title
stringlengths
1
90
url
stringlengths
31
120
text
stringlengths
0
504k
బ్రహ్మపుత్రా నది
https://te.wikipedia.org/wiki/బ్రహ్మపుత్రా_నది
thumb|240px|బ్రహ్మపుత్రా నది ఉపగ్రహ చిత్రం. thumb|240px|చిత్వాన్‌‌లో ఒక పడవ. బ్రహ్మపుత్ర (Brahmaputra river) (అస్సామీ భాష: ব্ৰহ্মপুত্ৰ, బెంగాలీ భాష: ব্রহ্মপুত্র} హిందీ భాష: ब्रम्हपुत्र, టిబెటన్ భాషཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) ఆసియాలోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం. టిబెట్లో నైఋతిన యార్లుంగ్ (Imperial blood) నదిగా పుట్టి, దక్షిణ టిబెట్ లో దిహాంగ్ నదిగా పారి, హిమాలయాలలోని లోతైన లోయలలోకి పరుగులు తీస్తుంది. నైఋతిలో అస్సాంలో ప్రవహించి, దక్షిణాన బంగ్లాదేశ్ లో జమునగా పారుతుంది. అక్కడా గంగా నదితో కూడి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. సుమారు 2900 కిలోమీటర్లు (1800 మైళ్ళు) పొడవున్న ఈ నది వ్యవసాయానికి జల మార్గాలకు ఉపయోగకరంగా ఉంది. దీని ఎగువ పారుదల ప్రాంతం చాలా రోజుల వరకు గుప్తంగా ఉంది. దీనికి జాంగ్ బో పెనులోయతో గల సంబంధం 1884-86 అన్వేషణ వల్లనే కనుగొనబడింది. ఇది ఇండియా లో మోగ వడి పేరుతో వున్నది ఈ నది దిగువ ప్రాంతము హిందువులకు పవిత్రమైనది. ఈ నది మెరుపు వరదలకు ప్రసిద్ధి. సాధారణంగా అలలు కేవలం సముద్రంలలోనే వస్తాయి. కానీ ప్రపంచంలో టైడల్ బోర్ (అలలపోటు) ను ప్రదర్శించే అరుదైన నదులలో ఇది ఒకటి. నదీ ప్రవాహ మార్గం టిబెట్‌లో ఉత్తర హిమాలయాలలోని కైలాస పర్వతం 100gogo.com ]</ref> దగ్గర జిమా యాంగ్ జాంగ్ హిమానీనదం<ref>The New Largest Canyon in the World from 100gogo.com లో పుట్టింది యార్లుంగ్ త్సాంగ్ పో నది. అక్కడి నుండి తూర్పు దిశగా సుమారు 1700 కిలో మీటర్లు, 4000 మీటర్ల ఎత్తున, ప్రయాణిస్తుంది. ఈ నది ప్రపంచంలోనే అన్ని నదులకన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత నంచా బార్వ పర్వతాన్ని చుడుతూ యార్లుంగ్ త్సాంగ్ పో పెనులోయను ఏర్పరుస్తుంది. ఈ పెనులోయ ప్రపంచంలోనే అత్యధిక లోతైనదిగా గుర్తించబడింది.Canyonlands of Tibet and Central Asia , from canyonsworldwide.com. భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్‌లో నది ప్రవేశించిన చోట ఈ నది పేరు సియాంగ్ అక్కడ చాలా ఎత్తు నుంచి చాల వేగంగా కిందికి దిగుతుంది. పర్వత పాద ప్రాంతంలో ఈ నదిని దిహంగ్ అంటారు. అక్కడ నుండి 35 కిలోమీటర్లు ప్రవహించాక దిబంగ్, లోహిత్ అనే మరో రెండు నదులతో సమాగమం అవుతుంది. ఈ సంగమ కేంద్రం నుండి ఈ నది చాలా వెడల్పు అవుతుంది, ఇక్కడ నుండి ఈ నది బ్రహ్మపుత్రగా పేరొందింది. సియాంగ్, దిబంగ్, లోహిత్ నదులు జల విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమైనవి. భారత ప్రభుత్వం వీటి మీద ఆనకట్టలు కట్టడానికి కృషి చేస్తోంది. అస్సాంలో ఈ నది వెడల్పు కొన్ని చోట్ల 10 కిలోమీటర్లు దాకా ఉంటుంది. జోర్హాత్ కి దగ్గరలో రెండు పాయలుగా విడిపోయి 100 కిలోమీటర్ల దిగువన కలవడం ద్వారా ఈ నది మజూలి అనే ద్వీపాన్ని ఏర్పరుస్తోంది. మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం. గౌహతి దగ్గర్లో హజో అనే గ్రామం దగ్గర షిల్లాంగ్ పీఠభూమిని కోసుకుంటూ ప్రవహించడంవల్ల నది వెడల్పు చాలా సన్నగా మారుతుంది. ఎన్నో శత్రు దాడులను ఎదుర్కోవడానికి ఈ విశాలమైన నది అస్సాంకి అండగా ఉండేది. నది సన్నబడ్డ ప్రాంతం దగ్గరే సరాయ్ ఘాట్ యుద్ధము జరిగింది. ఇక్కడ నదిపై నిర్మించిన రైలు రోడ్డు వంతెనకు సరాయ్ ఘాట్ వంతెన అని పేరు పెట్టారు. మజొలి ద్వీపం ఈ నది మధ్యలో ఉంది. ఇది జొర్హట్ కు సమీపంలో ఉంది. బ్రహ్మపుత్ర యొక్క పురాణ సంస్కృత నామం లౌహిత్య. దీనినుండే అస్సాంలో ఈ నదిని పిలిచే పేరు లుయిత్ వ్యుత్పత్తి చెందింది. స్థానికంగా అక్కడ నివసించే బోడోలు ఈ నదిని భుల్లం - బుతుర్, అని పిలుస్తారు. అంటే బోడో భాషలో 'గర గర శబ్దం చేసేది' అని అర్ధం. దీన్నే బ్రహ్మపుత్ర అని సంస్కృతీకరించారు. బంగ్లాదేశ్‌లో right|thumb| బంగ్లాదేశ్‌లో ముఖ్యమైన నదులను చూపే చిత్రపటం. ఇందులో బ్రహ్మపుత్రకు ఉపనదులైన 'జమున', 'దిగువ బ్రహ్మపుత్ర'లను చూడవచ్చును. బంగ్లాదేశ్ లో, బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునగా సాగి దిగువ గంగలో కలుస్తుంది, ప్రాంతీయులు దీనిని పద్మా నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా పారి మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ రెండు పాయలు చివరకు బంగ్లాదేశ్లోని చాంద్ పూర్ అనే ప్రదేశంలో కలిసి బంగాళా ఖాతంలోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగ, బ్రహ్మపుత్ర నదీ జలాలు గంగ - బ్రహ్మపుత్ర డెల్టాని ఏర్పరుస్తుంది. ఈ నది డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దదైనది. బ్రహ్మపుత్రపై చైనా జలవిద్యుత్‌ ప్రాజెక్టు బ్రహ్మపుత్ర నదిపై టిబెట్‌లో ఓ భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మిస్తోంది. బ్రహ్మపుత్రను టిబెట్‌లో త్సాంగ్‌పో నదిగా పిలుస్తారు. అక్కడ నామ్చా ప్రాంతంలో బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతి పెద్దదైన జలవిద్యుత్‌ ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. 26 టర్బైన్లతో పనిచేసే ఈ ఆనకట్ట గంటకు 40 మిలియను కిలోవాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది. 2009 మార్చి 16న దీనికి శంకుస్థాపన జరగగా మార్చి 16న పనులు ప్రారంభమయ్యాయి. చైనాలోని ఐదు పెద్ద విద్యుత్తు కంపెనీలు ఓ వ్యాపారకూటమిగా ఏర్పడి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాయి. ఇది పూర్తయితే ఇప్పటివరకు చైనాలో మొదటిస్థానంలో ఉన్న త్రీ గోర్జెస్‌ డ్యాం కంటే పెద్దదవుతుంది. బ్రహ్మపుత్ర నది భారత్‌, బంగ్లాదేశ్‌లకు ఎంతో ముఖ్యమైనది. భారతదేశంలో 40 శాతం జలవిద్యుత్తు అవసరాన్ని, 30 శాతం నీటి వనరుల అవసరాలని ఈ నది తీరుస్తోంది. బంగ్లాదేశ్‌లో అయితే మంచినీటికి, సేద్యానికి ఈ నదే ప్రధాన ఆధారం. దీనిపై భారత్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలను చైనా తోసిపుచ్చుతూ దీంతో తమకు సంబంధం లేదని అది పూర్తిగా ప్రైవేటు సంస్థల వ్యవహారమని పేర్కొంది. మరోవైపు ఆనకట్ట ఇంజనీర్లు మాత్రం ఇది పూర్తయితే భారత్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు చౌకగా విద్యుత్‌ సరఫరా చేయవచ్చని, బంగ్లాదేశ్‌కు వరదముప్పు తప్పుతుందని అంటున్నారు. (ఈనాడు16.10.2009) కాలుష్యము బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాప్తి చెంది కాలుష్యానికి కారణమవుతున్న మొక్క జలకుంభీ. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐవీఆర్ఐ) కొత్తరకమైన వానపామును అభివృద్ధి చేశారు. దీనిని వారు జై గోపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది సున్నా నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని జీవిస్తుం దని శాస్త్రవేత్తలు తెలిపారు. జలకుంభీ మొక్కలతో పాటు నీటిలోని నాచును ఇవి ఆహారంగా స్వీకరిస్తుందని ఐవీఆర్ఐ ప్రొఫెస ర్ రణవీర్ సింగ్ తెలిపారు. బ్రహ్మపుత్ర తీరంలో ఈ జలకుంభీ మొక్కల బెడదను తొలగించేందుకు ఇటీవలే గుహవటి ఐఐటీతో ఐవీఆర్ఐ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, వానపాముల అప్పగింత జరుగుతుందన్నారు. కాగా, జలకుంభీని ఆహారంగా స్వీకరించి ఈ వానపాము వెలువరిచే సేంద్రీ య ఎరువును టీ తోటల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుందట. అంతేకాదు చక్కెర మిల్లులలో వెలువడే రసాయనిక వ్యర్థాలను కూడా ఈ వానపాము ఆహారంగా స్వీకరిస్తుందన్నారు. నదీ ప్రయాణ సౌకర్యాలు 1947లో భారత దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ, బ్రహ్మపుత్రా నది ఒక పెద్ద జలమార్గంగా ఉపయోగించబడింది. ఎగువ అస్సాం లఖింపూర్ జిల్లాలోని సదియా నుంచి దిగువ అస్సాంలోని ధుబ్రి వరకూ జాతీయ జలమార్గం - 2 గ ప్రకటించబడింది. సరుకుల రవాణాకు ఈ మార్గం అనుగుణంగా ఉండేది. అస్సాం రాష్ట్ర ప్రధాన నగరమైన గౌహతి, గౌహతి, ఉత్తర గౌహతిగ బ్రహ్మపుత్ర నది వల్ల విభజించబడింది. ఉత్తర గౌహతికి పోవుటకు అత్యంత సౌకర్యమైనది నదీ మార్గమే. ఈ మధ్య కాలంలో చాలా నదీ క్రూజ్‌లు కూడా పెరిగాయి. అస్సాం బెంగాల్ నేవిగేషన్ చరైద్యూ అనే క్రూజ్ షిప్ ని కూడా నడుపుతోంది. మూలాలు మరిన్ని వనరులు బంగ్లాపీడియా:బ్రహ్మపుత్రా నది Banglapedia:Old Brahmaputra River Banglapedia:Brahmaputra-Jamuna River System Bibliography on Water Resources and International Law See Ganges and Brahmaputra Rivers section. Rivers of Dhemaji and Dhakuakhana Background to Brahmaputra Flood Scenario వర్గం:భారతదేశ నదులు
కృష్ణా నది
https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది
కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది. కృష్ణలో నీటి ప్రవాహం సెకనుకు 2213 మీ3 . నీటి ప్రవాహం పరంగా ఇది దేశంలో కెల్లా నాలుగవ పెద్ద నది. తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో, సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా కృష్ణానది జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1, 400 కి. మీ. ప్రయాణించి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రయాణం thumb|380x380px|కృష్ణానది సముద్రంలో కలిసే స్థలం - ఉపగ్రహ చిత్రం|alt= ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగ లు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. పడమటి కనుమలు దాటాక, జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలో ఘటప్రభ, మలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు, భీమా నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సూగూర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత ఆలంపూర్కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీ. ఇందులో మూడు పరీవాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది: మహారాష్ట్ర: 26.8% కర్ణాటక: 43.8% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: 29.4% కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు thumb|ప్రకాశం బ్యారేజి పనోరమ|alt=|380x380px కృష్ణా నదికి భారతదేశంలోని ఇతర నదుల వలెనే పౌరాణిక ప్రశస్తి ఉంది. ఎన్నో పుణ్య క్షేత్రాలు నది పొడుగునా వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి: శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయం. ప్రసిద్ధ శివక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, శ్రీశైలం. ఆలంపూర్ : అష్టాధశ శక్తి పీఠాలలో ఒకటైన ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు మొదలగు దేవాలయ సముదాయాలున్న ఆలంపూర్ చాళుక్య రాజుల ఆలయ శిల్ప నిర్మాణానికి అద్దం పడతాయి. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం (కనకదుర్గ) - విజయవాడ అమరావతి: అమరారామం ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటాడు. బౌద్ధుల ఆరామలకు కూడా ఇది ప్రసిద్ధి. మోపిదేవి: ఈ ప్రసిద్ధ క్షేత్రములో నాగ పూజలు చేస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద: సీతానగరం నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా వైకుంఠపురం వరకు కరకట్ట వెంబడి కృష్ణాతీరాన్ని ఆనుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి ఆశ్రమాన్ని కూడా నెలకొల్పారు.సీతానగరంలో శ్రీ మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయం, 1982లో అయిదెకరాల విస్తీర్ణంలో శ్రీ జీయరుస్వామివారు ఆశ్రమాన్ని నెలకొల్పారు. 2001 ఫిబ్రవరి 6వ తేదీన రామకృష్ణమిషన్‌ను ఇక్కడే ఏర్పాటు చేశారు. శ్రీ జయదుర్గా తీర్థాన్ని 1986లో దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్థాపించారు.ఇస్కాన్ మందిరంలో విదేశీ భక్తులు సైతం కృష్ణ భజనల్లో మునిగి తేలుతుంటారు. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేశారు.తాళ్లాయపాలెం లోశ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రాన్ని ఏడెకరాల విస్తీర్ణంలో విజయవాడకు చెందిన శ్రీ బ్రహ్మచారి శివస్వామి 2004లో నెలకొల్పారు. ఈ క్షేత్రంలో అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాదరస స్పటిక లింగాలు వుండడం ఓ విశేషం. ప్రాజెక్టులు కృష్ణా నది పరీవాహక రాష్ట్రాలు మూడూ కూడా విస్తృతంగా సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకున్నాయి. వీటిలో ముఖ్యమైనవి: కర్ణాటక అలమట్టి ప్రాజెక్టు నారాయణపూర్ ప్రాజెక్టు పై రెంటినీ కలిపి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అని అంటారు. తెలంగాణ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు : కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తరువాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. [Jogulamba gadwal district], రేవులపల్లి సమీపంలో నిర్మించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నాగార్జునసాగర్ ప్రాజెక్టు : కృష్ణానదిపై కల ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. గుంటూరు (ఆంధ్ర ప్రదేశ్‌), నల్గొండ (తెలంగాణ) జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టును 1956లో ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు : కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ పులిచింతల ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజి వరదలు 2009 అక్టోబరులో కృష్ణానదికి వచ్చిన వరదల్లో 350 గ్రామాలు మునిగిపోయి లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీన్ని వెయ్యేళ్ళ వరదగా భావిస్తున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఈ వరద బీభత్సం సృష్టించింది. కర్నూలు నగరం మొత్తం దాదాపు 3 రోజుల పాటు 3 మీటర్ల వరద నీటిలో మునిగిపోయి ఉంది. కృష్ణా నది శ్రీశైలం ఆనకట్ట పైగా ప్రవహించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద 11,10,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 1903 లో నమోదైన 10,80,000 క్యూసెక్కుల ప్రవాహ రికార్డును ఇది మించిపోయింది. ఇవి కూడా చూడండి కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ భౌగోళిక చరిత్ర కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ బయటి లంకెలు ఎన్‌కార్టాలో కృష్ణానది పటము కృష్ణానది సంగమం - గూగుల్ నుండి కృష్ణానదిలో కాలుష్యం కృష్ణా డెల్టా - నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ వారి సైట్ నుండి మూలాలు వెలుపలి లంకెలు వర్గం:భారతదేశ నదులు వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు వర్గం:తెలంగాణ నదులు వర్గం:కర్ణాటక నదులు వర్గం:మహారాష్ట్ర నదులు వర్గం:మహబూబ్ నగర్ జిల్లా నదులు వర్గం:కర్నూలు జిల్లా నదులు వర్గం:నల్గొండ జిల్లా నదులు వర్గం:కృష్ణా జిల్లా నదులు
కావేరి నది
https://te.wikipedia.org/wiki/కావేరి_నది
right|thumb|శ్రీరంగ పట్నం వద్ద నిండుగా ప్రవహిస్తున్న కావేరీ నది కావేరి నది (Kaveri river) (కన్నడ: ಕಾವೇರಿ ನದಿ, తమిళం: காவேரி ஆறு) భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం కర్ణాటక, లోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం. ఉపయోగాలు కావేరి నదిలోని నీరు ముఖ్యంగా వ్యవసాయానికి, గృహావసరాలకు, విద్యుదుత్పత్తికీ ఉపయోగిస్తారు. నదిలోకి నీరు ముఖ్యంగా ఋతుపవనాల కారణంగా కలిగే వర్షాలవల్లనే లభిస్తుంది ఈ నదిపై నిర్మించబడిన కృష్ణ రాజ సాగర్ డ్యామ్, మెట్టూర్ డ్యామ్, మొదలైనవి ఋతుపవనాల సమయంలో నీరు నిల్వచేసి వర్షాభావ పరిస్థితుల్లో విడుదల చేయబడుతాయి.u r హిందూ మతంలో కావేరి ప్రాముఖ్యత బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న, ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. తుల సంక్రమణం అనే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొను వేలాది మంది భక్తులు ఇక్కడ గల మూడు దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ నీరు ఫౌంటెయిన్ లాగా ఎగజిమ్ముతూ ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. పరీవాహక ప్రాంతాలు చందనం అడవులకు పేరు గాంచిన,, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకొనే కూర్గ్ ఈ నదీమతల్లి వరప్రసాదమే.శ్రీరంగ పట్టణం ఈనది ఒడ్డునే నెలకొని ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రములు శ్రీరంగం, కుంభకోణం ఈనది ఒడ్డునే నెలకొని ఉన్నాయి.. బృందావన్ గార్దెన్స్ ఈ నది వొడ్దు న ఉన్నాయి. కావేరి జల వివాదం ఈ నదీ జలాల వినియోగ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొని ఉంది. తమిళనాడు రాష్ట్రం చాలాకాలంగా ఈ నదీ జలాలను విస్తారంగా వాడుకుంటుండగా, కర్ణాటక దీన్ని చారిత్రక తప్పిదంగా భావిస్తోంది. 2023 వ సంవత్సరం లో ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరింది. బయటి లింకులు 2017 కావేరి కావేరి పుష్కరాలు సమాచారం కావేరి నది గురించి ఫేమస్ ఇండియా.కామ్ లో కావేరి గురించి మ్యాప్స్ ఆఫ్ ఇండియా లో వర్గం:భారతదేశ నదులు వర్గం:కర్ణాటక నదులు వర్గం:తమిళనాడు నదులు
నర్మదా నది
https://te.wikipedia.org/wiki/నర్మదా_నది
thumb|200px|right|Districts of central Gujarat నర్మదా లేదా నేర్‌బుడ్డా మధ్య భారత దేశము గుండా ప్రవహించే నది. సాంప్రదాయకముగా ఈ నది ఉత్తర, దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తున్నది. ఈ నది మొత్తము 1,289 కిలోమీటర్లు పొడవున ప్రవహించుచున్నది. భారత ద్వీపకల్పములో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే మూడే మూడు నదులలో ఇది ఒకటి. మిగిలిన రెండు తపతి నది, మహి నది. నర్మద భారత దేశములో రిఫ్ట్ లోయ వెంటా ప్రవహించే ఏకైక నది. మధ్య ప్రదేశ్ రాష్ట్రములోని అమర్‌కంఠక్ పర్వతాల్లో పుట్టి మొదటి 320 కిలోమీటర్లు సాత్పూరా శ్రేణుల పైభాగమున ఉన్న మాండ్ల కొండలలో మెలికలు తిరుగుతూ ప్రవహించి, జబల్‌పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య, సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుండి పశ్చిమంగా ప్రవహించి కాంబే గల్ఫ్ను చేరుతున్నది. నర్మద మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రములో కలుస్తుంది. నదీప్రవాహిత ప్రాంతం thumb|నర్మదా కుండం, (అమరకంటక) thumb|తిలవారా పర్వతమార్గం వద్ద నర్మదా నది (జబల్పూరు) thumb|ఓంకారేశవరులో నర్మదా నది thumb|The River Narmada flows through a gorge of Marble rocks in Bhedaghat thumb|Side view of the Dhuandhar Falls seen during the monsoon season. నర్మదా మూలం ఒక చిన్న జలాశయం. దీనిని నర్మదా కుండం అని పిలుస్తారు. ఇది తూర్పు మధ్యప్రదేశులోని షాడోలు జోను అనుప్పూరు జిల్లాలోని అమరకంటక పీఠభూమిలోని అమరకంటక వద్ద ఉంది.Chadhar, Mohanlal (2017), Amarakantak kshetra ka puravaibhava, SSDN, Publisher and Distributor, New Delhi, ఈ నది సోన్మడు నుండి దిగి తరువాత కపిల్ధర జలపాతం రూపంలో కొండ మీద పడి కొండలలో ప్రవహిస్తుంది. రాళ్ళు, ద్వీపాలను దాటి రాం నగరు శిధిల ప్యాలెసు వరకు ఒక కఠినమైన కోర్సు గుండా ప్రవహిస్తుంది. రాంనగరు, మాండ్ల మధ్య (25 కి.మీ (15.5 మైళ్ళు)) ప్రవహించి మరింత ఆగ్నేయంలో ఈ ప్రవాహం తులనాత్మక రాతి అడ్డంకులరహితంగా లోతైన నీటితో ప్రవహిస్తుంది. ఇక్కడ ఎడమ వైపు నుండి బ్యాంగరు సంగమిస్తుంది. తరువాత ఈ నది జబల్పూరు వైపు ఇరుకైన లూపులో వాయువ్య దిశగా ప్రవహిస్తుంది. ఈ నగరానికి దగ్గరగా, ధుంధర (పొగమంచు పతనం) అని పిలువబడే జలపాతంగా కొన్ని (9 మీ (29.5 అడుగులు)) పతనం తరువాత ఇది (3 కిమీ (1.9 మైళ్ళు)) లోతైన ఇరుకైన కాలువలో మెగ్నీషియం సున్నపురాయి ద్వారా ప్రవహించి, పాలరాతి శిలలు అని పిలువబడే బసాల్టు రాళ్ళు; సుమారు 90 మీ (295.3 అడుగులు) వెడల్పు నుండి ఇది (18 మీ (59.1 అడుగులు)) కాలువగా కుదించబడుతుంది. ఈ కేంద్రం దాటి అరేబియా సముద్రం వరకు, నార్మాడ ఉత్తరాన వింధ్య పర్వతసానువులు, దక్షిణాన సాత్పురా శ్రేణి మధ్య మూడు ఇరుకైన లోయల్లోకి ప్రవేశిస్తుంది. లోయ దక్షిణ పొడిగింపు చాలా ప్రదేశాలలో విస్తృతంగా ఉంది. ఈ మూడు లోయ విభాగాలు స్కార్పులు, సత్పురా కొండల దగ్గరికి ద్వారా వేరు చేయబడ్డాయి. thumb|right|నర్మదా నదీతీరాలలోని పాలరాతి శిలలు పాలరాతి శిలల నుండి ఉద్భవించిన ఈ నది దాని మొదటి సారవంతమైన ముఖద్వారంలోకి ప్రవేశిస్తుంది. ఇది దక్షిణాన 320 కిమీ (198.8 మైళ్ళు), సగటు వెడల్పు 35 కిమీ (21.7 మైళ్ళు) తో ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్తరప్రవాహం లోయ హోషంగాబాదు ఎదురుగా ఉన్న బర్ఖారా కొండల వద్ద ముగిసే బర్నా-బరేలి మైదానానికి పరిమితం చేయబడింది. అయినప్పటికీ కొండలు మళ్ళీ కన్నోడు మైదానంలో వెనుకకు వస్తాయి. నదీతీరాలు సుమారు (12 మీ (39.4 అడుగులు) ఎత్తులో ఉన్నాయి. నర్మదా మొదటి లోయలో దక్షిణాన ఉన్న అనేక ముఖ్యమైన ఉపనదులు దానితో చేరతాయి. సత్పురా కొండల ఉత్తర లోయల నీటిని తీసుకువస్తాయి. వాటిలో: షేరు, షక్కరు, దుధి, తవా (అతిపెద్ద ఉపనది), గంజాలు. ఉత్తరం నుండి ఉపనదులు హిరాను, బర్నా, కోరలు, కరం, లోహారు సంగమిస్తాయి. హండియా, నెమావరు నుండి హిరాను జలపాతం (జింకల లీపు) క్రింద, నదికి రెండు వైపుల నుండి కొండలు చేరుతాయి. ఈ విస్తరణలో నది పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. శివుడికి పవిత్రమైన ఓంకరేశ్వర ద్వీపం మధ్యప్రదేశులోని అతి ముఖ్యమైన నదీ ద్వీపం ఉంటుంది. మొదట అవరోహణ వేగంగా ఉంటుంది. ప్రవాహం వేగంతో వేగంగా రాళ్ళ అడ్డంకి పైకి వెళుతుంది. సిక్తా, కావేరి ఖండ్వా మైదానం క్రింద చేరతాయి. రెండు పాయింట్ల వద్ద, నెమవరు క్రింద 40 కి.మీ (24.9 మైళ్ళు), పునాసా సమీపంలో 40 కి.మీ (24.9 మైళ్ళు) దూరంలో ఉన్న దాద్రాయి వద్ద నది సుమారు 12 మీ (39.4 అడుగులు) ఎత్తులో వస్తుంది. further down near Punasa, the river falls over a height of about . thumb|right|Narmada River at full flow during monsoon in Bhedaghat. బరేలి సమీపంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆగ్రా నుండి ముంబై రహదారి, జాతీయ రహదారి 3 దాటిన పర్వమార్గం తరువాత నర్మదా మాండలేశ్వరు మైదానంలోకి ప్రవేశిస్తుంది. రెండవ ముఖద్వారం 180 కిమీ (111.8 మైళ్ళు) పొడవు, 65 కిమీ (40.4 మైళ్ళు) వెడల్పు ఉంటుంది. బేసిను ఉత్తర స్ట్రిపు 25 కిమీ (15.5 మైళ్ళు) మాత్రమే ఉంటుంది. రెండవ లోయ విభాగం సహేశ్వర ధారాజలపాతం ద్వారా మాత్రమే విచ్ఛిన్నమైంది. మార్కారి జలపాతం వరకు సుమారు 125 కి.మీ (77.7 మైళ్ళు) ప్రారంభ కోర్సు మాల్వా ఎత్తైన పీఠభూమి నుండి గుజరాతు మైదానం వరకు రాపిడ్ల వరుసతో కలుస్తుంది. ఈ బేసిను పడమర వైపు కొండలు చాలా దగ్గరగా ఉంటాయి. కాని త్వరలోనే భూతలానికి సమానంగా కిందకు చేరుకుంటాయి. మక్రై క్రింద నది వడోదర జిల్లా, నర్మదా జిల్లా మధ్య ప్రవహిస్తుంది. తరువాత గుజరాతు రాష్ట్రంలోని భరూచి జిల్లా గొప్ప మైదానం గుండా వెళుతుంది. నదీతీరాల మద్య పాత ఒండ్రు నిక్షేపాలు, గట్టిపడిన మట్టి, నోడ్యులరు సున్నపురాయి, ఇసుక కంకరల అధికంగా ఉన్నాయి. నది వెడల్పు మక్రై వద్ద 1.5 కిమీ (0.9 మైళ్ళు) నుండి భరూచు సమీపంలో 3 కిమీ (1.9 మైళ్ళు) వరకు, గల్ఫు ఆఫ్ కాంబే వద్ద 21 కిమీ (13.0 మైళ్ళు) వరకు విస్తరించి ఉంది. ప్రస్తుత నది నుండి 1 కిమీ (0.6 మైళ్ళు) నుండి 2 కిమీ (1.2 మైళ్ళు) దక్షిణాన ఉన్న నది పాత కాలువ భరూచి క్రింద చాలా స్పష్టంగా ఉంది. అసలు ప్రవాహంలో కరంజను, ఓర్సింగు చాలా ముఖ్యమైన ఉపనదులుగా ఉన్నాయి. పూర్వం రుంధు వద్ద, తరువాతి గుజరాతులోని వడోదర జిల్లాలోని వ్యాసు వద్ద ఒకదానికొకటి ఎదురుగా చేరి నర్మదా మీద త్రివేణి (మూడు నదుల సంగమం) ఏర్పడుతుంది. అమరావతి, భుఖీ ఇతర ప్రాముఖ్యత కలిగిన ఉపనదులు ఉన్నాయి. భుఖీ నోటికి ఎదురుగా అలియా బెటు లేదా కడారియా బెటు అని పిలువబడే పెద్ద డ్రిఫ్టు ఉంది. భరుచి పైన 32 కి.మీ (19.9 మైళ్ళు) వరకు టైడలు పెరుగుదల కనిపిస్తుంది. ఇక్కడ చక్కటి ఆటుపోట్లు ఒక మీటరు, స్ప్రింగు టైడు 3.5 మీ (11.5 అడుగులు) వరకు పెరుగుతాయి. భారుచి వరకు 95 టన్నుల (అంటే 380 బొంబాయి క్యాండీలు), షమ్లపిత, ఘాంగ్డియా వరకు 35 టన్నుల (140 బొంబాయి క్యాండీలు) ఓడల కోసం ఈ నది ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. గుజరాతులోని తిలకావాడ వరకు చిన్న ఓడలు (10 టన్నులు) ప్రయాణిస్తాయి. నోటి వద్ద, భారుచి వద్ద ఇసుక స్థావరాలు, షోల్సు ఉన్నాయి. నర్మదా నదిలో సమీపంలోని కబీర్వాడు ద్వీపంలో ఒక భారీ మర్రి చెట్టు ఉంది. ఇది 10,000 చ.మీ (2.5 ఎకరాలు) విస్తరించి ఉంది. . మూలాలు వర్గం:భారతదేశ నదులు వర్గం:మధ్యప్రదేశ్ నదులు వర్గం:మహారాష్ట్ర నదులు వర్గం:గుజరాత్ నదులు
కాశ్మీరీ భాష
https://te.wikipedia.org/wiki/కాశ్మీరీ_భాష
For other uses, see Kashmiri (disambiguation) కాశ్మీరీ (कॉशुर, کٲشُر కాషుర్) ఒక దార్దీ భాష, ప్రధానంగా భారతదేశం లోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని కాశ్మీరు లోయప్రాంతంలో మాట్లాడబడుచున్నది. ఈభాషను మాట్లాడేవారు దాదాపు 7,147,587 మంది గలరు: ఇందులో 6,797,587 మంది భారతదేశంలోనూ, 353,064 మంది పాకిస్తాన్ లోనూ గలరు. ఈ భాష ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన ఇండో-ఆర్యన్ భాషలుకు చెందింది. భౌగోళికపరంగా దీనిని ఉప-వర్గం దార్దీ భాష ల క్రమంలోనూ ఉంది. భారతదేశపు 23 అధికారికభాషలలో కాశ్మీరీ కూడా ఒకటి. మూలాలు వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు వర్గం:భారతీయ భాషలు
కొంకణి భాష
https://te.wikipedia.org/wiki/కొంకణి_భాష
thumb|దేవనాగరి లిపిలో "కొంకణి" అనే పదం కొంకణి[note 4] అన్నది ఇండో యూరోపియన్ వర్గానికి చెందిన ఇండో ఆర్యన్ భాష, దీన్ని భారతదేశపు నైఋతి తీరమంతా మాట్లాడతారు. భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్లో ప్రస్తావించిన 22 షెడ్యూల్డ్ భాషల్లో ఇది ఒకటి. గోవా రాష్ట్రానికి ఇది అధికారిక భాష. ప్రస్తుతం లభిస్తున్న మొట్టమొదటి కొంకణీ శాసనం సా.శ. 1187 నాటిది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర కేరళ (కాసర్ గోడ్ జిల్లా), దాద్రా నగరు హవేలీ, డామన్ డయ్యుల్లో ఇది మైనారిటీ భాష. కొంకణీ దక్షిణ ఇండో-ఆర్యన్ భాషా కుటుంబంలోనిది. ఇది ప్రాచీన ఇండో-ఆర్యన్ భాషా నిర్మాణాలను నిలబెట్టుకుంది, తూర్పు, పశ్చిమ ఇండో-ఆర్యన్ భాషలు రెంటితోనూ సాపత్యం కలిగివుంది. భాష పేర్లు ప్రాచీన కొంకణీ భాషను కేవలం ప్రాకృత్ అని ఆ భాషా వ్యవహర్తలు పిలిచేవారు అనడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలోని శ్రావణబెళగొళ ప్రాంతంలో ఉన్న బాహుబలి భారీ విగ్రహం పాదాల వద్ద చెక్కిన వాక్యాల్లో ఉన్న రెండు లైన్లు ఇలా ఉన్నాయి: (i) శ్రీ చాముండరాజె కరవియలె (ii) శ్రీ గంగ రాజె సుత్థలె కరవియలె. మొదటి వాక్యం సా.శ. 981లోనూ, రెండవ వాక్యం సా.శ.1116-17ల్లోనూ చెక్కారు. డాక్టర్ ఎస్.బి.కులకర్ణి, డాక్టర్ జోస్ పెరైయాల ప్రకారం ఈ వాక్యాల్లోని భాష కొంకణీ. ఈ వాదాలను పరిగణనలోకి తీసుకుంటే శ్రావణ బెళగొళలో ఉన్నది దేవనాగరి లిపిలోని అత్యంత ప్రాచీన కొంకణీ శాసనం. 13వ శతాబ్దికి పూర్వపు సాహిత్యంలో కొంకణీ అన్న పదం లభించదు. 13వ శతాబ్దికి చెందిన మరాఠీ కవి నామదేవుడు రాసిన 263వ అభంగలో కొంకణీ అన్న పదం మొదటగా కనిపిస్తోంది. కొంకణీ భాషకు కేనరిమ్, కాంకనిం, గోమంతకి, బ్రామన, గోవని వంటి పేర్లు కూడా ఉన్నాయి. అమ్చీ భాస్ (మన భాష) అని కూడా స్థానిక భాషా వ్యవహర్తలు (దక్షిణ కన్నడ ప్రాంతంలో అమ్చి గెలె అంటారు), ఇతరులు గోవి, గోయెన్చీ భాస్ అనీ ఈ భాషని పిలుస్తూంటారు. విద్యావంతులైన మరాఠీ భాషీయులు దీన్ని గోమంతకి అని వ్యవహరిస్తారు.M. Saldanha 717. పోర్చుగీసు వారు కొంకణీని సాధారణంగా లింగ్యువా కేనరిమ్ అనీ, కేథలిక్ మిషనరీలు లింగ్యువా బ్రాహ్మణ అనీ పిలిచేవారు. తర్వాతికాలంలో పోర్చుగీసు వారు కొంకణీని లింగ్యువా కొంకనిం అని పిలువనారంభించారు. కేనరిమ్ లేదా లింగ్యువా కేనరిమ్ అన్న పదాన్ని 16వ శతాబ్దికి చెందిన యూరోపియన్ జెసూట్ థామస్ స్టీఫెన్స్ తన ప్రఖ్యాత రచన ఆర్టె దె లింగ్యువా కేనరిమ్ పేరులోనే కొంకణి భాషను సూచిస్తూ వాడారు. ఈ పదం పర్షియన్ భాషలో సముద్ర తీరాన్ని సూచించే కినారా అన్న పదం నుంచి వచ్చివుండొచ్చు. సముద్ర తీరపు భాష అన్న అర్థం వస్తుంది. కన్నడ భాషను పిలిచే కినారీస్ అన్న పదంతో పొరబడేందుకు అవకాశం ఇస్తోంది.Arte Canarina na lingoa do Norte. అందరు యూరోపియన్ రచయితలు గోవా భాషలో రెండు రూపాలను గమనించారు: సామాన్యుల భాషయైన కెనరిమ్, విద్యావంతులు వాడే లింగ్యువా కెనారిమ్ బ్రాహ్మణా లేదా బ్రాహ్మణా దె గోవా. వ్రాతకు, సభల్లో మాట్లాడేందుకు, మతపరమైన కార్యకలాపాలకు బ్రాహ్మణా దె గోవానే యూరోపియన్లు, ఇతర కులాల వారూ ఉపయోగించేవారు.Mariano Saldanha, "História de Gramática Concani," Bulletin of the School of Oriental Studies 8 (1935–37) 715. చరిత్ర వ్యుత్పత్తి కొంకణ్, కొంకణీ అన్న పదాల వ్యుత్పత్తి గురించి వివిధ అభిప్రాయాలు, వాదనలు ఉన్నాయి. కొంకణీ భాష ప్రారంభమైన ప్రాంతంలో మొదటి నుంచీ నివాసం ఉంటున్న కుక్కణ జాతి పేరు నుంచి కొంకణ్ అన్న పేరు వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు సముద్రంలోకి బాణం సంధించి అది పడిన చోటు వరకూ సముద్రాన్ని వెనక్కి వెళ్ళిపొమ్మన్నాడనీ, అలా బయటకు తేలిన కొత్త భూభాగాన్ని కోణ (మూల), కణ (భాగం) అంటూ మూల భూభాగం అన్న అర్థంలో కొంకణ్ అన్నారనీ, ఆ ప్రాంతపు భాషకు కొంకణీ అయిందని చెప్తారు. ఈ గాథ స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కనిపిస్తుంది. కొంకణ్ అన్నది కొంకణీ అన్నదానికి సమానార్థకం కానీ ప్రస్తుతం కొంకణీ మాట్లాడే ప్రాంతం మహారాష్ట్ర (కొంకణ్ ప్రాంతం), గోవా, కర్ణాటక (ఉత్తర కర్ణాటక) ప్రాంతాలుగా విడిపోయింది.. Footnotes References ఇవి కూడా చూడండి కొంకణ్ హోటల్స్ కోంకణ్ వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు
గుజరాతీ భాష
https://te.wikipedia.org/wiki/గుజరాతీ_భాష
thumb|డబెస్తాన్-ఇ మజాహెబ్ యొక్క గుజరాతీ అనువాదం నుండి ఒక పేజీని ఫర్దుంజీ మార్జ్బాన్ (25 డిసెంబర్ 1815) సిద్ధం చేసి ముద్రించారు. ఘూర్జరభాష, లేదా ఘూర్జరం, స్థానికంగా గుజరాతీ (ગુજરાતી) ఒక ఇండో-ఆర్య భాష, ఇండో-ఐరోపా భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది. భారతదేశపు గుజరాత్ రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ , అధికారికభాష. గుజరాత్లోనూ, దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యులోనూ మాట్లాడే భాష ఇది. ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది ఘూర్జరం మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష (రోమానీ , సింధీ భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్య భాష. భారత జాతిపిత మహాత్మాగాంధీ, పాకిస్తాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ల ప్రథమభాష ఘూర్జరం. ధ్వనిశాస్త్రం అచ్చులు +అచ్చులుతాలవ్యమధ్యకంఠ్యసంవృతiuఅర్ధ సంవృతeəoఅర్ధ వివృతɛɔవివృత(æ)ɑ హల్లులు +హల్లులుఓష్ఠ్యదంత్య/దంతమూలీయమూర్ధన్యదంతమూలం వెనక్కి/తాలవ్యకంఠ్యకంఠ్యమూలీయఅనునాసికmnɳɲస్పర్శ/స్పర్శోష్మశ్వాస అల్పప్రాణptʈtʃkనాద అల్పప్రాణbdɖdʒɡశ్వాస మహాప్రాణpʰtʰʈʰtʃʰkʰనాద మహాప్రాణbʱdʱɖʱdʒʱɡʱఊష్మశ్వాస(f)sʃనాద(z)ɦఅంతస్థʋlɭ̆jఫ్లాపుɾ ఇవి కూడ చూడండి ప్రియా సారయ్య మూలాలు వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు వర్గం:భారతీయ భాషలు
మరాఠీ భాష
https://te.wikipedia.org/wiki/మరాఠీ_భాష
మరాఠీ (मराठी ) ఒక ఇండో-ఆర్యన్ భాష, దీనిని పశ్చిమ భారతదేశంలోని మరాఠీ ప్రజలు ఉపయోగిస్తారు. ఇది మహారాష్ట్ర యొక్క అధికార భాష. ప్రపంచంలో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఈ భాష మాట్లాడుతారు. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో నాలుగవ స్థానంలో ఉంది.Abstract of Language Strength in India : 2001 Census , ప్రపంచంలో 15వ భాష.. బెంగాలీ భాషతో బాటు మరాఠీ భాష కూడా ఇండో-ఆర్యన్ భాషలలో ప్రాచీన ప్రాంతీయ భాష. ఇది క్రీ.శ్. 1000 నుండి మాట్లాడబడుచున్నది.arts, South Asian." Encyclopædia Britannica. Encyclopædia Britannica 2007 Ultimate Reference Suite. మరాఠీ 1300 సంవత్సరాల వయస్సు గలది,, సంస్కృతం నుండి "ప్రాకృతం" , అపభ్రంశ ద్వారా ఆవిర్భవించింది. దీని గ్రామరు పాళీ భాష నుండి గ్రహించబడింది. ప్రాచీనకాలంలో మరాఠీ భాషను "మహారాష్ట్రి" అని "మర్హటీ" అని "మహ్రాట్టి" అని పిలిచెడివారు. thumb|తంజావూరులోని బృహదీశ్వర ఆలయ సముదాయంలో మరాఠీ శాసనం మరాఠీ వినియోగంకోసం హైకోర్టు ముంబై హైకోర్టు కోర్టుకు సంబంధించిన పత్రాలు, పిటిషన్ల డాక్యుమెంట్లను మరాఠీలోకి అనువదించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఫుల్ బెంచ్‌ను ఏర్పాటు చేసింది. మరో పక్క న్యాయవ్యవస్థలోని కింది స్థాయి సిబ్బంది నియామకం కోసం మరాఠీ మాధ్యమంలో పరీక్షలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తోంది. ఎంపీఎస్సీ నిర్వహించే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ పరీక్షల్లో మరాఠీని ప్రత్యామ్నాయ భాషగా గుర్తించాలని థానేకు చెందిన 'మరాఠీ భాషా వికాస్ ఆని సంరక్షణ సంస్థ' ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ పరీక్షను ఆంగ్లంలో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఆంగ్లంతో పాటుగా మరాఠీపై ఉన్న పరిజ్ఞానాన్నీ తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ పరీక్షాపత్రం ఉండాలని ఆ పిటిషన్‌లో సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.'పశ్చిబెంగాల్, హర్యానా, రాజస్థాన్, ఒడిషా రాష్ట్రాల్లో స్థానిక భాషల్ని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరీక్షల్లో వినియోగిస్తున్నారు. కోర్టుల్లో రాష్ట్ర భాషల్ని ఉపయోగించుకునే వెసులుబాటును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణలు కల్పించాయి. కిందిస్థాయి కోర్టుల్లో కనీసం 50 శాతం తీర్పులు మరాఠీలోనే ఉండాలని హైకోర్టు 2005లోనే అభిప్రాయపడింది. మూలాలు వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు వర్గం:భారతీయ భాషలు
సంస్కృత భాష
https://te.wikipedia.org/wiki/సంస్కృత_భాష
దారిమార్పు సంస్కృతం
ఉర్దూ భాష
https://te.wikipedia.org/wiki/ఉర్దూ_భాష
ఉర్దూ (Urdu ) లేదా స్థానికంగా లష్కరీ (لشکری) ఒక ఇండో-ఆర్యన్ భాష, భారత దేశంలో జన్మించిన భాష. భారతదేశపు 23 ఆధికారిక భాషల్లో ఒకటి. ఈ భాషకు మాతృక ఖరీబోలి లేదా హిందుస్తానీ. లష్కరి, రీఖ్తి దీనికి ఇతర నామాలు. అరబ్బీ (అరబిక్), బ్రజ్ భాష, పారశీకం (పర్షియన్), ఆంగ్లం మొదలగు భాషల సమ్మేళనం. ఉత్తర భారత దేశంలోని ముస్లింలు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని పట్టణ ప్రాంతాలలోని ముస్లింలు, పాకిస్తాన్ లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, తదితర నగరాలు, పట్టణాలలో ముస్లింలు మాత్రమే కాకుండా సింధీలు, సిక్కులు, హిందువులు కూడా ఉర్దూ ఎక్కువగా మాట్లాడుతారు.http://timesofindia.indiatimes.com/tech/personal-tech/computing/India-develops-Urdu-font-dumps-Pakistans/articleshow/21052924.cms చరిత్ర 13వ శతాబ్దం దక్షిణాసియా లోని ముస్లింల పరిపాలనా రాజుల సభలలో సభా భాషగా ఇండో-ఆర్యన్ (హిందూ-ఆర్యన్) ల మాండలికంగా ప్రారంభమయినది. ఢిల్లీ సుల్తానుల, మొఘల్ సామ్రాజ్యపు అధికార భాషగా విరాజిల్లినది. నాగరిక, సాహిత్య, పద్యరూపాలకు పరిపూర్ణభాషగా పర్షియన్ ఉపయోగంలో ఉండేది. మతపరమయిన, ధార్మికపరమయిన భాషగా అరబ్బీ ఉండేది. ఢిల్లీసుల్తానుల కాలంలో దాదాపు అందరు సుల్తానులు, అత్యున్నత పదాధికారులందరూ మధ్య ఆసియాకు చెందిన పర్షియన్-తురుష్కులే. వీరి మాతృభాష చొఘ్తాయి లేదా టర్కిక్ భాష. మొఘలులుకూడా మధ్యాసియాకు చెందిన పర్షియన్ లే. వీరి ప్రథమభాష టర్కీ, తరువాత వీరు పర్షియన్ (పారసీ, ఫారసీ భాష) భాషను తమభాషగా ఉపయోగించసాగారు. మొఘలులకు పూర్వం, పర్షియన్ భాష అధికార భాషగాను సభ్యతా, సాహితీభాషగా పరిగణించబడింది. బాబరు మాతృభాష టర్కీ, టర్కీభాషలోనే బాబరు తన రచనలు చేశాడు. ఇతని కుమారుడు హుమాయూన్ కూడా టర్కీభాషనే అవలంబించాడు. మొఘల్ కాలపు హిందూ-పర్షియన్ చరిత్రకారుడు మొఘల్ పరిపాలన, అక్బర్ పరిపాలన కాలంలో పర్షియన్ భాష తన సభ్యత, విశాలదృక్పథాలు, సరళతా కారణాలవల్ల ప్రధాన భాషగా ఆమోదం పొందిన భాషగా వర్ణిస్తాడు.Alam, Muzaffar. "The Pursuit of Persian: Language in Mughal Politics." In Modern Asian Studies, vol. 32, no. 2. (May, 1998), pp. 317–349. టర్కీ, పర్షియన్, బ్రజ్ భాష, హిందవి, హర్యానవి, హిందీ భాషల సమ్మేళనభాషగా ఉర్దూ జన్మించింది. ఈ భాష దక్షిణాసియాలో ప్రధానంగాను, ప్రపంచమంతటా పాక్షికంగాను వాడుకలో ఉంది. ఢిల్లీ, హైదరాబాదు, కరాచి, లక్నో, లాహోరు లలో తనముద్రను ప్రగాఢంగా వేయగల్గింది. స్వాతంత్రోద్యమంలో ఉర్దూ భాష స్వాతంత్ర్యోద్యమంలో నినాదాలు, పద్యాలు, కవితలు, గేయాలు దాదాపు ఉర్దూ భాష ఉద్భావితాలే. హస్రత్ మోహానీ, రాంప్రసాద్ బిస్మిల్, ముహమ్మద్ ఇక్బాల్, గాలిబ్ కవితలు ఉద్యమాన్ని ఎంతో ప్రభావితం చేసాయి. అభిప్రాయాలు స్వాతంత్ర్య ఉద్యమంలో ఉర్దూ భాష కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ, ప్రవాసాంధ్రుల విభాగం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నాడు. ఉర్దూ భాష మనందరి భాషగా గుర్తించాలన్నాడు. (ఈనాడు 17.8.2009). ఉర్దూ అనే పేరు ఎలా వచ్చింది? right|thumb|జబాన్-ఎ-ఉర్దూ-ఎ-ముఅల్లా అనే పదం ("లష్కరీ భాష") నస్తలీఖ్ లిపిలో వ్రాయబడింది. thumb|నాస్టాలిక్ వర్ణమాలలో "లష్కరి భాష" అనే శీర్షిక రీఖ్తి, లష్కరి (సైనిక), భాషగా పేరు పడ్డ ఉర్దూ, షాజహాన్ కాలంలో ఉర్దూ అనేపేరును పొందింది. ఉర్దూ అనే పదానికి మూలం టర్కిష్ పదము ఉర్ద్ లేదా ఓర్ద్, అనగా సైన్యము, సైన్యపు డేరా, లేదా బజారు. దీనిని లష్కరీ జబాన్ లేదా 'సైనికులభాష' గా పేరొచ్చింది. ఎర్రకోట నిర్మాణసమయంలో దీనిపేరు ఉర్దూగా స్థిరమయినది. సైనికులమధ్య వ్యావహారిక భాషగా మార్పుచెందుతూ, బజారులలో, వ్యాపారలావాదేవీల వ్యవహారాలలో, సభలలో తుదకు ఆస్థానాల ప్రధాన ఆధికారిక భాషగా స్థానం పొందింది. నవాబులు ఉర్దూను పోషించారు. రానురాను సాహితీభాషగా పద్యభాగానికి అనువైన భాషగా మార్పుచెందింది. ఉత్తరభారతదేశంలో ప్రధానభాషగా మారింది. రానురాను పర్షియన్ భాష స్థానాన్ని ఆక్రమించింది. పశ్చిమోత్తరభారతదేశంలో ప్రధానభాషగా ఉండినది. 1947లో భారతదేశం విడగొట్టబడి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ అధికారభాషగా ఆమోదింపబడింది. స్వతంత్రభారతదేశంలో అధికారభాష ప్రకటనా సమయంలో హిందీ భాషకు సమానంగా ఉర్దూకూ ఓట్లొచ్చాయి, పార్లమెంటులో హిందీ భాష ఆమోదం పొందింది. హిందీ-ఉర్దూ చెట్టాపట్టాలేసుకొని హిందవి లేదా హిందూస్తానీ భాషగానూ ప్రజామోదం పొందింది. ఉర్దూ లిపి ఉర్దూ లిపి నస్తలీఖ్, అరబ్బీ, పర్షియన్ భాషల సాంప్రదాయం. కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాస్తారు. అరబ్బీ భాష లోని శబ్దాలను (అరబ్బీ భాషలో ప,ట,చ,డ,గా శబ్దాలు లేవు) పర్షియన్ భాషనుండి ప,ట,చ,డ,గా శబ్దాలను సంగ్రహించి ఉర్దూ భాషా శబ్దాలను ఏర్పరచారు. మాండలికాలు thumb|350px|The Urdu Nastaʿliq alphabet, with names in the Devanāgarī and Latin alphabets thumb|right|265px|ఉర్దూ అక్షరమాల. (నస్తలీఖ్ అక్షరాలలో) ఉర్దూ భాషకు నాలుగు మాండలికాలు గలవు. అవి దక్కని దక్షిణభారతదేశంలోని మహారాష్ట్ర, హైదరాబాదు చుట్టుప్రక్కల ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలోను, కర్నాటక, తమిళనాడు లోను, పింజారి అనేక తెగలలోను, రీఖ్తా ఉర్దూ పాత ఒరవడిగాను,, ఖరీబోలి ఢిల్లీ ప్రాంతం లోను మాట్లాడబడుచున్నవి. దక్కనికు ఇతర పేర్లు దఖ్ఖని, దేశియా, మిర్గాన్. ఉర్దూ సాహిత్యం ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్, అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది. గద్యం ధార్మికసాహిత్యం ఇస్లామీయ, షరియా సాహిత్యంలో అరబ్బీ, పర్షియన్ ల తరువాత ఉర్దూ ప్రముఖం. ఖురాన్ తర్జుమాలు, హదీసులు, ఫిఖహ్, ఇస్లామీయ చరిత్ర, మారిఫత్ (ఆధ్యాత్మికము), సూఫీ తత్వము,, ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు. ఖససుల్ అంబియా, తఫ్ హీముల్ ఖురాన్, తర్జుమానుల్ ఖురాన్, తఫ్సీరుల్ ఖురాన్, ఫజాయల్-ఎ-ఆమాల్, బెహిష్తీ జేవర్, బహారె షరీయత్లు ప్రముఖం. సాహితీ గద్య సాహిత్యంలో ఇవి ముఖ్యం. దాస్తాన్, అఫ్సానా, నావల్ (నవల), సఫర్ నామా, మజ్ మూన్, సర్ గుజిష్త్, ఇన్ షాయియ, మురాసల, ఖుద్ నవిష్త్. పద్యం పద్యం లేదా కవితాసాహిత్యానికి చాలా అనువైనభాషగా ఉర్దూకు పేరుగలదు. గజల్ ఉర్దూకవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా గజల్కు పేరురాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూకు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తిగాదు. పద్యసాహిత్యంలో కవితలను ఈవిధంగా వర్గీకరించవచ్చు. నజమ్, గజల్, మస్ నవి, మర్సియా, దోహా, ఖసీదా, హమ్ద్, నాత్, ఖతా, రుబాయి, షెహ్ర్-ఎ-ఆషూబ్. కవి తనకవితలలో తన కలంపేరు 'తఖల్లుస్' ఉపయోగిస్తాడు. అరూజ్ లేదా ఛందస్సు అరూజ్ అనగా కవితా రచనలో తీసుకోవలసిన సాంప్రదాయక విలువలు. కవితలు ఒక క్రమంగా తఖ్తీని గలిగి వుంటాయి. ఒక బహర్ (మీటర్) లో ఇమడబడి ఉంటుంది. తఖ్తీ మూలాన్ని బహర్ అని, బహర్ లో ఉండే శబ్దాలను అర్కాన్ లని అంటారు. అరూజ్ లో ముఖ్యమైన పదాలు అరూజ్, తఖ్తీ, బహర్, జమీన్, అర్కాన్. షారిఖ్ జమాల్ నాగ్ పూరి అరూజ్ విద్వాంసుడు. ఇతని శిష్యగణం భారతదేశమంతటా, ముఖ్యంగా దక్షిణభారతదేశమంతటా గలరు. వ్యావహారికము ఉదాహరణలు తెలుగు వాడుక ఉర్దూ లిపిలో తెలుగు లిప్యాంతరీకరణ యధానువాదం (గమనిక) నమస్కారము السلام علیکم అస్సలామ్ ఒ అలైకుమ్ "మీకు శాంతి కలుగును గాక." ( అరబ్బీ నుండి.) (ప్రతి) నమస్కారము و علیکم السلام వ అలైకుమ్ అస్సలామ్ "మీకునూ శాంతి కలుగును గాక." (అరబ్బీ నుండి) నమస్తే (آداب (عرض ہے ఆదాబ్ (అర్జ్ హై) "గౌరవాన్ని ప్రకటించడం" (సెక్యులర్ విధానము) మంచిది. వెళ్ళి రండి خدا حافظ ఖుదా హాఫిజ్ "అల్లాహ్ మిమ్మల్ని కాపాడు గాక" అవును ہاں హాఁ అవును (సాధారణ వ్యవహారం) అవును جی జీ అండీ (గౌరవ సూచకం) అవునండీ جی ہاں జీ హాఁ అవునండీ (మర్యాదపూర్వంగా) లేదు نا నా (సాధారణ వ్యవహారం) లేదండి نہیں، جی نہیں నహీఁ, జీ నహీఁ లేదు (సాధారణ వ్యవహారం);లేదండీ (మర్యాదపూర్వంగా) దయచేసి, దయవుంచి مہربانی మెహర్బానీ (కర్‌కె) దయ (ఉండి) ధన్యవాదాలు شکریہ షుక్రియా ధన్యవాదాలు దయచేయండి, స్వాగతం تشریف لائیے తష్రీఫ్ లాయియే "గౌరవంగా స్వాగతించడం" దయచేసి కూర్చోండి تشریف رکھیئے తష్రీఫ్ రఖియే "గౌరవంగా కూర్చోబెట్టడం" మీతోకలసి చాలా సంతోషించాను اپ سے مل کر خوشی ہوئی ఆప్ సే మిల్ కర్ ఖుషీ హుఈ "మీతోకలవడం ఆనందదాయకం" మీరు ఇంగ్లీషు మాట్లాడగలరా? کیا اپ انگریزی بولتے ہیں؟ క్యా ఆప్ అంగ్రేజీ బోల్ తే హైఁ? "మీకు ఇంగ్లీషు వచ్చా?" నేను ఉర్దూ మాట్లాడలేను. میں اردو نہیں بولتا/بولتی మైఁ ఉర్దూ నహీఁ బోల్ తా/బోల్ తీ బోల్ తా (పుంలింగము), బోల్ తీ (స్త్రీలింగము) నా పేరు ... میرا نام ۔۔۔ ہے మేరా నామ్ .... హై లక్నో ఎక్కడుంది? لکھنئو کہاں ہے؟ లక్నో కహాఁ హై ఉర్దూ మంచి భాష. اردو اچھی زبان ہے ఉర్దూ అచ్ఛీ జబాన్ హై ఉర్దూ ఫాంట్స్ ఉర్దూ భాషా ఫాంట్ల అభివృద్ధి, భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఐ.టి. శాఖ, ఎన్. సి. పి. యు. ఎల్. (నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్) సంయుక్తంగా అభివృద్ధి పరచారు. దీని వలన ఇతర దేశాల (పాకిస్తాన్) పై ఆధారపడే దురవస్థ నుండి బయట పడ్డారు. ఇవి కూడా చూడండి ఉర్దూ సాహిత్యము ఉర్దూ ప్రముఖులు ఉర్దూ కవులు ముషాయిరా (కవిసమ్మేళనం) ఉర్దూ రచయితలు ఉర్దూ షాయిరి ప్రముఖ ఉర్దూ పుస్తకాలు ఉర్దూ జాతీయాలు ఉర్దూ-తెలుగు నిఘంటువు 1938-మొదటి ఉర్దూ – తెలుగు నిఘంటువు 1938లో వరంగల్ ఉస్మానియా కాలేజిలో అరబిక్ మాజీ ప్రొఫెసర్ ఐ.కొండలరావు సంకలనపరచి ప్రచురించాడు. ఇది అలీఫ్ నుండి లామ్ వరకు అహ్మదియా ప్రెస్ కర్నూలులోను, మీమ్ నుండి యే వరకు వరంగల్ కుమార్ ప్రెస్ లోను ముద్రణ చేయబడింది. మొత్తం 857 పేజీల పుస్తకం. 2009 – ఎ. బి. కె. ప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం 862 పేజీలతో ఈ నిఘంటువును పునర్ముద్రించింది. ఉర్దూ భాషలోకి అనువదింపబడిన ప్రముఖ గ్రంథాలు రామాయణం మహాభారతం – అక్బర్ కాలంలో పర్షియన్ లోకి అనువాదం రజ్మ్ నామా భగవద్గీత: హిందూముస్లింల పరస్పర అవగాహన కొరకు, అలహాబాద్ కు చెందిన డాక్టర్ అజయ్ మాల్వి సంస్కృతంలోగల భగవద్గీతను ఉర్దూలోకి తర్జుమా చేశాడు, దీనికి "నగ్మయే యజ్దానీ" (నగ్మా = గీతం; యజ్దాన్ = భగవంతుడు => భగవంతుడి గీతం => భగవద్గీత) ఈనాడు డిసెంబరు 26, 2008 గులేబకావళి కథ. మొదలగునవి. ఉర్దూ సామెతలు చూడండి : ఉర్దూ సామెతలు ఉర్దూ భాష మాట్లాడే దేశాలు భారత దేశం * పాకిస్తాన్ * బంగ్లాదేశ్ * యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ * యునైటెడ్ కింగ్డమ్ * సౌదీ అరేబియా * నేపాల్ * అమెరికా సంయుక్త రాష్ట్రాలు * ఒమన్ * కెనడా * బహ్రయిన్ * మారిషస్ * కతర్ * జర్మనీ * నార్వే * ఫ్రాన్స్ * స్పెయిన్ * స్వీడన్ * ఆఫ్ఘనిస్తాన్ * ఇరాన్ భారత దేశంలో ఉర్దూ ఆధికారిక భాషగా గల రాష్ట్రాలు ప్రథమ ఆధికారిక భాష జమ్మూ కాశ్మీరు రెండవ ఆధికారిక భాష ఉత్తర ప్రదేశ్ బీహారు ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో రెండవ ఆధికారిక భాషగా గల జిల్లాలు కర్నూలు అనంతపురం చిత్తూరు కడప గుంటూరు తెలంగాణ లో రెండవ ఆధికారిక భాషగా గల జిల్లాలు హైదరాబాదు రంగారెడ్డి నిజామాబాదు ఆదిలాబాదు వరంగల్లు మహబూబ్ నగర్ నల్గొండ కరీంనగర్ మెదక్ ఖమ్మం కర్నాటక జార్ఖండ్ ఢిల్లీ ఉత్తరాఖండ్ అధికార భాషల చట్ట సవరణ 2022 - ఆంధ్ర ప్రదేశ్ రెండవ అధికారిక భాషగా ఉర్దూను గుర్తిస్తూ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ 2022 మార్చి 23న ఆమోదించింది. ఉర్దూమాధ్యమంలో పరీక్షలు రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు ఇకపై ఉర్దూలో నిర్వహించనున్నట్లు రైల్వే శాఖామంత్రి మమతాబెనర్జీ ప్రకటించారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు లలో మాత్రమే ఆర్‌ఆర్‌బీ పరీక్షలు నిర్విహస్తున్నారు. (ఈనాడు 29.10.2009) ఆంధ్రప్రదేశ్ నుండి ప్రచురితమయ్యే ఉర్దూ వార్తా పత్రికలు దినపత్రికలు సియాసత్, * మున్సిఫ్ ,* రహ్ నుమా-యె-దక్కన్, ఏతెమాద్ , రాష్ట్రీయ సహారా , మిలాప్ మాస పత్రికలు అంధ్రప్రదేశ్ లో ఉర్దూ జనాభా దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. స్థానిక జనాభాలో 15% కంటే మించి ఉర్దూ ప్రజలు ఉన్నపట్టణాలు ఇవి: చిత్తూరు జిల్లా: మదనపల్లె, వాయల్పాడు, పీలేరు, పుంగనూరు, పలమనేరు, వి.కోట, బి.కొత్తకోట, తంబళ్లపల్లె కడప జిల్లా: కడప, ప్రొద్దుటూరు, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి అనంతపురం జిల్లా: కదిరి, గుత్తి, రాయదుర్గం, అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, హిందూపురం కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు, నంద్యాల, ఆళ్ళగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె, నందికొట్కూరు గుంటూరు జిల్లా: గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు కృష్ణా జిల్లా: విజయవాడ నెల్లూరు జిల్లా: నెల్లూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి ప్రకాశం జిల్లా: మార్కాపురం,ఒంగోలు పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు తెలంగాణలో ఉర్దూ జనాభా దాదాపు 50 లక్షల మంది ఉన్నారు. స్థానిక జనాభాలో 15% కంటే మించి ఉర్దూ ప్రజలు ఉన్నపట్టణాలు ఇవి: అదిలాబాద్ జిల్లా: అదిలాబాద్, భైంసా, కాగజ్ నగర్, నిర్మల్, మధోల్ కరీంనగర్ జిల్లా: కరీంనగర్ ఖమ్మం జిల్లా: ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లా: గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట మెదక్ జిల్లా: సదాశివపేట, సంగారెడ్డి, సిద్దిపేట, జహీరాబాదు నల్గొండ జిల్లా: బోనగిరి, నల్గొండ వరంగల్లు జిల్లా: వరంగల్లు నిజామాబాదు జిల్లా: బోధన్, నిజామాబాదు రంగారెడ్డి జిల్లా: మార్పల్లి, తాండూరు హైదరాబాదు జిల్లా: హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ విశ్వవిద్యాలయాలు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ భాషా విభాగాలు గల విశ్వవిద్యాలయాలు ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు హైదరాబాదు విశ్వవిద్యాలయము, హైదరాబాదు డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు కాకతీయ విశ్వవిద్యాలయము, వరంగల్లు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపురం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి భారతదేశంలో ఉర్దూ విశ్వవిద్యాలయాలు జామియా ఇస్లామియా - ఢిల్లీ జామియా నిజామియా - హైదరాబాదు అలీఘర్ విశ్వవిద్యాలయం - అలీఘర్ ఉర్దూ భాషాభివృధ్ధి కొరకు పాటుపడుతున్న సంస్థలు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అంజుమన్ తరఖ్ఖి ఉర్దూ ఉర్దూ అకాడమీ (హైదరాబాదు) భారతదేశం లో ఉర్దూ టి.వి. ఛానళ్ళు దూరదర్శన్, ఉర్దూ ఈ.టి.వి. ఉర్దూ భారతదేశం లో ఉర్దూ రేడియో స్టేషన్లు ఆల్ ఇండియా రేడియో ఉర్దూ సర్వీస్. వివిధ భారతి ఉర్దూ సర్వీస్. ఆకాశవాణి ఉర్దూ సర్వీస్. మూలాలు ترتیب وڈیزائننگ ایم پی خاؿ اردولشکری زبان (నమూనా సాహిత్యం) వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు వర్గం:భారతీయ భాషలు వర్గం:ఉర్దూ భాష వర్గం:ఈ వారం వ్యాసాలు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర
https://te.wikipedia.org/wiki/ఉమ్మడి_తూర్పు_గోదావరి_జిల్లా_చరిత్ర
thumb|తూర్పు గోదావరి జిల్లా దృశ్యచిత్రమాలిక: ఎడమ నుండి కుడికి, పై నుండి క్రిందికి: భీమేశ్వర దేవాలయం, 2. అంతర్వేది సముద్రతీరం, 3.నాగుల్లంక గ్రామం 4. ఏలేశ్వరం వద్ద యేలేరు ఆనకట్ట,తలుపలమ్మ లోవలో శివుని విగ్రహం 5.గోదావరిపై వంతెనలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర ఆనవాళ్లు సా.శ.350 నుండి లభిస్తున్నాయి. తొలిగా, మౌర్యులు, నందులు పరిపాలించగా, 5 వశతాబ్దంలో విష్ణుకుండినులు పాలించారు. 7 వశతాబ్దంలో తూర్పు చాళుక్యుల పరిపాలనలో దాక్షరామంలో భీమారామం ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత చాళుక్య చోళులు, వెలనాటి చోడులు, కాకతీయలు, ఢిల్లీ సుల్తానులు, విజయనగర రాజులు, కళింగ రాజులు, రెడ్డి రాజులు,గజపతులు, గోల్కొండ రాజులు, నిజాం పాలించిన పిదప బ్రిటీషు వారి పాలనలోకి వచ్చింది. 1953లో మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు భాష మాట్లాడే జిల్లాలతో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది. ఆ తరువాత అవిభక్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది. పోలవరం ప్రాజెక్టుకొరకు ముంపు మండలాలను తెలంగాణా నుండి ఈ జిల్లాలో కలిపారు. 2022 జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధితో జిల్లాపరిధిని సవరించుటకొరకు, దక్షిణంగా వున్న ప్రాంతాలు కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాలలో, ఉత్తరంగా వున్న గిరిజన ప్రాంతాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తర భాగంలో, గోదావరికి నదీతీరానికి పశ్చిమంగా వున్న కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు. తొలి హిందూరాజులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిగిలిన దక్కన్ పీఠభూమిలాగా మౌర్యులు, నందుల చేత పాలించబడింది. మౌర్యసామ్రాజ్య పతనము తరువాత మూడవ శతాబ్దం ప్రముఖ కవి, రాజు అయిన హలచక్రవర్తి వరకు ఈ ప్రదేశం శాతవాహనుల చేత పాలించబడింది. త్రవ్వకాలలో లభించిన నాణ్యాలు ఆధారంగా గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీ-పుత్ర పులుమాయి, యజ్ఞశ్రీ శాతకర్ణి పాలించినట్లు నిరూపితమైంది. సా.శ.350 లో పిష్టాపుర, అవాముఖ కాలంలో ఈ ప్రదేశం మీద సముద్రగుప్తుడు దండెత్తినట్లు ఆధారాలు ఉన్నాయి. సముద్రగుప్తుని దండయాత్ర తరువాత ఇక్కడ 375-500 వరకు మధరాకుల సామ్రాజ్యం పాలనసాగింది. వీరిలో మొదటి పాలకుడు మహారాజా శక్తివర్మ. ఈ ప్రాంతం 5వ శతాబ్దంలో విక్రమ వర్మ కాలంలో విష్ణుకుండినుల హస్తగతం అయింది. విష్ణుకుండినుల సామ్రాజ్యం ఉమ్మడి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల వరకు విస్తరించింది. ఇంద్రభట్టారకుడు విష్ణుకుండినుల సామ్రాజ్యం స్థాపించాడు. త్వరితంగా కళింగ సైన్యాల చేత ఓడింపబడ్డాడు. ఇంద్రభట్టారకుడు తరువాత మూడవ మాధవర్మ, మంచన్న భట్టారక పాలన కొనసాగింది. వీరు తమ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలని ప్రయత్నించారు. ఈ వంశపు కడపటి చక్రవర్తి మూడవ మాధవర్మ. చాళుక్యులు, చోళులు బాదామి చాళుక్యులకు చెందిన పులకేశి II, అతని సోదరుడు విష్ణువర్ధనుడు 7వ శతాబ్దంలో పిష్టాపురం రాజధానిగా ఈ ప్రాంతంపై అధిపత్యం వహించాడు. కుబ్జ విష్ణువర్ధనుడు స్థాపించిన తూర్పు చాళుక్య సామ్రాజ్యం పిష్టాపురం నుండి వేంగి, రాజమండ్రి వరకు విస్తరించింది. అనేక రాజులు పాలించిన కారణంగా వారి వంశస్థుల పాలనా చరిత్రలో స్పష్టత కొరవడింది. తొలి చాళుక్య చక్రవర్తి బీమా దాక్షారామంలో శివాలయం ఆలయనిర్మాణం చేసాడు. సా.శ. 973లో ఈ సామ్రాజ్యపు చక్రవర్తి అయిన ధనార్వుని పెదకల్లు (కర్నూలు జిల్లా) జాతచోడ భీమవప చంపి వేంగిని ఆక్రమించుకున్నాడు. ధనార్వుడి ఇద్దరు కుమారులైన మొదటి శక్తివర్మ, విమలవర్మ పారిపోయి మొదటి రాజరాజచోళుని సభలో ప్రవేశించి అతనిని ఆశ్రయించాడు. రాజరాజ చోళుడు ధనార్వుని కుమారుల తరపున వేంగి మీద దండెత్తి జాతచోడ భీమను చంపాడు. కల్యాణికి చెందిన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన సత్యరాయునికి వేంగి ప్రాంతం మీద చాళుక్యుల ఆధిపత్యం నచ్చలేదు. ఆ కారణంగా చోళులు, చాళుక్యుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. సా.శ. 1075లో విజయాదిత్యుడి VII మరణం తరువాత తూర్పు చాళుక్య సామ్రాజ్యం ముగిసింది. విజయాదిత్య VII శత్రువైన కులోత్తుంగచోళుడు I (రాజేంద్రచాళుక్యుడు) చోళుల తరఫున యుద్ధంచేసి చాళుక్య చోళుల సామ్రాజ్య స్థాపన చేసాడు. వేంగి రాజ్యంతో పాటు ఈ జిల్లా వారి సామ్రాజ్యంలో ఒక భాగం అయింది. జిల్లాలో అధిక భాగం చోళుల సామంతరాజైన వెలనాటి చోడుల ఆధిక్యతకు వశమైంది. చోళసామ్రాజ్యపు ప్రముఖ పాలకులలో కొందరు గొంకా I, రాజేంద్రచోడా II, రెండవ గొంకా II. ఈ ప్రదేశాన్ని పడమటి చాళుక్యుడైన విక్రమచోడుడు VII ఆక్రమించుకుని కొంతకాలం ఆధిక్యత సాధించాడు. అయినా ఇది తిరిగి వెలనాటి చోడ, చాళుక్యుల వశమైంది. తరువాత వెలనాటి చోడులు తిరుగుబాటుదారులైన కోణాకు చెందిన హైహయులు, కాకతీయులకు చెందిన రెండవ గొంకా, రుద్రాలచేత అణచబడ్డారు. కాకతీయులు ఢిల్లీ సుల్తానులు కాకతీయ చక్రవర్తి రెండవ ప్రోలా పశ్చిమ చాళుక్యుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అప్పటి నుండి చాళుక్యచోళులకు ప్రతిద్వంది అయ్యాడు. అతను కుమారుడు రుద్రా రెండవ చాళుక్యచోళుని నుండి గోదావరి డెల్టాను బహుమతిగా పొందాడు. గోదావరి డెల్టా మీద రుద్రా ఆధిపత్యాన్ని వెలనాడు చోడాలు ఎదిరించారు. చాళుక్య చోళ వెలనాటి రాజైన రెండవ రాజేంద్ర చోడా అతను మంత్రి దేవన ప్రగ్గడ సైన్యాధ్యక్షతలో రుద్రా మీదకు దండయాత్రకు పంపించాడు. రుద్రా అతను కనిష్ఠ సోదరుడు మహాదేవా దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించిన తరువాత రాజ్యపాలన చేపట్టాడు. అతను కుమారుడు గణపతి కాకతీయ సింసానానికి తరువాత రాజయ్యాడు. గణపతి నెల్లూరు చోడుల సహాయంతో ఉత్తరంలోని కళింగ సైన్యాలను, మధురై పాండ్యులను, చోళులను ఓడించాడు. గణపతి కామము అతను కుమార్తె రుద్రమదేవి కాలం అంతా గోదావరి ప్రదేశమంతా కాకతీయుల ఆధిపత్యం కొనసాగింది. 1295లో ప్రతాప రుద్రుడు కాకతీయ సింహాసనం అధిష్ఠించినప్పటికీ ఢిల్లీ సుల్తానులతో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. 1323లో అతను ముహ్హమద్-బీన్-తుగ్లక్ చేతిలో ఓడిపోయిన తరువాత ఈ జిల్లా ఢిల్లీ సుల్తానుల ఆధిపత్యానికి చేరింది. వారు దక్షిణభారతదేశాన్ని అయిదు సంస్థానాలుగా విభజించి వాటికి గవర్నర్లను నియమించారు. ముసునూరి నాయకర్లు, రెడ్లు, ఇతర హిందూరాజులు ఢిల్లీ సుల్తానులు ప్రాంతీయ ప్రముఖులైన ప్రొలయా ముసునూరి నాయకుల తెగల నిరంతర తిరుగుబాటును ఎదుర్కొన్నారు. అద్దంకి రెడ్లు, పిఠాపురం కొప్పుల తెలగాలు, రాచకొండ రేచర్ల వెలములు అతనుకు సహకరించారు. మునుసూరి కాపయ నాయకా తన బంధువులు అయిన అన్వొత నాయకా, ముమ్మడి నాయకా (కోరుకొండ)లను గోదావరీ ప్రదేశానికి గవర్నర్లుగా నియమించాడు. ముమ్మడి నాయకా కాపయ నాయకా మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. 1388 వరకు ముమ్మడి నాయకా జీవించాడు. అతనుకు ముగ్గురు కుమారులు తరువాత 40 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించి కొండవీటి రెడ్లచేత అణిచివేయబడ్డారు. తరువాత కళింగరాజైన ఐదవ నరసింహదేవ ఈ ప్రదేశాన్ని జయించి పాలించాడు అయినా రాజమడ్రికి చెందిన అనవొత రెడ్డిచేత అది తిరిగిస్వాధీనపచుకోబడింది. అతను తరువాత అదే సామ్రాజ్యానికి చెందిన అనవేమరెడ్డి, కుమరగిరి ఈ ప్రాంతాన్ని పాలించారు. కుమరగిరి రాచకొండకు చెందిన రాచెర్లులు, కళింగ రాజులతో అనేక యుద్ధాలు చేసాడు. అతను తన కుమారుడైన అనవోత వెంట సైన్యాధ్యక్షుడు కాటయ వేముని తూర్పు ప్రాంతాలను జయించడానికి పంపాడు. ఫలితంగా ఉత్తరంగా పలు ప్రాంతాలు సింహాచలం వరకు సామ్రాజ్యంలో చేరాయి. కొత్తగా లభించిన ప్రాంతం రెడ్డిరాజుల రాజ్యంలో చేరింది. అలాగే ఈ విభాగం ప్రత్యేకంగా తూర్పురాజ్యంగా పిలువబడింది. రాజకుమారుడు అనవోత రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించాడు. అతను 1395 వరకు పాలించిన తరువాత చిన్న వయసులోనే మరణించాడు. తరువాత సైన్యాధ్యక్షుడు, బావమరిది అయిన కాటయ వేమునికి అతను చేసిన సేవలకు గుర్తింపుగా రాజమహేంద్రవరం లభించింది. కాటయ వేమను కొండవీటి సింహాసనం నుండి పెదకోమటి వేమ బలవంతంగా త్రోసి వేసిన తరువాత కాటయవేమ రాజమహేంద్రవరానికి వెళ్ళాడు. పెదకోమటి వేమ, కాటయ వేమను ఓడించబడిన తరువాత కాటయవేమకు ఎరువా సైన్యాధ్యక్షుడు అన్నదేవ చోడునితో యుద్ధం ఏర్పడింది. అతను రాజమహేంద్రవరం లోని చాలాభాగం ఆక్రమించుకోబడింది. ఎలాగైతేనే అతడు కాటయవేమతో తరమబడ్డాడు. కాటయవేమ అన్నదేవచోడునితో చేసిన ఒక యుద్ధంలో మరణించాడు. అతను మరణించిన తరువాత అల్లాడరెడ్డి కాతయవేమ కుమారుడిని రాజమహేంద్రవరం పాలకుడిగా చేసి తాను రాజప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని పాలించాడు. అల్లాడరెడ్డి 1423 లో తనకు మరణం సంభవించే వరకు ఈ ప్రాంతాన్ని పాలించాడు. 1443లో విజయనగరం పాలకుడైన రెండవ దేవరాయ రాజు వీరభద్రుని ఓడించి ఈ రాజ్యాన్ని పాలించాడు. కొండవీడులో పెదకోమటి వేమ తరువాత రాచవేమ సింహాసనాధిష్టుడయ్యాడు. అతను పాలన చాలా క్రూరంగా ఉండేది. ఒడిషా నుండి గజపతులు, విజయనగర రాయలు దండెత్తినప్పుడు అతనుకు ప్రజల నుండి కొంత సహాయం లభిస్తుండేది. కపిలేశ్వర గజపతి రెడ్డిరాజులను అణచివేసి రాజమహేంద్రవరాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. 1470 కపిలేశ్వర గజపతి మరణించిన తరువాత అతను కుమారులైన హాంవీర, పురుషోత్తమా మధ్య రాజ్యం కొరకు యుద్ధం చేసారు. బహ్మనీల సహాయంతో హంవీర రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అయినా అతను ఎక్కువ కాలం నిలువ లేదు. పురుషోత్తమ హంవీరను త్రోసి రాజమహేంద్రవరం మిగిలిన ప్రదేశాలను తిరిగి జయించాడు. కాని మూడవ మహమ్మద్ షా ఆధ్వర్యంలో సైన్యాలు రాజమహేంద్రవరానికి వచ్చాయి. ఈ యుద్ధం చివరకు శాంతి ఒప్పందంతో ముగిసింది. మూడవ మహమ్మద్ షా మరణించిన తరువాత పురుషోత్తమ గజపతి గోదావరీ, కృష్ణా పరీవాహక ప్రాంతమంతా దక్షిణంగా కొండవీటి వరకు బహ్మనీ సైన్యాలను పారద్రోలాడు. పురుషోత్తమ తరువాత అతను కుమారుడు ప్రతాపరుద్ర పాలనా పగ్గాలు చేపట్టాడు. విజయనగర సామ్రాజ్యాధినేతకృష్ణదేవరాయలు ఈ రాజ్యాన్ని లోబరుచుకుని తన సామంతరాజ్యం చేసుకున్నాడు. అయినా వారిరువురి నడుమ జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతాపరుద్రుని కుమార్తెను కృష్ణదేవరాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. అందుకు బదులుగా తాను జయించిన భూభాగాన్ని తిరిగి ఇచ్చాడు. తరువాతి ముస్లిం రాజులు గోల్కొండ పాలకుడు కుతుబ్ షాహి రాజ్యంలో ఏర్పడిన అననుకూల పరిస్థితులను తనకూలంగా మలచుకుని సుల్తాన్ కులీ కుతుబ్ షాహి కోస్తా ప్రాంతం మీద దండయాత్రచేసి రాజమండ్రి, దాని పరిసర రాజ్యాలను కైవశం చేసుకున్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షాహి హత్యచేయడిన తరువాత అతడి కుమారుడైన జమ్షిద్ కుతుబ్ షాహ్ తరువాత అతను మనుమడు సుభాన్‌కుతుబ్‌షాహ్సింహాసనం అధిష్టించాడు. అతడి పాలనా కాలంలో ఇబ్రహీం షితాబ్‌ఖాన్, విద్యాధర్ల నుండి సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అబ్దుల్ హాసన్ తానాషా ఈ ప్రదేశానికి చివరి పాలకుడు అయ్యాడు. అతను 1672-1687 మధ్య పాలన సాగించాడు. ఈ కాలంలోనే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆధిపత్యంలోకి దక్షిణ భారతదేశం చేరింది. 1687 గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు జయించి స్వాధీనం చేసుకున్నాడు. అలాగే గోదావరి జిల్లా కూడా అతడి ఆధీనంలోకి వచ్చింది. అతడి సామ్రాజ్యంలోని 22 విభాగాలలో గోదావరి కూడా ఒకటి అయింది. ఔరంగజేబు ఈ సంస్థానాలను పాలించడానికి గవర్నర్లను నియమించాడు. మొఘల్ చక్రవర్తి ఫర్రుక్‌సియార్ దక్కన్ విభాగాన్ని పాలించడానికి నిజామ్- ఉల్ - ముల్క్ గా అసఫ్ జాను వైస్రాయ్ గా నియమించాడు. ముహామ్మద్ షా సమయంలో అసఫ్‌జా స్థానంలో హుస్సేన్ అలి ఖాన్ ఖాన్ నియమించబడ్డాడు, దక్కన్ లోని తీర ప్రాంతాలు ముబరిజ్‌ఖాన్ అధీనంలోకి వచ్చాయి. నిజాం షకర్‌ఖేరా యుద్ధంలో ముబరిజ్ ఖాన్ ను చంపి, దక్కన్ ప్రాంతాన్ని ఏకంచేసి స్వతంత్రంగా పాలించాడు. 1748లో నిజామ్ ఉల్ ముల్క్ మరణానంతరం అతను కుమారుడు నాసిర్‌జంగ్, మనుమడు ముజాఫర్‌జంగ్ మధ్య సింహాసనం కొరకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచ్ చెరి ఒక వైపు చేరారు. ఫ్రెంచ్ జనరల్ బుస్సీ, ముజాఫర్ జంగ్ మరణానంతరం సలాబత్ జంగ్ను రాజును చేశారు. ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ బుస్సీని భారతదేశం దక్షిణ ప్రాంతానికి పోయిన కొద్ది కాలంలోనే విజయనగర రాజు పసుపతి ఆనందగజపతి రాజా ఆంగ్లేయులకు ఉత్తర సర్కారుల (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, ఒడిషా) ను ఆక్రమించుకొనమని ఆహ్వానం పంపాడు. ఫ్రెంచ్, ఆంగ్లేయుల మధ్య చెలరేగిన ఈ కలహాలు చివరకు ఫ్రెంచ్ వారు ఓడిపోవటంతో ముగిసాయి. ఫ్రెంచ్ ఆధిపత్యం వదులుకుంటూ తమ దక్కన్ ఆధిక్యానికి గుత్రుగా యానాంను మాత్రమే తమ స్వాధీనంలో వుంచుకొన్నది. సలాబాత్ జంగ్ తరువాత పరిపాలించిన నిజామ్ అలి ఖాన్ రాజమండ్రి, చికాకోల్ (ప్రస్తుతం శ్రీకాకుళం) లను హాసన్ అలి ఖాన్‌కు గుత్తకు ఇచ్చాడు. లార్డ్ క్లైవ్ ఉత్తర సర్కారుల మీద ఆధిపత్యం కొరకు 1765 ఆగస్టులో మొఘల్ చక్రవర్తి షాహ్ అలామ్ తో చర్చలు జరిపి అంగీకారాన్ని పొందాడు. కొండపల్లి కోటను ఆక్రమించిన బ్రిటిష్ ప్రభుత్వం అవసర సమయాలలో సైన్యాలను నడిపించడానికి జనరల్ సిల్లౌడ్ ను మచిలీపట్నానికి పంపింది. నిజామ్ కూడా చురుకుగా యుద్ధప్రయత్నాలను చేపట్టాడు. కాని 1766 నవంబరు 12 న జరిగిన ఒప్పందం కారణంగా నిజాంకు బ్రిటీష్ వారికి మధ్య యుద్ధం ఆగిపోయింది. 1778 మార్చి ఒకటిన జరిగిన రెండవ ఒప్పందంలో నిజామ్ ప్రభుత్వం షాహ్ ఆలమ్ చేత ఇవ్వబడిన అధికారాన్ని తెలుసుకుంది. బదులుగా సంవత్సారానికి 50,000లను తీసుకోవడానికి స్నేహపూరిత ఒప్పందం జరిగింది. 1823 నాటికి ఈ ప్రాంతం మీద అధికారం నిజామ్ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి మారి మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక భాగం అయింది ఈ జిల్లా బ్రిటిష్ అధీనంలోకి వచ్చే ముందు జమిందారుల ప్రాముఖ్యత అధికంగా ఉండేది. జమీందారులైన రంప, తోటపల్లి, జమ్మిచావడి, జద్దంగి, పెద్దాపురం, పిఠాపురం, కోట, రామచంద్రపురం మొదలైనవి ప్రదేశంలో ప్రధానమైనవి. బ్రిటీషు హయాంలో అభివృద్ధి 1852లో సర్ ఆర్ధర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. దీనితో జిల్లాలో వరి, చెరకు విస్తారంగా సాగయింది. 20 సంవత్సరాలలో జిల్లా జనాభా మూడింతలయ్యింది. విశాఖ, గంజా తదితర ప్రాంతాల ప్రజలు వలస వచ్చారు. 1947 - 2014 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా అవతరించింది. ఈ జిల్లా 1953లో తెలుగు భాష మాట్లాడే జిల్లాలతో ఏర్పడ్డ కొత్త ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది. ఆ తరువాత 1956 లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే జిల్లాలతో కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. 2014 లో తెలంగాణ విభజన తర్వాత, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 59 మండలాలు ఉన్నాయి. జివో నంబరు 31 ద్వారా రౌతులపూడి అనే కొత్త మండలాన్ని 44 గ్రామాలతో ఏర్పరచారు. శంఖవరం నుండి 12 గ్రామాలు, కోటనందూరు నుండి 31 గ్రామాలు, తుని నుండి ఒక గ్రామాన్ని విడదీసి ఈకొత్త మండలాన్ని ఏర్పరచారు. దీనితో మొత్తం 60 మండలాలు అయ్యాయి. 2014 - 2022 thumb|తూర్పుగోదావరి రెవిన్యూ డివిజన్లు (2022 ఏప్రిల్ 4 కు ముందు) తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం (రామాలయమున్న భద్రాచలం రెవెను గ్రామం మినహా), చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం అనే 4 మండలాలు ఈ జిల్లాలో కలిసినవి. మొదట్లో ఈ 4 ముంపు మండలాలను రంపచోడవరం రెవెన్యూ డివిజనులో ఉంచినప్పటికీ, 2015లో ఎటపాక రెవెన్యూ డివిజను ఏర్పాటుచేస్తున్నప్పడు అందులోకి మార్చబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన భద్రాచలం గ్రామీణ మండలాన్ని నెల్లిపాక మండల కేంద్రంగా చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగానే కాక రెవెన్యూ మండలంగా మార్చబడటంతో, ఇక నెల్లిపాక మండలానికి బదులుగా ఎటపాక మండలంగా గుర్తించబడటం జరిగింది. పై మార్పుల ఫలితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్లు, మండలాలు 64, మండల ప్రజా పరిషత్తులు 57, పంచాయితీలు 1,012,మునిసిపాలిటీలు, కార్పొరేషనులు 9, పట్టణాలు 14, గ్రామాలు 1379 వుండేవి. రెవెన్యూ డివిజన్లు: 1.కాకినాడ 2.పెద్దాపురం 3.అమలాపురం 4.రాజమహేంద్రవరం 5.రంపచోడవరం 6. రామచంద్రపురం 7.ఏటపాక. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022 జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధితో జిల్లాపరిధిని సవరించుటకొరకు, దక్షిణంగా వున్న ప్రాంతాలు కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాలలో, ఉత్తరంగా వున్న గిరిజన ప్రాంతాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తర భాగంలో, గోదావరికి నదీతీరానికి పశ్చిమంగా వున్న కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు. మూలాలు వర్గం:తూర్పు గోదావరి జిల్లా వర్గం:చరిత్ర
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
https://te.wikipedia.org/wiki/సుల్తాన్_మహమ్మద్_కుతుబ్_షా
thumb|సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి. ఈయన 1612 నుండి 1626 వరకు పరిపాలించాడు. ఈయన తనకు ముందు పరిపాలించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా సోదరుడైన మీర్జా మహమ్మద్ అమీన్ కుమారుడు. ఈయన తండ్రి 25 సంవత్సరాల వయసులోనే మరణించాడు. తల్లి ఖానుమ్ ఆఘా, మా సాహెబా చెరువును కట్టించినది. కులీ కుతుబ్ షాకు మగ సంతానము లేనందున తన కూతురు హయాత్ బక్షీ బేగం ను మహమ్మద్ కుతుబ్ షాకు ఇచ్చి వివాహము చేసి తన వారసునిగా ప్రకటించాడు. మహమ్మద్ కుతుబ్ షాకు ముగ్గురు కుమారులు, కుమార్తెలు. వీరిలో ఏడవ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కూడా ఒకడు. హైదరాబాదులోని మక్కా మసీదు యొక్క నిర్మాణము 1617లో ఈయన హయాములోనే దరోగా మీర్ ఫైజుల్లా బేగ్, చౌధరీ రంగయ్య నేతృత్వములో ప్రారంభమైనది. సుల్తాను మసీదు నిర్మాణ శంకుస్థాపనకు నగరములో అందరు మత పెద్దలను పిలిపించి ఎన్నడూ వేళ తప్పకుండా ప్రార్ధించిన వ్యక్తిచే మసీదు నిర్మాణము ప్రారంభింపచేయాలని తలచాడు. కానీ ఎవరూ ముందుకు రాకపోయేసరికి 12వ యేట నుండి ఎన్నడూ వేళ తప్పకుండా రోజుకు ఐదు సార్లు ప్రార్ధించిన తనే స్వయంగా నిర్మాణము ప్రారంభించాడని చెప్పుకుంటారు. మహమ్మద్ కుతుబ్ షా జనవరి 31, 1626న మరణించాడు. ఈయన సమాధి కుతుబ్‌షాహీ సమాధులలో ఒకటి. అది ఈయనకు ముందు సుల్తానుల సమాధుల కంటే ఉన్నతమైనది. ఈ సమాధి మందిరములో ఈయన సమాధితో పాటు ఈయన కుమార్తెలు, కుమారుల సమాధులు కూడా ఉన్నాయి. ఈయన తర్వాత ఈయన కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షా గోల్కొండ చక్రవర్తి అయ్యాడు. మూలములు ఆంధ్రుల చరిత్ర - బి.యస్.యల్.హనుమంతరావు (పేజీ.430) వర్గం:1626 మరణాలు
అబుల్ హసన్ కుతుబ్ షా
https://te.wikipedia.org/wiki/అబుల్_హసన్_కుతుబ్_షా
thumb|అబుల్ హసన్ కుతుబ్ షా, తానాషా (దయామయ పాలకుడు) గా ప్రసిద్ధి చెందిన అబుల్ హసన్ కుతుబ్ షా దక్షిణ భారతదేశములో గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఏడవ, చివరి చక్రవర్తి. ఇతడు అబ్దుల్లా కుతుబ్ షా మూడవ అల్లుడు. ఈయన 1672 నుండి 1687 వరకు పాలించాడు. బాల్యం అబుల్ హసన్ చిన్నతనంలో అబ్దుల్లా మహారాజు భవంతిలో ఉండేవాడు. అతను ఎవరి కుమారుడో తెలియకున్నా, అతనికీ రాజవంశానికి ఏదో సంబంధం ఉందని భావిస్తూ అందరూ కొద్దిపాటి గౌరవాన్ని ఇచ్చేవారు. చిన్నతనంలోనే తాగుబోతుగా మారి అల్లరిచిల్లరిగా జీవితాన్ని గడుపుతూండే అబుల్ హసన్ ఓసారి మహారాణినే ఆ మైకంలో అవమానించాడు. దానితో కోపించిన మహారాజు భవంతి నుంచి వెళ్ళగొట్టారు. అనంతరం అతను నగరంలో ప్రసిద్ధిచెందిన సూఫీ సన్యాసి షారాజు ఆశ్రమంలో చేరాడు. ఇబ్బంది కలిగించకుండా అక్కడ బ్రతికేవారందరికీ ఆశ్రయం, ఆహారం అందించే సన్యాసి వాడుక అతనికి వరమైంది. చివరకి కొన్నాళ్ళకు అబుల్ హసన్ షారాజుకు సన్నిహిత శిష్యుడయ్యాడు. వివాహం-పట్టాభిషేకం మహారాజు అబ్దుల్లా కుతుబ్షా మూడవ కుమార్తెకు వివాహం చేసే విషయంలో అంత:పురంలో కలహాలు తలెత్తాయి. అబ్దుల్లా రెండవ అల్లుడు నిజాముద్దీన్ అహమ్మద్ ప్రోద్బలంతో తన మూడవ కుమార్తెకు సయ్యద్ అహమ్మద్ అనే వ్యక్తిని ఇచ్చి పెళ్ళిచేసేందుకు నిశ్చయించారు. అయితే తదనంతర కాలంలో నిజాముద్దీన్ కీ, సయ్యద్ కీ నడుమ చోటుచేసుకున్న వివాదాల వల్ల నిజాముద్దీన్ ఈ వివాహం చేయవద్దని, అలా చేస్తే తాను ముఘలులతో కలిసిపోయి మరీ గోల్కొండపై దండెత్తిస్తానని బెదిరించసాగాడు. ఇంతలో వివాహం తరుముకొస్తోంది, వివాహం ఏర్పాట్లు అలాగే సాగనివ్వమని, మూడురోజుల తర్వాత వస్తే తాను సరైన వరుణ్ణి చూపి సమస్య పరిష్కరిస్తానని షారాజ్ అబ్దుల్లాను పంపారు. మూడురోజుల పాటుగా కోటలో సయ్యద్ అహమ్మద్ ని పెళ్ళికొడుకుని చేయడం వంటి లాంఛనాలు కొనసాగించారు. పెళ్ళివేళకు షారాజు తన ఆశ్రమంలోని తానాషాకి ఇచ్చి పెళ్ళిచేయమని, అతనే తదుపరి రాజ్యానికి వస్తాడని ఆదేశించారు. ఆ ప్రకారమే హఠాత్తుగా అతనికిచ్చి రాకుమార్తెను పెళ్ళిచేశారు మహారాజు. మహారాజు అబ్దుల్లా కుతుబ్షా మరణించేలోపుగా తన ప్రవర్తనతో అందరినీ తానాషా ఆకట్టుకున్నారు. అబ్దుల్లా మరణశయ్యపైకి చేరాకా జరిగిన వారసత్వ యుద్ధంలో సైనికాధికారులు, మంత్రులు వంటివారందరినీ చాకచక్యం, మంచితనంతో ఆకట్టుకున్న తానాషా తన తోడల్లుడు నిజాముద్దీన్ మీద విజయం సాధించారు. అబ్దుల్లా అనంతరం గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించారు. పరమత సహనం ఇతర మతాలకు చెందిన ప్రజలను కూడా తారతమ్యాలు లేకుండా పరిపాలించిన ప్రభువుగా తానీషా చిరస్మరణీయుడు. ఈయన తన ఆస్థానములో మంత్రులు, సేనానులుగా అనేకమంది బ్రాహ్మణులను నియమించుకున్నాడు. ఉదాహరణకు తానీషా కొండవీడుకు చెందిన మాదన్న అనే తెలుగు బ్రాహ్మణున్ని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. తెలుగు సాహిత్యములో తానీషా, మాదన్న మేనల్లుడు రామదాసు (కంచర్ల గోపన్న) ను కారాగారములో బంధించిన చక్రవర్తిగా ప్రసిద్ధి పొందినాడు. పాల్వంచ తాలూకా నేలకొండపల్లి గ్రామ వాస్తవ్యుడైన కంచర్ల గోపన్నను తానీషా మాదన్న సిఫారుసుపై పాల్వంచ తాలూకాకు తాసీల్దారుగా నియమించాడు. గోపన్న ప్రజాధనాన్ని ప్రభువుకు ముట్టజెప్పకుండా భద్రాచలములో రామాలయము నిర్మించడానికి, సీతారామలక్ష్మణులకు నగలు చేయించడానికి వినియోగించగా ప్రజాధనాన్ని సొంతపనులకు ఉపయోగించుకున్నాడన్న అభియోగముపై గోపన్నను తానీషా గోల్కొండలోని కారాగారములో బంధించాడు. కథనం ప్రకారం ఆ తరువాత రామలక్షణులు తానీషాకు కనిపించి స్వయంగా డబ్బుతిరిగి ఇచ్చినారనీ, అందుచేత గోపన్నను విడుదల చేసినాడనీ ప్రతీతి. గోల్కొండ పతనం thumb|కర్ణాటకమును ఆక్రమించి గోల్కొండను విస్తరించినవాడు, ఔరంగజేబు పంచనచేరి గోల్కొండ పతనానికి కారకుడు, నమ్మకద్రోహి అయిన మీర్ జుమ్లా తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, అబ్దుల్లా కుతుబ్ షాను దక్కన్లో మొఘల్ సేనానిగా ఉన్న ఔరంగజేబు ఓడించి మొఘల్ చక్రవర్తి షాజహాను యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. మొగలుల దండయాత్రల నుండి గోల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర నాయకుడైన శివాజీతో అబుల్ హసన్ సంధి కుదుర్చుకున్నాడు. 1680లో శివాజీ మరణం తరువాత 1685లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలం నాయకత్వంలో గోల్కొండ పైకి దండయాత్ర చేశాడు. మొదట గోల్కొండకే విజయం లభించినా, చివరకు కొందరు సేనానుల నమ్మకద్రోహం వలన గోల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. పర్యవసానంగా అబుల్ హసన్ మొగలులతో సంధి చేసుకున్నాడు. సంధి షరతుల ప్రకారం అబుల్ హసన్ బకాయిల క్రింద కోటి హొన్నులు చెల్లించాలి. సంవత్సరానికి రెండు లక్షల హొన్నులు కప్పం చెల్లించాలి. మల్ఖేడు ప్రాంతాన్ని మొగలాయిలకు అప్పగించాలి. అక్కన్న, మాదన్నలను ఉద్యోగాల నుండి తొలగించాలి. మొగలు సైన్యం నిష్క్రమించిన తరువాత అక్కన్న, మాదన్నలను తొలగించడానికి అబుల్ హసన్ జాప్యం చేశాడు. ఔరంగజేబు కోపానికి కారణం వీరేనని భావించిన కొందరు ముస్లిం సర్దారులు, అంతఃపుర స్త్రీల ప్రోత్సాహంతో షేక్ మిన్హాజ్ నాయకత్వంలో అక్కన్న మాదన్నల హత్యకు కుట్ర పన్నారు. 1686 మార్చి 24వ తేదీ రాత్రి సుల్తానుతో సంప్రదించి ఇంటికి వెళుతున్న వారిని గోల్కొండ నడివీధిలో హత్య చేశారు. 1683 ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులను సకాలములో చెల్లించలేదు. దీని పర్యవసానంగా గోల్కొండపై మొఘలుల ఆధిపత్యాన్ని పటిష్ఠపరచేందుకు బీజాపూర్ ఆక్రమణ పూర్తయిన తరువాత ఔరంగజేబు స్వయంగా గోల్కొండపై 1687 ఫిబ్రవరి 7న దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని ఎనిమిది నెలలపాటు నిలువరించాడు. కానీ 1687 అక్టోబర్ 3వ తేదీన ఔరంగజేబు లంచం ఇచ్చి కోటలు తలుపులు తెరిపించి, గోల్కొండ కోటను వశపరచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకొని వెళ్ళి దౌలతాబాదు కోటలో 13 సంవత్సరాలు (అనగా సా.శ. 1700) మరణించేవరకు బంధించి ఉంచారు. తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశము అంతమొంది దక్కన్లో మొఘలుల ఆధ్వర్యములో నిజాం పాలన సా.శ. 1701 నుండి ప్రారంభమయ్యింది. మూలాలు వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:జనన సంవత్సరం తప్పిపోయినవి వర్గం:1699 మరణాలు వర్గం:హైదరాబాదు జిల్లా వ్యక్తులు వర్గం:భారతీయ ముస్లింలు వర్గం:కుతుబ్ షాహీ వంశము
ముహమ్మద్ కులీ కుతుబ్ షా
https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_కులీ_కుతుబ్_షా
thumb|right|250px|మహమ్మద్ కులీ కుతుబ్ షా thumb|240px|హైదరాబాదులో కుతుబ్ షా సమాధి. ముహమ్మద్ కులీ కుతుబ్ షా (సా.శ. 1565 - 1612 జనవరి 11), కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. చార్మినార్ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, ఇరాన్కు చెందిన ఇస్‌ఫహాన్ నగరంలా తీర్చిదిద్దాడు. ఇతను కులీ కుతుబ్ షాగా ఎక్కువగా పేర్కొనబడతాడు, హైదరాబాదు నిర్మాతాగా పేర్కొనబడతాడు. సాహిత్య పోషణ ముహమ్మద్ కులీ కుతుబ్ షా, అరబ్బీ భాష, పర్షియన్ భాష, ఉర్దూ భాష, తెలుగు భాష లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ, తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో దీవాన్ (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు. భాగమతి మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్ నగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది. ఇవీ చూడండి హైదరాబాదు చార్మినారు బాద్‌షాహీ అషుర్‌ఖానా మూలాలు Luther, Narendra. Prince, Poet, Lover, Builder: Muhammad Quli Qutb Shah, The Founder of Hyderabad బయటి లింకులు Medieval history of Andhra Pradesh Rulers of the sultanate of Golconda Review of the book "The Splendour of Hyderabad: The Last Phase of an Oriental Culture" by M.A. Nayeem. Bhagmati and Muhammad History of Hyderabad History of medieval India secrets of Golconda ఇతర పఠనాలు Books on Mohammad Quli Qutb shah వర్గం:1565 జననాలు వర్గం:1612 మరణాలు వర్గం:కుతుబ్ షాహీ వంశము వర్గం:ఉర్దూ సాహిత్యం వర్గం:ఉర్దూ కవులు
ఇబ్రాహీం కులీ కుతుబ్ షా
https://te.wikipedia.org/wiki/ఇబ్రాహీం_కులీ_కుతుబ్_షా
ఇబ్రహీం కులీ కుతుబ్‌షా వలీ గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ వంశానికి చెందిన మూడవ నవాబు. ఈయన 1550 నుండి 1580 వరకు గోల్కొండను పరిపాలించాడు. ప్రవాస జీవితం 1543లో ఇబ్రహీం సోదరుడు, జంషీద్ కులీ కుతుబ్ షా, తండ్రిని చంపి, సోదరుని కళ్ళు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. పద్నాలుగేళ్ల వయసులో ఇబ్రహీం కులీ కుతుబ్ షా, దేవరకొండ కోట నుండి తప్పించుకొని బీదర్ చేరుకుని అలీ బరీద్ ఆశ్రయంలో కొన్నాళ్లున్నాడు. ఇబ్రహీం ఏనుగులను, ధనాన్ని కొంత అలీ బరీద్ కాజేయటంతో ఇద్దరి మధ్య అభిప్రాయలేర్పడి, ఇబ్రహీం విజయనగరానికి చేరుకొని రామరాయలను ఆశ్రయించాడు. అక్కడ ఏడేళ్ల పాటు రాజ అతిధిగా జీవించాడు.Mohammad Quli Qutb Shah, Volume 216 By Masʻūd Ḥusain K̲h̲ān̲ రామరాయలు ఇబ్రహీం కులీకి ఒక జాగీరును కూడా ఇచ్చాడు. రామరాయల భార్య ఈయన్ను సొంత కొడుకుగా భావించి షెహజాద్ అని పిలిచేది. విజయనగరంలో ఉండగా తెలుగు భాషపై అభిమానం పెంచుకున్నాడు. తరువాత తన పాలనాకాలంలో తెలుగు భాషను ఆదరించి, కవులను పోషించాడు. thumbnail|ఇబ్రహీం కులీ కుతుబ్ షా చిత్రపటం రాజ్య సంక్రమణ 1550లో జంషీద్ కులీ కుతుబ్ షా మరణించిన తర్వాత ఏడు సంవత్సరాల బాలుడు సుభాన్‌ను రాజు చేశారు. రాజమాత బిల్కిస్ జమాన్ కోరిక రాజ్యవ్యవహారాలు చూసుకోవటానికి ఐనుల్ ముల్క్‌గా అహ్మద్‌నగర్ నుండి సైఫ్ ఖాన్‌ను గోల్కొండకు పంపించారు. అయితే సైఫ్ ఖాన్ అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకొని తనే రాజు అవ్వాలనే రాజ్యకాంక్ష పెంచుకున్నాడు. ఇది భరించలేక ముస్తఫా ఖాన్ వంటి కొందరు అధికారులు విజయనగరంలో ఉన్న ఇబ్రహీం కులీకి గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టవలసిందిగా రహస్య వర్తమానాన్ని పంపారు. అప్పట్లో గోల్కొండ రాజ్యంలోని కోటలను రక్షించడానికి నాయక్వారీలనే హిందూ సైనికదళముండేది. వారి నాయకుడు జగదేవరావు ధైర్యవంతుడు, చురుకైనవాడు. గోల్కొండలో ఉన్న జగదేవరావు, రాజ్యపాలన పట్టు జారిపోవటము, సైఫ్ ఖాన్ పాలనపై ఉన్న అసంతృప్తిని గమనించి, ఇదే అదనుగా పిచ్చి యువరాజుగా పేరొందిన దౌలత్ ఖాన్ (కులీ కుతుబ్‌షా యొక్క మరో కుమారుడు) ను నామమాత్రపు సుల్తానును చేసి అధికారం చేజిక్కించుకోవాలనుకున్నాడు. ఈ పన్నాగాన్ని పసిగట్టిన సైఫ్‌ఖాన్ జగదేవరావును గోల్కొండ కోటలో బంధించాడు. గోల్కొండ సేనానులు ఇబ్రహీంను రాజ్యం చేపట్టడానికి రావలసిందిగా ఆహ్వానించారు కానీ ఇబ్రహీంకు సై‌ఫ్‌ఖాన్‌ను ఎదుర్కొనేందుకు సైనిక సహాయం కావలసి ఉంది. అటువంటి సహాయం కేవలం నాయక్వారీల నుండి కానీ విజయనగరం రాజునుండి కానీ అందగలదు. విజయనగరం రాజు నుండి సహాయం తీసుకోవటానికి వారు ఇష్టపడలేదు. ఇక నాయక్వారీల నాయకున్ని సైఫ్‌ఖాన్ బంధించడంతో వాళ్లను సై‌ఫ్ ఖాన్ వ్యతిరేకంగా కూడగట్టడానికి అట్టే సమయం పట్టలేదు. నాయక్వారీలతో ఒప్పందం కుదరగానే ఇబ్రహీం విజయనగరం నుండి బయలుదేరి గోల్కొండ రాజ్యపు సరిహద్దులలో కోయిలకొండలో ముస్తఫా ఖాన్, సలాబత్ జంగ్ తదితర సేనానులను కలుసుకొని, కోయిలకొండలోని నాయక్వారీ సైన్యంతో గోల్కొండ వైపు కదిలాడు. ఇబ్రహీం వస్తున్నాడన్న వార్త అందగానే గోల్కొండ కోటలోని నాయక్వారీలు తిరగబడి, సుభాన్ కులీని బంధించి, Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains By Syed Ali Asgar Bilgrami జగదేవరావును చెరనుండి విడిపించారు. అలా నాయక్వారీలు, ఇతర సేనానుల మద్దతుతో ఇబ్రహీం, సైఫ్ ఖాన్ ను ఓడించి, గోల్కొండను చేజిక్కించుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయిన సైఫ్‌ఖాన్ పారిపోయి బీదరులో తలదాచుకున్నాడు. కోటలోకి అడుగుపెట్టి ఇబ్రహీం 1550, జూలై 27న ఇరవై యేళ్ల వయసులో ఇబ్రహీం కులీ కుతుబ్‌షాగా పట్టాభిషిక్తుడయ్యాడు. తనకు సహాయం చేసిన జగదేవరావును ప్రధానమంత్రిగా నియమించాడు. అయితే కొంతకాలానికి జగదేవరావు ఇబ్రహీం కులీని గద్దెదించి యువరాజు దౌలత్ ఖాన్‌ను సుల్తాను చేసేందుకు పథకం వేశాడు. అది ఇబ్రహీం కులీ కుతుబ్‌షాకు తెలియగానే పాలుపంచుకొన్నవారందరిని హతమార్చాడు. జగదేవరావు బేరారుకు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాడు. 1556లో ఎలగందల్పై దాడిచేశాడు కానీ కుతుబ్‌షా తిప్పికొట్టాడు. జగదేవరావు తన కలలు సాకారం చేసుకోవటానికి బేరారు సరిపోదని గ్రహించి ఒక చిన్న బృందంతో విజయనగరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో గోల్కొండ రాజ్యం గుండా వెళుతూ అనేక గ్రామాలను నేలమట్టం చేశాడు. ఆయన్ను ఎదిరించడానికి కుతుబ్‌షా ముస్తఫాఖాన్ ను పంపించాడు. ముస్తఫాఖాన్ చేతిలో ఖమ్మంమెట్టు వద్ద ఓడిపోయి జగదేవరావు విజయనగరంలో ఆశ్రయం పొందాడు. తళ్ళికోట యుద్ధం/బన్నీ హట్టి యుద్ధం / రాక్షస తంగేడి యుద్ధం 1565లో బహుమనీ సుల్తానులతో కలిసి సమైక్యంగా విజయనగర సామ్రాజ్యంపై యుద్ధం చేశాడు. తళ్ళికోట యుద్ధంలో యవ్వనంలో తనకు ఆశ్రయమిచ్చిన ఆళియ రామరాయలును స్వయంగా సంహరించినట్లు భావిస్తారు. ఈ యుద్ధంలో పాలుపంచుకున్న రాజ్యాలు :బీదర్, బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ కళాపోషణ కళాపోషకుడిగా ఇబ్రహీం సభలో అనేకమంది కవులకు ఆశ్రమమిచ్చాడు. అందులో పొన్నగంటి తెలగనార్యుడు రచన : యయాతి చరిత్ర (ఇది అచ్చ తెలుగులో రాసిన కావ్యం), , కందుకూరి రుద్రకవి (రచన :తొలి యక్షగానం:- సుగ్రీవ విజయం), నిరంకుశోపాక్యానం , జనార్దనాష్టకం అద్దంకి గంగాధరుడు తను వ్రాసిన తపతీ సంవరణోపాఖ్యానమనే ప్రబంధ కావ్యాన్ని ఇబ్రహీం కులీకి అంకితమిచ్చాడు. ఈయన్ను తెలుగు కవులు మల్కీభరాము, అభిరామగా అని వ్యవహరించేవారు. సాంప్రదాయంగా వస్తున్న అరబ్బీ, పారశీక కవులతో పాటు తెలుగు కవులను కూడా పోషించాడు. ఇబ్రహీం కులీ ప్రజా సంక్షేమంపై శ్రద్ధవహించాడు. అప్పటివరకు ఇటుకలు, మట్టితో కట్టి ఉన్న గోల్కొండ కోటను రాళ్లు, సున్నంతో కట్టించి కోటను దృఢపరిచాడు. తన అల్లుడు హుస్సేన్ వలీ ఖాన్ పేరు మీద హుస్సేన్ సాగర్ సరస్సును నిర్మింపజేశాడు, ఇబ్రహీంభాగ్ ను అభివృద్ధి పరచాడు. గోల్కొండ కోటలోని మక్కా దర్వాజాపై చెక్కబడిన ఒక శాసనంలో అత్యంత మహోన్నతమైన చక్రవర్తిగా కీర్తించబడ్డాడు. ఇబ్రహీం కులీ షియా మతస్థుడైనా పరమతసహనం పాటించాడు. ఇబ్రహీం కులీ, భాగీరథి అనే తెలుగు వనితను వివాహమాడినాడు. కొంతకాలం అస్వస్థత తర్వాత ఇబ్రహీం కులీ 1580లో మరణించాడు. వారసులు thumbnail|ఎడమ|ఇబ్రహీం కులీ కుతుబ్‌షా సమాధి thumbnail|ఇబ్రహీం కులీ కుతుబ్‌షా సమాధి మందిరం, ఆ పక్కనే ఉన్న చిన్న సమాధి మందిరం ఆయన ఆరవ కుమారుడు మిర్జా మహమ్మద్ అమీన్‌ది. ఈయన 25యేళ్ల వయసులో 1596, ఏప్రిల్ 25న మరణించాడు 1580లో ఇబ్రహీం కులీ చనిపోయేనాటికి ఆరుగురు కుమారులు జీవించి ఉన్నారు. అందులో పెద్దవాడు అబ్దుల్ ఖాదిర్, రెండవ యువరాజు హుస్సేన్ కులీ ఇరవై యేళ్ల వయసువాడు. హుస్సేన్ కులీ చక్రవర్తి కావటానికి మీర్ జుమ్లా తాబా తాబా వంటి అనేకమంది శక్తివంతమైన సేనానులు మద్దతు ప్రకటించారు. అయితే రాయరావు ఆధ్వర్యంలో ఒక దక్కనీ సేనానుల వర్గం, ఒక పన్నాగం ప్రకారం మూడవ కుమారుడైన మహమ్మద్ కులీని సింహాసనమెక్కించారు. అప్పటికి మహమ్మద్ కులీ వయసు పదిహేనేళ్లే. మహమ్మద్ కులీ హిందూ తల్లికి పుట్టినందున రాయరావు మద్దతిచ్చి ఉండవచ్చు. నిర్మాణాలు మౌలాలి గుట్ట ఉన్న మౌలాలి దర్గా (హజ్రత్‌ అలీ బాబా దర్గా) మూలాలు బయటి లింకులు http://www.ioc.u-tokyo.ac.jp/~islamarc/WebPage1/htm_eng/golconda-eng.htm వర్గం:1580 మరణాలు
సుభాన్ కులీ కుతుబ్ షా
https://te.wikipedia.org/wiki/సుభాన్_కులీ_కుతుబ్_షా
thumbnail|సుభాన్ కులీ కుతుబ్‌షా (ఛోటా మాలిక్) సమాధి మందిరం సుభాన్ కులీ కుతుబ్ షా 1550 లో తన తండ్రి జంషీద్ కులీ కుతుబ్ షా మరణంతో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయన అప్పటికి ఏడు సంవత్సరాల బాలుడు. జంషీద్ కులీ కొలువులో ఒకప్పుడు ప్రముఖ అధికారి అయిన సైఫ్ ఖాన్, సుల్తాను కోపానికి గురై అహ్మద్ నగర్లో తలదాచుకున్నాడు. రాజమాత బిల్కిస్ జమాన్ కోరిక మేరకు పిల్లవాడు పెరిగి పెద్దయ్యేదాకా రాజ్యవ్యవహారాలు చూసుకోవటానికి ఐనుల్ ముల్క్‌గా అహ్మద్‌నగర్ నుండి సైఫ్ ఖాన్‌ను తిరిగి గోల్కొండకు పంపించారు అహ్మద్‌నగర్ సుల్తానులు. అయితే సైఫ్ ఖాన్ అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకొని తనే రాజు అవ్వాలనే రాజ్యకాంక్ష పెంచుకున్నాడు. ఇది భరించలేక ముస్తఫా ఖాన్ వంటి కొందరు అధికారులు విజయనగరంలో ఉన్న ఇబ్రహీం కులీకి గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టవలసిందిగా రహస్య వర్తమానాన్ని పంపారు. సుభాన్ కులీ కుతుబ్ షా పట్టాభిషిక్తుడైన అదే సంవత్సరము మరణించాడు. సుభాన్ మరణించిన తర్వాత జరిగిన రాజకీయాల్లో నాయకవారీల సహాయంతో ఆయన పినతండ్రి ఇబ్రహీం కులీ కుతుబ్ షా సింహాసనమెక్కాడు. ఛోటామాలిక్ గా వ్యవహరించబడిన సుభాన్ కులీ సమాధి మందిరం, తన తాత కులీ కుతుబ్ సమాధి మందిరం పక్కనే ఒకే మండపంపై ఉన్నది. ఇతర సమాధి మందిరాలకంటే భిన్నంగా ఈ సమాధి పైన ఉన్న గుమ్మటం నునువుగా కాకుండా నిలువు గీరలలో అలంకరించబడి ఉన్నది. ఈయన తండ్రి సమాధి మందిరం లాగే ఈయన సమాధి మందిరంలో ఎటువంటి శిలాఫలకం ప్రతిష్టించబడలేదు.టోక్యో విశ్వవిద్యాలయ వెబ్ సైటులో సుభాన్ కులీ కుతుబ్‌షా సమాధి మందిరపు వర్ణన మూలాలు వర్గం:1550 మరణాలు
జంషీద్ కులీ కుతుబ్ షా
https://te.wikipedia.org/wiki/జంషీద్_కులీ_కుతుబ్_షా
జంషీద్ కులీ కుతుబ్ షా (? - 1550), గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశానికి చెందిన రెండవ సుల్తాను. ఈయన 1543 నుండి 1550 వరకు పాలించాడు. జంషీద్ కులీ కుతుబ్ షా గోల్కండ రాజ్యపు తొలి స్వతంత్ర పాలకునిగా చెప్పుకోవచ్చు. షా అన్న బిరుదము చేర్చుకొని, గోల్కొండ టంకశాల నుండి సొంత పేరు మీద నాణేలు ముద్రింపజేసిన తొలి కుతుబ్‌షాహీ సుల్తాను కూడా ఈయనే. చరిత్రలో కౄరునిగా చాలా ప్రసిద్ధి చెందినా, రాజ్యాన్ని పఠిష్టపరచి సమర్ధవంతమైన పాలకునిగా రణరంగంలోనూ, దౌత్యరంగంలోనూ నిరూపించుకున్నాడు.Golconda Through Time: A Mirror of the Evolving Deccan By Marika Sardar రాజ్య సంక్రమణ జంషీద్ తండ్రి, సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర దేశాన్నంతటిని పరిపాలించిన తొలి ముస్లిం పాలకుడయ్యాడు. సుల్తాన్ కులీకి ఆరుగురు కుమారులు. పెద్దవాడు హైదర్ ఖాన్ సుల్తాన్ కులీ కాలంలోనే మరణించాడు. రెండవ వాడైన కుతుబుద్దీన్ యువరాజుగా నియమించబడ్డాడు. మూడవ కుమారుడైన జంషీద్ కులీ, సోదరుడు కుతుబుద్దీన్ కళ్లు పీకేశాడు. జంషీద్ కుతుబుద్దీన్ ను చంపేందుకు ప్రయత్నించాడని సుల్తాన్ కులీ జంషీద్‌ను బంధింపజేశాడు. తనను బంధించినందుకు ప్రతీకారంగా సుల్తాన్ కులీని చంపేందుకు గోల్కొండ ఖిలాదారు మీర్ మహమ్మద్ హమిదానీని పురమాయించాడు. సుల్తాన్ కులీ కోటలోని జామీ మసీదులో ప్రార్థన చేస్తుండగా 1543 సెప్టెంబరు 4న హత్యచేయబడ్డాడు. ఈ విధంగా జంషీద్ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు కానీ అందరి దృష్టిలో గౌరవహీనుడయ్యాడు.Land and People of Indian States and Union Territories: In 36 ..., Volume 2 edited by Gopal K. Bhargava, S. C.Bhatt జంషీద్ మరో సోదరుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా, విజయనగరానికి పారిపోయి రామరాయలను ఆశ్రయించాడు. పాలన ఏడేళ్ల పాలనలో చాలాభాగం దక్కన్ సుల్తానులతో పరస్పర కలహాలతోనే గడచింది. అనేకసార్లు ఆదిల్షా, బరీద్‌షాకు వ్యతిరేకంగా ఇమాద్‌షా, నిజాంషాల కూటమికి మద్దతునిచ్చాడు. పాలనా వ్యవస్థను మెరుగుపరచాడు. పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఇరవై రెండు సర్కారులు, జిల్లాలుగా విభజించాడు. సాంస్కృతిక చరిత్రలో జంషీద్ కులీ కుతుబ్ షా పాలనాకాలం ఎలాంటి విలువైన శిల్పకళాభివృద్ధి జరగడానికి వీలులేని అస్తవ్యస్త సమయంగా చిత్రీకరించబడింది. జంషీద్ పాలన కాలంవని చెప్పడానికి ఎలాంటి నిర్మాణాలు కానీ శాసనాలు కానీ కనుగొనబడలేదు. చరిత్రకారులు ఈయన చేపట్టినవి చెప్పబడిన నిర్మాణాలేవి లేవు. ఈయన సంబంధించినదని చెప్పబడుతున్న సమాధి మందిరం కూడా ఈయన సమాధి ఉన్నదని కానీ, దాన్ని జంషీద్ స్వయంగా కట్టించాడనడానికి కానీ కచ్చితమైన ఆధారాలు లేవు. బీదరుతో వైషమ్యాలు జంషీద్ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించగానే బీదర్ సుల్తాను అలీ బరీద్ గోల్కొండపై దండయాత్ర చేశాడు. గోల్కొండ కోటకు ఏడు మైళ్ళ దూరంలో ఉండగా ఆ విషయాన్ని తెలుసుకొన్న జంషీద్ కులీ వెంటనే సైన్యాన్ని కూడగట్టుకొని మెరుపువేగంతో బీదర్ వైపు సైన్యాన్ని కదిలించాడు. ఈ పైఎత్తు ఫలించి అలీ బరీద్ తన రాజధానిని రక్షించుకోవటానికి సేనలను గోల్కొండ నుండి వెనక్కు మరలించాడు. అలీ బరీద్ ముప్పు శాశ్వతంగా వదిలించుకోవటానికి జంషీద్ కులీ బీజాపూరు సుల్తాను ఇబ్రహీం ఆదిల్‌షాతోనూ, అహ్మద్‌నగర్ నవాబు బుర్హాన్ నిజాంషాతో చేతులు కలిపాడు. ఆ సుల్తానులు బీదరుపై ఉన్న పాత కక్షల వల్ల అందుకు సంతోషంగా సమ్మతించారు. బుర్హాన్ నిజాంషా బీదరు ఆధీనంలో ఉన్న కంధార్ (నాందేడ్ జిల్లా) ను ఆక్రమించుకొన్నాడు. అలీ బరీద్, ఆదిల్షాను సహాయం అర్ధించడానికి వస్తే ఆయన్ను బంధించి, ఆదిల్షా బీదరు రాజ్యం యొక్క దక్షిణ భాగాన్ని మొత్తం ఆక్రమించుకున్నాడు. అలీ బరీదును సమర్ధవంతగా గద్దె దించారు కానీ ఆ తర్వాత పరిస్థితులు మరిన్నీ ఎత్తులు, పైఎత్తులు, జిత్తులకు దారితీసాయి. ఆదిల్షా ఆక్రమించుకొన్న బీదరు ప్రాంతాల మూలంగా ఆయనకు నిజాంషా కంటే కొంత పైచేయి అయ్యింది. ఈ విషయాన్ని నిరసించిన నిజాంషా, ఆదిల్షాను చికాకు పెట్టేందుకు, ఆదిల్షాకు ఆధీనంలో ఉన్న షోలాపూరు కోటపై దండెత్తాడు. ఇద్దరి బలాలు సమానంగా ఉండటంతో ఇబ్రహీం ఆదిల్షా తనకు మద్దతుగా జంషీద్ కులీని సహాయాన్ని కోరాడు. జంషీద్ అందుకు అంగీకరించాడు కానీ, ప్రతిగా అలీ బరీద్ ను విడుదల చేయాలని షరతు పెట్టాడు. ఆదిల్షా, అలీ బరీదును విడుదల చేసిన వెంటనే, జంషీద్ ఆదిల్షాకు సహాయం చేయకుండా బీదరు వెళ్లి అలీ బరీదును ఏ సింహాసనం నుండైతే తను పూనుకొని దించాడో మళ్లీ అదే సింహాసనం ఎక్కించాడు. దీనితో పరిస్థితి యధాస్థితికి చేరుకొని బీజాపూరు, అహ్మద్‌నగర్ మధ్య వైషమ్యాలు కొన్నాళ్ళు చల్లబడ్డాయి. జంషీద్ ఎప్పుడైనా సిద్ధమే అని కయ్యానికి కాలుదూసే సుల్తాను. ధైర్యశాలి. దక్కను సుల్తానుల మధ్య గొడవల్లో అవసరమైన దానికంటే ఎక్కువగానే తలదూర్చేవాడు. ఈయన పాలనాకాలంలో బీదరు, బీజాపూరు, అహ్మద్‌నగర్ మధ్యన జరిగిన అనేక గొడవల్లో స్వయంగా పాల్గొన్నాడు. ఈయన దౌత్య చతురతతో ఎప్పుడూ గెలిచే పక్షం వైపునే ఉండేవాడు. ఈయన కవి కూడా. చరమదశ thumbnail|జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి మందిరం ఈయన మరణించే ముందు రెండు సంవత్సరాల పాటు కాన్సర్‌కు గురయ్యాడు. క్రమంగా క్షీణించి కాన్సర్ బాధను మరిపించేందుకు విలాసాలకు బానిసయ్యాడు. ఈయన ఆరోగ్యంగా ఉన్న రోజుల్లోనే కౄరునిగా పేరొందాడు. కాన్సర్ బాధ కౄరత్వాన్ని మరింత ప్రజ్వలింపజేసి తన పాలనలోని చివరి రోజులు అందరికీ వణుకు పుట్టించే విధంగా సాగాయి. చిన్న చిన్న నేరాలకు కూడా చాలామందికి పెద్ద శిక్షలు వేశాడు. ఏడేళ్ల పాటు పాలించిన జంషీద్ 1550లో మరణించాడు. ఈయన మరణం తర్వాత, జంషీద్ కులీ కుతుబ్‌షా యొక్క ఏడేళ్ల కొడుకు సుభాన్ కులీని గద్దెనెక్కించారు. ఆ తదనంతర పరిస్థితులు అనుకూలించడం వళ్ళ, విజయనగరంలో ప్రవాసంలో ఉన్న ఇబ్రహీం కులీ గోల్కొండకు తిరిగివచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు. thumbnail|ఎడమ|జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి కుతుబ్‌షాహీ సమాధిమందిరాల్లో ఈయన సమాధిమందిరంగా భావించబడుతున్న సమాధిమందిరం విశిష్టమైనది. అష్టభుజాకారంగా రెండు అంతస్తులతో తన తండ్రి సమాధికి ఆగ్నేయదిశలో ఉంది. ఒక్కో అంతస్తు చుట్టూ పిట్టగోడలున్నాయి. రెండవ అంతస్తులో ఒక్కో మూలన ఒక చిన్న స్థంబాకార గోపురమున్నది. రెండంతస్థుల పైన ఉన్న పెద్ద గుమ్మటం మాత్రం ఇతర కుతుబ్‌షాహీ సమాధుల శైలిలోనే ఉంది. సమాధి మందిరం లోపల మూడు సమాధులున్నవి. అందులోని పెద్ద సమాధి సుల్తానుది.టోక్యో విశ్వవిద్యాలయ వెబ్ సైటులో జంషీద్ కులీ కుతుబ్‌షా సమాధి మందిరపు వర్ణన మూలాలు వర్గం:1550 మరణాలు
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్
https://te.wikipedia.org/wiki/సుల్తాన్_కులీ_కుత్బుల్_ముల్క్
thumb|హైదరాబాద్ లోని సుల్తాన్ కులీ కుతుబ్ షా సమాధిసుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ దక్షిణ ఇరాన్ నందు హన్దల్ అనే ప్రాంతంలో జన్మించాడు . ఆ ప్రాంతంలో కారకునాల్సు అనే నల్ల గొర్రెల కాపరులకు, అకునేల్ అనే తెల్ల గొర్రెల కాపరుల మద్య చాల కాలం నుంచి ఎడతెరిపి లేని గొడవలు జరుగుతుండేవి అయితే ఈ విషయంలో సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ తన ఆలోచన పరిజ్ఞానంతో దీనికి స్వస్తి చెప్పాలని ఉద్దేశంతో ఇద్దరి మద్య పోటీ ఏర్పాటు చేస్తాడు కాని ఈ పోటిలో కారకునాల్సు అనే నల్ల గొర్రెల కాపరుల ఓడిపోతారు .విషయం ఏమిటంటే సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ కూడా కారకునాల్సు అనే నల్ల గొర్రెల కాపరుల కావడంతో ఇరాన్ నుండి వలస వచ్చి స్థిరపడతాడు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ .(1543) దక్షిణ భారతదేశములోని గోల్కొండ రాజ్యాన్ని 1518 నుండి 1687 వరకు పరిపాలించిన కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు. తుర్కమేనిస్తాన్కు చెందిన ముస్లిం యువకుడు కులీ కుత్బుల్ ముల్క్ కొంతమంది బందువులు, మిత్రులతో కలిసి 16వ శతాబ్దము ప్రారంభములో ఢిల్లీకి వలస వచ్చాడు. ఆ తరువాత దక్షిణాన దక్కన్లో స్థిరపడి బహుమనీ సుల్తాను మహమ్మద్ షా వద్ద పనిచేశాడు. ఈయన 1518లో గోల్కొండను జయించి గోల్కొండ ప్రాంతానికి సామంతుడైనాడు. బహుమనీ సామ్రాజ్య పతనము తరువాత స్వాతంత్ర్యము ప్రకటించుకొని కుతుబ్ షా అనే పట్టం ధరించి, గోల్కొండ కుతుబ్ షాహీ వంశ స్థాపన చేసాడు. సుల్తాన్ కులీ, విజయనగర చక్రవర్తులు శ్రీ కృష్ణదేవరాయలు, అచ్యుత దేవ రాయలు యొక్క సమకాలికుడు. కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతితో యుద్ధములో ఉండగా సుల్తాన్ కులీ వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి కోటలను ఆక్రమించుకొని తన పాలనను తూర్పుతీరము వరకు విస్తరించాడు. ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. గజపతి నుండి కృష్ణా, గోదావరి డెల్టాల మధ్యప్రాంతాన్ని వశం చేసుకున్నాడు. సుల్తాను సేనలను తిమ్మరుసు కొండవీటి దగ్గర ఓడించడముతో కృష్ణదేవరాయలపై కులీ యొక్క దండయాత్ర ఆగిపోయింది. వర్గం:1543 మరణాలు
బెల్గాం జిల్లా
https://te.wikipedia.org/wiki/బెల్గాం_జిల్లా
బెళగావి జిల్లా / బెల్గాం జిల్లా (కన్నడ: ಬೆಳಗಾವಿ) కర్ణాటక రాష్ట్రం లోని ఒక జిల్లా. జిల్లా ముఖ్యపట్టణం బెల్గాం. ఈ జిల్లా ఉత్తర కర్నాటకలో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 42,14,505. అందులో 24.03% ప్రజలు పట్టణాలలో నివసిస్తున్నారు. జనంఖ్యా పరంగా జిల్లారాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బెంగుళూరు జిల్లా ఉంది. 13,415 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన జిల్లాలో 31,415 చ. కి.మీ. (12,129 చ.మై) వైశాల్యంతో 1278 గ్రామాలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 4.8 మిలియన్ల జనాభా ఉంది. బెల్గాం జిల్లా కర్ణాటకలో అతిపెద్ద జిల్లా. అరేబియా సముద్రం నుండి దాదాపు 779 మీ (2,556 అడుగులు), 100 కిమీ (62 మై) ఎత్తులో సహ్యాద్రి పర్వత శ్రేణుల (పశ్చిమ కనుమలు) పాదాలకు సమీపంలో మార్కండేయ నది ప్రవహిస్తూ ఉంటుంది.బెల్గాం స్థలాకృతి వాతావరణంలో వేగవంతమైన, కాలిడోస్కోపిక్ మార్పులను ప్రదర్శిస్తుంది. సరిహద్దు ఈ జిల్లాకు పశ్చిమాన, ఉత్తరాన మహారాష్ట్ర రాష్ట్రము, ఈశాన్యాన బీజాపూర్ జిల్లా, తూర్పున బాగలకోట్ జిల్లా, ఆగ్నేయాన గదగ జిల్లా, దక్షిణాన ధారవాడ, ఉత్తర కన్నడ జిల్లాలు, నైఋతిన గోవా రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడతారు. చరిత్ర thumb|left|250px|భువరహ నరసింహ ఆలయం హలాసి, కర్ణాటక thumb|250px|left| పంచలింగేశ్వర ఆలయం హూలి ఉత్తరకర్నాటక డివిషనల్ కేంద్రం బెళగావి. పట్టణ పురాతన నామం వేణుగ్రామ అంటే వెదురు గ్రామం అవి అర్ధం. దీనిని మాలాండ్ ప్రదేశ్ అని కూడా పిలిచేవారు. ఈ పరిసరాలలో లభించిన తాళపత్రాల ఆధారంగా జిల్లాలో అతి పురాతన ప్రాంతం హలసి అని భావిస్తున్నారు. హలసిని రాజధానిగా చేసుకుని కదంబరాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని భావిస్తున్నారు. 6 వ శతాబ్దం మద్య నుండి 760 వరకు ఈ ప్రాంతాన్ని చాళుఖ్యులు పాలించారు. వారి తరువాత రాష్ట్రకూటులు పాలించారు. రాష్ట్రకూటుల పతనం తరువాత ఈ ప్రాంతాన్ని (875-1250) రాట్టాలు పాలించారు. వీరు 1210 నుండి వేణుగ్రామాన్ని తమ రాజధానిగా చేసికొని పాలించారు. రాట్టలకు, గోవాకు చెందిన దీర్ఘకాలం పోరాటం జరిగిన తరువాత 12వ శతాబ్ధపు చివరిలో జిల్లా ప్రాంతంలో కొంతభాగాన్ని కదంబాలు స్వాధీనం చేసుకున్నారు. 1208 నాటికి రాట్టాలు కంబాలను ఓడించి ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1250 నాటికి రాట్టాలను ఓడించి యాదవాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. యాదవులను తొలిగించి ఈ ప్రాంతాన్ని 1320 నాటికి ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలం తరువాత ఘటప్రభా నదికి దక్షిణ ప్రాంతం విజయనగర పాలకుల వశం అయింది. 1347 నాటికి ఉత్తర భూభాగాన్ని బహ్మనీ సుల్తానేట్ స్వాధీనం చేసుకుంది. తరువాత వారు 1473లో బెల్గాంను స్వాధీనం చేసుకుని దక్షిణప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నారు. 1686 నాటికి ఔరంగజేబు బీజపూర్ సుల్తానులను తొలిగించి ఈ ప్రాంతాన్ని ముగల్ సామ్రాజ్యంలో విలీనం చేసాడు. 1776లో ఈ ప్రాంతాన్ని మైసూరు రాజు హైదర్ అలి స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ సహకారంతో మాధవరావు పేష్వా ఆధీనంలోకి మారింది. 1818 నాటికి ఈ ప్రాంతం బ్రిటిష్ పాలకుల వశం అయింది. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ధార్వాడ జిల్లాలో విలీనం చేసింది. 1836 నాటికి జిల్లాను రెండుభాగాలుగా విభజించినప్పుడు ఉత్తరభూభాగం బెల్గాం జిల్లా అయింది. కృష్ణానదీతీరంలో ఉన్న యాదూరు వద్ద ప్రముఖ వీరభద్రాలయం ఉంది. కర్నాటక, మహారాష్ట్ర నుండి పలుభక్తులు వస్తుంటారు. బెల్గవి జిల్లాలో హూలి ఒక పురాతన గ్రామం. ఇక్కడ పలు చాళుఖ్య కాలంనాటి ఆలయాలు ఉన్నాయి. వీటిలో పంచలింగేశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది. బెల్గవి జిల్లాలో కిత్తూరు జిల్లా చారిత్రక ప్రసిద్ధి చెందింది. కిత్తూరు రాణిచెన్నమ్మ (1778-1829) బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన వీరవనితగా గుర్తించబడుతుంది. భౌగోళికంగా మిలటరీ ప్రాముఖ్యతను గ్రహించిన బ్రిటిష్ ఇంఫాంటరీ పోస్ట్ ఏర్పాటు చేసింది. అందువలన బెల్గవి జిల్లాకు " ది క్రేడిల్ ఆఫ్ ఇంఫాంటరీ " అనే ముద్దు పేరు ఉంది. ఇక్కడ శిక్షణ పొందిన సైకిలను ఈస్టిండియా కంపనీ సైన్యంలో నియమించబడ్డారు. తరువాత బ్రిటిష్ భారతదేశం అంతటినీ తన స్వాధీనంలోకి తీసుకుంది. బెల్గవిలో ఉన్న మహాత్మా గాంధీ రైల్వేస్టేషను బ్రిటిష్ వారిచే స్థాపించబడిందిది. సరిహద్దు వివాదం బెళగావి జిల్లా కొత్తగా రూపొందిన మైసూర్ రాష్ట్రంలో (ప్రస్తుత కర్ణాటక) ఒక జిల్లాగా రూపొందించబడింది. 1956 దేశం భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజిస్తున్న తరుణంలో జిల్లాభూభాగంలో పలు పట్టణాలలో మరాఠీ ప్రజలు అధికంగా ఉన్నప్పటికీ కన్నడిగులు అధికంగా ఉన్నందున ఇది మైసూరు రాష్ట్రంలో చేర్చబడింది. భాషా పరంగా అధికంగా ఉన్న మరాఠీ ప్రజలు ధాఖలు చేసిన కేసు సుప్రీం కోర్టులో ఉంది.ఇ విభాగాలు పరిపాలనా విభాగాలు బెల్గాం జిల్లాలో 14 తాలూకాలు ఉన్నాయి :- జిల్లాలో చిక్కోడి తాలూకా (వైశాల్యం 1,995.70) పెద్దదిగా ఉంది. అలాగే చిన్న తాలూకా రేబాగ్ తాలూకా (వైశాల్యం 958.8) జిల్లాలో 6 ఉపవిభాగాలు ఉన్నాయి. జిల్లాలో 17 పురపాలకాలు, 20 పట్టణాలు, 485 గ్రామపంచాయితీలు, 1138 నివాస గ్రామాలు, 26 నిర్జన గ్రామాలు ఉన్నాయి బెల్గవి నగరం బెల్గాం రెవెన్యూ డివిషన్‌కు కేంద్రంగా ఉంది. నగరాలు & పట్టణాలు thumb|right|250px|సౌందట్టి కోట, కర్ణాటక thumb|right|250px|కర్నాటకలోని కిట్టూర్ నుండి 5 కి.మీ.ల దేగావ్ కమల నారాయణ ఆలయం బెలగవి హైరె-భగెవది నిప్పాణి గొకాక చిక్కోడి సవదత్తి అథణి (కర్నతక) సంకెశ్వర కుద్చి బైలహొంగల కిత్తూరు రందుర్గ్ ఉగర్ రయ్బగ్ శదల్గ ముదలగి ఖనపుర్ హుకెరి హిరెకొది హారుగేర్ ముగల్ఖొద్ నంది శంబ్ర 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 2001-11 కుటుంబనియంత్రణ శాతం. స్త్రీ పురుష నిష్పత్తి. జాతియ సరాసరి (928) కంటే. అక్షరాస్యత శాతం. జాతియ సరాసరి (72%) కంటే. 2011 జనాభా లెక్కల ప్రకారం బెలగావి జిల్లాలో 4,778,439 జనాభా ఉంది, ఇది సింగపూర్ దేశానికి లేదా అమెరికా రాష్ట్రమైన అలబామాకు సమానం. ఇది భారతదేశంలో 25 వ ర్యాంకును ఇస్తుంది (మొత్తం 640 లో). జిల్లాలో జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 356 మంది (920 / చదరపు మైళ్ళు). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 13.38%. బెల్గాం లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 969 మంది స్త్రీలు,, అక్షరాస్యత రేటు 73.94%. భాషలు కన్నడ ప్రధాన భాష, జిల్లాలోని జనాభాలో ఎక్కువ మంది (73% మంది) మాట్లాడతారు, అయితే బెలగావి, ఖానాపూర్, నిపానీ, ఉగర్ మొదలైన నగరాల్లో, దక్షిణాన చాలా గ్రామాల్లో మరాఠీ ప్రధానంగా మాట్లాడుతుంది. బెల్గాం, ఖానాపూర్ తాలూకాలో భాగం. జిల్లాలో దఖిని (ఉర్దూ యొక్క దక్షిణ మాండలికం), కొంకణి మాట్లాడేవారు కూడా ఉన్నారు. హిందీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, రెండోది కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా మాధ్యమం, మరాఠీ, కన్నడ, ముస్లిం కుటుంబాల చాలా ఉన్నత తరగతి, విద్యావంతులైన గృహాలలో మాట్లాడే భాష. బెల్గాం జిల్లాలో దాదాపు 67% మంది బహుభాషా, కన్నడ, మరాఠీ, ఉర్దూ-హిందీ, కొంతవరకు ఇంగ్లీషులో సంభాషిస్తున్నారు. సంస్కృతి పర్యాటక ప్రదేశాలు thumb|250px|right|కమల్ బసాది జైన దేవాలయం, బేలగవి thumb|200px|right|కసమల్గి పార్శ్వనాథ, కిట్టూరు నుండి 5 కి.మీ. బెల్గాం జిల్లా పర్యాటక ఆకర్షణలు పర్యాటక ప్రాంతాల బెళగావిన్కోట ' 'బెళగావి' ప్రసిద్ధ బెల్గాం ఫోర్ట్ కమల్ బసది జైన్ టెంపుల్, సఫి మసీదు, అనేక చారిత్రిక కట్టడాలు ఉన్నాయి. బెలగావి ఫోర్ట్ నగరం నడిబొడ్డులో ఉంది. కొటే సరస్సు కూడా సందర్శించడానికి అనువైన ఒక అందమైన సరస్సు. కోట లోపల ఒక పురాతన కమలా బసది , చిక్క బసది జైన దేవాలయంలు ఉన్నాయి. ఈ ఆలయ కొన్ని మీటర్ల నడకదారిలో రామకృష్ణ ఆశ్రమం ఉంది. ఇక్కడ పర్యాటకులు విశ్రాంతి తీసుకోవచ్చు. కోటలో ఒక పురాతన మసీదు ఉంది. పోర్చుగీస్, బ్రిటిష్ శైలి రెండింటినీ భవనాలతో చేరిన బెల్గాం కంటోన్మెంట్, చర్చి (భవనం), పాఠశాలలు ఉన్నాయి. హూలి 'హూలి పంచలింగేశ్వరాలయం జిల్లాలోని పురాతన గ్రామం సవదత్తి నుండి 13 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ఇతర శిథిలావస్థలో ఉన్న చాళుక్య దేవాలయాలు పరిరక్షణ, పునరుద్ధరణ కోసం వేచి ఉన్నాయి. ముగలఖాడ్ 'ముగల్ఖాడ్' 'రాయబాగ్ తాలూకాలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిందిన శ్రీ యల్లలింగేశ్వర ఆలయం ఉంది. గోకాక్ ఫాల్స్ గోకాక్ ఫాల్స్ షెడాల్ఫ్స్ 'షెద్బల్ ' , షెడ్బాల్ దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని ఒక గ్రామం. కర్ణాటకలో బెలగావి జిల్లా అథిని తాలూకాలోని ఒక ప్రసిద్ధ జైన ఆశ్రమమం. షెద్బల్ శాంతినాధ జైన దేవాలయం సంవత్సరం క్రీశ 1292 లో నిర్మించబడింది. ఎలాచార్య పరమపూజ్య ముని శ్రీ 108 విద్యానంద మహారాజ్ తపస్వి జన్మస్థలం. పరమపూజ్య ముని శ్రీ శాంతిసాగర్ మహారాజ్ ఆధ్వర్యంలో శాంతిసాగర్ చత్ర ఆశ్రమం నిర్మించబడింది. 24 తీర్థంకరుడైన చతుర్వంశధి తీర్థంకరుల మందిర్ 1952లో నిర్మించారు. జంబూతి బెల్గాం నుండి 20 కి.మీ దూరంలో ఉంది. సతతహరిత అరణ్యంతో కప్పబడిన కొండ ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. మందోవి మందోవి నది 60 అడుగుల ఎత్తు నుండి జాలువారుతూ వరపోహ జలపాతం. ఇది బెలగావి జిల్లాలో ఒక అందమైన జలపాతం. 'సౌన్డాట్టీ 'సౌన్డాట్టీ ' లోని సవదత్తి కోట, చారిత్రక ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. కిత్తూరు ఇక్కడ కిత్తూరు కోట, మ్యూజియం, ఇతర స్మారకాలు ఉన్నాయి. షిరసంగి షిరసంగి దేశాయ్ వాడే, ప్రసిద్ధి చెందిందిన కాళికా ఆలయం (షిరసంగి) ఉంది. ఇక్కడ ఇతర చారిత్రాత్మక స్మారక చిహ్నాలు ఉన్నాయి. తుర్మారి సంగోలీ నుండి 7 కి.మీ దూరంలో ఉన్న తుర్మారి వద్ద 300 సంవత్సరాల కంటే అధిక పురాతనమైన బి.సి.పాటిల్ హౌస్' (గౌడరమనె) ఉంది. ఇది రెండు అంతస్తుల భవనం. ఇక్కడ ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు గిరీష్ కర్నాడ్ చిత్రీకరించిన చలనచిత్రం' 'ఒందానొందు కాలదల్లి చిత్ర చిత్రీకరణ జరిగింది. డెగావ్ డెగావ్( డెగాంవ్ లేక దేవ్గాం) వద్ద ప్రసిద్ధి చెందిందిన కమలా నారాయణ ఆలయం ఉంది. ఇది కిత్తూరు నుండి 5కి.మీ దూరంలో ఉంది. కాసమల్గి 'కాసమల్గి మందిరం' నుండి 10 కి.మీ దూరంలో ; కమలా నారాయణ ఆలయం, హలసి ' హలసి లో ప్రముఖ కదంబ రాజవంశం ఉండేది. ఇక్కడ 'దేవనాధ నరసింహ' ఆలయం ఉంది. యల్లమ్మగుడ్డా 'యల్లమ్మగుడ్డా' లో ప్రజలు ప్రసిద్ధి చెందిందిన రేణుకా యల్లమ్మ ఆలయం, ఇక్కడకు మహారాష్ట్ర, ఆంధ్ర, దక్షిణ భారతదేశం పర్యటకులు వస్తుంటారు. . నవిలతీర్ధ 'నవిలతీర్ధ స్తవంది ' ' స్తవంది ఘాట్ జైన్ టెంపుల్ ' స్తవంది లేదా తవంది ఘాట్ ఒక పురాతన ప్రసిద్ధ జైన గణిత & ఆలయం ఉంది. ఇది నిప్పాని నగరం సమీపంలో ఉంది. పరసగాడ్ 'పరసగాడ్ కోట ' పర్యాటక ఆకర్షణలలో ఇది ఒకటి. ఎం.కె. హుబ్లి 'ఎం.కె. హుబ్లి ' '' అశ్వథ నరసింహ దేవాలయం, మలప్రభ నదిలో గంగామాత మెమోరియల్, ఎం.కె హుబ్లి ఇక్కడ ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది " హజారత్ ముఘత్ ఖాన్ సహబ్" దర్గా ఉంది. సంగోలి సంగోలి గ్రామానికి కిత్తూర్ రాణి చెన్నమ్మ కుడిభుజం సంగోలి రాయన్న ( స్వాతంత్ర్య సమరయోధుడు) పేరు పెట్టారు. నందగాడ్ నందగాడ్ స్వాతంత్ర్య సమరయోధుడు సంగోలి రాయన్న బ్రిటిష్ ప్రభుత్వంచే ఉరితీశారు వేదికైంది. మునవల్లి మునవల్లి వద్ద పంచలింగేశ్వర ఆలయం ఉంది. చందూర్ కృష్ణా నదీతీరంలోచందూర్ యదూర్ ఉంది. బొరాగావ్ బొరాగావ్ దుధగంగా నదీతీరంలో ఉన్న గ్రామంలో ఉన్న ఒక జైన దేవాలయం (నిషిధి). సుప్రసిద్ధ వ్యక్తులు సంగొల్లి రయన్న కిత్తుర్ చెన్నమ్మ బెలవది అల్లమ్మ కుమార్ గంధర్వ అతుల్ కులకర్ణి చంద్రషెఖర కంబర కాకా కాలెల్కర్ (1885-1981) సామాజిక సంస్కర్త, పండితుడు, చరిత్రకారుడు, విద్యావేత్త, విలేకరి. ఆమె బెల్గుంలో జన్మించింది. పండిట్ ఎస్ బల్లెష్ - షెహనాయ్ కళాకారుడు విద్య బెల్గవిలో విశ్వేశ్వరయ్యా టెక్నాలజీ యూనివర్శిటీ ఉంది. కర్నాటక రాష్ట్ర మొత్తం టెక్నికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ఈ విశవవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. జిల్లాలో విమాన సిబ్బంది ట్రైనింగ్ పాఠశాల, సంబ్ర వద్ద ఉన్న భారత వైమానిక దళం శిక్షణా కేంద్రం. మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ బెలగావి సైనిక విభాగ కార్యాలయం ఉంది. కమాండో పాఠశాల, జంగిల్ వార్‌ఫేర్ పాఠశాల, భారత సైన్యం మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. జిల్లాలో కర్నాటక లింగాయత్ (కె.ఎల్.ఈ), ఎజ్యుకేషన్ సొసైటీ (బెల్గవి), ది కె.ఇ.ఎల్.ఎస్. హాస్పిటల్ ఆఫ్ బెల్గవి, (ఆసియాలో రెండవ పెద్ద ఆసుపత్రిగా గుర్తించబడుతుంది), మెడికల్ కౌంసిల్ ఆఫ్ ఇండియా, (ఇది రీజనల్ సెంటర్), ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, వ్యాక్సిన్ ఇంస్టిట్యూట్ కూడా ఉన్నాయి. 1945 నాల్గవ కింగ్ జార్జ్ ఇండియా మిలటరీ పాఠశాలలు‌లో ఒకటైన మిలటరీ స్కూల్ ఆఫ్ బెల్గవి (ప్రింసిపల్ - లిమిటెడ్ కొ) స్థాపించాడు. ఆకర్షణలు thumb|200px|గోల్ గుంబజ్. thumb|ఇబ్రాహీం రౌజా. thumb|బసవ ప్రతిమ|link=Special:FilePath/Giant_Basava_statue.jpg ఇవీ చూడండి గోల్ గుంబజ్ ముహమ్మద్ ఆదిల్ షా మూలాలు వర్గం:కర్ణాటక వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు
