title
stringlengths
1
90
url
stringlengths
31
120
text
stringlengths
0
504k
మహబూబ్​నగర్​ జిల్లా
https://te.wikipedia.org/wiki/మహబూబ్​నగర్​_జిల్లా
మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒకటి. ఇది జిల్లా ముఖ్యపట్టణం.ఇది హైదరాబాదునుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లాను పాలమూర్ అని కూడా పిలుస్తారు. జిల్లాకు దక్షిణాన వనపర్తి జిల్లా, తూర్పున రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలు, ఉత్తరమున రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు, పశ్చిమాన నారాయణపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు.భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ,తొలి ముద్రణ 2006, పేజీ 233 రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేది. కృష్ణా, తుంగభద్ర నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచినఆలంపూర్ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133, మన్యంకొండ, కురుమూర్తి,మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఊర్కొండపేట, శ్రీరంగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు, పిల్లలమర్రి, బీచుపల్లి, వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, జూరాల, కోయిలకొండకోయిల్ సాగర్, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టునా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 247) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన గద్వాల కోట, కోయిలకొండ కోట, చంద్రగఢ్ కోట, పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సూదిని జైపాల్ రెడ్డి, సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. ఎన్.టి.రామారావును సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది. కెసిర్ ఈ జిల్లా మంత్రిగా ఉన్నపుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పట్టుచీరెలకు పేరొందిన చెందిన నారాయణపేట, చేనేత వస్త్రాలకు పేరుగాంచిన రాజోలి, కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, మామిడిపండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, రామాయణ కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో పేరొందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన తంగడి ప్రాంతంపాలమూరు వైజయంతి, 2013 ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 7 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 11 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1546 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట వరి. భౌగోళికం 260x260px|మహబూబ్‌నగర్ జిల్లా|alt=|కుడి భౌగోళికంగా ఈ జిల్లా తెలంగాణ ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. 16°-17° ఉత్తర అక్షాంశం, 77°-79° తూర్పు రేఖాంశంపై జిల్లా ఉపస్థితియై ఉంది.http://mahabubnagar.nic.in/nic/nic/index.php 18432 చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది సరిహద్దుగా ప్రవహిస్తున్నది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. ఈ జిల్లా గుండా ఉత్తర, దక్షిణంగా 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి, సికింద్రాబాదు-ద్రోణాచలం రైల్వే లైను, గద్వాల - రాయచూరు లైన్లు వెళ్ళుచున్నవి. అమ్రాబాదు గుట్టలుగా పిల్వబడే కొండల సమూహం జిల్లా ఆగ్నేయాన విస్తరించి ఉంది. 2001 జనాభా గణన ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35,13,934Handbook of Statistics, Mahabubnagar Dist-2009, published by CPO Mahabubnagar. జిల్లా వాయవ్యంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుండగా, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాలు నల్లమల అడవులలో భాగంగా ఉన్నాయి. నడిగడ్డగా పిల్వబడే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో ఉండగా, జూరాల, దిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి. చరిత్ర మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని రుక్మమ్మపేట అని పిలిచేవారు. ఆ తరువాత 1890 డిసెంబరు 4నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా (1869 - 1911) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడింది. సా.శ. 1883నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణం ప్రధానకేంద్రముగా ఉంది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి (చోళుల భూమి) అని పిలిచేవారు, గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు. ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. జిల్లాలోని ముఖ్య సంస్థానాలలో గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత, కొల్లాపూర్ సంస్థానాలు ప్రముఖ మైనవి. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు. పాలించిన రాజవంశాలు మౌర్య సామ్రాజ్యం: సా.శ.పూ.250 లో అశోక చక్రవర్తి కాలంలో మౌర్య సామ్రాజ్యంలో ఈ ప్రాంతము దక్షిణ సరిహద్దుగా ఉండేది. శాతవాహన రాజ్యం: సా.శ.పూ.221 నుంచి సా.శ. 218 వరకు పాలించిన శాతవాహన కాలంలో మహబూబ్ నగర్ ప్రాంతం భాగంగా ఉండేది. చాళుక్య రాజ్యం: సా.శ. 5 వ శతాబ్దం నుంచి సా.శ.11 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం చాళుక్య రాజ్యంలో భాగంగా ఉంది. రాష్ట్రకూట రాజ్యం: సా.శ. 9 వ శతాబ్దంలో కొద్ది కాలం ఇక్కడ రాష్ట్రకూటులు పాలించారు. కాకతీయ రాజ్యం: సా.శ.1100 నుంచి సా.శ.1474 వరకు ఇక్కడ కాకతీయ రాజులు రాజ్యం చేశారు. బహమనీ రాజ్యం: సా.శ.1347 నుంచి సా.శ.1518 వరకు ఇది బహమనీ రాజ్యంలో భాగంగా ఉండింది. కుతుబ్ షాహి రాజ్యం: సా.శ.1518 నుంచి సా.శ.1687 వరకు ఈ ప్రాంతం కుతుబ్ షాహి రాజ్యంలో భాగం మొఘల్ సామ్రాజ్యం: సా.శ. 1687 నుంచి దాదాపు 37 సం.ల పాటు మహబూబ్ నగర్ ప్రాంతాన్ని మొఘలులు పాలించారు. నిజాం రాజ్యం: సా.శ. 1724 నుంచి ఇక్కడ నిజాం పాలన ప్రారంభమైంది. స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదు సంస్థానం దేశంలో కల్సే వరకు నిజాం రాజ్యంలో భాగం గానే కొనసాగింది. ఆధునిక చరిత్ర హైదరాబాదు నిజాం ఆరవ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్ నగర్ అనే పేరు వచ్చింది. జిల్లాలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది. 1870లో నిజాం ప్రభుత్వం 8 తాలుకాలతో నాగర్ కర్నూల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసింది. 1881 నాటికి జిల్లాలో తాలుకాల సంఖ్య 10కి పెరిగింది. 1883లో జిల్లా కేంద్రాన్ని మహబూబ్ నగర్‌కు బదిలీ చేశారు. స్వాతంత్ర్యానంతరం సంస్థానాలుగా ఉన్న వనపర్తి, కొల్లాపూర్, షాద్‌నగర్ మొదలగు సంస్థానాలు తాలుకాలుగా ఏర్పడి విలీనమయ్యాయి. స్వాతంత్ర్యానికి పూర్వం 1930 దశాబ్దిలో జరిగిన ఆంధ్రమహాసభలలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అధ్యక్షత వహించారు. 1930లో మెదక్ జిల్లాలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించగా, 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించాడు. వీరిరువురూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులే. 1936లో ఐదవ ఆంధ్రమహాసభ జిల్లాలోని షాద్‌నగర్ లోనే జరిగింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లానుంచి పలు ప్రాంతాలు విడదీసి, సరిహద్దు జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాలు కలిపారు. జిల్లానుంచి పరిగి తాలుకాను విడదీసి హైదరాబాదు జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా)కు కలిపినారు. పశ్చిమాన ఉన్న రాయచూరు జిల్లా నుంచి గద్వాల, ఆలంపూర్ తాలుకాలను విడదీసి మహబూబ్ నగర్ జిల్లాకు జతచేశారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా నుంచి కోడంగల్‌ను ఇక్కడ విలీనం చేశారు. 1958లో కల్వకుర్తి తాలుకాలోని కొన్ని గ్రామాలు నల్గొండ జిల్లాకు బదిలీ చేయబడింది. 1959లో రంగారెడ్డి జిల్లా లోని కొన్ని గ్రామాలు షాద్‌నగర్‌కు బదిలీ చేయబడ్డాయి. 1959 నాటికి జిల్లాలో 11 తాలుకాలు ఏర్పడ్డాయి. 1986లో మండలాల వ్యవస్థ అమలులోకి రావడంతో 13 తాలుకాల స్థానంలో 64 మండలాలు ఏర్పడ్డాయి. జిల్లా భౌగోళికంగా పెద్దదిగా ఉన్నందున కోడంగల్ నియోజకవర్గంలోని మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో ఈ జిల్లాలో తెలంగాణలో అంతర్భాగంగా కొనసాగుతోంది. తెలంగాణ అవతరణ తర్వాత ఈ జిల్లా చాలా మార్పులకు లోనైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ జిల్ల్ 4 ముక్కలు కాగా తర్వాత పశ్చిమ భాగం నారాయణపేట పేరుతో మరో జిల్లా ఏర్పడి జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోవడమే కాకుండా నదులు, ప్రాజెక్టులు, చారిత్రక దేవాలయాలు కూడా ఇతర జిల్లాలలో విలీనమైనాయి. నిజాం విమోచనోద్యమం నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో పాలమూరు జిల్లా కూడా ఎంముఖ్య స్థానం పొందింది. ఎందరో పోరాటయోధులు తమప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి నిజాం ముష్కరుల చేతితో అమరులైనారు. మరికొందరు జైలుపాలయ్యారు. వందేమాతరం రామచంద్రారావు, వందేమాతరం వీరభద్రారావు, కె.అచ్యుతరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సురభి వెంకటేశ్ శర్మ, పాగపుల్లారెడ్డి, ఏగూరు చెన్నప్ప, ఆర్.నారాయణరెడ్డి, కొత్త జంబులురెడ్డి, శ్రీహరి, బి.సత్యనారాయణరెడ్డి లాంటి ముఖ్యులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పంపల్లి, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ లలో పోరాటం ఉధృతం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి. మహబూబ్‌నగర్ పట్టణంలో తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్యసమాజ్ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కోడంగల్‌లో గుండుమల్ గోపాలరావు. కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తుర్రేబాజ్ ఖాన్ ఇతను హైదరాబాద్ బ్రిటీషు రెసిడెన్సీ ( ప్రస్తుత కోఠీ ఉమెన్స్ కాలేజీ) పై దాడి చేసినందుకు మొగిలిగిద్ద గ్రామంలోని పోలీస్ స్టేషనులో సమారు 1940 ప్రాంతంలో బంధించారు. తరువాత ఇతనిని రెసిడెన్సీ గుమ్మానికి ఉరితీసారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమాచారం తెలంగాణలో భౌగోళికంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (పునర్య్వస్థీకరణకు ముందు) అతి పెద్ద జిల్లా. దీనిని పాలమూరు అని కూడా పిల్వబడే ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 10 పురపాలక సంఘాలు (నగర పంచాయతీలతో కలిపి), 2 లోక్‌సభ నియోజక స్థానాలు, 14 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు ఉన్నాయి. కృష్ణా, తుంగభద్రలతొ పాటు దిండి, బీమా లాంటి చిన్న నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - ద్రోణాచలం రైల్వే మార్గం ప్రధాన రవాణా సౌకర్యాలు. పంచాయత్‌రాజ్ రహదారులలో మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంది. ఇతర జిల్లాలలో చేరిన మండలాలు కుడి|220x220px ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 64 రెవెన్యూ మండలాలుగా ఉన్నాయి.పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో మహబూబ్ నగర్ జిల్లా తాలూకాల వివరాలు . జూలై 26, 2007న సేకరించారు.. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 64 మండలాలుకుగాను నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా పరిధిలో 9 మండలాలు,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 16 మండలాలు,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో 9 మండలాలు,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 వికారాబాద్ జిల్లా పరిధిలో 3 మండలాలుతెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 248, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 చేరగా, రంగారెడ్డి జిల్లా (పాత జిల్లా) పరిధిలో 7 మండలాలుతెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 250, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 చేరాయి. వనపర్తి జిల్లాలో చేరిన మండలాలు పెద్దమందడి మండలం ఘన్‌పూర్ మండలం గోపాలపేట మండలం వనపర్తి మండలం పాన్‌గల్‌ మండలం పెబ్బేరు మండలం వీపన్‌గండ్ల మండలం కొత్తకోట మండలం ఆత్మకూరు మండలం నాగర్‌కర్నూల్ జిల్లాలో చెేరిన మండలాలు బిజినేపల్లి మండలం నాగర్‌కర్నూల్ మండలం పెద్దకొత్తపల్లి మండలం తెల్కపల్లి మండలం తిమ్మాజిపేట మండలం తాడూరు మండలం కొల్లాపూర్ మండలం కోడేరు మండలం వెల్దండ మండలం కల్వకుర్తి మండలం వంగూరు మండలం అచ్చంపేట మండలం అమ్రాబాద్ మండలం బల్మూర్ మండలం లింగాల మండలం ఉప్పునుంతల మండలం జోగులాంబ గద్వాల జిల్లాలో చెేరిన మండలాలు 1. గద్వాల మండలం, 2. ధరూర్ మండలం, 3. మల్దకల్ మండలం, 4. గట్టు మండలం, 5. అయిజ మండలం, 6. వడ్డేపల్లి మండలం, 7. ఇటిక్యాల మండలం, 8. మానవపాడ్ మండలం, 9. అలంపూర్ మండలం వికారాబాద్ జిల్లాలో చెేరిన మండలాలు 1. కొడంగల్ మండలం, 2. బొంరాస్‌పేట్ మండలం, 3. దౌలతాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాలో చెేరిన మండలాలు 1.మాడ్గుల్ మండలం 2.షాద్‌నగర్ మండలం 3.కొత్తూరు మండలం 4.కేశంపేట మండలం 5.కొందుర్గు మండలం 6.ఆమన‌గల్ మండలం 7.తలకొండపల్లి మండలం పునర్య్వస్థీకరణ తరువాత జిల్లాలో మండలాలు పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట ఈ జిల్లాలో రంగారెడ్డి జిల్లానుండి చేరిన గండీడ్ మండలంతో కలిపి 21 పాతమండలాలు, 5 కొత్తగా ఏర్పడిన మండలాలు కలిపి 26 మండలాలు ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 241, Revenue (DA-CMRF) Department, Date: 11.01.2016 ఆ తరువాత 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం మహబూబ్​నగర్​ జిల్లా నుండి (9 పాత మండలాలు + 2 కొత్త మండలాలు) 11 మండలాలను విడగొట్టి కొత్తగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసింది.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 19, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019 మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్ మండలం (రూరల్)* మూసాపేట్ మండలం* అడ్డాకల్ మండలం భూత్‌పూర్‌ మండలం హన్వాడ మండలం కోయిలకొండ మండలం రాజాపూర్ మండలం* బాలానగర్ మండలం నవాబ్‌పేట మండలం జడ్చర్ల మండలం మిడ్జిల్ మండలం దేవరకద్ర మండలం చిన్నచింతకుంట మండలం గండీడ్ మండలం మహమ్మదాబాద్ మండలం కౌకుంట్ల మండలం* గమనిక:2016 పునర్య్వస్థీకరణలో వ.నెం.2, 3, 8, సంఖ్యగల మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి.చివరి మహమ్మదాబాద్ మండలం గండీడ్ మండలంలోని 10 గ్రామాలను విడగొట్టి 2021 ఏప్రిల్ 24 నుండి అమలులోనికి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట జిల్లాలో చేరిన మండలాలు నారాయణపేట మండలం దామరగిద్ద మండలం ధన్వాడ మండలం మరికల్ మండలం * కోస్గి మండలం మద్దూరు మండలం ఊట్కూర్ మండలం నర్వ మండలం మఖ్తల్ మండలం మాగనూరు మండలం కృష్ణ మండలం * గమనిక:2016 పునర్య్వస్థీకరణలో వ.నెం.4, 11రు మండలాలు కొత్తగా ఏర్పడినవి పట్టణ ప్రాంతాలు 250px|alt=పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు|కుడి|పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు మహబూబ్ నగర్ జిల్లాలో 11 మున్సీపాలిటీలతో పాటు (నగరపంచాయతీలతో కలిపి) అనేక పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి : మహబూబ్ నగర్ (స్పెషల్ గ్రేడ్ మున్సీపాలిటీ), గద్వాల (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), వనపర్తి (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), నారాయణపేట (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), షాద్‌నగర్ (థర్డ్ గ్రేడ్ మున్సీపాలటీ), కల్వకుర్తి (నగర పంచాయతి), కొల్లాపూర్ (నగర పంచాయతి), నాగర్ కర్నూల్ (నగర పంచాయతి), అయిజ (నగర పంచాయతి), జడ్చర్ల (నగరపంచాయతి), అచ్చంపేట్ (నగర పంచాయతి), ఆత్మకూర్ (మేజర్ గ్రామ పంచాయతి), 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష జనాభా పైబడి ఉన్న ఏకైక పట్టణం మహబూబ్‌నగర్. జాతీయ రహదారిపై, రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పట్టణప్రాంత జనాభా అధికంగా ఉంది. రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే పట్టణ జనాభా మహబూబ్‌నగర్ డివిజన్‌లో అత్యధికంగానూ, నారాయణపేట డివిజన్‌లో అత్యల్పంగానూ ఉంది. జనాభా thumb|right|250px|మహబూబ్ నగర్ జిల్లా జనాభా పెరుగుదల గ్రాఫ్ (ఎడమ ప్రక్క ఉన్న అంకెలు లక్షలలో సూచిస్తాయి 1941 జనగణన ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జనాభా 13.8 లక్షలు కాగా, 2011 జనగణన ప్రకారం 40,42,191. 1941 నుంచి 2001 వరకు ప్రతి 10 సంవత్సరాలకు సేకరించే జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా ప్రక్క గ్రాఫ్‌లో చూపెట్టబడింది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 35,13,934 కాగా 2011 నాటికి పదేళ్ళలో 15% వృద్ధిచెంది 40,42,191కు చేరింది. 2011 జనాభా ప్రకారం ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో 9వ స్థానంలో, దేశంలో 55వ స్థానంలో ఉంది. జనసాంద్రత 2001లో 191 ఉండగా, 2011 నాటికి 219కు పెరిగింది. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న పట్టణాలు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్. రవాణా సౌకర్యాలు thumb|250px|మహబూబ్ నగర్ రైల్వే స్టేషను thumb|250px|మహబూబ్ నగర్ బస్ స్టేషను రైలు సౌకర్యం : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం సికింద్రాబాదు నుంచి కర్నూలు గుండా తిరుపతి, బెంగుళూరు వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వేస్టేషను వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వేస్టేషనులు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషనులు ఉన్నాయి. (మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్, ఏనుగొండ). కర్ణాటకలోని వాడి, రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. మాగనూరు మండలంలోని కృష్ణా రైల్వేస్టేషను ఈ మార్గంలోనే ఉంది. గద్వాల నుంచి కర్ణాటక లోని రాయచూరుకు మరో రైలు మార్గపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజురు అయిననూ పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది. రోడ్డు సౌకర్యం : దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, జడ్చర్ల, పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-బీజాపూర్ రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది. బస్ డిపోలు: మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 01బస్సు డిపో ఉంది - మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాలు left|200px నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలున్నాయి. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సూదిని జైపాల్ రెడ్డి, మల్లు రవి, పాగపుల్లారెడ్డి, డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు, నాగం జనార్థన్ రెడ్డి, పి.శంకర్ రావు తదితరులు జిల్లా నుంచి ఎన్నికయ్యారు. వీరిలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందగా, పలువులు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1989లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందినాడు. పార్టీల బలాబలాలు చూస్తే 1983 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆధిపత్యం వహించింది. 1983లో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 6 స్థానాలలో విజయం సాధించాయి. 1985లో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు పొందగా 1989లో ఒక్కస్థానం కూడా దక్కలేదు. 1994లో తెలుగుదేశం 11 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఒక్కస్థానం కూడా ఇవ్వలేదు. 1999లో తెలుగుదేశం 8, కాంగ్రెస్ పార్టీ 4, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 7, తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి, ఇతరులు 4 స్థానాలు పొందగా తెలుగుదేశంకు ఒక్కస్థానమే లభించింది. 2009లో తెలుగుదేశం పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా నాగర్‌కర్నూల్ నుంచి విజయం సాధించిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావులు రాజీనామా చేశారు. మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన రాజేశ్వర్ రెడ్డి మరణించడంతో మొత్తం 3 స్థానాలకు 2012 మార్చిలో ఎన్నికలు జరుగగా మహబూబ్ నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. 2014 మార్చిలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 4, తెరాస 1, భారతీయ జనతా పార్టీ 1 పురపాలక సంఘాలలో మెజారిటీ సాధించాయి. కొన్ని గణాంక వివరాలు భౌగోళిక విస్తీర్ణం: 1847 చ.కిమీ. జనాభా: 40,42,191 (2011 జనగణన ప్రకారం), 35,13,934 (2001 ప్రకారం). జనసాంద్రత 219 (2011 జనగణన ప్రకారం), 191 (2001 ప్రకారం). రెవెన్యూ డివిజన్లు: 2 (మహబూబ్ నగర్, నారాయణ పేట) రెవెన్యూ మండలాలు: 26 లోక్ సభ నియోజకవర్గాలు: 2 (మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు) అసెంబ్లీ నియోజకవర్గాలు: 5 (జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్.) గ్రామ పంచాయతీలు: 1348. నదులు: (కృష్ణ, తుంగభద్ర నది (కృష్ణా ఉపనది), దిండి లేదా దుందుభి నది (షాబాద్ కొండలలో పుట్టిన దిండి కృష్ణానదికి ఉపనది), పెదవాగు, చినవాగు ) దర్శనీయ ప్రదేశాలు: (ప్రతాపరుద్ర కోట, పిల్లలమర్రి, కురుమూర్తి, మన్యంకొండ). సాధారణ వర్షపాతం: 604 మీ.మీ స్వాతంత్రానికి ముందు మహబూబ్‌నగర్ జిల్లాలో సంస్థానాలు స్వాతంత్ర్యానికి పూర్వం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 సంస్థానాలు ఉండేవి. అందులో ముఖ్యమైన సంస్థానాలు : వనపర్తి సంస్థానం గద్వాల సంస్థానం జటప్రోలు సంస్థానం అమరచింత సంస్థానం పాల్వంచ సంస్థానం గోపాల్ పేట్ సంస్థానం గురుకుంట సంస్థానం ఆనెగొంది సంస్థానం గోపాలపేట సంస్థానం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు జితేందర్ రెడ్డి : మహబూబ్ నగర్ లోక్‌సభ సభ్యుడు, నంది ఎల్లయ్య : నాగర్ కర్నూల్ లోక్‌సభ సభ్యుడు, శ్రీనివాస్ గౌడ్ : మహబూబ్ నగర్ శాసనసభ్యుడు, గువ్వల బాలరాజు : అచ్చంపేట శాసనసభ్యుడు, సంపత్ కుమార్ : ఆలంపూర్ శాసనసభ్యుడు, జిల్లెల చిన్నారెడ్డి : వనపర్తి శాసనసభ్యుడు, మర్రి జనార్థన్ రెడ్డి : నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు, డి.కె.అరుణ : గద్వాల శాసనసభ్యురాలు, చెర్లకోల లక్ష్మారెడ్డి : జడ్చర్ల శాసనసభ్యుడు, వంశీచంద్ రెడ్డి : కల్వకుర్తి శాసనసభ్యుడు, జూపల్లి కృష్ణారావు : కొల్లాపూర్ శాసనసభ్యుడు, రేవంత్ రెడ్డి : కోడంగల్ శాసనసభ్యుడు, వెంకటేశ్వర్ రెడ్డి : దేవరకద్ర శాసనసభ్యురాలు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి : మక్తల్ శాసనసభ్యుడు, అంజయ్య యాదవ్ : షాద్‌నగర్ శాసనసభ్యుడు, రాజేందర్ రెడ్డి : నారాయణపేట శాసనసభ్యుడు. సందర్శనీయ ప్రదేశాలు thumb|right|200px|ఆలంపూర్‌లో చాళుక్యుల కాలం నాటి దేవాలయాలు thumb|right|200px|జూరాల ప్రాజెక్ట్ thumb|right|200px|పిల్లల మర్రి వృక్షం thumb|right|200px| దేవరకద్ర సమీపంలోని ఒక దృశ్యం thumb|right|200px|రాజోలికోట ముఖద్వారం thumb|right|200px|రాజోలికోట లోపలి దేవాలయాలు thumb|right|200px|సంస్థానాధీశుల కాలం నాటి గద్వాల మట్టికోట thumb|right|200px|మహబూబ్ నగర్ జిల్లా పరిషత్తు కార్యాలయము ఆలంపూర్ దేవాలయాలు : తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదు-బెంగుళూరు 7 వ నెంబరు జాతీయ రహదారిపై కల ఆలంపుర్ చౌరస్తా నుంచి 15 కిలోమీటర్ల లోనికి ఆలంపూర్ లో ఈ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు చాళుక్యుల కాలంలో సా.శ.7, 8వ శతాబ్దాలలో నిర్మితమైనాయిశ్రీసాయిధాత్రి పర్యాటకాంధ్ర, దాసరి ధాత్రి రచన, 2009 ముద్రణ, పేజీ 295. జిల్లాలో వివిధ త్రవ్వకాలలో లభించిన పురాతన శిల్పాలు కూడా ఆలంపుర్ పురావస్యు మ్యూజియంలో ఉన్నాయి. పిల్లలమర్రి : మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో సుమారు 700 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మహావృక్షం ఊడలు ఊడలుగా అభివృద్ధిచెంది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిఉంది. మహబూబ్ నగర్ జిల్లాకే గుర్తుగా మారిన ఈ మహావృక్షాన్ని సందర్శించడాన్కి ఎందరో వస్తుంటారు. ఇక్కడే పురావస్తు మ్యూజియం, మినీ జూ పార్క్, అక్వేరియం, ఉద్యానవనం, పిల్లల క్రీడాస్థలం, జింకలపార్క్, దర్గా మొదలగునవి కూడా తనవితీరా చూడవచ్చు. బీచుపల్లి : 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారిపై కృష్ణానది పై కల ఆనకట్ట వద్ద పుష్కర ప్రాంతమైన బీచుపల్లి ఉంది. ఇక్కడ కృష్ణవేణి ఆలయంతో పాటు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై నుంచి వెళ్ళు వాహనాల నుండి కూడా ఇక్కడి అపురూపమైన దృష్యాలు కానవస్తాయి. ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు : ధరూర్ మండలం రేవుల పల్లి వద్ద కర్ణాటక సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టు ఉంది. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవలే విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది. ఇది గద్వాల నుంచి ఆత్మకూర్ మార్గంలో ఉంది. మన్యంకొండ దేవాలయం : మహబూబ్ నగర్ జిల్లా లోనే అతిపెద్ద దేవాలయం మన్యంకొండ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఎత్తయిన కొండపై మహబూబ్ నగర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక లోని రాయచూరు వెళ్ళు మార్గంలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున జాతర జర్గుతుంది. కొండపై ఉన్న ఆహ్లాదకర వాతావరణం సందర్శకులను ఆకట్టుకొంటుంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు :50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండల పరిధిలో ఊకచెట్టువాగుపై నిర్మించారు. నిర్మాణం సమయంలో ఈ ప్రాజెక్టు సాగునీటి లక్ష్యం 12 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 50 వేల ఎకరాలకు పెంచి ప్రాజెక్టును అభివృద్ధి పరుస్తున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు సందర్శన కొరకు అనేక పర్యాటకులు వస్తుంటారు. కురుమూర్తి దేవస్థానం : తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంతో పోలికలున్న కురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం సా.శ.14 వ శతాబ్దానికి చెందినది. ఇది చిన్నచింతకుంట మండలంలో ఉంది. మహబూబ్ నగర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరడానికి రైలుమార్గం కూడా ఉంది. ఉమా మహేశ్వర క్షేత్రం : నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండలపై ఉమా మహేశ్వర క్షేత్రం ఉంది. ఇది శ్రీశైల క్షేత్రం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు మార్గంలో ఉంది కాబట్టి శ్రీశైలం వెళ్ళు భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ వెళ్తారు. చుట్టూ ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉండటం కూడా భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు గద్వాల కోట : సంస్థాన రాజుల కాలంనాటి గద్వాల కోట పట్టణం నడిబొడ్డున ఉంది. ఈ పురాతన కోటలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. కోట లోపలే ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. కోటలోని స్థలాన్ని కళాశాలకు ఇచ్చినందున కళాశాల పేరు కూడా మహారాణి ఆదిలక్ష్మీ డిగ్రీ కళాశాలగా చెలమణిలో ఉంది. కోట పరిసరాలలో గతంలో సినిమా షూటింగులు కూడా జర్గాయి. శిర్సనగండ్ల దేవాలయం : అపరభద్రాద్రిగా పేరుగాంచిన సా.శ.14 వ శతాబ్ది కాలం నాటి శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం వంగూరు మండలంలో ఉంది. ఇక్కడ ప్రతిఏటా చైత్రశుద్ధి పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కూడా ప్రతియేటా దిగ్విజయంగా నిర్వహిస్తారు. చంద్రగఢ్ కోట : ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు సమీపంలో ఎత్తయిన కొండపై 18 వ శతాబ్దంలో మొదటి బాజీరావు కాలం నాటి కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇది ఆత్మకూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో నర్వ మండల పరిధిలో నిర్మించారు. జూరాల పాజెక్టు సందర్శించే పర్యాటకులకు ఇది విడిదిగా ఉపయోగపడుతుంది. 18 వ శతాబ్దం తొలి అర్థ భాగంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడు. రాజోలి కోట, దేవాలయాలు :పురాతనమైన రాజోలి కోట, కోటలోపలి దేవాలయాలు సందర్శించడానికి యోగ్యమైనవి. కోట ప్రక్కనే తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల డ్యాం కనిపిస్తుంది. జహంగీర్ పీర్ దర్గా:కొత్తూర్ మండలం, ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో ఉన్న ఈ దర్గా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందింది. కులమతాలకతీతంగా భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయనాయకులు సైతం కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తుంటారు. పాలమూరు మహనీయులు బూర్గుల రామకృష్ణా రావు హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పోరాటయోధులలో ముఖ్యుడు. 1915 నుంచే ఈయన పోరాటం ప్రారంభమైంది.పలుమార్లు జైలుకు వెళ్ళినాడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గేయాలు, రచనలు చేసి ప్రజలలో ఉత్తేజం కలిగించాడు. ఈయన స్వస్థలం షాద్‌నగర్ మండంలోని బూర్గుల గ్రామం. ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ ఊరిపేరే ఇంటిపేరుగా మారిపోయింది. 1952లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అవరతణకు వీలుగా ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత కేరళ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడు. సురవరం ప్రతాపరెడ్డి : న్యాయవాది, పత్రికా సంపాదకుడు, గ్రంథాలయోద్యమనేత, రాజకీయ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సురవరం ప్రతాపరెడ్డి పాలమూరు జిల్లా మనోపాడ్ మండలంలోని ఇటిక్యాలపాడు గ్రామంలో 1896, మే 28న జన్మించాడు. 1926లో గోల్కొండ పత్రికను స్థాపించి నిజాం ప్రభుత్వపు లోపాలను ఎండగట్టాడు. మెదక్ జిల్లా లోని జొగిపేటలో జరిగిన నిజామ్ ఆంధ్ర మహాసబ ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహిన్చారు1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1952లో జరిగిన తొలి ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వనపర్తి నుంచి ఎన్నికయ్యాడు. 1953 ఆగష్టు 25న ఆయన మరణించాడు. రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి : స్వాతంత్ర్య సమరయోధుడైన రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు. నిజాంకు కొత్వాల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తరువాత గోల్కొండ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. హైదరాబాదు . ప్రజాచైతన్యం కల్గించడానికి అనేక విద్యాసంస్థలను స్థాపించాడు. వందేమాతరం రామచంద్రారావు : పాలమూరు జిల్లానుంచి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న ముఖ్య నేతలలో వందేమాతరం రామచంద్రారావు ఒకడు. ఇతని అసలు పేరు రామచంద్రయ్య. తొలుత గద్వాల సంస్థానంలో సబ్‌ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూమహాసభలో చేరినాడు. పలుసార్లు జైలుశిక్ష అనిభవించాడు. విచారణ సమయంలో ఊరు, తండ్రిపేరు అడగగా అన్నింటికీ వందేమాతరం అనే సమాధానం ఇచ్చాడు. అందుచే జైలునుంచి విడుదల అనంతరం అందరూ వందేమాతరం రామచంద్రారావు అని పిల్వడం ప్రారంభించారు. బి.సత్యనారాయణరెడ్డి : 1927లో మహబూబ్‌నగర్ జిల్లా అన్నారంలో జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1990లో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, ఆ తర్వాత ఒడిషా గవర్నరుగా పనిచేశాడు. ఇదే కాలంలో బీహార్, పశ్చిమ బెంగాల్ ఇంచార్జి గవర్నరుగా కూడా విధులు చేపట్టాడు. 2012 అక్టోబరు 6న మరణించాడు హాస్టల్ రామారావు : స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పాత్ర వహించిన పాలమూరు వ్యక్తి హాస్టల్ రామారావు అసలు పేరు సంతపూర్ రామారావు. కొల్లాపూర్ మండలం అతని స్వస్థలం. స్వతంత్ర భారతదేశంలో కలిసేందుకు హైదరాబాదు సంస్థానం నిరాకరించడంతో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి1947లో అరెస్టు వారెంట్‌కు గురై రెండేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినాడు. స్వాతంత్ర్యం తరువాత నాగర్ కర్నూల్లో హరిజనుల కోసం హాస్టల్ ప్రారంభించి హరిజనోద్ధరణకు పాటుపడినందులకు అతని పేరు హాస్టల్ రామారావుగా స్థిరపడింది. గడియారం రామకృష్ణ శర్మ : పాలమూరు జిల్లాకు చెందిన రచయితలలో గడియారం రామకృష్ణ శర్మ ఒకరు. ఆయన రచించిన శతపత్రం పుస్తక రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar#1 తీసుకున్న తేది 27.12.2007. ఇతడు 1919లో అనంతపురం జిల్లాలో జన్మించి పాలమూరు జిల్లాలోని ఆలంపూర్లో స్థిరపడ్డాడు. 2006 జూలైలో మరణించాడు. అతడు రచించిన పుస్తకాలలో మాధవిద్యారణ్య చరిత్ర ఒకటి. రాజగిరి పరశురాములు : ఇతను సామాజిక కార్యకర్త. సర్వోదయం ఉద్యమంలో జాతీయ స్థాయిలో పనిచేసారు. అమ్రాబాద్ మండలం వంకేశ్వరంలో 1929లో జన్మించిన పరశురాములు భూదానోద్యమ రూపశిల్పి అయిన వినోభాబావే ప్రియశిష్యుడిగా చాలాకాలం పనిచేసారు. రాజా రామేశ్వర్ రావు 1 : సంస్థానాధీశుడు, పరిపాలనదక్షుడు, సంస్కర్త. 19వ శతాబ్ది తొలిసంవత్సరాలలో వనపర్తి సంస్థానాధీశునిగా పరిపాలన ప్రారంభించిన రామేశ్వర్ రావు మరణించేంతవరకూ దాదాపుగా 43 సంవత్సరాల పాటు పరిపాలించారు. చుట్టుపక్కల బ్రిటీష్ ఇండియాలో జరుగుతున్న మార్పులను అనుసరించి వనపర్తి సంస్థానంలో వివిధ సంస్కరణలు, నూతన రాజ్యపాలన విధానాలు చేపట్టారు. సైన్యబలం వల్ల ఆయన సంస్థానంలో స్వతంత్రమైన పాలన చేపట్టేవారు. హైదరాబాదీ బెటాలియన్‌ 1853 నవంబర్ 5 న సృష్టించారు. 1866లో ఆయన మరణము తర్వాత, ఈ బెటాలియన్‌ నిజాం సైన్యములో కలపబడి ఆ సైన్యానికి కేంద్రబిందువు అయ్యింది. రాష్ట్రంలోనే తొలి పంచాయతీ సమితి స్థానిక సంస్థల చరిత్రలో రాష్ట్రంలో జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం మూడంచెల పంచాయతీ వ్యవస్థ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లో ప్రారంభించారు. 1959, అక్టోబర్ 14న అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఇక్కడి సమితికి ప్రారంభోత్సవం చేసాడు. ఇది దేశంలోనే రెండవ పంచాయతీ సమితి. (మొదటి సమితిని రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు). నెహ్రూ ప్రారంభించిన పంచాయతీ సమితి భవనం నేడు మండల పరిషత్తు కార్యాలయంగా సేవలందిస్తోంది. విద్యారంగం thumb|జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబ్ నగర్ జిల్లాలో 1875 లోనే మొగిలిగిద్ద గ్రామంలో ప్రభుత్వ పాఠశాల స్థాపించబడింది. జిల్లాలో 1955-56 నాటికి 1160 ప్రాథమిక పాఠశాలలు, 20 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5 ఉన్నత పాఠశాలలు ఉండగా, 2006-07 నాటికి ఈ సంఖ్య పెరిగి 2860 ప్రాథమిక, 987 ప్రాథమికోన్నత, 729 ఉన్నత పాఠశాలలు, 82 జూనియర్ కళాశాలకు చేరింది.ఈనాడు దినపత్రిక జిల్లా ఎడిషన్ తేది 26.01.2008 పేజీ సంఖ్య 8 2008-09 నాటికి ఈ సంఖ్య 3094 ప్రాథమిక, 890 ప్రాథమికోన్నత, 926 ఉన్నత పాఠశాలలు, 147 జూనియర్ కళాశాలకు చేరింది. ఇవే కాకుండా 45 డీగ్రీ కళాశాలలు, 9 పీజీ కళాశాలలు, 39 బీఎడ్ కళాశాలలు, 7 డైట్ కళాశాలలు, 19 ఐటీఐలు, 3 పాలిటెక్నిక్ కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు, 6 ఫార్మసీ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు, ఒక మెడికల్ కళాశాల, ఒక వ్యవసాయ కళాశాల ఉన్నాయి. 2008 లో పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించబడింది.పాలమూరు విశ్వవిద్యాలయం దేశంలోనే 'లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్'అనే అంశంలో గిన్నిస్ రికార్డు సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా వాసికెక్కింది. జాతీయసేవాపథకం విభాగంలో ఈ రికార్డు ఆంగ్ల భాషలో గిన్నిస్ రికార్డు గ్రహీత అయిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఆధ్వర్యంలో 2010 నవంబర్ 12 న 2,500 మంది పాల్గొని నిర్వహించారు.ఈ రికార్డు సాధించడం ద్వారా రాష్ట్రానికి చెందిన ప్రశంస బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాలమూరు విశ్వవిద్యాలయాన్ని 'మహా మహా'అనే బిరుదునిచ్చి గౌరవించారు. సాహిత్యం సంస్థానాల కాలంలోనే పాలమూరు జిల్లా సాహిత్యంలో పేరొందింది. గద్వాల సంస్థానాధీశులు ఎందరో సాహితీవేత్తలను పోషించుకున్నారు. స్వయంగా గద్వాల పాలకులు సాహిత్యం కూడా రచించారు. సంస్థానాధీశుల కాలంలో విద్వత్ గద్వాలగా పేరుగాంచింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు. ఆలంపూర్ ప్రాంతానికి చెందిన గడియారం రామకృష్ణశర్మ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినాడు. తెలుగులో తొలి రామాయణం "రంగనాథ రామాయణం" రచించినది జిల్లాకు చెందిన గోనబుద్ధారెడ్డి.పాలమూరు సాహితీ వైభవం, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 8 హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కూడా అనేక కావ్యాలు, అనువాదాలు, కవితలు రచించారు.పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ సెప్టెంబరు 2012, పేజీ 14 గడియారం రామకృష్ణ శర్మ, కపిలవాయి లింగమూర్తి లాంటి సాహితీమూర్తులు పాలమూరు జిల్లాకు చెందినవారు. 2000 అక్టోబర్ 16 లో సీనియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అధ్వర్యంలో నారాయణపేటలో వార్తాతరంగాలు తెలుగు పత్రిక ప్రారంబించడం జరిగింది.అప్పటి మంత్రి యెల్కొటి యల్లారెడ్ది, మాజీ యెమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి,కొడంగల్ యెమ్మెల్యే సుర్యనారాయణ,బిజెపి నాయకుడు నాగురవు నామజి,అప్పటి మునిసిపల్ చైర్మన్ గడ్డం సాయిబన్న తదితరులు పాల్గొన్నారు.2004 జనవరి 14 లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా వార్తాతరంగాలు పత్రికను దిన పత్రికగా మార్చడం జరిగింది.ప్రస్తుతం రాష్ట్ర రాజధాని నుండి కూడా పత్రిక ప్రింట్ అవుతుంది.మనకాలపు మహానీయుడు ప్రజాకవి గోరటి వేంకన్న పాలమూరు బిడ్డే అన్న సంగతి మరువొద్దు. వర్షపాతం, వాతావరణం మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం తక్కువ. జిల్లా మొత్తంపై సగటు వార్షిక వర్షపాతం 60.44 సెంటీమీటర్లు. అందులో అధికభాగం నైరుతి రుతుపవనాల వల్ల జూన్, జూలై, ఆగస్టు నెలలలో కురుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు వాయుగుండం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదౌతుంది. జిల్లాలో సగటు వర్షపాతంలో ప్రాంతాల మధ్య తేడాలున్నాయి. దక్షిణవైపున తుంగభద్ర, కృష్ణానది తీరగ్రామాలు భారీ వర్షాల సమయంలో నీటమునిగితే, జిల్లా వాయవ్య ప్రాంతమైన నారాయణ పేట డివిజన్‌లో కరువు తాండవిస్తుంది. జిల్లాలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. సముద్రతీరం చాలా దూరంలో ఉండుటవల్లనూ, సమీపంలో పెద్ద చెరువులు లేకపోవడం వల్లనూ, చుట్టూ కొండలు చుట్టబడి ఉండుటచే చల్లని గాలులకు అవకాశం తక్కువగా ఉంది. ఈ వాతావరణం ప్రత్తి వంటి పంటలకు చాలా అనువైనందున జిల్లాలో ప్రత్తి విస్తారంగా సాగుచేయబడుతున్నది. వేసవి కాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. శీతాకాలంలో నవంబర్, డిసెంబర్ మాసాలలో 15-18 డిగ్రీలకు చేరుకుంటుంది. మిగితా జిల్లాలతో పోలిస్తే శీతాకాలంలో చలి తక్కువగా ఉన్ననూ, వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అడవులు జిల్లా మొత్తం విస్తీర్ణంలో దాదాపు 10.5% అడవులు ఉన్నాయి. దట్టమైన అడవులు 329 చ.కి.మీ.లతో కలిపి మొత్తం 1944 చ.కిమీ.ల అడవులున్నాయి. ఈ అడవులలో అధిక భాగం జిల్లా ఆగ్నేయాన ఉన్న శ్రీశైలం అడవీప్రాంతంలో ఉంది. జిల్లాలో కల దట్టమైన అరణ్యం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. శ్రీశైలం సమీపంలో కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్న అమ్రాబాదు మండలంలో అధికశాతం అడవులున్నాయి. ఈ ప్రాంతంలోని అడవులలో పులులు, ఇతర వన్యప్రాణి జంతువులు సంచరిస్తుంటాయి. ఇది 5 జిల్లాలలో విస్తరించియున్న రాష్ట్రంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగము. జిల్లాలోని అడవులను రెండు డివిజన్ల క్రింద విభజించారు. అచ్చంపేట డివిజన్‌లో 209 హెక్టార్లు ఉండగా మహబూబ్‌నగర్ డివిజన్‌లో కొంత భాగం అడవులున్నాయి. నీటిపారుదల సౌకర్యం దేశంలోనే మూడవ పెద్దనది కృష్ణానది, దాని ప్రధాన ఉపనది తుంగభద్ర, చిన్న వాగులపై జిల్లాలో జూరాలా ప్రాజెక్టు, ఆర్డీఎస్, కోయిలకొండ ప్రాజెక్టు, సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించగా, సరళా సాగర్ ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, బీమా లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులు జలయజ్ఞంలో ప్రారంభించబడి పురోభివృద్ధిలో ఉన్నాయి. పెద్దతరహా, మధ్యతరహా ప్రాజెక్టులు కలిపి జిల్లాలో 215000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవి కాకుండా కాలువలు, చెరువులు, బోరుబావులు, ఊటబావులు తదితరాల ద్వారా మరో 212000 ఎకరాల భూమి సాగవుతుంది. పంటల వారీగా చూస్తే అత్యధికంగా వరి 145000 ఎకరాలు, వేరుశనగ 71000 నీటిపారుదల సాగు క్రింద ఉంది. ఖనిజ వనరులు పాలమూరు జిల్లాలో క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్, గ్రానైట్ రాయి విరివిగా లభిస్తుంది. కోడంగల్ ప్రాంతంలో నాపరాయి, సున్నపురాయి లభ్యమౌతుంది. గట్టు ప్రాంతంలో బంగారం నిక్షేపాలున్నట్లు ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఇక్కడ ఇంకనూ పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశ్రమలు రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న కొత్తూరు మండలంలో జిల్లాలోనే అత్యధిక పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. రసాయన, ఇంజనీరింగ్, ఫార్మా, డ్రగ్స్ తదితర 137 పరిశ్రమలతో కొత్తూరు మండలం ప్రథమస్థానంలో ఉంది. మహబూబ్‌నగర్ మండలంలో 92, షాద్‌నగర్ మండలంలో 69, జడ్చర్ల మండలంలో 67 పరిశ్రమలున్నాయి. రాష్ట్రంలోనే తొలి సెజ్ జడ్చర్ల సమీపంలోని పోలెపల్లిలో ప్రారంభమైంది. జాతీయ రహదారిపై ఉన్న కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్ మండలాలలో పరిశ్రమలు అధికంగా ఉండగా. నారాయణపేట డివినల్‌లో తక్కువగా ఉన్నాయి. క్రీడలు జిల్లాలో ప్రజాదరణ కలిగిన క్రీడ క్రికెట్. ఇది కాకుండా వాలీబాల్, బ్యాడ్మింటన్ ఎక్కువగా ఆడుతారు. హైదరాబాదు రంజీ జట్టులో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. మహబూబ్ నగర్ పట్టణంలో క్రీడా స్టేడియం ఉంది. ఇక్కడ జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయికి చెందిన వివిధ పోటీలు జరుగుతాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని స్పోర్ట్స్ పాఠశాల నుంచి పలువులు విద్యార్థులు జాతీయస్థాయిలో పతకాలు సాధించారు. జిల్లాలో ఇటీవలి ముఖ్య పరిణామాలు 2016 జూలై 24: మామిడిపల్లి వద్ద సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీచే ప్రారంభించబడింది.ఈనాడు దినపత్రిక, తేది 25-07-2016 2016 ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీష్ రావుచే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థపన జరిగింది.ఈనాడు దినపత్రిక, తేది 30-04-2016 2014 నవంబరు 8: కొత్తూరులో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుచే ఆసరా పథకం ప్రారంభించబడింది. 2014 మే 12: పురపాలక సంఘాల కౌంటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 4, భారతీయ జనతా పార్టీకు 1, తెరాసకు 2 పురపాలక సంఘాలలో మెజారిటి లభించింది. ఒకదానిలో హంగ్ ఏర్పడింది.ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 13-05-2014 2014 ఏప్రిల్ 22:భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి యొక్క భారీ బహిరంగ సభ నిర్వహించబడింది.ఈనాడు దినపత్రిక, తేది 23-04-2014 2014 మార్చి 30: జిల్లాలో 11 పురపాలక సంఘాలకు గాను ఎనిమిదింటికి ఎన్నికలు జరిగాయి. 2013 డిసెంబరు 14: అయిజ మండలానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు పెద్దసుంకన్న గౌడ్ (97 సం) మరణించాడు.నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 15-12-2013 2013 అక్టోబరు 30: కొత్తకోట మండలం పాలెం వద్ద జాతీయ రహదారిపై బస్సుకు మంటలు చెలరేగి 45 మంది సజీవదహనం అయ్యారు.ఈనాడు దినపత్రిక, తేది 31-10-2013 2013 అక్టోబరు12: నూతనంగా నిర్మించిన గద్వాల- రాయచూర్ రైలుమార్గం ప్రారంభమైంది. 2013 సెప్టెంబరు 27: మహబూబ్‌నగర్ పట్టణంలో సుష్మా స్వరాజ్ యొక్క భారీ "తెలంగాణ ప్రజాగర్జన" సదస్సు నిర్వహించబడింది.ఈనాడు దినపత్రిక, తేది 22-09-2013 2013 మార్చి 22: కల్వకుర్తి మేజర్ పంచాయతిని నగరపంచాయతీగా అప్‌గ్రేడ్ చేశారు.ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 118, తేది 22-3-2013 2012 డిసెంబరు 21: కడ్తాల్ (ఆమన‌గల్)లో ప్రపంచ ధ్యానమహాసభలు ప్రారంభమై 10 రోజులపాటు జరిగాయి. 2012 డిసెంబరు 18, 19: జిల్లా కేంద్రంలో తెలుగు మహాసభలు నిర్వహించబడ్డాయి. 2012 అక్టోబరు 7: ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి మరణం.ఈనాడు దినపత్రిక, తేది 07-10-2012 2012 మే 27: మహబూబ్ నగర్ పురపాలక సంఘంలో పరిసరాలలోని 10 గ్రామపంచాయతీలను విలీనం చేశారు.ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 215, తేది 29-05-2012 2012 మార్చి 31: కంచుపాడు గ్రామానికి చెందిన సురవరం సుధాకరరెడ్డి సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2012 మార్చి 17: అందుగుల ప్రాంతంలో క్రీ.పూ.1000 కాలం నాటి పురాతన వస్తువులు లభ్యమయ్యాయి. 2012 ఫిబ్రవరి 10: మాడ్గుల ప్రాంతంలో ఇనుపయుగం కాలం నాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి.సాక్షి దినపత్రిక, తేది 11-02-2012 2012 జనవరి 7: మహబూబ్‌నగర్ పట్టణంలో టివి నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. 2011 అక్టోబరు 30: మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ రాజేష్వర్ రెడ్డి మృతిచెందాడు. 2010 అక్టోబరు 20 : స్వాతంత్ర్య సమరయోధుడు, గద్వాల నియోజకవర్గ శాసనసభ్యుడిగా, గద్వాల పురపాలక సంఘం చైర్మెన్‌గా, గద్వాల మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా పనిచేసిన పాగపుల్లారెడ్డి మరణం.ఈనాడు దినపత్రిక, తేది 21.10.2010 2009 అక్టోబరు 2: తుంగభద్ర నది వరదల వల్ల నదీతీర గ్రామాలు నీటమునిగాయి.ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009 2008 జనవరి, 4 : నారాయణపేట మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లలితాబాయి నామాజీ మృతి. 2007 డిసెంబర్, 27 : గడియారం రామకృష్ణశర్మ రచించిన శతపత్రం ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది 2007 డిసెంబర్, 2 : ఆమనగల్ మండలాధ్యక్షుడు పంతూనాయక్ హత్య. 2007 జూన్, 24 : భారీ వర్షపాతం వల్ల ఆలంపూర్ జోగుళాంబ దేవాలయం నీట మునిగింది. 2007 జనవరి,19 : కృష్ణానదిలో పుట్టి మునిగి 60 మంది మృతిచెందారు. మూలాలు ఇవి కూడా చూడండి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం జిల్లా గ్రామాల జాబితా బయటి లింకులు మహబూబ్‌నగర్ వెబ్‌సైట్ పాలమూరు NRI Forum వెబ్‌సైట్ మహబూబ్‌నగర్ జిల్లా * వర్గం:తెలంగాణ జిల్లాలు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:వ్యక్తుల పేరుతో ఉన్న తెలంగాణ జిల్లాలు వర్గం:వ్యక్తుల పేరుతో ఉన్న జిల్లాలు
విజయనగరం
https://te.wikipedia.org/wiki/విజయనగరం
విజయనగరం ఆంధ్రప్రదేశ్ నగరం, విజయనగరం జిల్లా కేంద్రం. ఇక్కడ విజయనగరం కోట, పైడితల్లి అమ్మవారి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. చరిత్ర thumb|240px|ప్రసిద్ధిచెందిన విజయనగరం కోట ముఖద్వారం thumb|240px|విజయనగరం పట్టణం విజయనగరం జమీందారీ ముఖ్యపట్టణం విజయనగరం. పూసపాటి వంశం వారు దీని పాలకులు. 1754 లో, విజయనగర పాలకుడైన పూసపాటి విజయరామ గజపతి రాజు, ఫ్రెంచి వారితో ఒప్పందం కుదుర్చుకొని, తన పాలన సాగించాడు. కానీ కొంత కాలానికే ఈ సంస్థానం బ్రిటిషు వారి ఏలుబడిలోకి వెళ్ళింది. స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిషువారి ఏలుబడిలోనే ఉంది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకంలోని ప్రధాన వేదిక విజయనగరమే! పట్టణంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలు - అయ్యకోనేరు, బొంకులదిబ్బ మొదలైన వాటి ప్రస్తావన ఈ నాటకంలో ఉంది. ఆ నాటక రచయిత గురజాడ అప్పారావు విజయనగరం రాజావారి ఆస్థానంలో ఉద్యోగస్తుడే. భౌగోళికం విజయనగరం భౌగోళికంగా 18 ° 07'N 83 ° 25'E / 18,12 ° N 83,42 ° E ప్రాంతంలో ఉంది. ఇది 74 మీటర్ల (242 అడుగులు) సగటు ఎత్తులో ఉంది. విజయనగరం విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యాన ఉంది. జనాభా వివరాలు 2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 227,533. ఇందులో 111,596 మగవారు, 115,937 ఆడవారు ఉన్నారు. 20,487 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 5,686 అబ్బాయిలు, 5,315 అమ్మయిలు. ఈ నగరంలో 81.85% అక్షరాస్యతతొ 169,461 మంది అక్షరాస్యులు ఉన్నారు. పరిపాలన విజయనగరం పురపాలక సంఘం 1888 లో స్థాపించారు. 2015 డిశెంబరు 9న నగరపాలక సంస్థగా అభివ్రుద్ది చేసాను.విజయనగరం నగరపాలక సంస్థ పరిపాలన నిర్వహిస్తుంది. రవాణా సౌకర్యాలు జాతీయ రహదారి 26 జిల్లాలో విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం పట్టణాలను అనుసంధానిస్తుంది. విజయనగరం రైల్వే స్టేషన్ దక్షిణతీర రైల్వే జోన్ లో వాల్తేర్ విభాగం పరిధిలోకి వస్తాయి. సమీప విమానాశ్రయం విశాఖపట్నంలో ఉంది. విద్యా సౌకర్యాలు ప్రముఖ విద్యాసంస్థలు మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల. మహారాజా కళాశాల, విజయనగరం పర్యాటక ఆకర్షణలు పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు విజయనగరం పట్టణంలో 300 ఏళ్లుగా జరుగుతున్నాయి. బొబ్బిలియుద్ధం సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను భక్తితో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు. విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' చాలా విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించారు. ఈ చెరువులోని నీటితో ఆయకట్టు రైతులు ఏటా మూడు పంటలు పండిస్తుంటారు. ఈ చెరువు పశ్చిమ భాగంలోనే పైడిమాంబ విగ్రహం సాక్షాత్కారమైనది. ఈ చెరువులోనే అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. గంట స్తంభం కూడలి విద్యుచ్చక్తి లేని రోజుల్లో నాటి పురపాలక సంఘం వారు మూడు లాంతర్లు కూడలిలో మూడు వైపులా మూడు హరికెన్ లాంతర్లు ఏర్పాటుచేశారు. రాత్రిపూట నెల్లిమర్ల, ధర్మపురి, గంటస్తంభం దారులలో ఎడ్లబళ్ళుతో వెళ్ళేవారికి, పాదచారుల సౌకర్యార్ధం నెలకొల్పారు. విజయనగర రాజులు అవృతఖానాను పెద్ద పూలకోటలో నిర్మించారు. ఖానా అంటే మదుము అని అవృత అనే ఆంగ్లపదంతో కలిసి రూపొందింది. నీరు బయటకు పోయే మదుము అని దీని అర్ధం. ఇది గంటస్తంభం నమూనాలో ఉంది. పైభాగంలో స్నానానికి అనువుగా పెద్ద తొట్టె ఉంది. క్రిందిభాగంలో నుయ్యి, దిగడానికి మెట్లు ఉన్నాయి. మహారాజులు ఇందులో స్నానాలు చేసేవారని పెద్దలు అంటారు. రాజావారి కోట కోట ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అంటారు. నాడు ఈ ప్రదేశాన్ని మహారాజులు సైనిక విన్యాసాలకు కవాతులకు వినియోగించేవారు. బంకు అనేది మహారాష్ట్ర పదం దీనికి తలవాకిట పహరా అని అర్ధం. కాలక్రమేణా ఈ బంకులదిబ్బే బొంకులదిబ్బగా రూపాంతరం చెందింది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఒక ఫ్రెంచి ఇంజినీరు భూగర్భ జలాల్ని బయటకు తెప్పిస్తానని గొట్టాలను తెప్పించి వాటిని ఇక్కడే భూమిలోకి దించాడట. తన ప్రయత్నం విఫలం కావడంతో చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే పారిపోయాడట. ఆ ఇంజినీరు పలికిన బొంకు లేదా అబద్ధం ఆ ప్రదేశానికి స్థిరపడిందంటారు. మహాకవి గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకాన్ని బొంకుల దిబ్బ సీనుతోనే ఆరంభించారు. ప్రస్తుతం ఈ ప్రదేశం కూరగాయల మార్కెట్ గా ఉపయోగపడుతుంది. విజయనగరం కోట thumb|240px|విజయనగరం రైలు సముదాయం విజయనగర రాజులు మొదట్లో కుమిలి లోని మట్టి కోటలో నివసించేవారు. ఆనంద గజపతి రాజు విజయనగరం కోట నిర్మాణాన్ని సా.శ. 1712-1714 ల మధ్య ప్రారంభించారు. అయిదు విజయాలకు చిహ్నంగా అనగా విజయ నామ సంవత్సరంలో, విజయదశమి, మంగళవారం నాడు (తెలుగులో జయవారం) ఈ కోట నిర్మాణం మొదలైంది. తన కుమారుడు విజయరామ రాజు పేరిట దీనికి 'విజయనగరం' అని పేరు వచ్చింది. అయితే 1717 సంవత్సరంలో ఆనందరాజు పరమపదించగఅ విజయరామరాజు కోట నిర్మాణాన్ని పూర్తిచేశారు.2012 నాటికి 300 సం.లు అయింది. విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. కోట చుట్టూ 19,653 చదరపు అడుగుల కందకం తవ్వించారు. నాడు కందకం నిండా నీరు ఉండేది. ఇది సుమారు రెండు ఏనుగులు మునిగేటంత లోతు ఉంటుంది. గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు కలిగివున్నాయి. ప్రముఖులు పి.సుశీల, సినీ గాయని ఇందుకూరి రామకృష్ణంరాజు వి.రామకృష్ణ ద్వివేదుల విశాలాక్షి శ్రీరంగం నారాయణబాబు నిడుదవోలు వేంకటరావు న్యాయపతి కామేశ్వరి వంకాయల నరసింహం మానాప్రగడ శేషసాయి పంతుల జోగారావు - కథా రచయిత విశేషాలు చిలుకూరి శాంతమ్మ - ఈమె విశాఖపట్నానికి చెందిన మహిళా ప్రొఫెసర్. ప్రస్తుతం ఆమె వయస్సు (2022) నాటికి 93 సంవత్సరాలు. ఆ వయస్సులోనూ ఆమె విశాఖపట్నం నుండి రోజుకు 60 కి.మీ ప్రయాణించి విజయనగరం లోని ఒక కళాశాలలో విద్యార్థులకు తనకున్న మక్కువతో భౌతిక శాస్త్రంపై పాఠాలు చెపుతుంది. ఇవీ చూడండి విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం విజయనగరం శాసనసభా నియోజకవర్గం మూలాలు బయటి లింకులు ఈనాడు విజయనగరం ఎడిషన్ 2008 అక్టోబరు 14 తేదీన, శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ప్రత్యేక అనుబంధంలో ప్రచురించిన సమాచారం. వర్గం:విజయనగరం జిల్లా వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు వర్గం:కోస్తా
హైదరాబాదు
https://te.wikipedia.org/wiki/హైదరాబాదు
హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని. హైదరాబాదు జిల్లా, రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం. హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరం. హస్తకళలకు, నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు భారతదేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం నుండి 28/10/2006న సేకరించబడినది.. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానంలో ఉంది.ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా నుండి 28/10/2006 న సేకరించబడినది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు, సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. హైదరాబాదు నగరం డెక్కన్ డైమండ్ సిటీ, నవాబుల నగరం, ముత్యాల నగరం, సరస్సుల నగరం, రాళ్ళ నగరం మొదలైన పేర్లతో ప్రసిద్ధి చెందింది. చరిత్ర thumb|left|మహమ్మద్ కులీ కుతుబ్ షా, 5వ కుతుబ్ షాహీ సుల్తాన్, హైదరాబాదు నగర స్థాపకుడు. thumb|left|250px|గోల్కొండ కోటపై నుండి హైదరాబాదు నగరం హైదరాబాదును మూసీ నది ఒడ్డున సా.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు.హైదరాబాదు అధికారిక వెబ్‌సైటు నుండి హైదరాబాదు చరిత్ర గురించి 29/10/2000న సేకరించబడినది. గోల్కొండలోని నీటి సమస్యకు సమాధానంగా పరిపాలనను ఇక్కడకు మార్చారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్థులు ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని భాగాలను పాలించారు.ఆర్.ప్లంకెట్, టి.కాన్నన్, పి.డేవిస్, పి.గ్రీన్‌వే , పి.హార్డింగ్‌లు, (2001)లో రాసిన Lonely Planet South India అనే పుస్తకములోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: Lonely Planet 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కుతుబ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత చించలం (ఇప్పుడు శాలిబండ ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశాడు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడు. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఇటాలి యన్ యాత్రికుడు టావెర్నియర్ నగరంలోని ఉద్యానవనముల శోభకు అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి 'బాగ్‌నగర్' అని శ్లాఘించాడు. ఉద్యాన వనాలకేకాక సరస్సులకు కూడా హైదరాబాద్ పెట్టింది పేరు.దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్ సకల వసతులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంటు, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజి వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషను, టంకశాల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నా యి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సంవత్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.1956లో హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు ఆరవ పెద్ద నగరంగా ఉంది. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేశారు. పాతబస్తీకి సరిహద్దుగా హైదరాబాదు సరిహద్దు గోడ కట్టబడింది. పేరు పుట్టుక thumb|లాల్ బహదూర్ శాస్త్రితో నిజాం (మీర్ ఉస్మాన్ అలీ ఖాన్) ప్రధానమంత్రి మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందిందిhttp://www.indiatraveltimes.com/legend/sultan.html హైదరాబాదుకు ఆ పేరు ఎలా వచ్చింది ఇండియా ట్రావెల్ టైంస్ సైటు నుండి మే 12, 2007న సేకరించబడింది. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం ఉంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి. భారత స్వాతంత్ర్యం అనంతరం 1947లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార, వాణిజ్యాలు స్థిరముగా ఉండేందుకు హైదరాబాదు రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణా కమ్యునిస్టులు హైదరాబాదును భారత దేశంలో కలుపుటకు, నిజాము సొంత సైన్యమయిన రజాకర్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణించాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగినాయి. అటువంటి సమయంలోనే, అప్పటి గృహమంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్యకు ఉపక్రమించింది. సెప్టెంబరు 17, 1948న, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడం వల్ల హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత ఎనిమిది సంవత్సరాలపాటు (సెప్టెంబరు 17, 1948 నుండి 1956 నవంబర్ 1వరకు) హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. 1956 నవంబర్ 1న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం , దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో కలిసాయి, అంతేకాదు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది. భౌగోళికం హైదరాబాదు దాదాపు తెలంగాణ రాష్ట్రము మధ్య ప్రాంతములో ఉంది. ఇది దక్కను పీఠభూమిపై సముద్రమట్టం నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు). హిమాయత్ సాగర్, సింగూరు జలాశయం, కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. కృష్ణా నది నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 2011 లో హైదరాబాదు మహానగర జనాభా 68,09,970. హైదరాబాదులో ముస్లిం జనాభా 40%గా ఉంది. తెలుగు, ఉర్దూ, హిందీ ఎక్కువగా మాట్లాడే భాషలు. వ్యాపార వ్యవహారాల్లో ఇంగ్లీషు ఎక్కువగానే వాడుతారు. భారత దేశములోని అనేక ప్రాంతములనుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. పౌర పరిపాలన నగర పరిపాలన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చే నిర్వహించబడుతుంది దీనికి అధిపతి మేయరు అయినప్పటికీ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నగరపాలక కమిషనరు అనబడే ఒక ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటాయి. నగర త్రాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలిగించుట, వీధిదీపముల ఏర్పాటు, మౌలిక వసతులకు బాధ్యత ఈ సంస్థదే. నగరం 150 వార్డులుగా విభజింపబడి ఉంది. ఒక్కో వార్డుకు ఒక కార్పొరేటరు ఎన్నికై కార్పొరేషనులో తన వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. నగరప్రాంతం మొత్తం తెలంగాణ 31 జిల్లాల్లో ఒకటి - అదే హైదరాబాదు జిల్లా. ఆస్తుల దస్తావేజులు, రెవెన్యూ సమీకరణకు జిల్లా కలెక్టరు బాధ్యుడు. హైదరాబాదు జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా కలెక్టరుదే. భారతదేశంలోని ఇతర మహానగరంలలో వలెనే, హైదరాబాదు పోలీసుకు పోలీసు కమీషనరుగా ఒక ఐపీఎస్‌ అధికారి ఆధిపత్యము వహిస్తుంటాడు. హైదరాబాదు పోలీసు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వములో పని చేయుస్తుంది. హైదరాబాదును ఐదు పోలీసు జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్‌కు ఒక డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు అధిపతిగా ఉంటాడు. ట్రాఫిక్‌ పోలీసు విభాగము హైదరాబాదు పోలీసు శాఖలో పరిమిత స్వయంప్రతిపత్తి కలిగిన ఒక విభాగము. తెలంగాణ రాష్ట్రము మొత్తము తన న్యాయ పరిధిలో ఉండే తెలంగాణ ఉన్నత న్యాయస్థానము యొక్క పీఠము హైదరాబాదు నగరంలోనే ఉంది. హైదరాబాదులో రెండు దిగువ న్యాయస్థానములు, పౌరసంబంధ సమస్యలకై చిన్న సమస్యల (small causes) న్యాయస్థానము , నేర విచారణ కొరకు ఒక సెషన్స్ న్యాయస్థానం ఉన్నాయి. హైదరాబాదు నగరానికి లోక్‌సభలో రెండు సీట్లు , రాష్ట్ర శాసనసభలో పదమూడు సీట్లు ఉన్నాయి. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) ప్రకారం కోర్‌ ఏరియా 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా... 2031 నాటికి అది 1.84 కోట్లకు పెరుగుతుందనే అంచనాలతో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా 22 ప్రాంతాలకు మల్టిపుల్‌ జోన్లుగా గుర్తింపు. ఐదు ప్రాంతాల్లో అంతస్తుల (మల్టీ లెవెల్‌) పార్కింగ్‌ ఏర్పాటుచేస్తారు. 70 కమర్షియల్‌ రోడ్లను గుర్తించారు. 150 హెరిటేజ్‌ భవనాలను గుర్తించి వాటి పరిరక్షణకు ప్రణాళిక రూపకల్పనచేశారు. 29 కొత్త రోడ్లు వేస్తారు.అంతర్గత రోడ్లను 40 అడుగులకు పరిమితం చేస్తారు. కొత్తగా పది ఫ్త్లెఓవర్ల నిర్మిస్తారు . మూసీనది, హుస్సేన్‌సాగర్‌ నాలాలపై 13 వంతెనలకు ప్రతిపాదన చేశారు.హుస్సేన్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలాలకు గ్రీన్‌ బెల్టుగా గుర్తించి, రెండు వైపులా తొమ్మిది మీటర్ల చొప్పున పచ్చదనం పెంపు చేస్తారు. ఆజామాబాద్‌, సనత్‌నగర్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాలకు వర్క్‌ సెంటర్లుగా గుర్తించారు.జాతీయ రహదారులను 120-150 అడుగుల మేరకు విస్తరిస్తారు.ఏడు చోట్ల రైల్‌ అండర్‌ బ్రిడ్జిలు, కందికల్‌ గేట్‌ వద్ద ఆర్వోబీ, తాడ్‌బండ్‌ వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తారు. రోడ్ల విస్తరణలో స్థలాన్నిచ్చే వారికి చెల్లించే పరిహారం 100 శాతంగా ఉన్న ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్స్‌ రైట్స్‌ను 150 శాతానికి పెంచుతారు. ఎంజీబీఎస్‌ మినహా మిగిలిన ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను బహుళ అవసరాలకు వినియోగించుకుంటారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, హైటెక్‌ సిటీ ఫ్త్లెఓవర్‌ నిర్మాణం పూర్తిచేస్తారు. హుస్సేన్‌సాగర్‌లోకి రసాయనాలు మోసుకొచ్చే పికెట్‌, కూకట్‌పల్లి నాలాలపై మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటర్‌ రీసైక్లింగ్‌ ద్వారా ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తారు. బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో ట్రక్స్‌ పార్కు ఏర్పాటు చేస్తారు. సాగర్‌ హైవేపై మంగల్‌పల్లి వద్ద 20 ఎకరాల్లో మరో ట్రక్‌ పార్కు ఏర్పాటు చేస్తారు. రవాణా వ్యవస్థ రోడ్డు రవాణా thumb|250x250px|హైదరాబాదులోని ఒక ఫై ఓవరు|alt= హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు , కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన జాతీయ రహదారి 44, జాతీయ రహదారి 163, జాతీయ రహదారి 65 నగరంలో నుంచే వెళ్తుంటాయి. హైదరాబాదు నగరం లోపలకూడా మంచి రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు 3-లేన్ సౌకర్యము ఉంది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగాను ఔటర్ రింగు రోడ్డు నిర్మాణము జరిగింది.ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వివరాలు 29/10/2006న సేకరించబడినది. హైదరాబాదు నగరంలో ప్రయాణ అవసరాలకు తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ,తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వెబ్సైట్ లెక్కకు మిక్కిలి సిటీ బస్సులను నడుపుతుంది. ఇక్కడ ఉన్న మహత్మా గాంధీ బస్ స్టేషను 72 ప్లాట్ఫారాలతో ఆసియాలోకెల్లా అతిపెద్ద బస్‌స్టేషనుగా పేరు సంపాదించింది. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం. హైదరాబాద్ రోడ్డు అభివృద్ధి సంస్థ (హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అనేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పబ్లిక్ రోడ్ల అధికారిక సంస్థ. దీని ద్వారా హైదరాబాదు నగరంలో రోడ్ల నిర్మాణం, నిర్వాహణ పనులు నిర్వర్తించబడుతాయి. రైలు రవాణా thumb|250x250px|నక్లెస్ రోడ్డులోని ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను|alt= హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, ఇది నగరంలో పెద్ద రైల్వేస్టేషన్, ఇక్కడనుండి నగరబస్సులు, ఎమ్ఎమ్టిఎస్ (యంయంటియస్) రైలు సేవలున్నాయి. నాంపల్లి రైల్వేస్టేషను (హైదరాబాదు దక్కన్) కాచిగూడ రైల్వేస్టేషను నగరంలో ఇతర రైల్వేస్టేషన్లు బేగంపేట రైల్వేస్టేషసు లింగంపల్లి రైల్వేస్టేషన్ మల్కాజ్‌గిరి రైల్వేస్టేషన్ సబర్బన్ రైల్వే హైదరాబాదు నగరంలో 2003లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (Multi-Modal Transport System (MMTS)) ప్రవేశ పెట్టారు. సికింద్రాబాదు - లింగంపల్లి, హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - ఫలక్‌నుమా, లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. 121 ట్రిప్పులతో రోజుకు 180,000 ప్రయాణీకులకు సేవలందిస్తోంది. దీనిక జతగా సెట్విన్ సంస్థ చిన్నబస్సు సేవలు నడుపుతుంది. మెట్రో రైలు మెట్రోరైల్ మొదటి దశ 2017 నవంబర్ లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గం 2018 అక్టోబరులో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం 2019 మార్చి న ప్రారంభించారు. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రోగా గుర్తింపుపొందింది. విమానయానం హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్లో కొత్తగా నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2008 మార్చి 15 తేదీన ప్రారంభించబడింది. ఇది ప్రపంచం లోని 5 ప్రముఖ విమానాశ్రయాలలో స్థానం సంపాదించింది. 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు. ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మధ్య ప్రాచ్య ప్రాంతం నైరుతి ఆసియా, దుబాయి, సింగపూరు, మలేషియా , చికాగో, ఫ్రాంక్‌ఫర్ట్ మొదలైనటువంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.భారత విమానాశ్రయాల అధికార సంస్థ (AAI) వెబ్‌సైటు నుండి బేగుంపేట విమానాశ్రయ సమాచారం, 29/10/2006న సేకరించబడినది. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయము ప్రత్యేక విమానాల (రక్షణ , ఇతరాలు) కొరకు మాత్రమే పనిచేస్తుంది. ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు హైదరాబాదు మహానగరం 1591లో స్థాపించబడినందున, నిత్యం పెరుగుతున్న నగర జనాభాకు ప్రస్తుతమున్న రోడ్లు సరిపోవు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా తెలంగాణా ప్రభుత్వం, హైదరాబాదు మహానగరపాలక సంస్థ ల ఆధ్వర్యంలో హైదరాబాదు నగరంలోని రోడ్ల అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అందులో భాగంగా ప్రభుత్వం నగరం అంతటా అనేక ఫ్లైఓవర్‌లు, అండర్ పాస్‌లు నిర్మించాలని నిర్ణయించింది. విద్య విద్య పరంగా హైదరాబాదు దక్షిణ భారతంలో ప్రముఖ కేంద్రం. thumb|ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల|alt=పెద్ద గులాబీ రంగు గ్రానైట్ భవనం|250x250px ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు చాలావరకు సిబిఎస్ఇ విద్యాపద్ధతి పాటిస్తాయి. మూడింట రెండు వంతులు విద్యార్థులు ప్రైవేట్ సంస్థలలో ఉన్నారు. బోధనా మాధ్యమాలు ఇంగ్లిషు, హిందీ, తెలుగు, ఉర్దూ. సంస్థని బట్టి, విద్యార్థులు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష రాస్తారు. లేక ఐసిఎస్ఇ (ICSE) రాస్తారు. సెకండరీ మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, జూనియర్ కళాశాలలో ఉన్నత మాధ్యమిక విద్యకొరకు చేరుతారు. ఇంజనీరింగ్ వృత్తి విద్య కొరకు ప్రవేశ పరీక్ష (ఎమ్సెట్) (EAMCET) రాసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, (JNTUH) లేక ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) అనుబంధం గల కళాశాలలలో చేరతారు. 13 విశ్వవిద్యాలయాలలో, రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, రెండు విశ్వవిద్యాలయ అర్హతగలవిభావించబడిని విశ్వవిద్యాలయాలు, ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, మూడు కేంద్ర విశ్వవిద్యాలయాలున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, (HCU) మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం , ఇంగ్లీషు , విదేశ భాషల విశ్వవిద్యాలయము ఉన్నాయి. 1918లో ఏర్పాటు చేయబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదులోని తొలి విశ్వవిద్యాలయం. ఇది విదేశీ విద్యార్థులని ఆకర్షించడంలో దేశంలో రెండవ స్థానంలో ఉంది. 1982 లో ఏర్పాటైన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, దేశంలోనే తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాదులో చాలా జీవసాంకేతికం, జీవమెడికల్ శాస్త్రం, ఔషధాల కేంద్రాలున్నాయి. నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) హైదరాబాదులో ఐదు వైద్యకళాశాలలున్నాయి. అవి ఉస్మానియా వైద్య కళాశాల, గాంధీ వైద్య కళాశాల, నిజాం వైద్య శాస్త్రాల సంస్థ, దక్కన్ వైద్య శాస్త్రాల సంస్థ] , షాదాన్ వైద్య శాస్త్రాల సంస్థ] ఎఐఐఎమ్ఎస్ (AIIMS) హైదరాబాద్ పొలిమేరలలో ప్రతిపాదించబడింది. యునాని వైద్యంలో ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల ఉంది. ఇంకా ప్రముఖ కళాశాలలు లేక సంస్థలు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (NIRD), నల్సార్ శాసనవిషయాల సంస్థ (నల్సార్), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (NGRI), ప్రభుత్వరంగ సంస్థల సంస్థ (IPE), the భారతీయ పరిపాలన ఉద్యోగుల సంస్థ (ASCI), ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా (ESCI),సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ. సాంకేతిక కళాశాలలు ఐఐఐటి (IIITH), బిట్స్ (BITS Hyderabad), గాంధీ సాంకేతిక నిర్వహణ సంస్థ (GITAM హైదరాబాదు) , ఐఐటి,హైదరాబాదు (IIT-H), వ్యవసాయ శాస్త్ర సంస్థలు ఇక్రిశాట్ (ICRISAT), ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఫ్యాషన్ కళకు సంబంధించిన రాఫిల్స్ మిల్లెనియమ్ ఇంటర్నేషనల్, నిఫ్ట్, హైదరాబాదు (NIFT-H), విగాన్ మరియ లీ కళాశాల కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2015 లో పని ప్రారంభించిది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఇస్లామిక్ విశ్వవిద్యాలయం అయిన జామియా నిజామియా కూడా ఇక్కడే ఉంది. వాణిజ్య వ్యవస్థ హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి రంగం వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే ముత్యాల మార్కెట్టు ఉంది. అందుకే ఈ నగరాన్ని ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ , కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన చలన చిత్ర నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని 1996లో నిర్మించారు.రామోజి ఫిలిం సిటీ వెబ్‌సైటు నుండి 28/10/2006న సేకరించబడినది. అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ చలన చిత్ర నిర్మాణ కేంద్రం అతిపెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది.గిన్నీసు బుక్కులో అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిలిం సిటీ స్థానము, 28/10/2006న సేకరించబడినది. హైదరాబాదులో పేరెన్నికగన్న పరిశోధనాలయాలు , విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే మరికొన్ని ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అంతేకాదు ఈ పరిశోధనాలయాలు వివిధ రంగాలకు విస్తరించాయి కూడా. వాటిలో కొన్ని: డాక్టరు రెడ్డీస్ లాబరేటరీలు - న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టయిన ప్రముఖ మందుల కంపెనీ. సిడిఎఫ్డి ఫోరెన్సిక్ లాబరేటరీ - భారత దేశంలో పేరెన్నికగన్న నేర పరిశోధనా సంస్థ. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి హైదరాబాదులోనే స్థాపించబోయే మరికొన్ని ముఖ్యమయిన ప్రాజెక్టుల వివరాలు జీనోము వ్యాలీ :- ఇది ఐసిఐసిఐ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టు. బయోటెక్నాలజీ కంపెనీలకు ఉపయుక్తంగా ఉండేటట్లు 200 ఎకరాలలో ఒక నాలేడ్జి పార్కును స్థాపించే ప్రయత్నం ఇది.జీనోము వ్యాలీ నుండి 28/10/2006 న సేకరించబడినది. రాజీవ్ గాంధీ నానో టెక్ సిలికాన్ ఇండియా పార్కు :- దీనిని శంషాబాదులో నిర్మింప తలపెట్టిన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో నిర్మిస్తున్నారు. దీనిని 350-ఎకరాలలో (మొదటి దశ 50 ఎకరాలు) నిర్మించాలని తలపెట్టారు. ఈ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 250 కోట్ల (మొదటి దశలో 60 కోట్లు)అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచానా వేస్తున్నారు.ఏపి ప్రభుత్వ సైటు నుండి 28/10/2006న సేకరించబడినది. రియల్ ఎస్టేట్ రంగము భారత దేశంలోని మరెన్నో ఇతర నగరాల వలే హైదరాబాదులో కూడా రియల్ ఎస్టేటు రంగము మంచి అభివృద్ధి సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణంగా ఇటీవల కాలంలో తామర తంపరగా వస్తున్న ఐటి సంస్థలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం హైటెక్ సిటీని నిర్మించిన తరువాత ఎంతోమంది ప్రైవేటు భాగస్వాములు కూడా ఐటి పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు సింగపూరులో కార్యకలాపాలు సాగించే ఎసెండాస్ 2002లో హైదరాబాదులోని హైటెక్ సిటీ దగ్గర ఐటీ పార్కుని నిర్మించటానికి ఎల్&టితో, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఎసెండాస్ ఇంఫోసిటీ వెబ్‌సైటు నుండి 28/10/2006న సేకరించబడినది. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ కూడా, సెస్మా ఇంటర్నెషనల్ (CESMA International) అనే సింగపూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటి ఉద్యోగులకు ఉపయుక్తంగా పోచారం దగ్గర 16000 గృహాల సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది.తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైటు లో సంస్కృతి గృహసముదాయం గురించిన వివరణ, 28/10/2006న సేకరించబడినది. thumb|right|250px|సైబర్ టవర్లు, హైదరాబాదు ఐటి చిహ్నము ఐటి రంగము 1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి , ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును బెంగుళూరు తరువాత రెండో సిలికాను వ్యాలీ గా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ, ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ టెక్ మహీంద్రా యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. ఐ బి ఎం, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్,డెల్, కాన్బే, జిఇ, సొన్స్ ఈన్దీ, డెలాయిట్, హెచ్ఎస్‌బిసి, జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న కంపెనీలలో కొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహవంతులకోసం ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ను కూడా ప్రారంభించింది. సంస్కృతి వైవిధ్యత thumb|250x250px|ఛార్మినార్ నుండి ఒక దృశ్యం|alt= హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. సిక్కులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు తెలుగు, ముస్లిములు ఉర్దూ మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి. హిందువులు, ముస్లిములు అన్నదమ్ముల కలిసి మెలిసి ఉంతరు ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను కచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు. రుచులు హైదరాబాదు రుచులు మిగతా భారతదేశపు రుచుల కంటే భిన్నంగా ఉంటాయి. మొఘలుల రుచులతో కలిసిన తెలంగాణా వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. బిరియానీ, బగారాబైంగన్ (గుత్తి వంకాయ), ఖుబానీ కా మీఠా, డబల్ కా మీఠా, హలీమ్, ఇరానీ చాయ్ మొదలైనవి ఇక్కడి ప్రముఖ వంటకాల్లో కొన్ని. చాలామంది హైదరాబాదీ ముస్లింలు పని చేయడానికి మధ్య ప్రాచ్యము అందులో ప్రత్యేకముగా దుబాయి వెళ్ళడము వలన, ఇప్పుడు హలీం ఆ ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందినది.హైదరాబాద్‌ హలీం భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌)ని సొంతం చేసుకొంది. సమాచార, వినోద మాధ్యమాలు హైదరాబాదు చారిత్రక, రాజధానిగా ఉండుట వలన ఇక్కడ ప్రచురణ , ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని తెలుగు వినోద, వార్తా ఛానళ్ళు రేడియో స్టేషన్లు హైదరాబాదు కేంద్రముగా పని చేయుచున్నవి. 1780 లో స్థాపించిన దక్కన్ టైమ్స్ పత్రిక హైదరాబాద్ నుండి వెలువడిన తొలి వార్తాపత్రిక. తెలుగు పత్రికలలో ప్రధానమైనవి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ. ఆంగ్ల పత్రికలలో ప్రధానమైనవి ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందు, దక్కన్ క్రానికల్ ప్రముఖ ఉర్దూ పత్రికలు ది సియాసత్ డైలీ, ది మున్సిఫ్ డైలీ,ఇండియన్ ఇతేమాద్. సికందరాబాదు కంటోన్మెంట్ బోర్డు తొలి రేడియో కేంద్రాన్ని 1919 లో ప్రారంభించిది. నిజాం కాలంలో దక్కన్ రేడియో కేంద్రం 1935 ఫిబ్రవరి 3 లో ప్రసారాలు ప్రారంభించింది. ఎఫ్ఎమ్ ప్రసారాలు 2000లో ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఎఫ్ ఎమ్ రేడియో ఛానళ్లు ఆకాశవాణి, రేడియో మిర్చి, రేడియో సిటీ, రెడ్ ఎఫ్ఎమ్, బిగ్ ఎఫ్ఎమ్, ఫీవర్ 104 ఎఫ్ ఎమ్. టెలివిజన్ ప్రసారాలు 1974 లో దూరదర్శన్ ప్రారంభంతో మొదలయ్యాయి. 1992 జూలైన, స్టార్ టివి ప్రారంభంతో ప్రైవేట్ రంగంలో టెలివిజన్ ప్రసారాలు మొదలయ్యాయి. ఉపగ్రహ టివీ ఛానళ్లు కేబుల్ టెలివిజన్, డిటిహెచ్, ఐపిటివి సేవల ద్వారా లభ్యమవుతున్నాయి. మొదటి సారి అంతర్జాల సేవ 1990 దశకంలో కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రమే వుండేవి. ప్రజలకు అంతర్జాల సేవ ప్రభుత్వరంగంలో 1995 లో ప్రైవేట్ రంగంలో 1998 లో ప్రారంభమయ్యాయి. 2015 లో అధిక వేగం గల ప్రజా వైఫై సేవ నగరంలోని కొన్ని భాగాలలో మొదలైంది. ఆకర్షణలు టాంక్ బండ్ హైదరాబాద్-సికిందరాబాద్ జంటనగరాలను కలుపుతున్న మార్గము పబ్లిక్ గార్డెన్స్ - శాసనసభ, జూబ్లీహాల్ వంటీ కట్టడాలతో కూడిన చక్కటి వనం. చార్మినారు- ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాదు చిహ్నం. లాడ్ బజార్- చార్మినారుకు పశ్చిమాన ఉంది. గాజులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది. మక్కా మసీదు - చార్మినారుకు నైరుతిలో ఉన్న రాతి కట్టడం. గోల్కొండ కోట - భారత్‌లో ప్రసిద్ధి చెందిన కోటల్లో ఇది ఒకటి. హుస్సేన్‌ సాగర్‌ - హైదరాబాదు, సికిందరాబాదులను వేరుచేస్తున్న మానవనిర్మిత కాసారం. సాలార్‌జంగ్ మ్యూజియం- పురాతన వస్తువులతో కూడిన పెద్ద సంగ్రహాలయమిది. బిర్లా ప్లానిటేరియం - నగర మద్యంలో నౌబత్ పహాడ్ గుట్టపై ఉంది. అష్టలక్ష్మి దేవాలయం - దిల్ షుక్ నగర్ దగ్గరి వాసవి కాలనీలో ఉంది. ఓషన్ పార్కు,మౌంట్ ఓపేరా వంటి థీమ్ పార్కులు ఉన్నాయి. బేగంబజార్, నగరంలోనే అతి పెద్ద మార్కెట్. అఫ్జల్ గంజ్ కి సమీపంలో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీ ఇస్కాన్ దేవాలయం-ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ భక్తుల సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతను, కృష్ణ తత్వాన్నీ ప్రచారం చేస్తుంటారు. ప్రతి పట్టణములోనూ కృష్ణ మందిర నిర్మాణములు చేపట్టి వ్యాప్తి చేస్తుంటారు. హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ రోడ్డులో తపాలా కార్యాలయానికి చేరువలో ఉంటుంది. లుంబిని పార్కు-హైదరాబాదు నగరంలోని ఒక ఉద్యానవనం. ఇది హుస్సేన్ సాగర్ ఒడ్డున, సచివాలయం ఎదురుగా ఉంది. ఇక్కడ నుండి బుద్దవిగ్రహం దగ్గరకు బోటులో వెళ్ళవచ్చు ఇంకా వివిధ రకాలయిన బోటులుపై షికారు చేయవచ్చు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది లక్ష్మీ నారాయణా యాదవ్ పార్క్- ఈ యస్ ఐ వద్ద ఇది ఇయస్ఐ బస్టాపు నుండి కొద్దిగా లోనికి వెళ్తే వస్తుంది. పార్కు చక్కగా నిర్వహించబడుతూ, ఆహ్లాదకరంగా ఉంటుంది. శిల్పారామం కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్ రేమండ్స్‌ స్తూపం హిల్ ఫోర్ట్ ప్యాలెస్ వండర్‌లా వినోద పార్కు, హైదరాబాద్, తెలంగాణ బన్సీలాల్‌పేట్ కోనేరు బావి మల్టీప్లెక్సు థియేటర్లు ఐనోక్స్ - జివికే వన్ మాల్, బంజారా హిల్స్, రోడ్డు నెం 8 సినిమ్యాక్స్ - ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఎదురుగా, బంజారా హిల్స్, రోడ్డు నెం 3 బిగ్ సినిమాస్ - బిగ్ బజార్ కాంప్లెక్సు, అమీర్ పేట పి వి ఆర్ - సెంట్రల్ మాల్, పంజగుట్ట ప్రసాద్స్ ఐమ్యాక్స్ - ఎన్ టీ ఆర్ గార్డెన్స్ ప్రక్కన, ఎన్ టీ ఆర్ మార్గ్ సినీ ప్లానెట్ - కొంపల్లి జి వి కే మాల్ - బంజారా హిల్స్ సుజనా ఫోరమ్ మాల్ కెపిహెబి షాపింగ్ మాల్ లు హైదరాబాద్ సెంట్రల్ - పంజగుట్ట షాపర్స్ స్టాప్ - బేగంపేట సిటీ సెంట్రల్ - అబీడ్స్ , బంజారా హిల్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ - అబీడ్స్ , బంజారా హిల్స్ జీవీకే మాల్ - బంజారా హిల్స్ ఇనార్బిట్ - విబీఐట పార్కు బన్సీలాల్‌పేట్ కోనేరు బావి గ్రంథాలయాల జాబితా హైదరాబాదు నగరంలో అనేక గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిల్లో నిత్యం అనేకమంది విద్యార్థులు, ఇతరులు పుస్తకాలు చదువుతున్నారు. కంపెనీలు హైదరాబాదులో ప్రధాన కార్యాలయాన్ని కలిగివున్న ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రముఖులు హైదరాబాదు నగరంలో జన్మించినవారు, హైదరాబాదీ సంతతికి చెందినవారు లేదా హైదరాబాద్‌లో ఎక్కువకాలం గడిపిన వారిని హైదరాబాదీ అంటారు. చిత్రమాల ఇవీ చూడండి హైదరాబాదు సరిహద్దు గోడ భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా కళ్యాణ కర్ణాటక దోసపాటి రాము మూలాలు బయటి లింకులు హైదరాబాదు నగర పటము (2007 నాటిది) హైదరాబాదు ఉపగ్రహ చిత్రం (2005 నాటిది,చాలాపెద్ద ఫైలు) వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు వర్గం:భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు వర్గం:హైదరాబాదు వర్గం:భారతీయ నగరాలు పట్టణాలు వర్గం:రాజధానులు వర్గం:భారతదేశం లోని రాజధాని నగరాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
https://te.wikipedia.org/wiki/మోక్షగుండం_విశ్వేశ్వరయ్య
right|thumb|మోక్షగుండం విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య - MV - (సెప్టెంబర్ 15, 1861 — ఏప్రిల్ 12, 1962), భారతదేశపు ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (Knight commander of the order of Indian empire (KCIE)) బిరుదునిచ్చి సత్కరించాడు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్ కు అతను ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు. బాల్యం, విద్యాభ్యాసం విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలో గల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగే వారు. అతని తండ్రి సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా. విశ్వేశ్వరయ్యకు 12 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. చిక్కబళ్ళాపూరు లో ప్రాథమిక విద్య, బెంగుళూరులో ఉన్నతవిద్య పూర్తి చేసాడు. 1881లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., తరువాత పుణె సైన్సు కాలేజి నుండి సివిలు ఇంజనీరింగులో ఉత్తీర్ణుడయ్యాడు. ఉద్యోగం పుణెలో ఇంజనీరింగు పూర్తయిన తరువాత తన 23వ యేట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరిన తరువాత, భారత నీటిపారుదల కమిషనులో చేరవలసినదిగా ఆహ్వానం వచ్చింది. అతను దక్కను ప్రాంతంలో చక్కని నీటిపారుదల వ్యవస్థను రూపొందించాడు. నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వచేయగలిగిన ఆటోమాటిక్ వరద గేట్ల వ్యవస్థను అతను రూపొందించాడు. 1903లో మొదటిసారిగా దీనిని పుణె దగ్గరి ఖడక్‌వాస్లా వద్ద నెలకొల్పారు. వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధిక నీటి నిల్వ చేసే విధానం ఇది. దీని తరువాత గ్వాలియర్ వద్ద అల తిగ్రా వద్ద, మైసూరు వద్ద గల కృష్ణరాజ సాగర్ ఆనకట్టలలోను దీనిని వాడారు. 1906-1907 మధ్య కాలంలో అతన్ని భారత ప్రభుత్వం యెమెన్ లోని ఆడెన్ కి పంపించి అక్కడి నీటి పారుదల వ్యవస్థనూ, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అతను నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిచేయబడింది. హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. కావేరీ నది పై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు అతని పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది.Husain, Dildar (1966) An Engineering Wizard of India, Institution of Engineers (India) AP, Hyderabad. కర్ణాటక పితామహుడు 1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేసాడు. క్రింద పేర్కొన్న సంస్థల ఏర్పాటులో అతను కీలక పాత్ర పోషించాడు. మైసూరు సబ్బుల కార్మాగారం పారాసిటాయిడ్ లేబొరేటరీ విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, భద్రావతి శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ద సెంచురీ క్లబ్ మైసూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఈ కళాశాలకు అతని పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా అతని పాత్ర ఉంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాడు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు ఏర్పాటులో కూడా అతని పాత్ర ఉంది. హైదరాబాదులోని పత్తర్‌గట్టి నిర్మాణానికి డిజైన్ ను అందించాడు. పురస్కారాలు 1911లో అతను కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (companion of the order of Indian empire) గా నియమితుడయ్యాడు. 1915 లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1955 లో భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రధానం చేశారు. లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ యాభై సంవత్సరాల పాటు, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి. భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (Indian science congress)కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు. గుర్తింపు విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. అందులో ప్రధానమైనవి విద్యారంగం, ఇంజనీరింగ్. కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగు కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ అతను పేరు మీద నెలకొల్పబడింది. ఇంకా బెంగుళూరులోని యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుణెలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (Nagpur college of engineering) అతని పేరు మీదుగా పిలవబడుతున్నాయి. పుణెలో అతని నిలువెత్తు విగ్రహాన్ని చూడవచ్చు. అతను జన్మశతి సంవత్సరంలో బెంగుళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది. స్మారక చిహ్నం అతను స్వస్థలమైన ముద్దెనహళ్ళిలో విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్టు వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది అతను నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడింది. ఇందులో అతను సాధించిన పతకాలు, బిరుదులు, అతను వాడిన కళ్ళద్దాలు, కప్పులు, వెబ్ స్టర్ డిక్షనరీ, అతను విజిటింగు కార్డును ముద్రించే పరికరం లాంటి వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా అతను రూపకల్పన చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట నమూనాను కూడా సందర్శించవచ్చు. అక్కడి ప్రజలు దాన్ని ఓ దేవాలయంగా భావిస్తుంటారు. బయటి లింకులు తెలుగుదనం.కో.ఇన్ లో మొక్షగుండం విశ్వేశ్వరయ్యపై ఒక వ్యాసం ఐఐఎస్సీ.ఎర్నెట్.ఇన్ లో మొక్షగుండం విశ్వేశ్వరయ్యపై ఇంకో వ్యాసం కర్ణాటకా.కాం లో మొక్షగుండం విశ్వేశ్వరయ్య పరిచయం యూట్యూబులో విశ్వేశ్వరయ్య పై డాక్యుమెంటరీ మూలాలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్గం:తెలుగువారిలో సాంకేతిక నిపుణులు వర్గం:భారతరత్న గ్రహీతలు వర్గం:కర్ణాటక వ్యక్తులు వర్గం:తెలుగువారు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:100 ఏళ్లకు పైగా జీవించిన వ్యక్తులు
భారతరత్న
https://te.wikipedia.org/wiki/భారతరత్న
భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రధానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది. ఎలాంటి జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది. భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (మొదటిది ఆరూ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు). కానీ ఈ గౌరవం వలన ఎలాంటి అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు. ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధిగా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987), నెల్సన్ మండేలా (1990) ఉన్నారు. చరిత్ర 1954, జనవరి 2వ తేదీన రెండు పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి యొక్క కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కాగా రెండవది దానికన్నా తక్కువ స్థాయి గల మూడంచెల పద్మవిభూషణ్ పురస్కారం. పద్మవిభూషణ్ పురస్కారం ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్గాలుగా విభజించారు. 1955, జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు. భారతరత్న పురస్కారం కేవలం భారతీయులకే ప్రధానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరీసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రధానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్‌కు తన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో ఇతనే అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రధాన సభ రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధొండొ కేశవ కర్వేకు అతని 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇతడు జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో అతి పెద్ద వయస్కుడు. 2015 నాటికి ఈ పురస్కారాన్ని మొత్తం 45 మందికి అందజేయగా వారిలో 12 మందికి మరణానంతరం లభించింది. చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు చేయబడింది. మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌరపురస్కారాలను రద్దుచేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునరుద్ధరించబడ్డాయి. 1992లో ఈ పురస్కారాల "రాజ్యాంగ సాధికారత"ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో అత్యున్నత న్యాయస్థానం ఈ పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది. నిబంధనలు భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ బేధాలను పాటించకుండా ప్రధానం చేయబడుతుంది. 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి ఇచ్చేవారు. 2011, డిసెంబరులో ఈ నిబంధనలను మార్చి "మానవజాతి అభివృద్ధికి పాటుపడే ఏ రంగానికైనా" అనే పదాన్ని చేర్చారు. 1954 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కావు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదటి సారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందాడు. ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పట్టికీ, ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రధానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక "సనదు(పట్టా)", ఒక పతకం ప్రధానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 18 (1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలెవ్వరూ తమ పేరు ముందు, వెనుక భారతరత్న అని పేర్కొనరాదు, భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు. నిర్దేశాలు 1954 నిర్దేశాల ప్రకారం 1 3⁄8 ఇంచుల (35మిల్లీ మీటర్ల) వ్యాసార్థం కలిగిన వృత్తాకార బంగారు పతకాన్ని ఈ పురస్కార సమయంలో బహూకరిస్తారు. పతకం ముఖభాగంలో సూర్యుని బొమ్మ ఉండి, కింది భాగంలో వెండితో "భారత రత్న" అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. వెనకవైపు మధ్యభాగంలో ప్లాటినం లోహంలో భారత చిహ్నం, కింది భాగంలో వెండితో భారత జాతీయ నినాదం "సత్యమేవ జయతే" అని రాసి ఉంటుంది. ఒక ఏడాది తరువాత దీని రూపాన్ని మార్చారు. అప్పుడు మార్చిన దానినే ఇప్పటికీ వాడుతున్నారు. ఇప్పటి నకలు ప్రకారం రావి ఆకు ఆకారంలో ఉండి 2 5⁄16 ఇంచులు (59 మి.మీ.) పొడవు, 1 7⁄8 ఇంచుల (48 మి.మీ.) వెడల్పు and 1⁄8 ఇంచుల (మి.మీ.) మందం కలిగి ఉండి ప్లాటినం చట్రం కలిగి ఉంటుంది. పతకం ముందుభాగంలో మధ్యలో సూర్యుని బొమ్మ చిత్రీకరించబడి ఉంటుంది. ప్లాటినం లోహంతో తయారు చేసిన ఈ బొమ్మ 5⁄8 ఇంచుల (16 మి.మీ.) వ్యాసార్థం కలిగి ఉండి, సూర్యుని కేంద్ర బిందువు నుంచి 5⁄6 ఇంచులు (21 మి.మీ.) నుంచి 1⁄2 దాకా (13 మి.మీ.) కిరణాలు విస్తరించి ఉంటాయి. ముందుభాగంలో భారతరత్న అన్న పదాలు, వెనుక వైపు భారత జాతీయ చిహ్నం, నినాదం సత్యమేవ జయతే 1954 డిజైన్ లోనే ఉంచేశారు. మెడలో వేయడానికి వీలుగా 2 ఇంచ్ వెడల్పు, 51 ఎం.ఎం. గల తెలుపు రిబ్బన్ ను పతకానికి కడతారు. 1957లో, వెండి పూత మార్చి ఎండిన కాంస్యం వాడటం ప్రారంభించారు. భారత రత్న పతకాలను కలకత్తాలోని అలిపోర్ ప్రభుత్వ ముద్రణశాలలో ముద్రిస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ, పరమ వీర చక్ర, వంటి పౌర, సైనిక పురస్కారలకు ఇచ్చే పతకాలు కూడా ఇక్కడే ముద్రిస్తుంటారు. వివాదాలు thumb|291x291px|1992లో సుభాష్ చంద్రబోస్‌కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. తరువాత 1997లో అత్యున్నత న్యాయస్థానం దీనిని రద్దుచేసింది. భారతరత్న పురస్కార ప్రధానంపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు నమోదు కాబడ్డాయి. సుభాష్ చంద్రబోస్ (1992) 1992, జనవరి 23వ తేదీన రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి సుభాష్ చంద్రబోస్‌కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో ఈ పురస్కారాన్ని ఉపసంహరించుకోవాలని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. 1945, ఆగష్టు 18 నాడు సుభాష్ చంద్రబోస్ మరణించాడనే విషయాన్ని భారతప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా అంగీకరించలేదని, అలాంటి సమయంలో అతనికి మరణానంతర పురస్కారం ఎలా ఇస్తారని ఫిర్యాది ప్రశ్నించాడు. సుభాస్ చంద్రబోస్ ఆచూకీని షానవాజ్ కమిటీ (1956), ఖోస్లా కమిషన్ (1970) నివేదికల ఆధారంగా కనిపెట్టాలని ఫిర్యాది తన వ్యాజ్యంలో అభ్యర్థించాడు. సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారు. సుజాత వి.మనోహర్, జి.బి.పట్నాయక్‌లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ప్రత్యేక విభాగ ధర్మాసనం ఈ కేసును పరిశీలిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాల ప్రధానంలో కొన్ని నిబంధనలను పాటించడం లేదని గుర్తించింది. పురస్కార గ్రహీతల పేర్లు గెజిట్ ఆఫ్ ఇండియాలో తప్పక ప్రచురించాలని, రాష్ట్రపతి అజమాయిషీలో ఒక రిజిస్టర్ నిర్వహించాలనీ, దానిలో ఈ పురస్కార గ్రహీతల పేర్లు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అంతే కాక అప్పటి రాష్ట్రపతులు ఆర్.వెంకట్రామన్ (1987-92), శంకర్ దయాళ్ శర్మ (1992-97)లు వారి సంతకం, ముద్రలతో కూడిన "సనదు" (పట్టా)ను ప్రధానం చేయలేదని గుర్తించింది. 1997, ఆగష్టు 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇస్తూ, ఈ పురస్కార ప్రధానం జరగలేదు కాబట్టి, రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి వెలువడిన ప్రకటనను కొట్టివేసింది. బోసు మరణం గురించి కాని, మరణానంతర ప్రస్తావన గురించి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించింది.; "బిరుదులు"గా పౌరపురస్కారాలు (1992) 1992లో మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఒకటి, కేరళ ఉన్నత న్యాయస్థానంలో మరొకటి రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇద్దరు ఫిర్యాదుదారులూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం ఈ పౌరపురస్కారాలను బిరుదులుగా పరిగణించడాన్ని సవాలు చేశారు. 1992, ఆగష్టు 25వ తేదీన మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను జారీ చేస్తూ అన్ని పౌరపురస్కారాలను తాత్కాలికంగా రద్దు చేసింది. అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసుల గురించి ఎ.ఎం.అహ్మది, కుల్‌దీప్ సింగ్, బి.పి.జీవన్‌రెడ్డి, ఎన్.పి.సింగ్, ఎస్.సాఘిర్ అహ్మద్ అనే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక విభాగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక విభాగ ధర్మాసనం 1995, డిసెంబరు 15న ఈ పౌరపురస్కారాలను పునరుద్ధరిస్తూ, ఈ పౌరపురస్కారాలు "బిరుదులు"గా పరిగణించరాదని పేర్కొంది. సి.ఎన్.ఆర్.రావు, సచిన్ టెండూల్కర్ (2013) సి.ఎన్.ఆర్.రావు, సచిన్ టెండూల్కర్‌లకు భారతరత్న పురస్కారం ఇస్తున్నట్లు 2013, నవంబరులో ప్రకటన వెలువడగానే అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయబడ్డాయి. సి.ఎన్.ఆర్. రావుకు వ్యతిరేకంగా వేయబడిన పిల్‌లో హోమీ భాభా, విక్రం సారాభాయ్ వంటి అనేక శాస్త్రజ్ఞులు రావు కంటే ఎక్కువ సేవలను అందించారని, 1400 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్లు రావు చేస్తున్న దావా "భౌతికంగా అసాధ్యం" అని వాదించారు. రావు "భావ చౌర్యాని"కి పాల్పడినట్లు నిరూపితమైనదని, అతనికి భారతరత్న పురస్కారం ప్రధానం చేయరాదని, ఈ ప్రతిపాదనను కొట్టివేయాలని కోరారు. టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేయబడిన వ్యాజ్యంలో అతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేయబడిన సభ్యుడని, అతనికి భారతరత్న పురస్కార నిర్ణయం ఆ సమయంలో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాంలలో జరుగుతున్న ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేసిన మరొక వ్యాజ్యంలో భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు. 2013, డిసెంబరు 4న ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరుగని రాష్ట్రాలలోని ప్రజలకు పౌరపురస్కారాలు ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం క్రింద రాదని పేర్కొంటూ వినతిని తిరస్కరించింది. మిగిలిన ఉన్నత న్యాయస్థానాలు కూడా సి.ఎన్.ఆర్.రావు, టెండూల్కర్‌లకు వ్యతిరేకంగా వేసిన వ్యాజ్యాలను తిరస్కరించాయి. విమర్శలు 1988లో చలనచిత్రనటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌కు భారతరత్న ప్రకటించడం త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికే అని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీపై విమర్శలు వచ్చాయి.బి.ఆర్.అంబేద్కర్, వల్లభభాయ్ పటేల్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల కన్నా ముందే ఎం.జి.రామచంద్రన్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించడం విమర్శలకు దారితీసింది.రవిశంకర్ ఈ పురస్కారానికై పైరవీలు చేశాడని, 1977లోకె.కామరాజ్‌కు ఈ పురస్కారాన్ని ఇవ్వాలని ఇందిరా గాంధీ నిర్ణయించడం తమిళ ఓటర్లను ప్రభావితం చేయడానికి అనే ఆరోపణలు వినిపించాయి. దళితులను ప్రసన్నం చేసుకోవడానికి వి.పి.సింగ్ అంబేద్కరుకు మరణానంతరం భారతరత్న ఇప్పించాడని విమర్శలు వెలువడ్డాయి. భారత స్వాతంత్ర్య సంగ్రామానికంటే, అంటే 1947 కంటే ముందు, లేదా ఈ పురస్కారం ప్రారంభించిన ఏడాది 1954 కంటే ముందు మరణించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రకటించడాన్ని పలువురు చరిత్రకారులు తప్పుబట్టారు. ఇటువంటి ప్రధానాలు మౌర్య చక్రవర్తి అశోకుడు, మొఘల్ చక్రవర్తి అక్బర్, మరాఠా వీరుడు శివాజీ, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్, హిందూ ఆధ్యాత్మికవాది స్వామి వివేకానంద,, స్వాతంత్ర్య యోధుడు బాలగంగాధర తిలక్ వంటి అనేకులకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్లకు వీలు కల్పించాయి. అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు 1991లో వల్లభభాయి పటేల్‌కు అతడు మరణించిన 41 సంవత్సరాల తర్వాత ఈ పురస్కారం ప్రకటించడాన్ని, 1945 నుండి ఆచూకీ లేని సుభాష్ చంద్రబోస్‌కు 1992లో ప్రకటించడాన్ని విమర్శించారు. అలాగే 2015లో నరేంద్ర మోడీ 1946లో మరణించిన మదన్ మోహన్ మాలవ్యాకు ఇవ్వాలని నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనార్థన్ ద్వివేది తప్పుపట్టాడు. మాలవ్యా వారణాశిలో ఎక్కువగా పనిచేశాడని, మోడీ వారణాశి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు కావాలని ఉద్దేశ పూర్వకంగా మాలవ్యాను ఈ పురస్కారానికి ఎంపిక చేశాడని ఆరోపించాడు. కొందరిని ప్రపంచం గుర్తించిన తర్వాత కాని ఈ పురస్కారానికి ఎంపిక చేయలేదనే విమర్శలు వెలువడ్డాయి. మదర్ థెరెసాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన తరువాతి సంవత్సరం భారతరత్న ప్రకటించారు. సత్యజిత్ రేకు ఆస్కార్ పురస్కారం అందిన తర్వాతనే భారతరత్న ప్రకటించారు. అలాగే అమర్త్య సేన్‌కు నోబెల్ బహుమతి వచ్చిన తర్వాతనే భారతరత్న ఇవ్వబడింది. ప్రముఖ డిమాండ్లు నిబంధనల ప్రకారం భారతరత్న పురస్కారానికి రాష్ట్రపతికి, ప్రధానమంత్రి మాత్రమే సిఫార్సులు చేసే హక్కు ఉంది. వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రముఖ నాయకుల పేర్లను ఎన్నోసార్లు సిఫార్సుకు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. 2008 జనవరిలో, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్.కె.అద్వానీ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయికు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. ఇది జరిగిన వెంటనే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) తమ నాయకుడు, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసుకు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. బసు భారతదేశంలోనే అత్యంత ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి. అయితే తనకు భారత రత్న వద్దనీ, అందుకు తాను అర్హుణ్ణి కాదనీ, దాని వల్ల ఆ పురస్కారానికి గౌరవం తగ్గుతుంది అని వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ వంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా తమ తమ నాయకులైన ఎన్.టి.రామారావు, కాన్షీరామ్, ప్రకాష్ సింగ్ బాదల్ లకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 2015 సెప్టెంబరులో, ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన శివసేన, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్కు పురస్కారం ఇవ్వాలని డిమాండు చేసింది. ఆయనను మునుపటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని పేర్కొంది. అయితే వినాయక్ కుటుంబసభ్యులు ఈ అభ్యర్థనను తాము సమర్ధించబోమనీ, వినాయక్ కు పురస్కారం రావాలని తాము డిమాండు చేయట్లేదనీ, స్వాతంత్ర్యం కోసం దేశానికి ఆయన చేసిన సేవలను భారతరత్న ఇవ్వకపోతే జాతి మరచిపోదని స్పష్టం చేయడం విశేషం. భారతరత్న పురస్కారం పొందిన వారి జాబితా పేరు సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) 1954 చక్రవర్తుల రాజగోపాలాచారి (1878-1972) 1954 డా.సి.వి.రామన్ (1888-1970) 1954 డా. భగవాన్ దాస్ (1869-1958) 1955 డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) 1955 జవహర్ లాల్ నెహ్రూ (1889 -1964) 1955 గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961) 1957 ధొండొ కేశవ కార్వే (1858-1962) 1958 డా. బీ.సీ.రాయ్ (1882-1962) 1961 పురుషోత్తమ దాస్ టాండన్ (1882-1962) 1961 రాజేంద్ర ప్రసాద్ (1884-1963) 1962 డా. జాకీర్ హుస్సేన్ (1897-1969) 1963 పాండురంగ వామన్ కానే (1880-1972) 1963 లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (1904-1966) 1966 ఇందిరాగాంధీ (1917-1984) 1971 వీ.వీ.గిరి (1894-1980) 1975 కే.కామరాజు (మరణానంతరం) (1903-1975) 1976 మదర్ థెరీసా (1910-1997) 1980 ఆచార్య వినోబా భావే (మరణానంతరం) (1895-1982) 1983 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988) 1987 యం.జి.రామచంద్రన్ (మరణానంతరం) (1917-1987) 1988 బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం) (1891-1956) 1990 నెల్సన్ మండేలా (జ. 1918) 1990 రాజీవ్ గాంధీ (మరణానంతరం) (1944-1991) 1991 సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం) (1875-1950) 1991 మొరార్జీ దేశాయి (1896-1995) 1991 మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) (1888-1958) 1992 జే.ఆర్.డీ.టాటా (1904-1993) 1992 సత్యజిత్ రే (1922-1992) 1992 సుభాష్ చంద్ర బోస్ (1897- ------) (తరువాత ఉపసంహరించబడినది) 1992 ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (జ. 1931-2015) 1997 గుర్జారీలాల్ నందా (1898-1998) 1997 అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (1906-1995) 1997 ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (1916-2004) 1998 సి.సుబ్రమణ్యం (1910-2000) 1998 జయప్రకాశ్ నారాయణ్ (1902-1979) 1998 రవి శంకర్ (జ. 1920) 1999 అమర్త్య సేన్ (జ. 1933) 1999 గోపీనాథ్ బొర్దొలాయి (జ. 1927) 1999 లతా మంగేష్కర్ (జ. 1929) 2001 బిస్మిల్లా ఖాన్ (జ 1916) 2001 భీమ్ సేన్ జోషి (జ. 1922) 2008 సచిన్ టెండూల్కర్ 2014 సి. ఎన్. ఆర్. రావు 2014 మదన్ మోహన్ మాలవ్యా 2015 అటల్ బిహారీ వాజపేయి 2015 ప్రణబ్ ముఖర్జీ 2019 నానాజీ దేశ్‌ముఖ్ 2019 భూపెన్ హజారిక 2019కర్పూరీ ఠాకూర్ (మరణానంతరం) (1924 - 1988)2024లాల్ కృష్ణ అద్వానీ2024యం.యస్.స్వామినాధన్ (మరణానంతరం) (1925 - 2023)2024చౌదరి చరణ్ సింగ్ (మరణానంతరం) (1902 - 1987)2024పి.వి. నరసింహారావు (మరణానంతరం) (1921 - 2004)2024 మూలాలు గ్రంథసూచి వర్గం:పురస్కారాలు వర్గం:భారత జాతీయ పురస్కారాలు |}
సంస్కృతం
https://te.wikipedia.org/wiki/సంస్కృతం
