title
stringlengths
1
90
url
stringlengths
31
120
text
stringlengths
0
504k
లతా మంగేష్కర్
https://te.wikipedia.org/wiki/లతా_మంగేష్కర్
లతా మంగేష్కర్ (మరాఠీ: लता मंगेशकर; ఆంగ్లం: Lata Mangeskar), (సెప్టెంబరు 28, 1929 - ఫిబ్రవరి 6, 2022) హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా.. నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడింది. ఈమె సోదరి ఆశా భోంస్లే. లతా మంగేష్కర్ కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. జీవిత సంగ్రహం లత 1929 సెప్టెంబరు 28 తేదీన సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్ కు పెద్ద కుమార్తెగా (ఐదుగురు సహోదరులలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా, మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన ఆమెకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం ఉండేది కాదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లత తనకు నచ్చిన గాయకుడుగా కె. ఎల్. సైగల్ ను పేర్కొంది. దీనానాథ్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ (1948 మొదలైన చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు. లత గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో మొదలుపెట్టింది. దేశ విభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ప్రోత్సాహమిచ్చారు. సి.రామచంద్ర లత పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చాడు. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీ లోని పాటలు అద్భుత విజయాలు చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి. హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, అనంతరం ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. అయితే ఓ.పి.నయ్యర్ మాత్రం లతపాట నా సంగీతానికి పనికిరాదని ఆమె సోదరి ఆషాను దాదాపు లతకు దగ్గరగా తీసుకెళ్ళాడు. లత సినీనిర్మాతగా మరాఠీలో వాదల్ (1953), కాంచన్ గంగా (1954), హిందీలో ఝూంఝుర్ (1954), లేకిన్ (1990) చిత్రాలు నిర్మించింది. ఆమె సంగీత దర్శకురాలిగా రాంరాంపహునా (1950), మొహిత్యాంచి మంజుల (1963), మరాఠా టిటుకమేల్ వాలా (1964), స్వాథూ మాన్ సే (1965) మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేసింది. గాయకురాలిగా కెరీర్ మొదట్లో (1940వ దశకం) 1942లో ఆమె తండ్రి గుండెజబ్బుతో చనిపోగా, నవయుగ్ చిత్రపత్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నారు. గాయనిగా, నటిగా లత కెరీర్ మొదలు పెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. నాచు య గడే, ఖేలు సారీ మనీ హౌస్ భారీ అనే పాటను మరాఠీ సినిమా కిటీ హాసల్ (1942) కోసం పాడారు లత. ఈ పాట ఆమె మొదటి పాట. సదాశివరావ్ నవరేకర్ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. నవయుగ చిత్రపత్ బ్యానర్ లో తీసిన మరాఠీ సినిమా పహలీ మంగళా-గౌర్ (1942) సినిమాలో ఒక పాత్ర పోషించారు. దాదా చందేకర్ స్వరపరచిన నటాలీ చైత్రాచీ నవలాయీ పాట కూడా పాడారు ఈ సినిమాలో. మరఠీ సినిమా గజబాహు (1943) లో మత ఏక్ సపూత్ కీ దునియా బాదల్ దే తూ ఆమె పాడిన మొదటి హిందీ పాట. 1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారిపోయినపుడు, లతా కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ దగ్గర నేర్చుకున్నారు. వసంత్ జొగలేకర్ తీసిన హిందీ సినిమా ఆప్ కీ సేవా మే (1946) లో దత దవ్జేకర్ స్వరపరచిన పా లగూన్ కర్ జోరీ అనే పాట పాడారామె. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన రోహిణి భతె ఆ తరువాత ప్రముఖ సంప్రదాయ నృత్యకళాకారిణిగా ప్రసిద్ధి చెందారు. వినాయక్ నిర్మించిన మొదటి హిందీ చిత్రం బడీ మా (1945) సినిమాలో లతా, అమె చెల్లెలు ఆశా కూడా చిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమాలో లత ఒక భజన పాట పాడుతూ కనిపిస్తారు. మాతే తేరే చరణో మే అనే భజన అది. వినాయక్ రెండవ హిందీ చిత్రం సుభద్ర (1946) సినిమాతో సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ కు పరిచయమయ్యారు లత. 1947లో పాకిస్థాన్ భారతదేశం నుంచి విడిపోయిన తరువాత ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ పాకిస్థాన్ కు వెళ్ళిపోవడంతో అమంత్ ఖాన్ దేవస్వలే వద్ద సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు లత. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ వద్ద కూడా నేర్చుకున్నారు. 1948లో వినాయక్ చనిపోయిన తరువాత గాయనిగా లతకు గులాం హైదర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. నిర్మాత శశధర్ ముఖర్జీకి లతను పరిచయం చేశారు హైదర్. లత గొంతు పీలగా ఉందంటూ ముఖర్జీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన హైదర్ చాలా బాధపడ్డారట. రాబోయే రోజుల్లో లతా గొంతు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తుంది, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాళ్ళావేళ్ళా పడతారని ముఖర్జీతో అన్నారట. దిల్ మేరా తోడా, ముఝే కహీ కా నా చోరా పాటతో లతకు మొదటి హిట్ ఇచ్చారు హైదర్. సెప్టెంబరు 2013లో తన 84వ పుట్టినరోజున, ఒక ఇంటర్వ్యూలో తనలో ఉన్న ప్రతిభను ముందు గుర్తించి, తన ప్రతిభపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి హైదర్ అని తలచుకున్నారు లత. మొదట్లో లతా ప్రముఖ గాయని నూర్ జహాన్ ను అనుకరించేవారట. కానీ తర్వాత తర్వాత విపరీతమైన సాధనతో తన స్వంత శైలితో శ్రోతల మదిలో తన ముద్ర వేశారామె. అప్పట్లో హిందీ సినిమాలలో ఉర్దూ కవుల ప్రభావం వల్ల ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండేవి. కథానాయకుడు దిలీప్ కుమార్ లత మహారాష్ట్రా యాస వల్ల ఆమె హిందీ భాష సరిగా లేదని ఆరోపించారు. దాంతో ఉర్దూ శిక్షకుడు షఫీతో ఉర్దూ నేర్చుకున్నారామె. మహల్ (1949) సినిమాలోని ఆయేగా ఆనేవాలా పాటతో మొదటి హిట్ అందుకున్నారు లతా ఈ సినిమాలోని పాటలను సంగీత దర్శకుడు ఖేమ్ చంద్ ప్రకాశ్. ఈ పాటలో నటి మధుబాల నటించారు. 1950వ దశకం 1950వ దశకంలో మంగేష్కర్ వివిధ సంగీత దర్శకులతో పనిచేశారు. అనిల్ బిశ్వాస్ సంగీత సారథ్యంలో తరానా, హీర్ సినిమాలు, శంకర్ జైకిసన్, నౌషాద్ అలీ, ఎస్.డి.బర్మన్, పండిట్ అమర్ నథ్ హుసన్ లాల్ భగత్ రాం సంగీత దర్శకత్వంలో బరీ బెహన్, మీనా బజార్, అఫ్సన, ఆదీ రాత్, అన్సూ, ఛోటీ భాబీ, అదల్-ఎ-జహంగీర్ వంటి సినిమాలు, సి.రామచంద్ర, హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, ఖయ్యం, రవి, సజ్జద్ హుస్సేన్, రోషన్, కళ్యాణ్ జీ-ఆనంద్ జీ, వసంత్ దేశాయ్, సుధీర్ ఫడ్కే, హన్స్ రాజ్ భేల్, మదన్ మోహన్, ఉషా ఖన్నా వంటి వారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడారామె.ధూన్ చిత్రంలో కూడ అద్బుతమైన పాటలు పాడారు. వనారధం (1956) తో తమిళంలో మొదటి పాట పాడారామె. ఈ సినిమాలో ఎన్తమ్ కన్నలన్ అనే పాట పాడారు. ఈ సినిమా ఉరన్ ఖోతల అనే హిందీ సినిమాకు తమిళ డబ్బింగ్. నౌషాద్ సంగీత దర్శకత్వం వహించారు. దీదార్ (1951), బైజు బవ్రా (1952), అమర్ (1954), ఉరన్ ఖోతల (1955), మదర్ ఇండియా (1957) వంటి సినిమాలలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో ఎన్నో రాగ ప్రధానమైన పాటలు పాడారు లత. నౌషాద్ మొదటి పాట లత, జి.ఎం.దురానీల డ్యుయెట్ ఏ ఛోరీ కీ జాత్ బడీ బేవాఫా. బర్ సాత్, ఆహ్ (1953), శ్రీ 420 (1955), చోరీ చోరీ (1956) సినిమాలలో లతాతో ఎక్కువ పాటలు పాడించారు ఆ సినిమాల సంగీత దర్శకులు శంకర్‌-జైకిషన్. 1957 ముందు తన అన్ని సినిమాలలోనూ లతతో పాడించుకున్నారు సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్. సచిన్ దేవ్ స్వరపరచిన సజా (1951), హౌస్ నెం.44 (1955), దేవదాస్ (1955) వంటి సినిమాలలో బర్మన్ స్వరపరచిన పాటలు పాడారు. కానీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె మళ్ళీ 1962 దాకా సచిన్ సంగీత సారథ్యంలో పాటలు పాడలేదు. 1958లో మధుమతి సినిమాలో లతా పాడిన ఆజా రే పరదేశీ పాటకు ఆమె ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఈ సినిమాకు సలీల్ చౌదరీ సంగీత దర్శకత్వం వహించారు. 1950వ దశకం మొదట్లో లత సి.రామచంద్ర నిర్మించిన అల్బెలా (1951), షిన్ షినకయి బుబ్లా బూ (1952), అనార్కలీ (1953), పెహ్లీ ఝలక్ (1954), ఆజాద్ (1955), ఆశా (1957), అమర్ దీప్ (1958) వంటి సినిమాలలో పాడారు. మదన్ మోహన్ సినిమాలు ఐన బాగీ (1953), రైల్వే ప్లాట్ ఫాం (1955), పాకెట్ మర్ (1956), దేఖ్ కబీరా రోయా (1957), అదాలత్ (1958), జైలర్ (1958), మొహర్ (1959), చాచా జిందాబాద్ (1959) లలో పాడారామె. 1960వ దశకం మొఘల్-ఎ-అజమ్ (1960) సినిమాలో నౌషాద్ సంగీత దర్శకత్వంలో లతా పాడిన ప్యార్ కియా తో డర్నా క్యా పాట ఇప్పటికీ చాలా ప్రాచుర్యం కలిగిన పాట. ఈ పాటలో మధుబాల నటించారు. దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి (1960) సినిమాలో మీనా కుమారి నటించిన, శంకర్‌-జైకిషన్ స్వరపరచిన అజీ దస్తాన్ హై యే పాట కూడా చాలా హిట్ అయింది. 1961లో బర్మన్ సహాయ దర్శకుడు జయదేవ్ స్వరపరిచిన ప్రముఖ్ భజనలు అల్లాహ్ తేరో నామ్, ప్రభు తేరో నామ్ పాడారు లత. 1962లో హేమంత్ కుమార్ స్వరపరచిన బీస్ సాల్ బాద్ సినిమాలోని కహీ దీప్ జలే కహీ దిల్ పాటకు రెండవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు లత. 1962లో ఆమెపై విష ప్రయోగం జరిగింది. డాక్టర్ ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు. 3రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. కానీ ఈ విష ప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3నెలల వరకూ ఆమె మంచంపైనే ఉన్నారు. ఈ 3నెలలూ గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్ పురీ ఆమెను కోలుకోవడానికి సాయం చేశారు. ప్రతీరోజూ సాయంత్రం ఆమె ఇంటికి వచ్చి సరదగా కథలు, కవితలు చెప్పి నవ్వించేవారట. ఆమె తినే ప్రతీ వంటనూ ముందు ఆయన తిని చెక్ చేసేవారట. ఈ సంఘటన జరిగాకా ఆమె ఇంటిలోని వంటవాడు ఆకస్మికంగా జీతం కూడా తీసుకోకుండా మాయమయ్యాడట. ఆ తరువాత ఆ వంటవాడు చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళలో పనిచేశాడట. 1963 జనవరి 27లో చీనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ ఎదుట అయే మేరే వతన్ కే లోగో(నా దేశ ప్రజలారా) పాట పాడారు లత. ఈ పాట సి.రామచంద్ర స్వరపరచగా, కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. 1963లో మంగేష్కర్ ఎస్.డి.బర్మన్ సంగీత సారథ్యంలో మళ్ళీ పాడటం మొదలుపెట్టారు. ఆయన కుమారుడు ఆర్.డి.బర్మన్ మొదటి సినిమా ఛోటే నవాబ్ లో పాడారు లత. రాహుల్ దేవ్ మిగిలిన సినిమాలు భూత్ బంగ్లా (1965), పతీ పత్నీ (1966), బహారోన్ కీ సప్నా (1967), అభిలాషా (1969) లలో కూడా పాటలు పాడారు. ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన గైడ్ (1965) సినిమాలోని ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై, కిశోర్ కుమార్తో కలసి గాతా రహా మేరా దిల్ , పియా తుసే పాటలు పాడారు. 1967లో జ్యుయెల్ థీఫ్ సినిమాలో హోతో పే ఏసా బాత్ పాట కూడా పాడారు లత. 1960ల్లో మదన్ మోహన్ సంగీత దర్శకత్వంలో అన్పధ్ (1962) లోని ఆప్ కీ నజరో నే సంజా వో కౌన్ థీ (1964) లో లగ్ జా గలే, నైనా బర్సే రిమ్ జిమ్, జహాన్ అరా (1964) లోని వో చుప్ రహే తో, మేరా సాయ (1966) సినిమాలోని తూ జహా జహా చలేగా, చిరాగ్ (1969) లోని తేరీ ఆంఖో కే సివా పాటలు పాడారు. అలాగే శంకర్-జైకిషన్ లతో కూడా ఆమె చాలా సినిమాలకు పనిచేశారు. 1960లలో లతా తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ పాటలు ఇచ్చిన సంగీత దర్శకులు లక్ష్మీకాంత్‌-ప్యారేలాల్ లతో భాగస్వామ్యం మొదలైంది. 1963లో మొదలైన్ వీరి భాగస్వామ్యం 35 సంవత్సారాలు కొనసాగింది. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో ఆమె దాదాపు 700 పాటలు పాడారు. వీరిద్దరి సంగీత దర్శకత్వంలో వచ్చిన పరస్మిని (1963), మిస్టర్. ఎక్స్ ఇన్ బాంబే (1964), ఆయే దిన్ బాహర్ కే (1966), మిలన్ (1967), అనిత (1967), షగిర్ద్ (1968), మేరే హమ్ దమ్ మే దోస్త్ (1968), ఇంతకం (1969), దో రాస్తే (1969), జీనే జీ రాహ్ (1969) వంటి సినిమాలలో పాటలు పాడారు లతా. జీనేకీ రాహ్ సినిమాకి లత మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. మరాఠీ సంగీత దర్శకులు హ్రిదయన్త్ మంగేష్కర్, వసంత్ ప్రభు, శ్రీనివాస్ ఖాలే, సుధీర్ ఫడ్కే వంటి వారి సారథ్యంలో పలు మరాఠీ సినిమాలలో పాటలు పాడారు లత. కొన్ని మరాఠీ సినిమాలకు ఆనందఘన్ పేరుతో ఆమె స్వయంగా సంగీత దర్శకత్వం వహించారు కూడా. 1960, 1970 దశకాలలో సలీల్ చౌదరి, హేమంత్ కుమార్ వంటి వారి సంగీత సారథ్యంలో పలు బెంగాలీ సినిమాలలో కూడా పాటలు పాడారు. 1967లో క్రాంతివీర సంగొల్లి రాయన్నా సినిమాలో బెల్లెనే బెలగాయితు పాటతో కన్నడలో మొదటి పాట పాడారెమె. ఈ సినిమాకు లక్ష్మణ్ బెర్లేకర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ దశకంలో అప్పటి టాప్ గాయకులు ముఖేష్, మన్నా డే, మహేంద్ర కపూర్, మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్లతో ఎన్నో పాటలు పాడారు లతా. 1960వ దశకంలో కొన్ని రోజుల పాటు రఫీ, లతల మధ్య రెమ్యునరేషన్ విషయంలో కొన్ని గొడవలు జరిగాయి. 1961లో మాయ సినిమాలోని తస్వీర్ తేరీ దిల్ మే పాట తరువాత ఇద్దరూ కలసి పాడకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కానీ తరువాత సంగీత దర్శకుడు జైకిషన్ వారిద్దరి మధ్య విభేదాలను పరిష్కరించారు. 1970వ దశకం నటిమీనాకుమారి నటించిన చివరి చిత్రం 1972లో విడుదలైన పాకీజా సినిమాలో గులాం మహ్మద్ సంగీత దర్శకత్వంలో చల్తే చల్తే, ఇన్హే లోగో నే వంటి హిట్ పాటలు పాడారు లత. ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిని చివరి సినిమాలు ప్రేం పూజారీ (1970) లో రంగీలా రే, షర్మీలా (1971) లో ఖిల్తే హై గుల్ యహాన్ , అభిమాన్ (1973) లో పియా బినా వంటి పాటలు పాడారామె. అలాగే స్వరకర్త మదన్ మోహన్ చివరి సినిమాలు అయిన దస్తక్ (1970), హీర్ రాంఝా (1970), దిల్ కే రహే (1973), హిందుస్తాన్ కీ కసమ్ (1973), హసంతే జఖమ్ (1973), మౌసమ్ (1975), లైలా మజ్నూ (1976) లలో ఆమె చాలా పాటలు పాడారు. 1970లలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్, రాహుల్ దేవ్ ల సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట పాటలు పాడారు లత. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వరపరచిన చాలా పాటల్ని గేయరచయిత ఆనంద్ బక్షి రాశారు. రాహుల్ దేవ్ సంగీత దర్శకత్వంలో అమర్ ప్రేమ్ (1972), కరావన్ (1971), కటి పతంగ్ (1971), ఆనంది (1975) వంటి సినిమాలలో పాటలు పాడారు. ఈ సినిమాలలో గేయరచయితలు మజ్రూహ్ సుల్తాంపురీ, ఆనంద్ బక్షి, గుల్జార్ ఎన్నో పాటలు రాశారు. 1973లో పరిచయ్ సినిమా కోసం పాడిన బీతీ నా బితాయ్ పాటతో ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు లత. ఈ పాటను ఆర్.డి.బర్మన్ స్వరపరచగా, గుల్జార్ రాశారు. మలయాళంలో ఆమె పాడిన ఒకే ఒక పాట కాదలీ చెనకదలీ. ఈ పాట నెల్లు (1974) లోనిది. ఈ సినిమాకు సలీల్ చౌదరి స్వరాలు అందించగా, వయలర్ రామవర్మ రాశారు. 1975లో కోరా కాగజ్ సినిమాలో కళ్యాణ్ జీ ఆనంద్ జీ స్వరపరచిన రూతే రూతే పియా పాటకు కూడా ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు లత. 1970ల నుంచి లతా సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. కొన్ని కచేరీలను ఉచితంగా చేశారు కూడా. 1974లో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో మొదటి విదేశీ సంగీత కచేరీ చేశారామె. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ కంపోజ్ చేసిన మీరాబాయ్ భజనలు, ఛాలా వాహీ దాస్ ల భక్తిగీతాలతో ఒక ఆల్బంను రిలీజ్ చేశారు లత. ఈ ఆల్బమ్లలో సాన్ వారే రంగ్ రాచీ, ఉద్ జా రే కాగా వంటి పాటలు కూడా ఉన్నాయి. 1970వ దశకం మొదట్లో ఆమె గాలిబ్ గజళ్ళు, గణేశ్ హారతులు, శాంత్ తుకారాం రాసిన అభంగ్ లు, కోలీ గేటే పేరుతో ఒక మరాఠీ జానపద గేయాలు వంటి ప్రైవేట్ ఆల్బంలను విడుదల చేశారామె. వీటిలో శాంత్ తుకారాం అభంగ్ లు శ్రీనివాస్ ఖాలే స్వరపరచగా, మిగిలినవి ఆమె తమ్ముడు హృదయనాథ్ స్వరపరిచారు. 1978లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన "సత్యం శివం సుందరం" సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. 1970వ దశకం చివర్లో, 1980వ దశకం మొదట్లో ఆమె రెండవ తరం సంగీత దర్శకులతో పనిచేశారు. 60ల నాటి ప్రముఖ స్వరకర్తల కుమారులతో 80లలో ఆమె ఎన్నో హిట్ పాటలకు పనిచేశారు. రాహుల్ దేవ్ బర్మన్ (సచిన్ దేవ్ బర్మన్ కొడుకు), రాజేష్ రోషన్ (రోహన్ కుమారుడు), అను మాలిక్ (సర్దార్ మాలిక్ కొడుకు), ఆనంద్‌-మిలింద్ (చిత్రగుప్త్ కుమారులు) లతో పనిచేశారు ఆమె. అస్సామీ భాషలో కూడా ఆమె చాలా పాటలు పాడారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ భుపే హజారికాతో మంచి స్నేహం ఉంది లతకు. ఆయన గైడెన్స్ లో ఆమె పాడిన దిల్ హూం హూం కరే పాట ఆ సంవత్సరంలోనే ఎక్కువ అమ్ముడుపోయిన పాటగా రికార్డు సృష్టించింది. 1980వ దశకం 1980వ దశకంలో సంగీత దర్శకులు శివ్-హరిలతో సిల్ సిలా (1981), ఫాస్లే (1985), విజయ్ (1988), చాందినీ (1989) వంటి సినిమాలలో ఎన్నో పాటలు పాడారు లత. రామ్-లక్ష్మణ్ ల సంగీత దర్శకత్వంలో ఉస్తాదీ ఉస్తాద్ సే (1981), బెజుబాన్ (1982), వో జో హసీనా (1983), యే కేసా ఫర్జ్ (1985), మైనే ప్యార్ కియా (1989). ఏక్ ధుజే కే లియే, సిల్ సిలా, కార్జ్, ప్రేమ్ రోగీ, ప్యార్ ఝుక్తా నహీ, రామ్ తేరీ గంగ మిలీ, హీరో నాగిన, చాందినీ రామ్ లఖన్ వంటి పెద్ద బడ్జెట్ సినిమాలలో పాటలు పాడారామె. 1985లో విడుదలైన సంజోగ్ సినిమాలోని జు జు జు పాట ఆ సంవత్సరంలోనే అతిపెద్ద హిట్. 1988లో మంగేష్కర్ వరుసగా తమిళంలో పాటలు పాడారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ సినిమాలో ఆరారో ఆరారో పాట, సత్య సినిమాలో వలై ఒసీ పాట పాడారు లత. 1980వ దశకంలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ బాలీవుడ్ సినీ సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశారు. వారి సంగీత సారథ్యంలో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు లత. షీషా హో థా దిల్ హో అశా (1980), తు కిత్నే బరస్ కా కరజ్ (1980), కిత్నా అసన్ హై దోస్తానా (1980), హమ్ కో భీ గమ్ ఆస్ పాస్ (1980), మేరే నసీబ్ మే సనీబ్ (1980), జిందగీ కీ నా టూటే క్రాంతీ (1981), సోలా బరస్ కీ ఏక్ ధుఝే కే లియే (1981), యే గలియన్ యే చౌబ్రా ప్రేమ్ రోగ్ (1982), లిఖ్నే వాలే నే లిఖ్ దాలేఅర్పన్ (1983), దిన్ మహీనే సాల్ అవతార్ (1983), ప్యార్ కర్నేవాలే, నిందియా సే జాగి హీరో (1983), జు జు జు సన్జోగ్ (1985), జిందగీ హర్ కదమ్ మేరీ జుంగ్ (1985), బైత్ మేరే పాస్ యాదోంకీ కసమ్ (1985), ఉంగలీ మే అంగోటీ రామ్ అవతార్ (1988) ఓ రామ్ జీ తేరే లఖన్ నే రామ్ లఖన్ (1989) వంటి ఎన్నో హిట్ పాటలు పాడారు లత. వరుస ఫ్లాపుల తరువాత అవతార్ సినిమాతో రాజేష్ ఖన్నా హిట్ అందుకున్నారు. 80లలో రాహుల్ దేవ్ బర్మన్ లతతో ఎన్నో హిట్ పాటలు పాడించారు. ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన ఆజా సర్-ఎ-బజార్ ఆలీబాబా ఔర్ చాలీస్ చోర్ (1980), బిందియా తర్సే ఫిర్ ఓ రాత్ (1981), తోడీ సీ జమాన్ సితార (1981), క్యా యహీ ప్యార్ హై రాకీ (1981), దేఖో మైనే దేఖా లవ్ స్టోరీ (1981), ట్యూన్ ఓ రంగీలే కుద్రత్ (1981), జీనే కైసే కబ్ శక్తి (1982), జబ్ హం జవాన్ హోంగే బతాబ్ (1983), హుమైన్ ఔర్ జీనే అగర్ తుం నా హోతే (1983), తుఝ్ సే నారాజ్ నహీ మౌసమ్ (1983), కహీ నా జా, జీవన్ కే దిన్ బడే దిల్ వాలే (1983), జానే క్యా బాత్ సన్నీ (1984), భురీ భురీ అంఖో అర్జున్ (1985), సాగర్ కినారే సాగర్ (1985), దిన్ ప్యార్ కే ఆయేంగే సవరే వాలీ గాడీ (1986), క్యా భలా హై క్యా, ఖామూష్ సా అఫ్సానా సీలి హవా చూ లిబస్ (1988), పాస్ హో తుమ్ మగర్ కరీబ్ లూట్ మార్ (1980), సుమన్సుధా రజినీ ఛందా మన్ పసంద్ (1980), రఫీ, లతాల డ్యుయెట్లు ముఝే ఛూ రహీ హై స్వయంవర్ (1980), కభీ కభీ బెజుబాన్ జానీ ఐ లవ్ యూ (1982), తుఝ్ సంగ్ ప్రీత్ కామ్ చోర్ (1982), అంగ్రేజీ మే కెహతా హై ఖుద్ దార్ (1982), అంఖియో హి అంఖియో మే నిషాన్ (1983), దిష్మన్ నే కరే ఆఖిర్ క్యూ? (1985), తూ వాదా నా తోడ్ దిల్ తుఝ్కో దియా (1987) వంటి పాటలు ఆమె కెరీర్ లోనే క్లాసిక్స్ గా నిలిచాయి. ఆ సమయంలోనే పూర్తిస్థాయి సంగీత దర్శకునిగా మారుతున్న బప్పీలహరి దక్షిణ భారతంలో జితేంద్ర-శ్రీదేవి-జయప్రదల సినిమాలకు డిస్కో-ప్రభావిత పాటలను అందించారు. ఆదే సమయంలో బాలీవుడ్ లో బప్పీలహరి సంగీత సారథ్యంలో లతా ఎన్నో హిట్ పాటలను పాడారు. దూరియా సబ్ మితా దో సబూత్ (1980), బైతే బైతే ఆజ్ ఆయీ పతిత (1980), జానే క్యూ ముఝే అగ్రిమెంట్ (1980), తోడా రెషమ్ లగ్తా హై జ్యోతి (1981), దర్ద్ కీ రాగిణీ ప్యాస్ (1982), కిషోర్ కుమార్ తో పాడిన డ్యుయెట్ నైనో మే సపనా హిమ్మత్ వాలా (1983) వంటివి వారిద్దరి భాగస్వామ్యంలో వచ్చిన హిట్ పాటలు. 80లలో ఖయ్యం సంగీత దర్శకత్వంలో కూడా లతా ఎన్నో హిట్ పాటలు పాడారు. కిషోర్ కుమార్ తో కలసి పాడిన డ్యుయెట్ హజార్ రహీ ముడ్ తోడీ సీ బేవాఫి (1980), సిమ్తీ హుయీ చంబల్ కీ కసమ్ (1980), న జానే క్యూ హువా దర్ద్ (1981), నకౌదా (1981), లతా-నితిన్ ముఖేష్ డ్యుయెట్ తుమ్హారీ పాలకోన్ కీ, చాందినీ రాత్ మే దిల్-ఎ-నదాన్ (1982), దిఖాయి దియే బజార్ (1982), చాంద్ కే పాస్ ఆయే దిల్-ఎ-నదాన్ (1982), భర్ లైన్ తుమ్హే, ఆజా నిందియా ఆజా లోరే (1984), కిరణ్ కిరణ్ మే షోఖియా ఏక్ నయా రిష్తా (1988) వంటి హిట్ పాటలు పాడారామె. జూన్ 1985, యునైటెడ్ వే ఆఫ్ గ్రేటర్ టొరొంటోలోని "మాపల్ లీఫ్ గార్డెన్స్ "లో ఒక సినీ సంగీత కచేరీ చేశారామె. 12,000మంది ఈ కచేరీకి వచ్చారు. ఈ కచేరీ నిర్వహించిన స్వచ్ఛంద సంస్థకు 150,000డాలర్లు వచ్చాయి. ఈ కచేరీని పేదల సహాయార్ధం ఉచితంగా చేశారు లతా. ఈ కచేరీలో అన్నా ముర్రే కోరిక మేరకు యూ నీడ్ మీ ఇన్ ద కాన్సర్ట్ పాట పాడి శ్రోతల్ని ఉర్రూతలూగించారు లతా. 1980వ దశకంలో మిగిలిన బాలీవుడ్ సంగీత దర్శకులకు కూడా ఆమె ఎన్నో హిట్ పాటలు పాడారు. రవీంద్ర జైన్ స్వరపరచిన రామ్ తేరీ గంగా మిలీ హోగయీ)1985) లో సున్ సహిబా సున్ పాట సూపర్ హిట్ అయింది. ఉషా ఖన్నన్ కు పాడిన చందా అప్నా సఫర్ షమా (1981), షాయద్ మేరీ షాదీ, జిందగీ ప్యార్ కా సౌతాన్ (1983), హం భూల్ గయే రే సౌతాన్ కీ బేటీ (1989) ఆమే కెరీర్ లోనే అతి పెద్ద హిట్లుగా నిలిచాయి. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీత దర్శకత్వంలో లతా కాలే కాలే గెహరే సాయే చక్రా (1981), యే ఆంఖే దేఖ్ కర్ , కుఛ్ లోగ్ మొహొబ్బత్ కో ధన్ వన్ (1981), ముఝే తుం యాద్ కర్నా మషాల్ (1984) వంటి పాటలు పాడారు. స్వరకర్తలు అమర్-ఉత్పల్ లకు జానే దో ముఝే షేహెన్ షా (1989). ఉత్తమ్ జగదీశ్ సంగీత సారథ్యంలో సజన్ మేరా ఉస్ పార్ గంగా జమునా సరస్వతి (1988), మేరే ప్యార్ కీ ఉమర్ వారిస్ (1989) వంటి పాటలు పాడారు. 1990 నుంచి ఇప్పటి వరకు 1990వ దశకంలో ఆనంద్-మిలింద్, నదీమ్-శ్రావన్, జతిన్ లలిత్, దిలీప్ సెన్-సమీర్ సెన్, ఉత్తం సింగ్, అను మాలిక్, ఆదేశ్ శ్రీవాస్తవ, ఎ.ఆర్.రహమాన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో మంచి పాటలు పాడారు మంగేష్కర్. ఈ సమయంలోనే కొన్ని ప్రైవేట్ ఆల్బంలలోను, గజల్స్ పాడారు. ఆప్పటి ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ, హరిహరన్, కుమార్ సను, సురేశ్ వాడ్కర్, మహ్మద్ అజిజ్, అభిజీత్ భట్టాచార్య, రూప్ కుమార్ రాథోడ్, వినోద్ రాథోడ్, గుర్ దాస్ మాన్, సోను నిగమ్ లతో ఎన్నో హిట్ పాటలు పాడారు లత. 1990లో లతా హిందీ సినీ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. మొదటి సినిమాగా గుల్జార్ దర్శకత్వం వహించిన లేకిన్ సినిమాను నిర్మించారు ఆమె. ఈ సినిమాకు ఆమె తమ్ముడు హృదయనాథ్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లతా పాడిన యారా సిలి సిలీ పాటకు ఉత్తమ నేపథ్యగాయనిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. యష్ చోప్రా దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలోనూ పాటలు పాడారు లతా. చోప్రా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బేనర్ లో వచ్చిన చాందినీ (1989), లమ్హే (1991), దార్ (1993), యే దిల్లగీ (1994), దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (1995), దిల్ తో పాగల్ హై (1997), ఆ తరువాత 2000 దశకంలో విడుదలైన మొహొబ్బతే (2000), ముఝ్సే దోస్తీ కరోగీ! (2002), వీర్-జారా (2004) వంటి సినిమాలలో కూడా ఆమె పాటలు పాడారు. 90లలో మంగేష్కర్ రామ్ లక్ష్మణ్ సంగీత దర్శకత్వం వహించిన పత్తర్ కా ఫూల్ (1991), 100 డేస్ (1991), మెహబూబ్ మేరే మెహబూబ్ (1992), సాత్వన్ ఆస్మాన్ (1992), ఐ లవ్ యు (1992), దిల్ కీ బాజీ (1993), అంతిం న్యాయ్ (1993), ది మెలోడి ఆఫ్ లవ్ (1993), ద లా (1994), హమ్ ఆప్కే హై కౌన్! (1994), మేఘా (1996), లవ్ కుశ్ (1997), మంచల (1999), దుల్హన్ బనో మై తేరీ (1999) వంటి సినిమాలలో పాటలు పాడారు. ఈ సమయంలోనే లతా ఎ.ఆర్.రహమాన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ పాటలు పాడారు. జియా జలే (దిల్ సే), ఖామూషియా గున్ గుననే లగీ(ఒన్ 2 కా 4), ఏక్ తు హీ భరోసా (పుకార్), ప్యారా సా గూన్ (జుబేదా), సో గయే హై (జుబేదా), లుక్కా చుప్పీ (రంగ్ దే బసంతీ), ఓ పాలన్ హారే (లగాన్), లాడ్లీ (రానక్). పుకార్ సినిమాలో ఈ పాట పాడుతూ కనపడతారు మంగేష్కర్. 1994లో లతా మంగేష్కర్ అమర గాయకుల హిట్ పాటలను తన స్వంత గొంతుతో పాడి రికార్డ్ లు విడుదల చేశారు. కె.ఎల్.సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్ మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జొహ్రబాయ్, అమీర్ బాయ్, పరౌల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళి ఇచ్వారు ఆమె. రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట, ఆఖరి పాట కూడా లతా మంగేష్కర్ పాడటం విశేషం. 1994లో రాహుల్ దేవ్ ఆఖరి సినిమాలోని ఆఖరి పాట కుచ్ నా కహో (1942:ఎ లవ్ స్టోరి) పాడారు లతా. 1999లో ఆమె పేరు మీద లతా ఎయు డె పెర్ఫ్యూమ్ అనే సుగంధ ఉత్పత్తి విడుదల చేశారు. అదే సంవత్సరంలో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. కానీ ఆమె ఎక్కువ సభలకు హాజరుకాలేదు. సహ సభ్యులు ప్రణబ్ ముఖర్జీ, షబానా అజ్మీ, అప్పటి రాజ్యసభ ఉపాధ్యక్షులు నజ్మా హెప్తుల్లా వంటి వారి నుండి విమర్శలు వచ్చేవి. ఆమె అనారోగ్యంతోనే సభకు రాలేదని చెప్పుకునేవారు. లతా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నందుకు జీతం కానీ దిల్లీలో ప్రభుత్వ వసతిగృహం కానీ తీసుకోలేదు. 2005లో దాదాపు 14ఏళ్ళ తరువాత ఆమె మళ్ళీ నదీమ్-శ్రవణ్ సంగీత దర్శకత్వంలో బేవఫా (2005) సినిమాలో కెసె పియా సై మై కహూ పాట పాడారు లతా. పేజ్ 3 (2005) లో కిత్నే అజీబ్ రిష్తే హై యహాన్ పర్ పాట, జైల్ (2009) సినిమాలో దాతా సున్ లే, సత్రంగీ పారాచ్యూట్ (2011) లో తేరే హస్నే సే ముఝ్కో, "జీనే క్యా హై వంటి పాటలు పాడారు. 28 నవంబర్ 2012లో లతా తన స్వంత ఆడియో లేబుల్ ఎల్.ఎం.మ్యూజిక్ ద్వారా భజనపాటలు విడుదల చేశారు. ఈ ఆల్బంలో తన చెల్లెలు ఉషా మంగేష్కర్ తో కలసి పాడారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా "స్ప్రెడింగ్ మెలోడీస్ ఎవ్రీవేర్" అనే ఆల్బంలో ఓ జానే వాలే తుఝ్కో అనే టైటిల్ పాట పాడారు ఆమె. ఈ ఆల్బంను రామ్ శంకర్ స్వరపరచగా, ఎ.కె.మిశ్రా సాహిత్యం అందించారు. భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో ఆమె పదవ స్థానంలో ఎంపికైయింది. ఇతర రంగాలు సంగీత సారధిగా 1955లో రామ్ రామ్ పవ్హనే అనే మరాఠా సినిమాకు మొదటిసారిగా సంగీత సారధ్యం వహించారు లతా. తరువాత 60లలో ఆనంద ఘన్ అనే మారు పేరుతో కొన్ని సినిమాలకు స్వరాలు అందించారు. అవి: 1963-మరాఠా టితుక మెల్వవా 1963-మోహిత్యంచి మంజుల 1965-సాధి మనసే 1969-తుంబడి మత సాధి మనసే సినిమాకు గాను ఆమె ఉత్తమ సంగీత దర్శకురాలిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలోని ఐరనించియా దేవ తులా పాటకు ఉత్తమ గాయినిగా కూడ అవార్డు అందుకున్నారు లతా. నిర్మాతగా లతా 4 సినిమాలను నిర్మించారు: 1953 - వాదల్(మరాఠీ) 1953 - జహంగీర్(హింది), సహనిర్మాతగా సి.రామచంద్ర 1955 - కాంచన్(హింది) 1990 - లేకిన్...(హింది) విశేషాలు ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించింది. ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకొంది. ఈమె తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన పాటలు పాడింది. 1959లో టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను "భారతీయ నేపథ్యగాయకుల రాణి" (Queen of Indian Playback Singers) గా పేర్కొన్నది. పాటలు ఈమె పాడిన కొన్ని మధురమైన హిందీ పాటలు: అయ్ మేరె వతన్ కే లోగో, జరా ఆంఖ్ మేఁ భర్ లో పానీ, జో షహీద్ హువే హైఁ ఉన్కీ, జరా యాద్ కరో ఖుర్బానీ ఛోడ్ దే సారీ దునియా కిసీ కే లియే, యే మునాసిబ్ నహీఁ ఆద్‌మీ కే లియే నా కొఈ ఉమంగ్ హై, నా కొఈ తరంగ్ హై, మెరీ జిందగీ హై క్యా, ఏ కటీ పతంగ్ హై జబ్ భీ జీ చాహే నయీ దునియా, బసాలేతే హైఁ లోగ్, ఏక్ చెహ్రే పే కయీ చెహ్రే లగాలేతె హైఁ లోగ్ పురస్కారాలు భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం. సంవత్సరంపురస్కారం చిత్రం పురస్కారం పేరు బహూకరించిందిఇతర వివరాలు 2001center|125pxభారతరత్నభారతరత్న పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతామంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.భారత ప్రభుత్వం బిస్మిల్లా ఖాన్ తోకలిపి అప్పటి రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ చేతులమీదుగా స్వీకారం. 1999centre|125pxపద్మవిభూషణ్పద్మవిభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతా మంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది. భారత ప్రభుత్వం 1969centre|125pxపద్మభూషణ్పద్మభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతా మంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది. భారత ప్రభుత్వం2006 ది లీజియన్ అఫ్ హానర్France to honour Lata Mangeshkar శీర్షిక క్రింద జులై 25,2008 న సేకరించబడినది. ఫ్రాన్స్ ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే (1989) మహారాష్ట్ర భూషన్ అవార్డు (1997) ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999) శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ రాజాలక్ష్మీ అవార్డు (1990) ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డు (2009) అప్సరా అవార్డు కాళిదాస్ సమ్మాన్ అవార్డు తాన్ సేన్ అవార్డు నేపాల్ అకాడమీ అవార్డు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు మరణం 2022 ఫిబ్రవరి 6న ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్‌ కరోనా అనంతర ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ కన్నుమూసారు. చనిపోయేనాటికి ఆమె వయస్సు 92 సంవత్సరాలు. ఆమె జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం రెండు రోజులు (2022 ఫిబ్రవరి 6, 7 తేదీలు) సంతాప దినాలను ప్రకటించింది. స్మారక అవార్డు లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ఆయనికి ఈ అవార్డును ప్రదానం చేశారు. చిత్రమాలిక ఇవికూడా చూడండి మూలాలు బయటి లింకులు ప్రపంచ సినీసీమకే "భారతరత్న" గానకోకిల లతామంగేష్కర్, ఫాల్కే అవార్డు విజేతలు, హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్స్, 2003, పేజీలు: 87-94. వర్గం:1929 జననాలు వర్గం:2022 మరణాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు వర్గం:దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు వర్గం:హిందీ సినిమా నేపథ్యగాయకులు వర్గం:భారతీయ మహిళా గాయకులు వర్గం:సుప్రసిద్ద సంగీతకారులు వర్గం:డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కార గ్రహీతలు వర్గం:కాళిదాస్ సమ్మాన్ గ్రహీతలు వర్గం:భారతీయ గజల్ గాయకులు వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు
బిస్మిల్లా ఖాన్
https://te.wikipedia.org/wiki/బిస్మిల్లా_ఖాన్
దారిమార్పు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్
పండిట్ రవిశంకర్
https://te.wikipedia.org/wiki/పండిట్_రవిశంకర్
పండిట్ రవి శంకర్ (దేవనాగరి: रविशंकर, "పండిట్" = "learned"), ఏప్రిల్ 7, 1920లో గాజీపూర్ లో జన్మించాడు.ఇతడు అల్లావుద్దీన్ ఖాన్, హిందూస్థానీ సంగీతంలో మైహార్ ఘరానా స్థాపకులు శిష్యుడు. సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చిన సంగీతజ్ఞుడు.ఫ్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని శాండియాగోలోని స్క్రిప్స్‌ మెర్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్‌ 7, 1920లో వారణాసిలో జన్మించిన రవిశంకర్‌ హిందుస్థాని క్లాసికల్‌ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు గ్రామీ పురస్కారం పొందారు. 1999లో రవిశంకర్‌ను ప్రభుత్వం అత్యున్నత పురస్కారం 'భారత రత్న'తో సత్కరించింది. రవిశంకర్‌ అసలు పేరు రబింద్రో శౌంకోర్‌ చౌదురి. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలిసి యూరప్‌ వెళ్లాడు. 1938లో నృత్యాన్ని పక్కనబెట్టి సితార్‌ నేర్చుకోవడానికి అల్లాద్దిన్‌ ఖాన్‌ అనే విద్వాంసుడి వద్ద చేరాడు. 1944లో చదువు అనంతరం మ్యూజిక్‌ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించి సత్యజిత్‌రే 'అప్పు' చిత్రానికి పనిచేశారు. 1949 నుంచి 1956 వరకు సంగీత దర్శకునిగా ఢిల్లీ ఆల్‌ ఇండియా రేడియోకు సేవలు అందించారు. 1956 నుంచి యూరప్‌, అమెరికాలో హిందుస్థాని క్లాసికల్‌ సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బోధన, పదర్శనల ద్వారా హిందుస్థాని క్లాసికల్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు. తన కూతురు అనౌష్కతో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 2003లో అనౌష్క తన మ్యూజిక్‌ అల్బమ్‌ ద్వారా గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. అవార్డులు 1975లో యునెస్కో సంగీత పురస్కారం 1981లో పద్మవిభూషణ్‌ పురస్కారం 1988లో కాళిదాస్‌ సమ్మాన్‌ పురస్కారం 1992లో రామన్‌ మెగసేసే పురస్కారం ఫండిట్ 1999లో అత్యున్నత పురస్కారం భారతరత్న 1986 నుంచి 1992 వరకూ రాజ్యసభలో నామినేటెడ్‌ సభ్యునిగా వ్యవహరించారు ఇతర విశేషాలు ఈయనకు భారత ప్రభుత్వం 1999 లో భారతరత్న బిరుదుతో సత్కరించినది. ఈయనకు భారత ప్రభుత్వం 1981 లో పద్మ విభూషణ్ పురస్కారం తో సత్కరించినది. సినిమాలు 1957: కాబూలీవాలా (సంగీతం) 1960: అనురాధ (సంగీతం) మూలాలు బయటి లింకులు రవిశంకర్ అధికారిక వెబ్‌సైట్ వర్గం:పశ్చిమ బెంగాల్ వ్యక్తులు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు వర్గం:1920 జననాలు వర్గం:సితార్ విద్వాంసులు వర్గం:సుప్రసిద్ద సంగీతకారులు వర్గం:కాళిదాస్ సమ్మాన్ గ్రహీతలు
జయప్రకాశ్ నారాయణ్
https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్
జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్ నారాయణ్ (జ:1902 అక్టోబరు 11 - మ:1979 అక్టోబరు 8) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఇతనిని ప్రజలు లోక్ నాయక్ అని సగౌరవంగా పిలుచుకుంటారు.భారత ప్రభుత్వం ఇతని 113 వ జయంతిని పురస్కరించుకుని "ప్రజాస్వామ్య పరిరక్షణ దినం"గా ప్రకటించింది. ప్రారంభ జీవితం జయప్రకాశ్ నారాయణ్ ఉత్తర ప్రదేశ్ లోని బలియా జిల్లాకు, బీహారు లోని సారన్ జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పాట్నాలో అభ్యసించాడు. అటుపిమ్మట అమెరికాలో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చాడు. అమెరికాలో ఉన్న సమయంలో మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే యం.యన్.రాయ్ రచనల ప్రభావానికి లోనయ్యాడు.1920లో జయప్రకాశ్ నారాయణ్ స్వాతంత్ర్య సమరయోధురాలు, కస్తూరిబాయి గాంధీ అనుచరురాలు ప్రభావతీ దేవిని వివాహమాడాడు.thumb|ఇజ్రాయేల్ ప్రధాని డేవిడ్ భెన్ ఘురియన్ తో నారాయణ్|260x260px స్వాతంత్ర్య సమరయోధుడిగా అమెరికానుండి వచ్చిన వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెసులో చేరి త్వరలోనే మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడుగా మారాడు. 1932 లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన కారణంగా జైలు పాలైన తరువాత, నారాయణ్ నాసిక్ జైలులో ఖైదు చేయబడ్డాడు. అక్కడ అతను రామ్ మనోహర్ లోహియా, మినూ మసాని, అచ్యుత్ పట్వర్ధన్, అశోక్ మెహతా, బసవోన్ సింగ్ (సిన్హా), యూసుఫ్ దేశాయ్, సికె నారాయణస్వామి, ఇతర జాతీయ నాయకులను కలిశాడు. విడుదలైన తరువాత కాంగ్రెసులో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన కాంగ్రెసు సోషలిష్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెసు నేతలంతా అరెష్టు చేయబడిన సమయంలో జయప్రకాశ్ నారాయణ్ రాంమనోహర్ లోహియా, బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఉద్యమాన్ని ముందుండి నడిపాడు. స్వాతంత్ర్యానంతరం జె.పి, ఆచార్య నరేంద్ర దేవ్, బాసవన్ సింగ్ మొదలైన వారితో కలసి కాంగ్రెసు నుండి బయటకు వచ్చి తమ సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీగా మారి బీహారు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించింది. సర్వోదయ 1954లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబా భావే యొక్క సర్వోదయ ఉద్యమానికి, దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశాడు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిబాగ్‌లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. జె.పి. త్వరితగతిన భారతదేశంలో మహాత్మా గాంధీ భావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందాడు. సంపూర్ణ క్రాంతి 1960 వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి బీహారు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనారంభించాడు. 1974లో బీహారులో జె.పి. నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం ఆతర్వాత బీహారు ఉద్యమంగా ప్రసిద్ధి పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవానికి జె.పి. పిలుపునిచ్చాడు. ఎమర్జెన్సీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీని దోషిగా పేర్కొంటూ అలహాబాదు హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి, మిలిటరీకి, పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ 1975 జూన్ 25 అర్థరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెనీ) ని విధించింది. జె.పి.ని, ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆఖరికి కాంగ్రెసు పార్టీ లోనే యంగ్ టర్క్‌లుగా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు. జె.పి. ఛండీఘడ్లో డిటెన్యూగా ఉంచబడ్డాడు. బీహారు వరదల సమయంలో అచటి పునరావాస కార్యక్రమాన్ని పర్యవేక్షించుటకు పెరోల్ పై విడుదల కోరినా కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డాడు. చివరికి ఇందిరా గాంధీ జనవరి 18, 1977న ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలను ప్రకటించడంతో ఆమెను ఎదుర్కోవటానికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా జె.పి.మార్గదర్శకత్వంలో జనతా పార్టీ రూపుదిద్దుకున్నది. చివరికి జనతా పార్టీ ఎన్నికలలో కాంగ్రెసును ఓడించి, ఇందిరను గద్దె దింపి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించింది. భారత రత్న భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అక్టోబరు 8, 1979లో మరణించాడు. మరణానంతరం 1998లో భారత ప్రభుత్వం ఇతనికి దేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్న ను ప్రకటించింది. ఇదిగాక జె.పి. చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 1965లో మెగసెసే అవార్డు ప్రకటించబడింది. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1902 జననాలు వర్గం:1979 మరణాలు వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
https://te.wikipedia.org/wiki/ఎం.ఎస్._సుబ్బులక్ష్మి
'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు. బాల్యము తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బులక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బులక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ఆల్బమ్ అందించింది. జీవితం thumb|right|200px|మీరా చిత్రంలో సుబ్బులక్ష్మి సుబ్బులక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బులక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం అయింది. సదాశివన్ తొలిభార్య కుమార్తె రాదను పెంచుకున్నారు. ఆ వివాహంతో మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బులక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. నటేశ అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె అతడి సరసన సుమతిగా నటించింది. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బులక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన 'మీరా' చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బులక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉంది. ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం thumb|right|ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ విగ్రహం. తిరుపతిలో సుబ్బులక్ష్మి పాడుతుంమల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజనపాడుతూ అందులోనే అమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు. ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది. స్వర సంకలనం గానం భాష సంవత్సరంఇతర వివరాలువెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవకోసం తిరుమల తిరుపతి దేవస్థానంవారికి గానం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంతెలుగుబ్రహ్మ కడిగిన పాదము...కీర్తన అన్నమాచార్య. వాతాపి గణ పతిం భజే...భజ గోవిందం మూడమతే... Iతిరుమల తిరుపతి దేవస్థానంవారి కోసంశ్రీ వెంకటేశ్వర పంచరత్నమాలరేడియో రేసిటాల్స్ వాల్యూమ్ 2 ఆడ మోడి గలదా...మ్యూజిక్ ఇండియా ఆన్ లైన్ వెబ్సైట్ నుండి...ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జూన్ 13,2008న సేకరించబడినది.రాగం : చారుకేశి తాళం : ఆది స్వరకర్త : త్యాగరాజు ఆల్బం : Radio Recitals Excerpts Vol 2ఆల్బం : సుబ్బులక్ష్మి ఎం.ఎస్ లైవ్అంబా నీ... రాగం: అతనా తాళం : ఆది స్వరకర్త : పాపనాసం శివన్ ఆల్బం : సుబ్బులక్ష్మి ఎం.ఎస్ లైవ్అరుల్ పురివై... రాగం : హంస ధ్వని తాళం : ఆది స్వరకర్త : సుబ్రహ్మణ్య భారతి ఆల్బం : ఎం.ఎస్.ఓల్డ్ జెమ్స్ thumb|తిరుపతి మునిసిపల్ పార్క్ వద్ద ఉన్న సుబ్బులక్ష్మి విగ్రహం చలనచిత్ర రంగం లో ఆధ్యాత్మిక సంగీతంలో తన పటిమతో పాటు ఇటు చలనచిత్ర రంగంలో కూడా తన ప్రతిభాపాటవాలను నిరూపించుకున్నారు ఎం.ఎస్. ఆమె నటించిన కొన్ని చిత్రాలు:ఎం ఎస్ సుబ్బలక్ష్మి సినీప్రస్థానం సంవత్సరం (సా.శ.) చలనచిత్రం భాష పాత్ర దర్శకుడు సంగీతం దర్శకుడు 1938 సేవాసదనం తమిళం సుమతి కె.సుబ్రమణ్యం పాపనాశం శివం 1941 సావిత్రి తమిళం నారద ముని వై.వీ.రావు కమలాదాస గుప్త & తురైయుర్ రాజగోపాల శర్మ 1945 మీరా తమిళం మీరాబాయి ఎల్లిస్ ఆర్. డంగెన్ ఎస్.వీ. వెంకటరామన్ 1947 మీరాబాయి హిందీ మీరాబాయి ఎల్లిస్ ఆర్. డంగెన్ ఎస్.వీ. వెంకటరామన్ పురస్కారాలు, సన్మానాలు తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, ఛేదించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని 'శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బులక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి. పురస్కారం పేరు బహూకరించింది సంవత్సరం (సా.శ.)ఇతర వివరాలు centre|125pxపద్మభూషణ్పద్మభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద ఎం.ఎస్.సుబ్బలక్ష్మిజూన్ 10,2008న సేకరించబడినది. భారత ప్రభుత్వం 1954బిరుదుసంగీతకళానిధిది మ్యూజిక్ అకాడమిచెన్నై, తమిళనాడు1965మొట్టమొదటి సారిగా అందుకున్న స్త్రీ గాయకురాలుడాక్టరేట్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అంధ్రప్రదేశ్1971డాక్టరేట్ఢిల్లీ యూనివర్సిటిఢిల్లీ1974రామన్ మెగసెసే పురస్కారంరామన్ మెగసెసె పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. జూన్ 10,2008న సేకరించబడినది. ఫిలిప్ఫీన్స్ ప్రభుత్వం1974centre|125pxపద్మవిభూషణ్భారత ప్రభుత్వం 1975డాక్టరేట్బెనారస్ యూనివర్సిటిఉత్తరప్రదేశ్1980డాక్టరేట్యూనివర్సిటి ఆఫ్ మద్రాస్తమిళనాడు1987కాళిదాస్ సమ్మాన్మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1988ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా అవార్డుభారత జాతీయ కాంగ్రెస్1990center|125pxభారతరత్నభారత ప్రభుత్వం1998 సంగీత విభాగం క్రింద మొట్టమొదటి సారిగా ఈ అత్యున్నత పురస్కారం అందుకుని చరిత్ర సృస్టించిన వ్యక్తి, స్త్రీ, గాయకురాలుజీవిత సాఫల్య పురస్కారంహిందూ పత్రిక వెబ్సైట్ నుండి Lifetime Achievement Award for M.S. Subbulakshmi జూన్ 10,2008న సేకరించబడినది. ( లైఫ్ టైం అచీవమెంట్ అవార్డు )ఢిల్లీ ప్రభుత్వం2004ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తనకు పురస్కారం క్రింద వచ్చిన 11 లక్షల రూపాయల నగదును స్వర్గీయ కంచి ఆచార్య చంద్రసేఖరేంద్ర సరస్వతీ స్మృతి కట్టడానికి విరాళమిచ్చారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గురించి ప్రచురణలు పుస్తకం పేరు భాష సంవత్సరం (సా.శ.)ఇతర వివరాలు centre|100pxఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్రసంకలన్ పరిచింది. టి.జే.ఎస్.జార్జిహిందూ పత్రిక వెబ్ సైట్ నుండి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర జూన్ 13,2008న సేకరించబడినది.ఇంగ్లీష్ 2004ప్రచురణ కర్త: హార్పెర్ కాలిన్స్ (Harper Collins) పేజీలు : 303 వెల: రూ.495 ఐ.ఎస్.బి.ఎన్ (ISBN) : 8172235275 పుస్తకం ఆన్ లైన్ ద్వారా కొనుటకు: ది హిందూ షాపింగ్ లింకు రిడిఫ్ బుక్స్ ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది. కాని ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుంది. ఇవికూడా చూడండి కర్ణాటక సంగీతం కౌషికి చక్రబర్తి లాల్గుడి జయరామన్ వెలుపలి లింకులు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గురించి రామన్ మెగసెసె అవార్డ్ వారి అధీకృత వెబ్సైట్ లో సంగ్రహ జీవిత చరిత్ర ఎం.ఎస్.సుబ్బులక్ష్మి-20వ శతాబ్దంలొ 100 మంది ప్రముఖ తమిళులు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవిత పరిచయం యూట్యుబ్ లో ఎం.ఎస్. గురించి ఫిల్మ్స్ డివిజన్ వారు చేసిన ఒక ఆంగ్ల డాక్యుమెంటరీ మూలాలు వర్గం:1916 జననాలు వర్గం:2004 మరణాలు వర్గం:కర్ణాటక సంగీతం వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు వర్గం:పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు వర్గం:సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు వర్గం:రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు వర్గం:భారతీయ మహిళా గాయకులు వర్గం:కాళిదాస్ సమ్మాన్ గ్రహీతలు వర్గం:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు వర్గం:ఈ వారం వ్యాసాలు
అరుణా అసఫ్ అలీ
https://te.wikipedia.org/wiki/అరుణా_అసఫ్_అలీ
అరుణా అసఫ్ అలీ (ఆంగ్లం Aruna Asaf Ali) (బెంగాళీ: অরুণা আসফ আলী) (జూలై 16, 1909 - జూలై 29, 1996) ప్రసిద్ధ భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మెట్టమొదటి మేయర్. ఈమెకు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది. తొలి జీవితం అరుణా గంగూలీ, హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాళీ బ్రహ్మసమాజ కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం లాహోరు, నైనీతాల్ లలో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. దేశములోని అప్పటి పరిస్థితుల్లో అది ఒక మహిళకు గొప్ప ఘనతే. ఈమె కలకత్తాలోని గోఖలే స్మారక పాఠశాలలో బోధించింది. అరుణకు భారత జాతీయ కాంగ్రేసు నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయమేర్పడింది. ఈ పరిచయం పెళ్ళికి దారితీసింది. అరుణ తల్లితండ్రులు మతాలు వేరు (ఈమె హిందూ, అతను ముస్లిం), వయోభేదము (ఇద్దరికీ వయసులో 20 ఏళ్ళకి పైగా తేడా) ఎక్కువన్న భావనతో ఆ పెళ్ళిని వ్యతిరేకించినా 1928లో అసఫ్ అలీని వివాహమాడింది. కుటుంబం అరుణ తండ్రి ఉపేంద్రనాథ్ గంగూలీ తూర్పు బెంగాల్లోని బరిసాల్ జిల్లాకు చెందినవాడు. అయితే సంయుక్త రాష్ట్రాల్లో (యునైటెడ్ ప్రావిన్స్)లో స్థిరపడ్డాడు. ఆయన ఒక రెస్టారెంటు యజమాని, సాహసికుడు. ఈమె తల్లి అంబాలికా దేవి, అనేక హృద్యమైన బ్రహ్మసమాజ ప్రార్థనాగీతాలు రచించిన ప్రముఖ బ్రహ్మజ నాయకుడు త్రైలోక్యనాథ్ సన్యాల్ యొక్క కూతురు. ఉపేంద్రనాథ్ గంగూలీ యొక్క చిన్నతమ్ముడు ధీరేంద్రనాథ్ గంగూలీ తొలితరం భారతీయ సినిమా దర్శకుడు. ఇంకో సోదరుడు నాగేంద్రనాథ్, ఒక మృత్తికా జీవశాస్త్రజ్ఞుడు, రవీంద్రనాథ్ టాగూర్ యొక్క జీవించి ఉన్న ఏకైక కుమార్తె మీరాదేవిని పెళ్ళిచేసుకున్నాడు. కానీ, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు విడిపోయారు. అరుణ సోదరి, పూర్ణిమా బెనర్జీ భారత రాజ్యాంగ సభలో సభ్యురాలు. స్వాతంత్ర్యోద్యమం: తొలి రోజులు right|thumb|150px|అరుణా అసఫ్ అలీ స్మారక తపాలాబిళ్ళ వివాహము తర్వాత అరుణ భారత జాతీయ కాంగ్రేసులో క్రియాశీలక సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహములో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నది. ఈమెను దేశదిమ్మరి అనే అభియోగము మోపి అరెస్టు చేశారు. అందువల్ల రాజకీయ ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ-ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఈమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసేవరకు జైలును వదిలి వెళ్ళేది లేదని పట్టుబట్టారు. మహాత్మా గాంధీ కలుగజేసుకోవటంతో కానీ వీరు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజాఆందోళన వలన ఈమెను విడుదల చేశారు. 1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఈమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాలలో పాల్గొనలేదు పురస్కారాలు 1987 : ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం 1996 : భారతరత్న (మరణానంతరం) ఇవి కూడా చూడండి సుప్రసిద్ధ భారతీయులు - జాబితా మూలాలు ఇతర లింకులు An Obituary of Mrs. Aruna Asaf Ali by Inder Malhotra in The Guardian A write-up on Aruna Asaf Ali Another write-up on Aruna Asaf Ali వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:1909 జననాలు వర్గం:1996 మరణాలు వర్గం:హర్యానా వ్యక్తులు వర్గం:ఢిల్లీ స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:జవహర్ లాల్ నెహ్రూ అవార్డు గ్రహీతలు వర్గం:పశ్చిమ బెంగాల్ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు
గుల్జారీలాల్ నందా
https://te.wikipedia.org/wiki/గుల్జారీలాల్_నందా
thumb|right|232x232px|గుర్జారీలాల్ నందా గుర్జారీలాల్ నందా (జూలై 4, 1898 - జనవరి 15, 1998) Former PMs of India భారత జాతీయ రాజకీయనాయకుడు, ఆర్థికవేత్త. అతను కార్మిక సమస్యలపై ప్రత్యేకంగా కృషిచేసిన వ్యక్తి. అతను రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత, రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణం తర్వాత ఈ పదవిని అలంకరించాడు. రెండు సందర్భములలో ఇతను నెల రోజుల లోపే పదవిలో ఉన్నాడు. అతను భారత జాతీయ కాంగ్రేసు ప్రధానమంత్రిగా కొత్త నేత ఎన్నిన్నుకునే వరకు ఈ రెండు సందర్భాలలో పరిపాలన చేశాడు. 1997లో అతనికి భారత రత్న పురస్కారం లభించింది. ప్రారంభ జీవితం జననం నందా 1898 జూలై 4న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్యిత పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను లాహోర్, అమృత్‌సర్, ఆగ్రా, అలహాబాద్ లలో విద్యాభ్యాసం చేసాడు. పరిశోధనా కార్యకర్త అతను 1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశాడు. 1921 లో బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవిని పొందాడు. అదే సంవత్సరము బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా జరిగిన సహాయనిరాకరణోద్యమములో పాల్గొన్నాడు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్‌టైల్ కార్మిక సంఘము కార్యదర్శిగా చేరి 1946 వరకు అందులోనే కొనసాగాడు. 1932లో సత్యాగ్రహము చేసి జైలు కెళ్లాడు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపాడు. అతను 407/2000 సంఖ్యతో 1860 సొసైటీ చట్టం పరిధిలో రిజిస్టరు కాబడిన "అలహాబాదు విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల అసోసియేషన్" విడుదలచేసిన 42 సభ్యుల జాబితాలో "గర్వపడవలసిన పూర్వ విద్యార్థి" గా గౌరవింపబడ్డాడు.https://www.washingtonpost.com/archive/local/1998/01/18/deaths/3c6cae5b-af47-4075-a8b6-a3ce7c65702f/"" Internet Archive of Proud Past Alumni" అతని వివాహం లక్ష్మీ తో జరిగింది. వారికి ఇద్దరు కూమరులు ఒక కుమార్తె. అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులు బ్రిటిష్ రాజ్ అతను 1937లో బ్రిటిష్ ప్రభుత్వంలో బొంబాయి శాసనసభకు ఎన్నికైనాడు. తరువాత 1937 నుండి 1939 వరకు బొంబాయి ప్రభుత్వంలో పార్లమెంటు సెక్రటరీ గా (కార్మిక, ఎక్సైజ్ శాఖలు) తన సేవలనందించాడు. 1946 నుండి 1950 వరకు బొంబాయి ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అతను రాష్ట్ర శాసనసభలో కార్మిక వివాదాల బిల్లును ప్రవేశపెట్టడంలో విజయవంతంగా నాయకత్వం వహించాడు. అతను కస్తూర్బా మెమోరియల్ ట్రస్టు లో ఒక ట్రస్టీగా తన సేవలనంచించాడు. అతను హిందూస్థాన్ మజదూర్ సేవక్ సంఘ్ కు సెక్రటరీగా, బొంబాయి హౌసింగ్ బోర్డు కు చైర్మన్ గా తన సేవలనందించాడు. అతను జాతీయ ప్లానింగ్ కమిటీలోసభ్యుడు. అతను "ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్" ను నిర్వహించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఆ సంస్థకు అధ్యక్షునిగా భాద్యతలు చేపట్టాడు. 1947లో, అతను జెనీవా, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభలకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యాడు. ఆ సమావేశంలో "ప్రీడం ఆఫ్ అసోసియేషన్ కమిటి"లో పనిచేస్తూ అతను స్వీడన్, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, బెల్జియం, యు.కె దేశాలను సందర్శించి ఆ దేశాలలో గల కార్మికులు, వారి గృహ పరిస్థితులను అధ్యయనం చేసాడు. ఇండియన్ ప్లానింగ్ కమిషన్ మార్చి 1950లో అతను భారత ప్లానింగ్ కమీషన్ లో వైస్ చైర్మన్ గా చేరాడు. 1951 సెప్టెంబరులో అతను భారత ప్రభుత్వంలో ప్లానింగ్ మంత్రి గా నియమింపబడ్డాడు. అతనికి వ్యవసాయం, విద్యుత్ శాఖలను కూడా అదనంగా కేటాయించారు. 1952 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను మరలా ప్లానింగ్, వ్యవసాయం, విద్యుత్ శాఖలకు మంత్రిగా మనలా నియమితుడయ్యాడు. అతను 1955 లో సింగపూర్ లో జరిగిన ప్లాన్ కన్సల్టేటివ్ కమిటీకి భారతీయ ప్రతినిధులకు నాయకత్వం వహించాడు. 1959 లోజెనీవా జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశాలలో పాల్గొన్నాడు. లోక్‌సభ సభ్యుడు నందా 1957 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను కార్మిక, ఉపాధి, ప్లానింగ్ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేసాడు. తరువాత అతను ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మంగా భాద్యతలు చేపట్టాడు. అతను 1959లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, యుగోస్లేవియా, ఆస్ట్రియా దేశాలకు పర్యటించాడు. నందా 1962 ఎన్నికలలో లోక్‌సభకు గుజరాత్ లోని శంబర్‌కాంత నియోజకవర్గంనుండి తిరిగి ఎన్నికయ్యాడు. అతను సామ్యవాద నిర్మాణం కోసం కాంగ్రెస్ ఫోరం ప్రారంభించాడు. అతను 1962 – 1963 కాలంలో కార్మిక, ఉపాధి శాఖలకు కేంద్రమంత్రిగాను, 1963 – 1966 కాలంలో హోం మంత్రిగానూ పదవులను చేపట్టాడు. అతను 1967,1971 లోక్‌సభ ఎన్నికలలో తిరిగి హర్యానాలోని కైతల్ నియోజవవర్గం నుండి ఎన్నికైనాడు. 1970 – 1971 కాలంలో రైల్వే శాఖకు కేంద్రమంత్రిగా తన సేవలనందించాడు. ఆపద్ధర్మ ప్రధానమంత్రి నందా భారతదేశానికి రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా భాద్యతలను చేపట్టాడు. మొదటి సారి 1964 లో భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం తరువాత 13 రోజులు, రెండవసారి 1966లో లాల్‌బహదూర్ శాస్త్రి మరణం తరువాత 13 రోజులు ఈ పదవిని చేపట్టాడు.Former PMs of India రెండు కాలాలలోనూ అతను ఏవిధమైన గొప్పతనం పొందనప్పటికీ ఆ కాలం దేశంలో అతి సున్నితమైన ముఖ్యమైనది. నెహ్రూ మరణం తరువాత 1962 చైనా యుద్ధం, శాస్త్రి మరణం తరువాత 1985 పాకిస్థాన్ యుద్ధం జరిగినందున ఈ సమయం దేశానికి ప్రమాదకరమైనది. నందా 1998 జనవరి 15న తన 99వ యేట మరణించాడు. https://www.washingtonpost.com/archive/local/1998/01/18/deaths/3c6cae5b-af47-4075-a8b6-a3ce7c65702f/ మూలాలు ఇతర పఠనాలు |- |- |- |- |- వర్గం:1898 జననాలు వర్గం:1998 మరణాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1వ లోక్‌సభ సభ్యులు వర్గం:2వ లోక్‌సభ సభ్యులు వర్గం:3వ లోక్‌సభ సభ్యులు
కె.కామరాజ్
https://te.wikipedia.org/wiki/కె.కామరాజ్
కె. కామరాజ్ గా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కామరాజ్ (Kamaraj Kumaraswami) (తమిళం: காமராஜ்) (జూలై 15 1903 – అక్టోబర్ 2 1975) తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు. భారత రత్న పురస్కార గ్రహీత. ఇందిరా గాంధీని ప్రధానమంత్రి చెయ్యటంలో ఈయన పోషించిన పాత్రకు గాను భారత రాజకీయాలలో కింగ్‌మేకర్‌గా పేరొందాడు. అతను రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అఖండ విజయంతో గెలుపొందింది. అప్పటికే అనేక లుక లుకలతో ఉన్న జాతీయ కాంగ్రెస్‌ను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్థుడిగా ఉన్న కామరాజ్‌ నాడార్‌ గొప్ప పోరాట యోధుడు. ప్రజల నుండి వచ్చి, పెద్దగా చదువుకోకున్నా ప్రజల జీవితాలను చదివినాడు కామరాజ్‌. నిరుపేద కల్లుగీత కుటుంబంలో పుట్టిన అతను ప్రజల కోసమే జీవితం అంకితం చేసి, పెళ్ళి కూడా చేసుకోలేదు. అతను రాజకీయ శక్తిగా ఎదగడానికి కారణం చిన్నతనం నుండి రాజకీయాల పట్ల మక్కువ ఎక్కువగా ఉండడమే. 1929 నాటికే కామరాజ్‌ కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకుడైన సత్యమూర్తికి సహచరుడిగా ఉండేవాడు.అతను సత్యమూర్తిని రాజకీయ గురువుగా భావించేవాడు. అంతేకాకుండా ప్రముఖ సంఘ సేవకుడు నారాయణ గురు ప్రభావం కామరాజ్‌ పై ఉండేది. బ్రాహ్మణ వ్యతిరేక పోరాటంలో ముందు ఉన్నాడు. తమిళనాట కల్లుగీత కులాలవారిని అంటరాని జాతిగా చూసేవారు. గుడి, బడి, సామాజిక హోదా కోసం కామరాజ్‌ నాడార్‌ శక్తికొద్ది ఉద్యమాలు నడిపాడు. అనతి కాలంలోనే కల్లుగీత, ఇతర అణగారిన కులాల నాయకుడిగా ఎదిగాడు. ఇదే సమయంలో సత్యమూర్తితో కాంగ్రెస్‌ పార్టీ తరపున రాష్ట్రమంతటా తిరగడం ద్వారా మంచి అనుభవం, పలుకుబడి కలిగిన వ్యక్తిగా రూపొందాడు. అనంతర కాలంలో తమిళనాడు కాంగ్రెస్‌లో గొప్ప శక్తిగా ఎదిగాడు. 1930లో మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. అనేక సందర్భాలలో దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో 8 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 1931లో తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. 1937లో కాంగ్రెస్‌ అసెంబ్లీ నుండి పోటీ చేశాడు. చారిత్రక విరూద్‌నగర్‌, శివకాశి వంటి ప్రాముఖ్యం కలిగిన ప్టణాలు ఉన్న ఈ నియోజకవర్గంలో కల్లుగీత కులస్థులైన నాడార్లు ఎక్కువగా జస్టిస్‌ పార్టీలోనే ఉండేవారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నుండి కామరాజ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జాతీయ కాంగ్రెస్‌ నాయకుల దృష్టికి వచ్చింది. దీనితో అతను ఇందిరాగాంధీకి దగ్గరయ్యాడు. అదే సమయంలో తమిళనాడులో పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు వెల్లువెత్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి బహుజన కులాలకు వ్యతిరేక చర్యలు తీసుకోవడంతో పెరియార్‌ రామస్వామి పెద్ద ఆందోళన చేపట్టాడు. దానితో రాజగోపాలాచారి స్థానంలో కామరాజ్‌ నాడార్‌ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాడు. ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన కామరాజ్‌కు సామాన్యుల సమస్యలు తెలుసు కాబట్టి, వారి బాగు కోసం శక్తి మేరకు కృషి చేశాడు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాడు. వెనుకబడిన కులాల జాబితాలోని అన్ని కులాలకు ఉద్యోగ, విద్యా రంగాల రిజర్వేషన్లలో, బడ్జెట్‌లో పెద్ద పీఠం వేయడం అతను కృషితోనే సాధ్యమయింది. 1954 నుండి 1963 వరకు కామరాజ్‌ నాడార్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో కామరాజ్ చెరగని ముద్ర వేశాడు. ఆ తర్వాత తమిళనాడులో అనేక సామాజిక కోణాల నుండి కొత్త రాజకీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి. కామరాజ్‌ పరిపాలనను అన్ని వర్గాల వారు గౌరవించారు. ఆ తర్వాత కామరాజ్‌ నాడార్‌ 1969 నాటికి జాతీయ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ప్రవేశించారు. జాతీయ కాంగ్రెస్‌ అత్యున్నత అధ్యక్ష బాధ్యతను కామరాజ్‌కు అప్పగించింది. భారత స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్న కామరాజ్, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అత్యంత సన్నిహితుడు. నెహ్రూ మరణము తర్వాత 1964లో లాల్ బహదూర్ శాస్త్రిని, అతను తర్వాత 1966లో ఇందిరా గాంధీని ప్రధాని చేయటంలో కామరాజ్ ప్రధానపాత్ర పోషించాడు. ఈయన అనుయాయులు అభిమానముతో ఈయన్ను దక్షిణ గాంధీ, నల్ల గాంధీ అని పిలిచేవారు. ఈయన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, 1957లో కామరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యను, పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి అనేక లక్షలమంది గ్రామీణ పేదప్రజలకు విద్యావకాశము కల్పించినందుకు నేటికీ ప్రశంసలందుకున్నాడు. 1976లో ఈయన మరణాంతరము భారత అత్యున్నత పౌరపురస్కారము భారతరత్నను అందుకున్నాడు. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:1903 జననాలు వర్గం:1975 మరణాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:తమిళనాడు ముఖ్యమంత్రులు వర్గం:భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు వర్గం:1వ లోక్‌సభ సభ్యులు వర్గం:4వ లోక్‌సభ సభ్యులు వర్గం:5వ లోక్‌సభ సభ్యులు