కర్ణాటక జిల్లాలు
https://te.wikipedia.org/wiki/కర్ణాటక_జిల్లాలు
దారిమార్పు కర్ణాటక జిల్లాల జాబితా
కోటప్ప కొండ
https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ
కోటప్పకొండ, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అది నేత ఇంద్ర దేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయ చరిత్ర thumb|260x260px|కోటప్పకొండ శిఖరాలు|alt= ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు ఇంద్ర, విష్ణు, శివ ఈ మూడు రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం సా.శ. 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని సా.శ.1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేసారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సంప్రదాయం లేదు. స్థలపురాణం thumb|త్రికోటేశ్వరస్వామి ఆలయ దృశ్యం|alt=|347x347px పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు.పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా, బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్పగుడి అను పేరు.లోపలి లింగం ఒక అడుగు ఎత్తు కలది.ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరంఅనబడుచుంది.విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరంనకు నైఋతి భాగంనున్న శిఖరంనకు బ్రహ్మశిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరంలపై స్వయంభువులగు జ్యోతిర్లింగంలు వెలయుటయు, ఈ శిఖరంపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది.ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె మునిమంద, ఎల్లమంద అనిపేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు, సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించియుండిరట. కావుననే దీనికాపేరులు వచ్చినవని చెపుతారు. ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు, భార్య కుందిరితో కలిసి త్రికుట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి (గొల్లభామ) అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్ర కొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి, ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఆమె ప్రతిరోజూ రుద్ర కొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమ దేవర లాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశకలిగేటట్లు చేయడానికి, కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు.ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి అతను మళ్ళీ కనిపించి, పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ, దిగుతూ ఇబ్బందులు తీసుకోవలసిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి, ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్ర కొండ నుండి, ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మ కొండకు చేరుకున్న తరువాత, ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం, ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి, జంగం దేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగ రూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి, తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునిలో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెపుతుంది. అభివృద్ధి యాత్రీకులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాలలో వెళ్ళడానికి 1999లో కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్డు నిర్మించబడింది. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి) విగ్రహాలు వుంచారు. దేవాలయ విశేషాలు ప్రభల ఉత్సవ సంబరాలు thumb|శివరాత్రికి కోటప్పకొండ ప్రభలు మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు.కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు. ఈ ప్రభల ఊరేగింపులో మ్రొక్కుబడులున్న వారు ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ వుంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తూ వుంటే, అలంకరించిన మువ్వల, గజ్జల, గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగినట్లుంటుంది. గ్రామాలగుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్థులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వార పోయగా, పురుషులు కత్తి చేత బట్టి, దండకాలను చదువుతారు. ఈ ఉత్సవంలో భాగంగా చిన్న పిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే, పెద్దలు దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తు ప్రభలను నిర్మిస్తారు.ఊరేగింపులో బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాలవంటి పలు కార్యక్రమాలు ఉంటాయి.గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి శివుడికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాతర తరువాత రెండో అతిపెద్ద జన జాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. వసతి సౌకర్యాలు కొండపై తిరుమల దేవస్థానంవారి సత్రం, గవర్నమెంటువారి అతిథి గృహాలు ఉన్నాయి. కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు, బసవ మందిరము సేవలందిస్తూ అందుబాటులో ఉన్నాయి. దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. రవాణా సౌకర్యాలు కోటప్పకొండకు నరసరావుపేట పాత బస్ స్టాండు, కొత్త బస్ స్టాండుల నుండి ప్రతి అరగంటకు బస్సు ఉంది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా లేక నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిపురాంతంకం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరివారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరవచ్చు. మూలాలు బయటి లింకులు వర్గం:పల్నాడు జిల్లా పుణ్యక్షేత్రాలు వర్గం:పల్నాడు జిల్లా పర్యాటక ప్రదేశాలు వర్గం:హిందూ దేవాలయాలు వర్గం:ప్రసిద్ధ శైవక్షేత్రాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు
అన్నమయ్య (సినిమా)
https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_(సినిమా)
15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన అన్నమయ్య 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం శాసనసభ సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడూ అయిన వి.దొరైస్వామి నాయుడు నిర్మించాడు.http://www.rediff.com/news/1998/jan/27star.htm అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని జంధ్యాలతో పాటు అనేకమంది దర్శకులు ప్రయత్నించి విఫలమయ్యారు. చిత్ర కవి ఆత్రేయ 18 పాటలను కూడా నమోదు చేయించి, స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. కానీ, ఆయన మరణంతో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. జె.కె.భారవి, రాఘవేంద్రరావుల కృషి ఫలితంగా 1997లో అది సాకారం అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణికచిత్రం అన్నమయ్యే.http://www.bharatwaves.com/portal/modules/stories/Annamayya-is-10-years-old-8005.html ఈ సినిమాను తమిళంలో అన్నమాచారియర్ గానూ, హిందీలో తిరుపతి శ్రీ బాలాజీగానూ అనువదించి విడుదల చేశారు. అన్నమయ్యకు తదుపరి చిత్రంగా నాగార్జున, రాఘవేంద్రరావు కలిసి అన్నమయ్య కుటుంబం ఆధారంగా ఇంటింటా అన్నమయ్య అన్న చిత్రం తీయబోతున్నట్టు ప్రకటించారు. నటీనటులు నాగార్జున - అన్నమయ్యఅప్పటిదాకా రొమాంటిక్ హీరో లేదా యాక్షన్ పాత్రలే వేసిన నాగార్జునను ఆధ్యాత్మిక పాత్ర అయిన అన్నమయ్యకు ఎంపిక చేసుకోవటం అప్పట్లో సాహసవంతమైన నిర్ణయంగా తెలుగు సినీ పరిశ్రమలో అనుకున్నారు. కానీ తన అద్భుతమైన నటనతో విమర్శకులకు సమాధానం చెప్పాడు నాగార్జున. రమ్యకృష్ణ - అన్నమయ్య పెద్ద భార్య కస్తూరి - అన్నమయ్య చిన్న భార్య మోహన్ బాబు - సాళువ నరసింహరాయలు (రాజు) సుమన్ - శ్రీ వేంకటేశ్వర స్వామి భానుప్రియ - లక్ష్మీ దేవీ kasthuri - అలమేలు మంగ రోజా - సాళువ నరసింహరాయల భార్య, రాణి తనికెళ్ళ భరణి బాలయ్య గుండు హనుమంతరావు బ్రహ్మానందం చిత్రీకరణ అన్నమయ్య సినిమాను తిరుమలలో చిత్రీకరించడానికి అనుమతించలేదు, అదీకాక అసలు దేవాలయంలో అన్నమయ్య కాలం నాటికి లేని అనేక ఆధునిక వసతులు, విద్యుద్దీపాలు మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. అవి చిత్రనిర్మాణానికి ఇబ్బంది కలుగజేస్తాయని యూనిట్ సభ్యులు అన్నపూర్ణా స్టూడియోలో తిరుమల దేవస్థానం యొక్క సెట్ ను నిర్మించి అందులో షూటింగ్ చేశారు. తిరుపతి కొండలుగా పశ్చిమ కనుమలను కేరళ రాష్ట్రములో చిత్రీకరించారు. కథ పాటలు అన్నమయ్య సినిమాలో మొత్తం 41 పాటలు ఉన్నాయి. అందులో చాలామటుకు అన్నమయ్య సంకీర్తనలు కాగా మిగిలినవి సినిమా కోసం వ్రాయబడినవి. యేలే యేలే మరదలా పాటకు ఇంతకుముందు సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని పూసింది పూసింది పున్నాగా అనే ప్రసిద్ధ పాట యొక్క బాణీనే తిరిగి ఉపయోగించారు. సీతారామయ్య గారి మనవరాలు సినిమాకూ నిర్మాత అయిన దొరైస్వామి నాయునికి ఆ బాణీ నచ్చటంతో, దాన్ని తిరిగి అన్నమయ్యలో కూడా ఉపయోగించాలని కీరవాణిని కోరాడు. పాట రచయిత గాయకులు1 నిగమ నిగమాంత వర్ణిత అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర2 అదివో అల్లదివో అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు3 అంతర్యామి అలసితి సొలసితి అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ4 అస్మదీయ మగటిమి తస్మదీయ తకథిమి వేటూరి సుందరరామ్మూర్తిమనో, కె.ఎస్.చిత్ర5 బ్రహ్మ కడిగిన పాదము అన్నమయ్య కీర్తనపూర్ణచందర్, శ్రీరామ్, కె.ఎస్.చిత్ర, అనురాధ6 యేలే యేలే మరదలా అన్నమయ్య కీర్తనకు వేటూరి మార్పులుఎస్.పి.బాలు, సుజాత, అనురాధ7 గోవిందాశ్రిత అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు, కీరవాణి, ఆనంద భట్టాచార్య, అనురాధ8 జగడపు చనవుల జాజర అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, మనో9 కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు10 మూసిన ముత్యాలకేలే మొరగులు అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర11 పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనంజె.కె.భారవిమనో12 పొడగంటిమయ్యా పురుషోత్తమా అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు13 శోభనమే శోభనమే అన్నమయ్య కీర్తనమనో14 కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు15 ఏమొకో చిగురుటధరమున అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు16 నానాటి బ్రతుకు అన్నమయ్య కీర్తనమనో17 దాచుకో నీ పాదాలకు అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ18 తెలుగు పదానికి వేటూరి సుందరరామ్మూర్తిఎస్.పి.బాలు, సుజాత, రేణుక19 వినరో భాగ్యము విష్ణు కథ అన్నమయ్య కీర్తన ఎస్.పి.బాలు, శ్రీలేఖ పార్థసారథి, కీరవాణి, అనురాధ, ఆనంద్, గంగాధర శాస్త్రి20 విన్నపాలు వినవలె వింతవింతలు అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు, శ్రీలేఖ పార్థసారథి, రేణుక21 బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు, కోరస్22 ఫాలనేత్రాలు అన్నమయ్య కీర్తనఎస్.పి.బాలు విమర్శలు సినిమాలో అన్నమయ్యకు మీసం ఉంచడం, అన్నమయ్య ఇద్దరు భార్యలతో డ్యూయట్లు పాడటాన్ని చాలామంది అవహేళన చేసి విమర్శించారు. ఈ సినిమాలో సాళువ నరసింహరాయలు పాత్ర పోషించిన మోహన్ బాబు తనదైన సొంతబాణీ డైలాగులతో పాత్ర ఔచిత్యాన్ని దిగజార్చారని పలు విమర్శలు వచ్చాయి. ఆదరణ , అవార్డులు అన్నమయ్య సినిమా బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. 42 కేంద్రాలలో వందరోజులు ఆడింది.Telugu cinema - Nagarjuna - bio data రెండు కేంద్రాలలో 176 రోజులు ప్రదర్శించబడి రజతోత్సవం జరుపుకున్నది. సినిమా ఆంధ్రప్రదేశ్ లోనే కాక పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఘన విజయం సాధించింది.Rediff On The Net, Movies: Nagarjuna plays a religious poet in Annamayya అప్పటికి దాకా విడుదలైన తెలుగు సినిమా పాటలలో కెళ్ళా అత్యధిక సంఖ్యలో విక్రయించబడిన ఆల్బం. మూలాలు వర్గం:నంది ఉత్తమ చిత్రాలు వర్గం:1997 తెలుగు సినిమాలు వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు వర్గం:తెలుగు జీవితచరిత్ర సంబంధమైన చిత్రాలు వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు వర్గం:సుత్తి వేలు నటించిన సినిమాలు వర్గం:కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలు వర్గం:తెలుగు భక్తి చిత్రాలు వర్గం:గుండు హనుమంతరావు నటించిన సినిమాలు
భారత జాతీయ కాంగ్రేసు
https://te.wikipedia.org/wiki/భారత_జాతీయ_కాంగ్రేసు
Redirectభారత జాతీయ కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర సమితి
https://te.wikipedia.org/wiki/తెలంగాణ_రాష్ట్ర_సమితి
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు. ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు తెరాసను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు. 2001 ఏప్రిల్‌ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టీఆర్​ఎస్​ పార్టీ పురుడు పోసుకుంది. సుదర్శన్‌ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్‌, నిమ్మ నర్సిం హారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్‌ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొ న్నా రు. సుమారు ఏడాదికిపైగా జలదృశ్యం లోనే టీఆర్‌ ఎస్‌ పార్టీ కార్యకలాపాలు సాగాయి. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ఈ పార్టీ ముఖ్యపాత్ర పోషించింది. 2001 మే 17న కరీంనగర్‌ ఎస్‌ ఆర్‌ ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. జేఎంఎం చీఫ్‌, అప్పటి జార్ఖండ్‌ సీఎం శిబూ సోరెన్‌ ఈ మీటింగ్‌కు చీఫ్‌ గెస్ట్‌‌గా హాజరయ్యారు. కొన్ని ఘటనల తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకలాపాలు నందినగర్, హైదరాబాద్ లోని కేసీఆర్‌ నివాసానికి మారాయి. ఆరు నెలల తర్వాత ఎమ్మెల్యే కాలనీలోని మాజీ మంత్రి వేదంతరావు ఇంటికి పార్టీ కార్యాలయాన్ని మార్చారు. 2004లో వైఎస్‌ ప్రభుత్వం బంజారాహిల్స్‌‌ రోడ్​ నంబర్​ 12లో ప్రస్తుతం తెలంగాణ భవన్​ ఉన్న స్థలాన్ని టీఆర్‌ఎస్‌కు కేటాయించింది. ప్రస్తుతం క్యాంటీన్‌ నిర్మిస్తున్న స్థలంలో రేకుల షెడ్డు వేసి టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని ప్రారంభించారు. 2006లో తెలంగాణ భవన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పార్టీకి 60లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. thumb|తెలంగాణ రాష్ట్ర సమితి లోగో.png 2022 అక్టోబరు 5న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు. 2022 డిసెంబరు 22న తెలంగాణ శాస‌న‌స‌భ‌, తెలంగాణ శాసనమండ‌లిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్‌) ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) గా మారుస్తూ బులెటిన్ జారీ చేసింది. టీఆర్ఎస్ఎల్పీ ఇక నుంచి బీఆర్ఎస్ఎల్పీగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పార్టీకి సైద్ధాంతిక భూమిక కల్పించడం దగ్గర్నుంచి కార్యాచరణను నిర్దేశించడం వరకు, తెలంగాణ సమాజాన్ని, దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని లోతుగా అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, తెలంగాణ ఉద్యమ వ్యూహానికి రూపకల్పన చేశారు. స్ట్రీట్ ఫైట్‌ స్థానంలో స్టేట్ ఫైట్ ఉండాలని, అందుకు వాహకంగా ‌తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్‌ ) ని తీర్చిదిద్దారు. అప్పుటి తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో అదొక సాహసోపేతమైన సూత్రీకరణ. తెలంగాణ రాష్ట్ర సమితి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో పొత్తు, నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం . యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణకు అనుకూలంగా దాదాపు 36 పార్టీలు లేఖ ఇవ్వడంలో టీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది.కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షకు దిగారు.అతని దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధృతం అయింది. దీంతో దిగివచ్చిన యూపీఏ2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబరు 9న ఒక ప్రకటన చేసింది. కానీ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబరు 23న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది. పొలిటికల్ జేఏసీ ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడిని తీవ్రం చేసింది. 2010 డిసెంబరు 16న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ తలపెట్టిన మహా గర్జనకు 20 లక్షల మంది హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తరర్వాత 2011 జనవరి నుంచి టీఆర్‌ఎస్‌ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొత్తం మీద రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీఆర్‌ రెండు సార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలోని సంఘాలు, విద్యార్థులు, రాజకీయ నేతల సహాయంతో ఉధృతంగా ఉద్యమం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన టీఆర్​ఎస్, ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారింది. తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2013 అక్టోబరులో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరో వైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరుగగా, మే 16న ఫలితాలు వచ్చాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 63, 11లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో గెలుపొంది రెండో సారి అధికారంలోకి రావడంతో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ప్లీనరీలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో అక్టోబరు 25న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించారు. ఎన్నికలు 2014 ఎన్నికలు తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన 2014 శాసనసభ ఎన్నికలో అత్యధిక స్థానాలు (119 సీట్లలో 63 స్థానాలు) గెలుపొంది కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు 2004 శాసనసభ 54 17http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_2004/StatisticalReports_AP_2004.pdf 2008 శాసనసభ (ఉపఎన్నిక) 7 16 2Front Page : TRS receives a setback in by-polls . The Hindu (2008-06-02). Retrieved on 2013-07-28. 2009 శాసనసభ 45 13http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf 2010 శాసనసభ (ఉపఎన్నిక) 11 11 0 2011 శాసనసభ (ఉపఎన్నిక) 1 1 0 2012 శాసనసభ (ఉపఎన్నిక) 4 5 0 2012 శాసనసభ (ఉపఎన్నిక) 1 1 0 2014 శాసనసభ 119 0 2019 శాసనసభ 119 0 లోక్‌సభ ఫలితాలు సంవత్సరం ఎన్నికలు గెలిచిన స్థానాలు పోటీ చేసిన స్థానాలు ధరావతు కోల్పోయిన స్థానాలు 2004 లోక్‌సభ 22 17 2008 లోక్‌సభ (ఉపఎన్నిక) 2 4 0 2009 లోక్‌సభ 9 1 http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/13_PerformanceOfStateParty.pdf 2014 లోక్‌సభ 17 0 2019 లోక్‌సభ 17 0 మూలాలు వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి వర్గం:తెలంగాణ వర్గం:తెలంగాణ రాజకీయ పార్టీలు వర్గం:రాజకీయ ఉద్యమాలు
అల్లూరి సీతారామరాజు (సినిమా)
https://te.wikipedia.org/wiki/అల్లూరి_సీతారామరాజు_(సినిమా)
అల్లూరి సీతారామరాజు ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్. సినిమాలో కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు. సినిమాలో కొంతభాగానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, మగిలిన చిత్రానికి కృష్ణ, పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు నందమూరి తారక రామారావు స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని కూడా విఫల యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని మహారథితో రాయించుకుని కృష్ణ తెరకెక్కించారు. చిత్ర కథ ప్రకారం బ్రిటీష్ పరిపాలన పట్ల చిన్ననాటి నుంచీ వ్యతిరేకత పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు, పోరాటాలు తెలుసుకుంటాడు. సీత అనే అమ్మాయిని ప్రేమించి, దేశసేవ కోసం పెళ్ళి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు. ఆపైన మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు నేతృత్వంలో, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక వీరుల మద్దతుతో ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది. బ్రిటీష్ వారు ప్రజలను హింసించడం తట్టుకోలేక సీతారామరాజు లొంగిపోయి మరణించడంతో సినిమా ముగుస్తుంది. సినిమాను ప్రధానంగా హార్సిలీ హిల్స్ ప్రాంతంలో తెరకెక్కించారు. సినిమా స్కోప్లో నిర్మాణమైన చిత్రంగా అల్లూరి సీతారామరాజు పేరొందింది. కృష్ణ 100వ సినిమాగా విడుదలైన అల్లూరి సీతారామరాజు ఘన విజయాన్ని సాధించి 19 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో-ఏషియన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శన-బహుమతి వంటివి పొందింది. సినిమాలో తెలుగు వీర లేవరా పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమాను సినీ విమర్శకులు కృష్ణ సినీ జీవితంలో మైలురాయిగా పేర్కొంటూంటారు. నిర్మాణం అభివృద్ధి అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. ఆయన గురించి తెలుగునాట నలుచెరగులా బుర్రకథలు, నాటకాలు వ్యాప్తిలో ఉండేవి. వీటిలో బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ బుర్రకథ బాగా ప్రచారంలో ఉండేది. ప్రజల్లో ఆయన గురించి అనేక కథలు, గాథలు వ్యాపించివున్నాయి. ఇంతటి ప్రచారం కలిగిన సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా తీద్దామని ఎన్టీ రామారావు ప్రయత్నించాడు. పడాల రామారావు అల్లూరి జీవితం ఆధారంగా రాసిన "ఆంధ్రశ్రీ" అన్న పుస్తకం ఆధారంగా రామారావు స్క్రిప్టు తయారుచేయించుకున్నా, దాన్ని తీయడంలో అనేక తర్జనభర్జనలు జరిగి కాలం గడిచింది. ఈలోగా కృష్ణ అల్లూరి జీవిత విశేషాలను ఆధారం చేసుకుని కల్పన జోడించి త్రిపురనేని మహారధితో వేరే స్క్రిప్ట్ రాయించుకుని సినిమా నిర్మించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాను రామారావు మాత్రమే కాకుండా అప్పటికి ఇతర హీరోలతో తీయాలను పలువురు నిర్మాతలు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. తాతినేని ప్రకాశరావు దర్శకునిగా అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగానూ, డి.ఎల్.నారాయణ నిర్మాణంలో శోభన్ బాబు కథానాయకుడిగానూ తీయాలని ప్రయత్నాలు జరిగినా అవీ సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో కృష్ణ దీన్ని స్వీకరించి నిర్మాణం చేశారు. దేవుడు చేసిన మనుషులు చిత్రం విజయవంతమైన తర్వాత కృష్ణ ఈ చిత్రనిర్మాణం చేపట్టాడు. అప్పటికే వి.రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అసాధ్యుడు (1968) చిత్రంలో కృష్ణ ఒక అంతర్నాటకంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. దానితో వి.రామచంద్రరావుని దర్శకునిగా కృష్ణ తీసుకున్నాడు. చిత్రీకరణ సినిమా చిత్రీకరణను వి.రామచంద్రరావు దర్శకత్వంలో ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్ ప్రాంతంలో ఎక్కువ భాగం చిత్రీకరించారు. అయితే కొంత సినిమా తీశాకా రామచంద్రరావు అనారోగ్యంతో మరణించడంతో సినిమా చిత్రీకరణ ఆగింది. కొందరు సన్నిహితుల సలహాతో కృష్ణనే మిగిలిన చిత్రానికి దర్శకత్వం వహించి,సూచించి, కె.ఎస్.ఆర్.దాస్ను దర్శకత్వంలో పోరాట దృశ్యాలను తీయడంతో. సినిమా పూర్తైంది. అల్లూరి సీతారామరాజు సినిమాను కలర్ సినిమాస్కోప్ లో చిత్రీకరించారు, ఇది తెలుగులో మొట్టమొదటి కలర్ స్కోప్ సినిమాగా నిలిచింది. అంతకు ముందు హిందీలో "పాకీజా" చిత్రానికి కమల్ అమ్రోహీ సినిమా స్కోప్ పరికరాలు (కెమెరాలు, కటకాలు) దిగుమతి చేసుకొన్నాడు. వాటినే ఈ సినిమా కోసం కృష్ణ తీ ఈ చిత్రాతీసుకున్నారు. ఈ చిత్రాన్ని విడుదల అయిన చాలా కాలం తరువాత ఎన్ టీ రామారావు గారు చూసి, ఈ చిత్రాన్ని ఇంతకంటే గొప్పగా తీయలేరు, ఆ పాత్రను ఇంతకంటే గొప్పగా పోషించలేరు అని కృష్ణను మెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని మేము చేయాల్సిన పని లేదు అని అన్నారు. చిత్రకథ సినిమా కథ ప్రకారం చిన్నతనం నుంచి బ్రిటీష్ పరిపాలన పట్ల వ్యతిరేకత ఉన్న అల్లూరి రామరాజు ఆంగ్ల విద్యను తిరస్కరించి భారతీయుల సనాతన యోగవిద్యను అభ్యసిస్తాడు. దేశమంతా పర్యటించి బ్రిటీష్ పరిపాలనలో ప్రజల కష్టాలు, సమస్యలు అర్థం చేసుకుని, అహింసా విధానాన్ని తిరస్కరిస్తాడు. రామరాజు సీత పరస్పరం ప్రేమించుకుని వివాహానికి పెద్దల అంగీకారాన్ని పొందుతాడు. దేశాటనకు వెళ్ళిన రామరాజు కార్తీక పౌర్ణమి నాటికి తిరిగి వచ్చి తాను అవివాహితుడిగా, సన్యాసిగా ఉండి దేశ దాస్యవిముక్తికి పోరాడతానని సీతకు చెప్పగా ఆమె వేరే పెళ్ళిని అంగీకరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆనాటి నుంచి అల్లూరి రామరాజు సీతారామరాజుగా పేరు మార్పుచేసుకుంటాడు. సీతారామరాజు మన్యం ప్రాంతంలో శ్రమదోపిడీ, ప్రకృతి వనరుల దోపిడీ చూసి చలించిపోయి, అక్కడి ప్రజల్లో తిరుగుబాటను ప్రోత్సహిస్తాడు. గంటదొర, మల్లుదొర వంటివారి సహకారంతో ప్రజలను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్లపై దాడిచేసి ప్రజలపై అక్రమంగా బనాయించిన కేసు పత్రాలను చించి, ఆయుధాలు స్వాధీనం చేసుకుంటాడు. బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజును బంధించాలని చేసే యత్నాలు భగ్నమై విప్లవ వీరులు విజయం సాధిస్తారు. అంతర్గత సమస్యలతో విప్లవం బలహీనం కాగా, బ్రిటీష్ కలెక్టర్ రూధర్ ఫర్డ్ మన్యంలోని గ్రామాలపై దాడులు చేసి, ప్రజలను హింసించి సీతారామరాజును స్వయంగా బయటకు రప్పిస్తుంది. రూధర్ ఫర్డ్, ఇతర అధికారులు వ్యక్తిగతంగా సీతారామరాజు సత్య నిష్ఠకీ, పోరాటంలోని నిజాయితీకి ఆకర్షితులైనా, వృత్తిధర్మంలో భాగంగా సీతారామరాజును కాల్చి చంపుతారు. ఒక్క సీతారామరాజును చంపితే వేలమంది సీతారామరాజులు పుడతారని నినదిస్తూండగా సీతారామరాజు మరణంతో సినిమా ముగుస్తుంది. చిత్రబృందం పాత్రలు-పాత్రధారులు అల్లూరి సీతారామరాజు - కృష్ణ గంటం దొర - గుమ్మడి మల్లు దొర - ప్రభాకర్ రెడ్డి అగ్గిరాజు - బాలయ్య పడాలు - కాంతారావు వీరయ్యదొర - రావు గోపాలరావు గోవిందు - చంద్రమోహన్ కోయరాముడు - కొమ్మినేని శేషగిరిరావు రూథర్ ఫర్డ్ - జగ్గయ్య మేజర్ గుడాల్ - రాజనాల బాస్టియన్ - త్యాగరాజు బ్రేకన్ - పేకేటి శివరాం పిళ్లె - కె.వి.చలం కవర్ట్ - జగ్గారావు హైటర్ - ఆనంద్ మోహన్ సింగన్న - అల్లు రామలింగయ్య లింగన్న - సాక్షి రంగారావు సీత - విజయనిర్మల రత్తి - మంజుల గంగమ్మ - జయంతి సింగి - రాజశ్రీ ఫ్లారెన్స్ - నందితాబోస్ నారాయణమ్మ - పండరీబాయి వేదుల లక్ష్మీగణపతి శాస్త్రి సాంకేతిక వర్గం రచన: త్రిపురనేని మహారథి పాటలు: శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, సినారె సంగీతం: ఆదినారాయణరావు కళ: తోట - రామలింగం కూర్పు: కోటగిరి గోపాలరావు ఛాయాగ్రహణం: వి.యస్.ఆర్.స్వామి దర్శకత్వం: వి.రామచంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్ నిర్మాత: జి. హనుమంతరావు నిర్వహణ: జి.ఆదిశేషగిరిరావు పాటలు పూర్తి స్థాయి ఇంగ్లీషు పాట ఉన్న తొలి (తెలుగు) చిత్రం ఇదే. ఈ పాట ఆదినారాయణరావు రాయటం విశేషం. జమైరే జోరు లగాడి - రచన: కొసరాజు - గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి తెలుగువీర లేవరా...దీక్షబూని సాగరా...దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా - రచన: శ్రీశ్రీ - గానం: ఘంటసాల, వి.రామకృష్ణ రగిలింది విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు - రచన: అరుద్ర - గానం: ఎస్.పి. వస్తాడు నారాజు ఈ రోజు రానె వస్తాడు - రచన: సినారె - గానం: పి.సుశీల విప్లవం మరణించదు వీరుడు మరణించడు - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి. హ్యాపీ హ్యాపీ న్యూ యియర్ అవార్డులు 1974 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు "తెలుగు వీర లేవరా" పాటకై శ్రీశ్రీకి జాతీయ ఉత్తమ సినీ గీత రచయితగా పురస్కారం ఆఫ్రో - ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడి బహుమతిని అందుకుంది. విడుదల అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ 100వ సినిమాగా విడుదలై సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. భారీ విజయాన్ని చవిచూసి, 19 కేంద్రాలలో 100రోజులు నడిచింది. సినిమాని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పేరుతో హిందీలోకి అనువదించారు. మూలాలు సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి. ఈనాడు వెబ్ లో నాలుగు దశాబ్దాల ఆణిముత్యం వ్యాసం బయటి లింకులు ఐ.ఎమ్.బి.డి.లో అల్లూరి సీతారామరాజు సినిమా పేజీ. వర్గం:నంది ఉత్తమ చిత్రాలు వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు వర్గం:తెలుగు జీవితచరిత్ర సంబంధమైన చిత్రాలు వర్గం:రావు గోపాలరావు నటించిన చిత్రాలు వర్గం:రాజనాల నటించిన చిత్రాలు వర్గం:సాక్షి రంగారావు నటించిన సినిమాలు వర్గం:కె.వి.చలం నటించిన సినిమాలు వర్గం:ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు వర్గం:గుమ్మడి నటించిన చిత్రాలు వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
అహ! నా పెళ్ళంట !
https://te.wikipedia.org/wiki/అహ!_నా_పెళ్ళంట_!
దారిమార్పు అహ! నా పెళ్ళంట!
ఇద్దరు మిత్రులు
https://te.wikipedia.org/wiki/ఇద్దరు_మిత్రులు
ఇద్దరు మిత్రులు పేరుతో ఈ క్రింది సినిమాలున్నాయి: ఇద్దరు మిత్రులు (1999 సినిమా) ఇద్దరు మిత్రులు (1985 సినిమా) ఇద్దరు మిత్రులు (1961 సినిమా)
బీజాపూర్ జిల్లా (కర్ణాటక)
https://te.wikipedia.org/wiki/బీజాపూర్_జిల్లా_(కర్ణాటక)
thumb|బీజాపూర్ రాజసభ|357x357px విజాపుర జిల్లా, కర్నాటక రాష్ట్రంలో భాగంగా ఉండేది. బీజాపుర్ నగరం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది బెంగుళూరుకు 530 కి.మీ వాయవ్య దిశలో ఉంది. ఆదిల్ షా కాలంనాటి పలు స్మారక చిహ్నాలు అనేకం ఉన్నాయి. బిజ్జపూర విజాపుర కర్ణాటక రాష్ట్రానికి చెందిన జిల్లా. ఇది కర్ణాటకలో ఉత్తరం వైపున మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఆదిల్‌షాహి వంశస్థులు నిర్మించిన అనేక చారిత్రక కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో 5 డివిజన్లు విజాపుర, బాగేవాడి, సింధగి, ఇండి, ముద్దెబిహాళ, బసవన బాగెవాడి ఉన్నాయి. పరిపాలనాపరంగా, బీజాపూర్ జిల్లా బాగల్‌కోట్, బెల్గాం, ధార్వాడ్, గడగ్, హవేరి, ఉత్తర కన్నడ (కార్వార్) జిల్లాలతో పాటు బెల్గాం డివిజన్‌లోకి వస్తుంది. చరిత్ర ఆంగ్లేయుల పాలనలో విజాపుర జిల్లా బాంబే ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేది. స్వాతంత్ర్యానంతరం 1948లో బొంబాయి రాష్ట్రంలో చేర్చారు. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాకా ఈ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో చేర్చబడింది. 1997లో విజాపురను విభజించి బాగల్‌కోట్జిల్లాను ఏర్పాటుచేశారు. thumb|చాంద్ బీబీ, బీజాపూర్ రీజెంట్ (1580-90)|360x360px పురావస్తు ఆధారాలు ఈ ప్రాంతం చివరి పాలియోలిథిక్ చేత స్థిరపడినట్లు సూచిస్తున్నాయి, బీజపూర్‌ను సా.శ. 900 లో రాష్ట్రకూట్లుల రాజప్రతినిథి (తర్దవాడి) తైలప్ప చేత నిర్మించబడింది. (revised English version of his (1973) Karnatakada sankshipta itihasa) మాల్వా వంశస్థుల దండయాత్ర తరువాత రాష్ట్రకూట సామ్రాజ్యం పతనావస్థకు చేరుకున్న తరువాత తైలప్పా స్వంతత్రం ప్రకటించుకుని కల్యాణిచాళుఖ్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అప్పుడీ నగరం విజయపురా (విజయ నగరం) అని పిలువబడింది. Vijayapura ("City of Victory") is also the name given by Thihathu to his new city of Pinya which he made the capital of Upper Burma in 1312.13వ శతాబ్దం ఆఖరి కాలంలో జిల్లాభూభాగం ఖిల్జీ సుల్తానేట్, ఢిల్లీ సుల్తానేట్ లోకి చేర్చబడింది. 1347లో జిల్లాభూభాగాన్ని గుల్బర్గాకు చెందిన బహ్మనీ సుల్తానులు ఆక్రమించుకున్నారు. ఈ సమయంలో విజయపూర్ బీజపూర్ అని పిలువబడింది. 1518లో బహ్మనీ సుల్తానేట్ ఐదు రాజాస్థానాలుగా (దక్కన్ సుల్తానేట్‌గా) విభజించబడింది. వీటిలో ఒకటి ఆదిల్షాహీ రాజ్యంగా (1490-1686) పాలించబడింది. స్వతంత్ర బీజపూర్ సామ్రాజ్య స్థాపన చేసిన యూసఫ్ ఆదిల్ షా కాలంలో బీజపూర్ ఉన్నత స్థితికి చేరింది. 1686 నాటికి మొగల్ చక్రవర్తులు బీజపూర్‌ను ఆక్రమించుకున్న తరువాత ఆదిల్షా పాలన ముగింపుకు చేరింది. 1724లో హైదరాబాదు నిజాం స్వతత్రం ప్రకటించుకుని దక్కన్‌లో నిజాం సామ్రాజ్య స్థాపన చేసాడు. తరువాత నిజాం బీజపూర్‌ను తనరాజ్యంలో విలీనం చేసుకున్నాడు. 1760లో మరాఠీలు నిజాంను ఓడించారు. తరువాత బీజపూరును నిజాం మరాఠీల వశంచేసాడు. 1818 నాటికి పేష్వా మూడవ బ్రిటిష్ - మరాఠీ యుద్ధంలో బ్రిటిష్ చేతిలో ఓడించబడ్డాడు. తరువాత బీజపూర్ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం అయింది. 1848లో రాజ్యానికి చివరి పాలకుడు వారసుడు లేకుండా మరణించిన తరువాత సతారా కూడా బీజపూరుతో బాంబే ప్రొవింస్‌లో విలీనం చేయబడింది. తరువాత జిల్లాభూభాగన్ని బ్రిటిష్ ప్రభుత్వం కలదగి పేరుతో కొత్త జిల్లాగా రూపొందించింది. కలదగి జిల్లాలో ప్రస్తుత బీజపూర్, బాగల్‌కోట్ జిల్లాలు భాగంగా ఉన్నాయి. జిల్లకు బీజపూర్ కేంద్రంగా చేయబడింది. 1885లో జిల్లాకేంద్రం బాగల్‌కోటకు మార్చబడింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జిల్లా బాంబే రాష్ట్రంలో భాగంగా మారింది. 1956లో మైసూరు రాష్ట్రంలో భాగం అయింది. మునుపటి జిల్లాలోని దక్షిణప్రాంత తాలూకాలు బాగల్‌కోట్ జిల్లాలో విలీనం చేయబడ్డాయి. ఆదిల్షా నిర్మించిన కోట ప్రాకారం 2 మైళ్ళ చుట్టుకొలతతో నిర్మించబడింది. ఇది విస్తారమైన సామాగ్రితో శక్తివంతంగా నిర్మినచబడింది. కోటచుట్టూ కందకం 100 గజాల వెడల్పుతో త్రవ్వించబడింది. మునుపు ఈ కందకానికి నీరు అందించబడేది. ఇపుడు ఇది చెత్తతో నిండి పోయింది. అందువలన దాని అసలైన లోతు కనిపెట్టడం కష్టం. కోట ప్రాకారంలో హిందూ ఆలయాలు, మసీదులు ఉన్నాయి. 1566లో ఆదిల్షా కోట నిర్మాణం పూర్తి చేసాడు. తరువా కోట ప్రాకారం చుట్టు కొలత 6 మైళ్ళ ఉంది. కోట గోడ ఎత్తు 30-50 అడుగులు. కోటకు 10 ద్వారాలు ఉన్నాయి. గోడ వెడల్పు 25 అడుగులు. కోట లోపల రక్షణదళం నిలిచి ఉండేది. వెలుపల నగరం ఉండేది. ప్రస్తుతం శిథిలాల నడుమ సమాధులు, మసీదులు మొదలైనవి ఉన్నాయి. బీజపూర్ సమీపంలోని బాదామి, అయిహోల్, పట్టడకల్ చాళుఖ్యుల కాలం నాటి చారిత్రక ఆలయాలకు ప్రసిద్ధి. . పాలన బ్రిటిష్ రాజ్ పాలనలో విజాపుర జిల్లా బాంబేప్రొవింస్‌లో భాగంగా ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948 బీజాపూర్ జిల్లా బాంబే జిల్లాలో భాగం అయింది. 1956లో దక్షుణభారతదేశం భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టబడిన తరువాత కన్నడ భాషాధిఖ్యం కారణంగా వీజాపుర జిల్లా కర్నాటక రాష్ట్రంలో భాగం అయింది. 1997లో విజాపుర జిల్లా నుండి కొంతభూభాగం వేరిచేసి బాగల్‌కోట్ జిల్లా రూపొందించబడింది. విభాగాల వివరణ విషయాలు వివరణలు తాలూకాలు 5 బీజపూర్, బసవన బాగెవాడి, సిందగి, ఇండి (కర్నాటక), ముద్దెబిహల్ పంచాయితీ గ్రామాలు 199 బీజపూర్ (కర్నాటక) 46 బసవన బెగెవాడి 38 సిందగి 40 ఇండి (కర్నాటక) 44 ముద్దెబహ 31 జిల్లా లోని పట్టణాలు , నగరాలు బసవన బాగెవాడి బిజాపూర్ (కర్నాటక) ఇండి (కర్నాటక) ముద్దెబిహల్ సిందగి తాలికోట భౌగోళికం సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా వైశాల్యం 10541 (రాష్ట్రంలో 5.49%) తూర్పు సరిహద్దు గుల్బర్గ ఆగ్నేయ సరిహద్దు రాయచూర్ దక్షిణ సరిహద్దు బాగల్‌కోట పశ్చిమ సరిహద్దు బెల్గాం వాయవ్య సరిహద్దు సాంగ్లి, మహారాష్ట్ర ఉత్తర సరిహద్దు షోలాపూర్ ఉత్తర అక్షాంశం 15 x 50 నుండి 17 x 28 తూర్పు రేఖాంశం 74 x 54 నుండి 76 x 28 భౌగోళికంగా భౌగోళికంగా జిల్లా దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది. జిల్లాలోని భూభాగం 3 భాగాలుగా విభజించబడింది. ఉత్తర భాగంలో బీజపూర్ జిల్లా ఉత్తర భూభాగం లోని సిండిగి, ఇండి ఉన్నాయి. మద్యభూభాగంలో బీజపూర్ నగరం ఉంది. దక్షిణ భాగంలో కృష్ణానది తీర సారవంతమైన భూమి ఉంది. ఉత్తరభూభాగంలో వృక్షరహిత పర్వత దిగువ భూభాగం ఉంది. మద్యలో లోయలతో కొంచం గుండ్రంగా ఉంటుంది. ఎగువభూములు సారరహితంగా ఉంటాయి. జలప్రవాతీరాల వెంట గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు ఒకటికి ఒకటి దూరంగా ఉన్నాయి. డాన్ నదీలోయలలో సారవంతమైన నల్లరేగడి మట్టి ఉంటుంది. కృష్ణానది కృష్ణానదీ తీరం వెంట తూర్పుపడమరలుగా ఉన్న ఇసుకరాతి కొండలమద్య మైదానం విస్తరించి ఉంది. జిల్లా సరాసరి వార్షిక వర్షపాతం 553 మి.మీ (37..2 దినాలు) వర్షపాతం ఉంది. జూన్- అక్టోబరు మాదాల మద్య వర్షాలు అధికంగా కురుస్తుంటాయి. అత్యధిక వర్షపాతం సెప్టెంబరు (149 మి.మీ) అత్యల్ప వర్షపాతం 34 మి.మీ ఫిబ్రవరి. మట్టి విషయాలు వివరణలు పూర్/ నాన్ -లో యల్డింగ్- మోడరేట్ - 72.2% (1000 నుండి 8000) జిల్లాలో పూర్, నాన్ యల్డింగ్ 9% (1000) పూర్, నాన్ యల్డింగ్ తాలూకాలు ముద్దెబిహల్, (19%), ఇండి (15%), బీజపూర్, సిందగి (13%), బసవన్‌బగెవాడి (4%), లో యల్డింగ్ 40% (4000) లో యల్డింగ్ తాలూకాలు బసవన్‌బగెవాడి (54%), ఇండి తాలూకాలో కొంత ఉంది. మోడరేట్ యల్డింగ్ 36% (4000-8000) మోడరేట్ యల్డింగ్ తాలూకాలు బీజపూర్ 70%, సిందగి 19%, హై యల్డింగ్ 15% హై యల్డింగ్ తాలూకాలు సిందగి 2%, ముద్దెబిహల్ 29% నగరపాలకం 2014లో " సజ్జాడే పీరన్ ముష్రి " చారిత్రక బీజపూర్‌కు మొదటి మేయరుగా నియమించబడ్డాడు. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 2,175,102, నగర నివాసితులు 21.92% .Census GIS India ఇది దాదాపు. లతివ దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. 210వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 207 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.38%. స్త్రీ పురుష నిష్పత్తి. 954:1000 జాతియ సరాసరి (928) కంటే. అధికం అక్షరాస్యత శాతం. 67.2%. జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ జనసంఖ్య 2001 1,806,918 2001-1991 జనసంఖ్య అభివృద్ధి 17.63% ఆకర్షణలు బీజపూర్ చారిత్రక ఆకర్షణలకు ప్రసిద్ధి. బీజపూర్ నగరంలో గోల్ గుంబజ్, జుమ్మా మసూద్, ఉప్పలి బురుజ్ టవర్, రెండవ ఇబ్రహీం ఆదిల్ షా సమాధి (ఇబ్రహీం రుజ్జా) ఉన్నాయి శివుని శిల్పం:- 85 అడుగుల శిల్పం. ఇది బీజపూర్- ఉత్కల్ రోడ్డులో బీజపూర్ నుండి 3కి.మీ దూరంలో ఉంది. 1500 టన్నుల బ్రహ్మాండమైన శివుని శిల్పం కింద గుండ్రని ఆలయం ఉంది. ఇది ఎత్తులో మూడవస్థానంలో ఉంది. పర్స్వనాథ్ బసది:- నగరానికి 3 కి.మీ దూరంలో దర్గా సమీపంలో పర్స్వనాథ్ ఆలయం ఉంది. పర్స్వనాథ్ మూర్తి ఒక మీటర్ ఎత్తున అందగాచెక్కబడి ఉంది. ఒక సర్పం పర్స్వనాథ్ శిల్పానికి చత్రంగా చెక్కబడి ఉంది. కొన్ని సంవత్సరాల ముందు ఒక మట్టిదిబ్బను త్రవ్వుతున్న సమయంలో ఈ శిల్పం బయటపడింది. గొలాజెరి:- నగరానికి 78 కి.మీ దూరంలో గొల్లేశ్వర్ దేవ్ ఆలయం ఉంది. బసవన బాగేవాడి:- 43 కి.మీ దూరంలో ఉంది. ఇది బసవ పుట్టిన ప్రదేశమని విశ్వసిస్తున్నారు. లింగాయతిజం యాత్రాకేంద్రంగా ఇది ప్రత్యేకత కలిగి ఉంది. సమీపంలోని బాగల్‌కోటలో సంగమేశ్వరాలయం ఉంది. ఆలమట్టి ఆనకట్ట:- నగరానికి 56 కి.మీ దూరంలో ఉంది. కొంవర్:- విజపూర్ నుండి 60కి.మీ శ్రీకోరేశ్వరాలయం. ఇది సిందగి తాలూకాలోని కొరవార్ గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని శంకరాచార్యుడు స్థాపించాడు. పురాతన చెట్లు బీజాపూర్ తాలుకాలోని 'అడెన్సోనియా డిజిటాటా' - మాల్వేసి 600 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. బీజాపూర్ తాలూకాలోని అడెన్సోనియా డిజిటాటా - మాల్వేసి, 359 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది. బీజాపూర్ దేవరిహిప్పరగి గ్రామంలోని టమరిండస్ ఇండికా (చింతపండు); - 883 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది. చిక్కబల్లాపూర్ జిల్లాలోని అజాడిరచ్టా ఇండికా (బెవు); - టి వెంకటపుర వద్ద 200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. మైసూర్ తాలూకా చిక్కహళ్ళిలోని మర్రి బెఘలెన్సిస్ ' (ఆలాడ మారా); - 260 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. మైసూర్ మానస గంగోత్రి లోని (పీపాల్) పవిత్ర అత్తి (ఫికస్ రెలిజియోసా) - 160 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. 'కెంపు మారా మైసూర్ రాజభవనము గేట్ లో; - 130 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. బెంగుళూర్ లో కెథొహల్లి మర్రి బెఘలెన్సిస్ ( దొద్దలద మారా) 400 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది. ఆరౌచరీ కుకీ; - లాల్బాగ్, 140 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది. షిమోగా జిల్లా బనవాసిలో 'పిలాల' ( మర్రి మైక్రో కార్పస్ ) ; - 400 సంవత్సరాల వయస్సు చరిత్ర కలిగి ఉంది. అడసోనియా డిజిటా వీటిలో 2 జాతులను సాధారణంగా బాయూబాబ్ చెట్లు అంటారు. వీటిని బీజపూరులో గుర్తించి జాబితాలో చేర్చారు. ఒకటి బీజపూరు లోని ఇబ్రహీం రోజా సమారక చిహ్నం వద్ద ఉంది. దీని చుట్టుకొలత 10.84 అడుగులు, ఎత్తు 5 అడుగులు. మరొకటి బీజపూరు లోని యోగపూర్ దర్గా వద్ద ఉంది. దీని వయసు 359, చుట్టుకొలత 9 అడుగులు, ఎత్తు 7 అడుగులు. ఈ రెండు వృక్షాలు ఆదిల్ షా కాలంలో నాటబడ్డాయి. పరిశోధకులు రాజా ఆదిల్ షా ప్రకృతి ఆరాధకుడని భావిస్తున్నారు. ప్రత్యేకంగా అడసోనియా డిజిటా ఇంపోనియా చెట్లు టర్కీ నుండి దిగుమతి చేయబడ్డాయని భావిస్తున్నారు. రాజులు వీటిని పెంచడంలో చాలా శ్రద్ధ వహించారు. వారు ఆ చెట్లను వారి పిల్లలుగా భావించి సంరక్షించారు. ప్రయాణ వసతులు బీజపూర్ జిల్లాలో ప్రాంతాలను రాజ్‌ట్రాంస్‌పోర్ట్ రహదారి మార్గంతో చక్కగా అనుసంధానం చేస్తుంది. వాయుమార్గం జిల్లాలో 100 కి.మీ దూరంలో షోలాపూర్ వద్ద వాణిజ్యరహిత విమానాశ్రయం ఉంది. జిల్లాకు ఉత్తరంలో 200 కి.మీ దూరంలో ఉన్న బెల్గాం జిల్లాలో విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్వేస్, జెట్ ఎయిర్వేస్ సర్వీసులు లభిస్తుంటాయి. సైనిక్ స్కూల్ వద్ద హెలిపాడ్ ఉంది. ఇది సైనిక్ స్కూలు అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుండి ప్రభుత్వ అతిధులు, అధికారులు మాత్రమే ప్రయాణిస్తుంటారు. రైలు మార్గం బీజపూర్‌లో బ్రాడ్ గేజ్ స్టేషన్ ఉంది. ఇది నగరకేంద్రం నుండి 2 కి.మీ దూరంలో ఉంది. Complete Info SWR ఇక్కడి నుండి బెంగుళూరు, ముంబయి, హైదరాబాదు, హుబ్లి, షోలాపూరు, షిర్ది. బసు సర్వీసులు ప్రభుత్వానికి స్వంతమైన " నార్త్ వెస్ట్ స్టేట్ రోడ్డు ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ " జిల్లాలోని అన్ని ప్రాంతాలకు బసులను నడుపుతుంది. ప్రాంతీయ బసులు బీజపూరు నగరపరిమితిలో మరొయు 15కి.మీ దూరంలో ఉన్న గ్రామాలకు నడుపబడుతున్నాయి. దూరప్రాంత బసులతో పో ల్చినట్లైతే నగరప్రాంతం బసులు అధికంగా ఉంటాయి. బీజపూర్ - బెంగుళూరు - హుబ్లి- ధార్వాడ, బెల్గాం మద్య ప్రైవేట్ యాజమాన్యం లగ్జరీ బసులను నడుపుతుంది. నగరం లోపల టాటా సుమో, టాటా ఇండికా. టెంపో టాక్సీలు లభ్యం ఔతుంటాయి. ఆటో, టోంగాలు ఇప్పటికీ ప్రజాదరణ కలిగి ఉన్నాయి. సైకిల్ రిక్షాలు సామాను తరలించడానికి ఉపయోగించబడుతున్నాయి. ప్రజలు సంప్రదాయం thumb|లంబాని మహిళలు|360x360px మద్య ఆసియాదేశం నుండి ముస్లింపాలకుల బిడారు ప్రజలలో భాగంగా ఇక్కడకు వచ్చారు. వీరిలో అత్యధికులు లిగాయత, సున్ని ముస్లిం వర్గానికి చెందినవారు. 2001 గణాంకాలను అనుసరించి వీరిలో 3,34,254 ఆదివాసి ప్రజలు. 30,051 మంది షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందినవారు. జిల్లాలో లంబాణి వర్గానికి చెందిన ప్రజలు అధికంగా స్థిరపడ్డారు. గ్రామాలలో నివసిస్తున్న లంబాణి ప్రజలను తండాలు అంటారు. క్రీడలు బీజపూర్ గుర్తింపుఒందిన జిల్లా నేషనల్ రోడ్డు సైక్లిస్టులు ఉన్నారు. మలేషియాలో నిర్వహించబడిన పెరిల్స్ ఓపెన్ 99 పోటీలలో సురేబన్ పాల్గొన్నాడు. . బి.ఆర్. అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడలకు ప్రధానకేంద్రంగా సేవలందిస్తుంది. అంబేద్కర్ స్పోర్ట్స్ వాలీబాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, సైక్లింగ్ క్రీడలకు అవసరమైన సౌకర్యాలను అందిస్తుంది. ప్రభుత్వసంస్థలే కాకుండా బి.ఎల్.డి.ఇ.ఎ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజి ఫిట్‌నెస్, స్పోర్ట్స్ సౌకర్యం అందిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతంలోని కబడీ, కోకో లను గుర్తిస్తుంది. క్రికెట్ ప్రాంతీయవాసులకు అభిమాన క్రీడ. అయినా స్కూల్స్, పాఠశాలలలో ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించబడుతుంటాయి. ప్రతిసంవత్సరం జిల్లాలో నవరాత్రి సమయంలో దసరా స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది. కళలు , సంస్కృతి నవరసపూర్ వద్ద ఆదిల్ షా అడిటోరియం ఉంది. ఇది నగరసరిహద్దు నుండి 10కి.మీ దూరంలో ఉంది. ఇప్పటికీ ఆసిధిలాలు కనిపిస్తూ ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించడానికి ప్రతిసంవత్సరం నవరసపూర్ ఉత్సవం నిర్వహింస్తున్నారు. భీంసేన్ జోషి, ఉస్తాద్ అల్ల రక్ష, జాకీర్ హుస్సేన్ (గాయకుడు), మల్లికార్జున మ్ంసూర్, గంగూభాయి హంగల్, పలువురు ప్రబల కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. శ్రీ సిద్ధేశ్వర్ ఆలయం:- ఇది నగరమద్యలో ఉంది. ఐది హిందువులకు పవిత్రప్రదేశం. అందమైన పర్యాటకప్రాంతంగ గుర్తించబడుతుంది. ఇక్కడ మకర సంక్రాంతి రోజున వార్షిక ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో పశువుల సంత నిర్వహించబడుతుంది. సమీపగ్రామాల నుండి వ్యవసాయదారులు ఇక్కడ పశువులను విక్రహిస్తుంటారు. మహారాష్ట్ర నుండి కొంతమంది పశువుల వ్యాపారానికి వస్తుంటారు. ఈ ఉత్సవంలో టపాసులు కూడా కాలుస్తుంటారు. కిత్తూరు చన్నామ్మ దియేటర్:- ఇక్కడ ఇప్పటికీ వృత్తికళాకారులు నృత్యప్రదర్శన ఇస్తుంటారు. నాటకాలకు ఆదరణ కరౌవౌతున్న కారణంగా నాటక కంపెనీలు మూతపడుతున్నాయి. నిలసం, (నీలకంటేశ్వర నాటక సంఘం), కె.వి. సుబ్బన్న స్థాపించిన ప్రయోగాత్మక దియేటర్ బృందం బీజపూరుకు వచ్చి నినాసం తిరుగాట్ట (కర్నాటల్ ఓ తిరగడం) కండగల్ హనుమతరాయ రంగ మందిర కళాకేంద్రాలుగ సేవలు అందిస్తున్నాయి. వేసవి కాలంలో ఈ దియేటర్‌లో అనేక నాటకాలు ప్రదర్శించబడుతుంటాయి. సూఫీయిజం బీజపూర్ " మదీనాతుల్ ఔలియా " (సూఫీలి) లేక సూఫీ సన్యాసుల నగరం. వివిధ ఔలియా (సూఫి సన్యాసులు) బీజపూర్‌ను సందర్శుంచారు. సూఫీ సన్యాసులలో అధికశాతం బీజపూర్‌లో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. జిల్లాలో ఔలియా క్వాద్రియా, సకఫ్యా, అష్రైఫ్యా, షుఫారియా, నాద్క్వాభండ్యా, చిసిత్యా మొదలైన విధానాలు ఆచరణలో కనిపిస్తుంటాయి. గొప్ప సన్యాసుల జాబితా:- హజ్రత్ పీర్ మహాబ్రి ఖందయత్, హజ్రత్ హాజీ రూమి. హజ్రత్ షేక్ ముంతజీబ్ ఖాద్రి (మాన్ ఖాద్రి). కుతుబుల్ అక్తబ్ సయెదిన హషింపీర్ దస్తగీర్ (ఆర్.హెచ్) హజ్రత్ సయ్యద్ షా ఖాద్రి తజీంతర్క్ (ఆర్.హెచ్) హజ్రాత్ ఖ్వాజా అమీనుద్దిన్ చిస్తి (ఆర్.హెచ్) చన్నబసప్ప అంబాజి - స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సంస్కర్త, మొదటి శాసనసభలో (భారతదేశం) సభ్యుడు (శాసన సభ్యులు) తికోట బసంత్ కుమార్ పాటిల్; -కె.ఎఫ్.సి.సి. అధ్యక్షుడు, ప్రసిద్ధ చిత్రం నిర్మాత. డాక్టర్ సరస్వతి చిమ్మల్గి - ఉత్తర కర్నాటకలోని ఎ.ఐ.పి.సి. అధ్యక్షుడు (కొత్త ఢిల్లీ), ప్రసిద్ధ కవి. నీలమ్మ మలిగ్వాడి; - అంతర్జాతీయ సైక్లిస్ట్, అనేక అవార్డులు విజేత సిరాజుద్దీన్. ఎం.హొరగిన్మని; -ఎం.ఎస్.సి. (గోల్డ్ పతక), పర్యావరణవేత్త ప్రేమలతా దురేబన్; - అంతర్జాతీయ సైక్లిస్ట్ (పెర్లిస్ పాల్గొన్నారు మలేషియా ఓపెన్ 99) ఎం.బి.పాటిల్ (ఎం.ఎల్.ఎ) శ్రీ సిద్ధేస్వర్ స్వామీజీ - ప్రసిద్ధ దేశం దేవుడు అని పిలుస్తారు షివానంద్ హిరేమఠ్ -స్వర్ణాంజలి, సెంట్రల్ ఒహియోలో ఉన్న ఒక సాంస్కృతిక సంస్థ (యు.ఎస్.ఎ ) వ్యవస్థాపకుడు శ్రీ కసగటేశ్వర్ - తాలికోటలో నదేదదువ్ దేవరు. సి.ఎస్. (అప్పాజి ) నాథగౌడ- శాసన సభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ చన్నబసప్ప వి బరగి - ప్రొఫెసర్ తత్వవేత్త, ఉత్తర-కర్ణాటక, సామాజిక కార్యకర్త అంతటా ఆయుర్వేద సాధకుడు గుర్తించినట్లుగా ప్రశాంత్ గురుబసప్ప బగలి (హొన్నుతగి బీజాపూర్) -ఇంఫొవల్లి బియోసిస్టంస్ -బెంగుళూర్, జెనెఫ్లక్స్ బయోసైన్సెస్-మలేషియా గెలిచింది అనేక బంగారు పతకాల యొక్క సహ వ్యవస్థాపకుడు ఆర్ధికం జిల్లా వాసులకు వ్యవసాయం ప్రధానవృత్తి. జిల్లా వైశాల్యంలో 7,760 చ.కి.మీ వ్యవసాయానికి అందుబాటులో ఉంది. జిల్లావైశాల్యంలో ఇది 74% ఉంది. అరణ్యప్రాంతం 0.19% ఉంది. 17.3% వ్యవసాయభూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది. 82.7% భూభాగం వర్షాధారితంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, బజ్ర, గోధుమలు, కందులు, చనగలు, పెసలు పండించబడుతున్నాయి. పొద్దుతిరుగుడు, కుసుంభగింజలు, వేరుశనగ మొదలైన పంటలు పండించబడుతున్నాయి. హార్టి కల్చర్ పద్ధతిలో ద్రాక్ష, దానిమ్మ, జామ, బెర్, సపోటా, నిమ్మ పండించబడుతున్నాయి. సమీపకాలంగా పండ్ల తోటలలో దానిమ్మ, ద్రాక్ష 8,610 చ.కి.మీ ప్రదేశంలో పండించబడుతుంది. 2002-3 లలో 52.2% ఆహారధాన్యం, నూనె గింజలు 15.6%, పత్తి, చెరకు 4.8%' ప,డించబడుతున్నాయి. సమీపకాలంలో 2 సంవత్సరాలుగా పత్తి, చెరకు పంట తగ్గుతూ వస్తుంది.  శ్రామికిలు వర్గీకరణ  శ్రామికుల సంఖ్య  రైతులు 2,21,060  వ్యవసాయ కూలీలు (భూ రహిత రైతులు) 2,87,778  Artisans 17,776  కుటీర పరిశ్రమలు 18,232  సేవా, ఇతర రంగాలు 1,95,573 విద్య బీజపూర్ సమీపకాలంలో విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందింది. 1980 కంటే ముందు జిల్లాలో కొన్ని వృత్తివిద్యాసంస్థలు ఉన్నాయి. వృత్తివిద్యాసంస్థలతో పలు విద్యాసంస్థలు గ్రాజ్యుయేట్, పోస్ట్ గ్రాజ్యుయేట్ ఫ్యాకల్టీ ఆర్ట్స్, సైన్సు, సోషల్ స్టడీస్, సైన్సు విద్య అందిస్తూ ఉండేవి. వృత్తివిద్యాసంస్థలు తప్ప మిగిలిన కాలేజీలు రాణిచెన్నామ్మ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు విశ్వేశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. బి.ఎల్.డి.ఇ.ఎ వైస్ ప్రింసిపాల్ డాక్టర్ పి.జి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హలకట్టి కాలేజ్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ కళాశాలల ఎస్.ఇ.సి.ఎ.బి కాలేజ్ అనుబంధంగా ఉన్నాయి. హెల్త్ సైన్సెస్ రాజీవ్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం .RGUHS-homepage బి.ఎల్.డి.ఇ.ఎ యొక్క బి.ఎం.పాటిల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అల్-అమీల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, సైనిక్ స్కూల్, బీజాపూర్, కర్ణాటక స్టేట్ వుమెన్ విశ్వవిద్యాలయం. ఎం.బి.ఎ, ఎం.సి.ఎ వంటి వివిధ పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. డిఫెంస్ ఫోర్స్‌కు సిబ్బందిని అందించడానికి అవసరమైన ఒకేఒక రెసిడెంషియల్ సైనిక పాఠశాల బీజపూరులో మాత్రమే ఉందని బీజపూర్ వాసులు సగర్వంగా చెప్పుకుంటారు. బీజపూర్ ఆలయాలకు స్మారకభవనాలకు గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికొరకు 1993లో కర్ణాటకా యూనివర్శిటీ పోస్ట్- గ్రాజ్యుయేట్ కాలేజీని స్థాపించారు. కర్ణాటకా యూనివర్శిటీ 2003లో బీజపూర్‌లో మహిళా విశ్వవిద్యాలయం స్థాపించింది. ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర కర్నాటక జిల్లాలలో 12 మహిళా కాలేజీలు పనిచేస్తున్నాయి.విశ్వవిద్యాలయం బేచిలర్ డిగ్రీ కొరకు ఆర్ట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్, విద్య, ఫ్యాషన్ టెక్నాలజీ, హోంసైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ సోషల్కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ మొదలైన కోర్సులను అందిస్తున్నాయి. బీడు భూములలో వ్యవసాయం అభివృద్ధిచేయడానికి అనువైన " యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ " సిటీ బస్ స్టాండు నుండి 6కి.మీ దూరంలో ఉంది. కిత్తూరు రాణి చెన్నామ్మ రెసిడెంషియల్ స్కూల్ - అంజుతగి ఇండి తాలూకాలో కొత్త భవననిర్మాణం చేపట్టింది. రాజకీయం బీజపూర్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాలు:- ముద్దెబిహాల్ దేవర హిప్పర్గిల్ బీజపూర్ (బీజపూర్ నగరం)'' బసవన బెగెవడిల్ బబలేశ్వర్ ఇండి (కర్నాటక) నాగనాథన్ సిందగి ప్రముఖులు భాస్కర బసవ - ఫిలాసఫర్, సాంఘిక సంస్కర్త (ఇంగలేశ్వర్‌లో జన్మించాడు) రన్న - పురాతన కన్నడ కవులలో ఒకరు. బి.డి జట్టి ఎస్.ఆర్. కంథిల్ వెంకన్న హెచ్ నాయక్ అమీర్‌బాయ్| కర్నాటక అలూరు వెంకట ఎం.ఎం.కాల్బుర్గిల్ సునీల్ కుమార్ దేశాయి: ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాత. గ్రామాలు అబ్బిహల్, బసవన బగెవది అబ్బిహల్, ముద్దెబిహల్ అద్వి హులగబల్ అద్వి సొమ్నల్ అగర్ఖెద్ అగసబల్, బసవన బగెవది అగసబల్, ముద్దెబిహల్ అగసనల్ అహెరి (బీజాపూర్) అహెరి (భెరి) అహిరసంగ్ ఐనపుర్ (బీజాపూర్) అకల్వది అలగినల్ అలహల్లి అల్గుర్ అలియబద్ అల్కొప్ప అల్మెల్ ఆలుర్ బీజాపూర్ జిల్లాలో అమరగొల్ అంబలనుర్ అనచి అంగదగెరి అనిమదు అంజుతగి అంకలగి అంతర్గంగి అరజనల్ అరకెరి (బీజాపూర్) అరలదిన్ని అరసనల్ అరసంగి ఉన్నారా శంకర్ అరెమురల్ అరెషంకర్ అర్జునగి అర్జునగి (భ్.ఖ్.) అర్జునగి (ఖ్.హ్.) అసంగి (భ్.ఖ్.) అసంగి (ఖ్.డ్.) అసంగిహల్ అసంతపుర్ స్ట్రాప్ స్పోర్ట్ హాల్ అథర్గ బబలది బబలద్ బబలెష్వర్ బబనగర్ హనుమంతయ (బీజాపూర్) బైల్కుర్ బలబత్తి బలదిన్ని బలగనుర్ బలగనుర్ బలవత్ బల్లొల్లి బలుతి (ఋ.ఛ్) బనహత్తి (ఫ్.ఆ) బందల్ బంగరగుంద్ బన్నిహత్తి బన్నిహత్తి (ఫ్.ట్) బనొషి బరగుది బరతగి బర్దొల్ బసనల్ బసర్కొద్ బసవనగర్ బసవనగర్ బసవెష్వర్ నగర్ బసవెష్వర్ నగర్ బస్తిహల్ బవూర్ బీరలదిన్ని బెకినల్ బెల్లుబ్బి బేలూర్ బెనకనహల్లి బెనకొత్గి బెనల్ ఆర్.సి భగనగర్ భైరవద్గి భైరునగి భంకల్గి భంథనల్ భంత్నుర్ భంత్నుర్ భతగునకి భుయర్ బిబి-ఈంగల్గి బిదనల్ బిదర్కుంది బిజ్జరగి బిలెభవి బింజల్భవి బిసనల్ బిస్నల్ బొలచిక్కలకి బొలవద్ బొలెగఒన్ బొమ్మనహల్లి (బీజాపూర్) బొమ్మనహల్లి (బీజాపూర్) బొమ్మనహల్లి (బీజాపూర్) బొమ్మనల్లి బొమ్మంజొగి బొర్గి బ్రమ్హదెవన్మదు బుదిహల్ బుదిహల్ బుదిహల్ (పి ఎన్) బుదిహల్ (పి.నల్తవద్) బుదిహల్ డాన్ బుదిహల్ (పి.హెచ్.) బుదిహల్ (పి.టి.) బుద్ని బురంపుర్ బైఅద్గిహల్ (పాత) బైఅకొద్ బైఅకొద్ బైఅలిహల్ బైఅలైఅల్ చబనుర్ చద్చన్ చలమి చంద్కవథె చంద్నగర్ చనెగఒన్ చత్తనహల్లి చత్తర్కి చవదిహల్ చవంభవి చీరల్దిన్ని చిచ్క్బెవనుర్ చిక్క-అల్లాపూర్ చిక్క-గలగలి చిక్కరుగి చిక్క-సింద్గి చింతమనినగర్ చిర్చంకల్ చొకవి చొంది చొరగి దంబల్ దసుర్ దస్యల్ దెగినల్ దెగినల్ దెవలపుర్ దెవంగఒన్ దెవపుర్ (బీజాపూర్) దెవర హిప్పర్గి దెవర-గెన్నుర్ దెవరనవద్గి దెవర్హులగబల్ దెవూర్ దెవూర్ ధనరగి ధన్యల్ ధవలగి ధవలర్ ధులిఖెద్ (పాత) ధుమకనల్ దిందవర్ దొమనల్ దొంకమదు ద్öన్üర్ దుదిహల్ దైఅబెరి ఫతెపుర్ పి.తలికొతి గబసవల్గి గాడి సొమనల్ గనవల్గ గాంధీనగర్ గంగనహల్లి గంగుర్ గని ఆర్.సి గనిహర్ గరసంగి గరసంగి (బి.కె.) గరసంగి (కె.డి .) గెద్దలమరి ఘలపుజి గొదిహల్ గొలసంగి గొలసర్ గొల్గెరి గొనల్ (పి.ఎన్) గొనల్ ఆర్.సి. గొనల్ ఎస్.హంద్రల్ గొనల్ ఎస్.హిరుర్ గొనసగి గొరవగుందగి గొర్నల్ (బీజాపూర్) గొతఖిందకి గొత్యల్ గోవిందాపూర్ (బీజాపూర్) గుబ్బెవద్ గుబ్బెవద్ గుదదిన్ని గుదదిన్ని గుద్దల్లి గుదిహల్ గుద్నల్ గుగదద్ది గునదల్ గునకి గుందకనల్ గుందకర్జగి గుందవన్ గుంద్గి గుథర్గి గుత్తిహల్ హచ్యల్ హదగలి హదగినల్ హదగినల్ హదలగెరి హదలసంగ్ హగరగుంద్ హల హళ్లీ హలగని హలగునకి హలగుందక్నల్ హలసంగి హలెరొల్లి (ఆర్.సి.) హలిహల్ హల్లద గెన్నుర్ హల్లుర్ హనమపుర్ హనమసగర్ హంచలి హంచినల్ హంచినల్ హంచినల్ హంచినల్ (పి.హెచ్) హంచినల్ (పి.ఎం.) హందర్గల్ల్ హందిగనుర్ హంద్రల్ హంగరగి హంగర్గి హంజగి హనుమనగర్ హరింద్రల్ హర్నల్ హర్నల్ హత్త హళ్లీ హత్తర్కిహల్ హవల్గి హవినల్ హెబ్బాల్ హెగదిహల్ హిక్కంగుత్తి హింగని హిరెబెవనుర్ హిరెమురల్ హిరుర్ హిత్తినహల్లి హిత్తినహల్లి హొక్కుంది హొక్రని హొనగనహల్లి హొనవద్ హొన్నల్లి హొన్నల్లి హొన్నుతగి బోటానికల్ గార్డెన్ హొసహల్లి హోసూర్ హుబనుర్ హులబెంచి హుల్లుర్ హునకుంతి హునష్యల్ (పి.బి.) హునష్యల్ (పి.సి.) హున్ష్యల్ హున్స్యల్ హువినహల్లి హువినహల్లి హువినహిప్పర్గి ఇబ్రహింపుర్ (బీజాపూర్) ఇంచగల్ ఇంచగెరి ఇందిరనగర్ ఇందిరనగర్ ఇందిరనగర్ ఇంగలెష్వర్ ఇంగల్గెరి ఇంగల్గి ఇంగల్గి ఇంగనల్ ఇతగి ఇతంగిహల్ ఇవనగి జైనపుర్ జైనపుర్ జక్కెరల్ జలగెరి జలపుర్ జల్పుర్ జల్వద్ జంబగి (ఆ) జంబగి (హ్) జమ్మలదిన్ని జంగమురల్ జతినల్ జయవద్గి జీరలభవి జీరంకల్గి జెత్తగి జెవూర్ జిగజీవని జుమ్నల్ కదకొల్ కదని కద్లెవద్ (పి.ఎ.) కద్లెవద్ (పి.సి.హెచ్.) కద్రపుర్ కగ్గొద్ కఖందకి కక్కలమెలి కలదెవనహల్లి కలగి కలహల్లి కల్గుర్కి కల్కెరి కల్లకవతగి కమల్దిన్ని కమంకెరి కంబగి కనబుర్ కనకల్ కనకనల్ కనమది కనముచనల్ కంచినల్ కందగనుర్ కన్నగుద్దిహల్ కన్నల్ కన్నల్ కన్నొల్లి కన్నూర్ కపనింబర్గి కరగనుర్ కరవినల్ కరిభంథ్నల్ హెచ్.కె. కరూర్ కషినకుంతి కతకనహల్లి కతరల్ కత్రల్ కౌలగి కౌల్గి కవదిమత్తి కెంగలగుత్తి కెంగినల్ కెరుర్ కెరుతగి కెసపుర్ కెసరత్తి ఖైనుర్ ఖానాపూర్ ఖానాపూర్ ఖతిజపుర్ ఖెద్గి ఖిలరహత్తి కిర్ష్యల్ కొదబగి కొదగనుర్ కొదగనుర్ కొకత్నుర్ కొళర్ (బీజాపూర్) కొలుర్ కొలురగి కొంద్గులి కొంకనగఒన్ కొన్నుర్ కొప్ప (బీజాపూర్) కొర్హల్లి కొర్వర్ కొత్నల్ కొత్యల్ క్రిష్ణపూర్ (బీజాపూర్ జిల్లా) కుబకద్ది కుచబల్ కుదగి కుదర్గొంద్ కుదరి సలవద్గి కుద్గి కులెకుమత్గి కుమషిగి కుమతగి కుమథె కుంచగనుర్ కుంతొజి కురబథల్లి కురుబరదిన్ని కైఅతనదొని కైఅతనకెరి కైఅతనల్ లచ్యన్ లక్కుండి లలసంగి లల్బహదుర్ షస్త్రినగర్ లింగదల్లి లింగదల్లి లింగదల్లి లొహగఒన్ గ్రామాన్ని (కె.డి.) లోని గ్రామాన్ని (భ్.ఖ్.) లొతగెరి మదబల్ మదగునకి మదనల్లి మదరి మదరి మదసనల్ మధభవి మదికెషిరుర్ మదినల్ మహల్ బగయత్ మహత్మగంధినగర్ మహవీర్నగర్ మైలర్ మైలెష్వర్ మజరెకొప్ప (ఆర్.సి.) మకనపుర్ మలగలదిన్ని మలఘన్ మల్ఘన్ మమదపుర్ (బీజాపూర్ ) మనగులి మనంకల్గి మంగలుర్ మంగలుర్ మన్నపుర్ మన్నుర్ మన్నుర్ మన్నుర్ మరదగి (ఆర్.సి.) మరగుర్ మరసనహల్లి మరిమత్తి (ఆర్.సి.) మర్కబ్బినహల్లి మసబినల్ మసలి (బి.కె.) మసలి (కె.డి..) మస్కనల్ మసుతి మసుతి మతకల్ దెవణల్లి మత్తిహల్ మవినల్లి మవింభవి మినజగి మించినల్ మిరగి మొరత్గి ముద్దపుర్ ముద్నల్ ముదుర్ ముకర్తిహల్ ముకిహల్ ములవద్ ముల్లల్ ముల్సవల్గి మురది ముత్తగి నాడ్ (బి.కె..) నాడ్ (కె.డి.ం.) నదహల్లి నగబెనల్ నగరబెత్త నగరదిన్ని నగరల్ నగరల్ నగరల్ డాన్ నగరల్దొన్ నగరళులి నగర్హల్లి నగర్హల్లి నగథన్ నగవి (బి.కె.) నగవి (కె.డి.) నగవద్ నగుర్ నగుర్ నలతవద్ నందరగి నంద్గెరి నందిహల్ (పి.హెచ్..) నందిహల్ (పి.యు.) నంద్రల్ నంద్యాల నరసల్గి నరసిమ్హనగర్ నవదగి నవరసపుర్ నెబగెరి నీరల్గి నెగినల్ నెహ్రునగర్ నెరబెంచి నిదగుంది నిదొని నింబల్ (బ్.కె.) నింబల్ (కె.డి.) నింబర్గి నివల్ఖెద్ నివర్గి ఓథిహల్ పదగనుర్ పదనుర్ పదెక్నుర్ పీరపుర్ పురదొల్ రబినల్ రాజాజీనగర్ రజనల్ రజనల్ రక్కసగి రమనగర్ రమనహల్లి రంభపుర్ రాంనగర్ (బీజాపూర్) రాంనగర్ (బారాబంకి) రాంపూర్ (పి.ఎ.) రాంపూర్ (పి.టి..) రెవథగఒన్ రొదగి రొనిహల్ రుదగి రుగి సలధల్లి సలవదగి సలొత్గి సంగొగి సంకనల్ సంఖ (పాత) సరవద్ సరుర్ (కర్ణాటక) ససబల్ ససనుర్ సతలగఒన్ (పి.ఐ.) సతలగఒన్ (పి.బి.) సతిహల్ సవల్సంగ్ సవనల్లి సీకల్వది సెవలల్నగర్ సెవలల్నగర్ షంబెవద్ షంకర్నగర్ (బీజాపూర్) శాంతినగర్ (బీజాపూర్ ) షెగునషి షెల్లగి షిగనపుర్ షిరబుర్ షిరదొన్ షిరగుర్ సమానమైన పవిత్ర స్థలంగా భావిస్తారు (పాత) షిరగుర్ ఖలస షిరస్గి షిర్కనహల్లి షిర్నల్ షిర్నల్ షిరొల్ షిర్ష్యద్ షివనగి షివపుర్ (బీజాపూర్ ) షివపుర్ (బి.కె.) షివపుర్ (ఖ్.హ్.) సిద్దనథ్ (ఆర్.సి.) సిద్దాపూర్ (బీజాపూర్ ) సిద్దాపూర్ పి.తలికొతి సింద్గెరి (పాత) సింద్గి (గ్రామీణ) సొలవదగి సొమజల్ సొమపుర్ సొమ్నల్ సొనకనహల్లి సులఖొద్ సుల్తాన్పూర్ సుంగథన్ సుర్గిహల్లి సుతగుంది తదల్గి తదవల్గ తద్దెవది తజపుర్ తజపుర్ (హెచ్) తకలి (బీజాపూర్) తక్కలకి తక్కలకి తక్కల్కి తలెవద్ తమదద్ది తంబ (బీజాపూర్) తంగదగి తపల్కత్తి తరనల్ తారాపూర్ (పాత) తవర్ఖెద్ (పాత) తెగ్గిహల్లి తెల్గి తెన్నిహల్లి [[ఠొంతపుర్ తిదగుంది తిగనిబిదరె తికొత తిల్గుల్ తిరుపతినగర్ తొన్స్యల్ తొరవి తుంబగి తుర్కంగెరి ఊచిత్నవద్గి ఊక్కలి ఊకుమనల్ ఊమ్రజ్ ఊమ్రని (పాత) ఊన్నిభవి ఊప్పలదిన్ని ఊప్పల-డిన్ని ఊత్నల్ ఊత్నల్ వనహల్లి వెంకతెష్నగర్ విభుతిహల్లి విజయనగర (బీజాపూర్ ) విజయనగర (బీజాపూర్) వదవదగి వదవదగి వేడ్ (బీజాపూర్) వనకిహల్ వనకిహల్ వందల్ వందల్ వర్కణల్లి యక్కుంది యల్గొద్ యల్గుర్ యల్వర్ యంబత్నల్ యంకంచి యరగల్ల యరజెరి యర్గల్ (బి.కె.) యర్గల్ (కె.డి.) యర్నల్ యత్నల్ యెల్గి (పి.హెచ్.) జలకి మూలాలు వెలుపలి లింకులు "Samanya Mahiti"a periodical released by the Bijapur Zilla Parishad. Tourist information of Bijapur and places nearby A Complete Information Portal of Bijapur Profiles of all the Districts in Karnataka Bijapur District Bijapur Heritage Profile of Adil Shah II. Bijapur at the Islamic Monuments of India Photographic Database SUFIS OF BIJAPUR IGNOU in the hindu newspaper వర్గం:బిజాపూర్ జిల్లా వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:1848 స్థాపితాలు వర్గం:బెల్గాం డివిజన్ వర్గం:భారతదేశం లోని జిల్లాలు
బళ్లారి
https://te.wikipedia.org/wiki/బళ్లారి
బళ్లారి కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా. చరిత్ర thumb|240x240px thumb|200px|రైల్వేష్టెషన్ లోపల,ప్లాట్‌ఫార్మ్ 1|right 1790ల వరకూ మైసూరు సామ్రాజ్యంలో భాగంగా ఉండే ప్రాంతమిది. 1796-98 ప్రాంతాల్లో మూడవ మైసూరు యుద్ధంలో బ్రిటీష్ వారి చేతిలో టిప్పుసుల్తాన్ ఓటమిపాలు కావడంతో మైసూరు సామ్రాజ్యంలోని భాగాలను కొన్నిటిని విజేతలు పంచుకున్నారు. విజేతలైన ఈస్టిండియా కంపెనీ వారు తమ మద్రాసు ప్రెసిడెన్సీకి, యుద్ధంలో సహాయం చేసిన మిత్రుడు నిజాం రాజుకి పంపకాలు పెట్టినప్పుడు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలు నిజాం కిందికి వచ్చాయి. తీరా రెండేళ్ళు గడవకుండానే 1800లో బ్రిటీష్ వారు నిజాం నుంచి తమకు రావాల్సిన సైన్యం ఖర్చుల బాకీ పద్దుకింద ఆ ప్రాంతాన్ని అంతా లెక్కకట్టుకోవడంతో ఇది తిరిగి ఈస్టిండియా కంపెనీ చేతికి వచ్చింది. అలా బ్రిటీష్ వారు నిజాం నుంచి పొందినందుకు ఈ ప్రాంతానికి దత్తమండలం అన్న పేరు స్థిరపడింది. ప్రముఖులు రూపనగుడి నారాయణరావు సుభద్రా శ్రీనివాసన్ ఇవీ చూడండి కళ్యాణ కర్ణాటక మూలాలు వెలుపలి లింకులు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు వర్గం:కర్ణాటక
కొప్పళ జిల్లా
https://te.wikipedia.org/wiki/కొప్పళ_జిల్లా
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో కొప్పళ జిల్లా ఒకటి. కొప్పళ (కోపనగర) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ప్రపంచ సంప్రదాయకేంద్రంగా గుర్తించబడిన హంపీ నగరం కొప్పళ పట్టణానికి 38కి.మీ దూరంలో ఉంది. జిల్లాలోని ఆనెగొంది కూడా ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా గుర్తించబడుతుంది. చరిత్ర కొప్పల్ జిల్లా కేంద్రం పురాతన కోపనగరం జైనులకు పవిత్రనగరంగా గుర్తించబడుతుంది. పాల్కిగుండు, గవిమథ్, కొప్పల్ పురాణాలలో వర్ణించిన ఇంద్రకీలాద్రి అని భావిస్తున్నారు. ఇక్కడ పురాతనమైన " మాలె మల్లీశ్వర " ఆలయం ఉంది. పాలకిగుండు, గవినాథ్ వద్ద రెండు శిలాశాసనాలు ఉన్నాయి. పశ్చిమ చాళుఖ్య సామ్రాజ్యానికి సామంతరాజ్యమైన షిలహరా రాజ్యానికి రాజధానిగా ఉంది. శివాజి పాలనాకాలంలో 8 రెవెన్యూ విభాగాలలో కొప్పళ నగరం ఒకటి. 1858లో భారతదేశ మొదటి స్వాతంత్ర్యసమరంలో ముందర్గి భీమారావు, హమ్మిజ్ కెంచనగౌడా ఇక్కడ ప్రాణత్యాగం చేసారు. లక్కకళాఖాండాలకు ప్రసిద్ధిగాంచిన కింహల్ కొల్లల్ పట్టణానికి 12 కి.మీ దూరంలో ఉంది. కొప్పల్ జిల్లాలో పట్టణాలు గంగావతి కనకగిరి కరతగి కొప్పళ్ కుక్నూర్ కుష్తగి (కుష్ఠగి) మునీరాబాద్ యెలబుర్గ భగ్యనగర్ తవరగెర హనుమసాగర్ కిన్నాల్ మంగలురు చల్లుర్ భౌగోళికం ఈ జిల్లా 7,190 కిమీ² విస్తీర్ణంలో ఉంది, 1,196,089 జనాభాను కలిగి ఉంది, ఇది 2001 నాటికి 16.58% పట్టణవాసులు. రాయచూర్ జిల్లా విడిపోయిన తరువాత కొప్పల్ జిల్లా ఏర్పడింది. తాలూకాలు కొప్పళ్ జిల్లాలో నాలుగు తాలూకాలు ఉన్నవి - కొప్పళ్ గంగావతి. యలబుర్గా కుష్టగి 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 2001-11 కుటుంబనియంత్రణ శాతం. స్త్రీ పురుష నిష్పత్తి. జాతియ సరాసరి (928) కంటే. అక్షరాస్యత శాతం. జాతియ సరాసరి (72%) కంటే. 2011 జనాభా లెక్కల ప్రకారం కొప్పల్ జిల్లా జనాభా 1,391,292, ఇది స్వాజిలాండ్ దేశానికి లేదా యుఎస్ రాష్ట్రమైన హవాయికి సమానం. ఇది భారతదేశంలో 350 వ ర్యాంకును ఇస్తుంది (మొత్తం 640 లో). జిల్లాలో జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 250 మంది (650 / చదరపు మైళ్ళు). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 16.32%. కొప్పల్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 983 మంది స్త్రీలు, అక్షరాస్యత 67.28%. పర్యాటక ఆకర్షణలు thumb|right|280px|కొప్పల్ జిల్లాలోని ఇటాగి వద్ద మహాదేవ ఆలయం, సా.శ. 1112, నగరా సూపర్ స్ట్రక్చర్‌తో కర్ణాట-ద్రవిడ ఉచ్చారణకు ఉదాహరణ పశ్చిమ చాళుఖ్య కాలానికి చెందిన నిర్మాణాలలో.Western Chalukya architecture ఇతగి వద్ద ఉన్న " మహదేవ ఆలయం " ఒకటి. ది మహదేవ ఆలయం thumb|left |1112 CE, కొప్పల్ జిల్లా ఇటగిలోని మహాదేవ ఆలయంలో ఓపెన్ మంటప (హాల్) thumb|left|మహాదేవ ఆలయంలో మూర్తి శిల్పం ఇతగి వద్ద మహాదేవ ఆలయంలోని ప్రధానదైవం శివుడు. చాళుఖ్యులు నిర్మించిన బృహత్తరమైన ఆలయాలలో ఇది ఒకటి. ఇది అతిప్రాముఖ్యమైన ఆలయంగా గుర్తించబడుతూ ఉంది. శిలాక్షరాలు ఈ ఆలయాన్ని ఆయయాల చక్రవర్తిగా అభివర్ణిస్తున్నాయి.Kamath (2001),pp 117–118 ప్రధాన ఆలయంలో లింగరూపంలో ఉన్న శివుడు ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలలో కూడా లింగప్రతిష్ఠ్జ చేయబడి ఉంది. ఈ ఆలయం 1112 లో చాళుఖ్యుల సేనాపతి చేత నిర్మించబడింది. ఆలయ ప్రాంగణంలో చాళుఖ్యుల సేనాపతి తల్లితండ్రులైన మూర్తినారాయణ, చంద్రకేశ్వరిలకు ఉపాలయాలు ఉన్నాయి. . హవేరి, సావనూర్, బైయాద్గి, మోటెబెన్నూర్, హంగల్ భూభాగంలో సోప్‌స్టోన్ విస్తారంగా లభిస్తుంది. ఆలయనిర్మాణానికి బాదామి చాళుక్యులు ఉపయోగించే గొప్ప ప్రాచీనమైనది ఇసుకరాయి బిల్డింగ్ బ్లాక్స్, చిన్న సోప్‌ స్టోన్ బ్లాక్లను ఉపయోగించారు.Cousens (1926), p 18 ఈ మూలపదార్ధాలను ఉపయోగించి నిర్మించిన మొదటి ఆలయం దార్వాడ జిల్లాలో అన్నిగేరి వద్ద ఉన్న అమర్తేశ్వరాలయం. ఈ ఆలయం సా.శ. 1050లో నిర్మించబడింది. ఇతగి వద్ద మహాదేవ ఆలయం వంటి పలు ఆలయాలకు ఈ ఆలయం నమూనాగా ఉంది.Foekema (2003), p 49 11వ శతాబ్దం నుండి ఆలయాల నిర్మాణం అధికం అయింది. 12 వ శతాబ్దంలో కూడా ఆలయనిర్మాణ సంప్రదాయం అధికం అయింది. ఇందుకు ఇతగి వద్ద మహాదేవ ఆలయం, హవేరి వద్ద ఉన్న శిద్ధేశ్వర ఆలయం ఉదాహరణగా నిలిచాయి. అన్నెగేరి వద్ద ఉన్న అమర్తేశ్వర ఆలయంలా ఉన్నప్పటికీ మహాదేవఆలయ అలంకరణలలో కొన్ని మార్పులు ఉన్నాయి. సాలా పైకప్పు అద్భుతమైన నిర్మాణ వైభవం కలిగి ఉంది. ఆలయ ఆవరణలో పిలాస్టర్ సూక్ష్మరూప నిర్మాణం (మినియేచర్) ఉంది.Foekema (2003), p 57 thumb|right|కర్ణాటకలోని కుక్నూర్ లోని నవలింగ ఆలయంలో 9 వ శతాబ్దపు కన్నడ శాసనం రెండు ఆలయాల నిర్మాణ కాలవ్యవధి 50 సంవత్సరాలు. మహాదేవ ఆలయంలో దృఢమైన నమూనాలు, అలంకరణలు కనిపిస్తుంటాయి. 11వశతాబ్ధానికి విలాసవంతమైన శిల్పాల స్థానంలో కొన్ని కొత్త శిల్పాలు చోటుచేసుకున్నాయి.Foekema (2003), p 56 కుకునూర్ కామతకలో అతి ప్రఖ్యాతి గాంచిన కాశివిశ్వనాథ ఆలయం Rashtrakutas, పట్టడకల్ వద్ద ఉన్న జైన్ నారాయణ ఆలయం రెండూ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. ఇతర ఆలయాలలో కొన్నూరు వద్ద ఉన్న పరమేశ్వర ఆలయం, సవాడి వద్ద ఉన్న బ్రహ్మదేవుని ఆలయం, అయిహోల్ వద్ద ఉన్న సెత్తవ్వ, కొంటిగుడి, జదరగుడి, అంబిగెరగుడి మొదలైనవి ప్రధానమైనవి. రాన్ వద్ద ఉన్న మల్లికార్జునాలయం, హులి వద్ద ఉన్న అంధకేశ్వరాలయం, సోగల్ వద్ద ఉన్న సోమేశ్వరాలయం, లోకపురా వద్ద ఉన్న లోకేశ్వరాలయం, కుక్నూర్ వద్ద ఉన్న నవలింగ ఆలయం, సందూర్ వద్ద ఉన్న కుమారస్వామి ఆలయం, గుల్బర్గలో ఉన్న షిరివాల్ ఆలయాలు కల్యాణి చాళుఖులచేత అభివృద్ధి చేయబడ్డాయి. ఈ ఆలయాల గురించిన పురాతత్వపరిశోధనలు ఈ ఆలయాలు పలుభాషలకు చెందిన వారిచే అభివృద్ధిచేయబడ్డాయని తెలియజేస్తున్నాయి. వీటిలో ( హొయశిల చెందిన బేలూరుకు, హళిబీడు ఆలయాలు ఉన్నాయి.Sundara and Rajashekar, దక్కన్ పీఠభూమిలో రూపుదిద్దుకున్న ఈ ఆలయాలు అత్యున్నత భారతీయ సాంస్కృతిక సంపన్నతకు చిహ్నాలుగా ఉన్నాయి. బాలక్రిష్ణహరి చపేకర్ thumb|right|కొప్పల్ జిల్లా ఇటాగి వద్ద మహాదేవ ఆలయంలో గృహ పైకప్పు 1897లో బాలకృష్ణ హరి చపేకర్ (చపేకర్ సోదరులలో ఒకరు)కు ర్యాండ్ కాల్చివేతలో సంబంధం ఉన్నకారణంగా పూనాలో ఖైదుచేయబడ్డాడు. మిస్టర్. స్టెఫెంసన్ చేత రాయచూరులో ఖైదుచేయబడ్డాడు. ఈ ఖైదు కొరకు బాంబే ప్రభుత్వం నుండి హెరాబాద్ పోలీస్ అవార్డును అందుకున్నది. ఈ సందర్భంలో బాలకృష్ణహరి చపేకర్ కొప్పల్, గంగావతి కొండల మధ్య (అది అప్పుడు రాయచూరు జిల్లాలో ఉన్నాయి) దాదాపు ఆరు మాసాల కాలం అఙాతవాసం చేసాడు. ఈ సంఘటనలో బాలకృష్ణహరి చపేకర్ ప్రజలసానుభూతిని చూరగొన్నాడు. ఆయన ఆచూకీ కొరకు బాంబే ప్రొవింస్‌కు తరఫున హైదరాబాదు పోలీస్ తీవ్రమైన విచారణ సాగించింది. ఖైదు తరువాత బాలకృష్ణహరి చపేకర్ ఆచూకీ తెలియజేసిన వారి పేర్లు హైదరాబాదు పోలీస్ చేత రహస్యంగా ఉంచబడ్డాయి. ఈ సంఘటన తరువాత బాలకృష్ణహరి చపేకర్ పట్ల ప్రజలకు సానుభూతి అధికరించించింది. తరువాత అచూకీ తెలియజేసినవారు భయభ్రాంతులకు గురయ్యారు. 1898లో జరిగిన ఈ సంఘటన తరువాత మరాఠీప్రజల స్వాతంత్ర్య పోరాటం వెలుగులోకి వచ్చింది. ఇవి కూడా చూడండి కొప్పల్ (పార్లమెంటు నియోజకవర్గం) కళ్యాణ కర్ణాటక మూలాలు వెలుపలి లింకులు Official website of Koppal district Kalyani Chalukyan temples on www.templenet.com Karnataka District Gazetteer Page 36 వర్గం:కొప్పల్ జిల్లా వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:కర్ణాటక జిల్లాలు
మాండ్య జిల్లా
https://te.wikipedia.org/wiki/మాండ్య_జిల్లా
మండ్య () కర్ణాటక రాష్ట్రములోని నగరం, మండ్య జిల్లా (కన్నడం: ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆ ) యొక్క ప్రధానపట్టణం. మండ్య మైసూరు నుండి 40 కిలోమీటర్లు, బెంగళూరు నుండి వంద కిలోమీటర్లు దూరములో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,808,680 వీరిలో 16.03% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు.. సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా దక్షిణ సరిహద్దు మైసూరు పశ్చిమ సరిహద్దు హాసన్ ఉత్తర సరిహద్దు తుముకూరు తూర్పు సరిహద్దు రామనగర్ జిల్లా రూపకల్పన 1939 పేరువెనుక చరిత్ర మాండ్య జిల్లాకేంద్రం. మాండ్య కారణంగా జిల్లాకు ఈ పేరు వచ్చింది. మాండ్య నగర నామం వెనుక పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఇది మాండవ్య ముని నివసించిన ప్రాంతం కనుక నగరానికి ఈ పేరు వచ్చిందని విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ పరిశోధకులు, విద్యావంతులు పురాతన శిలాక్షరాలను అనుసరించి మన్- త- య (ಮಂಟಯ) అని పేర్కొన్నారు. ఇది పురాతన కాలం నుండి మానవ నివాసప్రాంతంగా ఉందని విశ్వసిస్తున్నారు. ("ಆವಾಸಸ್ತಾನ, ಅತ್ಯಂತ ಪ್ರಾಚೀನವಾದ ನಾಗರೀಕತೆಗೂ ಮುನ್ನಿನ ಜನವಸತಿ ಎಂಬ ಅರ್ಥವಿದೆ". "ಸುವರ್ಣ ಮಂಡ್ಯ" ಪುಸ್ತಕದಿಂದ - ಸಂಪಾದಕರು ದೇ. ಜವಾರೇಗೌಡ (ದೇಜಗೌ)). కాలక్రమంలో ఇది మాండ్య అయింది. చరిత్ర మాండ్య చరిత్రకు మైసూరు రాష్ట్రంతో సమీప బాంధవ్యం ఉంది. మాండ్య, కావేరీ ముఖద్వారం పరిసర ప్రాంతాలను గంగాలు, చోళులు, హొయసలలు తరువాత 1346 లో విజయనగర రాజులు పాలించారు. 1565 యుద్ధంలో విజయనగరం దక్కన్ నవాబుల సమాఖ్య చేతిలో ఓడిపోయిన తరువాత విజయనగర సామ్రాజ్యం పతనావస్థకు చేరుకుంది. తరువాత క్రమంగా ఉడయార్లు బలపడసాగారు. తరువాత వారు దక్షిణభారతదేశంలోని ఒక చిన్న భూభాగానికి స్వతంత్ర పాలకులు అయ్యారు. అందులో పురాతన మైసూరు భూభాగం ఉంది. ఉడయార్లు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ కన్నడ, ధార్వార్ ప్రాంతాలను శ్రీరంగ పట్నం రాజధానిగా చేసుకుని పాలించారు. ఒడయార్లు ఉడయార్ల శక్తి 1761 వరకు నిరాఘాటంగా కొనసాగింది. వారి సైన్యాధికారులలో ఒకడైన హైదర్ అలి బలం పుంజుకుని ఒడయార్లను అధిగమించాడు. 1799లో హైదర్ ఆలి కుమారుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయాడు. కృష్ణరాజ ఒడయార్ 1799 జూన్ 30 న మూడవ కృష్ణరాజ ఒడయార్ మైసూరు సింహాసనాధిష్టుడు అయ్యాడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఒడయార్ల పాలన ముగింపుకు వచ్చింది. 1939 నుండి మాండ్య జిల్లాలోని తాలూకాలు మార్చకుండా స్థిరంగా ఉన్నాయి. భౌగోళికం జిల్లా వైశాల్యం 4850.8 చ.కి.మీ. జిల్లా భూభాగం చదరంగా ఉంటుంది. జిల్లా ఆగ్నేయ భూభాగంలో ఉన్న బిలిగిరిరంగన పర్వతశ్రేణిలోని పొడిగింపుగా అక్కడక్కడా రాళ్ళు ఉంటాయి. జిల్లాలో కావేరి, హేమవతి, లోకపావని, షింహ నదులు ప్రవహిస్తున్నాయి. నదీప్రవాహాలు జిల్లాకు ఆధ్యాత్మిక ఉన్నతి, ప్రాకృతిక సౌందర్యం ఇస్తున్నాయి. నదులు ప్రయాణయోగ్యం కాకున్నా అందమైన జలపాతాలను సృష్టిస్తున్నాయి. జలపాతాల సమీపంలో, నదీతీరాలలో ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి. భారతీయులకు నదులపట్ల ఉన్న పవిత్రభావానికి ఈ ఆలయాలే ప్రత్యక్షసాక్ష్యాలు. పర్యాటక ఆకర్షణలు thumb|రంగనాథ స్వామి ఆలయానికి పశ్చిమ గంగా రాజవంశం నాటి చరిత్ర ఉంది thumb|హొయసల ఆర్కిటెక్చరల్ షోపీస్ అయిన హోసహోలాలు వద్ద ఉన్న లక్ష్మీనారాయ ఆలయం (సా.శ. 1250) thumb|కిక్కెరి వద్ద ఉన్న బ్రహ్మేశ్వర ఆలయం (సా.శ. 1171) ఒక ప్రసిద్ధ హొయసల నిర్మాణ సాధన thumb|పంచకూట బసాది 10 వ శతాబ్దపు ద్రావిడ కళ చక్కటి నమూనా దీనిని పశ్చిమ గంగా రాజవంశం నిర్మించింది thumb|గోవిందనహళ్లిలోని పంచలింగేశ్వర ఆలయం సా.శ. 1230 హొయసల నిర్మాణం thumb|బసరాలు వద్ద ఉన్న మల్లికార్జున ఆలయాన్ని సా.శ. 1234 లో హొయసలు నిర్మించారు మాండ్య మాండ్య పట్టణంలో 1933 జనవరిలో మాండ్య షుగర్ ఫ్యాక్టరీ స్థాపించిన తరువాత మాండ్య ప్రాధాన్యత పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఈ సంస్థ స్థాపనకు 20 లక్షలు ఖర్చుపెట్టారు. ఇది ఆకాలంలో అతి పెద్ద మొత్తం. ఈ సంస్థ భారతదేశంలో పెద్ద సంస్థలలో ఒకటని భావిస్తున్నారు. ఇది బెంగళూరుకు 99కి.మీ, ఉత్తర మైసూరుకు 40 కి.మీ దూరంలో ఉంది. మాండ్య పట్టణంలో జనార్ధనస్వామి ఆలయం ఉంది. ఆలయ ప్రధానదైవం విష్ణుమూర్తి శంఖు చక్రాలు ధరించి శ్రీదేవి భూదేవితో కొలువైఉంటాడు. ఆలయగోపురం సమీపకాలంలో పునరుద్దరించబడింది. ఇక్కడ ఏప్రిల్ - మే మాసాలలో రథోత్సవం నిర్వహించబడుతుంది. మద్దూర్ మద్దూర్ మాండ్య నుండి 21 కిమీ దూరంలో ఉంది. ఇది పౌరాణిక ప్రాధాన్యత కలిగి ఉంది. దీని అసలు పేరు అర్జునపుర. అర్జునుడు యాత్రా సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించాడని విశ్వసిస్తున్నారు. టిప్పు - బ్రిటిష్ యుద్ధాల కారణంగా పట్టణం విపరీతంగా సమస్యలను ఎదుర్కొన్నదని చరిత్రకారులు భావిస్తున్నారు. టిప్పు సుల్తాన్ మద్దూరును కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలతో పోరాటాలు సాగించాడు. మద్దూరు కోటను టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలి నిర్మించాడు. ఈ కోటను కార్న్వాల్ 1791లో ధ్వంసం చేసాడు. ఇది మాంఢ్యకు 21 కి.మీ దూరంలో ఉంది. మద్దూరులో నరసింహాలయం ఉంది. హొయసల రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం ఇప్పటికీ సజీవంగా ఉంది. ఆలయంలో నల్లరాతితో చేయబడిన 7 అడుగుల ఉగ్రనరసింహ మూర్తి ప్రతిష్ఠించబడి ఉంది. మద్దూరులో వరదరాజ ఆలయం ఉంది. ఇది ఆరంభకాల చోళులు కాని అంతకంటే ముందుకాని నిర్మించబడినదని భావిస్తున్నారు. ఆలయంలో ప్రధానదైవం అలియనంతనాథుని ముందు, వెనుక మూర్తులను 12 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించారు. కన్నడంలో " ఎల్ల దేవర ముందే నోడు అలియనాథ బిందే నోడు " (ఎల్లదేవర ముందు చూడు అలియనంతనాథుని వెనుక చూడు) అంటారు. అన్ని దైవాలు ముందుకు చూస్తుంటే అలియనంతనాథుడు వెనుకకు చూస్తుంటాడు. మద్దూరు వడలకు ప్రసిద్ధి. వివిధ రకాల పప్పులతో చేయబడిన రుచికరమైన వడలకు ప్రసిద్ధి. మలవల్లి మలవల్లి మాండ్య నుండి 37 కి.మీ దూరంలో ఉంది.ఇది బ్రిటిష్ వారికి ఉపకరించకుండా ఉండాడానికి టిప్పు సుల్తాన్ తనకు తానే దీనిని కొంత ధ్వంసం చేసాడు. ప్రస్తుతం మలవల్లిలో సెరికల్చర్ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. మలవల్లిలో తోలుపరిశ్రమ కూడా అభివృద్ధి దశలో ఉంది. జలపాతాలు మలవల్లి నుండి 20 కి.మీ దూరంలో ఉంది. మాండ్య నుండి 44 కి.మీ దూరంలో ఉంది. శివసముద్రం నుండి కావేరీ నది రెండుగా చీలి ప్రవహిస్తుంది. అవి 106.68 అడుగుల ఎత్తు నుండి కిందకు పడడం వలన కావేరీ జలపాతాలు ఏర్పడ్డాయి. పశ్చిమ జలపాతాన్ని గగనకుచ్చి అంటారు. గగనకుచ్చి జలపాతం 16వ శతాబ్ధానికి చెందిన నందిరాజా ఆత్మహత్యా ప్రదేశంగా భావిస్తున్నారు. నందిరాజా తనభార్యతో కలిచి గగనకుచ్చి జలపాతం నుండి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. తూర్పు ప్రవాహం నుండి బారాకుచ్చి జలపాతం ఏర్పడింది. ఇది వర్షాకాలం (జూలై నుండి నవంబరు మద్య కాలం )ఇది అందంగా కనిపిస్తుంది. భీమేశ్వరి కావేరీ ఫిషింగ్ క్యాంప్. మాండ్య నుండి 50 కి.మీ దూరంలో ఉంది. ఈ క్యాంప్ కావేరీ నదీ తీరంలో ఉంది. కావేరీ నది సహజసిద్ధంగా ఏర్పరిచిన అభయారణ్యంలో " మహ్సీర్ (ఆసియా ప్రీమియర్ స్పోర్టింగ్ ఫిష్ ) కి ఇది అభయమిస్తుంది. ఇది శివసముద్రం - మెకెడతు మధ్య కావేరీ నదీజలాలతో కావేరీ దిగువవ ప్రవాహంలో ఏర్పడింది. వర్దంత్ వ్యాలీలోని దట్టమైన అరణ్యాకలో ఏనుగు, సాంబార్, చిరుత, అడవి పంది, రంగురంగుల పక్షులు ఉన్నాయి. కావేరీ జలాలు మొసళ్ళకు కూడా ఆశ్రయం ఇస్తున్నాయి. అందమైన ఈ జలాశయ పరిసరాలలో కొందరు రిసార్ట్ స్వతదార్లు సౌకర్యవంతమైన టెంట్లు ఏర్పాటు చేసారు. ఈ ఫిషింగ్ కేంద్రం విహారకేంద్రంగా కూడా ఉంది. పాండవపుర పాండవపురా మాండ్య నుండి 26.4 కి.మీ దూరంలో ఉంది. హైదర్ అలి, టిప్పు సుల్తాన్ కాలంలో ఇది సైనిక స్థావరంగా ఉంది. టిప్పు సుల్తాన్ సమయంలో ఫ్రెంచ్ సర్వీసుమెన్‌కు ఇది నివాసంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ బృహత్తర - ప్రణాళికలో స్థాపించబడిన షుగర్ ఫ్యాక్టరీ ఉంది. గతంలో పాండవపురాను హీరోడ్- దండు, ఫ్రెంచ్ రాక్స్ అనేవారు. కుంతిబెట్ట కుంతిబెట్టా పాండవపురా నుండి 2 కి.మీ దూరంలో ఉంది. లక్కాగృహ దహనం తరువాత అరణ్యాలలో సంచరిస్తున్న సమయంలో పాండవులు తమతల్లి కుంతితో కొంతకాలం ఇక్కడ నివసించాడని విశ్వసిస్తున్నారు. మేల్కోటె మేల్కోటె పాండవపురా నుండి 25 కి.మీ దూరంలో, మాండ్య నుండి 38 కి.మీ దూరంలో ఉంది. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. 12 వ శతాబ్ధంలో మేల్కోటెలో శ్రీవైష్ణవ సప్రదాయానికి చెందిన శ్రీ రామానుజాచార్య 14 సంవత్సరాల కాలం నివసించాడని విశ్వసిస్తున్నారు. మైసూరు మాహారాజులు మేల్కోటె లోని చలువరాయస్వామి భక్తులు. మైసూరు మహారాజా ఆలయానికి విలువైన ఆభరణాలు సమర్పించారు. చలువరాయస్వామిని సంవత్సరానికి ఒకదారి మార్చ్- ఏప్రెల్‌లో ఈ ఆభరణాలతో అలంకరిస్తుంటారు. ఈ ఉత్సవసమయాన్ని " వీరముడి " అంటారు. ఆలయంలో 1785 కాలంనాటి శిలాశాసనాలలో ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్ కొన్ని ఏనుగులను కానుకగా సమర్పించాడని తెలియజేస్తున్నాయి. శిలాసదృశ్యమైన కొండలలో నిర్మించబడిన యదుగిరి పట్టణం సౌదర్యవంతమైన ప్రకృతి దృశ్యాలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయంగా ఉంటుంది.. తిరుమలసాగర తిరుమలసాగర మేల్కొటెకు 6 కి.మీ దూరంలో ఉంది. తిరుమలసాగర సరోవరం రామానుజాచార్య అభీష్టం మేరకు హొయశిల రాజు బిట్టిదేవ చేత నిర్మించబడింది. బిట్టిదేవ వైష్ణవ సంరదాయాన్ని స్వీకరించి విష్ణువర్ధన నామాన్ని స్వీకరించాడు. అందుకు ఇక్కడ నిర్మించబడిన నంకి నారాయణ స్వామి, వేణుగోపాలా ఆలయాలు హొయశిల నిర్మాణకళకు సాక్ష్యాలుగా ఉన్నాయి. 1749 లో బీజపూర్ సుల్తాన్ ఆదిల్షా ఈ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో విలీనం చేసి దీనికి " మోతి తలాబ్ " లేక్ ఆఫ్ పీర్ల్స్ " (ముత్యాల సరసు) అని నామకరణం చేసాడు. కృష్ణరాజిపేట కృష్ణరాజపేట్ హొయశిల ఆలయాలకు నిలయం. హొయశిలల కాలంలో ఇక్కడ పలు ఆలయాలు నిర్మించబడ్డాయి. వీటిలో లక్ష్మీనారాయణాలయం శిల్పకళాసౌందర్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయం కృష్ణరాజపేటకు మూడు కి.మీ దూరంలో హొసహోలలు కుగ్రామం ఉంది. హొయశిల నిర్మాణవైభవానికి ఈ ఆలయం చిహ్నంగా ఉంది. ఇది ఒకప్పుడు అగ్రాహారంగా ఉండేది. ఇక్కడ ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్న కోట ఉంది. ఈ కోటను విజయనగర రాజులు పునరుద్ధరించారు. హొసహోలలు లక్ష్మీనారాయణ ఆలయం శిల్పకళా శోభ సోమనాథపూర్, నుగ్గెహల్లి, జవగల్, హిరెనల్లూర్, అరలుకుప్పె ఆలయ శిల్పకళావైభవానికి సమానమని భావిస్తున్నారు. నిర్మాణ శైలిని అనుసరించి ఇది 13 వశతాబ్ధానికి చెందినదని భావిస్తున్నారు. ఇది నక్షత్రాకారంలో నిర్మించబడిన వేదిక మీద త్రికుటాచల (మూడు ద్వారాలు) నిర్మాణం. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి విశాలమైన ఆవరణను వదిలి ఈ ఆలయం నిర్మించబడింది.ఆలయం మద్య స్థాంభాల మండపం ఉంది. నవరంగ మండపంలో ఉన్న స్తంభాలు నృత్యభంగిమలో ఉన్న నర్తకీమణుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. నవరంగ మండపం పైకప్పు కూడా శిల్పాలతో అలంకరించబడి ఉంది. ఆలయ కుడ్యశిల్పాలలో లతలు, ఏనుగులు, గుర్రాలు, పౌరాణిక దృశ్యాలు, స్క్రోల్స్, హంసలు, అనేక దైవాలు, దేవతలు వారి పరివారం శిల్పాలతో అలంకరించారు. ఆలయ కుడ్యాలలో రామాయణ, మాహాభారత, భాగవత కథలలోని దృశ్యాలను చెక్కారు. ఆలయంలో అదనంగా మాధవ, ధంవంతరి, దక్షిణామూర్తి, నృత్యసరస్వతి, కాళింది మర్ధన, పార - వాసుదేవ, నృత్యకారులు, సంగీతకారుల శిల్పాలు ఉన్నాయి. ఆలయం వెలుపలి కుడ్యాలలో అరగంబాలు, అరెగోపురాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ గాలిగోపురం అయిదు అంతస్తులతో నిర్మించబడి ఉంది. ఆలయగోపురం మీద వర్షపునీటిని వెలుపలికి పంపేవిధంగా చేసిన నైపుణ్యం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆలయంలో హరిహరేశ్వర, ఆంజనేయ ఉపాలయాలు ఉన్నాయి. 17వ శతాబ్ధానికి చెందిన ఆంజనేయ ఆలయంలో 10 అడుగుల ఎత్తైన గరుడ స్తంభం ఉంది. రంగబ హాబ్బ పేరుతో ఆలయంలో హీళి పండుగ సందర్భంలో వార్షిక జాతర నిర్వహించబడుతుంది. గ్రామంలో ఒక సరసు ఉంది. ఇక్కడ మోనోలిథిక్ బసవ విగ్రహం లభించింది. కిక్కెరి కిక్కేరి లోని బ్రహ్మేశ్వరాలయం కృష్ణరాజపేట నుండి 14 కి.మీ దూరంలో ఉంది. హొయశిల రాజుల నిర్మాణకళకు ఇది ఉదాహరణగా ఉంది. ఈ ఆలయాన్ని 1171లో మొదటి నరసింహ నిర్మించాడు. ఆలయంలోని స్థాంభాలు అందంగా మలచబడి శిల్పకారుల నైపుణ్యానికి చిహ్నంగా ఉన్నాయి. బసరాలు బసరాలు ఒక చిన్న గ్రామ. ఇది 12వ శతాబ్ధానికి చెందిన మల్లికార్జునఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని హొయశిల సైనికాధికారి చేత నిర్మించబడింది. ఆలయ వెలుపలి కుడ్యాలలో రామాయణ, మాహాభారత, భాగవతం చెక్కించబడి ఉన్నాయి. ఆలయంలో ఉన్న అద్భుతచిత్రాలలో అంధకాసురుని తల మీద నర్తిస్తున్న 16 భుజాలు కలిగిన శివుని నటరాజమూర్తి, కైలాసాన్ని పైకెత్తుతున్న రావణాసురుని శిల్పాలు ఉన్నాయి. శివపుర శివపుర మాండ్య నుండి 1 కి.మీ దూరంలో ఉంది. శివపుర జిల్లాలోని ప్రముఖ చారిత్రక ప్రదేశాలలో ఒకటి. 1938 10-12 ఏప్రిల్ మద్య వేలాది స్వాతంత్ర్య సమర యోధులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంఢా ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్ర్య సమర యూధుల వీరత్వానికి చిహ్నంగా ఇక్కడ స్మారక చిహ్నం నిర్మించబడింది. కొక్కరె-బెల్లురు కొక్కరే - బెల్లూరు గ్రామం ప్రస్తుతం పక్షుల శరణాలయంగా అభివృద్ధి చేయబడ్జింది. కొక్కరే - బెల్లూరు కొంగలను, పెలికాన్లు, పెద్ద సంఖ్యలో వలస పక్షులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు అక్టోబరు - మార్చి మాసాలలో వలస పక్షులు అధికంగా వస్తుంటాయి కనుక పక్షులను వీక్షించడానికి ఇది అనుకూల సమయం. బ్లఫ్ బ్లఫ్ పవర్ జనరేటింగ్ స్టేషను తూర్పు ఆసియా మొదటి పవర్ జనరేటింగ్ స్టేషను‌గా గుర్తించబడుతుంది. దీనిని 1902లో మైసూర్ దివాను దీనిని స్థాపించాడు. ఇక్కడకు 200 కి.మీ దూరంలో ఉన్న కోలార్ బంగారు గనులకు విద్యుత్తును అందించడానికి ఈ పవర్ ప్లాంటు స్థాపించబడింది. 137.16 మీటర్ల ఎత్తైన కొండ ప్రాంతం హైడ్రాలిక్ పైపులను అమర్చడానికి సౌకర్యం కల్పిస్తున్న కారణంగా ఈ ప్రాంతానికి బ్లఫ్ అని పేరు వచ్చింది. ఈ పవర్ హౌస్ చిన్న కొండ పాదాల వద్ద ఉంది. ఇక్కడకు ట్రాలీలో సులువుగా చేరుకోవచ్చు. ముత్తాతి ముత్తాతి మలవల్లి నుండి 35 కి.మీ దూరంలో, ఫిషింగ్ క్యాంపు నుండి 6కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ అందమైన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. రామాయణ పురాణకథనం అనుసరించి సీతాదేవి తనచేతి ఉంగరాన్ని ఇక్కడ ఉన్న కావేరీ నదిలో పోగొట్టుకుందని హనుమంతుడు నదిలో సీతాదేవి ఉంగరం కొరకు శోధించాడని తరువాత ఇక్కడ హనుమంతుని ఆలయం నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు. ఆలయం పలు భక్తులను ఆకర్షిస్తుంది. హనుమతునికి ప్రియమైన శనివారం నాడు ఈ ఆలయానికి భక్తులు అధికంగా వస్తుంటారు. నాగమంగళ నాగమంగళ పట్టణం హొయశిల కాలం నుండి ప్రాముఖ్యత కలిగి ఉంది. నాగమంగళ మాండ్య నుండి 42 కి.మీ దూరంలో ఉంది. నాగమంగళ లోహపు పనితనానికి నైపుణ్యం ఉన్న కళాకారులకు ప్రసిద్ధి చెందింది. నాగమంగళానికి చెందిన తిమ్మన్న శ్రీరంగపట్నం కోట నిర్మాణంలో పాల్గొన్నాడు. ఇక్కడ ఉన్న సౌమ్యకేశవ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. తరువాత ఈ ఆలయానికి విజయనగర రాజులు మెరుగులు దిద్దారని భావిస్తున్నారు. ఆలయ ప్రధానదైవం ఆదికేశవ విగ్రహం 1.83 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నాగమంగళ సమీపంలో ఉన్న కంబదల్లి జైనులకు పవిత్ర ప్రదేశం. ఇక్కడ బ్రహ్మదేవుని స్తంభం ఉన్నందున ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ముదురు బూడిదరంగు సోప్‌స్టోన్‌తో నిర్మించబడిన ఎనిమిది ముఖాలు కలిగిన ఈ స్తంభం చివరన బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. స్థాంభానికి సమీపంలో ఏడు గుడులు ద్రావిడ శైలిలో నాగమంగళానికి 16 కి.మీ దూరంలో ఆది చుంచనగరి ఒక యాత్రాస్థలం. ఇక్కడ సహజసిద్ధమైన రెండు గుహాలయాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రధానదైవం సిద్ధేశ్వర స్వామి, సోమేశ్వరుడు. ఇక్కడ ఆది చుంచనగరి మఠం ఉంది. మఠం ఒక మెడికల్ కాలేజీని నిర్వహిస్తుంది. సమీపంలో ఉన్న మనోహరమైన మయూర వనంలో ఉదయ, సాయంత్రం వేళలలో నెమళ్ళు విహరిస్తుంటాయి. శ్రీరంగపట్నం శ్రీరంగపట్నం మాండ్య నుండి 27 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ శ్రీరంగనార్హాలయం ఉన్నందున ఈ పట్టణానికీ పేరు వచ్చింది. ఇది పురాతన ఆలయం. గంగా రాజు తిరుమల సంబంధిత శిలాశాసనం అనుసరించి ఈ ఆలయం 894 లో నిర్మించబడిందని భావిస్తున్నారు. శ్రీరంగపట్నం ఒకప్పుడు మౌఉసురాజా రాజధానిగా ఉండేది. తరువాత హైదర్ అలి ఆతరువాత టిప్పు సుల్తానుకు రాజధానిగా ఉంది. 1799లో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యాలతో పోరాడి యుద్ధంలో మరణించిన తరువాత ఉడయార్లు రాజధానిని మైసూరుకు తరలించారు. బలమైన టిప్పుసుల్తాన్ కోట భారతదేశంలోని శక్తివంతమైన కోటలలో రెండవ స్థానంలో ఉంది. కోట ఉత్తర, పశ్చిమ దిశల గోడలను కావేరీ నది సరక్షిస్తూ ఉంది. కోటలో లాల్ మహల్, టిప్పు ప్యాలెస్ శిథిలాలు ఉన్నాయి. 1799లో కోటను చేపట్టే వరకు కోటలోని భాగాలను బ్రిటిష్ సైన్యం ధ్వంసం చేసింది. కోటకు 5 ప్రాకారాలు ఉన్నాయి. టిప్పు మిలటరీ భవనాలు ప్రత్యేకత కలిగి ఉన్నాయి. కావేరీ ఉత్తరతీరంలో హజారత్ టిప్పు సుల్తాన్ షహీద్, ది టైగ ఆఫ్ మైసూర్ దర్యా దౌలత్ బాఘ్ ( గార్డెన్ ఆఫ్ ది వెల్త్) సరాసీనిక్ ఆర్కిటెక్చర్ నమూనా, గోడల మీద పెయింటిగ్స్ ఉన్నాయి. శ్రీరంగపట్నానికి 3 కి.మీ దూరంలో గంజం గ్రామంలో టిప్పు సుల్తాన్ తండ్రి కొరకు టిప్పు గుంబజ్ నిర్మించబడింది. అక్కడే టిప్పు తల్లి, టిప్పు సుల్తాన్ కూడా సమాధి చేయబడ్డాడు. 1784లో నిర్మించబడిన ఈ భవనంలో 36 గ్రానైట్ స్తంభాలు ఉన్నాయి.స్తంభాలను 2 లక్షల రూపాయల ఖర్చుతో ఇటలీ నుండి దిగుమతి చేసుకున్నారు. గుంబజ్ ముందు చిన్న ప్రదేశంలో దురంత చెట్లు ఉన్నాయి. ఇక్కడ టిప్పు సుల్తాన్ శరీరానికి చివరిసారిగా స్నానం చేయించబడింది. టిప్పు కాలంలో ఇక్కడ ఒక అందమైన మసీదు ఉండేది. ప్రస్తుతం ఇక్కడ మట్టిప్రదేశం మాత్రమే ఉంది. టిప్పుసుల్తాన్ మరణించిన తరువాత అది పడగొట్టబడి ఆ వస్తువులను ఉపయోగించి ఊటీలో చర్చినిర్మాణంలో ఉపయోగించారు. సంగం - గుంభజ్ మార్గంలో ఆ శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. సంగమ సంగమ శ్రీరంగపట్నం నుండి 2 కి.మీ దూరంలో ఉంది. కె.ఎస్.టి.డి.సి అందమైన నదీతీర కాటేజీలను ఇక్కడ నిర్మించారు. పూర్తిగా అలంకరించబడిన, పూర్తిస్థాయి వసతులతో కూడిన ఈ కాటేజీలు, ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన రెస్టారెంటు దీనిని పర్యాటక ఆకర్షిత ప్రాంతంగా మార్చింది. ఇక్కడ నది ప్రశాంతంగా అందమైన పచ్చని ద్వీపాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రీరంగ పట్నం ఆనుకుని ఉన్న కావేరి, లోకపావని నదీతీరాలలోని చిన్న స్నానఘట్టాలు, ఆలయాలు పరిసరప్రాంతంలోని అందమైన ప్రాంతాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. శ్రీరంగపట్నానికి దక్షిణంగా ఉన్న సంగమ వద్ద రెండుగా చీలిన కావేరీ నది తిరిగి సంగమిస్తుంది. ఇక్కడ చిన్న వైర్ల్‌పూల్ ఉంది. కరిఘట్ట కరిఘట్ట శ్రీరంగపట్నం నుండి 6 కి.మీ దూరంలో లోకపావని నదీతీరంలో ఉంది. కొండమీద వెకటేశ్వరాలయం ఉంది. ఈ ఆలయానికి జూలై, నవంబరు మాసాలాలో భక్తులు అధికంగా వస్తుంట్టారు. ఆలయాన్ని చేరుకోవడానికి 100 మెట్లు ఉన్నాయి. మోటవాహనాలకు కూడా మర్గం నిర్మించబడి ఉంది. ఈ ప్రదేశం పర్వతారోహణకు అనుకూల ప్రాంతం. రంగనాథ్‌తిట్టు రంగనాథ్‌తిట్టు కావేరి నదిలోని ద్వీపంలో ఉంది. రంగనాథ్‌తిట్టు పక్షులకు స్వర్గంగా ఉంది. ఇక్కడకు సైబీరియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా నుండి పక్షులు వస్తుంటాయి. ఈ పక్షుల శరణాలయం సందర్శించడానికి అనువైన కాలం మే - నవంబరు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తున్న బోటు సర్వీసులు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు సరసులో విహరిస్తూ పక్షులను దగ్గరగా వీక్షించవచ్చు. బోట్ మన్ పక్షుల గురించి వివరిస్తుంటారు. మట్టి ద్వీపంలో ముసళ్ళు తిరుగుతూ ఉంటాయి. కృష్ణారాజసాగర్ ఆనకట్ట కృష్ణరాజ సాగర్ మాడ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకాకు 18 కి.మీ దూరంలో ఉంది. కృష్ణరాజసాగర్ ఆనకట్ట 39.62 మీటర్ల ఎత్తు, 2621.28 మీటర్ల పొడవు ఉంటుంది. రిజర్వాయర్ నిండినప్పుడు కృష్ణరాయసాగర్ ఆనకట్టలో 38 .04 మీ ఎత్తున జలాలు నిలువచేయబడతాయి. ఆనకట్ట వద్ద అందమైన పూదోటలు ఉన్నాయి. బృదావన గార్డెంస్ " ది బెస్ట్ - ఇల్యూమనేటెడ్ టెర్రస్ గార్డెంస్ "లో అరుదైన వృక్షజాతులు సంరక్షిచబడుతుంటాయి. పూదోటలో వివిధ ఆకారాలలో, సైజులలో ఫౌంటెన్లు ఉన్నాయి. వీటిలో మ్యూజికల్ డాంసింగ్ ఫౌంటెన్లు ప్రాబల్యం సంతరించుకుంది. చీకటి ముసురుకుంటున్న వేళలో మ్యూజికల్ ఫౌంటెన్ దృశ్యాలు చూపరులకు కనువుందు చేస్తుంటాయి. పరిశ్రమలు బెంగుళూరు - మైసూరు మద్యలో ఉన్నందున మాండ్య జిల్లా చక్కని ప్రయాణ సౌకర్యాలను అందుకుంటుంది. బెంగుళూరు రైలు మార్గం జిల్లాను బెంగుళూరు - మైసూరు నగరాలతో అనుసంధానిస్తుంది. అందువలన ముడిసరుకు సులువుగా అందుకునే వసతి ఉంది కనుక జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. జిల్లాలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజి, మూడు పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్లు పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న మానవ వనరును అందిస్తుంది. మాండ్య నుండి 50 కి.మీ పరిధిలోపల సి.ఎఫ్.టి.ఆర్.ఎల్, డి.ఎఫ్.ఆర్.ఎల్, సిపెట్, స్టెప్ సంస్థలు ఉన్నాయి. జిల్లాలో మాండ్య వద్ద రెండు (కె.ఐ.ఎ.డి.బి) ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి తుబినకెరె వద్ద ఉంది. మరొకటి మద్దుర్ సమీపంలోని సోమనాహలి వద్ద ఉంది. జిల్లాలో 6 (కె.ఎస్.ఎస్.ఐ.డి.సి) ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి మాండ్య గంజం (శ్రీరంగపట్నం), సోమనహళ్ళి (మద్దూరు), హరొహళ్ళి (పాండవపుర), నాగమంగళ వద్ద ఉన్నాయి. వరుస సంఖ్య . పరిశ్రమ పేరు వాణిజ్య ఉత్పత్తి 1 మైసూర్ షుగర్ కో లిమిటెడ్, మాండ్యా షుగర్ 2 బిపిఎల్ పిటిఐకి కెమికల్స్ లిమిటెడ్, సోమనహల్లి ఇండస్ట్రియల్ ఏరియా, మద్దూర్ తాలూకాలోని డ్రై సెల్స్ 3 పాండవపురా సహకారి సక్కర్వ్ కార్కానె, పాండవపుర షుగర్ 4 చాముండి చక్కెరలు లిమిటెడ్, భారతి నగర్, మద్దూర్ తాలూకాలోని షుగర్ 5 లియాబిబ్ ద్రావణి వెలికితీత లిమిటెడ్, టి.బి.రోడ్డు, ఎస్.ఆర్.పాట్నా వంటనూనెలు 6 ఎం.కె.అగ్రోటెక్, ఎస్.ఆర్.పాట్నా తాలూకా వంటనూనెలు 7 మాండ్యా జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ ఉత్పత్తులు సమాజం యూనియన్, గెజ్జలగెరె, మద్దూర్ తాలూకాలోని మిల్క్ ప్రోసెసింగ్ 8 ఐ.సి.ఎల్. చక్కెరలు, మలవల్లి, కె.ఆర్.పి.టి తాలూకా షుగర్ 9 కీలర పవర్ ప్రాజెక్ట్, కీలర, మాండ్యా తాలూకా పవర్ తరం 10 కర్నాటక మల్లాది బయోటెక్ యొక్క లిమిటెడ్, ట్యూబిన్‌కెరే ఇండ్ ఏరియా, బల్క్ డ్రగ్స్ మాండ్య తాలూకా. 11 ఎన్.ఎస్.ఎల్ చక్కెరలు లిమిటెడ్, కొప్ప, మద్దూర్ తాలూకాలోని విద్యుచ్ఛక్తి జిల్లాలో తయారు చేయబడుతున్న విద్యుత్తు గృహావసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు వినియోగించబడుతుంది. శివసముద్రం హైడ్రో - ఎలెక్ట్రిక్ పవర్. 1902లో స్థాపించబడింది. ఇది భారతదేశంలో మొదటి ఎలెక్ట్రిక్ పవర్ ప్లాంటుగా గుర్తించబడుతుంది. ఈ ప్లాంటు నుండి 42 మెగావాట్ల విద్యుత్తును అందిస్తుంది. షంష హైడ్రో - ఎలెక్ట్రిక్ పవర్ :- 1940లో స్థాపించబడింది. ఈ ప్లాంటు నుండి 17.2 మెగావాట్ల విద్యుత్తును అందిస్తుంది. కేరళ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలెక్ట్రానిక్ ప్రాజెక్ట్ (కేరళ్) మండ్య తాలూకాలో ఉన్న ఈ ప్లాంటు నుండి 2 మె.వా విదుత్తు లభిస్తుంది. మలవల్లి పవర్ ప్లాంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది వ్యవసాయ ఆధారిత ప్రాజెక్ట్. ఈ ప్లాంటు నుండి 4.5 మె.వా విదుత్తు లభిస్తుంది అత్రియా పవర్ కాత్పొరేషన్ లిమిటెడ్ మిని హైడ్రొ ఎలెక్ట్రిక్ ప్లాంటు స్థాపించడానికి అనుమతి పొందింది. ఈ ప్లాంటు నుండి 12 మె.వా విదుత్తు లభిస్తుందని భావిస్తున్నారు. భౌగోళికం మాండ్య జిల్లా 12°13' నుండి 13°04' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 76°19' నుండి 77°20' డిగ్రీల తూర్పు రేకాంశంలో ఉంది. నదులు మాండ్య జిల్లాలో ఐదు నదులు ప్రవహిస్తున్నాయి; కావేరి, 4 ఉపనదులు: హేమవతి, షింహ, లోకపావని, వీరవైష్ణవి. పరిపాలనా విభాగాలు విభాగాల వివరణ విషయాలు వివరణలు ఉపవిభాగాలు 2 మాండ్య, పాండవ పుర పాండవ పుర ఉపవిభాగంలో తాలూకాలు పాండవ పుర, శ్రీరంగపట్నం, కృష్ణరాజపేట, నాగమంగళ మాండ్య ఉపవిభాగంలో తాలూకాలు మాండ్య, మద్దురు, మలవల్లి తాలూకాలు 7 ఆర్ధికం మాండ్య జిల్లా కావేరీ నదీ తీరంలో ఉంది. జిల్లాలో వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, పత్తి, అరటి, రాగి, కొబ్బరి, పప్పు ధాన్యాలు పండించబడుతున్నాయి. ఉలవలు, కంది,ంకౌపీ, పెసలు, మినుములు, చిక్కుడు కూడా పండించబడుతున్నాయి. కూరగాయలు కూడా పండుతున్నాయి. రవాణా వ్యవస్థ రహదారులు మాండ్య జిల్లా విస్తారమైన రహదారి మార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారి 48, జాతీయ రహదారి 209 జిల్లా గుండా పయనిస్తున్నాయి. జిల్లాలో రోడ్ల సంఖ్య 73. జాతీయరహదార్ల పొడవు 467 కి.మీరాష్ట్రీయ రహదారి పొడవు 2968 కి.మీ. రైల్వే మాండ్య " సౌత్ వెస్టర్న్ రైల్వే " మార్గంలో ఉంది. జిల్లాలో పలు రైలు స్టేషన్లు ఉన్నాయి. జిల్లా రైలు స్టేషన్ల జాబితా: : ' 'స్టేషను పేరు' శ్రీరంగపట్నం - ఇ.ఎస్ పందవపుర - పి.ఎ.ఎం.పి మాణ్డ్య - మ్యా మద్దూర్ -ఎం.ఎ.డి యెలియూర్ - వై అక్కిహెబ్బలు-ఎ.కె.కె. మందగెరె - ఎంజిఎఫ్ బీరవల్లి- బి.ఆర్.బి.ఎల్ 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 1,808,680, ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.. 640 భారతదేశ జిల్లాలలో. 263 వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 365 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 2.55%. స్త్రీ పురుష నిష్పత్తి. 989:1000 జాతియ సరాసరి (928) కంటే. అధికం అక్షరాశ్యత శాతం. 70.14%. జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ చిత్రమాలిక ప్రముఖులు కె.వి. శంకర గౌడ - 1952 లో ఎం.ఎల్.ఎ. మాజీ . విద్యామంత్రి 1966 లో కర్ణాటకలోని సహకార రంగం స్థాపకుడు, పి.ఇ.ఎస్ ట్రస్ట్ స్థాపకుడు, సామాజిక కార్యకర్త, విద్య సంస్కరణవాది. ఎస్ఎం కృష్ణ - భారతదేశ విదేశాంగ మంత్రి, మాజీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి & మాజీ మహారాష్ట్ర గవర్నర్. ఎ.జి. బండి గౌడ - ఎ.జి. బండి గౌడ ఒక స్వాతంత్ర్య సమర యోధుడు లా ప్రాక్టీసు, అతను కాంగ్రెస్ శాసనసభ సభ్యత్వం పొందే ముందు మాండ్య లో మైసుగర్ కో చైర్మన్ గా పనిచేసాడు. మాండ్య ఎన్నికల చరిత్రలో 70% తేడాతో ఎన్నికల్లో విజయం సాధించిన ఒకే ఒక వ్యక్తిగా అతను గుర్తింపును పొందాడు. () అంబరీష్ - పాపులర్ కన్నడ చిత్రం స్టార్, పార్లమెంట్ సభ్యుడు. బి.ఎస్.యడయూరప్ప - కర్నాటక 25 వ ముఖ్యమంత్రిగా పనిచేసాడూ.యడయూరప్ప కె.ఆర్.పేటే తాలూకాలోని బూకనకెరె లో జన్మించాడు, KRPete తాలూకాలోని జి మేడ్ గౌడ - పార్లమెంట్, విద్యా సంస్కరణవాద మాజీ సభ్యుడు ఎల్.ఆర్. శివరామె గౌడ - బెంగుళూర్ మాజీ బి.డబల్యూ.డి. చైర్మన్ రెహమాన్ ఖాన్ కేంద్ర మంత్రి, న్యూ ఢిల్లీ. రమ్య దివ్య స్పందన ప్రముఖ కన్నడ చిత్రం హీరోయిన్, పార్లమెంటు సభ్యుడు. కళ, సాహత్యం బి.ఎం. శ్రీకాంతయ్య - ప్రభావంతమైన రచయిత, రచయిత, కన్నడ సాహిత్యం అనువాదకుడు పి. టి నరసింహాచారి - ప్రముఖ నాటకరచయిత, కన్నడ భాష కవి. ఎ.ఎన్. మూర్తి రావు - రచయిత, అనువాదకులు. కె. ఎస్ నరసింహస్వామి - ప్రముఖ ప్రేమ కవిత పుస్తకం మైసూర మల్లిగే '' సృష్టికర్త ఎం.ఎన్.సింగారమ్మ డాక్టర్ - కన్నడ, తమిళం, హిందీ తాత్విక పుస్తకాల రచయిత. ఎ.ఎన్. మూర్తి రావు - రచయిత, అనువాదకులు. ఎమ్,కె.కెంపసిద్ధాయ్య ఆనంద & సామాజిక విద్య ట్రస్ట్ -ఫౌండర్ హె.చ్.ఎల్. నాగె. గౌడ- (.రామనగర్ జిల్లా ) గ్రేట్ కన్నడ జానపద, కెంగల్ రచయిత, జనపద లోకా స్థాపకుడు సినిమా నాగతిహళ్లి చంద్రశేఖర్ - కన్నడ దర్శకుడు శ్రీధర్ రంగయాన్ - చిత్రనిర్మాత - అంతర్జాతీయంగా ప్రశంసలు సినిమాలు దర్శకుడు / రైటర్. ప్రేమ్ (దర్శకుడు) - కన్నడ చిత్ర పరిశ్రమలు చిత్ర నటుడు మూలాలు బయటి లింకులు Official website of Mandya district Map of Mandya District Mandya District profile Mandya City Council -Mandya District at a glance వర్గం:Mandya district వర్గం:1939 స్థాపితాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:కర్ణాటక వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