thumb|right సంస్కృతము (దేవనాగరి: संस्कृतम्) భారతదేశానికి చెందిన ప్రాచీన గుడి, భారతదేశ 23 ఆధికారిక భాషల లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ, జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే ఉంది. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135. అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని మత్తూరు అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, శారదా లిపి, అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును. సంస్కృతభాషావైభవము మూలం జటావల్లభుల పురుషోత్తము ఎం. ఏ. (Lecturer in Sanskrit, S.R.R. & C.V.R College, Vijayawada) చే రచించబడి, 1957 లో ముద్రింపబడిన "భారతీయవైభవము" అను పుస్తకము నుండి తీయబడింది. ఏదృష్టితో చూచినను సంస్కృతనుడి ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమై, వివిధ భాషామాతయైయలరారు చున్నది; భారత జాతీయతకు జీవగఱ్ఱయై, భారతీయభాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై, సరససాహిత్యజ్ఞానవిజ్ఞానరత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడా ప్రధానభూమికను నిర్వహింపగల్గియుండుట పరమ విశేషము. మాతృత్వము సుమారు 150 సంవత్సరములక్రిందట భాషాసాదృశ్య శాస్తము (Comparitive Philology) విజ్ఞాన ప్రపంచములో నుద్భవించెను. గ్రీకు, లాటిను, ఇంగ్లీషు, జర్మను, ఫ్రెంచి మున్నగు యూరోపియన్ భాషలనడుమ, అత్యంత సన్నిహితసంబంధము కలదనియు, ఈభాషలన్నియు ఆదిలో నేకమాతృసంజనితలనియు నపుడు పాశ్చాత్య పండితులు గ్రహించిరి. కొన్నిశతాబ్దములనుండి, ఐరోపాఖండములో వివిధయూరోపియన్ భాషలను నేర్చినవారెందరో యుండినను, వారి కంతకాలమును గోచరింపని యీ పరస్పర సంబంధము సంస్కృత భాషను నేర్చుకొన్నతర్వాతనే గోచరించుట విశేషము. ఇది గోచరించుటతోబాటు, వారికి సంస్కృతము ఆయన్నిభాషలకును తల్లియను విషయముకూడ స్పష్టమాయెను. వివిధ యూరపీయ భాషలు నిలిచియున్న విజ్ఞానరంగములోనికి, సర్వాంగసుందరియైన సంస్కృతభాష ప్రనేశించినప్పుడు, విమర్శకులీమె తల్లియనియు, మిగిలినభాష లక్కచెల్లెండ్రనియు గ్రహించిరి. ఆదిలో ఇండో యూరోపియన్ భాషా సాదృశ్యశాస్తములో కృషిచేసిన వారిమతమున, సంస్కృతము నిస్సంశయముగ తన్నుడిగనే యుండెను. పిమ్మట నేకారణముచేతనోకాని పాశ్చాత్యపండితులు సంస్కృతమునకు మాతృస్ధానమును తొలగించి, అది యూరోపియన్ భాషలతో పోదరీ సంబంధమునే కలిగియున్నదను సిద్ధాంతమును లేవదీసిరి. ఇట్లు చెప్పిన పాశ్చాత్యపండితులుగూడ నొక్కయంశమునంగీకరింపక తప్పినదికాదు. ఈయక్కచెల్లెండ్రకు తల్లియైన భాషను మిక్కిలి హెచ్చుగ బోలియున్నది సంస్కృతమే కాని మరొకటికాదని వారనుచున్నారు. నిజమైనతల్లి యిపుడు మృగ్యమనియు, చాల విషయములలో నది సంస్కృతమును పోలియుండునని మనమూహించుకొనవచ్చుననియు, విమర్శకులు నుడువుటచే వివిధ యూరపీయభాషలకు సంస్కృతము కీలకమను అంశము వ్యక్తమగుచున్నది. రాజకీయముగా భారతదేశము పాశ్చాత్యుల అధీనమయిన కాలములో, పాశ్చాత్యులు భారతీయభాషయే తమ భాషకు తల్లియని అంగీకరించుచో, అది విపరీతముగ నుండెడి మాట వాస్తవమే. అట్లొప్పుకొనుట పాలకజాతివారి గర్వమునకు భంగకరమును, పాలితజాతివారి ఆత్మగౌరవమునకు ఉద్దీపకమును అగును. అయినను ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటల నిట ఉల్లేఖించుచున్నాను. “గ్రీకు, లాటిను, గొతిక్ మొదలైన భాషలన్నియు భిన్న, భిన్న కాలములయందు సంస్కృతభాషనుండియే, ముఖ్యముగా వైదిక సంస్కృతమునుండియే, ఉద్భవించినవి.” (Journal of Royal Asiatic Society of Britain and Ireland అను ప్రసిద్ధ పత్రికలో ః 16 వ సంపుటము ప్రథమ భాగములో 177 వ పుట). నిష్పక్షపాతబుద్ధితో ఈరీతిగా సంస్కృతభాషకు యూరపీయభాషామాతృత్వము నంగీకరించినవారు కొందరు కలరు. 1834 వ సంవత్సరములో R.A.S. పత్రికలోనే ద్వితీయసంపుటములో Sanskrit Literature అను శీర్షిక క్రింద W.C. టెయిలర్ వ్రాసిన యీక్రిందిమాటలుకూడ గమనింపదగియున్నవి. “ప్రాచీనయూరోపీయభాషల కన్నింటికిని తల్లి హిందూదేశపుభాషయే. దేశములో ఎన్నిమార్పులు వచ్చినను ఆ భాషను హిందూదేశము నిలబెట్టుకొనగల్గినదని మనము ఆశ్చర్యముతో కనుగొంటిమి.” సంస్కృతమునకు ఇండోజర్మానిక్ భాషలలో జ్యేష్ఠ భగినీత్వము నారోపించుట యిటీవలనే కొందరు పాశ్చాత్యులు చేసినపనియనియు, మాతృత్వమే మొదట అంగీకరింపబడినదనియు నిరూపించుట కీవచనముల నుదాహరించియున్నాను. జ్యేష్ఠభగినీవాదియైన మాక్సుముల్లరుకూడ సంస్కృతమంత ప్రాచీనభాష మరియొకటి లేదనియు, ఇకమీదటకూడ అట్టిది కన్పట్టుట కవకాశము గోచరింపదనియు చెప్పియున్నాడు. ఎల్లభాషలకు కీలకము ఇండోయూరపీయ కుటుంబమునకు చెందిన యేభాషలోనైనను కూలంకషమైన పాండిత్యము గల్గుటకు సంస్కృతభాషాజ్ఞానము అత్యంతావశ్యకము. ఇం.యూ. కుటుంబమునకు చెందక, ప్రత్యేకము ద్రావిడభాషా కుటుంబమునకు చెందినవని కొందరిచే భావింపబడుచున్న ఆంధ్రము, కర్ణాటకము మున్నగు భాషలను నేర్చుకొనుటకుకూడ సంస్కృత జ్ఞాన మవసరమే. ఈనడుమ గొందరు పండితులు ఆంధ్రము, సంస్కృత ప్రాకృతజన్యమని రుజువుచేసియుండుటచే, సంస్కృతభాషాప్రాముఖ్యత మరింత హెచ్చింది. ప్రపంచములోని ఏభాషనునేర్చుకొనుటకైనను సంస్కృతము కీలకమని మాక్సుముల్లరు అభిప్రాయపడినాడు. ఆధునికశాస్త్రముల కన్నింటికిని గణితశాస్త్ర మెట్టిదో, ప్రపంచభాషలకన్నింటికిని సంస్కృతమట్టిదని యాయన నుడివినాడు. “What Mathematics is to the Sciences, the same is Sanskrit to the languages of the world”. సంస్కృతమునేర్చిన పాశ్చాత్య పండితులేకాక, ఇతర పాశ్చాత్య విద్వాంసులుకూడ నీ యభిప్రాయమునంగీకరించారు. జాన్ రస్కిన్ కూడా ఇంగ్లీషుభాషలో పాండిత్యము గలుగవలెనన్నచో మాక్సుముల్లరు రచించిన Biography of words అను గ్రంథమును చదువవలెనని చెప్పినాడు. ఆ గ్రంథములో ప్రధానముగా యూరపీయ భాషాపదముల సంస్కృతభాషా వ్యుత్పత్తి ప్రదర్శింపబడింది. దానిని చదువుటవలన ఇంగ్లీషుపదముల శక్తి, వినియోగ విధానము బాగుగా బోధపడునని రస్కిన్ అభీప్రాయము. (చూ: Sesame and Lilies.) విజ్ఞానభాండారము సంస్కతభాష సమస్త భాషలకు మాతయైనట్లే, సంస్కృతభాషాఘటితమైన విజ్ఞానముకూడ సమస్తదేశ ప్రాచీన విజ్ఞానమునకు మూలమైయున్నది. విజ్ఞాన ప్రవాహము భారతదేశమునుండి బయలుదేరి యేరీతిగా పర్షియా, అరేబియా, గ్రీసు మున్నగు దేశములకు వ్యాపించినదో విపులముగా వివరించుచు పోకాక్ అను ఆంగ్లేయుడు India in Greece అను గ్రంథములో నిరూపణచేసియున్నాడు. బాబిలోనియా, ఈజిప్టు మున్నగు దేశములలో అతిప్రాచీననాగరికత యని భావింపబడుచున్నది భారతదేశసంస్కృతియొక్క విస్తారమే యని ఆ గ్రంథములో వివరముగా తెలుపబడింది. ఈ గ్రంథము రచింపబడి నూరు సంవత్సరములగుచున్నది. ఇంత సహేతుకముగా సప్రమాణముగా ప్రపంచనాగరికత భారతీయనాగరికతా విస్తారమేయని నిరూపించిన గ్రంథమునకు దేశములో వ్యాప్తిలేకుండుట ఆశ్చర్యముగానున్నది. ఆ గ్రంథము వ్యాప్తిలోనికి వచ్చుచో భారతీయవిజ్ఞానముపట్ల భారతీయులయొక్కయు, ప్రపంచవాసులయొక్కయు దృక్పథములో మూలమట్టమైన మార్పువచ్చును. ప్రపంచములోని యేభాషలోను వాజ్ఞయము పుట్టక పూర్వమే, సంస్కృతములో వాజ్ఞయము బయలుదేరినదని ఎల్లరు నంగీకరించుచున్నారు. మానవ పుస్తకభాండాగారములో ఋగ్వేదమే మొదటిగ్రంథమని మాక్సుముల్లరు నుడివియున్నాడు. “Rig Veda is the first book in the Library of man” ప్రపంచములో మొదటికావ్యమగు రామాయణము సంస్కృతభాషలో నుద్భవించినది, ప్రపంచములోని మొదటి జ్యౌతిషగ్రంథము, మొదటి నాట్యశాస్త్ర గ్రంథము, మొదటి వ్యాకరణ గ్రంథము సంస్కృతభాషలోనే యుద్భవించినవి. కావున ప్రపంచవిజ్ఞానచరిత్రలో సంస్కృతభాషకు విశిష్టమైనస్థానము ఉంది. సంస్కృతభాషలోని వాఙ్మయముతో పరిచయమును పొందిన పాశ్చాత్యపండితులెల్లరు, దాని మహత్త్వమును వేనోళ్ల కొనియాడిరి. మహామేధావి, విమర్శకశిరోమణియైన గెటీయను జర్మనుపండితుడు శాకుంతలనాటకమును జర్మనుభాషలో చదివి ముగ్ధుడైనాడు. స్వర్గమర్త్యలోకముల సారసర్వస్వమే శకుంతలయని యాతడు వర్ణించాడు. మానవ హృదయమునకు ఉపనిషత్తు లీయగల శాంతిని మరియేవాఙ్మయము కూర్పజాలదని యెల్లరు నంగీకరించిరి. విశ్వవిఖ్యాతిగల షోపెన్ హోవర్ అను జర్మనువిద్వాంసుడు "ఉపనిషత్పఠన మంత లాభదాయకమైనది, ఔన్నత్యాపాదకమైనది మరొకటిలేదు. అది జీవితకాలమంతయు నాకు ఆశ్వాసజనకముగా నున్నది. మరణ సమయమునకూడ అదియే నాకు ఆశ్వాసహేతువు కాగలదు” అని నుడివినాడు. ఫ్రెడెరిక్ ష్లెగెల్ "భారతీయుల భాష, విజ్ఞానము” అను గ్రంథములో నిట్లు వ్రాసెను. “ప్రాగ్దేశస్థుల ఆదర్శ ప్రాయమైన విజ్ఞానజ్యోతి ముందర గ్రీకువేదాంతుల తత్వశాస్త్రము అప్రతిబద్ధమై మినుకుమినుకుమను నిప్పునెరసువలె నుండును”. సంస్కృతభాషయొక్క కట్టుబాటును గురించి మోనియర్ విలియమ్స్ యిట్లు పల్కినాడు. “ఇంతవరకు ప్రపంచములో బయలుదేరిన అద్భుతగ్రంథములలో పాణినివ్యాకరణమొకటి. స్వతంత్ర ప్రతిభ లోను, సూక్ష్మ పరిశీలనలోను పాణినీయ వ్యాకరణముతో పోల్చదగిన గ్రంథమును మరియే దేశమును సృజించుకొనలేదు”. భాషను నిబంధించు వ్యాకరణశాస్త్రము ఒక శాస్త్రముగా పరిగణింపబడు ఉన్నతస్ధితికి వచ్చుట భారతదేశములో మాత్రమే జరిగింది. సంస్కృతవ్యాకరణమునుగూర్చి యీరీతి వర్ణనను "Most Scientific Grammar” అని అనేక పాశ్చాత్యపండితులు గావించియున్నారు. బుద్ధికి శిక్షణము నొసగు విషయములలో గణితశాస్త్రమొకటి. గణితశాస్త్రమునుగాని, సంస్కృతవ్యాకరణమునుగాని చదువుచో మానవబుద్ధి సరియైన మార్గములో ఆలోచించుటయను అలవాటులో పడునని నిష్పక్షపాతబుద్ధి గల పాశ్చాత్యులే నుడివియున్నారు. బహుభాషానిబద్ధ సాహిత్యకృషి చేసినవారు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణముతో సమానమైన గ్రంథము లేదనిరి. ఆంగ్లములో గ్రంథకర్తగా ప్రసిద్ధిచెందిన భూతపూర్వ బీహార్ రాజ్యపాల శ్రీ ఆర్. ఆర్. దివాకర్ ఇట్లు వాక్రుచ్చారు. “కొందరు నాతో ఏకీభవించినను, ఏకీభవింపకపోయినను నామట్టునకు నాకు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణము ఉత్తమోత్తమ గ్రంథమనిపించుచున్నది.” (ఆంధ్రపత్రిక 21-7-57 ) . ఇట్టి బహువిషయములలో అగ్రస్థానము మరి యేభాషకును లభించుట లేదు. జాతిని తీర్చిదిద్దినది ప్రపంచములో ఏభాషయు సాధింపజాలని యొక విశేషమును సంస్కృతము సాధించినదని శ్రీ వివేకానంద స్వామి నుడివియున్నారు. ఏభాషలోనైనను కావ్యము రసవంతమై రమ్యముగానున్నచో అందు ధర్మబోధ తక్కువగా నుండును. ధర్మబోధ యెక్కువగానున్నచో రమ్యత తక్కువగానుండును. రమ్యతయు, ధర్మ్యతయు కలియుట మేలనియు, కాని అట్టి కలయిక కన్పట్టుటలేదనియు అరిస్టాటిల్ మున్నగు ప్రాచీనవిమర్శకులు పరితపించారు. పాశ్చాత్య నాటకకర్తలలో మేటియైన షేక్స్పియరులోకూడ ధర్మబోధ ప్రయత్నము తక్కువయనియు, షేక్స్పియరు లోకమునకు సందేశమునిచ్చు దృష్టితో నాటకములను వ్రాయనేలేదనియు విమర్శకులు చెప్పుచున్నారు. రమ్యతను, ధర్మ్యతను అత్యున్నత పథములో సమముగా సాధించిన గ్రంథము వాల్మీకి రామాయణము మాత్రమే. ఈ యంశమును స్వామి వివేకానందుడు అమెరికనులకు తెలుపుచు ఇట్లు పలికెను. “Nowhere else are the aesthetic and the didactic so harmoniously blended as in the Ramayana”. ఈ విషయములో రామాయణమునే వరవడిగా నుంచుకొని సంస్కృతకావ్య నాటకాదులు బయలుదేరినవనుట స్పష్టము. ఆలంకారికులుకూడ ఈలక్ష్యమునే ఆదేశించారు. ప్రతాపరుద్ర యశోభూషణములో విద్యానాథడు రచించిన "యద్వేదాత్ప్రభుసమ్మితాదధిగతం” ఇత్యాది శ్లోకసందర్భమును పరికింపదగును. పాఠకుని హృదయము ఆనందసముద్రములో ఓలలాడుటతో బాటు, ధర్మసౌధశిఖరమును సోపానక్రమముచే అధిరోహించుట రామాయణ పఠనసమయములోనేకాక కాళిదాసాది ఇతర సంస్కృతకవుల గ్రంథములను పఠించు సమయములో కూడా అనుభవగోచరము. అట్టి గ్రంథములే యింతకాలము భారతీయులను సత్వగుణ ప్రధానులనుగ చేసి, వారికి ప్రపంచములో నొక విశిష్టతను చేకూర్చినవి. ఆధునిక కాలములో (సైన్సు) విజ్ఞానము పర్వతరాశివలె పెరిగిపోయింది. దానిప్రక్కను భారతీయ సంస్కృతియను మరొకపర్వతమున్నది. ఈ సంస్కృతిచే పరిమళింప చేయబడని ఆధునికవిజ్ఞానమును మనముపయోగించుకొందుమేని అది యిప్పటిరీతిగానే ప్రపంచమునకు శాంతి ప్రదానశక్తిలేక, కల్లోలస్ధితికే కారణమగుచుండును. ఈరెండు పర్వతములను కలుపగల వంతెనయే సంస్కృతభాష. భారతరామాయణగాధలు, బోధలును, కాళిదాసాదికవుల గ్రంథములలోని మధురసందేశమును, భర్తృహరి సుభాషితాది హృదయంగమోపదేశములును నేటి విజ్ఞానపర్వతమునకును, భారతీయజీవిత పథమను సంస్కృతికిని సేతుబంధముగా పనిచేయగల్గి ఆధునికనాగరికతలో నూతనయుగము నావిర్భవింపచేయ గలవు. ఇట్టి సేతువును నిర్మింపవలసిన యావశ్యకతను రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాదుగారు 1952 వ సంవత్సరములో కాశీలోజరిగిల\న సంస్కృత విశ్వపరిషదధివేశమునకు అధ్యక్షతను వహించుచు, స్పష్టపరిచి యున్నారు. నైతికముగాను, ధార్మికముగాను సంస్కృతము మానవులకు గల్గింపగల యభ్యున్నతి నిరుపమానమైనది. ప్రపంచములో నెక్కడెక్కడ సంస్కృతము ప్రాకినదో, అక్కడక్కడ మానవహృదయమునకు మృదుత్వమేర్పడినదని రవీంద్రనాధటాగోరువంటి విశ్వమానవ సమదృష్టిగల విశ్వకవికూడ నుడివియుండుట గమనింపదగిన విషయము. భారతదేశములో ఫిన్లెండు రాజదూతగానుండిన హ్యూగోవల్వనే చెప్పిన యీ క్రిందిమాటలు సంస్కృతముయొక్క యీప్రభావమును ఘంటాపథముగ చాటుచున్నవి. “సంస్కృతభాషా నిబద్ధములైన భారతీయభావములు యూరపు హృదయమునకు మృదుత్వము నొసగినవి. అచట నాగరికతను నెలకొల్పినవి. ప్రత్యక్షముగా సంస్కృతభాషాద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారమునకూడ నీపనిజరిగినది. తరువాత కొన్ని శతాబ్దములపాటు సంస్కృతము యూరపియనులకు అందలేదు.” (11-2-53 తేదీని కాశీలో ప్రభుత్వ సంస్కృత కళాశాలా స్నాతక సభోపన్యాసము). ఇటీవల యూరపియనులు వాణిజ్యాదులకొరకు భారతదేశానికి వచ్చుటయు, సంస్కృతమును నేర్చుకొనుటయు, సంస్కృతసాహిత్యగ్రంథములనేకాక శాస్త్రములనుకూడ తమతమ భాషలలోనికి పరివర్తింపచేసికొనుటయు సంభవించెను. 18 వ శతాబ్దిలో ప్రారంభమైన యీ సంస్కృత సంస్కృతి ప్రసారము పాశ్చాత్యభాషలపైననూ, విజ్ఞానముపైనను అపారప్రభావమును చూపెను. సంస్కృతభాషను నేర్వనివారిపైకూడ ఈ ప్రభావము పడెను. కాంట్, స్పైనోజా మున్నగు దేవాంతులపైనను, ఎమర్ సన్, ఎడ్విన్ ఆర్నాల్డ్, సోమర్ సటే మాగమ్ మొదలైన రచయితలపైనను ఈ ప్రభావము ప్రస్ఫుటముగా గోచరించును. ఐరోపాలో 15 వ శతాబ్దిలో జరిగిన రినైజాన్స్ అని చెప్పబడు విజ్ఞానపునర్విజృంభణమునకు తరువాత జరిగిన వైజ్ఞానిక సంచలనములన్నిటిలోను గొప్పది సంస్కృత సంపర్కమువలన జరిగిన వైజ్ఞానికసంచలనమే యని ఎ. ఎ. మాక్డోనెల్ తన Sanskrit Literature అను గ్రంథములో వ్రాసియున్నాడు. (1 వ పుట) సంస్కృతభాషను నేర్చి, భారతీయుల జీవితపద్ధతులను చూచిన పాశ్చాత్యపండితు లెల్లరు సంస్కృత భాషానిబద్ధసంస్కృతికిని, భారతీయుల జీవితమునకును గల సన్నిహిత సంబంధమును, సమన్వయమును చూచి యాశ్చర్యపడిరి. భారతీయజీవితము నర్ధముచేసికొనుటకు సంస్కృతభాషా వాఙ్మయపరిచయము అవసరమని గుర్తించిరి. కావుననే బ్రిటిష్ ప్రభుత్వకాలములో ఈ దేశానికి పరిపాలకులుగా రాదలచిన ఐ. సి. యస్. పరీక్షాభ్యర్ధులకు మాక్సుముల్లరు రచించిన India; What can it teach us? అను గ్రంథము పఠనీయముగానుండెను. పైన పేర్కొనబడిన ఫిన్లెండ్ రాయబారి తన ప్రభుత్వము తన్ను భారతదేశానికి రాజదూతగా పంపిన కారణమును కాశీ విశ్వసంస్కృత పరిషదధివేశములో నిట్లు వివరించెను. 'మా దేశపు ప్రభుత్వము సంస్కృతభాషను నేర్చినవాని నెవనినయినను భారతదేశానికి దూతగా పంపిన బాగుండునని తలంచుచుండెను. నేను 35 సంవత్సరముల క్రిందట, మా దేశములో విశ్వవిద్యాలయములో సంస్కృతము నభ్యసించితిని. కావున ఈ ఉద్యోగమునకు నేను ఎంచుకొనబడుట సంభవించెను'. భారతదేశముతో సంబంధము పెట్టుకొనదలచిన పాశ్చాత్యులకే సంస్కృతభాషాజ్ఞానమంత ముఖ్యముగా భావింపబడుచుండగా, స్వయముగా భారతీయులకా భాష యెంతముఖ్యమో, అది యెంతగా ప్రాణసమానమైనదో వేరుగ చెప్పనక్కరలేదు. ఆసేతు హిమాచలము గల ప్రజలు ఏకజాతిగ నిబద్ధమగుటలో విశేషముగ తోడ్పడినది సంస్కృతభాష. రాజకీయ శాస్త్రములో జాతీయతకు (Nationhood) కావలసినవిగ చెప్పబడిన యంశములలో భాషైక్యమొకటి. ప్రాచీనభరతఖండములో ప్రాంతీయభాషలుండినను వివిధప్రాంతముల నడుమ సామాన్యభాషగా నుండినది సంస్కృతమే. పండితులలో సంస్కృతము సామాన్య భాషగా వాడబడుట నేటికిని గలదు. స్వచ్ఛ సంస్కృతము రాని భిన్నప్రాంతముల వారు సమావేశమైనప్పుడుకూడ వారు పరస్పరము అవగాహనము చేసికొనవలయునన్నచో వారివారి భాషలలో సామాన్యముగనుండు సంస్కృత పదజాలమే సహాయము చేయును. ఒక యాంధ్రుడును బీహారు ప్రాంతవాసియు నొకచోట కలిసినప్పుడు ఆంధ్రుడు బీహారీని "మీ నివాస మెక్కడ?” అని తెలుగులో అడిగినను అతని కర్థమగును. నివాస శబ్దము రెండు భాషలలోను సమానమే. 'భోజనము', 'శ్రమ', 'దానము' మున్నగు సామాన్యముగా వాడబడు పదములు రెండు భాషలలోను ఉండును. కావున భాషా భేదమున్నను, భారతీయు లెల్లరు సంస్కృతపద సూత్రబద్ధులై భాషైక్యముగూడ పొందియున్నారు. సంస్కృతభాషవలెనే తద్భాషా నిబద్ధమైయున్న విజ్ఞానముకూడ భారతదేశమున కైక్యమును సాధించింది. రామాయణము, మహాభారతము, భర్తృహరి సుభాషితములు మున్నగునవి భారతదేశములోని ఏప్రాంతమువారికైను సమాన పరిచితములే; వానినిచూచి యుప్పొంగని భారతీయుడు లేడు. సంస్కృతభాషను కాళిదాసాదివిరచితశ్లోకములద్వారమున నేర్పు సంప్రదాయమొకటి మన దేశములో నున్నది. దీనివలన సంస్కృతము, సంస్కృతి కూడా ఒకేసారి బాలబాలికల హృదయములో ప్రవేశించు సదవకాశము కల్గును. జీవితకాలమంతయు జ్ఞప్తియందుంచుకొనవలసిన రసవంతములైన శ్లోకములద్వారా భాష నేర్చుకొనుటవలన యువకులు వానిని కంఠస్థముచేయుటయు, జీర్ణించుకొనుటయు సంభవించును. నేటి పాఠ్యపుస్తకములద్వారా సంస్కృతము నేర్చుకొనుచో నీ ప్రయోజనము బోవును. మహాకవుల గ్రంథములు బాలురకు బోధపడునాయనుశంకకు అవకాశము లేదు. ప్రపంచములో ఏభాషకును లేని విశేషమొకటి సంస్కృతభాషకు ఉంది. ఈభాషలో మహోన్నతకవులే మహాసులభకవులు. వాల్మీకి, కాళిదాసు లెంతగొప్పవారో అంత సులభులు. కావున ఈ విషయమున సంస్కృతభాష మరొక భాషతో పోల్చదగినదికాదు. “సంస్కృతభాషయు, తన్నిబద్ధవిషయములును భారతదేశమునకు పరంపరాగతములైన పెన్నిధానములు. ఇవి భారతీయులకు పూర్వులనుండి వారసత్వముగా సంక్రమించిన మహోత్కృష్టభాగ్యరాశిగా చెప్పదగినవి. ఇవి భారతదేశములో నిలచియున్నంతకాలము ఈదేశమునకు మూలభూతమైన ప్రతిభ జీవించియుండును” ఇది భారతప్రధాని నెహ్రూ, సంస్కృతభాషావాఙ్మయములనుగురించి వెలుబుచ్చిన అమూల్యాభిప్రాయము. అమృతభాష సంస్కృతము ఏప్రాంతములోను నిత్యవ్యవహారభాష కానంత మాత్రముచేత కొందరు దీనిని మృతభాషయనుట అసమంజసము. భారతదేశములో సంస్కృతము జీవద్భాషయే యనునది స్పష్టమైన సత్యము. మృతభాషలైన గ్రీకు, లాటినులను సంస్కృతముతో పోల్చి చూతుమేని మృతభాషావాదము నిస్సారమని తెలియగలదు. నేడు ఒక సంస్కృతగ్రంథము ముద్రింపబడుచో సంవత్సరమునకు కొన్ని వేల ప్రతులు విక్రయింపబడుటను చూచుచున్నాము. అట్టి గ్రంథములు వందలకొలది ముద్రితము లగుచున్నవి; చెల్లుబడి యగుచున్నవి. గ్రీకు, లాటిన్ గ్రంథముల కింత ఆదరము లేదు సరికదా యిందులో శతాంశమైనను లేదు. నేడు వేలకొలది ప్రజలుగల సభలలో సంస్కృతమున ఉపన్యాసములు జరుగుటయు, ప్రజలు వాని నర్థముచేసికొనుటయు చూచుచున్నాము. మద్రాసువంటి ఆధునికపట్టణములో వేలకొలది మంది అర్థము చేసికొను భాషను మృతభాషయనుటకంటె అసత్యము మరొకటి యుండదు. గ్రీకు భాషలో ఉపన్యాసము జరుగుచో ఇంగ్లండులోనేకాదు గ్రీసు దేశములోకూడ ఏపట్టణములోను నూరుమందికూడ అర్థము చేసికొనజాలరు. ఇట్టి యనేక కారణములవలన సంస్కృతము నేటికికూడ జీవద్భాషయే యని స్పష్టమగుచున్నది. సంస్కృతము నేర్వనివారికి కూడా లోకోక్తి రూపముగాను, సుభాషితరూపముగాను పదులకొలదిగనైనను సంస్కృతశ్లోకములు వచ్చియుండును. పైని చెప్పిన లక్షణములలో ఏదియు మృతభాష కుండదు. సంస్కృతము మృతభాష కాకుండుటయేకాక మాధుర్యభరితమై యున్నందున అమృతభాషయని చెప్పదగియున్నది. హిందూమతముతో బాటు సంస్కృతమును జీవింపక తప్పదు. సంస్కృతవిరహితమైన హిందూమతము ఊహకుకూడ అందనిది. హిందువుల మతగ్రంథములన్నియు - వేదములు, పురాణేతిహాసములు, భాష్యములు మున్నగునవన్నియు - సంస్కృతములోనే యుండుటచేతను, నిత్యకర్మలును. నిషేకాదిశ్మశానాంతకర్మలును, శ్రేతపౌరాణిక యజ్ఞములును, పారాయణగ్రంథములును, అన్నియు సంస్కృతములోనే యున్నందున హిందువులకిది శాశ్వతముగ సమాశ్రయణీయము. మహాత్మా గాంధి యిప్పట్ల నుడివిన యీ మాటలు గమనింపదగినవి. “ప్రతి హిందూబాలుడును, బాలికయును సంస్కత భాషాజ్ఞానమును సంపాదింపవలయును. ప్రతి హిందువును అవసరము వచ్చినప్పుడు సంస్కృతములో మాట్లాడగల్గి యుండవలయును.” (Mahatma Vol. II, p 361) ఒకప్పడు క్రైస్తవమతమునకు పవిత్రభాషగా నుండి క్రైస్తవమతముతోబాటు శాశ్వతముగా జీవించీతీరునను అభిప్రాయమును గల్గించుచుండిన లాటిను భాష ఈనాడు క్రైస్తవమతమును వీడినట్లే సంస్కృతముకూడ హిందూమతమును వీడదాయను సందేహమెవరికైనను కలుగవచ్చును. ఆ సాదృశ్యము సరియైనదికాదు; (1) ఆదిలో లాటిను ద్వారా క్రైస్తవమతము ఐరోపాలో వ్యాపించినను, తన్మత మూలగ్రంథము లాటిను పుట్టియుండలేదు. కావున లాటిను కును క్రైస్తవమునకును సంబంధము మూలమట్టమైనదికాదు. (2) హిందూమత మూలగ్రంథములలో అర్ధశక్తియేగాక అక్షరశక్తికూడ కలదు ఆ అక్షరములు అదేరీతిగా, అదేస్వరముతో ఉచ్చరింపబడుచో అపూర్వము పుట్టునని యీ మతములోని సిధ్ధాంతము. కావున మూల గ్రంథమునకు ప్రముఖస్ధానము ఎప్పుడును పోదు. (3) ఈ మతమునకు చెందిన ఉద్గ్రంథములలో - ముఖ్యముగ త్రిమతస్ధుల ప్రస్థానత్రయ భాష్యములలో శబ్దవిచారమే ముఖ్యముగా చేయబడింది. “ఇచ్చట ఏవకారమునకు ప్రయోజన మేమి?”, ”అక్కడ ఆధాతువునకు ఆప్రత్యయము వచ్చినందున ఆయర్ధము తెలుపబడుచున్నది”—ఇత్యాది ధోరణిలో భాషమీదనే విశేషముగ విచారణ జరిగియున్నందున, ఈ మతముతో సంస్కృత భాషకుగల సంబంధ మెన్నటికిని పోదు. (4) ఇంతవరకు భారతీయ భాషలలో రామాయణ భారత భాగవతములకు అసంఖ్యాక పరివర్తన గ్రంథములు బయలుదేరినను ఏ యొక ధార్మికవిషయమునగాని భక్తివిషయమునకాని తత్వవిషయమున కాని సందేహము వచ్చినను మూల సంస్కృతగ్రంథమును చూచియే సందేహమును తీర్చుకొనుచున్నారుకాని యీ ప్రాంతీయభాషాగ్రంథములను చూచి సందేహమునెవ్వరును తీర్చుకొనుటలేదు. కావున ప్రామాణికత మూలసంస్కృత గ్రంథములకు పోయే అవకాశము లేదు. (5) సంస్కృతమువంటి అమూల్యరత్న నిధానమును హిందువులు విడిచిపెట్టుకొందురనుటకంటె వీరికిచేయబడు అన్యాయము వేరొండు లేదు. భారతీయ భాషలకు ప్రాణము ఆధునిక యుగమున భారతదేశములో ఫ్రాంతీయ భాషలకు సంస్కృతమువలన కలుగు పరిపుష్టి వర్ణనాతీతము. ఏభావమునైనను, భావచ్చాయనైనను తెలుపగల పదములు సంస్కృతములో సిద్ధములై యుండుటయేకాక అవసరమైనకొలదియు నూతన పదములను సృజించుకొను అవకాశము ఇందున్నంత పుష్కలముగా మరి యేభాషలోను లేదు. ఆయా ధాతువులకు చేర్చబడు ఉపపర్గల వలనను తిఙకృత్ప్రత్యయముల వలనను అనంతపదజాలము కల్పింపబడుట కవకాశమున్నది. అట్లే సుబంత తద్ధిత రూపములును కొల్లలుగా సంపాదింపబడును. ఒక్కథాతువునుండి సుమారు 150 పదములను సృజించు అవకాశము సంస్కృతములో ఉంది. ఇట్టి యవకాశము మరి యే భాషలోను లేదు. ఇంత భాగ్యవంతమును, సమృద్ధి మంతమును అయిన భాష ఆధునికయుగములో నిర్వహింపవలసిన కార్య మెంతయో ఉంది. బహువిధోద్యమములతోను, వైజ్ఞానిక సంచలనములతోను చైతన్యవంతమైన ఆధునిక కాలములో సంస్కృతము చేయుచున్నట్టియు, చేయగల్గినట్టియు సహాయ మింతింతయని చెప్పజాలము. సంస్కృత సహాయము లేనిచో సుమారు అర్థశతాబ్దినుండి ఆంధ్రదేశములో ( అట్లే యితర భాషాప్రాంతములలో ) విజృంభించుచున్న అనేకోద్యమము లింతగా ప్రజల హృదయములను తాకెడివికాదు. గ్రంథాలయోద్యమము, వయోజన విద్యాప్రచారము, సహాయ నిరాకరణోద్యమము, గ్రామ్య, గ్రాంధికభాషా వివాదము, భావకవిత్వ ప్రస్ధానము, సారస్వత విమర్శనము, చారిత్రక పరిశోధనము - అది యిది యననేల – ఆధునిక జీవిత విజృంభణ మంతయు సంస్కృత భాషావలంబనము చేతనే జరిగింది. సంస్కృతమునకా పటుత్వమున్నది. ఏయుద్యమము బయలుదేరినను అది ప్రజల హృదయములలో నాటుకొనిపోవులనట్లు చేయగల అమోఘమైన శక్తి సంస్కృతభాష కుండుటచేత సంస్కృతముద్వారా ఉద్యమములు వ్యాపించుటయే కాక ఉద్యమములద్వారా సంస్కృతభాష కూడా అపారముగా వ్యాపించిపోయింది. ఏమాత్రము విద్యాగంధము లేనివారికికూడ ఆయాయుద్యమ భావములతోఁబాటు సంస్కృతభాషా పదములుకూడ అందఁజేయఁబడినవి. తత్ఫలితముగా నేడు సంస్కృత పదములు వెనుకకంటె హెచ్చు వ్యాప్తిలోనికి వచ్చినవి. మునుపు సంస్కృత పండితులకు మాత్రమే యర్థమగుచుండిన కొన్ని సంస్కృతపదములు నేడు సామాన్యజనుల కర్ధమగుచున్నవి. 1920 వ సంవత్సరమునకు పూర్వము మనదేశములో "గ్రంథపఠనము”, “స్వార్థపరుడు”, “దృఢసంకల్పము” మున్నగు పదములకు అర్థమేమని దారినిపోవువాని నెవ్వని నైనను అడుగుచో అతడు తెల్లబోయెడివాడు. నేడు ఆంధ్రపత్రిక, ఆంథ్రప్రభ మున్నగు పత్రికలను చదువు సామాన్యజనుడు కూడా వీనియర్ధమును గ్రహించగల్గుచున్నాడు. కారణమేమి? ఆయా ఉద్యమములతోపాటు ఇట్టి పదములు కూడా ప్రజలకు పరిచితములైపోయినవి. మనకు తెలియకుండగనే సంస్కృతము మనకు సహాయము చేస్తోంది. అది సమస్తాధునికోద్యమములకు సహాయము చేయుచు, అన్నింటి మూలమునను కూడా వ్యాప్తిచెందుచు తన విలక్షణప్రభావమును లోకమునకు చాటుచున్నది. ఆధునిక నాగరికతకును సంస్కృతభాషకును ఇట్టి సంబంధము ఉంది. ఇది భారతదేశములోని అన్ని ప్రాంతీయ భాషలకును వర్తించును. కావుననే భారత కేంద్రప్రభుత్వమునకు అధికారభాష కావలసిన హిందీ పదములను స్వీకరింపవలసినపుడు ముఖ్యముగా సంస్కృతము నుండియు, తరువాత ఇతర భారతీయభాషల నుండియు (...by drawing, whereever necessary or desirable, for the vocabulary, primarily on Sanskrit and secondarily on other languages) స్వీకరింపవలయుననని భారత రాజ్యాంగ ప్రణాళికలో ఉపనిబద్ధమైయున్నది. (Part XVII, Chapter IV, 351) భారతదేశములోనేకాదు, ఇతరదేశములలో కూడా ఆధునిక వ్యవహారములకు సంస్కృత సహాయము పొందబడుచున్నది. సయాం, జావా మున్నగు దేశములలో దేశీయ భాషలు ఆధునిక వ్యవహారములకు ఉపయోగవడుటకై పరిపుష్టిని సంస్కృతభాషనుండి పొందుచున్నవి. సింహళ విశ్వవిద్యాలయాచార్యులైన వి. జి. సేకరే స్వీయ దేశ భాషాభివృద్ధి మార్గమును నిర్దేశించుచు నుడివిన యీమాటలు గుర్తింపదగినవి. “ఇంత కాలముపేక్షింపబడిన దేశీయభాష త్వరలోనే గురుతర బాధ్యతలను వహింపవలసివచ్చును. ఈ దేశీయభాషాభీవృద్ధిసందర్భమున మనకు ప్రధానమైన స్ఫూ ర్తి సంస్కృతభాషనుండి రావలసియున్నది. దీనినెల్లరు నంగీకరింతురు. విపులమైన శబ్దజాలము, శాస్త్రీయపారిభాషిక పదసమూహము సంస్కృతమున కాస్థానమును గల్గించుచున్నవి. సంస్కృత ధాతువుల నాధారముగా చేసికొనియే మనము నూతనపదములను నిర్మించుకొనవలసి యున్నది.” (22-6-54 తేదీని జాఫ్నాలో జరిగిన సంస్కృత మహాసభలోని ఉపన్యాసము.) భారతదేశములోని యే ప్రాంతీయ భాషాసాహిత్యములోనైనను ప్రవేశించుటకు గాని గ్రంథరచనగావించుటకుగాని సంస్కృతభాషాజ్ఞానము తప్పనిసరిగా నుండదగినది. ఈ సంస్కృతప్రభావము ప్రాచీనరచనలలోను, అర్వాచీనరచనలలోను సమానముగానే యున్నది. ప్రాంతీయభాషాప్రత్యయములను తొలగించి సంస్కృత ప్రత్యయములను చేర్చుచో సంస్కృతభాషగానే మారిపోవు రచనలు నాడును నేడును గూడ సర్వ ప్రాంతీయభాషలలోను ఉన్నాయి. సంస్కృతపద భూయిష్టములైన రచనలే అన్ని ప్రాంతీయ భాషలలోను జనసామాన్యముచే ఆదరింప బడుచున్నవి. ఏగ్రంథములు సంస్కృత పదములను వాడరాదను అభిప్రాయముతో కవులచే రచింపబడినవో ఆ గ్రంథములే కృతిమములు గాను, కఠినములు గాను గన్పట్టుచున్నవి. ధారాళముగా సంస్కృత పదములు ప్రయోగింపబడిన గ్రంథములు జనసామాన్యమున కర్థమగుచున్నవి. కొన్నిపట్ల సంస్కృతపదభూయిష్ఠ రచనయు కఠినముగా నుండవచ్చును. కాని యా కాఠిన్యతనకు కారణము ఆపదములు సంస్కృత పదములై యుండుటకాదు. అట్టిపదములు సంస్తృతగ్రంథములలో నున్నను ఆ గ్రంథములు సంస్కృత పండితులకు కఠినముగానే యుండును. వానికి బదులుగా తేలికయైన సంస్కృతపదములు వాడబడుచో ఆ రచన తెలుగు గ్రంథములోనున్నను తేలికగనే యుండును. సంస్కృతగ్రంథములలోనున్నను తేలికగానే యుండును. కావున కాఠిన్య, సౌలభ్యములు ఆ ప్రయుక్తపదములకు సంబంధించినవే కాని భాషకు సంబంధించినవి కావు. నేటి భారతీయ భాషాసాహిత్యములతో సంస్కృతమునకు గల గాఢసంబంధము గట్టిగా మనస్సునకు తట్టవలయునన్నచో అప్పుడప్పుడు జరుగుచుండు సర్వప్రాంతీయ కవిసమ్మేళనమములలో పద్యములను మనము వినవచ్చును. ఇంచుమించు అన్ని ప్రాంతీయభాషలలోను అవే సంస్కృత పదములు విననగును; భిన్నభారతీయ భాషలనడుమ ఎంత ఐక్యతకలదో స్పష్టముగ గోచరించును. నేటి మన వ్యవహారరంగములోను, సాహిత్యరంగములోను సంస్కృతమెంత సన్నిహిత సంబంధమును గల్గియున్నదో, సంస్కృతాభ్యాసము పెరుగుచో ఈ ఉభయరంగములలోను మన భాషాపాటవ మెంతగా పెరుగునో, జాతీయజీవన మెంత సౌభాగ్య వంతముగానుండునో పై విచారణమువలన తెలియగలదు. నవయుగములో సంస్కృత పునరుజ్జీవము ప్రాంతీయభాషా పునరుజ్జీవములో నొక ముఖ్యభాగముగా భావింపవలయుననియు, సర్వప్రాంతీయ భాషలలోను సంస్కృతపదజాలము పెరుగుచున్న కొలదియు భిన్నభిన్న ప్రాంతములవారు పరస్పరము దగ్గరకు చేరుకొనుటకును, భారతీయులలో ఏకజాతీయభావము ఇతోధికముగా సునిరూఢమగుటకును దోహదమేర్పడుననియుకూడ దీనివలన స్పష్టమగుచున్నది. మరొక విషయమేమనిన సంస్కృతము అత్యంత ప్రాచీన భాష యే కాదు. ఆ ప్రాచీనకాలము నుండి నేటివరకు నవనవోన్మేషముగా నిలబడియున్న భాష. ఉదాహరణకు షేక్స్ పియర్ మహానుభావుడు వ్రాసిన ఆంగ్ల నాటకము లో వాడబడిన భాష ఈరోజు వాడబడు ఆంగ్లభాష చాలావరకు మార్పు చెందినది. హీబ్రూ మొదలైన ప్రాచీన భాషల విషయమున ఇట్లే. కానీ సంస్కృత భాష విషయములో చూచినచో క్రీస్తు శకం 5 వ శతాబ్దమున కాళిదాసు వ్రాసిన రఘు వంశము, కుమారసంభవాదులను ఈరోజు సంస్కృత అభ్యాస వ్యాసంగమున 1 వ తరగతి యని చెప్పదగిన శబ్దమంజరి యందలి ఒక ఇరువది శబ్దములను, ఒక పది సంధి సూత్రములను ఒక నాలుగు సమాసములను నేర్చిన ఎవరైనను తెలిసి కొన వచ్చును. "వాగర్థావివ సమ్ప్రుక్తౌ వాగర్థ ప్రతిపత్తయే" మొదలైన శ్లోకములను మనమందరమూ తెలిసి కొని యుండుట మన యనుభవము లోనిదే. ఆదికవి వాల్మీకి రామాయణమును కొద్ది పాటి శబ్ద జ్ఞానము సంధి జ్ఞానము లతో మనము తెలిసికొనుట అత్యంతము అద్భుతమైన విషయము. ఆంధ్ర సాహిత్యమున మనము చదువుకొను నన్నయ భారత కాలమే క్రీస్తు అనంతర 10 యవ శతాబ్ది. 1300 సంవత్సరముల పూర్వము వ్రాసిన "నుత జల పూరితమ్ములగు నూతులు నూరిటి కంటె ఒక్క బావి మేలు" అను పద్యము ను మనము ఏ సహాయము లేకనే అర్థము చేసికొనుచున్నాము అన్నచో ఈ 1300 సంవత్సరములనుండి లేదా 1800 సంవత్సరములనుండి మనవరకు తెచ్చిన గురువులకు ఋణ పడి యుందుము. ఎదర రాబోవు 2000 సంవత్సరములు లేదా అనంత కాలము వరకు ఈ ప్రవాహమును నిరంతరాయముగా తీసుకొని పోవుట అందు కొరకు సంస్కృతమును తెలిసికొని ముందు తరములకు బోధించుట మన కర్తవ్యమయి ఉన్నది శబ్దశక్తి సంస్కృతమునకు ప్రాంతీయభాషలతోగల సంబంధమును గురించిన విచారణము ఇంతటితో నాపి సంస్కృత పదముల సహజశక్తిని గురించి యొకింత చెప్పవలసియున్నది. ఇతర భాషలలో అనేక పదములచే చెప్పవలసిన భావమును సంస్కృతములోని ఒక్క వదము చెప్పగలదు. నాలుగు ఉదాహరణములను మాత్ర మీక్రింద నిచ్చుచున్నాను. యాయజూకః = తఱచుగా యజ్ఞములు చేయువాడు. జిగమిషా = పోవలయునను కోరిక. రామతే = రామునివలె ఆచరించుచున్నాడు. కేశాకేశి = జుట్టుజుట్టు పట్టుకొని యుద్ధముచేయునట్లు. ఇట్టి శబ్దపటుత్వము నేటి ప్రపంచభాషలలో దేనికిని లేదు. ఇంతియేకాక, రెండు, మూడు అక్షరములు గల చిన్న పదములు గొప్ప భావమును స్ఫురింపజేయుట సంస్కృతములోనే కాంచనగును. ధర్మ శబ్దమువలన దాని నాచరించువాడు మంచిస్ధితిలో ధరింపబడునని బోధింప బడుచున్నది. రథ్యా శబ్దమువలన పూర్వము వీధులు రథము నడుచుటకు తగినంత వెడల్పుగా నుండెనని తెలుపబడును. శరీర శబ్దమువలన నిది శిథిలమైపోవునను (శీర్యతే) తత్వబోధ చేయబడుచున్నది. స్మృతి శబ్దమువలన మనుస్మృత్యాది గ్రంథములు, వేదములను స్మరించుచు వ్రాయబడినవే కాని తత్కర్తల స్వకపోలకల్పితములు కావని తెలియుచున్నది. ఈరీతిగా సంస్కృత శబ్దములకు లోకోత్తరశక్తి కన్పట్టుచున్నది. ఇతర భాషలలో నిది మిక్కిలి తక్కువ. మూలధాతువునకు కాని, మూల పదమునకు కాని దూరము కాకుండ, ప్రత్యభీజ్ఞానావకాశము గల్గునంత దగ్గరలో సంస్కృత పదములు నిలిచి యుండుట యీ పరిస్ధితికి గల కారణములలో నొకటి. ఇతర భాషలలో పదములకు సరియైన వ్యుత్పత్తులు లభించుటే కష్టము; లభించినను అవి భాషా ప్రాజ్ఞులకో, విశేష పరిశోధన గావించిన వారికో మాత్రమే లభించును. అజ్ఞాత వ్యుత్పత్తికములు సంస్కృతములో ఉన్నంత తక్కువగా మరి యెందును లేవు. ప్రపంచములో ఏ భాషలోని పదములకైనను వ్యుత్పత్తికావలసినచో సాధారణముగా ఇతర భాషలలోనికి పోయి వెదుకవలసి యుండును. ఒక ఇంగ్లీషు పదమునకు వ్యుత్పత్తి కావలసినచో కెల్టిక్, ట్యుటానిక్, హైజర్మన్, లోజర్మన్, లాటిన్, గ్రీక్ మున్నగువానిలో అది లభించును; అట్లే యితర భాషాపదములకును, ఈ మూలభాష లనుకొనబడుచున్నవాని పదములకు వ్యుత్పత్తి కావలసినచోకూడ మరొక భాషలో నన్వేషణము చేయవలసియుండును. గ్రీకులోని పదములకు కూడా అనేకములకు సంస్కృతములో వ్యుత్పత్తి లభించును. ఒక్క సంస్కృతములోని పదములకు మాత్రము వ్యుత్పత్తి అన్య భాషల కేగనక్కరలేకుండ ఆభాషలోనే లభించును. సంస్కృతముయొక్క సర్వ ప్రాచీనతకును స్వతంత్రతకును ఇది ప్రబల నిదర్శనము. శ్రావ్యత అర్ధముకానివారికి కూడా శ్రవణ సుఖమును గల్గించు భాష సంస్కృతము. సంస్కృత శ్లోకములను విని యానందింపని వాడుండడు. నేటి భాషలలో కాని, గ్రీకు, లాటినులలోగాని సంస్కృత వృత్తములంత మధురములైన వృత్తములు లేవు. Most musical metres – మధురతమ వృత్తములు - ఆని ఎ. ఎ. మాక్డొనెల్ సంస్కృత వృత్తములను వర్ణించి యున్నాడు. భగవద్గీతాది గ్రంథములలోని అనుష్టుప్ శ్లోకములు, మందాక్రాంత, వియోగిని, ద్రుతవిలంబితము, మాలిని మున్నగు వృత్తములు మధురాతి మధురములై సర్వ మనోరంజక శక్తిగలవై యొప్పుచున్నవి. చరమపరీక్ష సంస్కృత పండితులు సరస సాహిత్య సల్లాపములను గావింపునపుడు కాని, వేదాంతగోష్ఠిని నెరపునపుడు కాని, పురాణ ప్రవచనము సలుపునపుడు కాని వినునట్టి నవీన విద్యానాగరికతా సంపన్ను లెల్లరును తద్భాషా సౌందర్యము నకును, విషయ మహత్త్వ మాధుర్యములకును ముగ్ధులగుటను గాంచుచున్నాము. ఆధునిక సభ్యతలో నెంత ఉన్నతస్థతిలో నున్న వారును ఈ భాషాను వాఙ్మయమును నేర్చియుండినచో తమ జన్మ ధన్యమయ్యెడిదని భావించుట సర్వత్ర కాంచనగును. సంస్కృతమునకు గల అద్వితీయ మాధుర్య మహత్త్వముల కిది ప్రబల నిదర్శనము. ఇట్టి సర్వతోముఖ సౌరభ సౌభాగ్యములు గల్గిన సంస్కృతభాష భారత భాగ్యరాశిలో అమూల్యరత్న మగుటయేకాక భారతీయులకు భారతీయతను నిలబెట్టగల్గిన సర్వప్రముఖ సాధనమై యలరారుచున్నది. చరిత్ర సంస్కృతము ఆర్యుల అధికారిక భాష. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో మెపోపటేమియా, పర్షియా దేశాలనుండి వచ్చిన ఆర్యులు ఉత్తర భారతదేశంలో స్థిరపడిన తర్వాత చతుర్వేదాలు వ్రాసుకొన్నారని చరిత్రకారుల భావన. సాహిత్యం ప్రాచీన జ్ఞాన సంపదయైన వేదాలు, ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, మను స్మృతి, వాస్తు శాస్త్రం, అర్థ శాస్త్రం మొదలైనవన్నీ సంస్కృతంలో వ్రాయబడినవే. మధ్య యుగాల్లో తెలుగు కవులు సంస్కృత సాహిత్య పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించినప్పుడు ఎన్నో సంస్కత పదాలు తెలుగు భాషలో చేరాయి. అలాగే ఇతర ద్రావిడ భాషలపై సంస్కృత భాష ప్రభావము ఎంతైనా ఉంది. తెలుగు భాషలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, శూద్రకుడు రచించిన మృచ్చకటికము, భాసుడు రచించిన స్వప్న వాసవదత్తము, శ్రీహర్షుడు వ్రాసిన రత్నావళి, వాత్సాయనుడు వ్రాసిన కామసూత్రములు మొదలైనవి ప్రసిద్ధి చెందిన అనువాద గ్రంథాలు. చూడండి ఇండో యూరోపియను వర్గము మూలాలు 2. మూలం: "భారతీయవైభవము", జటావల్లభుల పురుషోత్తము ఎం. ఏ. (Lecturer in Sanscrit, S.R.R. & C.V.R College, Vijayawada) గారి చే 1957 లో ముద్రింపబడింది. బయటి లింకులు Rashtriya Sanskrit Sansthan Rashtriya Sanskrit Sansthan Samskrita Bharati Transliterator from romanized to Unicode Sanskrit Sanskrit Voice: Learn, read and promote Sanskrit Sanskrit transliterator with font conversion to Latin and other Indian Languages Sanskrit Alphabet in Devanagari, Gujarati, Bengali, and Thai scripts with an extensive list of Devanagari, Gujarati, and Bengali conjuncts Academic Courses on Sanskrit Around The World Sanskrit Documents Sanskrit Documents: Documents in ITX format of Upanishads, Stotras etc. and a metasite with links to translations, dictionaries, tutorials, tools and other Sanskrit resources. Read online Sanskrit text (PDF) of Mahabharata, Upanishada, Bhagavad-Gita, Yoga-Sutra etc. as well as Sanskrit-English spiritual Dictionary Digital Sanskrit Buddhist Canon GRETIL: Göttingen Register of Electronic Texts in Indian Languages, a cumulative register of the numerous download sites for electronic texts in Indian languages. Gaudiya Grantha Mandira - A Sanskrit Text Repository. This site also provides encoding converter. Sanskrit texts at Sacred Text Archive Clay Sanskrit Library publishes Sanskrit literature with facing-page text and translation. for texts and word-to-word translations [=languageSorter%3A%22Sanskrit%22&and[]=collection%3A%22digitallibraryindia%22] for DLI scanned books Primers Sanskrit Self Study by Chitrapur Math Discover Sanskrit A concise study of the Sanskrit language A Practical Sanskrit Introductory by Charles Wikner. A Sanskrit Tutor Ancient Sanskrit Online from the University of Texas at Austin Grammars An Analytical Cross Referenced Sanskrit Grammar By Lennart Warnemyr. వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు వర్గం:భారతీయ భాషలు వర్గం:సంస్కృత భాష
నిజాం
https://te.wikipedia.org/wiki/నిజాం
thumb|207.991x207.991px|1909 లో హైదరాబాద్ రాష్ట్రము. thumb|హైదరాబాద్ దక్కన్ అసఫియా జెండాహైదరాబాదు రాజ్యం పాలకుల పట్టం నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశం వారు 1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు. నిజాంలు హైదరాబాద్ రాష్ట్రానికి 18 వ నుండి 20 వ శతాబ్దపు పాలకులు. హైదరాబాద్ నిజాం (నిసామ్ ఉల్-ముల్క్, అసఫ్ జా అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ రాష్ట్ర చక్రవర్తి (2019 నాటికి తెలంగాణ రాష్ట్రం, కర్ణాటకలోని హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం మధ్య విభజించబడింది). 1713 నుండి 1721 వరకు మొఘల్ సామ్రాజ్యం క్రింద దక్కన్ వైస్రాయ్‌గా పనిచేసిన మీర్ కమర్-ఉద్-దిన్ సిద్దికి (అసఫ్ జా I) చేత అసఫ్ జాహి రాజవంశం స్థాపించబడింది. 1707 లో ఔరంగజేబ్ చక్రవర్తి మరణించిన తరువాత అతను ఈ ప్రాంతాన్ని అడపాదడపా పరిపాలించాడు. 1724 మొఘల్ నియంత్రణ బలహీనపడింది, అసఫ్ జా మొఘల్ సామ్రాజ్యం నుండి వాస్తవంగా స్వతంత్రుడయ్యాడు. హైదరాబాద్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజ్యం సొంత సైన్యం, వైమానిక సంస్థ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, రైల్వే నెట్‌వర్క్, పోస్టల్ సిస్టమ్, కరెన్సీ, రేడియో ప్రసార సేవలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు నిజాంలు హైదరాబాద్‌కు సొంత రైల్వే నెట్‌వర్క్‌ను కూడా ఇచ్చారు - "నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే" ఇది తరువాతి సంవత్సరాల్లో వివిధ పరిశ్రమలను స్థాపించడంలో సహాయపడింది. మహాభారతం సంకలనం కోసం విరాళం 1932 లో, పూణేలో ఉన్న భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో మహాభారతం ప్రచురణకు డబ్బు అవసరం ఉంది. 7 వ నిజాం - (మీర్ ఉస్మాన్ అలీ ఖాన్) 11 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 1000 రూ ఇచ్చారు. నిజాం నవాబులు మీర్ ఖ్అమర్-ఉద్-దిం ఖాన్ - నిజాం-ఉల్-ముల్క్, అసఫ్ జహ I (1724-1748) నాసిర్ జంగ్ మీర్ అహ్మద్ (1748-1750) మొహియుద్దీన్ ముజఫ్ఫర్ జంగ్ హిదాయత్ (1750-1751) ఆసిఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ (1751-1762) నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II (1762-1802) మీర్ అక్బర్ అలీ ఖాన్ అసఫ్ ఝా III (1802-1829) నాసిర్ ఉద్దౌలా ఫర్ఖుందా అలీ అసఫ్ ఝా IV (1829-1857) అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్నియత్ అలీ ఖాన్ అసఫ్ ఝా V (1857-1869) ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా VI (1869-1911) ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII (1911-1949) చిత్రమాలిక ఇవికూడా చూడండి నిజాం పాలనలో పరిశ్రమలు కళ్యాణ కర్ణాటక నిజాం పాలనలో భూమి పన్ను విధానాలు మూలాలు వర్గం:నిజాం వంశపాలకులు వర్గం:హైదరాబాద్ రాష్ట్రం
కుతుబ్ షాహీ వంశం
https://te.wikipedia.org/wiki/కుతుబ్_షాహీ_వంశం
కుతుబ్ షాహీ వంశం (ఈ వంశస్థులను కుతుబ్ షాహీలు అంటారు) దక్షిణ భారతదేశం లోని గోల్కొండ రాజ్యం పాలించిన పాలక వంశం. ఈ వంశస్థులు తుర్కమేనిస్తాన్-ఆర్మేనియా ప్రాంతంలోని తుర్కమేన్ తెగకు చెందిన షియా ముస్లింలు. స్థాపన కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్, 16వ శతాబ్దం ప్రారంభంలో కొందరు బంధువులు, స్నేహితులతో కలసి ఢిల్లీకి వలస వచ్చాడు. తరువాత దక్షిణాన దక్కన్ పీఠభూమికి వచ్చి బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షా కొలువులో పనిచేసాడు. అతడు గోల్కొండను జయించి హైదరాబాద్ రాజ్యానికి అధిపతి అయ్యెను. 1518లో బహుమనీ సామ్రాజ్యం పతనమై ఐదు దక్కన్ సల్తనత్ ఆవిర్భవించుచున్న సమయములో బహుమనీ సుల్తానుల నుండి స్వతంత్రం ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టం స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశం స్థాపించాడు. పరిపాలన ఈ వంశము తెలుగు వారిని పరిపాలించిన తొలి ముస్లిం వంశం. ఈ వంశం 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలు దక్కన్ని జయించేవరకు, 175 సంవత్సరాలు గోల్కొండను పరిపాలించింది. ఆ తరువాత 1948లో హైదరాబాదు రాజ్యం, న్యూఢిల్లీ సైనిక జోక్యం (పోలీసు చర్య) తో భారతదేశంలో విలీనము అయ్యేవరకు ముస్లింల పరిపాలనలోనే ఉంది. కుతుబ్ షాహీ పాలకులు గొప్ప కళా, శాస్త్ర పోషకులు. వీరు పర్షియన్ సంస్కృతిని పోషించడమే కాకుండా, ప్రాంతీయ దక్కన్ సంస్కృతికి చిహ్నమైన తెలుగు భాష, కొత్తగా అభివృద్ధి చెందిన ఉర్దూ (దక్కనీ) ను కూడా పోషించారు. తెలుగు ప్రాంతమైన తెలంగాణ గోల్కొండ రాజ్యములో ఒక ప్రముఖ భాగమైనందున, వాళ్ల మాతృ భాష కాకపోయినా, గోల్కొండ పాలకులు తెలుగు భాష అభ్యసించారు. గోల్కొండ, ఆ తరువాత హైదరాబాదు రాజ్యానికి రాజధానులుగా ఉండేవి, ఉభయ నగరాలును కుతుబ్ షాహీ సుల్తానులే అభివృద్ధి చేశారు. వంశ క్రమం ఈ వంశానికి చెందిన ఎనిమిది రాజులు క్రమంగా: సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ (1512-1543) జంషీద్ కులీ కుతుబ్ షా (1543-1550) సుభాన్ కులీ కుతుబ్ షా (1550) ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1550-1580) మహమ్మద్ కులీ కుతుబ్ షా (1580-1612) సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా (1612-1626) అబ్దుల్లా కుతుబ్ షా (1626-1672) అబుల్ హసన్ కుతుబ్ షా (1672-1687) 1.సుల్తాన్ కులీ కుతుబ్ షా: ఇతని కాలం లో ఇతనికి సమకాలికులు 1. శ్రీకృష్ణ దేవరాయలు 2. బాబర్, హుమాయూన్ ఇతని రాజ్య విస్తరణకు కారకులయిన సేనాధిపతులు 1. హైధర్ ఉల్ముల్క్ 2. మురారీరావ్. మురారి రావ్ అహోభిలమ్ దేవాలయం పై దండెత్తాడు మూలాలు బయటి లింకులు కుతుబ్ షాహీల పరిపాలనలో తెలుగు సాహిత్యము , సంస్కృతి వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర వర్గం:భారతదేశాన్ని పరిపాలించిన వంశములు వర్గం:ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం వర్గం:తెలంగాణ చరిత్ర
మూసీ నది
https://te.wikipedia.org/wiki/మూసీ_నది
right|thumb|1895లో మూసీ నది దృశ్యం మూసీ నది కృష్ణా నది ఉపనది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు.కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించబడింది. మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, వికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది, అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట సూర్యాపేట వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35% సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు బీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర ఉంది. మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నాయి. వీటిలో పురానా పుల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీ వంశస్తుడైన ఇబ్రహీం కుతుబ్ షా 1578 లో నిర్మించాడుమొహమ్మద్ కులీ కుతుబ్ షా - 2 వ పేజీ. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది. నయా పుల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉంది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్, ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నాయి. విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర, దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి. thumb|చాదర్‌ఘాట్ వద్ద మూసీనది దృశ్యం. ఈ చిత్రం నిజాం కాలంనాటి ఛాదర్‌ఘాట్ పాతవంతెన నుండి తూర్పు వైపుకు తీయబడింది. నుండి తీయబడింది. చిత్రంలో దగ్గరగా కనిపిస్తున్నది చాదర్‌ఘాట్ ప్రాంతంలో 1990వ దశకంలో కట్టిన వంతెన. దూరంగా కనిపిస్తున్నది మలక్‌పేట నుండి కాచీగూడవైపు వెళ్ళే రైలుమార్గంలో మూసీపై ఉన్న రైలు వంతెన. పాత వంతెనను ఉత్తరంవైపు వెళ్ళే వాహనాలకు, కొత్తవంతెనను దక్షిణం వైపు వెళ్ళే వాహనాలకు ఉపయోగిస్తున్నారు వరదలు 20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. 1830లో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్ర చరిత్రలో మూసీ గురించి, దాని వరదల గురించి వ్రాసుకున్నాడు. ఆయన 1829లో మూసీనదికి గొప్ప వరదలు వచ్చాయని వ్రాశారు. ఢిల్లీ దర్వాజా వద్ద ఆంగ్లేయులు నిర్మించిన వారధిని ఆ వరద ప్రవాహం పగలగొట్టి, బేగంబజారులో కొన్ని వీధులను ముంచి పోయిందని వ్రాశాడు. 1908 సెప్టెంబరు 28, మంగళవారము నాడు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా పారింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేసింది. జంటనగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది. నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వరదల పునరుక్తిని నివారించడానికి, నగరంలో మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబరు 1న తన నివేదిక సమర్పించాడు. ఏడవ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. మురికి కాలువ మూసీ right|thumb|ఈ దృశ్యంలో నందనవనం ప్రాజెక్టులో భాగంగా నది మధ్యలో నిర్మించిన కాంక్రీటు కాలువను చూడవచ్చు 1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్థ్యం ఉంది.http://www.rainwaterharvesting.org/hussain_sagar/hussainsagar%202.pdf 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు, రాజకీయ ప్రతిపక్షాలు, వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మూసీ ప్రక్షాళనపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించడంతో దాని పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్‌డ్యామ్‌లు నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. మూసీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసింది. మూసీ సుందరీకరణలో భాగంగా నాగోల్‌ సమీపంలో నిర్మించిన వాక్ పాత్ చిత్రాలు.. నదిపై వంతెనలు 545 కోట్ల‌ రూపాయలతో మూసీ నదిపై 14 బ్రిడ్జిలు నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా ఫతుల్లగూడ, – ఫీర్జాదీగూడ బ్రిడ్జికి, ఉప్పల్ శిల్పారామం వద్ద 5 మూసీ వంతెనలకు (ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌ వద్ద రూ.42 కోట్లతో, ప్రతాప సింగారం-గౌరెల్లి వద్ద రూ.35 కోట్లతో, మంచిరేవుల వద్ద రూ.39కోట్లతో, బుద్వేల్‌ ఐటీ పార్కు-2 సమీపంలో ఈసీపై రూ.32 కోట్లతో, బుద్వేల్‌ ఐటీ పార్కు-1 సమీపంలో ఈసీ నదిపై రూ.20కోట్లతో హెచ్‌ఎండీఏ వంతెనల నిర్మాణాలు) 2023 సెప్టెంబరు 25న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. మూలాలు వర్గం:తెలంగాణ నదులు వర్గం:హైదరాబాదు వర్గం:రంగారెడ్డి జిల్లా నదులు వర్గం:హైదరాబాదు జిల్లా నదులు వర్గం:నల్గొండ జిల్లా నదులు వర్గం:కృష్ణానది ఉపనదులు
గోల్కొండ
https://te.wikipedia.org/wiki/గోల్కొండ
thumb|గోల్కొండ దుర్గం గూర్చి శిలాఫలకం|463x463px గోల్కొండకోట, ఒక పురాతన నగరం. తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదుకు 10 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరం, కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. సా. శ. 1083 నుండి సా. శ. 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. సా. శ 1336 లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. సా. శ. 1364 లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాను మహమ్మదు షా వశము చేశాడు. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1365-1512) ఉంది. కానీ సా.శ. సా. శ 1512 తరువాత ముస్లిము సుల్తానుల రాజ్యములో రాజధాని అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు. చరిత్ర thumb|260x260px|గోల్కొండ కోట దృశ్యము. "మంగలవరమ్" నుండి"గొల్ల కొండ" నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందిన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం ఉంది. అదేమిటంటే 1143లో మానుగల్లు అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహము కనిపించింది. ఈ వార్త అప్పటి ఆ ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయ బడింది. వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. కాకతీయులకు, ముసునూరి కమ్మరాజులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యములో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. పిదప ముసునూరి కమ్మరాజుల విప్లవముతో ఓరుగల్లుతో బాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. 1347లో గుల్బర్గా రాజధానిగా వెలసిన బహమనీ రాజ్యమునకు ముసునూరి కమ్మరాజులకి పెక్కు సంఘర్షణలు జరిగాయిSarma, M. Somasekhara; A Forgotten Chapter of Andhra History 1945, Andhra University, Waltair. మహమ్మద్ షా కాలములో ముసునూరి కాపయ నాయకుడు కౌలాస్ కోటను తిరిగి సాధించుటకు తన కొడుకు వినాయక దేవ్ ని పంపాడు. కాని వినాయక దేవ్ ఈ ప్రయత్నములో విఫలుడయ్యాడు. 1361లో పారశీక అశ్వముల కొనుగోలు విషయములో వచ్చిన తగాదా ఫలితముగా మహమ్మద్ షా బేలం పట్టణంపై దాడి చేసి వినాయక దేవ్ ని బంధించి ఆతనిని ఘాతుకముగా వధించాడుమహమ్మద్ కాసిం ఫెరిష్తా, Translation by John Briggs, History of the Rise of Mahomedan Power in India, Vol. 2, 1829, pp. 310-319, Longman and others, London. గుల్బర్గాకు తిరిగిపోవు దారిలో మహమ్మద్ షా సైనికులను ఓరుగంటి వీరులు మట్టుబెట్టారు. సుల్తాను కూడా తీవ్రముగా గాయపడ్డాడు. ప్రతీకారముతో రగిలిన సుల్తాను పెద్ద సైన్యమును కూడగట్టి కాపయ నాయకుడుపై యుద్ధమునకు తలపడ్డాడు. ఓరుగంటికి విజయనగర సహాయము అందలేదు. కాపయ నాయకుడు ఢిల్లీ సుల్తాను సహాయము కోరాడు. తోటి మహమ్మదీయునిపై యుద్ధము చేయుటకు ఢిల్లీ సుల్తాను నిరాకరించాడు. బలహీనపడిన కాపయ నాయకుడు మహమ్మద్ షాతో సంధిచేసుకున్నాడు. 300ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూప్యములతో బాటు గోల్కొండ శాశ్వతముగా వదులుకున్నాడు. గోల్కొండ కోటకు అజీమ్ హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గాకు మరలాడు. ఈ విధముగా 1364లో గోల్కొండ కోట హిందువులనుండి చేజారి పోయింది. తరువాత నవాబులు పాలించారు. 1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలములో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కి.మీ. చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములో ఔరంగజేబు కోటను నాశనంచేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన కోహినూరు వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని పరిటాల-కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు. నిజాం నవాబుల పరిపాలన కాలంలో 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య అప్పటి గోల్కొండ స్థితిగతుల గురించి వ్రాసుకున్నారు. వాటి ప్రకారం 1830 నాటికి గోల్కొండలో నిజాం అంత:పుర స్త్రీలు, నైజాం మూలధనం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేవారు. కోటలో విస్తరించి ప్రజలు ఇళ్ళు కట్టుకుని జీవించేవారు. ఐతే రాజధాని తరలిపోయివుండడంతో అక్కడ రాజ్యతంత్రానికి సంబంధించిన, వర్తకవాణిజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు జరిగేవి కాదు. కోటలు thumb|347x347px|గోల్కొండ కోట దృశ్యము గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పెంచుటలో, పటిష్ఠపరుచటలో కుతుబ్‌షాహిలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది, అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది. బారాదరి ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి గోషామహల్‌ బారాదరి హైదరాబాదు భూమార్గము కూడా ఉంది. దీని పై అంతస్తులో రాజ సింహాసనము ఉంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణములో అతి సుందరము, శోభాయమానముగా కన్పిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్‌హౌజ్‌ చెరువు, హైదరాబాద్‌ నగరంన ముఖ్య కట్టడమైన చార్‌మినార్‌, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు-దక్షిణ మూలగా మీర్‌ ఆలమ్‌ చెరువు, ఫలక్‌నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్‌నగర్‌, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్‌ సాగర్‌ చెరువు (గండిపేట) పడమరగా ఉన్నాయి. తూర్పు - ఉత్తర మూలగా హుసేన్‌ సాగర్‌ చెరువు, సికింద్రాబాదు నగరం, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర-పడమర మూలగా కుతుబ్‌షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణం, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు. దర్వాజలు కోటకు మొత్తం తొమ్మిది (తలుపులు) ద్వారాలున్నాయి. ఫతే దర్వాజ, మోతి దర్వాజ, కొత్తకోట దర్వాజ, జమాలి దర్వాజ, బంజారి దర్వాజ, పటాంచెరు దర్వాజ, మక్కా దర్వాజ డబుల్‌, బొదిలి దర్వాజ, బహిమని దర్వాజా. వీటిలో 1,2,3,4,5,7 ప్రయాణీకుల సౌకర్యార్థము తెరచి వుంటాయి. మిగిలిన వాటిని మూసివేశారు. సమయములలో శత్రువుల పోకడలను గమనించుటకు వీలుగా బాలాహిసార్‌ ద్వారముల కెదురుగా నిర్మింపబడిన తెరవంటి గోడ. బాలాహిసార్‌ గేటుకు వెలుపలి భాగములో ఒక రంధ్రము ఉంటుంది. యుద్ధ సమయములో శత్రువు గేటు ద్వారా ఏనుగులతో తోయించే సమయంలో దీని నుండి కాగుతున్న నూనెను కాని, కరిగిన లోహమునుకాని పోసేవారు.వైబ్రేషన్‌: బాలాహిసార్‌ గేటు మధ్యభాగంలో మెట్లకు ఎదురుగా నిల్చొని చప్పట్లు కొడితే... తిరిగి బాలాహిసార్‌ ఎత్తయిన భాగము నుండి మారుమోగుతుంది. ఆయిల్‌ స్టోర్‌ హౌస్‌ ఇది నూనె దాచి ఉంచే కట్టడం. ఇది 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతున ఒకే రాతితో మలచబడింది. దీనిలో 12,000 గ్యాలన్ల నూనె నిల్వచేసి, సప్లయి చేసేవారు బాలాహిసార్‌ ఇది 15 మైళ్ళ విస్తీర్ణముతో కొండల మీద నిర్మించపబడింది. ఇక్కడ చాలా కట్టడములున్నాయి. వాటిలో కుతుబ్‌షా భవనములు, దర్బార్‌ ఎ-ఆల్‌ అనే జనరల్‌ శాసనసభ హాల్‌ (విధాన సభ), దర్బార్‌ -ఎ-ఖాన్‌ అనే ముఖ్యమైన విధాన మండపములున్నాయి. ఇంకా నూతులు, మందుగుండు సామాను దాచి ఉంచు గది, ఆయుధ కర్మాగారం, మసీదులు, దేవాలయాలు, భక్త రామదాసును బంధించిన జైలు, నీటి రిజర్వాయరు, పెద్ద తోట, స్నాన గదులు, తుపాకులు, మందు గుండు సామాను దాచి ఉంచు గది, కుడివైపు దర్బార్‌-ఎ-ఆమ్‌ అనే శాసనసభ హాలుకు పోవుటకు మార్గము... ఎడమవైపు రాజభవనము నిర్మింపబడింది. కోట బురుజులు ఈ కోటకు మొత్తం 87 బురుజులున్నాయి. వీటిలో పెట్లా బురుజు, మూసా బురుజు,మజ్ను బురుజు ప్రసిద్ధి గాంచినవి. పెట్లా బురుజు కోటకు ఉత్తర పడమర మూలగా వుంటుంది. దీని మీద అలంగిరీ జయమునుకు గుర్తుగా ఫిరంగి అమర్చబడి ఉంది. ఇది 16 అడుగులు పొడవు ఉంటుంది. ఒక మణుగు (165 పౌండ్ల బరువు గల) ఫిరంగి గుళ్ళు ఉంచే వీలుంది. ఇది చూడ్డానికి చాలా అందంగా వుంటుంది. కోటకు దక్షిణముగా మూసా బురుజు ఉంది. 1666 సంవత్సరములో (1977 హిజ్రి) కమాండర్‌ మూసా ఖాన్‌ ఆధిపత్యములో ధర్మాచారి అనే మేస్త్రీ దీన్ని నిర్మించాడు. దీని మీదుగా మీరాన్‌ అను ప్రసిద్ధిగాంచిన సైన్యాధిపతి హతుడౌతాడు. అతని స్థానంలోమూసా ఖాన్‌ నియమితుడవుతాడు. బురుజు మీద ఫిరంగి అమర్చి వుంటుంది. ఇది కూడా పెట్లా బురుజు ఫిరంగి మాదిరిగా దాడిచేయడానికి వీలుగా ఉంటుంది. కుతుబ్‌షా రాజుల స్నానం thumb|కోటలో బాలహిస్సార్ లోపలికెళ్ళగానే కుడి ప్రక్కన శవ స్నానాల గది.|347x347px బాలాహిసార్‌ గేటు నుండి లోనికి ప్రవేశించేటపుడు కుడి చేతి వైపు ఈ స్నానముల గది ఉంది. కొంచెము నగీనా తోటకు కుడి చేతి వైపు పక్కన వేడి నీళ్ళు... చన్నీళ్ళు వచ్చేలా నేల మార్గమున గొట్టములను అమర్చి కట్టినది. ఈ కుళాయిలను చెరువు నుండి నింపేవారు. ఈ నీటిని అతి ముఖ్యమైన సందర్భములలో ఉపయోగించేవారు. ఎవరయినా రాజ వంశస్థులు దివంగతులైనపుడు ఇక్కడ వేడి నీటితో స్నానము చేయించి శవపేటికను ఉత్తరపు ద్వారము నుండి బయటకు తీసుకెళ్లేవారు. కఠోరా హౌస్‌ కుతుబ్‌షాహీలు స్నానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు ఇది కోటలోని 'బాలాహిసార్‌' కు ఉత్తర దిశగా నిర్మితమై ఉంది. ఇది 200 గజముల పొడవు, అదే వెడల్పులో, 5 గజముల లోతుగా నిర్మించిన నీటిని నిలువచేసే స్థలం. దీనిని ఒక చెరువు నుండి వచ్చే నీటితో నింపేవారు. దీనికి పడమర దిశలో ఉన్న గేటు దగ్గర శబ్దం చేస్తే అది అన్ని వైపులకు ప్రతిధ్వనిస్తుంది. ఈ నీటి హౌస్‌ను రాజులు, మరి కొందరు ప్రముఖులు వినోద స్థలముగా ఉపయోగించేవారు. నగీనా బాగ్‌ తోటకు దక్షిణముగా ఆర్కులలో రాజకుమారులు, రాజకుమార్తెలు ఊగేందుకు ఊయలలు అమర్చబడి ఉన్నాయి. ఇప్పటికీ వాటి గుర్తుగా ఆర్కులోని రాళ్ళలో రంధ్రములు కన్పిస్తాయి. నగీనా గార్డెన్‌ నుండి వెళ్ళే సన్నని మార్గంలో ఎడమ చేతివైపు ఒక కట్టడము ఉంది. ఇది రక్షకభటుల కోసం నిర్మించిన భవనము. కుతుబ్‌షా వంశపు రాజులలో ఏడవవాడు, ఆఖరివాడు అయిన అబ్దుల్‌ హసన్‌ తానీషా పరిపాలనలో, రక్షక భటులకోసం కట్టబడిన భవన మార్గములోనే ఆయన మంత్రివర్యులైన అక్కన్న మాదన్నల కోసం నిర్మించిన కార్యాలయ భవనం ఉంది. బడీ బౌలి బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి ఉంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. ఈ బావిలో ఒక మూల రాయి ఉంది. అది వేసవి కాలములో నీరు కిందపడడానికి ఉపయోగపడేది. ఈ బావికి దగ్గరలో రెండు వరండాలున్న ఒక భవనముంది. దీనిలో రాజులు కూర్చొని ప్రకృతి సౌందర్యమును తిలకించేవారు. డ్రగ్‌ ట్యాంక్‌ కాలువ బడి బౌలికి కొద్ది దూరంలో మెట్లకిందుగా పారే ఒక కాలువ వుండేది. ఇది డ్రగ్‌ చెరువు కోటకు 5 మైళ్ళ దూరంలో ఉంది. కోటలో ఉన్న తోటలకు, చేలకు ఈ కాలువ ద్వారానే నీరును మళ్ళించేవారు, పంటలు పండించేవారు. ఎల్లమ్మ దేవి అక్కన్న మాదన్న, అబ్దుల్‌ హసన్‌ తానీషా కాలములో కట్టినది దుర్గాదేవి లేక మహాకాళి అమ్మవారి మందిరం. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసములో బోనాల జాతరలు జరుగుతాయి. జంట నగరాల నుండి అనేక మంది సందర్శకులు వస్తుంటారు. దాద్‌ మహల్‌ రోడ్డుకు తూర్పు దిశగా దీని బాల్కనీ ఉంది.. బాల్కనీ ముందు పెద్ద ఖాళీ స్థలము వుంటుంది. ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు. బాలా హిస్సారు దర్వాజా thumb|గోల్కొండ కోట లోపలి ద్వారము: బాల హిస్సార్|260x260px అన్ని ముఖద్వారములలోకి బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరమయినది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు, సింహపు బొమ్మలు ఈ రక్షణ ద్వారమునకు ప్రత్యేక అలంకారాలు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళటానికి 380 ఎగుడు దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువాత మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపము కనిపించును. దర్బారు హాలుగా ఉపయోగించే ఈ కట్టడములో 12 ఆర్చీలు, 3 అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృఢమయిన స్థంబాలతో విభజించారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీలద్వారా వెనుక ద్వారము తెరుచుకొనును. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనము కనిపించును. కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపములో అబుల్ హసన్ లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్మకము. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది - జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమయిన కూలరు వలె ఉంటుంది. దేవాలయాలు, మసీదులు thumb|గోల్కొండ కోటలో రామదాసు బందిఖానా|260x260px హిందూ ఉద్యోగులలో ముఖ్యులయిన అక్కన్న మాదన్నల కార్యాలయములు పైన ఉన్న కుతుబ్ షాహీ దర్బారులో ఉంటాయి. అక్కడ మనము గండశిల నుండి నిర్మించిన కాకతీయుల కాలమునాటి హిందూ దేవాలయమును కూడా చూడవచ్చు. దీనిని మాదన్న దేవాలయముగా సంబోదిస్తారు. అందులో రంగులలో చిత్రించిన కాళీదేవి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇంకో ముఖ్య కట్టడము "తారామతి" నిర్మించిన మసీదు. ఆక్కడి గండశిలల గుండా నడుస్తున్నప్పుడు మనకు బంకమట్టితో తయారుచేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి నీటి సరఫరా కోసం అప్పటి సమర్ధవంతమయిన ఏర్పాట్లకు ఇవి సాక్ష్యాలు. 1518లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కటించిన మసీదు మూలలలో ఉండే మినారుల వలన చాలా బాగా కనిపిస్తుంది. మసీదు ప్రాంగణం కోట బురుజుల వరకు విస్తరించి ఉంది. మసీదుకు దగ్గరలోనే గండశిలలో ఒక చిన్న రామ మందిరము ఉంది. అబుల్ హసన్ తానాషా సంస్థానంలో కోశాధికారిగా పనిచేస్తున్న రామదాసును, డబ్బులు దుర్వినియోగ పరిచిన నేరంపై ఇక్కడే బంధించాడు. అప్పుడే ఆయన ఇక్కడ రాళ్ళపైన రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల రూపాలను చెక్కాడు. రాచమందిరాలు thumb|గోల్కొండ కోటలోని రాచమందిర శిథిలాలు|260x260px ఏటవాలుగా, ఇరుకుగా ఉన్న మెట్లు కింద ఉన్న జనానాకు, రాణీగారి మహలుకు దారితీయును. అక్కడి రాచమందిరాలు, పెద్ద పెద్ద మిట్టలమీద కట్టారు, వాటికి ఎత్తయిన పైకప్పులు ఉన్నాయి, గోడలన్నీ అలంకార వస్తువులతో నింపి పొదరిల్లులు, చూరులు పర్శియను తరహా రూపకల్పనతో ఎంతో అందముగా తీర్చిదిద్దారు. ఆర్చీల మూలలలో సన్నటి పలకలపై నాజూకు ఆకృతులు మరింత శోభను తెచ్చిపెడుతుంది. రాణీ మహలులో ఉండే ఈ విశేష భోహములను చూసి నాటి మొగలులే అసూయచెందేవారు. దర్బారు హాల నుండి కొండపాదమున ఉండే ఒక రాచమందిరమునకు దారి చూపే రహస్య సొరంగ మార్గము ఉండేదని ఒక అభిప్రాయము. ఇస్లాముమత వాస్తుశాస్త్రము ఆధారముగా నిర్మించిన కుతుబ్ షాహీ నవాబుల సమాధులు గోల్కొండకు ఉత్తర దిక్కులో బయట గోడకు 1 కి.మీ. దూరమున నిర్మించారు. ఈ సమాధుల చుట్టూ వనములు, వాటి మధ్య అందమయిన రాతి శిల్పాలు ఉన్నాయి. కోట బయట రెండు వెర్వేరు మండపాలను బండరాళ్ళతో నిర్మించారు. వాటిని తారామతి మందిరము, ప్రేమతి మందిరము అని పెలిచేవారు. వీటిలో అక్కాచెళ్ళెలయిన తారామతి, ప్రేమతి నివసించేవారు. వారు రెండంతస్తుల పైన ఒక వృత్తాకారపు వేధికపై తమ ప్రధర్శనలు ఇచ్చేవారు. దానిని కళామందిరమని పిలిచేవారు. దానిని గోల్కొండ కోట పైన ఉన్న రాజుగారి దర్బారునుండి తిలకించవచ్చును. గోల్కొండ కోట గైడ్ మ్యాపు center|400x400px|border|frameless ఇతరాలు 260x260px|thumb|గోల్కొండ కోట ఒక దృశ్యం కోట ప్రవేశద్వారం వద్ద చప్పట్లు కొడితే కోట పైభాగానికి వినిపిస్తుంది. కోటలోకి ప్రవేశించే ప్రతి సందర్శకుడు ఇలా ఒకసారి చప్పట్లు కొట్టి ఆ అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఆ అనుభూతిని పదిలంగా గుండెల్లో దాచుకొని వెళతారు. ఈ ఇంద్రజాలం ఇవాళ ఒక సరదా. ఆనాడు శత్రువు రాక గురించి హెచ్చరించే వ్యూహం.ఇంకా అనేకానేక భద్రతా చర్యల్లో భాగం. కోటలోని ప్రతి మలుపు, ప్రతి ప్రాకారం విస్మయం గొలిపే దృశ్యం.నాటి రాజుల ఆయుధాగారాలు, ధాన్యశాలలు, స్నాన శాలలు, వంటశాలలు మొదలుకొని ఆశ్వశాలలు, నూనె నిల్వ చేసే గది ఉన్నాయి. ఆరోజుల్లోనే (క్రీశ1518) వేడినీటి శాలలు, చప్పట్లు కొడితే అల్లంత దూరాన వినిపించే సౌకర్యం వంటివి ఆశ్చర్యచకితులను చేస్తాయి. కోటలోని రాజభవనాలు, శయన మందిరాలు, స్నానవాటికలు, రాజ ప్రముఖుల భౌతికకాయాలకు చివరిస్నానం చేయించే స్నాన మందిరాలు, తోటలలకు, ఫౌంటెన్లకు రాళ్ళతో నిర్మించిన ఆక్వడెట్లు, రామదాసు బందీఖానా, మసీదులు, మందుగుండును నిల్వచేసే స్టోర్‌ రూములు, సైనికుల నివాసాలు, మంత్రుల కార్యాలయాలు, ఉద్యానవనాలు, హబ్సికమాన్లు, రాజు ఏకాంత మందిరం, తారామతి మసీదు, బారదారి (దర్బారు హాలు) ఇబ్రహీం మసీదు, నయాఖిల్లా వంటివి ఇప్పటికీ సందర్శకుల్ని మరపురాని అనుభూతులకు లోను చేస్తున్నాయి. దాదాపు ఏడు కిలోమీటర్ల పొడవు కలిగిన అగడ్తలు, మూడు ప్రాకారాలు, మొత్తం ఎనిమిది మహాద్వారాలు, కోట గోడలపై 15 నుంచి 18 మీటర్ల ఎత్తున వున్న దాదాపు 87 బురుజులతో కూడిన గోల్కొండ కోటలో, కోట సమీపంలో వున్న చాలా ప్రాంతాలు అన్యాక్రాంతమై ఉన్నాయి. గోల్కొండ కోట దక్కన్‌లోనే అతి పెద్ద దుర్గం. ఇంతటి విస్తీర్ణం, వైవిధ్యం, వాస్తు వైభవం వున్న మరో కోట దక్షిణ భారతదేశంలో లేదు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో నిర్మించిన మహాదుర్గం గోల్కొండ. ఇలాంటి కట్టడాన్ని పున:నిర్మించడం, పున:సృజించడం దుర్లభం. గొర్రెల కాపరుల గొర్రెలు మేపుకునే ప్రాంతంలో వున్న కొండ కాబట్టి దీనిని మొదట్లో గొల్లకొండ అన్నారన్నది ఒక కథనం. ఇదే కాలక్రమాన గోల్కొండగా ప్రసిద్ధి చెందింది. కాకతీయలు కాలంలో నిర్మించగా 1363 సంవత్సరంలో బహుమనీ సుల్తానుల అధీనంలోకి వచ్చింది. వారి పతనం తర్వాత 1518లో కుతుబ్‌షాల పరమైంది ఈ ప్రాంతం. కుతుబ్‌షాల రాజధానిగా మారిన తర్వాత గోల్కొండ కోటను ఇంకా బాగా పటిష్ఠపరిచారు. వజ్రాల గనిగా పేరొందిన కోట గోల్కొండ. కుతుబ్‌షాల పాలనలో వుండగా ఔరంగజేబు కోట మీద భీకరమైన దాడి చేశాడు. శత్రు దుర్భేద్యమైన గోల్కొండ కోట దాదాపు ఎనిమిది నెలల యుద్ధం తర్వాత మొగలాయిల అధీనంలోకి వచ్చింది. ఔరంగజేబు యుద్ధానంతరం తిరిగి వెళుతూ మొగలుల దక్కన్‌ ప్రతినిధిగా ఆసఫ్‌జాను నియమించాడు. ఆయన నిజాం ఉల్‌ ముల్క్‌ అనే బిరుదును ధరించి స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో గోల్కొండ కోట నిజాం పాలకుల పరమైంది. ఇక్కడ జామా మసీదు కూడా ఉంది. thumb|గోల్కొండ కోట ప్రధాన ద్వారం పైన నగిషీ|260x260px అవార్డులు గోల్కొండ కోట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం ఉంది. 106 ఎకరాల్లో విస్తరించిన కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో 16 సమాధులు, 23 మసీదులు, ఆరు బావులు ఉన్నాయి. పౌరులు, పౌర సంస్థలు పునరుద్ధరించిన వారసత్వ సంపద కేటగిరీలో ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)ల నుండి కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్లబావికి ‘అవార్డ్‌ ఆఫ్‌ డిస్టింక్షన్‌’ అవార్డు వచ్చింది. కట్టడాల విశిష్టత, పౌరులు, పౌరసంస్థలు పునరుద్ధరించిన తీరు తదితర అంశాలపై జ్యూరీ సభ్యులు పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి అవార్డుకు ఎంపికచేశారు. సమీప భవనాలు ఖజానా బిల్డింగ్ మ్యూజియం: కుతుబ్ షాహి రాజులు తమ ధనాన్ని దాచడానికి ఖాజానాకోసం గోల్కొండ కోటకు సమీపంలో 1580లో దీనిని నిర్మించారు. ఈ భవనం 2013లో పునరుద్ధరించి మ్యూజియంగా మార్చబడింది. ఇవికూడా చూడండి తెలంగాణ కోటలు చిత్రమాలిక మూలాలు బయటి లింకులు గోల్కొండ - భారతదేశ ఇస్లామిక్‌ కట్టడాల ఛాయాచిత్రాల డేటాబేస్‌ భారతదేశ కట్టడాలు వర్గం:భారతదేశ చరిత్ర వర్గం:హైదరాబాదు పర్యాటక ప్రదేశాలు వర్గం:తెలంగాణ కోటలు వర్గం:ఈ వారం వ్యాసాలు hi:गोलकोण्डा
అంతర్జాలం
https://te.wikipedia.org/wiki/అంతర్జాలం
right|thumb|ప్రాంతీయతని కలుపుతు అంతర్జాలంలోకి చేర్చుతున్న చిత్రం అంతర్జాలాన్ని ఆంగ్లంలో "ఇంటర్నెట్" (Internet) అని అంటారు. అంతర్జాలము అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్ లను కలిపే నెట్‌వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు (రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపులో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు. అంతర్జాలము మాతృక ఇంటర్నెట్ ద్వారా ఎటువంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో సేకరించుకోవచ్చు. ఇంటర్నెట్ కంప్యూటర్లకు సమాచారం చేరవేసే అద్భుతమైన సాధనం. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్. ప్రపంచంలోని అన్నిరకాల నెట్ వర్కులన్నింటి వల్ల కమ్యూనికేషన్ ప్రక్రియలో కోట్లాది మంది వ్యక్తులు అనుసంధానంలో ఉంటారు.  మెషిన్లు శాటిలైట్లు, సర్వర్లు, కంప్యూటర్లు ఒకదానితో మరొక్కటి అనుసంధానించిన అసంఖ్యాకమైన స్టాప్‌వేర్ ప్రొగ్రాంలు ప్రపంచ వ్యాప్తంగా ఆయా కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉన్న బహ్మండమైన నెట్‌వర్క్.. ఇవన్నీ ఇంటర్నెట్‌లో భాగాలే. ప్రతిరోజూ కోట్లాది మంది సమాచారాన్ని తీసుకునే ఆధునాతనమైన కమ్యూనికేషన్ మీడియా ఇంటర్నెట్. వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వ పరిపాలనా దాకా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో మన దశ, దిశ గురించి తెలుసుకోవచ్చు.  ఇంటర్నెట్ మాతృకను అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. 1973లో ఇంగ్లాండు-నార్వే మధ్య ప్రపంచ మొట్టమొదటి కమర్షియల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రారంభమైంది. 1982లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట వాడ కం ప్రారంభమైంది. ప్రతి నిమిషం ఇంటర్నెట్ ద్వారా వేలకోట్ల రూపాయల వ్యాపా ర లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ రంగానికైనా కావలసిన సమాచారం ఇంటర్నెట్‌లో అవలీలగా లభ్యమవుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా వేలాది టీవీ చానళ్లు, వార్తాపత్రికలు అలాగే విద్యార్థుల చదువులు, ఫలితాలు, కౌన్సిలింగ్, రైతులు, మీ సేవా వంటి సేవలు ఇట్లా ఏ రంగాన్ని నెట్‌తో సంబంధం లేకుండా ఊహించుకోలేము. చరిత్ర ఇంటర్నెట్ చరిత్ర చాల పెద్దది. అమెరికా భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్పా(ARPA)" వారి నిధులతో సృష్టించబడింది. అంతర్జాలం పని చేసే విధానం చాలా మందికి ఇంటర్నెట్ కి వరల్డ్ వైడ్ వెబ్ కి మధ్య ఉన్న తేడా తెలియదు. ఈ రెండింటిని ప్రత్యామ్నాయ పదబంధాలుగా వాడెస్తూ ఉంటారు. అలా చెయ్యడం వల్ల కొంప ములిగిపోయే నష్టం ఏమీ లేదు కాని ఈ రెండింటికి మధ్య తేడా ఉండడం ఉంది. అంతర్జాలం వేగం సాంకేతిక ప్రపంచంలో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిపోయింది. అందుకని వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు పోటీ పడడం సహజం. పీ.సీ లకు మొబైల్ ఫోన్ లకు ఇంటర్నెట్ వేగం రకరకలా విధాలుగా 100 యంబీపీయస్ నుండి శక్తివంతమైన 4జీ (జెనరేషన్), కొన్ని ఏరియాల్లో 5జీ (జెనరేషన్) ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నది. మే 2019లో ఆస్ట్రేలియా 'అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని నమోదు చేసింది' సెకనుకు 44.2 టెరాబైట్స్‌ (టిబిపిఎస్). 2021 జూలైలో జపాన్‌కు చెందిన ఎన్‌ఐసీటీ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ప్రపంచంలోనే వేగవంతమైన ఇంటర్నెట్‌ను విజయవంతంగా పరీక్షించి రికార్డు నెలకొల్పారు. దీని ద్వారా సెకనుకు 319 టెరాబైట్స్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలను అందిచవచ్చని తేల్చారు. 2020లో ఇది 178 టెరాబైట్/సెకన్‌ గా నమోదు అయింది. ఈ ప్రయోగంలో అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీతోపాటు స్టాండర్డ్ అవుటర్ డయామీటర్‌, 4-కోర్ ఆప్టికల్‌ ఫైబర్‌ను ఉపయోగించారు. అలానే ఎర్బియం, థులియం కలయికతో రూపొందించిన ఫైబర్ యాంప్లిఫయర్‌, రామన్ యాంప్లిఫికేషన్ ద్వారా 3,001 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ఇంటర్నెట్‌ను ట్రాన్స్‌మిట్ చేసారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ link=https://en.wikipedia.org/wiki/File:NICT_National_Institute_of_Information_and_Communications_Technology.jpg|thumb|210x210px|టోక్యోలోని కోగనీలో NICT భవనం1896లో స్థాపించబడిన జపాన్ కమ్యూనికేషన్స్ రీసెర్చ్ లాబొరేటరీ,  టెలికమ్యూనికేషన్స్ అడ్వాన్స్‌మెంట్ ఆర్గనైజేషన్‌తో 2004లో విలీనం అయినప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (NICT) స్వతంత్ర పరిపాలనా సంస్థగా స్థాపించబడింది. NICT ప్రధాన లక్ష్యం సమాచారం, సమాచార సాంకేతిక రంగంలో పరిశోధన చేయడం తద్వారా అభివృద్ధి పరచడం. జపాన్ రేడియో చట్టం ఆధారంగా గ్లోబల్ మారిటైమ్ డిస్ట్రెస్ సేఫ్టీ సిస్టమ్ (GMDSS), మెరైన్ రాడార్ కోసం రేడియో పరికరాల రకం ఆమోద పరీక్షలను నిర్వహించడం; అయానోస్పియర్, అంతరిక్ష వాతావరణంపై సాధారణ పరిశీలనలను అందించడం. అలాగే జపాన్‌లో ఉన్న తక్కువ ఫ్రీక్వెన్సీ టైమ్ సిగ్నల్ రేడియో స్టేషన్ JJYని కూడా నిర్వహిస్తుంది. ఆగష్టు 2015 చివరలో, సంస్థ అభివృద్ధి చేసిన టెరాహెర్ట్జ్ రేడియేషన్ స్కానర్ ESA జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా తీసుకువెళ్ళే పరికరాలలో ఒకటిగా ఉంటుందని ప్రకటించబడింది. ఇది 2022లో ప్రారంభించబడుతుంది. అంతర్జాలం ఆధారిత మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో మొట్టమొదటి ఫోన్ నోకియా 9000 కమ్యూనికేటర్ 1996లో ఫిన్లాండ్‌లో విడుదలైంది. ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్ ఆలోచన ఈ నమూనా నుండి ధరలు పడిపోయే వరకు జనాదరణ పొందలేదు, ఫోన్‌లలో ఇంటర్నెట్‌ను అనుమతించడానికి నెట్‌వర్క్ ప్రొవైడర్‌లు సిస్టమ్‌లు, సేవల అభివృద్ధిని ప్రారంభించారు. అంతర్జాలం (ఇంటర్నెట్) అంతర్జాలం అంటే ఏమిటో చిన్న ఉదాహరణతో చెప్పడం తేలిక. మన దేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఊళ్లని ఎన్నింటినో కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ గుర్తించిన దేశపటాన్ని చూస్తే అంతా గజిబిజిగా అల్లిక అల్లిన గుడ్డలా గీతలు కనిపిస్తాయి. దీనిని మనం ఇంగ్లీషులో అయితే “రైల్వే నెట్‌వర్క్” (railway network) అంటాం. తెలుగులో కావలిస్తే “వలలా అల్లుకుపోయిన రైలు మార్గాలు” అని అనవచ్చు, లేదా టూకీగా “రైలు మార్గాల వలయం” అనో మరీ టూకిగా “రైలు వలయం” అనో అనొచ్చు. ఇప్పుడు ఒక్క సారి చరిత్రలో వెనక్కి వెళదాం. మనకి స్వతంత్రం రాక పూర్వం దేశంలో ఉన్న రైలు మార్గాలని బ్రిటిష్ ప్రభుత్వం నడిపేది కాదు; ప్రెవేటు రంగంలో కంపెనీలు నడిపేవి. మద్రాస్ సదరన్ మరాటా రైల్వే వారి మార్గం ఒకటి మద్రాసు నుండి వాల్తేరు వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఎం. ఎస్ .ఎం. రైలు వలయం (MSM rail network) అనేవారు. బెంగాల్ నాగపూర్ రైల్వే వారి మార్గం ఒకటి వాల్తేరు నుండి హౌరా వరకు వెళ్లేది. ఇలాంటి మార్గాలు వారికీ చాలా ఉండేవి. వీటన్నిటిని కలిపి బి. ఎన్. ఆర్. రైలు వలయం (BNR rail network) అనేవారు. ఇలాగే “నైజాం రైలు వలయం,” “మైసూర్ రైలు వలయం” వగైరాలు ఉండేవి. ఇవన్నీ వేర్వేరు రైలు వలయాలు. అయినప్పటికీ ఒకరి రైలు బళ్లు మరొకరి పట్టాల మీద ఇబ్బంది లేకుండా నడిచేవి. ఈ రకం ఏర్పాటుని “అంతర్‌వలయం” అనొచ్చు (అంతర్‌జాతీయం లా). అనేక దేశాల ఉమ్మడి సంస్థలకి పేర్లు పెట్టవలసి వచ్చినప్పుడు ఇంగ్లీషులో “ఇంటర్” (inter) అనే విశేషణం వాడతాం. అదే విధంగా అనేక వలయాలని ఉమ్మడిగా ఉపయోగించినప్పుడు ఆ ఉమ్మడి వలయాన్ని “ఇంటర్‌నెట్” అనొచ్చు; లేదా తెలుగులో “అంతర్‌వలయం” అనో “ఉమ్మడి వలయం” అనో పిలవచ్చు. చేపలని పట్టే వలని జాలం అనిన్నీ, పట్టేవాడిని జాలరి అనీ అన్నట్లే, పైన చెప్పిన రైలు మార్గాల అమరికని అంతర్జాలం అనిన్నీ ఈ అంతర్‌జాలాన్ని వాడే వారిని అంతర్‌జాలరులు అనిన్నీ కూడా అనొచ్చు. వరల్డ్ వైడ్ వెబ్(పపప) మా ఊరు రైలు స్టేషన్ లో “సామానులని నిల్వ చేసే గిడ్డంగి” (గొడౌను) ఉంది. దీనినే గోదాం అని కాని, మండీ అని కాని అంటారు. మా ఉరుపాటి ఊళ్లన్నిటిలోను ఇలాటి గిడ్డంగులు ఉంటాయి. మా ఊరు నుండి ఎగుమతి చేసే ఖద్దరు బట్టలు, బెల్లం, చింతపండు, అడ్డాకులు, తమలపాకులు, మామిడి పళ్లు, వగైరాలు ఈ గిడ్డంగిలో ఉన్న గదులలో పేర్చేవారు - బండి వచ్చి బరువులు ఎక్కించుకుని మోసుకుపోయేవరకు. ఇలా ప్రతి ఊళ్లోను ఎగుమతులు, దిగుమతులు చెయ్యవలసిన సరకులని దాచడానికి గిడ్డంగి గదులు ఉంటాయి కదా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అల్లుకుపోయిన గిడ్డంగులని “విశ్వ వ్యాప్త గిడ్డంగుల అల్లిక” అందాం. దీనినే ఇంగ్లీషులో అంటే “వరల్డ్ వైడ్ వెబ్” (World Wide Web) అవుతుంది. ఇక్కడ “వెబ్” అన్న పదం “స్పైడర్ వెబ్” (spider web) లాంటి ప్రయోగం కనుకనున్నూ, “స్పైడర్ వెబ్”ని తెలుగులో “సాలె గూడు” అని కాని, “సాలె పట్టు” అని కాని అంటాము కనుకనున్నూ, “వరల్డ్ వైడ్ వెబ్” (world wide web లేదా WWW) ని “ప్రపంచ పరివ్యాప్తమైన పట్టు” లేదా “పపప” అనొచ్చు. రైలు పట్టాలు లేకుండా కేవలం గిడ్డంగులు, ఆ గిడ్డంగులలో సామానులు ఉండి మాత్రం ఏమి లాభం? అలాగే రైలు మార్గాలు ఉండి, వాటి మీద రవాణా చెయ్యడానికి సరుకులు లేకపోతే ఏమి ప్రయోజనం? కనుక రైలు మార్గం లాంటి ఇంటర్‌నెట్టూ, అల్లుకుపోయిన గిడ్డంగులు లాంటి వర్లడ్ వైడ్ వెబ్బూ, రెండూ ఉంటేనే ప్రయోజనం. ఇంటర్‌నెట్ రవాణాకి కావాలి. వెబ్ సరుకులు దాచుకునేందుకు కావాలి. ఈ ఉపమానం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు రైలు మార్గాలకి బదులు సమాచార ప్రసార మార్గాలు – అంటే టెలిఫోను సౌకర్యాలలాంటివి – చూద్దాం. రైలు మార్గాలలాగే ఈ సమాచార ప్రసార మార్గాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సమాచార వలయానికి (అంతర్జాలానికి, ఇంటర్‌నెట్‌కి) మన కంప్యూటరుని (మన గిడ్డంగిని లేదా మన వెబ్ పేజిని) తగిలించేమనుకొండి. మనం ఇతరులతో పంచుకోవాలనుకున్న వ్యాసాలు, కథలు, ఛాయాచిత్రాలు, పాటలు, వగైరాలని మన కంప్యూటర్‌లో ఉన్న మన “గిడ్డంగి”లో పెడితే అప్పుడు అవన్నీ ఆ సమాచార వలయంతో లంకించుకున్న వారందరి అందుబాటులోకి వస్తాయి. టూకీగా ఇదీ కథ. మనం ఇతరులతో పంచుకోదలచిన సమాచారాన్ని కంప్యూటర్‌లో ఎక్కడ దాచుకుంటామో ఆ స్థలం “మన వెబ్‌సైట్” లేదా తెలుగులో “మన గిడ్డంగి” అనో “మన ఆటపట్టు” అనో అందాం. ఈ ఆటపట్టులో ఉండేవి చింతపండు, బెల్లం కాదు - సమాచారం. కనుక ఈ “వెబ్ సైట్” (ఆటపట్టు) ని పుస్తకంలో పేజీలలా అమర్చుకుంటే చదివేవారికి సదుపాయంగా ఉంటుంది. అప్పుడు ప్రతి పేజీని “వెబ్ పేజ్” (web page) లేదా “పట్టు పుట” అని కాని “పట్టు పత్రం” అని కాని అనొచ్చు. పుస్తకానికి ముఖపత్రం ఎలాంటిదో అలాగే ఆటపట్టు (“వెబ్ సైట్”) కి ముఖపత్రం (“హోం పేజి”) అలాంటిది. పుస్తకం కొనేవాడు అట్ట మీద బొమ్మ చూసి కొంటాడు. ఇంట్లోకి వచ్చేవాడు వీధి వాకిలి ఎలా ఉందో చూస్తాడు. కనుక ప్రతి వెబ్ సైట్ కి అందంగా ఉన్న ముఖపత్రం ఒక ముఖ్యమైన అంగం. డొమెయిన్ పేరు లేదా ఇలాకా పరిధి ఇళ్లకి చిరునామాలు లేదా విలాసాలు ఉన్నట్లే ఈ వెబ్ సైట్లకి (ఆటపట్లకి) కూడా చిరునామాలు ఉంటాయి. చిరునామాలో వ్యక్తి పేరో, సంస్థ పేరో ఉండడమే కాకుండా, ఊరు పేరు దేశం పేరు ఉంటాయి అన్న విషయం మరచిపోకండి. వెబ్ సైట్ల చిరునామాని ఇంగ్లీషులో URL (Universal Resource Locator) అంటారు. ఉదాహరణకి https://web.archive.org/web/20170926174924/http://friendsoftelugu.org/ అనే చిరునామానే తీసుకుందాం. ఇందులో http అనేది ఇది ఏ రకం వెబ్ సైటో చెబుతుంది. అంటే వెబ్ సైట్లలో రకాలు ఉంటాయన్నమాట. తరువాత ://ని చూడగానే కంప్యూటర్ (బ్రౌజర్) రాబోయేది "ఒకానొక రకం" వెబ్ సైటు విలాసం అని తెలుసుకుంటుంది. ఈ విలాసంలో “మాటకీ మాటకీ మధ్య” చుక్కలు మాత్రమే ఉండొచ్చు (కామాలు, కోలన్లు, వగైరా విరామ చిహ్నాలు నిషిద్ధం). తరువాత Friendsoftelugu అనేది వెబ్ సైటు పేరు. తరువాత చుక్క, ఆ చుక్క తరువాత “ఆర్గ్” (org) - అంటే ఇది ఏ రకం సంస్థో చెబుతోందన్న మాట. దీనిని ఇంగ్లీషులో “డొమైన్ నేం” (domain name) అంటారు; తెలుగులో “ఇలాకా పేరు” అందాం. ఇలాకా అంటే అధికార పరిధి అని అర్థం. ఎక్కువ తరచుగా తారసపడే ఇలాకా పేరు (domain name) “డాట్ కాం” (.com) ; దీనిని వ్యాపార సంస్థలకి కేటాయించేరు. విద్యాసంస్థలు వాడే ఇలాకాని “డాట్ ఇడియు” (.edu) అంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకి బయట ఇలాకా పేరు తరువాత ఆయా దేశాల పేర్లు, రెండక్షరాల సంక్షిప్తం రూపంలో, వాడతారు. ఇండియాలో ఉన్న సంస్థల పేర్ల చివర “డాట్ ఇన్” (.in) అని ఉండడం గమనించే ఉంటారు. సాధారణంగా పైన ఉదహరించిన URL చివర /index.html అని మరొక అంశం ఉండొచ్చు. ఒక వెబ్ సైట్ లో ఎన్నో పుటలు పుస్తకరూపంలో అమర్చి ఉన్నాయని అనుకుందాం. అపుడు https://web.archive.org/web/20170926174924/http://friendsoftelugu.org/ అనే విలాసం మాత్రమే వాడితే ఆ పుస్తకంలో ఏ పేజీకి వెళ్లాలి? మనం ఏ పేజీకి వెళ్లాలో నిర్ద్వందంగా చెప్పలేదు కనుక కంప్యూటరు మనని “విషయసూచిక” ఉన్న పేజీకి తీసుకెళుతుంది. ఈ విషయసూచిక ఉన్న పేజీ పేరే index.html. మన ఇంటికి వచ్చేవారంతా వీధి గుమ్మంలోకి వచ్చి తలుపు తడితే బాగుంటుంది కాని పాలవాడు పెరటి గుమ్మంలోకి వచ్చి పెళ్లాంతో సరసాలాడతానంటే ఏమి బాగుంటుంది? అందుకని పట్టు పుటని index.html పేజిగా నిర్మిస్తే మన వెబ్ సైట్‌కి వచ్చేవారందరికీ ముందుగా ముఖపత్రం కనిపిస్తుంది. ప్రపంచంలోని ముఖ్యమైన డొమైన్ల జాబితాని ఇక్కడ చూడవచ్చు. తెలుగులో కూడా డొమైన్‌ పేరు ఇక నుంచి తెలుగులోనూ వెబ్‌సైట్‌ డొమైన్‌ పేరు రాసుకోవచ్చు. విదేశీ డొమైన్లపై లాభాపేక్షలేని సంస్థ 'ద ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఆసియాన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌' (ఐసీఏఎన్‌ఎన్‌) భారత్‌కు చెందిన ఏడు భాషలకు ఆమోదం తెలిపింది. ఆంగ్లేతర భాషల్లోనూ డొమైన్ల పేర్లకు ఆహ్వానం పలికిన ఆ సంస్థ తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ భాషలనూ అనుమతించింది. (ఈనాడు3.11.2009) అంతర్జాల విలాసం (ఇంటర్నెట్ అడ్రస్) లేదా ఐపి అడ్రసు డొమెయిన్ నేమ్‌ (ఇలాకా పేరు) కీ ఇంటర్నెట్ ప్రోటోకోల్ (IP) అడ్రస్ (అంతర్జాల విలాసం) కీ మధ్య తేడా ఉంది. టూకీగా చెప్పాలంటే ఇలాకా పేరు మనుష్యులకి అర్థం అయే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో సృష్టించింది. IP అడ్రస్ యంత్రాలకి అర్థం అయే రీతిలో సృష్టించింది. ఐపి అడ్రసుకు ఉదాహరణలు: 192.168.0.167 203.178.193.23 ఈ సంఖ్యలు మానవులకి అర్థం అవాలని సృష్టించినవి కావు. కాని ప్రతి కంప్యూటరుకి ఈ రకం సంఖ్యలు కేటాయించబడి ఉంటాయి. ఉదాహరణకి మాత్రమే - పైన్ ఇచ్చిన మొదటి ఐపి అడ్రసుకి ఈ దిగువ ఊహించిన విధంగా అర్థం చెప్పుకోవచ్చు: 192 అనేది ఇండియాకి సంకేతం అనుకుందాం. 168 ఉభయ గోదావరి జిల్లాలకి సంకేతం అనుకుందాం. తరువాత వచ్చే 0 మొగల్తుర్రు ఊరికి సంకేతం అనుకుందాం. చివరన ఉన్న 167 వేమూరి పార్వతీశం గారి ఇంటికి సంకేతం అనుకుందాం. అప్పుడు 192.168.0.167 అనేది బారిష్టరు పార్వతీశం గారి ఇంట్లో కంప్యూటరు అని తెలుస్తుంది. కాని ఈ సంఖ్యలని ఎవరు గుర్తు పెట్టుకోగలరు. అందుకని బారిష్టరు పార్వతీశం తన స్నేహితులకి https://web.archive.org/web/20170926174924/http://friendsoftelugu.org/ అనే చిరునామాని ఇస్తారు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసినది Friendsoftelugu.org అన్న భాగం. ఇది URLకి IP అడ్రెస్ కి ఉన్న అవినాభావ సంబంధం. వెబ్ బ్రౌజర్ అంటే ఏమిటి? ముందు బ్రౌజర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కంప్యూటర్ యుగానికి ముందే ఈ మాట ఇంగ్లీషు భాషలో వాడుకలో ఉంది. గ్రంథాలయానికి వెళ్లినప్పుడు కాని, పుస్తకాల దుకాణానికి వెళ్లినప్పుడు కాని మనం సాధారణంగా అట్ట మీద బొమ్మ చూసో, పేరు చూసో ఒక పుస్తకాన్ని ఎన్నుకుని విప్పి చూస్తాం. ఒక నిమిషం పోయిన తరువాత ఆ పుస్తకాన్ని తిరిగి బీరువాలో పెట్టెస్తాం. మరొక పుస్తకం తీస్తాం, చూస్తాం, పెట్టెస్తాం. ఈ రకం పనిని “బ్రౌజింగ్” అంటారు. ఈ పని చేసే వ్యక్తిని "బ్రౌజర్" అంటారు. అంటే తెలుగులో “చూడ్డం, పరిశీలించడం, వీక్షించడం,” వగైరా పనులని "వీక్షించడం" అనిన్నీ, ఆ పని చేసే వ్యక్తిని "వీక్షకి" అనిన్నీ అందాం. చీరల కొట్లోకి వెళ్లి మన ఆడవాళ్లు చేసే పనిని కూడా “బ్రౌజింగ్” అనొచ్చు. అంతర్జాలంలో విహరించడానికి ఉపయోగపడే సాధనం కనుక దీనిని తెలుగులో విహరిణి అంటున్నారు. “వెబ్ బ్రౌజింగ్” అంటే జాల విహారం. అంటే, పైన చెప్పిన పనినే పుస్తకాల దుకాణంలోనో, గ్రంథాలయంలోనో, చీరల కొట్లోనో కాకుండా “పపప” మీద చెయ్యడం. వరల్డ్ వైడ్ వెబ్ (పపప) అంటే ప్రపంచవ్యాప్త పట్టు పుటల సమాహారం అనుకున్నాం కదా. మనం మన ఇంట్లో మన కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పేజీలన్నీటిని ఎలా చూడడం? ఈ పని చెయ్యడానికి ప్రత్యేకంగా రాసిన ఒక క్రమణిక (program) కావాలి. ఈ క్రమణికనే “వెబ్ బ్రౌజర్” అంటారు. వెబ్ బ్రౌజర్ అంటే నిరవాకి (operating system) కాదు, అన్వేషణ యంత్రం (search engine) కాదు. ఈ వెబ్ బ్రౌజర్ అనే క్రమణికకి మనం ఒక "వెబ్ సైటు" చిరునామా ఇస్తే ఆ చిరునామా గల పట్టుపుటలో ఏముందో వెబ్ బ్రౌజర్ తెర మీద చూపిస్తుంది. కనుక దీనిని "పట్టు దర్శని" అనొచ్చు. మనకి బజారులో రకరకాలైన పట్టు దర్శనులు దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు ఎక్స్‌ప్లోరర్ (Explorer) కి మద్దత్తు ఇస్తే, ఏపిల్ కంపెనీ వారు సఫారీ (Safari) కి మద్దత్తు ఇస్తున్నారు. గూగుల్ కంపెనీ వారు క్రోం (Chrome) ని వెనకేసుకొస్తున్నారు. ఏ కంపెనీకి చెందని జనతా దర్శని పేరు ఫైర్‌ఫాక్స్ (Firefox). ఒకరి గణాంకాల ప్రకారం వీటన్నిటిలోను ఎక్కువ జనాదరణ పొందినవి, ఆ క్రమంలో, క్రోం, ఫైర్‌ఫాక్స్, ఎక్స్‌ప్లోరర్, సఫారీ. తమాషా ఏమిటంటే అన్ని దేశాలలోనూ ఈ జనాదరణ ఒకేలా లేదు. ఇక్కడ చెప్పిన గణాంకాలు బల్ల మీద పెట్టుకుని వాడుకునే కంప్యూటర్ల విషయంలోనే. అరచేతిలో ఇమిడే కంప్యూటర్ల విషయానికి వస్తే సఫారీ ఎక్కువ ఆదరణలో ఉన్నట్లు కనిపిస్తోంది. కనుక గణాంకాలని గభీమని గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు. అంతర్జాలంలో మనకు లభించే సేవలు రహదారులు ఉండబట్టి మనకి రవాణా సౌకర్యాలు లభించినట్లే, ఇంటర్నెటు ఉండటం వల్ల మనకి అనేకమైన సౌకర్యాలు, సేవలు (services) లభిస్తున్నాయి. రహదారురహదారులు వెంబడి టపాలు బట్వాడా చేసినట్లే అంతర్జాలం మీద బట్వాడా అయే టపాలని ఈ-టపా లేక ఈ-మెయిలు అంటారు. ఇక్కడ ఈ అనే అక్షరం ఇంగ్లీషులో Electronic అనే మాటకి సంక్షిప్తం. కావలిస్తే దీనిని తెలుగులో విద్యుత్-టపా లేదా వి-టపా అనొచ్చు. internet is on smart phone in india from year 2008 so the net usage increses inindia india is one of the hiegest net userfs in the world net is usefull for education and online servies and communicaiton రహదారులు ఉండబట్టే మనం ఇరుగు పొరుగులకి వెళ్ళి బాతాఖానీ కొట్టి రాటానికి వీలయింది. అలాగే ఈ విద్యుత్‌ రహదారిని ఉపయోగించి, ఇల్లు వదలి బయటకి వెళ్ళకుండా బాతాఖానీ కొట్టొచ్చు. ఈ బాతాఖానీనే ఇంగ్లీషులో చాటింగ్ (Chatting) అంటారు. రహదారులు ఉండబట్టే ఆ రహదారురహదారులు వెంబడి గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు, పత్రికలు చదవటానికి సానుకూలం అయింది. అదే విధంగా ఈ అంతర్జాలపు రహదారి వెంబడి మనం ప్రపంచం అంతా "తిరిగి" బహిరంగంగా ఉన్న గ్రంథాలయాలే కాకుండా ఇంటింటా ఉన్న సొంత గ్రంథాలయాలని కూడా దర్శించి విషయ సేకరణ చెయ్యవచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్ఞాన సంపదనే 'వరల్డ్ వైడ్ వెబ్' అంటారు. వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా లభించే సేవ. ఇందులో వెబ్ సైట్సు, బ్లాగులు, మొదలయిన ఎన్నో పేజీలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని మనం వాడుకనేందుకు వాడే సాఫ్టువేర్ అనువర్తనాన్ని బ్రౌజర్ లేదా విహరిణి అంటారు. అంతెందుకు మీరు ఇప్పుడు చదువుతున్న వికీపిడియా కూడా వరల్డ్ వైడ్ వెబ్ లో బాగమే. వరల్డ్ వైడ్ వెబ్ ను పలకటానికి సులువుగా ఉంటుందని వెబ్ అని పిలుస్తుంటారు. వెబ్ తరువాత ఇంటర్నెటులో ఈ-మెయిల్ అత్యధికంగా ఉపయోగించబడే సేవ. మన పోస్టలు సేవకు మల్లేనే ఇందులో మనము ఉత్తరాలు వాటికి ప్రత్యుత్తరాలు పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కాగితం అవసరంలేదు. కేవలం సమాచారం ఉంటే చాలు. చాటింగ్ లేదా ఇన్స్టెంట్ మెసేజింగ్ కూడా ఈ-మెయిల్ వంటిదే, కానీ సమాచారమును మరింత తొందరగా చేరవేస్తుంది, కాకపోతే కొద్ది సమాచారమును మాత్రమే పంపించగలము. సినిమాలంటే ఇష్టం ఉన్న వారు "మూవీ డేటాబేస్" (IMDB) కి వెళ్లి కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు. పోర్టల్ రకరకాలసేవలను అందించే ప్రత్యేక వెబ్సైటులను వెబ్ పోర్టల్ అంటారు. పోర్టల్ ని తెలుగులో గవాక్షం అంటున్నారు. ఇవి తెలుగు భాషలో లభ్యమవుతున్నాయి భిన్నాభిప్రాయాలు అయితే కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఇంటర్నెటు ఒక్క చెడ్డ వ్యవస్థ అనే అభిప్రాయం కలిగి ఉన్నాయి. అవి ఇంటర్నెటులోని కొన్ని భాగాలను తమ దేశాలలో ప్రజలు వాడుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఉదాహరణకు, చైనాలో ప్రజలు ఎవరు కూడా మీరు చదువుతున్న ఈ వికీపిడియాను చదవలేరు, మార్పులు కూడా చేయలేరు. అంతేకాదు కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంటర్నెటు చాలా కీడు చేస్తుందని భావిస్తుంటారు. అంతర్జాలం వల్ల కలిగే నష్టాలు ప్రమాదకరమైన సైట్లకు వెళ్ళినట్లయితే, మీ కంప్యూటరుకు వైరస్ సోకి చెడిపోయే ప్రమాదం ఉంది. ' అంతర్జాలంలో ఇంకా సమర్ధమయిన monitoring systems లేవు. కనుక చిన్నపిల్లలు పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సైట్లకు వెళ్ళినట్లయితే వారి మనసుల మీద దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాలంలో అనవసర విషయాల వల్ల మన అముల్యమైన సమయం వృధా అవుతుంది.కనుక మంచి, అవసరమైన విషయాల కోసం ఉపయోగించాలి. ఇంటర్నెట్ అంటే ఏమిటి ? ఇంటర్నెట్ అంటే ఏమిటో మరిత సమాచారం బయటి లింకులు the linux and microsoft iis softwares are used in web side design and web software that arein all computers servers in space stations and satilites the os are linux based computers for scientific applicaiton the microsoft and linux computer servers are jointly developing the software for commercial and software developments software in internet informaiton servers the linux servers are fastest servers for connectivity and smart phones are linux based androd operating systems that are on internet connected dives are used smart phones and computers and satilites and cable networks are are based on internet -A.Gopal-Assistant Proffeossr computing engineering Admin officer—orugallu technologhy india enginering services orugallu technology india enginering services-hanamkonda, warangal city-ts-India novemebr 2017 -అధికారిక వెబ్సైటు :[ లింక్] "10 Years that changed the world" — Wired looks back at the evolution of the Internet over last 10 years Berkman Center for Internet and Society at Harvard CBC Digital Archives—Inventing the Internet Age The Internet Society History Page RFC 801, planning the TCP/IP switchover Archive CBC Video Circa 1990 about the Internet European Future Internet Portal Preparing Europe’s digital future - i2010 Mid-Term Review Ringmar, Erik. A Blogger's Manifesto: Free Speech and Censorship in the Age of the Internet (London: Anthem Press, 2007). ప్రచురణలు పుస్తకాలు ఉపన్యాసాలు విశేషాలు ఇవి కూడా చూడండి మెషీన్ లెర్నింగ్ మూలాలు వర్గం:అంతర్జాలం వర్గం:కంప్యూటర్ వర్గం:అభిరుచులు
బ్లాగు
https://te.wikipedia.org/wiki/బ్లాగు
thumbnail|250px|ఒక తెలుగు బ్లాగు బ్లాగు (blog) అనే పదం వెబ్‌లాగ్ (weblog) అనే పదాన్ని సంక్షిప్తంగా చేయడంతో వచ్చింది. బ్లాగు అంటే మామూలు వెబ్‌పేజీయే, కాకపోతే ఇందులో రాసిన జాబులు తేదీల వారీగా. చివరగా రాసిన జాబులు ముందు చూపిస్తూ అమర్చి ఉంటాయి. వ్యక్తిగత డైరీల నుండి రాజకీయ ప్రచారాల దాకా, వివిధ మాధ్యమాల కార్యక్రమాల నుండి పెద్ద కంపెనీల వరకు, అప్పుడప్పుడు కలం విదిల్చే రచయితల నుండి అనేక మంది చెయ్యితిరిగిన రచయితల సామూహిక రచనల దాకా బ్లాగులు విస్తరించాయి. చాలా బ్లాగుల్లో చదువరులకు వ్యాఖ్యలు రాసే వీలు కలగజేస్తారు. అలా వ్యాఖ్యలు రాసేవారితో ఆ బ్లాగు కేంద్రంగా ఒక చదువరుల సమూహం ఏర్పడుతుంది; మిగతా వాళ్ళు కేవలం చదివి 'పారేసే' వాళ్ళన్నమాట. ఈ బ్లాగులూ, వాటికి సంబంధించిన వెబ్‌సైట్లూ అన్నిటినీ కలిపి బ్లాగోస్ఫియరుఅని దాన్ని తెలుగులో బ్లాగావరణం అని అంటారు. ఏదైనా ఒక విషయం గురించి, లేక వివాదం గురించి బ్లాగుల్లో వాద ప్రతివాదాలు చెలరేగితే వాటిని బ్లాగ్యుద్ధాలు, బ్లాగు తుఫానులు అంటారు. బ్లాగులు రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. మామూలు బులెట్‌జాబితా లాగా పేర్చిన హైపరులింకుల (hyper links) వంటి వాటి నుండి, పాఠకుల వ్యాఖ్యలు, రేటింగులతో కూడిన సంక్షిప్త వ్యాసాల దాకా ఉంటాయి. వ్యక్తిగత బ్లాగు జాబులన్నీ కూడా తేదీ, సమయం ప్రకారం అన్నిటి కంటే కొత్తవి అన్నిటి కంటే పైన కనపడేలా అమర్చబడి ఉంటాయి. పాఠకుల వ్యాఖ్యలు జాబుకు అడుగున ఉంటాయి. బ్లాగులకు లింకులు చాలా ముఖ్యం కనుక పాత జాబులను ఓ క్రమపద్ధతిలో అమర్చి ప్రతీ జాబుకూ ఓ స్థిర లింకును కేటాయించే ఏర్పాటు ఉంటుంది. ఈ స్థిర లింకునే పెర్మాలింకు అంటారు. కొత్త వ్యాసాలు, వాటి లింకులు అర్ ఎస్ ఎస్ (RSS) లేదా ఆటమ్ (Atom లేదా ఎక్స్ఎమ్ఎల్ (XML ) పద్ధతుల్లో అందిస్తున్నారు. వీటిని ఏ ఫీడురీడరు ద్వారానైనా చదువుకోవచ్చు. బ్లాగుల రచన, కూర్పు, ప్రచురణ ఎక్కువగా కంటెంటు మేనేజిమెంటు సిస్టము లేదా CMS ద్వారా చేస్తారు. చరిత్ర తొలుదొల్త ఎలెక్ట్రానిక్ సమాజాలు ఇంటర్నెట్టుకు పూర్వమే ఉన్నాయి. ఉదాహరణకు అసోసియేటెడ్‌ప్రెస్ వారి వైరు ఓ పెద్ద చాట్ గది లాగా ఉండేది. ఎలెక్ట్రానిక్ సంభాషణలు, వైరు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. హ్యాం రేడియో ఈ ఎలెక్ట్రానిక్ సమాజానికి మరో ఉదాహరణ. ఈ హ్యాం రేడియో వినియోగదారులు సైబోర్గ్‌లాగ్ (గ్లాగ్) అని వ్యక్తిగ్త డైరీలు రాసేవారు. బ్లాగులు వ్యాపించక ముందు, Usenet, ఈమెయిలు జాబితాలు, బులెటిన్‌బోర్డులు మొదలైనవి ఉండేవి. 1990 లలో WebX లాంటి ఇంటర్నెట్టు సాఫ్టువేర్లు నిరంతరంగా సాగుతూ ఉండే సంభాషణలను వీలైన సాఫ్టువేరును సృష్టించాయి. ప్రస్తుతం బ్లాగుల్లో వాడుకలో ఉన్న అనేక పదాలు వీటిలో రూపుదిద్దుకున్నవే. కొంతమంది ఇంటర్నేట్లో జర్నళ్ళను ప్రచురించారు. ఆటల సాఫ్టువేరు ప్రోగ్రాములు రాసే జాన్ కార్మార్క్ రాసిన జర్నలు ప్రసిద్ధి చెందింది. బ్లాగు ప్రారంభం వ్యక్తిగత పేజీలతోపాటు బ్లాగ్‌రోల్సూ, ట్రాక్‌బాక్ వంటి లింకులు, వ్యాఖ్యల వంటి లింకులను తేలిగ్గా అమర్చుకునే వీలును బ్లాగు కలిగించింది. కొంత మంది నియంత్రణలో ఉండే ఫోరములు, ఎవరైనా చర్చ మొదలుపెట్టగలిగే మెయిలు జాబితాలకు భిన్నంగా సొంతదారు నియంత్రణలో ఉంటూ వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా బ్లాగు ఉంటుంది. 1994 లో స్వార్త్‌మోర్ కాలేజీలో చదివేటపుడు బ్లాగటం మొదలుపెట్టిన జస్టిన్ హాల్‌ను తొలి బ్లాగరులలో ఒకడిగా భావిస్తారు. 1997లో జాన్ బార్జర్ మొదటిసారిగా "వెబ్‌లాగ్" అనే మాటను వాడాడు. పీటర్ మెర్హోల్జ్ 1999 ఏప్రిల్, మేల్లో ఈ మాట ఇంగ్లీషు స్పెల్లింగుతో చిన్న ప్రయోగం చేసాడు. Weblog అనే ఒక పదాన్ని విడగొట్టి we blog అనే పదబంధంగా మార్చి తన బ్లాగులో పెట్టాడు. బ్లాగ్ అనేది వెబ్‌లాగ్ కి పొట్టిపదంగానూ, దాని క్రియగానూ భావించారు. క్రమేణా వెబ్‌లాగ్‌కు బ్లాగ్ అనే పేరే స్థిరపడి పోయింది. సరిగ్గా అదే సమయంలో వెలుగు చూసిన మొదటి బ్లాగు హోస్టింగు సైట్లయిన బ్లాగర్ (2004 లో గూగుల్ కొనేసింది), గ్రోక్‌సూప్లు ఈ మాటకు మరింత ప్రచారాన్ని తీసుకువచ్చాయి. 2003 మార్చిలో వెబ్‌లాగ్ అనేమాట నిఘంటువులకు ఎక్కింది. బ్లాగులంటే కేవలం మామూలు వెబ్‌సైట్ల లాగా కాక, వాటికి కొత్త హంగులు చేర్చి శోభ తెచ్చిన వ్యక్తి డేవ్ వైనర్. ఆయన ఓ సర్వరును సృష్టించాడు.. బ్లాగులో ఏదైనా మార్పు చేర్పులు జరగ్గానే సదరు బ్లాగు ఈ సర్వరును తట్టి, తనకు మార్పులు జరిగిన విషయం తెలియజేస్తుంది. బ్లాగ్‌రోలింగు వంటి పరికరాలను వాడి తమకిష్టమైన బ్లాగుల్లో ఎప్పుడు మార్పులు చేర్పులు జరుగాయో వినియోగదారులు తెలుసుకోగలిగారు. ప్రభావశీలంగా బ్లాగు సెప్టెంబర్ 11 దాడుల తరువాత అమెరికాను సమర్ధించే బ్లాగులు ఎన్నో వచ్చాయి. ఆ సంఘటననకు సంబంధించిన సమాచారం మరింత తెలుసుకునేందుకు, దాన్ని అర్థం చేసుకునేందుకు పాఠకులు ఈ బ్లాగులను ఆదరించారు. 2002 నాటికి వీటిలో చాలా బ్లాగులు అమెరికా ఇరాక్ ఆక్రమణను, సామూహిక మారణాయుధాల నిల్వల ఏరివేతనూ సమర్ధించాయి. ఈ యుద్ధ బ్లాగరులు ఎక్కువగా యుద్ధ సమర్ధకులైన మిత వాదులే అయినప్పటికీ, తరువాతి కాలంలో ఇరాక్ యుద్ధం గురించి రాసేవారంతా - వారి దృక్కోణం ఎలా ఉన్నప్పటికీ - యుద్ధ బ్లాగరుల కోవలోకి వచ్చేలా ఈ పదం కొత్త అర్థం సంతరించుకుంది. 2003లో ఫోర్బెస్ పత్రిక ఉత్తమ యుద్ధబ్లాగులను సంకలనం చేసినపుడు యుద్ధ బ్లాగరులను ఈ కొత్త అర్థంలోనే వాడింది. మొదటి బ్లాగు వివాదం బహుశా "ట్రెంట్ లాట్ పతనం" అయి ఉండవచ్చు. స్ట్రోం థర్మండ్ గౌరవార్థం ఇచ్చిన ఓ విందులో థర్మండ్ నాయకత్వ లక్షణాల కారణంగా అయ్యన ఒక ఉత్తమ అధ్యక్షుడు కాగలడని లాట్ వ్యాఖ్యానించాడు. థర్మండ్ తన రాజకీయ జీవితపు తొలిన్నాళ్ళలో తెల్ల జాత్యహంకారుల సానుభూతిపరుడుగా ఉండేవాడు. దీంతో అతన్ని పొగడిన లాట్‌ను ప్రజలు జాతి దురహంకారిగా భావించారు. తరువాతి కాలంలో జరిగిన పరిణామాల్లో జోష్ మార్షల్ వంటి బ్లాగర్లు ఈ విషయంపై దాడిని కొనసాగించారు. ఆయన వ్యాఖ్యలు ఏదో పొరపాటున నోరుజారి చేసినవి కావనీ, లాట్ స్వతహాగానే జాతి దురహంకారి అనీ వాదిస్తూ ఆయన చేసిన మరి కొన్ని ప్రసంగాలను ఉదహరిస్తూ తమ బ్లాగుల్లో రాసారు. ఈ ప్రయత్నాల మూలంగా వత్తిడి పెరిగి చివరికి సెనేట్ మెజారిటీ నాయకుడిగా లాట్ రాజీనామా చెయ్యవలసి వచ్చింది. ఆ సరికి బ్లాగు ఒక గొప్ప ఆవిష్కరణగా మారింది. బ్లాగు ఎలా సృష్టించాలి, జాబులు ఎలా రాయాలి మొదలైన అంశాలను నేర్పిస్తూ వ్యాసాలు రాసాగాయి. ఇతర ప్రాజెక్స్టులకు వ్యాప్తి కలిగించడంతో పాటు, ఎలెక్ట్రానిక్ సమాజాలను నిర్మించడంలో బ్లాగుల ప్రాముఖ్యత గురించి కూడా వ్యాసాలు వచ్చాయి. జర్నలిజం కళాశాలలు బ్లాగులను పరిశీలిస్తూ, వాటికి, ప్రస్తుత జర్నలిజం పద్ధతులకు మధ్య తేడాలను గుర్తించే పని మొదలుపెట్టాయి. వార్తలను, విశేషాలను వెల్లడి చెయ్యడం, వార్తా వ్యాసాలు రాయడం, వ్యాపింపజెయ్యడం మొదలైన అంశాల్లో వాటి పాత్ర కారణంగా బ్లాగుల ప్రాచుర్యం 2003 నుండి దినదినాభివృద్ధి చెందింది. 2003 ఇరాక్ యుద్ధం బ్లాగు ప్రస్థానంలో ఒక ప్రముఖ సంఘటన. మితవాదులూ, వామపక్షవాదులూ ఈ విషయంపై పరిణతితో కూడిన అభిప్రాయాలను వెల్లడించారు. ఇరాక్ యుద్ధ వార్తలతో కూడిన బ్లాగులు ఒక విస్ఫోటనం లాగా అకస్మాత్ ప్రజాదరణ పొందాయి. ఫోర్బెస్ పత్రిక ఈ వ్యవహారాన్ని అక్షరబద్ధం చేసింది. హొవార్డ్ డీన్, వెస్లీ క్లార్క్ లాంటి రాజకీయవేత్తల బ్లాగులు తమ అభిప్రాయాలను ప్రకటించేందుకు బ్లాగులను వాడుకోవడంతో వార్తా కేంద్రాలుగ వారి ప్రాశస్త్యం మరింత బలపడింది. డేనియల్ డ్రెజ్ఞర్, జె.బ్రాడ్‌ఫోర్డ్ డిలాంగ్ వంటి విషయ నిపుణులు బ్లాగులు రాయడం కారణంగా లోతైన విశ్లేషణా కేంద్రాలుగా బ్లాగులు పేరుపొందాయి. 2003 ఇరాక్ యుద్ధాన్ని ఓ రకంగా మొదటి బ్లాగు యుద్ధంగా చెప్పవచ్చు. బాగ్దాదు బ్లాగరుల బ్లాగులకు పాఠకాదరణ బాగా పెరిగింది. సలీం పాక్స్ అనే బ్లాగరి తన బ్లాగును ఒక పుస్తకంగా ప్రచురించాడు. ఇరాక్ యుద్ధంలో పాల్గిన్న సనికుల్లో కూడా బ్లాగులు రాయడం పెరిగిపోయింది. వీరి బ్లాగుల ద్వారా ప్రజలకు యుద్ధాన్ని మరో కోణం నుండి చూడగలిగారు. యుద్ధ రంగం నుండి వచ్చిన బ్లాగరుల భావనలు అధికారిక వార్తలకు సమాంతర వ్యాఖ్యలుగా రూపొందాయి. బ్లాగుల నుండి లింకులు ఇవ్వడం ద్వారా పెద్దగా వ్యాప్తి లేని వార్తా సాధనాలకు ప్రచారం కలిగించడం తరచుగా జరిగింది. ఉదాహరణకు 2004 మార్చి 11న స్పెయిన్‌లో తీవ్రవాదుల ఘాతిఉకాలకు వ్యతిరేకంగా మాడ్రిడ్‌లో జరిగిన తీవ్రవాద వ్యతిరేక ప్రదర్శనను చూపేందుకు బ్లాగరులు అక్కడి వీధుల్లోని ట్రాఫిక్ కెమెరాలకు తమ బ్లాగుల నుండి లింకులు ఇచ్చారు. టెలివిజనులో వచ్చే కార్యక్రమాలకు ఇంచుమించు ప్రత్యక్ష వ్యాఖ్యానం లాగా బ్లాగరులు తమ తమ బ్లాగుల్లో రాస్తూ ఉంటారు. బ్లాగటం అంటే ప్రత్యక్ష వ్యాఖ్యానమనే మరో అర్థం అనే స్థాయికి చేరింది. ఎన్నికల పొత్తులపై సీపీఎం నాయకుడు "రాఘవులు వ్యాఖ్యలను బ్లాగుతున్నాను" అంటే "రాఘవులు వ్యాఖ్యలకు నా స్పందనను అలా టీవీలో చూస్తూ ఇలా బ్లాగులో రాస్తున్నాను" అని అర్థం. 2003 చివరికి, అగ్రస్థానాల్లో ఉన్న ఇన్స్టాపండిట్, డైలీ కోస్, అట్రియోస్ వంటి బ్లాగులకు రోజుకు 75,000 కు మించిన సందర్శకులు వస్తూ ఉన్నారు. ప్రధాన స్రవంతిలో బ్లాగు 2004 లో బ్లాగులు ప్రధాన స్రవంతిలో భాగం కాసాగాయి. రాజకీయ పరిశీలకులు, వార్తా సంస్థలు, ఇతర వ్యక్తులు ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దేందుకు, ప్రజల నాడిని తెలుసుకునేందుకు వాడసాగారు. రాజకీయ ప్రచారాల్లో పాల్గొనని నాయకులు కూడా తమ ఆలోచనలు, అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు బ్లాగులను వాడుకున్నారు. కొలంబియా జర్నలిజం రివ్యూ పత్రిక బ్లాగుల గురించి రాయడం మొదలుపెట్టింది. బ్లాగుల సంకలనాల ముద్రణ మొదలైంది. రేడియో, టీవీల్లో బ్లాగరులు కనపడడం కూడా మొదలైంది. ఆ సంవత్సరం వేసవిలో జరిగిన అమెరికా రాజకీయ పార్టీల జాతీయ సమావేశాల్లో బ్లాగులు, బ్లాగరులు ప్రస్తావనకు వచ్చాయి. వెబ్‌స్టర్స్ డిక్షనరీ "blog"ను 2004కు ఆ సంవత్సరపు మాటగా గుర్తింపు నిచ్చింది. (వికీన్యూస్) రాదర్‌గేట్ కుంభకోణం గురించి ఇక్కడ చెప్పుకోవాలి. సీబీఎస్ వార్తా సంస్థకు చెందిన డాన్ రాదర్ 60 మినిట్స్ 2 అనే టీవీ కార్యక్రమంలో చూపించిన కొన్ని పత్రాలు ఫోర్జరీవి అని వాదిస్తూ కొందరు బ్లాగరులు సమీకృతంగా జాబులు రాసారు. మూడురోజుల్లోనే సీబీఎస్ తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పక తప్పలేదు. ఈ సంఘటనతో బ్లాగు కూడా ఒక వార్తా మాధ్యమంగా ఇతర మాధ్యమాలు అంగీకరించినట్లుగా బ్లాగరులు భావించారు. పాతుకుపోయిన వార్తా సంస్థలపై కూడా వత్తిడి తీసుకువచ్చి వారి వార్తా కథనాలను వెనక్కు తీసుకునేలా చెయ్యడంలో బ్లాగుల ప్రభావం తెలియవచ్చింది. వినియోగదారుల ఫిర్యాదులను వెలుగులోకి తీసుకువచ్చే పని కూడా ప్రస్తుతం బ్లాగుల ద్వారా - ఒకప్పుడు యుస్‌నెట్ ద్వారా చేసినట్లు - చేస్తున్నారు. బ్లాగరులు మాధ్యమాల వైపుకు కూడా మళ్ళారు. అట్రియోస్, గ్లెన్ రేనాల్డ్స్, మార్కోస్ మౌలిటాస్ జునీగా రేడియోలో పాల్గొంటారు. :en:Ana Marie Cox (:en:Wonkette) టీవీలో వస్తూ ఉంటారు. ఇక హ్యూ హెవిట్ వంటి వారు మాధ్యమాల నుండి ఇటువైపు వచ్చి తమ "పాత పరపతిని" బ్లాగుల ద్వారా మరింత విస్తరించుకున్నారు. జనవరి 2005లో పీటర్ రోజాస్, జెని జార్డిన్, బెన్ ట్రాట్ & మెనా ట్రాట్, జోనాథన్ ష్వార్ట్జ్, జాసన్ గోల్డ్‌మన్, రాబర్ట్ స్కోబుల్, జాసన్ కలకానిస్ అనే ఎనిమిది మంది బ్లాగరులను వ్యాపార వర్గాలు విస్మరించజాలని వారుగా ఫార్చూన్ పత్రిక రాసింది. బ్లాగడము, సంస్కృతీ బ్లాగడమంటే రాజకీయాలెంతో సాంకేతికాలూ అంతే. బ్లాగులను నడిపించే ఉపకరణాలూ, బ్లాగుల చుట్టూ అల్లుకున్న సమాజాలూ బ్లాగులను ఓపెన్‌సోర్స్ ఉద్యమంతో ముడిపెట్టాయి. లారీ లెస్సిగ్, డేవిడ్ వీన్‌బెగర్ వంటి రచయితలు తమ బ్లాగుల ద్వారా బ్లాగులకు ప్రాచుర్యం కల్పించడమే కాక, రకరకాల సామాజిక దృష్టికోణాలను పాదుకొల్పారు. వార్తా సేకరణలో బ్లాగు పాత్ర గురించిన చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతున్న జర్నలిజం చర్చల్లో ఒకటి. ఇది సమాజంలో మాధ్యమాల పత్రగురించీ, మేథో సంపత్తి గురించీ పలు ప్రశ్నలకు దారి తీస్తుంది. చాలా మంది బ్లాగరులు ప్రధాన స్రవంతి మాధ్యమాల నుండి తమను తాము భిన్నంగా చూస్తారు. కొందరు మాత్రం మరో మాధ్యమం ద్వారా పనిచేస్తున్న ఆ మాధ్యమాల సభ్యులే. చాలామంది బ్లాగరులకు పెద్ద పెద్ద ఎజెండాలే ఉన్నాయి. బ్లాగులను ఓపెన్‌సోర్సు రాజకీయాల్లో ఒక భాగంగానూ, రాజకీయాల్లో మరింత ప్రత్యక్షంగా పాల్గొన వీలు కలిగించే మార్గం గాను భావించారు. సంస్థలు మాత్రం అడ్డుగోడలేమీ లేకుండా ప్రజలకు నేరుగా తమ సందేశాలను చేర్చగలిగే సాధనంగా భావించాయి. బ్లాగుల సృష్టీ, ప్రచురణా బ్లాగులు మొదలైనప్పటి నుండి బ్లాగులను సృష్టించుకునేందుకు వీలు కలిగిస్తూ అనేక సాఫ్టువేరు పాకేజీలు వచ్చాయి. వెబ్‌లో బ్లాగులను రచించేందుకు, వాటిని ఆవిష్కరించేందుకు అనేక సంస్థలు తామరతంపరగా వచ్చాయి. గ్రేటెస్ట్ జర్నల్, పిటాస్, బ్లాగర్, లైవ్‌జర్నల్, క్సాంగా వీటిలో కొన్ని. చాలా మంది బ్లాగరులు సర్వరు సాఫ్టువేరు ఉపకరణాలను వాడి బ్లాగులను సృష్టించేందుకు మొగ్గు చూపుతారు. న్యూక్లియస్ CMS, మూవబుల్‌టైప్, బిబ్లాగ్, వర్డ్‌ప్రెస్, బి2ఇవల్యూషన్, బోస్ట్‌మెషిన్, సెరెండిపిటీ ఇలాంటి ఉపకరణాల్లో కొన్ని. వీటి ద్వారా సృష్టించిన బ్లాగులను తమ తమ వెబ్‌సైట్లలో, లేదా తమకనువైన మరోచోట ప్రచురించుకోవచ్చు. ఈ ప్రోగ్రాములు మరిన్ని సౌలభ్యాలతో, మరింత శక్తివంతంగా ఉంటాయి కానీ, వాటిని వాడేందుకు మరింత పరిజ్ఞానం కావాలి. వెబ్‌లో రచనలు చేసేందుకు ఏర్పాటు చేస్తే ఎక్కడనుండైనా బ్లాగులు రాసే వీలు కలుగుతుంది. ఇవేకాక, కొంతమంది తమ బ్లాగు సాఫ్టువేరును తామే ఓనమాల దగ్గరి నుండి రాసుకుంటారు. PHP, CGI వంటి భాషలు వాడి రాసే ఈ ప్రోగ్రాములకు చాలా సమయం పడుతుంది కానీ, చక్కగా తమకు అనువైన విధంగా బ్లాగులను తీర్చిదిద్దుకోవచ్చు. బ్లాగులకు సామాన్యంగా ఉండే రెండు అంశాలు "బ్లాగ్చక్రాలు" (blogrolls), "వ్యాఖ్యలు" (commenting). బ్లాగ్చక్రాలు అంటే ఓ బ్లాగు నుండి లింకులు ఇచ్చిన బ్లాగుల జాబితా. తన బ్లాగు దగ్గర సంబంధం కలిగి ఉన్న బ్లాగులకు లింకులు ఇవ్వడం ద్వారా బ్లాగరి తన బ్లాగుకు ఒక సందర్భాన్ని సృష్టిస్తారు. ఈ లింకుల ద్వారా ఒక బ్లాగు ఎన్నిసార్లు ఉదహరించబడిందో లెక్క వేస్తారు. బ్లాగ్చక్రపు మరో ప్రయోజనం ఏమిటంటే.. పరస్పర లింకులు ఇచ్చుకోవడం. లేదా తన బ్లాగుకు లింకు ఇస్తారనే ఆశతో తన బ్లాగునుండి మరో బ్లాగుకు లింకు ఇవ్వడం మరో ముఖ్యమైన, వివాదాస్పదమైన అంశం.. వ్యాఖ్యానాల పద్ధతి. ఈ పద్ధతిలో పాఠకులు బ్లాగు జాబులపై తమ వ్యాఖ్యలను రాయవచ్చు. కొన్ని బ్లాగులకు ఈ వ్యాఖ్యల పద్ధతి ఉండదు. మరి కొన్నిటిలో వ్యాఖ్యలకు బ్లాగరి అనుమతి తప్పనిసరి చేసి ఉంటుంది. కొందరు బ్లాగరులు వ్యాఖ్యలను చాలా కీలకమైనవిగా భావిస్తారు. అసలైన బ్లాగులకు మామూలు రకం బ్లాగులకు తేడా ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందని వీరు భావిస్తారు. వ్యాఖ్యాన అంశాన్ని బ్లాగు సాఫ్టువేరులో అంతర్భాగంగా రూపొందించవచ్చు. లేదా హేలోస్కాన్ వంటి సేవను అనుబంధంగా చేర్చడం ద్వారా నెలకొల్పవచ్చు. ఏదైనా బ్లాగుకు క్రమం తప్పకుండా రాసే వ్యాఖ్యాతలుంటే వారందరినీ ఆ బ్లాగు యొక్క సంఘంగా అనుకోవచ్చు. ఎక్టో, w.బ్లాగర్ వంటి ఉపకరణాలను వాడి బ్లాగరులు వెబ్‌కు వెళ్ళకుండానే తమ బ్లాగుల్లో జాబులు రాయవచ్చు. బ్లాగు సాంకేతికాంశాలు ఇంకా మెరుగుపడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు మూవబుల్‌టైప్ వారు 2002 లో ప్రవేశపెట్టిన ట్రాక్‌బాక్ ద్వారా బ్లాగుల్లో మార్పులు చేర్పులు జరిగినపుడు విషయ సంబంధం ఉన్న బ్లాగులకు ఈ విషయం తెలియజేస్తుంది&ందష్;ఫలానా విషయంపై జాబు లేదా వేరే బ్లాగులోని ఫలానా జాబుపై స్పందన.. ఇలాగ. ఈ ట్రాక్‌బాకుల్లాంటి విశేషాలు కలిగిన బ్లాగులు సెర్చి ఇంజన్లు వాడే పేజీ రాంకు పద్ధతిని జటిలం చేసాయి. వీటిని సెర్చి ఇంజన్ల పరిధి లోకి తీసుకురావడం ఒక సవాలుగా మారింది. కావాలని సెర్చి రాంకును ముందుకు నెట్టేందుకు కొందరు దీన్ని వాడుతున్నారు. అయితే, పేజిరాంకును నిర్ణయించే పని సెర్చి ఇంజన్లది.. అది ఎలా చెయ్యాలి అనేది అవే చూసుకోవాలి. వెబ్‌హోస్టింగు కంపెనీలు, ఆన్‌లైను ప్రచురణా సంస్థలు కూడా బ్లాగు తయారీ ఉపకరణాలను అందిస్తున్నాయి. సేలన్, ట్రైపాడ్, బ్రేవ్‌నెట్, అమెరికా ఆన్‌లైన్ మొదలైనవి కొన్ని ఉదాహరణలు. తాము ప్రచురించే బ్లాగులను వీరు "జర్నల్స్" అంటారు. బ్లాగుల్లో రకాలు వ్యక్తిగతం బ్లాగు అంటే ఆన్‌లైను డైరీ లేదా జర్నలుగా చెప్పడం తరచూ జరుగుతూ ఉంటుంది. సరళమైన బ్లాగు ఆకృతి కారణంగా పెద్ద అనుభవం లేనివారు కూడా జాబులను సులభంగా రాసి, ప్రచురించగలుగుతున్నారు. ప్రజలు తమ రోజువారీ అనుభవాలను, ఫిర్యాదులను, కవిత్వాన్ని, గద్యాన్ని, దొంగచాటు, చాటుమాటు ఆలోచనలను రాసుకుంటారు. కొన్నిసార్లు ఇతరులను కూడా రాయనిస్తారు. ఇంటర్నెట్టు పితామహుడైన టిం బెర్నర్స్ లీ చెప్పినట్లు పరస్పరం కలిసి పనిచేయడమన్నమాట. 2001లో ఈ ఆన్‌లైను డైరీల గురించిన పరిజ్ఞానం నాటకీయంగా పెరిగిపోయింది. కౌమారదశలో ఉన్నవారు, కాలేజీ కుర్రాళ్ళు, మొదలైనవారి దైనందిన జీవితంలో ఆన్‌లైను డైరీ ఓ భాగమైపోయింది. ఒకరినొకరు తిట్టుకోడానికీ, పైగా స్నేహితులు, శత్రువులు, అపరిచితులు - అందరూ చక్కగా వాటిని చదువుకోడానికి ఈ డైరీలు అనువుగా ఉన్నాయి. ఆలోచనాత్మకం వ్యక్తిగత బ్లాగు దైనందిన జీవితంలోని విషయాలకు, సంఘటనలకు సంబంధించింది కాగా, ఈ ఆలోచనాత్మక బ్లాగులు ఒక విశేష విషయంపై బ్లాగరు ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. విషయాలేమైనా కావచ్చు.. ప్రస్తుతం వార్తల్లో ఉన్న విషయాలే కానక్కర్లేదు, వేదాంత విషయాల దగ్గర్నుండి ఏవైనా కావచ్చు. ఒకవైపు వ్యక్తిగత బ్లాగులతోటీ, మరోవైపు విషయాత్మక బ్లాగులతోటి కలుస్తున్నప్పటికీ ఈ ఆలోచనాత్మక బ్లాగులను ఓ ప్రత్యేక వర్గంగా భావించవచ్చు. మిత్రబ్లాగు ఒకే అభిరుచులు కలిగిన వారు కలగలసి రాసే జర్నలే మిత్రబ్లాగు. ఇవి చిన్న చిన్న జాబులతో కూడి ఉంటాయి. జాబులు తరచుగా రాస్తూ ఉంటారు. రచయిత తన మిత్రబ్లాగును తన స్నేహితుల మిత్రబ్లాగులతో కనెక్టయ్యే వీలు కల్పిస్తారు. దీంతో బ్లాగుల గొలుసుకట్టు ఏర్పడితుంది. విషయాత్మకం ఓ ప్రత్యేక విషయంపై - సాధారణంగా సాంకేతిక విషయం - రాసే బ్లాగులే విషయాత్మక బ్లాగులు. గూగుల్ బ్లాగు దీనికో ఉదాహరణ. గూగుల్‌కు సంబంధించిన వార్తలు మాత్రమే ఇందులో ఉంటాయి. చాలా బ్లాగుల్లో పోస్టులను వర్గీకరించుకునే ఏర్పాటు ఉంది. దీంతో మామూలు బ్లాగును కూడా విషయాత్మక బ్లాగుకా మార్చుకోగలిగే వీలు ఏర్పడింది. వార్తలు కొన్ని బ్లాగులు వార్తలను సంక్షిప్తంగా సమర్పిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తెలుగువారికి సంబంధించిన వార్తలు, చైనాలో ఇంటర్నెట్టు, బేస్‌బాల్, నార్వే వార్తలు, సంగీతం సంయుక్తంగా (, ఉమ్మడిగా లేదా గుంపుగా) ఒక విషయం గురించి ఒకే బ్లాగులో ఒకరికంటే ఎక్కువ మంది రాసే బ్లాగులు ఇవి. ఇలాంటి బ్లాగులు ఎవరైనా రాసే విధంగానైనా, లేదా కొంతమందికే పరిమితమైగానీ ఉండవచ్చు. మెటాఫిల్టరు దీనికో ఉదాహరణ. స్లాష్‌డాట్ లో కొంతమంది ఎడిటర్లు సాంకేతికాంశాలకు చెందిన వార్తలపై రోజంతా తమకు వచ్చే లింకులను పరిశీలించి సరైనవాటిని ఎంచి ప్రచురిస్తూ ఉంటారు. వాళ్ళు స్లాష్‌డాట్ ను బ్లాగు అని పిలవనప్పటికీ బ్లాగు లక్షణాలు దానికి కొన్ని ఉన్నాయి. మరో కొత్త రకం బ్లాగు వచ్చింది.. బ్లాగరులూ, సాంప్రదాయిక మాధ్యమాలు పరస్పర సహకారంతో నిర్వహించే బ్లాగులివి. ఈ మాధ్యమాల్లో వచ్చే వార్తలను బ్లాగుల్లోనూ, బ్లాగు వార్తలను మాధ్యమాల్లోను చర్చించే కార్యక్రమమిది. లోన్‌స్టార్ టైమ్స్, హూస్టన్ టాక్ రేడియో స్టేషనుల మధ్య గల సహకారం ఇలాంటిదే! రాజకీయపరమైనవి బ్లాగుల్లో ఎక్కువగా కనపడే రకాలలో రాజకీయ బ్లాగులు ఒకటి. వార్తల వెబ్‌సైట్లలోని వార్తలకు లింకులు ఇస్తూ వాటి గురించి తమ అభిప్రాయాలు రాస్తూ ఉంటారు. రచయితకు ఆసక్తి ఉన్న ఏ అంశంపైనైనా జాబులు రాయవచ్చు. వీటిలో కొన్ని ప్రత్యేకమినవి.. వార్తల వెబ్‌సైటులో గానీ, ఇతర బ్లాగుల్లో గానీ దొర్లిన తప్పులు, పక్షపాత ధోరణి గురించి రాస్తూ ఉంటారు ఈ బ్లాగుల్లో. న్యాయపరమైనవి న్యాయ, చట్టపరమైన విషయాలను చర్చించే బ్లాగులు ఇవి. ఇంగ్లీషులో వీటిని blawgs అనడం కద్దు. డైరెక్టరీ బ్లాగులు అనేకానేక వెబ్‌సైట్ల వివరాలను ఒక పద్ధతిలో, విషయానుసారంగా అమర్చి పెట్టిన బ్లాగులివి. వార్తలకు సంబంధించిన బ్లాగులు ఈ కోవలోకి వస్తాయి. ప్రసార మాధ్యమాల ప్రధానమైనవి కొన్ని బ్లాగులు ప్రసార మాధ్యమాల తప్పులని, వక్రీకరించబడిన యదార్థాలని వేలెత్తిచూపిస్తూ, ప్రసార మాధ్యమాలకు కాపలాదార్లుగా ఉంటాయి. చాలా మాధ్యమ-ప్రధానమైన బ్లాగులు ఏదో ఒక్క వార్తాపత్రికనో, టెలివిజన్ నెట్‌వర్క్‌పైనో దృష్టి కేంద్రీకరిస్తాయి. వ్యాపార సంస్థల బ్లాగులు పెద్ద పెద్ద వ్యాపార సంస్థల ఉద్యోగులు అధికారిక, లేదా ఉప అధికారిక బ్లాగులు ప్రచురించడము బాగా ఎక్కువ అవుతున్నది. కానీ సంస్థలు మాత్రం అన్ని వేళలా ఈ బ్లాగులును, బ్లాగర్లను మెచ్చుకోలేదు. జనవరి 2005లో జాయ్ గోర్డన్, స్కాట్లాండు లోని ఎడింబర్గ్ లోని వెస్ట్స్టోన్ పుస్తకాల షాపు నుండి ఉద్యోములో నుండి తొలగించబడినాడు, ఎందుకంటే ఇతను తన బ్లాగులో పై అధికారిని " asshole in sandals" అని తిట్టినాదు. అలాగే 2004 సంవత్సరములో ఎల్లెన్ సిమోనెట్టి డెల్టా ఎయిర్ లైన్స్ విమాన సేవకుడు కూడా తన బ్లాగులో ఉద్యోగ డ్రస్సులో ఫోటో పెట్టినందుకు తొలగించబడింది. బహుశా అన్నిటికన్నా ప్రముఖమైన సంఘటన ఓ వెబ్సైటు జేటూఈఈ నుండి పీహెచ్‌పీకి మారడంలోని ఔచిత్యం గురించి వ్రాసినందుకు అనే ఆవిడను ఫ్రెడ్‌స్టెర్ నుండి ఉద్యోగము నుండి తొలగించుట. దీనికి వ్యతిరేకముగా ప్రవర్తించిన సంస్థలు కూడా ఉన్నాయి. 2004లో బ్లాగుల పాపులారిటీని గమనించిన అనేక సంస్థల పై అధికారులు, విశ్వ విద్యాలయాలు బ్లాగులను సమాచార మార్గముగా వాడటము మొదలుపెట్టినాయి. ఇలా బ్లాగులను (ఏవైతే కేవలము ఇంటర్నెట్టులో అభిరుచి గల వారికి మాత్రమే పరిమితము అయినాయో) సంష్తలు వాడటము మొదలుపెట్టడము బ్లాగు వ్యవస్థకే చేతు అని భయపడుతున్నాయి, కానీ కొందరు మాత్రము ఇది చాలా మంచి పరిణామము అని భావిస్తారు. 2005 వ సంవత్సరములో ఎలాక్ట్రానిక్ ఫ్రాంటియరు ఫౌండేషను ప్రచురించిన అనామకంగా, సురక్షితంగా బ్లాగు చేయడం అనే రచన చూడదగ్గది. సలహా చాలా బ్లాగులు సలాహాలు అందిస్తుంటాయి, ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ సాంకేతిక విజ్ఞానము (గారీడెవ్)లేదా కాల్పనిక మహిళా రచనలు (ఫోర్ చిక్స్, కిడ్స్ ). మతపరమైన కొన్ని బ్లాగులు మతపరమైన విషయాలు చర్చిస్తూ ఉంటాయి. వీటిలో మత పరమైన సలహాలు, సూచనలు, శ్లోకాలు, మంత్రాలు, మత గ్రంథాల వివరాలు, విశ్లేషణలు, ఇంకా మత పరమైన ఆరోపణలు, కేకల్ మొదలగున్నవి ఉంటాయి ఫార్మేటులు కొన్ని బ్లాగులు ఫార్మేటులో ప్రత్యేకతను కలిగి ఉంటాయి, ఉదాహరణకు బొమ్మల బ్లాగు, వీడియో బ్లాగు మరి కొన్ని ప్రత్యేకమైన విషయముపై ఉంటాయి, ఉదాహరణకు మొబైలు బ్లాగు. ఆడియో లేదా ధ్వని బ్లాగులు 2000 సంవత్సరము నుండి బాగా అభివృద్ధి చెందిన బ్లాగులు ఆడియో బ్లాగులు, ఈ ఆడియో బ్లాగులు సాధారణంగా ఏదైనా విషయముపై ఉదాహరణకు పాత పాటల బ్లాగులు, కొత్త పాటల బ్లాగులు వంటివి ఉంటాయి, ఇవే కాకుండా వ్యక్తిగత పాటల బ్లాగు అనగా పాడ్‌కాస్టింగ్ కూడా బహుళ ప్రాచుర్యము పొందుతున్నది. ఫోటోగ్రఫీ బహుళ ప్రాచుర్యము పొందిన డిజిటల్ కెమెరాలు, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ల వల్ల ఇంటర్నెట్ (అంతర్జాలము) పై ఫోటోలు పంచుకోవడము చాలా తేలిక మరియూ ప్రాచుర్యము వహించింది. ఈ కోవలోని చెందినదే ఫోటో బ్లాగు, ఈ బ్లాగులో ఫోటోలు చాలా చక్కగా అలంకరించి ఉంటాయి. వీడియో జనవరి 2005 న మొదటి వీడియో బ్లాగు ఏర్పాటు చేయబడింది. దీనితో ఓ క్రొత్త బ్లాగర్ల ఫార్మేటు ప్రారంభమైంది, అదే వీడియో బ్లాగింగు. సాధారణ పదజాలం అన్ని హాబీల్లాగే బ్లాగింగు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన పదజాలాన్ని సృష్టించుకున్నది. వాటిలో ఎక్కువ తరచుగా వాడే పదాలు, పదబంధాలు కొన్నిటిని వివరించడానికి చేసిన చిన్న ప్రయత్నం ఇది (పదం యొక్క అర్థం స్పష్టంగా లేనిచోట ఆ పదం ఎలా ఏర్పడిందో కూడా పేర్కొనడం జరిగింది): ఆడియో బ్లాగు (బ్లాగ్ధ్వని) ఈ రకము బ్లాగులో జాబులు సాధారణముగా ఆడియో జాబులు ఉంటాయి. వీటిలో పాడ్‌కాస్టింగ్ అనేది ఒక ఉప శాఖ. బ్లెగ్ (బ్లెగ్గింగు) ఏదైనా సమాచారము కోసం చదువరులను అడిగే బ్లాగు, ఇది బ్లాగు మరియూ బెగ్గింగు అనే పదాల నుండి వచ్చింది. బ్లాగు ఫీడు యక్స్ యం యల్ (XML) ఆధారిత ఫైలు, దీనిలో బ్లాగు సాఫ్ట్‌వేరులు యాంత్రికముగా చదవతగిన బ్లాగును ఉంచుతాయి, తద్వారా ఆ బ్లాగు వెబ్బులో పంచబడి, సిండికేటు చేయబడి ప్రాచుర్యము పొందుతుంది. ఆర్ యస్ యస్ (RSS) మరియూ యాటం (Atom) అనునవి దీనిలో ప్రముఖమైన స్టాండర్డులు. బ్లాగ్ఫూ (బ్లాగనామక) అనాకముడిని, లేదా అనామక గుంపును ఉద్దేశించి వ్రాయబడుతున్నట్టున్న బ్లాగులు కానీ నిజానికి అవి ఓ ప్రత్యేకమైన వ్యక్తిని లేదా సంస్థను ఉద్దేశించి వ్రాయబడునవి. బ్లాగ్జంపులుఒక బ్లాగు నుండి మరొక బ్లాగునకు లింకుల ద్వారా ఫాలో అవ్వడము అన్నమాట, మన టార్జాను గారు ఒక చెట్టు నుండి మరొక చెట్టునకు దుముకుతారు చూడండి అలాగన్నమాట. ఇలా ఫాలో అవ్వుతున్నప్పుడు సాధారణంగా మరింత సమాచారము, ఉపయోగపడే ఇతర లిణ్కులు చాలా తగులుతుంటాయి. బ్లాగకుడు బాగా బ్లాగు చేసేవాదు అని అర్థము బ్లాగుచుట్ట (బ్లాగ్‌రోల్) ఒక బ్లాగుల చిట్టా, సాధారణంగా ఒకని ఇష్టమైన బ్లాగుల చిట్టా ఉంటుంది. ఈ చిట్టాలు బ్లాగ్రోలింగు సేవలు ఉపయోగించుట ద్వారా మరింత శక్తివంతముగా చేయవచ్చు. బ్లాగ్సైటు బ్లాగు యొక్క వెబ్బు లొకేషను. సాధారణంగా ఒక బ్లాగుకు దానికి మాత్రమే చెందిన డిమైను ఉన్నచో ఇలా పిలుస్తారు. బ్లాగ్స్నాబు ( బ్లాగద్దకస్తుడు) తన బ్లాగుపై కామెంట్లకు జవాబులు ఇవ్వడంలో బద్దకించి అస్సలు ఇవ్వని వాడు. మోబ్లాగు మొబైలు బ్లాగు, సాధారణంగా మొబైలు ఫోను నుండి పంపబదిన ఫోటులు కలిగి ఉంటాయి. శాశ్వత లింకు ఒక బ్లాగు జాబునకు ఉన్న శాశ్వత లింకు. పింగు ట్రాక్ బ్యాకు పద్ధతిలో ఒక బ్లాగులోని టపాకు సంబంధించి ఇంకొక బ్లాగులో ఏదైనా రాస్తే అది సూచిస్తూ మొదటి బ్లాగుకు పంపే ఆటోమేటిక్ సంకేతాన్ని పింగంటారు. ట్రాక్‌బ్యాకుఒక బ్లాగులోని టపాకు జవాబుగా లేదా వ్యాక్యానిస్తూ ఎవరైనా ఆ వ్యాఖ్యనే తమ బ్లాగులో టపాగారాసి ట్రాక్బ్యాకు పద్ధతిలో ఆ మూల బ్లాగుకు దీనికి వ్యాఖ్య లేదా తిరుగుటపా ఇక్కడుందన్నట్టు ఒక పింగు పంపించే పద్ధతిని ట్రాక్‌బ్యాక్ అంటారు. చూడండి ఆటోకేస్టింగు బ్లాగు పదజాలం బ్లాగుమూలాలు బ్లాగ్‌స్ట్రీము కామన్‌ప్లేసు: చారిత్రకంగా బ్లాగుకు ముందున్నది గూగుల్ బాంబు వార్తా సంకలిని పర్షియను బ్లాగులు తెలుగు బ్లాగులు పాడ్‌కాస్టింగు బయటి లింకులు తెలుగు బ్లాగుల జల్లెడ తెలుగు బ్లాగుల కూడలి తెలుగు బ్లాగుల మాలిక తెలుగు బ్లాగర్లు తెలుగు బ్లాగ్ తెలుగు బ్లాగర్ల సహాయానికై ఒక సమూహం బ్లాగ్ మానిఫెస్టో (బ్లాగులు ఇటర్నెట్టుకు మేలు చేస్తున్నాయా? కీడా) Blog Primer — బ్లాగ్ ని అర్ధంచేసుకొని చదవడానికి కావలసిన మౌలిక సమాచారం జాన్ సి. డ్వారక్ BlogTree.com — బ్లాగ్ యొక్క వంశవృక్షం చేయుటలో ప్రయత్నం. బ్లాగర్ల పరిరక్షణ కమిటీ వెబ్లాగు పరికరాల సమాహారం డాన్ గిల్మోర్యొక్క We The Media. Grassroots Journalism by the People, for the People (2004, full text online) sees blogs as paradigmatic of a new form of journalism in the digital age. బ్లాగుల గురించి తరచూ అడిగే ప్రశ్నలు - ఆంధ్రేయాస్ రామోస్ బ్లాగుటకు సంబంధించిన పదాలతో ఓ పదకోశం బ్లాగులపై గార్డియన్ ప్రత్యేక నివేదిక MeatballWiki's బ్లాగులు (ప్రత్యేకంగా వాటి చరిత్ర) గురించి సమగ్ర వ్యాసం. The Online Coalition letter to the FEC Open Directory Project: Weblog Search Engines Weblog service providing: Identification of functional requirements and evaluation of existing weblog services in German and English languages, master dissertation by Markus K. Westner వెబ్లాగులు: చరిత్ర, దృక్కోణం by Rebecca Blood (2000). "Web of Influence" — by Daniel W. Drezner, Henry Farrell from Foreign Policy Magazine "Why your Movable Type blog must die" (humorous article) వర్గం:డిజిటల్ విప్లవం వర్గం:అంతర్జాలం వర్గం:విన్నూత పోకడలు వర్గం:అభిరుచులు వర్గం:ఈ వారం వ్యాసాలు
చీరాల
https://te.wikipedia.org/wiki/చీరాల
చీరాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిబాపట్ల జిల్లాకు చీరాల మండలంకు చెందిన పట్టణం. వస్త్ర ఉత్పత్తి, వ్యాపారంలో సాధించిన ప్రగతి కారణంగా చీరాల చిన్న బొంబాయిగా పేరుగాంచింది. దగ్గరలోని వాడరేవు పర్యాటక కేంద్రం. చరిత్ర thumb|పురపాలక కార్యాలయం thumb|సముద్రతీరం ఈ పట్టణం పేరు పాత చీరాలకు అసలు పేరైన 'శుద్ధనగరం' నుండి ఏర్పడిందని అంటారు. ఇక్కడ సముద్రము తెల్లగా కనపడుతుంది కావున, ఈ పట్టణాన్ని క్షీరపురి కూడా అంటారు. అయితే ఇవి ఈ పుస్తకాలు రాసిన రోజుల్లో సంస్కృతం పేరు ఉంటేనే గొప్పగా భావించి ప్రాచీనమైన తెలుగు పేర్లను సంస్కృతీకరించడం సర్వసాధారణం కాబట్టి ఈ పేర్లు కూడా అతిసంస్కృతీకరణ (hyper-Sanskritization)కు ఉదాహరణలుగా భావించాలి. 11వ శతాబ్దంలో చోళులు కట్టించిన పురాతన ఆదికేశవస్వామి గుడి ఇక్కడి గుడులలో పురాతనమైనది. 12వ శతాబ్దంలో పలనాటిని పాలించిన హైహయ వంశ పాలకుడైన అనుగురాజు, బ్రహ్మనాయుడితో కలిసి పరివార సమేతంగా పాత చీరాలకు వచ్చినపుడు చెన్నకేశవస్వామి విగ్రహాన్ని, స్వామి దేవేరులు, ఆయుధాలతో సహా ఇచ్చి వెళ్ళాడు. మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారం లోని రికార్డుల ప్రకారం, శుద్ధనగరాన్ని కాకతి గణపతిదేవ చక్రవర్తి వద్ద మంత్రిగా ఉన్న గోపరాజు రామన్న, చీరాల అనంతరాజుకు సా.శ.1145 లో దానమిచ్చాడు. అతని వారసుడు చీరాల వెంకటకృష్ణుడు ప్రస్తుత చీరాలను కొత్త పట్టణాన్ని నిర్మించేందుకు గాను యాదవులకు కౌలుకిచ్చాడు. నేటి చీరాల పట్టణానికి శంకుస్థాపన విశ్వావసు సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నాడు 1604లో ఇద్దరు యాదవ ప్రభువులు - మించాల పాపయ్య, మించాల పేరయ్యలు చేశారు. కొత్త పట్టణంలో 1619 లో వేణుగోపాలస్వామి గుడిని, 1620 లో మల్లేశ్వరస్వామి గుడి కట్టించారు. మరి కొద్దికాలం తరువాత గంగమ్మ గుడి కట్టించారు. 19వ శతాబ్దపు మధ్య కాలంలో చీరాల రామన్న పంతులు ఈ గుడులకు రథాలు తయారుచేయించాడు. బ్రిటిషువారు చీరాలను ఆరోగ్య విడిదిగా భావించేవారు. 1906 లో మొదటగా ఎడ్వర్డు VII పట్టాభిషేక స్మారక ఆసుపత్రి ప్రారంభమైంది. 1912లో బాయరు మిషనరీ ఆసుపత్రి ప్రారంభమైంది. 1923 లో పొగాకు క్యూరింగు కేంద్రాన్ని ప్రారంభంకావడంతో ఈ ప్రాంతంలో చాలా మందికి ఉపాధి ఏర్పడింది. యాంత్రికీకరణకు ముందు, 6,000 మంది వరకు ఇక్కడ పనిచేసేవారు. చేనేతకు పట్టుగొమ్మైన చీరాల 25,000 నుండి 30,000 వస్త్రకారులకు ఉపాధి కల్పిస్తున్నది. ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ప్రత్యేక నేత వస్త్రానికి మంచి ఎగుమతి మార్కెట్టు ఉంది. 1959 లో సహకార స్పిన్నింగు మిల్లు కూడా ప్రారంభమైంది. చెన్నై-కోల్‌కతా-ఢిల్లీ ప్రధాన రైలుమార్గంలో ఉన్న చీరాలలో రైల్వే స్టేషను ఏర్పాటయ్యాక, వ్యాపారపరంగా చీరాల అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మోటుపల్లి రేవు ద్వారా సముద్ర వ్యాపారం చేసిన పాత చీరాల క్రమేణా ప్రాముఖ్యతను కోల్పోయి, ఓ చిన్న గ్రామంగా మిగిలిపోయింది. స్వాతంత్ర్య సమరంలో ప్రత్యేక భూమిక పోషించిన చీరాల 2004, ఏప్రిల్ 27 న (వైశాఖ శుద్ధ సప్తమి) 400 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చీరాల పేరాల ఉద్యమం స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ప్రముఖంగా పేర్కొనే బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమంగా పేరుపడిన చీరాల పేరాల ఉద్యమం చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ఉద్యమం చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. గోపాలకృష్ణయ్య వేయిమంది సభ్యులతో రామదండు అనే వాలంటీర్ సంస్థను ఏర్పాటు చేశారు. విజయవాడ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా గాంధీ వచ్చినపుడు గోపాలకృష్ణయ్య ఆయనకు సమస్య వివరించాడు. గాంధీ చీరాలను సందర్శించి ఊరు ఖాళీ చేసిపోతే మున్సిపాలిటీ దానంతట అదే రద్దవుతుందనే ఆలోచన చెప్పాడు. గోపాలకృష్ణయ్య చీరాల, పేరాల ప్రజలను ఊరు ఖాళీచేయించి దాని పొలిమేర అవతల రామ్‌నగర్ పేరుతో కొత్త నివాసాలు ఏర్పర్చాడు. అక్కడ 11 నెలలపాటు కష్ట నష్టాలని ప్రజలు అనుభవించారు. ఉద్యమానికి కావలసిన విరాళాలను సేకరించడానికి గోపాలకృష్ణయ్య బరంపురం వెళితే ప్రభుత్వం ఆయన్ను నిర్భందించి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. దీంతో చేసేదేమీ లేక ప్రజలు తమ నివాసాలకు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. విద్యా సౌకర్యాలు ప్రస్తుత ఎన్.ఆర్ అండ్ పీ.మున్సిపల్ ఉన్నత పాఠశాల 1912లో ప్రథమాంగ్ల పాథశాలగా స్థాపించబడింది. చారిత్రాత్మక చీరాల-పేరాల స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ మహాత్ముని సూచనమేరకు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో 18 వేల ప్రజానీకమంతా పట్టణాన్ని వదలి వెళ్ళిపోవడం వలన-పాఠశాల 1921లోమూతపడి మరల 1924లో మునిసిపల్ మిడిల్ స్కూల్గా పునःప్రారంభమైంది. 1928లో మొట్టముదటి యస్.యస్.యల్.సి బ్యాచ్ విద్యార్థులు ఈ స్కూల్ నుండి పబ్లిక్ పరీక్షకు హాజరైనారు. 2004లో ఈ స్కూల్ అశీతి (80) వసంతోత్సవాలను ప్రధానోపాధ్యాయులు చంగవల్లి సత్యనారాయణ శర్మ సారథ్యంలో ఘనంగా జరుపుకున్నది. వివిధ రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన ఎన్.ఆర్.అండ్.పి.మున్సిపల్ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులలో జి.వి.జి.కృష్ణమూర్తి, ప్రగడ కోటయ్య, వెంకట్ చంగవల్లి (సిఈఓ,108 అంబులెన్స్) ఉన్నారు. 1946లో కస్తూరిబా గాంధీ మునిసిపల్ గరల్స్ ఉన్నత పాఠశాల స్థాపించబడింది.దీన్ని టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించాడు. 1948లోఎన్.ఆర్.ప్.యమ్ ఉన్నత పాఠశాలలో గాంధీ విగ్రహాన్నిప్రతిష్ఠించారు. 1951లో పేరాలలో ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాల స్థాపించబడింది. ఇంజనీరింగ్ కళాశాలలు వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ: 1951లో స్థాపన సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చీరాల ఇంజనీరింగ్ కాలేజి రవాణా సౌకర్యాలు thumb|చీరాల రైల్వే స్టేషన్ చీరాల ప్రముఖ రవాణా కూడలి. పిడుగురాళ్ల-వాడరేవును కలిపే జాతీయ రహదారి 167A చీరాల గుండా పోతుంది. చెన్నయ్-హౌరా రైలు మార్గములో ఈ పట్టణం ఉంది. రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ పక్క పక్కనే వుండడంతో ప్రయాణీకులకు సౌకర్యంగా వుంటుంది. ఇక్కడి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారములు చేరటానికి లిఫ్టు సదుపాయం కూడావుంది. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు వాడరేవు ఓడరేవు: ఇక్కడికి 9 కి.మీ దూరంలో సముద్రతీరం, ఓడరేవు. శ్రీ రేణుకాదేవి అమ్మవారి ఆలయం చీరాల పట్టణంలోని బోస్‌నగర్‌లో గల పురాతన ఆలయం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో బహుళ పాడ్యమి నుండి బహుళ పంచమి వరకు, ఐదు రోజులపాటు, ఈ ఆలయంలోని అమ్మవారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజున 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించెదరు. రెండవ రోజు సాయంత్రం సామూహిక కుంకుమార్చనలు మూడవరోజు సాయంత్రం అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం, నాల్గవ రోజున అమ్మవారికి 108 రకల ప్రసాదాల నైవేద్యం, ఐదవ రోజున అన్నసంతర్పణ, హారతుల సమర్పణతో సేవలతో ఉత్సవాలు ముగింపుకు చేరుకుంటవి. ఈ వేడుకలకు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేయుదురు. ముఖ్యముగా ఒంగోలు, పరుచూరు, బాపట్ల, అ చుట్టు ప్రక్కల గ్రామాలనుండి వేలాదిగా తరలి వచ్చెదరు. శ్రీ మల్లీశ్వరాలయం 17వ శతాబ్దానికి చెందిన ప్రాచీన శివాలయం ఇది.ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. మెకంజీ కైఫీయతుల ప్రకారము ఈ ఆలయంలో 1620, రౌద్రి నామ సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి గురువారం నాడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయంలో ఈశ్వరునికి ఈశాన్యమున భ్రమరాంబా దేవి విగ్రహం ఉంది. ఈ ఆలయంలో వినాయకుడు, నందీశ్వరుల విగ్రహాలు కూడా ఉన్నాయి. నందీశ్వరుని విగ్రహం మైసూరులో చాముండేశ్వరి ఆలయంలో ఉన్న నందీశ్వరుని పోలివుంది. ఈ ఆలయానికి దక్షిణం వైపున వీరభద్రుని ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో తూర్పున నవగ్రహాలు ఉన్నాయి. వాయవ్యదిశలో షణ్ముఖ ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు జరుపబడుతుంది. కార్తీక మాసంలోను, గణపతి నవరాత్రి ఉత్సవాలు, షణ్ముఖ జయంత్యుత్సవాలు, పార్వతీ కళ్యాణము, వల్లీ కళ్యాణములు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిదినము ఈ ఆలయంలో పురాణాది సత్కాలక్షేపాలు జరుగుతాయి. చిత్రమాలిక ఇవీ చూడండి చీరాల పురపాలక సంఘం చీరాల శాసనసభ నియోజకవర్గం మూలాలు వెలుపలి లింకులు వర్గం:1604 స్థాపితాలు వర్గం:బాపట్ల జిల్లా పట్టణాలు
బనగానపల్లె
https://te.wikipedia.org/wiki/బనగానపల్లె
బనగానపల్లె ఆంధ్ర ప్రదేశ్, నంద్యాల జిల్లా బనగానెపల్లె మండలం లోని జనగణన పట్టణం. 1790 నుండి 1948 వరకు బనగానపల్లె సంస్థానానికి కేంద్రంగా వుండేది. బనగానపల్లె సంస్థాన చరిత్ర left|frame|బనగానపల్లె సంస్థాన పటం1601లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరుకు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ మేనమామ, ముబారిజ్‌ ఖాన్‌ దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది. 1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియాలో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి.తూమాటి, దొణప్ప (ఆగస్టు 1969). ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణ (1 ed.). విశాఖపట్టణం: ఆంధ్రా యూనివర్శిటీ. p. 12. 1948లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆలయాలు left|thumb|200px|చింతమాను మఠం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి thumb|200px|నేలమఠం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం, బనగానపల్లె thumb|200px|నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు. బనగానపల్లెకి 10 కి.మీ. దూరంలో యాగంటి పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం, రవ్వలకొండ ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు. శీశ్రీశ్రీ చెంచులక్ష్మి సమేత పావన నరసింహ స్వామి క్షేత్రం బనగానపల్లి సమీపములోని రవ్వలకొండపై కలదు విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు బనగానపల్లె పట్టణంలో, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఉన్నాయి. బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు విద్య సంస్థలు కూడా ఉన్నాయి. బనగానపల్లెలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉంది. ఒక సార్వజనిక వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాల ఉన్నాయి. ఆర్.టి.సి. డిపో ఉంది. బనగానపల్లె నుండి రాయలసీమ లోని అన్ని ముఖ్య పట్టణాలకు రవాణ సౌకర్యం ఉంది. హైదరాబాదుకి ప్రతి రోజు రాత్రి బస్సులు ఉన్నాయి. రైల్వే స్టేషను ఉంది. గణాంకాలు 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 16,462. ఇందులో పురుషుల సంఖ్య 8400, మహిళల సంఖ్య 8,062, గ్రామంలో నివాస గృహాలు 3,338 ఉన్నాయి. మామిడి బనగానెపల్లె ప్రాంతంలో పెరిగే ఒక రకం మామిడికి బంగినపల్లి మామిడి అని వాడుకలో పేరు. చాలా ప్రసిద్ధమైన మామిడి రకం ఇది. దీన్ని "బేనిషా" అని కూడా అంటారు. మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక ఎన్.టి.ఆర్. చిత్రంలో "బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది. మూలాలు బయటి లింకులు బనగానపల్లె సంస్థానము చరిత్ర వర్గం:నంద్యాల జిల్లా పుణ్యక్షేత్రాలు వర్గం:జనగణన పట్టణాలు వర్గం:నంద్యాల జిల్లా జనగణన పట్టణాలు
కనిగిరి
https://te.wikipedia.org/wiki/కనిగిరి
కనిగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిప్రకాశం జిల్లాకు చెందిన పట్టణం. కనిగిరిని మనుమసిద్ధిపై యుద్ధం చేసిన కాటమరాజు పరిపాలించాడని ప్రతీతి. కనిగిరి కొండపై కనిగిరి కోట, బావులు, దుర్గం ముఖ్యమైనవి. చరిత్ర కనిగిరిని పూర్వము కనకగిరి (బంగారుకొండ) అని పిలిచేవారు. దీని పూర్తిపేరు కనకగిరి విజయ మార్తాండ దుర్గము.Gazetteer of the Nellore District: brought upto 1938 By Government Of Madras Staff పేజీ.325 కవి, రాజు నన్నెచోడుడు ఉదయగిరిని పరిపాలించిన కాలంలో కనిగిరి సామంత రాజ్యంగా ఉండేది. కనిగిరిని మనుమసిద్ధిపై యుద్ధము చేసిన కాటమరాజు పరిపాలించాడని ప్రతీతి. కనిగిరి కొండపై కొన్ని చారిత్రక కట్టడములు ఉన్నాయి. వాటిలో కనిగిరి కోట, బావులు, దుర్గము ముఖ్యమైనవి. కనిగిరి కొండపై రెండు జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. కొండపై ఒక చదరపు మైలు వైశాల్యము కలిగిన చదును నేల ఉంది. పూర్వము కొండపై ఒక పట్టణం ఉండేదని స్థానికుల కథనంLists of the Antiquarian Remains in the Presidency of Madras By Robert Sewell పేజీ.138 మనుచరిత్రలో వర్ణించిన కనకగిరి ఇదియే అని పలువురి అభిప్రాయము. కనిగిరిసీమకు సంబంధించిన శాసనాలని పరిశీలించినచో కటకపురాధీశ్వరుండగు రుద్రుడీ సీమను పాలించినట్లు-అతడే-ఇక్కడ ఉన్న దుర్గములను నిర్మించి తన విజయసూచకముగా ఇక్కడ విజయమార్తాండదుర్గ అని పేరిడినట్లు చరిత్రపుటలలో కనబడుతున్నది. అతనిపిదప ఆతని వంశస్థులీ పరిసరములను కొంతకాలము పాలించిరి. అటుపై కొంతకాలము తరువాత 17వ శతాబ్దంలో మైసూరు నవాబగు హైదరాలి ఈ కనిగిరిసీమను జయించి-పట్టణంను-కోటను కుంగుటేళ్ళతో కూడా నేలమట్టము గావించెను.ఈతను తరువాత ఇది నిజాము వశము కాబడింది. అటుపై ఆంగ్లేయుల దత్తము కాబడింది.ఆశ్వేతముఖుల పాలనలో ఈ తాలూక కొన్ని దినములు కర్నూలు కడప జిల్లాలలో చేర్చబడి-మరికొంతకాలమునకు నెల్లూరు జిల్లాలో ఉండెను. 1970 నుండి ప్రకాశము జిల్లాలో నున్నది.కనకగిరికి సంబంధించిన శాసనములు నెల్లూరు జిల్లా శాసన సంపుటములో 40 వరకు ఉన్నాయి. చెన్నమ్మక్క బావి బొగ్గు గొందిలోనికి పోగా వచ్చునది చెన్నమ్మక్క బావి. దీనిని శ్రీ కృష్ణదేవరాయలు పట్టమహిషియైన చిన్నాదేవి సర్వ జనోపయోగార్దముగ నిర్మింపజేసినదియు-క్రమముగా మారుచు నేటికీ పేరు నిలిచినదని పలువురి అభిప్రాయము. ఇందలి నీరు లోదుర్గమున యాతాయాతవంబులకుపయోగిపడుచున్నది. దీని పరిసరములలో కొన్ని భిన్నములైన విగ్రహములున్నవి. పోయినవిపోగా ఉన్నవాటిలో చతుర్భుజుడైన శ్రీమహావిష్ణుమూర్తి. ఆనాటి కోటలోనుండు దేవాలయములోని విగ్రహమేమో? ఇక్కడనుండి కొంచెము ముందుకు సాగినచో భీముని పాదమట-అడుగు ఆకారము కల ఒక గుంటకలదు. సింగారప్ప దేవాలయం ఈ సిద్ధపురుషుడెవ్వరో తెలియదు. ఈ ఆలయనిర్మాణమునకుపయోగించిన బండలు 3 అడుగుల మందముకలిగి అంతేలావు కలిగి ఉన్నాయి. ఈ దేవాలయమునకు ప్రక్కనే కాశీ ద్వారమున్నది. ఈ పర్వతమంతయు పెద్ద శివలింగాకారముగా ఉంది. ఇందొక గుహలో దక్షిణాభిముఖుడగు మార్తాండేశ్వరుడున్నాడు. దక్షిణాభిముఖుడగు ఈశ్వరదేవాలయముంట అరుదుకదా! ఈ పరమేశ్వరునిని-మార్కాండేయ మహర్షి ప్రతిష్ఠించినని చెప్పుచున్నారు. భౌగోళికం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు పశ్చిమంగా 80 కి.మీ దూరంలో కనిగిరి ఉంది. జనగణన వివరాలు 2011 భారత జనగణన ప్రకారం పట్టణ జనాభా 37,420. పట్టణ పరిపాలన కనిగిరి నగరపంచాయితీపట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. రవాణా సౌకర్యాలు కనిగిరి నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది. సమీప రైల్వే స్టేషనులు సింగరాయకొండ,దొనకొండ. సమీప విమానాశ్రయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సంస్కృతి కనిగిరి గ్రామ దేవత అంకాలమ్మ. హిందువులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ముస్లింలు, క్రైస్తవులు పట్టణం అంతటా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామివారి ఆలయం ఇది శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయం. ఈ ఆలయంలో ఒకప్పుడు రాజులు పూజలు చేసేవారు. 100 ఎకరాలకు పైగా మాన్యం భూములు, కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ప్రముఖులు సాంస్కృతిక ప్రముఖులు జానీ లీవర్: బాలీవుడ్ సినీనటుడు, హాస్యనటుడు. కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి: కవి. ఇతను పలు కవితా సంపుటాలు రచించారు. అలాగే అనేక విమర్శనాత్మక కవితలు వ్రాసినారు. తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా (1912-19.12.1978) హరికథకుడు రాజకీయనాయకులు బుర్రా మధుసూదన్ యాదవ్. శాసన సభ్యులు (2019-ప్రస్తుతం) కదిరి బాబూరావు. శాసన సభ్యులు (2014-2019) ఇవీ చూడండి కనిగిరి శాసనసభ నియోజకవర్గం మూలాలు బయటి లింకులు 1979 భారతి మాసపత్రిక. వ్యాసము: కనిగిరిలో దుర్గము. వ్యాసకర్త:విద్వాన్ శ్రీ కొమాండూరి రామానుజాచార్యులు. చింతలపూడి కరుణానిధి రచించిన పరిశోధన గ్రంథం కనిగిరి దుర్గం చరిత్ర సరిహద్దులు వర్గం:ప్రకాశం జిల్లా పట్టణాలు