జాకిర్ హుసేన్
https://te.wikipedia.org/wiki/జాకిర్_హుసేన్
జాకిర్ హుస్సేన్ (ఫిబ్రవరి 8, 1897 - మే 3, 1969), భారత 3వ రాష్ట్రపతి (మే 13 1967 నుండి 1969 మే 3 న మరణించినంతవరకు) హుసేన్ హైదరాబాదు (భారతదేశం) లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు హైదరాబాదు నుండి ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ కు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని 'ఇస్లామియా ఉన్నత పాఠశాల' లో చదువుకున్నాడు, ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజిలో అభ్యసించాడు. ఇచట విద్యార్థిసంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. హుసేన్ 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయముస్లింవిశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిల్లియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. తరువాత ఇతను విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేసేందుకు, 'బెర్లిన్ విశ్వవిద్యాలయానికి (జర్మనీ) వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ, కవితాసంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జామియా మిల్లియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా మారాడు. బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీతో చేతులుకలిపి, "బేసిక్ విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమ దార్శనికుడిగా, భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నా చేతగూడా పొగడబడ్డాడు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశభక్తుడు. భారత స్వాతంత్ర్యం తరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో ఉంచుటకు, ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు. బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది. ఇవి కూడా చూడండి జాకిర్ హుసేన్ గ్రంథాలయం రాష్ట్రపతి భవనం మూలాలు ఇతను రాష్టపతి పదవీకాలంలో మరణించిన ప్రథమ రాష్ట్రపతి, ( 1969 మే 3) వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1897 జననాలు వర్గం:1969 మరణాలు వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు వర్గం:బీహారు గవర్నర్లు వర్గం:ఆంధ్రప్రదేశ్ ముస్లిం నాయకులు వర్గం:రాజ్యసభ సభ్యులు వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు
మదర్ థెరిస్సా
https://te.wikipedia.org/wiki/మదర్_థెరిస్సా
దారిమార్పు మదర్ థెరీసా
రాజీవ్ గాంధీ
https://te.wikipedia.org/wiki/రాజీవ్_గాంధీ
రాజీవ్ గాంధీ, (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ ఖాన్ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఇతని వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇవికూడా చూడండి ఇందిరా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ కాంగ్రెసు పార్టీ సోనియా గాంధీ ప్రధానమంత్రి మూలాలు వెలుపలి లంకెలు వర్గం:1944 జననాలు వర్గం:1991 మరణాలు వర్గం:భారత ప్రధానమంత్రులు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:9వ లోక్‌సభ సభ్యులు వర్గం:నెహ్రూ-గాంధీ కుటుంబం వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు వర్గం:హత్య చేయబడ్డ భారతీయులు వర్గం:ఇందిరా గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు వర్గం:ఉత్తరప్రదేశ్ నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
ఔకు
https://te.wikipedia.org/wiki/ఔకు
ఔకు, నంద్యాల జిల్లా, ఔకు మండలం లోని గ్రామం, ఆ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నంద్యాల నుండి 70 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2871 ఇళ్లతో,11760 జనాభాతో 3166 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5764, ఆడవారి సంఖ్య 5996. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1479 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 271. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 594484.పిన్ కోడ్: 518124. ఇక్కడికి 40 కి.మీ.దూరంలో మంగంపేట దగ్గర కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉంది. గణాంకాలు 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,198. ఇందులో పురుషుల సంఖ్య 7,372, మహిళల సంఖ్య 6,826, గ్రామంలో నివాస గృహాలు 2,650 ఉన్నాయి. విద్యా సౌకర్యాలు గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాలఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, పాలీటెక్నిక్ బనగానపల్లెలోనూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, సమీప అనియత విద్యా కేంద్రం నంద్యాల లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలు లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం ఔకులో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు ఔకులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం ఔకులో భూ వినియోగం కింది విధంగా ఉంది: అడవి: 204 హెక్టార్లు వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 410 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 241 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 38 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 410 హెక్టార్లు బంజరు భూమి: 34 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 1826 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 1442 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 829 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు ఔకులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 400 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 45 హెక్టార్లు* చెరువులు: 382 హెక్టార్లు ఉత్పత్తి ఔకులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు శనగలు, వరి, జొన్నలు చరిత్ర ఔకు సంస్థానం 1473 కు పూర్వం విజయనగర సామ్రాజ్యము లో భాగంగా ఉండేది. ఇది ఆ సమయంలో దక్షిణ దక్కన్‌ ప్రాంతం లొని ఒక చిన్న రాజ్యం. ఇది ఉత్తరాన ఉన్న హైదరాబాదు నుండి దక్షిణాన ఉన్న బెంగుళూరు నుండి సమదూరంలో ఉంది ఔకు సంస్థానాధీశులు బుక్క1473-1481 బుక్క కుమారుడు (పేరు తెలియదు)1481-1508 తిమ్మ1508-1536 నల్ల తిమ్మ1536-1555 రఘునాథ1555-1558 పెద్ద క్రిష్ణమ1558-1588 చిన్న క్రిష్ణమ1588-1618 ఒలజాపతి I1618-1646 నరసింహ I1646-1668 రాఘవ1668-1691 పెద్ద కుమార రాఘవ1691-1735 అప్ప నరసింహ1735-1737 చెల్లమ1737-1739 నరసింహ II1739-1743 క్రిష్ణమ1743-1751 ఒలజాపతి II1751-1759 కుమార రాఘవ1759-1767 వెంకట నరసింహ1767-1771 నారాయణ1771-1785 కృష్ణ1785-1805 1805 తర్వాత ఔకు సంస్థానం హైదరాబాదు రాజ్యంలో విలీనమైంది. ఆర్థిక పరిస్థితి శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బనకచర్ల రెగ్యులేటర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఇక్కడి బాలెన్సింగు జలాశయానికి చేరి, ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తాయి. మూలాలు
జూలై 20
https://te.wikipedia.org/wiki/జూలై_20
జూలై 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరములో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి. సంఘటనలు 1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడా లోని పిక్టౌ (నొవ స్కాటియా) కి వచ్చారు. 1868: సిగరెట్లమీద మొదటిసారిగా 'టాక్స్ స్టాంపుల' ను వాడారు అమెరికాలో. 1871: బ్రిటిష్ కొలంబియా, కెనడా సమాఖ్యలో చేరింది. 1872: అమెరికన్ పేటెంట్ కార్యాలయం, వైర్‌లెస్ టెలిగ్రఫీ మొదటి పేటెంట్ మహ్లాన్ లూమిస్ అనే వ్యక్తికి ఇచ్చింది. 1878: హవాయిలో మొట్టమొదటి టెలిఫోన్ ని ప్రవేశ పెట్టారు. 1903: ఫోర్డ్ మోటార్ కంపెనీ తన మొట్టమొదటి కారును ఎగుమతి చేసింది. 1921: న్యూయార్క్ నగరం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఎయిర్ మెయిల్ సర్వీస్ మొదలైంది. 1930: వాషింగ్టన్, డి.సి. (జిల్లా రికార్డ్) 106 డిగ్రీల ఫారెన్ హీట్ (41 డిగ్రీల సెంటిగ్రేడ్). 1934: అయొవా రాష్ట్రం రికార్డు. అయొవా రాష్ట్రంలో ఉన్న 'కియోకుక్' లో 118 డిగ్రీల ఫారెన్ హీట్ (48 డిగ్రీల సెంటిగ్రేడ్). 1935: లాహోర్ లోని మసీదు విషయమై ముస్లిములకు, సిక్కులకు జరిగిన అల్లర్లలో, 11 మంది మరణించారు. 1944: రాస్తెన్ బర్గ్ లో జరిగిన మూడవ హత్యా ప్రయత్నం నుంచి, అడాల్ఫ్ హిట్లర్ తప్పించుకున్నాడు. 1947: ప్రధాని యు. అంగ్ సాన్ మీద, అతని మంత్రివర్గ సభ్యులుగా ఉన్న మరొక తొమ్మిది మంది మీద, హత్యా ప్రయత్నం చేసినందుకు, బర్మా (నేటి మియన్మార్) మాజీ ప్రధాని 'యు. సా' ని, మరొక 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1947: 1947 జూలై 19 న జరిగిన అభిప్రాయ సేకరణలో చాలా ఎక్కువ ఓట్లతో, వాయవ్య సరిహద్దు ప్రాంతం ప్రావిన్స్ (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) ప్రజలు, భారతదేశంలో కంటే, పాకిస్తాన్ లోనే చేరటానికి, తమ సమ్మతిని తెలిపారని, భారతదేశపు వైస్రాయి 1947 జూలై 20 తేదీన, చెప్పాడు. 1960: సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి). 1960: రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే. 1962: కొలంబియాలో జరిగిన భూకంపంలో 40మంది మరణించారు. 1969: భారత రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి పదవీ విరమణ. 1969: భారత రాష్ట్రపతిగా ఎం.హిదయతుల్లా పదవిని స్వీకరించాడు. 1974: టర్కీ సైన్యం సైప్రస్ మీద దాడి చేసింది. 1975: 'ది టైమ్స్', 'ది డెయిలీ టెలిగ్రాఫ్', 'న్యూస్ వీక్' పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి - ఎమెర్జెన్సీ కాలం) 1976: 'వైకింగ్ 1' అనే రోదసీ నౌక కుజగ్రహం మీద దిగింది. అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడిమీద దిగి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా, అమెరికా ఈ 'వైకింగ్ 1' ని ప్రయోగించింది. మొదటిసారిగా కుజుడి నేలమీద 'క్రిస్ ప్లానిటియా' అనే చోట (కుజుడి నేల మీద ఉన్న ఒక స్థలం పేరు) ఈ వైకింగ్ దిగింది. 1976: అమెరికా తన సైనిక దళాలను థాయ్‌లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది) 1989: బర్మాను పాలిస్తున్న సైనికా జుంటా ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకురాలు 'దా అంగ్ సాన్ సూ క్యి' ని గృహ నిర్బంధం (ఇంటిలో నుంచి బయటకు రాకుండా) లో ఉంచారు. 1990: లండన్ స్టాక్ ఎక్షేంజ్ పై ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ బాంబు పేల్చింది. జననాలు 1785: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు. 1822: గ్రెగర్ జాన్ మెండెల్, ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. 'లాస్ ఆఫ్ హెరెడిటీ' జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు. 1864: ఎరిక్ కార్ల్‌ఫెల్డ్, స్వీడన్. కవి. ( 1918 లో నోబెల్ బహుమతి తిరస్కారము. 1931 లో నోబెల్ బహుమతి మరణానంతరం ఇచ్చారు). 1892: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (మ.1969) 1919: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాడు. (మ.2008) 1920: లెవ్ అరోనిన్, యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు (1950) 1933: రొద్దం నరసింహ, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత. 1941: వ్లాదిమిర్ ఎ ల్యాఖోవ్, రోదసీ యాత్రికుడు (సోయుజ్ 32, టి-9) 1947: గెర్డ్ బిన్నింగ్ ఫ్రాంక్‌ఫర్ట్, ఫిజిసిస్ట్ (టన్నెలింగ్ మైక్రోస్కోప్ - నోబెల్ బహుమతి గ్రహీత 1986) 1969: గిరిజా షెత్తర్, తెలుగు సినిమా నటి. 1980: గ్రేసీ సింగ్, భారతీయ సినీనటి , భరత నాట్యం, ఒడిస్సీ, నృత్య కారిణి. 1983: వేణు ఊడుగుల, తెలుగు సినిమా దర్శకుడు. మరణాలు thumb|బ్రూస్ లీ 1937: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1874) 1951: జోర్డాన్ రాజు, అబ్దుల్లా ఇబిన్ హుస్సేన్, ని జెరూసలెంలో హత్య చేసారు. 1972: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930) 1973: బ్రూస్ లీ, ప్రపంచ యుద్ధ వీరుడు. (జ.1940) 1980: పర్వతనేని బ్రహ్మయ్య, పేరొందిన అకౌంటెంట్. (జ.1908) 2019: షీలా దీక్షిత్, దేశ రాజధాని ఢిల్లీకి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.(జ. 1938) 2023: చిలుకూరి రామచంద్రారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (జ. 1944) పండుగలు, జాతీయ దినాలు 1810 : కొలంబియా దేశం స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొంది. అంతర్జాతీయ చెస్ రోజు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 20 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు జూలై 19 - జూలై 21 - జూన్ 20 - ఆగష్టు 20 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
జూలై 21
https://te.wikipedia.org/wiki/జూలై_21
జూలై 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరములో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి. సంఘటనలు 0356 బి.సి. : హెరోస్ట్రేటస్ అనే యువకుడు, ప్రపంచపు 7 వింతలలో ఒకటైన, ఎఫెసిస్ లో ఉన్న ఆర్టెమిస్ ఆలయానికి, నిప్పు పెట్టాడు. 1588: స్పానిష్ ఆర్మడాని ఇంగ్లీష్ వారి నౌకాదళం ఓడించింది. 1667: బ్రేడా సంధి జరిగింది. దీనివలన రెండావ ఆంగ్లేయులు-డచ్చిదేశస్తుల మధ్య జరిగిన రెండవ యుద్ధం అంతమైంది. 1718: పస్సరోవిట్జ్ సంధి, ఒట్టోమన్ సామ్రాజ్యానికి, ఆస్ట్రియాకి, రిపబ్లిక్ ఆఫ్ వెనిస్ కి మధ్య జరిగింది. 1831: నెదర్లాండ్ నుంచి బెల్జియమ్ స్వాతంత్ర్యం పొందింది. లియోపోల్డ్ I రాజు అయ్యాడు. 1873: అయోవా (పశ్చిమ అమెరికా) రాష్ట్రంలోని అడేర్ దగ్గర జెస్సె జేమ్స్, జేమ్స్ యంగర్ ముఠా మొదటిసారిగా రైలు దోపిడీ చేసారు. 1904: కేమిల్లె జెనాట్జీ కారుని గంటకు 65.79 మైళ్ళ వేగంతో ప్రయాణించి, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 1931: సి.బి.ఎస్. టెలివిజన్ చానెల్, అమెరికా లో, తన 7 రోజుల రోజు వారీ ప్రసారాలను, క్రమం తప్పకుండా ప్రసారం చేయటం మొదలుపెట్టింది. 1934: గల్లిపొలిస్ (అమెరికాలోని ఓహియో రాష్ట్రం) లో 113 డిగ్రీల ఫారెన్‌హీట్ (45 డిగ్రీల సెంటిగ్రేడ్). ఇది ఓహియో రాష్ట్రంలో నమోదు అయిన రికార్డు. 1940: ఎస్తోనియా, లాత్వియా, లిథూనియా దేశాలను, సోవియట్ యూనియన్, తనలో కలిపి వేసుకుంది. 1944: జపాన్ ఆక్రమించిన 'గువామ్' అనే ప్రాంతాన్ని, అమెరికన్ దళాలు విడిపించాయి. (రెండవ ప్రపంచ యుద్ధం). 1949: అమెరికన్ సెనేట్ నార్త్ అట్లాంటిక్ సంధిని (నాటో)ని 82-13 ఓట్లతో రద్దు చేసింది. 1954: జెనీవా సమావేశంలో వియత్నాం దేశాన్ని, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలుగా విడదీసారు. 1954: ఫ్రాన్స్, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు, జెనీవాలో ఒప్పుకున్నది. 1959: ప్రపంచంలో మొట్టమొదటిగా అణుశక్తితో నడిచే వాణిజ్య నౌక 'సవన్నా' జల ప్రవేశం చేసింది. 1960: సిరిమావొ బండారునాయకె, శ్రీలంక (నాటి సిలోన్) ప్రధాన మంత్రి (ణి) గా పదవిని చేపట్టి, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానిగా, మొదటి మహిళా దేశాధినేత్రిగా గుర్తింపు పొందింది. (1960 జూలై 20 అని కూడా అంటారు) 1960: అఫ్రికాలో కటం(తం)గా దేశంగా ఆవిర్భవించింది. 1961: మెర్క్యురీ 4 (మెర్క్యురీ - రెడ్‌స్టోన్ 4 మిషన్) అనే రోదసీ నౌకను (లిబర్టీ బెల్ 7) గుస్ గ్రిస్సాం (రోదసీ యాత్రికుడు) తో అమెరికా ఆకాశంలోకి పంపింది. ఇతడు రోదసీలోకి వెళ్ళిన రెండవ అమెరికన్( సబ్-ఆర్బిటల్ మిషన్ అంటే రోదసీ లోనే తక్కువ ఎత్తులో, కక్ష్యలో, ప్రయాణించటం). (మెర్క్యురీ ప్రోగ్రాం) 1965: పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలు ప్రాంతీయ సహకార సంధిని చేసుకున్నాయి. 1978: ప్రపంచంలోనే అత్యంత బలమైన, 80 కె.జి. ల బరువున్న, 'సెయింట్ బెర్నార్డ్' జాతికి చెందిన కుక్క, 2909 కే.జి.ల బరువును 27 మీటర్ల దూరం లాగింది. ఈ జాతి కుక్కల గురించిన చరిత్ర, కధలు చదవండి. 1980: జీన్ క్లాడ్ డ్రోయెర్, పారిస్ లోని ఈపిల్ టవర్ని 2గంటల 18 నిమిషాలలో ఎక్కాడు. 1983: పోలిష్ ప్రభుత్వం 19 నెలల మార్షల్ లాని ఎత్తివేసింది. 1983: ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత వోస్తోక్ స్టేషను, అంటార్క్‌టికా ఖండంలో (-89.2 డిగ్రీల సెంటిగ్రేడ్ -128.6 డిగ్రీల ఫారెన్ హీట్) రికార్డ్ అయ్యింది. 1984: తూర్పు జర్మనీకి చెందిన 'మారిటా కోచ్' 200 మీటర్లను 21.71 సెకండ్లలో సాధించి మహిళల ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 1988: ఏరియేన్ -3 రాకెట్ ద్వారా 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపారు. అందులో ఒకటి భారత దేశానికి చెందినది. 1990: తూర్పు బెర్లిన్లో బెర్లిన్ గోడని తీసివేసినందుకు ఆనందంగా రాక్ కన్సర్ట్, 1,50,000 మంది ఒక పండుగలా జరుపుకున్నారు. 2005: లండన్లో బాంబు పేలుళ్ళు. అంతకు ముందు జూలై 7 న కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి. 2007: జె.కె. రౌలింగ్ రాసిన హారీ పాటర్ వరుస నవలలో చివరిదైన హారీ పాటర్ అండ్ ది డెత్లో హాలోస్ విడుదలైంది. జననాలు 1899: ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికన్ నవలా రచయిత. నోబెల్ బహుమతి గ్రహీత 1923: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2005) 1936: జె.బాపురెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, కవి, రచయిత (మ. 2023) 1940: శంకర్ సిన్హ్ వాఘేలా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. 1947: చేతన్ చౌహాన్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1961: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు.(మ.1988) 1966: అనురాధ (నటి), తెలుగు నృత్యతార, సుమారు 35 చిత్రాలలో నటించింది. 1969: పసునూరు శ్రీధర్ బాబు, పాత్రికేయుడు, కవి. 1989: వరుణ్ సందేశ్ , తెలుగు సినీనటుడు 1989: మధుశాలిని , తెలుగు, తమిళ నటి, వ్యాఖ్యాత , మోడల్ మరణాలు thumb|కుడి|గిడుగు రాజేశ్వరరావు 1796: రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి. 1948: అర్షిలె గోర్కీ, అబ్‌స్ట్రాక్ట్ ఎక్ష్‌ప్రెషనిస్ట్, 43వ ఏట. 1957: బెర్నార్డ్ స్పూనర్, అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను వ్యక్తి. 1998: అలాన్ షెపార్డ్, అమెరికాకు చెందిన మొదటి రోదసీ యాత్రికుడు. అపొలో-14 రోదసీ నౌకను నడిపి చంద్రుడిని చేరి, చంద్రుడి మీద నడిచిన 5వ మనిషి. 2001: శివాజీ గణేశన్ , ప్రసిద్ధ దక్షిణ భారత చలన చిత్ర నటుడు (జ.1928) 2009: గంగూబాయ్ హంగళ్, హిందుస్తాని గాయని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గ్రహీత. 2013: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (జ.1932) 2023:చిత్తరంజన్ , లలిత గీతాలు రచయిత , సంగీత దర్శకుడు, ఆకాశవాణి లో స్వరకల్పన.(జ.1938) పండుగలు , జాతీయ దినాలు 1831 : బెల్జియం జాతీయ దినోత్సవము. జాతీయ జంక్ ఫుడ్ డే. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై21 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు జూలై 20 - జూలై 22 - జూన్ 21 - ఆగష్టు 21 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
జూలై 22
https://te.wikipedia.org/wiki/జూలై_22
జూలై 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 203వ రోజు (లీపు సంవత్సరములో 204వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 162 రోజులు మిగిలినవి. సంఘటనలు 1099: మొదటి క్రూసేడ్ (మతయుద్ధం) : జెరూసలెమ్ రాజ్యాన్ని రక్షించడానికి 'బౌలియన్' కి చెందిన 'గాడ్‌ఫ్రే' ఎన్నికయ్యాడు. 1298: ఇంగీషు సైన్యం 'ఫాల్కిర్క్ యుద్ధం' లో 'స్కాట్స్' ని ఓడింఛింది. 1456: యూరప్ లో ఒట్టోమన్ యుద్ధాలు - బెల్‌గ్రేడ్ ముట్టడి. హంగరీ రాజప్రతినిధి, జాన్ హున్యాది, ఒట్టోమన్ రాజ్యానికి చెందిన 'మెహ్మెత్ II' ని ఓడించాడు. 1461: రాజైన ఛార్లెస్ VII, (1422-61) తన 58వ ఏట మరణించాడు. 1587: ఇంగ్లీషు వారి రెండవ వలస 'రోనోక్ దీవి' (నార్త్ కరోలినా) లో వెలిసింది. 1686: 'అల్బనీ' ( న్యూయార్క్), మునిసిపాలిటీగా ఏర్పడింది. 1763: 'కేథరిన్ II' విదేశీయులను రష్యా లో శాశ్వత నివాసానికి ఆహ్వానించింది. చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపారు. 1775: జార్జ్ వాషింగ్టన్ అమెరికన్ సైన్యం అధిపతి అయ్యాడు. 1796: జనరల్ మోజెస్ క్లీవ్ లాండ్, ఓహియో రాష్ట్రంలో, 'క్లీవ్‌లాండ్' నగరాన్ని స్థాపించాడు. క్లీవ్‌లాండ్, కనెక్టికట్ లాండ్ కంపెనీ అనే సర్వే కంపెనీ, అధిపతిగా ఉండే వాడు. 1812: 'సలమాంకా యుద్ధం' (స్పెయిన్) - ఆర్ధర్ వెలెస్లీ నాయకత్వంలోని (తరువాత వెల్లింగ్టన్ డ్యూక్) బ్రిటిష్ సైన్యం, ఫ్రెంచి సైన్యాన్ని ఓడించింది. 1854: గ్రహశకలం (అస్టరాయిడ్) #30 యురేనియాని 'జె.ఆర్. హింద్' కనుగొన్నాడు. 1898: బెల్జియన్ సిబ్బంది (బెల్జికా క్రూ అని వీరికి పేరు), అంటార్కిటికా పరిశోధనకు వెళ్ళారు. వారంతా, బయలు దేరిన, 1600 గంటల తరువాత, అంటార్కిటికా శీతాకాలంలో, సూర్యోదయాన్ని చూసారు. 1908 : అమి వాండెర్‌బిల్ట్. ఈమె 'కంప్లీట్ బుక్ ఆఫ్ ఎటికెట్ (ఎటిక్వెట్) రాసింది. ఎటికెట్ అంటే మర్యాదలు అనుకోవచ్చును. ఎందుకంటే ఇంగ్లీషులో కూడా ఈ పదాన్ని సరిగా నిర్వచించలేదు. 1908 : విలియం లారెంజ్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) '#665 సబినె (సబిన్) ' ని కనుగొన్నాడు. 1912 : స్పెయిన్ లోని స్టాక్ హోమ్ లో 5వ ఒలింపిక్ గేమ్స్ పూర్తి అయ్యాయి. 1917 : అలెగ్జాండర్ కెరెన్‌స్కీ రష్యా కి ప్రధాన మంత్రి అయ్యాడు 1917 : ఎమ్. వుల్ఫ్ మూడు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు. ఆ మూడింటి పేర్లు '#879 రికార్డా', '#880 హెర్బా', '#881 అథెనె'. 1926 : 'వాటర్‌బరి' (కనెక్టికట్) రాష్ట్రం లోని ఉష్ణోగ్రత రికార్డు. 105 డిగ్రీల ఫారెన్ హీట్, 41 డిగ్రీల సెంటిగ్రేడ్. 1926 : 'ట్రాయ్' (న్యూయార్క్) రాష్ట్రం ఉష్ణోగ్రత రికార్డు. 108 డిగ్రీల ఫారెన్ హీట్, 42 డిగ్రీల సెంటిగ్రేడ్. 1930 : '#1306 స్కిథియా' అనే పేరుగల గ్రహశకలా న్ని (ఆస్టరాయిడ్) 'జి. న్యూజ్మిన్' కనుగొన్నాడు. 1930 : హెండ్రిక్ వాన్ జెంట్ రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్) ను కనుగొన్నాడు. వాటి పేర్లు '#1666 వాన్ జెంట్', '#1752 వాన్ హెర్క్'. అలాగే చంద్రుడి అవతలి భాగంలో ఉన్న ఒక క్రేటర్ కి ఇతని పేరు మీద 'వాన్ జెంట్' అని పేరు పెట్టారు. 1933 : విలీ పోస్ట్ ఒంటరిగా 15,596 మైళ్ళు 7 రోజుల 18 గంటల 45 నిమిషాలలో విమానంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి. 1935 : సి. జాక్సన్ రెండు గ్రహశకలాల ను (ఆస్టెరాయిడ్స్) కనుగొన్నాడు. అవి #1359 ప్రియెస్కా, #1360 తార్కా. 1939 : మొదటి నల్లజాతి న్యాయాధికారిణి (స్త్రీ) పేరు జేన్ మటిల్డా బోలిన్, న్యూయార్క్. 1942 : యూదుల నువార్సా ఘెట్టో నుంచి టెబ్లింకా కు ఒక పద్ధతిగా (రోజుకి 6 వేల నుంచి 7 వేల మందిని) చేరవేయటం (వారిని చంపటానికి. అలా చనిపోయిన వారు ఎంత తక్కువగా చూసినా 3 లక్షలమంది ఉంటారు) మొదలైన రోజు. 1944 : పోలాండ్ లిబరేషన్ డే. 1947: పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం భారత జాతీయజెండా గా ఆమోదించబడింది. 1962 : శుక్ర గ్రహాని కి పంపటానికి తయారు చేసిన అమెరికన్ రోదసీ నౌక మారినర్ 1, ప్రయోగించేదశలోనే పడిపోయింది 1963 : బీటిల్స్ (నలుగురు గాయకుల గుంపు) 'ఇంట్రడ్యూసింగ్ ది బీటిల్స్' అనే మొదటి ఆల్బంని విడుదల చేసారు. 1969 : యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) స్పుత్న్కి 50, మొల్నియల్-12 అనే రెండు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది. 1972 : రష్యా ప్రయోగించిన వెనెరా 8 పేరు గల రోదసీ నౌక శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగింది. 1983 : డిక్ స్మిత్ హెలికాప్టర్ మీద ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి. 1987 : సోయుజ్ టి.ఎమ్-3 అనే రోదసీ నౌకను ముగ్గురు రోదసీయాత్రికులతో (అందులో ఒకడు సిరియా దేశస్థుడు) రష్యా ప్రయోగించింది. 1988 : ఫ్రెంచి గయానా (కౌరు) నుంచి ఇన్సాట్ 1-సి ప్రయోగించారు. 1999 : మైక్రోసాప్ట్ కంపెనీ ఎమ్.ఎస్.ఎన్. మెసెంజర్ మొదటి వెర్షన్ (మొదటి తరం) ని విడుదల చేసింది. జననాలు thumb|గ్రెగర్ మెండెల్ 1822: గ్రెగర్ మెండల్, జన్యుశాస్త్రం లో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (మ.1884) 1887: గుస్టావ్ లుడ్విగ్ హెర్ట్‌జ్, జర్మన్ క్వాంటమ్ శాస్త్రవేత్త (1925 లో నోబెల్ బహుమతి గ్రహీత). ఇతని బంధువైన హీన్‌రిఛ్ రుడాల్ఫ్ హెర్ట్‌జ్ పేరుతో రేడియో తరంగాలకు (హెర్ట్‌జ్) గా పేరు పెట్టారు. 1916: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (మ.1977) 1923: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (మ.1976) 1922: పుట్టపర్తి కనకమ్మ, సంస్కృతాంధ్ర కవయిత్రి, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు భార్య. (మ.1983) 1925: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (మ.1987) 1940: యూరి పి అర్త్యుఖిన్, రోదసీయాత్రికుడు (సోయుజ్ 14). 1965: రాగతి పండరీబాయి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (మ.2015). 1995: అర్మాన్ మాలిక్ , గేయ రచయిత, సింగర్. 1959: బోయినపల్లి వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు, న్యాయవాది. 2002: నకరకంటి దివ్య, ముకుందపురం, సూర్యపేట జిల్లా, తెలంగాణ. మరణాలు 1826: గియుసెప్పె పియజ్జి, మొదటి గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్న శాస్త్రవేత్త. 1987: ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (జ.1933) 2003: 'ఉదయ్', ఖుసే హుస్సేన్', సద్దాం హుస్సేన్ కుమారులు. ఉత్తర ఇరాక్ లో జరిగిన యుద్ధంలో, తుపాకీ కాల్పులకు మరణించారని అమెరికా ప్రకటించింది. పండుగలు, జాతీయ దినాలు 1944: పోలండ్ జాతీయదినోత్సవం. - మ్యాంగో డే. వరల్డ్ బ్రెయిన్ డే బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 22 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు జూలై 21 - జూలై 23 - జూన్ 22 - ఆగష్టు 22 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
జూలై 23
https://te.wikipedia.org/wiki/జూలై_23
జూలై 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 204వ రోజు (లీపు సంవత్సరములో 205వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 161 రోజులు మిగిలినవి. సంఘటనలు 0636: బైజాంటైన్ సామ్రాజ్యం నుంచి అరబ్బులు పాలస్తీనా లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాధించారు. 0685: కేథలిక్ పోప్ గా జాన్ V తన పాలన మొదలుపెట్టాడు. 1253: పోప్ ఇన్నోసెంట్ III, వియెన్నె ఫ్రాన్స్ నుంచి యూదులను బహిష్కరించాడు. 1298: ఉర్జుబర్గ్, జర్మనీ లోని ఉర్జుబర్గ్ లో యూదులను ఊచకోత (హత్యాకాండ) కోసారు. 1798: నెపోలియన్, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాను పట్టుకున్నాడు. 1829: విలియం ఆస్టిన్ బర్ట్ 'టైపోగ్రాఫర్' (టైప్‌రైటర్) కి పేటెంట్ పొందాడు. 1871: సి.హెచ్.ఎఫ్. పీటర్స్, గ్రహశకలం (ఆస్టరాయిడ్) #114 కస్సండ్రను కనుగొన్నాడు. 1877: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను హవాయిలో పూర్తి చేసారు. 1877: మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ (సిన్సిన్నాతి సదరన్) మొదలైంది. 1880: మిచిగాన్ లోని గ్రాండ్ రేపిడ్స్ లో మొదటి వాణిజ్య జలవిద్యుత్ కేంద్రం మొదలైంది. 1895: ఎ. ఛార్లోయిస్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) #405 థియని కనుగొన్నాడు. 1904: 'లా పర్చేజ్ ఎక్ష్పో' ప్రదర్శన జరుగుతున్నప్పుడు, 'ఛార్లెస్ ఇ. మెంచెస్', 'ఐస్ క్రీం కోన్' ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. 1908: 'ఎ. కోఫ్' #666 డెస్‌డెమొన, #667 డెనైస్ అనే పేర్లు గల రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు. 1909: 'ఎమ్. ఉల్ఫ్', '#683 లాంజియ' పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్నాడు. 1920: కీన్యా బ్రిటిష్ సామ్రాజ్యం లో వలసగా మారింది. 1921: అమెరికాకు చెందిన 'ఎడ్వర్డ్ గౌర్డిన్' లాంగ్ జంప్ లో రికార్డు 25' 2 3/4" సాధించాడు. 1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1932: '#1246 ఛక' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు. 1937: 'పిట్యూటరీ హార్మోన్' ని వేరు చేసినట్లుగా 'యేల్ యూనివెర్సిటీ' ప్రకటించింది. 1938: '#1468 జోంబ' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు. 1947: మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ) 1952: ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం) 1955: భారతీయ మజ్దూర్ సంఘ్ ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు. 1956: గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది. 1931: హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి బదిలీ చేసారు. 1964: ఈజిప్షియన్ ఆయుధాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా', బోనె (అల్జీరియా) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది. 1965: బీటిల్స్ (గాయకుల గుంపు), 'హెల్ప్' అనే ఆల్బంని యునైటెడ్ కింగ్‌డంలో విడుదల చేసారు. 1967: జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్ లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు. 1968: 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది. 1968: జాతుల వివక్షత కారణంగా, కీవ్‌ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు. 1972: మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు. 1973: సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు 1974: గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది. 1979: '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొన్నాడు. 1980: 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేసింది. 1984: 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది. 1987: తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది (మహిళల రికార్డు). 1987: మొరాకోకి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు. జననాలు thumb|Bal G. Tilak |accessdate=9 December 20141936: శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (మ.1973) 1856: బాలగంగాధర తిలక్, భారత జాతీయనేత. (మ.1920) 1870: రాయసం వెంకట శివుడు, రచయిత, పత్రికా సంపాదకులు, సంఘసంస్కర్త. (మ.1954) 1892: హేలి సెలాస్సీ, ఇతియోపియా (1930-1974) చక్రవర్తి (మ. 1975). 1893: కార్ల్ మెన్నింజెర్, మానసిక శాస్త్రవేత్త (మెన్నింజెర్ క్లినిక్) (మ.1990). 1906: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931) 1946: పులి వీరన్న, రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినాడు. 1949: కోడి రామకృష్ణ , తెలుగు చలనచిత్ర దర్శకుడు (మ.2019) 1953: గ్రాహం గూచ్, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1975: సూర్య, తమిళ నటుడు , నిర్మాత, టీ.వి.వ్యాఖ్యాత. 1986: గొట్టిముక్కుల రమాకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షులు, వరంగల్ అర్బన్ జిల్లా, తెలంగాణ. మరణాలు 1885: యులీసెస్ ఎస్. గ్రాంట్, 18వ అమెరికన్ ప్రెసిడెంట్, తన 63వ ఏట మౌంట్ మెక్‌గ్రెగర్, (న్యూయార్క్) లో చనిపోయాడు. 1916: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (జ.1852) 2004: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (జ.1932) 2013: మంజుల , తెలుగు చలనచిత్ర నటి (జ.1954) 2020: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (జ.1940) 2022: కార్టూనిస్ట్ పాప ఈనాడు పత్రికలో కార్టూన్లు గీసిన మొదటి తరం కార్టూనిస్టు. (జ.1944) పండుగలు, జాతీయ దినాలు 1952: ఈజిప్ట్ జాతీయదినోత్సవం. ఇథియోపియా జాతీయదినోత్సవం జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం (4 వ ఆదివారం) జాతీయ ప్రసార దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై 23 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు జూలై 22 - జూలై 24 - జూన్ 23 - ఆగష్టు 23 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
జూలై 24
https://te.wikipedia.org/wiki/జూలై_24
జూలై 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 205వ రోజు (లీపు సంవత్సరములో 206వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 160 రోజులు మిగిలినవి. సంఘటనలు 1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు. 1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి. 2022: నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. జననాలు thumb|భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేశుభాయ్ పటేల్‌ 1928: కేశూభాయి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. 1936: మొదలి నాగభూషణశర్మ, నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు. 1953: శ్రీవిద్య , భారతీయ చలనచిత్ర నటి, గాయని(మ.2006) 1975: విజయ్ ఆంటోనీ , సంగీత,దర్శకుడు,గాయకుడు, నటుడు ,నిర్మాత. 1976: కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ సభ్యుడు, మంత్రి. మరణాలు 1862: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. 1899: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (జ.1803) 1970: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు (జ.1890) 1971: గుర్రం జాషువా, తెలుగు కవి (జ.1895). 2000: ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు (జ.1924) 2014: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, భాషా శాస్త్రవేత్త (జ.1934) 2018: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (జ.1935) 2022: రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (జ. 1940) పండుగలు , జాతీయ దినాలు -జాతీయ ధర్మల్ ఇంజినీర్ దినోత్సవం ఆదాయపు పన్ను దినం . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జూలై24 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు జూలై 23 - జూలై 25 - జూన్ 24 - ఆగష్టు 24 -- అన్ని తేదీలు వర్గం:జూలై వర్గం:తేదీలు
దామోదరం సంజీవయ్య
https://te.wikipedia.org/wiki/దామోదరం_సంజీవయ్య
దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 - మే 8, 1972) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. 2022 ఫిబ్రవరి 14న సంజీవయ్య 101వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. బాల్యము , విద్యాభ్యాసము సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలంలో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడము వలన నేత పనిచేసి, కూలి చేసి జీవనము సాగించేవారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మునెయ్య చనిపోగా కుటుంబము మేనమామతో ప్యాలకుర్తికి తరలివెళ్లినది. అక్కడ సంజీవయ్య పశువులను కాసేవాడు. మూడు సంవత్సరాల తరువాత తిరిగి పెద్దపాడు చేరుకున్నారు. సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు. పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ పాఠశాలలో చేరాడు. 1935లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938లో SSLC (ఎస్.ఎస్.ఎల్.సీ) జిల్లాలోనే ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యాడు. ఉద్యోగాలు ఆ తరువాత చిన్నయ్య ఆర్థిక సహాయముతో అనంతపురం దత్తమండల కళాశాలలో గణితము, ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. 1942లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధము వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉంది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబరు 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటూ పనిచేశాడు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు. సంజీవయ్య 1946లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో 'ఎఫ్.ఎల్' (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ ఉన్నత పాఠశాలలో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు. లా చదువుతున్నపుడు సంజీవయ్యకు రోమన్ న్యాయానికి సంబంధించిన లాటిన్ పదాలు గుర్తుపెట్టుకోవడము కష్టమయ్యేది. లాలో ఆయనకు సహాధ్యాయి అయిన ప్రముఖ రచయిత రావిశాస్త్రి వాటిని తెలుగు పాటగా మలిచి పాడుకుంటే బాగా గుర్తుంటాయని సలహా ఇచ్చాడు. లా చదివే రోజుల్లో సంజీవయ్య చంద్రగుప్త అనే నాటకములో పాత్ర ధరించాడు. శివాజీ అనే ఇంకొక నాటకాన్ని తనే రచించి రంగస్థలము మీద ప్రదర్శించాడు. ఈయన గయోపాఖ్యానము గద్యముగా రచించాడు అయితే ఇందులో ఏ ఒక్కటి ప్రస్తుతము లభ్యము అవుటలేదు. లా పట్ట చేతపుచ్చుకొని సంజీవయ్య 1950 అక్టోబర్ లో మద్రాసు బార్ లో న్యాయవాదిగా నమోదు చేసుకొన్నాడు. ఈయన గణపతి వద్ద ఆ తరువాత జాస్తి సీతామహాలక్ష్మమ్మ వద్ద సహాయకునిగా పనిచేశాడు రాజకీయ రంగప్రవేశము సంజీవయ్యకు విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము, సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది. సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు. 1950 జనవరి 26న రాజ్యాంగము అమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించింది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదొ ఒకే సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చింది. షెడ్యూల్డ్ కులమునకు చెందిన ఎస్.నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వము అట్టిపెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానమును పూరించడానికి బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు కమిటీ తరఫున సంజీవయ్యను ఎంపిక చేశాడు. ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణస్వీకారము చేయడముతో 1952 మే 13 న ప్రొవిజనల్ పార్లమెంటు రద్దయినది. టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గములో ఆరోగ్యశాఖా మంత్రిగా ఉండగానే సికింద్రాబాదులో పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కృష్ణవేణిని సంజీవయ్య 1954, మే 7 న పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు. వీరికి సంతానము లేదు. సుజాత అను ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బకొట్టాలని కర్నూలు జిల్లాలోని బస్సురూట్లను జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. కనుక సంజీవయ్య శాసన సభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు. బలీయమైన రెడ్డి వర్గం ఎ.సి.సుబ్బారెడ్డి నాయకత్వాన ఎదురు తిరిగి సొంత పక్షం పెట్టుకున్నారు. 1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినపుడు సంజీవయ్య పోటీ చేద్దామనుకున్నారు కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ఎ.సి. సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను ఎద్దేవ చేసాడు.1962లో ముఖ్యమంత్రిగా దిగిపోయిన సంజీవయ్య, గవర్నరుకు రాజీనామా సమర్పించిన మర్నాడే సికిందరాబాదులో తన భార్యను వెంటబెట్టుకుని అజంతా టాకీసులో సినిమాకని నడచి వెళ్ళారు. త్రోవలో ఎస్.వి.పంతులు కనిపిస్తే రా పంతులూ సినిమాకి పోదాం అని ఆయనను కూడా వెంటబెట్టుకు వెళ్ళారు. సంజీవయ్య వ్రాసిన లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు. 1967లో ఎన్నికల ప్రచార సమయములో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. 1972 మే 7 వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు మే 9వ తేదీన సికింద్రాబాదులోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు. 2008 లో విశాఖపట్నంలో స్థాపితమైన ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీకి ఆయన జ్ఞాపకార్థం 2012 లోదామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని పేరుమార్చారు. నిర్వహించిన పదవులు 1950 - 1952 ప్రొవిజనల్ పార్లమెంటు సభ్యుడు 1952 ఏప్రిల్ 20 - 1953 అక్టోబర్ 1 మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడు. రాజాజీ మంత్రివర్గములో మద్రాసు రాష్ట్ర మున్సిపల్, సహకార శాఖా మంత్రి 1953 అక్టోబర్ 1 - 1954 నవంబర్ 15 ప్రకాశం మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య, హరిజనోద్ధరణ, పునరావాస శాఖా మంత్రి 1955 మార్చి 28 - 1956 నవంబర్ 1 బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గములో ఆంధ్ర రాష్ట్ర రవాణా, వాణిజ్య పన్నుల శాఖా మంత్రి 1956 నవంబర్ 1 - 1960 జనవరి 10 నీలం సంజీవరెడ్డి మంత్రివర్గములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రమ, స్థానిక స్వయంపరిపాలనా శాఖా మంత్రి 1960 జనవరి 11 - 1962 మార్చి 29 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి. 1962 జూన్ - 1964 జనవరి 6 అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు. 1964 జనవరి 24 - 1964 జూన్ 9 నెహ్రూ ప్రభుత్వములో కేంద్ర శ్రమ, ఉద్యోగ శాఖామంత్రి 1964 జూన్ 9 - 1966 జనవరి 23 లాల్ బహుదూర్ శాస్త్రి ప్రభుత్వములో కేంద్ర శ్రమ, ఉద్యోగ శాఖామంత్రి 1966 జనవరి 24 - 1967 మార్చి 12 ఇందిరా గాంధీ ప్రభుత్వములో కేంద్ర పరిశ్రమల శాఖామంత్రి 1970 ఫిబ్రవరి 18 - 1971 మార్చి 18 ఇందిరా గాంధీ ప్రభుత్వములో కేంద్ర శ్రమ, పునరావాస శాఖామంత్రి 1971 మార్చి 18 - 1972 మే 7 అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు. మూలాలు బయటి లింకులు ఇది నిజమైన జన్మ దినము కాకపోవచ్చు. ఆ రోజుల్లో సంజీవయ్య జన్మదినమును నమోదు చేయలేదు కాబట్టి బడిలో చేరే సమయములో సంజీవయ్యను జన్మదినము అడిగినప్పుడు ఆయన ఫిబ్రవరి 14 ను ఎంచుకున్నాడు. దామోదరం సంజీవయ్య అండ్ హిజ్ టైంస్ - ఆచార్య జీ.వెంకట్రాజం (ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధనా గ్రంథము) (ఆంగ్లములో) శిధిలావస్థలో ఉన్న సంజీవయ్య పూర్వీకుల గృహము వర్గం:కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వర్గం:1921 జననాలు వర్గం:1972 మరణాలు వర్గం:3వ లోక్‌సభ సభ్యులు వర్గం:4వ లోక్‌సభ సభ్యులు వర్గం:కర్నూలు జిల్లా రాజకీయ నాయకులు వర్గం:ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులు వర్గం:కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రులు వర్గం:కర్నూలు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు వర్గం:మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గం:మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన సభ్యులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గం:ఆంధ్ర రాష్ట్రంలో శాసన సభ్యులు వర్గం:కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మంత్రులు వర్గం:కర్నూలు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు వర్గం:కర్నూలు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వర్గం:ఈ వారం వ్యాసాలు
టంగుటూరి అంజయ్య
https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య
టంగుటూరి అంజయ్య (ఆగష్టు 16,1919 - అక్టోబరు 19,1986), రామాయంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా. అతను 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. జీవిత విశేషాలు టి. అంజయ్యగా సుపరిచితుడైన టంగుటూరి అంజయ్య అలియాస్ తాళ్ళ రామకృష్ణారెడ్డి 1919, ఆగష్టు 16 న హైదరాబాదు లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలంలోని భానూర్ గ్రామం. అయితే వారి కుటుంబం హైదరాబాదు లో స్థిరపడింది. అంజయ్య వెనుకబడిన కులానికి లేదా దళిత వర్గానికి చెందినవారని లేదా గౌడ కులం, రెడ్డికులం వారితో సాన్నిహిత్యం ఏర్పరచుకోన్నారని తన పేరును రామకృష్ణారెడ్డి అని మార్చుకున్నారని, తన ముఖ్యమంత్రి పదవీకాలానికి రాజకీయంగా శక్తివంతమైన రెడ్డి సంఘం మద్దతు పొందటానికి రెడ్డి కులస్తులతో వైవాహిక సంబంధాలు కుదుర్చుకున్నారని అతనిపై ఆరోపణలున్నాయి. అంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నాడు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తరువాత ఉన్నత విద్యాభాసం చేయలేదు. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల (24 పైసలు) కూలీగా జీవితం ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆతరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు. కాంగ్రెసు పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. అంజయ్య తన ప్రారంభ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు, ఇది అతనిని సామాజిక న్యాయం కోసం పోరాట యోధునిగా చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజకీయాలకు అనుగుణంగా పనిచేసాడు. ముఖ్యమంత్రిగా 1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. అతను మర్రి చెన్నారెడ్డి తరువాత 1980 అక్టోబరు 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించాడు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలోని 15 మంది అసమ్మతి వాదులకు పదవులు ఇవ్వవలసి వచ్చింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు.Parties, Elections, and Mobilisation - K. Ramachandra Murty పేజీ.41 అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇద్దరు యువ తిరుగుబాటు రాజకీయ నాయకులు, డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి. నారా చంద్రబాబునాయుడు, ప్రాముఖ్యతను పొందారు. ఈ సమయంలో ఎన్టీఆర్ను రాజ్యసభ సభ్యునిగా చేయాలనే ప్రతిపాదన చేసారు. అంజయ్య పి.జనార్దన్ రెడ్డికి గురువు. విశాఖపట్నం, విజయవాడలలో మునిసిపల్ ఎన్నికలలో అధికార పార్టీ ఓడిపోయిన తరువాత టి.అంజయ్య తన పార్టీలోని కొంతమంది మంత్రులతో సహా ప్రత్యర్థులను ఎదుర్కొన్నాడు. మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడి తేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడుPlotting, Squatting, Public Purpose, and Politics: Land Market Development, Low Income Housing and Public intervention in India - Robert-Jan Baken పేజీ.41. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయినందున, ఫిబ్రవరి 13 న పదవి నుంచి వైదొలగాలని శ్రీమతి ఇందిరా గాంధీ కోరినప్పుడు, అతను తన రాజీనామాను ఏడు రోజుల తరువాత 1982 ఫిబ్రవరి 20 న అధికారికంగా ఇచ్చాడు. అతను అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది. అనుచరులు లేని నాయకుడిగా అతను అనూహ్యమైన ప్రజల సానుభూతిని పొందగలిగాడు. ముఖ్యమంత్రిగా తన చివరి బహిరంగ ప్రదర్శనలో, అతను రాజీనామా చేయడానికి ముందు రోజు 30,000 మంది ప్రజలు పాల్గొన్నారు 1982 ఫిబ్రవరి 24 న భవనం వెంకటరామిరెడ్డి అంజయ్య స్థానంలో ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిష్టించాడు. అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.The Indian Journal of Political Science By Indian political science association Vol. 35, no. 4 (Oct.-Dec. 1974) పేజీ.542 1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా రాజీవ్ గాంధీ మంత్రివర్గములో పనిచేశాడు. ఈయన తర్వాత ఈయన సతీమణి టంగుటూరి మణెమ్మ కూడా సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికైంది. 2018 సెప్టెంబరు 9 న మణెమ్మ హైదరాబాదులో చనిపోయింది. thumb|టంగుటూరి అంజయ్య రాజీవ్ గాంధీతో సంఘటన అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతనికి విమానాశ్రయంలో అవమానం జరిగింది. రాజీవ్ గాంధీ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చాడు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో రాజీవ్ గాంధీని స్వాగతించేందుకు అంజయ్య భారీ ఏర్పాట్లు చేశాడు. అంజయ్య అనుచరగణాన్ని వేసుకుని వెళ్ళి విమానం ఆగుతూండగానే భారీ కాయంతో, భారీ దండల్తో రన్‌వే పైకి, పరుగులు పెట్టుకుంటూ వెళ్లాడు. అతనితో పాటు అనేక మంది జనం వెళ్లారు. స్వతహాగా పైలట్‌ అయిన రాజీవ్‌కు విమానాశ్రయంలో యీ భద్రతారాహిత్యం ఒళ్లు మండించింది. తెచ్చిన పూలదండలలోని పూల రేకులు విమానం ప్రొపెర్లలో పడతాయని ఆందోళనతో అంజయ్యను మందలించాడు. దానికి అంజయ్య మొహం మాడ్చుకున్నాడు తప్ప నిరసన తెలపలేదు. తను చేసినది ఎయిర్‌పోర్టు రూల్సుకు వ్యతిరేకమని అతనికి తెలుసు. ఈ వార్త పత్రికలకు ఎక్కాక ఎవ్వరూ అంజయ్యగారిని సమర్థించలేదు. రాజీవ్‌ కాస్త మెత్తగా చెప్పి వుండాల్సిందనే అనుకున్నారంతే. ఎలాంటి పదవి లేని రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రిని తోసేయడం సంచలనం సృష్టించింది. అంజయ్య దళితుడు కాబట్టే రాజీవ్ గాంధీ అతన్ని అవమానించారని 2018 బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మోదీ స్వయంగా అన్నారు. నిజానికి టి.అంజయ్య దళితుడు కాదు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారన్నది పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పే మాట. తెలుగు వారికి జరిగిన అవమానంతో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడు. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. విశేషాలు అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత చెప్పాడు. హిందీ, ఉర్దూ మాట్లాడటం, అంజయ్యకు కలిసివచ్చాయి. ముఖ్యమంత్రిగా ఆయన జంబో జెట్ మంత్రివర్గాన్ని 61మందితో ఏర్పరచి ఏమంత్రికి ఎవరి సిఫారసు ఉన్నదో బయట పెట్టాడు. కాదనలేక జాబితా పెంచుతూ పోయాడు. అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగని దాశరథి వ్యాఖ్యానించాడు. సముద్రంలో తేల్ పడిందంట లాంటి తెలుగు ఉర్దూ కలిపిన పదాలు ఆయన ఎన్నో వాడుతుండేవారు. టి. అంజయ్య డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రి ప్రారంభించడానికి సహాయం అందించాడు. సంజీవయ్య పార్క్ వద్ద నగరం నడిబొడ్డున 7 ఎకరాల భూమిని ఇవ్వడం ద్వారా అంజయ్య తన వాగ్దానానికి అనుగుణంగా నడుచుకున్నాడు. టి. అంజయ్య ముఖ్యమంత్రి సహాయ నిధి 1982 లో హైదరాబాద్ లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను స్పాన్సర్ చేసింది. టంగుటూరి అంజయ్య ప్రసంగాలతో ప్రేరణ పొందిన విజయ చందర్ టంగుటూరి ప్రకాశం జీవిత చరిత్ర ఆధారంగా ఆంధ్రకేసరి సినిమా తీయాలనే ఆలోచన చేసాడు. అటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని అంజయ్య తెలిపాడు. మాతా మనికేశ్వరి కోరిక మేరకు శ్రీశైలంలో టంగుటూరి అంజయ్య గారు సుఖా ఆశ్రమం నిర్మాణానికి 1981 మే 8 న భూమి పూజ చేశారు. అంజయ్య కూడా కొంతకాలం తెలంగాణ ప్రజాసమితి నాయకుడిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి, నారాచంద్రబాబు నాయుడులు అంజయ్య మంత్రివర్గంలో పనిచేసారు. చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మంత్రిగానూ, రాజశేఖర రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. మూలాలు వర్గం:1919 జననాలు వర్గం:1986 మరణాలు వర్గం:8వ లోక్‌సభ సభ్యులు వర్గం:హైదరాబాదు జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు వర్గం:హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు వర్గం:హైదరాబాదు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వర్గం:హైదరాబాదు జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు వర్గం:హైదరాబాదు జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) కు చెందిన కేంద్ర మంత్రులు వర్గం:హైదరాబాదు జిల్లా కార్మిక నాయకులు వర్గం:ఈ వారం వ్యాసాలు
కోట్ల విజయభాస్కరరెడ్డి
https://te.wikipedia.org/wiki/కోట్ల_విజయభాస్కరరెడ్డి
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన కోట్ల విజయభాస్కరరెడ్డి (ఆగష్టు 16, 1920 - సెప్టెంబర్ 27, 2001), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేశాడు. 1982 - 1983లో మొదటిసారి, 1992 నుండి 1994 వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.విజయభాస్కర రెడ్డి1920 ఆగష్టు 16 న కర్నూలు జిల్లాలోని లద్దగిరి గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి, ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి), ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు. విజయభాస్కరరెడ్డి సెప్టెంబర్ 27, 2001 న మరణించాడు. రాజకీయ జీవితం తొలిసారి 1955లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2 సార్లు కర్నూలు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశాడు. మొత్తం 5 సార్లు శాసనసభకు, 6 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగినాడు. విశేషాలు పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో, గోపీ హోటల్.లో మిత్రులతో సరదాగా పేకాడుకోవటం ఆయన హాబీ. ఎన్.టి.రామారావు ఇస్తున్న హామీలకు మారుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను కూడా కిలో బియ్యం రూ. 1.90 పైసలకే ఇస్తామని చెప్పినా జనం పట్టించుకోలేదు. రెండు పర్యాయాలు కూడా తన చేతి మీదుగా కాంగ్రెస్.ను వోడించి ఎన్.టి. రామారావుకు అధికారం కట్టబెట్టిన పేరు విజయభాస్కర రెడ్డికే దక్కింది. 1999 ఎన్నికలలో ఓడిపోయి రాజకీయాలనుండి పదవీవిరమణ చేసాడు. లోక్‌సభ సభ్యుడిగా విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. మొదటిసారి 1977లో ఆరవ లోక్‌సభకు ఎన్నికవగా, మధ్యలో 8 వ లోక్‌సభకు మినహా 12వ లోక్‌సభ వరకు వరుసగా ఎన్నికైనాడు. మూలాలు వర్గం:1920 జననాలు వర్గం:2001 మరణాలు వర్గం:6వ లోక్‌సభ సభ్యులు వర్గం:7వ లోక్‌సభ సభ్యులు వర్గం:9వ లోక్‌సభ సభ్యులు వర్గం:10వ లోక్‌సభ సభ్యులు వర్గం:11వ లోక్‌సభ సభ్యులు వర్గం:12వ లోక్‌సభ సభ్యులు వర్గం:కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రులు వర్గం:కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మంత్రులు వర్గం:కర్నూలు జిల్లా రాజకీయ నాయకులు వర్గం:కర్నూలు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
నారా చంద్రబాబునాయుడు
https://te.wikipedia.org/wiki/నారా_చంద్రబాబునాయుడు
నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (2014-2019). విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు."TDP to elect N Chandrababu Naidu as legislature party leader on June 4" – Economic Times. Articles.economictimes.indiatimes.com (31 May 2014). Retrieved on 7 June 2014.Chandrababu Naidu invites PM Modi to his swearing-in ceremony – IBNLive . Ibnlive.in.com (31 May 2014). Retrieved on 7 June 2014."TDP chief Chandrababu to take oath as Andhra CM on June 8" : Andhra Pradesh, News – India Today. Indiatoday.intoday.in (28 May 2014). Retrieved on 7 June 2014.Naidu to take oath at Mangalagiri. The Hindu (2 June 2014). Retrieved on 7 June 2014. అతను ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు.This Is What We Paid For. www.outlookindia.com (20 May 2004). Retrieved on 16 January 2012.Naidu, India's leading reformer. Ia.rediff.com (12 May 2004). Retrieved on 16 January 2012.With Naidu, Blair and Clinton have also been voted out -DAWN; 19 May 2004. Archives.dawn.com (19 May 2004). Retrieved on 16 January 2012. అతను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. ప్రారంభ జీవితం, విద్య ఈయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు.Economic times. Articles.economictimes.indiatimes.com (5 March 2004). Retrieved on 7 June 2014. అతని తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి.Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu. Rediff.com (23 September 1999). Retrieved on 2016-06-18. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్ళి అచట 10వ తరగతి పూర్తిచేసి, తదుపరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో 1972లో బి.ఎ., తరువాత ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరి లోని జిల్లాపరిషత్తు పాఠశాలలో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు.Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu. Rediff.com (23 September 1999). Retrieved on 16 January 2012. ప్రారంభ రాజకీయ జీవితం చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను, మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అతను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారునిగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ వ్యుహ చతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీచేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసిననూ స్థానిక నేతల కారణంగా విరమించుకోవలసి వచ్చింది. శాసన సభ్యుడు, 1978–1983 చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సభ్యుడైనాడు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున అతనికి ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు. కొంతకాలం తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ యేట నియమితులయ్యాడు.A High-Tech Fix for One Corner of India – Page 4 – New York Times. Nytimes.com (27 December 2002). Retrieved on 16 January 2012. కాంగ్రెస్ (ఐ) క్యాబినెట్ లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందాడు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేశాడు. సినీమాటోగ్రఫీ మంత్రిగా అతను ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డాడు. 1981, సెప్టెంబర్ 10 న ఎన్.టి.రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడాడు. తెలుగుదేశంపార్టీ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982, మార్చి 29న ప్రారంభించాడు.తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : వివరాలు జులై 19, 2008న సేకరించబడినది. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచాడు. 1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత అతను తెలుగు దేశం పార్టీలో చేరాడు. తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు. పార్టీలో ఎదుగుదల 1984లో ఎన్టీఆర్‌ గుండె చికిత్స కోసం అమెరికాకు వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్‌తో చేతులు కలిపి కొంత మంది శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకొన్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశాడు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన రాంలాల్ ని కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. ఆ సందర్భంలో చంద్రబాబునాయుడు తెలుగు దేశంపార్టీ శాసన సభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు, చంద్రబాబునాయుడుని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చాడు. భాస్కరరావు తిరుగుబాటు యత్నం తరువాత చంద్రబాబు తెలుగు దేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసాడు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తగినంత మెజారిటీ లేక పోవడంతో, ప్రతిపక్ష హోదాతో శాసన సభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో, నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. శాసనసభ్యుడు, 1989–1994 1989 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పోటీచేసి 50,098 ఓట్లు సాధించి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాడు. 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాలా బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రిగా (1995–2004) alt=Dark-haired man giving gifts to grey-haired man|thumb|2000 లో బిల్ క్లింటన్ ను ఆహ్వానిస్తున్న నాయుడు1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. అతను ఆహార సబ్సిడీలను తగ్గించి, విద్యుత్ సుంకాలను పెంచాడు.South Asia | Surprise performance in Andhra Pradesh. BBC News (7 October 1999). Retrieved on 16 January 2012. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్‌డం ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లు హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడును కలిసారు. అమెరికన్ మ్యాగజైన్ "టైమ్"కు చెందిన అపరిసిమ్‌ ఘోష్, " కేవలం ఐదు సంవత్సరాలలో, అతను గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, భారత దేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చాడు." అని తెలిపాడు. ఆ పత్రిక అతనిని "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా అభివర్ణించింది. {{Cite web |url=http://edition.cnn.com/ASIANOW/time/asiabuzz/9912/30/sd/ |publisher=TIME Asia |title= South Asian of the Year: Chandrababu Naidu | date=1999-12-30| |date= 19 September 2018. విజన్ 2020 భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను "విజన్ 2020" పేరుతో ఈ ప్రణాళికను రూపొందించాడు. దీనిని యు.ఎస్. కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలసి కొన్ని ప్రతిపాదనలు చేసాడు.alt=Middle-aged man listening to two younger men|thumb|ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విద్యార్థులతో చర్చిస్తున్న దృశ్యం. సార్వజనీనమైన, తక్కువ ఖర్చుతో విద్య,ఆరోగ్యాన్ని అందించడం. గ్రామీణ ఉపాధి చిన్న పెట్టుబడిదారులకు ప్రత్యామ్నాయంగా పెద్ద సంస్థలు. విజన్ 2020 ను అమలు చేయడం ద్వారా, నాయుడు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ, విద్యను ప్రైవేటీకరించాడు. ఇది పరోక్షంగా వ్యవసాయ భూముల నుండి చిన్న రైతులు పారదోలేందుకు, తద్వారా పశ్చిమ దేశాలలో వలె పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకు స్థిరమైన / లాభదాయకమైనది కాదనీ, రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎన్నుకోవాలనీ తెలిపాడు. 2004 ఎన్నికలలో ఓటమి పాలవ్వడానికి ఇది కూడా ప్రధాన కారణమైంది. సంక్షేమ కార్యక్రమాలు 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబరు 1న ప్రారంభించాడు. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనంద దాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించాడు. అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి అమలు చేశాడు. సాంకేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్‌ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్‌ హైటెక్‌సిటి ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబర్‌ 10న ‘పచ్చదనం–-పరిశుభ్రత’ కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసాడు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్థితో చేపట్టారు. జాతీయ రాజకీయాలపై ప్రభావం 1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్‌ పార్టీని ఒప్పించాడు. ఇందులో భాగంగా దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్‌ ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు. 1999 ఎన్నికల విజయం 1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. అతను ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణస్వీకారం చేశాడు. 2000 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య "నీరు-మీరు" కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం. హైదరాబాదు అభివృద్ధి alt=Large round building, with cross-hatched superstructure|thumb|హై-టెక్ సిటీ, హైదరాబాద్‌లో నాయుడు రత్న కిరీటం.|189x189px ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ ఔట్సోర్సింగ్ సర్వీసెస్" వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికోసం చేసిన తన ప్రణాళికపై చర్చించాడు.'Defeat has been an eye-opener'. Rediff.com (11 November 2004). Retrieved on 16 January 2012. తన లక్ష్య సాధన కోసం అతను "బై బై బెంగళూర్, హలో హైదరాబాద్" నినాదాన్నిచ్చాడు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటు సెంటర్‌ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీయాటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. నాయుడు ఇతర ఐ.టి కంపెనీలను (ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్‌, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్) హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్నందించాడు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సి.ఇ.ఓ లను ఒప్పించేందుకు కృషిచేసాడు.Biswas, Soutik (7 September 1998) Reinventing Chief Ministership. www.outlookindia.com. Retrieved on 16 January 2012. అతని పదవీ కాలం చివరలో 2003-04 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదు నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.Hyderabad booms: IT exports top $1 billion. Ia.rediff.com (June 2004). Retrieved on 18 June 2016. ఇది దేశంలో నాల్గవ అతి పెద్ద ఎగుమతి నగరంగా మారింది. 2013-14 లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి.Software exports from Hyderabad may touch Rs 64,000 crore. Deccanchronicle.com. Retrieved on 18 June 2016. దీని ఫలితంగా హైదరాబాదులో IT & ITES రంగాలలో 320,000 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రపతి ఎన్నికలో పాత్ర రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన నారాయణన్‌ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్‌ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు. 2003 హత్యా ప్రయత్నం 2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.A blast and its shock . Hindu.com. Retrieved on 24 August 2010. ఈ సంఘటనలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి బి.గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సి.హెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవరు శ్రీనివాసరాజు లకు కూడా గాయాలైనాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ బాంబుదాడి కేసులో 2014లో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు సెప్టెంబర్ 25, 2014, గురువారం తీర్పు చెప్పింది. 2004 ఎన్నికలలో ఓటమి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా గెలిచి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసన సభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్‌సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసన సభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకునిగా తన సేవలనందించాడు. 2014 ఎన్నికలలో విజయం చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ (నవ్యాంధ్ర) కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2014 జూన్‌ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.CBN to take oath on June 8th. Deccan Journal ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్ననమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. హెరిటేజ్ ఫుడ్స్ 1992లో హెరిటేజ్ గ్రూపును చంద్రబాబునాయుడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్‌ ఫుడ్స్‌. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది. సూర్యోదయ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తరువాత, నవ్యాంధ్ర కు ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. హైదరాబాదు వలె కాకుండా https://economictimes.indiatimes.com/news/politics-and-nation/how-andhra-pradesh-plans-to-make-its-new-capital-amaravati-a-world-class-city/articleshow/58767503.cmshttp://www.thehindu.com/opinion/op-ed/telangana-rising-amaravathi/article7271810.ece అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐ.టి.సెజ్ - ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐ.టి.హబ్ https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/Vizag-set-to-become-IT-hub-of-new-state/articleshow/36405634.cms గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను "ఏ.పి క్లౌడ్ ఇనిషియేటివ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసాడు.http://www.thehindubusinessline.com/news/national/ap-cloud-initiative-launched/article8948616.ecehttp://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Naidu-to-launch-Cloud-Initiative-on-Aug.-5/article14518284.ece అమరావతి శంకుస్థాపన 2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు. 2019 ఎన్నికలలో పరాజయం అతని నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలను చేపట్టాడు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23, 25 పార్లమెంటు స్థానాలకు గాను 3 స్థానాలలో విజయం సాధించింది. సాహిత్య రచనలు ఇండియాస్ గ్లోబల్ లీడర్ - తేజశ్వినీ పగడాల మనసులోమాట - చంద్రబాబు జీవిత చరిత్ర. విజయాలు 28వ యేట రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్నవయసు గల సభ్యుడు, మంత్రి తెలంగాణ రాష్ట్రం విభజన జరగక పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించినఘనత. రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తొలిముఖ్యమంత్రిగా 2014 జూన్ 8 నుండి సేవలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం పరిపక్షనాయకునిగా సేవలు.Chandrababu's chance to equal ND Tiwari's record . timesofap.com. 31 July 2013 ఇండియా టుడే ద్వారానిర్వహించిన ఓటులో ఐ.టి. ఇండియన్ ఆఫ్ దమిలీనియంగా ఎంపిక. టైం మ్యాగజైన్ ద్వారా "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా గుర్తింపు. ఎకనమిక్స్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్"గా గుర్తింపు. "సి.ఇ.ఒ ఆఫ్ ఆంధ్రప్రదేశ్"గా ఆయనను పిలుస్తారు. 2016 జనవరి 30 న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్, ఎం.ఐ.టి స్కూల్ అపహ్ గవర్నెన్స్ తో కలసి "ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం". మే 2017లో "ట్రాన్స్‌ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు". వివాదాలు, విమర్శలు మే 2018లో టీటీడీ బోర్డులో జరుగుతోన్న అవకతవకలపై - ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతోన్న పనులపై తాను నోరు మెదిపినందుకే ప్రభుత్వం తనపై కక్ష్య తీర్చుకుంటోందని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసాడు. శ్రీవారి వంటశాలలోని నేలమాళిగలలో ఉన్నవిలువైన ఆభరాణాలకోసం జరిగిన తవ్వకాల వెనుక చంద్రబాబు హస్తముందని సంచలన ఆరోపణలు చేశాడుhttp://www.republicworld.com/india-news/general-news/sensational-andhra-pradesh-cm-chandrababu-naidu-ttd-plundered-tirupati-temples-wealth-claims-ex-head-priest. 2015 వోటుకి నోటు ఘటన: డబ్బు అందజేస్తూ తెలుగుదేశం నాయ‌కులు దొరికిపోవ‌టంతో ఈ ఓటుకి నోటు అనే అంశం బాగా పేరుపొందింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు జరిగే ఎన్నిక‌ల్లో .. ఒక నామినేటెడ్ శాసన సభ్యుని ప్ర‌లోభ పెట్టే ప్ర‌య‌త్నం జ‌రిగింది. తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి స్వ‌యంగా రూ.50 ల‌క్ష‌లు ఇస్తూ పోలీసుల‌కు దొరికిపోయాడు. ఆయ‌న్ని కోర్టు ముందు హాజ‌రు పరిచి, జైలుకి పంపించ‌టం జ‌రిగింది. త‌ర్వాత అదే నామినేటెడ్ శాసన సభ్యునితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంభాషణ అన్న ఫోన్ సంభాష‌ణ‌లు నాట‌కీయంగా బ‌య‌ట‌పడ్డాయి. దీని ఫలితంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైద్రాబాదునుండి ఆంధ్రప్రదేశ్ కు మార్చటం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడడం జరిగాయి. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుండి ఆయనకు 118 కోట్లు వచ్చాయని, వాటిపై సరైన సమాచారం ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులను చంద్రబాబు నాయుడుకు జారీ చేసింది. ఈ మొత్తాన్ని "బహిర్గతం కాని ఆదాయం"గా పరిగణించరని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. అతను ప్రాథమిక అభ్యంతరాలను తిరస్కరించిన తరువాత 2023 ఆగస్టు 4న సెంట్రల్ సర్కిల్, హైదరాబాద్ నుండి ఈ నోటీసు జారీ చేశారు. షాపూర్జీ పలోంజీ & కో. ప్రైవేట్ లిమిటెడ్ (SPCL) తరపున డిసెంబర్ 2017 నుండి ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ ప్రక్రియలో పాల్గొంటున్న మనోజ్ వాసుదేవ్ పార్ధసాని (నోటీస్‌లో MVP గా ప్రస్తావించారు) చెందిన ప్రాంగణంలో సోదాలు జరిపారు. నవంబర్ 2019లో పార్దసాని అసోసియేట్స్ ప్రాంగణంలో సోదాలు జరిపిన తర్వాత చంద్రబాబు నాయుడుపై I-T దర్యాప్తు ప్రస్తావన వచ్చింది. బూటకపు సబ్-కాంట్రాక్టర్ కంపెనీల ద్వారా నగదును సంపాదించడానికి, SPCL ద్వారా నిధులను స్వాహా చేయడానికి బోగస్ కాంటాక్ట్‌లు, వర్క్ ఆర్డర్‌లను సృష్టించినట్లు పార్ధసాని అంగీకరించాడని నోటీసుల్లో పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (ఆంధ్రప్రదేశ్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)లో జరిగిన అవినీతి కుంభకోణం కేసులో ఆయనను నేర పరిశోధన విభాగం (సీఐడీ) పోలీసులు 2023 సెప్టెంబరు 9న నంద్యాలలో అరెస్ట్‌ చేశారు.ఆయన హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం పేరిట స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందని ఆయన ఎదురకరుంటున్న ప్రధాన ఆరోపణలు. ఈ స్కామ్ లో రూ.241 కోట్లు అవినీతి జరిగిందనే అభియోగాలు ఉన్నాయి.నారా చంద్రబాబునాయుడు కు ఈ కేసులో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కుటుంబం నారా చంద్రబాబునాయుడు, ఎన్.టి.రామారావు కూతురు నందమూరి భువనేశ్వరిని పెళ్ళిచేసుకొని నందమూరి కుటుంబంలో భాగమయ్యాడు. ఈయన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు. వీరి కుమారుడు దేవాన్ష్. ఇవీ చూడండి తెలుగుదేశం పార్టీ మూలాలు బయటి లింకులు తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నారా చంద్రబాబునాయుడు అధికారిక వెబ్‌సైటు తెలుగుదేశం పార్టీ వెబ్సైటు Update on recent visit to USA వర్గం:తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వర్గం:తెలుగుదేశం పార్టీ వర్గం:జీవిస్తున్న ప్రజలు వర్గం:1950 జననాలు వర్గం:రాజకీయవేత్తలు వర్గం:చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రులు వర్గం:చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు వర్గం:చిత్తూరు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు వర్గం:చిత్తూరు జిల్లా రాజకీయ నాయకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2014) వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2019) వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009) వర్గం:శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు వర్గం:ఈ వారం వ్యాసాలు
వై. యస్. రాజ శేఖర్ రెడ్డి
https://te.wikipedia.org/wiki/వై._యస్._రాజ_శేఖర్_రెడ్డి
దారిమార్పు వై.యస్. రాజశేఖరరెడ్డి
డిసెంబర్ 5
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_5
డిసెంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 339వ రోజు (లీపు సంవత్సరములో 340వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 26 రోజులు మిగిలినవి. సంఘటనలు భారత దేశము రాజ్యాంగ దినోత్సవం ఆంధ్ర ప్రదేశ్ 1970: ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు జిల్లా అవతరణ. 1972: ఒంగోలు జిల్లా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది. జననాలు 1782: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (మ.1862). 1886: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు (మ.1969). 1896: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు, అణు భౌతిక శాస్త్రవేత్త (మ.1969). 1901: వాల్ట్ డిస్నీ, అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, గొంతు కళాకారుడు, చిత్రకారుడు, వ్యాపారవేత్త (మ.1966). 1905: షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982) 1940: గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు. 1931: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (మ.2015) 1958: దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1992: పాయల్ రాజ్ పుత్ , భారతీయ సినీ నటీ మరణాలు thumb|Nelson Mandela-2008 (edit) 1950: శ్రీ అరబిందో, గురు (జ.1872). 1995: కాశీనాయన, పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసారు 2008: కొమ్మినేని శేషగిరిరావు,. తెలుగుసినిమా దర్శకుడు, నటుడు (జ.1939). 2008: మహ్మద్ ఇస్మాయిల్, సాహితీకారుడు (జ.1943). 2013: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు (జ.1918). 2016: జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, సినిమానటి (జ.1948). 2020: కమతం రాంరెడ్డి, తెలంగాణకు చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ. 1938) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం. ప్రపంచ నేల దినోత్సవం . బయటి లింకులు BBC: On This Day This Day in History డిసెంబర్ 4 - డిసెంబర్ 6 - నవంబర్ 5 - జనవరి 5 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 6
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_6
డిసెంబర్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 340వ రోజు (లీపు సంవత్సరములో 341వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 25 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb|బాబ్రీ మసీదు 1992: కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదును ధ్వంసం చేసారు. జననాలు thumb|మాక్స్ ముల్లర్ right|thumb|250px|ఆచంట రుక్మిణమ్మ 1823: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900) 1892: ఆచంట రుక్మిణమ్మ 1898: గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. (మ.1987) 1936: సావిత్రి, సినిమా నటి. (మ.1981) 1950: నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి 1999: నేహా శెట్టి మోడల్ , కన్నడ,తెలుగు,చిత్రాల నటి మరణాలు 1956: బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891). 1995: కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత పండుగలు , జాతీయ దినాలు పౌర రక్షణ దినం. బయటి లింకులు BBC: On This Day This Day in History డిసెంబర్ 5 - డిసెంబర్ 7 - నవంబర్ 6 - జనవరి 6 -- అన్ని తేదీలు మూలాలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
డిసెంబర్ 7
https://te.wikipedia.org/wiki/డిసెంబర్_7
డిసెంబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 341వ రోజు (లీపు సంవత్సరములో 342వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 24 రోజులు మిగిలినవి. సంఘటనలు 1792: భారతదేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. 1856: వితంతు పునర్వివాహ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి వివాహం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది. 1946: ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు. జననాలు thumb|జాన్ టెర్రీ 1896: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1990) 1921: భారత ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం. 1975: సురేంద్ర రెడ్డి , తెలుగు చలనచిత్ర దర్శకుడు. 1976 హరీష్ రాఘవేంద్ర , ప్లేబ్యాక్ సింగర్ , యాక్టర్ 1980: ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు జాన్ టెర్రీ జననం. మరణాలు 2013: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1954) పండుగలు, జాతీయ దినాలు భారత సాయుధ దళాల పతాక దినోత్సవం అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో డిసెంబర్ 6 - డిసెంబర్ 8 - నవంబర్ 7 - జనవరి 7 -- అన్ని తేదీలు వర్గం:డిసెంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 1
https://te.wikipedia.org/wiki/నవంబర్_1
నవంబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 305వ రోజు (లీపు సంవత్సరములో 306వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 60 రోజులు మిగిలినవి. సంఘటనలు అమెరికా చే 1952 నవంబరు 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది. 1956: బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబరు 1 వరకు). 1956: ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది. 1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్‌దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు. 1983: ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు. 2000: చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది. జననాలు 1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. (మ.1980) 1915: వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (మ.1961) 1919: అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (మ.1986) 1944: వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే. 1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు. 1973: ఐశ్వర్యా రాయ్, అందాల తార, నటి, 1974: వి.వి.యెస్.లక్ష్మణ్, క్రికెట్ ఆటగాడు. 1978: టిప్పు , నేపథ్య గాయకుడు. 1986: ఇలియానా, తెలుగు సినిమా నటీమణి. మరణాలు thumb|హరనాథ్1957: వాసిరెడ్డి భాస్కర రావు, బుర్ర కథలు, నాటక రచన, సినీ సంభాషణలు, పాటల రచయిత (జ.1914) 1996: శ్రీలంక మాజీ అధ్యక్షుడు జయవర్థనే. 1989: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (జ.1936) పండుగలు , జాతీయ దినాలు ఆంధ్ర ప్రదేశ్అవతరణ దినోత్సవము. కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం. గర్వాల్ రైఫిల్ దినం. ప్రపంచ శాఖాహార దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబరు 1 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 31 - నవంబరు 2 - అక్టోబర్ 1 - డిసెంబర్ 1 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
అక్టోబర్ 1
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1
అక్టోబరు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 274వ రోజు (లీపు సంవత్సరములో 275వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 91 రోజులు మిగిలినవి. సంఘటనలు 1854: భారతదేశంలో తపాలా బిళ్ళల ప్రసరణ మొదలయ్యింది. బిళ్ళల పై రాణి విక్టోరియా గారి మొహం ఇంకా భారతదేశం చిత్రాలు ఉండేవి. వాటి అప్పటి వెల సగం ఆణ (రూ. 1/32) 1864: కలకత్తాలో తుఫాను వలన 70,000 మంది మరణించారు 1880: శ్రీలంకలో భారతదేశంతో ద్రవ్య మార్పిడి మొదలయ్యింది. 1892: భారత రెండు అన్నా నాణెం చెల్లదు ఇంకా శ్రీలంకలో వెండి నాణేలు ప్రవేశపెట్టబడ్డాయి 1926: బల్కంజీ బారి ఇనిస్టిట్యూట్ పిల్లల సంక్షేమం కోసం స్థాపించబడింది. 1932: ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదలయిన రోజు (రైసింగ్డే). 1932: భారతీయ భాగస్వామ్య చట్టం, 1932 అమలులోకి వచ్చింది. 1949:'మరాఠీ రంగభూమి' అనే నాటక సంస్థ స్థాపించబడింది 1953: కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే మద్రాసు రాజ్యం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1958: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, బరువుల కొలతల కోసం ప్రవేశ పెట్టారు. 1959: గౌరవనీయ న్యాయమూర్తి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 1966: భారత పర్యాటక అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. 1978: బాల్య వివాహ చట్టంలో, వివాహానికి కనీస వయస్సు మగవారికి 21 సంవత్సరాలు, ఆడవారికి 18 సంవత్సరాలు పెంచబడింది 1981: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సూత్రధారి దాల్ ఖల్సా కార్యకర్తలను అరెస్టు చేశారు 1982: తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది. 1984: బజరంగ్ దళ్ అన్న హిందూ మత సంస్థ స్థాపన. 1990: పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించడానికి రాజ్యాంగం యొక్క 75వ సవరణ బిల్లు సాధారణ మెజారిటీ కోసం లోక్‌సభలో మొదటి దశలో విఫలమైంది. 1990: జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1990: మండలం కమిషన్ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. 2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. 2001: కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ భవనంపై తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 38 మంది చనిపోయారు. 2003: అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యాహత్నం. 2006: పాండిచ్చేరి రాష్ట్రం పేరు పుదుచ్చేరిగా మార్చబడింది జననాలు thumb|150px|రమణారెడ్డి thumb|150px|జి.ఎం.సి.బాలయోగి 1542: మరియం-ఉజ్-జమాని, ముఘల్ చక్రవర్తైన అక్బర్ భార్యలలో ఒకరు 1842: సుబ్బియర్ సుబ్రహ్మణ్య అయ్యర్, భారత న్యాయవాది, న్యాయనిపుణుడు (మ. 1924) 1847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933) 1861: నీల్ రతన్ సర్కార్, బ్రిటిష్ భారతీయ వైద్యుడు, విద్యావేత్త. ( మ. 1943 ) 1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939) 1887: పండిట్ హృదయనాథ్ అజుధియనాథ్ కుంజ్రు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త 1890: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి. 1894: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1977) 1895: లియాఖత్ అలీ ఖాన్, భారత-పాకిస్తానీ న్యాయవాది, రాజకీయ నాయకుడు, పాకిస్తాన్ 1వ ప్రధానమంత్రి (మ. 1951) 1901: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. 1904: ఎ. కె. గోపాలన్, భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త (మ. 1977) 1906: సచిన్ దేవ్ బర్మన్, భారతీయ స్వరకర్త, గాయకుడు (మ. 1975) 1906: నికుంజ సేన్, భారత స్వాతంత్ర్య పోరాట విప్లవకారుడు, రైటర్స్ బిల్డింగ్స్ క్యాంపెయిన్ వ్యవస్థాపకుడు. (మ. 1986 ) 1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974) 1913: జనరల్ హర్బక్ష్ సింగ్, పద్మ విభూషణ్, వీర చక్ర అవార్డు పొందిన భారతీయ సైనిక అధికారి. 1915: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013) 1918: గోవిందప్ప వెంకటస్వామి, భారతీయ నేత్ర వైద్యుడు (మ. 2006) 1919: మజ్రూహ్ సుల్తాన్‌పురి, భారతీయ కవి, పాటల రచయిత (మ. 2000) 1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (మ.1974) 1922: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు. (మ.2004) 1928:శివాజీ గణేశన్, తమిళ సినీ నటుడు (మ. 2001 ) 1934: భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. 1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014) 1939: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015) 1942: బోయ జంగయ్య, రచయిత. (మ.2016) 1945: రామ్ నాథ్ కోవింద్, 14వ భారత రాష్ట్రపతి 1947: దల్వీర్ భండారీ, భారతీయ న్యాయవాది, న్యాయమూర్తి 1951: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002) 1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు 1969: మహేష్ ఠాకూర్, భారత నటుడు 1984: వినీత్ శ్రీనివాసన్ భారత గాయకుడు, నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత 1990: అనుష్క రంజన్, భారత నేటి, మోడల్ 1992: మడోన్నా సెబాస్టియన్, మలయాళ, తమిళ, తెలుగు, నటి గాయని 1998: జెహాన్ దారువాలా, భారత ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ మరణాలు right|thumb|150px|ఆదుర్తి సుబ్బారావు 1939: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784) 1946: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (జ.1902) 1975: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912) 1979: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901) 1986: వీర్ చంద్ర సింగ్ గర్వాలీ, భారతదేశ విప్లవకారుడు. 1995: ఆదిత్య విక్రమ్ బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త 1997: గుల్ మొహమ్మద్, తను ఉన్నప్పటి కాలంలో ధ్రువీకరించబడిన అత్యంత పొట్టి మనిషి. 2022: తులసీ తాంతీ, భారతీయ వ్యాపారవేత్త. (జ. 1958) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ శాఖాహార దినోత్సవం ప్రపంచ వృద్ధుల దినోత్సవం . అంతర్జాతీయ కాఫీ దినోత్సవం జాతీయ రక్తదాన దినోత్సవం. సైప్రస్, నైజీరియా, తువాలు, పలౌ స్వాతంత్ర్య దినోత్సవం. ప్రపంచ ఆవాస దినోత్సవం. స్వచ్ఛంద రక్తదాన దినం. అంతర్జాతీయ సంగీత దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబర్ 1 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు https://web.archive.org/web/20190128135613/http://www.satyambruyat.com/2018/10/history-of-1-october-in-india-and-world.html https://frontline.thehindu.com/the-nation/article30219569.ece సెప్టెంబర్ 30: అక్టోబర్ 2: సెప్టెంబర్ 1: నవంబర్ 1:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
తెలుగు లిపి
https://te.wikipedia.org/wiki/తెలుగు_లిపి
thumb|right|తెలుగు లిపి పరిణామం మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా thumb|250px|right|3వ శతాబ్దము ఇక్ష్వాకులనాటి శాసనం తెలుగు లిపి ఇతర భారతీయ భాష లిపుల లాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది.తెలుగు లిపి; http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపిలో వ్రాసిన శాసనాలు మొదట భట్టిప్రోలులో దొరికాయి. అక్కడి బౌద్ధ స్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్య కాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి.ఆనంద బుద్ధ విహార;http://www.buddhavihara.in/ancient.htm ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి.The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire; http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm ఆవిర్భావం thumb|250px|right|1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనం తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరాన ఉన్న భట్టిప్రోలు గ్రామమందు క్రీ. పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది.The History of Andhras, Durga Prasad; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడా అచటకు చేరినది. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవుల నుంచి ఇతర దేశాలకు కూడా చేరి అక్కడి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది.థాయ్ లిపి ఆవిర్భావ వివరాలుభాష ఆవిర్భావ వివరాలు సా.శ. ఐదవ శతాబ్దము నాటికి భట్టిప్రోలు లిపి పాత తెలుగు లిపిగా పరిణామము చెందింది.The Blackwell Encyclopedia of Writing Systems by Florian Coulmas, p. 228Vishwabharath by K. N. Murthy and G. U. Rao, http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf Indiain Epigraphy: a guide to the study of inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan languages, by Richard Solomon, Oxford University Press, 1998, p.40, ISBN 0-19-509984-2Indian Epigraphy by Dineschandra Sircar, Motilal Banarsidass, 1996, p.46, ISBN 81-208-1166-6The Dravidian Languages by Bhadriraju Krishnamurti, 2003, Cambridge University Press, pp.78-79, ISBN 0-521-77111-0K. Raghunath Bhat, http://ignca.gov.in/nl001809.htm తెలుగున నన్నయ్య కావ్యవ్యాకరణచ్చంద సంప్రదాయములకేకాక, తెలుగు లిపి సౌందర్యము నావిష్కరించుటయందు ప్రథమాచార్యుడు. నన్నయకు పూర్వము తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని వేంగీచాళుక్య లిపి అని దానిపేరు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే వ్రాయబడినవి. ఆ లిపి చతురస్రముగాను, తలకట్లు గీతలకొరకు గంటము వ్రాతకు సాధనముగా ఏర్పడినది. తాటాకుపైనగాని గంటముతో వ్రాయునప్పుడు తలకట్లు అడ్డుగీతలుగా వ్రాసిన తాటాకు చినిగిపోవును. తలకట్టు-అనగా ఆకారమునకేగాక, ఆ దీర్ఘము వ్రాయవలసివచ్చినప్పుడు, ఆ దీర్ఘమును ఇప్పటివలె ా వ్రాయక --- అని నిలువుగీతగా రాసేవారు. ఒ కార చిహ్నమగు కొమ్ము ొ ా అని గీతగానే ఉండేది. -జ్క, ణ్బ, న + తవత్తు, ం + ప వత్తు, ఞ + చ వత్తు -అను రీతిగా వ్రాసెడివారు. ఇట్టివి తాటియాకుపైన వ్రాయుట కష్టసాధ్యము. నన్నయ వీటిని పరిశీలించి, తెలుగు లిపిని చతురస్ర స్వరూపమునుండి గుండ్రదనమునకు మార్పు చేసి పలు మార్పులు చేసాడు. అవే తలకట్టునకు ా గాక ప్రస్తుత తలకట్టు లాగా, కొమ్ముల మార్పు ప్రస్తుత వరుసగా, ర్గ సంయుక్తాక్షరములు అనునవి పంకచంక-ఖండ-నంద-డింబ-అనురీతి పూర్ణబిందువులుగా వ్రాయుట, రకార సంయుక్తాక్షరములను ర్క, ర్త, ర్చ మొదలగునవి అర్క-అక౯, కర్త-కత౯, కర్చ-కచ౯ గా వ్రాయుట మొదలుచేసాడు. ౯ ఈ చిహ్నమునకే వలపలగిలక అని పేరు. ఈ వలపలగిలక వలన రకార సంయుక్తాక్షరములుగా నుండక ఏకాక్షరములుగా ఉండును. ఇందువలన లిపికి సమత ఏర్పడినది, అంతకుముందున్న ఒక అక్షరము శకటరేఫముకన్నా భిన్నమైనది, ష్జగా పలుకునదానిని "డ"గా మార్చాడు. ఈ మార్పుల వలన తెలుగు లిపికి గుండ్రనిదనము, సౌందర్యము చేకూరినవి. తెలుగులిపినందు ఈమార్పులు చేయుటయేకాక నన్నయ, తాను వ్రాసిన నందంపూడి శాసనము లో తాను ప్రతిపాదించిన సంస్కరణలిపిని ప్రవేశపెట్టి - ఆవెనుక తాను వ్రాసిన మహా భారతమును ఆ లిపిలోనే వ్రాసినాడు. తెలుగు అక్షరములకు అంతకుముందులేని రమ్యతను-లేక మనోహరత్వమును తాను ప్రతిపాదించుటచేత - నన్నయ తెలుగులిపి సౌందర్యమును వ్యక్తపరిచాడు. అర్ధ ముక్తి శబ్ద సంబంధమైనది అక్షర రమ్యత లిపి సంబంధమైనది-రెండింటి సమ్మేళనము నన్నయ కవితలో మౌర్యులకాలపు (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీలిపి పట్టికలోని రెండవ వరుసలో ఇవ్వబడింది. అటు పిమ్మట భట్టిప్రోలు ధాతుకరండముపై కొద్దిమార్పులుగల బ్రాహ్మీలిపి మూడవ వరుసలో చూడవచ్చును. తెలుగు శాసనములు శాతవాహనుల శాసనములు శాతవాహనుల శాసనములలోని (క్రీ. శ. 1వ శతాబ్ది) భట్టిప్రోలు లిపి పరిణామము 4వ వరుసలో ఇవ్వబడింది. ఇక్ష్వాకుల శాసనములు సా. శ. 218 లో శాతవాహనుల సామంతులు ఇక్ష్వాకులు స్వతంత్రులైరి. వారికాలమునాటి లిపి 5వ వరుసలో గలదు. శాలంకాయన నందివర్మ శాసనము ఇక్ష్వాకుల తరువాత శాలంకాయనులు ఆంధ్ర దేశాన్ని క్రీ. శ. 300 నుండి 420 వరకు పాలించారు. శాలంకాయనుల రాజధాని వేంగి. ఆకాలమునాటి లిపి 7వ వరుసలోనున్నది. ఈ కాలములోనే తెలుగు లిపి మిగిలిన దక్షిణ భారత, ఉత్తర భారత లిపులనుండి వేరుపడుట ప్రారంభమయింది. క్రీ. శ. 420-611 మధ్యకాలములో విష్ణుకుండినులు వినుకొండ రాజధానిగా పరిపాలించారు. విష్ణుకుండిన శాసనములు విష్ఱుకుండినుల కాలంనాటి 5వ శతాబ్ది తెలుగు శాసనం ‘తొలుచువాన్డ్రు’ను కీసరగుట్టలో పురావస్తుశాఖ గుర్తించింది(1987 పురావస్తుశాఖ నివేదిక). ఇంత స్పష్టంగా వాడుక తెలుగులో చెక్కిన శాసనమేదీ అంతకు ముందు లభించలేదు. ఇదే తెలుగులో మొదటి శాసనం. విష్ణుకుండినుల పరిపాలనాకాలములో భాషల వాడుకలో, వ్రాతలో పలుమార్పులు వచ్చాయి. ప్రాకృతము బదులు సంస్కృతము వాడుట ఎక్కువయ్యింది. అదేసమయములో రాయలసీమను పాలించిన రేనాటి చోళులు రాజశాసనములు తెలుగులో వ్రాయించారు. మనకు దొరికిన వారి మొదటి శాసనము క్రీ. శ. 573 నాటిది. తీరాంధ్రప్రాంతంలో దొరికిన క్రీ. శ. 633 నాటి శాసనము మొదటిది. అప్పటినుండి తెలుగు వాడకము బాగా ఎక్కువయింది. పల్లవ నరసింహవర్మ శాసనము శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈ లిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది. పరిణామము thumb|right|తెలుగు లిపి పరిణామం మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా భాషాపరంగా కన్నడ తమిళ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి. కాని, చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది. శాతవాహనుల కాలములోనే భట్టిప్రోలు లిపి కర్ణాట దేశానికి వ్యాప్తి చెందింది. ఆంధ్రదేశము, వేంగీ విషయము, కమ్మనాడు, పుంగనూరు వాస్తవ్యుడైన పంప అనే బ్రాహ్మణపండితుడు జైనమతావలంబియై వేములవాడను పాలించిన అరికేసరి అను చాళుక్య రాజు ఆశ్రయముపొంది విక్రమార్కవిజయము అనబడు తొలి కన్నడ గ్రంథము వ్రాశాడు. తెలుగు కన్నడ లిపులు ముడిపడి ఉండడానికి ఇలాంటి కారణాలు కొన్నిఉన్నాయి. వరుసలు 9, 10, 11 చాళుక్యుల కాలము (7, 10, 11వ శతాబ్దములు) నాటి లిపులను సూచిస్తునాయి. 10, 11 వరుసలలోని లిపిని వేంగీలిపి అనికూడ అంటారు. 12వ వరుసలో కాకతీయుల కాలమునాటి లిపిచూడవచ్చు. ఈ కాలములో తెలుగు భాష, సాహిత్యములు ప్రజ్వరిల్లాయి. 13, 14 వరుసలలో మహాకవి శ్రీనాథుని కాలము నాటి లిపి, చివరి వరుసలో విజయనగరకాలము నాటి తెలుగు-కన్నడ ఉమ్మడి లిపి చూడవచ్చు. అధునిక తెలుగు లిపికిది చివరి పరిణామదశ. బెంజమిన్ షుల్జ్ అను మతప్రచారకుని మూలముగ క్రైస్తవ సాహిత్యము జర్మనీ దేశమందు తెలుగులిపిలో ప్రచురించబడింది. బ్రౌను దొర తెలుగు పుస్తకముల ప్రచురణకు చాల కృషిచేశాడు. 20వ శతాబ్ది మధ్యలో తెలుగు గొలుసుకట్టు పద్ధతిలో (ఆంగ్లమువలె) కూడా వ్రాయబడింది. కాని అది ప్రాచుర్యము చెందలేదు. thumb|250px|right|1747 నాటి క్రైస్తవ రచన thumb|250px|right|1817లో బ్రౌను దొర వెలువరచిన తెలుగు పుస్తకం మూలాలు వనరులు ఇవల్యూషన్ ఆఫ్ తెలుగు కారక్టర్ గ్రాఫ్స్: https://web.archive.org/web/20090923234606/http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html తిరుమల రామచంద్ర (1916-1997). "మన లిపి పుట్టు పూర్వోత్తరాలు" పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి (1890-1951). "ఆంధ్ర లిపి పరిణామం" ఏటుకూరు బలరామమూర్తి, 1953, "ఆంధ్ర సంక్షిప్త చరిత్ర," ప్రచురణ: విశాలాంధ్ర. 1971 భారతి మాస పత్రిక- వ్యాసము -తెలుగు లిపి-వ్యాస కర్త-నిడదవోలు వేంకటరావు. బయటి లింకులు Useful and authenticated information about Telugu Telugu Association Inc. Sydney Australia. Celebration of Telugu Culture in Sydney Omniglot - Telugu script PROEL - Telugu script compared with other Dravidian scripts Vignanam - Learn Something Today వర్గం:తెలుగు భాష వర్గం:లిపులు
కృష్ణా జిల్లా
https://te.wikipedia.org/wiki/కృష్ణా_జిల్లా
కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా. ఈ జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వలన జిల్లాకు ఈ పేరు వచ్చింది. చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం. 2022 లో ఈ జిల్లాను విడదీసి ఎన్టీఆర్ జిల్లాను, విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో కూడా కొన్ని మండలాలను కలిపారు. చరిత్ర కృష్ణా పరీవాహక ప్రాంతం కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాలో ఉన్న ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు పాశుపతాస్త్రం కొరకు పరమశివుని ఉద్దేశించి తపమాచరించాడని, దుర్గాదేవి ఇక్కడ మహిశాసురుడిని సంహారం చేసిందని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కృష్ణా నది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనక దుర్గాదేవి భక్తజన పూజలను అందుకొంటూ ఉంది. శ్రీకాకుళం రాజధానిగా శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహన రాజులు నాలుగు శతాబ్దాల కాలం పాటూ ఈ ప్రదేశాన్ని పాలించారు. గుంటూరు జిల్లా మైదవోలులో లభించిన తామ్ర శాసనాలననుసరించి పల్లవులు ఈ ప్రాంతాన్ని 250 నుండి 340 సా.శ.॥ వరకూ పాలించారు. ఆ తదుపరి బృహత్పలాయనులు కోడూరు రాజధానిగా ఈ జిల్లా ప్రాంతాన్ని పాలించారు. వారి తరువాత విష్ణు కుండినులు సా.శ.॥5వ శతాబ్దంలో పాలించారు. వీరి కాలంలోనే మొగల్రాజపురం ఇంకా ఉండవల్లిలోని గుహలు తవ్వించి తీర్చిదిద్దబడ్డాయి. తూర్పుచాళుక్యులు ఉండవల్లిలో గుహామందిరాలు, శివాలయాలు కట్టించారు. కాకతీయులు సా.శ.॥1323 వరకు వీరి పాలన జరిగింది. రెడ్డిరాజులు కొండపల్లి రాజధానిగా పరిపాలించారు. అనంతరం గజపతుల పాలనలో కృష్ణా జిల్లా ప్రాంతం వచ్చింది. ప్రస్తుత పమిడిముక్కల మండలంలోని కపిలేశ్వరపురం గజపతి రాజయిన కపిలేశ్వర గజపతి పేరున నామకరణం చేయబడింది. కపిలేశ్వర గజపతి తదుపరి వచ్చిన విద్యాధర గజపతి విజయవాడలోని విద్యాధరపురాన్ని ఇంకా కొండపల్లి సరస్సుని నిర్మించాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సన్నిధిలోనే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను రచించి అంకితమిచ్చాడు. తరువాత సా.శ.॥1512 లో గోల్కొండ వద్ద సుల్తాన్ కులీ కుతుబ్ షా సామ్రాజ్యంలో భాగమైంది. మచిలీపట్నం ఓడ రేవుగా ఎగుమతి-దిగుమతులు జరిగేవి. తానీషాగా ప్రసిద్ధి చెందిన అబూ హుసేన్ షా మంత్రులయిన అక్కన్న ఇంకా మాదన్న వారి కార్యాలయాన్ని విజయవాడలో స్థాపించారు. వీరిరువురు కనక దుర్గ అమ్మవారిని ఆరాధించేవారు. నేటికీ ఇంద్రకీలాద్రి కొండ దిగువన వీరు ఆరాధించిన గుహలు మనకు దర్శనమిస్తాయి. ఔరంగజేబు సామ్రాజ్యంలో భాగమయిన గోల్కొండను 5 నవాబులకు విభజించి ఆసఫ్ ఝా సుబేదారుగా పాలించాడు. ఆర్కాటు, కడప, కర్నూలు, రాజమండ్రి, చీకకోల్ (శ్రీకాకుళం) నవాబుల కింద పాలించబడ్డాయి. ఈ ప్రాంతం రాజమండ్రి నవాబు పరిపాలనలో వుండేది. సా.శ.॥1611 లో ఆంగ్లేయులు మచిలీపట్నం కేంద్రంగా తమ కార్యకలాపాలు జరపడం ప్రారంభమైంది. 1641 లో మద్రాసుకు తరలి వెళ్ళే వరకూ ఇది వారికి ముఖ్యపట్నంగా కొనసాగింది. ఆంగ్లేయుల తరువాత డచ్చి, ఫ్రెంచి వారు మచిలీపట్నాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1748 లో నిజాం-ఉల్-ముల్క్ మరణంతో ఈ ప్రాంతం ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి హస్తగతమయింది. 1761 లో నిజాం అలీ ఖాన్ తిరిగి గోల్కొండ నవాబు అయినపుడు మచిలీపట్నం నిజాం పట్నం, కొండవీడులో కొంత భాగం బ్రిటిష్ వారికి కానుకగా ఇచ్చాడు. ఆ తరువాత సర్కారు ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు "మచిలీపట్నం జిల్లా" అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణాజిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. 2022 లో కృష్ణా జిల్లాలో విజయవాడతో కలిసిన ఉత్తరభాగాన్ని ఎన్టీఆర్ జిల్లాగా విడదీశారు. ఉత్తరంలో కొంత భాగాన్ని ఏలూరు జిల్లాలో కలిపారు. భౌగోళిక స్వరూపం ఉమ్మడి కృష్ణా జిల్లా పీఠభూమి, తీర ప్రాంతాలుగా విభజించబడింది. భారతదేశ అత్యంత పర్యావరణ సంబంధిత ముఖ్యమైన చిత్తడినేలలో కొల్లేరుసరస్సు ఒకటి ఈజిల్లాలో పాక్షికంగా ఉంది. నీటివనరులు thumb|border|కృష్ణ నది మీదుగా విజయవాడ వద్ద ప్రకాశం బారేజి|alt= thumb|ఉమ్మడి కృష్ణా జిల్లా నీటి పారుదల వ్యవస్థ|alt= ఉమ్మడి జిల్లాలో కృష్ణా నది ముఖ్యమయిన నది. బుడమేరు, మున్నేరు, తమ్మిలేరు ఇతర నదులు. కృష్ణా నది బంగాళా ఖాతంలోకి హంసలదీవి, నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, ఇంకా నడిమేరు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సులో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తమ్మిలేరు, పోలవరం ముఖ్యమైన పెద్ద, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు. భూమి, భూగర్భ వనరులు ఉమ్మడి జిల్లావివరాలు: నల్లమట్టి (57.6%), ఇసుక బంకమట్టి (22.3%) ఎర్ర బంకమట్టి (19.4%) అను మూడు రకాల నేలలు ఉన్నాయి. సహజ వాయువు, ముడి పెట్రోల్: జిల్లా తీర ప్రాంతములో ఉన్నాయి. ఇసుక: కృష్ణ, మున్నేరు నదుల నుండి త్రవ్వకాలు జరిపి సేకరిస్తారు. క్రోమైటు: కొండపల్లి కొండలు, దగ్గర ప్రాంతాలలో ఉన్నాయి. వజ్రాలు: పరిటాల, ఉస్తేపల్లి, కొండవీటికల్లు, రామన్నపేట, సూర్యవరం, కొత్తపేట, నెమలిపురం, మాగులూరు, పుట్రేల (రాజస్థాన్ లో ముఖ్యమైనవి) మొదలైన ప్రాంతాలు. ఇనుము ధాతువు: జగ్గయ్యపేట ప్రాంతం. సున్నపురాయి: జగ్గయ్యపేట ప్రాంతం. మైకా: తిరువూరు ప్రాంతం. ఆటవీ ప్రదేశం ఉమ్మడి జిల్లాలో అటవీ ప్రాంతం 7.5%గా ఉంది. పశుపక్ష్యాదులు వృక్షజాలం, జంతుజాలం ఉమ్మడి జిల్లాలో అడవి జిల్లా వైశాల్యంలో 9% మాత్రమే ఉంది. అయితే నందిగామ, విజయవాడ,నూజివీడు, తిరువూరు,గన్నవరము, మచిలీపట్నం ప్రాంతాలలో, దివి తాలూకాలలో రిజర్వు ఫారెస్ట్ కలిగి ఉంది. ఒక రకం అయిన పొనుకు (గైరోకాపస్ జాక్విని) అని పిలువబడే తేలికపాటి రకమయిన చెక్క కొండపల్లి ప్రాంతములో కనిపిస్తుంది. ఈ చెక్కను కొండపల్లి బొమ్మలు తయారీకి ఉపయోగిస్తారు. చాలా గుర్తించదగ్గ చెట్లు అయిన టెరోకార్‌పస్, టెర్‌మినాలియా, ఎనోజీస్సస్, లోగస్ట్రోయినయ్, కాజురినా లాంటివి కూడా ఉన్నాయి. పాంథర్స్ పులులు, దుమ్ములగొండులు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు, ఇతర మాంసాహార క్షీరదాల జంతుజాలం ఇక్కడ కనిపిస్తాయి. జింక, మచ్చల లేడి సాంబార్, కృష్ణ జింక, ఇతర శాకాహార జంతువులు ఈ భూభాగ అడవులలో గుర్తించవచ్చు. జిల్లా సరిహద్దులోని కొల్లేరుసరస్సులో ఒక వలస బూడిద రంగు గల పెలికాన్ బిల్డ్ అనే ఒక రక్షిత పక్షి ఉంది. అనేక ముర్రా జాతి గేదెలు, ఆవులు పెద్ద సంఖ్యలో కలిగి ఉంది. వాతావరణం ఉమ్మడి జిల్లా వాతావరణ పరిస్థితులు, వేసవికాలం చాలా వేడిగా, శీతాకాలం తక్కువ వేడిగా ఉంటాయి. . ఏప్రిల్ ప్రారంభ కాలం నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంటుంది. ఈ ప్రాంతానికి నైరుతి రుతుపవనాల ద్వారా 1028 మి.మీ. వర్షపాతం కలుగుతుంది. జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల ప్రకారం, నూతన కృష్ణా జిల్లా విస్తీర్ణం 3775 చ.కి.మీ, జిల్లా జనాభా 17.35 లక్షలు. రెవెన్యూ డివిజన్లు,మండలాలు భౌగోళికంగా కృష్ణా జిల్లాను మూడు రెవెన్యూడివిజన్లగా, 25 రెవెన్యూ మండలాలుగా విభజించారు. ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ ఉయ్యూరు కంకిపాడు ఘంటసాల తోట్లవల్లూరు పమిడిముక్కల పెనమలూరు మొవ్వ గుడివాడ రెవెన్యూ డివిజన్ ఉంగుటూరు గన్నవరం గుడివాడ గుడ్లవల్లేరు నందివాడ పామర్రు పెదపారుపూడి బాపులపాడు మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ అవనిగడ్డ కృత్తివెన్ను కోడూరు గూడూరు చల్లపల్లి నాగాయలంక పెడన బంటుమిల్లి మచిలీపట్నం మోపిదేవి నగరాలు, పట్టణాలు నగరం:మచిలీపట్నం పట్టణాలు: గుడివాడ పెడన తాడిగడప ఉయ్యూరు రాజకీయ విభాగాలు లోక్‌సభ నియోజకవర్గాలు మచిలీపట్నం విజయవాడ (పాక్షికం) అసెంబ్లీ నియోజకవర్గాలు అవనిగడ్డ గన్నవరం గుడివాడ పామర్రు పెడన పెనుమలూరు (పాక్షికం) (మిగతా భాగం ఎన్టీఆర్ జిల్లా) మచీలీపట్నం రవాణా వ్వవస్థ రహదారి రవాణా సౌకర్యాలు జిల్లాలోని జాతీయ రహదారులు: జాతీయ రహదారి-65: మచిలీపట్నం నుండి పూనే జాతీయ రహదారి-216: ఒంగోలు నుండి కత్తిపూడి సరిహద్దు లోని జాతీయ రహదారులు సరిహద్దులో గల ఎన్టీఆర్ జిల్లా లోని విజయవాడను కలిపే జాతీయ రహదారులు. జాతీయ రహదారి-16: కోల్‌కత నుండి చెన్నై జాతీయ రహదారి-30: జగదల్‌పూర్ నుండి విజయవాడ రైలు రవాణా సౌకర్యాలు ఎన్టీఆర్ జిల్లా లోని, విజయవాడ వద్ద రైల్వే స్టేషను భారతదేశంలో 2 వ రద్దీగా ఉండే జంక్షన్ ఉంది. 200 కంటే ఎక్కువ రైళ్లు ఈ రైల్వే స్టేషను ద్వారా (పాస్) ప్రయాణించడము, రైల్వే స్టేషను వద్ద రైలు ఆగిపోవడము లేదా (ప్రారంభము) బయలుదేరడము కాని జరుగుతుంది. విమాన రవాణా సౌకర్యాలు దగ్గరలోని విమానాశ్రయం:ఎన్టీఆర్ జిల్లా లోని, విజయవాడ గృహోపకరణ సూచికలు 2007–2008 సంవత్సరములో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ సంస్థ వారు జిల్లా అంతటా 1229 గృహాలు 34 గ్రామాలలో ఇంటర్వ్యూ జరిపారు. వారు 94.7% విద్యుత్, 93,4% నీటి సరఫరా, పారిశుద్ధ్యం, 60.3% టాయిలెట్ సౌకర్యాలు, 45.5 (శాశ్వత) నివాస గృహాసౌకర్యాలు ఉన్నట్లు కనుగొన్నారు. 20.6% మంది స్త్రీలు అధికారక వయస్సు 18 సం.లు నిండక ముందే వివాహము చేసుకున్నారు. ఇంటర్వ్యూ నిర్వహించిన వారిలో 76,9% ఒక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఉన్నారు. పరిశ్రమలు ఉయ్యూరు వద్ద ఉన్న కెసీపి చక్కెర కర్మాగారం భారతదేశంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారములలో ఒకటి. మచిలీపట్నం వద్ద బంగారం-లేపనం ఆభరణాలు (గిల్టు నగలు) పరిశ్రమలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన ఓడరేవు మచిలీపట్నంలో ఉంది. సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన సాంప్రదాయిక నృత్యరీతియైన కూచిపూడి నృత్యం జిల్లాలోని కూచిపూడి గ్రామంలో పుట్టింది. సంస్కృతి ప్రపంచ ప్రసిద్ధ కూచిపూడి నృత్య రూపం ఈ జిల్లాలో నుండి ఉద్భవించింది. ఈ జిల్లా వాసులు మాట్లాడే తెలుగు యాసను తెలుగు భాషయొక్క సహజరూపమని భావించబడుతుంది. విద్యాసంస్థలు కృష్ణా విశ్వవిద్యాలయం - మచిలీపట్నం. ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం పర్యాటక ఆకర్షణలు చారిత్రక స్థలాలు మచిలీపట్నం ఆధ్యాత్మిక స్థలాలు మొవ్వ గోపాల స్వామి ఆలయం, మొవ్వ: ఈ ఊరి స్థల పురాణము ప్రకారం మౌద్గల్య మహర్షి చేత ఇసుకతో ఇచటి మువ్వ గోపాల స్వామి విగ్రహం తయారుచేయబడెను. ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవస్థానం, శ్రీకాకుళం గ్రామం: ఈ ఆలయ ప్రధానదైవం "శ్రీమహావిష్ణువు". ఈ స్వామి ఆంధ్ర వల్లభుడు, ఆంధ్ర నాయకుడు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు, ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలందుకుంటున్నాడు. కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఈ స్వామి ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం,మోపిదేవి శ్రీ లక్ష్మి గాయత్రీ దేవి ఆలయం, తేలప్రోలు క్రీడలు ఈ జిల్లాలో కబాడీ ఆట అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడతో పాటు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ ఆటలు ప్రాముఖ్యమైనవి. విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు, భారతదేశం యొక్క అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. హాకీ క్రీడాకారుడు బలరాం ఈ జిల్లాకు చెందినవారు. ప్రముఖ వ్యక్తులు జిల్లాకు చెందిన చాల మంది వివిధ రంగాలలో పేరుగడించారు. వారిలో కొందరు: సిద్ధేంద్ర యోగి, క్షేత్రయ్య, విశ్వనాథ సత్యనారాయణ, గుడిపాటి వేంకటచలం, వేటూరి సుందరరామమూర్తి, వెంపటి చినసత్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పింగళి వెంకయ్య, ముట్నూరి కృష్ణారావు,కాశీనాథుని నాగేశ్వరరావు, గోపరాజు రామచంద్రరావు, పుచ్చలపల్లి సుందరయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య, సి. కె. నాయుడు, రఘుపతి వెంకయ్య నాయుడు, ఎస్. వి. రంగారావు, సావిత్రి, నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల వేంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, శోభన్ బాబు, చంద్రమోహన్, మండలి వెంకటకృష్ణారావు, ఇవీ చూడండి కృష్ణా జిల్లా కథా రచయితలు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మూలాలు బయటి లింకులు వర్గం:కోస్తా వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు
నవంబర్ 15
https://te.wikipedia.org/wiki/నవంబర్_15
నవంబరు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరములో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి. సంఘటనలు 1937: కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్). 1954: టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు) 1954: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు). 1993: ఇండియన్ ఎయిర్‌లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు 2000: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు. 2000: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. జననాలు 1738: విలియం హెర్షెల్, వరుణ (యురేనస్‌) గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త. (మ.1822) 1883: ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (మ.1939) 1898: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (మ.1992) 1902: గోరా, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (మ.1975) 1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు సాహితీవేత్త. 1935: తెన్నేటి హేమలత, నవలా రచయిత్రి. 1949: మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలుగు రచయిత. 1986: సానియా మీర్జా, భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. మరణాలు 220x124px|thumb|right|alt=మరణం|ఘట్టమనేని కృష్ణ thumb|125px|కుడి|వేదాంతం సత్యనారాయణశర్మ 1630: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (జ.1571) 1949: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (జ.1910) 1949: నారాయణ్ ఆప్తే, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు. 1982: వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1895) 2012: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935) 2022: ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1943) పండుగలు, జాతీయ దినాలు 2000: ఝార్ఖండ్ ఫౌండేషన్ డే - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబరు 15 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబరు 14 - నవంబరు 16 - అక్టోబర్ 15 - డిసెంబర్ 15 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
నవంబర్ 14
https://te.wikipedia.org/wiki/నవంబర్_14
నవంబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 318వ రోజు (లీపు సంవత్సరములో 319వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 47 రోజులు మిగిలినవి. సంఘటనలు 1943: హైదరాబాదు స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభమైంది. 1960: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది. జననాలు thumb|Jnehru 1716 : గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (జ.1646) 1889: జవహర్ లాల్ నెహ్రూ, భారతదేశ ప్రధానమంత్రి (మ.1964) 1924: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000) 1931: వంకాయల నరసింహం, సంగీత విద్వాంసుడు, ప్రథమశ్రేణి మృదంగ నిపుణులు. 1939: ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (మ.2017) 1947: దేవరకొండ విఠల్ రావు, 4 వ భారత పార్లమెంటు సభ్యుడు. 1948: యండమూరి వీరేంధ్రనాథ్, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు 1948: మధుబాబు, పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవల రచయిత. 1948: నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (మ. 2022) 1971: ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్. 1976: హేమంగ్ బదాని, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1978: తవ్వా ఓబుల్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన తెలుగు రచయిత. 1984: మమతా మోహన్ దాస్, సినీ నటి, నేపథ్య గాయని . 1991: సమీరా షెరీఫ్ భారతీయ టెలివిజన్ నటి, నిర్మాత. మరణాలు 1958: తాడంకి శేషమాంబ, తొలి తరం తెలుగు సినిమా నటి. 1967: సి.కె.నాయుడు, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1895) 1977: ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద, అధ్యాత్మిక గురువు. 1995: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు పండుగలు , జాతీయ దినాలు జాతీయ బాలల దినోత్సవం. ప్రపంచ మధుమేహ దినోత్సవం. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, జాతీయ పుస్తక వారోత్సవాలు, సహకార సంఘాల వారోత్సవాలు. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 14 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 13 - నవంబర్ 15 - అక్టోబర్ 14 - డిసెంబర్ 14 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 15
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_15
అక్టోబర్ 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 288వ రోజు (లీపు సంవత్సరములో 289వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 77 రోజులు మిగిలినవి. సంఘటనలు 1582: పోప్‌ గ్రెగరీ-13 గ్రెగరియన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అప్పటిదాకా అందరూ అనుసరిస్తున్న జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం అంతకు ముందురోజు అక్టోబరు 4. కొత్త గణన ప్రకారం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తర్వాత రోజును అక్టోబరు 15గా చర్చి ప్రకటించింది. ఆ రకంగా మధ్యలో పదిరోజులను కావాలనే తప్పించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న క్యాలెండర్‌ ఇదే. 2009 :ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు టివి ఛానెల్ ప్రారంభమైంది. ఎ.బి.ఎన్ అంటే ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్‌వర్క్.. 1932: దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ('టాటా సన్స్‌ లిమిటెడ్‌') ప్రారంభమైంది. 1949: బనారస్ సంస్థానం, త్రిపుర, మణిపూర్‌ భారత్‌లో విలీనమయ్యాయి. 1992: ఎయిర్ ఇండియా విమానం: కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి. 1997: ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతీ రాయ్కు బ్రిటన్‌ అత్యున్నత సాహితీ పురస్కారం 'బుకర్స్‌ ప్రైజ్‌' లభించింది. జననాలు thumb|ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ 1881: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (మ.1975) 1889: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1944) 1920: మారియో పుజో, గాడ్‌ఫాదర్‌ నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన అద్భుత నవలా రచయిత. (మ. 1999) 1908: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.2006) 1920: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (మ.2002) 1926: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (మ.1984) 1927: పర్దుమన్ సింగ్ బ్రార్, షాట్‌పుట్, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడలలలో మనదేశానికి పతకాలు సాధించిన క్రీడాకారుడు. (మ.2007) 1931: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. (మ.2015) 1933: పి.చంద్రశేఖర్ రెడ్డి , తెలుగు చలనచిత్ర, దర్శకుడు (2022) 1939: జీ.రామకృష్ణ , తెలుగు, తమిళ, మళయాళ ,సినీ నటుడు, రంగస్థల నటుడు(మ.2001) 1953: మాగుంట శ్రీనివాసులురెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. 1964: పేడాడ పరమేశ్వరరావు, ప్రముఖ రచయిత, భాషావేత్త, పాత్రికేయుడు, విద్యావేత్త. 1987: సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు, "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడు. మరణాలు 1918: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (జ.1835) 1937: నెమిలి పట్టాభి రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్‌. (జ.1862) 1982: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1903) 2014: తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (జ.1936) 2022: కాట్రగడ్డ మురారి, తెలుగు సినిమా నిర్మాత. (జ.1944) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అంతర్జాతీయ అంధుల ఆసరా దినం. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ప్రపంచ తెల్ల చెరకు దినోత్సవం అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 15 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 14: అక్టోబర్ 16: సెప్టెంబర్ 15: నవంబర్ 15:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 16