మైసూరు జిల్లా
https://te.wikipedia.org/wiki/మైసూరు_జిల్లా
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో మైసూరు జిల్లా (కన్నడం:ಮೈಸೂರು ಜಿಲ್ಲೆ) ఒకటి. మైసూరు పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి కర్ణాటక రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా మైసూర్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మూడవదిగా గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో బెంగుళూరు, బెల్గాం జిల్లాలు ఉన్నాయి.. సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా ఈశాన్య సరిహద్దు మాండ్య ఆగ్నేయ సరిహద్దు చామరాజనగర్ దక్షిణ సరిహద్దు కేరళ రాష్ట్రం పశ్చిమ సరిహద్దు కొడగు ఉత్తర సరిహద్దు హాసన్ పర్యాటక ఆకర్షణలు మైసూరు జిల్లాలో నాగర్‌హోల్ నేషనల్ పార్ మొదలైన పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రచరిత్రలో మైసూర్ ప్రధానపాత్ర వహించింది. మైసూరును వుడయార్లు 1399 నుండి 1947 వరకు పాలించారు. కర్ణాటక రాష్ట్రానికి గతంలో మైసూర్ రాజధానిగా ఉండేది. రాజధానిగా ఉన్నప్పుడు మైసూరు ప్రాభవం అధికంగా ఉండేది. పేరు వెనుక చరిత్ర మైసూర్ జిల్లా కేంద్రమైన మైసూర్ పట్టణం పేరు జిల్లా పేరుగా నిర్ణయించబడింది. నగరంలో మహిషాసురుని శిల్పం ఉంది. ఇది మహిషాసురుని ప్రాంతంగా పురాణకథనాలు తెలియజేస్తున్నాయి. నగరంలోని చాముండీ కొండశిఖరం మీద మహిషాసురుని వధించిన మహిషాసుర మర్ధిని ఆలయం ఉంది. ఆలయ ప్రధాన దైవం చాముడీశ్వరిగా పూజలందుకుంటూ ఉంది. చరిత్ర 200px|thumb|left|Hoysala architecture in Somanathapura temple 200px|thumb|right|Vaidyeshvara Temple (1000 A.D.) at Talakad in Mysore district thumb|Shveta Varaswami temple in the Mysore palace grounds, built by King Chikka Devaraja Wodeyar in the 17th century thumb|Nanjangud Temple at night మైసూరు జిల్లాను ఆరంభకాలంలో గంగాలకు చెందిన రాజా అవినిథ (సా.శ. 469-529)పాలించారు. గంగాలకాలంలో రాజధాని కోలార్ నుండి కావేరీ నదీతీరంలో ఉన్న తలకాడ్‌కు మార్చబడింది. తలకాడ్ ప్రస్తుతం తిరుమకూడలు నరసిపురా తాలూకాలో ఉంది.Kamath (2001), p 40 గంగాల పాలన ముగిసే వరకు (11వ శతాబ్ద ఆతంభం వరకు) తలకాడ్ రాజధానిగా ఉంది. మైసూర్ జిల్లా చరిత్రలో గాగాల పాలన గంగావాడి పేరుతో అధికభాగం ఆక్రమించింది. 8 వ శతాబ్దం రాష్ట్రకూటుల దూర్వా ధరవర్ష గంగారాజు రెండవ శివవర్మాను ఓడించి గంగావాడీని తన వశం చేసుకున్నాడు. తరువాత ఈ ప్రాతానికి దూర్వా ధరవర్ష కుమారుడు కంబరాసాను రాజప్రతినిధిగా నియమించారు. అధికారాచ్యుతులైన గంగాలు వేచి చూసి వారి రాజు నీతిమార్గా ఎరెగంగా (853 నుండి 869) నాయకత్వంలో తిరిగి రాష్ట్రకూటుల రాజు రాజారాముని ఓడించి రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తరువాత గంగాల శక్తిమంతులయ్యారు. రాష్ట్రకూట రాజు మొదటి అమోఘవర్ష తన కుమార్తెను రేవకనిమ్మదిని ఎరెగంగ కుమారునికి ఇచ్చి వివాహం చేసాడు. తరువాత రెండవ బుటుగ గంగావాడి పాలకుడయ్యాడు. గంగాలా పాలన ఈ ప్రాంతాన్ని దీర్ఘ కాలం పాలించారు. గంగాల రాజు రక్కస గంగా (985 -1024) ను చోళులు ఓడించారు. .The History of the Gangas is discussed by 1117లో హొయశిల రాజా విష్ణువర్ధన గంగావాడీని స్వాధీనం చేసుకున్నాడు. విష్ణువర్ధన విజయానికి సంకేతంగా తలకాడులో కీర్తినారాయణా ఆలయం నిర్మించాడు. .The history of Talakad has been presented by యరువాత గంగావాడి హొయశిలకు చెందిన మూడవ వీర బలలాల మరణం వరకు కొనసాగింది. తరువాత గంగావాడి విజయనగర సామ్రాజ్యంలో భాగం అయింది. 1399 వరకు యదురాయ మైసూర్ ప్రాంతంలో వుడయార్ సామ్రాజ్య స్థాపన చేసాడు. 1565 వరకు అది విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజ్యంగా ఉంది. విజయనగర సామ్రాజ్యం బలహీన పడిన సమయంలో రాజా వుడయార్ (1578-1617) ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సాధించాడు. ఆయన వుడయార్ కుటుంబానికి ప్రధాన రాజుగా గుర్తించబడ్డాడు. కెసరే యుద్ధంలో ఆయన విజయమగర ప్రతినిధిని మైసూర్ వద్ద ఓడించాడు. తరువాత 1610లో రాజా వుడయార్ రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు.A history of the Wodeyar kings of Mysore is presented by తరువాత వుడయార్లు (1734-1766) వరకు నిరంతరాయంగా మైసూరు ప్రాంతాన్ని పాలించారు. తరువాత హైదర్ ఆలి, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకులయ్యారు. 1799 లో బ్రిటిష్ సైన్యాలచేతిలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత వుడ్యార్లు తిరిగి మైసూర్ ప్రాంతానికి పాలకులు అయ్యారు. రాజధాని మైసూరుకు మార్చబడింది. వుడయార్లు బ్రిటిష్ ప్రభుత్వానికి సామతులుగా ఉన్నారు. మూడవ కృష్ణరాయ ఉడయార్ కాలంలో బ్రిటొష్ 1831లో బ్రిటిష్ వుడయార్ల నుండి రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.A brief description of the British Raj's rule at Mysore is described by బ్రిటిష్ ప్రభుత్వం కమీషనర్లను మైసూర్ భూభాగానికి పాలకులుగా నియమించారు. మార్క్ కబ్బన్ (కబ్బన్ తరువాత బెంగుళూరులో అయన ఙాపకార్ధం ఒక రోడ్డుకు కబ్బన్ రోడ్డు అని నామకరణం చేయబడింది), ఎల్.బి. బౌరింగ్ (ఎల్.బి. బౌరింగ్ తరువాత బెంగుళూరులో అయన ఙాపకార్ధం ఆయన పేరుతో బౌరింగ్ హాస్పిటల్ నిర్మించబడింది) బ్రిటిష్ తరఫున కమీషనర్లుగా నియమించబడ్డారు. వుడయార్లు బ్రిటిష్ పార్లమెంటులో మైసూర్ పాలనాధికారం కావాలని అభ్యర్థించారు. 1881లో మూడవ కృష్ణరాజ వుడయార్ కుమారుడు చామరాజ వుడయార్ (6వ వుడయార్ ) కు తిరిగి మైసూరు అధికారం ఇవ్వబడింది. తరువాత వుడయార్లు మసూరు పాలనాధికారం చేజిక్కించుకున్నారు. తరువాత జయచామరాజ వుడయార్ 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వానికి సామంతులుగా పాలించారు. తరువాత మైసూరు భారత యూనియన్‌లో విలీనం చేయబడింది. భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించే వరకు వుడయార్లు మైసూర్ మహారాజాగా ఉన్నారు. తరువాత వుడయార్లు రాజప్రముఖులుగా ఉన్నారు. 1956 రాష్ట్ర విభజన సమయంలో మైసూర్ రాష్ట్రంగా అవతరించింది. తరువాత జయచంద్ర వుడయార్ 1964 వరకు మైసూర్ గవర్నరుగా నియమించబడ్డాడు. భౌగోళికం మైసూరు జిల్లా 11°45' నుండి 12°40' ఉత్తర అక్షాంశం, 75°57' నుండి 77°15' రేఖాంశంలో ఉంది. [ సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా ఉత్తర సరిహద్దు మాండ్య ఆగ్నేయ సరిహద్దు చామరాజనగర్ దక్షిణ సరిహద్దు కేరళ పశ్చిమ సరిహద్దు కొడగు ఉత్తర సరిహద్దు హాసన్ జిల్లావైశాల్యం 6,854. జసంఖ్యాపరంగా జిల్లా 12వ స్థానంలో ఉంది. మైసూర్ జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా మైసూర్ డివిషన్‌లో భాగంగా ఉంది.చామరాజనగర్ జిల్లా విభజించక ముందు మైసూర్ జిల్లాలో భాగంగా ఉంది. జిల్లా దక్షిణ పీఠభూమిలోని అసమానమైన భూభాగంలో ఉంది. జిల్లాలో కావేరీ నది (ఈశాన్య, తూర్పు భూభాగంలో ప్రవహిస్తుంది) వాటర్ షెడ్ ఉంది. జిల్లా ఉత్తర భూభాగంలో కావేరీ నది మీద కృష్ణరాజ సాగర రిజర్వాయర్ నిర్మించబడి ఉంది. జిల్లాలో ఉన్న " నాగర్‌హోలె నేషనల్ పార్క్ " లోని కొంత భాగం పొరుగున ఉన్న కొడగు జిల్లా ఉంది. వాతావరణం విషయ వివరణ వాతావరణ వివరణ వాతావరణ విధానం వేసవి వర్షాకాలం శీతాకాలం గరిష్ఠ ఉష్ణోగ్రత 35 ° సెల్షియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత 15 ° సెల్షియస్ వర్షపాతం 785మి.మీ Average Rainfall in the districts of Karnataka are specified by నైసర్గికం జిల్లాలో ప్రధానంగా ఎర్రమట్టి (ఎరుపు గులక లోవామ్ మట్టి, ఎరుపు లోవామ్ మట్టి, ఎరుపు గులక మట్టి, ఎర్ర బంకమట్టి నేల) అధికంగా ఉంది. Types of soil found in Karnataka are described by జిల్లాలో కియానైట్, సిలిమనైట్, మాంగనీస్, సోప్‌స్టోన్, ఫెల్సైట్, కొరండం, గ్రాఫైట్, లైంస్టోన్, డోలోమైట్, సిలికోనైట్, డ్యూనైట్ మొదలైన ఖనిజాలు ఉన్నాయి.List of Mining Leases given out by the State of Karnataka is mentioned by ఆర్ధికం భారతదేశంలోని మిగిలిన జిల్లాలలో లాగా జిల్లా ఆర్థికరంగానికి వ్యవసాయం వెన్నెముకగా ఉంది. జిల్లాలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితంగా ఉంది. కావేరీ నది, కబిని నదులు వ్యవసాయానికి అవసరమైన నీటిని అందిస్తున్నాయి. 2001 గణాంకాల ఆధారంగా జిల్లాలో 3,25,823 మంది రైతులు ఉన్నారని భావిస్తున్నారు. 2001-2002 లో మైసూర్ జిల్లా జిల్లాలో 608,596 టన్నుల ఆహారధాన్యం ఉత్పత్తి చేయబడుతుంది. రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడుతున్న మొత్తం ఆహారధాన్యాంలో ఇది 6.94%.Statistics related to Agriculture are presented by జిల్లాలో ప్రధానంగా చనగలు, బఠాణీ, జొన్నలు, మొక్కజొన్నలు, రాగి, వరి, చెరకు, పొద్దుతిరుగుడు, కందిపప్పు.Statistics related to cultivation of various crops in Karnataka are presented by హెచ్.డి కోట్ తాలూకాలో పాం ఆయిల్ ఉత్పత్తి చేయబడితుంది.Palm Oil production in Mysore district is discussed by పరిశ్రమలు మైసూర్ జిల్లాలో ప్రధానంగా పరిశ్రమలు నంజన్‌గూడ్ వద్ద కేంద్రీకరించబడ్డాయి. కర్ణాటక పారిశ్రామిక ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు (కె.ఐ.ఎ.బి) మైసూర్, నంజన్‌గూడ్ వద్ద రెండు పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, వీటిలో ఆరు పారిశ్రామిక ప్రాంతాలను మైసూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చెందిన కేంద్రాలను బెలగోలా, బెలవాడి, హెబ్బల్, (ఎలెక్ట్రానిక్ నగరం), హూతగల్లి వద్ద ఏర్పాటు చేసింది. నంజన్‌గూడ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చెందిన కేంద్రాలను తాండవపురా, నంజన్‌గూడ వద్ద ఏర్పాటు చేయబడ్డాయి. Industrial Areas developed by KIADB in Mysore district are mentioned in the webpage: KIADB Industrial Areas 1960లో మైసూర్ పారిశ్రామికంగా వెనుకబన ఉన్నసమయంలో మైసూర్ మహారాజ భాగస్వామ్యంలో మొదటిసారిగా ప్రధాన పరిశ్రమలు స్థాపించబడ్డాయి.ఐడియల్ జావా (ప్రస్తుతం మూతబడి ఉంది), జావా మోటర్ల సాంకేతిక పరిఙానంతో ఇండియా లిమిటెడ్ మోటార్ సైకిల్ స్థాపించబడ్డాయి. మైసూర్ నగరం సమీపంలో ఉన్న ప్రధాన పరిశ్రమలలో కొన్ని: విక్రాంత్ టైర్స్ లిమిటెడ్ - టైర్లు తయారీదారు ఆటోమోటివ్ ఇరుసులు ళ్త్ద్. - ఇరుసులు తయారీదారు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (భి.ఇ.ఎం.ఎళ్) - భారీ యంత్రాలు తయారీదారు కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కె.ఎస్.ఐ.సి.) - పట్టు వస్త్రాలు తయారీదారు టీవీఎస్ ళిమితెద్. - మోటారు వాహనాలు, భాగాలు తయారీదారు (దగ్గర్లోని నంజన్గూడ్, మైసూర్ తాలూకా) లార్సన్ అండ్ ట్యూబ్రొ లిమిటెడ్ (వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్ మీటర్లు తయారీదారు) ఉన్న ముఖ్య పరిశ్రమలలో కొన్ని నంజన్గూడ్ ఉన్నాయి: డుంఫొర్ద్ ఫాబ్రిక్స్ (మూసివేయబడింది) వి.కె.సి చెప్పులు (భారతదేశం) ప్రైవేట్ లిమిటెడ్ నెస్లే భారతదేశం లిమిటెడ్ రే హన్స్ టెక్నాలజీస్ ఎ.టి & ఎస్ భారతదేశం ప్రెవేట్ లిమిటెడ్ టీవీఎస్ మోటార్ మోటార్ కంపెనీ బన్నారి అమ్మన్ చక్కెరలు లిమిటెడ్ దక్షిణ భారతదేశం పేపర్ మిల్స్ ఇండస్ ఫిల ఎస్ కుమారుకు ఇప్పుడు రీడ్ & టేలర్ రామన్ బోర్డ్ రీ ఎలక్ట్రానిక్స్ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ పరిమితం బ్రేక్లు (భారతదేశం) బకార్డి రమ్, జెమిని డిస్టిలరీస్ ప్రెవేట్ లిమిటెడ్ జెనిత్ టెక్స్టైల్స్ కోత్తకల్ ఆర్య వైద్యశాల సుప్రీం ఫార్మాస్యూటికల్స్ మైసూర్ ప్రెవేట్ లిమిటెడ్, ఐటిసి లిమిటెడ్ ఐటిసి (పొగాకు ప్రోసెసింగ్) యునైటెడ్ బ్రూవరీస్ (రానున్నవి) Information technology మైసూర్ కర్ణాటక రెండవ ఐ.టి కేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఐ.టి రంగంలో అభివృద్ధి చెందిన 20 నగరాలలో మైసూరు ఒకటి అని గవర్నమెంటాఫ్ ఇండియా గుర్తించింది. Mysore is the number one among Tier II cities for the promotion of IT industry is discussed by ప్రస్తుతం ఐ.టి సంస్థలన్ని మైసూర్ నగర పరిశరాలలో స్థాపించబడి ఉన్నాయి. మసూరులోని ది సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్.టి.పి)ను 1998 లో భారతప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ ద్వారా ఆరంభించబడింది. 2006 ఆగస్టు మాసంలో (ఎస్.టి.పి) లో 42 సంస్థలు నమోదు చేయబడ్డాయి. (ఎస్.టి.పి) కి చెందిన 42 ఐ.టి స్థల నుండి 2006-2007 ఆర్థిక సంవత్సరంలో మైసూర్ సఫ్ట్‌ వేర్ ఉత్పత్తులు 850 కోట్లకు చేరాయి. . మైసూర్‌లో స్థాపించబడిన ఐ.టి.సంస్థలు విప్రో ఇన్ఫోటెక్ డబల్యూ.ఎ.పి పార్టులు లిమిటెడ్ (గతంలో విప్రో ఎపరిఫెరల్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ నమూనాలు (భారతదేశం) లార్సన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ (ఎ.ల్& టి ) కొమత్ టెక్నాలజీస్ సిద్ధాంతం భారతదేశం ప్రెవేట్ లిమిటెడ్. లిమిటెడ్ ఎక్సెల్‌సాఫ్ట్ టెక్నాలజీస్ కావేరీ టెక్నాలజీ సొల్యూషన్స్ ఐ.సి.ఎ.ఎన్ టెక్నాలజీస్ పర్యాటకం thumb|Mysore Palace మైసూర్ జిల్లా ఆర్థికరంగానికి పర్యాటకం విస్తృతంగా సహకారం అందిస్తుంది. పర్యటకపరంగా మఒసూరుకు ఉన్న ప్రాధాన్యతకు కర్ణాటక టూరిస్ట్ ఎక్స్‌పో 2006 ఏత్పాటు చేయడమే సాక్షి. Tourism Expo in Mysore is described by జిల్లాలో పర్యాటక పరంగా మైసూర్ నగరం ప్రాధాన్యత వహించినప్పటికీ జిల్లాలోని ఇతర ప్రాంతాలు కూడా క్రమంగా పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.Plans to grow other areas in Mysore district as tourist places is discussed by విభాగాలు మైసూర్ జిల్లా మూడు ఉపవిభాగాలు విభజించబడింది, గూడ్, మైసూర్, హన్సూర్. మైసూర్ జిల్లా యంత్రాంగం డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఉంటుంది. జిల్లా కమిషన అదనంగా మేజిస్ట్రేట్ బాధ్యత ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్లు, తహసిల్దార్ షిరస్తేదార్లు (తాలూకా స్థాయిలో ఆదాయం అధికారిక), రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామీణ అకౌంటెంట్స్ జిల్లా పరిపాలన డిప్యూటీ కమిషనర్ సహాయం చేస్తారు. మైసూర్ నగరం జిల్లా ముఖ్యపట్టణం. [|ఇది జిల్లాలోని ఈశాన్య భాగంలో నెలకొని ఉంది, దసరా సమయంలో సంబరాలకు (మైసూర్ దసరా) అందమైన రాజభవనాలు కేంద్రంగా ఉంటాయి. 2007గణాంకాలను అనుసరించి మైసూర్ జిల్లా 7 తాలూకాలుగా విభజించబడింది : పిరియపత్న (224,254) హున్సుర్ (253,926) క్రిష్నరజనగర (239,199) మైసూర్ (1,038,490) హెగ్గదదెవనకొతే (245,930) నంజన్గూడ్ (360,223) తిరుమకుదలు నరసిపుర (279,005) మొత్తం 2.641.027 మైసూరు జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: చామరాజ, కృష్ణరాజ, నరసింహరాజ, చాముండేశ్వరీ ( మైసూర్ నగరం) వరుణ (నంజన్గూడ్, తిరుమకుదలు నరసిపుర) హన్సుర్ పిరియపత్న క్రిష్నరజనగర హెగ్గదదెవనకొతె నంజన్గూడ్ తిరుమకుదలు నరసిపుర మైసూర్ జిల్లాలో ఒక రాజ్యసభ నియోజకవర్గం ఉంది. చామరాజనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో నంజన్‌గూడ, తిరుమకూడలు నరసిసిపుర, బన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 2,994,744, ఇది దాదాపు. ఆర్మేనియా దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. మిసిసిపి నగర జనసంఖ్యకు సమం.. 640 భారతదేశ జిల్లాలలో. 125వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత..437 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.39%. స్త్రీ పురుష నిష్పత్తి. 982:1000 జాతియ సరాసరి (928) కంటే. అక్షరాస్యత శాతం. 72.56%. జాతియ సరాసరి (72%) కంటే. జిల్లాలో హిందువులు 87.44%, ముస్లిములు 8.87% ఉన్నారు. మిగిలిన వారిలో క్రైస్తవులు, బౌద్ధులు, ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు..Data related to the 2001 Census; classified according to religion is provided in detail in the website of the Census department of India in this webpage భాషలు జిల్లాలో ప్రధానభాషగా కన్నడం ఉంది. జెనుకుర్బా, బెట్టకుర్బా, పనియ, పంజరి, యెరెవా, సొలిగ మొదలైన సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు. A detailed report on the tribes found in the Nagarhole National Park is presented by ఇవి కూడ చూడండి నగరం (నగరం) మైసూర్ డివిషన్ నంజంగూడ మూలాలు మూలాలు Dr. Suryanath U. Kamat, A Concise history of Karnataka from pre-historic times to the present, Jupiter books, MCC, Bangalore, 2001 (Reprinted 2002) OCLC: 779604 వెలుపలి లింకులు www.mysore.ind.in Official Website of Mysore district Mysore City Portal Mysore Media వెలుపలి లింకులు వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:కర్ణాటక వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:కర్ణాటక నగరాలు, పట్టణాలు
రాయచూర్ జిల్లా
https://te.wikipedia.org/wiki/రాయచూర్_జిల్లా
కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో రాయ‌చూరు జిల్లా ఒకటి. రాయ‌చూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కర్నాటక రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. సరిహద్దు వివరణ జిల్లా ఉత్తర సరిహద్దు యాద్గిర్ ఈశాన్య సరిహద్దు బీజ్‌పూర్, బాగల్‌కోట్ పశ్చిమ సరిహద్దు కొప్పల్ దక్షిణ సరిహద్దు బళ్ళారి తూర్పు సరిహద్దు మహబూబ్‌నగర్ (తెలంగాణా), కర్నూల్ (ఆంధ్రప్రదేశ్) భౌగోళికం రాయ‌చూరు నది కృష్ణా, తుంగభద్రా నదీ సంగమ మైదానంలో ఉంది. జిల్లాలు ఉత్తరంలో కృష్ణా నది దక్షిణంలో తుంగభద్రా నది ప్రవహిస్తున్నాయి. సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా ఉత్తర సరిహద్దు బీజాపూర్, గుల్బర్గ్ (కృష్ణా నదికి అటువైపు) పశ్చిమ సరిహద్దు కొప్పల్, బాగల్‌కోట్ ఆగ్నేయ సరిహద్దు బళ్ళారి (తుంగభద్రా నదికి అటువైపు) ఈశాన్య సరిహద్దు మహబూబ్‌నగర్ (తెలంగాణా) తూర్పు సరిహద్దు కర్నూల్ (ఆంధ్రప్రదేశ్) చరిత్ర జిల్లా చరిత్ర క్రీ.పూ 3 శతాబ్దం నుండి లభిస్తుంది. లింగసుగుర్ తాలూకాలోని మస్కి వద్ద అశోకుని ఒకటి, కొప్పల్ సమీపంలో రెండు శిలాశాసనాలు లభిస్తున్నాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతం కొంతకాలం (273-236) మయూర చక్రవర్తి అశోకుని స్వాధీనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. క్రిస్టియన్ శకం ఆరంభంలో ఈ ప్రాంతం శాతవాహనుల ఆధీనంలోకి మారింది. 3-4 శతాబ్ధాలలో ఈ ప్రాంతం ఒకతకాల ఆధీనంలోకి మారింది. తరువాత ఈ ప్రాంతాన్ని కదంబ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఈ ప్రాంతాన్ని చాళుక్గ్యులు స్వాధీనం చేసుకున్నారు. అయిహోల్ శలాశాసనాల ఆధారంగా రెండవ పులకేశి పల్లవులను ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారని భావిస్తున్నాడు. పులకేశి కుమారుడు ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు.8 శతాబ్దం తరువాత రాయ‌చూరు ప్రాంతం అంతా రాష్ట్రకూటులు స్వాధీనం చేసుకున్నారని శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. మంవి తాలూకాలో లభిస్తున్న శిలాశాసనాలు ఆధారంగా రాష్ట్రకూటుల సామంతరాజు రెండవ కృష్ణా రాజు ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. రాష్ట్రకూట రాజు నృపతుంగ కన్నడ రచనలలో ఈ ప్రాంతంలోని కొప్పల్ భూభాగాన్ని గ్రేట్ కొప్పల్ అని వర్ణించాడు. రాజసంస్థానాల పాలన పశ్చిమ చాళుఖ్యులకు సంబంధించిన శిలాశాసనాలు జిల్లాలో పలు ప్రాంతాలలో లభిస్తున్నాయి. వీటి ఆధారంగా సా.శ. 10-12 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం చాళుఖ్యుల ఆధీనంలో ఉంది. లింగ్సుగుర్ తాలూకాలో లభించిన ఆధారలను అనుసరించి చాళుఖ్యుల పాలనాకాంలో రాయ‌చూరు ప్రాంతాన్ని ఐదవ విక్రమాదిత్యుని సోదరుడు మొదటి జగదేకమల్లుడు పాలించాడని భావిస్తున్నారు. మస్కి తాలూకాలో లభిస్తున్న ఆధారాలను అనుసరించి ఈ నగరం ఒకప్పుడు జయసింహునికి రాజధానిగా ఉందని భావిస్తున్నారు. రాయచూరు ప్రాంతంలో దక్షిణభారతీయ పాలకులైన చోళరాజులకు, కల్యాణి సామ్రాజ్య పాలకులైన చాళుఖ్యులు (అక పశ్చిమ చాళుఖ్యులు) మద్య ఆధిక్యత కొరకు పలు యుద్ధాలు సంభవించాయి. ఈ ప్రాంతం కొంతకాలం చోళుల ఆధిక్యతలో ఉంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాలను హయహయులు, సిందాలు పాలించారు. చాళుఖ్యల పతనం తరువాత రాయచూరు ప్రాంతం కలచూరి, తరువాత సెవ్న యాదవ రాజుల పాలనలో ఉంది. తరువాత 13వ శతాబ్దంలో కాకతీయుల పాలనలోకి మారింది. రాయచూరు కోట గోడలమీద లభించిన శిలాశాసనాల ఆధారంగా సా.శ. 1294 రాణి రుద్రమదేవి సైనికాధికారి గోర్ గంగయ్యరెడ్డి రాయ‌చూరు కోటను నిర్మించాడని తెలుస్తుంది. . తరువాత సా.శ. 1312లో రాయ‌చూరు ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తాన్ సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫిర్ స్వాధీనం చేసుకున్నాడు. విజయనగర పాలకులు ఢిల్లి సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసిన తరువాత రాయచూరు జిల్లా సా.శ. 1323లో విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి మారింది. 1363లో రాయ‌చూరు ప్రాంతాన్ని బహమనీ సుల్తానులు స్వాధీనం చేసుకున్నారు. బీజపూర్ సుల్తానేట్ విచ్ఛిన్నం అయిన తరువాత 1489లో బీజపూర్ సుల్తానేట్‌కు చెందిన ఆదిల్‌షా స్వాధీనం చేసుకున్నాడు. 1520లో రాయ‌చూరు యుద్ధం తరువాత విజయనగర పాలకులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేదుకున్నారు. 1565లో దక్కన్ సుల్తానేట్ సాగించిన తాలికోట యుద్ధంలో విజయనగర రాజు ఓడిపోయిన తతువాత బీజపూర్ రాజులు ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1853 - 1860 వరకు ఔరంగజేబు చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. నిజాముల కాలంలో ఈ ప్రాంతం గుల్బర్గా డివిషన్‌లో భాగంగా ఉంది. పోలో ఆపరేషన్ తరువాత 1948 సెప్టెంబరు 17 న నిజాం రాజ్యం తప్పనిసరిగా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయబడింది. తరువాత ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉంది. భాధాప్రయుక్త రాష్ట్రాల విభజన తరువాత ఈ ప్రాంతం మైసూరు రాష్ట్రంలో (తరువాత ఇది కర్నాటక రాష్ట్రం)!భాగం అయింది. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 2001-11 కుటుంబనియంత్రణ శాతం. స్త్రీ పురుష నిష్పత్తి. జాతియ సరాసరి (928) కంటే. అక్షరాస్యత శాతం. జాతియ సరాసరి (72%) కంటే. 2011 జనాభా లెక్కల ప్రకారం రాయ‌చూరు జిల్లాలో 1,924,773 జనాభా ఉంది, ఇది లెసోతో దేశానికి లేదా అమెరికా రాష్ట్రమైన వెస్ట్ వర్జీనియాకు సమానం. ఇది భారతదేశంలో 246 వ ర్యాంకును ఇస్తుంది (మొత్తం 640 లో). జిల్లాలో జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 228 మంది (590 / చదరపు మైళ్ళు). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 15.27%. రాయ‌చూరు‌లో ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు, అక్షరాస్యత 60.46%. రాయ‌చూరు జిల్లాలో ఐదు తాలూకాలు ఉన్నాయి: రాయ‌చూరు, దేవదుర్గా, సింధనూర్, మాన్వి, లింగ్సుగూర్. జిల్లా రాజధాని రాచూర్ నగరం, ఇది రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 409 కి.మీ. పర్యాటకం జిల్లాలో ఉన్న చారిత్రక ఆకర్షణలలో 1294లో నిర్మించబడిన రాయ‌చూరు కోట ఒకటి. సమీపంలో ఉన్న అనెగుండి పట్టణంలో విజయనగరానికి చెందిన రంగనాథ ఆలయం, పంపానది, కమల్ మహల్ మొదలైన పలు స్మారకచిహ్నాలు ఉన్నాయి. రాయ‌చూరు పట్టణానికి 20 కి.మీ దూరంలో ఉన్న కల్లూరు ప్రాంతంలోమహాలక్ష్మీ ఆలయం ఉంది. రాయ‌చూరు పట్టణానికి 18 కి.మీ దూరంలో కృష్ణానదీ తీరంలో దియోసుగుర్ గ్రామంలో శ్రీసుగురేశ్వర ఆలయం (వీరభద్రుడు) ఉంది. రహదారి మార్గం ద్వారా రెండు ఆలయాలకు సులువుగా చేరుకోవచ్చు. ముద్గల్ వద్ద ముద్గల్ కోట, పురాతన కాథలిక్ చర్చి (1557 లో నిర్మించబడింది) ఉన్నాయి. హట్టి బంగారు గనులు ప్రపంచంలోని అతిపురాతన గనిగా గుర్తించబడుతుంది. ఇది ఆశోకచక్రవర్తి కంటే పూర్వం నాటిదని భావిస్తున్నారు. భారతదేశంలో పనిచేస్తున్న ఒకే ఒక గని ఇదే. నారదగడ్డె ఇది నారద ముని సంబంధిత పవిత్ర ప్రదేశం. ఇక్కడ నారదమహర్షి తపమాచరించాడని విశ్వసిస్తున్నారు. కృష్ణానదిలోని నారదగడ్డె, కూర్మగడ్డె ద్వీపలో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. జలదుర్గా ఒక కోట గ్రామం. ఆది షాహి రాజులు దీనిని నిర్మించారని భావిస్తున్నారు. నియోలిథిక్ కాలంనాటి పిక్లిహ చరిత్రకాలానికి ముందు నాటిదని భావిస్తున్నారు. ముద్గల్ పట్టణానికి ఇది 5కి.మీ దూరంలో ఉంది. రాయచూరుకు 30 కి.మీ దూరంలో మంవి తాలాకాలో ఉన్న కల్లుర్ పురాతత్వ ప్రదేశం ఒక రాగి బధ్రపరచిన ప్రదేశం అని భావిస్తున్నారు. ఆర్ధికం thumb|right|రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్ జిల్లాలో శక్తి నగర్ వద్ద " రాయ‌చూరు ధర్మల్ పవర్ స్టేషను " నుండి కర్ణాటక రాష్ట్రం విద్యుత్తు అవసరాలకు అధికభాగం విద్యుత్తు లభిస్తుంది. భారతదేశంలో బంగారం లభిస్తున్న ప్రదేశాలలో రాయ‌చూరు జిల్లా ఒకటి. రాయ‌చూరు నగరానికి 90 కి.మీ దూరంలో హట్టి బంగారు గనులు ఉన్నాయి. జిల్లాలోని 5 తాలూకాలకు చక్కటి నీటి పారుదల సౌకర్యం లభిస్తుంది. కృష్ణానది మీద నారాయణపూర ఆనకట్ట నిర్మించబడింది. రాయ‌చూరు వరి పంటలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాలో అత్యుత్తమ నాణ్యమైన వరిధాన్యం లభిస్తుంది. రాయచూరులో అనేక రైసు మిల్లులు ఉన్నాయి. ఇక్కడి నుండి ఇతరదేశాలకు బియ్యం ఎగుమతి చేయబడుతున్నాయి. రాయచూరులో పత్తికి మంచి మార్కెట్ వసతి లభిస్తుంది. 2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాయ‌చూరు జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న కర్ణాటక రాష్ట్ర 5 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.. విద్యా సంస్థలు నవోదయ వైద్య కళాశాల ఇవీ యూడండి కళ్యాణ కర్ణాటక మూలాలు India Post pincode search వెలుపలు లింకులు Official website of Raichur district Website of Raichur City Corporation Map of Raichur district వెలుపలి లింకులు వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:కర్ణాటక వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు sv:Raichur
శివమొగ్గ
https://te.wikipedia.org/wiki/శివమొగ్గ
శివమొగ్గ లేదా షిమోగా (కన్నడం:ಶಿವಮೊಗ್ಗ), కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ జిల్లా లోని నగరం.ఇది అదే జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది తుంగ నది ఒడ్డున ఉంది. "శివ ముఖ" (శివుని ముఖం) అనే పదం నుండి "శివమొగ్గ" పదం వచ్చిందంటారు. "సిహి మోగె" (తీపి కుండ) నుండి కూడా ఈ పేరు వచ్చిందంటారు. 16వ శతాబ్దంలో "కేలడి" నాయకుల పాలనా కాలంలో ఈ పట్టణం ప్రాముఖ్యతను సంతరించుకొంది. శివప్ప నాయకుని కాలం ఈ నగరం చరిత్రలో సువర్ణఘట్టం. తరువాత మైసూరు రాజ్యంలో భాగంగా ఉంది. 2006 నవంబరు 1 న అధికారికంగా ఈ నగరం, జిల్లా పేరును "షిమోగా"నుండి "శివమొగ్గ"గా మార్చారు. జిల్లా సరిహద్దులు 175px|left|thumbతుంగ, భద్ర నదులు కలిసే స్థానాన్ని "కూడలి" అంటారు. అక్కడ ఉన్న చిన్న మందిరం. ఈ జిల్లాకు తూర్పున దావణగెరి జిల్లా, ఆగ్నేయాన చిక్‌మగళూరు జిల్లా, నైరుతిన ఉడిపి జిల్లా, వాయువ్యాన ఉత్తర కన్నడ జిల్లా, ఈశాన్యాన హవేరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు రైలు రవాణా ఈ జిల్లాలో ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు భద్రావతి, హర్నహళ్ళి, కుంసి, ఆనందపురం, సాగర్ ల మీదుగా తల్గుప్ప వరకు ఒక రైలు మార్గం ఉంది. రోడ్డు రవాణా ఈ జిల్లాలో ప్రధాన పట్టణాలను కలుపుతూ ముఖ్య రహదారులున్నాయి.13వ నెంబరు జాతీయ రహదారి, 206వ నెంబరు జాతీయ రహదారులు ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 6632 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండగా అందులో 222 కిలోమీటర్లు జాతీయ రహదారులు. 402 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు కూడా ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి. వాయు రవాణా ప్రస్తుతానికి వాయు రవాణా ఈ జిల్లాలో లేనప్పటికీ శివమొగ్గ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో సొగానె వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. పరిశ్రమలు దేశంలోని ముఖ్య ఇనుము-ఉక్కు పరిశ్రమలలో ఒకటైన విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు పరిశ్రమ ఈ జిల్లాలో ఈశాన్యాన భద్రావతి వద్ద ఉంది. ఈ పారిశ్రామిక పట్టణంనకు మంచి రైలు, రోడ్డు సౌకర్యం ఉంది. ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకాలపై ఏర్పడిన ఈ కర్మాగారపు ప్రారంభనామం మైసూర్ ఇనుము-ఉక్కు పరిశ్రమ. ప్రస్తుతం ఈ పరిశ్రమ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో పనిచేస్తుంది. భద్రావతిలోనే మరో ముఖ్యమైన పరిశ్రమ భద్రావతి పేపర్ మిల్స్ లిమిటెడ్. ISO 14001 ధృవపత్రం పొందిన ఈ కంపెనీ అన్నిరకాల పేపరును ఉత్పత్తి చేయుటలో ప్రసిద్ధి. ఇవే కాకుండా పలు వ్యవసాయ ఆధారిత, ఇంజనీరింగ్ ఉత్పత్తుల, ఆటోమోబైల్, ఆహార, పానీయాలకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లు ఈ జిల్లాలో కలవు. ముఖ్య పట్టణాలు శివమొగ్గ సోరబ్ శికారిపుర హోసనగర అంజనపుర తీర్థహళ్ళి భద్రావతి తుంగ అవీ ఇవీ కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉంది. భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ ఈ జిల్లాలోని భద్రావతిలో జన్మించాడు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి తీర్థహళ్ళి తాలుకాలోని మెలిగె గ్రామంలో జన్మించాడు. శరావతిలోయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సాగర్ తాలుకాలో ఉంది. బయటి లింకులు కువెంపు విశ్వవిద్యాలయం షిమోగా జిల్లా పంచాయితీ షిమోగా గురించి షిమోగా ఆన్‌లైన్ పడమటి కనుమలు షిమోగా నగరం వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు
తుమకూరు
https://te.wikipedia.org/wiki/తుమకూరు
తుమకూరు (), ఇది వరకు తుమ్కూరుగా పిలవడిన ఈ నగరం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రములోని ఒక ప్రముఖ నగరం. ఇది తుమకూరు జిల్లా ముఖ్యపట్టణం. పేరు వ్యుత్పత్తి వ్యుత్పత్తి ప్రకారం తుమకూరు ఇక్కడ విరివిగా కనిపించే తుంబే పువ్వు మీదుగా తుంబే ఊరు అన్న వాడుకనుండి వచ్చిందని భావిస్తారు. లేదా తమాటే ఊరు నుండి వచ్చిందని మరో అభిప్రాయం (ఇక్కడ పూర్వం ఉపయోగించేవారని భావిస్తున్న తమాటే ఒక డప్పు వాయిద్యము). ఈ నగరానికి కొబ్బరికాయల నగరం అని కూడా పేరు. భౌగోళిక స్వరూపం తుమకూరు అక్షాంశరేఖాంశాల వద్ద ఉంది. సముద్ర మట్టం నుండి ఈ నగరపు సరాసరి ఎత్తు 822 మీటర్లు (2696 అడుగులు). తుముకూరు నగరం యొక్క వాతావరణం బెంగుళూరును పోలి ఉంటుంది. బెంగుళూరుకు వాయువ్యాన 43 మైళ్ళ దూరములో ఉన్న ఈ నగరంలో దక్షిణ రైల్వే విభాగంలో భాగమైన రైల్వేస్టేషను ఉంది. గణాంకాలు 2001 భారత జనాభా లెక్కల ప్రకారం, తుమకూరు 2,48,592 మంది జనాభా కలిగి ఉంది. అందులో 52% పురుషులు, 48% స్త్రీలు. తుముకూరు ప్రజల సగటు అక్షరాస్యత 75% (జాతీయ సరాసరి 59.5% కంటే అధికం). పురషులలో అక్షరాస్యత 79%. స్త్రీలలో అక్షరాస్యత 70‍%. 11% జనాభా 6 సంవత్సరాలు లేదా అంతకంటే పిన్నవయస్కులు. ఆర్ధికరంగం ఇక్కడ పండించే ప్రధాన పంటలు చిరుధాన్యాలు, వరి, పప్పుదినుసులు, పోకచెక్కలు , నూనెగింజలు. పరిశ్రమలలో ముతక నూలు వస్త్రాలు, ఉన్ని కంబళ్ళు, తాళ్ళు, గడియారాలు (హిందుస్తాన్ మెషీన్ టూల్స్), విప్రో, టి.వి.ఎస్.ఈ , కార్‌మోబిల్స్ ముఖ్యమైనవి. తుముకూరు పరిసరాల్లోని ఖ్యాత సంద్ర సిద్ధగంగ మఠము ప్రసిద్ధమైనది. ఇక్కడ దేశములోని వివిధ ప్రాంతాలకు చెందిన 8000కు పైగా విద్యార్థులు వివిధ సిద్ధగంగ సంస్థలలో విద్యనభ్యసించుచున్నారు. ఈ మఠానికి అనుబంధంగా ఒక ఇంజనీరింగు కళాశాల (సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కూడా ఉంది. ఇటీవల సిద్ధగంగ మఠం నూరు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రస్తుత మఠ నిర్వాహకుడు శివకుమార్ స్వామీజీని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం కర్ణాటక రత్న పురస్కారంతో సత్కరించింది. కర్ణాటక అర్ధశతోత్సవం "సువర్ణ కర్ణాటక" పురస్కరించుకొని తుమ్కూరు యొక్క అధికారిక నామాన్ని తుమకూరుగా మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ మార్పును ఇంకా ఆమోదించలేదు. 80% శాతం రాష్ట్ర జనాభా రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు చేరటానికి తుమకూరు గుండా ప్రయాణించటం విశేషం. జిల్లాలో తాలూకాలు thumb|సిద్దగంగా మఠం, కోటే ఆంజనేయ స్వామి విగ్రహం, గ్లోబ్ లైబ్రరీ ఆఫ్ ఎస్ఎస్ఐటి, ఎస్ఐటి, ఇండియా ఫుడ్ పార్క్ తుముకూరు జిల్లాలో 10 తాలూకాలున్నాయి. అవి గుబ్బి, తిపటూరు, మధుగిరి, పావగడ, కొరటగేరె, సీరా, తురువెకేరె, చిక్కనాయకనహళ్ళి, కుణిగల్ , తుమకూరు. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:కర్ణాటక వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు
ఉడిపి జిల్లా
https://te.wikipedia.org/wiki/ఉడిపి_జిల్లా
ఉడిపి, కర్ణాటక రాష్ట్రం లోని ఒక జిల్లా. ఉడుపి జిల్లాను ఆగష్టు 1997లో ఏర్పాటు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడు ఉత్తర తాలూకాలు (ఉడుపి, కుందాపుర, కార్కళ) కలిపి ప్రత్యేక ఉడుపి జిల్లాను చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనసంఖ్య 11, 12, 243. అందులో 18.55% పట్టణ జనాభా. కన్నడ, తుళు, కొంకణి జిల్లాలో మాట్లాడే ప్రధాన భాషలు. తుళు మాతృభాషగా కలిగిన ప్రజలు గణనీయంగా ఉండటం వలన ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలను కలిపి కొన్నిసార్లు తుళునాడుగా వ్యవహరిస్తారు.ఉడిపి, కర్ణాటక రాష్ట్రం లోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరం ఉడుపి నగరంలో ఉంది. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 1, 177, 908, ఇది దాదాపు. తైమూర్ లెస్టే దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. రోలె ద్వీపం నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. 403 వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 304 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 5.9%. స్త్రీ పురుష నిష్పత్తి. 1093:1000 జాతియ సరాసరి (928) కంటే. అధికం అక్షరాస్యత శాతం. 86.29%. జాతియ సరాసరి (72%) కంటే. అధికం భౌగోళికం ఉడిపి జిల్లా పశ్చిమ తూర్పున పశ్చిమ కనుమలు (వరల్డ్ హెరిటేజ్ సైట్) పశ్చిమంలో అరేబియన్ సముద్రం ఉన్నాయి. సముద్ర సమీపంలో ఉన్న భూమి చిన్న కొండలు, వరి పొలాలు, కొబ్బరి తోటలు, అడవులు, కొండ ప్రాంతాల్లోతో కప్పబడి ఉంటుంది తూర్పు పశ్చిమ కనుమల సరిహద్దు భూమి సాధారణంగా అడవులు కొన్ని భాగాలలో చాలా మందపాటి అరణ్యాలు ఉన్నాయి. హెబ్రి, సోమేశ్వర వద్ద " సోమేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం " ఉంది. కొల్లూరు (ఉడిపి) సమీపంలో ఉన్న, " మూకాంబికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ " ఉంది. కర్కలకు 16 కిలోమీటర్ల దూరంలో మాలా సమీపంలో కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం ఉంది. పరిసర ప్రాంతం కొల్లూర్ (ఉడుపి) దట్టమైన అడవులున్న, గ్రామాలు అటవీ ప్రాంతం మధ్య ఉన్నాయి. కుందాపూర్ తాలూకాలో, కర్కాల తాలూకాలోని కొన్ని భాగాలు మాలెనాడు అడవులు ఉన్నాయి. రెండు పచ్చదనం అలాగే సంస్కృతిలో ఒకదానిని ఒకటి పోలిఉన్నాయి. జిల్లాలో అరుదైన వృక్షజాలం, జంతుజాలం ​​ఉన్నాయి. పులి, రాజనాగం, జింక, అడవి దున్న మొదలైన అరుదైన జంతువులు ఉన్నాయి. జిల్లాలోని అడవిలో గులాబీ చెక్క, టేకు కలప, అరుదైన మొక్కలు, కొన్ని ఫంగస్ ఉన్నాయి. విభాగాల వివరణ విషయాలు వివరణలు తాలూకాలు 3 ఉడిపి, కుండపుర, కర్కల ప్రతిపాదించబడిన తాలూకాలు బైందూర్, బ్రహ్మవర్ జిల్లా రూపకల్పన 1997 ఆగస్ట్ అసెంబ్లీ నియోజక వర్గం 5 కౌప్, ఉడిపి, కుండపుర, బైదూర్, కర్కల పార్లమెంటు నియోజక వర్గం షిమోగా ఎన్నిక కాబడిన ప్రతినిధులు ఎం.ఎస్. శోభా కరండ్లజె (ఉడిపి-చికమగాలూర్ లోక్‌సభ నియోజకవర్గం) (బిజెపి) కర్ణాటక విధానసభ సభ్యులు ప్రమోద్ మధ్వరాజ్ (ఐ.ఎన్.సి) - ఉడిపి కలడి శ్రీనివాస్ శెట్టి (ఇండిపెండెంట్) - విహార గోపాల్ పూజారికి (ఐ.ఎన్.సి ) - బైందూర్ వి సునీల్ కుమార్ (బిజెపి) - కర్కల వినయ్ కుమార్ Sorake (ఐ.ఎన్.సి) - కౌప్ (కర్ణాటక) వ్యవసాయం ఉడిపి జిల్లాలో వరి, కొబ్బరి పుష్కలంగా పండించబడుతుంది. తరువాత పోక (వక్క) తోటలు. ముంతమామిడి కూడా పండించబడుతుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వ్యవసాయదారుల నుండి పాలను సేకరించి వినియోగదారులకు అందిస్తుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు జిల్లాలోని మణిపాల్ వద్ద డైరీ ప్రొసెసింగ్ ప్లాంటు ఉంది. సమీపకాలంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా పాలను సేకరించడం, ప్రొసెసింగ్ సస్థలను నిర్వహిస్తుంది. చేపల పరిశ్రమ జిల్లాలో మంచినీటి చేపలు, ఉప్పునీటి చేపలు పరిశ్రమలు ఉన్నాయి. మాల్పె, గంగొల్లి చేపలపరిశ్రమ ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. అరేబియన్ సముద్రం చేపలపరిశ్రమకు ప్రధాన వనరుగా ఉంది. వాణిజ్యం, పరిశ్రమ జిల్లాలో అధికంగా చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రముఖ పరిశ్రమలు ఏవీ లేవు. అయినప్పటికీ జిల్లాకు కొన్ని ప్రముఖ పరిశ్రమలు రానున్నాయి. జిల్లాలో ఎర్రమట్టి పెంకులు (మంగుళూరు టైల్స్), ముంతమామిడి (జీడిపప్పు) కొబ్బరి నూనె పరిశ్రమలు ప్రకలకు వందలాది మందికి ఉపాది కలిగిస్తూ ఉన్నాయి. మణిపాల్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉంది. పై గ్రూప్‌కు చెందిన ఈ ప్రింటింగ్ ప్రెస్ నుండి అత్యున్నత సెక్యూరిటీ సంబంధిత చెక్కులు, షేర్ సర్టిఫికేట్లు, మొబైల్ రీచార్జ్ కూపన్లు, పలు భారతీయ విశ్వవిద్యాల కొరకు ప్రశ్నాపత్రాలు ముద్రించబడుతున్నాయి. అవిభాజిత దక్షిణ కనరా 4 ప్రభుత్వరంగ బ్యాంకులకు పి.ఎస్.బి (., విజయాబ్యాంక్, కనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్) జన్మస్థలం. జిల్లాలో లైఫ్ ఇంసూరెంస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఉడిపి) డివిషనల్ ఆఫీస్ ఉంది. రోబోసాఫ్ట్ టెక్నాలజీస్ SourceHub India Pvt Ltd, డాటా ట్రీ ఐ.టి సర్వీసెస్, యునైటెడ్ స్పెక్ట్రం సొల్యూషంస్- మొబైల్ అప్లికేషంస్, మణిపాల్ వద్ద మణిపాల్ డిజిటల్ సిస్టంస్ వారి కార్పొరేట్ ఆఫీసులు, రీజనల్ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. రోబోసాఫ్ట్ ఉడిపికి అంతర్జాతీయ గురింపును తీసుకు వచ్చింది. నందికూర్ వద్ద నాగార్జునా గ్రూప్ విద్యుద్త్పత్తి కొరకు ఒక థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేయబడింది. ఈ స్థాపించేసమయంలో పర్యావణ సంబంధిత వివాదాలు తలెత్తాయి. పదుబిద్రె వద్ద సుజలాన్ పవన విద్యుత్తు తయారీ వ్యవస్థ ఏర్పాటు చేసింది. పదూర్ వద్ద కేంద్రప్రభుత్వం భూగర్భ పెట్రోలియం వెలికితీత కొరకు పనిచేస్తుంది. పర్యావరణవాదులు ఇటువంటి పరిశ్రమల స్థాపన వలన అరణ్యాల పచ్చదనానికి భగంకలిగిస్తాయని ఆందోళన చెందుతున్నారు. రవాణా thumb|550px|భారతదేశంలోని మరవంతే, బైందూర్ సమీపంలో జాతీయ రహదారి 17, ఇక్కడ అరేబియా సముద్రం, సౌపర్నికా నది మధ్య జాతీయరహదారి వెళుతుంది ఉడిపి జిల్లా రెండు జాతీయరహదార్లు ఉన్నాయి. జాతీయరహదారి 17 (ప్రస్తుతం జాతీయరహదారి 66 అని మార్చబడింది), రెండవది జాతీయరహదారి 13. జాతీయరహదారి 17 జిల్లా ఉత్తర దక్షిణ దిశగా పయనిస్తూ ఉడిపిని మంగుళూరు, కార్వార్, మురుదేష్వర, కొచ్చి, మద్గావ్, గోవా రత్నగిరి, ముంబయితో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 13 జిల్లాను షిమొగా, బీజపూర్, సోలాపూర్, చిత్రదుర్గ, హోస్పేటలతో అనుసంధానిస్తుంది. రైల్వే కొంకణి రైల్వే జిల్లాను పొరుగు జిల్లాలు, రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. జిల్లాలో ఉడిపి, బైందూర్, కుందపురె వద్ద ప్రధాన రైలు స్టేషన్లు ఉన్నాయి. వాయు మార్గం జిల్లాకు అతి సమీపంలోని విమానాశ్రయం జిల్లాకేంద్రం ఉడిపికి 55 కి.మీ దూరంలో బజ్పె వద్ద " మంగుళూరు విమానాశ్రయం " ఉంది. భాషలు ఉడిపి జిల్లాలో ప్రధానంగా తులుభాష, కన్నడ, బియరీ భాష, ఉర్దూ, కొంకణి భాషలు వాడుకలో ఉంది. ఉడిపి, దక్షిణ కన్నడ తులునాడు అంటారు. ఇక్కడ తులు ప్రజలు అధికంగా నివసిస్తుంటారు. తులు భాషా శిలాశాసనాలు జిల్లా, పరిసర ప్రాంతాలలోని బర్కూర్ (పురాతన తులునాడు రాజధాని) లభిస్తున్నాయి. కన్నడ భాషా కుటుంబానికి చెందిన కుందకన్నడ కుందపూర్, బైందూర్ తాలూకా, హెబ్రి, బ్రహ్మవర్ ప్రాంతాలలో దీర్ఘకాలం నుండి వాడుకలో ఉంది. జిల్లాలోని గౌడసరద్వతి బ్రాహ్మణులు, మంగోలోరియన్ కాథలిక్స్ కొంకణి భాషను అధికంగా మాట్లాడుతుంటారు. జిల్లాలోని ముస్లిములలో ఉర్దూ భాష వాడుకలో ఉంది. బైందూర్ లోని ముస్లిములలో బియరీ భాష, నవయాథ్ వాడుకలో ఉంది. చర్చిలు ఎస్.టి. లారెంస్ - ష్రైన్ - ఉడిపి బస్ నుండి (ఉడిపి-కర్కల ఆర్డి ద్వారా) అత్తుర్, 35.5 కి.మీ రోమన్ - కాథలిక్- డియోసెస్ - ఆఫ్- ఉడిపి (మిలాగ్రెస్ కేథడ్రల్ చర్చి) - ఉడిపి బస్ స్టాప్ నుండి (జాతీయరహదారి 17 ద్వారా) కల్లియన్‌పురం 8.3 కి.మీ ఫాతిమా చర్చి అవర్ లేడీ - పెరంపల్లి ఉడిపి బస్ స్టాప్ నుండి, 5.5 కి.మీ (వయా గుండిబలి -మణిపాల్ ఆర్డి) . క్రీస్తు చర్చి - మణిపాల్ (మణిపాల్-కల్లసంక ద్వారా) 6.6 కి.మీ ఉడిపి బస్ వైలంకని చర్చి కల్మాడి ఆఫ్ అవర్ లేడీ - ఉడిపి బస్ స్టాప్ నుండి 3.5 కి.మీ (ఆది ఉడిపి ద్వారా) ఉడిపి వంటకాలు ఉడుపి వంటకాలు. ఉడుపి హోటల్లు ప్రపంచవ్యాప్తముగా ఉన్నాయి.. సాధారణము శాకాహార వంటకాలలో ఉడుపి శైలి వంటలు చాలా ప్రసిద్ధి చెందినవి. కర్ణాటక అంతటా ఉడిపి వంటలకు విశేష ఆధారణ ఉంది. ఉడిపి శైలి హోటల్స్ భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. అలాగే తరువాత ప్రంపంచమంతా విస్తరించాయి. ఉడిపి రెస్టేరెంట్లు దక్షిణ భారతీయ శాకాహార వంటకాలను మాత్రమే అందిస్తుంటాయి. ముంబయి, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాలలో రుచికరమైన శాకాహార వంటకాలకు, మర్యాదపూర్వకంమైన సేవలకు ఉడిపి హోటల్స్ ప్రసిద్ధి చెందాయి. నేయి వేసి దోరగా కాల్చిన దోశ మద్యలో ఉర్లగడ్డకూరను చేర్చి మడిచి పెట్టి వివిధ రకాల చట్నీలతో అందించే మసాలా దోశను ఉడిపి హోటళ్ళ రూపకల్పన అన్నది ప్రత్యేకత. వ్యక్తులు రాజకీయ నాయకులు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ - మాజీ కేంద్రమంత్రి సాహిత్యం ఉడిపి జిల్లా పలువురు కన్నడ సాహిత్యకారులను అందించి కన్నడ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తుంది. ఙానపీఠ అవార్డ్ గ్రహీత డాక్టర్ షివరామ కరంథ్ జిల్లాలోని కుగ్రామం కోటలో జన్మించారు. ముఖ్యమైన రచయితలు డాక్టర్ కె శిరామ కృష్ణ, ఙానపీఠం అవార్డు విజేత, రచయిత, నవలా రచయిత, పర్యావరణవేత్త, డ్యాన్స్ సంస్కర్త మొదలైనవి గోపాలకృష్ణ అడిగ, కవి ప్రొఫెసర్ ఏ.వి. నవాడ. సంతోష్ కుమార్ గుల్వడి . జర్నలిస్టు, రచయిత బి.జనార్ధన్ భట్, సాహిత్య విమర్శకుడు జయరామ కారంత్, కవి ఉల్లూర్ మూకాజి, కవి వ్యాపారవేత్తల టి.ఎం.ఎ. పాయ్ టి.ఎ. పాయ్ బి.ఆర్. శెట్టి ఖాన్ బహదూర్ హాజీ అబ్దుల్లా సాహెబ్ స్థాపకుడు కార్పొరేషన్ బ్యాంకు హిదయతుల్లా అబ్బాస్ ఉచియ రాజ్ శెట్టి టి.ఎస్. భూదాన్ భాషా చైర్మన్ వక్ఫ్ బోర్డు కమిటీ, అధ్యక్షుడు, జమియ మసీదు ఉడిపి కళ, సంస్కృతి యక్షగాన ప్రఖ్యాత నృత్య, నాటక సమ్మిశ్రిత జానపద సంప్రదాయ నృత్యరూపం. జిల్లాలో పలు యక్షగాన కళారూపాలు ఉన్నాయి. జిల్లాలో యక్షగాన శిక్షణాలయాలు ఉన్నాయి. నాగారాధనె జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో ఆచరించబడుతుంది. జిల్లాలో నాగరాధన సమయంలో నృత్యం, పూజ, రంగోలి మొదలైన కార్యక్రమాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భుటకోల, ఆటి కలెంజ, కద్యనాట మొదలైన రూపస్లలో జిల్లాలోని ప్రజలు ప్రకృతి ఆరాధన చేస్తుంటారు. గ్రామాలలో ప్రజలు కంబల, కోడిపందాలు, లగోరి, గిల్లి దండ మొదలైన క్రీడలను వీక్షిస్తుంటారు. నాటకం సంప్రదాయ నాటకరూపాలు జిల్లాలో సజీవంగా ఉన్నాయి. జిల్లాలో స్కూల్ డే, కాలేజీ డే వంటి సందర్భాలలో ప్రాంతీయవాసులు నాటకప్రదర్శన ఇవ్వడం నాటకపోటీలు నిర్వహించడం సాధారణంగా జరుగుతుంటాయి. ఉడిపి జిల్లా నుండి యక్షగాన కళాకారులు దివంగత కళింగ నవద దివంగత నరనప్ప ఉప్పూర్ వీరభద్ర నాయక్ వందరు బసవ రాఘవేంద్ర మైయ్య లేట్ రామ నైరి బ్రహ్మవర లావణ్య కల్వ వ్రంద బైందూర్ లేట్ హరది రామ గానిగా కొలలి కృష్ణ శెట్టి సందేశ్ శెట్టి గొర్రెలు ఊల్లూర్ శంకర్ డెవదిగ దినేష్ శెట్టి బెప్దె భగవథ్ కొలలి కృష్ణ శెట్టి పర్యాటక ప్రదేశాలు తీరాలు thumb|right|సెయింట్ మేరీస్ ద్వీపం దృశ్యం thumb|right|సెయింట్ మేరీస్ ద్వీపంమరొక దృశ్యం right|thumb|కుబ్లు తీర్థ జలపాతం, హెబ్రీ సమీపంలో ఉంది మాల్పె:- ఉడిపి నుండి 6 కి.మీ దూరంలో ఉన్న మాల్పె చేపలపరిశ్రమకు, నౌకావ్యాపారానికి కేంద్రం. సెయింట్ ఐలాండ్ (కర్నాటక):- మాల్పె వద్ద అరేబియన్ సముద్రంలో ఉంది. కౌప్ (కర్నాటక):- ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ బీచ్, లైట్ హౌస్ ఉన్నాయి. మరవంతె:-ఉడిపి నుండి 42 కి.మీ దూరంలో ఉంది. అరేబియన్ సముద్రం, సౌపర్ణిక నదుల మద్య జాతీయరహదారి 65 లో ప్రయాణం చక్కని అనుభూతిని ఇస్తుందిఅయినప్పటికీ నిరంతరం సముద్రం చొచ్చుకుని వస్తున్న కారణంగా మూసివేయబడిన జాతీయ రహదారి 17 రహదారి ఇప్పటికీ ఉనికిలో ఉంది. మరవంతె దగ్గర నుండి నది యు టర్న్ తిరిగి తూర్పు దిశగా ప్రవహించి 10 కి.మీ ప్రవహించిన తరువాత కుందపురాను చేరుతుంది. ఒథినానె:- ఇది ఎత్తైన పర్వతాల పక్కన ఉన్న పరిశుభ్రమైన సముద్రతీరం. ఆలయాలు ఉడిపిలో ప్రముఖ ఉడిపి కృష్ణాలయం ఉంది. ఉడిపి అనంతేశ్వర దేవాలయం ప్రముఖ వైష్ణవ గురువు మధ్వాచార్యులు ఉడిపి నుండి తన ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభించాడు. కుట్టపల్లి సుభహ్మణాలయాలకు ప్రసిద్ధి. సుభహ్మణ్య షష్టి (నవంబరు- డిసెంబరు) నాడు ఈ ఆలయాలకు వేలాది భక్తులు వస్తుంటారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరాలయం (కనంగి ఆలయం) ఉంది. ఇక్కడ సత్యయుగ యోగాశ్రమ, రామకృష్ణ భజన మందిరం ఉన్నాయి. కృష్ణాలయం ఉడిపి శ్రీ కృష్ణ దేవాలయంలో కృష్ణుడు విగ్రహం|alt=ఉడుపి శ్రీకృష్ణుడు|thumb ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ విగ్రహం ఉంది. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదక్షం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచార్యులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటికి పర్యాయంలో ఉన్న పీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు. అష్ట మఠాలు ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్ట మఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. పుత్తగె పేజావర పలిమారు అదమారు సోదె మఠ శీరూరు కాణియూరు కృష్ణాపుర దగ్గరలోని కొన్ని ముఖ్య ప్రదేశాలు కోల్లూరు ముకాంబికా దేవాలయం మరవంతె బీచ్ మల్పే రేవు కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు) కార్కళ లోని గోమటేశ్వరుడు వేణూరు లోని గోమటేశ్వరుడు కార్కళ సెయింట్ లారెన్స్ ఇగర్జి సెయింట్ మేరీస్ ద్వీపం మూడబిదరెలో సావిరకంబద బసది మణిపాల్ బైందూరు కోసళ్ళి జలపాతము జామియా మసీదు 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18, 000 మంది ప్రార్థనలు చేసే విధంగా ప్రార్థనాశాలలు నిర్మించబడ్డాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు. పాజక:- ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేసిన ప్రదేశం ఉంది. కొల్లూరు (ఉడిపి):- ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. పశ్చిమ కనుమలలో ఉన్న ఈ ప్రదేశం మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తులు విశ్వసిస్తున్నారు. తమిళనాడు, కేరళా నుండి ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు. కర్కల:- ఉడిపి నుండి 37 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జైన బసదీలు (ఆలయాలు), గోమటేశ్వర శిల్పం (బృహద్రూపం ) ఉన్నాయి. ఇక్కడ ఇంకా పుదు తిరుపతి శ్రీ వెంకటరమణ ఆలయం, అత్తూర్ సెయింట్ లారెన్స్ చర్చి, శ్రీ హోసమారిగుడి ఆలయం, శ్రీ ఉచ్చంగి మరియమ్మ ఆలయం, శ్రీ అనంతపద్మనాభ ఆలయం, శ్రీ పద్మావతి టెంపుల్, శ్రీ మహాలింగేశ్వర దేవాలయం, శ్రీ సిద్ధివినాయక ఆలయం, శ్రీ ఉమామహేశ్వర ఆలయం, సల్మార్ జామా ఉంటాయి మసీదు మొదలైన ముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. అనెగుడ్డె:- ఉడిపి నుండి 30 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ప్రముఖ గణేశాలయం ఉంది. ఆత్తుర్ చర్చి:- ఉడిపి నుండి 25 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ వార్షికంగా నిర్వహించబడే సంతకు కులమతభేద రహితంగా ప్రజలు వస్తుంటారు. బర్కూర్:- ఉడిపి నుండి 15కి.మీ దూరంలో ఉంది. పలు ఆలయాలు జైన బసదీలు ఉన్న బర్కూరు తులునాడు రాజులకు రాజధానిగా ఉండేది. సాలిగ్రామ:- ఉడిపి నుండి 27కి.మీ దూరంలో ఉంది. ఇక్కడా గురునరసింహస్వామి ఆలయం ఉంది. పరంపల్లి:- ఇక్కడ 800 వందల పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది. పెర్నకిల:- ఇక్కడ ఒక పురాతన గణేశుని ఆలయం ఉంది. పెర్దోర్:- ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది. అగుంబే - షిమోగా రాష్ట్రీయ రహదారి సమీపంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది. మాస సంక్రాంతి రోజున ఈ ఆలయంలో విశేషపూజలు నిర్వహించబడుతున్నాయి. ఈ పూజలు చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. హరియాద్క:- ఉడిపి నుండి 16 కి.మీ దూరంలో ఉంది. పురాతనమైన వీరభద్రాలయం ఉంది. శంకరనారాయణ:- ఉడిపి నుండి 40 కి.మీ దూరంలో ఉంది. శకరనారాయణాలయం ఒక సరోవరం మద్యన ఉండడం విశేష ఆకర్షణ. ఆలయ ప్రధాన దైవాలు శంకరుడు - నారాయణుడు. మారనకట్టె:-ఉడిపి నుండి 45 కి.మీ దూరంలో ఉంది. పశిమకనుమలలోని దట్టమైన అరణ్యాలమద్య ఉన్న ఈప్రాంతం ప్రకృతి ఆరాధకుల స్వర్గభూమిగా ఉంటుంది. మందర్హి:- ఉడిపి నుండి 20 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ అమ్మనవారు (దుర్గాపరమేశ్వరి) ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదంగా ఇవ్వబడే " దోశ" సంతానప్రాప్తి కలిగిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇక్కడకు దేశవిదేశాల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. ముదుహోలె కర్కడ:- ఇక్కడ పురాతన దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దేశం అంతటి నుండి భక్తులు వస్తుంటారు. ఆలయంలో నవరాత్రికి విశేషపూజ నిర్వహించబడుతుంది. ఇక్కడ ధనుర్మాసం 4వ రోజు నిర్వహించే పూజకు భక్తులు విశేషంగా వస్తుంటారు. వన్యప్రాణుల అభయారణ్యాలు ఉడిపి జిల్లాలో దట్టమైన సతతహరితారణ్యాలు ఉన్నాయి. ఇవి పశ్చిమకనుమలు, సహ్యాద్రి పర్వతారణ్యాలలో భాగమై ఉన్నాయి. అరణ్యాలలో ఉత్తనతమైన వృక్షజాల మైరియు జంతుజాల సంపద ఉంది. సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం:-ఇది ఉడిపి నుండి 40 కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఉన్నాయి. మూకాంబికా వన్యప్రాణి అభయారణ్యం:- ఇది ఉడిపి నుండి 50 కి.మీ దూరంలో ఉంది. కుందపూర్- కొల్లూర్ రోడ్డు పక్కన విస్తరించి ఉంది. పర్యాటక చిత్రపటంలో ఇది చేర్చబడలేదు. జలపాతాలు కుర్ధు తీర్ధ జలపాతాలు:- ఉడిపి నుండి 42 కి.మీ దూరంలో ఉంది. పశ్చిమ కనుమల లోని దట్టమైన అరణ్యాల మధ్య ఉంది. ఇది ఒక అందమైన జలపాతం. ఇది ఫిబ్రవరి- మే మాసాల మధ్య బలహీనంగా ప్రవహిస్తుంది. జలపాతం ఎత్తు 300 అడుగులు. ఇది నేరుగా ఒక మడుగులోకి చేరుతుంది. ప్రాంతీయ ప్రజలు దీనిని పవిత్రంగా భావిస్తుంటారు. వేలాది సంవత్సరాలముందు ఋషులు ఇక్కడ తపసు చేసారు కనుక ఇది అతి పవిత్రమైనదిగా భావిస్తున్నారు. మంగ తీర్ధ:- కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మద్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్థం అని కూడా అంటారు. బర్కన జలపాతం:- ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు, శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది. ఉడిపి - శివమొగ్గ రహదారి మార్గం నుండి 45 నిముషాల నడకద్వారా జలపాతం చేరుకోవచ్చు. బెల్కల్ తీర్థ జలపాతం:- ఉడిపి నుండి 50 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమకనుమలలో ఉంది. ఇది 400 అడుగుల ఎత్తులో ఉంది. ఫిబ్రవరి - మేమాసాలలో ఇది ఎండి పోతుంది. అరసిన గుండి:- ఇది డాలి గ్రామం వద్ద అరణ్యాల మద్య ఉన్న అందమైన జలపాతం. జొమ్లు తీర్థ:- ఉడిపి నుండి 35 కి.మీ దూరంలో బెల్వె ఉంది., ఇది సీతనదీ జజాలతో ఏర్పడిన 20 అడుగుల ఎత్తైన చిన్న జలపాతం. ఈ నది మీద ఇది రెండవ జలపాతం. మొదటి జలపాతం కుద్లు తీర్థ. కొసల్లి జలపాతం:- ఇది కుందపూర్ తాలూకాలోని బైందూర్ వద్ద ఉంది. ఇది జిల్లా ఉత్తర సరిహద్దులో ఉన్న అందమైన జలపాతం. నది ద్వీపాలు నదులు సౌపర్నిక, స్వర్న, చక్రానది, సీతా, వర్హి నది, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి. త్రాగునీరు, విద్యుత్తు, ప్రయాణ వసతులు మొదలైన మౌలిక సదుపాయాలు లేవు. ఉదాహరణగా నదీద్వీపాలలో సుల్ కుర్దు, కన్నడ కుర్దు, బబ్బు కుర్దు, కట్టె కుర్దు, బెన్నె కుర్దు, కుక్కుడె కుర్దు, తిమ్మన్న కుర్దు, పాడు కుర్దు, హట్టి కుర్దు, బాల్ కుర్దు, బవలి కుర్దు, షెట్టి కుర్దు, ఉప్పిన కుర్దు, కురు, జరు కుర్దు ఉన్నాయి. ప్రత్యేక తులునాడు రాష్ట్రానికి డిమాండ్ స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగిన సమయంలో తులువ ప్రజలు తులువ భాషకు అధికార హోదా, ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాటం సాగించారు. ప్రస్తుత కర్ణాటక రాషంలోని దక్షిణ కన్నడ, ఉడిపి, కేరళ రాషంలోని కాసరగాడ్ జిల్లాలను కలిపిన భూభాన్ని కలిపి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం సాగించారు. తరువాత ఇది కొంత ఆణిచివేయబడినప్పటికీ సమీపకాలంగా ఈ కోరిక తిరిగి బలపడుతూ ఉంది. తులు రాజ్య హోరాట సమితి వంటి సంస్థలు ఈ కోరికను కేంద్రీకరించి తరచుగా సమావేశాలు, ప్రదర్శనలు తులువనాడు లోని పట్టణాలలో పోరాటం సాగిస్తున్నారు. తులు అధికారభాషగా చేయడం, తులువనాడులో తులువ భాషను బోధనా భాషగా చేయడం, తులు సంప్రదాయ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఈ పోరాటానికి ప్రధానాంశాలుగా పోరాటం కొనసాగుతూ ఉంది. ఇది కూడ చూడు ఉడుపి ఉడిపి వంటకాలు దక్షిణ కన్నడ మంగుళూరు పాజక శ్రీ కృష్ణ మఠం మధ్వాచార్యులు కనసదాసు పురందరదాసు మరవంతే మూలాలు బయటి లింకులు Official Website of Udupi district Udupi District Tourism Information Comprehensive information on Udupi Know about Udupi South Canara Gazetteer 1973 News from Udupi, Manipal, Kundapura, Brahmavara, Karkala, Padubidri News from entire Udupi district and surrounding areas ఉడుపి గురించె చెప్పే వెబ్ సైటు పేజిలు వర్గం:1997 స్థాపనలు వర్గం:కర్ణాటక వర్గం:కర్ణాటక పుణ్యక్షేత్రాలు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు వర్గం:పరశురామ క్షేత్రాలు వర్గం:ఉడిపి జిల్లా
ధార్వాడ్ జిల్లా
https://te.wikipedia.org/wiki/ధార్వాడ్_జిల్లా
Dharwad70px Karnataka Coat-of-armsStateKarnatakaDivision BelgaumTaluksDharwad, Hubli,Kalghatgi, Navalgund,KundgolDistrict headquartersDharwadDistrict CommissionerSameer ShuklaArea4265 km²Population (2011)1,846,993Codes Telephone Vehicle+0836KA-25,KA-63Time zoneIST (UTC+5.30) కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో ధార్వాడ జిల్లా ఒకటి. ధార్వాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా ధార్వాడ పేడాకు (పాలతో చేసే స్వీటు) ప్రసిద్ధి. పురపాలకం వైశాల్యం 191 చ.కి.మీ. ధార్వాడ బెంగుళూరుకు వాయవ్యంగా 425 కి.మీ దూరంలో ఉంది. పూనాకు దక్షిణంగా 421 కి.మీ దూరంలో ఉంది. ఇది బెంగుళూర్- పూనా మార్గంలో రహదారికి దగ్గరగా ఉంది. జిల్లాలో " నార్త్ యూనిట్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ కంస్ట్రక్షన్ కార్పొరేషన్ " ప్రధాన కార్యాలయం ఉంది. జిల్లాలో హైకోర్ట్ సర్క్యూట్ బెంచ్ ఉంది.1997కు ముందు జిల్లా వైశాల్యం 13738. 1997 తరువాత ధార్వాడ నుండి గదగ్, హవేరి జిల్లాలు రూపొందించబడ్డాయి. ధార్వాడ, మరొక రెండు జిల్లాల నుండి భూభాగలను సేకరించి దావణగెరె జిల్లా రూపొందించబడింది. thumb|300px|right|ధార్వాడ (కర్ణాటక) జిల్లా పటం . పేరు వెనుక చరిత్ర ధార్వాడ అంటే విడిది అంటే స్వల్పకాల విశ్రాంత ప్రదేశం అని అర్ధం. కొన్ని శతాబ్ధాలపాటు ధార్వాడ మలెనాడు భూభాగం, మైదాన భుభాగాల మద్య ప్రధాన ద్వారంగా ఉండేది. మలెనాడు భూభాగం, మైదాన భుభాగాల మద్య ప్రయాణించే యాత్రీకులు ఇక్కడ కొంతకాలం విశ్రమించేవారు. సంస్కృతపదం ద్వారావత పదం నుండి ధార్వాడ అనే పదం వచ్చింది. ద్వారా అంటే తలుపు వాడ అంటే పట్టణం. మరొక కథనం విజయనగర పాలనాకాలంలో ధార్వాడ భూభాగాన్ని ధర్వ్ (1403) లో పాలించాడని ఆయన నుండి ఈ భూభాగానికి ధార్వాడ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో లభిస్తున్న కొన్ని శిలాశాసనాలు ఈ ప్రాంతాన్ని కామన స్థాన అని ప్రస్తావించబడింది. చరిత్ర నరేంద్ర గ్రామంలోని దుర్గాదేవి ఆలయసమీపంలో ఆర్.ఎల్.ఎస్ ఉన్నత పాఠశాల వద్ద లభించిన 12వ శతాబ్ధపు శలాశాసనాలు ధార్వాడ 900 సంవత్సరాల నుండి ఉనికిలో ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. బోక్యపూర్ సరససు (ధార్వాడ నుండి 18కి.మీ దూరంలో ఉన్న గ్రామం) వద్ద ఉన్న హనుమాన్ ఆలయం వద్ద లభించిన శిలాశాసనాలు కూడా ధార్వాడ గురించిన వివరాలను అందిస్తున్నాయి. చాళుక్యులు 12 వ శతాబ్దంలో చాళుఖ్యులు ధార్వాడను పాలించారు. 1117 లో భాస్కరదేవ పాలించినట్లు శిలాశాసనాలద్వారా తెలుస్తుంది. 14వ శతాబ్దంలో బహ్మనీ సుల్తానులు జిల్లాభూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇది కొత్తగా స్థాపించబడిన హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యంలో భాగం అయింది. విజయనగర రాజులు ధార్వాడ వద్ద కోటను నిర్మించారు. 1565లో తాలికోట యుద్ధంలో విజయనగర పాలకులు ఓటమి పొందాక ధార్వాడ కొంతకాలం హిందూ రాజుల పాలనలో స్వతంత్రరాజ్యంగా ఉంది. 1573లో బీజపూర్ సుల్తాన్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత ఆదిల్ షా రాజ్యంలో భాగం అయింది. ఆఫిల్ షా ఇక్కడ నిర్మించిన కోట్ మన్నాఖిలె అని పిలువబడింది. తరువాత నజ్రతాబాద్ అని పిలువబడింది. ఈ కోట నిర్మాణంతో ధార్వాడ ఊహాత్మకంగా అభివృద్ధి చెందింది. తరువాత ధార్వాడ పలువురు ఔరంగజేబు, శివాజీ, ఔరంగజేబు కుమారుడు ము ఆజం, పేష్వా, బాలాజీ రావు, హైదర్ అలి, టిప్పు సుల్తాన్ చివరిగా బ్రిటిష్ ప్రభుత్వం మొదలైన పలువురి విజేతలను ఆకర్షించింది. ముగల్ సామ్రాజ్యం 1685లో ధార్వాడ కోటను ముగల్ పాలకులడు ఔరంగజేబు స్వాధీనం చేదుకున్నారు. 1764లో తరువాత ధార్వాడ మరాఠీల పాలనకుడైన పూనా పేష్వా పాలనలోకి మారింది. 1778లో ఈ భూభాగం మైసూరు పాలకుడైన హైదర్ అలి రాజ్యంలో భాగం అయింది. 1791లో ధార్వాడ తిరిగి మరాఠీల వశమైంది. చివరిగా బ్రిటిష్ ప్రభుత్వం పేష్వాను ఓడించి ధార్వాడను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ధార్వాడను బాంబే ప్రొవింస్‌లో చేర్చారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ రాజ్యవిస్తరణను నారాగుండ్ పాలకుడు బాబా షాహెబ్, కిత్తూరు చెన్నమ్మ మొదలైన స్థానిక పాలకులు తీవ్రంగా వ్యతిరేకించారు. జహంగీర్ బాద్ జహంగీర్‌దర్ (బాద్) కులీనవర్గీయుడు. ఆయన ఒక జమీందారుగా ఉన్నాడు. ఆకాలంలో వారు రాజా, నవాబు, మిర్జా, పలు ఇతర బిరుదునామాలను స్వీకరించేవారు. జాగీరుదారులు రాజప్రతినిధులకు సమానంగా ఉండేవారు. కొంన్ని మార్లు వారు స్వతంత్రంగా వ్యవహరించేవారు. మరికొన్ని మార్లు స్వతంత్ర రాజులుగా వ్యవహరించే వారు. బ్రిటిష్ పాలనా కాలంలో జాగీరుదారులు కూడా వారి ప్రాభవాన్ని కోల్పోయారు. ముగల్ పాలనలో జాగీరుదార్లు ప్రజల నుండి పన్ను వసూలు చేసే అధికారం కలిగి ఉండేవారు. జాగీరుదారి అధికారం వారసత్వంగా కొనసాగేది. జాగీరు సరాసరి వైశాల్యం 50,000 హెక్టార్లు. (50-150 గ్రామాలు). జాగీరుదారుల స్వంతంత్ర భావాలకు వెరచిన మొగల్ పాలకులు జాగీరు అధికారాన్ని తరచుగా మారుస్తూ వేరే వారిని జాగీరుదారులుగా నియమించేవారు. 17వ శబాబ్ధం నుండి వారసత్వ అధికారంగా మారిన జాగీరుదారి 18 వ శతాబ్దం వరకు కొనసాగింది. స్వాతంత్ర్య సమరయోధుడు ధార్వాడ ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు " కర్నాటక కులపురోహిత్ ", శ్రీ అలూర్ వెంకటరావులకు జన్మస్థలం. శ్రీ అలూర్ వెంకటరావు రచించిన " కర్నాటక గత వైభవ " కర్నాటక ప్రజలలో ఉత్తేజం కలిగించింది. 19వ శతాబ్దం అధకభాగం ధార్వాడ ప్రశాంతంగానే ఉండేది. ఈ సమయంలో ధార్వాడలో 1848లో ఒక ఆగ్ల మాధ్యమ పాఠశాలను స్థాపించింది. తరువాత 1863లో ది బాసెల్ మిషన్ ఆర్గనైజేషన్ మరొక స్కూలును ప్రారంభించింది. 1867లో బ్రిటిష్ మరొక స్కూలును స్థాపించింది. వర్మల్ స్కూల్, తరువాత 1867లో ఇది ట్రైనింగ్ స్కూలుగా మార్చబడింది. 1883లో పురపాలక ప్రాంతంలో సిధాపూర్, లకమంహళ్ళి, హవేరి పీట్, బాగ్తలన్, మదిహల్, గలగంజికోప్, మాలపూర్, కమల్‌పూర్, నారాయణపూర్, సప్తపూర్, అత్తికోలా, హోసయపూర్ విలీనం చేయబడ్డాయి. 1888లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ రైల్వే స్టేషను ఏర్పాటు చేసింది. రైల్వే ధార్వాడ పట్టణంలో సదరన్ మరాఠా రైల్వే మార్గంలో ఒక రైల్వే స్టేషను ఉంది. 1901 గణాంకాలను అనుసరించి పట్టణ జనసంఖ్య 31,279. జిల్లాలో పలు కాటన్ జిన్, కాటన్ మిల్, రెండు హైస్కూళ్ళు ఉన్నాయి. ఒకదానిని ప్రభుత్వం నిర్వహిస్తుంది. రెండవదానిని బాసెల్ జర్మన్ మిషన్ నిర్వహిస్తుంది. 1947 ఆగస్టు 15 న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1956లో రాష్ట్ర పునర్విభజన సమయంలో బాంబే రాష్ట్రంలో ఉన్న కన్నడ మాట్లాడే జిల్లాలు మైసూరు రాష్ట్రంలో చేర్చబడ్డాయి. వాటిలో ధార్వాడ జిల్లా ఒకటి. 1972 నుండి మైసూరు రాష్ట్రం కర్నాటక రాష్ట్రంగా మార్చబడింది. ధార్వాడలో " కర్నాటక విశ్వవిద్యాలయం ", యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైంసెస్ (యు.ఎ.ఎస్) అలాగే పలు ఇతర కాలేజీలు ఉన్నాయి. 1941లో ధార్వాడ జనసంఖ్య 47,992.Columbia-Lippincott Gazeteer. p. 511 1961లో ధార్వాడ పొరుగున ఉన్న హుబ్లీ పట్టణంలో కలిసిపోయి హుబ్లి- ధార్వాడ పురపాలకం అయింది. రెండు నగరాల జనసంఖ్య కలిసి జనసంఖ్యాపరంగా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో బెంగుళూరు ఉంది. 1981-1991 మద్య కాలంలో హుబ్లి- ధార్వాడ జనసంఖ్య 22.99% (527,108 నుండి 648,298) అభివృద్ధి చెందింది. 1991 - 2001 మద్య కాలంలో హుబ్లి ధార్వాడ జనసంఖ్య 21.2 % అభివృద్ధి చెందింది. 2008లో ధార్వాడలో సర్క్యూట్ బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ కర్నాటక స్థాపించబడింది. ది సర్క్యూట్ బెంచి పరిధిలో ముంబయి - కర్ణాటక చేర్చబడ్డాయి. భౌగోళిక విశేషాలు ధార్వాడ వైశాల్యం 4263చ.కి.మీ. 15°02' నుండి 15°51' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 73°43' నుండి 75°35'డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తున ఉంది. జిల్లాలో ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణం ఉంది. భౌగోళికంగా జిల్లా మూడు విభాగాలుగా విభజించబడి ఉంది. మాల్నాడు, సెమీ మాల్నాడు, మైదాన్. జిల్లాలో ప్రాంతాలను అనుసరించి భారీ, మితమైన వర్షపాతం ఉంటుంది. కల్ఘతగి, అల్నవర్ ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. జిల్లాలోని ఇతర తాలూకాలకంటే ధార్వాడ తాలూకాలో అధిక వర్షపాతం ఉంటుంది. సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా ఉత్తర సరిహద్దు బెల్గాం తూర్పు సరిహద్దు గదగ్ దక్షిణ సరిహద్దు హవేరి పశ్చిమ సరిహద్దు ఉత్తర కన్నడ తాలూకాలు ధార్వాడ హుబ్లి కుంద్గొల్ నావల్గుండ్ కల్ఘత్గి ప్రముఖ వ్యక్తులు దాదాసాహెబ్ చింతామణి పవతె డాక్టర్. బెంద్రే కె ఎస్ అమర్ జి. ఎస్ అమర్ వెంకన్న హెచ్ నాయక్ సుధా మూర్తి గంగూబాయ్ హంగల్ పండిత్ మల్లికార్జున్ మన్సూర్ పండిట్ సవాయి గంధర్వ పండిత్ బసవరాజ్ రాజ్గురు పండిత్ కుమార్ గంధర్వ పండిట్ భీమ్సేన్ జోషి గిరీష్ కర్నాడ్ సురేష్ హెబిల్కర్ ఆర్.సి. హిరెమత్ సరోజినీ మహిషి, (మాజీ మంత్రి ఇందిరా మహాత్మా గాంధీ మంత్రివర్గం) జి.ఎ. కులకర్ణి సీనియర్ పోలీస్ అధికారులు అనుభవఙలైన పోలీసు అధికారులు:- వీరన్న ఐవల్లి - ఐ.పి.ఎస్. (1943-2002) కాశ్మీర్ పోలీస్ లో పనిచేసాడు. 2002 ఆగస్టులో " షేర్- ఇ- కాశ్మీర్ " అవార్డును అందుకున్నాడు. షరనబస్సప్ప బి తొంగ్లి - ఐ.పి.ఎస్. (జననం1920 డిసెంబరు 12 - మరణం 2012 జనవరి 25) వి.బి. నంగూర్- ఐ.పి.ఎస్ ఆర్.పి. మాలిమఠ్ - ఐ.పి.ఎస్ ఎస్.ఎస్.హస్బి- ఐ.పి.ఎస్ విద్య thumb|200px|right|కర్నాటక విశ్వవిద్యాలయం ధార్వాడ జిల్లా విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందింది. జిల్లాలో పలు ప్రముఖ ఉన్నత పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విద్యాసంస్థల జాబితా. 19వ శతాబ్దం మద్యకాలం నుండి జిల్లాలో మరాఠీ భాష ప్రాబల్యంలో ఉంది. అందువలన జిల్లాలో మరాఠీ పాఠశాలలు కూడా ఉన్నాయి. మరాఠీ ఆగ్లం ప్రభుత్వ పాఠశాలలు, కోర్టు వ్యవహారం, చట్టం మొదలై విషయాలకు ఉపయోగిస్తున్నారు. అందువలన కన్నడ భాష జిల్లాలో కొంత వెనుకబాటుకు గురైంది. అందువలన చెన్నబసప్ప, అర్తల్ రుద్రగౌడ, రోడా శ్రీనివాస్ రావు, సర్ సిద్దప్ప, కాంబ్లి, సక్కారి బాలాచార్య, ఆర్.హెచ్. దేశ్పాండే, ఆలూర్ వెంకట్రావు, కడప రాఘవేంద్ర రావు, సలి రామచంద్ర రావు విద్యావంతులైన కన్నడ భాషాభిమానులు కన్నడ భాషను పునఃస్థాపన కొరకు తమజీవితాలను కన్నడ భాషకు అంకితం చేసారు. వారు పాఠశాలలను, కాలేజీలను స్థాపించి కన్నడ భాషా మాధ్యమంలో బోధన జరగడానికి ఉపాధ్యాయులను నియమించి మాతృభాషకు సేవలందించారు. ధార్వాడ జిల్లా సరస్వతీ నిలయంగా పేరు పొందింది. జిల్లాలో విద్యావంతులు, విద్యాసంస్థలు, విద్యాభిమానులు, విద్యానుకూల పరిస్థితులున్న కారణంగా పరిసర జిల్లాలలోని విద్యార్థులు కూడా జిల్లాకు విద్యను అభ్యసించడానికి వస్తూ ఉన్నారు. ఉదయం 8-10, మద్యాహ్నం 12-1 సాయంత్రం 5 గంటల సమయానికి ధార్వాడ రహదార్లు, బస్సులు, ఆటోరిక్షాలు విద్యార్థులతో నిండిపోతుంటాయి. ఈ సమయాలలో ధార్వాడ మొత్తం ఒక పెద్ద పాఠశాలగా దర్శనమిస్తుంది. ధార్వాడలో కన్నడ, ఆంగ్లం, ఉర్దు మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి. పరిశ్రమలు హుబ్లి ఒక ప్రాధాన్యత కలిగిన పారిశ్రామిక కేంద్రం. 1000 స్మాల్ మరొయు మీడియం తరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో మెషి టూల్స్ ఇండస్ట్రీలు, ఎలెక్ట్రికల్, స్టీల్ ఫర్నీచర్, ఆహార ఉత్పత్తులు, రబ్బర్, తోలు పరిశ్రమలు, శిక్షణా సంస్థలు ఉన్నాయి. సంస్థల జాబితా :- టాటా మోటార్స్ లిమిటెడ్ టాటా మార్కోపోలో మోటార్స్ లిమిటెడ్ టెల్కో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (టెల్కోన్). కిర్లోస్కర్ ఎలక్ట్రికల్ కో లిమిటెడ్ కంపెనీస్ మైక్రోఫినిష్ గ్రూప్. భోరుకా టెక్స్టైల్ మిల్. ఎన్.జి.ఇ.ఎఫ్ లిమిటెడ్. కర్నాటక మిల్క్ ఫెడరేషన్. ఇండస్ట్రీస్ బి.డి.కె. గ్రూప్. మురుడేశ్వర్ సెరామిక్స్ లిమిటెడ్ కామత్ గ్రూపు (హోటల్స్ ప్రజాదరణ సమూహం) హోటల్స్ ఈ చాలా నగరంలో ప్రారంభమయ్యాయి. జె.బి.ఎం.ఇండస్ట్రీస్. డి.ఆర్.టి. సెలవులు భారతదేశం. వి.ఆర్.ఎల్. హుబ్లి నగర నడిబొడ్డులో ఐ.టి పార్క్ - హుబ్లి ఉంది. దీనిని గవర్నమెంట్ ఆఫ్ కర్నాటక ఐ.టి డిపార్ట్మెంటు స్థాపించింది. కెయోనిక్స్ హుబ్లి ఐ.టి పార్క్ నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహాబాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రయాణ సౌకర్యాలు రహదారి మార్గం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్.డబల్యూ.కె.ఆర్.టి.సి (నార్త్‌వెస్ట్ కర్నాటక రోడ్డు ట్రాన్‌పోర్ట్ కార్పొరేషన్) ప్రధానకార్యాలయం హుబ్లీలో ఉంది. నగరంలో హుబ్లి, ధార్వాడ, కల్ఘటి, నావలగుండు, కుండగోల్ మద్య చక్కని రవాణా వ్యవస్థ ఉంది. ఎన్.డబల్యూ.కె.ఆర్.టి.సి, బెంద్రె నగర సారిగె ఈ ప్రదేశాల మద్య దినసరి బసు సర్వీసులు అందిస్తూ పూర్తి స్థాయిలో రవాణాసౌకర్యం కలిగిస్తుంది. హుబ్లి, బెంగుళూరు, మంగుళూరు, పూనా, ముంబయి, గోవా, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు నగరం నుండి దినసరి బసు సౌకర్యంలభిస్తుంది. రైలు మార్గం హుబ్లి సౌత్ వెస్టర్న్ రైల్వేస్ జోన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ప్రధానకార్యాలయం ఉంది. పలు ఎక్స్‌ప్రెస్ పాసింజర్ దినసరి రైళ్ళు హుబ్లీ - బెంగుళూరు మద్య నడుపబడుతున్నాయి. ప్రధాన రైలు జంక్షన్ అయిన హుబ్లీ నుండి ముంబై, పూనే, మిరాజ్, ఢిల్లీ, హైదరాబాదు (ఆంధ్ర ప్రదేశ్), అహ్మదాబాద్, విజయవాడ, మైసూర్ లకు దినసరి రైలు వసతి లభిస్తుంది. చెన్నై, హౌరా, తిరువనంతపురం లకు వారాంతపు రైలు సౌకర్యం లభిస్తుంది. వాయుమార్గం స్పైస్ జెట్ బెంగుళూరు - ముంబయి విమానసర్వీసులు లభిస్తున్నాయి. హుబ్లి విమానాశ్రయంలో నైట్ - లాండింగ్ సౌకర్యం అభివృద్ధి చేయబడింది. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 1,846,993, ఇది దాదాపు. కొసవొ దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. 256 వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 434 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.13%. స్త్రీ పురుష నిష్పత్తి. 967:1000, జాతియ సరాసరి (928) కంటే. అధికం అక్షరాస్యత శాతం. 80.3%. జాతియ సరాసరి (72%) కంటే. అధికం సంస్కృతి ధార్వాడ భూభాగం కొన్ని హిందుస్థానీ సంగీతకళాకారులను అందించింది. జిల్లాలో సవైగంధర్వ, మల్లుకార్జున మంసూర్, భీంసేన్ జోషి (2011లో మరణించాడు), బసవరాజ్ రాజగురు, కుమార్ గంధర్వ, గంగుభాయ్ హంగల్ మొదలైన హిందూస్థానీ గాయకులు ఉన్నారు. అబ్దుల్ కరీం ఖాన్ ధార్వాడ కిరణ ఘరన కళకు కూడా గుర్తింపు పొందింది. ఉసాద్ అబ్దుల్ కరీం ఖాన్ తరచుగా మైసూర్ దర్బారుకు వచ్చిపోతూ ఉండేవాడు. మైసూర్ దదర్బార్ ఆయనకు సంగీతరత్న బిరుదు ఇచ్చి సత్కరించింది. మైసూరుకు వెళ్ళేదారిలో ఆయన తనసోదరునితో ధార్వాడలో కొంతకాలం నివసించాడు. ధార్వాడలో ఆయన ఒక తన అత్యంత కీర్తి పొందిన శిష్యునికి సంగీతం నేర్పాడు. ఆ శిష్యుడే సవై గంధర్వ. సవైగంధర్వ గంగుభాయి హంగల్, భీంసేన్, బసవరాజ్ రాజగురు వంటి శిష్యులకు సంగీతం నేర్పాడు. ప్రముఖులు ఙానపీఠ్ అవార్డ్ విజేతలు డాక్టర్ బెంద్రె, వి.కె గోకక్, గిరీష్ కర్నాడ్ వారి పూర్వీక మూలాలతో ధార్వాడతో సంబంధం ఉంది. కన్నడ రచయిత, విమర్శకుడు సాహిత్య అవార్డ్ గ్రహీత కీర్తినాథ్ కులకర్ణి తనజీవితంలో అధికాలం ధార్వాడలో నివసించాడు. ఒక మరాఠీ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత జి.ఎ. కులకర్ణి కూడా తన జీవితంలో చాలాకాలం ధార్వాడలో నివసించాడు. ప్రముఖ హిందీ నటి, కిషోర్ కుమార్ భార్య లీనా చందావర్కర్ ధార్వాడలో నివసించింది. తరువాతి కాలంలో కూడా రైల్వే స్టేషను సమీపంలో ఆమెకు ఆస్తులు ఉన్నాయి. నందన్ నిలెకాని నందన్ నిలెకాని ఇంఫోసిస్ కోచైర్మన్ తన అంకుల్ కుటుంబంతో ధార్వాడకు వెళ్ళి విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆయన సెయింట్ జోసెఫ్ హై స్కూల్‌లో నివసించాడు. నిలెకాని " కర్నాటక కాలేజి ఆవరణలో సృజన పేరుతో ఆర్ట్ అడిటోరియం నిర్మించజేసాడు. . న్యాయవాదులు ధార్వడ ప్రముఖ సంగ్లాడ్ జె, .బన్నూర్మఠ్బ జె., ఎ.సి కబ్బిన్ జె., మోహన్ షందంతంగౌదర్ జె, బి.ఎస్ పాటిల్, అశోక్ హించిగేరి జె. సుభాష్ ఆది జె. న్యావాదులు అయిన ష్రీ హితెగౌదార్, సి.బి. పాటిల్, షరత్ ఎస్. జవలి (సుప్రీం కోర్ట్) మోహన్ కతర్కి (కావేరి వివాద పరిషార కర్నాటక న్యావాది) మొదలైన చట్టసంబంధిత ప్రముఖులకు స్వస్థలంగా ఉంది. మరి కొందరు ప్రముఖులు ప్రముఖ ఇంవెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఉమ శశికాంత్, సుచేత దలాల్, ముంబయిలో నివసిస్తున్న ఫైనాంషియల్ జర్నలిస్ట్ (హర్షద్ మెహ్తతా కుంభకోణం వెలికి తీసాడు) కూడా ధార్వాడలో విద్యాభ్యాసం చేసారు. పి.బి. మహిషి, టి.ఎం. శివకుమార్, గణపతి భట్, మనిష్ దేశాయి, కె నంది సివిల్ సర్వీసులలో ల్యూసి, వారి ప్రత్యేకత చాట్టుకున్నారు. డి. అబ్ర్యూ కూడా ధార్వాడలో జన్మించిన వాడే. దళిత నాయకుడు ధార్వాడ పాల్వంకర్ బాలూ జన్మస్థలం. ఆయన క్రికెట్ క్రీడాకారుడుగా తరువాత రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించాడు. ఇండియన్ క్రికెట్ బౌలర్ సన్ జోషి ధార్వాడ వాసి మాత్రమేకాక పండిట్ భీంసేన్ బంధువు కూడా. ఆధ్యాత్మిక ప్రముఖులు జిల్లాలో ఆధ్యాత్మిక ప్రముఖులు ఉన్నారు. జిల్లాలో షిషునల్ షరీఫ్ సాహెబ్ సిద్దారూఢ స్వామిగళు, కుమార స్వామీజి, హురకడ్లి అజ్జా, మృత్యుంజయ అప్పగళు, మహంత అప్పగళు, గతగ్ మాదీవలేశ్వర మొదలైన అధ్యాత్మిక ప్రముఖులు ఉన్నారు. పర్యాటక ధార్వాడ జిల్లాలలో పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. చారిత్రక ఆలయాలు, స్మారకచిహ్నాలు ఉన్నాయి. ధార్వాడ అమ్మింభవి ధార్వాడ నుండి 6 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ 24 తీర్ధంకర బసది, హిరె మాతా, గుహాలయం ఉంది. ఆలయంలో కిత్తూరు నుండి వచ్చిన కొయ్యఫలకం మీద చిత్రించిన చిత్రం ఉంది. thumb|right|150px|ఉంకల్ హుబ్లి-ధార్వాడ్ వద్ద చంద్రమౌలేశ్వర ఆలయం thumb|right|150px|అన్నీగేరిలోని అమృతేశ్వర ఆలయం హుబ్లి ఉంకల్ వద్ద ప్రముఖ చంద్రమౌళేశ్వరాలయం ఉంది. ఇది పశ్చిమ చాళుఖ్యుల కాలం నాటిదని భావిస్తున్నారు. ఆలయ సమీపంలో ఉంకల్ సరసు ఉంది. ధార్వాడలో జిల్లాలోని అందమైన సరసులలో చంద్రమౌళీశ్వరాయం ఒకటి. ఉంకల్ సరసు హుబ్లి నుండి 3కి.మీ దూరంలో ఉంది. ఇది అందమైన పూదోటలు, పిల్లల వినోదసౌకర్యాలు, బోటింగ్ సౌకర్యం మొదలైన ఆకర్షణలతో కూడిన విహారకేంద్రం. thumb|left|200px|ఉన్కల్ సరస్సు భవాని శంకర్ ఆలయం :- చాళుఖ్యులు నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన దైవం నారాయణుడు. అసర్:- 1616లో దీనిని మొహమ్మద్ అలి షాహ్ దీనిని కోర్ట్ హాలుగా ఉపయోగించడానికి నిర్మించాడు. ఈ హాలును ప్రవక్త అనుయాయులు బసచేయడానికి ఉపయోగిస్తారు. ఇందులో స్త్రీలకు అనుమతి లేదు. నృపతుంగ హాల్ :- ఇది జిల్లా ఈశాన్య భూభాగంలో చిన్న కొండ మీద ఉంది. కొండమీద నుండి హుబ్లీ నగరం సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడి నుండి హుగ్లీ నగరంలోని అమరగోలి, విమానాశ్రయం వరకు కనిపిస్తుంది. ఉదయపు నడక సాగించే వారికి, సాయంత్రపు వేళలో వ్యాహ్యాళికి వెళ్ళే వారికి ఇది చాలా అనువైన ప్రదేశం. thumb|200px|left|సిద్దరూధ మఠం ఓల్డ్-హుబ్లి సిద్ధరూత మఠం :- ఇది ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ. ఇది స్వామి సిద్ధరూధ అధ్వైత సిద్ధాంత ప్రవచన కేంద్రం. ఇది హుబ్లీ నగర శివార్లలో ఉంది. గ్లాస్ హౌస్ :- ఈ అద్దాల మండపాన్ని ప్రధానమంత్రి ఇందిరాగాంధి చేత ప్రారంభించబడింది. బాణశంకరి ఆలయం (అమర్గొలి) లో శంకరలింగ, బాణశంకరి ఆలయాలు ఉన్నాయి. ఇది హుబ్లి- ధార్వాడ మార్గంలో నవనగర సమీపంలో ఉంది. అన్నిగెరి :- వద్ద పలు కల్యాణి చాళుక్యుల కాలంనాటి " అమరేశ్వర ఆలయం " ఉంది. చారిత్రక ఆలయాలు ఉన్నాయి. హుబ్లి నుండి కి.మీ దూరంలో ఉంది. ఇది హుబ్లికి 30కి.మీ దూరంలో హుబ్లి- గదగ్ మార్గంలో ఉంది. thumb|right|150px|ఉత్తర కర్ణాటకలోని కుండ్‌గోల్ వద్ద శంభులింగ ఆలయం నావలగుండ :- శ్రీ జగద్గురు అజాత నాగలింగ స్వామి ముత్త . కుండోగి :- హుబ్లీ నుండి 15 కి.మీ దూరంలో హుబ్లీ- ధార్వాడ మార్గంలో ఉంది. ఇక్కడ శంభులింగ ఆలయం ఉంది. ఇది కర్నాటక రాష్ట్రంలోని హిదూస్థానీ సంగీతానికి కేంద్రంగా ఉంది. ఇది హిందూస్థానీ సంగీతానికి విశ్వవిద్యాలయం వంటిది. సవాయి గంధర్వ యొక్క జన్మస్థలం. భారతరత్న, సవాయి గంధర్వ గురు పండిట్ భీమ్సేన్ జోషి, గంగూబాయ్ హంగల్ హిందుస్తానీ సంగీతం అధ్యయనం చేసారు. కల్ఘతగి తంబూర్ :- కల్ఘత్గి నుండి 8 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ బసవన్న ఆలయం ఉంది. ఇక్కడ దేవకూప్ప అరణ్యం ఉంది. శ్రీ బసవేశ్వరాలయం :- ఇది భోగెనగరకొప్పలో ఉంది. ఇది కలఘతగి నుండి 14 కి.మీ దూరంలో ఉంది. మహాలక్ష్మీ ఆలయం. శాంతినాథ ఆలయం. శాతినాథ బసది జైన ఆలయం. రిచ్ జానపద వారసత్వం డోల్లు కునిథ :- ఇది ప్రబల డ్రమ్ము నృత్యం, డ్రమ్ములను వర్ణరంజితమైన వస్త్రాలతో అలంకరించి వాయిస్తారు. వీరాగాసె :- వీరాగాసె ప్రబల జానపద నృత్యం. ఇది వీరత్వానికి చిహ్నంగా ప్రదర్శించబడుతుంది. ఇది వీరబధ్ర స్వామిని ఆరాధిస్తూ నర్తించబడుతుంది. శ్రావణ, కార్తిక మాసాలలో ఈ నృత్యం శివారాధనలో భాగంగా నర్తించబడుతుంది. ఈ నర్తకులను లింగదేవరు అంటారు. నందికొలు కునిత :- మాలే భక్తులు శివారాధన సమయంలో ఈ కళను ప్రదర్శిస్తుంటారు. నంది పోలె 18 క్యూబిట్ల పొడవు ఉంది. ఒక్కొక క్యూబిటును ఒక ధర్మ అంటారు. పోల్ పొడవును ఇత్తడి కుండలు, రేకులతో అలంకరించబడి ఉంది. భక్తులు ఆనందపరవశత్వంతో వాయిధ్యగోష్ఠి నడిమ చేసే నృత్య ప్రకంపనలు పోలులో ఉన్న ఇత్తడి కుండలు, రేకులు ప్రతిధనిస్తాయి. జొడు హలిగె :- హలిగె అంటే రెండు వాయిద్యాలను ఒకేసారి లయబద్ధంగా వాయిస్తూ ప్రదర్శించే కళారూపం. కాళాకారులు వారి శక్తియుక్తులను ఉపయోగిస్తూ చేసే ప్రదర్శన పేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. హల్లిగి గుండ్రంగా ఉంటుంది. దానిని బర్రెతోలుతో బిగించి తయారు చేస్తుంటారు. దీనిని చిన్న పూల్లలను ఉపయోగించి వాయిస్తారు. లంబాని నృత్యం :- లంబాని నృత్యంలో స్త్రీలు వర్ణరంజితమైన వస్త్రధారణ చేస్తుంటారు. గుండ్రంగా నిలిచి లయబద్దంగా తిరుగుతూ నరిస్తుంటారు. ఈ నృత్యం అసాధారణంగా ఉంటుంది. వారు కొన్ని ముఖ్యసమయాలలో స్వేచ్ఛాయుతంగా నర్తింస్తుంటారు. నాట్యం వారి జీవితంలో ఒక భాగంగాఉంటుంది. లంబాడీ నివాసం, వస్త్రధారణ, జీవనసరళి ప్రత్యేకంగా ఉంటుంది. వీరబధ్రకునిత :- నృత్యకారులు వీరబధ్రుని కథను వువరిస్తూ నర్తింస్తుంటారు. పౌరాణిక దైవం మహాశివుని సృష్టి. దక్షుని అహంకారానికి తగిన బుద్ధి చెప్పడానికి దక్షాయఙాంలో సతీదేవి ఆత్మాహుతికి కృద్ధుడైన పరమశివునిచేత వీరబధ్రుడు సృష్టించబడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ జానపద కళారూపం అంతరించిపోతున్న దశలో ఉంది. కర్నాటకాలో ఈ నృత్యరూప ప్రదర్శనకు తగిన ప్రోత్సాహం లభించడం లేదు. ప్రత్యేకంగా ఉత్తరకర్నాటకలోని దొద్దాట, సన్నట, గొంబెవతలో ఇప్పుడీ కళ క్షీణస్థితిలో ఉంది. ప్రజలు, భాష, ఆచారాలు జిల్లాలో ప్రధానంగా కన్నడ వాడుకలో ఉన్నప్పటికీ ద్వితీయ స్థానంలో మరాఠీ భాష వాడుకలో ఉంది. మరాఠీ భాష కూడా గుర్తించతగిన స్థితిలో ఉంది. ఇక్కడ మాట్లాడే కన్నడ భాషను ధార్వాడ కన్నడ అంటారు. ఇది దక్షిణ కర్నాటకలో మాట్లాడే భాషకంటే స్వల్పమైన భేదంతో ఉంటుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో పురుషులు తలపాగా (ఫెటా) ధరిస్తుంటారు. పలువురు పురుషులు తెల్లని టోపీలను కూడా ధరిస్తుంటారు. వ్యవసాయం, వాణిజ్యం జిల్లాలో అధికంగా జొవర్, మొక్కజొంబ, గోధుమలు, ఎర్రగడ్డలు, ఇతర పంటలు పండించబడుతున్నాయి. జిల్లాలో అదనంగా బొప్పాయి, అరటి, హార్టికల్చర్ పంటలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. వ్యవసాయ ఆధారితమైన బొరుగుల తయారీ, ఆతుకుల తయారీ, ఆహార నూనెనెల తయారీ సంస్థలు ఉన్నాయి. వాణిజ్య కేంద్రం జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు హుబ్లి ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉంది. కర్నాటక రైతులే కాక ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వారి ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తున్నారు. హుబ్లీలో పెద్ద ఎ.పి.ఎం.సి మార్కెట్ ఉంది. ఇది హుబ్లి- ధార్వాడ మార్గంలో అమర్గొల్ వద్ద ఉంది. హుబ్లీ ఎ.పి.ఎం.సి. మార్కెట్‌లో ఎండుమిరపకాయలకు, ఎర్రగడ్డలకు, బియ్యం, పత్తి, జొన్నల పంటలు విక్రయించబడుతున్నాయి. హుబ్లి- ధార్వాడ నగరాలలో మద్యతరహా, చిన్నతరహా పరిశ్రమలు గుర్తించతగినంతగా స్థాపించబడి ఉన్నాయి. పరిశ్రమల నుండి ఇంజనీరింగ్ పరికరాలు, ఎలెక్ట్రికల్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు లభిస్తున్నాయి. జిల్లాలో పలు స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. పరిపాలనా విభాగాలు విభాగాల వివరణ విషయాలు వివరణలు తాలూకాలు 5 ధార్వాడ్, హుబ్లి, కాల్ఘాట్గీ, కుంద్గోల్ల, నావల్‌గుండ్. గ్రామ పంచాయితీలు 50 హుబ్లి- ధార్వాడ నరపాలితం Hubli-Dharwad Municipal Corporation హెచ్.డి.ఎం.సి 1962లో రూపొందించబడింది. రెండు నగరాల మద్య 20 కి.మీ దూరం ఉంది. నగరాభివృద్ధి చరిత్రలో ఇది ఒక ప్రయోగం. నగరపాలిత (కార్పొరేషన్) వైశాల్యం 181.66 చ.కి.మీ. ఇందులో 45 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 1991లో జనసంఖ్య 7 లక్షలు. ప్రస్తుత జనసంఖ్య 15 లచలు. హుబ్లి :- 1855 ఆగస్టు 15న హుబ్లి పురపాలకం రూపొందించబడింది. ధార్వాడ :- ది ధార్వాడ ముంసిపల్ కౌంసిల్ 1856 జనవరిలో రూపొందించబడింది. హుబ్లి వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా గుర్తించబడుతుంది. విద్యా కేంద్రగా కూడా ధార్వాడ అభివృద్ధి చెందింది. వైశాల్యపరంగా జంట నగరాల కార్పొరేషన్ రాష్ట్రంలో రెండవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో బెంగుళూరు కారఒరేషన్ ఉంది. హెచ్.డి.ఎం.సి పలు మార్పులను చూసింది. నగరపాలన ప్రజానుకూలంగా, పారదర్శకంగా నిర్వహించబడుతుంది. అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. అత్యున్నత సేవలకు పోలీస్ వ్యవస్థ ఐ.ఎస్.ఒ సర్టిఫికేట్ పొందింది. ఇది కూడ చూడు పశ్చిమ చాళుఖ్య ఆలయాలు పశ్చిమ చాళుఖ్య నిర్మాణకళ పశ్చిమ చాళుఖ్య సామ్రాజ్యం ఉత్తర కర్నాటక ఉత్తర కర్నాటక పర్యాటకం అన్నిగెరి కుండ్గొల్ తంబూరి బనశంకరి ఆలయం (అమర్గొల్) చంద్రమౌళీశ్వరాలయం హవేరి గదగ్ కిత్తూర్ మూలాలు వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:ధార్వాడ్ జిల్లా వర్గం:బెల్గాం డివిజన్ వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు
హసన్ జిల్లా
https://te.wikipedia.org/wiki/హసన్_జిల్లా
హసన్ భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా , ఒక పట్టణం. ఈ పట్టణం హసన్ జిల్లాకు రాజధాని కూడా. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ISRO) ప్రధాన నియంత్రణ కేంద్రం హసన్ నందే ఉంది. చరిత్ర హసన్ చరిత్ర సుమరుగా 5వ శతాబ్దం నుండి ప్రారంభమైనట్లుగా గుర్తించబడుతోంది. హాల్మాడి గ్రామంలోని కదంబ రాజులు వేయించిన శిలాశాసనమే దీనికి సాక్షి. కదంబ వంశం తరువాత 11వ శతాబ్దంలో హొయసల వంశం ఈ ప్రదేశాన్ని పరిపాలించింది. 11 నుండి 14వ శతాబ్దం వరకు హోయస్ల రాజుల రాజధాని ద్వారసముద్ర. ఇప్పటి హళేబేడు గ్రామంలో ఈ రాజధాని అవశేషాలు కనిపిస్తాయి. మొదట్లో హోయస్ల రాజులు జైన మతాన్ని పాటించగా, ఆ తరువాతి హోయస్ల రాజులు శైవాన్ని పాటించారు. కానీ ఈ రాజ వంశీయులు అన్ని మతాలను సమాన దృష్టితో చూసేవారని చెప్పడానికి హళిబేడులోని శివుని దేవాలయమైన హొయసలేశ్వర దేవాలయం, బేలూరులోని విష్ణువు దేవాలయమైన చెన్నకేశవ స్వామి దేవాలయం సాక్షి. శిలా శాసనాలు కదంబ వంశానికి చెందిన రాజులు కన్నడ భాషలో మొట్టమొదటి శిలశాసనం బేలూరు తాలుకాలోని హల్మాడి గ్రామంలో ఉంది. హసన్ జిల్లాలోని శ్రావణబెళగొళలోనే అత్యధిక కన్నడ శిలాశాసనాలు లభిస్తున్నాయి. శ్రావణబెళగొళలో మరాఠీ శిలశాసనాలు కూడా ఉన్నాయి. హసన్ పేరు వెనుక కథ హసన్ పేరు వెనుక రెండు కథలు ఉన్నాయి 1) ఈ హసన్ మొదటి పేరు సింహసనపురి ఒక వాదన 2) హసన్ పట్టణంలో ఉన్న హసనాంబాదేవి వలన ఈ పట్టణానికి ఈ పేరు వచ్చిందనేది మరో వాదన 3).హసన్ గారు ముహమ్మదు ప్రవక్త మనుమడు .అలీ ఫాతిమా ల సంతానం.ఖురాన్ సంకలనం చేయించిన ఖలీఫా. హసన్ జిల్లా సరిహద్దులు హసన్ జిల్లాకు ఈశాన్యాన తుముకూరు జిల్లా, ఆగ్నేయం వైపు మాండ్య జిల్లా, దక్షిణం వైపు మైసూరు జిల్లా, నైఋతి వైపు కొడగుజిల్లా, పశ్చిమం వైపు దక్షిణ కన్నడ జిల్లా, వాయువ్యం వైపు చిగ్‌మగళూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.హసన్ జిల్లా విస్తీర్ణం ೬೮೧೪ చ.కి.మి. ఈ జిల్లా జనాభా 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ೧೭,೨೧,೩೧೯. ఇది 1991 జనాభా లెక్కల కంటే ೯.೬೬ శాతం హెచ్చు. భౌగోళిక ఉనికి హసన్ జిల్లాలో రెండు ముఖ్య భౌగోళిక భాగాలు ఉన్నాయి. మొదటిది మలనాడు పర్వత శ్రేణులు రెండవది పీఠభూమి భాగం. మలనాడు పర్వతశ్రేణులు పశ్చిమ కనుమలలో భాగం. ఈ జిల్లాలో ప్రముఖ నది హేమవతి ఈ నది కావేరి నదికి ఉపనది. పశ్చిమ కనుమల్లో భాగమైన మలనాడు కొండలలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవులలో అమిత జంతు-వృక్ష సంపద ఉంది. ఈ జిల్లాలో అనేక కాఫీ తోటలు ఉన్నాయి. మొట్ట మొదటి కాఫీ తోట ೧೮೪೩ సంవత్సరం వేయబడింది. పరిపాలన నిమిత్తం హసన్ జిల్లాను 8 తాలుకాలుగా విభజించారు. హసన్ అరసీకెరి చెన్నరాయపట్టణ హోళోనరసిపుర అరకలగూడు బేలూరు సకలేశ్‌పుర ఆలూరు దర్శించవలసిన ప్రదేశాలు హసన్ జిల్లాలో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రావణబెళగొళ. శ్రావణబెళగోళలో ೫೭ ఎత్తు ఉన్నగోమటేశ్వరుడి విగ్రహం ఏకశిలా విగ్రహాలలో అతిపెద్ద విగ్రహం.హళేబీడులో హోయ్సళేశ్వర దేవాలయం , బేలూరులో ఉన్న చెన్నకేశవ దేవాలయం హోయస్ల శిల్పకళాచాతుర్యానికి తార్కాణాలు. ప్రయాణ సౌకర్యాలు హసన్ నుండి కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరు, మైసూర్, తుముకూర్, షిమోగ, చిత్రదుర్గ పట్టణాల రైలుస్టేషన్లకు రైలు సౌకర్యం ఉంది. బయటి లింకులు హసన్ జిల్లా వెబ్ సైటు వర్గం:కర్ణాటక జిల్లాలు en:Hassan, India
దావణగెరె
https://te.wikipedia.org/wiki/దావణగెరె
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి. దావణగెరె పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,946,905. వీరిలో 32.31% నగరవాసులు. 1997లో దావణగెరె జిల్లా రూపొందించబడింది. సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా సరిహద్దు శివమొగ్గ , హవేరి తూర్పు సరిహద్దు చిత్రదుర్గ ఉత్తర సరిహద్దు బళ్ళారి దక్షిణ సరిహద్దు చికమగలూరు జిల్లా విభాగాలు విషయాలు వివరణలు తాలూకాలు 6 మండలాలు 24 హోబ్లీలు గ్రామపంచాయితీలు 230 గ్రామాలు 803 మానవ వివాస ప్రాంతాలు 1334 పురపాలకాలు 2 నగరపాలితాలు 1 .District formation The Official Website Of Zilla Panchayat, Davangere, Government of Karnataka. భౌగోళికం దావణగిరె జిల్లా దక్కన్ పీఠభూమి మైదానంలో (బయలు సీమె) ఉంది. జిల్లా రాష్ట్ర కేంద్రభాగంలో ఉంది. 13°5' నుండి 14°50' ఉత్తర అక్షాంశం , 75°30' నుండి 76°30' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లాలో పవనశక్తి అధికంగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయి. అది పవన విద్యుత్తు ఉత్పత్తికి సహకరిస్తుంది. జిల్లా వైశాల్యం 5926 చ.కి.మీ. ఆర్ధికం 2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి అని గుర్తించింది.బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న కర్ణాటక రాష్ట్ర దావణగెరె జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 1,946,905 ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. 241వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.71% స్త్రీ పురుష నిష్పత్తి. 967:1000 జాతియ సరాసరి (928) కంటే. అధికం అక్షరాస్యత శాతం. 76.3%. జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ మూలాలు వెలుపలి లింకులు బయటి లింకులు దావణగెరె జిల్లా పటము బ్రహ్మప్ప దేవేంద్రప్ప తవనప్పనవర్ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల బాపూజీ ఇంజనీరింగ్ , తాంత్రిక మహావిద్యాలయము వర్గం:కర్ణాటక వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు
బాగల్‌కోట్ జిల్లా
https://te.wikipedia.org/wiki/బాగల్‌కోట్_జిల్లా
భత్కల్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలోని 30 జిల్లాలలో ఒకటి. భత్కల్ (కన్నడం: ಭಟ್ಕಳ, ಭಟಕಳ ( కన్నడంలో భత్కళ), ప్రముఖ యాత్రీకుడు ఇబ్న్ బటుయా దీనిని " బాద్- ఉల్- క్విలాహ్" అని వర్ణించాడు. పోర్చిగీసు చారిత్రక రచనలలో బతేకల ఉత్తర కన్నడలోని నౌకాశ్రయ పట్టణాలలో ఒకటి. భత్కల పట్టణం ముంబయి- కొశ్చి రహదారి మార్గంలో ఉంది. భత్కల్ రైల్వే స్టేషను కొంకణి రైలు మార్గంలో ఉన్న ప్రధాన రైలు స్టేషనులలో ఒకటిగా గుర్తించబడుతుంది. భత్కల్‌సమీపంలో ఉన్న విమానాశ్రయం " మంగుళూరు విమానాశ్రయం " . చరిత్ర ప్రబల మొరొకాన్ యాత్రీకుడు ఇబ్న్ బటుయా (1307-1377), "బాద్- ఈ - క్విల్లాహ్ " భత్కల్ నవాథ్ ముస్లిం, జైనులు నివసించే అరేబియన్ సముద్రతీర పట్టణంగా వర్ణించబడింది. షరావతి నదీ తీరంలోని భత్కల్‌ను నవాథ్ పాలించాడని పేర్కొనబడింది. దేశచరిత్రలో భత్కల్‌కు ప్రాధాన్యత ఉంది. పలు సామ్రాజ్యాలు, చక్రవర్తుల ఉన్నత, పతనాలకు భత్కల్ సాక్ష్యంగా ఉంది. 1291 నుండి 1343 వరకు హొయశిల సామ్రాజ్యంలో భాగంగా ఉంది. హొయశిలల నుండి భత్కల విజయనగర పాలనలోకి మారింది. తరువాత భత్కల్ సులువ (జైన) పాలకుల ఆధీనంలోకి మారింది. సలైవా కాలంలో పలు ఆలయాలు, సత్రాలు నిర్మించబడ్డాయి. సలైవా కాలానికి చిహ్నాలుగా ఇప్పటికీ ముద్భత్కల్ వద్ద ఉన్న ఆలయాలు నిలిచి ఉన్నాయి. చోళా చక్రవర్తి మొదటి ఆదిత్యా ఆయన కుమారుడు మొదటి పరంతక, వారి వారసుడు సుందర చోళ (రెండవ పరంతక చోళుడు) (క్రీ.శ880-975) కన్నడ రాజ్యం మీద దండయాత్రచేసి మైసూర్ పీఠభూమిలోని గంగావాడి ప్రాంతాలను, సహ్యాద్రి పర్వతశ్రేణిలో ఉన్న భత్కల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. కన్నడ రాజ్యం మీద వారి విజయానికి చిహ్నంగా సోలేశ్వర ఆలయాన్ని నిర్మించారు. మొదటి పరంతక చోళుని నుండి మూడవ కులోత్తుంగ చోళునివరకు వారి సైనికాధికారులు " కొంకణ ప్రభువులు " అని ప్రశంశించినట్లు శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి.కొంకణ లోని సోలేశ్వరుని మీద భక్తిప్రపత్తులు ప్రదర్శించే శిలాశాసనం భత్కల్ వద్ద కూడా ఉంది. 16 వ శతాబ్దంలో పోర్చుగీసులు కూడా వారి చిహ్నాలను ఇక్కడ వదిలి వెళ్ళారు. కెలాడి పాలకుల నుండి భత్కల్ హైదర్ అలి, టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి మారింది. 1799లో టిప్పు సుల్తాన్ మరణం తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోకి మారింది. భౌగోళికం భత్కల్ జిల్లా 13.97 ఉత్తర అక్షాంశం, 74.57 తూర్పు రేఖాంశంలో ఉంది.Falling Rain Genomics, Inc - Bhatkal జిల్లా సుమారుగా సముద్రమట్టానికి 3 మీ. ఎత్తులో ఉంది. జనాభా 2011 గణాంకాలను అనుసరించి భత్కల్ జనసంఖ్య 49,730. వీరిలో స్త్రీ పుషులు సమానంగా ఉన్నారు. జిల్లా అక్షరాస్యత 83%.పురుషుల అక్షరాస్యత 88%. స్త్రీల అక్షరాస్యత 78%. 6 వయసుకు తక్కువగా ఉన్న బాలబాలికలు 14% ఉన్నారు. ఆర్థికం జిల్లా ఆర్థికంగా అత్యధికంగా పర్యాటక రంగం, చేపల పరిశ్రమ మీద ఆధారపడి ఉంది. రాజకీయాలు భత్కల్ అసెబ్లీ నియోజకవర్గంగా ఉంది. ఉగ్రవాదం భట్కల్ ఇటీవల తీవ్రవాదం పర్యాయపదంగా మారింది. పేదరికం బారిన పడిన ముస్లిం మతం సుకి మాక్డోం కాలనీ శివారు టెర్రర్ రియాజ్ అహ్మద్ సయీద్, ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద యాసిన్ భత్కల్ (అహ్మద్) తీవ్రవాద అనుమానితులుగా గుర్తించబడ్డారు. బెంగుళూర్ పోలీసులు భట్కల్ లోని ఒక నివాసం జర్పిన ఒక తీవ్రవాద దాడిలో, భట్కల్ 3 స్థానికులు కాక్స్ టౌన్, బెంగుళూర్ ఉగ్రవాద కార్యకలాపాలకు అరెస్టు చేశారు. దాడి సమయంలో, పోలీసు అమ్మోనియం నైట్రేట్ 5 కి.లో జెలటిన్ జెల్ 3 కిలోల, 10 విద్యుత్ సర్క్యూటులను, 3-4 టైమర్లు, కమ్యూనికేషన్ పరికరాలు పట్టుబడ్డాయి. . పర్యాటక, వంటకాలు చన్నపట్టణ హనుమంతుడు చన్నపట్టణ హనుమాన్ ఆలయం భత్కల్ పట్టణం మద్యలో ఉంది. ఆలయ ప్రధానదైవానికి వార్షికంగా రథోత్సవం నిర్వహించబడుతుంది. ముస్లిం సుభాందారి కుటుంబం నుండి ఈ ఉత్సవ నిర్వహణకు అనుమతి తీసుకుని ఉత్సవం నిర్వహించబడుతుంది. ఉత్సవ సమయంలో ఆలయ నిర్వాహం, సుభాందారి కుటుంబం మద్య తీపివంటకాల పరిమార్పిడి జరుగుతుంది. పురాతన కథనం అనుసరించి ఒకదారి ఆలయ రథం విరిగిందని దానిని మరమ్మత్తు చేయడానికి హిందువుల వద్ద తగిన ధనం లేదని ఆసమయంలో రథం మరమ్మత్తులకు సుభాందారి కుటుంబం ధనసహాయం చేసిందని వివరిస్తున్నాయి. అప్పటి నుండి సుభాందారి కుటుంబం నుండి అనుమతి తీసుకుని రథోత్సవం నిర్వహించే సంప్రదాయం ఏర్పాటైంది. కొంజి సంవత్సరాల ముందు యువత హిందూ ఉత్సవనిర్వహణకు ముస్లిం అనుమతి తీసుకోవడానికి అభ్యతరం తెలిపారు. ఆ సంవత్సరం అనుమతి తీసుకోకుండా రథోత్సవం నిర్వహించబడింది. అయినప్పటికీ రథం కచ్చితంగా సుభాందారి కుటుంబం ఇంటి ముందు విరిగింది. అప్పటి నుండి మరెవరూ రథోత్సవానికి సుభాందారి కుటుంబం అనుమతి తీసుకోవడానికి అభ్యంతరపెట్ట లేదు. దారుల్ ఖురాన్ దారుల్ ఖురాన్ (ఖురాన్ గృహం) మౌలానా అబ్దుల్ అలి నద్వి అకాడమీ (భత్కల్) ఉంది. ఇది 2004లో స్థాపించబడింది. మ్యూజియంలో 55 దేశీయ, అంతర్జాతీయ భాషలకు చెందిన వెలకట్టలేని అరుదైన ఖరాన్ అనువాద ప్రతులు భద్రపరచబడి ఉన్నాయి. వీటిలో 1000 సంవత్సరాల పురాతనమైన ఖురాన్ ఒకటి. భత్కల్ పర్యాటక గమ్యంగా కూడా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా మురుడేశ్వరాలయంలోని శివుని శిల్పం, బసాదీలు, సముద్రతీరాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. భత్కల్ పట్టణానికి 100 కి.మీ దూరంలో ఉన్న జోగ్ జలపాతం అధికసంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఆహారసంస్కృతి జిల్లాలో పలు సంప్రదాయాలు ఉన్నందున పలు సంప్రదాయ ఆహారాలు కూడా జిల్లాలో వాడుకలో ఉన్నాయి. భత్కలి బిర్యాని జిల్లాలోని ప్రబల ఆహారాలలో ఒకటి. భత్కల్ పట్టణం జాతీయరహదారి 17 సమీపంలో ఉంది. సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా దక్షిణ సరిహద్దు మంగుళూరు జిల్లా ఉత్తర సరిహద్దు హొన్నువర్, కుంత, జిల్లా కేంద్రం కరవార్ కొంకణి రైలు మార్గంలో భత్కల్ రైల్వే స్టేషను ఉంది. నేత్రావ్ని గుండి బైలాజికల్, మేరిన్ స్పెసీస్ లకు ప్రసిద్ధి చెంది ఉంది. జిల్లాలో పలు ఆలయాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి. 'సముద్రతీరాలు:' 'జాలీ బీచ్, బందరు బీచ్, హడిన్ బీచ్, ముందల్లి బీచ్, బెల్కె బీచ్'. 'నెథ్రవని గుండి (6-9 కి.మీ) :' 'దీవులు' '. హిల్ స్టేషను : మరుకెరె, హదవల్లి (4-8 కి.మీ). వాటర్ జలపాతం : (4-5 కి.మీ) కన్నిగుంది జలపాతం, మహాత్మా గాంధీ జలపాతం. లైట్ హౌస్: బందర్ ( 4-5 కి.మీ) . ఆనకట్ట :' కద్వింకత్తు ఆనకట్ట ' ( 4-5 కి.మీ ). ఆలయాలు:' 'ముర్దెష్వర ఆలయం, మరికంబ ఆలయం, అల్వెకొది శ్రీ దుర్గ పరమెష్వరి ఆలయం, శొదిగదె ఆలయం, ఖద్వింకత్తు ఆలయం. 'మసీదు:' 'జామియా మసీద్ (చెన్నన్ పాలి / గోల్డ్ మసీదు) సుల్తాన్ మసీదు (నిజానికి ఇది టిప్పు సుల్తాన్ బిల్డ్), మసీదు-ఇ-మిలి, ముష్మ మసీదు' 'హోటల్స్:' కవలితి హోటల్, శ్రీనివాస డీలక్స్, హొతెల్ సిటి లైట్స్, మిరప హోటల్, టిఎఫ్సి హోటల్. విద్యా సంస్థలు అంజుమన్ నర్సరీ, ప్రాథమిక పాఠశాల అంజుమన్ ఆజాద్ ప్రాథమిక పాఠశాల అంజుమన్ నూర్ ప్రాథమిక పాఠశాల అంజుమన్ బాయ్స్ ఉన్నత పాఠశాల అంజుమన్ గర్ల్స్ ఉన్నత పాఠశాల అంజుమన్ గర్ల్స్ ఉన్నత పాఠశాల, నవయాథ్ కాలనీ అంజుమన్ ఆర్ట్స్, విజ్ఞాన శాస్త్రం, కామర్స్ కళాశాల అంజుమన్ డిగ్రీ కళాశాల, P.G. సెంటర్ మహిళల * అంజుమన్ ప్రీ యూనివర్సిటీ కాలేజ్ మహిళల * అంజుమన్ కాలేజ్ అంజుమన్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ * అంజుమన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అంజుమన్ ఇన్స్టిట్యూట్ అంజుమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, భట్కల్ ఇస్లామియా ఆంగ్లో ఉర్దూ ఉన్నత పాఠశాల ఇఖ్రా బాయ్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల (ముర్దేశ్వర్) ఇఖ్రా అమ్మాయిలు ఆంగ్ల మీడియం ఉన్నత పాఠశాల (ముర్దేశ్వర్) నూతన ఆంగ్ల ప్రీ-యూనివర్శిటీ కళాశాల శ్రీ గురు సుధీంద్ర కాలేజ్ శ్రీ గురు సుధీంద్ర బి.బి.ఎ. &బి.సి.ఎ.కాలేజ్ శ్రీ ఙానేశ్వరి కాలేజ్ (బి.ఇ.డి) ఎడ్యుకేషన్ శ్రీ ఙానేశ్వరి కాలేజ్ (ఎమ్) ఎడ్యుకేషన్ శ్రీ దుర్గాపరమేశ్వరి ఉన్నత పాఠశాల అల్వెకొడి హెచ్.హెచ్. ఎడ్యుకేషన్ స్వామి పరిఙానాశ్రమం కాలేజ్ (డి.ఇ.డి) విద్యాంజలి పబ్లిక్ పాఠశాల (సి.ఐ.సి.ఎస్.ఇ సిలబస్) (భట్కల్) విద్యాభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల (భట్కల్) ఆనంద్ ఆశ్రమం కాన్వెంట్ ఉన్నత పాఠశాల (భట్కల్) ఆనంద్ ఆశ్రమం కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాల జత్న విద్యాలయ కన్నడ పాఠశాల (ముర్దేశ్వర్) కరవలి ఉన్నత పాఠశాల హౌస్ ఆఫ్ రోమియో జుజె ద్సౌజ (బలిలూర్) ఆర్.ఎన్. శెట్టి రూరల్ పాలిటెక్నిక్ (ముర్దేశ్వర్) ఆర్.ఎన్ శెట్టి ప్రీ యునివర్సిటీ కోల్లెజ్, ముర్దేశ్వర్ ఆర్.ఎన్ శెట్టి నర్సింగ్ కోల్లెజ్ (ముర్దేశ్వర్) జనతా విద్యాలయ ఉన్నత పాఠశాల (ముర్దేశ్వర్) విశ్వభారతి ఉన్నత పాఠశాల (బెంగ్రె) జామియా ఇస్లామియా (భట్కల్) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ముత్తలి భట్కల్) ఇఖ్రా ఇంగ్లీష్ నర్సరీ, ప్రాథమిక పాఠశాల (ముర్దేశ్వర్) జామియా ముక్తబ్ జంగి గర్ల్స్ ఉన్నత పాఠశాల నూతన ఆంగ్ల పాఠశాల కొత్త మోడల్ ఉర్దూ పాఠశాల, నేషనల్ కాలనీ (ముర్దేశ్వర్ ) మోడల్ బాయ్స్ ఉర్దూ పాఠశాల, మోడల్ గర్ల్స్ ఉర్దూ పాఠశాల, నేషనల్ బాలికల ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, ముర్దేశ్వర్ నేషనల్ బాయ్స్ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, ముర్దేశ్వర్ నేషనల్ అమ్మాయిలు ఆంగ్ల మీడియం ఉన్నత పాఠశాల, ముర్దేశ్వర్ నేషనల్ బాయ్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల, ముర్దేశ్వర్ జాయ్ల్యాండ్ ఆనంద్ ఆశ్రమం హోం ప్లే నౌనిహాల్ సెంట్రల్ పాఠశాల నౌనిహాల్ కాలనీ పాఠశాల కౌసర్ వుమెన్ కాలేజ్ జమియాటస్ శాలిహట్ నేషనల్ నర్సరీ, ప్రాథమిక పాఠశాల, ముర్దేశ్వర్ విమెన్, ముర్దేశ్వర్ జాతీయ ప్రీ యూనివర్సిటీ కాలేజ్ షామ్స్ నర్సరీ, ప్రాథమిక పాఠశాల షామ్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ఆలీ పబ్లిక్ పాఠశాల బయటి లింకులు Bhatkal Town Municipal Council Bhatkal Town Classified All About Bhatkal Town Anjuman Institute of Technology and Management News, Audio and Photos from Bhatkal Bhatkal news Website మూలాలు బాగల్‌కోట్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలోని ఒక ముఖ్య జిల్లా. జిల్లా కేంద్రము బాగల్‌కోట్ పట్టణం. ఇది ఉత్తర కర్ణాటక ప్రాంతములోని ఒక ముఖ్య ప్రాంతము. పరిపాలనా విభాగాలు thumb|320px|బాగల్‌కోట్ జిల్లా పటము చిత్రమాలిక వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు
బెంగళూరు అర్బన్ జిల్లా
https://te.wikipedia.org/wiki/బెంగళూరు_అర్బన్_జిల్లా
కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో బెంగుళూరు జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 6,537,124 of which 88.11%..2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 9,588,910. 2001 గణాంకాలను అనుసరించి జనసాంధ్రత 4,378. (చ.కి.మీ). స్త్రీ పురుష నిష్పత్తి 908:1000 సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా పశ్చిమ సరిహద్దు బెంగుళూరు గ్రామీణ తూర్పు , ఉత్తర సరిహద్దు క్రిష్ణగిరి జిల్లా తమిళనాడు బెంగుళూరు నగర జిల్లా 1986లో రూపొందించబడింది. బెంగుళూరు జిల్లాను విభజించి బెంగుళూరు నగర , బెంగుళూరు గ్రామీణ జిల్లాలుగా రూపొందించారు. బెంగుళూరు నగర జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి. బెంగుళూరు తూర్పు, బెంగుళూరు దక్షిణ, బెంగుళూరు ఉత్తర , అనెకల్. విభాగాల వివరణ విషయాలు వివరణలు నగరం బెంగుళూరు (కర్నాటక రాష్ట్ర రాజధాని) పురపాలకాలు 9 మండలాలు (హొబి) 17 గ్రామాలు 668 బెంగుళూరు జిల్లాలో భరతదేశానికి గర్వకారణమైన ఎలెక్ట్రానిక్ నగరంజ్ , ఐ.టి సంస్థలు అనెకల్ తాలూకాలో ఉన్నాయి. వాతావరణం విషయ వివరణ వాతావరణ వివరణ వాతావరణ విధానం ఆహ్లాదకరం వేసవి మితమైన వేడి వర్షాకాలం శీతాకాలం మితమైన చలి గరిష్ఠ ఉష్ణోగ్రత 18 ° సెల్షియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత 16 ° సెల్షియస్ వర్షపాతం మి.మీ 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 9,588,910, ఇది దాదాపు. బెలారశ్ దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. నార్త్ కరోలినా నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. 3 వ స్థానంలో ఉంది.. 1చ.కి.మీ జనసాంద్రత. 4378 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 46.68%. స్త్రీ పురుష నిష్పత్తి. 908:1000 జాతియ సరాసరి (928) కంటే. తక్కువ అక్షరాస్యత శాతం. 88.48%. జాతియ సరాసరి (72%) కంటే. భాషలు 71% of population speak kannada. Remaining population speak తమిళం, Bengali English, Hindi, తెలుగు, Malayalam, Oriya and ఉర్దూ. ఆలయాలు గవి గంగాధరేశ్వర ఆలయం. మూలాలు External links Official website of Bangalore Urban District వర్గం:1986 స్థాపితాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:కర్ణాటక వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:కర్ణాటక నగరాలు, పట్టణాలు