గిద్దలూరు (ప్రకాశం జిల్లా)
https://te.wikipedia.org/wiki/గిద్దలూరు_(ప్రకాశం_జిల్లా)
గిద్దలూరు ప్రకాశం జిల్లాలోని ఒక పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం. right|thumb|గిద్దలూరు చరిత్రకు కేంద్రబిందువైన పురాతన పాతాళ నాగేశ్వరస్వామి ఆలయం. ఇది సగిలేరు ఒడ్డున ఉంది. పురాతన చరిత్ర 1930వ దశకములో కామ్మియెడ్, బర్కెట్ట్ అను ఇద్దరు పురావస్తు శాస్త్రజ్ఞులు గిద్దలూరు పరిసరాల్లో పాత రాతియుగం (అప్పర్ పేలియోలిథిక్) నాటి మానవుడు నివసించిన ఆధారాలు కనుగొన్నారు.Indian Anthropologist: Journal of the Indian Anthropological Association By Indian Anthropological Association v.11 (1981) పేజీ.21 ఇక్కడ మధ్య రాతియుగము నాటి చిన్న రాతి పనిముట్ల పరిశ్రమలు బయల్పడ్డాయి.An Encyclopaedia of Indian Archaeology By Amalananda Ghosh పేజీ.149 ఈ చిన్న పనుముట్లు క్వార్ట్‌జ్ చేయబడినవి.Indian History (21st Edition, 2005) Allied Publishers ISBN 8177647660 పేజీ.A-9 ఆధునిక చరిత్ర గిద్దలూరు పూర్వ నామం సిద్ధలూరు. సిద్ధలూరు సమీపములోని నాగేశ్వరాలయం దగ్గర ఒక స్థలమును నందన చక్రవర్తి శ్రీవత్స గోత్రజుడు, నందనవారిక వంశానికి చెందిన కుంచాల శివప్పకు అగ్రహారముగా ఇచ్చాడు. కానీ తరువాత ఈ గ్రామం పాడుబడటము వలన, శివప్ప వంశీయుడైన రామచంద్ర నందవరము నకు తరలివెళ్లి, అక్కడి నుండే సిద్ధలూరి వ్రిత్తిని అనుభవించాడు. శక యుగములో తొండమారయగుళ్ల స్థాపన జరిగిన తరువాత, కుంచెల రామచంద్ర తొండమారయగుళ్ల నాయకుని నుండి కొత్తగా స్థాపించిన సిద్ధలూరిని అగ్రహారముగా పొంది నందవరము నుండి ఇరవై - ముప్పై బ్రాహ్మణ కుటుంబములు, బారబలావతులతో (12 మంది గ్రామ సేవకులు) సహా సిద్ధలూరికి తిరిగి వచ్చాడు. అయితే, తొండమారయగుళ్ల నాయకుని మరణానంతరము ఆ ప్రదేశము నిర్జనమైంది. ఆ కాలములో సిద్ధలూరి ప్రాభవము పెరిగి గ్రిద్ధలూరని కొత్త పేరు సంతరించుకొన్నది. కొంత కాలము తర్వాత గ్రిద్దలూరు అగ్రహారీకుడూ, కుంచాల రామచంద్రుని వంశజుడూ అయిన కుంచెల వెంకటాద్రయ్య గ్రామం చుట్టూ అనేక కుగ్రామాలు స్థాపన చేయించి గిద్దలూరిని మెరుగు పరచెను. అనతి కాలములోనే ఆ కుగ్రామాలు కంచిపల్లె, చట్టిరెడ్డిపల్లె, అక్కలరెడ్డిపల్లె మౌజే లుగా (స్వంతంత్ర గ్రామాలు లేదా ఒక మాదిరి పట్టణములు) ఎదిగినవి. దీనితో గిద్దలూరు కస్బా (ప్రధాన కేంద్రము) అయినది. హరిహర దేవరాయల కాలములో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామంలను వెంకటాద్రి నుండి వశము చేసుకొన్నాడు. కానీ ఆ తర్వాత కాలములో వెంకటాద్రి నుండి ఆ వంశములో మూడవ తరానికి చెందిన రామచంద్ర, హరిహర రాయలచే పునస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందెను. ఆయన కరణముగా కూడా నియమించబడెను. ఈ విధముగా ముస్లింలు రాక వరకు రామచంద్రరాజు వంశజులు గిద్దలూరు కస్బాను, దాని గ్రామాలను పరిపాలించారు. రాయల పాలన ముగింపుతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురై, ఆ తరువాత కాలములో దత్తమండలాలను నిజాము బ్రిటీషువారికి దత్తము చేసినప్పుడు కడప జిల్లాలో భాగముగా ఉన్న గిద్దలూరు బ్రిటిషు పాలనలోకి వచ్చింది. కర్నూలు జిల్లా యేర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలోను భాగమై, 1971లో ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలపబడింది. భౌగోళికం సగిలేరు నది (స్వర్ణబాహు నది) గిద్దలూరికి దక్షిణాన ప్రవహిస్తున్నది. జనగణన గణాంకాలు 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 26,977. ఇందులో పురుషుల సంఖ్య 13,662, మహిళల సంఖ్య 13,315, గ్రామంలో నివాస గృహాలు 5,979 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,094 హెక్టారులు. 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 35,150. పరిపాలన గిద్దలూరు నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. రవాణా సౌకర్యం గిద్దలూరు గుంటూరు - ద్రోణాచలము రైల్వే లైనుపై ఒక ప్రముఖ రైల్వేస్టేషను. ప్రధాన పంటలు వరి, అపరాలు, కాయగూరలు ప్రధాన వృత్తులు వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వృత్తులు. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు పురాతన పాతాళ నాగేశ్వరస్వామి ఆలయం ఈ ఆలయం కొంగలవీడు రహదారిపై, సగిలేరు వాగు ఒడ్డున ఉంది. విశేషాలు అమ్మ ఆశ్రమం: ఇది కొంగళవీడు రహదారిపై ఉన్నది ఇవి కూడా చూడండి గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం మూలాలు వర్గం:ప్రకాశం జిల్లా పట్టణాలు
ఆంధ్ర కేసరి
https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_కేసరి
దారిమార్పు టంగుటూరి ప్రకాశం
తెలంగాణ
https://te.wikipedia.org/wiki/తెలంగాణ
తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలంగాణ రాష్ట్రపు వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు దొరికాయి. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందింది. తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు. ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీ స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీ సీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి ముఖ్య పర్యాటక ప్రాంతాలు.సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358 2023 జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినందున రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ శతాబ్ది వేడుకలునిర్వహించారు. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ జనాభా రెండు కోట్లు ఉండగా 2023 నాటికి కోటి జనాభా పెరిగింది. ప్రస్తుత తెలంగాణ జనాభా మూడు కోట్లు. పేరు చరిత్ర శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలించిన ప్రాంతం త్రిలింగ దేశం, తెలుగు మాట్లాడే కాకతీయుల రాజ్యం, తెలుగు దేశం + ఆణెం అంటే దేశం, కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. చరిత్ర భారత స్వాతంత్యానికి పూర్వం thumb|right|170px|సా.శ.1150 నాటికి తెలంగాణలో పాలించే రాజ్యాలు పురాతన రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికిని కలిగియుంది. పూర్వ రాతియుగం కాలం నాటి ఆవాసస్థలాలు వేములపల్లి, ఏటూరునాగారం, బాసర, బోథ్, హాలియా, క్యాతూర్ తదితర ప్రాంతాలలో బయటపడ్డాయి. వాడపల్లి, వెల్టూరు, పోచంపాడు, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలలో బృహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పేజీ 20 షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది.ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి, రచన:పి.రామశర్మ ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది.A History of South India, K.A.Neelakanta Shastry, P 65 విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం).ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి, పి.రామశర్మ షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. మౌర్యుల కాలం:మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, ఫణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది.ఆంధ్రుల చరిత్ర, బి.ఎస్.ఎల్.హన్మంతరావు, పేజీ 52 ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి, పేజీ 17 మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్ఠాన రాజ్యమే అయి ఉంటుందని చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.తెలంగాణ చరిత్ర, రచన:సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 37 శాతవాహనుల కాలం:శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్ఠానపురం, ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల, దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు.తెలంగాణ చారిత్రక భౌగోళం, జి.రాంబాబు, పేజి 102 శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు.తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 69 ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి. thumb|left|170px|ఆలంపూర్‌లో బాదామి చాళుక్యుల నిర్మించిన దేవాలయాలు బాదామి చాళుక్య కాలం: బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలోఉండేది.ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి-మొదటి భాగం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్‌లో పలు సంఖ్యలో వీరి రాతిశాసనాలు ఉన్నాయి.తెలంగాణ శాసనాలు, మొదటి భాగంహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది. ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది. విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం). షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. రాష్ట్రకూటుల కాలం: రెండో కీర్తివర్మతో చాళుక్యవంశం అంతంకాగా మాన్యఖేతం రాజధానిగా రాష్ట్రకూటులు పాలన సాగించారు. దంతిదుర్గుని కాలంలో తెలంగాణ మొత్తం రాష్ట్రకూటుల పాలనలో ఉండేది. తెలంగాణలో తొలి గద్యశాసనం "కొరివి శాసనం" ఈ కాలం నాటిదే. రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న వేములవాడ చాళుక్యులు బోధన్, వేములవాడలలో స్వతంత్ర పాలన చేశారు. కళ్యాణి చాళుక్యకాలం: రాష్ట్రకూట రాజు రెండోకర్కరాజును ఓడించి రెండో తైలపుడు కళ్యాణి చాళుక్యరాజ్యం స్థాపించాడు. కవి రన్నడు ఇతని ఆస్థాన కవి.పాలమూరు చరిత్ర, దేవీదాస్ రావు మహబూబ్‌నగర్ జిల్లా గంగాపురంలోని చెన్నకేశ్వస్వామి ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించబడింది. ఈ ప్రాంతంలోవీరి పలు శాసనాలున్నాయి. ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు పాలించారు. పాలమూరు జిల్లా మద్యభాగంలో కందూరి చోడుల పాలన కిందకు ఉండేది. కందూరి చోడులు: క్రమక్రమంగా కందూరు చోళరాజ్యం విస్తరించింది. తొలి కాకతీయుల కాలం నాటికి ఇది కాకతీయ రాజ్యం కంటే పెద్ద రాజ్యంగా విలసిల్లింది.కాకతీయులు, రచన: పి.వి.పరబ్రహ్మశాస్త్రి కందూరు, మగతల (నేటి మక్తల్), వర్థమానపురం (నేటి నంది వడ్డెమాన్), గంగాపురం, అమరాబాద్, భువనగిరి, వాడపల్లి, కొలనుపాక ఈ కాలంలో పెద్ద పట్టణాలుగా విలసిల్లాయి. విక్రమాదియుని కుమారుడు తైలపుని కాలంలో రాజ్యాన్ని రెండుగా చేసి ఇద్దరు కుమారులను రాజులుగా చేశాడు. దానితో ఇప్పటి నల్గొండ, పాలమూరు జిల్లా ప్రాంతాలలోవేర్వేరు పాలన సాగింది. గోకర్ణుడు తన రాజధానిని పానగల్లు నుంచి వర్థమాన పురానికి తరలించాడు. కందూరు చోడుల శాసనం ఒకటి మామిళ్ళపల్లిలో కూడా లభ్యమైంది. ఇదే కాలంలో వరంగల్ ప్రాంతంలో పొలవాస పాలకులు రాజ్యం చేశారు. అనుమకొండ (నేటి హన్మకొండ ప్రాంతం) మాత్రం కొలనుపాక రాజధానిగా కళ్యాణి చాళుక్యులే పాలించారు. thumb|170px|కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు శిలాతోరణం కాకతీయ కాలం: తొలి కాకతీయుల కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఉత్తర తెలంగాణకే పరిమితమై ఉండగా రుద్రదేవుని కందూరు చోడరాజ్యంపై దండెత్తి వర్థమానపురాన్ని నాశనం చేసి తన సామంతులను పీఠం అధిష్టింపచేశాడు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్ధారెడ్డి ఈ కాలం వాడే. ఈయన సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవియిత్రిగా ఖ్యాతిచెందింది. సా.శ1323లో ఢిల్లీ సుల్తానుల దాడితో కాకతీయ సామ్రాజ్యం అంతంకాగా తెలంగాణ ప్రాంతం సుల్తానుల వశమైంది. అయితే కొంతకాలానికే ప్రతాపరుద్రుని సేనానిగా పనిచేసిన రేచర్ల సింగమ నాయకుడు స్వతంత్రించి పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ఇది దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పాలన సాగించగా, ముసునూరి పాలకులు ఈశాన్య తెలంగాణలో కొంతవరకు పాలించారు. ఆ తర్వాత కృష్ణానదికి దక్షిణభాగం ఉన్న తెలంగాణ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. ఉత్తర భాగం మాత్రం గోల్కొండ సుల్తానుల అధీనంలో ఉండేది. కుతుబ్‌షాహీల కాలం: సా.శ1565లో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా, దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్‌షాహీల పాలనలోకి వచ్చింది. ఉత్తర ప్రాంతంలో అంతకు క్రితమే బహమనీలు పాలించారు. బహమనీ సామ్రాజ్యం ఐదు ముక్కలు అయిన పిదప గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్‌షాహీలు రాజ్యమేలారు. కుతుబ్‌షాహీల ఉచ్ఛదశలో కూడా కృష్ణానదికి దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతం (రాయచూర్ డోబ్‌లోని నడిగడ్డ ప్రాంతం) ఆదిల్‌షాహీల పాలన కిందకు ఉండేది. అయితే ఇది తరచుగా చేతులు మారింది. 1687లో ఈ ప్రాంతం మొఘలుల వశమైంది. ఆసఫ్‌జాహీల కాలం: సా.శ1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీలు పాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూ ప్రవేశపెట్టారు.తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 196 స్థానిక ప్రజలను అణకద్రొక్కి ఢిల్లీనుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి 1925లో గోల్కొండ పత్రికను స్థాపించడం, 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు బూర్గుల రామకృష్ణారావు, పులిజాల వెంకటరావు, కొండా వెంకట రంగారెడ్డి, మాడపాటి హన్మంతరావు, మందుముల నరసింగరావు, రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తెలంగాణ విమోచనోద్యమం thumb|left|170px|పాలమూరు పట్టణంలో విమోచనోద్యమానికి గుర్తుగా ఉన్న తూర్పుకమాన్ హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడంభారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటి, 2006 ప్రచురణ, పేజీ 176 నానా అరాచకాలు సృష్టించారు.ఆంధ్రజ్యోతి దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-209 అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి.స్వాతంత్ర్య సమర నిర్మాతలు, స్వాతంత్ర్యోద్యమ చరిత్ర పరిశోధన సంస్థ ప్రచురణ, 1994, పేజీ 48 హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్ఠుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబరు 18న భారత్ యూనియన్‌లో విలీనం చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగావ్యవహరించారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా రాయచూర్, గుల్బర్గా, బీదర్ కర్ణాటక ప్రాంతం కన్నడ మాట్లాడే ప్రాంతాలు, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక లకు వెళ్ళిపోగా. ఔరంగాబాద్, బీడ్, పర్భణీ, నాందేడ్, హుస్నాబాద్ మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వేర్పాటు ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో 11 లోక్‌సభ స్థానలలో విజయం సాధించింది. 2001, ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదమైన లక్ష్యంకొరకు శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసినా ఫలితంలేకపోయింది. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం "ఐక్య కార్యాచరణ సమితి" చేతుల్లోకి వెళ్ళడంతో విద్యార్థులు, ఉద్యోగసంఘాలు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపైబడి సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటును ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్, బిల్లు తయారీ జరిగింది. ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ, శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తికాకముందే, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి. 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్‌సభ ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యధాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది. 2014 జూన్ 2 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. భౌగోళిక స్వరూపం thumb|తెలంగాణ సరిహద్దుల పటం thumb|తెలంగాణ భౌతిక పటం thumb|170px|left|తెలంగాణా జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతము సముద్రమట్టం నుంచి సరాసరిన 1500 అడుగుల ఎత్తున ఉండి ఆగ్నేయానికి వాలి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. తెలంగాణకు సముద్రతీరం లేదు. ఈ రాష్ట్రం కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది. thumb|220x220px|తెలంగాణా నదులు నదులు: గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమానది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీనది రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. అడవులు: ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్ జిల్లాలలోఅడవులు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అగ్నేయప్రాంతం, నల్గొండ జిల్లా నైరుతి ప్రాంతంలో విస్తరించియున్న అమ్రాబాదు పులుల అభయారణ్యం దేశంలోనే పెద్దది.నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 26-10-2014 మెదక్, నిజామాబాదు జిల్లాలలో, నల్గొండ ఆగ్నేయ భాగంలోని దేవరకొండ డివిజన్‌లో కూడా అడవులు ఉన్నాయి. నల్లమల అటవీ రక్షిత ప్రాంతం, మంజీరా అభయారణ్యం, కిన్నెరసాని అభయారణ్యం, కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఈ ప్రాంతంలోని రక్షిత అరణ్యాలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడే నాటికి 8 జిల్లాలు ఉండగా, 1956లో ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు 1978లో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. దక్షిణమున మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయమున నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతి తూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు. కర్ణాటక సరిహద్దుగా 3 జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దుగా 3 జిల్లాలు, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుగా 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా 3 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. తెలంగాణ పర్యాటక ప్రదేశాలు thumb|220x220px|పిల్లల మర్రి వృక్షం తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక, అధ్యాత్మిక, సాంస్కృతిక తదితర పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. ఆలంపూర్‌లో అష్టాదశ శక్తిపీఠం, బాసరలో జ్ఞానసరస్వతి దేవాలయం, భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం, నిజామాబాద్ సారంగపూర్ హనుమాన్ మందిరం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), ఆర్మూర్ సిద్దులగుట్ట, నిజామాబాద్ ఖిల్లా రఘునాధ ఆలయం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), డిచ్ పల్లి ఖిల్లా రామాలయం, ( కేస్లాపూర్‌లో నాగోబా దేవాలయం, సిరిచెల్మలో సోమేశ్వరాలయం, జైనాథ్‌లో పల్లవుల కాలం నాటి ఆలయం, గంగాపూర్‌లో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చెన్నకేశ్వస్వామి ఆలయం, కదిలిలో పాపహరేశ్వరాలయం, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం,మాతల్లి గోదావరి (తితిదే ప్రచురణ) కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయం, కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, అచ్చంపేట సమీపంలో ఉమామహేశ్వర ఆలయం, నారాయణపేట సమీపంలో ఔదుంబరేశ్వరాలయం, సిర్సనగండ్లలో సీతారామాలయం, మన్యంకొండలో శ్రీవెంకటేశ్వరాలయం, మామిళ్ళపల్లిలో నృసింహక్షేత్రం, బీచుపల్లిలో పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయంఆంధ్రప్రదేశ్ దర్శిని, పేజీ136నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 246, మెదక్‌లో పెద్ద చర్చి, ఏడుపాయలలో భావాని మందిరం, కొత్లాపూర్‌లో ఎల్లమ్మ ఆలయం, ఝురాసంగంలో కేతకీ ఆలయం, కొల్చారంలో జైనమందిరం, నాచగిరిలోనృసింహాలయం, బొంతపల్లిలో వీరభద్ర ఆలయం, వరంగల్‌లో వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, నిజామాబాద్ జిల్ల లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహస్వామి ఆలయం, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయం, తాండూరులో భద్రేశ్వరస్వామి ఆలయం, అనంతగిరిలో పద్మనాభస్వామి ఆలయం, కీసరలో రామలింగేశ్వరస్వామి ఆలయం, చేవెళ్ళలో వెంకటేశ్వరస్వామి ఆలయం, చిలుకూరులో బాలాజీ ఆలయం, పాంబండలో రామాయణం కాలం నాటి శివాలయం, దామగుండంలో రామలింగేశ్వరాలయం, పాలంపేటలో రామప్పదేవాలయం, కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి ఆలయం, మేడారంలో సమ్మక్క-సారక్క గద్దె ఉన్నాయి.వరంగల్ జిల్లా మేడారానికి 20 కిలోమీటర్ దూరంలో బ్రిటిష్ కాలానికి చెందిన అద్భుతమైన మరో ప్రకృతి వనం అందులోనూ కొలకత్తా హౌరా బ్రిడ్జి నమూనా రెండు వేరు వేరు దీవులను ఏకం చేస్తూ కట్టిన మరో అద్భుతం లక్నవరపు సరస్సు. left|thumb|180px|రామోజీ పిల్మ్ సిటి ఆదిలాబాదు జిల్లాలో ఎత్తయిన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం, బత్తీస్‌ఘఢ్ కోట, హైదరాబాదులో బిర్లామందిరం, బిర్లా ప్లానెటోరియం, చార్మినార్, గోల్కొండ కోట, నెహ్రూ జూపార్క్, రామోజీ ఫిలిం సిటి, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్, ఎన్టీయార్ గార్డెన్, సంఘీనగర్ వెంకటేశ్వరాలయం, సర్దార్ మహల్, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఖిల్లా, ఎలగందల్, రామగిరిఖిల్లా, ఖమ్మం జిల్లాలో రామాయణం కాలం నాటి పర్ణశాల, పాపికొండలు, కిన్నెరసాని అభయారణ్యం, నేలకొండపల్లి బౌద్ధస్తూపం, ఖమ్మం ఖిల్లా, పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి వృక్షం, గద్వాల కోట, ఖిల్లాఘనపురం కోట, అంకాళమ్మ కోట, కోయిలకొండ కోట, పానగల్ కోట, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, వరహాబాదు వ్యూపాయింట్, మల్లెలతీర్థం, నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు, భువనగిరి కోట, దేవరకొండ దుర్గం, నిజామాబాదు జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ ప్రాజెక్టు, దోమకొండ కోట,నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజామాబాద్ కందకుర్తి త్రివేణి సంగమం (గోదావరి, మంజీరా, హరిద్రా నదులు కలిసే స్థలం), రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేశవరావ్ హెగ్డేవార్ జన్మస్థలం, రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, కోట్‌పల్లి ప్రాజెక్టు, గండిపేట, శామీర్‌పేట చెరువు, వరంగల్ జిల్లాలో ఓరుగల్లు కోట, రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, పాకాల చెరువు, లక్నవరం, భోగత జలపాతం, మెదక్ జిల్లాలో మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యం, మంజీరా అభయారణ్యం, కొండాపూర్ మ్యూజియం, వనపర్తి జిల్లాలో వనపర్తి సంస్థానం, తిరుమలయ్య గుట్ట దేవాలయం, శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి thumb|200x200px|హైటెక్ సిటి తెలంగాణలో హైదరాబాదు జిల్లా ఆర్థికంగా ముందంజలో ఉండగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని మొత్తం జీడిపిలో సేవారంగం వాటా 59.01% ఉంది. వ్యవసాయరంగంలో 55.7% మంది పనిచేస్తుండగా, సేవారంగంలో 32.6%, పారిశ్రామిక రంగంలో 11% పనిచేస్తున్నారు.ఈనాడు దినపత్రిక (తెలంగాణ ఎడిషన్), తేది 07-11-2014 హైదరాబాదు జిల్లా నుంచి సేవారంగంలో సింహభాగం వాటా లభిస్తుండగా, పారిశ్రామిక రంగం నుంచి హైదరాబాదు పరిసరాలలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతం నుంచి, మెదక్ జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం నుంచి, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ప్రాంతం నుంచి లభిస్తుంది. తలసరి ఆదాయం:తెలంగాణ ప్రాంతపు ప్రజల తలసరి ఆదాయం రూ.36082గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే, హైదరాబాదులో అత్యధికంగా ఉండగా ఆదిలాబాదు, మహబూబ్ నగర్ జిల్లాల తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది. ఖనిజాలు: తెలంగాణలో అనేక ఖనిజ నిక్షిప్తమై ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాదు జిల్లాలలో బొగ్గు గనులు, ఆదిలాబాదు, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలలో ముడి ఇనుము, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలలో ముగ్గు రాయి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో సున్నపురాయి నిక్షేపాలు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. పరిశ్రమలు: హైదరాబాదు, పరిసరాలలో అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు లో, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో పారిశ్రామికవాడ ఉంది. మెదక్ జిల్లా పటాన్‌చెరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. బోధన్ లో చక్కెర కర్మాగారం, సిర్పూర్‌లో కాగితం పరిశ్రమ, కొత్తగూడెంలో ఎరువుల పరిశ్రమ ఉంది. విద్యుత్ కేంద్రాలు: 1921లో హుస్సేన్‌సాహర్ విద్యుత్ కేంద్రం స్థాపించబడింది. 1930లో నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపితమైంది. 1956లో నాగార్జున సాగర్ నిర్మించిన పిదప విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1983లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయానికి ప్రాజెక్టుగా మార్చి జలవిద్యుత్ కేంద్రంగా మార్చారు. 2011లో ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టులో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. గట్టు ప్రాంతంలో భారీ సౌరవిద్యుత్ కేంద్రం స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వ్యవసాయం: ప్రాచీన కాలంలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతం వ్యవసాయికంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయాభివృద్ధి కోసం కాకతీయులు నిర్మించిన పలుచెరువులు నేటికీ కనిపిస్తున్నాయి. రెండొబేతరాజు కేసరి సముద్రం నిర్మించగా, గణపతిదేవుడు దేశం (తెలంగాణ) నలుమూలలా పలు భారీ చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు ప్రఖ్యాతిగాంచిన రామప్ప చెరువును త్రవ్వించాడు. తెలంగాణ ప్రాంతంలో సువాసనలువెదజల్లే బియ్యం పండుతున్నట్లు అప్పట్లోనే సాహితీవేత్తలు పేర్కొన్నారు.తెలంగాణ చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పేజీ 133 కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల కాలంలో కూడా ఈ ప్రాంతం వ్యవసాయంలో పేరుగాంచింది. 1914లో వ్యవసాయాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటుచేశారు. నిజాంసాగర్ (1935)జలాశయం, అలీసాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల నిర్మాణం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనా స్థానము (1935) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో వరి, జొన్నలు, కందులు, ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్తి, నిజామాబాదు జిల్లాలో వరి, చెరుకు, మొక్కజొన్న, కరీంనగర్ జిల్లాలో వరి, ప్రత్తి, మెదక్ జిల్లాలో వరి, మొక్కజొన్న, వరంగల్ జిల్లాలో ప్రత్తి, వరి, నల్గొండ జిల్లాలో వరి, ప్రత్తి, రంగారెడ్డి జిల్లాలో వరి, కందులు అధికంగా పండుతాయి.తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల ద్వారా 70 లక్షల ఆయకట్టుకు పుష్కలమైన సాగునీరు అందుతున్నది. మరో 15.71 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. రవాణా సౌకర్యాలు left|thumb|170px|తెలంగాణలో గ్రామాలను నగరాలను కలిపే ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు రోడ్డు రవాణా: దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి, జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 నిజామాబాదు-జగదల్‌పూర్, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, వంటి జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. left|thumb|170px|కాచిగూడ రైల్వే స్టేషను రైలు రవాణా: సికింద్రాబాదు, కాజీపేటలు తెలంగాణలోని రైల్వేజంక్షన్లు. సికింద్రాబాదు దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము, డివిజన్ కేంద్రము . హైదరాబాదు/సికింద్రాబాదు నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి. నిజాంల కాలంలో 1874లో వాడి నుండి హైదరాబాదుకు రైలుమార్గం వేయబడింది. సికింద్రాబాదు-విజయవాడ మార్గం 1886లో పూర్తయింది. కాచిగూడ నుండి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, ఔరంగబాద్ ల మీదుగా మన్మాడ్ వరకు గోదావరి వ్యాలీ రైలు మార్గం 1899లో మొదలు పెట్టి 1901లో ప్రారంభమైంది. సికింద్రాబాదు నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా బెంగుళూరుకు, స్వాతంత్ర్యానంతరం బీబీనగర్ నుంచి నడికుడికి మార్గాలు వేశారు. నూతనంగా గద్వాల నుంచి రాయచూర్ మార్గం 2013, అక్టోబరు 12 నఈనాడు దినపత్రిక, తేది 13-10-2013 ప్రారంభమైంది. దేవరకద్ర నుంచి రాయచూరు, నిజామాబాద్ నుంచి పెద్దపల్లితో సహా పలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-నిజామాబాదు-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ముఖ్య కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. వాయు రవాణా: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు, విదేశాలకు వెళ్ళడానికి సదుపాయం ఉంది. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విమానాశ్రయంగా పలుసార్లు అవార్డులు పొందినది. విమానాశ్రయ ఏర్పాటుకు ముందు బేగంపేటలో డొమెస్టిక్ విమానాశ్రయం ఉండేది. వరంగల్, నిజామాబాదు, రామగుండంలలో కూడా విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన ఉంది. తెలంగాణ రాజకీయాలు తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014), తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018) చూడండి thumb|150px|తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 1948 వరకు ఈ ప్రాంతం హైదరాబాదు రాజ్యంలో భాగంగా ఉండుటచే ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేకుండేది. హైదరాబాదు రాజ్య విమోచనం అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రారంభమయ్యాయి. 1952లో తొలిసారిగా ఈ ప్రాంతంలో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు, తొలి లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండేవి. తొలి లోక్‌సభ ఎన్నికలలో కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటితో విజయం సాధించారు. హైదరాబాదు శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు లభించడంతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందినారు. 1956 నవంబరులో ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. 1969లో తెలంగాణ ఉద్యమం తలెత్తింది. 1971 లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ 11 స్థానాలకు గాను పదింటిలో విజయం సాధించింది. 1971-73 కాలంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందినారు. 11 నెలల రాష్ట్రపతి పాలన అనంతరం 1973 డిసెంబరు నుంచి 1978 మార్చి వరకు ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజాసమితి పార్టీ నాయకుడైన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి 1978 మార్చి నుంచి 1980 అక్టోబరు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. ఆ తర్వాత 1980 అక్టోబరు నుంచి మెదక్ జిల్లాకు చెందిన టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి పదవి పొంది 1982 ఫిబ్రవరి వరకు పనిచేశారు. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో 1983 ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లభించింది. 1989 డిసెంబరు నుంచి 1990 డిసెంబరు వరకు మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణకు చెందినవారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందలేరు. 2011లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన పిదప దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. 2001 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వల్ల తెలంగాణ రాజకీయంగా చాలా మార్పులను లోనైంది. 2004 లోక్‌సభ ఎన్నికలలో తెరాస కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 26 శాసనసభ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలలో విజయం సాధించింది. 2009 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 12, తెలుగుదేశం పార్టీ 2, తెరాస 2, ఎంఐఎం 1 స్థానాలలో విజయం సాధించాయి. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ ప్రాంతంలోని 119 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందినది. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటిచేసి, విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి మెజారిటీ స్థానాలు సాధించి తెలంగాణ రాష్ట్రపు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 2018లో గడువు ముందుగా జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించి, కె.చంద్రశేఖరరావు రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ యువ తెలంగాణ పార్టీ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రముఖులు 160px|thumb|కోదండరాం హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరుపొందిన భాగ్యరెడ్డివర్మ, తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్దారెడ్డి,పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, సహజకవి బమ్మెరపోతన, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్, కవి, విమోచనోద్యమకారుడు దాశరథి రంగాచార్యులు, కవయిత్రి సరోజినీ నాయుడు, కవి పండితుడు వానమామలై వరదాచార్యులు, ఒగ్గు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మిద్దె రాములు, విమోచనోద్యమకారుడు, నిజాంపైబాంబులు విసిరిన నారాయణరావు పవార్, చిత్రకళాకారుడు కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణవాది, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ, సాహితీవేత్త జువ్వాడి గౌతంరావు, సుమతీ శతక కర్త బద్దెన, తొలి తెలుగు పురాణ అనువాదకుడు, మార్కండేయ పురాణం రచించిన మారన, భూమి కోసం, భుక్తి కోసం సాయుధపోరాటం చేసిన దొడ్డి కొమరయ్య, సాహితీవేత్త దేవులపల్లి రామానుజరావు, తెలంగాణ కాటన్‌గా ప్రసిద్ధి చెందిన నవాబ్ అలీ నవాబ్‌జంగ్ బహదూర్, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు, సంకీర్తనాచార్యుడు ముష్టిపల్లి వేంకటభూపాలుడు,పాలమూరు జిల్లా వాగ్గేయకారులు, రచన: పి.భాస్కరయోగి విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి సుబ్బారావు, నిజాం కాలంలో కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి,స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచన: మల్లయ్య సాయుధపోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, కవి వేములవాడ భీమకవి, సమరయోధుడు రాధాకిషన్ మోదాని, జానపద సాహిత్య సృష్టికర్త బిరుదురాజు రామరాజు, తెలంగాణ సాహితీమూర్తి లక్ష్మీ నరసింహశర్మ, ప్రముఖ సమరయోధుడు పులిజాల వెంకటరంగారావు, 13వ శతాబ్దికి చెందిన శివకవి పాల్కురికి సోమనాథుడు, కమ్యూనిస్ట్ నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం, తెలంగాణ సాయుధ పోరాట సేనాని రాజ్ బహదూర్ గౌర్, నిజాంపై తిరగబడిన షోబుల్లాఖాన్, గద్వాల కోటను నిర్మించిన పెద సోమభూపాలుడు,కృష్ణవేణి తరంగాలు, (తితిదే ప్రచురణ) సమరయోధుడు జమలాపురం కేశవరావు, చిత్రకారుడు పాకాల తిరుమల రెడ్డి, కవి సామల సదాశివ, సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య, సమరయోధుడు, సంఘసంస్కర్త పల్లెర్ల హనుమంతరావు,మహబూబ్‌నగర్ జిల్లా అజ్ఞాత విషయాలు, రచన: పల్లెర్ల జానకి రామశర్మ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక రూపు తీసుకువచ్చిన కొత్తపల్లి జయశంకర్, అడవి బిడ్డలకు అండగానిలిచిన రాంజీ గోండు, కుతుబ్‌షాహీల నాటి కవి మరింగంటి సింగనాచార్యులు, తెలంగాణ ఉద్యమకారిణి టి.ఎస్.సదాలక్ష్మి, తొలితరం తెలుగు కవి కొరవి గోపరాజు, నటుడు కత్తి కాంతారావు, విమోచనోద్యమకారుడు విశ్వనాథ్ సూరి, దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళాపాలకురాలు రుద్రమదేవి, left|160px|thumb|హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య, సాహితీవేత్త కృష్ణస్వామి ముదియార్, తెలంగాణభాషలో కవితలద్దిన కాళోజీ నారాయణరావు, కవి మల్లినాథ సూరి, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, కవి, కళాకారుడు సుద్దాల హనుమంతు, బహుముఖ ప్రజ్ఞాశాలి వట్టికోట ఆళ్వారుస్వామి, తెలంగాణ రైతాంగపోరాటయోధుడు బందగి, కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణరెడ్డి, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, సమరయోధుడు మందుముల నరసింగరావు, కళాకారుడు, కవి పల్లెర్ల రామ్మోహనరావు,పాలమూరు జిల్లా నాటక కళావైభవం, రచన:దుప్పల్లి శ్రీరాములు గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి, తెలంగాణలో కవులే లేరని హేళన చేయగా "గోల్కొండకవుల చరిత్ర"తో నోరుమూయించిన సురవరం ప్రతాపరెడ్డి, కవి, చరిత్ర పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి, తొలితెలుగు కవయిత్రి కుప్పాంబిక, చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ, తెలంగాణ ఉద్యమనేత బొజ్జం నరసింహులు, నిజాం పాలనను ఎదిరించి ప్రజలలో చైతన్యం తెచ్చినశతవసంతాల కరీంనగర్ జిల్లా అనభేరి ప్రభాకరరావు, 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి చరిగొండ ధర్మన్న, మొఘల్ పాలనను అడ్డుకున్న సర్వాయి పాపన్న, కూచిపూడి నృత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిచెందిన రాజారాధారెడ్డి దంపతులు, ఆర్యసమాజ్ పండిత్ నరేంద్రజీ, విమోచనోద్యమకారుడు పాగ పుల్లారెడ్డి, నిజాంపై తిరగబడిన ఆదివాసి కొమురం భీమ్, ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కె.చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కథా రచయిత అల్లం రాజయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు రాకమచర్ల వేంకటదాసు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరాం, విమోచనొద్యమకారుడు వెల్దుర్తి మాణిక్యరావు, ప్రముఖ విద్యావేత్త జి.రాంరెడ్డి, చిత్రకారుడు తోట వైకుంఠం, శాసనసభ స్పీకరుగా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు, చేనేత వస్త్ర పరిశోధకుడు నల్ల పరంధాములు, ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి, కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న సి.హెచ్.విద్యాసాగర్ రావు, చరిత్ర పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు, విమోచనోద్యమకారిణి ఆరుట్ల కమలాదేవి, విప్లవకవి గద్దర్, రచయిత జ్వాలాముఖి, విమోచనొద్యమకారుడు మగ్దూం మొహియుద్దీన్, ప్రస్తుత కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన కొండా వెంకట రంగారెడ్డి,తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే.....స్వరాస్ట్రం కోసం అసువులు బాసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి.కణకణలాడే నిప్పును ముద్దాడి తన శ్వాస ఆశ ఆశయం తెలంగాణ రాష్ట్రం అంటూ ఉద్యమ సాక్షిగా మంటల్లో మాడి మసి అయిన విద్యార్థి శ్రీకాంతాచారి, 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు. ఈ ప్రాంతానికి చెందిన కొందరు. సందీప్ గౌడ్‌ తెలంగాణ రాష్ట్రానికి వ్యక్తి 2016లో ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆయన 2021లో ఒమాన్ దేశం తరపున టి - 20 వరల్డ్ కప్ లో ఆడాడు. జనాభా 2001 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,09,87,271 కాగాhttp://www.censusindia.gov.in, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతపు జనాభా 3,52,88,768 గా ఉంది. అప్పటి రంగారెడ్డి జిల్లా 52.96 లక్షల జనాభాతో ప్రథమస్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా 40.42 లక్షలతో రెండో స్థానంలో, హైదరాబాదు జిల్లా 40.10 లక్షల జనాభాతో మూడవ స్థానంలో ఉంది. నిజామాబాదు జిల్లా చివరి స్థానంలో ఉంది. తెలంగాణ సాహిత్యం thumb|170px|తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి ప్రాచీనకాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం విలసిల్లింది. ఆలంపూర్‌కు చెందిన మంథాన భైరవుడు 10వశతాబ్దంలోనే ప్రసిద్ధ "భైరవతంత్రం"అనే సంస్కృత గ్రంథం రచించాడు.పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు 13వ శతాబ్దిలో గోన బుద్ధారెడ్డి "రంగనాథ రామాయణం" ద్విపద ఛందస్సులో రచించాడు. ఇది తొలి తెలుగు రామాయణంగా ప్రసిద్ధి చెందినది. గోన బుద్ధారెడ్డి సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి పొందింది. ఈమె వేయించిన బూదపురం శాసనం నేటి భూత్పూర్‌లోని దేవాలయంలో ఉంది. తెలంగాణ సాహిత్యంలో కాకతీయ యుగం స్వర్ణయుగంగా భావించబడుతుంది. గణపతిదేవుని బావమరిది జాయపసేనాని నృత్యరత్నావళిని రచించాడు. తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కుర్కి సోమనాథుడు తెలుగు సాహిత్యంలోనే ఆదికవిగా నిలిచాడు.తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 139 వేములవాడ భీమకవి ఈ కాలం నాటివాడే. 13వ శతాబ్దికే చెందిన బద్దెన కాకతీయుల కాలంలో సుమతీ శతకము రచించాడు. తొలి పురాణ అనువాద మహాకవి మారన ఇదే కాలానికి చెందినవాడు. ప్రతాపరుద్రుని ఆస్థానకవి విద్యానాథుడు రచించిన పలు గ్రంథాలలో ప్రతాపరుద్ర యశోభూషణం ప్రఖ్యాతిచెందింది. మూడు తరాల కాకతీయ చక్రవర్తుల వద్ద మంత్రిగా పనిచేసిన శివదేవయ్య కూడా మహాకవి. 14వ శతాబ్దికి చెందిన కాచ-విఠలులు తొలి తెలుగు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. చమత్కార చంద్రిక రచించిన విశ్వేశ్వరుడు కూడా 14వ శతాబ్దికి చెందిన కవి. తెలుగులో తొలి యక్షగాన రచయిత సర్వజ్ఞ సింగభూపాలుడు కూడా ఇదే కాలానికి చెందినవాడు. అనపోత నాయకుని కుమారుడు రెండో సింగభూపాలుడు స్వయంగా కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయనగర రాజు బుక్కరాయల కోడలైన గంగాదేవి కాకతీయుల ఆడబిడ్డ, ఈమె కవయిత్రిగా పేరుపొందింది.తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 167 తొలి తెలుగు వచనకర్త కృష్ణమాచార్యులు కూడా 14వ శతాబ్దికి చెందినవాడు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు స్వయంగా కవి అయి శివయోగసారం లాంటి పలు రచనలు చేశాడు. సింహాసన ద్వాత్రింశిక రచించిన కొరవి గోపరాజు కూడా ఇదే కాలానికి చెందినవారు. సిగ్మండ్ ప్రాయిడ్ కంటే ముందే మానసిక సమస్యలు విశ్లేషించిన వాడిగా గోపరాజు ప్రఖ్యాతిచెందారు. చిత్రవిచిత్రాలతో కూడిన "చిత్రభారతం" రచయిత చరిగొండ ధర్మన్న 15-16వ శతాబ్దికి చెందిన కవి. thumb|left|170px|జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణలో తెలుగు సాహిత్య ప్రభ తగ్గిననూ మరింగంటి సింగరాచార్యులు తన కవిత్వంతో ఇబ్రహీం కుతుబ్‌షానే మెప్పించి అగ్రహారాన్ని పొందాడు. అప్పటి కవులు ఇతనిని మల్కిభరాముడని అభివర్ణించారు. ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానకవి అద్దంకి గంగాధరుడు ప్రతిభావంతుడైన కవి. ఇతను రచించిన తపతి సంవర్ణోపాఖ్యానం ప్రఖ్యాతిచెందింది. పొన్నెగంటి తెలగనాచార్యుడు 16వ శతాబ్దికి చెందినకవి. కులీకుతుబ్‌షా ఫారసీ కవులను ఆదరించాడు. ఇతని కాలంలో ఫారసీ, ఉర్దూలలో పలు రచనలువెలువడ్డాయి. కులీకుతుబ్‌షా సంస్కృత "శుకసప్తతి"ని "యాతినామా" పేరుతో ఫారసీలోకి అనువాదం చేయించాడు. ఈ కాలంలోనే దోమకొండ సంస్థానం సాహిత్యానికి పేరుగాంచింది. 1600 ప్రాంతానికి చెందిన కాసే సర్వప్ప "సిద్దేశ్వర చరిత్ర" రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి ఎలకూచి బాలసరస్వతి తెలుగులోనే మొట్టమొదటి మహామహోపాధ్యాయ కవిగా గణతికెక్కాడు. కొందరు గుంటూరు జిల్లా కవిగా భావించే కాకునూరి అప్పకవి తెలంగాణ వాడేనని బూర్గుల నిరూపించాడు. తానీషా వద్ద పనిచేసే అక్కన్న-మాదన్నల మేనల్లుడు కంచెర్ల గోపన్న (భక్తరామదాసు) కీర్తనలు తెలుగువారికి శతాబ్దాల నుంచి సుపరిచితమే. thumb|160px|తెలంగాణ భాషలో కవితలద్దిన కాళోజీ ఆసఫ్‌జాహీల కాలంలో (1724-1948) తెలంగాణ సాహిత్యం కుంటుపడింది. తెలుగుభాషను అణగద్రొక్కి బలవంతంగా ప్రజలపై ఉర్దూభాష రుద్దడం, తెలుగు కవులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో కాకతీయుల కాలంలో వెలుగులు విరజిమ్మిన తెలంగాణ సాహిత్యం ఆసఫ్‌జాహీలకాలంలో దారుణంగా దెబ్బతిన్నది. అక్కడక్కడా తెలుగులో రచించిన గ్రంథాలు కూడా వెలుగులోకి రాకుండా చేశారు. ఈ కాలంలో స్థానిక స్థల మహాత్మ్యాలు, దేవాలయ చరిత్రల విశేషాలు రచించినవి తర్వాతి కాలంలో బయటపడ్డాయి. భజనకీర్తనలు కూడా ఈ కాలంలో వ్రాయబడ్డాయి. మన్నెంకొండ హనుమద్దాసు, రాకమచర్ల వేంకటదాసు, వేపూరు హనుమద్దాసు ఈ కాలంలోని సంకీర్తన త్రిమూర్తులుగా పరిగణించబడతారు. రాజవోలు ప్రభువు ముష్టిపల్లి వేంకటభూపాలుడు వేలాది సంకీర్తనలు రచించాడు. ఆసఫ్‌జాహీలు స్వయంగా కవిపండితులకు ఆదరణ ఇవ్వకున్ననూ స్వతంత్రంగా పాలన కొనసాగించిన సంస్థానాలలో మాత్రం సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆధునిక కాలంలో కవిపండితులకు నిలయమైన గద్వాల సంస్థానం ప్రత్యేకతను కలిగియుంది. సాహితీవేత్తలు ఈ సంస్థానాన్ని విద్వత్గద్వాలగా అభివర్ణించేవారు. గద్వాల సంస్థానాధీశూలు కూడా స్వయంగా కవులుగా ఉండి పలు రచనలు చేశారు. తరుచుగా కవితాగోష్టులు నిర్వహించేవారు. గద్వాల సంస్థానాధీశులు కవులను ఎంతగా అభిమానించేవారంటే, వారి కోసం ఒక ప్రత్యేక ద్వారాన్నే ఏర్పాటు చేసి, వారు నడిచే మార్గంలో తెల్లటి వస్త్రాన్ని పరిచి, కవిపండితుల పాదధూళిని భరిణెలో భద్రపర్చి వాటిని తిలకంగా నుదుటికి పెట్టుకొనేవారు. గద్వాల సంస్థానంతో పాటు పరిసర సంస్థానాలైన వనపర్తి సంస్థానం, జటప్రోలు సంస్థానాధీశూలు కూడా గద్వాల సంస్థానంతో పోటీపడ్డారు. వీరి మధ్య తరుచుగా కవితా గోష్టులు జరిగేవి. తిరుపతి వేంకటకవులను కూడా ఓడించిన ఘనత వనపర్తి సంస్థాన కవులకు దక్కింది. 1920 తర్వాత తెలంగాణలో నీలగిరి, గోల్కొండ పత్రిక లాంటి తెలుగు పత్రికలు రాకతో సాహిత్యం మరింత అభివృద్ధి చెందింది. అదివరకు వెలుగులోకి రాని కవులు, వారి రచనలను సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రికలోనే, దానికి అనుబంధమైన సుజాత సాహిత్య పత్రికలోనూ ప్రచురించేవారు. తెలంగాణలో కవులే లేరనే ఒక ఆంధ్రుడి సవాలును తీసుకొని 356 కవుల చరిత్ర, వారి రచనలతో "గోల్కొండ కవుల సంచిక" పేరుతోఒక గ్రంథాన్నే ప్రజల ముందుకు ఉంచిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలుగులో తొలి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇతనికే లభించింది. గ్రంథాలయోద్యమం సమయంలో ప్రతి ప్రాంతంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, సాహిత్య గ్రంథాలు ఉంచడంతో సాహితీ అభిమానులు కూడా అధికమయ్యారు. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య లాంటి కవులు నిజాం దురాగతాలను ఎలగెత్తడానికి పద్యాలనే ఆధారం చేసుకోగా, కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషలోనే కవితలు చేసి ప్రజలను జాగృతం చేశారు. వట్టికోట ఆళ్వారుస్వామి, మందుముల నరసింగరావు, బూర్గుల రామకృష్ణారావు లాంటి వారు విమోచనోద్యమ కాలంలోనే సాహిత్య రచన చేశారు. సామల సదాశివ బహుభాషావేత్త, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి ఆధునిక తెలుగు సాహితీవేత్తలలోనే అగ్రగణ్యులుగా ప్రసిద్ధి చెందారు. నందిని సిద్ధారెడ్డి, అందెశ్రీ, గోరటి వెంకన్నలు తెలంగాణపై కవితలు రచించారు. తెలంగాణ సంస్కృతి left|thumb|160px|బతుకమ్మ ఉత్సవం పండుగలు: బోనాల ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇవి కాకుండా మిగితా తెలుగు ప్రజలు జరుపుకొనే సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, రంజాన్ తదితర ముఖ్య పండుగులను ఇక్కడి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2014 జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలును రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వు జారీచేసింది.ఈనాడు దినపత్రిక, తేది 27-06-2014 భాష: తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల భాష తెలుగు. సంపూర్ణ తెలంగాణావారు మాట్లాడే తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా కలుస్తాయి. ఆదిలాబాదు జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో ఆ జిల్లాలో మరాఠి భాష ప్రభావం కొంత ఉంది. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు జిల్లాల కర్ణాటక సరిహద్దు గ్రామాలలో కన్నడ భాష ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతపు గ్రామీణ తెలుగు భాష యాసలో మిగితా ప్రాంతపు తెలుగు భాషకు కొద్దిగా వైరుధ్యం కనిపిస్తుంది. తెలంగాణాలోని ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కొద్దిగా స్వచ్ఛమైన తెలుగు వినిపిస్తుంది. వస్త్రధారణ: తెలంగాణ ప్రాంతము ఉత్తర-దక్షిణ భారతదేశానికి వారధిగా ఉండటం,కొన్ని శతాబ్దాల నుంచి ఈ ప్రాంతంపై దండయాత్రలుచేసి పాలించడం, ఇతర ప్రాంతాల వారు వచ్చి నివాసం ఏర్పర్చుకోవడంతో ఇక్కడ మిశ్రమ వస్త్రధారణ ఉంది. అలాగే మారుతున్న ధోరణులు, సినిమా-అంతర్జాలం-అంతర్జాతీయీకరణ తదితరాల వల్ల కూడా ఇక్కడి వస్త్రధారణ పట్టణ ప్రాంతాలలో చాలా మార్పుచెందింది. అయిననూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పురుషులు మోకాళ్లపైకి ఉండే ధోవతి, మహిళలు చీరలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంది. గిరిజన ప్రాంతాల మహిళలు మాత్రం వారి సంప్రదాయక దుస్తులు ధరిస్తారు. వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి. రెండో ప్రధాన పంట జొన్నలు. ప్రాజెక్టులు, నదులు, కాలువలు ఉన్న ప్రాంతాలలో వరి అధికంగా పండుతుంది. జొన్నల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాదు జిల్లాలు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. కందుల ఉత్పత్తికి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం పేరుగాంచాయి. మొక్కజొన్న ప్రధానంగా మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్ జిల్లాలో పండుతుంది. పెసర్ల పంటలో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. నూనెగింజల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా నిజామాబాదు జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. చెరుకు ఉత్పత్తిలో మెదక్ జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో ఉంది. మిరపపంటలో ఖమ్మం జిల్లా అగ్రస్థానం పొందగా, పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాదు జిల్లా ముందంజలో ఉంది. పొగాకు, ఉల్లి సాగులో మహబూబ్ నగర్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. మొత్తం సాగుభూమి విస్తీర్ణంలో భౌగోళికంగా పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్ అగ్రస్థానంలో ఉండగా పూర్తిగా నగర ప్రాంతమైన హైదరాబాదు జిల్లాలో ఎలాంటి సాగుభూమి లేదు. తెలంగాణలోని వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ పర్యవేక్షిస్తుంది. ఆనకట్టలు, జలాశయాలు తెలంగాణ రాష్ట్రం ఆనకట్టలు, రిజర్వాయర్లు, సరస్సులు, కాలువలు, ట్యాంకులకు నిలయంగా పిలువబడుతుంది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే డ్యాములు, రిజర్వాయర్లు, సరస్సులు, ట్యాంకులు, కాలువలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. విద్యాసంస్థలు 220x220px|thumb|ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం 1959లో వరంగల్లో నిట్ (NIT) జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం స్థాపించబడింది.1919లో హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1964లో ఎన్.జీ.రంగా విశ్వవిద్యాలయం, జే.ఎన్.టి.యూ, 1974లో హైదరాబాదు విశ్వవిద్యాలయం, 1976లో వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రారంభించబడినవి. 2000 తర్వాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నిజామాబాదులో తెలంగాణ విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్‌లో పాలమూరు విశ్వవిద్యాలయం, కరీంనగర్‌ లో శాతవాహన విశ్వవిద్యాలయం, నల్గొండలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రారంభించబడ్డాయి. హైదరాబాదులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కళలు తెలంగాణలోని పలు ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందినవి. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ కొయ్యబొమ్మలకు పేరుగాంచగా, వరంగల్ జిల్లా పెంభర్తి ఇత్తడి సామానుల తయారికి ప్రసిద్ధి చెందింది.warangal.ap.nic.in/tourism/maintour ఆదిలాబాదు జిల్లా కేంద్రం రంజన్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. నారాయణపేట జరీచీరల తయారీకి పేరుపొందింది. జిల్లాలు-మండలాలు వ.సంఖ్య జిల్లా జిల్లా ప్రధాన కార్యాలయం రెవెన్యూ డివిజన్ మండలాలురెవెన్యూ గ్రామాలు సంఖ్యఅందులో నిర్జన గ్రామాలునిర్జన గ్రామాలు పోగా మిగిలిన రెవెన్యూ గ్రామాలు సంఖ్య వైశాల్యం (చ.కి)1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్2184,185.972 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్2154,300.163 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం2238,951.004 జయశంకర్ జిల్లా భూపాలపల్లి 1116,361.705 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ 1122,928.006 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్216 4,325.297 జగిత్యాల జిల్లా జగిత్యాల 3183,043.238 జనగామ జిల్లా జనగామ 2122,187.509 కామారెడ్డి జిల్లా కామారెడ్డి 3223,651.0010 కరీంనగర్ జిల్లా కరీంనగర్2162,379.0711 ఖమ్మం జిల్లా ఖమ్మం2214,453.0012 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ 2162,876.7013 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్1164,037.0014 మంచిర్యాల జిల్లా మంచిర్యాల 2184,056.3615 మెదక్ జిల్లా మెదక్3212,740.8916 మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా మెడ్చల్2155,005.9817 నల్గొండ జిల్లా నల్లగొండ3312,449.7918 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్4206,545.0019 నిర్మల్ జిల్లా నిర్మల 2193,562.5120 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్3294,153.0021 రంగారెడ్డి జిల్లా హైదరాబాదు5271,038.0022 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి2144,614.7423 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి 4264,464.8724 సిద్దిపేట జిల్లా సిద్దిపేట 3243,425.1925 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల1132,030.8926 సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2231,415.6827 వికారాబాద్ జిల్లా వికారాబాద్2193,385.0028 వనపర్తి జిల్లా వనపర్తి 1142,938.0029 హన్మకొండ జిల్లా హన్మకొండ2141,304.5030 వరంగల్ జిల్లా వరంగల్2132,175.5031 యాదాద్రి - భువనగిరి జిల్లా భువనగిరి 2173,091.4832 ములుగు జిల్లా ములుగు193,881.0033 నారాయణపేట జిల్లా నారాయణపేట 1112,336.00 మొత్తం73593112,077.00 రాష్ట్ర చిహ్నాలు తెలంగాణ రాష్ట్ర వృక్షంగా-జమ్మిచెట్టు, రాష్ట్ర పండు-మామిడి పండు, రాష్ట్ర గీతం-జయ జయహే తెలంగాణ, రాష్ట్ర చిహ్నం-తెలంగాణ అధికారిక చిహ్నం, రాష్ట్ర భాష-తెలుగు, ఉర్దూ రాష్ట్ర జంతువు-జింక, రాష్ట్ర పక్షిగా-పాలపిట్ట, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు, రాష్ట్ర చేప-కొర్రమట్ట (కొర్రమీను), రాష్ట్ర క్రీడ-కబడ్డీను రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది.నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది నవంబరు 18, 2014 ఆధునిక తెలంగాణ- కాలరేఖ 1948, సెప్టెంబర్ 13 ఆపరేషన్ పోలోలో భాగంగా భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. 1948, సెప్టెంబరు 17: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది. 1948, ఆగస్టు 22: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది. 1953, ఆగస్టు 25: తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణించాడు. 1955, డిసెంబరు 10: నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. 1956, ఫిబ్రవరి 20: తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. 1956, నవంబరు 1: తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో భాగమైంది. 1961, ఫిబ్రవరి 6: తెలంగాణకు చెందిన సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు. 1963,జూలై 26: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1967, ఫిబ్రవరి 24: హైదరాబాదు రాజ్యపు చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ మరణించాడు. 1967, ఏప్రిల్ 11: హైదరాబాదులో ఈసీఐఎల్ స్థాపించబడింది. 1967, ఆగస్టు 4: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభించబడింది. 1969, ఫిబ్రవరి 28: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితిని స్థాపించారు. 1969, మార్చి 29: ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1970, జూలై 24: తెలంగాణ పితామహుడిగా పేరుపొందినకొండా వెంకట రంగారెడ్డి మరణించాడు. 1971, సెప్టెంబరు 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవి చేపట్టాడు. 1973, డిసెంబరు 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిలోకి వచ్చాడు. 1976, మార్చి 31: తెలంగాణ సాయుధపోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి మరణించాడు. 1976, సెప్టెంబరు 24: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు పండిత్ నరేంద్రజీ మరణించాడు. 1976, మే 12: సమరయోధుడు, రచయిత, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు మరణించాడు. 1978: ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి పదవిలోకి వచ్చాడు. 1978, ఆగస్టు 15: హైదరాబాదు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడింది. 1991, జూన్ 21: తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు. 2000, మార్చి 7: హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ల దురాగతాలకు బలయ్యాడు. 2007, ఏప్రిల్ 16: హైదరాబాదు నగరపాలక సంస్థ స్థానంలో "గ్రేటర్ హైదరాబాదు" (హైదరాబాదు మహానగరపాలక సంస్థ) ఏర్పడింది. 2008, మార్చి 15: రంగారెడ్డి జిల్లా శంషాబాదులో అంతర్జాతీయ విమానాశయం ప్రారంభించబడింది. 2009, అక్టోబరు 19: దేశంలోనే అతిపొడవైన ఫైఓవర్ (పి.వి.నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే) హైదరాబాదులో ప్రారంభమైంది. 2009, నవంబరు 29: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది. 2009, డిసెంబరు 9: భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు. 2011, మార్చి 10: ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ ఉద్యమం నిర్వహించబడింది. 2013, జూలై 30: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. 2013, అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2013, డిసెంబరు 5: తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది. 2014, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2014, ఫిబ్రవరి 13: తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. 2014, ఫిబ్రవరి 18: లోక్‌సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది. 2014, ఫిబ్రవరి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014, మార్చి 1: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. 2014, మార్చి 4: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ 2014 జూన్ 2 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2014, జూన్ 2: భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఇవి కూడా చూడండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు‎ తెలంగాణ విమోచనోద్యమం తెలంగాణా సాయుధ పోరాటం తెలంగాణ చరిత్ర (పుస్తకం) తెలంగాణ విశిష్ట దేవాలయాలు తెలంగాణ ప్రముఖులు తెలంగాణ అధికారిక చిహ్నం తెలంగాణ యాస తెలంగాణా బీసీ కులాల జాబితా తెలంగాణ ఆసరా ఫింఛను పథకం తెలంగాణ గ్రామజ్యోతి పథకం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తెలంగాణ గ్రామీణ బ్యాంకు తెలంగాణ కోటలు తెలంగాణ జాతరలు తెలంగాణలోని నదులు, ఉపనదులు మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ మూలాలు ఇతర పఠనాలు (direct link) వర్గం:తెలంగాణ వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:దక్షిణ భారతదేశం
మచిలీపట్నం
https://te.wikipedia.org/wiki/మచిలీపట్నం
మచిలీపట్నం (బందరు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన తీర నగరం, జిల్లా కేంద్రం. ఇక్కడ 350 పడవల సామర్ధ్యం గల సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డులకు ప్రసిద్ధి. ఇక్కడి తీరప్రాంతం తరచు తుఫాను, వరదల బారిన పడుతుంటుంది. బియ్యం, నూనె గింజలు, బంగారపు పూత నగలు, వైజ్ఞానిక పరికరాలు ఇక్కడి ప్రధాన ఉత్పత్తులు. చరిత్ర ఈ పట్టణం చరిత్ర 3 వ శతాబ్దం శాతవాహనుల కాలంలో నుండి ఉందని, దానిని మైసలోస్ (టోలిమి) మసిలా (పెరిప్లస్) అని పిలిచేవారని తెలుస్తుంది. దీనిని మసూలిపట్నం లేదా మసూల బందరు, మచిలీ బందరు అని పూర్వం పిలిచేవారు. మచిలీపట్నం అన్న పేరు రావటానికి వెనుక కథ ఒకటి ఉంది. సముద్రపుటొడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అని పేరొచ్చిందంటారు. 'మచిలీ' అంటే హిందీ భాషలో చేప, పట్నం అంటే పెద్ద ఊరు. తెలుగు దేశంలో పట్టణం అనేది సాధారణంగా సముద్రపు ఒడ్డున ఉన్న రేవులకే వాడతారు. ఇంకొక కథనం ప్రకారం, మచిలీపట్నాన్ని మసుల అనీ మససోలియ అని గ్రీకు రచయితలు రాసారు. థీని అసలు పేరు మహాసాలిపట్నమ్. అథే మహాసలిపట్నమ్, మసిలిపట్నమ్ , మచిలిపట్నమ్ గాను కాలక్రమంలో మార్పు చెందింది. ఇక్కడినుండి రోము నగరానికి సన్ననేత వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. ఇది సాలీలు నివాసం. ఆదే దాని అసలుపేరు. తీరపట్టణం అవడం చేత 17 వ శతాబ్దంలో బ్రిటీష్ వారు, ఫ్రెంచ్ వారు డచ్ వారు ఇక్కడ నుండి వర్తకం జరిపేవారు. 1659 లో బ్రిటిషు వారు ఫ్రెంచివారిని మసూలిపటం ముట్టడిలో ఓడించి, వారి స్థావరాన్ని ఆక్రమించారు. భౌగోళికం నగరం అక్షాంశరేఖాంశాలతో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో వుంది. ఇది సముద్రమట్టానికి 7 మీ.ఎత్తులో ఇంది. సమీప పట్టణాలు పెడన, గుడివాడ, రేపల్లె. రవాణా సౌకర్యాలు రోడ్డు: NH-65: మచిలీపట్నం నుండి పూనే NH-216: ఒంగోలు నుండి కత్తిపూడి రైలు: ఇక్కడ నుండి గుడివాడ, విజయవాడ, విశాఖపట్నాలకు నేరు రైలు సేవలున్నాయి. విమాన సౌకర్యాలు: దగ్గరలోని విమానాశ్రయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం. విద్యా సౌకర్యాలు హిందూ కళాశాల: పురాతన కళాశాల. ఆంధ్ర జాతీయ కళాశాల (నేషనల్ కాలేజి). ఈ కళాశాలను కోపల్లె హనుమంతరావు 1910 లో స్థాపించారు. ఈ కళాశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ రెండు సార్లు విడిది చేశారు. ఈ కాలేజికి అడవి బాపిరాజు మొదలైన మహానుభావు లెందరో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు. కృష్ణా విశ్వవిద్యాలయం దైతా మధుసూధన శాస్త్రి శివా ఇంజినీరింగ్ కళాశాల (స్థాపన 1981), మచిలీపట్నం నోబుల్ కాలేజి లేడీ యాంప్తెల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల. సరస్వతీ ప్రాథమికోన్నత పాఠశాల:- విద్యను ఉచితంగా అందించవలెనను ఉద్దేశంతో, సర్కిల్‌పేటలోని ఈ పాఠశాలను, శ్రీ వేదాంతం యోగానందనరసింహాచార్యులు, 1928లో, ఏర్పాటుచేసారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలయిన చిన ఉల్లంగిపాలెం,పెద ఉల్లంగిపాలెం, ఎస్.సి.వాడ, రెల్లికాలనీ, ఫతులాబాద్, జలాల్‌పేట, తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ఈ పాఠశాలలో చేరుతారు. సంస్కృతి కలంకారి అద్దకం , ఇతర కళలు మచిలీపట్నపు కలంకారీ వస్తువులు ప్రసిద్ధి చెందినవి. దుస్తులు, తివాచీలు, గోడకు వేలాడతీసే వస్తువులు (వాల్ హేంగింగ్స్) మొదలైనవి కలంకారీ చేసే వస్తువులలో ముఖ్యమైనవి. కలంకారీ అనేది ఒక విధమైన అద్దకము పని. కలంకారీ అనే పేరు కలం అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. కలం అంటే ఒక రకమైన పెన్ను. వెదురు బొంగుకి చివర ఖద్దరు గుడ్డ చుట్టి దానితో దుస్తుల మీద కాని తివాచీల మీద కాని రంగులు పులుముతారు. ఈ రంగులు నూనెగింజల నుండి లేదా కూరగాయల నుండి తయారు చేస్తారు. ఈ కలంకారీ పనిలో ఉతకడం, పిండడం, నానబెట్టడం, చలువ చేయడం (బ్లీచింగ్), కొన్ని మోడరెంట్లు, రంగులు కలపడం చేస్తారు. నీలం రంగుకు నీలిమందు, ఎరుపు కొరకు మంజిష్ఠ, పసుపుపచ్చ కోసం మామిడి చెక్క, ఎండు కరక్కాయ, నలుపురంగు కోసం తాటిబెల్లం, తుప్పుపట్టిన ఇనుములను ఉపయోగిస్తారు. ఈ అద్దకము అనేక రోజులపాటు సాగే పెద్ద ప్రక్రియ. కొన్ని చిన్న భాగాలు చేత్తో గీసినా, విస్తారమైన పెద్ద వస్తువులను అచ్చుతో అద్దుతారు. పౌరాణిక కథలు, పాత్రలు చిత్రించబడి గోడకు వేళ్ళాడదీసుకొనే వస్తువుల తయారీకి కాళహస్తి పేరుపొందినది. అదే విధంగా మచిలీపట్నం, చీరలలో ఉపయోగించే అచ్చుతో అద్దిన పెద్ద వస్తువులకు పెట్టింది పేరు. మచిలీపట్నంలో అచ్చులతోనూ, చేతితోనూ వేసే అద్దకం పనిలో పూలూ, మొక్కల డిజైన్లతో ఎంతో అందంగా ఉంటాయి. ఈ అద్దకం పనులు స్థానిక పాలకుల ఆదరం పొందడమే కాక, బాగా ఎగుమతి కూడా అయ్యేవి. ఈ ఎగుమతులు మచిలీపట్నంపై ఐరోపా వర్తకులకు మోజు కలిగించాయి. బందరు లడ్డు బందరులో 150 సంవత్సరాల క్రితం స్ధిరపడిన సింగుల కుటుంబాలు బందరు లడ్డుల సష్టికర్తలుగా చెపుతారు. బొందిలీలు అని కూడా పిలచే సింగుల కుటుం బాలు బందరులో ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. వీరిలో ఎవరు ఇప్పుడు ఈ లడ్డుల తయారీలో కానీ, ఈ వ్యాపారంలో కానీ లేరు. ఆ కుటుం బాల వద్ద పనిచేసి లడ్డు తయారీ నేర్చు కున్న ఒకటి రెండు కుటుంబాలలో ఒక కుటుంబం ఇప్పటికీ ఆ వ్యాపారాన్ని విడచిపెట్టలేదు. అందుకే బందరు లడ్డు అనగానే బందరులో ఠక్కున శిర్విశెట్టి సత్యనారాయణ కేరాఫ్‌ తాతారావు పేరు చెపుతారు. తాతారావును ఇప్పటికీ మిఠాయి కొట్టు తాతారావుగా పిలుస్తుంటారు. గత 50 ఏళ్లుగా ఆయన ఈ వ్యాపారంలో ఉన్నారు.బందరు లడ్డును తొక్కుడు లడ్డూ అని కూడా అంటారు. స్వచ్ఛమైన శనగపిండి నుండి ముందు పూస తీస్తారు. దాని నాణ్యతలో ఎక్కడా రాజీలేకుండా ఘుమఘు మలాడే అతి స్వచ్ఛమైన నేతితో వేయించి ఆ తరువాత దంచుతారు. దాన్నలా ఉంచి సరైనపాళ్లలో బెల్లం పాకం తయారు చేస్తారు. ఆ పాకాన్ని దంచుతున్న పొడిలో పోస్తూ తొక్కుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు 9 గంటలు పడుతుంది. సరైన పక్వానికి వచ్చిన దశలో యాల కులు, పటికబెల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి కలిపి ఆ తరువాత లడ్డూలుగా చుడతారు. ఆ విధంగా తయారైన లడ్డూ 20 రోజులపాటు నిల్వ ఉంటుం ది. ఈ లడ్డులో ఎటువంటి రంగు, రసాయనాలు కలుపరు. సాహిత్య సంస్థలు "సాహితీమిత్రులు" పేరుతో మినీకవిత పితామహుడు రావి రంగారావు వ్యవస్థాపకాధ్యక్షుడిగా గత 30 సంవత్సరాలనుండి ఈ సంస్థలో కృషిచేస్తున్నాడు. ఇప్పటివరకు సంస్థ పక్షాన 62 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. 2000లో శతావధానం, 2001లో ద్విశతావధానం, కవిత్వశిక్షణ వర్కుషాపులు అనేకం నిర్వహించబడ్డాయి. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు right|thumb|250px|మచిలీపట్నం సాయిబాబా మందిరం thumb|250px|మచిలీపట్నం బీచ్ వద్ద సూర్యోదయం శ్రీ పాండురంగస్వామి దేవాలయం, మచిలీపట్నం: ఇక్కడి దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు. పండరీపురంలో ఉన్న దేవాలయం వలే ఇక్కడ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం చాలా విశాలంగా ఉంటుంది. అంతరాలయంలోనున్న పాండురంగడి నల్లరాతి విగ్రహం, గర్భగుడి బయటవున్న పాలరాతి అమ్మవార్ల విగ్రహలు చూపరులను భక్తిభావంతో కట్టిపడెస్తాయి. భక్తులు పాండురంగడిని అరాధించి, పటికబెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. మంగినపూడి బీచ్: మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంది. బెస్తవారు ఉండే చిన్న గ్రామమిది. ఇక్కడి బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. విదేశీయులకు తూర్పు తీరానికి చేరడానికి ఇది ముఖ ద్వారంగా ఉండేది. ఇక్కడి బీచ్ లో సముద్రం లోతు తక్కువగా ఉంటుంది. ఈ బీచ్ లో ఉన్న నాట్య పాఠశాలలో నృత్య విద్యార్థులకు కూచిపూడి నృత్యం నేర్పిస్తారు. శ్రీ దత్త ఆశ్రమం, మంగినపూడి: మైసూర్ పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చే ప్రతిష్టించబడిన దత్తాత్రేయ అవతారాలైన శ్రీ నరసింహ సరస్వతి  పాదుకలున్నాయి . ఆశ్రమoలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ షోడశ రూపాలైన ఒకరు శ్రీ అనఘా దేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు.  బందరు బస్టాండు నుంచి 1 కి.మీ. లోపలే నే చేరుకోవచ్చును . ఇక్కడ ఉన్న శివాలయం చాలా పురాతనమైంది. రామేశ్వరములో ఉన్నట్లుగా ఇక్కడ పన్నెండు బావులు నక్షత్ర  ఆకారం లో ఉంటాయి. అంతే కాదు ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు.http://www.dattapeetham.com/india/festivals/birthday99/history.html దత్తపీఠం అందువలన దీనిని దత్తరామేశ్వరం అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమికి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్నానము చేస్తారు. ఘంటసాల: మచిలీపట్నానికి 21 కి.మీ. దూరములో ఉన్న ఈ గ్రామంలో పురాతన బౌద్ధ స్థూపాలు ఉన్నాయి. ఇవీ చూడండి మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం ప్రముఖులు మచిలీపట్నానికి చెందిన ప్రముఖులలో కొందరు: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి (యూజీ) తత్వవేత్త. భావరాజు నరసింహారావు రఘుపతి వేంకటరత్నం నాయుడు శంకరమంచి పార్థసారధి నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి కాటంరాజు నారాయణరావు జరుక్ శాస్త్రి శాంతికుమారి (తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శి) శ్రీకాంత్ బొల్లా - పారిశ్రామికవేత్త గరికిపర్తి కోటయ్య దేవర, సంగీత విద్వాంసుడు, ఆంధ్రగాయక పితామహుడు అనే బిరుదును పొందినవాడు. సినీరంగ ప్రముఖులు నల్లూరి సుధీర్ కుమార్ ( సంగీత దర్శకుడు ) సుత్తివేలు కొర్రపాటి గంగాధరరావు నిర్మలమ్మ మాస్టర్ వేణు కమలాకర కామేశ్వరరావు నల్లూరి అరుణ్ కుమార్ ( ఎడిటర్, తొలి తెలుగు డైలీ సీరియల్ ఋతురాగాలు ) దాసరి మారుతి మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ తీర పట్టణాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు వర్గం:మచిలీపట్నం వర్గం:ప్రాచీన తెలుగు పట్టణాలు వర్గం:కృష్ణా జిల్లా
చుట్టరికాలు
https://te.wikipedia.org/wiki/చుట్టరికాలు
దారిమార్పుబంధువు వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు
టంగుటూరి ప్రకాశం పంతులు
https://te.wikipedia.org/wiki/టంగుటూరి_ప్రకాశం_పంతులు
దారిమార్పు టంగుటూరి ప్రకాశం
అర్ధవీడు
https://te.wikipedia.org/wiki/అర్ధవీడు
అర్ధవీడు ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలం లోని గ్రామం.ఇది మండల కేంద్రం భౌగోళికం ఇది సమీప పట్టణమైన మార్కాపురం నుండి 56 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1568 ఇళ్లతో, 6572 జనాభాతో 2360 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6602, గ్రామంలో నివాస గృహాలు 1390 ఉన్నాయి. సమీప గ్రామాలు దొనకొండ 4 కి.మీ, యాచవరం 9 కి.మీ, గన్నేపల్లి 10 కి.మీ, పెద్దకందుకూరు 12 కి.మీ, మగుటూరు 14 కి.మీ. గ్రామ పంచాయతీ 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, గుల్లా పుల్లారెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు.ఈనాడు ప్రకాశం; 2013,ఆగస్టు-11; 5వపేజీ. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు 600 సంవత్సరాలనాటి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంతో పాటు పలు ఆలయాలున్నాయి. విద్యా సౌకర్యాలు గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కంభంలోను, ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నంద్యాలలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు కందులాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కందులాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పలు ప్రైవేటు వైద్య కేంద్రాలున్నాయి. తాగు నీరు చెన్నారాయుడు చెరువు 334 సర్వే నంబరులో, 104 ఎకరాల 38 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. సమాచార, రవాణా సౌకర్యాలు గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. వినోద సౌకర్యాలు గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం ఉన్నాయి. భూమి వినియోగం అర్ధవీడులో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 463 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 23 హెక్టార్లు శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 15 హెక్టార్లు తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 49 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 64 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 416 హెక్టార్లు బంజరు భూమి: 541 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 783 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 1266 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 476 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు అర్ధవీడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 476 హెక్టార్లు ఉత్పత్తి ప్రధాన పంటలు ప్రత్తి, ఆముదం, వరి, అపరాలు, కాయగూరలు మూలాలు వెలుపలి లంకెలు
కాకర్ల
https://te.wikipedia.org/wiki/కాకర్ల
కాకర్ల పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది. కాకర్ల (అర్ధవీడు) - ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలానికి చెందిన గ్రామం కాకర్ల (జూలూరుపాడు) - ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు మండలానికి చెందిన గ్రామం కాకర్ల (తిరువూరు) - కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని గ్రామం. కాకర్ల (Kakarla) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. కాకర్ల (ఇంటి పేరు) కాకర్ల సుబ్బారావు
బేస్తవారిపేట
https://te.wikipedia.org/wiki/బేస్తవారిపేట
బెస్తవారిపేట ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బెస్తవారిపేట నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2006 ఇళ్లతో, 7606 జనాభాతో 222 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3799, ఆడవారి సంఖ్య 3807. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 980 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 80. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591149.పిన్ కోడ్: 523334. గ్రామ పంచాయతీ 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దూదేకుల రసూల్ బీ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి మట్టా వరలక్ష్మి ఎన్నికైనారు. [2] విద్యా సౌకర్యాలు గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల నెల్లూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు కంభంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం మార్కాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలులోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం బెస్తవారిపేటలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. 9 మందుల దుకాణాలు ఉన్నాయి. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. పారిశుధ్యం మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. సమాచార, రవాణా సౌకర్యాలు బెస్తవారిపేటలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. బ్యాంకులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు. భారతీయ స్టేట్ బ్యాంకు. విజయ బ్యాంకు. కొటక్ మహీంద్రా బ్యాంకు. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 6 గంటల పాటు వ్యవసాయానికి, 6 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం బెస్తవారిపేటలో భూ వినియోగం కింది విధంగా ఉంది: అడవి: 26 హెక్టార్లు వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 19 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 11 హెక్టార్లు శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 3 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 2 హెక్టార్లు బంజరు భూమి: 59 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 99 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 67 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 94 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు బెస్తవారిపేటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 45 హెక్టార్లు చెరువులు: 49 హెక్టార్లు ఉత్పత్తి బెస్తవారిపేటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు ప్రత్తి, మిరప, శనగ దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు త్రిలోక పుణ్యక్షేత్రం:- ఈ ఆలయంలో కారీకపౌర్ణమి సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. శ్రీ లలితాంబికా అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలోని అమ్మవారి జన్మదినం సందర్భంగా, 2017, మార్చి-12వతేదీ, ఫాల్గుణ పౌర్ణమి, ఆదివారం, హోలీపండుగనాడు, ఆలయంలో వేడపండితులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూల విరాట్టుకు క్షీరాభిషేకం, విష్ణ చక్రార్చన నిర్వహించారు. శివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవారినీ దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. శ్రీ అంబమల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, కార్తీకమాసాన్ని పురస్కరించుకొని. 2014, నవంబరు-9, ఆదివారం నాడు, వనభోజనాలు ఏర్పాటుచేసారు. భక్తులు స్వామివారికి విశేషపూజలు చేసారు. అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయం:- స్థానిక బి.సి.కాలనీలో ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారి జయంతిని పురస్కరించుకుని, 2017, జూలై-23వదేదీ ఆదివారంనాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- స్థానిక రాణీపేట లోని ఈ ఆలయ వార్షికోత్సవం, 2016, ఫిబ్రవరి-20, శనివారంనాడు నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పన నిర్వహించెదరు. శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం:- స్థానిక తేరు బజారు లోని ఈ ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు 2017, జూన్-8వతేదీ గురువారం నుండి ప్రారంభించారు. 8న గణపతిపూజ, విష్ణుసహస్రనామ పారాయణ, అభిషేకం, జలాధివాసం, హనుమాన్‌చాలీసా పారాయణం, నవగ్రహ ఆరాధన, నిర్వహించారు. 9వతేదీ శుక్రవారంనాడు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 10వతేదీ శనివారంనాడు వేదమంత్రోచ్ఛారణల మధ్య యంత్ర, ధ్వజ ప్రాణ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. కళాన్యాసం, పూర్ణాహుతి తదితర పూజలు నిర్వహించారు. భక్తులు ధ్వజస్తంభం పునాదుల వద్ద నవధాన్యాలు, పంచలోహాలు సమర్పించారు. ఈ ధ్వజస్తంభ దాత శ్రీ సన్నిధి శ్రీనివాసులు. అనంతరం స్వామి, అమ్మవారల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక పోలేరమ్మ అమ్మవారికి, 2015, మార్చి-21వ తేదీనాడు, ఉగాది సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుఝామున, 108 బిందెలతో అభిషేకం, కలశాలతో అమ్మవారికి గ్రామోత్సవం, సాయంత్రం కోలాటం, కులుకు భజన మొదలైఐన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక దర్గా రహదారిలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు మూడురోజులపాటు, వైభవంగా నిర్వహించెదరు. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- బేస్తవారిపేట దర్గా కొండపై వెలసిన ఈ ఆలయంలో, 2015, ఆగస్టు-25వ తేదీనాడు, ఆలయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యాహ్నం, భక్తులకు అన్నదానం నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక దర్గా కొండపై ఉంది. శ్రీ కాశీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక చిన్నకంభం వెళ్ళే దారిలో ఉంది. దత్తాత్రేయ ఆశ్రమం, దత్తకొండ. శ్రీ భావనాఋషి ఆలయం. మూలాలు వెలుపలి లంకెలు
మోక్షగుండం
https://te.wikipedia.org/wiki/మోక్షగుండం
మోక్ష గుండుం ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బెస్తవారిపేట నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మార్కాపురం నుండి 47 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 584 ఇళ్లతో, 2127 జనాభాతో 974 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1065, ఆడవారి సంఖ్య 1062. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 242 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591163.పిన్ కోడ్: 523334. గ్రామం పేరు వెనుక చరిత్ర గ్రామానికి రెండు కిలోమీటర్లు తూర్పున ఒక చిన్న కొండపై ముక్తేశ్వరము అను శివాలయము ఉంది. ప్రతి యేటా మాఘ మాసములో (ఫిబ్రవరి) జరిగే ముక్తేశ్వర స్వామి జాతరకు అనేక మంది భక్తులు చుట్టుపక్కల ప్రదేశముల నుండి విచ్చేస్తారు. ఈ గుడి దగ్గర ఉన్న పవిత్ర గుండములో స్నానము చేసిన వారికి మోక్షము కలుగునని స్థానికులు భావిస్తారు. అందుకే ఈ ఊరికి మోక్షగుండo అని పేరు వచ్చింది. సమీప గ్రామాలు సోమిదేవిపల్లి 4 కి.మీ, పందిల్లపల్లి 4 కి.మీ, గుడిమెట్ట 7 కి.మీ, బసినెపల్లి 8 కి.మీ, పిట్టికాయగుళ్ల 8 కి.మీ. విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి బెస్తవారిపేటలోను, మాధ్యమిక పాఠశాల పూసలపాడులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బెస్తవారిపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల కంభంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నెల్లూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు కంభంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల బెస్తవారిపేటలోను, అనియత విద్యా కేంద్రం మార్కాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం మోక్ష గుండుంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. పారిశుధ్యం మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు మోక్ష గుండుంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 5 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం మోక్ష గుండుంలో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 150 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 121 హెక్టార్లు శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 29 హెక్టార్లు తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 95 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 14 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 38 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 523 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 372 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 189 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు మోక్ష గుండుంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 189 హెక్టార్లు ఉత్పత్తి మోక్ష గుండుంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు ప్రత్తి, మిరప, జొన్న దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శ్రీ ముక్తేశ్వర క్షేత్రం - పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞతో తల్లి రేణుకాదేవిని హతమార్చి పాపపరిహారానికై ఇక్కడి గుడిలో ఉన్న లింగాన్ని పూజించి ముక్తి పొందుటచే దీనికి ముక్తేశ్వర క్షేత్రంగా పేరు వచ్చినట్టు స్థలపురాణంలో చెప్పబడింది. గర్భగుడిలోని లింగాన్ని వశిష్ఠుడు ప్రతిష్ఠ చేశాడని ఆ పురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీరాముడు సతీసమేతంగా అరణ్యవాసం చేయు సమయాన తండ్రి దశరథుని సంవత్సరీకం వచ్చింది. ఆ సందర్భంలో నీరు లభించని కారణంగా బాణం వేసి పాతాళగంగ ను పైకి తెచ్చినట్టు పురాణంలో పేర్కొనబడింది. ఈ స్థలంలో నిర్మించిన కోనేరు, శ్రీరాముని కోనేరు గా నేటికీ పిలవబడుచున్నది. ఇచ్చటగల అమ్మవారిని భ్రమరాంబగా కొలుస్తారు. ఈ ఆలయంలో 2014, జూన్-18, బుధవారం ఉదయం 11 గంటలకు, ఆదిత్యాది నవగ్రహ మృత్యుంజయ యంత్ర బింబ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం యోగి వేమన విగ్రహం - గ్రామంలోని యోగి వేమన విగ్రహం వద్ద, వేమన జయంతి సందర్భంగా, 2015, మార్చి-25వ తేదీనాడు, పూజా కార్యక్రమం నిర్వహించెదరు. అనంతరం పద్యగానం కార్యక్రమం ఏర్పాటుచేసెదరు. ప్రముఖులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క పూర్వీకులు ఈ గ్రామం నుండే కన్నడ దేశానికి వలస వెళ్లారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ CYIENT (సెయింట్) అధినేత శ్రీ బి.వి.మోహనరెడ్డి (బోధనపు వెంకట రామమోహన రెడ్డి) :- వీరు 2017, జనవరి-26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనారు. గ్రామ విశేషాలు స్థానిక పంచాంగములు లెక్కలు కట్టే గ్రామానికి చెందిన జ్యోతిష్యులు ఈ ప్రదేశములో పేరుపొందారు. మోక్షగుండంలో పూర్వం శివానంద ఆశ్రమం కూడా ఉన్నట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. బ్రహ్మ కైలాస శివానందాశ్రమం - మోక్షగుండం వారి ధర్మం అని ఒక శిలాశాసనంపై రాయబడి ఉంది. ఈ గ్రామానికి చెందిన శ్రీ దొంతా పెద్దపోలయ్య కుమారుడైన వెంకటశ్రీనివాసులు, 2010-12 సం.లలో గుజరాతులోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (ఎగ్రికల్చర్) చదివి, దానిలో ప్రథముడిగా నిలిచి బంగారు పతకం సాధించాడు. 2014, జనవరి-15న జరిగిన స్నాతకోత్సవంలో వీరీ పురస్కారాన్ని గుజరాతు గవర్నరు శ్రీమతి కమలాబెన్ చేతులమీదుగా అందుకున్నారు. ఈ గ్రామానికి చెందిన శ్రీ నరాల రవీంద్రరెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగు కళాశాలలో ఇ.సి.ఇ. విభాగంలో చదువుచూ, 2012-13 విద్యాసంవత్సరంలో, వార్షిక పరీక్షలలో, 9.11 గ్రేడ్ సాధించి, టాపరుగా నిలిచి, 2014, సెప్టెంబరు-29న వైస్-ఛాన్సిలరు శ్రీ జి.ఎస్.ఎన్. రాజుగారి చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు. ఈ గ్రామంలో శ్రీ ఆవుల లక్ష్మీరెడ్డి అను ఒక ప్రజానాట్య మండలి కళాకారుడు ఉన్నారు. వీరు 65 సంవత్సరాల వయస్సులో 2016, మే-13న అనారోగ్యంతో తన నివాసంలో కాలధర్మం చెందినారు. ఈ గ్రామస్థులైన CYIENT (సెయింట్) సంస్థ అధినేత శ్రీ బి.వి.మోహనరెడ్డి, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గ్రామానికి చెందిన ఆవుల శ్రీవేద, మైక్రోబయాలజీలో పరిశోధనలకుగాను, యోగివేమన విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. సాల్వాట్ జనిక్ బ్యాక్టీరియాను ఉపయోగించి వ్యవసాయ వ్యర్ధాల నుండి అవిటోన్, బ్యుటనాల్, ఇథనాల్ వంటి జీవ సాంకేతిక ఇంథనాల తయారీ అను అంశంపై పరిశోధనలు పూర్తిచేయడంతో వీరికి డాక్టరేట్ ప్రదానం చేసారు. గణాంకాలు 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,102. ఇందులో పురుషుల సంఖ్య 1,082, మహిళల సంఖ్య 1,020, గ్రామంలో నివాస గృహాలు 488 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 974 హెక్టారులు. మూలాలు వెలుపలి లింకులు
తెలుగు గ్రంథాలయాలు
https://te.wikipedia.org/wiki/తెలుగు_గ్రంథాలయాలు
thumb|333x333px|శ్రీకాకుళంలోని కథానిలయం లోని గ్రంథాలయ పుస్తకాలు. కథానిలయం నిర్వాహకుడు సుబ్బారావు (మధ్య) తో పాటు బి.కె.విశ్వనాథ్ (కుడి), కె.వెంకటరమణ (ఎడమ) తెలుగు గ్రంథాల విశేషమైన సేకరణలు ఉన్న గ్రంథాలయాలు ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. గౌతమి గ్రంథాలయము - రాజమండ్రి బ్రౌన్‌ గ్రంథాలయము - కడప సారస్వత నికేతనం - వేటపాలెం నగర కేంద్ర గ్రంథాలయము - హైదరాబాదు వరంగల్‌ గ్రంథాలయము - వరంగల్ రామ్‌ మోహన్‌ రాయ్‌ గ్రంథాలయము - విజయనగరం కొన్నెమరా గ్రంథాలయము - మద్రాసు ప్రాచ్య లిఖితప్రతుల గ్రంథాలయము - మద్రాసు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్చీవులు - హైదరాబాదు సరస్వతీ మహల్‌ - తంజావూరు శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయము - హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రము - హైదరాబాదు కథానిలయం - శ్రీకాకుళం వి.ఎస్.కృష్ణ గ్రంథాలయము, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం శ్రీ రామచంద్ర గ్రంథాలయము, పోడూరు ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రభుత్వ మ్యూజియం - కాకినాడ శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పిఠాపురం అన్నమయ్య గ్రంథాలయం, గుంటూరు తెలుగు సేకరణలు కల ఇతర భారతీయ గ్రంథాలయములు తెలుగు సేకరణలు కల ఇతర అంతర్జాతీయ గ్రంథాలయములు వర్గం:గ్రంథాలయాలు వర్గం:జాబితాలు
ఏలూరు
https://te.wikipedia.org/wiki/ఏలూరు
ఏలూరు (ఎల్లొర్ ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఏలూరు జిల్లా నగరం, జిల్లా కేంద్రం. సమీపంలో గల కొల్లేరు సరస్సు ప్రముఖ పర్యాటక ఆకర్షణ. పేరు వ్యుత్పత్తి ఏల అన్న చిన్న ఏరు ఈ పట్టణ పరిసరాల్లో ప్రవహించడంతో ఏలూరు అన్న పేరు ఏర్పడివుంటుందని బూదరాజు రాధాకృష్ణ భావించాడు. చరిత్ర తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా 1200 వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినపుడు ఏలూరు వారి రాజ్యంలో భాగం. తరువాత కళింగ రాజ్యం, గజపతుల పరిపాలనలోకొచ్చింది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకొన్నాడు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపములో ఉన్న పెదవేగి, గుంటుపల్లె (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తరువాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. తరువాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉంది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పరచినపుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయ్యింది. కృష్ణానది నుండి వచ్చే ఏలూరు కాలువ, గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం (మల్కాపురం) వద్ద కొల్లేరులో కలుస్తాయి. అందువలన హేలాపురి అనే పేరు సాహిత్యపరంగా వాడుకలోకి వుచ్చింది . తూర్పు లాకుల దాకా గోదావరి నీళ్ళు, పడమటి లాకుల దాకా కృష్ణ నీళ్ళూ. కృష్ణ ఎత్తు, గోదావరి పల్లం కావున నదులు కాలవలో సమతలంగా కలపడానికి తూర్పు లాకులు, పడమటి లాకులు ఉండేవి. ఆ లాకులు ముయ్యడం, తియ్యడం, పడవలని జాగ్రత్తగా కాలవలోకి పంపించడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. చైత్ర వైశాఖ మాసాల్లో లాకులు కట్టేసి కాలవ మూసేసే వాళ్ళు. అప్పుడు కాలవ ఎండి పోయేది. మళ్ళీ మృగశిర కార్తెలో, కాలవ వదిలే వాళ్ళు. ఆ కాలవ నీళ్ళే పంపుల చెరువుల్లోకి పట్టి ఉంచేవాళ్ళు. కాలక్రమేణా కాలవలో సమృద్ధిగా నీళ్ళు వుండకపోవడంతో, పడవలు తిరగడం ఆగిపోయింది. పంపుల చెరువులు పూడిపొయ్యాయి."ఈ మాట" అంతర్జాల పత్రికలో వేమూరి వేంకటేశ్వరరావు వ్యాసం. పట్టణం ఎదుగుదల ఫలితంగా 2005 ఏప్రిల్‌లో ఏలూరు మునిసిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపబడ్డాయి. ఆ విధంగా నగర జనాభా 3, 50, 000కు చేరుకొంది. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధితో ఏలూరు జిల్లా కేంద్రంగా మారింది. భౌగోళికం భౌగోళికంగా ఏలూరు అక్షాంశ రేఖాంశాలు .Falling Rain Genomics, Inc - Eluru సముద్ర తలం నుండి ఎత్తు 22మీటర్లు. (72అడుగులు) . బంగాళాఖాతం తీరం నుండి ఏలూరు 40 మైళ్ళ దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్యంగా 78 కి.మీ దూరంలో ఉంది. విజయవాడ నుండి 63 కి.మీ. రాజమండ్రి నుండి 98 కి.మీ. దూరంలో ఈ రెండు నగరాల మధ్య ఉంది. ఇది ప్రధానంగా ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతం. ఏప్రిల్, మే, జూన్ నెలలు బాగా వేడిగా ఉంటాయి. ఏలూరులో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 51.7 డిగ్రీలు సెంటీగ్రేడ్, అత్యల్ప ఉష్ణోగ్రత 12.9 0 డిగ్రీలు సెంటీగ్రేడ్. పట్టణం స్వరూపం thumb|తమ్మిలేరుపై నిర్మించిన తూర్పు లాకులు (విహంగ వీక్షణం) thumb|right|ఓవర్ బ్రిడ్జి పైనుండి దృశ్యం right|thumb|ఫైర్ స్టేషను సెంటర్ right|thumb|రమామహల్ సెంటర్ thumb|right|ఏలూరు పెద్దబజారు నగరానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు (కొల్లేరు, కైకలూరు), మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది. మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర అశోక్ నగర్ వద్ద రెండుగా చీలుతుంది . ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు ప్రధాన నగరం వుంటుంది. ఈ కారణం వల్లే నాగిరెడ్డి గూడెం ప్రాజెక్ట్ కట్టక మునుపు ఏలూరు ముంపుకు గురి అయ్యేది. కృష్ణానదినుండి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. తమ్మిలేరు అనే యేరు ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలవుతుంది. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జల్లాలలో సుమారు 120 మైళ్ళు ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. ఏలూరులో ఎఫ్.సి.ఐ. గోడౌనుల దగ్గర రెండుగా చీలుతుంది. ఆ చీలికలు మొండికోడు, పెదయడ్లగాడి అనే రెండు స్థలాల వద్ద కొల్లేరులో కలుస్తాయి. ముఖ్య ప్రాంతాలు నగరం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది. పట్టణం మధ్యగా తమ్మిలేరు కాలువ ప్రవహిస్తుంది. స్థూలంగా పట్టణాన్ని I టౌన్ (తమ్మిలేరు కాలువకి ఆవల వున్న ప్రాంతం), II టౌన్ (తమ్మిలేరు కాలువకి ఇవతల వున్న ప్రాంతం) గా విభజించవచ్చు. అయితే పోస్టల్ వారి ప్రకారం ఏలూరు-1 (తమ్మిలేరు కాలువ నుండి తూర్పు వైపు వున్న ప్రాంతం), ఏలూరు-2 ( పవర్ పేట, ఆర్ ఆర్ పేట తదితర ప్రాంతాలు), ఏలూరు-3 (శనివారపు పేట), ఏలూరు-3 (చాటపర్రు ప్రాంతం), ఏలూరు-5 (రైల్వే స్టేషన్, ఆదివారపు పేట ప్రాంతాలు, తంగెళ్ళమూడి, ఏలూరు-6 (నరసింహారావు పేట, అమీనా పేట, అశోక్ నగర్ ప్రాంతాలు), ఏలూరు-7 (వట్లూరు, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు ప్రాంతాలు) లుగా విభజించబడింది. ప్రధాన విభాగాలు వ్యాపార కేంద్రాలు: మెయిన్ బజారు, ఆర్.ఆర్. పేట, బిర్లా భవన్ సెంటర్, చాటపర్రు రోడ్ సెంటర్, ఘడియారపు స్తంభం, నరసింహా రావు పేట, పత్తేబాద, జి యన్ టి రోడ్. ప్రయాణ కేంద్రాలు: పెద్ద రైల్వే స్టేషను, పవర్ పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషన్, క్రొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు, ఆశ్రం హాస్పిటల్. వైద్య కేంద్రాలు: ఆర్ ఆర్ పేట, రామ చంద్రరావు పేట, వెంకట్రావు పేట, పెద్దాసుపత్రి, ఆశ్రం హాస్పిటల్, మెడికల్ కాలేజీ కూడళ్ళు: I టౌన్: గడియారపు స్తంభం సెంటర్, పెద్ద వంతెన సెంటర్, కర్ర వంతెన సెంటర్, వసంత మహల్ సెంటరు, బిర్లా భవన్ సెంటర్, కొత్త రోడ్డూ, వంగాయగూడెం సెంటర్ చౌరాస్తా, జ్యూట్ మిల్ జంక్షన్ II టౌన్ కూడళ్ళు: పాత బస్ స్టాండు సెంటర్, పవర్ పేట సెంటర్, ప్రెస్ గేటు సెంటర్, రమామహల్ సెంటరు, మధులత సెంటర్, విజయవిహర్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటరు ప్రధాన నివాస కేంద్రాలు: పవర్ పేట, గాంధీ నగరం, కొత్త పేట, నరసింహారావు పేట, రామచంద్రరావు పేట, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు, ఖాదర్ జండా, ఖతీబ్ వీధి, ఆదివారపు పేట, పెన్షన్ మొహాల్ల, అమీన పేట, అశోక్ నగర్, ఇస్రేల్ పేత, పత్తేబాద, గవరవరం, తంగెళ్ళమూడి. విద్యా కేంద్రాలు: సత్రంపాడు (డిగ్రీ, పి.జి., బి.యిడి, పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ తదితర సి.ఆర్.ఆర్ కాలేజీలు, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ) ఆర్ ఆర్ పేట, విద్యానగర్, గవరవరం (సెయింట్ దెరిసాస్ కాలేజీలు, సెయింట్ జేవియర్ స్కూల్స్) దుగ్గిరాల (డెంటల్ కాలేజీ), మల్కాపురం (ఆశ్రం హాస్పిటల్, మెడికల్ కాలేజీ) నగరంలో కలిసిపోయిన పరిసర గ్రామాలు: తంగెళ్ళమూడి, సత్రంపాడు, గవరవరం, శనివారపుపేట, చోదిమెళ్ళ, చాటపర్రు. మెహర్ బాబా సెంటర్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు జనగణన గణాంకాలు 2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 217, 876. 1901లో పట్ణ జనాభా 33, 521 మాత్రమే ఉండేది. 1991 నాటికి ఇది 2, 12, 866 కు చేరుకొంది. 1991 లెక్కల ప్రకారం అక్షరాస్యత 72%. 1981-91 మధ్యకాలంలో 26.63% అక్షరాస్యతా వృద్ధి నమోదయ్యింది. 2001లో జనాభా 2, 15, 642. పరిపాలన 1866 లో మునిసిపాలిటిగా ఏర్పడింది. (దేశంలో రెండవ మోడల్ మునిసిపాలిటి) 2005 లో మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తించబడింది. ఏలూరు ప్రస్తుతం ఒక స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కార్పొరేషన్. ఏలూరు నగరపాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది. రవాణా సౌకర్యాలు thumb|ఏలూరు కొత్త బస్టాండ్ ఏలూరు నగరం, రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ నగరాలు, పట్టణాలు చాలా బాగా అనుసంధానించబడి ఉంది. రోడ్డు మార్గాలు జాతీయ రహదారి 16 పై ఈ నగరం ఉంది. ఏలూరు పాత బస్సు స్టేషన్, ఏలూరు కొత్త బస్సు స్టేషన్ల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సు నడుపుతోంది. రైలు మార్గాలు thumb|ఏలూరు రైల్వే స్టేషన్ ఏలూరు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజన్లో దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక రైల్వే స్టేషను. పవర్‌పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషను నగరానికి చెందిన శాటిలైట్ స్టేషన్లు. ఈ స్టేషన్లు హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉన్నాయి. వాయు మార్గం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏలూరుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం (35 కి.మీ). జలమార్గం జాతీయ జలమార్గం 4 గా ప్రకటించబడిన జలమార్గం తీర ప్రాంతం వెంబడి కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్‌హాం కాలువ ద్వారా వెళ్తుంది. రక్షణ వ్యవస్థ ఏలూరులో శాంతిభద్రతల కొరకు ఎనిమిది పోలీసు స్టేషన్లు నిర్వహించబడుతున్నవి. వీటిలో, ఒక మహిళా పోలీసు స్టేషను, ఒక ట్రాఫిక్ పోలీసు స్టేషనూ ఉన్నాయి. ఇవి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పరిధిలోకే ఉన్నాయి. విద్యా సదుపాయాలు link=|thumb|తంగెళ్ళమూడిలోని సిద్ధార్థ పాఠశాల ఏరియల్ వ్యూ thumb|ఇండియన్ ఇంస్టిట్యుట్ అఫ్ అయిల్ పాం రీసర్చ్ thumb|నగర సమీపంలోని ఒక కళాశాల right|thumb|సర్ సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి, వట్లూరు, ఏలూరు వద్ద వాటిలో కొన్ని: ఈదర సుబ్బమ్మ దేవి మునిసిపల్ ఉన్నత పాఠశాల" చాలా కాలంనుండి నడుస్తున్న ఉన్నత పాఠశాల. "శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం ఉన్నత పాఠశాల" కూడా చాలా కాలంనుండి నడుస్తున్న ఉన్నత పాఠశాల. "సర్ సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థలు" -ఇవి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి పేరు మేద నిర్మించబడ్డాయి. 1945లో ప్రాంభమైనవి. ఈ సంస్థలచే నిర్వహింపబడుతున్న విద్యాలయాలు: పబ్లిక్ స్కూలు, మోడల్ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీకాలేజి, పి.జి. కాలేజి, లా కాలేజి, బి.ఎడ్. కాలేజి. వీరి మహిళల కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి ఏలూరు పరిసర గ్రామమైన వట్లూరులో ఉన్నాయి. "సెయింట్ థెరిసా విద్యా సంస్థలు" - సెయంట్ థెరిసా విద్యా సంస్థలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుపిల్లల విద్యాభివృద్ధికి ఎంతో చేయూతనిచ్చాయి. వీటిలో బాలికల పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజి, పి.జి. కాలేజి ఉన్నాయి. "ఆశ్రం మెడికల్ కాలేజి" - (మల్కా పురమ్ వద్ద) దీనికి దగ్గరలో ఆటో నగర్ నిర్మించ బడుతోంది. వైద్య సదుపాయాలు ప్రభుత్వ ఆసుపత్రి - జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (పెద్దాసుపత్రి) 350 పడకల ఆశ్రం వైద్య కళాశాల ఆసుపత్రి - మెడికల్ కాలీజికి అనుబంధంగా ఉంది. 780 పడకలతో ముఖ్యమైన అన్ని సదుపాయాలతో నిర్మింపబడింది. డీ పాల్ దంత వైద్య శాల/ దంత వైద్య కలాశాల - ఇది దుగ్గిరాల సమీపంలో వుంది, ఇది రాష్ట్రం లోనే పెద్ద దంత వైద్య కలాశాల. పెదవేగి చర్మ వైద్య శాల - ఇక్కడ అన్ని రకాల చర్మ వ్యాధులు నివారించ బడతాయి, కుష్టు వ్యాధికి మందు కూడా ఉచితముగా ఇస్తారు. పరిశ్రమలు అంబికా గ్రూప్ - 60 యేళ్ళపైగా ఈ వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే "అంబికా దర్బార్ బత్తి", మరి కొన్ని అగర్‌బత్తిలు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గ్రూప్ అధిపతులు ఇంకా సినిమా నిర్మాణం, విద్యుత్తు, హోటళ్ళు వంటి మరికొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. జూట్ మిల్లు - ఈస్టిండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్ద పరిశ్రమ. గోనె సంచులు, ఇతర జనపనార ఉత్పత్తులు వీరి ఉత్పాదనలు. చేపలు, రొయ్యలు పరిశ్రమలు: దీనికి కారణం కొల్లేరు, దాని చుట్టుతా ఉన్న చేపల చెరువులు, రొయ్యల చెరువులు. వస్త్రాలు: పత్తేబాదలో ముఖ్యంగా చీరలు నేస్తారు. తివాచీ, చేనేత పరిశ్రమలు - ఏలూరులో తివాచీలు అధికంగా మహమ్మదీయులచే నేయబడుతున్నాయి. ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్నాయి. రిలయన్స్: సోమవరపుపాడు వద్ద ఉంది. ఆటో నగర్: ఆశ్రం ఆసుపత్రికి వెళ్లేదారిలో పెద్ద రైల్వే స్టేషనుకి చేరువలో ఉంది. సంస్కృతి ఉత్సవాలు కొల్లేరు జాతర వేంగి ఉత్సవం - ఇది పెదవేగి (వేంగి), ఏలూరు, పట్టిసీమలలో నిర్వహించబడుతుంది.. బలివే తిరుణాలు, బలివే పెద్దింటమ్మ తిరుణాల్లు, కొల్లేటికోట అచ్చమ్మ పేరంటాళ్ళు తిరణాలు, గాలాయగూడెం ఏలూరు దర్గా ఉరుసు పర్యాటక ఆకర్షణలు వెయ్యి సంవత్సరాలకు పైబడి చరిత్రవున్న ఆలయాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం, జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, జనార్దన కన్యకాపరమేశ్వరీదేవి గుడి, మార్కండేయాలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి. జ్వలాపహరేశ్వర స్వామి వారి ఆలయం, దక్షిణపు వీధి (ఇది అత్యంత ప్రాఛీన ఆలయం) శ్రీ మార్కండేయ స్వామి గుడి, దక్షిణపు వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పడమరవీధి (ప్రాచీన ఆలయం స్థాపితం: సా.శ.1104) . హజ్రత్‌ సయ్యద్‌ బాయజీద్‌ మహాత్ముల వారి దర్గా, అగ్రహారం, కోటదిబ్బ. నూకాలమ్మ గుడి, ఆదివారపు పేట. చెన్నకేశవ స్వామి దేవస్టానం ఏలూరు సి.యస్.ఐ చర్చి,, స్థాపితం 1864 ఏలూరు రొమన్ కాతలిక్ చర్చి, గ్జేవియర్ నగర్ (ఇది పురాతన మైనది) . అవతార్ మెహెర్ బాబా సెంటర్, కట్టా సుబ్బారావు తోట చిత్రమాలిక ప్రముఖులు సి. ఆనందారామం దువ్వూరి సుబ్బారావు (మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్) పసుపులేటి కన్నాంబ (కన్నాంబ ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణి) సిల్క్ స్మిత బడేటి కోట రామారావు మాజీ ఎం ఎల్ ఏ అంబికా కృష్ణ కారుమంచి రామమూర్తి బెండపూడి వెంకట సత్యనారాయణ మోతే వేదకుమారి రేకందార్ అనసూయాదేవి మోహన భోగరాజు పద్మనాభం జుజ్జవరపు ఇవి కూడా చూడండి ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా వేంగి కొల్లేరు సరస్సు వనరులు, మూలాలు బయటి లింకులు Falling Rain Genomics, Inc - Eluru వార్డు ప్రకారం జనాభా ఏలూరు గురించి జిల్లా వెబ్ సైటులో వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు వర్గం:ఏలూరు వర్గం:ఏలూరు జిల్లా వర్గం:ఈ వారం వ్యాసాలు
సారస్వత నికేతనం
https://te.wikipedia.org/wiki/సారస్వత_నికేతనం
thumb|సారస్వత నికేతనం, వేటపాలెం కరపత్రం తొలిపేజీ సారస్వత నికేతనం బాపట్ల జిల్లా వేటపాలెం లోని పురాతన తెలుగు గ్రంథాలయం. ఈ గ్రంథాలయము 1918 అక్టోబరు 15 నాడు ఊటుకూరి వెంకట శ్రేష్టి స్థాపించాడు. అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేశాడు. స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉంది. చరిత్ర 1918 అక్టోబరు 15 నాడు ఊటుకూరి వెంకట శ్రేష్టి స్థాపించిన ఈ గ్రంథాలయమునకు గాంధేయుడు గోరంట్ల వెంకన్న మొదటి దశలో భూరి విరాళము ఇచ్చాడు. దీని కొత్త భవనానికి 1929 లో మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935 లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించాడు. దీని భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ ఉంది. కొన్ని వార్తాపత్రికలు 1909 వ సంవత్సరమునుండి ఉన్నాయి. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బసచేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు. గ్రంథాలయం అభివృద్ధిలో కొన్ని ముఖ్య ఘట్టాలు 1918 అక్టోబరు 15 నాడు ఊ.వెం. శ్రేష్ఠి F.A.R.U., హిందూ యువజన సంఘం గ్రంథాలయాన్ని స్థాపించాడు 1924 ఒక పెంకుటిల్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రంథాలయాన్ని తరువాత 'సారస్వత నికేతనం' అని నామకరణం చేశారు. ఈ భవనాన్ని జమ్నాలాల్ బజాజ్ చే ప్రారంభించబడింది. 1927 లో ఈ గ్రంథాలయం, 1927 సొసైటీ చట్టం క్రింద రిజిస్టరు కాబడింది. 1929 క్రొత్త భవంతికి శంకుస్థాపన, మహాత్మా గాంధీ, చేసాడు. తరువాత ఈ భవంతిని ప్రకాశం పంతులు ప్రారంభించాడు. 1930 ఈ గ్రంథాలయం, జిల్లా కేంద్ర గ్రంథాలయంగా గుర్తింపు పొందినది. 1935 బాబూ రాజేంద్ర ప్రసాద్, గ్రంథాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభాన్ని శంకుస్థాపన చేశాడు. ఇదో జ్ఞానమందిరంగా అభివర్ణింపబడింది. 1936 గాంధీగారు రెండో సారి విచ్చేశాడు. 1942 గుంటూరు జిల్లా గ్రంథాలయాల సభ జరిగింది. 1943 అంతర్జాతీయ సహకార ఉద్యమం. 1949 6వ దక్షిణ భారత యువత విద్యా సదస్సు జరిగింది. 1950 జర్నలిజం కొరకు తరగతులు, వావిలాల గోపాలకృష్ణ ప్రధానాచార్యులుగా వ్యవహరించి, జరిపించారు. 1985 RRLF, కలకత్తా వారిచే ఇవ్వబడిన మ్యాచింగ్-గ్రాంటు సహాయంతో, క్రొత్త వింగ్ ను ఏర్పాటు గావించారు. 2018 వందేళ్ల పండుగ సందర్భంగా గ్రంథాలయ భవనం చిత్రంలో పోస్టల్‌ కవర్‌ విడుదల. భౌగోళికము చీరాల నుండి 8 కి.మీ దూరంలో వేటపాలెంలో వున్నది. (OSM పటం చూడండి) అపురూపమైన పుస్తకాలు సారస్వత నికేతనంలో ఎన్నో అపురూపమైన, అత్యంత అరుదైన పుస్తకాలు ఉండటం వలన తెలుగు సాహిత్య చరిత్రలో, చరిత్రరచనకు ఉపయోగం. తెలుగులో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్ర గ్రంథాన్ని 1940 ప్రాంతాల్లో మూడవసంకలనం కూర్పుచేసి పునర్ముద్రించేందుకు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, పుస్తకప్రియుడు దిగవల్లి వేంకటశివరావు ప్రయత్నించగా వేటపాలెం గ్రంథాలయంలోనే మంచి ప్రతి దొరికి పునర్ముద్రణ సాధ్యమైంది. చిత్రమాలిక మూలాలు బయటి లింకులు "తెలుపు" వెబ్‌సైటులో సారస్వత నికేతనం గురించి వర్గం:గ్రంథాలయాలు
వేటపాలెం
https://te.wikipedia.org/wiki/వేటపాలెం
వేటపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం లోని జనగణన పట్టణం. చరిత్ర "వేటపాలెం" పేరును సంస్కృతీకరించి "మృగయాపురి" అని కొన్నిచోట్ల వ్రాస్తారు. ఒకప్పుడు వేటకు అనువుగా ఈ ఊరు ఉండేది అంటారు. "ఎచ్చులకు వేటపాలెం పోతే తన్ని తల గుడ్డ తీసుకున్నారట" అనే సామెతలో ఈ ఊరు ప్రస్తావన వుంది. రంగస్థల నటుడు రావిపాటి శ్రీరామచంద్రమూర్తి ఈ ఊరివారే. భౌగోళికం ఈ గ్రామం సముద్ర తీరం నుండి 4.5 కి.మీ. దూరంలో ఉంది. వేటపాలెం గ్రామం ఒంగోలు - విజయవాడ రైల్వే లైనులో ఉంది. వేటపాలెం గ్రామం చీరాల పట్టణానికి 9 కి.మీ దూరంలో ఉంది. వేటపాలెం కి సమీపంలోనే ఒకనాడు ఆంధ్రదేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపి, నౌకా కేంద్రాల్లో కెల్లా మహానౌకా కేంద్రంగా వెలుగొందిన మోటుపల్లి ఉన్నది. ప్రస్తుతం మోటుపల్లి ఒక సామాన్య కుగ్రామంగా మిగిలిపోయింది. జనాభా గణాంకాలు వేటపాలెం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం వేటపాలెం పట్టణంలో మొత్తం 11,013 కుటుంబాలు నివసిస్తున్నాయి. వేటపాలెం మొత్తం జనాభా 38,671 అందులో పురుషులు 19,079, స్త్రీలు 19,592, వేటపాలెం సగటు లింగ నిష్పత్తి 1,027. పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3688, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 1881 మంది మగ పిల్లలు 1807 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం వేటపాలెంలో బాలల లింగ నిష్పత్తి 961, ఇది సగటు లింగ నిష్పత్తి (1,027) కంటే తక్కువ. వేటపాలెం అక్షరాస్యత రేటు 74.1%. ఆ విధంగా పాత ప్రకాశం జిల్లాలో 63.1% అక్షరాస్యతతో పోలిస్తే వేటపాలెంలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది. వేటపాలెంలో పురుషుల అక్షరాస్యత రేటు 82.67%, స్త్రీల అక్షరాస్యత రేటు 65.77%. 2011 జనగణన ప్రకారం జనాభా 38,671. 2001 జనాభా లెక్కల ప్రకారం వేటపాలెం జనాభా 37,037. దశాబ్దకాలంలో 4.4 శాతం పెరుగుదల వుంది. గ్రామ పరిపాలన వేటపాలెం గ్రామ పంచాయతీ 1886, ఏప్రిల్-9న ఆవిర్భవించింది. ఆ రోజులలో గ్రామ విస్తీర్ణం 3,178 ఎకరాలు. అప్పట్లోనే మేజర్ పంచాయతీగా, కుటీరపరిశ్రమల కేంద్రంగా విరాజిల్లింది. 17 వార్డులలో, 16,000 జనాభా ఉండేవారు. తరువాత 1987, డిసెంబరు-19న, పురపాలకసంఘంగా ఎదిగింది. 1988లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటివరకూ రు. 3 లక్షలు ఉన్న పన్నులు, రు. 10 లక్షలు అయినవి. దీనితో పౌరసమితిని ఏర్పాటుచేసి, ప్రజలు మునిసిపాలిటీని రద్దు చేయాలని ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో 1992లో చీరాల శాసనసభ్యులుగా పోటీచేసిన కొణిజేటి రోశయ్య మునిసిపాలిటీని రద్దు చేసి, పంచాయతీగా మారుస్తానని ఎన్నికలలో వాగ్దానం చేశారు. ఆ రకంగా, ఇది వేటపాలెం, రామన్నపేట, దేశాయిపేట గ్రామాలతో. కలిసి, మరలా పంచాయతీ స్థాయి మారింది.ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలు, వేటపాలెం మునిసిపాలిటీ పేరిటే జరుగుచున్నవి. విద్యా సౌకర్యాలు సారస్వత నికేతనం right|412x412px|సారస్వత నికేతనం, వేటపాలెం thumb|వేటపాలెంలోని సారస్వత నికేతనం గ్రంథాలయం|260x260px "సారస్వత నికేతనం" అనే గ్రంథాలయం ప్రపంచ ప్రసిద్ధమైంది. దీన్ని 1918లో వూటుకూరి వేంకట శ్రేష్టి స్థాపించాడు. స్వాతంత్ర్యం రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయం మొదటి నుండి ప్రైవేటు కుటుంబం నిర్వహించే గ్రంథాలయంగానే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కెల్ల ఇటువంటి అరుదైన ఏకైక గ్రంథాలయం సారస్వత నికేతనం. ఈ గ్రంథాలయ భవనానికి 1929లో జాతిపిత మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించి ఆశీర్వదించారు. కట్టడం పూర్తైన భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు.తరువాతి రోజుల్లో గాంధీగారు ఆ గ్రంథాలయాన్ని సందర్శించారు.ఆ సందర్భాన వారి చేతి కర్ర అక్కడ విరిగిపోతే దానిని జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ గ్రంథాలయంలో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ ఉంది. కొన్ని వార్తాపత్రికలు 1909వ సంవత్సరంనుండి ఉన్నాయి. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయంలో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశం నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బస చేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు. తెలుగులో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్ర గ్రంథాన్ని 1950 ప్రాంతాల్లో పునర్ముద్రించేందుకు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, పుస్తకప్రియుడు దిగవల్లి వేంకటశివరావు ప్రయత్నించగా వేటపాలెం గ్రంథాలయంలోనే మంచి ప్రతి దొరికి పునర్ముద్రణ సాధ్యమైంది. కళాశాలలు బండ్ల బాపయ్య హిందూ జూనియర్, డిగ్రీ కాలేజి ఉంది. ఇది 1921లో స్థాపించబడింది. ఇక్కడి గొల్లపూడి సీతారామయ్య వసతి గృహములో పేద విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యము కల్పిస్తారు. నాయునిపల్లి గ్రామంలో సెయింటాన్స్ ఇంజినీరింగ్ కాలేజి, చీరాల ఇంజినీరింగ్ కాలేజిలు ఉన్నాయి. సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజి - చల్లారెడ్డిపాలెం లోని ఒక ఇంజినీరింగ్ కళాశాల సెయింట్ యాన్స్ పాలిటెక్నిక్ ఉన్నత పాఠశాలలు బండ్ల బాపయ్య హిందు ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వుంది. మండలం లోని కొత్తపేట గ్రామం లో జిల్లాపరిషత్ హైస్కూల్ అధునాతన సౌకర్యాలతో నిర్మాణం పూర్తి కావడంతో 1000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.2018 లో ప్రారంభించిన ఈ పాఠశాల లో విశాల మైన డైనింగ్ హాలు,30 కంప్యూటర్లు గల డిజిటల్ క్లాస్ రూమ్, ఆరు స్క్రీన్లు ఉన్నాయి. క్రీడల్లో కూడా విశేష ప్రాచుర్యం పొందింది. ఆశ్రమాలు నిత్యావతార దత్తక్షేత్రం. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం;- ఇక్కడ గడియార స్తంభం సెంటర్ లో ఉన్నది ఇందులోనే కళ్యాణ మండపం కూడా ఉంది. ప్రతి దసరా పండగకి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరి సహకారంతో ఘనంగా జరుపుతారు. శ్రీ భోగ లింగేశ్వరస్వామివారి ఆలయo:- ఈ గ్రామంలోని నాయునిపల్లిలో శివాలయం వున్నది. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం. శ్రీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి రోజూ సహస్ర దీపాలంకరణసేవ నిర్వహించెదరు. శ్రీ నాగవరపమ్మ తల్లి ఆలయం. తిరునాళ్ళ-సంబరాలు-పండుగలు శ్రీ పోలేరమ్మ తిరునాళ్ళ. శ్రీ కనక నాగవరపమ్మ తిరునాళ్ళ. (రావూరిపేట) హిందువులు అన్ని పెద్ద పండుగలను దేవాలయాలలో, వారి ఇళ్ళల్లో ఘనంగా జరుపుతారు. ముస్లింలు రంజాన్, బక్రీద్, పీర్ల పండుగలను ఘనంగా జరుపుతారు. క్రైస్తవులు క్రిస్టమస్ పండుగను ఘనంగా జరుపుతారు. ప్రధాన వృత్తులు వ్యవసాయం ప్రధానంగా జీడి తోటలు, మామిడి తోటలపై కేంద్రీకృతమైంది. సముద్రతీరం వుండడంతో రొయ్యల పెంపకం, చేపల పెంపకం కూడా ప్రధాన వ్యవసాయ అనుబంధ వృత్తిగాఉంది. పరిశ్రమలు చేనేత పరిశ్రమలు, జీడి పప్పు పరిశ్రమలు, అగరబత్తి పరిశ్రమలు, తాటి కల్లు పరిశ్రమలు, బీడి పరిశ్రమలు. మూలాలు బయటి లింకులు వర్గం:రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు వర్గం:జనగణన పట్టణాలు
నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా)
https://te.wikipedia.org/wiki/నేలకొండపల్లి_(ఖమ్మం_జిల్లా)