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_16
అక్టోబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 289వ రోజు (లీపు సంవత్సరములో 290వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 76 రోజులు మిగిలినవి. సంఘటనలు 1945: ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది. 1968: 'మెడిసిన్‌ అండ్‌ ఫిజియాలజీ' విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను నోబెల్ బహుమతి వరించిన రోజు. 1985: భారతదేశంలో జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది. ఇందిరా గాంధీ హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు. 1990: నెల్సన్ మండేలాను భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. జననాలు thumb|Oscar Wilde Sarony 1854: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (మ.1900) 1916: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1981) 1948: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, రచయిత. 1948: హేమా మాలిని, నటి, భరత నాట్యకారిణి. 1948: రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, రచయిత, విమర్శకులు. 1990: అనిరుద్ రవిశంకర్ ,సంగీత దర్శకుడు . మరణాలు 1958: తెన్నేటి సూరి, తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. (జ.1911) 1971: నార్ల చిరంజీవి ,రచయిత (జ.1925) 2022: దిలీప్ మహలనాబిస్, అతిసార వ్యాధుల చికిత్సకు ఓరల్ రీహైడ్రెయ్షన్ థెరపీని ప్రవేశపెట్టిన శిశువైద్యనిపుణుడు. (జ.1934) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ ఆహార దినోత్సవం ప్రపంచ అనస్థీషియా దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 16 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 15: అక్టోబర్ 17: సెప్టెంబర్ 16: నవంబర్ 16:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 17
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_17
అక్టోబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 290వ రోజు (లీపు సంవత్సరములో 291వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 75 రోజులు మిగిలినవి. సంఘటనలు 1933: నాజీ ల దురాగతాలు భరించలేక మాతృభూమి (జర్మనీ) ని వదిలి ఐన్‌స్టీన్‌ అమెరికాకు పయనం. 1949: జమ్ము, కాశ్మీర్‌ లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 వ నిబంధనను చట్టసభలు స్వీకరించాయి. 1979: మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 2003: 'జితి జితాయి పాలిటిక్స్‌'... మధ్యప్రదేశ్‌లో హిజ్రా ల తొలి రాజకీయపార్టీ స్థాపన. జననాలు thumb|Anil Kumble 1872: చిలుకూరి వీరభద్రరావు, పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చేసిన ఇతిహాసకుడు. 1901: జి.ఎస్.మేల్కోటే, సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, పరిపాలనా దక్షుడు. (మ.1982) 1920: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948) 1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త. (మ.2011) 1948: అన్నపూర్ణ (నటి), ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి. 1955: స్మితా పాటిల్, హిందీ సినీనటి. (మ.1986) 1965: మాల్గాడీ శుభ , తెలుగు పాప్ సింగర్. 1970: అనిల్ కుంబ్లే, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1980: చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (మ. 2020) 1992: కీర్తీ సురేష్, మలయాళం, తమిళ, తెలుగు సినిమా నటి. 1992; ప్రణీత సుభాష్, కన్నడ,తెలుగు,తమిళ, చిత్ర నటి. మరణాలు 1937: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (జ.1877) 2014: ఎనుముల సావిత్రీదేవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు. పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం. బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 17 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 16: అక్టోబర్ 18: సెప్టెంబర్ 17: నవంబర్ 17:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 18
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_18
అక్టోబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 291వ రోజు (లీపు సంవత్సరములో 292వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 74 రోజులు మిగిలినవి. వైస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు బొడ శ్రవణ్ పుట్టిన రోజు సంఘటనలు 1922: 'బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ' (బీబీసీ) ప్రారంభం. కాలక్రమంలో అది 'బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌'గా మారింది. 1954: 'టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌' సంస్థ ట్రాన్సిస్టర్‌రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది. 1992: వందలాది పోలీసుల పదఘట్టనలతో మారుమోగిన అమృత్‌సర్‌స్వర్ణదేవాలయం. 2004: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసారు. 2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర, తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారు. జననాలు 1867: వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (మ.1949) 1900: చిలకపాటి సీతాంబ, రచయిత్రి, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత. 1925: నారాయణదత్ తివారీ, భారత జాతీయ కాంగ్రెసు రాజకీయ నాయకుడు (మ.2018). 1925: ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) మాజీ డైరెక్టర్ (మ.2020) 1928: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత (మ.2013). 1936: యాతగిరి శ్రీరామ నరసింహారావు, చారిత్రక పరిశోధకుడు. 1956: మార్టినా నవ్రతిలోవా, మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. 1965: నరేంద్ర హిర్వాణి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1978: జ్యోతిక, దక్షిణ భారత దేశానికి చెందిన నటి. మరణాలు thumb|కవిసామ్రాట్ విశ్వానాథ సత్యనారాయణ 1931: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (జ.1847) 1976: విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తెలుగు వారిలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895) 2004: వీరప్పన్, గంధపు చెక్కల స్మగ్లర్. (జ.1952) 2013: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1927) 2014: తవనం సుబ్బాయమ్మ, మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు, పలు సార్లు ఉద్యమాలు నిర్వహించారు. 2016: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (జ.1952) 2018: నారాయణదత్ తివారీ, భారత జాతీయ కాంగ్రెసు రాజకీయ నాయకుడు (జ.1925). 2022: కల్వల సదానందరావు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు. తెలంగాణ రైతుసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు. పండుగలు , జాతీయ దినాలు : బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 18 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 17: అక్టోబర్ 19: సెప్టెంబర్ 18: నవంబర్ 18:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 19
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_19
అక్టోబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 292వ రోజు (లీపు సంవత్సరములో 293వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 73 రోజులు మిగిలినవి. సంఘటనలు 1952: ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు. 1954: బీజింగ్లో భారత ప్రధానమంత్రి నెహ్రూ చైనా నాయకుడు మావోను కలిసాడు. 1970: పూర్వపు సంస్థానాధీశుల ప్రీవీ పర్సు లను ప్రభుత్వం రద్దు చేసింది. 1983: ప్రొ.సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ తన 73వ పుట్టినరోజునాడు ఫిజిక్స్ నోబెల్ పురస్కారానికి ప్రొ.విలియం ఫౌలర్ తో కలిసి ఎంపికయ్యాడు. 1983: ముంబైలో 13 జౌళి పరిశ్రమ లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ బొంబాయి జౌళి పరిశ్రమల సమ్మె ముగిసింది. ఈ సమ్మెకు దత్తా సామంత్ నాయకత్వం వహించాడు. 1987: అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఘోరపతనం. డౌ జోన్స్‌ సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో ఈ పతనం బ్లాక్‌మండేగా ప్రసిద్ధి చెందింది. జననాలు right|thumb|150px|సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ 1864: ఆచంట సాంఖ్యాయన శర్మ, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. (మ.1933) 1910: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత (మ.1995). 1916: వడ్డూరి అచ్యుతరామ కవి, తెలుగు కవి, పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పురాణ ప్రవచకుడు. (మ.1996) 1917: ఎస్.ఎస్.శ్రీఖండే, భారతీయ గణిత శాస్త్రవేత్త. 1929: సింహాద్రి సత్యనారాయణ, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు (మ.2010). 1955: గుణ్ణం గంగరాజు, సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో ఈయన మంచి పనితనానికి ప్రసిద్ధుడు. 1958: రాధశ్రీ అనే కలం పేరు కలిగిన దిడుగు వేంకటరాధాకృష్ణ ప్రసాద్, పద్యకవి, శతకకారుడు. 1987: సాకేత్ మైనేని, ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ పోటీలలో మనదేశానికి స్వర్ణపతకం సాధించాడు మరణాలు thumb|150px|ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ 1937: ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు (జ.1871). 1986: టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (జ.1919). 1987: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక ఆంధ్రప్రభను నడిపించిన సంపాదకుడు (జ. 1915). 1991: ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు (జ.1917). 2006: శ్రీవిద్య , చలనచిత్ర నటి, గాయని.(జ.1953) 2013: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత (జ.1928). 2015: కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు (జ.1945). పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ క్రెడిట్ యూనియన్ డే బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 19 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 18: అక్టోబర్ 20: సెప్టెంబర్ 19: నవంబర్ 19:- అన్ని తేదీలు thumb|William Cheselden వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 20
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_20
అక్టోబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 293వ రోజు (లీపు సంవత్సరములో 294వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 72 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb|Flag of the British East India Company (1801) 1774: భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్‌ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు. 1920: సెన్సార్‌ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్‌ జారీ చేసింది. 1947: భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు. 1962: పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్‌పై దాడి చేసింది. జననాలు 1855: గోవర్ధన్‌రాం త్రిపాఠీ - గుజరాతీ నవలా రచయిత. (మ.1907) 1930: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017) 1935: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (మ.2018) 1938: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983) 1951: కందుకూరి శ్రీరాములు, నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి. 1978 : వీరేంద్ర సెహ్వాగ్, భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 1986 : ప్రియాంక శర్మ, భారతీయ నటి. 1987: రాధికా చౌదరి , హిందీ,తెలుగు,తమిళ,నటి , దర్శకురాలు. 1997: తులసి నాయర్ , మోడల్, తమిళ నటి(నటి రాధ కుమార్తె) 1979: సోనూ కక్కర్ , నేపథ్య గాయని. మరణాలు 1990: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916) 2010: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (జ.1919) 2011: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ గణాంక దినోత్సవం. ప్రపంచ ఆస్టియో పోరోసిస్ ( ఎముకల సంబంధ వ్యాధి ) రోజు. బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 20 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 19 - అక్టోబర్ 21 - సెప్టెంబర్ 20 - నవంబర్ 20 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 21
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_21
అక్టోబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 294వ రోజు (లీపు సంవత్సరములో 295వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 71 రోజులు మిగిలినవి. సంఘటనలు 1934: లోక్‌నాయక్‌ జయప్రకాశ్ నారాయణ్‌ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్‌ అధ్యక్షుడిగా 'కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ' ఆవిర్భావం. 1943: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు. 1954: పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది. 1990: దూరదర్శన్‌ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభం. జననాలు thumb|ఆల్‍ఫ్రెడ్ నోబెల్ 1833: ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1896) 1881: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (మ.1963) 1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. 1915: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు 1920: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు 1925: సూర్జీత్ సింగ్ బర్నాలా, రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2017) 1926: షౌకత్ అజ్మీ, భారతీయ నాటకరంగ, సినిమా నటి. (మ.2019) 1930: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (మ.2011) 1947: నోరి దత్తాత్రేయుడు, భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్టు, అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు. 1967: అశ్వనీ నాచప్ప , మాజీ భారతీయ క్రీడా కారిణి, నటి. 1978:సంగీత , తెలుగు సినీ నటి , ఒరియా, దక్షిణాది భాషలలో ప్రవేశం. 1986: పూనమ్ కౌర్ , తెలుగు,తమిళ, మలయాళ ,నటి,మోడల్ 1992: శ్రీనిధి శెట్టి , కన్నడ, తమిళ చిత్రాల నటి , మోడల్. మరణాలు 1985: పింగళి దశరధరామ్ హేతువాది, పత్రికా సంపాదకుడు. 1986: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923) 1996: పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (జ.1915) 2002: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (జ.1920) 2005: మహీధర నళినీమోహన్, నవలా రచయిత, పాత్రికేయుడు. పండుగలు , జాతీయ దినాలు - పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం. బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 21 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 20 - అక్టోబర్ 22 - సెప్టెంబర్ 21 - నవంబర్ 21 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 22
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_22
అక్టోబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 295వ రోజు (లీపు సంవత్సరములో 296వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 70 రోజులు మిగిలినవి. సంఘటనలు 1764: బక్సర్ యుద్ధం జరిగింది. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ కి, బెంగాలులో మొగలుల పాలకుడు మీర్ కాసిం సేనలకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచి, భారత్‌లో తన అధికారాన్ని స్థిరపరచుకుంది. కంపెనీ సేనలకు హెక్టర్ మన్రో నాయకత్వం వహించాడు. 1953: లావోస్ ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది. 1960: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది. 1966: సోవియట్ యూనియన్ లూనా-12 అంతరిక్షనౌకను ప్రయోగించింది. 1975: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది. 1981: పారిస్-లియాన్‌ ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది. 2008: భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది. 2015 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో జరిగింది. జననాలు thumb|కొమురం భీమ్‌ 1894: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు. 1901: కొమురం భీమ్ హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవంశమునకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (మ.1940) 1927: గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరణాలు 1996:పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (జ.1896) 1998: అజిత్ ఖాన్, హిందీ సినిమా నటుడు (జ. 1922) 2001: జీ.రామకృష్ణ , తెలుగు,తమిళ, మళయాళ, నటుడు , రంగస్థల నటుడు.(జ.1939) 2020:నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (జ.1934) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 22 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 21 - అక్టోబర్ 23 - సెప్టెంబర్ 22 - నవంబర్ 22 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 23
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_23
అక్టోబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 296వ రోజు (లీపు సంవత్సరములో 297వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 69 రోజులు మిగిలినవి. సంఘటనలు 1990: అయోధ్యకు రథయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అప్పటి అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీని బీహార్ లోని సమస్తిపూర్ లో అరెస్టు చెయ్యడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది. జననాలు 1873: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975) 1922: అనిశెట్టి సుబ్బారావు, రచయిత. 1923: భైరాన్‌సింగ్ షెకావత్, భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి [మ. 2010]. 1924: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. కామన్ మ్యాన్ సృష్టికర్త. (మ.2015) 1924: కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు. (మ.2003) 1939: భగవాన్ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు. (మ.2002). 1940: పీలే, బ్రెజిల్‌ ఫుట్‌బాల్ ఆటగాడు. 1979: ప్రభాస్, తెలుగు సినిమా నటుడు. 1985: ప్రదీప్ మాచిరాజు, టివి వ్యాఖ్యాత 1989: జోనితా గాంధీ, నేపథ్య గాయని. 1991: చాందిని చౌదరి , తెలుగు చలనచిత్ర నటి. మరణాలు thumb|Gosvami Tulsidas II 1623: తులసీదాసు, హిందీ రామాయణకర్త (జ.1532). 2007: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927). 1980: న్యాయపతి కామేశ్వరి, రేడియో అక్కయ్యగా పేరుపొందినది, న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది (జ.1908). 2023: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిషన్ సింగ్ బేడి (జ. 1946) బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 23 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 22 - అక్టోబర్ 24 - సెప్టెంబర్ 23 - నవంబర్ 23 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 24
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_24
అక్టోబర్ 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 297వ రోజు (లీపు సంవత్సరములో 298వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 68 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb|The United Nations Secretariat Building 1945: ఐక్యరాజ్య సమితి స్థాపన 1919: న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ పతనమై మహా ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది. 1964: జాంబియా స్వాతంత్ర్యం పొందింది. జననాలు 1927: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. (మ.2015) 1930: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలనచిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (మ.2014) 1932: జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (మ. 2022) 1933: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010) 1953: నర్రా విజయలక్ష్మి, అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు. 1965: ఇయాన్ బిషప్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు . 1966: నదియా, తమిళ, తెలుగు, మలయాళ,నటి . 1980 : కౌషికి చక్రబొర్తి, భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి. 1980: లైలా , హిందీ, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ,చిత్రాల నటి. మరణాలు 1985: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (జ.1899) 1994: ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (జ.1915) 2010: చెరుకూరి లెనిన్, ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు. 2015: మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (జ.1950) 2017: గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (జ.1929) 2017: ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు(జ.1948). పండుగలు , జాతీయ దినాలు 1945 - ఐక్యరాజ్యసమితి దినోత్సవం ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం. ఇండో - టిబెటియన్ సరిహద్దు దళాల అవతరణ దినోత్సవం. ప్రపంచ పోలియో దినోత్సవం. బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 24 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 23 - అక్టోబర్ 25 - సెప్టెంబర్ 24 - నవంబర్ 24 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు వర్గం:అంతర్జాతీయ దినములు
అక్టోబర్ 25
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_25
అక్టోబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 298వ రోజు (లీపు సంవత్సరములో 299వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 67 రోజులు మిగిలినవి. సంఘటనలు కజకిస్తాన్ రిపబ్లిక్ దినోత్సవం 1951: భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. 1971: ఐక్యరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం. జననాలు 1800: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబర్ 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు). 1921: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973) 1929: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు. (మ.2012) 1962: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.(మ.2013) 1968: సంపత్ రాజ్ , దక్షిణ భారత సినీ , ప్రతి నాయక,సహాయ పాత్రల నటుడు. 1988 : శక్తిశ్రీ గోపాలన్, భారతీయ గాయని, గీత రచయిత్రి. 1987 : ఉమేష్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు. మరణాలు thumb|తంగి సత్యనారాయణ 1999: సాలూరు రాజేశ్వరరావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో సంగీత దర్శకుడు (జ.1922). 2000: గోపగారి రాములు, తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. (జ. 1926) 2003: కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకుడు (జ.1944). 2009: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి (జ.1931). 2015: జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 25 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 24 - అక్టోబర్ 26 - సెప్టెంబర్ 25 - నవంబర్ 25 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 26
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_26
అక్టోబర్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 299వ రోజు (లీపు సంవత్సరములో 300వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 66 రోజులు మిగిలినవి. సంఘటనలు 1945 జననాలు thumb|కుడి|నాగూర్ బాబు (మనో) 1890: గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (మ.1931) 1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు 1932: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప. 1949 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం. 1965: నాగూర్ బాబు, ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడాడు 1974: రవీనా టాండన్., తెలుగు, హిందీ, కన్నడ,నటి, నిర్మాత. 1985: ఆసిన్, కేరళ రాష్ట్రంకి చెందిన భారతీయ చిత్రనటి. 1986: శైలేష్ కొలను , చలనచిత్ర దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే. 1991: అమలా పాల్, కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. మరణాలు 1955: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం. (జ.1921) పండుగలు , జాతీయ దినాలు - గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు. జాతీయ గుమ్మడి కాయ దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 26 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 25 - అక్టోబర్ 27 - సెప్టెంబర్ 26 - నవంబర్ 26 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 27
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_27
అక్టోబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 300వ రోజు (లీపు సంవత్సరములో 301వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 65 రోజులు మిగిలినవి. సంఘటనలు 1920: భారత పదవ రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ కేరళ లోని ఉఝవూరులో జన్మించాడు. 1961: అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది 1971: కాంగో దేశం పేరు "రిపబ్లిక్ ఆఫ్ జైర్"గా మార్చబడింది. జననాలు 1542: అక్బర్‌, మొఘల్ చక్రవర్తి. (మ.1605) 1728: ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లను కనుగొన్న నావికుడు జేమ్స్ కుక్ జన్మించాడు. 1811 : కుట్టు మిషను రూపకర్త ఐజాక్ మెరిట్ సింగర్ జననం (మ.1875). 1858: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919) 1904: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (మ.1929) 1920: కె.ఆర్. నారాయణన్, భారత రాష్ట్రపతి. (మ.2005) 1928 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దత్తా గైక్వాడ్ జననం. 1936: పర్వతనేని ఉపేంద్ర, ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చేపట్టి (1989 - 1990) సమర్ధవంతంగా నిర్వహించాడు. 1939: చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (మ.2002) 1954: అనురాధ పౌడ్వాల్ , భారతీయ నేపథ్య గాయని , పద్మశ్రీ అవార్డు గ్రహీత 1966 : భారత దేశానికి చెందిన చదరంగ క్రీడాకారుడు దివ్యేందు బారువా జననం. 1977 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు కుమార సంగక్కర జననం. 1984 : భారత క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ జననం. మరణాలు thumb|కొమురం భీమ్ 1795: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (జ.1774) 1914: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, కవీంద్రుడు, పండితులు, కవి శిఖామణి. 1940: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901) 1987:కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (జ.1905) పండుగలు , జాతీయ దినాలు పదాతి దళ దినోత్సవం. శిశు దినోత్సవం. ఆక్యు పేషనల్ థెరపీ డే బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 27 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 26 - అక్టోబర్ 28 - సెప్టెంబర్ 27 - నవంబర్ 27 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 28
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_28
అక్టోబర్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 301వ రోజు (లీపు సంవత్సరములో 302వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 64 రోజులు మిగిలినవి. సంఘటనలు జననాలు thumb|సిస్టర్ నివేదిత 1867: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (మ.1911) 1909: కొడవటిగంటి కుటుంబరావు, తెలుగు రచయిత, హేతువాది. (మ.1980) 1924: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (మ.1996) 1970: గురుకిరణ్ , సంగీత దర్శకుడు , గాయకుడు, నటుడు . 1986: అదితిరావు హైదరి , బాలీవుడ్ , తమిళ,తెలుగు ,చిత్రాల నటి. 1990: షర్మిలా మాండ్రే , కన్నడ, తెలుగు, తమిళ , చిత్రాల నటి , నిర్మాత. మరణాలు 1892: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (జ.1824) 1900: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823) 1959: గోవిందరాజులు సుబ్బారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1895) 2011: దూసి బెనర్జీ భాగవతార్, రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌. 2016: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (జ.1935) 2019: చక్రవర్తుల రాఘవాచారి సీనియర్ పాత్రికేయుడు. విశాలాంధ్ర సంపాదకుడు. (జ.1939) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ యానిమేషన్ డే. అత్తవార్ల దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 28 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 27 - అక్టోబర్ 29 - సెప్టెంబర్ 28 - నవంబర్ 28 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 29
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_29
అక్టోబర్ 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 302వ రోజు (లీపు సంవత్సరములో 303వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 63 రోజులు మిగిలినవి. సంఘటనలు 1963: స్టార్ ఆఫ్ ఇండియాతో సహా ఎన్నో విలువైన రత్నాలు న్యూయార్కు లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి. 1971: తుపాను తాకిడికి ఒడిషాలో 10, 000 మంది మరణించారు. 1989 : విజయవాడలో మొదటి పుస్తక ప్రదర్శన నిర్వహించారు 1996: ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియంతో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ తమిళనాడు లోని కల్పక్కంలో పని చెయ్యడం ప్రారంభమయింది. 2005: తెలంగాణలో నల్గొండ దగ్గరి వలిగొండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రేపల్లె, సికిందరాబాదు డెల్టా పాసెంజరు యొక్క ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా. ఢిల్లీలో జరిగిన మూడు వరుస పేలుళ్ళలో 70 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. ఒక బస్సులో ఉంచిన పేలుడు పదార్ధాలను గుర్తించిన డ్రైవరు, కండక్టరు వాటిని బయటకు విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది. 2007: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 20, 000 దాటి రికార్డు సృష్టించింది. జననాలు 1017: హెన్రీ III, రోమన్ చక్రవర్తి. 1899: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (మ.1978) 1950: తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత. (మ.2022) 1961: కొణిదల నాగేంద్రబాబు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత. 1976: రాఘవ లారెన్స్, నృత్య దర్శకుడు, సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడు . 1981: రీమాసేన్, భారతీయ సినిమా నటి. 1986: శ్రీదేవి విజయ్ కుమార్, తమిళ, తెలుగు, కన్నడ, నటి. 1991: హరిప్రియ, భరత నాట్య కళాకారిణి, మోడల్, దక్షిణ భారతీయ సినీ నటీ. మరణాలు right|thumb|125px|ఘంటసాల బలరామయ్య 1940: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (జ.1863) 1953: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (జ.1906) 2002 మహేష్ మహదేవన్ , సంగీత దర్శకుడు.(జ.1955) పండుగలు , జాతీయ దినాలు జాతీయ పిల్లుల (క్యాట్) రోజు. ప్రపంచ స్ట్రోక్ డే బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 29 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 28 - అక్టోబర్ 30 - సెప్టెంబర్ 29 - నవంబర్ 29 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 30
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_30
అక్టోబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 303వ రోజు (లీపు సంవత్సరములో 304వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 62 రోజులు మిగిలినవి. సంఘటనలు 2006: 2005 అక్టోబర్ లో, కేంద్ర ప్రభుత్వము "పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ (పిఏడిసి) ని ఏర్పాటు చేసింది. దీనినే సోలి సొరాబ్జి కమిటీ అని అంటారు. పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, ప్రభుత్వానికి 30 అక్టోబరు 2006 న సమర్పించింది. అతిపురాతనమైన, పోలీస్ ఏక్ట్ 1861 ని, నేటి కాలానికి, అనుగుణంగా, మార్చవలసిన అవసరం ఉంది. మోడల్ పోలీస్ ఏక్ట్ 2006 ని, చదవాలంటే, ఇక్కడ నొక్కండి. ఇది హోమ్ మంత్రిత్వశాఖ వెబ్‍సైట్ లో ఉంది. 1976: ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ ఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది. 2013: బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు మరణించారు జననాలు thumb|Homi Jehangir Bhabha 1735: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు. 1751: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (మ. 1816) 1909: హోమీ జహంగీర్ బాబా, అణుశాస్త్రవేత్త. 1930: వారెన్ బఫ్ఫెట్, యు.ఎస్. మదుపరి, వ్యాపారవేత్త,, లోకోపకారి. 1938: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989) 1944: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (మ.2014) 1957: శిఖామణి, కవి. 1987: రామ్ మిరియాల , గాయకుడు,సంగీత దర్శకుడు, రచయత . 1998:అనన్య పాండే , హిందీ ,తెలుగు , చలన చిత్ర నటి. మరణాలు 1883: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (జ.1824) 1910: హెన్రీ డ్యూనాంట్, రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు. 1973: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1902) 1990: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (జ.1901) 1992: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (జ.1921) 2011: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956) 2022: తిరుకోవెల అంజయ్య, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు. పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ పొదుపు దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 30 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రోజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 29 - అక్టోబర్ 31 - సెప్టెంబర్ 30 - నవంబర్ 30 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 31
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_31
అక్టోబర్ 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 304వ రోజు (లీపు సంవత్సరములో 305వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 61 రోజులు మిగిలినవి. సంఘటనలు 1840: మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) లెక్స్ లోసి (Lex Loci, భారతదేశంలో, ఇంగ్లీష్ లా యొక్క పాత్ర, అధికారం గురించిన నివేదికను ఇచ్చాడు. 1984: భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమితుడైనాడు. 2000: డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు. 2005: ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. జననాలు thumb|right|125px|సర్దార్ వల్లభభాయి పటేల్ 1875: సర్దార్ వల్లభభాయి పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి. (మ. 1950) 1889: ఆచార్య నరేంద్ర దేవ్. (మ.1956) 1895: సి.కె.నాయుడు, భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు. (మ.1967) 1925: కోటయ్య ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.2001) 1937: నరిశెట్టి ఇన్నయ్య, హేతువాది, తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు. 1943: ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి (మ. 2023) 1946: కరణం బలరామకృష్ణ మూర్తి, రాజకీయ నాయకుడు. మరణాలు thumb|కుడి|125px|ఇందిరాగాంధీ 1974: మాచిరాజు దేవీప్రసాద్, తనది "వికట కవిత్వం" అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించాడు. (జ. 1922) 1984: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917) 1984: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత. (జ.1912) 1990: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగ నేపథ్యగాయని. (జ.1928) 2003: అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. (జ.1914) 2004: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు నవలా రచయిత. (జ.1935) 2005: పి.లీల, మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. (జ.1934) 2019: గీతాంజలి తెలుగు సినిమా నటి. (జ.1947) 2022: జేజే ఇరానీ, భారతీయ పారిశ్రామికవేత్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1936) 2023: ఈశ్వరరావు , తెలుగు చలన చిత్ర నటుడు, టీ వీ.సీరియల్ నటుడు. పండుగలు , జాతీయ దినాలు హాలోవీన్ (Hallowe'en గా కూడా వ్రాస్తారు) అనేది అక్టోబరు 31న జరుపుకునే సెలవుదినం. క్రైస్తవ మతంలో ప్రొటస్టెంట్ సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు...మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు -ఏక్తా దివస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. ఇందిరాగాంధీ వర్ధంతి. ప్రపంచ పొదుపు దినోత్సవం జాతీయ ఐక్యతా దినోత్సవం బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 31 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 30 - నవంబర్ 1 - సెప్టెంబర్ 30 - నవంబర్ 30 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
సెప్టెంబర్ 30
https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_30
సెప్టెంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 273వ రోజు (లీపు సంవత్సరములో 274వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 92 రోజులు మిగిలినవి. సంఘటనలు 1667 - గోల్కొండ ఔరంగజేబు సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. 1947: పాకిస్థాన్ ఇంకా యెమన్ ఐక్యరాజ్యసమితిలో చేరాయి. 1955: రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది. 1971: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టాడు. 1993: మహారాష్ట్ర లోని లాతూర్ భూకంపం, సుమారు 10,000 ప్రజలు మరణించారు. 2001 - మధ్యప్రదేశ్, మెయిన్‌పురి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియాతో సహా మొత్తం 8 మంది మరణించారు. 2007 - మెక్సికోలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా భారతీయ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ కొత్త ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. 2008: రాజస్థాన్ లోని జోధ్‌పూర్లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు. 2010: అయోధ్యలోని బాబ్రీ మసీదు రామ మందిర వివాదంపై ప్రయాగ్‌రాజ్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్, ఆ వివాదాస్పద నేలను మూడు ముక్కలుగా వేరు చేసి, రామ్ లల్లా, నిర్మోహి అఖారా, వక్ఫ్ బోర్డులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చింది. 2012: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చి (కవాతు) జరిగింది. 2020: బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా, సంఘ్ అగ్రనాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది జననాలు 1207: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ. (మ.1273) 1828: లాహిరి మహాశయులు, భారత యోగీశ్వరుడు, మహావతార్ బాబాజీకి శిష్యుడు. (మ.1895) 1864 - స్వామి అకందానంద, స్వామి రామకృష్ణ శిష్యుడు (మ. 1937 ) 1893: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (మ.1965) 1900: ఎం. సి. చగ్లా, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి (మ. 1981 ) 1913: ఆర్. రామనాథన్ చెట్టియార్, తమిళనాడు రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త (మ. 1995 ) 1922: హృషీకేష్ ముఖర్జీ, బెంగాలీ-హిందీ సినిమాల దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ. 2006) 1934: అన్నా కష్ఫి, భారత-అమెరికన్ నటీమణి (మ. 2015) 1941: కమలేశ్ శర్మ, భారత దౌత్యవేత్త, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్‌ 1951: రేలంగి నరసింహారావు, తెలుగు చలనచిత్ర దర్శకుడు, హాస్య చిత్రాలకు ప్రసిద్ధి. 1961: చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1966 - శంకర్ బాలసుబ్రమణియన్, భారతీయ-బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త 1967: దీప్తి భట్నాగర్, భారతీయ సినీ నటీ, మోడల్, టీ వి.వ్యాఖ్యత . 1964: మోనికా బెల్లూచి ఇటలీ నటి, ఫ్యాషన్ మోడల్ జననం. 1970:దీపా మాలిక్, భారత క్రీడాకారిణి. 1972: శాంతను ముఖర్జీ (షాన్), పేరుగాంచిన భారత గాయకుడు. 1980: మార్టినా హింగిస్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి. మరణాలు 1955: జేమ్స్ డీన్, అమెరికాకు చెందిన నటుడు (జ.1931). 1990: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు సుప్రసిద్ధ నవలా రచయిత (జ.1954). 2001: మాధవరావు సింధియా, రాజకీయ నాయకుడు (జ.1945). 2012: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు (జ.1923). 2014: మౌల్వి ఇఫ్తిఖర్ హుస్సేన్ అన్సారీ, భారత మతగురువు, రాజకీయ నాయకుడు. (జ.1940). పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ అనువాద దినోత్సవం. అంతర్జాతీయ పొడ్కాస్ట్ (వలపఱపం/వలప్రసారం) దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 30 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు https://www.tribuneindia.com/news/lifestyle/time-to-listen-436796 https://youthistaan.com/from-aurangzebs-capture-of-golconda-to-the-release-of-the-accused-of-babri-demolition-see-todays-history-here/ Noorani, Abdul Gafoor Abdul Majeed (1970). India's Constitution and Politics. Jaico books. Jaico Publishing House. p. 174. సెప్టెంబర్ 29 - అక్టోబర్ 1 - ఆగష్టు 30 - అక్టోబర్ 30 -- అన్ని తేదీలు వర్గం:సెప్టెంబర్ వర్గం:తేదీలు
కీసర (కీసర మండలం)
https://te.wikipedia.org/wiki/కీసర_(కీసర_మండలం)
కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరంలో ఉంది.కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివాలయానికి ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయాన్ని దర్శించుటకు రాష్ట్రం నలుమూలలనుండి భక్తులు విచ్చేస్తారు. గణాంకాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2318 ఇళ్లతో, 10087 జనాభాతో 2918 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5152, ఆడవారి సంఖ్య 4935. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1442 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 240. గ్రామం జనగణన లొకేషన్ కోడ్ 574142 శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం స్థలపురాణము త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వనవిహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్ఠాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి "శ్రీరామలింగేశ్వరస్వామి" అని పేరు వచ్చింది. తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ఠ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసెను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం అతని పేరుమీద 'కేసరి గిరి'గా ప్రసిద్ధిచెందుతుందని ఆశీర్వదించెను. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్ఠించాడు. అదే మారుతీ కాశీ విశ్వేశ్వరాలయము.కాలక్రమేణా కేసరిగిరి క్షేత్రం కీసరగుట్ట'గా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉండుట విశేషం. చరిత్ర చారిత్రక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం సా.శ. 4వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి 7వ శతాబ్దం పూర్వార్థం వరకు ఆంధ్రదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశమునకు కీసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అతని రాజముద్రిక లంఘించు సింహం (కేసరి). ఈ ప్రదేశంలో రాజ వంశానికి చెందిన రెండవ మాధవ వర్మ 11 అశ్వమేధ యాగాలు,ఇంకా 1000 ఇతర యాగాలు నిర్వహించి నర్మదా తీరం వరకు తన రాజ్యాన్ని విస్తరించిన గొప్ప రాజు. విష్ణుకుండినులు మొదట ఇంద్రపురిని (నేటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం) రాజధానిగా చేసుకొని ప్రజారంజకంగా పరిపాలన చేశారు. కీసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖవారి త్రవ్వకపు పరిశోధనలలో 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట, భవనాలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణెములు, మట్టి పాత్రలు, యజ్ఞ కుండాలు వెలుగుచూశాయి. ఈ వంశంలోని మొదటి గోవింద వర్మ బలపరాక్రమ సంపన్నుడై అనేక రాజ్యాలను జయించి బౌద్ధారామ విహారాలను, చైత్యములను, దేవాలయములను నిర్మించి ప్రసిద్ధిచెందినట్లుగా ఇంద్రపురి (ఇంద్రపాల నగరం) లో లభించిన తామ్రశాసనం ద్వారా తెలుస్తోంది. విష్ణుకుండినులు తెలుగుబాషను అధికార భాషగా మొట్టమొదట గుర్తించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తున్నది.నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 11 ఈ వంశీయులు అపురూపమైన దేవాలయాలను, గుహాలయాలను నిర్మించారు. నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయం, తుమ్మలగూడెం లోని రామేశ్వర, అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (ఫరూఖ్‌నగర్) సమీపంలోని ఉత్తరరాజ రామలింగేశ్వరాలయం, కందూరు రామలింగేశ్వరాలయం, గుంటూరు జిల్లా వేల్పూరు రామలింగేశ్వరాలయం వీటిలో కొన్ని దేవాలయాలు. సా.శ. 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రముగా అభివృద్ధి చేయదలచి హిందూ మహమ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక దేవాలయాన్ని నిర్మించారు. దానిలో శ్రీ లక్ష్మీనృశింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం ఉంది. ఈ స్తంభంపై మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, ఆంజనేయ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి.కీసరగుట్టలో ఉన్న పురాతన విగ్రహలు ఉన్నాయి. స్థలపురాణం శ్రీ రాముడు రావణ వధ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించాడు, రావణ వధ తర్వాత బ్రహ్మ హత్యా పాతకం తొలగి పోవడానికి ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నారు, హనుమంతున్నీ వారణాసికి వెళ్లి శివ లింగాన్ని తీసుకురమ్మని పంపించాడు, అయితే హనుమంతుడు ఆలస్యం చెయ్యడంతో రాముడు శివున్ని ప్రార్ధిస్తాడు, అప్పుడు ప్రత్యక్షం ఐన శివుడు లింగరూపంలో ఇక్కడ వెలిసాడు, ఇక్కడ వెలిసిన లింగం స్వయంభు: లింగం, ఆ లింగాన్ని రాముడు పూజించాడు, ఆలస్యంగా చేరుకున్న ఆంజనేయుడు రాముడు వేరే లింగాన్ని ప్రతిష్ఠించడంతో తాను వెంట తెచ్చిన 101 లింగాలని ఆ ప్రాంతంలో విసిరి పారేసాడు, అందుకే ఈ గుట్టపై అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. కేసరి సుతుడైన ఆంజనేయుడి పేరు మీదిగా కేసరి గుట్ట అనే పేరు వచ్చింది, కేసరి గుట్టె నేడు కీసర గుట్టగా పిలవబడుతుంది. ఇక్కడ ఆలయంలో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు, భవాన్ని అమ్మవారు, శివ దుర్గా అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు, ఈ దేవాలయంలో లక్ష్మి నరసింహ స్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివ రాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు. ఈ గుట్ట కింది భాగంలో ఆశ్రమాలు, యోగ కేంద్రాలను ఏర్పాటు చేసారు, ప్రశాంత మైన వాతావరణంతో పాటు కొండ సువిశాలంగా ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండడం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు, ఇది ఆధ్యాత్మిక కేంద్రం గానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా, ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖ వారు మరిన్ని సోగబులను తీర్చిదిద్దారు. గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారి ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటుచేసారు, వానాకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొండపైన విశాలమైన కాలి స్థలం ఉండడం వల్ల దీనిని విస్తరించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు మాఘ బహుళ త్రయోదశి మొదలు ఫాల్గుణ శుద్ధ విదియ వరకు మహాశివరాత్రి పర్వదినాన ఐదు రోజులు పరమశివునికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రత్యేక మాసోత్సవాలు ఆరుద్ర నక్షత్రముతో కూడిన సోమవారములలో విశేష పూజలు జరుపబడును. ప్రతి మాసమునందు కృష్ణ చతుర్దశి నాటి మాస శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరుపబడును. విద్యా సౌకర్యాలు గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 4 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, 4 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. గ్రామంలో 2 ప్రైవేటు మేనేజిమెంటు కళాశాలలు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కాప్రాలోను, ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ హైదరాబాదులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదులో ఉన్నాయి. వేద సంస్కృత పాఠశాల: దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు 1981 సంవత్సరము నుండి నిర్వహించుచున్నది. ఇక్కడ గురుకుల పద్ధతిలో కృష్ణ యజుర్వేదము, సంస్కృత శాస్త్రములు బోధింపబడుచున్నవి. గురుకుల విద్యాలయము: ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల సంస్థ 1972 సంవత్సరంలో ఒక సంస్థను ప్రారంభించి, 1980 లో డా. మర్రి చెన్నారెడ్డి గారు పాఠశాలకు శంకుస్థాపన చేశారు. వసతులు తిరుమల... తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల ఉంది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ వారు నిర్మించిన హరిత హోటల్ ఉంది. ఇందులో భోజనం, వసతి సదుపాయం ఉంది. జిల్లా పరిషత్ వారు, ఆర్ అండ్ బి వారు నిర్మించిన గదులు కూడా ఉన్నాయి. ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం ఉంది. బ్రాహ్మణులకు నిత్యాన్నదాన పథకం ఉంది. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం కీసరలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. సమాచార, రవాణా సౌకర్యాలు కీసర (రంగారెడ్డి జిల్లా)లో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ఈక్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో ఉంది. జంట నగరాలలోని సికింద్రాబాద్, ఇ.సి.ఐ.ఎల్., అఫ్జల్ గంజ్ నుండి బస్సులు వెంట, వెంటనే ఉన్నాయి. ప్రవేటు వాహనాలు కూడా ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. ఆటో సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 5 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం కీసర (రంగారెడ్డి జిల్లా)లో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 190 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 981 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 956 హెక్టార్లు బంజరు భూమి: 635 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 156 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 1579 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 167 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు కీసర (రంగారెడ్డి జిల్లా)లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 167 హెక్టార్లు ఉత్పత్తి కీసర (రంగారెడ్డి జిల్లా)లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి దర్శనీయ ప్రదేశాలు శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రధాన దేవాలయము భవానీ, విఘ్నేశ్వర విగ్రహములు స్వామి పుష్కరిణి విజయ స్తంభము, నంది స్తంభములు అక్కన్న, మాదన్నల లక్ష్మీ నృసింహస్వామి దేవాలయము ఆళ్వారుల విగ్రహములు ఆంజనేయస్వామి దేవాలయము సీతమ్మవారి దేవతాస్థానము శైవ విఘ్నేశ్వరాలయము సీతాసరోవరము, తామరకొలను క్షేత్రపాలక, భైరవ విగ్రహములు సన్యాసి మఠము 101 శివలింగములు కాశీబుగ్గ వద్దనున్న గుహ శ్రీరాములవారి పాదములు నందిసేవిత శివలింగము ప్రాచీన జైన విగ్రహము పురావస్తుశాఖ త్రవ్వకాలు: శివాలయము, యజ్ఞవాటిక ముప్పైమూడు అడుగుల బారి ఆంజనేయ స్వామి విగ్రహం: కీసర గుట్టకు ప్రక్కనే వున్న మరో గుట్టపై నిజాముల కాలంలో కట్టిన పెద్ద ద్వారం. గుట్టపై ప్రాచీన కాలంలో కట్టిన బౌద్ధ స్థూపాల ఆనవాలు. వీటిని అతి పెద్ద ఇటుకలతో వృత్తాకరంలో కట్టివున్నవి. చిత్రమాలిక మూలాలు బయటి లింకులు కేసరిగిరి క్షేత్ర మహిమ, రచయిత: శ్రీ ఎం. సత్యనారాయణ, 1995. కీసరగుట్ట www.keesara.com కీసర మేనేజ్ వెబ్ సైట్ వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు
బూర్గుల రామకృష్ణారావు
https://te.wikipedia.org/wiki/బూర్గుల_రామకృష్ణారావు
బూర్గుల రామకృష్ణారావు (మార్చి 13, 1899 - సెప్టెంబర్ 14, 1967) బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు.తెలుగు వెలుగులు పుస్తకం, అమరావతి పబ్లికేషన్సు జననం - విద్యాభ్యాసం రామకృష్ణరావు 1899 మార్చి 13 న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో జన్మించాడు. వీరి స్వగ్రామం బూర్గుల; ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది. ధర్మపంత్ స్కూలు (హైదరాబాద్) లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. 1915లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. పూణె లోని ఫెర్గూసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ చదివాడు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) పూర్తిచేసి, హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. బూర్గుల దగ్గర పివినరసింహారావు జూనియర్ లాయర్‌గా పనిచేశాడు. రాజకీయ జీవితం 1924లో పెళ్ళి చేసుకున్నాడు. 1923లో హైదరాబాదులో న్యాయవాద వృత్తి ప్రారంభించి అగ్రస్థాయికి చేరాడు. న్యాయవాదిగా ఉంటూనే, రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, భూదానోద్యమం మొదలైన వాటిలో పాల్గొన్నాడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైన వారితో కలిసి పనిచేసాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు. హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టీ తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు బూర్గుల అధ్యక్షత వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. 1948లో పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు అయి, వెల్లోడి ముఖ్యమంత్రిగా సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవెన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. రెవెన్యూ మంత్రిగా వినోబాభావే ప్రారంభించిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించాడు.భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సిసైటి ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ 222 1952లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగిపుడు, మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యాడు. పూర్తి మెజారిటీ లేకున్ననూ, మంత్రివర్గంలో సంపూర్ణ సహకారం లేకున్ననూ, పరిపాలన దక్షుడైన ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు.ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరామారావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 56 1956లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయినపుడు, కొత్త రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. బూర్గుల, కేరళ రాష్ట్రానికి గవర్నరుగా వెళ్ళాడు. 1960 వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత 1962 వరకు ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. right|thumb|150px|తపాలాశాఖ 2000లో విడుదల చేసిన తపాలాబిళ్ళ 1948 జనవరిలో ప్రభుత్వ ఏజెంట్ జనరల్‌గా హైదరాబాద్ వచ్చిన కె.యం. మున్షీని నిజాం ఆజ్ఞలకు విరుద్ధంగా అందరికన్నా ముందే సందర్శించి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడై ప్రజా ఉద్యమానికి సారథ్యం వహించాడు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కృషి సల్పిన తీరు విశేషమైనది. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో వీరు చేపట్టిన సేవ ప్రత్యేకమైనది. ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్ విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం అధ్యక్షులుగా ఉన్నాడు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల తెలుగు ఉర్దూ అకాడమీ, భారతీయ విద్యాభవన్, ప్రశాంతి విద్వత్ పరిషత్ అధ్యక్షులుగా గొప్ప సాంస్కృతిక సేవలందించాడు. క్లాసికల్ లాంగ్వేజి కమిషన్ సభ్యులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సంస్కృత పరిషత్‌ల ఉపాధ్యక్షులుగా భాషా సేవలు అందించాడు. సాహితీ వ్యాసంగం బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవాడు. పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం, రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం) మొదలైనవి ఆయన ఇతర రచనలు. ఈయన రచించిన వ్యాసాలు 'సారస్వత వ్యాస ముక్తావళి' పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, కృష్ణశతకం, వేంకటేశ్వర సుప్రభాతం, నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశాడు. అనువాద రచనలు కూడా చేశాడు. వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రోత్సాహంతో 'తెలంగాణ రచయితల సంఘం' ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యాడు. పురస్కారాలు 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవపట్టాను ప్రదానం చేసింది. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ అనే పట్టాను ఇచ్చింది. మరణం బూర్గుల 1967, సెప్టెంబర్ 14 న గుండెపోటుతో మరణించాడు. మూలాలు, వనరులు వర్గం:1899 జననాలు వర్గం:1967 మరణాలు వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్గం:కేరళ గవర్నర్లు వర్గం:ఉత్తర ప్రదేశ్ గవర్నర్లు వర్గం:రంగారెడ్డి జిల్లా గ్రంథాలయోద్యమ నేతలు వర్గం:నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు వర్గం:రంగారెడ్డి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:పెద్దమనుషుల ఒప్పందంలో పాలుపంచుకున్న తెలంగాణ వ్యక్తులు వర్గం:రంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైన హైదరాబాదు రాష్ట్ర శాసన సభ్యులు వర్గం:రంగారెడ్డి జిల్లాకు చెందిన గవర్నర్లు వర్గం:రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వర్గం:రంగారెడ్డి జిల్లా రచయితలు వర్గం:రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు వర్గం:తెలుగు గ్రంధాలయ ప్రముఖులు
అక్టోబర్ 2
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2