బెంగళూరు గ్రామీణ జిల్లా
https://te.wikipedia.org/wiki/బెంగళూరు_గ్రామీణ_జిల్లా
కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో బెంగుళూరు గ్రామీణ జిల్లా ఒకటి. 1986లో బెంగుళూరు జిల్లాను విభజించి బెంగుళూరు జిల్లా, బెంగుళూరు గ్రామీణ జిల్లా రూపొందించబడ్డాయి. రాష్ట్ర రాజధాని బెంగుళూరుకు సమీపంలో ఉన్న కారణంగా ఇక్కడి నుండి బెంగుళూరుకు ఉద్యోగులు దినసరి రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధానంగా జీవనోపాధి కలిగిస్తున్నా సెజ్ స్థాపన తతువాత ఐ.టి రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. బెంగుళూరు గ్రామీణ జిల్లా సమీపంలో ముద్దెనహళ్ళి, కనివెనారాయణపురం, సత్యసాయిబాబా విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ మెడిసిన్, ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ముద్దెనహళ్ళి), విశ్వేశ్వర ఇంస్టిట్యూట్ ఆఫ్ ఆద్వాంస్డ్ టెక్నాలజీ (చిక్కబల్లపూర్), విద్యాసంస్థలు, సిల్క్ సిటీ ఉన్నాయి. 2011 గణాంకాలను అనుసరించి కర్నాటక రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా బెంగుళూరు గ్రామీణజిల్లా అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.http://www.deccanherald.com/content/31009/silk-city-come-up-near.html బెంగుళూరు ఇంటర్నేషనల్ సమీపంలో దేవనహళ్ళిలో దేవనహళ్ళి బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయబడి ఉంది. .http://www.thehindubusinessline.com/2009/09/05/stories/2009090551001700.htm2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,881,514. నగరప్రాంతం 21.65%. జనసాంధ్రత 309.చ. కి.మీ. జిల్లాలో షెడ్యూల్డ్ కుల్లాలు, షెడ్యూల్డ్ జాతుల ప్రజలు 22.5%. జిల్లాలో ప్రధానంగా హిందువులు అధికంగా ఉన్నారు. బెంగుళూరు గ్రామీణ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన జిల్లా అయినప్పటికీ జిల్లాలో డెయిరీ పరిశ్రమల అభివృద్ధి, సెరికల్చర్ వంటి పరిశ్రమలఅభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. విభాగాలు there are 2 divisions, 4 Talukas, 35 Hoblis (cluster of villages), 1,713 inhabited and 177 uninhabited villages, 9 towns, and 229 Gram Panchayats వ్యవసాయం జిల్లా వ్యవసాయ ప్రాధాన్యత కలిగి ఉంది. రాగి, వరి, వేరుచనగ, చెరకు, ఆముదం గింజలు, ద్రాక్ష, మల్బరి మొదలైన హార్టీ కల్చర్ పంటలు పండించబడుతున్నాయి. జిల్లాలో బ్యాంకింగ్, రవాణా, సమాచారసేవలు, క్రెడిట్, మార్కెటింగ్ మొదలైన మౌలిక సదుపాయాలు తగినంతగా ఉన్నాయి. జిల్లాలో ఖనిజసంపద, నాన్మినరల్ ఖనిజాలు ఇటుకల తయారీ, టైల్స్ తయారీ,, రాతి పాత్రల తయారీలో ఉపయోగ పడుతున్నాయి. అనేక సంవత్సరాలుగా నేత పరిశ్రమ జిల్లాలో అధికంగా ప్రజలకు ఉపాధిని ఇస్తుంది. మట్టి, వాతావరణం మలబరీ పంట, పట్టుదారాల ఉత్పత్తి,, పట్టు ఉత్పత్తి, ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అనుకూలిస్తున్నాయి. జిల్లాలో అనేక ద్రాక్షతోటలు, వైన్ తయారీ పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. బెంగుళూరు గ్రామీణ జిల్లాను కంపగౌడా జిల్లాగా మార్చాలని కర్నాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. 2007లో రామనగరం జిల్లా నుండి కనకపురా, రామనగరం, మగడి, చన్నపట్న తాలూకాలు జిల్లాలో విలీనం చెయ్యబడ్డాయి. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 2001-11 కుటుంబనియంత్రణ శాతం. స్త్రీ పురుష నిష్పత్తి. జాతియ సరాసరి (928) కంటే. అక్షరాస్యత శాతం. జాతియ సరాసరి (72%) కంటే. According to the 2011 census Bengaluru Rural district has a population of 987,257, roughly equal to the nation of Fiji or the US state of Montana. This gives it a ranking of 449th in India (out of a total of 640). The district has a population density of . Its population growth rate over the decade 2001-2011 was 16.02%. Bengaluru Rural has a sex ratio of 945 females for every 1000 males, and a literacy rate of 78.29%. మూలాలు వెలుపలి లింకులు వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:బెంగుళూరు గ్రామీణ జిల్లా వర్గం:1986 స్థాపితాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు
చామరాజనగర్ జిల్లా
https://te.wikipedia.org/wiki/చామరాజనగర్_జిల్లా
చామరాజనగర్ (కన్నడం:ಚಾಮರಾಜನಗರ) కర్నాటకా రాష్ట్రంలో దక్షిణభాగంలో ఉంది. కర్ణాటకారాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న మైసూరు జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి 1998లో చామరాజనగర్ జిల్లాగా ఏర్పాటుచేసారు. జిల్లాకు ప్రధాననగరంగా చామరాజనగర్ ఉంది. కర్నాటకారాష్ట్రంలోని 30 జిల్లాలలో చామరాజనగర్ జిల్లా జనసాంద్రతలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో కొడుగు, బెంగుళూరు గ్రామీణ జిల్లా జిల్లాలు ఉన్నాయి. . చరిత్ర చామరాజనగర్ ఒకప్పుడు అరికోత్తర అని పిఉవబడుతుండేది. మైసూరును పాలించిన రాజైన చామరాజ ఉడయార్ ఇక్కడ జన్మించిన తరువాత ఈ ప్రదేశానికి చామరాజనగర్ అని నామకరణం చేయబడింది. ఇక్కడ హొయశిల రాజైన గంగరాజా వద్ద రాజప్రతినిధి పునిసదండనాయక సా.శ. 1117 లో " ది విజయ అర్స్వనాథ్ బసాడి " అనే జైన ఆలయం నిర్మించాడు. . భౌగోళికం కర్నాటక రాష్ట్రం దక్షిణభాగంలో ఉన్న చామరాజనగర్ జిల్లా సరిహద్దులలో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లాకు వాయవ్యసరిహద్దులో మైసూరు జిల్లా, ఉత్తరసరిహద్దులో మండ్య, ఈశాన్యసరిహద్దులో బెంగుళూరు జిల్లాలు ఉన్నాయి. తూర్పుసరిహద్దులో తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా, సేలం జిల్లా, ఈరోడ్ జిల్లా, నీలిగిరి జిల్లాలు ఉన్నాయి. ఆగ్నేయంలో వేల్యాండు జిల్లాలు ఉన్నాయి. కర్నాటక రాష్ట్రంలోని జాతీయరహదారి 209 బెంగుళూరు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ వద్ద జాతీయరహదారి 7 తో అనుసంధానించబడి ఉంది. జాతీయరహదారి 7 కర్నాటక సరిహద్దులో పడమర కనుమల వద్ద పంజూరు వద్ద ముగుస్తుంది. జిల్లాలోని అత్యధిఅభాగం నీలగిరి పర్వతాల దిగువభూములు ఆక్రమించి ఉన్నాయి. ఇవి వర్షాధార మైదానాలుగా అరణ్యాలు, కొండలతో నిండి ఉన్నాయి. గణాంకాలు 2011 గణాంకాలను అనుసరించి చామరాజనగర్ జిల్లా జనసంఖ్య 1,020,962. ఇది దాదాపు సైప్రస్ దేశానికి సమానంగా ఉంది. అలాగే యు.ఎస్ రాష్ట్రాలలోని మాంటనా రాష్టానికి సమానం. 640 భారతీయ జిల్లాలలో ఇది 441వ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 200. .2001-2011 కుటునబనియంత్రణ శాతం 5.75%. చామరాజనగర్ స్త్రీపురుష నిష్పత్తి 989:1000., అలాగే అక్షరాస్యత శాతం 61.12%. అటవీప్రాంతం అత్యధికంగా ఉన్న జిల్లా అయినందున జిల్లాలో అత్యధికస్థాయిలో గిరిజనులు నివసిస్తున్నారు. వారిలో " సోలిగా, యరావా, జెనుకుర్బా, బెట్ట కుర్బాలు జాతి వారు ప్రధానులుగా పరిగణిచబడుతున్నారు. ఈ జాతి ప్రజల సంఖ్య మొత్తం 82,000. ఈ ప్రజలకు వారి ప్రత్యేక భాష ఉంటుంది. ఇతర సమాచారం జిల్లాలోని దక్షిణప్రాంతం అధికంగా దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాలు గంధపు చెట్ల అక్రమరవాణా, బందిపోటు వీరప్పన్‌కు ఆశ్రయం అయ్యాయి. వీరప్పన్ 100 కంటే అధికమైన పోలీసుల మరణానికి హేతువు కారణమయ్యాడు. వీరప్పన్ ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న " స్పెషల్ టస్క్ ఫోర్స్ " చేతిలో 2004 అక్టోబరు18 న తమిళనాడుకు చెందిన ధర్మపురి జిల్లాలో ఎంకౌంటర్‌లో హతుడయ్యాడు. విరప్పన్ దాదాపు 2 దశాబ్ధాల కాలం పరారి జీవితం గడిపాడు. వీరప్పన్ నల్లరాతి అక్రమరవాణా చేసి అటవీ శాఖను హడకెత్తించాడు. . మూలాలు వెలుపలి లింకులు :వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:కర్ణాటక వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు
చిక్కమగళూరు జిల్లా
https://te.wikipedia.org/wiki/చిక్కమగళూరు_జిల్లా
చిక్‌మగళూరు : (ఆంగ్లం: Chikkamagaluru కన్నడ:ಚಿಕ್ಕಮಗಳೂರು) భారతదేశం లోని కర్ణాటక) రాష్ట్రం లోని ఒక జిల్లా, పట్టణం. భారతదేశం లోనే మొట్టమొదటిగా చిక్‌మగళూరులో కాఫీ తోటలు పెంచబడ్డాయి. చిక్‌మగళూరు జిల్లాలో ఉన్న పశ్చిమ కనుమల పర్వతశ్రేణులలో తుంగ, భద్ర నదులు పుడుతున్నాయి. ఈ జిల్లాలోనే ఉన్న ముల్లాయనగిరి పర్వత శ్రేణులు కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి, కుద్రేముఖ్ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకుల నేత్రాలకు విందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం ఈ జిల్లాలో ఉన్న శృంగేరిలో ఉంది. ఆ తరువాతి కాలంలో భారతీ కృష్ణ తీర్థ స్వామిచే తన ముందు పీఠాధిపతి అయిన విద్యాశంకర స్వామి స్మారక నిమిత్తం నిర్మించబడిన విద్యాశంకర దేవాలయం కూడా శృంగేరిలో ఉంది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు అమృతపురలో నిర్మించిన హొయసల దేవాలయం ఈ జిల్లాలోనే ఉంది. వన్యప్రాణి సంరక్షణ మీద ఆసక్తి ఉన్నవారు ఈ జిల్లాలో ఉన్న కుద్రేముఖ్ జాతీయ వనం, భద్ర అభయారణ్యం దర్శించి తీరవలసిందే. జిల్లా పేరు వెనుక కథ జిల్లాకి చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వచ్చింది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాషలో చిన్న కూతురు ఊరు అని అర్థం (చిక్క=చిన్న, మగళు=కూతురు, ఊరు=ఊరు). సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతారు.చిక్‌మగళూరు పేరు వెనుక ఉన్న కథను చిక్‌మగళూరు జిల్లా వెబ్‍సైటు లో వివరించారు . రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీద చిక్‌మగళూరుకు 5 కి.మీ దూరంలో హిరెమగళూరు ఉన్నది (హిరె=పెద్ద మగళూరు కూతురు ఊరు.) జిల్లా చరిత్ర thumb|left|200px|ఎకకుంట, అమృతేశ్వర దేవాలయం,1196, అమృత‌పుర హొయసల రాజులు తమ సామ్రాజ్య విస్తరణ జరపడానికి పూర్వం ఇక్కడే గడిపారు. ఇతిహాసం ప్రకారం హొయసల రాజవంశాన్ని స్థాపించిన శాల తన జైన గురువు శుదత్త అనుజ్ఞతో ఈ జిల్లాలో సొసివురు (ఇప్పటి ముడిగిరి తాలుకా లోని అంగడి గ్రామం) లోని ససంతిక దేవి గుడిలో పులిని చంపాడని చెబుతారు. ప్రాచీన కన్నడలో హొయ=విసరడం, హొయసల అంటే శాల చేత విసరబడడం.Angadi village in Chikkamagaluru district, where it is believed that king Sala, founder of Hoysala dynasty killed the tiger, will be made a major tourist destination, reports the . ఈ కథ మీద కొన్ని అనుమానాలు కూడా లేక పోలేదు.C. Hayavadhana Rao, J. D. M. Derrett, B. R Joshi call the Sala story a legend, . హొయసల రాజులలో ప్రముఖుడైన రెండవ వీర బల్లాల (1173-1220) తరికెరి తాలుకాలో అమృతపురలో అమృతేశ్వర దేవాలయాన్ని నిర్మించాడని చెబుతారు. 1670 సంవత్సరంలో చిక్‌మగళూరు జిల్లాలోని బాబు బుడాన్‌ గిరి కొండల పై భారతదేశం లోనే మెట్ట మెదటి సారిగా కాఫీ తోటలు పెంచారు. కాఫీ పెంపకం గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం బాబా బుడాన్ (బాబా బుర్హాన్ లేదా దాదా హయాత్ కలందర్) మక్కా యాత్రకు వెళుతూ యెమెన్‌ దేశం లోని మొఛా నౌకాశ్రయం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు మెదటిసారి కాఫీని రుచి చూశాడు. కాఫీ రుచిని భారత దేశానికి అందించే ప్రయత్నంలో ఏడు కాఫీ గింజలు తనతోబాటు అరబ్‌ దేశాల నుండి తీసుకొని వచ్చాడు. బాబా బుడాన్ భారతదేశానికి తిరిగి వచ్చాక చిక్‌మగళూరులో ఈ గింజలు పాతాడు. బాబా బుడాన్ పై గౌరవానికి గుర్తుగా ఈ కొండలను బాబా బుడాన్ (బాబా బుర్హాన్) కొండలని పిలుస్తారు. 1978 సంవత్సరం భారత పార్లమెంటు లోక్‌ సభ ఎన్నికలలో భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చిక్‌మగళూరు నుండి పోటీ చేసి గెలుపొందారు. భౌగోళిక స్వరూపం thumb|180px|right|ప్రస్ఫుటంగా కనిపిస్తున్న భాగం కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరు జిల్లాను సూచిస్తోంది చిక్‌మగళూరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి 251 కి.మీ దూరంలో బాబా బుడన్‌ కొండల మధ్య అభయారణ్యాల మధ్య ఉంది. ఈ జిల్లా 75° 04´ 46´´ - 76° 21´ 50´´ తూర్పు రేఖాంశాల మధ్య 12° 54´ 42´´ and 13° 53´ 53´´ ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. జిల్లా తూర్పు నుండి పశ్చిమానికి పొడవు 138.4 కి.మీ., ఉత్తరం నుండి దక్షిణానికి పొడవు 88.5 కి.మీ. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యున్నత పర్వత శిఖరం ముల్లాయనగిరి కొండలు సముద్రమట్టానికి 1926 మీటర్ల ఎత్తులో ఉంది.జిల్లా సగటు వర్షపాతం 1925 మి.మీ.ఈ జిల్లా 30% (2108.62 km²) అరణ్యాలతో నిండి ఉంది.Geographical details of Chikkamagaluru district are discussed by . ఈ జిల్లాకు ఉత్తరాన షిమోగా, ఈశాన్యాన దావణగెరె, తూర్పున చిత్రదుర్గ, తుమకూరు, దక్షిణాన హాసన్, నైఋతి దిక్కున దక్షిణ కన్నడ, పశ్చిమాన ఉడిపి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ జిల్లాలో భద్ర, తుంగ, హేమవతి, నేత్రావతి, వేదవతి నదులు సంవత్సరం పొడవునా ప్రవహిస్తుంటాయి. ఈ జిల్లాలో ఇనుము, మాంగనైటు, గ్రానైటు గనులు ఉన్నాయి. బాబా బుడాన్ కొండ ప్రాంతం నల్లరేగడి భూములు ఉండగా, జిల్లా దక్షిణ భాగంలో ఎర్ర మట్టి నేలలు ఉన్నాయి. రవాణా వ్యవస్థ రోడ్డు సౌకర్యం చిక్‌మగళూరు జిల్లాలో రహదారుల అభివృద్ధి, నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది.The damage to roads in the district, including State highways and municipal roads is unprecedented reports the Deplorable condition of Chickmagalur roads and money being released to address the issue is reported by . దీన స్థితిలో ఉన్న రోడ్లు మార్గాలు, రైలు సౌకర్యం లేకపోవడం వల్ల జిల్లాలోని కొన్ని గ్రామాలు అభివృద్ధి చెందలేదు.In absence of good rail network, the roads play an important part for the industrial development. However, most of the roads in Chikkamagaluru district needs proper maintenance. Report by . జిల్లాలో మొత్తం రోడ్ల పొడవు 7264 కి.మీ. ఈ జిల్లా భూభాగంపై రెండు జాతీయ రహదార్లు వెళుతున్నాయి. మంగళూరు-షోలాపూర్ జాతీయ రహదారి-13 శృంగేరి కొప్ప పట్టణాల మీదుగా వెళుతుంది. బెంగళూరు-హొన్నవర జాతీయ రహదారి 206 కడూరు, బీరూరు, తరికెరి మీదుగా పోతుంది. రాష్ట్ర రహదార్లు శృంగేరి-హసన్, తరికెరి-బేలూరు, కడూరు-మంగళూరు అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో భాగంగా చిక్‌మగళూరు రహదార్లు అభివృద్ధి చెందుతాయనే ఆశ ఉంది.Plans to upgrade some roads in Chikkamagaluru district is presented by . రైలుమార్గం కడూరు, తరికెరి తాలుకాల మీదుగా రైలు మార్గం ఉంది. జిల్లాలో రైలు మార్గం పొడవు 91 కి.మీ (51 కి.మీ కడూరు తాలూకా, 40 కి.మీ తరికెరి తాలూకా). బీరూరు రైలుస్టేషన్ ఒక పెద్ద జంక్షన్‌. బెంగళూరు నుండి వచ్చే రైలు మార్గం ఇక్కడే (బీరూర్) విభజించబడి ఒక మార్గం షిమోగాకు మరోమార్గం హుబ్లికి వెళ్తుంది. జిల్లా రాజధాని చిక్‍మగళూరుకి రైలు సౌకర్యం లేదు. క్రొత్తగా ప్రణాళికలో ఉన్న కడూరు - సక్లేష్‌పుర రైలు మార్గ నిర్మాణం జరిగితే చిక్‌మగళూరుకి మిగతా కర్ణాటక పట్టణాలతో రైలు మార్గం ద్వారా కలిసే అవకాశం ఉంటుంది.Isolation of Chikkamagaluru city from the rest of the state because of it not having a railway station and plans to correct this is discussed in . విమాన సౌకర్యాలు చిక్‌మగళూరు జిల్లాకు విమానాశ్రయం లేదు. దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు మంగళూరు, బెంగళూరు, హుబ్లి. చిక్‌మగళూరుకి 10 కి.మీ. దూరంలో ఉన్న మార్లే గ్రామంలో విమానాశ్రయం నిర్మించాలనే ఒక ప్రణాళిక ఉంది.Proposal to construct an airport in Chikkamagaluru district is discussed by . విద్యా రంగం 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం చిక్‌మగళూరు జిల్లా అక్షరాస్యత శాతం 72.63; ఇందు పురుషుల అక్షరాస్యత 80.68, స్త్రీల అక్షరాస్యత 64.48% కర్ణాటక రాష్ట్ర అక్షరాస్యతతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. చిక్‌మగళూరు జిల్లాలో శృంగేరి తాలూకా 80.78% అక్షరాస్యతతో మెదటి స్థానంలో ఉంటే, కడూరు తాలూకా 68.33%తో చివరి స్థానంలో ఉంది. ప్రాథమిక-ప్రాథమికోన్నత విద్య 2001 సంవత్సర లెక్కల ప్రకారం చిక్‌మగళూరు జిల్లాలో 1,51,923 మంది విద్యార్థులతో 1,620 ప్రాథమిక పాఠశాలలు, 34,607 మంది విద్యార్థులతో 235 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి.Statistics related to schools in చిక్‌మగళూరు జిల్లా are discussed by . ప్రాథమిక పాఠశాలల విషయంలో 414 ప్రాథమిక పాఠశాలలతో (42,774 విద్యార్థులు) చిక్‌మగళూరు తాలూకా మెదటి స్థానంలో నిలిస్తే, శృంగేరి తాలూకా 80 ప్రాథమిక పాఠశాలల (5,822 విద్యార్థులు) తో చిక్‌మగళూరు జిల్లాలో చివరిస్థానంలోఉన్నది. ప్రాథమికోన్నత పాఠశాలల విషయానికి వస్తే కడూరు తాలూకా 74 ప్రాథమికోన్నత పాఠశాలలతో (9,990 విద్యార్థులు) మెదటి స్థానంలో ఉంటే, శృంగేరి తాలూకా 9 ప్రాథమికోన్నత పాఠశాలలతో (1,492 విద్యార్థులు) జిల్లాలో చివరి స్థానంలో ఉంది. ఉన్నత విద్య చిక్‌మగళూరు జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 46 కళాశాలలు (4,711 విద్యార్థులతో) ఉన్నత విద్య అందిస్తున్నాయి.. కడూరు తాలుకాలో 12 ఉన్నత విద్యా పాఠశాల-కళాశాలలు (1,324 విద్యార్థులు) ఉండగా, శృంగేరి తాలుకాలో 160 విద్యార్థులతో 2 ఉన్నత విద్యా పాఠశాల-కళాశాలు మాత్రమే ఉన్నాయి. పట్టభద్ర విద్య 2001 లెక్కల ప్రకారం 4,615 విద్యార్థులతో 13 పట్టభద్ర కళాశాలు డిగ్రీ విద్య అందిస్తున్నాయి.. చిక్‌మగళూరు తాలూకాలో 4 పట్టభద్ర కళాశాలు ఉండగా, కొప్ప, ముడిగిరె, నరసింహరాజపుర, తాలూకాలలో ఒక్కొక్క పట్టభద్ర కళాశాల ఉంది. సాంకేతిక విద్య ఇంజనీరింగ్‌: చిక్‌మగళూరు జిల్లాలో శ్రీ ఆది చుంచునాగిరి ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కళాశాల చిక్‌మగళూరు పట్టణంలో ఉంది. ఈ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్ అండ్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ వంటి విభాగాలలో ఇంజనీరింగ్‌ పట్టా చేయడానికి కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాల బెల్గాంలో ఉన్న విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయానికి అనుసంధానించబడి ఉంది. పాలిటెక్నిక్‌ కళాశాలలు: జిల్లాలో 3 పాలిటెక్నిక్‌ కళాశాలలు డిప్లమా కోర్సులు అందిస్తున్నాయి.Colleges offering Technical Education in Chikkamagaluru district are discussed in . They are: ఆది చుంచునాగిరి పాలిటెక్నిక్‌ కళాశాల, చిక్‌మగళూరు: ఈ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్ విభాగాలలో డిప్లమా కోర్సులు అందిస్తోంది. డి.ఎ.సి.జి. (DACG) పాలిటెక్నిక్‌ కళాశాల, చిక్‌మగళూరు: సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమా కోర్సులు అందిస్తోంది. యస్‌.జె.యం.యం.విద్యాపీఠ్ పాలిటెక్నిక్‌ కళాశాల, బీరూరు : ఈ కళాశాల సివిల్‌, టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌ విభాగాలలో డిప్లమా కోర్సులు అందిస్తోంది. పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు: జిల్లాలో 7 పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు (Industrial Training Institure) ఉన్నాయి.. అవి: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం, చిక్‌మగళూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం, కడూరు యస్‌.డి.యం. పారిశ్రామిక శిక్షణా కేంద్రం, సంసె, ముడిగిరె తాలూకా యస్‌.డి.ఆర్. పారిశ్రామిక శిక్షణా కేంద్రం, బాళెహన్నూరు, నరసింహరాజపుర తాలూకా యస్‌.జె.యం. పారిశ్రామిక శిక్షణా కేంద్రం, బీరూరు, కడూరు తాలూకా కర్ణాటక పారిశ్రామిక శిక్షణా కేంద్రం, చిక్‌మగళూరు లక్ష్మీసింహ పారిశ్రామిక శిక్షణా కేంద్రం, దేవనూరు, కడూరు తాలూకా. మారుతి పారిశ్రామిక శిక్షణా కేంద్రం, కడూరు వైద్య విద్య చిక్‌మగళూరు జిల్లాలో పాశ్చాత్య వైద్య విద్యా కళాశాలలేవీ లేవు కానీ ఒక ఆయుర్వేద వైద్య కళాశాల ఉంది. అది కొప్పలోని అర్రూర్ లక్ష్మీనారాయణ రావు మెమోరియల్ ఆయుర్వేద కళాశాల. ఈ కళాశాల, ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆయుర్వేద వైద్య విధానములో పట్టభధ్ర డిగ్రీలు (బాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) ప్రధానము చేస్తోంది. పర్యాటక కేంద్రాలు పర్వత కేంద్రాలు thumb|200px|right|కెమ్మనగుండికి వెళ్ళే మధ్యభాగంలో అద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు కెమ్మనగుండి: బాబా బుడన్ కొండల మధ్య చిక్‌మగళూరు పట్టణానికి 55 కి.మీ దూరంలో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉంది. కెమ్మనగుండి పర్వత కేంద్రంలో వాడేయార్ రాజు కృష్ణరాజ వాడేయార్ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వతశ్రేణులను కె.ఆర్. కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వత కేంద్రం సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతొ హరితంగా ఉంటుంది. పూల తోటలతో, కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. అరణ్యాలు అన్వేషణ జరిపే వారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని తిలకించవలసిందే. కేంద్రం పైన గులాబీ తోటలు అనేకం ఉన్నాయి. పర్వతం నడిబొడ్డు నుండి పది నిమిషాల నడకలో వచ్చే జెడ్-పాయింట్ నుండి చూస్తే రమణీయంగా ఉండే పశ్చిమ కనుమలలోని శొల గడ్డి భూములు కనిపిస్తాయి. కుద్రేముఖ్, కుద్రేముఖ్ జాతీయ వనం : కుద్రేముఖ్ జిల్లా రాజధాని చిక్‌మగళూరుకు 95 కి.మీల నైఋతి దిశలో ఉంది. కన్నడ భాషలో కుద్రే=గుర్రం ముఖ్=ముఖం. ఈ పర్వతశ్రేణులు గుర్రపుముఖం ఆకారంలో ఉండడం వల్ల కుద్రేముఖ్ అని పిలుస్తారు. ఈ కుద్రేముఖ్ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం ఉంది. అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వత శ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్రమట్టానికి 1,894.3 కి.మీ. ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్ లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయి. కుద్రేముఖ్ లో ఉన్న కుద్రేముఖ్ ఉక్కు కర్మాగారంలో ఉక్కు కొద్దిగా శుద్ధి చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణంబూర్ నౌకాశ్రయానికి సరఫరా చేయబడుతుంది. ముల్లయనగిరి: ముల్లయనగిరి బాబు బుడాన్ కొండలలో ఒక భాగం. ఈ కొండ చిక్‌మగళూరు పట్టణానికి 16 కి.మీ దూరంలో ఉంది. సముద్రమట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రం లోనే ఎత్తైన పర్వత శ్రేణులు. ఈ పర్వత శిఖరం సూర్యాస్తమయం వీక్షించడానికి చాలా ప్రసిద్ధి. చిక్‌మగళూరు నుండి సితలయనగిరి వెళ్ళే మార్గంలో ఉన్న శివుడి గుడిలో లింగం నిరంతరం నీటిలో ఉంటుంది. నీటి మట్టం ఏ సమయంలో నైన ఒకే లాగ ఉంటుంది. అక్కడ నుండి ముల్లయనగిరికి వెళ్ళే రహదారి చాలా సన్నగా ఉండి రెండు ప్రక్కల వాహనాలు పోవడానికి వీలు లేకుండా ఉంటుంది. ముల్లయనగిరి కొండ చాలా వాలుగా ఉండడం వల్ల పైకి పూర్తిగా వాహనాల మీద చేరుకోలేరు. ముల్లయనగిరి కొండకు ఎక్కే మధ్య భాగంలో ఒక చిన్న గుడి కూడా ఉంది. ముల్లయనగిరి కొండల నుండి ఆకాశం నిర్మలంగా ఉన్న రోజులలో అరేబియా సముద్రం కనిపిస్తుంది. పర్వత శ్రేణులను అధిరోహించాలని ఆసక్తి ఉన్నవారికి ఈ కొండ చాలా మంచి ప్రదేశం. దత్త పీఠం (బాబా బుడాన్ గిరి) : చిక్‌మగళూరుకు ఉత్తరాన బాబా బుడాన్ కొండలు ఉన్నాయి. వీటికి చంద్ర ద్రోణ పర్వత అనే పేరు కూడా ఉంది. ఈ కొండలకు చాలా పురాతన చరిత్ర ఉంది. ఈ కొండలు హిమాలయాలకు నీలగిరి కొండలకు మధ్య ఉన్న ఎత్తైన కొండలలో ఇదిఒకటి. ఈ కొండకు ఈ పేరు 150 సంవత్సరాల క్రితం నివసించిన ముస్లిం ఔలియా, సూఫీ అయిన బాబా బుడాన్ (దాదా హయాత్ కలందర్) వల్ల వచ్చింది. జలపాతాలు thumb|200px|right|బాబా బుడాన్ గిరి కొండల వద్ద నున్న మాణిక్యధార జలపాతం thumb|200px|right|హనుమాన్ గుండి జలపాతం మాణిక్యధార జలపాతం ఈ జలపాతం బాబా బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠంకి దగ్గరలో ఉంది. ఈ జలపాతం పడేటప్పుడు నీరు ముత్యాల వలే కనిపిస్తూ చూపరులకు, జలక్రీడలు ఆడేవారికి అమిత అనందాన్ని కలిగిస్తోంది. కళ్ళహతిగిరి జలపాతం కెమ్మనగుండి నుండి 10 కి.మీ దూరంలో ఉన్న కల్లహతగిరి జలపాతాన్ని కాళహస్తి జలపాతం అనికూడా పిలుస్తారు. 122 మీటర్ల ఎత్తులోనున్న చంద్ర ద్రోణ పర్వతం నుండి పడే ఈ జలపాతం చాలా రమణీయంగా ఉంటుంది. జలపాతం పడే రాళ్ళ మధ్య శివునిగా అర్చించబడే వీరభద్ర దేవాలయం ఉంది. హెబ్బే జలపాతం కెమ్మనగుండి పర్వత కేంద్రం నుండి 10 కి.మీ దూరంలో ఉన్న ఈ జలపాతం 168 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఈ జలపాతం రెండు గతిపథులుగా పడుతుంది. దొడ్డ హెబ్బే ( పెద్ద హెబ్బె) జలపాతం, చిక్క హెబ్బే (చిన్న హెబ్బె) జలపాతం శాంతి జలపాతం కెమ్మనగుండి నుండి జెడ్-పాయింట్ కి వెళ్ళే మార్గంలో ఈ జలపాతం వస్తుంది. హనుమాన్‌ గుండి జలపాతం కలసాకి 32 కి.మీల దూరంలో ఉన్న ఈ జలపాతం నుండి పడే జలం వల్ల 100 అడుగుల కంటే ఎత్తు కల సహజ శిలలు ఏర్పడ్డాయి. కదంబి జలపాతం ఈ జలపాతం కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం వద్ద ఉంది. పుణ్యక్షేత్రాలు thumb|200px|right|శృంగేరి లోని విద్యాశంకర దేవాలయం 200px|right|thumb|హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయమహాద్వారం శృంగేరి: చిక్‌మగళూరుకు 90 కి.మీలకు పశ్చిమంగా తుంగ నది ఒడ్డున శంకరాచార్యులు అద్వైత ధర్మప్రచారానికి స్థాపించిన మొట్టమొదటి మఠమైన శారద పీఠానికి నిలయం శృంగేరి. శృంగేరిలో శారదా దేవి దేవాలయం ఉన్నది, శారద దేవి ఆలయానికి ప్రక్కన విద్యాశంకరులు స్మారకంగా నిర్మితమైన విద్యాశంకర్ దేవాలయం హొయసల రాజుల కాలంలో ప్రారంభించబడి విజయనగర రాజుల చేత పూర్తి చేయబడింది. ఈ విద్యాశంకర దేవాలయంలో 12 రాశులను సూచిస్తూ 12 స్తంభాలు ఉన్నాయి. సూర్యుడు ఏ రాశితో ఉన్నాడో సూర్యకిరణాలు ఆ స్తంభం మీద పడతాయి. హొరనాడు: చిక్‌మగళూరుకు 100 కి.మీ.ల నైఋతి దిక్కులో ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉంది. ఈ దేవాలయం పునరుద్ధరణ ఈ మధ్య కాలంలో జరిగింది. ఆదిశక్తితో ప్రాణ పతిష్ట చేసిన ఈ గుడిలో ఉన్న ఈ అమ్మవారిని ఆదిశక్త్యకాంబ శ్రీ అన్నపూర్ణేశ్వరిగా భావిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారిని దర్శించడానికి వచ్చిన తీర్థయాత్రీకులకు దేవస్థానం వసతి భోజన సదుపాయాలు కల్పిస్తుంది. కలస: చిక్‌మగళూరుకు నైఋతిథిశలో 92 కి.మీల దూరంలో భద్ర నది ఒడ్డున కలస ఉంది.భద్ర నది ఒడ్డున ఉన్న పంచ క్షేత్రాలలో (ఐదు సరస్సులు) ఇది ఒకటి . దగ్గరలో ఉన్న చిన్న కొండ పై హొయసల శైలితో నిర్మితమైన శివాలయం కాళేశ్వర దేవాలయం ఉంది. కలసలో ఉన్న పెద్ద శిలను మధ్వాచార్య బండఅని పిలుస్తారు. ఈ బండ పై మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధించాడని చెబుతారు.ఈ శిల పై ఇప్పుడు మధ్వచార్యుల విగ్రహం చెక్కబడింది. గురు దత్తాత్రేయ, బాబా బుడాన్ స్వామి దర్గాహ్: బాబా బుడాన్ గిరి కొండలపై నున్న ఇమాం దత్తాత్రేయ పీఠాన్ని హిందువులు ముస్లిములు సమానమైన పవిత్ర స్థలంగా భావిస్తారు.ఈ కొండ పై నున్న లాటిరైటు (కంకర) గుహలో దత్తాత్రేయ స్వామి లేదా హజరత్‌ దాదా హయాత్‌ మీర్ కలందర్ నివసించారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. (బాబా బుర్హాన్ సూఫీ సంతుడిని, హిందువులు దత్తాత్రేయ స్వామి అని, ముస్లింలు హజరత్ దాదా హయాత్ మీర్ కలందర్ అని పిలుస్తారు) ప్రతి సంవత్సరం ఇక్కడి ఫకీర్ల జాతరను, ఉర్సును నిర్వహిస్తారు. అమృత్‌పుర: చిక్‌మగళూరు పట్టణానికి 67 కి.మీల ఉత్తరంలో ఉన్న అమృత్‌పుర గ్రామంలో ఉన్న అమృతేశ్వర దేవాలయాన్ని సా.శ. 1196 సంవత్సరంలో అమృతేశ్వర దండ నాయక అని పేరు గాంచిన హొయసల రాజు రెండవ వీర బల్లాల్ కట్టించాడు. ఈ దేవాలయం చూస్తే హోయసల రాజుల కాలంలో శిల్ప నైపుణ్యం ఎంత ఉచ్ఛ స్థితిలో ఉండేదో అవగతమవుతుంది. బేలవాడి: చిక్‌మగళూరుకు ఆగ్నేయంలో 29 కి.మీ.ల దూరంలో ఉన్న బేలవాడి గ్రామంలో ఉన్న శృంగారమైన వీరనారాయణ దేవాలయం, ఉద్భవ గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధం. ఈ గ్రామానికి 10 కి.మీ. దూరం లోనే హళేబీడు ఉంది. వృక్ష-జంతు సంపద thumb|200px|భద్ర అభయారణ్యంలో ఉన్న రివర్-టెర్న్ అనే పక్షి భద్ర అభయారణ్యం: తుంగ భద్ర నది ఒడ్డున 495 కి.మీ.². విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యంలో పులుల ప్రాజెక్టు ఉంది.ఈ అభయారణ్యం ఉన్న జలాశయం తుంగ భద్ర నది నుండి వచ్చే నీటిని నిల్వ ఉంచి దక్షిణ కర్ణాటక వర్షచ్ఛాయ జిల్లాలకు నీరు అందిస్తోంది.ఈ అభయారణ్యం లోని అడవులలో వెదురు చెట్లు ఉన్నాయి. సహ్యాద్రి పర్వతాల (పశ్చిమ కనుమలు) లో, మలబారు తీరంలో కనిపించే వివిధ పక్షిజాతులు ఇక్కడ కనిపిస్తాయి. కుద్రేముఖ్ జాతీయ వనం: 13°01'00" - 13°29'17" N అక్షాంశాల, 75°00'55' - 75°25'00" E రేఖాంశాల మధ్య ఉన్న ఈ కుద్రేముఖ్ జాతీయ వనం ఉంది. జంతు వైవిధ్యం ఉండి ప్రపంచం మొత్తం మీద సంరక్షిత స్థలాలుగా ఎన్నుకొనబడిన 25 ప్రదేశాలలో పశ్చిమ కనుమలలోని కుద్రేముఖ్ ఒకటి. వన్యప్రాణి కన్సర్వేషన్ సొసైటి (Wildlife Conservation Society (WCS) ), వర్డ్ వైడ్ ఫండ్ (World Wide Fund-USA) చేత అవిష్కరించబడుతున్న ఈ కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం Global Tiger Conservation Priority-I క్రిందకు వస్తుంది. మూలాలు బయటి లింకులు చిగ్‌మగళూర్‌ జిల్లా వెబ్ సైటు వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
చిత్రదుర్గ
https://te.wikipedia.org/wiki/చిత్రదుర్గ
చిత్రదుర్గ, నగరం బళ్ళారినుండి షిమోగా, దావణెగెరే వెళ్ళు మార్గంలో, బళ్ళారినుండి 125కి.మీ దూరంలో ఉంది.అలాగే బెంగళూరు-దావణేగెరె (బెంగళూరు-పుణె జాతీయరహదారి-4) రాస్తాలో, బెంగుళూరుకు 210కి.మీ దూరంలో ఉంది. బళ్ళారి-బెంగళూరు రహదారిలో బళ్ళారికి 105 కి.మీ దూరంలో చళ్ళెకెరే అను పట్టణం నుండి 20కి.మీ.దూరంలో ఈ నగరం ఉంది. ఈ నగరం పేరుమీదనే జిల్లా ఉంది. ఈ నగరానికి వెలుపల వున్న, పెద్దపెద్ద గ్రానెట్‌ బండలు (రాళ్ళు) వున్న, కొంచెం నిలువుగా వున్న కొండలను (గుట్ట) కలుపుచూ పెద్దరాళ్లతో కట్టిన గోడలతో 'చిత్రదుర్గ కోట' ఉంది. ఈ కోట చిత్రమైన కోట విన్యాసం కలిగి వుండటం వలన 'చితుర దుర్గ, చిత్రకళా దుర్గ' అని అంటారు. చిత్రదుర్గను కల్లినకొటే (కన్నడలో' కల్లు' అనగా రాయి అని అర్ధం) అనియు, ఉక్కుదుర్గం, ఏడు గోడలదుర్గం (కోట) అని కూడా పిలువబడుతుంది. పేరువెనుక చరిత్ర మహాభారతంలో భీముడు, హిడింబాసురుడు ఒకరిపై ఒకరు యుద్ధ సమయంలో విసురుకున్నరాళ్ళు అవి అని అక్కడివాళ్ళ నమ్మకం.ఒక్కోరాయి ఒక్కో ఆకారంతో చిత్రవిచిత్రాలుగా కనిపిస్తాయి.అక్కడి దుర్గం పేరు అందుకే "చిత్రదుర్గ" అయింది పురాతన చరిత్ర పురాతత్వశాఖవారికి సామాన్యశక పూర్వం 3వ శాతాబ్బికి చెందిన అవశేషాలు లభించాయి. ఇతిహాసిక కథనం ఈ దుర్గానికి చెందిన గుట్టలతో మహాభారత చరిత్ర""ముడుపడివున్నది.దుర్గానికి చెందిన ఈ కొండల(గుట్ట)లో 'హిడింబ'అనే అసురుడు,'హిడింబి'అనే అతని సోదరి నివసించెవారు. హిడింబాసురుడు కౄరస్వభావం కలిగివుండి,ప్రజలను హింసిస్తూ, నరభక్షణ చేసెవాడు. అతని సోదరి హిడింబి సాత్విక స్వభావంకల్గివుండెది. పాండురాజు పుత్రులైన పాండవులు జూదంలో ఓడి పోయి, రాజ్యంతో పాటు సర్వసంపదలను,చివరికి ద్రౌపదినికూడా ఒడ్డి ఓడిపోయి, సుయోధనునితో చేసుకున్నఒప్పందం ప్రకారం 12 ఏళ్ల వనవాసంచేస్తూ, తమతల్లి కుంతితోపాటు ఇక్కడికి వచ్చినప్పుడు, హిడింబుడు పాండవులను ఎదిరింస్తాడు.భీమునితో జరిగిన పోరాటంలో హతుడవ్వుతాడు. తదనంతరం భీముడు సాత్వికగుణంకలిగిన హిడింబిని,తనతల్లి , సోదరులకోరిక మేరకు పెళ్ళాడతాడు.ఈ దంపతులకు జన్మించినవాడే""ఘటోత్కచుడు.అర్జున-సుభద్రల పుత్రుడుఅయిన అభిమన్యుడు ఇష్టపడిన శశిరేఖను ఆమె తండ్రి, శ్రీ కృష్ణుని సోదరుడైన బలరాముడు, శశిరేఖను ధుర్యోధనుని కుమారుడైన లక్ష్మనకు ఇచ్చి కళ్యాణానికి సిద్దమవ్వగా, శ్రీ కృష్ణుని సహకారంతో అభిమన్యు-శశిరేఖలపిళ్ళిజరిపిస్తాడు. ఘటొత్కచుడు తన తండ్రిలా బలపర్క్రామాలు కలిగివుండటమే కాక, తన తల్లి వైపునుంచి సంక్రమించిన అసుర మాయవిద్యలలో ఆరితేరినవాడు.భారత సంగ్రామ సమయంలో ఘటొత్కఛుడు తన అసురమాయవిద్యతో కౌరవసేనను కకాలవికంచేయ్యగా, పాపుపోని రారాజు కర్ణునుని ఎలాగైనా ఘటొచ్కతున్ని సంహరించమని వేడుకొనగా, కర్ణుడు ఇంద్రుని నుండి పొందిన, అర్జునున్ని సంహరించటానికై దాచివుంచిన 'శక్తి'అస్త్రాన్ని ఘటొత్కచునిపై ప్రయోగించి సంహరిస్టాడు.ఆవిధంగా ఘటొత్కచుడు భారత యుద్ధంలో తన ప్రాణాన్ని అర్పించి, తనపినతండ్రి ప్రాణదాతగా నిలిచాడు. thumb|right|చిత్రదుర్గ పట్టణం.కోట నుండి దృశ్యం. thumb|right|చిత్రదుర్గ కోట. thumb|చిత్రదుర్గ రాఘవేంద్ర మఠం. thumb|right|చిత్రదుర్గలోని రాతి ఇసురురాయి (తిరగలి). thumb|చిత్రదుర్గ దీపస్తంభం. చరిత్ర బ్రహ్మగిరి వద్ద లభించిన ఆశోకునికాలం నాటి రాతిశాసనాన్నిబట్టి, ఈ దుర్గం మౌర్యసామ్రాజ్యంలోని సామంతరాజ్యమని తెలుస్తున్నది. మౌర్యపలనకాలంలో ఈ దుర్గాన్ని రాష్ట్రకూటులు, చాళుక్యులు, హయసులులు పాలించినట్లుగా తెలుస్తున్నది. అయితే విజయనగరసామ్రాజ్యపలన కాలంలో, పాలెగాండ్లు (Paleyagars) లేదా 'నాయకర్లు'అనబడు పాలకుల వంశపాలనలో ఈ వగరం మంచిప్రాభల్యంసంతరించుకున్నది.విజయనగర చక్రవర్తి, 'తిమ్మననాయక్' అనే సైన్యాధిపతి (chieftain) యుద్ధాలలో కనపర్చిన ప్రతిభ, సేవలకు, అతనిని చిత్రదుర్గ పాలకునిగా (governor) నియమించాడు.విజయనగరసామ్రాజ్యపతనానంతరం ఈ దుర్గాన్ని స్వత్రంత రాజ్యంగా ప్రకటించుకున్నారు. తిమ్మననాయకర్కుమారుడు అయిన ఒబన నాయక/ మదుకరనాయక్ ( 1588) లో గద్దెనెక్కిపాలన ప్రారంభించిన తదుపరి క్రమంగా ఈ ప్రాంతంలో చిత్రదుర్గ పాలకుల ప్రాభల్యం పెరిగింది. మధుకరనాయకుని కుమారుడు కస్తూరి రంగప్ప (1602 ) తండ్రి తదనంతరం గద్దెనెక్కాడు.ఇతనికాలంలో పాలనకొంతమేరకు శాంతియుతంగా సాగినది. కస్తూరిరంగప్పకు సంతానం లేక పోవడం వలన, అతని దత్తపుత్రుడు రాజ్యాధికారంలోకి వచ్చినప్పటికి, 'దళవాయుల' తిరుగుబాటు వలన పదవిచ్యుతుడు అయ్యాడు. అతని తరువాత మదకరినాయకుడు II సోదరుడు చిక్కన్న నాయకుడు పాలన బాధ్యతలు స్వీకరించాడు (1676).ఆ తురువాత అతనిసోదరుడు 1686లో 'మదకరినాయక III' పేరుతో రాజ్యాధికారాన్ని చేచిక్కించుకున్నాడు.కాని తిరిగి అతని పాలనను దళవాయిలు వ్యతిరేకించడం వలన, వారికి దూరపు బంధువైన 'బ్రమ్మప్ప నాయకుడు 'అధికారంలోకి (1689) లోకి వచ్చాడు. ఇతనిపాలనలోనే 'నాయక్‌'లపాలన గణతికెక్కి, ప్రాభల్యం పొందినది. నాయక్‌పాలకులలో పాలానాదక్షుడుగా పీరుపొందాడు.తదనంతరం హిరి మదకరినాయక్‌ IV (1721, కస్తూరి రంగప్ప నాయక్‌ II (1748, మదకరినాయక్‌ v (1758) చిత్రదుర్గను పాలించినప్పటికి, వారి పాలన అంతగా చెప్పుకోవలనిన స్ధాయిలో లేదని తెలుస్తున్నది. 1779 లో హైదర్‌ఆలి, అతనికుమారుడు టిప్పు సుల్తానుతో జరిగిన యుద్ధంలో మదకరినాయక్‌ v ఓడిపోవడంవలన చిత్రదుర్గ హైదర్‌ఆలి వశమైనది. తదనంతరం టిప్పిసుల్తాను బ్రిటీషు వారిచేతిలో ఓడిపొయ్యిన పిమ్మట 'చిత్రదుర్గ' మైసూరుకు చెందిన ఒయల్‌కుటుంబపాలనలోకి వెళ్ళినది. చిత్రదుర్గ కోట పెద్ద గ్రానైట్‌బండలను కలిగివున్న కొండలను (గుట్టలను) కలుపుతూ వర్తులాకారంగా కోట గోడలనిర్మాణం జరిగింది. ఏడు రాతితో కట్టిన గోడలను కలిగివున్నది. కోట మొదటి కూట గోడకు చుట్టు బయటి వైపున పెద్దకందకం వున్న్నది.కోటలోనికి ప్రవేశించటానికి 18 కోట గుమ్మాలు, 38 వెనుక ప్రవేశ ద్వారాలున్నాయి.ప్రస్తుతం వీటిలో చాలా శిథిల స్ధితిలో ఉన్నాయి.కోట గుమ్మాల తలుపులు తొలగిం పబడినవి. కోట గోడలు కూడా అక్కడక్కడ శిథిలమైనవి. అత్యవసర పరిస్ధితులలోకోటలోనికి రహస్యంగా వెళ్ళూటకు కొన్నిరహస్యమార్గాలు ఉన్నాయి.ఈ రహస్య మార్గాలు సహజంగా కొండరాళ్ల మధ్యనుండు ఖాళీల, చీలికలద్వారా ఏర్పాటు చేసారు.కొండలఎతైన శిఖరభాగన పహర కోటబురుజులను ఏర్పాటు చేసారు. ఈ బురుజులనుండి నలువైపుల 4-6కి.మీ దూరం వరకు కపిస్తుంది. అందు వలన శత్రుసేనలరాకను ముందస్తుగా గమనించి అప్రమత్తులగుటకు వీలున్నది.రెండవ కోట గోడను దాటిన తరువాత నూనె బావి (ఎన్నెకొలె) ఉంది. బవుశా ఇందులో నూనెను నిల్వ వుంచే వారెమో. రాతిని తొలచి, పిద్దతొట్టిలా చేశారు. దుర్గం యొక్క గూడల పైభాగం వెడల్పుగా వుండి నలుగురైదుగు నడిచేలా ఉన్నాయి.కొన్నిగోడలపైభాగంన దాగివుంది తుపాకు లను ప యోగించెలా కట్టడాలు న్నాయి. గోదలు కొన్నిచోట్ల 20-25 అడుగులఎత్తు (పల్లంగావున్నచోట, కొండబండల (రాళ్ళ) మీద15-20అడుగులఎత్తు ఉన్నాయి.నాల్గవ కోట దాటినతరువాత మొడటగా గణపతి ఆలయంవున్నది.ఈ ఆలయం గర్భగుడి ఒక పెద్ద బండరాయిని దాపు చేసుకునివున్నది. కోటగోడలుకూడా చాలా మేరకు శ్శిథిలమై ఉన్నాయి. గోడలను దాటుకొని లోపలికి వెళ్లగానే విశాలమైన బయలు ప్రదేశం దర్శన మిస్తుంది. ఇక్కడనే రాతిదీపస్తంభం, రాతి స్థంబాల ఉయ్యాలకొక్కెలు, వసంతకోనేరు, కొన్నిపాతకట్టడాలు, సిద్ధేశ్వరిదేవి గుడి, కొద్దిదూరంలో మట్టిగోడలతో నిర్మించిన టంకశాల (Mint home) ఉన్నాయి. కొండకు ఒకవైపున చిన్నగుట్టపై లింగేశ్వర ఆలయం ఉంది.ముందుకు వెళ్ళిన విశాలమైన ప్రదేశంలో రాఘవేంద్రస్వామి మఠం ఉన్నాయి. ఈ మరం స్ధంభాలు, పై కప్పు రాళ్లను చెక్కి నిర్మించినవే. ఈ మఠం పక్కనే సిద్ధలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంయొక్క గర్భగుడి, ముందుకుచొచ్చుకు వచ్చిన కొండయొక్కపెద్దరాయిలోపలి భాగంలో వుండి, ఆలయంగోడలుగా ఈ రాయి సహజ సిద్ధంగా మూసి ఉంది.ఈ ఆలయం ముందు పెద్దఆరుగువుండి, పర్వదినాలలో కళాకారులు తమ కళలను ప్రదర్శించెవారు.ఈ ఆలయంలోనే 16 వ శతాబ్దినాటి శిలాశాసనపలకాలు రెండు ఉన్నాయి. ఈ గుడికి వెనుక వైపున రాళ్లతో, పైకప్పుతో సహ సహజసిద్ధంగా ఏర్పడిన కొండగుహాలున్నాయి. పైకప్పురాళ్ళు పద్దప్రమాణంలో వుండి ఒకదానిమీద ఒకటి పేర్చివుండటం విస్మయం గొల్పుతుంది. టంకశాలనుండి దిగువకు వెళ్ళిన అక్కడ అక్కా-చెల్లెల్ల (అక్కా-తంగి) చెరువులున్నాయి. కొండలపైన కురిసిన నీరు ఈ రెండుచెరువులలో చేరువిధంగా కాల్వలున్నాయి. అక్కచెరువు నిండిన తరువాత నీరు అలుగు ద్వారాచెల్లెలు చెరువులు ప్రవహించును. రెండుచెరువులు నిండిన తరువాత నీరు కొండ దిగువకు పారేటట్లు నిర్మించారు. 'అక్క'చెరువుకు ఎదురుగా వున్న గుట్టపై వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. మరొకవైపున్ననునుపైన ఉపరితలం వున్న పెద్ద బండరాయి యుతమైన కొండపైన కోట బురుజు ఉంది. దీన్నిని అతిప్రయాసమీద పర్యాటకులు ఎక్కవలెను.ఈ చెరువుకు మూడోవైపున రాజభవనాలు, ఆయుధనిల్వగిడ్డంగులు, వాటికి వేరువగా కాపలాగార్ల బంకరులున్నాయి. రాజభవనాలు పూర్తిగా జీర్ణించిపొయ్యి, కేవలం పూనాదులు కన్పిస్తున్నాయి. అక్కా-చెళ్లెకా చెరువలనుండి దిగువవైపునకు ప్రయాణించిన బాటప్రక్కన రెండు పెద్ద రాళ్ళ మధ్యలోచల్లని మంచినీళ్లచలమ (తన్నీరు దోని.) ఉంది. చిన్నగుంటలో చల్లని నీటి వూట ఉంది. వేసవికాలంలో కూడా ఈకుంటలో నీరు వూట వస్తుంటుంది. ఒనకె ఒబవ్వకుండి ఇంకను క్రిందివైపునకువెళ్ళిన ఒబక ఒబవ్వనకుండి కన్పిసుంది. కన్నడ చరిత్రలో కిత్తురు చెన్నమ్మ (కిత్తూరు రాణి చెన్నమ్మ, బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాటం సల్పిన వీరవనిత) తరువాత అంతగా గణతికెక్కిన మహిళ. ఒబవ్వ దుర్గలోని ఒక కోట కాపలా భటుని భార్య.మదకరినాయకుడుv కు హైదరిఆలికి (టిప్పుసుల్తాను తండ్రి) కి యుద్ధంజరుగుతున్న కాలంఅది. హైదర్‌ఆలి దాడిని మదుకర్‌ నాయక్‌ సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నాడు.ఏలాగైన సరే దుర్గాన్ని స్వాధీనమొదవలెనని హైదర్‌ఆలి ప్రయత్నంచేస్తున్న రోజులవ్వి. ఒకరోజు కాపలావిధిలో వున్న భర్తకు మధ్యహన్నం భోజనం తీసుకెళ్ళినది ఒబవ్వ.ఆమే భర్త కాపలస్దలానికి దగ్గరలోవున్న సత్రంలో భోజనంచేయుటకు ఉపక్రమించాడు.భర్తకు నీళ్ళుతేవటానికి నీటి చెలమవద్దకు వెళ్ళుచున్న ఒబవ్వకు, రెండు బండ రాళ్ళ మధ్యనున్న సన్నని కన్నంనుండి హైదర్‌ఆలి సైనికుడు లోపలికి రావడం గమనించింది. ఆ కన్నంనుండి ఒకతూరి ఒకమనిసి అతికష్టమీద రాగలడు. అప్పూడే భోజనంచేస్తున్న భర్తను భజనంవద్దనుండి లీపడం ధర్మంకాదని భావించిన ఒబవ్వ, తనకు అందుబాటులో వున్న ఒనెకే (రోకలి) ని తీసుకునివెళ్ళి ఆ కుండి పక్కనే నిల్చుని, కన్నంనుండి లోపలికి వస్తున్న ఆలి సైనికుని తలమీద బలంగామోది, పక్కకు లాగివేసింది.ఆ కన్నంచాలా ఇరుకుగా వున్నందున ఇవతల జరుగుతున్నది అవతల వున్న సైనికులకు కన్పించె, తెలిసే వీలులేదు. ఆవిధంగా ఒబవ్వ లోపలికి వస్తున్న ఒక్కొక్క భటునుని రోకలోతోతలమీదబాది చంపడం మొదలుపెట్టినది. భోజనంముగించుకొనివచ్చిన ఒబవ్వభర్తకు, వందలసంఖ్యలో గుట్టలుగా పడివున్న హైదర్‌సైనికుల శవాలమధ్య రోకలిపట్టుకుని వున్న ఒబవ్వ అపరకాళినే తలపించింది.ఆవిధంగా ఒకసామాన్యభటుని భార్య అయిన ఒబవ్వ వీర వనితగా నిలిచింది.ఇప్పటికి చిత్రదుర్గకు వచ్చే పర్యాటకుకు తప్పనిసరిగా ఈ కుండిని చూసి, ఆమె వీరత్వాన్ని తలచుకును పులస్తారు. రాయలసీమలోని చాలా మంది ఆడవారికి ఒబవ్వ, ఒబులమ్మ అనేపేర్లు ఉన్నాయి. కన్నడలో అవ్వ అనగా 'అమ్మ'ని అర్ధం. thumb|right|300px|ఒబవ్వ కుండి. thumb|right|300px|పవనవిద్యుత్తు-గాలిమరలు టంకశాల ఇక్కడి టంకశాలను మట్టిగోడలతో నిర్మించారు. ఈ మట్టిగోడలను ఒకవిశిష్టమైన పద్ధతిలోనిర్మించారు. నలుపలకలుగా చెక్కిన పునాది రాళ్లను పునాదిగా వాడి వాటిమీద మట్టి గోడలను కట్టారు. ఈ మట్టిగోడలను ఒకే సారిగా కాకుండగా కొంతఎత్తువరకు వరుసగా గోడను కట్టి, ఆరినతరువాత పైవదుసగోడను నిర్మించారు.పునాదికి ఇరువైపుల గోడమందంలో చెక్కపలకలను అమర్చి, వాటిని కదలకుండ మేకులతో బిగించి బాగా కలిపిన బంకమన్ను, గులక ఇసుక వంటి వాటిని మిశ్రం చేసి పలకలమధ్యన మెత్తెవారు.గోడ ఆరిన తరువాత, చెక్కపలకలను పై వరుసలో ఆమర్చి గోడను కట్టెవారు. గోడలను కట్టి రెండు వందల సంవత్సరాలయిన ఇప్పటికి ఈ మొండిగోడలు వానలకు తట్టుకుని నిల్చి అలనాటి భవన నిర్మాణనిపుణుల నైపుణ్యానికి తార్కాణంగా నిల్చున్నాయి. ఈ టంకశాలలో నాణెల ముద్రణ, వసూలు చేసిన శిస్తును ఇక్కడే భద్రపరచేవారట. భారీ రాతి తిరగల్లు కోటలోనికి మొదటి కోట ద్వారాన్ని దాటిన తరువాత ఎడమవైపునకు 200 మీటర్ల దూరం వెళ్లినచో అక్కడ పెద్ద పరిమాణంలో వున్న రాతి తిరగల్లు నాలుగు ఉన్నాయి. నాలుగు దిక్కులను సూచిస్తు నాలుగు వైపుల వీటిని వుంచారు.దాదాపు 9-10అడుగుల గొయ్యిని విశాలంగా వుండి, దాని గోడలను చెక్కిన రాళ్లతో రివిటింగ్‌ చేశారు. రాతి ఇసురురాయి పైభాంనవున్న తిరిగే రాతి అంచులకు గంట్లువున్నాయి. గొయ్యిలో మధ్యలో ఇరుసువంటిదాన్ని ఆమర్చి, దానినుండి ఇసురురాళ్లను తిరిగేలా మరలను అమర్చి, ఆ ఇరుసును తిప్పడం ద్వారా ఏకకాలంలో నాలుగు తిరగల్లు తిరెగెలా చేసెవారు. మధ్య ఇరుసును మనష్యులతోకాని, జంతువులతోకాని తిప్పెవారు. స్ధానికులకథనం ప్రకారం ఈ ఇసురురాళ్లను పయోగించి రోట్టెల పిండి ఆడించారని. కాని ఈక్కడ పర్యాటక శాఖవారు వుంఛిన వివరణ బోర్డు ప్రకారం తుపాకులలో వుపయోగించే మందు పొడిని తయారుచేసెవారట. మతం-ఆలయాలు ఈ కోటలో వైష్ణవ, శైవ మందిరాలు వుండటం వలన ఈ కోట పాలకులు రెండు మతాలను అభిమానించి, ఆదరించినట్లు తెలుస్తున్నది. చిన్నవి, పెద్దవి దాదాపు 20ఆలయాలవరకు వున్నప్పటికి, ఇందులో చాలా గుడులు శిథిలమైనవి.కోటలో ఒక మసీదు కూడా ఉంది. దీనిని, హైదర్‌ఆలి పాలన సమయంలో నిర్మించింటారు. ఈ దుర్గం పురాతన కట్టడాల సంరక్షణ శాఖ ఆధీనంలో ఉంది. కోట బయటవున్న కందకంకూడా కొంతమేరకు ఆక్రమణకు గురైనది. వస్తుప్రదర్శనశాల కోటకు బయట ఎదురుగా కాలేజివున్నది. మరికొద్దిదూరంలో ప్రవేట్‌వ్యక్తులచే నిర్వహించబడుతున్న'వాల్మికి మ్యుజియం'వున్నది.ఈ మ్యుజియంలో దుర్గను పాలించిన నాయక్‌ల చిత్రపటాలు, నాటి ఖడ్గాలు, కైజారులు, తుపాకులు, నాణెలు ఉన్నాయి. పవన విద్యుత్తు చిత్రదుర్గ నగరానికి చుట్టుపక్కల 2-4కి.మీ పరిధిలో కొండల వరుసలు ఉన్నాయి.వీటి మీద వందలసంఖ్యలో గాలిమరలను ఆమర్చారు. వ్యవసాయం ఈ ప్రాంతంలో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారం మీద ఆధారపడివున్నది. ఇక్కడ పొద్దుతిరుగుడు పంట సాగు అధికం. అయితే దానిమ్మ పండ్ల సాగులో ఈ జిల్లా దేశంలోనే మొదటి స్థానం ఆక్రమించింది.The New Indian Express, Thursday, May 08, 2014 ఈ జిల్లాలోని చెళ్ళెకెరే (చిత్రదుర్గనుండి 18 కి.మీ.) లో నూనె మిల్లులు చాలా అధిక సంఖ్యలో ఉన్నాయి.చెళ్లెకెరెను నూనె నగరం (ఎణ్ణే నగర) అని అంటారు.ఇవికాకుండ వరి, జొన్న, ఉల్లి, మిరప పంటలను సాగు చేయుదురు. ప్రజలు-భాష ఇది కర్నాటక ప్రాంతం అవటం వలన ఇక్కడి ప్రజల మాతృభాష కన్నడం అవ్వడం సహజం, అయితే కన్నడంతో పాటు ఇక్కడి ప్రజలలో చాలా మంది తెలుగు ధారాళంగా మాట్లాడుతారు. చిత్రదుర్గ జిల్లాకు ఆనుకుని అనంతపురం జిల్లా వుండటం వలనను, వందల ఏళ్లక్రితం రాయలసీమతదితర ప్రాంతాల నుండి తెలుగువారు వలస వెళ్ళడం వలనైతేనేమి, ఇక్కడ రెండుభాషలు సహజీవనం చేస్తున్నవి. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:కర్ణాటక వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు
దక్షిణ కన్నడ జిల్లా
https://te.wikipedia.org/wiki/దక్షిణ_కన్నడ_జిల్లా
దక్షిణ కన్నడ మునుపు దక్షిణ కనర అని పిలువబడింది. కర్ణాటక రాష్ట్రంలో ఇది సముద్రతీర జిల్లాలలో ఒకటిగా ఉంది. ఇది పశ్చిమ కనుమలలో తూర్పుదిశలో ఉన్నాయి. జిల్లా సరిహద్దులో అరేబియా సముద్రపు నీలజలాలు ఉన్నాయి. అందమైన పర్వతశ్రేణి, ఆలయ పట్టణాలు, సంపన్నమైన సంస్కృతి సమ్మిశ్రితం ఈ జిల్లాను అభిమాన పర్యాటక గమ్యంగా మార్చింది. మంగుళూరు నగరం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 4,866. జనసాంధ్రత 430.జిల్లాలో 354 గ్రామాలు ఉన్నాయి. విభాగాల వివరణ విషయాలు వివరణలు తాలూకాలు 5 తాలూకా మంగళూరు, బంత్వా, పుత్తూర్ (కర్ణాటక) సుల్లియా, బెల్తంగండి. . జిల్లాలో మునుపు ఉడిపి, కుందపూర్, కార్కల తాలూకాలు కూడా ఉండేవి. 1947 ఆగస్టు 15 న దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఉడిపికి జిల్లా హోదా ఇవ్వబడింది. తరచుగా దక్షిణ కన్నడ, ఉడిపి, కాసరగాడ్ జిల్లాలను తులునాడు అంటారు. ఈ ప్రాంతంలో తులుభాష ప్రధానభాషగా వాడుకలో ఉంది. ఈ ప్రాంతాన్ని 8-14 శతాబ్ధాల నుండి అలుపాలు పాలించారు. అలుపాలు ప్రధాన కర్నాటక సామ్రాజ్యాలకు సామంతరాజ్యంగా ఉంది. అందువలన కర్నాటక రాష్ట్రంలో తులు మాట్లాడే ప్రజలు ప్రత్యేకంగా ఉన్నారు. సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా ఉత్తర సరిహద్దు ఉడిపి వాయవ్య సరిహద్దు చిక్కమగళూరు తూర్పు సరిహద్దు హాసన్ ఆగ్నేయ సరిహద్దు కొడగు దక్షిణ సరిహద్దు కాసరగాడ్ జిల్లా కేరళ రాష్ట్రం నేపథ్యం thumb|right|తన్నిర్భవి బీచ్ thumb|left| సురత్కల్ బీచ్ వెంటవున్న లైట్ హౌస్ 1860కి ముందు దక్షిణ కనర జిల్లాలో భాగంగా ఉండేది. కనర జిల్లా ఒకటిగా మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. 1860లో బ్రిటిష్ ప్రభుత్వం దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలుగా విభజించబడి 1862 వరకు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగానే ఉంటూ తరువాత బొబాయి ప్రెసిడెన్సీలో భాగంగా మారింది. కుందపురా తాలూకా ముందు ఉత్తరకనర జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత అది దక్షిణ కనరాలో విలీనం చేయబడింది. 1956లో పునర్విభజన సమయంలో కాసరగాడ్ విభజించబడి కొత్తగా రూపొందిన కేరళ రాష్ట్రంలో విలీనం చేయబడింది. దక్షిణ కన్నడ మైసూరు రాష్ట్రంలో (ప్రస్తుత కర్నాటక) చేర్చబడింది. తరువాత కర్నాటక ప్రభుత్వం పాలనాసౌలభ్యం కొరకు గ్రేటర్ దక్షిణ కన్నడ నుండి ఉడిపి జిల్లా రూపొందించబడింది. జిల్లా ఎర్రమట్టి టైల్స్‌కు (మంగుళూరు టైల్స్), జీడిపప్పు, జిడిపప్పు సంబంధిత ఉత్పత్తులకు, బ్యాంకింగ్, విద్య, కుకరీ తరగతులకు ప్రసిద్ధి. దక్షిణకనర బ్రిటిష్ దక్షిణకన్నడ 13.00 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.40 డిగ్రీల తూర్పు రేఖంశంలో ఉంది.Patsy Lozupone, Bruce M. Beehler, Sidney Dillon Ripley.(2004).Ornithological gazetteer of the Indian subcontinent, p. 82.Center for Applied Biodiversity Science, Conservation International. ISBN 1-881173-85-2. 1949లో కనర జిల్లానుండి విభజించిన భూభాగం దక్షిణకన్నడ జిల్లాగా రూపొందించబడింది. తరువాత ఇది అవిభాజిత దక్షిణ కన్నడ జిల్లా ఉండేది. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 2,089,649, ఇది దాదాపు. రిపబ్లిక్ మెసిడోనియల్ దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. 220 వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 457 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.8%. స్త్రీ పురుష నిష్పత్తి. 1018 జాతియ సరాసరి (928) కంటే. అక్షరాస్యత శాతం. 88.62%. జాతియ సరాసరి (72%) కంటే. ప్రజలు జిల్లా భూభాగంలో మొదటి సారిగా స్థిరపడిన వారు తులువ ప్రజలని భావిస్తున్నారు. వీరిలో బిల్లవ, మొగవీర, బంట్, కొరగాస్, కులాల, దేవడిగ ఉప తెగలు ఉన్నాయి. ఇతర జాతులలో తులువ బ్రాహ్మణులు, హొలెయాలు, వొక్కలిగాలు, కొండజాతులు, ముస్లిములు, మంగోలియన్ కాథలిక్కులు ఉన్నారు. బ్రాహ్మణులు ప్రధానంగా శివల్లి బ్రాహ్మణ, గౌడ శరవస్త బ్రాహ్మణులు (సారస్వత్), హవ్యక బ్రాహ్మణ, కోట బ్రాహ్మణులు మొదలైన ఉపజాతుల ప్రజలు ఉన్నారు. జిల్లాలో తులువ భాష, బియరీ భాష, కన్నడ, కొంకణి భాషలు వాడుకలో ఉన్నాయి. భౌగోళిక స్వరూపం thumb|300px|దక్షిణ కన్నడ ప్రకృతి దృశ్యం thumb|left|300px|దక్షిణ కన్నడ లోని కుక్కే సుబ్రహ్మణ్య దగ్గర ఉన్న పశ్చిమ కనుమల దృశ్యం జిల్లా భౌగోళికంగా తూర్పున పశ్చిమ కనుమలు, పశ్చిమ దిశలో అరేబియన్ సముద్రం ఉన్నాయి. జిల్లాలో నేత్రావతి, కుమారధార, ఫల్గుణి, శాంభవి, నందిని (పవంజె), పయాస్విని నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులన్నీ అరేబియన్ సముద్రంలో సంగమిస్తున్నాయి. నైసర్గికంగా జిల్లా చదరంగా ఉంటుంది. సముద్రతీరంలో భూభాగం 18-2 కి.మీ ఉంటుంది. తరువాత తూర్పుదిశగా ఉన్న పశ్చిమ కనుమలలోని ఎగుడు దిగుడుగా కొండప్రాంతం వైపు సాగుతూ ఉంటుంది. . జిల్లాలో సతతహరితారణ్యాలు విస్తారంగా ఉన్నాయి. అరణ్యాలు ప్రణాళికారహిత వాణిజ్య అవసరాలు, నగరీకరణ కారణంగా ధ్వంసం చేయబడుతున్నాయి. అరణ్యాలలో టేకు, కర్మర (ఎబోనీ),విల్డ్ జాక్, భోగి, పలు ఇతర జాతుల వృక్షజాలం కనిపిస్తుంటుంది. దక్షిణ కన్నడ అరణ్యాలలో ఉన్న వృక్షజాలం పలుకారణాల వలన క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంది. మిలిన భారతీయ గ్రామాలలోలాగా కాకుండా దక్షిణ కన్నడ గ్రామాలు తోటలమద్య నిర్మించబడిన గృహసముదాయాలతో కనిపిస్తూ ఉంటాయి. దక్షిణ కన్నడ జిల్లా నివాసగృహాలు వ్యవసాయ తోటలు, పూదోటలు, కొబ్బరి, పోక మొదలైన ప్లాంటేషన్ మద్య నిర్మించబడి ఉన్నాయి. పలు గ్రామాల మద్య కొన్ని వందల మీటర్ల భూభాగం గ్రామాలను ప్రత్యేకంగా విభజిస్తున్నాయి. వ్యవసాయ భూములు, పూదోటలు, అరణ్యభూభాగం మద్య ఉండే గృహసముదాయ దృశ్యాలు క్రమంగా అంతరించి పోతున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న జనసంఖ్య, ఉమ్మడికుటుంబాలు అవిచ్ఛిన్నం కావడం కారణంగా 1990 నుండి నివాస గృహాల నిర్మాణం అధికరించడం కారణంగా దక్షిణ కన్నడ జిల్లాలోని పచ్చని వాతావరణం క్షీణించడం మొదలైంది. విద్య మరియి పరిశోధన thumb|right|జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయము, కర్ణాటక, సురత్కల్ thumb|right|సేంట్ అలాసియస్ కాలేజీ దక్షిణకన్నడ జిల్లా 4 స్థాయిల విద్యావిధానం అనుసరిస్తుంది. ప్రాథమిక, మాద్యమిక విద్య సమాజంలోని అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉంది. జిల్లా అక్షరాస్యత జాతీయ అక్షరాస్యతకంటే అధికంగా ఉంటుంది. ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్న కారణంగా దేశంలోని పలుప్రాంతాల నుండి విద్యార్థులు ఉడిపి, దక్షిణకన్నడ జిల్లాలకు విద్యాధ్యయనం చేయడానికి వస్తుంటారు. జిల్లాలో ఉన్న విద్యాసంస్థలు వైద్య, ఇంజనీరింగ్, మందులతయారీ, నర్సింగ్, హోటెల్ & కోటరింగ్, లా & మేనేజ్మెంటు మొదలైన విద్యలను అందిస్తుంది. జిల్లాలో ప్రఖ్యాత " నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ " (నిట్- కె) విద్యాసంస్థ ఉంది. జిల్లాలో ఫిషరీ కాలేజ్ ఉంది. ఇది కంకనడీ సమీపంలో ఉన్న యెక్కూర్ వద్ద ఉంది. జిల్లా పలు రీసెర్చ్ సంస్థలకు నిలయంగా ఉంది. వీటిలో పుత్తూర్ (కర్ణాటక) వద్ద ఉన్న " నేషనల్ ఇంస్టిట్యూట్ సెంటర్ ఫర్ కాష్యూ " ఒకటి. మరొకటి విట్ల వద్ద ఉన్న సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ ". వి.టి.యు. ఆధ్వర్యంలో పనిచేస్తున్న పలు కాలేజీలు సైన్సు, టెక్నాలజీ సంబంధిత పోస్ట్ గ్రాజ్యుయేట్ కోర్సులు అందిస్తున్నాయి. మంగుళూరులో 6 పైగా రీసెర్చి కేంద్రాలు పి.హెచ్.డి కోర్సులను అందిస్తున్నాయి. అవి మంగుళూరు, మూడబిద్రి, పుత్తూరు, బంత్వల్, ఉజిరె, సులియాల వద్ద ఉన్నాయి. భాష జిల్లాలో ప్రధానంగా తులు భాష వాడుకలో ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలో తులు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. అదనంగా బియరీ భాష, కన్నడ భాషలు వాడుకలో ఉన్నాయి. సమాచార పరిమార్పిడిలో ఆగ్లభాష కూడా వాడుకలో ఉంది. చారిత్రాత్మక ప్రదేశాలు కింద ఉన్నవి దక్షిణ కన్నడ జిల్లలో చూడదగిన చారిత్రాత్మక ప్రదేశాలు: thumb|right|Sri Manjunatha Temple at Dharmasthala thumb|right|Kukke Subramanya Temple|link=Special:FilePath/Kukke_Subramanya_Swami.jpg thumb|right|Milagres Church మంగళా దేవి దేవాలయం: మంగళూరు హిందూ మతం దేవత మంగళా పేరు పెట్టారు. వేణూర్ : ప్రముఖ ఏక బాహుబలి విగ్రహం (వేణూర్) కద్రి : ప్రముఖ ఆలయంలోని కద్రి మంజునాథ్ ఆలయం. మూడబిద్రి: పురాతన జైన దేవాలయాలు, భట్టారకుని సీటు సైట్. కృష్ణపుర మఠాన్ని: మఠాన్ని (మఠం) ఒకటి అష్ట మఠాన్ని ఉడుపి చెందిన. ధర్మస్ధల: లార్డ్ ఆఫ్ ది పాపులర్ ఆలయం ధర్మస్ధల దేవాలయం (శ్రీ మంజునతేశ్వర) కటీల్: దేవత శ్రీ దుర్గా పరమేశ్వరి యొక్క ప్రసిద్ధ ఆలయం కుద్రొలి: గొకర్ననథెశ్వర ఆలయం ముంద్కుర్: శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం కరింజెష్వర ఆలయం భారీ రాతి శివ పార్వతి ప్రసిద్ధ పురాతన ఆలయం ఉల్లాల్: అద్భుతమైన సైట్ బీచ్ లో సూర్యాస్తమయం చూసిన కుక్కే సుబ్రహ్మణ్య: పాము లార్డ్ సుబ్రహ్మణ్య యొక్క ప్రసిద్ధ పురాతన ఆలయం ఇక్కడ ఉన్న. ముల్కి, భారతదేశం : దుర్గపరమెశ్వరి ఆలయం సెయింట్ అలోయ్సిస్ చాపెల్, మంగళూరు మిలగ్రెస్ చర్చి (మంగళూరు) సయ్యద్ మదనీ మసీదు, దర్గా (ఉల్లాల్) సుల్తాన్ బ్యాటరీ (మంగళూరు), మంగళూరు పుత్తూర్ (కర్ణాటక) : శ్రీ మహాలింగేశ్వర యొక్క ప్రసిద్ధ దేవాలయం విట్టల్: పంచలింగేశ్వర ఆలయ ప్రసిద్ధ పురాతన ఆలయం ఉప్పినంగది: సహస్రలింగెష్వర ఆలయం. కెపు, అనంతది (బల్నదు) : దేవత ఉల్లల్థి దేవాలయానికి ప్రసిద్ధి. సోమనాథేశ్వర్ ఆలయం: సోమేశ్వర, ఉల్లాల్. వేసవి శాండ్: ఉల్లాల్ బీచ్, ఉల్లాల్. పిలికుల నిసర్గదమ: పిలికుల, మూదుసెద్దె, మంగళూరు. కుదుపు ఆలయం: కుదుపు, మంగళూరు. కుంబ్లది బలసుబ్రహ్మన్య చర్వక కపిలేస్వర దేవస్థాన శ్రీ క్షేత్ర దైపిల Climate Dakshina Kannada district features a Tropical Monsoon climate (Am) according to the Koppen-Geiger climate classification. The rainfall varies from at the Mangalore coast, at Moodabidri and at Puttur near the Western Ghats. The average humidity is 75% and peaks in July at 89%. Cultures, Traditions and rituals thumb|right|Yakshagana stage thumb|left|Traditional House in Dakshina Kannada దక్షిణ కన్నడ ఆచారాలకు, సంప్రదాయాలకు, సంస్కృతికి నిలయం. ప్రజలు ప్రస్తుత కాలంలో కూడా ఆచారాలు, సంప్రదాయాలు, మతాచారాలు అనుసరిస్తూనే ఉన్నారు. జిల్లాలో హిందూ దేవుళ్ళు, దేవతలకు చెందిన పలు ఆలయాలు ఉన్నాయి. అవి అతి పురాతనమైనవి, లోతైన ఆధ్యాత్మిక అనుబంధం కలిగి ఉన్నాయి. దక్షిణ కన్నడ ప్రజలు నాగదేవత అయిన సుభ్రహ్మణ్యస్వామిని (మురుగన్) ఆరాధిస్తుంటారు. పురాణ కథనాలను అనుసరించి జిల్లా భూభాగం సముద్ర నుండి పరశురాముని కొరకు వెలువడిందని విశ్వసిస్తున్నారు. నాగజాతిని రక్షించడానికి నాగారాధన ఆచరించబడిందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో పితృదేవతారాధన కూడా ప్రజలలో వాడుకలో ఉంది. భుటాకోల వంటి ఆరాధనా కార్యక్రమాల ద్వారా పితృదేవతలను ఆరాధిస్తుంటారు. కంబల పేరుతో వరి పొలాలలో బర్రెల పందాలు నిర్వహించబడుతుంటాయి. మతపరమైన, సాంస్కృతిక స్థాయిలో తెయ్యం దేవతలకు రక్తం, కోడిని సమర్పించడం ఆచారంగా ఉంది. సాంస్కృతిక ఉత్సవాలలో కోడి పందాలు కూడా నిర్వహించబడుతుంటాయి. A Panorama of Indian Culture: Professor A. Sreedhara Menon Felicitation Volume - K. K. Kusuman - Mittal Publications, 1990 - p.127-128"" గ్రామీణ పామర ప్రజలకు కోడి పందాలు కాలక్షేపంగా ఉంటుంది. దురదృష్టకరంగా కోడిపందాలు (కోరి కట్టా) జూదాలకు దారితీస్తున్నాయి. యక్షగానం ప్రముఖ జానపద కళగా గుర్తించబడుతుంది. సాధారణంగా యక్షగానం రాత్రంతా ప్రదర్శించబడుతూ ఉంటుంది. యక్షగానానికి తులునాడులో అత్యంత అభిమానుల ఆదరణ లభిస్తుంది. . జిల్లాలోని యువత, పెద్దవారిలో కూడా పులివేషం (హుళివేషం) ప్రత్యేక జానపద కళారూపం ప్రాబల్యం సంతరించుకుంది. ఇది మైసూరు దసరా ఉత్సవాలు, కృష్ణజమాష్టమి దినాలలో ప్రదర్శించబడుతుంది. జిల్లాలో కరడి వేష (ఎలుగుబంటు వేషం) నృత్యరూపం అధిక ప్రాబల్యం కలిగి ఉంది. ఇది మైసూరు దసరా ఉత్సవాలలో ప్రదర్శించబడుతూ ఉంది. కంబల లేక బర్రెల పందాలు వరి పొలాలలో నిర్వహించబడుతుంటాయి. దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఉగాది, కృష్ణజయంతి, గణేశచతుర్ధి, నవరాత్రి, దసరా, దీపావళి, అతి హునిమె మొదలైన హిందూ పండుగలు ఉత్సాహంగా జరుపుకుంటారు. Transport దక్షిణకన్నడ బసు సర్వీసులను ప్రైవేట్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం కర్నాటక స్టేట్ రోడ్డు ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ (కె.ఎస్.ఆర్.టి.సి) ఆధ్వర్యంలో నడుపబడుతున్నాయి. జిల్లాలో 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు నడిపే ట్రాంస్‌పోర్ట్ బసులు ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తుంది. . జిల్లాలో మూడు జాతీయరహదారులు పయనిస్తున్నాయి. ఇవి జిల్లాను కర్ణాటకలోని పలు ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయి. జాతీయ రహదారి 17 జిల్లాను ఉడిపి, కర్వార్, ముంబయి, గోవా, కొచ్చిలతో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 13 జిల్లాను షోలాపూర్‌తో అనుసంధానిస్తుంది. జాతీయరహదారి 48 జిల్లాను బెంగుళూరు, హాసన్, సక్లేష్‌పురాతో అనుసంధానిస్తుంది. మంగుళూర్ - ముదిగెరె రాష్ట్రీయ రహదారి జాతీయరహదారి 234గా ప్రకటించబడింది. జాతీయరహదారి 234 మంగుళూరును చర్మాడి, ముదిగెరె, బేలూర్, హళిబీడు, చింతామణి, వేలూరు మీదుగా తమిళనాడులోని విల్లిపురంతో అనుసంధానిస్తుంది. రైలు మార్గం సా.శ. 1907లో జిల్లా మొదటి రైలు మార్గం నిర్మించబడింది. రైలుమార్గం జిల్లాను అళికల్‌తో అనుసంధానిస్తుంది. ఈ రైలు మార్గం జిల్లాను మద్రాసు ప్రెసిడెన్సీ లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. కొంకణి రైలుమార్గం (1988) దక్షిణకన్నడ జిల్లాను మహారాష్ట్రా, గోవా, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, కేరళలతో అనుసంధానిస్తుంది. మంగుళూరు నుండి ముంబయి, తానే, చెన్నై, గోవా, త్రివేండ్రం లకు నేరుగా రైళ్ళు ఉన్నాయి. మీటర్ గేజి రైలు మార్గం బ్రాడ్ గేజిగా మార్చబడిన తరువాత బెంగుళూరు నుండి హాసన్ కుక్కి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం అనుసంధానిస్తూ మంగుళూరు వరకు రైళ్ళు నడుపబడుతున్నాయి. కేరళాలో మొదలై గుజరాత్, రాజస్థాన్, గోవా, ఢిల్లీలతో అనుసంధానించబడిన రైళ్ళు జిల్లా మీదుగా పయనిస్తున్నాయి. నౌకాశ్రయం దక్షిణకన్నడ జిల్లాలో పనంబూర్ వద్ద నౌకాశ్రయం ఉంది. ఈ నౌకాశ్యయాన్ని మంగుళూరు పోర్ట్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఇక్కడ నుండి కార్గో, టింబర్, పెట్రోలియం, క్రూడాయిల్ ఎగుమతి చేయబడుతున్నాయి. పశ్చిమభారత తీరంలో ప్రధాన నౌకాశ్రయాలలో ఇది ఒకటి. వాయిమార్గం జిల్లాకు సమీపంలోని విమానాశ్రయం " మంగుళూరు విమానాశ్రయం". (ఇది బజ్పీ వద్ద ఉంది). కర్నాటక రాష్ట్రంలో రైలుమార్గం, రహదారి మార్గం, వాయు మార్గం, నౌకా మార్గాలతో అనుసంధానితమై ఉన్న ఒకేఒక నగరం మంగళూరు నగరం ఒక్కటే. Agriculture thumb|right|Arecanut plantation in DK|link=Special:FilePath/Arecanuttrees.jpg thumb|left|Monsoon scene of rural Dakshina Kannada జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధాన జివనాధారాంగా ఉంది. ఇతర రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడిన ప్రజలద్వారా వచ్చి పడుతున్న పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం వ్యవసాయం మీద ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. ఈ జిల్లా నుండి గుర్తించతగినంత మంది దేశంలోని ఇతర రాష్ట్రాలు, గల్జ్ దేశాలలో పనిచేస్తూ ఉన్నారు. పొలాలు, తోటలు నివాసగృహాలు, షాపింగ్ కాంప్లెక్సులుగా మార్చబడుతున్నాయి. కూలీలు అధికం కావడం, శ్రామికులు లభించక పోవడం మొదలైన కారణాలతో హార్టికల్చర్ కూడా వెనుకబడి పోతుంది. అసమానమైన భౌగోళిక పరిస్థితులు, వ్యవసాయ భూములు చిన్న చిన్న భూభాగాలుగా ఉన్నందున యంత్రాలవాడకం సాధ్యపడడం లేదు. జిల్లాలో ప్రధానంగా వరి, కొబ్బరి, పోక, నల్లమిరియాలు, కోకో పండించబడుతున్నాయి. వార్షికంగా వరి మూడు మార్లు పండించబడుతుంది. కార్తిక (యెనెల్) (మే నుండి అక్టోబరు) సుగ్గి (అక్టోబరు నుండి జనవరి), కొలకె (జనవరి నుండి ఏప్రిల్) మాసాలలో వరి పండించబడుతుంది. వరి పంటకు నీరు పుష్కలంగా లభించడమే అందుకు కారణం. సుగ్గి సీజన్లో కొన్ని ప్రాంతాలలో మినుములు పండించబడుతున్నాయి. కూరగాయలు, పండ్లు, పూతోటలు స్వంత ఉపయోగానికి పండించబడుతున్నాయి. వీటి అమ్మకం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొరకు జిల్లాలోని పలు తాలూకాలలో (ఎ.పి.ఎం.సి) మార్కెట్ నిర్వహించబడుతుంది. మంగుళూరు లోని కులశేఖర వద్ద ది కర్నాటక మిల్క్ ఫెడరేషన్ పనిచేస్తుంది. ఈ ప్లాంటు వ్యవసాయదారుల పశువుల నుండి పాలను సేకరించి ప్రజలకు విక్రయిస్తుంది. ఆర్ధికం జిల్లా " క్రేడిల్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ " అని పిలువబడుతుంది. అలాగే కర్నాటక రాషట్రంలో అధికంగా పారిశ్రామీకరణ చేయబడిన జిల్లాగా గుర్తించబడుతుంది. కనరాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, విజయ బ్యాంక్, ప్రైవేట్ సెక్టరుకు చెందిన కర్నాటక బ్యాంకు మొదలైన జాతీయం చేయబడిన ప్రధాన బ్యాంకులు ఈ జిల్లాలో ఆరంభం అయ్యాయి. thumb|200px|right|Houses with Mangalore Tiles మంగుళూరు పెంకులు (ఎర్రమట్టి పెంకులు), జీడిపప్పు తయారీ పరిశ్రమలు, బీడి పరిశ్రమలు ఒకప్పుడు ఈ జిల్లాలో ఉచ్చస్థితిలో ఉండేవి. సేవారంగం, ప్రొఫెషనల్ ఎజ్యుకేషన్ ఇంస్టిట్యూట్లు, ఇంఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నాయి. జిల్లా అరేబియన్ సముద్రతీరంలో ఉంది. సముద్రతీరంలో ఉన్న కారణంగా చేపలు పట్టడం ప్రజల ప్రధానవృత్తిగా మారింది. బుండర్ (పాత నౌకాశ్రయం), పనంబూర్, కోటేశ్వర్, ససిహితులు. జిల్లాలో ప్రధాన పరిశ్రమలు మంగుళూరు పరిసరప్రాంతాలలో కేంద్రీకరించబడి ఉన్నాయి. మంగుళూరు కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, (ఎం.ఎఫ్.సి), కుద్రెముఖ్ ఇరన్ ఓర్ కంపనీ లిమిటెడ్, కనరా వర్క్ షాప్స్ లిమిటెడ్ (కనరా స్ప్రింగ్స్ తయారీ), మంగుళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికస్ లిమిటెడ్ బి.ఎ.ఎస్.ఎఫ్. టోటల్ గాజ్, భారతి షిప్యార్డ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎల్), మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలోని పుత్తూరు వద్ద కాంప్కొ నిర్వహిస్తున్న చాక్లెట్ తయారీ కంపనీ ఉంది. ఐ.టి ప్రధాన ఇంఫర్మేషన్ టెక్నాలజీ, ఔట్ సౌర్సింగ్ మంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. జిల్లాలో ఇంఫోసిస్, లేజర్‌సాఫ్ట్ సిస్టంస్ లిమిటెడ్, ఎంఫాసిస్ బి.పి.ఒ మొదలైన ఐ.టి కంపనీలు ఉన్నాయి. విప్రొ కంపనీ కూడా మంగుళూరులో స్థిరపడే ప్రయత్నాలు చేస్తుంది. ఐ.టి డెడికేటెడ్ కంపనీలు నిర్మాణదశలో ఉన్నాయి. గంజిమఠ్ వద్ద " ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ " (ఇ.పి.ఐ.పి) ఒకటి, మంగుళూరు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మరొక ఐ.టి సెజ్ నిర్మాణదశలో ఉన్నాయి. మూడవ ఐ.టి సెజ్ గంజిమఠ్ వద్ద ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది. ఆయిల్, గ్యాస్ కాత్పొరేషన్ ఒ.ఎన్.జి.సి. 35,000 కోట్ల పెట్టుబడితో " మల్టీ ప్రొడక్ట్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) స్థాపించాలని యోచిస్తుంది. . 2 మిలియన్ చదరపు అడుగుల వైశాల్యంలో మరొక ఐ.టి సెజ్ నిర్మాణదశలో ఉంది. ఇది వ్యాపారకూడలి, కాంవెంషన్ కూడలి, మ్మాల్, హెలిపాడ్ సౌకర్యాలతో కూడుకుని ఉంటుందని భావిస్తున్నారు . Demand for a separate Tulunadu state స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగిన సమయంలో తులువ ప్రజలు తులువ భాషకు అధికార హోదా, ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాటం సాగించారు. ప్రస్తుత కర్ణాటక రాషంలోని దక్షిణ కన్నడ, ఉడిపి, కేరళ రాషంలోని కాసరగాడ్ జిల్లాలను కలిపిన భూభాన్ని కలిపి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం సాగించారు. తరువాత ఇది కొంత ఆణిచివేయబడినప్పటికీ సమీపకాలంగా ఈ కోరిక తిరిగి బలపడుతూ ఉంది. తులు రాజ్య హోరాట సమితి వంటి సంస్థలు ఈ కోరికను కేంద్రీకరించి తరచుగా సమావేశాలు, ప్రదర్శనలు తులువనాడు లోని పట్టణాలలో పోరాటం సాగిస్తున్నారు. తులు అధికారభాషగా చేయడం, తులువనాడులో తులువ భాషను బోధనా భాషగా చేయడం, తులు సంప్రదాయ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఈ పోరాటానికి ప్రధానాంశాలుగా పోరాటం కొనసాగుతూనే ఉంది. .http://webcache.googleusercontent.com/search?q=cache:TF4m2ofQx1UJ:www.deccanherald.com/Archives/oct222006/district1955220061020.asp+tulu+separate+state&cd=6&hl=en&ct=clnk&gl=in See also దక్షిణ కనర మంగుళూరు సులియా బెల్తనగడి పుత్తూరు బంత్వాల్ ఉడిపి కాసగగాడ్ డబల్యూ.టి.ఎన్. మిస్ మంగుళూరు మూలాలు బయటి లింకులు Official web site List of places in Dakshin-Kannad DK Zilla Parishad వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:కర్ణాటక జిల్లాలు
గదగ్ జిల్లా
https://te.wikipedia.org/wiki/గదగ్_జిల్లా
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో గదగ్ జిల్లా ఒకటి. గదగ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 1997లో ధర్వాడ జిల్లాలోని కొంతభూభాగం తీసుకుని గదగ్ జిల్లా రూపొందించబడింది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 971,952. వీరిలో 35.21% ప్రజలు నరర వాసితులు. 1991 - 2001 నుండి 13.14% అభివృద్ధి చెందింది. సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా ఉత్తర సరిహద్దు బాగల్‌కోట్ తూర్పు సరిహద్దు కొప్పల్ ఆగ్నే సరిహద్దు బళ్ళారి ఆగ్నేయ సరిహద్దు హవేరి పశ్చిమ సరిహద్దు దర్వాడ వాయవ్య సరిహద్దు బెల్గాం విభాగాలు జిల్లాలో పశ్చిమ చాళుఖ్య సాంరాజ్యానికి చెందిన పలు హిందూ, జైన స్మారకచిహ్నాలు ఉన్నాయి. గదగ్ జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి. గడగ్-బెత్గెరి, రాన్ (కర్ణాటక), షిర్హత్తి, నార్గుండ్, లక్ష్మేష్వర, గజెంద్రగద్, ముందర్గి. చరిత్రాత్మక ప్రదేశాలు thumb|left|150px|alt=Old, dark building with ornate carvings|గడగ్ లోని త్రికుటేశ్వర ఆలయ సముదాయంలో సరస్వతి ఆలయం thumb|right|150px|alt=Tall, dome-shaped building against blue sky|లక్ష్మేశ్వర వద్ద సోమేశ్వర ఆలయం thumb|right|150px|alt=Two tall, narrow monuments with black stones on their sides|కల్కాలేశ్వర ఆలయం ముందు, గజేంద్రగడ్ thumb|right|150px|alt=Old temple with two domed towers|సుడి వద్ద జంట-టవర్ల ఆలయం thumb|right|150px|alt=Tall, ornate building with covered area on the right|లక్కుండి వద్ద జైన దేవాలయం thumb|right|150px|alt=Tall, ornate building with low entrance|దంబల్ వద్ద ఉన్న దొడ్డబసప్ప ఆలయం Gadag జిల్లాలో 11 - 12 వ శతాబ్ధానికి చెందిన స్మారకచిహ్నాలు. వీరనారాయణ ఆలయం, త్రికూటేశ్వర ఆలయ సమూహం, జైన మత సంరదాయానికి చెందిన మహావీరుని ప్రధాన ఆలయం వంటి చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయి. త్రికూటేశ్వర ఆలయ సమూహం త్రికూటేశ్వర ఆలయ సమూహం ఆరంభకాల చాళుఖ్యులచేత 6-7 శతాబ్ధాలలో నిర్మించబడింది. ఇది చాళుఖ్యుల నిర్మాణకౌశలానికి ఉదాహరణగా నిలిచింది. ఆలయ ప్రధాన దైవం " శరవస్తి ". వీరనారాయణ ఆలయం అనేక మంది భక్తులను ఆకర్షిస్తున్న వీరనారాయణ ఆలయం 11 వ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. జుమ్మామసీదు జుమ్మామసీదులో 600 మంది ఒకేసారి ప్రార్ధించగలిగిన అవకాశం ఉంది. 17-18 వ శతాబ్ధాలలో గదగ్‌ను ముస్లిములు పాలించిన సమయంలో ఈ మసీదు నిర్మించబడింది. జిల్లా భూభాగం తరువాత మరాఠీలు ఆతరువాత బ్రిటిష్ ఆధీనంలో ఉంది. లక్ష్మేష్వర సిరహట్టిలో ఉన్న లక్ష్మేష్వరలో పలు హిందూ, జైన ఆలయాలు, మసీదులు ఉన్నాయి. సోమేశ్వర ఆలయసమూహంలో పలు శివాలయాలు ఉన్నాయి. ఇది కోట వంటి ప్రాకారం లోపల నిర్మించబడింది. సుది చాళుఖ్యుల జోడిగోపుర, మల్లిఖార్జునాలయాలు, బృహత్తర గణాశ, నంది శిల్పం మొదలైన స్మారకచిహ్నాలు. లకుండి గదగ్ నుండి 12 కి.మీ దూరంలో ఉన్న లక్కుండి చాళుఖ్యరాజుల నివాస ప్రదేశంగా ఉంది. ఇక్కడా 101 మెట్లున్న కల్యాణి అనే బావి ఉంది. ఇక్కడ హిందూ, జైన ఆలయాలు ఉన్నాయి. పురాతత్వ శాఖ నిర్వహణలో ఒక శిల్పప్రదర్శన శాల ఉంది. దంబల్ దంబల్ 12వ శతాబ్ధానికి చెందిన చాళుఖ్య కాలానికి చెందిన దొడ్డబసప్ప ఆలయం ఉంది. గజేంద్రగాడ్ గజేంద్రగాడ్ ఒక కొండ మీద నిర్మించబడిన కోట. ఇక్కడ కాలకాళేశ్వర ఆలయం ఉంది. హర్తి హర్తిలో పలు హిందూ ఆలయాలు ఉన్నాయి. బసవేశ్వర ఆలయాలు ఆలయాలంలో వార్షిక ఉత్సవాలు, ఊరేగింపులు ఉన్నాయి. పార్వతి పరమేస్వరాలయం (ఉమా మహేశ్వరాలయం)లో చాళుఖ్యరాజుల కాలంనాటి కుడ్యశిల్పాలు ఉన్నాయి. కొటుమచగి గదగ్ పట్టణానికి 12 కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయ గ్రామం కొటుమచగి. ఇక్కడ సోశ్వర, దుర్గాదేవి, చామరాస ఆలయాలు ఉన్నాయి. ఇది కన్నడ రచయిత ప్రభులింగ్లీలె జన్మస్థలం. నరేగల్ నరేగల్ వద్ద రాష్ట్రకూటులు నిర్మించిన పెద్ద జైన ఆలయం ఉంది. హొంబల్ గడగ్ నుండి 12 కిలోమీటర్ల (7.5 మైళ్ళు) దూరంలో ఉన్న ఈ గ్రామం పాత దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. రాన్ రాన్ వద్ద అనంతసాయి గుడి, ఈశ్వర గుడి, కాలా గుడి, లోకనాథ ఆలయం, మల్లికార్జున గుడి,ంపత్స్వనాథ్ జైన ఆలయం, సోమలిగేశ్వర ఆలయం మొదలైన చారిత్రక స్మారకచిహ్నాలు ఉన్నాయి. కుర్తకోటి కుర్తకోటి గదగ్ నుండి 16 కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయ ఆధారిత గ్రామం. ఇక్కడ ఉగ్రనరసింహ ఆలయం, దత్తాత్రేయ ఆలయం, విరూపాక్షలింగ, రామా ఆలయం ఉన్నాయి. రామా, రామాలయంలో లక్ష్మణ, సీత విగ్రహాలను బ్రహ్మచైతన్య స్థాపించాడు. ఇది కన్నడ రచయిత కీర్తినాథ్ కుర్తకోటి స్వస్థలం. నర్గుండి నర్గుండిలో ఉన్న 17వ శతాబ్ధపు కోట 1857లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తురుగుబాటులో ప్రధానపాత్ర వహించింది. దొని తండ గదగ్ నుండి 24 కి.మీ దూరంలో ఉన్న దొని కొండ పవనశక్తికి ప్రత్యేకత పొందింది. బెలధాడి గదగ్ నుండి 10 కి.మీ దూరంలో ఉన్న బెలదాడిలో రామాలయం ఉంది. అంతూరు గదగ్ నుండి 23 కి.మీ దూరంలో వ్యవసాయ గ్రామం " శ్రీ జగద్గురు బుదిమహేశ్వమిగళ సంస్తాన్ మఠం ఉంది. మఠాన్ని హిందువులు, క్రైస్తవులు సంరక్షిస్తున్నారు. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 1,065,235, ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. రోలే ద్వీపం నగర జనసంఖ్యకు సమం.. 640 భారతదేశ జిల్లాలలో. 426 వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 229 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.61% స్త్రీ పురుష నిష్పత్తి. 978:1000 జాతియ సరాసరి (928) కంటే. అధికం అక్షరాస్యత శాతం. 75.18 %. జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ మగడి పక్షుల శరణాలయం మగడి పక్షుల శరణాలయం, మగడి పక్షుల శరణాలయం వైశాల్యం 26 చ.కి.మీ. ఇది గదగ్ - బెంగుళూరు రహదారిలో ఉంది. ఇది షిర్హట్టి నుండి 8 కి.మీ దూరంలో, కక్ష్మృశ్వర్ నుండి 11 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ బార్- హెడ్డేడ్ గూస్ వంటి వలస పక్షులు వస్తుంటాయి. అవి వ్యవసాయ పక్షిలు, చేపలను ఆహారంగా తీసుకుంటాయి. ప్రముఖులు కుమారవ్యాస :- జంట కవులు కొలివాడ (గదగ్), చామరస మహాభారతాన్ని కన్నడ భాషలోకి (మహాభారత కథామంజరి), ప్రభులింగలీలె అనువదించారు. గనయొగి పంచాక్షరీ గవయి హిందూస్థాని గాయకుడు భారత రత్న భీంసెన్ జోషి. పుట్టరాజ్ గవయి. Rajguru Guruswami Kalikeri గనయోగి పంచాక్షరీ గవయి. హిందూస్థాని గాయకుడు భారత రత్న భీమేష్ జోషి. పుట్ట్రాజ్ గవయి. సునిల్ జోషి (క్రికెట్ క్రీడాకారుడు) సయ్యద్ షాహ్ సూఫిసాబ్ అలైస్ డాక్టర్ బి. బి.పీర్జడే స్వాతంత్రసమరం నారాయణ రావు షంకర్ రావు కంపలి, మార్తాండరావు నర్గుండ్కర్ ఆయన అనుయాయులు భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. సహకార ఉద్యమం కనగినహల్‌లో భారతదేశంలో మొదటిసారిగా (100 సంవత్సరాలు దాటింది) సహకార ఉద్యమం ఆరంభించబడింది. తరువాత కె.హెచ్.పటేల్ దీనికి అధుకరణీకరణ కార్యక్రమం చేపట్టాడు. పవన విద్యుత్తు జిల్లాలోని గజేంద్రగాడ్, కప్పటగుడ్డ, కుర్కొటి లలో పవన విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది. See also ఉత్తర కర్ణాటక ఉత్తరకర్ణాటక పర్యాటకం లక్కుండి సుండి లక్ష్మేశ్వర గజేంద్రగాడ్ దంబల్ దొడ్డబసప్ప ఆలయం నరెగల్, గదగ్ మహదేవ ఆలయం ఇతాగి భీమాంబిక మూలాలు వెలుపలి లింకులు వర్గం:గదగ్ జిల్లా వర్గం:1997 స్థాపనలు వర్గం:బెల్గాం డివిజన్ వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:కర్ణాటక వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు
హవేరి జిల్లా
https://te.wikipedia.org/wiki/హవేరి_జిల్లా
హవేరి, కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా, పట్టణం. ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనుకూలంగా అనేక చూడవలసిన ప్రదేశాలున్నాయి.. కనుక పర్యాటకులను ఈ ప్రదేశం విశేషంగా ఆకర్షిస్తుంది. జిల్లా మపఖ్యపట్టణం హవేరి, భౌగోళికం హవేరి జిల్లా సరిగ్గా కర్ణాటక మధ్యలో ఉంది, ఇది ఉత్తరాన బీదర్ నుండి దక్షిణాన కొల్లెగల్ వరకు సమానంగా ఉంది. ఈ జిల్లాలో హనగల్, షిగ్గావ్, సవనూర్, హవేరి, భయాదగి, హిరేకెరూర్, రణెబెన్నూర్ అనే ఏడు తాలూకాలు ఉన్నాయి. ఇది ఉత్తరాన ధార్వాడ్ జిల్లా, ఈశాన్యంలో గడగ్ జిల్లా, తూర్పున బళ్లారి జిల్లా, దక్షిణాన దావంగెరే జిల్లా, నైరుతిలో షిమోగా జిల్లా, పశ్చిమ, వాయవ్య దిశలో ఉత్తర కన్నడ సరిహద్దులుగా ఉన్నాయి. దీనిని సొంత జిల్లాగా మార్చడానికి ముందు, ఇది ధార్వాడ్ జిల్లాలో భాగం. హవేరి బెంగళూరు నుండి 335 కి. హవేరి జిల్లా యొక్క పరిపాలనా, రాజకీయ ప్రధాన కార్యాలయం కాగా, దక్షిణాన రాణెబెన్నూర్ ఒక వ్యాపార కేంద్రంగా ఉంది. హవేరి జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, గ్రామాలు: హవెరి :- జిల్లా పాలనా, సంస్కృతి, రాజకీయ కేంద్రం. జిల్లా పశు సంపదకు, ఆయిల్ మిల్లులకు, పత్తి మార్కెటుకు ప్రసిద్ధి. హవేరి " హవేరి న్యాయ " విధానానికి ప్రసిద్ధి. ఇది వివాదాలను సంప్రదాయ పద్ధతిలో పరిష్కరిస్తుంది. హౌంసభవి :- ప్రముఖ విద్యాకేంద్రంగా గుర్తించబడుతుంది. (మృత్యుంజయ విద్యాపీఠం). హంగల్ :- తాలూకా ప్రధాన కార్యాలయం, ఇక్కడ అందమైన తారకేశ్వర్ ఆలయం ఉంది. అక్కి- ఆలూర్ :- సిటీ ఇన్ హంగల్ తాలూకా. " రైస్ బౌల్‌గా ప్రసిద్ధి చెందింది ". ఇది సరసులకు, తోటలకు ప్రసిద్ధి చెందింది. కుమార్ పట్టణం :- ఇక్కడ తుంగభద్రా తీరంలో బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. బైయాద్గి :- బైయాద్గి మిరపకాయలకు ప్రసిద్ధి. బంకపురా :- " బంకపూర్ కంసర్వేషన్ రిజర్వ్ " ఇది నెమళ్ళ అభయారణ్యంగా ప్రదిద్ధి చెందింది. రాణేబెన్నూరు :- ఇది ప్రముఖ వ్యాపార కేంద్రం. కగ్నెలె :- " కగ్నెలె కనక గురు పీఠం " ఇది ఒక ఆధ్యాత్మిక మఠం (సంస్థ). ఇది కనకదాస ౠషి పేరున స్థాపించబడింది. రాత్తిహళ్ళి :- ఇది హిరెకెరూర్ తాలూకా లోని ఒక పట్టణం. ఇక్కడ అందమైన కదంబేశ్వరాలయం ఉంది. గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 1,598,506, ఇది దాదాపు. గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. 312 వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 331 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.08%. స్త్రీ పురుష నిష్పత్తి. 951:1000 జాతియ సరాసరి (928) కంటే. అధికం అక్షరాస్యత శాతం. 77.6%. జాతియ సరాసరి (72%) కంటే. అధికం పర్యాటక ఆకర్షణలు thumb|250x250px| హవేరి ప్రాంతం పర్యాటక పటం, ఉత్తర కర్ణాటక వన్యప్రాణి అభయారణ్యం (రనెబెన్నుర్:హవేరి జిల్లా) సిద్ధెస్వర ఆలయం (హవేరి) దేవత ద్యమవ్వ మహాదేవ హవనుర్ హుక్కెరి మఠం (హవేరి) తారకేశ్వర్ వద్ద (హనగల్) నగరెష్వర్ వద్ద (బనకపురా) ముక్తెష్వర ఆలయం (చౌదయ్యదనపుర) గలగెష్వర ఆలయం (గలగనథ) రత్తిహల్లి వద్ద కదంబెస్వర ఆలయం సోమేశ్వర్ (హరలహల్లి) జైన మందిరం (యలవత్తి) ఆలయాలు కగినెలె (కనకదస) అన్వెరి ఆలయం (హోల్) అంజనెయస్వమి ఆలయం (కదరమందలగి) మైలర లింగెశ్వర ఆలయం (మైలర గుత్తల) సమీప ంలో గుడ్డ గుడ్డాపుర వద్ద మల్లరి ఆలయం (రనెబెన్నూరు) సంగమెశ్వర్ ఆలయం (కుదల్, హంగల్, నరెగల్ నుండి 2.కి.మీ) బసవేశ్వర ఆలయం (హొంబలి, హంగల్) మల్లికార్జున దేవాలయం (విలేజ్ నరెగల్) thumb|250px|హవేరి జిల్లా చౌడయ్య దానపురలో ముక్తేశ్వరాలయం. thumb|right|250px|గలగనాథ గలగేశ్వర మందిరం, హవేరి జిల్లా కగినెళ ఆలయాలు కగినెళి మహాసంస్థాన కనకగురుపీఠ ఆదికేశవ ఆలయం వీరభద్రుని ఆలయం సోమేశ్వర ఆలయం సంగమేశ్వర దేవాలయం ఖలహస్తెష్వర ఆలయం నరసింహ ఆలయం లక్ష్మీ ఆలయం హందిగనుఒర్ వన్యప్రాణి సంక్చురి (రనెబెన్నుర్: హవేరి జిల్లా) జైన్ ఆలయం (బలంబీడ్) శిద్దరుద ఆలయం (చిక్కల్లి) హొంబన్న బావి (ఆక్కీలుర్ గ్రామం) రాణిబెన్నూరులో ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ప్రముఖులు కనకదాస :- కనకదాస జిల్లాలోని బాబా గ్రామంలో జన్మించాడు. మైలర మహదేవప్ప :- బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం సాగించాడు. ఆయన జిల్లాలోని మోతెబెన్నూర్ జిల్లాలో జన్మించాడు. సిద్దప్ప్ హోసమనీ కరజ్గి :- స్వాతంత్ర్య సమర యోధుడు. ఆయన తన స్థానిక ప్రదేశం అయిన కరజ్గి వద్ద బ్రిటిష్ వారిని అడ్డగించాడు. ఆయన గొప్ప న్యాయవాది. ఆయన సుభాస్ చంద్రబోసుతో అన్యోన్య సంబంధాలు ఉన్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంటుగా పనిచేసాడు. పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన హవేరీలో ఉన్న ముంసిపల్ హై స్కూల్ స్థాపించాడు. పేదల కొరకు సేవలు అందించాడు. ఆయన శిల్పం కె.ఎస్.ఆర్.టి.సి బస్ స్టాండు వద్ద ఉన్న హవేరీ జిల్లా ప్యాలెస్‌లో స్థైంచబడింది. గుడ్లెప్ప హల్లికెరె :- స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన హోసరెట్టి ప్రాంతానికి చెందిన వాడు.హోసరట్టిలో " ఆయన గాంధీ గ్రామీణ గురుకుల్ " రెసిడెంషియల్ స్కూల్ స్థాపించాడు. శాంతా షిషునల్ షరీఫ్ :- ఆయన గొప్ప కవి, 19వ శతాబ్ధానికి చెందిన తాత్వికవాది. ఆయన వ్రాసిన జానపద గేయాలు సజీవంగా ఉన్నాయి. ఆయన హవేరీ జిల్లాలోని షిగ్గావ్ తాలూకాలోని షిషువినల్‌కి చెందిన వాడు. రామన్నద్ మన్నగి :- ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. ఆయన జంగమన కొప్ప వద్ద ఒక ఆశ్రమం స్థాపించాడు. ఇది హవేరి పట్టణం నుండి 5 కి.మీ దూరంలో ఉంది. సుబ్బాన్న ఎక్కుండి :- సాహిత్య అకాడమీ గ్రహీత. (2011 జనవరి). పుట్టరాజ్ గవైగళు :- ఆయన హవేరి జిల్లాలోని దేవగిరిలో జన్మించాడు. ఆయన గొప్ప హిందూస్థానీ సంప్రదాయ గాయకుడు. ఆయన గడగ్ వద్ద " వీరేశ్వర పుణ్యాశ్రమం " స్థాపించాడు. పండిత్ పండి పంచాక్షరీ గవైగళ్ :- జిల్లాలోని కడా షెట్టిహళ్ళి తాలూకాలో జన్మించాడు. గలగనాథరు :- ఆయన గలగనాథ్‌కు చెందిన గొప్ప రచయిత. సరవజ్నయ :- ఆయన జిల్లాలోని అబలురు హిరెకెరూరు తాలూకాకు చెందిన వాడు. వి.కె. గొకక్ :- గొప్పరచయిత. ఙాఅనపీఠ అవార్డ్ గ్రహీత. ఆయన జిల్లాలోని సవనూర్ లో జన్మించాడు. జూనియర్ రాజ్‌కుమార్ :- అశోక్ బస్తి జిల్లాలోని దేవగిరి తాలూకాలో జన్మించాడు. ఎన్ బసవర ఆయన గుడగేరి జిల్లాలో జన్మించాడు. ఆయన గొప్ప నటుడు, నాటక కంపెనీ స్వాతదారుడు. బి.సి. పత్ని :- కన్నడ చిత్రనటుడు. ఆయన జిల్లాలోని యలివలలో జన్మించాడు. మహేష్ బిక్షవర్తిమఠం :- రీజనల్ హెడ్ ఆఫ్ కర్ణాటక జీ. ఆయన హవేరి జిల్లాకు చెందినవాడు. విద్యా సంస్థలు పాఠశాలలు సాయి-చంద్ర గురుకుల్, బసవేశ్వర్ నగర్. మునిసిపల్ హై స్కూల్ జీన గంగా శిక్షణ సమితి కన్నడ మీడియం పాఠశాల, ఉన్నత పాఠశాల, (కూడా గెలెయార బలాగా అని పిలుస్తారు) కె.ఎల్.ఇ ఇంగ్లీష్ మీడియం సి.బి.ఎస్.సి స్కూల్ జే.పి. రోటరీ స్కూల్ లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హుక్కరిమఠం శివబశ్వేశర హై స్కూల్ (హవేరి) శ్రీ మురళి దేశాయ్ రెసిడెన్షియల్ హై స్కూల్ (నెగలూర్) కర్ణాటక పబ్లిక్ స్కూల్ (హంగల్ రోడ్ హవేరి) కళాశాలలు గుడ్డెప్ప హళ్ళికేరి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ కె.ఎల్.ఇ ఆఫ్ సి.బి. కొల్లి పాలిటెక్నిక్ కళాశాల కర్ణాటక పబ్లిక్ స్కూల్ (హంగల్ రోడ్ హవేరి) ఎస్.జె.ఎం.కాలేజ్ ( హోదమఠం అని కూడా ) పిలుస్తారు ఆర్.టి.ఇ.ఎస్. చట్టం. కాలేజ్, రాణెబెన్నూర్. ఇది కూడ చూడు ఉత్తర కర్ణాటక ఉత్తర కర్ణాటక పర్యాటకం రాణేబెన్నూరు చౌడయ్యదనపురా గలగనాథ్ హంగల్ కుండగోల్ బల్లిగవి హవేరి మూలాలు వెలుపలి లింకులు వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు
ఉత్తర కన్నడ జిల్లా
https://te.wikipedia.org/wiki/ఉత్తర_కన్నడ_జిల్లా
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో ఉత్తరకన్నడ (ఉత్తర కనర) జిల్లా ఒకటి. సరిహద్దులు సరిహద్దులు సరిహద్దు వివరణ జిల్లా ఉత్తర సరిహద్దు గోవా రాష్ట్రం, బెల్గాం జిల్లా తూర్పు సరిహద్దు ధ్వార్వాడ, హవేరి జిల్లాలు దక్షిణ సరిహద్దు షిమోగా, ఉడిపి పశ్చిమ సరిహద్దు అరేబియన్ సముద్రం చరిత్ర thumb|250px|Kali River & Sadashivgad Fort as seen from Nandangadda Village|link=Special:FilePath/Sadashivgad_Fort_&_Kali_Bridge_as_seen_from_Nandangadda_Village.jpg ఉత్తరకన్నడ కదంబ సామ్రాజ్యానికి (350-525) స్వస్థలంగా ఉంది. వారు బనవాసిని కేంద్రంగా చేసుకుని పాలన సాగించారు. కదంబాలను చాళుక్యులు జయించిన తరువాత జిల్లా ప్రాంతాన్ని చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయశిలలు, విజయనగర చక్రవర్తులు పాలించారు. ప్రఖ్యాత యాత్రీకుడు ఇబ్న్ బటూటా నవయాత్ సుల్తాన్ జమాల్ ఆల్- దిన్ కాలంలో ఈ ప్రాంతంలో హున్నూరు వద్ద కొంతకాలం నివసించాడు. ఈ ప్రదేశం ప్రస్తుతం హొన్నవర్ పట్టణంలో ఉండేది. మసీదు శిథిలాలు, చిన్న మీనారు కూడా ఇప్పుడీ గ్రామంలో ఉన్నాయి. 1750లో ఈ జిల్లాభూభాగం మరాఠీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత మైసూర్ రాజ్యంలో ఉండేది. తరువాత 1799లో జరిగిన 4వ మైసూరు యుద్ధంలో ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వబడింది. ఇది ముందుగా మద్రాసు ప్రెసిడెన్సీలోని కనరా జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత 1859లో జిల్లా ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలుగా విభజించబడింది. 1862లో చివరిగా ఉత్తర కన్నడ జిల్లా బాంబే ప్రొవింస్‌కు మార్చబడింది. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత బాంబే ప్రెసిడెన్సీ పునర్విభజన చేయబడిన తరువాత బాంబే రాష్ట్రం రూపుదిద్దుకుంది. 1956లో బంబే రాష్ట్ర దక్షిణ ప్రాతం మైసూరు రాష్ట్రంలో విలీనం చేయబడింది. 1972లో మైసూరు రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం అయింది. ఉత్తర కన్నడ నెదర్లాండ్ (డచ్), పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రిటిష్, అరేబియన్లతో వ్యాపారసంబంధాలు ఉన్న పురాతన నగరం. ఇబ్న్ బటూటా తన యాత్రలో భాగంగా రెండు మూడు మార్లు ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళాడు. చారిత్రక ప్రసిద్ధి చెందిన అందమైన సదాశివగాడ్ కోట ప్రస్తుతం ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇది కాళీనదీతీరంలో వంతెన వద్ద ఉంది. కాళీనది అరేబియన్ సముద్రంలో సంగమిస్తున్న ప్రదేశంలో ఈ కోట నిర్మించబడి ఉంది. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్1882లో ఉత్తరకన్నడ ప్రాంతాన్ని సందర్శించాడని భావిస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాకూర్ ఒక అధ్యాయం పూర్తిగా ఈ నగరాన్ని గురించి వర్ణించాడు. .Uttara Kannada in Tagore's memoirs 22 సంవత్సరాల రవీంద్రనాథ్ ఠాకూర్ తన అన్న సత్యేంద్రనాథ్ ఠాకూర్ వద్ద కొంతకాలం నివసించాడు. సత్యేంద్రనాథ్ ఠాకూర్ ఉత్తర కన్నడ జడ్జిగా పనిచేసాడు. ఈ ప్రాంతంలో గుర్తించతగినన్ని చార్డో కుటుంబాలు ఉన్నాయి. వీరు గోవాలో పోర్చుగీస్ సాగించిన హింసకు భాయపడి ఈ ప్రాంతానికి వలస వచ్చారు. పోర్చుగీస్ చింటకోరా (ఇది చిత్రకూల్, చిట్టకుల, సిద్పూర్ అని పిలువబడింది). ఈ కోటను సదాశివగాడ్ నిర్మించాడు. తరువాత ఈ గ్రామానికి సదాశివగాడ్ అని పేరు వచ్చింది. పీర్ కోటలో ప్రసిద్ధి చెందిందిన షాకరముద్దీన్ దర్గా ఉంది . 1510లో దీనిని పోర్చుగీసులు ఆక్రమించి కాల్చి వేసారు. కాళీ నదీ సంగమ ప్రాంతం ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేది. సదాశివగాడ్ కోటను నిర్మించిన తరువాత ఈ నౌకాశ్రయం ప్రాముఖ్యత సంతరించికుంది. పోర్చుగీసువారు ఈ నౌకాశ్రయ ప్రాముఖ్యతను గ్రహించి దీని మీద దాడి చేసారు. British 1638లో ఉత్తరకన్నడలో బ్రిటిష్ వ్యాపార బృందం ఒక పరిశ్రమను స్థాపించారు. కాళీనదికి 6 కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు కడ్వాడ్. ప్రముఖ వాణిజ్య నౌకాశ్రయంగా ఉన్న ఈ ప్రాంతానికి అరేబియా, ఆఫ్రికా నుండి వ్యాపారులు తరచుగా వచ్చిపోతూ ఉండేవారు. బైకోల్ కోట (ప్రస్తుత ఉత్తరకన్నడ సివిల్ పోర్ట్) సహజ నౌకాశ్రయంగా ప్రసిద్ధి చెందింది. బైకోల్ అంటే రక్షణ అని అర్ధం. ఇక్కడ నుండి పలుచని వస్త్రాలు అధికంగా ఎగుమతి చేయబడినప్పటికీ ఉత్తర కన్నడ నుండి నల్ల మిరియాలు, యాలుకలు, కాసియర్, పత్తితో చేసిన నీలివర్ణ ముతక వస్త్రాలు కూడా ఎగుమతి చేయబడేవి. గోవాకు 50 కి.మీ దూరంలో భారతీయ పశ్చిమతీరంలో ఉన్న ఉత్తర కన్నడ సురక్షిత నౌకాశ్రయంగా పేరు పొందింది. 1649లో కోర్టీన్ అసోసియేషన్ ఈస్టిండియా కంపనీతో విలీనం అయింది. తరువాత ఉత్తర కన్నడ కంపనీ ఫ్యాక్టరీగా మారింది. Kingdom of Mysore 1784లో టిప్పు సుల్తాన్, ఈస్టిండియా కంపనీ మద్య జరిగిన ఒప్పందంలో ఉత్తరకన్నడ, సదాశివగాడ్ (కార్వర్, సదాశివ్గుడే) ప్రస్తావన ఉంది. . బ్రిటిష్ సామ్రాజ్యం 1882లో బ్రిటిష్ సామ్రాజ్యం. ఉత్తరకన్నడను వారి జిల్లాకేంద్రంగా చేసారు. 1862 నుండి బాంబే ప్రెసిడెన్సీలో విలీనం చేయబడిన తరువాత బాంబే - కొలంబోల మద్య ఉత్తరకన్నడ ప్రథమశ్రేణి నౌకాశ్రయంగా గుర్తించబడింది. Geography and climate thumb|250px|Karwar Evening|link=Special:FilePath/Karwar_Evening.jpg జిల్లాలోని ప్రధాన భౌగోళికాంశం పశ్చిమ కనుమలు లేక సహ్యాద్రి పర్వతావళి. జిల్లాలో ఇవి ఉత్తరదక్షిణాలుగా విస్తరించి ఉన్నాయి. సహ్యాద్రి, అరేబియా సముద్రం నడుమ సన్నని సముద్రతీర భూభాగం ఉంది. దీనిని పయంఘాట్ అంటారు. ఇది వెడల్పులో 8-24 కి.మీ వైవిధ్యంలో ఉంటుంది. సముద్రతీర మైదానాల వెంట ఉన్న సహ్యాద్రి పర్వతావళి 60-100 మీ వైవిధ్యమైన ఎత్తులో ఉంటాయి. తూర్పులో ఉన్న సహ్యాద్రి పర్వతాలను బాలాఘాట్ ఎగువ భూములు విస్తారమైన దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది. వర్షపాతం పశ్చిమం నుండి వీస్తున్న తేమతోకూడిన గాలుల కారణంగా 3000 మి.మీ వార్షిక వర్షపాతం లభిస్తుంది. పశిమముఖంగా ఉండే సహ్యాద్రి పర్వతశ్రేణిలో అత్యధికంగా 5000 మి.మీ వర్షపాతం ఉంటుంది. తూర్పుముఖంగా విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వతాలలో వర్షపాతం 1000 మి.మీ ఉంటుంది. జూన్- సెప్టెంబరు మధ్య వర్షపాతం అధికంగా ఉంటుంది. నదులు సహ్యాద్రి పర్వతాలలో జన్మించి పశ్చిమంగా ప్రవహిస్తున్న నదులు అరేబియా సముద్రానికి చేరుకుంటున్నాయి. కాళి, గుంగావళి, అఘనాషిని, షరావతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదుల నుండి పలు జలపాతాలు పుట్టాయి. వీటిలో ప్రధానమైనవి జోగ్ జలపాతం నుండి ప్రవహిస్తున్న నీరు పొరుగున ఉన్న షిమోగా జిల్లా వద్ద షరావతి నదిలోకి చేరుతున్నాయి. ఇతర ప్రధాన జలపాతాలలో ఉంచల్లి జలపాతాలుగుర్తించతగినవి. అఘానాశిని జలాలు 116 మీటర్ల లోతులో జలాలను కుమ్మరించడం వలన ఈ జలపాతాలు ఏర్పడుతున్నాయి. మగాడ్ జలపాతాలు బెద్తి నదీ జలాలు 180 మీటర్ల లోతులో జలాలను కుమ్మరించడం వలన ఈ జలపాతాలు ఏర్పడుతున్నాయి షివగంగ జలపాతాలు సొండా (షల్మాలి) నదీ జలాలు 74 మీటర్ల లోతులో జలాలను కుమ్మరించడం వలన ఈ జలపాతాలు ఏర్పడుతున్నాయి. లాల్గులి జలపాతాలు, మైల్మనే జలపాతాలను కాళీనదీ జలాలు సృషిస్తున్నాయి. ఈ నదులు దిగువభూములలో సముద్రతీరం వెంట పలు కి.మీ ప్రాంతంలో చిత్తడి భూములను ఏర్పరుస్తూ ఉన్నాయి. Ecology thumb|250px|Candy Corn Plant in the Anshi National Park జిల్లా అందుకుంటున్న అధిక వర్షపాతం కారణంగా జిల్లాలో సుమారు 70% దట్టమైన అరణ్యాలు ఆక్రమించి ఉన్నాయి. అరేబియా సముద్రం, 250 మీటర్ల ఎత్తులో వరకు పశ్చిమ కనుమల కొండ దిగువ మధ్య ఉన్న సన్నని పర్యావరణ ప్రభావిత భూభాగంలోమలబార్ తీర చిత్తడి అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ అడవులు దాదాపు పూర్తిగా వ్యవసాయం, టేకు చెట్ల పెంపక భూములుగా మార్చబడ్డాయి. ఉత్తర పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి]] నుండి సముద్రమట్టానిమి 250 - 1000 మీటర్ల ఎత్తులో ఆర్ద్ర ఆకురాల్చు అడవులు విస్తరించి ఉన్నాయి. అనేక చెట్లు పొడి మాసాలలో ఆకులు రాల్చుతుంటాయి. సముద్రమట్టానికి 1000 పైన మీటర్ల ఎత్తులో ఉత్తర పశ్చిమ కనుమలలోని సతతహరిత వర్షారణ్యాలు ఉంటాయి. 250 చ.కి.మీ విస్తరించి ఉన్న దండేలి సమీపంలోని అంషి నేషనల్ పార్క్ అర్ధ హరితం అరణ్యం విస్తరించి ఉంది. ఈ అరణ్యంలో పులి, నల్ల చిరుత, చిరుత పిల్లి, గౌర్, ఆసియా ఏనుగు, సాంబార్ జింక మొదలైన జంతుజాలం ఉంది. పలు పక్షి జాతులు, పలు సరీసృపాలు ఉన్నాయి. 834 చ.కి.మీ విస్తరించి ఉన్న దండేలి వన్యప్రాణి సంక్చురి అర్ధ హరితం, కాళి నది, దాని ఉపనదులు కనేరి, నాగజ్‌హరి పరీవాహక వెదురు అడవికి రక్షణ కలిగిస్తుంది. భీంగాడ్ అభయారణ్యంలో రాగ్‌టని ఫ్రీటెయిల్ బ్యాట్ (అక్టోపస్ రాగ్‌టన్) కనిపిస్తుంటాయి. జిల్లా సావన (ఉష్ణమండల పసరిక మైదానాం), పలుచని పొదారణ్యాలు ఉన్నాయి. వీటిని వంట చెరకు, పశువుల మేపడానికి అతిగా ఉపయోగిస్తున్నారు. దిగువభూములలో అరణ్యం అధికభాగం వ్యవసాయంకోసం నిర్మూలించబడింది. నదీమైదానాలలో మాన్‌గ్రోవ్ అరణ్యాలు అధికంగా ఉన్నాయి. నదీతీరంలోని ఇసుక భూములు కాలోఫిలం, ఇనోఫిలం, కొబ్బరి చెట్లు, స్క్రూ పైన్ (పాండాంస్) అధికంగా ఉన్నాయి. బింగ, అర్గ, బెలెకెరి, తదాడి, అంకోలా, కుంట, ధారేశ్వర్, కాసర్‌కోడ్, ముర్దేశ్వర్, భత్క, బెల్కే మొదలైన శిలామయ సముద్రతీరాలలో సముద్రప్రాణులతో సుసంపన్నంగా ఉన్నాయి. ఉత్తరకన్నడ శిలామయ సముద్రతీరాలలో ఫిలం పొరిఫెర, సియోలెంతెరటా, అన్నెలిడా, అర్త్రోపొడా, మొలుస్కా, ఎచినోడెర్మిటా వంటి వృక్షజాలం కనిపిస్తుంది. అట్టివేరి పక్షులశరణాలయంలో 22 విదేశీపక్షులతో కలిసి 79 జాతుల పక్షులు సంరక్షించబడుతున్నాయి. దండేల్ వన్యప్రాణి అభయారణ్యం నల్లని చిరుతలకు, గౌర్, పులి, చిరుతలకు ప్రసిద్ధి. కవల గుహలలో 5 అడుగుల ఎత్తైన శివలింగం ఉంది. 500 అడుగుల ఎత్తైన సిథరీ రాళ్ళతో తయారైన గుహలు, జలపాతాలు వించోలి రాపిడ్స్, ఆకాశ వీక్షణా కేంద్రాలు ఉన్నాయి. అభయారణ్యంలో కాళినది, వ్రేలాడే వంతెన మొదలైన పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. దట్టమైన అరణ్యాలలో పర్వతారోహణ ద్వారా యానా చేరుకుంటే అక్కడ ప్రకృతి సౌందర్యం వీక్షకులను మత్రముగ్ధులను చేస్తుంది. ఇది జాగ్‌రాక్డ్ ఫార్మేషన్లకు, జలపాతాలకు ప్రసిద్ధి. ఇక్కడ భైరవేశ్వరాలయం ఉంది. దండేల్‌కు కొంత దూరంలో అంషి నేషనల్ పార్క్ ఉంది. ఉత్తరకన్నడ జిల్లాలో బురుడే జలపాతం (సిద్ధపురా నుండి 20 కి.మీ), ఉంచల్లి జలపాతాలు, శివగంగె, బీనెహొలే జలపాతం (సిర్సి నుండి 25 కి.మీ) మగాడ్ జలపాతాలు, సతోడి (యలపురా సమీపంలో) జలపాతం మొదలైన ప్రముఖ జలపాతాలు ఉన్నాయి. జిల్లాలో సుపా ఆనకట్ట, కొడసల్లి ఆనకట్ట, కంద్రా ఆనకట్ట మొదలైన ఆనకట్టలు ఉన్నాయి. కైగ వద్ద కాళి నదీతీరంలో ప్రఖ్యాత ఆణువిద్యుత్తు కేంద్రం ఉన్నాయి. Culture Language and religion జిల్లాలో ప్రధానంగా కన్నడ భాష వాడుకలో ఉంది. తరువాత స్థానాలలో కొంకణి కూడా అధికంగా వాడుకలో ఉంది. సాంఘిక సమాచార పరిమార్పిడిలో మరాఠీ, ఉర్దూ, హిందీ, ఆగ్లం కూడా వాడుకలో ఉన్నాయి. ప్రజలలో హిందువులు అధికంగా ఉన్నారు. సంప్రదాయపరంగా ప్రజల జాబితా:- Dance thumb|right|200px|Costume of Yakshaghana యక్షగాన సంప్రదాయ నృత్యం కర్ణాటక రాష్ట్రంలో ప్రాబల్యం కలిగి ఉంది. ఇది ఉత్తరకన్నడ జిల్లాలో అత్యధికంగా ప్రజాదరణ కలిగి ఉంది. షిమోగా, ఉడిపి, దక్షిణ కనర, క్శ్రళ లోని కాసరగాడ్ జిల్లాలలో కూడా ప్రాబల్యత సంతరించుకుని ఉంది. ఈ కళలో సంగీతం, నృత్యం, నటన, వచనం, కథ, అసమానమైన వస్త్రాలంకరణ భాగమై ఉంటాయి. సంగీతం నృత్యంతో సమ్మిశితమైన స్వల్పమైన చక్కని కథకూడా ఉంటుంది. ఇది భారతీయ సంప్రదాయ నృత్యాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. నటన, వచన ఉచ్చారణ కళాకారుని ప్రతిభను చాటుతుంది. సంప్రదాయ, జానపద సమ్మిశ్రితం యక్షగానాన్ని భారతీయ నృత్యకళారూపాలలో అసమాన నృత్యరూపంగా చేస్తుంది. పశ్చిమ దేశాల దృష్టిలో ఇది ఒక ఒపేరాగా కనిపిస్తుంది. సాధారణంగా యక్షగానం రాత్రి వేళలో (లేట్ నైట్) మొదలై రాత్రంతా కొనసాగుతుంది. నేపథ్యగాయకుడు భాగవతార్ కథను నడిపిస్తూ వేదికమీద మొత్తం కాత్యక్రమాన్ని నియంత్రిస్తుంటాడు. భగవతార్‌తో వాయిద్యకళాకారులు మద్దెల, చండే వాయిద్యాలను వాయిస్తుంటారు. కళాకారులు వర్ణరంజితమైన వస్త్రధారణ చేస్తుంటారు. కళాకారులు కథాంశంలో పలు పాత్రలను ధరిస్తూ నర్తిస్తుంటారు. కర్ణాటకాలో పలు యక్షగాన బృందాలు ఉన్నాయి. చలనచిత్రాలు, టి.వి షోల పోటీల మధ్య ఈ బృందాలు టికెట్ వసూలు చేసుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ ఆదాయం పొదుతూ ఉన్నాయి. గ్రామీణ ఉత్సవాలలో మంచి ప్రావీణ్యత ప్రదర్శించే బృందాలను పిలిపించి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. వీరిలో " చిత్తాణి రామక్రిష్ణ హెగ్డే, కొండాడ్కుళి రామక్రిష్ణ హెగ్డే బృందాలు ప్రాంతీయ కళాకారులకు అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. యక్షగానం కన్నడ, కొంకణి భాషలలో ఆట (నాటకం)!అని కూడా అంటారు. . యక్షగానం అంటే యక్షుల గానం అని అర్ధం. పురాణాలలో యక్షులు గానంలో ప్రసిద్ధిలని పేర్కొనబడి ఉంది. గానం చేయడం వారి ప్రధాన వృత్తులలో ఒకటిగా ఉండేది. వ్యవసాయం జిల్లాలో ప్రధానంగా వరి, పోక పండించబడుతుంది. కొబ్బరి, చెరకు, కోకో, జీడిపప్పు, మామిడి, అరటి, అనాస, గార్సినియా, సపోటా మొదలైన పండ్లరకాలు పండించబడుతున్నాయి. ఎర్రగడ్డలు, ముల్లంగి, దోస, కాలిఫ్లవర్, చిలగడ దుంప (గనిసి గడ్డ), బ్రింజాల్, అమరనాథ్ మొదలైన కూరాగాయలు పండించబడుతున్నాయి. నల్లమిరియాలు, యాలుకలు, అల్లం, జాజి మొదలైన సుగంధద్రవ్యాలు పండించబడుతున్నాయి. పశ్చిమ పర్వత ప్రాంతాలలో మిల్లెట్, పత్తి మొదలైన మెట్టపంటలు పండించబడుతున్నాయి. Industries జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు ప్రధానంగా టైల్స్, నార ఉత్పత్తులు, ఆభరణాలు, ఆహార తయారీ, వుడ్, ఫర్నీచర్, గ్లాస్, సెరామిక్, సీ ఫుడ్ ప్రధానమైనవి. ఎస్.ఎస్.ఐ, చిన్నతరహా పరిశ్రమలు అధికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. మద్యతరహా, బృహత్తర పరిశ్రమలకు అవసరమైన పనిముట్లు, విడిభాగాలు జిల్లానుండి, వెలుపలి నుండి లభిస్తున్నాయి. జిల్లాలోని 8 మద్యతరహా, బృహత్తర పరిశ్రమల నుండి పేపర్, డూప్లెక్స్ బోర్డ్, కాస్టిక్ బోర్డ్, ఫెర్రో అల్లాయ్స్, ట్రాంస్మిషన్ గియర్స్, ఫుడ్ కాంసెంట్రేట్స్, మూలికా ఔషధాలు, ఔషధాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. పట్టణాలు Demographics 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 2001-11 కుటుంబనియంత్రణ శాతం. స్త్రీ పురుష నిష్పత్తి. జాతియ సరాసరి (928) కంటే. అక్షరాస్యత శాతం. జాతియ సరాసరి (72%) కంటే. According to the 2011 census Uttara Kannada has a population of 1,436,847, roughly equal to the nation of Swaziland or the US state of Hawaii. This gives it a ranking of 346th in India (out of a total of 640). The district has a population density of . Its population growth rate over the decade 2001-2011 was 6.15%. Uttara Kannada has a sex ratio of 975 స్త్రీs for every 1000 పురుషుడుs, and a literacy rate of 84.03%. పండుగలు హిందువులు దీపావళి పండుగను కోలాహలంగా జరుపుకుంటారు. దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. గృహాలు, దుకాణాలు, కార్యాలయాలు ప్రత్యేకంగా అలంకరించబడుతుంటాయి. జిల్లాలో ముస్లిములు సంప్రదాయకంగా ఈద్- ఉల్- ఫితర్ (రంజాన్), ఈద్ - ఉల్- ఆధా (బక్రీద్) పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. వంటకాలు thumb|right|250px|Batata Vada ఉత్తరకన్నడ జిల్లా రుచికరమైన సీ ఫుడ్ (సముద్ర ఆధారిత ఆహారం) ప్రసిద్ధి చెందింది. చేపలకూర, అన్నం జిల్లావాసులకు ప్రధాన ఆహారంగా ఉంది. జీడిపప్పు, కొబ్బరి ఆహారంలో ప్రధానపాత్ర వహిస్తుంటాయి. ఆహారంలో ప్రధానంగా వండిన అన్నం, కూరలు లేక సీ ఫుడ్ ఉంటాయి. సముద్రం నుండి పుష్కలంగా ఆహారం లభిస్తున్న కారణంగా ఆహారంలో సీ ఫుడ్స్ అధికంగా భాద్వామ్యం వహిస్తున్నాయి. సీ ఫుడ్స్‌కు సుగంధ ద్రవ్యాలను చేర్చి ఘుమఘుమలాడే వంటలు తయారు చేయబడుతుంటాయి. టీ కూడా ప్రజల అభిమానపానీయంగా భావించబడుతుంది. యాలుకలు, పుదీనా వేసి చేసే మసాలా టీ ప్రత్యేకరుచితో ఉంటుంది. మాధ్యమం రవాణా వ్యవస్థ Public transport " నార్త్ వెస్ట్ కర్ణాటక ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ " (ఎన్.వి.కె.ఆర్.టి.సి) జిల్లాలో ప్రజలకు ప్రయాణసౌకర్యాలు అందిస్తుంది. ఎన్.వి.కె.ఆర్.టి.సి జిల్లాలోని పట్టణాలు, గ్రామాలన్నింటికి అవసరమైన ప్రయాణ సౌకర్యాలు అందిస్తుంది. జిల్లాలో చక్కని ట్రాంస్‌పోర్ట్ నెట్‌వర్క్ పనిచేస్తుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు (బెంగుళూరు, మైసూరు, మేంగుళూరు) క్రమానుసార సర్వీసులు నిర్వహించబడుతున్నాయి. మేంగుళూరు నుండి గోవాకు ప్రయాణసౌకర్యాలు ఉన్నాయి. కుంత, భత్క, సిర్సి మొదలైనవి ప్రధాన ప్రయాణ సౌకర్య కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ నుండి 24 గంటలు బసు సౌకర్యం లభిస్తూ ఉంది. పలు ప్రైవేట్ ట్రాంస్‌పోర్ట్ బసులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బసులు నడుపబడుతున్నాయి. ప్రైవేట్ ట్రాంస్‌పోర్ట్ బసులకు భత్క ప్రధానకేంద్రంగా ఉంది. జాతీయరహదారి 17 జిల్లా గుండా పయనిస్తుంది. ఇది జిల్లాను పాంవెల్, ముంబయి, పూనా, కొల్హాపూర్, బెల్గాం, పనజి, మార్గో, ఉడిపి, మేంగుళూరు, భత్కల్, కాసరగాడ్, కన్నూర్, కోళికోడ్ మొదలైన నగరాలతో అనుసంధానం చేస్తుంది. రహదారులు కింది ఉత్తర కన్నడ జిల్లాలో ద్వారా పోయే నేషనల్ హైవేలు. జాతీయరహదారి -17 సమీపంలో ఎడపల్లి కొచీ (వద్ద కలుపుతుంది, పాన్వెల్ ముంబై (వద్ద కలుస్తుంది) జిల్లాలో ఇది ఉత్తరాన మజలి గ్రామం వద్ద ప్రారంభమై & భట్కల్ వద్ద ముగుస్తుంది. జాతీయరహదారి -206 కలిపే హోన్నావర్, బెంగళూరు కలిపే జాతీయరహదారి -63 అంకోలా, హుబ్లి జాతీయరహదారి -17a కలిపే దండేలి, వాస్కో డ గామా (గోవా) రైల్వే కింది రైల్వేస్ జిల్లా గుండా: కొంకణ్ రైల్వే మంగళూరు కలిపే, ముంబై కార్వార్ ద్వారా, లొండా (కర్ణాటక) క్యాజెల్ రాక్ ద్వారా పోయే వాస్కో రైల్వే లైన్ కోట దండేలి రైల్వే లైన్ రాక్. హుబ్లి - అంకోలా రైల్వే లైన్ కార్వార్ పోర్ట్, ఉత్తర కర్నాటక లింక్ ప్రతిపాదించబడింది. సేవల ఆర్-ఆర్ ( ఆఫ్ రోల్ రోల్) కు అంకోలా రైల్వే స్టేషను నుండి సురత్కల్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వే ద్వారా అందించబడుతుంది. అనేక ట్రక్కర్స్ మంగళూరుకు అంకోలా మధ్య ఈ సౌకర్యం ఉపయోగించవచ్చు. Ports ఉత్తరకన్నడ సముద్రతీర జిల్లాలలో ఒకటిగా ఉంది. జిల్లాలో 120 కి.మీ పొడవున సముద్రతీరం ఉంది. జిల్లాలోని పకు నౌకాశ్రయాలు వ్యాపార కేంద్రాలు, నావల్ బేస్, చేపల పరిశ్రమలు ఇతర మేతిన్ ఏక్టివిటీలు అభివృద్ధి చెందాయి. కార్వార్ పోర్ట్ :- ఈ నౌకాశ్రయం మహాదముద్ర నౌకలు, సముద్రతీర షిప్పింగ్, ఫిస్షింగ్ జెట్టి మొదలైన కాత్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడి నుండి కార్వర్ పోర్ట్ వరకు షిప్ బంకరింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఐ.ఎన్.ఎస్ కదంబ :- ఇది ఒక నావల్ బేస్‌గా ఉంది. ఇది కార్వర్ లోని అర్గా గ్రామం వద్ద ఉంది. ఇది నావల్ వెసెల్స్ కొరకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నావల్ షిప్ మరామత్తు కేంద్రం (డ్రై డాక్స్) కూడా ఉంది. 'బెల్కెరి పోర్ట్' ఒక లంగరు నౌకాశ్రయం. 'తద్రి పోర్ట్' ఒక ఫిషింగ్ పోర్ట్ ఉంది. 'కుంటా పోర్ట్' ఒక ఫిషింగ్ పోర్ట్ ఉంది. 'హోన్నావర్ పోర్ట్' ఒక ఫిషింగ్ పోర్ట్ ఉంది. 'భట్కల్ పోర్ట్' ఒక ఫిషింగ్ పోర్ట్ ఉంది. సమీపంలోని విమానాశ్రయాలు హుబ్లి బెల్గాం విమానాశ్రయం గోవా అంతర్జాతీయ విమానాశ్రయం (పనజీ) మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సుప్రసిద్ధ వ్యక్తులు రామకృష్ణ హెగ్డే డాక్టర్ మాల్ప ఆలీ (వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు జామియా ఇస్లామియా భట్కల్) అఫ్తాబ్ కోలా: ఎడిటర్, ఒమాన్ టైమ్స్ ఎ.కె.హఫీజా (లేట్): భారత రాయబారి - సౌదీ అరేబియా 1977, బొంబాయి, అధ్యక్షుడు శాసన సభ్యులు -బి.పి.సి.సి. రామ రఘోబా రాణే ( మేజర్) పరమవీరచక్ర అవార్డ్ గ్రహీత. జయశ్రీ గద్కర్ మరాఠీ సినిమా నటి అక్బర్ ఆలీ అనంత్ నాగ్ దినకర దేశాయ్ గురీష్ కైకిని నారాయణ్ హోస్‌మనే గురుదాస్ కామత్ జయంత్ కైకిని లీనా చందావార్కర్ నందన్ నిలేకని పండరీ బాయి పండిట్ రమేష్ నాదకర్ణి శంకర్ నాగ్ సుందర్ నాదకర్ణి సురేష్ హెబ్లికర్ విలాస్ సారంగ్ యశ్వంత్ చిత్తల్ పల్లవి సుభాష్ చంద్రన్ సినిమా, టీవీ నటి వెంకన్న హెచ్ నాయక్ బారిస్టర్ సన్నప్ప పరమేశ్వర్ గోయంకర్ కెరెమనే శివరామ్ హెగ్డే గొప్ప యక్షగాన కళాకారుడు మూలాలు బయటి లింకులు వెలుపలి లింకులు వర్గం:ఉత్తర కన్నడ జిల్లా వర్గం:బెల్గాం డివిజన్ వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:కర్ణాటక జిల్లాలు