నేలకొండపల్లి, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 23 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. గణాంకాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2156 ఇళ్లతో, 7767 జనాభాతో 1435 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3827, ఆడవారి సంఖ్య 3940. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1679 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 198. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579716. పిన్ కోడ్: 507160.ఎస్.టి.డి.కోడ్ = 08742.''' గ్రామ చరిత్ర thumb|left|200px|నేలకొండపల్లి స్థూపం 200px|thumb|left|నేలకొండపల్లి స్థూపం సమీప దృశ్యం నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి. మనం చూస్తున్న ఈ ప్రాంతాన్ని కీచకగుండం అని పిలుస్తారు. ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉంది.దీనికి కీచకగుండం అని పేరు రావడానికి కారణం, భీముడు కీచకుడిని చంపింది ఇక్కడే అని జనం చెబుతుంటారు. అంతేకాదు కీచకుడిని చంపిన తర్వాత పాతిపెట్టిన ప్రాంతం కూడా ఇదే కావడంతో, దీనికి కీచకగుండం అని పేరుపెట్టారు. నేలకొండపల్లి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు భక్తరామదాసు. భద్రాచలంలో శ్రీరామచంద్రుడికి గుడి కట్టించిన పరమభక్తుడు రామదాసు. ఆ భక్తరామదాసు నడయాడిన ఈ ప్రాంతం ఎన్నో వింతలు విశేషాలకు పెట్టింది పేరు. రామదాసు సా.శ.1664లో ఈ గుడి కట్టించాడు. అంతకంటే కొన్ని శతాబ్దాల ముందు, అంటే సా.శ.2వ శతాబ్దంలోనే మనం చూస్తున్న బౌద్ధస్థూప నిర్మాణం జరిగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశానికి ఇక్కడ నుంచే బౌద్ధ విగ్రహాల పంపిణీ జరిగేది. విగ్రహాల తయారీ కేంద్రం ఇక్కడే ఉండేది. నేలకొండపల్లి అంటే నెలసెండా అనే పట్టణం అని, 2వ శతాబ్దంలోనే టోలమీ రాసిన ఇండికా గ్రంథంలో నేలకొండపల్లి ప్రస్తావన ఉంది. ఇట్లా నేలకొండపల్లి చరిత్ర 2వేల సంవత్సరాలదని అర్థమవుతోంది. కీచకవధ గురించి తెలుసుకోవాలంటే మనం పాండవుల వనవాసచరిత్రను గుర్తుచేసుకోవాలి. పాండవులు 12ఏండ్ల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం ఉత్తరభారతం నుంచి దక్షిణభారత ప్రాంతానికి వచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద, విరాటరాజు రాజ్యం ఉంది. ఆ రాజు వద్ధ పాండవులు మారువేషంలో పనికి చేరుతారు. భీముడు ఆడవేషంలో వచ్చి కీచకుడిని వధిస్తాడు. కీచకుడు భీముడి యుద్ధం అతి భీకరంగా సాగుతుంది. మనం చూస్తున్న ఈ బైరాగుల గుట్ట రాళ్ల కిందనే కీచకుడిని సమాధి చేశారని చరిత్ర చెబుతోంది. thumb|నేలకొండపల్లిలో దొరికిన అవలోకితేశ్వర బుద్ధుని విగ్రహం. 4-5వ శతాబ్దాలకు చెందిన ఈ విగ్రహం గాంధార శైలిలో ముడి ఇనుముతో చేసింది. అవలోకితేశ్వర బుద్ధుడు సంపద (నిలువు) స్థితిలో కనిపిస్తున్నారు. కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పల్కింది నేలకొండపల్లే! కీచకవధ అంటే ద్వాపరయుగం నాటి కౌరవ పాండవ యుద్ధ కాలంలోకి పోవాలీ! మహాభారతంలో యుద్ద సన్నివేశాల వేదికగా నిలిచిన ప్రాంతాలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి! కానీ, వాక్కు రూపంలో మాత్రం ఈ ప్రాంత చరిత్ర సజీవంగా నిలిచింది! ద్వాపర యుగం నుంచి, బౌద్ధుల వరకు, ఆ తరువాత కాకతీయులు, నిజాం కాలంలో భక్తరామదాసు వరకు ఎంతో చరిత్ర ఈ ఊరి సొంతం! భక్తరామదాసు చరిత్ర అంటే, 400 ఏండ్ల క్రితం సంగతి! కాని, గత 40 ఏండ్ల క్రితం వరకు కూడా, ఇక్కడ మనం చూస్తున్న బౌద్ధస్థూపం కనిపించేది కాదు! ఇక్కడ ఇపుడు మనం చూస్తున్న ఆ బౌద్ధస్థూప నిర్మాణం ఇటీవలే తవ్వకాల్లో బయటపడింది! ముజ్జుగూడెం గ్రామానికి చెందిన కొందరు పండుగల సమయంలో పుట్టమన్ను కోసం తవ్వకాలు జరిపారు! బౌద్ధస్తూపం బయటపడింది! సా.శ.2వ శతాబ్దం నుంచి దాదాపు 1800 ఏండ్లు అలా మట్టిపొరల్లో దాగున్న తథాగతుని చరిత్ర చీకట్లోనే ఉండిపోయింది! బౌద్ధస్తూపం ఎలా మట్టిపొరల్లో వందల ఏళ్లు మరుగునపడ్డదో, సరిగ్గా అలాగే ఇదిగో ఈ ద్వాపరయుగ చరిత్ర సైతం వెలుగుచూడలేదు! కీచకవధ జరిగిన యుద్ధప్రాంతాలు అలానే మరుగునపడ్డాయి! కాని, వాక్కు మాత్రం చరిత్రను బతికిస్తున్నది! కౌరవ పాండవ వనవాస కాలంలో పాండవులు తమ బాణాలను జమ్మిచెట్టుపై దాచరని మనకందరికీ తెలుసు! ఆ జమ్మిచెట్టు బాణాపురంలోనే ఉందని మాత్రం ఎవరికీ తెలియదు! బాణాపురం ముదిగొండ మండలంలో ఉంది! ఈ ఊరిలోనే పాండవులు బాణాలు దాచారట! అందుకే ఈ ఊరికి బాణాపురం అనే పేరు వచ్చింది! మనం చూస్తున్న గోకినేపల్లికి ఆ పేరు రావడానికి కారణం పాండవులు వనవాస కాలంలో గోవులు ఇక్కడే కాశారట! అందుకే ఈ గ్రామానికి గోకినేపల్లి అని పేరు వచ్చిందని ఇక్కడి జనం తరతరాలుగా చెబుతున్నారు! ఊరొక్కటే! కాని, ఒక్కో యుగంలో ఒక్కో చరిత్రకు దోసిలిపట్టింది నేలకొండపల్లి! తరతరాలుగా జనవాక్కుగా పిలవబడుతూ, కీచకగుండం కొలువైంది ఇక్కడే! ఈ చరిత్ర ఏ చరిత్రపుటల్లోకి ఎక్కలేదు! పాండవుల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం విరాటరాజ్యంలో మారువేషంలో ఉంది! కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పల్కిన నేలకొండపల్లి చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి! కీచకవధ జరిగిన ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నా, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంది! దీన్ని స్థానిక ప్రజలు ఖండిస్తున్నారు!నేలకొండపల్లి నాటి ద్వాపరయుగం నుంచి నేటి భక్తరామదాసు వరకు ఎన్నో విశేషాలకు వేదికైంది! కాలరగ్బంలో ఇంకా వెలుగులోకి రాని చరిత్ర అవశేషాలతో నెలువైంది! కాలగర్భంలో కలసిన ఈ కౌరవ పాండవ యుద్ధ విశేషాలతో పాటు, మట్టిపొరల్లో మరుగునపడ్డ తథాగతుని చరిత్రను వెలుగులోకి రావాల్సి ఉంది! నాటి ద్వాపరయుగం నుంచి నేటి భక్తరామదాసు వరకు, విశేషాలను వెలుగులోకి తెస్తూ కేసీఆర్ సర్కార్‌ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేలకొండపల్లివాసులు కోరుతున్నారు! ఇప్పటికైనా కీచకవధ జరిగిన నేలకొండపల్లిని టూరిస్టు స్పాట్‌గా ప్రకటించాలి! ద్వాపరయుగం నాటి చారిత్రక స్థలాలపై పరిశోధనలు చేసి, మరింత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి, పరిరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ సర్కార్‌ పై ఉందంటున్నారు జిల్లావాసులు! ఇటీవలి చరిత్రకు వస్తే.., నేలకొండపల్లి భక్త రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న ఇక్కడే జన్మించాడు. ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. గ్రామంలో సౌకర్యాలు ఇక్కడ మండల రెవెన్యూ కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయం, పోలీస్ స్టేషను, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పలు జాతీయ బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఉన్నాయి. విద్యా సౌకర్యాలు గ్రామంలో 9ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఏడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలో ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం నేలకొండపల్లిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఏడుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్.బి.బి.యస్. కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు.నాటు వైద్యులు ఇద్దరు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. పారిశుధ్యం మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు నేలకొండపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. నేలకొండపల్లి ఖమ్మం నుండి కోదాడ (నల్లగొండ జిల్లా)రహదారిపై ఉంది. ఖమ్మం నుండి కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రదేశాలకు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. హైదరాబాదు వెళ్ళాలంటే ఖమ్మం లేదా కోదాడ నుండి ఎక్స్ ప్రెస్స్ బస్సులు దొరకుతాయి. ఖమ్మం నుండి దేశం లోని అన్ని ముఖ్య ప్రదేశాలకు రైలు సౌకర్యం ఉంది. అతి దగ్గర విమానాశ్రయం హైదరాబాదు విజయవాడలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం నేలకొండపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 284 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 112 హెక్టార్లు శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 51 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 29 హెక్టార్లు బంజరు భూమి: 100 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 859 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 35 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 953 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు నేలకొండపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 473 హెక్టార్లు బావులు/బోరు బావులు: 75 హెక్టార్లు చెరువులు: 405 హెక్టార్లు ఉత్పత్తి నేలకొండపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి, మిరప, పొగాకు సందర్శించవలసిన ప్రదేశాలు/ దేవాలయాలు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం:- కలియుగవరదుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉన్నాడు.చూపరులను ఆకట్టుకొనే ఆలయశోభతో, వివిధ దేవీదేవతలతో ఈ ధామం అలరారుతోంది. ప్రతి శుక్ర, శనివారాలలో ఇక్కడ విశేషపూజలు జరుగుతవి.ఈ ఆలయదర్శనం సర్వశుభదాయకంగా భక్తులు భావిస్తారు.[2] ఇంకా చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన భీమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి, రాజగోపాలస్వామి ఆలయం, ఉత్తరేశ్వర ఆలయములు ఉన్నాయి. వీటిని కనీసం 400 సంవత్సరముల క్రితం నిర్మించారని ప్రతీతి. విశేషాలు భక్తకవి రామదాసు స్వస్థలం పాహి రామప్రభో . . పాహి భద్రాద్రి వైదేహి . . . రామప్రభో అంటూ రాముడిని పరిపరివిధాలా ఆర్తిగా కీర్తించిన భక్తకవి రామదాసు (కంచర్ల గోపన్న) స్వస్థలం నేలకొండపల్లి. రామదాసు నేలకొండపల్లిలోని రాజగోపాలస్వామి అనుగ్రహంతోనే జన్మించాడని ప్రతీతి. రామదాసు తల్లిదండ్రులు, రామదాసు ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించుకున్న దైవం శ్రీ రాజగోపాలస్వామిఈనాడు జిల్లా ఎడిషన్ 18 సెప్టెంబరు 2013. 1వ పేజీ.[2] ఈనాడు జిల్లా ఎడిషన్ 25 అక్టోబరు 2013.. మూలాలు ఇతర లంకెలు అంతర్లోచన బ్లాగ్ లో నేలకొండపల్లి పై వ్యాసం నమస్తే తెలంగాణ వెబ్ లో నేలకొండపల్లి పై వ్యాసం వెలుపలి లింకులు వర్గం:తెలంగాణ బౌద్ధ చారిత్రక స్థలాలు వర్గం:తెలంగాణ బౌద్ధమత క్షేత్రాలు
పాల్వంచ
https://te.wikipedia.org/wiki/పాల్వంచ
పాల్వంచ, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ మండలానికి చెందిన పట్టణంతెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 1987లో 3వ గ్రేడ్ పాల్వంచ పురపాలకసంఘంగా ఏర్పాటుచేయబడి, 2001లో అప్ గ్రేడ్ చేయబడింది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. గ్రామ భౌగోళికం thumb|అంబేద్కర్ సర్కిల్ ఖమ్మంకు దాదాపు 90 కి మీ ల దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం, పాల్వంచ. కొత్తగూడెం - భద్రాచలం రహదారిపై, కొత్తగూడెంకు 12 కి మీ ల దూరంలో, భద్రాచలానికి 28 కి మీ ల దూరంలో ఉన్న పాల్వంచ, కొత్తగూడెం శాసనసభ నియోజక వర్గం పరిధిలోకి, ఖమ్మంలోక్‌సభ నియోజక వర్గ పరిధి లోకి వస్తుంది గణాంకాలు thumb|220px|పాల్వంచ వద్ద ప్రముఖ ఆలయం పెద్దమ్మ గుడి 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,13,872 - పురుషులు 57,353 - స్త్రీలు 56,519;పిన్ కోడ్: 507 115. ఎస్.టి.డి. కోడ్ = 08744. గ్రామ చరిత్ర పాల్వంచ ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందినది. పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను శ్రీ కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ పాల్వంచ సంస్థాన చరిత్ర పేరుతో రాసారు. ఈయన పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా పనిచేసారు, దానితో పాటు ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పట్టణానికి రవాణా సౌకర్యాలు ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో 12 కి.మీ. దూరంలో, భద్రాచలం రోడ్ రైలుస్టేషను (కొత్తగూడెం) ఉంది. సికింద్రాబాద్ నుండి మణుగూరు వెళ్ళు రైలు బండి పాల్వంచ పట్టణం ప్రక్కగా వెళుచున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య పట్టణాల నుండి, ప్రభుత్వ రవాణా శాఖల (ఆర్.టి.సి) వారి బస్సు సౌకర్యం నేరుగా ఉంది. పట్టణంలోని విద్యా సౌకర్యాలు కె.టి.పి.యస్. ఉన్నత పాఠశాల. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కస్తుర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల. ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Govt. Degree College)https://www.facebook.com/pages/Government-Degree-College-Paloncha/207473402796820 ఇవి కాక మరికొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. పట్టణంలోని మౌలిక వసతులు విద్యుత్ కళా భారతి ఆటస్థలo లోగడ ఖమ్మం జిల్లాలో కెల్లా అతి పెద్దదైన ఈ ఆటస్థలం చరిత్ర పాల్వంచ క్రికెట్‌ క్లబ్బుతో ముడిపడి ఉంది. ప్రస్తుత కళాభారతి 1964లో ఉనికి లోకి వచ్చింది. ఈ ప్రదేశం ఎవరికి చెందినదో తెలియరాలేదు కానీ, క్రికెట్‌ క్లబ్బుకు అందాక, క్లబ్బు 1971లో పెవిలియను నిర్మించి ఈ ప్రాంతంలో క్రికెట్‌ ఆట అభివృద్ధికి దోహదం చేసింది.కళా భారతి అతి పెద్ద మైదానం. ఇది రాష్ట్రంలో అత్యుత్తమంగా పరిగణించబడుతుంది. పాల్వంచ క్రికెట్ క్లబ్ యొక్క చరిత్రతో కళా భారతి యొక్క చరిత్ర సరిగ్గా లేకపోవటంతో, ఇది పాల్వంచలో కాకుండా ఖమ్మం జిల్లా మొత్తంలో క్రికెట్లో మార్గదర్శకంగా పేరుపొందింది. ప్రస్తుత కళా భారతి 1964 లో కొంతకాలం ఉనికిలోకి వచ్చింది. భూమికి సంబంధించి విషయం ఏమిటంటే, కొన్ని రికార్డులు అది KTPS యొక్క ఆస్తి అని చెబుతున్నాయి, కొన్ని ఇతర రికార్డులు రాధాకృష్ణ టెంపుల్ కు చెందినవి అని రికార్డులు ఉన్నాయి.అయితే, ఈ ప్రాంతాన్ని పాల్వంచ క్రికెట్ క్లబ్ యొక్క చేతికి సమర్ధవంతంగా ఇచ్చుటకు ఆమోదించాయి.ఇది వినోదం కోసం పాల్వంచ పౌరులకు అందించారు. పాల్వంచ క్రికెట్ క్లబ్, కళా భారతి గ్రౌండ్స్ లో దాని ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది. పెవిలియన్ 1971 లో నిర్మించబడింది,సిల్వన్ పరిసరాలలో క్రికెట్ చాలా కాలం పాటు జరిగింది. వైద్య సౌకర్యం నవభారత్ వారి ఆధ్వర్యంలో ఎల్.వి.ప్రసాదు కంటి ఆసుపత్రి ఉంది. పట్టణానికి సాగు/త్రాగునీటి సౌకర్యం పట్టణానికి దగ్గరలో ప్రవహించే కిన్నెరసాని నది నుండి నీరు అందుబాటులో ఉంది.. పాల్వంచలో పరిశ్రమలు ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే బొగ్గు ఇక్కడి కొత్తగూడెం, మణుగూరు లలోని సింగరేణిగనులలో పుష్కలంగా దొరుకుతుంది. టియస్ జెనకో వారి కొత్తగూడెం (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం (KTPS) స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది. నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌ మొదలైనవి. పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శివాలయం: 1820లో నిర్మించబడ్డ ఈ ఆలయం, ఇస్లామిక్‌, గోతిక్‌ నిర్మాణ రీతుల్లో ఉంటుంది. శ్రీ రుక్మిణీ రాధాకృష్ణ దేవాలయం: KTPS-A కాలనీలో ఉంది. కళ్యాణ మండపం కూడా కలిగి ఉంది. శ్రీ రామాలయ భజన మందిరం:శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీనివాసకాలనీ - పాల్వంచ బస్సుస్టాండుకి 2 కి.మీ.దూరంలోని శ్రీనివాసకాలనీలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారు వెలసినారు. అక్కడి ప్రజలు గుడి అభివృద్ధి చేసారు. శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, నవనగర్‌ : నవభారత్ సంస్థచే, నవనగర్‌లో, నవభారత్‌ కొండపై నిర్మించబడిన ఈ ఆలయం, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం : 1951లో పాలపిట్ట చెట్టు క్రింద వెలసిన ఈ అమ్మవారి ఆలయంలో, ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నెలరోజులపాటు ప్రతిదినం, ఉదయం, సాయంత్రం, ప్రత్యేకపూజలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. ఈ వేడుకలను పురస్కరించుకుని, ఆలయాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దెదరు.ఈనాడు భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం; 2017,జులై-23; 2వపేజీ. పెద్దమ్మ తల్లి ఆలయం:పాల్వంచ బస్టాండు నుంచి 4 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. హైవే (ప్రధాన రహదారి) పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ కనీసం మనస్సులో అమ్మవారిని ఒక్కసారి రోడ్దు పై నుంచే ధ్యానించు కొనుట ఆనవాయితీ. ప్రతి ఆదివారం వందల సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆశాఢ, శ్రావణ మాసాల్లో ఐతే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ క్రొత్త వాహనాలకు పూజ చేయించటం చాల మంచిదని ప్రజల నమ్మకం. ప్రతి శుభ కార్యానికి ముందు అమ్మవారిని దర్శించుకొనుట శుభప్రదంగా భావిస్తారు. జంతు (కోడి, మేక) బలి ద్వారా అమ్మవారిని శాంతింపచేస్తే, అమ్మవారి కృపకు పాత్రులమవుతామని ఇక్కడి ప్రజల విశ్వాసం చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే బొగ్గు ఇక్కడి కొత్తగూడెం, మణుగూరు లలోని సింగరేణిగనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే కిన్నెరసాని నది నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని: TS Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం:- Kothagudem Thermal Power Station (KTPS) స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది. నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌. కిన్నెరసాని నది: పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది కిన్నెరసాని. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ యాత్రికుల సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది. దీనికి 21కిమీలో కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. పట్టణ విశేషాలు ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలలో ఒక నమ్మకం ఉంది. అదేమనగా: “పాల్వంచ లో బ్రతక నేర్చిన వ్యక్తి ఎక్కడైనా బ్రతక గలడు". మండలంలోని పట్టణాలు పాల్వంచ:పాల్వంచ అనునది పాత పాల్వంచ, కొత్త పాల్వంచ అను ఊర్ల కలయిక. ఈ పట్టణ జనాభా సుమారు 1,40,000 ఉంటుంది. పాల్వంచ పట్టణమునకు 10 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని నదిపై డ్యాం కలదు ఇక్కడ చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ నది చుట్టూ అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల అడవి జంతువులను చూసేవీలుంది. పాల్వంచ పట్టణం కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత శాసనసభ్యుడువనమా వెంకటేశ్వర రావు పోడు పట్టాల పంపిణీ పాల్వంచలోని సుగుణ ఫంక్షన్‌ హాల్లో 2023, జూన్ 30న ఉదయం 11:35 గంటలకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కలిసి గిరిజన రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. మూలాలు వెలుపలి లింకులు వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు
మధిర
https://te.wikipedia.org/wiki/మధిర
మధిర, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. . 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ప్రముఖులు మధిర సుబ్బన్న దీక్షితులు - ఇతను కాశీ మజిలీ కథలును సృజించారు. దాశరథి కృష్ణమాచార్యులు - తెలంగాణకు చెందిన కవి, రచయిత. మిరియాల నారాయణ గుప్తా - స్వాతంత్ర్య సమరయోధుడు. శాసనసభ నియోజకవర్గం ఇతర విశేషాలు మధిరలో మొత్తం నాలుగు సినిమా హాల్లు ఉన్నాయి. శాంతి, వాసవి, కళామందిర్‌, శ్రీ లక్ష్మీశ్రీనివాస. కళామందిర్‌ కొన్ని నెలల క్రితం మూసివేశారు. మధిరలోని వాసవి క్లబ్బు సమాజ సేవా రంగంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మధిర అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉంది. మూలాలు బయటి లింకులు వర్గం:ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు
కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)
https://te.wikipedia.org/wiki/కొత్తగూడెం_(భద్రాద్రి_జిల్లా)
కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కొత్తగూడెం మండలానికి చెందిన పట్టణం.భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రం.కొత్తగూడెం మండలం పేరుతోనున్న మండలానికి ప్రధాన కేంద్రం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ఇది 1971లో 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడి, 1995లో ఫస్ట్ గ్రేడ్ కొత్తగూడెం పురపాలకసంఘంగా మార్చబడింది. గణాంకాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 1,88,191 - పురుషులు 93,300 - స్త్రీలు 94,891,పిన్ కోడ్: 507101. భద్రాద్రి జిల్లా పరిపాలన కేంద్రం. లోగడ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా భద్రాద్రి పేరుతో నూతన జిల్లాను, కొత్తగూడెం జిల్లా పరిపాలన కేంద్రంగా ఉండేలాగున, అలాగే మండల కేంద్రంగా రామవరం గ్రామంతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ తేది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2023, జనవరి 12న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ అనుదీప్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం, రాజకీయాలు పౌర పరిపాలన కొత్తగూడెం పురపాలక సంఘము 1971 లో స్థాపించిబడింది. ఇది 33 వార్డులు కలిగి ఉన్న ఒక మొదటి గ్రేడ్ పురపాలక సంఘము. ఈ పట్టణ అధికార పరిధి . రవాణా సదుపాయాలు కొత్తగూడెం రైల్వేస్టేషన్ ను "భద్రాచలం రోడ్డు " అనే పేరుతో పిలుస్తారు. భద్రాచలం చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. భద్రాచలం ఇక్కడి నుండి గంట ప్రయాణము. పాల్వంచ పట్టణం మీదుగా వెళ్ళవలసి వుంటుంది. కొత్తగూడెంకు హైదరాబాదు నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలు, బెజవాడ నుండి అయితే నాలుగు గంటలూ పడుతుంది. కొత్తగూడెం నాలుగు దిక్కులా పచ్చని అడవులను చూడవచ్చు. పట్టణంలో చెప్పోకోదగ్గ ముఖ్య అంశము సింగరేణి సంస్థ గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఉండటం వలన కొత్తగూడెంకి బ్లాక్ గోల్డ్ నగరం అని పేరు. కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది. ఇది పాల్వంచ పట్టణంలో ఉంది. అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా ఉంది. భౌద్ధం ఆనవాళ్ళు కొత్తగూడెం మండలం హేమచంద్రాపురంగ్రామంలోని కారుకొండగుట్ట లకు ఘనమైన చరిత్ర ఉంది. రాతితో బుద్ధుడు పద్మాసనంలో కూర్చొని ఉండటం.. ఇక్కడి ప్రత్యేకత. వీటితో పాటు ఈ గుట్టపై అతి పెద్ద సొరంగం కూడా ఉందని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ కొండకు ఆగ్నేయంగా రెండు బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఒకే రాయిపై 4 వైపులా బుద్ధుని ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఇక్కడ చరిత్ర నిక్షిప్తమై ఉన్నట్లు ప్రభుత్వం 1989లోనే గుర్తించి నిర్ధారించింది. మండలంలోని పట్టణాలు కొత్తగూడెం (m+og) కొత్తగూడెం (m) చాతకొండ (ct) చుంచుపల్లి (ct) శాసనసభ నియోజకవర్గం విశేషాలు ఇక్కడ సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయము ఉండుటవల్ల దీనిని దక్షిణ భారతదేశపు బొగ్గు పట్టణంగా పిలుస్తారు. కొత్తగూడెం, పాల్వంచలు జంట పట్టణాలు. కొత్తగూడెం చుట్టుపక్కల అడవులు, పరిశ్రమలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. విద్యాసంస్థలు కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల: 2021లో ప్రారంభించబడిన ఈ వైద్య కళాశాలకు 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లభించింది. గ్రామ ప్రముఖులు కన్నెగంటి తిరుమలదేవి, మహిళా శాస్త్రవేత్త. మూలాలు వెలుపలి లింకులు వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు వర్గం:తెలంగాణ బౌద్ధమత క్షేత్రాలు
జగిత్యాల
https://te.wikipedia.org/wiki/జగిత్యాల
జగిత్యాల, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలానికి చెందిన పట్టణం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. ఇది రెవెన్యూ డివిజను ప్రధాన కేంద్రం.ఇది హైదరాబాదుకు 210 కి.మీ. దూరంలో ఉంది. 1952లో 3వ గ్రేడ్ పురపాలకసంఘంగా ఏర్పడింది. 1984లో 2వ గ్రేడ్ పురపాలకసంఘంగా, 2009లో 1వ గ్రేడ్ జగిత్యాల పురపాలక సంఘంగా మార్చబడింది. విశేషాలు చుట్టుపక్కల 50 చ.కి.మీ. లోని 30 గ్రామాల ప్రజలకు జగిత్యాల వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతపు ప్రజలకు ఇది విద్యాకేంద్రం కూడా. పట్టణానికి ఉత్తరాన జాఫరుద్దౌలా 1747లో కట్టించిన పాత కోట ఉంది. సమీప, దూర ప్రాంతాల పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో జగిత్యాలకు చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పట్టణానికి రైలు మార్గం ఈ మధ్యనే నిర్మించారు. జగిత్యాల ఒక శాసనసభ నియోజకవర్గ కేంద్రం. నిజాం పరిపాలన గుర్తుగా జగిత్యాలలో అప్పటి నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. జగిత్యాల చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వేములవాడ (42 కి.మీ), ధర్మపురి (30 కి.మీ), కొండగట్టు (15 కి.మీ) ప్రముఖమైనవి. ప్రముఖ చారిత్రక ప్రదేశమైన పొలాస (7కి.మీ ) (కాకతీయుల నాటి పౌలస్త్యేశ్వరపురం) జగిత్యాలకు చేరువలోనే ఉంది. అలాగే వీటితో పాటు చూడదగ్గ ప్రదేశం పెంబట్ల దుబ్బ రాజన్న స్వామి ఆలయం ఇది 11 కి.మీ దూరంలో ఉంటుంది., బీర్పూర్ మండల కేంద్రం అయిన 25 కి.మీ దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ఉంటుంది. విద్యా సౌకర్యాలు జగిత్యాల సమీపంలో కొండగట్టు వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పొలాస గ్రామములో ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( అగ్రికల్చర్ పాలిటెక్నిక్ బియస్సీ & పిజి ) కళాశాలలు ఉన్నాయి.డాక్టరు వి.ఆర్.కె. ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పలు జూనియర్ & డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయి.గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి జగిత్యాలలో ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల జగిత్యాలలో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కాలేజ్ పట్టణంలో ఉన్నాయి, అనియత విద్యా కేంద్రం జగిత్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్ లోనూ ఉన్నాయి. కోరుట్లలో ప్రభుత్వ పశువైద్య వెటర్నరీ కళాశాల ఉంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉంది నూక పల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో వృత్తివిద్య కళాశాల, బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ కేంద్రాలు ఉన్నాయి. చరిత్ర జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. సా.శ. 1110 నుండి 1116 వరకు పొలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు, తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాల్ని స్థాపించాడు. పొలాసకు దక్షిణాన 6 కి.మీ. దూరంలో జగ్గదేవుడు అతని పేరిట జగ్గదేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాలగా స్థిరపడిందని చరిత్రకారులు కథనం. మరో కథనం ప్రకారం...ఎల్గందుల కోటకు అధిపతిగా ఉండిన మబారిజుల్ ముల్క్ జఫరుద్ధౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధంసా సా.శ.1747లో జగిత్యాలలో నక్షత్రాకారంలో ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్లయి జాక్ సాంకేతిక సహకారంతో నిర్మించాడు. ఆ ఇద్దరి ఇంజనీర్ల పేరు మీదే ‘జాక్ పిలవబడి క్రమంగా జగ్త్యాల్, జగిత్యాలగా మారిందనీ చెబుతారు. జగిత్యాల కోట జగిత్యాల కోట రాయి, సున్నంతో నక్షత్రాకారంలో నిర్మితమైంది. ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది ఇప్పటికీ నీటితో నిండి ఉంది. కోట నిర్మాణం కండ్లపల్లి చెరువు పక్కన జరిగింది, కనుక కందకంలో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇది నిర్మించి దాదాపు 250 సంవత్సరాలు కావొస్తుంది. కోట బురుజులలో దాదాపు రెండు మీటర్ల పొడవైన తోపులు అనేకం ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ఫిరంగులపై మహ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంది. కోటలోపల, మందు గుండు సామాగ్రి కోసం నిర్మించిన గదులు అనేకం ఉన్నాయి. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి. ఇక్కడ ఒక ఖిలేదార్, 200 మంది సిపాయిలు ఉండేవారు. ఆ కాలంలో అంటే సా.శ. 1880లో జగిత్యాలలో 516 ఇళ్లు మాత్రమే ఉండేవంటారు. ఆనాటి జనాభా 2,812 అని తెలుస్తోంది. చెక్కు చెదరని గడీ జగిత్యాల పట్టణంలో జువ్వాడి ధర్మజలపతి రావు అనే దొర ఒక గడీని నిర్మించాడు. ఈ గడీ చల్‌గల్ గడీకి దగ్గర పోలికల్తో ఉంటుంది. ఇరుపక్కల విశాలమైన బురుజులతో, లావైన స్తంభాలతో జగిత్యాల గడీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఈ గడీలో పై అంతస్థు పైన ఉండడానికి బయట నుండే రెండు వైపుల మెట్లను నిర్మించారు.ఆ కాలంలోని ‘దువ్వం తాలూకాదార్లు’ (డిప్యూటి కలెక్టర్‌లు) ఈ గడీలోనే ఉండేవారనీ చెబుతారు. క్లాక్ టవర్‌ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1937లో తన పరిపాలనా రజతోత్సవాలను రాజ్యమంతటా జరిపించాడు. ఆ సందర్భంగా ధర్మజలపతి రావు జగిత్యాల నడిబొడ్డున ఎత్తయిన క్లాక్ టవర్‌ను నిర్మించాడు. అది చూసి మెచ్చుకొని, నిజాం రాజు ఆ క్లాక్ టవర్ వెండి నమూనాను చేయించి జ్ఞాపికగా ధర్మజలపతి రావుకు బహుకరించాడు. ఈ గడీని అమ్మివేయడంతో అది ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది. జగిత్యాల జైత్రయాత్ర జగిత్యాలకి ఇంతటి పేరు రావడానికి కారణం 1978 సెప్టెంబరు 9. ఆ రోజు విప్లవోద్యమానికి సంబంధించి చారిత్రాత్మకమైన ప్రస్తావనకు జగిత్యాల నాంది పలికింది. నలభై వేల మంది ప్రజలు భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అనాటి ‘జైత్రయాత్ర’లో ప్రముఖ మావోయిస్టు నాయకుడు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, శీలం నరేష్, లలిత, మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ, మల్లా రాజిడ్డి, సాహు, నల్లా ఆదిరెడ్డి, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశాలు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణ్‌రావు, గద్దర్, అల్లం నారాయణలతో పాటు పలువురు పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజల్ని ఉత్తేజ పరిచారు. ఈ జైత్రయాత్ర రష్యా గోడలపైన కూడా నినాదమై చోటు సంపాదించుకుంది. జగిత్యాల విశేషాలు ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉండే జగిత్యాల నేడు చుట్టుపక్కల ఉన్న ఊర్లను ఎన్నింటినో తనలో కలుపుకొని ఒక ‘పెద్ద పట్టణం’గా రూపాంతరం చెందింది. జగిత్యాలలో ప్రస్తుతం సుమారు లక్షా యాబై వేల జనాభా ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ భాషలు సమాన స్థాయిలో పలుకుబడిలో ఉన్నాయి. ఇంగ్లీష్ కూడా క్రమంగా పరివ్యాప్తం చెందుతోంది. రాష్ట్రంలోని పెద్ద పట్టణాలలో ఇది ఒకటి. రాష్ర్ట ప్రభుత్వం ద్వారా ‘అతి పరిశుభ్రమైన నగరం’గా గుర్తింపు పొందింది.జగిత్యాలకు నాలుగు వైపుల నాలుగు చెరువులు ఉన్నాయి. కండ్లపల్లి, ముప్పారపు, మోతె చెరువుల నీళ్లని వ్యవసాయానికి, ధర్మసముద్రం నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న జగిత్యాల జనాభాలో 51 శాతం పురుషుల, 49 శాతం మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 63 శాతంగా నమోదైంది. ఇది జాతీయ రేటు (59.5 శాతం) కంటే ఎక్కువ. ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనా కేంద్రం ఉత్తర తెలంగాణ వాతావరణ మండలంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఇది సేవలందిస్తోంది.రైతుల దేవాలయం...పొలాస వ్యవసాయ పరిశోధనాకార్యాలయం, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 1980 డిసెంబర్ 2న జగిత్యాల మండలం పొలాస వద్ద పరిశోధనా క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో క్షేత్రం ఏర్పాటు కాగా, 1983 నుంచి పూర్తిస్థాయి కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.పై మూడు జిల్లాల్లో ఏరువాక కేంద్రాలు, కృషీ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తున్నారు. Pddf వాలంతరీ ఫామ్ చలిగల్ లో కలదు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, 2008లో బిఎస్‌సి అగ్రికల్చర్ కాలేజీని ఏర్పాటు చేశారు. జగిత్యాల సాహిత్యం ‘మరణం నా చివరి చరణం కాదు’ అని ప్రకటించుకున్న అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల మట్టిలో పుట్టిన మాణిక్యమే. ప్రభాకర్ గొప్ప చిత్రకారుడు కూడా. 21 ఏండ్ల వయస్సులో ‘ఎర్ర పావురాలు’ కవిత్వంతో సాహిత్యపు ప్రపంచంలో అడుగుపెట్టి 1979లో ‘మంటల జెండాలు’, 1981లో ‘చురకలు’, 1982లో హైదరాబాద్ చేరుకొని ‘రక్తరేఖ’, ‘సంక్షోభగీతం’, ‘సిటీలైఫ్’ మున్నగు సంపుటాలు వెలువరించారు. సామాజిక తత్వవేత్తగా, కథా రచయితగా, నవలా రచయితగా బి.ఎస్. రాములు సుప్రసిద్ధులు. విప్లవ దళిత, పౌరహక్కుల సంఘాల్లో భూమికను నిర్వహిస్తున్నారు.‘గతితార్కిక తత్వదర్శన భూమిక’ అనే గ్రంథాన్ని వెలువరించారు. వందకు పైగా కథలు, ఆరు నవలలు రాయటమే కాకుండా కథల బడి, కథా సాహిత్య అలంకార శాస్త్రం అనే గ్రంథాల్ని వెలువరించారు. అలాగే అమ్మ, యుద్ధం, బురదలో జాబిల్లి, నాన్న, నాతిచరామి, ఊరు, సిటీ, విభిన్న కథా సంపుటాలు, బేబి ఓ బేబి, నల్ల సముద్రం, అత్తారింటికి దారేది లాంటి నవలలు రాసిన కె.వి.నరేందర్ జగిత్యాలకు చెందినవారే. వలస కవిత్వంతో జీవితానుభవాలను రంగరిస్తున్న కవి సంగవేని రవీంద్ర అన్వేషణ, వర్లీనానీలు, లోలోన లాంటి కవితా సంపుటాలు వెలువరించారు. కె.వి.నరేందర్, సంగవేని రవీంద్రలు సంయుక్తంగా ‘తెలంగాణ గడీలు’ అనే చారిత్రాత్మక పుస్తకాన్ని కూడా వెలువరించారు.ఇంకా జగిత్యాలకు చెందిన కవి_రచయిత_ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన ఎనుగంటి వేణుగోపాల్ 'వేణుగాన శతకము'అనే పద్యపుస్తకాన్ని'అమ్మానాన్న','నవరసభరితం',‘గోపాలం'హాస్య కథలు, ‘నాలుగు పుటలు’నా మినీ కథలు','ఎనుగంటి కాలంకథలు','బుజ్జిగాడిబెంగ'పిల్లలకథలు,'వైవిద్యకథలు','నాలుగుమెతుకులు' వంటి 09 కథా సంపుటాలు మరియ'విజయానికి అన్నీమెట్లే 'వ్యక్తిత్వవికాసవ్యాసాలు ','అమ్మానాన్న పిల్లలు' పిల్లలవ్యాసాలు వంటి మరో 3 పుస్తకాలతో పాటు'అవని','ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్' వంటి 2 నవలలను కూడా పుస్తక రూపంలో వెలువరించారు. పలు కథలు రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకున్నాయి.టీవీ చానల్స్ పలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.ఎనుగంటి వేణుగోపాల్ సాహిత్యంపై 'ఎనుగంటి వేణుగోపాల్ కథలు'అనే యం.ఫిల్. గ్రంథము కూడా వెలువడింది.ఇక మరోకవి జనార్ధన్ ‘జెకమొక’ అనే కవితా సంపుటి తీసుకొచ్చారు. చరిత్ర పరిశోధకుడు జైశెట్టి రమణయ్య జగిత్యాల చారిత్రాత్మక సంపదపై లోతైన పరిశోధనలు చేసిన చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య జగిత్యాల వాస్తవ్యులే. ఈయన రాసిన ‘టెంపుల్స్ ఆఫ్ సౌతిండియా’,‘ది చాళుక్యాస్ అండ్ కాకతీయ టెంపుల్స్ ఎ స్టడీ’అనే రెండు పుస్తకాలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించి పెట్టాయి.యాబై చారిత్రాత్మక వ్యాసాలు ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమై పాఠకుల మన్ననలు అందుకున్నాయి. జగిత్యాలపై మూడు పుస్తకాలు జగిత్యాలపై ఇప్పటి వరకు మూడు పుస్తకాలు వెలువడ్డాయి.అవి 1.జగిత్యాల జంగల్ మహల్ 2.జగిత్యాల పల్లె 3.నేను రుద్రవీణని... జగిత్యాలని. జగిత్యాల జైత్రయాత్ర జరిగిన తీరు, అంతకు ముందు దొరల వెట్టిచాకిరి, ఈ ప్రాంతం వెనుకబాటుతనం లాంటి విషయాల్ని విశ్లేషిస్తూ ‘జగిత్యాల జైత్రయాత్ర’ జరగడానికి కారణాలేమిటో చెబుతూ జగిత్యాల ‘జంగల్ మహల్’ పుస్తకం వెలువడింది. క్రాంతి ప్రచురణల పేరుతో విప్లవ రచయితల సంఘం 1981 జనవరిలో ఆరువేల కాపీలతో ఈ పుస్తకాన్ని ముద్రించారు.జగిత్యాల జైత్రయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రముఖ పాత్రికేయులు, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ ‘జగిత్యాల పల్లె’ పేరుతో ముప్పయి కవితల సంకలనాల్ని వెలువరించారు. అల్లం నారాయణ రాసిన కవితలే కాకుండా పాటలు కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా *‘జగిత్యాల కదిలింది జంబాయిరే... ఊరూరు మండింది జంబాయిరే...’ అనే పాట ఇప్పటికీ పల్లె ప్రజల నాల్కలపై విన్పిస్తుంది.ఇక ‘నేను రుద్రవీణని...జగిత్యాలని’ శీర్షికన వచ్చిన పుస్తకం కె.వి.నరేందర్, సంగవేని రవీంద్ర రచించిన దీర్ఘ కవిత. జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యం, ఈ ప్రాంతంలో ప్రపంచీకరణ ప్రభావం వల్ల అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని, ఫొటోలతో ప్రతిబింభిస్తూ ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్' పేరుతో ఒక విశిష్ట రూపంతో అల్లం నారాయణ కలం నుంచి వెలువడిన కవిత ఇది. జగిత్యాల పల్లె పందిళ్లు విరుగుతయ్ బీరపాదులతో సహా సన్నీలు శరీరాల మీద దిగుతయ్ బట్టలు ఇగ్గేసీ బజారు పాలు చేస్తారు.ఎవడో ఒక అభాగ్యుడు పండ్లు గిలకరించి మూలుగుతడు.తెల్లవారుతుంది, అజ్ఞాత సూరీడు, విరిగిన, పగిలిన, చిరిగిన, చిట్లిన గుడిసె కప్పుల మీదుగా కిరణాలు ఝళిపిస్తూ తూర్పున రగుల్కొంటాడు...ఇదే జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత వాసాల లక్ష్మినారాయణ జీవన గమనం, అక్షర సైన్యం, అక్షర సమ్మేళనం అనే పుస్తకాలను వెలువరించాడు . మాతాశిశు కేంద్రం జగిత్యాల పట్టణ కేంద్రంలో 18 కోట్ల ఖర్చుతో 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 2022 మే 4న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు, సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఇ రమేష్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ ఆబాది స్థలం 20 ఎకరాల్లో 49.20 కోట్ల‌ రూపాయలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2022, డిసెంబరు 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. చాంబర్‌లో కలెక్టర్‌ జీ రవిని సీటులో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సముదాయంలోని ఎనిమిది ఎకరాల్లో కలెక్టర్‌ (6వేల చదరపు అడుగులు), అదనపు కలెక్టర్‌ (2,877 చదరపు అడుగులు), జిల్లా రెవెన్యూ అధికారి (2130 చదరపు అడుగులు) క్యాంపు కార్యాలయాలతోపాటు జీప్లస్‌ 2 పద్ధతిలో 19,300ల చదరపు అడుగుల విస్తీర్ణంలో జిల్లాస్థాయి అధికారుల గృహ సముదాయాలు, ఐడీఓసీలో 32 శాఖలకు గదులు, కలెక్టర్‌-అదనపు కలెక్టర్ల కోసం మూడు పెద్ద చాంబర్లు, విజిటర్స్‌ వెయింటింగ్‌ హాల్‌, ఇంటిగ్రేటెడ్‌ మీటింగ్‌ హాల్‌, మూడు మినీ మీటింగ్‌ హాల్స్‌ నిర్మించబడ్డాయి. పోలీసు కార్యాలయం 20 ఎక‌రాల విస్తీర్ణంలో 40 కోట్ల‌ రూపాయలతో నిర్మించిన జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయం నిర్మించబడింది. 47వేల చదరపు ఫీట్ల స్థలంలో జీ ప్లస్‌ త్రీ పద్ధతిలో నిర్మించిన ఈ కార్యాలయంలో ఎస్పీ, ఏఎస్పీ, ఓఎ‌స్‌‌డీ‌లకు ప్రత్యేక గదు‌ల‌తో‌పాటు రెస్ట్‌ రూంలు, నేరా‌లను ఛేదిం‌చేలా క్రైం విభాగం, పరి‌పా‌లనా విభా‌గా‌లు, ఇంటె‌లి‌జెన్స్‌, డాగ్‌ స్క్వాడ్‌, డిజి‌టల్‌ ల్యాబ్‌లు, ట్రైనింగ్‌ హాల్‌, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, ఐటీ కోర్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, సైబర్‌ ల్యాబ్‌, పీడీ సెల్‌, నాలుగు సెమినార్ హాళ్ళు, ఇన్‌‌వార్డు, ఔట్‌‌వార్డు, మినీ కాన్ఫ‌రె‌న్స్‌‌హాల్‌, పరేడ్‌ గ్రౌండ్‌, పార్కు ఏర్పాటుచేయబడ్డాయి. 2023, అక్టోబరు 3న రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోంమంత్రి మహమూద్ అలీ కలిసి ప్రారంభించాడు. మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన మహమూద్ అలీ అనంతరం శిలాఫలకాన్ని ప్రారంభించి, ఆఫీస్ రిబ్బన్ కట్ చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎస్పీ ఛాంబర్ ను సందర్శించి జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ను చైర్ లో కూర్చో బెట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వ‌ర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు ఎల్. రమణ, టి. భానుప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు డా. ఎమ్. సంజయ్ కుమార్, బాల్క సుమ‌న్, సుంకె ర‌విశంక‌ర్‌, కల్వకుంట్ల విద్యాసాగ‌ర్ రావుతో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమీకృత మార్కెట్‌ పాత వ్యవసాయ మార్కెట్‌ యార్డులో 4.50 కోట్ల రూపాయల పట్టణ ప్రగతి ప్రత్యేక నిధులతో 2 ఎకరాల స్థలంలో రెండు భారీ షెడ్లు, కౌంటర్లతో సమీకృత మార్కెట్‌ నిర్మించబడింది. మూడు బ్లాక్‌లుగా విభజించిన ఈ మార్కెట్‌లోని 52 స్టాళ్ళు కూరగాయల విక్రేతలకు, 30 స్టాల్స్‌ను మాంసం, చేపల విక్రేతలకు, 18 స్టాల్స్‌ను పూలు, పండ్ల వ్యాపారులకు కేటాయించబడ్డాయి. సమీకృత మార్కెట్‌ కూడా 2023, అక్టోబరు 3న ప్రారంభించబడింది. విద్యాసంస్థలు జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల: 2021లో ఏర్పాటుచేయబడిన ఈ వైద్య కళాశాలకు 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లభించింది. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానల భవన నిర్మాణ పనులకు 2022, డిసెంబరు 7న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేసి, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 2022 నవంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. మూలాలు వెలుపలి లింకులు వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు
లేపాక్షి
https://te.wikipedia.org/wiki/లేపాక్షి
లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న లేపాక్షి మండలం లోని గ్రామం, అదే మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2133 ఇళ్లతో, 10042 జనాభాతో 1891 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5373, ఆడవారి సంఖ్య 4669. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1120 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 134. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 595570.పిన్ కోడ్: 515331.thumb|280x280px|ఏకశిలా నంది గ్రామ ప్రాముఖ్యత లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాన శైవక్షేత్రం, పర్యాటక కేంద్రం. ఇక్కడ వున్న వీరభద్ర స్వామి దేవాలయం (లేపాక్షి) నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు.ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా "లేపాక్షి వారసత్వ కట్టడాల సముదాయా"నికి గుర్తింపు పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేరింది. ఇతిహాసం రామాయణములో రావణాసురుడు సీతను అపహరించుకుని వెళుతుండగా ఈ కూర్మ పర్వతం పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలములో పడిపోయినట్లు, ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి, జరిగిన విషయం తెలుసుకుని, తర్వాత ఆ పక్షికి మోక్షమిచ్చి లే-పక్షీ అని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను పదమే క్రమ క్రమముగా లేపాక్షి అయినట్లు స్థలపురాణంద్వారా తెలుస్తుంది. మరో కథనం ప్రకారం అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తై, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి విరూపణ్ణ వ్యతిరేకులు ఈ విషయం గురించి చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు. లేపాక్షి బసవేశ్వరుడు పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇచ్చట గుట్టవంటి ఏకశిలను బసవేశ్వరుడుగా తీర్చిదిద్దారు. ఇంత పెద్ద బసవడు బహుకొద్దిచోట్లమాత్రమే ఉన్నాయి. ఈగుడిని ఉద్ధేసించి "లేపాక్షి రామాయణము" అను హరికథ ఉంది. పాతికకు మించిన శిలా స్తంభాలు, నాలుగు వైపులా లతలను చెక్కిపెట్టినవి, చేరి లతా మండప మేర్పరచినవి.ఇలాంటి మండపం ఇతరచోట్ల సామాన్యముగా కానరాదు. నాలుగు కాళ్ళ మండపం విజయనగరపు ఆలయాలలో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కాని ఈ ఆలయంలో పశ్చిమ వైపు భాగంలో ఉంది. పూర్వపు చరిత్ర ఈ ఊరు శ్రీ కృష్ణదేవ రాయలు కాలములో మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయక, వీరణ్ణ నాయకులను ఇద్దరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగా ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలం. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠితుడైయున్నాడు. ఈ శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. మొదట ఇది గర్భగుడిగా మాత్రమే ఉండేది. ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ప్రశాంతముగా డేవుని కొలిచేవారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించాడు. ఈ లేపాక్షి దండకారణ్యం లోనిది. ఇచ్చట జటాయువు పడియుండెననీ, శ్రీరాముడు ఆతనిని "లే పక్షీ" అని సంబోధించారని, అందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అంటారు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారం జరిగింది. శ్రీరాముడు ఉత్తరం నుండి దక్షిణానికు వచ్చాడని కొందరంటారు. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ దాదాపు ముప్పై అడుగుల ఎత్తున, పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది. ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని సా. శ. 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనం వెచ్చించి రామదాసుకు చాలాముందే ఈ వీరభద్రాలయం కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా, రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలనీ కళ్ళు తీయించుకున్నాడట. ఆలయ నిర్మాణం మూడింట ఒక వంతు ఆగిపోవడం ఇందువల్లనే అంటారు. ఈ ఆలయ నిర్మాణం జరగడానికి ముందు ఈ స్థలం కూర్మ శైలం అనే పేరుగల ఒక కొండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారాలుగల ఆలయం కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన నాలుగు ప్రాకారాలు కాలగర్భమున కలసిపోయాయివని అంటారు. ప్రాకారం గోడలు ఎత్తైనవి. గోడలపైనా, బండలపైనా కన్నడ భాషలో శాసనాలు మలచారు. ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయి. ఇక్కడి గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి మూలవిరాట్టు వీరభద్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహం ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడతాడు. వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచం ప్రక్కకు వుంటుంది. గుడి లోని పైకప్పు కలంకారి చిత్రాలతో తీర్చిదిద్దబడ్డది. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక తువ్వాలుని అతి సులువుగా తీయవచ్చును. ఇది అప్పటి శిల్పుల కళాచాతుర్యానికి ఒక మచ్చుతునక. వీరభద్ర స్వామి దేవాలయం thumb|280x280px|లేపాక్షి వీరభద్ర దేవాలయంలో విరూపాక్ష అమ్మవారి ఉత్సవ మూర్తి thumb|లేపాక్షి దేవాలయంలోని 16వ శతాబ్దపు వర్ణచిత్రం|361x361px లేపాక్షి దేవాలయం చక్కని ఎరుపు, నీలిమ, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులను ఉపయోగించి అద్భుతమైన చిత్రాలతో నిర్మించబడింది. కృష్ణదేవరాయల కాలపు చిత్రలేఖనం గొప్పదనం- అంటే లేపాక్షి చిత్రలేఖనపు గొప్పదనం కూడా చూడవచ్చు. సమకాలికుడగు పింగళి సూరన్న ప్రభావతీ ప్రద్యుమ్నమున కొంత సూచించాడు. అందు ప్రభావతీ వర్ణన " కన్నుల గట్టినట్లు తెలికన్నుల నిక్కను జూచినట్ల, తోబలుక కడంగినట్ల, భావ గంభీరత లుట్టి పడన్ శివ వ్రాసినట్టి ఈ చిత్తరవు" అని శుచిముఖిచేత వర్ణించాడు.శివ, వీరభద్ర, వైష్ణవాలాయములకు సమానమైన ముఖమండపం పైకప్పు లోభాగాన మహాభారత, రామాయణ పౌరాణిక గాథల లిఖించారు. వీరభద్ర దేవాలయపు గోడలమీదను, శివాలయపు అర్ధపంటపమున శివకథలతో అలంకరించారు. పార్వతీ పరిణయం, పార్వతీ పరమేశ్వరుల పరస్పరానురాగ క్రీడలు, త్రిపుర సంహారం, శివ తాండవం లోని ఆఖ్యాయికలు గాథా విషయాలుగ చేర్చబడినవి. భౌగోళికం ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాదు, బెంగుళూరు రోడ్డుకు ఎడమ వైపు నుండి 11 కి.మీ. దూరంలో ఉంటుంది. విద్యా సౌకర్యాలు గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల హిందూపురంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల సేవామందిర్ లో ఉన్నాయి. నవోదయ పాఠశాల గ్రామీణ ప్రాంతాలలో విద్యా ప్రమాణాల అభివృద్ధికి, బీదరికం అడ్డుకాకుండా వుండటానికి ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను ఉచితంగా అందచేయడానకి ప్రారంభించిన జవహర్ నవోదయ విద్యాలయం పథకం క్రింద 1987లో ఈ విద్యాలయాన్ని ప్రారంభించారు. విశాలమైన క్రీడామైదానం, గ్రంథాలయంతో పాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయం లోను విద్యార్థులకు పాఠాలు బోధించేలా పనిచేసే ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్ శిక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సంగీతం, చిత్రలేఖనం లోనూ తర్ఫీదు ఇస్తారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు నేషనల్ కౌన్సిల్ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సిలబస్‌లో బోధన జరుగుతుంది. 10, 12 తరగతుల విద్యార్థులు సెంటర్‌బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షలకు హాజరవుతారు. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం లేపాక్షిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు లేపాక్షిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం లేపాక్షిలో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 378 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2 హెక్టార్లు తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 321 హెక్టార్లు బంజరు భూమి: 781 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 395 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 1077 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 421 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు లేపాక్షిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 417 హెక్టార్లు చెరువులు: 4 హెక్టార్లు ఉత్పత్తి లేపాక్షిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వేరుశనగ, మొక్కజొన్న, వరి చిత్ర మాలిక మూలాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ చారిత్రక స్థలాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు వర్గం:అనంతపురం జిల్లా పర్యాటక ప్రదేశాలు వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు వర్గం:అనంతపురం జిల్లా పుణ్యక్షేత్రాలు వర్గం:ప్రసిద్ధ శైవక్షేత్రాలు
రామడుగు
https://te.wikipedia.org/wiki/రామడుగు
రామడుగు, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, రామడుగు మండలానికి చెందిన గ్రామం.http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf ఇది సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.  2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1249 ఇళ్లతో, 5121 జనాభాతో 780 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2440, ఆడవారి సంఖ్య 2681. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 646 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 14. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572226.పిన్ కోడ్: 505531. విద్యా సౌకర్యాలు గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గుండిలోను, ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కరీంనగర్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్లో ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం రామడుగులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు, ముగ్గురు నాటు వైద్యులు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు రామడుగులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ఇక్కడకు చేరుకోవడానికి కరీంనగరు, జగిత్యాల, గంగాధర, చొప్పదండి లనుండి చాలా బస్సులు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం రామడుగులో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 46 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 31 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 41 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 10 హెక్టార్లు బంజరు భూమి: 529 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 123 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 613 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 49 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు రామడుగులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 49 హెక్టార్లు ఉత్పత్తి రామడుగులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి, ప్రత్తి, మొక్కజొన్న పారిశ్రామిక ఉత్పత్తులు బీడీలు చేతివృత్తులవారి ఉత్పత్తులు చేతితో చేసే రాతి పని ముట్లు గ్రామ విశేషాలు ఇక్కడ ప్రాచీన కాలంనాటి కోట ఒకటి ఉన్నది. దీని గోడలు ముప్పై మీటర్లు ఎత్తులో ఉంటాయి. ఇది రాతి శిల్పాలకు బహు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్నటువంటి రాతి శిల్పాలను చూడటానికి భారతదేశం నలుమూలలనుండి జనాలు వస్తారు. మూలాలు వెలుపలి లింకులు
మంథని
https://te.wikipedia.org/wiki/మంథని
మంథని, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, మంథని మండలానికి చెందిన పట్టణం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. ఈ పట్టణం రెవెన్యూ డివిజన్ కేంద్రం.ఇది సమీప పట్టణమైన రామగుండం నుండి 40 కి. మీ. దూరంలోనూ, కరీంనగర్ నుండి 60 కి.మీ.ల దూరంలోనూ, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 225 కి.మీ.ల దూరంలో ఉంది. భౌగోళికంగా మంథని 18-30', 19' ఉత్తర అక్షాంశాల మధ్యా, 78-30', 80-30' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి సముద్ర మట్టానికి 421 అడుగులు (128 మీటర్లు) ఎత్తులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న మంథని పురపాలకసంఘంగా ఏర్పడింది. గణాంకాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4859 ఇళ్లతో, 17927 జనాభాతో 2297 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8866, ఆడవారి సంఖ్య 9061. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2513 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 208. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 571808.పిన్ కోడ్: 505184. విశేషాలు ఈ చిన్న గ్రామం వేద బ్రాహ్మణులతో, దేవాలయాలతో నిండి ఉంది.మంథనికి ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన బొక్కలవాగు అనే చిన్న యేరు, తూర్పున సురక్షిత అడవి, పశ్చిమాన రావులచెరువు హద్దులుగా ఉన్నాయి. దక్షిణాన, పశ్చిమాన గ్రామ వ్యవసాయ భూములు ఈ పొలిమేరలకు ఆవల ఉన్నా ప్రధాన నివాస స్థలము ఈ హద్దులలోనే ఉంది. గ్రామ విస్తీర్ణము 6 చదరపు కి.మీ. విద్యా సౌకర్యాలు గ్రామంలో 8 ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 21, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల రామగుండంలో ఉంది. సమీప వైద్య కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్‌ కాటారంలోను, మేనేజిమెంటు కళాశాల రామగుండంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రామగుండంలో ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం మంథనిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు డాక్టర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. మాతాశిశు సంరక్షణ కేంద్రం మంథని పట్టణంలో 7 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల మాత శిశు హాస్పిటల్ (ఎంసి హెచ్)ని 2022 జూన్ 22న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, గిరిజన-బిసీ-మైనారిటీ సంక్షేమ శాఖలమంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు మంథనిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం మంథనిలో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 233 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 442 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 1622 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 190 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1432 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు మంథనిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 800 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 132 హెక్టార్లు* చెరువులు: 500 హెక్టార్లు ఉత్పత్తి మంథనిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి, ప్రత్తి, మిరప గ్రామంలోని వీధులు (తూర్పు నుండి సవ్య దిశలో) లక్ష్మినారాయణస్వామి వీధి వాగు గడ్ద దొంతుల వాడ రావుల చెరువు కట్త మందాట పోఛమ్మ వాడ నడి వీధి తమ్మ చెరువు కట్ట పెంజెరు కట్త రాజీవ్ నగర్ నేతాజీ సుభాష్ నగర్ గాంధీ ఛౌక్ రాఘవులు నగర్ ఎరుకల గూడెం బర్రె కుంట పాత బస్టాండ్ శ్రీపాద కాలనీ భరత్ నగర్ మసీదు వాడ బోయినిపేట కొత్త వాడలు గంగపూరి కూచి రాజ్ పల్లి శ్రీరామ్ నగర్ గ్రామంలోని చెరువులు / నీటి వనరులు బన్నె చెరువు బర్రె కుంట బొక్కల వాగు రావుల చెరువు తమ్మి చెరువు: తమ్మిచెరువు కట్టకు మంథనిలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. తమ్మిచెరువు కట్ట ఒడ్డున శివుని ఆలయం, హనుమాన్ ఆలయం, శ్రీ షిరిడి సాయి ఆలయాలు ఉన్నాయి. మంథనిలో ఎక్కువ ఆలయాలు తమ్మిచెరువు ఒడ్దునే ఉన్నాయి. తమ్మిచెరువును మినీ ట్యాంక్ బండ్ లా అభివృద్ధి చేయుట కొరకు తెలంగాణ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో పనిచేస్తుంది. ఈ తమ్మిచెరువును త్రాగు నీటి ఉద్దేశం కొరకు ఏర్పాటు చేసినప్పటికీ, కలుషితం ఐన కాలువ నీరు అందులో చేరడం వాళ్ళ ఆ నీరు తాగే పరిస్థితి లేకపోయింది. తమ్మిచెరువులో బతుకమ్మల నిమజ్జనం, వినాయకుల నిమజ్జనం వల్ల నీరు కలుషితంగా మారుతుంది. ఈ కాలుష్యాన్ని ఆపటం కొరకు మంథని గ్రామ పంచాయితీ పలు కార్యక్రమాలు చేపట్టింది. శీల సముద్రం అయ్యగారి చెరువు గోదావరి నది రెడ్డి చెరువు సూరయ్యపల్లి చెరువు గ్రామ ప్రముఖులు ముద్దు బాలంభట్టు లొకె రామన్న వరహాల భీమన్న లొకె లక్ష్మణ శర్మ ముద్దు రామకృష్ణయ్య ఘట్టు నారాయణ గంగా రాజేశ్వర రావు శ్రీరాంభట్ల మురళిధర్ బాబా దుద్దిల్ల శ్రీపాదరావు అయోధ్య రమణ (ఐ.ఎ.యస్) చంద్రుపట్ల సీతారాం రెడ్డి, చంద్రుపట్ల నారాయణ రెడ్డి(సి.ఎన్.రెడ్డి)మాజీ ఎం.ఎల్.ఎ. చంద్రుపట్ల రాజిరెడ్డి, మాజీ సమితి ప్రెసిడెంట్, చంద్రుపట్ల ఆగారెడ్డి, మాజీ న్యాయమూర్తి, మాదాడి ప్రభాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్,న్యాయవాది, గీట్ల జనార్ధన్ రెడ్డి, మాజీ ఎం.ఎల్.సి. పోతిపెద్ది వెంకటనారాయణ రెడ్డి, న్యాయవాది,భా.జ.పా. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, చంద్రుపట్ల రాంరెడ్డి, మాజీ శాసన సభ్యులు. చంద్రుపట్ల దుర్గారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ లోకే సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది మంథని వేద పండితులు అవధానుల పురుశోత్తమ శర్మ (పుల్లన్న సోమయాజులు) అవధానుల నరహరి (నరహరి సోమయాజులు) మహావాది లింగన్న దుద్దిళ్ళ కృష్ణయ్య దుద్దిళ్ళ రామన్న మోతెరాం రాజేశ్వర్ రావు శాస్ర్తులు వొజ్జెల సిద్దాంతి గంగా సిద్దాంతి దూలం సిద్దాంతి గట్టు లింగన్న - ఘనాపాటి అవధానుల కృష్ణయ్య దుద్దిళ్ళ మారుతి ముద్దు రాజన్న - నల్ల ముద్దు రాజన్న కొల్లారపు సీతారామ శర్మ రా్జవరమ్ సేనమ్ శాస్ర్తులు మంథని స్వాతంత్ర్య సమరయోధులు దేవళ్ళ రాజన్న) రావికంటి రామయ్య - (కాంగ్రెస్ రామయ్య) పనకంటి కిషన్ రావు లోకే లక్ష్మణ శర్మ లోకే విశ్వనాథ శర్మ గులుకోట శ్రీరాములు రఘునాథ్ కాచె చొప్పకట్ల చంటయ్య గ్రామంలోని మహిళా ప్రముఖులు ముద్దు సీతమ్మ కొల్లారపు సావిత్రి సువర్ణ తైలాంబ సువర్ణ రాధ మ్మ పల్లి మాధవి రామగుండం రాజెశ్వరి తనుగుల చంద్రకళ భాగొతుల అమ్మాయమ్మ సువర్ణ వనమళ చింతపల్లి జగదాంబ చింతపల్లి సావిత్రి నల్లగొండ సావిత్రి గట్టు సీతమ్మ అవధానుల సరొజన అవధానుల రాంబాయామ్మ శాస్త్రుల చంటమ్మ రంగీ కమల గట్టు సుమతి అవధానుల సరోజన ప్రిన్సిపాల్ గుడి నర్మద ఇల్లెందుల లక్ష్మీభాయి చొప్పకట్ల సత్యభామ మారుపాక నర్సమ్మ మారుపాక శకుంతల మారుపాక అన్నమ్మ మంథెన లక్ష్మీ మంథెన విమలమ్మా ( నల్లగొండ) ఆచారపు సత్తెమ్మ దుధ్దిల్ల సావి ట్్ర్రరి గ్రామంలోని విద్యా సంస్థలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోషిని డిగ్రీ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రణవి జూనియర్ కళాశాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (ఆడి బడి) యు.పి.యస్ జే.బి.యస్ సరస్వతి శిశు మందిర్ సాధన ఉన్నత పాఠశాల మార్గదర్శి విద్యానికేతన్ శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ లిటిల్ హార్ట్స్ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేరీ మీడియా ట్రిక్స్ అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయితీ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం.''' పోలీసు స్టేషన్ న్యాయస్థానం భవన సముదాయము గ్రామంలోని వంశాల పేర్లు రామగుండం దొంతుల రంగి మహావాది పెద్ధీరాజు అవధాని అవధానుల ఇల్లెందుల కర్ణె కాచె కామొజ్జల కొంతం కొమురవెల్లి కుక్కడపు కూ కొల్లారం/కొల్లారపు గట్టు ఘనుకోట ఛకిలం చక్రగారి ఛిల్లప్పగారి జలివెంచ టక్కెగారి భాగవతుల భారతుల బెజ్జాల బుర్ర బొర్ర తనుగుల దుద్దిళ్ళ నల్లగొండ పనకంటి మారుపాక మోతెరాం గారి రాంపల్లి రాజవరం రేగళ్ళ లొకె వరాల తొడుపునూరి సోమారం సువర్ణ నఛెగారి నన్నెగారి కొమురోజు సంగెం గుజ్జేటి చంద్రుపట్ల మాదాడి పోతిపెద్ది ముస్కుల పింగళి గీట్ల కాసర్ల కటుకూరి తాటి మాచిడి ముప్పిడి పోరెడ్డి అక్కేటి మూల పెండ్రు భయ్యపు గ్రామంలోని గోత్రాల వారిగా వంశాల పేర్లు 1) కాశ్యపస గోత్రము:రంగి,దుద్దిళ్ళ,రాంపల్లి,లొకె,కాచె 2) హరితస గోత్రము:పల్లి,కామొజ్జల,,చిల్లప్పగారి,రేగళ్ళ,ముద్దు,వొజ్జల,భారతుల 3) శ్రీవత్సస గోత్రము:చొప్పకట్ల,బొర్ర,నన్నెగారి,గంగా,సుశిల్ల,బెజ్జాల.దహగం,ఓదెల,పాపిట్ల 4) కౌన్డిన్యస గోత్రము:శ్రీరంభట్ల,తనుగుల,గట్టు,మల్లోజ్జల 5) భరద్వాజస గోత్రము:నారంభట్ల,ఘనుకోట,తళ్ళము,వరహాల 6) గౌతమస గోత్రము:పనకంటి,మహావాది,కొల్లారంకొల్లారపు 7) కౌశికస గోత్రము:రామడుగు,దూలం,మంథెన 8) స్వతంత్రకపి గోత్రము:దేవళ్ళ,అష్టధని,గడ్డము 9) ఆత్రేయస గోత్రము:అవధానుల,యెలిశెట్టి 10) భార్గవస గోత్రము:సువర్ణ,యఘ్నంభట్ల 11) పరాశర గోత్రము:వల్లంభట్ల,మారుపాక 12) లోహితస గోత్రము:రాంపెల్లి,చక్రగారి 13) వాధులస గోత్రము:రాధారపు 14) వశిష్టస గోత్రము,కర్ణె 15) మౌద్గల్యస గోత్రము:గూడెపు 16) జయపుత్ర గోత్రము,కొమరోజు 17) కమండలము:బుర్ర,కుక్కునూల్ల,చంద్రుపట్ల సూచన: కింది వంశాల పేర్లకు సంబంధించి గోత్రాలు తెలియకున్నవి. నమోదు చేయగలరని మనవి. కూ గొలుగుల రుద్రబట్ల జక్కి కుందారపు పెండ్యాల ఛకిలం ఇల్లెందుల కొంతం కొమురవెల్లి కుక్కడపు తొడుపునూరి సోమారం గ్రామంలోని ఆలయాలు / ప్రార్థనా స్థలాలు వీర ఆంజనేయాలయం గౌండ్ల ఆంజనేయాలయం వాగు గడ్డ ఆంజనేయాలయం భళిర ఆంజనేయాలయం వడ్ల ఆంజనేయాలయం రావులచెరువు కట్ట ఆంజనేయాలయం నడివీధి ఆంజనేయాలయం ఆంజనేయాలయం (లక్ష్మి నారాయణ ఆలయం ప్రాంగణం లో) తమ్మచెరువు కట్ట ఆంజనేయాలయం ఆంజనేయాలయం (గోదావరి వద్ద) పెంజెరుకట్ట ఆంజనేయాలయం బల్లెరు ఆంజనేయాలయం సమ్మక్క గుడి - గ్రామం పొలిమేరల్లో - వంతెన ముందుగా మహాలక్ష్మి ఆలయం శ్రీ శీలేశ్వర సిద్ఢేశ్వర దేవాలయం (బోడ గుడి) సిద్దేశ్వరాలయం ఆది శంకరాచార్యాలయం - శీలేశ్వరాలయం, సిద్దేశ్వరాలయం మధ్యలో ఒంకారేశ్వరాలయం భిక్షేశ్వరాలయం సాయి బాబా ఆలయం అయ్యప్ప ఆలయం గణపతి ఆలయం (గోదావరి త్రోవలో) దత్రాత్రేయాలయం (గోదావరి త్రోవలో) చర్చి (గోదావరి త్రోవలో) గౌతమేశ్వరాలయం (మంథని) రామాలయం (గోదావరి వద్ద - గౌతమేశ్వరాలయం ప్రాంగణం లో) సరస్వతి లాలయం (గోదావరి వద్ద - గౌతమేశ్వరాలయం ప్రాంగణం లో) లక్ష్మి నారాయణ ఆలయం కృష్ణార్జునుల ఆలయం (లక్ష్మి నారాయణ ఆలయం ప్రాంగణం లో) మస్జిద్ గమనిక:పై అలయాల్లో తరచూ పూజలు జరుగుతుంటాయి.ఇవి కాక గ్రామానికి నాలుగు సరిహద్దుల్లో నాలుగు బోయి లింగాలు ఉన్నాయి. ఇంకా పూజింప బడని విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. మూలాలు ఇవి కూడా చూడండి మంథని శాసనసభ నియోజకవర్గం బయటి లింకులు మంథని వెబ్‌ సైట్‌. మన మంథని వెబ్‌ సైట్‌. వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు
అబ్దుల్లా కుతుబ్ షా
https://te.wikipedia.org/wiki/అబ్దుల్లా_కుతుబ్_షా
thumb|సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా అబ్దుల్లా కుతుబ్ షా దక్షిణ భారతదేశములోని గోల్కొండ రాజ్యమును పరిపాలించిన కుతుబ్ షాహీ వంశములో ఏడవ రాజు. అతడు 1626 నుండి 1672 వరకు పరిపాలించాడు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కుమారుడైన అబ్దుల్లా, బహుభాషా కోవిదుడు, సంగీత నాట్య ప్రియుడు. అతడు ప్రసిద్ధి చెందిన పదకర్త క్షేత్రయ్యను తన సభకు ఆహ్వానించి సత్కరించాడు. క్షేత్రయ్య మధుర భక్తి సంప్రదాయములో సుప్రసిద్ధుడు. ఈయన పేమమతి తారామతి అనే ఇద్దరు హిందూ యువతులను వివాహం చేసుకున్నాడు. అబ్దుల్లా తరువాత అతని అల్లుడు, అబుల్ హసన్ కుతుబ్ షా, గోల్కొండ రాజు అయినాడు. రాజకీయ వ్యవహారాలు పట్టాభిషేకం, ప్రతినిధుల పరిపాలన 1626లో ముహమ్మద్ కులీ కుతుబ్ షా మరణించడంతో అప్పటికి 12 సంవత్సరాల వయస్సులో ఉన్న కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షా పట్టాభిషిక్తుడు అయ్యాడు. 1626 ఫిబ్రవరి 1న చార్మినార్ వద్ద అబ్దుల్లాను గోల్కొండ రాజ్యానికి సుల్తాన్‌గా ప్రకటించి, తర్వాతిరోజున మహమెదీ మహల్ వద్ద పట్టాభిషిక్తుణ్ణి చేసి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సుల్తాన్ చిన్నవయసులో ఉండడంతో రాజప్రతినిధి మండలి ఏర్పడి పరిపాలన చేసేది. రాజప్రతినిధుల మండలిలో ప్రధానమైన అధికారం సుల్తాన్ తల్లి హయత్ బక్షీ బేగం చేతిలో ఉండేది, ఆమెతో పాటుగా సుల్తాన్ నాయనమ్మ ఖానుం ఆఘాకు కూడా సమ ప్రాధాన్యం ఉండేది. షాజహాన్‌కు సామంతునిగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆదేశంతో 1930 డిసెంబరు 3న గోల్కొండ రాజ్యపు ఈశాన్య సరిహద్దుల్లో గోల్కొండకు చెందిన మన్సుర్ ఘర్ అన్న కోటపై మొఘల్ పరిపాలిత ఒరిస్సాకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న బకర్ ఖాన్ సైన్యసహితంగా దండయాత్ర చేశాడు. తమకే అన్ని విధాలా అనుకూల్యత ఉన్నా గోల్కొండ సైన్యం మొఘల్ సైన్యం చేసిన తొలి దాడికే లొంగిపోయింది. ఆ ఓటమితో మన్సూర్ ఘర్, ఖిరాపరా ప్రాంతాలను గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యానికి కోల్పోయింది. తర్వాతి సంవత్సరంలో షాజహాన్ మరొక మొఘల్ సేన్యాధ్యక్షుడైన నసిరిఖాన్‌ను గోల్కొండ రాజ్యపు వాయవ్య సరిహద్దుల నుంచి దాడిచేయమని ఆదేశించాడు. మొఘల్ సైన్యాలు కాందహార్ కోటను (మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది) హస్తగతం చేసుకున్నాయి. తద్వారా గోల్కొండ రాష్ట్రంలోని తెలంగాణ ప్రావిన్సులో మూడవ వంతు మొఘల్ సామ్రాజ్యం అధీనంలోకి వెళ్ళిపోయింది. thumb|సింహాసనాన్ని అధిష్టించి ఉండగా నాట్యకత్తెలు, ఉద్యోగులు పరివేష్టితులైన చిత్రం 1935-36లో దక్కన్‌లో మరో ముఖ్యమైన రాజ్యమైన అహ్మద్‌నగర్ మీద మొఘల్ సైన్యం దాడి చేసి పతనం చేసింది. స్వయానా షాజహాన్ దక్కన్‌కి వచ్చి అహ్మద్‌నగర్ రాజ్యాన్ని సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. గోల్కొండ, బీజాపూర్ సుల్తాన్‌లకు మొఘల్ చక్రవర్తి ఆఖరు హెచ్చరిక పేరిట ఫర్మానా పంపాడు. అహ్మద్‌నగర్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నందుకు నిందించడంతో పాటుగా మొఘల్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని అంగీరించి, కప్పం కట్టమని లేదంటే గోల్కొండ మీద మొఘల్ సైన్యం దండయాత్ర చేయక తప్పదనీ అందులో షాజహాన్ పేర్కొన్నాడు. అప్పటికే మొఘల్ సైన్యపు దాడులకు రాజ్యభాగాలను కోల్పోవడంతో పాటు సాటి సుల్తానేట్ అయిన అహ్మద్‌నగర్ మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోవడంతో అబ్దుల్లా స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేసే సాహసం చేయలేదు. 1636లో మొఘల్ సామ్రాజ్య రాయబారి అబ్దుల్ లతీఫ్ ముందు ఖురాన్ మీద ప్రమాణం చేసి, మొఘల్ సామ్రాజ్యానికి సామంతునిగా వ్యవహరిస్తాననీ, మొఘల్ చక్రవర్తి ఆధిపత్యాన్ని అంగీకరిస్తానని, చక్రవర్తి పరిపాలన ప్రారంభమైన సంవత్సరం నుంచీ లెక్కించి ఏడాదికి రెండు లక్షలు పేష్కష్ (కప్పం) చెల్లిస్తాననీ ఇన్‌ఖియద్ నామా లేక సమర్పణా పత్రాన్ని రాసి ఇచ్చాడు. తద్వారా గోల్కొండ రాజ్యపు స్వాతంత్ర్యం ముగిసిపోయింది. అబ్దుల్లా అప్పటి నుంచీ మొఘల్ సామంతుని స్థాయికి దిగిపోయాడు. తన పేరిట కాకుండా మొఘల్ చక్రవర్తి పంపిన నమూనాలో నాణాలను ముద్రించడం ప్రారంభించాడు. మొఘల్ ప్రతినిధి అబ్దుల్లా కొలువులో ఉండేవాడు. సామంతునిగా మారడం వల్ల అబ్దుల్లా చేయబోయే ప్రతీ ముఖ్యమైన రాజకీయ నిర్ణయానికి అప్రకటితమైనది కానీ, గర్భితంమైనది కానీ అసలంటూ మొఘల్ చక్రవర్తి ప్రతినిధి ఆమోదం అవసరం. విజయనగరంపై దండయాత్రలు తళ్ళికోట యుద్ధం తర్వాత బలహీనమై, రకరకాల రాజధానులు మారుస్తూ పోయిన విజయనగర సామ్రాజ్యంపై 1642 ఏప్రిల్‌లో దండయాత్ర ప్రారంభించడానికి అబ్దుల్లా నిర్ణయించాడు. అందుకు తగ్గట్టుగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ కూడా కర్ణాటక ప్రాంతంపై తనకు అధికారం ఉందనీ, కాబట్టి గోల్కొండ, బీజాపూర్ (అప్పటికి మొఘల్ సామంత రాజ్యం అయింది) రాజ్యాలు కర్ణాటకపై దండయాత్ర చేసి గెలిచి తమ రాజ్యాల మధ్య దాన్ని పంచుకొమ్మని ఫర్మానా వెలువరించాడు. అన్నివైపులా దుర్భేద్యమైన రక్షణ కలిగి ఉన్న ఉదయగిరి కోటపై గోల్కొండ రాజ్యం ముట్టడి చేసింది. సాధారణంగా దాన్ని గెలవడం సాధ్యమయ్యేదో కాదో కానీ అబ్దుల్లా అదృష్టం కొద్దీ కొత్తగా రాజ్యానికి వచ్చిన రెండవ శ్రీరంగ రాయల మీద వ్యతిరేకతతో ఉన్న కోట సేనాని మల్లయ్యను గోల్కొండ సైన్యం లొంగదీసుకోగలిగింది. రహస్య మార్గం గుండా కోటలోకి ప్రవేశించి విజయం సాధించింది. బీజాపూర్ సుల్తాన్ ద్వారా సహాయం పొందిన రెండవ శ్రీరంగ రాయలు మళ్ళీ ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకోగా, గోల్కొండ సైన్యాధ్యక్షుడు రెండవ మీర్ జుమ్లా తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈసారి కడప ప్రాంతాన్ని రెండవ మీర్ జుమ్లా తన కిందే ఉంచుకున్నాడు. ఆపైన శాన్ తోమ్, చెంగల్పట్టు ప్రాంతాన్నీ జయించాడు. 1646 నాటికల్లా విజయనగర ఆఖరి పాలకుడైన రెండవ శ్రీరంగ రాయల పరిపాలనలో ఉన్న మొత్తం ప్రాంతం గోల్కొండ పాలైంది. రెండవ మీర్ జుమ్లాతో సమస్యలు, ఔరంగజేబు చేతిలో ఓటమి thumb|యువకునిగా గుర్రం మీద అబ్దుల్లా కుతుబ్ షా, 1635 నాటి చిత్రం విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన అబ్దుల్లా వజీర్ రెండవ మీర్ జుమ్లా పోను పోను తన సుల్తాన్‌కి సమస్యాత్మకంగా తయారయ్యాడు. మీర్ జుమ్లా దక్కన్‌లో మొఘల్ గవర్నర్‌గా ఉన్న ఔరంగజేబుతో రహస్యంగా మంతనాలు సాగిస్తూ, అతన్ని గోల్కొండపై దండయాత్రకు రమ్మని ఆహ్వానించిన విషయం అబ్దుల్లాకు తెలిసింది. మీర్ జుమ్లాను తన కొలువులో హాజరు కావాలని పంపిన ఆదేశానికి సమాధానం లేకపోవడంతో అబ్దుల్లా అతని కుమారుడిని, భార్యని ఖైదుచేసి, యావదాస్తిని జప్తుచేశాడు. అవతల మీర్ జుమ్లా మొఘల్ కొలువును అంగీకరించాడు, ఔరంగజేబు సహకారంతో షాజహాన్ నుంచి 5 వేలమంది సైన్యానికి మన్సబుదారుగా తనకూ, 2 వేలమంది సైన్యానికి మన్సబుదారుగా తన కుమారుడికీ హోదా పొందాడు. మీర్ జుమ్లా కుటుంబాన్ని విడిపించం అసలు కారణం కాగా మొఘల్ సామ్రాజ్యానికి రావాల్సిన పేష్కష్ బాకీ కోసం అన్న వంకతో ఔరంగజేబు గోల్కొండపైకి సైన్యాన్ని నడిపిస్తున్నట్టు ప్రకటించాడు. ఇందుకు తన కుమారుడిని సైన్య సహితంగా వెళ్ళమని ఆదేశించాడు. ఈ పరిణామంతో భయపడిపోయిన అబ్దుల్లా హైదరాబాద్‌ను విడిచిపెట్టి గోల్కొండ కోటలో దాక్కున్నాడు. దానితో పాటు మీర్ జుమ్లా కుమారుడిని, భార్యను విడిచిపెట్టాడు. ఐనా, ఔరంగజేబు కుమారుడు మహమ్మద్ మాత్రం వెనుదిరగలేదు. గోల్కొండ కోటను ముట్టడించి కూర్చున్నాడు. ధైర్యం సన్నగిల్లిన అబ్దుల్లా ఓటమిని అంగీకరించి శాంతిని కోరాడు. సంధి షరతుల్లో భాగంగా కోటి రూపాయలు చెల్లించాడు. పాద్షా బీబీ సాహెబా అన్న పేరుతో పేరొందిన తన కుమార్తెను ఔరంగజేబు పెద్ద కొడుకు మహమ్మద్ సుల్తాన్ మీర్జాకు ఇచ్చి పెళ్ళిచేశాడు. ఈ పరిణామాలు 1656లో జరిగాయి. ఔరంగజేబుపై తిరుగుబాటు, ఓటమి 1658లో షాజహాన్ అనారోగ్యం పాలు కావడంతో సింహాసనం కోసం షాజహాన్ కుమారుల్లో అంతర్యుద్ధం జరిగి, అందులో గెలిచి ఔరంగజేబు వారసునిగా స్థిరపడేవరకూ మొఘల్ రాజకీయ వ్యవహారాల అస్థిరత్వంలోకి వెళ్ళాయి. మరోవైపు, ఔరంగజేబు దక్కన్‌లో శివాజీ నేతృత్వంలో మరాఠా రాజ్యంతో పోరాటాల్లో మునిగితేలాడు. దీనితో కుతుబ్ షాహీ రాజ్యానికి వెనువెంటనే వచ్చిన ముప్పేమీ లేకపోయింది. కానీ, విజయనగరం నుంచి గెలుచుకున్న భూభాగం విషయమై వివాదం తలెత్తింది. అది గోల్కొండకు వజీరుగా ఉండగా మీర్ జుమ్లా గెలిచింది కాబట్టి గోల్కొండ భూభాగమేనని అబ్దుల్లా వాదించాడు. తనకు సన్నిహితుడైన మీర్ జుమ్లా ప్రభావంతో ఔరంగజేబు చక్రవర్తి మాత్రం మీర్ జుమ్లా మొఘల్ ఉద్యోగి అనీ, కాబట్టి ఆ భూభాగాలపై అబ్దుల్లాకు అధికారం లేదని తేల్చాడు. చక్రవర్తి ఔరంగజేబు దక్కన్‌లో మిగిలిన సుల్తానులను వదిలించుకుని ఆ భూభాగాన్ని మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకోవడానికి కృత నిశ్చయుడై ఉండడంతో 1665లో బీజాపూర్ సుల్తాన్ మీదికి దండయాత్రకు ఆదేశించాడు. ఈ పరిస్థితుల్లో అబ్దుల్లా తన బావ అయిన బీజాపూర్ ఆదిల్షాకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకుని, గోల్కొండ సైన్యాధికారియైన మూసా ఖాన్‌ను 12 వేల మందితో తుపాకీ దళంతో మొఘల్ సైన్యంపై దాడిచేయమని ఆదేశించాడు. ఔరంగజేబు మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తర్వాత ఒకసారి అబ్దుల్లా కుతుబ్ షాని ఎప్పటిలానే మొఘల్ రాజ ప్రతినిధిని తన కొలువులో ఉంచమని ఆదేశించగా, ఆ ఆదేశాన్ని అబ్దుల్లా తిరస్కరించాడు. ఖైదులో జీవిస్తున్నా షాజహాన్ జీవించే ఉండడంతో ఔరంగజేబు ధర్మబద్ధంగా చక్రవర్తి కాబోడనీ, ఇప్పటికీ షాజహానే చక్రవర్తి అనీ, కాబట్టి ఔరంగజేబు ఆదేశాలు తాను స్వీకరించనక్కరలేదనీ ఒక వాదన కూడా చెప్పాడు. మొఘల్ రాజప్రతినిధిని తన కొలువులో అవమానించాడు. దీనితో మొఘల్ సైన్యం మీదికి దండయాత్ర చేసి, అబ్దుల్లాను ఓడించింది. అలా కుదుర్చుకున్న సంధిలో కారణంగా అబ్దుల్లా మొఘల్ సామ్రాజ్యానికి లోబడి సామంతునిగా ఉండేట్టు అంగీకరించి గోల్కొండ రాజ్యానికి తిరిగి పాలకుడయ్యాడు. పరిపాలన, సంస్కృతి thumb|అబ్దుల్లా తన తల్లి పేరిట నిర్మించిన హయాత్ బక్షీ మసీదు అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన చాలా ఇబ్బందుల్లో సాగింది. సైనికంగా చాలా బలహీనమైన పాలకుడిగా కనిపిస్తాడు. అయితే, సుల్తాన్ గా అతని బాధ్యతల్లో ఒకటైన న్యాయ నిర్ణయం విషయంలో అబ్దుల్లాకు చాలా మంచి పేరు ఉంది. న్యాయబుద్ధికి, న్యాయాన్యాయ విచక్షణకీ అతను పేరుపొందాడు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా అన్యాయంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేవాడు కాదు. తెలుగు భాష పోషణ విషయంలో కుతుబ్ షాహీలు పేరు పొందినా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో దీనికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అబ్దుల్లా తెలుగు భాషా సాహిత్యాల పోషణను పునరుద్ధరించాడు. మత సామరస్యాన్ని కూడా పాటించాడు, హిందూ ముస్లింలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తన చర్యలతో దోహదం చేశాడు. అబ్దుల్లా కాలంలో గోల్కొండ రాజ్యంలో ద్విభాషా ఫర్మానాలు వెలువడ్డాయి, వీటిలో పర్షియన్ భాషలో సారాంశం, తెలుగులో పూర్తి పాఠం ఉండేవి. అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలనలో గోల్కొండ రాజ్యంలో మల్లారెడ్డి దేశాయ్, కేశన-మల్లన వంటి తెలుగు కవులు కావ్యాలు రాశారు. అబ్దుల్లా కాలంలోనూ గోల్కొండ రాజ్యంలో పర్షియన్ సాహిత్య పోషణ ఎంతగానో జరిగింది. అతని పాలనలో ఇక్కడ అనేకానేక పర్షియన్ రచనలు వచ్చాయి. 1651లో అబ్దుల్లా పాలనలో మహమ్మద్ హుసేన్ బుర్హాన్ రూపొందించిన బుర్హాన్-ఇ-ఖాతీ అన్న పర్షియన్ నిఘంటువు ఈనాటికీ పర్షియన్ భాషలో ప్రామాణికమైన నిఘంటువుగా పేరొందింది. మరెన్నో పర్షియన్ రచనలు, చెప్పుకోదగ్గ ఉర్దూ సాహిత్యం అబ్దుల్లా పోషణలో వెలువడింది. రెండవ మీర్ జుమ్లా చేతిలో మోసపోయి అనేక సమస్యల పాలైన కారణంగా చివరి దశలో తనకు నమ్మకస్తులైన వారిని పరిపాలనలో నియమించుకోవాలని అబ్దుల్లా నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారమే ప్రతిభావంతుడైన తెలుగు బ్రాహ్మణ ఉద్యోగి మాదన్నను ప్రోత్సహించాడు. రాజ్యంలోని అన్ని కీలకమైన ఉద్యోగాల్లోనూ మాదన్నకు నమ్మకస్తులైన వ్యక్తులను నియమించమని అతనికి అవకాశం కల్పించాడు. క్రమేపీ అతన్ని బలపరుస్తూ వచ్చి, తుదకు సయ్యద్ ముజఫర్‌ను తొలగించి, మీర్ జుమ్లా (ఆర్థిక మంత్రి) పదవిలో మాదన్నను నియమించాడు. మాదన్న సైన్యంలోనూ, పరిపాలనలోనూ వివిధ ఉన్నత పదవుల్లో తనకు నమ్మకస్తులైన దగ్గరి బంధువులను, కుటుంబ సభ్యులను నియమించాడు. మహమ్మద్ కుతుబ్ షా సమయంలోనే గోల్కొండ రాజ్యంలో వజ్రాల గనులు ఉన్న విషయం బయటపడినా, గనులను వెలికితీసి దాన్ని పూర్తిస్థాయి పరిశ్రమగా తీర్చిదిద్దింది అబ్దుల్లా పరిపాలన వ్యవస్థే. అబ్దుల్లా వజ్రాల గనుల నిర్వహణ, వెలికితీత ప్రక్రియ, అమ్మకం వగైరా మొత్తం వజ్రాల పరిశ్రమ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చాడు. వజ్రాల వెలికితీత ఎంత ముమ్మరంగా ఉండేదంటే వాటిని లెక్కించేప్పుడు ఒక్కో వజ్రాన్నీ కాక వజ్రాల మూటలుగా లెక్క పెట్టేవారు. అబ్దుల్లా కిరీటంలో ప్రపంచంలోనే అత్యుత్తం అనదగ్గ వెలకట్టలేని వజ్రాలు ఉండేవి.thumb|అబ్దుల్లా కుతుబ్ షా సమాధిఅబ్దుల్లా పరిపాలనలో కుతుబ్ షాహీ నిర్మాణ కౌశలం అత్యుత్తమ దశకు చేరుకుంది. తన జీవితకాలంలో అబ్దుల్లా అనేక మసీదులను కళాత్మకంగా నిర్మింపజేశాడు. హయత్‌నగర్ మసీదు, హతీ బౌలీ, ఖాస్ బాఘ్, ఇబ్న్-ఖాటూన్ సమాధి మందిరం, టోలీ మసీదు, ఘోషా మహల్, కుతుబ్-ఎ-ఆలమ్ మసీదు, మూసా బురుజు, గోల్కొండ టూంబ్స్‌కు సంబంధించిన గొప్ప మసీదు, హయత్ బక్ష్ బేగం సమాధి మందిరం, హీరా మసీదు, అబ్దుల్లా కుతుబ్ షా సమాధి మందిరం అన్నవి అబ్దుల్లా పాలనాకాలంలో నిర్మించిన గొప్ప నిర్మాణాలు. కుటుంబం అబ్దుల్లా కుతుబ్ షాకి ముగ్గురు కుమార్తెలు: పెద్ద కుమార్తె ఔరంగజేబు కొడుకు మహమ్మద్ సుల్తాన్ మీర్జాను వివాహం చేసుకుంది. రెండవ కుమార్తెను అబ్బాస్ (అబ్బాస్ ద గ్రేట్ అన్న పేరొందాడు) మేనల్లుడైన సయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్‌కు ఇచ్చి పెళ్ళి చేశారు. మూడవ కుమార్తెను అబుల్ హసన్ కు ఇచ్చి పెళ్ళిచేశారు. మరణం అబ్దుల్లా చివరకు 1672లో మరణించాడు. అతనికి వారసునిగా గోల్కొండ సామ్రాజ్యాన్ని అతని మూడవ అల్లుడు అబుల్ హసన్ పట్టాభిషిక్తుడయ్యాడు. మూలాలు ఆధార గ్రంథాలు
క్షేత్రయ్య
https://te.wikipedia.org/wiki/క్షేత్రయ్య
thumb|right|200px|<center>225px|క్షేత్రయ్య<center> కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు మొవ్వా వరదయ్య గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్యగా మారింది. జీవిత విశేషాలు క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు "వరదయ్య". ఇంటిపేరు "మొవ్వ". క్షేత్రయ్య పదాలలోని "వరద" అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు 'వరదయ్య'గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ వూరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన "మోహనాంగి" అనే దేవదాసితో సన్నిహితుడైనాడు. తరువాత మేనమామ కూతురు "రుక్మిణి"ని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట.మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట.మరొక కథ: బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి 'గోపాల మంత్రం' ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది. దేశాటనం, సన్మానాలు, గుర్తింపు ఆంధ్ర దేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక, కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే అతనికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది. ముందుగా గుంటూరు జిల్లా బెల్లంకొండలో చలువు చక్కరపురీశుని దర్శించాడు (చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?) . అనంతరం భద్రాచలం లోని సీతారామచంద్రస్వామిని, పిదప శ్రీశైలం మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు - పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించాడు. పిదప దక్షిణాభిముఖంగా సాగి (దక్షిణ ఆర్కాటు జిల్లా) కోవిల్లూరు మువ్వగోపాల స్వామిని దర్శించాడు. తిరువళ్ళూరు వీర రాఘవస్వామి, వేద నారాయణపురం వేదపురీశుడు, సత్యవేడు సత్యపురవాసుదేవుడు, కరిగిరి స్వామి దేవుళ్ళ దర్శనం చేసుకొన్నాడు. మార్గంలో పండితుల, పాలకుల సత్కారాలందుకొన్నాడు. క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు, చెంజి కృష్ణప్ప నాయుడు (తుపాకుల రాయుడు) ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడు. చిదంబంరం గోవిందస్వామిని "తిల్ల గోవిందస్వామి" అని క్షేత్రయ్య ప్రస్తుతించాడు. చిదంబరం పాలకుడైన కృష్ణప్పనాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు వెళ్ళి రఘునాధనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడినుండే శ్రీరంగం, కంచి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలలోని దైవం గురించి కొన్ని క్షేత్రయ్య పదాలు మనకు లభిస్తున్నాయి. 1646లో తంజావూరు పతనమై గోల్కొండ నవాబు వశమైంది. గోల్కొండ సైన్యాధిపతి మీర్ జుమ్లా సాహిత్యాభిమాని. క్షేత్రయ్యను సగౌరవంగా గోల్కొండ నవాబు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వద్దకు తోడ్కొని వెళ్లాడు.ఆ నవాబు ఆస్థానంలో క్షేత్రయ్య పెక్కుకాలం ఉండి 1500 పదాలు వ్రాశాడు. తిరుగుప్రయాణంలో భద్రాచలం క్రొత్త తాసిల్దార్ కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించాడు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగివచ్చాడు. తాను వివిధ పాలకులవద్ద కూర్చిన పదాలగురించ ఈ క్షేత్రయ్య పదం ద్వారా మనకు తెలుస్తుంది. దేవగాంధారి రాగం - ఆది తాళం పల్లవి: వేడుకతో నడచుకొన్న - విటరాయడే అనుపల్లవి: ఏడుమూడు తరములుగా - ఇందు నెలకొన్న కాణాచట! కూడుకొని మువ్వ గోపాలుడే నా విభుడు ||వేడుక|| చరణాలు: మధుర తిరుమలేంద్రుడు - మంచి బహుమానమొసగి యెదుట కూర్చుండమని - ఎన్నికలిమ్మనెనే యిదిగో రెండువేల పదములు - ఇపుడెంచుకొమ్మనగా? చదురు మీదనే యున్న సామికి - సంతోషమింతింత గాదె? ||వేడుక|| అలుకమీరి తంజావూరి అచ్యుత విజయరాఘవుడు వెలయ మనుజుల వెంబడి - వేగమె పొడగాంచి చలువ చప్పరమున నుండగ - చక్కగ వేయి పదముల పలుకరించుకోగానే బహుమానమిచ్చేనావేళ ||వేడుక|| బలవంతుడయిన గోలకొండ - పాదుషా బహుమానమిచ్చి తులసిమూర్తితో వాదు తలచే నావేళ వెలయు మువ్వ గోపాలుడు - వెయ్యిన్నూరు పదములు నలువది దినములలో - నన్ను గలసి వినిపించెనే ||వేడుక|| క్షేత్రయ్య పద విశిష్టత మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే వాగ్గేయకారులు లేదా బయకారులు అన్నారు. భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధుర భక్తి. ఇలాంటి మధుర భక్తి ప్రబలంగా ఉన్న 17 వ శతాబ్దంలో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4, 500 కు పైగా పదాలు రచించాడు అని "వేడుకతో నడుచుకొన్న విటరాయుడే" అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1, 500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షాకు అంకితమిచ్చాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.క్షేత్రయ్య - డా. మంగళగిరి ప్రమీలాదేవి- క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు, జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు. డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి తన రచనలో క్షేత్రయ్య పదాలకు ఈ విశిష్టతలు ఉన్నాయని వివరించింది - భావ విస్తృతికి అనువైన రాగ ప్రస్తారం. క్షేత్రయ్య పదాలకు సంగతులు పాడే అలవాటున్నది. ఈతని పదాలు రాగ భావ పరిపూరితాలు. రాగాలను భావానుగుణంగా ప్రయోగించడం తెలిసిన సంగీతజ్ఞుడు క్షేత్రయ్య. ఈయన తన పదాలలో సుమారు 40 రాగాలను ఉపయోగించాడు. త్రిపుట తాళంలో ఎక్కువ పదాలు పాడాడు. క్షేత్రయ్య పదాలు ఎక్కువగా అభినయం కోసం ఉద్దేశింపబడినవి. వీనిలో నృత్తానికి అవకాశం తక్కువ.దృశ్య యోగ్యాలైన శబ్దాలను ఎన్నింటినో చక్కగా వాడాడు.మూర్తి వర్ణన కూడా చాలా చక్కగా చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే క్షేత్రయ్య పదం దృశ్య శ్రవణ సమసంబంధి! కళాహృదయ చైతన్య గ్రంథి! సంగీత సాహిత్య అభినయాలకు సముచిత ప్రాధాన్యత ఉన్న పదకవితలను రచించి క్షేత్రయ్య తరువాతివారికెందరికో మార్గదర్శకుడైనాడు. క్షేత్రయ్య పదాల లక్షణాల గురించి డా. దివాకర్ల వేంకటావధాని ఇలా వ్రాశాడుక్షేత్రయ్య పదములు - స్వరసాహిత్యము - డా. మంచాల జగన్నాధరావు తెలుగులో గేయములను ఆరు విధాలుగా విభజింపవచ్చును - కృతులు, కీర్తనలు, తత్వములు, పదములు, జావళీలు, పాటలు. వీటిలో పదములు, జావళీలు అభినయానుకూలములు. అందునా పదములు రాగతాళవిలంబముతో కూడియుండును. క్షేత్రయ్య వట్టి పదకర్తయే కాదు. అలంకారశాస్త్రములో ప్రావీణ్యత సంపాదించి క్రొత్త పుంతలు త్రొక్కినాడు. పదములలో గొప్ప సంగీత కళాపాటవమును ప్రవేశపెట్టినవారిలో అగ్రగణ్యుడు క్షేత్రయ్య... అదివరకెవ్వరు రాగమునకిట్టి అందచందములు కూర్చలేదు. తరువాతి వాగ్గేయకారులకును, సంగీతకారులకును క్షేత్రయ్య మార్గదర్శియైనాడు. కాలప్రభావముననుసరించి అతడు తన పదములలో శృంగారమునకే అధిక ప్రాధాన్యతనిచ్చాడు. మనమెట్టి నాయికానాయకుల గురించి తెలుసుకోవాలన్నా గాని క్షేత్రయ్య పదాలలో చక్కని ఉదాహరణం లభిస్తుంది. భావ ప్రకటనమున క్షేత్రయ్య మిక్కిలి ప్రౌఢుడు. అతని పదములన్నియును వినివారి హృదయములకత్తుకొనే భావములకు ఉనికిపట్టు. ఆనాటి పలుకుబడులెన్నో అతని పదాలలో గోచరిస్తాయి. అతడు మారు మూల పదములు, జాతీయములు ఎక్కువగా వాడాడు. శబ్దరత్నాకరంలో అతని పదాలను విరివిగా ఉదహరించారు. క్షేత్రయ్య పదములు అభినయానుకూల్యమైనవి. పూర్తి క్షేత్రయ్య పదాలు క్షేత్రయ్య పదాలు వికీసోర్స్ లో ఉదాహరణలు ఆనంద భైరవి రాగం - ఆదితాళం పల్లవి: శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే కోపాలా? మువ్వ గోపాలా? అనుపల్లవి: ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స ల్లాపాలా? మువ్వ గోపాలా? చరణాలు: పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత తీపేలా? మువ్వ గోపాలా? చూపుల నన్యుల దేరి-చూడని నాతో క లాపాలా? మువ్వ గోపాలా? నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే నా పాలా? మువ్వ గోపాలా? ఇంతసేపు మోహమేమిరా ? ఇందరికంటే - నింతి చక్కనిదేమిరా ? సుంతసేపు దాని - జూడకుండలేవు అంతరంగము దెలుప - వదియేల మువ్వగోపాలా ! ||ఇంత|| నీకెదురుగ వచ్చునా ? నెనరూరగా - నిండు కౌగిట జేర్చునా ? ఆకుమడుపు లిచ్చునా ? తన చెలిమి కైన వాడని మెచ్చునా ? తమి హెచ్చునా ? ఏకచిత్తమున మీరిద్దరు - నింపు సొంపుగ నున్న ముచ్చట నాకు వినవిన వేడుకయ్యిరా ! యిపుడానతీరా ! ||ఇంత|| మోవి పానకమిచ్చునా ? కొసరి కొసరి - ముద్దులాడనిచ్చునా ? తావి పువ్వుల దెచ్చునా ? తన సొగసుకు తగినవాడని మెచ్చునా ? మనసిచ్చునా ? దేవరే మొగడు గావలెనని - భావజుని పూజ లొనరించిన యా వనిత పేరేమి సెలవీరా ? సిగ్గేలరా ? ||ఇంత|| సంతోషముగ నాడునా ? తంబుర మీట - సంచు పాట పాడునా ? వింత రతుల గూడునా ? ఆ సమయమున విడవకుమని వేడునా ? కొనియాడునా ? సంతతము న న్నేలుకొని యా - కాంతపై వలచినపుడె యిక కొంత యున్నదో మువ్వగోపాల ? గోరడ మేలా ? ||ఇంత|| ఇవి కూడా చూడండి మహాకవి క్షేత్రయ్య సినిమా. మూలాలు బయటి లింకులు తెలుగు శోధనలో విస్సా అప్పారావు రచన - క్షేత్రయ్య పదములు. మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్యాన్ని గురించిన పరిశోధన. క్షేత్రయ్య పదములు- సాహిత్యము మంచాల జగన్నాధరావు క్షేత్రయ్య, దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003. క్షేత్రయ్య - (తెలుగు వైతాళికులు సిరీస్ ప్రచురణ) - రచన: డా. మంగళగిరి ప్రమీలాదేవి - ప్రచురణ: తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (1996) వర్గం:సంగీతకారులు వర్గం:వాగ్గేయ కారులు వర్గం:తెలుగు కవులు వర్గం:కృష్ణా జిల్లా కవులు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:ఈ వారం వ్యాసాలు
గండికోట
https://te.wikipedia.org/wiki/గండికోట
గండికోట వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కి. మీ. దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. ఈ గ్రామంలో గల చారిత్రక కోట శిథిలాలు ప్రముఖ పర్యాటక ఆకర్షణ. చరిత్ర thumb|280x280px|గండికోట వద్ద పెన్నానది|alt= thumb|గండికోట|alt=|280x280px గండికోట ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దం రెండవ అర్థభాగంలో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణి చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వరచే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజుసా. శ. 1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (సా.శ. 1123 జనవరి 9) నాడు చిన్న మట్టికోటను కట్టించెను అని పేర్కొనబడింది. ఐతే ఇది నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు. త్రిపురాంతకము వద్ద గల సా.శ.1212 (సా.శ. 1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు (సా.శ. 1314) చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తోంది. గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలం (ప్రాంతము) లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మసాని కమ్మ నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు పాలించారు. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనపుడు, పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా పెమ్మసాని కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు. కమ్మ నాయకులు గండికోటను మూడు వందలయేళ్ళకు పైగా పరిపాలించారు. వీరి పాలనలో గ్రామాలని మూడు విధాలుగా విభజించారు. బండారువాడ, అమర, మాన్య విభాగాలుగా విభజించారు. ఇందులో బండారువాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి. మాన్య గ్రామాలు దేవాలయాల, బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. అమర గ్రామాలు అమరులైన కోట అధ్యక్షుల ఆధీనంలో ఉండేవి. అందమైన లోయలు, ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలే ఇక్కడ కన్పిస్తాయి. ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం. ఎందరో రాజులు, రాజవంశాల పరాక్రమానికి, నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం. ఈ కోటను సందర్శిస్తే ఆనాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, నాటి రాజుల పరిపాలన గుర్తుకు వస్తుంది. దీని పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలున్నాయి. పడమర, ఉత్తర దిక్కుల్లో పెన్నానది ప్రవహిస్తోంది. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నానది కన్పిస్తుండడం విశేషం. ఇక్కడున్న జుమ్మామసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. మసీదు ప్రాకారం చుట్టూ లోపల 64 గదులు, బయట 32 గదులుండి ఎంతో ఆకర్షిస్తాయి. ఎలాంటి నేరాలకైనా కృరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేసేవారు. పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేసేవారు. తాళ్ళపాక అన్నమయ్య ఆహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరాడు. అ యాత్రలో అప్పుడు వున్న గండికోట చెన్నకేశవాలయం దర్శించి చెన్నకేశుడిని "చీరలియ్యగదవోయి చెన్నకేశవా! చూడు చేరడేసి కన్నుల వో చెన్నకేశవా" అని స్తుతించాడు. పర్యాటక ఆకర్షణలు గండికోట శిథిలాలు thumb|గండికోట ప్రాకారంలోని కొంత భాగం|280x280px thumb|గండికోటలోని మాధవరాయ ఆలయం. ప్రస్తుతం ఇది శిథిలమైపోయింది|280x280px thumb|'రంగనాథాలయం|280x280px వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిథిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి. రంగనాథాలయం: ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (సా.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని సా.శ.పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు. మాధవరాయ ఆలయం: ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన సా.శ.పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని సా.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు. జనగణన 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 278 ఇళ్లతో, 1118 జనాభాతో 4278 హెక్టార్లలో విస్తరించి ఉంది. విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాలలు గూడెంచెరువులో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, పాలీటెక్నిక్‌, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జమ్మలమడుగు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, కడప లోనూ ఉన్నాయి. మేనేజిమెంటు కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ప్రొద్దుటూరు లోనూ ఉన్నాయి. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. సమాచార, రవాణా సౌకర్యాలు జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. భూమి వినియోగం గండికోటలో భూ వినియోగం కింది విధంగా ఉంది: అడవి: 1460 హెక్టార్లు వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1261 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1340 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 6 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 69 హెక్టార్లు బంజరు భూమి: 6 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 133 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 197 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 12 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు గండికోటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 12 హెక్టార్లు ప్రధాన ఉత్పత్తులు కంది, సీతాఫలం, పసుపు, ( (నిమ్మ తోటలు) ) చిత్ర మాలిక ఇవి కూడా చూడండి గండికోట యుద్ధం పెమ్మసాని నాయకులు అగస్తేశ్వర కోనా మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ చారిత్రక స్థలాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ కోటలు వర్గం:రాయలసీమ కోటలు వర్గం:వైఎస్‌ఆర్ జిల్లా వర్గం:వైఎస్‌ఆర్ జిల్లా కోటలు
రాయలసీమ
https://te.wikipedia.org/wiki/రాయలసీమ
రాయలసీమ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యప్రాంతాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే 8 జిల్లాలు (కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్, అనంతపురం, శ్రీ సత్య సాయి, తిరుపతి, చిత్తూరు) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి. చరిత్ర రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. ఇంకా కాకతీయ, ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారు. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగింది. బ్రిటిషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన హైదరాబాదుకి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి దత్త మండలం అని పేరు వచ్చింది. 1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారి, కడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురంను బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణరావు "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటినుండి ఆ పేరే స్థిరపడినది. ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. బళ్ళారి కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. కోస్తా, రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని కర్ణాటకలో కలిపి వేశారు. కన్నడ, తెలుగు మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత మైసూరులో చేర్చారు. 1956 లో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణలో కలపటంతో అప్పటి నుండి ఇవి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉంటున్నాయి. తెలంగాణా విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం నవ్యాంధ్రప్రదేశ్ లో భాగమైంది. తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం. కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో రాజధాని హైదరాబాదుకు మారింది. వ్యుత్పత్తి పలు యుద్ధాలలో బ్రిటీషు వారు నిజాం పాలకులకి సహకరించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దత్త మండలాలు లేదా దత్త సీమ పదాలు వ్యావహారికంలోకి వచ్చాయి. 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఇక్కడి మేధావులు ఈ పేర్లు అవమాన కారకాలుగా అనుభూతి చెందారు. 1928 నవంబరు 17-18 తారీఖులలో నంద్యాల పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో చిలుకూరి నారాయణ రావు విజయనగర సామ్రాజ్యమునకు చెందిన రాయల వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కావున, వారి సుపరిపాలనలోనే ఇక్కడి సంస్కృతి, వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కావున, దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. (ఇది వరకు ఈ పేరు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ప్రతిపాదించారు అనే ఆలోచన వ్యాప్తిలో ఉండేది. కానీ పరిశోధనల్లో ఈ ఘనత చిలుకూరి వారిదే అని తేలినది.) రాయలసీమ అన్న పేరు అన్ని వర్గాల మేధావులని/సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించటంతో ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిపోయింది. కోస్తా ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి, మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చటానికే 1937 నవంబరు 16 లో శ్రీబాగ్ ఒడంబడిక రూపొందించబడింది. రాయలసీమ సంస్కృతి తత్వము తత్వము సంస్కృతిలో ఒక భాగం. రాయలసీమలో ఎందరో తత్వవేత్తలు జన్మించారు. వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి హజరత్ షాహమీర్ కడప. జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లె. ముంతాజ్ అలీ - సత్సంగ్, మదనపల్లె. సాహిత్యం విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి, శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. అష్టదిగ్గజాలలో ఐదు మంది (అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే. కడప జిల్లాకి చెందిన యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది. బళ్ళారి రాఘవ, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి రంగస్థల ప్రముఖులను అందించిన బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర గలదు. బళ్ళారి లోని రాఘవ కళా మందిర్ బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే. తత్త్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరుకి చెందినవారు. చిత్తూరు జిల్లా, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు. భాష రాయలసీమలో శుద్ధమైన తెలుగు భాష మాట్లాడే సంస్క్రతి ఉంది. రాజభాష తెలుగైనా రెండవ అధికార భాషగా ఉర్దూ భాష ఉంది. చిత్తూరు జిల్లాలోని పడమట, దక్షిణ ప్రాంతాలలో తమిళ భాష మాట్లాడేవారు ఎక్కువ. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాలలో తమిళ ప్రభావం ఎక్కువ. కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. మూడు రాష్ట్రాలు, ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. సంగీతం బ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల (అర్ధవీడు)కి చెందినవాడు. ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లా ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు. వాగ్గేయకారుడైన అన్నమయ్య కడప జిల్లాకి చెందిన తాళ్ళపాకకి చెందినవాడు. తరిగొండ నరసింహ స్వామి పై, వెంకటేశ్వర స్వామి పై అనేక గీతాలని రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినది. సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినవాడు. సంగీతకారుడు, వైద్యుడు అయిన శ్రీపాద పినాకపాణి జన్మతః శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైననూ, కర్నూలులో స్థిర పడ్డారు. కళలు కలంకారీ చిత్రలేఖనం చలన చిత్ర రంగం కె.వి.రెడ్డి: దర్శకులు. తాడిపత్రికి చెందినవారు. నీలకంఠ: షో, మిస్సమ్మ (2003) ల దర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: మల్లీశ్వరి (1951) చిత్రదర్శకుడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లికి చెందిన వారు బి.నాగిరెడ్డి: నిర్మాత. కడప జిల్లా శాంతకుమారి: అలనాటి నటి. కడప జిల్లా, ప్రొద్దుటూరు బి. పద్మనాభం: హాస్యనటుడు. కడప జిల్లా, పులివెందుల తాలూకా, సింహాద్రిపురం జయప్రకాశ్ రెడ్డి: సీమ భాషని నిఖార్సుగా పలికే హాస్యనటుడు, ప్రతినాయకుడు రమాప్రభ: కదిరిలో పుట్టిన మదనపల్లెకు చెందిన పేరుపొందిన సహాయనటి పుణ్యక్షేత్రాలు తిరుమల వెంకటేశ్వరాలయం శ్రీశైలం శివాలయం అహోబిళం నరసింహాలయం శ్రీ కాళహస్తి శివాలయం మహానంది శివాలయం యాగంటి శివాలయం మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయం కడప పెద్ద దర్గా పుట్టపర్తి సత్య సాయి బాబా ఆలయం కాణిపాకం విఘ్నేశ్వరాలయం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కసాపురం ఆంజనేయస్వామి ఆలయం లేపాక్షి నందీశ్వరాలయం ప్రొద్దుటూరు వాసవీమాత ఆలయం ఒంటిమిట్ట పుష్పగిరి తాళ్ళపాక తాడిపత్రి గండి క్షేత్రం చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం కొండసుంకేసుల కోన చంద్రాయుడు స్వామి దేవస్థానం పర్యాటక ప్రదేశాలు thumb|220x220px|కదిరిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమ్మ మర్రిమాను పెనుగొండ కోట షాహీ జామియా మసీదు, ఆదోని బెలూం గుహలు, కొలిమిగుండ్ల, కర్నూలు జిల్లా చంద్రగిరి కోట, హార్సిలీహిల్స్, తలకోన, చిత్తూరు జిల్లా గండి కోట కోన చంద్రాయుడు స్వామి, కొండసుంకేసుల, వై.ఎస్.ఆర్. జిల్లా ఆధ్యాత్మిక గురువులు ఆర్థిక పరిస్థితి తక్కిన రాష్ట్రం వలెనే రాయలసీమ కూడా వ్యవసాయాధారితమైనది. రాయలసీమలో వర్షపాతం రాష్ట్ర సగటు వర్షపాతం కంటే తక్కువ. అనంతపురం జిల్లా దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం గల జిల్లాల్లో రాజస్థాను లోని జైసల్మీరు తరువాత రెండో స్థానంలో ఉంది. వ్యవసాయాధార ఆర్థికపరిస్థితి గల ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది అతిపెద్ద అవరోధం. రాయలసీమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రచించాయి. బ్రిటిషు వారు నిర్మించిన కర్నూలు కడప కాలువ తోపాటు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులు వీటిలో కొన్ని. అయితే పథకాలు ఎన్నున్నా వాటి అమలు విషయంలో జరుగుతున్న జాప్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పథకాల అంచనాల మేరకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. భౌగోళిక స్వరూపం రాయలసీమ ప్రాంతం భౌగోళికస్వరూపం ప్రకారం హంపి నగరం దగ్గర మొదలుకొని తూర్పు కనుముల వరకు విస్తరించివుంది. రాయలసీమకు తూర్పున కోస్తాఆంధ్ర తీరప్రాంతం, పడమరన కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన తెలంగాణ రాష్ట్రం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రలు ఉన్నాయి. స్వతంత్రానంతరం గుంటూరు జిల్లానుండి కొంత భాగాన్ని, కర్నూలు జిల్లా నుండి కొంత భాగాన్ని వేరు చేసి ప్రకాశం జిల్లాను ఏర్పరచారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం కోస్తా ప్రాంతంలోనే చూపించబడుతున్నది. జిల్లాల పునర్విభజన తరువాత ఆంధ్రరాష్ట్రం 13జిల్లాలు కాస్త 26జిల్లాలుగా రూపుదిద్దుకుంది. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో నాలుగు జిల్లాలు కాస్త ఎనిమిది జిల్లాలు అయ్యాయి. పరిశ్రమలు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (తిరుపతి) ఎస్.టి.పి.ఐ పాడి పరిశ్రమ గ్రానైటు పట్టు పరిశ్రమ సిమెంటు పరిశ్రమ కోళ్ళ పరిశ్రమ వాహన పరిశ్రమ చరవాణి తయారీ పరిశ్రమ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ రైలు భొగీ రిపేరు పరిశ్రమ నదులు పెన్నా నది:పెన్నా (సంస్కృతంలో పెన్నార్, పెన్నేరు లేదా పెన్నేరు, పినాకిని) దక్షిణ భారతదేశంలోని ఒక నది. పెన్నా కర్నాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో నంది కొండల కొండపై పుడుతుంది, బంగాళాఖాతంలో ఖాళీ చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుండా ఉత్తరం, తూర్పున ప్రవహిస్తుంది. ఇది 597 కిలోమీటర్స్ (371 mi) పొడవు, 55,213 స్క్వేర్ కిలోమీటర్స్ (21,318 sq mi) పెద్ద డ్రైనేజీ బేసిన్.[2] ఈ నదీ పరీవాహక ప్రాంతం దాదాపు 55,213 కిమీ2 వైశాల్యంలో ఉంది. పెన్నా అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వరుసగా 6,937 కిమీ2, 48,276 కిమీ 2 నదీ పరీవాహక ప్రాంతంతో అంతర్రాష్ట్ర నది. నదీ పరీవాహక ప్రాంతం ఏటా 500 మి.మీ సగటు వర్షపాతం పొందుతుంది. నదీ పరీవాహక ప్రాంతం తూర్పు కనుమలలో వర్షపు నీడ ప్రాంతంలో ఉంది. తుంగభద్ర నది:తుంగభద్ర నది దక్షిణ భారతదేశంలోని ఒక నది, ఇది కర్ణాటక రాష్ట్రం గుండా ప్రారంభమై ప్రవహిస్తుంది, ముందు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ప్రవహిస్తుంది, చివరికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో కృష్ణా నదిలో కలుస్తుంది. రామాయణంలో తుంగభద్ర నదిని పంపా అనే పేరుతో పిలిచేవారు. కట్టవలసిన ప్రాజెక్ట్ గుండ్రేవుల రీజర్వాయర్. కృష్ణా నది:కృష్ణా నది మధ్య-దక్షిణ భారతదేశంలో గంగ, గోదావరి తర్వాత మూడవ పొడవైన నది. నది దాదాపు 1,300 కిలోమీటర్లు (810 మైళ్ళు) పొడవు ఉంది. ఈ నదిని కృష్ణవేణి అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నీటిపారుదలకి ప్రధాన వనరు. కట్టవలసిన ప్రాజెక్ట్ సిద్దేశ్వరం అలుగు. కుందూ నది:కుందూ నది భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో పెన్నా నదికి ఉపనది. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో నీటి బుగ్గగా ఆవిర్భవించి కడప జిల్లా ఆదినిమ్మాయ పల్లి గ్రామం వద్ద పెన్నాలో కలిపే ముందు అనేక మార్పులకు గురైంది. ఇది నంద్యాల, కోయిల్‌కుంట్ల ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగించే తరచుగా వరదలకు ప్రసిద్ధి చెందింది, అందుకే దీనిని "నంద్యాల దుఃఖ దాయని" అని పిలుస్తారు. కానీ ఈ రోజుల్లో నంద్యాల పట్టణం భారీ జనాభాతో పెద్ద పట్టణంగా మారింది, తద్వారా డ్రైనేజీ వ్యవస్థను కుందూ నదికి అనుసంధానించబడి డ్రెయిన్లను ఫిల్టర్ చేయకుండా ఉంది. పారిశ్రామికవేత్తలు తమ దృష్టిని మరింత ఎక్కువ లాభాలపై కేంద్రీకరించారు, వారు నదిని వీలైనంత ఎక్కువగా కలుషితం చేశారు. నంద్యాల నుండి నది దిగువన నివసిస్తున్న గ్రామస్థులు వివిధ చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. కాలుష్యం జంతువుల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రాచీన కాలంలో ఈ నదిని కుముద్వతి అని పిలిచేవారు. రాయలసీమలో కుందూ నీరు తాగితే శత్రువులను ఎదుర్కొనే అపారమైన ధైర్యం వస్తుందని ఒక సామెత. కుందూ లోయను రేనాడు అని పిలుస్తారు, ఇది "రేనాటి పౌరుషం" అనే పదానికి ప్రతీక. చిత్రావతి నది:చిత్రావతి దక్షిణ భారతదేశంలోని అంతర్రాష్ట్ర నది, ఇది పెన్నార్ నదికి ఉపనది. కర్నాటకలో పెరుగుతూ, ఇది ఆంధ్ర ప్రదేశ్‌లోకి ప్రవహిస్తుంది, దాని బేసిన్ 5,900 కిమీ2 కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. పుణ్యక్షేత్రమైన పుట్టపర్తి దాని ఒడ్డున ఉంది. కంటెంట్‌లు 1 కోర్సు 2 పరగోడు ప్రాజెక్ట్ 3 పర్యావరణ సమస్యలు 4 మతపరమైన ప్రాముఖ్యత 5 సూచనలు కోర్సు చిత్రావతి నది చిక్కబళ్లాపూర్ వద్ద ఉద్భవించి, ఆంధ్ర ప్రదేశ్‌లోకి ప్రవేశించే ముందు కర్ణాటకలోని కోలార్ జిల్లా గుండా ప్రవహిస్తుంది, ఇక్కడ పెన్నార్‌లో కలిపే ముందు అనంతపురం, కడప జిల్లాలను ప్రవహిస్తుంది. చిత్రావతి నదీ పరీవాహక ప్రాంతం 5,908 కిమీ2 విస్తీర్ణంలో ఉంది.రెండు రాష్ట్రాలలో ఇది ప్రవహించే మండలాలలో బాగేపల్లి, హిందూపూర్, పెనుకొండ, బుక్కపట్నం, ధర్మవరం, తాడిపత్రి, కదిరి. ఈ నది జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గండికోట నీటిపారుదల ప్రాజెక్టు కడప జిల్లాలోని గండికోట వద్ద పెన్నార్‌లో కలుస్తుంది. చిత్రావతి అనేది రుతుపవనాల తర్వాత సజీవంగా వచ్చే కాలానుగుణ నది. పాపాగ్నితో పాటు, ఇది మధ్య పెన్నార్ సబ్ బేసిన్‌లో భాగంగా ఏర్పడుతుంది, పెన్నార్ యొక్క కుడి ఒడ్డు ఉపనది. వేదవతి:వేదవతి నది భారతదేశంలోని ఒక నది. ఇది పశ్చిమ కనుమల నుండి ఉద్భవించి కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేదవతిని హగరి అని కూడా పిలుస్తారు. రెండు నదులు, వేద, అవతి, సహ్యాద్రి కొండ శ్రేణి యొక్క తూర్పు భాగంలో పుడుతుంది, తూర్పున ప్రవహిస్తుంది, వేదవతిని ఏర్పరచడానికి పురా సమీపంలో కచేరీని కలుపుతుంది. వేదవతి ఒడ్డున, హోసదుర్గ తాలూకాలోని కెల్లోడులో శ్రీ ఆంజనేయుడికి అంకితమైన ప్రసిద్ధ ఆలయం ఉంది. వేదవతి నదిపై నిర్మించిన వాణి విలాస సాగర జలాశయం ఒక శతాబ్దం నాటిది. హిరియూరు తాలూకాలోని కూడలహళ్లి వద్ద సువర్ణముఖి అనే ఉపనది వేదవతితో సంగమిస్తుంది. దీనిని స్థానికులు 'పుణ్య భూమి' లేదా 'పవిత్ర భూమి'గా భావిస్తారు. వేదవతి నది హిరియూరు నుండి నారాయణపుర, పరశురామపుర, బృందావనహళ్లి వైపు ప్రవహిస్తుంది, ఇక్కడ నది వృత్తాకారంగా ప్రవహిస్తుంది, అందుకే ఈ గ్రామాన్ని బృందావన హళ్లి అని పిలుస్తారు, ఆపై జాజూర్ (మూడల జాజుర్) నాగగొండనహళ్లి, జానమద్ది వరకు ఆపై ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది, అనగా భైరవానితిప్ప ఆనకట్ట. నాగగొండనహళ్లి ఒడ్డున చిలుమేస్వామి అనే ప్రసిద్ధ మఠం ఉంది, అతను అవధూతుడు, ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తారు, లక్షల మంది సందర్శిస్తారు. కట్టవలసిన ప్రాజెక్ట్ 8టీఎంసీ. పాపఘ్ని: పెన్నా నదికి ఉపనది. పాపఘ్ని నది కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని సిడ్లఘట్ట గ్రామం వద్ద పుట్టి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. పాలకొండ శ్రేణుల గుండా ప్రవహించి, వైఎస్ఆర్ జిల్లా మైదానపు ప్రాంతంలోకి పారుతుంది. పాపఘ్ని వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. పాపఘ్ని ఉపనదుల్లో మొగమేరు చెప్పుకోదగినది. మొత్తం 205 కిలోమీటర్ల పొడవున్న పాపఘ్ని నది యొక్క మొత్తం పారుదల ప్రాంతం 7,423 చ.కి.మీలు. ఇది మొత్తం పెన్నా నది పారుదల ప్రాంతంలో 14.14%. పాపఘ్ని నది యొక్క పారుదల ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నా, ప్రధాన భాగం చిత్తూరు జిల్లాలోని పశ్చిమభాగంలోని కొండప్రాంతంలో ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో ప్రవహించే పాపఘ్ని పై గాలివీడు మండలం, వెలిగల్లు గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పంటలు వేరుశనగ: భారతదేశంలోనే పేరుపొందిన కదిరి-9, కదిరి-7,కదిరి-5 రకం వేరుశనగ శ్రీ సత్య సాయి జిల్లా కదిరి వ్యయసాయ పరిశోధనకేంద్రంలో తయారు చేస్తున్నారు. మామిడి చెరకు బొప్పాయి నిమ్మ దానిమ్మ చీనీ పండు జామ రాగులు జొన్నలు కొర్రలు కూరగాయలు విద్యా సంస్థలు జవహర్ నవోదయ విద్యాలయాలు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. రిషి వ్యాలీ పాఠశాల. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి. ఇండియన్ కలినరీ ఇన్ట్సిట్యూట్, తిరుపతి. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ సైన్సు ఏడుకేషన్ అండ్ రిసెర్చ్, తిరుపతి. జి. పుల్లా రెడ్డి (జిపిఆర్) ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలు కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు పుష్పగిరి విద్యా సంస్థలు, కడప, 1887. కేశవ రెడ్డి విద్యాసంస్థలు, కర్నూలు శాంతి రాముడు వైద్య కళాశాల, నంద్యాల కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్ (KSRM) ఇంజినీరింగ్ కళాశాల, పులివెందుల రోడ్, కడప యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప (పూర్వం SVU PG Center) శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం, పుట్తపర్తి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం,JNTUA, అనంతపురం శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల,తిరుపతి. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి. ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం. రాజీవ్ గాంధీ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సు,కడప. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల, తిరుపతి. శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల,తిరుపతి. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇడుపులపాయ. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కర్నూలు. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీసిటీ. దామోదరం సంజీవయ్య లా విశ్వవిద్యాలయం, కడప కేంద్రం. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి. శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప సంస్థ కళాశాల, తిరుపతి. రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు. జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA) ఇంజనీరింగ్ కళాశాల, పులివెందుల. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి. శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి. వేద పాఠశాల,ధర్మగిరి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుమల. శ్రీ విద్యానికేతన్ ఏడుకేషనల్ ట్రస్టు, తిరుపతి. సైనిక పాఠశాల, కలికిరి. ఆంధ్ర ప్రదేశ్ రెసిడెంషియల్ విద్యా సంస్థల సొసైటీ, పాఠశాల నుండి డిగ్రీ కళాశాల వరకు, అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా. వన సంపద ఎన్నో అరుదైన వృక్షాలు, పక్షులు, ఔషదులు, జంతువులు ఇక్కడి అడవుల్లో ఉన్నాయి. కలివికోడి ఎర్ర చందనం బంగారు బల్లి దేవాంగ పిల్లి ఆల్వా (sunda pangolin) పశు సంపద పుంగనూరు జాతి చిత్రాలు ఇవి కూడా చూడండి రాయలసీమ సంస్కృతి రాయలసీమ జలసాధన సమితి రాయలసీమ విద్యావంతుల వేదిక రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అన్నమయ్య కర్నూలు నంద్యాల కడప అనంతపురం చిత్తూరు తిరుపతి శ్రీ సత్యసాయి మూలాలు ఆధార గ్రంథాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు వర్గం:రాయలసీమ
కర్ణాటక
https://te.wikipedia.org/wiki/కర్ణాటక
కర్ణాటక (కన్నడ: ಕರ್ನಾಟಕ) భారతదేశంలోని నైరుతి ప్రాంతంలో ఉన్న రాష్ట్రం. విస్తీర్ణ ప్రకారం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద, భారతదేశంలో ఆరవ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదంతో ఇది 1956 నవంబరు 1న ఏర్పడింది. నిజానికి మైసూర్ రాష్ట్రంగా తొలిగా పిలిచినా,1973లో కర్ణాటకగా పేరు మార్చారు. దీని రాజధాని, అతిపెద్ద నగరం బెంగళూరు. కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యాన గోవా, ఉత్తరాన మహారాష్ట్ర, ఈశాన్యాన తెలంగాణ, తూర్పున ఆంధ్రప్రదేశ్, ఆగ్నేయాన తమిళనాడు, దక్షిణాన కేరళ సరిహద్దులుగా ఉన్నాయి. మిగతా 4 దక్షిణ భారత సోదరి రాష్ట్రాలతో భూ సరిహద్దులు ఉన్న ఏకైక దక్షిణాది రాష్ట్రం ఇది. రాష్ట్రం . ఇది భారతదేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో 5.83 శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 61,130,704 మంది నివాసితులతో, జనాభా ప్రకారం ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన కన్నడ, రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడే అధికారిక భాష. అల్పసంఖ్యాకులు మాట్లాడే ఇతర భాషలలో ఉర్దూ, కొంకణి, మరాఠీ, తులు, తమిళం, తెలుగు, మలయాళం, కొడవ, బేరీ ఉన్నాయి . కర్ణాటకలో భారతదేశంలో సంస్కృతం ప్రధానంగా మాట్లాడే కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. కర్ణాటక అనే పేరు కన్నడ పదాలైన కరు, నాడు నుండి ఉద్భవించింది. కరు అంటే "ఎత్తైన" అనే అర్ధంతో "ఎత్తైన భూమి" అని , "నలుపు" అనే అర్ధంతో "నల్లనిప్రాంతం" (బయలు సీమ ప్రాంతంలో కనిపించే ప్రత్తి పంటకు అనువైన నల్లమట్టి ) అనే అర్ధాలను సూచిస్తుంది. కృష్ణానదికి దక్షిణంగా భారతదేశం రెండు వైపులా వున్న ప్రాంతానికి బ్రిటిష్ పాలకులు కొన్నిసార్లు కర్ణాటక్ అనే పదాన్ని ఉపయోగించారు.See Lord Macaulay's life of Clive and James Talboys Wheeler: Early History of British India, London (1878) p.98. పురాతన పాతరాతియుగం కాలంనాటి చరిత్రతో కర్నాటక ప్రాంతాన్ని అత్యంత శక్తివంతమైన పురాతన, మధ్యయుగ భారతదేశం సామ్రాజ్యాల రాజులు పరిపాలించారు. ఈ సామ్రాజ్యాలు పోషించిన తత్వవేత్తలు, సంగీతకారులు సామాజిక-మత, సాహిత్య ఉద్యమాలను ప్రారంభించారు. ఇవి నేటి వరకు కొనసాగుతున్నాయి. కర్ణాటక, హిందూస్థానీ సంప్రదాయాల భారతీయ శాస్త్రీయ సంగీతానికి కర్ణాటక గణనీయంగా దోహదపడింది. స్థూల రాష్ట్ర ఉత్పత్తి ₹16.99 ట్రిలియన్ తో, తలసరి రాష్ట్ర ఉత్పత్తి ₹ 231,000 తో కర్ణాటక భారతదేశంలో నాల్గవ అతిపెద్ద రాష్ట్రం. మానవ అభివృద్ధి సూచికలో భారత రాష్ట్రాలలో పంతొమ్మిదవ స్థానంలో ఉంది.రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు మైసూరు, మంగుళూరు, హుబ్లీ, ధార్వాడ్, బళ్ళారి , బెల్గాం భౌగోళికం కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యాన గోవా రాష్ట్రం, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, తూర్పున , ఆగ్నేయాన తమిళనాడు , నైరుతిన కేరళ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా రాష్ట్రం మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడింది. సన్నని తీర ప్రాంతం, - పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్యన ఉన్న ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతము. ఇక్కడ ఓ మోస్తరు నుండి భారి వర్షాలు కురుస్తాయి. పడమటి కనుమలు - ఈ పర్వత శ్రేణులు సగటున 900 మీటర్ల ఎత్తుకు చేరతాయి. వర్షపాతం ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం. దక్కన్ పీఠభూమి - కర్ణాటకలోని చాలా మటుకు భూభాగము ఈ ప్రాంతంలోనే ఉంది. ప్రాంతం పొడిగా వర్షాభావంతో సెం-అరిద్ స్థాయిలో ఉంది. కర్ణాటక పేరు ఎలా వచ్చినది అనేదానికి చాలా వాదనలున్నాయి. అయితే అన్నిటికంటే తర్కబద్ధమైన వాదన ఏమిటంటే కర్ణాటక పేరు కరు+నాడు = ఎత్తైన భూమి నుండి వచ్చిందని. గమనించవలసిన విషయమేమంటే కర్ణాటక రాష్ట్ర సగటు ఎత్తు 1500 అడుగులు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువే. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత 45.6 సెంటీగ్రేడు రాయచూరు వద్ద 1928 మే 23న నమోదైనది. అత్యల్ప ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెంటీగ్రేడు బీదర్లో 1918 డిసెంబరు 16 న నమోదైనది. భాష కర్ణాటక, భాష ఆధారితంగా ఏర్పడిన రాష్ట్రం. అందుకే రాష్ట్రం ఉనికిలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు అధికార భాష కన్నడను మాట్లాడతారు. తెలుగు, తమిళం, కొడవ, తులు, ఇతర భాషలు. ఆర్ధిక రంగం కర్ణాటక భారతదేశంలోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటి. దీని రాజధాని బెంగళూరు దేశంలో సమాచార సాంకేతిక సేవలకు ప్రధాన కేంద్రం. భారతదేశంలోని 90% బంగారం ఉత్పాదన కర్ణాటకలోనే జరుగుతుంది. ఇటీవల మాంగనీసు ముడిఖనిజం వెలికితీత పనులు బళ్ళారి, హోస్పేట జిల్లాలలో ముమ్మరంగా సాగుతున్నాయి. చరిత్ర thumb|343x343px|బేలూరులో హొయసల శిల్పకళ. కర్ణాటక చరిత్ర పురాణ కాలంనాటిది. రామాయణములో వాలి, సుగ్రీవుడు , 'వానర సేన యొక్క రాజధాని ప్రస్తుత బళ్లారి జిల్లాలోని హంపి అని భావిస్తారు. మహాభారతములో పాండవులు తమ తల్లి కుంతితో వనవాసం చేయుచున్న కాలంలో భీమునిచే చంపబడిన కౄర రాక్షసుడు హిడింబాసురుడు ప్రస్తుత చిత్రదుర్గ జిల్లా ప్రాంతంలో నివసించుచుండేవాడని కథనం. అశోకుని కాలంనాటి శిలాశాసనాలు ఇక్కడ లభించిన పురాతన పురావస్తు ఆధారాలు. సా.శ.పూ. 4వ శతాబ్దంలో శాతవాహనులు ఈ ప్రాంతం అధికారానికి వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశం క్షీణించడంతో ఉత్తరాన కాదంబులు, దక్షిణాన గాంగులు అధికారానికి వచ్చారు. అత్యంత ఎత్తైన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహం గాంగుల కాలంనాటి కట్టడమే. బాదామి చాళుక్యులు (500 - 735) వరకు నర్మదా నదీ తీరంనుండి కావేరీ నది వరకు గల విస్తృత ప్రాంతాన్ని రెండవ పులకేశి కాలం (609 - 642) నుండి పరిపాలించారు. రెండవ పులకేశి కనౌజ్ కు చెందిన హర్షవర్ధనున్ని కూడా ఓడించాడు. బాధామీ చాళుక్యులు బాదామి, ఐహోల్ , పట్టడకళ్లో అద్భుతమైన రాతి కట్టడాలను కట్టించారు. ఐహోల్ ను దేశములో ఆలయ శిల్పకళకు మాతృభూములలో ఒకటిగా భావిస్తారు. వీరి తరువాత 753 నుండి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మల్ఖేడ్ కు చెందిన రాష్ట్రకూటులు కనౌజ్ పాలకులపై కప్పం విధించారు. ఈ కాలంలో కన్నడ సాహిత్యం ఎంతగానో అభివృద్ధి చెందింది. జైన పండితులు ఎందరో వీరి ఆస్థానంలో ఉండేవారు. 973 నుండి 1183 వరకు పరిపాలించిన కళ్యాణీ చాళుక్యులు , వీరి సామంతులైన హళేబీడు హొయసలులు అనేక అద్భుతమైన దేవాలయాలను కట్టించి సాహిత్యం మొదలైన కళలను ప్రోత్సహించారు. మితాక్షర గ్రంథం రచించిన న్యాయవేత్త విజ్ఞేశ్వర కళ్యాణీలోనే నివసించాడు. వీరశైవ మతగురువైన బసవేశ్వర కళ్యాణీలోనే మంత్రిగా ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యం దేశీయ సంప్రదాయాలకు పెద్దపీట వేసి కళలను, మతం, సంస్కృత, కన్నడ, తెలుగు , తమిళ భాషలలో సాహిత్యంను ప్రోత్సహించారు. ఇతర దేశాలతో వాణిజ్యం అభివృద్ధి చెందింది. గుల్బర్గా బహుమనీ సుల్తానులు , బీజాపూరు ఆదిల్‌షాహీ సుల్తానులు ఇండో-సార్సెనిక్ శైలిలో అనేక కట్టడాలు కట్టించారు , ఉర్దూ, పర్షియన్ సాహిత్యాలను ప్రోత్సహించారు. మరాఠా పీష్వా , టిప్పూ సుల్తాన్ల పతనంతో మైసూరు రాజ్యం (కర్ణాటక) బ్రిటీషు పాలనలోకి వచ్చింది. thumb|270x270px|మైసూరు ప్యాలెస్ భారత స్వాతంత్ర్యానంతరం, మైసూరు ఒడియార్ మహారాజు తన రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశాడు. 1950 లో, మైసూరు రాష్ట్రంగా అవతరించడంతో, పూర్వపు మహారాజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి రాజప్రముఖ్ లేదా గవర్నరుగా నియమితుడయ్యాడు. విలీనం తర్వాత ఒడియార్ కుటుంబానికి ప్రభుత్వం 1975 వరకు భత్యం ఇచ్చింది. ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికీ మైసూరులోని తమ వంశపారంపర్యమైన ప్యాలెస్ లోనే నివసిస్తున్నారు. 1956 నవంబరు 1 న కూర్గ్ రాజ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న మద్రాసు, హైదరాబాదు , బొంబాయి లలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని మైసూరు రాష్ట్రం విస్తరించి ప్రస్తుత రూపు సంతరించుకుంది. ఆ రోజును రాజ్యోత్సవ దినంగా ఆచరిస్తారు. 1973 నవంబరు 1 న రాష్ట్రం పేరు కర్ణాటక గా మార్చబడింది. పకృతి సిద్ధ ప్రదేశాలు కర్ణాటక అనేక జాతీయ వనాలకు ఆలవాలం. అందులో ముఖ్యమైనవి బందీపూర్ జాతీయ వనం - మైసూరు జిల్లా బన్నేరుఘట్ట జాతీయవనం - బెంగళూరు జిల్లా నాగర్‌హోల్ జాతీయవనం - మైసూరు, కొడగు జిల్లాలు కుద్రేముఖ్ జాతీయవనం - దక్షిణ కన్నడ, చిక్‌మగళూరు జిల్లాలు ఆన్షీ జాతీయవనం - ఉత్తర కన్నడ జిల్లా. ఇవే కాక అనేక వన్యప్రాణి సంరక్షణాలయాలు, అభయారణ్యాలు ఉన్నాయి. షిమోగా జిల్లాలోని జోగ్ జలపాతం ప్రపంచంలోనే రెండవ ఎత్తైన జలపాతం రాజకీయ నాయకులు సిద్దరామయ్య బసవరాజు బొమ్మై ఉమేశ్ కట్టి ఆర్. అశోక వి. సోమణ్ణ అనంతకుమార్ అశోక్ గస్తీ ఎస్. నిజలింగప్ప కె.హెచ్.మునియప్ప కే.ఆర్.రమేష్ కుమార్ కే.ఎస్‌. ఈశ్వరప్ప గోవింద్ కర్జోల్ జార్జ్ ఫెర్నాండెజ్ జైరాం రమేష్ డి.వి.సదానంద గౌడ డీ.కే. శివ కుమార్ డీ.కే. సురేశ్ బంట్వాల్ వైకుంట బాలిగ బి.శ్రీరాములు యశోధర దాసప్ప రామకృష్ణ హెగ్డే వీరప్ప మొయిలీ జె. సి. మధుస్వామి ఎస్. అంగార అరాగ జ్ఞానేంద్ర సి.ఎన్. అశ్వత్ నారాయణ్ సి.సి. పాటిల్ ఆనంద్ సింగ్ ప్రభు చౌహన్ కోట శ్రీనివాస్ పూజారి అరబైల్ హెబ్బార్ శివరామ్ మురుగేష్ నిరాని జిల్లాలు కర్ణాటక జిల్లాలు చూడండి. విమానాశ్రయాలు బెంగళూరు, మంగుళూరు, మైసూరు, బెల్గాం, హుబ్లీ ఆనకట్టలు వాణి విలాస సాగర పుణ్యక్షేత్రాలు గోకర్ణ మంజునాథ ఆలయం, ధర్మస్థల సహస్రలింగ దేవాలయం ఇవికూడా చూడండి కర్నాటక జానపద కళలు కన్నడ కర్నాటక ముఖ్యమంత్రుల జాబితా కళ్యాణ కర్ణాటక శ్రీపతి రవీంద్ర భట్ మూలాలు బయటి లింకులు హసన్‌లోని హొయసల పర్యటన కర్ణాటక పటము కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ కర్ణాటక పర్యటన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము కర్ణాటక ప్రభుత్వ సమాచార శాఖ కర్ణాటక చరిత్ర , సాంస్కృతిక అంశాలు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:దక్షిణ భారతదేశం
కంభం
https://te.wikipedia.org/wiki/కంభం