అక్టోబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 275వ రోజు (లీపు సంవత్సరములో 276వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 90 రోజులు మిగిలినవి. సంఘటనలు 1535: ఫ్రెంచ్ విశ్లేషకుడు జాక్యూస్ కార్టైర్ 1535 అక్టోబరు 2న హోచెలాగా (మాట్రియల్ చూడండి) ను సందర్శించాడు, హోచెలాగాలో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు. 1844: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు. 1845: భారతదేశంలో మొదటి షిప్పింగ్ కంపెనీ ప్రారంభమైంది 1934: భారత నావికాదళం ( అప్పటి పేరు రాయల్ ఇండియన్ నేవీ) స్థాపించబడింది. 1951: శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు 1952: సంఘ ప్రెంపుదల కార్యక్రమం ప్రారంభమైంది. 1954: ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్‌నగర్ పశ్చిమ బెంగాల్‌లో భాగంగా మారింది 1955: చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది. 1961: బొంబాయిలో (నేటి ముంబై) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. 1966: భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే ఏర్పడింది. 1971: అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గాంధీ సదన్‌గా ఇప్పుడు మనకు తెలిసిన బిర్లా హౌస్‌ను దేశానికి అంకితం చేశారు . ఇక్కడే మహాత్మా గాంధీ హత్య జరిగింది. 1972: భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ స్టేషన్ బొంబాయిలో మొదలయ్యింది. 1985: వరకట్న నిషేధ సవరణ చట్టం అమలులోకి వచ్చింది 1988: సెప్టెంబర్ 17 నుంచి దక్షిణ కొరియాలోని సియోల్లో మొదలయిన 24వ ఒలింపిక్ క్రీడలు ముగిసాయి. 1988: తమిళనాడులోని మండపం ఇంకా పంబన్ నడుమ సముద్రంపై పొడవైన వంతెన తెరవబడింది. 1991: బీహార్ రాజధాని పాట్నా ఇంకా క్రొత్త ఢిల్లిల నడుమ శ్రమజీవి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ను మొదలుపెట్టారు 1992: ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడింది. 1994: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి. 2004: అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. 2006: అణు ఇంధన సరఫరా సమస్యపై భారత్‌కు మద్దతు ఇవ్వాలని దక్షిణాఫ్రికా నిర్ణయించింది. 2008: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది 2009: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి. 2012: తెదేపా అధినేత చంద్రబాబు చేసిన 'వస్తున్నా మీకోసం' 208 రోజుల పాదయాత్ర మొదలుపెట్టారు. 2014: స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం మొదలయ్యింది. 2016: భారతదేశంలో విద్య విధానాలమీద సంస్కరణల కోసం దేశంలో వున్నా స్వచ్ఛంద సంస్థలను, యువతను భాగస్వామ్యం చేస్తూ దేశంలో యువత ద్వారా సంస్కరణల స్థాపనే ఏకైక లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం (వైపిపి) ఏర్పడింది జననాలు thumb|125px|గాంధీ 1852: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916) 1869: మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948) 1891: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962) 1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1987). 1904: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966) 1908: పర్వతనేని బ్రహ్మయ్య, ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980) 1910: డి. అర్కసోమయాజి, ఆంధ్ర విద్యావేత్త 1911: అంబత్ మీనన్, కేరళ విద్యావేత్త 1911: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (మ.1997) 1923: ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017). 1924: తపన్ సిన్హా, ప్రముఖ సినీ దర్శకుడు (మ. 2009) 1926: నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (మ. 1993) 1928: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (మ.1992) 1931: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010) 1935: ఎన్.నిత్యానంద్ భట్, చలనచిత్ర నిర్మాత 1942: ఆశా పరేఖ్, ప్రముఖ సినీ నటి 1943: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు. 1943: మినతీ సేన్, భారత 12, 13, 14 లోక్ సభ సభ్యుడు. 1961: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020) 1974: రచనా బెనర్జీ, ఒరియా, బెంగాలీ, దక్షిణాది చిత్రాలనటీ. 1900 : అక్టోబర్ 2 లీలా రాయ్ జన్మించింది మరణాలు thumb|right|125px|సి.డి.దేశ్‌ముఖ్ 1422: ఫిరుజ్ షా బహమనీ. 1906: రాజా రవివర్మ, ప్రముఖ చిత్రకారుడు (జ. 1848) 1961: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906) 1974: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900) 1975: కుమారస్వామి కామరాజ్, తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు. 1982: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (జ.1896) 1992: హొన్నప్ప భాగవతార్, దక్షిణ భారత కర్ణాటక సంగీతకారుడు, నాటకరంగ ప్రముఖులు. (జ. 1915) 2018: ఎం.వి.వి.ఎస్. మూర్తి, విశాఖపట్నం లోని గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు అమెరికా లోని అలాస్కాలో మరణం (జ. 1938 జూలై 3). పండుగలు , జాతీయ దినాలు గాంధీ జయంతి. (అంతర్జాతీయ అహింసా దినం, ) లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం. ప్రపంచ సాధు జంతువుల రోజు. మానవ హక్కుల పరిరక్షణ దినం . గ్రామ స్వరాజ్ డే. ఖైదీల దినోత్సవం. జాతీయ ఖాదీ దినోత్సవం దానోత్సవ వారం (జాయ్‌ ఆఫ్‌ గివింగ్‌) అక్టోబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు. మాదకద్రవ్య వినిమయ వ్యతిరేక దినం బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 2 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 1: అక్టోబర్ 3: సెప్టెంబర్ 2: నవంబర్ 2:- అన్ని తేదీలు మూలాలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 3
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_3
అక్టోబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 276వ రోజు (లీపు సంవత్సరములో 277వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 89 రోజులు మిగిలినవి. సంఘటనలు 1791: కలకత్తా మ్యాగజైన్, ఓరియంటల్ మ్యూజియం, భారత ఉపఖండంలోని మొదటి మాసపత్రిక, ప్రచురించడం ప్రారంభమైంది 1831:బ్రిటిష్ వారు మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నారు 1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది. 1950: న్యూయార్క్‌లో యుఎన్ దళాలు 38 వ సమాంతరాన్ని దాటడాన్ని భారత్ నిరసించింది. 1955: మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది. 1957:రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది 1977:న్యూఢిల్లీలో అధికారిక అవినీతి ఆరోపణలపై ఇందిరా గాంధీని అరెస్టు చేశారు. 1978: ప్రపంచంలో రెండవ, భారతదేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జన్మించింది. 1984: భారతదేశపు అతి పొడవైన రైలు హిమ్సాగర్ ఎక్స్‌ప్రెస్ (జమ్మూ తావి నుండి కన్యా కుమారి వరకు) మొదటిసారిగా జెండా ఊపింది. 1985: సహారావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌ని న్యూఢిల్లీ ఆమోదించినట్లు ప్రకటించిన తర్వాత మొరాకో భారతదేశంతో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేసింది 1988: లెబనీస్ కిడ్నాపర్లు మిథిలేశ్వర్ సింగ్‌ను 30 నెలల బందీగా ఉంచిన తర్వాత విడుదల చేశారు. 1990: పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి. 2000:వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటనపై భారత్, రష్యా సంతకాలు చేశాయి. 2005: వర్తుల సూర్యగ్రహణం (యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్) ఏర్పడింది. 2013: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2013: లాలూ ప్రసాద్ యాదవ్‌కు పశువుల దాణా కుంభకోణం కేసులో తొలి శిక్షగా ఐదేళ్ళు జైలు శిక్ష 2021: రోహ్‌తాంగ్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ సొరంగంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ‌ ప్రారంభించారు. జననాలు thumb|right|125px|స్వామీ రామానందతీర్థ 1890: లక్ష్మీనారాయణ సాహు, సాహితీవేత్త, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త 1903: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (మ.1972) 1924: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994) 1926: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (మ.2010) 1949 - జె.పి.దత్, భారతీయ చలనచిత్ర దర్శకుడు 1954: సత్యరాజ్, దక్షిణ భారత చలన చిత్రాలుతో పాటు హిందీ చిత్రాల్లో, సహాయ, ప్రతి నాయక నటుడు 1988: కాశి రాజు, వర్థమాన కవులలో ఒకడు, కవిసంగమంలో గ్రూప్ కవితలు వ్రాస్తున్నాడు. మరణాలు right|thumb|125px|ఇ.వి.సరోజ 1923: కాదంబినీ గంగూలీ - భారతదేశపు మొదటి పట్టభద్రురాలైన మహిళా, మొదటి మహిళా వైద్యురాలు. (జ.1861) 1992: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (జ.1898) 2006: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలలో పేరొందిన చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (జ.1935) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు BBC: On This Day This Day in History చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 3 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 2 - అక్టోబర్ 4 - సెప్టెంబర్ 3 - నవంబర్ 3 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 4
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_4
అక్టోబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 277వ రోజు (లీపు సంవత్సరములో 278వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 88 రోజులు మిగిలినవి. సంఘటనలు 1855: ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చొరవ, నాయకత్వంలో వితంతు వివాహ చట్టం ప్రవేశపెట్టబడింది 1934: అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది. 1957: సోవియట్ యూనియన్ మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌ని విజయవంతంగా ప్రయోగించింది. ఇక్కడ నుండే అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య అంతరిక్ష పోటీ ప్రారంభమైందని నమ్ముతారు. 1992: సమాజ్‌వాదీ పార్టీ, భారతదేశ రాజకీయ పార్టీ, స్థాపించబడింది. 2006: వికీలీక్స్ ప్రారంభించబడింది జననాలు thumb|కుడి|125px|కమలాకర కామేశ్వరరావు 1911: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1998) 1912: కుంకలగుంట సైదులు, మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు. 1920: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (మ.2013) 1943: రసరాజు, (రంగేనేని సత్యనారాయణ రాజు) కవి, సినీ గీత రచయిత . 1957: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత. 1958: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వనపర్తి శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వ్యవసాయ, సహకార, ఆహార & పౌర సరఫరా శాఖల మంత్రిగా ఉన్నాడు. 1977: సంఘవి, కన్నడ, తెలుగు సినిమా నటి. మరణాలు thumb|right|125px|ఏడిద నాగేశ్వరరావు 1904 : ఫ్రెడెరిక్ ఆగస్టు బార్తోల్డి, అమెరికా దేశంలో ఉన్న స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో చెక్కిన సింహం విగ్రహము విగ్రహ శిల్పి (జ.1834) . 1947: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858) 2015: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1934) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ జంతు దినోత్సవం. ప్రపంచ అంతరిక్ష వారం. thumb|Little Joe 6 launch 10-4-1959 from Wallops Is. Virginia బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 4 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 3 - అక్టోబర్ 5 - సెప్టెంబర్ 4 - నవంబర్ 4 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 5
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_5
అక్టోబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 278వ రోజు (లీపు సంవత్సరములో 279వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 87 రోజులు మిగిలినవి. సంఘటనలు 1864: కలకత్తాలో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు. 1964: రెండవ అలీన దేశాల సదస్సు కైరోలో ప్రారంభమైనది. 2006: కేంద్ర ప్రభుత్వము తన ఉద్యోగుల జీత భత్యాలను సవరించటానికి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ ఛైర్‌మన్ గా ఆరవ వేతన సంఘాన్ని నియమించింది. 18 నెలలలో నివేదిక సమర్పించాలని చెప్పింది. ప్రొఫెసర్ రవీంద్ర ధోలకియా, జె.ఎస్. మాథుర్ లు సభ్యులుగా, శ్రీమతి సుష్మా నాథ్, మెంబర్-సెక్రటరీగా ఉన్నారు. జననాలు thumb|right|125px|జి.వెంకటస్వామి 1882: రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (మ.1945) 1885: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు, సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (మ.1964) 1911: పసుపులేటి కన్నాంబ , రంగస్థల నటి, చలన చిత్ర కళాకారిణి , గాయని(మ.1968) 1914: పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (మ.1950) 1929: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (మ.2014) 1929: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (మ.2009) 1930: మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1999) 1952: కంచ ఐలయ్య, భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు 1954: ఎం.వి.రఘు, ఛాయాగ్రాహకుడు, కళ్లు సినిమా దర్శకుడు. 1965: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి (మ.2016) 1980: ఆదిత్య ఓం, నటుడు, పాటల రచయిత, దర్శకుడు. మరణాలు 2001: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (జ.1910) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవము అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 5 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 4 - అక్టోబర్ 6 - సెప్టెంబర్ 5 - నవంబర్ 5 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 6
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_6
అక్టోబర్ 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 279వ రోజు (లీపు సంవత్సరములో 280వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 86 రోజులు మిగిలినవి. సంఘటనలు 1860: ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు 1927: ది జాజ్ సింగర్ అనే తొలి టాకీ సినిమా (శబ్ద చిత్రం) ని వార్నర్ బ్రదర్స్ (అమెరికా) లో విడుదల చేసారు. ఒకటి, రెండు పాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉన్నాయి. 1963: హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంభించబడింది. జననాలు thumb|right|125px|వినోద్ ఖన్నా 1896: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (మ.1978) 1908: ఈశ్వరప్రభు, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1932 : గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్. 1933: ముకర్రం జా, నిజాం వారసుడు (మ. 2023) 1942: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు. 1943: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు. 1946: వినోద్ ఖన్నా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (మ.2017) 1958: పనబాక లక్ష్మి, భారత పార్లమెంటు సభ్యురాలు. మరణాలు thumb|right|125px|టెన్నిసన్ 1892: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892) 1967: సి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898) 2012: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.1927) 2014: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (జ.1930) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ గృహ వసతి దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 6 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 5 - అక్టోబర్ 7 - సెప్టెంబర్ 6 - నవంబర్ 6 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 7
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_7
అక్టోబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 280వ రోజు (లీపు సంవత్సరములో 281వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 85 రోజులు మిగిలినవి. సంఘటనలు 1737: 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు. 1952 : పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ఎంపిక. జననాలు thumb|125px|నీల్స్ బోర్ 1885: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1962) 1900: గంటి జోగి సోమయాజి, తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ. (మ.1987) 1900: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీ సభ్యుడు. (మ.1945) 1901: మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (మ.1990) 1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, సాహితీ పరిశోధకుడు, కవి, నాటకకర్త, దర్శకుడు, ప్రయోక్త, కథకుడు, ఉత్తమ అధ్యాపకుడు. (మ.2011) 1945: అట్లూరి సత్యనాథం, కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మరణాలు thumb|right|125px|పి.యశోదారెడ్డి 1940: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866) 1975: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (జ.1887) 1976: పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904) 2007: పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ మంచి పని దినోత్సవం ప్రపంచ పత్తి దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 7 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 6 - అక్టోబర్ 8 - సెప్టెంబర్ 7 - నవంబర్ 7 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 8
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_8
అక్టోబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 281వ రోజు (లీపు సంవత్సరములో 282వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 84 రోజులు మిగిలినవి. సంఘటనలు 2009 : 2009 అక్టోబరు 8న, ఒబామా మాథ్యూ, షెపర్డ్, జేమ్స్ బైర్డ్, Jr. హేట్ ప్రతీకార నేరాల నిరోధక చట్టంపై సంతకం చేశారు 1993: దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతమవడంతో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది. జననాలు thumb|right|125px|అడివి బాపిరాజు 1860: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1933) 1891: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (మ.1940) 1895: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (మ.1952) 1902: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ ఉపకులపతి (మ.1961). 1918: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (మ.2006) 1918: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980) 1932: శివశక్తి దత్త ,తెలుగు ,సినీ గేయరచయిత. 1935: ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997) 1950: చివుకుల ఉపేంద్ర, అమెరికా లోని ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి. 1964: సరిత, దక్షిణ భారత చలన చిత్ర నటి , డబ్బింగ్ కళాకారిణి. 1970: అర్చన , తెలుగు,తమిళ ఉత్తమ జాతీయ అవార్డు నటి 1977: మంచు లక్ష్మి, భారతీయ సినీ, టెలివిజన్ నటి, నిర్మాత, 1981: దాసరి మారుతి, తెలుగు సినీ దర్శకుడు. 1981 : భారతీయ సినిమా నటి వేద శాస్త్రి జననం. మరణాలు thumb|right|125px|సి.ఎస్.ఆర్.ఆంజనేయులు 1936: ప్రేమ్‌చంద్, భారతదేశపు హిందీ, ఉర్దూ కవి. (జ.1880) 1963: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (జ.1907) 1970: నెల్లూరు కాంతారావు , వస్తాదు , సినీ నటుడు నిర్మాత(జ.1931) 1976: కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (జ.1905) 2008: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (జ.1917) పండుగలు , జాతీయ దినాలు - భారత వైమానిక దళ దినోత్సవం. రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 8 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 7 - అక్టోబర్ 9 - సెప్టెంబర్ 8 - నవంబర్ 8 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 9
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_9
అక్టోబర్ 9, గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 282వ రోజు (లీపు సంవత్సరములో 283వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 83 రోజులు మిగిలినవి. సంఘటనలు జననాలు thumb|right|125px|అంజద్ అలీఖాన్ 1945: అంజద్ అలీఖాన్, భారతీయ సరోద్ విద్వాంసుడు. 1945: విజయ కుమారతుంగా, శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (మ.1988) 1962: ఎస్ . పి.శైలజ., తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల గాయని , డబ్బింగ్ కళాకారిణి. 1974: వి. వి. వినాయక్, తెలుగు సినిమా దర్శకుడు. మరణాలు thumb|125px|చే గువేరా 1562: గాబ్రియల్ ఫెలోపియో, శరీర నిర్మాణ శాస్త్రవేత్త, వైద్యుడు. 1967: చే గెవారా (చే గువేరా) దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (జ.1928) 1974: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (జ.1928) 2000: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (జ.1924) 2013: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా మారిన‌ నటుడు. (జ.1964) 2015: రవీంద్ర జైన్,సంగీత దర్శకుడు (జ.1944) 2017: ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (జ.1948) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ తపాలా దినోత్సవం న్యాయ సేవా దినోత్సవం. జాతీయ ప్రాదేశిక సైనిక దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 9 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 8 - అక్టోబర్ 10 - సెప్టెంబర్ 9 - నవంబర్ 9 -- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 10
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_10
అక్టోబర్ 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 283వ రోజు (లీపు సంవత్సరములో 284వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 82 రోజులు మిగిలినవి. సంఘటనలు 1964: 18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో ప్రారంభమయ్యాయి. 1959: భారత ప్రధాననమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి వరంగల్‌లో శంకుస్థాపన చేశారు. 1971: ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ (15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో) వెలువడింది. జననాలు 1731: హెన్రీ కేవిండిష్,బ్రిటిష్ తత్వవేత్త, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. (మ.1810) 1872: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920) 1902: [పులుగుర్త వేంకటరామారావు]], శతావధాని, రచయిత, ఆదర్శ ఉపాధ్యాయుడు. (మ.1964) 1906: ఆర్.కె.నారాయణ్, భారతీయ ఆంగ్ల నవలా రచయిత (మ.2001). 1908: ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు (1980). 1914: భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (మ.1993) 1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985). 1922: మేడిచర్ల ఆంజనేయమూర్తి, బాలల కథల, గేయ రచయిత. 1927: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014) 1922: నర్రా మాధవరావు, నిజాం విమోచన పోరాటయోధుడు 1933: సదాశివ పాటిల్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1944: ఎల్.ఆర్.స్వామి, రచయిత, అనువాదకుడు. 1945: జయప్రకాశ్ రెడ్డి, తెలుగు నటుడు. 1945: కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు. (మ.2015) 1947: ఎమ్. చంద్రసేనగౌడ్, రంగస్థల నటి 1950: మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (మ.2015) 1954: రేఖ, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న ఒక భారతీయ నటి. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందినది. 1956: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్య నటుడు. (మ.2018) 1960: మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (మ.2008) 1960: యర్రా రఘు బాబు, తెలుగు సినీ నటుడు. 1968: ఆలీ (నటుడు), తెలుగు సినిమా హాస్యనటుడు. 1973: ఎస్. ఎస్. రాజమౌళి, తెలుగు చలనచిత్ర దర్శకుడు. 1989: సంజన గల్రాని ,తమిళ ,మలయాళ ,కన్నడ ,తెలుగు, చిత్రాల నటి. 1990: రకుల్ ప్రీత్ సింగ్ , తెలుగు,తమిళ,కన్నడ, హిందీ, నటి. మరణాలు thumb|125px|జగ్జీత్ సింగ్ 1958: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత. (జ.1892) 1982: సుద్దాల హనుమంతు జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు. (జ.1908) 1985: యూలి బోరిస్వోవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు. (జ.1920 జూలై 11) 2011: జగ్జీత్ సింగ్, భారతీయ గజల్ గాయకుడు. (జ.1941) 2022: ములాయం సింగ్ యాదవ్, భారతీయ రాజకీయవేత్త, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు. (జ.1939) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.(అక్టోబర్ నెలలో రెండో శనివారం) ప్రపంచ నిర్వాసితుల దినోత్సవం. ప్రపంచ గంజి దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 10 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 9: అక్టోబర్ 11: సెప్టెంబర్ 10: నవంబర్ 10:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 11
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_11
అక్టోబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 284వ రోజు (లీపు సంవత్సరములో 285వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 81 రోజులు మిగిలినవి. సంఘటనలు 1980: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య ప్రమాణ స్వీకారం చేసాడు. 1988: జనతా దళ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ దీనికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. జననాలు thumb|Amitabh Bachchan 1827: అఫ్జల్ ఉద్దౌలా, హైదరాబాదు పరిపాలకులలో ఐదవ నిజాం. ఇతడు 1857 నుండి 1869 వరకు పరిపాలించాడు. (మ.1869) 1902: జయప్రకాశ్‌ నారాయణ్, భారత్‌లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించిన వ్యక్తి. (మ.1979) 1922: సాలూరు రాజేశ్వరరావు,సంగీత దర్శకుడు (మ.1999) 1942: అమితాబ్ బచ్చన్, సినిమా నటుడు. 1947: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013) 1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త. 1972: సంజయ్ బంగర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1978: క్రిష్: జాగర్లమూడి రాధాకృష్ణ , చలన చిత్ర దర్శకుడు మరణాలు 1997: గబ్బిట వెంకటరావు , సినీ, నాటక, రచయిత . పద్యకవి , నిర్మాత ,దర్శకుడు(జ.1928) 2015: మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937) 2020:రాజన్ ,(రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం ) సం గీత దర్శకుడు,(జ.1933) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ బాలికా దినోత్సవం అంతర్జాతీయ పేపర్ బాయ్ దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 11 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 10: అక్టోబర్ 12: సెప్టెంబర్ 11: నవంబర్ 11:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 12
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_12
అక్టోబర్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 285వ రోజు (లీపు సంవత్సరములో 286వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 80 రోజులు మిగిలినవి. సంఘటనలు 1965: 19వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి. 1998: ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ ప్రమాణ స్వీకారం. 1999: ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2000: జే ఎం ఎం ముడుపుల కేసులో పూర్వపు ప్రధానమంత్రి పి వి నరసింహారావు కు, బూటాసింగుకు కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగారం, 2 లక్షల జరిమానా విధించింది. (తరువాత వీరిద్దరూ నిర్దోషులుగా బయటపడ్డారు). జననాలు 1911: విజయ్ మర్చంట్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు . 1917: బూర్గుల రంగనాథరావు, తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి. 1918: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986) 1929: రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త. 1932: యుషిరో మియురా, తన 70వ యేట, 75వ యేట, 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు. 1936: రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, వ్యాసరచయిత. 1945: పంతుల జోగారావు, వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. 1948: ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (మ.1998) 1955: హేమా చౌదరి, దక్షిణ భారత సినిమా నటి. 1955: బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (మ. 2002) 1981: స్నేహ , తెలుగు సినీ నటి . మరణాలు thumb|కుడి|గండికోట బ్రహ్మాజీ 1967: రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు. 1993: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ గవర్నరు. (జ.1921) 2012: ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922) పండుగలు , జాతీయ దినాలు : సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు. ప్రపంచ దృష్టి దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 12 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 11: అక్టోబర్ 13: సెప్టెంబర్ 12: నవంబర్ 12:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 13
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_13
అక్టోబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 286వ రోజు (లీపు సంవత్సరములో 287వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 79 రోజులు మిగిలినవి. సంఘటనలు 1679: పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు. జననాలు 1860: హెచ్.వి.నంజుండయ్య,మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920) 1923: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు. (మ.2012) 1936: వీణాపాణి, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (మ.1996) 1956: సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ రాష్ట్రానికిచెందిన రాజకీయ నాయకుడు ఆయన 12 జూన్ 2014 నుండి 16 జనవరి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా పనిచేశాడు. 1973: కందికొండ యాదగిరి , గీత రచయిత,కవి ,(2022) 1990: పూజా హెగ్డే ,, మోడల్,తెలుగు,తమిళ, చిత్రాల నటి. 1993: హనుమ విహారి, ఆస్ట్రేలియాలో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు. మరణాలు thumb|సిస్టర్ నివేదిత 1911: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. (జ.1867) 1987: కిషోర్ కుమార్, సుప్రసిద్ద హిందీ సినీ నటుడు, గాయకుడు. (జ.1929) 2006: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924) 2020: గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (జ.1947) పండుగలు , జాతీయ దినాలు : అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం. ప్రపంచ గుడ్డు దినోత్సవం. జాతీయ సినిమా దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 13 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 12: అక్టోబర్ 14: సెప్టెంబర్ 13: నవంబర్ 13:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
అక్టోబర్ 14
https://te.wikipedia.org/wiki/అక్టోబర్_14
అక్టోబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 287వ రోజు (లీపు సంవత్సరములో 288వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 78 రోజులు మిగిలినవి. సంఘటనలు 1912: హెచ్.సి.హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు 1956: నాగపూరులో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించాడు. 1977: జ్యోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా నియామకం. 1985: అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది. 1994: బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు. 1998: అమర్త్యసేన్‌కు ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. జననాలు 1643: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (మ.1712) 1877: వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (మ.1937) 1909: సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలలో ఆద్యుడు. (మ.1989) 1952: వేదగిరి రాంబాబు, రచయిత (మ.2018). 1980: శివ బాలాజీ , సినీ నటుడు, వ్యాపార వేత్త. 1981: గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. మరణాలు thumb|Ardeshir Irani recording Alam Ara, 1931 1969: అర్దెషీర్ ఇరానీ, సినిమా రచయిత, చిత్ర దర్శకుడు, నటుడు, డిస్ట్రిబ్యూటర్, షోమాన్, ఛాయాగ్రహకుడు. (జ.1886) 1982: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి. (జ.1897) 2004: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (జ.1920) 2010: సాయి శ్రీహర్ష , తెలుగు సినీ గీత రచయిత(జ.1961) 2011: జాలాది రాజారావు, తెలుగు రచయిత. (జ.1932) 2013: టి.వెంకటేశ్వరరావు, బెజవాడ కార్పొరేషన్ మొదటి మేయర్, పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రాత వహించాడు. 2020: శోభానాయుడు, కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1956) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 14 చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రోజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు అక్టోబర్ 13: అక్టోబర్ 15: సెప్టెంబర్ 14: నవంబర్ 14:- అన్ని తేదీలు వర్గం:అక్టోబర్ వర్గం:తేదీలు
నాగార్జునసాగర్
https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో , ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు. నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో నాగార్జునకొండ ప్రదర్శనశాలలో భద్ర పరచారు. ఈ జలాశయానికి 11,560 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించ బడుతున్నది. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలున్నాయి. భౌగోళికం కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లా సరిహద్దుల పై నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు. నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది. ఆనకట్టకు ఇరువైపుల దక్షిణ విజయపురి (వి.పి.సౌత్) (గుంటూరు జిల్లా),ఉత్తరవిజయపురిలో భాగంగా పైలాన్ (నల్గొండ జిల్లా), హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం కూడా. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రిక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో నాగార్జునకొండ అని ఇప్పుడు పిలువబడే ప్రదర్శనశాలలో భద్ర పరచారు. విమాన శిక్షణ కోసం నాగార్జున సాగర్‌లో చిన్నపాటి విమానాశ్రయం ఉంది. జాతీయ రహదారి 565 ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాదు నుండి 165 కి.మీ, విజయవాడ నుండి 190 కి.మీ దూరంలోవుంది. సమీప రైల్వే స్టేషన్ మాచర్లనుండి 24 కి.మీ దూరంలో ఉంది. సమీప విమానాశ్రయాలు హైదరాబాదు విమానాశ్రయం, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం. చరిత్ర ఇక్కడ ఒక జలాశయము కట్టాలనే ఆలోచన బ్రిటిష్ పరిపాలకుల కాలంలోను అనగా నైజాము పరిపాలన కాలములోనే 1911 లోనే వచ్చింది. చివరికి భారత దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు 10 నాడు పునాది రాయి పడింది. భారత దేశ మూడవ ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా 1967 లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది. గతంలో ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, శాతవాహనులు పరిపాలించేవారు. ఆకాలంలో కట్టబడి అనేక బౌద్ధ స్థూపాలు ఇతర కట్టడాలు ఈ జలాశయములో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాటి పరిరక్షణకు వాటిలో చాల వాటిని యదాతదంగా పెకలించి జలాశయం మధ్యలో నెలకొని వున్న నాగార్జునకొండపైకి తరలించి అక్కడ వాటిని యదాతదంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఒక మ్యూజియం కూడా నిర్మించి అందులో ఆనాటి అనేక వస్తువులను ప్రదర్శన కొరకు పెట్టారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు "కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్"ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతిఊరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయములోనే కె. ఎల్. రావు ద్వారా పూర్వం హైదరాబాదు నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు. అన్వేషించి ఆ రిపోర్టులు సాధించాడు. నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయముగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై మాచెర్ల దగ్గర నదీలోయను దర్శించాడు. స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి. డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించాడు. అప్పటి మద్రాసు ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటనలో నందికొండ ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. 1952లో ఖోస్లా కమిటీ నందికొండ ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది. విజయవాడ నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా "ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం" అని తెల్పాడు. ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నములు మొదలైనవి. రాజా ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్రణాళికా సంఘం సభ్యులందరిని ఒప్పించి సుముఖులుగా చేశాడు. ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను 1952లో ఆమోదించింది. జలాశయ సామర్థ్యం 281 టి.ఎం.సి.గా సూచించింది. అదే సమయములో రాష్ట్ర ప్రభుత్వము కూలిపోయింది. రాష్ట్రములో గవర్నర్ (చందూలాల్ త్రివేది) పాలన ఆరంభమయింది. త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10న (మన్మధ నామ సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నాడు) అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సి.ఎం.త్రివేది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. నిర్మాణం కొరకు శరవేగంతో మాచర్లలో వెలగపూడి రామకృష్ణ గారు కెసిపి సిమెంట్ ప్యాక్టరీ నిర్మించారు. మానవ శక్తితో డ్యాము నిర్మాణం 1969లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని 1974లో పూర్తయింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. నార్ల వెంకటేశ్వర రావు మాటలలో "ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మనకు సిద్ధించేది కాదేమో". రాజా గారిని ప్రజలు "ప్రాజెక్టుల ప్రసాద్" అని పిలుచుకునేవారు.బౌద్ధ అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన నందికొండ, ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 2005 డిసెంబరు 10 న స్వర్ణోత్సవాలను జరుపుకుంది. సాగర్ నిర్మాణ సమయంలో అసువులు బాసిన వారి స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని వై.ఎస్. ఆవిష్కరించాడు. గౌతమ బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడి విగ్రహాలతో బాటు సాగర్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్న నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇంజినీరింగ్ నిపుణులు కె.ఎల్.రావు, సాగర్ మొదటి చీఫ్ ఇంజినీర్ జాఫర్ అలీల విగ్రహాలను వై.ఎస్. ఆవిష్కరించాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ఋణంతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి పేరుతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను చేపట్టింది. 2010, ఆగస్టు 14వ తేదిన ప్రపంచ బ్యాంక్ తో దీనిపై ఒప్పందం కుదిరింది. 10.9.2010 నుండి ఈ పథకం అమలు లోకి వచ్చింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.4444.41 కోట్లు. ఇందులో 48 శాతం ప్రపంచబ్యాంకు ఋణం. రాష్ట్రప్రభుత్వం వాటా 52 శాతం. ఒప్పందానికి సంవత్సరం ముందునుండి నిబంధనలకు లోబడి జరిగిన వ్యయంలో ప్రపంచ బ్యాంకు ఋుణం వాటా రిట్రోఏక్టివ్ ఫడింగ్ ద్వారా చెల్లిస్తుంది. ఆధునీకరణ లక్ష్యాలు నాగార్జున సాగర్ కాలువలను ఆధునీకరించి నీటి సరఫరా సామర్ధ్యాన్ని వృధ్ది చేస్తూ వ్యవసాయాభివృధ్ధి చేయుట,వ్యవసాయ ఉత్పాదకత పెంచుట నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్ని పెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా జలవనరులను అభివృధ్ది చేసి నిర్వహించుట ఈ పథకంలో పలు అంశాలు ఉపాంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ పథకం గరిష్ఠ లక్ష్యాలతో కూడుకొన్నది. ఈ పథకాన్ని ప్రధానంగా సాగునీరు ఆయకట్టు అభివృధ్ది శాఖ అమలు చేస్తుంది. కాగా అంశం బిలో ఉపాంశాలను వ్యవసాయ శాఖ. ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు ఈ పథకం అమలులో పాలు పంచుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు తోడు వాలంతారి, ఆచార్యఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామేతి వంటి సంస్దలు ఈ పధకం అమలులో భాగస్వాములు. సి అంశంలో రెండు ఉపాంశాలను భూగర్భ జలశాఖ అమలు చేస్తుంది. 2018లో రెండు సంవత్సరాల ఆలస్యంగా పథకం పూర్తయింది. ప్రపంచబ్యాంక్ దీనికి మోస్తరు సంతృప్తి అని అంచనా వేసింది. ప్రాజెక్టు వివరాలు ప్రాజెక్టు గణాంకాలు డ్యాము పొడవు: 15,956 అ. (4863.388 మీ.) ప్రధాన రాతి ఆనకట్ట పొడవు: 4756 అ. (1449.628 మీ.) మొత్తం మట్టికట్టల పొడవు: 11,200 అ. (3413.76 మీ.) ఎడమ మట్టికట్ట పొడవు: 8400 అ. (2560.32 మీ.) కుడి మట్టికట్ట పొడవు: 2800 అ. (853.44 మీ.) మొత్తం క్రెస్టుగేట్ల సంఖ్య: 26 కుడి కాలువ పొడవు: 203 కి.మీ. ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ. జలాశయ సామర్థ్యం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 408 టి.ఎం.సి. (శతకోటి ఘనపుటడుగులు-థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్) కనీస స్థాయి నిల్వ: 213 టి.ఎం.సి. విద్యుదుత్పత్తి సామర్థ్యం విద్యుదుత్పత్తికై నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మూడు కేంద్రాలున్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్థ్యం 960 మె.వా. (మెగా వాట్లు) నది దిగువకు నీరు విడుదలయ్యే చోట నిర్మించిన కేంద్రంలో: 810 మె.వా., దీనిలో 8 యూనిట్లు వుండగా మొదటి యూనిట్ 1978 మార్చి 7 లో ప్రారంభమైనది. చివరి యూనిట్ 1985 డిసెంబరు 24 న ప్రారంభమైనది. కుడి కాలువకు నీరు విడుదలయ్యే చోట: 90మె.వా., ఎడమకాలువకు నీరు విడుదలయ్యే చోట: 60 మె.వా. ఆయకట్టు వివరాలు thumb|300px|right|నాగార్జున సాగర్ ఎడమకాలువ thumb|300px|right|నాగార్జున సాగర్ కుడి కాలువ గేట్లు డ్యాముకు ఇరువైపుల నుండి రెండు సాగునీటి కాలువలు బయలుదేరుతాయి. కుడి కాలువని జవహర్ కాలువ గాను, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ గాను పేరు పెట్టారు. అయితే వ్యవహారంలో వీటిని కుడి కాలువ, ఎడమకాలువ గానే పిలుస్తారు. కుడికాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా నల్గొండ,సూర్యపేట కృష్ణా, ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. అంతేకాక, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించేందుకు కూడా నాగార్జునసాగర్ ఉపయోగపడుతుంది. 300px|thumb|కుడికాలవ విస్తరణ ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లో మొత్తం 22,35,910 ఎకరాల ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి. కుడి కాలవ కుడి కాలువ జిల్లాఆయకట్టు, ఎకరాల్లో గుంటూరు జిల్లా 6,68,230 ప్రకాశం జిల్లా 4,43,180 మొత్తం 11,11,410 కుడికాలవపై గుంటూరు శాఖా కాలవ, అద్దంకి శాఖా కాలవ, ఒంగోలు శాఖా కాలువ, ఇంకా చాలా పెద్ద కాలువలు ఉన్నాయి. ఎడమకాలవ ఎడమ కాలువ జిల్లాఆయకట్టు, ఎకరాల్లో నల్గొండ జిల్లా 3,72,970 ఖమ్మం జిల్లా 3,46,769 కృష్ణా జిల్లా 4,04,760 మొత్తం 11,24,500 దర్శనీయ స్థలాలు thumb|దర్శనీయ స్థలాలు నాగార్జునకొండ thumb|right|300px నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ మ్యూజియంలో, బుద్ధవనం మ్యూజియంలో భధ్రపరిచారు. ఇది ప్రపంచంలోనే అరుదైనది. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి. సాగరమాత దేవాలయం 250x250px|thumb|సాగరమాత దేవాలయం పర్యాటకులకు ప్రధానమైన ఆకర్షణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ముఖ్యంగా వర్షాలు బాగా పడి గేట్లు తెరిచినప్పుడు పెద్దయెత్తున సందర్శకులు వస్తారు. నాగార్జున సాగర్ దక్షిణభాగమైన విజయపురి సౌత్ లో ఉన్న సాగరమాత ఆలయం హిందూ ఆలయ శైలిలో నిర్మించిన కాథలిక్ చర్చి. ఈ ఆలయం నాగార్జునసాగర్ జలాశయానికి దక్షిణపు ఒడ్డున ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రధానద్వారానికి ఎదురుగా ఉంది. ఈ ఆలయము నిర్మాణ శైలిలోనే కాక కొన్ని పూజా పద్ధతులలో కూడా హిందూమత పద్ధతులను అవలంబించడం విశేషము. ఉదాహరణకు ఈ గుడిలో మేరీమాతకు భక్తులు టెంకాయలు కొట్టి అగరువత్తులు సమర్పిస్తుంటారు. ప్రతియేటా మూడురోజుల పాటు జరిగే సాగరమాత ఆలయ తిరునాళ్ళకు చుట్టుపక్కల ప్రాంతాలనుండి అనేకమంది భక్తులు విచ్చేస్తారు. అనుపు thumb|250x250px|అనుపు వద్ద బౌద్ధ యాత్రికులు అనుపు ప్రదేశానికి బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో ఇచ్చటకు వచ్చి ఒక విశ్వ విద్యాలయాన్ని నిర్మించాడు. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించారనటానకి చారిత్రికాధారాలున్నాయి. సాగర గర్భంలో వుండిన ఆనాటి విశ్వ విద్యాలయ శిథిలాలను యధాతథంగా తరలించి నాగార్జునకొండ పైన మ్యూజియంలోను, ఆరుబటయ కూడా భద్ర పరచి సందర్శకులు చూడడానికి ఏర్పాటు చేశారు. అనుపు అనే ప్రాంతం సాగర్ ముంపునకు గురికాలేదు. కనుక అక్కడ వున్న ఆనాటి కట్టడాలు ఎక్కడ వున్నవి అక్కడనే భద్రపరచి జాగ్రత్త తీసుకుంటున్నారు భారత పురావస్తు శాఖ వారు. అనుపు నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపున సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. వాహనాలలో వచ్చే వారికి రోడ్డు మార్గమున్నది. అనుపు నుండి కూడా నాగార్జునకొండ వరకు లాంచీలను అప్పుడప్పుడు నడుపుతారు. ఇతరాలు ఎత్తిపోతల జలపాతం - సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం. మాచర్ల - పురాతన ఆలయాలు ఉన్నాయి చిత్ర మాలిక ఇవి కూడా చూడండి ప్రకాశం బారేజి పులిచింతల ప్రాజెక్టు నాగార్జునకొండ మ్యూజియం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ మూలాలు, వనరులు బయటి లింకులు వర్గం:తెలంగాణలో కృష్ణా నదిపై ప్రాజెక్టులు వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు వర్గం:నల్గొండ జిల్లా పర్యాటక ప్రదేశాలు వర్గం:ఆనకట్టలు వర్గం:బౌద్ధ పుణ్యక్షేత్రాలు వర్గం:ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిపై ప్రాజెక్టులు వర్గం:పల్నాడు జిల్లా పర్యాటక ప్రదేశాలు
విజయనగర సామ్రాజ్యం
https://te.wikipedia.org/wiki/విజయనగర_సామ్రాజ్యం
విజయనగర సామ్రాజ్యాన్ని (కర్ణాట సామ్రాజ్యం అని, పోర్చుగీసువారు బిస్నెగర్ రాజ్యం కూడా పిలుస్తారు). ఇది దక్షిణ భారతదేశంలోని దక్కను పీఠభూమి ప్రాంతంలో ఉంది. దీనిని 1082 లో సంగమ రాజవంశానికి చెందిన మొదటి హరిహర రాయుడు, సోదరుడు మొదటి బుక్క రాయుడు స్థాపించారు.By James Mansel Longworth page 204edited by J C morris page 261 11 వ శతాబ్దం చివరి నాటికి ఇస్లామికు దండయాత్రలను నివారించడానికి దక్షిణాది శక్తుల ప్రయత్నాల పరాకాష్ఠగా ఈ సామ్రాజ్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది 1646 వరకు కొనసాగినప్పటికీ 1565 లో తళ్ళికోట యుద్ధంలో దక్కను సుల్తానేట్ల సంయుక్త సైన్యాలుతో జరిగిన పోరాటంలో ఓటమి తరువాత దాని శక్తి క్షీణించింది. ఈ సామ్రాజ్యం దాని రాజధాని విజయనగరం పేరు మీద ఉంది. దీని శిథిలాలు ప్రస్తుత హంపి పరిసరాలలో ఉన్నాయి. హంపి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. డొమింగో పేసు, ఫెర్నావో నూన్సు, నికోలో డా కాంటి వంటి మధ్యయుగ ఐరోపా ప్రయాణికుల రచనలు, స్థానిక భాషలలోని సాహిత్యం దాని చరిత్ర గురించి కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. విజయనగరం వద్ద జరిపిన పురావస్తు త్రవ్వకాలలో సామ్రాజ్యం శక్తి, సంపద వెల్లడయ్యాయి. దక్షిణ భారతదేశంలో విస్తరించిన సామ్రాజ్యం వారసత్వసంబంధిత అనేక స్మారక చిహ్నాలను కలిగి ఉంది. వీటిలో బాగా తెలిసినది హంపి వద్ద ఉన్న నిర్మాణ సమూహం. దక్షిణ, మధ్య భారతదేశంలో వివిధ ఆలయ నిర్మాణ సంప్రదాయాలు విజయనగర నిర్మాణకళా శైలిలో నిర్మితమయ్యాయి. ఈ సంశ్లేషణ హిందూ దేవాలయాల నిర్మాణ ఆవిష్కరణలకు ప్రేరణనిచ్చింది. విజయనగరపాలన సమర్థవంతమైన పరిపాలన, శక్తివంతమైన విదేశీ వాణిజ్యం, నీటిపారుదల, నీటి నిర్వహణ వ్యవస్థ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చింది. సామ్రాజ్యం ప్రోత్సాహంతో కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతంలో లలిత కళలు, సాహిత్యం కొత్త ఎత్తులకు చేరుకోగలిగింది. ప్రస్తుత రూపంలో కర్ణాటక సంగీతం ఉద్భవించింది. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత చరిత్రలో హిందూ మత ప్రచారం చేయడం ద్వారా దక్షిణ భరతదేశాన్ని సమైక్యపరచి ప్రాంతీయతను అధిగమించింది. పేరు వెనుక చరిత్ర విజయనగర సామ్రాజ్యానికి మరొక పేరు కర్ణాట రాజ్య (కర్ణాట సామ్రాజ్యం). దీనిని కొన్ని శాసనాలు, విజయనగర కాలంలోని సాహిత్య రచనలు, సంస్కృత రచన జాంబవతి కళ్యాణం, కృష్ణదేవరాయ, తెలుగు రచన వాసు చరితములు సాక్ష్యంగా ఉన్నాయి. ఆనెగొంది విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క), బుక్క అనే అన్నదమ్ములు 1082 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు. ఈ సామ్రాజ్యం 1082 నుండి 1660 వరకు వర్ధిల్లింది. చివరి శతాబ్దాన్ని దీనికి క్షీణదశగా చెప్పుకోవచ్చు. సుల్తానుల సమాఖ్య వీరిని తళ్ళికోట యుద్ధంలో దారుణంగా ఓడించింది. సుల్తానుల సైన్యం రాజధానిని ఆరునెలల పాటు కొల్లగొట్టి, నేలమట్టం చేసింది. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్టి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు. రాయలవారి రెండో రాజధాని పెనుగొండ. ప్రస్తుతం గంగావతి, ఆనెగొందిలో రాయల వంశానికి చెందిన 17వ తరం వారున్నారు. ఆనెగొందిలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా రాయల వారి ఇంటి నుంచే తాళిబొట్టు వెళుతుంది. ముస్లింలు సైతం ఏ పండుగ వచ్చినా నమాజ్ చేసిన తర్వాత నేరుగా రాయలవారి ఇంటికే వెళ్లి వారికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు. ఈ ఆచారం వందల సంవత్సరాలుగా ఆ గ్రామంలో కొనసాగుతోంది. శ్రీరంగనాథస్వామి దేవాలయం, నవ బృందావనం, ఉచ్చప్పయ్య మఠం, 64 స్తంభాల మండపం, చింతామణి ఆలయం, గజశాల, ఒంటెశాల, ఆదిశక్తి దుర్గాదేవి ఆలయం, మేల్కోటే, గవి రంగనాథస్వామి దేవాలయం, పంపా సరోవరం (విజయలక్ష్మి దేవస్థానం), అంజినాద్రిబెట్ట ఆలయాలన్నింటిలోనూ రాయల కుటుంబీకుల ఆధ్వర్యంలోనే హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. రాయల కుటుంబీకుల్లో ఎవరి వివాహం నిశ్చయమైనా మొదట హంపిలోనే పూజలు చేస్తారు.స్థాపన విజయనగర సామ్రాజ్య స్థాపనకు శతాబ్దము తరువాత దక్షిణ భారత దేశము లోని రాజ్యములను ముస్లింలు జయించారు. 1309 లో మాలిక్ కాఫర్ ఓరుగల్లును ఆక్రమించి మలబార్ రాజ్యములపై దాడి చేశాడు. ఆ సమయమున హరహర, బుక్క అను సోదరులు ప్రతాపరుద్రుని ఆస్థానములో కోశాధికారులుగా ఉన్నారు. సోదరులిద్దరిని ఢిల్లీకి తరలించి ఇస్లాము మతానికి మార్చారు. హోయసల రాజు తిరుగుబాటు అణచివేయుటకు సుల్తాను వీరిద్దరినీ ద్వారసముద్రము పంపాడు.దాని తరువాత దక్షిణ భారతదేశంలో హిందువులు విజయనగర సామ్రాజ్య నాయకత్వం లో ముస్లిం రాజుల నీ ఓడించి మళ్ళీ హిందూ రాజ్యాలు స్థాపించారు.Robert Sewell, A Forgotten Empire (Vijayanagar): A contribution to the history of India, Chapter 2; http://www.gutenberg.org/dirs/etext02/fevch10.txt బుక్క భూపతి రాయలనే బుక్కరాయలని కూడా అంటారు. అయినె విజయనగర సామ్రాజ్యానికి తొలి చక్రవర్త. దక్కను ప్రాంతంలోని ముస్లిమ్ సామంతుల తిరుగుబాట్ల వల్ల ముహమ్మద్ తుగ్లక్ పాలన అంతమవడంతో దెవరాయలు ఏలుబడిలోని ప్రాంతం త్వరితంగా విస్తరించింది. విజయనగర రాజధాని 1082 ప్రాంతంలో ఆనెగొందికి ఎదురుగా తుంగభద్రానదికి ఆవలి తీరాన స్థాపించబడింది. దెవరాయల తర్వాత 1339 లో అధికారంలోకి వచ్చిన మల్లికార్జున రాయలు ఇంకా అచ్చత రాయలు 1360 వరకు పాలించాడు. వారి పాలనా కాలం చివరకొచ్చేసరికి దక్షిణభారత దేశంలో తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపుగా అతడి ఏలుబడిలోకి వచ్చింది. చరిత్ర విజయనగర సామ్రాజ్యం మూలానికి సంబంధించి భిన్నమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. ఉత్తర భారతదేశం నుండి ముస్లిం దండయాత్రలను నివారించడానికి తుంగభద్ర ప్రాంతంలో ఉన్న హొయసల సామ్రాజ్యం సైన్యంలోని కన్నడిగులు, సైనికాధికారులు అయిన మొదటి హరిహర రాయలు, మొదటి బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అని చాలా మంది చరిత్రకారులు ప్రతిపాదించారు.Historians such as P. B. Desai (History of Vijayanagar Empire, 1936), Henry Heras (The Aravidu Dynasty of Vijayanagara, 1927), B.A. Saletore (Social and Political Life in the Vijayanagara Empire, 1930), G.S. Gai (Archaeological Survey of India), William Coelho (The Hoysala Vamsa, 1955) and Kamath Karmarkar (1947), p30Kulke and Rothermund (2004), p188Rice (1897), p345 మరికొందరు వారు తెలుగు ప్రజలు, మొదట కాకతీయ రాజ్యంతో సంబంధం కలిగి ఉన్నారు. హొయసల సామ్రాజ్యక్షీణత సమయంలో ఉత్తర భాగాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.; ; N. Ventakaramanayya, The Early Muslim expansion in South India, 1942; B. Surya Narayana Rao, History of Vijayanagar, 1993; వారి మూలంతో సంబంధం లేకుండా, దక్షిణ భారతదేశం మీద ముస్లిం దండయాత్రకు వ్యతిరేకంగా పోరాడటానికి శృంగేరి ఆశ్రమంలో సాధువు అయిన విద్యారణ్యస్వామి మద్దతు, ప్రేరణ లభించిందని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. విజయనగర రాజ్యంలో ఇటీవలి త్రవ్వకాలు, మధ్యయుగ యుగంలో విదేశీ ప్రయాణికులు రాసిన రచనలు, కోటలు, శాస్త్రీయ పరిణామాలు, నిర్మాణ ఆవిష్కరణలు సామ్రాజ్యం చరిత్ర గురించి చాలా అవసరమైన సమాచారాన్ని కనుగొన్నాయి.Portuguese travelers Barbosa, Barradas and Italian Varthema and Caesar Fredericci in 1567, Persian Abdur Razzak in 1440, Barani, Isamy, Tabataba, Nizamuddin Bakshi, Ferishta and Shirazi and vernacular works from the 14th century to the 16th century. 14 వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యం అభివృద్ధికి ముందు దక్కను హిందూ రాష్ట్రాలు - దేవగిరి యాదవ సామ్రాజ్యం, వరంగలు కాకతీయ రాజవంశం, మదురై పాండ్య సామ్రాజ్య సైన్యాలు విజయనగరం మీద పదేపదే దాడి చేశారు. 1336 లో ఎగువ దక్కను ప్రాంతం (ఆధునిక మహారాష్ట్ర, తెలంగాణ)అంతటినీ సుల్తాను అలావుద్దీను ఖల్జీ, ఢిల్లీ సుల్తానేటు ముహమ్మదు బిన్ తుగ్లకు సైన్యాలు ఓడించాయి. సా.శ. 1294 లో ఢిల్లీ సుల్తానేటు ముస్లిం దళాలు దేవగిరి సెయునా యాదవుల భూభాగాలను ఓడించి స్వాధీనం చేసుకున్న తరువాత దక్కను ప్రాంతానికి దక్షిణంలో హొయసల సైనికాధికారి సింగేయ నాయకా -3 (సా.శ. 1280–1300) స్వాతంత్ర్యం ప్రకటించారు. ఆయన సృష్టించిన కంపిలి రాజ్యం ఈ కాలంలో జరిగిన యుద్ధాల కాలంలో ఇది స్వల్పకాలిక రాజ్యంగా ఉనికిలో ఉంది. కంపిలి రాజ్యం ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని ఈశాన్య భాగాలలో గుల్బర్గా, తుంగాభద్ర నది సమీపంలో ఉంది. ఢిల్లీ సుల్తానేటు సైన్యాలు ఓడించిన తరువాత ఇది ముగిసింది. మాలికు జాడా నేతృత్వంలోని విజయవంతమైన సైన్యం, కంపిలి రాజ్యం మీద విజయంసాధించిన వార్తలతో ఢిల్లీలోని ముహమ్మదు బిన్ తుగ్లకుకు, చనిపోయిన హిందూ రాజు గడ్డితో నింపిన తల పంపించబడింది. సా.శ. 1327-28 లో కంపిలిలో జనాభా ఒక జౌహరు (సామూహిక ఆత్మహత్య) కు పాల్పడింది. ఎనిమిది సంవత్సరాల తరువాత కంపిలి రాజ్యం శిధిలాల నుండి సా.శ.1336 లో విజయనగర రాజ్యం ఉద్భవించింది. సామ్రాజ్యం స్థాపించిన మొదటి రెండు దశాబ్దాలలో మొదటి హరిహరరాయలు తుంగభద్ర నదికి దక్షిణాన చాలా ప్రాంతాల మీద నియంత్రణ సాధించి పూర్వాపస్చిమ సముదాయశివర ("తూర్పు, పశ్చిమ సముద్రాల మాస్టర్") బిరుదును సంపాదించాడు. 1374 నాటికి మొదటి హరిహరరాయలు వారసుడైన మొదటి బుక్కారాయలు ఆర్కాటు ప్రధాన రాజ్యం కొండవీడు రెడ్లు మదురై సుల్తాన్లను ఓడించి పశ్చిమప్రాంతంలోని గోవా మీద ఉత్తరప్రాంతంలో తుంగభద్ర-కృష్ణ నది పరీవాహకప్రాంతం మీద నియంత్రణ సాధించారు. వారి రాజధాని నేటి కర్ణాటకలోని తుంగభద్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న అనెగోండి రాజ్యంలో ఉంది. మొదటి బుక్క రాయ పాలనలో రాజధానిని తరువాత నది దక్షిణ ఒడ్డున ఉన్న విజయనగరానికి తరలించారు. ఉత్తర భూముల నుండి ముస్లిం సైన్యాలు సాగించే నిరంతరం దాడి చేయడాన్ని ఎదుర్కొనడాన్ని సుభతరం చేయడానికి రజధాని విజయనగరానికి తరలించ బడింది. విజయనగర సామ్రాజ్యం ఇప్పుడు పొట్టితనాన్ని కలిగి ఉండటంతో మొదటి బుక్కరాయరాయలు రెండవ కుమారుడు రెండవ హరిహరరాయలు కృష్ణ నదికి దాటిన రాజ్యాన్ని మరింత సంఘటితం చేసి దక్షిణ భారతదేశం మొత్తాన్ని విజయనగర గొడుగు కిందకు తీసుకువచ్చాడు.The success was probably also due to the peaceful nature of Muhammad II Bahmani, according to తరువాతి పాలకుడు మొదటి దేవరాయరాయలు ఒడిశా గజపతులకు వ్యతిరేకంగా విజయవంతమై కోట నిర్మాణం, నీటిపారుదల ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాడు.From the notes of Portuguese Nuniz. Robert Sewell notes that a big dam across was built the Tungabhadra and an aqueduct long was cut out of rock (). ఇటాలియను యాత్రికుడు నికోలో డి కాంటి ఆయనను భారతదేశపు అత్యంత శక్తివంతమైన పాలకుడిగా పేర్కొంటూ రాశాడు.Columbia Chronologies of Asian History and Culture, John Stewart Bowman p.271, (2013), Columbia University Press, New York, రెండవ దేవరాయరాయలు (గజబెటెకర అని పిలుస్తారు)Also deciphered as Gajaventekara, a metaphor for "great hunter of his enemies", or "hunter of elephants" (). 1424 లో సింహాసనం మీద విజయం సాధించారు. ఆయన సంగమ రాజవంశం పాలకులలో అత్యంత సమర్థుడు. ఆయన తిరుగుబాటు చేసిన భూస్వామ్య ప్రభువులను, కాలికటు జామోరిను, దక్షిణాన క్విలాన్లను అరికట్టాడు. ఆయన శ్రీలంక ద్వీపంపై దాడి చేసి పెగు, తనస్సేరిమ్ వద్ద బర్మా రాజులకు అధిపతి అయ్యాడు.From the notes of Persian Abdur Razzak. Writings of Nuniz confirms that the kings of Burma paid tributes to Vijayanagara empire From the notes of Abdur Razzak about Vijayanagara: a city like this had not been seen by the pupil of the eye nor had an ear heard of anything equal to it in the world (Hampi, A Travel Guide 2003, p11) thumb|left|దక్షిణ భారత దేశ చిత్రపటం, 1400 సా.శ. 1407 లో బహమనీ సుల్తానేటుకు చెందిన ఫిరుజు బహ్మణి విజయనగరానికి చెందిన మొదటి దేవరాయతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి బహమనీకి "1,00,000 హంసు, ఐదు మాండ్స్స్ ముత్యాలు, యాభై ఏనుగులు" వార్షిక కప్పం అర్పించవలసి ఉంది. 1417 లో సుల్తానేటు విజయనగరపై దండెత్తినప్పుడు కప్పం చెల్లించడంలో విఫలమయ్యాడు. 15 వ శతాబ్దంలో విజయనగర కప్పం చెల్లింపు కోసం ఇటువంటి యుద్ధాలు పునరావృతమయ్యాయి. 