కొడగు జిల్లా
https://te.wikipedia.org/wiki/కొడగు_జిల్లా
కొడగు () కర్ణాటక రాష్ట్రములోని జిల్లా. కొడగు యొక్క ఆంగ్లీకరణ అయిన కూర్గ్ పేరుతో ప్రసిద్ధమైనది. నైఋతి కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఈ జిల్లా 4.100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 5, 48, 561. అందులో 13.74% జనాభా జిల్లాలోని పట్టణప్రాంతాలలో నివసిస్తున్నారు. కొడగు జిల్లా యొక్క ముఖ్యపట్టణం మడికేరి. ఈ జిల్లాకు వాయువ్యాన దక్షిణ కన్నడ జిల్లా, ఉత్తరాన హసన్ జిల్లా, తూర్పున మైసూరు జిల్లా, నైఋతిన కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా, దక్షిణాన వైనాడ్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమతీరంలో ఉండే కొండలు, అడవులతో నెలకొని ఉంటుంది. కనుచూపు మేరలో ఎటుచూసినా కాఫీ తోటలు, మిరియాలు, యాలకుల తోటలతో సుమనోహరంగా ఉంటుందీ ప్రాంతం. ఈ ప్రాంతం నంచి ఎటువైపు చూసినా కాఫీ తోటలు, ఆ తోటల మధ్యలో నివాసం ఏర్పరుచు కున్న ప్రజలు అగుపిస్తారు. ఇక ఏ రుతువులో నయినా సరే, ఉష్ణోగ్రత 20-25 డిగ్రీలకు మించని కొడగు ప్రాంతంలో మనకు తెలియకుండానే కాలం ఇట్టే హాయిగా గడచిపోతుంది. ఎక్కడికెళ్లినా పచ్చదనం, నీలి ఆకాశం దానికింద పెద్ద పెద్ద లోయ లు, ఆ లోయలలో ప్రవహించే అందమైన సెలయేర్లు, అక్కడక్కడా జలపాతాలు పర్యాటకు లను విశేషంగా ఆకట్టుకుంటాయి. కొడగు ప్రాంతం లోనే కావేరీ నది జన్మించింది. కావేరీ నదీ ప్రవాహం ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతంలో ఎన్నెన్నో విహార యాత్రా స్థలాలు రూపుదిద్దుకు న్నాయి.కావేరీ నదిలో నౌకా విహారం, ఏనుగుల మందల షికారు, గిరిజనుల ఉత్సవాలు... మొదలయిన వాటినన్నింటినీ కలగలిపి చూడాలంటే, నాలుగైదు రోజులకు మించే సమయం పడుతుంది. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:కర్ణాటక వర్గం:కర్ణాటక జిల్లాలు వర్గం:పర్యాటక ప్రదేశాలు
మహారాష్ట్ర జిల్లాల జాబితా
https://te.wikipedia.org/wiki/మహారాష్ట్ర_జిల్లాల_జాబితా
276x276px|thumb|భారతదేశపు పటంలో మహారాష్ట్ర.|alt= మహారాష్ట్ర 1960 మే 1న ఏర్పడింది. ప్రారంభంలో 26 జిల్లాలుండేవి. 2014 ఆగష్టుకు ముందు 35 జిల్లాలు ఉండేవి. 2014 ఆగస్టు 1 న మహారాష్ట్ర ప్రభుత్వం, పాల్ఘర్‌ను 36వ జిల్లా ఏర్పాటును ప్రకటించింది, ఇది థానే జిల్లా నుండి విభజించబడింది. పాల్ఘర్ జిల్లా ఉత్తరాన దహను నుండి మొదలై నైగావ్ వద్ద ముగుస్తుంది. జిల్లాలో పాల్ఘర్, వడ, విక్రమ్‌గడ్, జవహర్, మొఖదా, దహను, తలసరి, వసై-విరార్ తాలూకాలు ఉన్నాయి. 2023 నాటికి రాష్ట్రంలో 36 జిల్లాలు ఉన్నాయి. ప్రాంతాలు, విభాగాలు మహారాష్ట్రలో 36 జిల్లాలు, 6 డివిజన్లు ఉన్నాయి.List of districts and divisions ప్రాంతాలు భౌగోళికంగానూ, చారిత్రకంగానూ, రాజకీయ సెంటిమెంట్ల పరంగానూ మహారాష్ట్ర ఆరు ప్రధాన విభాగాలుగా విభజింపబడి ఉంది. విదర్భ - (నాగపూర్ , అమరావతి డివిజన్లు) - (పాత బేరార్ ప్రాంతం) మరాఠ్వాడా - (ఔరంగాబాద్ డివిజన్) ఖాందేష్ - ఉత్తర మహారాష్ట్ర ప్రాంతం - (నాశిక్ డివిజన్) పూణే - (పూణే డివిజన్) కొంకణ్ - (కొంకణ్ డివిజన్) 550x550px|thumb|మహారాష్ట్రలోని డివిజన్లు, జిల్లాలు.|alt=|center విభాగాలు విభాగం పేరు ముఖ్యపట్టణం ప్రాంతం జిల్లాలు పెద్ద నగరం అమరావతి డివిజన్ అమరావతి విదర్భ అమరావతి ఔరంగాబాద్ డివిజన్ ఔరంగాబాద్ మరాఠ్వాడా ఔరంగాబాద్ కొంకణ్ డివిజన్ ముంబై కొంకణ్ ముంబై నాగపూర్ డివిజన్ నాగపూర్ విదర్భ నాగపూర్ నాశిక్ డివిజన్ నాసిక్ ఖాందేష్ నాసిక్ పూణే డివిజన్ పూణే దేష్ పూణే జిల్లాలు క్రింది పట్టికలో 36 జిల్లాలు చూపబడ్డాయి. ఇందులో జనాభా సమాచారం 2001 జనగణన ప్రకారం ఇవ్వబడింది. సంఖ్య పేరు కోడ్ స్థాపన ముఖ్య పట్టణం పరిపాలనా విభాగం వైశాల్యం (చ.కి.మీ) జనాభా (2011 జనగణన) జనసాంద్రత (2001) చ.కి.మీ.1కి అక్షరాస్యత (2001) (%) లింగ నిష్పత్తి (2001) మూలం 1 అహ్మద్‌నగర్ జిల్లా AH 1960 మే 1 అహ్మద్ నగర్ నాశిక్ డివిజన్ 17,413 4,54,3,159 234.77 75.82 941 District website 2అకోలా జిల్లా AK 1960 మే 1 అకోలా అమరావతి డివిజన్ 5,417 18,13,906 300.78 81.41 938 District website 3అమరావతి జిల్లా AM 1960 మే 1 అమరావతి అమరావతి డివిజన్ 12,626 28,88,445 206.40 82.5 938 District website 4ఔరంగాబాద్ జిల్లా AU 1960 మే 1 ఔరంగాబాద్, ఔరంగాబాద్ డివిజన్ 10,100 37,01,282 286.83 61.15 924 District website 5బీడ్ జిల్లా BI 1960 మే 1 బీడ్ ఔరంగాబాద్ డివిజన్ 10,439 12,00,334 207.04 68 936 District website 6భండారా జిల్లా BH 1960 మే 1 భండారా నాగపూర్ డివిజన్ 3,717 25,85,049 305.58 68.28 982 District website 7బుల్ధానా జిల్లా BU 1960 మే 1 బుల్ధానా అమరావతి డివిజన్ 9,680 25,86,258 230.63 75.8 946 District website 8చంద్రపూర్ జిల్లా CH 1960 మే 1 చంద్రపూర్ నాగపూర్ డివిజన్ 10,695 22,04,307 193.65 73.03 948 District website 9ధూలే జిల్లా DH 1960 మే 1 ధూలే నాశిక్ డివిజన్ 8,063 20,50,862 211.83 71.6 944 District website 10గడ్చిరోలి జిల్లా GA 1982 ఆగస్టు 26 గడ్చిరోలి నాగపూర్ డివిజన్ 14,412 10,72,942 67.33 60.1 976 District website 11గోండియా జిల్లా GO 1999 మే 1 గోండియా నాగపూర్ డివిజన్ 4,843 13,22,507 247.81 67.67 1005 District website 12హింగోలి జిల్లా HI 1999 మే 1 హింగోలి ఔరంగాబాద్ డివిజన్ 4,526 11,77,345 218.11 66.86 953 District website 13జలగావ్ జిల్లా JG 1960 మే 1 జలగావ్ నాశిక్ డివిజన్ 11,765 42,29,917 312.79 76.06 932 District website 14జాల్నా జిల్లా JN 1981 మే 1 జాల్నా ఔరంగాబాద్ డివిజన్ 7,612 19,59,046 211.82 64.52 952 District website 15కొల్హాపూర్ జిల్లా KO 1960 మే 1 కొల్హాపూర్ పూణే డివిజన్ 7,685 38,76,001 457.44 77.23 949 District website 16లాతూర్ జిల్లా LA 1982 ఆగస్టు 15 లాతూర్ ఔరంగాబాద్ డివిజన్ 7,372 24,54,196 282.19 71.54 935 District website 17ముంబై నగర జిల్లా MC 1960 మే 1 ముంబై కొంకణ్ డివిజన్ 67.7 30,85,411 49,140.9 86.4 777 District website 18ముంబై సబర్బన్ జిల్లా MU 1990 అక్టోబరు 1 బాంద్రా (తూర్పు) కొంకణ్ డివిజన్ 369 93,56,962 23,271 86.9 822 District website 19 నాగపూర్ జిల్లా NG 1960 మే 1 నాగపూర్ నాగపూర్ డివిజన్ 9,897 46,53,570 409.36 84.18 933 District website 20 నాందేడ్ జిల్లా ND 1960 మే 1 నాందేడ్ ఔరంగాబాద్ డివిజన్ 10,422 33,61,292 275.98 68.52 942 District website 21 నందుర్బార్ జిల్లా NB 1998 జూలై 1 నందుర్బార్ నాశిక్ డివిజన్ 5,035 16,48,295 260 46.63 975 District website 22 నాశిక్ జిల్లా NS 1960 మే 1 నాశిక్ నాశిక్ డివిజన్ 15,530 61,07,187 321.56 74.4 927 District website 23 ఉస్మానాబాద్ జిల్లా OS 1960 మే 1 ఉస్మానాబాద్ ఔరంగాబాద్ డివిజన్ 7,512 16,57,576 197.89 54.27 932 District website 24పాల్ఘర్ జిల్లాPL2014 ఆగష్టు 1పాల్ఘర్ కొంకన్ డివిజన్5,34429,90,11656280900DIistrict Website 25 పర్భణీ జిల్లా PA 1960 మే 1 పర్భణీ ఔరంగాబాద్ డివిజన్ 6,251 18,36,086 244.4 55.15 958 District website 26 పూణే జిల్లా PU 1960 మే 1 పూణే పూణే డివిజన్ 15,642 94,29,408 461.85 80.78 919 District website 27 రాయగఢ్ జిల్లా RG 1960 మే 1 అలీబాగ్ కొంకణ్ డివిజన్ 7,148 26,34,200 308.89 77 976 District website 28 రత్నగిరి జిల్లా RT 1960 మే 1 రత్నగిరి కొంకణ్ డివిజన్ 8,208 16,15,069 206.72 65.13 1,136 District website 29 సాంగ్లీ జిల్లా SN 1960 మే 1 సాంగ్లీ పూణే డివిజన్ 8,578 28,22,143 301.18 62.41 957 District website 30 సతారా జిల్లా ST 1960 మే 1 సతారా పూణే డివిజన్ 10,484 30,03,741 266.77 78.52 995 District website 31 సింధుదుర్గ్ జిల్లా SI 1981 మే 1 ఒరోస్ కొంకణ్ డివిజన్ 5,207 8,49,651 166.86 80.3 1,079 District website 32 షోలాపూర్ జిల్లా SO 1960 మే 1 దౌండ్ పూణే డివిజన్ 14,845 43,17,756 259.32 71.2 935 District website 33 థానే జిల్లా TH 1960 మే 1 థానే కొంకణ్ డివిజన్ 9,558 80,70,032 850.71 80.67 858 District website 34 వార్ధా జిల్లా WR 1960 మే 1 వార్ధా నాగపూర్ డివిజన్ 6,310 13,00,774 195.03 80.5 936 District website 35 వాషిమ్ జిల్లా WS 1998 జూలై 1 వాషిం అమరావాతి డివిజన్ 5,150 11,97,160 275.98 74.02 939 District website 36 యావత్మల్ జిల్లా YA 1960 మే 1 యావత్మల్ అమరావతి డివిజన్ 13,582 27,72,348 152.93 57.96 951 District website మొత్తం - - - - - ,627 314.42 77.27 922 - ఇవీ చూడండి మహారాష్ట్రలోని తహశీళ్ళు మహారాష్ట్ర మూలాలు వెలుపలి లంకెలు Census of India వర్గం:మహారాష్ట్ర వర్గం:భారతదేశ జిల్లాల జాబితాలు వర్గం:జాబితాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:మహారాష్ట్రకు సంబంధించిన జాబితాలు
ఉస్మానాబాద్
https://te.wikipedia.org/wiki/ఉస్మానాబాద్
ఉస్మానాబాద్ మహారాష్ట్ర రాష్ట్రంలోని ఉస్మానాబాద్ జిల్లా ముఖ్యపట్టణం. జిల్లాలోని తుల్జాపూర్ లో కల తుల్జాభవానీ మాత భారతదేశమంతటా ప్రసిద్ధి చెందింది. జిల్లా విస్తీర్ణం 7512.4 చదరపు కి.మీలు అందులో 241.4 చ.కి.మీల మేరకు పట్టణప్రాంతాలు ఉన్నాయి. 2001 జనగణన ప్రకారం జిల్లా మొత్తం జనాభా 14,86,586. అందులో 15.69% పట్టణాలలో నివసిస్తున్నారు ఉనికి ఉస్మానాబాద్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం దక్షిణభాగంలో ఉంది. దక్కన్ పీఠభూమిలో భాగమైన ఈ జిల్లా సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తున ఉంది. మంజీరా , తెర్నా నదులు జిల్లాగుండా కొంతభాగం ప్రవహిస్తున్నాయి. జిల్లా మరాఠ్వాడా ప్రాంతానికి తూర్పున 17.35 నుండి 18.40 డిగ్రీల ఉత్తర రేఖాంశాలు , 75.16 నుండి 76.40 డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. శీతోష్ణస్థితి వర్షాకాలం జూన్ మధ్యనుండి ప్రారంభమై సెప్టెంబరు నెల చివరివరకు కొనసాగుతుంది. అక్టోబరు , నవంబరు నెలల్లో వాతావరణం తేమగాను, నవంబరు మధ్యనుండి జనవరి వరకు చల్లగా, పొడిగా ఉంటుంది. ఫిబ్రవరి నుండి జూన్ వరకు పొడిగా ఉండి, ఉష్ణోగ్రత పెరుగుతూపోతుంది. వేసవిలో ఉస్మానాబాద్ జిల్లాలో మరాఠ్వాడా ప్రాంతంలోని ఇతర జిల్లాలతో పోల్చితే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. సాలీనా సగటు వర్షపాతం 730 మిమీలు. తాలూకాలు ఉస్మానాబాద్ జిల్లాలో ఎనిమిది తాలూకాలు ఉన్నాయి. అవి ఉస్మానాబాద్ తుల్జాపూర్ ఒమర్గా లోహారా కల్లంబ్ భూమ్ పరందా వాషీ పరందా చారిత్రక స్థలము. ఇక్కడి పరందా కోట ప్రసిద్ధి చెందినది. మంజీరా నది ఒడ్డున ఉన్న కల్లంబ్ జిల్లాలో ప్రముఖ వ్యాపారకేంద్రము. కల్లంబ్ నుండి 20 కిలోమీటర్ల దూరములో ఉన్న యెర్మలలో యేదేశ్వరి దేవి ఆలయం ఉంది. తుల్జాపూరు ప్రముఖ తాలూకా కేంద్రం. ఇది షోలాపూర్ నుండి 30 కి.మీలు, ఉస్మానాబాద్ నుండి 25 కి.మీలు , హైదరాబాదు రహదారిపై ఉన్న నల్‌దుర్గ నుండి 40 కి.మీల దూరములో ఉంది. తుల్జాపూర్ తుల్జా భవానీ మందిరం వల్ల ప్రసిద్ధికెక్కింది. తుల్జాభవానీ ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని ఇచ్చిందని చెబుతారు. శివాజీ కొడుకు శంభాజీ ఈ ఆలయాన్ని పునర్ణిర్మించాడు. ఒమెర్గా ఉస్మానాబాద్ జిల్లాలో అత్యంత జనసాంద్రత కలిగిన తాలూకా. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు
ఔరంగాబాద్ (మహారాష్ట్ర)
https://te.wikipedia.org/wiki/ఔరంగాబాద్_(మహారాష్ట్ర)
ఔరంగాబాద్ (ఔరంగాబాదు) మహారాష్ట్రలోని ఒక నగరం.ఇది ఔరంగాబాద్ జిల్లాకు కేంద్రం.Paper 2 – Cities having population 1 million and above – 2011 census ఔరంగాబాదును అధికారికంగా ఛత్రపతి శంభాజీ నగర్ అని పిలుస్తారు.[8] ఛత్రపతి శంభాజీనగర్ అని కూడా పిలుస్తారు. మరాఠ్వాడా ప్రాంతంలో అతిపెద్ద నగరం. డెక్కన్ ట్రాప్స్‌లోని కొండ ప్రాంతాలలో ఉన్న ఔరంగాబాద్ 11,75,116 మంది జనాభాతో మహారాష్ట్రలో ఐదవ-అత్యధిక జనాభా కలిగిన పట్టణ ప్రాంతం. శాతవాహన రాజవంశం (సా.శ.పూ ఒకటవ శతాబ్దం-సా.శ. 2వ శతాబ్దం ) సామ్రాజ్య రాజధాని పైథాన్, అలాగే యాదవ రాజవంశం (సా.శ.9వ శతాబ్దం–సా.శ.14వ శతాబ్దం) రాజధాని దేవగిరి, ఆధునిక ఔరంగాబాద్ పరిమితుల్లో ఉన్నాయి. 1308లో సుల్తాన్ అల్లావుద్దీన్ ఖాల్జీ పాలనలో ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తానేట్‌చే విలీనం చేయబడింది. 1327లో, సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో ఢిల్లీ సుల్తానేట్ రాజధాని ఢిల్లీ నుండి దౌలతాబాద్‌కు (ప్రస్తుత ఔరంగాబాద్‌లో) మార్చబడింది. అతను ఢిల్లీ జనాభాను దౌలతాబాద్‌కు భారీగా తరలించాలని ఆదేశించాడు. అయితే, మహమ్మద్ బిన్ తుగ్లక్ 1334లో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రాజధానిని తిరిగి ఢిల్లీకి మార్చాడు. 1499లో, దౌల్తాబాద్ అహ్మద్‌నగర్ సుల్తానేట్‌లో భాగమైంది. 1610లో ఇథియోపియన్ మిలటరీ నాయకుడు మాలిక్ అంబర్ అహ్మద్‌నగర్ సుల్తానేట్‌కు రాజధానిగా పనిచేయడానికి ఆధునిక ఔరంగాబాద్ స్థానంలో ఖాడ్కీ అనే కొత్త నగరం స్థాపించబడింది, అతను బానిసగా భారతదేశానికి తీసుకురాబడ్డాడు.అయితే అతను ప్రముఖ ప్రధానమంత్రిగా ఎదిగాడు. అహ్మద్‌నగర్ సుల్తానేట్, మాలిక్ అంబర్ తర్వాత అతని కుమారుడు ఫతే ఖాన్, నగరం పేరును ఫతేనగర్‌గా మార్చాడు. 1636లో, డెక్కన్ ప్రాంతంలో అప్పటి మొఘల్ వైస్రాయ్‌గా ఉన్న ఔరంగజేబు ఈ నగరాన్ని మొఘల్ సామ్రాజ్యంలోకి చేర్చాడు. 1653లో, ఔరంగజేబు నగరాన్ని "ఔరంగాబాద్" గా మార్చాడు. మొఘల్ సామ్రాజ్యంలోని దక్కన్ ప్రాంతానికి రాజధానిగా చేసాడు. 1724లో, దక్కన్ మొఘల్ గవర్నర్, నిజాం అసఫ్ జా I, మొఘల్ సామ్రాజ్యం నుండి విడిపోయి తన స్వంత అసఫ్ జాహీ రాజవంశాన్ని స్థాపించాడు. రాజవంశం 1763లో తమ రాజధానిని హైదరాబాద్ నగరానికి బదిలీ చేసే వరకు, మొదట్లో ఔరంగాబాద్‌లో తమ రాజధానితో హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించారు. బ్రిటీష్ రాజ్ కాలంలో హైదరాబాద్ రాష్ట్రం రాచరిక రాష్ట్రంగా మారింది.ఆ తరువాత 150 సంవత్సరాలు (1798-1948) అలాగే కొనసాగింది. 1956 వరకు ఔరంగాబాద్ హైదరాబాద్ స్టేట్‌లో భాగంగానే ఉంది. 1960లో, ఔరంగాబాద్, మరాఠీ మాట్లాడే ప్రాంతం మహారాష్ట్ర రాష్ట్రంలో భాగమైంది. నగర ప్రాముఖ్యత ఈ నగరం పత్తి వస్త్రాల ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్శిటీతో సహా అనేక ప్రముఖ విద్యాసంస్థలు నగరంలో ఉన్నాయి.అజంతా, ఎల్లోరా గుహలు వంటి పర్యాటక ప్రదేశాలు దాని శివార్లలో ఉన్నాయి, ఈ నగరం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. 1983 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. ఔరంగాబాద్ గుహలు, దేవగిరి కోట, ఘృష్ణేశ్వర దేవాలయం, జమా మసీదు, బీబీ కా మక్బరా, హిమాయత్ బాగ్, పంచక్కి, సలీం అలీ సరస్సు వంటి ఇతర పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా, ఔరంగాబాద్‌లో 52 గేట్లు ఉన్నాయి, వాటిలో కొన్ని మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి, దీని కారణంగా ఔరంగాబాద్‌కు "సిటీ ఆఫ్ గేట్స్" అని పేరు పెట్టారు. 2019లో, ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ (AURIC) ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద భారతదేశంలోని మొదటి గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ సిటీగా అవతరించింది. ఔరంగాబాద్ పట్టణానికి సుమారు 106 కిలోమీటర్ల దూరంలో ప్రఖ్యాతి చెందిన అజంతా గుహలు ఉన్నాయి. చరిత్ర ఖడ్కీ అనేది గ్రామం అసలు పేరు, దీనిని అహ్మద్‌నగర్ సుల్తాన్ ముర్తాజా నిజాం షా II ప్రధాన మంత్రి మాలిక్ అంబర్ రాజధానిగా చేశారు.ఆ తరవాత ఒక దశాబ్దంలో, ఖాడ్కి జనాభా వృద్ధితో ఒక గంభీరమైన నగరంగా అభివృద్ధి చెందింది. మాలిక్ అంబర్ 1626లో మరణించాడు.Qureshi Dulari, "Tourism Potential in Aurangabad," p.6 అతని తరువాత అతని కుమారుడు ఫతే ఖాన్, ఖడ్కీ పేరును ఫతేనగర్‌గా మార్చాడు. 1633లో సామ్రాజ్య సేనలు దేవగిరి కోటను స్వాధీనం చేసుకోవడంతో, ఫతేనగర్‌తో సహా నిజాం షాహీ ఆధిపత్యాలు మొఘలుల ఆధీనంలోకి వచ్చాయి. 1653లో, మొఘల్ యువరాజు ఔరంగజేబు రెండవసారి దక్కన్ వైస్రాయ్‌గా నియమితులైనప్పుడు, అతను ఫతేనగర్‌ను తన రాజధానిగా చేసుకుని దానికి ఔరంగాబాద్‌గా పేరు మార్చాడు. ఔరంగాబాద్‌ను కొన్నిసార్లు ఔరంగజేబు పాలనకు సంబంధించిన చరిత్రకారులు ఖుజిస్తా బున్యాద్‌గా సూచిస్తారు. 1667లో ఔరంగజేబు కుమారుడు ముఅజ్జామ్ ఈ ప్రావిన్స్‌కు గవర్నర్ అయ్యాడు. అతని కంటే ముందు మీర్జా రాజా జై సింగ్ కొంతకాలం ఈ ప్రావిన్స్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. 1681లో, చక్రవర్తిగా ఔరంగజేబు పట్టాభిషేకం తర్వాత, దక్కన్‌లో తన సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి అతను తన ఆస్థానాన్ని ఢిల్లీ రాజధాని నగరం నుండి ఔరంగాబాద్‌కు మార్చాడు. నగరంలో మొఘల్ ప్రముఖుల ఉనికి పట్టణ అభివృద్ధికి దారితీసింది, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు నిర్మించబడ్డాయి. 1684 తర్వాత ఔరంగజేబు నగరంలో నివాసం ఉండకూడదని నిర్ణయించుకున్నప్పటికీ, నగరం మొఘల్ దక్కన్ ప్రాథమిక సైనిక కేంద్రం వలె ప్రాముఖ్యతను నిలుపుకుంది. సంపదను ఆకర్షించింది.దానితో ఔరంగాబాద్‌ను వాణిజ్య కేంద్రంగా మారింది. ఎంబ్రాయిడరీ సిల్క్స్ తయారీ ఈ కాలంలో ఉద్భవించింది.నేటికీ ఔరంగాబాద్‌లో ఆచరించబడుతోంది. ఔరంగాబాద్ ఒక మొఘల్ సాంస్కృతిక కేంద్రంగా ఉంది.ఇది పర్షియన్ ఉర్దూ సాహిత్యానికి ముఖ్యమైన కేంద్రం. మొఘల్ యుగంలో ఔరంగాబాద్‌లో 2,00,000 మంది జనాభా ఉన్నట్లు అంచనా వేయబడింది. వారు 54 శివారు ప్రాంతాల్లో నివాసం ఉన్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి. 1724లో, దక్కన్ ప్రాంతంలోని మొఘల్ జనరల్, నిజాం అల్-ముల్క్ అసఫ్ జా, దక్కన్‌లో తన సొంత రాజవంశాన్ని స్థాపించాలనే ఉద్దేశ్యంతో శిథిలమైన మొఘల్ సామ్రాజ్యం నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. 1763లో అతని కుమారుడు, వారసుడు నిజాం అలీ ఖాన్ అసఫ్ జా II రాజధానిని హైదరాబాద్‌కు బదిలీ చేసే వరకు, ఔరంగాబాద్ అసఫ్ జా కొత్త రాజ్యానికి రాజధానిగా, తదుపరి 40 సంవత్సరాలు రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఔరంగాబాద్ విశేష స్థానం కోల్పోవడం ఆర్థిక క్షీణతకు దారితీసింది.19వ శతాబ్దం ప్రారంభం నాటికి, నగరం జనాభా తక్కువుకు దిగిపోయింది. దాని పరిపాలన కుంటుపడింది. భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.ఏది ఏమైనప్పటికీ, ఔరంగాబాద్ రాజకీయ జీవితకాలంలో మిగిలిన నిజాం పాలనలో "రెండవ నగరం"గా ముఖ్యమైనదిగా కొనసాగింది. 1816లో, బ్రిటీష్ వారు ఔరంగాబాద్ వెలుపల ఒక కంటోన్మెంట్‌ను స్థాపించారు (వారు నిజాం ఆధిపత్యాలలోని ఇతర ప్రాంతాలలో చేసినట్లు), కానీ నిజాం అధికారులు నగరంలోకి ప్రవేశించకుండా నిరుత్సాహపరిచారు.బ్రిటీష్ అధీనంలో ఒక రాచరిక రాష్ట్రంగా, నిజాం హైదరాబాద్ రాష్ట్రం పాక్షిక-స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. అంటే ఔరంగాబాద్ సంస్కృతి కొంతవరకు వలసవాద ప్రభావం లేకుండా ఉంది. ఔరంగాబాద్ 19వ శతాబ్దం చివరలో పారిశ్రామికీకరణను ప్రారంభించింది. నగరం మొదటి పత్తి మిల్లు 1889లో ప్రారంభించబడింది.1881లో నగర జనాభా 30,000, తరువాతి రెండు దశాబ్దాల్లో 36,000కి పెరిగింది. ఔరంగాబాద్ ముఖ్యంగా 1899-1900, 1918 - 1920లలో దక్కన్ కరువులచే ప్రభావితమైంది, దీనివల్ల నేరాలు పెరిగాయి.భారత స్వాతంత్ర్యం తరువాత, హైదరాబాద్ రాష్ట్రం 1948లో ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయబడింది. తత్ఫలితంగా ఔరంగాబాద్ ఇండియన్ యూనియన్ హైదరాబాద్ స్టేట్‌లో భాగమైంది. 1956లో, ఇది కొత్తగా ఏర్పడిన ద్విభాషా బొంబాయి రాష్ట్రంగా మారింది. 1960లో ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో భాగమైంది. బాల్ థాకరే 1988లో నగరాన్ని శంభాజీనగర్‌గా మార్చాలని ప్రతిపాదించాడు. స్థానిక పాలక సంస్థ 1995లో పేరు మార్పుపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2022 జూన్ 29న, శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర క్యాబినెట్ మరాఠా సామ్రాజ్యంలోని రెండవ ఛత్రపతి శంభాజీ భోసలే పేరు మీద ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చడానికి ఆమోదించింది. జనాబా గణాంకాలు 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఔరంగాబాద్ జనాభా 11,75,116, అందులో 6,09,206 మంది పురుషులు కాగా, 565,910 మంది స్త్రీలు ఉన్నారు. 0 నుండి 6 సంవత్సరాల వయస్సులోపు జనాభా 1,58,779 మంది ఉన్నారు. ఔరంగాబాద్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 8,89,224, ఇది జనాభాలో 75.67%గా ఉంది. పురుషుల అక్షరాస్యత 79.34%, స్త్రీల అక్షరాస్యత 71.72%. ఔరంగాబాద్ 7+ జనాభా ప్రభావవంతమైన అక్షరాస్యత రేటు 87.5%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 92.2%, స్త్రీల అక్షరాస్యత రేటు 82.5%. షెడ్యూల్డ్ కులాలు జనాభా వరుసగా 2,29,223, షెడ్యూల్డ్ తెగల జనాభా 15,240 మంది ఉన్నారు. 2011లో ఔరంగాబాద్‌లో 2,36,659 నివాస గృహాలు ఉన్నాయి. మతం ప్రకారం జనాభా ఔరంగాబాద్ జనాభాలో ఎక్కువ మంది హిందువులు (51%), తర్వాత 30% ముస్లింలు, 15.2% బౌద్ధులు, 1.6% జైనులు ఉన్నారు. నగరంలో గణనీయమైన సంఖ్యలో సిక్కు మతం, క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు ఉన్నారు.[39] బౌద్ధులు నవయాన సంప్రదాయానికి చెందినవారు, వీరు ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు. ప్రముఖులు ప్రతీక్షా లోన్కర్: నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. చిత్రమాలిక మూలాలు వెలుపలి లింకులు Aurangabad District website తెలంగాణ‌లో మెదక్ జిల్లా, మెదక్ మండలంలో కూడా ఒక ఔరంగాబాద్ అనే గ్రామం ఉంది. వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు
కొల్హాపూర్ జిల్లా
https://te.wikipedia.org/wiki/కొల్హాపూర్_జిల్లా
కొల్హాపూర్ (మరాఠీ:कोल्हापूर) ఉత్తర మహారాష్ట్రలో ఒక పట్టణం , జిల్లా ప్రధానకేంద్రం. ఈ పట్టణం భారతదేశంలోని అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటి. దీని ప్రస్తుత జనాభా ఇంచుమించుగా 419,000 ఉంటుంది. ఇక్కడి ప్రధాన భాష మరాఠీ. ఇది పంచగంగ నది ఒడ్డున ఉంది. ఇక్కడి మహాలక్ష్మి దేవాలయం బాగా ప్రసిద్ధిచెందినది. ఈ పట్టణం కొల్హాపూర్ చెప్పులకు కూడా ప్రసిద్ధి. చూడవలసిన ప్రదేశాలు కొల్హాపూర్ లో ముఖ్యంగా చూడవలసినవి మహాలక్ష్మి దేవాలయం , మహారాజ భవనం.left|thumb|150px|కొల్హాపూర్ మహాలక్ష్మి మహాలక్ష్మి దేవాలయం 'హేమాడ్ పంతి' నిర్మాణశైలిలో కట్టబడింది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని 'అంబాబాయి' అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్నతెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఇక మహారాజ భవనం సుమారు రెండు వందల గదులతో మూడు అంతస్తులతో చక్కగా విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. ఆనాటి రాజుల ఆయుధాలు, రాజరికపు సామగ్రి మొదలైనవి ఇందులో పొందుపరిచారు. కొల్హాపూర్ సంస్థానం thumb|left|కొల్హాపూర్ సంస్థాన పతాకము కొల్హాపూర్ బ్రిటిష్ కాలంలో బొంబాయి ప్రెసిడెన్సీలో ఒక ప్రముఖ సంస్థానం. ఆ కాలంలో నాలుగు ముఖ్యమైన సంస్థానాలలో ఒకటి; మిగిలిన మూడు బరోడా, గ్వాలియర్ , ఇండోర్. దీని పాలకులైన బోంస్లే రాజ్యం 19-గన్ సెల్యూట్ కు అర్హులు. right|thumb|250 px|కొల్హాపూర్ జిల్లా పటం కొల్హాపూర్ సంస్థానం క్రింద 3,165 చదరపు మైల్లు (8,200 చ.కి.మీ.) ఉండేది. ఈ సంస్థానంలో 1901 జనాభా లెక్కల ప్రకారం దీనిలో 910,011, ప్రజలు నివసించేవారు, వీరిలో 54,373 కొల్హాపూర్ పట్టణంలో ఉండేవారు. దీని ఆదాయం £300,000. కొల్హాపూరును పరిపాలించిన రాజులు, తంజావూరు , సతారాలను పాలించిన భోంసాలే వంశాల వలె మరాఠా భోంసాలే రాజవంశము నుండి ఉద్భవించారని చెప్పుకుంటారు. మరాఠా సామ్రాజ్య వారసత్వ విషయమై తలెత్తిన వివాదాల వలన సతారా , కొల్హాపూరు రాజ్యాలు 1707లో ఏర్పడ్డాయి. మరాఠా సామ్రాజ్యానికి వారసుడైన షాహూ శంభాజీని మొగలులు తొమ్మిదేళ్ళ వయసులో పట్టి బంధించి ఖైదులో ఉంచారు. షాహూ శంభాజీ తండ్రి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ పెద్దకొడుకు శంభాజీ. శంభాజీ మరణం తర్వాత శివాజీ చిన్నకొడుకు రాజారాం ఛత్రపతి అయ్యాడు. 1700లో అనారోగ్యము వలన రాజారాం మరణించగా ఆయన భార్య మహారాణి తారాబాయి తన కొడుకు రెండవ శంభాజీని మహారాజుగా ప్రకటించి, తాను ప్రతినిధిగా పాలించింది. 1707లో మెగలులు కొన్ని షరతులతో షాహూను విడుదల చేశారు. విడుదలైన షాహూ తన వంశానుగతమైన రాజ్యాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేశాడు. thumb|నూతన రాజసౌధం, కొల్హాపూర్|250x250px ఖేడ్ వద్ద జరిగిన యుద్ధంలో షాహూ, తారాబాయి ఓడించి సతారాపై తన అధికారాన్ని స్థాపించాడు. ఓడిపోయిన రాణి తన కొడుకుతో కలిసి కొల్హాపూరులో స్థిరపడింది. 1710 కల్లా రెండు వేర్వేరు రాజ్యాలుగా పరిణమించాయి. దీన్ని 1731లో కుదుర్చుకున్న వార్నా సంధి ధ్రువీకరించింది. బ్రిటీషు వారు కొల్హాపూరుపై 1765లోనూ, 1792లోనూ సైన్యాన్ని పంపారు. 1812లో మరాఠా సామ్రాజ్య పతనం తర్వాత కొల్హాపూరు రాజులు బ్రిటీషు వాళ్లతో సంధి కుదుర్చుకున్నారు. 19వ శతాబ్దపు తొలినాళ్లలో బ్రిటీషువారు తిరిగి కొల్హాపూరుపై దాడిచేసి, తాత్కాళికంగా రాజ్యవ్యవహారాలు నిర్వహించడానికి ఒక రాజకీయ అధికారిని నియమించారు. కొల్హాపూరు చివరి పాలకుడైన మహారాజా ఛత్రపతి రెండవ షాహాజీ పువర్ 1947లో భారత స్వాతంత్ర్యానంతరం కొల్హాపూరును 1947, ఆగస్టు 14న భారతదేశంలో విలీనం చేశాడు. కొల్హాపూరు రాజ్యం 1949, మార్చి 1న బొంబాయి రాష్ట్రంలో కలిసిపోయింది. 1960లో భాషాప్రాతిపదికన బొంబాయి రాష్ట్రము మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా విభజించిబడినప్పుడు, కొల్హాపూరు సంస్థానము యొక్క సరిహద్దులు, కొల్హాపూరు జిల్లా సరిహద్దులైనవి. మూలాలు వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర జిల్లాలు
గోండియా జిల్లా
https://te.wikipedia.org/wiki/గోండియా_జిల్లా
గోండియా జిల్లా (), భారతదేశంలో మహారాష్ట్రకు చెందిన జిల్లా. ముఖ్యపట్టణం గోండియా. జిల్లా విస్తీర్ణం 5,431కి.మీ.². 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 1,200,707. అందులో 11.95% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు (as of 2001). జిల్లా నాగపూరు విభాగంలో ఉంది. ఈ జిల్లాలో (ప్రాంతంలో) గోండియా భాష మాట్లాడేవారు అధికంగా కానవస్తారు. గోండియా పట్టణాన్ని బియ్యపు నగరంగా కూడా అభివర్ణిస్తారు. ఈ పరిసర ప్రాంతాల్లో వరి పండిస్తారు. గోండియా పట్టణం పరిసర ప్రాంతంలో 250కి పైగా బియ్యపు మిల్లులు ఉన్నాయి. ఇది ప్రముఖ వ్యాపారకేంద్రం. జిల్లా గుండా వెళుతున్న ఏకైక జాతీయ రహదారి ముంబై-నాగపూరు-కోల్‌కతా రోడ్డు, జిల్లాలో 99.37 కిలోమీటర్లు మేరకు ఉంది. గోండియా నుండి జబల్పూరు, నాగపూరు, బాలాఘాట్ పట్టణాలకు బస్సు సౌకర్యం ఉంది. జిల్లా రెడ్ కారిడార్లో భాగంగా ఉంది. పాలనా విభాగాలు thumb|ఎడమ|నగ్జిరాలో అడవి జిల్లా రెండు రెవెన్యూ విభాగాలు, ఎనిమిది తాలూకాలుగా విభజించబడింది. అవి గోండియా విభాగం, దేవుడీ విభాగం. ఒక్కొక్క విభాగంలో నాలుగు తాలూకాల చొప్పున ఉన్నాయి. గోండియా విభాగంలో గోండియా, గోరేగావ్, తిరోరా, అర్జునీ మోరేగావ్ తాలూకాలు, దేవుడీ విభాగంలో దేవుడీ, అమ్‌గావ్, సలేకాస, సడక్ అర్జునీ తాలూకాలున్నాయి. జిల్లా మొత్తంలో 556 గ్రామ పంచాయితీలు, 8 పంచాయితీ సమితులు, 954 రెవెన్యూ గ్రామాలున్నాయి. జిల్లాలో రెండు పురపాలక సంఘాలున్నవి. అవి గోండియా, తిరోరా. జిల్లాలో 4 విధాన సభ నియోజవర్గాలున్నవి. అవి అర్జునీ-మోరేగావ్ (షె,కు), గోండియా, తిరోరా, అమ్‌గావ్ (షె.తె). మొదటి మూడు నియోజకవర్గాలు భండారా-గోండియా లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైతే, చివరిది ఘడ్చిరోలి-చిమూరు (షె,తె) లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. శీతోష్ణస్థితి thumb|left|300px|గోండియా సరాసరి ఉష్ణోగ్రతలు గోండియా జిల్లా శీతోష్ణస్థితిలో మార్పులు తీవ్రంగా ఉంటాయి. వేసవికాలం చాలావేడిగానూ, చలికాలంలో చాలా చల్లగాను ఉంటుంది. ఇక్కడ సరాసరి గాలిలో తేమ 62 శాతం. వర్షాకాలంలో ప్రతిసంవత్సరం సాధారణంగా 1200 మి.మీలకు పైగా వర్షాన్ని నమోదు చేసుకుంటుంది. మేనెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు 42°సె చేరతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 28°సె వద్ద ఉంటాయి. మే నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 48 °C, అత్యల్ప ఉష్ణోగ్రత 20 °C. డిసెంబరు నెల చివర్లో, జనవరి నెలల్లో ఉష్ణోగ్రత సాధారణంగా గరిష్ఠం 29°సెకు చేరుతుంది. రాత్రిళ్ళు ఉష్ణోగ్రత 13°సెకు పడిపోతుంది. ఇటీవల కాలంలో జనవరి నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38°సె, అత్యల్ప ఉష్ణోగ్రత 0°సె. ఉంటుంది. ఆర్ధిక రంగం 2006లో భారతదేశపు పంచాయితీరాజ్ శాఖ గోండియా, దేశంలో కెళ్ళా బాగా వెనుకబడిన 250 జిల్లాలలో (మొత్తం 640 జిల్లాలు) ఒకటిగా ప్రకటించింది. మహారాష్ట్రలో వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ కార్యక్రమం (బి.ఆర్.జి.ఎఫ్)లో భాగంగా ఆర్థిక సహాయం అందుకుంటున్న పన్నెండు జిల్లాలలో గోండియా కూడా ఒకటి. జనాభా గణాంకాలు 2011 జనాభా లెక్కల ప్రకారం గోండియా జిల్లా మొత్తం జనాభా 1,322,331, ఇది మారిషస్ దేశపు జనాభాతో లేదా అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్రంతో సరిసమానం.. భారతదేశంలో 640 జిల్లాలో జనాభా పరంగా గోండియా 369వది. జిల్లా జనసాంద్రత చ.కి.మీకు 253 . 2001-2011 వరకు సాగిన దశాబ్దంలో జిల్లా జనాభా 10.13%. వృద్ధి చెందింది గోండియా జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 996 మంది స్త్రీలు ఉన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతం 85.41%గా ఉంది. సరిహద్దులు మూలాలు వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర జిల్లాలు వర్గం:గోందియా జిల్లా
చంద్రపూర్
https://te.wikipedia.org/wiki/చంద్రపూర్
చంద్రపూర్ మహారాష్ట్ర లోని ఒక పట్టణం, అదే పేరు గల జిల్లా కేంద్రం. చంద్రపూర్ కోటలు ఉన్న నగరం ఈ నగరాన్ని గోండు రాజు అయిన ఖండక్య బల్లర్షా 13 శతాబ్దంలో స్థాపించాడు దర్శనీయ ప్రదేశాలు జిల్లా కేంద్రం, చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు thumb|తడోబా జాతీయ పులుల సంరక్షణ కేంద్రం - సేద తీరుతున్న ఒక పులి తడోబా జాతీయ పులుల సంరక్షణ కేంద్రం ఆనందవన్ కుష్టురోగుల ఆశ్రమము (వరోర) రమల తలావ్ (చంద్రపూర్) ఘొదజరి తలావ్ (నాగ్‌భిర్) అసోల మెంధ తలావ్ (సలోయ్) మహాకాళి మందిర్ (చంద్రపూర్) అంచలేశ్వర్ మందిర్ (చంద్రపూర్) భద్రనాగ్ మందిర్ (భద్రావతి) జైన్ మందిర్ (భద్రావతి) బుద్ధ లేని (భద్రావతి) గురాల గణపతి మందిర్ ( భద్రావతి) గే ముఖ్ (తదోధి బాలాపుర్ ) పాత మహెడియో మందిరం విష్ణు మందిరము (కొర్పన) ప్రముఖ వ్యక్తులు కరంవీర్ దాదాసాహెబ్ కన్నంవార్ - మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. బల్వంత్‌రావ్ దేశ్‌ముఖ్ - న్యాయవాది, బాలగంగాధర తిలక్ సహచరుడు. మోహన్ భగవత్ -రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధ్యక్షుడు బారిష్టర్ రాజభౌ ఖోబ్రగడె - న్యాయవాది, భీంరావ్ రాంజీ అంబేద్కర్ యొక్క మిత్రుడు. శంతారాం పొట్‌దుఖే - మాజీ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి. వామన్‌రావ్ చటప్ - మాజీ శాసన సభ్యుడు, 1997 ఉత్తమ పార్లమెంటు సభ్యుడు పురస్కార గ్రహీత. సునీల్ పల్ - హాస్య నటుదు మానసి మొఘె - విశ్వసుందరి 2013 తుది పోటీలలో ప్రవేశించిన అభ్యర్థి. హన్స్‌రాజ్ గంగారాం అహిర్- నరేంద్ర మోడి మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ, & రసాయనాలు, ఎరువుల సహాయ మంత్రి. సుభాష్ షిండే - నగల వర్తకుడు, సమాజ సేవకుడు ఇవి కూడా చూడండి చంద్రపూర్ విమానాశ్రయం మూలాలు వెలుపలి లింకులు చంద్రపూర్ జిల్లా అధికారిక వెబ్సైటు Chandrapur Information Portal Chandrapur Information Portal వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు వర్గం:మహారాష్ట్ర పర్యాటక ప్రదేశాలు
నందుర్బార్ జిల్లా
https://te.wikipedia.org/wiki/నందుర్బార్_జిల్లా
thumb|కతి హోలీ నందుర్బార్ మహారాష్ట్ర రాష్ట్రములోని వాయవ్య మూలన ఉన్న ఖాందేష్ ప్రాంతములోని ఒక జిల్లా. జిల్లా ముఖ్యపట్టణం నందుర్బార్. జిల్లా 5055 కి.మీ² మేర వ్యాపించి ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 13,11,709. అందులో 15.45% పట్టణప్రాంతాలలో నివసిస్తున్నారు. నందుర్బార్ పట్టణం నుండి 30 కి.మీల దూరములో సుజ్లాన్ ఎనర్జీ ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సామర్థ్యం కల గాలిమరల ఫార్మును నెలకొల్పుతున్నారు. ఇది ప్రపంచములోనే అతిపెద్ద గాలిమరల సముదాయము. ఇక్కడ స్థానికంగా గాలిమరల టవర్లను , బ్లేడ్లను తయారుచేసేందుకు సుజ్లాన్ ఒక నిర్మాణసంస్థను నెలకొల్పింది. తాలూకాలు జిల్లాలో ఆరు తాలూకాలున్నవి. అవి అక్కల్‌కువా, అక్రానీ మహల్ (ధడ్‌గావ్ అని కూడా పిలుస్తారు. తలోదా, షాహదా, నందుర్బార్ , నవపూర్. జిల్లాలో ఒక లోక్‌సభ నియోజకవర్గము ఉంది. అది నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గము. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ధూలే జిల్లాకు చెందిన సక్రి , షిర్‌పూర్ నియోజకవర్గాలు కూడా భాగంగా ఉన్నాయి. జిల్లాలో నాలుగు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. అవి అక్కల్‌కువా, షాహదా, నందుర్బార్ , నవాపూర్. నందుర్బార్ ప్రాథమికంగా ఆదివాసులుండే ప్రాంతం. వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర జిల్లాలు
నాగపూర్
https://te.wikipedia.org/wiki/నాగపూర్
నాగపూర్ (మరాఠీ: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం, మహారాష్ట్ర రెండవ రాజధాని. ఇది నాగపూర్ జిల్లా ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం. ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. నాగపూర్ ను గోండు రాజు భక్త్ బులంద్ షా స్థాపించాడు . గోండులచే స్థాపించబడినా తరువాతి కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడింది. వీరు బ్రిటిష్ వాళ్ళకు లొంగి పోయారు.19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్, బేరార్ కు కేంద్రంగా చేసుకుంది. రాష్ట్రాల పునర్వస్థీకరణ తరువాత మహారాష్ట్రకు బొంబాయిని రాజధానిగా, నాగపూర్ ను రెండవ రాజధానిగా మార్చారు. నాగపూర్ హిందూ జాతీయ చేతనానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలకు ప్రధాన కేంద్రం. తూర్పు - పడమర ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 6 ఉత్తర - దక్షిణ ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 7 కూడలిగా మారిన ప్రముఖ ప్రదేశం నాగపూర్. ప్రముఖులు సుబ్రమణియం రామదొరై: భారత ప్రభుత్వ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ పై ప్రధానమంత్రి సలహాదారు."S. Ramadorai" .   ఇవి కూడా చూడండి నాగ్పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా నాగ్‌పూర్‌కి చెందిన రఘోజీ I రఘుజీ భోంసాలే II శరద్ అరవింద్ బాబ్డే మూలాలు వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు వర్గం:భారతదేశం లోని రాజధాని నగరాలు
నాసిక్
https://te.wikipedia.org/wiki/నాసిక్
నాసిక్, భారతదేశం, మహారాష్ట్రలాని నాసిక్ జిల్లాకు చెందిన ఒక నగరం. ఇది నాసిక్ జిల్లా కేంద్రం. ఇది బొంబాయి, పూణే లకు 180, 220 కి.మీ. దూరంలో పడమటి కనుమలలో దక్కను పీఠభూమికి పడమటి అంచున ఉంది. ఇది భారతదేశ వైన్ కాపిటల్ గా ప్రసిద్ధిచిందినది. నాశిక్ దగ్గరలోనున్న త్రయంబకేశ్వర్ గోదావరి నదికి జన్మస్థానం. త్వరగా అభివృద్ధి చెందుతున్న నాశిక్ పట్టణ జనాభా ఇంచుమించు 1.4 మిలియన్లు (2006 అంచనా). ప్రఖ్యాత సినీరంగ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే ఇక్కడే జన్మించాడు. త్రయంబకేశ్వరాలయం త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు. పురాతన త్రయంబకేశ్వరాలయం నాశిక్ నుండి 28 కి.మీ.దూరంలోని త్రయంబకం అనే పట్టణంలో ఉంది. శివుని ఆరాధన ప్రాముఖ్యంగా గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది పవిత్ర గోదావరి జన్మస్థానం. గోదావరి నది జన్మించిన పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్. త్రయంబకేశ్వర్' లో పూజించే దేవుడు మహా శివుడు. ద్వాదశ మహార్లింగాలల్లో ఒక పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్.thumb|త్రయంబకేశ్వరాలయం, నాశిక్. ఇతర దేవాలయాలు గంగా గోదావరి దేవాలయం: గంగా గోదావరి దేవాలయం అనేది నాశిక్ లో ఉంది. నాశిక్ లో రాంకుండ్ సమీపంలో గోదావరి కుడిగట్టున ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఈ గుడిలో గోదావరి మాత కొలువై ఉంది. ఈ నదిలో స్నానం చేయగానే ఈ మాతను దర్శించుకుంటారు. బాలచంద్ర గణపతి మందిరం: బాలచంద్ర గణపతి మందిరాన్ని మోరేశ్వర్ దేవాలయం అనీ అంటారు. భారతదేశంలో 21 గణపతి పీటాల్లో ఒకటి అయిన ఈ కోవెల ఎంతో పురాతనమైనది. ప్రవర సంగమం: గోదావరి ప్రవరా నదుల సంగమస్థలంలోని అందమైన ప్రదేశమిది. ఔరాంగాబాదుకు 40 కిలోమీటర్లు దూరం. రామాయణంలో ముడిపడి ఉన్న ఈ ప్రదేశంలో సిద్దేశ్వరం, రామేశ్వర, ముక్తేశ్వర ఆలయాలు ఉన్నాయి. చంగ్ దేవ్ మహరాజ్ మందిరం, పుణతాంబ, కోపర్ గావ్: ఇక్కడ సాధువు వందేవ్ మహరాజ్ సమాధి ఉంది. గోదావరి ఒడ్డునే ఉన్న ఈ పుణతాంబ షిర్డికి దగ్గర్లో ఉంటుంది. సుందర నారాయణ మందిరం: గోదావరికి సమీపంలో ఉన్న ఈ మందిరాన్ని 1756లో గంగాధర యశ్వంత చంద్రచూడు నిర్మించాడు. ప్రధానమూర్తి నారాయణుడు. ఆయనకు ఇరువైపులా లక్ష్మీ సరస్వతులు కొలువై ఉన్నారు. దీనికి దగ్గర్లోనే బదరికా కొలను ఉంటుంది. ఈ కొలనును ప్రముఖ మహారాష్ట్ర సాధువు సంత్ జ్ఞానేశ్వర్ తన జ్ఞానేశ్వరిలో ప్రస్తావించాడు. మార్చి21 నాడు ఆలయంలోని విగ్రహాల మీద సూర్య కిరణాలు ప్రసరించడం విశేషం. ఈ ఆలయ నిర్మాణశైలిలో మొగలుల వాస్తుశిల్ప ప్రభావం కనిపిస్తుంది. ఇవి కూడా చూడండి నాసిక్ లోక్‌సభ నియోజకవర్గం ఖండేష్ జిల్లా బయటి లింకులు Web Portal of Nashik City and District-NashikDiary.com Official Website of Nashik Nasik Nashik @ Information Technology - Publish Local News of Nashik and Nashik Business Directory. NasikDiary - Online Web Portal of Nashik Programme Guide of Nasik Yellow Pages of Nashik Real Estate Information on Nashik Nashik City Overview of Nashik on Wikimapia Nasik district Gazetteers వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర పుణ్యక్షేత్రాలు వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు వర్గం:జ్యోతిర్లింగాలు వర్గం:గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రములు వర్గం:ప్రసిద్ధ శైవక్షేత్రాలు
నాందేడ్
https://te.wikipedia.org/wiki/నాందేడ్
నాందేడ్, మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రెండవ అతిపెద్ద నగరం, నాందేడ్ జిల్లా ముఖ్య పట్టణం. నాందేడ్ సిక్ఖులకు చాలా చారిత్రకమైన స్థలం. అంతేకాక నాందేడ్ అనేక సూఫీ ఆలయాలకు కూడా నెలవు. ఈ నగరం గోదావరి నది ఒడ్డున ఉంది. ఇది రాష్ట్రంలో పదవ అతిపెద్ద నగరం, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన డెబ్బై తొమ్మిదవ నగరం. మరఠ్వాడా ప్రాంతంలో రెండవ అతిపెద్ద నగరం.నాందేడ్ జిల్లాకు జిల్లాకేంద్రంగా ఉంది. చివరి సిక్కు గురువు, గురు గోవింద్ సింగ్ తన చివరి రోజులలో నాందేడ్‌లో గడిపాడు. 1708లో అక్కడ మరణించే ముందు తన గురుత్వాన్ని పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌కు పంపాడు భౌగోళికం నాందేడ్ పట్టణ ప్రాంతం విస్తీర్ణంలో విస్తరించి ఉంది.Nanded home page NWCMC నాందేడ్ జిల్లాకు పశ్చిమాన లాతూర్ జిల్లా,పర్భాని జిల్లా, హింగోలి జిల్లా, ఉత్తరాన యవత్మాల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాకు తూర్పున తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. నాందేడ్ రెండు భాగాలుగా ఉంది:పాత నాందేడ్ గోదావరి నది ఉత్తర తీరాన్ని ఆక్రమించింది.న్యూ నాందేడ్,నదికి దక్షిణంగా వాఘాలా, పరిసర ప్రాంతాలను కలిగి ఉంటుంది. వ్యుత్పత్తి శాస్త్రం సుమారు పట్టణం వాషిమ్‌లో కనుగొనబడిన రాగి ఫలకం శాసనం నుండి నాందేడ్‌కు ఉత్తరాన, పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నగరాన్ని గతంలో ( అని పిలిచేవారు.) మరొక పేరు Nanded City Nanded airport Corporation website. "నాందేడ్" అనే పేరు శివుని వాహనం నంది అభివృద్ధి చెందిందని జానపద కథలు సూచిస్తున్నాయి.శివుడు గోదావరి నది ఒడ్డున () తపస్సు చేశాడని చెప్పబడింది. ఈ " " తరువాత "నాందేడ్" అయింది. చరిత్ర నాందేడ్ మహాభారతంలో భరత్ తల్లి తాతల ప్రదేశంగా పేర్కొనబడింది.సాశ.1వ శతాబ్దం లో,ఈ ప్రాంతంలో అధికారం ఆంధ్రభృత్యులు, సత్వాహనుల వద్ద ఉంది. సా.శ.పూర్వం 5వ, 4వ శతాబ్దాలలో, నాందేడ్‌ను నందా రాజవంశం పరిపాలించింది.సా.శ.పూర్వం 3వ శతాబ్దంలో (సుమారు 272 నుండి 231 సా.శ.పూర్వం వరకు), ఇది అశోకుని ఆధ్వర్యంలోని మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉంది. స్థానిక నీటిపారుదల పద్ధతులు, నాందేడ్ కూడా లీలా చరిత్ర (సా.శ. 1200ల చివరి) గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. నాందేడ్ ముగ్గురు మరాఠీ కవి-సన్యాసుల జన్మస్థలం-విష్ణుపంత్ శేష, రఘునాథ్ శేష, వామన్ పండిట్ కంధర్ కోట కంధర్‌లో ఉంది.ఇది సా.శ. 10వ శతాబ్దంలో పాలించిన రాష్ట్రకూట రాజు మల్ఖేడాకు చెందిన కృష్ణ IIIకి ఆపాదించబడింది. 1636 నుండి నాందేడ్ నిజాం రాష్ట్రం పాలనా కేంద్రంగా ఉంది.ఇందులో ప్రస్తుత తెలంగాణ, కర్ణాటకకు చెందినప్రాంతాలు ఉన్నాయి.ఇది మొఘల్ బాద్షా (చక్రవర్తి) షాజహాన్ సామ్రాజ్య ప్రావిన్స్.1657లో నాందేడ్ బిదా సుబాలో విలీనం చేయబడింది.గురునానక్ (సా.శ.1469 1539) శ్రీలంకకు వెళ్లే మార్గంలో నాందేడ్ గుండా వెళ్ళారు. గురు గోవింద్ సింగ్ (సా.శ.1666 1708) మొఘల్ చక్రవర్తి బహదూర్ షా I (సా.శ.1643 1712 ) తో కలిసి సా.శ.1707 లో ఆగస్టు చివరిలో నాందేడ్‌కు చేరుకున్నారు.బహదూర్ షా గోల్కొండకు వెళ్లినప్పుడు, గురుగోవింద్ సింగ్ నాందేడ్‌లోనే ఉన్నాడు.గురు గోవింద్ సింగ్ తాను చివరి (పదవ) సజీవ గురువు అని ప్రకటించాడు. పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను శాశ్వతమైన "జీవన" నాయకుడిగా స్థాపించాడు. గురు గోవింద్ సింగ్ తన నలుగురు కుమారుల బలిదానం కారణంగా వంశపారంపర్య వారసుడు లేకుండా మరణించాడు. 1725లో నాందేడ్ హైదరాబాద్ రాష్ట్రంలో భాగమైంది. సుమారు 1835లో మహారాజా రంజిత్ సింగ్ సికిందర్ జా (హైదరాబాద్ 3వ నిజాం ఆర్థిక సహాయంతో నాందేడ్‌లో గురుద్వారా నిర్మాణాన్ని అప్పగించారు.ఇది గురు గోవింద్ సింగ్ దహన సంస్కారాల స్థలంలో నిర్మించబడింది.గురుద్వారా హజూర్ సాహిబ్‌లో భాగం. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత,భారత సాయుధ దళాలు హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ పోలోలో నిజాం పాలనను ముగించాయి. నాందేడ్‌ను కొత్త హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా చేసింది.నాందేడ్ 1956 వరకు బొంబాయి ప్రెసిడెన్సీలో చేర్చబడే వరకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత,భారత సాయుధ దళాలు హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ పోలోలో నిజాం పాలనను ముగించాయి. నాందేడ్‌ను కొత్త హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా చేసింది.నాందేడ్ 1956 వరకు బొంబాయి ప్రెసిడెన్సీలో చేర్చబడే వరకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉంది. జనాభా గణాంకాలు 2011 జనాభా లెక్కల ప్రకారం, నాందేడ్ జనాభా 5,50,564.లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 924 మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో 12.4 శాతం మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు. ప్రభావవంతమైన అక్షరాస్యత శాతం 87.40, 81.74 శాతం మంది మహిళా అక్షరాస్యులు కాగా, పురుష అక్షరాస్యత 92.68 శాతం మంది ఉన్నారు. ప్రయాణం రహదారి ద్వారా మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నాందేడ్ నుండి మహారాష్ట్ర రాష్ట్రంలోని అనేక నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి.తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ బస్సులు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని నగరాలకు నాందేడ్‌ నగరానికి కలుపుతాయి. రైలుద్వారా హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్ (ఎస్.సి.ఆర్) లోని నాందేడ్ రైల్వే డివిజన్‌లోని సికింద్రాబాద్-మన్మాడ్ లైన్‌లో ఉంది. నాందేడ్ రైల్వే డివిజన్ భారతీయ రైల్వేలలోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఆరు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ స్టేషన్ నుండి ప్రతి రోజు దాదాపు 48 రైళ్లు వచ్చి బయలుదేరుతాయి. మాల్టెక్డి రైల్వే స్టేషన్ నాందేడ్ నగరానికి సేవలు అందించే మరొక రైల్వే స్టేషన్. వాయు మార్గం శ్రీ గురు గోవింద్ సింగ్ జీ విమానాశ్రయం, నాందేడ్ నుండి హైదరాబాద్, ముంబై, జల్గావ్‌లకు రోజువారీ ట్రూజెట్ విమానాలు సేవలు అందిస్తాయి. ఎయిర్ ఇండియా అమృత్‌సర్‌కు విమానాలను నడుపుతోంది. ఆర్థికం నాందేడ్ చుట్టూ పండే పంటలలో పత్తి, అరటి, చెరకు, మామిడి, సోయా బీన్స్, తీపి నిమ్మకాయలు, ద్రాక్ష, బొప్పాయి, జొన్న (జావర్) ఉన్నాయి. నాందేడ్‌లో పత్తి-పెరుగుతున్న పరిశ్రమకు మద్దతుగా ప్రాంతీయ పత్తి పరిశోధనా కేంద్రం ఉంది. పర్భానిలోని కృషి విద్యాపీఠం ఆధ్వర్యంలో ఒక వ్యవసాయ పాఠశాల ఉంది. ఎక్కువగా మతపరమైన యాత్రికులు ప్రతి సంవత్సరం నాందేడ్ నగరం 10 మిలియన్లు మంది యాత్రికులు సందర్శిస్తుంటారు. విద్యా సౌకర్యం 1994 సెప్టెంబరు 17 న, ఔరంగాబాద్‌లోని మరఠ్వాడా యూనివర్శిటీ పునర్నిర్మాణం తర్వాత స్వామి రామానంద్ తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం (ఎస్.ఆర్.టి.ఎం.యు) నాందేడ్‌లో స్థాపించబడింది. మరాఠ్వాడా డివిజన్‌లోని నాలుగు జిల్లాల్లోని సీనియర్ కళాశాలల్లో విద్యా కార్యకలాపాలను విశ్వవిద్యాలయం పర్యవేక్షిస్తుంది. నాందేడ్‌లోని ప్రముఖ విద్యా సంస్థలలో డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీ గురు గోవింద్ సింగ్‌జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. పరిపాలన నాందేడ్ నగరాన్ని నాందేడ్-వాఘాలా నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది. కార్పొరేషన్‌లో 81 మంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు. కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మునిసిపల్ కమీషనరు వ్యవహరిస్తాడు. పర్యాటక ప్రదేశాలు నాందేడ్ కోట ఇది గోదావరి నది ఒడ్డున ఉంది.దీనిని నందగిరి కోట అని కూడా పిలుస్తారు. గోదావరి నది మూడు వైపులా కోటను చుట్టుముట్టింది. పర్యాటకులను ఆకర్షించేందుకు కోటను ఉద్యానవనంగా మార్చారు. కోటలో వాటర్ ట్యాంక్ నిర్మించబడింది. గోదావరి నది ఘాట్లు ఊర్వశి ఘాట్, రామ్ ఘాట్, గోవర్ధన్ ఘాట్ వంటి గోదావరి నది ఘాట్‌లపై వైదిక ఆచారాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. దేవాలయాలు కాళేశ్వర మందిరం, విష్ణుపురి శని మందిర్, మోండా యాజ్ఞవల్క్య వేదపాఠశాల సరస్వతీ మందిరం, శ్రీ నగర్ శ్రీ యాదవ్ అహిర్ సమాజ్ మహామాయి మాతా మందిర్, దేవినగర్ గణపతి మందిర్, త్రికూట్ హనుమాన్ మందిర్, త్రికూట్ దత్త మందిర్, త్రికూట్ రేణుకా మాతా మందిర్, మహూర్‌ఘర్ సిద్ధేశ్వర మందిరం, హోటల్ - చాళుక్యుల కాలంలో నిర్మించబడింది, ఇది హేమడ్‌పంతి ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణ. శివ మందిరం, తడ్ఖేల్, డెగ్లూర్ తాలూకా - హిందూ రాజు సేనాపతి గ్రంథాన్ని ప్రదర్శించే పెద్ద రాళ్లతో నిర్మించబడింది. జగదాంబ మాతా మందిర్, తడ్ఖేల్ శ్రీ నర్సింహ మందిరం, జూన్న కౌఠా. గురుద్వారా హజూర్ సాహిబ్ మహారాజా రంజిత్ సింగ్ చేత నిర్మించబడింది. ఇది పంజ్ తఖ్త్‌లో ఒకటి, సిక్కులకు ఉన్నత అధికారం ఉన్న ఐదు స్థానాలు. ఇది గురు గోవింద్ సింగ్ దహన సంస్కార స్థలంలో నిర్మించబడింది. అతని అవశేషాలు, ఆయుధాలు సైట్లో భద్రపరచబడ్డాయి. గురుద్వారా నగీనా ఘాట్ సాహిబ్ గురుద్వారా బందా ఘాట్ సాహిబ్ (బాబా బందా సింగ్ బహదూర్) గురుద్వారా షికార్ ఘాట్ సాహిబ్ గురుద్వారా బావోలి సాహిబ్ గురుద్వారా హీరా ఘాట్ గురుద్వారా మాతా సాహిబ్ గురుద్వారా మాల్ టెక్డి గురుద్వారా సంగత్ సాహిబ్ గురుద్వారా నానక్‌పురి సాహిబ్ (గురునానక్ స్థలం) గురుద్వారా భజంగర్ సాహిబ్ చర్చీలు సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ కాథలిక్ చర్చి మెథడిస్ట్ చర్చి బెతెల్ ఎజి చర్చి పెంటెకోస్టల్ మిషన్ (చర్చ్) బెథెస్డా మినిస్ట్రీస్ చర్చి నగర ప్రముఖులు బందా సింగ్ బహదూర్, సిక్కు సైనిక కమాండర్. దత్తా భగత్, అంబేద్కరైట్ రచయిత. అశోక్ చవాన్, మహారాష్ట్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గ మాజీ పార్లమెంటు సభ్యుడు. శంకర్‌రావ్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ హోం మంత్రి. ప్రతాపరావు గోవిందరావు చిఖాలీకర్, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ సభ్యుడు సయ్యద్ సదాతుల్లా హుసైనీ, జమాతే ఇస్లామీ హింద్ (జెఐఎచ్) అధ్యక్షుడు (అమీర్) కమల్‌కిషోర్ కదమ్, మాజీ విద్యాశాఖ మంత్రి. నాగనాథ్ లాలూజీరావు కొత్తపల్లె, (బిఎఎంయు) మాజీ వైస్ ఛాన్సలర్, విద్యావేత్త, రచయిత. నర్హర్ అంబదాస్ కురుంద్కర్, పండితుడు, విమర్శకుడు, రచయిత. వామన్ పండిట్, మరాఠీ పండితుడు, కవి. నాందేడ్‌లో మరణించిన చివరి సిక్కు గురువు గురుగోవింద్ సింగ్. మూలాలు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు
పూణే
https://te.wikipedia.org/wiki/పూణే
పూణే పశ్చిమ భారతదేశం లోని మహారాష్ట్ర అనే రాష్టంలో ఉంది. ఈ నగరం పూణే జిల్లా రాజధాని. 4.5 మిలియన్ల జనాభాతో ఇది భారతదేశంలోని ఎనిమిదవ అతి పెద్ద నగరంగా, మహారాష్ట్రలో రెండవ అతి పెద్ద నగరంగా ఉంది. ముంబాయి మహానగరం నుండి ఇది సుమారు 160 నుంచి 180 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుంది. ఇది ఎన్నో గొప్ప విద్యాసంస్థలకు ప్రసిద్ధిగాంచింది. అందుకే దీనిని "ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్" (ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ఇండియా) అని పిలుస్తారు. జాతీయ వైరాలజీ పరిశోధన సంస్థ ఇక్కడ ఉంది. ప్రముఖులు పూణే నగరంలో జన్మించిన కొందరు ప్రముఖులు: ఆనందీబాయి జోషి - పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. కమల్ రణదివె - భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. కునాల్ గాంజావాలా - సినిమా నేపథ్య గాయకుడు. ప్రభా ఆత్రే - కిరాణా ఘరానాకు చెందిన హిందుస్తానీ గాయని. బాల గంధర్వ - ఈ పేరుతో ప్రసిద్ధుడైన నారాయణ్ శ్రీపాద్ రాజ్‌హంస్ మరాఠీ గాయకుడు, నాటక కళాకారుడు. బాల్ థాకరే - శివసేన పార్టీ వ్యవస్థాపకుడు. మణీందర్ సింగ్ - భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. రాధిక ఆప్టే - భారతీయ నటి. తెలుగు, హిందీ సినిమాలలో నటించింది. రేణూ దేశాయ్ - తెలుగు నటి, రూపదర్శి, కాస్ట్యూం డిజైనర్. తెలుగు నటుడు పవన్ కళ్యాణ్ని వివాహం చేసుకుంది. రోహిణీ హట్టంగడి - హిందీ నటి. రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ చిత్రంలో కస్తూరీబా పాత్రలో నటించింది. వసంత్ గోవారికర్ - భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. వినోద్ ఖోస్లా - ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్, సన్ మైక్రోసిస్టమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకడు. వినోద్ ధామ్ - ఇంటెల్ పెంటియమ్ చిప్ యొక్క రూపకర్త. వై.వి. చంద్రచూడ్ - 16వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి. సులోచన/రూబీమేయర్స్ - తొలి తరం హిందీ సినిమా నటి. "ఇండియన్ గ్రేటాగార్బో"గా ప్రసిద్ధి చెందిన ఆంగ్లో ఇండియన్. స్మితా పాటిల్ - భారతీయ సినిమా, టెలివిజన్ నటి. హంసా నందిని - నటిగా, మోడల్‌గా రాణిస్తున్న వ్యక్తి. పలు తెలుగు సినిమాలలో నటించింది. ఇవికూడా చూడండి భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా లేన్యాద్రి హుజూర్పాగా వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు
బాంద్రా (ముంబై)
https://te.wikipedia.org/wiki/బాంద్రా_(ముంబై)
బాంద్రా (ఆంగ్లం: Bandra) (మరాఠీ భాష वांद्रे, వాంద్రే ) ముంబైకి చెందిన ఒక ఉప-నగర ప్రాంతం. ఇచ్చట గల రెక్లమేషన్ ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో బాలీవుడ్కు చెందిన అనేక నటులు, నటీమణుల నివాసాలు గలవు. thumb|బాంద్రా రెక్లమేషన్ నుండి ముంబాయి దృశ్యం. పాఠశాలలు, కాలేజీలు IES' న్యూ ఇంగ్లీష్ స్కూల్ ఆర్య విద్యా మందిర్. బాంద్రా ఉర్దూ ఉన్నత పాఠశాల B. A. F. పెటిట్ బాలికల ఉన్నత పాఠశాల. ఫాదర్ ఆగ్నెల్ ఉన్నత పాఠశాల, కాలేజి లర్నర్స్ అకాడెమీ మహాత్మాగాంధీ విద్యామందిర్ R. D. నేషనల్ కాలేజి. థాడోమల్ సహానీ ఇంజనీరింగ్ కాలేజి. రిజ్వీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్. జియో లింకులు Ideally geo links should be integrated into the main article మూలాలు వెలుపలి లింకులు MyBandra.com — classifieds, blogs and events in Bandra వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు
భండారా
https://te.wikipedia.org/wiki/భండారా
భండారా , మహారాష్ట్ర లోని భండారా జిల్లాకు చెందిన పురపాలక సంధ పట్టణం.ఇది భండారా జిల్లా కేంద్రం ప్రత్యేకతలు link=https://en.wikipedia.org/wiki/File:Pillar_with_Naga_Muchalinda_over_the_throne_of_the_Buddha._Pauni_(Bhandara_District)._Railing_pillar_from_Jagannath_Tekri._2nd-1st_century_BCE.jpg|thumb|భండారాలో లభించిన బౌద్ధ శిల్పం భండారా ఒక వ్యవసాయకేంద్రం. ఇక్కడ వరి విస్తారంగా పండించబడుతుంది. నగరంలో అధికంగా మారాఠీ వాడుకలో ఉంది. నగరం నుండి జాతీయరహదారి- 6 పోతుంది. నగరాన్ని వైనగంగా, సూర్ నదులు విభజిస్తున్నాయి. ఆర్ధికం భండారా నగరంలో ఆర్డినెంస్, అశోక్ లేలాండ్, సన్ ఫ్లాగ్ ఐరన్ పరిశ్రమలు ఉన్నాయి. ప్రజలు భండారాలో నొగ్యాలింగ్ టిబెటన్ సెటిల్మెంట్ ఉంది. 1972లో స్థాపించబడింది. ఇక్కడ దాదాపు 1000 మది టిబెటియన్లు నివసిస్తున్నారు. టిబెటన్లు నివసిస్తున్న నొగ్యాలింగ్‌ను నోర్గ్యేలింగ్, నొర్గలింగ్ అనికూడా పిలుస్తారు. భౌగోళికం భండారా 21.17 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.65 డిగ్రీల దక్షణ రేఖాంశంలో ఉంది.Falling Rain Genomics, Inc - Bhandara నగరం సముద్రమట్టానికి సరాసరి ఎత్తు 244 మీ. ఆర్ధికం భండారా ఆర్థికంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఆటవీ వనరుల మీద ఆధారపడి ఉంది. భండారాలో వరి విస్తారంగా పండించబడుతుంది. చేతితో నేసిన పట్టువస్త్రాలకు భండారా ప్రసిద్ధి. వీటిని హల్బా కోష్టి గిరిజనులు తయారుచేస్తారు. వాతావరణం నగరంలో వాతావరణం అన్ని సీజన్లలో అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెల్షియస్ ఉంటుంది. శీతాకాలాలు కూడా అతిశీతలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 8 డిగ్రీలు సెల్షియస్ ఉంటుంది. గణాంకాలు 2001 గణాంకాలను అనుసరించి వివరణలు. విషయం వివరణ జనసంఖ్య 91,845 పురుషులు 51% స్త్రీలు 49% అక్షరాస్యత 80% పురుషుల అక్షరాస్యత 85% స్త్రీల అక్షరాస్యత 75% 6 వయసు లోపు పిల్లలు 11% పరిశ్రమలు అశోక్ లేలండ్ సంస్థ ఇక్కడ భారీ వాహనాలు తయారు చేస్తుంది. భండారా నగరంలో బి.హెచ్.ఇ.ఎల్, సన్‌లాగ్ ఐరన్ & స్టీల్ కంపెనీ, ఆర్డినెంస్ ఫ్యాక్టరీ, ఎల్లోరా మిల్, మాంగనీస్ ఓర్ మైంస్ ఉన్నాయి. భండారా వద్ద వీడియోకాన్ ఇంటర్నేషనల్ కంస్స్యూమర్ ఎలెక్ట్రానిక్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. భాష మరాఠీ అధికంగా వాడుకలో ఉంది. హిందీ కూడా వాడుకలో ఉంది. ఇవికూడా చూడండి మేక్ ఇన్ మహారాష్ట్ర మూలాలు వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు
ముంబై
https://te.wikipedia.org/wiki/ముంబై
ముంబయి (), పూర్వం దీనిని బొంబే అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ముఖ్య నగరం. ఇది మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని , భారత దేశంలో ఢిల్లీ తర్వాత రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరం. అలాగే ప్రపంచంలో జనభా పరంగా ఏడో స్థానంలో ఉంది. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు (ఒక కోటి ముప్పై లక్షలు ). ఇది మహారాష్ట్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉంది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు. ఈ నగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్థులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈ నగర వాసుల సాహసం ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియాలో ముంబాయ్ అతి పెద్ద నగరం. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. పేరు మరాఠీయుల ఆరాధ్యదైవమయిన ముంబా దేవి పేరు మీదుగా ఈ పట్టణానికి ముంబై అనే పేరు వచ్చింది. పాత పేరైనటువంటి 'బాంబే' కు మూలం, 16వ శతాబ్దములో పోర్చుగీసు వారు ఈ నగరానికి వచ్చినపుడు బొంబైమ్ అనే పేరుతో పిలిచేవారు. 17వ శతాబ్దంలో బ్రిటిషువారు దీనిని 'బాంబే' అని పిలిచారు. మహారాష్ట్రీయులు దీనిని 'ముంబై' అని హిందీ ఉర్దూ భాషలవారు 'బంబై' అనే పేర్లతో పిలుస్తారు. కాని మహారాష్ట్రీయులు , గుజరాతీయులు ఇంగ్లీషు భాషలో సంభాషించినపుడు 'బాంబే' అనే పలుకుతారు. 1995 లో అధికారికంగా ఈ నగరానికి "ముంబై" అనే పేరును స్థిరీకరించారు. పేరు చరిత్ర ముంబై నగరానికి ఈ పేరు మాంబాదేవి అనే హిందూ దేవత పేరు ఆధారంగా వచ్చింది. మహా అంబ అనే పేరు రూపాంతరంచెంది మంబాగా మారింది. ఆయీ అంటే మరాఠీ భాషలో అమ్మ ముంబ, ఆయి కలసి ముంబై అయింది. దీనికి ముందరి పేరు బాంబేకి మూలం పోర్చుగీసువారి బాంబియం. 16వ శతాబ్దంలో ఇక్కడకు ప్రవేశించిన పోర్చుగీసు వారు ఈ నగరాన్ని పలు పేర్లతో పిలిచి చివరకు వ్రాత పూర్వకంగా బాంబియంగా స్థిరపరిచారు. 17వ శతాబ్దంలో ఈ నగరాన్ని స్వాధీన పరచుకున్న ఆంగ్లేయులు ఈ పేరుని కొంత ఆంగ్ల భాషాంతరం చేసి బాంబేగా మార్చారు. మరాఠీలు , గుజరాతీయులు దీనిని మంబాయి, ముంబాయి గానూ హిందీలో దీనిని బంబాయి గాను పిలిచినా ఆంగ్లంలో మాత్రం దీనిని బాంబేగా పిలుస్తారు. 1995 లో దీనిని అధికార పూర్వకంగా మరాఠీల ఉచ్ఛారణ అయిన ముంబైగా మార్చారు. నగర చరిత్ర thumb|235px|left|గేట్ వే ఆఫ్ ఇండియా thumb|left|ముంబై హైకోర్టు ముంబై నగర ఉత్తర భాగంలో కాందివలిలో లభించిన కళాఖండాల ఆధారంగా ఇక్కడ రాతియుగం నుండి నివసించినట్లు విశ్వసిస్తున్నారు. క్రీ.పూ 250 నుండి వ్రాతపూర్వక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని గ్రీకు రచయిత హెప్టెనేషియాగా (గ్రీకు భాషలో:సప్త ద్వీప సమూహం) వ్యవహరించాడు. క్రీ.పూ 3 వ శతాబ్దంలో ఈ సప్త ద్వీపాలు బౌద్ధ మత అవలంబీకుడైన మౌర్యచక్రవర్తి అశోకుని సామ్రాజ్యంలో భాగంగా మారాయి. మొదటి కొన్ని శతాబ్ధాల వరకు ఈ ద్వీపాలపై ఆధిపత్యంలో ఇండో సితియన్ స్ట్రాప్స్ , శాతవాహనుల మధ్య వివాదాలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఈ ద్వీపాలు సిల్హరా సామ్రాజ్యంలో భాగమైనాయి. 1343 వరకూ ఈ ద్వీపాలు గుజరాత్ లో కలిసే వరకూ సిల్హరా పాలనలోనే ఉన్నాయి. కొన్ని పురాతన నిర్మాణాలున్న ఎలెఫెంటా గృహలు, వాకేశ్వర్ గుడుల సమూహం ఇక్కడ ఉన్నాయి. 1534 లో ఈ ద్వీపాలు బహదూర్ షాహ్ ఆఫ్ గుజరాత్ నుండి పోర్చుగీస్ ఆధీనంలోకి వచ్చాయి. 1661లో ఈ ద్వీపాలు ఇంగ్లాండుకు చెందిన రెండవ చార్లెస్‌కు కేథరిన్ డీ బ్రగాంజాను వివాహమాడిన సందర్భంలో వరకట్నముగా లభించాయి. 1963లో ఈ ద్వీపాలు ఈస్టిండియా కంపనీకు 10 పౌండ్ల సంవత్సర లీజు కింద ఇవ్వబడ్డాయి. వారు ఈ ద్వీపాల తూర్పు తీరంలో భారత ద్వీపకల్పంపంలోని తమ మొదటి రేవుని నిర్మించారు. 1661లో 10,000 జనాభా ఉన్న ఈ ప్రాంతం జనాభా 1675 , 1687 నాటికి 60,000 జనాభాగా త్వరితగతిని అభివృద్ధి చెందింది.ది బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ తన ప్రధాన కార్యాలయాన్ని సూరత్ నుండి బాంబేకు మార్చింది. ఎట్టకేలకు ముంబై నగరం బాంబే ప్రెసిడెన్సీకు ప్రధాన నగరంగా మారింది. 1817 నుండి బృహత్తర నిర్మాణ ప్రణాళికల ద్వారా అన్ని ద్వీపాలను అనుసంధానించాలని తలపెట్టారు.1845 నాటికి హార్న్‌బై వల్లర్డ్ పేరుతో నిర్మాణకార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దీని ఫలితంగా మొత్తం ద్వీపాలు 438 చదరపు కిలోమీటర్ల ప్రదేశానికి విస్తరించాయి. 1853లో మొదటి రైలు మార్గాన్ని బాంబే నుండి థానే వరకు నిర్మించారు. అమెరికన్ సివిల్ వార్ (1861-1865) కాలంలో ముంబై నగరం నూలు వస్త్రాల వ్యాపార కేంద్రంగా మారింది. ఫలితంగా నగర ఆర్థిక పరిస్థితులలో పెను మార్పు సంభవించింది. ఆ కారణంగా నగర రూపురేఖలలో విశేష మార్పులు వచ్చాయి. 1955లో బాంబే రాష్ట్రం భాషాపరంగా మహారాష్ట్రా , గుజరాత్‌లుగా విభజింప బడిన తరువాత ఈ నగరం స్వయంపాలిత ప్రాంతంగా మార్చాలన్న ఆలోచనని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రీయులు బాంబే ముఖ్యపట్టణంగా మహారాష్ట్రా రాష్ట్రం కావాలని కోరుతూ సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం లేవదీయడంతో, పోలీసు కాల్పుల్లో 105 మంది మరణంతో ఉద్యమం విజయవంతంగా ముగిసింది. మహారాష్ట్రా రాష్ట్రం బాంబే ముఖ్యపట్టణంగా వెలిసింది. 1970 తరువాత నిర్మాణ కార్యక్రమాలు త్వరిత గతిని అభివృద్ధి చెందటం, వలస ప్రజల స్థిర నివాసం కారణంగా జనసంఖ్యలో బాంబే కలకత్తాను అధిగమించింది. వలస ప్రజల ప్రవాహం ముంచెత్తడం మహారాష్ట్రీయులను కొంత అశాంతికి గురి చేసింది. వారి నాగరికత, భాష , ఉపాధి పరంగా జరిగే నష్టాలను ఊహించి ఆందోళన పడసాగారు. ఈ కారణంగా బాలాసాహెబ్ థాకరే నాయకత్వంలో మాహారాష్ట్రీయుల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యాంశంగా శివసేనా పార్టీ ప్రారంభం అయింది. 1992-1993లో నగర సర్వమత సౌజన్యం చీలికలైంది. దౌర్జన్యాలు విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల కారణంగా మారాయి. కొన్ని నెలల తరువాతి కాలంలో మార్చి 12 వ తారీఖున ముంబాయి మాఫియా ముఠాల ఆధ్వర్యంలో ప్రధాన ప్రదేశాలలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. ఈ సంఘటనలో 300 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. 1995లో శివసేనా ప్రభుత్వ పాలనలో ఈ నగరం పేరు పురాతన నామమైన మూంబైగా మార్చబడింది. 2006లో ముంబై మరో తీవ్రవాద దాడికి గురైంది ఈ సంఘటన 200 ప్రాణాలను బలితీసుకుంది. ఈ దాడి ముంబై నగర రైల్వే పైన జరిగింది. భౌగోళికం ముంబై భారతదేశపు పడమటిభాగంలో అరేబియన్ సముద్ర తీరంలో ఉల్హానదీ ముఖద్వారంలో ఉంది.మహారాష్ట్రా రాష్టృఆనికి చెందిన సాష్టా ద్వీపంలో ముంబై నగరం అధిక భాగాన్ని ఆక్రమించుకుని విస్తరించి ఉంది.ఇది కాక ఈ ద్వీపంలో ఠాణే జిల్లాలోకొంతభాగం కూడా ఉంది.ముంబై నగర అధిక భూభాగం సముద్ర మట్టానికి స్వల్ప ఎత్తులో మాత్రమే ఊంటుంది.నగరమంతా సముద్ర మట్టానికి 10 నుండి 15 మీటర్ల ఎత్తుల మధ్య ఉంటుంది. ఉత్తర ముంబై నగరం కొడ ప్రాంతాలతో నిండి ఉంటుంది.నగరంలోకెల్లా ఎత్తైన ప్రదేశం ఎత్తు 450 మీటర్లు.నగరం విస్తీర్ణం 603 కిలోమీటర్లు. ముంబై నగరంలో సంజయ్ గాంధి నేషనల్ పార్క్ మాత్రం నగరంలోని ఆరవభాగం భూభాగంలో విస్తరించి ఉంది.ఇక్కడ ఇప్పుడు కూడా చిరుతపులులు ఉన్నట్లు గుర్తించబడింది. ముంబై వాసుల మంచినీటీ అవసరాలు తీర్చడానికి భాత్సా కాకుండా ఆరు సరసులు ఉన్నాయి.అవి వరసగా విహార్, వైతర్ణా, ఉప్పర్ వైతర్ణా, తుసి, తాన్సా , పొవాయ్.త్ల్సి, విహార్ సరసులు బొరివిలి నేషనల్ పార్క్‌లో నగర సరిహద్దులో ఉన్నాయి.నగర సరిహద్దులో ఉన్న పొవాయ్ నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తారు.దహిసర్, పొఇన్‌సర్ , ఒహివారా అనే మూడు నదులు ఉన్నాయి.తుల్సి నుండి ప్రవహించే మిథి నది విహారు , పొవాయ్ సరసులు పొంగి పొరలుతున్నపుడు వచ్చేనీటిని చేర్చుకుని ప్రవహిస్తుంది.పడమటి సముద్ర తీరం సెలఏర్లు నీటిమడుగులు ఉన్నాయి.పడమటి సముద్ర తీరం ఇసుక , రాళ్ళతో నిండి ఉంటుంది. వాతావరణం ముంబై నగరం భూమధ్యరేఖకు సమీప ప్రాంతం , సముద్రతీర ప్రాంతం అయినందున ఇక్కడి వాతావరణం రెండు ప్రత్యేక మార్పులకు గురౌతుంది.గాలిలో తేమ అధికంగా ఉండే జీజన్ , పొడిగాలులు వీచే సీజన్ ముంబైలో సహజంగా ఉంటుంది.తడిగాలులు మార్చి , అక్టోబరు మధ్యకాలంలోనూ పొడిగాలులు జూన్ , సెప్టెంబరు మధ్యకాలంలో అధికం.జూన్ , సెప్టెంబరు మాసాల మధ్యకాలంలో వీచే నైరుతి ఋతుపవనాలు నగరానికి నీటి అవసరాన్ని చాలావరకు భర్తీ చేస్తుంది.నగరంలోని వార్షిక వర్షపాతం 2,200 మిల్లీమీటర్లు ఉంటుంది.1954లో నమోదైన 3,452 మిల్లీలీటర్ల వర్షపాతం నగరంలో నమోదైన అత్యధిక వర్షపాతం.ఒక రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం 944 మిల్లీలీటర్లు.పోడి గాలులు వీచే నవంబరు , ఫిబ్రవరి మధ్యకాలం మితమైన తడితో చేరిన వెచ్చదనంతో కూడిన చలిగాలులు కలిగిన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది.ఉత్తరదిశ నుండి వీచే చలిగాలులు జనవరి , ఫిబ్రవరి మాసాల మధ్యకాలంలో కొంచంగా చలిని పుట్టించడానికి కారణమౌతాయి.సంవత్సర అత్యధిక ఉష్ణోగ్రత 38డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యల్ప ఉష్ణోగ్రత 11డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. జనాభా 2001 జనాభా లెక్కల ననుసరించి ముంబై జనాభా 1,30,00,000. నగరపురాలలో నివసిస్థున్న ప్రజలను చేర్చుకుంటే ఈ సంఖ్య 1,60,00,000.5 ముంబై నగర పురపాలక వ్యవస్థకి చెందిన వెలుపలి ప్రదేశాలలో 10,04,000 ప్రజలు నివసిస్థున్నట్లు అంచనా. 2008 లో జనసంఖ్య 1,36,62,885. పురపాలక వ్యవస్థకు చెందిన వెలుపలి ప్రాంతాల జనాభా 2,08,70,764. జన సాంద్రత ఒక చదరపు కిలో మీటర్‌కి 22,000. అక్షరాస్యత శాతం 86%, ఇది దేశ సరాసరి కంటే అధికం. ప్రతి 1000 మంది రురుషులకు 875 మంది స్త్రీలు. ఇది దేశ సరాసరి కంటే కొంచం తక్కువ. ముంబై జనాభాలో హిందువులు 68%, ముస్లిములు 17%, క్రిస్తియన్లు 4%, జైనులు 4%. మిగిలిన వారు పారశీకులు, బౌద్ధ మతస్థులు, యూదులు , అథియిస్టులు.1991 జనాభా లెక్కల మహారాష్ట్రియన్లు 42%, గుజరాతియన్లు18%, ఉత్తర భారతీయులు21%, తమిళులు 3%, సింధీలు 3%, కన్నడిగులు 5% , ఇతరులు. మిగిలిన పెద్ద నగరాలకంటే ముంబైలో అధిక భాషలను మాట్లాడకలిగిన ప్రజలు అధికం. మహారాష్ట్రా రాష్ట్రానికి అధికారభాష మరాఠీ. మరాఠీ రాష్ట్రంలో అధికసంఖ్యాకులు మాట్లాడే భాష. ఇతరభాషలు హిందీ, ఆంగ్లము (ఇంగ్లీషు) , ఉర్దూ. ఇక్కడి వారు మాట్లాడే హిందీని బాంబియా హిందీగా వ్యవహరిస్తారు. మరాఠీ, హిందీ , భారతీయ ఆంగ్లము ఇవి కాక మరికొన్ని ప్రాంతీయ భాషల కలగలుపుగా ఇక్కడి హిందీ ఉంటుంది. ఇక్కడి ప్రజలు అధికంగా ఆంగ్లంలోనే మాట్లాడుతుంటారు. వైట్ కాలర్ జాబ్ అనబడే కార్యాలయ ఉద్యోగులు ఆంగ్లభాషను ఎక్కువగా మాట్లాడుతుంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాధారణంగా ఎదుర్కొనే సమస్య నగారాలు వాటి పరిసరాలలో పెరిగే జనసంఖ్య. అన్ని ననగరాల మాదిరిగా ముంబాయి కూడా నగరపరిసరాలలో విపరీతంగా పెరుగుతున్న జనాభాతో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ కారణంగా నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం లాంటి సమస్యలు నగరానికి పరిష్కరించవలసిన ప్రధాన సమస్యలు. పెరుగుతున్న జనాభా కారణంగా నివాసగృహాలు కొరత వలన ప్రజలు ఇరుకైన గృహాలలో నివసించవలసి వస్తుంది. నివాసాలకు చెల్లించ వలసిన బాడుగలు ఎక్కువే. నివాస ప్రదేశానికి పనిచేసే ప్రదేశానికి దూరాలూ ఎక్కువే. ఈ కారణంగా ప్రయాణ వసతులు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం కొంత కష్ణమవుతున్నది. సిటీ బస్సులు, లోకల్ ట్రైన్లలో జన సమర్ధం ఎక్కువైనప్పటికి, చక్కగా కాల ప్రమాణాలను అనుసరించటంవల్ల ప్రజలకు ఎంతగానో సౌకర్యవంతముగా ఉన్నాయి. 2001లో జనాభా లెక్కలననుసరించి నగరంలోని 54% ప్రజలు మురికివాడలలో (స్లమ్స్) అతితక్కువ సౌకర్యాలు కలిగిన నివాసాలలో నివసిస్తున్నట్లు అంచనా. 2004లో ముంబై 27,577 నేరాలను నమోదు చేసింది. 2001 లో నమోదు చేసిన 30,991 నేరాలకంటే 11% తగ్గిన మాట వాస్తవం. ఇతర రాష్ట్రాలనుండి 1991-2001 మధ్య ఇక్కడకు వలస వచ్చిన ప్రజలసంఖ్య 11.2కోట్లు. ఇది ముంబై జనసంఖ్యను54%పెంచింది. పట్టణ పరిపాలన ముంబై నగరాన్ని రెండు ప్రత్యేకవిభాగాలుగా విభజిస్తారు.ఒకటి ముంబైనగర ద్వీపం (ఐలాండ్ సిటీ) రెండు నగరపరిసరాలు.నగరనర్వహణ బృహన్ముంబై మునిచిపల్ కార్పొరేషన్ (బిఎమ్‌సి) అధ్వర్యంలో జరుగుతుంది.దీనిని పూర్వం బాంబే మునిసిపల్ కార్పొరేషన్ అని అంటారు.మున్సిపల్ కమీషనర్నగర ప్రధాన అధికారి.ఈ పదవికి ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.24 నియోజకవర్గాల నుండి 227 కౌన్సిలర్లను నగర పాలన నిమిత్తం ప్రజలు నేరుగా 24 వార్డుల నుండి ఓటు వేసి ఎన్నుకుంటారు.వీరుకాక ప్రతిపాదించబడిన అయిదుగురు కౌన్సిలర్లు ఒక మేయరు ఉంటారు.మేయరు మర్యాదపూర్వక అధికారి.పాలనాధికారాలు మున్సిపల్ కమీషనర్ ప్దవికి వర్తిస్తాయి.మహానగర ముఖ్యావసరాలు తీర్చవలసిన బాధ్యత బిఎమ్‌సి వహిస్తుంది.సహాయక కమీషనర్ ప్రతి ఒక్క వార్డు పాలనా వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటారు.ఈ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలన్నీ పాలుపంచుకుంటాయి.ది ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అంతర్భాగంగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు,13 మున్సిపల్ కౌన్సిల్స్ ఉంటాయి.గ్రేటర్ ముంబైలో అంతర్భాగంగా రెండు జిల్లాలు ఉన్నాయి.జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆస్తివివరాలు, ఆదాయ వ్యయాలు , జాతీయ ఎన్నికల నిర్వహణా బాధ్యతలు నడుస్తుంటాయి. ఐపిఎస్ ఆఫీసరైన పోలిస్ కమీషనర్ ఆధ్వర్యంలో ముంబై పోలిస్ తనబాధ్యతలు నెరవేరుస్తుంటుంది.రక్షకదళం హోమ్‌మంత్రిత్వ శాఖ అధికారంలో పనిచేస్తుంది. ముంబై నగరం ఏడు పోలీస్ విభాగాలుగానూ, ఏడు ట్రాఫిక్ పోలిస్ విభాగాలుగానూ విభజించారు.ట్రాఫిక్ పోలిస్ వ్యవస్థ పోలి వ్యవస్థ అధ్వర్యంలోనే ఉన్నా కొంతభాగం స్వతంత్రంగానే వ్యవహరించే వీలుకలిగి ఉంటుంది.నలుగురు సహాయక అగ్నిమాపక దళ అధికారులు, ఆరుగురు విభాగాల అధికారుల సహాయంతో ఉన్నత అగ్నిమాపక అధికారి అధ్వర్యంలో నగరంలోని అగ్నిమాపకదళం ముంబై ఫైర్ బ్రిగేడ్ పనిచేస్తుంది. మహారాష్ట్ర, గోవా , యూనియన్ ప్రదేశాలైన డామన్, డయ్యూ, దాద్రా, నగర్ హవేలీల న్యాయ వ్యవహారాలు చక్కదిద్దే బాంబే హైకోర్ట్ నగరంలోపల ఉండి న్యాయ సేవలందిస్తుంది.ఇవి కాక రెండు క్రింది కోర్టులు ఉన్నాయి.ఒకటి సాధారణ వ్యవహారాలకుస్మాల్ కాజెస్ కోర్ట్ ఒకటి నేరసంబంధిత వ్యవహారలను చక్కదిద్దే సెషన్స్ కోర్ట్ ఉన్నాయి.తీవ్రవాద సమస్యల నిమిత్తం ప్రత్యేక కోర్ట్ ఉంది దానిని టిడిఎ అంటారు.నగరం నాలుగు పార్లమెంట్ నియోజక వర్గాలుగానూ, ముప్పై నాలుగు విధాన సభ నియోజక వర్గాలుగా విభజించబడింది. విద్య నగరంలో మునిసిపల్ పాఠశాలలు లేక ప్రైవేట్ పాఠశాలలు విద్యా సంబంధిత సేవలందిస్తూ ఉన్నాయి.ఈ పాఠశాలలు మహారాష్ట్రా స్టేట్ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ ఫర్ సెంకండరీ ఎడ్జ్యుకేషన్ , ది ఆల్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎక్జామినేషన్స్లలో ఏదైనా ఒకదానిలో భాగమై ఉంటాయి.ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం నుండి కొంత నిధులు అదుంతూ ఉంటాయి.ప్రభుత్వ పాఠశాలలు అనేక సదుపాయాలతో పనిచేస్తాయి.ప్రభుత్వ పాఠశాలలలో ఖరీదైన ప్రైవేట్ పాఠశాలలో చదివించలేని వారు తమ పిల్లలను చదివిస్తుంటారు.అధిక శాతం ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలలో చదివించడానికే మొగ్గు చూపుతుంటారు.ప్రైవేట్ పాఠశాలలు చక్కని భవన నిర్మాణ వసతులు కలిగి ఉండటం ఒక కారణం. విద్యార్థులు 10 సంవత్సరాల చదువు పూర్తిచేసిన తరువాత విద్యార్థులకు జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించడానికి అర్హులౌతారు.రెండు సంవత్సరాల జూనియర్ కళాశాల విద్య్హలో విద్యార్థులు ఆర్ట్స్, కామర్స్ (వాణిజ్యం) , సైన్స్ (విజ్ఞానం) విభాగాలలో ఒకదానిని ఎన్నుకుని విద్యాభ్యాసం కొనసాగిస్తారు.ఇది సాదారణ పట్టా లేక వృత్తి విద్యలను కొనసాగించడానికి సౌలభ్యం కలిగిస్తుంది.అత్యధిక కళాశాలలు ముంబై విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.యూనివర్శిటీ ఆఫ్ ముంబై ప్రపంచంలోతి పెద్దకళాశాలలలో ఒకటి.ఇక్కడ పట్టభద్రులైయ్యేవారి సంఖ్య అత్యధికం.నగరంలో ఉన్న భారత దేశంలో ప్రాముఖ్యత కలిగిన ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లు ముంబై నగర విద్యార్ధులకు సాంకేతిక ఉన్నత విద్యలను అందిస్తున్నాయి.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ,నర్శీ మంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ , వీరమాత జిజియాబాయ్ టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ , ఎస్‌ఎన్‌డిటి మహిళా విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఇతర సాంకేతిక విద్యాలయాలు.ఇవి కాక నగరంలో జమ్నాలాల్ బజాజ్ ఇన్‌స్ట్త్యౌత్ అఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, నర్శీ మంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసర్చ్, ఎస్‌పి జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసేర్చ్ లాటి ఆసియాలో పేరెన్నికగన్న కళాశాలలు ఉన్నాయి. సమాచార రంగం ముంబై నగరం అనేక వార్తాపత్రికా ప్రచురణ సంసంస్థలకు, దూరదర్శన్ , రేడియో కేంద్రాలకు పుట్టిల్లు.ఇండియన్ ఎక్స్‌ప్రెస్, మిడ్‌డే, డెన్‌ఏ , టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ప్రముఖ ఆంగ్ల వార్తా దినపత్రికలు ఇక్కడ నుండి ప్రచురించబడి అమ్మబడుతుంటాయి.లోక్ సత్తా, లోక్ మాతా , మహారాష్ట్రా టైమ్స్ లాంటి ప్రాంతీయ పత్రికలు ప్రచురించబడుతున్నాయి.ఇతర భారతీయ భాషలలోనూ అనేక వార్తాపత్రికలు నగరంలో లభ్యమౌతూ ఉన్నాయి.1822 నుండి ప్రచురించబడుతున్న బాంబే సమాచార్ వార్తాపత్రిక ఆసియాలో అతి ప్రాచీన వార్తాపత్రిక అంతస్తును కలిగి ఉంది.1832లో బాలశాస్త్రి జంబేకర్‌చే బాంబే దర్పన్ అనే మొదటి మరాఠీ వార్తా పత్రిక ప్రచురించబడింది. ముంబై నగవాసులు స్వదేశీ , విదేశీ దూరదర్శన్ ప్రసారాలనేకం చూస్తూంటారు.కేబుల్ కనెక్షన్ ద్వారా దాదాపు నూరుకు పైబడిన చానల్స్ గృహాలకు అందింబడుతున్నాయి. వివిధ మతాలకు , భాషలకు చెందిన ప్రజలకు ఈ ప్రసారాలవలన ప్రయోజనంచేకూరుతుంది. అనేక అంతర్జాతీయ వార్తాసంస్థలు వార్తా ప్రసారాలు , ప్రచురణా సంస్థలకు నగరం ప్రధాన కేంద్రం. జాతీయ దూరదర్శన్ ప్రసారాలద్వారా రెండు ఉచిత ప్రసారాలను ప్రజలకు అందిస్తుంది. మూడు ప్రధాన సంస్థలు అనేక గృహాలకు కేబుళ్ళ ద్వారా ప్రసారాలను అందిస్తున్నాయి. వీటిలో ఈటీవీ మరాఠి, జీ మరాఠి, స్టార్‌స్పోర్ట్స్ , ఇఎస్‌పిఎన్, డిడి మరాఠి, శేషాద్రి, మీ మరాఠి, జీటాకీస్, జీటీవీ, స్టార్‌ప్లస్ , నూతన ప్రసారాలైన స్టార్‌మజా లేక పాపులర్ ప్రజల అభిమానాన్ని సంపాదించిన ప్రసారాలు. పాపులర్ వార్తాప్రసారాలు పూర్తిగా ముంబై , మహారాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రసారమౌతుంటాయి. స్టార్‌మజా, జీ24టాస్ , షహారాసమయ్ పాపులర్ అందించే ముఖ్య ప్రసారాలు. అధిక ఖరీదైన పాపులర్, టాటాస్కై , డిష్ టీవీ ప్రసార కారణంగా ముంబై ఉపగ్రహ ప్రసారాలు శాటిలైట్ టెలివిజన్ ప్రసారాలు ప్రజలంగీకారాన్ని సాధించాయి. పన్నెండు ఆకాశవాణి ప్రసారకేంద్రాలలో నాలుగు కేంద్రాలు ఎఫ్‌ఎమ్ ప్రసారాలందిస్తున్నాయి.ఇవి కాక మూడు ఆకాశవాణి ప్రసారాలు ఏమ్ బ్రాండ్ ప్రసారాలందిస్తున్నాయి.ముంబై నగరంలో కమర్షియల్ రేడియో అందించే వరల్డ్ స్పేస్, సైరస్ , ఎక్స్‌ఎమ్ ప్రసారాలు అందిస్తుంది.2006 యూనియన్ గవర్న్‌మెంట్ చే ప్రారంభించబడిన కండిషనల్ ఏక్సెస్ విధానం దాని అనుబంధ విధానం డీటీహెచ్‌తో పోటీని ఎదుర్కోవడంలో విఫలమైంది. ఆర్ధికరంగం భారతదేశంలో ముంబై అతి పెద్ద నగరం.దేశం మొత్తంలో పారిశ్రామిక ఉద్యోగాలు 10% ముంబై నగరం నుండి లభిస్తుంది.ఈ నగరంలో ఆదాయపు పన్ను దేశం మొత్తం లభిచించేదానిలో 40%.దేశం మొత్తంలీని కస్టమ్స్ పన్ను 60% ఈ నగరం నుండి లభిస్తుంది.దేశానికి 20% ఎగుమతి పన్ను ముంబై నగరం నుండి లభిస్తుంది.దేశం మొత్తంలో విదేశీ వర్తకం , పారిశ్రామిక పన్ను రూపంలో 40% ముంబైనగరం నుండి లభిస్తుంది.ముంబై నగర తలసరి ఆదాయం 48,954 రూపాయలు.ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే మూడింతలు ఎక్కువ.భారతదేశం అంతా శాఖలు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసి, గోద్రెజ్, రిలయన్స్ లాంటి భారతీయ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు చెందిన నాలుగు పరిశ్రమలు ముంబై నుండి తమకార్యకలాపాలు సాగిస్తున్నాయి.విదేశీ బ్యాంకులూ , ఆర్థిక సంస్థలు అనేకం ఈ నగరంలో కార్యాలయాలను స్థాపించాయి.వీటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్(ముంబై)ప్రధానమైనది.1980 వరకు ముంబైనగర ప్రధాన ఆదాయపు వనరులలో వస్త్రాల తయారీ , సముద్ర రేవు (హార్బర్) లు ప్రధానమైనవి. ప్రజాదాయం ఇంజనీరింగ్, వజ్రలను సానబెట్టడం, హెల్థ్ కేర్ , సమాచార మాధ్యమం.నగరం బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ , దేశంలో ప్రత్యేకత కలిగిన సాంకేతిక పరిశ్రమలు.ఈ కారణంగా నగరంలో అత్యాధునిక భవన సముదాయాలు అభివృద్ధి చెందాయి.విస్తారంగా మానవ వనరులు లభ్యం కావడం ఈ అభివృద్ధికి ఒక కారణం. నగరంలోని ఉద్యోగులలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అధికం.అత్యధిక నైపుణ్యం కలిగిన వారు మితమైన నపుణ్యం కలిగినవారూ స్వయం ఉపాధి కలింగిఉన్నారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు.వీధి వర్తకులు, టాక్సీ డ్రైవర్లూ, మెకానిక్ , శ్రామిక జీవితంతో తమజీవికకు కావలసిన ద్రవ్యాం సంపాదించే ప్రజలసంఖ్య కూడా నగరంలో అధికమే.ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రేవు , నౌకా పరిశ్రమ ఉద్యోగాలు కల్పిస్తుంది.మధ్య ముంబైలోని ధారవిలో ఉన్న బృహత్తర రీసైక్లింగ్ పరిశ్రమ నగరంలోని ఇతర భాగంలోని వ్యర్ధాల నుండి పలు పరికరాలు తయారు చేయబడతాయి.ఇక్కడ ఒకే గదిలో పనిచేసే లఘు పరిశ్రమలు 15,000 ఉన్నాయి. ముంబై నగర ప్రధాన ఉపాధి వనరులలో ప్రచార మాధ్యమం ఒకటి.అనేక దూరదర్శన్ , ఉపగ్రహ (శాటిలైట్) నెట్‌వర్క్‌లు, అలాగే ప్రధాన ప్రచురణా సంస్థలు ఇక్కడనుండి ప్రారంభం అయినవే.హిందీ చలన చిత్రాలకు ముంబై ప్రధాన కేంద్రం. చందు రవాణా వ్యవస్థ thumb|right|ఛత్రపతి శివాజీ టెర్మినస్ thumbnail|చర్చిగేట్ మెట్రో రెయిల్వే స్టేషను|ఎడమ thumb|విమానాశ్రయం, ముంబై thumb|బీఎస్‌టి (BEST) బసు thumb|'ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్' ముంబై ప్రజలు అనేకంగా ప్రభుత్వంచే నడపబడుతున్న రైళ్ళలోనూ, సిటీ బస్సులలో ప్రయాణానికి ఉపయోగించుకుంటారు. 'ముంబై సబర్బన్ రైల్వే'బి ఇ ఎస్ టి బస్సులు, కార్లు, ఆటోరిక్షాలు , ఫెర్రీలు లలో వారు పనిచేసే ప్రదేశాలను చేరుకుంటూ ఉంటారు. ముంబై నగరం రెండు భారతీయ రైల్వే సంస్థలకు చెందిన ప్రధాన కార్యాలయాలకు కేంద్రం. 'ఛత్రపతి శివాజీ టెర్మినస్'(CR)లో సెంట్రల్ రైల్వేకి చెందిన ప్రధాన కార్యాలయం, 'వెస్ట్రన్ రైల్వే' (WR) ప్రధాన కార్యాలయం చర్చ్‌గేట్ వద్ద ఉన్నాయి. ముంబై సబర్బన్ రైల్‌వే నగరంలో ప్రయాణానికి వెన్నెముక లాంటిది. ఇది మూడు భాగాలుగా విభజింప బడింది.భూమి లోపల , వెలుపల ప్రయాణం చేసే 'ముంబై మెట్రో రైల్ మార్గం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది వెర్సోవా నుండి అంధేరీ మీదుగా ఘాట్‌కోపర్ వరకు ప్రయాణీకులను తీసుకొని వెళుతుంది. 2009లో దీనిలో కొంత భాగం పనులు పూర్తికాగానే మిగిలిన భారతీయ భూభాగంతో ఇండియా రైల్వే ద్వారా ముంబై చక్కగా అనుసంధించబడుతుంది. శివాజీ టెర్మినస్, దాదర్, లోకమాన్య టెర్మినస్ (కుర్లా), ముంబై టెర్మినస్ , బాంద్రా టెర్మినస్ నుండి రైళ్ళ రాకపోకలు ఉంటాయి. 'సబర్బన్ రైల్వే' రైళ్ళలో ఒక సంవత్సరానికి 2.20 కోట్ల ప్రాయాణీకులను తమ గమ్యాలకు చేరవేస్తున్నట్లు అంచనా. బస్సు ప్రయాణాలతో పోల్చి చూస్తే ట్రైన్ చార్జీలు కొంత తక్కువ. ఈ కారణంగా ప్రజలు దూర ప్రయాణాలకు రైళ్ళలో ప్రయాణించడానికి ప్రాముఖ్యత ఇస్తారు. ముంబై ప్రభుత్వం బియిఎస్‌టి(BEST)పేరుతో నగరం లోపల బస్సులను నడుపుతుంది. ఈ బస్సు మార్గాలు నగరమంతటినీ కలుపుతూ నగరంలో ఏప్రాతానికైనా చేరుకునేలా ఉంటాయి. ఈ మార్గాలు నేవీ ముంబై నుండి తానే వరకు విస్తరించి ఉన్నాయి. ది బి.యి.ఎస్‌.టి.(BEST) 3,400 బస్సులను నడుపుతుంది. నగర ప్రజలు తక్కువ, మధ్య రకం ప్రయాణాలకు వీటిని ఉపయోగించుకుంటారు. ఫెర్రీ (బోట్) లలో 45% ప్రజలు ప్రయాణిస్తారనీంచనా. ఫెర్రీలలో సాదారణ ఫెర్రీలే కాక రెండస్థుల ఫెర్రీలు నడపడం ప్రత్యేకత. 340 జలమార్గాలలో ఫెర్రీలు ప్రజలను అటూ ఇటూ చేరవేస్తుంటాయి. మహారాష్ట్రలోని ప్రధాన నగరాలను కలుపుతూ ఎయిర్ కండిషన్ బస్సులను ఎమ్‌ఎస్‌ర్‌టిసి (MSRTC) పేరుతో నడుపుతుంటారు. ఈ సర్వీసులు నగరం లోపలి భాగాలలో కూడా ఉంటాయి. ఇక్కడికి సందర్శనార్ధం వచ్చే ప్రయాణీకులకోసం 'ముంబై దర్శన్' పేరుతో బస్సులను నడుపుతుంటారు. వీటి సాయంతో అనేక ముంబై పర్యాటక ఆకర్షణ ప్రదేశాలను దర్శించ వచ్చు. నలుపు, పసుపు రంగులతో మీటర్ల సహాయంతో నడిచే కార్ల బాడుగ వసూలు చెసుకొని ప్రయాణీకులను చేరవేస్తూ ఉంటాయి. నగరపురాలలో ఆటోరిక్షాలు అధికంగా ఉంటాయి. గ్యాస్ సిలిండర్ల సాయంతో నడిపే రిక్షాలు బాడుగకు నడుపుతుంటారు. ఇవి బడుగు వర్గాలకు అందుబాటులో ఉండే చౌకైన వాహనాలు.వీటిలో ముగ్గురు ప్రయాణం చేయవచ్చు. మొదట 'షహర్ ఎయిర్‌పోర్ట్' గానూ ప్రస్తుతం 'ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్' గాను వ్యవహరిస్తున్న విమానాశ్రయం దే భారత దేశంలో ఎక్కువమంది ప్రయాణం చేసే విమానాశ్రయాలలో ఒకటి. 'జుహూ ఎయిరోడ్రోమ్' భారత దేశంలో మొదటి విమానాశ్రయం.దీనిలో ఇప్పుడు ఫ్లైయింగ్ క్లబ్, హెలీ ఎయిర్ కార్యాలయాలు కూడా పనిచేస్తున్నాయి.కోప్రా-పాన్‌వెల్ లో'అంతర్జాతీయ నావికాదళ విమానాశ్రయం'నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.ఇది పనిచేయడం ఆరంభమైతే 'ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్' లో ప్రస్తుతం ఉన్న ప్రయాణీకుల రద్దీ కొంత తగ్గించవచ్చని ఆలోచన.భారథదేశంలో 25% దేశంలోపల ప్రాణించే ప్రయాణీకులు '38% అంర్జాతీయ ప్రయాణీకులు ముంబై నుండి ప్రయాణిస్తారని అంచనా. ప్రజలు సంస్కృతి ముంబైలో నివసించే పౌరులను ముంబైకార్, ముంబైవాలా అని వ్యవహరిస్తుంటారు. ప్రయాణ సౌకర్యంకోసం పనిచేసే ప్రదేశాన్ని సులువుగా చేరడం కోసమూ ప్రజలు ఎక్కువగా రైల్వే స్టేషను సమీపంలో నివసిస్తుంటారు. ఇక్కడి ప్రజల సమయం ఎక్కువ భాగం ప్రయాణాలకే వెచ్చించవలసి రావడం దీనికి కారణం. ముంబై వాసుల ఆహారవిధానంపై ఎక్కువగా మరాఠీ, గుజరాతీ ప్రభావం ఉంటుంది. ఎక్కువ పౌష్ఠికంగా ఉంటాయి మసాలాలు కొంచం తక్కువ. ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే అల్పాహారాలు కచోడీ, భేల్పూరి, పానీపూరీ, మీన్వాలా కర్రీ (చేపల కూర) బాంబే మసాలా బాతు. బజారులలో చిన్న చిన్న దుకాణాలలో వడా పావ్, పావ్ భాజీ, భేల్‌పూరీ అమ్మకాలు జరుగుతుంటాయి. భారతీయ చిత్రసీమకు ముంబై పుట్టిల్లు. దాదాసాహెబ్ ఫాల్కే తన మొదటి దశ మూకీ చిత్రాలతో చిత్రనిర్మాణం ప్రారంభించి తరువాతి దశలో మరాఠీ భాషలో చిత్రాలు తీసాడు. 20వ శతాబ్ధపు ప్రారంభంలో ముంబై దియేటర్లో మొదటి చలన చిత్రం ప్రదర్శించ బడింది. ముంబై నగరంలో అధిక సంఖ్యలో చిత్రాలు నిర్మిస్తుంటారుం. అంతర్ఝాతీయ ప్రసిద్ధి పొందిన ఐమాక్స్ దియేటర్లు ఇక్కడ ఉన్నాయి. వీటిలో ఎక్కువగా హిందీ, మరాఠీ , హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. అధిక సంఖ్యలో ప్రజలు దియేటర్లలో చిత్రాలను చూడటానికి ఆసక్తి కనబరచడం విశేషం. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ , అనేక ప్రాంతీయ భాషలలో చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. సమకాలీన కళాప్రదర్శనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇవి ప్రభుత్వప్రదర్శనశాలలే కాక వ్యాపార ప్రదర్శనశాలలలో ప్రదర్శిస్తుంటారు. 1883లో నిర్మించిన ప్రభుత్వానికి స్వంతమైన 'జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ' , 'నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రెన్ ఆర్ట్'లు ఉన్నాయి . ఏషియాటిక్ 'సొసైటీ ఆఫ్ బాంబే'ముంబై నగర పురాతన గ్రంథాలయం.'ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయ(వస్తు ప్రదర్శన శాల)' పునరుద్ధరింపబడిన మ్యూజియం దక్షిణ ముంబై మధ్యభాగంలో గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉంది.ఇక్కడ భారతీయ చారిత్రాత్మక వస్తువులను ప్రదర్శిస్తుంటారు. జిజియా మాతా ఉద్యాన్ అనే జంతు ప్రదర్శనశాల ఉంది. ప్రజావసరాలు సేవలు దస్త్రం ముంబై అపార్ట్‌మెంట్లు ముంబై నగరానికి మంచినీటి సరఫరాను బిఎమ్‌సి అందిస్తుంది.అధికంగా తులసి విహార్ సరస్సులు ఈ నీటిని అందిస్తున్నాయి అలాగే ఉత్తరభాగంలో ఉన్న ఇతర సరసులు కొన్నిటి నుండి ఈ నీటిని అందిస్తారు.ఈ నీటిని ఆసియాలోని అతిపెద్ద ఫిల్టరేషన్ ప్లాంట్ అయిన భాండప్ దగ్గర శుభ్రపరపరుస్తారు. ఆకాశసౌధాలు ఇవికూడా చూడండి భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం ముంబ్రా దేవి ఆలయం విశాల్ దద్లానీ ప్రియా సారయ్య రాజేష్ రోషన్ రాజ్ కన్వర్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 యూసుఫ్ మెహెరల్లీ జూనియర్ మెహమూద్ మూలాలు వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు వర్గం:ముంబాయి వర్గం:నగరాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
వార్ధా జిల్లా
https://te.wikipedia.org/wiki/వార్ధా_జిల్లా
thumb|పుల్గావ్ వద్ద వార్ధా నది మధ్యప్రదేశ్ లోని జిల్లాలలో'వార్ధా జిల్లా''' (హిందీ:वर्धा जिल्हा) ఒకటి. వార్ధా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,300,774. నగరాలలో వివసిస్తున్న వారి శాతం 26.28%. చరిత్ర వార్ధా చరిత్ర చారిత్రక పూర్వం నాటిది. ఇండియన్ నేచురల్ హిస్టరీ తెలుసుకోవడానికి ఇది సరైన ఆధారం. వార్ధా జిల్లాలోని సింధి రైల్వే స్టేషను వద్ద ఆస్ట్రిక్ ఎగ్- షెల్ కనుగొనబడింది. జిల్లాలో ఒకప్పటి మౌర్యులు, సుంగాలు, శాతవాహనులు, ఒకతకాలు, ప్రవర్పూర్, ఆధునిక పవ్నర్ (ఒకప్పటి ఒకతక సామ్రాజ్యానికి రాజధాని) రాజాస్థానాలు పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వతకాలు గుప్తుల సమకాలీనులు. రెండవ చంద్రగుప్తుని (విక్రమాదిద్త్యుడు) కుమార్తె వతక పాలకుడు రుద్రసేనుడిని వివాహం చేసుకుంది. వతకా పాలకులు సా.శ. 2-5 శబ్ధాలకు చెందినవారని భావిస్తున్నారు. వారి సామ్రాజ్యం పశ్చిమంలో అరేబియన్ సముద్రం, తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన నర్మదా నది దక్షిణాన గోదావరి కృష్ణా మైదానం వరకు విస్తరించి ఉండేది. పాలకులు తరువాత వార్ధాను చాళుఖ్యులు, రాష్ట్రకూటులు, దేవగిరికి చెందిన సెయునా యాదవులు, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, బేరర్‌కు చెందిన ముస్లిం పాలకులు, గోండులు, మరాఠీలు పాలించారు. గోండు పాలకుడు రాజా బులంద్ షాహా, బోంస్లే పాలకుడు రఘూజీ మధ్యయుగంలో పాలించిన పాలకులలో ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. 1850 నాటికి వార్ధా (అప్పుడు నాగపూర్‌లో భాగంగా ఉండేది) బ్రిటిష్ పాలకుల వశం అయింది. వారు వార్ధాను సెంట్రల్ ప్రోవింస్‌లో విలీనం చేసారు. సేవాగ్రామానికి వార్ధా సహోదర గ్రామంగా ఉండేది. ఇవి రెండు భారతస్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా ఉండేది. 1934 భారతజాతీయ కాంగ్రెస్ సమావేశానికి వార్ధాలోని మాహాత్మాగాంధి ఆశ్రమం కేంద్రంగా ఉంది. బ్రిటిష్ 1862లో వార్ధా నాగపూర్ జిల్లాలో భాగంగా ఉండేది. తరువాత పాలనా సౌలభ్యం కొరకు ఇది నాగపూర్ జిల్లా నుండి విభజించబడింది. పుల్గావ్ సమీపంలోని కవాథా వార్ధా జిల్లా కేంద్రంగా ఉంది. 1866లో జిల్లా కేంద్రం పాలక్వాడి గ్రామానికి మార్చబడింది. ప్రస్తుతం ఇది వార్ధానగరంలో భాగంగా మారింది. వార్ధా జిల్లాలో ఆచార్య వినోభాభావే జన్మించి నివసించిన పవనార్ గ్రామం ఉంది. ఆధునిక కాలం సమీపకాలంలో వార్ధా రైతుల ఆత్మహత్య కారణంగా వార్తలలో ప్రధాన్యత సంతరించుకుంది. నీటి పారుదల కొరత, పంట సరిగా అందక, కరువు కారణంగా అప్పులు చెల్లించలేక పలువురు రైతులు ఆత్మహత్య చేసుకొన్న విషయం ప్రధాన వార్తలలో చోటు చేసుకుంది. తరువాత ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వార్ధాను సందర్శించి పరిస్థితి అవగాహన చేదుకుని ఆర్థిక సాయం ప్రకటించాడు. 2001 లో గణాంకాలు విషయాలు వివరణలు జిల్లా జనసంఖ్య . 1,300,774, ఇది దాదాపు. మొరోషియస్ దేశ జనసంఖ్యకు సమానం. అమెరికాలోని. న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం. 640 భారతదేశ జిల్లాలలో. 377 వ స్థానంలో ఉంది. 1చ.కి.మీ జనసాంద్రత. 205 . 2001-11 కుటుంబనియంత్రణ శాతం. 4.8%. స్త్రీ పురుష నిష్పత్తి. 946:1000 జాతియ సరాసరి (928) కంటే. అక్షరాస్యత శాతం. 87.22%. జాతియ సరాసరి (72%) కంటే. కేంద్ర, రాష్ట్ర ప్రతినిధి thumb|వార్ధా నది 'లోక్ సభ సీటు' వార్ధా రాందాస్ తదాస్ (బిజెపి) '' 'మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్లు' వార్ధా : డాక్టర్ పంకజ్ భోయర్ (బిజెపి) డియోలి : రంజిత్ కాంబ్లే (ఐ.ఎన్.సి) ఆర్వి : అమర్ కాలే (ఐ.ఎన్.సి ) హింగంఘాట్ : సమీర్ కునవర్ (బిజెపి) ప్రముఖులు బాబా ఆమ్టే భారతదేశం యొక్క సామాజిక, హింగంఘాట్ ( 1914 డిసెంబరు 24 న జన్మించింది) నైతిక నాయకుడు జమ్నాలాల్ బజాజ్, స్వాతంత్ర్య సమరయోధుడు అభయ్ బ్యాంగ్ రాణి బ్యాంగ్, సోషల్ వర్కర్లు, గడ్చిరోలి జిల్లా పేద ఆదివాసి ప్రజలకు వైద్య సేవలు అందించడం. మూలాలు వెలుపలి లింకులు Wardha district website Wardha Zilla Parishad వెలుపలి లింకులు వర్గం:1862 స్థాపితాలు‎ వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:మహారాష్ట్ర వర్గం:మహారాష్ట్ర జిల్లాలు వర్గం:మహారాష్ట్ర నగరాలు, పట్టణాలు
సాతారా
https://te.wikipedia.org/wiki/సాతారా
సాతారా, మహారాష్ట్రలోని సాతారా జిల్లా ముఖ్యపట్టణం. ఇది కృష్ణా నది, వెన్నా నదుల సంగమం వద్ద ఉంది. ఈ నగరాన్ని 16 వ శతాబ్దంలో స్థాపించారు. ఇది ఛత్రపతి షాహుజీ-1 కి రాజధానిగా ఉండేది. ఏడు (సాత్) దుర్గాల (తారా) నగరంగా దీనికి ఈ పేరు వచ్చింది. భౌగోళికం right|250px|thumb|పంచగని దృశ్యం సతార పట్తణం వద్ద ఉంది. అజింక్యతారా దుర్గపు వాలులో నగరం నెలకొని ఉంది. దక్కను పీఠభూమికి పశ్చిమ ప్రాంతంలో ఉంది. కాస్ పీఠభూమి నగరం నుండి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటి. స్థానికంగా దీన్ని కాస్ పత్థర్ అని అంటారు. చరిత్ర దక్కన్‌పై మొట్టమొదటి ముస్లిం దండయాత్ర 1296లో జరిగింది. 1636లో నిజాం షాహీ రాజవంశం అంతమైంది. 1663లో ఛత్రపతి శివాజీ పరాలి, సాతారా కోటలను జయించాడు. శివాజీ మరణం తరువాత, మరాఠా సామ్రాజ్యానికి వారసుడైన షాహు శివాజీని, ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మొఘలులు బంధించారు. 1700లో తన తండ్రి మరణించే వరకు అతను వారి ఖైదీ గానే ఉన్నాడు. అతడి సవతి తమ్ముడు, మహారాణి తారాబాయి కుమారుడు అయిన షాహూ శంభాజీని ఆమె ఛత్రపతి మహారాజ్‌గా ప్రకటించి తాను రాజప్రతినిధిగా పరిపాలన చేపట్టింది. 1707లో కొన్ని ముందస్తు షరతులతో మొఘలులు షాహూని విడుదల చేశారు. ఔరంగజేబు కుమారుడు ముహమ్మద్ ఆజం షా 6 నెలల ముట్టడి తర్వాత సాతారా కోట అజింక్యతరను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత 1706లో దీన్ని తిరిగి పరశురామ్ ప్రతినిధి చేజిక్కించుకున్నాడు. 1708లో ఛత్రపతి శంభాజీ కుమారుడు ఛత్రపతి షాహూకు సాతారా కోటలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఛత్రపతి శివాజీ ప్రత్యక్ష వారసులు సాతారాలో నివసిస్తున్నారు. ఛత్రపతి ఉదయన్‌రాజే భోంస్లే శివాజీ 13వ వారసుడు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సాతారాలో షాడో ప్రభుత్వాన్ని స్థాపించారు. జనాభా వివరాలు 2011 జనగణన ప్రకారం, Cities having population 1 lakh and above. Censusindia.gov.in సాతారాలో జనాభా 1,20,079. ఇందులో 61,129 మంది పురుషులు కాగా 59,066 మంది స్త్రీలు - పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. సాతారా సగటు అక్షరాస్యత 80%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 84% కాగా, స్త్రీలలో ఇది 76%. సాతారా జనాభాలో 10% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. మరాఠీ విస్తృతంగా మాట్లాడే భాష. జనాభాలో 1.5% మంది హిందీ మాట్లాడుతారు. మహారాష్ట్ర రాష్ట్ర లింగ నిష్పత్తి 883 కాగా, సాతారాలో ఇది 881. శీతోష్ణస్థితి సాతారా నగరంలో ఉష్ణమండల తడి, పొడి శీతోష్ణస్థితి ఉంటుంది (కొప్పెన్ వాతావరణ వర్గీకరణ: Aw). నగరం చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలు నగర శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయి. నగరంలో ఏడాదికి 900 మిమీ నుండి 1,500 మిమీ వరకు వర్షపాతం ఉంటుంది. రవాణా జాతీయ రహదారి 48 (గతంలో జా.ర 4) సాతారా గుండా పోతుంది. పర్యాటక ప్రదేశాలు పంచగని మహాబలేశ్వర్ పటేశ్వర్ అజింక్యతారా (మంగళాదేవి మందిరం) యవతేశ్వర్ కాస్ సరస్సు బమ్నోలి సజ్జన్ గడ్ తోసేఘర్ జలపాతం చల్కెవాడి వందగిరి, కళ్యాణగడ్ కోటలు మయాని పక్షి ఉద్యానవనం కొయనా ఆనకట్ట ప్రముఖ వ్యక్తులు పి.బి. గజేంద్రగడ్కర్: భారతదేశ సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి. ఇవి కూడా చూడండి సాతారా లోక్‌సభ నియోజకవర్గం మూలాలు బయటి లింకులు సాతారా జిల్లా వెబ్ సైటు చరిత్ర సాతారా జిల్లా రోడ్లు, రైల్వేలు సాతారా జిల్లా భౌగోళిక మ్యాపు వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు
సింధుదుర్గ్
https://te.wikipedia.org/wiki/సింధుదుర్గ్
సింధుదుర్గ్ (మరాఠి:सिंधुदूर्ग ) మహారాష్ట్ర రాష్ట్రములోని జిల్లా యొక్క ముఖ్యపట్టణం. సింధుదుర్గ్ జిల్లాను రత్నగిరి జిల్లానుండి ఏర్పరచారు. సింధుదుర్గ్ మహారాష్ట్రలో అత్యంత దక్షిణాదిన ఉన్న జిల్లా. ఈ జిల్లా యొక్క ముఖ్యపట్టణం ఓరోస్. ఈ జిల్లా యొక్క విస్తీర్ణము 5207 చదరపు కిలోమీటర్లు, జనాభా 8,68,825. జనాభాలోని 9.47% శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు (2001 జనాభా లెక్కలు) జిల్లాలో అక్షరాస్యత 80%. జిల్లాలోని మాల్వన్ పట్టణానికి సమీపాన, సముద్రములో ఒక రాతిమయమైన తిప్పపై ఉన్న సింధుదుర్గ్ కోట పేరుమీదుగా జిల్లాకు ఆ పేరు వచ్చింది. సింధుదుర్గ్ జిల్లాకు ఉత్తరాన రత్నగిరి జిల్లా, దక్షిణాన గోవా రాష్ట్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున పశ్చిమ కనుమలు లేదా సహ్యాద్రి శ్రేణులకు ఆవల కొల్హాపూర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. సింధుదుర్గ్ పశ్చిమ మహారాష్ట్రలో పశ్చిమ కనుమలకు అరేబియా సముద్రానికి మధ్యన ఒక సన్నని పట్టీలా ఉండే కొంకణ్ ప్రాంతంలోని భాగం మూలాలు వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు
సోలాపూర్
https://te.wikipedia.org/wiki/సోలాపూర్
సోలాపూర్ (सोलापूर) మహారాష్ట్రలో ఒక జిల్లా, అదే జిల్లాకు కేంద్రమైన పట్టణం. ఇది కర్ణాటక రాష్ట్రం సరిహద్దులలో ఉంది. ఇక్కడ మరాఠి, కన్నడ, తెలుగు భాషలు మాట్లాడుతారు. దేశం ఉత్తర, దక్షిణ రైలు మార్గంలో ఇది ఒక ముఖ్యమైన స్టేషను. ఇది ప్రత్తి మిల్లులకు, మరమగ్గాలకు పస్రసిద్ధి చెందిన పట్టణం. సోలాపూర్ దుప్పట్లు, ఛద్దర్‌లు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సిద్ధేశ్వర మందిరం ఉంది. అక్కడ మకర సంక్రాంతికి పెద్దయెత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ జిల్లాలో అక్కల్ కోటలో అక్కల్‌కోట మహారాజు ఆశ్రమం ఉంది. జనవరిలో ఇక్కడ జరిగే "గడ్డ తిరుణాలకు" చాలామంది యాత్రికులు పొరుగు రాష్ట్రాలనుండి కూడా వస్తారు. ఇవి కూడా చూడండి షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం వెలుపలి లింకులు వర్గం:మహారాష్ట్ర నగరాలు పట్టణాలు
హింగోలి జిల్లా
https://te.wikipedia.org/wiki/హింగోలి_జిల్లా
thumb|ఔంధ నాగనాథ్ ఆలయం హింగోలీ (हिंगोली), మహారాష్ట్రలో ఒక జిల్లా. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 చ.కి.మీ. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. . ప్రస్తుతం హింగోలి జిల్లా పరిధిలో ఉన్న ప్రాతం 1956లో బొంబాయి రాష్ట్రంలో భాగమైనది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో పర్భణీ జిల్లాలో భాగంగా ఉంది. 1999, మే 1న పర్భణీ జిల్లా నుండి హింగోలి జిల్లాను ఏర్పాటుచేశారు. జిల్లాను రెండు ఉప డివిజన్లు, మొత్తం ఐదు తాలూకాలుగా వ్యవస్థీకరించారు. హింగోలి సబ్ డివిజన్లో హింగోలి, కాలమ్నూరి, సేన్‌గావ్ తాలూకాలున్నాయి. అలాగే, బాస్మత్ సబ్ డివిజన్లో ఔందా, బాస్మత్ తాలూకాలున్నాయి. జిల్లాలో మూడు విధానసభా నియోజకవర్గాలున్నాయి. అవి బాస్మత్, కాలమ్నూరి, హింగోలి. ఈ మూడు నియోజకవర్గాలు హింగోలి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమై ఉన్నాయి. ఇతర విశేషాలు జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగనాధ లింగం హింగోలీ జిల్లాలో ఉంది. మూలాలు బయటి లింకులు Hingoli NIC వర్గం:మహారాష్ట్ర జిల్లాలు
జనవరి 23
https://te.wikipedia.org/wiki/జనవరి_23
జనవరి 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 23వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 342 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 343 రోజులు). సంఘటనలు 1565: తళ్లికోట యుద్ధము 1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి పైగా మరణించారు. 1950: ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది. 1977: 'జనసంఘ్‌', 'భారతీయ లోక్‌దళ్‌', కాంగ్రెస్‌ (ఓ), 'స్వతంత్ర పార్టీ', 'సోషలిస్టు పార్టీ'లు కలిసి 'జనతాపార్టీ'గా ఏర్పడ్డాయి. జననాలు thumb|కుడి|హిల్టా మేరీ లాజరస్ 1719: జాన్ లాండెన్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు. (మ.1790) 1863: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936) 1890: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978) 1893: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (మ.1979) 1897: సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945) 1906: ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (మ.1984) 1911: జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009) 1915: ఆర్థర్ లూయీస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. 1926: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012) 1971: నిరోషా , సినీ నటి 1977: అభినయ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు. 1982: విమలా రామన్ , దక్షిణ భారత చలన చిత్ర సహాయ పాత్రల నటీ , మోడల్. మరణాలు 1972: కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (జ. 1914) 1978: హిల్డా మేరీ లాజరస్, ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890) 2015: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951) 2016: ఏ.సి.జోస్ మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. (జ.1937) 2018: వెంపటి రవిశంకర్‌, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969) 2022: ఆర్.నాగస్వామి, భారతీయ చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రజ్ఞుడు, శిలాశాసన శాస్త్రవేత్త. (జ.1930) పండుగలు , జాతీయ దినాలు సుభాష్‌చంద్రబోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం బయటి లింకులు బీబీసి: ఈ రోజున టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో చరిత్రలో ఈ రోజు : జనవరి 23 జనవరి 22 - జనవరి 24 - మార్చి 29 - మే 29 -- అన్ని తేదీలు వర్గం:జనవరి వర్గం:తేదీలు వర్గం:1565 వర్గం:1890 జననాలు వర్గం:1893 జననాలు వర్గం:1897 జననాలు వర్గం:1915 జననాలు వర్గం:1978 మరణాలు
సర్వేపల్లి రాధాకృష్ణన్
https://te.wikipedia.org/wiki/సర్వేపల్లి_రాధాకృష్ణన్