కంభం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, ప్రకాశం జిల్లా, కంభం మండల లోని జనగణన పట్టణం. ఇది కంభం మండలానికి కేంద్రం, చారిత్రక పట్టణం.కంబం పట్టణం 15,5669 ° N 79,1167 ° E వద్ద ఉంది.ఇది సముద్ర మట్టానికి 184 మీటర్ల (606 అడుగులు) ఎత్తులో ఉంది. గ్రామ చరిత్ర గుండికా వీరాంజనేయస్వామివారి ఆలయం గుండ్లకమ్మనది ఒడ్డున "నాగంపల్లి" పాత గ్రామం ఉంది. మొఘల్ సామ్రాజ్యం పరిపాలనా కాలంలో నాయక్ వీధి, పార్కు వీధి, కోనేటి వీధి, మెయిన్ బజారు కలుపుకొని "గుల్షానాబాద్" పాత గ్రామం ఉంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీ రికార్డ్స్ లో కూడా "గుల్షానాబాద్" అని ఉంది. "గుల్షానాబాద్" (కంభం) 17 వ శతాబ్దంలో 6000 జనాభా ఉండేది. అప్పట్లో "గుల్షానాబాద్" (కంభం) నగర పాలక సంస్థ (మునిస్పాలిటి) ఉంది. శ్రీ కృష్ణదేవరాయల విజయనగర రాజవంశం రాణి వరదరాజమ్మ (జగన్మోహిని రాణి) పరిపాలనా కాలంలో పెద్ద కంభం, చిన్నకంభం, పేరు గల వారిని చెరువు ఆనకట్టకు (తూములు) కట్టబడే గోడకు వారిని బలి దానం చేసారు. వారి చిహ్నంగా "కంభం" ప్రస్తుతం అని పిలువ బడుతుంది. శాసనాలు కంభంలో రెండు శాసనాలు లభ్యమైనవి. మొదటిది 1706లో ఔరంగజేబ్‌ పరిపాలనా కాలంలో కంభం కోట ఖిలాదార్‌ ఖాజా మొహమ్మద్‌ షరీఫ్‌ మరణం గురించి ప్రస్తావిస్తుంది. రెండవది 1729లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా పరిపాలనా కాలంలో కంభం గవర్నర్ మొహమ్మద్‌ ఖయ్యూం కుమారుడు మొహమ్మద్‌ సాహీన్‌ గురించి ప్రస్తావిస్తుంది. సమీప గ్రామాలు చినకంభం-4 కి.మీ, * నాగులవరం - 4 కి.మీ, * దర్గా - 5 కి.మీ, * జంగంగుంట్ల-5 కి.మీ, * కందులాపురం- 4 కి.మీ, జనాభా గణాంకాలు 2011 జనాభా లెక్కల ప్రకారం, కుంభం పట్టణ పరిధిలో మొత్తం 3,769 కుటుంబాలు నివసిస్తున్నాయి.మొత్తం జనాభా 15,169, అందులో 7,588 మంది పురుషులు కాగా, 7,581 మంది స్త్రీలు ఉన్నారు. సగటు లింగ నిష్పత్తి 999. కంభం పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1624, ఇది మొత్తం జనాభాలో 11%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 825 మంది మగ పిల్లలు, 799 మంది ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లల లింగ నిష్పత్తి 968, ఇది సగటు లింగ నిష్పత్తి (999) కంటే తక్కువ.అక్షరాస్యత మొత్తం రేటు 78.7%.అవిభాజ్య ప్రకాశం జిల్లా 63.1% అక్షరాస్యతతో పోలిస్తే కుంభం అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 89.12% స్త్రీల అక్షరాస్యత రేటు 68.36%. రవాణా సౌకర్యాలు రాష్ట్రం రహదారి వినుకొండ-నంద్యాల-కడప విజయవాడ-గుంతకల్ పట్టణం మీదుగా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ గుంటూరు-గుంతకల్ రైల్వే లైను మార్గంలో ఉంది. విద్యా సౌకర్యాలు 1938 లో స్థాపించిన ప్రభుత్వం ఉన్నత పాఠశాలతో పాటు గురుకుల పాఠశాల, మరి ఇతర ప్రైవేటు పాఠశాలలున్నాయి. 1938 లో స్థాపించిన ప్రభుత్వం జూనియర్ కళాశాలతో పాటు గురుకుల జూనియర్ కళాశాల,మరి ఇతర ప్రైవేటు జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వం డిగ్రీ కళాశాలతో పాటు, పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, డిఇడి కళాశాలలు, బీఇడి కళాశాలలు, పారామెడికల్ కళాశాలలున్నాయి. వైద్య సౌకర్యం స్థానిక వైద్యవిధాన పరిషత్తు వైద్యశాలతో పాటు పలు ప్రైవేట్ వైద్యశాలలున్నాయి. బ్యాంకులు ది కంభం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ తో పాటు పలు ప్రభుత్వరంగ బ్యాంకులు సేవలందిస్తున్నాయి. కంభం చెరువు thumb|250x250px|కంభం చెరువు కంభం చెరువు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా కంభం లో ఉంది. ఈ చెరువు 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయులు కాలంలో ఈ చెరువును నిర్మించారు.ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది.కంభం చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇటీవల పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితం అయినది. ఈ చెరువు ద్వారా 6,944 ఎకరాలకు సాగునీరు చేరుతుంది.ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి వంటి పంటలు విరివిగా పండిస్తున్నారు. 2 లక్షల జనాభా తాగునీటి సమస్య తీరుస్తుంది.ఈ చెరువు 9 సార్లు మాత్రమే పూర్తిగా నిండింది. అది కూడా 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996,2005,2020 పూర్తిగా నిండింది. రాజకీయాలు కంభం పట్టణం 2009 వరకు ఒక కంభం అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉంది.తరువాత కంభం నియోజకవర్గం పునర్వ్యవస్థీకరించి, గిద్దలూరు నియోజకవర్గంలో విలీనం చేసారు. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం (కాపువీధి) శ్రీ వరదరాజమ్మ వారి ఆలయం:- చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై వేంచేసియున్నది శ్రీ కాశీవిశ్వేశ్వర శ్రీ కోటేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయం, కంభం-పోరుమామిళ్ళ మార్గంలో, గుండికా నది ఒడ్డున ఉంది. శ్రీ అంకాళమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం కంభం చెరువు ఆనకట్ట వద్ద ఉంది. కందులపురం యందు ఫైర్ స్టేషన్ దగ్గర గల కొండపైన, శ్రీ మస్తాన్ వలి స్వామి దర్గా ఉంది. జుమ్మామస్జిద్ 1629 లో భారతదేశం (దక్షిణ) చక్రవర్తి కట్టించారు. గచ్చు కాలువ మస్జిద్ 1729 లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా కట్టించారు. బేస్తవారిపేట పోవు దారిలో మస్జిద్ ను ఔరంగజేబ్‌ పరిపాలనా కాలంలో కట్టించారు. గుండ్లకమ్మ నది గురించి 1794 మార్చిలో ఒక తెలియని కళాకారుడు చిత్రీకరించాడు. ఈ చిత్రం పెయింటింగ్ ఇప్పటికీ బ్రిటిష్ లైబ్రరీలో ఉంది. గ్రామ ప్రముఖులు అబ్దుల్ గఫూర్ "ఖురాన్‌"ను మొదటిసారిగా సరళీకరించిన కంభంవాసి పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌ ఇస్లాంపై మమకారంతో అబ్దుల్ గఫూర్ 1946లో కంభంలో తన నివాసం పక్కనే మసీదు నిర్మించాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్లి దారుల్ ఉలూమ్ దేవబంద్‌లో మౌల్వి కోర్సు పూర్తి చేశాడు. అప్పటి నుంచి అతని పేరు మౌల్వి అబ్దుల్ గఫూర్‌గా మారింది. కొంత కాలం కర్నూలు ఇస్లామియా అరబిక్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ కళాశాల ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో తన కల సాకారం చేసుకోవడానికి ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేశారు. కంభంలో అతను నిర్మించిన మసీదులో కూర్చొని ఖరాన్‌ను 3 భాగాలుగా తెలుగులోకి అనువదించాడు. ఇదే సమయంలో ఓ వైపు అరబిక్ లిపి, దాని పక్కనే తెలుగులిపి, మరో పక్క పూర్తి తెలుగులో అర్థంతో పాటు, ఇంగ్లీషు లిపి కూడా రాసాడు. 1948 నాటికి పుస్తకం ముద్రణ పూర్తిచేసుకుంది. గఫూర్.. ఖురాన్‌తో పాటు మహ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, మిష్కాత్ షరీఫ్ పుస్తకాలను రచించాడు.ఇతనికి ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు అమ్మాయిలున్నట్లు తెలిసింది. ఖురాన్ అనువాదం తర్వాత మక్కా వెళ్లాడు. అయితే మక్కా యాత్ర చేసిన ఫొటోలు ఉండకూడదని వాటిని తగులబెట్టారట. గఫూర్ అనువాదం తర్వాత 1978లో విజయవాడ వాసి హమీదుల్లా షరీఫ్.. ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించాడు.ఇస్లాంలోని అంశాలను తెలియజేసే ఖురాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. రంజాన్ మాసంలో అవతరించిన ఈ దివ్య గ్రంథం శాంతి.. సమానత్వం.. సేవా గుణాలకు ప్రతీకగా నిలుస్తుంది. గతంలో ఇతర భాషల్లోనే అనువాదమైన ఖురాన్‌ను ఎలాగైనా తెలుగులోకి తర్జుమా చేసి రాష్ట్ర ప్రజలకు అంకితమివ్వాలనే ఆలోచన మొట్టమొదటిగా కంభం వాసికి కలిగింది. అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ వంటి 30కి పైగా వివిధ భాషల్లో అచ్చయిన ఖురాన్ అప్పటికింకా తెలుగు ప్రజలకు సరిగా అందుబాటులోకి రాలేదు. దీనిపై కలత చెందిన అబ్దుల్ గఫూర్ చివరకు తెలుగులో సరళీకరించారు. త్యాగరాజు (1767 మే 4 - 1847 జనవరి 6) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. అతని కీర్తనలు శ్రీరాముని పై అతనికిగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనికి ఉన్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.త్యాగరాజు ప్రస్తుత కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767 లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. పూల సుబ్బయ్య కంభంలో జన్మించాడు. 1952లో కంభం పంచాయతీకి వార్డు సభ్యులుగా పోటీచేసి ఓడిపోయాడు. అప్పుడు మార్కాపురానికి మకాం మార్చి, న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి, తిరిగి ఆరు సంవత్సరాల తరువాత, రాజకీయాలలోకి వచ్చి, యర్రగొండపాలెం శాసనసభకు సి.పి.ఐ.అభ్యర్థిగా పోటీచేసి, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. అదే స్థానంలో 1967 లోనూ, 1978లోనూ, మార్కాపురం నుండి శాసనసభ్యులుగా ఎన్నికైనాడు. వరుస కరువు కాటకాలతో కుదేలవుచున్న అన్నదాతల చింతలు తీర్చేటందుకు, వెలిగొండ ప్రాజెక్టు మాత్రమే పరిష్కారమని తలచి, ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసారు . ఫలితంగా మూడు జిల్లాల వరదాయిని, "వెలుగొండ ప్రాజక్టు" నిర్మాణానికి అడుగులు పడినవి. అతని సేవలకు గుర్తుగా ప్రభుత్వం, ఈ జలాశయానికి "పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు" అని నామకరణం చేసింది. ఒకరైన శ్యామశాస్త్రి, ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఇక్కడి వారే. ప్రధాన పంటలు చెరకు, వరి, టమోటా, అరటి,పసుపు ప్రధాన వృత్తులు వ్యవసాయం మూలాలు వెలుపలి లంకెలు
ప్రొద్దుటూరు
https://te.wikipedia.org/wiki/ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైఎస్ఆర్ జిల్లాలో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న పట్టణం. ఇక్కడ ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయం, కన్యకా పరమేశ్వరి దేవాలయం వలన ప్రముఖ యాత్రాస్థలం. బంగారు, వెండి నగలు, బట్టల వ్యాపారాలకు కేంద్రం. జనగణన గణాంకాలు 2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 1,63,970. పట్టణ పరిపాలన ప్రొద్దుటూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. విద్యా సౌకర్యాలు వై. ఎస్. ఆర్. ఇంజనీరింగ్ కళాశాల. ఉత్పత్తులు ఈ పట్టణం, చుట్టుపక్కల పల్లెలందు వరి, జొన్న, ప్రత్తి, ప్రొద్దు తిరుగుడు, శనగ, కుసుమ, పసుపు, వేరు శనక్కాయలు, కంది, అలసంద ఎక్కువగా పండిస్తారు. ఎండా కాలములో కర్బూజ, కలింగర, దోసకాయలు పండిస్తారు. పాల కోసము బర్రెలు ఎక్కువగా పెంచుతారు. పరిశ్రమలు వేరు శనక్కాయల నుంచి నూనె తీయు గానుగలు నల్ల రాయిని రాతి గనులనుండి వెలికితీయటం, సానబెట్టటం పర్యాటక ఆకర్షణలు thumb|ప్రొద్దుటూరు రైలు సముదాయం|280x280px ముక్తి రామేశ్వరం ముక్తి రామేశ్వరాలయం పెన్నా నదిగా పిలువబడే పినాకినీ నది ఒడ్డున ఉంది. స్థల పురాణం పురాణ కథల ప్రకారం లంకాధిపతియైన రావణుడు సాక్షాత్తూ బ్రహ్మ మనుమడు. అందు చేత బ్రాహ్మణుడు. శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు బ్రహ్మ హత్యా పాతకం రాముడిని ఒక పిల్లి రూపంలో వెంటబడింది. దానినుంచి విముక్తుడు కావడానికి శ్రీ రాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకొన్నాడు. పినాకినీ నదీ తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఇక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించి, కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుడిని పంపగా, హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేక పోయాడు. దాంతో రాముడే పెన్నా నది లోని ఇసుకతో ఒక లింగాన్ని తయరు చేసి ప్రతిష్ఠించాడు. అది సైకత లింగం (ఇసుక లింగం)గా పేరుగాంచింది. కాశీ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీ రాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆక్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రమ్, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడు మొదటి పూజ కాశీ లింగానికీ, తరువాతి పూజ సైకత లింగానికీ జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ఠలు అయిన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డు దాకా నడచి అదృశ్యమైందట. పిల్లి పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును "పిల్లి గుండం" అంటారు. రామలింగేశ్వర స్వామికి ప్రక్కన రాజరాజేశ్వరి, శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు. చైత్ర మాసంలో పౌర్ణమి నుండి పది దినాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి, ప్రక్కన, వెనుక ఇద్దరు మునుల ఆలయాలున్నాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. ఈ క్షేత్ర ప్రతిష్ఠతో రాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తి రామేశ్వరం అంటారు. ఆలయ చరిత్ర శాసనాల ప్రకారం శ్రీ కృష్ణదేవరాయలు ఈ దేవాలయం మీద ఐదు అంతస్తుల గోపురం నిర్మించాడు. గోపురం చుట్టూరా చెక్కిన అనేక మంది దేవతల అందమైన విగ్రహాలు ఆ నాటి శిల్పుల పనితనాన్నీ, సామర్థ్యాన్నీ చెప్పకనే చెబుతాయి. స్థలపురాణం ప్రకారం శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రొద్దు పొడవక ముందే తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. రామలింగేశ్వర ఆలయం ఈ క్షేత్ర దైవం లింగరూపంలో ఉండే శ్రీ రామలింగేశ్వరుడు. ఈ శివ లింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీరాముడు. అందుకే దీనికి రామేశ్వరమని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీ రాముడి వేలి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే శ్రీ హనుమత్ లింగేశ్వర క్షేత్రముంది. హన్మంతుడు కాశీ నుంచి తీసుకు వచ్చిన శివ లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించింది ఇక్కడే. శ్రీ రామలింగేశ్వర ఆలయం ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఆది శంకరాచార్యులు పూజించిన "శ్రీ చక్ర యంత్రం" ఉంది. ఈ చక్ర ప్రభావం వల్లే ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని ప్రొద్దుటూరు వాసులు బలంగా విశ్వసిస్తారు. ఈ శ్రీ చక్ర యంత్రాన్ని పూజించిన వారికి కోరికలన్నీ తీరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని ఒక నమ్మకముంది. శిల్పకళ ముక్తి రామలింగేశ్వరాలయం సువిశాలమైన స్థలంలో నిర్మించిన పెద్ద ఆలయం. అందమైన శిల్పాలతో అలరారే ఐదంతస్థుల రాజగోపురం చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చుట్టూ రక్షణ కోసం నిర్మించిన తలుపులతో బలమైన గోడలున్నాయి. ఈ ఆలయ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడని ప్రతీతి. కుమారస్వామి, దుర్గా దేవి, నాట్య గణపతి, శివపార్వతులు, గరుడ వాహనం మీదుండే విష్ణువు, కాళీయ మర్ధనం చేసే కృష్ణుడు మొదలైన విగ్రహాలు పూర్వ కాలపు శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనాలుగా ఉన్నాయి. అగస్త్యేశ్వరాలయం ఈ ఆలయాన్ని నందిచోళుడు నిర్మించాడు. సాళువ నరస నాయకుడు అభివృద్ధి చేశాడు. ఈ ఆలయం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమ్మలకు కాణాచిగా ఉండేది. మహా కవి పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ ఆలయంలోనే 'శివతాండవం' కావ్యాన్ని వ్రాశాడు. ఈ ఆలయానికి ఎత్తైన ప్రాకారాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అగస్త్యేశ్వరుడు, రాజరాజేశ్వరి, భీమలింగేశ్వరుడు, సుందరేశ్వరుడు, కోదండరామస్వామి ఆలయాలున్నాయి. అగస్త్యేశ్వరుడు మూడడుగుల లింగాకారంలో ఉన్నాడు. అంతరాలయంలో వీరభద్రుడు, కార్తికేయుడు, గణపతి ఉన్నారు. అలయానికి ముందు పుష్కరిణి ఉండేది. దానిని పూడ్చి మార్కెట్ కాంప్లెక్సు నిర్మించారు. ప్రతి సంవత్సరం అగస్త్యేశ్వర స్వామికి వైశాఖ శుద్ధ సప్తమి నుంచి పది దినాల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రాజరాజేశ్వరీ దేవికి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కన్యకా పరమేశ్వరీ ఆలయం thumb|280x280px| ఆలయ గోపురం, అమ్మవారు ప్రొద్దుటూరు నగర కీర్తికి తలమానికం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారు వైశ్య కుల దేవత అయినా హిందువులందరూ అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. సా.శ. 1890లో ఈ దేవాలయాన్ని స్థాపించారు. కామిశెట్టి కొండయ్య అనే వైశ్యునికి అమ్మవారు కలలో కనిపించి తన కోసం దేవాలయం నిర్మించవలసిందిగా ఆదేశించింది. ఆయన, మరికొందరు వైశ్య ప్రముఖులు కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరి దినము అమ్మ వారి ఊరేగింపునకు సుమారుగా 2 లక్షల మంది భక్తులు వస్తారు. దసరా ఉత్సవాలలో మైసూరు తర్వాత ప్రొద్దుటూరునే చెప్పుకోవాలి. ఆలయానికి ఎత్తైన గాలిగోపురం ఉంది. ముఖ ద్వారాలు శిల్పకళతో విరాజిల్లుతున్నాయి. పురాణగాథలు తెలిపే శిల్పాలు మనోహరంగా ఉంటాయి. అమ్మవారి జన్మ వృత్తాంతం తెలిపే ఛాయాచిత్రాలున్నాయి. మహాత్మా గాంధీ (1929 లో), శృంగేరీ పీఠాధిపతులు, కంచి కామకోటి పీఠాధిపతులు మొదలగు ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించారు. దసరా ఉత్సవాలు 1890లో నిర్మించిన వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవస్థానంలో 1895 నుండి అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరుపుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు స్థానిక ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా విజయదశమి దినమున జరిగే గ్రామోత్సవం, తొట్టి మెరవని అత్యంత ప్రధానమైనవి. అయ్యప్ప స్వామి ఆలయం ప్రొద్డుటూరుకు కొత్త శోభ పెన్నా నదీ తీరంలో నిర్మించబడిన అయ్యప్ప స్వామి దేవాలయం. ఇక్కడి ప్రకృతి అందాలు ఒళ్ళు పులకరింప జేస్తాయి. 1991 లో విగ్రహాన్ని పంచలోహాలతో నిర్మించారు. ఈ విగ్రహం 21 అంగుళాల ఎత్తు, 110 కిలోగ్రాముల బరువు ఉంది.తిరుపతి సమీపంలోని తిరుచానూరు వాస్తవ్యులైన తిరుమలాచార్యులనే శిల్పి ఈ విగ్రహన్ని తయారు చేశాడు. శిల్ప కళా నైపుణ్యంతోనూ, గాలిగోపురాలతోనూ దేవాలయాన్ని చూడముచ్చటగా నిర్మించారు.మన రాష్ట్రంలో భారీ వ్యయంతో నిర్మించిన అయ్యప్ప దేవాలయాల్లో ఇదొకటి. (నిర్మాణ వ్యయం 60 లక్షలు.) ఆలయ ప్రాంగణంలో 22 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పుతో శివుని శిరస్సు నిర్మించారు.రాష్ట్రంలోని యాత్రికులు ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకుని శబరిమల యాత్ర చేస్తారు. శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల ఆలయం ప్రొద్దుటూరుకు సమీపంలో రామేశ్వరం, ఆర్టీపీపీ రోడ్డు, పెన్నానది తీరంలో నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల ఆలయం, కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణం పవిత్ర పెన్నానది తీరాన వెలసిన శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల ఆలయ సముదాయ ఆశ్రమమును కీ॥శే॥ పూర్వపు గురూజీ శ్రీ భగవాన్ నారాయణ స్వాములవారి ఆశీస్సులతో స్థల దాత శ్రీ తెల్లాకుల శివయ్యశ్రేష్ఠి, గారి కుటుంబీకులు, నిర్మాణ దాత, ఆశ్రమ ధర్మకర్త కీ॥శే॥ కొట్టూరు యల్లారెడ్డి గారు, శిష్యులు, భక్తుల ఆర్థిక సహాయ సహకారములతో కళ్యాణ మండపం, ఇతర నిర్మాణములను నిర్మించారు. గత 31 సంవత్సరములుగా శ్రీ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవములను భక్తుల ఆర్థిక సహాయ సహకారములతో అత్యంత వైభవోపేతముగా నిర్వహించుచున్నాము. ఇందులో భాగముగా వివిధ ఊర్లనుండి, ప్రొద్దుటూరు, ఐజ, కర్నాటక నుండి భక్తులు పాల్గొని స్వాములవారి అనుగ్రహము పొందియున్నారు. ఐజ, కర్నాటక నుండి భక్తులు పాల్గొని స్వాములవారి అనుగ్రహము పొందియున్నారు. కావున ఈ సంవత్సరం ప్రస్తుత గురూజీ బ్రహ్మపథ, బ్రహ్మ యోగానంద డా|| శ్రీ కృష్ణమాచార్యులు గురువు గారి పర్యవేక్షణలో జరుగు ఆరాధన మహోత్సవములలో పాల్గొని తమ ఆర్థిక సహాయ సహకారములను అందించి స్వాములవారి కృపకు పాత్రులగుదురని కోరుచున్నాము. శ్రీ అవధూత కృష్ణయ్య స్వామి ఆలయం ఈ అలయం ప్రొద్దుటూరు పట్టణంలోని వై.ఎం.ఆర్. కాలనీలో ఉంది. శ్రీ గీతాశ్రమం ప్రొద్దుటూరు శివాలయం కూడలిలోని ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు నామా ఎరుకలయ్య. 2020,నవంబరు-15న, ఈ ఆశ్రమంలో, నామా ఎరుకలయ్య, కమలాక్షమ్మల ఆరాధనోత్సవాలు ప్రారంభమైనవి. ఈ సందర్భంగా, గ్రామస్థులు, భక్తులు, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ఉత్సవాలు 23-11-2020 వరకు నిర్వహించెదరు.ఈనాడు కడప జిల్లా;2020,నవంబరు-16,4వపేజీ . ఇతర ఆలయాలు ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నానుకుని ఉన్న బొల్లవరం గ్రామంలో విజయనగర రాజులు నిర్మించిన వెంకటేశ్వర, చెన్న కేశవ, వేణుగోపాల, ఆంజనేయ స్వామి ఆలయాలు, రామాలయం ఉన్నాయి. ప్రొద్దుటూరులో చాలా వరకు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయాలు ఊన్నాయి. ప్రొద్దుటూరు (రామేశ్వరం) - ఆర్.టి.పి.పి. రహదారిలోని అష్టభుజి శ్రీ చౌడేశ్వరి ఆలయంలో, శ్రీ చౌడేశ్వరి విగ్రహ మూర్తి 50 అడుగుల ఎత్తయినది. నరసింహాపురం గ్రామం ప్రొద్దుటూరు పట్టణానికి పడమర దిశలో, ప్రొద్దుటూరు - జమ్మలమడుగు రహదారి లో, ప్రొద్దుటూరు నుండి 6 కిమీ ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఒకటి ఉంది. గుడియందలి శిల్ప కళని గమనించినట్లయితే విజయనగర రాజుల చివరి కాలంలో అనగా 17వ శతాబ్దం చివరలో నిర్మించినట్లుగా అనుకోవచ్చు. నరసింహాపురంకి పడమటి దిశలో పొలాలలో ఒక పురాతన శివాలయము ఉంది. ఇందులోని శివలింగముని ఆంజనేయుడు ప్రతిష్ఠించాడు అని చెప్పుకుంటారు ఇతర విశేషాలు 1929లో జాతిపిత మహాత్మా గాంధీ, వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెళ్ళిన మార్గాన్ని గాంధీ రోడ్డుగా పిలుస్తారు. ఇది ప్రొద్దుటూరులో ఒక ముఖ్య వాణిజ్య మార్గము. ఇవీచూడండి ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం మూలాలు వెలుపలి లింకులు ప్రొద్దుటూరు పట్టణ సమాచారం వర్గం:వైఎస్‌ఆర్ జిల్లా పట్టణాలు
పెన్నా నది
https://te.wikipedia.org/wiki/పెన్నా_నది
పెన్నానది లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. పెన్నా నది (ఉత్తర పినాకిని) కర్ణాటక రాష్ట్రంలో కోలారు సమీపానగల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. అనంతపురం జిల్లా, వైఎస్‌ఆర్ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ప్రవహించి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్నా ప్రవాహం, ఉపనదులు పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: కుముదావతి, జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు, బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది. పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న ప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది. అక్కడి నుంచి ఈ నది కడప జిల్లాలో పోట్లదుర్తి, హనుమనగుత్తి, కోగటం, పుష్పగిరి, చెన్నూరు, లింగంపల్లె, జ్యోతి క్షేత్రం, సిద్ధవటం గ్రామాలను ఆనుకుని ప్రవహించి సోమశిల రిజర్వాయర్ ను చేరుతుంది. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరి క్షేత్రాన్ని పంచనదీక్షేత్రమంటారు. పెన్నా నది పరివాహక రాజ్యాలు, కోటలు గండికోట: ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నది వల్ల ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నది, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది. సిద్ధవటం కోట: దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తలతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది. మట్లి అనంతరాజు సిద్ధవటం మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. మట్లి రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. అప్పట్నుంచి కడప నవాబులు సిద్ధవటం కోట నుంచే పాలించేవారు. పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడల్లా సిద్ధవటానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో పాలనాకేంద్రాన్ని కడపకు మార్చారు. ప్రస్తుతం కడప నగరానికి, పెన్నేటికి మధ్య దూరం దాదాపు 5 కిలోమీటర్లు. పెన్నా నది మీద ప్రాజెక్టులు సోమశిల ప్రాజెక్టు thumb|260x260px|పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము|alt= left|thumbnail|400px|తూర్పు కొండల వద్ద పెన్నానది center|thumbnail|900px|గండికోట వద్ద పెన్నానది సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు ప్రతిపాదన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాడు. మూలాలు బయటి లింకులు పెన్నానది పరీవాహక ప్రాంత పటము వర్గం:శ్రీ సత్యసాయి జిల్లా నదులు వర్గం:అనంతపురం జిల్లా నదులు వర్గం:వైఎస్‌ఆర్ జిల్లా నదులు వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నదులు వర్గం:పెన్నా నది
నేపాల్
https://te.wikipedia.org/wiki/నేపాల్
హిమాలయాలలో ఉన్న నేపాలు రాజ్యం, 2006 నేపాల్ ప్రజాస్వామ్య ఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక హిందూ రాజ్యం. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉంది. ఇది ఒక భూపరివేష్టిత దేశం (లాండ్‌లాక్) చరిత్ర నేపాల్ కు వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర ఉంది. కిరాంత్ లేదా కిరాతి అనేది 7వ లేక 8వ శతాబ్దములలో తూర్పు నుండి వలస వచ్చిన, చరిత్రకారులకు తెలిసిన మొదటి తెగ. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వము 563లో నేపాల్‌లోనే జన్మించాడు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అశోకుడు కూడా ఉత్తర భారతదేశంతో బాటు ఇప్పటి నేపాల్ లోని దక్షిణ ప్రాంతాలను (హిమాలయ పర్వత ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో లేవు) పరిపాలించాడు. అశోకుడు రుమ్మినిదేవి అను ప్రాంతమున ఒక స్తంభమును నెలకొల్పినాడు, స్యయంభూనాధ్ అనుచోట కొండకు పడమటి భాగమున కొన్ని బౌద్ధ కట్టడములను కట్టించినట్లు చెప్పబడుచుండెను. అంతేకాక అశోకుడు తన కుమార్తె అయిన చారుమతిని దేవపటాణ్ అను ప్రాంతమున నివసించు సుక్ష్యత్రియుడు అగు ఒక బౌద్ధ ధర్మదీక్షాపరాయణుడికిచ్చి వివాహము చేసినట్లు కొందరు చరిత్రకారులు చెప్పుచున్నారు. అశోకుని అనంతరము మగధ సామ్రాజ్యము విచ్ఛిన్నమయిపోయింది. ఇతర దేశములతోపాటు నెపాళదేశము కూడా సామ్రాజ్యంతర్భాగమున నుండుటను విరమించుకొనెను. ఈ విశేషము జరిగిన పిమ్మట చాలాకాలము వరకు అంతగ నేపాళ దేశపు చరిత్ర ఎవ్వరికి తెలియకుండెడిది. కాని క్ర్రీస్తు వెనుక 340 సంవత్సర ప్రాంతమందు గుప్తవంశీయుడు, భారతసామ్రాజ్యాధిపతి అగు సముద్రగుప్తుడు నేపాళ దేశమును తాను జయించిన దేశముల పట్టీలో పేర్కొనెను. ఇదియే అలహాబద్ స్తంభ శాసనమందీ పట్టీకలదు. క్రీస్తు శకం 200 నాటికి బౌద్ధ సామ్రాజ్యాన్ని హిందువులు అంతమొందించి, లిచ్ఛవి వంశ పరిపాలనను ప్రారంభించారు. నేపాళ దేశమున నాగవాసము (Now Called Lake Table Land) అనుపేరుగల గొప్ప సరోవరము నుండెనట, ఇది మిక్కిలి లోతుకలదై అసంఖ్యాకముగ నీటి పక్షులతో మనోహరముగ ఆవృతమై యొప్పుచుండెను. ఈ సరోవరమున కర్కోటకుడగు 'నాగరాజూ పరిపాలించుచుండెను. ఆ కాలములో నాగసరోవరములో ఒక్క తామరమొక్క అయినా మొలవకుండెడిదట. ఇట్లుండగా అంతకు చాలాకాలము క్రిందట విందుమతీ నగరమునుండి విపస్య బుద్ధుడు ఈ సరోవరమునకు వచ్చినప్పుడు అతడొక తామర మొక్క మంత్రించి ఈ సరోవరమున పారవైచి "ఈ తామర పుష్పించిననాడు స్వయంభువుడగు బుద్దభగవానుడు జ్యోతివలె భక్తులకు కనపడునని" చెప్పి వెడిలిపోయినాడట. ఈ కారణముచేతనే స్యయంభూనాథ్, బోద్‌నాథ్ దేవాలయములందు జ్యోతి ఎల్లప్పుడు వెలుగుచూనే ఉండును. అటుపిమ్మట శిఖిబుద్ధుడు నాగవాసమందు నిర్వాణము పొందెను. ఆ తరువాత విశ్వభూబుద్ధుడు, బోధిసత్వుడు నాగవాసములో తప్పస్సు నొనర్చారు. ఈ బోధిసత్వుడినే కొందరు "మంజుశ్రీ" అని పిలిచెదరు. ఈ మంజుశ్రీ అను నాతడు కొందరు చైనా దేశము వాడని, మరికొందరు ఆంధ్రుడని మరికొందరు చెప్పుచున్నారు. 900వ సంవత్సరంలో లిచ్ఛవి వంశాన్ని పారద్రోలి ఠాకూర్లు, వారిని పారద్రోలి మల్లులు పరిపాలనకు వచ్చారు. వాళ్ళే 18వ శతాబ్దం వరకూ పాలించారు. 1768 లో పృథ్వి నారాయణ్ షా అనే గూర్ఖా రాజు ఖాట్మండును ఆక్రమించుకున్నాడు. 1814లో నేపాలు ఇంగ్లీషు వారితో యుద్ధం చేసింది (ది ఆంగ్లో నేపాలీస్ వార్). 1816లో సుగౌలి సంధితో ఈ యుద్ధం ముగిసింది. ఇంగ్లీషు వారికి సిక్కిం ను, దక్షిణ భాగాలను ఇచ్చివేయడంతో ఇంగ్లీషు వారు వెనుదిరిగారు. కానీ 1857లో భారతదేశంలోని సిపాయిల తిరుగుబాటును అణచివేయడంలో ఇంగ్లీషు వారికి సహాయపడినందుకు గాను ఇంగ్లీషువారు దక్షిణ ప్రాంతాలను తిరిగి ఇచ్చివేశారు. షా వంశాన్ని 1846లో జంగ్ బహద్దూర్ రాణా అంతమొందించి దేశ పరిపాలనను తన చేతిలోకి తీసుకున్నాడు. దీనికోసం అతడు దాదాపు కొన్ని వందల మంది రాకుమారులను, తెగల నాయకులను అంతమొందించాడు (దాన్నే కోట్ ఊచకోత అంటారు). 1948వ సంవత్సరము వరకూ రాణాలు వారసత్వ ప్రధాన మంత్రులుగా నేపాలను పరిపాలించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే త్రిభువన్ అనే క్రొత్త రాజు నేపాలు పాలనకు రావడానికి భారతదేశం సహాయపడింది. నేపాలీ కాంగ్రెసు పార్టీ ఏర్పడడానికి కూడా సహాయపడింది. రాజు త్రిభువన్ కుమారుడైన రాజు మహేంద్ర ప్రజాస్వామ్య ప్రయోగాన్ని, పార్లమెంటును రద్దు చేసి, పార్టీలు లేని పంచాయితీ పద్ధతి ద్వారా నేపాలును పరిపాలించాడు. అతని కుమారుడు బీరేంద్ర సింహాసనాన్ని అధిరోహించాడు. అతను కూడా 1989 వరకూ పంచాయితీ పద్ధతినే అనుసరించాడు. కాని ప్రజల ఆందోళన తర్వాత బలవంతంగా రాజ్యాంగ మార్పులను ఆమోదించాడు. 1991 మే నెలలో దాదాపు యాభై సంవత్సరాల తరువాత నేపాలలో ఎన్నికలు జరిగాయి. నేపాలీ కాంగ్రెస్ పార్టీ, కమ్మూనిస్టు పార్టీలకు ఎక్కువ ఓట్లు దక్కాయి. ఏ పార్టీ కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పరిపాలించలేక పోయింది. అందుకు కారణంగా ప్రజోపయోగ కార్యక్రమాలలో మార్పు లేకపోవటం, అవినీతి రోగం లాగా మారటాన్ని చూపిస్తారు. ఫిబ్రవరి 1996 లో మావోయిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని మార్చి, సామ్యవాదాన్ని స్థాపించడం కోసం విప్లవాత్మక ధోరణిని ఎంచుకొని ప్రజా యుద్ధాన్ని ప్రారంభించింది. అదే ఆ తర్వాత అంతర్యుద్ధంగా మారి 10 వేల మంది మరణానికి దారితీసింది. నేపాలు ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2001, జూన్ 1 నాడు సింహాసన వారసుడు దీపేంద్ర తన ప్రేమను ఒప్పుకోలేదని రాజభవనంలో రాజు బీరేంద్రను, రాణి ఐశ్వర్యను, తమ్ముడిని, చెల్లెల్ని, ఇద్దరు బాబాయిలను, ముగ్గురు పినతల్లులనూ కాల్చి చంపేశాడు. తర్వాత తనూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కోమాలో ఉన్నా, సాంప్రదాయం ప్రకారం అతడిని వైద్యశాల పడక పైనే రాజుగా ప్రకటించారు. అతడు మూడు రోజుల తరువాత మరణించాడు. అతని మరణం తరువాత బీరేంద్ర తమ్ముడు అయిన జ్ఞానేంద్రను జూన్ 4న రాజుగా ప్రకటించారు. వెంటనే అతను రాజ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. మావోయిస్టులతో యుద్ధానికి నేపాలు సైన్యాన్ని రంగంలోకి దించాడు. thumb|దుర్బర్నువ్కోట్ విభాగాలు నేపాలును మొత్తం 14 ప్రాంతీయ విభాగాలుగా విభజించారు. భాగమతి, భేరి, ధావలగిరి, గండకి, జానక్ పూర్, కర్నలి, కోషి, లుంబిని, మహాకాళి, మేచి, నారాయణి, రప్తి, సగర్మత, సేతి భౌగోళికం, వాతావరణం thumb|250px|left|హిమాలయ పర్వత దృశ్యాలు భారత్, చైనా మధ్యలో భౌగోళికముగా నేపాల్ బంధింపబడి ఉంది. మొత్తం 1,47,181 చ.కి.మీ. వైశాల్యములో విస్తరించి ఉంది. అందులో 56,827 చ.మై. భౌగోళిక వైవిధ్యమున్నప్పటికీ, పర్వతాలతో నిండి ఉంది. అడ్డంగా మూడు వైవిధ్య భౌగోళిక స్వరూపాలు ఈ దేశంలో ఉన్నాయి. దక్షిణాన లోతట్టు ప్రాంతము, మధ్యన చిన్న పర్వతాలతో ఉన్న ప్రాంతము, ఉత్తరాన హిమాలయాలతో (ఎవరెస్టు, ఇతర ఎత్తైన శిఖరాలతో) కూడిన అతి ఎత్తైన ప్రాంతము (8,850 మీ లేదా 29,035 అడుగులు). మొత్తము నేపాలలో 20% భూమి మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది. అడవుల కొట్టివేత కూడా ఒక ముఖ్య సమస్య. ఎవరెస్టు శిఖరం ఈ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో సాగరమాత అనీ, టిబెట్ భాషలో ఖోమోలోంగ్మ అనీ పిలుస్తారు. ఇది నేపాల్-ఛైనా సరిహద్దులో ఉంది. సమున్నతమైన ఎవరెస్టు శిఖరము, హిమాలయ పర్వత సానువులతో బాటు, ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాలు లోనే ఉన్నాయి. ఇవి పర్యటకులకు ముఖ్య ఆకర్షణ. వీటిని ప్రకృతి వింతలుగా చెప్తారు. నేపాలలో ఐదు వాతావరణ ప్రాంతాలు ఎత్తుల వారీగా ఉన్నాయి. దక్షిణాన సమశీతోష్ణ మండలం మొదలుకొని చల్లని వాతావరణము, ఉత్తరాన అతిశీతల ప్రదేశాల వరకూ ఉన్నాయి. వర్షపాతం వివిధ ఋతువులలో ఋతుపవనాల పై ఆధారపడి వివిధ రకాలుగా ఉంటుంది. ఆ వర్షపాతమే మొత్తము సంవత్సర వర్షపాతములో 60-80% మేర ఇస్తుంది. సంవత్సరానికి తూర్పున 2500 మి.మీ., పశ్చిమాన 1000 మి.మీ., 1420 మి.మీ. ఖాట్మండు చుట్టుప్రక్కలా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఇది 4000 మి.మీ. దాకా, కొన్ని సార్లు 6000 మి.మీ. దాకా కూడా ఉండవచ్చు. ఋతుపవనాలు మంచి ఊపు మీద ఉన్నప్పుడు వర్షపాత వివరాలు. (జులై-ఆగస్టు). దదెల్ధురా:350mmనేపాల్ గన్జ్:510mmబుట్వల్:715mmపోఖర:920mmముస్తాన్గ్:60mmకాఠ్మండు:370mmచైన్పుర్:320mmనమ్ఛే బజార్:220mm ఆర్థికవ్యవస్థ thumb|250px|right|కొండ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రభుత్వము, మావోయిస్టుల మధ్య నిరంతరము జరిగే గొడవలు, తగవులు, చిన్న అంతర్యుద్ధముల వల్ల నేపాలు ఆర్థికముగా పతనము చెందినది. ప్రపంచములోని అత్యంత పేద దేశాలలో నేపాలు ఒకటి, కానీ ఆర్థికంగా ఓ ప్రబల శక్తిగా మారుటకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న దేశము, కానీ సరైన నాయకత్వం లోపం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. సేవలు, వ్యవసాయం దీని ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. సుమారుగా 80% జనాభా, 41% స్థూల జాతియాదాయం ఈ రెండు రంగాల నుండే వస్తుంది. పారిశ్రామికీకరణ కేవలం వ్యవసాయాధార పరిశ్రమలయిన నార (jute), చక్కెర, పొగాకు, ఆహార పంటలకు మాత్రమే పరిమితం అయినది. వస్త్ర ఉత్పత్తి, తివాచీల తయారీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది, గత మూడు సంవత్సరాలలో ఇవి రెండూ దేశ విదేశీ మారక ద్రవ్య సంపాదనలో 80% ఆక్రమించినాయి. పారిశ్రామికాభివృద్ది చాలా వరకూ ఖాట్మండు లోయ చుట్టుప్రక్కల, మరియూ భిరత్ నగర్, బిర్గంజ్ వంటి నగరాలలోనే జరిగింది. వ్యవసాయాభివృద్ది 5%, వార్షిక జనాభావృద్ది 2.3%గా ఉంది. 1991లో ప్రభుత్వము ఆర్థిక సరళీకరణల ద్వారా వ్యాపారాన్ని, విదేశీ సంస్థాగత మదుపుదారులను ప్రోత్సహించడంద్వారా, ఆర్థికాభివృద్ది చాలా త్వరగా సాధించుదామని మొదలుపెట్టినది. కానీ రాజకీయ అస్థిరత్వం వల్ల, ఎక్కువగా వృద్ధి సాధించలేక పోయింది. ముఖ్యముగా జల విద్యుత్తు, పర్యటక రంగములలో అభివృద్ధికి బాటలు పరచింది. కానీ చిన్న ఆర్థికవ్యవస్థ, రాజకీయ అస్థిరత్వం, సహజ దుర్ఘటనలు (?), సాంకేతికపరంగా వెనుకబడి ఉండటం వల్ల, చైనా, భారత దేశాల మధ్య భౌగోళికంగా చిక్కుకొని పోవడం వల్ల ఎక్కువగా పెట్టుబడులు రాలేదు. కానీ ఇప్పటికీ తన అభివృద్ధి బడ్జెటులో 80%, మొత్తం బడ్జటులో 28% విదేశీ పెట్టుబడులే ఆక్రమించినాయి. జనగణన వివరాలు,సంస్కృతి నేపాలు బహు భాషా, బహు మత, బహు జాతులు గల సమాజం. ఈ క్రింద ఇవ్వబడిన లెక్కలు 2002 నేపాలు జన గణన నుండి ఇవ్వబడింది. భాషలు నేపాల్‌కి వైవిధ్య భరితమైన భాషా సంస్కృతి ఉంది. అది మూడు భాషా సముదాయాల నుండి ఏర్పడింది. 1.ఇండో-ఆర్యన్, 2.టిబెటో-బర్మన్, 3.దేశీయమైన. 2001 జాతీయ లెక్కల ప్రకారం నేపాలులో మొత్తం 92 వివిధ భాషలు మాట్లాడతారు (93వ దాన్ని ఉన్నాగుర్తించలేకపోయారు). మాతృభాషగా నేపాలీలు మాట్లాడేది జనాభా శాతం ప్రకారం నేపాలి (49%), మైథిలి (12%), భోజ్ పురి (8%), థారు (6%), తమంగ్ (5%), నేవారి లేదా నేపాల్ భాష (4%), మగర్ (3%), అవధి (2%), బంటవ (2%), లింబు (1%), బజ్జిక (1%). మిగతా 81 భాషలు మాతృభాషగా 1% కన్నా తక్కువ మంది మాట్లాడతారు. అధికార భాష దేవనాగరి లిపిలో వ్రాయబడే నేపాలీ భాష. వివిధ భాషలు మాట్లాడే నేపాలీలందరికీ, ఈ భాష భాషా మాధ్యమంగా ఉపయోగపడుతున్నది. దక్షిణ తెరాయ్ లేదా 5-10 మైళ్ళ వెడల్పు ఉన్న నేపాలు భారత సరిహద్దు ప్రాంతంలో హిందీ కూడా మాట్లాడతారు. మతములు thumb|250px|పతన్‌లో హిందూ ఆలయం ఆధికారికంగా నేపాలు ప్రపంచంలో ఏకైక హిందూ దేశము. కానీ దీర్ఘ కాలంగా అక్కడి చట్టాలు బలవంతపు మత మార్పిడులను, అన్య మత విద్వేషాన్ని అడ్డుకుంటున్నాయి. 2001 లెక్కల ప్రకారం 80.6% మంది హిందువులు, 11% మంది బౌద్ధులు. కాని ఇరు మతాల వాళ్ళూ ఇరు మతాల సంప్రదాయాలనూ, ఆచారాలనూ, సమానంగా ఆచరిస్తారు. ఇంకా 4.2% మంది ముస్లింలు, 3.6% మంది కిరాంతులనబడే వాళ్ళూ, 0.5% మంది క్రైస్తవులూ ఉన్నారు. వీరి సంఖ్య 2005 కు 6 లక్షలకు పెరిగింది. నేపాల్ లో ముఖ్యమైన పండగలు 1 ముఖ్య పండగలు నేపాలీలకు కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులు చాల పవిత్రమైనవి. ఈ సందర్భంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. ఇవి ఐదు రోజులు పాటు జరుపు కుంటారు. యమలోకాధి పతి ఐన యమధర్మ రాజును పూజించడంతో ఈ పండగలు ప్రారంభ మౌతాయి. ఈ పండగల కొక ఇతిహాసము ఉంది. దాని ప్రకారం: పండగ దినాల్లో కూడా భూలోకంలో మానవులు మరణిస్తున్నారనీ, వారి ఆత్మలను తీసుకు రావడానికి తమకు బాదగా వున్నదనీ, దీనికి నివారణోపాయాన్ని చెప్పమని యమధూతలు.... యమ ధర్మ రాజుకు మొర పెట్టుకోగా. యమ ధర్మరాజు ఒక తరుణోపాయం ఆలోచించి వారికి చెప్తాడు. దాని ప్రకారం. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి వుండదనీ శలవిస్తాడు. ఆ విధంగా ఆ అయిదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు. 1.1 కాగ్ తీహార్ యమ పంచకంలో మొదటి రోజైన ఈ రోజున కాగ్ తీహార్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున అపశకునపు పక్షి అయిన కాకిని పూజిస్తారు. మానవుల మరణానికి కాకులు దూతలు బావించి ఈ రోజున ఇంట్లోని వారందరూ భోజనం చేయకుండా వుపవాసముండి, ఇంటిని దీపాలతో అలంకరించి పూజానంతరం కాకులకు అన్నం పెడతారు. 1.2 కుకుర్ తీహార్ రెండో రోజున కుకుర్ తీహార్ అనగా కుక్కల పండుగ . ముఖ్యంగా మరణానికి పుత్రులుగా నల్లని కుక్కలను chestnut రంగు కుక్కలను భావించి వాటిని పూజిస్తారు. వాటి ముఖానికి బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి, వాటికి మంచి ఆహారం పెట్టి పూజిస్తారు. అన్ని జంతువుల కన్న కుక్క మానవునికి అత్యంత విశ్వాస పాత్రమై నందున, మానవునికి తోడుగా వుండి, అతనికి ఇంటిని కాపలా కాస్తున్నందున ఈ విధంగా వాటికి రుణం తీర్చుకోవడంగా కూడా నేపాలీ ప్రజలు భావిస్తారు. ( సాధారణంగా భారతదేశంలో ఆలయాల లోనికి కుక్కలు ప్రవేశిస్తే అపవిత్రంగా భావిస్తారు. ఆ అపవిత్రతను తొలిగించ డానికి కొన్ని శుద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారు. కానీ నేపాల్ దేశంలో ఖాట్మండులోని పరమ పవిత్ర పశుపతి నాద్ దేవాలయంలో కొందరు పూజారులు కొన్ని కుక్కలకు నొసటన పసుపు పూసి కుంకుం బొట్లు పెట్టి వాటి మెడలో పూల మాల వేసి ఒక స్తంభానికి కట్టి ఆ ప్రక్కనే ఒక పూజారి కూర్చొని వుండగా నేను గమనించాను. కుక్కలు ఆలయంలో ఈ విధంగా వుండడము చూచి ఇదేదో పవిత్రమైన కార్యమై వుంటుందని భావించి కొంత లోతుగా పరిశీలించగా..... ఆలయానికొచ్చిన భక్తులు కుక్క వద్ద వున్న పూజారికి కుక్కలకు పూజా కార్యక్రమం చేయించి వారినుండి కొంత సంభావన స్వీకరించారు. ఇది నేను స్వయంగా చూసిన విషయం. బహుశా పూజించ డానికి కుక్కలు దొరక నందున ఆలయంలో ఈవిదంగా కుక్కలను పూజించే అవకాశం కల్పించబడినదని భావించ వచ్చు. ) 1.3 గోవుల పండగ మూడోరోజున పశువుల పండగ జరుపు కుంటారు. (ఆంధ్ర ప్రదేశ్ లో పశువుల పండుగ లాంటిది కాదు) గోవును లక్ష్మీ ప్రతిరూపంగా భావించి పూజించడము హిందువులకు ప్రపంచ వ్వాప్తంగా వున్న ఆచారమే. హిందువు లందరూ గోమాత అవయవాలల్లో అన్ని రకాల దేవతలు కొలువై వున్నారని నమ్ముతారు. గోమాత పూజను నేపాలీలు కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు. చీకటిని ప్రాలద్రోలి లక్ష్మీ దేవికి స్వాగతం పలకడానికి ప్రజలందరూ తమ ఇండ్లను దీపాలతో అలంకరిస్తారు. క్షీర సాగర మదనంలో లక్ష్మీ దేవి ఈరోజునే పుట్టిందని వీరి నమ్మిక. స్త్రీలందరినీ లక్ష్మీ దేవి అవతారులుగా ఈ రోజున భావిస్తారు. స్త్రీలు ఈ రోజున స్నానానంతరం కొత్త బట్టలు ధరించి లక్ష్మీ పూజలు చేసి bhailo పాటలు పాడుతూ ఇంటింటికి వెళతారు. ఆ ఇంటి ఇల్లాలు ...... పాటలు పాడుతూ తమ ఇంటి ముంగిటకు వచ్చిన స్త్రీలను లక్ష్మీ అవతారంగా భావించి వారిని దీపాలతో ఆహ్వానిస్తారు. ఇంట్లో కూర్చో బెట్టి ఒక పళ్ళెంలో వివిధ రకాల రొట్టెలు, పలు రకాల పండ్లు అలంకరించి అందులో కొంత డబ్బులు పెట్టి వారికి సమర్పిస్తారు. ప్రతిగా....., ఆ వచ్చిన స్త్రీలు ఆ యింటి వారిని లక్ష్మీ కటాక్షం కలిగి ధన ధాన్యాలతో తులతూగాలని దీవిస్తారు. ఈ పండుగ నేపాల్ దేశంలో ప్రతి పల్లెలోను ఇప్పటికీ జరుగు తున్నది. పట్టణాలలో అంతగా లేదు. నేపాల్ లోని పశ్చిమ ప్రాంతాలైన దోటి, హుమ్లా ప్రాంతాల్లో భైలే పాటలు ఐదు రోజులు పాటు పాడుతారు. అంతే గాక పుష్య మాసంలో (జనవరి-పిబ్రవరి) 20 రోజులు జరుపుతారు. దీనిని మఖ్య భైలే అని అంటారు. 1.4 ఎద్దుల పండుగ నాల్గవ రోజున కూడా ప్రజలు తమ ఇండ్లను దీపాలతో అలంక రిస్తారు. కాని పూజా విధానంలో ప్రజలు వారి వారి సంస్కృతిని బట్టి కొన్ని మార్పులతో జరుపు కుంటారు. సాధారణంగా ఈ రోజు అందరూ తలంటుకుని స్నానంచేసి ఎద్దులకు కూడా స్నానంచేయించి, అలంకరించి పూజిస్తారు. ఆవులను పాలు పితకరు, ఎద్దులను పనిలో పెట్టరు. శ్రీ కృష్ణున్ని పూజించేవారు ఈ రోజు గోవర్థన పూజ చేస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని ఎత్తి అనేక పశువులను, ప్రజలను రక్షించినది ఈ రోజు ఇదేనని పూజ చేస్తారు. కొందరు కొత్త తరం వారు ప్రతి మానవుని లోను దేవుడున్నాడని నమ్మి ఆత్మ పూజ చేస్తారు. గోవర్థన పూజ జరిగిన రాత్రి పురుషులు భైలిలో స్త్రీలు పాటలు పాడినట్లు పాటలు పాడుతారు. (men play their carol called devsi) దీన్ని దెవ్సీ అంటారు. ఇందులో స్త్రీలకు ప్రవేశం లేదు. పట్టణ ప్రాంతాల్లో పురుషులు ఈ మార్గాన్ని ధన సంపాదనకు మార్గంగా ఎంచు కుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఈ బృందం తాము అడిగినంత విరాళం ఇవ్వనందుకు ఇంటి వారితో వాగ్వివాదానికి దిగి అసభ్యంగా ప్రవర్తించడం కూడా జరుగు చున్నది. హోటళ్ళు వంటి కొన్ని వ్వాపార సంస్థలు ఈ దెవ్సీ బృందానికి తాము ఇంతే మొత్తమిస్తామని బయట బోర్డులు కూడా పెడ్తారు. పరదేశీ విహార యాత్రా వాహనాలను అటవీ ప్రాంతాలలో మధ్యలో ఆపి తాము అడిగి నంత ధనము ఇచ్చు నంత వరుకు వదలరు. ఆనందానికి ఆలవాలమైన ఈ పురాతన సాంప్రదాయం కొందరి స్వార్థపరులకు ధన సంపాదన మార్గంగా మారడంతో ప్రజాభిమానాన్ని కోల్పోతున్నది. 1.5 బాయిటికా ఐదవ రోజు భాయ్ టికా పండుగను జరుపు కుంటారు. యమ పంచకంలో ఇది చివరి రోజు. ఈ రోజున యమ ధర్మ రాజు తన చెల్లె లైన యమునా' ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడని వీరి నమ్మిక. స్కాంద పురాణం లోని కార్తీక మహత్యం ప్రకారం పురుషులు ఈ రోజున తమ ఇంట్లో గాక తమ చెల్లెలి ఇంట్లో భోజనం చేయాలి. చెల్లెలు లేని పురుషులు ఈ రోజు కొరకు ఎవరైనైనా దత్తత తీసుకుని వారింట భోజనం చేయాలి. ఆ అవకాశం కూడా లేనివారు ఒక చెట్టు నైనా తమ చెల్లెలుగా భావించి ఆ చెట్టు క్రింద భోజనం చేయాలి. ఆ సోదరి తన అన్నకు ఆయురారోగ్యాల నందించాలని కోరి అన్నగారి నుదుట రంగు రంగుల తిలకం దిద్ది తగు బహుమతులిస్తుంది. అదే విధంగా అన్నకూడ తన చెల్లెలికి నుదుట తిలకం దిద్ది ఆమెకు బహుమతులిస్తాడు. ఈవిధంగా .... హిందువులు అధికంగా ఉన్న నేపాల్ దేశంలో హిందూ సాంప్రదాయ పండగలు అనేకం జరుపుకుంటారు. ఇక్కడ జరుపుకునే పండగలలో కొన్ని ప్రత్యేకమైన పండగలు కూడా గమనించ వచ్చు.(* మూల: యమ పంచక పండగల విశేషాలు... కొన్ని స్వయంగా చూసినవి. వివరాలు మాత్రం నేపాల్ లోని ఆంగ్ల దినపత్రికలైన The himalayan, and The khatmandu post) నేపాల్ పర్యటన ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. దీనికి కారణాలు అనేకం. అక్కడి ప్రకృతి రమణీయత కావచ్చు., హిందూ మతస్తులకు, బౌద్ధ మతస్తులకు సంబంధించిన అత్యున్నతమైన కేంద్రాలు కావచ్చు., ట్రెక్కింగు, రాప్టింగు వంటి సాహస క్రీడలకి ముఖ్య కేంద్రం కావచ్చు, ముఖ్యంగా అక్కడి ప్రజల స్నేహ పూరిత స్వభావం కావచ్చు. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకంలో వున్నాయా అన్నట్టున లోయలు, నదులు, సెలయేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, భౌద్దులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఇలా కారణాలేవైనా నేపాల్ దేశం పర్యాటకులకు నయనాందకరం చేసే దేశం. నేపాల్ దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు కూడా పర్యటకమే. ప్రపంచంలో చివరి హిందూ సామ్రాజ్యం మొన్నటి దాక రాజుల పరిపాలనలో ఉన్న నేపాల్ దేశం ప్రపంచంలో ఉన్న ఏకైక హిందు రాజ్యం. భారత దేశానికి ఉత్తరాన ఆనుకునే ఉన్న ఈ దేశంలోనికి అడుగు పెట్టాలంటే భారతీయులకు ఎటువంటి పాస్ పోర్టు / వీసా / ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదు. వాహనాలకు మాత్రం కొంత రుసుము తీసుకొని అనుమతిస్తారు. అదే విధంగా భారతీయులు నేపాల్ లో స్థిరాస్తులు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకనే నేపాల్ లో ఉన్న పెద్ద పెద్ద హోటళ్ళు వ్యాపారం భారతీయుల చేతిలోనే ఉంది. ఇదంతా నేపాల్ --- భారత దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జరుగు తున్నది. ఈ దేశంలో ఉన్న మొత్తం జనాభాలో ఎనభై శాతం హిందువులు. తక్కిన ఇరవై శాతంలో భౌద్దులు, ముస్లింలు, క్రిష్టియన్లు ఉన్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాలు ఇక్కడున్నాయి. అలాగే భౌద్దులకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలాలు ఇక్కడున్నాయి. హిందువులు, భౌద్దులు కలిసే ఉంటారు. ద్రవ్యం (కరెన్సి) నేపాల్ లోని ద్రవ్యమును కూడా రూపాయి అంటారు. భారత్ రూపాయిని ఐ.ఆర్ అని నేపాల్ రూపాయిని ఎన్.ఆర్. అని అంటారు. ద్రవ్య మారకానికి చాల చోట్ల అవకాశం ఉంది. కాని నేపాల్ లోని ప్రతి దుకాణంలోను, ఇతర ప్రదేశాలలోను భారత్ రూపాయిని తీసుకుంటారు. భారత్ రూపాయలు వందకు నేపాల్ రూపాయలు నూట అరవై ఇస్తారు. చిన్న నాణేలు అనగా పైసలు కూడా అక్కడ చలామణి లోవున్నాయి. భారత రూపాయి మారకానికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రవేశ ద్వారాలు భారత్ భూభాగంతో కలిసి ఉన్న నేపాల్ లోనికి ప్రవేశించడానికి చాలా భూమార్గాలున్నాయి. అన్నింటిలోకి ఘోరక్పూర్ వద్ద ఉన్న మార్గమే ప్రధాన మైనది. ఈ బార్డర్ లో ఇరువైపుల కలిసి ఉన్న గ్రామం పేరు సునౌలి ఇక్కడ అసాధరాణమైన భద్రతా ఏర్పాట్లేమి వుండవు. అక్కడి స్థానిక ప్రజలు మామూలుగానే అటు ఇటు తిరుగు తుంటారు. భారతీయులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నేపాల్ భూభాగంలోకి ప్రవేశించవచ్చు. కాని వాహనాలకు కొంత రుసుం కడితే లోనికి అనుమతిస్తారు. అలా నేపాల్ లోనికి ప్రవేశించిన వాహనాలు ఆ దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు. సరిహద్దు వద్ద నేపాల్ భూభాగం లోనికి ప్రవేశించిన పర్యాటకులకు సేద దీరడానికి, కాల కృత్యాలు తీర్చుకోడానికి అనేక ఏర్పాట్లుంటాయి. నేపాల్ భూబాగంలోనికి ప్రవేశించగానే ప్రత్యేకంగా కనిపించే విషయమేమంటే ఇంకా తెల్లవారకముందే అక్కడున్న చిన్న చిన్న అన్నశాలలు, సత్రాలు, బడ్డి కొట్టులు అన్ని తెరిచే వుంటాయి. ఆ దుకాణాల ముందు ఒక మేజా బల్ల వేసి దానిపై మద్యం సీసాలు పెట్టి వుంటారు. మందు బాబులు కూడా అప్పటికప్పుడు తమ పని కానిచ్చుకొని వెళు తుంటారు. మద్యంపై ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేదు. గ్రామాలు పంట పొలాలు సరిహద్దు నుండి కొంత దూరమే మైదాన ప్రాంతం. అక్కడక్కడ పల్లెలు పంట పొలాలు వుంటాయి. ఇక్కడ వరి ప్రధాన పంట. ఆ వరి చాల ముతక రకం. వ్యవసాయం సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతున్నది. కొండ వాలున కొన్ని అడుగుల వెడల్పున చదును చేసి అక్కడే వరి పండిస్తుంటారు. ఆ పొలాలు చూడ్డానికి చాల అందంగా కనబడుతుంటాయి. కొండలకు అందమైన మెట్లు చెక్కారా అని అనిపిస్తుంది. అటు వంటి కొండల పాద భాగన మంచి పారుతున్నా అది కొన్ని వందల అడుగుల లోతులో వున్నందున ఆ నీటిని పొలాలకు పారించ లేరు. కొండల పైనుండి జారు వారే నీటి ధారలే ఈ పంటలకు జల వనరులు. ఇటు వంటి నీటి ధారలు చిన్నచిన్నవి చాల ఎక్కువ. కొన్ని పెద్ద పెద్ద జలధారలు వుంటాయి అవి జలపాతాల్లాగా కనబడుతుంటాయి. ఈ కొండలలో ప్రజలు అన్ని రకాల కూరగాయలు, పండ్లు కూడా పండిస్తుంటారు. పల్లెలు చాల పలుచగా వుంటాయి. ఇళ్లు దూర దూరంగా వుంటాయి. కొన్ని చోట్ల పొలాల మధ్యలోనే ఇళ్లుంటాయి. ప్రతి ఇంటి ముందు బంతి పూల చెట్లుంటాయి. రోడ్లు విశాలంగా వున్నా అక్కడ తిరిగే వాహనాలు చాల పాతవి. జీపుల్లాంటి డొక్కు వాహనాలు, రిక్షాలు మొదలగునవి ప్రయాణ సాధనాలు. ఘాట్ రోడ్డు నేపాల్ దేశం కొండలమయమైనందున అక్కడ రోడ్డులన్ని ఘాట్ రోడ్డులే. కొండ వాలులో రోడ్డుకు సరిపడినంత మేర చదును చేసి కొండ వాలు వెంబడి వంకర టింకరగా మెలికలు తిరుగుతూ రోడ్లుంటాయి. బస్సులో వెళుతుంటే ఒకవైపు ఆకాశం అంతెత్తున్న కొండలు, మరొక వైపున పాతాళం కనిపిస్తున్నదా అన్నంత లోతున ప్రవహిస్తున్న నది ఇలా వందలాది మైళ్ల పర్యంతం కనబడుతూనే వుంటుంది. లోయలో ప్రవహిస్తున్న నదిలో అతి శుభ్రమైన నీరుంటుంది. ఆ నది కూడా అనేక మలుపులు తిరుగుతూ ఎగుడు దిగుడుగా నురగలు కక్కుతూ ప్రవహిస్తుంటుంది. ఆ నదిలో రాళ్లన్ని అతి నును దేలి కాలు పెడితే జారిపోయేటట్లుంటాయి. వాటినే సాలగ్రాం లంటారు. నదులు చిన్నవైనా అవి అతి వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ నదులలో సాహసికులు ప్రత్యేక బట్టలు వేసుకుని తలకు టోపి పెట్టుకొని రబ్బరు బోట్లలో పోటి పడుతుంటారు. కొండ వాలులో బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఇదొక ఆనంద కరమైన దృశ్యం. రోడ్డు ప్రయాణికులకు టీ, కాఫీ, అల్పాహారం అందించడానికి అక్కడక్కడా చిన్న చిన్న జనవాసాలుంటాయి. అక్కడే సాహసిక క్రీడలైన రాప్టింగ్ (నదిలో రబ్బరు బోట్ల పోటీ) ట్రెక్కింగ్ ( తాళ్ల సాయంతో కొండలనెక్కే సాహస క్రీడ) లకు కావలసిన సామాగ్రిని అద్దెకిచ్చే దుకాణాలుంటాయి. ఇటు వంటి నివాస ప్రాంతాలలో కూడా నీటి వసతికి నది అత్యంత లోతులో నున్నందున దానిపై ఆధార పడకుండా కొండలపై నుండి జాలువారే జలధారలకు పైపు తగిలించి వారి అవసరాలకు వాడుకుంటారు. ఈ రోడ్డు పై ప్రయాణించే ప్రయాణికులకు మరొక ఆశ్చర్యపరిచే వినోదం మరొకటి కనువిందు చేస్తుంది. అవతిలి కొండ వాలులో పంటలు పండించే రైతులు ఇవతల నుండి నదిని దాటి అటు పక్కకు వెళ్లాలంటే. కొన్ని వందల అడుగుల లోతుకు దిగి అతి వేగంగా ప్రవహించే నదిని దాటి తిరిగి ఆ కొండ నెక్కి తమ పొలాలకు వెళ్ళాలి. ఆ నది చిన్నదే అయినా అతి వేగంగా ప్రవహిస్తుంటుంది. అందులోని రాళ్లు అతి నునుపుగా కాలు జారేటట్టుంటాయి. ఇటు వంటి ప్రమాదాన్నుండి తప్పించుకోడానికి వారు ఒక ఉపాయం కనిపెట్టారు. ఇవతల కొంత దిగువన ఒక బలమైన స్థంభాన్ని పాతి దానికి సమాంతరంగ నదికి అవతిలి వైపున కూడా ఇలాంటి స్థంభాన్ని పాతి ఈ రెండు స్థంభాలను ఒక బలమైన ఇనుప మోకుతో అనుసందానిస్తారు. పైన చక్రాలు కట్టిన ఊయాల లాంటి ఒక పెద్దబుట్టను ఆ ఇనుప మోకుకు తగిలించి ఆ బుట్టలో కూర్చొని తమ చేతులతో ఆ ఇనుప మోకును తమవైపుకు లాగుతూ వుంటే తాము కూర్చున్న ఆ బుట్ట ముందుకు సాగి అవతలి గట్టుకు చేరుకుంటారు. ఇది ఎంతో సాహసంతో కూడిన ప్రమాదకరమైన పనిగా అనిపిస్తుంది. ఇటువంటి సాహసాలు దారి పొడుగునా కనబడుతూనే వుంటాయి. ఒక్కోచోట కేవలం ఒక మనిషే కోతిలాగ ఆ ఇనుప తాడును పట్టుకొని అవతలికి వెళ్లే సందర్భాలు కూడా చూడొచ్చు. ఇలా ఎన్నో ప్రమాద భరితమైన సాహాసాలు చూస్తు ప్రయాణిస్తున్న బస్సు ప్రయాణికులలు కూడా అత్యంత ప్రమాదం పొంచి వుంటుంది. అదేమంటే వర్షాకాలంలో కొండ చెరియలు విరిగితే అవి కచ్చితంగా ఆ రోడ్డు పైనే పడతాయి. వాహనాలపై పడితే ఇక చేయగలిగింది ఏమీలేదు. ఖాళీ రోడ్డుపై పడినా వాటిని తొలిగించేంత వరకు వారి ప్రయాణం వాయిదా పడాల్సిందే. పోక్రా లో దేవి జలపాతం నేపాల్ లోని ముఖ్యమైన పట్టణాలలో పోక్రా ఒకటి. ఇది అతి చిన్న పట్టణం. కొండ కోనల్లో కట్టిన ఇళ్లతో అందంగా కనబడుతుంది. ఈ పట్టణానికి ప్రాముఖ్యతను ఆపాదించడానికి మరొక కారణమున్నది. అది పట్టణానికి అల్లంత దూరంలో మంచుతో కప్పబడిని హిమాలయా పర్వతాలు. వెండి కొండలవలే ప్రకాశిస్తున్న ఆ హిమాలయాలను దగ్గర నుండి చూడడానికి విమాన ప్రయాణాన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ చిన్న విమానాలలో హిమాలయాలకు కొంత దగ్గరికి వెళ్లి తిరిగి వస్తాయి. ఈ పట్టణాన్ని స్విజ్డర్లాండుతో పోలుస్తారు. దీనికి ఆసియాలోని స్విజ్డర్ల్యాండు అని అంటారు. హిమాలయాల అందాలను చూడడానికి మంచి సమయం సూర్యోదయానికి కొంత ముందు దాని తర్వాత కొంత సమయం. ఆ సమయానికి పర్యాటకులు తాము బస చేసిన భవనాల పైకెక్కి హిమాలయాల అందాలను తిలకిస్తుంటారు. సూర్యోదయానికి ఇంకా కొన్ని నిముషాలుందనగా ఆకాశం ఎర్ర బడుతుంది. ఆ కాంతిలో ఆ మంచు కొండలు బంగారు కాంతితో మెరిసి పోతుంటాయి. ఆ బంగారు కాంతి పొద్దెక్కే కొద్ది రంగు మారి వెండి కొండ వలే వెలుగు లీనుతుంది. ఆదృశ్యం అత్యంత నయానంద కరం. ఈ పట్టణంలో మరొక వింత దేవి జలపాతం. సాధారణంగా జలపాతాలను క్రింద నుండి పైకి చూసారు. కాని ఈ జలపాతాన్ని పైనుండి క్రిందికి చూడాలి. అంటే కొండ పైకెక్కి చూడాలని కాదు. భూమి పైనుండే విశాలమైన బావిలోనికి చూడాలి. ఆ బావి చుట్టూ ప్రమాద నివారణ కొరకు ఇనుప పట్టీలతో కంచె ఏర్పాటు చేశారు. దాని అంచున నిలబడి బావి లోనికి చూడాలి. లోపల బావి దరి లోనుండి అతి పెద్ద జల ప్రవాహం వచ్చి చాల లోతున్న బావిలోనికి పడుతుంది. ఆ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. పర్యాటకులు నిలబడిన భూమి క్రింద సుమారు ఇరవై అడుగుల లోతోలోనుండి వచ్చి బావిలోనికి పడుతుంది. ఈ జలంతో ఆ బావి నిండి పోదు. ఆ వచ్చిన నీరు ఎలా వచ్చాయో అదే విధంగా భూమి లోపలికి వెళ్లి పోతాయి. అవి ఎక్కడ బయట పడతాయో. ఈ వింత జలపాతం పోక్రా పట్టణం మధ్యలోనే ఉంది. పోక్రాకు దిగువన కొంత మైదాన ప్రాంతమున్నది. అక్కడ వరి పంట పొలాలు ఎక్కువగా ఉన్నాయి. అల్లంత దూరంలో వున్న మంచు కొండల నుండి మంచు కరిగి వచ్చే నీరే వీరి పంటలకు సాగునీరు. ఆ నీరు అనేక చిన్న చిన్న కాలువగుండా స్వచ్ఛంగా ప్రవహిస్తుంటుంది. కాఠ్మండు కాఠ్మండు నగరం కొండల మధ్యన మైదాన ప్రాంతంలో ఉంది. ఇది ఈ దేశంలో అతి పెద్ద పట్టణం, దేశ రాజధాని కూడ. ఇక్కడ ఇది పెద్ద పట్టణమైనా భారతదేశంలో పట్టణాలతో పోలిస్తే ఇది చిన్నదే. బహుళ అంతస్తుల భవనాలు, భారీ కట్టడాలు చాల తక్కువ. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి డొక్కువి కూడాను. పాత జీపుల్లాంటి వాహనాలే ఇక్కడి ప్రయాణ సాధనాలు. కాఠ్మండులో ఒక ఆకర్షన అక్కడి జూద గృహాలు. వీటిని కాసినొ అంటారు. ఇక్కడ మద్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడుతారు. ఈ జూదం ఆడడానికే దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు. సాధారణ పర్యటకులు కూడా వెళుతుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగు సెంటర్లు కూడా ఉన్నాయి. కాని అవి ఎక్కువగా భారత్ లాంటి విదేశాల వర్తకులకు చెందినవే. అన్ని దేశాలకు చెందిన వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు. సామాన్యంగా ఇక్కడ తయారైన వస్తువులు అంటు ఏమి వుండవు. అన్ని విదేశాలవే. స్థానికుల కన్నా పర్యటకులే ఈ వస్తువులను కొంటుంటారు. ఇది కూడా అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి ఆదాయ వనరే. ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందు చేత రుద్రాక్షలు ఎక్కువగా, చాల చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటుంటారు. వాటిని పగల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండినట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయలుంటుంది. మనసులో అనుకొన్న కోరికలు తీర్చే మనోకామన thumb|right|మనోకామని గుడి, నేపాల్ పోఖారా నుండి ఖాట్మండు కు పోయే దారిలో ఈ మనో కామని ఆలయం ఒక పెద్ద కొండపై ఉంది. బస్సు రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నది లోనికి దిగ గలిగినంత లోతులోనే ఉంది. నదికవతల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై మనో కామిని ఆలయం వెలసి ఉంది. అక్కడికి వెళ్లడానికి రోప్ వే" ఏర్పాటు ఉంది. ఆ రోప్ కారులో వెళుతుంటే ఆదృశ్యం . క్రింద నది, లోయలు, కొండ వాలులో పంటలు చాల మనోహరంగా వుంటుంది. గతంలో ఈ ఆలయానికి వెళ్ల డానికి మెట్ల దారి వున్నట్లు తెలిపే మెట్ల వరుసలు ఇప్పటి కనబడతాయి. ఈ రో ప్ కారులో మనుషులతో బాటు గొర్రెలు కూడా వెళుతుంటాయి. కొండ కొసన పెద్ద ఆలయం ఉంది. ఇది పగోడ పద్ధతిలో ఉంది. ఈ ఆలయంకొరకు వెలసినదే ఇక్కడున్న చిన్న గ్రామం. ఇక్కడి పూజారులను పండితులు అంటారు. వారు భక్తులను దేవి చుట్టు కూర్చో బెట్టి పూజ చేయిస్తారు. చివరన పూలు ప్రసాదం ఇస్తారు. ఇక్కడి అమ్మవారు భక్తుల మనసు లోని కోరికలు తెలుసుకొని వాటిని నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ ప్రాంగణంలో పావురాలు ఎక్కువగావున్నాయి. వాటికి గింజలను మేతగా వేస్తారు. ఇది చాల పురాతన ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక జంతు వధ శాల ఉంది. ఇక్కడ తరచు దేవి కొరకు జంతు బలులు ఇస్తుంటారు. ఈప్రాంతం అంతా రక్త సిక్తంగా వుంటుంది. ఆ జంతువులు అనగా గొర్రెలు కూడా రోప్ కార్లలో రావలసిందే. ఇక్కడ చిన్న చిన్న హోటళ్లు ఉన్నాయి. అందులో ప్రతి టేబుల్ ముందు మద్యం బాటిళ్లు పెట్టి వుంటాయి. ఈ కొండ పై నుండి సుదూరంలో మంచుతో కప్పబడిని హిమాలయాలు కనబడు తుంటాయి. thumb|రోప్ కారు పశుపతినాధ్ ఆలయం ఇక్కడ చూడ వలసిన ప్రదేశాలు చాల ఉన్నాయి. అందులో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పశుపతినాథ్ దేవాలయం. ఇది శివాలయం. చాల విశాలమైనది. కాని చాలవరకు శిథిలమయం. ఇక్కడి ప్రధాన ఆలయం పగోడ ఆకారంలో చాల ఎత్తుగా వుంటుంది. ఇందులో గర్భాలయం చతురస్త్రాకారంలో వుండి నాలుగు వైపుల ద్వారాలు కలిగుంటుంది. మధ్యలో ఉన్న శివ లింగానికి నాలుగు వైపుల నాలుగు ముఖాలుంటాయి. అవి ధర్మార్థకామ మోక్షాలకు ప్రతీకలని నమ్మకం. నాలుగు ద్వారాల వద్ద నలుగురు పండితులు ఉండి పూజలు చేయిస్తుంటారు. ఇక్కడి పూజారులను పండితులు అని అంటారు. వీరందరు తెలుగు వారేనని అంటారు. వారు తరతరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ ఆలయంలోనికి హిందూవులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. కాని వచ్చే వారు హిందువు అవునో కాదో గుర్తించే ఏర్పాట్లేమి వుండవు. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది ఉంది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం ఉంది. అక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే వుంటాయి. గర్భ గుడికి ఎదురుగా అతి పెద్ద నంది ఉంది. ఆలయ ప్రాంగణంలో వివిధ మందిరాలలో కొంత మంది పండితులు భక్తులకు పూజలు వ్రతాలు చేయిస్తుంటారు. ఇక్కడ రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. రుద్రాక్ష మాలలు చాల చవకగా అమ్ముతుంటారు. భక్తులు ఒక రుద్రాక్ష మాలను కొని పూజారికిచ్చి దానిని గర్భ గుడిలోని శివుని పై వుంచి మంత్రాలు చదివి దానికి తిరిగి భక్తులకు ఇస్తారు. దాన్ని భక్తులు పవిత్రంగా భావించి ధరిస్తారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలలో అనేక దుకాణలాలలో ముత్యాలు, నవరత్నాలు, అనేక రంగుల పూసలు విక్రయిస్తుంటారు. విదేశీ యాత్రికులే వీటిని ఎక్కువగా కొంటుంటారు. మహావిష్ణు ఆలయం శేషశయనుని పై పవళించినట్లు ఉన్న మహావిష్ణువు నల్లరాతి భారీ విగ్రహం తక్కువ లోతు నీళ్లున్న కోనేరులో తేలియాడుతున్నట్లున్న ఈ దేవుని భక్తులు నీళ్లలోకి దిగి పూజలు చేస్తుంటారు. ఆ విగ్రహం చేతులలో శంఖు, చక్రం, గధ మొదలైన ఆయుధాలున్నాయి. ఇది స్వయంభువని, బుద్ధుని అవతారమని ఇక్కడి వారి నమ్మిక. ఇది చాల పురాతనమైనది. ఈ చుట్టు పక్కల ఉన్న దేవాలయాల శిథిలాలను చూస్తుంటే గతంలో ఇక్కడ అతి పెద్ద ఆలయం ఉండేదని అర్థం అవుతుంది. అతి పొడవైన రుద్రాక్ష మాలలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు. ముక్తినాథ ఆలయం హిందువులు పవిత్రంగా భావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్య ధామాలలో ముక్తినాథ ఆలయం 106 వది. పోక్రానుండి ముక్తినాధ్ ఆలయానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. అంతా గతుకుల బాట. చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవి కూడ వాతావరణం సరిగా లేకుంటే నడపరు. వాటిలో వెళ్లినా ఆ తర్వాత కూడా కొంత దూరం కాలి నడకన వెళ్లాల్సిందే. ఇది చాల కష్టతరమైన దారి ప్రయాసతో కూడుకున్న పని. ముక్తి నారాయణుడు స్వయంభువు. పద్మాసనంలో కూర్చొన్నట్లున్న మూర్తి. ఇక్కడ నూట ఎనిమిది ధారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటే నూట ఎనిమిది దివ్యధామాలు దర్శించుకున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక. సూర్యోదయ వీక్షణ ఖాట్మండుకు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉదయిస్తున్న సూర్యుని చూడడానికి ఒక కేంద్రం ఉంది. సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లే దారి సన్నగాను మలుపులు తిరిగి వుంటుంది. కనుక పెద్ద వాహనాలు వెళ్లలేవు. చిన్న వాహనాలలో వెళ్లాలి. ఈ కొండ పైనున్న ఒక హోటల్ లో యాత్రికులకు కావలసిన టీ, కాఫీ ఫలహారాల వంటి వసతులు చాల బాగా వుంటాయి. కొండ ఎత్తుగ వున్నందున సుదూర ప్రాంతం చక్కగా కనబడుతుంది. సూర్యోదయ సమయానికి మేఘాలు అడ్డు లేకుంటే ఆ సూర్యోదయ దృశ్యం చాల అద్భుతంగా ఉంటుంది. భక్తా పూర్ thumb|right|నేపల్ లో భక్తఫూర్ లో ఒక ఆలయం నేపాల్ దేశంలో భక్తాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరంలో చూడవలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం ఉన్నాయి. పశుపతినాధ్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడా ఇక్కడ ఉంది. అలాంటి దేవాలయాలు అనేకం ఉన్నాయి . కాని అన్ని శివాలయాలే. రాజ దర్బారు హాలు చాల గంభీరంగ ఉంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి ఉంది. ఇది ఆలయం లాగ కాకుండ నివాస గృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమే తెరుస్తారు. లోన అత్యంత సంపద ఉన్నట్లు స్థానికులు చెపుతారు. గర్భ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడ వీలున్నది. ఈ ప్రాంతంలోని కట్టడాలు అతి మనోహరంగా ఉన్నాయి. ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాలతో అనేక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడే నేపాల్ దేశం రాజకీయంగా అత్యంత వేడి. వాడి చర్యలు చాల ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే ఈ దేశం ఆర్థికంగా ఎదగక పోవడానికి కారణం. జాతులు, కులములు నేపాల్‌లో 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తము 103 (ఒక గుర్తు తెలియని జాతితో సహా) జాతులు/కులములు ఉన్నట్లు తేలినది. కులములు అనే పద్ధతి హిందూ మతము నుండి వచ్చింది. జాతుల విభజన అనేది, చారిత్రక విశేషాల వల్ల, వారికే ప్రత్యేకమైన ప్రాంతీయ ఊహాజనితమైన కథల వల్ల జరిగింది. 2001 జనాభా లెక్కల ప్రకారం ముఖ్యమైన కులాలు క్షత్రియ (ఛెత్రి) 15.8%, బ్రాహ్మణ (హిల్) 12.7%, మధేషి 33%, మగర్ 7.1%, తమంగ్ 5.6%, నేవార్ 5.5%, మహమ్మదీయ 4.3%, కామి 3.9%, (జాతులు) రాయ్ 3.9%, గురుంగ్ 2.8%, దమాయ్/ధోలి 2.4%. మిగతా 92 కులాలు/జాతులు 2% కన్నా తక్కువగా ఉన్నారు. వీళ్ళలోనే ప్రఖ్యాతి గాంచిన షెర్పాలు కూడా ఉన్నారు. పట్టణ జనాభా ప్రాంతము జిల్లా జనాభా 19911 జనాభా. 2001 సరాసరి పెరుగుదల 2005 అంచనా ఖాట్మండు ఖాట్మండు 414.264 671.846 4,7 807.300 లలిత్ పూర్ లలిత్ పూర్ 117.203 162.991 3,4 190.900 పోఖరా కాశీ 95.311 156.312 5,0 190.000 భిరత్ నగర్ మోరంగు 130.129 166.674 2,5 184.000 బిర్గంజ్ పార్ష 68.764 112.484 4,9 136.200 ధరన్ సంసారి 68.173 95.332 3,6 109.800 భరత్ పూర్ చిత్వాన్ 54.730 89.323 4,9 108.200 భూత్వాల్ రూపందేహి 44.243 75.384 5,3 92.700 మహేంద్రనగర్ కంచన్ పూర్ 62.432 80.839 2,7 89.900 జానక్ పూర్ ధనుషా 55.021 74.192 3,1 83.800 ధన్ గడి కైలాలి 45.094 67.447 4,1 79.200 భక్తపూర్ భక్తాపూర్ 61.122 72.543 1,7 77.600 హేతౌడా మక్వన్పూరు 54.072 68.482 2,4 75.300 త్రియుగ ఉదయపూర్ - 55.291 3,9 64.400 నేపాల్ గంజ్ బంకే 48.556 57.535 1,9 62.000 సిద్ధార్థ్ నగర్ రూపందేహి 35.456 52.569 2,9 58.900 మధ్యపూర్- తిమ్మి భక్తాపూర్ - 47.751 4,0 55.900 మేచి నగర్ జప - 49.060 2,8 54.800 గులరియ బర్డియ - 46.011 4,1 50.700 త్రిభువన నగర్ దంగ్దౌకురి 29.152 43.126 4,0 50.500ఇటహ సంసారి - 41.210 4,3 48.800 లేన్కత్ కాశీ - 41.369 3,2 46.900 టికాపూర్ కైలాలి - 38.722 4,1 45.500కీర్తిపూర్ ఖాట్మండు - 40.845 2,7 45.400రత్నానగర్ చిత్వాన్ - 37.791 4,1 44.500కమలమయి సింధూలి - 32.828 5,3 40.400కలైయా బర 17.265 32.260 5,6 40.100తులసీపూర్ దంగ్దేఖురి 20.752 33.876 4,0 39.600భీరేంధ్ర నగర్ సుర్ఖేట్ 22.888 31.381 3,1 35.500 దమక్ జప 41.419 35.009 -1,7 35.000రాజ్ బిరాజ్ సప్తరి 23.847 30.353 2,3 33.200కపిలబస్తు కపిలబస్తు 17.146 27.170 4,6 32.500 బ్యాస్ తనహు 20.175 28.245 3,4 32.300లహన్ సిరాహ 19.046 27.654 3,8 32.100పుతలిబజార్ స్యంజ - 29.667 1,4 31.400ప్రుథ్వినారాయణ్ గోర్ఖా - 25.738 2,2 28.100 పనౌటి కభ్రేపలంచోక్ - 25.563 2,4 28.100 గౌర్ రౌతహట్ 23.258 25.383 2,2 27.700 దీపాయల్-సిల్గధి దోటి 12.259 22.061 5,8 27.600ఇనరువ సన్సరి 18.562 23.200 2,2 25.300 సిరాహ సిరాహ - 23.988 1,0 25.000రాంగ్రాం నవల్ పరసి - 22.630 1,8 24.300 తాన్సేన్ పల్ప 13.617 20.431 4,0 23.900 జలేశ్వర్ మహోత్తరి 18.161 22.046 2,0 23.900 భగ్లంగ్ భగ్లంగ్ - 20.852 3,2 23.700భీమేశ్వర్ డోలఖ - 21.916 1,3 23.100 ఖడ్బరి సంకువసభ - 21.789 1,5 23.100 ధనుకుట ధనుకుట 17.155 20.668 1,9 22.300 బీదుర్ నువాకోట్ 18.862 21.193 1,3 22.300 వలింగ్ స్యంజ - 20.414 2,0 22.100 నారాయణ్ దైలేఖ్ - 19.446 2,1 21.100 మలంగ్వ సర్లహి 13.666 18.484 2,7 20.600 భధ్రపూర్ జప 15.123 18.145 1,8 19.500 అమరగడి దడేల్ధుర - 18.390 1,1 19.200 దశరథచండ్ భైతడ్ - 18.345 0,2 18.500 ఇలాం ఇలాం 13.150 16.237 2,1 17.600 బనేప కభ్రేపలంచోక్ 12.622 15.822 2,3 17.300 ధులికేల్ కభ్రేప్లంచోక్ 9.664 11.521 1,6 12.300 మొత్తం పట్టణ జనాభా 1.742.359 3.197.834 3,5 3.545.500 increase 91-01 for first 36 mun. 1.742.359 2.528.218 1991 నాటికి కేవలం 36 మున్సిపాలిటీలు మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి సెలవు దినాలు నేపాల్‌కు నాలుగు పంచాంగాలు ఉన్నాయి. ప్రభుత్వపు సౌర మాన పంచాంగము, చంద్రమాన పంచాంగము, నేపాలి సాంప్రదాయ పంచాంగము, పాశ్చాత్య పంచాంగము. నేపాల్ మతపరమైన సెలవు దినాలన్నీ చాంద్రమాన పంచాంగము ప్రకారము ఉంటాయి. అందువల్ల నేపాలీలకు సెలవు దినాల కోసమై ఒక స్థిరమైన తేదీలు అంటూ ఉండవు. సాధారణంగా రెండు ముఖ్యమైన సెలవు దినములు దషైన్, తిహార్‌లు, అక్టోబరు, నవంబరు మాసాలలో వస్తాయి. ఇవి కూడ చూడండి హేరంబ బయటి లింకులు Essay on Nepal in Nepali Language నేపాలి రాజ్య అంతర్జాలం CIA World Factbook సి.ఏ.ఐ> వెబ్ సైటులో నేపాల్ (2000) నేపాలి జనాభా నివేదిక (2002) నేపాలి వార్తలు నేపాలి టైమ్స్ Newslook Magazine Newa Post NepalOnline.com Free Expression in Nepal Kantipur Online City Times United We Blog! International Nepal Solidarity Network Samudaya FreeNepal.org myfreenepal మరిన్ని విషయాలకు ఈక్రింద ఉన్న రచనలు చూడండి Barbara Crossette. 1995. So Close to Heaven: The Vanishing Buddhist Kingdoms of the Himalayas''. New York: Vintage. (ISBN 0679743634) Bista, Dor Bahadur. The Peoples of Nepal Peter Matthiessen.1993, "The Snow Leopard". (ISBN 0-00-272025-6) Joe Simpson. 1997. "Storms of Silence" Samrat Upadhyay. 2001. "Arresting God in Kathmandu" Joseph R. Pietri.2001. "The King of Nepal" Maurice Herzog.1951. "Annapurna" Dervla Murphy.1967. "The Waiting Land" Jon Kraukauer.1997. "Into Thin Air" Indra Majupuria.1996. "Nepalese Women". (ISBN 974-89675-6-5) Dor Bahadur Bista.1996. "People of Nepal". Kathmandu. Eva Kipp.1995. "Bending Bamboo Changing Winds". (ISBN 81-7303-037-5) Broughton Coburn.1982/1991. "Nepali Ama". (ISBN 0-918373-74-3) వర్గం:నేపాల్ వర్గం:ఆసియా వర్గం:భూపరివేష్టిత దేశాలు వర్గం:హిందీ మాట్లాడే దేశాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
పాకిస్తాన్
https://te.wikipedia.org/wiki/పాకిస్తాన్
పలు సంస్కృతులు ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతం పురాతన సంస్కృతులకు పుట్టిల్లు. మేహర్గర్ నియోలిథిక్, కాంశ్య యుగం సింధు నాగరికత, తరువాత పలు మతాలు, సంస్కృతులకు రాజుల పాలన కొనసాగింది. వీరులో హిందువులు, ఇండో – గ్రీక్, ముస్లిములు, తింరిద్ (టర్కో మొఘలు,ఉ), ఆఫ్ఘన్లు, సిక్కులు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని పలు రాజవంశాలు పాలించాయి. ఇది పలు సామ్రాజ్యాలలో భాగంగా ఉండేది. ఇది మయూర సామ్రాజ్యం, ఆచ – ఎమెనిద్ (పర్షియా), అలెగ్జాండర్ పాలనలో ఉంది. ముహమ్మద్ అలీ జిన్నాభారతద్వీపకల్పం సాగించిన స్వతంత్ర సమరం తరువాత 1947 లో పాకిస్థాన్ ముస్లిం రాజ్యంగా అవతరించింది. ముందు భారతదేశ తూర్పు – పశ్చిమం లలో ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాలు పాకిస్థాన్‌గా ఉండేది. 1956 లో పాకిస్తాన్ "కాంస్టిట్యూట్ ఆఫ్ పాకిస్తాన్" పేరుతో ఇస్లామిక్ రిపబ్లిక్ విధానం స్వీకరించింది. 1971 బంగ్లాదేశ్ స్వతంత్ర సమరం తరువాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశంగా అవతరించింది.Apply Here For Nadra Birth Certificate Pakistan And Apply Here For Degree Attestation From Pakistan Online Attestation Pakistan పాలన పాకిస్థాన్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్లు కలిగిన ఫెడరేషన్ పార్లమెంటరీ రిపబ్లిక్ పాలనా విధానం కలిగి ఉంది. పాకిస్థాన్ సప్రదాయ , భాషాపరమైన వైవిధ్యం కలిగిన దేశం. అలాగే పాకిస్థాన్ భౌగోళికంగా , భాషాపరంగా వైవిధ్యం కలిగి ఉంది. అలాగే కేంద్రీకృత అధికారవిధానం కలిగి ఉంది. పాకిస్థాన్ "స్టాండింగ్ ఆర్మీ ఫోర్స్" కలిగిన జాబితాలో 7వ స్థానంలో ఉంది. అలాగే పాకిస్థాన్‌కు న్యూక్లియర్ పవర్ అలాగే న్యూక్లియర్ ఆయుధసంపత్తి కలిగిన దేశాలలో చోటు కల్పించబడింది. న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన ఒకేఒక ముస్లిం దేశంగా గుర్తించబడుంది. న్యూక్లియర్ ఆయిధాలు కలిగిన దక్షిణాసియా దేశాలలో రెండవస్థానంలో ఉంది. పాకిస్థాన్ అర్ధపారిశ్రాకరణ చేయబడిన ఆర్ధికవ్యవస్థ కలిగి ఉంది. అలాగే చక్కగా ఏకీకృతం చేయబడిన వ్యవసాయరగం కలిగినదేశంగానూ, ఆర్ధికపరంగా జి.డి.పి అభివృద్ధిలో అంతర్జాతీయంగా 26వ దేశంగానూ, కొనుగోలు శక్తిలో జి.డి.పి అభివృద్ధిలో అంతర్జాతీయంగా 45వ స్థానంలోనూ, ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగానూ పాకిస్థాన్ గుర్తించబడుతుంది. స్వాతంత్ర్యం తరువాత స్వాతంత్రం తరువాత పాకిస్తాన్ అధికంగా సైనిక పాలిత దేశాలలో ఒకటిగా గుర్తించబడుతోంది. ఇండో- పాక్ యుద్ధాలు, రాజకీయ అస్థిరత కలిగిన దేశంగా గుర్తించబడుతోంది. పాకిస్థాన్ అధిక జనసంఖ్య, తీవ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత,లంచగొండితనం మొదలైన సవాళ్ళను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ 2012 లో హ్యాపీ ప్లానెట్ జాబితాలో 16వ స్థానంలో ఉంది. పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి సభ్యత్వం, కామన్‌వెల్త్ దేశం, నెక్స్ట్ లెవెన్ ఎకనమీ, ఎకనమిక్ కోపరేషన్, యునైట్జింగ్ ఫర్ కాంసెన్సస్, కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. డెవలపింగ్ 8, కైర్ంస్ గ్రూప్, క్యోటో ప్రొటొకోల్, ఇంటర్నేషనల్ కొవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, రీజియనల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్‌మెంటు, యు.ఎన్.సి.హెచ్,ఆర్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ వెస్టుమెంటు బ్యాంక్, గ్రూప్ ఆఫ్ లెవెన్, చైనా- పాకిస్తాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, గ్రూప్ 24, జి 20 డెవలపింగ్ నేషన్స్, ఇ.సి.ఒ.ఎస్.ఒ.సి, ఫండింగ్ మెంబర్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్, సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కార్పొరేషన్, సి.ఇ.ఆర్, ఎన్ సభ్యత్వం కలిగి ఉంది. కొత్త రాజధాని పాకిస్థాన్‌లో త్వరలో జంట రాజధాని నగరాలు ఏర్పడనున్నాయి. అందమైన మార్గల్లా పర్వత శ్రేణుల్లో కొత్తగా రాజధాని నగర నిర్మాణానికి చకచకా చర్యలు ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్‌కు సొరంగ మార్గం ద్వారా అనుసంధానం చేయనున్నారు. దీంతోపాటు సుమా రు రూ.77 వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టులో పలు నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇది అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించడంతో రాజధాని అభివృద్ధి అథారిటీ (సీడీఏ) ఈ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.రావల్పిండి-ఇస్లామాబాద్ మధ్య రెండు రింగు రోడ్డులు, రావల్పిండిలోని రావత్ వద్ద ఒక కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. బ్లూ ఏరియా నుంచి రావత్ వరకూ ఉన్న ఇస్లామాబాద్ హైవేను 8 నుంచి పది లైన్లకు విస్తరించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్డు తరహాలో బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలను కూడా నిర్మించనున్నారు. ఇస్లామాబాద్ హైవేకు ఇరువైపుల ఉన్న ప్లాట్లను వాణిజ్య అవసరాలకు ఇవ్వడం ద్వారా భారీ మొత్తంలో డాలర్లను రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విదేశీ పెట్టుబడిదారులను, ముఖ్యంగా ప్రవాస పాకిస్థానీయులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. పాక్‌ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర పాక్‌లో త్వరలో తీసుకురానున్న 232వ రాజ్యాంగ సవరణ ద్వారా "అత్యవసర పరిస్థితి విధింపు", "న్యాయమూర్తుల, ముఖ్య ఎన్నికల అధికారి నియామకం" వంటి అధ్యక్షుడి అసాధారణ అధికారాలకు కత్తెర వేయనున్నారు. రాష్ట్ర శాసనసభలను సంప్రదించకుండా అధ్యక్షుడు తనంత తానుగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించలేరు. అలాకాకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే దానికి పార్లమెంటు ఉభయసభలు 10రోజుల వ్యవధిలో ఆమోదముద్ర వేస్తేనే అమల్లోకి వచ్చే విధంగా ముసాయిదాలో పొందుపరిచారు. Maxbet ఆరోపణలు పాకిస్తాన్ నుంచి ఉత్తరకొరియా, లిబియా వంటి దేశాలకు అణుపరిజ్ఞానం అక్రమముగా తరలించిదని ఆరోపణలు ఉన్నాయి. వివాదాలు భారతదేశముతో 1947 నుంచి కాశ్మీరు గురించి వివాదము నడుస్తోంది. కషిమిర్ వివాదం purthiayyindhe Kashmir eka India de భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరు వివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999 (కార్గిల్)) అలాగే భారత్, చైనా దేశాల మధ్య 1962 (బ్రిటిష్ వలస పాలన కాలములో భారత చైనాలను విదదీసే మెక్ మెహాన్ రేఖను చైనా గుర్తించనందుకు) యుద్ధానికి కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది. కాశ్మీరులో భాగమైన గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్‌ 1947లో ఆక్రమించింది. ఇప్పటి వరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్‌ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది. ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్‌ చైనాకు అప్పగించింది. అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్‌ రవాణా మార్గంలో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ భూభాగం ఉంది. భారత్‌-పాక్‌ను సన్నిహితం చేద్దాం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇరుదేశాలకు చెందిన ఏడుగురు మాజీ మంత్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్‌కు చెందిన జశ్వంత్‌సింగ్‌, నట్వర్‌సింగ్‌, మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్‌ నుంచి ఖుర్షీద్‌ ఎం.కసూరీ, సర్తాజ్‌ అజీజ్‌, అబ్దుల్‌ సత్తార్‌, గొహర్‌ అయూబ్‌ఖాన్‌ ఇరుదేశాల మధ్య నలుగుతున్న కాశ్మీర్‌ వ్యవహారం, జలాల పంపిణీ, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై వారు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇకపై ప్రతిఏటా సమావేశం కావాలని నిర్ణయించారు. పేరువెనుక చరిత్ర పాకిస్థాన్ పేరులోని పాక్ అంటే ఉర్దూ, పాష్తొ , పర్షియాలలో స్వచ్చత అని అర్ధం. స్థాన్ అంటే ప్రదేశం అని అర్ధం. పాకిస్థాన్ అంటే స్వచ్చమైన ప్రదేశం అని అర్ధం. స్థాన్ అనే పర్షియన్ పదానికి మూలం సంస్కృత స్థాన్ (సంస్కృతం (దేవనాగర్): स्थान) అని భావిస్తున్నారు.1933 లో మొదటిసారిగా పాకిస్థాన్ స్వాతంత్ర సమర యోధుడు చౌద్రీ రహ్మత్ అలి ఒక కరపత్రంలో "పాకిస్థాన్ డిక్లెరేషన్" పేరును పేర్కొన్నాడు., పాక్స్థాన్‌లో 3 కోట్లమంది ముస్లిములు నివసిస్తున్నారని పేర్కొన్నాడు. ఇందులో సౌత్ ఆసియా బ్రిటిష్ రాజ్ లోని పంజాబు, ఖైబర్, పఖ్తుంఖ్వల్, కాశ్మీరి, సింధీ, బలూచిస్థాన్ ప్రాంతాలు పేర్కొనబడ్డాయి. పాక్(pak) అనే పదానికి సులువుగా పలకడానికి ,అర్ధవంతం చేయడానికి పేరులో ఐ "i" చేర్చబడింది. చరిత్ర ఆరంభ , మద్యయుగం thumb|150px|right|Standing Buddha from Gandhara దక్షిణాసియాలోని పురాతన మానవ సంస్కృతులలో పాకిస్థాన్ సంస్కృతి ఒకటి.Petraglia, Michael D.; Allchin, Bridget (2007), "Human evolution and culture change in the Indian subcontinent", in Michael Petraglia, Bridget Allchin, The Evolution and History of Human Populations in South Asia: Inter-disciplinary Studies in Archaeology, Biological Anthropology, Linguistics and Genetics, Springer, ISBN 978-1-4020-5562-1 పాకిస్థాన్‌లో నివసించిన వారిలో ఆరంభకాల పాలియోలిథిక్ కాలానికి చెందిన సొయానియన్లు ప్రధములని విశ్వసిస్తున్నారు. పంజాబు లోని సొయాన్ లోయలో వారు ఉపయోగించిన రాతి పనిముట్లు లభించాయి. పాకిస్థాన్‌లోని అధికభూభాగంలో ప్రవహిస్తున్న సింధూనది ప్రవాహిత ప్రాంతంలో పలు సంస్కృతులు విలసిల్లాయి. నియోలిథిక్ మెహర్గర్ వీటిలో ఒకటి. కాంశ్య యుగంలో మెహంజుదార్, హరప్పాలోని సింధూనాగరికత (క్రీ.పూ 2800–1800) కూడా వీటిలో మరొకటి. వేదకాలం వేదకాలం (క్రీ.పూ 1500–500) ఇండో - ఆర్యన్ సంస్కృతిగా వర్గీకరించబడింది. ఇది హిందూయిజం నుండి జనించింది. హిందూయిజం ఈ ప్రాంతంలో చక్కగా విలసిల్లింది. ముల్తాన్ ప్రముఖ్య హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. వేద సంస్కృతి పంజాబుకు చెందిన తక్షశిలలోని (ప్రస్తుతం పంజాబు లోని తక్షిల) గాంధారం వద్ద వికసించింది. క్రీ.పూ 519 లో ఈ ప్రాంతాన్ని పర్షియన్ సామ్రాజ్యం, క్రీ.పూ 326లో అలెగ్జాండర్ పాలించారు. చంద్రగుప్తుడు స్థాపించిన మౌర్యసామ్రాజ్యం తరువాత క్రీ.పూ 185 లోఅశోకుడు ఈప్రాంతాన్ని పాలించారు. బాక్ట్రియాకు చెందిన డెమెట్రియస్ క్రీ.పూ 180-165 లో స్థాపించిన ఇండో- గ్రీక్ రాజ్యంలో పంజాబ్, గాంధార భాగం అయ్యాయి. క్రీ.పూ 165-150 నాటికి మెనందర్ దీనిని విస్తరించాడు. తరువాత ఈ ప్రాంతంలో గ్రేకో – బుద్ధిజం సంస్కృతి వికసించింది. తక్షశిల పురాతనమైన విద్యాసంస్థగా ,అత్యున్నత విద్యను అందించిన విద్యాసంస్థగా అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. మద్య యుగం మద్యయుగం (సా.శ. 642–1219) ఈ ప్రాంతంలో ఇస్లాం వ్యాపించింది. ఈ సమయంలో సూఫీ మిషనరీలు అధికసంఖ్యలో బౌద్ధులను , హిందువులను ఇస్లాం మతానికి మార్చడంలో కీలకపాత్ర వహించారు. సింధు ప్రాంతంలో రాయ్ రాజవంశం (సా.శ. 489–632) ఈ ప్రాంతాన్ని పరిసర ప్రాంతాలతో చేర్చిపాలించింది. ధర్మపాలా, దేవపాలా ఈప్రాంతాన్ని పాలించిన చివరి బౌద్ధపాలకులుగా గుర్తించబడుతున్నారు. పాలా సామ్రాజ్యంలో బంగ్లాదేశ్ ఉత్తరభారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ భాగంగా ఉంది. ముహమ్మద్ బీన్ కాశిం సా.శ. 711 ముహమ్మద్ బీన్ కాశిం విజేత సింధూలోయలోని పాకిస్థాన్‌ పంజాబు, ముల్తాన్ ప్రాంతాలను జయించాడు. పాకిస్థాన్ ప్రభుత్వ చారిత్రక ఆధారాలు పాకిస్థాన్ తకెత్తడానికి ఇది పునాదిగా ఉందని తెలియజేస్తున్నాయి. ఈ విజయం తరువాత భారత ద్వీపకల్పంలో పాలన సాగించిన ముస్లింల విజయానికి వేదిక తయారుచేసింది. తరువాత (సా.శ. 975–1187) లో ఘజ్నావిద్ సామ్రాజ్యం, ఘోరిద్ రాజ్యం, (సా.శ. 1206–1526) ఢిల్లీ సుల్తానేట్ ఈ ప్రాంతాన్ని కూడా పాలించాయి. తరువాత సుల్తానేట్ స్థానంలో (సా.శ. 1526–1857) నుండి ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. మొఘల్ పాలకులు ఈ ప్రాంతంలో పర్షియన్ సంప్రదాయం,ఉన్నతస్థాయి ఇండో- పర్షియన్ సంస్కృతి ప్రవేశపెట్టాయి. 16వ శతాబ్దం ఆరంభంలో ఈ ప్రాంతం భారతీయ మొఘల్ పాలకుల పాలనలో ఉంది. 18వ శతాబ్దం నాటికి యురేపియన్ ప్రభావం అధికరించి మొఘల్ పాలన వాణిజ్యపరంగా, రాజకీయ పరంగా క్షీణించింది. ఈస్టిండియా కపెనీ thumb|Edwin Lord Weeks illustration of an open-air restaurant near Wazir Khan Mosque, Lahore. ఈ సమయంలోనే ఈస్టిండియా కంపెనీ సముద్రతీర స్థావరాలు ఏర్పరచుకున్నది.Metcalf, B.; Metcalf, T. R. (9 October 2006), A Concise History of Modern India (2nd ed.), Cambridge University Press, ISBN 978-0-521-68225-1 సముద్రం మీద ఆధిపత్యం, గొప్ప వనరులు, సాంకేతికత ఈస్టిండియా కంపెనీ సమీకరించిన సైనికశక్తి రక్షణ బ్రిటిష్ ప్రభుత్వం భారతద్వీపకల్పంలో కంపెనీ పాలనకు అనుమతించేలా చేసింది. 1765 నాటికి భారతద్వీపకల్పం మీద యురేపియన్ల ఆధిపత్యం అధికరించింది.Asher, C. B.; Talbot, C (1 January 2008), India Before Europe (1st ed.), Cambridge University Press, ISBN 978-0-521-51750-8 1820 నాటికి బ్రిటిష్ శక్తి బెంగాల్ వరకు విస్తరించడంతో సైనిక శక్తిని పెంచుకోవడానికి అనుకూలమైన భూభాగాన్ని తమభూభాగంతో విలీనం చేసుకోవడానికి అనుకూలించింది. చరిత్రకారులు ఇది కాలనీ పాలనకు ఆరభబిందువని వర్ణిస్తున్నారు. ఈ సమయానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఈస్టిండియా కంపెనీకి లభించిన మద్దతుతో ఈస్టిండియా కంపెనీకి మరింత విశ్వాసంతో విద్య, సాంఘిక సంస్కరణలు , సంస్కృతికరంగం మొదలైన ఆర్ధికేతర రంగాలలో శక్తివంతగా ప్రవేశించడానికి అవకాశం లభించింది. 1835 లో "ఇంగ్లీష్ ఎజ్యుకేషన్ యాక్ట్" (1845) , ఇండియన్ సివిల్ సర్వీస్ వంటి సంస్కరణ అమలుచేయబడింది.Jalal, Ayesha (1994). The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge UK: Cambridge South Asian Studies. భారతీయ ద్వీపకల్పంలోని భారతీయ ముస్లిములు విద్యను అభ్యసించడానికి సంప్రదాయకమైన మదరసాలకు ఆగ్లేయులు మద్దతు ఇవ్వలేదు. తరువాత దాదాపు మదరసాలు అన్ని నిధులు సహాయం కోల్పోయాయి.Stephen Evans, "Macaulay's minute revisited: Colonial language policy in nineteenth-century India," Journal of Multilingual and Multicultural Development (2002) 23#4 pp. 260–281 కాలనీ పాలన 18వ శతాబ్దం ఆరంభంలోనే మొఘల్ సామ్రాజ్యం క్రమంగా పతనం చెందడం ప్రారంభం అయింది. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం భారతద్వీపకల్పం అంతటి మీద ఆధిపత్యం సాగించే వరకు సిక్కుల ప్రాభవం అధికం అయింది.1857 లో భారతీయ తిరుగుబాటు 1857 (సిపాయీల తిరుగుబాటూ) ఈ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం , క్వీన్ విక్టోరియాలకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద సైనికచర్యగా గుర్తించబడుతుంది. హిందూయిజం , ఇస్లాం అనుయాయుల మద్య మతకహాలు అధికమై హిదూ ఇస్లామిక్ సంబంధాలు క్షీణించడం వలన బ్రిటిష్ పాలనకు ప్రధాన సమస్యగా పరిణమించింది. హిందీ- ఉర్దూ వివాదాలు హిందువులు , ముస్లిముల మద్య సంఘర్షణలను మరింత అధికం చేసింది. బెంగాలి పునరుజ్జీవనం సంప్రదాయ హిందూయిజ ఙానం జాగరూకమైంది. అలాగే అది బ్రిటిష్ ఇండియన్ సామారాజ్య సాంఘిక , రాజకీయాల మీద కూడా గొప్పగా ప్రభావం చూపింది. బెంగాలీ పునరుజ్జీవనం ఎదుర్కోవడానికి సయ్యద్ అహ్మద్ ఖాన్ నాయకత్వంలో అలిఘర్ ఉద్యమం నిర్వహించబడింది. ఫలితంగా 1901 లో "ఇండియన్ ముస్లిం లీగ్" స్థాపించబడింది. తరువాత రెండుదేశాల విధానాన్ని ముస్లిం లీగ్ ఆదరించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ వ్యతిరేక విధానం, బ్రిటిష్ విలువలను స్వీకరించిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ భవిష్యత్తు పాకిస్థాన్ సాంఘిక విధానం రూపొందించాయి.byQureshi, M. Naeem Pan-Islam in British Indian politics, pp. 57,245 by M.Naeem Qureshi మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వ్యతిరేక విధానం హిందూ జర్మన్ కుట్ర మొదలైన వివాదాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , జర్మన్ దేశాలమద్య సయోధ్య కలేగేలా చేసాయి.Chirol, Valentine (2006), Indian Unrest, Adamant Media Corporation, ISBN 0-543-94122-1. జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో అహింసా విధానంలో స్వరంత్ర పోరాటం దేశావ్యాప్తంగా వ్యాపించింది. ఈ విధానంలో మూకుమ్మడి పోరాటాలలో లక్షలాది ప్రజలు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1920 లో క్విట్ ఇండియా ఉద్యమం , 1930 లో సహాయనిరాకరణోద్యమాలలో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ముస్లిం లీగ్ 1930 నాటికి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ క్రమంగా పెద్ద ఎత్తున ప్రజాదరణ సంపాదించింది. 1930 డిసెంబరు 29న ముహమ్మద్ ఇక్బాల్ ముస్లిములు అధికంగా ఉన్న వాయవ్యభారతంలో ఉన్న పంజాబు (పాకిస్థాన్), వాయవ్య భూభాగం (1901–55), సింధు , బలూచీ స్థాన్ వీలీనం కావాలని పిలుపు ఇచ్చాడు. పాకిస్థాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలి జిన్నా ప్రధానంగా రెండు దేశాల విధానాన్ని బలపరిచాడు. తరువాత ముస్లిం లీగ్‌ను 1940 లాహోర్ నిర్ణయం (పాకుస్థాన్ నిర్ణయం) వైపు నడిపించాడు. రెండవ ప్రపంచం యుద్ధం, ముహమ్మద్ ఆలి జిన్నా , ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యునైటెడ్ కింగ్డంకు మద్దతు ఇచ్చింది. క్యాబినెట్ మిషన్ 1946 లో భారత్‌లో క్యాబినెట్ మిషన్ విఫలం అయింది. తరువాత యునైటెడ్ కిండం భారత్‌లో 1946 - 47 లలో " బ్రిటిష్ రాజ్ " ముగింపుకు వస్తుందని సూచనలు అందజేసింది. . బ్రిటిష్ ఇండియాలో జాతీయ కాంగ్రెస్ లోని నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, ఆల్ ఇండియ ముస్లిం లీగ్ లోని ముహమ్మద్ ఆలి జిన్నా , సిక్కులకు నాయకత్వం వహించిన తారాసింగ్ మొదలైన భారతీయ జాతీయవాదులు 1947 జూన్ మాసంలో స్వతంత్రం , అధికార పరివర్తన షరతుల గురించి సంప్రదింపులు జరిపారు.1947 లో యునైటెడ్ కింగ్డం భారత్ విభజనకు అంగీకారం తెలిపింది. ఆగస్ట్ 14 న వాయవ్య భారతం , తూర్పు భారతంలోని అధికసంఖ్యాకులైన ముస్లిం ప్రజలను కలుపుకుంటూ పాకిస్థాన్ అవతరించింది. బలూచీస్థాన్, తూర్పు బెంగాల్, వాయవ్య సరిహద్దు భూభాగం (1901–55), పంజాబు (పాకిస్థాన్) , సింధ్ భూభాగాలు పాకిస్థాన్‌లో భాగం అయింది. భారత్ విభజన కారణంగా పంజాబ్ , బెంగాల్ లలో తీవ్రమైన మతకలహాలు చెలరేగాయి. లక్షలమంది ముస్లిములు పాకిస్థాన్‌కు తరలి వెళ్ళారు లక్షలాది హిందువులు , సిక్కులు భారత్‌కు తరలి వచ్చారు. రాజస్థానం జమ్ము కాశ్మీర్ వివాదం " మొదటి కాశ్మీర్ యుద్ధం (1948) కి దారితీసింది. స్వతంత్రం ఆధునిక పాకిస్థాన్ thumb|left|The American CIA film on Pakistan made in 1950 examines the history and geography of Pakistan. 1947 లో భారత్ నుండి విభజించిన పాకిస్థాన్ రూపుదిద్దుకున్న తరువాత ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అద్యక్షుడు ముహమ్మద్ ఆలి జిన్నా "పాకిస్థాన్ గవర్నర్ జనరల్ " అయ్యాడు. అలాగే పాకిస్థాన్ పార్లమెంటుకు మొదటి స్పీకర్ అయ్యాడు. ఫండింగ్ ఫాదర్స్ ఆఫ్ పాకిస్థాన్ లైక్వత్ ఆలీ ఖాన్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ జనరల్ సెక్రెటరీ కావడానికి అంగీకరించారు. అలాగే లైక్వత్ ఆలీ ఖాన్ పాకిస్థాన్ ప్రధమ ప్రధానమత్రి స్థానం కూడా అలంకరించాడు. 1947 లో ఆరవ జార్జ్ భారత చక్రవర్తి పదవిని త్యజించిన తరువాత పాకిస్థాన్ కామంవెల్త్ దేశాలలో ఒక రాజ్యంగా మారింది. 1952 ఫిబ్రవరి 2న ఆరవ జార్జ్ మరణం తరువాత రెండవ ఎలిజబెత్ పాకిస్థాన్ రాణి అయింది. 1956 లో పాకిస్థాన్ కాంస్టిట్యూషన్ అంతస్థు పొందే వరకు పాకిస్థాన్ కామంవెల్త్ దేశాలలో ఒకటిగా ఉంది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఇస్కందర్ మిర్జా " టూ మాన్ రూల్ " స్థానంలో ఆర్మీ చీఫ్ పాలన అమలైన తరువాత పాకిస్థాన్ స్వతంత్రం ప్రశ్నార్ధకంగా మారింది. తరువాత అధ్యక్షుడు ఇస్కందర్ పాలన తొలగించి మిర్జా ఆర్మీ చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ పాకిస్థాన్ పాలన స్వాధీనం చేసుకున్నాడు. 1962 లో అధ్యక్షపాలన అమలైన తరువాత పాకిస్థాన్ ఆర్ధికరంగం గుర్తించతగినంగా అభివృద్ధి చెందింది. 1965 లో రెండవ ఇండో – పాక్ యుద్ధం తరువాత పాకిస్థాన్ ఆర్ధికవ్యవస్థలో పతనం మొదలైంది. 1969 లో పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ నుండి యాహ్యాఖాన్ పాలన చేపట్టిన తరువాత 1970 లో సంభవించిన పాకిస్థాన్‌లో సంభవించిన తుఫాన్ తూర్పు పాకుస్థాన్‌లో 50,000 మంది ప్రాణాలను బలుగొన్నది. thumb|upright|Signing of Tashkent Declaration to end hostilities with India in 1965 in Tashkent, USSR, by President Ayub alongside with Bhutto (center) and Aziz Ahmed (left). జాతీయ ఎన్నికలు 1970 లో పాకిస్థాన్ మొదటిసారికా డెమొక్రటిక్ ఎన్నికలు (1970) నిర్వహించింది. ఇది మిలటరీ పాలన నుండి స్వతంత్రపాలన ఆరంభానికి నాంది అయింది. తూర్పు పాకిస్థాన్‌లోని అవామీలీగ్ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మీద విజయం సాధించింది. యాహ్యాఖాన్ మిలటరీ పాలనను ప్రజలు తిరస్కరించారు. 1971 మార్చ్ 25న బంగ్లాదేశ్ స్వతంత్ర సమరం సమయంలో పరిస్థితి చక్కదిద్దడానికి పాకిస్థాన్ సైన్యం బంగ్లాదేశ్ చేరుకుంది."1971 బంగ్లాదేశ్ మారణహోమం" బంగ్లాదేశ్ స్వతంత్రం ప్రకటించడానికి దారితీసింది. తరువాత బెంగాల్ ముక్తి బహిని భారత్ సహాయంతో ప్రత్యేక బంగ్లాదేశ్ స్వతంత్ర సమరానికి సేనలను సమీకరించాడు. అయినప్పటికీ పశ్చిమ పాకిస్థాన్ ఈ యుద్ధాన్ని అంతరుద్ధం అని అభివర్ణించింది.http://www.jstor.org/discover/10.2307/4417267?uid=3738832&uid=2129&uid=2&uid=70&uid=4&sid=21101002754703 అల్లర్లు స్వతంత్ర సమరంలో దాదాపు 3 - 30 లక్షలమంది పౌరులు అసువులు కోల్పోయారని అంచనా. స్వతంత్రసమరానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ భారత్ - బంగ్లాదేశ్ మీద త్రివిధదళాల దాడి చేసింది. లొంగుబాటు 1971 లో పాకిస్థాన్ లొంగుబాటుతో యుద్ధంలో ఎదురైన అపజయం కారణంగా యాహ్యాఖాన్ స్థానంలో జుఫిల్ అలి భుట్టో పాకిస్థాన్ అధ్యక్షుడిగా అధికారపీఠం అధిష్టించాడు.తరువాత పాకిస్థాన్ కాంసిట్యూషన్ అఫ్ పాకిస్థాన్‌గా డెమాక్రసీ మార్గంలో పయనించింది. 1972–1977 మద్య పాకిస్థా డెమొక్రసీ పునరుద్ధరించబడింది. స్వీయ చైతన్యం, సోషలిజం, పాకిస్థానీ జాతీయత దేశవ్యాప్తంగా పునరుద్ధరణ కార్యక్రమాలు చురుకుగా సాగాయి. తరువాత 1972 లో పాకిస్థాన్ అభివృద్ధి పధాకాలు చేపట్టింది. అలాగే న్యూక్లియర్ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టింది. విదేశీజోక్యం అడ్డుకోవడానికి విధ్వంశకర మార్గాన్ని వదిలి మొదటి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించింది. 1974 లో మొదటిసారిగా భారత్ మొదటి సారిగా న్యూక్లియర్ పరొశోధ జరపడం పాకిస్థాన్‌కు ప్రేరణ కలిగించడం వలన 1979 లో పాకిస్థాన్ న్యూక్లియర్ వెపన్ పరిశోధన పూర్తిచేసింది. 1977 సైనిక చర్యతో పాకిస్థాన్ డెమొక్రసీ ముగింపుకు వచ్చింది. 1978లో జనరల్ జియా - ఉల్-హాక్ పాకిస్థాన్ అధ్యక్షపదవి చేపట్టాడు. అధ్యక్షుడు జనరల్ జియా చేపట్టిన కార్పొరేట్ సెక్టర్ ఆఫ్ పాకిస్థాన్ , ఇస్లామైజేషన్ ఆఫ్ ఎకనమి పధకాలు దక్షిణాసియాలో వేగవంతమైన దేశాలజాబితాలో ఒకటిగా చేసింది. న్యూక్లియర్ నియంత్రణ, ఇస్లామైజేషన్ అభివృద్ధి సంప్రదాయవాద తత్వం అభివృద్ధి కొనసాగింది. తరువాత పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌లో రష్యా కార్యకలాపాకు వ్యతిరేకంగా యు.ఎస్ కార్యకలాపాలకు సహకారం అందించింది. జియా మరణం 1988 విమానప్రమాదంలో ముహమ్మద్ జియా- ఉల్- కాక్ మరణం తరువాత జుల్ఫికర్ ఆలి భుట్టో కుమార్తె బెనజిర్ భుట్టో పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నిక చేయబడింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరువాత సంప్రదాయవాద పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధికారం చేపట్టింది. తరువాత దశాబ్ధంలో ఈ రెండు పార్టీలు మార్చిమార్చి అధికారం చేపట్టాయి. 1980 తో పోల్చితే తరువాత దశాబ్ధంలో దేశఆర్ధిక వ్యవస్థ క్షీణించింది. తరువాత పాకిస్థాన్ దీర్ఘకాలం ద్రవ్యోల్భణం, అస్థిరత, లంచగొండితనం, పాకిస్థాన్ జాతీయవాదం, భౌగోళిక రాజకీయం, భారత్‌తో శతృత్వం, సోషలిజం పతనం, సంప్రదాయవాదం, మొదలైన అంశాలమధ్య చిక్కుకుపోయింది. 1997 లో పాకిస్థాన్ జాతీయ ఎన్నికలలో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అత్యధిక ఆధిఖ్యత సాధించింది. 1988 లో భారత్ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పాయ్ నేతృత్వంలో నిర్వహించబడిన పొక్రాన్ అణ్వాయుధ పరిశోధనకు సమాధానంగా ముషారఫ్ నేతృత్వంలో రెండవ పాకిస్థాన్ అణ్వాయుధ పరిశోధన నిర్వహించబడింది. కార్గిల్ యుద్ధం left|thumb|President Bush meets with President Musharraf in Islamabad during his 2006 visit to Pakistan. 1999 లో పాకిస్థాన్ , భారత్ మద్య సౌనిక ఘర్షణలు అధికరించి కార్గిల్ యుద్ధానికి దారితీసాయి. సివిల్- మిలటరీ సంఘర్షణలు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ పాకిస్థాన్ అధికారాన్ని చేపట్టడానికి అనుమతించాయి. 1999 నుండి 2001 వరకు ముషారఫ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్‌గా పాకిస్థాన్‌ను పాలించాడు. తరువాత 2001 నుండి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షునిగా పాలించాడు. ముషారఫ్ పాలనలో ఆధునికీకరణ, సాంఘిక స్వాతంత్రం, ఆర్ధిక సంస్కరణల పొడిగింపు మొదలైన చర్యలు చేపట్టబడ్డాయి. తరువాత పాకిస్థాన్ యు.ఎస్ తో కలిసి తీవ్రవాదంతో చేసిన యుద్ధంలో పాల్గిన్నది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ విజయవంతంగా 5 సంవత్సరాల పాలన ముగించిన తరువాత 2007-నవంబరు 15న పాకుస్థాన్ జాతీయ ఎన్నికలకు పాకిస్థాన్ ఎన్నికల కమిటీ పిలుపును ఇచ్చింది.2007 లో బెనాజిర్ భుట్టో కాల్చివేతకు గురైన తరువాత 2008 లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సురక్షిత ఆధిఖ్యతతో విజయం సాధించింది. తరువాత యూసఫ్ రాజా గిలాని ప్రధాని పదవిని చేపట్టాడు. ముషారఫ్ మీద ఆరోపించబడిన నేరారోపణా ఉద్యమానికి వెరచి ముషారఫ్ 2008 ఆగస్ట్ 18న అధ్యక్షపదవికి రాజీనామా చేసిన తరువాత ఆసిఫ్ ఆలి జర్దారీ అధ్యక్షపదవి చేపట్టాడు. . పాకిస్థాన్ న్యాయవ్యవస్థతో ఏర్పడిన ఘర్షణల తరువాత యూసఫ్ రాజా గిలానీ 2012 జూన్ లో ప్రధానపదవికి అనర్హుడని నిర్ణయించబడింది. తీవ్రవాదంతో యుద్ధంలో పాకిస్థాన్ పాత్ర, తీవ్రవాదం మీద యుద్ధం ఖరీదు 67.93 అమెరికన్ డాలర్లు. అంతే కాక తీవ్రవాదం కారణంగా దాదాపు 30 లక్షల మంది ప్రజలు స్వస్థలం నుండి తరలించబడ్డారు. . 2013 లో నిర్వహించబడిన పాకిస్థాన్ జాతీయ ఎన్నికలు (2013)లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అమోఘమైన ఆధిఖ్యత సాధించింది. తరువాత నవాబు షరీఫ్ ప్రధానమంత్రి పదవి అలంకరించాడు. 14 సంవత్సరాల తరువాత పాకిస్థాన్‌లో తిరిగి డెమొక్రసీ స్థాపించబడింది. ప్రభుత్వవిధానాలు పాకిస్థాన్ ఇస్లాం మతప్రాతిపదిక కలిగిన ప్రజాస్వామ్య దేశం. పాకిస్థాన్ ఫెడరల్ పార్లమెంటరీ విధానం కలిగి ఉంది. 1956 లో మొదటిసారిగా పాకిస్థాన్ కాంస్స్టిట్యూషన్ నిర్మితమైనది. అయినప్పటికీ 1958 లో నిలిపివేయబడి 1962 లో పునర్నిర్మించబడింది. సమగ్రమైన పాకిస్థాన్ కంస్టిట్యూషన్ 1973 నుండి అమలై 1977 లో జియా-ఉల్-హక్ చేత రద్దుచేయబడి 1985 లో తిరిగి అమలుచేయబడింది. పాకిస్థాన్ మిలటరీ పాకిస్థాన్ రాజకీయచరిత్ర లలో కీలకపాత్ర వహిస్తుంది. సైనిక పాలన కాలంలో అధ్యక్షుని మిలటరీ నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యకాలంలో అధ్యక్షుని ఎన్నిక ప్రజాస్వామ్యవిధానంలో నిర్ణయించబడుతుంది. పాకిస్థాన్‌లో బహుళపార్టీ విధానం కలిగిఉంది. 2013 మే మాసంలో పాకిస్థాన్‌లో జనరల్ ఎలెక్షన్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. విదేశీవ్యవహారాలు thumb|upright|alt=(L-R) President of India Pranab Mukherjee, Prime Minister of India Narendra Modi, Prime Minister of Pakistan Nawaz Sharif and Prime Minister of Mauritius, Navin Ramgoolam.|Indian Prime Minister Narendra Modi hand shakes with Prime Minister Nawaz Sharif. జసంఖ్యాపరంగా రెండవస్థానంలో ఉన్న ముస్లిందేశంగా (మొదటిస్థానంలో ఇండోనేషియా ఉంది) , అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిందేశంగా పాకిస్థాన్ గుర్తించబడుతూ ప్రపంచరాజకీయాలలో కీలకపాత్ర వహిస్తుంది. సగం వ్యవసాయం , సగం పారిశ్రామిక దేశం అయిన పాకిస్థాన్ ఆర్ధికరం విదేశీవ్యవహారలతో అధికంగా ముడిపడి ఉంది. పాకిస్థాన్ సేవాసంస్థలు, కార్పొరేషన్ , పౌరవ్యవస్థ కూడా విదేశీ వ్యవహారలతో ముడివడిఉంది. స్థిరమైన విదేశీవిధానాలతో పాకిస్థాన్ విదేశాలతో సుముఖమైన సంబంధాలను కలిగి ఉంది. భారత్ నిర్వహించిన పొక్రాన్ అణ్వాయుధ పరిశోధన తరువాత పాకిస్థాన్ అణ్వాయుధ పరిశోధన జరపడానికి దారితీసింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత thumb|left|U.S President Barack Obama in conversation with Prime Minister Nawaz Sharif, 2014. ప్రపంచం చమురుసరఫరా మార్గంలో ఉండడం , చమురూత్పత్తి చేస్తున్న మధ్యఆసియాదేశాలకు సమీపంలో ఉండడం పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిస్తుంది. 2004 లో పాకిస్థాన్ " ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ , ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ వార్ అగెయినిస్ట్ టెర్రరిజంలో (మేజర్ నాటో అల్లే) సహకారం పాకిస్థాన్ ప్రాముఖ్యత అంతర్జాతీయంగా అధికం అయింది. పాకిస్థాన్ విదేశీవిధానం , పాకిస్థాన్ భౌగోళిక వ్యూహం ఆర్ధికరంగం , పాకిస్థాన్ జాతీయతరక్షణ, ప్రాంతీయసమైఖ్యత, సహముస్లిం దేశాలతో సత్సంభంధాల మీద కేంద్రీకరించి ఉంది. పాకిస్థాన్ ఐఖ్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వం , శాస్వత ప్రాతినిధ్యం కలిగి ఉంది. పాకిస్థాన్ ముస్లిం ప్రపంచంలో ఆధినికతకు ఆదరణ ఇస్తున్న దేశంగా గుర్తించబడుతుంది పాకిస్థాన్ కామంవెల్త్ దేశాల సభ్యత్వం కలిగి ఉంది. సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కాత్పొరేషన్, ఎకనమిక్ కార్పొరేషన్, జి 20 డెవలిపింగ్ దేశాల సభ్యత్వం కూడా కలిగి ఉంది. పాకిస్థాన్ ఇజ్రాయేలు మధ్య దౌత్యసంబంధాలు లేవు. అయినప్పటికీ ఇజ్రాయేలు ప్రజలు పర్యటన నిమిత్తం పాకిస్థాన్‌కు వచ్చి పోతుంటారు. ఆర్మేనియాతో సంబంధాలు లేని ఒకేఒక దేశం పాకిస్థాన్ మాత్రమే. అయినప్పటికీ ఆర్మేనియన్లు ఇప్పటికీ పాకిస్థన్‌లో నివసిస్తున్నారు. thumb|Pak-China Friendship Centre was constructed by China as a gift for Pakistan. Pakistan also hosts China's largest overseas embassy.|link=Special:FilePath/Pak-China_Friendship_Centre.JPG పాకిస్థాన్ మిడిల్ ఈస్ట్ దేశాలు , ఇతర ముస్లిం దేశాలతో రాజకీయ, సాంఘిక , ఆర్ధిక సంబంధాలు కలిగి ముస్లిం దేశాలలో ప్రాముఖ్యత ఉంది. పాకిస్థాన్ చైనాతో దౌత్యసంబంధాలు ఏర్పరుచుకున్న మొదటి దేశం పాకిస్థాన్. అలాగే 1962 ఇండో-చైనా యుద్ధం తరువాత పాకిస్థాన్ , చైనాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. 1960–1989 చైనా రిపబ్లిక్ ప్రపంచ ప్రధాన దేశం కావడానికి పాకిస్థాన్ ఎంతగానో సహకరించింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు చైనా పర్యటనకు పాకిస్థాన్ సహకరించింది. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ చైనాలో పర్యటించాడు. పాకిస్థాన్‌లో ప్రాంతీయ , అంతర్జాతీయ పరిస్తితులు చైనా , పాకిస్థాన్ మద్య సంబంధాలను బలపరుస్తూ ఉన్నాయి. బదులుగా పాకిస్థాన్ , చైనాల మద్య పరస్పర ఆర్ధిక సహకారం శిఖరాగ్రానికి చేరుకుంది. చైనా పాకిస్థాన్‌లో మైళిక సదుపాయాల నిర్మాణాల మీద పెట్టుబడులు పెడుతుంది. గ్వాడర్ వద్ద డీప్‌వాటర్ పోర్ట్ నిర్మాణం ఒకటి. 2000 లో చైనా పాకిస్థాన్ మద్య జరిగిన "చైనా-పాకిస్థాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్" ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.అలాగే పాకిస్థాన్ చైనా-, ముస్లిం దేశాల మద్య వారధిలా సహకారం అందిస్తుంది. భారత్‌తో భౌగోళిక శతృత్వం ఉన్నప్పటికీ పాకిస్థాన్ టర్కీ , ఇరాన్ లతో రాజకీయ సంబంధాలను కొనసాగిస్తుంది. సౌదీ అరేబియా కూడా పాకుస్థాన్‌తో గౌరవనీయ సంబంధలు కలిగి ఉంది. . కాశ్మీర్ సంగర్షణతో భారత్ పాక్ మద్య పెద్ద అఘాతం ఏర్పడింది. కాశ్మీర్ కారణంతో ఇరుదేశాల మద్య 4 మార్లు యుద్ధం సంభవించింది. 1950 , 1980 సోవియట్-ఆఫ్ఘ యుద్ధం వంటి రాజకీయ కారణాల వలన సోవియట్ యూనియన్‌తో విబేధాలు తలెత్తాయి. పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్ సన్నిహితసంబంధిత దేశాలలో ఒకటి. 1999 నుండి పాకిస్థాన్ రష్యాల మద్య పలురంగాలలో పరస్పర సంబంధాలు మెరుగుపడ్డాయి. పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్ మద్య బలమైన అంతరంగిక సంబంధాలు ఉన్నాయి. కోల్డ్ వార్ పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్‌తో కలిసి పనిచేసింది. 1990 పాకిస్థాన్ రహస్యంగా అణాయుధాలు తాయారుచేసిన విషయం బహిర్గతం అయిన తరువాత అమెరికా పాకిస్థాన్ సంబంధాలు బలహీనపడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిపిన పోరు అమెరికా పాకిస్థాన్‌లు సన్నిహితం అయినప్పటికీ ఆఫ్ఘన్ యుద్ధం (2001) తరువాత సంబంధాలలో తీవ్రవాదం కారణంగా సమస్యలు ఎదురైయ్యాయి. 1948 నుండి ప్రత్యేక బలూచీస్థాన్ వాదులు నైరుతీ బలూచీస్థాన్‌లో తరచుగా ఆదోళన చేస్తున్నారు. నిర్వహణావిభాగాలు Administrative DivisionCapitalPopulation25pxBalochistan Quetta 7,914,00025px Punjab Lahore 101,000,00025px Sindh Karachi 42,400,00025px Khyber Pakhtunkhwa Peshawar 28,000,000 Gilgit–Baltistan Gilgit1,800,00025px FATA 3,176,33125px Azad Kashmir Muzaffarabad4,567,982 Islamabad Capital TerritoryIslamabad1,151,868 ఫెడరల్ పాత్లమెంటరీ రిపబ్లిక్ రాజ్యంగా పాకిస్థాన్ ఫెడరేషన్‌లో (పంజాబు, ఖైబర్, సింధి , బలూచీస్థాన్) నాలుగు విభాగాలు ఉన్నాయి. .Article 1(1)–2(d) of the Part I: Introductory in the Constitution of Pakistan ట్రైబల్ బెల్ట్,గిల్జిట్- బలూచీస్థాన్, ఇస్లామాబాద్ కాపిటల్ టెర్రిటరీ , అజాద్ కాశ్మీర్ పేరిట నాలుగు నిర్వహణా విభాగాలు ఉన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం డీ ఫేక్టో స్టాండర్డ్ " విధానం అనుసరిస్తుంది. పాకిస్థాన్ పాలన త్రీటైర్ (పాకిస్థాన్ జిల్లాలు, తాలూకాలు , యూనియన్ కౌన్సిల్స్ ఆఫ్ పాకిస్థాన్) సిస్టం అనుసరించి నిర్వహించబడుతుంది. ఒక్కొక్క విధానానికి ఎన్నిక విధానంలో సభ్యులను ఎన్నికచేస్తారు. ట్రైబల్ ఏరియాలో ఏడు గిరిజనప్రాంతాలు , ఆరు చిన్న సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. పాకిస్థాన్ న్యాయవ్యవస్థ , పాకిస్థాన్ ఇంటెలిజంస్ కమ్యూనిటీ పాకిస్థాన్ చట్టపరిధిలో పనిచేస్తాయి. దీని క్రింద నేషనల్ ఇంటెలిజంస్ డైక్టరేట్‌ పరిధిలో ఫెడరల్ , ప్రివింషియల్ స్థాయిలో పనిచేస్తుంది. ఫెడరల్ ఇంచెస్టిగేషన్ ఏజన్సీ, ఇంటెలిజంస్ బ్యూరో, నేషనల్ హైవేస్, మోటర్ వేస్ ఆఫ్ పాకిస్థాన్ , పాకిస్థాన్ రేంజర్స్ , ఫ్రాంటియర్ కార్ప్స్ వంటి పారామిలటరీ దళాలు పనిచేస్తుంటాయి. పాకిస్థాన్ కోర్ట్ సిస్టంలో పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ అగ్రస్థానంలో ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ పాకిస్థాన్, ఫెడరల్ షరియట్ కోర్టులు (ఒక్కొక భూభాగానికి ఒకటి , ఫెడరల్ కాపిటల్‌లో ఒకటి), జిల్లా కోర్టులు (ఒక్కొక జిల్లాకు ఒకటి), జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (ఒక్కొక నగరం , ఒక్కొక పట్టాణానికి ఒకటి), ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు , సివిల్ కోర్టులు ఉన్నాయి. పాకిస్థాన్ పీన్ల్ కోడ్ గిరిజనప్రాంతాలలో పరిమితికి లోబడి ఉంటుంది. గిరిజన ప్రాంతాలకు గిరిజన సంప్రదాయాలను అనుసరించి చట్టం అమలు చేయబడుతుంది. సైనికదళం పాకిస్థాన్ సైనికబలంలో ప్రంపంచం 8వ స్థానంలో ఉంది. 2001 గణాంకాలను అనుసరించి పూర్తిసమయం పనిచేసేవారి సంఖ్య 6,17,000. రిజర్వ్ దళం 5,13,000 పాకిస్థాన్ మిలటిరీ 1947 లో రూపొందించబడింది. పాకిస్థాన్ రాజాకీయాలలో మిలటరీ కీలకపాత్రవహించింది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ కమిటీ ఆధ్వర్యంలో చైన్ ఆఫ్ కమాండ్ విధులు నిర్వహించబడుతుంటాయి. జాయింట్ స్టాఫ్ హెడ్క్వారటర్స్ రావల్పుండి మిలటరీ జిల్లాలో ఉంది. చైరమన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ సైనికదళానికి ఉంత్తాధికారిగా , ప్రభుత్వానికి ప్రధాన సైనిక సలహాదారుగా ఉంటాడు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఉన్నతాధికారి సైనికదళాన్ని నియంత్రిస్తుంటాడు. అలాగే సైనికదళం , ప్రభుత్వం మధ్య వ్యూహాత్మక అనుసంధానకర్తగా ఉంటాడు. పాకిస్థాన్ ఆర్మీ ప్రధాన శాఖలు వాయుదళం, నౌకాదళం, పాకిస్థాన్ మారిన్. వీటికి పాకిస్థాన్ పార్లలమెంటరీ ఫోర్స్ సహకారం అందిస్తుంది అణ్వాయుధపరిశోధనా నియంత్రణ, ఉద్యూగనియామకం, కమాండ్, కంట్రోల్, సమాచారం, కంప్యూటర్లు, ఇంటెలిజంస్, సర్వైలెంస్, న్యూక్లియర్ కామాండ్ కంట్రోల్ సైనికదళం బాధ్యతలో భాగంగా ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్, టర్కీ, చైనా దేశాలు పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ పాకిస్థాన్‌కు అవసరమైన ఆయిధాలను సరఫరాచేస్తూ ఉన్నాయి. తరచుగా చైనా, టర్కీ దేశాలతో కలిసి సైనిక శిక్షణ నిర్వహించబడుతుంది. 1947 నుండి జమ్ము కాశ్మీర్‌లో నాలుగుమార్లు ఇండో- పాక్ యుద్ధాలు జరిగాయి. 1947లో పాకిస్థాన్ పశ్చిమ కాశ్మీర్ భూభాగాన్ని (అజాద్ కాశ్మీర్), గిల్హిత్, బలూచీస్థాన్ స్వంతం చేసుకుంది. ఇండియా తూర్పు పాకిస్థాన్‌ను స్వంతం చేసుకుంది. 1963లో జరిగిన యుద్ధంలో తూర్పు బెంగాలీ శరణార్ధుల సమస్య తలెత్తింది. ఈ కారణంగా 1971 ఇండో- పాక్ యుద్ధం జరిగింది. కార్గిల్ వద్ద సంభవించిన సంఘర్షణ ఫలితంగా 1999లో మరొక మారు ఇండో- పాక్ యుద్ధం సంభవించింది. 1947 నుండి ఆఫ్ఘన్ పాక్ సరిహద్దు సమస్యలు సైక తురుగుబాటుకు కారణం అయింది. 1961లో ఆఫ్ఘన్ సరిహద్దులో బజౌర్ ఏజెంసీ వద్ద ఉన్న పాకిస్థాన్ సైనికదళం తిరుగుబాటు చేసింది. ఐఖ్యరాజ్యసమితి శాంతిదళం పాకిస్థాన్ ఐఖ్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ దళంలో (యునైటెడ్ నేషంస్ పీస్ కీపింగ్ మిషంస్) భాగస్వామ్యం వహిస్తుంది. 1993 లో సోమాలియా మొగదిష్ వద్ద చిక్కుకుపోయిన అమెరికన్ సైనికులను విడిపించడానికి పాకిస్థాన్ ప్రధానపాత్ర వహించింది. యునైటెడ్ నేషంస్ నివేదికలో " యు.ఎన్ పీస్ కీపింగ్ మిషన్‌లో పాకిస్థాన్ సైనికులు అధికసంఖ్యలో ఉన్నారని తెలిపింది. పాకిస్థాన్ కొన్ని అరబ్ దేశాల రక్షణ బాధ్యత వహిస్తూ సైనికులను నియమించింది. అలాగే సౌనిక శిక్షణ , సలహాసంప్రదింపుల బాధ్యత వహిస్తుంది. 1967 లో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ , పాకిస్థాన్ నౌకాదళ ఫైటర్ పైలట్లు మిడిల్ ఈస్ట్ సైనిక దళంగా నిలిచి సారెల్‌కు వ్యతిరేకంగా ఆరు రోజుల యుద్ధం , యోం కిప్పూర్ యుద్ధంలో పోరాడారు. 1973 లో పాకిస్థాన్ ఫైటర్ పైలట్లు ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రేల్ విమానాలను కూల్చారు. అరబ్ దేశాలతో సైనిక సంబంధాలు 1979 లో సౌదీ అరేబియా ప్రభుత్వ అభ్యర్ధన మీద అరేబియా సైనికుల సహాయార్ధం అరేబియాలోని మక్కలోని గ్రాండు మసీదుకు (మసీద్-అల్- హారం) పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ బృందాలు పంపబడ్డాయి. 1991 లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో యు.ఎస్.నాయకత్వం వహించిన సైనికులతో చేరి పాకిస్థాన్ 5,000 సైనికులతో పాల్గొన్నది.2004 నుండి పాకిస్థాన్ వాయవ్య భూభాగంలో తెహ్రిక్- తాలిబన్ పాకిస్థాన్‌తో తలపడింది. పాకిస్థాన్ సైనిక దళం ఆపరేష బ్లాక్ తండర్ స్ట్రోం , ఆపరేషన్ రాహ్ ఈ నిజాత్ వంటి మేజర్ ఆపరేషన్‌లను నిర్వహించింది. కాశ్మీర్ సమస్య thumb|250px|alt=Pir Chinasi (Pir Shah Hussain Bukhari's shrine).|The Pir Chinasi in Azad Kashmir, which is part of Pakistan's controlled Kashmir. దక్షిణాసియా నైరుతిలో ఉన్న కాశ్మీర్ భూభాగం విషయంలో భారత్ పాక్ మద్య నిరంతర వివాదాలు కొనసాగుతున్నాయి. భారత్ – పాక్ కాశ్మీర్ వివాదం కొరకు భారత్ – పాక్ బృహత్తర ప్రణాళికతో మూడుమార్లు (1947, 1965, 1971) యుద్ధం జరిగింది. 1971 యుద్ధం పాకిస్థాన్ షరతులు లేని లొంగుబాటుకు సాక్ష్యంగా నిలిచింది. అలాగే ఆసమయంలో జరిగిన సిమ్లా ఒప్పందం కారణంగా బంగ్లాదేశ్కు పూర్తి స్వాతంత్ర్యం లభించింది. ఇతర తీవ్రమైన సైనిక సంఘర్షణలలో 1984 జరిగిన సైచెన్ సంఘర్షణ , 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం గుర్తించతగినవి. రాజాస్థానంగా ఉన్న లడక్ , సైచెన్‌తో చేరిన జామ్మూ – కాశ్మీర్ భూభాగంలో షుమారు 45.1% కాశ్మీర్ భూభాగం భారత్ ఆధీనంలో ఉంది. యుద్ధంలో పాకిస్థాన్ ఆక్రమిత ప్రదేశం కాశ్మీర్‌లో(అజాద్ కాశ్మీర్ , గిల్జిత్-బలూచీస్థాన్) 38% ఉంది. కాశ్మీర్ వివాదానికి 1947లో భారత్ పాక్‌లను విభజించిన సమయంలో బ్రిటిష్ ఆధిపత్యం తీసుకున్న నిర్ణయం మూలంగా ఉంది. విభజన సమయంలో కాశ్మీర్ భూభాగం పాక్‌తో విలీనం చేయాలా లేక భారత్‌తో విలీనం చేయాలా లేక స్వతంత్రదేశంగా ఉండాలా అన్న విషయం రాజాస్థానం అయిన కాశ్మీర్‌కు ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయానికి భారత్ - పాక్‌లు అంగీకరించాయి. కాశ్మీర్ మహారాజు తనరాజ్యాన్ని హరిసింగ్ భారత్‌తో విలీనం చేయడానికి అంగీకరించాడు. పాకిస్థాన్ ముస్లిం ప్రజల ఆధిఖ్యత , భౌగోళికం ఆధారంగా కాశ్మీర్ భూభాగాన్ని కోరుకున్నారు. అదే కారణాలతో రెండు స్వతంత్ర రాజ్యాలు కావాలని కోరుకున్నారు. భారత్ వివాదాన్ని 1948 లో ఐఖ్యరాజ్యసమితి వరకు తీసుకువెళ్ళారు. 1948 లో యునైటెడ్ నేషంస్ సెక్యూరిటీ కైంసిల్ రిసొల్యూషన్ వెలువడింది. ఐఖ్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పాకిస్థాన్ సైనికబృందాలను వివాదిత కాశ్మీర్ భూభాగాన్ని వదిలివెళ్ళాలని ఆదేశించింది. అయినప్పటికీ పాకిస్థాన్ కాశ్మీర్ భూభాగాన్ని విడిచిపెట్టక ముందే 1949 లో సరిహద్దులు నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరింది. కాశ్మీర్ భూభాగాన్ని భారత్ , పాకిస్థాన్‌లకు విభజించబడింది. పాకిస్థాన్ కాశ్మీర్ ప్రజలకు ఎన్నిక నిర్వహించి ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకోలని ఐఖ్యరాజ్యసమితిని కోరుకున్నారు. భారత్ మాత్రం సిమ్లా ఒప్పందం (1972) ఆధారంగా కాశ్మీర్ అఖండ భారతంలో భాగమని వాదించింది. సమీపకాలంలో స్వతంత్ర కాశ్మీర్ ఉద్యమం ఫలితంగా కాశ్మీర్ భారత్-పాక్ నుండి విడివడి స్వతంత్రంగా ఉండగలదని భావిస్తున్నారు. చట్టం అమలు thumb|230px|right|Women Commandos of counter-terrorism Special Combat Unit.|link=Special:FilePath/SpecialCombatUnitWomenCommandos.jpg ఫెడరల్ ప్రభుత్వం , పాకిస్థాన్ పోలీస్ వ్యసస్థ పాకిస్థాన్ చట్టం అమలు బాధ్యత వహిస్తుంది. పాకిస్థాన్‌లోని నాలుగు ప్రాంతాలు , రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతాలకు విడివిడిగా పోలీస్ దళం ఉంటుంది. ఫెడరల్ స్థాయిలో పాకిస్థాన్‌లో పలు ఇంటెలిజంస్ బృందాలు పనిచేస్తుంటాయి. వీటిలో ఫెడరల్ ఇంవెస్టిగేషన్ ఏజెంసీ, ఇంటెలిజంస్ బ్యూరో, , నేషనల్ హైవేస్ , మోటర్వే భాగంగా ఉన్నాయి. అలాగే పలు పాకిస్థాన్ పార్లమెంటరీ బలగాలలో నేషనల్ గార్డ్ ఆఫ్ పాకిస్థాన్, పాకిస్థాన్ ఉత్తరభూభాగాలు, పాకిస్థాన్ రేంజర్లు (పంజాబు పాకిస్థాన్) , సరిహద్దు దళాలు ఖైబర్ పంఖుత్వా , బలూచీస్థాన్ భాగంగా ఉన్నాయి. సివిల్ పోలీస్ సివిలియన్ పోలిస్ అధికారులలో అధికం పాకిస్థాన్ పోలీస్ వ్యవస్థలో భాగంగా ఉన్నారు. అవి నాలుగు ప్రాంతాలకు చెందిన అడిమినిస్ట్రేట్ యూనిట్లుగా ఉన్నాయి. ఇవి వరుసగా పంజాబు (పోలీస్), సింధు (పోలిస్), ఖైబర్ పంక్తువా (పోలీస్) , బలూచీస్థాన్ (పోలీస్) ఉన్నాయి. వీటికి ఇంస్పెక్టర్ జనరల్స్ ఆధిపత్యం వహిస్తారు. రాజధాని ఇస్లామాబద్ భూభాగానికి వేరుగా పోలీస్ వ్యవస్థ (కాపిటల్ టెర్రిటరీ పోలీస్), ఉంది. ది క్రైం ఇన్వెస్టిగేట్ డిపార్ట్మెంటు అఫ్ పాకిస్థాన్ నేరవిభాగానికి బాధ్యత వహిస్తూ ప్రాంతీయ పోలీస్ వ్యవస్థలో ప్రధానపాత్ర వహిస్తారు. జాతీయరహదారి పాకిస్థాన్ చట్టం అమలు విభాగంలో జాతీయరహదార్లు , మోటర్వేలు పోలీస్ భాగంగా ఉంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక పోలీస్ విభాగం ఉంది. నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ కూడా అందులో భాగంగా ఉంది. ప్రముఖుల రక్షణ కొరకు ఒక కౌంటర్ టెర్రరిజం విభాగం పనిచేస్తుంది. పంజాబు పాకిస్థాన్ , సింధు, పాకిస్థాన్ రేంజర్లు యుద్ధభూమిలో సేవలు అందిస్తారు. వారు పోలీస్ విభాగానికి సుఇచనలు ఇస్తూ చట్టం అమలుకు సహకారం అనిఫిస్తుంటారు. ఫ్రాంటియర్ క్రాప్స్ ఖైబర్ , బలూచూస్థాన్ ప్రాంతాలలో సేవలు అందిస్తున్నారు. భౌగోళికం పాకిస్థాన్ భౌగోళికం , పాకుస్థాన్ వాతావరణం అత్యంత వైవిద్యం కలిగి ఉటుంది. పాకిస్థాన్‌లో పలు వైవిధ్యమైన జంతుజాలం ఉంది. పాకిస్థాన్ వైశాల్యం 7,96,095 చ.కి.మీ. ఇది దాదాపు ఫ్రాంస్ , యునైటెడ్ కింగ్డంల మొత్తం వైశాల్యానికి సమానం. వైశాల్యపరంగా పాకిస్థాన్ అంతర్జాతీయంగా 36వ స్థానంలో ఉంది. వివాదాంశమైన కాశ్మీర్ వైశాల్యం చేర్చడం తేడాలలో వర్గీకరణలో వ్యత్యాసాలు ఉండవచ్చు. పాకిస్థాన్ అరేబియన్ సముద్రతీరం , గల్ఫ్ ఆఫ్ ఓమన్ సముద్రతీరం మొత్తం పొడవు 1046 కి.మీ. పాకిస్థాన్ భూభాగం సరిహద్దు మొత్తం పొడవు 6774కి.మీ ఇందులో ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ సరిహద్దు పొడవు 2430 కి.మీ., పాకిస్థాన్- చైనా సరిహద్దు పొడవు 523 కి.మీ., భారత్ – పాకిస్థాన్ 2912 కి.మీ , పాకిస్థాన్ – ఇరాన్ సరిహద్దు పొడవు 909 కి.మీ. పాకిస్థాన్ సముద్రతీరాన్ని ఓమన్‌తో పంచుకొంటూ ఉంది. , పాకిస్థాన్ ఓమన్ లను తజకిస్థాన్ కోల్డ్, నేరో వాఖన్ కారిడార్ వేరుచేస్తుంది. భౌగోళికంగా పాకిస్థాన్ దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ , మద్య ఆసియా లలో ప్రాధాన్యత కలిగిన భూభాగంలో ఉంది. భౌగోళికంగా పాకిస్థాన్‌లోని సింధ్ , పంజాబు భూభాగాలు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్‌లో ఉంది. పాకిస్థాన్‌లోని బలూచీస్థాన్ , కైబర్ పఖ్తుంఖ్య లోని అధిక భాగం యురేషియన్ ప్లేట్‌లో (ప్రధానంగా ఇరానియన్ ప్లేట్) ఉంది. గిల్జిత్ – బలూచీ స్థాన్ , కాశ్మీర్ ఇండియన్ ప్లేట్ అంచున అధికంగా భూంపాలు సంభవించడానికి ప్రాంతంలో ఉంది. దక్షిణ పాకిస్థాన్‌లో సముద్రతీరంలో గ్లాసియేటెడ్ పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పాకిస్థాన్‌లో మైదానాలు, ఎడారులు , పీఠభూములు ఉన్నాయి. భౌగోళిక విభజన పాకిస్థాన్ భౌగోళికంగా ఉత్తర ఎగువ భూములు, సింధూనదీ మైదానం , బలూచీస్థాన్ పీఠభూమి మూడు ప్రధాన భాగాలుగా విభజించబడింది. ఉత్తర ఎగువభూములలో కరకొరం, హిందూ కుష్ , పామిర్ పర్వతం మొదలైన పర్వతశ్రేణులు ఉంటాయి. ఇక్కడ ఎత్తైన శిఖరాలు కూడా ఉన్నాయి. వీటిలో 14 " ఎయిట్ తౌజండర్స్" పర్వతశిఖరాలలో 5 పాకిస్థాన్‌లో ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ పర్వతారోహకులను పాకిస్థాన్‌ వైపు ఆకర్షిస్తున్నాయి. పర్వతారోహకులను ఆకర్షించే శిఖరాలలో కె-2 ఎత్తు 8611మీ , నంగా ప్రభాత్ ఎత్తు 8126 మీ శిఖరాలు ప్రధానమైనవి. బలూచిస్థాన్ పీఠభూమి థార్ ఎడారి తూర్పున ఉంది. దేశంలో 1609 కి.మీ పొడవున సింధూనది దాని ఉపనదులు కాశ్మీర్ నుండి అరేబియన్ సముద్రం వైపు ప్రవహిస్తున్నాయి. పంజాబుకు సింధూనది విస్తారమైన సారవంతమైన మట్టిని చేరుస్తూ ఉంటుంది. వాతావరణం పాకిస్థాన్ వాతావరణం ఉష్ణమడల వాతావరణానికి అతీతంగా కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. సముద్రతీర ప్రాంతంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుంది. వర్షాకాలంలో అధిక వర్షపాతం కారణంగా తరచుగా వరదలు సంభవిస్తుంటాయి. అలాగే పొడి సీజన్లో తక్కువ వర్షం లేక అసలు వర్షాలు పడకుండా ఉంటుంది. పాకిస్థాన్ వాతావరణాన్ని నాలుగుగా విభజించవచ్చు. పొడిగా ఉండే శీతల వాతావరణం (డిసెంబరు – ఫిబ్రవరి), వేడిగా పొడిగా ఉండే వసంతకాలం (మార్చ్ – మే), వేసవి , వర్షాకాలం (జూన్ – సెప్టెంబర్), వర్షాకాలాంతర సీజన్ అక్టోబరు –నవంబర్. వృక్షజాలం , జంతుజాలం thumb|Deodar, Pakistan's national tree. భౌగోళిక , వాతావరణ వ్యత్యాసాలు అత్యధిక జాతుల చెట్లు , మొక్కలు పుష్కలంగా పెరగడానికి దోహదం చేస్తుంది. పాకిస్థాన్‌లో కోనిఫెరస్, ఆల్పైన్ , సుబల్‌పైన్ మొదలైన వైవిద్యమైన అరణ్యాలు ఉన్నాయి. ఉత్తర భూభాగంలోని పర్వతాలలో అరణ్యాలలో స్రౌస్, పైన్ , దేవదారు చెట్లు అధికంగా కనిపిస్తుంటాయి. సులైమాన్ పర్వతాలలో మల్బరీ మొదలైన డెసిడ్యుయస్ చెట్లు అధికంగా ఉంటాయి. దక్షిణ భూభాగంలోని బలూచిస్థాన్, సింధ్ , పంజాబు ప్రాంతాలలో కొబ్బరి , ఫోనిక్స్ చెట్లు అధికంగా ఉంటాయి. పశ్చిమ పర్వతాలలో యూనిపర్, టమరిస్క్, పదునుగా ఉండే గడ్డి , పొదలు ఉంటాయి. దక్షిణంలో ఉన్న సముద్రతీర తడిభూములలో మాంగ్రోవ్ అరణ్యాలు ఉంటాయి. . కొనిఫెరౌస్ అరణ్యాలు సముద్రమట్టానికి 1000-4000 మీటర్ల ఎత్తున ఉత్తరం , వాయవ్య భూభాగంలో ఉంటాయి. పొడారిన బలూచీస్థాన్ భూభాగంలో తాటి, ఈత వంటి ఏకదళబీజ చెట్లు, ఎఫెద్ర చెట్లు కనిపిస్తుంటాయి. పంజాబు , సింధ్ మొదలైన ట్రాపికల్ , సబ్ ట్రాపికల్ డ్రై అండ్ మాయిస్ట్ అరణ్యాలు ఉంటాయి. ఈ అరణ్యాలలో మల్బరీ, అకాసియా , యూకలిఫ్టస్ చెట్లు ఉంటాయి.2010 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లోని అరణ్యాల వైశాల్యం 2.2%. పాకిస్థాన్‌ వాతావరణ వైవిధ్యం కలిగి ఉంది. పాకిస్థాన్‌లో దాదాపు 668 పక్షిజాతులు కనిపిస్తుంటాయి. సాధారణంగా కాకులు, ఉడుతలు, మైనాలు, హాక్, ఫాల్కన్ , గద్దలు కనిపిస్తుంటాయి. పాలాస్ (కొహిస్థాన్)లో గుర్తించతగినంగా వెస్టర్న్ ట్రాగోపన్ ఉన్నాయి. పాకిస్థాన్‌లో యూరప్, మద్య ఆసియా , భారత్ నుండి వలస వస్తున్న పలు వలస పక్షులు కనిపిస్తుంటాయి. దక్షిణ భూభాగంలోని మైదానాలలో ముంగిసలు, పునుగు పిల్లి, కుందేళ్ళు, ఆసియాటిక్ నక్క, భారత పంగోలిన్, ఎడారి పిల్లి , అడవి పిల్లి ఉన్నాయి. సింధూ ప్రాంతంలో ముగ్గర్ మొసళ్ళు ఉన్నాయి. పరిసర ప్రాంతాలలో అడవి పంది, జింక , ముళ్ళపంది , ఎలుకలు కనిపించడం సాధారణం. మద్య పాకిస్థాన్‌లో ఉన్న దిగువన ఉన్న ఇసుక భూములలో ఆసియాటిక్ నక్కలు, చారల హైనా, అడవి పిల్లులు , చిరుతలు ఉన్నాయి. అనకూల వాతావరణ కారణంగా చెట్లు తాక్కువగా ఉండడం, జింకలు మేయడం వలన వన్యమృగాలు ఎడారిభూములలో జంతువులు భద్రతలేని స్థితిలో ఉన్నాయి. చోలిస్థాన్‌లో స్వల్పంగా చింకారాలు కనిపిస్తుంటాయి. పాకిస్థాన్- భారత్ సరిహద్దులో చోలిస్థాన్‌లో కొన్ని ప్రాంతాలలో స్వల్పసంఖ్యలో నీల్ గాయ్ కనిపిస్తుంటుంది. ఉత్తర భూభాగంలోని పర్వతాలలో మార్కోపోలో గొర్రె, ఉరియల్, మార్ఖొర్ , ఐబెక్స్ మేకలు, ఆసియన్ బ్లాక్ బియర్ , హిమాలయన్ బ్రౌన్ బియర్ మొదలైన పలు జాతుల జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అరుదుగా మంచు చిరుతలు, , ఆసియన్ చిరుతలు. సింధ్ ప్రాంతంలో సంరక్షితప్రాంతంలో బ్లైండ్ ఇండస్ రివర్ డాల్ఫిన్ ఉన్నాయి. అంతరించి పోతున్న దశలో ఇవి 1,100 మాత్రమే మిగిలి ఉన్నాయని భావిస్తున్నారు. . పాకిస్థాన్ ప్రాంతంలో 174 క్షీరదాలు, 177 సరీసృపాలు, 22 ఆఫిబియన్లు, 198 మంచినీటి చేపలు, 5,000 అకశేరుకాలు నమోదు చేయబడ్డాయి. పాకిస్థాన్ వృక్షజాలం , జంతుజాలం పలు సమస్యలు ఎదుర్కొంటున్నాది. అరణ్యాల నరికివేతలో పాకిస్థాన్ అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉంది. వేట , వాతావరణ కాలుష్యం పర్యావరణం మీద తీవ్రప్రభావం చూపుతున్నాయి. జాతీయ పార్కులు , అభయారణ్యాలు thumb|Plain of Deosai National Park. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఐ.యు.సి.ఎన్ గుర్తింపు పొందిన 157 సంరక్షిత ప్రాంతాలు ఉన్నాయి. ఆధునిక సరక్షిత ప్రాంతాల చట్టం అనుసరించి పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పార్క్‌లో వన్యమృగాలు తమ సహజసిద్ధ వాతావరణంలో తిరుగాడుతూ ఉన్నాయి. బహవల్పూర్ వద్ద ఉన్న "లాల్ సుహంరా నేషనల్ పార్క్" 1972 లో స్థాపించబడింది. ఇది పాకిస్థాన్‌లోని ఒకేఒక "బయోస్ఫేర్ రిజర్వ్" గా గుర్తించబడుతుంది. గిల్జిత్ బల్తిస్థాన్ వద్ద ఉన్న" సెంట్రల్ కరకొరం నేషనల్ పార్క్ "దేశంలోని అతిపెద్ద నేషనల్ పార్క్‌గా గుర్తించబడుతుంది. దీని వైశాల్యం 13,90,100 చ.