1436 లో కప్పం చెల్లిమలేదని సుల్తాను మొదటి అహ్మదు చెల్లించని ఒక యుద్ధాన్ని ప్రారంభించాడు. తరువాతి సుల్తానేట్సు-విజయనగర యుద్ధాలు విజయనగర మిలిటరీని విస్తరించాయి. దాని శక్తి, దాని సైనిక సైనికాధికారి మధ్య వివాదాల ఫలితంగా 1485 లో సలువా నరసింహ ఒక తిరుగుబాటుకు నాయకత్వం వహించి రాజవంశ పాలనను ముగించారు. అదే సమయంలో (ఉత్తరాన బహమనీ సుల్తానేటు విచ్ఛిన్నం తరువాత సృష్టించబడింది) సామ్రాజ్యాన్ని సుల్తానేట్ల దాడుల నుండి రక్షించడం కొనసాగించారు. 1505 లో మరొక సైన్యాధ్యక్షుడు తులువా నరస నాయక తిరుగుబాటులో సాలూవ వారసుడి నుండి విజయనగర పాలనను చేపట్టాడు. ఈ సామ్రాజ్యం 1509 లో తులువా నరస నాయక కుమారుడు కృష్ణ దేవరాయ పాలనలో వచ్చింది. హిందువులను, ముస్లింలను తన సైన్యంలోకి నియమించడం ద్వారా ఆయన సామ్రాజ్యాన్ని బలపరిచి సంఘటితం చేశాడు. తరువాతి దశాబ్దాలలో ఇది దక్షిణ భారతదేశం అంతటా విస్తరించి దాని ఉత్తరాన స్థాపించబడిన ఐదు దక్కను సుల్తానేట్ల దండయాత్రలను విజయవంతంగా ఓడించింది. క్రిష్ణ దేవరాయుడి పాలనలో వరుస విజయాలతో సామ్రాజ్యం శిఖరాగ్రస్థాయిని చేరుకుంది.From the notes of Portuguese traveler Domingo Paes about Krishna Deva Raya: A king who was perfect in all things (Hampi, A Travel Guide 2003, p31)గతంలో ఉత్తర, తూర్పుదక్కనులోని సుల్తానేట్ల పాలనలో ఉన్న భూభాగాలను, కళింగ భూభాగాలను దక్షిణాన ఇప్పటికే స్థాపించబడిన భూభాగాలను సారాజ్యంలో విలీనం చేసుకుంది.The notes of Portuguese Barbosa during the time of Krishna Deva Raya confirms a very rich and well provided Vijayanagara city () కృష్ణ దేవరాయల కాలంలో అనేక ముఖ్యమైన స్మారక చిహ్నాలు పూర్తయ్యాయి, కొన్ని ప్రారంభించబడ్డాయి.Most monuments including the royal platform (Mahanavami Dibba) were actually built over a period spanning several decades (Dallapiccola 2001, p66) thumb|విజయనగర వద్ద సహజ కోట 1529 లో కృష్ణ దేవరాయ తరువాత అతని తమ్ముడు అచ్యుత దేవరాయుడి పాలించాడు. 1542 లో అచ్యుత దేవరాయ మరణించిన తరువాత అచ్యుతరాయ టీనేజు మేనల్లుడు సదాశివరాయుడిని రాజుగా నియమించారు. సంరక్షకులుగా, అలియా రామరాయలు (కృష్ణ దేవరాయ అల్లుడు- 1512 నుండి అల్-ముల్క్‌ను గోల్కొండ సుల్తానేటుకు నియమించినప్పుడు సుల్తాన్ కులీ కుతుబ్ అల్-ముల్క్‌కు సేవ చేసిన వ్యక్తి)ని నియమించారు. అలియా రామరాయలు గోల్కొండ సుల్తానేటును విడిచిపెట్టి, దేవరాయ కుమార్తెను వివాహం చేసుకుని అధికారంలోకి వచ్చాడు. సదాశివరాయ - దేవరాయ కుమారుడు - యుక్త వయస్సుకు రాగానే అలియా రామరాయ ఆయనను జైలులో ఉంచి మామ అచ్యుతరాయను సంవత్సరానికి ఒకసారి బహిరంగంగా హాజరుకావడానికి అనుమతించారు. అలియ రామరాయ తన మునుపటి సుల్తానేటు కనెక్షన్ల నుండి ముస్లిం సైనికాధికారులను తన సైన్యంలో నియమించుకుని తనను తాను "సుల్తాన్ ఆఫ్ ది వరల్డ్" అని పిలిచాడు. thumb|రాయల చిహ్నం:వరాహము, సూర్యుడు, చంద్రుడు, బాకు. విజయనగరానికి ఉత్తరాన ఉన్న సుల్తానేట్లు 1565 జనవరిలో తళ్ళికోట యుద్ధంలో అలియా రామరాయ సైన్యం మీద దాడి చేశారు. యుద్ధంలో విజయనగర పక్షం యుద్ధంలో విజయం సాధించింది. అకస్మాత్తుగా విజయనగర సైన్యానికి చెందిన ఇద్దరు ముస్లిం సైనికాధికారులు అలియరాయలుకు వ్యతిరేకంగా సుల్తానేట్ల పట్ల తమ విధేయతను మార్చుకున్నారు. సైనికాధికారులు అలియా రామరాయలును పట్టుకుని అక్కడికక్కడే నరికి చంపారు. సుల్తాను హుస్సేను సుల్తానేట్లతో కలిసి కత్తిరించిన తలను ప్రదర్శన కోసం గడ్డితో నింపడం కోసం వారితో చేరారు., Quote: "When battle was joined in January 1565, it seemed to be turning in favor of Vijayanagara - suddenly, however, two Muslim generals of Vijayanagara changes sides. Rama Raya was taken prisoner and immediately beheaded." అలియా రామరాయల శిరచ్ఛేదం విజయనాగర ఇప్పటికీ సైన్యంలోని విశ్వసనీయ భాగాలలో గందరగోళాన్ని, వినాశనాన్ని సృష్టించింది. ఇది అవకాశంగా తీసుకుని మిగిలిన సైన్యాలను పూర్తిగా నిర్మూలించారు. సుల్తానేట్సు సైన్యం హంపిని దోచుకుని దానిని ప్రస్తుతం ఉన్న శిధిలమైన స్థితికి తగ్గించింది; ఇది తిరిగి ఆక్రమించబడలేదు. తళ్ళికోట యుద్ధం తరువాత తిరుమల దేవరాయ అరవీడు రాజవంశాన్ని ప్రారంభించి నాశనం చేసిన హంపి స్థానంలో పెనుకొండను కొత్త రాజధానిగా స్థాపించి విజయనగర సామ్రాజ్యం అవశేషాలను పునర్నిర్మించడానికి ప్రయత్నించారు. తిరుమల దేవరాయుడు 1572 లో పదవీ విరమణ చేసి తన రాజ్య అవశేషాలను తన ముగ్గురు కుమారులకు విభజించి 1578 లో మరణించే వరకు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాడు. అరవీడు రాజవంశం వారసులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాని 1614 లో సామ్రాజ్యం కూలిపోయింది. బీజాపూరు సుల్తానేటు ఇతరులతో నిరంతర 1646 నాటికి చివరి అవశేషాలు ముగిశాయి. ఈ కాలంలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ రాజ్యాలు స్వతంత్రం ప్రకటించుకుని విజయనగర నుండి విడిపడినాయి. స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన వారిలో మైసూరు రాజ్యం, కేలాడి నాయక, మదురై నాయకులు, టాంజూరు నాయకులు, చిత్రదుర్గ నాయకులు, జింగీ నాయకు ఉన్నారు. ఇవన్నీ రాబోయే శతాబ్దాలలో దక్షిణ భారతదేశ చరిత్ర మీద గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. తారస్థాయి thumb|విజయనగర ప్రజలు ధరించే దుస్తులు - డచ్ పెయింటర్ అయిన కార్నెలియస్ హజర్ చిత్రం తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్య ఆధిపత్యం దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొని ఒక బలీయమైన శక్తిగా నిలబడింది. విజయనగర రాజులకు సమంతులుగా కమ్మరాజులు అయిన పెమ్మసాని నాయకులు, సూర్యదేవర నాయకులు, శాయపనేని నాయకులు, రావెళ్ళ నాయకులు ఆంధ్రదేశాన్ని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా ఉంటూ యుద్ధాల్లో తోడ్పడుతూ విజయనగర రక్షణ కవచంలా వారు ఎదురు నిలిచి, ఆ తరువాత స్వతంత్రులుగా ఒక్కొక్కరు రెండు శతాబ్దాల వరకు పరిపాలించారు. 1510 ప్రాంతాల్లో బిజాపూరు సుల్తాను అధీనంలో ఉన్న గోవాను పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. ఇది బహుశా విజయనగర రాజ్యపు అనుమతి లేదా రహస్య అవగాహన ద్వారా జరిగి ఉండవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు వీరికి చాలా ముఖ్యమైనవి. శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని. 1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. 1542 లో అళియ రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని దక్కను సుల్తానులు చిత్తుగా ఓడించారు. సంయుక్త సుల్తాను సైన్యం రాజధానిని సర్వనాశనం చేసి, నేలమట్టం చేసింది. యుద్ధంనుండి సజీవముగా బయటపడిన రామరాయల తమ్ముడు తిరుమలరాయలు, సదాశివరాయలతో సహా పెనుకొండకు పారిపోయాడు. విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు. పాలన విజయనగర సామ్రాజ్యం పాలకులు తమ భూభాగాలను పరిపాలించడానికి తమ పూర్వీకులైన హొయసల, కాకతీయ, పాండ్య రాజ్యాలు అభివృద్ధి చేసిన పరిపాలనా పద్ధతులను అవసరమైన చోట మాత్రమే మార్పులు చేశారు.A war administration, (K.M. Panikkar in ప్రధానమంత్రి (మహాప్రధన) నేతృత్వంలోని మంత్రుల మంత్రి (ప్రధాన) సహాయంతో రాజు అంతిమ అధికారం నిర్వహిస్తాడు. ప్రధాన కార్యదర్శి (కార్యకర్త లేదా రాయస్వామి), సామ్రాజ్య అధికారులు (అధికారి) నమోదు చేసిన ఇతర ముఖ్యమైన శీర్షికలు కలిగిన వ్యక్తులు పాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉన్నత స్థాయి మంత్రులు అందరూ, అధికారులు సైనిక శిక్షణ పొందవలసి ఉంది.From the notes of Persian Abdur Razzak and research by B.A. Saletore () రాజు భవనం సమీపంలో ఉన్న ఒక సచివాలయం రాజు ఉంగరంతో ముద్రించిన మైనపు ముద్రను ఉపయోగించి అధికారికంగా చేసిన రికార్డులను నిర్వహించడానికి లేఖరులను, అధికారులను నియమించింది.From the notes of Nuniz () దిగువ పరిపాలనా స్థాయిలో సంపన్న భూస్వాములు (గౌదాలు) అకౌంటెంట్లను (కరణికలు లేదా కరణం), కాపలాదారులను (కావలు) పర్యవేక్షించారు. రాజభవన పరిపాలనను 72 విభాగాలు (నియోగాలు) గా విభజించారు. ప్రతి ఒక్కరికి యువతులు, అందం ఆధారంగా ఎంపికైన అనేక మంది మహిళా పరిచారకులు ఉన్నారు (కొందరిని దిగుమతి చేసుకున్నారు లేదా విజయవంతమైన యుద్ధాల్లో పట్టుబడ్డారు) వారు చిన్న పరిపాలనా విషయాలను నిర్వహించడానికి, కులీనులకు లేదా ఉంపుడుగత్తెలుగా సేవ చేయడానికి శిక్షణ పొందారు. thumb|హంపిలోని విరుపాక్ష ఆలయంలో 1509 నాటి రాజు కృష్ణదేవరాయ కన్నడ శాసనం, ఆయన పట్టాభిషేకం, పెద్ద బహిరంగ మంటప నిర్మాణాన్ని వివరిస్తుంది|330x330px ఈ సామ్రాజ్యాన్ని ఐదు ప్రధాన ప్రావిన్సులుగా (రాజ్య) విభజించారు. ఒక్కొక్కటి ఒక కమాండరు (దండనాయక లేదా దండనాథ) ఆధ్వర్యంలో రాజప్రతినిధి నేతృత్వంలో (తరచూ రాజకుటుంబానికి చెందినవారు ఉంటారు) పాలనావ్యవహారాలు నిర్వహించడానికి వారు స్థానిక భాషను ఉపయోగించారు.From the notes of Duarte Barbosa (). However, the kingdom may have had nine provinces (T. V. Mahalingam in ఒక రాజ్యాన్ని ప్రాంతాలుగా (విశాయ వెంటే లేదా కొట్టం) విభజించారు. వీటినీ మరింతగా కౌంటీలుగా (సిమే లేదా నాడు) విభజించారు. వాటిని మునిసిపాలిటీలుగా (కంపన లేదా స్థలా) విభజించారు. వంశపారంపర్య కుటుంబాలు ఆయా భూభాగాలను పరిపాలించి సామ్రాజ్యానికి కప్పం అర్పించగా కెలాడి, మదురై వంటి కొన్ని ప్రాంతాలు కమాండరు ప్రత్యక్ష పర్యవేక్షణలో వచ్చాయి. యుద్ధభూమిలో రాజు కమాండర్లు దళాలను నడిపించారు. సామ్రాజ్యం యుద్ధ వ్యూహంలో అరుదుగా భారీ దండయాత్రలు జరిగాయి; చాలా తరచుగా ఇది వ్యక్తిగత కోటల మీద దాడి చేయడం, నాశనం చేయడం వంటి చిన్న తరహా పద్ధతులను ఉపయోగించింది. విదేశీ ప్రతినిధులు నిర్వహించే సుదూర ఫిరంగిని ఉపయోగించిన మొదటి భారతదేశంలోని సామ్రాజ్యంగా (నేటి తుర్క్మెనిస్తాను నుండి వచ్చినవారు ఉత్తమమైనవిగా పరిగణించబడ్డారు)ప్రత్యేకత సంతరించుకుంది. ఆర్మీ దళాలు రెండు రకాలు: రాజు వ్యక్తిగత సైన్యం నేరుగా సామ్రాజ్యం చేత నియమించబడినది. ప్రతి హూస్వామ్య అధిపతుల సైన్యం. రాజు కృష్ణదేవరాయ వ్యక్తిగత సైన్యంలో 1,00,000 పదాతిదళాలు, 20,000 మంది అశ్వికదళ సిబ్బంది, 900 మందికి పైగా ఏనుగులు ఉన్నాయి. ఈ సంఖ్య సైన్యంలో 1.1 మిలియన్ల మంది సైనికులలో ఒక భాగం మాత్రమే, రెండు మిలియన్ల సైన్యం వైవిధ్యంగా ఉన్న వ్యక్తులతో నావికాదళ ఉనికితో నమోదు చేయబడింది. ఇది నావిగడప్రభు (నావికాదళ కమాండరు) అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా రుజువు చేయబడింది.)From the notes of Abdur Razzaq and Paes respectively () సైన్యం సమాజంలోని అన్ని వర్గాల నుండి నియమించబడింది (భూస్వామ్య పాలకుల నుండి అదనపు భూస్వామ్య కప్పం సేకరణకు మద్దతు ఇస్తుంది). విలుకారులు, మస్కటీర్లు, క్విల్టెడు ట్యూనిక్సు ధరించి, కత్తులు, కవచాలు మోసే సైనికులు ఉన్నారు. గుర్రాలు, ఏనుగులు పూర్తిగా సాయుధమయ్యాయి. ఏనుగులు యుద్ధంలో గరిష్ట నష్టం కలిగించడానికి వారి దంతాలకు కత్తులు కట్టుకున్నాయి.From the notes of Nuniz రాజధాని నగరం నీటిని సరఫరా చేయడానికి, నిల్వ చేయడానికి నిర్మించిన నీటి సరఫరా పూర్తిగా వ్యవస్థల మీద ఆధారపడింది. ఈ వ్యవస్థ ఏడాది పొడవునా స్థిరమైన సరఫరాను నిర్ధారిస్తుంది. ఈ హైడ్రాలికు వ్యవస్థల అవశేషాలు చరిత్రకారులకు దక్షిణ భారతదేశంలోని అర్ధశుష్క ప్రాంతాలలో ఆ సమయంలో వాడుకలో ఉన్న ఉపరితల నీటి పంపిణీ పద్ధతులను ఇచ్చాయి.Davison-Jenkins (2001), p89 సమకాలీన రికార్డులు, విదేశీ ప్రయాణికుల గమనికలు కార్మికులచే భారీ ట్యాంకులను ఎలా నిర్మించాయో వివరిస్తాయి. From the notes of Domingo Paes and Nuniz (Davison-Jenkins 2001, p98) త్రవ్వకాలలో రాయలు ఎన్‌క్లోజరు పెద్ద ఆలయ సముదాయాలు (ఇది రాజకుటుంబ ప్రత్యేకమైన ఉపయోగం కోసం, ప్రత్యేక వేడుకల కోసం నిర్మించబడినట్లు సూచిస్తున్నది) నీటితో రవాణా చేయడానికి గురుత్వాకర్షణ, సిఫానులను ఉపయోగించి అధునాతన ఛానెళ్లతో ఉన్న బాగా అనుసంధానించబడిన పైపులైన్లతో కూడిన నీటి పంపిణీ వ్యవస్థ అవశేషాలను కనుగొన్నారు.Davison-Jenkins (2001), p90 కాలానుగుణ రుతుపవనాల నీటిని సేకరించి, వేసవిలో ఎండిపోయే పెద్ద నీటి ట్యాంకుల అవశేషాలు పబ్లికు వాటరు వర్కులను పోలి ఉంటాయి. తుంగభద్ర నదికి సమీపంలో ఉన్న సారవంతమైన వ్యవసాయ ప్రాంతాలలో నది నీటిని నీటిపారుదల ట్యాంకుల్లోకి నడిపించడానికి కాలువలు తవ్వారు. ఈ కాలువలలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి తెరిచి మూసివేయడానికి అనువైన తూములు ఉన్నాయి. ఇతర ప్రాంతాలలో పరిపాలనా అధికారులు పర్యవేక్షణతో బావులను తవ్వటానికి పరిపాలన ప్రోత్సహించింది. రాయలు ప్రోత్సాహంతో రాజధాని నగరంలో పెద్ద ట్యాంకులను నిర్మించారు. సంపన్న వ్యక్తులు సామాజిక, మతపరమైన అర్హతలను పొందటానికి చిన్న ట్యాంకులకు నిధులు సమకూర్చారు. ఆర్ధికం thumb|హంపీ నందు గల పురాతన సంత (మార్కెట్ ప్రదేశం), తోటలు. thumb|విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించిన గజశాల, యుద్ధానికి కావలసిన ఏనుగులను ఇక్కడ ఉంచే వారు. సామ్రాజ్యం ఆర్థిక వ్యవస్థ అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. పాక్షిక శుష్క ప్రాంతాలలో జొన్న (జోవరు), పత్తి, పప్పులు చిక్కుళ్ళు పండించబడ్డాయి. వర్షపు ప్రాంతాలలో చెరకు, బియ్యం, గోధుమలు పండించబడ్డాయి. తమలపాకులు, పోక (నమలడం కోసం), కొబ్బరికాయలు ప్రధాన నగదు పంటలుగా పండించబడ్డాయి. పెద్ద ఎత్తున పత్తి ఉత్పత్తితో సామ్రాజ్యం శక్తివంతమైన వస్త్ర పరిశ్రమ, నేత కేంద్రాలను సరఫరా చేసింది. మారుమూల మాల్నాడు కొండ ప్రాంతంలో పసుపు, మిరియాలు, ఏలకులు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు పండించబడి వాణిజ్యానికి నగరానికి రవాణా చేయబడ్డాయి. సామ్రాజ్యం రాజధాని నగరం అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రంగా ఉంది. ఇందులో పెద్ద మొత్తంలో విలువైన రత్నాలు, బంగారం విక్రయించబడింది.From the notes of Duarte Barbosa (). సుసంపన్నంగా ఉన్న ఆలయ భవన నిర్మాణాలు వేలాది మంది శిల్పకళాకారులు, శిల్పులు, ఇతర నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారికి ఉపాధి కల్పించింది. భూమి యాజమాన్యం ముఖ్యమైనది. సాగు చేసేవారిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉండేవారు. కాలక్రమేణా భూమి మీద కొంత యాజమాన్య హక్కు ఇవ్వబడింది. అవసరమైన ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ పన్ను విధానాలు, పన్ను విధింపులను నిర్ణయించడానికి భూ వినియోగం మధ్య వ్యత్యాసాలను చూపించాయి. ఉదాహరణకు సెంటుతయారీదార్లకు గులాబీ రేకుల రోజువారీ మార్కెటు లభ్యత ముఖ్యమైనది కనుక గులాబీల సాగుకు తక్కువ పన్ను విధించాలని భావించబడింది.From the notes of Abdur Razzak in ఉప్పు ఉత్పత్తి, ఉప్పు ప్లాంటుల తయారీ ఇలాంటి మార్గాల ద్వారా నియంత్రించబడింది. నెయ్యి (స్పష్టీకరించిన వెన్న) తయారీ చేయబడి దీనిని మానవ వినియోగానికి నూనెగా, దీపాలను వెలిగించటానికి ఇంధనంగా విక్రయించబడింది.From the notes of Abdur Razzak in చైనాకు ఎగుమతులు తీవ్రతరం అయ్యాయి. పత్తి, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, పాక్షిక విలువైన రాళ్ళు, దంతాలు, ఖడ్గమృగం కొమ్ము, ఎబోనీ, అంబరు, పగడాలు, పరిమళ ద్రవ్యాలు వంటి సుగంధ ఉత్పత్తులు ఉన్నాయి. చైనా నుండి వచ్చే పెద్ద ఓడలు తరచూ సందర్శించేవి. కొన్ని చైనా నౌకలకు అడ్మిరలు జెంగు హి నాయకత్వం వహించాడు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం వద్ద పెద్ద, చిన్న సామ్రాజ్యాల 300 ఓడరేవులకు చైనా ఉత్పత్తులను తీసుకువచ్చాయి. వీటిలో మంగుళూరు, హోనవరు, భట్కలు, బార్కూరు, కొచ్చిను, కన్నానోరు, మచిలిపట్నం, ధర్మదాం నౌకాశ్రయాలు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి.From the notes of Abdur Razzak in వ్యాపారి నౌకలు నౌకాశ్రయాలకు చేయబడినప్పుడు, సరుకులను అధికారిక అదుపులోకి తీసుకున్నారు. విక్రయించిన అన్ని వస్తువుల మీద పన్ను విధించారు. సరుకుల భద్రతకు పరిపాలన అధికారులు హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న వాణిజ్య వ్యాపారం ఆకర్షించబడిన అనేక రాజ్యాలకు చెందిన వ్యాపారులు (అరబ్బులు, పర్షియన్లు, గుజరేట్సు, ఖొరాసానియన్లు) కాలికటులో స్థిరపడ్డారు. నౌకాశ్రయ భవనం అభివృద్ధి చెందింది. 1000–1200 బహారెసు (భారం) కలిగిన ఓడలు డెక్సు లేకుండా నిర్మించబడ్డాయి. వాటిని మొత్తం పొట్టును, మేకులతో కట్టుకోకుండా తాళ్ళతో కుట్టడం ద్వారా నిర్మించబడ్డాయి. విజయనగర వస్తువులతో ఓడలు ఎర్ర సముద్రం ఓడరేవులైన అడెను, మక్కాకు వెనిసు వరకు విక్రయించబడ్డాయి. సామ్రాజ్యం ప్రధాన ఎగుమతులలో మిరియాలు, అల్లం, దాల్చినచెక్క, ఏలకులు, మైరోబాలను, చింతపండు కలప, అనాఫిస్టులా, విలువైన, పాక్షిక విలువైన రాళ్ళు, ముత్యాలు, కస్తూరి, పచ్చలు, రబ్బరు, కలబంద, పత్తి వస్త్రం, పింగాణీ ప్రాధాన్యత వహించాయి. పత్తి నూలును బర్మాకు, ఇండిగోను పర్షియాకు పంపించారు. పాలస్తీనా నుండి చేసుకున్న దిగుమతులు రాగి, పాదరసం (క్విక్సిల్వరు), సింధూరం, పగడం, కుంకుమ, రంగు వెల్వెటు, రోజు వాటరు, కత్తులు, రంగుల కుగ్రామాలు, బంగారం, వెండి ప్రాధాన్యత వహించాయి. రాజధానికి రెండు వారాల భూమి యాత్రకు ముందు పర్షియా గుర్రాలను కన్నానూరుకు దిగుమతి చేసుకున్నారు. చైనా నుండి పట్టు, బెంగాలు నుండి చక్కెర వచ్చాయి. తూర్పు తీర వాణిజ్యం హల్కాండ నుండి వరి, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పొగాకును పెద్ద ఎత్తున పండించడం జరిగింది. నేత పరిశ్రమ కోసం ఇండిగో, చాయ్ రూట్ రంగు పంటలు ఉత్పత్తి చేయబడ్డాయి. అధిక నాణ్యత గల ఇనుము, ఉక్కు ఎగుమతులకు మచిలీపట్నం ప్రవేశ ద్వారంగా ఉంది. కొల్లూరు ప్రాంతంలో చురుకుగా వజ్రాల వెలికితీత జరిగింది. పత్తి నేత పరిశ్రమ సాదా కాలికో, మస్లిను (బ్రౌన్, బ్లీచిడ్ లేదా డైడ్) అనే రెండు రకాల కాటన్లను ఉత్పత్తి చేసింది. స్థానిక పద్ధతులచే రూపొందించబడిన రంగు నమూనాలతో ముద్రించిన వస్త్రం జావా, ఫార్ ఈస్ట్ లకు ఎగుమతి చేయబడింది. గోల్కొండ సాదా పత్తి, పులికాటు ముద్రించిన ప్రత్యేకత. తూర్పు తీరంలో ప్రధాన దిగుమతులు ఫెర్రసు కాని లోహాలు, కర్పూరం, పింగాణీ, పట్టు, లగ్జరీ వస్తువులు. సంస్కృతి సాంఘిక జీవితం thumb|హంపీ నందు గల హజార రామాలయ బాహ్య గోడల పై చెక్కబడిన ఈ శిల్ప కళ విజయనగర సామ్రాజ్య ప్రజల జీవితాలను వర్ణిస్తుంది. విదేశీ సందర్శకుల రచనల నుండి వచ్చింది, విజయనగర ప్రాంతంలోని పరిశోధనా బృందాలు వెలికితీసిన ఆధారాలు విజయనగర సామ్రాజ్యంలో సాంఘిక జీవితం గురించి అధిక సమాచారం లభిస్తుంది. హిందూ కుల వ్యవస్థ ప్రబలంగా, కఠినంగా అనుసరించబడింది. ప్రతి కులసమాజానికి ప్రాతినిధ్యం వహించడానికి స్థానికపెద్దల సమాఖ్య ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ పెద్దలు రాజాఙ సహాయంతో నియమ నిబంధనలను రూపొందించి ప్రజలను నిర్దేశించారు. కుల వ్యవస్థలో అంటరానితనం భాగంగా ఉంటుంది. ఈ వర్గాలకు నాయకులు (కైవదవరు) ప్రాతినిధ్యం వహించారు. తీరప్రాంత కర్ణాటకలో ముస్లిం వర్గాలకు వారి స్వంత సమూహం ప్రాతినిధ్యం వహించింది. అయినప్పటికీ కుల వ్యవస్థలోని అన్ని కులాల నుండి విశిష్ట వ్యక్తులను సైన్యం, పరిపాలనలో ఉన్నతస్థాయి పదోన్నతి పొందకుండా నిరోధించలేదు. పౌర జీవితంలో కుల వ్యవస్థ కారణంగా బ్రాహ్మణులు ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందారు. సైనిక వృత్తికి వెళ్ళిన కొద్దిమంది మినహా చాలా మంది బ్రాహ్మణులు మత, సాహిత్య విషయాల మీద దృష్టి పెట్టారు. భౌతిక సంపద, అధికారం నుండి వారు వేరుచేయడం వారిని స్థానిక న్యాయ విషయాలలో ఆదర్శవంతమైన మధ్యవర్తులుగా చేసింది. ప్రతి పట్టణం, గ్రామాలలో వారి ఉనికిని క్రమం తప్పకుండా నిర్వహించడానికి ప్రభువులు, కులీనవర్గాలు చేసిన గణనీయమైన నిధిని మదుపు చేస్తారు.According to Sir Charles Elliot, the intellectual superiority of Brahmins justified their high position in society () అయినప్పటికీ తక్కువ కుల పండితుల (మొల్ల, కనకదాస వంటివారు) రచనలు (వేమన, సర్వజ్ఞలతో సహా) జనాదరణ పొందడం సమాజంలో సామాజిక సమత్వ స్థాయికి సూచనగా ఉంది. thumb|left|200px|హంపీ నందు పూజింపబడిన నాగ దేవతల విగ్రహాలు. thumb|left|200px|ధర్మేశ్వర ఆలయం (కొండరాహళ్ళి, హోస్ కోటే) లో గల విజయనగర సామ్రాజ్య సమయం నాటి ఆలయ పలకలు, బి.యల్.రైస్ గారు వీటిని గుర్తించారు. సతీసహగమనం ఆచారం అనుసరిస్తూ ఒక వితంతువు చనిపోయిన భర్త మృతదేహంతో తనకు తాను ఆత్మాహుతి చేసుకోవడానికి సాక్ష్యాలు విజయనగర శిథిలాలలో లభించాయి. విజయనగరంలో సతీకలు (సతి రాయి) లేదా సతి-విరాకలు (సతీ యోధరాయి) అని పిలువబడే సుమారు యాభై శాసనాలు కనుగొనబడ్డాయి.Verghese (2001), p 41 ఆశిసు నంది ఆధారంగా మొఘలు సైన్యాల దాడి కారణంగా రాజపుత్ర రాజ్యాలలో సతీసహగమన ఆచారం అధికరించిన మాదిరిగానే విజయనాగర సతిసహగమనం ఆచారసాధన "అంటువ్యాధి"కి ఒక ఉదాహరణగా ఉంది. ముస్లిం సుల్తానేట్లు, హిందూ రాజ్యం మధ్య నిరంతర యుద్ధాలు, విదేశీ చొరబాట్లు ఈ అభ్యాసం అధికరించడానికి కారణమని పేర్కొంది. జాను హాలీ వంటి పండితుల అభిప్రాయం ఆధారంగా "ఆచారం పరిధి గురించి, దానిని అభ్యసించిన తరగతుల గురించి ఆధారాలు చాలా స్పష్టంగా లేవు. ఎందుకంటే చాలా రచనలు ముస్లిం చరిత్రకారులు, యూరోపియను ప్రయాణికుల నుండి వచ్చాయి" వీరికి అభ్యాసం లేదా దాని పరిస్థితులు కచ్చితంగా నివేదించడానికి మార్గాలలో నిష్పాక్షికత లేదు. మునుపటి శతాబ్దాల సాంఘిక-మతాచారాలు, లింగాయాటిజం వంటివి, మహిళలకు అనువైన సామాజిక నిబంధనలు ఉండేవి. ఈ సమయానికి దక్షిణ భారత మహిళలు చాలా అడ్డంకులను దాటారు. పరిపాలన, వ్యాపారం, వాణిజ్యం, లలిత కళలలో పాల్గొనడం వంటి పురుషుల గుత్తాధిపత్యంగా ఇప్పటివరకు పరిగణించిన విషయాలలో మహిళలు చురుకుగా పాల్గొన్నారు.B.A. Saletore in వరదాంబిక పరిణయం రాసిన తిరుమలంబ దేవి, మధురవిజయం రాసిన గంగాదేవి ఆ కాలపు ప్రముఖ మహిళా కవులుగా ఉన్నారు. ఈ కాలంలో తొలి తెలుగు మహిళా కవులలో తాళ్ళపాక తిమ్మక్క, ఆతుకూరి మొల్ల వంటివారు ప్రాచుర్యం పొందారు. తంజావూరులోని నాయకుల న్యాయస్థానం అనేక మంది మహిళా కవులను పోషించినట్లు తెలిసింది. దేవదాసి వ్యవస్థ ఉనికిలో ఉంది. అలాగే చట్టబద్దమైన వ్యభిచారం ప్రతి నగరంలోని కొన్ని వీధులకు పరిమితం చేయబడుతుంది. రాజకుటుంబ పురుషులలో అంతఃపుర ఆదరణ గురించి రికార్డులు తెలియజేస్తున్నాయి. thumb|హిందూ పురాణాలను వర్ణిస్తూ పెయింటింగ్ చేయబడిన 14వ శతాబ్దపు విరూపాక్ష దేవాలయ పైకప్పు. బాగా డబ్బున్న పురుషులు పేతా లేదా కులవి అను పట్టుతో చేసి, బంగారంతో అలంకరించబడిన పొడవాటి తలపాగా ధరించేవారు. చాలా భారతీయ సంప్రదాయాలలో వలె, ఆభరణాలను పురుషులు, మహిళలు ఉపయోగించారు. అలాగే వివిధ రకాలైన వంకీలు, కంకణాలు, వేళ్లకు ఉంగరాలు, హారాలు, చెవి పోగులను వినియోగించారని తెలుస్తుంది. వేడుకల సమయంలో, పురుషులు, మహిళలు తమను తాము పూల మాలలతో అలంకరించుకునేవారు. అలానే పన్నీరు, కస్తూరి లేదా గంధంతో చేసిన పరిమళమైన సుగంధ ద్రవ్యాలు ఉపయోగించేవారు. నిరాడంబరంగా ఉండే సామాన్యులకు పూర్తి భిన్నంగా, సామ్రాజ్యంలో రాజులు, రాణులు విలాసవంతమైన జీవితాన్ని కలిగి ఉండేవారు. రాణులు, యువరాణులుకు చాలా మంది పరిచారకులు ఉండేవారు, వారు విలాసవంతమైన దుస్తులతో, చక్కటి ఆభరణాలతో అలంకరించబడేవారు, వారి రోజువారీ విధులు సునాయాసంగా ఉండేవి.From the writings of Portuguese Domingo Paes () పురుషులు శారీరక వ్యాయామాలు చేసేవారు అలాగే వినోదం కోసం క్రీడలు, మల్లయుద్ధం ఆడేవారు. మహిళా రెజ్లర్ల గురించి కూడా రికార్డుల్లో పేర్కొన్నారు. రాజప్రాసాదాల వద్ద వ్యాయామశాలలు కనుగొనబడ్డాయి. యుద్ధం లేని సమయంలో దళపతులు వారి సైన్యాలకు సాధారణ శారీరక శిక్షణ ఇచ్చేవారని రికార్డులు చెబుతున్నాయి. రాజభవనాలు, మార్కెట్ ప్రదేశాల వద్ద ప్రత్యేక వేదికలు ఉన్నాయి. ఇక్కడ రాజ వంశస్థులు, సాధారణ ప్రజలు కోడి పందాలు, పొట్టేల పందాల, మహిళల మధ్య కుస్తీ వంటి ఆటలను వీక్షించి ఆనందించేవారు. విజయనగర నగర పరిధిలోని త్రవ్వకాల్లో బండరాళ్లు, రాతి దిమ్మెలు, ఆలయ అంతస్తులపై చెక్కిన ఆధారాలు ఉన్నాయి. కనుక ఈ ప్రదేశాలలో సాంఘిక కార్యకలాపాల ఉనికి వెల్లడైంది. ఈ ఆటలలో కొన్ని నేడు వాడుకలో ఉన్నాయి, మరికొన్ని ఇంకా గుర్తించలేదు.Mack (2001), p39 మతం thumb|హంపిలోని విరూపాక్ష దేవాలయం.|220x220px thumb|మహావిష్ణువు అవతారమైన ఉగ్ర నరసింహ స్వరూపం, హంపి|293x293px thumb|విరూపాక్ష దేవాలయం దగ్గర అలంకృతమైన స్తంభాలు.|335x335px thumb|హజారే రామ దేవాలయంలోని కుడ్యఫలకాలు.|220x220px విదేశీ సందర్శకులు పొందుపరచిన విశేషాల ప్రకారం విజయనగర రాజులు అన్ని మతాలను, వర్గాలను గౌరవించేవారు.From the notes of Duarte Barbosa () విజయనగర రాజులు గోబ్రాహ్మణ ప్రతిపాలనాచార్య (అనగా, " గోవుల, బ్రాహ్మణుల సంరక్షకుడు"), హిందూరాయ సురత్రాణుడు (అనగా, "హిందువుల విశ్వాసమును ఆదరించు రాజు") అను బిరుదులు కలిగి ఉండేవారు. దీని ప్రకారం విజయనగర రాజులు హిందూ మతమునకు ప్రాధాన్యం ఇచ్చే వారు అని తెలుస్తున్నది అయినప్పటికీ రాజ సభలో వారు పాటించే కొన్ని సంప్రదాయాలు, దుస్తులు ఇస్లాం మతముతో పోలివుండేవి. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు అయిన హరిహర I, బుక్కరాయలు I, ఇద్దరూ శివభక్తులు అయినప్పటికీ శృంగేరికి చెందిన విద్యారణ్య మునిని వైష్ణవులకు గురువుగా గుర్తించి నగదును, అనుమతులను అందించారు. అలాగే విష్ణువు అవతారమైన వరాహమును విజయ నగర సామ్రాజ్య చిహ్నంగా నిర్ణయించారు. పావువంతుకు పైగా పురావస్తుశాఖ తవ్వకాలలో రజనివాసం దరిదాపుల్లోనే ఇస్లాముల నివాసాలు గుర్తించ బడ్డాయి. మద్య ఆసియాకు చెందిన తైమురిడ్ రాజ్య వంశస్థులు, అధికారులు విజయ నగర సామ్రాజ్యమును సందర్శించేవారు. చివరి సాళువ రాజులు, తుళువ రాజులు వైష్ణవ భక్తులైనప్పటికి హంపిలోని విరూపాక్ష స్వామివారికి, తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి పాద పూజలు చేసేవారు.కృష్ణ దేవరాయలు వారి సంస్కృత రచన అయినటువంటి జాంబవతి కళ్యాణంలో విరూపాక్ష స్వామివారిని కర్ణాట రాజ్య రక్షా మణి (అనగా, "కర్ణాట సామ్రాజ్యము యొక్క రక్షిత మణి") గా అభివర్ణించడం జరిగింది. ఉడిపిలో విజయ నగర రాజులు మాధవాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని నమ్మే సన్యాసులను ఆదరించేవారు. ఆ సమయంలో భక్తి ఉద్యమం ప్రాచుర్యంలో వుంది, ఎంతో మంది హరిదాసులు ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఇందులో 12వ శతాబ్దముకు చెందిన వీరశైవ ఉద్యమం చెప్పుకోదగినది, ఈ ఉద్యమం కొన్ని లక్షల మందిని ప్రేరేపించి వారి జీవితంలో భాగమైపోయింది. హరి దాసులు వ్యాస కూట, దశ కూట సమూహములుగా ఉండే వారు. వ్యాస కూట సముహమునకు చెందిన వారు వేదములలో, ఉపనిషత్తులలో, ఇతర దార్శన లలో పాండిత్యం పొందేవారు. దశ కుటకి చెందిన సమూహం మాధవాచార్యుల ఉపదేశాలను భక్తి పాటల (Devaranamas, కీర్తనల) రూపంలో కన్నడ భాషలో ప్రజలలోకి తీసుకు వెళ్ళేవారు. మాధవాచార్యుల వారి వేదాంతమును అతని శిష్యులైన నరహరి తీర్థ, జయ తీర్థ, శ్రీపాద రాయ, వ్యాస తీర్థ, వాది రాజ తీర్థ మొదలగువారు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.Shiva Prakash in Ayyappapanicker (1997), p192, pp194–196 వాది రాజ తీర్థకు గురువైన వ్యాస రాజ తీర్థ, కర్నాటి సంగీత పితామహుడు పురందరదాసుIyer (2006), p93Owing to his contributions to carnatic music, Purandaradasa is known as Karnataka Sangita Pitamaha. (Kamat, Saint Purandaradasa),, కనక దాసుడుShiva Prakash (1997), p196 శ్రీకృష్ణదేవరాయులు గారి చేత పూజింపబడ్డారు.Shiva Prakash (1997), p195. రాజు గారు మునులను తమ కులదేవతలుగా పూజించేవారు, వారి రచనల ద్వారా గౌరవించేవారు. ఆ సమయంలోనే తిరుపతికి చెందిన మరొక గొప్ప కర్నాటి సంగీత స్వరకర్త అన్నమాచార్యుల వారు తెలుగులో కొన్ని వందల కీర్తనలు రచించారు. ఇస్లాం ఆనాటి ప్రపంచంలో పర్షియా, టర్కీల ప్రభావం ప్రపంచం మీద భారీగా ఉండేది. ఆ సంస్కృతులు అభిలషణీయమైన సంస్కృతులు అయ్యాయి. విజయనగర సామ్రాజ్యం మతాతీతమైన ఇస్లామీకరణకు లోనయింది. వస్త్రధారణ, వాస్తుశిల్పం వంటివాటిలో ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇక మతపరంగానూ ఇస్లాంను వారు ఆదరించారు. విజయనగర చక్రవర్తులు మతపరమైన అంశాల్లో చాలా ఉదారంగా వ్యవహరించేవారనీ, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర అల్పసంఖ్యాకులు సామ్రాజ్యంలో సంతోషంగా జీవించేవారని శాసన, సాహిత్యాధారాలు చెప్తున్నాయి. 11వ శతాబ్దం ప్రారంభంలో చోళులు, జైన పశ్చిమ గంగా రాజవంశాన్ని ఓడించడం, 12వ శతాబ్దంలో వైష్ణవ, వీరశైవ అనుచరుల సంఖ్య పెరగడం జైనమతంపై తగ్గిన ఆసక్తికి అద్దం పడుతుంది. విజయనగర భూభాగంలో రెండు ముఖ్యమైన జైన ప్రదేశాలు శ్రావణబెళగొళ, కంబదహళ్ళి. దక్షిణ రాజ్యాలు - అరబ్ రాజ్యాల మధ్య వాణిజ్య సంబంధాల ఫలితంగా, భారతదేశ దక్షిణ ప్రాంతంతో ఇస్లామిక్ సంబంధాలు 7వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి. జుమ్మా మసీదులు 10వ శతాబ్దం నాటికి రాష్ట్రకూట సామ్రాజ్యంలో ఆవిర్భవించాయి.From the notes of Arab writer Al-Ishtakhri () అలానే 14వ శతాబ్దం ప్రారంభంలో మలబార్ తీరంలో అనేక మసీదులు అభివృద్ధి చెందాయి.From the notes of Ibn Batuta () స్థానికంగా స్థిరనివాసులు ఏర్పరుచుకున్న ముస్లింలు స్థానిక స్త్రీలను వివాహం చేసుకున్నారు; వారి పిల్లలను మప్పిలా (మోప్లా) అని పిలుస్తారు. వీరు గుర్రపు వ్యాపారం, నౌకాదళం వంటి వాటిలో చురుకుగా పాల్గొనేవారు. విజయనగర సామ్రాజ్యం, బహమనీ సుల్తానేట్‌ల మధ్య పరస్పర సంబంధాలు దక్షిణాన ముస్లింల ఉనికిని పెంచాయి. మలబార్ క్రైస్తవులకు భూమి మంజూరు చేసిన రాగి ఫలకను కనుగొనడం ద్వారా 8వ శతాబ్దంలోనే క్రైస్తవ మతం దక్షిణ ప్రాంతానికి విస్తరించిందని చెప్పవచ్చు. క్రైస్తవ యాత్రికులు మధ్య యుగాలలో దక్షిణ భారతదేశంలో క్రైస్తవుల కొరత గురించి వ్రాయడం చేత, మిషనరీలు ఈ ప్రాంతంపై ఆకర్షితులైయ్యారు.From the notes of Jordanus in 1320–21 () 15-16వ శతాబ్దంలో పోర్చుగీస్, డచ్ రాక, ఫ్రాన్సిస్ జేవియర్ (1545) క్రైస్తవ మత ప్రచారాలు, వాణిజ్య సంబంధాలు మొదలైనవి దక్షిణాన క్రైస్తవ మతం వృద్ధికి తోడ్పడ్డాయి. భాష సామ్రాజ్యంలోని ఆయా ప్రాంతాలలో కన్నడ, తెలుగు, తమిళ భాషలు వాడుకలో ఉండేవి. 7000 కు పైగా శిలాశాసనాలు అందులో 300 తామరశాసనాలు తిరిగి వెలికి తీయబడ్డాయి. వీటిలో దాదాపు సగం కన్నడలో ఉన్నాయి. మిగిలినవి తెలుగు, తమిళం, సంస్కృత భాషలలో ఉన్నాయి.G.S. Gai in 14వ శతాబ్దం నాటికి ద్విభాషా శాసనాలు ఆదరణ కోల్పోయాయి.Thapar (2003), pp 393–95 హంపి, పెనుగొండ, తిరుపతిలలో ముద్రించబడిన నాణేలు దేవనాగరి, కన్నడ, తెలుగు లిపిని కలిగివుండేవి. సాధారణంగా ఈ నాణేలపైన పాలకుడి పేరు ముద్రించబడి ఉండేది. గద్యాన, వరాహ, పొన్, పగోడ, ప్రతాప, పన, కాసు, జితల్ అనే నాణేలను బంగారు, వెండి, రాగితో చేసేవారు. నాణేల మీద బాలకృష్ణడు, వెంకటేశ్వరస్వామి దేవతలైన భూదేవి, శ్రీదేవి, మొదలగు దేవుళ్ల చిత్రాలు, ఎద్దులు, ఏనుగులు, పక్షులు వంటివి ముద్రించేవారు. తొలి దశలో నాణేలపై హనుమంతుడు, విష్ణువు వాహనం అయిన గరుడ చిహ్నాలు ఉన్నాయి. కన్నడ, తెలుగు శాసనాలను భారత పురావస్తు శాఖ చరిత్రకారులు అధ్యయనం చేసి భద్రపరిచారు. సాహిత్యం విజయనగర సామ్రాజ్యం యొక్క పాలనలో, కవులు, పండితులు, తత్వవేత్తలు ప్రధానంగా కన్నడ, తెలుగు, సంస్కృతం, తమిళం వంటి భాషలలో రచనలు చేసారు వారు ముఖ్యంగా మతం, జీవిత చరిత్ర, ప్రబంధ (కల్పన), సంగీతం, వ్యాకరణం, కవిత్వం, ఔషధం, గణితం వంటి అంశాల మీద రచనలు చేశారు. కన్నడ, తెలుగు భాషలు సామ్రాజ్యంలో ముఖ్యమైన భాషలుగా, ఆస్థాన భాషలుగా ఉండేవి - తెలుగు భాష చివరి విజయనగర (తులువ, అరవీడు) రాజుల పాలనలో మరింత సాంస్కృతిక ప్రాముఖ్యతను పొందింది., Nagaraj in Pollock (2003), p378Quote:"Royal patronage was also directed to the support of literature in several languages: Sanskrit (the pan-Indian literary language), Kannada (the language of the Vijayanagara home base in Karnataka), and Telugu (the language of Andhra). Works in all three languages were produced by poets assembled at the courts of the Vijayanagara kings". Quote:"The Telugu language became particularly prominent in the ruling circles by the early 16th century, because of the large number of warrior lords who were either from Andhra or had served the kingdom there", Asher and Talbot (2006), pp 74–75 విజయనగర సామ్రాజ్యంలో తెలుగు ఒక ప్రసిద్ధ సాహిత్య మాధ్యమంగా ఉండేది, శ్రీ కృష్ణదేవరాయల ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంది. చాలా సంస్కృత రచనలు వేదాలపై లేదా రామాయణ, మహాభారత ఇతిహాసాలపై వివరణ రూపంలో ఉండేవి. ఇవి సాయన, విద్యారణ్య వంటి ప్రసిద్ధ కవులచే వ్రాయబడ్డాయి, వీరి వ్యాఖ్యానాలు ఇతర ప్రత్యర్థ హిందూ తత్వాల కంటే అద్వైత తత్వశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని ప్రస్తావించాయి. ఇతర రచయితలు ఉడిపి క్రమానికి చెందిన ప్రసిద్ధ ద్వైత సిద్ధాంత సాధువులు ఉదాహరణకు జయతీర్థ (అతని రచనలకు తికాచార్య అను బిరుదు పొందారు), వ్యాసతీర్థ (అద్వైత తత్వాన్ని, పూర్వ తర్కవేత్తల తీర్మానాలను ఖండించారు), వాదిరాజతీర్థ, శ్రీపాదరాయలు (ఇద్దరూ ఆది శంకరాచార్యుల వారి విశ్వాసాలను విమర్శించారు). వీరు కాకుండా, మరి కొందరు ప్రముఖ సంస్కృత పండితులు విజయనగర రాజుల, వారి సామంత రాజుల ఆస్థానాలను అలంకరించారు. రాజకుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు కూడా కొన్ని రచనలు చేశారు, ఉదాహరణకు శ్రీ కృష్ణదేవరాయల వారు జాంబవతి కళ్యాణం, ఉషాపరిణయం, యువరాణి గంగాదేవి గారు (ఈమే బుక్క రాయలు I గారి కోడలు) మధుర విజయం వంటి ముఖ్యమైన రచనలను చేసారు. మధుర విజయం రచనను వీరకంపరాయ చరిత అని కూడా పిలుస్తారు, దీనిలో మధురై సుల్తానేట్‌ను విజయనగర సామ్రాజ్యం జయించడం గురించి వివరించారు. thumb|upright|left|విజయనగర కవి అయిన మంజరాజు (1398 CE) కన్నడలో లిఖించిన కవితా శాసనం. హరిదాసులు, బ్రాహ్మణలు, వీరశైవుల (లింగాయతత్వం) సాహిత్యం ద్వారా ప్రాముఖ్యత పొందిన వైష్ణవ భక్తి ఉద్యమానికి మద్దతునిస్తూ, సామ్రాజ్యంలోని కన్నడ కవులు, పండితులు ముఖ్యమైన రచనలను రూపొందించారు. హరిదాస కవులు తమ భక్తిని దేవరనామ అనే పాటల ద్వారా చాటుకున్నారు, ఇవి సాంగత్య, సులాది, ఉగాభోగ, ముండిగే అను స్థానిక బానీలలో ఉండేవి.Shiva Prakash in Ayyappapanicker (1997), p164, pp 193–194, p203 వీరికి మాధవాచార్యులు, వ్యాసతీర్థుల బోధనలు ప్రేరణగా ఉండేవి. హరిదాసులలో పురందరదాసు, కనకదాసుల అపారమైన సేవల కారణంగా దాసులలో అగ్రగామీలగా పరిగణించబడ్డారు. బ్రాహ్మణ పండితులలో ప్రముఖుడైన కుమార వ్యాసుడు మహాభారత పురాణాన్ని గదుగిన భారతం గా అనువదించాడు. గదుగిన భారతం కన్నడ సాహిత్యం, ఆధునిక కన్నడ సాహిత్యంగా రూపాంతరం చెందడానికి తోడ్పడింది. ప్రసిద్ధ వీరశైవ పండితుడు, కవి అయిన ఛామరస, రెండవ దేవరాయల ఆస్థానంలో వైష్ణవ పండితులతో అనేక చర్చలలో పాల్గొన్నాడు. అతని ప్రభులింగ లీలే, తరువాత తెలుగు, తమిళ భాషల్లోకి అనువదించబడింది, ఇది సెయింట్ అల్లమ ప్రభుని స్తుతించి చేసిన రచన (అల్లమ ప్రభును గణపతి అవతారంగా పరిగణిస్తారు).Rice E.P. (1921), p.68 తెలుగు సాహిత్యం అత్యున్నత స్థితిలో ఉన్న ఈ సమయంలో, అత్యంత ప్రసిద్ధ రచన మనుచరితము ప్రబంధ శైలిలో లిఖించబడింది. తెలుగు సాహిత్యంలో నిష్ణాతుడైన శ్రీ కృష్ణదేవరాయలు ప్రసిద్ధ ఆముక్తమాల్యదను రచించాడు.During the rule of Krishnadevaraya, encouragement was given to the creation of original Prabandhas (stories) from Puranic themes () ఆముక్తమాల్యద, శ్రీరంగంలో తమిళ ఆళ్వార్ల కవి అయిన ఆండాళ్‌ (పెరియాళ్వార్ కుమార్తె) తో విష్ణువు వివాహం జరిగిన కథను వివరిస్తుంది. శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా పిలవబడే ఎనిమిది మంది ప్రసిద్ధ సాహిత్య పండితులు రాయల సభకు మూల స్తంభాలుగా పరిగణించబడ్డారు. వారిలో అత్యంత ప్రసిద్ధులు ఆంధ్రకవితాపితామహడు ("తెలుగు కవిత్వ పితామహుడు") అల్లసాని పెద్దన అలాగే అనేక ప్రముఖ రచనలను రచించిన ఆస్థాన కవి తెనాలి రామకృష్ణుడు ఉన్నారు.Like the nine gems of King Vikramaditya's court, the Ashtadiggajas were famous during the 16th century.() మిగిలిన ఆరుగురు కవులు నంది తిమ్మన (ఈయనను ముక్కు తిమ్మన అని కూడా పిలుస్తారు), అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్యగారి మల్లన, రామరాజభూషణుడు (రామరాజ భూషణ), పింగళి సూరన, ధూర్జటి. అది (అప్పటి తెలుగు కవులందరిలో గొప్పవాడైన) శ్రీనాథుని యుగం. అతను మరుత్తరాట్చరిత్ర, శాలివాహన-సప్త-సతి వంటి రచనలు రచించాడు. అతను రెండవ దేవరాయల ఆస్థాన కవి, రాజ్యంలో అతను ముఖ్యమైన మంత్రులతో సమానమైన హోదా పొందాడు. ఈ కాలంలో తమిళ భాషా సాహిత్య అభివృద్ధి సామంత రాజులైన పాండ్యులు పాలించబడిన ప్రాంతాల నుండి వచ్చినప్పటికీ, కొంతమంది కవులను విజయనగర రాజులు కూడా చేరదీసారు. స్వరూపానంద దేశికర్ అద్వైత తత్వశాస్త్రంపై 2824 శ్లోకాల సంకలనమైన శివప్రకాశప్పెరుండిరట్టును రచించారు. అతని శిష్యుడైన, తట్టువరాయర్, కురుండిరట్టు అనే ఒక చిన్న సంకలనాన్ని రచించాడు. శ్రీ కృష్ణదేవరాయలు తమిళ వైష్ణవ కవి హరిదాసును పోషించాడు, అతని ఇరుసమయ విలక్కం అప్పటి రెండు ముఖ్య హిందూ వ్యవస్థలలో వైష్ణవ వ్యవస్థకు ప్రాధాన్యతనిచ్చింది. సంగీతం, వైద్యంపై లౌకిక రచనలలో ముఖ్యమైనవి విద్యారణ్య యొక్క సంగీతసార, ప్రౌఢ రాయల యొక్క రతిరత్నప్రదీపిక, సయన యొక్క ఆయుర్వేద సుధానిధి అలాగే లక్ష్మణ పండితుని యొక్క వైద్యరాజవల్లభం.Prasad (1988), pp.268–270 గణిత శాస్త్రనికి సంబంధించిన త్రికోణమితి, కాలిక్యులస్‌ల పై ముఖ్యమైన కృషి చేసిన సంగమగ్రామానికి చెందిన మాధవ (c. 1340–1425) అలాగే గ్రహాల కక్ష్యలను ప్రతిపాదించిన నీలకంఠ సోమయాజి (c. 1444–1545) వంటి సుప్రసిద్ధ పండితుల ఆధ్వర్యంలో ఈ కాలంలో కేరళ భూభాగంలో ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం అభివృద్ధి చెందాయి."History of Science and Philosophy of Science: A Historical Perspective of the Evolution of Ideas in Science", editor: Pradip Kumar Sengupta, author: Subhash Kak, 2010, p91, vol XIII, part 6, Publisher: Pearson Longman, నిర్మాణకళ thumb|left|upright|షిమోగా జిల్లా ఇక్కేరి అఘోరేశ్వర ఆలయంలోని యాలి స్తంభాలు. విజయనగర నిర్మాణకళ చాళుక్య, హొయసల, పాండ్య, చోళ నిర్మాణ శైలుల యొక్క కలయిక, ఇవి మధ్య శతాబ్దాలలో అభివృద్ధి చెందాయి.Art critic Percy Brown calls Vijayanagara architecture a blossoming of Dravidian architecture style ()Arthikaje, Literary Activity, Art and Architecture, History of karnataka. OurKarnataka.Com విజయనగర సామ్రాజ్యం అంతరించిన తరువాత కూడా నాటి శిల్పకళ, నిర్మాణకళ, చిత్రలేఖనం తరువాతి కాలం నాటి కళల అభివృద్ధిని ప్రభావితం చేసింది. వీరి నిర్మాణ శైలిలో బాగా పేరు పొందినవి అతి సుందరమైన స్తంభాలతో కూడిన కళ్యాణమండపాలు, వసంతమండపాలు (స్తంభాల మందిరాలు), రాయగోపురం. నిరంతర దండయాత్రలతో రాజ్యానికి ముప్పు ఉన్నందున నిర్మాణాలలో స్థానికంగా లభించే గట్టి గ్రానైట్‌ను ఉపయోగించేవారు. దక్షిణ భారతదేశం అంతటా విజయనగర నిర్మాణాలు వ్యాపించి ఉన్నప్పటికి, అవేవి యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌దైన విజయనగర రాజధానిలో విస్తారంగా నిర్మింపబడిన కట్టడాలకు సాటిరావు."So intimate are the rocks and the monuments they were used for make, it was sometimes impossible to say where nature ended and art began" (Art critic Percy Brown, quoted in Hampi, A Travel Guide, p64) మొదట 14వ శతాబ్దంలో రాజులు వేసర (వేసెర) లేదా దక్కన్-శైలి కట్టడాలను నిర్మించడం కొనసాగించారు, అయితే తర్వాత వారి ఆచార అవసరాల మేరకు ద్రవిడ-శైలి నిర్మాణాలు చేశారు. బుక్క రాయల ప్రసన్న విరూపాక్ష దేవాలయం (భూగర్భ దేవాలయం), దేవరాయల హజారా రామ దేవాలయం దక్కన్ శైలి నిర్మాణాలకు ఉదాహరణలు. స్తంభాల మీద వైవిధ్యమైన, సంక్లిష్టమైన అలంకరణ వారి నైపుణ్యానికి చిహ్నం.Nilakanta Sastri about the importance of pillars in the Vijayanagar style in హంపి లోని, విఠ్ఠల దేవాలయం వారి స్తంభాల కళ్యాణమండప శైలికి అత్యుత్తమ ఉత్తమ ఉదాహరణ అయినప్పటికీ, హజారా రామస్వామి ఆలయం వారి నైపుణ్యానికి, నిరాడంబరమైన నిర్మాణానికి ఒక చక్కటి ఉదాహరణ."Drama in stone" wrote art critic Percy Brown, much of the beauty of Vijayanagara architecture came from their pillars and piers and the styles of sculpting (Hampi, A Travel Guide, p77) చాళుక్యులు అభివృద్ధి చేసిన సరళమైన, నిర్మలమైన నిర్మాణ కళను అనుసరించడం వారి నిర్మాణలలో కనిపించే అంశం.About the sculptures in Vijayanagara style, see విజయనగర నిర్మాణ కళకు గొప్ప నమూనా అయిన విఠ్ఠల దేవాలయం తుళువ రాజుల పాలనలో పూర్తి చేయడానికి అనేక దశాబ్దాలు పట్టింది.Several monuments are categorised as Tuluva art () విజయనగర శైలిలో మరొక ముఖ్యమైన అంశం ఏకశిలా శిల్పకళ. హంపిలోని శశివేకాలు (కన్నడలో ఆవాలు అని అర్థం) గణేశుడు, కడలేకలు (కన్నడలో వేరుశెనగ అని అర్థం) గణేశుడు; కర్కాళ, వేణూరులోని గొమ్మటేశ్వర (బాహుబలి) ఏకశిలలు; లేపాక్షిలోని నంది ఎద్దు వంటి పెద్ద ఏకశిలా విగ్రహాలు విజయనగర శిల్ప కళా నైపుణ్యానికి తార్కాణం. కర్ణాటకలోని కోలార్, కనకగిరి, శృంగేరి, ఇతర పట్టణాలలోని విజయనగర దేవాలయాలు; ఆంధ్రప్రదేశ్‌లోని తాడపత్రి, లేపాక్షి, అహోబిలం, తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలు; తమిళనాడులోని వెల్లూరు, కుంభకోణం, కంచి, శ్రీరంగం ఆలయాలు ఈ శైలికి ఉదాహరణలు. విజయనగర కళలో చిత్రలేఖనం ముఖ్యమైన కళ, హంపిలోని విరూపాక్ష ఆలయంలోని దశావతారాలు, గిరిజాకళ్యాణంకు (పార్వతి వివాహం, శివుని భార్య) సంబంధించిన చిత్రాలు, లేపాక్షిలోని వీరభద్ర ఆలయంలో శివపురాణ కుడ్యచిత్రాలు (శివుని కథలు), కంచిలోని కామాక్షి, వరదరాజ ఆలయంలో ఆలయ గోడలపై ఉన్న చిత్రాలు ఆనాటి కళా నైపుణ్యానికి ఉదాహరణలు.Some of these paintings may have been redone in later centuries (Rajashekhar in ) ఈ దక్షిణ భారత శైలుల కలయిక వలన పూర్వ శతాబ్దాల నిర్మాణాల కంటే విజయనగర నిర్మాణ కళ గొప్పగా కనబడుతుంది, దీనికి ముఖ్య కారణం శిల్పకళతో పాటు వివిధ హంగులతో ఈ శిల్పాలను, నిర్మాణాలను మునపటికంటే అందంగా అలంకరించడం.Historians and art critics K.A. Nilakanta Sastri, A. L. Basham, James Fergusson and S. K. Saraswathi have commented about Vijayanagara architecture (Arthikaje Literary Activity). విజయనగర నగరాలలో ఇస్లామిక్ లక్షణాలు కలిగిన అనేక లౌకిక నిర్మాణాల ఉనికి కాస్మోపాలిటనిజంను (విశ్వమానవత్వం) తెలియజేస్తుంది. రాజకీయ చరిత్ర విజయనగర సామ్రాజ్యానికి దక్కన్ సుల్తానేట్‌లకు మధ్య సంఘర్షణపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, నిర్మాణ శైలిలో పరస్పర సంకర్షణ ప్రతిబింబిస్తుంది. ఈ ప్రభావాలను చూపించే అనేక శిలా తోరణాలు, డోమ్ రూపంలో ఉన్న గోపురాలు, బాండాగారాలు ఉన్నాయి. ఛత్రి, శాలలు, టవర్లు వంటి నిర్మాణాల ఒకే దగ్గర కేంద్రీకరమవ్వడం చూస్తే వీటిని రాజులు ఉపయోగించే వారని అర్ధమవుతుంది. ఈ నిర్మాణాల సంకర్షణ బహుశా 15వ శతాబ్దం ప్రారంభంలో అనగా మొదటి దేవరాయ, రెండవ దేవరాయల పాలనలో జరిగి ఉండవచ్చు. ఈ కాలం నాటి రాజులు తమ సైన్యంలో, ఆస్థానాలలో చాలా మంది ముస్లింలను నియమించుకున్నారని తెలుస్తుంది, వీరిలో కొందరు మొఘల్ వాస్తుశిల్పికి చెందినవారు కావచ్చు. ఈ సామరస్యపూర్వకమైన వాస్తు ఆలోచనల మార్పిడి ఈ రాజ్యాల మధ్య అరుదైన శాంతి కాలాల్లో జరిగి ఉండాలి.Philon (2001), p87 ది గ్రేట్ ప్లాట్‌ఫారమ్ గా పిలవబడే మహానవమి దిబ్బ పైన చెక్కబడిన బొమ్మలు రాజ పరిచారకులుగా పనిచేసిన మధ్య ఆసియా టర్క్‌ల ముఖ లక్షణాలను కలిగి ఉన్నాయి.Dallapiccola (2001), p69 thumb|800px|center|మీనాక్షి దేవాలయం యొక్క వైమానిక దృశ్యం, దక్షిణ గోపురం పై నుండి ఉత్తరం వైపుకు. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య "నాయక్"లు పునర్నిర్మించారు.|alt= దేవాలయ ప్రాంగణం యొక్క వైమానిక చిత్రం. పతన దశ తళ్ళికోట యుద్ధానంతర దశను విజయనగర సామ్రాజ్య పతనదశగా చెప్పుకోవచ్చు. 1565లో తళ్లికోట యుద్ధం జరిగి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా ఓటమిచెందిన తర్వాత తిరుమల దేవరాయలు నామమాత్ర పరిపాలకుడైన సదాశివరాయలను తీసుకుని విజయనగర ఖజానాను ఎత్తుకుని పెనుకొండకు పారిపోయారు. విజయనగరాన్ని పాదుషాలు నేలమట్టం చేసి వదిలిపోయాకా తిరుమల దేవరాయలు ఆ రాజధానిని బాగుచేసుకుని పరిపాలించేందుకు మూడేళ్ళపాటు ప్రయత్నించారు. శ్మశానంలా తయారైన ఈ రాజధానిని తిరిగి ఏలుకోలేక పెనుకొండకు తిరిగివచ్చారు. అంతటితో విజయనగర సామ్రాజ్యపు రాజధానిగా విద్యానగరం ముగిసిపోయింది. ఆపైన కొన్నేళ్ళు పెనుకొండ, మిగిలిన సంవత్సరాలు చంద్రగిరిలను రాజధానులుగా చేసుకుని పాలించారు. తళ్ళికోట ఓటమి తర్వాత రాజ్యభాగాలు తగ్గిపోనారంభించాయి. తిరుమలదేవరాయలు తన ముగ్గురు కుమారులను మూడు ప్రాంతాలకు ప్రతినిధులుగా పరిపాలింపజేశారు. పెద్దకుమారుడైన రామరాయలు కన్నడప్రాంతాలను శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలించారు. రెండో కుమారుడు శ్రీరంగ దేవరాయలు పెనుగొండను రాజధానిగా చేసుకుని తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. మూడో కుమారుడు వేంకటపతి దేవరాయలు మొదట చంద్రగిరిని రాజధానిగా చేసుకుని తమిళ ప్రాంతాలు పాలించేవారు. విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా శ్రీరంగదేవరాయలు తెలుగు ప్రాంతాల విషయంలో చాలా ప్రయత్నాలు చేసి, వైభవాన్ని పునరుద్ధరించేందుకు విఫలయత్నాలు చేశారు. బీజాపూరు సుల్తానులతో కొన్ని యుద్ధాల్లో గెలిచి, కొన్ని ఓడిపోయారు. ఆయనకు పుత్రసంతానం లేకపోవడంతో చిన్నతమ్ముడు చంద్రగిరి పాలకుడు అయిన వేంకటపతి దేవరాయలకు రాజ్యాన్నిచ్చారు. ఆయన పాలనకాలంలోనే బ్రిటీషు వారికి మద్రాసు పట్టణం ఏర్పాటు చేయటానికి భూమి మంజూరు చేశారు. కొంతకాలం పాటు పెనుకొండను రాజధానిగా చేసుకుని అన్నగారు ఇచ్చిన సామ్రాజ్యాన్ని పాలించినా ఆపైన మాత్రం రాజధానిని తన పట్టణమైన చంద్రగిరికే మార్చుకున్నారు. ఆయన విజయనగర సామ్రాజ్యపు ఆఖరి గొప్ప చక్రవర్తిగా పేరొందారు. ఆయన కాలంలో శ్రీరంగపట్నాన్ని ఒడయారు రాజులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోకపోయినా కొందరు రాజులు స్వతంత్రించే వ్యవహరించేవారు. వంశ పరంపర కింది జాబితా రాబర్ట్ సెవెల్ రాసిన ఎ ఫర్గాటెన్ ఎంపైర్'' (విస్మృత సామ్రాజ్యం) అనే పుస్తకం నుండి సంగ్రహించినవి. సంగమ వంశం మొదటి బుక్క భూపతి రాయలు, 1082 - 1087 మొదటి హరిహర రాయలు, 1087 - 1104 బుక్క మహా రాయలు, 1104 - 1126 సదా శివ రాయలు, 1126 - 1152 పురందర రాయలు, 1152 - 1207 ప్రతాప్ దెవ రాయలు, 1207 - 1227 వీర ప్రతాప్ దెవ రాయలు,1227-1242 ప్రతాప్ వెంకట్ రాయలు,1242-1251 రెండవ బుక్కభూపతి రాయలు,1251-1260 రెండవ హరిహర రాయలు,1260-1280 బుక్కన్నా వొడయారు రాయలు,1280-1285 కుమారా కంపా రాయలు,1285-1290 మొదటి బుక్క రాయలు,1290 మొదటి దెవ రాయలు, 1290 గుండమ్మా రాయలు, 1290 మొదటి బుక్క రాయలు,1290-1294 విద్యారన్య రాయలు, 1294 మొదటి బుక్క రాయలు,1294 సంగమా రాయలు, 1294 ముడప హరిహర రాయలు,1294 కుమారా కంపా రాయలు, 1294 రెండప బుక్క రాయలు,1294 మారప్పా ముద్దాప్పా రాయలు,1294 -1295 బుక్కన్నా వొడయారు రాయలు,1295-1304 అభినవ బుక్క రాయలు,1304-1306 రెండవ బుక్క రాయలు ఇంకా అయినా కుమారుడు ప్రతాప్ హరిహర రాయలు,1306-1322 ముడవ బుక్క రాయలు,1322-1330 నరసింహా రాయలు,1330-1332 రెండవ దెవ రాయలు,1332-1339 మొదటి మల్లికార్జున రాయలు,1339-1347 అచ్చుత దెవ రాయలు,1347-1360 కృష్ణ రాయలు,1360-1380 యిమ్మాడి హరిహర రాయలు,1380-1390 ముడవ దెవ రాయలు,1390-1404 మొదటి విరూపాక్ష రాయలు,1404-1405 నాలుగవ బుక్క రాయలు,1405-1406 నాలుగవ దెవ రాయలు,1406-1422 రామచంద్ర రాయలు, 1422లో నాలుగు నెలలు! వీర విజయ బుక్క రాయలు, 1422 - 1426 ఐదవ దేవ రాయలు, 1426 - 1446 త్రయంబక్ రాయలు, 1446-1458 రెండవ మల్లికార్జున రాయలు, 1458 - 1465 రెండవ విరూపాక్ష రాయలు, 1465 - 1485 రాజశేఖర రాయలు 1468-1469 (తేదీలు సందేహాస్పదం) మొదటి విరూపాక్ష రాయలు 1470-1471 (తేదీలు సందేహాస్పదం) ప్రౌఢదేవ రాయలు 1476-1479 (తేదీలు సందేహాస్పదం) రాజశేఖర 1479-1480 (తేదీలు సందేహాస్పదం) ముడవ విరూపాక్ష రాయలు 1483-1486 (తేదీలు సందేహాస్పదం) రాజశేఖర 1486-1487 (తేదీలు సందేహాస్పదం) సాళువ వంశం నరసింహ 1487-1490 అచ్చుత దెవ రాయలు 1490-1503 తుళువ వంశం నరస (వీర నరసింహ) ?-1509 శ్రీ కృష్ణదేవరాయలు 1509-1530 అచ్యుత దేవరాయలు 1530-1542 సదాశివరాయలు (నామమాత్రపు రాజు) 1542-1567 రామరాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1542-1565 తిరుమల రాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1565-1567 తిరుమల (పట్టాభిషిక్తుడు) 1567-1575 రెండవ రంగరాయలు 1575-1586 మొదటి వెంకటాపతి రాయలు 1586-1614 ఆరవీడు (తేదీలు సందేహాస్పదం, కేవలం శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం) రాజుల్లో కిందివారు ఉన్నారు. ప్రతిపేరుతోను ఒకరికంటే ఎక్కువమంది రాజులు ఉన్నారు. కాలం - 1614 నుండి చివరగా తెలిసిన 1739 వరకు రంగ దేవరాయ II 1614-1615 రామ దేవరాయ 1615-1633 వెంకట దేవరాయ III 1633-1646 రంగ దేవరాయ III 1614-1615 ఇవి కూడా చూడండి విజయనగర వంశస్తుల వంశవృక్షాలు విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్తితులు విజయనగర సామ్రాజ్యంలో మత వ్యవస్థ విజయ నగర రాజుల కాలంనాటి సైనిక స్థితి విజయ నగర రాజులు పరిపాలనా కాలాన్ని అనుసరించి విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ విజయనగర చరిత్ర (వికీ బుక్స్) లో భారత జాతీయవాదం సంబంధిత లింకులు సార్వజనికమైన వనరు ఎ ఫర్గాటెన్ ఎంపైర్: విజయనగరం: e కాంట్రిబ్యూషన్ టు ది హిస్టరీ ఆఫ్ ఇండియా హరిహర, బుక్క రాయల కథ విజయనగర సామ్రాజ్యానికి అనేక లింకులు హంపి-చరిత్ర పర్యాటకం విజయనగర నాణెములు మూలాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:భారతదేశాన్ని పరిపాలించిన వంశములు వర్గం:విజయనగర సామ్రాజ్యం వర్గం:చరిత్ర వర్గం:మధ్యయుగ భారతీయ సామ్రాజ్యాలు
ఎత్తిపోతల జలపాతం
https://te.wikipedia.org/wiki/ఎత్తిపోతల_జలపాతం
thumb|250x250px|ఎత్తిపోతల జలపాతం|alt= ఎత్తిపోతల జలపాతం, నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉంది.Encyclopaedia of Tourism Resources in India By Manohar Sajnani పేజీ.64 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉంది.చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యంలో తాళ్ళపల్లి వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయవ్యాన కృష్ణా నదిలో కలుస్తుంది.Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal, N. Ramesan ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది. యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల) గా ప్రసిద్ధిగాంచింది.ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. ఆలయాలు thumb|250x250px|ఎత్తిపోతల జలపాతం ఈ లోయలో వెలిసిన దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి ఏటా తొలి ఏకాదశినాడు జరిగే తిరునాళ్ళకు సమీప జిల్లాల్లోని సుగాలీలు అసంఖ్యాకంగా హాజరవుతారు. మధుమతీదేవి, రంగనాధస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడున్నాయి. ఈ దేవాలయాలు ఎత్తిపోతల జలపాతానికి దిగువభాగంలో ఉన్న అతిపురాతన దేవాలయాలు. వీటిని గురించి బయటి ప్రపంచానికి తెలిసినది అంతంతమాత్రమే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉంది. దేవాలయం మొత్తం, కొండను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే తలదించుకొని వెళ్ళావలసినదే. లేదంటే తలకు పైభాగం రాతి ప్రాంతానికి తగిలి తల బొప్పి కట్టవలసినదే. ప్రతి తొలి ఏకాదశి]], దత్త జయంతి మొదలగు పర్వదినాలలో, రాష్ట్రంలోని నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలివచ్చెదరు. మాచర్ల మండలంలో ఉన్న ఈ దేవాలయాలకు సరిహద్దులో ఉన్న నల్లగొండ, గుంటూరు, ప్రకాశం, మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల నుండి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. అయినా ఇక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి రంగనాధస్వామి దేవాలయం:శాతవహనలుకు సామంతలుగా ఉండి మంచికల్లు రాజధానిగా పలనాటిసీమను పాలించిన పల్లవుల ఇలవేల్పు ఈ రంగనాధస్వామి దేవాలయం 3 వ శాతబ్దం కాలంలో విగ్రహ్హన్ని ప్రతిస్తించి ఉంటారు. ఇక్కడ నీరు నది ద్వారా వచ్చి ఇక్కడ పడడం లేదు. ప్రకాశం జిల్లాలో నుండి అంతర్వాహినిగా నీరు ప్రవహించి ఇక్కడ బయల్పడి జలపాతం ఏర్పడింది. ఇదొక వింత.ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ జలపాతాలు వర్గం:పల్నాడు జిల్లా పర్యాటక ప్రదేశాలు
నవంబర్ 16
https://te.wikipedia.org/wiki/నవంబర్_16
నవంబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 320వ రోజు (లీపు సంవత్సరములో 321వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 45 రోజులు మిగిలినవి. సంఘటనలు 1937: కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. 1965: రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్షనౌక శుక్రగ్రహం వైపు ప్రయాణం ప్రారంభించింది. 1966: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ రోజును భారత్‌లో జాతీయ పత్రికా దినంగా జరుపుకుంటారు. జననాలు 1890: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (మ.1973) 1901: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (మ.1978) 1908: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు. (మ.1977) 1923: టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (మ.2009) 1930: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (మ.2013) 1931: వి.ఎల్.ఎస్.భీమశంకరం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు 1936: రామోజీరావు, భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు. 1962:అంబిక: దక్షిణ భారత చలన చిత్ర నటి 1963: మీనాక్షి శేషాద్రి , భారతీయ చలనచిత్ర నటి, నృత్య కారిణి . 1973: పుల్లెల గోపీచంద్, భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 1973: ఆమని, తెలుగు, తమిళ సినిమా నటి 1983: ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివ కుమార్ , తెలుగు,తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు . మరణాలు thumb|Portrait of Milton Friedman పండుగలు, జాతీయ దినాలు జాతీయ పత్రికా దినోత్సవం అంతర్జాతీయ సహనం దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 16 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రోజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 15 - నవంబర్ 17 - అక్టోబర్ 16 - డిసెంబర్ 16 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 17
https://te.wikipedia.org/wiki/నవంబర్_17
నవంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 321వ రోజు (లీపు సంవత్సరములో 322వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 44 రోజులు మిగిలినవి. సంఘటనలు 1932: లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 2001: శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక లోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటిలభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జననాలు 1587: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్, డచ్ కవి, నాటక రచయిత. (జ.1679) 1878: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (మ.1936) 1900: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (మ.1975) 1920: జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005) 1942: మార్టిన్ స్కోర్సెస్, అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు, చలనచిత్ర చరిత్రకారుడు. 1961: చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలు. 1972: రోజా సెల్వమణి, దక్షిణ భారతదేశంలో సినిమా నటి, రాజకీయవేత్త. 1978 కీర్తి రెడ్డి , ప్రముఖ చలనచిత్ర నటి 1990: ప్రణీత వర్థినేని, అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి. మరణాలు thumb|Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped) 1928: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (జ.1865) 1993: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, సంగీత దర్శకత్వం, నేపథ్య గానం. (జ.1927) 2009: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1936) 2012: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (జ.1926) 2015: అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (జ. 1926). 2018: ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త. 2022: జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (జ. 1928) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం జాతీయ మూర్ఛ అవగాహన దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 17 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 16 - నవంబర్ 18 - అక్టోబర్ 17 - డిసెంబర్ 17 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 18
https://te.wikipedia.org/wiki/నవంబర్_18
నవంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 322వ రోజు (లీపు సంవత్సరములో 323వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 43 రోజులు మిగిలినవి. సోషల్ సర్వీస్ ఇన్ ఇండియా సంస్థ అధినేత సత్తి శివారెడ్డి పుట్టినరోజు కొప్పవరం ఫోన్ నెంబర్ 8500633423 సంఘటనలు 1493: క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు. 1955: సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు - నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు. 1963: మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి. 1972: భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు. జననాలు 1888: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (మ.1957) అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, తెలుగు కవి, పండితుడు. (మ. 1959) 1901: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (మ.1990) 1924: ఆవంత్స సోమసుందర్, అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత. 1945: మహింద్ర రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు. 1946: శంకరమంచి పార్థసారధి, కథ, నాటక రచయిత. 1972: జుబిన్ గార్గ్, అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత. 1984: నయన తార , కేరళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల నటి, నిర్మాత,మోడల్ . 1993: సాక్షి చౌదరి , తెలుగు సినీ నటి , మోడల్. మరణాలు thumb|Niels Bohr 1962: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1885) 1971: వేదాంతం రాఘవయ్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు ,(జ.1919) 1972: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899) 1982: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (జ.1904) 1994: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928) 2022: తబస్సుమ్ గోవిల్, భారతీయ నటి, టాక్ షో హోస్ట్, యూట్యూబర్. (జ.1944) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 18 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రోజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 17 - నవంబర్ 19 - అక్టోబర్ 18 - డిసెంబర్ 18 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 19
https://te.wikipedia.org/wiki/నవంబర్_19
నవంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 323వ రోజు (లీపు సంవత్సరములో 324వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 42 రోజులు మిగిలినవి. సంఘటనలు 1951: మొదటి ఆర్దిక సంఘము (ఫైనాన్స్ కమిషన్) ఏర్పడిన రోజు. భారత రాజ్యాంగంలోని 280 అధికరణం ఇచ్చిన అధికారంతో, భారత దేశ అధ్యక్షుడు, ఈ ఆర్ధిక సంఘము ఏర్పాటు చేయవచ్చును. 1977: ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలను, ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమను అతలా కుతలం చేసిన పెను తుఫాను వచ్చిన రోజు. జననాలు thumb|కుడి|ఇందిరాగాంధీ 1828: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (మ.1858) - మరాఠా సామ్రాజ్య ప్రాంతంలో అమరవీరుల దినోత్సవముగా జరుపుకుంటారు. 1852: అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (మ.1909) 1917: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984) 1923: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (మ.2017) 1928: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (మ.2012) 1954: చింతా మోహన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు. 1936: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (మ.2017) 1960: శుభలేఖ సుధాకర్, నటుడు. 1965: కిల్లి కృపారాణి, రాజకీయ నాయకురాలు, వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం. 1973: షకీలా, భారతీయ నటి. 1975: సుష్మితా సేన్, విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి భారతీయ నటి. మరణాలు 1806: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (జ.1728) 1995: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1908) 1995: మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (జ.1920) 2007: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931) 2022: మదన్, తెలుగు సినీ దర్శకుడు పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినం. పౌరుల దినోత్సవం . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 19 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 18 - నవంబర్ 20 - అక్టోబర్ 19 - డిసెంబర్ 19 -- అన్ని తేదీలు మూలాలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 20
https://te.wikipedia.org/wiki/నవంబర్_20
నవంబరు 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 324వ రోజు (లీపు సంవత్సరములో 325వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 41 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb|కుడి|భోగరాజు పట్టాభిసీతారామయ్య 1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది. జననాలు 1750: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (మ.1799) 1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. (మ.1937) 1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983) 1925: చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు. 1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు.. (మ.1999) 1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006) 1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత. 1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. 1969: శిల్పా శిరోద్కర్ , హిందీ, తెలుగు చిత్రాల నటి. 1994: ప్రియాంక అరుల్ మోహన్ , తెలుగు,తమిళ కన్నడ చిత్రాల నటి మరణాలు 1910: లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన రచయిత. (జ.1828) 1963: జీ: రామనాదన్ , సంగీత దర్శకుడు , పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబరు 20 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబరు 19 - నవంబరు 21 - అక్టోబర్ 20 - డిసెంబర్ 20 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
నవంబర్ 21
https://te.wikipedia.org/wiki/నవంబర్_21
నవంబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 325వ రోజు (లీపు సంవత్సరములో 326వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 40 రోజులు మిగిలినవి. సంఘటనలు 1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ను ఫ్రాన్సులో ఎగురవేశారు. 1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు. 1990: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది. జననాలు thumb|హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి 1694: వోల్టయిర్, ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు. (మ.1778) 1854: పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922) 1939: హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి. 1982: ఆర్తి చాబ్రియా, తెలుగు, కన్నడ , పంజాబీ , హిందీ చిత్రాల నటి, ప్రచారకర్త. 1987: నేహా శర్మ , భారతీయ చలనచిత్ర నటి. మరణాలు 1952: బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటుడు, న్యాయవాది. (జ.1902) 1970: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (జ.1888) 1996: అబ్దుస్ సలం, పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1926) 2013: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947) 2020: దేవీప్రియ, పాత్రికేయుడు, కవి.(జ.1949) 2020: వజ్జా వెంకయ్య: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు (జ. 1926) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ మత్స్య దినోత్సవం ప్రపంచ టెలివిజన్ దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 21 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 20 - నవంబర్ 22 - అక్టోబర్ 21 - డిసెంబర్ 21 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 22
https://te.wikipedia.org/wiki/నవంబర్_22
నవంబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 326వ రోజు (లీపు సంవత్సరములో 327వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 39 రోజులు మిగిలినవి. సంఘటనలు 1956: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్లో ప్రారంభమయ్యాయి. 1965: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.డి.పి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం - ఐక్యరాజ్యసమితి ఆభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైనది. 1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. 1980: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరించాడు. 1988: బాబా ఆమ్టేకు ఐరాస మానవహక్కుల సంఘం పురస్కారం లభించింది. 1997: హైదరాబాదులో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు. జననాలు thumb|Boris Becker 2007 amk 1830: ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి. (మ.1858) 1864: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (మ.1955) 1907: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (మ.1997) 1913: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (మ.1988) 1933: నీరుకొండ హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన కవి. (మ.2016) 1967: బోరిస్ బెకర్, జర్మనీకి చెందిన మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు. 1970: మర్వన్ ఆటపట్టు, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్. 1979: శశాంక్ , తెలుగు సినిమా నటుడు. మరణాలు 1963: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (జ.1917) 2006: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (జ.1917) 2016: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (జ.1930) 2019: షౌకత్ అజ్మీ, భారతీయ నాటకరంగ, సినిమా నటి. (జ.1926) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 22 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 21 - నవంబర్ 23 - అక్టోబర్ 22 - డిసెంబర్ 22 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 23
https://te.wikipedia.org/wiki/నవంబర్_23
నవంబరు 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 327వ రోజు (లీపు సంవత్సరములో 328వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 38 రోజులు మిగిలినవి. సంఘటనలు 1971: 'పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా' (పి.ఆర్‌.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు. 1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది. జననాలు thumb|GaryKirsten 1926: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (మ.2011) 1930: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (మ.1972) 1965: బాబా సెహగల్ , ర్యాప్ గాయకుడు. 1967: గారీ క్రిస్టెన్, దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు. 1979: కెల్లీ బ్రూక్, ఇంగ్లాండుకు చెందిన నటి, మోడల్ 1981: మంచు విష్ణు వర్ధన్ , తెలుగు సినీ నటుడు , నిర్మాత , 1982: అనిల్ రావిపూడి ,రచయిత , దర్శకుడు. 1986: అక్కినేని నాగ చైతన్య, సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు. మరణాలు 1937: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (జ.1858) 1977: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (జ.1916) 1994: బి.ఎస్. నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. (జ. 1929) 2006: డీ.యోగానంద్, తెలుగు చలన చిత్ర దర్శకుడు.(జ.1922) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబరు 23 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబరు 22 - నవంబరు 24 - అక్టోబర్ 23 - డిసెంబర్ 23 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
నవంబర్ 24
https://te.wikipedia.org/wiki/నవంబర్_24
నవంబరు 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 328వ రోజు (లీపు సంవత్సరములో 329వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 37 రోజులు మిగిలినవి. సంఘటనలు 1997: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు. జననాలు thumb|కుడి|భోగరాజు పట్టాభిసీతారామయ్య 1880: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959) 1897: వంగర వెంకటసుబ్బయ్య, హాస్యనటుడు. (మ.1976) 1924: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకుడు. (జ.1992) 1929: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత. (మ.2007) 1952: బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1953: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు. 1955: ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1961: అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. 1981: సెలీనా జైట్లీ , భారతీయ చలనచిత్ర నటి.పలు తెలుగు చిత్రాలలో నటించింది.రచయత్రి . మరణాలు 1981: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897) 2018: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (జ.1952) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ ఎవల్యూషన్ డే. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబరు 24 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబరు 23 - నవంబరు 25 - అక్టోబర్ 24 - డిసెంబర్ 24 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
నవంబర్ 25
https://te.wikipedia.org/wiki/నవంబర్_25
నవంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 329వ రోజు (లీపు సంవత్సరములో 330వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 36 రోజులు మిగిలినవి. సంఘటనలు 1839: దేశంలోని తీరప్రాంతాలను ప్రచండ తుఫాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడులక్షల మంది మరణించి ఉంటారని అంచనా. 1932: ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందిన హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంది. 2010: ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. జననాలు thumb|Konferenz Pakistan und der Westen - Imran Khan (cropped) 1926: రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012) 1951: సుధామ, కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత. 1952: ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు. 1954: సౌభాగ్య, కవితాసంపుటి 'సంధ్యాబీభత్సం' ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది 1966: రూపా గంగూలీ, భారతీయ సినిమా నటి. 1968: ముప్పలనేని శివ , తెలుగు చలన చిత్ర దర్శకుడు. 1969: సుకన్య , దక్షిణ భారత చలన చిత్ర నటి. మరణాలు 1964: ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు. (జ.1893) 1974: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909) 1984: యశ్వంతరావ్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. 1988: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (జ.1922) 2003: ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (జ.1928) 2010: మిద్దె రాములు, ఒగ్గు కథ కళాకారుడు. (జ.1942) 2015: ఆచంట వెంకటరత్నం నాయుడు, తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935) 2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో మరణించాడు (జ. 1926). పండుగలు, జాతీయ దినాలు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము. ఎన్.సి.సి. దినోత్సవం. జాతీయ జంతు సంక్షేమ దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబర్ 25 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబర్ 24 - నవంబర్ 26 - అక్టోబర్ 25 - డిసెంబర్ 25 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 26
https://te.wikipedia.org/wiki/నవంబర్_26
నవంబరు 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 330వ రోజు (లీపు సంవత్సరములో 331వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 35 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb 1949: 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది. 1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది. 2008: ముంబై తీవ్రవాద దాడులు. జననాలు 1947: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995) 1965: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మరణాలు thumb|ఆవేటి పూర్ణిమ thumb|ప్రగడ కోటయ్య 1975: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910). 1984: తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త (జ. 1907). 1995: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918). 1996: బొమ్మ హేమాదేవి , తొలితరం నవలా రచయిత్రి (జ.1931) 1995: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు (జ.1915). 1997: మందాడి ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935). 2006: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి (జ.1926). 2008: "ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే 2008: ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే 2008: సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్ పండుగలు , జాతీయ దినాలు జాతీయ న్యాయ దినోత్సవం సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం. అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు. జాతీయ పాల దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : నవంబరు 26 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చరిత్రలోని రోజులు నవంబరు 25 - నవంబరు 27 - అక్టోబర్ 26 - డిసెంబర్ 26 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
నవంబర్ 27
https://te.wikipedia.org/wiki/నవంబర్_27
నవంబర్ 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 331వ రోజు (లీపు సంవత్సరములో 332వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 34 రోజులు మిగిలినవి. సంఘటనలు 1919: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి. 1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం. జననాలు thumb|బ్రూస్ లీ 1973 1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744) 1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956) 1907: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003) 1919: కంచర్ల సుగుణమణి సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి. (మ.2017) 1935: ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1940: బ్రూస్ లీ, యుద్ధ వీరుడు. (మ.1973) 1942: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, హిందీ రచయిత్రి 1950: పోపూరి లలిత కుమారి (ఓల్గా) తెలుగు రచయిత్రి. 1953: బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు. 1975: సుచిత్రా కృష్ణమూర్తి, నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి. 1986: సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. మరణాలు 1938: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1938) 1939: చర్ల నారాయణ శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (జ.1881) 1974: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861) 1975: రేలంగి వెంకట్రామయ్య , తెలుగు చలన చిత్ర హాస్య నటుడు(జ.1910) 1993: భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (జ.1914) 2008: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931) 2013: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్‌ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933) పండుగలు , జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో నవంబర్ 26 - నవంబర్ 28 - అక్టోబర్ 27 - డిసెంబర్ 27 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
నవంబర్ 28
https://te.wikipedia.org/wiki/నవంబర్_28
నవంబరు 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 332వ రోజు (లీపు సంవత్సరములో 333వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 33 రోజులు మిగిలినవి. సంఘటనలు జననాలు thumb|కుడి|ఫెడ్రిక్ ఎంగిల్స్ 1784: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (మ.1939) 1820: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (మ.1895) 1922: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (మ.1983) 1927: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (మ.2008) 1928: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (మ.1994) 1948: వేముల మోహనరావు, రంగస్థల కళాకారుడు. 1985: ఇషా గుప్తా , మోడల్, భారతీయ సినీ నటీ . మరణాలు 1890: జ్యోతిరావ్ పూలే, (జ.1827) 1954: ఎన్రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. 2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు 2011: అవసరాల రామకృష్ణారావు, కథలు, నవలల రచయిత. (జ.1931) 2011: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (జ.1933) పండుగలు, జాతీయ దినాలు - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో నవంబరు 27 - నవంబరు 29 - అక్టోబర్ 28 - డిసెంబర్ 28 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
నవంబర్ 29
https://te.wikipedia.org/wiki/నవంబర్_29
నవంబరు 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 333వ రోజు (లీపు సంవత్సరములో 334వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 32 రోజులు మిగిలినవి. సంఘటనలు 1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది. 1929: భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ ఎగిరాడు. 1947: హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది. 2009: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో 'ఆమరణ నిరాహార దీక్ష' ప్రారంభించాడు. జననాలు 1901: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986) 1945: బాలి, చిత్రకారుడు. 1954: పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి. 1982: రమ్య , దక్షిణ భారత సినీ నటి, రాజకీయనాయకురాలు మరణాలు thumb|రెండవ అలంఘీర్ - బ్రూక్లిన్ మ్యూజియంలోని తైలవర్ణచిత్రం 1759: అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి (జ.1699). 1993: జె.ఆర్‌.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (జ.1904). పండుగలు , జాతీయ దినాలు యుగోస్లావియా గణతంత్ర దినం. పాలస్తీనా ప్రజా సంఘీభావ దినం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో నవంబరు 28 - నవంబరు 30 - అక్టోబర్ 29 - డిసెంబర్ 29 -- అన్ని తేదీలు వర్గం:నవంబరు వర్గం:తేదీలు
నవంబర్ 30
https://te.wikipedia.org/wiki/నవంబర్_30
నవంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 334వ రోజు (లీపు సంవత్సరములో 335వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 31 రోజులు మిగిలినవి. సంఘటనలు 1917 - తొలి రూపాయి నోటు ముద్రణ జరిగింది. జననాలు 1835: మార్క్ ట్వేయిన్, అమెరికన్ రచయిత, మానవతావాది. (మ.1910) 1858: జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (మ.1937) 1937: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (మ.2005) 1945: వాణీ జయరాం, గాయని. 1948: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి. 1957: శోభారాజు, గాయని. 1957: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, సినీ గేయ సంభాషణల రచయిత(మ.2021) 1962: బాంబే జయశ్రీ , గాయనీ , సంగీతజ్ఞురాలు 1971: కొండపల్లి దశరథ్, దర్శకుడు ,రచయిత 1990: మాగ్నస్ కార్ల్‌సన్, నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు. 1990: రాశీ ఖన్నా , భారతీయ సినీ నటీ. 1990: నివేదా సేతురాజు, దక్షిణ భారత సినీ నటి, మోడల్. మరణాలు thumb|Oscar Wilde Sarony 1900: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (జ.1854) 1912: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, నటుడు, నాటక రచయిత. (జ.1853) 1915: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862) 2011: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925) 2012: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919) 2021: సిరివెన్నెల సీతారామశాస్త్రి , తెలుగు సినీ రచయిత .(జ.1955) పండుగలు , జాతీయ దినాలు జాతీయ పతాక దినోత్సవం . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో నవంబర్ 29 - డిసెంబర్ 1 - అక్టోబర్ 30 - డిసెంబర్ 30 -- అన్ని తేదీలు వర్గం:నవంబర్ వర్గం:తేదీలు
ఆగష్టు 30
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_30
ఆగష్టు 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 242వ రోజు (లీపు సంవత్సరములో 243వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 123 రోజులు మిగిలినవి. సంఘటనలు 1574 – గురు రామ్ దాస్ నాలుగవ సిక్కు గురువు అయ్యాడు. 1791 – హెచ్.ఎమ్.ఎస్ పండోరా అనే నౌక ములిగిపోయింది. 1800 – వర్జీనియాలోని రిచ్ మండ్ దగ్గర బానిసల తిరుగుబాటుకి గేబ్రియల్ ప్రోస్సెర్ నాయకత్వం వహించాడు. 1813 – కుల్మ్ యుద్ధము: ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాల కూటమి ఫ్రెంచి సైన్యాలను ఓడించాయి. 1813: క్రీక్ యుద్దము. 1835: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరాన్ని స్థాపించారు. 1836: ఆగస్టస్ చాప్‌మాన్ అల్లెన్, జాన్ కిర్బీ అల్లెన్ హౌస్టన్ అనే ఇద్దరు హౌస్టన్ నగరాన్ని స్థాపించారు. హౌస్టన్, అమెరికాలోని నాలుగవ పెద్ద నగరం. టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరం. 1862: అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్‌మండ్ యుద్ధము : 1862: అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్ధములో యూనియన్ సైన్యము ఓడిపోయింది. 1873: ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఫ్రాంజ్ జోసెఫ్ లేండ్ అనే అర్చిపెలాగోని ఆస్ట్రియాకు చెందిన సాహసికులు (యాత్రికులు) జూలియస్ వాన్ పేయర్, కార్ల్ వీప్రెచ్ కనిపెట్టారు. 1897: మడగాస్కర్ లో ఉన్న అంబికీ అనే పట్టణాన్ని, మెనాబే నుంచి ఫ్రెంచి వారు గెలిచారు. 1896: ఫిలిప్పైన్స్ లోని ఎనిమిది రాష్టాలలో స్పానిష్ గవర్నర్ జనరల్ రామన్ బ్లాంకో మార్షల్ లా (సైనిక పాలన) విధించాడు. ఆ రాష్ట్రాలు మనిలా, కవిటె, బులాకన్, పంపంగ, నువే ఎకిజా, బతాన్, లగున, బతంగస్. 1909: బర్గెస్ షేల్ ఫాసిల్స్ (శిలాజాలు) ని ఛార్లెస్ డూలిటిల్ కనిపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ శిలాజాలు బ్రిటిష్ కొలంబియాలో ఉన్నాయి. ఇవి 505 మిలియన్ (50 కోట్ల 50 లక్షలు) సంవత్సరాల నాటి మధ్య కేంబ్రియన్ యుగానికి చెందినవి. 1914: తన్నెన్‌బెర్గ్ యుద్ధము. మొదటి ప్రపంచ యుద్ధము మొదటి రోజులలో జర్మన్ సామ్రాజ్యానికి, రష్యన్ సామ్రాజ్యానికి 1914 ఆగష్టు 23 నుంచి 1914 ఆగష్టు 30 వరకు జరిగిన యుద్ధము. 1922: గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యమును దుమ్లుపినార్ యుద్ధము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్ధము )అని కూడా అంటారు. 1941: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్‌గ్రాడ్ ముట్టడి మొదలైంది. 1942: రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్ధము మొదలైంది. 1945: బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది. 1945: జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు. 1963: అమెరికా అధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి. 1967: అమెరికా సుప్రీం కోర్టుకు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్‌గుడ్ మార్షల్ ని నియమించారు. 1974: బెల్‌గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు 'జాగ్రెబ్' అనే పెద్ద రైల్వే స్టేషను దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు. 1974: టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న 'మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ ' దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 1975 మే 19 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు. 1980: పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్ఠు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి. 1982: పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు. 1984: అమెరికా రోదసీ నౌక ఎస్.టి.ఎస్-41-డి డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది. 1995: బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి నాటో 'ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్'ని అమలు చేసింది. 1999: ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు. 2001: యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లొబొదాన్ మిలోసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది. 2005: హరికేన్ కత్రినా, అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము 'న్యూ ఆర్లియెన్స్' వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు. 2010: డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. జననాలు thumb|ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ 1797: మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ షెల్లీ, ఫ్రాంకెన్‌స్టీన్ నవలా రచయిత్రి (మ.1851). 1871: ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు. (మ.1937) 1912: వెల్లాల ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా తొలితరం కథానాయకుడు. 1913: రిచర్డ్ స్టోన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. 1934: బాలూ గుప్తె, భారతీయ క్రికెట్ ఆటగాడు. (మ.2005) 1936: జమున, సినిమా నటి (మ. 2023) 1958: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (మ.2005) 1959: నాగబాల సురేష్ కుమార్, రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. 1983: మాధవి. ఒ, తెలుగు రంగస్థల నటి, గాయని. 1980: రిచా పల్లాడ్, తెలుగు, హిందీ నటి. 1994: నందితా రాజ్: తెలుగు చలన చిత్ర నటి . మరణాలు 30 బి.సి.: క్లియోపాత్ర ఉచ్చారణ తేడా క్లియోపాట్ర VII, ఈజిప్ట్ మహారాణి, గొప్ప అందగత్తె, ఆత్మహత్య చేసుకున్నది. 1949: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (జ.1899) 1963: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (జ.1885) 2008: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (జ.1918) 2013: సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1939) 2022: మిఖాయిల్ గోర్బచేవ్, చివరి సోవియట్ యూనియన్ నాయకుడు. (జ.1931) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ తప్పిపోయిన వారి దినోత్సవము. సెయింట్ రోజ్ ఆఫ్ లీమా దినోత్సవము (పెరూ దేశము లో). విజయ దినము (టర్కీ దేశము లో). చిన్న పరిశ్రమల దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 30 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చారిత్రక దినములు. ఆగష్టు 29 - ఆగష్టు 31 - జూలై 30 - సెప్టెంబర్ 30 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు వర్గం:అంతర్జాతీయ దినములు
వనపర్తి సంస్థానం
https://te.wikipedia.org/wiki/వనపర్తి_సంస్థానం
400px|right|వనపర్తి రాజ భవనం వనపర్తి సంస్థానం, పూర్వ హైదరాబాదు రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో నైఋతి దిక్కున ఉంది. ఈ సంస్థానంలోని 124 గ్రామాలు మహబూబ్ నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కల్వకుర్తి, అమ్రాబాద్ తాలూకాలలో విస్తరించి ఉన్నాయి. ఈ సంస్థానం 450 చ.కి.మీ.లలో విస్తరించింది. 1901లో సంస్థాన జనాభా 62,197. సంస్థానం రెవెన్యూ 1.5 లక్షలు, అందులో 76,883 రూపాయలు నిజాంకు కప్పంగా కట్టేవారు చరిత్ర విజయ నగర రాజుల కాలంలో రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన వీర కృష్ణారెడ్డి అను క్షత్రీయుడు పాతపల్లె, సూగూర్ గ్రామాలను కొని అభివృద్ధి చేసి ఈ సంస్థాన స్థాపనకు బీజాలు వేశాడు. వీరి మునిమనుమడు గోపాలరావు. గొప్ప పండితుడు. పాలకుడు. ఎనిమిది భాషలలో విద్వాంసుడు. అందుకే ఇతనిని అష్టభాషి బహిరీ గోపాలరావుగా పిలుస్తారు. ఇతనికి మొదట్లో సంతానం లేకపోవడంచే బంధువుల బిడ్డ వెంకటరెడ్డిని దత్తత తీసుకున్నాడు. తరువాత సంతానం కలిగినా ఈ దత్తపుత్రుడే పాలకుడయ్యాడు. వెంకటరెడ్డి తన దత్తుతల్లి పేర జానంపేట ను, దత్తుతండ్రి పేరిట గోపాలపేటను ఏర్పాటుచేశాడు. మొగలుల రాజ్యాధికారాన్ని ధిక్కరించాడు. తత్ఫలితంగా దక్కను సుబేదారు జానంపేటపై దండెత్తగా వీరోచితంగా తన సేనలతో పోరాడి, చివరకు సైన్యాన్ని కోల్పోయి, దిక్కుతోచని దుస్థితిలో అభిమానవంతుడై తప్పించుకునిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని వీరత్వాన్ని కీర్తిస్తూ ఈ ప్రాంతపు శారదగాండ్రు పాటలు కట్టి ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో పాడుతూనే ఉంటారు. వెంకటరెడ్డి అనంతరం అతని కుమారుడు బహిరీ చిన గోపాలరావు (తాత గారి పేరు) పాలకుడయ్యాడు. ఇతను కుతుబ్ షాహీ రాజులకు సన్నిహితముగా ఉండేవాడు. అసఫ్ జా అర్కాట్ మీదికి యుద్ధానికి వెళ్తూ, తన రాజధాని బాధ్యతలను గోపాలరావుకు అప్పగించాడంటే, వారికి ఇతనెంత విశ్వాసియో అర్థమవుతుంది. ఈ గోపాలరావు 1746 లో మరణించాడు. ఇతని అనంతరం ఇతని కుమారుడు సవై వెంకటరెడ్డి సూగూరు పాలకుడయ్యాడు. ఇతనే రాజధానిని సూగూరు నుండి శ్రీరంగపురం (నేటి శ్రీరంగాపురం) నకు మార్చాడు. ఇతని కాలం నుండి దాదాపు 50 సంవత్సరాల పాటు శ్రీరంగపురం రాజధానిగా భాసిల్లినదిసమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-32 & 33.. తరువాతి కాలంలో రాజధాని వనపర్తికి మార్చబడింది.తొలిదశలోని వనపర్తి రాజులు 2000 మంది పదాతి దళము, 2000 మంది అశ్విక దళాలు కల సైన్యమును నిర్వహించేవారు. 1727 వరకు సంస్థానానికి సుగూరు రాజధానిగా ఉండేది. దాని పేరు మీదుగా సంస్థానాన్ని సుగూరు సంస్థానము అని పిలిచేవారు. కానీ తర్వాత కాలంలో వనపర్తిని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. పరిపాలనా సౌలభ్యము కొరకు సంస్థానాన్ని "సుగూరు", "కేశంపేట్‌‌" అను రెండు తాలూకాలుగా విభజించి, ఇద్దరు తహసీల్దారులను నియమించారు. 1823లో రాజా రామకృష్ణరావు తరువాత ఆయన దత్తపుత్రుడు మొదటి రామేశ్వరరావు సంస్థానాధీశుడయ్యాడు. ఆధునిక భావాలున్న రామేశ్వరరావు మంచి పరిపాలనదక్షుడు. తన రాజ్యపు చుట్టుపక్కల అమలులో ఉన్న బ్రిటీషు పాలనా విధానాలను అనుసరించే ప్రయత్నాలు చేశాడు.Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), K. Sukhender Reddy, Bh Sivasankaranarayana v.12 పేజీ.40 1830 కాలంలో కొల్లాపూరు సంస్థానానికి వనపర్తి సంస్థానానికీ తీవ్రమైన ఘర్షణ జరిగిందని యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య పేర్కొన్నారు. ఈ వివాదంలో ఒకరినొకరు సైన్యసహితంగా యుద్ధం చేయడమే కాక ఒకరి గ్రామాలను మరొకరు కొల్లగొట్టి, గ్రామస్తులను హింసించి పాడుచేస్తున్నారని .1843 మార్చి 17న నిజాం సికందర్‌ ఝా, రాజా రామేశ్వర రావు I కు గౌరవ చిహ్నంగా "బల్వంత్" అను బిరుదును ప్రధానము చేశారు. నిజాము తన సైన్యానికి రాజా రామేశ్వర రావును ఇన్స్పెక్టర్‌గా నియమించాడు. రాజా రామేశ్వర రావు I, హైదరాబాదీ బెటాలియన్‌ 1853 నవంబర్ 5 న సృష్టించాడు. 1866లో ఆయన మరణము తర్వాత, ఈ బెటాలియన్‌ నిజాం సైన్యములో కలపబడి ఆ సైన్యానికి కేంద్రబిందువు అయ్యింది. మొదటి రామేశ్వర రావు తర్వాత ఆయన కుమారుడు రాజా కృష్ణ ప్రసాదరావు సంస్థానాధీశుడయ్యాడు. 1910లో రెండవ రాజా రామేశ్వరరావు, అబిస్సీనియులు, సొమాలీలు, ఐరోపా అధికారులతో కూడుకొన్న అశ్విక దళాన్ని నిజామ్‌ VI కి బహుకరించాడు. అదే ఆఫ్రికన్‌ క్యావలరీ గార్డ్స్ లేదా ఏ.సీ.గార్డ్స్ గా ప్రసిద్ధి చెందినది. ఈ ప్రత్యేక దళాన్ని అధికారిక లాంఛనాలలో నిజాం యొక్క భద్రత కొరకు ఉపయోగించేవారు. "మహారాజ" రెండవ రాజా రామేశ్వరరావు, 1922 నవంబర్ 22 వ తేదీన మరణించాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, కృష్ణదేవరావు, రామదేవరావు. భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత ఈ కుటుంబము దేశ రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొన్నది. వంశక్రమము వీర కృష్ణారెడ్డి అష్టభాషి బహిరీ గోపాలరావు (1676-) వెంకటరెడ్డి (1691-) బహిరీ చిన గోపాలరావు ( - 1746) సవై వెంకటరెడ్డి ( 1746 -1763 ) రామకృష్ణరావు ( - 1823) మొదటి రామేశ్వరరావు (1823 - 1866) కృష్ణ ప్రసాదరావు (1866 - ) రెండవ రామేశ్వరరావు ( - 1922) కృష్ణదేవరావు (1922 - 1944?) మూడవ రామేశ్వరరావు (1923-1998) విశేషాలు ఈ సంస్థానము నైరుతీ భాగము గుండా కృష్ణా నది 16 మైళ్ల దూరము ప్రవహించేది. కానీ, నదీతలము చాలా అడుగున ఉండటము మూలాన దాని జలాలు వ్యవసాయపారుదల కొరకు ఉపయోగపడటము లేదు. వనపర్తి పట్టణములో ఆ రోజుల్లో ఆముదము తయారుచేయుటకు ఒక నూనె మిల్లు ఉండేది. ఇక్కడి తయారు చేసిన ఆముదము రాయచూరు, మద్రాసు ప్రెసిడెన్సీలోని కర్నూలుకు ఎగుమతి చేసేవారు. నూలు, పట్టు వస్త్రాలు, చీరలు ఇక్కడ నేసేవారు కానీ, వాటి అల్లిక అమరచింత, గద్వాలలో నేసిన వాటంత నాణ్యముగా లేదు. సాహిత్యం వనపర్తి సంస్థానంలో చాలామంది కవులు తమ పాండిత్యాన్ని ప్రదర్శించి, సన్మాన సత్కారాలు పొందారు. వారిలో ఒక కవి అక్షింతల సింగర శాస్త్రి. ఇతడు అక్షింతల సుబ్బాశాస్త్రి రెండవ కుమారుడు. ఇతని స్వస్థలం రేపర్ల అనీ, జటప్రోలు వద్ద అయ్యవారిపల్లె అనీ వేరువేరు చోట్ల వ్రాయబడింది. ఇతను వనపర్తి స్థానాధీశుల ఆశ్రయంలో ఉండేవాడు. ఇతని రచనలు - అన్నపూర్ణాష్టకము, భాస్కర ఖండము, ద్వాదశ మంజరి, శ్రీశైల మల్లికార్జున పంచరత్నము మొదలగునవి. ఇతడు తర్క వేదాంత పండితుడు. వెంకటగిరి, గద్వాల, అనంతగిరి, ఆత్మకూరు ఆస్థానాలలో కూడా సన్మానాలు పొందాడు.తెలుగు సాహిత్య కోశము. - తెలుగు అకాడమీ, హైదరాబాదు వారి ప్రచురణ http://www.archive.org/details/TeluguSahityaKosham.స్వయంగా పాలకులైన బహిరీ పెద్ద గోపాలరావే గొప్ప విద్వాంసుడు. ' రామచంద్రోదయం ' అను శ్లేషకావ్యాన్ని, 'శృంగార మంజరి' అను భాణాన్ని సంస్కృతంలో రచించాడు. ' చంద్రాంగదోపాఖ్యానం ' రచించిన చింతలపల్లి సంజీవి, ' యాదవ భారతీయం ' రచించిన చెన్న కృష్ణయ్య, ' జగన్నాటకం ' అను యక్షగానాన్ని రచించిన ఏదుట్ల శేషాచలం అను కవులు ఈ ఆస్థానానికి చెందినవారే. ఇవి కూడా చూడండి వనపర్తి వనపర్తి శాసనసభ నియోజకవర్గం రావుల చంద్రశేఖర్ రెడ్డి జిల్లెల చిన్నారెడ్డి మూలాలు వర్గం:మహబూబ్ నగర్ జిల్లా సంస్థానాలు వర్గం:తెలంగాణ సంస్థానాలు వర్గం:సంస్థానాలు వర్గం:వనపర్తి
ఆగష్టు 1
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_1
ఆగష్టు 1, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 213వ రోజు (లీపు సంవత్సరములో 214వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 152 రోజులు మిగిలినవి. సంఘటనలు 1498: క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా ప్రధాన భూభాగం చేరాడు. 1790: అమెరికాలో మొట్టమొదటి జనాభా లెక్కలు ముగిసిన రోజు. ఆనాటి అమెరికా జనాభా 39, 29, 214 మాత్రమే. 1774: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు ఆక్సిజన్ (ఆమ్లజని ) మూలకాన్ని కనుగొన్నారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1958 అక్టోబరు 1న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1957 ఏప్రిల్ 1 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు 1798: ఆంగ్ల నౌకాదళం, నెల్సన్ నాయకత్వంలో, కింద, నైలు నది దగ్గర జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్ నావికాదళాన్ని ఓడించింది. 1861: "టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటి "వాతావరణ వివరాలు" ప్రచురించింది. ఆనాడు, వాతావరణ శాఖలో పనిచేస్తున్న "అడ్మిరల్ రాబర్ట్ ఫిట్ఝ్‌రోయ్" ఈ వాతావరణ వివరాలు అందచేసాడు. ("రేపటి వాతావరణం వివరాలు" పుట్టిన రోజు) 1876: కొలరాడో 38వ రాష్ట్రంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరింది. 1914: జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించింది. ఇటలీ దేశం దానికదే తటస్థ దేశంగా చెప్పింది. 1936: అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ ఆటల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించాడు. 1957: భీమసేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పదవీస్వీకారం (1957 ఆగష్టు 1 నుంచి 1962 సెప్టెంబరు 6 వరకు) . 1969: ఎయిర్ ఛీఫ్ మార్షల్గా అర్జున్ సింగ్ పదవి స్వీకారం (1964 ఆగష్టు 1 1946: అమెరికన్ ప్రెసిడెంటు ట్రూమన్ రెండు చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేసాడు. ఒకటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం, మరొకటి పుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ చట్టం.నుంచి 1969 జూలై 15 వరకు) . 1971: అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహం పై దిగిన రెండవ రోజున, చంద్రగ్రహం పుట్టుక నాటి ’రాయి’ చంద్రశిలను అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రేటర్ అనే పెద్ద గోతి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి చంద్ర వాహనం నడిపిన వారు కూడా వీరే. 1975: మానవ హక్కుల ఒప్పందం పై 35 పైగా దేశాలు సంతకం చేసాయి. ( దీనిని హెల్సింకీ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం హెల్సింకీ నగరంలో జరిగింది) 1981 : ఉర్రూతలూగించే ఎమ్.టి.వి. తన మొట్టమొదటి ప్రసారం, ఉదయం 12:01 నుంచి ప్రారంభించింది. మొట్టమొదట ప్రసారమైన వీడియో బగ్లెస్ వారి "వీడియో కిల్డ్ ద రేడియో స్టార్". 1983: జనరల్ ఎ.ఎస్.వైద్య భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. 2008: భారతదేశంకు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది. జననాలు 10 బి.సి: క్లాడియస్ రోమన్ చక్రవర్తి (మ. 0054) . 1744: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (మ.1829) 1770: విలియం క్లార్క్, ఎక్స్‌ప్లోరర్ 1779: ఫ్రాన్సిస్ స్కాట్ కీ, అమెరికన్ జాతీయగీతం రచయిత. పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత జననం 2 ఆగష్టు 1876. ఆశ్చర్యం ఏమిటంటే అమెరికా జాతీయ గీతాన్ని (ద స్టార్ స్ఫాంగ్‌ల్ద్ బేనర్ - “O say can you see by the dawn's early light” ) రచించిన ప్రాన్సిస్ స్కాట్ కీ పుట్టిన రోజు 1 ఆగష్టు 1779. ఇద్దరికి 1 రోజు తేడా. నెల ఒక్కటే. సంవత్సరాలు 97 తేడా. అమెరికా, భారత దేశము రెండూ ప్రజాస్వామ్య దేశాలే. ఒకరు జాతీయ పతాక నిర్మాత. మరొకరు జాతీయ గీతం రచయిత. 1818: మేరియా మిచెల్, రోదసీ పరిశోధకుడు. 1877: షార్లెట్ మారియన్ హుఘ్స్, బ్రిటన్ లోని క్లీవ్ లాండ్ (మార్స్క్) అనే చోట 1 ఆగష్టు 1877 న జన్మించి 1989లో బ్రిటన్ లోని పురాతన వ్యక్తిగా తన 112వ పుట్టిన రోజు చేసుకున్నది. ఈమె పుట్టిన రోజున అలెగ్జాండర్ గ్రాహం బెల్ తన మొదటి టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు. అదే సంవత్సరం మొదటి లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్, వింబుల్డన్ వద్ద జరిగింది. అప్పటికి క్వీన్ విక్టోరియా భారతదేశపు మహారాణిగా ఉంది. 1888: శొంఠి వెంకట రామమూర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (మ.1964) 1889: డాక్టర్ జాన్ ఎఫ్ మహనీ, సవాయి వ్యాధికి పెన్సిలిన్తో చికిత్స చేయటం మొదలుపెట్టి, అభివృద్ధి, చేసాడు. (ఆ కాలపు సుఖవ్యాధులలో సవాయి అత్యంత భయంకరమైనది) (మ.1957) 1890: అనంతపంతుల రామలింగస్వామి, తెలుగు కవి. (మ.1977) 1900: పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు (మ.1962) 1921: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (మ.1966) 1925: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాదు‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (మ.2013) 1933: డోమ్ డెలూయిస్, అమెరికన్ సినిమా నటుడు. 1934: నవోదయ రామమోహనరావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (మ.2019) 1935: ఏ.బి.కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు. 1936: వైవెస్ సెయింట్ లారెన్ట్, ఫాషన్ డిజైనర్. 1942: జెర్రీ గార్షియా, సంగీత కళాకారుడు. 1944: యూరి వి రొమనెన్కొ, రష్యాదేశపు వ్యోమగామి USSR, కాస్మోనాట్ (సోయుజ్ 26, సోయుజ్38, సోయుజ్ టి.ఎమ్-2 రోదసీ నౌకలలో ప్రయాణించాడు) 1949: గల్లా అరుణకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. 1949: దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, విమర్శకుడు, భాషాశాస్త్ర పండితుడు, ఎమెస్కో గౌరవ సంపాదకుడు. 1955: అరుణ్ లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1956: అనంత వెంకట రామిరెడ్డి, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు 1975: హరీష్: తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళo, హిందీ, చిత్రాల నటుడు . 1983: కే.ఎస్ .రవీంద్ర , తెలుగు చలనచిత్ర దర్శకుడు. 1987: తాప్సీ, వర్థమాన సినీ నటి, మోడల్. 1992: మృణాల్ ఠాగూర్ , మరాఠి, హిందీ, తెలుగు చిత్రాల నటి. మరణాలు thumb|బాలగంగాధర తిలక్ 1920: బాలగంగాధర తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1856) 1936: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. (జ.1863) 2010: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (జ.1917) 2013: పి.వి.రంగారావు, మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940) 2017: పుష్ప మిత్ర భార్గవ, భారతీయ శాస్రవేత్త. "సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ" వ్యవస్థాపకుడు. (జ.1928) 2020: పైడికొండల మాణిక్యాలరావు, భాజపా నేత, ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి. (జ.1961) 2022: కె.జె.సారథి, తెలుగు సినిమా నటుడు, నిర్మాత. (జ.1942) పండుగలు , జాతీయ దినాలు తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు) 1935 - ఆగస్టులోని మొదటి ఆదివారం 'స్నేహితుల దినోత్సవం" జరుపుకోవటం అమెరికాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించింది. 1976: ట్రినిడాడ్ స్వాతంత్ర్య దినోత్సవం. 1976: టొబాగో స్వాతంత్ర్య దినోత్సవం. స్విట్జర్లాండ్ జాతీయ దినోత్సవం. (స్విస్ కాన్ఫెడరేషన్ దినోత్సవం) బెనిన్ జాతీయ దినోత్సవం. కుక్ ఐలాండ్స్ రాజ్యాంగ దినోత్సవం. జమైకా స్వాతంత్ర్య దినోత్సవం. ఇండియా ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవము. అంతర్జాతీయ పర్వత దినోత్సవం యార్క్ షైర్ డే (యు.కె . జరుపుకొనే ముఖ్యమైన దినోత్సవం ) వరల్డ్ వైడ్ వెబ్ డే బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 1 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చారిత్రక దినములు. జూలై 31 - ఆగష్టు 2 - జూలై 1 - సెప్టెంబర్ 1 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు వర్గం:అంతర్జాతీయ దినములు
ఆగష్టు 2
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_2
ఆగష్టు 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 214వ రోజు (లీపు సంవత్సరములో 215వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 151 రోజులు మిగిలినవి. సంఘటనలు 0216 బి.సి.: రెండో పునిక్ యుద్ధం: ‘కేన్నే దగ్గర జరిగిన యుద్ధం’ అంటారు – రోమన్ సైన్యం ఓడిపోయింది. 0338 బి.సి.: మసడోనియన్ సైన్యం, ఫిలిప్ II నేతృత్వంలో ఖరొనియా యుద్ధంలో, ఎథెన్స్ దళాలను, తేబెస్ దళాలను కలిపి ఓడించాడు. ఈ యుద్ధం వలన, మసడోనియన్ రాజ్యపు పెత్తనం (అధికారం) సురక్షితమైంది. 1375: మొదటి రోలర్ స్కేటింగ్ రింక్ లండన్ లో మొదలు పెట్టారు. (రెండు కాళ్ళకు చక్రాలున్న జోళ్ళు కట్టుకుని, తిరగటాన్ని రోలర్ స్కేటింగ్ అంటారు) . ప్రత్యేకంగా తయారైన వలయంలో ఈ రోలర్ స్కేటింగ్ ని నేర్చుకోవటం, పోటీలు వగైరా జరుగుతాయి. 1769: ఈ రోజు ’లాస్ ఏంజిల్స్‘ నగరానికి బారసాల జరిగిన రోజు. ఇదే రోజున ఈ నగరానికి లాస్ ఏంజిల్స్ అని పేరు పెట్టారు. గాస్పర్ ’డి’ పోర్టోల, ఒక స్పానిష్ సైనిక కెప్టెన్,, ఫ్రాన్సిస్కాన్ పూజారి అయిన జువాన్ క్రెస్పి, లు ఇద్దరినీ, శాన్ డీగో ( డియాగొ) నుండి ఉత్తరం వైపు వెళ్ళకుండగా అడ్డుకున్నారు. కానీ, వారిద్దరికీ, ఆ ప్రాంతం చాలా బాగా నచ్చింది. అందుకని దానికొక పేరు పెట్టారు ‘ఇది పొగమంచు లేని స్వర్గం’ అనే అర్ధం వచ్చేలా స్పానిష్ భాషలో . ఆ పేరు ‘ న్యూస్ట్రా సెనొరా ల రీనా డి లాస్ ఏంజెలెస్ డి పోర్సిఉన్సుల’ . ఆ పదాలకి అర్ధం దేవతల మహారాణి పోర్సిఉన్సిల, మా దేవత. పోర్సిఉన్సిలకి ఇటలీలో ఒక ఒక చిన్న గుడి ఉంది. 1776: హెన్రీ హడ్సన్ పసిఫిక్ మహాసముద్రం లోని హడ్సన్ బేని కనుగొన్నాడు. హడ్సన్ పేరుతో, ఆ ప్రాంతాన్ని హడ్సన్ బేగా పేరు పెట్టారు.. 1776: కాంటినెంటల్ కాంగ్రెస్ కి హాజరు కావటానికి వచ్చిన ప్రతినిధులు అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటన పై సంతకాలు చేయటం మొదలు పెట్టారు. 1790: మొదటి సారిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జనాభా లెక్కలు మొదలు పెట్టారు. 1823: ‘ది న్యూయార్క్ మిర్రర్ , లేడీస్ లిటరరీ గెజెట్] స్థాపించబడింది. తరువాత కాలంలో ఈ వార పత్రిక, న్యూయార్క్ మిర్రర్ దినపత్రిక గా మారింది 1824: ఫిప్త్ ఎవెన్యూ న్యూయార్క్ నగరంలో ఆరంభించారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రోడ్లలో ఒకటి, అనేక అందమైన దుకాణాలు, ఫ్యాషన్ దుకాణాలకు నెలవు అయ్యింది. 1870: ప్రపంచంలో మొదటి భూగర్భ ట్యూబ్ రైల్వే, టవర్ సబ్‍వే, లండన్ లో ప్రారంభించారు.. 1887: బెలాయిట్ నగరానికి (విస్కాన్సిన్ రాష్ట్రం, అమెరికా) చెందిన చెస్టర్ ఎ. హాడ్జ్ కి ముళ్ళ తీగ (ముళ్ళకంచె పేటెంట్ హక్కులు ఇచ్చారు. ఈ ముళ్ళ కంచెనే మనం ఇప్పుడు, స్థలాలకు, రక్షణకు కంచెగా, హద్దులుగా వాడుతున్నాము. 1903: ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం అయ్యింది. 1914: షెర్లాక్ హోమ్స్ సాహస గాధ "హిజ్ లాస్ట్ బౌ" నవల విడుదలైంది. 1916: మొదటి ప్రపంచ యుద్ధం: ఆస్ట్రియన్ విద్రోహ చర్యవలన ఇటాలియన్ యుద్ధనౌక లియోనార్డో డా విన్సీ టరంటొలో మునిగి పోయింది. 1931: సైన్యానికి సంబంధించిన ఏ పనినైనా, తిరస్కరించమని, ఐన్‌స్టీన్, విజ్ఞానవేత్తలను కోరాడు. 1937: మారిజునా, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులను నిషేధిస్తూ, అమెరికా, 1937 లో ’ది మారిహున టాక్స్ చట్టము’ చేసింది. (మారిజునా – ప్రమాదకరమైన మత్తు పదార్ధము) . 1939: మన్‌హట్టన్ ప్రాజెక్టు (అణుబాంబుని తయారు చేసే కార్యక్రమం) ని మొదలు పెట్టమని, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్,, లి జిల్డ్ (Le Szilrd) ఇద్దరూ, నాటి అమెరికన్ అధ్యక్షుడికి లేఖ ద్వారా విన్నవించుకున్నారు. 1943: ఈ రోజు లెఫ్టినెంట్ (జె.జి – జూనియర్ గ్రేడ్) జాన్ ఎఫ్ కెన్నెడీ (తరువాత అమెరికన్ అధ్యక్షుడు) ki ఒక చెడ్డ రోజు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అమెరికాకి చెందిన పి.టి. 109 (పెట్రోల్ టార్పెడో బోట్) జాన్ ఎప్ కెన్నెడి నడుపుతున్న సమయంలో, ’అమగిరి లేదా అమిగిరి’ పేరుగల జపాన్ వారి డిస్ట్రాయర్ యుద్ధనౌక ఆ పి.టి. 109ని ముంచివేసింది. ఆ సమయంలో, కెన్నెడీ, తన బోట్ లోని సిబ్బందిని అందరినీ (ఇద్దరిని తప్ప) రక్షించి, యుద్ధ హీరో అయ్యాడు. ఆ సంఘటన, జాన్ కెన్నెడీకి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని ఇచ్చి, అమెరికా అధ్యక్షపదవిని కట్టబెట్టింది. ఆ సమయంలో, వెన్నుపూసకు తగిలిన గాయం కూడా అలాగే జీవితాంతం వెంటాడింది. పి.టి 109 యొక్కకథ జాన్ ఎప్ కెన్నెడీగా క్లిఫ్ రాబర్ట్సన్ నటించిన, 1963సంవత్సరంలో తీసిన చిత్రం, పి.టి. 109లో హాలీవుడ్ శైలిలో చెప్పారు. 1943: ట్రెబ్లింకా లోని నాజీ మరణం శిబిరంలో తిరుగుబాటు జరిగింది. 1945: రెండవ ప్రపంచ యుద్ధం: మిత్ర రాజ్యాలు ఓడిపోయిన జర్మనీ యొక్క భవిష్యత్తు చర్చించడానికి, పోట్స్ డామ్ సమావేశం జరిపి, ఒక నిర్ణయం తీసుకున్నారు. 1967: రెండవ బ్లాక్‌వాల్ టన్నెల్ (సొరంగం) లండన్ లోని గ్రీన్‌విచ్ దగ్గర ప్రారంభమైంది. ఇది థేమ్స్ నది అడుగు భాగంలో తవ్విన సొరంగం. 1984: ఎ. సర్రే అనే వ్యాపారి, చట్టవిరుద్ధంగా తన ఫోన్ ను పోలీసులు టాపింగ్ చేసారని ఆరోపించాడు. మానవ హక్కుల యూరోపియన్ కోర్ట్ ఇలా ఫోన్ టాపింగ్ చేయటం తప్పు అని, పోలీసులను మందలించింది. 1985: "లాక్‌హీడ్ ఎల్-1011 ట్రైస్టార్"కి చెందిన "డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 191", "డల్లాస్ / ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం" వద్ద కూలిపోయింది. 137 మంది ప్రయాణీకులు, సిబ్బంది మరణించారు. 1990: ఈ రోజు ఉదయాన్నే, ఇరాక్, లక్షమంది సైనికులతో, 700 యుద్దటాంకుల దన్ను రాగా, కువైట్ మీద దురాక్రమణ చేసింది. 1990 ఇరాక్ కువైట్ ను ఆక్రమించగానే, ఎమీర్ సౌది అరేబియా పారిపోయాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఇరాకీ అక్రమణను ఖండించింది. అంతే కాదు, ఇరాక్ మీద పూర్తి దిగ్బంధం విధించింది. 2009 16మంది ప్రయాణికులతో బయలుదేరిన మెర్పాతి నుసంతారా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 9760, ట్విన్ ఓట్టర్ విమానం, పాపువా, ఇండోనేషియా ప్రాంతంలో కనిపించకుండా పోయింది. 2009 ఎయిడ్స్ (AIDS) కలిగించే కొత్తరకం వైరస్ ను, కామెరూన్ దేశంలో నివసిస్తున్న ఒక మహిళలో కనుగొన్నారు. జననాలు 1696 : ఒట్టోమన్ సుల్తాన్ మహ్మూద్-I ఆస్ట్రియన్లు & రష్యన్లుతో యుద్ధం చేసాడు. (మ. 1754 డిసెంబరు 13) . 1754 : ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) . 1832: దివ్యజ్ఞాన సమాజం (థియొసాఫికల్ సొసైటీ) యొక్క మొదటి అధ్యక్షుడు హెన్రీ స్టీల్ ఒల్కోట్ 1834: ఫ్రెడెరిక్ ఆగష్ట్ బార్తోల్డి స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో చెక్కిన సింహం విగ్రహము (బెల్ఫోర్ట్ సింహం) ; (మ. 4 అక్టోబరు 1904) 1876: పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత. 1878: ఇంజెబోర్గ్, స్వీడన్ యువరాణి 1880: బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (మ.1946) 1892: జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు.హాలీవుడ్లో ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ ఒకటి; (మ. 9 సెప్టెంబర్ 1978) . 1924: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (మ.2014) 1934: వలెరి బైకొవ్‍స్కీ, రోదసీ యాత్రికుడు. (వోస్టోక్ 5, సోయుజ్ 22, 31 వ్యోమనౌకలలో ప్రయాణించాడు) 1944: ఆశావాది ప్రకాశరావు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు గ్రంథరచయిత, అవధాని, కవి. 1949: బెర్టలాన్ ఫర్కాస్, రోదసీలో ప్రయాణించిన మొదటి హంగరీ దేశస్థుడు. (సోయుజ్36 వ్యోమ నౌక) 1952: పాల్ డేవిడ్ క్రూస్ ఎస్సీ, హంతకుడు -ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) మోస్ట్ వాంటెడ్ జాబితా లోని వ్యక్తి) 1956: లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013) 1979: దేవి శ్రీ ప్రసాద్, దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. 1989: షీలా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ,సినీనటి . మరణాలు thumb|Alexander Graham Bell 1075: జాన్ VIII జిఫిలినస్, వేదాంతి / కానిస్టెంటినోపల్ యొక్క దేశభక్తుడు. 1923: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1847) 1923 లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 29వ అధ్యక్షుడు వారెన్ జి హార్డింగ్, శాన్ ఫ్రాన్సిస్కోలో మరణించాడు. కాల్విన్ కూలిడ్జ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు. 1934: పాల్ వాన్ హిందేన్బర్గ్ తన 86వ ఏట మరణింఛగా, అడాల్ఫ్ హిట్లర్ పదవిని స్వీకరించాడు. 1967: అసోసియేటెడ్ నీగ్రో ప్రెస్ స్థాపించిన క్లాడ్ ఎ బార్నెట్, తన 78వ ఏట మరణించాడు. 2019: దేవదాస్ కనకాల నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (జ.1945) పండుగలు , జాతీయ దినాల స్నేహితుల దినోత్సవం. తల్లిపాల వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్/తెలంగాణాలో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు). ఆంగ్లో ఇండియన్. దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 2 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 1 - ఆగష్టు 3 - జూలై 2 - సెప్టెంబర్ 2 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 3
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_3
ఆగష్టు 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 215వ రోజు (లీపు సంవత్సరములో 216వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 150 రోజులు మిగిలినవి. సంఘటనలు thumb|Evening, Nile River, Uganda 1777: మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్ని ప్రారంభించారు. 1858: విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు 1907: పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది. 1914: కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది 1957: తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలేషియా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు. 1958: మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్ అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది. 1978: ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్‌వెల్త్ గేమ్స్ని కెనడా లోని ఎడ్మంటన్ లో ప్రారంబింది. 1990: నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేసింది. 1911లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అయింది. 2003: అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది. 2008: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందారు. జననాలు 1656: కాకునూరి అప్పకవి, తెలుగు లాక్షణిక కవి. 'ఆంధ్రశబ్ద చింతామణి ' ఆధారంగా 'ఆంధ్రశబ్దచింతామణి ' అను ఛందో గ్రంథానికి రచయిత. 1886: మైథిలీ శరణ్ గుప్త, హిందీ రచయిత (మ.1964) 1913: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013) 1921: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (మ.2003) 1931: సూరి బాలకృష్ణ, భూ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త (మ.1984).. 1948: వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినినటి. 1956: టి. మీనాకుమారి, న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి. 1983: ఆషీమా భల్లా , హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, అస్సామీ చిత్రాల నటి . 1989: గౌరినంద , మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల నటి. మరణాలు 2008: పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి. 2011: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (జ.1942) 2013: ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928) 2013: ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933) 2017 : జీడిపల్లి విఠల్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు. పండుగలు , జాతీయ దినాలు తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు) 1811: వెనెజుల దేశపు జెండా దినము. ( 1806 సంవత్సరం నుంచి, మార్చి నెల 12 వ తేదిన జరిపుకునేవారు) . 1960: నైగర్ దేశపు స్వాతంత్ర్యదినోత్సవము. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 3 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 2 - ఆగష్టు 4 - జూలై 3 - సెప్టెంబర్ 3 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 4
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_4