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17 ; స్థానికంగా రాధాకృష్ణయ్య ) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. అతను 1939 నుండి 1948 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నాల్గవ వైస్-ఛాన్సలర్‌గా, 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్-ఛాన్సలర్‌గా కూడా ఉన్నాడు. రాధాకృష్ణన్ తులనాత్మక మతం, తత్వశాస్త్రం యొక్క 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, విశిష్టమైన పండితులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్‌లో 1921 నుండి 1932 వరకు, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని స్పాల్డింగ్ చైర్ ఆఫ్ ఈస్టర్న్ రెలిజియన్ అండ్ ఎథిక్స్ కు 1936 నుండి 1952 వరకు తన సేవలనందించాడు. The Madras Mail, Saturday, 8 February 1936, page 9 భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశాడు. రాధాకృష్ణన్ తన జీవితంలో 1931లో నైట్‌హుడ్, 1954లో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న, 1963లో బ్రిటిష్ రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గౌరవ సభ్యత్వంతో సహా అనేక ఉన్నత పురస్కారాలను పొందాడు. అతను భారతదేశంలోని వెనుకబడిన వృద్ధుల కోసం లాభాపేక్షలేని సంస్థ హెల్పేజ్ ఇండియా వ్యవస్థాపకులలో ఒకరు. రాధాకృష్ణన్ "ఉపాధ్యాయులు దేశంలో అత్యుత్తమ ఆలోచన గలవారు" అని విశ్వసించేవారు. 1962 నుండి, భారతదేశంలో ప్రతీ సంవత్సరం అతని పుట్టినరోజు సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. జీవిత విశేషాలు బాల్యం సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5 న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరంలో ఉన్న తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగుదంపతులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు."Radhakrishnayya, as Shri Radhakrishnan sometimes referred to himself, was born in the Sarvepalli family which traced its roots in the village of Sarvepalli in the Nellore District of Andhra Pradesh." అతను తన ముగ్గురు తోబుట్టువులలో రెండవవాడు. అతని కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినది. అతని బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతిలో గడిపారు. అతని తండ్రి స్థానిక జమీందార్ (స్థానిక భూస్వామి) సేవలో సబార్డినేట్ రెవెన్యూ అధికారి. అతని ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కె.వి. హైస్కూల్‌లో సాగింది. 1896లో ఆయన తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్ ఎవాంజెలికల్ లూథరన్ మిషన్ పాఠశాలకు తరువాత వాలాజాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మారాడు.బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. విద్య రాధాకృష్ణన్ తన విద్యాబ్యసన జీవితంలో స్కాలర్‌షిప్‌లు పొందాడు. హైస్కూల్ విద్య కోసం అతను వేలూరులోని వూర్హీస్ కాలేజీలో చేరాడు. ఎఫ్.ఏ (ఫస్ట్ ఆఫ్ ఆర్ట్స్) తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత అతను 16 సంవత్సరాల వయస్సులో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ( మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది) చేరాడు. అతను 1907 లో అక్కడ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను అదే కళాశాల నుండి తన మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. రాధాకృష్ణన్ తాను విద్యాభ్యసనలో ఎంచుకునే విషయాల కంటే యాదృచ్ఛికంగా తత్వశాస్త్రాన్ని అభ్యసించాడు. ఆర్థిక స్థోమత ఉన్న విద్యార్థి కావడంతో, అదే కళాశాలలో పట్టభద్రుడైన బంధువు రాధాకృష్ణన్‌కు తన తత్వశాస్త్ర పాఠ్యపుస్తకాలను అందించినప్పుడు, అది అతని విద్యా కోర్సు తత్త్వశాస్త్రంగా స్వయంచాలకంగా నిర్ణయించబడింది. సర్వేపల్లి "ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రిసపోజిషన్స్" అనే అంశంపై తన బ్యాచిలర్ డిగ్రీ థీసిస్ రాశాడు. ఇది "వేదాంత వ్యవస్థలో నైతికతకు చోటు లేదనే ఆరోపణలకు సమాధానంగా ఉద్దేశించబడింది." అతనికి బోధించే ఇద్దరు ప్రొఫెసర్లు, రెవ్. విలియం మెస్టన్, డాక్టర్ ఆల్ఫ్రెడ్ జార్జ్ హాగ్ లు రాధాకృష్ణన్ చేసిన ప్రవచనాన్ని మెచ్చుకున్నారు. రాధాకృష్ణన్ థీసిస్ కేవలం ఇరవై సంవత్సరాల వయస్సులో ప్రచురించబడింది. రాధాకృష్ణన్ "భారతీయ సంస్కృతికి సంబంధించిన హాగ్ తో పాటు ఇతర క్రైస్తవ ఉపాధ్యాయుల విమర్శలు నా విశ్వాసానికి భంగం కలిగించాయి. నేను ఆశ్రయించిన సాంప్రదాయక ఆధారాలను కదిలించాయి." అని తెలిపాడు. కుడి|thumb|1963లో ఓవల్ ఆఫీస్‌లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీతో కలిసి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వివాహం, సంతానం రాధాకృష్ణన్ మే 1903లో 10 సంవత్సరాల వయస్సు గల శివకామమ్మ Radhakrishnan's wife's name is spelled differently in different sources, perhaps because a common Telugu spelling is Sivamma. It is spelled Sivakamu by Sarvepalli Gopal (1989); Sivakamuamma by Mamta Anand (2006); and still differently by others. (1893–1956) తో తన 16 వ యేట వివాహం జరిగింది ఆ దంపతులకు పద్మావతి, రుక్మిణి, సుశీల, సుందరి, శకుంతల అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారికి సర్వేపల్లి గోపాల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అతను చరిత్రకారుడిగా చెప్పుకోదగిన వృత్తిని కొనసాగించాడు. రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులు, అతని మనుమలు, మనుమరాళ్లతో సహా ప్రపంచవ్యాప్తంగా అకాడెమియా, పబ్లిక్ పాలసీ, మెడిసిన్, లా, బ్యాంకింగ్, బిజినెస్, పబ్లిషింగ్, ఇతర రంగాలలో విస్తృతమైన వృత్తులను అభ్యసించారు. భారత మాజీ క్రికెటర్‌ వీ.వీ.ఎస్‌. లక్ష్మణ్‌ ఆయన మేనల్లుడు. శివకాము 1956 నవంబర్ 26న మరణించింది. అప్పటికి వారి వివాహమై దాదాపు 53 సంవత్సరాలు అయింది. ఉద్యోగం alt=hand made portrait of Mr. President.|thumb|బుజ్జాయి గీసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రంపై తెలుగులో సర్వేపల్లి "రాధాకృష్ణయ్య" అని సంతకం చేసిన సర్వేపల్లి. ఏప్రిల్ 1909లో, రాధాకృష్ణన్ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ విభాగానికి ఫ్రొఫెసర్ గా నియమితులయ్యాడు. 1918లో మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య రాధాకృష్ణన్ తత్వశాస్త్రంలో ప్రతిభను గుర్తించి, పిలిపించుకుని ప్రొఫెసరుగా నియమించాడు. అక్కడ అతను మైసూర్‌లోని మహారాజా కళాశాలలో బోధించాడు. అతను ఉపన్యాసాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. అప్పటికి అతను ది క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎథిక్స్ వంటి ప్రసిద్ధ పత్రికలకు అనేక వ్యాసాలు వ్రాసాడు. అతను తన మొదటి పుస్తకం "ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌" ని కూడా పూర్తి చేశాడు. అతని రెండవ పుస్తకం, "ది రీన్ ఆఫ్ రిలిజియన్ ఇన్ కాంటెంపరరీ ఫిలాసఫీ" 1920లో ప్రచురించబడింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. 1921 లో అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్‌ లో తత్వశాస్త్రంలో ప్రొఫెసర్‌గా నియమించబడ్డాడు. అతను జూన్ 1926లో బ్రిటిష్ సామ్రాజ్యంలో విశ్వవిద్యాలయాల కాంగ్రెస్‌లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. సెప్టెంబరు 1926లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫిలాసఫీకి ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో జరిగిన మరో ముఖ్యమైన విద్యాసంఘటన ఏమిటంటే , 1929లో ఆక్స్‌ఫర్డ్‌లోని మాంచెస్టర్ కాలేజీలో హిబర్ట్ జీవిత ఆదర్శాలపై ఉపన్యాసాన్ని అందించడానికి ఆహ్వానం అందింది. ఇది "యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్‌"గా పుస్తక రూపంలో ప్రచురించబడింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు అతను 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకుంది. 1929లో మాంచెస్టర్ కళాశాలలో ప్రిన్సిపల్ జె. ఎస్ట్లిన్ కార్పెంటర్ ద్వారా ఖాళీ చేయబడిన పదవికి రాధాకృష్ణన్ ఆహ్వానించబడ్డాడు. దీంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు తులనాత్మక మతంపై ఉపన్యాసాలు ఇచ్చే అవకాశం లభించింది. విద్యకు ఆయన చేసిన సేవలకు గాను జూన్ 1931 జన్మదిన వేడుకల్లో జార్జ్ V చేత నైట్ బిరుదు పొందాడు. ఏప్రిల్ 1932లో భారత గవర్నర్ జనరల్, ఎర్ల్ ఆఫ్ విల్లింగ్‌డన్ ద్వారా అధికారికంగా బిరుదును పొందినప్పటికీ , అతను ఆ తర్వాత బిరుదును స్వాతంత్ర్యానంతరం ఉపయోగించడం మానేశాడు. దీని బదులుగా అతని విద్యాసంబంధమైన 'డాక్టర్' బిరుదును ఇష్టపడేవాడు. . Page 9 states: "In 1931.... He was knighted that year, but ceased to use the title after Independence." 1931లో డా. సి.ఆర్.రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశాడు. 1931 నుండి 1936 వరకు ఆ పదవిలో ఉన్నాడు. తన మొదటి కాన్వకేషన్ ప్రసంగంలో, అతను తన స్థానిక ఆంధ్ర గురించి ఇలా మాట్లాడాడు, "మనం ఆంధ్రులం అదృష్టవశాత్తూ కొన్ని విషయాల్లో స్థితప్రజ్ఞులం. భారతదేశంలోని ఏ ప్రాంతమైనా సమర్ధవంతమైన ఐక్యతా భావాన్ని పెంపొందించుకోగలిగితే అది ఆంధ్రలోనే అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సంప్రదాయవాదం పట్టు బలంగా లేదు. మన ఔదార్యత, మనస్సు యొక్క బహిరంగత బాగా తెలిసినవి. మన నైతిక భావం, సానుభూతి కల్పన సిద్ధాంతం వల్ల పెద్దగా తారుమారు కాలేదు. మా మహిళలు సాపేక్షంగా ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నారు. మాతృభాషపై ప్రేమ మనందరినీ బంధిస్తుంది." అప్పట్లో రాధాకృష్ణన్‌ పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు. 1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకైనాడు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకుడుగా పనిచేసాడు.. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశాడు. 1937లో, అతను సాహిత్యంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు, అయితే ఈ నామినేషన్ ప్రక్రియ, గ్రహీతలందరికీ, ఆ సమయంలో పబ్లిక్ కాదు. అవార్డు కోసం తదుపరి ప్రతిపాదనలు 1960ల వరకు స్థిరంగా కొనసాగుతాయి. 1939లో Pt. మదన్ మోహన్ మాలవ్య తన వారసుడిగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) వైస్-ఛాన్సలర్‌గా రావాలని ఆహ్వానించారు. అతను జనవరి 1948 వరకు దాని వైస్-ఛాన్సలర్‌గా పనిచేశాడు. 1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ కు సభ్యుడుగా పనిచేసాడు. 1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు రాధాకృష్ణన్ నియమితుడైనాడు రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. సర్వేపల్లి తాత్వికచింతన ఇతను పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించాడు. అతని దృష్టిలో తత్వం అనేది జీవితాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక మార్గం, భారతీయ తత్వాన్ని అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించాడు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకం, తర్కం ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు. చేపట్టిన పదవులు link=https://en.wikipedia.org/wiki/File:Sarve_palli_raadhakrishnan,_tankbund.JPG|thumb|హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సర్వేపల్లి విగ్రహం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను నిర్వహించాడు 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసాడు. 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు. 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబరు 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. 1929లో ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు అతనును ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు "తులనాత్మక మతం" (Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసం ఇవ్వగలిగే అవకాశం వచ్చింది. 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసాడు. 1936లో,స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగాడు. 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసాడు. 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసాడు. 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించాడు. 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు. 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యాడు. 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు. పొందిన గౌరవాలు link=https://en.wikipedia.org/wiki/File:S._Radhakrishnan_receiving_the_Bharat_Ratna_award_from_President_Dr._Prasad.jpg|thumb|అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకుంటున్న సర్వేపల్లి వివిధ దేశాల గౌరవాలు ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవానికిగాను ప్రతీ సంవత్సరం అతను పుట్టిన రోజును సెప్టెంబరు 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఇతనును వరించింది. 1954లో మానవ సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందాడు. 1954లో మెక్సికో ప్రభుత్వం ఆ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం" ఆర్డర్ ఆఫ్ ద అజ్ టెక్ ఈగిల్" పురస్కారాన్ని అందించింది. 1961లో జర్మనీ పుస్తక సదస్సు శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందాడు. 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేటులు సంపాదించాడు. ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది. ఇతర గౌరవాలు రాధాకృష్ణన్ చిత్రపటాన్ని భారతదేశ రాజ్యసభ ఛాంబర్‌లో అలంకరించారు. 1933–37: సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఐదుసార్లు నామినేట్ చేయబడ్డాడు. 1938: బ్రిటిష్ అకాడమీ ఫెలోగా ఎన్నికయ్యాడు. 1947: ఇన్‌స్టూట్ ఇంటర్నేషనల్ డి ఫిలాసఫీలో శాశ్వత సభ్యునిగా ఎన్నిక. 1959: ఫ్రాంక్‌ఫర్ట్ నగరం యొక్క గోథే ప్లేక్ పురస్కారం. 1961: జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతి. 1962: భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం, ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న రాధాకృష్ణన్ పుట్టినరోజున జరుపుకుంటారు, "ఉపాధ్యాయులు దేశంలో అత్యుత్తమ ఆలోచన గలవారుగా ఉండాలి" అనే రాధాకృష్ణన్ విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈ దినాన్ని జరుపుకుంటారు. 1968: సాహిత్య అకాడమీ ఫెలోషిప్, ఒక రచయితకు సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత గౌరవం (ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఆయన). 1975: 1975లో టెంపుల్‌టన్ ప్రైజ్ అందుకున్నాడు. ఈ టెంపుల్టన్ ప్రైజ్ మొత్తాన్ని అతను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చాడు. 1989: రాధాకృష్ణన్ జ్ఞాపకార్థం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా రాధాకృష్ణన్ స్కాలర్‌షిప్‌ల సంస్థ. స్కాలర్‌షిప్‌లు తరువాత "రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్‌లు"గా మార్చబడ్డాయి. అతను సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు, నోబెల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు నామినేట్ అయ్యాడు.Nomination Database. nobelprize.org భారత తపాలా శాఖ 1967, 1989 లలో స్మారక తపాలా స్టాంపులు విడుదలచేసింది. జనాదరణ పొందిన సంస్కృతిలో సర్వేపల్లి రాధాకృష్ణ (1988) అనేది రాధాకృష్ణన్ గురించి తెలియజేసిన డాక్యుమెంటరీ చిత్రం, దీనికి ఎన్.ఎస్. థాపా దర్శకత్వం వహించాడు, దీనిని భారత ప్రభుత్వ చలనచిత్ర విభాగం నిర్మించింది. రచనలు The Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు, వాటి ఉపయోగం ఒక తలంపు) (1908) - ఎం.ఏ. పరిశోధనా వ్యాసం. The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వం) (1918). The Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వంపై మతం ఏలుబడి) (1920). Indian Philosophy (భారతీయ తత్వం) (2 సంపుటాలు) (1923, 1927). The Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణం) (1926). The Religion We Need (మనకు కావలిసిన మతం) (1928). Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత భవిష్యత్తు) (1929). An Idealist View of Life (ఆదర్శవాది జీవిత ధృక్కోణం) (1932). East and West in Religion (ప్రాక్‌ పశ్చిమాలలో మతం) (1933). Freedom and Culture (స్వాతంత్ర్యం, సంస్కృతి) (1936). The Heart of Hindusthan (భారతీయ హృదయం) (1936). My Search for Truth (Autobiography) (నా సత్యశోధన (ఆత్మకథ)) (1937). Gautama, The Buddha (గౌతమ బుద్ధుడు) (1938). Eastern Religions and Western Thought (తూర్పు మతాలు, పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969). Mahatma Gandhi (మహాత్మా గాంధీ) (1939). India and China (భారతదేశం, చైనా) (1944). Education, Politics and War (విద్య, రాజకీయం, యుద్ధం) (1944). Is this Peace (ఇది శాంతేనా) (1945). The Religion and Society (మతం, సంఘం) (1947). The Bhagwadgita (భగవధ్గీత) (1948). Great Indians (భారతీయ మహానీయులు) (1949). East and West: Some Reflections (తూర్పు, పడమర: కొన్ని చింతనలు) (1955). Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతం) (1967). ఇతర విశేషాలు రాధాకృష్ణన్ ది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారి వృత్తి చేయమన్నాడు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇక అప్పటినుంచీ ఇతను చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కొనలేని పరిస్థితుల్లో అతను నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎం.ఏ పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరాడు. అతను పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. అతను రోజులో 12 గంటల పాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవాడు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్‌ఛాన్స్‌లర్) గా పనిచేశాడు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశాడు. అతను రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాడు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. 1952లో బారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టాడు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. ఏనాడూ ఎటువంటి ఆడంబరాలకు పోలేదు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగి ఇచ్చాడు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై, ప్రేమాభిమానాలు చూపేవాడు. అతను మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి, తమ గురువును కూర్చోబెట్టి, రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. ఆరోజు నుంచే అతను పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. మూలాలు వనరులు liveindia.comలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర (సమగ్రంగా) sify.comలో నాస్తికత్వంపైన ఉల్లేఖనాలు ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతుల గురించి భారత ప్రభుత్వంవారి అధికారిక వెబ్‌సైటులో చూడండి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతి రాత , అతను గొంతును కూడా ఇక్కడ వినవచ్చు బాహ్య లంకెలు Sarvepalli Radhakrishnan at the Internet Encyclopedia of Philosophy "Dr. Sarvepalli Radhakrishnan- The philosopher president", Press Information Bureau, Government of India "Sarvepalli Radhakrishnan (1888—1975)" by Michael Hawley, Internet Encyclopedia of Philosophy S. Radhakrishnan materials in the South Asian American Digital Archive (SAADA) సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు వర్గం:భారత ఉపరాష్ట్రపతులు వర్గం:తమిళనాడు తత్వవేత్తలు వర్గం:ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతులు వర్గం:ఆత్మకథ రాసుకున్న తమిళనాడు వ్యక్తులు వర్గం:తమిళనాడు తెలుగువారు వర్గం:తమిళనాడుకు చెందిన రాష్ట్రపతులు వర్గం:ఈ వారం వ్యాసాలు
లాల్ బహదూర్ శాస్త్రి
https://te.wikipedia.org/wiki/లాల్_బహదూర్_శాస్త్రి
లాల్ బహదూర్ శాస్త్రి ( ) (1904 అక్టోబర్ 2, - 1966 జనవరి 11, ) భారత దేశ రెండవ ప్రధానమంత్రి , భారతదేశ స్వాతంత్ర్యోద్యమం లో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లలో భారత స్వాతంత్ర్యోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్ తో కలసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. అలాగే నెహ్రూ, శాస్త్రికి ఎంతో ఇష్టమైనవాడు అయినప్పటికీ పార్టీలో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నాడు. కానీ నెహ్రూతో సాన్నిహిత్యం కారణంగా అతను తరువాత కాలంలో ప్రధానమంత్రి కాగలిగాడు. అతను 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు. అతని నినాదం "జై జవాన్ జై కిసాన్" యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. ఒప్పందం జరిగిన తరువాత దినం తాష్కెంట్లో అతను గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా చెప్పబడింది. ప్రారంభ జీవితం (1904–1917) శాస్త్రి వారణాసి లోని రామనగర లో తన తల్లితరపున తాత గారింట కాయస్థ హిందూ కుటుంబంలో 1904 అక్టోబర్ 2న జన్మించాడు. ఆ కుటుంబం సాంప్రదాయకమైన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ . సివిల్ సర్వెంట్స్ ఉన్న నేపధ్యం కలది. అతని తండ్రి తరపున పూర్వీకులు వారణాసి దగ్గరలోని రామనగర లో జమీందారుల వద్ద పనిచేసేవారు. అతను జన్మించిన మొదటి సంవత్సరంలో ఇక్కడ పెరిగాడు. శాస్త్రి తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాస్తవ ఉపాధ్యాయునిగా పనిచేసాడు. తరువాత అలహాబాద్ రెవెన్యూ కార్యాలయంలో గుమస్తాగా పనిచేసాడు. ఆమె తల్లి మొఘల్ సరాయ్ లోని రైల్వే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. ఆంగ్ల ఉపాద్యాయునిగా పనిచేసిన మున్షీ హజారీ లాల్ కుమార్తె. శాస్త్రి రెండవ సంతానంగా పెద్ద కుమారునిగా జన్మించాడు. అతని అక్క పేరు కైలాష్ దేవి (జ.1900) 1906 ఏప్రిల్ లో శాస్త్రికి ఒక యేడాది వయస్సు ఉన్నప్పుడు, అతని తండ్రి డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి పొందాడు కానీ ప్లేగు అనే అంటువ్యాధికి గురై మరణించాడు. ఆ సమయంలో 23 సంవత్సరాల వయస్సు గల రామ్‌దులారీ దేవికి మూడవ బిడ్డతో గర్భంతో ఉంది. ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఆమె తన కన్నవారి ఇంటికి (ముఘల్‌సరాయ్) వచ్చి అక్కడ స్థిరపడింది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు. అక్కడ ఆమె సుందరీ దేవి అనే కుమార్తెకు జూలై 1906 న జన్మనిచ్చింది. ఆ విధంగా శాస్త్రి ఆమె సొదరీమణులతో కలసి తాతగారైన హజారీ లాల్ ఇంటి వద్ద పెరిగాడు. అయినప్పటికీ హజారీలాల్ 1908లో గుండెపోటుతో మరణించాడు. తరువాత శాస్త్రి కుటుంబాన్ని తన మామయ్య దర్బారీ లాల్ చూసుకున్నాడు. దర్బారీలాల్ ఘజీపూర్ లోని "నల్లమందు నియంత్రణ విభాగం" లో ప్రధాన గుమస్తాగా పనిచేస్తూండేవాడు. తరువాత దర్బారీలాల్ కుమారుడు బిందేశ్వరి ప్రసాద్, ముఘల్‌సరాయ్ లో ఉపాద్యాయునిగా పనిచేసాడు. అన్ని కాయస్థ కుటుంబాల మాదిరిగానే శాస్త్రి కుటుంబంలోని పిల్లలకు ఉర్దూ భాష, సంస్కృతిలో విద్యను అందించే ఆచారం ఉంది. ప్రభుత్వంలో ఆంగ్ల భాష రాక ముందు అనేక శతాబ్దాలుగా ఉర్దూ/పర్షియన్ భాషలు వాడబడుతున్నందున ఈ భాషలు నేర్చుకోవాలనే ఆచారం ఆనాడు ఉండేది. అందువలన శాస్త్రి తన నాలుగు సంవత్సరాల వయస్సులో ముఘల్‌సరాయ్ లోని తూర్పు మధ్య రైల్వే ఇంటర్ కళాశాలలో బుధన్ మిలన్ అనే మౌల్వీ (ముస్లిం పండితుడు) వద్ద విద్యను అభ్యసించాడు. అక్కడ 6వ తరగతి వరకు చదివాడు. 1917లో తన కుటుంబాన్ని పోషిస్తున్న మామయ్య బృందేశ్వర ప్రసాద్ కు వారణాసి కి బదిలీ అయింది. అందువల్ల కుటుంబం అంతా వారణాసి వెళ్లవలసి వచ్చింది. ఆ కుటుంబంతో పాటు రామ్‌దులారీ దేవి తన ముగ్గురు పిల్లలతో కలసి వారణాసి చేరింది. శాస్త్రి హరిష్ చంద్ర హైస్కూలు లో ఏడవ తరగతిలో చేరాడు. ఇక్కడ అతను తన పేరులోని "శ్రీవాస్తవ" అనే ఇంటిపేరును వదిలివేసాడు. నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. తోటి విద్యార్థులు తనకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తున్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు. అది గమనించిన టీచర్లకు లాల్ బహదూర్ పై ప్రేమ ఇంకా ఎక్కువైంది. సత్యాగ్రహం చేసే యువకునిగా (1921–1945) శాస్త్రి కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్ర్యోద్యమ నేపధ్యం లేనప్పటికీ అతను చదివే హరిష్ చంద్ర హైస్కూల్ లోని ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్ మిశ్రా ద్వారా దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు అతని పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం చేసేవాడు. మిశ్రా దేశభక్తిని ప్రేరణగా పొందిన శాస్త్రి, స్వాతంత్ర్యోద్యమంపై మక్కువ పెంచుకున్నాడు. తరువాత స్వామి వివేకానంద, గాంధీజీ, అనీబిసెంట్ అంటి వ్యక్తుల చరిత్ర, వారు చేసిన సేవలను గూర్చి అధ్యయనం చేసాడు. 1921 జనవరిలో అతను 10వ తరగతి చదువుతున్నప్పుడు పరీక్షలకు మూడు మాసాల వ్యవధి ఉన్న సమయంలో బెనారస్ లో మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ద్వారా నిర్వహింపబడిన సభకు హాజరైనాడు. మహాత్మా గాంధీ పిలువుకు ప్రేరణ పొందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. రెండవరోజే శాస్త్రి హరీష్ చంద్ర పాఠశాలను వదలి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తగా చేరాడు. అతను చురుకుగా అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. ఈ కారణంగా అతనిని అరెస్టు చేసారు కానీ మైనర్ అయినందువలన వెంటనే విడిచిపెట్టారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లోని అధ్యాపకునిగా పనిచేసిన జె.బి.కృపాలానీ శాస్త్రికి సూపర్‌వైజర్ గా ఉండేవాడు. కృపాలానీ భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీని అనుసరిస్తూ ఉన్న ప్రముఖ నాయకులలో ఒకడు. స్వాతంత్ర్యోద్యమంలోకి చదువును వదిలి వచ్చిన యువ కార్యకర్తలు తమ విద్యను కొనసాగించడానికి కృపాలానీ తన స్నేహితుడు వి.ఎన్.శర్మతో కలసి అనియత పాఠశాలను స్థాపించి యువకులు వారి జాతీయ వారసత్వాన్ని కొనసాగించడానికి "జాతీయ వాద విద్య" ను బోధించేవారు. ఒక సంపన్న పరోపకారం గల వ్యక్తి, కాంగ్రెస్ జాతీయవాది అయిన శివప్రసాద్ గుప్తా మద్దతుతో 1921 ఫిబ్రవరి 10 న బెనారస్ లో ఉన్నత విద్యా సంస్థ (కాశీ విద్యా పీఠ్) స్థాపించబడి గాంధీచే ప్రారంభించబడినది. 1925 లో ఈ విద్యాపీఠ్ లోని మొదటి బ్యాచ్ విద్యార్థులలో శాస్త్రి తత్త్వ శాస్త్రం, నీతి శాస్త్రాలలో మొదటి శ్రేణిలో గ్రాడ్యుయేషన్ చేసాడు. అతనికి "శాస్త్రి" (పండితుడు) అనే బిరుదునిచ్చారు. ఈ బిరుదును బ్యాచిలర్స్ డిగ్రీ అందజేసే విద్యాపీఠ్ ఇస్తుంది కానీ ఇది అతని పేరులో స్థిరపడిపోయింది.Hindustan Times, New Delhi Friday, 11 January 2013 page no 5 అతను లాలా లజపతిరాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్స్ సొసైటీ (లోక్ సేవక్ మండల్) లో జీవితకాల సభ్యత్వం తీసుకున్నాడు. అతను ముజఫర్ పూర్ లో గాంధీజీ అధ్వర్యంలో హరిజనుల మంచి కోస్ం వివిధ కార్యక్రమాలలో పాల్గొనేవాడు. తరువాత అతను ఆ సొసైటీకి అధ్యక్షునిగా పనిచేసాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర శాస్త్రి 1928లో గాంధీజీ పిలుపుతో కాంగ్రెస్ లో చురుకైన, పరిపక్వత గల సభ్యునిగా మారాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో అతను పాల్గొన్నాడు. దాని ఫలితంగా రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తరువాత 1937 లో ఉత్తర ప్రదేశ్ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసాడు. 1940 లో అతను స్వాతత్ర్య ఉద్యమానికి మద్దతుగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందున ఒక సంవత్సరం పాటు జైలు లో ఉన్నాడు. 1942 ఆగస్టు 8 న దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులు భారతదేశ్ం విడిచి పోవాలనే డిమాండ్ తో గాంధీజీ ముంబై లోని గోవిలియా టాంక్ వద్ద క్విట్‌ ఇండియా ఉద్యమం గూర్చి సందేశాన్నిచ్చాడు. శాస్త్రి ఒక సంవత్సర కాలం జైలుశిక్ష అనుభవించి విడుదలైన వెంటనే అలహాబాదుకు ప్రయాణమయ్యాడు. జవహర్ లాల్ నెహ్రూ గృహమైన ఆనందభవన్‌లో ఉన్న స్వాతంత్ర్య ఉద్యమకారులకు సూచనలను ఒక వారంపాటు పంపాడు. కొద్ది రోజుల తరువాత అతను అరెస్టు కాబడి 1946 వరకు జైలు శిక్ష అనుభవించాడు. శాస్త్రి స్వాతంత్యోద్యమంలో మొత్తం 9 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. అతను జైలులో ఉన్నకాలాన్ని పుస్తకాలు చదవడంతో గడిపాడు. పశ్చిమ దేశ తత్వవేత్తలు, విప్లవకారులు, సాంఘిక సంస్కర్తల కృషిని బాగా తెలుసుకున్నాడు. రాజకీయ జీవితం (1947–64) thumb|1954లో కేంద్ర రైల్వే మంత్రిగా చిత్తరంజన్ రైల్వే ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్ర మంత్రి భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత శాస్త్రి తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1947 ఆగస్టు 15 న గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో పోలీసు, రవాణా శాఖలకు మంత్రిగా వ్యవహరించాడు. రఫీ అహ్మద్ కిద్వాయ్ నిష్క్రమణ తరువాత కేంద్రంలో మంత్రిగా చేరాడు. అతను రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారిగా మహిళా కండక్టర్లను నియమించాడు. పోలీసు శాఖా మంత్రిగా అతను పోలీసులు ఎక్కువగా ఉన్న జన సమూహాలను పారద్రోలేటందుకు లాఠీ చార్జ్ కు బదులుగా వాటర్ జెట్ లు వాడాలని ఆదేశించాడు. పోలీసు మంత్రిగా (తరువాత కాలంలో 1950 నుండి హోం మంత్రి) ఆయన పదవీకాలంలో 1947 లో శరణార్థుల వలసలు, పునరావాసం లో జరిగిన మత సంఘర్షణలను విజయవంతంగా అణచివేసాడు. క్యాబినెట్ మంత్రి 1951లో శాస్త్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. అతను ప్రచారం, ఎన్నికల కార్యకలాపాలు, అభ్యర్థుల ఎంపికకు పూర్తి బాధ్యత వహించాడు. అతని మంత్రివర్గంలో రతిలాల్ ప్రేం చంద్ మెహ్తా వంటి ఉత్తమమైన భారతీయ వ్యాపారవేత్తలు ఉండేవారు. అతను 1952, 1957, 1962 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలోముఖ్య పాత్ర పోషించాడు. 1952 లో ఉత్తర ప్రదేశ్ లోని సోరాన్ ఉత్తర (ఫూల్పూర్ పశ్చిమ) విధాన సభ నియోజక వర్గం నుండి పోటీ చేసి 69% ఓట్లతో విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ హోం మంత్రిగా పదవినలంకరిస్తాడని నమ్మాడు కానీ కేంద్ర ప్రభుత్వంలో నెహ్రూ పిలుపు మేరకు తిరిగి కేంద్రానికి వెళ్లాడు. నెహ్రూ అతనికి 1952 మే 13 న తన మొదటి కేబినెట్ లో రైల్వే మంత్రి భాద్యతలను అప్పగించాడు. భారత ప్రధానమంత్రి (1964–66) 1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రికి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలుపరిచాడు. 1964 జూన్ 11 న ప్రధానమంత్రిగా అతను చెప్పిన మొదటి మాటలు ప్రసారమైనాయి. అవి: దేశీయ విధానాలు జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలోని అనేక మంది మంత్రులను శాస్త్రి కొనసాగించాడు. టి.టి కృష్ణమాచారిని ఆర్థిక మంత్రిగా నియమించాడు. యశ్వంతరావ్ చవాన్ కు రక్షణశాఖను అప్పగించాడు. అతను స్వరన్ సింగ్ ను విదేశీ వ్యవహారాల శాఖను అప్పగించాడు. అతను జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీకి సమాచార ప్రసారాల శాఖా మంత్రిత్వ శాఖను, గుల్జారీలాల్ నందాకు హోం శాఖను అప్పగించాడు. అతని పరిపాలనా కాలంలో 1955లో మద్రాసులో హిందీ వ్యతిరేక ఆందోళన జరిగింది. భారతీయ ప్రభుత్వం చాలా కాలంగా భారతదేశ ఏకైక జాతీయ భాషగా హిందీని స్థాపించడానికి ప్రయత్నం చేసింది. ఈ విధానాన్ని హిందీ భాషేతర ప్రాంతాలైన ముఖ్యంగా మద్రాసు రాష్ట్రం వ్యతిరేకించింది. పరిస్థితిని శాంతింపజేయడానికి శాస్త్రి హిందీ భాష మాట్లాడని రాష్ట్రాలలో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉపయోగించబడుతుందనే హామీ ఇచ్చాడు. ఈ సందర్భంలో జరిగిన విద్యార్ధి ఆందోళనలు, శాస్త్రి హామీ తరువాత సద్దుమణిగాయి. ఆర్థిక విధానాలు కేంద్ర ప్రణాళికతో నెహ్రూ సోషలిస్టు ఆర్థిక విధానాలను శాస్ర్తి నిలిపివేశాడు. అతను వైట్ విప్లవాన్ని(వైట్ రివల్యూషన్) ప్రోత్సహించాడు. ఈ వైట్ విప్లవం ముఖ్య ఉద్దేశ్యం పాలు ఉత్పత్తి, సరఫరా పెంచడానికి ఒక జాతీయ ప్రచారం చేయడం. గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతంలో ఉన్న అమూల్ మిల్క్ కో-ఆపరేటివ్ సహకారంతో "నేషనల్ డైరీ డెవలప్‌మెంటు బోర్డు" ఏర్పాటు చేయడమైంది. 1964 అక్టోబరు 31 న అతను గుజరాత్ లోని ఆనంద్ ప్రాంతాన్ని సందర్శించి కంజరి వద్ద ఏర్పాటు చేసిన అముల్ పశుగ్రాస ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసాడు. ఈ కో-ఆపరేటివ్ విజయాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి కలిగిన అతను ఒక గ్రామంలో రైతులతో రాత్రిపూట బస చేసి ఒక రైతు కుటుంబముతో విందు కూడా చేసాడు. అతను కైరా జిల్లా కో-ఆపరేటివ్ పాల ఉత్పత్తుల యూనియన్ లిమిటెడ్ (అమూల్) జనరల్ మేనేజర్ అయిన వర్ఘీస్ కురియన్ తో ఈ విషయంలో చర్చలు జరిపాడు. అతను ఇటువంటి నమూనాలను దేశంలో రైతుల సాంఘిక-ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికి దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో కూడా నెలకొల్పాలని వర్ఘీస్ కురియన్ తో చర్చించాడు. ఈ సందర్శన ఫలితంగా 1965 లో ఆనంద్ వద్ద నేషనల్ డైరీ డెవలప్‌మెంటు బోర్డు (NDDB) స్థాపించబడింది. దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆహార కొరత గురించి మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా ఒక భోజనాన్ని ఇవ్వాలని కోరాడు. దీని ఫలితంగా ఆహార కొరత గల ప్రజలకు కూడా ఆహారం దొరుకుందని తెలియజేసాడు. అయితే దేశానికి విజ్ఞప్తి చేసే ముందు అతను మొదట తన సొంత కుటుంబంలో ఈ వ్యవస్థను అమలు చేసి ధృవీకరించాడు. ఒక వారంలో ఒక భోజనాన్ని వదిలివేసే అభ్యర్థనను ప్రజలకు తెలియజేయడానికి అతను దేశమంతా పర్యటించాడు. అతని విజ్ఞప్తికి విశేషమైన ప్రతిస్పందన వచ్చింది. దీని ఫలితంగా రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలు ప్రతీ సోమవారం సాయంత్రం మూసివేయబడినవి. దేశంలోని అనేక ప్రాంతాలు "శాస్త్రి వ్రత్" ను పరిశీలించారు. న్యూఢిల్లీ లోని తన అధికార నివాసంలోని పచ్చిక మైదానాన్ని దున్నడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించాడు. 1965 అక్టోబరు 19 న పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో 22వ రోజున అతను అలహాబాదులోని ఉర్వా లో ప్రభావశీలమైన "జై జవాన్ జై కిసాన్" (సైనికులకు అభినందనలు, రైతులకు అభినందనలు) నినాదాన్నిచ్చాడు. అతి తరువాత జాతీయ నినాదమైనది. భారతదేశ ఆహార ఉత్పత్తిని పెంచే అవసరాన్ని తెలియజేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) అతను బాటలు వేసాడు. అతను సామ్యవాది అయినప్పటికీ, భారతదేశం క్రమమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండరాదని పేర్కొన్నాడు. 1964 ఫుడ్ కార్పొరేషన్ చట్టం అద్వర్యంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడినది. తరువాత నేషనల్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ బోర్డ్ చట్టం కూడా ఏర్పడినది. విదేశీ విధానాలు శాస్త్రి నెహ్రూ విధానాన్ని నిరంతరాయంగా కొనసాగించడంతో పాటు సోవియట్ యూనియన్ తో మరింత దగ్గరి సంబంధాలను ఏర్పరుచుకున్నాడు. 1962 సైనో-ఇండియన్ యుద్ధం తరువాత, చైనీస్ పీపుల్స్ రిపబ్లిక్, పాకిస్తాన్ మధ్య సంబంధాల కోసం సైనిక ఏర్పాటు కోసం భారతదేశ సైనిక దళాల రక్షణ బడ్జెట్‌ను విస్తరించాలని శాస్త్రి ప్రభుత్వం నిర్ణయించింది. 1964లో సిలోన్ లోని భారతీయ తమిళుల హోదాకు సంబంధించి శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారనాయకే తో జరిగిన ఒప్పందంపై సంతకం చేసాడు.Encyclopedia of the Third World, as quoted in ఈ ఒప్పందాన్ని "సిరిమా-శాస్త్రి ఒడంబడిక" గా వ్యవహరిస్తారు. The Far East and Australasia, 1996 ఈ ఒప్పందం ప్రకారం, 600,000 మంది భారతీయ తమిళులను తిరిగి స్వదేశానికి పంపించగా, 375,000 మంది శ్రీలంక పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఈ పరిష్కారం 31 అక్టోబరు 1981 నాటికి జరిగింది. అయితే, శాస్త్రి మరణం తరువాత, 1981 నాటికి, భారతదేశం 300,000 తమిళులను మాత్రమే స్వదేశంలోకి తీసుకున్నారు. శ్రీలంక పౌరసత్వాన్ని 185,000 పౌరులకు (1964 తరువాత మరో 62,000 మంది జన్మించారు) మాత్రమే ఇచ్చింది. తరువాత, భారతదేశం పౌరసత్వం కోసం ఏ ఇతర దరఖాస్తులను పరిగణించకుండా తిరస్కరించింది, 1964 ఒప్పందం గడిచినట్లు పేర్కొంది. 1962 లో జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత బర్మాతో భారత్ సంబంధాలు బలహీనపడ్డాయి, 1964 లో అనేక భారతీయ కుటుంబాలను బర్మా చేత స్వదేశానికి పంపించడం జరిగింది. న్యూ డిల్లీలోని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి వస్తున్న పౌరులను తిరిగి బదిలీచేసే మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ, బర్మా నుండి తిరిగి వచ్చిన భారతీయుల గుర్తింపు, రవాణా కొరకు ఏర్పాటు చేసింది. ఇది భారతీయ నేల మీద నిరాశకు గురైనవారికి ఆశ్రయం కల్పించడానికి, తగిన సౌకర్యాలను అందించడానికి స్థానిక ప్రభుత్వాల బాధ్యతలకు లోబడి ఉంది. ముఖ్యంగా మద్రాసు రాష్ట్రంలో ఆ సమయంలో ఉన్న ముఖ్యమంత్రి, మింజుర్ కె.భక్తవత్సలం, తిరిగి వచ్చిన వారిని పునరావాసం చేయటంలో శ్రద్ధ చూపించాడు. 1965 డిసెబరులో బర్మాలోని రంగూన్ కు తన కుటుంబంతో పాటు అధికారికంగా పర్యటించాడు. జనరల్ "నె విన్" సైనిక ప్రభుత్వంతో సహజమైన సంబంధాలను తిరిగి పునఃస్థాపించాడు. పాకిస్థాన్ తో యుద్ధం 1965 ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్ము కాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్త్రి గారి పై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్- అమెరికా, భారత్- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య కార్యక్రమాలు జరిగాయి. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు దౌత్యపత్రాల ద్వారా వెల్లడైంది. కాశ్మీర్‌లోకి దొంగచాటుగా సేనల్ని పంపి యుద్ధానికి కారణం కావటమే కాకుండా నెపాన్ని ఇతరులపై మోపుతున్నారంటూ అమెరికా రాయబారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అదీకాక తాము ఇచ్చిన ఆయుధాలతో భారత్‌పై యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. దాంతో ప్లేటు ఫిరాయించిన పాక్ 1948లో ఐరాస చేసిన తీర్మానాన్ని అనుసరించి జమ్ముకశ్మీర్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరుపాలని అమెరికా, ఐరాసను కోరింది. అదే సమయంలో నాటి భారత ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌కు లేఖ రాశారు. ఐరాస తీర్మానానికి ఏనాడో కాలం చెల్లిపోయిందని, కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమేలేదని కరాఖండిగా చెప్పారు. బేషరతుగా కాల్పుల విరమణను పాటించేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. దాంతో పాకిస్థాన్‌ను కాల్పుల విరమణ పాటించాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు దౌత్యపత్రాల ద్వారా తెలిసింది. శాస్త్రి తన ప్రధానమంత్రిగా పదవీ కాలంలో రష్యా, యుగోస్లేవియా, ఇంగ్లాండ్, కెనడా, నేపాల్, ఈజిప్టు, బర్మా దేశాలను సందర్శించాడు. అతను కైరోలో జరిగిన అహింసా సమావేశం నుండి తిరిగి వచ్చినపుడు అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆయూబ్ ఖాన్ తనను విందు కోరకు ఆహ్వానించినపుడు అతను కరాచీ విమానాశ్రయంలో ప్రోటోకాల్ ప్రకారం ఆయూబ్ ఖాన్ వ్యక్తిగతంగా ఆహ్వానించకపోవడంతో కొన్ని గంటలపాటు నిరీక్షించాడు. 1965 లో పాకిస్తాన్తో కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత, శాస్త్రి, అయుబ్ ఖాన్ తాష్కెంట్ లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. దీనిని అలెక్సీ కోసైజిన్ నిర్వహించాడు. 1966 జనవరి 10 న శాస్త్రి, ఆయూబ్ ఖాన్ తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం మేరకు సోవియట్ లోని టాష్కెంట్లో ఒప్పందం పై సంతకం చేసి అక్కడే మృతిచెందాడు. మరణం thumb|తాష్కెంట్ లో శాస్త్రి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తాష్కెంట్ ఒప్పందం పై సంతకం చేసిన రోజున 02:00 గంటలకు అతను తాష్కెంట్ లో గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించబడినది. కానీ ప్రజలు మరణం వెనుక కుట్ర ఆరోపించారు. అతను విదేశంలో చనిపోయే భారతదేశ మొదటి ప్రధాన మంత్రి. అతనిని జాతీయ నాయకునిగా శ్లాఘిస్తూ అతని జ్ఞాపకార్థం విజయఘాట్ లో స్మారకం ఏర్పాటు చేసారు. అతను మరణించిన తరువాత భారత కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇందిరా గాంధీని ఎన్నుకొనే వరకు గుల్జారీ లాల్ నందా ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నాడు. కుడి|thumb|ముంబైలో శాస్త్రి విగ్రహం|278x278px కుట్రపూరిత సిద్ధాంతాలు పాక్‌తో జరుగుతున్న యుద్ద విరమణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు. తాష్కెంట్‌ (ఇది ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో ఉంది) లో 1966 జనవరి 10న ఒప్పందాలపై సంతకాలు చేసిన మర్నాడే జనవరి 11న ఆయన హృద్రోగంతో అక్కడే మరణించాడు. ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిధిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్ళి అక్కడే అసహజ, అనుమానాస్పదంగా మృతి చెందడం చరిత్రలో అంతకు ముందెప్పడూ లేదు. ఈ మరణం హృద్రోగం వల్ల సంభవించిందని సోవియట్‌ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీన్నే ధ్రువీకరించింది. కానీ ఆధారాల మేరకు శాస్త్రి బౌతికఖాయానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. అంతకుముందెప్పుడూ శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విషప్రయోగం వల్లే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయిDhawan, H. "45 years on, Shastri's death a mystery – PMO refuses to Entertain RTI Plea Seeking Declassification of Document". The Times of India, New Delhi Edition, Saturday, 11 July 2009, page 11, columns 1–5 (top left). దీనిపై కేంద్రం రాజ్‌నారాయణ్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం నివేదిక ఇప్పటివరకు వెలుగుచూడలేదు. ఆఖరికి ఇది భారత పార్లమెంట్‌ లైబ్రరీలో కూడా అందుబాటులో లేదు. వాస్తవానికి పాక్‌తో యుద్ధం చివరిదశకొచ్చింది. భారత్‌ విజయంవైపు దూసుకు పోతోంది. ఈ దశలో ఐక్యరాజ్యసమితి పాక్‌తో విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అప్పటికే శాస్త్రి యుద్ద వీరుడిగా దేశంలో జేజేలందుకుంటున్నారు. ఈ దశలో ఒప్పందానికి అంగీకరించే విధంగా శాస్త్రిపై తాష్కెంట్‌లో తీవ్ర ఒత్తిళ్ళొచ్చా యన్న ఆరోపణలున్నాయి. భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని గాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితాశాస్త్రి గుర్తించారు. శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్‌తో మాట్లాడాడు. ఫోన్‌లో మాట్లాడుతూ పాలుతాగి పడుకుంటానని చెప్పాడు. ఈలోగా ఫోన్‌లైన్‌ డిస్కనెక్ట్‌ అయింది. తర్వాత దాదాపు పదిహేనునిమిషాలకు పైగా సుమన్‌ లైన్‌ కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత లైన్‌ దొరికింది కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్‌ ఎత్తాడు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు చెప్పాడు. అంతవరకు ఎలాంటి అరోగ్యకర ఇబ్బందుల్లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటు సంభవించినా కేవలం పదిహేనునిమిషాల్లో మృత్యువాత పడతాడా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. శాస్త్రి వెంట అతని వ్యక్తిగత వైద్యుడు ఆర్‌ఎన్‌ చుగ్‌ కూడా తాష్కంట్‌ వెళ్ళాడు. అతనూ పక్కగదిలోనే ఉన్నాడు. కనీసం శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడికి కూడా సోవియట్‌ అధికారులు వెల్లడించలేదు. మరణించిన తర్వాతే ఆ విషయాన్ని చెప్పారు. 1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు డాక్టర్‌ చుగ్‌ బయలుదేరారు. కారులో ఢిల్లీ వైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. చుగ్‌ అక్కడికక్కడే మరణించాడు. అలాగే శాస్త్రి వ్యక్తిగత సేవకుడు రామ్‌నాధ్‌ కూడా ఆయనతో పాటు తాష్కంట్ వెళ్ళాడు. మృతదేహం వెంటే ఆయనా తిరిగొచ్చాడు. అతనిని కూడా కమిటీ సాక్షిగా పరిగణించింది. వాంగ్మూలం నమోదుకు పిల్చింది. మోతీలాల్‌నెహ్రూ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఆయన ఒక్కడుగు బయటకేయగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామ్‌నాధ్‌ రెండుకాళ్ళూ నుజ్జునుజ్జు అయ్యాయి. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన గతాన్ని మర్చిపోయాడు. శాస్త్రి విష ప్రయోగం వలన మరణించాడని అతని భార్య లలితా శాస్త్రి ఆరోపించింది. 1978 లో క్రాంత్ ఎం.ఎల్.వెర్మా హిందీలో "లలితా కె ఆంసు"* Book:Lalita Ke Ansoo on worldcat పేరుతో పుస్తకాన్ని రాసి ప్రచురించాడు.Hindustan (Hindi daily) New Delhi 12 January 1978 (ललिता के आँसू का विमोचन) ఈ పుస్తకంలో శాస్త్రి మరణం గురించి విషాద కథ అతని భార్య లలిత శాస్త్రిచే వ్యాఖ్యానించబడింది. Panchjanya (newspaper) A literary review 24 February 1980 అతని మరణం చుట్టూ ఇప్పటికీ తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. అతని కుమారుడు సునీల్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి వెనుక ఉన్న మర్మాన్ని తెలియజేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరాడు. 1966 లో అతని మరణం తరువాత భారతదేశానికి తీసుకువచ్చిన భౌతిక కాయంపై నీలం రంగు మచ్చలు, కొన్ని గాట్లు ఉన్నట్లు అనుమానాలను వ్యక్తికరించాడు. పోస్టు మార్టం చేయబడనప్పటికీ శరీరంపై గాట్లు ఏర్పడానికి కారణాన్ని గూర్చి అడిగాడు. తాష్కెంట్ ఒప్పందం గూర్చి శాస్త్రి రష్యా వెళ్ళిన తరువాత పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ నుండి పాకిస్థాన్ భవిష్యత్తులో భారత్ పై బలగాలను ఎప్పుడూ ప్రయోగించరాదనే వాగ్దానాన్ని కోరాడు. కానీ చర్చలు కొనసాగలేదు. తరువాత రోజు శాస్త్రి మరణించాడు. భారత ప్రభుత్వం అతని మరణం గురించి ఎటువంటి సమాచారం అందించలేదు. అప్పుడు మీడియా నిశ్శబ్దంగా ఉంది. భారతదేశంలో ఈ కుట్ర జరిగే సాధ్యాసాధ్యాలను "అవుట్ లుక్ మ్యాగజైన్" ప్రచురించింది. 2009లో దక్షిణాసియాపై సిఐఎ దృష్టి పేరిట అనుజ్‌ధార్‌ అనే రచయిత పుస్తకం రాసేందుకు ఉపక్రమించాడు. ఇందుకోసం శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు కావాలంటూ సమాచారహక్కు చట్టం క్రింద భారత ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటి జారీకి పిఎమ్‌ఓ నిరాకరించింది. పైగా ఈ పత్రాల జారీ భారత సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అతనికిచ్చిన రాతపూర్వకలేఖలో పిఎమ్‌ఓ అధికారులు పేర్కొ న్నారు. పైగా వీటిని ఓ డాక్యుమెంట్‌గానే పరిగణిస్తున్నట్లు పిఎమ్‌ఓ వెల్లడించింది. భారత ప్రధాని అసహజ, అనుమానాస్పద మరణానికి సంబంధించిన అత్యంత విలువైన సమాచారాన్ని సాధారణ డాక్యుమెంట్‌గా పిఎమ్‌ఓ పరిగణించడం కూడా అనేక సందేహాలకు తావిస్తోంది. శాస్త్రి మరణం నాటికే భారత్‌, సోవియట్‌ల మధ్య విస్తృతమైన మైత్రిబంధముంది. దీంతో మరణం వెనుక సోవియట్‌ హస్తాన్ని ఎవరూ సందేహించలేదు. అప్పటికే యుద్ధంలో పాక్‌ ఓటమిదశకు చేరుకుంది. నిబంధనలు అడ్డురావడంతో ప్రత్యక్షంగా సాయం చేయకపోయినా అమెరికా పరోక్షంగా పాక్‌కు అండగా నిల్చింది. ఈ కారణంగా సిఐఎ ప్రమేయాన్ని కూడా తక్కువగా అంచనావేయలేం. పైగా ఆ సమయంలో సిఐఎలో డైరెక్టర్‌ ఆఫ్‌ ప్లాన్స్‌గా ఉన్న రోబర్డ్‌ క్రోలీ అమెరికాకు చెందిన గ్రెగరీడగ్లస్‌ అనే జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ శాస్త్రితో పాటు భారత అణు పితామహుడు డాక్టర్‌ హోమీబాబా మరణాలకు సిఐఎ ప్రణాళికలు రచించి అమలు చేసిందని వెల్లడించారు. అయితే తన మరణానంతరమే ఈ ఇంటర్వ్యూను ప్రచురించాలని ఆయన డగ్లస్‌ను కోరారు. శాస్త్రి, హోమీబాబా మరణాలు ఒకే నెలలో జరిగాయి. రెండింటికి మధ్య రెండు వారాల వ్యవధే ఉంది. పైగా ఈ రెండు దేశానికి వెలుపలే చోటు చేసుకున్నాయి. శాస్త్రి మరణంలో హృద్రోగాన్ని సాకుగా చూపితే బాబా మరణానికి పైలెట్‌ తప్పిదాన్ని కారణంగా ప్రచారం చేశారు. 60వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతల్ని హతమార్చడం సిఐఎ పనిగా పెట్టుకుంది. కుటుంబం, వారసులు 1928 మే 16 న శాస్త్రి మిర్జాపూర్ కు చెందిన లలితా దేవిని వివాహమడాడు. ఈ వివాహం పెద్దలచే సాంప్రదాయ పద్ధతిలో చేయబడినది. వారికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, వారి పేర్లు: కుసుమ శాస్రి, పెద్ద కుమార్తె హరికృష్ణ శాస్త్రి, పెద కూమరుడు. అతని భార్య విభా శాస్త్రి సుమన్ శాస్త్రి, రెండవ కుమార్తె, ఆమె విజయ్ నాథ్ సింగ్ ను వివాహమాడింది. వారి కుమారుడు సిద్దేంద్రనాథ్ సింగ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికార ప్రాతినిధి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో వైద్యశాఖామంత్రి. అనిల్ శాస్త్రి. ఆమె మంజు శాస్త్రిని వివాహమాడాడు. అతను కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. అతని కుమారుడు ఆదర్శ్ శాస్త్రి ఏపిల్ కంపెనీ తో కార్పొరేట్ జీవితాన్ని ప్రారంభించి 2014 సార్వత్రిక ఎన్నికలలో ఆమ్‌ఆదమీ పార్టీ తరపున అలహాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. సునీల్ శాస్త్రి. అతను మీరా శాస్త్రిని వివాహమాడాడు. అతను భారతీయ జనతాపార్టీలో సభ్యుడు. అశోక్ శాస్త్రి. చిన్న కుమారుడు. అతను కార్పొరేట్ ప్రపంచంలో పనిచేస్తూ 37 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అతని భార్య నీరా శాస్త్రి, కుమారుడు సమీప్ శాస్త్రి లు భారతీయ జనతా పార్టీలో సభ్యులు. వారసత్వ సంపద 1960 నుండి 1964 మధ్య కాలంలో కులదీప్ నయ్యర్, శాస్త్రికి సలహాదారునిగా ఉండేవాడు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అతని కుమార్తెకు జబ్బు చేసింది. అతను జైలు నుండి పెరోల్ పై విడుదలయ్యాడు. అయినప్పటికీ వైద్యులు ఖరీదైన మందులు సూచించిన కారణంగా ఆమెను రక్షించుకోలేక పోయారని నయ్యర్ తన జ్ఞాపకాలను తెలిపాడు. 1963 తరువాత, కేబినెట్ నుండి బయటికి వచ్చిన తరువాత అతను తన గృహంలో చీకటిలో కూర్చున్నాడు. దానికి కారణం అడిగితే అతను ఇకపై మంత్రిని కాదు కనుక అన్ని ఖర్చులు స్వయంగా చెల్లించవలసి ఉంటుందని తెలిపాడు. ఒక పార్లమెంటు సభ్యుడు, మంత్రిగా అతను అవసరమైన సమయం కోసం ఆదాచేయడానికి తగినంత సంపాదించలేదు అని తెలిపాడు. అతను 1950లలో అనేక సంవత్సరాలపాటు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ మరణించే నాటికి పేదరికంలో ఉన్నాడు. చివరికి అతనికి ఒక పాత కారును, ప్రభుత్వం నుండి వాయిదాల పద్ధతితో కొనుగోలు చేసాడు. దానికి వాయిదాలు చెల్లిస్తూ ఉండేవాడు. అతను సెర్వంట్స్ ఆఫ్ ఇండియా సొసైటిలో సభ్యుడు. సభ్యునిగా ప్రైవేట్ ఆస్తులను వృద్ధిచేయడాన్ని విసర్జించి ప్రజా సేవకులుగా ఉండాలని సభ్యులను కోరాడు. అతి పెద్ద రైల్వే ప్రమాదం జరిగినప్పుడు నైతిక భాద్యత వహిస్తూ రైల్వే మంత్రిగా రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. 1964 నవంబరు 19 న అతని ప్రధానమంత్రి కాలంలో లక్నో లో బాల విద్యామందిర్ కు శంకుస్థాపన చేసాడు. నవంబరు 1964లో చెన్నైలోని తారామణి వద్ద సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభించాడు. అతను 1965లో ప్లూటోనియం రీ ప్రాసెసింగ్ ప్లాంటును ప్రారంభించాడు. హోమీ జహంగీర్ భాభా సలహాపై అణు పేలుడు పదార్థాల అభివృద్ది చేయాలని నిర్ణయించాడు. భాభా అణు పేలుడు పదార్థాల రూపకల్పన బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కృషి ప్రారంభించాడు. అతను 1965 మార్చి 20న హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. దానికి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా 1966లో నామకరణం చేసాడు. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత ఇది రెందు విశ్వవిద్యాలయాలుగా విడిపోయింది. తెలంగాణ లోని విశ్వవిద్యాలయానికి జూలై 2014న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసారు. శాస్త్రి అలహాబాదులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ప్రారంభించాడు. స్మారకాలు కుడి|thumb|200x200px|లాల్ బహాదుర్ శాస్త్రి నేషనల్ అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీ శాస్త్రి నిజాయితీ పరుడు, మానవతావాదిగా పేరొందాడు. మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని పొందిన వ్యక్తులలో మొదటివాడు. న్యూఢిల్లో లో "విజయ్ ఘాట్" పేరుతో అతనికి స్మారక స్థలముంది. అతని పేరుతో లాల్ బహాదుర్ శాస్త్రి అకాడమి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విద్యాసంస్థను ముస్సోరీ, ఉత్తరఖండ్ లో నెలకొల్పారు. 1995 లో "లాల్ బహదూర్ శాస్త్రి ఎడ్యుకేషన్ ట్రస్టు" ద్వారా "లాల్ బహాదూర్ శాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు" స్థాపించబడినది. ఇది భారత దేశంలో అతి పెద్ద బిజినెస్ స్కూలు. ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ను లాల్ బహాదూర్ శాస్త్రి నేషనల్ మెమొరియల్ ట్రస్టు ప్రారంభించింది. 2011లో శాస్త్రి 45వ వర్థంతి సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రామ్‌నగర్ లో శాస్త్రి నివసించిన పూర్వీకుల భవనాన్ని పునరుద్ధరించి అతని జీవిత చరిత్ర మ్యూజియంగా మలచాలని ప్రకటించింది. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయానికి అతని పేరును పెట్టారు.http://pib.nic.in/newsite/erelease.aspx?relid=12805 ఉజ్బెకిస్థాన్, తాష్కెంట్ నగరంలో ఒక వీధికి అతని పేరును పెట్టారు. కొన్ని స్టేడియాలకు అతని పేరు పెట్టారు. ఉదా: హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియం. అదే విధంగా అహ్మదాబాద్, కొల్లం, కేరళ, భవానీపాట్నా లలో ఈ పేరుతో స్టేడియం లు ఉన్నాయి. కృష్ణా నదిపై ఉత్తర కర్నాటకలోనిర్మిచిన ఆల్మట్టి డ్యాం కు "లాల్ బహాదూర్ శాస్త్రి సాగర్" గా నామకరణం చేసారు. కార్గో షిప్ కు "ఎం.వి.లాల్ బహాదూర్ శాస్త్రి" గా నామకరణం చేసారు. భారతీయ రిజర్వు బ్యాంగు ఐదు రూపాయల నాణేన్ని అతని చిత్రంతో విడుదల చేసింది. 1991 నుండి ప్రతీ సంవత్సరం ఆల్ ఇండియా లాల్ బహాదూర్ శాస్త్రి హాకీ టోర్నమెంటు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు "లాల్ బహాదూర్ శాస్త్రి కాలువ" గా పేరుపెట్టారు. దీని పొడవు 295 కి.మీ. అతని పూర్తి విగ్రహాలు ముంబై, బెంగళూరు(విధాన సౌధ), న్యూఢిల్లీ(సి.జి.ఒ సముదాయం), ఆల్మట్టి ఆనకట్ట స్థలంలో, రామనగర్ (యు.పి), హిసార్, విజగపట్టిణం, నాగార్జున సాగర్ ఆనకట్ట స్థలం, వరంగల్ లలో ఉన్నాయి. అతని సగం భాగం గల బస్ట్ విగ్రహాలు తిరువనంతపురం, పూణె, వారణాసి (విమానాశ్రయం), అహ్మదాబాద్ (సరస్సు ప్రక్కన), కురుక్షేత్ర, షిమ్లా, కాసర్గాడ్, జలంధర్, లలో ఉన్నాయి. న్యూఢిల్లీ, ముంబై, పూణె, పాండిచేరి, లక్నో, వరంగల్, అలహాబాద్ లలో ముఖ్యమైన రోడ్లకు పేరు పెట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి మెడికల్ కళాశాల, మండి, హిమాచల ప్రదేశ్ లో వుంది. శాస్త్రి భవనాలు న్యూఢిల్లీ, చెన్నై, లక్నోలలో వున్నాయి. 2005లో భారత ప్రభుత్వం ఆయన పేరుతో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామ్య, పరిపాలన అధ్యయన విభాగంలో అధ్యక్ష స్థానం కల్పించింది. ఇతర విషయాలు దేశ ప్రధాని కాకముందు లాల్‌ బహాదుర్‌ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచాడు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీ అయ్యాడు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్త్రి వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్త్రి’ గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు, శాస్త్రికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్త్రి గారి భార్య లలితాశాస్త్రి తో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు "స్వంత ఇల్లు" అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్త్రి గారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డాడు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’ అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు. లాల్‌ బహదూర్‌శాస్త్రి దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్త్రిగారు) మీద ఒత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నాడు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శాస్త్రి మరణించాడు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్త్రి అభిమానులు, ఆయన భార్య లలితాశాస్త్రి కి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట. లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్త్రి మరుసటిరోజు, లాల్‌ బహదూర్‌ శాస్త్రి గారికి ఈ విషయం తెలిపాడు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట. మూలాలు ఇతర పఠనాలు Pavan Choudary and Anil Shastri. Lal Bahadur Shastri: Lessons in Leadership. Wisdom Village Publications, 2014 John Noyce. Lal Bahadur Shastri: an English-language bibliography. Lulu.com, 2002. Lal Bahadur Shastri, 'Reflections on Indian politics', Indian Journal of Political Science, vol.23, 1962, pp1–7 L.P. Singh, Portrait of Lal Bahadur Shastri (Delhi: Ravi Dayal Publishers, 1996) (Sir) C.P. Srivastava, Lal Bahadur Shastri: a life of truth in politics (New Delhi: Oxford University Press, 1995) (Sir) C.P. Srivastava, Corruption: India's enemy within (New Delhi: Macmillan India, 2001) chapter 3 India Unbound From Independence to Global Information Age by Shri Gurucharan Das chapter 11 The spiritual master of Sri Lal Bahadur Shastri was Sri Sri Thakur Anukul Chandra Chakravarty. బయటి లింకులు Why has history forgotten this giant? Lalita Ke Aansoo on en.wikisource Government of India - PM India Book Review - Lal Bahadur Shastri : A life of truth in politics by C.P Srivastava |- |- |- వర్గం:1904 జననాలు వర్గం:1966 మరణాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1వ లోక్‌సభ సభ్యులు వర్గం:2వ లోక్‌సభ సభ్యులు వర్గం:3వ లోక్‌సభ సభ్యులు వర్గం:ఉత్తర ప్రదేశ్ వ్యక్తులు వర్గం:ఉత్తరప్రదేశ్ రాజకీయనాయకులు
పొట్టి శ్రీరాములు
https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు
పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 - 1952 డిసెంబరు 15) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. జీవిత విశేషాలు పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లా లోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామం.(అప్పట్లో ప్రకాశం జిల్లా ఏర్పడలేదు. కనిగిరి,పడమటిపల్లె నెల్లూరు జిల్లా లో ఉండేవి.) ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్రోద్యమంలో పాత్ర పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-1942 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. అతని గురువు ప్రపంచానికే గురువు, సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ, కులపతి (గాంధీ) ఆదరాన్నీ చూరగొన్నాడు." గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943-1944 లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. అప్పుడు మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశంకు ఇలా వ్రాశాడు - "హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)". - 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది.హిందూ పత్రికలో ఈ వ్యాసం --11/11/2002 - The martyr of Telugu statehood జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం... పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబరు 5వ తేదీనాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయరసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో నెత్తురు పడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబరు నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం; ప్రభుత్వం స్పందించకపోవడం; ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓరోజు బులుసు సాంబమూర్తి, నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు. ఆఖరు రోజు డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు!! ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 15.8 కేజీలు బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా... చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు. పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటి ఇంటి ముందు గోడమీద బొగ్గు తో " పొట్టి శ్రీరాములను పొట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలి" అని రాసేరు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవ్వరూ చెరపలేదు.అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూ కు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు పొట్టిశ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు. ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకుని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువుల బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు కర్మకాండ జరిపారు. పర్యవసానాలు పొట్టి శ్రీరాములు, ప్రాణాలర్పించటంతో ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసు లో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించాడు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం, రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. స్మరణలు thumb|273x273px|సచివాలయం ఎదురుగా పొట్టి శ్రీరాములు విగ్రహం మద్రాసు మైలాపూరు, రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవియైన 126 నంబరు ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్దం తపాల శాఖ వారు 2000 మార్చి 16 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. మూలాలు వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:1901 జననాలు వర్గం:1952 మరణాలు వర్గం:నిరాహారదీక్ష మరణాలు వర్గం:నెల్లూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నవారు వర్గం:ఒక స్థలానికి తన పేరు పెట్టబడిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:తమ పేరిట స్మారక పోస్టల్ స్టాంపు విడుదలైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
నందమూరి తారక రామారావు
https://te.wikipedia.org/wiki/నందమూరి_తారక_రామారావు
నందమూరి తారక రామారావు (మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు. బాల్యం నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపలు ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన అతనుకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో అతనుకు బహుమతి కూడా వచ్చింది. కుటుంబం తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. చలనచిత్ర జీవితం రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు. రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు అతనుకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు. ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే అతనును మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే అతను తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత అతను మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది. 1949లో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు. 1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనుకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1956లో విడుదలైన మాయాబజార్‌లో అతను తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి, విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది. శ్రీమద్విరాటపర్వములో అతను ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు అతను పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. 1972నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. ఈ చిత్రాన్ని తన సోదరుడు త్రివిక్రమరావు ఆధీనంలోని "నేషనల్ ఆర్టు ప్రొడక్షన్సు" పతాకంపై విడుదల చేసాడు. 1977లో విడుదలైన దాన వీర శూర కర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు. 1978లో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం అతను నటించి, దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర 1990లో విడుదలైంది. ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా కచ్చితంగా ఉండేవాడు. గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ మద్రాసు మెరీనా బీచిలో అభ్యాసం చేసేవాడు. నర్తనశాల సినిమా కోసం అతను వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల అతను నిబద్ధత అటువంటిది. కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, ఎందుకంటే అతను డైలాగులను ముందుగానే కంఠతా పట్టేసేవాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు గా బిరుదాంకితుడైన అతను 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసారు. 1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు 'కళాప్రపూర్ణ ' స్వీకరించారు. రాజకీయ రంగ ప్రవేశం 1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి, రాష్ట్రంలో శాసనసభ్యులచేత నామకార్థం ఎన్నిక చేయించేవారు. ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం అప్రదిష్ట పాలయింది. 1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు. అతను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం. అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వరత్వరగా పూర్తి చేసాడు. 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు అతనుకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే అతను తన ప్రసంగాలు చేసేవాడు. దానిని అతను "చైతన్యరథం" అని అన్నాడు. ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్యరథమే స్ఫూర్తి. ప్రచార ప్రభంజనం నందమూరి తారక రామారావు|right|thumb|250px right|thumb|250px|రామారావు ప్రచార ర్యాలీ. ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించాడు. చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది. ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. ముఖ్యమంత్రులను తరచూ మార్చడం.., అదీ ఢిల్లీ పెద్దల నిర్ణయం ప్రకారమే తప్ప, శాసనసభ్యుల మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తన ప్రసంగాలను మలచుకున్నాడు. కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ తీవ్రపదజాలంతో విమర్శించాడు. కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు. కాంగ్రెసు నిర్వాకానికి అప్పటికే విసుగు చెందిన, ప్రజలు అతను నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. 1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. అతను విజయానికి అప్పటి దినపత్రికలు - ఎంతో తోడ్పడ్డాయి. రాజకీయ ఉత్థాన పతనాలు 1970లలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదొడుకులు తప్పించి, ఎన్టీఆర్ సినిమా జీవితం విజయవంతంగా, అప్రతిహతంగా సాగిపోయింది. అయితే అతను రాజకీయ జీవితం అలా -నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకూ, అవమానకరమైన అపజయాలకూ మధ్య తూగుటూయలలా సాగింది. ఎన్నికల ప్రచారసమయంలో ఎన్టీఆర్ కాంగ్రెసు నాయకులపై చేసిన ఆరోపణuల కారణంగానూ, ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెసు పొందిన దారుణ పరాభవం వల్లనూ, ఆ రెండు పార్టీల మధ్య వైరి భావం పెరిగింది. రాజకీయపార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన కాక శతృత్వ భావన నెలకొంది.ఇది తెలుగుదేశం పాలిత ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెసు పాలిత కేంద్రానికీ మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది. కేంద్రం మిథ్య అనేంతవరకు ఎన్టీఆర్ వెళ్ళాడు. 1983 శాసనసభ ఎన్నికల్లో అతను సాధించిన అపూర్వ విజయం అతను రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తరువాత, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వీటిలో ప్రధానమైనది. ఈ నిర్ణయాల కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు. 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు అతనుకు ఎంతో సహాయం చేసాయి. ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం కేంద్రప్రభుత్వానికి తప్పింది కాదు. నెలరోజుల్లోనే, అతను ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భమిది. ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అతను ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. 1984లో సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలుపరిచాడు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని రద్దు చేసాడు (1985 జూన్ 1 న అధికారికంగా మండలి రద్దయింది). హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై (ట్యాంకుబండ్ నందు) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో మార్చి 1985లో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు. 1985-89 మధ్య కాలంలో తన ఏకస్వామ్యపాలన వలన ఎన్టీఆర్ ఎంతో అప్రదిష్ట పాలయ్యాడు. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే అయి నడిపించాడు. ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణమైంది. 1989లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు. ఈ కాలంలో జరిగిన కొన్ని కులఘర్షణలు కూడా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసాయి. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెసు తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారానికి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రేసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు. 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు. 1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు. శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు. ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నాడు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. అతను వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులతో అతను సంబంధాలపై ఈ పెళ్ళి కారణంగా నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి. 1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే అతను రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకొన్నారు అనే ప్రచారంతో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు.తెలుగు దేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో అతను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యాడు . అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత, 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు. ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. అతను మరణించినపుడు ఈనాడు పత్రికలో శ్రీధర్ వేసిన ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానానికి అద్దం పడుతుంది. మహానాడు మహానాడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రతీ సంవత్సరం మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. 2022లో తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు హైదరాబాదులో మార్చి 29న, మహానాడును విజయవాడలో మే 28న జరగనున్నాయి. ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఈ ఏడాదిపాటు వేడుకగా జరగనున్నాయి. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం right|thumb|భారత ప్రభుత్వం వారిచే విడుదల చేయబడిన స్టాంపు ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్మారక నాణెం విడుదల సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన స్వర్గీయనందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్మ్ గారు, ఎన్. టి. ఆర్ 100 రూపాయల స్మారక నాణెం 28.ఆగస్ట్ 2023 న విడుదల చేశారు. ఎన్టీఆర్ విశిష్టత సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్‌. ఆంధ్ర ప్రదేశ్ లో, అతను సమకాలికుల్లో అతనుంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు. వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్‌దే. పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి అతను. ఈ కారణాలవల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు. తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం అతనుకు దక్కింది. రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత అతను. ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు అతను. దేవేందర్ గౌడ్, కె.చంద్రశేఖరరావు మొదలైన నేతలు అతను పరిచయం చేసినవారే. “నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ సమర్థించటం ఒక విశేషం. మదరాసులో అతను వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు మొక్కుబడిగా మదరాసు వెళ్ళి అతనును దర్శించుకుని వచ్చేవారు. కొన్ని సాహసోపేత నిర్ణయాలు: మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం రామారావుగారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉంది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది. ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్టు, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు. రామారావూ గారి నాయకత్వన జరిగిన కార్యక్రమాల జాబిత: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో,ఎన్టీఆర్‌ మిగతా కులముల వారికి ఆశాకిరణం లాగ కనిపించారు ఎన్టీఆర్‌ మొట్ట మొదటి సారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు అయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. తెలంగాణాలో బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారినారు. thumb|ఒక ప్రధాన కూడలి వద్ద నందమూరి తారకరామారావు విగ్రహం విమర్శలు ఏకస్వామ్య పరిపాలన వ్యక్తుల గురించి, రాజకీయ పార్టీల గురించి అతను వాడిన భాష రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఇతర పార్టీలు దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంతో రాజకీయనేతలు వాడే భాషా స్థాయి మరింత పడిపోయింది. ఏ ఇతర నేతకూ లభించని ప్రజాదరణ పొందినా కేవలం స్వీయ తప్పిదాల కారణంగా దాన్ని నిలుపుకోలేకపోయారు. అతను పాలనా కాలంలో కులపరమైన ఘర్షణలు జరిగాయి. అతనుకు ప్రత్యక్ష సంబంధం లేకున్నా, అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించక తప్పలేదు. సినిమాలు నటుడిగా దర్శకునిగా సీతారామ కళ్యాణం (1961 సినిమా) (1961) గులేబకావళి కథ (1962) శ్రీకృష్ణ పాండవీయం (1966) వరకట్నం (1969) తల్లా పెళ్ళామా (1970) తాతమ్మకల (1974) దానవీరశూరకర్ణ (1977) చాణక్య చంద్రగుప్త (1977) అక్బర్ సలీమ్ అనార్కలి (1978) శ్రీరామ పట్టాభిషేకం (1978) శ్రీమద్విరాటపర్వం (1979) శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం (1979) చండశాసనుడు (1983) శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984) బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991) సామ్రాట్ అశోక్ (1992) నిర్మాతగా సామ్రాట్ అశోక్ (1992) శ్రీనాథ కవిసార్వభౌమ (1993) దానవీరశూరకర్ణ (1977) శ్రీమద్విరాటపర్వం (1979) శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం (1979) చండశాసనుడు (1983) శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984) బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991) రచయితగా ప్రచురణలు పుస్తకాలు + పుస్తకం ముఖ చిత్రంవివరాలు పేరు :NTR, a biography భాష : ఇంగ్లీష్ రచయిత :ఎస్.వెంకట్ నారాయణ్ పబ్లిషర్ :వికాస్,న్యూ ఢిల్లీ సంవత్సరం : 1983 ISBN 0706924045ISBN 978-0706924046 ఓ.సి.ఎల్.సి సంఖ్య (OCLC):10432404 లభ్యం : లింక్ పేరు : ఎన్.టి.ఆర్-ది మాన్ అఫ్ ది మాస్సేస్ భాష : ఇంగ్లీష్ రచయిత :ఎం.డి. నారాయణ నాయుడు పబ్లిషర్ :శోభ లత పబ్లిషెర్స్ సంవత్సరం : 1995 డిస్ట్రిబ్యూటర్స్ : బుక్ లింక్స్ కార్పోరేషన్ ఓ.సి.ఎల్.సి సంఖ్య (OCLC):35151720 లభ్యం :లింక్ పేరు : ఒకేఒక్కడు భాష : తెలుగు రచయిత: ఇ.వెంకట రావు సాంస్కృతిక ప్రపంచంలో స్మరణలు నందమూరి తారకరామారావు జీవితచరిత్ర ఆధారంగా ఎన్.టి.ఆర్. కథానాయకుడు, ఎన్.టి.ఆర్. మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్‌టిఆర్ సినిమాలు 2019 లో విడుదలయ్యాయి. వంశవృక్షం మూలాలు వనరులు ఇవికూడా చూడండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బాలకృష్ణ లక్ష్మీ పార్వతి బయటి లింకులు నందమూరి అభిమానుల వెబ్ సైటు (ఆంగ్లం) ఎన్.టి.ఆర్ గురించి : N.T. Rama Rao (1923 - 1995): ది హిందూ(ఇంగ్లీష్ పత్రిక)కథనం శిరాకదంబం వెబ్ సైటు లో నందమూరి గురించిన వ్యాసం తెలుగు దేశం పార్టీ వెబ్ సైటు వర్గం:తెలుగు సినిమా నటులు వర్గం:తెలుగు రంగస్థల నటులు వర్గం:1923 జననాలు వర్గం:1996 మరణాలు వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గం:కృష్ణా జిల్లా రంగస్థల నటులు వర్గం:రాజకీయాలలో సినీనటులు వర్గం:తెలుగుదేశం పార్టీ వర్గం:తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వర్గం:తెలుగు సినిమా దర్శకులు వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు వర్గం:తెలుగు కళాకారులు వర్గం:కృష్ణా జిల్లా సినిమా నటులు వర్గం:కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు వర్గం:కృష్ణా జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు వర్గం:అనంతపురం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు వర్గం:కృష్ణా జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు వర్గం:కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్యమంత్రులు వర్గం:కృష్ణా జిల్లా సినిమా దర్శకులు వర్గం:కృష్ణా జిల్లా సినిమా నిర్మాతలు వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:తమ పేరిట స్మారక పోస్టల్ స్టాంపు విడుదలైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి
https://te.wikipedia.org/wiki/వై.ఎస్.రాజశేఖర్_రెడ్డి
దారిమార్పు వై.యస్. రాజశేఖరరెడ్డి
గురజాడ అప్పారావు
https://te.wikipedia.org/wiki/గురజాడ_అప్పారావు
గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు *కవి శేఖర* అనే బిరుదు ఉంది. బాల్యం-విద్యాభ్యాసం గురజాడ అప్పారావు విశాఖ జిల్లా, యస్.రాయవరం లో, మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21 న, వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. అతనికి శ్యామలరావు అనే తమ్ముడు ఉన్నాడు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా, గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవెన్యూ సూపర్వైజరు గాను, ఖిలేదారు గానూ పనిచేసాడు. తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నాడు. తర్వాత, వారి తండ్రి కాలం చెయ్యటంతో, విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించాడు. ఈ సమయంలో అప్పటి ఎమ్. ఆర్. కళాశాల ప్రధానాధ్యాపకులు సి. చంద్రశేఖర శాస్త్రి ఇతన్ని చేరదీసి ఉండడానికి చోటిచ్చాడు. 1882లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884లో ఎఫ్.ఎ చేసాడు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయునిగా చేరాడు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి అతనుకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను యస్.రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం-సంతానం alt=గురజాడ చిత్రపటం|కుడి|303x303px 1885లో అప్పారావు అప్పల నరసమ్మగారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు. 1887లో మొదటి కుమార్తె ఓలేటి లక్ష్మి నరసమ్మ జన్మించింది. 1890లో కుమారుడు వెంకట రామదాసు, 1902లో రెండవ కుమార్తె పులిగెడ్డ కొండయ్యమ్మ జన్మించింది. ఉద్యోగాలు అప్పటి కళింగ రాజ్యంగా పేరుపొందిన విజయనగరంలోనే అప్పారావు నివసించాడు. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో అతనుకు మంచి సంబంధాలు ఉండేవి. 1887లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతను మొదట ప్రసంగించాడు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరాడు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇదే సమయంలో తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసాడు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర, ఇండియన్ లీషర్ అవర్ (Indian leisure hour) లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నాడు. అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రోయిట్ ప్రచురణకర్త శంభుచంద్ర ముఖర్జీ విని, అప్పారావును తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించాడు. ఆంగ్లంలో యెంత గొప్పగా వ్రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరని అతడన్నాడు. ఇండియన్ లీషర్ అవర్ ఎడిటరు గుండుకుర్తి వెంకట రమణయ్య కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించాడు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియామకం పొందాడు. 1897లో మహారాజా ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గార్లకు వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు నియమితుడయ్యారు. 1884లో మహారాజా కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1886లో డిప్యూటీ కలెక్టరు కార్యాలయంలో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887లో కళాశాలలో అధ్యాపక పదవినీ నిర్వహించాడు. 1886లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యత్వం లభించింది. కన్యాశుల్కం గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు. (కచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909లో రచించాడు. 1892లో గురజాడ వారి కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో, అప్పారావు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి ముఖ్యుడు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడంతో అప్పారావుకు ఎంతో పేరు వచ్చింది. 1896లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టాడు. 1897లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు ప్రచురించారు. అప్పారావు దీన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చాడు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం తిరగ రాసాడు. 1910లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. 1911లో మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డు అఫ్ స్టడీస్లో నియమించబడ్డారు. అదే సంవత్సరంలో, స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించాడు. అస్తమయం 1913లో అప్పారావు పదవీ విరమణ చేసాడు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడ్డారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు "ఫెలో" తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబరు 30 న గురజాడ అప్పారావు మరణించారు. వ్యవహారిక భాషోద్యమంలో 20వ శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి పోరాటం సలిపారు. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు.గిడుగు వాదనాబలానికి, గురజాడ రచనాశక్తి వ్యావహారిక భాషోద్యమానికి వినియోగపడ్డాయి.. సాహితీ చరిత్ర కన్యాశుల్కం 250px|right|thumb|గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కము (నాటకం) గురజాడ రచనల్లో కన్యాశుల్కము (నాటకం) అగ్రగణ్యమైంది. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన అత్యుత్తమమైన రచనలలో ఒకటి. 1892లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది. గురజాడ మరణం తరువాత కన్యాశుల్కం పై ఎన్నో వివాదాలు రేగాయి. అది అసలు అతను రాయనేలేదనీ, వేరెవరో రాస్తే, తన పేరు వేసుకున్నారని ఒకటి; అతను ఇంగ్లీషులో రాస్తే, వేరే ఒకాయన దానిని తెలుగు లోకి అనువదించారని మరొకటి, ఇలాగ కొన్ని వివాదాలు రేగాయి. చివరికి ఆ వాదనలన్నీ అసత్యాలని తేలిపోయాయి. ఈ వివాదాలన్నీ గురజాడ మరణం తరువాత వచ్చినవే. ఇన్ని వివాదాల మధ్యా కన్యాశుల్కం కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకమదే! పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిద్ధ గేయం అతను రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కము దురాచారమే. కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది: కన్నుల కాంతులు కలువల చేరెను మేలిమి జేరెను మేని పసల్‌ హంసల జేరెను నడకల బెడగులు దుర్గను జేరెను పూర్ణమ్మ పుత్తడి బొమ్మా పూర్ణమ్మా దేశమును ప్రేమించుమన్నా అతను రాసిన ప్రముఖ గేయం లోని ఒక భాగం ఇది: పూర్తి గేయాన్ని కూడా చదవండి. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్ గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ పాడి పంటలు పొంగిపొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండకలదోయ్ కండకలవాడేను మనిషోయ్ ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్‌ జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరకులు నింపవోయ్‌ అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్ దేశి సరుకుల నమ్మవలెనోయి; డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయి వెనక చూసిన కార్యమేమోయి మంచి గతమున కొంచెమేనోయి మందగించక ముందు అడుగేయి వెనుకపడితే వెనకే నోయి పూను స్పర్థను విద్యలందే వైరములు వాణిజ్యమందే; వ్యర్థ కలహం పెంచబోకోయ్ కత్తి వైరం కాల్చవోయ్ దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌ పూని ఏదైనాను ఒక మేల్‌ కూర్చి జనులకు చూపవోయ్‌ ఓర్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చే సెనోయ్; ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్ పరుల కలిమికి పొర్లి యేడ్చే పాపి కెక్కడ సుఖం కద్దోయ్; ఒకరి మేల్ తన మేలనెంచే నేర్పరికి మేల్ కొల్లలోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడుపడవోయ్‌ దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ చెట్టపట్టాల్‌ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్‌ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్‌ మతం వేరైతేను యేమోయ్ మనసు లొకటై మనుషులుంటే; జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్ దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్; నరుల చమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్ ఆకులందున అణగిమణగీ కవిత కోవిల పలకవలెనోయ్; పలుకులను విని దేశమందభి మానములు మొలకెత్తవలెనోయ్ ఇతర రచనలు సారంగధర (ఇంగ్లీషు పద్య కావ్యం-ఇండియన్ లీజర్ అవర్ (విజయనగరం) లోనూ రీస్ అండ్ రయ్యత్ (బెంగాల్) పత్రిక లోనూ ప్రచురించబడింది) పూర్ణమ్మకొండుభట్టీయంనీలగిరి పాటలుముత్యాల సరాలుకన్యకసత్యవ్రతి శతకంబిల్హణీయం (అసంపూర్ణం)సుభద్రలంగరెత్తుముదించులంగరు లవణరాజు కలకాసులుసౌదామిని (రాయాలనుకున్న నవలకు తొలిరూపం) కథానికలు మీపేరేమిటి (దేవుడు చేసిన మనుషులు చలనచిత్రం పేరు దీని నుండి గ్రహించిందే)దిద్దుబాటుమెటిల్డాసంస్కర్త హృదయంమతము విమతముపుష్పాలవికలు ప్రభావం సానుకూలాంశాలు వివాదాలు, వ్యతిరేకత గురజాడను వ్యతిరేకించినవారు ప్రధానంగా అతను భావాల విషయంలో కొందరు, సాహిత్యపరంగా అతను వాడుక భాష విషయకంగా మరికొందరు వ్యతిరేకించారు. అతను సంస్కరణలను సమర్థిస్తూ, సాంఘికాంశాల విషయంలో అతని అభిప్రాయాలను వ్యతిరేకించినవారు భావాల విషయంలో వ్యతిరేకులు కాగా, గ్రాంథిక భాష సమర్థకులు అతన్ని వాడుక భాష విషయంలో వ్యతిరేకించారు. 1955 మార్చి 13 న (అప్పారావు మరణించిన దాదాపు 40 ఏళ్ళ తరువాత) జయంతి కుమారస్వామి ఆంధ్ర పత్రికలో రాసిన ఒక వ్యాసంతో ఒక పెద్ద వివాదం చెలరేగింది.పూర్తి వివరాలను కన్యాశుల్కం (నాటకం) పేజీలో చూడండి.ఇతర లింకులు చిలుమె గురజాడ రచనలు తెలుగుపరిశోధన వెబ్ సైట్ లో ఎవరెవరు ఏమన్నారు "కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు" - శ్రీశ్రీ "కన్యాశుల్కము బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం"-శ్రీ శ్రీ "కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ" - శ్రీశ్రీ "గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే అతను జీవించడం ప్రారంభించాడు" - దేవులపల్లి కృష్ణశాస్త్రి చిత్రమాలిక మూలాలు ఇతర లింకుల వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:తెలుగు కవులు వర్గం:1862 జననాలు వర్గం:1915 మరణాలు వర్గం:తెలుగు నాటక రచయితలు వర్గం:విజయనగరం జిల్లా సంఘ సంస్కర్తలు వర్గం:విజయనగరం జిల్లా నాటక రచయితలు వర్గం:తెలుగువారిలో ఇంగ్లీషు రచయితలు వర్గం:విజయనగరం జిల్లా హేతువాదులు వర్గం:ఈ వారం వ్యాసాలు
రంగనాయకమ్మ
https://te.wikipedia.org/wiki/రంగనాయకమ్మ
right|thumb|రంగనాయకమ్మ రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.ఆమె వ్రాసిన నవల స్వీట్ హోం. జీవితం రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామంలో 1939లో జన్మించారు. ఈమె తాడేపల్లిగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి 1955లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలైంది. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతంలోని కళాశాలకు పంపించి చదివించలేని కారణంగా ఈమె విద్యాభ్యాసం అంతటితో ఆగిపోయింది. రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకంగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970లో ఆ వివాహం నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడూ, అభిమానీ, పాఠకుడూ బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి ఉంటున్నారు. ఇంటి పేరు తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరువాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం. రచయిత్రిగా విమర్శకురాలిగా ఈమె అనేక విషయాల పై అనేక విమర్శలు చేస్తుంటారు. గాంధీ లాంటి పేరొందిన వ్యక్తుల్ని కూడా విమర్శించారు. వరవరరావు చేతకాని వాళ్ళని కొజ్జా వాళ్ళతో పోలుస్తూ ఒక కవిత వ్రాసినప్పుడు స్త్రీలనీ, కొజ్జావాళ్ళనీ కించపరిచే భాష వాడడం ఎందుకు తప్పో వివరిస్తూ రంగనాయకమ్మ వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసం చదివి వరవరరావు వెంటనే తన తప్పుని అంగీకరించాడు. అసమానత్వం నుంచి అసమానత్వం లోకే ఈమె వ్రాసిన విమర్శనాత్మక రచనలలో ఒకటి. వివాదాలు ఈమె వ్రాసిన నవల 'జానకి విముక్తి' ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగి పోయింది. తరువాత ఆ నవల పుస్తక రూపంలో విడుదల అయ్యింది. నీడతో యుద్ధం పుస్తకంలో గోరా, జయగోపాల్, సి.వి., ఎమ్.వి. రామ మూర్తి వంటి నాస్తిక రచయితల్ని విమర్శిస్తూ ఈమె వ్యాసాలు వ్రాయడం వల్ల విశాఖపట్నం నాస్తికులు ఈ సీరియల్ ని నిలిపి వెయ్యాలని కోరుతూ పత్రిక ఎడిటర్లకి ఉత్తరాలు వ్రాసారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనం కలిగించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల 'తులసిదళం' ని విమర్శిస్తూ 'తులసిదళం కాదు గంజాయి దమ్ము' అనే వ్యాస సంకలనం వ్రాసింది. వాటిలో యండమూరితో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావును కూడా విమర్శించడం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచాడు. "జన సాహితి" సంస్థలో రంగనాయకమ్మ మరిన్ని వివరాలకోసం జన సాహితితో మా విభేదాలు పుస్తకం గురించిన వ్యాసం చూడండి. నవలలు జానకి విముక్తి రచయత్రి బలిపీఠం కృష్ణవేణి పేకమేడలు కూలినగోడలు స్త్రీ ఇదే నా న్యాయం చదువుకున్న కమల కల ఎందుకు స్వీట్ హోం అంధకారంలొ ఇతర రచనలు రామాయణ విషవృక్షం ఇదండి మహాభారతం!-రచనకాలం 2014 అసమానత్వం నుంచి అసమానత్వం లోకే నీడతో యుద్ధం నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా? జన సాహితితో మా విభేదాలు కాపిటల్ -2 (పుస్తకం) మూలాలు బయటి లంకెలు http://www.avkf.org/BookLink/book_link_index.php వారి సౌజన్యంతో రంగనాయకమ్మ వెబ్ సైటు తెలుగుపీపుల్.కాంలో రంగనాయకమ్మ పరిచయం Complete works of Ranganayakamma on Kinige వర్గం:1939 జననాలు వర్గం:స్త్రీవాద రచయితలు వర్గం:మార్క్సిస్టులు వర్గం:తెలుగు రచయిత్రులు వర్గం:తెలుగు నవలా రచయితలు వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా రచయిత్రులు
ఆత్రేయ
https://te.wikipedia.org/wiki/ఆత్రేయ
ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 - సెప్టెంబర్ 13, 1989) తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి.మనసులు దోచిన కవి ఆత్రేయ Written by Nagesh | Updated: September 13, 2013 అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు. జీవిత సంగ్రహం 1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే 'కప్పలు' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ', 'భయం' నాటకాలు కూడా వ్రాసారు. ఆత్రేయ పలు చలన చిత్రాలకు సంభాషణలు, పాటలు రాశారు. వీరి పాటలలో ఎక్కువగా మనసుకు సంబంధించిన ప్రస్తావన ఉండటం వలన అతను మనసు కవి, మన సుకవి అయ్యాడు. దీక్ష (1950) చిత్రానికి తొలిసారి గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథా రచన చేసారు. వాగ్ధానం (1961) చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా చేసాడు. చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ ఘనాపాటి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి 1989,సెప్టెంబర్ 13 న స్వర్గస్తులయ్యారు. జీవిత తత్వాన్ని గుట్టువిప్పే సంభాషణలు ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు. గొప్ప వేదాంతి ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది. ఆత్రేయ పాటలు గురించి 'దీక్ష' (1950) చిత్రానికి తొలిసారి అతను పాటలు రాశారు. "పోరా బాబు పో.." అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన 'సంసారం' చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. 'అర్థాంగి' చిత్రంలో 'రాక రాక వచ్చావు చందమామా..', 'తోడి కోడళ్ళు' చిత్రంలో 'కారులో షికారుకెళ్లి...', 'శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం'లో 'శీశైలవాసా శ్రీ వెంకటేషా...', 'మంచి మనసులు'ల్లో 'శిలలపై శిల్పాలు చెక్కినారు...', 'మూగ మనసులు' చిత్రంలో 'ముద్దబంతి పువ్వులో...' 'డాక్టర్‌ చక్రవర్తి'లో 'నీవులేక వీణ ...', 'అంతస్తులు'లో 'తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము...', 'ప్రేమ్‌నగర్‌'లో 'నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది...', 'మరోచరిత్ర'లో 'ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో...', 'ఇంద్రధనస్సు'లో 'నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి...', 'అంతులేని కథ'లో 'కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు...', 'మరోచరిత్ర'లో 'విధి చేయు వింతలన్నీ...', 'ఇది కథ కాదు'లో 'సరిగమలు గలగలలు...', 'స్వాతిముత్యం'లో 'చిన్నారి పొన్నారి కిట్టయ్య...' తోపాటు 'తేనే మనసులు', 'ప్రైవేట్‌ మాస్టర్‌', 'బ్రహ్మాచారి', 'మట్టిలో మాణిక్యం', 'బడి పంతులు', 'పాపం పసివాడు', 'భక్త తుకారం', 'బాబు', 'జ్యోతి', 'అందమైన అనుబంధం', 'గుప్పెడు మనసు', 'ఆకలి రాజ్యం', 'అభిలాష', 'కోకిలమ్మ', 'అభినందన', 'ప్రేమ' వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని అతను సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు.మనసు కవి 'ఆత్రేయ'... ఆత్రేయ గురించి రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని అతనుపై ఓ ఛలోక్తి. కానీ అతను ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్థానో ఎందరికి తెలుసు అనేవారు. తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత అతనును బూత్రేయ అనీ అన్నారు. ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు "చోళ" అందుకే "పల్లవి" తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే చోళులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు. తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. ఉదాహరణకి, తేనె మనసులు సినిమాలో ఈ రెండు పాటలు "ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు," "నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు." అలాగే ప్రేమనగర్ సినిమాలో "నేను పుట్టాను ఈలోకం మెచ్చింది,, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది." పాట,, "తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా" పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా అనంతమే అవుతుంది. మరోచరిత్ర సినిమాకి రాసిన పాటలు ఏ తీగ పువ్వునో...ఏ కొమ్మ తేటినో...పదహారేల్లకు...నీలో నాలోబలే బలే మగాడివోయ్ ...నీ అన నీ దానినోయ్...అనే పాటలు ఇప్పటికి శ్రోతలని అలరిస్తూనే ఉన్నాయి. కృష్ణ, శారదలు నటించిన "ఇంద్రధనుస్సు" సినిమాలోని పాట "నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి" అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. అతనుే ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు. ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే అతను రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీగా లబ్ధప్రతిష్ఠుడైన శ్రీరంగం శ్రీనివాసరావు. వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే ...... సినిమాలో "కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన" పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ. ఆత్రేయ పాటల రచయిత మాత్రమే కాకుండా, అనేక సినిమాలకు మాటల రచయితగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రేమనగర్ సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు. అందులో, మచ్చుకు ప్రేమ్ నగర్ సినిమాకు రాసిన మాటలు కొన్ని : డోంట్ సే డ్యూటీ. సే బ్యూటీ. బ్యూటీని చెడగొట్టేదే డ్యూటీ. నిలకడ కోసం, ఏ మాత్రం నిలకడ లేని వా దగ్గర కొచ్చారా ? (ఇంటర్వ్యూ సన్నివేసం) ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్థలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు. చిత్ర సమాహారం సినీ రచయిత ముద్దుల మొగుడు (1983) (రచయిత) ఎస్.పి.భయంకర్ (1983) (సంభాషణలు) గుప్పెడు మనసు (1979) (సంభాషణలు) జీవన తరంగాలు (1973) స్క్రీన్ ప్లే, సంభాషణలు) కన్నెమనసులు (1966) (స్క్రీన్ అనుసరణ) డాక్టర్ చక్రవర్తి (1964) (సంభాషణలు, స్క్రీన్ అనుసరణ) మురళీకృష్ణ (1964) (సంభాషణలు) వెలుగు నీడలు (1964) (రచయిత) మూగ మనసులు (1963) (రచయిత) ఆరాధన (1962) (సంభాషణలు) వాగ్దానం (1961) స్క్రీన్ ప్లే, సంభాషణలు) పెళ్ళి కానుక (1960) (సంభాషణలు) శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (1960) (అనుసరణ) (సంభాషణలు) జయభేరి (1959) (కథ and సంభాషణలు) మాంగల్య బలం (1958) (సంభాషణలు) తోడి కోడళ్ళు (1957) (అనుసరణ) (సంభాషణలు) అర్ధాంగి (1955) (రచయిత) గుమస్తా (1953/II) (సంభాషణలు) (కథ) కన్నతల్లి (1953) (రచయిత) నిర్మాత:దర్శకుడు వాగ్దానం (1961) ఆత్రేయ రచనలు, అయన పాటలతో కూడిన పుస్తకాలు మనసు గతి ఇంతే (2007) + పుస్తకం పేరు రచయిత పేరుప్రచురణ, ఇతర వివరాలు centre|100px cellఆత్రేయ పాటలని 2007 వ సంవత్సరంలో ఒక పుస్తక రూపంలో ఎవికేఎఫ్.ఆర్గ్ వెబ్సైట్ నుండి సేకరణ. మనసు గతి ఇంతే...ఆత్రేయజూన్ 11,2008న సేకరించబడినది. విడుదల చేసారు.ఎవికేఎఫ్.ఆర్గ్ వెబ్సైట్ నుండి ఆన్ లైన్ ద్వారా కొనవచ్చు.లింకు పురస్కారాలు తెలుగు సాహిత్యరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసారు Athreya తీసికున్న తేదీ:09-08-2008 మూలాలు ఇతర లింకులు ఆత్రేయ వ్రాసిన ఎవరు దొంగ నాటకం మన "సు" కవి - ఆచార్య ఆత్రేయ వర్గం:1921 జననాలు వర్గం:1989 మరణాలు వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు వర్గం:తెలుగు నాటక రచయితలు వర్గం:తెలుగు కళాకారులు వర్గం:నెల్లూరు జిల్లా సినిమా పాటల రచయితలు వర్గం:కలం పేరుతో ప్రసిద్ధులైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గం:నెల్లూరు జిల్లా నాటక రచయితలు వర్గం:నెల్లూరు జిల్లా సినిమా నిర్మాతలు వర్గం:నెల్లూరు జిల్లా సినిమా దర్శకులు వర్గం:నెల్లూరు జిల్లా సినిమా నటులు వర్గం:ఈ వారం వ్యాసాలు
కోవూరు
https://te.wikipedia.org/wiki/కోవూరు
కోవూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన నెల్లూరు నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పట్టణం 8585 ఇళ్లతో, 32082 జనాభాతో 628 హెక్టార్లలో విస్తరించి ఉంది. పట్టణంలో మగవారి సంఖ్య 15640, ఆడవారి సంఖ్య 16442. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 5111 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4750. పట్టణం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 592113.నెల్లూరు నగరానికి 5 కి.మీ ల దూరంలో, పెన్నా నది తీరాన ఉంది. కోవూరు సహకార పంచదార కర్మాగారం, నెల్లూరు థర్మల్ స్టేషను ఈ పట్టణ పరిధిలో ఉన్నాయి. మూడు న్యాయస్థానాలు, మూడు సినిమాహాల్లు కలిగి ఉంది. ఈ పట్టణం నెల్లూరు పట్టణాభివృద్ది సంస్థలో ఒక భాగం. గణాంకాలు 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం, జనాభా 28782, అందులో పురుషుల సంఖ్య 14244, స్త్రీల సంఖ్య 14538, నివాసగృహాలు 7074, విస్తీర్ణం 628 హెక్టారులు సమీప గ్రామాలు పోతిరెడ్డి పాలెం 3 కి.మీ, నార్త్ రాజుపాలెం 3 కి.మీ, పడుగుపాడు 4 కి.మీ, ఇనమడుగు 4 కి.మీ, వేగూరు 5 కి.మీ, గంగవరం 5 కి.మీ విద్యా సౌకర్యాలు గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 23, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఏడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ నెల్లూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నెల్లూరులో ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం కోవూరులో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం పట్టణంలో 10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఏడుగురు ఉన్నారు. 13 మందుల దుకాణాలు ఉన్నాయి. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు కోవూరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం కోవూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది: నికరంగా విత్తిన భూమి: 628 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 628 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు కోవూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 483 హెక్టార్లు బావులు/బోరు బావులు: 75 హెక్టార్లు చెరువులు: 68 హెక్టార్లు ఉత్పత్తి కోవూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి, చెరకు చేతివృత్తులవారి ఉత్పత్తులు వస్త్రాలంకరణ రాజకీయాలు కోట గ్రామానికి చెందిన నల్లపరెడ్ది వంశస్థులు రాజకీయంగా ఎదురులేని మహారాజులుగా ఈ శాసనసభా నియోజకవర్గానికి నిరాటంకంగా 18 సంవత్సరాల పాటు ఎన్నికైనారు. కోవురు శాసనసభ నియోజకవర్గం దేవాలయాలు శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో అత్యంత వైభవంగా నిర్వహించెదరు. శ్రీ కామాక్షీ సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా, 2014, జూన్-9, సోమవారం ఉదయం ఆలయప్రాంగణంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించి, ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళాభక్తులకు కొడిముద్దలను అందజేసినారు. ప్రముఖ వ్యక్తులు జెట్టి శేషారెడ్డి - నెల్లూరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో ప్రజావైద్యునిగా ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించిన వ్యక్తి. పడాల బాలకోటయ్య మూలాలు
చక్రవర్తి రాజగోపాలాచారి
https://te.wikipedia.org/wiki/చక్రవర్తి_రాజగోపాలాచారి