హె. పాకిస్థాన్‌లోని అతి చిన్న నేషనల్ పార్క్" అయూబ్ నేషనల్ పార్క్ " వైశాల్యం 931 చ.హె. మౌళిక సదుపాయాల నిర్మాణము ఆర్ధికం పాకిస్థాన్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అలాగే తరువాతి 11 దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ప్రపంచపు బృహత్తర ఆర్ధికశక్తి కలిగిన 21 దేశాలలో ఒక దేశంగా మారడానికి అవకాశం ఉన్న దేశాలలో పాకిస్థాన్ ఒకటి అని భావిస్తున్నారు. దశాబ్ధాలుగా దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా 2013 నాటికి పాకిస్థాన్ తీవ్రమైన ఆర్ధికలోటును ఎదుర్కొన్నది. తత్కారణంగా తీవ్రమైన నిర్వహణా లోపం , క్రమపరచడానికి వీలుకాని ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నది. అలాగే కనీసావసారాలైన రైల్వే సేవలను , విద్యుత్తు ఉత్పత్తిని అందించడానికి అవసరమైన పునరుద్ధరణ , అభివృద్ధిచేయడానికి వీలుకాని పరిస్థితితులు ఎదుర్కొన్నది. పాకిస్థాన్ ఆర్ధికరంగం సెమీ ఇండస్ట్రిలైజ్‌గా భావిస్తున్నారు. సింధునదీ పరివాహక ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉంది. పాకిస్థాన్ ఆర్ధికరంగం కారాచీ ఆర్ధికం , పంజాబు నగరప్రాంత ఆర్ధికంగా విభజించబడింది. ఇతరప్రాంతాలలో అభివృద్ధి తక్కువగా ఉంది. పాకిస్థాన్ 2011 జి. డి.పి202 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండవచ్చని అంచనావేయబడింది. జి.డి.పి కొనుగోలు శక్తి 838.164 మిలియన్లు అమెరికన్ డాలర్లు.GDP ranking, PPP based World Bank తలసరి ఆదాయం జి.డి.పి. 1,197 అమెరికన్ డాలర్లు, కాపిటల్ జి.డి.పి 4,602 అమెరికన్ డాలర్లు , జి.డి.పి. ఋణశాతం 55.5%. ప్రపంచ బ్యాంక్ ఆర్ధికాభివృద్ధి కొరకు పాకిస్థాన్ వ్యూహాత్మకంగా కృషిచేస్తుందని భావిస్తుంది. సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతున్న పాకిస్థాన్ యువత దేశాభివృద్ధికి సరిపడినంత మానవవనరుల శక్తిని అందించగలదని భావిస్తున్నారు. అలాగే దేశానికి అధికంగా సేవారంగ అభివృద్ధి , ఉపాధికల్పన వంటి సవాళ్ళను ఎదుర్కొనవలసిన అవసరం కూడా ఉంది. 2013 లో ప్రపంచబ్యాంక్ వెలువరించిన నివేదిక ప్రపంచ ఆర్ధికశక్తిలో పాకిస్థాన్ 24వ స్థానంలో ఉందని అలాగే కొనుగోలు శక్తిలో 45వ స్థానంలో ఉందని తెలుస్తుంది. దక్షిణాసియా దేశాలలో ఆర్ధికశక్తిలో పాకిస్థాన్ రెండవ స్థానంలో ఉంది. దక్షిణాసియా ఆర్ధికంలో పాకిస్థాన్ ఆర్ధికరంగ జి.డి.పి 15% ఉంది. పాకిస్థాన్ ఆరంభం నుండి ఆర్ధికాభివృద్ధి వైవిధ్యం కలిగి ఉంది. డెమాక్రసీ సమయంలో ఆర్ధికాభివృద్ధి వేగం తక్కువగా ఉన్నప్పటికీ మార్షల్ లా అమలులో ఉన్న మూడు కాలాలో అద్భుతంగా ఉంది. అయినప్పటికీ సమానమైన , స్థిరమైన దేశాభివృద్ధికి సరైన పూనాదులు నిర్మించబడలేదు. . 2000 లలో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి అభివృద్ధి పనులు చేపట్టిన తరువాత పేదరికం 10% తగ్గింది. జి.డి.పి 3% అభివృద్ధి చెందింది. 2007 లో ఆర్ధికరంగం కొంత పతనావస్థకు చేరుకుంది.2008 లో ఇంఫ్లేషన్ 25.0%. పాకిస్థాన్ ఫిజికల్ పాలసీకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సహకరిస్తుంది. తరువాత సంవత్సరం ఆసియన్ డెవెలెప్మెంటు బ్యాంక్ నివేదిక పాకిస్థాన్ ఆర్ధిక సంక్షోభం తగ్గిందని తెలియజేసింది. . 2010-11 ఫిజికల్ ఇంఫ్లేషన్ శాతం 14.1%. జనవరి 2014 ట్రేడ్ ఆర్గనైజేషన్ సర్వే జపాన్ కంపెనీలతో వాణిజ్య సంబంధాలు అధికంగా ఉన్న దేశాలలో తైవాన్ తరువాత స్థానంలో పాకిస్థాన్ ఉందని వెల్లడించింది. 27 జపాన్ కంపెనీలకు పాకిస్థాన్‌తో వ్యాపారసంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. కమ్మోడిటీ ముడిసరుకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న దేశాలలో పాకిస్థాన్ ఒకటి. పాకిస్థాన్ శ్రామికశక్తి ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ నుండి 11 మిలియన్ల ఉద్యోగులు యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేస్తూ 11.2 బిలియన్ల అమెరికండాలర్లు పాకిస్థాన్‌కు పంపి పాకిస్థాన్ ఆర్ధికంగా 2011-12 ఫిజికల్ ఇయర్‌కు సహకరిస్తున్నారు.. పాకిస్థాన్ ప్రజలు ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, అరబ్ స్టేట్స్ ఆఫ్ ది పర్షియన్ గల్ఫ్, బహరియన్, కువైత్, కతార్ , ఓమన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, యునైటెడ్ కిండం, నార్వే , స్విడ్జర్లాండ్ దేశాలలో పనిచేస్తున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నివేదిక అనుసరించి అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఎగుమతులు తగ్గాయని ప్రపంచస్థాయిలో 2007 లో పాకిస్థాన్ ఎగుమతులు 0.128% ఉందని పేర్కొన్నది. 2010-11 ట్రేడ్ లోటు 11.217 అమెరికన్ డాలర్లు. పాకిస్థానీ ఆర్ధికరంగ నిర్మాణం పాకిస్థానీ ఆర్ధికనిర్మాణం వ్యవసాయం నుండి సేవల వైపు మార్చబడింది. 2010 వ్యవసాయం జి.డి.పి లో 21.2%. ఐఖ్యరాజ్యసమితి " ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ " నివేదిక అనుసరించి 2005 పాకిస్థాన్ 21,591,400 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి చేసిందని ఇది ఆఫ్రికా గోధుమ ఉత్పత్తికంటే (20,304,585 మెట్రిక్ టన్నులు) అధికమని , దక్షిణ అమెరికా గోధుమ ఉత్పత్తికి (ఇది 20,304,585 మెట్రిక్ టన్నులు) సమీపంలో ఉందని తెలియజేస్తుంది. 2002–2007 పాకిస్థాన్ బ్యాంకింగ్ , విద్యుత్తు రంగాలలో తగినంత విదేశీ పెట్టుబడి పెట్టబడింది. పాకిస్థాన్‌లోని పరిశ్రమలలో దుస్తులు , టెక్స్‌టైల్ (దాదాపు 60% ఎగుమతులు) ఆహారతయారీ, రసాయన ఉత్పత్తులు, ఇనుము , స్టీల్ ప్రధానమైనవి. పాకిస్థాన్‌లో పర్యాటకరంగం అభివృద్ధికి పుష్కలమైన అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత అందుకు ఆడ్డుగా నిలుస్తుంది. పాకిస్థాన్ నిర్మాణ రంగం , ఆఫ్ఘనిస్థాన్ అవసరాల కారణంగ పాకిస్థాన్ సిమెంటు కంపెనీలూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2013 లోపాకిస్థాన్ 7,708,557 మెట్రిక్ టన్నుల సిమెంటు ఎగుమతి చేసింది. . 2012-2013 పాకిస్థాన్ సిమెంటు ఉత్పత్తి 44,768,250 , క్లింకర్ ఉత్పత్తి 42,636,428. పాకిస్థాన్ ఆర్ధిక రంగంలో సిమెంట్ పరిశ్రమ ప్రధానపాత్ర వహిస్తుంది. విదేశీ పెట్టుబడులు 2006 ఫిజికల్ ఇయర్ మొదటి 9 మాసాలలో విదేశీ పెట్టుబడి 2.22 బిలియన్ల అమెరికన్ డాలర్లు , పోర్ట్పోలియో పెట్టుబడి 407.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ 2005- 06 విదేశీ పెట్టుబడి 792.6 మిలియన్ల అమెరికన్ డాలర్ల నుండి 2.224 బిలియన్లకు చేరుకుంది. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ సమీపకాల నివేదికను అనుసరించి పోర్ట్ పోలియా 108.1 మిలియన్ల అమెరికన్ డాలర్ల నుండి 407.4% అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2006–2007 ఆర్ధిక సంవత్సరంలో పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్ నుండి 8.4 బిలియన్ల పెడ్డుబడి (ప్రభుత్వ లక్ష్యం 4 బిలియన్లు) సాధించింది. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ నివేదిక అనుసరించి 2010 లో పాకిస్థాన్ రాజకీయ అస్థిరత కారణంగా విదేశీ పెట్టుబడి గుర్తించతగినంత 54.6% తగ్గింది. టెక్స్‌టైల్ పరిశ్రమ పాకిస్థాన్ టెక్స్‌టైల్ పరిశ్రమ పాకిస్థాన్ ఎగుమతులలో కీలకపాత్ర వహిస్తుంది. పాకిస్థాన్ టెక్స్‌టైల్ ఉతపత్తుల ఎగుమతిలో పాకిస్థాన్ ఆసియాలో 8 వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ జి.డి.పి టెక్స్‌టైల్ రంగం లో 9.5% భాగస్వామ్యం వహిస్తుంది. టెక్స్‌టైల్ రంగం పాకిస్థాన్‌లో 1.5 కోట్లమందికి ఉపాధి కల్పిస్తుంది. 30% శ్రామికశక్తి టెక్స్‌టైల్ రంగంలో పనిచేస్తుంది. దేశంలో పనిచేస్తున్న శ్రామికుల సంఖ్య 4.9 కోట్లు. పాకిస్థాన్ పత్తి ఉతపత్తిలో ఆసియాలో 4 వ స్థానంలో ఉంది. స్పిన్నింగ్ శక్తిలో 3వ స్థానంలో ఉంది (మొదటి రెండు స్థానాలలో చైనా , భారత్ ఉన్నాయి). పాకిస్థాన్ అంతర్జాతీయ స్పిన్నింగ్ శక్తిలో 5% భాగస్వామ్యం వహిస్తుంది. పాకిస్థాన్ టెక్స్‌టైల్స్ అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాలలో చైనా ద్వితీయ స్థానంలో ఉంది. చైనా పాకిస్థాన్ నుండి పత్తి, పత్తి నూలు , పత్తి వస్త్రాలు దిగుమతి చేసుకుంటుంది. యునైటెడ్ కింగ్డం మొత్త టెక్స్‌టైల్ దిగుమతులలో పాకిస్థాన్ 3.3% (1.07 బిలియన్ల అమెరికన్ డాలర్లు) , చైనా 12.4% (4.61 బిలియన్ల అమెరికన్ డాలర్లు), యునైటెడ్ స్టేట్స్ 2.98% (2.98 బిలియన్ల అమెరికన్ డాలర్లు), జర్మన్ 1.6% (0.88 బిలియన్ల అమెరికన్ డాలర్లు), భారత్ 0.8% (0.888 బిలియన్ అమెరికన్ డాలర్లు) భాగస్వామ్యం వహిస్తుంది. . బ్యాంకింగ్ పాకిస్థాన్ బ్యాంకింగ్ రంగం క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. బ్యాంకింగ్ రంగానికి విదేశీ , స్వదేశీ మదుపుదార్లు భాగస్వామ్యం వహిస్తున్నారు. బ్యాంకుల మద్య పోటీ అధికరిస్తూ ఉంది. దీర్ఘకాల ప్రయోజనాలు వంటి ఆకర్షణీయమైన పధకాలతో వాడుకరులను ఆకర్షించడంలో బ్యాంకులు పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్‌లో 6 ఫుల్ ప్లెడ్జ్డ్ ఇస్లామిక్ బ్యాంకులు , 13 కాన్వెన్షనల్ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఇస్లామిక్ బ్యాంకింగ్ , ఇస్లామిక్ ప్రభావిత కాన్వెన్షనల్ బ్యాంకులు పాకిస్థాన్ బ్యాంకు వ్యవస్థలో 9.7%. భగస్వామ్యం వహిస్తున్నాయి. 2012 లో రెవెన్యూ అనుసరించి పాకిస్థాన్‌లోని బృహత్తర పరిశ్రమల జాబితా: పాకిస్థాన్ కీలక ఆర్ధికవ్యూహాలు పాకిస్థాన్ జి.డి.పి. వ్యవసాయం 25.3%పరిశ్రమలు 21.6%సేవలు 53.1% ఉపాధి శ్రామిక శక్తి 59.7 మిలియన్లు ఉద్యోగులు 56.0 మిలియన్లు సహజ వనరులు రాగి 12.3 మిలియన్ టన్నులు Gold 20.9 మిలియన్ టన్నులు బొగ్గు 175 బిలియన్ టన్నులు షేల్ గ్యాస్ 105 ట్రిలియన్ టన్నులు షేల్ ఆయిల్ 9 బిలియన్ బ్యాతెల్స్ గ్యాస్ ఉత్పత్తి 4.2 బిలియన్ క్యూబిక్ అడుగులు/రోజుకు ఆయిల్ ఉత్పత్తి 70,000 బ్యారెల్స్/రోజుకు ఇనుప గనులు 500 మిలియన్లు కార్పొరేషన్లు Corporations Headquarters 2012 revenue(Mil. $)Services పాకిస్థాన్ స్టేట్ ఆయిల్ కరాచి 11.570 పెట్రోలియం , సహజ వాయువు పాక్-అరబ్ రిఫైనరీ క్వాస్బా గుజరాత్ 3,000 ఆయిల్ , శుద్ధి కర్మాగారాలు సుయి ఉత్తర గ్యాస్ పైప్లైన్స్ లాహోర్ 2,520 సహజ వాయువు షెల్ పాకిస్తాన్ కరాచి 2,380 పెట్రోలియం ఆయిల్ , గ్యాస్ డెవలప్మెంట్ కంపెనీ ఇస్లామాబాద్ 2,230 పెట్రోలియం , సహజ వాయువు నేషనల్ రిఫైనరీ కరాచి 1,970 ఆయిల్ రిఫైనరీ హబ్ పవర్ కంపెనీ హబ్(బలూచిస్తాన్) 1,970 పాకిస్తాన్ లో ఎనర్జీ కె-ఎలెక్ట్రిక్ కరాచి 1,840 పాకిస్తాన్ లో ఎనర్జీ ఎటాక్ రిఫైనరీ రావల్పిండి 1,740 ఆయిల్ రిఫైనరీ ఎటాక్ పెట్రోలియం రావల్పిండి 1,740 పెట్రోలియంలాహోర్ ఎలెక్ట్రిక్ సప్లై కో లాహోర్ 1,490 పాకిస్తాన్ లో ఎనర్జీ పాకిస్తాన్ రిఫైనరీ కరాచి 1,440 పెట్రోలియం , సహజ వాయువు సుయి దక్షిణ గ్యాస్ పైప్లైన్స్ కరాచి 1,380 సహజ వాయువు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్ వర్క్ కరాచి 1,360 పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎంగ్రో కార్పొరేషన్ కరాచి 1,290 ఆహార పరిశ్రమ , టోకు అణువిద్యుత్తు 2012 డేటా అనుసరించి పాకిస్థాన్‌లో మూడు లైసెంస్ - కమర్షియల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అణువిద్యుత్తును అందిస్తున్నాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంటులను నిర్మించి పాకిస్థాన్ ముస్లిం దేశాలలో ఆణుశక్తిని ఉపయోగించిన మొదటి దేశంగా గుర్తింపు పొందింది.Nuclear power in Pakistan, Dr. Zia H. Siddiqui and Dr. I.H. Qureshi, pp.31–33. ఈ ప్లాంటుల నిర్వహణ బాధ్యతను పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమీషన్, ది సైంటిఫికండ్ న్యూక్లియర్ గవర్నమెంటల్ అథారిటీ వహిస్తున్నాయి. పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ న్యూక్లియ ఉపయోగాన్ని నియంత్రిస్తుంది. పాకిస్థాన్‌లో ఉత్పత్తి చేయబడుతున్న విద్యుత్తులో అణుశక్తి ప్లాంటులనుండి 5.8% లభిస్తుంది. ఫాసిల్ ఫ్యూయల్(పెట్రోలియం) శక్తి 62% లభిస్తుంది, జలవిద్యుత్తు 29.9% లభిస్తుంది , కోయల్ పవర్ ప్లాంటు నుండి 0.3% విద్యుత్తు లభిస్తుంది. పాకిస్థాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో లేని నాలుగు దేశాలలో పాకిస్థాన్ (మిగిలిన దేశాలు ఇండియా, ఇజ్రేల్ , నార్త్ కొరియా) ఒకటి. అయినప్పటికీ పాకిస్థాన్ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెంసీ గుడ్ స్టాండిగ్‌లో సభ్యత్వం కలిగి ఉంది. వాణిజ్య అవసరాలకు ఉపకరిస్తున్న న్యూక్లియర్ పవర్ ప్లాంటుకు చైనా రిపబ్లిక్ ఆసక్తిగా సహకరిస్తుంది. ఆరంభకాలంలో న్యూక్లియర్ విద్యుత్తు అధారాల నుండి చష్మా రియాక్టర్ తయారుచేయబడింది.1971 లో చందా ద్వారా మొదటిసారిగా పాకిస్థాన్ మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయిన " ది కరాచీ న్యూక్లియర్ పవర్ ప్లాంటు " స్థాపించబడింది. తరువాత చైనా రిపబ్లిక్ పాకిస్థాన్ పారిశ్రామిక అభివృద్ధి కొరకు న్యూక్లియర్ పవర్ ప్లాంటును పాకిస్థాన్‌కు విక్రయించింది. 2005 లో చైనా- పాకిస్థాన్‌లు జాయింట్ ఎనర్జీ సెక్యూరిటీ ప్లాన్ కొరకు సమఖ్యంగా పనిచేసాయి. 2008 లో పాకిస్థాన్ లోని చస్మా వద్ద "న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ (చష్మా 3) , చష్మా న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ (చస్మా 4) స్థాపించబడ్డాయి. ఒక్కొకటి 320-340 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. వీటి విలువ 129 వందల కోట్లు, చైనా వంటి అంతర్జాతీయ దేశాల నుండి 80 వందలకోట్ల రూపాయలు వ్యయం చేయబడ్డాయి. 2008 లో ఇండియా యునైటెడ్ స్టేట్స్ సివిల్ " ఒప్పదం ప్రభావానికి బదులుగా పాకిస్థాన్ చైనా సహాయంతో మరొక అగ్రిమెంటు మీద సంతకం చేయబడింది. ఈప్లాంటు విలువ 1.7 బిలియన్ల అమెరికన్ డాలర్లు. దీని కొరకు 1.07 బిలియన్ల విదేశీఋణం లభించింది. 2013 లో కరాచీలో రెండవ న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ అదనపు రియాక్టర్ల నిర్మాణంతో విస్తరణ పనులు ప్రారంభించబడ్డాయి. పాకిస్థాన్ విద్యుత్తు ఉత్పత్తి పలు పరిశ్రమలకు విద్యుత్తును అందిస్తుంది. అలాగే పాకిస్థాన్ లోని నాలుగు విభాగాలకు సమానంగా విద్యుత్తును అందిస్తుంది. కారాచీ లోని " కె.ఎలెక్ట్రిక్ " , వాటర్ , పవర్ డెవలెప్మెంటు అథారిటీ అత్యధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి దేశానికి ఆదాయం అందిస్తుంది. 2014 లో పలు ప్రాజెక్ట్‌ల ద్వారా 22,797 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయబడింది. పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ నుండి అనుమతి పొందిన పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమీషన్ మూడు వాణిజ్య అణువిద్యుత్తు కేంద్రాల నుండి అణువిద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాం కలిగిన ఒకేఒక ముస్లిం దేశం పాకిస్థాన్ పాకిస్థాన్ విద్యుత్తు ఉత్పత్తిలో 5.8% అణువిద్యుత్తు నుండి ఉత్పత్తి చేయబడుతుంది. ధర్మల్ పవర్ స్టేషన్ నుండి 64% విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది. హైడ్రాలిక్ పవర్ నుండి 29.9% విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.కోయల్ ఎలెక్ట్రిసిటీ నుండి 0.3% విద్యుత్తు చేయబడుతుంది. పర్యాటకం thumb|225px|left|Badshahi Mosque was commissioned by the Mughals in 1671. It is listed as a World Heritage Site. 2012 లో పాకిస్థాన్ వైవిద్యమైన సంస్కృతిక ప్రజలు , ప్రకృతిదృశ్యాలు పాకిస్థాన్‌కు ఒక మిలియన్ పర్యాటకులను ఆకర్షించాయి.1970 లో పాకిస్థాన్ నిర్వహించడానికి వీలుకానంతమంది పర్యాటకులను ఆకర్షించింది. పర్యాటకులు అధికంగా ఖైబర్ పాస్, పెషావర్, కరాచి, స్వాత్ (పకిస్థాన్) , రావల్పిండి నగరాలకు అధికంగా వస్తుంటారు. హిమాలయ పర్వతంలో ఉన్న మొహంజుదారో, హరప్పా , తక్షిశిల శిధిలాలు పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్నాయి. పాకిస్థాన్‌లో 700మీ కంటే అధికమైన ఎత్తైన పలు పర్వతశిఖరాలు ఉన్నాయి. thumb|right|170px|Daman-e-Koh is a garden overlooking the city of Islamabad. పాకిస్థాన్ ఉత్తర ప్రాంతంలో అనేక పురాతన కోటలు ఉన్నాయి. పురాతన నిర్మాణాలు, హంజాలోయ, చిత్రల్ లోయ ప్రాంతాలలో ఇస్లామిక్ పూర్వ నాస్తిక కలాషా ప్రజలు గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ సంతతి వారని భావిస్తున్నారు. పాకిస్థాన్ సంస్కృతిక రాజధాని లాహోర్‌లో మొఘల్ నిర్మాణాలకు ఉదాహరణగా ఉన్నాయి. వీటిలో బాద్షాహీ మసీదు, షాలిమార్ గార్డెంస్ (లాహోర్), జహంగీర్ సమాధి , లాహోర్ కోట ప్రధానమైనవి. ఇవి పర్యాటకులను ఆకర్షించడంలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. . 2015 అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభానికి ముందు పాకిస్థాన్‌ను వార్షికంగా 5 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. 2008 నుండి అస్థిరత కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గింది. 2005 కాశ్మీర్ భూకంపం తరువాత 2006 అక్టోబరు ది గార్డియన్ " పాకిస్థాన్ లోని 5 అత్యుత్తమ పర్యాటక ప్రాంతాలు" పాకిస్థాన్ పర్యాటకరంగానికి సహకరిస్తున్నయని వర్ణించింది. 5 ప్రాంతాలలో తక్షశిల, లాహోర్, కరకోం హైవే, కరీమాబాద్ (హుంజ) , సైఫుల్ ములక్ సరసు ఉన్నాయి. ఇవి అసమానమైన పాకిస్థాన్ సంస్కృతిక వారస్వత్వానికి వైవిధ్యానికి ఉదాహరణగా నిలిచాయి.Events taking place during 2007, Press released by Tourism of Pakistan2009 లో " ది వరల్డ్ ఎకనమిక్ ఫోరంస్ ట్రావెల్ & టూరిజం కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ " ప్రపమంచ వారసత్వ సంపదలలో 25% పాకిస్థాన్‌లో ఉన్నాయి. సింధూ లోయలలో సింధూ నాగరిక చిహ్నాలు అధికంగా ఉన్న హరప్పా , మొహంజుదారోలు , 5,000 సంవత్సరాల మాంగ్రోవ్ వృక్షాలు ఉన్నాయి. ప్రయాణసౌకర్యాలు 250px|thumb|right|Jinnah International Airport in Karachi handles 16 million passengers annually. పాకిస్థాన్ ట్రాంస్‌పోర్ట్ జి.డి.పి.లో 10.5% భాగస్వామ్యం వహిస్తింది. పాకిస్థాన్ రహదారి రవాణా వ్యవస్థ భారత్, బంగ్లాదేశ్ , ఇండోనేషియా కంటే మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ పాకిస్థాన్ రైల్వే వ్యవస్థ చైనా , భారత్ కంటే వెనుకబడి ఉంటుంది. అలాగే విమానవ్యవస్థ కూడా అభివృద్ధిచేయవలసిన అవసరం ఉంది. పాకుస్థాన్ జలమార్గవ్యవస్థ చాలా స్వల్పంగా ఉంటుంది. సముద్రతీర నౌకావ్యవస్థ ప్రాతీయప్రజల అవసరాలను కొంతవరకు తీర్చుతూఉంది. పాకిస్థాన్ ట్రాంస్‌పోర్ట్ వ్యవస్థకు వెన్నెముక వంటి పాకిస్థాన్ జాతీయరహదారి పొడవు 2,59,618కి.మీ. 91% ప్రయాణీకులు , 96% సరుకు రవాణాకు రహదారి ఆధారంగా ఉంది. రోడ్డు ట్రాంస్పోర్ట్ వ్యవస్థ అత్యధికంగా ప్రైవేట్ రంగం ఆధీనంలో ఉంది. సరుకు రవాణా వ్యవస్థ 95% ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. నేషనల్ హైవే అథారిటీ జాతీయరహదారి , మోటర్‌వేల నిర్వహణ బాధ్యత వహిస్తుంది. జాతీయరహదారి , మోటర్‌వే ఉత్తర- దక్షిణాలను కలుపుతూ దక్షిణ తీరంలో ఉన్న నౌకాశ్రయాన్ని పంజాబు , ఖైబర్ ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. మొత్తం దేశరహదారి మార్గంలో 4.2% ఉన్న ఈ మార్గం 85% ట్రాఫిక్ ఆధారంగా ఉంది.. రైలు మార్గం పాకిస్థాన్ రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే (పాకిస్థాన్) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 1947–1970 లో తరువాత దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం , ఆర్ధికాభివృద్ధి కారణంగా పాకిస్థాన్ ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధి జరిగేవరకు పాకిస్థాన్ ప్రజల ప్రయాణాలకు రైలుమార్గం ప్రధానంగా ఉంది. 1990 నుండి ప్రయాణీకులు రైల్వే నుండి అధికస్థాయిలో రహదారి మార్గాల ప్రయాణాలు ఎంచుకోవడం ఆరంభం అయింది. పాకిస్థాన్‌లో ఆటోమోటివ్ పరిశ్రమ ప్రారంభించిన తరువాత ప్రజలు రహదారి మీద ఆధారపడ అధికరించింది. ప్రస్తుతం 10% పాకిస్థాన్ ప్రజలు రైప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 4% సరికురవాణా రైళ్ళద్వారా జరుగుతుంది. వ్యక్తిగత ప్రయాణాలకు అధికంగా ఆటోమొబైల్ మీద ఆధాఅడుతున్నారు. 1990–2011 మద్య రైలు మార్గం పొడవు 8,775 నుండి 7,791 కుదించబడింది. పాకిస్థాన్ చైనా, ఇరాన్ , టర్కీ దేశాలతో వాణిజ్యం కొరకు రైల్వే సేవలలు వాడుకోవాలని ఎదురుచూస్తుంది. వాయుమార్గం పాకిస్థాన్‌లో దాదాపు మిలటరీ , సివిల్ ఉపయోగాలకు 139 విమానాశ్రయాలు ఉన్నాయి. "జిన్నా ఇంటర్నేషనల్ విమానాశ్రయం" పాకిస్థాన్ అంతర్జాతీయ ముఖద్వారంగా భావించబడుతుంది. అదనంగా పాకిస్థాన్‌లో ప్రధానంగా ఆలమా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, బెనాజిర్ బుట్టో ఇంటర్నేషనల్ విమానాశ్రయం, పెషావర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, క్వెట్టా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఫైసలాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, సైలకోట్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం , ముల్తాన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మొదలైన విమానాశ్రయాలు ఉన్నాయి. పాకిస్థాన్ ఏవియేషన్ పరిశ్రమలు, జాతీయ , ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్రాలకు స్వంతమైన సంస్థలు దాదాపు 73% దేశీయ ప్రయాణాలు , సరుకురవాణా చేస్తున్నాయి. ఎయిర్ బ్లూ, షాహీన్ ఎయిర్ ఇంటర్నేషనల్ , ఎయిర్ ఇండస్ మొదలైన ప్రైవేట్ సంస్థలు తక్కువ ఖర్చుతో విమానసేవలు అందిస్తున్నాయి. సముద్రమార్గం పాకుస్థాన్‌లో ప్రధానంగా కరాచీ (పోర్ట్ ఆఫ్ కరాచీ), సింధ్ (పోర్ట్ ఆఫ్ క్వాసిం) మొదలైన నౌకాశ్రయాలు ఉన్నాయి. 1990 గ్వాడర్ పోర్ట్ , గడానీ షిప్ – బ్రేకింగ్ యార్డ్ నిర్మించున తరువాత నౌకాశ్రయ కార్యక్రమాలు బలూచీ స్థాన్‌కు మార్చబడ్డాయి. . సాంకేతికం పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాకిస్థాన్ మౌళికసదుపాయాల అభివృద్ధి , పాకిస్థాన్ ఆధునికీకరణలో ప్రభావవంతమైన పాత్రపోషిస్తుంది. పాకిస్థాన్ అకాడమీ ఆఫ్ సైంస్ , ఇంటర్నేషనల్ నథియాగలి సమ్మర్ కాలేజ్ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రతిసంవత్సరం ప్రపంచం అంతటి నుండి నిపుణులను ఆహ్వానిస్తుంటారు.2005లో పాకిస్థాన్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో భౌతికశాస్త్రం (ఫిజిక్స్ ఇన్ డెవెలెపింగ్ కంట్రీ) సెమినార్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ప్రముఖ సాంకేతిక సంస్థలు పాకిస్థాన్ థియరిటికల్ ఫిజిస్ట్ అబ్దుస్ సలాం తన "ఎలెక్ట్రో వీక్ ఇంటరాక్షన్" కొరకు నోబుల్ బహుమతి అందుకున్నాడు. పాకిస్థానీ శాస్త్రఙలు ఇంఫ్లుయంషియల్ పబ్లికేషన్స్ , క్రిటికల్ సైంటిఫిక్ వర్క్స్ ఇన్ ది అడ్వాంస్డ్ మాథమెటిక్స్, బయాలజీ, ఎకనమిక్స్, కంప్యూటర్ సైంస్ , జెనెటిక్స్ లలో దేశీయ , అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని యోచిస్తున్నారు. ప్రముఖ శాస్త్రవేత్తలు , సాధనలు రసాయన శాస్త్రవేత్త సలీముజ్జామన్ సిద్దిక్వి వేపచెట్టు ఔషధీయ గుణాలను రసాయన ఉత్పత్తిదారుల దృష్టికి తీసుకువచ్చిన మొదటి పాకిస్థానీ శాస్త్రవేత్తగా గురింపు పొందాడు. . పాకిస్థానీ న్యూరోసర్జన్ అయూబ్ కె. ఒమ్మయ " ఒమ్మయ రిజర్వాయర్ " , బ్రైన్ ట్యూమర్ , మెదడు సమస్యలకుపరిష్కార విధానాలుఆవిష్కరించాడు. సాంకేతికాభివృద్ధి సంస్థలు సైంటిఫిక్ రీసెర్చ్ , అభివృద్ధి పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో కీలకపాత్ర వహిస్తుంది. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వసహకారంతో నేషనల్ పార్క్ , లాబరేటరీలు నిర్వహించబడుతున్నాయి. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ పాకిస్థాన్ పరిశ్రమలకు సహకారం అందిస్తుంది. 2010 లో పాకిస్థాన్ సైంటిఫిక్ పేపర్లు ప్రచురిస్తున్న దేశాలలో పాకిస్థాన్ 43 వ స్థానంలో ఉంది. పాకిస్థాన్‌లోని శక్తివంతమైన శాస్త్రీయ సమూహానికి చెందిన " పాకిస్థాన్ అకాడమీ ఆఫ్ సైన్స్ పాకిస్థాన్ ప్రభుత్వ సైంస్ విధానాలు రూపొందించడంలో సిఫార్సులు చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది.1960 లో అభివృద్ధిచెందిన ఆసియన్ అంతరిక్షప్రయోగాలలో భాగంగా "స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమీషన్" నాయకత్వంలో అత్యాధునిక రాకెటరీ, ఎలెక్ట్రానిక్స్ , ఎయిరోనొమి ఉత్పత్తులు చేయబడ్డాయి. అంతరిక్ష పరిశోధన పాకిస్థాన్‌లోని స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమీషన్ ప్రొగ్రాం పాకిస్థాన్ చేసిన గుర్తించతగిన విన్యాసాలు , సాధనలు నమోదు చేసింది. ఈ ప్రయోగం పాకిస్థాన్ అంతరిక్ష ప్రయోగం చేసిన మొదటి దక్షిణాసియా దేశంగా చేసింది.1990 లో బాదర్ ఫస్ట్ శాటిలైట్ తాయారు చేసి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ప్రయోగం పాకిస్థాన్‌కు అంతరిక్షంలో శాటిలైట్ నిలబెట్టిన మొదటి ముస్లిం దేశం , రెండవ దక్షిణాసియా దేశంగా గుర్తింపు తీసుకువచ్చింది. 1971 ఇండో పాక్ యుద్ధం తరువాత " పాకిస్థాన్ అండ్ వెపంస్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ " విదేశీ దండయాత్రలను అడ్డుకోవడానికి అణుబాంబును తయారుచేసింది. అణుపరిశోధన భారత్‌తో పోటీ పాకిస్థాన్ అణుబాంబు పరిశోధన చేపట్టిన దేశాలజాబితాలో స్థానం పొందేలా చేసింది. 1988 లో చాగై న్యూక్లియర్ పరిశోధన తరువాత పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసిన ఏడవదేశంగా గుర్తించబడింది. అంటార్కిటికా పాకిస్థాన్ అంటార్కిటికా ప్రొగ్రాం స్థాపించిన తరువాత ఆటార్కిటికా పరిశోధన క్రియాశీలకంగా చేస్తున్న స్వల్పసంఖ్యలో ఉన్న దేశాలలో పాకిస్థాన్ ఒకటిగా గుర్తించబడుతుంది. "పాకిస్థాన్ అంటార్కిటికా ప్రొగ్రాం" పర్యవేక్షణలో అంటార్కిటాకాలో ఖండంలో రెండు రీసెర్చ్ స్టేషన్లు నిర్వహించబడుతున్నాయి. అలాగే సంవత్సరం అంతా పనిచేసేలా అదనపు బేస్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. కంప్యూటర్లు , అంతర్జాలం 1990 నుండి పర్సనల్ కంప్యూటర్ పరిచయం చేసిన తరువాత కంప్యూటర్ల కొరకు విద్యుత్తు వాడకం అధికం అయింది. పాకిస్థాన్‌లో 2 కోట్లమంది అంతర్జాలం (ఇంటర్నెట్) ఉపయోగిస్తున్నారు. 2011 గణాంకాలను అనుసరించి అంతర్జాలం అధికంగా ఉపయోగిస్తున్న ఉత్తమశ్రేణి దేశాలలో పాకిస్థాన్ ఒకటిగా గుర్తించబడుతుంది. పాకిస్థాన్ కీలకమైన సాంకేతిక పబ్లికేషన్లను విడుదల చేస్తుంది. దేశీయంగా పాకిస్థాన్ సాధించిన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి అంతర్జాతీయ ప్రశంశలు అందుకుంటుంది. అధికసంఖ్యలో అంతర్జాలం వాడుకుంటున్న 27 ప్రపంచ దేశాలలో పాకిస్థాన్ ఒకటి. 2000 నుండి " పాకిస్థాన్ సూపర్ కంప్యూటింగ్ " లో పాకిస్థాన్ గుర్తించతగినంగా అభివృద్ధి సాధించింది. అలాగే పలు సంస్థలు "పారలెల్ కంప్యూటింగ్ " పరిశోధనలకు అవకాశం కల్పిస్తుంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇంఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్టుల కొరకు 4.6 బిలియన్లు వ్యయం చేస్తుంది. పాకిస్థాన్‌లో అధికంగా కంప్యూటర్ సాంకేతికతను మానవ వనరులు, మౌళిక వసతుల అభివృద్ధి, ఎ- గవర్నమెంటు వాడుకుంటున్నారు.. ప్రముఖ పాకిస్థానీ ఆవిష్కరణలు వివరణ ఒమ్మయ రిజర్వాయర్ మెదడు కణితులు తో రోగులకు చికిత్స కోసం మస్తిష్కమేరుద్రవమ ఔషధాల డెలివరీ సిస్టమ్. (సి)బ్రైన్ చరిత్రలో మొదటి కంప్యూటర్ వైరస్‌లలో ఒకటి ఎలెక్ట్రో వీక్ ఇంటరాక్షన్ ముస్లిం ప్రపంచం నాయకత్వం వహించిన మొదటి నోబుల్ బహుమతి పొందిన ఆవిష్కరణ ఫ్లాస్టిక్ మేగ్నెట్ సాధారణ ఉష్ణోగ్రతతో పనిచేసే మొదటి ఫ్లాస్టిక్ మేగ్నెట్ ఆవిష్కరణ . లెథల్ రహిత ఎరువు (నాన్- లెథల్ ఫర్టిలైజర్) బంబు తయారీ పదార్ధంగా మార్చలేని ఎరువుల తయారీ సూత్రం . నాన్- కింక్ - కాథటర్ మౌంట్ ( అనెస్థాలజీకి ఉపకరించే సాధనం) హ్యూమన్ డెవెలెప్మెంటు ఇండేక్స్ పాకిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి , మహబూబ్నగర్లో ఉల్ హక్ ఆవిష్కరణ Haq, Mahbub ul. 1995. Reflections on Human Development. New York: Oxford University Press. ప్రామాణిక నమూనా పాకిస్థానీ శాస్త్రవేత్త అబ్దుస్ సలాం ఆవిష్కరించిన ప్రాక్టికల్ ఫిజిక్స్ సూత్రం విద్య పాకిస్థాన్ ప్రజలకు ప్రాధమిక, సెంకండరీ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తుంది. పాకిస్థాన్ ప్రత్యేకదేశం అయిన తరువాత పాకిస్థాన్‌లో యూనివర్శిటీ ఆఫ్ పంజాబు విశ్వవిద్యాలయం ఒక్కటే ఉంది. తరువాత పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలో నాలుగు భూభాగాలలో వేగవంతంగా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. అవి వరుసగా 1949లో సింధ్ యూనివర్శిటీ, 1950 లో పెషావర్ యూనివర్శీటీ, 1953 లో కరాచీ యూనివర్శిటీ , 1970 యూనివర్శిటీ ఆఫ్ బలూచీస్థాన్. పాకిస్థాన్‌లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్శిటీలు , పబ్లిక్ , ప్రైవేట్ యూనివర్శిటీలు ఉన్నాయి. పాకిస్థాన్ యూనివర్శిటీలు పరిశోధనలు , ఉన్నతవిద్యను అందిస్తున్నాయి. పాకిస్థాన్‌లో 3193 ఒకేషనల్ విద్యాసంస్థలు ఉన్నాయి. పాకుస్థాన్‌లో మదరసాలు కూడా ఉన్నాయి. మదరసాలు ఉచిత ఇస్లాం విద్య, ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తుంది. మదరసాలలో అధికంగా బీదవర్గం ప్రజలు విద్యను అభ్యసిస్తుంటారు. ప్రజలవత్తిడి , పాకిస్థాన్ తాలిబన్‌లు మదరసాలను కొత్తగా తీవ్రవాదులను చేసుకోవడానికి వాడుకుంటున్నారని విమర్శలు తలెత్తడం వలన పాకుస్థానీ ప్రభుత్వం మదరసాల విద్యాస్థాయిలో విద్యాసంస్కరణలు చేపట్టింది. విద్యా విధానం పాకిస్థాన్ విద్యావిధానంలో నర్సరీ విద్య (ప్రిపరేటరీ తరగతులు), ఎలిమెంటరీ విద్య(ఒకటి నుండి ఐదు వరకు), మాధ్యమిక విద్య (ఆరు నుండి ఎనుమిది) ఉన్నత పాఠశాల (తొమ్మిది,పది) (సెకండరిక్ సర్టిఫికేట్ పొందవచ్చు) కమ్యూనిటీ కాలేజీలు (11 గ్రేడ్ , 12 గ్రేడ్) (హైయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ పొందవచ్చు). తరువాత యూనివర్శిటీ ప్రోగ్రాం ద్వారా గ్రాజ్యుయేట్ , పోస్ట్ గ్రాజ్యుయేట్ విద్య. పాకిస్థానీ స్కూల్స్ సెకండరీ ఎజ్యుకేషన్ విధానం యునైటెడ్ కింగ్డం లోని కేంబ్రిడ్జి విద్యాప్రణాళికను అనుసరించి ఉంటుంది. కొంతమంది విద్యార్దులు బ్రిటిష్ కౌంసిల్ నిర్వహించే సాధారణ స్థాయి , ఉన్నతస్థాయి పరీక్షలకు హాజరు ఔతుంటారు. నూతనవిద్యా విధానం thumb|250px|left|Islamia College University in Peshawar was founded in October 1913. 2007 నుండి పాకిస్థాన్‌లోని అన్ని పాఠశాలలలో నిర్భంధ ఇంగ్లీష్ మీడియం ఎజ్యుకేషన్ ప్రవేశపెట్టింది. 2013 లో అదనపు సంస్కరణలు చేపట్టబడ్డాయి. సింధు విద్యాసంస్థలు అన్నింటిలో చైనీస్ భాషాతరగతులు అదనంగా చేర్చబడ్డాయి. చైనా సూపర్ పవర్‌గా రూపొందడం , చైనా – పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడడం, పాకిస్థాన్ మీద చైనా ప్రభావం అధికం కావడం అందుకు కారణం. ప్రాంతాలవారీగా అక్షరాశ్యత స్థాయి వేరుపడుతూ ఉంటుంది. గిరిజన ప్రాంతాలలో స్త్రీల అక్షరాశ్యత 3% మాత్రమే ఉంది. 1995 లో కంప్యూటర్ విద్యాప్రవేశం తరువాత 1998 లో ప్రభుత్వం అక్షరాశ్యతకు నిర్మూలన కొరకు పిల్లలందరికి ఆరభవిద్యవిధానం ప్రవేశపెట్టింది. 2015 లో పలు విద్యాసంస్కరణల ద్వారా100% అక్షరాశ్యత సాధించడానికి ప్రయత్నిస్తుంది. ప్రాధమిక పాఠశాలలలో విద్యార్ధుల (10 సంవత్సరాలు దాటిన) ప్రవేశం 86 % చేరుకుంది. ఉన్నత విద్య హైయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ పొందిన తరువాత విద్యార్ధులు ప్రొఫెషనల్ కాలేజీలలో లేక బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఉన్నత విద్య కొరకు ఎంచుకుంటారు. విద్యార్ధులు సాధారణంగా ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్) / బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్.సి), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎం.బి.బి.ఎస్), ఎండీ), దంతవైద్య డిగ్రీ (డెంటిస్ట్రీ) (బి.డి.ఎస్), పశువైద్యం (వెటరినరీ మెడిసిన్ (డి.వి.ఎం)), బ్యాచులర్ ఆఫ్ లా (ఎల్.ఎల్.బి), ఎల్ఎల్ఎం, జ్యూరిస్ డాక్టర్ (జెడి), బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ (బి.ఎ. ఆర్క్)), డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మసి డాక్టరేట్) , బాటు (నర్సింగ్ బ్యాచిలర్ (బి.నర్స్) విద్యను ఎంచుకుంటారు. విద్యార్ధులు కొంతమంది బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లిటరేచర్ , మేనేజ్మెంటు సైంస్, బ్యావిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బి.ఎ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బి.కాం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎం.బి.ఎ) విద్యలను కూడా ఎంచుకుంటారు. పాకిస్థాన్ ఉన్నత విద్యలను సాధారణంగా హైయ్యర్ ఎజ్యుకేషన్ కమీషన్ (హెచ్.ఎస్.సి) పర్యవేక్షిస్తుంటారు. హైయ్యర్ ఎజ్యుకేషన్ కమీషన్ (హెచ్.ఎస్.సి) విద్యా విధానాల రూపకల్పన , దేశం అంతటా ఉన్న విశ్వవిద్యాలయాల వర్గీకరణ చేస్తుంది. 2014 అక్టోబర్‌లో పాకిస్థాన్ ఎజ్యుకేషన్ ఉద్యమకారుడు యూసఫ్‌జై నోబుల్ బహుమతి అందుకున్నాడు. అంతేకాక యూసఫ్‌జై అతిపిన్నవయస్కుడైన నోబుల్ బహుమతి గ్రహీతగా గుర్తించబడ్డాడు. గణాంకాలు thumb|right|Kalash people maintain a unique identity within Pakistan. పాకిస్థాన్ గణాంకాలను అనుసరించి 2017 లో పాకిస్థాన్ జనసంఖ్య 21,32,22,917. which is equivalent to 2.57% of the world population. అత్యంత జనసంఖ్య కలిగిన దేశాలలో 6వ స్థానంలో ఉంది. జనసంఖ్యాభివృద్ధి దక్షిణాసియాలో ప్రధమస్థానం (2.03% ) వార్షిక జనసంఖ్యాభివృద్ధి 3.6 మిలియన్లు 2020 నాటికి జనసంఖ్య అంచనా 210.13 మిలియన్లు 2045 నాటికి జనసంఖ్య అంచనా 420.6 మిలియన్లు 1947 పాకిస్థాన్ జనసంఖ్య 32.5 మిలియన్లు 1900 - 2009 జనసంఖ్యాభివృద్ధి 57.2% 2030 నాటికి పాకిస్థాన్ ప్రస్తుత ప్రపంచంలో అత్యంత అధిక జనసంఖ్య కలిగిన ముస్లిం దేశంగా గుర్తించబడుతున్న ఇండోనేషియాను అధిగమిస్తుందని అంచనా. 2010 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్ జనసంఖ్య 104 మిలియన్ల. పాకిస్థాన్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన ప్రజల శాతం 35%. అధికమైన ప్రజలు దక్షిణ పాకిస్థాన్‌ లోని సింధూనది తీరంలో నివసిస్తున్నారు. కరాచీ అత్యంత జనసాధ్రత కలిగిన వాణిజ్య ప్రాధాన్యత కలిగిన నగరంగా గుర్తించబడుతుంది. తూర్పు పాకిస్థాన్‌లో కైబర్ , ఉత్తర పాకిస్థాన్‌లో లాహోర్, ఫైసలాబాద్, రావల్పిండి, సర్గోధా, ఇస్లామాబాద్, గుజ్రంవాలా, సైల్కోట్, గుజరాత్ నగరం, ఝెలం, షైఖ్పురా, నౌషెరా, మర్దన్ , పెషావర్ నగరాలలో ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. 1990-2008 గణాంకాలను అనుసరించి నగరాలలో నివసిస్తున్నవారి శాతం 36%. దక్షిణాసియాలో అధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో పాకిస్థాన్ ప్రధమ స్థానంలో ఉంది. 2009–2010 పాకిస్థాన్ ఆర్ధికప్రణాలికలో ఆరోగ్యపరిరక్షణ కొరకు జిడిపి నుండి 2.6% వ్యయం చేసింది. 2010 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్ ప్రజల స్త్రీల సరాసరి ఆయుర్ధాయం 65.4%, స్త్రీల ఆయుర్ధాయం 63.6%. పాకిస్థాన్‌లో 80% ప్రజలు ఆరోగ్యసంరక్షణ కొరకు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. మొత్తం ప్రజలలో 19% , 30% పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 2009 గణాంకాలను అనుసరించి జన్మించిన ప్రతి వెయ్యిమంది శిశువులలో 87 మంది మరణిణిస్తున్నారని తెలుస్తుంది. Race/Ethnicity Composition భాషలు పాకిస్థాన్‌లో పలుప్రాంతాలు వాడుకలో ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో ముస్లిం జాతీయతకు చిహ్నంగా పాకిస్థాన్‌లో ఉర్దు భాషవాడుకలో ఉంది. ఉర్దూ భాష జాతీయ సమైఖ్యతకు గుర్తుగా 75% ప్రజలకు వాడుకభాషగా ఉంది. ఉర్దూ ప్రజలకు ప్రధాన అనుసంధాన భాషగా ఉంది.. అధికారభాషగా ఉన్న ఆగ్లం ప్రభుత్వకార్యాలయాలు, వ్యాపారం , న్యాయవ్యవస్థలో వాడుకలో ఉంది. ప్రజలలో ఆంగ్లభాష ప్రధానంగా పాకిస్థానీ యాసలో వాడుకలో ఉంది. పంజాబు ప్రాంతంలో పంజాబీ భాష వాడుకలో ఉంది. దక్షిణ పంజాబీలో సరైకి భాష వాడుకలో ఉంది. ఖైబర్‌లో పాష్తో భాష (ఇది ప్రాంతీయ భాష) వాడుకలో ఉంది. పాష్తో భాషను సింధు , బలూచీస్థాన్ ప్రజలు చక్కగా అర్ధం చేసుకుంటున్నారు. సింధూ ప్రాంతంలో సింధీ భాష, బలూచీ స్థాన్‌లో బలూచీ భాష వాడుకలో ఉన్నాయి. వలసప్రజలు పాకిస్థాన్ ప్రజలలో వలసప్రజలు కూడా ఉన్నారు. పాకిస్థాన్‌లో 1.7 మిలియన్ల ఆఫ్ఘన్ ప్రజలు తమను ఆఫ్ఘన్ పాకిస్థానీయులుగా నమోదుచేసుకున్నారు. వీరు కైబర్ ప్రాంతంలో ఉన్నారు. వీరు గిరిజన ప్రాంతానికి చెందిన ప్రజలు. వీరి స్వల్పంగా కారచీ , క్వెట్టాలలో ఉన్నారు. 1995 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లో బంగ్లాదేశీయులు 1.6 మిలియన్లు ఉన్నారు.6,50,000 అఫ్ఘన్లు ఉన్నారు. 2,00,000 మంది బర్మాదేశీయులు ఉన్నారు. 2,320 మంది ఇరానియన్లు ఉన్నారు. అంతేకాక ఫిలిప్పైనీయులు, నేపాలీయులు కూడా ఉన్నారు. భారతీయ ముస్లిములు అధికంగా కరాచీలో నివసిస్తున్నారు. పాకిస్థాన్ ఇతర దేశాలకంటే అత్యధికంగా శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చింది. జనంఖ్య వివరణ పాకిస్థాన్ ప్రజలు అధుకంగా నాలుగు ప్రాంతాలలో కేంద్రీకరించి ఉన్నారు. వీరు వరుసగా పంజాబీ ప్రజలు, పష్టన్ ప్రజలు, సింధీ ప్రజలు , బలూచీస్థాన్ ప్రజలు. 2009 గణాంకాలు అనుసరించి పంజాబీ ప్రజలు 76 మిలియన్లు (44.15%), పష్టన్ ప్రజలు 29 మిలియన్లు (15.42%) ఉన్నారు. . సింధీ ప్రజలు 24 మిలియన్లు(14.1%), సరైకి ప్రజలు 14.8 మిలియన్లు (10.53%)ఉన్నారు. ఉర్దూ మాట్లాడే ముహ్జర్ ప్రజలు (భారతీయ ముస్లిములు) 13.3 మిలియన్లు (7.5%), బలూచీ ప్రజలు 6.3 మిలియన్లు (3.5%) ఉన్నారు. మిగిలిన 11.1 మిలియన్ (4.66%) ప్రజలు హజారా , కలాష్ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ప్రవాస పాకిస్థానీ ప్రజలు 7 మిలియన్లు ఉన్నారు. మతం thumb|150px|Faisal Mosque, built in 1986 by Turkish architect Vedat Dalokay on behalf of King Faisal bin Abdul-Aziz of Saudi Arabia. పాకిస్థాన్ జనసంఖ్యాపరంగా ప్రపంచంలోని ముస్లిం దేశాలలో రెండవ స్థానంలో ఉంది. అలాగే షియాముస్లిముల సంఖ్యలో పాకిస్థాన్ ప్రంపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇరాన్ ఉంది. పాకిస్థాన్‌ ప్రజలలోలో 97% ముస్లిములు ఉన్నారు. పాకిస్థాలో అహమ్మదీయులు తరువాత స్థానంలో ఉన్నారు. స్వల్పసంఖ్యలో ఉన్న అల్బియట్లు అధికారికంగా ముస్లిమేతరులుగా భావించబడుతున్నారు. అదనంగా క్యురేనియన్ సమూహానికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు. సెప్టెంబరు 11 యునైటెడ్ స్టేట్స్ దాడి, పాకిస్థాన్ సెక్టేరియన్ వయలెంస్ తరువాత సున్నీ , షియాలను కేంద్రీకరిస్తూ దాడులు అధికరించాయి. 2013 లో షియాలు , సున్నీలు సెక్టేరియన్ హింస అడ్డగించాలని, చట్టాలని కఠినతరం చేయాలని , సున్నీ , షియా సంబంధాలు పరిరక్షించాలని దేశవ్యాప్తంగా పోరాటంసాగించారు.1974 నుండి రెండవ చట్టసవరణ జరిగిన తరువాత అహమ్మదీయులు తమనుతాము ముస్లిములమని చెప్పుకుంటున్నారు. 1984 నుండి అమదీయ ప్రార్ధనా మందిరాలు మసీదులుగా భావించడం రద్దు చేయబడింది.New Approaches to the Analysis of Jihadism: Online and Offline – Page 38, Rüdiger Lohlker – 2012 2012 గణాంకాలను అనుసరించి 12% పాకిస్థానీయులు తమను ముస్లిమేతరులు సూచించారు..Chapter 1: Religious Affiliation retrieved 4 September 2013 ఇస్లాం ప్రభావం ఇస్లాం ప్రభావనికి ముందు అరబ్ ప్రంపంచ ముస్లిముల సంప్రదాయాలతో పాకిస్థానీ ముస్లిములు సమఖ్యం చేయబడ్డారు. లాహోర్ లోని అలీ హవారి (12వ శతాబ్దం) వంటి సుఫీ ముస్లిముల ప్రార్ధనా మందిరాలకు జాతీయ గుర్తింపు ఉండేది. సింధు ప్రాంతం షెహ్వాన్‌లో ఉన్న సుఫీయిజానికి చెందిన షహ్బాజ్ క్వాలాండర్ (12వ శతాబ్దం) కూడా వీటిలో ఒకటి. సుఫీయిజానికి దేశంలో దీర్ఘకాల చరిత్ర ఉంది. సుఫీయజంలో ప్రజలు గురువారాలలో ప్రార్ధనామందిరాలలో సమైఖ్యంగా ఆరాధనలు నిర్వహిస్తుంటారు. సుఫీ వార్షిక ఉత్సవాలలో సుఫీ సంగీతం , నృత్యం చోటుచేసుకుంటాయి.సమకాలీన ముస్లింవాదులు సుఫీ సంప్రదాయాన్ని విమర్శిస్తుంటారు. హిందూయిజం పాకిస్థాన్‌లో ఇస్లాం తరువాత హిందూయిజం (1.6%) , క్రైస్తవం (1.6%) ఉన్నాయి. 1998 గణాంకాలను అనుసరించి బహా అనుయాయులు 30,000, సిక్కులు, బౌద్ధులు , జొరొయాస్ట్రియనిజం, ఒక్కో మతానికి 20,000 ఉన్నారు. పాకిస్థాన్‌లో స్వల్పంగా జైనిజం ఉంది.బ్రిటిష్ పాలనలో మొదటి ప్రపంచయుద్ధం , రెండవ ప్రపంచయుద్ధం కాలంలో యునైటెడ్ కింగ్డం కరాచీ మౌళిక వసతులు అభివృద్ధి చేసిన తరువాత రోమన్ కాథలిక్ అనుయాయులైన గోవా , తమిళ ప్రజలు కరాచీలో స్థిరపడ్డారు. 2005 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లో నాస్థికులు 1% మాత్రమే ఉన్నారు. 2012 నాటికి నాస్థికుల శాతం 2% చేరుకుంది. సంస్కృతి thumb|right|Truck art in Pakistan is a unique feature of Pakistani culture. పాకిస్థాన్ సాంఘిక జీవితం క్రమానుగతమైన ఆచారవ్యవహారాలను అనుసరించి ఉంటుంది. సంప్రదాయ ఇస్లామిక విలువలు సాఘికజీవితం , రాజకీయజీవితం మీద ప్రభావం చూపుతుంటుంది. సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అధికంగా కనిపిస్తుంది. అయినప్పటికీ సాంఘిక , ఆర్ధిక కారణాల వలన ప్రజలు న్యూక్లియర్ కుటుంబాల వైపు (విడి విడిగా చిన్న కుటుంబాలు) అంటే మక్కువ చూపుతున్నారు. . స్త్రీ పురుషులకు సల్వార్ కమీజ్ సంప్రదాయ దుస్తులుగా ఉన్నాయి. ఆధునిక కాలంలో జీంస్ , టీ షర్ట్లు కూడా మక్కువ అధికం ఔతుంది.. పాకిస్థాన్‌లో 3.5 కోట్లమంది మద్యతరగతి ప్రజలు, 1.7 కోట్లమంది ఎగువ మద్యతరగతి ప్రజలు ఉన్నారని భావిస్తున్నారు. సమీపకాలంగా ఆర్ధికంగా గ్రామీణ భూస్వాములను నగరప్రముఖులు అధిగమిస్తున్నారు. పండుగలు ఈద్ -ఉల్- ఫిర్ట్, ఈద్ - అల్- అధా, రంజాన్, క్రిస్మస్, ఈస్టర్ , దీపావళి మొదలైన పాకిస్థాని పండుగలను పాకిస్థాన్ ప్రజలు అధికంగా ఆచరించబడుతున్నాయి. . గ్లోబలైజేషన్ అధికరించడం వలన ఎ.టి. కీర్నీ గ్లోబలైజేషన్ జాబితాలో పాకిస్థాన్ 56వ స్థానంలో ఉన్న్నట్లు తెలుస్తుంది.. దుస్తులు, కళలు , ఫ్యాషన్ పాకిస్థాన్ జాతీయ దుస్తులుగా సల్వార్ , కమీజ్ గుర్తించబడుతుంది. దీనిని పాకిస్థాన్ లోని పంజాబు, సింధు, బలూచీస్థాన్ , ఖైబర్ ప్రాతాలలోని స్త్రీపురుషులు ధరిస్తుంటారు. అలాగే అజాద్ కాశ్మీర , గిరిజన ప్రజలు కూడా ధరిస్తుంటారు. ఒక్కో భూభాగంలో ఒక్కో తరహా శైలిలో సల్వార్ కమీజ్ ధరిస్తుంటారు. పాకిస్థాన్ ప్రజలు సూనితమైన వర్ణాలు , డిజైన్లతో రూపొందించబడిన సిల్క్, షిఫాన్, కాటన్ వస్త్రాలను ధరిస్తుంటారు. . సంప్రదాయ దుస్తులతో పురుషులు టైలరింగ్ చేయబడిన సూట్ , టై ధరిస్తుంటారు. వీటిని కార్యాలయాలు, పాఠశాలలు , ఇతర ప్రదేశాలలో ధరిస్తుంటారు. . ఫ్యాషన్ పరిశ్రమ ఫ్యాషన్ ప్రపంచంలో మార్పులు సంభవించిన తరువాత పాకిస్థాన్ ఫ్యాషన్ పరిశ్రమ వికసించింది. పాకిస్థాన్ ఫ్యాషన్ చారిత్రాత్మకంగా పలుదశలు దాటింది. పాకిస్థాన్ ఫ్యాషన్ భారతదేశ ఫ్యాషన్ , సంస్కృతి కంటే విలక్షణంగా ఉండి తన ప్రత్యేకత చాటుకుంటుంది. పాకిస్థాన్ ఫ్యాషన్ సంప్రదాయ , ఆధునిక మేలుకలయికగా ఉండి పాకిస్థాన్ ప్రత్యేకత గుర్తుచేస్తూ ఉంటుంది. ఆధునిక శైలికి భిన్నంగా ప్రజలు ధరించే దుస్తులు సంప్రదాయ , ప్రాంతీయ సహజత్వానికి ప్రతీకగా ఉంటాయి. ప్రాంతీయ తరహా దుస్తులు అధిక నూతనంగా , స్వచ్చమైన రూపంతో విలక్షణంగా ఉంటాయి. లాహోర్‌లో ఉన్న "పాకిస్థాన్ ఫ్యాషన్ డిజైన్ కౌంసిల్ " , కరాచీలో ఉన్న" ఫ్యాషన్ వీక్ " పాకిస్థాన్‌లో ఫ్యాషన్ షో నిర్వహిస్తుంటాయి. 2009 లో మొదటిసారిగా పాకిస్థాన్ ఫ్యాషన్ వీక్ నిర్వహించబడింది. స్త్రీవాదం పాకిస్థానీ స్త్రీల సాంఘిక అంతస్థు వ్యత్యాసంగా ఉంటుంది. స్త్రీల స్థితి సాంఘిక స్థితి, పుట్టిపెరిగిన వాతావరణం , ప్రాంతీయత మీద ఆధారపడి ఉంటుంది. అసమానంగా ఉండే ఆర్ధికసాంఘిక స్థితి , స్త్రీ విద్య పాకిస్థాన్ స్త్రీల జీవనవిధానం మీద కూడా ప్రభావం చూపుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకంగా స్త్రీలపట్ల వివక్ష అధికంగా ఉంది. . పాకిస్థాన్ ఆవిర్భావం నుండి స్త్రీవాదం ఉచ్చస్థాయిలో వినిపిస్తుంది.. 1947 నుండి ఆల్ పాకిస్థాన్ వుమంస్ అసోసియేషన్ , ఔరత్ ఫౌండేషన్, అంతర్జాతీయ స్త్రీవాద సంస్థలు పాకిస్థాన్‌లో స్త్రీ హక్కుల రక్షణార్ధం కృషిచేస్తున్నాయి. షీలా ఇరెనె పంత్, బెనాజిర్ బుట్టో మలాల, కల్సూం నవాజ్ షరీఫ్ , బుష్రా అంసారి పాకిస్థాన్‌లోని ప్రముఖ మహిళావాదులుగా గుర్తించబడుతున్నారు. మతపరమైన ఙానం , విద్యాభివృద్ధి కారణంగా పాకిస్థాన్ లోని స్త్రీల స్థితి మెరుగైంది. అంతర్జాతీయంగా సరాసరితో పోల్చిచూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2014 లో "వరల్డ్ ఎకనమిక్ ఫోరం" వర్గీకరణలో లింగవివక్షలో పాకిస్థాన్ అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది. స్త్రీ పురుష వివక్ష సంప్రదాయకంగా స్త్రీలు అణిచివేతకు గురౌతున్నారు. సాధారణంగా స్త్రీలకు ఇంటిపనులు పురుషులకు ఇంటి పోషణ బాధ్యతలు వహిస్తారు. పురుషులు ధనసంపాదన బాధ్యతవహిస్తారు. అయినప్పటికీ నగరప్రాంతాలలో స్త్రీలు వృత్తిఉద్యోగాలు చేస్తూ ఇంటిఖర్చులకు ఆర్ధికంగా సహకరిస్తుంటారు. అయినప్పటికీ ఆర్ధికస్వాతంత్రం అనుభవిస్తున్న వారి శాతం తక్కువగా ఉంటుంది. స్త్రీలు అధికంగా టీచింగ్ ఉద్యోగాలు ఎంచుముంటారు. ప్రజలలో చైతన్యం అభివృద్ధి కారణంగా స్త్రీలకు విద్యావకాశాలు అధికరిస్తున్నాయి.. మతాధికారులు కూడా ప్రస్తుతం స్త్రీవాద పోరాటాలకు , కార్యాలయాలు , గృహాలలో సమానత్వం కొరకు సహకారం అందిస్తున్నారు. . మాధ్యమం పాకిస్థాన్ ప్రైవేట్ వార్తాపత్రికలు , రాష్ట్రానికి చెందిన పాకిస్థాన్ టెలివిషన్ కార్పొరేషన్ (పి.టి.వి) , పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (పి.బి.సి),21వ శతాబ్దంలో పాకిస్థాన్ రేడియో పాకిస్థాన్ మాధ్యమం మీద ఆధిపత్యం వహిస్తున్నాయి. 2000 నుండి మాధ్యమం ప్రైవేటీకరణ చేయబడిన తరువాత అధికంగా 24 గంటల వార్తాప్రసారాలు, పాకిస్థాన్ న్యూస్ చానెల్స్ , టెలివిషన్ చానెల్స్ మాధ్యమం మీద ఆధిపత్యం వహిస్తున్నాయి. అదనంగా జాతీయ ఎంటర్టైన్మెంటు , న్యూస్ చానెల్స్, వీదేశీ టెలివిషన్ ప్రసారాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. చిత్ర పరిశ్రమ లాలీ వుడ్ (ఉర్దూ చిత్రసీమ) కు కారాచీ, లాహోర్ , పెషావర్ ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. పాకిస్థాన్ ప్రజల సంస్కృతిలో ప్రధాన భాగంగా ఉన్న బాలివుడ్ చిత్రాలు 1965–2008 వరకు ప్రజలకు నిషేధించబడ్డాయి. పాకిస్థాన్ చిత్రపరిశ్రమ బలహీనంగా ఉన్నా పాకిస్థానీ ఉర్దూ నాటకాలు, నాటకరంగ ప్రదర్శనలకు ప్రజాదరణ అధికంగా ఉంది.పలు పాకిస్థానీ టెలివిషన్ ప్రసారాలు దినసరి వరుసకార్యక్రమాలను అందిస్తూ ఉన్నాయి. పాకిస్థానీ నాటకాలు టెలివిషన్ ప్రసారాలను అధిగమిస్తున్నాయి. పాప్ సంగీతం 1960–1970 లో పాప్ మ్యూజిక్ డిస్కో ప్రాబల్యం సంపాదించుకుని పాకిస్థాన్ సంగీతప్రపంచం మీద ఆధిఖ్యత సాధించాయి. 1980-1990 లో బ్రిటిష్ హెవీ మెటల్ సంగీతం, పాకిస్థానీ రాక్ సంగీతాలు పాకిస్థానీ ప్రజలను ఆకర్షించాయి. 2000 లో హెవీ మెటల్ సంగీతం పాకిస్థాన్ సంగీతప్రపంచానికి పరిచయం చేయబడింది. ఇది ప్రజాదరణ సాధించడమేగాక విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది. జానపద సంగీతం పాకిస్థానీ జానపద సంగీతంలో ప్రాంతీయ జానపద సంగీతం , క్వవ్వాల్, ఘజల్ మొదలైన సంప్రదాయ శైలి భాగస్వామ్యం వహిస్తున్నాయి. అఫనంగా ఆధునికమైన పాశ్చాత్య సంగీతం కూడా ప్రజాదరణ కలిగి ఉంది.. పాకుస్థాన్‌లో అనేకమంది జానపదగాయకులు ఉన్నారు. పశ్చిమభూభాగం నుండి ఆఫ్ఘన్ శరణార్ధిల ప్రవేశించిన తరువాత పాష్తో సంగీతానికి ఆదరణ అధికం అయింది. అయినప్పటికీ పాష్తో సంగీతానికి కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత కనిపిస్తుంది. పాకిస్థాన్‌లో కొంత అత్యాధునికమైన , పారదర్శకమైన మాధ్యమం పనిచేస్తుంది. పాకిస్థాన్ మాధ్యమం లంచగొండితనం వెలుగులోకి తీసుకురావడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. నగరీకరణ thumb|left|Long exposure of Empress Market in Karachi. పాకిస్థాన్‌కు స్వతంత్రం వచ్చిన తరువాత పాకిస్థాన్ నగరీకరణ వేగవంతం అయింది. అందుకు పలు వైవిద్యమైన కారణాలు ఉన్నాయి. దక్షిణ పాకిస్థానీయులు అధికంగా సింధూనదీతీరంలో నివసిస్తుంటారు. అధిక జనసంఖ్య కలిగిన నగరంగా కరాచీ ప్రత్యేకత కలిగి ఉంది. తూర్పుప్రాంత పాకిస్థాన్ ప్రజలు ఖైబర్ పఖ్తుంవా , ఉత్తర పాకిస్థాన్ లాహోర్, ఫైసాలాబాద్, రావల్పిండి, ఇస్లామాబాద్, సర్గోధా, గుజరంవాలా, సైకోట్, గుజరత్ నగరం, ఝెలం, షైయిఖ్పురా, నౌషెరా, మార్దన్ , పెషావర్ నగరాలు ఉన్నాయి. 1990–2008 మద్య కాలంలో నగరాలో నివసిస్తున్న ప్రజల శాతం 36%. ఇది పాకిస్థాన్‌ను ఆసియాలో అధికంగా నగరీకరణ దేశంగా నిలబెట్టింది. అదనంగా 50% ప్ర్జలు 5,000 మంది కంటే అధిక జనసంఖ్య కలుగిన పట్టణాలలో నివసిస్తున్నారు. . పాకిస్థాన్ ప్రజలు అధికంగా దేశీయంగానూ , విదేశాలకు వలసపోతుంటారు. అందువలన పాకిస్థాన్ ప్రజలు అధికంగా నగరాలకు వలసపోవడానికి సహకరిస్తుంది. 1998 లో ఒక విశ్లేషకుడు 1940 నుండి పాకిస్థాన్ నగరీకరణ గురించి వివరణ అందించాడు.. స్వాతంత్రం తరువాత ఇతరదేశాల నుండి పాకిస్థాన్‌కు వలస రావడం (ప్రత్యేకంగా పొరుగుదేశాల నుండి) వలన పాకిస్థానీ నగరీకరణను మరింత అధికం చేసింది. 1971 లో బంగ్లాదేశ్ ప్రత్యేకదేశంగా అవతరించిన తరువాత పాకిస్థాన్ నగరీకరణ మరింత అధికం అయింది. సంప్రదాయానికి ముఖ్యత్వం ఇచ్చే బీహారీ పాకిస్థానీలు అధికసంఖ్యలో , స్వల్పసంఖ్యలో బెంగాలీలు పాకిస్థాన్‌కు వలసపోయారు. తరువాత బర్మీయులు పాకిస్థాన్‌కు వలసపోయారు. ఆఫ్ఘనీస్థాన్‌లో సోవియట్ యుద్ధం కూడా మిలియన్ల ఆఫ్ఘనీయులను పాకిస్థాన్‌కు తరలివెళ్ళేలా చేసింది. ఆఫ్ఘన్లు ప్రత్యేకంగా వాయవ్య పాకిస్థాన్‌కు శరణార్ధులుగా తరలివెళ్ళారు. ఆఫ్ఘన్‌ల వలస కారణంగా పాకిస్థాన్ నగరీకరణ వేగవంతం చేయవలసిన అవసరం అధికమైంది. ఆఫ్ఘన్ల రాక సాంఘిక- రాజకీయ- ఆర్ధిక సమస్యలను అధికం చేసింది. అదనంగా జనసంఖ్య అధికమవడం కారణంగా హరిత విప్లవం , రాజకీయాల అభివృద్ధికి కారణం అయింది. . ప్రవాస పాకిస్థానీలు దాదాపు 7 మిలియన్ల పాకిస్థాన్ ప్రజలు విదేశాలలో నివసిస్తున్నారని అంచనా. అత్యధికంగా మద్య ఆసియా, యూరప్ , నార్త్ అమెరికాలో నివసిస్తున్నారు. 13బిలియన్ల అమెరికన్ డాలర్లు ప్రవాస పాకిస్థాన్ విదేశీ మారకాన్ని స్వదేశానికి పంపుతున్నట్లు అంచనా. విదేశీ మారక ఆదాయంలో పాకిస్థాన్ ప్రంపంచంలో 10వ స్థావనంలో ఉంది. విదేశీ ఉపాధి ప్రవాస పాకిస్థాన్ ప్రజలను పాకిస్థాన్ ఓవర్సీస్ పాకిస్థానుకుగా గుర్తిస్తుంది. 2008 లో మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ పాకిస్థానీస్ స్థాపించబడింది. ప్రవాస పాకిస్థానీయుల సంస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ఇది పనిచేస్తూ ఉంది. ప్రవాస పాకిస్థాన్ ప్రజల విదేశీమారకం దేశం విదేశీమారక నిల్వలను పెంచడంలో రెండవస్థానంలో ఉంది. మొదటిస్థానంలో ఎగుమతులు ఉన్నాయి. పాకిస్థాన్ విదేశీమారకం వార్షికంగా క్రమక్రమాభివృద్ధి చెందుతూ ఉంది. 2007-2008 లలో 4 మిలియన్ల అభివృద్ధి సాధించగా 2008-2009 లో 8 మిలియన్ల అభివృద్ధికి (21.8%) చేరుకుంది. విదేశీమారకం 2009–2010 లో పాకిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌కు 9.4 బిలియన్ల అమెరికన్ డాలర్లు విదేశీమారకం పంపారు. పాకిస్థాన్ ప్రజల విదేశీమారక ఆదాయం ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. 2012 లో పాకిస్థాన్ పాకిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌కు పంపిన విదేశీమారకం పాకిస్థాన్‌ను ప్రపంచం లో 10 వ స్థానంలో (13 బిలియన్లు) నిలిపింది. పాకిస్థాన్ ప్రవాసపాజిస్థాన్ ప్రజల విదేశీమారకం పాకిస్థాన్ ఆర్ధికరంగలో ముఖ్యత్వవహిస్తుందని గ్రహించిన పాకిస్థాన్ ప్రభుత్వం 2004 లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో ది ఓవర్సీస్ పాకిస్థాన్ డివిషన్ స్థాపించబడింది. అదనంగా సాంఘిక సంక్షేమ పథకాలు, ఓవర్సీస్ పాకిస్థాన్ ఫౌండేషన్ ప్రవాస పాకిస్థాన్ ప్రజలకు సహకరిస్తూ ఉంది. విమానాశ్రయ సౌకర్యాలు అధికరించడం, నివాసగృహాల అభివృద్ధి, విద్య , ఆరోగ్యసంక్షేమ పథకాల అభివృద్ధి చేస్తూ ప్రవాస పాకిస్థానీయులకు సహకారం అందిస్తుంది. వీటిలో అతిముఖ్యమైనది తిరుగి స్వదేశం చేరుకున్న ప్రవాసపాకిస్థానీయులకు పునరావాసం ఏర్పరచడం ప్రధానమైనది. సాహిత్యం thumb|right|140px|alt=Muhammad Iqbal|Muhammad Iqbal, Pakistan’s national poet who conceived the idea of Pakistan. పాకిస్థాన్‌లో ఉర్ధూసాహిత్యం, సింధూ సాహిత్యం, పంజాబీసాహిత్యం, పషో సాహిత్యం , కవిత్వం, బలోచీ అకాడమీ, పర్షియన్ సాహిత్యం, పాకిస్థానీ ఆగ్లసాహిత్యం , ఇతరసాహిత్యప్రక్రియలు ఉన్నాయి. అతిపెద్ద సాహిత్య సముదాయం అయిన "ది పాకిస్థానీ అకాడమీ ఆఫ్ లెటర్స్" అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యం , కవిత్వం అందిస్తుంది.Official website in English Pakistan Academy of Letters " ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ పాకిస్థాన్" అత్యధికంగా సాహిత్యాన్ని ప్రచురణ , పోషణ బాధ్యతవహిస్తుంది. అలాగే సాహిత్యాన్ని ప్రజలకు అందజేయడానికి తగినంతగా సహకరిస్తుంది. 19వ శతాబ్ధానికి ముందు పాకిస్థాన్‌లో సాహిత్యం అధికంగా కవిత్వం, సూఫీ కవిత్వం, వివిధ సంగీత ప్రక్రియలు , పాప్ సంప్రదాయం రూపంలో ఉండేది. కాలనీ పాలనాకాలంలో దేశీయసాహిత్యకాతులు ఆగ్లసాహిత్యంతో ప్రభావితులు అయ్యారు. వారు వివిధ రచనావిధానాలను స్వీకరించారు. వీటిలో ప్రోజ్ విధానం అధికంగా ఆదరించబడింది. కవిత్వం thumb|180px|left|Tomb of Shah Rukn-e-Alam is part of Pakistan's sufi heritage. పాకిస్థాన్‌ సాహిత్యకారుల జాబితా:- ముహమ్మద్ ఇక్బాల్: ఉర్దూ , పర్షియన్ కవిత్వం. ఆయన ఇస్లామిక్ సాంస్కృతిక ప్రజల ఆధ్యాత్మిక , రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టాడు. ఆయన అంతర్జాతీయ ముస్లిముల ఐఖ్యత కొరకు పాటుబడ్డాడు. ఫియాజ్ అహ్మద్: ఆయయన అందమైన దస్తూరి , చిత్రలేఖనానికి ప్రఖ్యాతిచెందాడు. సుఫీ కవులు: షాహ్ అబ్దుల్ లతీఫ్, బులెహ్ షాహ్, మైన్ ముహమ్మద్ భక్ష్ , ఖవాజ ఫరిద్ మొదలైనవారు చాలా ప్రజాదరణ పొందారు. మిర్జా కాలిచ్ బెగ్: ఆధునిక సింధూసాహిత్యానికి మూలస్థంభంగా ఉన్నాడు. తాత్వికం ముహమ్మద్ ఇక్బాల్, సయ్యద్ అహమ్మద్ ఖాన్, ముహమ్మద్ ఆసాద్, అబు, ఆలా మౌదుబి , ముహమ్మద్ అలి జౌహరిలు పాకిస్థాన్ తాత్వికచిందన అభివృద్ధికి మార్గదర్శకం వహించారు.Javed, Kazi. Philosophical Domain of Pakistan (Pakistan Main Phalsapiana Rojhanat) (in Urdu). Karachi: Karachi University Press, 1999. తరువాత బ్రిటిష్ తాత్వికచింతన ఆతరువాత ఆమెరికన్ తాత్వికచింతన పాకిస్థాన్ తత్వచింతన అభివృద్ధికి సహకరించాయి. తాత్విక వాదులు ఎం.ఎం. షరీఫ్ , సయ్యద్ జఫ్రుల్ హాసన్ 1947 లో మొదటి పాకిస్థాన్ తాత్వికఉద్యమానికి తెరతీసారు. 1971 ఇండో – పాకిస్థాన్ యుద్ధం తరువాత పాకిస్థాన్‌ తాత్విక ప్రపంచంలోమార్కిజం చింతన అభివృద్ధికి జలాలుద్దీన్ అబ్దుర్ రహీం, సొభొ గియాన్‌చందని , మాలిక్ మెరాజ్ ఖలిద్ మొదలైన ప్రముఖులు సహకరించారు.. మంజూర్ అహ్మద్, జాన్ ఎలియా, హాసన్ అస్కారి రిజ్వి చితనలు పాకిస్థాన్ తత్వచింతన మీద ప్రభావం చూపారు. అంతర్జాతీయ ఖ్యతిచెందిన తాత్వికుడు నొయాం చోకీ చింతనలు పాకిస్థాన్ తత్వచింతన, రాజకీయ , సాంఘిక చింతన మీద ప్రభావంచూపింది. నిర్మాణశైలి thumb|left|160px|The Lahore Fort, a landmark built during the Mughal era, is a UNESCO World Heritage Site. పాకిస్థాన్ చరిత్రలో నాలుగు గుర్తించతగిన కాలాలు ఉన్నాయి. ఇస్లామిక్ కాలానికి ముందు, ముస్లిం కాలం, కాలనీ కాలం , సిధూనాగరికత ఆరంభకాలం( క్రీ.పూ 3000). ఆరభకాల ఉన్నతస్థాయి నగరసంస్కృతికి చెందిన భవనాలలో కొన్ని ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇస్లామిక్ కాలానికి ముందు కాలానికి చెందున మొహంజొ- దారో, హరప్పా , కోట్ దిజి వంటి మానవస్థావర ప్రాంతాలు ప్రస్తుత పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.. మొదటి శతాబ్దం ఆరంభంలో బుద్ధిజం , గ్రీక్ ప్రభావం కారణంగా గ్రీకో- బుద్ధిజం శైలి అభివృద్ధికి కారణం అయింది. Sachindra Kumar Maity. Cultural Heritage of Ancient India Abhinav Publications, 1983 ISBN 039102809X p 46 ఈ శకానికి శిఖారాగ్రంగా గాంధారశిల్పం శైలి రూపుదిద్దుకుంది. బుద్ధిజానికి ఉదాహరణగా ఖైబర్ పఖ్తుంక్వాలోని తాకత్- ఇ- భై బౌద్ధ ఆరామం ఒకటి. ఇస్లాం ప్రవేశం ప్రస్తుత పాకిస్థాన్‌లో ఇస్లాం ప్రవేశించగానే పాకిస్థాన్‌లో బుద్ధిజం ముగింపుకువచ్చింది. తరువాత క్రమంగా ఈ ప్రాంతంలో ఇస్లామిక్ నిర్మాణాలు అధికరించాయి. అతి ప్రాముఖ్యత సంతరించుకున్న ఇండో- ఇస్లామిక్ నిర్మాణాలకు ఉదాహరణగా ముల్తాన్‌లో "రుక్న్- ఇ- ఆలం" (షహ్ రుక్న్- ఇ- ఆలం సమాధి) ఇప్పటికీ నిలిచిఉంది. మొఘల్ కాలానికి చెందిన "పర్షియన్- ఇస్లామిక్" శైలి నిర్మాణాలలో హిందూస్థానీ కళలు చోటుచేసుకున్నాయి. మొఘల్ పాలకులకు సందర్భానుసార నివాసంగా ఉన్న లాహోర్‌లో మొఘల్ కాలానికి చెందిన పలు నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో " బాద్షాహీ మసీదు" , లాహోర్ కోట, ఆలంగిరీ ద్వారం, వర్ణరజితమైన మొఘల్ నిర్మాణశైలిలో నిర్మించబడిన "వజీర్ ఖాన్ మసీదు" అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నిర్మాణాలు గుర్తించబడుతున్నాయి.,Simon Ross Valentine. 'Islam and the Ahmadiyya Jama'at: History, Belief, Practice Hurst Publishers, 2008 ISBN 1850659168 p 63 మొఘల్ కాలానికి చెందిన మరొకొన్ని నిర్మాణాలలో లాహోరు లోని షాలీమర్ గార్డెన్లు, తట్టలోని షాజహాన్ మసీదు ఉన్నాయి. కాలనీ పాలనకు ముందు ఇండో- యురేపియన్ " శైలి కార్యాలయాలు ఇండియన్- ఇస్లామిక్ మిశ్రిత శైలిలో అభివృద్ధి చేయబడ్డాయి. కాలనీ పాలన తరువాత ఫైజల్ మసీదు, మినార్- ఇ- పాకిస్థాన్ , మజర్-ఇ- ఖ్వైద్ మొదలైన ఆధునిక నిర్మాణాలు పాకిస్థానీ జాతీయత ప్రతిబింబించేలా నిర్మిచబడ్డాయి. మౌళిక వసతులకు చెందిన నిర్మాణాలలో యునైటెడ్ కింగ్డం నిర్మాణశైలి ప్రతిబింబిస్తుంది. అలాంటి నిర్మాణాలు లాహోరు, పెషావర్ , కరాచీలలో ఉన్నాయి. ఆహారం 250px|thumbnail|right|A Pakistani dish cooked using the tandoori method. పాకిస్థాన్ ఆహారసంస్కృతిలో దక్షిణాసియా దేశాలప్రభావం అధికంగా ఉంది. 16వ శతాబ్దంలో మొఘల్ రాజుల వంటగది నుండి వెలువడిన పలు ఆహారాలు ఇప్పటికీ పాకిస్థాన్ ఆహార అలవాట్ల మీద ప్రభావం చూపుతూ ఉంది. మిగిలిన ద్వీపకల్పంలో కంటే పాకిస్థాన్‌లో అత్యధికమైన మాంసాహారాలు వాడుకలో ఉన్నాయి. ఈ మాంసాహారాలకు బ్రిటిష్, మద్య ఆసియా, మిడిల్ ఇస్ట్ దేశాల మాంసాహారాల ప్రభావం మూలంగా ఉంది. పాకిస్థానీ ఆహారాలలో మసాలా దినుసులు, మూలికలు, సీసనింగ్స్ అధికంగా వాడబడుతుంది. అల్లం, వెల్లుల్లి, పసుపు, ఎండుమిరపకాయలు , గరం మసాలా అధికమైన ఆహారల తయారీకి వాడుతుంటారు. సాధారణంగా పాకిస్థానీ ఆహారంలో చపాతీలతో కూరలు, మాంసం, కూరగాయలు, పప్పుకూరలు ఉంటాయి. అన్నంకూడా పాకిస్థాన్ ప్రధానాహారాలలో ఒకటి. వట్టి అన్నం (ప్లెయిన్ రైస్) లేక సుఘంధ ద్రవ్యాలను చేర్చి వేపిన అన్నం కూరలతో వడ్డించబడుతుంది. ఆహారంలో తీపిపదార్ధాలు కూడా ఉంటాయి. పానీయాలు పాకిస్థాన్‌లోని పంజాబీప్రాంతవాసులకు సంప్రదాయపానీయం లస్సీ. దక్షిణ భూభాగంలో చాలాప్రాబల్యం పొందిన స్వీటుగా సోహన్ హల్వాకు ప్రత్యేకత ఉంది. ఇది పాకిస్థాన్ అంతటా ఆదరణ కలిగి ఉంది. . క్రీడలు బ్రిటిష్ పాలనా కాలం నుండి పాకిస్థాన్ క్రిడారంగం అభివృద్ధిచెందింది. పాకిస్థాన్ జాతీయక్రీడ హాకీ. పాకిస్థాన్ క్రీడాకారులు 3 మార్లు (1960-1968-1984) ఓలింపిక్ స్వర్ణపతకాలను సాధించారు. పాకిస్థాన్ 4 మార్లు పురుషుల ప్రపంచ హాకీకప్ (1971-1978-1982-1994) గెలుచుకుంది. క్రికెట్ పాకిస్థాన్ ప్రజలకు అత్యంత అభిమానపాత్రమైన క్రీడ క్రికెట్. పాకిస్థాన్ నేషనల్ క్రికెట్ క్రీం (షాహీన్) 1992 ప్రపంచ క్రికెట్ సాధించింది. 2007 ఐ.సి.సి. వరల్డ్ ట్వంటీ పోటీలలో రన్నర్‌ స్థానం దక్కించుకున్నది. 2009లో తీవ్రవాదులు శ్రీలంక క్రికెట్ క్రీడాకారుల మీద మిలిటెంట్లు దాడి చేసారు. ఫలితంగా పాకిస్థాన్ క్రికెట్ క్రీడకు కొంత అవరోధం ఏర్పడింది.. అయినప్పటికీ 2015 మే ఇంటర్నేషనల్ క్రికెట్ తిరిగి పాకిస్థాన్ చేరుకుంది. జింబావే టీం పాకిస్థాన్‌ పర్యటనలో మొత్తం పోటీలు గట్టి బందీబస్తు మద్య లాహోరులో నిర్వహించబడ్డాయి. అన్ని పోటీలు హౌస్ ఫుల్ సాధించి సరికొత్త చరిత్రను సృషిటించాయి. . తరువాత పలుపోటీలకు ద్వారాలు తెరచుకున్నాయి. thumb|left|225px|The A1 car of A1 Team Pakistan driven by the motorsport driver, Adam Khan. అథ్లెట్లు 1954 -1958 లలో ఆసియన్ అథ్లెట్ క్రీడలో అబ్దుల్ ఖలిక్ పాల్గొన్నాడు. ఆయన పాకిస్థాన్ తరఫున 34 అంర్జాతీయ స్వర్ణపతకాలను 14 రజిత పతకాలను , 12 కాంశ్యపతకాలను సాధించాడు. . క్రీడాకారులు స్క్వాష్ లో అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడు జహంగీర్ ఖాన్ , జంసర్ ఖాన్‌లు పలుమార్లు చాంపియన్ షిప్ సాధించి చరిత్ర సృష్టించారు. జంసర్ ఖాన్ బ్రిటిష్ ఓపెన్ స్క్వాష్ చాంపియన్‌షిప్ కూడా 10 మార్లు సాధించి విజయం సాధించాడు. ఒలింపిక్స్ పాకిస్థాన్ క్రీడాకారులు పలుమార్లు ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నారు. పాకిస్థాన్ క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో హాకీ, బక్సింగ్, అథ్లెట్లు,ఈత , షూటింగ్ మొదలైన క్రీడలలో పాల్గొన్నారు. పాకిస్థాన్ సాధించిన 10 ఒలింపిక్ స్వర్ణపతకాలలో 8 హాకీ క్రీడాకారులు సాధించినవే. పాకిస్థాన్ క్రీడాకారులు కామంవెల్త్ క్రీడలు , ఆసియన్ క్రీడలలో 65 -160 పతకాలు సాధించారు. పోలో పాకిస్థాన్‌లో జాతీయస్థాయి పోలో ప్రబలంగా ఉంది. దేశంలో పలుప్రాంతాలలో పోలో క్రీడలు నిర్వహించబడుతున్నాయి. బాకిసింగ్, బిలియర్డ్స్, రోయింగ్, కయకింగ్, కేవింగ్, టెన్నిస్, కాంట్రాక్ట్ బ్రిడ్జ్, గోల్ఫ్ , వాలీబల్ మొదలైన క్రీడాలలో కూడా పాకిస్థాన్ క్రీడాకారులు చురుకుగా పాల్గొంటూ వీటిని అంతర్జాతీయ , జాతీయ స్థాయిలో పాల్గొంటున్నారు. లాహోర్ , కారాచీలలో బాస్కెట్ బాల్‌ ప్రాబల్యం కలిగిఉంది. రాజకీయ నాయకులు ఇమ్రాన్ ఖాన్ నియాజి పర్వేజ్ ముషార్రఫ్ బెనజీర్ భుట్టో షెహబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ ఇవి కూడా చూడండి భారత్ పాక్ యుద్దం 1965 భారత్ పాక్ యుద్దం 1971 గమనికలు మూలాలు వర్గం:దక్షిణాసియా దేశాలు వర్గం:కామన్వెల్తు దేశాలు వర్గం:ప్రపంచ దేశాలు వర్గం:పాకిస్తాన్
మాల్దీవులు
https://te.wikipedia.org/wiki/మాల్దీవులు
మాల్దీవుల గణతంత్రరాజ్యం భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం. మాల్దీవులలో 26 పగడపు దిబ్బలలో మొత్తం 1,196 పగడపు దీవులు ఉన్నాయి. చరిత్ర thumb|left|18వ శతాబ్ధానికి చెందిన ఈ మాల్దీవుల మ్యాప్ నెదర్లాండ్ దేశానికి చెందిన పియార్రే మార్టియర్ గీసినది మాల్దీవుల యొక్క ప్రాచీన చరిత్ర అస్పష్టముగా ఉంది. మాల్దీవుల కథల ప్రకారం, కోయిమాలే అనే ఒక సింహళ యువరాజు తన పెళ్ళికూతురైన శ్రీలంక చక్రవర్తి కుమార్తెతో పాటు ఒక మాల్దీవుల లగూన్ లో చిక్కుకొని అక్కడే స్థిరపడి మాల్దీవుల మొదటి సుల్తాన్‌గా పరిపాలించాడని ప్రతీతి. శతాబ్దాలుగా ఈ దీవుల అభివృద్ధిపై దగ్గరగా ఉన్నఅరేబియా సముద్ర, హిందూ మహాసముద్ర తీరాల నుండి వచ్చిన నావికుల ప్రభావము ఉంది. మలబార్ (ఇప్పటి భారతదేశంలోని కేరళ) తీరానికి చెందిన మోప్లా సముద్రపు దొంగలు ఈ దీవులను ఎంతో ఇబ్బందికి గురి చేసారు. 16వ శతాబ్దములో పోర్చుగీసు వాళ్ళు ఈ దీవులను తమ ఆధీనములోనికి తెచ్చుకుని 15 సంవత్సరాలు (1558-1573) వరకూ పాలించారు. వారిని మహమ్మద్ అల్ ఆజమ్ అనే దేశభక్తి గల వీరుడు తరిమివేశాడు. చాలాకాలం స్వతంత్ర మహమ్మదీయ రాజ్యంగా ఉన్నా (1153-1968) మాల్దీవులు ఇంగ్లీషు వారి రక్షణగల దేశంగా ఉండేది (1887-జులై 25 1965). గణతంత్ర రాజ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగినా మహమ్మదీయ సామ్రాజ్యంగానే ఉండిపోయింది. ఇస్లామ్ మతానికి మారక ముందు మాల్దీవులలో బౌద్ధం విలసిల్లింది. ఈ మత మార్పిడికి కూడా రన్నమారి అనే సైతాను గురించిన ఊహాజనితమైన నమ్మశక్యము కాని కథ ప్రచారంలో ఉంది. మధ్యలో స్వల్పకాలం పాటు హిందూమతం కూడా ప్రజలు పాటించారు. బ్రిటీషు వారి నుండి 1965లో స్వాతంత్ర్యము పొందినా సుల్తాను రాజ్యమే తరువాతి 3 సంవత్సరాలు పరిపాలన సాగించింది. 1968 నవంబరు 11 లో దాన్ని రద్దు చేసి ఇప్పటి పేరుతో గణతంత్ర రాజ్యముగా మార్చడం జరిగింది. పర్యాటక రంగము, మత్స్య పరిశ్రమ ఈ దీవుల సమూహములో అభివృద్ధి చెందింది. 2004 డిసెంబరు 26లో హిందూ మహాసముద్రములో వచ్చిన భూకంపము వలన ఏర్పడిన సునామీ వల్ల మాల్దీవులకు అపార నష్టం వాటిల్లింది. నిరోధించటానికి అవసరమైన భూమి లేకపోవటము వలన అలలు 1.2 -1.5 మీటర్ల ఎత్తు ఎగసి పడడంతో ఈ ఉపద్రవం సంభవించింది. ఇంతే కాకుండా ఈ దీవుల సమూహము సముద్ర మట్టానికి క్రిందుగా ఉండటము (సముద్ర మట్టానికి క్రిందుగా ఉన్న దేశాలలో ప్రపంచంలో ఇదీ ఒకటి) మూలంగా కూడా మొత్తము దేశమంతా ఛిత్తడి నేలగా మారిపోయింది. సుమారు 75 మంది, ఆరుగురు విదేశీయులతో సహా గల్లంతయ్యారు. ప్రజలు నివసించే 13 దీవులలో, 29 విహార దీవులలో మొత్తం వసతులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆర్ధిక వ్యవస్థ మత్స్య పరిశ్రమ మాల్దీవుల ఆర్థికవ్యవస్థ అనేక శతాబ్దాలనుండి, మత్స్య పరిశ్రమ, సముద్ర ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. నేటికీ ఇవే ప్రజల ప్రధాన జీవనాధారాలు. అందువల్లే ప్రభుత్వము మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థలోనూ, ఇక్కడి మత్స్య పరిశ్రమ చరిత్రలోనూ 1974లో సాంప్రదాయ విధానమైన ధోనిలో చేపలు పట్టే పద్ధతిని యాంత్రికీకరించడము ఒక పెద్ద మైలురాయిగా భావిస్తారు. 1977లో ఒక జపానుకు చెందిన కంపెనీ యొక్క సహకారముతో చేపలను డబ్బాలలో నింపే పరిశ్రమను ఫెలివారూ దీవిలో స్థాపించారు. 1979లో మత్స్యరంగము యొక్క అభివృద్ధికి అవసరమైన పాలసీ మార్గదర్శకాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలూ చేసేందుకు ఒక మత్స్యపరిశ్రమ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. మానవవనరుల అభివృద్ధి పథకాలు 80వ దశకపు తొలినాళ్లలో ప్రారంభమయ్యాయి. మత్స్య పరిశ్రమ విద్యను పాఠశాలలో పాఠ్యాంశముగా చేర్చారు. ఫిష్ అగ్రవేటింగ్ డివైజులను, నావిగేషనల్ సహాయకారక యంత్రాలను అనేక ప్రధాన ప్రాంతాలలో యేర్పాటు చేశారు. అంతేకాక, మాల్దీవుల మత్స్యరంగ ఎక్స్‌క్లూజివ్ ఆర్థిక జోను (EEZ) ప్రారంభము మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మరింత దోహదము చేసింది. ప్రస్తుతం, మాల్దీవుల మత్స్య పరిశ్రమ జాతీయ స్థూల ఆదాయములో 15% పైగా చేకూర్చటమే కాక, దేశంలోని 30% పైగా జనాభాకు ఉపాధి కల్పిస్తుంది. మాల్దీవుల విదేశీ మారక ఆర్జనలో పర్యాటక రంగము తర్వాత స్థానము మత్స్యపరిశ్రమదే. పర్యాటక పరిశ్రమ thumb|300px|మాల్దీవుల రాజధాని మాలే పర్యటక రంగము యొక్క అభివృద్ధి మొత్తం మాల్దీవుల యొక్క ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసింది. ఈ రంగము అనేకమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించడమే కాకుండా ఇతర సంబంధిత రంగాలలో ఆదాయమార్గాలను పెంపొందించింది. ప్రస్తుతం, పర్యాటకరంగము దేశం యొక్క అతిపెద్ద విదేశీమారక వనరు. జాతీయ స్థూల ఆదాయములో పర్యాటక రంగము యొక్క వాటా 20%. దేశం మొత్తం 86 పర్యాటక రెసార్టులు పనిచేస్తు ఉండగా, 2000 సంవత్సరములో 4,67,154 మంది పర్యాటకులు మాల్దీవులకు విచ్చేసినట్టు నమోదయ్యింది. కుటీర పరిశ్రమలు దేశములో పర్యాటక రంగము అభివృద్ధితో చాపల అల్లకం, లక్కపని, హస్తకళలు, కొబ్బరితాళ్ళ తయారీ వంటి అనేక సాంప్రదాయక కుటీర పరిశ్రములకు కూడా ఊతమిచ్చింది. కొత్తగా అభివృద్ధి చెందిన పరిశ్రమలలో ముద్రణ, పీవిసి పైపుల తయారీ, ఇటుకల తయారీ, సముద్రములో ఉపయోగించే ఇంజన్ల మరమ్మత్తు, షోడా నీళ్ళ బాట్లింగ్ పరిశ్రమ, దుస్తుల తయారీ మొదలైనవి ముఖ్యమైన పరిశ్రమలు. రాజకీయాలు మౌమూన్ అబ్దుల్ గయూమ్, 1978లో మొదటి ఎన్నుకోబడిన అధ్యక్షుడు. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికారదర్పముతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకముగా జరిగిన ఒక కుట్రనుండి భారత రక్షక దళాల సహాయముతో తప్పించుకున్నాడు. 2003 నుండి అప్పుడప్పుడు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజకీయ ప్రక్షాళనకు దారితీశాయి. మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలి నవంబరు 17న ప్రమాణస్వీకారం చేశారు. భౌగోళికము మాల్దీవులు ప్రపంచములోనే అతి చదునైన దేశముగా పేరుగాంచింది. దేశములోని అత్యున్నత స్థానము కేవలం 2.3 మీటర్లే. పెరుగుతున్న సముద్రమట్టము మాల్దీవుల ఉనికికి ప్రమాదకారిగా మారే అవకాశమున్నదని నివేదికలు వచ్చినప్పటికీ, వాస్తవానికి ఇటీవలి దశకాలలో సముద్రమట్టము కొంచెం తరిగినది. 2004లో హిందూ మహాసముద్రములో సంభవించిన సునామీ వల్ల మాల్దీవులలోని కొంతభాగము జలమయమై అనేకమంది ప్రజలను నిర్వాసితులను చేసింది. ఈ వినాశనము తర్వాత, కార్టోగ్రాఫర్లు సునామీ వల్ల రూపాంతరము చెందిన దీవుల యొక్క పటాలను తిరిగి గీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మాల్దీవుల ప్రజలు, ప్రభుత్వము ఎప్పుడో ఒకప్పుడు మాల్దీవులు సముద్రపటమునుండి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. బయటి లింకులు రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ మాల్దీవుల అధికారిక వెబ్‌సైటు వర్గం:హిందూ మహాసముద్ర పగడపుదిబ్బలు * వర్గం:ద్వీప దేశాలు
థాయిలాండ్
https://te.wikipedia.org/wiki/థాయిలాండ్
థాయిలాండ్ లేదా థాయ్‌లాండ్ ( నించి, "ప్రదేశ థాయి"), అధికారికంగా థాయి రాజ్యం ( రచ్చ అన్న చక్ర థాయ్ "రాజా ఆజ్ఞ చక్ర థాయి"; కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్), ఒక ఆగ్నేయ ఆసియా దేశము. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది. థాయ్‌లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్,కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్, మలేషియా, పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో ఆగ్నేయంలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ యందు వియత్నాం, ఇండోనేషియా, భారతదేశం ఉన్నాయి. ఇది దక్షిణాసియా దేశాలలో ఒకటి. థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ దేశాన్ని పాలిస్తూ, ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా చరిత్రలో స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనికదళాధిపతి, బౌద్ధమతానునయుడు, అన్ని మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు. థాయ్‌లాండ్ సుమారు 5,13,000 చదరపు కిలోమీటర్ల (1,96,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో, ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం. జనసాంద్రతలో ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ జనసంఖ్య 6.4 కోట్లు. థాయ్‌లాండ్‌లో అతిపెద్ద, రాజధాని నగరం బాంకాక్. బాంకాక్ థాయ్‌లాండ్ దేశానికి రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. థాయ్‌లాండ్ ప్రజలలో 75% మంది థాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు థాయ్ చైనీయులు, 3% మంది ప్రజలు మలే సంప్రదాయానికి చెందిన వారు. మిగిలిన అల్పసంఖ్యాకులలో మోనులు, ఖెమరానులు, వివిధ గిరిజన సంప్రదాయానికి చెందినవారు కలరు. థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్, మతం బౌద్ధమతం. బౌద్ధమతాన్ని థాయ్‌లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్ 1985, 1996లో అతివేగంగా ఆర్థికాభివృద్ధి చెంది, ప్రస్తుతం ఒక పారిశ్రామిక దేశంగా, ప్రధాన ఎగుమతి కేంద్రంగా తయారైనది. దేశాదాయంలో పర్యాటక రంగం కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. దేశంలో, చట్టబద్ధంగా, చట్టవ్యతిరేకంగా, 20 లక్షల వలసప్రజలు నివసిస్తున్నారు. అలాగే దేశంలో అభివృద్ధి చెందిన దేశాలనుండి వచ్చి చేరిన బహిష్కృతులు అనేకమంది నివసిస్తున్నారు. పేరువెనుక చరిత్ర థాయ్‌లాండ్‌ను ఇక్కడి ప్రజలు సాధారణంగా మెయాంగ్ థాయ్‌ అని పిలుస్తూ ఉంటారు, ఇతరులు " ది ఎక్సోనిం సియాం " అని సియాం, శ్యాం, శ్యామ అని కూడా అంటారు. 'శ్యామా' అంటే సంస్కృతంలో 'నల్లని 'అని అర్ధం. 1851-1868 మధ్యకాలంలో సియాం రాజ్యాన్ని మాంకట్ రాజు పరిపాలించాడు. 1939 జూన్ 23న ఈ దేశం పేరు థాయ్‌లాండ్ గా మార్చబడింది.1945 నుండి 1949 మే 11 వరకు థాయ్‌లాండు తిరిగి సియాంగా పిలుబడింది. తరువాతి కాలంలో మరల థాయ్‌లాండుగా మార్చబడింది. థాయ్ అనే మాట చలా మంది అనుకున్నట్లు 'స్వతంత్రం' అని అర్ధం వచ్చే పదముకు సంబంధించినది కాదు; అక్కడ నివసించే ఒక జాతి ప్రజలను సూచిస్తుంది. ప్రముఖ పరిశోధక విద్యార్థిఒకరు థాయ్ అంటే " ప్రజలు ", " మానవుడు " అని అర్ధమని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇప్పటికీ థాయ్‌లాండ్ గ్రామాలలో ప్రజలను ఉద్దేశించడానికి 'ఖోన్ 'కు బదులుగా 'థాయ్'ని వాడుతుంటారు. థాయ్ అనే మాటకు స్వేచ్ఛ అని అర్ధం కూడా ఉంది. దక్షిణాసియాలో యురోపియన్ ఆక్రమణకు గురికాని ఒకే ఒక్క దేశం థాయ్‌లాండ్ కనుక ఇక్కడి ప్రజలు తమదేశాన్ని " ద లాండ్ ఆఫ్ ఫ్రీడం " (స్వతంత్ర భూమి) అని సగర్వంగా పిలుచుకుంటారు. అయినప్పటికి కొందరు ప్రజలు ప్రాథెట్ థాయ్, మెయాంగ్ థాయ్ లేక చిన్నాగా థాయ్ అనీ అంటుంటుంటారు. థాయ్ అంటే దేశం అయినప్పటికీ నగరం, పట్టణం అని కూడా అర్ధం స్పూరిస్తుంది. రాచా అనాచక్ థాయ్ అంటే థాయ్‌లాండ్ సామ్రాజ్యం అని అర్ధం. రాచా అంటే సంస్కృతంలో రాజా, రాజరికం అని అర్ధం. అనా అంటే సంస్కృతంలో ఆఙ అని అర్ధం. చక్ అంటే సంస్కృతంలో చక్రం అనగా అధికారానికి, పాలనకు గుర్తు. థాయ్‌లాండ్ జాతీయగీతాన్ని 1930లో దేశభక్తుడైన పీటర్ ఫియట్ రచించాడు. చరిత్ర థాయ్ ల్యాండ్ ఉద్భవనం కొద్ది కాలమే ఉన్న 1238 నాటి సుఖోథాయ్ రాజ్యానికి ఆపాదిస్తారు. ఈ రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి సి ఇంథ్రాథిత్. దీని తర్వాత ఆయుత్థాయ రాజ్యం 14వ శతాబ్దంలో స్థాపించబడింది. థాయ్ సంస్కృతి చైనా, భారతదేశముల వల్ల ప్రభావితము చెందినది. మిగిలిన దక్షిణాసియా దేశాముల వలె థాయ్‌లాండ్‌లో 40,000 సంవత్సరాలాకు పూర్వమే మానవులు నివసించిన ఆధారాలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో ఖేమర్ సామ్రాజ్యానికి చెందిన ఫ్యునాన్ పాలనా సమయం నుండి థాయ్‌లాండ్ ప్రజలమీద భారతీయ సంప్రదాయ, మత ప్రభావం అధికంగా ఉంది. ఆయుత్థాయ వద్ద ఉన్న " వాట్ చైనావాతానారాం " అవశేషాలు 1767లో బర్మీయులు రాజా హిబంషిన్ ఆధ్వర్యంలో ఈ దేశంలో సాగించిన భస్మీపటలానికి గుర్తుగా నిలిచాయి. 13వ శతాబ్దంలో ఖేమర్ సామ్రాజ్య పతనం తరువాత థాయ్, మాన్, మలాయ్ రాజ్యాలు వర్ధిల్లాయి. ఈ ప్రదేశాలలో పురాతత్వ పరిశోధనలు, కళాఖండాలు, సియాం సామ్రాజ్య అవశేషాలు ఇప్పటికీ విశేషంగా లభిస్తున్నాయి. 12 వ శతాబ్ధానికి ముందు థాయ్ లేక సియామీ సామ్రాజ్యానికి చెందిన బుద్ధసంప్రదాయాన్ని అనుసరించే సుఖోథాయ్ పాలనసాగినట్లు 1238లో లభించిన ఆధారాలు తెలియజేస్తున్నాయి. thumb|left| ఆయుత్థాయ వద్ద వాట్ చైవత్తనారాం శిథిలాలు. ఈ నగరం (1767లో) బర్మా రాజు హసీన్ భ్యూశిన్ సైనికుల ద్వారా కాల్చి, ఆక్రమింపబడినది . 13-15వ శతాబ్దంలో ఖేమర్ సామ్రాజ్యం పతనం తరువాత భౌద్ధసంప్రదాయానికి చెందిన సుఖోథాయ్ సామ్రాజ్యం, లాన్నా, క్సాంగ్ (ఇప్పుడు లావోస్) వర్ధిల్లాయి. అయినప్పటికీ ఒక శతాబ్దం తరువాత అనగా 14 వ శతాబ్దంలో సుఖోథాయ్ అధికారం దిగువ చాయో ఫ్రయా నది లేక మెనాం ప్రదేశంలో స్థాపించబడిన ఆయుథ్థాయ సామ్రాజ్యం వశమైంది. మెనాంను కేంద్రీకృతం చేసుకుని ఆయుథ్థాయ సామ్రాజ్యం విస్తరిస్తున్న సమయాన నార్తన్ వెల్లీలో లాన్నా సంరాజ్యం, థాయ్ నగరం భూభాగం కూడా దానిలో అనత్భాగం అయ్యాయి. 1431లో ఖేమర్ అంకారును విడిచివెళ్ళిన తరువాత అయుథాయా సైన్యాలు ఈ నగరాన్ని ఆక్రమించుకున్నాయి. థాయ్‌లాండ్ పొరుగు రాజ్యాలతో చేరి వాణిజ్య సంప్రదాయం దక్కించుకుని చైనా, భారతదేశం, పర్షియా, అరబ్ దేశాలతో వాణిజ్యసంబంధాలు ఏర్పరచుకుంది. ఆయుథ్థాయ ఆసియాలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారితో మొదలై ఫ్రెంచ్,డచ్, ఆంగ్లేయులు, మొదలైన ఐరోపావ్యాపారుల రాక కొనసాగింది. right|thumb| ఆయుత్థాయ హిస్టారికల్ పార్క్ లో స్తూపాలు. 1767 తరువాత అయుథాయ సామ్రాజ్య పతనం తరువాత రాజా టక్సిన్ తన రాజ్య రాజధానిని థాయ్‌లాండ్ నుండి థాన్‌బురికి 15 సంవత్సరాల వరకు తరలించాడు. ప్రస్తుత రత్తానకోసియన్ శకం 1787 నుండి ఆరంభమైంది. తరువాత మొదటి రాజారామా ఆధ్వర్యంలో బ్యాంకాక్‌ను రాజధానిగా చేసుకుని చక్రి సంరాజ్య స్థాపన జరిగింది. బ్రిటానికా ఎంసైక్లోపీడియాను అనుసరించి థాయ ప్రజలలో మూడుభాగాలు, బర్మీయులు 17-19 శతాబ్ధాలలో బానిసలుగా వాడుకోబడ్డారు. యురోపియన్ల వత్తిడికి ప్రతిగా యురోపియన్ సామ్రాజ్యలకు లోబడని ఏకైక దక్షిణాసియా దేశంగా థాయ్‌లాండ్ నిలబడింది. నాలుగు శతాబ్ధాల కాలంగా శక్తివంతమైన పాలకులు దీర్ఘకాలం థాయ్‌లాండ్‌ను పాలించడమే ఇందుకు ప్రధాన కారణం. థాయ్‌లాండ్ పాలకులు ఫ్రెంచ్ ఇండోచైనా, బ్రిటిష్ సామ్రాజ్యం వత్తిడి, శత్రువానికి 4 శతాబ్ధాల కాలం ఎదురొడ్డడం విశేషం అని చెప్పవచ్చు. దక్షిణాసియా దేశాలు ఫ్రెంచ్, బ్రిటిన్ సామ్రాజ్యల మద్య ఉన్నందున థాయ్‌లాండ్ పశ్చిమదేశాల ప్రభావానికి లోనయ్యింది. పశ్చిమదేశాల ప్రభావంతో 19వ శతాబ్దంలో వివిధరకాల సంస్కరణలు జరిగాయి. అలాగే ప్రధానంగా మెకాంగ్ తూర్పు భాగంలో విస్తారమైన భూభాగం ఫ్రెంచ్ వశపరచుకోగా బ్రిటన్‌ ప్రభుత్వం అంచలంచలుగా మలే ద్వీపకల్పంలోని భూభాగాలను స్వాధీనం చేసుకుంది. 20వ శతాబ్దం An example of pottery discovered near Ban Chiang in Udon Thani province, the earliest dating to 2100 BCE.|thumb|left పెనాంగ్‌తో మొదలైన నష్టం కొనసాగి చివరకు మలే సంప్రదాయక ప్రజలు నివసిస్తున్న నాలుగు ప్రాంతాలు కూడా ఆక్రమణకు లోనయ్యాయి. తరువాత 1909లో ఆంగ్లో - సియామీ ఒప్పందం కారణంగా ఆ నాలుగు భూభాగాలు మలేషియా ఉత్తరభూభాగ ప్రాంతాలుగా అయ్యాయి. 1932లో సైన్యానికి చెందిన ఖానా రాసడాన్నా బృందం, సివిల్ అధికారుల యకత్వంలో రక్తపాతరహిత ఉద్యమం చెలరేగి పాలనాధికారం చేతులుమారింది. రాజా ప్రజాధిపాక్ సియాం భూభాగాన్ని ప్రజలహస్థగతం చేయడంతో శతాబ్దాలుగా సాగిన రాజులపాలన ముగింపుకు వచ్చింది. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ థాయ్‌లాండ్ అధికారాన్ని మయాయ్ సరిహద్దులకు మార్చమని వత్తిడి చేసింది. థాయ్‌లాండ్ దేశంమీద దండయాత్ర చేసిన జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలను ప్లిక్ పిబల్సంగ్రం వద్ద 6-8 గంటల వరకు నిలిపి ఉంచాయి. 1941 డిసెంబరు 21 న జరిగిన ఈ సంఘటన తరువాత జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలకు దారి ఇచ్చింది. థాయ్‌లాండ్, జపాన్ ఫ్రెంచ్, బ్రిటిష్ సైన్యాలకు ఎదురించి పోరాడడానికి రహస్యఒప్పందం కుదుర్చుకున్నాయి. 1942లో థాయ్‌లాండ్ జపాన్ సాయతో అమెరికా, యునైటెడ్ కింగ్‌డం మీద యొద్ధం ప్రకటించింది. థాయ్‌లాండ్ అదేసమయం సెరీ-థాయ్ పేరుతో జపాన్‌ను అడ్డుకునే ఉద్యమం కూడా కొనసాగించడం విశేషం. థాయ్‌లాండ్- బర్మా డెత్-రైల్వే పనిలో 2,00,000 ఆసియన్ (ప్రధానంగా రోముషాకు చేరినవారు) కూలీలు, 60,000 సంయుక్త సైనికదళ సభ్యులు పాల్గొన్నారు. యుద్ధం తరువాత థాయ్‌లాండ్ అమెరికా సహాయ దేశంగా మారింది. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత థాయ్‌లాండ్ మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలమాదిరిగా రాజకీయ అస్థిరత వంటి సమస్యలను ఎదుర్కొంది. అయినప్పటికీ 1880 నాటికి స్థిరమైన సమృద్ధి, స్వాతంత్ర్యం సాధించింది. చిత్రమాలిక దక్షిణ భూభాగం thumb|The southern provinces of Thailand showing the Malay-Muslim majority areas. థాయ్‌లాండ్ 1400 లో మలాయ్ ద్వీపకల్పం మీద ఆధిక్యత సాధించింది. మలాక్కా అనకూడా పిలువబడే ఈ భూభాగంలో టమాసెక్ (ప్రస్తుత సింగపూర్), అండమాన్ ద్వీపాలలో కొన్ని, జావా కాలనీ కూడా అంతర్భాగంగా ఉండేది. అయినప్పటికీ చివరకు సుల్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా దాడి చేసిన బ్రిటిష్ సైన్యాల ధాటికి వెనుకంజ వేయక తప్పలేదు. మలాయ్ సుల్తాన్ రాజ్యానికి చెందిన ఉత్తర భూభాగం నుండి థాయ్ రాజాకు బంగారు పుష్పాలరూపంలో సంవత్సర కానుకలు సామంతరాజులు ఇచ్చే కప్పంలా అందుతూ ఉండేవి. మలాయ్ సామ్రాజ్యంలో బ్రిటిష్ ప్రవేశం తరువాత " ఆంగ్లో-సియామీస్ " ఒప్పందం తరువాత బ్యాంకాక్ వరకు రైల్వే మార్గం నిర్మించడానికి సన్నాహాలు ఆరంభం అయ్యాయి. ఈ ఒప్పంద తరువాత సాతన్, పట్టాని భూభాగాలు థాయ్‌లాండుకు ఇవ్వబడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మలాయ్ ద్వీపకల్పం జపానీయుల చొరబాటుకు గురైంది. 1942 నుండి 2008 వరకు కమ్యూనిస్టుల ఆధిపత్య కొనసాగింది. చైనా సాంస్కృతిక విప్లవం తరువాత చైనా, వియత్నాం భూభాగంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గడంతో థాయ్, మలయా శాంతి కొరకు పోరాటం సాగించారు. రెండవ ప్రపంచయుద్ధం తరువాత పి.యు.ఎల్.ఒ కొరకు సుకర్నో మద్దతుతో శాంతిపోరాటం తీవ్రం అయింది. ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన బౌద్ధులు, ముస్లిములు అత్యధికంగా ప్రాణాలు అర్పించవలసిన పరిస్థితి ఎదురైంది. విదేశీసంబంధాలు thumb|Thai Prime Minister Yingluck Shinawatra greets U.S. President Barack Obama at the Government House, during his official state visit to Thailand on 18 November 2012. థాయ్‌లాండ్ అత్యధికంగా అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది. థాయ్‌లాండ్ అలీనోద్యమరాజ్యాలలో ప్రధానమైనది అలాగే యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ వాచ్ లిస్ట్ 301 దేశాలలో ప్రాధాన్యత కలిగి ఉంది. అసోసేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఎ.ఎస్.ఎ.ఎన్) లో క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉంది. థాయ్‌లాండ్ మిగిలిన ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా, మలేషియా,ఫిలిప్పైన్స్,సింగపూర్, బ్రూనై,లావోస్,కంబోడియా,బర్మా, వియత్నాం లతో సంబంధాలను అభివృద్ధి చేసుకుంటుంది. అలాగే సంవత్సర విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటూ ఉంది. ఆర్థిక, వాణిజ్యం, బ్యాంకింగ్, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలకు సహాయసహకారాలు అందిస్తుంది. 2003లో ఎ.పి.సి.ఇకి ఆతిథ్యం ఇచ్చింది. థాయ్‌లాండ్ గత ఉపముఖ్యమంత్రి డాక్టర్ సుపాచై పనిట్చ్‌పక్డి ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌గా ఐక్యరాజ్యసమితి ట్రేడ్ ఎండ్ డెవలప్మెంట్ సమావేశంలో ( యు.ఎన్.సి.టి.ఎ.డి) పాల్గొన్నాడు. థాయ్‌లాండ్ 2005 లో ఈస్ట్ ఆసియా సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది. గత కొన్నిసంవత్సరాలుగా అంతర్జాతీయ వేదిక మీద చురుకైన పాత్రపోషిస్తుంది. తూర్పు తైమూర్ ఇండోనేషియా నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత థాయ్‌లాండ్ మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి శాంతి దళాలలో భాగస్వామ్యం వహించింది. థాయ్‌లాండ్ సైనిక బృందాలు ఇప్పుడు ఐక్యరాజ్యసమితి శాంతిసైన్యంలో నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భాగంగా థాయ్‌లాండ్ ప్రాంతీయ సంస్థలు, అమెరికా సంస్థలు, " ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్ " సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ పునర్నిర్మాణ కార్యక్రమాలలో థాయ్‌లాండ్ బృందాలు పనిచేస్తున్నాయి. థాయ్‌లాండ్ చైనా, ఆస్ట్రేలియా, బహ్రయిన్,భారతదేశం అరియు అమెరికా లతో వ్యాపారసంబంధాలకు ప్రయత్నాలు చేస్తున్నది. తరువాత అధికథరల కారణంగా తీవ్రవిమర్శలకులోనై థాయ్ పరిశ్రమలు తుడిచిపెట్టుకు పోయాయి. థాక్సిన్ విదేశీసహాయాన్ని నిరాకరించి నిధిసహాయ దేశాలతో కలిసి పొరుగున ఉన్న మెకాంగ్ భూభాగ అభివృద్ధి కొరకు కృషిచేసింది. థాక్సిన్ పొరుగున ఉన్న లావోస్ వంటి వెనుకబడిన దేశాలకు థాయ్‌లాండ్ నాయకత్వం వహించాలని అభిలషిస్తూ వాటి అభివృద్ధి కొరకు వివిధ ప్రణాళికలను ప్రవేశపెట్టింది. థాక్సిన్ వివాదాస్పదంగా నిరంకుశ బర్మాప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. యు.ఎస్ నాయకత్వం వహించిన ఇరాక్ యుద్ధానికి 423 మంది శక్తివంతమైన యోధులను పంపి సహకరించింది. 2004 సెప్టెంబరులో థాయ్ తన బృందాలను వెనుకకు తీసుకుంది. ఈ యుద్ధంలో థాయ్ ఇద్దరు యోధులు మరణించారు. పీపుల్స్ అలయంస్ ఫర్ డెమాక్రసీ లీడర్ కాసిట్ పిరోమ్యాను విదేశాంగమంత్రిగా నియమించాడు. విదేశాంగమంత్రిగా నియమించడానికి ముందు కాసిట్ కంబోడియా వ్యతిరేక పార్టీకి నాయకత్వం వహించాడు. 2009లో థాయ్, కంబోడియాల మద్య పెద్దేత్తున యుద్ధం చెలరేగింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న 900 సంవత్సరాల విహియర్ హిందూ ఆలయం సమీపంలో ఈ యుద్ధం జరిగింది. కంబోడియా ప్రభుత్వం తాము 4 థాయ్ సైనికులను చంపామని 10 మందిని యుద్ధఖైదీలుగా పట్టుకున్నామని ప్రకటించారు. అయినప్పటికీ థాయ్‌లాండ్ మాత్రం తమ సైనికులు మరణినించినట్లుగాని గాయపడినట్లుగాని అంగీకరించలేదు. యుద్ధం తాము ఆరంభించలేదని రెండు దేశాలు గట్టిగా వాదించాయి. సైన్యం thumb|right|The HTMS Chakri Naruebet, an aircraft carrier of the Royal Thai Navy. థాయ్ సైనికదళం " ది రాయల్ థాయ్ ఆర్ముడ్ ఫోర్స్ " అనిపిలివబడుతుంది. ఇందులో రాయల్ థాయ్ ఆర్మీ, ది రాయల్ థాయ్ నేవీ, రాయల్ థాయ్ ఎయిర్ అంతర్భాగంగా పారామిలిటరీ దళాలు ఉంటాయి. అంతేకాక పారామిలటరీ దళాలు కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటాయి. ప్రస్తుతం సైన్యం మొత్తం సంఖ్య 8,00,000 మంది నియమించబడి ఉన్నారు. రాజా భూమిబోల్ అదుల్యతేజ్ (9వ రామా ) సైన్యాలకు నామమాత్ర అధ్యక్షత (చొంతాక్) వహిస్తాడు. థాయ్‌లాండ్ రక్షణ మంత్రిత్వశాఖ థాయ్ సైనికదళాల నిర్వహణా వ్యవహారాలను చూసుకుంటుంది. థాయ్ సైనిక ప్రధానకార్యాలయ ఆధ్వర్యంలో సైనికదళం బాధ్యతలు నిర్వహిస్తుంది. సైనికాధికారిగా థాయ్‌లాండ్ రక్షణదళ ఉన్నతాధికారి బాధ్యతలు నిర్వహిస్తాడు. థాయ్‌లాండ్ సైనికదళ వ్యయం దాదాపు 100 కోట్లు అమెరికన్ డాలర్లు. రాజ్యాంగబద్ధంగా సైన్యంలో పనిచేయడం ప్రతిఒక్క పౌరుని బాధ్యతగా భావించబడుతుంది. అయినప్పటికీ రిజర్వ్ దళ శిక్షణలో చేరనివారిలో 21సంవత్సరాలు నిండిన వారికి సవచ్చంధ సైనికసేవలో కాని లేక ఆపత్జాల సైనిక బృందాలలో కాని పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. శిక్షణాకాలానికి అభ్యర్థులకు కాలనిర్ణయానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. 6-24 మాసాల శిక్షణ వారి విద్యార్హత, వారి రిజర్వ్ శిక్షణ లేక సైనికదినంలో (సాధారణంగా ఏప్రిల్ 1 వ తారీఖు ) వారి స్వచ్ఛంద సేవ మీద ఆధారపడి ఉంటుంది. గుర్తింపు పొందిన కళాశాల 1 విద్య పూర్తిచేసిన వారికి సంవత్సర ఆపత్కాల సైనిక శిక్షణకు కాని వారి జిల్లాలోని సైనిక కాత్యాలయంలో 6 మాసాల పనిచేయడానికి అర్హులౌతారు. 3 సంవత్సరాల పట్టవిద్య పూర్తిచేసిన వారు 1 సంవత్సరం ఆపత్కాల సైనికసేవ లేక వారి వారి జిల్లాలలో ఆరుమాసాల సేవకు అర్హులౌతారు. అంటే 1 సంవత్సర విద్య పూర్తిచేసినవారికి ఒక సంవత్సర శిక్షణార్హత ఉంటుంది. 2 సంవత్సర విద్య పూర్తిచేసినవారికి ఒక సంవత్సర శిక్షణార్హత ఉంటుంది, సంవత్సర విద్య పూర్తిచేసినవారు పూర్తిశిక్షణకు అర్హులౌతారు. " ది రాయల్ ఆర్ముడ్ ఫోర్స్ " దినం జనవరి 18 జరుపుకుంటున్నారు. 1593 లో బర్మారాజకుమారునితో రాజనరేసుయన్ యుద్ధంచేసి విజయం సాధించిన రోజును సైనికదినంగా జరుపుకుంటున్నారు. భౌగోళికం thumb|left|View of the Luang Prabang Range straddling the Thai/Lao border in northern Thailand. థాయ్‌లాండ్ వైశాల్యం 5,13,120 చదరపు కిలోమీటర్లు (1,98,120 చదరపు మైళ్ళు. వైశాల్యారంగా థాయ్‌లాండ్ ప్రపంచంలో 51వ స్థానంలో ఉంది. ఇది యోమన్ కంటే స్వల్పంగా చిన్నది అలాగే స్పెయిన్ కంటే స్వల్పంగా పెద్దది. థాయ్‌లాండ్ పలు విభిన్న భూభాగాలకు పుట్టిల్లు. థాయ్ ఉన్నతభూములు ( హైలాండ్స్) అనిపిలువబడే పర్వతభూభాగం థాయ్‌లాండ్ ఉత్తరదిశలో ఉన్నాయి. తనాన్ తాంగ్ చై పర్వతావళిలో సముద్రమట్టానికి 2,565 మీటర్ల (8,415 అడుగులు ) ఎత్తులో ఉన్న ఇంతానాన్ శిఖరం దేశంలో ఎత్తైన భూభాగంగా భావించబడుతుంది. ఈశాన్యంలో సముద్రతీరం, మెకాంగ్ నది సరిహద్దుల మద్య " ఖోరత్ పీ,ఠభూమి " ఉంది. దేశం మద్యభాగంలో ప్రధానంగా థాయ్‌లాండ్ అఖాతం (గల్ఫ్) వద్ద సముద్రసంగమం చేస్తున్న చయో ఫర్యా నదీ మైదానం ఆధిక్యత కలిగి ఉంది. thumb|Satellite image of flooding in Thailand in October 2011. దక్షిణ థాయ్‌లాండ్ భుభాగంలో సన్నని క్రా ఇస్త్మస్ మలేషియా వరకు విస్తరించి ఉంది. థాయ్‌లాండ్ జసంఖ్య, ప్రధాన వనరులు, సహజసిద్ధమైన భూభాగం, సాంఘిక అరియు ఆర్థిక స్థితిగతుల భేదంకలిగిన ఆరుభాగాలుగా రాజకీయంగా విభజించబడి ఉంది. థాయ్‌లాండ్ భౌతిక ఆకర్షణీయతకు ఈ వైవిధ్యాలు విపరీతంగా భాగస్వామ్యం వహిస్తున్నాయి. చయో ఫర్యా, మెకాంగ్ నదులు గ్రామీణ థాయ్‌లాండ్ స్థిరమైన వనరుగా భావించబడుతుంది. ఈ రెండు నదులు, ఉపనదులు థాయ్‌లాండ్ వ్యవసాయ ఉత్పత్తికి ఆధారభూతంగా ఉదహరించబడుతున్నాయి. 3,20,000 కిలోమీటర్ల (1,24,000 మైళ్ళ ) పొడవైన థాయ్‌లాండ్ అఖాత సముద్రతీరాలో చాయో ఫర్యా, మెకాంగ్, బాంగ్ పకాంగ్, తాపి నదులు సముద్రసంగమం చేస్తున్నాయి. ఇది థాయ్‌లాండ్ పర్యాటకరంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. థాయ్ అఖాతం లోతు తక్కువైన స్వచ్ఛమైన జలాలు పర్యాట్కులను అత్యధికంగా ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ తీరంలో ఉన్న క్రా ఇస్త్మస్ ప్రాతం ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. థాయ్‌లాండ్ అఖాతం పారిశ్రామికంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. థాయ్‌లాండ్ ప్రధాన నౌకాశ్రయం అయిన సతాహిప్ పోర్ట్ బాంకాక్ ఇన్‌లాండ్ సీపోర్ట్ ప్రవేశంగా ఉంది. అత్యధికంగా పర్యాటక ఆకర్షణ కలిగిన విలాసవంతమైన రిసార్ట్లు ఉన్న అండమాన్ సముద్రతీర ప్ర్రంతం ఆసియాలో పసిద్ధి చెందాయి. ఫూకెట్, క్రబీ, రనాంగ్, ఫంగ్ న్గా, ట్రాంగ్, సుందరమైన థాయ్‌లాండ్ ద్వీపాలు అన్నీ అండమాన్ సముద్రతీరంలో ఉన్నాయి. 2004లో సంభవించిన సునామీ సంఘటనలను అధిగమించి ఆసియా ఉన్నత వర్గానికి చెందిన ప్రజలకు ఇవి జలక్రీడా మైదానాలుగా ఉన్నాయి. సూయజ్, పనామా కాలువల మాదిరిగా " తాయ్ కెనాల్ " నిర్మించి రవాణా సౌకర్యాన్ని ఏర్పరచాలన్న వ్యూహాత్మకంగా ప్రణాళికలు సాగుతున్నాయి. థాయ్ రాజకీయనాయకులు సహితం ఈ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కాలువ నిర్మాణంతో సింగపూర్ నౌకాశ్రయ చార్జీలు తగ్గడం అలాగే చైనా, భారత్‌లతో వాణిజ్యసంభంధాలు మెరుగుపడగలవని యోచిస్తున్నారు. మలాకా సంధిలోని సముద్రచోరులనుండి రక్షణ లభించడం రవాణా సమయం తగ్గడం వంటి ప్రయోజనాలే కాక ఆసియాలో థాయ్‌లాండ్ ప్రధాన నౌకాకేంద్రంగా మారే అవకాశాల దృష్ట్యా ఈ ప్రభుత్వ ప్రణాళికు వ్యాపారవర్గాల మద్దతు కూడా లభిస్తుంది. థాయ్‌లాండ్ దక్షిణతీర నౌకాశ్రయాలు దేశ ఆర్థికరంగ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది. ప్రధానంగా పర్యాటకరంగం ద్వారా లభిస్తున్న దేశాదాయం ఇప్పుడు సేవారంగానికి విస్తరించడం ద్వారా థాయ్‌లాండ్ ఆసియా సేవాకేంద్రగా మారనున్నది. ఇంజనీరింగ్ ప్రాధాన్యత కలిగిన ఈ కాలువ నిర్మాణానికి సుమారుగా 20-30 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయం కాగలదని భావిస్తున్నారు. ఉష్ణమండల ఉష్ణోగ్రతలు కలిగిన థాయ్‌లాండ్ వాతావరణం మీద వర్షాల ప్రభావంకూడా అధికంగానే ఉంటుంది. వర్షాలతో కూడిన, వెచ్చని, చల్లని సౌత్-వెస్ట్ వర్షపాతం మే మాసం మద్య నుండి సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. దక్షిణ ఇస్త్మస్ వేడి, తడితో కూడిన మిశ్రిత వాతావరణం కలిగి ఉంటుంది. విద్య thumb|right|ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, థాయి లాండ్ థాయ్‌లాండ్‌లో అక్షరాస్యత అత్యున్నతమైన స్థాయిలో ఉంది. అలాగే థాయ్‌లాండ్‌లో చాక్కగా నిర్వహిస్తున్న విద్యావిధానంలో కిండర్‌గార్డెన్, లోయర్ సెకండరీ, అప్పర్ సెకండరీ పాఠశాలలు, లెక్కకు మించిన ఒకేషనల్ కాలేజులు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగ విద్యావిధనం కూడా చక్కగా అభివృద్ధి చెంది అన్ని రంగాలకు చెందిన విద్యను అందిస్తూ ప్రభుత్వరంగ విద్యాసంస్థలను అధిగమించింది. 14 సంవత్సరాల వరకు నిర్భంధ విద్యావిధానం అమలులో ఉంది. అలాగే ప్రభుత్వం 17 సంవత్సరాల వరకు ఉచిత విద్యను అందిస్తుంది. thumb|left|upright|చులాలోంగ్కార్న్ యూనివర్శిటి స్థాపన 1917, థాయి లాండ్ లో ప్రాచీన విశ్వవిద్యాలయం. విద్యావిధానం విద్యార్థులపై కాఏంద్రీకృతమై ఉంది. అయినప్పటికీ పాఠ్యాంశాలు మాత్రం నిరంతరం మార్పులకు లోనౌతున్న కారణంగా ఉపాధ్యాయులకు తాము బోధించవాసినది ఏమిటో తెలియక, పాఠ్యపుస్తకాల రచయితలు తమపనిని కొనసాగించఏని స్థితిలో ఉన్నారు. ఇది కొన్ని సంవత్సరాల నుండి విశ్వవిద్యాలయాలలో సహితం వివాదాంశంగా మారింది. అయినప్పటికీ 2001 నాటికి విద్యావిధానం అత్యున్నత స్థాయికి చేరుకుంది. వర్తమాన విద్యార్థులలో అధికులు కంప్యూటర్ సంబంధిత విద్యకు ముఖ్యత్వం ఇస్తున్నారు. ఆంగ్లభాషా సామర్ధ్యంలో థాయ్‌లాండ్ ఆసియాలో 54వ స్థానంలో ఉంది. 2010 నుండి 2011 జనవరి వరకు దేశమంతా ఐ.క్యూ పరీక్షలు నిర్వహించబడ్డాయి. సరాసరి ఐక్యూ 98.59 గా నిర్ణయించబడింది. ఇది ముపటి అధ్యయనాలకంటే అధికం. దక్షిణ భూభాగం ఐక్యూ శక్తి 88.7 గా నిర్ణయించబడింది. నాంతబురీ భూభాగంలో అత్యధికంగా ఐక్యూ శక్తి 108.91 గా నిర్ణయించబడింది. థాయ్ ఆరోగ్యశాఖ ఐడోడిన్ లోపం ఇందుకు కారణమని భావించి పశిమదేశాల మాదిరిగా అయోడిన్ చేర్చబడిన ఉప్పును ప్రజలకు అందించాలని సూచిస్తుంది. 2013లో విద్యాశాఖ 27,231 పాఠశాలలకు అంతర్జాల వసతి కల్పించబడుతుందని ప్రకటించింది. సైన్స్ , టెక్నాలజీ థాయ్‌లాండ్‌లో సైన్స్ గురించిన పరిశోధనలు, ఆర్థిక సంబంధిత బాధ్యతను " ది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ " విభాగం వహిస్తుంది. భౌతిక, రసాయనిక, మెటీరియల్ సైంసెస్ సంబంధిత విషయాలకు " ది సిన్‌క్రోట్రాన్ లైట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్.ఎ.ఆర్)" సంస్థ సహకారం అందిస్తున్నది. ఇది " సురానరీ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ " (ఎస్.యు.టి) లో అంతర్భాగంగా ఉంది. ఈ ఇన్‌స్టిట్యూటుకు " మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎం.ఒ.ఎస్.టి) ఆర్ధికసాయం అందిస్తుంది. దక్షిణాసియాలో అత్యధిక ఆర్ధికసాయంతో నడుస్తున్న ఇన్‌స్టిట్యూట్‌గా భావించబడుతుంది. ఎస్.ఒ.ఆర్.టి.ఇ.సి సింక్రోట్రాన్ ముందుగా జపాన్‌లో ఆరంభించి తరువాత థాయ్‌లాండుకు తరలించబడింది. అంతర్జాలం థాయ్‌లాండ్‌ ప్రభుత్వం 23,000 వై.వై అంతర్జాల అనుసంధాన కేంద్రాలు ప్రజల కొరకు అందిస్తుంది. థాయ్‌లాండ్‌లో అంతర్జాలం 10గిగాబైట్ల హైస్పీడ్ ఫైబర్-ఆప్టిక్ లైన్లు ఉన్నాయి. ఐ.ఎస్.పి , కె.ఐ.ఆర్.జెడ్ సంస్థలు నివాసగృహాలకు అంతర్జాల వసతి అందిస్తుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వం అంతర్జాలాన్ని సెంసార్ చేసి కొన్ని సైట్స్‌ను ప్రజలకు చేరకుండా అడ్డుకుంటుంది. రాయల్ థాయ్ పోలీస్, ది కమ్యూనికేషన్ అథారిటీ, సమాచార మంత్రిత్వశాఖ సెంసార్ బాధ్యత వహిస్తుంది. శక్తి థాయ్‌లాండులో అణుధార్మిక విద్తుత్ సంస్థలు లేవు. అయినప్పటికీ 2026లో ఆరంభించడానికి అవకాశం ఉంది. ప్రస్థుతం 80% విద్యుత్తు ఫాసిల్ ఫ్యూయల్ నుండి లభిస్తుంది. ఆర్ధికరంగం thumb|బాంకాక్, పెద్ద నగరం, వ్యాపార పరిశ్రమల కేంద్రం, థాయి లాండ్. thumb|Thailand is the largest rice exporter in the world. థాయ్‌లాండ్ సరికొత్తగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్న దేశాలలో ఒకటి. 1985-1996 మద్య అత్యధికసాయిలో సాధించిన అభివృద్ధి తరువాత థాయ్‌లాండ్ ద్రవ్యం సంవత్సరానికి 12.4% అభివృద్ధి రేటును నమోదు చేస్తుంది. 1997లో దేశం ఎదుర్కొన్న ఆర్ధికసంక్షోభం కారణంగా దేశ ఆర్ధిక అభివృద్ధి 1.9% పతనం అయింది. సంక్షోభాన్ని నివారించలేని అసమర్ధత కారణంగా " చవాలిత్ యోంగ్‌చైయుధ్ రాజ్యాంగం మంత్రిమండలితో సహా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఎదురైంది. 1978 నాటికి అమెరికన్ డాలరుకు బదులుగా 25 బాహ్త్‌ (థాయ్ ద్రవ్యం) 1997 నాటికి 56 బాహ్త్‌ల స్థాయికి పతనం అయింది. 1998 నాటికి మరో 10.8% పతనం అయింది. ఈ పతనం ఆసియన్ ఆర్థిక సంక్షోభం మీద మరింత ప్రభావం చూపింది. 1999 లో థాయ్‌లాండ్ ఆర్థికవ్యవస్థ కోలొకోవడం ప్రారంభం అయింది. అత్యధికంగా పెరిగిన ఎగుమతులే ఇందుకు ప్రధానకారణం. 2001లో సరళీకృతం చేయబడిన ప్రపంచ ఆర్థికవ్యవస్థ కారణంగా థాయ్‌లండ్ 2.2% ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది. తురువాత కాలంలో థాయ్‌లాండ్ ఆసియా ఆర్థికవ్యవస్థలో క్రమాభివృద్ధి సాధించింది. బలహీనమైన బాహ్త్ ఎగుమతులను ప్రోత్సహించిఅడమేకాక భారి ప్రణాళికలు, ప్రధానమంత్రి అందిచిన ప్రోత్సాహం దేశాంతర్గత కొనుగోలుశక్తి అధికం అయింది. 2002,2003, 2004 సంవత్సరానికి 5.7% ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది.2005,2006, 2007 సంవత్సర అభివృద్ధి 4-5% అభివృద్ధి కొనసాగింది. 2008 నాటికి అమెరికన్ డాలర్ బలహీనపడడం, థాయ్‌లాండ్ ద్రవ్యం బలపడడం కొనసాగిన కారణంగా 2008 నాటికి అమెరికన్ డాలర్‌కు ఎదురుగా బాహ్త్ 33 స్థాయికి అభివృద్ధి కొనసాగింది. థాయ్‌లాండ్ సంవత్సరానికి సేవలరూపంలో అందిస్తున్నది, వస్తురూపంలో ఎగుమతి చేస్తున్న వాణిజ్యం విలువ 105 అమెరికన్ డాలర్లు. ఎగుమతులలో ప్రధానమైనవి థాయ్ బియ్యం, వస్త్రాలు, పూలు, మత్య ఉత్పత్తులు,రబ్బర్, ఆభరణాలు, కార్లు, కంప్యూటర్లు, విద్యుత్తు పరికరాలు మొదలైనవి. బియ్యం ఎగుమతులలో థాయ్‌లాండ్ మొదటి స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ సంవత్సరానికి 6.5 మిలియన్ టన్నులు బియ్యం ఎగుమతి చేస్తున్నది. దేశంలో ప్రధాన పంట వరి. 27.25% సారవంతమైన భూములతో థాయ్‌లాండ్ పంటభూములు అధికంగా కలిగిన దేశాలలో మహా మెకాంగ్ భూభాగంలో ప్రథమ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ సాగుభూములలో 55% వరి పంటకు ఉపయోగించబడుతుంది. విజయవంతంగా నడుస్తున్న విద్యుత్తు ఉపయోగ పరికరాలు, విడిభాగాలు, కంప్యూటర్లు విడిభాగాలు, కార్ల సంబంధిత ఉత్పత్తులు దేశాదాయానికి ఉపకరిస్తుండగా. థాయ్‌లాండ్ ఆదాయానికి పర్యాట్కరగం నుండి 6% ఆదాయం లభిస్తుంది. అలాగే పేదరికం, సాంస్కృతిక పరిస్థితులు మిళితమైన కారణంగా చట్టవిరుద్దమైన కార్యకలాపాలతో సంపాదించిన న్యాయవిరుద్ధమై ద్రవ్యంతో 2003 లో థాయ్‌లాండ్ జి.డి.పి 3% అభివృద్ధి చెందింది. ఇలా చేరిన ద్రవ్యం విలువ సుమారు 3 బిలియన్ల (300 కోట్లు) అమెరికన్ డాలర్లని అంచనా. 1993 లో చట్టవిరుద్దమైన కార్యకలాపాలతో సంపాదించిన ద్రవ్యంతో థాయ్‌లాండ్ జి.డి.పి 2.7% పెరిగిందని చులాలాంకోన్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పర్యాటక రంగం నుండి లభిస్తున్న ఆదాయంలో 10% చట్టవిరోధ కార్యకలాపాలద్వారా లభిస్తుందని అంచనా. థాయ్‌లాండ్ జి.డి.పి విలువ 602 బిలియన్ల ( 60200 కోట్లు ) అమెరికన్ డాలర్లు. థాయ్‌లాండ్ ఆర్థికశక్తి దక్షిణాసియాలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో ఇండోనేషియా ఉంది. థాయ్‌లాండ్ తలసరి ఆదాయం దక్షిణాసియా దేశాలలో 4వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలలో సింగపూర్, బ్రూనై, మలేషియా ఉన్నాయి. పొరుగున ఉన్న లావోస్, బర్మా, కంభోడియా దేశాలకు థాయ్‌లాండ్ ఆర్థికరంగం మూలాధారంగా ఉంది. 1997-1998 ఆసియా ఆర్థిక సంక్షోభానికి అనేక ఇతరకారణలాతో ఎగుమతులు ప్రధాన కారణమైయ్యాయి. ప్రపంచంలో ఆటోమోటివ్, విద్యుత్తు ఉపయోగ పరికరాలు ఏగుమతులలో థాయ్‌లాండ్ ప్రథమ స్థానంలో ఉంది. 1997, 2010 మద్యకాలంలోంపరిశ్రమల సమ్మిళితం, సంపద విక్రయాల విలువ 81 మిలియన్ల (8,100 కోట్లు) అమెరికండాలర్లని థాయ్ ఫార్ంస్ ప్రకటించింది. 2010 లో మాత్రమే ఈ విక్రయాలు సరికొత్త రికార్డ్ సృష్టిస్తూ 12 మిలియన్ల (1,200 కోట్లు) అమెరికండాలర్లని అంచనా. 2011 లో జరిగిన పి.టి.టి కెమికల్స్ పి.సి.ల్ కపెనీ సమ్మిళితం అతి పెద్ద విక్రయంగా భావించబడుతుంది.ఈ విక్రయం విలువ 3.8 బిలియన్ల (380 కోట్లు). థాయ్‌లాండ్ శ్రామికులలో 49% వ్యవవసాయక్షేత్రాలలో పనిచేస్తున్నారు. అయినప్పటికీ 1980లో వ్యవసాయక్షేత్రాలలో 70% శ్రామికులు పనిచేసేవారు. పారిశ్రామిక సంస్థలకు శ్రామికులు అధికంగా తరలిపోవడంతో వ్యవసాయరంగం శ్రామికుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. 1962-1983 మద్యకాలంలో వ్యవసాయరంగం 4.1% అభివృద్ధిని సాధించింది. తరువాత సంవత్సరాలలో సరాసరి 2.2% అభివృద్ధి కొనసాగింది. వస్తువుల ఎగుమతి, సేవారంగంలో జి.డి.పి అభివృద్ధి కొనసాగుతున్న తరుణంలో వ్యవసాయరంగ జి.డి.పి మాత్రం తగ్గుముఖం పట్టింది. 2011లో థాయ్‌లాండ్ నిరుద్యోగం 0.4%తో ఆరంభం అయింది. సమీపకాలంలో అనుకోకుండా తలెత్తిన తిరుగుబాటు, సైకప్రపాలన ప్రభావం వలన దేశంలో అస్థిరత ఏర్పడినప్పటికీ జి.డి.పి అభివృద్ధి మాత్రం 4-5% వద్ద నిలదొక్కుకుంది. సివిలియన్ పాలనలో 5-7% ఉన్న జి.డి.పి రాజకీయ అస్థిరత వలన కొంత క్షీణించింది. థాయ్‌లాండ్ సాధారణంగా మెట్రిక్ విధానం అనుసరిస్తున్నా భూ పరిమాణ కొలతలకు అంగుళాలు, అడుగుల వంటి సంప్రదాయక విధానాలను అనుసరిస్తుంది. కొన్ని సమయాలలో వడ్రంగి పనికి ఉపకరించే కొయ్యను కొలడానికి కూడా ఈ పద్ధతి అనుసరించబడుతుంది. విద్యాబోధనకు బి.ఇ ( బౌద్ధ శకం) విధానంలో కాలగణన జరుగుతున్నప్పటికీ పౌరసేవలకు, ప్రభుత్వ ఒప్పందాలకు, వార్తాపత్రికలకు, బ్యాంకింగ్, పరిశ్రమలు, వాణిజ్య సంబంధిత వస్షయాలకు మాత్రం పాశ్చాత్య విధానంలో క్రీస్తుశకం కాలగణను అనుసరిస్తుంది. గణాంకాలు భాష thumb|Ethnic map of Thailand|left|180px థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్ - కడై. ఇది లావోస్, బర్మాలోని షాన్ భాషకు సమీపంగ ఉంటుంది. దక్షిణ చైనా సరిహద్దులకు సమీపంగా ఉన్న హన్నియన్ యోమన్ నగరాలలో ఉపభాషలు కొన్ని మాట్లాడబడుతున్నాయి. థాయ్ - కడై భాషా విద్యబోధనకు, ప్రభుత్వనిర్వహణకు ఉపకరిస్తూ దేశమంతటా వాడుకలో ఉంది. మద్య థాయ్‌లాండ్‌లో వాడుకలో ఉన్న భాష ప్రామాణిక భాషగా భావించబడుతుంది. ఇది థాయ్ అక్షరమాల, అబుగిడా లిపి ( ఖేమర్ లిపి ప్రభావితంగా ఏర్పడినది) గా వాడబడుతుంది. పలు ఇతర భాషలు వాడుకలో ఉన్నాయి. దక్షిణ థాయ్ భాష దక్షిణ థాయ్‌లాండ్‌లో మాట్లాడబడుతుంది. ఉత్తర భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. స్వతంత్రరాజ్యమైన లానథాయ్ భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. థాయ్‌లాండ్ పలు అల్పసంఖ్యాక భాషాకు కూడా ఆతిథ్యం ఇస్తుంది. వీటిలో పెద్దది లావో యాసతో కూడిన ఇసాన్ ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. ఇది ఒక్కోసారి థాయ్ భాషగా పరిగణించబడుతుంది. ఈ భాషను మాట్లాడే ప్రాంతం ఒకప్పుడు లావోస్ రాజ్యంలో (లన్ క్సనంగ్ సామ్రాజ్యం) ఉంటూ వచ్చింది. సుదూర దక్షిణ ప్రాంతంలో మలేషియా దేశ ప్రధాన భాషైన మలాయ్ యాసతో కూడిన యావీ భాష మాట్లాడబడుతుంది. అత్యధికంగా ఉన్న చైనీయులు వైవిధ్యమైన చైనా భాషలు మాట్లాడబడుతున్నాయి. టియోచ్యూ వీటిలో ప్రధానమైనది. మాన్-ఖేమర్ కుటుంబం చెందిన మాన్, వియట్, మ్లబ్రి, ఆస్ట్రోనేషియన్ కుటుంబానికి చెందిన ఒరంగ్ అస్లి, చాం, మోకెన్. సినో - టిబెటన్ కుటుంబానికి చెందిన లావా, అఖాన్, ఇతర థాయ్ భాషలైన నియా, ఫూథాయ్, సియాక్ వంటి పలు గిరిజన భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. హమాంగ్ ప్రజల మధ్య హమాంగ్ భాష వాడుకలో ఉంది. దీనిని భాషాకుటుంబానికి చెందిన ప్రజలకు వాడుకలో ఉన్న భాషగా గౌరవిస్తున్నారు. పాఠశాలలలో ఆంగ్లభాషను నిర్బంధం చేస్తున్నప్పటికీ ఆంగ్లభాషను ధారాళంగా మాట్లాడుతున్న ప్రజలసంఖ్య మాత్రం తక్కువగా ఉన్నారు. ప్రత్యేకంగా నగరానికి వెలుపల నివసిస్తున్న ప్రజల మధ్య ఆగ్లభాష వాడకం తక్కువగా ఉంది. మతం థాయ్‌లాండ్‌లో సాధారణంగా తరవాడ బుద్ధమతం ఆచరణలో ఉంది. ప్రపంచంలో తరవాడ బుద్ధిజం ఉన్నతమైన బుద్ధమతంగా భావించబడుతుంది. చివరి గణాంకాలను అనుసరించి బుద్ధమతావలంబీకులలో 94.6% మంది తరవాడ బుద్ధిజాన్ని అనుసరిస్తున్నారని భావిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న ముస్లిం మతాన్ని 4.6% ప్రజలు ఆచరిస్తున్నారు. థాయ్‌లాండ్‌ దక్షిణ భూభాగాలలో పట్టాని, యాల, నరాథివాట్, సంగ్కాల చుంఫాన్‌లో కొంతభాగం ముస్లిములు అధికంగా ఉన్నారు. జనసంఖ్యలో క్రైస్తవ మతావలంబీకులు 07% ఉన్నారు. దేశంలోని నగరాలలో స్వల్పసంఖ్యలో సిక్కు మతావలంబీకులు, హిందూ మతావలంబీకులు ఉన్నారు. దేశంలో 17వ శతాబ్ధనికి చెందిన ప్రజలలో కొందరు జ్యూయిష్ మతస్థులు కూడా ఉన్నారు. సంస్కృతి thumb|right|Theravada Buddhism is highly respected in Thailand. థాయిలాండ్ ఒకప్పటి అఖండ భరత్ లో భాగం కనుక అక్కడ హిందూ సంస్కృతి మొదటి నుండి ఉంది. భారతదేశం నుండి పోయిందని విశ్లేషకులు చెప్తున్నారు కానీ అది ఎలా సాధ్యం? భారతదేశంలో భాగం థాయిలాండ్ ఒకప్పుడు. కనుక హిందూ సంస్కృతి అనేది థాయ్ ప్రజలు మొదటి నుండి పాటిస్తున్నారు. వాళ్ళ భాషలు సంస్కృతముతో ముడి పడి ఉన్నాయి. థాయ్ సంస్కృతి భారతీయ, లావో, బర్మా, కంబోడియా, చైనా సంస్కృతుల ప్రభావంతో రూపుదిద్దుకుంది. థాయ్ సంప్రదాయాలు కూడా భారతీయ, కంబోడియా, చైనా, ఇతర దక్షిణాసియా సంప్రదాల వలన ప్రభావితమై ఉంది. థాయ్‌లాండ్ దేశీయ మతం తరవాడ బుద్ధిజం ఆధునిక థాయ్‌లాండ్ ఒక ప్రత్యేకతగా ఉంది. థాయ్ బుద్ధిజం కాలానుగుణంగా హిందూయిజం, అనిమిజం అలాగే పూర్వీకుల ఆరాధనా విధానాల వంటి అనేక మతవిశ్వాలతో ప్రభావితమైంది. థాయ్ అధికారిక క్యాలెండర్ బౌద్ధశక ఆధారితంగా తయారుచేయబడింది. ఇది గ్రిగేరియన్ క్యాలెండరుకు (పాశ్చాత్య) 543 సంవత్సరాలకు ముందు ఉంటుంది. ఉదాహరణగా సా.శ. 2012 థాయ్ క్యాలెండరులో 2555 ఉంటుంది. భారతదేశం నుంచి విస్తరించిన హిందూ, బౌద్ధమతాల ప్రభావాలు కాంభోజదేశం నుంచి థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించింది. అంతేకాక భారతదేశం నుంచి విజ్ఞాన కృషి చేయడానికి వచ్చిన బ్రాహ్మణులు, వ్యాపారానికి వచ్చిన వర్తకులు ఈ మతప్రచారం చేశారు. థాయ్‌లాండ్‌లోని మతం, భాష, సంస్థలు, లిపి, కళలు, సాహిత్యం వంటివాటిలో భారతీయ ముద్ర కనిపిస్తుంది. థాయ్ ప్రజల నిర్లక్ష్యానికి గురైన పలు ప్రత్యేక ఆదివాసి ప్రజలలో కొంతమంది బర్మా, లావోస్, కంబోడియా, మలేషియాలలో ప్రవేశించి వారితో కలిసిపోయారు. మిగిలిన వారు వారి సంప్రదాయాలకు ప్రాంతీయ సంస్కృతో సంప్రదాయాలు, అంతర్జాతీయ సంప్రదాయాలను మిశ్రితంచేసి సరికొత్త వరవడిని సృష్టించుకున్నారు. చైనా నుండి వచ్చి చేరిన ప్రజలు కూడా థాయ్ ప్రజలలో గుర్తించ తగినంత సంఖ్యలో ఉన్నారు. వీరు ప్రత్యేకంగా బ్యాంకాక్, దాని పరిసరప్రాంతాలలో ఉన్నారు. వారు తాయ్ ప్రజలతో మిశితం అవడం వలన వారు ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రత్యేక స్థానం వహిస్తున్నారు. వారికి ఉన్న అంతర్జాతీయ కుటుంబ సంప్రదాయ సంబంధాలతో వారు వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుని వాణిజ్యరంగంలో విజయం సాధించారు. ఖోన్ షో థాయ్‌లాండ్ కళాప్రదర్శనలలో ప్రాబల్యం సంతరించుకుంది. thumb|right|Khon Show is the most stylised form of Thai performance. థాయ్ యువత ఒకరిని ఒకరు కలుసుకున్న సమయాలలో వాయ్ అని ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకుంటారు. వాయ్ అంటే రెండుచేతులు కలిపి నమస్కరించి తల వంచి చేతి వేళ్ళను తాకుతూ తమ గౌరవాన్ని తెలియజేస్తూ మాటలలో " సవాస్దీ ఖ్రాప్ " అని పురుషులకు, " సవాస్దీ కా " అని స్త్రీలకు పలుకుతారు. వయసులో పెద్దవారు కూడా అలాగే ప్రతిస్పందిస్తారు. అధికారులు, పెద్దవారు, పూజ్యులు ప్రత్యేకంగా ఇలా గౌరవాన్ని అందుకుంటారు. భారతదేశం, నేపాల్ దేశాలలో నమస్కారం పోలినదే వాయ్. ఫుట్ బాల్ క్రీడ థాయ్ సంప్రదాయక క్రీడ అయిన మాయ్ క్రీడను అధిగమించింది. సమకాలీన థాయ్‌లాండ్ యువత ఈ క్రీడలను చూడడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. థాయ్ ప్రజలు అధికంగా ఆదరిస్తున్న ఇతర క్రీడలలో గాలిపటాలు ఎగురవేయడానికి ప్రత్యేకస్థానం ఉంది. థాయ్ ఆహార సంస్కృతిలో ప్రధానంగా ఐదు రుచులు ప్రాధాన్యత వహిస్తాయి. అవి వరుసగా తీపి, ఖారం, వగరు, చేదు, ఉప్పు. థాయ్ వంటలలో తెల్లగడ్డలు, మిరపకాయలు, నిమ్మకాయ రసం, నిమ్మగడ్డి, ఫిష్ సాస్ ప్రధానంగా చోటుచేసుకుంటాయి. థాయ్ ప్రధాన ఆహారం బియ్యం. ప్రత్యేకంగా జాస్మిన్ బియ్యం ( దీనిని హాం మాలి రైస్ అని కూడా అంటారు) దాదాపు తాయ్ ఆహారలు అన్నింటికి చేర్చుకుంటారు. బియ్యం ఎగుమతిలలో అంతర్జాతీయంగా ప్రథమస్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌లో ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి సరాసరి 100 కిలోల బియ్యం తన ఆహారంలో ఉపయోస్తున్నాడు. థాయ్‌లాండ్ నుండి సేకరించిన 5,000 వరివంగడాలు ఫిలిప్పైన్‌లో ఉన్న " రైస్ జెనె బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రైస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ " (ఐ.ఆర్.ఆర్.ఐ) సంరక్షించబడుతున్నాయి. థాయ్‌లాండ్ రాజు ఐ.ఆర్.ఆర్.ఐ అధికారిక పోషకుడుగా ఉంటాడు. అనేక ఆసియన్ సంస్కృతుల మాదిరిగా థాయ్‌లాండ్ మతసంప్రదాయాలు పూర్వీకులపట్ల గౌరవం ప్రదర్శినడానికి ప్రధాన్యత ఇస్తాయి. వంశానుగతంగా వచ్చిన సంస్కృతి వలన సేవాభావం, ఔదార్యం థాయ్ సంస్కృతిలో భాగమై ఉంది. పెద్దరికం అన్నది థాయ్ సంప్రదాయంలో అత్యంత ప్రధాన్యత కలిగి ఉంది. పండుగలు, సంప్రదాయ వేడుకలు, కుటుంబ నిర్ణయాలు చేయడంలో పెద్దలకు సముచిత స్థానం ఉంటుంది. సంతానంలో పెద్దవారు చిన్నవారి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. థాయ్‌లాండ్ సంస్కృతిలో కాలితో మరొకరి తలను తాకడం నిషేధం. థాయ్‌లాండ్ ప్రజలు కాళ్ళు శరీరంలో హీనమైన భాగంగా భావించడమే ఇందుకు కారణం. థాయ్ ప్రజలు గతకొన్ని సనత్సరాలుగా పలుభాషా సాహిత్యాన్ని చదివి ఆనందిస్తున్నారు. సమీపకాలంగా దేశంలో పలుభాషా సాహిత్యం అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం. దేశంలో ఆంగ్ల, థాయ్, చైనా పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలను ఆకర్షించడానికి పలు థాయ్ పత్రికలు కూడా ఆంగ్లశీర్షికలను ప్రచురిస్తుంటాయి. థాయ్‌లాండ్ వాణిజ్యంలో అధికంగా ఆంగ్లభాషను ఉపయోగిస్తారు. అలాగే కొంత వరకు ఇతర భాషలను కూడా మాట్లాడుతుంటారు. థాయ్‌లాండ్ దేశంలో వార్తా పత్రికల ప్రచురణ దక్షిణాసియాలోనే ప్రత్యేకత కలిగి ఉంది. 2013 వ సంవత్సరంలో దేశంలో ఒకరోజుకు 13 మిలియన్ల దినపత్రికలు విక్రయించబడ్డాయి. బ్యాంకాక్ లోని అప్ కౌంటీ ప్రాతం మీడియాకు ప్రధానంగా స్థావరంగా వర్ధిల్లుతుంది. ఉదాహరణగా 2003-2004 థాయ్‌లాండ్స్ పబ్లిక్ రిలేషంస్ డిపార్ట్మెంట్ నివేదికలను అనుసరించి థాయ్‌లాండ్ ఈశాన్యభాగంలో 116 వార్తాపత్రికలు, రేడియో, టి.వి, కేబుల్ సంస్థలు పనిచేస్తున్నాయి. హిందూ దేవాలయాలు నకోన్‌ రాచసీమ రాష్ట్రంలో సా.శ. 11వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం ఉంది. అందులోని శివలింగం, నంది విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అక్కడికి 15 కి.మీల దూరంలో పిమాయ్‌ చారిత్రాత్మక పార్కు ఉంది. 11-12 శతాబ్దాల్లో నిర్మించిన ఈ నగరం పేరు వాస్తవానికి విమయపుర తరువాతి కాలంలో విమయ, పిమాయ్‌గా మారింది. హిందూఖేమర్‌ వంశస్థులు నిర్మించిన ఈ నగరం కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం కోరట్‌. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన ఆదిమానవుల అవశేషాలను ప్రదర్శనలో ఉంచారు. దేశంలో సందర్శించాల్సిన మరో నగరం ఆయుతయ. ఇది కోరట్‌ - బ్యాంకాక్‌ మధ్య చావ్‌ ప్రాయా నది ఒడ్డున ఉన్న ప్రాచీన నగరం. ఆయుతయ... మన అయోధ్య నుంచి వచ్చిందని అభిప్రాయం. ఈ నగరంలో చాయ్‌వతనరం బౌద్ధాలయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత ప్రధానమైనది. నాలుగు గోపురాల నడుమ 35 మీటర్ల ప్రధాన గోపురం నాటి నిర్మాణ శైలిని, నైపుణ్యాన్ని కళ్ళకు కడుతోంది. పండుగలు థాయ్‌ల్యాండ్‌ పండుగల్లో సోంక్రన్‌, లోయ్‌క్రతాంగ్‌ ప్రధానమైనవి. ప్రాచీన థాయ్‌ క్యాలెండర్‌ ప్రకారం సంవత్సరాదిన అంటే ఏప్రిల్‌ ఒకటోతేదీన మొదలయ్యే సోంక్రన్‌ మన హోలీ లాంటిదే. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ మూడురోజులపాటు ఉత్సాహంగా జరుగుతుంది. అలాగే లోయ్‌ క్రతాంగ్‌ పండుగ మన బతుకమ్మ, కార్తీక పౌర్ణమి వేడుకల్ని గుర్తు చేస్తుంది. అరటి దొప్పలో ఆకులు, పూలు, క్యాండిల్‌‌స అమర్చి నీటిలో వదులుతారు. వినోదం దేశంలో వ్యవసాయానికి, పశుసంపదకు ప్రసిద్ధి పొందిన ప్రదేశం కూడా కౌయాయ్‌ రీజియన్‌ మాత్రమే. ప్రత్యేక వాహనాల్లో వైన్‌ యార్డు మొత్తం తిరిగి చూడవచ్చు. కౌయాయ్‌ డెయిరీ ఫామ్‌‌సకి కూడా ప్రసద్ధి. చోక్‌చాయ్‌ ఫామ్‌ ఆసియాలోకి పెద్దది. 50 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఫామ్‌ గొప్ప పర్యాటక ప్రదేశం కూడ. సాధారణ పర్యాటకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు... ఏడాదికి కనీసం మూడు లక్షల మంది సందర్శిస్తారు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ బయోడీజిల్‌, ఐస్‌క్రీమ్‌ వంటి పాల ఉత్పత్తులు తయారుచేసే చోక్‌చాయ్‌ ఫామ్‌ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సందర్శకుల బస కోసం అత్యాధునిక గుడారాలు, వినోదం కోసం కౌబాయ్‌ షోవంటి వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, షాపింగ్‌ సెంటర్లు ఉన్నాయి. పర్యాటకులకు వసతులు థాయ్‌లో పట్టాయాలో బీచ్‌ రిసార్టులు, హోటళ్లు ఉన్నట్లే కౌయాయ్‌లో రిసార్టులు పచ్చటి చెట్లు, పర్వత శ్రేణుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ప్రతి రిసార్‌‌ట, హోటల్‌ పర్యాటకుల వినోదాల కోసం ఏదో ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, అడ్వెంచర్‌ స్పోర్‌‌ట్స, స్విమ్మింగ్‌ పూల్‌‌స, కౌబాయ్‌ షోలవంటి వినోద కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. అరడజనుపైగా గోల్‌‌ఫ మైదానాలు ఉన్నాయి. దారిపొడవునా ప్రీమియం ఔట్‌లెట్‌‌స, లోటస్‌ మాల్‌‌స వంటి షాపింగ్‌ సెంటర్లు ఉంటాయి. ఇక్కడి పాలియో షాపింగ్‌ మాల్‌లో ఏదీ కొనకుండా విండో షాపింగ్‌ చేయడమూ చక్కని అనుభవమే. కౌయాయ్‌ ప్రాంతంలోనే ఉన్న డాన్‌క్వియాన్‌ ప్రాంతం పాటరీకి ప్రసిద్ధి. ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం మరకత బుద్ధుడు థాయ్‌ టూర్‌లో మరో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఎమరాల్‌‌డ బుద్ధుడిని చూడడం. వాట్‌ ప్రాకయో (ఎమరాల్‌‌డ బౌద్ధ ఆలయం) కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. పచ్చని గ్రానైట్‌ రాతితో నిర్మించిన బుద్ధుడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శతాబ్దాల క్రితం భారతదేశం నుంచి కాంబోడియా, లావోస్‌, వియత్నాం దేశాలగుండా చేతులు మారుతూ బ్యాంకాక్‌ చేరింది. బౌద్ధులు జీవితంలో ఒక్కసారైనా మరకత బుద్ధుడిని దర్శించుకోవాలనుకుంటారు. ఈ ఆలయం బ్యాంకాక్‌లో చావ్‌ప్రాయ నది ఒడ్డున ఉంది. ఈ నదికి మరో ఒడ్డున నిర్మించిన వాట్‌ అరుణ్‌ దేవాలయం మరో అద్భుత కట్టడం. 79 మీటర్ల పొడవైన పగోడా సూర్య కాంతితో మిలమిలా మెరుస్తూంటుంది. ఇటాలి యన్‌శైలిలో ఉన్న థాయ్‌ రాజపస్రాదం ఆనంద సమక్రోమ్‌ కూడా చూసి తీరాల్సిన కట్టడమే. బ్యాంకాక్‌లో చూడాల్సిన అనేక విశేషాల్లో జిమ్‌ థామ్సన్‌ హౌస్‌ మ్యూజియం, సువాన్‌ పక్కడ్‌ ప్యాలెస్‌ మ్యూజియం ఉన్నాయి. సువాన్‌ పక్కడ్‌ మ్యూజియం ప్రాచీన థాయ్‌ ఇళ్ల నిర్మాణాన్ని అనుసరించి ఉంటుంది. రాజవంశస్తులు దేశ, విదేశాల నుంచి సేకరిం చిన అనేక వస్తువులు ఇందులో ఉన్నాయి. షాపింగ్ సెంటర్లు బ్యాంకాక్‌లో షాపింగ్‌ సెంటర్లలో ప్రముఖమైనది ఆసియాటిక్‌ షాపింగ్‌ సెంటర్‌. ఇది కూడా చావ్‌ప్రాయ నది ఒడ్డునే ఉంది. ఇందులో వందల షాపులు, అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే పహూరత్‌ బాంబే మార్కెట్‌ కూడ. ఇది థాయ్‌లాండ్‌కు వలస వెళ్లిన భారతీయులు ఏర్పాటు చేసుకున్న మార్కెట్‌. థాయ్‌లాండ్‌లో వాతావరణం మన వాతావరణాన్నే తలపిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యటనకు మన వాళ్లు ప్రత్యేక దుస్తులవంటి ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. థాయ్‌లాండ్‌లో పర్యాటకం ముఖ్యమైన పరిశ్రమ, అక్కడి వారు టూరిస్టుల పట్ల ఆదరాభిమానాలు చూపిస్తారు. గొడవలు ఏమున్నా పార్లమెంటుకే పరిమితం. టూరిస్టులు నిర్భయంగా దేశంలో ఎక్కడైనా పర్యటిం చవచ్చు అని థాయ్‌లాండ్‌ పర్యాటకం అథారిటీ ప్రకటించింది. కౌయాయ్‌ నేషనల్‌ పార్కులో... పర్వతశ్రేణులు, దట్టమైన అడవులు, జలపాతాలు, సెలయేళ్లు, క్రూరమృగాల సంచారం, అరుదైన పక్షుల కిలకిలరవాలు, ఆది మానవుల అవశేషాలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంటే... అత్యాధునికతకు ప్రతీకగా హాలిడే రిసార్ట్స, గోల్‌‌ఫ కోర్టులు ఉన్నాయి. టూరిస్టుల కోసం క్యాంపింగ్‌, నైట్‌ సఫారీ, ట్రెకిగ్‌కు ఏర్పాట్లు ఉన్నాయి. హనీమూన్‌ కపుల్‌ని అలరించే బ్యూటిఫుల్‌ స్పాట్‌లతోపాటు పిల్లలతో వచ్చిన కుటుంబాలు సేదదీరే సౌకర్యం ఉన్న ప్రదేశం కౌయాయ్‌. ఈ పార్‌‌క పురావస్తు పరిశోధన, ప్రాచీన కళలు, నిర్మాణం వంటి అంశాలపై ఆసక్తి ఉన్న వారికి సరైన గమ్యస్థానం కూడ. కౌయాయ నేషనల్‌ పార్‌‌క నాలుగు రాషా్టల్ల్రో విస్తరించి ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. మసాజ్‌ సెంటర్‌‌ బ్యాంకాక్‌లో ఏ వీధిలో చూసినా మసాజ్‌ సెంటర్లు కనిపిస్తాయి. ఇది వారి సంప్రదాయ వైద్యవిధానం. థాయ్‌ల్యాండ్‌ మసాజ్‌ సెంటర్ల మీద మన వాళ్లకు ఏ అభిప్రాయం ఉన్నా థాయ్‌ వాసులు మాత్రం దాన్ని పవిత్రంగా భావిస్తారు. మనం కేరళ ఆయుర్వేద మసాజ్‌ను గౌరవించినట్లు. ఎలా వెళ్లాలి థాయ్‌లాండ్‌ వెళ్లాలంటే వీసా ఆన్‌ అరైవల్‌ సౌకర్యం ఉంది. వెట్‌ బ్యాగ్రౌండ్‌లో తీసిన రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రెగ్యులర్‌ కౌంటర్‌లో 1000 బాత్‌లు లేదా తత్కాల్‌ కౌంటర్‌లో 1200 బాత్‌ల ఫీజు చెల్లించాలి. డబ్బును రెండుమూడు వేల బాత్‌లుగా, మిగిలినది డాలర్లుగా తీసుకువెళ్ళటం మంచిది. దేశంలో కరెన్సీ ఎక్సే్చజ్‌ సెంటర్లు చాలా ఉన్నాయి. డాలర్లను క్షణాల్లో థాయ్‌ బాత్‌లుగా మార్చుకోవచ్చు. థాయ్‌ బాత్‌ విలువ దాదాపుగా రూపాయి ఎనభై పైసలు. నాలుగు రోజుల ట్రిప్‌కు ఒక్కరికీ 20 నుంచి 25 వేల రూపాయవుతుంది. హోటల్‌ రెంట్‌ రోజుకు వెయ్యి నుండి ఆరేడు వేల వరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం థాయ్‌లాండ్‌ పర్యాటకం అథారిటీ వెబ్‌సైట్‌ చూడవచ్చు. థాయ్‌ సంప్రదాయ నాట్యం లికాయ్‌. ఈ కళాకారులు బౌద్ధాలయాల్లో ప్రదర్శనలిస్తారు. ఈ నాట్యం చేసేటప్పుడు కళాకారుల వస్త్రధారణ, కథాంశం అన్నీ భారతీయతను పోలి ఉంటాయి. అధికారికం Thaigov.go.th థాయిలాండ్ ప్రభుత్వపు సైటు థాయి జాతీయ శాసనసభ Tourism Authority of Thailand Official tourism website ఇతరాలు Wikivoyage: Thailand - Travel guide CIA - The World Factbook - Thailand మూలాలు వర్గం:ఆసియా
చైనా
https://te.wikipedia.org/wiki/చైనా