ఆగష్టు 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 216వ రోజు (లీపు సంవత్సరములో 217వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 149 రోజులు మిగిలినవి. సంఘటనలు 0070: రోమన్లు, జెరూసలేం లోని రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేసారు. 0181: ఆకాశంలోని, కేసియోపియా రాశిలో సూపర్ నోవాని చూసారు. సూపర్ నోవా అంటే ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ, ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ, పేలిపోయే నక్షత్రం) సూపర్ నోవా 1693: డోమ్ పెరిగ్నాన్, షాంపేన్ అనే సారాయిని కనిపెట్టాడు. పాశ్చాత్య దేశాలలోని ఆడవాళ్ళు ఈ షాంపేన్ని ఎక్కువగా తాగుతారు. 1735 : బ్రిటన్ యొక్క ఉత్తర అమెరికా కాలనీలలో పత్రికా స్వాతంత్ర్యం కోసం మొదటి ముఖ్యమైన విజయం జరిగింది.జాన్ పీటర్ జెంజెర్, 1733 లో న్యూయార్క్ వీక్లీ జర్నల్ ప్రచురించడం మొదలుపెట్టాడు. వలస ప్రభుత్వ విధానాలను, తన పత్రికలో విమర్శించటంతో, వలస ప్రభుత్వం అతనిని నిర్బంధించింది. న్యాయస్థానం, అతని పత్రికలో రాసిన వాటికి, ఆధారాలు ఉన్నాయని, అతనిని విడుదల చేసింది. ఇది మొదటి పరువు ఖైదు (డిఫమేషన్) కేసు కూడా. 1777: రిటైర్ అయిన, బ్రిటీష్ సైనిక దళం అధికారి ఫిలిప్ ఆష్లే, మొదటి సర్కస్ని ప్రారంభింఛాడు. 1821: అత్కిన్సన్, అలెగ్జాండర్ అనే ఇద్దరు కలిసి, "సాటర్‌డే ఈవెనింగ్ పోస్ట్" అనే ఒక వారపత్రికను మొట్టమొదటిసారిగా ప్రచురించారు. 1824: కోస్ యుద్దం, టర్కీ దేశం, గ్రీసు దేశం మధ్య జరిగింది. 1830: చికాగో నగరం కోసం ప్రణాళికలు సిద్ధం చేసారు. 1854: హినొమరు, జపాన్ నౌకల నుండి ఎగుర అధికారిక జెండాగా ప్రకటించారు. 1858: మొదటిట్రాన్స్-అట్లాంటిక్ కేబుల్ పూర్తి అయింది. 1884: థామస్ స్టీవెన్స్ సైకిల్ మీద అమెరికా అంతా చుట్టివచ్చిన మొదటి మనిషి. ఆ తరువాత, అతడు, సైకిల్ మీద ప్రపంచమంతా, చుట్టివచ్చాడు. 1906: ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో, సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభమైంది. 1914: మొదటి ప్రపంచ యుద్ధం : బెల్జియం దేశం మీద జర్మనీ దురాక్రమణ చేసింది. బదులుగా, బ్రిటన్, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది. 1916: అమెరికా డెన్మార్క్ నుండి వర్జిన్ ద్వీపాలను 25 మిలియన్ల డాలర్లకు, కొనుగోలు చేయడానికి అంగీకరించింది. 1916: మొదటి ప్రపంచ యుద్ధం : లైబీరియా దేశం, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది. 1925: అమెరికా నావికాబలగాలు 13-సంవత్సరాల ఆక్రమణ తరువాత నికారాగువా దేశాన్ని (నికరాగ్వా వదిలేసి, వెళ్ళిపోయారు. 1927: అమెరికా, కెనడా ల మధ్య పీస్ బ్రిడ్జ్ (వంతెన) ప్రారంభమైంది. 1929: జిడ్డు కృష్ణమూర్తి, దివ్యజ్ఞాన సమాజం, దాని అనుబంధ సంస్థల నుంచి రాజీనామా చేసాడు. 1944: ఆమ్‌స్టర్ డాంలో దాగి ఉన్న అన్నే ఫ్రాంక్ అనే 15 సంవత్సరాల బాలికను, ఆమె కుటుంబాన్ని, నాజీలు ఖైదు చేసారు. ఈ బాలిక రాసిన అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతనకు ప్రతిబింబం ఈ డైరీ (దినచర్య పుస్తకం) . 1947: జపాన్ సుప్రీం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) ఏర్పడింది. 1954: హఫీజ్ జలంధ్రీ రాసిన, అహ్మద్ జి. ఛగియ కంపోజ్ (కూర్చిన) చేసిన, ఖయుమి తరానా జాతీయగీతాన్ని, పాకిస్థాన్, "ప్రభుత్వ జాతీయ గీతం"గా ఆమోదించింది. విను 1956: మొదటిసారిగా గంటకి 200 మైళ్ళవేగంతో మోటార్ సైకిల్ ప్రయాణించింది. 1960: అమెరికాకు చెందిన వైమానికదళ పరిశోధక విమానం, గంటకి 2, 150 మైళ్ళ వేగంతో ప్రయాణించి, రికార్డు నమోదు చేసింది. ఇది సంప్రదాయకమైన ప్రొపెల్లర్ తో కాకుండా, రాకెట్ ప్రొపెల్లర్ ఉపయోగించి, ఇంత వేగాన్ని సాధించింది. 1971: అమెరికా మనుషులు ఉన్న అంతరిక్షనౌకనుంచి, మొదటి సారిగా ఒక ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది. 1977: అమెరికా ప్రెసిడెంట్ కార్టర్ డిపార్ట్ర్త్‌మెంట్ ఆఫ్ ఎనెర్జీని ఏర్పాటు చేస్తూ సంతకం చేసాడు. 1983: ఇటలీ 1946 తరువాత, మొదటి సామ్యవాద ప్రధాన మంత్రిని ఎన్నుకుంది. 1972: అలబామా గవర్నర్ అయిన జార్జి వాలెస్ని హత్య చేయబోయిన ఆర్థర్ బ్రెమెర్ (21 సంవత్సరాలు) కి అమెరికా లోని మేరీలేండ్ న్యాయస్థానం, 63 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ హత్యాప్రయత్నంలో, జార్జి వాలెస్]కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు (న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది) . ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే సమయానికి నిందితుడి వయస్సు 74 సంవత్సరాలు ఉంటుంది. 2009: క్రమం తప్పకుండా యూరోపియన్లు 50% కంటే ఎక్కువ మంది, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో విహరిస్తారని, (గత ఐదు సంవత్సరాలలో 33% పెరిగింది) యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. 2009: తొలి స్వైన్ ఫ్లూ మరణం, మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది. జననాలు thumb|బరాక్ ఒబామా 1719: జోహన్ గాట్లోబ్ లెమాన్, జర్మన్ ఖనిజ శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త (మ.1767) 1755: నికోలస్ జాక్వె కోంటె, "పెన్సిల్"ని కనిపెట్టిన శాస్త్రవేత్ (మ.1805). 1792: పెర్సీ షెల్లీ, ఆంగ్ల కవి (మ.1822) 1868: మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(మ.1922) 1900: క్వీన్ ఎలిజబెత్, బ్రిటిష్ రాణి తల్లి. 2000 సంవత్సరంలో బ్రిటిష్ రాణి తల్లి 100వ పుట్టినరోజు వేడుకలు బ్రిటన్ లో జరుపుకున్నారు (మ.2002). 1912: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (మ.1992) 1926: మండలి వెంకట కృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (మ.1997). 1948: శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 1954: ఉండవల్లి అరుణ కుమార్, భారత పార్లమెంటు సభ్యుడు. 1955: ఛార్లెస్ డి "సామ్" గెమర్ యాంక్టన్ ఎస్.డి, రోదసీ యాత్రికుడు ( రోదసీ నౌకలు ఎస్.టి.ఎస్. 38, 48) 1961: అమెరికా 44వ అధ్యక్షుడు () బరాక్ ఒబామా, హవాయి ద్వీపం లో పుట్టాడు. 1993: మాళవిక మోహనన్ , మలయాళం, తెలుగు,తమిళ,హిందీ చిత్రాల నటి,మోడల్ మరణాలు 2006: నందిని సత్పతీ, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (జ.1931) 2007: పాగల్ అదిలాబాదీ, తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (జ. 1941) 2020: వంగపండు ప్రసాదరావు, విప్లవకవి, జానపద వాగ్గేయకారుడు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు (జ. 1943) 2020: సున్నం రాజయ్య, సిపిఎం నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోను, తెలంగాణ శాసనసభ లోనూ సభ్యుడు. (జ. 1960) 2020: ఇబ్రహీం అల్కాజీ, నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) మాజీ డైరెక్టర్ (జ.1925) పండుగలు , జాతీయ దినాలు తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు) యు ఎస్ . కోస్ట్ గార్డ్ డే- అంతర్జాతీయ బీర్ దినోత్సవం (ఆగస్ట్ మొదటి శుక్రవారం ) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 4 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 3 - ఆగష్టు 5 - జూలై 4 - సెప్టెంబర్ 4 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 5
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_5
ఆగష్టు 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 217వ రోజు (లీపు సంవత్సరములో 218వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 148 రోజులు మిగిలినవి. సంఘటనలు 1100: హెన్రీ I, వెస్ట్ మినిష్టర్ అబ్బే లో, ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషిక్తుడయాడు. 1583: సర్ హంఫ్రీ గిల్బర్ట్ మొట్టమొదటి ఆంగ్లేయుల వలస ను, ఉత్తర అమెరికా లో, నెలకొల్పాడు. ఆ ప్రాంతాన్నిన్యూపౌండ్‌ లాండ్ లోని సెయింట్ జాన్ గా పిలుస్తున్నారు. 1624: విలియమ్ జేమ్స్‌టౌన్, ఆంగ్లేయులు ఆక్రమించిన (వర్జీనియా, అమెరికా) లో పుట్టిన మొదటి నీగ్రో. 1845: ఆస్ట్రేలియా లోని 'కింగ్ ఐలేండ్' ద్వీపానికి దగ్గరలో జరిగిన ఘోరమైన ఓడ (పేరు: కేటరక్వి) ప్రమాదంలో, 407 మంది మరణించారు. 1858: మొట్టమొదటి ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రఫ్ కేబుల్ లైను వేసారు. 1861: అమెరికా సైనిక దళాలు, 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేసింది. (క్రమశిక్షణను పాటించని కొందరి సైనికులకు ఈ శిక్ష విధించేవారు) . 1861: అమెరికా మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి) 1864: తోకచుక్క వర్ణపటలము (సూర్యకాంతి ఏడురంగులను వర్ణపటలము అంటారు) ను మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్త జియోవన్ని దొనాతి 1874: ఇంగ్లాండ్లో ఉన్న పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ఆదర్శంగా తీసుకుని, జపాన్ తన సొంత పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ప్రవేశపెట్టింది. 1879: రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా, ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 'గ్యాస్ లైట్ల' వెలుతురులో క్రికెట్ ఆడారు. 1882: స్టీలుతో తయారయిన యుద్ధనౌకలను, అమెరికా నౌకాదళంలో వాడటానికి అమెరికా అనుమతించి, ఆధునిక నౌకాదళానికి నాంది పలికింది. 1882: మార్షల్ లా (సైనిక దళాల న్యాయం), జపాన్లో చట్టమయ్యింది. 1882: స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని అమెరికాలో స్థాపించారు. 1882: స్టేట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి, బెడ్లోస్ ఐలేండ్ (న్యూయార్క్ హార్బర్) శంకుస్థాపన జరిగింది. ఆ సమయంలో వర్షం కురుస్తున్నది. 1905: నార్వే దేశం, స్వీడన్ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకుంది. 1912: జపాన్ లోని టోక్యో నగరంలోని "గింజా" అనే చోట, మొట్టమొదటి సారిగా టాక్సి కేబ్ (అద్దె కారు- టాక్సీలు) లు ప్రారంభించారు. 1914: మొదటి ప్రపంచ యుద్ధంలో, జర్మనీ దేశం, సోవియట్ యూనియన్ దేశం, మీద యుద్ధం ప్రకటించినప్పుడు, అమెరికా తనను తాను, తటస్థ దేశంగా ప్రకటించుకున్నది. 1914: అమెరికా లోని ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లేండ్ నగరంలో మొట్టమొదటి ట్రాఫిక్ లైట్లు ప్రారంభించారు. 1923: ఇంగ్లీష్ ఛానెల్ని ఈదిన మొదటి అమెరికా ఈతగాడు హెన్రీ సల్లివాన్ 1962: నెల్సన్ మండేలాని నిర్బంధించి, చెఱ (ర) సాలలో బంధించారు. 1963: ఆణ్వస్త్రాలు, భూమిలోపలే పరీక్షించాలి (వాతావరణంలో గాని, రోదసీలో గాని, నీటిలోపల గాని పరీక్షించకూడదు) అన్న మినహాయింపుతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేసాయి 1963: అమెరికా, ప్రయోగించిన రోదసీ నౌక, మారినర్-7, మొట్టమొదటి సారి, కుజగ్రహం చిత్రాలను, ప్రసారంచేసింది. 1973: ఇద్దరు ఆరబ్ తీవ్రవాదులు, ఏథెన్స్ లోని విమానాశ్రయంలో గుంపుగా ఉన్న ప్రయాణీకుల మీద కాల్పులు జరపగా, ముగ్గురు మరణించగ, 55 మంది గాయపడ్డారు. 1984: జోన్ బెనోయిట్, స్త్రీల మొదటి ఒలింపిక్ మారథాన్ గెలుచుకున్నది. జననాలు 1896: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (మ.1990) 1862: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం ఏప్రిల్ 11, 1890) . 1908: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (మ.1975) 1930: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (మ.2012) 1948: వడ్డేపల్లి కృష్ణ, లలిత గీతాలు, గేయ రచయిత 1950: ప్రేమ్ వాత్స, భారతీయ-కెనడియన్ బిలియనీర్ వ్యాపారవేత్త. 1974: కాజోల్, భారతీయ సినీ నటి. 1980: ఉదయ భాను, టెలివిజన్ యాంకర్, చలన చిత్ర నటి. 1985: మమతా మోహన్ దాస్, సినీ నటి, నేపథ్య గాయని 1987: జెనీలియా, తెలుగు,తమిళ,కన్నడ, హిందీ చిత్రాల నటి. 1996:ఆషికా రంగనాథ్ , తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల నటి. మరణాలు thumb|కుడి|ఫెడ్రిక్ ఎంగిల్స్ 1895: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (జ.1820) 1950: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (జ.1890) 1962: మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (జ.1926) 1991: సొయిఛిరో హోండా, హోండా కంపెనీ స్థాపకుడు., కాలేయ కేన్సర్ తో 84వ ఏట మరణించాడు (జ.1906) 1984: రిచర్డ్ బర్టన్, హాలీవుడ్ నటుడు, తన 58వ ఏట మరణించాడు (జ.1925 నవంబరు 10) 1997: బోడేపూడి వెంకటేశ్వరరావు, కమ్యునిష్టు నాయకుడు. (జ.1922) 2022: భీమపాక భూపతిరావు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే. పండుగలు , జాతీయ దినాలు తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు) జాతీయ ఆవాల దినోత్సవం (మొదటి శనివారం.) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 5 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 4 - ఆగష్టు 6 - జూలై 5 - సెప్టెంబర్ 5 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 6
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_6
ఆగష్టు 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ (gorgeon calander) ప్రకారము సంవత్సరములో 218వ రోజు (లీపు సంవత్సరములో 219వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 147 రోజులు మిగిలినవి. సంఘటనలు 1787: అమెరికా రాజ్యాంగ ప్రతి తాలుకు, 60 (ప్రూఫ్ షీట్లు) పుటలను, అమెరికా రాజ్యాంగ సభ సమావేశానికి అందించారు. 1806: పవిత్ర రోమన్ సామ్రాజ్యం అధికారికంగా ముగిసింది. 1825: బొలీవియాకు స్వాతంత్ర్యం, 300 సంవత్సరాలు స్పెయిన్ పాలకుల చేతిలో నలిగి పోయిన బొలీవియా 1825 ఆగష్టు 6 న స్వతంత్ర రిపబ్లిక్ గా ఏర్పడింది. 1861: బ్రిటన్, నైజీరియాకు చెందిన, లాగోస్ ని, తన సామ్రాజ్యంలో కలుపుకున్నది. 1889: ప్రైవేట్ స్నానాలగదులు కలిగిన, మొదటి బ్రిటిష్ హోటల్, "సావోయ్ హోటల్" లండన్ లో ప్రారంభమైంది. 1890: న్యూయార్క్లో ఉన్న, ఆబర్న్ జైలులో, విద్యుత్ కుర్చీ మీద కూర్చుని మరణశిక్ష అనుభవించాలని, శిక్ష విధించబడిన మొదటి వ్యక్తి హంతకుడు విలియమ్ కెమ్లెర్. 1915: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, వార్సా, జర్మనీ చేతుల్లోకి వచ్చింది. 1926: గెర్త్రుడ్ ఏడెర్లె, ఇంగ్లీష్ ఛానల్ ని, 14 గంటల 30 నిమిషాలలోమ్ ఈదిన మొదటి మహిళ.1926 ఆగష్టు 6 రోజు ఉదయం 07:05 వద్ద ఫ్రాన్స్ లో కాప్ గ్రిస్-నెజ్ వద్ద మొదలు పెట్టి, 14 గంటల 30 నిమిషాల తరువాత, ఆమె కింగ్స్‌డౌన్, కెంట్, ఇంగ్లాండ్ వద్ద ఒడ్డుకి వచ్చింది. 1950లో, ఫ్లోరెన్స్ చాడ్విక్ 13 గంటల 20 నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానెల్ ని ఈదినంతవరకు, ఆమె నమోదు చేసిన రికార్డు అలాగే ఉంది. 1945: హిరొషిమా మీద బాంబ్ ప్రయోగించబడింది. 1945 ఆగష్టు 6 న 'ఎనొల గే' అనే అమేరికా బి-29 బాంబర్ (బాంబులను ప్రయోగించడానికి వాడే విమానం), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని, హిరోషిమా పట్టణం పైన విడిచింది. ప్రపంచ చరిత్రలో, అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్నిక్షనాలోనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్ఫోటనంలో, 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ, మూడవ రోజు, అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన, నాగసాకి పై, అటువంటిదే, మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధం లో, అమెరికాకు, లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే, అతి ఖరీదైన యుద్ధం గా, మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించ బడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పోయింది. 1945 ఆఖరికి 2 లక్షల మందికి పైగా, యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించ గలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు. 1961: రష్యా వ్యోమగామి (కాస్మోనాట్) మేజర్ ఘెర్మన్ టితోవ్ రోదసీలో ఒక రోజు (24 గంటలు) గడిపి, ప్రపంచాన్ని, ఆశ్చర్యంలో, ముంచాడు. 1962: జమైకాకు స్వాతంత్ర్యం. 300 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల క్రింద వున్న జమైకా 1962 ఆగష్టు 6 న స్వతంత్ర దేశంగా ఏర్పడింది. 1991: వరల్డ్ వైడ్ వెబ్ (www) ఇంటర్నెట్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజు. అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి సర్ టిమ్ బెర్నెర్స్ లీ. 1991: ఆగస్టు 6 1991న చుండూరు, ఆంధ్రప్రదేశ్ గ్రామంలో దళితులపై అగ్రకులస్తులు (రెడ్డి, తెలగలు) చేసిన దాడి, హత్యాకాండలను చుండూరు ఘటనగానూ, చుండూరు హత్యాకాండగానూ అభివర్ణిస్తారు. 1997: శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. జననాలు thumb|Alexander Fleming 3 1890: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు. (మ.1971) 1912: కొత్త రఘురామయ్య, రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. (మ.1979) 1925: చిల్లర భావనారాయణ రావు, నాటక రచయిత, సినీ రచయిత (మ.2010) 1931: గడ్డవరపు పుల్లమాంబ, రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు. 1933: ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (మ.1987) 1934: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (మ.2011) 1943: కె.శివారెడ్డి, సుప్రసిద్ధ వచన కవి, అభ్యుదయ కవి, విప్లవకవి. 1964: పృద్విరాజ్, హాస్య, ప్రతి నాయక పాత్రల నటుడు. 1991: ధన్య బాలకృష్ణ, తెలుగు, తమిళ సినిమా నటి. 1881: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1955) 1809: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892) మరణాలు 1925: సురేంద్రనాథ్ బెనర్జీ, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1848) 1951: ఆచంట రుక్మిణమ్మ 1962: ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (జ.1880) 1978: పోప్ పాల్ VI, తన 80వ ఏట, తన వేసవి విడిది వద్ద గుండెపోటుతో మరణించాడు. 1981: దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1916) 1986: విలియం J స్క్రోడర్స్, మనిషి చేసిన కృత్రిమ గుండె (జార్విక్ VII) తో, ఎక్కువ కాలం (620 రోజులు) బ్రతికాడు. 2012: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936) 2019: సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి (జ.1952) 2020: సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (జ.1961) 2023:గద్దర్, ప్రజా గాయకుడు ఉద్యమకారుడు పండుగలు , జాతీయ దినాలు తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు) 1825: బొలివియా స్వాతంత్ర్యదినోత్సవం.స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నది. ప్రపంచం 1847 జూలై 21 లో గుర్తించింది. 1962: జమైకా స్వాతంత్ర్యదినోత్సవం. హిరోషిమా దినోత్సవం. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 6 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 5 - ఆగష్టు 7 - జూలై 6 - సెప్టెంబర్ 6 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు వర్గం:1825 వర్గం:1881 వర్గం:1933 వర్గం:1945 వర్గం:1962 వర్గం:1978 వర్గం:1986 వర్గం:1997
ఆగష్టు 7
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_7
ఆగష్టు 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 219వ రోజు (లీపు సంవత్సరములో 220వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 146 రోజులు మిగిలినవి. సంఘటనలు 1858: బ్రిటిష్ క్వీన్ విక్టోరియా, ఒట్టావా నగరాన్ని, కెనడాకు రాజధానిగా ఎంపిక చేసింది. 1942: అమెరికా మెరైన్లు గ్వాడల్ కెనాల్ పై దాడి ప్రారంబించారు. 1960: ఫ్రాన్స్ నుంచి ఐవరీ కోస్ట్ స్వాతంత్ర్యం పొందింది. 1970: ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్కి చెందిన వేలెరీ గనె, కి ఒక నాలుగు సంవత్సరాల బర్మా జాతికి చెందిన తారావుడ్ ఆంటిగొనె, అనే పేరుగల పిల్లి ఉంది. అధి ఒకే కాన్పులో (ఈత), పందొమ్మిది పిల్లి పిల్లలకు, జన్మనిచ్చింది. జీవించి ఉన్న పదిహేను పిల్లి పిల్లలలో, ఒకటి ఆడది మిగిలిన 14 మగ పిల్లిపిల్లలు. నాలుగు పిల్లిపిల్లలు మరణించాయి. ఇప్పటికీ, ఇదే రికార్డు. 1972: ఉగాండా నియంత, ఇడి అమిన్ ఆసియా దేశస్తులందరూ, ఉగాండాని 90 రోజులలోగా, విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీచేశాడు. 1987: 30 సంవత్సరాల వయసు ఉన్న లైనే కాక్స్, ఆర్కిటిక్, పసిఫిక్ సముద్రాల వేరుచేసే బేరింగ్ జలసంధిని, స్విమ్ సూట్ (ఈత దుస్తుల) లో, అలస్కా నుండి సైబీరియాకు 2.7 మైళ్ళు (4.3 కిలోమీటర్లు) దూరాన్ని, రెండు గంటల ఆరు నిమిషాలలో ఈదింది. ఆమె ఈదుతున్నప్పుడు నీరు 50 సెంటిగ్రేడ్ వేడ్ మాత్రమే ఉంది. అంతేకాదు, సంవత్సరంలో, ఎక్కువ భాగం ఈ ప్రాంతం అంతా గడ్డకట్టుకుని ఉంటుంది. 1998: ఆఫ్రికా లోని, కెన్యా, టాంజానియా లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై వెంట వెంటనే నిమిషాల్లో బాంబు దాడి చేసినప్పుడు కనీసం 200 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. 2009: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా మార్గరెట్ ఆల్వా ప్రమాణస్వీకారం. జననాలు 0317: కాన్స్‌టాంటియస్ II రోమన్ చక్రవర్తి (పరిపాలన 337నుంచి 361 వరకు- మరణం. 361) 1598: జార్జ్ స్టీర్న్‌హీం, "స్వీడిష్ కవిత్వ పితామహుడి" పేర్కొంటారు. (హెర్క్యులెస్) 1702: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (మ.1748) 1779: ఆధునిక భూగోళశాస్త్రానికి పునాది వేసిన వారిలో కార్ల్ రిట్టేర్ రెండవవాడు. 1783: జాన్ హీత్కోట్, ఆవిష్కర్త లేస్-మేకింగ్ (లేస్ తయారు చేసే) యంత్రాలను కనుగొన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని, మహిళలు, ఈ లేసు తయారీలో నిపుణులు. అది వారికి కుటీర పరిశ్రమ. వారు తయారుచేసిన లేసులు విదేశాలకు ఎగుమతి అవుతాయి. 1876​​: మాతా హరి, డచ్ దేశస్తురాలు, నర్తకి, గూఢచారి (మ.1917). 1886: లూయిస్ హజెల్టైన్, న్యూట్రొడైన్ (neutrodyne) సర్క్యూట్ ని కనుగొన్నాడు. ఈ సర్క్యూట్ వలన రేడియోని తయారు చేయటం సాధ్యమైంది (మ.1964). 1890: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (మ.1979) 1903: లూయిస్ లీకీ, ఆంత్రోపోలజిస్ట్ (1964 లో రిచర్డ్ హూపెర్ మెడల్ బహుమతిగా పొందాడు) (మ.1972). 1907: బెజవాడ గోపాలరెడ్డి, స్వాతంత్ర్యసమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1997) 1916: బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 1984) 1925: ఎం.ఎస్.స్వామినాథన్, జన్యుశాస్త్రవేత్త, అంతర్జాతీయంగా పేరొందిన "హరిత విప్లవం" నిర్వాహకుడు. 1926: అన్నవరపు రామస్వామి, వాయులీన విద్వాంసులు. 1947: సుత్తివేలు, తెలుగు హాస్య నటులు. (మ.2012) 1963: సంజయ్ రథ్, భారతీయ జ్యోతిష పండితుడు. 1966: జిమ్మీ వేల్స్, అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్, వికీపీడియాను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రోజెక్టులు ప్రారంభించిన వ్యక్తి. 1980: చేతన్ ఆనంద్, భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 1984: సచిన్ జోషి , చలనచిత్ర నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. 1993: కాలభైరవ , తెలుగు,తమిళ,హిందీ, చిత్రాల ,సంగీత దర్శకుడు , గాయకుడు మరణాలు thumb|Rabindranath Tagore in 1909 1941: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (జ.1861) 1974: అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (జ.1883) 1997: శ్రీరాం వెంకట (యస్వీ) భుజంగరాయ శర్మ, రచయిత. 2011: మాతంగి విజయరాజు, రంగస్థల నటులు. 2012: సామల సదాశివ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త. (జ.1928) 2016: దూబగుంట రోశమ్మ, 1991లో సారావ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి నాయకత్వం వహించిన మహిళ. 2018: ఎం.కరుణానిధి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (జ.1924). పండుగలు , జాతీయ దినాలు తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు) 1960: ఐవరీకోస్ట్ స్వాతంత్ర్యదినోత్సవము. 2015: జాతీయ చేనేత దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 7 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 6 - ఆగష్టు 8 - జూలై 7 - సెప్టెంబర్ 7 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 8
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_8
ఆగష్టు 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 220వ రోజు (లీపు సంవత్సరములో 221వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 145 రోజులు మిగిలినవి. సంఘటనలు 1942: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, 1942 ఆగష్టు 8 తేదీన, క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది 1969: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా గురుదయాళ్ సింగ్ ధిల్లాస్ పదవిని స్వీకరంచాడు. 2008: రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములో 2008 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం. జననాలు thumb|Chellapilla Venkata Sastry 1870: చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులులో ఒకరు. (మ.1950) 1907: అనుముల వెంకటశేషకవి, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ శతావధాని. 1921: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001) 1927: వక్కలంక సరళ , తెలుగు సినీ గాయని(మ.1999) 1929: పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (మ.2007) 1936: మోదుకూరి జాన్సన్, నటులు, తెలుగు సినిమా సంభాషణల రచయిత, నాటక కర్త. (జ.1988) 1945: నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు. 1946: కర్రెద్దుల కమల కుమారి, పార్లమెంటు సభ్యురాలు. 1950: పిల్లి సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు. 1950: వై.ఎస్.వివేకానందరెడ్డి, లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1960: సున్నం రాజయ్య, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2020) 1981: రోజర్ ఫెడరర్, స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. మరణాలు 1987: గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (జ.1899) 1998: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (జ.1917) 2004: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (జ.1925) 2010: సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (జ.1914) 2020: నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (జ. 1942) పండుగలు , జాతీయ దినాలు క్విట్ ఇండియా దినోత్సవం. జాతీయ డాలర్ దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 8 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 7 - ఆగష్టు 9 - జూలై 8 - సెప్టెంబర్ 8 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 9
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_9
ఆగష్టు 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 221వ రోజు (లీపు సంవత్సరములో 222వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 144 రోజులు మిగిలినవి. సంఘటనలు 1945: ఆగష్టు 6 న 'ఎనొలా గే' అనే అమెరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని హిరోషిమా పట్టణంపైన విడిచింది. ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలో 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజున 1945 ఆగష్టు 9 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు. 1962: భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు‌ లోని నంగల్‌లో ప్రారంభించారు. 1965: సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది. 1974: గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం. జననాలు 1754 : ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (మ.1825). 1889: చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1951) 1910: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975) 1932: జాలాది రాజారావు, తెలుగు రచయిత. (మ.2011) 1962: వెలుదండ నిత్యానందరావు, రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు. 1965: బ్రహ్మాజీ, తెలుగు సినిమా నటుడు. 1970: రావు రమేష్, భారతీయ సిని, టీవి నటుడు. 1972: మురళిశర్మ , తెలుగు తో పాటు పలు ఇతర భాషలలో ప్రతి నాయకుడు . 1975: మహేష్ బాబు, తెలుగు సినిమా నటుడు. 1987: వి.జయశంకర్, తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత. 1991: హన్సిక మోత్వాని , చిత్రసీమ లో బాలనటిగా గుర్తింపు పొందిన భారతీయ సినీ నటీ మరణాలు thumb|Yellapragada subbarao 1948: యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895) పండుగలు , జాతీయ దినాలు అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం 1965 : సింగపూర్ స్వాతంత్ర్య దినోత్సవం. నాగసాకి దినోత్సవం. క్విట్ ఇండియా దినోత్సవం . ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 9 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 8 - ఆగష్టు 10 - జూలై 9 - సెప్టెంబర్ 9 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 10
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_10
ఆగష్టు 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 222వ రోజు (లీపు సంవత్సరములో 223వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 143 రోజులు మిగిలినవి. సంఘటనలు 0610: ఇస్లాం మతంలో సాంప్రదాయంగా, అతి పవిత్రమైన లయలత్ అల్ ఖదర్ రోజు. ఈ రోజున, ముహమ్మద్ ప్రవక్త, అతి పవిత్రమైన ఖురాన్ని అందుకున్నాడు. 1519: ఫెర్డినాండ్ మాగెల్లాన్, ఐదు నౌకలతో, ప్రపంచాన్ని చుట్టిరావడానికి, సెవిల్లె నుండి బయలు దేరాడు. 1680: మెక్సికోలో పెబ్లో (ప్యూబ్లో) ఇండియన్స్, స్పెయిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. 1743: బహుమతి కోసం యుద్ధం చేయటం గురించిన నియమాలు (పోరాట నియమాలు) ఏర్పరిచినట్లుగా, మొట్టమొదటిగా రికార్డు చేశారు. 1792: లూయిస్ XVI రాజభవంతి పై ఫ్రెంచ్ ప్రజలు దాడి చేసారు. 1821: అమెరికా 24వ రాష్ట్రంగా మిస్సోరిని అమెరిక సెనేట్ అమోదించింది. 1833: చికాగో 200 మంది జనం గల ఒక గ్రామంగా అవతరించింది. పెరిగిన విధానం ఇలా: 1910 సంవత్సరంలో 21, 85, 283; 1920 సంవత్సరంలో 27, 01, 705 (పెరిగిన జనాభా) ; 2010 సంవత్సరంలో 26, 95, 598 (తగ్గిన జనాభా) . 1840: కెనడాలో ఎగిరిన మొదటి బెలూన్ (గాలి గుమ్మటం) పేరు, స్టార్ ఆఫ్ ది ఈస్ట్ 1846: స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ను అమెరికాలో స్థాపించారు. 1866: ట్రాన్సాట్లాంటిక్ కేబుల్ ని, అట్లాంటిక్ మహాసముద్రంలో వేశారు. దీనివలన ఖండాంతర దేశాలకు టెలిఫోన్ సౌకర్యం కలిగింది. 1877: రైలు ప్రయాణాన్ని, మొదటిసారిగా, టెలిఫోన్ వాడుతూ (నియంత్రిస్తూ) పంపించారు.సిడ్నీ మైన్స్ రైల్వే దగ్గర ఉన్న, గ్లేస్ బేలో ఉన్నటువంటి, కాలెడోనియా మైన్ (గని) వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ గని యజమానులలో, ఒకడైన, అలెగ్జాండర్ గ్రాహంబెల్ మామగారైన, గార్డినెర్ జి. హబ్బర్డ్, రెండు టెలిఫోన్లు పెట్టి, వాటి ద్వారా రైలు ప్రయాణాన్ని నియంత్రించాడు. 1893: జర్మనీ లోని ఆగస్బుర్గ్ వద్ద 1893 ఆగష్టు 10, నాడు రుడాల్ఫ్ డీజిల్ యొక్క ప్రధాన మోడల్ (10 అడుగుల సిలిండర్, ఒక చక్రం) మొదటిసారి తన సొంత శక్తి (వేరుశనగ నూనె) తో పరుగులు పెట్టింది. ఈ కారణంగా, ఆగష్టు 10వ తేదీని ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం (ప్రపంచ శాకాహార నూనె దినోత్సవం)గా పాటిస్తున్నారు 1945: జపాన్ చక్రవర్తి హిరోహితో యొక్క హోదా, యధాతధంగా ఉంచితే, జపాన్, మిత్రరాజ్యాలకు లొంగిపోవటానికి, తన సుముఖతను, ప్రకటించింది 1948: అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఎ.బి.సి.) నెట్‌వర్క్ టి.వి దశ లోకి ప్రవేశించింది. 1958: యు.ఎస్.ఎస్. స్కేట్ అమెరికా యొక్క మూడవ అణు జలాంతర్గామి. ఇది, ట్రాన్స్-అట్లాంటిక్ (అట్లాంటిక్ మహాసముద్రం అవతల నుంచి ఇవతల వరకు) దాటింది. ఉత్తర ధృవం చేరిన రెండవ అణు జలాంతర్గామి. ఉత్తర ధృవం సముద్ర జలాల నుంచి పైకి వచ్చిన మొదటి అణు జలాంతర్గామి. 1961: అమెరికా సైన్యం మొట్టమొదటిసారిగా వియత్నాం దక్షిణ ప్రాంతంలో ఏజెంట్‌ ఆరెంజ్‌(ఎఒ)/ డయాక్సిన్ను చల్లడం ప్రారంభించి, 1971 మధ్య కాలానికి, నాల్గింట ఒక వంతు భూభాగంలో 61 శాతం విషపూరిత రసాయనాలు, 366 కిలోల డయాక్సిన్‌తో ఉన్న సుమారు ఎనిమిది కోట్ల లీటర్ల ఏజెంట్ ఆరంజ్ ను చల్లింది. దక్షిణ వియత్నాం పర్యావరణ వ్యవస్థను నాశనం చేసి, 48 లక్షల మంది వియత్నామీయులు ఏజెంట్ ఆరెంజ్ బారిన పడేలా చేసింది. ఆ దుష్ఫలితాలు రెండవ, మూడవ తరాలవారితో సహా సుమారు 30 లక్షల మంది ఇప్పటికీ బాధపడుతున్నారు. 1974: ఈనాడు తెలుగు దిన పత్రిక విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ జూలై=డిసెంబరు 2010 సర్వే ప్రకారం 16, 70, 750 కాపీలు పంపిణీ జరుగుతున్నది. 1988: నార్త్ సీ,, బాల్టిక్ సముద్రం లలో ఉన్న సీల్ జంతువులకు, విచిత్రమైన జబ్బు సోకి, 6000 సీల్ జంతువులు మరణించాయి. ఆ జబ్బు, బ్రిటిష్ జలాలలో ఉన్న సీల్ జంతువులకు కూడా సోకింది. 1988: ఐక్య రాజ్య సమితి, ఆసియా ఖండం యొక్క జనాభా 3 బిలియన్లు (300 కోట్లు) అని ప్రకటించింది. భారతదేశపు జనాభా, ఈ క్షణంలో కావాలి అంటే ఇక్కడ నొక్కండి. 1990: అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్ర గ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్ర గ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు. 2000: ప్రపంచ జనాభా పెరుగుదలను, ప్రతిక్షణం, గమనించే, ఇబిబ్లియో అనే వెబ్‌సైటు, ప్రపంచ జనాభా 6 బిలియన్లకు (600 కోట్లు) చేరుకుందని ప్రకటించింది. ప్రపంచ జనాభా గడియారం. ప్రపంచ జనాభా ఎంతో తెలుసుకోవాలి అంటే ఇక్కడ నొక్కండి. 2003: ఎన్నడూ లేని ఎండ వేడికి (100 డిగ్రీల పారెన్‌హీట్ కి పైనే) బ్రిటన్ వాసులు మల మల మాడిపోయారు. దేశంలోని, సముద్రపు ఒడ్డులు, జనసముద్రమే అయ్యాయి. రహదారులు అన్నీ, ట్రాఫిక్ మూలంగా, అదుపు తప్పాయి. 2009: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. జననాలు thumb|శంకరంబాడి సుందరాచార్యుల విగ్రహం. తిరుపతి 1782: ఛార్లెస్ జేమ్స్ నేపియర్, బ్రిటిష్ సైనిక దళాధిపతి (ఆర్మీ జనరల్) (మ.1853). 1855: అల్లాదియా ఖాన్ - హిందుస్తానీ సంగీతంలో జైపూర్- అత్రౌలీ ఘరానా పద్ధతిని ఆరంభించిన గాయకుడు.(మ.1946) 1874: హెర్బర్ట్ హూవర్ అమెరికా 31వ అధ్యక్షుడు (మ.1964) . 1894: వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి (మ.1980). 1914: శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత (మ.1977). 1918: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985). 1929: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి (మ.2017). 1932: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు (మ.2010). 1933: తుర్లపాటి కుటుంబరావు, పాత్రికేయుడు, రచయిత, వక్త. (మ. 2021) 1935: రఘునాథ పాణి గ్రాహి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత దర్శకుడు, గాయకుడు. 1939: చౌటి భాస్కర్, ప్రముఖ సంగీత విద్యాంసులు (మ. 1990) 1945: దేవబత్తుల జార్జి, తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, నాటక దర్శకుడు. (మ. 2021) 1946: కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు (మ.2015). 1961: సునీల్ శెట్టి , హిందీ, కన్నడ, మరాఠి, తెలుగు,తమిళ, మలయాళ నటుడు 1962: నందమూరి లక్ష్మీపార్వతి, రచయిత్రి, హరికథా కళాకారిణి, నందమూరి తారక రామారావు రెండవ భార్య. 1973: మాలాశ్రీ , తెలుగు, తమిళ ,కన్నడ, భాషల సినీనటి 2005: "ప్రణమ్య మెనారియ" 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి "దేవేంద్ర హర్నె" జననం 1995 జనవరి 9. మరణాలు 1945: రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (జ.1882) 1988: అరియాస్ అర్నుల్ఫో, పనామా దేశ అధ్యక్షుడు ( మూడు సార్లు) (జ.1901). 2021: జి. రాజ్ కుమార్, రాజకీయ నాయకుడు, జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటి మేయర్ (జ. 1953) పండుగలు , జాతీయ దినాలు 1893: ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం (ప్రపంచ శాకాహార నూనె దినోత్సవం) నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం డెంగ్యూ వ్యాధి నిర్మూలనా దినం. (ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు 10 తేదీల్లో ‘జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం’ చేపడుతోంది.) ప్రపంచ సింహాల దినోత్సవం . బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 10 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 9 - ఆగష్టు 11 - జూలై 10 - సెప్టెంబర్ 10 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 11
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_11
ఆగష్టు 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 223వ రోజు (లీపు సంవత్సరములో 224వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 142 రోజులు మిగిలినవి. సంఘటనలు 2008: బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి 2010: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి. 2013: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి యొక్క నవభారత యువభేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది. జననాలు 1926: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత, హోమియో వైద్యుడు (మ.1984). 1949: దువ్వూరి సుబ్బారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా (2008 - 2013) పనిచేశాడు. 1950: మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు. మరణాలు File:పైడి జైరాజ్ 1908: ఖుదీరాం బోస్, భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు (జ.1889). 1946: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు (జ.1918). 1962: పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు (జ.1900). 2000: పైడి జైరాజ్, భారత సినీరంగంలో నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1909). 2012: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకుడు, భాషాశాస్త్ర అధ్యాపకుడు (జ.1928). 2016: యాదాటి కాశీపతి, అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు, రచయిత. 2016: ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాల సాహిత్య రచయిత. (జ.1940). 2018: విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్, భారత సంతతికి చెందిన వ్యక్తి, సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహిత (జ. 1932). పండుగలు , జాతీయ దినాలు 1960 - చాద్ స్వాతంత్ర్యదినోత్సవము. - బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 11 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 10 - ఆగష్టు 12 - జూలై 11 - సెప్టెంబర్ 11 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 12
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_12
ఆగష్టు 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 224వ రోజు (లీపు సంవత్సరములో 225వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 141 రోజులు మిగిలినవి. సంఘటనలు 1851: ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, బోస్టన్లో వ్యాపారం మొదలుపెట్టాడు. 1936: ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, (ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య), ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో స్థాపించబడింది. 1976: లండన్ లోని నేషనల్ థియేటర్ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది. 1978: ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా అవతరించింది. 2009: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. 2010: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. 2010: రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది 2011: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు. జననాలు thumb|విక్రం సారాభాయ్ 1892: ఎస్.ఆర్.రంగనాథన్, భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972). ఇతడి పుట్టినరోజుని, భారతదేశం, జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించింది. 1892: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975) 1919: విక్రం సారాభాయ్, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971) 1930: జార్జ్ సోరోస్, హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి,, రాజకీయ ఉద్యమకారుడు. 1939: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (మ.2016) 1965: పల్లెర్ల రామ్మోహనరావు, కళాకారుడు, భజన కీర్తనల రచయిత. 1997: సాయేశా సైగల్, తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల నటి మరణాలు 30 బి.సి: క్లియోపాత్ర, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది (జ. 69 బి.సి.). ఈమెను ప్రపంచ సుందరిగా పిలుస్తారు.ఈజిప్ట్ మహారాణి 1944: కైవారం బాలాంబ, అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు (జ.1849). 1945: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి (జ.1878). 2009: మల్లవరపు జాన్, తెలుగు కవి (జ.1927). 2022: అన్షు జైన్ భారత సంతతికి చెందిన బ్యాంకర్‌. బ్రిటిష్ వ్యాపార కార్యనిర్వాహకుడు. (జ.1963) పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ ఏనుగుల దినోత్సవం అంతర్జాతీయ యువ దినోత్సవం జాతీయ గ్రంథాలయ దినోత్సవం (లైబ్రరీ డే) బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 12 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 11 - ఆగష్టు 13 - జూలై 12 - సెప్టెంబర్ 12 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 13
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_13
ఆగష్టు 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 225వ రోజు (లీపు సంవత్సరములో 226వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 140 రోజులు మిగిలినవి. సంఘటనలు 3114 బి.సి : మాయా కేలండర్ మొదలైన రోజు. మాయా నాగరికత అమెరికాలో వెల్లివిరిసింది 0533 : పోప్ జాన్-I ఎన్నికయాడు. 0554 : బైజాంటియమ్ చక్రవర్తి అయిన, జస్టినియాన్, ఇటలీ దేశ పునర్నిర్మాణం ప్రారంభించాడు. 0900 : లోరైన్ల రాజు అయిన జ్వెండిబోల్డ్ యుద్ధంలో మరణించాడు. 1099: పాస్చల్ II, పోప్గా ఎన్నికయ్యాడు. 1422: రెచుయెల్ ఆఫ్ ది హిస్టరీస్ ఆఫ్ ట్రాయ్ బోర్న్ అనే పుస్తకాన్ని,విలియం కాక్స్‌టన్, అనే ఇంగ్లీష్ ముద్రాపకుడు, ఇంగ్లీషు భాషలో, మొదటిసారిగా ముద్రించాడు. 1438: జాన్ నైడెర్, తత్వవేత్త, మరణం 1521: స్పానిష్ విజేత హీర్నాందో కోర్టేజ్, అజ్టెక్ ఇండియన్లు నుండి ఇప్పటి మెక్సికో నగరాన్ని, స్వాధీనం చేసుకున్నాడు. వారి నాయకుడు టెనోక్టిట్లాన్. 1587: వర్జీనియా లోని రోనోక్కి చెందిన, మాంటియో అనే మొదటి అమెరికా ఆదివాసి, ఇంగ్లాండ్ చర్చి లోకి, ఒక ప్రొటెస్టంట్గా మతం స్వికరించాడు (మొదటి మత మార్పిడి అమెరికాలో). సర్ వాల్టర్ రాలీ యొక్క "న్యూ వరల్డ్ యాత్ర" లోని సభ్యుల ద్వారా, అతని మత మార్పిడి జరిగింది. 1642: క్రిస్టియాన్ హుయ్గేన్స్, కుజగ్రహపు దక్షిణ ధ్రువం పైన ఉన్న శిఖారాన్ని (కేప్) గుర్తించాడు. 1654: ఫోల్లి జంతువుల మధ్య, మొదటి, రక్త మార్పిడి చేసాడు. 1846: అమెరికా జెండాను లాస్ ఏంజిల్స్లో మొదటిసారి ఎగరవేసారు. 1868:పెరూ, ఈక్వెడార్, బొలీవియా దేశాలలో భూకంపం, సునామీ వచ్చి 25,000 మంది మరణం. 300 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం 1889: నాణెం వేసి టెలిఫోన్ చేసే విధానానికి, విలియం గ్రే పేటెంట్ తీసుకున్నాడు. 1907: మొదటి టాక్సికేబ్ (అద్దెకారు), న్యూయార్క్ నగరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టింది. 1912: మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను, అమెరికా ప్రభుత్వపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, ఫిలడెల్ఫియా లోని సెయింట్ జోసెఫ్ కళాశాలకు మంజూరు చేసింది. 1913: స్టెయిన్‌లెస్ స్టీల్ని హారీ బ్రియర్లీ కనుగొన్నాడు. 1923: టర్కీ అధ్యక్షుడుగా ముస్తఫా కెమల్ ఎన్నికయ్యాడు. 1930: కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్, న్యూయార్క్ నుంచి, లాస్ ఏంజిల్స్ వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి, గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు. 1942: వాల్ట్ డిస్నీ యొక్క యానిమేటెడ్ ఫీచర్ బాంబి, న్యూయార్క్ నగరంలోని, రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో ప్రదర్శించారు. 1960: మొదటి సారిగా, టెలిఫోన్ ద్వారా, రెండువైపులా సంభాషణ "ఎకో వన్ ఉపగ్రహం సాయంతో జరిగింది. 1961: బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది. 1985: పోప్ జాన్ పాల్ II, కెమరూన్లో ఇచ్చిన, ఒక ఉపన్యాసంలో, ఆధునిక ఆఫ్రికన్లు, 400 సంవత్సరాల పాటు, లక్షల ఆఫ్రికన్లను, వారి ఇళ్ళనుంచి, ఎత్తుకొచ్చి, బానిసలుగా చేసిన, అమెరికా, యూరప్ ల లోని క్రైస్తవులను క్షమించాలని కోరాడు. 1987: బుల్ మార్కెట్ 5వ వార్షికోత్సవ్సం నాడు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ (డౌ జోన్స్ పారిశ్రామిక సగటు) 2700 పాయింట్ల వరకు ఎగిసి, 269149 వద్ద ముగిసింది 1990: ఇరాక్, కువాయిట్ని ఆక్రమించినందుకు, అమెరికా అధ్యక్షుడు బుష్, డిఫెన్స్ సెక్రటరీ డిక్ చెనీ ని, రెండవ సారి పెర్షియన్ గల్ఫ్ కు పంపాడు. సౌదీ అరేబియా లోని అమెరికన్ సైనిక దళాలు సుదీర్ఘ కాలం ఉండడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. 1990: కువైట్ నుండి స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీలు, వస్తువులు, ఇరాక్ బంగారం మార్కెట్ లో (బులియన్) లో $ 3 బిలియన్, $ 4 బిలియన్ మధ్య బదిలీ చేసినట్లు గా, లండన్ లోని అరబ్ బ్యాంకర్లు నివేదించారు 1994: హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, ఆస్పిరిన్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే, ఇది కోలోన్ కేన్సర్ (పెద్దప్రేగు కాన్సర్) ని కూడా నిరోధిస్తుంది 2004: 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్లో ప్రారంభమయ్యాయి. 2005: బురుండి లోని గతుంబ హత్యాకాండ (ఊచకోత) ను కార్యకర్తలు గుర్తుతెచ్చుకున్నారు. 2006: నెదర్లాండ్స్లో H5N1 బర్డ్ ఫ్లూని ధ్రువీకరించారు 2006: దావానలం, స్పెయిన్లో కొనసాగుతుంది 2006: అంతర్జాతీయ ఎయిడ్స్ సమావేశం, టొరంటోలో ప్రారంభమయ్యింది. 2007: అమెరికా దానశీలి, పరోపకారి బ్రూక్ ఏస్టర్ తన 105వ ఏట మరణించాడు 2007: భారతదేశం ఇంగ్లాండ్ మీద టెస్ట్ క్రికెట్ సిరీస్ లో విజయం పొందింది. 2007: ఉత్తర అర్థగోళంలో కనిపించే వార్షిక పెర్సెయిడ్స్ ఉల్కాపాతం 2007: ప్రపంచ డెఫ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్- డే 1: యూరోపియన్ ఈతగాళ్ళు పెరుగుతున్నారు. 2008: చైనా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల లోని కొంతభాగం మోస పూరితమని, అధికారులు, అంగీకరించారు. 2008: ఒలింపిక్ ముఖ్యాంశాలు: 2008 ఆగష్టు 13 2009: భారతదేశం H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి ముంబైలో మూసివేతలు ప్రారంభించింది. 2009: మహిళా బాక్సింగ్ ను మొదటిసారి 2012 ఒలింపిక్స్ లో చేర్చేందుకు నిర్ణయించారు. 2009: బ్రిటన్ లో నిరుద్యోగ సంఖ్య 2.4 మిలియన్లకు పెరిగింది. 2011: రాఖీ పండుగ; జంధ్యాల పౌర్ణమి; శ్రావణ పౌర్ణమి; సింహాచలం అప్పన్నకు కరాళచందనం సమర్పించే రోజు. జననాలు 1655: జోహన్ క్రిస్తోఫ్ డెన్నెర్, క్లారినెట్ను కనుగొన్న శాస్త్రవేత్త. 1818: లూసీ స్టోన్, సంఘ సంస్కర్త. 1860: అన్నీ ఓక్లే, షార్ప్ షూటర్. 1888: జాన్ బైర్డ్, టెలివిజన్ సాంకేతిక విజ్ఞానానికి మార్గదర్శకం చేసిన స్కాటిష్ శాస్త్రవేత్త (మ.1946). 1899: ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్, సినిమా దర్శకుడు, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్గా ప్రఖ్యాతుడు (మ.1980). 1925: ఎస్.వరలక్ష్మి, తెలుగు సినీ నటి,గాయని(మ.2009) 1926: ఫిడేల్ కాస్ట్రో రుజ్, క్యూబా దేశపు విప్లవకారుడు, నియంత (మ.2016). 1933: వైజయంతి మాల , హిందీ,తెలుగు,తమిళ, సినీ నటి, నర్తకి, పార్లమెంట్ సభ్యురాలు . 1934: ఎక్కిరాల వేదవ్యాస, ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు (మ. 2014).. 1952 : హిందీ చలనచిత్ర నటీమణి యోగీతా బాలీ జననం. 1954: రేణుకా చౌదరి, కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి. 1963: శ్రీదేవి, సినిమా నటి (మ. 2018). 1970: అలన్ షేరర్, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఇంగ్లాండు జాతీయజట్టులో స్ట్రైకర్‌గా ఆడాడు. 1975: షోయబ్ అక్తర్, పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు. 1986: అజయ్ భూపతి , తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత మరణాలు thumb|కుడి|రావు గోపాలరావు 1910: ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (జ.1820) 1936: భికాజి కామా, స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1861) 1978: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (జ.1896) 1988: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (జ.1916) 1994: రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1937) 2005: స్నిపర్, శ్రీలంక యొక్క విదేశాంగ మంత్రి. 2008: శాండీ అల్లెన్ , ప్రపంచంలో ఎత్తైన మహిళ (7' 7 1/4" (232 సెంటిమీటర్లు), (జ.1955) 2009: కార్ల్ వాన్ హేస్స్, అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్. 2018: సోమనాథ్ చటర్జీ, లోక్‌సభ మాజీ సభాపతి, కోల్‌కత్తాలో చనిపొయారు (జ. 1929). పండుగలు , జాతీయ దినాలు ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం 1960: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిచ్ స్వాతంత్ర్య దినోత్సవము. బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 13 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు ఆగష్టు 12 - ఆగష్టు 14 - జూలై 13 - సెప్టెంబర్ 13 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు వర్గం:అంతర్జాతీయ దినములు
ఆగష్టు 14
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_14
ఆగష్టు 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 226వ రోజు (లీపు సంవత్సరములో 227వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 139 రోజులు మిగిలినవి. సంఘటనలు 1862: బోంబే హైకోర్టు ప్రారంభం. 1947: భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. 2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది. జననాలు 1895: మాగంటి బాపినీడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాడు. 1923: కులదీప్‌ నయ్యర్‌, భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత. (మ.2018 ) 1927: మానాప్రగడ శేషసాయి, ఆకాశవాణి, దూరదర్శన్ వ్యాఖ్యాత. 1933: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (మ.2011) 1930: జాన నాగేశ్వరరావు, జనవాక్యం పత్రిక నడిపారు. 1946: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (మ. 2016) 1957: జానీ లీవర్: భారతీయ సినీ హాస్యనటుడు. 1966: హాలీ బెర్రీ, అమెరికన్ నటి. 1968: ప్రవీణ్ ఆమ్రే, భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు. 1982సుచిత్ర , తెలుగు నేపథ్య గాయనీ, నటి, రేడియో జాకీ. 1983: సునిధి చౌహాన్ , ప్లే బ్యాక్ సింగర్ మరణాలు thumb|షమ్మీ కపూర్ 1910: గాదె చిన్నప్పరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు. 1958: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900) 1994: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (జ.1934) 2010: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (జ.1934) 2011: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (జ.1931) 2012: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (జ.1945) 2015: గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1930) 2015: యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931) పండుగలు , జాతీయ దినాలు పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం- బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 14 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చారిత్రక దినములు. ఆగష్టు 14 - ఆగష్టు 15 - జూలై 14 - సెప్టెంబర్ 14 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 15
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_15
ఆగష్టు 15, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి. సంఘటనలు 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1822: 1822 జనాభా లెక్కలు ప్రకారం అప్పర్ కెనడాలో 1,20,000 మంది, లోయర్ కెనడా లో,500,000 మంది ప్రజలు నివసించేవారు. 1834: 1834 లో బ్రిటన్ పార్లమెంట్, చేసిన "సౌత్ ఆస్ట్రేలియా చట్టము" ప్రకారము, అక్కడ వలస (కోలనీ) ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి లభించింది. 1858: పసిఫిక్ సముద్రతీరప్రాంతానికి, ప్రతీ రోజూ ఉత్తరాల పంపిణీ జరగటం మొదలు అయ్యింది. 1889: ఆసియా లోనే, అతి పురాతనమైన, మోహన్ బాగన్ ఎ.సి. కలకత్తాలో స్థాపించబడింది. 1870: ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే మార్గము పూర్తి అయ్యింది. 1889: 15 ఆగష్ట్ నుంచి 16 సెప్టెంబరు వరకు జరిగిన ది గ్రేట్ లండన్ డాక్ స్ట్రైక్ వలన, బ్రిటిష్ ట్రేడ్ యూనియనిజం, నిపుణులైన కార్మికుల నుంచి, తక్కువ నిపుణత ఉన్న కార్మికులకు పాకింది. 1901: కాడిలాక్ మోటార్ కంపెనీ డెట్రాయిట్లో స్థాపించబడింది. 1914: అంకన్ అనే పేరుగల సరుకుల ఓడ (రవాణా ఓడ), అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం లోకి, పనామా కాలువ ద్వారా, ప్రయాణించటంతో, పనామా కాలువ ప్రారంభమైంది. 1944: ఫ్రాన్స్ దక్షిణాన, మిత్ర దేశాల దళాలు దిగి, మార్సీల్స్ పట్టణాన్ని, తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. 1938: ఆంధ్రప్రభ దినపత్రిక చెన్నై (నాటి మద్రాసు) లో, పారిశ్రామిక వేత్త రామనాధ్ గోయెంకా మొదలు పెట్టాడు. 1945: కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది. 1947: భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది. 1947: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ నియామకం. 1947 : పాకిస్తాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా మొదటి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా, కరాచీలో పదవిని స్వీకరించాడు. 1950: విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు. 1950: అస్సాంలో భూకంపం 8.6 రెక్టర్ స్కేల్ మీద. 1,000 మందికి పైగా మరణించారు. 1960: రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె), ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది. 1960: ముగ్గురు కాలిఫోర్నియా కాపలాదారులు, ఎగిరే పళ్ళాలు (గుర్తుపట్టలేని ఫ్లైయింగ్ వస్తువులు) చూసామని చెప్పారు. 1961: తూర్పు జర్మనీలో బెర్లిన్ గోడ కట్టటం మొదలైంది. జర్మనీ ప్రజలకు చీకటి రోజు 1965: లాస్ ఏంజిల్స్ లోని, జాతి కలహాలు నివారించటానికి, అమెరికాకి చెందిన నేషనల్ గార్డ్ని పిలిచారు. 1965: బీటిల్స్, న్యూయార్క్ లోని, షియా స్టేడియంలో పాటలు పాడారు. 1969: వుడ్ స్టాక్ సంగీత ఉత్సవం మాక్స్ యాస్గర్ ఫార్మ్లో ప్రారంభించారు. 1971: బహ్రెయిన్, బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. 1971: అమెరికా అధ్యక్షుడు నిక్సన్, జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు. 1974: దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న, దక్షిణ కొరియా, అధ్యక్షుడు పార్క్ చంగ్ హీ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో, దక్షిణ కొరియా, ప్రథమ మహిళ యూక్ యంగ్ సూ, మరణించింది. 1975: బంగ్లాదేశ్లో సైనిక కుట్ర. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు. 1977: ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ' లో "సెటి" ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని "వౌ సిగ్నల్" అనే పేరు పెట్టారు. 1983: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామ్ లాల్ నియమితులయ్యాడు. 2006: ఎయిడ్స్ సమావేశము : క్లింటన్, గేట్స్, అమెరికా అధ్యక్షుడి ప్రణాళికను సమర్ధించారు. 2006: శీతలీకరించిన వీర్యం పై చేసిన పరిశోధన, అంతరించి పోయిన పాలిచ్చే జంతువులు (మమ్మాల్స్) తిరిగి పునఃసృష్టి చేయగలమనే ఆశలు కలిగిస్తున్నది 2007: పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఇకా, పెరూ దేశంలోని పలుప్రాంతాలలో, భూకంపం, 8.0- (మేగ్నిట్యూడ్) రెక్టర్ స్కేల్ మీద వచ్చి, 514 మంది మరణించగా, 1,090 మంది గాయపడ్డారు.  జననాలు thumb|Jacques-Louis David 017 1769: నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి. (మ.1821) 1771: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. 1888: టి.ఇ. లారెన్స్, 'లారెన్స్ ఆఫ్ అరేబియా'; సైనికుడు, రచయిత 1889: దండు నారాయణరాజు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1944) 1895: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1955) 1902: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995) 1913: బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (మ.1994) 1914: పరశురామ ఘనాపాఠి వేదపండితుడు. (మ.2016) 1915: ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (మ.1994) 1924: మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (మ.2011) 1929: ద్వివేదుల విశాలాక్షి, కథా, నవలా రచయిత్రి. (మ.2014) 1931: నాగభైరవ కోటేశ్వరరావు, కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (మ.2008) 1935: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (మ.2013) 1945: రాళ్లపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు(మ.2019) 1949: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996) 1949: దేవిప్రియ, పాత్రికేయుడు, కవి (మ.2020). 1955: రాళ్ళపల్లి, తెలుగు సినిమా, రంగస్థల నటులు. (మ.2019) 1961: సుహాసిని, దక్షిణ భారత సినిమా నటి. 1961: పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. (మ.2015) 1964: శ్రీహరి, తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. (మ.2013) 1975: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ భరద్వాజ్ 1985: లయ (నటి), తెలుగు సినిమా నటీమణి. 1986: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009) మరణాలు 1935: అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవి, శతావధాని. (జ.1883) 1942: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (జ.1892) 1949: కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866) 2004: అమర్‌సిన్హ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1941). 2005: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (జ.1927) 2006: జి. వి. సుబ్రహ్మణ్యం, వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935) 2013: లాల్‌జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956). 2018: అజిత్ వాడేకర్, భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1941) ఆగష్టు 15: మహ్మద్ హబీబ్, తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. (జ. 1949) పండుగలు , జాతీయ దినాలు 1945: రెండవ ప్రపంచ యుద్ధం లో, ఓడిపోయిన, జపాన్, లొంగిపోయిన రోజు. 1947: భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవం. 1960: రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె) స్వాతంత్ర్య దినోత్సవము. 1971: బహ్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం. పశ్చిమ బెంగాల్ దినోత్సవం. బంగ్లాదేశ్ జాతీయ సంతాప దినం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 15 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చారిత్రక దినములు. ఆగష్టు 14 - ఆగష్టు 16 - జూలై 15 - సెప్టెంబర్ 15 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు
ఆగష్టు 16
https://te.wikipedia.org/wiki/ఆగష్టు_16
ఆగష్టు 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 228వ రోజు (లీపు సంవత్సరములో 229వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 137 రోజులు మిగిలినవి. సంఘటనలు 1953 - జననాలు 1909: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2006). 1912: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు, రచయిత (మ.1984). 1919: టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (మ.1986). 1920: కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (మ.2001). 1939: కాంచన , దక్షిణ భారతీయ చలనచిత్ర నటీమణి 1958: మడొన్నా (మడొన్నా లూయీ సిక్కోన్). అమెరికన్ నటి, పాటగత్తె, పాటల రచయిత్రి. 1970: మనీషా కోయిరాలా . తెలుగుచిత్రాలలోనటించిన నేపాల్ నటి. 1978: మంత్రి కృష్ణమోహన్, 2013 కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత. 1989: శ్రావణ భార్గవి, సినీ గాయని, అనువాద కళాకారిణి, గీత రచయిత్రి. మరణాలు thumb|Ramakrishna 1886: స్వామి రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (జ.1836) 1996: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (జ. 1909) 2001: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918) 2004: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (జ.1937) 2012: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930) 2018: అటల్ బిహారీ వాజపేయి, భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారత రత్న భాజపా నేత. (జ. 1924) 2020: రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (జ.1940) పండుగలు , జాతీయ దినాలు ప్రత్యక్ష కార్యాచరణ దినం . బెనింగ్టన్ యుద్ద దినం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 16 చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం. ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది. ఈ రోజున ఏమి జరిగిందంటే. చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు. ఈ రొజు గొప్పతనం. కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు చారిత్రక దినములు. ఆగష్టు 15 - ఆగష్టు 17 - జూలై 16 - సెప్టెంబర్ 16 -- అన్ని తేదీలు వర్గం:ఆగష్టు వర్గం:తేదీలు