రాజాజీగా పేరొందిన చక్రవర్తి రాజగోపాలాచారి (డిసెంబరు 10, 1878 - డిసెంబరు 25, 1972) (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి గవర్నర్ జనరల్. అతను సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీ తమిళనాడు రాష్ట్రములోని సేలం జిల్లా, తోరపల్లి గ్రామంలో 1878, డిసెంబరు 10న జన్మించాడు. బాల్యం రాజాజీ 1878 డిసెంబరు 10న సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబీకులైన చక్రవర్తి అయ్యంగార్, సింగారమ్మ దంపతులకు జన్మించాడు. అతను స్వస్థలం తమిళనాడు, సేలం జిల్లాలోని దొరపల్లి అగ్రహారం అనే గ్రామం. ఇది పారిశ్రామిక పట్టణమైన హోసూరుకు దగ్గర్లో ఉంటుంది. అతను తండ్రి చక్రవర్తి అయ్యంగార్ తోరపల్లి గ్రామానికి మునసబు. అతను పాఠశాల విద్య హోసూరు లోనూ, కళాశాల విద్య చెన్నై, బెంగళూరు లోనూ జరిగింది. 1897లో బెంగళూరు లోని సెంట్రల్ కళాశాల నుంచి ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు. 1899 లో మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాడు. 1900లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు.సేలంలో ఉండగానే అతను సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఆసక్తి చూపేవాడు. భారత స్వాతంత్ర్యోదమం రాజకీయాల్లో రాజాజీ ప్రస్థానం సేలం పట్టణానికి ప్రతినిధిగా ఎన్నికవడంతో ప్రారంభమైంది. 1900 మొదటి దశాబ్దంలో జాతీయవాది బాలగంగాధర తిలక్ పట్ల ఆకర్షితుడయ్యాడు. 1917లో సేలం పట్టణ మునిసిపాలిటీకి ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. సేలం ప్రభుత్వంలో మొట్టమొదటి దళిత ప్రతినిధి కూడా అతను చొరవతోనే ఎన్నికయ్యాడు. తరువాత అతను భారత జాతీయ కాంగ్రెస్లో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం ప్రారంభించాడు. 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్ర్య పోరాట యోధుడి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించాడు. 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడు. జాతీయవాది వీఓ చిదంబరం పిళ్ళై ఇతనుకు మంచి స్నేహితుడు. అనీబిసెంట్ కూడా రాజాజీని అభిమానించేది. 1919లో మహాత్మా గాంధీ స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ కూడా అతను్ను అనుసరించాడు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశాడు. 1921 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా కూడా వ్యవహరించాడు. 1923లో కాంగ్రెస్ విడిపోయినపుడు రాజాజీ సివిల్ డిసొబీడియెన్స్ కమిటీలో సభ్యుడు. గాంధీజీ అంటరానితనాన్ని రూపుమాపడానికి చేపట్టిన వైకోం సత్యాగ్రహంలో అతనుకు కుడిభుజంగా ఉన్నాడు. ఆ సమయంలో పెరియార్ ఈవీ రామస్వామి రాజాజీ నాయకత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. వీరిద్దరూ తరువాతి కాలంలో రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందినా మంచి స్నేహితులుగా ఉన్నారు. 1930లో తమిళనాడు కాంగ్రెస్ లో రాజాజీ నాయకుడయ్యాడు. అదే సమయంలో మహాత్మా గాంధీ దండియాత్ర నిర్వహించినపుడు రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్ళాడు. తరువాత రాజాజీ తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1935 లో భారత ప్రభుత్వం అమల్లోకి వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెస్ ను సాధారణ ఎన్నికల్లో పాల్గొనేలా చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. జీవితచరిత్ర పుస్తకం రాజాజీ స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం కొద్ది దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహించిన రాజనీతివేత్త. ప్రాథమికంగా కాంగ్రెసువాది అయినా పరిస్థితుల ప్రాభల్యం వల్ల కొన్ని పార్టీలు మారి, స్వాతంత్ర్యానంతరం నెహ్రూ సోషలిస్టు విధానల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాక, దేశానికి ఆఖరి గవర్నర్ జనరల్‌గా చరిత్రకెక్కారు. అతను జీవిత చరిత్ర వల్ల ఆయా పరిణామాలపై మంచి అవగాహన కలిగే అవకాశముంది. అయితే ఈ పుస్తకం ఆర్. నారాయణ మూర్తి 1944లో రాయగా ఆపైన దాదాపుగా రెండు దశాబ్దాల వరకూ దేశ చరిత్రలో చురుకుగా వ్యవహరించారు. దీనిని నెల్లూరు వర్ధమాన సమాజము ప్రచురించింది.భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి. మూలాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1878 జననాలు వర్గం:1972 మరణాలు వర్గం:భారతదేశ గవర్నర్ జనరల్లు వర్గం:తమిళనాడు ముఖ్యమంత్రులు వర్గం:పశ్చిమ బెంగాల్ గవర్నర్లు వర్గం:తమిళ రాజకీయ నాయకులు వర్గం:తమిళ రచయితలు వర్గం:గవర్నర్ జనరల్
చంద్రశేఖర వేంకట రామన్
https://te.wikipedia.org/wiki/చంద్రశేఖర_వేంకట_రామన్
సి.వి.రామన్‌FRS (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 1930 డిసెంబరులో రామన్‌కు నోబెల్‌ బహుమతి వచ్చింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించిందిG. Venkataraman, Journey into light: Life and Science of C. V. Raman, Indian Academy of Science, 1988. ISBN 818532400X.. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును (ఫిబ్రవరి 28) జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. బాల్యం, విద్యాభ్యాసం చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబరు 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. తాను ఎనిమిదిమంది సహోదరులలో రెండవవాడు. తన తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసాడు. 1882లో తన తండ్రి విశాఖపట్నంలో ఎ.వి.నరసింహారావు కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగంలో చేరినందున వారి కుటుంబం విశాఖపట్నంలో నివాసముంది. అతను విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్‌ఫిట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. ఉద్యోగం 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వంఅంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ ఉత్తీర్ణుడై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్‌తో వివాహమైంది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్‌కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి. అతని తల్లి పార్వతి అమ్మాళ్‌కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. అప్పుడు శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశాలతోరాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు నవ్వులాటగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డా, కాంప్టన్ ఫలితం ఎక్స్(X) కిరణాల విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు. అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధరచేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో 'భారతరత్న' అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ 'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. ఆయన నాజీవితంలో ఒక విఫల ప్రయోగం. ఎందుకంటే నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను. అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్ట్‌లు, సైన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం thumb|చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సి.వి.రామన్ విగ్రహం 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటారు. మూలాలు బయటి లింకులు రామన్ గారిపై వ్యాసం - బ్రిటానికా నుండి నోబెల్ బహుమతి విజేతలు నోబెల్ బహుమతి గ్రహించినప్పటి ఉపన్యాసం The Nobel Prize in Physics 1930 at the Nobel Foundation and his Nobel Lecture, 11 December 1930 Path creator – C.V. Raman Archive of all scientific papers of C.V. Raman Scientific Papers of C. V. Raman, Volume 1 Volume 2 Volume 3 Volume 4 Volume 5 Volume 6 Raman Effect: fingerprinting the universe by Raja Choudhury and produced by PSBT and Indian Public Diplomacy. వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు వర్గం:సర్ బిరుదాంకితులు వర్గం:భారతీయ శాస్త్రవేత్తలు వర్గం:1888 జననాలు వర్గం:1970 మరణాలు
భగవాన్ దాస్
https://te.wikipedia.org/wiki/భగవాన్_దాస్
భగవాన్ దాస్ (జనవరి 12, 1869 - సెప్టెంబర్ 18, 1958) భారతీయ తత్వవేత్త. కొంతకాలము ఈయన అవిభాజిత భారతదేశము యొక్క కేంద్ర శాసనసభలో పనిచేశాడు. ఈయన హిందుస్తానీ సాంస్కృతిక సమాజముతో అనుబంధితుడై ఘర్షణ ఒక ఆందోళనా పద్ధతిగా ఉపయోగించడాన్ని చురుకుగా వ్యతిరేకించాడు. స్వాతంత్ర్య సమరయోధునిగా బ్రిటిషు పాలనకు వ్యతిరేకముగా పోరాడుతూ సామ్రాజ్యవాద ప్రభుత్వము నుండి తరచూ ముప్పును ఎదుర్కొన్నాడు. వారణాసిలో జన్మించిన ఈయన పాఠశాల తరువాత కలెక్షన్ బ్యూరోలో డిప్యుటీగా పనిచేశాడు. ఆ తరువాత ఉన్నత చదువులకోసము ఉద్యోగాన్ని వదిలాడు. అన్నీ బీసెంట్తో కలిసి ఈయన కేంద్ర హిందూ కళాశాల స్థాపించాడు. ఇదియే ఆ తర్వాత కాలములో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము అయినది. దాస్ ఆ తరువాత జాతీయ విశ్వవిద్యాలయమైన కాశీ విద్యాపీఠమును స్థాపించి ప్రాధానోపాధ్యాయునిగా పనిచేశాడు. భగవాన్ దాస్ సంస్కృత పండితుడు. ఈయన సంస్కృతము, హిందీ బాషలలో దాదాపు 30 పుస్తకాలు రచించాడు. భగవాన్ దాస్ కు భారత ప్రభుత్వము 1955 లో భారత రత్న పురస్కారము ప్రధానము చేసింది. ఈయన వారణాసిలోని ఒక విభిన్నమైన సంపన్న షా కుటుంబానికి చెందినవాడు. తన కొడుకు శ్రీ ప్రకాశ న్యాయ విద్య అభ్యసించడానికి బ్రిటన్ వెళ్లాలని అనుకున్నప్పుడు సముద్రము దాటడము వలన కులాన్ని ఏమీ కోల్పోమని సమర్ధించడము వలన ఈయనను అగర్వాల్ సమాజము నుండి బహిష్కరించారు. వర్గం:1869 జననాలు వర్గం:1958 మరణాలు వర్గం:భారతీయ తత్వవేత్తలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ సభ్యులు
పురుషోత్తమ దాస్ టాండన్
https://te.wikipedia.org/wiki/పురుషోత్తమ_దాస్_టాండన్
పురుషోత్తమ దాస్ టాండన్ (पुरुशोत्तम दास टंडन) (ఆగష్టు 1, 1882 – జూలై 1, 1962), ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు. ఈయన హిందీకి భారతదేశ అధికార భాషా స్థాయిని సాధించేందుకు విశేషకృషి చేశాడు. ఈయనకు రాజర్షి అన్న బిరుదు ఉంది. తొలి జీవితం పురుషోత్తమ దాస్ టాండన్, అలహాబాదులోని ఒక ఖత్రీ కుటుంబములో జన్మించాడు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై, చరిత్రలో ఎం.ఏ డిగ్రీని పొంది, 1906లో న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. 1908లో తేజ్ బహదూర్ సప్రూకు జూనియర్ న్యాయవాదిగా అలహాబాదు ఉన్నత న్యాయస్థానము యొక్క బార్ లో చేరాడు. 1921లో ప్రజాకార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి న్యాయవాద వృత్తిని త్యజించాడు. స్వాతంత్ర్యోద్యమం టాండన్ 1899లో విద్యార్థిరోజుల నుండి భారత జాతీయ కాంగ్రేస్ సభ్యునిగా ఉన్నాడు. 1906లో అఖిల భారత కాంగ్రేసు కమిటీలో అలహాబాదుకు ప్రాతినిధ్యము వహించాడు. టాండన్, 1919లో జలియన్‌వాలా భాగ్ ఉదంతాన్ని అధ్యయనం చేసిన కాంగ్రేసు కమిటీలో పనిచేశాడు. లాలా లజపతి రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీకి అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.http://www.servantspeople.org/pv.htm 1920లలో సహాయనిరాకరణోద్యమంలో, 1930లలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. 1931లో గాంధీ లండన్లో జరిగిన రౌండు టేబుల్ సమావేశము నుండి తిరిగిరాక మునుపే అరెస్టు చేయబడిన వ్యక్తులలో నెహ్రూతో పాటు టాండన్ కూడా ఉన్నాడు. రైతు ఉద్యమంలో ఈయన పోషించిన పాత్రకు గాను చిరస్మరణీయుడు. 1934లో బీహార్ ప్రాంతీయ కిసాన్ సభకు అధ్యక్షునిగా పనిచేశాడు. 1937, జూలై 31 నుండి ఆగష్టు 10, 1950 వరకు 13 సంవత్సరాల పాటు ఉత్తర ప్రదేశ్ శాసనసభ స్పీకరుగా పనిచేశాడు. 1946లో భారత రాజ్యాంగ సభకు ఎన్నికైనాడు. స్వాతంత్ర్యం తర్వాత 1948లో కాంగ్రేసు పార్టీ అధ్యక్ష పదవికై పట్టాభి సీతారామయ్య పై పోటీ చేసి ఓడిపోయాడు. కానీ క్లిష్టమైన 1950 ఎన్నికలలో నాగపూర్ సదస్సుకు నేతృత్వం వహించడానికి ఆచార్య కృపలానీపై గెలుపొందాడు. టాండన్ 1952లో లోక్ సభకు ఆ తర్వాత 1956లో రాజ్యసభకు ఎన్నికైనాడు. ఆ తరువాత క్షీణిస్తున్న ఆరోగ్యము వలన క్రియాశీలక ప్రజాజీవితము నుండి విరమించాడు. 1961లో భారత ప్రభుత్వము టాండన్ ను అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:1882 జననాలు వర్గం:1962 మరణాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:ఉత్తర ప్రదేశ్ వ్యక్తులు
బాబూ రాజేంద్ర ప్రసాద్
https://te.wikipedia.org/wiki/బాబూ_రాజేంద్ర_ప్రసాద్
డా. రాజేంద్ర ప్రసాద్ (1884 డిసెంబర్ 3 – 1963 ఫిబ్రవరి 28) భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. అతడు 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించాడు.The President of India Shri Pranab Mukherjee . Presidentofindia.nic.in. Retrieved on 12 December 2013. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా 'బాబూ' అని పిలిచేవారు. అతడు భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్ లో భారత స్వాంతంత్ర్యోద్యమ కాలంలో చేరాడు. అతడు బీహార్ లో ప్రముఖ నాయకునిగా ఎదిగాడు. మహాత్మాగాంధీ మద్దతుదారునిగా అతడు 1931 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లోజరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1946 ఎన్నికల తరువాత అతడు ఆహారం, వ్యవసాయం శాఖకు భారత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించాడు. అతడు భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించాడు.President's Secretariat National Informatics Centre 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తరువాత అతడు రాగ్యాంగ పరిషత్తు ద్వారా మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. 1951 సార్వత్రిక ఎన్నికల తరువాత అతడు మొదటి భారత పార్లమెంటు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఒక రాష్ట్రపతిగా అతడు పక్షపాత ధోరణి లేకుండా, ఉన్నత పదవులలో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుండి వైదొలగి కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈ పదవి అలంకారప్రాయ మైనదైనప్పటికీ అతడు భారతదేశంలో విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు గాను అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ కు వివిధ సందర్భాలలో సలహాలనిచ్చేవాడు. 1957లో అతడు రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికై, రెండు సార్లు భారత రాష్ట్రపతి పదవినలంకరించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. బాల్యము, విద్యాభ్యాసం రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని జెర్దాయ్ గ్రామంలో 1884లో డిసెంబరు 3 న జన్మించాడు. అతని తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం, పర్శియను భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయణం నుండి కథలు వివరించేది. ఐదవ ఏటనే పర్షియన్ భాష, హిందీ భాష , అంకగణితం ను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ (ముస్లిం పండితుడు) దగ్గరకు పంపించబడ్డాడు. తరువాత ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసాడు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్‌వంశీ దేవిని వివాహం చేసుకున్నాడు. అటు తరువాత విద్యకై పాట్నాలో తన అన్న మహేంద్ర ప్రసాద్ వద్ద ఉంటూ ఆర్.కె.ఘోష్ పాఠశాలలో చదువుకున్నాడు. మరల ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై నెలకు రూ.30 ఉపకారవేతనం పొందాడు. 1902లో అతడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. మొదట్లో సైన్సు విద్యార్థి. 1904లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎఫ్.ఎ ఉత్తీర్ణుడయ్యాడు. అక్కడే 1905లో మొదటి స్థానంలో గ్రాడ్యుయేషన్ చేసాడు. అతని అధ్యాపకులలో జగదీష్ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదలగువారు ఉన్నారు. అతడి మేథాశక్తికి ఒక ఎక్జామినర్ (పరీక్షకుడు) ప్రభావితుడై అతడి పరీక్షా జవాబు పత్రంపై "పరీక్షకుని కంటే పరీక్షితుడు గొప్పవాడు" అనే వ్యాఖ్య రాసాడు. తరువాత అతడు సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకుని అటువైపు తన దృష్టి మరల్చాడు.1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందాడు. రాజేంద్ర ప్రసాద్ చదువుతున్నప్పుడు తన అన్నతో కలిసి ఈడెన్ హిందూ హాస్టలులో నివసించేవాడు. అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపాడు. అతడు "ద్వాన్ సమాజం" లో క్రియాశీల సభ్యునిగా సేవలందించాడు. అతడు పాట్నా కళాశాలలో1906లో జరిగిన బీహారీ స్టూడెట్స్‌ కాన్ఫరెన్సు ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. భారతదేశంలో మొదటిసారి ఏర్పడిన ఈ సంస్థ చంపారన్ ఉద్యమం, సహాయనిరాకరణోద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన నాయకులైన అనుగ్రహ నారాయణ్ సిన్హా, కృష్ణ సింగ్ లను దేశానికందించింది. . జీవితం ఉపాధ్యాయునిగా thumb|(కుడి నుండి ఎడమకు కూర్చున్నవారిలో) ప్రసాద్, అనుగ్రహనారాయణ సింగ్ - 1917లో మహాత్మాగాంధీ చంపారన్ ఉద్యమం సమయంలో తీసిన చిత్రం అతడు ఉపాద్యాయునిగా అనేక విద్యాసంస్థలలో పనిచేసాడు. ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ పూర్తి చేసిన తరువాత అతడు బీహార్ లోని ముజఫర్‌పూర్ లాంగట్ సింగ్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా చేరాడు. తరువాత ఆ సంస్థకు ప్రధానాచార్యునిగా తన సేవలనందించాడు. తరువాత 1909లో కలకత్తాలోని రిప్పన్ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించడానికి గాను ఉద్యోగాన్ని వదిలి వెళ్ళాడు. అతడు ఆ కళాశాలలో న్యాయవాద విద్యను అభ్యసించే సమయంలో కలకత్తా సిటీ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు. 1915 లో "మాస్టర్ ఆఫ్ లా" పరీక్షలకు హాజరై ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని పొందాడు. 1937లో అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీని పొందాడు. న్యాయవాదిగా 1911 లో, కాంగ్రేసులో చేరాడు. కానీ అతని కుటుంబ పరిస్థితి ఏమంత బాగాలేదు. కుటుంబం తన సహాయానికై ఎదురు చూస్తున్న తరుణంలో, స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు అన్నగారిని అనుమతి అడిగాడు.అతడు అందుకు ఒప్పుకోక పోవటం వలన 1916 లో, బీహార్, ఒడిషా రాష్ట్రాల హైకోర్టులలో చేరాడు. తరువాత 1917లో అతడు పాట్నా విశ్వవిద్యాలయంలోని సెనేట్, సిండికేట్ లో మొదటి సభ్యునిగా నియమింపబడ్డాడు. బీహార్ లో సిల్క్-టౌన్ గా ప్రసిద్ధిగాంచిన భగల్‌పూర్ లో న్యాయవాద పాక్టీసును చేపట్టాడు. ఏదైనా విచారణ జరుగుతున్నప్పుడు, తన వాదనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉదాహరణలు చూపలేకపోయినప్పుడు, న్యాయమూర్తులు రాజేంద్ర ప్రసాదునే ఉదాహరణ ఇవ్వమని అడిగేవారు.thumb|కలకత్తా హైకోర్డు ఆవరణలో డా. రాజేంద్ర ప్రసాద్ విగ్రహం స్వాతంత్ర్య సమరంలో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్షితుడయ్యాడు. రాజేంద్రప్రసాద్ 1906లో మొదటి సారి కలకత్తాలో నిర్వహించబడిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల ద్వారా సంబంధాన్ని పెంచుకున్నాడు. ఆ సమయంలో అతడు కలకత్తాలో విధ్యాభ్యాసం చేస్తూ ఆ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకునిగా చేరాడు. 2011లో రెండవసారి వార్షిక సమావేశాలు జరుగుతున్న సమయంలో అతడు భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. 1916 లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో మహాత్మా గాంధీని కలిసాడు. చంపారన్ లో జరగనున్న నిజ నిర్ధారన కమిటీలోనికి తనతో పాటు స్వచ్ఛంద కార్యకర్తగా రావాలని మహాత్మా గాంధీ అతనిని కోరాడు. మహాత్మా గాంధీ అంకితభావం, విశ్వాసం, ధైర్యాలను చూసి చలించిపోయాడు. 1918 లో'సర్చ్ లైట్'అనే ఆంగ్ల పత్రికను, ఆ తర్వాత 'దేశ్' అనే హిందీ పత్రికను నడిపాడు. 1920లో భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా నిర్వహించబడిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. అతడు తన లాభదాయకమైన న్యాయవాద వృత్తిని, అలాగే విశ్వవిద్యాలయంలోని అధ్యాపక వృత్తి విధులను తప్పుకున్నాడు. పాశ్చాత్య విద్యా సంస్థల స్థాపనకు గాంధీజీ బహిష్కరణకు పిలుపునిచ్చినందున ప్రసాద్ అతని కుమారుడు మృత్యుంజయ ప్రసాద్ ను పాఠశాలనుండి మానివేయించి, భారతీయ సాంప్రదాయ విధానాలలొ విద్యాభ్యాసం అందిస్తున్న బీహార్ విద్యాపీఠ్ లో చేర్పించాడు. Atul Sethi, "Distant dads?" ''The Times of India'' (Aug 12 2007) . Timesofindia.indiatimes.com (12 August 2007). Retrieved on 12 December 2013. ఈ విద్యాపీఠాన్ని1921లో తన మిత్రబృందంతో కలిసి స్థాపించి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నడిపాడు. .1921లో మహాత్మా గాంధీతో ఒకమారు సమావేశం తరువాత, విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు. భారత స్వాతంత్ర్యోద్యమంలో అతడు ప్రముఖ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ ను కలిసాడు. రాహుల్ సాంకృత్యాయన్ రాజేంద్రప్రసాద్ మేథస్సుకు ప్రభావితుడై ఒక గురువుగా భావించాడు. అతడు రాసిన అనేక వ్యాసాలలో సాంకృత్యాయన్ తో జరిపిన సమావేశాల గురించి పేర్కొన్నాడు. అతడు విప్లవవాద ప్రచురణలను "సెర్చ్‌లైట్" , "దేశ్" పత్రికలకు రాసేవాడు. ఈ పత్రికల కోసం నిధిని సేకరించేవాడు. అతడు దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజలకు స్వాతంత్ర్యోద్యమం విధానాలను ఉపన్యాసాల ద్వారా వివరించాడు. 1924లో బీహారు బెంగాల్‌లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడంకోసం తనవంతు సహాయాన్ని ముందుండి అందించాడు. 1934జనవరి 15, న ీహారులో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాదు జైలులో ఉన్నాడు. రెండురోజుల అనంతరం అతనిని విడిచిపెట్టారు. బయటకు రాగానే అతను 1934 జనవరి 17 న బీహార్ సెంట్రల్ రిలీఫ్ కమిటీ లో చేరి నిధులను సేకరించడం మొదలుపెట్టాడు. అలా భూకంప బాధితుల సహాయార్ధథంఅతను సేకరించిన నిధులు (38 లక్షలు) అప్పట్లో వైస్రాయి సేకరించిన నిధులకు మూడింతలున్నాయి. రాజేంద్రప్రసాద్ 1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అలాగే 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరువాత, 1947లో ఇంకోసారి, మొత్తం మూడుసార్లు ఆ పదవిని చేపట్టాడు. 1942 ఆగస్టు 8 న క్విట్ ఇండియా తీర్మానాన్ని కాంగ్రెస్ బొంబాయిలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా అనేక మంది స్వాతంత్ర్యోద్యమ కారులు అరెస్టు చేయబడ్డారు. అతనిని పాట్నాలోని సదాఖత్ ఆశ్రమం వద్ద అరెస్టు చేసి, బాంకిపూర్ కేంద్ర కారాగానికి తరలించారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష తర్వాత, 1945, జూన్ 15 న విడిచిపెట్టారు. 1946 సెప్టెంబరు 2 న ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం జవాహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో 12 మంది మంత్రులను ఎంపిక చేసింది. అందులో రాజేంద్ర ప్రసాద్ ఆహారం, వ్యవసాయ శాఖకు మంత్రిగా పనిచేసాడు. తరూవత 1946 డిసెంబరు 11 న రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. తరువాత జి.పి.కృపాలానీ కాంగ్రెస్ అద్యక్షునిగా రాజీనామా చేసిన తరువాత 1947 నవంబరు 17 న కాంగ్రెస్ అధ్యక్షునిగా భాద్యతలు స్వీకరించాడు. భారత గణతంత్ర రాజ్యానికి మొదటి రాష్ట్రపతి page=47|thumb|రాజేంద్ర ప్రసాద్ చిత్రం స్వామిచే 1948 లో గీయబడినది. ఈ చిత్రాన్ని చందమామ పత్రికలో ప్రచురించారు. భారత స్వాతంత్ర్యం వచ్చిన రెండున్నర సంవత్సరాల తరువాత 1950 జనవరి 26 న స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించబడింది. రాజేంద్ర ప్రసాదును మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. అనుకోకుండా భారత గణతంత్ర దినోత్సావానికి ఒక రోజు ముందు 1950 జనవరి 25 నాటి రాత్రి అతని సోదరి భగవతి దేవి ప్రసాద్ మరణించింది. అతడు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసాడు కానీ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు పెరేడ్ గ్రౌండ్ లో పూర్తిచేసిన తరువాత మాత్రమే పూర్తిచేసాడు. భారతదేశానికి అధ్యక్షునిగా రాజ్యాంగం ప్రకారం భాద్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిగా ఏ రాజకీయ పార్టీకి చెందకుండా స్వతంత్రుడిగా వ్యవహరించాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా భారత అంబాసిడరుగా విదేశీ దేశాలతో దౌత్య సంబంధాలు పెంపొందించడం కోసం పర్యటనలు చేసాడు. అతడు రెండవసారి వరుసగా 1952, 1957 లలో తిరిగి ఎన్నుకోబడ్డాడు. ఈ విధంగా ఎంపిక కాబడ్డ మొదటి రాష్ట్రపతిగా చరిత్రలో స్థానం సంపాదించాడు. అతని రాష్ట్రపతి పదవీ కాలమ్లో మొదటి సారి రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్న ముఘల్ గార్డెన్స్ ఒక నెల పాటు సందర్శకుల కోసం అనుమతించబడ్డాయి. దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా స్వతంత్రంగా మెలిగి, ప్రధానిని గానీ పార్టీని గానీ రాజ్యాంగ నిర్మాణంలో జోక్యంచేసుకోనివ్వలేదు. అలా తన తరువాత వచ్చిన అందరు రాష్ట్రపతులకు ఉదాహరణగా నిలిచాడు. "హిందూ కోడ్ బిల్" చట్టం పై వివాదాల తరువాత అతను రాష్ట్ర వ్యవహారాల్లో మరింత చురుకైన పాత్రను పోషించాడు. 12 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి 1962 న పదవీ విరమణ చేసాడు. కార్యాలయాన్ని విడిచిపెట్టిన తరువాత 1962 మే 14 న పాట్నా కు తిరిగి వచ్చి బీహార్ విద్యాపీఠంలో ఉండాలని కోరుకున్నాడు.About Rajendra Smriti Sanghralaya, Sadakat Ashram, Patna, Bihar, India . Rss.bih.nic.in. Retrieved on 12 December 2013. 1962 సెప్టెంబరు లో, అతని భార్య రాజ్‌వంశీ దేవి చనిపోయింది. 1963 ఫిబ్రవరి 28 న ఆయన రాం రాం అంటూ కన్ను మూశాడు. మరణానికి నెలరోజుల ముందు తనకుతానే ఒక ఉత్తరం రాసుకున్నాడు, అందులో ఇలా చెప్పాడు, "నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తూంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది". అనంతర కాలంలో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని రాజేంద్ర ప్రసాదుకు ప్రకటించారు. పాట్నాలో " రాజేంద్ర స్మృతి సంగ్రహాలయం" ను అతనికి అంకితం చేసారు. . Indian Politicians Biography దేశ ప్రజలలో ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమాభిమానాల వలన ఆయనను దేశ్ రత్న అని పిలిచేవారు. సాహితీ సేవలు ప్రెసిడెంట్ ఆఫ్ కాన్‌స్టిట్యూయంట్ అసెంబ్లీ సత్యాగ్రహ ఎట్ చంపారన్ (1922) డివిజన్ ఆఫ్ ఇండియా (1946, ఆన్‌లైన్) ఆత్మకథ (1946), బానిక్ పూర్ జైలులో 3 సంవత్సరాలు ఉన్న సమయంలో రాసిన స్వీయ చరిత్ర. మహాత్మా గాంధీ అండ్ బీహార్, సం రెమినిసైన్సెస్ (1949) బాపూ కె కదమోం మె (1954) సిన్స్ ఇండిపెండెన్స్ (1960 లో ప్రచురణ) భారతీయ శిక్ష అట్ ద ఫీట్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇతర పఠనాలు Rajendra Prasad, first President of India, by Kewalram Lalchand Panjabi. Published by Macmillan, 1960. Rajendra Prasad: twelve years of triumph and despair, by Rajendra Lal Handa. Published by Sterling Publishers,1979. Dr Rajendra Prasad, Correspondence and Select Documents, by Rajendra Prasad, Valmiki Choudhary. Published by Allied Publishers, 1984. . Excerpts (Vol. 1-Vol. 10) Dr Rajendra Prasad by India Parliament. Lok Sabha. Published by Lok Sabha Secretariat, 1990. Rajendra Prasad and the Indian freedom struggle, 1917–1947, by Nirmal Kumar. Published by Patriot Publishers, 1991. . Dr Rajendra Prasad: Political Thinkers Of Modern India, by V. Grover. Published by Deep & Deep Publications, 1993. First Citizens of India, Dr Rajendra Prasad to Dr Shanker Dayal Sharma: Profile and Bibliography, by A. B. Kohli. Published by Reliance Pub. House, 1995. . ఆధారాలు ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతుల గురించి భారత ప్రభుత్వంవారి అధికారిక వెబ్‌సైటులో చూడండి కాంగ్రేస్ పార్టీ వెబ్‌సైటులో రాజేంద్ర ప్రసాద్ గురించి డా. రాజేంద్ర ప్రాసాద్ జీవిత చరిత్ర మూలాలు బయటి లింకులు Rajendra Prasad at Encyclopædia Britannica రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ వర్గం:ఆత్మకథ రాసుకున్న బీహార్ వ్యక్తులు వర్గం:బీహార్ స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:రాజ్యాంగ పరిషత్తు సభ్యులు వర్గం:బీహార్ రచయితలు
వినోబా భావే
https://te.wikipedia.org/wiki/వినోబా_భావే
ఆచార్య వినోబా భావేగా పేరొందిన చెందిన వినాయక్ నరహరి భావే (సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15, 1982) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీకి ఆధ్యాత్మిక వారసుడు. జననం వినోబా, మహారాష్ట్రలోని గగోదేలో 1895, సెప్టెంబర్ 11న ఒక సాంప్రదాయ చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యములో ఈయన భగవద్గీత చదివి స్ఫూర్తి పొందాడు. ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత టాక్స్ ఆన్ ది గీత అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు. సంఘ సంస్కర్తగా భారతదేశంలోని పల్లెల్లో జీవించే సగటుజీవి అనుభవించే కష్టాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కృషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడా భావించారు. ఈ ధోరణి క్రమేణా సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమేకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం భూదానోద్యమం. నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్థించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. అహింస, ప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే అంశం - గోహత్య విధాన నిర్మూలనం. వినోబా తన జీవిత చరమాంకం, మహారాష్ట్రలోని పౌనాఋలో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని సమర్ధించిన వారిలో వినోబా ఒకరు కావడం, ఆ కాలాన్ని అనుశాసన పర్వంగా అభివర్ణించి, క్రమశిక్షణకు సరియైన సమయం అని వ్యాఖ్యానించారు. విద్వత్తు ఉన్నచోట వివాదం, అసూయలు జనిస్తాయి. తర్కంలేని అతి గాంధీవాదం వినోబాది అని ప్రముఖ సాహితీవేత్త వి. ఎస్. నైపాల్ విమర్శించాడు. కాని, భారతీయ ఆర్థిక, రాజకీయవిధానంతో భాగస్వామ్యం పొందని నైపాల్ నుంచి యిటువంటి విమర్శలు రావడం చాలా విడ్డూరం అని ప్రతి విమర్శలు కూడా వచ్చాయి. భూదానోద్యమ ప్రారంభం 1951 ఏప్రిల్ 18 న యాదాద్రి భువనగిరి జిల్లాలో వినోబా భావే పోచంపల్లి మండలంలో ప్రవేశించాడు. మొట్టమొదటి సారి భూదానోద్యమం ఇక్కడే నుండే ప్రారంభించబడింది. అందుకే దీనికి భూదాన్ పోచంపల్లి అని పిలుస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లిలోకి మొదటి సారి వినోబా భావే ప్రవేశించినప్పుడు అతన్ని గ్రామస్తులు స్వాగతించారు. కొంత కాలం పోచంపల్లిలో ఉన్నాడు. ఆయన అక్కడ 75% కంటే ఎక్కువ మంది భూమిలేని పేద గ్రామస్తులు ఉన్నారని తెలుసుకున్నారు. గ్రామస్తులు అతన్ని కలవటానికి వచ్చి 80 ఎకరాల (సగం తడి భూములు, ఇంకో సగం పొడి భూములు) భూమి కావాలని అడిగారు. అప్పుడు వినోబా భావే అందరు గ్రామస్తులకు ప్రభుత్వమే ఎందుకు సహాయం చేయాలి. భూస్వాములు తోటి పేదలకు సహాయ పడవచ్చుకదా అని అన్నారు. అప్పుడు వెంటనే వెదిరె రామచంద్రారెడ్డి అనే ఒక భూస్వామి నేను పేదలకు 100 ఎకరాల భూమి ఇస్తాను అన్ని వాగ్దానం చేశాడు. దీనితో, భారతదేశ భూసమస్యను పరిష్కరించే సామర్ధ్యం ఈ ఉద్యమానికి ఉందని వినోబాభావే అనుకున్నాడు. అక్కడ ఆ విధంగా భూదాన్ ఉద్యమం మొదలైయింది.Bhoodan and the Landless, S.V. Khandewale and K.R. Nanekar, Popular Prakashan, 1973.India since independence - bipin Chandra ప్రతిభకు పురస్కారాలు 1958 లో వినోబాకు సామాజిక నాయకత్వంపై రామన్ మెగసెసే పురస్కారం మొట్టమొదటి స్వీకర్త వినోబా కావడం భారతదేశానికి దక్కిన గౌరవం. 1983లో భారతరత్న బిరుదుని వినోబా మరణాంతరం వెంటనే బహూకరించారు. వినోబా భావాలు విప్లవాలకు ఆధ్యాత్మికభావాలే మూలం; మానవుల హృదయాలని, మనస్సులని ఏకీకృతం చేయడానికే నా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం జరిగింది. ప్రశాంతత అనేది మానసికం, ఆధ్యాత్మకం. ఈ ధోరణులనుంచే మానవుల వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశిస్తాయి. ప్రపంచగమనం వీటిపైనే ఆధారపడింది. జై జగత్! విశ్వానికి విజయం! బీదప్రజల హృదయాలను సుసంపన్నంగాను, సంపన్నప్రజల హృదయాలను బీదతనంతోను భగవంతుడు సృష్టించడం విడ్డూరం, ఆశ్చర్యకరం. ప్రజాశక్తి, ప్రజాబలం సంకల్పంగా సాధించాలి. హింసాయుత, బలవంతపు అధికారిక రాజ్యపాలనం ఆహ్వానించదగ్గది కాదు. ఏ దేశమైనా, సైన్యం, యుద్ధసామగ్రి బలంతో కాక, నైతినబలంతో సమర్ధించుకోవాలి. పాతపడిన యుద్ధసామగ్రితో కొత్త యుద్ధాలు చేయగలగడం అసాధ్యం. ప్రభుత్వాల తప్పిదాలపై విమర్శించ వలసిన పని నాకు లేదు. మంచి పనులని అనుకున్నవాటిపై నా విమర్శ ఉంటుంది. విప్లవవాదాన్ని ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది అన్న భావం, భావన ఎన్నటికీ రానీయకూడదు. అహింసా విధానాలపై నిదానధోరణిని అవలబించకూడదు. అహింసామార్గం ద్వారా, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే, కాలయాపన, జాప్యం శతృవులు అనే అనుకోవాలి. పట్టు ఎంతమాత్రం సడలకూడదు. మెతకదనం, పసలేని, ప్రభావంలేని అహింసావిధానాలను అవలంబించినందువల్ల ప్రస్తుత స్తబ్ధత కొనసాగే ప్రమాదంతోపాటు, పెరుగుదల, అభివృద్ధి చతికిలబడతాయి. చివరకు పరాజయం, నిరాశ తప్పవు. సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకథోరణి, కుష్టివ్యాధిగ్రస్థులకు సహాయసహకారాలు, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని కచ్చితంగా చెప్పవచ్చు. మరణం ఆచార్య వినోబా భావే 1982, నవంబర్ 15 న, చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోడానికి నిరాకరించి, సల్లేఖనంగా భావించగా, కీర్తిశేషులైనారు. మూలాలు బయటి లింకులు తెలుగుజర్నల్లో వినోభా భావేపై వ్యాసం వినోబా భావేపై జోశ్యుల సూర్యనారాయణమూర్తి రాసిన గ్రంథం వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1895 జననాలు వర్గం:1982 మరణాలు వర్గం:రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:మహారాష్ట్ర వ్యక్తులు
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
https://te.wikipedia.org/wiki/ఖాన్_అబ్దుల్_గఫార్_ఖాన్
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పష్తో/ఉర్దూ: خان عبد الغفار خان) (జననం : హష్త్ నగర్ (ఉస్మాన్ జయీ, పెషావర్), వాయవ్య సరిహద్దు రాష్ట్రం, బ్రిటిషు ఇండియా, జననం 6 ఫిబ్రవరి, 1890 – మరణం పెషావర్, NWFP, పాకిస్తాన్, 20 జనవరి 1988. బాద్షా ఖాన్ గా సరిహద్దు గాంధీ గా పేరుగాంచాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. భారతరత్న పురస్కారమును పొందిన తొలి భారతేతరుడు. "ఎర్రచొక్కాల ఉద్యమం" ప్రారంభించిన ప్రముఖుడు. ఇతని అనుచరులను "ఖుదాయీ ఖిద్మత్‌గార్" (భగవత్సేవకులు) అని పిలిచేవారు. ఇతను పష్తో లేదా పక్తూనిస్తాన్ కు చెందిన రాజకీయ, ధార్మిక నాయకుడు. 300px|thumb|left|ఖుదాయీ ఖిద్మత్‌గార్ (భగవత్సేవకులు) thumb|మహాత్మాగాంధీతో బాద్షా ఖాన్.‎ thumb|left|కేబినెట్ మిషన్ తరువాత, గఫార్ ఖాన్, నెహ్రూ నడచి వచ్చే దృశ్యం. భారత విభజనకు తీవ్రంగా వ్యతిరేకించినవాడు. భారత రాజకీయనాయకులతో కలసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. భారతదేశ రాజకీయనాయకులతో మరీ ముఖ్యంగా గాంధీ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీతో కలసి పోరాటం సలిపాడు. సరిహద్దు ప్రాంతపు ముస్లింలీడర్లు, ఇతను ముస్లింల ద్రోహి అని 1946 లో హత్యా ప్రయత్నం చేసారు. దేశ విభజనను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేయలేదు. ఇటు సరిహద్దు ప్రాంతవాసులకు ద్వేషి అయ్యాడు, అటు దేశ విభజన ఆగలేదు. అబ్దుల్ గఫార్ ఖాన్ పరిస్థితి అగమ్యగోచరమయ్యింది. బాద్షా ఖాన్, అనుయాయులు, భారత పాకిస్తాన్ లు మమ్మల్ని తీవ్రంగా ద్రోహం చేశాయని భావించారు. కాంగ్రెస్ పార్టీని, భారత రాజకీయ నాయకులను ఉద్దేశించి బాద్షాహ్ ఖాన్ అన్న ఆఖరి మాటలు, "మీరు మమ్మల్ని తోడేళ్ళ ముందు విసిరేసారు" .Partition and Military Succession Documents from the U.S. National Archives మూలాలు Footnotes బయటి లింకులు సెక్యూరిటి రీసెర్చ్ రివ్యూలో ఖాన్ అబ్దుల్‌గఫార్‌ఖాన్ పై వ్యాసము వర్గం:1890 జననాలు వర్గం:1988 మరణాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమం వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:జవహర్ లాల్ నెహ్రూ అవార్డు గ్రహీతలు
జ్ఞానపీఠ పురస్కారం
https://te.wikipedia.org/wiki/జ్ఞానపీఠ_పురస్కారం
భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైంది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, పదకొండు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం.1964లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. ఐతే ఒక భాషాసాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత మూడేళ్ళపాటు ఆ భాషాసాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు. 1982కు ముందు, ఏదైనా ఒక రచనకు గాను సంబంధిత రచయితకు ఈ పురస్కారం ఇచ్చేవారు. అప్పటినుండి, భారతీయ సారస్వతానికి చేసిన సేవకు కూడా ఈ బహుమతిని ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కన్నడ రచయితలు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ రచయితలు ఆరుసార్లు అందుకున్నారు. అవార్డు thumb|250x250px|విశ్వనాథ సత్యనారాయణకు అందజేసిన జ్ఞాన పీఠ్ అవార్డు దృశ్యచిత్రం సంవత్సరంపేరుకృషిభాష 1965 జి. శంకర కురుప్ ఒడక్కుజల్ (వేణువు) మలయాళం 1966 తారాశంకర్ బందోపాధ్యాయ గణదేవత బెంగాలి 1967 డా.కె.వి.పుట్టప్ప (కువెంపు) శ్రీ రామాయణ దర్శన కన్నడ 1967 ఉమాశంకర్ జోషి నిషిత గుజరాతీ 1968 సుమిత్రానందన్ పంత్ చిదంబర హిందీ 1969 ఫిరాఖ్ గోరఖ్‌పురి గుల్-ఎ-నగ్మా ఉర్దూ 1970 విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం తెలుగు 1971 బిష్ణు డే స్మృతి సత్తా భవిష్యత్ బెంగాలి 1972 రామ్‌ధరీ సింగ్ 'దినకర్' ఊర్వశీ హిందీ 1973 దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె నాకుతంతి (నాలుగు తీగలు (తంత్రులు) కన్నడ 1973 గోపీనాథ్ మొహంతి మట్టిమతల్ ఒరియా 1974 విష్ణు సఖారాం ఖాండేకర్ యయాతి మరాఠీ 1975 పి.వి.అఖిలాండం చిత్రప్పావై తమిళం 1976 ఆశాపూర్ణా దేవి ప్రథం ప్రతిశృతి బెంగాలి 1977 కె.శివరామ కారంత్ మూక్కజ్జియ కనసుగళు (బామ్మ కలలు) కన్నడ 1978 ఎస్.హెచ్.వి.ఆజ్ఞేయ కిత్నీ నావోన్ మే కిత్నీ బార్ (ఎన్ని పడవల్లో ఎన్నిసార్లు?) హిందీ 1979 బీరేంద్ర కుమార్ భట్టాచార్య మృత్యుంజయ్ అస్సామీ 1980 ఎస్.కె.పొట్టెక్కాట్ ఒరు దేశత్తింతె కథ (ఒక దేశపు కథ) మలయాళం 1981 అమృతా ప్రీతం కాగజ్ తే కాన్వాస్ పంజాబీ 1982 మహాదేవి వర్మ హిందీ 1983 మాస్తి వెంకటేశ అయ్యంగార్ కన్నడ 1984 తకళి శివశంకర పిళ్ళె మలయాళం 1985 పన్నాలాల్ పటేల్ గుజరాతీ 1986 సచ్చిదానంద రౌత్రాయ్ ఒరియా 1987 విష్ణు వామన్ శిర్వాద్కర్ మరాఠీ 1988 డా.సి.నారాయణ రెడ్డి విశ్వంభర తెలుగు 1989 ఖుర్రతుల్-ఐన్-హైదర్ ఉర్దూ 1990 వి.కె.గోకాక్ కన్నడ 1991 సుభాష్ ముఖోపాధ్యాయ బెంగాలి 1992 నరేశ్ మెహతా హిందీ 1993 సీతాకాంత్ మహాపాత్ర ఒరియా 1994 యు.ఆర్.అనంతమూర్తి కన్నడ 1995 ఎం.టి.వాసుదేవన్ నాయర్ మలయాళం 1996 మహాశ్వేతా దేవి బెంగాలీ 1997 అలీ సర్దార్ జాఫ్రి ఉర్దూ 1998 గిరీష్ కర్నాడ్ కన్నడ 1999 నిర్మల్ వర్మ హిందీ 1999 గురుదయాల్ సింగ్ పంజాబీ 2000 ఇందిరా గోస్వామి అస్సామీ 2001 రాజేంద్ర కేశవ్‌లాల్ షా గుజరాతీ 2002 డి.జయకాంతన్ తమిళం 2003 విందా కరందీకర్‌ మరాఠీ 2004 రెహమాన్ రాహి‌ కష్మీరీ 2005 కువర్ నారాయణ్‌ హిందీ 2006 రవీంద్ర కేళేకర్‌ కొంకణి 2006 సత్యవ్రత శాస్త్రి‌ సంస్కృతం 2007 డా.ఓ.యన్.వి.కురూప్ మళయాళం 2008 అక్లాక్ ముహమ్మద్ ఖాన్ ఉర్దూ 2009 అమర్ కాంత్ హిందీ 2009 శ్రీ లాల్ శుక్లా హిందీ 2010 చంద్రశేఖర కంబార కన్నడ 2011 ప్రతిభా రాయ్ ఒడియా 2012 రావూరి భరద్వాజపాకుడురాళ్ళు (మాయాజలతారు) తెలుగు2013 కేదార్‌నాథ్‌ సింగ్హిందీ2015రఘువీర్ చౌదరిగుజరాతీ2016 శంఖ ఘోష్బెంగాలీ2017 కృష్ణ సోబ్తి హిందీ2018అమితవ్ ఘోష్ ఆంగ్లం2019అక్కితం అచ్యుతన్ నంబూతిరిమలయాళం2021నీలమణి ఫూకాన్అస్సామీ2022దామోదర్ మౌజోకొంకణి2023గుల్జార్ఉర్దూ2023జగద్గురు రామభద్రాచార్యసంస్కృతం బయటి లింకులు అధికారిక వెబ్ సైటు. వర్గం:భారతీయ సాహిత్య పురస్కారాలు వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు వర్గం:భారతీయ పురస్కారాలు‎
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
https://te.wikipedia.org/wiki/దాదాసాహెబ్_ఫాల్కే_పురస్కారం
link=https://en.wikipedia.org/wiki/File:Phalke.jpg|alt=A Black and White photo of Dadasaheb Phalke looking at the filmstrip|thumb|దదాసాహెబ్ ఫాల్కే - భారతదేశపు తొట్టతొలి సినిమా నిర్మాత (1913). దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమా పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల తోపాటు ఇస్తారు. చరిత్ర భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే. అతను అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్ పట్టణానికి 30కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో జన్మించాడు. బొంబాయి లోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బరోడాలోని కళాభవన్‌లలో అతను విద్యాభ్యాసం చేశాడు. 1896లో అతను బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో ఏసుక్రీస్తు చరితం పై ప్రదర్శించబడిన సినిమాను చూశాడు. ఆ ప్రభావంతో అతను హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియ్యాలన్న సంకల్పానికి వచ్చాడు. 1913లో అతను తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన అతను సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే రచయితగా ఈ కాలంలో అతను 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించాడు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా అతను సినీపరిశ్రమకు తిరిగి ఖర్చుచేశాడు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను అతను పెద్దగా పట్టించుకోలేదు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అతను ఎంతో కృషిచేశాడు. అవార్డు వివరాలు 1969లో మొట్టమొదటి సారిగా ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి వాళ్ళకు ఈ అవార్డ్ అందచేశారు. కానీ మొట్టమొదటగా ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారు మాత్రం బియన్ రెడ్డిగా పిలవబడే బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి. తెలుగు వారే కాదు భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన మల్లీశ్వరి, బంగారు పాప లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బి.యన్.రెడ్డి సోదరుడైన మరో బియన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం. బియన్ రెడ్డి లతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె. విశ్వనాథ్ ఉన్నారు. దర్శకులు సత్యజిత్ రే, అదూర్ గోపాల కృష్ణన్, మృణాళ్ సేన్, శ్యాం బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు. కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. నేపథ్యగాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే కూడా ఈ అవార్డు గ్రహీతలే. ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలు 1969 - దేవికా రాణి, నటి 1970 - బి.ఎన్.సర్కార్, నిర్మాత 1971 - పృథ్వీరాజ్ కపూర్, నటుడు 1972 - పంకజ్ మాలిక్, సంగీత దర్శకుడు గాయకుడు 1973 - సులోచన 1974 - బి.ఎన్.రెడ్డి, దర్శకనిర్మాత 1975 - ధీరేన్ గంగూలీ, నటుడు 1976 - కానన్ దేవి, నటి 1977 - నితిన్ బోస్, దర్శకుడు 1978 - ఆర్.సి.బోరల్, స్క్రీన్ ప్లే 1979 - సోహ్రాబ్ మోడి, దర్శకనిర్మాత 1980 - పైడి జైరాజ్, దర్శకుడు, నటుడు 1981 - నౌషాద్, సంగీత దర్శకుడు 1982 - ఎల్.వి.ప్రసాద్, దర్శకుడు, నిర్మాత, నటుడు 1983 - దుర్గా ఖోటే, నటి 1984 - సత్యజిత్ రే, దర్శకుడు 1985 - వి.శాంతారాం, దర్శకుడు, నిర్మాత, నటుడు 1986 - బి.నాగిరెడ్డి, నిర్మాత 1987 - రాజ్ కపూర్, నటుడు, దర్శకుడు 1988 - అశోక్ కుమార్, నటుడు 1989 - లతా మంగేష్కర్, గాయని 1990 - ఎ.నాగేశ్వర రావు, నటుడు 1991 - భాల్జీ ఫెండార్కర్, గాయకుడు, సంగీత దర్శకుడు 1992 - భూపేన్ హజారికా, గాయకుడు, సంగీత దర్శకుడు 1993 - మజ్రూహ్ సుల్తాన్‌పురి, పాటల రచయిత 1994 - దిలీప్ కుమార్, నటుడు, గాయకుడు 1995 - రాజ్ కుమార్, నటుడు, గాయకుడు 1996 - శివాజీ గణేశన్, నటుడు 1997 - ప్రదీప్, పాటల రచయిత 1998 - బి.ఆర్.చోప్రా, దర్శకుడు, నిర్మాత 1999 - హృషీకేష్ ముఖర్జీ, దర్శకుడు 2000 - ఆషా భోంస్లే, గాయని 2001 - యష్ చోప్రా, దర్శకుడు, నిర్మాత 2002 - దేవానంద్, నటుడు, దర్శకుడు, నిర్మాత 2003 - మృణాల్ సేన్, దర్శకుడు 2004 - అదూర్ గోపాలక్రిష్ణన్, దర్శకుడు 2005 - శ్యాం బెనగళ్, దర్శకుడు 2006 - తపన్ సిన్హా, దర్శకుడు 2007 - మన్నా డే, గాయకుడు 2008 - వి.కె.మూర్తి, ఛాయాగ్రాహకుడు 2009 - డి.రామానాయుడు, దర్శకుడు, నిర్మాత, నటుడు, 2010 - కైలాసం బాలచందర్, దర్శకుడు 2011 - సౌమిత్ర ఛటర్జీ నటుడు కవి రచయిత దర్శకుడు 2012 - ప్రాణ్, నటుడు 2013 - గుల్జార్, నటుడు 2014 - శశికపూర్, నటుడు 2015 - మనోజ్ కుమార్, నటుడు, దర్శకుడు, నిర్మాత 2016 - కె.విశ్వనాథ్, నటుడు, దర్శకుడు, నిర్మాత 2017 - వినోద్ ఖన్నా 2018 - అమితాబ్ బచ్చన్ 2019 - రజనీకాంత్ 2020 - ఆశా పరేఖ్ 2023 - వహీదా రెహమాన్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022 2022 ఫిబ్రవరి 20న ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2021లో విడుదలై విశేష ఆదరణ పొందిన సినిమాలు, నటులు అవార్డులు అందుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప : ది రైజ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. షేర్షా  ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. 83 సినిమాలో నటించిన రణవీర్ సింగ్కు ఉత్తమ నటుడు, మిమీ సినిమాలో నటించిన కృతి సనన్కు ఉత్తమ నటి అవార్డులు దక్కాయి. ఇవి కూడా చూడండి నంది పురస్కారాలు ఉగాది పురస్కారాలు రఘుపతి వెంకయ్య అవార్డు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఏఎన్ఆర్ జాతీయ అవార్డు మూలాలు నవతరంగం వెబ్ లో వర్గం:సినిమా పురస్కారాలు వర్గం:భారతీయ సినిమా వర్గం:బహుమతులు వర్గం:దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు
గోవింద్ వల్లభ్ పంత్
https://te.wikipedia.org/wiki/గోవింద్_వల్లభ్_పంత్
గోవింద్ వల్లభ్ పంత్, (1887 సెప్టెంబరు 10 - 1961 మార్చి 7) భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో నాయకుడు. ఆధునిక భారతదేశపు వాస్తుశిల్పిలలో ఒకరు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్‌తో పాటు, పంత్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక వ్యక్తి, తరువాత భారత ప్రభుత్వంలో కీలక వ్యక్తి. అతను ఉత్తరాఖండ్ రాజకీయ నాయకులలో అగ్రగామి. (అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ అని పిలుస్తారు) భారతీయ యూనియన్ జాతీయ భాషగా హిందీని స్థాపించడానికి విఫలమైన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు.నేడు అనేక భారతీయ ఆసుపత్రులు, విద్యా సంస్థలు పునాదులు అతని పేరును కలిగి ఉన్నాయి. ఒక పేద కుటుంబంలో జన్మించిన పంత్, వకీలు వృత్తిని ఎంచుకుని 1914లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాజ్యంలో విజయం సాధించాడు. 1921లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి గెలవడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టాడు. 1937-39, 1946-50 లలో సంయుక్త రాజ్యాలకు (యునైటెడ్ ప్రావిన్సెస్) ముఖ్యమంత్రిగా, ఆ పైన ఉత్తర్ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1950-54 లలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1955 లో కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఇతనికి 1957లో భారతరత్న పురస్కారం లభించింది. జీవితం తొలిదశ thumb|351x351px పంత్ 1887 సెప్టెంబరు 10 న అల్మోరా సమీపంలోని శ్యాహి దేవి కొండ వాలుపై ఉన్న ఖూంట్ గ్రామంలో జన్మించాడు.https://inc.in/congress-sandesh/tribute/govind-ballabh-pant-10-september-1887-7-march-1961 అతను కుమోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లి పేరు గోవింది బాయి. తండ్రి మనోరత్ పంత్. బల్లభ్ పంత్ తండ్రి ప్రభుత్వ అధికారి.అందువలన ఉద్యోగరీత్యా నిరంతరం తిరుగుతూ ఉండేవాడు. స్థానికంగా ఉన్న ఒక ముఖ్యమైన ప్రభుత్వ అధికారి ద్వారా, గోవింద్‌ వ్యక్తిత్వం, రాజకీయ అభిప్రాయాలను రూపొందించడంలో అతని తాత బద్రి దత్ జోషి ముఖ్య పాత్రను పోషించాడు. పంత్ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. తరువాత కాశీపూర్‌లో న్యాయవాదిగా పనిచేశాడు. అక్కడ అతను 1914లో బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా చురుకైన పనిని ప్రారంభించాడు. బ్రిటిష్ అధికారుల లగేజీని స్థానికులు ఉచితంగా రవాణా చేయాల్సిన కూలీ బేగర్ చట్టంపై విజయవంతమైన సవాలులో అతను ఒక స్థానిక పరిషత్ లేదా గ్రామ మండలికి సహాయం చేసాడు. 1921లో అతను రాజకీయాల్లోకి ప్రవేశించాడు.ఆగ్రా ఉద్ యునైటెడ్ ప్రావిన్సుల శాసనసభకు ఎన్నికయ్యాడు. స్వాతంత్ర్యపోరాటం అత్యంత సమర్థుడైన న్యాయవాదిగా పేరుగాంచిన పంత్ 1920 ల మధ్యలో కాకోరి కేసులో పాల్గొన్న రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, ఇతర విప్లవకారులకు ప్రాతినిధ్యం వహించడానికి కాంగ్రెస్ పార్టీచే నియమించింది. అతను 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్నాడు జవహర్‌లాల్ నెహ్రూ తన ఆత్మకథలో, నిరసనల సమయంలో పంత్ తనకు అండగా నిలిచిన వివరాల గురించి రాస్తూ, అతని పెద్ద వ్యక్తి, అతడిని పోలీసులు తేలికగా లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నాడు. ఆ నిరసనలలో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు.అది అతని జీవితాంతం తన వీపును నిఠారుగా చేయకుండా నిరోధించింది. 1930 లో, గాంధీ మునుపటి చర్యల నుండి ప్రేరణ పొందిన సాల్ట్ మార్చి నిర్వహించినందుకు అతన్ని అరెస్టు చేసి కొన్ని వారాలపాటు జైలులో ఉంచారు. 1933లో, అప్పుడు నిషేధించబడిన ప్రావిన్షియల్ కాంగ్రెస్ సెషన్‌కు హాజరైనందుకు హర్ష్ దేవ్ బహుగుణ (చౌకోట్ గాంధీ) తో పాటు అతడిని అరెస్టు చేసి ఏడు నెలల పాటు జైలులో ఉంచారు. 1935లో నిషేధం రద్దు చేయబడింది. పంత్ కొత్త శాసన మండలిలో చేరాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, పంత్ వారి యుద్ధ ప్రయత్నాలలో బ్రిటీష్ రాజుకు మద్దతునివ్వాలని సూచించిన గాంధీ వర్గం, సుభాష్ చంద్రబోస్ వర్గం మధ్య టైబ్రేకర్ గా వ్యవహరించాడు, బ్రిటీష్ రాజ్‌ను అన్ని విధాలుగా బహిష్కరించడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.1934లో కాంగ్రెస్ చట్టసభల బహిష్కరణను ముగించారు. పంత్ కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ లీడర్ అయ్యాడు.B. R. Nanda, Pant, Govind Ballabh (1887–1961), politician in India (2004) 1940లో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించడంలో సహాయపడినందుకు పంత్ జైలు పాలయ్యాడు. 1942 లో క్విట్ ఇండియా తీర్మానంపై సంతకం చేసినందుకు మళ్లీ అరెస్ట్ చేయబడ్డాడు.1945 మార్చి వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని ఇతర సభ్యులతో కలిసి మూడు సంవత్సరాలు అహ్మద్‌నగర్ కోటలో గడిపాడు, ఆ సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ పంత్ ఆరోగ్యం దెబ్బతిన్నదనే కారణంపై విడుదల కోసం విజయవంతంగా అభ్యర్థించాడు. యునైటెడ్ ప్రావిన్సుల ప్రీమియర్ 1937, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి 1950 thumb|260x260px|టి.టి. కృష్ణమాచారి, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి, భారత ప్రభుత్వం 1957 నవంబరు 18 న న్యూఢిల్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత జరిగిన ప్రణాళికా సంఘం సమావేశానికి పండిట్ గోవింద్ బల్లభ్ పంత్, అప్పటి కేంద్ర హోం మంత్రి హోదాలో హాజరైనప్పటి చిత్రం. (కుడివైపు చివర వ్యక్తి) పంత్ 1937 నుండి 1939 వరకు యునైటెడ్ ప్రావిన్సుల (ఉత్తరాఖండ్) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. 1945లో, బ్రిటిష్ లేబర్ ప్రభుత్వం ప్రావిన్షియల్ చట్టసభలకు కొత్త ఎన్నికలను ఆదేశించింది. యునైటెడ్ ప్రావిన్సులలో 1946 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. పంత్ మళ్లీ ప్రధానమంత్రి అయ్యాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొనసాగాడు. ఉత్తర ప్రదేశ్‌లో అతని న్యాయమైన సంస్కరణలు, స్థిరమైన పాలన భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్ర ఆర్థిక స్థితిని స్థిరీకరించింది. ఆ స్థానంలో అతను సాధించిన విజయాలలో జమీందారీ వ్యవస్థ రద్దు ఉంది. అలాగే అతను హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు. హిందూ పురుషులకు ఏకస్వామ్యాన్ని తప్పనిసరి చేశాడు. హిందూ మహిళలకు పూర్వీకుల ఆస్తికి విడాకులు, వారసత్వ హక్కులను కల్పించాడు. పంత్ 1955 జనవరి 3 న కేంద్ర మంత్రివర్గంలో పోర్ట్‌ఫోలియో లేకుండా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి లక్నో నుండి న్యూఢిల్లీకి వెళ్లాడు. భారత కేంద్ర హోంమంత్రి పంత్‌ను కేంద్ర మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా 1955 జనవరి 10న జవహర్‌లాల్ నెహ్రూ నియమించాడు.1955 నుండి 1961 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేసాడు. భాషా పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అతని ముఖ్య విజయం. కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాల అధికారిక భాషగా హిందీని స్థాపించడానికి అతను బాధ్యత వహించాడు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో పంత్‌కు 1957 జనవరి 26న భారతరత్న లభించింది. మరణం 1960లో అతను గుండెపోటుతో బాధపడ్డాడు. అప్పటికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అతని స్నేహితుడు బిధన్ చంద్ర రాయ్‌తో సహా భారతదేశంలోని అగ్ర వైద్యులు అతనికి చికిత్స అందించారు. అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. అతను 1961 మార్చి 7 న 74 సంవత్సరాల వయస్సులో, సెరిబ్రల్ స్ట్రోక్‌తో మరణించాడు. ఆ సమయంలో అతను ఇప్పటికీ భారత హోం మంత్రి పదవిలో ఉన్నాడు. అతనికి సంతాపం తెలుపుతూ, అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలా పేర్కొన్నాడు, "పండిట్ గోవింద్ బల్లభ్ పంత్ నాకు 1922 నుండి తెలుసు, ఈ సుదీర్ఘ కాల వ్యవధిలో అతని నుండి పరిగణన మాత్రమే కాదు, ఆప్యాయత కూడా పొందడం నా విశేషం. అతని శ్రమను, అతని విజయాలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు.దుంఖంలో మాటలు రావటంలేదు. నేను అతనిని ప్రేమించే, ఆరాధించే వారి అందరి కోసం అతని ఆత్మకు శాంతిని కోరుతూ ప్రార్థించగలను. " సంస్థలు, స్మారక చిహ్నాలు గోవింద్ బల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇనిస్టిట్యూట్, అలహాబాద్ గోవింద్ బల్లభ్ పంత్ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం, పంత్ నగర్ గోవింద్ బల్లభ్ పంత్ ఇంజనీరింగ్ కళాశాల, పౌరీ గర్వాల్, ఉత్తరాఖండ్ గోవింద్ బల్లభ్ పంత్ ఇంజనీరింగ్ కళాశాల, ఢిల్లీ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్, సోనేభద్ర (ఉత్తర ప్రదేశ్) మూలాలు వెలుపలి లంకెలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:1887 జననాలు వర్గం:1961 మరణాలు వర్గం:ఉత్తర ప్రదేశ్ రాజకీయనాయకులు వర్గం:ఉత్తర ప్రదేశ్ వ్యక్తులు వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు వర్గం:బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ సభ్యులు
పాండురంగ వామన్ కాణే
https://te.wikipedia.org/wiki/పాండురంగ_వామన్_కాణే
ఆచార్య పాండురంగ వామన్ కాణే (1880-1972) మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడు. 1963 లో ఈయన భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈయనకు మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది. హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఈయన రచించిన ప్రఖ్యాత గ్రంథం. ఈ పుస్తకం కోసం ఈయన శతాబ్దాలుగా వెలువడిన అనేక తాళపత్ర గ్రంథాలను పరిశోధించాడు. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే, భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్ లాంటి సంస్థలో ఉన్న వనరులకు ఇందుకోసం వాడుకున్నాడు. బాల్యం, విద్యాభ్యాసం ఈయన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఒక సాంప్రదాయ చిత్‌పవన బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ప్రసిధ్ధ ప్రచురణలు thumb|ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే టౌను హాలు; కాణే తన పరిశోధనలకు ఇక్కడి వనరులను వాడారు. హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర (ధర్మశాస్త్రం చరిత్ర) అను ఉద్గ్రంథాన్ని రచించినందుకు డా. కాణే పేరు పొందారు. ఏన్షెంట్ అండ్ మిడీవల్ రెలిజియన్స్ అండ్ సివిల్ లా ఇన్ ఇండియా (భారతదేశముయందలి ప్రాచీన, మధ్య తరపు మతవిశ్వాసములు, వ్యవహార చట్టము) అను ఉపశీర్షికతో ఈ పుస్తకం ప్రచురింపబడింది. శతాబ్దాలుగా వెలువడిన పలు తాళపత్రగ్రంథాల మొదలు పుస్తకాల వరకు పరిశోధించిన డా. కాణే ఈ పుస్తకము ద్వారా భారతదేశముయందలి ప్రాచీన, మధ్య తరాలలో న్యాయవర్తనయొక్క పరిణామక్రమము గురించి తెలియజేసెను. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే, భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రఖ్యాత సంస్థలలో లభ్యమయిన వనరులను డా. కాణే తన పరిశోధనలో ఉపయోగించారు. ఆరువేల అయిదువందల పుటల పైబడి ఉన్న ఈ గ్రంథము ఐదు సంపుట్లలో ప్రచురితమయ్యింది; మొదటి సంపుటి 1930లో ప్రచురింపబడగా చివరి సంపుటి 1962లో ప్రచురింపబడింది. ఈ గ్రంథము విషయవైశాల్యము, లోతైన పరిశోధనలకు పేరు పొందినది - డా. కాణే మహాభారతం, పురాణాలు, చాణక్యుడు వంటి విభిన్న దృక్పథాల రచనలను సంప్రదించడమే కాక, అప్పటివరకు జనసామాన్యానికి తెలియని ఎన్నో పుస్తకాలను సంప్రదించారు. ఈ గ్రంథ వైశిష్ట్యము ఆయన సంస్కృత భాషా ప్రావీణ్యానికి ఆపాదించబడింది. పురాణాలు మున్నగు గ్రంథాలను పూజాభావముతో కాక అపేక్షాభావముతో పరిశోధించినందువలనే ఆయన కృతార్థులయ్యారని ఒక భావన. వ్యవహారమయూఖ అను పుస్తకరచనలో భాగంగా, చదువరులకు ఉపయుక్తముగా ఉండుటకు ధర్మశాస్త్రచరిత్ర గురించి ఒక ముందుమాట వ్రాయడానికి కాణే పూనుకున్నారు. కాలక్రమంలో ఆ బీజం మహావృక్షమై హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్రగా రూపు దిద్దుకుంది. ఈ ఉద్గ్రంథాన్ని ఆంగ్లభాషలో రచించినప్పటికీ, "ధర్మ" అను పదానికి సరిసమానమైన అర్థం ఇవ్వగల పదమేదీ ఆంగ్లభాషలో లేదని కాణే అభిప్రాయపడ్డారు. ఆంగ్ల, సంస్కృత, మరాఠీభాషలలోని ఆయన రచనలు దాదాపు పదిహేనువేలపుటలదాకా ఉన్నాయి. గుర్తింపు ఆచార్య కాణే "మహామహోపాధ్యాయ" బిరుదుతో గుర్తింపబడ్డారు. ఆయన బొంబాయి విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. భారతీయత్వ విద్యకై (Indology or Indic studies: ఇండాలజీ లేక ఇండిక్ స్టడీస్) నెలకొల్పబడిన కురుక్షేత్ర విశ్వవిద్యాలయం స్థాపనకై ఆయన సేవలు వినియోగించుకోబడినాయి. 1956లో ఆయన పరిశోధనాగ్రంథం అయిన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర వాల్యూమ్ IVకు (ధర్మశాస్త్రం చరిత్ర నాల్గవ సంపుటి) సంస్కృతానువాదం విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన భారతీయ విద్యా భవన్లో గౌరవసభ్యునిగా ఉన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనను రాజ్యసభ సభ్యునిగా నియమించింది. 1963లో సర్వోత్తమమైన భారతరత్న అవార్డుతో ఆయన గౌరవించబడ్డారు. ఇతరాలు ప్రజలకు హక్కులే గానీ బాధ్యతలు లేవు అన్న తప్పుడు అభిప్రాయం కలుగజేయడం ద్వారా భారత రాజ్యాంగము దేశములోని సాంప్రదాయిక ఆలోచనలను ప్రక్కన పెట్టిందని కాణే అభిప్రాయపడ్డారు. ఆయన ఉద్గ్రంథముయొక్క సాధికార ప్రవృత్తి వలన, విజ్ఞాన సర్వస్వమువలె వైశాల్యము కలిగియుండుట వలన, పెక్కుమార్లు అది రాజకీయచర్చలలో చోటుచేసుకున్నది. అటువంటి ఒక సందర్భము అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వ హయాములో చోటుచేసుకుంది: ప్రాచీన భారతీయులు గోమాంసము భుజించెడివారా, లేదా అను అంశముపై రెండు వర్గాలవారూ తమ వాదనను బలపరుచుకోవటానికి కాణే పుస్తకాలలోని వివిధ భాగాలను ఉటంకించారు. సాంప్రదాయికముగా హిందువులు ఆవులను గోమాతగా పూజించుట వలన గోమాంసము వారికి నిషిధ్ధము; అందువలన ఈ వాదోపవాదములు మిక్కిలి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అటులనే ఇంకొక సందర్భములో యజ్ఞోపవీతధారణ అవకాశము నేడు కేవలము పురుషులకే లభ్యమయినప్పటికీ పూర్వకాలములో మహిళలు కూడా యజ్ఞోపవీతం ధరించేవారా, లేదా అన్న అంశము పై కాణే రచనలను ప్రామాణికముగా తీసుకుని వాదన జరిగింది. స్మరణ 1974లో కాణే జ్ఞాపకార్ధంగా ప్రాచ్యశాస్త్ర విద్యలో (Oriental studies: ఓరియంటల్ స్టడీస్) పరిశోధనను పెంపొందించి, ప్రోత్సహించి, పోషించే నిమిత్తం, ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే వారు మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే ఇన్స్టిట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ రిసర్చ్ను (మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే స్నాతకోత్తర విద్య, పరిశోధనా సంస్థ) నెలకొల్పారు. అంతేగాక, ప్రతి మూడు సంవత్సరములకు ఒక మారు, వైదిక, ధర్మశాస్త్ర, అలంకార సాహిత్యాలలో విశేష కృషిని కనపరిచిన ఒక పరిశోధకునికి మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే స్వర్ణ పతకము ఇవ్వబడుతోంది. మూలాలు (ఆంగ్లములో) మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే పై ఒక వ్యాసము హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఐదు సంపుటిల ప్రచురణ సంవత్సరాలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి భారతీయ విద్యా భవన్ గౌరవ సభ్యత్వం గురించి మహామహోపాధ్యాయ డా. పి. వి. కాణే ఉద్గ్రంథ పరిణామక్రమము భారత రాజ్యాంగము - దేశములోని సాంప్రదాయిక ఆలోచనలు ఒక వాదన: ప్రాచీన భారతీయులు గోమాంసము భుజించెడివారు - డా. పి. వి. కాణే ప్రచురణల నుండి ఋజువులు ఒక వాదన: ప్రాచీన భారతీయులు గోమాంసము భుజించెడివారు కారు - డా. పి. వి. కాణే ప్రచురణల నుండి ఋజువులు డా. కాణే గురించి (విభాగము 2.2) (జర్మను సైటు, డా. కాణే గురించి ఆంగ్లములో) ధర్మశాస్త్ర సాహిత్యము - కాణే కాలక్రమ వర్గీకరణ (వ్యాసము చివరలో ఇవ్వబడినది) (జర్మను సైటు, కాలక్రమ వర్గీకరణ ఆంగ్లములో) మూలాలు వర్గం:1880 జననాలు వర్గం:1972 మరణాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు వర్గం:ఈ వారం వ్యాసాలు
ఇందిరా గాంధీ
https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.Gandhi, Indira. (1982) My Truth మోతీలాల్ నెహ్రూ పేరుమోసిన న్యాయవాది. సంపదలకు నెలవైన ఆ ఇంటికి మోతీలాల్ ఇంగ్లీషు స్నేహితులు (బ్రిటిష్ వారు), స్వదేశీ స్నేహితులు వస్తూ పోతూ ఉండేవారు. అతని కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ, కోడలు కమలా నెహ్రూ. కమలా నెహ్రూ సాంప్రదాయక కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం వల్ల అత్తవారింటికి అలవాటు పడటానికి మొదట్లో కొంచెం ఇబ్బంది పడింది. మోతీలాల్ కుటుంబంలోని వారు నవీన సంప్రదాయానికి అలవాటు పడినవారు. ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమె మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. మోతీలాల్‌కు మనుమరాలంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయన నేషనల్ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అయినా తన వృత్తిని వదలలేదు. 1919లో పంజాబ్ లోని వైశాఖీ పండుగ జరుగుతున్న తరుణంలో బ్రిటిష్ వారు జలియన్ వాలా బాగ్‌లో జరిపిన మారణకాండలో కొన్ని వేలమంది బలయ్యారు. ఈ సంఘటన మోతీలాల్ హృదయాన్ని కదిలించి వేసింది. వెంటనే తన వృత్తిని వదిలిపెట్టాడు. తన వద్ద ఉన్న ఖరీదైన విదేశీ వస్తులనన్నింటినీ తగులబెట్టాడు. ఖద్దరు దుస్తులను మాత్రమే ధరించడం మొదలు పెట్టాడు. తన కుమార్తెకు కాన్వెంట్ స్కూలు మానిపించాడు. ఇలాంటి తరుణంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వారి ఇంటికి వచ్చాడు. నెహ్రూతో చాలా సేపు మాట్లాడాడు. ఇందిరకు వారు మాట్లాడుకున్నది ఏమిటో అర్థం కాకపోయినా ఇంటిలో జరిగే మార్పులకు ఒక చిన్ని ప్రేక్షకురాలిగా ఉంది. అది మొదలు వారి ఇల్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వీరులకు తమ కార్యక్రమాలను రూపొందించుకునే కేంద్రంగా మారింది. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ స్వాంతంత్ర్యం కోసం కదనరంగంలోకి దూకారు. చిన్నారి ఇందిర సైతం తన విదేశీ బొమ్మలను వదిలివేసింది. ఇప్పటి దాకా భోగ భాగ్యాలకు అలవాటు పడిన నెహ్రూలు కష్టాలను కోరి ఆహ్వానించినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వతంత్ర భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. బాల్యం ఇందిర తొలి పేరు ప్రియదర్శిని ఇందిర. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి. తాత మోతీలాల్ నెహ్రూ కూడా అలహాబాదులో పేరుపొందిన న్యాయవాదే కాకుండా జాతీయోద్యమ నాయకులలో ప్రముఖుడు. ఇందిర పుట్టేసరికి భారతదేశమంతా ఆంగ్లేయుల పాలనలో ఆర్థికంగాను, సామాజికంగాను అనేక సమస్యలతో అల్లకల్లోలంగా ఉంది. ప్రతీ ఒక్కరూ వారి పాలనకు వ్యతిరేకిస్తున్నారు. వారిలో సమైక్యతను తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన అవసరం వచ్చింది. దీనికి శరీరంలోని ప్రతీ అవయవంలోనూ దేశభక్తి నిండిన నాయకులు కావాలి. బాల గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, సరోజినీ నాయుడు, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి నాయకులు ఈ పనికి పూనుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ స్వాతంత్ర్య పోరాట సమయంలో కారాగారానికి వెళ్ళవలసి వచ్చేది. అటువంటి సమయంలో చిన్నారి ఇందిరకు ఆమె తాతగారైన మోతీలాల్ నెహ్రూ తోడుగా ఉండేవారు. మోతీలాల్ కూడా కారాగారానికి వెళ్ళవలసి వచ్చినపుడు ఆమెకు తోడు ఎవరూ లేక ఒంటరితనాన్ని అనుభవించేది. ఒక చిన్నారి తన ఎదురుగా జరిగే సంఘటనలను బట్టి తన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటుంది. తాను ఆడుకొనే ఆటలు సైతం ఆ సంఘటనలకు అనుగుణంగా ఉండేవి. ఇందిర తాను ఆడుకునే ప్రతీ ఆటలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడే ఒక దేశభక్తురాలిగానే తనను ఊహించుకుంటూ ఆడుకొనేది. ఆమె ఆటలు ఆమెలో దేశభక్తిని ఎంత బాగా నింపాయంటే ఆమె స్వాతంత్ర్య పోరాటంలో చిన్నతనంలోనే తనతోటి వారితో కలసి పాల్గొనేలా చేసాయి. వానర సేన స్వాతంత్ర్య పోరాట సమయంలో నాయకులకు బ్రిటిష్ వారు తమని ఏ క్షణాన అరెస్టు చేస్తారో తెలిసేది కాదు. కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎప్పుడు దాడి చేస్తారో కూడా తెలిసేది కాదు. ఒకరి నుండి ఒకరికి వార్తలు చేరటం కష్టంగా ఉండేది. అటువంటి సమయంలో ఇందిర తన స్నేహితులతో కలసి "వానర సేన"ను ఏర్పాటు చేసింది. వారు వార్తలను చేరవేయడం, జెండాలను తయారుచేయడం పోలీసుల చర్యలపై గూఢచర్యం చేయడం వంటి పనులను చేసేవారు. ఈ వానరసేనకు ఇందిర నాయకత్వం వహించి చెయ్యవలసిన పనులను వారికి నిర్దేశిస్తూ ఉండేది. "మనం పిల్లలమైనా స్వాతంత్ర్యం కోసం మనవంతు కృషి చెయ్యాలి". అని తోటి పిల్లలకు చెప్తూ ఉండేది. గాంధీజీ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు ఆయన పక్కనే కూర్చుని తమ పిల్లల మద్దతు ఆయనకుందని తెలియజెప్పేది. ఆమె విద్యార్థినిగా ఉన్న సమయంలో తన తల్లిదండ్రులు, గాంధీజీ మొదలైన కాంగ్రెస్ నాయకులు ఉన్న కారాగారాలకు వెళ్ళి వారిని చూసి వచ్చేది. ఇందిర వయసులో చిన్నదైనా భారతదేశపు చరిత్రను, స్వాతంత్ర్య పోరాటం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. ఆమె తండ్రి నెహ్రూ తన బిడ్డకు లోకజ్ఞానం గురించి తెలియజెప్పవలసిన సమయంలో ఎక్కువ కాలం కారాగారములో ఉండటం వలన ఇందిరకు ఏమీ నేర్పే అవకాశం లేదని ఆలోచించి కారాగారము నుండే ఆమెకు భారతదేశ సంస్కృతి గురించి, భారతదేశ చరిత్ర గురించి, ప్రపంచ చరిత్ర గురించి ఉత్తరాలను రాసేవారు. ఆయన తన కుమార్తె ఇందిరను ప్రియదర్శిని అని పిలిచేవాడు విద్యాభ్యాసం, తల్లి మృతి పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణురాలయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లో చేరింది. అక్కడ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. తరచుగా కారాగారానికి వెళ్ళడం మూలాన కమలా నెహ్రూ ఆరోగ్యం చెడిపోయింది. ఆమెను చికిత్స కోసం స్విట్జర్లాండ్ తీసుకువెళ్ళారు. తల్లికి తోడుగా ఆమె అక్కడే ఒక బడిలో చేరింది. ఎంత చికిత్స చేయించినా కమలా నెహ్రూ ఆరోగ్యం కుటుదపడలేదు. పైగా అంతకంతకూ క్షీణించింది. ఇందిరకు పదిహేడు సంవత్సరాల వయస్సు వచ్చేటప్పడికి ఆమె ఎంతో అభిమానించే తల్లి మరణం ఆమెను ఒంటరిని చేసింది . తల్లి మరణం వలన ఏర్పడిన ఒంటరితనం నుండి ఆమె త్వరగా కోలుకోవాలంటే ఆమె ఐరోపాలోనే చదవాలని నెహ్రూ నిర్ణయించాడు. అక్కడ ఆమె చదువు ఆమెకు మనోధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో నిర్మించుకుని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుందని నెహ్రూగారి ఆశయం తండ్రి ఆశయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఇందిర కూడా నిర్ణయించుకుంది. పశ్చిమ విద్యను అభ్యసిస్తూ ఆమె తనలోని సంకోచాన్ని, ఒంటరితనాన్ని వదిలించుకుంది. లండన్లో ఎక్కువ రోజులు గడిపింది. ఇంగ్లండు లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాలలో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది.Frank, Katherine. (2001) Indira: The Life of Indira Nehru Gandhi. ఆ తర్వాత లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే, పాత్రికేయుడు ఫిరోజ్ గాంధీతో స్నేహం ఏర్పడింది. ఫిరోజ్ తో స్నేహం ఆమె ఒంటరితనాన్ని పోగొట్టింది. వివాహం ఫిరోజ్ తో పరిచయము క్రమంగా పరిణయానికి దారి తీసింది. ఫిరోజ్ గాంధీ నెహ్రూ కుటుంబానికి తెలిసినవాడు మాత్రమే కాదు స్నేహితుడు కూడా. ఇందిరకు అతని వ్యక్తిత్వం బాగా నచ్చింది. అతడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఫిరోజ్ పూర్వీకులు పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చి స్థిరపడ్డారు. వారు పార్సీలు. నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. అందువల్ల ముందు నెహ్రూ వీరి వివాహానికి అంగీకరించలేదు. నెహ్రూ ఇందిర నిశ్చయాన్ని విని గాంధీ సలహాని తీసుకోవాల్సిందిగా ఇందిరను కోరాడు. గాంధీ వీరి ప్రేమను అర్థం చేసుకుని వారి వివాహానికి అంగీకరించాల్సిందిగా నెహ్రూను కోరాడు. మహాత్మా గాంధీ ఒప్పించడంతో 1942లో ఇందిర, ఫిరోజ్ ల వివాహం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలయింది. జవహర్‌లాల్ నెహ్రూ కారాగారం నుండి విడుదల అవుతూనే మళ్ళీ అరెస్టు అయ్యారు. గాంధీజీ కూడా అరెస్టు అయ్యారు. అరెస్టుకు నిరసనగా దేశమంతా సమ్మెలు జరిగాయి. అయితే బ్రిటిష్ వారు పోలీసు బలంతో సమ్మెలను అణచివేసారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టు అయి కారాగారానికి వెళ్ళి 1943 మే 13 న విడుదలైంది.Frank, Katherine. (2001) Indira: The Life of Indira Nehru Gandhi. Page 186 కారాగారంలో ఉండగానే ఆమె ఒక మగ పిల్లవాడికి తల్లి అయింది. ఆ పిల్లవాడికి రాజీవ్ అని పేరు పెట్టింది. పెళ్ళి జరిగినది మొదలు అరెస్టు అయ్యి, విడదలయ అయ్యేలోపు ఆమెలో జాతీయ భావం పెరిగి పెద్దయ్యింది. దేశం కోసం పనిచేయాలి అనే తపన మొదలయింది. రాజీవ్ గాంధీకి రెండు సంవత్సరాల వయసు ఉండగా వారు లక్నో బయలుదేరి వెళ్లారు. అక్కడ నేషనల్ హెరాల్డు పత్రికా సంపాదకునిగా ఫిరోజ్ గాంధీ పనిచేసేవాడు. రాజీవ్ గాంధీకి తమ్ముడు సంజయ్ గాంధీ జన్మించాడు. భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితుడిగా మెలగింది. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్ లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడూ ఇందిర తండ్రి తరఫున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ, నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా బీమా కుంభకోణాన్ని బయటపెట్టాడు. తత్ఫలితంగా అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేయవలసి వచ్చింది. రాజకీయ జీవితానికి శ్రీకారం ఇందిర ఎన్నో సంవత్సరాలపాటు నెహ్రూగారి వెనుకనే ఉన్నా, అనుకోని విధంగా తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టింది. ఇది ఆమె ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోను, తండ్రి రాలేక పోయిన సభలలో ఆమె మాట్లాడవలసి వచ్చేది. ఆమె ఉపన్యాసం, ముఖ్యంగా ఖంగుమని మోగే కంఠస్వరం, సామాన్యులలో కలసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేవి. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2 న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సెప్టెంబరు 8న ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మరణించాడు. ఇది ఆమెలో అభద్రతా భావాన్ని కలుగజేసింది. అయితే పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వహించడం, భర్త మరణం వలన ఏర్పడిన ఒంటరితనం ఆమె మౌనాన్ని పెంచడంతో పాటు, ఆమెకు జీవితం పట్ల అవగాహనను, ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది. నెమ్మదిగా నెహ్రూగారి స్నేహితులతోను, రాజకీయ నాయకులతోనూ సంభాషణలలో పాల్గొనడం ప్రారంభించింది. తేజ్‌పూర్ యాత్ర 1962 చివరిలో చైనా భారత సరిహద్దుపై వివాదం చెలరేగి అస్సాంలో తేజ్‌పూర్ చైనా దాడికి గురయ్యింది. అటువంటి సమయంలో ఆర్మీ ఛీఫ్ హెచ్చరికను గానీ, స్నేహితుల మాటలను గానీ, తండ్రి చెప్పినది గానీ, వినకుండా అస్సామీలకు ధైర్యాన్నిచ్చి, వారిని కష్టాలకు వదిలి వెయ్యమనే నమ్మకాన్ని వారికి ఇవ్వడానికి ఇందిరా ఒంటరిగా తేజ్‌పూర్ ప్రయాణం చేసి వెళ్ళారు. చైనా వారు వెనక్కి తగ్గేదాకా తాను తేజ్‌పూర్ వదలనని వారి వెన్నంటి ఉంటానని అక్కడి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. అయితే ఆమె వచ్చిన రోజే చైనావారు వారి సేనలను ఉపహరించుకోవడం మొదలుపెట్టారు. చైనా సమస్య వల్ల నెహ్రూ చాలా అలసటకు, ఒత్తిడికి గురి అయ్యాడు. రాజకీయ వర్గాలలోనూ, ప్రజలలోనూ నెహ్రూ పట్ల వ్యతిరేకత మొదలయ్యింది. ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చెయ్యడం మొదలుపెట్టారు. నెహ్రూకు వీటికి ప్రతిగా చర్యలను చేపట్టేందుకు శక్తిగానీ, ఆసక్తి గానీ లేకపోయింది. ఇందిర తండ్రి పరిస్థితిని గమనించింది. నెహ్రూ తన వద్దకు వచ్చేవారి సమస్యల పరిష్కారానికి, కొన్ని కఠినమైన విషయాల పరిష్కారానికి ఇందిర సహాయం తీసుకోవడం ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె తీసుకున్న చర్యలు, ఆమె పద్ధతి, పట్టుదల నెహ్రూకి ఆమె నాయకత్వం పట్ల, ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి. కామరాజ్ ప్లాన్ 1963లో కామరాజ్ ప్లాన్ కు ఇందిర మద్దతు తెలిపింది. దీని ప్రకారం వయసు ముదిరిన వారు రాజీనామా చేసి యువకులకు అవకాశమివ్వాలి. ఎందరో సీనియర్ నేతలను రాజీనామా చేయవలసినదిగా కోరారు. మొట్టమొదటిగా జవహర్‌లాల్ నెహ్రూ తాను ప్రధాని పదవికి రాజీనామా చెయ్యబోతున్నట్లుగా ప్రకటించారు. ఎవరైతే నెహ్రూని పదవిని నుండి తప్పించాలని అనుకున్నారో వారే రాజీనామాకు అంగీకరించలేదు. నెహ్రూని పదవిలో కొనసాగించవలసినదిగా కోరారు. 1963 ఆగస్టు 25న పదకొండు మంది సీనియర్ నేతలు పార్టీ నుండి వైదొలగారు. కామరాజ్ పార్టీ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఎంతో పకడ్బందీగా వ్యూహం పన్ని పార్టీలో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇందిరాగాంధీ రాజకీయంగా ఎదగడానికి ఇది ఒక సువర్ణావకాశం. నెహ్రూని అంటిపెట్టుకుని, ఆయనకు తానొక సంరక్షకురాలిగా మారి, ఆయనకు అవసరమైన వేళ తన యుక్తితో తన శక్తిని నిరూపించిన గొప్ప మేథావి, రాజకీయవేత్త ఇందిరాగాంధీ. ఒకే ఒక దెబ్బతో నెహ్రూని ఎదురు నిలిచిన రాజకీయ నాయకులనందరినీ మట్టి కరిపించారు. ఆమె నాయకత్వాన్ని సమర్థించేవారు రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్నారు. ఇది ఎంత సువర్ణావకాశమైనా ఆమె దానిని సంపూర్ణంగా వినియోగించుకోలేకపోయింది. "కామరాజ్ ప్లాన్" అమలులోకి తీసుకువచ్చిన కొన్ని నాళ్లకే నెహ్రూ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆమె తండ్రికి సపర్యలు చేస్తూ తండ్రి వద్దే ఉండిపోయింది. 1964 జనవరి 6న నెహ్రూగారికి పక్షవాతం వచ్చింది. అప్పుడు భువనేశ్వర్ లో 68వ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. నెహ్రూ ఆరోగ్యం మీద నమ్మకం కుదరక కొంతమంది నేతలు ప్రధాని పదవికి పోటీ పడటం మొదలుపెట్టారు. కొంతమంది శ్రేయోభిలాషులు నెహ్రూ వారసుడిని ప్రకటిస్తే బాగుంటుందని సూచించారు. ఆ అవసరం లేదని, తనకేం కాదని, తనకు స్వస్థత చేకూరుతుందని త్వరలో తాను మరలా హుషారుగా తిరగగలుగుతానికి వారికి నెహ్రూ చెప్పాడు. అయితే 1964 మే 27న జవహర్ లాల్ నెహ్రూ తుదిశ్వాస విడిచాడు. కేంద్ర మంత్రిగా.. నెహ్రూ మరణం తరువాత లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధాని పదవిని అధిష్టించాడు. శాస్త్రిగారు ఇందిరా గాంధీని ప్రధానిగా ఉండమని కోరాడు. అయితే నెహ్రూకు ఆఖరి దశలో ఏర్పడిన వ్యతిరేకత తనను రాజకీయంగా ఎదగనివ్వదని తెలిసిన ఇందిరా గాంధీ శాస్త్రిగారి ప్రతిపాదనను వెంటనే తిరస్కరించింది. శాస్త్రిగారు ఆమె ఏ మంత్రిత్వ శాఖనైనా నిర్వహించాలని మరీ మరీ కోరగా, కొంత అయిష్టంగానైనా అందుకు అంగీకరించింది. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. దక్షిణ భారతదేశంలో గొడవలు జరిగాయి. బలవంతంగా హిందీ భాషను వారిపై రుద్దాలని నేతలు నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా దక్షిణ భారత ప్రజలు సమ్మెను మొదలుపెట్టారు. ఇందిర తానే వెళ్ళి అక్కడివారికి హిందీ బలవంతంగా వారిపై రుద్దమని, ఇష్టమైన వారే ఆ భాషను చేర్చుకోవచ్చని ప్రభుత్వం తరపున వారికి హామీ ఇచ్చి వారిని శాంతింపజేసింది. ప్రధానమంత్రిగా 1964 లో ప్రధాని పదవిని చేపట్టిన శాస్త్రిగారు తాష్కెంట్ నగరంలో 1966 జనవరి 10న గుండెపోటుతో మరణించాడు. గుల్జారీలాల్ నందా కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవి నిర్వహించాడు. శాస్త్రి తరువాత ప్రధాని ఎవరన్న ప్రశ్న పార్టీలో తలెత్తింది. మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా మొదలైన మహామహులంతా ఇందిరాగాంధీకి ప్రత్యర్థులుగా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. చివరకు మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ పోటీలో మిగిలారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ ఇందిరాగాంధీకి తన మద్దతు తెలిపాడు. అతని మద్దతుకు కారణం - ఆమె ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పరిచయాలను కలిగి ఉండటమే కాక వారి మధ్యనే పెరగడం, అనేక దేశాలను చూడడమే కాక, ఎంతో మంది ప్రపంచ నేతలతో పరిచయాలను కలిగి ఉండటం, రాష్ట్ర, కుల, మతాలకు అతీతంగా నవీన భావాలను కలిగిన ఆమె ఆదర్శం. ఆమె 1966 జనవరి 24న మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించింది. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్ని చేపట్టలేదు. ఇందిర ప్రధానమంత్రి అయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఏమంత సజావుగా లేవు. అంతర్గత కుమ్ములాటలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీలో మొరార్జీ దేశాయ్ లాంటి వారు అసమ్మతివాదులుగా తమ గళాన్ని వినిపించారు. ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ ను అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి కామరాజ్ మద్దతుతో సిండికేట్ సహాయంతో 355-169 ఓట్లతో ఓడించి దేశ 3వ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది. మొరార్జీ దేశాయ్ ఇందిరను మూగ బొమ్మ (గూంగీ గుడియా) గా అభివర్ణించాడు. అయితే అది సరైనది కాదని ఇందిర మున్ముందు తన చర్యల ద్వారా నిరూపించుకుంది. ఆమె ధైర్యం, సమయస్ఫూర్తితో చర్యలు గైకొనే రీతి, ఆమెను ఎన్నో సంవత్సరాలు ప్రధాని పదవిలో ఉండేటట్లు చేసాయి. ఆమె ప్రధాని పదవిని చేపట్టేవరకు ఆమె తన చర్యలను తన ఆలోచనలను బహిరంగపరచలేదు. స్త్రీ శక్తిని తక్కువగా అంచనావేసే ఆ రోజుల్లో ఒక మహిళ ప్రధానమంత్రిగా అంత పెద్ద దేశాన్ని, అంతమంది ప్రజలను, తనకున్న తక్కువ అనుభవంతో ఎలా పరిపాలిస్తుందో ప్రపంచం మొత్తం గమనిస్తోంది. వారందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆమె కొద్ది కాలంలోనే తన సమర్థతను నిరూపించుకుంది. ఆమె ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన కొత్తలోనే అధికార యంత్రాంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించింది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కొత్త పద్ధతులను చేపట్టబోతున్నట్లు, ఇది పాత సాంప్రదాయ పద్ధతులకు, నవీన భావాలు గల యువతరానికి జరిగే పోరాటంగా ఆమె చెప్పింది. సామాన్యుని అండ రాజకీయనేతలకు ఎంత ముఖ్యమో ఆమెకు తెలుసు. అందుకే తాను కార్యాలయానికి వెళ్ళే ముందు దేశం నలుమూలల నుండి తనను కలవడానికి వచ్చే ఎంతో మంది ప్రజలను కలసి వారి సమస్యలను వినేది. వారిచ్చే వినతులను స్వీకరించేది. వాటిని అంతటితో వదిలెయ్యకుండా వాటికి తగ్గ చర్యలను తీసుకోవల్సిందిగా వెంటనే ఆదేశాలిచ్చేది. ప్రపంచ నేతల గుర్తింపు సిక్కుల కోరిక మేరకు వారికి పంజాబ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటుకు ఒప్పుకోని కొంతమంది తిరుగుబాటు చెయ్యగా దానిని ఆమె అణచివేసింది. దేశంలో కరువు కాటకాలు ఎక్కువగా ఉండటంతో ఆమె ఆహార ధాన్యాల దిగుమతిపై దృష్టి సారించింది. పేదరికాన్ని నిర్మూలించడానికి ఆమె నడుం కట్టింది. వీటి మీదే ఆమె దృష్టిని కేంద్రీకరించింది. పశ్చిమ దేశాల సహాయంతోను, ప్రపంచ బ్యాంకు సహాయంతోను దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని ఆమె ఆశించింది. అందుకే ఆమె అమెరికా ప్రయాణమయింది. మధ్యలో పారిస్ లో ఆగి అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఛార్లెస్ డిగాలేని కలిసింది. స్త్రీల శక్తి సామర్థ్యాల మీద ఏ మాత్రం నమ్మకం లేని ఛార్లెస్ ఇందిరాగాంధీతో మాట్లాడాక, "స్త్రీలలో ఇంతటి శక్తి సమర్థ్యాలు ఉంటాయని నేనూహించలేదు. ఆమెలోని సామర్థ్యం చూసిన వారికి ఆశ్చర్యం కలుగక మానదు. ఆమె ఏమైనా సాధించగలదు." అని వ్యాఖ్యాంచించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్‌ను, రష్యా ప్రధాని అలెక్సి కోసిజిన్ తోను, ప్రపంచ బ్యాంకు అధికారులతోను, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధికారులతోను చర్చలు జరిపింది. ఆ చర్చలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. ఆమె భారత దేశ గౌరవానికి, ఉన్నతికి ఏ మాత్రం భంగం కలుగకుండా మాట్లాడిన తీరు, ఆమె కనబరచిన రాజకీయ పరిపక్వత, చురుకుదనం అందరినీ ఆకట్టుకుంది. మొరార్జీ దేశాయ్ని సంతృప్తి పర్చడానికి ఉప ప్రధానమంత్రి, కీలకమైన ఆర్థిక మంత్రి పదవులను ప్రసాదించింది. అంతర్గత పోరాటాల ఫలితంగా 1967 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవాల్సివచ్చింది. ఆమె మాత్రం విజయం సాధించింది. దీనికి అసలు కారణం ఆమె సామాన్యునికి దగ్గరగా ఉండటం. మరలా ప్రధాని పదవికి పోటీ ఏర్పడింది. ఓడినవారు కూడా వ్యాపారవేత్తలు. కొంతమంది జమీందారీ కుటుంబాలకు చెందిచవారి అండాతో ప్రధాని పదవికై పోటీ పడ్డారు. అయితే బరిలో చివరికి ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ లు మిగిలారు. ఆమె తన తెలివితేటలతో ఆయనని పోటీ నుండి విరమింపజేసింది. ఆమె ప్రధాని అయింది. మొరార్జీ దేశాయ్ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. అంతే కాక ఆమె నేతృత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించింది. ప్రధానిగా రెండవసారి ఆమె ప్రధాని పీఠాన్ని రెండవసారి అలంకరించింది. అప్పటి అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్నన్ గారి పదవీకాలం పూర్తి కావచ్చింది. కాంగ్రెస్ వారు మరలా అతనినే ఆ పదవిలో నిలబెట్టాలని అనుకున్నారు. కానీ ఇందిర అప్పటి ఉపాధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ ను అధ్యక్షునిగా పదవికి ప్రతిపాదించింది. ప్రతిపక్షాల వారు ప్రధాన న్యాయమూర్తి సుబ్బారావుగారిని ప్రతిపాదించారు. జాకీర్ హుస్సేన్ ఓటమి తనకు పెద్ద దెబ్బ అవుతుందని తెలిసీ, ఆమె అందుకు సిద్ధపడింది. ఆమె అంచనాలు ఎప్పుడూ తలకిందులవ్వలేదు. జాకీర్ హుస్సేన్ పోటీలో నెగ్గాడు. ఇజ్రాయిల్, అరబ్బు దేశాలకు మధ్య తగవులు వచ్చినప్పుడు ఇందిర అరబ్బుల పట్ల తన సానుభూతిని వెలిబుచ్చడం అమెరికా తదితర అభివృద్ధి చెందిన దేశాలకు ఆగ్రహం తెప్పించింది. అయినా ఆమె వెరవలేదు. తన పద్ధతులను, ఆలోచనా పంథాను మార్చుకోలేదు. ఎవరికీభయపడని మనస్తత్వం ఆమెది. ఆరెండు దేశాల మధ్య యుద్ధం దేనికైనా దారి తీయవచ్చని, ప్రపంచ యుద్ధమే సంభవించవచ్చని, మన దేశ పరిస్థితి దృష్ట్యా మన ఆసియా ఖండంలో, శాంతి సుస్థిరత అవసరమని ఆమె ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో తెలియజేసింది. 1969లో జాకీర్ హుస్సేన్ మరణం ఆమెకు సవాల్‌గా మారింది. ఆమె వ్యతిరేకులు ఆమెను ఎలాగైనా గద్దె దించాలనే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని అధ్యక్ష పదవికి పోటీలో పెట్టారు. కానీ, ఇందిరా గాంధీచే ప్రతిపాదించబడ్డ చేయబడ్డ వి.వి.గిరి పోటీలో నెగ్గి అధ్యక్షుడయ్యాడు. మొరార్జీ నుండి ఆర్థిక శాఖను వెనక్కి తీసుకోవడమే కాక 1969లో బ్యాంకులను జాతీయం చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించడం వి.వి.గిరి గెలుపుకు కారణం కావచ్చు. మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసాడు. కాంగ్రెస్ లో చీలిక బ్యాంకుల జాతీయకరణం ద్వారా ప్రజల మన్ననలనందుకున్న ఇందిర, పార్టీలో మాత్రం శత్రువుల సంఖ్యను పెంచుకుంది. జరుగుతున్న, జరిగిన సంఘటనలతో నష్టపోయిన కొంతమంది నాయకులు, ఆమె నాయకత్వం సహించలేని మరికొందరు ఆమె పార్టీ నుండి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. కాంగ్రెస్ ఆవిర్భవించిన 100 సంవత్సరాల తరువాత దానిలో చీలిక ఏర్పడింది. ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ ను కాంగ్రెస్ (ఆర్) గాను, రెండవ చీలికను కాంగ్రెస్ (ఓ) గాను గుర్తించారు. ఈ చీలిక వల్ల ఇందిరాగాంధీకి ఆధిక్యం తగ్గడం జరిగింది. ఇందిరపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వారి ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. పార్లమెంటులో మిగిలిన చిన్న పార్టీలు, స్వాతంత్ర్య సభ్యులు ఆమెకు మద్దతునిచ్చారు. ఇది ఆమె దూరదృష్టికి చక్కటి నిదర్శనం. జమీందారీ వ్యవస్థ రద్దుకై ఆమె ప్రవేశపెట్టిన బిల్లు లోక్‌సభలో నెగ్గినా రాజ్యసభలో వీగిపోయింది. అయితే పట్టువదలని ఆమె రాష్ట్రపతి ద్వారా జమీందారీ వ్యవస్థను రద్దు చెస్తున్నట్లుగా అధికార ప్రకటన చేయించింది. ఇది సహించలేని జమీందారులు, కాంగ్రెస్ (ఓ) నేతలు, కొన్ని పార్టీలను కలుపుకొని, వ్యాపారవేత్తలు, వారి మద్దతుతో నడిచే పత్రికల సహాయంతో ఇందిరకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఇందిరా గాంధీ ప్రజల ఓట్లతోనే తన సామర్థ్యాన్ని నిరూపించి తన శత్రువులకు చూపించదలచి, లోక్‌సభను రద్దు చెయ్యవలసినదిగా రాష్ట్రపతికి సిఫారసు చేసింది. 1971 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పటికీ కమ్యూనిస్టుల సహాయంతో అలాగే రెండేళ్ళు పరిపాలించింది. గరీబీ హటావో ఎలాగైనా ఇందిరాగాంధీని పదవీచ్యుతురాలిని చెయ్యాలని ఎత్తులు వేసే నేతలు ఇందిరా హటావో (ఇందిరను తొలగించండి) అనే నినాదంతో ప్రచారం మొదలు పెట్టారు. ఎత్తులకుపై ఎత్తులు వేయగల నేర్పరి ఇందిర "గరీబీ హటావో" (పేదరికాన్ని పారద్రోలండి) అనే నినాదంతో తన ప్రచారాన్ని నిర్వహించింది. నలభై మూడు రోజుల పాటు దేశమంతా పర్యటించింది. ముప్పై ఆరు వేల మైళ్ల పర్యటనలో మూడు వందల సభలను నిర్వహించి కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకుంది. ఆమెను చూసిన ప్రజల కళ్ళు ఆనందంతో మెరిసాయి. వారందరి దృష్టిలోనూ అమే వారి కోసం పోరాడే ఒక గొప్ప యోధురాలు. ప్రజలే ఆమె బలం. వారిచ్చే తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని తెలిసినా ప్రత్యక్షంగా వారిని కలసి కాంగ్రెస్ (ఆర్) ను గెలిపించవలసినదిగా కోరింది. మరలా ప్రధాని పదవి ఆమె తిరుగులేని ఆధిక్యతతో గెలిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మూడవసారి ప్రధాని పదవిని చేపట్టింది. ఈ పదవీ కాలంలోనే బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగింది. తూర్పు పాకిస్తాన్‌లో, పశ్చిమ పాకిస్తాన్‌ బలగాలు సృష్టించే అల్లర్లను, అరాచకాలను భరించలేక లక్షలకొద్దీ ప్రజలు భారతదేశంలోకి వలస రావడం మొదలుపెట్టారు. ముక్తి బహిని (తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్యసమరయోధులు) తూర్పు పాకిస్తాన్ విముక్తికై పోరాడుతున్నారు. ఇది 1970 నుండి 71 వరకు జరిగింది. వారికి తన మద్దతును తెలుపుతూ మన దేశ సైన్యాన్ని వారికి అండగా పంపించింది. మనదేశ సైన్య సహకారంతో ముక్తి బహిని విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అంకురార్పణ చేసారు. ఆనాటి తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్. ఈ కాలంలో రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలన కై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 1974లో రాజస్థాన్ ఎడారి లోని పోఖ్రాన్లో అణుపాటవ పరీక్ష చేసి అమెరికా కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన పునాది పడింది. 1971 డిసెంబరు 16న లోక్‌సభలో ఆమె ఈ చారిత్రాత్మక సంఘటన గురించి సగర్వంగా ప్రకటిస్తూ, మనదేశ వాయు, నావిక, ఆర్మీ సేవల శౌర్యానికి, సామర్థ్యానికి దేశ ప్రజల గర్విస్తున్నారని అభినందించింది. ఈ సందర్భంగా ఆమెకు వ్యతిరేకులు, ప్రతిపక్ష నేతలు సైతం లేచి నిలబడి ఆమెను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. ఈ నిర్ణయం, విజయం తనది కాదని దేశ ప్రజలందరిదీ అని ఆమె చెప్పింది. దీనివల్ల ఆమె ప్రజలలో మరింత పేరు తెచ్చుకోవడమే కాక వారందరి దృష్టిలో మరింత ఎదిగింది. కానీ కాలం గడుస్తున్నకొద్దీ ప్రజలలో అసహనం పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో పెద్దగా మార్పు రాకపోవడం, పెరిగిన లంచగొండితనం, ప్రజాజీవన స్థితిగతులలో మార్పు రాకపోవడం వంటివి ప్రజల అసహనానికి కారణాలయ్యాయి. అత్యయిక స్థితి/ అత్యవసర పరిస్థితి 1971లో అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలహాబాదు ఉన్నత న్యాయస్థానం 1975లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఇందిరాగాంధీ అత్యున్నత న్యాయస్థానంలో స్టే ఆర్డర్ తెచ్చుకున్నది. ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు కలిసి ఇందిరకు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి, పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఇందిరకు తమ అవిధేయతను తెలియజేయాల్సిందిగా కోరదలిచారు. ఈ సంగతిని పసిగట్టిన ఇందిర పరిస్థితిని చేజారనీయకుండా అదుపులోకి తీసుకురావాలని ఆలోచిందింది. వారిని అలా వదిలేస్తే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయని, శాంతిని స్థాపించడం కోసం తాను ఎంతటి కఠినమైన చర్యకైనా సిద్ధమని నిరూపిస్తూ ఇందిర దేశామంతటా అత్యయిక స్థితి (emergency)ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న అత్యయిక స్థితిని ప్రకటించారు. అదే రోజు ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుల వ్యూహం. 1975 జూన్ 26న దేశ ప్రజలనందరినీ ఉద్దేశించి రేడియోలోను, దూరదర్శన్‌లోనూ, ఏ మాత్రం ఆవేశపడాకుండా, మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్ వంటి నేతలు అరెస్టు చెయ్యబడ్డారని చెప్పినపుడు ప్రజలందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కారణం అరెస్టు అయిన వారిలో కొందరు ఆమె తండ్రి నెహ్రూతో కలసి పనిచేసారు. కొంతమంది స్వాతంత్ర్య సమరయోధులు. అత్యయిక స్థితిని అమలు చేయడంలో ఆమె అసలు అంతర్యం ప్రజలెవ్వరికీ బోధపడలేదు. చట్టం కఠినంగా అమలు పరచబడింది. విదేశీ పత్రికలకు సంబంధించిన విలేకరులను దేశం వదిలిపెట్టి వెళ్లవలసినదిగా ఆదేశించారు. మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్ వంటి నేతలను అరెస్టు చేసి కారాగారంలో పెట్టలేదు. గృహ నిర్బంధం గావించారు. అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు ఏవైతే ప్రజల శాంతి భద్రతలను భంగం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయో, ప్రజాస్వామ్యాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకొని ఆ ప్రజాస్వామ్యాన్నే భ్రష్టుపట్టించడానికి ప్రయత్నిస్తున్నాయో ఆ శక్తులను అరెస్టు చేసి కారాగారాలలో పెట్టారు. అన్ని పౌర హక్కులను రద్దు చేసి, వేలకొలది ప్రతిపక్ష నాయకులను, విలేకరులను చెరసాలపాలు చేసింది. అత్యయిక స్థితిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించి సమయానికి రావడం జరిగింది. లంచగొండితనం మాయమయింది. మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలు, అత్యాచారాలు జరగడం లేదు. రైళ్ళు సమయానికి నడిచాయి. ప్రజలలో నేరాల పట్ల భయాందోళనలు తగ్గాయి. 20 సూత్రాల పథకం పంచ వర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి చెయ్యాలని నెహ్రూగారి ఆకాంక్ష. కాని, బీదప్రజలు కానీ, మధ్య తరగతికి చెందిన వారు కానీ ఆ ప్రణాళికల ఫలాన్ని సరిగ్గా అందుకోలేక పోయారు. అసలు ఆ ప్రణాళికల ఆశయం నెరవేరడం లేదు. గాంధీ గారి సూత్రాన్ని అనుసరించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వారి కోసం ఇరవై సూత్రాల పథకాన్ని రూపొందించింది. వెట్టి చాకిరీ చట్ట విరుద్ధమని ప్రకటించింది. 20 సూత్రాల పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తానని ఆమె చేసిన ప్రతిజ్ఞను చెల్లించుకోవడమే ఆమె ఆశయం. ఇరవై సుత్రాల పథకాన్ని అమలు చెయ్యాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్రమంత్రులకు సూచించింది. దేశ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడసాగింది. ప్రతిపక్ష నాయకులు అత్యయిక స్థితి పట్ల తమ అసంతృప్తిని వ్యక్తపరిస్తే, అందులో కొందరు నాయకులు దీనిలో విదేశీ హస్తం ఉందని ఆరోపించారు. విదేశాల్లో ఉండి స్వాతంత్ర్య పోరాటానికి సహకరించిన ఎందరో మిత్రులు కూడా ఇందిర చర్యను వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకత ఆమెకు మనశ్శాంతిని దూరం చెయ్యడం మాత్రమే కాక ఆమె ఆరోగ్యాన్ని కూడా కొంచెం పాడు చేసింది. తన భావాలను ఎదుటి వారితో పంచుకునే అలవాటు లేని ఆమె ఇప్పుడు మరింత ఒంటరి అయ్యింది. అంతే కాకుండా 1975 ఆగస్టు 15న బంగ్లాదేశ్ అధ్యక్షుడు హత్యకావించబడటం, ఆమెలో అనేక సందేహాలను రేకెత్తించింది. అందులోనూ అత్యయిక స్థితి వల్ల ఏర్పడిన పరిస్థితుల వల్ల కూడా ఆమెకు సందేహాలు ఎక్కువయ్యాయి. ప్రతివారిని అనుమానించడం, నమ్మకం కోల్పోవడం జరిగింది. ఆ సమయంలో ఆమెకు అండగా ఆమె రెండవ కుమారుడు సంజయ్ గాంధీ నిలిచాడు. సంజయ్ గాంధీ ఇందిర నుండి ధైర్యం, ఓటమిని అంగీకరించని మనస్తత్వం, నిర్ణయత్మక ధోరణిని పుణికిపుచ్చుకున్నాడు. వీటికి అదనంగా తండ్రి నుండి అనుకున్నది సాధించాలనే గుణం, స్నేహతత్త్వం మొదలైనవి వారసత్వంగా అందుకున్నాడు. సంప్రదాయాలకు వ్యతిరేకి. కార్యసాధనే ముఖ్యంగా భావించేవాడు. సాధనా పద్ధతి ఎటువంటిదైనా లెక్కచేసేవాడు కాదు. యువజన కాంగ్రెస్ ను స్థాపించి తమ మద్దతును ఇందిరకు ప్రకటించాడు. అవసరమైన సమయంలో తనకు సహకరించిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు తన కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేసింది ఇందిర. ఇందిర ఓటమి సంజయ్ గాంధీ ఐదు సూత్రాల పథకాన్ని ప్రారంభించాడు. కుటుంబ నియంత్రణ, వరకట్నం, కులాల మీద ఆయన దృష్టి సారించాడు. ఇందిర ఆయనపై విశ్వాసాన్ని పెంచుకుని, అవసరమైన వేళల రాజకీయ విషయాలపై తగు సూచనలు చెయ్యవచ్చని అభిప్రాయపడింది. సంజయ్ గాంధీ చర్యల వల్ల కొంతమంది ఇందిరాగాంధీ అనుచరులు కొన్ని విషయాలలో బాధపడిన సందర్భాలున్నాయి. వారిలో కొందరు సంజయ్ గాంధీ గురించి ఇందిరకు చూచాయగా తెలియజేసారు. కానీ, ఆమె కొట్టి పారేసింది. మరి కొందరు ఆమెకు చెప్తే తాము ఆమె అభిమానానికి దూరమవుతామని భయపడి మిన్నకున్నారు. సంజయ్ గాంధీ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, అత్యయిక స్థితి గురించి సరియైన పత్రికా ప్రచారం లేకపోవడం వంటివి ప్రజలలో ఇందిరమీద అభిమానాన్ని తగ్గించాయి. 1977లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓడిపోయింది. సన్నిహితులు ఆమెను ఎన్నోసార్లు అత్యయిక స్థితి వల్ల కొన్ని దుష్ఫలితాలు ఎదురవుతున్నాయని, ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతోందని, అత్యయిక స్థితి ముగింపును ప్రకటించమని హెచ్చరించారు. ఆమె వినలేదు. అత్యయిక స్థితి ముగీయకుండానే గృహ నిర్బంధంలో ఉన్న నాయకులంతా విడుదల చెయ్యబడ్డారు. 1977 మార్చి 19న ఎన్నికలు నిర్వహించబడతాయని ప్రకటించింది. అత్యయిక స్థితి ఇంకా అమలులో ఉన్నందున పోలింగు సమయంలో అవినీతికి ఆస్కారం ఉండదు. తమకు అనుకూల చర్యలు చేపట్టేందుకు ఆమె వ్యతిరేకులకు సరియైన వ్యవధి లేకపోయింది. 1977లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది. జనవరి 30న జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ వంటి నాయకులు ఊరేగింపు జరిపి ప్రజల వద్దకు వెళ్ళారు. వారిని చాలాకాలం తరువాత చూసిన ప్రజలు జయజయ ధ్వానాలు చేసారు. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. మార్చి 22న ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేసింది. ఓటమిని చవిచూసినా, రాజకీయాల నుండి విరమణ తీసుకోలేదు. జనతాపార్టీ విజయానికి ముఖ్యకారణం ఇందిర మీద జరిగిన దుష్ప్రచారమే. జనతా పార్టీలో వారివి విభిన్న ధ్యేయాలు, అభిప్రాయాలు. ఒకరితొ ఒకరికి పడదు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఇందిరను పదవీచ్యుతురాలిని చేయాలనే సంకల్పమే వారిని ఒకటిగా పనిచేసేటట్లు చేసింది. ఇందిరను కొన్ని కేసులలో ఇరికించి అరెస్టు చేయించారు. కానీ ఏ కేసులూ ఆమె మీద నిలువలేదు. వెంటనే ఆమెను విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రజలలో ఇది జనతా పార్టీ మీద అవిశ్వాసాన్ని కలుగజేసింది. ఇందిర మీద అభిమానాన్ని పెంచింది. ఇందిర విడుదలవుతూనే ప్రజలలోకి వెళ్లింది. ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. ఇందిరాగాంధీ తనకు అనుకూలంగా ఉన్నవారందరిని కూడగట్టి ఇందిరా కాంగ్రెస్గా ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి ఇందిర అధ్యకురాలిగా ఎన్నికయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లలో ఇందిరా కాంగ్రెస్ విజయభేరి మ్రోగించి రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 1978 నవంబరు 7 న ఇందిర మరలా పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయింది. కర్ణాటక లోని చిక్‌మగలూరు నుండి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించింది. అయితే ఇందిరను దారిలోంచి తొలగించుకోవాలనే వారు చేసే ప్రయత్నాలు ఆపలేదు. ఆమె పదవిలో ఉండగా అధికారులను పీడించినట్లు ఆరోపించి ఆమెను తీహార్ కారాగారంలో ఉంచారు. అయినా ఆమెలోని పోరాట పటిమ తగ్గలేదు. అక్కడ ఉండే తాను విడుదల అయిన తరువాత చెయ్యవలసిన ప్రణాళికను తయారుచేసింది. విడుదల అవగానే తన ప్రణాళికను అమలు పరచింది. అప్పటి మొరార్జీ దేశాయ్ పరిపాలనలో ధరలు ఆకాశాన్నంటాయి. నేరాలు పెరిగాయి. అదును చూసి ప్రతిపక్షమైన కాంగ్రెస్ వారు అతనిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిలో నెగ్గలేకపోయిన దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేసాడు. ఇందిరా కాంగ్రెస్ మద్దతుతో చరణ్ సింగ్ ప్రధానిగా పదవిని చేపట్టాడు. నెలలోపే అతను తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అతను ప్రధానిగా ప్రజల సమస్యల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. 23 రోజులు అతని పాలనను గమనించిన ఇందిర అతనికి తన మద్దతును ఉపసంహరించుకుంది. గత్యంతరం లేని పరిస్థితులలో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి లోక్‌సభను రద్దు చెయ్యవలసినదిగా కోరాడు. ఇందిర ప్రజలలో సుడిగాలివలె తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చెస్తానని వారికి మాట ఇచ్చింది. ఇందిరపై ప్రజలకు గల నమ్మకం మరొకసారి ఋజువయింది. లోక్‌సభ ఎన్నికలలో 529 స్థానలకు గాను 351 స్థానాలు గెలుచుకుని తమ సత్తాను నిరూపించుకున్నది. ప్రధానిగా మరలా ఇందిర ఆమె స్వయంగా తెలంగాణలోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది. 1980 జనవరిలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇందిర తన మంత్రివర్గంలో యువజన కాంగ్రెస్ సభ్యులకు చోటిచ్చింది. ఎంతమందికి మంత్రి పదవి ఇచ్చినా తన కుమారుడైన సంజయ్ గాంధీకి మాత్రం అవకాశం ఇవ్వలేదు. అతడికి ఇంకా రాజకీయానుభవం కావాలని ఆమె ఉద్దేశం. అప్పటికి దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. 1979 లో వచ్చిన కరువు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన కాందిశీకులు అస్సాంలో నివాసమేర్పరచుకొని అక్కడే ఉండిపోవడం వంటివి దేశంలోని పరిస్థితిని తలక్రిందులు చేసాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు జనతాపార్టీ పాలనలో ఉండిపోవడం దేశ పరిస్థితిని చక్క దిద్దడానికి ఆటంకంగా మారింది. అందువల్ల 1980 ఫిబ్రవరి 13న ఆ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. తన మంత్రివర్గంలోని మంత్రులకు అనుభవం లేకపోవడం వల్ల ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారిని, మేధావులను వారికి సహాయకులుగా ఏర్పాటు చేసింది. నెమ్మదిగా దేశ పరిస్థితిని అదుపులోకి తీసుకు రాసాగింది. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎదుర్కోవలసి వచ్చుంది. ఉగ్రవాదులు పంజాబ్ స్వర్ణదేవాలయం నుండి ఉద్యమాన్ని నడపాలని నిర్ణయించారు. బింద్రన్ వాలే నాయకత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఆపడానికి భారత సైన్యం సహాయంతో "ఆపరేషన్ బ్లూస్టార్" పేరుతో జరిపించిన పోరాటంలో బింద్రన్ వాలేతో పాటు ఇంకా చాలా మంది మరణించారు. కానీ స్వర్ణదేవాలయం దెబ్బతింది. దీనివల్ల సిక్కుల కోపానికి ఇందిర గురయ్యింది. రాజకీయాల్లోకి రాజీవ్ 1980 జనవరిలో ప్రధానిగా పదవిని చేపట్టిన ఇందిరకు జూన్ లో అనుకోని కష్టం ఎదురైంది. జూన్ 23న సంజయ్ గాంధీ విమానం కూలి మరణించాడు. ఆమెకు కలిగిన శోకాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. అయినా ఆమె అంతటి కష్టాన్ని కడుపులో దాచుకొని గాంభీర్యాన్ని ప్రదర్శించింది. ఆమె పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ పైలట్ గా తన ఉద్యోగానికి రాజీనామా చేసి, సోదరుని మరణంతో కుంగిన తల్లికి తన అండదండలు అందించాడు. కానీ సంజయ్ గాంధీ భార్య (మేనకా గాంధీ) ఆమెకు దూరమయ్యింది. 1983 లో అలీనోద్యమ దేశాల సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించారు. కామన్‌వెల్త్ సమావేశాన్ని కూడా భారతదేశంలో నిర్వహించారు. దీని ద్వారా భారత దేశ కీర్తిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంచింది. భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను ఏడవ స్థానంలో ఎంపికైయింది. అంతిమ క్షణాలు ఆమె తనపై హత్యాయత్నం జరుగవచ్చని అనుమానిస్తూనే ఉంది. ఆమె తన మరణం హింస వల్ల వచ్చినా, ఆశ్చర్యం లేదని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరి రక్తపు బొట్టు ఇంకిపోయేవరకు తాను దేశం కోసం శ్రమిస్తానని, ప్రజలపై తనకు గల ప్రేమను ఎవరూ చంపలేరని పత్రికల్లో ప్రకటించింది. ఆమె అన్నట్లుగానే 1984 అక్టోబరు 31న ఆమె అంగ రక్షకులే ఆమెను కాల్చి చంపారు. ఆమెను చంపిన ఇద్దరు అంగ రక్షకులూ సిక్కులే. స్వర్ణదేవాలయం దెబ్బతినడం వలన ఏర్పడిన ద్వేషానికి బలయిపోయింది. 1984లో స్వర్ణదేవాలయంలో సైనికులను పంపి ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించి సిక్కు నాయకుడు సంత్ జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలేను హతమార్చింది. చివరికదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చింది. చివరి రక్తపు బొట్టు దాకా దేశం కోసమే ధారపోస్తాననే ఆమె మాటలు 66వ ఏట నిజం అయ్యాయి. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద గురుద్వారాలో ఇందిరాగాంధీ హంతకులు సత్వంత్‌సింగ్, బియాంత్‌సింగ్‌ లతోపాటు కుట్రదారుడు కేహార్‌సింగ్‌ లకు అమర వీరుల సరసన చోటుకల్పించడం నిరసనలకు కారణమైంది. వీరిని 'షహీద్‌ భాయ్‌'లుగా అభివర్ణిస్తూ రూపొందించిన చిత్రపటాలను సిక్కు మతవిశ్వాసాల కోసం ప్రాణాలు విడిచిన వారి పటాల పక్కనే ప్రచురించారు. ఈ పరిణామంతో ఆక్‌లాండ్‌లోని సిక్కు మతస్థుల్లో విభజన ఏర్పడింది. ఇతర వర్గాల ప్రజలూ హతాశులయ్యారు. ఇందిరా గాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలు 1938: భారత జాతీయ కాంగ్రెసులో ప్రవేశం 1942-3-26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరిగింది. తరువాత ఇందిరాగాంధీగా మారింది. 1944-8-20న రాజీవ్ గాంధీ, 1946-12-14న సంజయ్ గాంధీలకు జన్మనిచ్చింది. 1955 : కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సంఘంలో ప్రవేశం 1955లోనే అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైనది. 1966-01-10న ప్రధాని లాల్ బహుదూర్ మరణంతో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎన్నికైనది. 1966-01-24న భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. 1966 : రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రి పదవి చేపటిన వ్యక్తులలో ఇందిరా గాంధీ మొట్టమొదటిది. 1966-1977 ‍ 1980-1984 : జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రి పదవి చేపట్టి రెండో స్థానంలో నిల్చింది. 1967-03-13న కాంగ్రెసు పార్టి నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది. తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది. 1969 : ఇందిరా కాంగ్రెస్ పార్టీ స్థాపన 1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది. 1971-03-18న ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది. గరీబీ హటావో అనే నినాదంతో దేశప్రజలని ఉత్తేజపరిచింది. 1971లో పాకిస్తానుతో యుద్ధం జరగగా, ఓడించింది. 1971 : తూర్పు పాకిస్తాన్‌ను పాకిస్తాన్ నుండి విడదీసి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసింది. 1971 : భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ కూడా ఇందిరా గాంధీ. 1973 మేలో సముద్రంలోని తైలనిక్షేపాలను వెలికితీసే సాగర్ సామ్రాట్ ని ఏర్పాటుచేసింది. ఈమె హయంలో రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిపింది. 1975-04-19న తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రయోగం ఈమె హయంలో జరిగింది. సిక్కులను భారతదేశంలో అంతర్భాగం చేసింది. రాజభరణాలను రద్దు చేసింది. 1975-06-25న దేశంలో అత్యవసర పరిస్థితిని విధించింది. 1977 : ఎన్నికలలో ఓడిపోయిన మొట్టమొదట భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. 1980 : కొద్ది కాలం విరామం తర్వాత మళ్ళీ భారత ప్రధానమంత్రి పదవి చేపట్టిన వారిలో మొట్టమొదటి వ్యక్తి. ఈమె హయంలో ఆలీనోద్యమం కొత్త రూపు సంతరించుకుంది. 1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించింది. సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా. బిందైన్ వాలాపై దాడికోసం స్వర్ణదేవాలయంలోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు. ఈ దాడియే ఆపరేషన్ బ్లూస్టార్గా ప్రసిద్ధిగాంచింది. ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20 సూత్రాలని కూడా అమలపరిచింది. 1983: అలీన దేశాల సదస్సును ఢిల్లీలో నిర్వహించింది. 1984 : ఆపరేషన్ బ్లూ స్టార్ చర్యకు ఆదేశం 1984-10-31న ఉదయం 9గంటల 16 నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను. హత్యకు గురైన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి కూడా ఇందిరా గాంధీ. ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు. ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969, ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972, ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను. 1953లో ఈమె సేవలకు అమెరికా వారిచే మదర్స్ అవార్డ్, 1960లో ఏల్ యూనివర్షిటీ వారిచే హాలెండ్ మెమొరియల్ అవార్డ్, 1965లో ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టే అవార్డులు వరించాయి. 1967, 1968లల్లో రెండుసార్లు ఈమెని ఫ్రెంచ్ ప్రజలు, మిక్కిలి అభిమాన పాత్రురాలైన నాయకురాలుగా, ఎన్నుకున్నారు. అంతరిక్షంలో ఉన్న వ్యోమగామితో మాట్లాడిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అమెరికావారి గ్యాలప్ పోల్ లో ప్రపంచాభిమానిగా ఈమె యావత్ ప్రపంచ ప్రజల అభిమానాన్ని పొందింది. అక్టోబరు 31న ఈమె వర్థంతిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఈమె హయంలో రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ 1975 నాటి అత్యవసర పరిస్థితి, స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైంది. సంతానం / వారసులు ఇందిరా గాంధీకి ఇద్దరు కుమారులు - రాజీవ్ గాంధీ (1944 - 1991), సంజయ్ గాంధీ (1946 - 1980) . సంజయ్ గాంధీని రాజకీయాలలో తెచ్చి, అత్యవసర పరిస్థితి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సంజయ్ ని తన రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దాలన్న సమయంలో విమాన ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాత 1981 ఫిబ్రవరిలో పైలట్ ఉద్యోగాన్ని వదలి రాజీవ్ గాంధీ రాజకీయాలలో ప్రవేశించాడు. ఇందిర హత్య అనంతరం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టి అత్యంత పిన్న వయస్సులో ఆ పదవిని చేపట్టిన రికార్డు సృష్టించాడు. అయితే బోఫోర్స్ కేసులో ఇరుక్కొని ఎన్నికలలో ఓటమిపాలైనాడు. 1991 మేలో శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ప్రచారం సమయంలో తమిళ ఈలం మానవ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో ఉంటూ 2004 లోక్‌సభ ఎన్నికలలో యూ.పి.ఏ. కూటమితో కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, కుమారై ప్రియాంకలు కూడా రాజకీయాలలో ప్రవేశించారు. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ సంజయ్ మరణం తర్వాత ఇంటి నుంచి గెంటివేయబడింది. వేరు కుంపటి పెట్టి సంజయ్ విచార్ మంచ్ పార్టీ పెట్టిననూ మంచి ఆదరణ పొందలేదు. సంజయ్ గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యుడు. బిరుదులు 1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను స్వీకరించి ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది. 1983-84 లో రష్యా దేశపు లెనిన్ శాంతి బహుమతి లభించింది ప్రాచుర్యం 1971 లో బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా సాధించిన సందర్భంలో నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి ఆమెను దుర్గామాతగా కీర్తించాడు.http://www.india-today.com/itoday/millennium/100people/indira.html ఇందిరా గాంధీ గురించి ఇండియా టుడేలో వచ్చిన వ్యాసం విమర్శలు ఇందిరా గాంధీ స్వతంత్ర భారతదేశంలో పలు రాజ్యాంగ వ్యవస్థల పతనానికి నాంది పలికిన ప్రధానిగా విమర్శలు ఎదుర్కొంది. ప్రచురణలు పుస్తకాలు 1. *Indira: The Life of Indira Nehru Gandhi By Katherine Frank Published by Houghton Mifflin Books, 2002 ISBN 0-395-73097-X, ISBN 978-0-395-73097-3 567 pages 2. *indira gandhi: Daughter of India By Carol Dommermuth-Costa Published by Twenty-First Century Books, 2001 ISBN 0-8225-4963-8, ISBN 978-0-8225-4963-5 128 pages ఇవికూడా చూడండి రాజీవ్ గాంధీ జవహర్‌లాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రధానమంత్రి మూలాలు, వనరులు బయటి లింకులు ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ మరణం గురించి ప్రముఖ అమెరికా ఇంగ్లీష్ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక సంస్మరణ-కథనం ఇందిరా ద్రుక్కొణములో వర్గం:భారత ప్రధానమంత్రులు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1వ లోక్‌సభ సభ్యులు వర్గం:2వ లోక్‌సభ సభ్యులు వర్గం:3వ లోక్‌సభ సభ్యులు వర్గం:భారత స్వాతంత్ర్య సమర యోధులు వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు వర్గం:భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు వర్గం:1917 జననాలు వర్గం:1984 మరణాలు వర్గం:మహిళా ప్రధానమంత్రులు వర్గం:నెహ్రూ-గాంధీ కుటుంబం వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు వర్గం:శాంతి నికేతన్ పూర్వ విద్యార్థులు వర్గం:హత్య చేయబడ్డ భారతీయులు వర్గం:ఉత్తర ప్రదేశ్ వ్యక్తులు వర్గం:భారతదేశ ప్రధానమంత్రుల పిల్లలు వర్గం:జవహర్ లాల్ నెహ్రూ అవార్డు గ్రహీతలు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:ఉత్తరప్రదేశ్ నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు వర్గం:భారత మంత్రివర్గంలో మహిళా సభ్యులు