చైనా అని సాధారణంగా పిలువబడే చైనా ప్రజల గణతంత్రం ( పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో సెకండ్ .Area rank is disputed with the United States and is either ranked third or fourth. See List of countries and outlying territories by area for more information. 130 కోట్ల (1.3 బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల 2డో దేశము చైనా ఉంది. చైనా రాజధాని నగరం బీజింగ్ (Beijing).అతిపెద్ద నగరం షాంఘై (shangai).చైనా ఏక పార్టీ పాలిత దేశం. చైనాలో 22 భూభాగాలు ఉన్నాయి., వీటిలో 5 స్వయం ప్రతిపత్తి (అటానిమస్) కలిగిన భూభాగాలు, నాలుగు డైరెక్ట్ కంట్రోల్డ్ మునిసిపాలిటీలు (బీజింగ్, తియాజిన్, షాంగై, చాంగ్క్వింగ్), రెండు స్వయంపాలిత భూభాగాలు (హాంగ్‌కాంగ్, మాకౌ) ఉన్నాయి. పి.ఆర్.సిలో ఉన్న ఫ్రీ ఏరియా ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా భూభాగాలను రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలో ఉన్నాయి. తైవాన్, కిన్మెన్, మత్సు, ఫ్యూజియన్, దక్షిణాసియా అధీనంలో ఉన్న ద్వీపాలు రాజకీయ స్థితి వివాదాస్పదంగా ఉంది. సంస్కృతి చైనా సంస్కృతి అతి పురాతనమైనది. చైనా ప్రపంచపు పురాతనమైనది. ఉత్తర చైనా మైదానాన్ని పచ్చ నది ఫలవంతం చేస్తుంది. చైనా రాజకీయ చరిత్రలో వంశపారంపర్య రాజవంశాలు ఉన్నాయి. ఆరంభకాలంలో క్రీ.పూ 2800 లో పచ్చ నదీతీరంలో సెమీ మిథలాజికల్ రాజవంశం పాలించింది. క్రీ.పూ 221 నుండి క్విన్ రాజవంశం చైనాలోని పలుప్రాంతాలను స్వాధీనపరచుకుంది. తరువాత రాజ్యం విస్తరించబడి పలుమార్లు సంస్కరించబడింది. 1911 లో క్విన్ సామ్రాజ్యాన్ని త్రోసివేసి చైనా రిపబ్లిక్ (1912-1949) అవతరించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తరువాత కమ్యూనిస్ట్ పార్టీ చైనా ప్రధాన భూభాగంలోని కుయోమింతాంగ్‌ను ఓడించి 1948 అక్టోబరు 1న రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించించింది. క్యుమింతాంగ్ తిరిగి ప్రస్తుత తైపే వద్ద రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైనా సంక్లిష్టమైన, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగి ఉంది.http://browse.oecdbookshop.org/oecd/pdfs/product/4107091e.pdf Angus Maddison. Chinese Economic Performance in the Long Run. Development Centre Studies. Accessed 2007. p.29 1978లో చైనాలో ఆర్థిక సంస్కరణలు జరిగినప్పటి నుండి, అతివేగంగా జి.డి.పి. అభివృద్ధి చేసిన దేశాలలో ఒకటిగా చైనా గుర్తింపు పొందింది. 2019 గణాంకాలను అనుసరించి నామినల్ జి.డి.పి. అభివృద్ధిలో చైనా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందని తెలుస్తుంది. 2014 గణాంకాలను అనుసరించి నామినల్ జి.డి.పి. అభివృద్ధిలో చైనా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది.అతిపెద్ద మొత్తంలో సరుకులను ఎగుమతి చేసే దేశాలలో చైనా రెండవస్థానంలో ఉంది. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలలో చైనా ఒకటి. అత్యధిక సంఖ్యలో సైనిక బృందాలను కలిగి ఉన్న దేశాలలో కూడా చైనా ఒకటి. 1971 నుండి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పి.ఆర్.సి) ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కలిగి ఉంది. చైనా, వరల్డ్ ట్రేడ్ ఆర్త్గనైజేషన్, ఆసియా పసిఫిక్ ఎకనమిక్ కార్పొరేషన్, బి.ఆర్.ఐ.సి.ఎస్, ది షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్, ది బి.సి.ఐ.ఎం, జి-20 మేజర్ ఎకనమీస్ వంటి పలు ఫార్మల్, ఇంఫార్మల్ బహుళజాతి సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది. చైనా గొప్పశక్తిగా, అలాగే ఆసియాలో అతిపెద్ద శక్తిగా గుర్తించబడుతోంది. విమర్శకులు చైనా అపార సామర్థ్యం గల దేశంగా అవతరించగలదని భావిస్తున్నారు. thumb|The Temple of Heaven, a center of heaven worship and an UNESCO World Heritage site, symbolizes the Interactions Between Heaven. పురాతనకాలం నుండి చైనీయుల సంస్కృతి మీద కంఫ్యూషియనిజం, సంప్రదాయవాద సిద్ధాంతాల ప్రభావం ఉంది. రాజవంశపాలనలో హాన్ రాజవంశ ఆధారిత పాలకులు సాంఘికాభివృద్ధి కొరకు కృషిచేసారు. చైనీయులసాహిత్యం చైనాసంస్కృతిలో చైనా దస్తూరీ, సంప్రదాయ చైనీయకవిత్వం, చైనా చిత్రలేఖనం మొదలైన చైనాకళారూపాలు చైనానాటకం, నృత్యం కంటే ఉత్తమమైనవిగా భావించబడుతున్నాయి. చైనాసంస్కృతికి దీర్ఘమైన చరిత్ర, అంతర్గత జాతీయదృక్కోణం ఉన్నాయి. Examinations and a meritocracy remain greatly valued in China today. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆరంభకాల నాయకులు సంప్రదాయరాజకుటుంబ వారసత్వానికి చెందినవారై ఉన్నారు. అయినప్పటికీ " మే ఫోర్త్ ఉద్యమం " స్ఫూర్తి, సంస్కరణా సంకల్పప్రభావం కలిగి ఉన్నారు. వారు గ్రామీణ పదవీకాల ప్రమాణం, లింగవివక్ష, కఫ్యూషియ విధానవిద్య, కుటుంబవ్యవస్థ, వినయవిధేయతలు కలిగిన సంస్కృతి మొదలైన చైనాసంస్కృతి కలుపుకుంటూ మార్పులను కోరుకున్నారు. 1949లో స్థాపించబడిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజరికచరిత్ర సంబంధితమై ఉంది. అయినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ చైనాసంప్రదాయాలను త్రోసివేస్తూ అవతరించింది. 1960లో తలెత్తిన సాంస్కృతిక విప్లవ ఉద్యమం కూడా అందులో ఒకటి. కమ్యూనిజం భూస్వామ్య విధాన అవశేషాలను తొలగించే ప్రయత్నం చేసింది. చైనా సంప్రదాయక నీతి, కంఫ్యూషియనిజ సంస్కృతి, కళలు, సాహిత్యం, పెకింగ్ ఒపేరా వంటి కళాప్రదర్శనలు కలగలిసిన చైనాసంస్కృతిని ప్రభుత్వవిధాలు కదిలించాయి. చైనా సంస్కృతిలో గుర్తించతగిన మార్పులు సంభవించాయి. విదేశీ మాధ్యం మీద అత్యధికంగా నిషేధాలు విధించబడ్డాయి. ప్రస్తుత చైనా ప్రభుత్వం నుండి చైనా సంప్రదాయ చౌనా సంస్కృతికి చెందిన పలు విధానాలకు అనుమతి లభిస్తుంది. సాంస్కృతిక విప్లవానికి ముగింపు పలకడం చైనాజాతీయత అధికరించడం కారణంగా చైనా కళలు, సాహిత్యం, సంగీతం, చలనచిత్రాలు, ఫ్యాషన్, నిర్మాణకళకు తిరుగి దృఢమైన పునరుజ్జీవనం లభించింది. అలాగే చైనా జానపదకళలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. చైనా పర్యాటకరంగం కూడా అభివృద్ధిని సాధించింది. చైనా పర్యాటకరంగానికి ప్రపంచపర్యాటక గమ్యాలలో మూడస్థానం లభించింది. 2010లో 55.7 మిలియన్ల పర్యాటకులు చైనాను సందర్శించినట్లు అంచనా. దేశీయపర్యాటకులు కూడా అత్యధికంగా పర్యటిస్తూ చైనా పర్యాటకరంగాన్ని పరిపుష్టం చేస్తున్నారు. 2012లో శలవు దినాలలో పర్యటించిన పర్యాటకుల సంఖ్య 740 మిలియన్లు ఉంటుందని అంచనా. సినిమాలు ఎ టచ్ ఆఫ్ సిన్ భాష గడులు.. గీతలు.. బొమ్మలుగా ఉండే చైనా భాష చాలా చిత్రంగా,సంక్లిష్టంగా ఉంటుంది. చైనా వారు ఈ భాషను 'మండారిన్' అని పిలుస్తారు. అక్కడి నిఘంటువుల ప్రకారం చూస్తే సుమారు 56,000 గుర్తులు (కేరక్టర్లు) ఉన్నాయని చెబుతారు. ఎక్కువగా మాత్రం 3,000 గుర్తులు వాడతారు. ఇవి వస్తే 99 శాతం చైనా భాషను నేర్చేసుకున్నట్టే. చైనా అక్షరాలు రాయడానికి కనీసం 1 నుంచి గరిష్ఠంగా 64 గీతలు గీయాల్సిఉంటుంది!ఈనాడు దిన పత్రికలో(ఆగష్టు 03,2008 నాటి సంచిక) వింతల పుట్టిల్లు... అద్భుతాల నట్టిల్లు! శీర్షికన 'చైనా' వివరాలు 04 ఆగష్టు, 2008న సేకరించబడినది. చైనాలో మెజారిటీ ప్రజలు మాట్లాడే 'మండారిన్ ‌' భాషను మన సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలో చేర్చనున్నారు.ఈనాడు 16.9.2010 చరిత్ర చరిత్రకాలానికి ముందు పురాతత్వ పరిశోధకులు ఆరంభకాల హోమినీడ్లు 2,50,000, 2.24 మిలియన్ సంవత్సరాల ముందు చైనాలో నివసించారని భావిస్తున్నారు."Early Homo erectus Tools in China". Archaeological Institute of America. 2000. Retrieved 30 November 2012. జౌకౌడియన్ (ప్రస్తుత బీజింగ్) లోని ఒక గుహలో క్రీ.పూ 6,80,000 - 7,80,000 మద్య నివసించిన హోమినీడ్ శిలాజాలు లభించాయి. పీకింగ్ మాన్ హోమో ఎరెక్టస్‌కు (మొదటిసారిగా అగ్నిని ఉపయోగించిన మానవుడు) ఒక ఉదాహరణ. పీకింగ్ మాన్ ప్రదేశంలో 18,000-11,000 హోమో సాపైంస్ కాలానికి చెందిన అవశేషాలు కూడా లభించాయి. క్రీ.పూ 7,000 కాలానికి ముందు నుండి ప్రోటో- రైటింగ్ ఉనికిలో ఉందని తెలుస్తుంది. దామెయిడ్ సమీపంలో 5,800-5,400 కాలానికి చెందిన దడివాన్ సంస్కృతి, 5 మిలియన్ల సంవత్సరాలకు ముందు నాటి బొంపొ సంస్కృతి విలసిల్లిందని తెలుస్తుంది.Qiu Xigui (2000). Chinese Writing. English translation of 文字學概論 by Gilbert L. Mattos and Jerry Norman. Early China Special Monograph Series No. 4. Berkeley: The Society for the Study of Early China and the Institute of East Asian Studies, University of California, Berkeley. ISBN 978-1-55729-071-7..కొంతమంది పరిశోధకులు క్రీ.పూ 7 మిలియన్ సంవత్సరాలకు ముందున్న జైహూ చిహ్నాలు అతిపురాతనమైనవని భావిస్తున్నారు. తొలి రాజవంశాలు thumb|Yinxu, ruins of an ancient palace dating from the Shang Dynasty (14th century BCE) చైనా సంప్రదాయం అనుసరించి క్రీ.పూ 2100 సంవత్సరాలకు చెందిన క్సియా రాజవంశం చైనాను పాలించిన మొదటి రాజవంశంగా భావిస్తున్నారు. 1959లో హెనన్‌లో ఎర్లిటౌ సంస్కృతికి చెందిన కాంస్య యుగం (బ్రోంజ్ ఏజ్) నాటి అవశేషాలను పరిశోధించిన చరిత్రకారులు ఇది పురాణకాలానికి చెందిన సామ్రాజ్యం అని భావిస్తున్నారు."Bronze Age China". National Gallery of. Retrieved 11 July 2013. ఇది నిరూపితం చేయబడకుండా ఉంది. ఈ ప్రాంతం క్సియా సామ్రాజ్యంలోనిదై ఉండాలి లేక సమకాలీన మరొక సంస్కృతికి చెందినదని భావిస్తున్నారు. తరువాత షాంగ్ వంశం గురించి సమకాలీన రికార్డుల ద్వారా లభించిన సమాచారం నమోదైన సమాచారంలో ఆరంభకాలం నాటిదని భావిస్తున్నారు. షంగ్ రాజవంశం తూర్పు చైనాలోని యెల్లోనదీ మైదానాన్ని క్రీ.పూ 11- 7శతాబ్ధాలలో పాలించారు. షంగ్ రాజవంశానికి చెందిన ఒరాకిల్ బోన్ స్క్రిప్ట్ (ఒరాకిల్ ఎముకల వ్రాత) (క్రీ.పూ 1200), ఆధునిక చైనా లిపిసంబంధిత పూర్వీకుల వ్రాతలు లభించాయి. ఝౌ వంశం షంగ్ వంశం మీద విజయం సాధించి ఝౌ రాజవంశం క్రీ.పూ 7-5 శతాబ్ధాల మధ్య పాలన సాగించింది. క్రమంగా భూస్వాములు రాజ్యపాలన చేపట్టారు. ఝౌ వంశం బలహినపడిన తరువాత పలు స్వతంత్ర రాజ్యాలు తలెత్తాయి. తరువాత వసంతం, హేమంతకాలాలో రాజ్యాలమధ్య 300 సంవత్సరాల కాలం నిరంతర యుద్ధాలు సాగాయి. తరువాత క్రీ.పూ 5-3 శతాబ్ధాల కాలంలో సాగించిన యుద్ధాల మధ్య 7 శక్తివంతమైన రాజ్యాలు అవతరించాయి. ఈ రాజ్యాలకు ప్రత్యేకంగా రాజు, మంత్రివర్గం, సైన్యం ఉన్నాయి. చైనా సామ్రాజ్యాలు thumb|right|Some of the thousands of life-size Terracotta Army of the Qin Dynasty, c. 210 BCE క్రీ.పూ 221 నాటికి క్విన్ రాజవంశం ఇతర ఆరు రాజ్యాల మీద విజయం సాధించిన తరువాత రాజ్యాలమధ్య యుద్ధాలకు ముగింపు లభించింది. తరువాత మొదటి సమైక్య చైనా సామ్రాజ్యం అవతరించింది. క్విన్ షి హంగ్ తనకు తానే మొదటి క్విన్ చక్రవర్తిగా ప్రకటించికుని చైనా అంతటా సంస్కరణలు చేపట్టాడు. సంస్కరణలలో చైనీస్ భాషను ప్రవేశపెట్టడం, కొలతలు, కొలపరిమాణాలు, కరెంసీ, బండి ఇరుసుల పొడవు నిర్ణయించడం మొదలైనవి ప్రధానమైనవి. తరువాత 15 సంవత్సరాలకు క్విన్ షి హంగ్ మరణం తరువాత క్విన్ రాజవంశం అధికారం కోల్పోయింది. తరువాత అథోరిటేరియన్ పోలీస్ నాయకత్వంలో రాజ్యమంతటా తిరుగుబాటు తలెత్తింది..Bodde, Derk. (1986). "The State and Empire of Ch'in", in The Cambridge History of China: Volume I: the Ch'in and Han Empires, 221 B.C. – A.D. 220. Edited by Denis Twitchett and Michael Loewe. Cambridge: Cambridge University Press. ISBN 0-521-24327-0. హాన్ రాజవంశం తరువత క్రి.పూ 206 నుండి సా.శ. 220 వరకు పాలించిన హాన్ రాజవంశం సంస్కృతి ప్రజలలో వ్యాపించి ప్రస్తుత కాలం వరకు నిలిచి ఉంది. హాన్ వంశం పాలనలో దక్షిణ కొరియా, వుయత్నాం, మంగోలియా, మధ్య ఆసియా ప్రాంతాలలో సైనిక చర్యలు కలహాలు అధికరించాయి. అలాగే మధ్య ఆసియాలో సిల్క్ రోడ్డు స్థాపనకూడా సాధ్యం అయింది. పురాతన ప్రపంచంలో హాన్ చైనా అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉండేది. హాన్ రాజకుటుంబీకులు ఆచరించిన కంఫ్యూషియనిజం ప్రజలలో ప్రాచుర్యం పొదింది. క్విన్ చట్టాలు, అధికారిక నియమాలను వదిలి హాన్ సరికొత్త పాలనా విధానాలను ప్రవేశపెట్టింది. thumb|left|The Great Wall of was built by several dynasties over two thousand years to protect the sedentary agricultural regions of the China Proper from incursions by nomadic pastoralists of the northern steppes. హాన్ పాలన తరువాత హాన్ పాలన ముగింపుకు వచ్చిన తరువాత ప్రజలలో ఐకమత్యం విచ్ఛిన్నమై సరికొత్తగా మూడు రాజ్యాలు అవతరించాయి.Whiting, Marvin C. (2002). Imperial Chinese Military History. iUniverse. p. 214 సా.శ. 581లో చైనా సుయీ రాజవంశం నాయకత్వంలో సమైక్యపరచబడింది. గొగుర్యేవో - సుయీ యుద్ధాలలో (సా.శ.్ 598-614) సుయీ ఓడిపోవడంతో సుయీ పాలన ముగింపుకు వచ్చింది.Ki-Baik Lee (1984). A new history of Korea. Harvard University Press. ISBN 978-0-674-61576-2. p.47.David Andrew Graff (2002). Medieval Chinese warfare, 300–900. Routledge. ISBN 0-415-23955-9. p.13. తరువాత తంగ్, సాంగ్ రాజవంశాలు, చైనా సాంకేతికం, సంస్కృతి స్వర్ణయుగంలో ప్రవేశించింది.Adshead, S. A. M. (2004). T'ang China: The Rise of the East in World History. New York: Palgrave Macmillan. p. 54 8వ శతాబ్ధంలో ఆన్ షి తిరుగుబాటు దేశాన్ని వినాశనం చేయడమే కాక సామ్రాజ్యాన్ని బలహీనపరచింది.City University of HK Press (2007). China: Five Thousand Years of History and Civilization. ISBN 962-937-140-5. p.71 ప్రపంచంలో పేపర్ కరెన్సీ ప్రవేశపెట్టిన మొదటి ప్రభుత్వంగా సాంగ్ సామ్రాజ్యం ప్రత్యేకత సంతరించుకుంది..Paludan, Ann (1998). Chronicle of the Chinese Emperors. London: Thames & Hudson. ISBN 0-500-05090-2. p. 136. 10-11 శతాబ్ధాలలో చైనా ప్రజల సంఖ్య రెట్టింపై 100 మిలియన్లు చేరుకుంది. మధ్య, దక్షిణ చైనాలో వరిపంట అధికరించడం, ప్రజలకు విస్తారంగా ఆహారం లభించడం జనసంఖ్య అధికరించడానికి కారణాలలో ఒకటి అయింది. సాంగ్ పాలనలో తత్వశాస్త్రం, కళలు వర్ధిల్లాయి. ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ, పోట్రెయిట్ కొత్త స్థాయికి చేరుకుని పక్వం, సరికొత్త సమీకరణ సాధించాయి. ప్రజలు కళాఖాండాలను దర్శించడం వారి కళాఖాండాలను వ్యాపారదృష్టితో పరిశీలించడం ఆరంభం అయింది.సాంగ్ పాలనా కాలంలో నియో కంఫ్యూషియనిజం, తాంగ్ పాలనలో బుద్ధిజం ప్రాబల్యత సంతరించుకున్నాయి. మంగోల్ దండయాత్ర thumb|Detail from Along the River During the Qingming Festival, a 12th-century painting showing everyday life in the Song dynasty's capital city, Bianjing (today's Kaifeng) 13వ శతాబ్ధంలో చైనాను మంగోల్ సామ్రాజ్యవాదుల దాడికి గురైంది. 1271 నాటికి మంగోల్ వీరుడు కుబ్లైఖాన్ యువాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1279లో యువాన్ శేధభాగాన్ని అంతటినీ జయించింది. మంగోల్ దండయాత్రకు ముందు చైనా పౌరుల సంఖ్య 120 మిలియన్లు అయింది. 1300 నాటికి గణాంకాలు చైనా పౌరుల సంఖ్యను 60 మిలియన్లుగా నమోదు చేసింది. Ping-ti Ho. "An Estimate of the Total Population of Sung-Chin China", in Études Song, Series 1, No 1, (1970). pp. 33–53. ఝుయువాన్ జంగ్ అనే కర్షకుడు 1368లో యువాన్ సామ్రాజ్యాన్ని త్రోసి మింగ్ సామ్రాజ్య స్థాపన చేసాడు. మింగ్ పాలనలో చైనా మరొక స్వర్ణయుగాన్ని చూసింది. ఆ సమయంలో చైనా ప్రపంచంలో శక్తివంతమైన నౌకానిర్మాణం చేసింది. చైనా ఆసమయంలో కళలు, సంస్కృతి అభివృద్ధితో సంపన్నమైన ఆర్థికవ్యవస్థను కలిగి ఉండేది. జంగ్ హీ నాయకత్వంలో ప్రపంచదేశాలన్నింటినీ చైనీయులు అన్వేషణ సాగించారు. మింగ్ సామ్రాజ్యం ఆరంభంలో నైనా రాజధాని నాంజింగ్ నుండి బీజింగ్‌కు తరకించబడింది.మింగ్ పాలనా కాలంలోవాంగ్ యాంగ్ మింగ్ మొదలైన తత్వవేత్తలు కొంత విమర్శకు గురైయ్యారు.నియో కంఫ్యూషియనిజం వ్యక్తిత్వవాదం, నైతికవాదంతో మరింత విస్తరించింది.. సమైఖ్య తిరుగుబాటు దళాలు 1644లో బీజింగ్ సమైక్య తిరుగుబాటు దళాల వశం అయింది. తిరుగుబాటు దళాలకు మింగ్ యువ అధికారి నాయకత్వం వహించాడు. చివరి మింగ్ చక్రవర్తి చాంగ్ ఝెన్ చక్రవర్తి నగరం స్వాధీనం చేసుకున్న తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. మంచు క్విన్ సామ్రాజ్య సైనికాధికారి వూ సంగూ స్వల్పకాల పాలన చేసిన షన్ రాజవంశానికి చెందిన లీని తొలగించి బీజింగ్‌ను స్వాధీనం చేసుకుని మింగ్ రాజధానిని చేసుకుని పాలన సాగించాడు. వంశపాలనకు ముగింపు thumb|left|A 19th-century painting depicting the Taiping Rebellion of 1850–1864 చైనాలో చివరి రాజరిక వ్యవస్థ 1644లో ఆరంభమై 1912 వరకు కొనసాగింది. విజయవంతం అయిన సామ్రాజ్యంగా క్వింగ్ పాలనలో క్వింగ్ వ్యతిరేకత, హైజిన్ (సముద్ర నిషేధం), సిద్ధాంతిక సాహిత్య విచారణ మొదలైనవి నిరంకుశ అణిచివేతకు గురైయ్యాయి. 19వ శతాబ్ధంలో చైనా పశ్చిమ సామ్రాజ్యవాద దాడులను అనుభవించింది. బ్రిటన్, ఫ్రాన్స్ తో మొదటి ఓపియం యుద్ధం (1838-42), రెండవ ఓపియం యుద్ధం తరువాత చైనా అసంబద్ధమైన ఒప్పందాలలో సంతకం చేయడం, నష్టపరిహారం చెల్లించడం, విదేశాలకు అదనపు భూభాగం ఇవ్వడం, హాంగ్ కాంగ్‌ను బ్రిటన్‌కు వదలడం మొదలైనవి రాజరిక వ్యవస్థను దెబ్బతీసాయి.Ainslie Thomas Embree, Carol Gluck (1997). Asia in Western and World History: A Guide for Teaching. M.E. Sharpe. p.597. ISBN 1-56324-265-6. 1842లో నాన్‌కింగ్ ఒప్పందం, 1894- 95 మొదటి జపాన్- సీనో యుద్ధం కొరియన్ ద్వీపకల్పంలో క్వింగ్ రాజరిక వ్యవస్థా ప్రాబల్యాన్ని తగ్గించాయి. అలాగే తైవాన్ జపాన్ స్వతంత్రంగా వ్యవహరించడం ఆరంభం అయింది. క్వింగ్ రాజవంశం 1850 - 1860 మద్య కాలంలో క్వింగ్ మిలియన్ల ప్రజల మరణానికి కారణం అయిన రాజ్యాంగ అశాంతికి, దక్షిణ చైనాను కదిలించిన విఫలమైన తైపింగ్ తిరుగుబాటుకు సాక్ష్యంగా నిలిచింది. పుంటి హక్కా క్లాన్ యుద్ధాలు (1855-67), నిజాన్ తిరుగుబాటు (1851- 78), మియో తిరుగుబాటు (1854- 73), పంతే తిరుగుబాటు (1856-73), దుంగన్ తిరుగుబాటు (1862-77), విజయవంతం అయిన 1860 స్వశక్తి ఉద్యమం 1880-1890 లమద్య వరుస సైనిక చర్యలతో అణిచివేయబడ్డాయి. చైనీస్ వలసలు 19వ శతాబ్ధంలో సంభవించిన ఉత్తర చైనా కరువు (నార్తెన్ చైనా ఫామైన్ 1876-79) వంటి ఉపద్రవంలో 9-13 మిలియన్ల మంది ప్రజల మరణానికి గురైయ్యారు. నష్టాలు ఉపద్రవల కారణంగా చైనీయులలో పెద్ద ఎత్తున వలసలు ప్రారంభం అయ్యాయి. దీనిని గొప్ప చైనా వససలుగా వర్ణించారు."Dimensions of need – People and populations at risk". 1995. Food and Agriculture Organization of the United Nations (FAO). Retrieved 3 July 2013. 1898లో ఆధునిక రాజ్యాంగ స్థాపన కొరకు గంగ్సు చక్రవర్తిచే వందరోజుల సంస్కరణలు చేపట్టబడ్డాయి. ఈ సస్కరణలను చక్రవర్తిని డోవాగర్ సిక్స్ చేత నిరోధించబడ్డాయి. యాంటీ వెస్టర్న్ బాక్సర్ రిబెల్లియన్ (1899-1901) కారణంగా సామ్రాజ్యం మరింత బలహీనపడింది. చక్రవర్తిని డొవాగర్ సిక్స్ పలు ప్రతిష్ఠత్మకమైన సంస్కరణలు చేపట్టినప్పటికీ 1911-12లో క్వింగ్ సామ్రాజ్యం అంతరించింది. తరువాత రిపబ్లిక్ ఆఫ్ చైనా (1912-49) అవతరించింది. రిపబ్లిక్ ఆఫ్ చైనా (1912–49) thumb|Sun Yat-sen, the father of modern China (seated on right), and Chiang Kai-shek, later President of the Republic of China thumb|Chiang Kai-shek and Mao Zedong toasting together in 1946 following the end of World War II 1912 జనవరి 1 రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించబడింది.క్యూమింతాంగ్‌కు చెందిన సన్-యాత్-సెన్ (నేషనలిస్ట్ పార్టీ) అధ్యక్షునిగా నియమించబడ్డాడు. Eileen Tamura (1997). China: Understanding Its Past. Volume 1. University of Hawaii Press. ISBN 0-8248-1923-3. p.146. అయినప్పటికీ తరువాత అధ్యక్షపదవి పూర్వపు క్వింగ్ జనరల్‌కు యుయాన్ షికైకు ఇవ్వబడింది. యువాన్ షికై 1915 లో తననుతాను చైనాచక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. తరువాత ఆయన స్వంతసైన్యం వ్యతిరేకత, ప్రముఖులఖండన సింహాసనాన్ని వదిలి తిరిగి రిపబ్లిక్ స్థాపించవలసిన పరిస్థితి ఎఉదురైంది.Stephen Haw, (2006). Beijing: A Concise History. Taylor & Francis, ISBN 0-415-39906-8. p.143. షికై మరణం తరువాత 1916లో చైనా రాజకీయంగా విభజనకు గురైంది. చైనా బీజ్ంగ్ ఆధారిత ప్రభుత్వం అధికారంలో తక్కువగా ఉన్నా అంతర్జాతీయ గుర్తింపును కలిగి ఉంది. చైనాలోని అత్యధికభూభాన్ని ప్రాంతీయ యుద్ధవీరుల హస్థగతం అయింది.Bruce Elleman (2001). Modern Chinese Warfare. Routledge. ISBN 0-415-21474-2. p.149.Graham Hutchings (2003). Modern China: A Guide to a Century of Change. Harvard University Press. ISBN 0-674-01240-2. p.459. 1920లో క్యూమింతాంగ్ " నార్తెన్ ఎక్స్పెడిషన్ " పేరిట దేశాన్ని తిరిగి సమైక్యం చేసాడు.Peter Zarrow (2005). China in War and Revolution, 1895–1949. Routledge. ISBN 0-415-36447-7. p.230.M. Leutner (2002). The Chinese Revolution in the 1920s: Between Triumph and Disaster. Routledge. ISBN 0-7007-1690-4. p.129. క్యూమింతాంగ్ దేశరాజధానిని నాంజింగ్‌కు తరలించాడు. క్యూమింతాంగ్ యాత్-సెన్- డాక్టరిన్ పేరిట రాజకీయ శిక్షణా విధానాన్ని ప్రవేశపెట్టి చైనాను ఆధునిక ప్రజాపాలనకు తీసుకువచ్చాడు. Hung-Mao Tien (1972). Government and Politics in Kuomintang China, 1927–1937 (Volume 53). Stanford University Press. ISBN 0-8047-0812-6. pp. 60–72.Suisheng Zhao (2000). China and Democracy: Reconsidering the Prospects for a Democratic China. Routledge. ISBN 0-415-92694-7. p.43.David Ernest Apter, Tony Saich (1994). Revolutionary Discourse in Mao's Republic. Harvard University Press. ISBN 0-674-76780-2. p.198. రెండవ సినో - జపాన్ యుద్ధం 1937-1945 జరిగిన సినో- జపాన్ యుద్ధం క్యుమింతాంగ్, కమ్యూనిస్ట్ పార్టీలమద్య అసౌకర్యమైన కూటమి కలగడానికి దారితీసింది. జపాన్ సైన్యం చైనాపౌరులకు వ్యతిరేకంగా పలు యుద్ధనేరాలు, దారుణాలకు పాల్పడింది. యుద్ధం మిలియన్లకొద్దీ చైనాపౌరుల మరణానికి సాక్ష్యంగా నిలిచింది."Nuclear Power: The End of the War Against Japan". BBC — History. Retrieved 14 July 2013. జపాన్ ఆక్రమణ సమయంలోనాంజింగ్‌లో మాత్రమే 2,00,000 మంది చైనీయులు మూకుమ్మడి హత్యలకు గురైయ్యారు."Judgement: International Military Tribunal for the Far East". Chapter VIII: Conventional War Crimes (Atrocities). November 1948. Retrieved 4 February 2013. యుద్ధసమయంలో చైనా, యు.కె యు.ఎస్, సోవియట్ యూనియన్‌లను " ట్రూస్టిప్ ఆఫ్ ది పవర్ఫుల్ " అని, ఐక్యరాజ్యసమితి చేత " బిగ్ ఫోర్ "గా అభివర్ణించబడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కూటని దేశాలలో చైనా మిగిలిన మూడు దేశాలతో కలిసి " ఫోర్ పోలీస్ మెన్ " అని వర్ణించబడింది. రెండవ ప్రపంచయుద్ధంలో విజయం సాధించిన దేశాలలో చైనా కూడా ఒకటిగా పరిగణించబడింది.Hoopes, Townsend, and Douglas Brinkley. FDR and the Creation of the U.N. (Yale University Press, 1997) 1945లో జపాన్ లొంగిపోయిన తరువాత పెస్కడోర్స్‌తో చేర్చిన తైవాన్ తిరిగి చైనావశం చేయబడింది. చైనా విజయం సాధించిన దేశాలలో ఒకటిగా నిలిచినప్పటికీ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతిన్నది. యుద్ధం వలన కలుగిన నష్టాలు పరిస్థితిని మరింతగా దిగజార్చాయి. క్యూమింతాంగ్, మద్య అవిశ్వాసం కొనసాగడం 1947 అంతర్యుద్ధానికి దారితీసింది. రాజ్యంగం తిరిగి పునఃస్థాపితం చేయబడింది. యుద్ధానంతర పరిణామాలు రిపబ్లిక్ ఆఫ్ చైనా అంతటా అశాంతి నెలకొనడానికి దారితీసాయి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (1949–present) 1948లో చైనా అంతర్యుద్ధం ముగింపుకు వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ చైనాలోని అత్యధికమైన భూభాగాన్ని వశపరచుకున్నది. క్యూమింతాంగ్ దేశం విడిచి పారిపోయాడు. రిపబ్లిక్ ఆఫ్ చైనా అధికారం తైవాన్, హైనాన్, సమీపంలో ఉన్న ద్వీపాలకు పరిమితం అయింది. కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ మావో జెడాంగ్ " పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" స్థాపన చేసినట్లు ప్రకటించాడు. 1950లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హైనాన్‌లో నిలిచి రిపబ్లిక్ నుండి భూభాగాలను వేరుచేయడానికి, టిబెట్ను ఆక్రమించడానికి ప్రయత్నించింది. మావో పాలన మావో పాలనలో 1-2 మిలియన్ల భూస్వాములను హతమార్చి చేపట్టబడిన వ్యవసాయసంస్కరణలు కర్షకుల ఆదరణను పొందాయి.Busky, Donald F. (2002). Communism in History and Theory. Greenwood Publishing Group. p.11. మావో నాయకత్వంలో చైనా స్వతంత్ర పారిశ్రామిక ఆధారితమైన ఆర్థికవ్యవస్థను, అణ్వాయుధ సంపత్తిని సాధించింది. తరువాత చైనా పౌరుల సంఖ్య 550 నుండి 900 ల మిలియన్లకు చేరుకుంది. మావో ఆర్థిక, సాంఘిక సంస్కరణల చేసినప్పటికీ " గ్రేట్ చైనీస్ ఫామైన్ "గా వర్ణించబడిన కరువు సమయంలో 45 మిలియన్ల మరణాలు సంభవించాయి. 1958-1961 మద్య సాగిన కరువులో మిలియన్లకొద్దీ ప్రజలు ఆకలితో మరణించారు. 1966లో మావో కూటమి ఆరంభించిన సస్కృతిక విప్లవం రాజకీయ ప్రతీకారం, సాంఘిక తిరుగుబాటుకు దారితీసింది. ఈ సంఘర్షణలు 1976లో మావో మరణంతో ముగింపుకు వచ్చాయి.Michael Y.M. Kao. "Taiwan's and Beijing's Campaigns for Unification" in Harvey Feldman and Michael Y. M. Kao (eds., 1988): Taiwan in a Time of Transition. New York: Paragon House. p.188. సాంస్కృతిక విప్లవం మావో మరణం తరువాత డెంగ్ క్సియోపింగ్ అధికారం చేపట్టి ఆర్ధిక సంస్కరణలు చేసాడు. కమ్యూనిస్టు పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తరువాత చైనా సోషలిజ ఆధారిత ప్రత్యేకమైన స్వంత పాలనావిధానం ఏర్పాటు చేసుకుంది.Hart-Landsberg, Martin; and Burkett, Paul. "China and Socialism: Market Reforms and Class Struggle". Monthly Review. Retrieved 30 October 2008. 1982లో చైనాలో ప్రస్తుత రాజ్యాంగవిధానం ప్రవేశపెట్టబడింది. 1989లో తైనాన్మెన్ స్క్వేర్ నినాదాలు నిరంకుశంగా అణిచివేయబడ్డాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవిమర్శలకు దారితీసి పలుదేశాలు చైనా ప్రభుత్వానికి వ్యతురేకంగా వైవిధ్యమైన నిర్ణయాలు తీసుకున్నాయి. జైగ్ జెమిన్ - లి పెంగ్, రోంగ్ 1990లో దేశరాజకీయాలకు జియాంగ్ జెమిన్, లీ పెంగ్, ఝు రాంగ్జి నాయకత్వం వహించారు. వారి నాయకత్వంలో చైనా 150 మిలియన్ల వ్యవసాయదారుల ఆర్ధికపరిస్థితి మెరుగై బీదరికం నుండి వారు వెలుపలికి వచ్చారు. అలాగే చైనా జి.డి.పి 11.2% అభివృద్ధి చెందింది.Nation bucks trend of global poverty. China Daily. 11 July 2003. Retrieved 10 July 2013.China's Average Economic Growth in 90s Ranked 1st in World. People's Daily. 1 March 2000. Retrieved 10 July 2013.2000లో హూ జింటో, వెన్ జింటో ఆధ్వర్యంలో ఆర్ధికాభివృద్ధి సాధించింది. 2001లో చైనా " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ " భాగస్వామ్యం వహించింది.China worried over pace of growth. BBC. Retrieved 16 April 2006.China: Migrants, Students, Taiwan. Migration News. January 2006.In Face of Rural Unrest, China Rolls Out Reforms. Washington Post. 28 January 2006. చైనాపౌరుల జీవనస్థితి వేగవంతంగా అభివృద్ధిదశలో ముందుకుసాగింది. అయినప్పటికీ కేంద్రీకృతమైన రాజకీయాధికారం శక్తివంతంగా మారింది. 2012 లోవాంగ్ లిజున్ సంభవం తరువాత దశాబ్ధకాల కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో మార్పులు సంభవించాయి. 18వ కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో క్సి జిన్‌పింగ్ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీగా హ్యూజింటోని నియమించాడు. క్సి జింపింగ్ నాయకత్వంలో చైనాప్రభుత్వం ఆర్థికసంస్కరణలను చేపట్టింది. ఆర్థిక సంస్కరణలు నిర్మాణాత్మక అస్థిరత, అభివృద్ధి మాంధ్యానికి దారితీసాయి. క్సి-లి నాయకత్వం సంస్కరణలలో ఒకే ఒక బిడ్డ, ఖైదు విధానాన్ని ప్రవేశపెట్టింది. భౌగోళికం 9.6 మిలియన్ల వైశాల్యంతో చైనా వైశాల్యపరంగా ఆసియాలో రెండవ స్థానంలో ఉంది. చైనా భౌగోళికంగా విస్తారమైన, వైవిధ్యంగా ఉంటుంది. మంగోలియన్ మంచూరియన్ సోపాన అరణ్యాలు (స్టెప్ ఫారెస్ట్), గోబీ ఎడారి, తక్లమకన్ ఎడారి, ఉత్తరంలో ఉన్న ఉప ఉష్ణమండల అరణ్యాలు ఉన్నాయి. హిమాలయ, కరకొరం, పామిర్ పర్వతాలు, తియాన్ షాన్ పర్వతావళి (ఇవి చైనాను దక్షిణాసియా, మధ్య ఆసియా నుండి వేరుచేస్తున్నాయి) ఉన్నాయి. టిబెట్ నుండి ప్రవహిస్తున్న యాంగ్త్జే నది, ఎల్లో నది (ప్రపంచంలో ఆరవ పెద్దనది) ఉన్నాయి. పసిఫిక్ సముద్రతీరంలో ఉన్న చైనా సముద్రతీరం పొడవు 4,500 కి.మీ. సముద్రతీరం వెంట బొహై సముద్రం, యెల్లో సముద్రం, తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం ఉన్నాయి. రాజకీయ భౌగోళికం ప్రపంచదేశాలలో భూవైశాల్యపరంగా చైనా రెండవ స్థానంలో ఉంది. మొదటిస్థానంలో రష్యా ఉంది. అయినా భూభాగం, జలభాగం కలిసిన వైశాల్యపరంగా చైనా మూడు లేక నాల్గవస్థానంలో ఉంది. రష్యా,కెనడా, అమెరికాసమ్యుక్తరాష్ట్రాల మొత్తం వైశాల్యం మొదటి మూడుస్థానాలలో ఉందని భావిస్తున్నారు. చైనా మొత్తం వైశాల్యం 96,00,000 చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. . ఇది ఎంసైక్లోపీడియా బ్రిటానికా అంచనా అనుసరించి 95,72,900 చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. ఐక్యరాజ్యసమితి ఇయర్ బుక్ అనుసరించి 9596961చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. , సి.ఐ.ఎ వరల్డ్ బుక్ అంచనా అనుసరించి 9596961 చదరపు మైళ్ళు ఉంటుందని అంచనా. చైనాలోని యాలు ముఖద్వారం నుండి గల్ఫ్ ఆఫ్ తొంకిన్ మద్యదూరం 22117 కి.మీ ఉంటుందని అంచనా. . చైనా సరిహద్దు దేశాల సంఖ్య రష్యా కాక 14 ఉన్నాయి. చైనా తూర్పు ఆసియా వరకు విస్తరించి ఉంది. చైనా సరిహద్దులో వియత్నాం, లావోస్, బర్మా దేశాలు, ఆగ్నేయ ఆసియాదేశాలైన భారతదేశం, భూటాన్, నేపాల్, పాకిస్థాన్ ఉన్నాయి. దక్షిణాసియా దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, తజకిస్థాన్, కిర్గిజికిస్థాన్ ఉన్నాయి. మద్య ఆసియాదేశాలైన రష్యా, మంగోలియా, ఉత్తర కొరియా ఉన్నాయి. అదనంగా చైనా సముద్రసరిహద్దులలో జపాన్, వియత్నాం, ఫిలిప్పైంస్, దక్షిణ కొరియా ఉన్నాయి. ప్రకృతి, శీతోష్ణస్థితి చైనా 18° నుండి 54° ఉత్తర అక్షాంశం, 73° నుండి 135° తూర్పు రేఖాంశంలో ఉంది. తూర్పున యెల్లో సీ, తూర్పుచైనా సీ సారవంతమైన మైదానాలతో నిండి జసాంధ్రత అధికంగా కలిగి ఉంది. ఉత్తరంలో మంగోలియన్ మైదానం పచ్చికబయళ్ళతో పచ్చగా ఉంటుంది. దక్షిణచైనా పర్వతప్రాంతం, దిగువ పర్వతావళి అత్యధికంగా ఉంటుంది. మద్య తూర్పు ప్రాంతం చైనాలోని యెల్లోనదీమైదానం, యంగ్త్జే అనే రెండు నదీమైదానాల మద్యఉంటుంది. అదనంగా చైనాలో క్సి, మెకాంగ్, బ్రహ్మపుత్ర, అమూర్ నదులు ప్రవహిస్తున్నాయి. పశ్చిమంలో హిమాలయ పర్వతశ్రేణి ఉంటుంది. ఉత్తర చైనాలో తక్లమకన్ ఎడారి, గోబీ ఎడారి ఉన్నాయి. చైనా నేపాల్ సరిహద్దులో ప్రపంచంలో ఎత్తైన శిఖరంగా గుర్తించబడుతున్న ఎవెరెస్ట్ శిఖరం (సముద్రమట్టానికి 8,848 మీ) ఉంది. చైనాలోని అత్యంత దిగువ ప్రాంతంలోని తుర్పాన్ డిప్రెషన్‌లో ఉన్న అయిడింగ్ సరసు (సముద్రమట్టానికి -15 మీ దిగువన ఉంది) ప్రంపంచంలో అత్యంత దిగువన ఉన్న ప్రాంతాలలో మూడవ స్థానంలో ఉందని గుర్తించబడుతుంది. చైనా వాతావరణాన్ని డ్రై సీజన్, వెట్ మాంసూన్ ఆధిక్యత చేస్తుంది. అది శీతాకాలం, వేసవి కాలం మద్య వ్యత్యాసం అధికరించడానికి కారణం ఔతుంది. ఎగువ నుండి శీతాకాలంలో ఉత్తర పవనాలు చల్లని, పొడిగాలులు వీద్తుంటాయి. వేసవిలో దక్షిణ సముద్రతీరం నుండి వెచ్చని తేమగాలులులు వీస్తుంటాయి. చైనా వాతావరణం ఒక్కొక ప్రంతానికి ఒక్కోలా వౌవిధ్యంగా ఉంటుంది. వైవిధ్యమైన భౌగోళిక స్థితి ఇందుకు ప్రధానజారణంగా ఉంది. చైనాలో పర్యావరణ వివాదాలలో ఏడారుల విస్తరణ ఒకటి. గోబీ ఎడారి స్థితి ఇందులో ప్రధానమైనది."Beijing hit by eighth sandstorm". BBC news. Retrieved 17 April 2006. 1970 నుండి ఇసుకతుఫానుల వేగాన్ని తగ్గించడానికి చెట్లవరుసలను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తర చైనాలో వసంతకాలంలో ఆసియన్ ధూళితుఫానుల కారణంగా నిరంతర కరువు, వ్యవసాయసనస్యలు ఎదురౌతూనే ఉన్నాయి. ధూళితుఫానులు చైనాలోనే కాక పొరుగున ఉన్న కొరియా, జపాన్‌లలో కూడా వ్యాపిస్తూ ఉంటాయి. చైనా పర్యావరణ సంస్థ 2007 సెప్టెంబరు నివేదికలో ధూళితుఫానుల కారణంగా చైనా సాలీనా 4,000 ఎకరాలను నష్టపోతున్నదని తెలియజేసింది. చైనాతో ఇతరదేశాల సంబంధానికి నీటి నాణ్యత, భూ ఊచకోత, జనసంఖ్యాభివృద్ధి నియంత్రణ మొదలైనవి ప్రాధాన్యత కలిగిన విషయాలుగా ఉన్నాయి. హిమాలయాలలోని గ్లాసియర్లు కరగడం వలన లభిస్తున్న విస్తారమైన జలం కోట్లాదిప్రజలు జీవించడానికి ఆధారంగా ఉంది. జీవవైవిధ్యం thumb|A giant panda, China's most famous endangered and endemic species, at the Chengdu Research Base of Giant Panda Breeding in Sichuan అత్యధికంగా వైవిధ్యం కలిగిన 17 దేశాలలో చైనా ఒకటి., పర్యావరణ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంలో ఉండడం, ఇండోమాలయ, పాలియార్కిటిక్ ప్రాంతంలో ఉండడం ఇందుకు ఒక కారణం. చైనాలో 34,687 జాతుల జంతువులు, వాస్కులర్ మొక్కలు చైనాను ప్రపంచదేశాలలో బయోడైవర్శిటీ కలిగిన దేశాలలో మూడవస్థానంలో నిలిపింది. మొదటి రెండు స్థానాలలో బ్రెజిల్, కొలంబియా దేశాలు ఉన్నాయి.Countries with the Highest Biological Diversity . Mongabay.com. 2004 data. Retrieved 24 April 2013. 1992 జూన్ 11 న చైనా " రియో డీ జనెరియో "లో జరిగిన " కాంవెంషన్ ఆన్ బయోడైవర్శిటీ మీద సంతకం చేసి 1993 జనవరి 5న సమావేశంలో భాగస్వామ్యం వహించింది. 2010 సెప్టెంబరు 10న జరిగిన సమావేశం తరువాత చైనా " బయోడైవర్శిటీ ఏక్షన్ ప్లాన్ " తయారుచేసింది. చైనాలో 551 జాతుల క్షీరదాలు ఉన్నాయి. క్షీరదాల సంఖ్యలో చైనా అంతర్జాతీయంగా మూడవస్థానంలో ఉంది.IUCN Initiatives – Mammals – Analysis of Data – Geographic Patterns 2012 . IUCN. Retrieved 24 April 2013. Data does not include species in Taiwan. 1221 జాతుల పక్షులు ఉన్నాయి. పక్షిజాతులతో చైనా అంతర్జాతీయంగా చైనాను ఎనిమిదవ స్థానంలో ఉంది.Countries with the most bird species. Mongabay.com. 2004 data. Retrieved 24 April 2013. 424 సరీసృపాలతో,Countries with the most reptile species. Mongabay.com. 2004 data. Retrieved 24 April 2013. 333 జాతుల ఉభయచరాలతో చైనా అంతర్జాతీయంగా ఏడవ స్థానంలో ఉంది.IUCN Initiatives – Amphibians – Analysis of Data – Geographic Patterns 2012 . IUCN. Retrieved 24 April 2013. Data does not include species in Taiwan. జీవవైవిధ్యం అధికంగా ఉన్న చైనాలో హోమోసేపియన్‌ జాతికి చెందిన గిరిజనులు అత్యధికసంఖ్యలో ఉన్నారు. చైనాలో ఉన్న జంతువులలో 840 జాతులు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. మానవ నివాసాల అవసరం, కాలుష్యం, అహారపదార్ధాలను అధికంగా పండించవలసిన అవసరం, ఔషధాల మూలికల ఉపయోగం, జంతువుల ఉన్ని ఉపయోగం కారణంగా జతువులు అతరించిపోతున్న స్థితికి చేరుకున్నాయి. Top 20 countries with most endangered species IUCN Red List. 5 March 2010. Retrieved 24 April 2013. అంతరించిపీతున్న జంతువులు 2005 నుండి చట్టబద్ధంగా సంరక్షించబడుతున్నాయి. దేశంలో 2,349 అభయారణ్యాలు ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 149.95 మిలియన్ హెక్టారులు ఉంటుంది. ఇది చైనా వైశాల్యంలో 15% ఉంటుంది. చైనా 32,000 వస్కులర్ మొక్కలు,Countries with the most vascular plant species. Mongabay.com. 2004 data. Retrieved 24 April 2013. అనేక అడవి జాతివృక్షాలు ఉన్నాయి. ఉత్తర భూభాగంలో కోల్డ్ కోనిఫెరస్ చెట్లు అధికంగా ఉన్నాయి. ఇవి దుప్పి, ఆసియన్ ఎలుగు, 120 పక్షిజాతులకు ఆధారంగా ఉన్నాయి.. దిగువన ఉన్న మాయిస్టర్ కోనిఫర్ అరణ్యాలలో దట్టమైన వెదురుపొదలు ఉన్నాయి. ఎగువన జూనీపర్, టాక్సస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వెదురు పొదల స్థానాన్ని రోడోడెండ్రాన్ చెట్లు ఆక్రమించాయి. దక్షిణ, మద్య చైనాలో ఉప ఉష్ణమండల జాతి చెట్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ 1,46,000 జాతుల చెట్లు ఉన్నాయి. యున్నన్, హైనన్ ద్వీపాలలో ఉష్ణమండల, సీజనల్ వర్షారణ్యాలు ఉన్నాయి. ఇక్కడ చైనాలోని జంతువులు, వృక్షాలలో నాగువవంతు ఉన్నాయి. చైనాలో 10,000 జాతుల శిలీంధ్రాలు, 6,000 జాతుల హైఘర్ ఫంగీ నమోదు చేయబడ్డాయి. పర్యావరణ అంశాలు thumb|Wind turbines in Xinjiang. The Dabancheng project is one of Asia's largest wind farms సమీపకాలంలో చైనా పర్యావరణ వివాదాలను ఎదుర్కొంటున్నది. 1979 పర్యావరణ క్రమబద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చట్టాలు రూపొందించబడ్డాయి. కఠినమైన చట్టాలు అమలుచేయడంలో అలసత్వం ఏర్పడింది. చట్టాలను ప్రాంతీయప్రజలు, ప్రభుత్వ అధికారులు గౌరవించలేదు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ఇందుకు కారణం. నగర వాయుకాలుష్యం అనారోగ్య సమస్యలకు కారణం ఔతుంది. 2013 ప్రపంచబ్యాంకు అంచనాలను అనుసరించి చైనాలో అత్యధిక జనసాంధ్రత కలిగిన 20 నగరాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రపంచదేశాలలో చైనా అత్యధికంగా కార్బండయాక్సైడ్ వెలువరిస్తున్న దేశంగా భావిస్తున్నారు. దేశానికి జలసంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. 298 మిలియన్ల గ్రామీణ ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందడం లేదని అంచనా. అలాగే చైనా నదులలో 40% పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్ధాలు వ్యవసాయ వ్యర్ధాల కారణంగా కలుషితమౌతున్నాయని 2011 గణాంకాలు వివరిస్తున్నాయి."China's decade plan for water" . The Earth Institute. Columbia University. 24 October 2011. Retrieved 23 November 2011. కాలుష్యసమస్యల కారణంగా ఈశాన్యచైనా ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. చైనా " రిన్యూవబుల్ ఎనర్జీ కమర్షియలైజేషన్ " (పునరుత్పాదక శక్తి వ్యాపారీకరణ) కొరకు అత్యధికంగా పెట్టుబడి చేసిన దేశంగా గుర్తించబడుతుంది. 2011లో చైనా ఇందు కొరకు 52 బిలియన్ల అమెరికడాలర్లను పెట్టుబడి చేసింది. చైనా రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. ప్రాంతీయ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రణాళికల కొరకు అత్యధికంగా వ్యయంచేస్తూ ఉంది."China's big push for renewable energy". Scientific American. 4 August 2008. Retrieved 24 September 2011. 2009 నాటికి చైనా ఖర్చుచేస్తున్న విద్యుత్తులో 17% రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా లభించిందని భావిస్తున్నారు. జలవిద్యుత్తు ప్రణాళికల నుండి చైనా 197 గిగాబైట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుందని అంచనా."China tops the world in clean energy production." Ecosensorium. 2010. Retrieved 24 September 2011. 2011లో చైనా ప్రభుత్వం 618.55 బిలియన్ల అమెరికా డాలర్లు వాటర్ ఇంఫ్రాస్ట్రక్చర్, డిసాలినేషన్ ప్రణాళిక కొరకు మంజూరు చేసింది. 2020 నాటికి వరద నివారణ నిర్మాణాలు పని చేసుకుని కరువును నివారించగకమని ప్రభుత్వం భావిస్తుంది. "Splashing out: China to spend 4 trillion yuan on water projects" . Want China Times. 11 July 2011. Retrieved 27 November 2011. 2013లో చైనా 277 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో పంచవర్ష ప్రణాళిక ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా ఉత్తరచైన అభివృద్ధి కొరకు కృషిచేస్తుందని అంచనా. రాజకీయాలు thumb|Tiananmen with a portrait of Mao Zedong ప్రంపంచంలో బహిరంగంగా సోషలిజాన్ని బలపరుస్తున్న దేశాలలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఒకటి. చైనీస్ ప్రభుత్వవిధానం వైవిధ్యమైన కమ్యూనిస్టు సోషలిస్టు విధానాన్ని అనుసరిస్తున్నట్లు వర్ణించబడుతుంది. కానీ చైనా నియంతృత్వ, సంస్థాగత సమ్మిశ్రిత పాలనా విధానం అనుసరిస్తుంది. అనేక కట్టుబాట్ల మద్య ఇంటర్నెట్ (ఇంటర్నెట్ సెంసార్ చేయడంపట్ల వ్యతిరేకత ఉంది), పత్రికా స్వాతంత్ర్యం, అసెంబ్లీ స్వాతంత్ర్యం, పిల్లలను పొందే స్వతంత్రం, ఫ్రీ ఫార్మేషన్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్, మతస్వాతంత్ర్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి చైనా ప్రస్తుత రాజకీయ, ఆర్థిక విధానాలను వారి నాయకులచేత " పీపుల్స్ డెమొక్రటిక్ డిక్టేటర్‌షిప్", సోషలిజం విత్ చైనీస్ కారెక్టరిస్టిక్స్, సోషలిస్ట్ మార్కెట్ ఎకనమిగా మార్చబడవచ్చని భావిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ చైనా దేశం కమ్యూనిస్టు పార్టీచేత పాలించబడుతుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఎన్నికలు వారసత్వవిధానంలో నిర్వహించబడుతున్నాయి. లోకల్ పీపుల్స్ కాంగ్రెస్ నేరుగా ఎన్నుకొనబడుతుంది. ఆఫ్ చైనాలో ఉన్నత స్థాయిలో ఉన్న పీపుల్స్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులను క్రిందస్థాయి సభ్యులుగా పీపుల్స్ కాంగ్రెస్ చేత పరోక్షంగా ఎన్నుకొంటారు.Article 97 of the Constitution of the People's Republic of China రాజకీయ విధానం వికేంద్రీకరణ, ప్రాంతీయ ఉపప్రాంతీయ నాయకులు గణనీయమైన స్వయంప్రతిపత్తి కలిగి ఉంటారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, చైనీస్ పీపుల్స్ పొలిటకల్ పార్టీలకు చెందిన ( పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని రాజకీయ పక్షాలు) డెమొక్రటిక్ పార్టీలుగా భావించబడుతున్నాయి. thumb|left|The Great Hall of 1970లో బీజింగ్‌లో నిర్వహించబడిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు మూసిన తలుపుల వెనుక నిర్వహించబడ్డాయి. చైనా స్వతంత్రంగా వ్యవహరించడం ఆరంభం అయిన తరువాత రాజకీయ వాతావరణంలో కట్టుదిట్టాలు సడలించిన కారణంగా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ కొంత స్వతంత్రంగా వ్యవహరించడం మొదలైంది. చైనా లెనినిస్ట్ విధానాలు కలిగిన " డెమొక్రటిక్ సెంట్రలిజం " అనుసరించింది.Constitution of the People's Republic of China. (1982) అయినప్పటికీ ఎన్నికైన నేషనల్ కాంగ్రెస్ సభ్యులను " రబ్బర్ స్టంప్ " (నామమాత్రపు అధికారాలు కలిగినది)!గానే భావిస్తున్నారు. ఏకపార్టీ దేశంగా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీ అంతిమ నిర్ణయాధికారం కలిగి ఉంటాడు. మార్చి మాసంలో 82 మిలియన్ల సభ్యులున్న కమ్యూనిస్టు పార్టీ సెక్రెటరీ జిపింగ్-59 అత్యంత శక్తివంతమైన అధ్యక్షపదవిని హూ జింటో నుండి చేపట్టాడు. ప్రభుత్వం పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షడు దేశానికి నామమాత్రపు అధ్యక్షత వహిస్తాడు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెరిమోనియల్ కార్యక్రమాలలో పాల్గొనడం మొదలైన అలంకారప్రాయమైన విధినిర్వహణా బాధ్యతలు నిర్వహిస్తాడు. అఫ్హ్యక్షుని కార్యాలయం ప్రతిష్ఠాత్మకమైనది. అధ్యక్షుడు దేశానికి నాయకత్వం వహిస్తాడు. 1982 నుండి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుని అధికారం, విధులను పునఃస్థాపితం చేసి ఆయనను దేశాధిపతిగా గుర్తించింది. అయినప్పటికీ అధ్యక్షుడు అమెరికన్ అధ్యక్షుని వంటి అధికారాలు కలిగి ఉండక అలంకారప్రాయమైన అధికారాలు కలిగి ఉంటాడు. చైనా అధ్యక్షుని భారతదేశ అధ్యక్షుడు, యునైటెడ్ కింగ్డం రాజు లేక రాణితో పోల్చవచ్చు.Krishna Kanta Handique State Open University , EXECUTIVE: THE PRESIDENT OF THE CHINESE REPUBLIC.}} పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రీమియర్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. నలుగురు సహాయ ప్రీమియర్లతో స్టేట్ కౌంసిల్ ఆఫ్ ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, మంత్రులు, కమిషన్ల మీద ఆధిపత్యం వహిస్తాడు. కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీ, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ క్సి జింపింగ్ తనను సర్వోత్తమ నాయకునిగా చేసుకున్నాడు. ప్రీమియర్ లీ కెక్వియంగ్ (సి.పి.సి పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సీనియర్ సభ్యుడు) ఉన్నత నిర్ణయాధికారం కలిగి ఉంటాడు. రాజకీయ స్వాతంత్ర్యానికి కొన్ని చర్యలు తీసుకొనబడ్డాయి. బహిరంగ ఎన్నికలు గామం, నగర స్థాయిలో నిర్వహించబడుతున్నాయి.Lohmar, Bryan; and Somwaru, Agapi; Does China's Land-Tenure System Discourage Structural Adjustment?. 1 May 2006. USDA Economic Research Service. Retrieved 3 May 2006. ఏది ఏమైనా పార్టీ ప్రభుత్వ నియామకాలలో శక్తివంతమైన నియంత్రణాధికారం కలిగి ఉంటారు."China sounds alarm over fast-growing gap between rich and poor" . Associated Press via Highbeam (subscription required to see full article). 11 May 2002. Retrieved 1 February 2013.Hasmath, R. (2012) "Red China's Iron Grip on Power: Communist Party Continues Repression", The Washington Times, 12 November, p. B4. అయినప్పటికీ ప్రభుత్వానికి, దేశనిర్వహణకు ప్రజలు మద్దతుగా నిలిచారు. 2011 గణాంకాలను అనుసరించి 85%-95% ప్రజలు ప్రభుత్వపాలన పట్ల సంతృప్తి వ్యక్తంచేసారు. పరిపాలనా విభాగాలు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 22 ప్రాంతాలుగా విభజించబడింది. అదనంగా తైవాన్ ప్రాంతం చేర్చబడింది. తైవాన్ ప్రాంతాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 23 ప్రాంతంగా భావించబడుతుంది. అయినప్పటికీ తైవాన్ ప్రాంతం మీద రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆధిపత్యం కలిగి ఉండడం వివాదాస్పదంగా ఉంది.Gwillim Law (2 April 2005). Provinces of China. Retrieved 15 April 2006. చైనాలో స్వయంప్రతిపత్తి కలిగిన ఉపవిభాగాలు ఉన్నాయి. ఉపవిభాగాలు అల్పసంఖ్యాక సమూహాలకు ప్రత్యేకించబడ్డాయి. ఇందులో 4 మునిసిపాలిటీల ఆధీనంలో, ప్రత్యేక నిర్వహణాప్రాంతాలు (వీటి రాజకీయ స్వయంప్రతిపత్తి ఉంది) ఉన్నాయి. ఈ 22 ప్రాంతాలు, 4 మునిసిపాలిటీలు, 5 స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలు ప్రధాన చైనా భూభాగంగా పరిగణించబడుతున్నాయి. హాంగ్ కాంగ్, మకయు ప్రాంతాలు ఇందుకు అతీతంగా ఉన్నాయి. పి.ఆర్.సి నియంత్రణలో ఉన్న ప్రాంతాలను ఆర్.ఒ.సి ప్రభుత్వం చేత గుర్తించబడలేదు. విదేశీ విధానం thumb|Chinese President Xi Jinping holds hands with fellow BRICS leaders at the 2014 G20 Brisbane in Australia పి.ఆరి.సి 171 దేశాలతో దౌత్యసంబంధాలను కలిగి ఉంది. embassies in 162|పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా దౌత్యకార్యాలయా జాబితా. 162 దేశాలలో చైనాకు దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. దౌత్యకార్యాలయాల చట్టబద్ధతను రిపబ్లిక్ ఆఫ్ చైనా, కొన్ని ఇతర దేశాలలో వివాదాద్పదంగా ఉంది. పరిమితమైన గుర్తింపు కలిగిన అతిపెద్ద, జసాంధ్రత కలిగిన దేశంగా చైనా భావించబడుతుంది.1971లో ఐక్యరాజ్య సమితి సభ్యత్వానికి ఆర్.పి.సి స్థానంలో పి.ఆర్.సి నియమించబడింది. ప్రస్తుతం. ఐక్యరాజ్యసమితి శాశ్వతసభ్యత్వం కలిగిన 5 దేశలలో చైనా ఒకటి.Chang, Eddy (22 August 2004). Perseverance will pay off at the UN, The Taipei Times. గతంలో చైనా అలీన దేశాలకు చైనా సభ్యత్వం కలిగి నాయకత్వం వహించింది. చైనా ఇప్పటికీ తనను అభివృద్ధిచెందుతున్న దేశాలకు న్యాయవాదిగా భావిస్తుంది.బ్రెజిల్,రష్యా,భారతదేశం, దక్షిణాఫ్రికాతో చైనా బి.ఆర్.సి.ఎస్ సభ్యత్వం కలిగి ఉంది. న ఈ దేశాలు అంతర్జాతీయ ప్రధాన ఆర్థికశక్తిగా ఎదుగుతున్నాయి. 2011 బి.ఆర్.సి.ఎస్ సమావేశాలకు (చైనా లోని సన్యా, హైనన్‌లో జరిగాయి) చైనా ఆతిథ్యం ఇచ్చింది."BRICS summit ends in China". BBC. 14 April 2011. Retrieved 24 October 2011. వన్- చైనా- పాలసీ విధానాం అనుసరించి తైవాన్ మీద చైనా ఆధిపత్యాన్ని అంగీకరించాలని షరతువిధిస్తూ చైనా ఇతరదేశాలతో దౌత్యసంభధాలను అభివృద్ధిచేస్తూ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో అధికార సంబంధాలు కలిగి ఉంటుంది. తైవాన్‌తో ఇతరదేశాలు దౌత్యసంబంధాల విషయమై ప్రయత్నించిన పలు సందర్భాలలో చైనా తైవాన్ మీద తమకున్న ఆధిపత్యాన్ని ప్రకటిస్తూనే ఉంది. ప్రత్యేకంగా ఆయుధాల విక్రయాల విషయాలలో చైనా ఇది స్పష్టం చేస్తుంది. ప్రస్తుత చైనా విధానాలు ఝౌ ఎన్లై రూపొందించిన " ఫైవ్ పాలసీస్ ఆఫ్ పీస్ఫుల్ కో ఎక్జిస్టెంస్ " ఆధారితం, " హార్మొనీ విటౌట్ యూనిఫార్మిటీ " (సైద్ధాంతిక విభేదాలున్న దేశాలతో దౌత్యసంబంధాలు) విధానం అనుసరించి ఉంటాయి. ఈ విధానం చైనాను పశ్చుమ దేశాలు అపాయకర దేశాలని భావిస్తున్న జింబావే, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలకు మద్దతు తెలపడానికి అవకాశం కల్పిస్తుంది. చైనా రష్యాతో సన్నిహిత ఆర్థిక, సైనిక సంబంధాలు కలిగి ఉంది. యు.ఎన్ సెక్యూరిటీ కౌంసిల్ వోటింగ్ సమయంలో రెండు దేశాలు ఏకీకృత అభిప్రాయాలు వెలిబుచ్చుతూ ఉంటాయి. thumb|right|A meeting of Group of Five leaders in 2007, with China's Hu Jintao second from right వాణిజ్యసంబంధాలు సమీప దశాబ్ధాలలో చైనా " ఫ్రీ ట్రేడ్ ఏరియా " లను అభివృద్ధిచేయడం, పొరుగున ఉన్న ఆసియాదేశాలతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రధానపాత్ర వహించింది. 2004లో మొదటి " ఈస్ట్ ఆసియా సమ్మిట్ " ప్రతిపాదన చేసింది.Dillon, Dana; and Tkacik, John, Jr.; China's Quest for Asia. Policy Review. December 2005 and January 2006. Issue No. 134. Retrieved 22 April 2006. ఈ.ఏ.ఎస్.లో ఆసియన్ ప్లస్ త్రీ, ఇండియా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. ఈ.ఏ.ఎస్ ప్రారంభ సమావేశం 2005లో నిర్వహించబడింది. చైనా రష్యా, మద్య ఆసియా రిపబ్లిక్కులతో కలిసి షంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్‌కు నిధిని సమకూరుస్తుంది. 2001 డిసెంబరు 1 నుండి చైనా " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ "లో సభ్యత్వం కలిగి ఉంది.2000లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ చైనాతో " పర్మనెంట్ నార్మల్ ట్రేడ్ రిలేషంస్ " (శాశ్వత సాధారణ వాణిజ్య సంబంధాలకు (ఇతర దేశాలకు చైనా అదే విలువతో వస్తువులను ఎగుమతి చేసే సుంకాలతో కల్పించడం) అంగీకారం తెలిపింది. చైనా అత్యధికంగా వస్తువుల అధికంగ యునైటెడ్ స్టేట్స్‌ ఎగుమతి చేస్తుంది."US trade gap widens on increased Chinese imports". BBC News. 14 October 2010. 2010లో యు.ఎస్. రాజకీయవేత్తలు చైనా యుయాన్ తక్కువ విలువైనదని అది చైనాకు వాణిజ్య అవకాశం అధికంగా ఇస్తుందని వాదించింది."Chinese President Hu Jintao resists Obama calls on yuan". BBC News. 13 April 2010. సమీప కాలంలో చైనా " ఆఫ్రికన్ దేశాలతో వాణిజ్యం, పస్పర సహకారం " విధానం అనుసరిస్తుంది. McLaughlin, Abraham; "A rising China counters US clout in Africa". Christian Science Monitor. 30 March 2005.Lyman, Princeton N.; "China's Rising Role in Africa" . 21 July 2005. Council of Foreign Relations. Retrieved 26 June 2007.Politzer, Malia. "China and Africa: Stronger Economic Ties Mean More Migration". Migration Information Source. August 2008. Retrieved 26 February 2013. 2012లో సినో- ఆఫ్రికన్ ట్రేడ్ మొత్తం విలువ 160 బిలియన్ల అమెరికన్ డాలర్లు. చైనా అదనంగా ప్రధాన దక్షిణ అమెరికన్ దేశాలతో ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. బ్రెజిల్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటూ అర్జెంటీనాతో వ్యూహాత్మక సంబంధాలను కలిగి ఉంది."Is Brazil a derivative of China?". Forbes.com. 24 August 2011. Retrieved 24 September 2011."China, Argentina agree to further strategic ties". Xinhua.com. 9 September 2011. Retrieved 24 September 2011. సరిహద్దు వివాదాలు thumb|Map depicting territorial disputes between the PRC and neighbouring states. For a larger map, see here అదనంగా తైవాన్ వివాదంతో చైనా ఇతర అంతర్జాతీయ భూభాగ వివాదాలు కలిగి ఉంది. 1990 నుండి చైనా, భారత చైనా సరిహద్దు వివాదం, నిర్ణయించబడని భూటాన్ సరిహద్దు పరిష్కారాల కొరకు ప్రయత్నిస్తుంది. చైనా తూర్పు, దక్షిణ చైనా లోని స్కార్బోరో షోయల్, సెంకకు ద్వీపాల వివాదం వంటి పలు వివాదాలను ఎదుర్కొంటూ ఉంది. "China denies preparing war over South China Sea shoal". BBC. 12 May 2012. 2014 మే 21న అధ్యక్షుడు క్సి షంఘై సమావేశంలో మాట్లాడుతూ చైనా భూభాగ వివాదాలు శాంతివంతంగా పరిష్కరించాలని సూచించాడు. కాబోయే సూపర్ పవర్ చైనా క్రమంగా శక్తివంతమైన సూపర్ పవర్‌గాప్రశంశించబడితుంది. విమర్శకులు చైనా వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న సైనిక శక్తి, అత్యంత అధికమైన జనసంఖ్య, అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ ప్రాముఖ్యత గమనిస్తూ ఉన్నారు. 21వ శతాబ్ధంలో చైనా అంతర్జాతీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. ఇతరులు ఆర్థికలోపం, జనసంఖ్యాభివృద్ధి కారణంగా చైనా శతాబ్ధ ఆభివృద్ధి కుంటుబడగలదని భావిస్తున్నారు. కొందరు సూపర్ పవర్‌కు వివరణ అడుగుతున్నారు. చైనా బృహత్తర ఆర్థికం కారణంగా సూపర్ పవర్ అర్హత పొందలేదని భావిస్తున్నారు. చైనా సైనిక, సాంస్కృతిక ప్రభావంలో యునైటెడ్ స్టేట్స్‌ను అధిగమించలేదని భావిస్తున్నారు. Grinin, Leonid. "Chinese Joker in the World Pack" . Journal of Globalization Studies. Volume 2, Number 2. November 2011. Retrieved 1 November 2012. సామాజిక రాజకీయ అంశాలు, మానవ హక్కులు, సంస్కరణ thumb|Protests in support of Cantonese media localization in Guangzhou, 2010 చైనా డెమొక్రటిక్ ఉద్యమం సాంఘిక కార్యకర్తలు, కొంతమంది కమ్యూనిస్టు సభ్యులు సాంఘిక, రాజకీయ సంస్కరణల అవసరాన్ని గుర్తించారు. 1970 నుండి ఆర్థిక, సాంఘిక కట్టుబాట్లు గణనీయంగా సడలించబడ్డాయి. రాజకీయ స్వాతంత్ర్యం ఇప్పటికీ పటిష్ఠంగా పరిమితం చేయబడి ఉంది. చైనా రాజ్యాంగ నిర్మాణంలో వాక్స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం, పౌరహక్కులు, న్యాయవిచారణ, మతస్వాతంత్ర్యం, అంతర్జాతీయ సమస్యలు, ఆస్తి హక్కులు రూపొందించబడ్డాయి. అయినప్పటికీ ఇవి సాధారణంగా న్యాయవిచారణ సమయంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలం ఔతూ ఉన్నాయి. చైనా ప్రభుత్వ విధానాలు, చైనా కమ్యూనిస్టు పార్టీ పాలన సహించడం విషయంలో విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఉపన్యాసాలు, సమాచారం మీద నిఘా. అంతర్జాలం మీద నిఘా విషయాలలో విమర్శలు ఉన్నాయి."China Requires Internet Users to Register Names". AP via My Way News. 28 December 2012. Retrieved 29 December 2012. మూకుమ్మడి ప్రదర్శనలు సాధారణంగా అడ్డగించబడుతుంటాయి. 2005లో " రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ " నివేదికలో చైనా 159వ (మొత్తం దేశాలదంఖ్య 167) స్థానంలో ఉంది. ఇది పత్రికాస్వాతత్రం స్థితిని తెలియజేస్తుంది. 2014లో మొత్తం 180 దేశాలలో చైనా 175వ స్థానంలో ఉంది.World Press Freedom Index 2014 , Reporters Without Borders, Retrieved 10 March 2015 చైనా నగరాలకు గ్రామీణ వలసప్రజలు ద్వితీయస్థాయి పౌరులుగా పరిగణించబడుతున్నారని వారిలో వారు భావిస్తున్నారు., దేశీయ వెల్ ఫేర్ విధానం అయిన హుకూ విధానం వారికి అనుకూలంగా లేకపోవడం ఇందుకు కారణం. ఆస్తి హక్కులు కూడా తరచుగా పేలవంగా సంరక్షించబడుతుంటాయి. అలాగే పన్ను విధానం బీద పౌరులను బాధిస్తూ ఉంది.2000 తరువాత పలు గ్రామీణ పన్నులు తగ్గించబడడం, రద్దుచేయబడడం జరిగింది. అంతేకాక గ్రామీణ ప్రజలకు అదనపు సేవలు అందించబడుతున్నాయి. పలు విదేశీప్రభుత్వాలు, విదేశీ పత్రికా ఏజెంసీలు, ఎన్.జి.ఒలు తరచుగా చైనా మానవహక్కుల ఉల్లంఘన అతిక్రమణ గురించి విమర్శిస్తున్నారు. విచారణ లేకుండా అడ్డగించడం, బలవంతపు గర్భస్రావం వంటి పౌరహక్కుల ఉల్లంఘన బలవంతపు అంగీకారాం, పౌరహక్కుల కట్టుబాట్లు, హింస, మరణశిక్ష వంటివి కూడా విమర్శించబడుతూ ఉన్నాయి. ప్రజాభిప్రాయ ప్రకటనలను (1989 తైనాన్మెన్ ప్రొటెస్ట్), వివరణలను అణిచివేత మూలంగా సాంఘిక అస్థిరతకు దారితీస్తుంది.1992 ఫాలన్ గాంగ్ బహిరంగంగా నేర్పించబడింది. దీనికి 70మిలియన్ల అభ్యాసకులు ఉన్నారు. Seth Faison, "In Beijing: A Roar of Silent Protestors", New York Times, 27 April 1999 ఫాలన్ గాంగ్ మీద నిషేధం అమలుచేసిన సమయంలో మూకుమ్మడి ఖైదు, చెరశాల మరణాలు, నిర్భంధ న్యాయవిచారణ, హింస వంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. చైనా రాజ్యంగం టిబెట్, క్సింజియాంగ్ లలో నిర్వహించిన బృహత్తర మూకుమ్మడి అణిచివేత, పౌరహక్కుల ధిక్కారం, పోలీస్ దౌర్జన్యం, మతపరమైన అణచివేత విమర్శలకు కారణం అయింది. చైనీస్ ప్రభుత్వం విదేశీవిమర్శలకు ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఉపాధి సౌకర్యం, ఆర్థికాభివృద్ధి ఇతర విధాలైన ఆర్థికాభివృద్ధికి అవసరమని చైనా విదేశీవిమర్శలకు సమాధానం ఇస్తూ ఉంది. ఇతర విధాలైన పౌరహక్కులు ప్రస్తుత ఆర్థికాభివృద్ధికి దారితీసిందని చైనా అభిప్రాయపడుతుంది."China's Progress in Human Rights in 2004" . Gov.cn. July 2005. Retrieved 31 May 2015. 1970 నుండి చైనీయుల జీవనస్థాయి అభివృద్ధి, అక్షరాస్యతాభివృద్ధి, ప్రజల ఆయుఃప్రమాణం అధికం కావడం తమ అనుసరిస్తున్న విధానాలకు కలిగిన సత్ఫలితం అన్నది చైనా భావన. అలాగే వర్క్ స్పేస్ రక్షణాభివృద్ధి, (నిరంతర బీభత్సానికి కారణం ఔతున్న యంగ్‌త్జే నది వరదలు) ప్రకృతి వైపరిఒత్యాలతో పోరాటం విజయవంతంగా సాగుతున్నాయి. "China seeks to improve workplace safety". USA Today. 30 January 2008. Retrieved 15 May 2012."China's reform and opening-up promotes human rights, says premier". Embassy of the People's Republic of China in the United States. 11 December 2003. Retrieved 28 April 2006. కొంతమంది రాజకీయవాదులు ప్రజాస్వామ్యానికి బహిరంగంగా మద్దతు తెలియజేస్తున్నారు. మిలిన నాయకులు సంప్రదాయవాదాన్ని సమర్ధిస్తూ ఉన్నారు. "Chinese Premier Wen Jiabao talks reform, but most countrymen never get to hear what he says". Washington Post. 13 October 2010. Retrieved 6 July 2013. 2013 కొన్ని ప్రధాన సంస్కరణ ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం ఒకే- బిడ్డ విధానం, అత్యధికంగా విమర్శలకు అవకాశం కలిగించిన " రీ ఎజ్యుకేషన్ త్రూ లేబర్ " ప్రోగ్రాం సడలించింది. అయినప్పటికీ మానవహక్కుల వాదులు సంస్కరణలు అలంకారప్రాయమైనవని గమనించారు. 2000, 2010 ప్రాంరంభంలో చైనా ప్రభుత్వం ఎన్.జి.వొల సమస్యలకు పరిష్కారం సూచించింది. సైన్యం 2.3 మిలియన్ క్రియాశీల సేనలతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పి.ఎల్.ఎ) నాయకత్వంలో ప్రపంచంలో అతిపెద్ద నిలబడి సైనిక శక్తిగా నిలిచింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సైన్యాన్ని సెంట్రల్ మిలిటరీ కమిషన్ (చైనా పీపుల్స్ రిపబ్లిక్) (సిఎంసి) నియంత్రిస్తుంది. పి.ఎల్.ఎలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్స్ (పి.ఎల్.ఎ.జి.ఎఫ్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (ఎం.ఎ.పి), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పి.ఎల్.ఎ.ఎ.ఎఫ్ ), క్షిపణి వ్యూహాత్మక అణుశక్తి క్షిఫణి, రెండవ ఆర్టిలరీ కార్ప్స్ (చైనా) మొదలైన విభాగాలను కలిగి ఉంది. చైనీస్ ప్రభుత్వ గణాంకాలను అనుసరించి 2014 చైనా సైనిక బడ్జెట్ వ్యయం ప్రపంచంలో రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్‌గా గుర్తించబడుతుంది. 2014 సంయుక్త చైనా సైనిక బడ్జెట్ 132 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అయితే, అనేక అధికారిక వర్గాలు - ఎస్.ఐ.పి.ఆర్., యు.ఎస్. రక్షణ కార్యాలయ కార్యదర్శి సహా - చైనా అధికారిక బడ్జెట్ కంటే వ్యయంచేసేది అధికంగా ఉంటుందని వాదిస్తున్నారు.Annual Report To Congress – Military Power of the People's Republic of China 2009 (PDF) . Defenselink.mil. Retrieved 27 November 2011. గుర్తించబడిన అణ్వాయుధాలు కలిగియున్న దేశంగా చైనా ప్రాతీయ సైనిక శక్తి, శక్తివంతమైన సైనిక శక్తి కలిగిన దేశంగా గుర్తించబడుతుంది.Nolt, James H. Analysis: The China-Taiwan military balance . Asia Times. 1999. Retrieved 15 April 2006. 2013 నివేదికలను అనుసరించి యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెంస్ ", చైనాలో 50-75 అణ్వయుధాలు, అసంఖ్యాకంగా షార్ట్- రేంజ్- బల్లిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయని భావిస్తున్నారు. యు.ఎన్ సెక్యూరిటీ కౌంసిల్ శాశ్వతసభ్యత్వం కలిగి ఉన్న ఇతర నాలుగు దేశాలతో పోల్చితే చైనా సైనికశక్తి సామర్ధ్యాలు పరిమితమైనవని భావిస్తున్నారు. చైనా ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ లియోనింగ్ 2012 నుండి సేవలు అందించడం మొదలు పెట్టింది. చైనాలో గణనీయమైన సబ్మెరీన్లు (జలాంతర్గాములు) ఉన్నాయి. వీటిలో అణు జలాంతర్గామి, అణు దాడి జలాంతర్గామి, బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఉన్నాయి."China unveils fleet of submarines". The Guardian. 22 April 2009. Retrieved 16 October 2011. చైనా అదనంగా సముద్రతీరం వెంట ఉన్న దేశాలతో సైనిక సంబంధాలను కలిగి ఉంది. thumb|The Lanzhou (DDG170), a Type 052C destroyer of the PLAN ఇటీవల దశాబ్దాల్లో చైనా తన వైమానిక దళాన్ని ఆధునీకరణ చేయడంలో గణనీయమైన ప్రగతి సాధించింది. వంటి రష్యన్ నుండి సుఖోయ్ సు -30 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడం, అలాగే తన స్వంత ఆధునిక యుద్ధ విమానాలతయారీ వంటి ప్రగతిని సాధించింది. చైనాలో ప్రధానంగా చెంగ్డూ జె-10, చెంగ్డూ జె-20, షేన్యంగ్ జె-11, షేన్యంగ్ జె-15, జె-16, షేన్యంగ్ జె-31 మొదలైన యుద్ధవిమానాలను తయారుచేస్తుంది. చైనా అదనంగా మానవరహిత యుద్ధ వాయువాహనాలు, దేశీయమైన స్టీల్త్ విమానం ఇంకా అనేక అభివృద్ధి పనులు చేయడంలోనిమగ్నమై ఉంది."Early Eclipse: F-35 JSF Prospects in the Age of Chinese Stealth." China-Defense. Retrieved 23 January 2011."Chengdu J-20 – China's 5th Generation Fighter." Defense-Update.com. Retrieved 23 January 2011. ప్రాంతీయ బెదిరింపులను ఎదుర్కొనడానికి ఎయిర్, సీ డెనియల్ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది.Washington Journal. (12 August 2015) "U.S. Military Approach toward China". Mark Perry, Politico writer, interview by Steve Scanlan, host. C-Span. Retrieved 12 August 2015. C-Span websiteAl Jazeera America Wire Service. (11 May 2015) Japan moves to boost role of military. Retrieved 12 August 2015. Al Jazerra America website చైనా పదాతిదళాలను అధినీకరణ చేసింది. సోవియట్ యూనియన్ వద్ద కొనుగోలుచేసిన కాలావతి చెందిన మెయిన్ బాటిల్ టాంక్‌లను మార్చింది. టైప్ 99 ట్యాంకులు రూపకల్పన చేయడం, సి3, సి4 యుద్ధభూములను అభివృద్ధిచేసింది.Ground Forces. SinoDefence.com. Retrieved 31 May 2015. అదనంగా చైనా అసంఖ్యాకంగా అధునిక మిస్సైల్ Surface-to-air Missile System. SinoDefence.com. 2006. Retrieved 31 May 2015. 2007 చైనీస్ యాంటీ - శాటిలైట్ మిస్సైల్ "China plays down fears after satellite shot down" . Agence France-Presse via MediaCorp Channel NewsAsia. 20 January 2007. Retrieved 11 July 2013. క్రూసీ మిస్సైల్స్,"Chinese Navy Tests Land Attack Cruise Missiles: Implications for Asia-Pacific" . New Pacific Institute. 25 July 2012. Retrieved 1 October 2012. అణ్వాయుధాలు కలిగిన జలాంతర్గామి కలిగి ఉంది."China expanding its nuclear stockpile". The Washington Times. 25 August 2011. Retrieved 16 October 2011. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ డేటా అనుసరించి చైనా 2010-2014 మద్య ఆయుధాలను విక్రయిస్తున్న దేశాలలో అంతర్జాతీయంగా మూడవ స్థానంలో ఉంది.2005-2009 నుండి ఆయుధాల విక్రయంలో చైనా 143% అభివృద్ధి సాధించింది. ఆర్ధికం thumb|325px|China and other major developing economies by GDP per capita at purchasing-power parity, 1990–2013. The rapid economic growth of China (red) is readily apparent. thumb|The Shanghai Stock Exchange building in Shanghai's Lujiazui financial district. Shanghai has the 25th-largest city GDP in the world, totalling US$304 billion in 2011 "Shanghai's GDP grows 8.2% in 2011". China Daily. 20 January 2012. Retrieved 15 April 2012. 2014 నాటికి, చైనా అంతర్జాతీయ ద్రవ్య నిధి నివేదికలను అనుసరించి చైనా నామినల్ జి.డి.పి సుమారుగా 10,380 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు. " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " నివేదికలను అనుసరించి నామినల్ జి.డి.పి పరంగా చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగివుంది. కొనుగోలు శక్తి తుల్యత (పి.పి.పి) పరిగణనలోకి తీసుకుంటే, చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అతి పెద్దదిగా భావిస్తున్నారు. 2014లో చైనా కోనుగోలు శక్తి జి.డి.పి. (పి.పి.పి. జి.డి.పి.) 17,617 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. 2013 లో చైనా తలసరి కోనుగోలు శక్తి జి.డి.పి (పి.పి.పి. జి.డి.పి). 12.880 అమెరికన్ డాలర్లు. తలసరి నామమాత్ర జి.డి.పి. 7.589 అమెరికన్ డాలర్లు ఉంది. రెండు సందర్భాలు తలసరి ప్రపంచ జిడిపి ర్యాంకింగ్స్ శాతం పరంగా చైనా (ఐ.ఎం.ఎఫ్. జాబితాలో 183 దేశాలలో) వెనుక అభివృద్ధి చెందుతూ ఉన్న ఎనభై దేశాలు ఉన్నాయి. ఆర్ధిక చరిత్ర, అభివృద్ధి 1949 - 1949 వరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సోవియట్ యూనియన్ శైలిలో కేంద్ర ప్రణాళికాబద్ధ ఆర్థికవ్యవస్థ విధానం అనుసరించింది. 1976లో మావో మరణించిన తరువాత సాంస్కృతిక విప్లవం ముగింపుకు వచ్చిన ఫలితంగా చైనాలో డెంగ్ క్సియోపింగ్, సరికొత్త చైనా నాయకత్వం ఆరంభం అయింది. తరువాత చైనాలో ఒన్- పార్టీ పాలనలో ఆర్థిక సంస్కరణలు, మార్కెట్ ఓరియంటెడ్ మిక్స్డ్ ఎకానమీ చేపట్టబడ్డాయి. సంఘటిత వ్యవసాయం స్థానంలో వ్యవసాయ క్షేత్రాలు అభివృద్ధి చేయబడ్డాయి. విదేశీవాణిజ్యానికి కొత్తగా ప్రాధాన్యత ఇవ్వబడడం వలన ప్రత్యేక ఎకనమిక్ జోన్స్ (సెజ్) సృష్టించబడ్డాయి. బలహీనమైన ప్రభుత్వ- కార్పొరేషంస్ (ఎస్.ఒ.సి) పునర్నిర్మించబడ్డాయి. నష్టాలలో ఉన్న సంస్థలు మూసివేయబడ్డాయి. ఫలితంగా మూకుమ్మడిగా ఉద్యోగాలు రద్దయ్యాయి. ఆధునికచైనాలో ప్రైవేట్ యాజమాన్యం, మార్కెట్ ఆధారిత ఆర్థికం అభివృద్ధి చేయబడ్డాయి. ఆధునిక చైనా కాపిటలిజంలో పెను మార్పులు సంభవించాయి."Communism Is Dead, But State Capitalism Thrives". Vahan Janjigian. Forbes. 22 March 2010. Retrieved 11 July 2013."The Winners And Losers In Chinese Capitalism". Gady Epstein. Forbes. 31 August 2010. Retrieved 11 July 2013. చైనా ప్రభుత్వం ఇప్పటికీ వ్యూహాత్మక విద్యుత్తు ఉత్పత్తి బృహత్తర పరిశ్రమల నిర్వహణ స్వయంగా చేస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థలకు కూడా అధికంగా ప్రాముఖ్యత ఇవ్వబడింది. 2008లో 30 మిలియన్ల ప్రైవేట్ వ్యాపారాలు నమోదుచేయబడ్డాయి. John Lee. "Putting Democracy in China on Hold". The Center for Independent Studies. 26 July 2008. Retrieved 16 July 2013. thumb|left|Nanjing Road, a major shopping street in Shanghai 1978 నుండి చైనాలో ఆర్థిక స్వాతంర్యం ఆరంభం అయింది. చైనా ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా గుర్తించబడుతుంది. చైనా తరువాత పెట్టుబడి- ఎగుమతి ప్రధాన్యత కలిగిన అభివృద్ధి దిశలో పయనించడం ఆరంభించింది. ఐ.ఎం.ఎఫ్. నివేదికలు అనుసరించి 2001 -2010 మద్య చైనా వార్షిక జి.డి.పి. అభివృద్ధి 10.5%. 2007-2011 చైనా ఆర్థికాభివృద్ధి జి-7 దేశాలన్నింటి ఆర్థికాభివృద్ధికి సమానంగా ఉంది. జి-3 నివేదికలు అనుసరించి 2011 ఫిబ్రవరిలో సిటీగ్రూప్ చైనా జి-3 గ్రూప్ అభివృద్ధి శాతంలో చైనా ఉన్నత స్థానంలో ఉందని ప్రకటించింది. అధికమైన ఉత్పత్తి, తక్కువైన శ్రామిక వేతనాలు, మంచి మౌలికసదుపాయాలు చైనాను ఉత్పత్తిలో అంతర్జాతీయ ఆధిపత్యం కలిగిన దేశంగా నిలిపింది. 2010లో చైనా ప్రపంచంలో అత్యధికంగా విద్యుత్తును ఉపయోగిస్తున్న దేశంగా గుతించబడింది. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి 70% విద్యుత్తు అవసరాలను తీరుస్తుంది. 2013లో చైనా చమురు దిగుమతిలో యు.ఎస్‌ను అధిగమించింది. 2010లో చైనా ఆర్థికాభివృద్ధి శాతం క్షీణించడం ఆరంభం అయింది. దేశీయ ఋణసంబంధిత సమస్యలు అంతర్జాతీయ అవసరాలకు తగినంత చైనా ఎగుమతులను బలహీనపరుస్తుంది. చైనా ఈ - కామర్స్ పరిశ్రమ ఈయు, యు.ఎస్ కంటే చాలా నిదానంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 2009 నుండి ఇందులో గణనీయమైన మార్పులు సంభవించాయి. క్రెడిట్ సుయిస్సే నివేదికలను అనుసరించి ఆన్‌లైన్ బదీలీల మొత్తం విలువ 2008 నుండి గణనీయంగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. 2008 లో 3 ట్రిలియన్లుగా ఉన్న ధన బదిలీలు 2012 నాటికి 660 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. చైనా ఆన్‌లై చెల్లింపుల మార్కెట్‌ను అలి పే, టెన్ ప్లే, చైనా యూనియన్ ప్లే సంస్థలు అధిగమించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా చైనా " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ " సభ్యత్వం, ప్రపంచపు అతిపెద్ద వ్యాపారశక్తి కలిగి ఉంది. 2012 చైనా అంతర్జాతీయ వ్యాపారం మొత్తం విలువ 3.87 ట్రిలియన్లు. 2010లో చైనా విదేశీమారకం విలువ 2.85 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు. మునుపటి సంవత్సరం కంటే ఇది 18.7% అధికం. 2012లో చైనా విదేశీపెట్టుబడులలో అధికంగా పెట్టబడిన దేశాలలో చైనా ప్రథమస్థానంలో ఉంది. చైనాలో విదేశీ పెట్టుబడి విలువ 253 బిలియన్ల అమెరికన్ డాలర్లు. చైనా విదేశాలలో కూడా పెట్టుబడి చేస్తుంది. 2012లో చైనా విదేశాలలో 62.4 బిలియన్ల పెట్టుబడి చేసింది. అలాగే చైనా పలు విదేశీసంస్థలను కొనుగోలుచేసింది. 2009లో చైనా 1.6 ట్రిలియన్ల యు.ఎస్ షేర్లను కలిగి ఉందని అంచనా. యు.ఎస్ పబ్లిక్ డెబ్ట్ అధికంగా పొందిన దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనా వద్ద ఉన్న యు.ఎస్. ట్రెషరీ బాండ్ల విలువ 1.6 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు."Washington learns to treat China with care". CNNMoney.com. 29 July 2009. చైనా ఎక్స్చేంజ్ పతనం ఇతర ప్రధాన ఆర్థికవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అధిక మొత్తంలో వస్తూత్పత్తిచేయడం విమర్శలకు గురౌతుంది.Intellectual Property Rights. Asia Business Council. September 2005. Retrieved 13 January 2012. 2007లో చైనాలో మెకింసి సంస్థ మొత్తం ఋణం 7.4 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు, 2014లో 28.2 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు. ఇది చైనా జి.డి.పి కంటే 228% అధికం. జి-20 దేశాల మొత్తం జి.డి.పి కంటే 1% అధికం. Graph comparing the 2014 nominal GDPs of major economiesin US$ billions, according to International Monetary Fund dataచైనా గ్లోబల్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో 29వ స్థానంలో ఉంది.The Global Competitiveness Report 2009–2010 World Economic Forum. Retrieved on 24 September 2009." ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ " 179 దేశాల జాబితాలో చైనా 136వ స్థానంలో ఉంది."2011 Index of Economic Freedom" . The Heritage Foundation. Retrieved 17 April 2011. 2014లో ప్రపంచ లార్జెస్ట్ కార్పొరేషంస్ " ఫార్చ్యూంస్ గ్లోబల్ 500 " జాబితాలో 95 చైనా సంస్థలు ఉన్నాయి. ఇందులో యు.ఎస్ కూటమి ఆదాయం 5.8 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు. అదే సంవత్సరం ఫోర్బ్స్ నివేదికలో ప్రపంచంలోని 10 బృహత్తర సంస్థలలో 5 చైనాదేశానికి చెందినవి. ఇందులో ఇండస్ట్రియల్, కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒకటి. తరగతి, ఆదాయ సమానతలు 2012 నాటికి చైనాలో మద్యతరగతి ప్రజలు (10,000 - 60,000 అమెరికన్ డాలర్ల వార్షిక ఆదాయం పొందేవార్) 300 మిలియన్లు ఉన్నారు. హురున్ నివేదిక అనుసరించి అమెరికన్ డాలర్ల బిలియనీర్లు 2009లో 130 మంది ఉండగా 2012 నాటికి ఈ సంఖ్య 251కి చేరుకుంది. ఇది చైనాను బిలియనీర్ల సంఖ్యాపరంగా చైనా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది."China's billionaires double in number". The Daily Telegraph. Retrieved 7 September 2011. 2012లో చైనా దేశీయ రిటెయిల్ మార్కెట్ విలువ 20 ట్రిలియన్ల యుయాన్లు ఉంది. 2013 గణాంకాలను అనుసరించి దేశీయ రిటెయిల్ మార్కెట్ విలువ 12% అభివృద్ధిచెందింది. దేశీయ విలాస వస్తువుల మార్కెట్ విలువ విస్తారంగా గ్లోబల్ షేర్‌లో 27.5% ఉంది. "Super Rich have Craze for luxury goods". China Daily. 3 March 2010. Retrieved 4 March 2010. సమీపకాలంలో చైనా వేగవంతమైన ఆర్థికాభివృద్ధి దేశంలో ధనాభావానికి దారితీస్తూ."China inflation exceeding 6%". BusinessWeek. 14 October 2011. Retrieved 18 October 2011."Steep rise in Chinese food prices". BBC. 16 April 2008. Retrieved 18 October 2011. ప్రభుత్వం చొరవతీసుకుని క్రమబద్ధీకరణ చేయడానికి దారితీసింది."China's GDP grows 9.1% in third quarter". Financial Times. 18 October 2011. Retrieved 16 July 2013. చైనాలో ఆర్థిక అసమానతలు అత్యధికంగా ఉన్నాయి. అది గత కొన్ని సంవత్సరాలుగా మరింత అభివృద్ధి చెందింది. 2012లో చైనా గిని కోయెఫీషియంట్ 0.474. చైనా ద్రవ్యం విధానం అంతర్జాతీయం 2008లో అంతర్జాతీయంగా సంభవించిన ఆర్థికసంక్షోభం తరువాత చైనా తాము ఆమెరికన్ డాలర్ మీద ఆధారపడిన విషయం, అంతర్జాతీయ ద్రవ్యవిధానం లోని బలహీనతలు గ్రహించింది. 2009లో చైనా డిం సం బాండులను ప్రవేశపెట్టిన తరువాత ఆర్.ఎం.బి. అంతర్జాతీయం చేయడం వేగవంతం చేయబడడమే కాక సరిహద్దులను దాటి మార్కెట్ విస్తరుంచబడింది. ఆర్.ఎం.బి పైలట్ ప్రాజెక్ట్ ద్వారా పరిష్కారం సూచించిన తరువాత ఆర్.ఎం.బి లిక్విడిటీ పూల్స్ స్థాపించడానికి మార్గం సులువైంది. "RMB Settlement", Kasikorn Research Center, Bangkok, 8 February 20112010 నవంబరులో రష్యా చైనాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ద్రవ్యాన్ని ఉపయోగించడం ఆరంభించింది. తరువాత దీనిని జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డం,, కెనడాలు అనుసరించాయి. చైనా ద్రవ్యాన్ని అంతర్జాతీయం చేసిన కారణంగా 2013 నాటికి ప్రపంచపు ద్రవ్య వాణిజ్యంలో చైనా 8వ స్థానానికి చేరుకుంది. శాస్త్రీయం, సాంకేతికం చారిత్రికం మింగ్ రాజవంశం వరకు చైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచానికి నాయకత్వం వహించింది. కాగితం తయారీ, తూర్పు ఆసియాలో ముద్రణ, దిక్సూచి, తుపాకిమందు (నాలుగు గొప్ప నూతన ఆవిష్కరంణలలో ఒకటి) వంటి ప్రాచీన చైనీస్ పురాతన ఆవిష్కరణలు తరువాత ఆసియా, ఐరోపాలో బాగా ప్రాచుర్యం పొందాయి. చైనీస్ గణిత శాస్త్రజ్ఞులు మొట్టమొదటగా ప్రతికూల సంఖ్యలు ఉపయోగించారు.Struik, Dirk J. (1987). A Concise History of Mathematics. New York: Dover Publications. p.32–33. "In these matrices we find negative numbers, which appear here for the first time in history." అయినప్పటికీ 17 వ శతాబ్దం నాటికి పాశ్చాత్య ప్రపంచదేశాలు శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధిలో చైనాను అధిగమించాయి. ఈ గ్రేట్ డైవర్జెన్స్ కారణాల విషయంలో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయి. 19 వ శతాబ్ధంలో పశ్చిమ దేశాలలో జరిగిన యుద్ధాలలో అపజయాలు పునరావృతం అయిన తరువాత చైనా సంస్కర్తలు స్వీయ సంఘటిత శక్తిని అభివృద్ధిచేసే ఉద్యమంలో భాగంగా ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధికి మఖ్యత్వం ఇచ్చారు. కమ్యూనిస్టులు 1949 లో అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రీయ, సాంకేతికాభివృద్ధి ప్రయత్నాలకు సోవియట్ యూనియన్ విధానాలు ఆధారంగా కొనసాగించారు. శాస్త్రీయ పరిశోధనలు కేంద్రం ప్రణాళికల ఆధారంగా నిర్వహించబడుతున్నాయి. 1976 లో మావో మరణానంతరం శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలు నాలుగు ఆధునీకరణలలో ఒకటిగా చేర్చబడ్డాయి. అంతేకాక సోవియట్-ప్రేరిత విద్యా వ్యవస్థ క్రమంగా సరిదిద్దబడింది. ఆధునిక యుగం సాంస్కృతిక విప్లవం ముగింపు తరువాత చైనా శాస్త్రీయ పరిశోధనల కొరకు గణనీయమైన పెట్టుబడి చేసింది. 2012లో చైనా శాస్త్రీయ పరిశోధనలు, అభివృద్ధి కొరకు 163 బిలియన్లు వ్యయం చేసింది. శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధి చైనా ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను సాధించడానికి ముఖ్యమని చైనా విశ్వసించడం ఇందుకు కారణం. సాంకేతిక జాతీయత జాతికి గర్వకారణమని కొన్ని మార్లు వర్ణిస్తూ ఉంటారు. అయినప్పటికీ చైనా బేసిక్, సైంటిఫిక్ పరిశోధనలు సాంకేతికరంగంలో యునైటెడ్ స్టేట్స్, జపాన్ల కంటే వెనుకబడి ఉంది. చైనాలో పుట్టిన శాస్త్రీయపరిశోధకులు ఒకసారి భౌతికశాస్త్రంలో " నోబుల్ బహుమతి " అందుకున్నారు. చైనా శాస్త్రీయపరిశోధకులు పాశ్చాత్యదేశాలలో చేసిన పరిశోధనల కొరకు నోబుల్ బహుమతి అందుకున్నారు.త్సంగ్- డియో - లీ, చెన్ నింగ్ యంగ్ డానియల్ సి త్సుయి చైనాలో జన్మించి భౌతికశాస్త్రంలో నాలుగుమార్లు నోబుల్ బహుమతి అందుకున్నారు., ఒకసారి రసాయనశాస్త్రంలో నోబుల్ బహుమతి అందుకున్నారు. వీరందరూ శాస్త్రీయపరిశోధకులు పాశ్చాత్యదేశాలలో చేసిన పరిశోధనల కొరకు నోబుల్ బహుమతి అందుకున్నారు. చార్లెస్ కె.కయో యుయాన్ టీ లీ కూడా వీరిలో ఉన్నారు. thumb|upright|right|The launch of a Chinese Long March 3B rocket చైనా స్టెం ఫీల్డ్‌, గణితం, ఇంజనీరింగ్ విభాగాలలో తమ విద్యావిధానంలో వేగవంతమైన అభివృద్ధి సాధించింది. 2009లో చైనా 10,000 మంది పి.హెచ్.డి ఇంజనీరింగ్ పట్టభద్రులను, 5 లక్షల మంది బి.ఎస్.సి పట్టభద్రులను తయారు చేసి ఇతరదేశాలలో ఉన్నతస్థానంలో నిలిచింది."Desperately seeking math and science majors" CNN. 29 July 2009. Retrieved 9 April 2012. చైనా విద్యాసంబంధిత పుస్తకాలను (శాస్త్రీయపరిశోధనా పత్రాలు) ప్రచురించడంలో చైనా ప్రపంచంలో రెండవస్థానంలో ఉంది. 2010లో చైనా 121,500 శాస్త్రీయపరిశోధనా పత్రాలు ప్రచురించబడగా వీటిలో 5,200 శాస్త్రీయపరిశోధనా పత్రాలు ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలలో ప్రచురించబడ్డాయి. "China publishes the second most scientific papers in international journals in 2010: report". Xinhua. 2 December 2011. Retrieved 25 April 2012. హుయావీ, లెనోవో వంటి చైనా సాంకేతిక సంస్థలు టెలీ కమ్యూనికేషంస్, పర్సనల్ కంప్యూటింగ్‌లో ప్రపంచ ప్రముఖ సంస్థలుగా గుర్తించబడుతున్నాయి. చైనా సూపర్ కంప్యూటర్లు స్థిరంగా టి.ఒ.పి 500 (ప్రంపంచంలో అత్యధిక శక్తివంతమైనవి) గా పరిగణించబడుతున్నాయి. చైనా అదనంగా పారిశ్రామిక రొబోట్లను గణనీయంగా ఉపయోగిస్తున్న దేశంగా గుర్తించబడుతుంది. 2008-2011 మద్య కాలంలో మల్టీ రోల్ రొబోటులను చైనా సంస్థలలో ఉపయోగించడం 136% అధికరించింది. చైనా అంతరిక్ష కార్యక్రమాలు ప్రపంచ క్రియాశీలక కార్యక్రమాలలో ఒకటిగా ఉండి చైనా జాతీయఘనతకు ప్రధాన ఆధారంగా ఉంది. David Eimer, "China's huge leap forward into space threatens US ascendancy over heavens". Daily Telegraph. 5 November 2011. Retrieved 16 April 2013. 1970లో చైనా తన మొదటి శాటిలైటు డాంగ్ ఫాంగ్ హాంగ్‌ను అంతరిక్షంలో ప్రవేశపెట్టి స్వతంత్రంగా అంతరిక్షంలో శాటిలైటును ప్రవేశపెట్టిన ఐదవ దేశంగా ప్రత్యేకత సంతరించుకుంది. 2013లో చైనా విజయవంతంగా చంద్రుని వద్దకు చాంఘే 3 ప్రోబ్, యుతురోవర్‌ను పంపింది. 2003లో చైనా స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపి మానవులను అంతరిక్షంలోకి పంపిన మూడవదేశంగా నిలిచింది. యాంగ్ లివీతో షెంఖౌ 5ను, 2015 10 మంది చైనీయులు అంతరిక్షానికి పంపబడ్డారు. వీరిలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. 2011లో చైనా మొదటి అంతరిక్ష స్థావరం తియాంగంగ్ -1 అంతరిక్షంలో ప్రవేశపెట్టబడింది. 2013లో చైనా విజయవంతంగా చాంఘే 3 ప్రోబ్, యుతురోవర్‌ను పంపింది. 2017 నాటికి చైనా ల్యూనార్ శ్యాంపిల్స్ సేకరించాలని యోచిస్తుంది. మౌలిక సదుపాయాలు టెలికమ్యూనికేషన్ చైనా మొబైల్ ఫోన్లు అధికంగా ఉపయోగిస్తున్న (2012 నాటికి 1 బిలియన్ సెల్ ఫోన్‌ల కంటే అధికం)దేశాలజాబితాలో చైనా ఒకటి. అంతర్జాలం అధికంగా ఉపయోగిస్తున్న దేశాలలో చైనా ఒకటి. 2013 నాటికి 591 మిలియన్ల అంతర్జాల వినియోగదారులు ఉన్నారు. జనసఖ్యలో 44%. 2013 నివేదికలు జతీయ సరాసరి అంతర్జాల ఉపయోగం 3.14 ఎం.బి. China's Internet speed averages 3.14 MBps: survey - Xinhua | English.news.cn. News.xinhuanet.com (18 April 2013). Retrieved on 9 August 2013. 2013 గణాంకాలను అనుసరించి చైనా ప్రపంచంలో అంతర్జాలం అనుసంధానం చేయబడిన డివైసెస్‌లో 24% కలిగి ఉంది. ప్రపంచంలో రెండు పెద్ద బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు చైనా టెలికాం, చైనా యునికాం 20% ప్రపంచ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు సేవలు అందిస్తున్నాయి. చైనా యునికాం 40 మిలియన్ కంటే అధికమైన చందారాలకు సేవలు అందిస్తుండగా చైనా టెలికాం ఒంటరిగా 50 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు సేవలు అందిస్తుంది. ప్రధానంగా హుయావీ, జ్తే వంటి అనేక చైనీస్ టెలికమ్యూనికేషన్స్ సంస్థలు చైనా సైనిక రహస్యాలపై నిఘాచేస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. చైనా తన స్వంత ఉపగ్రహ మార్గనిర్దేశనం (శాటిలైట్ నేవిగేషన్) వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. చైనాకు చెందిన బియిడు శాటిలైట్ నేవిగేషన్ సంస్థ 2012 నుండి ఆసియాలో వాణిజ్య సేవలు అందించడం ప్రారంభించింది. 2020 నాటికి ఇది ప్రంపచదేశాలకు సేవలు అందించాలని ప్రయత్నిస్తుంది."The final frontier" . China Daily. 27 April 2012. Retrieved 16 February 2013. రవాణా thumb|left|The Baling River Bridge is one of the world's highest రహదార్లు 1990 నుండి చైనా జాతీయరహదారి నెట్‌వర్క్ " చైనా జాతీయ రహదారి నెట్‌వర్క్ ", ఎక్స్ప్రెస్ వే ఆఫ్ చైనా " ల ద్వారా గణినీయంగా విస్తరించబడింది. 2011లో చైనా రహదారుల పొడవు 85000 కి.మీ లకు చేరింది. చైనా రోడ్డు నెట్వర్క్ చైనాను ప్రపంచంలో అతిపొడవైన రోడ్డు నెట్‌వర్క్ కలిగిన దేశాల జాబితాలో చేర్చింది. 1991లో యంగ్త్జే నదిమీద ఆరు వంతనలు మాత్రమే నిర్మితమై ఉన్నాయి. ఇవి చైనాను దక్షిణ, ఉత్తర చైనాలుగా విడదీస్తుంది. 2014 అక్టోబరు నాటికి యంగ్తే నది మీద 81 వంతెనలు, టన్నెల్స్ (కనుమలు) నిర్మించబడ్డాయి.చైనా ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌ను కలిగి ఉంది. ఆటో ఉత్పత్తి, తయారీలో చైనా యునైటెడ్ స్టేట్స్‌ను అధిగమించింది. 2009లో చైనా ఆటో విక్రయాలు 13.6 మిలియన్లకు చేరుకుంది. అలాగే 2020 నాటికిది 40 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. చైనా రోడ్డు నెట్వర్క్ అభివృద్ధి కారణంగా ట్రాఫిక్ విపత్తులు గణనీయంగా పెరిగాయి. ట్రాఫిక్ చట్టాలు బలహీనంగా ఉన్నందున 2011లో మాత్రమే 62,000 చైనీయులు రోడ్డు విపత్తులలో మరణించారు. నగరప్రాంతాలలో ప్రజలు ఆటో వాహనాలను ఉపయోగాన్ని తగ్గించడానికి ప్రయాణానికి సాధారణంగా బైసైకిళ్ళను వాడుతుంటారు. 2012 నాటికి చైనాలోని బైసైకిల్స్ సంఖ్య 470 మిలియన్లు. thumb|Terminal 3 of Beijing Capital International is the second largest airport terminal in the world రైలు మార్గం చైనా రైల్వే సంబంధిత చైనా రైల్వే కార్పొరేషన్ రైలు ప్రాయాణీకుల మద్య ప్రపంచంలో అత్యంత రద్దీ అయినదిగా గుర్తించబడుతుంది. చైనాలో మూడు మాసాల రైలు ప్రయాణీకుల సంఖ్య 2006 ప్రంపంచ ప్రయాణీకులలో 6% ఉండగా ప్రస్తుతం ప్రంపంచ రైలుప్రయాణీకులలో 25% ఉందని అంచనా."Chinese Railways Carry Record Passengers, Freight" Xinhua 21 June 2007 2013 గణాంకాలను అనుసరించి చైనాలో 103144 రైల్వేలు ఉన్నాయని అంచనా. As of 2013, the country had of railways, the ప్రపంచంలోమూడవ పొడవైన రైలుమార్గం.(Chinese) "2013年铁道统计公报" అన్ని ప్రాంతాలు, భూభాగాలు రైలు మార్గంతో అనుసంధానించబడింది. చైనా కొత్తసంవత్సరం రోజున దేశవ్యాప్తంగా విస్తారంగా ప్రయాణిస్తుంటారు. 2013లో చైనా రైల్వేలు 2.106 బిలియన్ల పాసింజర్ ట్రిప్పులు నిర్వహిస్తూ, పాజింజర్ రైళ్ళు 1,059.56 కి.మీ ప్రయాణించాయి. అలాగే 3.967 బిలియన్ టన్నుల సరుకును బదిలీ చేసింది. కార్గోలు 2,917.4 కి.మీ ప్రయాణించాయి. హైస్పీడ్ రైళ్ళు చైనా హైస్పీడ్ రైళ్ళు (హెచ్.ఎస్.ఆర్) విధానం 2000 లోనే మొదలైయ్యాయి. అలాగే 11028 కి.మీ పొడవైన రైలు మార్గం నిర్మించబడింది. చైనా హైస్పీడ్ రైలు మార్గం ప్రంపంచంలో పొడవైనదిగా భావించబడుతుంది.(Chinese) "中国高铁总里程达11028公里占世界一半" 新华网 5 March 2014 చైనా హైస్పీడ్ నెట్‌వర్క్‌లో బీజింగ్-గ్వంగ్స్యూ-షెన్జెన్-హాంకాంగ్ హై-స్పీడ్ రైల్వే ( హెచ్.ఎస్.ఆర్ ప్రపంచంలో ఒకే పొడవైన రైలుమర్గంగా గుర్తించబడుతుంది), బీజింగ్ - షంఘై హైస్పీడ్ రైల్వే (బీజింగ్-షాంఘై దురిత రైల్వే) భాగంగా ఉన్నాయి. చైనాలో ప్రపంచంలోని పొడవైన రైలువంతెనలు మూడు ఉన్నాయి. 2020 నాటికి హెచ్.ఎస్.ఆర్ ట్రాక్ నెట్‌వర్క్ పొడవు 16000 కి.మీ చేరుకుంటుందని భావిస్తున్నారు."China boasts biggest high-speed rail network" . Agence France-Presse via The Raw Story. 24 July 2011. Retrieved 24 April 2012. షాంఘై మాగ్లేవ్ ట్రైన్ గంటకు 431కి.మీ ప్రయాణిస్తూ ప్రంపంచంలో అతివేగమైన రైలుగా గుర్తించబడుతుంది."Top ten fastest trains in the world" railway-technology.com 29 August 2013 thumb|left|The Shanghai Maglev Train 2014 గణాంకాలను అనుసరించి " చైనా అర్బన్ రైల్ ట్రాంసిస్ట్ "లో 2020 నాటికి మరొక డజన్ రైళ్ళు చేర్చబడతాయి అని అంవనా. మెట్రో రైళ్ళు షంఘై మెట్రో, బీజింగ్ సబ్వే, గౌంగ్‌ఝౌ మెట్రో, హాంగ్ కాంగ్ ఎం.టి.ఆర్, షెన్‌జెన్ మెట్రో రైళ్ళు చైనా మెట్రో రైళ్ళ జాబితాలో ఉన్నాయి. thumb|right|The China Railways CRH380A, an indigenous Chinese bullet train వాయుమార్గం 2012 గణాంకాలను అనుసరించి చైనాలో 82 కమర్షియల్ విమానాశ్రయాలు ఉన్నాయి. 2015 నాటికి అదనంగా 82 సరికొత్త విమానాశ్రయాలు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించబడింది. 2013 గణాంకాలను అనుసరించి ప్రంపంచంలో నిర్మాణదశలో ఉన్న విమానాశ్రయాలలో మూడవ వంతు చైనాలో ఉన్నాయి. 2011లో 1,910 గా ఉన్న చైనా విమానాల సంఖ్య 2031 నాటికి 5,980కి చేరుకుంటుందని అంచనా. పౌర విమానయానంలో వేగవంతమైన విస్తరణ, ప్రపంచంలో అత్యంత రద్దీగల విమానాశ్రయాలలో చైనా లోని అతిపెద్ద విమానాశ్రయాలు కూడా చేర్చబడ్డాయి. 2013 లో, బీజింగ్ లోని కేపిటల్ విమానాశ్రయం (ఇది 2002 లో 26 ఉంది) ప్రయాణీకుల రద్దీ ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది.2010 నుండి, హాంగ్ కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, షంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రపంచంలోని సరుకు రవాణా విమానాశ్రయాలలో మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. చైనా యొక్క గగనతలం 80% సైన్య ఉపయోగానికి పరిమితం, ఆసియాలో నాణ్యతలేని సేవలు అందిస్తున్న 10 విమానాశ్రయాలలో 8 విమానయాన సంస్థలు చైనాలో ఉన్నాయి. చైనా విమానాశ్రాలలో జరుగుతున్న జాప్యాలే ఇందుకు కారణం. జలమార్గాలు చైనాలోని 2,000 పైగా నది, సముద్ర ఓడరేవులలో విదేశీ షిప్పింగ్ కొరకు తెరవబడినవి 130. 2012 లో, షాంఘై, హాంగ్ కాంగ్, షెన్జెన్, నింగ్బో-సూషన్, గ్వాంగ్ఝౌ, క్వింగ్డయో, టియాంజిన్ నౌకాశ్రయాలు, డేలియన్ కంటైనర్ ట్రాఫిక్, సరకు రవాణాలో ప్రపంచంలోనే అగ్ర స్థానాల్లో నిలిచాయి."Top 50 World Container Ports" World Shipping Council Accessed 2 June 2014 జనాభా వివరాలు thumb|A 2009 population density map of the People's Republic of China. The eastern coastal provinces are much more densely populated than the western interior 2010లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆరవ గణాంకాలను అనుసరించి చైనా జనసంఖ్య 1,370,536,875 ఉంటుందని అంచనా. వీరిలో 14 సంవత్సరాలకు తక్కువ వయసున్నవారి శాతం 16.60%, 15-59 మధ్య వయస్కుల శాతం 70.40%, 60 సంవత్సరాల పైబడిన వయసున్నవారి శాతం 13.26%. 2013 జనసంఖ్యాభివృద్ధి శాతం 0.4%. పశ్చిమ దేశాల ప్రమాణాలు అనుసరించి 1978 నుండి చైనాలో జరుగుతూన్న వేగవంతమైన ఆర్థికాభివృద్ధి మిలియన్లకొద్దీ ప్రజలను పేదరికం నుండి వెలుపలకు తీసుకువచ్చిందని భావిస్తున్నారు. ప్రస్తుతం 10% ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని అంచనా (1978 ముందు 64%). 2007 నాటికి చైనాలోని నగరప్రాంతాలలో నిరుద్యోగం 4% నికి చేరుకుటుందనిని అంచనా వేయబడింది.Urban unemployment declines to 4% in China People's Daily Online (22 January 2008). Retrieved on 27 July 2008. 1.3 బిలియనులుగా ఉన్న చైనా జనసంఖ్య, క్షీణించి పోతున్న సహజవనరులు చైనా అధికంగా ఆందోళన చెందుతూ ఉంది. 1979 నుండి చైనా జసంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అందుకొరకు కఠినమైన ఒక బిడ్డ మాత్రమే విధానం అనుసరిస్తుంది. 2013కు ముందు ఒక కుటుంబాబినికి ఒకే బిడ్డ అనే విధానంలో కొన్ని స్థానిక సముదాయాలకు మినహాయింపు, గ్రామీణ ప్రాంతాలలో కొంత సడలింపు ఉండేది. 2013 తరువాత ఒకే బిడ్డ విధానాన్ని సడలించి ఒక కుటుంబానికి ఇద్దరు పిల్లలు, సింగిల్ పేరంట్ (విడిగా ఉండే జంటలలోతల్లి లేక తండ్రి) కు ఒకే బిడ్డ విధానం ప్రవేశపెట్టబడింది. చైనా కుటుంబనియంత్రణ మంత్రి 2008లో ఒకే బిడ్డ విధానం 2020 వరకు ఉండాలని సూచించాడు. ఒకే బిడ్డ విధానానికి గ్రామీణ కుటుంబాలలో వ్యతిరేకత ఉంది. వ్యవసాయ శ్రామికుల అవసరం, మగపిల్లలకు సంప్రదాయంలో ఉండే ముఖ్యత్వం ఇందుకు ఒక కారణంగా ఉంది. అందువలన గణాంకాల సమయంలో కుటుంబాలు నిజం మరుగుపరుస్తూ ఉండేవారు. 2010 గణాంకాలను అనుసరించి టోటల్ ఫర్టిలిటీ శాతం 1.4% ఉంది. thumb|right|Population of China from 1949 to 2008 మగపిల్లలకు సంప్రదాయలో ఉండే ముఖ్యత్వం కారణంగా సమాజంలో స్త్రీ:పురుష నిష్పతీలో సమతుల్యత దెబ్బతిన్నది.. 2010 గణాంకాలను అనుసరించి యువతీ:యువకుల నిష్పత్తి 100:118.06 ఉంది.,"Chinese mainland gender ratios most balanced since 1950s: census data". Xinhua. 28 April 2011. Retrieved 20 October 2011. ఇది సాధారణంగా ఉండే 100:105 గా ఉండే స్త్రీ పురుష నిష్పత్తిని అధిగమించింది. 2010 గణాంకాలు అనుసరించి మొత్తం జనసంఖ్యలో పురుషులు 51:27 % ఉన్నారని తెలియజేస్తున్నాయి. సమూహాలు చైనా అధికారికంగా 56 స్థానిక సముదాయాలను గుర్తించింది. వారిలో హాన్ చైనీయుల సమూహం సంఖ్యాపరంగా ప్రథమస్థానంలో ఉన్నదని భావిస్తున్నారు. వీరు మొత్తం చైనాజనసంఖ్యలో 91.51% ఉన్నారని భావిస్తున్నారు. హాన్ చైనీయులు ప్రపంచంలో అతిపెద్ద సప్రదాయసముదాయంగా అంచనావేయబడింది. 2010 గణాంకాలను అనుసరించి స్థానిక మైనారిటీ సముదాయాలకు చెందినవారి శాతం 8.49%. 2000 గణాంకాలను అనుసరించి హాన్ చైనీయుల సంఖ్య 66,537,177 (మొత్తం జనసంఖ్యలో 5.74%). మిగిలిన స్థానిక ప్రజల సంఖ్య 7,362,627 (6.92%). 2010 గణాంకాలను అనుసరించి చైనాలో నివసిస్తున్న మొత్తం జనసంఖ్య 593,832. వీరిలో అత్యధికులు దక్షిణకొరియాకు చెందినవారి సంఖ్య 120,750, యునైటెడ్ స్టేట్స్ ప్రజలసంఖ్య 71,493, జపాన్ ప్రజలసంఖ్య 66,159."Major Figures on Residents from Hong Kong, Macao and Taiwan and Foreigners Covered by 2010 Population Census". National Bureau of Statistics of China. 29 April 2011. Retrieved 31 May 2015. Languages thumb|left|1990 map of Chinese ethnolinguistic groups చైనాలో 292 సజీవభాషలు ఉన్నాయి.Languages of China – from Lewis, M. Paul (ed.), 2009. Ethnologue: Languages of the World, Sixteenth edition. Dallas, Tex.: SIL International. సాధారణంగా చైనాలో సినో- టిబెటన్ కుటుంబానికి చెందిన సింధిక్ భాష అధికంగా వాడుకలో ఉంది. అందులోని మాండరిన్ భాషను 70% మంది ప్రజలకు వాడుకభాషగా ఉంది. అదనంగా వూ చైనీస్ (షంగైనీతో చేర్చినది), యూఏ (కాంటనెసెతో చేర్చినది), తైషనెసె, మిన్ చైనీస్ (హొకియన్, తెయోచ్యు), క్సియాంగ్, గాన్ చైనీస్, హక్కా చైనీస్ భాషలు వాడుకలో ఉన్నాయి. టిబెటో - బర్మన్, ప్రామాణిక టిబెట్, క్వియాంగ్, నక్సి,, ఈ భాషలు టిబెటన్ మైదానంలో వాడుకభాషలుగా ఉన్నాయి. ఆగ్నేయచైనాలో తాయ్- కడై కుటుంబానికి చెందిన ఝుయాంగ్, డాంగ్, సుయీ, హ్మాంగ్ మియన్ కుటుంబానికి చెందిన హ్మోంజిక్ (మియో),మియెనిక్ (యాఒ), ఆస్ట్రోయేసియాటిక్ కుటుంబానికి చెందిన వా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈశాన్యచైనాలో మంగోలియన్, ఉయుఘూర్, కళక్, క్యర్గిజ్, సాలర్, సెటర్న్ యుగూర్ మొదలైన పలు టర్కిక్ భాషలు వాడుకలో ఉన్నాయి. ఉత్తర కొరియన్ సరిహద్దులో కొరియన్ భాష వాడుకలో ఉంది. ప్రధాన చైనాలో సరికో, ఇండో యురేపియన్ కుటుంబానికి చెందిన తక్సిక్, తైవానీ భాషలు, ఆస్ట్రోనేషియన్ భాషలు వాడుకలో ఉన్నాయి."Languages". 2005. Gov.cn. Retrieved 31 May 2015. చైనా ప్రామాణిక భాష మాండరిన్ బీజింగ్ యాసతో బీజింగ్‌లో వాడుకలో ఉంది. లిపి వేలాది సంవత్సరాల నుండి సింటిక్ భాషలు వ్రాయడానికి చైనా లిపి వాడబడుతూ ఉంది. 1956లో ప్రభుత్వం సరళీకృతం చేయబడిన లిపిని ప్రవేశపెట్టింది. ఇది పురాతనకాల చైనా ప్రధాన భూమిలో వాడుకలో ఉన్న ఉండేది. టిబెటన్ అక్షరాలకు బ్రాహిక్ లిపి ఆధారంగా ఉంటుంది. మంగోలియన్, మంచు భాషలు రెండూ పురాతన ఉయఘూరు భాష లిపి నుండి జనించాయి. ఆధునికమైన ప్రామాణికమైన ఝుయాంగ్ వ్రాయడానికి లాటిన్ లిపి ఉపయోగించబడుతుంది. నగరీకరణ సమీప దశాబ్ధాలలో చైనా అధికంగా నగరీకరణ చేయబడింది. 1990 నగ్రప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలశాతం 20% 2014 నాటికి 50% నికి చేరుకుంది. 2030 నాటికి చైనా నగరప్రాంత నివాసితుల సంఖ్య 1 బిలియన్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. 2012 గణాంకాలను అనుసరించి చైనాలో 262 మిలియన్ల వలస శ్రామికులు నగరాలలో నివసిస్తున్నారని అంచనా. అధికంగా గ్రామీణ శ్రామికులు నగరాలలో పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. చైనాలో 1 మిలియన్ జనసంఖ్య కలిగిన 160 నగరాలు ఉన్నాయి. వీటిలో 10 మిలియన్ల అధికమైన జనసంఖ్య కలిగిన 7 మహానగరాలు ఉన్నాయి. అవి వరుసగా చాంగ్క్విక్, షంఘై, బీజింగ్, గుయాంగ్ఝౌ, తియాంజిన్, షెంజెన్, వుహాన్. 2025 దేశంలో మిలియన్ జనసంఖ్య కలిగిన 221 నగరాలు ఉంటాయని భావిస్తున్నారు. క్రింద టేబుల్‌లో 2010 గణాంకాలను అనుసరించిన నగరాల జాబితా ఉంది. ఇది నగరనిర్వహణ పరిమితిలో నివసిస్తున్న నివాసితుల సంఖ్య మాత్రమే. ఇది కాక నగరాలలో నివసిస్తున్న వలస శ్రామికుల సంఖ్యను చేర్చి గణించడంలో అయోమయం నెలకొంటున్నది.Francesco Sisci. "China's floating population a headache for census". The Straits Times. 22 September 2000. క్రింద ఇచ్చిన సంఖ్య దీర్ఘకాలంగా నగరాలలో నివసిస్తున్న వారిసంఖ్య మాత్రమే. విద్య thumb|Beijing's Tsinghua University, one of the top-ranked universities in China 1986 నుండి చైనాలో నిర్భంధ ప్రాథమిక, మాధ్యమిక విద్య అమలులో ఉంది. గత 9 సంవత్సరాల నుండి తొలగించబడింది. 2010లో 82.5% విద్యార్థులు మూడుసంవత్సరాల సెకండరీ విద్యను కొనసాగిస్తున్నారు.. 2010లో నిర్వహించిన చైనా " జాతీయ విశ్వవిద్యాలయం " ప్రవేశపరీక్షకు హాజరైన విద్యార్థులు 27% ఉన్నతవిద్యకు అర్హత సాధించారు. సెకండరీ, టెర్రిటరీ స్థాయి నుండి ఒకేషనల్ విద్య అందుబాటులో ఉంది. 2006 ఫిబ్రవరి నుండి ప్రభుత్వం పూర్తిగా 9 సంవత్సరాల ఉచితవిద్యను ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత రుసుముతో అందించింది."China pledges free 9-year education in rural west" . China Economic Net. 21 February 2006. Retrieved 18 February 2013. 2003లో వార్షికంగా విద్యాభివృద్ధికి 50బిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయం చేయబడగా 2011 నాటికి విద్య కొరకు ప్రభుత్వం 250 బిలియన్ల అమెరికన్ డాలర్లకంటే అధికంగా వ్యయం చేసింది. అయినప్పటికీ విద్యకొరకు చేయబడప్డుతున్న వ్యయంలో అసమానతలు ఉన్నాయి. 2010లో వార్షికంగా సెకండరీ స్కూల్ కొరకు బీజింగ్‌లో ఒక్కొక్క విద్యార్థికి 20,023 యుయానులు వ్యయం చేయబడగా, గుయిఝౌలో ఒక్కొక్క విద్యార్థికి 3,204 యుయానులు వ్యయం చేయబడ్డాయి. చైనాలో ఉచిత విద్య ప్రాథమిక, మాధ్యమిక స్థాయి వరకు 6-15 సంవత్సరాల వరకు అందించబడుతుంది. 2011లో 81.4% చైనీయులు సెకండరీ విద్యను పూర్తిచేసారు. 2007 నాటికి చైనాలో 396,567 ప్రాథమిక, 94,116 మాధ్యమిక, 2,236 హైయ్యర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి.2010 గణాంకాలను అనుసరించి చైనాలో 94% అక్షాశ్యులు ఉన్నారు. 1950లో 20% ప్రజలు మాత్రమే అక్షరాశ్యులుగా ఉన్నారు. Plafker, Ted. "China's Long—but Uneven—March to Literacy". International Herald Tribune. 12 February 2001. Retrieved 22 December 2012. 2009లో షంఘై లోని విద్యార్థులు గణితం, సైన్సు, లిటరసీలో అంతర్జాతీయంగా ఉన్నత ఫలితాలు సాధించారు. " ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ " 15 సంవత్సరాల విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహించింది. "China Beats Out Finland for Top Marks in Education" . Time magazine. 2009. Retrieved 18 February 2013. ఆరోగ్యం thumb|right|Chart showing the rise of China's Human Development Index from 1970 to 2010 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ ప్రాంతీయ హెల్త్ బ్యూరోతో కలిసి చైనీయుల ఆరోగ్యావసరాలను పర్యవేక్షింస్తుంది. 1950లో " పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ " చైనీస్ ఆరోగ్య విధానం రూపొందించింది. ఆ సమయంలో, కమ్యూనిస్టు పార్టీ పారిశుద్ధ్యం, పరిశుభ్రత అభివృద్ధి, చికిత్స, అనేక వ్యాధులు నిరోధించడం లక్ష్యంగా " పేట్రియాటిక్ హెల్త్ కంపాజిన్ " (దేశభక్తిపూర్వక ఆరోగ్యం ప్రచారం) పేరిట ప్రారంభించారం ప్రారంభించింది. గతంలో చైనాలో ఉధృతంగా ఉన్న కలరా, టైఫాయిడ్, స్కార్లెట్ ఫీవర్ మొదలైన వ్యాధులు ప్రచారం ద్వారా దాదాపు నిర్మూలించవచ్చు అని భావించారు. 1978 లో "డెంగ్ జియావోపింగ్ " ఏర్పరచిన ఆర్థిక సంస్కరణల తరువాత మంచి పోషణ కారణంగ చైనీస్ ప్రజా ఆరోగ్యం వేగంగా మెరుగైంది. గ్రామీణ ప్రజలకు అందిస్తున్న ఉచిత ప్రజారోగ్య సేవలు క్రమంగా అదృశ్యమయ్యాయి. ప్రైవేటీకరణ, నాణ్యమైన ఆరోగ్యసేవలతో చైనా ఆరోగ్యసంరక్షణ అభివృద్ధి చెందింది. 2009 లో ప్రభుత్వం 124 బిలియన్‌ల అమెరికన్ డాలర్ల వ్యయంతో 3-సంవత్సరాల బృహత్తర ప్రణాళిక ద్వారా ఆరోగ్యసంరక్షణ సదుపాయం అందించడం ప్రారంభించింది. 2011 నాటికి 95% చైనా ప్రజలు బేసిక్ హెల్త్ ఇసూరెంస్ సౌకర్యం పొదారు. 2011లో చైనా ప్రంపంచంలో అత్యధికంగా ఔషధాలు సరఫరాచేస్తున్న దేశాలలో మూడవ స్థానానికి చేరుకుంటుందని అంచనా వేయబడింది.2012 గణాంకాలు అనుసరించి చైనీయుల ఆయుఃపరిమాణం 75 సంవత్సారాలు. శిశుమరణాలు 1000 మందికి 12. 1950 నుండి చైనీయుల ఆరోగ్యం, ఆయుఃపరిమాణంలో అభివృద్ధి చెందింది. అలాగే 1950లో శిశుమరణాల సంఖ్య 1000 మందికి 300 ఉండగా 2001 నాటికి 1000 మందికి 33కి చేరుకుంది."China's Infant Mortality Rate Down". 11 September 2001. China.org.cn. Retrieved 3 May 2006. అభివృద్ధి కారణంగా పోషకాహార లోపం 33.1% నుండి 2010 నాటికి 9.9% తగ్గించబడింది. ఆరోగ్యసంరక్షణలో అభివృద్ధి, ఆధునిక వైద్య సదుపాయాల అందుబాటుతో చైనా వాయు కాలుష్యం కారణంగా శ్వాససంబంధిత సమస్యలు మొదలైన పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాది. చైనాలో మిలియన్ల కొద్దీ ప్రజలకు పొగాకు సంబధిత పొగత్రాగే అలవాటు ఉంది.ఇది కూడా శ్వాసవ్యాధులకు ఒక కారణంగా ఉంటుంది. "China's Tobacco Industry Wields Huge Power" article by Didi Kirsten Tatlow in The New York 10 June 2010 నగరప్రాంత యువతలో ఊబకాయం అధికం ఔతుంది."Serving the people?". 1999. Bruce Kennedy. CNN. Retrieved 17 April 2006."Obesity Sickening China's Young Hearts". 4 August 2000. People's Daily. Retrieved 17 April 2006. సమీపకాలంగా చైనాలో అధికజనసంఖ్య, జనసాంధ్రత అధికంగా ఉన్న నగరాలలో తీవ్రమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయి. 2003లో సార్స్ వ్యాధి వ్యాపించడం వీటిలో ఒకటి.అది ఇప్పటికీ చైనాలో ఆరోగ్యసమ్యగా ఉంది."China's latest SARS outbreak has been contained, but biosafety concerns remain". 18 May 2004. World Health Organization. Retrieved 17 April 2006. 2010లో చైనాలో వాయుకాలుష్యం కారణంగా 1.2 మిలియన్ ప్రిమెచ్యూర్ మరణాలు సంభవించాయి. మతం సహస్రాబ్ధి కంటే ముందు నుండి చైనా సంస్కృతి మీద పలుమతాల ప్రభావం ఉంది. కన్ఫ్యూషియనిజం (ఇది మతంగా పరిగణించడంలో వివాదాలు ఉన్నాయి), }} బుద్ధిజం, తాయిజం చారిత్రకంగా చైనీయుల సంస్కృతిలో ముఖ్యపాత్రవహించాయి.Xinzhong Yao. Chinese Religion: A Contextual Approach. Bloomsbury Academic, 2011. pp. 9-11. ISBN 1847064760 ఈ మూడు మతాలలోని అంశాలు జనపదాల ప్రజాల జీవితంలో చొచ్చుకుపోయాయి. చైనా రాజ్యాంగంలో మతస్వాతంత్ర్యం ఉంది. అయినప్పటికీ మతసంబంధిత సంస్థలకు అనుమతి లభించడం కష్టం."China bans religious activities in Xinjiang". Financial Times. 2 August 2012. Retrieved 28 August 2012.Constitution of the People's Republic of China. Chapter 2, Article 36. గణాంకపరంగా చైనా ప్రజలలో అధికంగా వ్యాపించిన మతం తాయిజం, షెన్ అరాధన (శక్తిని ఇచ్చే దైవం) ప్రధానమైనవి.Steven F. Teiser. What is Popular Religion?. Part of: Living in the Chinese Cosmos, Asia for Educators, Columbia University. Extracts from: Stephen F. Teiser. The Spirits of Chinese Religion. In: Religions of China in Practice. Princeton University Press, 1996. ప్రబల విశ్వాసాలలో కల్ట్ (సముద్రదేవత) ఒకటి.André Laliberté. Religion and the State in China: The Limits of Institutionalization. On: Journal of Current Chinese Affairs, 40, 2, 3-15. 2011. ISSN 1868-4874 (online), ISSN 1868-1026 (print). p. 7, quote: «[...] while provincial leaders in Fujian nod to Taoism with their sponsorship of the Mazu Pilgrimage in Southern China, the leaders of Shanxi have gone further with their promotion of worship of the Yellow Emperor (黄帝, Huangdi).»Religions & Christianity in Today's China (China Zentrum). Vol. IV, 2014, No. 1. ISSN 2192-9289. pp. 22-23. యాన్ హంగ్ జిసుని భక్తులలో హౌంగ్డి ఒకరు.Barry Sautman. Myths of Descent, Racial Nationalism and Ethnic Minorities in the People's Republic of China. In: Frank Dikötter. The Construction of Racial Identities in China and Japan: Historical and Contemporary Perspectives. Honolulu, University of Hawai'i Press, 1997, pp. 75–95. ISBN 9622094430. pp. 80-81 గౌండి (యుద్ధం, వ్యాపారదేవత) కైషెన్ (సంపద, సంపన్నత ఇచ్చే దేవత) హెనన్ లోని బౌద్ధాలయం ప్రజలలో ప్రాబల్యత కలిగి ఉన్నాయి. 2010 జరిపిన అభిప్రాయ సేకరణలో 47% చైనీయులు తమను నాస్థికులుగా అంగీకరించారు. పరిశోధకులు చైనాలో మతాలమద్య కచ్చితమైన హద్దులు లేవని అభిప్రాయం వెలువరించారు. ప్రత్యేకంగా ప్రాంతీయ ప్రజలు అనుసరించే విధానంలో బుద్ధిజానికి, తాయిజానికి వ్యత్యాసం తక్కువగా ఉంది. మతపరమైన గణాంకాలను అనుసరించి చైనాలో 30-80% ప్రజలు ఫోల్క్ రిలీజియన్, తాయిజాన్ని అనుసరిస్తున్నారని అంచనా. 10-16% బుద్ధిజం, 2-4% క్రైస్తవ మతం, 1-2% ముస్లిములు ఉన్నారు. హాన్ ప్రజలు ప్రాంతీయ మతవిధానాన్ని అనుసరిస్తున్నారు. చైనాలో అల్పసంఖ్యాక స్థానికులు ఉన్నారు. వివిధ మతాలకు చెందిన స్థానిక ప్రజలు 2-3% ఉన్నారు. బుద్ధిజీవులలో కంఫ్యూషియనిజం మతంగా పరిగణించబడుతుంది. స్థానిక ప్రజలలో టిబెటన్ బుద్ధిజం, ఇస్లాం హుయీ, హిందూమతాలను కూడా ఆచరిస్తారు. సైన్యం ఎడమ|thumbnail|200px|PLA soldiers march in Beijing పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో సైన్యాన్ని నిర్వహిస్తుంది. దీనిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (ప్రజా స్వాతంత్ర్య సైన్యం) అని పిలుస్తారు. దీనిలో నావికా దళం, వాయు దళం ఉన్నాయి. 2005లో దీని బడ్జటు సుమారుగా మూడువేల కోట్ల డాలర్లు (పదిహేను వేల కోట్ల రూపాయలు ?)కానీ ఈ బడ్జటు విదేశీ ఆయుధాలు, ఇతర పరిశోధనల ఖర్చు కాకుండా! విమర్శకులు ఈ బడ్జటును ఇంకా చాలా ఎక్కువగా చెపుతారు. ఇటీవలి రాండ్ (RAND) అను సంస్థ ప్రకారం ఈ ఖర్చు రెండు రెట్లు ఎక్కువ! ఇది అమెరికా సంయుక్త రాష్టాల నాలుగు వందల బిలియన్ డాలర్ల తరువాత ప్రపంచంలో రెండవ స్థానంలో నిలుస్తుంది. దీనికి చక్కని అణు ఆయుధాలు, ఇతర ప్రధాన ఆయుధాలు ఉన్నప్పటికీ, బలహీనమైన నావికాదళం, విమాన వాహక నౌకలు, వైమానిక దళంలోని పాత విమానాల వల్ల, తక్కువ శిక్షణా సమయం వల్ల దీనిని ప్రపంచపు సూపర్ పవరుగా గుర్తించరు, కానీ ఓ ప్రాంతీయ శక్తిగా మంచి గుర్తింపు ఉంది. భారత్‌కు పాక్ కంటే చైనానుంచే ఎక్కువ ప్రమాదముందని భారత వాయుసేనాధిపతి హోమీమేజర్ అభిప్రాయపడ్డారు. భారత్-చైనాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నది.ఈనాడు 24.5.2009. మన దేశంలో జంతువుల పేర్లతో రాశులున్నట్లు, చైనాలో 12 సంవత్సరాలకు జంతువుల పేర్లతో పిలుస్తారు. అవి మూషికం, వృషభం, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, గొర్రె, కోతి, కోడిపుంజు, కుక్క, పంది. వీరికి 1972, 1984, 1996, 2008 మూషిక నామ సంవత్సరాలు. ఫిబ్రవరి 7 నుండి చైనా కాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలౌతుంది. చైనా వారి ఆవిష్కరణలు క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల క్రితమే హ్యాన్‌ చక్రవర్తి కాలంలో కలపగుజ్జు నుంచి పేపరస్‌ పేరుతో కాగితం తయారీని కనిపెట్టారు. మొట్టమొదటిసారి ముద్రణాయంత్రం తయారు చేసింది చైనా వారే. దీనికి 'ఉడ్‌బ్లాక్‌ ప్రింటింగ్‌' అని పేరుపెట్టారు. 220వ సంవత్సరంలో రూపొందించిన ఈ యంత్రం ఆధారంగానే ప్రింటింగ్‌ విధానం అందుబాటులోకి వచ్చింది. ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్‌)ని చైనీయులు 1044 లోనే కనుగొన్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల్ని కూడా దీని ద్వారానే గుర్తించారు. తొమ్మిదో శతాబ్దంలో కనిపెట్టిన గన్‌పౌడర్‌ ఆధారంగానే టపాసులు (బాణాసంచా) పుట్టుకొచ్చాయి. ప్రపంచం చీనాంబరాలుగా చెప్పుకునే పట్టు వస్త్రాలను క్రీస్తుకు పూర్వం 3630 సంవత్సరాల క్రితమే చైనా అల్లింది. ప్రపంచ వాణిజ్యంలో పై చేయి సాధించింది. క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఇద్దరు యూరోపియన్లు సన్యాసుల వేషంలో చైనా వెళ్ళి చేతి కర్రల్లో పట్టుపురుగులను తీసుకొచ్చేవరకూ ఆ రహస్యం ప్రపంచానికి తెలియనేలేదు. ఇప్పటికి 3000 ఏళ్ళ క్రితమే ఓ చైనా రాజు తన కోటను చుట్టుముట్టిన సైనికులు ఎంత దూరంలో ఉన్నారో కనుగొనడానికి తొలి గాలిపటాన్ని ఎగరేశాడనే కథ ఉంది. రోజూ పళ్ళు తోముకునే అలవాటును నేర్పించింది చైనావాళ్ళే అని చెప్పవచ్చు. 1400లోనే వాళ్ళు టూత్‌బ్రెష్‌తో తోముకున్నారు! ఐస్‌క్రీం పుట్టింది కూడా ఇక్కడే. క్రీస్తు పూర్వం 2000 నాడే పాలతో కలిపిన బియ్యాన్ని మంచులో ఉంచి తినేవారు తేదీలు, ముహూర్తాలు చూస్తే క్యాలెండర్‌ని కూడా క్రీ.పూ. 2600 ల్లోనే రూపొందించారు. చైనీయులు క్రీస్తుకు వందేళ్ళ క్రితమే టీ తయారీని కనిపెట్టి, క్రీస్తుశకం 200 ఏళ్ళకల్లా ప్రజల్లోకి టీ ఒక పానీయంగా ప్రాచుర్యం లోనికి తెచ్చారు. ముడుచుకునే గొడుగును పరిచయం చేసింది కూడా చైనీయులే. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలకే ఇత్తడి ఊసలతో ఇలాంటి గొడుగు చేశారు. ఇంకా చెప్పాలంటే పరిశ్రమల్లో ఉపయోగపడే బ్లాస్ట్‌ఫర్నేస్‌, బోర్‌హోల్‌డ్రిల్లింగ్‌, ఫోర్క్‌లు, ఇండియన్‌ ఇంక్‌, దశలవారీగా ప్రయాణించే రాకెట్లు, రెస్టారెంట్లో మెనూ పద్ధతి, భూకంపాలను కనిపెట్టే సీస్మోమీటర్‌, టాయ్‌లెట్‌పేపర్‌, పిస్టన్‌పంప్‌, క్యాస్ట్‌ఐరన్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జి, ఇంధనాలుగా బొగ్గు, సహజవాయువులను వాడే ప్రక్రియ ఇలాంటివెన్నింటికో తొలి రూపాలు చైనాలో రూపుదిద్దుకున్నాయి. సాహిత్యం thumb|The stories in Journey to the are common themes in Peking opera చైనీయుల సాహిత్యానికి ఝౌ రాజవంశం మూలమై ఉంది."中国文学史概述" . jstvu.edu.cn. Retrieved 18 July 2015. రచనలు చైనీయుల సంప్రదాయం ప్రతిబింబించి ఉంటాయి. రచనలలో విస్తారమైన ఆలోచనలు, చైనీయ సంప్రదాయానికి చెందిన ప్రజగాథలు ఉంటాయి. చైనా కేలండర్, చైనా సైనిక రచనలు, చైనా జ్యోతిషం, చైనా మూలికలు, చైనా భౌగోళికం, పలు ఇతర విషయాలు ఉన్నాయి. ఆరంభకాల రచనలలో ఐ చింగ్, షూజింగ్ ఫోర్ బుక్స్, ఫైవ్ క్లాసికల్స్‌లో ఉన్నాయి. తాంగ్ రాజవంశం పాలనలో సంప్రదాయ సాహిత్యం, చైనా సంప్రదాయ సాహిత్యం అభివృద్ధిచేయబడ్డాయి. లీ బై, దూ ఫూ రచనలు కాల్పనికం, వాస్తవికానికి అద్దం పట్టయి."李白杜甫优劣论". 360doc.com. 18 April 2011. Retrieved 21 July 2015. చైనా చరిత్ర షిజితో మొదలైంది. చైనా చారిత్రక సంప్రదాయం " ట్వెంటీ ఫోర్ హిస్టరీస్ "లో ప్రతిబింబిస్తుంది. అది చైనా జానపదాలు, పురాణాల ఆధారితంగా రచించబడింది."史传文学与中国古代小说" . 明清小说研究. April 1997. Retrieved 18 July 2015. " ఫోర్ గ్రేట్ క్లాసికల్ నావెల్స్ " లో మింగ్ రాజవంశ కాలానికి చెందిన పౌరులు, చైనీయుల సంస్కృతిక ప్రతిబింబించే కాల్పనిక సాహిత్యం, చారిత్రక, దేవుళ్ళు దేవతల రచనలు ఉంటాయి. వీటిలో " వాటర్ మార్జిన్", " రోమాంస్ ఆఫ్ త్రీ కింగ్డంస్, జర్నీ టు ది వెస్ట్, డ్రీం ఆఫ్ ది రెడ్ చాంబర్ ఉన్నాయి. "第一章 中国古典小说的发展和明清小说的繁荣" . nbtvu.net.cn. Retrieved 18 July 2015. జిన్ యాంగ్ గురించిన కాల్పానిక సాహిత్యం " వుక్సియా "."金庸作品从流行穿越至经典" . 包头日报. 12 March 2014. Retrieved 18 July 2015. తూర్పు ఆసియాకు చెందిన ఆసక్తికరమైన సాహిత్యంగా దీనికి ప్రత్యేకత ఉంది. "四大名著在日、韩的传播与跨文化重构". 东北师大学报:哲学社会科学版. June 2010. Retrieved 18 July 2015. క్వింగ్ సామ్రాజ్యం ముగింపు తరువాత ఆరంభం అయిన " కొత్త సాంస్కృతిక విప్లవం " కొత్తశకం మొదలైంది. తరువాత సాధారణ చైనీయుల కొరకు వ్యవహారిక భాషలో సరికొత్త రచనలు వెలువడ్డాయి. హ్యూ షిన్, ల్యూ క్సన్ ఆధునిక సాహిత్యప్రక్రియలో గుర్తింపు పొందారు."新文化运动中的胡适与鲁迅" . 中共杭州市委党校学报. April 2000. Retrieved 18 July 2015. వివిధ సాహిత్యప్రక్రియలలో మిస్టీ పొయిట్రీ, సాంస్కృతిక విప్లవం తరువాత ప్రారంభం అయిన స్కార్ సాహిత్యం, క్సన్ జన్ ఉద్యమం మాజిక్ రియలిజంతో ప్రభావితం అయ్యాయి. "魔幻现实主义文学与“寻根”小说" . 文学评论. February 2006. Retrieved 18 July 2015. క్సన్ జన్ సాహిత్య రచయిత మో యాన్ 2012లో నోబుల్ బహుమతి గెలుచుకున్నాడు."莫言:寻根文学作家" . 东江时报. 12 October 2012. Retrieved 18 July 2015. ఆహారసంస్కృతి thumb|Chinese foods originated from different regional cuisines: la zi ji from Sichuan, xiaolongbao from Jiangsu, rice noodle roll from Cantonese and Peking duck from Shandong.చైనీయుల ఆహారసంస్కృతి వైవిధ్యంగా ఉంటుంది. వీటిలో సిచుయాన్, కాంటోనెస్, జైంగ్సు, షండాంగ్, ఫ్యూజియన్, హ్యునాన్, అంహుయి, ఝెజియాంగ్ విధానాలు ప్రబలమైనవి. ఇవి అన్నీ తరగడం, వేడిచేయడం,వర్ణాలను చేర్చడం, సువాసనలను చేర్చడం వంటి ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. చైనీయుల ఆహారసంస్కృతిలో విస్తారమైన వంటసామాగ్రి ఉపయోగించబడుతుంది. వీటిని తయారు చేయడానికి పలు నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. చైనీయుల వైద్యవిధానాలలో చైనీయులు ఆహారవిధానం కూడా భాగమై ఉంటుంది. దక్షిణచైనాలో బియ్యం ప్రధాన ఆహారంగా ఉండగా, ఉత్తర చైనాలో గోధుమలతో చేసిన బ్రెడ్ ప్రధాన ఆహారంగా ఉంది. ఆధునిక కాలానికి ముందు చైనీయులు సాధారణంగా ధాన్యం, కూరగాయలను ఆహారంలో అధికంగా ఉపయోగిస్తారు. ప్రత్యేక విందులో మాంసం కూడా ఉంటుంది. మాంసకృత్తులు అధికంగా కలిగిన ఆహారం అయిన సోయాబీన్స్ ఆధారిత తొఫు, సోయామిల్క్ వంటి వాటిని కూడా చైనీయులు అధికంగా ఆహారంలో తీసుకుంటారు."中国居民豆类及豆制品的消费现状". 中国食物与营养. January 2008. Retrieved 17 July 2015. ప్రస్తుతం చైనాలో పోర్క్ మాంసం ప్రజలలో అధిక ప్రాచుర్యం కలిగి ఉంది. దేశంలో వాడబడుతున్న మొత్తం మాంసాహారంలో నాలుగువ భాగం పోర్క్ ఉండడం విశేషం.. అదనంగా చైనాలో బౌద్ధ ఆహారవిధానం, చైనా ఇస్లామిక్ ఆహారవిధానం కూడా ఉన్నాయి.."清真菜对北京菜影响". yqx.cc. 8 January 2013. Retrieved 17 July 2015. దక్షిణ చైనీయుల ఆహారంలో సముద్రతీరం ఉన్నందున, మైల్డర్ వాతావరణం కారణంగా సముద్రజల ఆహారం విస్తారంగా లభిస్తున్నందున సముద్రజల ఆహారం (సీ ఫుడ్), కూరగాయలు అధికంగా చోటుచేసుకుంటాయి. పొడిగా ఉండే ఉత్తరచైనాలో గోధుమ ఆహారం అధికంగా తీసుకుంటారు.చైనా ఆహారవిధానంలో హాంగ్ కాంగ్ విధానం, అమెరికన్ చైనా ఆహారవిధానం విదేశాలలో ప్రాచుర్యం పొందాయి. క్రీడలు thumb|left|Dragon boat racing, a popular traditional Chinese sport ప్రపంచంలోని అతిపురాతన క్రీడా సంప్రదాయం కలిగిన దేశాలలో చైనా ఒకటి. చైనా ఆరంభకాల రాజరికవ్యవస్థలలో ఒకటైన వెస్టర్న్ ఝౌ రాజరిక వ్యవస్థ కాలం నుండి విలువిద్య, కుజు (దాదాపు ఫుట్‌బాల్ సంబంధిత క్రీడ) అభ్యసించబడుతున్నాయి.1994లో ఆసియాలో అత్యధికంగా గుర్తించబడుతున్న " చైనీస్ సూపర్ లీగ్ " స్థాపించబడింది. అది. "足球不给劲观众却不少 中超球市世界第9亚洲第1". 搜狐体育. 14 July 2013. Retrieved 17 July 2015. ప్రాబల్యత కలిగిన ఇతర క్రీడలలో చైనీస్ మార్షల్ ఆర్ట్స్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటెన్, స్విమ్మింగ్, స్నూకర్ ప్రధానమైనవి. బోర్డ్ క్రీడలలో గో (వెయిక్వి), క్సియాంక్వి, మహ్జాంగ్, చదరంగం మొదలైన క్రీడలకు ప్రాధాన్యత ఉంది."Chinese players dominate at Malaysia open chess championship" . TheStar.com. 2 September 2011. Retrieved 24 September 2011. చైనాలో ఫిజికల్ ఫిట్‌నెస్ అధికంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీటిలో క్విక్ జాంగ్, తాయ్ చి చుయాన్ వంటి ఉదయకాల వ్యాయామాలు ప్రధానమైనవి. and commercial gyms and fitness clubs gaining popularity in the country. చైనాలో ప్రస్తుతం బాస్కెట్ బాల్‌కు అభిమానులు అధికంగా ఉన్నారు. "全国普查 篮球成中国第一运动" . 网易体育. 8 August 2014. Retrieved 17 July 2015. " ది చైనీస్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ", అమెరికన్ నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అత్యధికంగా చైనాప్రజల అభిమానపాత్రంగా ఉన్నాయి. ప్రాంతీయ చైనా క్రీడాకారులలో యాంగ్ మింగ్, యీ జైన్లియన్ ప్రాధాన్యత కలిగి ఉన్నారు. అదనంగా చైనాలో సైక్లింగ్ చేసేవారు అధికంగా ఉన్నారు. 2012 గణాంకాలను అనుసరించి చైనాలో 470 మిలియన్ల సైకిలిస్టులు ఉన్నారని భావిస్తున్నారు. చైనాలో డ్రాగన్ బోటు రేసింగ్, మంగోలియన్ మల్లయుద్ధం, గుర్రపు పందాలు మొదలైన పలు సంప్రదాయక్రీడలకు కూడా ప్రజాదరణ అధికంగా ఉంది. Qinfa, Ye. "Sports History of China" . About.com. Retrieved 21 April 2006.1932 నుండి చైనా క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో కూడా అధికంగా పాల్గొంటున్నారు. 1952లో చైనా క్రీడాకారులు సమ్మర్ ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నారు. 2008 సమ్మర్ ఒలింపిక్స్‌ క్రీడలకు చైనా ఆతిథ్యం ఇచ్చింది. అందులో చైనా క్రీడాకారులు 51 స్వర్ణపతకాలు సాధించి మొదటి స్థానంలో ఉన్నారు. 2012 సమ్మర్ పారాలింపిక్స్ క్రీడలలో చైనా క్రీడాకారులు 95 స్వర్ణపతకాలతో 231 పతకాలను సాధించారు. చైనా 2011లో గాంగ్డంగ్ లోని షెంఝెన్‌లో " 2011 సమ్మర్ యూనివర్శబుల్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. చైనా లోని తైజన్‌లో " 2013 ఈస్ట్ ఆసియన్ గేంస్ " కు ఆతిథ్యం ఇచ్చింది. 2014 లో చైనా నాంజింగ్‌లో " సమ్మర్ యూత్ ఒలిపిక్స్ " కు ఆతిథ్యం ఇచ్చింది. మతం క్రీ.పూ.217లో 12మంది బౌద్దభిక్షువులు చైనా చేరుకున్నారు. క్రీస్తు శకం ఆరంభమైన నాటి నుంచీ యూఎచీ, బాక్ట్రియను, సాగ్డియను మొదలైన పలువురు మధ్య ఆసియా జాతుల వారు చైనాలో బౌద్ధమత విస్తృతికి ప్రయత్నం చేసింది. సా.శ.67లో కశ్యపమతంగుడైన ఇద్దరు భారతీయ భిక్షువులు చైనా వెళ్ళి మింగ్ టి అనే చైనా చక్రవర్తి ఆదరణ గౌరవాలు పొందారు. వారు బౌద్ధ గ్రంథాలను అనువదించి, ఆరాధనలు నెలకొల్పి మతాల ప్రచారం చేసేవారు. సా.శ.6వ శతాబ్దంలో మరో ఇద్దరు బౌద్ధభిక్షువులు మత ప్రచారం చేశారు. వారిలో మొదటివాడు బోధిధర్ముడు. పుస్తకాలు వీడియోలు విశేషాలు ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం ఆట బొమ్మలు చైనా నుంచే ఉత్పత్తి అవుతున్నాయి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కాగితాల రూపంలో డబ్బుని అందుబాటులోకి తెచ్చిన దేశం ఇదే. ప్రస్తుతం చైనాలో డబ్బుని రెన్‌మిన్‌బీ అంటారు. అంటే ప్రజల సొమ్ము అని అర్థం. రూపాయలకి యువాన్‌, జియావో, ఫెన్‌ లాంటి పేర్లు ఉన్నాయి. మూలాలు బయటి లింకులు Overviews People's Daily: China at a Glance BBC News — Country Profile: China "Rethinking ‘Capitalist Restoration’ in China" by Yiching Wu డాక్యుమెంటరీలు "China on the Rise" PBS Online NewsHour. October 2005. China Rises a documentary co-produced by The New York Times, Discovery Times, CBC, ZDF, France 5 and S4C. 9 April2006. China in the Red, 1998–2001. PBS Frontline. China From the Inside A documentary series co-produced by KQED Public Television and Granada Television. ప్రభుత్వం The Central People's Government of People's Republic of China (English) China's Official Gateway for News & Information (English) పరిశీలన Assertive Pragmatism: China's Economic Rise and Its Impact on Chinese Foreign Policy - analysis by Minxin Pei, IFRI Proliferation Papers n°15, 2006 The Dragon's Dawn: China as a Rising Imperial Power February 11, 2005. History of The People's Republic of China Timeline of Key Events since 1949. Media, advertising, and urban life in China. China's Neoliberal Dynasty by Peter Kwong, originally published in The Nation 2 October 2006. ప్రయాణం దేశ పటాలు గూగుల్ మాప్స్ - చైనా గూగుల్ మాప్స్ - చైనా చైనా ఆకర్షనీయమైన ప్రాంతాలు ఇవికూడా చూడండి రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ వర్గం:ఆసియా వర్గం:చైనా
ఇరాన్
https://te.wikipedia.org/wiki/ఇరాన్