వి. వి. గిరి
https://te.wikipedia.org/wiki/వి._వి._గిరి
right|130px|thumb|వి.వి.గిరి వి.వి.గిరిగా ప్రసిద్ధుడైన వరాహగిరి వేంకటగిరి (ఆగష్టు 10, 1894 - జూన్ 24, 1980), భారతదేశ నాలుగవ రాష్ట్రపతి. ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణంలోని వరాహగిరి వెంకట జోగయ్య ,సుభద్రమ్మ దంపతులకు ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ జిల్లా, పట్టణం ఇప్పుడు ఒడిషా రాష్ట్రములో ఉన్నాయి. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధిచెందిన న్యాయవాది. ఈయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురానికి వలస వెళ్ళాడు. 1913లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ ఐర్లండ్ లో సీన్‌ఫెన్ ఉద్యమములో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్‌నీల్, జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది. భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. గిరి 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యాడు.Narasingha P. Sil, Giri, Varahagiri Venkata (1894–1980), trade unionist and president of India in Oxford Dictionary of National Biography (2004) 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరి కాంగ్రేసు అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచాడు. 1937లో మద్రాసు ప్రోవిన్స్ లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రేసు ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1942లో కాంగ్రేసు ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్ళాడు. ఈయనను రాజమండ్రి జైలులో ఖైదీగా ఉంచారు. ఇవి కూడా చూడండి రాష్ట్రపతి భవనం భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల జాబితా మూలాలు వర్గం:1894 జననాలు వర్గం:1980 మరణాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:భారత ఉపరాష్ట్రపతులు వర్గం:ఉత్తర ప్రదేశ్ గవర్నర్లు వర్గం:1వ లోక్‌సభ సభ్యులు వర్గం:ఒడిషా తెలుగువారు వర్గం:మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గం:ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వ్యక్తులు వర్గం:మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన సభ్యులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గం:బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ సభ్యులు
బి.ఆర్. అంబేద్కర్
https://te.wikipedia.org/wiki/బి.ఆర్._అంబేద్కర్
భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు. ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును “అంబేద్కర్ జయంతి”గా జరుపుకుంటారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు. జీవిత విశేషాలు బాల్యం thumb|యువకునిగా అంబేద్కర్|291x291px భీంరావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’ అన్న గ్రామంలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతులకు చివరి సంతానంగా (14వ) జన్మించాడు. ఇతని అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంటవాడ గ్రామంలో నివసించినందున వారు మరాఠీ నేపథ్యం కలవారుమల్లాది 2012, p. 13.. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు. ఇతని తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసాడు. ఆరేళ్ళ వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో తొమ్మిది మంది అకాల మృత్యువాత పడగా ఇద్దరు అక్కలు - మంజుల, తులసి, ఇద్దరు  అన్నలు- బలరాం, ఆనందరావు మిగిలారు.మల్లాది 2012, p. 22. బాల్యములో అంబేద్కర్ సమస్య మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతం లోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు.{{Cite అంబేద్కర్ చిన్నతనంలో ఎన్నో అవమానాలను సహించి,తన విధ్యభ్యాసాన్ని కొనసాగించారు.web|url=https://telugu.samayam.com/latest-news/india-news/ambedkar-jayanti-2020-remembering-great-person-on-his-birth-anniversary/articleshow/75132908.cms|title=అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్’|website=Samayam Telugu|language=te|access-date=2020-06-23}} అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు.మాండవ 2011, p. 8. మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (కార్మికుడు) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితిని అంబేద్కర్ క్లుప్తంగా - “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు. డబ్బులు చెల్లించే స్తోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన (మంగలి మహార్లని, చాకలి వీరి బట్టలనూ ముట్టుకునేవారు కాదు) అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేద్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్ళు ఎవ్వరూ (అస్పృశ్యులని) ముందుకురాకపోతే, మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడువగా అంబేద్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు నాయని 1996, p. 671, 674. విద్యాభ్యాసం - ఉద్యోగం - కుల వివక్ష బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో ఎం.ఏ., 1916లో పి.హెచ్.డి. పట్టాలను పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ళ తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అనే పేరుతో ప్రచురితమయ్యింది. 1917లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు. అప్పటికి అతని వయస్సు 27 ఏళ్ళు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది. మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడు. కాని కార్యాలయములో నౌకర్లు కాగితాలు అతని బల్లపై ఎత్తివేసేవారు. కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ 'మూక నాయక్' అనే పక్షపత్రికకు సంపాదకత్వం వహించాడు. సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్‌ని పైచదువుల కొఱకు విదేశాలకు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కానీ కార్యాలయములో జనులు కూడా అతనిని అస్పృశ్యుడుగా చూచారు. దళిత మహాసభ 1927లో మహాద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా, అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ 'బహిష్కృత భారతి' అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగా పుట్టివుంటే 'స్వరాజ్యం నా జన్మ హక్కు'అని ఉండడు. 'అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు' అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వ వాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్‌ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు. పరిష్కారం భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే, ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమాజములో ఉన్నదని ఆయన సమర్థించాడు. అయితే అంటరానివారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు. ఇలా కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు. గాంధీ, అంబేద్కర్‌ల మధ్య పూనా ఒప్పందం 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931,1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు కాగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే గాంధీకి అంబేద్కర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసాడు. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ "కమ్యూనల్ అవార్డు"ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నాడు. ఈ ప్రకటన గురించి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టాడు. అంబేద్కర్‌పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్‌కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి 'హరిజన్ సేవక్ సమాజ్' ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు. అంబేద్కర్‌ను కూడా ఇందులో భాగస్వామిని చేసాడు గాంధీ. కాని అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు లేదు. దీనితో అంబేద్కర్ గాంధీ ఉద్యమం నుండి బయటకు వచ్చి ప్రత్యేకముగా దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రె స్స్‌డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నం చేసాడు. ఈ సందర్భములో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం జరిగాయి. రాజ్యంగ పరిషత్తు, మంత్రివర్గ సభ్యుడిగా రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ "రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు". అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత జీవితం అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. బౌద్ధ ధర్మ- స్వీకారం 1956 అక్టోబరు 29 నాడు నాగపూర్ లో తలపెట్టిన బౌద్ధ ధర్మ దీక్షా సదస్సులో అంబేద్కర్, 5,౦౦,౦౦౦ల అనుచరులతో బౌద్ధ ధర్మమును స్వీకరించాడు. ముందుగా త్రిశారణం, పంచాశీల స్వీకరించి అతనితో వున్నా 5 లక్షల మందికి 22 ప్రతిజ్ఞలతో బౌద్ధ ధమ్మముని ఉపదేశించాడు. గాంధీతో అనేక విషయాలలో విభేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయిన దానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరి పోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. 'ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ', 'ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా', 'ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్', 'ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ' ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6 న మహాపరి నిర్వాణం చెందాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం. అభ్యసించిన డిగ్రీలు బి.ఎ. (బాంబే విశ్వవిద్యాలయం, 1912) ఎం.ఎ. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1915) ఎమ్మెస్సీ ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్, 1921) పి. హెచ్. డి. (కొలంబియా విశ్వవిద్యాలయం, 1927)C250 Celebrates Columbians Ahead of their Time డీ.ఎస్.సి ( లండన్ విశ్వవిద్యాలయం, 1923) బారిష్టర్ ఎట్ లా (గ్రేస్ ఇన్ లండన్, 1923) ఎల్. ఎల్. డి ( కొలంబియా విశ్వవిద్యాలయం, 1952, గౌరవపట్టా) డి. లిట్. ( ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1953, గౌరవపట్టా) భారతరాజకీయాలపై ప్రభావం దేశంలో ప్రతి రాజకీయపార్టీ పై అంబేద్కర్ ప్రభావముంది. ఇది కేవలం దళిత వోట్లు దక్కించుకొనటానికే కాని సమాజాభ్యుదయం జరగటంలేదనే విమర్శ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసాలు సౌత్ బరో కమిటీకి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన వాంగ్మూలం ఆయన రాజకీయ రచనల్లో మొదటిది. మహారాష్ట్ర ప్రభుత్వం (బొంబాయి), విద్యశాఖ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలను వివిధ సంపుటంలో ప్రచురించింది. 1994 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంపుటాలను తెలుగులో అనువదించి ప్రచురించింది. సంపుటం సం. వివరణ సంపుటం 1 భారతదేశంలో కులాలు: వాటి విధానాలు, పుట్టుక, అభివృద్ధి, 11 ఇతర వ్యాసాలు సంపుటం 2 బొంబాయి చట్టసభలో, సైమన్ కమిషన్తో, రౌండ్ టేబుల్ సమావేశంలో డా. అంబేద్కర్ ఉపన్యాసాలు,1927–1939 సంపుటం 3కమ్యూనిజానికి ముందు కావలసినవి; విప్లవం - ప్రతి విప్లవం; బుద్ధుడు లేక కారల్ మార్క్స్ సంపుటం 4 హిందూతత్వంలో చిక్కుప్రశ్నలు, డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-4:ఆచార్య పేర్వారం జగన్నాథండా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-4:ఆచార్య పేర్వారం జగన్నాథం, హిందూమతంలో చిక్కుముడులు సంపుటం 5"అంటరానివారు , అంటరానితనంపై వ్యాసాలు" డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-5:ఆచార్య పేర్వారం జగన్నాథం డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-5:ఆచార్య పేర్వారం జగన్నాథం సంపుటం 6 బ్రిటీషు భారతదేశంలో ప్రాంతాల ఆర్థికబలం పరిణామం సంపుటం 7"శూద్రులంటే ఎవరు? అంటరానివారు " సంపుటం 8 "పాకిస్తాన్ లేక భారతదేశ విభజన", డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-8- ఆచార్య పేర్వారం జగన్నాథండా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-8- ఆచార్య పేర్వారం జగన్నాథం సంపుటం 9అంటరానివారి గురించి కాంగ్రెసు, గాంధీ చేసిన కృషి. గాంధీ, అంటరానివారి ఉద్ధరణ. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-9 -ఆచార్య పేర్వారం జగన్నాథండా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-9ఆచార్య పేర్వారం జగన్నాథం సంపుటం10గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యునిగా డా.అంబేద్కర్ 1942–46 సంపుటం 11 "బుద్ధుడు , అతని ధర్మం". డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-11-ఆచార్య పేర్వారం జగన్నాథండా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-11-ఆచార్య పేర్వారం జగన్నాథంసంపుటి12"అముద్రిత రచనలు: ప్రాచీన భారత వాణిజ్యం; చట్టాలపై వ్యాఖ్యలు, వీసా కొరకు వేచివుండుట , ఇతరాలు. "డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-12 (అచల బోధ సిద్దాంతము) సంపుటం13 భారతదేశ రాజ్యాంగానికి ప్రధాన రూపకర్తగా డా. అంబేద్కర్ సంపుటం14 (2 భాఘాలు) డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరయు హిందూ కోడ్ బిల్ సంపుటం15 భారతదేశపు మొదటి స్వతంత్రా న్యాయశాఖ మంత్రి , పార్లమెంటులో ప్రతిపక్షసభ్యునిగా డా.అంబేద్కర్ (1947–1956) సంపుటం16 పాలి వ్యాకరణం -డా. బాబాసాహెబ్ అంబేద్కర్ సంపుటం17 (భాగం 1) డా.బి.ఆర్ అంబేద్కర్, అతని సమతా విప్లవం –మానవహక్కులపై పోరాటం . 1927 మార్చి నుండి 1956 నవంబరు 17 వరకు కాలక్రమంలో ఘటనలు (భాగం 2) డా.బి.ఆర్ అంబేద్కర్, అతని సమతా విప్లవం –సామాజికరాజకీయ, మతపరమైన చర్యలు .1929 నవంబరు నుండి 1956 మే 8 వరకు కాలక్రమంలో ఘటనలు (భాగం 2) డా.బి.ఆర్ అంబేద్కర్, అతని సమతా విప్లవం –ఉపన్యాసాలు.1 జనవరి నుండి 1956 నవంబరు 20 వరకు కాలక్రమంలో ఘటనలు సంపుటం18 డా.బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసములు మరాఠీలో (భాగం 1) సంపుటం19 డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసములు మరాఠీలో (భాగం 2) సంపుటం 20 డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు, ఉపన్యాసములు మరాఠీలో (భాగం 3) సంపుటం 21 డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఛాయాచిత్రమాలిక, లేఖావళి స్మరణలు అంబేద్కర్ ను దహనం చేసిన ప్రాంతాన్ని చైత్యభూమిగా పిలుస్తూ, ఆయన స్మారక నిర్మాణాలను ఏర్పాటుచేశారు. బి.ఆర్. అంబేద్కర్ రాజగృహం అనేది బి.ఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నం, ఇల్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోనసీమ జిల్లాను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా 2022 ఏప్రిల్ 2 న పేరు మార్చింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి 2022 సెప్టెంబరు 15న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టబడింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలోతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 14న ఆంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ముని మనవడు ప్రకాశ్ అంబేద్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులలోపాటు అన్ని నియోజకవర్గాల నుంచి 50 వేలమంది పాల్గొన్నారు. గ్యాలరీ ఇవి కూడా చూడండి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ - అంబేద్కర్ రాసిన పుస్తకం మూలాలు బయటి లింకులు డా.భీంరావ్ రాంజీ అంబేద్కర్ ఛాయాచిత్రాలు, వీడియోలు,రచనల వెబ్సైట్ (ఆంగ్లం) సింబియాసిస్ అంబేద్కర్ మెమోరియల్ , మ్యూజియం , పూనా (ఆంగ్లం) Ambedkar: The man behind India's constitution, BBC News Dr. B. R. Ambedkar: Timeline Index and more work by him at the Columbia University Exhibition: "Educate. Agitate. Organise." Ambedkar and LSE, exhibition at the London School of Economics and Political Science, which includes Ambedkar's "student file." Writings and Speeches of Dr. B.R. Ambedkar in various languages at the Dr. Ambedkar Foundation, Government of India Dr. Babasaheb Ambedkar's related articles 'Babasaheb' Dr. B.R. Ambedkar: Maker and conscience-keeper of modern India at the Ministry of External Affairs, Government of India వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1వ లోక్‌సభ సభ్యులు వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు వర్గం:దళిత రచయితలు వర్గం:1891 జననాలు వర్గం:1956 మరణాలు
నెల్సన్ మండేలా
https://te.wikipedia.org/wiki/నెల్సన్_మండేలా
thumb|నెల్సన్ మండేలా నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (18 జూలై, 1918 - డిసెంబరు 5, 2013) దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (African National Congress) కు, దానికి సాయుధ విభాగం అయిన "ఉంకోంటో విసిజ్వే"కు అధ్యక్షుడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో కారాగార శిక్షననుభవించాడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకడు. నల్లజాతి సూరీడు అని పలు తెలుగు వ్యాసాలలో ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచాడు. 1990 ఫిబ్రవరి 11లో కారాగారం నుండి విడుదల అయిన తరువాత నెల్సన్ మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైర్యాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశాడు. తన పూర్వపు ప్రతిస్పర్థుల నుండి కూడా ప్రశంసలు అందుకొన్నాడు. వందకు పైగా పురస్కారాలు, సత్కారాలతో వివిధ దేశాలు, సంస్థలు మండేలాను గౌరవించాయి. వాటిలో 1993లో లభించిన నోబెల్ శాంతి బహుమతి ముఖ్యమైనది. స్వదేశంలో మండేలాను మదిబా అని వారి తెగకు సంబంధించిన గౌరవసూచకంతో మన్నిస్తారు. మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పెక్కుమార్లు చెప్పాడు. భారత దేశం మండేలాను 1990 లో 'భారత రత్న', జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతులతో సత్కరించింది. భారత దేశం నుండి మండేలాకు ఎంతో సమర్థన లభించింది. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు మండేలా ఒక ప్రతీకగా మారారు. పశ్చిమ దేశాలు కూడా హక్కుల ఉద్యమ కారులైన అబ్రహం లింకన్‌, మార్టిన్‌ లూథర్‌కింగ్‌లతో సమానంగా ఆయన్ను గౌరవిస్తున్నాయి. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు తెచ్చింది. నోబెల్‌ శాంతి బహుమతితో అంతర్జాతీయ సమాజం ఆయన్ను గౌరవించుకోగా, 1990లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి భారతీయ సమాజం గౌరవించింది. మండేలా 2013 డిసెంబరు 5 న మరణించారు. మండేలా మానవతకే స్ఫూర్తి ప్రదాతని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొనియాడారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా మృతికి గౌరవసూచకంగా కేంద్ర ప్రభుత్వం ఐదు రోజుల సంతాపదినాలు ప్రకటించింది. జననం మండేలా కుటుంబం "తెంబు" వంశానికి చెందినది. వీరు దక్షిణ ఆఫ్రికాలో "కేప్ ప్రాంతం"లో "ట్రాన్సకెయన్" భాగాలకు సాంప్రదాయికంగా పాలకులు. ఇతడు ఉమాటా జిల్లాలో మవెజో అనే వూరిలో 18 జూలై 1918న జన్మించాడు. ఇతని తాతలకాలంలో వారు పాలించే తెంబూ తెగల ప్రాంతం బ్రిటిష్ వలస పాలకుల పరమయ్యింది. మండేలా తండ్రి "గాడ్లా" హక్కుల ప్రకారం పాలకుడు కాకపోయినా కొన్ని స్థానిక తెగలకు నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండేవాడు. స్థానిక మండలిలో సభ్యుడు. గాడ్లాకు నలుగురు భార్యలు. పదమూడు మంది పిల్లలు. వారిలో గాడ్లా 3వ భార్య "నోసెకెని ఫాన్నీ"కి జన్మించిన మగబిడ్డకు "రోలిహ్లాహ్లా" (అంటే కొమ్మలు లాగేవాడు -"దుడుకు స్వభావం కలవాడు" ) అని పేరు పెట్టారు. మండేలా బాల్యం తల్లి కుటుంబానికి చెందిన గూడెం ("ఉమ్జీ")లో అధికంగా గడిచింది. చదువు ఏడవయేట రోలిహ్లాహ్లా చదువు ప్రారంభమైంది. (వారి కుటుంబంలో బడికి వెళ్ళిన మొదటి వ్యక్తి అతనే.) ) బడిలోని ఒక మెథడిస్ట్ ఉపాధ్యాయుడు అతనికి "నెల్సన్" అనే పేరు తగిలించాడు. (ప్రసిద్ధుడైన బ్రిటిష్ నావికాదళ నాయకుడు హొరేషియో నెల్సన్ పేరు మీద). ఎందుకంటే ఆ ఉపాధ్యాయునికి రోలిహ్లాహ్లా పేరు పలకడం రాలేదు. రోలిహ్లాహ్లా 9వ యేట అతని తండ్రి క్షయ వ్యాధితో మరణించాడు. తరువాత నెల్సన్ మండేలా చదువు వివిధ పాఠశాలలలో సాగింది. తెంబూ తెగల ఆచారం ప్రకారం ప్రివీ కౌన్సిల్‌లో అతని తండ్రి స్థానం అతనికి సంక్రమిస్తుంది. 1937లో మండేలా "ఫోర్ట్ బ్యూఫోర్ట్"లో "హీల్డ్‌టౌన్" కళాశాలలో చేరాడు. అతనికి బాక్సింగ్, పరుగు పట్ల ఆసక్తి పెరిగింది. మెట్రిక్యులేషన్ తరువాత మండేలా ఫోర్ట్‌హేర్ విశ్వవిద్యాలయంలో బి.ఎ.లో చేరాడు. అక్కడ అతనికి పరిచయమైన ఆలివర్ టాంబో అతని జీవితకాలం మిత్రుడైనాడు. అదే సమయంలో అతని తెగకు వారసత్వంగా నాయకుడు కావలసిన కైజర్ మతంజిమా కూడా మిత్రుడయ్యాడు కాని కాలక్రమంలో వారిద్దరూ రాజకీయ ప్రతిస్పర్థులయ్యారు. ఎందుకంటే మతంజిమా "బంతూస్తాన్" కార్యకలాపాల పక్షం వహించాడు. ఒక సంవత్సరం తరువాత విశ్వవిద్యాలయం రాజకీయాలలో పాల్గొన్న ఫలితంగా మండేలాను విశ్వవిద్యాలయం నుండి తీసేశారు. తరువాత అతను కారాగారంలో ఉన్నపుడు లండన్ విశ్వవిద్యాలయం వారి దూర విద్యా సదుపాయంతో బి.ఎల్. పూర్తి చేశాడు. జొహన్నెస్‌బర్గ్ కు ఫోర్ట్‌హేర్ వదలిన కొద్దికాలానికే మండేలా సంరక్షకుడైన జోగింతాబా మండేలాకు పెండ్లి నిశ్చయించాడు. అదే సమయంలో జోగింతాబా కొడుకు (కుటుంబ వారసుడు)కు కూడా వివాహం నిశ్చయమైంది. ఇది ఇష్టం లేక యువకులిద్దరూ తమ సంపన్న కుటుంబాలను వదలి జోహాన్నెస్‌బర్గ్‌కు వెళ్ళిపోయారు. నగరంలో మండేలా చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. తాను మధ్యలో ఆపివేసిన బి.ఎ. డిగ్రీ కోర్సును దూరవిద్య ద్వారా పూర్తి చేశాడు. తరువాత విట్‌వాటర్స్‌రాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువసాగాడు. ఆ సమయంలో అతనికి పరిచయమైన కొందరు మిత్రులు తరువాత జాతివివక్ష వ్యతిరేక కార్యశీలురయ్యారు. రాజకీయ కార్యకలాపాలు 1948లో ఆఫ్రికనెర్‌లు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా నేషనలిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. నల్ల, తెల్ల జాతుల మధ్య వివక్షత, ఇద్దరినీ వేరువేరుగా ఉంచడం వారి విధానం. ఆ పరిస్థితులలో 1952 డిఫెన్సు కాంపెయిన్, 1955 పీపుల్స్ కాంగ్రెస్ కార్యక్రమాలలో నెల్సన్ మండేలా ప్రముఖంగా పాల్గొన్నాడు. వారు ఆమోదించిన "స్వాతంత్ర్య చార్టర్" వారి జాతివివక్షత వ్యతిరేక విధానానికి ప్రాథమిక దశానిర్దేశకంగా రూపొందింది. ఈ సమయంలో మండేలా, అతని మిత్రుడు కలసి స్థాపించిన ఒక లా సంస్థ ద్వారా అనేక పేద నల్లజాతి వారికి ఉచితంగా న్యాయవాద సౌకర్యం కలిగించారు. మండేలా కార్యక్రమాలపైన, ఇతర దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాలపైనా జాతీయ మహాత్మా గాంధీ ప్రభావం గాఢంగా ఉంది. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం విధానాన్ని ప్రవేశపెట్టి 100 సంవత్సరాలు గడచిన సందర్భంగా ఢిల్లీలో 29 జనవరి – 30 జనవరి 2007న జరిగిన సమ్మేళనానికి నెల్సన్ మండేలా హాజరయ్యాడు. మొదట్లో మండేలా శాంతియుతంగానే తన ప్రతిఘటనను నిర్వహించినా గాని 5 డిసెంబరు 1956న మండేలా, మరో 150 మంది దేశద్రోహనేరంపై అరెస్టు చేయబడ్డారు. 1956-61 కాలంలో సుదీర్ఘంగా నడచిన ఈ విచారణ అనంతరం వారందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే 1952-59 కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌ (ఆ.నే.కా.)లో చాలామంది అసహనానికి గురై తమ ఆశయాలను సాధించిడానికి మరింత తీవ్రమైన చర్యలు చేపట్టాలని వత్తిడి చేశారు. అంతకుముందు ఆ.నే.కా.లో ఉన్న మితవాద నాయకుల నాయకత్వానికి సవాళ్ళు ఎదురయ్యాయి. దక్షిణ ఆఫ్రికా కమ్యూనిస్టు పార్టీ ఈ కాలంలో బలం పుంజుకుంది. 1959లో అతివాద ఆఫ్రికనిస్టులు ఆ.నే.కా.ను సమర్థిస్తున్న "పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్" నుండి విడిపోయారు. అలా విడిపోయినవారికి ఘనా వంటి ఇతర దేశాలనుండి మద్దతు కూడా లభించింది. గెరిల్లా కలాపాలు 1961లో మండేలా ఆ.నే.కా.కు సాయుధ విభాగాన్ని ఏర్పరచి దానికి అధ్యక్షుడు అయ్యాడు. ఈ విభాగం పేరు "ఉమ్‌ఖోంటో వి సిజ్వె" (అనగా దేశపు బల్లెం). ఈ విభాగం దళాలు ప్రభుత్వ, సైనిక స్థానాలను లక్ష్యాలుగా చేసుకొని దాడులు నిర్వహించింది. జాతి వివక్షతను అంతం చేయడానికి గెరిల్లా పోరాటం కొరకు ప్రణాళికలు కూడా తయారు చేసుకొన్నారు. 1980 దశకంలో వీరి దళాలు నిర్వహించిన గెరిల్లా పోరాటాలలో అనేకులు మరణించారు. శాంతియుత ప్రతిఘటన వల్ల ప్రయోజనం లేనందునా, ప్రభుత్వం విచక్షణారహితంగా దమన విధానాన్ని అమలు చేస్తున్నందువలనా, తతిమ్మా మార్గాలన్నీ మూసుకుపోవడం వల్లనే తాము సాయుధపోరాటం వైపు మళ్ళవలసివచ్చిందని మండేలా సమర్థించుకొన్నాడు. అయితే ఈ విధమైన సాయుధచర్లవలన ఆ.నే.కా. మానవ హక్కులను ఉల్లంఘించిందని తరువాతికాలంలో మండేలా అంగీకరించాడు. తన ఈ అంగీకారాన్ని తన పార్టీలోని కొందరు సత్య, సర్దుబాటు కమిషన్ రిపోర్టులనుండి తొలగించడానికి ప్రయత్నించగా అందుకు వ్యతిరేకించాడు. Mandela admits ANC violated rights, too (from findarticles.com, originally published in the Milwaukee Journal Sentinel, 2 November 1998) అరెస్టు, రివోనియా విచారణ 5 ఆగస్టు 1962న మండేలా అరెస్టు చేయబడ్డాడు. అంతకుముందు అతను 17 నెలలు అజ్ఞాతంలో ఉన్నాడు. అతని ఉనికిని గురించిన సమాచారం ప్రభుత్వానికి అందించడంలో సి.ఐ.ఎ. హస్తం ఉండి ఉండవచ్చును. మూడు రోజుల తరువాత అతనిపై అభియోగాలు న్యాయస్థానంలో వెళ్ళడించబడ్డాయి - 1961లో కార్మికులచే సమ్మె చేయించడమూ, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడమూ. 25 అక్టోబర్ 1962న మండేలాకు ఐదు సంవత్సరాల శిక్ష విధించబడింది. రెండేళ్ళ తరువాత 11 జూన్ 1964న, అంతకుముందు ఆ.నే.కా.లో అతని కార్యకలాపాల విషయంలో మరొక తీర్పు వెలువడింది. మండేలా అరెస్టు అయిన సమయంలోనే ప్రభుత్వం అనేక ప్రముఖ ఆ.నే.కా. నాయకులను అరెస్టు చేసింది. మండేలాపైన, తక్కినవారిపైన తీవ్రమైన నేరాలు ఆరోపించారు. దేశద్రోహ చర్యల అభియోగాన్ని, విదేశాలతో కూడి దేశంపై దాడిజరపడాన్నీ మండేలా నిరాకరించాడు. కొన్ని విధ్వంసకర చర్యల బాధ్యతను మండేలా ఒప్పుకొన్నాడు. 20 ఏప్రిల్ 1964న ప్రిటోరియాలో న్యాయస్థానం ఎదుట మండేలా తమ లక్ష్యాలను సాధించడానికి ఆ.నే.కా. సాయుధ పోరాట విధానాన్ని ఎందుకు అవలంబింపవలసి వచ్చిందో వివరించాడు. తమ శాంతియుత ప్రతిఘటన ఎలా విఫలమైందో తెలియజెప్పాడు. ప్రభుత్వ దమన విధానం తరువాత కూడా తాము అలానే ఉండిపోతే ప్రభుత్వ విధానాలకు అంగీకరించి లొంగిపోయినట్లే అవుతుందని తేల్చిచెప్పాడు. ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించాడు. ఆ సందర్భంలో అతని చివరి వాక్యాలు: నిందితుల పక్షాన కూడా ప్రసిద్ధులైన న్యాయవాదులు వాదించారు. కాని ఒకరు తప్ప మిగిలినవారందరూ దోషులుగా తీర్మానించబడింది. కాని ఉరి శిక్ష పడలేదు. జీవితకాలం ఖైదు శిక్ష 12 జూన్ 1964న విధించబడింది. కారాగార జీవితం 250px|thumb|right|రొబెన్ దీవిలో మండేలా ఉన్న చెరసాల గది తరువాతి 18 సంవత్సరాలు నెల్సన్ మండేలా రొబెన్ దీవిలో కారాగారశిక్ష అనుభవించాడు. అతని 27 సంవత్సరాల కారాగార జీవితంలో 18 సంవత్సరాలు ఇక్కడే గడిచింది. "డి"-గ్రేడ్ ఖైదీ (అంతదరికంటె తక్కువ స్థాయి ఖైదీ)గా మండేలాకు చాలా తక్కువ సదుపాయాలు లభించాయి. ఆరు నెలలకొక ఉత్తరం (అదీ సెన్సార్ చేయబడింది), ఒక సందర్శకుడు. సున్నపు క్వారీలో శారీరిక శ్రమ. అతి తక్కువ రేషనులు. కారాగారంలో ఉన్న కాలంలోనే మండేలా లండన్ విశ్వవిద్యాలయం వారి విదేశీ కార్యక్రమం ద్వారా న్యాయవాద పట్టాను సాధించాడు. తరువాతి కాలంలో 2009లో మండేలా పేరు లండన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా ప్రతిపాదింపబడింది. (కాని ఎన్నిక కాలేదు. రాకుమారి యాన్నె ఆ ఎన్నికలో విజయం సాధించింది) 1981 తాను వ్రాసిన Inside BOSS అనే జ్ఞాపిక రచనలో గోర్డాన్ వింటర్ అనే గూఢచారి ఉద్యోగి సంచలనాత్మక విషయాలు వ్రాశాడుWinter, Gordon, Inside BOSS, Penguin 1981 మండేలాను చెరసాల నుండి తప్పించడానికి ఒక పథకం వేయబడింది. ఆ పథకం వేసే బృందంలో (విశ్వాస పాత్రునిగా) దక్షిణ ఆఫ్రికా గూఢచారి గోర్డాన్ వింటర్ చొరబడ్డాడు. అతని ఆలోచన ఏమంటే మండేలా కారాగారంలోంచి పారిపోయే పరిస్థితులు కల్పించి, అతను పారిపోయేటప్పుడు ఆతనిని కాల్చి చంపాలని. బ్రిటిష్ గూఢచారి సంస్థ ద్వారా ఈ పథకం భగ్నం చేయబడింది.Lobster Magazine 18. మార్చి 1982లో మండేలా, మరికొందరు నాయకులను రాబెన్ దీవి నుండి పోల్స్‌మూర్ కారాగారానికి మార్చారు. బహశా ఇతర యువ ఖైదీలపై మండేలా ప్రభావం పడకుండా కావచ్చును. లేదా హడావుడి లేకుండా మండేలాతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చును. ఫిబ్రవరి 1985లో మండేలా గనుక సాయుధ పోరాటాన్ని త్యజిస్తే అతనిని విడుదల చేస్తానని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు పీటర్ విలియన్ బోథా ప్రకటించాడు. అయితే మండేలా ఈ ప్రభుత్వ ప్రతిపాదనను తృణీకరించాడు. అతని కుమార్తె ద్వారా అతను విడుదల చేసిన ప్రకటనలో ఇలా ఉన్నది - "ప్రజల సంస్థలను నిషేధించినపుడు నాకిచ్చిన స్వేచ్ఛకు అర్థం ఏమున్నది? స్వతంత్రుడైన వ్యక్తి మాత్రమే ఇచ్చిపుచ్చుకొనే చర్చలు జరుపవచ్చును. ఖైదీ ఇటువంటి ఒప్పందాలలో ప్రవేశించలేడు" 1985లో మండేలా, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య మొదటి సమావేశం (ఒక ఆసుపత్రిలో) జరిగింది. తరువాతి 4 సంవత్సరాలలో అనేక సమావేశాలు జరిగాయి. వీటివల్ల మరిన్ని చర్చలకు అవకాశం కలిగింది. కాని జరిగిన ప్రగతి చాలా అల్పం. మండేలా కారాగారంలో గడిపిన కాలమంతా దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి బయటి నుంచి, లోపలి నుంచి అతన్ని విడుదల చేయమని ఒత్తిళ్ళు ఎక్కువయ్యాయి. 1989 లో బోతా వైఫల్యంతో ఫ్రెడెరిక్ విలియం క్లర్క్ అధ్యక్షుడయ్యాడు. క్లర్క్ ఫిబ్రవరి 1990 లో మండేలా ను విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేశాడు. విడుదల ఫిబ్రవరి 2, 1990న దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన ఫ్రెడెరిక్ డీ క్లర్క్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఇతర జాతి వివక్ష వ్యతిరేక పోరాట సంస్థల మీద నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు, మండేలా తొందరలో విడుదలవబోతున్నట్లు ప్రకటించాడు. దాంతో మండేలా విక్టర్ వెర్స్టర్ కారాగారం నుంచి ఫిబ్రవరి 11, 1990న విడుదల అవడం జరిగింది. ఈ దృశ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేశారు. మండేలా విడుదలైన రోజున ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ఉపన్యాసంలో ఆయన తను శాంతికి కట్టుబడి ఉన్నానని, ఇందుకోసం శ్వేత జాతీయులతో ఒప్పందానికి సిద్దమనీ ప్రకటించాడు. కానీ జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సాగించే పోరు మాత్రం ఆగదని సూచనప్రాయంగా తెలిపారు. అంతే కాకుండా నల్ల జాతి వారి జీవితాలలో శాంతిని నెలకొల్పడం, వారికి జాతీయ, ప్రాంతీయ ఎన్నికలలో వోటు హక్కును కల్పించడం తన ప్రాథమ్యాలలో భాగమని పేర్కొన్నాడు. చర్చలు విడుదలైన తరువాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ పగ్గాలను తిరిగి స్వీకరించాడు. 1990, 1994 మధ్యలో బహుళ పక్షాలతో సమావేశాన్ని ఏర్పరిచి దేశంలో మొట్టమొదటిసారిగా అన్ని జాతులవారికీ కలిపి ఎన్నికలను నిర్వహించేటట్లు చేశాడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, దాని మీద నిషేధం ఎత్తివేసిన తరువాత మొదటిసారిగా 1991లో జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మండేలాను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. మండేలా కారాగారంలో ఉన్నపుడు పార్టీ పగ్గాలు చేపట్టిన పాత స్నేహితుడు ఆలివర్ టాంబో జాతీయ అధ్యక్షుడయ్యాడు. మండేలా కారాగారంలో ఉండగానే దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ డి క్లర్క్‌తో చర్చలు సాగించాడు. 1993లో వారిద్దరికి సమిష్టిగా నోబెల్ బహుమతి ఇవ్వడం ద్వారా వారి కృషికి మరింత గుర్తింపు, ప్రోత్సాహం లభించాయి. సుదీర్ఘ కాలం జరిగిన ఈ చర్చలకు అనేక అవాంతరాలెదురయ్యాయి. బోయ్‌పాటాంగ్ ఊచకోత తరువాత ఈ చర్చలు నిలిపివేశారు. మళ్ళీ 1992లో పునఃప్రారంభించారు. 1993లో సీనియర్ ఆ.నే.కా. నాయకుడు క్రిస్ హని హత్య జరిగినపుడు దేశం అంతర్యుద్ధంలో పడిపోయే పరిస్థితి ఎదురయ్యింది. అప్పుడు దేశంలో శాంతి కోసం మండేలా ఇచ్చిన పిలుపు ఒక దేశాధ్యక్షుడి సందేశంలాగానే ఉంది: కొద్దిపాటి అలజడుల తరువాత దేశంలో శాంతి నెలకొంది. మరల చర్చలు వూపందుకొన్నాయి. 27 ఏప్రిల్ 1994లో సార్వజనిక ఎన్నికలు జరగాలని నిశ్చయించారు. స్వియ చరిత్ర మండేలా స్వియ చరిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ 1994లో ప్రచురింపబడింది. అతను కారాగారంలో ఉండగానే రహస్యంగా ఇది వ్రాయడం మొదలుపెట్టాడు. కాని అందులో మండేలా డి క్లర్క్ దురాగతాల గురించి గాని, కొన్ని హింసా కార్యక్రమాలలో తన భార్య విన్నీ మండేలా పాత్ర గురించి గాని ఏమీ వ్రాయలేదు. ఇవీ, మరికొన్ని వివాదాస్పద విషయాలు తరువాత మండేలా అనుమతి, సహకారాలతో ప్రచురింపబడిన మరొక జీవిత చరిత్రలో వ్రాయబడ్డాయి. మండేలా: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ. దక్షిణ ఆఫ్రికా అధ్యక్ష పదవి ఏప్రిల్ 27, 1994న దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా పూర్తి ప్రజాస్వామ్యంతో కూడిన ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ 62 శాతం ఓట్లను సాధించింది. 1994, మే 10 వతేదీన మండేలా దేశానికి నల్లజాతికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడయ్యాడు. డీ క్లర్క్ ఉపాధ్యక్షుడిగానూ, థాబో ఎంబెకీ రెండవ ఉపాధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. జాతీయ సయోధ్య విధానం మే 1994 నుంచి జూన్ 1999 దాకా అధ్యక్షుడిగా పని చేసిన మండేలా జాతీయ, అంతర్జాతీయ విధానాలలో ఆయన చూపిన చొరవకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు లభించాయి. 1995 లో దక్షిణాఫ్రికాలో జరిగిన రగ్బీ ప్రపంచ కప్ పోటీల సందర్భంగా నల్లజాతీయులైన దక్షిణాఫ్రికన్లను జాతీయ జట్టులో చేరమని మండేలా ప్రోత్సహించాడు. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు న్యూజీలాండ్ జట్టుపై గెలిచిన తరువాత మండేలా దక్షీణాఫ్రికా జెర్సీని ధరించి ఆ జట్టు నాయకుడైనటువంటి ఫ్రాంకాయిస్ పైనార్ కు ట్రోఫీ అందజేశాడు. ఈ సంఘటనను దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులకు, నల్లజాతివారికీ కుదిరిన సయోధ్యలో ముఖ్యమైన అధ్యాయంగా అభివర్ణించవచ్చు. మండేలా అధ్యక్షుడైన తరువాత ఆయన ముఖ్యమైన సందర్భాలలో కూడా బాటిక్ చొక్కాలను వాడేవాడు. వీటినే మడీబా చొక్కాలంటారు. లిసోతో పై దాడి దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక పోరాటాల అనంతరం జరిగిన మొట్టమొదటి సంఘటన లిసోతోపై దాడి. సెప్టెంబరు 1998 న మండేలా అప్పటి ప్రధాని పకలిత మొసిసిలి ప్రభుత్వాన్ని కాపాడడానికి తన సేనలను లిసోతో పై దాడికి పంపించాడు. ఎన్నికల వివాదంతో వ్యతిరేక పక్షాలు ప్రభుత్వాన్ని కూలదోస్తామన్న బెదిరింపే ఇందుకు కారణం. ఎయిడ్స్ వ్యాధి గురించిన వ్యాఖ్యలపై విమర్శలు ఎడ్విన్ కామెరాన్ మొదలైన ఎయిడ్స్ ఉద్యమ కారులు, వ్యాఖ్యాతలు, విమర్శకులు ఎయిడ్స్ పట్ల మండేలా ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని విమర్శించారు. మండేలా పదవీ విరమణ చేసిన తరువాత ఎయిడ్స్ నివారణలో తన ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు. అప్పటి నుంచీ ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించేవారు. లాకర్బీ విచారణ లిబ్యా ప్రెసిడెంట్ ముహమ్మద్ గద్దాఫీకి, అమెరికాకు మధ్య చిరకాలం నడచిన లాకర్బీ వివాదం పరిష్కారం కొరకు మండేలా చొరవ చూపాడు. 21 డిసెంబర్ 1988లో పాన్‌అమ్ విమానం 103 కూలిపోవడానికి కారకులని నిందింపబడిన ఇద్దరు లిబ్యనులను అప్పగించడానికి లిబ్యా నిరాకరంచడమే ఈ వివాదానికి మూలకారణం. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. ఈ వివాదంలో నిందితుల విచారణ దక్షిణాఫ్రికాలో జరపమని మండేలా ప్రతిపాదించాడు కానీ అందుకు అమెరికఅ, బ్రిటన్ ప్రభుత్వాలు అంగీకరించలేదు.Families say SA trial site acceptable The Guardian 11 May 1999 page 13 "Mandela's parting shot at Major over Lockerbie". కాని మళ్ళీ మండేలా 1997లో "నేరారోపణ చేయడం, విచారణ జరపడం, తీర్పు ఇవ్వడం - అన్నీ ఒకే దేశం అధీనంలో ఉండడం న్యాయం కాదు" అన్న వాదనతో ఇదే ప్రతిపాదన చేశాడు. సుదీర్ఘ చర్చల తరువాత నెదర్లాండ్స్‌లో స్కాటిష్ న్యాయచట్టం ప్రకారం విచారణ జరగాలని ఒప్పందం జరిగింది. తరువాత మండేలా గద్దాఫీని కలిసి 1999లో ఈ ప్రతిపాదనకు ఒప్పించాడు. 9 నెలల విచారణ తరువాత ఒకరిని విడుదల చేశారు. మరొకరికి 27 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. అనంతర కాలంలో 2002లో జైలులో ఉన్న మెగ్రాహీని మండేలా పరామర్శించాడు. అతని ఒంటరితనంపై విచారం వ్యక్తం చేశాడు. వివాహం, కుటుంబం మండేలా మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. ఆరు మంది సంతానం, 20 మంది మనుమలు, మనుమరాళ్ళు, ఇంకా పెద్ద సంఖ్యలో ముని మనుమలు ఉన్నారు. ఇతని మనుమడు మండ్లా మండేలా ఒక తెగకు నాయకుడు కూడా. మొదటి వివాహం మండేలా మొదటి వివాహం దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారు ఎక్కువగా నివసించే ట్రాన్స్కీ అనే ప్రదేశం నుంచి వచ్చిన ఎంటోకో మేస్ అనే మహిళతో జరిగింది. వీరు మొట్టమొదట కలుసుకొన్నది జొహన్నెస్ బర్గ్ లో. వీరికి ఇద్దరు కొడుకులు, మడిబా థెంబెకైల్ (1946 లో జననం), మగాతో (1950 లో జననం), ఇద్దరు కూతుర్లు. ఇద్దరి పేర్లూ మకాజివే మండేలానే. మొదటి కూతురు తొమ్మిది నెలల వయసులోనే కన్ను మూసింది. కాబట్టి రెండవ కూతురికి ఆమె జ్ఞాపకార్థం అదే పేరు పెట్టారు. వీరి వివాహమైన 13 సంవత్సరాల తరువాత, 1957 లో, నెల్సన్ ఎక్కువగా విప్లవం వైపు మొగ్గు చూపుతూ ఉండట వలన, ఆయన భార్య రాజకీయ తటస్థతను విశ్వసించడం వలన, అభిప్రాయ భేదాలతో విడిపోయారు. మండేలా కారాగారంలో ఉండగా మొదటి కొడుకు 25 సంవత్సరాల వయసులో కారు ప్రమాదానికి గురై మరణించాడు. అందరు పిల్లలు వాటర్ ఫోర్డ్ కామ్లాబా అనే చోటనే విద్యనభ్యసించారు. ఎవెలీన్ మేస్ 2004లో చనిపోయింది. రెండవ వివాహం మండేలా రెండవ భార్య విన్నీ మడికిజెలా మండేలా లేదా విన్నీ మండేలా. ఆమె జోహాన్నెస్ నగరంలో సమాజ కార్యకర్త అయిన మొదటి నల్ల జాతి వనిత. వారికి ఇద్దరు కుమార్తెలు. ఈ వివాహంలో కూడా దక్షిణాఫ్రికా నల్లజాతివారు ఎదుర్కొనే రాజకీయ, సాంఘిక అంతఃసంఘర్షణ ఛాయలు ప్రబలంగా పడ్డాయి. 1992లో వారు విడాకులు తీసుకొన్నారు. వీరి కుమార్తె జింద్జీకి జొలేకా మండేలా 1980లో జన్మించింది. ఆమె రచయిత, ఆరోగ్య సంరక్షణ కార్యకర్త. మూడవ వివాహం 1998లో, తన 80వ జన్మదినం సందర్భంగా నెల్సన్ మండేలా మూడవసారి గ్రాచా మాచెల్‌ను పెళ్ళి చేసుకొన్నాడు. ఈ వివాహానికి ముందు ఎన్నో నెలల చర్చలు (కన్యాశుల్కానికి సంబంధించిన బేరసారాల వంటివి) జరిగాయి. (ఈ పెళ్ళి కుదిర్చిన పెద్దమనిషే అంతకుముందు ఒకమారు మండేలాకు సంబంధం నిర్ణయిస్తే, అందుకు ఒప్పుకోని కుర్ర మండేలా ఇల్లు వదలి వెళ్ళిపోయాడు.) పదవీ విరమణ, అనంతరం 1994 లో మండేలా 77 సంవత్సరాల వయసులో అధ్యక్ష పదవిని చేబట్టి ఆ పదవిని అలంకరించిన వారిలో అతి పెద్ద వయస్కుడయ్యాడు. రెండవసారి మరలా ఎన్నికల్లో పోటీ చేయరాదని నిశ్చయించుకున్నాడు. 1999లో పదవీ విరమణ చేశాడు. ఆయన తరువాత థాబో ఎంబెకీ ఆ పదవిని స్వీకరించాడు. జూలై 2001లో మండేలాకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నదని నిర్ధారించబడింది. రేడియేషన్ వైద్యం చేశారు. జూన్ 2004లో తాను పబ్లిక్ జీవితం నుండి విరమిస్తున్నట్లుగాను, అధికంగా కుటుంబంతో గడపదలచుకొన్నట్లుగాను మండేలా ప్రకటించాడు. కాని పూర్తిగా సమాజం నుండి దూరంగా ఉండలేదు. "My appeal therefore is: Don't call me, I will call you." 2003 తరువాత తన సాంఘిక కార్యక్రమాలను మండేలా బాగా తగ్గించుకొన్నాడు. పైబడుతున్న వయసు కారణంగా అతని ఆరోగ్యం కొంత క్షీణించింది. 2003లో మండేలా మరణం గురించిన సంతాపవార్త పొరపాటున సి.ఎన్.ఎన్. వారి వెబ్సైటులో ప్రచురింపబడింది. వారు మండేలా వంటి ప్రముఖుల మరణవార్తల సందేశాలను ముందుగా వ్రాసి ఉంచుకుంటారు. సామాజిక కార్యాలు పదవీ విరమణానంతరం మండేలా మానవహక్కులకు సంబంధించినవి, పేదరికం నిర్మూలనకు అంకితమయినవి అయిన వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. 2006 శీతాకాలపు ఒలింపిక్ క్రీడల టెలివిజన్ ప్రచారంలో కనిపించాడు. 17 రోజులు వాళ్ళు రూమ్ మేట్స్ 17 రోజులు వాళ్ళు ఆత్మబంధువులు 22 సెకన్లు వారు ప్రతిస్పర్థులు 17 రోజులు సమానులు, 22 సెకన్లు విరోధులు ఇది ఎంత అద్భుతమైన ప్రపంచం? ఇదే ఒలింపిక్ ఆటలలో నాకు కనిపించే ఆశాభావం. ఇంకా కొన్ని సామాజిక కార్యక్రమాలలో మండేలా పాత్ర వహించాడు. పెద్దలు 18 జూలై 2007న నెల్సన్ మండేలా, గ్రాచా మాకెల్, డెస్మండ్ టుటు కలిపి జోహాన్నెస్‌బర్గ్‌లో వృద్ధులైన ప్రపంచనాయకుల స్వతంత్ర సమూహాన్ని ప్రపంచ పెద్దలు అనే పేరుతో స్థాపించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని తీవ్రమైన సమస్యల పరిష్కారానికి వారి అనుభవాన్ని, వివేకాన్ని అందించి సహకరించడమే వారి ఆశయం. బిషప్ టుటు అధ్యక్షతన ప్రాంభమైన ఈ సమూహంలో మరికొంతమంది పేరెన్నికగన్న ప్రపంచ నాయకులు ఉన్నారు. వారి ఆశయాన్ని గురించి మండేలా ఇలా చెప్పాడు. Nelson Mandela announces The Elders July 18, 2007 ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తన పదవీ విరమణ తరువాత ఎయిడ్స్ వ్యాధి నివారణకు మండేలా విశేషంగా కృషి చేశాడు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలకు తన సహకారం అందించాడు. మండేలా కుమారుడు మకఘతో మండేలా ఎయిడ్స్ వ్యాధితో మరణించాడు. ఇరాక్ పై దాడి గురించి 2003లో జార్జి బుష్ అధ్వర్యంలో అమెరికా ఇరాక్ పై చేసిన దాడినీ, అమెరికా విదేశాంగ విధానాన్నీ మండేలా నిశితంగా విమర్శించాడు. ఐక్య రాజ్య సమితిని బుష్ నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించాడు. ఈ విధానంలో అమెరికా యొక్క జాతి వివక్ష భావాలు కనిపిస్తున్నాయని కూడా విమర్శించాడు. ఒక దేశం ప్రపంచంపై పెత్తనం సాగించడాన్ని వ్యతిరేకించమని చాటిచెప్పాడు. మానవాళి మనుగడకు ప్రమాదకరమైన సంఘటనలు అందరికంటే అధికంగా అమెరికా వల్లనే జరిగాయన్నాడు. ఇస్మాయిల్ అయూబ్ వివాదం ఇస్మాయిల్ అయూబ్ 30 సంవత్సరాలకు పైగా మండేలాకు నమ్మకమైన వ్యక్తిగత న్యాయవాదిగా పని చేశాడు. 2005 మేలో తను సంతకం చేసిన ప్రతులను అమ్మవద్దనీ, ఇంతకు ముందు అమ్మినవాటి డబ్బులు లెక్క చూపమనీ ఇస్మాయిల్‌ను మండేలా ఆదేశించాడు. ఈ విషయంపై నెలకొన్న వివాదం ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్ళింది. చాలా కాలం నడచింది. అయితే తాను ఏ విధమైన చట్టవిరుద్ద చర్యా చేయలేదని, తనను అపఖ్యాతి పాలుజేయడానికి కుట్ర జరుగుతున్నదని ఇస్మాయిల్ వాదించాడు. 2005, 2006 సంవత్సరాలలో మండేలా అనుయాయులు ఇస్మాయిల్ కుటుంబంపై దాడి చేశారు. ఈ వివాదం రచ్చన పడి దేశమంతా చర్చనీయాంశం అయ్యింది. ఇస్మాయిల్ అయూబ్ కుటుంబాన్ని దాదాపు వెలివేశారు. 2007లో అయూబ్ వివాదం పరిష్కారానికి మండేలా కుటుంబం ట్రస్టుకు R700 000 విరాళం ఇచ్చి క్షమాపణ చెప్పాడు. అయితే మండేలాకున్న ఉన్నత స్థాయి వలన అయూబ్ పక్షం వాదనను నిష్పక్షపాతంగా పరిశీలించే అవకాశం లేకుండా పోయిందని కొందరు వ్యాఖ్యానించారు. ఆరోపణలు నెల్సన్ మండేలా వారసుల కోసం ఏర్పరచిన నెల్సన్ మండేలా ట్రస్ట్‌కు ప్రముఖ వాణిజ్యవేత్తలనుండి పెద్ద పెట్టున విరాళాలు లభించడం వల్ల వారి ఆర్థిక లావాదేవీల గురించి కూడా కొన్ని వివాదాలు జరిగాయి. మండేలా విదేశీ బ్యాంకు ఖాతాల గురించి, పన్నులు కట్టకపోవడం గురించిన ప్రస్తావనలు కూడా ఈ వివాదాలలో ఉన్నాయి. వజ్రాల వాణిజ్యంపై వివాదం దక్షిణాఫ్రికా ఆర్థిక స్థితికి వజ్రాల గనులు ఒక ముఖ్యమైన వనరు. రక్తపు వజ్రాల గురించి ఈ విషయంలో కొన్ని విమర్శలున్నాయి. ఆ విషయంపై వజ్రాల వ్యాపారాన్ని పరిరక్షించే దిశలో మండేలా చేసిన వ్యాఖ్యల గురించి పెక్కు విమర్శలు వచ్చాయి. తన మిత్రుడైన వజ్రాల వ్యాపారిని సమర్థిస్తున్నాడని, సంకుచితమైన స్వదేశ ఆర్థిక లాభాలను కాపాడుకొంటున్నాడని విమర్శించారు. జింబాబ్వే, రాబర్ట్ ముగాబే 1980లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జింబాబ్వేకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రాబర్ట్ ముగాబే 1980లలో గుకురాహుండి అనే ప్రదేశంలో 20,000 మందిని వధించడంలోనూ, అవినీతి, అసమర్థ పరిపాలన, రాజకీయంగా అణగదొక్కడం వంటి విషయాలపైననూ అంతర్జాతీయంగా చాలా విమర్శలకు గురయ్యాడు. అంతే కాకుండా ఆర్థికంగా ఆ దేశం వెనుకబాటు తనానికి కారణమయ్యాడు. మండేలా 2000 సంవత్సరంలో ఆ ప్రభుత్వాన్ని విమర్శించాడు. కానీ 2003 నుంచీ జింబాబ్వే పై, ఇతర అంతర్జాతీయ విషయాలపై మండేలా మౌనంగా ఉన్నాడు. తన ప్రభావాన్ని ఉపయోగించి ముగాబే విధానాలను సరిదిద్దుకోమని చెప్పడం మాని మౌనంగా ఉండడం అనేక విమర్శలకు దారి తీసింది. ప్రశంసలు, సన్మానాలు thumb|right|దక్షిణాఫ్రికా విముక్తి పోరాట యోధుడు - 1988 లో సోవియట్ యూనియన్‌లో విడుదలయిన స్మారక తపాళా బిళ్ళ పురస్కారాలు మండేలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. 1993 లో ఫ్రెడెరిక్ విలియం డీ క్లర్క్ తో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు. ఇంగ్లండు రాణి ఎలిజబెత్ -2 నుంచి "వెనెరబుల్ ఆర్డర్ ఆఫ్ సెయింట్ జాన్", కామన్వెల్త్ కూటమి ప్రధానం చేసే "ఆర్డర్ ఆఫ్ మెరిట్", జార్జి బుష్ నుంచి "ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్" గౌరవాలను అందుకున్నాడు. జూలై 2004 లో జొహన్నెస్ బర్గ్ నగరంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం "ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ" ని ఓర్లాండో లో జరిగిన కార్యక్రమంలో ప్రధానం చేశారు. 1998లో ఆయన పాల్గొన్న కెనడా పర్యటనలో టొరంటో లోని స్కైడోమ్ లో ఏర్పాటు చేసిన ఉపన్యాస సభలో 45,000 మంది స్కూలు విద్యార్థులు మండేలాకు స్వాగతం పలికారు. ఈ సంఘటన అతనికి విదేశాలలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియజేస్తుంది. 1989 లో అతనికి కెనడా గౌరవ పౌరసత్వాన్ని ప్రకటించింది. జీవించి ఉన్న వ్యక్తికి కెనడా గౌరవ పౌరసత్వాన్ని ఇవ్వడం అదే మొదటిసారి. అంతకు మునుపు మరణానంతరం ఈ గౌరవాన్ని పొందింది రావుల్ వాలెన్ బర్గ్. 1990లో భారత ప్రభుత్వం మండేలాకు భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ను ప్రకటించింది. అదే సంవత్సరం సోవియట్ ప్రభుత్వం లెనిన్ శాంతి బహుమతిని ప్రకటించి సత్కరించింది. 1992 లో అతనికి టర్కీ "అటాటర్క్ శాంతి బహుమతి"ని ప్రకటించింది. దీనిని మొదట్లో అప్పట్లో టర్కీలో మానవ హక్కుల ఉల్లంఘనను కారణంగా చూపి తిరస్కరించినా, 1999 లో మండేలా అంగీకరించడం జరిగింది. పాటలు, చలనచిత్రాలు, రోడ్లు, విగ్రహాలు పెక్కు మంది సంగీత కళాకారులు తమ పాటలను మండేలాకు అంకితం చేశారు. వీటిలో బాగా ప్రచారం పొందినది ది స్పెషల్స్ 1983 లో రూపొందించిన నెల్సన్ మండేలా అనే గీతం. స్టెవీ వండర్ కు ఐ జస్ట్ కాల్డ్ టు సే ఐ లవ్ యు అనే గీతానికి 1985లో లభించిన ఆస్కార్ పురస్కారాన్ని మండేలాకు అంకితం చేశాడు. దాంతో అప్పటి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశంలో అతని సంగీతాన్ని నిషేధించింది. 1985 లో యూసౌ ఎండూర్ కూడా అమెరికాలో నెల్సన్ మండేలా మీద ఆల్బమ్ ను విడుదల చేశాడు. 1988 లో మండేలా 70వ జన్మదినం నాడు లండన్ లోని వెంబ్లే స్టేడియంలో ఒక సంగీత ప్రదర్శన జరిగింది. జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి అది ఒక కేంద్ర బిందువుగా నిలిచింది. ఈ ప్రదర్శనలో చాలామంది కళాకారులు మండేలాకు తమ మద్దతు ప్రకటించారు. నెల్సన్ మండేలా అనే పుస్తకాన్ని రచించిన జెర్రీ డామర్స్ నేతృత్వం లోఈ కార్యక్రమం జరిగింది. సింపుల్ మైండ్స్ అనే బృంద ప్రదర్శన కోసం మండేలా డే అనే గీతాన్ని సమకూర్చగా, శంతన మండేలా అనే వాయిద్య సంగీతాన్ని సమకూర్చింది. ట్రేసీ చాప్ మాన్ మండేలాకు అంకితంగా ఫ్రీడమ్ నౌ అనే గీతాన్ని ఆలపించింది. ఈ గీతాన్ని క్రాస్ రోడ్స్ అనే ఆల్బమ్ తో కలిపి విడుదల చేసింది. మాలి నుంచి వచ్చిన సలీఫ్ కీటా తరువాత దక్షిణాఫ్రికాను సందర్శించి 1995లో ఫోలోన్ అనే ఆల్బమ్ కోసం మండేలా పై ఒక పాటను స్వరపరిచాడు. thumb|right|150px|లండన్ లోని పార్లమెంటు స్క్వేర్ వద్దగల మండేలా విగ్రహం ఇంకా మండేలాను గౌరవిస్తూ వివిధ దేశాలలో పెక్కు పాటలు, ఆల్బమ్‌లు, సంగీత కార్యక్రమాలు అతనికి అంకితం చేయబడ్డాయి. 1997లో వచ్చిన మండేలా అండ్ డీ క్లర్క్ అనే చలన చిత్రం మండేలా జైలు నుంచి విడుదలైన కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో మండేలా పాత్రను సిడ్నీ పాయిటర్ అనే నటుడు పోషించాడు. మండేలా జీవితం మీద ఆధారపడి నిర్మించిన గుడ్ బై బఫానా అనే చిత్రం ఫిబ్రవరి 11, 2007న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. డెన్నిస్ హేస్బర్ట్ మండేలాగా నటించిన ఒక చిత్రం, జైలు గార్డు జేమ్స్ గ్రెగొరీతో అతని సంబంధాన్ని గురించి వివరిస్తుంది. 1992లో, 27 సంవత్సరాల జైలు జీవితం తరువాత, వచ్చిన ఒక చిత్రం Malcolm X లో మండేలా ఒక పాఠశాల ఉపాధ్యాయునిగా కనిపించాడు. అందులో అతని ప్రసిద్ధి చెందిన ఉపన్యాసాలలో కొన్ని భాగాలు మండేలా స్వయంగా చెప్పాడు. సమాన హక్కుల కోసం మేము పోరాడతాం అనే సందర్భంలో చెప్పిన ఉపన్యాసంలో అవసరాన్ని బట్టి ఏ విధానంలోనైనా'' అన్న భాగాన్ని ఆ చిత్రంలో మండేలా చెప్పలేదు. ఎందుకంటే ఆ పదాలను అతనిపై నేరారోపణ చేయడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాడుకోవచ్చునేమోనని. మండేలా విగ్రహాలు కూడా అనేకచోట్ల నెలకొల్పబడ్డాయి. కొన్ని కూడళ్ళకు, రోడ్లకు మండేలా పేరు పెట్టారు. ఢిల్లీలో కూడా ఒక "నెల్సన్ మండేలా రోడ్" ఉంది. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా యొక్క జయంతి జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం జరుపబడుతుంది. అస్తమయం కొంత కాలంగా తీవ్ర శ్వాసకోశ సంబంధ అస్వస్థతతో బాధపడుతూ 2013 డిసెంబరు 5 న 20:50 (దక్షిణాఫ్రికా ప్రాంతీయ సమయం)గంటలకు జోహెన్స్ బర్గ్ లో మరణించారు. వివిధ దేశాలనుండి సుమారుగా 90 మంది ప్రతినిధులు ఆయన అంత్యక్రియలకు హాజరు అయ్యారు. ఇవి కూడా చూడండి దక్షిణ ఆఫ్రికా చదువ దగినవి ఆంగ్లంలో పెక్కు రిఫరెన్సులకొరకు ఆంగ్ల వికీ వ్యాసం :en:Nelson Mandela చూడండి. బయటి లింకులు Nelson Mandela – Biography at Nobelprize.org Nelson Mandela Foundation Nelson Mandela Children's Fund Nelson Mandela Children's Fund (Canada) Time 100 profile Mandela: An Audio History Mandela: Son of Africa, Father of a Nation Documentary & Soundtrack Nelson Mandela: Helping Orphans in South Africa The Elders The Art of Nelson Mandela మూలాలు వర్గం:దక్షిణ ఆఫ్రికా వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు వర్గం:1918 జననాలు వర్గం:2013 మరణాలు వర్గం:దక్షిణ ఆఫ్రికా రాజకీయ నాయకులు వర్గం:జవహర్ లాల్ నెహ్రూ అవార్డు గ్రహీతలు వర్గం:ఈ వారం వ్యాసాలు
ఎం.జి.రామచంద్రన్
https://te.wikipedia.org/wiki/ఎం.జి.రామచంద్రన్
ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు. 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది. తన యవ్వనంలో ఎంజిఆర్, అతని అన్నయ్య ఎంజి చక్రపాణి తమ కుటుంబాన్ని పోషించడానికి ఒక నాటక బృందంలో సభ్యులయ్యారు. గాంధేయ ఆదర్శాల ప్రభావంతో ఎంజిఆర్ భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. కొన్ని సంవత్సరాల పాటు నాటకాల్లో నటించిన తరువాత 1936లో సతీ లీలావతి చిత్రంలో ఒక సహాయ పాత్రలో చలనచిత్రరంగ ప్రవేశం చేశాడు. 1940 దశకం చివరికల్లా అతను కథానాయక పాత్రలు సంపాదించాడు. తరువాత మూడు దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకునిగా ఆధిపత్యం సంపాదించాడు. సిఎన్ అన్నదురై నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె పార్టీ)లో ఎం.జి.ఆర్. సభ్యుడయ్యాడు. నటుడిగా తనకున్న అపారమైన ప్రజాదరణను భారీ రాజకీయ బలం పెంపొందించడానికి ఉపయోగించాడు. తద్వారా డీఎంకెలో తన స్థానాన్ని వేగంగా పెంచుకుంటూ పోయాడు. అన్నాదురై మరణించాకా పార్టీ నాయకత్వం చేపట్టిన తన ఒకప్పటి స్నేహితుడు కరుణానిధితో ఎం.జి.ఆర్.కు రాజకీయ విరోధం ఏర్పడింది. 1972లో అన్నాదురై మరణించిన మూడేళ్ళకు డిఎంకెను విడిచిపెట్టి, తన సొంత పార్టీ- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కళగం (ఎఐఎడిఎంకె) ను ఏర్పాటు చేశాడు. ఐదు సంవత్సరాల తరువాత, 1977 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఎం.జి.ఆర్. తన నేతృత్వంలోని ఏఐఎడిఎంకె కూటమిని విజయం వైపుకు నడిపించాడు. అలా అతను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో భారతదేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రి పదవి సాధించిన సినీ నటుడిగా చరిత్ర సృష్టించాడు. ఆయన నేతృత్వంలో ఏఐఏడిఎంకె 1980లోనూ, 1984లోనూ మరో రెండు పర్యాయాలు రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించింది. 1980లో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన విధించిన ఆరు నెలలు మినహాయిస్తే, 1987లో మరణించేవరకూ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగాడు. నటించిన సినిమాలు ఎం.జి.ఆర్. నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాల పాక్షిక జాబితా: సర్వాధికారి (1951) ఆలీబాబా 40 దొంగలు (1956) సాహస వీరుడు (1956) రాజపుత్రి రహస్యము (1957) మహాదేవి (1958) వీరఖడ్గం (1958) అనగనగా ఒక రాజు (1959) దేసింగురాజు కథ (1960) బాగ్దాద్ గజదొంగ (1960) కత్తిపట్టిన రైతు (1961) జేబు దొంగ (1961) ఇద్దరు కొడుకులు (1962) ఏకైక వీరుడు (1962) భాగ్యవంతులు (1962) వీరపుత్రుడు (1962) అదృష్టవతి (1963) రాణీ సంయుక్త (1963) ఇంటి దొంగ (1964) దొంగనోట్లు (1964) దొంగ బంగారం (1964) దొంగను పట్టిన దొర (1964) హంతకుడెవరు? (1964) కథానాయకుడు కథ (1965) కాలం మారింది (1965) ఘరానా హంతకుడు (1965) ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు (1965) ఎవరాస్త్రీ? (1966) ఎవరి పాపాయి (1966) కాలచక్రం (1967) ధనమే ప్రపంచలీల (1967) పెళ్ళంటే భయం (1967) శభాష్ రంగ (1967) అంతులేని హంతకుడు (1968) అగ్గిరవ్వ (1968) దెబ్బకు దెబ్బ (1968) దోపిడీ దొంగలు (1968) కొండవీటి సింహం (1969) డ్రైవర్ మోహన్ (1969) నా మాటంటే హడల్ (1969) ప్రేమ మనసులు (1969) సికింద్రాబాద్ సి.ఐ.డి. (1971) బందిపోటు భయంకర్ (1972) రిక్షా రాముడు (1972) లోకం చుట్టిన వీరుడు (1973) కాశ్మీరు బుల్లోడు (1975) మంచి కోసం (1976) మూలాలు వర్గం:మద్రాసు విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థులు వర్గం:తమిళనాడు ముఖ్యమంత్రులు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1987 మరణాలు వర్గం:1917 జననాలు వర్గం:తమిళ సినిమా నటులు
సత్యజిత్ రాయ్
https://te.wikipedia.org/wiki/సత్యజిత్_రాయ్
సత్యజిత్ రాయ్ (మే 2 1921–ఏప్రిల్ 23 1992) భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత. ఆతను ప్రపంచ సినిమాలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించాడు. కలకత్తాలో బెంగాలీ కళాకారుల కుటుంబములో జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విద్యాలయము లోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రాయ్, లండన్ లో ఫ్రెంచి నిర్మాత జాన్ రెన్వాను కలిసాక, ఇటాలియన్ "నియోరియలిస్టు" సినిమా బైసికిల్ థీవ్స్ తరువాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు. రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించాడు. ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), సంగీతము, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము - వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక "సందేశ్"ను చాలా ఏళ్ళు నిర్వహించాడు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నాడు. thumb|250px|upright|1992లో సత్యజిత్ రాయ్ గౌరవ ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి భారతీయునిగా నిలిచాడు. 1992లో, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్) సత్యజిత్ రాయ్కి అకాడమీ గౌరవ పురస్కారం (ఆస్కార్ అవార్డు) అందించారు. గౌరవ ఆస్కార్ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగానూ, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు.. తొలి జీవితము రాయ్ తాత ఉపేంద్రకిషోర్ రాయ్ చౌదరి, ఒక రచయిత, తత్త్వవేత్త, ప్రచురణకర్త, బ్రహ్మ సమాజం నాయకుడు. ఉపేంద్రకిషోర్ కొడుకు సుకుమార్ బెంగాలీలో నాన్సెన్స్ కవిత్వము (అంటే యతి ప్రాసలు లేకుండా వింతగా ఉండి, నవ్వు పుట్టించే కవిత్వము) సృష్టికర్త, బాల సాహిత్యవేత్త, విమర్శకుడు. సత్యజిత్ సుకుమార్, సుప్రభ దంపతులకు 1921 మే 2న జన్మించాడు. రాయ్‌కు 3 సంవత్సరములు ఉన్నపుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న ఆదాయముతో రాయ్‌ని పెంచింది. రాయ్ కళల పై ఆసక్తి ఉన్నపటికీ ప్రెసిడెన్సీ కాలేజీలో అర్థశాస్త్రము చదివాడు. శాంతినికేతన్ పై చిన్న చూపు ఉన్నప్పటికీ తల్లి ప్రోద్బలముతో టాగూర్ కుటుంబము పై గౌరవముతో విశ్వభారతికి వెళ్ళాడు. అక్కడ ప్రాచ్య కళలు (ఓరియంటల్ ఆర్ట్) లను ఆభ్యసించాడు. ప్రముఖ పెయింటర్లు నందలాల్ బోస్ వినోద్ బిహారీ ముఖర్జీ నుంచి నేర్చుకున్నాడు, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు దర్శించి భారతీయ కళల పై మక్కువ పెంచుకున్నాడు. సత్యజిత్ రాయ్ మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయన పై ఓ స్టాంపును విడుదల చేసింది. దర్శకత్వం వహించిన సినిమాలు ఇతడు దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు : పథేర్ పాంచాలి (1955) అపరాజితొ (1956) అపుర్ సంసార్ (1959) దేవి (1961) కాంచన్‌జంగ (1962) మహానగర్ (1963) చారులత (1964) చిరియాఖానా (1967) తీన్ కన్య కాపురుష్ వో మహాపురుష్ గోపీ గాఁయె బాఘా బఁయె (1969) సీమబద్ధ (1971) సోనార్ కెల్లా నాయక్ ఘరె బైరె (1984) అగంతక్ రచయితగా సత్యజిత్ రాయ్ ప్రపంచానికి సత్యజిత్ రాయ్ ఒక దర్శకుడిగా మాత్రమే తెలిసినా కూడా ఆయన బెంగాలీలో ఎన్నో రచనలు చేశాడు. తన తాత ప్రారంబించిన "సందేశ్" పత్రిక మధ్యలో ఆగిపోతే సత్యజిత్ రాయ్ తిరిగి ప్రారంభించాడు. ఇది చిన్న పిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక. ఇందులోనే సత్యజిత్ రాయ్ పిల్లల కోసం "ఫెలూదా" అన్న డిటెక్టివ్ ని సృష్టించారు. 1965 మొదలుకుని 1994 దాకా 35 ఫెలూదా నవలలు రాసారు. ఇందులో - ఫెలూదా, అతని కజిన్ తపేష్, జటాయు అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలూదా కథలు. ఇది కాక సత్యజిత్ రాయ్ ప్రొఫెసర్ శొంకు అన్న మరో పాత్రని కూడా సృష్టించి నవలలు రాసాడు. బెంగాలీ పిల్లల సాహిత్యంలో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది. సత్యజిత్ రాయ్ కథా రచయిత కూడా. ఆయన రాసిన కథలు ఆయనకు వివిధ రంగాలలో ఉన్న విశేష పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఆయన రచనల్లో చాలా వరకు గోపా మజుందార్ ఆంగ్లానువాదం చేసారు. సత్యజిత్ రాయ్ పిల్లల నవల - "ఫతిక్ చంద్" తెలుగు లోకి కూడా అనువదితమైంది. ఇవి కాక, సినిమాలు తీయడం గురించి ఆయన అనేక వ్యాసాలు రాశాడు. వాటిలో కొన్ని తెలుగులోకి అనువదితం అయ్యాయి కూడా. ఆయన కథా సంకలనాలలో కొన్ని: 1.20 short stories 2. Stranger and other stories (20 short stories above + Fotik chand) 3. The Best of Satyajit Ray - ఆయన కథలన్నీ మొదట పన్నెండు కథల సంకలనాలుగా వచ్చాయి. పన్నెండుకి రకరకాల నామాంతరాలతో విడుదల కావడం వాటి ప్రత్యేకత. ఉదాహరణకు - "డజన్", "టూ ఆన్ టాప్ ఆఫ్ టెన్" వగైరా. ఆయన ఫెలూదా కథల జాబితాని ఇక్కడ చూడవచ్చు. గౌరవాలు 2021లో జరిగిన 52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సత్యజిత్ రే శతజయంతి సందర్భంగా, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ 'స్పెషల్ రెట్రోస్పెక్టివ్' ద్వారా ఆయనకు నివాళులు అర్పించింది, చిత్రోత్సవంలో రే రూపొందించిన 11 సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డాయి. అతని వారసత్వానికి గుర్తింపుగా జీవితకాల సాఫల్య పురస్కారానికి ఈ సంవత్సరం నుండి 'సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'గా పేర్కొనబడింది. గ్రంథసూచి సత్యజిత్ రాయ్ – ఓ చిన్న ఉపోద్ఘాతం – ఈమాట రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు – ఈమాట 'అపు సంసార్ ' – సత్యజిత్ రాయ్ సినిమా – ఈమాట ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా – ఈమాట 'అపరాజితో' – సత్యజిత్ రాయ్ సినిమా – ఈమాట రహదారి పాట – 'పథేర్ పాంచాలి' సత్యజిత్ రాయ్ సినిమా - ఈమాట మూలాలు బాహ్య లంకెలు వర్గం:దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు వర్గం:రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు వర్గం:1921 జననాలు వర్గం:1992 మరణాలు వర్గం:పశ్చిమ బెంగాల్ వ్యక్తులు వర్గం:సినిమా దర్శకులు వర్గం:కోల్‌కతా రచయితలు వర్గం:బెంగాలీ రచయితలు వర్గం:శాంతి నికేతన్ పూర్వ విద్యార్థులు వర్గం:అకాడమీ అవార్డు విజేతలు
జె.ఆర్.డి.టాటా
https://te.wikipedia.org/wiki/జె.ఆర్.డి.టాటా
జె.ఆర్.డి.టాటా (జూలై 29, 1904 - నవంబర్ 29, 1993) భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త. తొలి విమాన చోదకుడు. ఈయనకు 1992లో భారతరత్న పురస్కారం ఇవ్వబడింది. ప్యారిస్ లో జన్మించిన ఈయనను "జెహ్" లేక "జేఆర్డీ"గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో, ఈయన ఫ్రెంచి భాషను మొదటి భాషగా నేర్చుకున్నాడు. 1929లో ఈయన భారతదేశములోనే మొట్టమొదటి పైలట్ లైసెన్సు పొందాడు. 1932 లో ఈయన భారతదేశపు తొలి వాణిజ్య విమానసేవలను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. 1946లో అది "ఎయిర్ ఇండియా"గా రూపాంతరం చెందింది. తర్వాతికాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా ప్రశంసింపబడ్డాడు. 34 ఏళ్ళ వయసులో ఆయన టాటా వ్యాపారసంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ (Holding Company: హోల్డింగ్ కంపెనీ లేక మాతృసంస్థ) అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మనుగా బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగాడు. సుదీర్ఘమైన ఆయన హయాంలో టాటా గ్రూపు ఆస్తులు అరవైరెండు కోట్ల రూపాయల నుండి పదివేల కోట్ల రూపాయల పైబడి పెరగగా, గ్రూపులో సంస్థలు పదిహేను నుండి నూటికి పైగా చేరుకున్నాయి. బాల్యం జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయి టాటా ఫ్రాన్స్‌ లోని ప్యారిస్‌లో రతన్‌జీ దాదాభాయి టాటాకు ఆయన ఫ్రెంచ్‌ సతీయణి అయిన సుజానె బ్రెయిర్‌కూ రెండో బిడ్డగా 1904 జూలై 29 లో జన్మించాడు. ఆయన తండ్రి భారతదేశంలో తొలి పారిశ్రామికవేత్త అయిన జెంషెట్‌జీ టాటాకు దాయాది సోదరుడు. టాటా ఫ్రాన్స్‌లోని బీచ్‌బడ్డున ఉన్న హార్డెలోట్‌లో తన బాల్యాన్ని గడిపినప్పుడు, ఆయనకు విమానయానం పైన ఆసక్తి ఏర్పడింది. విమానాలు నడపడంలో ఆద్యుడైన లూయీ బ్లెరియో నుండి ఆయన స్ఫూర్తి పొందాడు.1929 లో టాటా భారతదేశంలో మొట్టమొదట పైలట్‌ లైసెన్సు పొందాడు. తర్వాతి కాలంలో ఆయన భారత పౌర విమానయాన పితగా గుర్తింపు పొందాడు. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్ధ టాటా ఎయిర్‌ లైన్స్‌ను 1932 లో స్ధాపించాడు. అదే తర్వాత 1946 లో ఎయిర్‌ ఇండియాగా మారింది. ఆయన తల్లి ఫ్రెంచ్‌ దేశానికి చెందినవారవటం వల్ల ఆయన తన బాల్యాన్ని ఎక్కువగా ఫ్రాన్స్‌లోనే గడిపాడు. అతను నేర్చుకున్న మొదటి భాష ఫ్రెంచ్‌. ఆయనకు ఎన్నో ఇష్టాలుండేవి. కేంబ్రిడ్జ్‌లో చదువుకోవాలనుకున్నాడు. వేగంగా వేళ్లే కార్లపై మోజు పడేవాడు, ఫ్రెంచ్‌ సైన్యంలో లా సఫిస్‌ (సిపాయిు) అనే రెజిమెంట్‌లో పనిచేశాడు. ముంబయిలోని కాథెడ్రల్‌, జాన్‌కానన్‌ పాఠశాల్లో చదువుకున్నాడు. వ్యాపారం 1925 లో టాటా స్టీల్‌ కంపెనీలో అప్పటి డైరెక్టర్‌ ఇన్‌ఛార్జి అయిన జాన్‌ పీటర్సన్‌ దగ్గర పనిచేయడానికి బొంబాయి హౌజ్‌కు వచ్చాడు.1938 లో టాటా సన్స్‌కి చైర్మన్‌ అయిన సర్‌ నౌరోజి సక్లత్‌ వాలా చనిపోగానే 34 ఏళ్ల వయస్సున్న జె.ఆర్‌.డి దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. చాలా దశాబ్దాల పాటు స్టీల్‌, ఇంజినీరింగ్‌ ఎల్లక్ట్రికల్‌ కంపెనీ వంటి ఎన్నో పరిశ్రమున్న టాటా గ్రూప్‌ సంస్ధను ఉన్నత ప్రమాణాలతో, ఏ రాజకీయవేత్తకూ లంచాలూ ముడుపులూ చెల్లించకుండా, నల్లబజారు మార్గం ఎంచుకోకుండా ఆయన వ్యాపారం నడిపించాడని కీర్తి పొందాడు.ఈ రోజుకూ విశ్వాసానికి మారుగా టాటా పేరు గడించాడు. 1939 లో దేశంలో మళ్లీ మళ్లీ ఏర్పడుతున్న కొరతను తీర్చడానికై స్వయం ఆధారితమైన మౌలిక కర్బనేతర రసాయన పరిశ్రమ టాటా కెమికల్స్‌ను భారతదేశం కోసం ప్రారంభించాడు. 1945 టాటా స్టీల్‌ వారు భారత రైల్వే శాఖలో లోకోమోటివ్స్‌ను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో టాటా ఇంజనీరింగ్‌ అండ్‌ లోకోమోటివ్‌ కంపెనీని (టెల్కో) ను స్ధాపించాడు. టెల్కోను తర్వాత టాటా మోటర్సుగా మార్పు చేసి భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఆటోమోటివ్‌ మార్కెట్‌లో అత్యంతప్రధానమైనదిగాను తీర్చిదిద్దాడు. జెఆర్‌డి అధ్యక్షతన (చైర్మన్‌) టాటా గ్రూప్‌ కంపెనీ 15 నుండి 100 కు అభివృద్ధి చెందాయి. 1932 లో టాటా విమానయాన సర్వీసును ప్రారంభించడం ద్వారా ఆయనకు విమానాపై ఉన్న ఆశ నెరవేరింది. మొట్టమొదటి భారత పౌర విమానం కరాచీలోని ద్రిగ్‌ రోడ్డు విమానక్షేత్రం నుండి 1932 అక్టోబరు 15 న భయుదేరి టాటానే స్వయంగా ఒంటరిగా దాన్ని నియంత్రిస్తుండగా అహ్మదాబాద్‌కు, అక్కడి నుండి బాంబేకు చేరింది. టాటా ఏవియేషన్‌ సర్వీస్‌ ప్రారంభమైన మొదటి సంవత్సరంలో వందకు వంద శాతం సమయపాలన పాటిస్తూ 10,000 రూపాయి లాభాన్ని పొందింది. 1953 లో ప్రభుత్వం విమానయాన వ్యాపారాన్ని జాతీయం చేయాని నిర్ణయించి ఆ పరిశ్రమకు అధ్యక్షుడుగా టాటాను ఆహ్వానించింది. దేశంలోని విమానయాన పరిశ్రమ అప్పుడు ఆధ్వాన్న స్ధితిలో ఉండింది. టాటా ఏవియేషన్‌ తర్వాత 1946 లో ఎయిర్‌ ఇండియాగా మారింది. టాటా అంత:కరణ కలిగిన చైతన్యవంతమైన పౌరుడు. జాతికి సేవందించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు.1941 లో ఆసియాలోని మొదటి కేన్సర్‌ ఆసుపత్రిని టాటా నేతృత్వంలో 1941 లో ప్రారంభించాడు. అంతర్జాతీయంగా కేన్సర్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో టాటా మెమోరియల్‌ ఆసుపత్రి భారతదేశంలో మొట్టమొదటిది. దేశంలో శాస్త్ర (సైన్సు) రంగ పరిశోధన కోసం డా॥హోమీబాభాకు, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పండ్‌మెంటల్‌ రిసెర్చ్‌' స్ధాపించడానికై టాటా గొప్ప వితరణతో గ్రాంటు ఇచ్చాడు. హోమి భాభా మాటల్లో చెప్పాంటే ఆ ఇన్‌స్టిట్యూట్‌ మన ఆటోమిక్‌ ఎనర్జీ ప్రోగ్రాంకి నాంది అనవచ్చు. జనాభా నియంత్రణ కోసం మొదటగా కృషి ప్రారంభించింది టాటానే.1951 జనాభా లెక్క ప్రకారం భారతదేశం 35 కోట్ల జనాభాను మించిపోయిందని ఆయన గుర్తించాడు. టాటా ఈ విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టికి తీసుకువెళ్లాడు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. జెఆర్‌డి ప్రభుత్వ స్పందన కోసం అగలేదు, మిసెస్‌ ఆవాబాయి వాడియా ప్రారంభించిన భారత కుటుంబ నియంత్రణ అసోసియేషన్‌కు పాక్షిక సాయం అందించాడు. 1970 లో ఫోర్డ్‌ ఫౌండేషన్‌తో కలిసి కుటుంబ నియంత్రణ సంస్ధను స్ధాపించాడు.ఈ రంగంలో ఆయన చేసిన కృషికిగాను 1992 లో ఆయనకు యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ అవార్డు ప్రదానం చేశారు. భారతదేశానికి, వాణిజ్య పరిశ్రమ రంగాకు అందించిన ఎనలేని సేవకు గుర్తుగా 1992 లో టాటాకు, ఆయన జీవించిఉండగానే ఇది ఎంతో అరుదైన సంఘటన భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో గౌరవించారు. 1954 లో ఫ్రెంచ్‌ ప్రభుత్వం అయనకు అవార్డు నిచ్చింది. వాణిజ్య విమానయాన సంస్ధకు అయన అందించిన విశిష్టసేవకు గాను ఆయనకు టోనీ జానస్‌ అవార్డు లభించింది.1988 లో ఆయన ప్రతిష్ఠాత్మకమైన గుగెన్‌ హేమ్‌ మెడల్‌ను పొందారు. జెఆర్‌డి టాటా తన 89వ ఏట 1993 లో స్విట్జర్లండ్‌లోని జెనీవాలో మరణించాడు. ఆయనను పారిస్‌లోని పెర్‌ షైజ్‌ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఇండియన్‌ పార్లమెంట్‌, అసాధారణంగా ఏ ప్రభుత్వ రాజకీయపదవీ అనుభవించని సామాన్య పౌరుడైన ఆయనకు నివాళిగా సభను వాయిదా వేసింది. మహారాష్ట్ర మూడు రోజు సంతాపదినాలుగా ప్రకటించింది. భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను ఆరవ స్థానంలో ఎంపికైయ్యాడు. మూలాలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు వర్గం:1904 జననాలు వర్గం:1993 మరణాలు వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు వర్గం:టాటా కుటుంబం వర్గం:భారతీయ పారిశ్రామికవేత్తలు
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
https://te.wikipedia.org/wiki/మౌలానా_అబుల్_కలామ్_ఆజాద్
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888 నవంబరు 11 - 1958 ఫిబ్రవరి 22) (, ఉర్దూ: ابو الکلام آزاد ) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలుపేరు "మొహియుద్దీన్ అహ్మద్", 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకడు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు.భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. బాల్యం, విద్య మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరంలో 1888 నవంబరు 11 న జన్మించాడు. అతని వంశస్థులు బాబర్ రోజుల్లో హేరాత్ (ఆఫ్ఘనిస్తాన్లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానాల వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్, షేక్ మహ్మద్ జహీర్ వత్రి, అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాల ఉన్న ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 1890 లో అయన తన కుటుంబంతో కలకత్తా వెళ్లాడు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు. అతని విద్య ఇంట్లోనే సాగింది. మొదట తండ్రి, పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట *అరబిక్, పెర్షియన్ నేర్చుకున్నాడు. తరువాత *తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం అభ్యసించాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నాడు.ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందాడు.అతను దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసాడు.. యువకుడుగా జీవితగమనం అతను జమాలుద్దిన్ ఆఫ్ఘానీ పాన్-ఇస్లామిక్ సిద్ధాంతాలలో, అలిగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలోచనలో ఆసక్తి చూపేవాడు. పాన్-ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా, టర్కీ సందర్శించాడు.ఇరాక్ లో అతను ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటం సల్పుతున్న నిర్వాసిత విప్లవ కారులను కలుసుకున్నాడు. ఈజిప్ట్ లో అతను షేక్ ముహమ్మద్ అబ్దుహ్, సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాదిగా రూపాంతరం చెందించాయి. విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్, బెంగాల్ కు చెందిన అరవింద ఘోష్, శ్రీ శ్యాం సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు పరిమితం అగుట ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాల లోపల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఆసమయంలో విప్లవ వాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తుందని భావించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించాడు రాజకీయ జీవితం thumb|250x250px|సిమ్లా కాన్‌ఫరెన్స్ (1946) లో, మౌలానా, బాబూ రాజేంద్రప్రసాద్, జిన్నా , రాజగోపాలాచారి. 1912 లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో ‘ అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్ హిలాల్ మోర్లే-మింటో సంస్కరణల ఫలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం-ముస్లిం వర్గాల మద్య ఐక్యత కుదుర్చటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ‘అల్ హిలాల్’ అతివాద భావనల ఒక విప్లవాత్మక ధ్వనిగా మారింది. ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా “అల్- హిలాల్”ను భావిస్తింది. ప్రభుత్వం దానిని 1914 లో నిషేధించింది. ఆజాద్ భారతీయ జాతీయ వాదం, హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు.1916 లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు, రాంచిలో ఆజాద్ ను నిర్భందించారు. ఆతరువాత మొదటి ప్రపంచ యుద్ధం 1920 తర్వాత విడుదల చేసారు. విడుదల తరువాత ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచారు. ఖలీఫా ఉద్యమం ప్రధాన లక్ష్యం ఖలీఫాను తిరిగి టర్కీ రాజుగా ప్రకటించడం. జాతీయ కాంగ్రెసులో చేరిక మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీజీ ప్రారంభించిన "సహాయ నిరాకరణ" ఉద్యమం ను సమర్ధించి 1920 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు.ఇతడు ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా (1923) ఎన్నికయ్యాడు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు , 1946 వరకు ఆ పదవిలో ఉన్నాడు.అతను విభజనకు వ్యతిరేకి. విభజన అతని కలలను నాశనం చేసింది. హిందువులు , ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కలను నాశనం చేసి అతనిని విపరీతంగా బాధించింది. జైలు జీవితం మౌలానా ఆజాద్ గాంధీజీ *ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 లో అరెస్టు అయ్యాడు. అతనిని ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు.ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. మరణం 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు. గౌరవాలు, బిరుదులు గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ , నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్‌ అని పిలిచేవాడు. భారత ప్రభుత్వం మరణానంతరం (1888-1958) 1992లో అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించింది.https://web.archive.org/web/20180209002846/http://mha.gov.in/sites/upload_files/mha/files/RecipientsBR_140515.pdf ఇతడి జన్మదినం నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు. సాహిత్యం తర్జుమానుల్ ఖురాన్ (ఖురాన్ అనువాదం) "అల్-హిలాల్" , "అల్-బలాగ్" అనే పత్రికలు స్థాపించాడు. గుబార్-ఎ-ఖాతిర్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ మూలాలు వెలుపలి లంకెలు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:1888 జననాలు వర్గం:1958 మరణాలు వర్గం:ఖురాన్ అనువాదకులు వర్గం:ఉర్దూ సాహితీకారులు వర్గం:ఉర్దూ రచయితలు వర్గం:భారతీయులు వర్గం:1వ లోక్‌సభ సభ్యులు వర్గం:2వ లోక్‌సభ సభ్యులు వర్గం:ఢిల్లీ స్వాతంత్ర్య సమర యోధులు
సర్దార్ వల్లభాయి పటేల్
https://te.wikipedia.org/wiki/సర్దార్_వల్లభాయి_పటేల్
దారిమార్పు సర్దార్ వల్లభభాయి పటేల్
మొరార్జీ దేశాయి
https://te.wikipedia.org/wiki/మొరార్జీ_దేశాయి
మొరార్జీ దేశాయి (1896 ఫిబ్రవరి 29, – 1995 ఏప్రిల్ 10)Profile of Morarji Desai భారత స్వాతంత్ర్య సమర యోధుడు. జనతా పార్టీ నాయకుడు. అతను 1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారతదేశ 4వ ప్రధానిగా తన సేవలనందించాడు. అతను దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. అతను భారతదేశం, పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్న, నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టాడు. వాటిలో: బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత హోంమంత్రి, ఆర్థికమంత్రి పదవులతొ పాటు భారతదేశ 2వ ఉపప్రధాని పదవిని చేపట్టాడు. అంతర్జాతీయంగా దేశాయ్ తన శాంతి ఉద్యమం ద్వారా కీర్తి సంపాదించాడు. అతను దక్షిణ ఆసియాలో ప్రత్యర్థి దేశాలైన పాకిస్తాన్, భారతదేశం మధ్య శాంతిని ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ లో జరిగిన మొదటి అణుపరీక్ష తరువాత అతను చైనా, పాకిస్తాన్ లతో స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయం చేసాడు. 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం వంటి అంశాలలో సాయుధ పోరాటం నివారించడానికి కృషి చేసాడు. మరోవైపు భారతదేశపు నిఘావ్యవస్థ (రా)ను దెబ్బతీసి పాకిస్తాన్‌లో భారత నిఘా లేకుండా చేసిన వ్యక్తిగా అతనిపై పలు విమర్శలు ఉన్నాయి. ప్రారంభ జీవితం జననం మొరార్జీ దేశాయ్ బొంబాయి రాజ్యంలో (ప్రస్తుత గుజరాత్) బ్లస్టర్ జిల్లాకు చెందిన భడేలీ గ్రామంలో 1896 ఫిబ్రవరి 29 న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఉపాధ్యాయుడు. పాఠశాల విద్య అతను ప్రాథమిక విద్యను సౌరాష్ట్రకు చెందిన సవరకుండ్లలోని కుండ్ల పాఠశాలలో (ప్రస్తుతం జె.వి.మోదీ పాఠశాల) చదివాడు. తరువాత వాల్సాద్ లోని భాయ్ అవా భాయ్ ఉన్నత పాఠశాలలో చదివాడు. ముంబైలోని విల్సన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత అతను గుజరాత్ లో సివిల్ సర్వీసులో చేరాడు. 1927-28 గోద్రాలో జరిగిన అల్లర్ల సమయంలో హిందువులపై మెతక వైఖరి అవలంభించాననే అపరాధ భావంతో 1930 మేన అతను గోద్రా డిప్యూటీ కలెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేసాడు. స్వాతంత్ర్య సమరయోధుడు అతను మహాత్మాగాంధీ అధ్వర్యంలో జరిగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోఅనేక సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తన తెలివైన నాయకత్వ నైపుణ్యాలు, కఠినమైన చైతన్యం కారణంగా అతను స్వాతంత్ర్య సమరయోధులందరికీ అభిమాని అయ్యాడు. గుజరాత్ ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ముఖ్యమైన నాయకుడయ్యాడు.1934, 1937 లలో ప్రాంతీయ ఎన్నికలు జరిగినప్పుడు, అతను బొంబాయి ప్రెసిడెన్సీలో వరుసగా రెవెన్యూమంత్రి, హోంమంత్రి బాధ్యతలను చేపట్టాడు. ప్రభుత్వంలో బాంబే ముఖ్యమంత్రి, రెండు రాష్ట్రాల విభజన ఎడమ|thumb|199x199px|బొంబాయి ప్రెసెడెన్సీలో హోం మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ - 1937 భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు, అతను బొంబాయి సంస్థానానికి హోం మంత్రి అయ్యాడు. 1952లో బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. బొంబాయి రాష్ట్రం ద్వి భాషా రాష్ట్రంగా ఉండేది. బొంబాయి రాష్ట్రంలో గుజరాత్, మరాఠీ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. 1956 నుండి సంయుక్త మహారాష్ట్ర సమితి పేరుతో ఒక క్రియాశీలక సంస్థ ఏర్పడి కేవలం మరాఠీ మాట్లాడే ప్రజల కోసం మహారాష్ట్ర రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టింది. ఒక దృఢమైన జాతీయవాదిగా అతను అటువంటి ఉద్యమాలను వ్యతిరేకించాడు. వాటిలో ప్రత్యేక గుజరాత్ రాష్ట్ర సాధన కోసం ఇందూలాల్ యాగ్నిక్ అధ్వర్యంలో మహాగుజరాతీ ఉద్యమం కూడా ఉంది. వివిధ భాషా, సాంస్కృతిక, మతపరమైన నేపథ్యాలతో అనేక తరాలుగా దీర్ఘకాలం స్థిరపడిన పౌరులు ఉన్నందున దేశాయ్ ముంబయి మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం లేదా సార్వజనీన స్వభావం గల ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా మార్చాలని ప్రతిపాదించాడు. గాంధీ భావాలకు వ్యతిరేకంగా ఫ్లోరా ఫౌంటైన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేందుకు చేరుకున్న " సమైక్య మహారాష్ట్ర సమితి" ముంబై శాఖకు చెందిన ప్రదర్శనకారులపై కాల్పులు జరిపేందుకు పోలీసులు ఆదేశించాడు. నిరసనకారులను "సేనాపతి బాపట్" నేతృత్వం వహించాడు. దేశాయ్ ఆదేశంతో జరిగిన కాల్పుల సంఘటనలో 11 సంవత్సరాల బాలికతో సహా 105 మంది ఆందోళనకారులు మరణించారు. ఈ సంఘటన సమస్య తీవ్రతను మరింత పెంచి, భాష ఆధారంగా రెండు వేర్వేరు రాష్ట్రాలకు అంగీకరించడానికి ఫెడరల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత బొంబాయి (ప్రస్తుతం ముంబై) దాని ముఖ్యపట్టణం అయినది. ఉద్యమం జరిగిన ఫ్లోరా ఫౌంటెన్ ప్రాంతం 105 మంది ఉద్యమకారుల త్యాగాలను గుర్తిస్తూ "హతత్మా చౌక్" (మరాఠీ భాషలో "మేర్థీర్స్ స్క్వేర్") గా పేరు మార్చబడింది. తరువాత దేశాయ్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కేబినెట్ లో హొం మంత్రి బాధ్యతలను చేపట్టాడు. హోం మంత్రిగా హోం మంత్రిగా దేశాయ్, సినిమాలు, థియేటర్ ప్రొడక్షన్లలో నటిస్తున్న పాత్రల అసభ్యకర సన్నివేశాలను ("ముద్దు" సన్నివేశాలతో పాటు) చట్ట పరంగా బహిష్కరించాడు. ధృఢమైన గంధేయవాదిగా దేశాయ్, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సోషలిస్టు విధానాలకు వ్యతిరేకంగా సామాజిక సంప్రదాయవాదిగా, అనుకూల-వ్యాపార, ఉచిత సంస్థ సంస్కరణలకు అనుకూలంగా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎదిగిన అతను, అవినీతి వ్యతిరేక అంశాలతో తీవ్ర జాతీయవాదిగా, ప్రధానమంత్రి నెహ్రూ, అతని మిత్రపక్షాలను విభేదించాడు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడైనా ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తోను అతని సహచరులతోను విభేదాలుండేవి. నెహ్రూ వయస్సురీత్యా ఆరోగ్యం క్షీణించడంతో ప్రధానమంత్రి పదవికి ప్రధాన పోటీదారుడయ్యాడు. 1964 లో నెహ్రూ మరణాంతరము తను ప్రధానమంత్రి రేసులో ఉన్నా నెహ్రూ అనుచరుడు లాల్ బహాదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 18 నెలల తరువాత 1966ల ప్రారంభంలో ఊహించని విధంగా లాల్ బహాదూర్ శాస్త్రి తాష్కెంట్ లో మరణించిన తదుపరి మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉన్న నాయకునిగా ప్రధాని రేసులో ఉన్నాడు. అయినప్పటికీ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీతో నెగ్గలేక 169/351 ఓట్ల తేడాతో వెనుదిరగవల్ససి వచ్చింది. దేశాయ్ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా సేవలనందించాడు. అతను భరత హోం మంత్రిగా 1969 వరకు కొనసాగాడు. తరువాత ఆర్థిక శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ కాలంలో ఇందిరా గాంధీ 14 పెద్ద బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఈ కారణంగా అతను ఇందిరా గాంధీ కేబినెట్ కు రాజీనామా చేసాడు. కాంగ్రెస్ పార్టీ విభజన తరువాత మోరార్జీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) పార్టీలో చేరాడు. ఇందిరా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ (రూలింగ్) అని పిలిచే ఒక నూతన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యామ్నాయంగా, దేశాయ్, ఇందిరా గాంధీల రెండు విభాగాలు సిండికేట్ అండ్ సిండికేట్ అని వరుసగా పిలువబడ్డాయి. 1971 సార్వత్రిక ఎన్నికలలో ఇందిరా గాంధీ విభాగం కొద్ది సీట్ల తేడాతో గెలిచింది. మొరార్జీ దేశాయ్ పార్లమెంటు సభ్యునిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మొరార్జీ గుజరాత్ లోని నవనిర్మాణ ఉద్యమానికి మద్దతుగా 1975 మార్చి 12 న జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షకు వెళ్లాడు. 1971 సాధారణ ఎన్నికలలో ప్రచారం సందర్భంగా ప్రభుత్వ పౌర సేవకులను (సివిల్ సర్వెంట్లు), ప్రభుత్వ పరికరాలను ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చిన తరువాత, అలహాబాద్ హైకోర్టు ఈ ఎన్నికల మోసంపై ఇందిరా గాంధీని దోషిగా నిర్ధారించింది. తదుపరి 1975–77లో అత్యవసర పరిస్థితి సమయంలో భారీ అణిచివేతలో భాగంగా దేశాయ్, ఇతర ప్రతిపక్ష నేతలను ఇందిరా గాంధీ ప్రభుత్వం జైలు శిక్ష విధిందింది. ఎమర్జెన్సీ కాలంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, 1977 ఎమర్జెన్సీ వ్యతిరేకతతో ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన సీట్లను కోల్పోవలసి వచ్చింది. 1975 లో విధించబడిన అత్యవసర పరిస్థితి 1977 ఫిబ్రవరి - మార్చి నెలలలో జరిగన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 30 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన అంతమయింది. కాంగ్రసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్, జనసంఘ్, సోషలిస్టు పార్టీలు "జనతాపార్టీ" పేరుతో ఒకటయ్యాయి. మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. మాజీ మంత్రి జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డెమొక్రటిక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ స్థాపించాడు. జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చాడు. ఫిబ్రవరి 16 - మార్చి 10వ తేదీ మధ్య జరిగిన ఎన్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. ఇందిరాగాంధీ- రాయ్ బెరీలో ఒడిపోయింది. మార్చి 21వ తేదీ అత్యవసర పరిస్థితి పసంహరించుకోబడింది. మార్చి 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. భారతదేశ ప్రధానమంత్రి (1977-79) మొదటి దశ ప్రధానమంత్రి thumb|1978 జనవరిలో యు.ఎస్.అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో మురార్జి దేశాయ్ (కుడి నుండి మూడవ వ్యక్తి). thumb|1978లో న్యూఢిల్లీ లో రుమేనియా అధ్యక్షుడునికోలా సిసెసు తో మొరార్జీ దేశాయ్.ఇందిరా గాంధీ మార్చి 21వ తేదీ అత్యవసర పరిస్థితి పసంహరించుకోవడానికి నిర్ణయించుకున్న తరువాత, జరిగిన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టాడు. 1962 యుద్ధం తరువాత మొదటి సారిగా అతను ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో స్నేహ పూర్వక సంబంధాలను వృద్ధి చేసాడు. అతను జియా ఉల్ హక్తో చర్చించి స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచాడు. చైనాతో దౌత్య సంబంధాలు కూడా పునఃస్థాపన చేయబడ్డాయి. అత్యవసర సమయంలో రాజ్యాంగానికి చేసిన అనేక సవరణలను ఆయన ప్రభుత్వం రద్దు చేసింది. ఏదైనా భవిష్యత్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని కష్టతరం చేసింది. ఏదేమైనా, జనతా పార్టీ సంకీర్ణం, వ్యక్తిగత, విధాన ఘర్షణలతో నిండిపోయింది. అంతర్గత ఘర్షణలతో ఏమీ సాధించలేకపోయింది. సంకీర్ణ నాయకత్వంలో ఎటువంటి పార్టీ లేకుండా, ప్రత్యర్థి గ్రూపులు దేశాయ్ ను పదవీత్యుడిని చేయడానికి పోటీ పడ్డారు. అత్యవసర-శకం దుర్వినియోగాలపై ఇందిరా గాంధీతో సహా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద విమర్శలకు గురైనందున తన పరిపాలన మరింత దిగజారింది, మొదటి అణు పరీక్ష 1974 లో భారతదేశం మొట్టమొదటి అణు పరీక్ష జగిగినప్పటికి, భారతదేశ అణు రియాక్టర్లను "దేశంలో అణు బాంబుల కోసం ఎప్పటికీ ఉపయోగించరు, నేను సహాయం చేయగలిగితే దానిని చూస్తాను" అని దేశాయ్ తెలిపాడు. 1977 లో, యు.ఎస్ అధ్యక్షుడు కార్టర్ పాలనా యంత్రాంగం భారత్‌కు భారజలం, యురేనియం పదార్థాలను భారత దేశంలోని అణు రియాక్టర్ల కొరకు అమ్మివేయాలని ప్రతిపాదించింది కానీ అణు పదార్థాల వినియోగంలో అమెరికన్ ఆన్-సైట్ తనిఖీ అవసరం అని తెలిపింది. దీనిని దేశాయ్ వ్యతిరేకించాడు. 1974 లో ఆశ్చర్యకర అణు పరీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాన అణు శక్తులు లక్ష్యంగా చేసుకున్న తరువాత దేశీయంగా, అతను భారతీయ అణు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాడు. మొరార్జీ దేశాయ్ భారతదేశ ప్రధాన గూఢచార సంస్థ "రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్" (R & AW) ను, దాని బడ్జెట్, కార్యకలాపాలను తగ్గించడం ద్వారా మూసివేసాడు. అతను 1990 లో పాకిస్థాన్ అధ్యక్షుడు గులాం ఇస్తాక్ ఖాన్ నుండి పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్-ఇ-పాకిస్థాన్" పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ పాకిస్థాన్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయునిగా గుర్తింపు పొందాడు. తరువాత, అతని విధానాలు దేశంలో సామాజిక, ఆరోగ్య,పరిపాలనా సంస్కరణలను ప్రోత్సహించాయి. పాకిస్థాన్ లో అణుపరీక్ష చేస్తున్న కహుటా నుండి పాకిస్థాన్ జనరల్ ముహమ్మద్ జియా-ఉల్-హక్ కు జరిగిన టెలీఫోన్ సంభాషణ గురించి R&AW కు తెలుసునని అతను వెల్లడించాడు."Kaoboys of R&AW: Down Memory Lane" by B. Raman 'రా' ను నాశనం చేయడం మొరార్జీ దేశాయ్ భారతదేశ బాహ్య గూఢచారి సంస్థ అయిన "రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW)" ఇందిరా గాంధీకి వ్యక్తిగత భద్రతా గార్డులుగా వ్యవహరిస్తుందని వివరించాడు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపి వేసాడు. ఆ సంస్థకు నిధులు, కార్యకలాపాలు ఇవ్వకుండా చేసి దాని ప్రాభవాన్ని తగ్గించాడు. పాకిస్తాన్ తొలి అణుకేంద్రం కహూటాలో ఉందని 1977లో రా ఏజెంట్లు విజయవంతంగా కనుగొని సమాచారాన్ని భారతదేశానికి చేరవేసినప్పుడు, ఒక ఏజెంటు తనవద్ద ఉన్న కహూటా అణుకేంద్రపు ప్లాన్ పటాన్ని ఇవ్వాలంటే పదివేల డాలర్లు కావాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్ అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి విన్నవించగా దాన్ని తిరస్కరించడమే కాక ఆ రహస్య సమాచారాన్ని, అది తమకు తెలుసన్న సంగతినీ స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్‌కి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో రా ఏజెంటును పాకిస్తాన్‌లో కనిపెట్టి చంపారు. పదవీ విరమణ 1979లో రాజ్ నారాయణ్, చరణ్ సింగ్ లు జనతాపార్టీ నుండి వైదొలగారు. దేశాయ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుండి పదవీవిరమణ పొందాలని ఒత్తిడి తెచ్చారు. "జనతా పార్టీ సభ్యుడు ఏకకాలంలో ప్రత్యామ్నాయ సామాజిక లేదా రాజకీయ సంస్థ సభ్యుడిగా ఉండరాదు" అని రాజ్ నారాయణ్, చరణ్ సింగ్, వామపక్ష నాయకులైన మధు లిమాయే, కృష్ణకాంత్, జార్జి ఫెర్నాడెజ్ లు డిమాండ్ చేయడం వలన కూలిపోయింది. "ద్వంద్వ సభ్యత్వం" పై దాడికి జనసంఘ్ పార్టీ సభ్యులయిన జనతా పార్టీ సభ్యులు ప్రత్యేకంగా దర్శకత్వం వహించారు. వారు జనసంఘ్ సైద్ధాంతిక మాతృసంఘమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులయ్యారు.Lloyd I. Rudolph and Susanne H. Rudolph, In Pursuit of Lakshmi: The Political Economy of the Indian State (1987), University of Chicago Press, pp 457–459. మరణం మొరార్జీ దేశాయ్ జనతాపార్టీకి 1980 సార్వత్రిక ఎన్నికలలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రచారం చేశాడు, కాని ఎన్నికలో పోటీ చేయలేదు. పదవీ విరమణ తరువాత అతను ముంబైలో నివసించి తన 99వ యేట 1995 ఏప్రిల్ 10 న మరణించాడు.https://www.nytimes.com/1995/04/11/obituaries/morarji-desai-dies-at-99-defeated-indira-gandhi-to-become-premier-of-india.html అత్యధిక కాలం జీవించిన భారత ప్రధానిగా గుర్తింపు పొందాడు. సంఘ సేవ మొరార్జీ దేశాయ్ గాంధేయవాది, సంఘసేవకుడు,సంఘ సంస్కర్త. అతను గుజరాత్ విద్యాపీఠ్ కు ఛాన్సలర్ గా ఉన్నాడు. అతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోకూడా ఈ విద్యాపీఠ్ ను అక్టోబరు మాసంలో సందర్శించాడు. అతను సాధారణ జీవితం గడిపాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నప్పుడు కూడా పోస్ట్ కార్టులను తానే వ్రాసేవాడు. కైరా జిల్లాలో రైతులతో సమావేశాలను నిర్వహించడానికి సర్దార్ పటేల్ అతనిని నియమించాడు. ఇవి చివరకు అమూల్ కో-ఆపరేటివ్ ఉద్యమం స్థాపనకు దొహదపడ్డాయి. వ్యక్తిగత జీవితం కుటుంబం మొరార్జీ దేశాయ్ 1911 లో తన 15వ యేట గుజ్రాబెన్ ను వివాహమాడాడు. గుజరాన్ ఆమె భర్త ప్రధానమంత్రి కావాలని చూసింది కానీ అంతకు పూర్వమే మరణించింది. వారికి కాంతి దేశాయ్ అనే కుమారుడు ఉన్నాడు. జగదీప్, భరత్ దేశాయ్ అనబడే మనుమలు ఉన్నారు. జగదీష్ దేశాయ్ కుమారుడు మధుకేశ్వర్ దేశాయ్ పై తన తాత వారసత్వం పునరుద్ధరించే బాధ్యత పడింది. మధుకేశ్వర దేశాయ్ ప్రస్తుతం భారతీయ్ జనతా యువమోర్చాకు ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. భరత్ దేశాయ్ కుమారుడు విశాల్ దేశాయ్ రచయిత, సినిమా నిర్మాత. మూత్ర చికిత్స న్యాయవాది 1978లో "మూత్ర చికిత్స" దీర్ఘకాలిక అభ్యాసకుడైన దేశాయ్ డేంరాథర్ తో "60 మినిట్స్" కార్యక్రమంలో మాట్లాడుతూ మూత్రం త్రాగడం వలన కలిగే ప్రయోజనాలను వివరించాడు. వైద్య చికిత్స పొందలేని లక్షల మంది భారతీయులకు మూత్ర చికిత్స అనేది పరిపూర్ణ వైద్య పరిష్కారం అని దేశాయ్ పేర్కొన్నాడు.Wasson, R.G., 1979. Soma brought up-to-date. Journal of the American Oriental Society, 99(1), pp.100-105. మూత్రం తాగడం ద్వారా అతను తన దీర్ఘాయువుని అందుకున్నాడని తెలిపాడు - అతను దీనిని "జీవజలము" అని పిలిచాడు. మూలాలు బయటి లంకెలు |- |- |- |- |- |- |- వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:6వ లోక్‌సభ సభ్యులు వర్గం:గుజరాత్ వ్యక్తులు వర్గం:భారత ప్రధానమంత్రులు వర్గం:1896 జననాలు వర్గం:1995 మరణాలు వర్గం:సంఘసంస్కర్తలు