ఇరాన్ (పురాతన నామం = పర్షియా) (పర్షియన్: ایران) నైఋతి ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము. 1935 దాకా ఈ దేశము పాశ్చాత్య ప్రపంచములో పర్షియా అని పిలవబడేది. 1959లో మహమ్మద్ రెజా షా పహ్లవి ఉభయ పదములు ఉపయోగించవచ్చని ప్రకటించారు.కానీ ప్రస్తుత ఇరాన్ ను ఉద్దేశించి "పర్షియా" పదము వాడుక చాలా అరుదు. ఇరాన్ అను పేరు స్థలి "ఆర్యన్" అర్థం "ఆర్య భూమి". ఇరాన్ కు వాయవ్యాన అజర్‌బైజాన్ (500 కి.మీ), ఆర్మేనియా (35 కి.మీ), ఉత్తరాన కాస్పియన్ సముద్రము, ఈశాన్యాన తుర్కమేనిస్తాన్ (1000 కి.మీ), తూర్పున పాకిస్తాన్ (909 కి.మీ), ఆఫ్ఘనిస్తాన్ (936 కి.మీ), పశ్చిమాన టర్కీ (500 కి.మీ), ఇరాక్ (1458 కి.మీ), దక్షిణాన పర్షియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్ లతో సరిహద్దు ఉంది. 1979లో, అయాతొల్లా ఖొమేని ఆధ్వర్యములో జరిగిన ఇస్లామిక్ విప్లవం పర్యవసానముగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (جمهوری اسلامی ایران) గా అవతరించింది. ఇరాన్లో, పెర్షియన్, అజర్బైజాన్, కుర్దిష్ (కుర్దిస్తాన్), లూర్ అత్యంత ముఖ్యమైన జాతి సమూహాలు. చరిత్ర ఇరాన్ యొక్క జాతీయత పర్షియా నుండి ఉద్భవించింది. పర్షియా అన్నపదము నేటి ఇరాన్, తజికిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, కాకసస్ ప్రాంతాలకు ఉన్న ప్రాచీన గ్రీకు పేరు పర్సిస్ నుండి వచ్చింది. క్రీ.పూ 6వ శతాబ్దములో ఈ ప్రాంతాలన్నీ ఆకెమెనిడ్ వంశము యొక్క పాలనలో గ్రీస్ నుండి వాయవ్య భారతదేశము వరకు విస్తరించిన మహాసామ్రాజ్యములో భాగముగా ఉన్నాయి. అలెగ్జాండర్ మూడు ప్రయత్నాల తర్వాత ఈ సామ్రాజ్యాన్ని జయించగలిగాడు. అయితే పర్షియా వెనువెంటనే పార్థియన్, సస్సనిద్ సామ్రాజ్యాల రూపములో స్వతంత్రమైనది. అయితే ఈ మహా సామ్రాజ్యాలను 7వ శతాబ్దములో ఇస్లాం అరబ్బీ సేనల చేత చిక్కినది. ఆ తరువాత సెల్జుక్ తుర్కులు, మంగోలులు, తైమర్‌లేను ఈ ప్రాంతాన్ని జయించారు. 16వ శతాబ్దములో సఫవిదులు పాలనలో తిరిగి స్వాతంత్ర్యమును పొందినది. ఆ తరువాత కాలములో ఇరాన్ను షాహ్ లు పరిపాలించారు. 19వ శతాబ్దంలో పర్షియా, రష్యా, యునైటెడ్ కింగ్ డం నుండి వత్తిడి ఎదుర్కొన్నది. ఈ దశలో దేశ ఆధునీకరణ ప్రారంభమై 20వ శతాబ్దములోకి కొనసాగినది. మార్పు కోసము పరితపించిన ఇరాన్ ప్రజల భావాల అనుగుణంగా 1905/1911 పర్షియన్ రాజ్యాంగ విప్లవం జరిగింది. చరిత్రకు ముందు ఇరాన్ లోని కషఫ్రద్, గంజ్ పార్ ప్రాంతాలలో లభించిన కళా అవెశేషాలు ఆరంభకాల ఇరాన్ చరిత్రను వివరిస్తున్న మొదటి ఆధారాలుగా భావిస్తున్నారు. ఇవి దిగువ పాలియో లిథిక్ శకానికి (క్రీ.పూ 8,00,000 - 2,00,000) సంబంధించినవని భావిస్తున్నారు. ఇవి నీన్దేర్తల్ మద్య పాలియో లిథిక్ శకానికి (క్రీ.పూ 2,00,000- 80,000) సంబంధించినవని భావిస్తున్నారు. ఇవి జాగ్రోస్ లోని వార్వాసి, యఫ్తెష్ గుహ ప్రాంతాలలో లభించాయి. క్రీ.పూ 10,000- 8,000 సంవత్సరాలకు పూర్వం ఇరాన్ ప్రాంతాలలో చోగా గోలన్, చొఘా బొనట్ వ్యవసాయ సమూహాలు వర్ధిల్లాయి. "Emergence of Agriculture in the Foothills of the Zagros Mountains of Iran", by Simone Riehl, Mohsen Zeidi, Nicholas J. Conard - University of Tübingen, publication 10 May 2013 అలాగే జాగ్రోస్ ప్రాంతంలోసుసా, చొఘా మిష్ వ్యవసాయ సమూహాలు వర్ధిల్లాయి. సుసా నగరం స్థాపన రేడియో కార్బన్ (క్రీ.పూ 4,395) జరిగిందని భావిస్తున్నారు. ఇరాన్ పీఠభూమి అంతటా పలు పాలియోలిథిక్ శకానికి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ఇవి దాదాపు క్రీ.పూ 4,000 ప్రాంతానికి చెందినవని భావిస్తున్నారు. కాంస్య యుగ కాలంలో ఇరాన్ ప్రాంతంలో ఈళం, జిరోఫ్ట్, జయందేష్ సంస్కృతి మొదలైన సంస్కృతులు వర్ధిల్లాయి. వీటిలో ప్రధానంగా ఈళం సంస్కృతి ఇరాన్ వాయవ్యప్రాంతంలో వర్ధిల్లింది. ఈళం సంస్కృతి సుమేరియన్ భాష, ఎలమైట్ సంఙాలిపి జనించిన కాలానికి సమకాలీనమని (క్రీ.పూ 3,000) భావిస్తున్నారు. ఎలమైట్ రాజ్యం మెడియన్, అచమెనిడ్ సామ్రాజ్యాలు అవతరించే వరకు కొనసాగింది. క్రీ.పూ 3,400 - 2,000 మద్యకాలంలో వాయవ్య ఇరాన్ కురా- అరాక్సెస్ సంస్కతి ప్రజల నివాసిత ప్రాంతంగా ఉంది. కురా- అరాక్సెస్ కౌకాసస్, అనటోనియా ప్రాంతాలలో కూడా విస్తరించింది. క్రీ.పూ 2000 సంవత్సరాల నుండి పశ్చిమ ఇరాన్ స్వాత్ ప్రాంతంలో నివసించిన అస్యరియాలు సమీప ప్రాంతాలను వారి భూభాగంలో కలుపుకుని పాలించార. సాంప్రదాయిక పురాతనత్వం thumb|A depiction of the united Medes and Persians in Apadana, Persepolis క్రీ.పూ 2000 యురేషియన్ స్టెప్పీల నుండి పురాతన ఇరానియన్ ప్రజలు (ప్రొటో ఇరానియన్) ఇరాన్ ప్రాంతానికి వచ్చి చేరిన ప్రజలు ఇరాన్ స్థానిక ప్రజలకు సమానంగా భావించారు. తరువాత ఇరానియన్ ప్రజలు మహా ఇరాన్ ప్రాంతానికి తరిమివేయబడ్డారు. తరువాత ప్రస్తుత ఇరాన్ భూభాగం మీద పర్షియన్, మెడియన్ మరియన్ పార్థియన్ గిరిజనులు ఆధిక్యత సాధించారు. క్రీ.పూ 10-7 వ శతాబ్దంలో " ప్రి - ఇరానియన్- కింగ్డంస్ " ద్వారా సంఘీభావంగా జీవించిన ఇరానియన్ ప్రజలు ఉత్తర మెసొపటేనియాకు చెందిన అసిరియన్ ఎంపైర్ ఆధిక్యతకు లోనయ్యారు. Georges Roux – Ancient Iraq రాజా సయాక్సెరెస్ పాలనలో మెడేస్, పర్షియన్లు బాబిలోన్‌కు చెందిన నబొపొలస్సార్‌, స్కిథియన్లు, చిమ్మెరియన్లతో కూటమి ఏర్పరుచుకుని అస్సిరియన్ సామ్రాజ్యాన్ని ఎదొర్కొన్నారు. అస్సిరియన్ సామ్రాజ్యంలో క్రీ.పూ 616-615. మద్యలో అంతర్యుద్ధం సాగింది. తరువాత శతాబ్ధాల కాలం సాగిన అస్సిరియన్ పాలన నుండి ఇరాన్ ప్రజలు విడిపించబడ్డారు. . క్రీ.పూ డియోసెల్సా పాలనలో సంఖైఖ్యపరచబడిన మెడియన్ ప్రజలు క్రీ.పూ 612 నాటికి మెడియన్ సామ్రాజ్యస్థాపన చేసారు. వారు సంపూర్ణ ఇరాన్, అనటోలియా మీద ఆధిక్యత సాగించారు. ఇది ఉరార్తు రాజ్యానికి ముగింపుకు రావడానికి కారణం అయింది. thumb|left|Ruins of the Gate of All Nations, Persepolis thumb|right|Modern impression of Achaemenid cylinder seal, 5th century BC. A winged solar disc legitimises the conquering Persian king who subdues two rampant Mesopotamian lamassu figures. thumb|left|Tomb of Cyrus the Great, founder of the Achaemenid Empire, Pasargadae క్రీ.పూ 550 లో మందానే, మొదటి కంబైసెస్ సైరస్ ది గ్రేట్ మేడియన్ సామ్రాజ్యాన్ని స్వాధీనపరచుకుని పరిసర నగరాలను రాజ్యాలను సమ్మిళితం చేస్తూ అచమెనింద్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మెడియా మీద విజయం " పర్షియన్ తిరుగుబాటుగా "గా వర్ణించబడింది. అస్సిరియన్ పాలకుని చర్యలకారణంగా ఉత్తేజితులైన బురౌహా తరువాత వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరించి పర్షియన్లతో కూటమి ఏర్పరుచుకున్నారు. తరువాత సైరస్ నాయకత్వంలో విజాయాలు సాధించి సాంరాజ్యాన్ని లిబియా,బాబిలోన్ పురాతన ఈజిప్ట్ , బాల్కన్‌లోని కొన్ని భాగాలు , యూరప్ వరకు విస్తరించారు. అలాగే ఇది సింధు , అక్సస్ నదుల పశ్చిమ తీరం వరకు విస్తరించింది. thumb|Achaemenid Empire around the time of Darius I and Xerxes I అచమెనింద్ సామ్రాజ్యం నల్ల సముద్రం తీర ప్రాంతాలు ఈశాన్య గ్రీస్ , దక్షిణ బల్గేరియా (థారెస్ను) లో చాలావరకు ఇరాన్, అజర్బైజాన్, అర్మేనియా, జార్జియా, టర్కీ యొక్క మోడర్న్ భూభాగాలు చేర్చారు, మేసిడోనియా (Paeonia), ఇరాక్ యొక్క అత్యంత, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సుదూర పశ్చిమ లిబియా, కువైట్, ఉత్తర సౌదీ అరేబియా, UAE , ఒమన్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ యొక్క భాగాలు, మధ్య ఆసియా, పురాతన ఈజిప్ట్ యొక్క అన్ని కేంద్రాలు కలిపిన ప్రాచీన జనాభాతో మొదటి ప్రపంచ అతిబృహత్తర ప్రభుత్వం , అతిపెద్ద సామ్రాజ్యం స్థాపించబడింది. క్రీ.పూ 480 లో స్థాపించబడిన అచమెనిద్ సాంరాజ్యంలో 50 మిలియన్ల ప్రజలు నివసించారు. Yarshater (1996, p. 47)While estimates for the Achaemenid Empire range from 10–80+ million, most prefer 50 million. Prevas (2009, p. 14) estimates 10 million. Strauss (2004, p. 37) estimates about 20 million. Ward (2009, p. 16) estimates at 20 million. Scheidel (2009, p. 99) estimates 35 million. Daniel (2001, p. 41) estimates at 50 million. Meyer and Andreades (2004, p. 58) estimates to 50 million. Jones (2004, p. 8) estimates over 50 million. Richard (2008, p. 34) estimates nearly 70 million. Hanson (2001, p. 32) estimates almost 75 million. Cowley (1999 and 2001, p. 17) estimates possibly 80 million. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనుసరించి ఆసమయంలో అచమెనింద్ పాలనలో ప్రంపంచంలోని 44% ప్రజలు పాలించబడ్డారని భావిస్తున్నారు. ఆకాలంలో జనసంఖ్యా పరంగా అచమెనింద్ సాంరాజ్యం ప్రథమస్థానంలో ఉందని భావిస్తున్నారు. గ్రీక్ చరిత్రలో ఇది శత్రురాజ్యంగా భావించబడి బానిసలుగా పట్టుబడి రాజభవనాలు, రహదారులు , గోపురాల నిర్మాణపుపనులకు నియోగించబడిన యూదులు, బాబిలోనియన్లను విడిపించడానికి ప్రయత్నించారు. చక్రవర్తి ఆధీనంలో అధికారం కేంద్రీకరించబడింది. పౌరసేవ, బృహత్తరసైన్యం మొదలైన పాలనా అభివృద్ధి విధానాలు తరువాత వెలసిన సాంరాజ్యాలకు ప్రేరణకలిగించింది.Schmitt Achaemenid dynasty (i. The clan and dynasty) అచమెనింద్ సాంరాజ్యంలో క్రీ.పూ 352-350 మద్య పురాతన ప్రపంచ 7 అద్భుతాలలో ఒకటైన " హలికర్నాసస్ మౌసోలియం" నిర్మించబడింది. లోనియన్ తిరుగుబాటు ఆరంభమై అది గ్రీకో- పర్షియన్- యుద్ధాలుగా పరిణమించి క్రీ.పూ 5వ శతాబ్దం అర్ధభాగం వరకు కొనసాగాయి. పర్షియన్లు బాల్కన్, తూర్పు యురేపియన్ యురేపియన్ భూభాలనుండి వైదొలగడంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. thumb|left|A bas-relief at Naqsh-e Rostam, depicting the victory of Shapur I over Valerian, following the Battle of Edessa క్రీ.పూ 334 లో మహావీరుడు అలెగ్జాండర్ అచమెనింద్ సామ్రాజ్యం మీద దండెత్తి ఇస్సస్ యుద్ధంలో చివరి అచమెనింద్ చక్రవర్తి మూడవ డారియస్ మీద విజయం సాధించాడు. అలెగ్జాండర్ చిన్న వయసులోనే మరణించడంతో ఇరాన్ సెలెయుసిడ్ సామ్రాజ్యానికి చక్రవర్తి హెలెనిస్టిక్ చక్రవర్తి వశపరచుకున్నాడు. 2వ శతాబ్దం అర్ధభాగంలో తలెత్తిన పార్ధియన్ సామ్రాజ్యం ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. తరువాత పర్షియన్-రోమన్ల మద్య శతాబ్ధకాల విరోధం కొనసాగింది. విరోధం కారణంగా పలు రోమన్- పార్ధియన్ యుద్ధాలు కొనసాగాయి. తరువాత 5 శతాబ్ధాలకాలం భూస్వామ్య ప్రభుత్వం కొనసాగింది. సా.శ. 224 లో ఇరాన్ సస్సనిద్ సామ్రాజ్యం వశం అయింది. బైజంటైన్ సామ్రాజ్యం తనపొరుగున ఉన్న శత్రుసామ్రాజ్యంతో అవి రెండు శక్తివంతమైన రెండు రాజ్యాంగశక్తులుగా 4 శతాబ్ధాలకాలం నిలిచాయి. thumb|Sassanid reliefs at Taq Bostan అచమెనింద్ మద్య సరిహద్దులను ఏర్పరుస్తూ సస్సనిడ్లు స్టెసిఫోన్ రాజధానిగా చేసుకుని సామ్రాజ్యస్థాపన చేసారు. సస్సనిద్ సామ్రాజ్యం ఉనికిలో ఉన్న కాలం ఇరాన్ ప్రభావంతమైన కాలంగా భావిస్తున్నారు. పురాతన రోం సంస్కృతి J. B. Bury, p. 109.Will Durant, Age of Faith, (Simon and Schuster, 1950), 150; Repaying its debt, Sasanian art exported it forms and motives eastward into India, Turkestan, and China, westward into Syria, Asia Minor, Constantinople, the Balkans, Egypt, and Spain.. ఆఫ్రికా సంస్కృతి చైనా సంస్కృతి, భారతీయ సంస్కృతి ఇరాన్‌ను ప్రభావితం అధికంగా ఉంది. Sarfaraz, pp. 329–330 ఇవి ప్రాముఖ్యత సంతరించుకున్న మెడీవల్ కళ తూర్పు ఆసియా కళా రూపుదిద్దుకోవడంలో ప్రధానపాత్ర వహించాయి. పర్షియన్, సస్సనిద్ సామ్రాజ్యాలలో అత్యధికప్రాంతాలలో రోమన్ - పర్షియన్ యుద్ధపర్యవసనాల నీడ ప్రసరించింది. రోమన్లు పశ్చిమతీరంలో అనటోలియా, పశ్చిమ కౌకాసస్, మెసపటోమియా, లెవంత్ 700 సంవత్సరాలు నిలిచిఉన్నారు. ఈ యుద్ధాలు రోమన్లు, సస్సనింద్ సామ్రాజ్యాలు అరబ్బుల చేతిలో అపజయం పొందడానికి కారణం అయిమ్యాయి. అచమెనింద్ సంతతి ప్రజలు పర్షియన్లు, సస్సనిదులు స్థాపించిన రాజ్యాలు శాఖలు అనటోలియా, కౌకాసస్, పొంటస్,మిహ్రందీలు, అరససిద్ సామ్రాజ్యాలు, డాగెస్తాన్ ప్రాంతాలలో ఏర్పాటుచేయబ డ్డాయి. మద్యయుగం దీర్ఘకాలం బైజాంటైన్ - సస్సనిద్ యుద్ధాలు కొనసాగాయి. వీటిలో బైజాంటైన్- సస్సనిద్ యుద్ధం 602-628 వరకు కొనసాగింది. సస్సనిద్ సామ్రాజ్యం అంతర్యుద్ధాలు ముగింపుకు వచ్చిన తరువాత 7వ శతాబ్దంలో ఇరాన్ మీద అరబ్ దాడికి దారితీసింది. ఆరంభంలో అరబ్ రషిదున్ కాలిఫేట్ చేతిలో ఓటమి పొందిన తరువాత ఇరాన్ అరబ్ కాలిఫేట్ ఆధీనం అయింది. ఇరాన్‌లో ఉమ్మయద్ కాలిఫేట్, అబ్బాసిద్ కాలిఫేట్‌లు పాలించారు.అరబ్ దండయాత్ర తరువాత దీర్ఘకాలం ఇరాన్ ఇస్లాం మతరాజ్యంగా మార్చబడింది. రషిదున్ కాలిఫేట్, ఇమయత్ కాలిఫేట్ మవాలి, నాన్ కనవర్టెడ్ (దిమ్మీ) ఇరానీయుల పట్ల వివక్ష చూపబడింది. వారిని ప్రభుత్వోద్యాగాలకు, సైనిక ఉద్యోగాలకు దూరం చేస్తూ అదనంగా వారికి జిజ్యా సుంకం విధించబడింది. H. Patrick Glenn, Legal Traditions of the World. Oxford University Press, 2007, pg. 218–219. గుండే షపూర్‌లో " అకాడమీ ఆఫ్ గుండే షపూర్ " స్థాపించబడింది. ఆసమయంలో ఇది ప్రపంచ వైద్యకేంద్రంగా విలసిల్లింది. దండయాత్ర తరువాత సజీవంగా నిలిచిన అకాడమీ ఇస్లామిక్ సంస్థ " గా నిలిచింది. thumb|Tomb of Hafez, the popular Iranian poet whose works are regarded as a pinnacle in Persian literature, and have left a considerable mark on later Western writers, most notably Goethe, Thoreau, and Emerson750లో అబ్బాసిదులు ఉమ్మయాదులను త్రోసి మవాలీ ఇరానియన్లకు మద్దతుగా నిలిచారు. మవాలి తిరుగుబాటు సైన్యాలను సమీకరించారు. సైన్యానికి అబు ముస్లిం నాయకత్వం వహించారు. అబ్బాసిద్ కాలిఫాల రాక తరువాత ఇరానియన్ సంస్కృతి , ప్రభావం తిరిగి వికసించింది. తరువాత అరబ్ సంప్రదాయాలు తొలగించబడ్డాయి. అరబ్ కులీనవిధానం స్థానంలో క్రమంగా ఇరానియన్ రాజ్యాంగ విధానం పునరుద్ధరించబడింది. 2శతాబ్ధాల అరబ్ పాలన తరువాత అబ్బాసిద్ కలిఫేట్ క్షీణదశ తరువాత తహ్రిదీ, సఫరిద్, సమనిద్ , బుయిద్ అర్ధస్వతంత్ర , పూర్ణస్వతంత్ర రాజ్యాలు వెలిసాయి. 9-10 శతాబ్ధాలలో సమనిద్ శకం ఆరంభమైన తరువాత ఇరానియన్లు తమ స్వాతంత్రం తిరిగి స్థిరపరచుకున్నారు. ఇరానియన్ సాహిత్యం, ఇరానియన్ తాత్వికవాదం, వైద్యపరమైన శాస్త్రీయ , సాంకేతికత , ఇరానియన్ కళలు అభివృద్ధి సరికొత్త ఇరానియన్ సంస్కృతి అభివృద్ధి రూపొందింది. ఈ కాలాన్ని " ఇస్లామిక్ స్వర్ణయుగం " గా వర్ణించబడింది. ఇస్లామిక్ స్వర్ణయుగం ఇస్లామిక్ స్వర్ణయుగం 10-11 శతాబ్ధాల నాటికి శిఖరాగ్రం చేరుకుంది. శాస్త్రీయదృక్పథాలకు ఇరాన్ ప్రధానప్రాంతం అయింది. 10శతాబ్దం తరువాత పర్షియన్ భాషతో అరబిక్ భాషలు శాస్త్రీయ, తాత్విక, చారిత్రక, సంగీత , వైద్యశాస్త్రాలకు ఉపయోగించబడ్డాయి. నాసిర్ అల్-దిన్ అల్- తుసి, అవిసెన్నా, కొతుబ్ అల్-దిన్ షిరాజ్, బిరున్ మొదలైన ఇరానియన్ రచయితలు శస్త్రీయ రచనలు చేయడంలో ప్రధానపాత్ర వహించారు. అబ్బాసిద్ శకంలో సంభవించిన సంస్కృతి పునరుజ్జీవనం ఇరాజియన్ జాతీయతను గుర్తించేలా చేసింది. గతంలో ఇరాన్‌లో చేసిన అరబినీయత తిరిగి పునరావృతం కాలేదు. ఇరానియన్ షూబియా ఉద్యమం అరబ్ ప్రభావం నుండి ఇరానీయులు స్వతంత్రం పొందేలా చేసింది. ఉద్యమఫలితంగా పర్షియన్ భాషా కావ్య రచయిత " ఫెర్డోస్ " ను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఫెర్డోస్‌కు ఇరానియన్ సాహిత్యంలో శాశ్వతస్థానం ఉంది. 10వ శతాబ్దంలో టర్కీ నుండి గిరిజనులు మద్య ఆసియా నుండి ఇరాన్ పీఠభూమికి మూకుమ్మడిగా వలసవచ్చి స్థిరపడ్డారు. ఆరంభంలో అబ్బాసిద్ సైన్యంలో. ఇరానియన్ , అరబ్ స్థానంలో టర్కిక్ గిరిజనయువకులు బానిస సైన్యం (మమ్లుల్క్స్) గా నియమించబడ్డారు. ఫలితంగా బానిససైన్యం రాజకీయాధికారం సంపాదించారు. ఘజ్నవిద్ 999 లో ఇరాన్‌లో అధికభాగం ఘజ్నవిద్ వశం అయింది. ఘజ్నవిద్ పాలకుడు మమ్లక్ టర్కీ సంతతికి చెందినవాడు. తరువాత సెల్జుక్ చక్రవర్తి , ఖ్వరేజ్మైన్ చక్రవర్తి ఇరాన్‌ను పాలించారు. ఈ టర్కీ పాలకులు పర్షియన్లుగా , పర్షియన్ నిర్వహణ , పాలనను అనుసరించారు. తరువాత సెల్జుక్లు ఒకవైపు సంపూఋణ పర్షియన్ గుర్తింపుతో అనటోలియాలో రుం సుల్తానేట్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చారు. Sigfried J. de Laet. History of Humanity: From the seventh to the sixteenth century UNESCO, 1994. ISBN 9231028138 p 734Ga ́bor A ́goston,Bruce Alan Masters. Encyclopedia of the Ottoman Empire Infobase Publishing, 1 jan. 2009 ISBN 1438110251 p 322 పర్షియన్ సంస్కృతి దత్తు తీసుకుని టర్కీ పాలకులు సరికొత్త టర్కీ- పర్షియన్ సంస్కృతి జనించడానికి అభివృద్ధిచెందడానికి అవకాశం ఇచ్చారు. 1291-21 మద్య ఖ్వరెజ్మైన్ సాంరాజ్యం చంఘిస్ఖాన్ నాయకత్వంలో సాగిన మంగోల్ దండయాత్రతో ధ్వంశం చేయబడింది. స్టీవెన్ ఆర్.వర్డ్ అభిప్రాయంలో " మంగోలియన్ దండయాత్రలో జరిగిన హింసలో ఇరానియన్ పీఠభూమిలో నివసిస్తున్న ప్రజలలో మూడు వంతుల ప్రజలు (10-15 మిలియన్ ప్రజలు) వధించబడ్డారు " అని వర్ణించబడింది. మరికొంతమంది చరిత్రకారులు 20వ శతాబ్దం వరకు ఇరాన్ ప్రజల సంఖ్య మంగోలియన్ దండయాత్రకు ముందున్న స్థాయికి చేరుకోలేదని భావిస్తున్నారు. మంగోల్ సాంరాజ్యం విభజితం అయిన తరువాత 1256లో చంగిస్ఖాన్ మనుమడు హులగుఖాన్ ఇరాన్‌లో ఇల్ఖనేట్ సాంరాజ్యం స్థాపించాడు. 1370 లో తైమూర్ ఇరాన్‌ను వశపరచుకుని తైమూర్ సాంరాజ్యస్థాపన చేసాడు. తరువాత 156 సంవత్సరాల కాలం తైమూర్ సాంరాజ్యపాలన కొనసాగింది. 1387 లో తైమూర్ ఇస్ఫాహన్ మూకుమ్మడి హత్యలకు ఆదేశాలుజారీ చేయడంతో 70,000 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇల్ఖాన్లు , తైమూరులు వేగంగా ఇరానీయుల జీవబమార్గాన్ని ఎంచుకుని జీవించారు. ఫలితంగా ఇరాన్ సంస్కృతికి భిన్నంగా ఇరాన్‌లో మరొక సంస్కృతి రూపుదిద్దుకున్నది. ఆరంభకాల ఆధునిక యుగం thumb|right|upright|A Venetian portrait of Ismail I, founder of the Safavid Dynasty – the Uffizi Gallery 1500 నాటికి అర్దాబిల్ నుండి ఇస్మాయిల్ తబ్రిజ్ రాజధానిగా చేసుకుని సఫావిద్ సాంరాజ్యస్థాపన చేసాడు. . ఆరంభంలో అజర్బైజన్‌తో ఇరానియన్ భూభాగమంతా అధికారాన్ని విస్తరించాడు. తరువాత సమీపప్రాంతాలను కూడా అధికారపరిధిలోకి తీసుకువచ్చి మహా ఇరాన్ (గ్రేటర్ ఇరాన్) అంతటా ఇరానీ గుర్తింపు కలుగజేసాడు.Why is there such confusion about the origins of this important dynasty, which reasserted Iranian identity and established an independent Iranian state after eight and a half centuries of rule by foreign dynasties? RM Savory, Iran under the Safavids (Cambridge University Press, Cambridge, 1980), p. 3. ఇస్మాయిల్ సఫావిద్ సాంరాజ్యంలో సున్నీ , షియా స్థానంలో ఇరానీ సున్నియిజం వచ్చేలా చేసాడు. షియా ఇస్లాం విస్తరించి ఉన్న కౌకాసస్, ఇరాన్,అనటోనియా , మెసపటోనియా ఇరానీ సున్నీయిజం విస్తరించింది. ఫలితంగా ఆధునిక ఇరాన్ , రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజన్ మాత్రమే అధికారిక షియా ముస్లిం దేశాలుగా గుర్తించబడుతున్నాయి. రెండు దేశాలలో షియా ముస్లిముల ఆధిఖ్యత ఉంది. అలాగే రెండు దేశాలు షియా ముస్లిం సఖ్యలో ప్రధమ , ద్వితీయ స్థానాలలో ఉన్నాయి. Juan Eduardo Campo,Encyclopedia of Islam, p.625 సఫావిద్ , ఆటమిన్ సాంరాజ్యాల మద్య నెలకొన్న శతాబ్ధాల భౌగోళిక , సిద్ధాంతాల శతృత్వం పలు " ఆటమిన్ - పర్షియన్" యుద్ధాలకు దారితీసింది. అబ్బాస్ ది గ్రేట్ కాలంలో (1587-1629) లలో సఫావిద్ శకం శిఖరాగ్రం చేరింది. చుట్టూ ఉన్న ఆటమిన్ శత్రువులను ఆణిచివేసి సామ్రాజ్యాన్ని పశ్చిమ యురేషియాలో శాస్త్రీయ, కళాకేంద్రంగా మార్చబడింది. సఫావిద్ కాలంలో కౌకాసస్ ప్రజలు అధికంగా ఇరాన్ ప్రజలతో సమ్మిళితం కావడం తరువాత పలు శతాబ్ధాలకాలం ఇరాన్ చరిత్ర మీద ప్రభావం చూపింది. ఆటమిన్‌తో నిరంతర యుద్ధాలు, అంతర్యుద్ధాల, విదేశీ జోక్యం (ప్రధానంగా రష్యా జోక్యం) కారణంగా 1600 చివర - 1700 ఆరంభకాలం నాటికి సామ్రాజ్యం క్షీణదశకు చేరుకుంది. పష్టన్ 1722లో తిరుగుబాటుదారులు ఇస్ఫాహన్ స్వాధీనపరుచుకుని సుల్తాన్ హుస్సైన్‌ను ఓడించి హొతకి సామ్రాజ్యస్థాపన చేసారు. thumb|left|Statue of Nader Shah, founder of the Afsharid Dynasty – the Naderi Museum నాదిర్షా 1729లో ఖొరసన్ నుండి సైనికాధికారి, సైనికవ్యూహ నిపుణుడు నాదిర్షా విజయవంతంగా పష్టన్ ఆక్రమణదారులను తరిమివేసాడు. తరువాత నాదిర్షా తిరిగి స్వాధీనం చేసుకున్న కౌకాసిన్ భూభాగాలు కాంస్టాంటినోపుల్ (1724) ఒప్పందం ద్వారా ఆటమిన్, రష్యాలకు విభజించబడి ఇవ్వబడ్డాయి. స్సనిద్ పాలన తరువాత నాదిర్షా పాలనలో ఇరాన్ అత్యున్నత స్థానం చేరుకుంది. కౌకాసస్, పశ్చిమ ఆసియా ప్రధాన భూభాగాలు, మద్య ఆసియాలో ఇరానియన్ ఆధిపత్యం తిరిగి స్థాపించబడింది. ఆసమయంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది. 1730లో నాదిర్షా భారతదేశం మీద దండేత్తి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. నాదిర్షా భూభాగ విస్తరణ, సైనిక విజయాలు ఉత్తర కౌకాసస్‌లో డాగేస్థాన్ యుద్ధంతో ముగింపుకు వచ్చాయి. జంద్ సాంరాజ్యం నాదిర్షా హత్య తరువాత ఇరాన్‌లో స్వల్పకాలం అల్లర్లు, అంతర్యుద్ధాలు కొనసాగాయి. 1750లో కరీం ఖాన్ జంద్ సామ్రాజ్యస్థాపన చేసిన తరువాత ఇరాన్‌లో శాతి, సుసంప్పన్నత నెలకొన్నది. భౌగోళికంగా మునుపటి ఇరాన్ సామ్రాజ్యాలతో పోల్చితే జంద్ సామ్రాజ్యం పరిమితమైనది.కౌకాసస్ ప్రాంతంలోని పలు ప్రాంతాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. అలాగే ప్రాంతీయంగా పలు కౌకాసస్ ఖనాటేలు పలనాధికారం చేపట్టారు. అయినప్పటికీ స్వయంపాలనకు బదులుగా రాజులంతా జంద్ చక్రవర్తికి సామంతులుగా నిలిచారు.Encyclopedia of Soviet law By Ferdinand Joseph Maria Feldbrugge, Gerard Pieter van den Berg, William B. Simons, Page 457 కనాటేలు మద్య ఆసియాలోని వ్యాపార మార్గాల మద్య విదేశీ వాణిజ్యాధికారం దక్కించుకున్నారు. thumb|right|A map showing the northwestern borders of Iran in the 19th century, with the modern-day Eastern Georgia, Dagestan, Armenia, and Azerbaijan, before being ceded to the Imperial Russia by the Russo-Persian Wars ఆఘా మొహమ్మద్ ఖాన్ 1779లో కరీం ఖాన్ తరువాత మరొక అంతర్యుద్ధం చెలరేగింది. అంతర్యుద్ధం ఫలితంగా 1794లో " ఆఘా మొహమ్మద్ ఖాన్ " తలెత్తి క్వాజర్ సామ్రాజ్యస్థాపన చేసాడు. జార్జియన్ అవిధేయత, జార్జ్విస్క్ ఒప్పందంతో గార్జియన్ రష్యా కూటమి ఏర్పాటు, క్రత్సనిస్ యుద్ధంలో క్వజార్లు త్బ్లిసిని వశపరచుకోవడం మొదలైన విషయాలు రష్యన్లను కౌకాసస్‌ను విడిచిపోయేలా చేసింది. తరువాత కొంతకాలం తిరిగి ఇరానియన్ పాలన పునరుద్ధరించబడింది. 1804-1813 మద్య సంభవించిన రుస్సో-పర్షియన్ యుద్ధాలు, 1826-1828 మద్య సంభవించిన రుస్సో పర్షియన్ యుద్ధం ఫలితంగా ఇరాన్ త్రాంస్కౌకాసియా, డాగేస్థాన్ ప్రాంతాలను కోల్పోయింది. మూడు శతాబ్దాలుగా ఇరాన్‌లో భాగంగా ఉన్న ప్రాంతాలను కోల్పోవడం ఇరాన్‌ను కోలుకోలేనంతగా బాధించింది. ఇది పొరుగున ఉన్న రష్యా సామ్రాజ్యానికి తగినంత లాభం చేకూర్చింది. 19వ శతాబ్ధపు రుస్సో- పర్షియన్ యుద్ధాల ఫలితంగా రష్యన్లు కాకసస్ భూభాగం అంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ అంతర్భాగంగా ఉన్న డాగెస్థాన్, జార్జియా, అర్మేనియా, అజర్బైజన్ భూభాగాలను శాశ్వతంగా కోల్పోయింది.Farrokh, Kaveh. Iran at War: 1500-1988. ISBN 1780962215 అరాస్ నది ఉత్తరభాగంలో ప్రస్తుత అజర్బైజన్, జార్జియా, డాగెస్థాన్, అర్మేనియా 19వ శతాబ్దంలో రష్యన్లు ఆక్రమించేవరకు ఇరాన్ ఆధీనంలో ఉన్నాయి. ఇరాన్ లోని ట్రాంస్కౌకాసస్, నార్త్ కౌకాసస్ భూభాగాలను రష్యా ఆక్రమించిన తరువాత ఈ ప్రాంతాలలోని ముస్లిములు ఇరాన్ వైపు తరలి వెళ్ళారు. А. Г. Булатова. Лакцы (XIX — нач. XX вв.). Историко-этнографические очерки. — Махачкала, 2000. ఆర్మేనియన్లు కొత్తగా రూపొందించబడిన రష్యా భూభాలలో నివసించడానికి మొగ్గుచూపారు. ."Griboedov not only extended protection to those Caucasian captives who sought to go home but actively promoted the return of even those who did not volunteer. Large numbers of Georgian and Armenian captives had lived in Iran since 1804 or as far back as 1795." Fisher, William Bayne; Avery, Peter; Gershevitch, Ilya; Hambly, Gavin; Melville, Charles. The Cambridge History of Iran, Cambridge University Press – 1991. p. 339 A. S. Griboyedov. "Записка о переселеніи армянъ изъ Персіи въ наши области", Фундаментальная Электронная БиблиотекаBournoutian. Armenian People, p. 105 సమీపకాల ఆధునిక యుగం 1870-1871 మద్యకాలంలో సంభవించిన కరువులో దాదాపు 1.5 మిలియన్ల ప్రజలు (మొత్తం జనసంఖ్యలో 20-25%)మరణించారని అంచనా. thumb|The first national parliament of Iran, established in 1906 1872, 1905 మధ్య క్వాజర్కు చెందిన నాజర్ ఉద్దిన్ షా, మొజాఫర్ క్వాజర్ ఉద్దిన్ షా, విదేశీయుల అమ్మకానికి రాయితీలు ఇచ్చినందుకు ప్రతిస్పందనగా వరుస నిరసనలు ఎదురైయ్యాయి. ఈ సంఘటనలు మొదటి ఇరానియన్ రాజ్యాంగవిప్లవానికి దారితీసాయి. కొనసాగుతున్న విప్లవం ద్వారా, 1906 లో ఇరాన్ మొదటి రాజ్యాంగం ఇరాన్, మొదటి జాతీయ పార్లమెంట్ స్థాపించబడ్డాయి.. ఇరాన్ రాజ్యాంగసవరణలలో మూడు మతపరమైన అల్పసంఖ్యాకులకు (క్రైస్తవులు, జొరాస్ట్రియన్లు, యూదులు) అధికారిక గుర్తింపు ఇవ్వబడింది.Colin Brock,Lila Zia Levers. Aspects of Education in the Middle East and Africa Symposium Books Ltd, 7 mei 2007 ISBN 1873927215 p 99 అప్పటి నుండి ఇరాన్ చట్టానికి ఇవి ఆధారభూతంగా ఉన్నాయి. 1911లో మొహమ్మద్ అలీ షా ఓడించబడి పదవీచ్యుతుడు అయ్యేవరకు రాజ్యాంగ కలహాలు కొనసాగాయి. పరిస్థితి చక్కదిద్దే నెపంతో రష్యా 1911లో ఉత్తర ఇరాన్‌ను ఆక్రమించి ఆక్రమిత ప్రాంతంలో సంవత్సరాల కాలం సైన్యాలను నిలిపిఉంచింది. ప్రపంచయుద్ధం సమయంలో బ్రిటన్ ఇరాన్ లోని అధిక భూభాగం ఆక్రమించి 1921 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంది.ప్రపంచయుద్ధం మిడిల్ ఇష్టర్న్ థియేటర్‌లో భాగంగా మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఆటమిన్ దంయాత్ర కారణంగా పర్షియన్ యుద్ధం ఆరంభం అయింది. ఆటమిన్ ప్రతీకారాఫలితంగా ఇరాన్ సరిహద్దుప్రాంతాలలోని ఉర్మియా లోపల, పరిసరాలలో ఉన్న అస్సిరియన్ ప్రజలను ఆటమిన్ సైన్యం మూకుమ్మడిగా సంహరించింది.Richard G. Hovannisian. The Armenian Genocide: Cultural and Ethical Legacies. pp 270-271. Transaction Publishers, 31 dec. 2011 ISBN 1412835925Alexander Laban Hinton,Thomas La Pointe,Douglas Irvin-Erickson. Hidden Genocides: Power, Knowledge, Memory. pp 117. Rutgers University Press, 18 dec. 2013 ISBN 0813561647 అక్వా మొహమ్మద్ ఖాన్ పాలనలో క్వాజర్ పాలన ఒకశతాబ్ధకాలం అసంబద్ధ పాలనగా గుర్తించబడింది. 1921లో క్వాజర్ సామ్రాజ్యం పహలవి సామ్రాజ్యానికి చెందిన రేజా ఖాన్ చేత పడగొట్టబడింది. తరువాత రేజా ఖాన్ ఇరాన్ సరికొత్త షా అయ్యాడు. thumb|left|Mohammad Reza Pahlavi and the Imperial Family in the Coronation of the Shah of Iran, 1967 1941లో షాను ఆయన కుమారుడు మొహమ్మద్ రేజా పహలవి చేత పదవీచ్యుతుని చేసాడు. తరువాత మొహమ్మద్ రేజా పహలవి పర్షియన్ కారిడార్ స్థాపన చేసాడు. బృహత్తర సరఫరా మార్గం అయిన పర్షియన్ కారిడార్ తరువాత సంభవించిన యుద్ధం వరకు ఉనికిలో ఉంది. ఇరాన్‌లోని పలు విదేశీబృందాలు సోవియట్ యూనియన్‌తో చేరి ఇరాన్‌లో రెండు పప్పెట్ (కీలు బొమ్మ) రాజ్యాలను (అజర్బైజన్ పీపుల్స్ గవర్నమెంటు, రిపబ్లిక్ ఆఫ్ మొహబద్) స్థాపించాయి. సోవియట్ యూనియన్ ఆక్రమిత ఇరాన్ భూభాగాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. 1946 ఇరాన్ క్రైసిస్ ఫలితంగా రెండు పప్పెట్ రాజ్యాలు, సోవియట్ ఆక్రమిత ప్రాంతాల విడుదల సాధ్యం అయింది. thumb|upright|Mohammad Mosaddegh, democracy advocate and deposed Prime Minister of Iran 1951లో మొహమ్మద్ మొసడెగ్ ప్రధానమంత్రిగా ఎన్నిక చేయబడ్డాడు. పెట్రోలియం పరిశ్రమ, ఆయిల్ నిలువలు జాతీయం చేసిన తరువాత మొహమ్మద్ మొసడెగ్ ఇరాన్‌లో ప్రాంఖ్యత సంతరించుకున్నాడు. 1953లో మొహమ్మద్ మొసడెగ్ పదవి నుండి తొలగించబడ్డాడు. ఆగ్లో- అమెరికన్ కూటమితో నిర్వహించబడిన ఈ సంఘటన కోల్డ్ వార్ సమయంలో మొదటిసారిగా యు.ఎస్ విదేశీప్రభుత్వాన్ని పడగొట్టడంగా గుర్తించబడింది. ఈ సంఘటన తరువాత షా సుల్తాన్ అయ్యాడు. తరువాత ఇరాన్ ఏకచత్రాధిత్యం, సుల్తానిజం పునరుద్ధరించబడ్డాయి. తరువాత కొన్ని దశాబ్ధాలకాలం ఇరాన్- యునైటెడ్ స్టేట్స్ మరి కొన్ని విదేశీ సత్సంబంధాలు కొనసాగాయి.Nikki R. Keddie, Rudolph P Matthee. "Iran and the Surrounding World: Interactions in Culture and Cultural Politics" University of Washington Press, 2002 p 366 షా ఇరాన్‌ను మతాతీత రాజ్యంగా, ఆధునికీకరణ చేయడంలో సఫలీకృతం అయినప్పటికీ మరొకవైపు ఇరాన్‌లో రహస్యపోలీస్ చర్యలతో ఏకపక్ష ఖైదులు, హింస అధికం అయ్యాయి. ది సవక్ (ఎస్.ఎ.వి.ఎ.కె) మొత్తం రాజకీయ వ్యతిరేకతను అణిచివేసింది. అయతుల్లాహ్ రుహొల్లాహ్ ఖోమేని షా " వైట్ రివల్యూషన్ "కు క్రియాశీలక విమర్శకుడు అవడమే కాక బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఖోమేని 18 సంవత్సరాలకాలం ఖైదు చేయబడ్డాడు. 1964లో ఖోమేని విడుదల చేయబడిన తరువాత ఖోమేని బహిరంగంగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని విమర్శించాడు. షా ఖోమేనిని దేశబహిషృతుని చేసాడు. ఖోమేని మొదటిసారిగా టిబెట్ చేరి ఆతరువాత ఇరాక్ ఆతరువాత ఫ్రాంస్ చేరాడు. 1973లో ఆయిల్ ధరలు అధికరించిన సమయంలో ఇరాన్ విదేశీమారకం నిలువలు వరదలా అధికరించాయి. అందువలన ఇరాన్ ద్రవ్యోల్భణ సమస్యను ఎదుర్కొన్నది. 1974లో ఇరాన్ ఆర్ధికం రెండంకెల ద్రవ్యోల్భణం సమస్యను ఎదుర్కొన్నది. దేశంలో బృహత్తర పరిశ్రమలు ఆధునికీకరణ చేయబడ్డాయి. దేశంలో లంచగొండితనం అధికరించింది. 1970-1975 ఇరానియన్ విప్లవానికి దారితీసింది. 1975-1976 ఎకనమిక్ రీసెషన్ నిరోద్యగదమస్య అధికరించడానికి దారితీసింది. 1970 ఆర్ధికాభివృద్ధి సమయంలో మిలియన్ల కొద్దీ యువకులు ఇరాన్ నగరాలకు తరలి నిర్మాణరంగంలో పనిచేయడానికి వెళ్ళారు. 1977 లో వీరిలో అత్యధికులు షా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బహిరంగంగా విమర్శిమే వారి జాబితాలో చేరుకున్నారు. 1979 రివల్యూషన్ తరువాత thumb|upright|right|Ruhollah Khomeini returning to Iran after 14 years exile, on February 1, 1979 1979 విప్లవం తరువాత " ఇస్లామిక్ విప్లవం "గా వర్ణించబడింది.Fereydoun Hoveyda, The Shah and the Ayatollah: Iranian Mythology and Islamic Revolution ISBN 0-275-97858-3, Praeger Publishers విప్లవం 1978 లో షాకు వ్యతిరేకంగా ప్రధాన వివరణలు తరువాత మొదలైంది. ఇరానియన్ విప్లవం , ఇరానియన్ డిమాంస్ట్రేషన్లు ఆరంభం అయిన ఒక సంవత్సరం తరువాత షా దేశబహిష్కరణ , ఖోమేని ప్రవేశం జరిగాయి. షా టెహ్రాన్‌కు పారిపోగా ఖోమేని ఇరాన్‌లో ప్రవేశించాడు. 1979లో ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం రూపొందించబడింది. ఇరానియన్ రిపబ్లిక్ రెఫరెండం తరువాత 1979 ఏప్రెల్ మాసంలో ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. 1979 లో రెండవ ఇరానియన్ రిఫరెండం ద్వారా " ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ " అంగీకారం పొందింది. అతి త్వరలో దేశవ్యాప్తంగా కొత్తప్రభుత్వానికి వ్యతిరేకత తలెత్తింది. 1979 కుర్దేష్ రిబెల్లియన్, 1979 ఖుజెస్థాన్ తిరుగుబాటు, సిస్తాన్ , బలూచీస్థాన్ తిరుగుబాటు , ఇతర ప్రాంతాలలో తిరుగుబాటు మొదలైనవి తలెత్తాయి. తరువాత కొన్ని సంవత్సరాలకాలం తిరుగుబాట్లు కొనసాగాయి. కొత్త ప్రభుత్వం ఇస్లామేతర రాజకీయ ప్రత్యర్ధులను అణిచివేతకు గురిచేసింది. నేషనలిస్టులు , మార్కిస్టులు ఆరంభంలో ఇస్లాం ప్రజలతో కలిసి షాను పడగొట్టారు. తరువాత ఇస్లాం ప్రభుత్వం లక్షలాది మందిని వధించింది. 1979 నవంబర్ 4న ముస్లిం స్టూడెంట్ ఫాలోవర్స్ ఆఫ్ ది ఇమాం లైన్ " యు.ఎస్ దౌత్యకార్యాలయం మీద దాడిచేసింది. మొహమ్మద్ రేజ్ పహలవి ఇరాన్ రావడానికి మరణశిక్షను ఎదుర్కొనడానికి యు.ఎస్ నిరాకరించడంతో జిమ్మీ కార్టర్ ఇరాన్ నిర్బంధంలో ఉన్న అమెరికన్లను విడిపించడానికి చేసిన రాజీ ప్రయత్నాలు, ఆపరేషన్ ఇగల్ క్లా విఫలం కావడం రోనాల్డ్ రీగన్ అమెరికా అద్యక్షపదవికి రావడానికి కారణం అయింది. జిమ్మీ కార్టర్ చివరి అధికార దినం రోజున చివరి నిర్బంధితుడు విడుదల చేయబడ్డాడు. 1980 సెప్టెంబరు 22న ఇరాకి సైన్యం ఇరాన్ లోని ఖుజెస్థాన్ మీద దాడి చేసింది. తరువాత ఇరాన్- ఇరాక్ యుద్ధం ఆరంభం అయింది. సదాం హుస్సేన్ సైన్యాలు ఆరంభంలో ముందుకు చొచ్చుకు పోయినప్పటికీ 1982 మద్య కాలానికి ఇరాన్ సైన్యాలు విజయవంతంగా ఇరాకీ సైన్యాలను తిప్పికొట్టాయి. 1982 జూలై నాటికి ఇరాక్ స్వీయరక్షణ చేసుకొనవలసిన పరిష్తితికి చేరుకుంది. ఇరాన్ ఇరాక్ మీద దాడిచేయసంకల్పించి అనేక ప్రయత్నాల తరువాత బస్రా మొదలైన ఇరాకీ నగరాలను వశపరచుకుంది. 1988 వరకు యుద్ధం కొనసాగింది. తరువాత ఇరాకీ సైన్యం ఇరాక్ లో ఉన్న ఇరాన్ సైన్యాలను ఓడించి సరిహద్దు వరకు తిప్పికొట్టింది. తరువాత ఖోమేని ఐక్యరాజ్యసమితి నిర్ణయానికి తల ఒగ్గాడు. యుద్ధంలో 123,220–160,000 సైనికులు మరణించారు. 60,711 మంది తప్పి పోయారు. 11,000-16,000 పౌరులు మరణించారు.. thumb|Silent Demonstration – the 2009–10 Iranian election protests ఇరాన్- ఇరాక్ యుద్ధం తరువాత 1989 లో అక్బర్ హషెమి రఫ్స్తంజాని, ఆయన ప్రభుత్వం వ్యాపార అనుకూల కార్యసాధక విధానం స్థాపన చేయడానికి దృష్టికేంద్రీకరించారు. 1997లో రఫ్స్తంజానిని వెన్నంటి మొహమ్మద్ ఖటామీ ఇరాన్ సంస్కరణ ఆరద్శంతో పదవిని అలంకరించాడు. ఆయన ప్రభుత్వం దేశాన్ని అత్యంత స్వతంత్రం చేయడంలో సఫలత సాధించడంలో విఫలం అయింది. 2005 ఇరానియన్ అధ్యక్ష ఎన్నికలు పాపులిస్ట్ కంసర్వేటివ్ అభ్యర్థి మొహమ్మద్ అహ్మదెనెజాదీని అధికారపీఠం అధింష్టించేలా చేసాయి. . 2009 ఇరానియన్ అధ్యక్ష ఎన్నికలలో అహ్మదెనెజాదీ 62.63% ఓట్లను స్వంతంచేసుకోగా ప్రత్యర్థి మీర్- హుస్సేన్- మౌసవి 33.75% ఓట్ల్లతో రెండవ స్థానంలో నిలిచాడు. . 2009లో అత్యధికంగా అక్రమాలు జరిగాయని అభియోగాలు తలెత్తాయి. 2013 జూన్ 15 లో మొహమ్మద్ బఘేర్ ఘలిబాఫ్‌ను ఓడించి హాసన్ రౌహానీ అధ్యక్షుడుగా ఎన్నుకొనబడ్డాడు. కొత్త అధ్యక్షుడు హాసన్ రౌహానీ ఇతరదేశాలతో ఇరాన్ సంబంధలను అభివృద్ధి చేసాడు.Strategic Asia 2013-14: Asia in the Second Nuclear Age - Page 229, Abraham M. Denmark, Travis Tanner - 2013 భౌగోళికం ఇరాన్ 1648195 చ.కి.మీ వైశాల్యంతో ప్రపంచ 18 అతిపెద్ద దేశాల జాబితాలో ఒకటిగా ఉంది. . వైశాల్యపరంగా ఇరాన్ దాదాపు యునైటెడ్ కింగ్డం, ఫ్రాంస్, జర్మనీలకు సమానం. అలాగే యు.ఎస్ స్టేట్ అలాస్కా కంటే కొంచం అధికం. ఇరాన్ 24°-40° డిగ్రీల ఉత్తర అక్షాంశం, 44°-64° డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. వాయవ్య సరిహద్దు దేశాలుగా అజర్బైజన్ (, ఆర్మేనియా, ఉత్తర సరిహద్దులో కాస్పియన్ సముద్రం, ఈశాన్య సరిహద్దులో తుర్క్మేనిస్థాన్, తూర్పు సరిహద్దులో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, పశ్చిమ సరిహద్దులో టర్కీ, ఇరాక్ఉన్నాయి. దక్షిణంలో పర్షియాగల్ఫ్, ఓమన్ ఉన్నాయి. thumb|left|Mount Damavand, Iran's highest point, is located in Amol County, Mazanderan. ఇరాన్ లోని ఇరాన్ పీఠభూమి కాస్పియన్ సముద్రం నుండి ఖుజెస్థాన్ వరకు విస్తరించి ఉంది. ఇరాన్ ప్రపంచంలోని అత్యధిక పర్వతప్రాంతం కలిగిన దేశాలలో ఒకటిగా ప్రత్యేకత కలిగి ఉంది. ఇరాన్ భూభాంలో కఠినమైన పర్వతభాగం ఆధిక్యత కలిగి ఉంది. పర్వభూభాగం పలు నదీప్రవాహాలను, పీఠభూములను ఒకదానితో ఒకటి వేరుచేస్తూ ఉంటుంది. జనషాంధ్రత అధికంగా కలిగిన పశ్చిమభూభాగంలో కౌకాసస్ పర్వతాలు, జాగ్రోస్ పర్వతాలు, అల్బోర్జ్ పర్వతాలు (ఇది ఇరాన్‌లో అత్యధిక ఎత్తైన పర్వతశిఖరం) వంటి పర్వతభాగం అధికంగా ఉంది. హిందూఖుష్ పశ్చిమ భాగంలో ఉన్న దామావంద్ పర్వతం యురేషియాలో ఎత్తౌనభూభాగంగా గుర్తించబడుతుంది. ఇరన్ ఉత్తరభాగంలో జంగిల్స్ ఆఫ్ ఇరాన్ అని పిలువబడుతున్న దట్టమైన వర్షాఫ్హారారణ్యాలు ఉన్నాయి. తూర్పుభూభగంలో దష్త్ ఇ కవిర్ (ఇరాన్ లోని అతివిశాలమైన ఎడారి), దష్త్ ఇ లట్ వంటి ఎడారి భూభాగం ఉంది. అలాగే ఉప్పునీటి సరసులు కూడా ఉన్నాయి. అత్యంత ఎత్తుగా ఉన్న పర్వతభూగాలు ఈ భూభాలకు నీరు లభ్యం కావడానికి అడ్డుగా ఉన్నందున ఇవి ఎడారులుగా మారాయి. కాస్పియన్ సముద్రతీరంలో మాత్రమే మైదానభూభాగం ఉంది. పర్షియన్ సముద్రతీరంలో చిన్న చిన్న మైదానాలు ఉన్నాయి. వాతావరణం thumb|Climate map of Iran (Köppen-Geiger) ఇరాన్ కాస్పియన్ సముద్రతీరం జంగిల్స్ ఆఫ్ ఇరాన్ వెంట వాతావరణం ఎడారి వాతావరణం లేక సెమీ అరిడ్ నుండి ఉప ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఉత్తరతీరంలో అరుదుగా ఉష్ణోగ్రత ఫ్రీజింగ్ స్థాయికంటే తక్కువగా ఉంటుంది అలాగే మిగిలిన సమయాలలో తడివాతావరణం ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత అరుదుగా 29° డిగ్రీల సెల్షియస్ దాటుతుంది. వర్షపాతం వార్షిక వర్షపాతం తూర్పు మైదానంలో 680 అంగుళాలు, పశ్చిమ భాగంలో 700 అంగుళాలు ఉంటుంది. జాగ్రోస్ ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత, అధికమైన హిమపాతం ఉంటుంది. మద్య, తూర్పు భాగాలలో పొడివాతావరణం ఉంటుంది. ఇక్కడ వర్షపాతం 200 అంగుళాలకంటే తక్కువగా ఉంటుంది. వేసవి వేసవి ఉష్ణోగ్రత 38° డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. పర్షియన్ సముద్రతీరం, గఫ్ ఆఫ్ ఓమన్ భాగాలలో స్వల్పమైన శీతాకాలం,అత్యంత వేడి, తేమ కలిగిన వాతావరణం ఉంటుంది. వార్షిక వర్షపాతం 135 అంగుళాలు ఉంటుంది. వృక్షజాలం , జంతుజాలం thumb|left|Persian Leopard, an endangered species living primarily in Iran ఇరాన్‌లో తోడేలు, హరిణాల, అడవి పంది, ఎలుగుబంట్లు సహా నక్కలు, చిరుతపులి, యురేషియా లినక్స్, నక్కలు మొదలైన జంతుజాలం ఉంది. ఇరాన్‌లో గొర్రెలు, పశువులు, గుర్రాలు నీటిగేదెలు, గాడిదలు, ఒంటేలు పెంపుడుజంతువులుగా పోషించబడుతున్నాయి. నెమలి, వేపక్షులు, కొంగ, గ్రద్ద, ఫాల్కన్స్ కూడా ఇరాన్ స్థానిక వన్యప్రాణులుగా ఉంటాయి. ఇరాన్ లోని జంతువులలో అంతరించిపోతున్న ఆసియన్ చిరుతపులి ఒకటి. దీనిని ఇరాన్ చిరుత అని కూడా అంటారు. వీటి సంఖ్య 1979 నుండి తగ్గుముఖం పడుతూ ఉంది. ఇరాన్ లోని ఆసియన్ సింహాలన్ని అంతరించిపోయాయి. 20వ శతాబ్ధపు ఆరంభకాలంలో కాస్పియన్ పులి జీవించి ఉంది. ఇరన్‌లో " ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కంసర్వేషన్ ఆఫ్ నేచుర్" రెండ్ లిస్ట్ లోని 20 జాతుల జంతువులు ఉన్నాయి. ఇది ఇరాన్ పర్యావరణానికి రహస్య బెదిరిపు అని భావిస్తున్నారు. ఇరానియన్ పార్లమెంటు పర్యావరణాన్ని అలక్ష్యం చేస్తూ అపరిమితంగా గనులు త్రవ్వకానికి, అభివృద్ధి పనులకు అనుమతి ఇస్తుంది. ప్రాంతాలు,భూభాగాలు , నగరాలు ఇరాన్ ఇరాన్ ప్రాంతాలుగా విభజించబడింది. ఇరాన్ 31 ప్రంతాలుగా (ఓస్టన్) విభజించబడింది. ఒక్కొక ప్రాంతానికి ఒక్కొక గవర్నర్ (ఒస్తాందార్) నియమించబడతాడు. ప్రాంతాలను కౌటీలుగా విభజిస్తారు. కౌంటీలను జిల్లాలు (బక్ష్), సబ్ జిల్లాలు (దేహెస్తాన్) గా విభజిస్తారు. ప్రపంచంలో నగరప్రాంతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇరాన్ ఒకటి. 1950-2002 ఇరాన్ నగరప్రాంత జనసంఖ్య 27% నుండి 60% నికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి ఇరాన్‌లో 2030 నాటికి 80% ప్రజలు నగరప్రాంతనివాసితులు ఔతారని అంచనా వేస్తుంది. 2006-2007 ఇరాన్ గణాంకాలను అనుసరించి దేశీయ వలసప్రజలు తెహ్రాన్, ఇస్ఫహన్, అహ్వజ్, క్వాం నగరాల సమీపాలలో నివసిస్తున్నారని అంచనా. ఇరాన్ లోని అతిపెద్ద నగరం, ఇరాన్ రాజధాని తెహ్రాన్ జనసంఖ్య 7,705,036. మిగిలిన పెద్ద నగరాల మాదిరిగా తెహ్రాన్ కూడా జసంఖ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నది. ముస్సద్ జనసంఖ్య 2,410,800. ఇది ఇరాన్ పెద్ద నగరాలలో ద్వీతీయస్థానంలో ఉంది. ఇది రెజవి ఖొరసన్ రాజధాని. ఇది ప్రంపంచంలోని షియాల పవిత్రనగరాలలో ఒకటి. ఇక్కడ " ఇమాం రెజా మందిరం " ఉంది. ప్రతి సంవత్సరం ఇమాం రెజా మందిరం సందర్శించడానికి 15-20 మిలియన్ల యాత్రికులు వస్తుంటారు. ఇది ఇరాన్ పర్యాటకకేంద్రాలలో ఒకటి. ఇరాన్ ప్రధాన నగరాలలో 1,583,609 జనసంఖ్య కలిగిన ఇస్ఫహాన్ ఒకటి. ఇది ఇస్ఫహాన్ ప్రాంతంలో " నక్వష్-ఇ-జహన్ స్క్వేర్ " ఉంది. నక్వష్-ఇ-జహన్ స్క్వేర్ ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. నగరంలో 11-19వ శతాబ్ధానికి చెందిన విస్తారమైన ఇస్లామీయ భవనాలు ఉన్నాయి. నగరం చుట్టూ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న కారణాంగా ఇస్ఫహాన్ ఇరాన్ ప్రధాన నగరాలలో జనసంఖ్యాపరంగా మూడవ స్థానానికి చేరింది. ఇస్ఫహాన్ మహానగర వైశాల్యం 1,430,353 చ.కి.మీ. ఇరాన్ ప్రధాన నగరాలలో 1,378,935 జనసంఖ్య కలిగిన తబ్రిజ్ నగరం నాలుగవ స్థానంలో ఉంది. ఇది తూర్పు అజర్బైజన్ ప్రాంతానికి రాజధానిగా ఉంది. ఇది ఇరాన్ రెండవ పారిశ్రామిక నగరంగా ఉంది. మొదటిస్థానంలో తెహ్రాన్ ఉంది. 1960 వరకు తబ్రిజ్ ఇరాన్ ప్రధాన నగరాలలో రెండవ స్థానంలో ఉండేది. ఇది మునుపటి ఇరాన్ రాజధానులలో ఒకటి. క్వాజర్ రాజకుటుంబం నివాసిత నగరం ఇదే. ఇరాన్ సమీపకాల చరిత్రలో ఈ నగరం ప్రాధాన్యత వహించింది. ఇరాన్ ప్రధాన నగరాలలో 1,377,450 జనసంఖ్య కలిగిన కరాజ్ నగరం ఐదవ స్థానంలో ఉంది. ఇది అల్బోర్జ్ ప్రాంతంలో ఉంది. ఇది తెహ్రాన్‌కు 20కి.మీ దూరంలో అల్బోర్ఝ్ పర్వతపాదాల వద్ద ఉంది. అయినప్పటికీ ఈ నగరం తెహ్రాన్ పొడిగింపుగా ఉంటుంది. ఇరాన్ ప్రధాన నగరాలలో 1,214,808 జనసంఖ్య కలిగిన షిరాజ్ నగరం ఆరవ స్థానంలో ఉంది. ఇది ఫార్స్ ప్రాంతంలో ఉంది. మొదటి బాబిలోన్ సంస్కృతికి ఈ ప్రాంతాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. క్రీ.పూ 9వ శతాబ్దం పురాతనకాల పర్షియన్లు ఇక్కడ నివసిస్తున్నారు. క్రీ.పూ 6వ శతాబ్దంలో వీరు అచమెనింద్ సామ్రాజ్యంలో పెద్ద రాజ్యాలకు పాలకులుగా ఉన్నారు. అచమెనింద్ సామ్రాజ్యానికి చెందిన నాలుగు రాజధానులలో రెండు (పెర్సిపోలీస్, పాసర్గాడే) షిరాజ్ సమీపంలో ఉన్నాయి. అచమెనింద్ సామ్రాజ్యానికి పెర్సిపోలీస్ ఉత్సవకేంద్రంగా ఉండేది. ఇది ఆధునిక షిరాజ్ నగరానికి సమీపంలో ఉంది. 1979లో " సిటాడెల్ ఆఫ్ పెర్సిపోలీస్ "ను యునస్కో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించింది. ఆర్ధికం thumb|270px|Provinces of Iran by contribution to national GDP in 2014. thumb|270px|Provinces of Iran by GDP per capita in 2012. ఇరాన్ ప్రభుత్వం ఆధీనంలో ఆయిల్ , బృహత్తర పరిశ్రమలు ఉంటాయి. గ్రామీణ వ్యవసాయం , చిన్న తరహా పరిశ్రమలు , ఇతర సేవాసంస్థలు ప్రజల పైవేట్ యాజమాన్యంలో ఉంటాయి. 2014లో ఇరాన్ జి.డి.పి. 404.1 బిలియన్ల అమెరికన్ డాలర్లు. తలసరి కొనుగోలు శక్తి 17,000 అమెరికన్ డాలర్లు. ప్రపంచ బ్యాంక్ ఇరాన్‌ను ఎగువ- మధ్యతరగతి ఆర్ధికశక్తిగా వర్గీకరించింది. 21వ శతాబ్దంలో సేవారంగం జి.డి.పి.లో అధికభాగానికి భాగస్వామ్యం వహించింది. తరువాత స్థానాలలో గనుల పరిశ్రమ , వ్యవసాయం ఉన్నాయి. Iran Investment Monthly . Turquoise Partners (April 2012). Retrieved 24 July 2012. " ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ " ఇరాన్ అభివృద్ధి పనులకు బాధ్యత వహిస్తుంది. ఇరాన్ కరెంసీకి కూడా బాధ్యత వహిస్తుంది. ట్రేడ్ యూనియన్లను గుర్తించడం లేదు. ఉద్యోగుల నియామసం , రక్షణ బాధ్యత వహిస్తున్న " ఇస్లామిక్ లేబర్ కౌంసిల్ "కు మాత్రం ప్రభుత్వ గుర్తింపు ఉంది. 2013 గణాంకాలను అనుసరించి 487 మిలియన్ల రియాల్స్ (134 అమెరికన్ డాలర్లు) 1997 గణాంకాలను అనుసరించి ఇరాన్‌లో నిరుద్యోగం 10% ఉండేది. స్త్రీల నిరుద్యోగం పురుషుల నిరుద్యోగం రెట్టింపు ఉండేది.2006లో 41% ప్రభుత్వ ఆర్ధిక ప్రణాళిక వ్యయం ఆయిల్ , సహవాయువు ఉత్పత్తి నుండి లభించగా 31% పన్నువిధింపు ద్వారా లభిస్తుంది. 2007 గణాంకాలను అనుసరించి ఇరాన్ 70 మిలియన్ల విదేశీమారకం సంపాదించింది. ఇందులో 80% క్రూడాయిల్ అమ్మకం ద్వారా లభించింది. . ఇరానియన్ లోటు బడ్జెట్ ఒక చారిత్రాత్మక సమస్య. 2010లో " ఇరానియన్ ఎకనమిక్ రిఫార్ం ప్లాన్ "కు పార్లమెంటు అనుమతి లభించింది. 5-సంవత్సరాల ఫ్రీ మార్కెట్ ప్రైసెస్ , ఉత్పత్తి అధికరించడం , సోషల్ జస్టిస్‌కు ప్రభుత్వం అడ్డుచెప్తుంది. ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలను కొనసాగిస్తూనే ఉంది. ఇది అయిల్ సంబంధిత ఆదాయం వైవిధ్యమైన రంగాలకు తరలించబడుతుందని సూచిస్తుంది. ఇరాన్ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ , ఔషధతయారీ రంగాలమీద దృష్టిసారించింది. అయినప్పటికీ జాతీయం చేయబడిన బాన్యాద్ సంస్థ నిర్వహణ బలహీనంగా ఉండడం దానిని అశక్తతకు గురిచేయడమే కాక సంవత్సరాల తరబడి పోటీ ఎదుర్కొనడంలో అసఫలం ఔతుంది. ప్రభుత్వం పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది. విజయాలతో ఇరాన్ లంచగొండితనం , పోటీకి నిలవలేక పోవడం మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నది. ప్రపంచ పోటీలో ఇరాన్ 139 దేశాలలో 69వ స్థానంలో ఉందని అంచనా. కార్ తయారీ , ట్రాంపోర్టేషన్, నిర్మాణం సంబంధిత వస్తూత్పత్తి, గృహోపకరణాలు, ఆహారం , వ్యవసాయ ఉత్పత్తులు, ఆయుధాలు, ఔషధాలు, సమాచారం సాంకేతికత, విద్యుత్తు పెట్రో కెమికల్స్ ఉత్పత్తిలో మిడిల్ ఈస్ట్ దేశాలలో ఇరాన్ ఆధిక్యత సాధించింది. . 2012లో " ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ " నివేదికలు అనుసరించి చెర్రీ, సౌ చెర్రీ, కుకుంబర్ , ఘెర్క్న్, ఖర్జూరం, వంకాయ మొక్కలు, కామన్ ఫిగ్, పిస్టాచియోస్, క్వింస్, వాల్నట్ , పుచ్చకాయలు మొదలైన ఉత్పత్తులలో ప్రపంచదేశాలలో మొదటి ఐదు దేశాలలో ఇరాన్ఒకటిగా ఉందని గుర్తించింది. ఇరాన్ వ్యతిరేకంగా " ఎకనమిక్ శాంక్షన్లు " (ప్రధానంగా క్రూడ్ ఆయిల్ మీద అంక్షలు) ఇరాన్ ఆర్ధికరంగాన్ని దెబ్బతీస్తున్నాయి. అంక్షలు కారణంగా 2013లో అమెరికన్ డాలర్‌కు బదులుగా రియాల్ విలువ పతనం కావడానికి కారణం అయింది. 2013 కు ముందు ఒక అమెరికన్ డాలర్ విలువ 16,000 రియాన్లు ఉండగా అంక్షలు తరువాత 36,000 రియాన్లకు పతనం అయింది.Kutsch, Tom. (15 July 2015) "Iran's elites likely to benefit most from sanctions relief". Aljazeera America. Retrieved 15 July 2015. Aljazeera America website పర్యాటకం thumb|Over 1 million tourists visit Kish Island each year.http://www.nytimes.com/2002/04/15/world/kish-journal-a-little-leg-a-little-booze-but-hardly-gomorrah.html ఇరాక్తో యుద్ధం కారణంగా ఇరాన్ పర్యాటకరం క్షీణించినప్పటికీ తరువాత తగినంత కోలుకున్నది. 2004లో 1,659,000 పర్యాటకులు ఇరాన్‌ను సందర్శించారు. 2009లో 2.3 మిలియన్ పర్యాటకులు ఇరాన్‌ను సందర్శించారు. మద్య ఆసియా రిపబ్లిక్కుల నుండి పర్యాటకులు అధికంగా వస్తున్నారు. యురేపియన్ యూనియన్ , ఉత్తర అమెరికా నుండి 10% పర్యాటకులు వస్తున్నారు.Iran hosted 2.3 million tourists this year. PressTV, March 19, 2010. Retrieved March 22, 2011. ఇరాన్ లోని ఇస్ఫహన్, మస్సద్ , షిరాజ్ నగరాలు పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్నాయి.Sightseeing and excursions in Iran . Tehran Times, September 28, 2010. Retrieved March 22, 2011. 2000 లో నిర్మాణరంగం, కమ్యూనికేషన్, ఇండస్ట్రీ స్టాండర్స్ , వ్యక్తిగత శిక్షణ తీవ్రమైన పరిమితులను ఎదుర్కొన్నది. 2003లో 3,00,000 ఆసియన్ ముస్లిములకు మస్షద్ , క్వాం (పవిత్ర యాత్రకు) సందర్శించడానికి టూరిస్ట్ వీసాలు మంజూరు చేయబడ్డాయి. జర్మనీ, ఫ్రాంస్ , ఇతర యురేపియన్ దేశాల నుండి వార్షికంగా ఆర్కియాలజీ ప్రాంతాలు , స్మారకచిహ్నాల సందర్శనకు ఆర్గనైజ్డ్ టూర్స్ ద్వారా పర్యాటకులు వస్తుంటారు. 2003లో అంతర్జాతీయ గణాంకాలను అనుసరించి పర్యాట ఆదాయంలో ఇరాన్ 68వ స్థానంలో ఉంది.Iran ranks 68th in tourism revenues worldwide . Payvand/IRNA, September 7, 2003. Retrieved February 12, 2008. యునెస్కో గణాంకను అనుసరించి " 10 మోస్ట్ టూరిస్ట్ కంట్రీస్ "లో ఇరాన్ ఒకటి అని తెలియజేస్తున్నాయి. దేశీయ పర్యాటకంలో ఇరాన్ ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. ప్రచారంలో బలహీనత రాజకీయ అస్థిరత ప్రంపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలలో అపోహ, పర్యాటకరంగంలో ప్రణాళికల బలహీనత ఇరాన్ పర్యాటకరంగాన్ని బలహీనపరుస్తుంది. విద్యుత్తు thumb|Iran holds 10% of the world's proven oil reserves and 15% of its gas. It is OPEC's second largest exporter and the world's fourth oil producer. ఇరాన్ సహజ వాయు వనరులలో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉంది. ఇరాన్ సహజవాయు ప్రమాణం 33.6 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు. సహజ వాయు ఉతపత్తిలో ఇరాన్ మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో రష్యా, ఇండోనేషియా ఉన్నాయి. ఆయిల్ నిలువలో ఇరాన్ 4 వ స్థానంలో ఉంది. 153,600,000,000 బ్యారెల్ ఆయిల్ నిలువ ఉంటుందని అంచనా. ఇరాన్, చమురు ఎగుమతులలో ఓ.పి.ఇ.సి. దేశాల్లో కెల్లా ద్వితీయ స్థానంలో ఉంది. 2005లో ఇరాన్ 4 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఫ్యూయల్ దిగుమతి చేసుకుంది. 1975లో ఒకరోజుకు 6 మిలియన్ బ్యారెల్ ఉత్పత్తి జరిగింది. 2000 నాటికి సాంకేతిక లోపం, మౌలిక వసతుల కొరత కారణంగా 2005లో ఆయిల్ ఉత్పత్తి కనీస స్థాయికి దిగజారింది. 2005 లో ఎక్స్ప్లొరేటరీ ఆయిల్ వెల్స్ త్రవ్వబడ్డాయి. 2004లో ఇరాన్‌లో హైడ్రో ఎలెక్ట్రిక్ స్టేషన్లు, కోయల్, ఆయిల్ - ఫైర్డ్ స్టేషన్లు అధికం అయ్యాయి. అవి మొత్తంగా 33,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసాయి. విద్యుత్తు ఉత్పత్తి కొరకు 75% సహజవాయువును ఉపయోగిస్తుండగా, 18% ఆయిల్ ఉపయోగించబడుతుంది, 7% హైడ్రో ఎలెక్ట్రిక్ ఉత్పత్తి చేయబడుతుంది. 2004లో ఇరాన్ మొదటిసారిగా పవన విద్యుత్తు, జియోథర్మల్ ఉత్పత్తి, మొదటి సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఆరంభించింది. గ్యాస్- టు- లిక్విడ్ టెక్నాలజీ ఉపయోగించిన దేశాలలో ఇరాన్ మూడవ స్థానంలో ఉంది. అధికరిస్తున్న పరిశ్రమల కారణంగా 8% విద్యుత్తు అవసరం అధికం అయిందని గణాంకాలు సూచిస్తున్నాయి. న్యూక్లియర్, హైడ్రో ఎలెక్ట్రిక్ ప్లాంటులు స్థాపించడం ద్వారా 53,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరాలని ఇరాన్ ఆసించింది. విద్య upright|thumb|An 18th century Persian astrolabe ఇరాన్‌లో విద్య అధికంగా కేద్రీకృతం చేయబడ్డాయి. " కె-12 ఎజ్యుకేషన్" మిసిస్ట్రీ ఆఫ్ ఎజ్యుకేషన్ " పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఉన్నత నిద్య " మినిస్ట్రీ ఆఫ్ సైన్సు రీసెర్చ్ అండ్ టెక్నాలజీ " పర్యవేక్షణలో పనిచేస్తుంది. 2008 గణాంకాలను అనుసరించి వయోజన అక్షర్యత 85%. 1976లో ఇది 36.5% ఉండేది. హైస్కూల్ డిప్లోమో అందిన తరువాత జాతీయ విశ్వవిద్యాలయం ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత అయిన తరువాత ఉన్నత విద్యకు అర్హత పొందవచ్చు. ఇరానియన్ యూనివర్శిటీ ఎంట్రెంస్ ఎగ్జాంస్ (కాంకర్), ఇది యు.ఎస్ ఎస్.ఎ.టి ఎగ్జాం లాంటిది. అధికంగా విద్యార్ధులు 1-2 సంవత్సరాల " యూనివర్శిటీ- ప్రిపరేషంస్- స్కూల్ప్రి- యూనివర్శిటీ " చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇది " జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ జ్యుకేషన్, బకలౌరేట్‌కు సమానం. ప్రి యూనివర్శిటీ కోర్స్ పూర్తిచేసిన తరువాత విద్యార్థులు ప్రీ యూనివర్శిటీ సర్టిఫికేట్ సంపాదిస్తారు. ఉన్నత విద్య వైవిధ్యమైన స్థాయిలో డిప్లొమాలను అందిస్తుంది. రెండుసంవత్సరాల ఉన్నత విద్య తరువాత కర్దాని (ఫాక్వా ఇ డిప్లొమా) విడుదల చేయబడుతుంది. 4 సంవత్సరాల ఉన్నత విద్య తరువాత కర్సెనాసి (బ్యాచిలర్ డిగ్రీ) విడుదల చేయబడుతుంది. దీనిని లికాంస్ అని కూడా అంటారు. తరువాత 2 సంవత్సరాల అనంతరం కర్సెనాసి ఇ అర్సద్ (మాస్టర్ డిగ్రీ) విడుదల చేయబడితుంది. తరువాత మరొక ప్రవేశపరీక్ష తరువాత పి.హెహ్.డి (డాక్టర్ డిగ్రీ) విడుదల చేయబడుతుంది." వెబొమెట్రిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్శిటీ " నివేదిక అనుసరించి దేశంలోని విశ్వవిద్యాలయాలలో తెహ్రాన్ యూనివర్శిటీలు 468వ స్థానంలో ఉంది, తెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైంసెస్ 612వ స్థానంలో ఉంది, ఫెర్డోసీ యూనివర్శిటీ ఆఫ్ మస్సద్ 815వ స్థానంలో ఉంది. 1966- 2004 మద్య ఇరాన్ ప్రచురణా వ్యవస్థ 10 రెట్లు అభివృద్ధి చెంది ఔట్ పుట్ గ్రోత్‌లో ప్రథమ స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఎస్.సి.ఇమాగో అనుసరించి 2018 నాటికి పరిశోధనలలో ఇరాన్ ప్రంపంచంలో 4వ స్థానానికి చేరుకుంటుందని అంచనా. thumb|200px|Safir (rocket). Iran is the 9th country to put a domestically built satellite into orbit and the sixth to send animals in space. 2009లో ఎస్.యు.ఎస్.ఇ. లినక్స్ - ఆధారిత హెచ్.పి.సి విధానం ఎయిరోస్పేస్ రీసెర్చి ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇరాన్ ద్వారా రూపొందించబడింది. సురేనా 2 రొబోట్‌ను యూనివర్శిటీ ఆఫ్ తెహ్రాన్ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించారు. ది ఇంస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలెక్ట్రానిక్స్ రూపొందించిన సురేనా ప్రపంచంలోని ఐదు ప్రముఖ రొబోట్లలో ఒకటిగా భావించబడుతుంది. ] ఇరాన్ బయోమెడికల్ సైంసెస్‌లో " ఇంస్టిట్యూట్ ఆఫ్ బయోకెమెస్ట్రీ అండ్ బయోఫిజిక్స్ " యునెస్కో గుర్తింపు పొందింది. 2006లో ఇరానియన్ పరిశోధకులు " సోమాలిక్ సెల్ న్యూక్లియర్ ట్రాంస్ఫర్ " విధానం ద్వారా తెహ్రాన్ లోని రాయన్ రీసెర్చ్ సెంటర్‌లో విజయవంతంగా క్లోనింగ్ విధానం ద్వారా ఒక గొర్రెను సృష్టించారు. డేవిడ్ మొర్రిసన్, అలి ఖాదెం హుస్సైనీ అధ్యయనం అనుసరించి ఇరాన్ స్టెం సెల్ రీసెర్చ్ ప్రంపంచంలో 10 అత్యుత్తమ పరిశోధనలలో ఒకటి అని తెలుస్తుంది. ఇరాన్ నానో టెక్నాలజీలో ఇరాన్ ప్రపంచంలో 15వ స్థానంలో ఉందని భావిస్తున్నారు. 2009 ఫిబ్రవరి 2న ఇరాన్‌లో తయారుచేయబడిన ఉపగ్రాహాన్ని 1979లో రివల్యూషన్ 30వ వార్షికోత్సవం సందర్భంలో కక్ష్యలో ప్రవేశపెట్టారు. దేశీయంగా తయారుచేసిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన దేశాలలో ఇరాన్ 7వ స్థానంలో ఉంది.1950 ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ప్రారంభించబడింది. యూరైడ్ ఉతపత్తి, న్యూక్లియర్ ఫ్యూఉఅల్ సైకిల్ పూర్తిగా నియంత్రించడంలో ఇరాన్ ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఇరానియన్ పరిశోధకులు ఇరాన్ వెలుపల కూడా ప్రధాన పరిశోధనలో పాల్గొంటున్నారు. 1960లో అలి జవన్ గ్యాస్ లేజర్ సృష్టించిన పరిశోధకులలో ఒకడుగా గుర్తించబడ్డాడు. లోట్ఫి జడేహ్ " ఫ్యూజీ సెట్ తెరఫీ "ని కనిపెట్టాడు. ఇరానియన్ కార్డియాలజిస్ట్ టాఫీ ముస్సివంద్ కృత్రిమ కార్డియల్ పంప్‌ను కనిపెట్టి అభివృద్ధి చేసాడు. శామ్యుయేల్ రాహ్బర్ డయాబిటీస్ చికిత్సా విధానం రూపొందించాడు. స్ట్రిగ్ థియరీలో ఇరానియన్ ఫిజిక్స్ శక్తివంతంగా ఉంది. ఇరానియన్ పరిశోధకులు పలు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఇరానియన్ - అమెరికన్ స్ట్రింగ్ థియరిస్ట్ కంరాన్ వఫా ఎడ్వర్డ్ విట్టెన్‌తో కలిసి " వఫా- విట్టెన్ థియోరెం " ప్రతిపాదించాడు. 2014 ఆగస్టులో మర్యం మీర్ఖాని మాథమెట్క్స్ ఉన్నత పురస్కారం అందుకున్న మొదటి ఇరానియన్, మొదటి మహిళగా గుర్తించబ డింది. గణాంకాలు thumb|270px|Provinces of Iran by population in 2014. thumb|270px|Provinces of Iran by population density in 2013. పలు మతాలు, సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న దేశం ఇరాన్. అందరినీ సమైక్యంగా పర్షియన్ సంస్ఖృతిలో భాగస్వామ్యం వహిస్తున్నారు. సమీపకాలంగా ఇరాన్ జననాలశాతం గణనీయంగా క్షీణిస్తూ ఉంది. ఇరాన్ శరణార్ధులకు అభయం ఇవ్వడంలో ప్రంపంచంలో ప్రథమస్థానంలో ఉంది. ఇరాన్‌లో 1 మిలియంకంటే అధికమైన శరణార్ధులు నివసిస్తున్నారు. వీరిలో అధికంగా ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ దేశాలకు చెందినవారు ఉన్నారు. 2006 నుండి ఇరానియన్ అధికారులు యు.ఎన్.హెచ్.సి.ఆర్ కొరకు పనిచేస్తున్నారు. ఆఫ్ఘన్ అధికారులు వారి స్వదేశానికి పనిచేస్తున్నారు. ఇరాన్ గణాంకాలను అనుసరించి 5మిలియన్ ఇరానీయులు విదేశాలలో పనిచేస్తున్నారని భావిస్తున్నారు. ఇరానియన్ రాజ్యాంగ నియమాలను అనుసరించి ఇరాన్ ప్రభుత్వం ప్రతి ఇరానియన్ పౌరుడు సోషల్ సెక్యూరిటీ,రిటైర్మెంట్, నిరోద్యోగం, వృద్ధాఒయం, అశక్తత, విపత్తులు, ఆపదలు, ఆరోగ్యం, వైద్య చికిత్స, సంరక్షణాసేవలు మొదలైన సౌకర్యాలను కలిగిస్తుంది. భాషలు ప్రజలలో అత్యధికులు పార్శీభాషను మాట్లాడుతుంటారు. పర్షియన్ భాష ఇరాన్ అధికారిక భాషగా ఉంది. ఇండో- యురేపియన్, ఇతర సంప్రదాయాలకు చెందిన భాషలు కూడా ఇరాన్‌లో వాడుకలో ఉన్నాయి. దక్షిణ ఇరాన్‌లో ల్యూరీ, లారీ భాషలు వాడుకలో ఉన్నాయి. ఉత్తర ఇరాన్‌లోని గిలాన్, మజందరన్ ప్రాంతాలలో గిలకి, మజందరానీ భాషలు వాడుకలో ఉన్నాయి. ఇవి పర్షియన్, ఇతర ఇరానియన్ భాషల యాసలతో చేర్చి మాట్లాడబడుతున్నాయి. ఇవి రెండు పొరుగున ఉన్న కౌకాససియన్ భాషలతో ప్రభావితమై ఉన్నాయి. కుర్ధిస్థాన్ ప్రాంతంలో దాని సమీపప్రాంతాలలో కుర్ధిష్ భాషలు అధికంగా వాడుకలో ఉన్నాయి. ఖుజెస్థాన్‌లో పర్షియన్ భాషలు వాడుకలో ఉన్నాయి. అదనంగా గిలాన్, తాలుష్ అధికంగా వాడుకలో ఉన్నాయి. ఇవి పొరుగున ఉన్న అజబైజాన్ ప్రాంతంలో కూడా విస్తరించి ఉన్నాయి. టర్కిక్ భాషలలో అజర్బైజనీ భాష అధికంగా వాడుకలో ఉంది. ఇది ఇరాన్ అధికారిక భాష పర్షియన్ భాషకు తరువాత స్థానంలో ఉంది. Annika Rabo,Bo Utas. The Role of the State in West Asia Swedish Research Institute in Istanbul, 2005 ISBN 9186884131 ఇరానీ అజర్బైజనీ, ఖుజస్థానీ అరబిక్ భాషలు ఖుజస్థానీ అరబ్బులకు వాడుకలో ఉన్నాయి. ఆర్మేయిన్, జార్జియన్, నియో- అరామియాక్ భాషలు అల్పసఖ్యాక ప్రజలకు వాడుకలో ఉన్నాయి. సికాషియన్ భాష సికాషియన్ ప్రజలలో వాడుకలో ఉండేది. కానీ పలుసంవత్సరాల కాలం గడిచిన తరువాత ప్రజలు ఇతర భాషలకు అలవాటుపడిన కారణంగా ప్రస్తుతం సికాషియన్ భాష మాట్లాడే ప్రజలసంఖ్య చాలావరకు తగ్గింది. Encyclopedia of the Peoples of Africa and the Middle East Facts On File, Incorporated ISBN 143812676X p 141 Excerpted from: భాషాప్రాతిపదిక రాజకీయాల కారణంగా భాషాపరంగా జనసంఖ్యను నిర్ణయించడంలో వాదోపవాదాలు ఉన్నాయి. అధికంగా అత్యధిక వాడుకలో ఉన్న ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్న భాషలు (పర్షియన్, అజర్బైజన్) గౌరవించబడుతున్నాయి. సి.ఐ.ఎ వరల్డ్ ఫాక్ట్ బుక్ అనుసరించి పర్షియన్లు 53%,అజర్బైజన్లు 16%,ఖుర్దిష్ 10%, మజందరానీ, గిలకీ 7%, ల్యూరీ 7%, అరబిక్ 2%, టర్క్మెనీ 2%, బలోచీ 2%, అర్మేనియన్, జార్జియన్, నియో-అరమియాక్, చిర్కాషియన్ భాష% ఉంటుందని భావిస్తున్నారు. సంప్రదాయ ప్రజలు ఇరాన్ సంప్రదాయ ప్రజలశాతం గురించిన వాదోపవాదాలు ఉన్నాయి. అధికంగా ప్రథమ ద్వితీయ స్థానాలలో ఉన్న పర్షియన్, అజర్బైజనీ సంప్రదాయాలు గౌరవించబడుతున్నాయి. ఇరానియన్ గణాంకాలు బలహీనంగా ఉన్నందున ది వరక్డ్ ఫాక్ట్ బుక్ ఆధారంగా ఇరానియన్ భాషలు మాట్లాడుతున్న ప్రోటో-ఇండో-యురేపియన్, ఎత్నోలింగ్స్టిక్ ప్రజలు 79% ఉంటారని భావిస్తున్నారు.J. Harmatta in "History of Civilizations of Central Asia", Chapter 14, The Emergence of Indo-Iranians: The Indo-Iranian Languages, ed. by A. H. Dani & V.N. Masson, 1999, p. 357 పర్షియన్ ప్రజలలో మజందరాని, గిలకి ప్రజలు, 61%, కుర్దిష్ ప్రజలు 10%, ల్యూరీ ప్రజలు 6%, బలోచీ ప్రజలు 2% ఉన్నారు. మిగిలిన 21%లో ఇతర సంప్రదాయ ప్రజలలో అజబైజనీ ప్రజలు 16%, అరబ్ ప్రజలు 2%, తుర్క్‌మెన్ ప్రజలు, టర్కిక్ ప్రజలు 2%, ఇతరులు 1% (అర్మేనియన్, తలిష్, జార్జియన్, సికాషియన్, అస్సిరియన్ ప్రజలు) ఉన్నారు. ది లిబరరీ ఆఫ్ కాంగ్రెస్ కొంత వ్యత్యాసమైన అంచనాలు: పర్షియన్ ప్రజలు (మజందరనీయ, గిల్కీ, తాల్ష్) 65%, అజబైననీయులు 16%, ఖుర్దీలు 7%, క్యూరీలు 6%, బ్లోచీలు 2%, టర్కిక్ గిరిజనులు క్వష్క్వై ప్రజలు 1%, తుర్క్మెనీలు 1% ఇరనీయేతర ప్రజలు (ఆర్మేనియన్లు, జార్జియన్లు, అస్సిరియన్లు, సికాషియన్లు, అరబ్బులు) 3% ఉన్నారని తెలియజేస్తున్నాయి. పర్షియన్ ప్రధాన భాషగా ఉన్న ప్రజలు 65% ఉన్నారు. ద్వితీయభాషగా ఉన్న ప్రజలు 35% ఉన్నారు. ఇతర ప్రభుత్వేతర అంచనాలు అనుసరించి పర్షియన్, అజర్బౌజియన్ ప్రజలు దాదాపు వరక్డ్ ఫాక్ట్ బుక్, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సూచించిన సంఖ్యకు సమీపంలో ఉన్నాయి. పరిశోధకులు, ఆర్గనైజేషన్ అంచనాలు ఈ రెండు గ్రూపుల అంచనాలతో విభేదిస్తున్నాయి. వారి అంచనాలు అనుసరించి అజర్బైనీయులు 22-30% ఉండవచ్చని అంచనా. అధికమైన సంస్థల అంచనాలు 25% ఉంటుందని సూచిస్తున్నాయి. Shaffer, Brenda (2003). Borders and Brethren: Iran and the Challenge of Azerbaijani Identity. MIT Press. pp. 221–225. ISBN 0-262-19477-5". There is considerable lack of consensus regarding the number of Azerbaijanis in Iran ...Most conventional estimates of the Azerbaijani population range between one-fifth to one-third of the general population of Iran, the majority claiming one-fourth" Azerbaijani student groups in Iran claim that there are 27 million Azerbaijanis residing in Iran."Shaffer, Brenda (2003). Borders and Brethren: Iran and the Challenge of Azerbaijani Identity. MIT Press. pp. 221–225. ISBN 0-262-19477-5"There is considerable lack of consensus regarding the number of Azerbaijanis in Iran ...Most conventional estimates of the Azerbaijani population range between one-fifth to one-third of the general population of Iran, the majority claiming one-fourth" Azerbaijani student groups in Iran claim that there are 27 million Azerbaijanis residing in Iran." Minahan, James (2002). Encyclopedia of the Stateless Nations: S-Z. Greenwood Publishing Group. p. 1765. ISBN 978-0-313-32384-3"Approximately (2002e) 18,500,000 Southern Azeris in Iran, concentrated in the northwestern provinces of East and West Azerbaijan. It is difficult to determine the exact number of Southern Azeris in Iran, as official statistics are not published detailing Iran's ethnic structure. Estimates of the Southern Azeri population range from as low as 12 million up to 40% of the population of Iran – that is, nearly 27 million..."Rasmus Christian Elling,Minorities in Iran: Nationalism and Ethnicity after Khomeini , Palgrave Macmillan, 2013. Excerpt: "The number of Azeris in Iran is heavily disputed. In 2005, Amanolahi estimated all Turkic-speaking communities in Iran to number no more than 9 million. CIA and Library of congress estimates range from 16 percent to 24 precent – that is, 12–18 million people if we employ the latest total figure for Iran's population (77.8 million). Azeri ethnicsts, on the other hand, argue that overall number is much higher, even as much as 50 percent or more of the total population. Such inflated estimates may have influenced some Western scholars who suggest that up to 30 percent (that is, some 23 million today) Iranians are Azeris." * Ali Gheissari, "Contemporary Iran:Economy, Society, Politics: Economy, Society, Politics", Oxford University Press, 2 April 2009. pg 300Azeri ethnonationalist activist, however, claim that number to be 24 million, hence as high as 35 percent of the Iranian population" Rasmus Christian Elling,Minorities in Iran: Nationalism and Ethnicity after Khomeini , Palgrave Macmillan, 2013. Excerpt: "The number of Azeris in Iran is heavily disputed. In 2005, Amanolahi estimated all Turkic-speaking communities in Iran to number no more than 9 million. CIA and Library of congress estimates range from 16 percent to 24 precent -- that is, 12-18 million people if we employ the latest total figure for Iran's population (77.8 million). Azeri ethnicsts, on the other hand, argue that overall number is much higher, even as much as 50 percent or more of the total population. Such inflated estimates may have influenced some Western scholars who suggest that up to 30 percent (that is, some 23 million today) Iranians are Azeris." 16% లేక 30% లాలో ఏది వాస్తవమైనా అజబైనీయులు అధికసంఖ్యలో నివసిస్తున్న దేశం ఇరాన్ మాత్రమే. మతం + Iranian people by religion, 2011 General Census Results Religion % of population No. of people 99.4% | 74,682,938 0.4% | 205,317 0.16% | 117,704 0.03% | 25,271 0.01% | 8,756 0.07% | 49,101 చారిత్రాత్మకంగా ఇఆరాన్‌లో అచమెనింద్, పార్ధియన్, సస్సనిద్ సామ్రాజ్యాల పాలనలో జొరాష్ట్రియన్ మతం ఆధిక్యతలో ఉంది. సస్సనిద్ సామ్రాజ్యం పతనమై ముస్లిములు ఇరాన్‌ను ఆక్రమించిన తరువాత జొరాస్ట్రియన్ స్థానంలో ఇస్లాం చేరింది. ప్రస్తుతం ఇస్లాం శాఖలైన ట్వెల్వర్, షియా శాఖలు 90%-95% ఉన్నారని భావిస్తున్నారు. 4% నుండి 8% ఇరానీయులు సున్నీ మతానికి చెందిన (ప్రధానంగా ఖుర్దిష్, బలోచీ ప్రజలు) వారు, మిగిలిన 2% ప్రజలు ముస్లిమేతర ప్రజలు. వీరిలో క్రైస్తవులు, పర్షియన్ యూదులు, బహియాలు, మాండియన్లు, యజీదులు, యర్సన్లు, జోరాస్ట్రియన్లు ఉన్నారు. thumb|left|The remains of Adur Gushnasp, a Zoroastrian fire temple built during the Sassanid period. జొరాస్ట్రియన్లు ఇరాన్ దేశ పురాతన మతానికి సంబంధించిన వారు. ఇరాన్‌లో జొరాస్ట్రియన్ దీర్ఘకాలచరిత్ర ప్రస్తుత కాలంవరకు కొనసాగుతుంది. జుడియిజానికి ఇరాన్‌లో దీర్ఘకాల చరిత్ర ఉంది. వీరు పర్షియన్ ఆక్రమిత బాబిలోనియాకు చెందినవారు. ఇజ్రేల్ రూపొందిచిన తరువాత, 1979 ఇజ్రేల్ విప్లవం తరువాత వీరిలో అనేకులు ఇజ్రేలుకు తరలివెళ్ళారు. సమీపకాల గణాంకాలను అనుసరించి ప్రస్తుతంలో ఇరాన్‌లో 8,756 యూదులు నివసిస్తున్నారని అంచనా. ఇరాన్ ఇజ్రేల్‌కు వెలుపల మిడిల్ ఈస్ట్ దేశాలలో యూదులు అధికంగా నివసిస్తున్న దేశం ఇరాన్ మాత్రమే. ఇరాన్‌లో 250,000 - 370,000 క్రైస్తవులు నివసిస్తున్నారని అంచనా.Country Information and Guidance "Christians and Christian converts, Iran" December 2014. p.9 ఇది అల్పసంఖ్యాకులలో అధికమని భావిస్తున్నారు. ఇరానియన్ ఆర్మేనియన్లలో అధికంగా అస్సిరుయన్లు ఉన్నారు. క్రైస్తవులు, జ్యూడిజం, జొరాష్ట్రియన్లు, సున్ని ముస్లిములను అధికారికంగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఇరాన్ ప్రభుత్వంలో తగినాన్ని స్థానాలు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. బహా విశ్వాసానికి చెందిన ప్రజలు ఇరాన్‌లో అత్యధిక ముస్లిమేతర ప్రజలుగా ఉన్నారు. వీరు అధికారికంగా గుర్తించబడలేదు. 2010 లో హిందువులు 39,200 మంది ఉన్నారు. 19వ శతాబ్దం నుండి వీరు వివక్షకు గురిచేయబడుతున్నారు. 1979 విప్లవం తరువాత బహాయీలపై హింస అధికమైంది. హింసలో పౌరహక్కుల నిరాకరణ, స్వతంత్రం, ఉన్నత విద్యకు అనుమతి నిరాకరణ ఉద్యోగనియామకాల నిరాకరణ భాగంగా ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం మతేతర గణాంకాల విడుదలకు వ్యతిరేకంగా ఉంది. నాస్తికులలో అధికంగా ఇరానియన్ అమెరికన్లు ఉన్నారు.Public Opinion Survey of Iranian Americans. Public Affairs Alliance of Iranian Americans (PAAIA)/Zogby, December 2008. Retrieved April 11, 2014. సంస్కృతి ఇరానీ సంస్కృతి ప్రపంచం లోని ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి.అసలు 'ఇరాన్' అనే పదం 'ఆయిర్యాన' అను పదం నుండి ఉధ్భవంచింది.ఇరానీయుల సంప్రాదాయల కు,భారతీయ సంప్రదాయలకు దగ్గరి పోలిక ఉంది.వారు అగ్ని ఉపాసకులు.వారు కూడా ఉపనయనాన్ని పోలిన ఒక ఆచారాన్ని పాటిస్తారు.దీనిని బట్టి వారి పూర్వికులు కూడా ఆర్యులే నని పలువురు చరిత్రకారుల అభిప్రాయం. అన్నీ ప్రాచీన నాగరికతల వలెనే, పర్షియన్ నాగరికతకు కూడా సంస్కృతే కేంద్ర బిందువు. ఈ నేల యొక్క కళ, సంగీతం, శిల్పం, కవిత్వం, తత్వం, సాంప్రదాయం, ఆదర్శాలే ప్రపంచ విఫణీలో ఇరానియన్లకు గర్వకారణము. ఇరానీ ప్రజలు తమ నాగరికత ఆటుపోట్లను తట్టుకొని వేల సంవత్సరాల పాటు మనుగడ సాగించడానికి దాని యొక్క సంస్కృతే ఏకైక ప్రధాన కారణమని భావిస్తారు. ఆరంభకాల సస్కృతిక ఆధారాలు నమోదు చేయబడిన ఆరంభకాల ఇరాన్ చరిత్ర దిగువ పాలియోలిథిక్ శకం (లోవర్ పాలియో లిథిక్) నుండి లభిస్తుంది. ప్రపంచంలో ఇరాన్ భౌగోళిక, సాంస్కృతిక ఆధిక్యత కలిగి ఉంది. ఇరాన్ పశ్చిమప్రాంతం ప్రత్యక్షంగా గ్రీస్, మెసెడోనియా, ఇటలీ, ఉత్తర ఇరాన్‌లో రష్యా, దక్షిణ ఇరాన్‌లో ఆర్మేనియా ద్వీపకల్పం, దక్షిణాసియా, తూర్పు ఆసియా సంస్కృతులతో ప్రభావితమై ఉంది. కళ thumb|Ceiling of the Lotfollah Mosque వివిధ ప్రాంతాలు, కాలాలలో ఇరానియన్ కళలు పలు వైవిధ్యమైన శైలికలిగి ఉంటాయి. వివిధ రీతి కళల మూలాంశాలు ఒకదానితో ఒకటి సంబధితమై ఉంటాయి. [F. Hole and K. V. Flannery, Proceedings of the Prehistoric Society, 1968] ఇరాన్ కళలలో కాంబినేషన్ మరొక ప్రధానమైన అంశంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఇరానియన్ మిథాలజీ సంబంధిత మానవ, జంతువు రూపాల మిశ్రితమైన అంశాలతో కళరీతులు రూపొందించబడుతుంటాయి. ఇరానియన్ కళాలలో పలు విభాగాలు ఉంటాయి. ఇందులో నిర్మాణకళ, నేత, మృణ్మయపాత్రలు, అందమైన దస్తూరి, లోహపు పని, రాతిశిల్పాలు భాగస్వామ్యంవహిస్తూ ఉంటాయి. మెడియన్, అచమెనింద్ సామ్రాజ్యాలు విడిచివెళ్ళిన కళాసంస్కృతి తరువాత కాలాలో జనించిన కళలకు ఆధారభూతమై ఉన్నాయి. పార్ధియన్ కళ ఇరానియన్, హెల్లెంస్టిక్ మిశ్రిత కళారూపమై ఉంటుంది. ఈ కళకు రాజరిక వేట యాత్రలు, పట్టాభిషేకాలు ఆధారమై ఉంటుంది. ; see also సస్సనిద్ కళ యురేపియన్, ఆసియన్ మిశ్రిత మెడీవల్ కళలో ప్రధానపాత్ర వహిస్తుంది. ఇది తతువాత మెడీవల్ కళను ఇస్లాం ప్రపంచంలోకి తీసుకువచ్చింది. ఇస్లామిక్ ప్రాచీన భాష, సాహిత్యం, న్యాయమీమాంశ, ఆరంభకాల ఇస్లాం తాత్వికత, ఇస్లామిక్ వైద్యం, ఇస్లామిక్ నిర్మాణకళ, సైన్సు కలిసిన సస్సనిద్ కళారూపంగా మారింది. ఉత్సాహపూరితమైన సమకాలీన ఆధునిక ఇరానియన్ కళ1940 నుండి ప్రభావం చూపుతుంది. 1949లో తెహ్రాన్‌లో మొహమ్మద్ జావేద్ పౌర్, సహచరులు చేత " అపదాన గ్యాలరీ " నిర్వహించబడుతుంది. 1950లో మార్కోస్ గ్రిగోరియన్ ఇరాన్ మోడరన్ ఆర్ట్ ను ప్రబలం చేసాడు. ఇరానియని తివాసి నేత " కాంశ్య యుగం " కాలం నుండి కొనసాగుతుంది. ఇరాన్ కళలలో ఇది ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రంపంచ కార్పెట్ తయారీలో, చేతితో నేసిన తివాసీలను ఎగుమతి చేయడంలో ఇరాన్ ప్రథమస్థానంలో ఉంది. ప్రపంచ తివాసీ ఎగుమతులలో ఇరాన్ 30% భాగస్వామ్యం వహిస్తుంది. ఇరానియన్ క్రౌన్ జువల్స్ తయారీ అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. నిర్మాణశైలి ఇరనీ నిర్మాణకళాచరిత్ర క్రీ.పూ 7వ శతాబ్దంలో ఆరంభం అయింది.Arthur Pope, Introducing Persian Architecture. Oxford University Press. London. 1971. ఇరానియన్లు మొదటిసారిగా గణితం, జామెంట్రీ, జ్యోతిషం నిర్మాణకళలో ప్రవేశపెట్టారు. ఇరానియన్ నిర్మాణాలు ఉన్నతప్రమాణాలు కలిగిన నిర్మాణం, సౌందర్యం మిశ్రితమై ఉంటుంది. క్రమంగా పురాతన సంప్రదాయాలు, అవుభవాల నుండి వెలుపలకు వచ్చింది. .Arthur Upham Pope. Persian Architecture. George Braziller, New York, 1965. p.266 ఇరానియన్ నిర్మాణకళ సమైక్యంగా అంతరిక్షం చిహ్నాలు మూలాంశాలుగా కలిగి ఉంటుంది. Nader Ardalan and Laleh Bakhtiar. Sense of Unity; The Sufi Tradition in Persian Architecture. 2000. ISBN 1-871031-78-8 ఇరాన్ పురాతన నిర్మాణ అవశేషాలు అధికంగా కలిగిన దేశాలలో అంతర్జాతీయంగా 7వ స్థానంలో ఉంది. యినెస్కో గుర్తించిన ఇరాన్ పురాతన నిర్మాణ అవశేషాలు అంతర్జాతీయ పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్నాయి. సాహిత్యం thumb|right|Mausoleum of Ferdowsi in Tus ఇరాన్ సాహిత్యం ప్రంపంచపు పురాతన సాహిత్యాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇరాన్ సాహిత్యం అవెస్టా, జొరాష్ట్రియన్ సాహిత్య కవిత్వం కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. ఇరానియన్ సంప్రదాయ సాహిత్యం, సైన్సు, మెటాఫిజిక్సులలో కవిత్వం ఉపయోగించబడింది. పర్షియన్ భాష కవిత్వం రూపొందించి బధ్రపరచడానికి అనుకూలమైనదిగా ఉంది. ఇది ప్రంపంచంలోని నాలుగు ప్రముఖ సాహిత్యాలలో ఒకటిగా భావించబడుతుంది. పర్షియన్ భాషలు ఇరానియన్ పీఠభూమి ద్వారా చైనా నుండి సిరియా, రష్యా వరకు వాడుకలో ఉన్నాయి.Arthur John Arberry, The Legacy of Persia, Oxford: Clarendon Press, 1953, ISBN 0-19-821905-9, p. 200.Von David Levinson; Karen Christensen, Encyclopedia of Modern Asia, Charles Scribner's Sons. 2002 p. 48 ఇరాన్‌లో రూమీ, ఫెర్డోస్, హాఫెజ్, సాదీ షిరాజ్, ఖయ్యాం, నెజామీగంజమి మొదలైన ప్రముఖ కవులు ఉన్నారు. ఇరానియన్ సాహిత్యం జియోతె, థొరెయు, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ మొదలైన రచయితలను ఆకర్షించింది. తాత్వికత thumb|left|alt=The Farohar Symbol from Persepolis|Depiction of a Fravarti in Persepolis ఇరానియన్ తాత్వికతకు " ఇండో- ఇరానియన్ " మూలంగా ఉంది. దీనిని జొరాస్ట్రియన్ బోధనలు ఇరాన్ తత్వశాత్రం మీద అత్యంత ప్రభావం చూపాయి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫిలాసఫీ అనుసరించి విషయచరిత్ర, త్వత్వశాస్త్రం ఇండో- ఇరానీయులతో ప్రారంభం అయిందని భావిస్తున్నారు. ఇది క్రీ.పూ 1500 లలో సంభవించిందని భావిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ " జొరాష్ట్రా తత్వశాస్త్రం యూదులు , ప్లాటోనిజం ద్వారా పశ్చిమదేశాలలో ప్రవేశించిందని భావిస్తున్నారు. భారతీయ వేదాలు , ఇరానియన్ అవెస్టాలకు పురాతనకాలం నుండి సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. వేదాలు , అవెస్టా రెండు ప్రధాన తాత్వికశాత్రాలుగా గౌరవించబడుతున్నాయి. ఇవి ఆధారభూతమైన వ్యత్యాసంతో రూపొందించబడ్డాయి. విశ్వంలోని మానవుల స్థితి , సంఘం సంబంధిత సమస్యలపరిష్కారంలో మానవులపాత్రను తెలియజేస్తున్నాయి. సైరస్ సిలిండర్ " మనవ హక్కుల ప్రారంభ రూపం " అని భావిస్తున్నారు. ఇవి మానవులలో ఉదయించే ప్రశ్నలకు , ఆలోచనలకు సమాధానమే తత్వశాస్త్రం అని భావించబడుతుంది. తత్వశాస్త్రం అచమెనింద్ సాంరాజ్యంలోని జొరాష్ట్రియన్ పాఠశాలలలో " జరాథుస్త్రా" పేరుతో తత్వశాస్త్రం బోధించబడింది.Philip G. Kreyenbroek: "Morals and Society in Zoroastrian Philosophy" in "Persian Philosophy". Companion Encyclopedia of Asian Philosophy: Brian Carr and Indira Mahalingam. Routledge, 2009.Mary Boyce: "The Origins of Zoroastrian Philosophy" in "Persian Philosophy". Companion Encyclopedia of Asian Philosophy: Brian Carr and Indira Mahalingam. Routledge, 2009. జొరాష్ట్రియన్ పాఠశాలలో ఆరంభకాల విద్యార్థులు జొరాష్ట్రియన్ మతసిద్ధాంతాలను అవెస్టన్ భాషలో అధ్యయనం చేసారు. వీటిలో షికంద్- గుమానిక్ - విచార్, డేంకర్ద్, జాత్స్ప్రం మొదలైన గ్రంథాలు అవెస్టా, గథాస్ లకు ఆధారగ్రంధాలుగా ఉన్నాయి.An Anthology of Philosophy in Persia. From Zoroaster to 'Umar Khayyam. S. H. Nasr & M. Aminrazavi. I. B. Tauris Publishers, London & New York, 2008. ISBN 978-1845115418. పురాణాలు ఇరానియన్ పురాణాలలో ఇరానియన్ జాపదసాహిత్యం, గాథలు మిశ్రితమై ఉంటాయి. అవి దేవతల గురించి మంచి, చెడు కార్యాల ఫలితాలను వివరిస్తుంటాయి. అలాగే గొప్ప కావ్యనాయకులు, అద్భుతాలను వివరిస్తుంటాయి. పురాణాలు ఇరాన్ సంస్కృతిలో ప్రముఖపాత్ర వహిస్తుంటాయి. కౌకసస్, అనటోలియా, మద్య ఆసియా, ప్రస్తుత ఇరాన్ కలిసిన గ్రేటర్ ఇరాన్ అందులోని ఎత్తైన పర్వతశ్రేణి ఇరాన్ పురాణాలలో ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. ఫెర్డోస్ విరచిత షహ్నమెహ్ గ్రంథం ఇరాన్ పురాణసాహిత్య గ్రంథాలలో ప్రధానమైనదిగా భావించబడుతుంది. అందులో జొరాష్ట్రియనిజం సంబంధిత విస్తారమైన పాత్రలు, కథనాలు చోటుచేసుకున్నాయి. దీనికి అవెస్టా, డెంకద్, బుందహిష్న్ ఆధారంగా ఉన్నాయి. పండుగలు , జాతీయ దినాలు thumb|right|Haft-Seen (or Haft-Čin), a customary of the Iranian New Year ఇరాన్‌లో మూడు అధికారిక క్యాలెండర్‌లు వాడుకలో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది సోలార్ హిజ్రి క్యాలెండర్. అంతర్జాతీయ క్యాలెండర్‌గా " గ్రిగేరియన్ క్యాలండర్ " వాడుకలో ఉంది. ఇది క్రైస్తవ పండుగలకు ఆధారంగా ఉంది. అలాగే ఇస్లామిక్ క్యాలెండర్ ఇస్లామిక్ పండుగలకు ఆధారంగా ఉంటాయి. ఇరాన్ జాతీయ వార్షిక పర్వదినాలలో " నౌరజ్ " ప్రధానమైనది. పురాతన సంప్రదాయానికి గుర్తుగా ఇది మార్చి 21న జరుపుకుంటారు. ఇది కొత్తసంవత్సర ఆరంభదినంగా భావించబడుతుంది. దీనిని వివిధ మతాలకు చెందిన ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. అయినప్పటికీ ఇది జిరాష్ట్రియన్ల పండుగ. ఇది మానవత్వానికి "మాస్టర్ పీస్ ఆఫ్ ఓరల్ అండ్ ఇంటాణ్జిబుల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమనిటీ " (అగోచరమైన ఊహాత్మక మానవ వారసత్వం) భావించబడుతుంది. ఇది పర్షియన్ కొత్తసంవత్సరంగా పరిగణించబడుతుంది. 2009లో యునెస్కో అనుసరించి: ఇరాన్ ఇతర జాతీయ దినాలు షహర్షంబీ సూరీ : నౌరుజ్ కు ముందుగా జరుపుకునే పవిత్ర అగ్ని (అతర్) ఉత్సవం. దీనిని నౌరుజ్ కు ముందు జరుపుకుంటారు. ఇందులో టపాసులు కాల్చడం, ఫైర్ జంపింగ్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. సిజ్దాహ్ బెదర్: ఇల్లు వదిలి ప్రకృతితో ఐక్యం కావడం. దీనిని కొత్తదంవత్సరం 30 వ రోజున ఏప్రిల్ 2న జరుపుకుంటారు. యల్ద: సంవత్సరంలో అతి దీర్ఘమైన రాత్రి. దీనిని " ఈవ్ ఆఫ్ వింటర్ సొలిస్టైస్ " అంటారు. కవిత్వ పఠనం, పుచ్చకాయ, దానిమ్మ, మిక్సెడ్ నట్స్ మొదలైన దేశీయ పండ్లను తినడం వంటివి జరుపుకుంటారు. తిర్గన్ : ఇది వేసవి మద్య దినం. తిష్త్ర్యను గౌరవిస్తూ జర్పుకుంటారు. దీనిని తిర్ మాసం (జూలై 4న) జరుపుకుంటారు. నీటిని చల్లుకుంటూ కవిత్వం పఠిస్తూ సోల్- జర్ద్, స్పినాచ్ సూప్ వంటి సంప్రదాయ ఆహారాలు తింటూ జరుపుకుంటారు. మెహ్ర్గన్ ఇది వార్షిక ఆకురాలు కాల ఉత్సవం. మిథ్రాను గౌరవిస్తూ దీనిని జరుపుకుంటారు. దీనిని మెహర్ మాసం 16 (అక్టోబరు 8) న కుటుంబం అంతా చేరి టేబుల్ మీద తీపి పదార్ధాలు, పూలు, అద్దం పెట్టి జరుపుకుంటారు. సెపందర్మజ్గన్ : అమెషా స్పెంటా (పవిత్ర భక్తి) గౌరవార్ధం జరుపుకుంటారు. పండుగ సందర్భంగా భాగస్వాములకు బహుమతులు అందజేసుకుంటారు. దీనిని ఈస్ఫంద్ 15న (ఫిబ్రవరి 24) న జరుపుకుంటారు. పండుగలు జాతీయ పర్వదినాలతో వార్షికంగా రంజాన్, ఈద్-అల్-ఫిత్ర్, డే ఆఫ్ అసురా (రుజ్ ఇ అసురా) ముస్లిముల పండుగలుగా జరుపుకుంటారు. క్రిస్మస్, లెంట్ (సెల్లే ఇ రుజె),, ఇష్టర్ పండుగలను క్రైస్తవుల పండుగలుగా జరుపుకుంటారు. పూరిం, పాసోవర్ (ఈద్ ఇ ఫతిర్), తూ బీష్వత్ పండుగలను యూదులు జరుపుకుంటారు. సంగీతం thumb|Karna, an ancient Iranian musical instrument from the 6th century BC ఇరాన్ పురాతన సంగీతపరికరాలకు పుట్టిల్లు. క్రీ.పూ 3 వ మైలేనియానికి చెందిన సంగీత పరికరాలు ఇరాన్‌లో పురాతత్వ పరిశోధనశాఖ నిర్వహించిన త్రవ్వకాలలో లభించాయి. .Third Millennium BC: Arched Harps In Western Iran, Encyclopædia Iranica ఇరానియన్లు నిలువు, అడ్డం, కోణాలతో ఉన్న సంగీతపరికరాలను మదక్తు, కుల్-ఇ- ఫరాహ్ సమీపంలో కనుగొనబడ్డాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ఎలమైట్ పరికరాలు నమోదు చేయబడ్డాయి. అస్సిరియన్ ప్రాంతలలో పలు హార్ప్స్ నమోదు చేయబడ్డాయి.అస్సిరియన్ ప్రాంతాలలో పలు నిలువు హార్ప్స్ చిత్రాలు ఉన్నాయి. ఇవి క్రీ.పూ. 865-650 నాటికి చెందినవని భావిస్తున్నారు. " క్సెనొఫోన్ సైరొపడియా " విధానం అనేక మంది స్త్రీలు కలిసి పాడే సంగీతప్రక్రియగా భావించబడుతుంది. వీరు అచమెనింద్ సభలో కీర్తించబడింది. అచమెనింద్ చివరి రాజు అథెనియస్ ఆఫ్ నౌక్రాటిస్ రాజ్యాలలో, అర్తశత (క్రీ.పూ 336-330) సభలలో ఈ ప్రక్రియ వాడుకలో ఉంది. గయనీమణులను మెసెడోనియా సైనికాధికారి పరమెనియన్ పట్టి తెచ్చాడని భావిస్తున్నారు. [The Deipnosophistae, Athenaeus] పార్ధియన్ సామ్రాజ్యంలో ఒకవిధమైన కావ్యసంగీతంలో యువతకు శిక్షణ ఇవ్వబడింది. జాతీయ కావ్య చిత్రాలు, పురాణాలు " షహ్నమెహ్ , ఫెర్డోస్ ప్రక్రియలలో ప్రతిబింబీంచాయి.["Parthians taught their young men songs about the deeds both of gods and of the noblest men." – Strabo'sGeographica, 15.3.18] సస్సనిద్ సంగీతం సస్సనిద్ సంగీతం చరిత్ర జిరాష్ట్రియన్ రచనలలో కనిపిస్తున్నాయి. ఇది ఆరంభకాల సస్సనిద్ చరిత్రలో నమోదు చేయబడింది. iv. First millennium C.E. (1) Sasanian music, 224–651. సాస్సనిద్ రాజసభలలో ఖొస్రొ సంగీతప్రక్రియ పోషించబడింది. ఇందులో రంతిన్, బంషద్, నకిస, అజాద్, సర్కాష్ , బర్బాద్ విధానాలు ఉంటాయి. thumb|left|A Safavid painting at Hasht Behesht, depicting a 7th-century Iranian banquet కొన్ని ఇరానియన్ సంప్రదాయ సంగీత పరికరాలలో సాజ్, తార్, డోతర్, సెతార్, కామంచె, హార్ప్, బర్బాత్, సంతూర్, తంబూర్, క్వనన్, డాప్, తాంబాక్ , నే ప్రధానంగా ఉన్నాయి. thumb|The National Orchestra of Iran, conducted by Khaleghi in the 1940s ఆధునిక సంగీతం 1940 లో మొదటి నేషనల్ మ్యూజిక్ సిసైటీ " రౌహొల్లాహ్ ఖలేఘీ " స్థాపించబడింది. ఇది 1949 లో " స్కూల్ ఆఫ్ నేషనల్ మ్యూజిక్ " పేరుతో సంగీత పాఠశాలను స్థాపించింది. A view of the life and works of Ruhollah Khaleghi, BBC Persian ఇరాన్ ప్రధాన ఆర్కెస్ట్రాలో " ఇరాన్ నేషనల్ ఆర్కెస్ట్రా " ది మెలాల్ ఆర్కెస్ట్రా , తెహ్రాన్ సింఫోనీ ఆర్కెస్ట్రా భాగంగా ఉన్నాయి. క్వాజర్ శకంలో ఇరానియన్ పాప్ మ్యూజిక్ వెలుగులోకి వచ్చింది.The origin of Iranian pop music 1950 లో విగుయన్(కింగ్ ఆఫ్ పాప్ అండ్ జాజ్" ప్రదర్శకుడు) పాప్ గాయకుడుగా కీర్తిగడించాడు. 1970లో ఇరానియన్ సంగీతప్రపంచంలో సంభవించిన విప్లవాత్మక మార్పు సంభవించిన సమయంలో ఇరానియన్ పాప్ మ్యూజిక్ స్వర్ణయుగం ఆరంభం అయింది. స్థానిక సంగీతపరికరాలకు ఆధునిక ఎలెక్ట్రానిక్ గితార్ వాడుకలోకి వచ్చింది. ఈ సమయంలో హయేదేహ్, ఫరమార్జ్ అస్లాని, ఫర్హాద్ మెహ్రద్, గూగూష్, ఎబి మొదలైన సంగీతకారులు ప్రముఖకళాకారులుగా ఉన్నారు ఇరానియన్ రాక్, ఇరానియన్ హిప్ హాప్ ప్రవేశించిన తరువాత యువత పాత సంగీతప్రక్రియను విడిచి కొత్తపంథాను అనుసరించడం మొదలైంది. తరువాత ఇరాన్ సంగీతప్రక్రియలలో కొత్త సంగీత విధానాల ప్రభావం చూపాయి.Rebels of rap reign in Iran థియేటర్ ఇరాన్ థియేటర్ సంస్కృతి పురాతనత్వంకగి పురాతన చరిత్రతో ముడివడి ఉంది. తెపే సియాక్, తెపే మౌసియన్ మొదలైన చరిత్రకు పూర్వంనాటి ప్రాంతాలలో నృత్యసంబంధిత ఆరంభకాల ఆధారాలు లభించాయి.DANCE: i. In Pre-Islamic Iran, Encyclopædia Iranica కావ్యలలో వర్ణించబడిన ఉత్సవ కాల వేదికలలో (సౌగ్ ఇ సివాష్, మొగ్ఖొషి) నృత్యాలు, నటన సంబంధిత విషయాలు థియేటర్ సస్కృతికి ఆరంభం అని భావిస్తున్నారు. ఇరానియన్ పురాణరచనలైన హెరొడోటోస్, క్సెనొఫోన్ లలో ఇరానియన్ నృత్యం, థియేటర్ గురించిన వర్ణనలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ చలనచిత్రాలు ప్ర్రంరంభానికి ముందు పలు కళాప్రక్రియలు రూపొందించబడ్డాయి. వీటిలో క్సెమే షాంబ్ బాజి (పప్పెటరిఉ), సాయే బాజీ (తోలుబొమ్మలు), రూ- హౌజీ (హాస నాటకాల్య్), తాజియే (సారో నాటకాలు) మొదలైనవి ప్రధానమైనవి. రోష్టంఅండ్ సొహార్బ్ కావ్యం ఆధాంగా రూపొందించబడిన రోష్టం అండ్ సొహాబ్ (షహనమె) ప్రస్తుత ఇరాన్ ఆధునిక నాటకరంగ ప్రదర్శనకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. సినిమా , అనిమేషన్ ఇరాన్ చరిత్రలో విషయుయల్ ప్రాతినిథ్యానికి ఉదాహరణలు " పర్సెపోలీస్ బాస్ రిలీఫ్ కాలానికి చెందినవి (క్రీ.పూ. 500). పురాతన అచమెనింద్ సాంరాజ్యానికి పర్సెపోలీస్ ఉత్సవ కేంద్రంగా ఉంది.Honour, Hugh and John Fleming, The Visual Arts: A History. New Jersey, Prentice Hall Inc, 1992. Page: 96. సస్సనింద్ శకంలో ఇరానియన్ విష్యుయల్ ఆర్ట్స్ శిఖరాగ్రం చేరుకున్నాయి. ఈ సమయంలో తాక్వ్ బొస్టన్‌లో అబాస్ - రిలీఫ్ నుండి చిత్రీకరించిన వేటదృశ్యాలు ఉన్నాయి. ఈ కాలానికి చెందిన ఇటువంటి కళారూపాలు అధునాతన విధానాలలో అత్యున్నత ప్రమాణాలతో రూపొందించడ్డాయి. ఇవి చలనచిత్రాల క్లోజప్ దృశ్యాలకు మూలంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వీటిలో గాయపడిన అడవిపంది వేట ప్రాంతం నుండి తప్పించుకుని పోవడం చిత్రీకరించబడింది. 20వ శతాబ్దం ఆరంభంలో 5 సంవత్సరాల చరిత్ర కలిగిన చలనచిత్ర పరిశ్రమ ఇరాన్‌లో ప్రవేశించింది. మొదటి ఇరానియన్ చలన చిత్ర నిర్మాత " మిర్జా ఎబ్రహాం ఖాన్ అక్కాస్ బాష్ ", అధికారిక చాయాచిత్రకారుడు క్వాజర్‌చెందిన " మొజాఫర్ అద్ దిన్ షాహ్ క్వాజర్ " . " మిర్జా ఇబ్రహీం ఖాన్ " 1940లో తెహ్రాన్‌లో మొదటి సినిమాథియేటరును ప్రారంభించాడు. తరువాత రుస్సీ ఖాన్, అర్దాషిర్ ఖాన్ , అలి వకిల్ " తెహ్రాన్‌లో సరికొత్త థియేటర్లను ప్రారంభించారు. 1930 ప్రారంభం వరకు తెహ్రాన్‌లో 15 సినిమా థియేటర్లు ఇతర ప్రాంతాలలో 11 థియేటర్లు ప్రారంభించబడ్డాయి.1930లో మొదటి ఇరానియన్ మూకీ చిత్రం " ప్రొఫెసర్ ఓవంస్ ఒహనియన్ " చేత నిర్మించబడింది. మొదటి 1932లో శబ్ధసహిత చలన చిత్రం " లోరీ గిర్ల్" అబ్దొల్ హుస్సేన్ సెపంత చేత నిర్మించబడింది. 1960లో ఇరానియన్ చిత్రరంగం గణనీయమైన అభివృద్ధి చెందింది. వార్షికంగా 25 చిత్రాలు నిర్మించబడ్డాయి. దశాబ్ధం చివరకు వార్షికంగా 65 చిత్రాలు నిర్మించబడ్డాయి. అత్యధిక చిత్రాలు మెలో డ్రామా, త్రిల్లర్ కథాంశలు కలిగి ఉన్నాయి. క్వేసర్, ది కౌ, చిత్రాలకు మాసౌద్ కిమియై, దరిష్ మెహ్రుజ్ 1969లో దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాలు చిత్రరంగంలో వారి ప్రతిభను ఎత్తి చూపాయి. 1954లో చిత్రోత్సవం గోల్రిజాన్ ఫెస్టివల్ నిర్వహించబడింది. ఇది 1969లో నిర్వహించిన సెపాస్ ఫెస్టివల్‌కు మార్గదర్శకంగా ఉంది. ఈ ప్రయత్నాలు 1973 తెహ్రాన్ వరల్డ్ ఫెస్టివల్ విజయానికి కారణం అయ్యాయి. thumb|upright|Abbas Kiarostami 1979 తరువాత కొత్త ప్రభుత్వం చిత్రనిర్మాణానికి కొత్త చట్టాలు, ప్రమాణాలు నిర్ణయించింది. ఇరానియన్ చలనచిత్రాలలో కొత్త శకం ప్రారంభం అయింది. ఖొస్రో సినై తరువాత అబ్బాస్ కైరోస్తమీ (క్లోజప్ సినిమా), జాఫర్ పనాహీ వంటి దర్శకులు పరిచయమై ప్రజలకు ఆరాధనీయులు అయ్యారు. 1977లో ఆయన " టేస్ట్ ఆఫ్ చెర్రీ " చిత్రం కొరకు పాల్మే డ్'ఓర్" అవార్డ్ అందుకున్న తరువాత ప్రపంచచిత్రరంగానికి ఇరాన్ చిత్రాలగురిచి అవగాహనకలిగింది. కేంస్ ఫిలిం ఫెస్టివల్, వెనిస్ ఫిలిం ఫెస్టివల్, బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ మొదలైన అంతర్జాతీయ వేదికలలో ఇరానియన్ చిత్రాలు నిరంతరాయంగా ప్రదర్శించబడిన తరువాత ఇరాంచిత్రరాజాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.2006లో 6 వైవిధ్యమైన శైలి కలిగిన ఇరానియన్ చిత్రాలు బెర్లిన్ ఫిల్ం ఫెస్టివల్‌లో ప్రదర్ శించబడ్డాయి. ఇరాన్ చిత్రరంగంలో ఇది చరిత్ర సృష్టించిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఇరానియన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హంద్ " బెస్ట్ ఫారిన్ లాంగ్యుయేజ్ " కొరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అకాడమీ అవార్డును అందుకున్నాడు. 2012లో టైం మాగజిన్ ప్రంపంచంలోని 100 ప్రతిభావంతులైన వారిలో ఒకడుగా అస్ఘర్ ఫర్హంద్‌ను పేర్కొన్నది. thumb|left|Reproduction of the world's oldest example of animation, dating back to the late half of the 3rd millennium BC, found in Burnt City, Iran పురాతన అనిమేషన్ రికార్డులు క్రీ.పూ 3 మైలేయానికి చెందినవి.ఆగ్నేయ ఇరాన్‌లోని " బర్ంట్ సిటీలో "5,200 వందల పురాతనమైన " ఎర్తెన్ గ్లోబ్లెట్ " ఒకటి కనుగొనబడింది. అనిమేషన్‌కు ప్రపంచంలోని పురాతన చిహ్నాలలో ఇది ఒకటి అనిభావిస్తున్నారు.1950 లో ఆధునిక ఇరాన్‌లో అనిమేషన్ కళ అభ్యసించబడుతుంది. 4 దశాబ్ధాల ఇరాన్ అనిమేషన్ తయారీ , మూడు దశాబ్ధాల అనుభవం ఉన్న " కానూన్న్ఇంస్టిట్యూట్ ", తెహ్రాన్ ఇంటర్నేషనల్ అనిమేషన్ ఫెస్టివల్ 1999 లో నిర్వహించబడింది. ప్రతి రెండు సంవత్సరాలకు 70 దేశాలకంటే అధికమైన దేశాల నుండి ప్రతినిధులు ఈ ఉత్సవానికి హాజరౌతుంటారు. ఇది ఇరాన్‌ను అతిపెద్ద అనిమేషన్ మార్కెట్టుగా మార్చింది. సినిమాలు బరాన్ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ ది సేల్స్‌మన్ ది సైక్లిస్ట్ ది ఆపిల్ ప్రభుత్వం , రాజకీయాలు thumbnail|Ali Khamenei, Supreme leader of Iran, talking with former Brazilian president Luiz Inácio Lula da Silva thumb|Iran's syncretic political system combines elements of a modern Islamic theocracy with democracy. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాజకీయవిధానం 1979 ఇరాజ్ రాజ్యాంగ విధానం, ప్రభుత్వ అధికకారకార్యవర్గం అనుసరించి ఉంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఇస్లామిక్ న్యాయవిధానాల సంరక్షణ, పర్యవేక్షణ బాధ్యతవహిస్తాడు. సుప్రీం లీడర్ ఆర్ం ఫోర్స్ల కమాండర్ ఉండి సైన్యం, ఇంటెలిజంస్, రక్షణ బాధ్యతల నిర్వహణ, యుద్ధం, శాంతి లేక సంధిప్రయత్నాలు నిర్ణాయీధికారం కలిగి ఉంటాడు. న్యాయాధికారం, రేడియో, టేలివిషన్ నెట్వర్క్స్, పోలీస్, మిలటరీ కమాండింగ్ బాధ్యతవహించడానికి గార్డియన్ కౌంసిల్ 12 సభ్యులలో 6 గురు సుప్రీం లీడర్‌చే నియమించబడతారు. అసెంబ్లీ ఎక్సోర్ట్స్ సుప్రీం లీడర్ ఎన్నిక, తొలగింపు అధికారం కలిగి ఉంటారు. సుప్రీం లీడర్ తరువాత రాజ్యాంబద్ధమైన అధికారిగా ఇరాన్ అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్షుడు అధ్యక్షుని ఎన్నిక 4సంవత్సరాలకు ఒకమారు ఉంటుంది. అధ్యక్షుడు తిరిగి మరొకమారు మాత్రమే ఎనూకొనబడడానికి అర్హత కలిగి ఉంటాడు. అధ్యక్ష పదవికి పోటీచేవారు గార్డియంకౌంసిల్ అనుమతి పొందవలసిన అవసరం ఉంది. అధ్యక్షుడు రాజ్యాంగం అమలు, నిర్వహణాధికారాలు (సుర్పీం లీడర్ అధికారాలకు అతీతం) కలిగి ఉంటాడు. 8 మంది ఉపాధ్యక్షులు అధ్యక్షునికి సహాయంగా పనిచేస్తారు. ఇరాన్ లెజిస్లేచర్ యునికెమరల్ బాడి అని పిలువబడుతుంది. ఇరాన్ పార్లమెంటులో 290 మంది సభ్యులు ఉంటారు. ఇరాన్ పార్లమెంటు అంతర్జాతీయ ఒప్పందాలు, దేశీయ బడ్జెట్ అనుమతి మొదలైన బాధ్యతలు వహిస్తుంది. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులను అందరూ గార్డియన్ కౌంసిల్ అనుమతి పొందవలసిన అవసరం ఉంది. గార్డియన్ కౌంసిల్‌లో 12 మంది న్యాయాధికారులలో 6 సుప్రీం లీడర్ చేత నియమించబడతారు. ఇతరులను ఇరానియన్ పార్లమెంటు చేత నియమించబడతారు. జ్యూడీషియల్ సిస్టం హెడ్ జ్యూరిస్టుల నియామకం చేస్తాడు. కౌంసిల్ వీటో అధికారం కలిగి ఉంటుంది. చట్టం షరియా (ఇస్లామిక్ చట్టం), రాజ్యాంగానికి అనుకూలంగా లేకుంటే అది పరిశీలన కొరకు తిరిగి పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది. ఎక్స్పెడియంసీ కౌంసిల్ పార్లమెంటు, గార్డియన్ కౌంసిల్ వివాదాల ఆదేశాధికారం ఉంటుంది. అలాగే సుప్రీం లీడర్ సలహామండలిగా సేవలు అందిస్తుంది. ప్రాంతీయ నగర కౌంసిల్ (లోకల్ సిటీ కౌంసిల్) ను ప్రజాఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. వీరిని ఇరాన్‌లోని నగరాలు, గ్రామాలకు చెందిన ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారు. చట్టం thumb|right|The Iranian Parliament సుప్రీం లీడర్ ఇరాన్ జ్యుడీషియరీ అధ్యక్షుని నియమిస్తాడు. జ్యుడీషియరీ అధ్యక్షుడు సుప్రీం కోర్ట్ అధ్యక్షుడు, ప్రాసిక్యూటర్లను నియమిస్తాడు. . పబ్లిక్ కోర్టులు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ కోర్టులు జాతీయ రక్షణ మొదలైన కేసులను పరిష్కరిస్తాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ కోర్టుల నిర్ణయాలు అంతిమమైనవి ఇక్కడ ఇచ్చిన తీర్పు తరువాత మరెక్కడా అప్పీల్ చేసుకోవడానికి వీలు ఉండదు. ది స్పెషల్ క్లరికల్ కోర్టులు క్లరిక్ కేసుల పరిష్కారం, ప్రజల వ్యక్తిగత కేసులను పరిష్కరిస్తుంది. స్పెషల్ క్లరికల్ కోర్టులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. సుప్రీం లీడర్ మాత్రమే వీటిమీద ఆధిక్యత కలుగి ఉంటాడు. స్పెషల్ క్లరికల్ కోర్టుల తీర్పు అంతిమమైనది ఇక్కడ తీర్పు ఇచ్చిన తరువాత మరెక్కడా అప్పీల్ చేయడానికి వీలు ఉండదు. అసెంబ్లీ ఎక్స్పర్టులు 86 మంది సభ్యులను 8 సంవత్సరాలకు ఒకసారి ఓటుహక్కుతో అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలలో ఎన్నుకుంటారు. సభ్యుల అర్హతను గార్డియన్ కౌంసిల్ నిర్ణయిస్తుంది. సుప్రీం లీడర్‌ను అసెంబ్లీ ఎన్నుకుంటుంది. అసెంబ్లీ ఎప్పుడైనా సుప్రీం లీడర్ నియామకం రద్దుచేసే అధికారం కలిగి ఉంటుంది. సుప్రీం లీడర్ నిర్ణయాలను సవాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉండదు. " టెలీ కమ్యూనికేషన్ ఆఫ్ ఇరాన్ " టెలీకమ్యూనికేషన్ నిర్వహణ చేస్తుంది. ది మీడియా ఆఫ్ ఇరాన్ ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తుంది. పుస్తకాలు, చలనచిత్రాలు విడుదలకు ముందు " ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్షాద్ " అనుమతి పొందవలసిన అవసరం ఉంది. ఇరాన్ అంతర్జాల సేవలు 1993 నుండి మొదలైయ్యాయి. ఇరానియన్ యువతలో ఇది అత్యంత ఆదరణ సంతరించుకుంది. విదేశీ సంబంధాలు thumbnail|Iranian President Hassan Rouhani meeting with Russian President Vladimir Putin – Iran and Russia are strategic allies. thumbnail|left|Iranian FM Zarif shakes hands with John Kerry during the Iranian nuclear talks – There is no formal diplomatic relationship between Iran and the USA. ఇరానియన్ ప్రభుత్వం అధికారికంగా న్యూ వరల్డ్ ఆర్డర్ స్థాపించింది. ఇందులో ప్రపంచ శాంతి, గ్లోబల్ కలెక్టివ్ సెక్యూరిటీ (అంతర్జాతీయ సమైక్యరక్షణ), న్యాయనిర్ణయం భాగంగా ఉన్నాయి.Iran urges NAM to make collective bids to establish global peace . PressTV, 26 August 2012. Retrieved 20 November 2012.Ahmadinejad calls for new world order based on justice . PressTV 26 May 2012. Retrieved 20 November 2012. రివల్యూషన్ తరువాత ఇరాన్ విదేశీ సంబంధాలు అన్నీ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇరాన్‌లో విదేశీయుల జోక్యాన్నిబహిష్కరించడం, అభివృద్ధి చెందుతున్న, అలీన దేశాలతో సత్సంబంధాలు అభివృద్ధి చేసుకోవడం ప్రధానాంశాలుగా ఉన్నాయి.Iran Country Study Guide Volume 1 Strategic Information and Developments, ISBN 1-4387-7462-1, page 1412005 నుండి " న్యూక్లియర్ ప్రోగ్రాం ఆఫ్ ఇరాన్ " అంతర్జాతీయంగా వివాదాంశం అయింది. ఇరాన్ తన ప్రత్యర్థులతో యుద్ధసమయంలో (ప్రత్యేకంగా ఇజ్రేల్ మీద) అణ్వాయుధ ప్రయోగం చేయగలదన్నది వివాదాంశంగా ఉంది.Ayatollah Ali Akbar Hashemi-Rafsanjani: Israel is a 'one bomb nation'. "...application of an atomic bomb would not leave any thing in Israel" (Dec 14 2001, Iran's Rafsanjani says Muslims should use nuclear weapon against Israel , (CNN report according to Iran Press)) " ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం " అణ్వాయుధ తయారీకి దారితీస్తుందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఐక్యరాజ్యసమితి ఆర్థిక మంజూరీలను నిషేధించడానికి దారితీసింది. 2009 నుండి ఇది ఇరాన్‌ను మిగిలిన ప్రపంచదేశాలలో ఆర్థికంగా ఒంటరిని చేసింది. " ది యు.ఎస్.డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజంస్) ఇరాన్‌ను అణయుధ తయారీ చేయలేదని 2013 లో వెల్లడించింది. దౌత్య సంబంధాలు 2009 నాటికి ఇరాన్ అఖ్యరాజ్యసమితి సభ్యదేశాలలో 99 దేశాలతో దౌత్యసంబంధాలు కలిగి ఉంది. అయినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ , ఇజ్రేల్‌తో దౌత్యసంబంధాలు లేవు. 1979 రివల్యూషన్ నుండి యునైటెడ్ స్టేట్స్ , ఇజ్రేల్‌ ఇరాన్‌ను గుర్తించలేదు.1945 జూలై 14న తెహ్రాన్ " పి5+1" న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రాంను ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజంసీ నియమాలను అనుసరించి క్రమబద్ధీకరణ చేసిన తరువాత ఇరాన్‌ మీద విధించబడిన ఆర్థిక అంక్షలు తొలగించబడ్డాయి.Kutsch, Tom. (July 14, 2015) "Iran, world powers strike historic nuclear deal". Aljazeera America. Retrieved 15 July 2015. Aljazeera America website ఇరాన్ జి -77, జి -24, జి-15, ఐ.ఎ.ఇ.ఎ., ఐ.ఎ.బి.ఆర్.డి., ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ఐ.డి.ఎ), ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఐ.డి.బి), ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐ.ఎఫ్.సి), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.ఓ), ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ.ఎం.ఎఫ్), ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్, ఇంటర్పోల్ (సంస్థ), ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ.ఐ.సి, ఓ.పి.ఎ.సి., మొదలైన అంతర్జాతీయ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం వరల్డ్ ట్రేడ్ ఆగనైజేషన్ వద్ద పర్యవేక్షణ అర్హత కలిగి ఉన్నాయి. మిలటరీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెండు విధానైన సైనిక శక్తిని కలిగి ఉంది. రెగ్యులర్ ఫోర్స్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఆర్మీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఎయిర్ ఫోర్స్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్నేవీ, ఆర్మీ ఆఫ్ ది గార్డియంస్ ఆఫ్ ది ఇస్లామిక్ రివల్యూషన్‌లలో 5,45,000 క్రీయాశీలక బృందాలు ఉన్నాయి. ఇరాన్‌లో 3,50,000 రిజర్వ్ దళాలు ఉన్నాయి. IISS Military Balance 2006, Routledge for the IISS, London, 2006, p.187 ఇరాన్‌లో పారామిలటరీ వాలంటీర్ మిలిటియా ఫోర్స్ (ఐ.ఆర్.గి.సి) ఉంది దీనిని బసీజ్ అని కూడా అంటారు. ఇందులో 90,000 ఫుల్ టైం యాక్టివ్ యూనిఫాం సభ్యులు ఉంటారు. 11 మిలియన్ల స్త్రీ పురుష బసీజ్ సభ్యులు పిలుపు అందుకున్న తరువాత సైనికసేవలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు. గ్లోబల్ స్ర్క్యూరిటీ ఆర్గనైజేషన్ అంచనా అనుసరించి ఇరాన్ ఒక మిలియన్ పురుషులను తరలించిందని భావిస్తున్నారు. వరల్డ్ ట్రూప్ మొబలైజేషన్‌లో ఇది అత్యధికం అని భావిస్తున్నారు. 2007లో ఇరాన్ మిలటరీ కొరకు జి.డి.పిలో 2.6% (తసరి 102 అమెరికన్ డాలర్లు ) వ్యయం చేస్తుంది. పర్షియన్ గల్ఫ్ దేశాలలో ఇది అత్యల్పం. ఇరాన్ మిలటరీ డాక్టరిన్ " డిఫరెంస్ థియరీ " అధారితమై ఉంది. 2014లో మిలటరీ వ్యయం కొరకు ఇరాన్ 15 బిలియన్లు వ్యయం చేస్తుంది.Parsi, Trita and Cullis, Tyler. (July 10, 2015) "The Myth of the Iranian Military Giant" Foreign Policy. Retrieved 11 July 2015.Foreign Policy website ఇరాన్ సిరియా, ఇరాక్, లెబనాన్ (హెజ్బొల్లాహ్) సైనిక చర్యలకు వేలకొలది మిస్సైల్స్, రాకెట్లు అందిస్తూ మద్దతు ఇస్తుంది.Karam, Joyce & Gutman, Roy, presenters. (5 August 2015) "Middle East Institute: "Iran Nuclear Agreement and Middle East Relations". Washington, DC: Johns Hopkins School of Advanced International Studies. Retrieved 5 August 2015. C-Span website 1979 నుండి రివల్యూషన్ విదేశీ అంక్షలను అధిగమించడానికి ఇరాన్ తన స్వంత మిలటరీ పరిశ్రమని అభివృద్ధి చేసింది. ఇరాన్ స్వయంగా ట్యాంకులు, అర్మోర్డ్ పర్సనల్ కారియర్స్, గైడెడ్ మిస్సైల్స్, సబ్మెరీన్, మిలటరీ వెసెల్స్, ఇరానియన్ డిస్ట్రాయర్ జమరాన్ (గైడెడ్ మిస్సైల్ డిసాస్టర్), రాడార్ సిస్టంస్, హెలీకాఫ్టర్లు, ఫైటర్ ప్లేన్స్ తయారు చేసుకుంది. సమీపకాలంలో హూట్ (మిస్సైల్స్), కౌసర్, జెల్జా, ఫతేష్ -110, షాహబ్-3, షెజ్జిల్ మిసైల్స్, ఇతర స్వయం చోదిత బాహనాలు (అన్ మాండ్ ఏరియల్ వెహికస్) తయారీ గురించి ఇరాన్ అధికారిక ప్రకటనలు చేసింది. అత్యాధునిక బాసలిక్ మిసైల్స్‌లో ఫాజర్-3 (ఎం.ఆర్..వి)ఒకటి. ఇది లిక్విడ్ ఫ్యూయల్‌తో పనిచేసే మిసైల్. ఇది దేశంలో తయారు చేయబడి అందించబడింది. క్రీడలు left|thumb|Azadi Stadium, Tehran ఇరాన్ జనసంఖ్యలో మూడింట రెండువంతులు 25 సవత్సరాల లోపువారు. ఇరాన్‌లో సంప్రదాయ, ఆధునిక క్రీడలు ఆడబడుతున్నాయి. పోటో పోటో క్రీడ జన్మస్థానం ఇరాన్. ఇది ఇరాన్‌లో పర్షియన్ భాషలో " కౌగాన్", పహలవని కొస్టి (హిరోయిక్ మల్లయుద్ధం) అని పిలువబడుతుంది. " ఫ్రీ స్ట్రైల్ రెస్ట్లింగ్ " సంప్రదాయంగా ఇరాన్ జాతీయక్రీడగా గౌరవించబడుతుంది. " ఇరాన్ నేషనల్ ఫ్రీ స్ట్రైల్ రెస్ట్లింగ్ అథెట్లు " బృదం ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటారు. ఫుట్ బాల్ " ఇరాన్ ఫుట్ బాల్ " ఇరాన్‌లో ప్రాముఖ్యత కలిగి క్రీడలలో ఒకటిగా భావించబడుతుంది. " ఇరాన్ నేషనల్ ఫుట్ బాల్ టీం " మూడుమార్లు ఆసియన్ కప్ గెలుచుకుంది. వాలీ బాల్ ఇరాన్ క్రీడలలో ప్రాబల్యత సంతరించుకున్న క్రీడలలో రెండవ స్థానంలో ఉన్న క్రీడ " వాలీబాల్ ".Volleyball pioneer Ahmad Masajedi says Iran's rise to the top won't stop " ఇరాన్ మెంస్ వాలీబాల్ టీం " 2014 ఎఫ్.ఐ.వి.బి. వాలీబాల్ వరల్డ్ లీగ్ " లో 4వ స్థానంలోనూ, " 2014 ఎఫ్.ఐ.వి.బి. వాలీబాల్ మెన్స్ వరల్డ్ చాంపియంషిప్ " లో 6వ స్థానంలోనూ ఉంది. అలాగే ఆసియన్ నేషనల్ టీంలలో ఉన్నత ఫలితాలు సాధించింది. Iranˈs world 4th volleyball power in FIVB League, best Asian rank ever Irna:USA Coach John Speraw: "We got beat by a better volleyball team" thumb|right|Skiers at the Dizin Ski Resort పర్వతారోహణ పర్వతాలు అధికంగా ఉన్న ఇరాన్ పర్వతారోహకులకు వేదిగగా ఉంది. ఇరాన్ హైకింగ్ , రాక్ క్లైంబింగ్ పర్వతారోహణ లకు అనుకూలమైనది. స్కీయింగ్ రిసార్ట్ ఇరాన్ స్కీయింగ్ రిసార్టులకు నిలయం. 13 ski resorts operate in Iran, ఇరాన్ లోని తోచల్, డిజిన్ , షెంషెక్ రిసార్టులు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇవి తెహ్రాన్‌కు మూడు గంటల ప్రయాణదూరంలో ఉన్నాయి. తోచల్ రిసార్ట్ ప్రపంచ ఎత్తైన రిసార్టులలో 5వ స్థానంలో ఉంది. ( ఎత్తున ఉంది). బాస్కెట్ బాల్ బాస్కెట్ బాల్ ఇరాన్‌లో ప్రాముఖ్యత సంతరించుకుంది. 2007 నుండి " ఇరాన్ బాస్కెట్ బాల్ టీం " మూడుమార్లు ఎఫ్.ఐ.బి.ఎ. ఆసియా చాంపియన్ షిప్‌ను గెలుచుకుంది. 1974 లో ఆసియన్ గేంస్ లో ఇరాన్ ఆసియన్ గేంస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. పశ్చిమాసియాదేశాలలో ఆసియన్ గేంస్‌కు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా ఇరాన్ గుర్తింపును పొందింది. ఆహారసంస్కృతి thumb|Kuku Sabzi with herbs, topped with barberries and walnuts ఇరాన్ ఆహారాలు వైవిధ్యతను కలిగి ఉంటాయి. వీటి మీద పొరుగుప్రాంతాల ఆహారవిధానాలు విపరీతంగా ప్రభావితం చూపుతున్నాయి. ఊక్కొక ప్రాంతం ఆహారాలు, వండేవిధానం సంప్రదాయాలు , శైలి వైవిధ్యం కలిగి ఉంటాయి. ఇరానియన్ ఆహారం బియ్యం, మంసం, కోడి మాసం, చేపలు , కూరగాయలు, వేళ్ళు , మూలికలను అధికంగా వాడుతుంటారు, మూలికలను అధికంగా ప్లం, దానిమ్మ, క్వింస్, ప్రూనెస్, అప్రికాట్స్ మొదలైన పండ్లతో మొలకలను చేర్చి తీసుకుంటుంటారు. ఇరానీయులు సాధారణంగా సాదా యోగర్ట్ (ఒక విధమైన పెరుగు) ను మధ్యాహ్న భోజం , రాత్రి భోజనాలతో తింటూంటారు. ఇరాన్‌లో యోగర్ట్ ప్రధాన ఆహారాలలో ఒకటిగా ఉంది. అహారంలో సమతుల్యత కొరకు సుచాసన చేర్చడానికి కుంకుమ పువ్వు, ఎండిన నిమ్మకాయలు, దాల్చిన చెక్క , పార్స్లీ కలిపి కొన్ని ప్రత్యేకమైన వంటకాలను వండుతుంటారు. ఎర్రగడ్డలు , తెల్లగడ్డలు వంటలతో చేర్చి వండుతూ వటిని విడిగా కూడా భోజనసమయాలలో వడ్డిస్తుంటారు. వీటిని సహజసిద్ధంగా తరిగిన ముక్కలు , ఊరగాయరూపంలో భోజనం , ఉపాహారాలతో అందిస్తారు. ఇరాన్‌లో " కవీర్" ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇరాన్ కేబినెట్‌లో మహిళలు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇరాన్ కేబినెట్‌లో మహిళలకు చోటు లభించింది. దేశాధ్యక్షుడిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అహ్మదీ నెజాద్ కేబినెట్‌లో గైనకాలజిస్టు మర్‌జిహే వహిద్ దస్త్‌జెర్ది (50), శాసనకర్త ఫాతిమే అజోర్లు (40) మహిళలు.1970ల తర్వాత ఇరాన్ కేబినెట్‌లో స్త్రీలకు చోటు దక్కడం ఇదే ప్రథమం. 1968-77 మధ్య ఫరోఖ్రో పార్సే చివరి మహిళా మంత్రిగా పనిచేశారు. 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అవినీతి ఆరోపణలపై ఆమెను పాలకులు ఉరితీశారు.ఈనాడు 17.8.2009 అధికారిక ప్రభుత్వ లింకులు Official site of the Supreme Leader, (Qom office) Presidency of the Islamic Republic of Iran - Official website. The Council of Guardians, Official website. The Majlis, Iran's parliament. (2). Ministry of Foreign Affairs సూచికలు బయటి లింకులు News and Economy Portal Encyclopaedia Iranica Iranian Cultural & Information Center at Stanford University, California Iran Travel and Tourism Guide CIA World Factbook - Iran The Dismal Reality of Ahlus Sunnah in Iran Iran, The Persian Gulf - Iran in the Persian Gulf ప్రపంచంలో ఇరాన్ హైకమిషన్, ఎంబసీ, కాన్సులేట్ (రాయబార కార్యాలయా) ల జాబితా Iranian High Commissions, embassies and consulates వర్గం:ఆసియా దేశాలు వర్గం:పర్షియన్ సంధి దేశాలు వర్గం:ఇరాన్ వర్గం:మధ్యప్రాచ్య దేశాలు
తజికిస్తాన్
https://te.wikipedia.org/wiki/తజికిస్తాన్
తజికిస్తాన్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్ (ఆంగ్లం : Tajikistan) (తజక్ భాష : Тоҷикистон), (పర్షియన్ : تاجیکی ) పూర్వపు తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, మధ్య ఆసియాలోని ఒక దేశము. దీనికి ఆఫ్ఘానిస్తాన్, చైనా, కిర్గిజ్ స్తాన్,, ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దులు ఉన్నాయి. దక్షిణంలో ఉన్న పాకిస్థాన్‌ను వాఖన్ కారిడార్ వేరు చేస్తుంది. తజికిస్తాన్ అంటే తజిక్ ల మాతృభూమి అని అర్థం. మద్య ఆసియాలో తజికిస్తాన్ పర్వతమయమైన భూబంధిత సార్వభౌమత్వాధికారం కలిగిన దేశం. 2013 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 8 మిలియన్లని అంచనా. జసంఖ్యాపరంగా తజకిస్థాన్ ప్రపంచదేశాలలో 98 వ స్థానంలో ఉంది. దేశ వైశాల్యం 143100 చ.కి.మీ. వైశాల్యపరంగా తజకిస్థాన్ ప్రపంచదేశాలలో 96వ స్థానంలో ఉంది. తజకిస్థాన్ సంప్రదాయంగా తజిక్ ప్రజలకు స్థానిక ప్రదేశంగా ఉంది. ప్రస్తుతం దేశంలో తజకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుత తజకిస్థాన్ ప్రాంతంలో పూర్వం పలు ఆసియన్ సంప్రదాయాలకు నిలయంగా ఉంది. తర్జం నగరంలో నియోలిథిక్, కాంశ్యయుగం కాలంనాటి ప్రజలు నివసించారు. తరువాత తజకిస్థాన్ పలు మతాలకు, సంస్కృతులకు చెందిన పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. బక్ట్రియా- మర్గియానా (ఆక్సస్ సంస్కృతి), అండ్రొనొవొ సంస్కృతి, బుద్ధిజం, నెస్టోరియన్ క్రిస్టియానిటీ, జొరొయాస్ట్రియనిజం, మనిచీయిజం మొదలైన పలుసంస్కృతులకు చెందిన పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ ప్రాంతం పలు సామ్రాజ్యాలలో భాగమై పలు రాజవంశాల పాలనలో ఉంది. తిమురిడ్ రాజవంశం, రష్యన్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని పాలించాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత 1991 తజకిస్థాన్ స్వతంత్రరాజ్యంగా మారింది. 1992-1997 మద్య కాలంలో తజకిస్థాన్ స్వతంత్రం కొరకు అంతర్యుద్ధాన్ని ఎదుర్కొన్నది. యుద్ధం చివర స్థిరమైన రాజకీయ స్థితి నెలకొనడమే కాక దేశాభివృద్ధికి అవసరమైన విదేశీసాహాయం కూడా లభించింది. తజకిస్థాన్ నాలుగు ప్రాంతాలు కలిగిన ఒక " ప్రెసిడెంషియల్ రిపబ్లిక్ ". తజకిస్థాన్ లోని 8 మిలియన్ల ప్రజలలో అత్యధికులు తజకి సంప్రదాయానికి చెందిన ప్రజలు. వీరు తజకీ భాషను (ఆధునిక పర్షియన్ యాసలలో ఒకటి) మాట్లాడుతుంటారు. రష్యాభాష కూడా ప్రజలలో అధికంగా వా డుకలో ఉంది. దేశంలో 90% భూమి పర్వతమయంగా ఉంటుంది. దేశ ఆర్థికరంగం అధికంగా అల్యూమినియం, పత్తిపంట మీద ఆధారపడి ఉంది. దేశం జి.డి.పి. ప్రపంచదేశాలలో 126వ స్థానంలో ఉంది. కొనుగోలుశక్తి ప్రపంచదేశాలలో 136వ స్థానంలో ఉంది. పేరువెనుక చరిత్ర తజకిస్థాన్ అంటే " తజకీల భూమి " అని అర్ధం. స్థాన్ అంటే పర్షియన్ భాషలో ప్రదేశం అని అర్ధం. or "country" తజకీలు ఇస్లామిక్ పూర్వకాలానికి (7వ శతాబ్ధానికి ముందు ) చెందిన గిరిజనులు.A Country Study: Tajikistan, Ethnic Background, Library of Congress Call Number DK851 .K34 1997, http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field%28DOCID+tj0013%29 1997 " లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ " తజకిస్థాన్ దేశాధ్యయనం తజిక్ పదం అర్ధం తెలుసుకోవడం కష్టం. 12వ శతాబ్దంలో మద్య ఆసియాలో నివసించిన ప్రజలు టర్కిక్, ఇరాన్ ప్రజలని అన్న విషయం వివాదాంశంగా ఉంది. చరిత్ర ఆరంభకాల చరిత్ర ఈ ప్రాంతపు సంస్కృతులు క్రీ.పూ 4వ శతాబ్ధానికి చెందినవి. వీటిలో కాంశ్యయుగం, బక్ట్రియా- మర్గియానా ఆర్కియాలాజికల్, అండ్రినొవొ సంస్కృతి, సరజం (ప్రపంచ వారసత్వసంపద)లు ప్రధానమైనవి.UNESCO, pro-urban site of Sarazm, http://whc.unesco.org/en/list/1141 ఈ ప్రాంతసంబంధంగా నమోదైన చరిత్రలో ప్రారంభకాలానిమి చెందినది క్రీ.పూ 500 సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. కొంతమంది పరిశోధకులు క్రీ.పూ 7-6 శతాబ్దాలు ఆధునిక తజకిస్థాన్‌లో జరవ్షన్ లోయ అచమెనింద్ సామ్రాజ్యంలో భాగం కాకముందు కాంభోజరాజ్యంలో భాగంగా ఉన్నాయని భావిస్తున్నారు.See: The Deeds of Harsha: Being a Cultural Study of Bāṇa's Harshacharita, 1969, p 199, Dr Vasudeva Sharana Agrawala; Proceedings and Transactions of the All-India Oriental Conference, 1930, p 118, Dr J. C. Vidyalankara; Prācīna Kamboja, jana aura janapada =: Ancient Kamboja, people and country, 1981, Dr Jiyālāla Kāmboja, Dr Satyavrat Śāstrī - Kamboja (Pakistan). అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత గ్రేకో-బక్టిరియన్ రాజ్యంలో (అలెగ్జాండర్ తరువాత పాలన) భాగం అయింది. ఉత్తర తజకిస్థాన్ (ఖుజంద్, పంజకెంట్) సొగ్డియాలో భాగంగా ఉండేది. క్రీ.పూ 150 లో నగర- రాజ్యాల కూటమి స్కిథియన్లు, యుయేజీ నోమాడిక్ గిరిజనజాతుల ఆధీనంలో ఉన్నాయి. సిల్క్ రోడ్డు ఈ ప్రాంతం గుండా నిర్మించబడింది. చైనా చక్రవర్తి వూ ఆఫ్ హన్ పాలనా కాలంలో (క్రీ.పూ 141) అన్వేషకుడు ఝంగ్ క్వియాన్ దండయాత్రచేసిన సమయంలో హాన్ సామ్రాజ్యం (చైనా), సిగ్డియానాల మద్య వ్యాపారసంబంధాలు ఉండేవి.C. Michael Hogan, Silk Road, North China, The Megalithic Portal, ed. Andy BurnhamShiji, trans. Burton Watson సొగ్డియన్లు ఈ ప్రాంతంలో వ్యవసాయం, వడ్రంగి పని, గ్లాస్ తయారీ, వుడ్‌కార్వర్స్ పనులు, వ్యాపార సౌకర్యాలు కలిగించడంలో ప్రముఖపాత్ర వహించారు.Wood 2002:66సా.శ. 1వ శతాబ్దంలో కుషన్ సామ్రాజ్యం (యుయేజీ సముదయకూటమి) ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని 4వ శతాబ్దం వరకు పాలించింది. ఈ కాలంలో ఈ ప్రాంతంలో బుద్ధిజం, నెస్టోరియన్ క్రిస్టియానిటీ, జొరొయాష్ట్రియనిజం, మనియాచిజం ఆచరణలో ఉండేవి. http://lcweb2.loc.gov/cgi-bin/query/r?frd/cstdy:@field%28DOCID+tj0014%29 తరువాత హెప్తలైట్ సామ్రాజ్యం (నోమాడిక్ జాతి కూటమి) ఈ ప్రాంతానికి తరలి వచ్చారు. 8వ శతాబ్దం ఆరంభకాలానికి ఈ ప్రాంతానికి అరబ్ ప్రజలు ఇస్లాంను తీసుకువచ్చారు. తరువాత తజకిస్థాన్ ప్రాంతం మద్య ఆసియా, చైనా మద్య వ్యాపార మార్గంగా, ఇస్లామిక్ ప్రధాన ప్రాంతంగా ప్రాముఖ్యత కలిగి ఉంది. అరబ్ పాలనను త్రోసి సనిద్ సామ్రాజ్యం ఈ ప్రాంతంమీద ఆధిక్యత సాధించింది. తరువాత సమర్ఖండ్, భుకారా నగరాలను (ప్రస్తుతం ఈ నగరాలు ఉజ్బెక్స్థాన్లో ఉన్నాయి) విస్తరించింది. ఇవి తజకిస్థాన్ సంస్కృతికి కేంద్రంగా మారాయి. తరువాత వీటిని టిబెట్ సామ్రాజ్యం ఆతరువాత చైనా 650-680 స్వాధీనం చేసుకున్నాయి. 710 ఈ ప్రాంతాలను తిరిగి అరేబియన్లు స్వాధీనం చేసుకున్నారు. కరా- ఖండ్ ఖనటే ట్రాంసోక్సానియాను (అందులో ఆధునిక ఉజ్బెకిస్థాన్,తజకిస్థాన్,దక్షిణ కిర్గొజ్స్థాన్, నైరుతీ కజకిస్థాన్ ఉన్నాయి) స్వాధీనం చేసుకుని 999-1211 మద్య పాలించింది. వారు ట్రాంసోక్సానియాలో ప్రవేశించిన తరువాత ఇరానియన్ నుండి వచ్చున టర్కీపాలకుల ప్రభావం మద్య ఆసియాలో అధికరించింది. క్రమంగా కరా- ఖండీలు ఈ ప్రాంతంలోని పర్షియన్- అరేబియన్ ముస్లిం సంస్కృతిలో కలిసిపోయారు.ilak-khanids: Iranica. accessed May 2014. 13వ శతాబ్దంలో జంఘిస్ ఖాన్ మంగోలీ ఖవరెజ్మియా దండయాత్ర తరువాత మంగోలీ సామ్రాజ్యం దాదాపు మద్య ఆసియా ప్రాంతం అంతటినీ తమ అధీనంలోకి తీసుకుంది. దాదాపు ఒక శతాబ్దం తరువాత ఆధునిక తజకిస్థాన్ జగటై కనాటే పాలనలోకి మారింది. తమర్లనే తింరుద్ సామ్రాజ్యస్థాపన చేసి 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తనస్వాధీనంలోకి తీసుకున్నాడు. 16వ శతాబ్దంలో ఆధునిక తజకిస్థాన్ బుఖారాకు చెందిన కనాటేల స్వాధీనంలోకి మారింది. 18వ శతాబ్దం నాటికి కనేటాల పాలన ముగింపుకు వచ్చి ఈ ప్రాంతం బఖారాకు చెందిన ఎమిరేటులు, కనాటే కొకండ్‌ల ఆధీనంలోకి చేరింది. 20వ శతాబ్దం వరకు ఈప్రాంతంలో ఎమిరేటుల పాలన కొనసాగింది. అయినప్పటీకీ 19వ శతాబ్దంలో 2వ ప్రపంచయుద్ధం సమయంలో యురేపియన్ శక్తి (రష్యన్ సామ్రాజ్యం) ఈ ప్రాంతానికి చెందిన భూభాగాలను ఆక్రమించడం ప్రారంభించింది. రష్యన్ తజకిస్థాన్ 19వ శతబ్ధంలో రష్యా సామ్రాజ్యవాదం మద్య ఆసియాలోని భూభాగాలపై విజయం సాధించడానికి దారితీసింది. 1864, 1885 ల మద్యకాలంలో రష్యా క్రమంగా రష్యన్ తజకిస్థాన్ ప్రాంతం మొత్తం మీద (బుఖారా ఎమిరేట్, కనాటే కొకండ్ ఆధిక్యత సాధించింది. రష్యా ఈ ప్రాంతానికి కాటన్ సరఫారా చేయడానికి ఆసక్తి చూపింది. 1870 నాటికి ఈ ప్రాంతంలో ధాన్యం బదులుగా పత్తి పండించబడింది. ఈ వ్యూహం తరువాతి కాలంలో సోవియట్లు అనుకరించి విస్తరించారు. 1885 నాటికి తజకిస్థాన్ ప్రాంతం రష్యా లేక రష్యాకు చెందిన వస్సాల్ రాజ్యంలో భాగంగా ఉంది. ఎమిరేట్స్ ఆఫ్ బుఖారా ప్రాంతం రష్యా ప్రభావాన్ని అనుభవించింది. thumb|Tajik men and boys, 1905-1915 19వ శతాబ్దంలో జదీదిస్టులు ఈ ప్రాంతం అంతటా ఇస్లామిక్ ఉద్యమానికి తెరతీసారు. ఆధునిక భావాలుకలిగిన జదీదిస్టులు రష్యాపట్ల వ్యతిరేకత చూపనప్పటికీ రష్యనులు ఈ ఉద్యమన్ని ఒక బెదిరింపుగా భావించారు. 1910, 1913 మద్య రష్యన్ బృందాలు కొకనాడ్ కనాటేల వ్యతిరేకతను తగ్గించి పరిస్థితి చక్కదిద్దాలనుకున్నారు. 1916 జూలైలో మొదటి ప్రపంచయుద్ధంలో బలవంతంగా పపాల్గొన చేసినందుకు ప్రదర్శనకారులు ఖుజంద్‌లో రష్యన్ సైనికులపై దాడి చేసిన తరువాత హింసాత్మకచర్యలు అధికం అయ్యాయి. బదులుగా రష్యన్ బృందాలు త్వరగానే పస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ తజకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో ఘర్ష్ణలు కొనసాగాయి. సోవియట్ తజకిస్థాన్ thumb|left|Soviet negotiations with basmachi, 1921 1997లో రష్యాతిరుగుబాటు తరువాత మద్యాసియా అంతటా గొరిల్లాలు (బాస్మాచి) స్వతంత్రాన్ని రక్షించుకోవడానికి బొల్షెవిక్ సైన్యాలతో యుద్ధం చేసారు. 4 సంవత్సరాల యుద్ధంలో బొల్షెవిక్‌లు మసీదులను, గ్రామాలను కాల్చివేసి ప్రజలను అణివేతకు గురిచేసారు. సోవియట్ ప్రభుత్వం లౌకిక వాదాన్ని బలపరుస్తూ ఇస్లాం, జ్యూడిజం, క్రైస్తవమతావలంబనలను నిరుత్సాహపరచడం లేక అణిచివేస్తూ పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో మసీదులు, చర్చిలు, సినగోగ్యూలు మూతపడ్డాయి. తరువాత సంఘర్షణల పర్యవసానంగా సోవియట్ సంఘటిత వ్యవసాయవిధానాల వలన మద్య ఆసియా, తజికిస్థాన్‌ ప్రాంతాలు కరువుతో పీడించపడ్డాయి. కరువు పలువురు ప్రణాలను బలితీసుకున్నది.1924లో ఉజ్బెకిస్థాన్‌లో భాగంగా తజిక్ అటానిమస్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ రూపొందించబడింది. 1929లో తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (తజిక్ ఎస్.ఎస్.ఆర్) గా ప్రత్యేక రిపబ్లిక్ రూపొందించబడింది. అయినప్పటికీ సంప్రదాయక తజిక్ నగరాలైన సమర్కండ్, బుఖారాలు ఉజ్బెక్ ఎస్.ఎస్.ఆర్.లో ఉండిపోయాయి. 1927, 1934 మద్య దక్షిణప్రాంతంలో సంఘటిత వ్యవసాయం, వేగవంతమైన పత్తిపంట అభివృద్ధి చేయబడింది. సోవియట్ సంఘటిత విధానాలు వ్యవసాయదారులలో వ్యతిరేకతను అధికరించి తజికిస్థాన్‌ను వదిలి ఇతరప్రాంతాలకు వలసపోవలసిన పరిస్థితికి నెట్టాయి. కొందరు వ్యవసాయదారులు సంఘటిత వ్యవసాయాన్ని ఎదిరిస్తూబస్మాచీ ఉద్యమాన్ని బలపరిచారు. నీటిపారుదల ప్రాజెక్టులు విస్తరణ కారణంగా కొన్ని చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి సాధ్యం అయింది. మాస్కో 1927-1934, 1937-1938 మద్య రెండు దఫాలుగా ప్రక్షాళన కార్యక్రమాలను చేపట్టింది. ఫలితంగా తజకిస్థాన్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన అన్నిస్థాయిలకు చెందిన 10,000 మంది బహిస్కరణకు గురైయ్యారు. బహిష్కరణకు గురైనవారి స్థానంలో సంప్రదాయ రష్యా ప్రజలు పంపబడ్డారు. ఫలితంగా రష్యాప్రజలు అన్ని స్థాయిలలో ఆధిక్యత సాధించారు. మొదటి సెక్రటరీ పదవిలో కూడా రష్యన్లు నియమించబడ్డారు. 1926, 1959 మద్య తజకిస్థాన్‌లో రష్యనుల తరలింపు 1% నుండి 13% అధికరించింది.Tajikistan – Ethnic Groups, U.S. Library of Congress సోవియట్ శకంలో తజికిస్థాన్ కమ్యూనిస్ట్ పార్టీ మొదటి సెక్రటరీ ( 1946-1956 ) గా పనిచేసిన రాజకీయనాయకుడు బొబొజాన్ ఘఫురోవ్ మాత్రమే గుర్తించతగిన దేశీయేతర ఒకేఒక రాజకీయనాయుకుడుగా ఉన్నాడు. ఆయన తరువాత తేసున్ ఉల్బజయేవ్ (1956-61), జబ్బొర్ రసుల్ఫ్వ్ (1961-1982), రహమాన్ నబియేవ్ (1982-1985, 1991-1992) ఈ పదవిని చేపట్టారు. 1939లో మొదటి ప్రపంచయుద్ధంలో తజకిస్థానీయులు నిర్బంధంగా సోవియట్ సైన్యంలో నియమించబడ్డారు. 2,60,000 మంది తజికిస్థానీయులు జర్మని,ఫిన్లాండ్, జపాన్ లతో పోరాటం సాగించారు.Historical Dictionary of Tajikistan, by Kamoludin Abdullaev,Shahram Akbarzaheh, 2010, second edition, pg 383 రెండవ ప్రపంచ యుద్ధంలో 60,000 (4%), 1,20,000 (4%).Vadim Erlikman. Poteri narodonaseleniia v XX veke spravochnik. Moscow 2004; ISBN 5-93165-107-1, pp. 23–35 15,30,000 మంది పౌరులు మరణించారు. యుద్ధం తరువాత స్టాలిన్ పాలనలో తజికిస్థాన్‌లో వ్యవసాయం, పరిశ్రమలు విస్తరించబడ్డాయి. 1957-1958 నికిత క్రుస్చేవ్ వర్జిన్ లాండ్స్ కంపాజిన్ సోవియట్ యూనియన్ లోని ఇతర రిపబ్లికన్ల కంటే జీవనస్థితి, విద్య, పరిశ్రమ పరంగా వెనుకబడి ఉన్న తజకిస్థాన్ మీద దృష్టి కేంద్రీకరించింది. In the 1980s, Tajikistan had the lowest household saving rate in the USSR,Boris Rumer, Soviet Central Asia: A Tragic Experiment, Unwin Hyman, London, 1989, p. 126. ఆసమయంలో తజకిస్థాన్ తలసరి ఆదాయం అతి తక్కువగా ఉండేది. Statistical Yearbook of the USSR 1990, Goskomstat, Moscow, 1991, p. 115 . అలాగే 1000 మందిలో విశ్వవిద్యాలయ డిగ్రీపుచ్చుకున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉండేది.Statistical Yearbook of the USSR 1990, Goskomstat, Moscow, 1991, p. 210 . 1980 నాటికి తజిక్ జాతీయవాదులు అధిక హక్కుల కొరకు పోరాటపిలుపును ఇచ్చారు. 1990 వరకు వాస్తవమైన ఆటంకాలు లేవు. తరువాత సోవియట్ యూనియన్ పతనావస్థకు చేరుకుంది. అలాగే తజికిస్థాన్ స్వతంత్రం ప్రకటించుకుంది. thumb|Tajik men and women rally on Ozodi square in Dushanbe shortly after independence, 1992. స్వతంత్రం thumb|left|Spetsnaz soldiers during the Civil War, 1992. దేశంలో అకస్మాత్తుగా అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతర్యుద్ధంతో పలు వర్గ ఘర్షణలు మొదలైయ్యాయి. . హింసకారణంగా 5,00,00 కంటే అధికంగా నివాసితులు పేదరికం అధికరించడం, పశ్చిమదేశాలు, ఇతర సోవియట్ రిపబ్లిక్కులలో మంచి ఉద్యోగవకాశాలు దేశం నుండి పారిపోయారు. 1992లో నవంబరు ఎన్నికలలో అబ్దుమాలిక్ అబ్దుల్లాజినోవ్‌ను ఓడించి 58% ఓట్ల ఆధిక్యతతో ఓడించి ఎమోమల్లి రహమాన్ అధికారానికి వచ్చాడు. యుద్ధం ముగింపు తరువాత తజకిస్థాన్ పూర్తిగా ధ్వంసం చేయబడిన తరువాత ఎన్నికలు నిర్వహించబడ్డాయి. యుద్ధంలో 1,00,000 మంది మరణించారు. 1.2 మిలియన్ల ప్రజలు దేశీయంగా, పొరుగుదేశాలకు ఆశ్రితులుగా వెళ్ళారు. 1997లో అఖ్యరాజ్యసమితి జోక్యంతో రహమాన్, గెర్డ్ డి మెర్రం నాయకత్వంలో ప్రతిపక్షపార్టీల మద్య శాంతి ఒప్పందం జరిగింది. ఒప్పందంలో 30% యునైటెడ్ తజిక్ అపోజిషానికి మంత్రివర్గపదవులు ఇవ్వడానికి అవకాశం కలిగించింది. 1999 తజకిస్థాన్ అధ్య్క్షక్ష ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో రహమాన్ 98% ఓట్లతో విజయం సాధించడం పరిపక్షాలు, విదేశీపర్యవేక్షకుల విమర్శకు లోనైంది. 2006 ఎన్నికలలో రహమాన్ 79%తో విజయం సాధించి మాడవసారి అధ్యక్షపదవిని అలంకరించాడు. 2006 ఎన్నికలను పలు ప్రతిపక్షాలు నిరాకరించాయి. ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ ఐరోపా ఎన్నికలను విమర్శించింది. కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ పర్యవేక్షకులు ఎన్నికలు చట్టబద్ధంగా, పారదర్శకంగా జరిగాయని నిర్ధారించింది. 2010 లో ఒ.ఎస్.సి.ఇ. రహమాన్ పాలనలో మధ్యమాన్ని అణచడం, తీవ్రంగా సెంసార్ చేయడం గురించి మరింతగా విమర్శించింది. తజిక్ ప్రభుత్వం తజక్, విదేశీ వెబ్‌సైట్లను సెంసార్ చేయడం, ప్రచురణా సంస్థల మీద పన్నును అధికరించడం చేస్తుంది. స్వతంత్ర వార్తాపత్రికలు, ప్రచురణాచర్యలు హింసకు గురౌతున్నాయి.2005 వేసవి వరకు రష్యా సరిహద్దు దళాలు తజిక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో నిలుపబడ్డాయి. 2001 సెప్టెంబరు దాడి తరువాత ఫ్రాన్స్ సైనికదళాలు నాటో ఎయిర్ ఆపరేషన్‌కు మద్దతుగా దుషన్‌బే ఎయిర్ పోర్ట్‌లో నిలిచాయి. యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ, యునైటెడ్ స్టేట్స్ మేరిన్ దళాల అధికారులు కొన్ని వారాలపాటు సమైక్య శిక్షణ కొరకు అప్పుడప్పుడు తజకిస్థాన్‌కు వస్తుంటారు. 2010లో భారతప్రభుత్వం దుషన్‌బేకు ఆగ్నేయంలో ఉన్న అయ్ని ఎయిర్ బేస్ పునర్నిర్మాణ కార్యక్రమాలను (70 మిలియన్ల అమెరికన్ డాలర్లు) చేపట్టి పూర్తిచేసింది. అది ప్రస్తుతం తజికిస్థాన్ ప్రధాన ఎయిర్ బేస్‌గా ఉపయోగించబడుతుంది. అయని ఎయిర్ బేస్ ఉపయోగం గురించి రష్యా ఆందోళన చెందుతున్నట్లు కొన్ని మాటలు ప్రచారంలో ఉన్నాయి.. అలాగే రష్యా దుషంబే వెలుపల బృహత్తర ఎయిర్ బేస్‌ను నిర్వహిస్తుంది.2010లో తజిక్ జైళ్ళ నుండి 25 మంది తీవ్రవాదులు తప్పించుకున్న తరువాత అధికారులు తూర్పుభాగంలోని ఇస్లామిక్ మెటీయరిలిజం గురించి ఆందోళన చెందారు. తరువాత సెప్టెంబరులో రష్త్ లోయ వద్ద 28 మంది తజిక్ సైనికులు తీవ్రవాదుల దాడిలో మరణించారు. మరొక దాడిలో 30 మంది సైనికులు మరణించారు. ఘరం వెలుపల జరిగిన ఘర్షణలో 3 మంది తీవ్రవాదులు మరణించారు. తరువాత 2010 నవంబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రప్రభుత్వం తూర్పు భాగాన్ని ఆధీనంలోకి తీసుకుని రష్త్ లోయలో సైనికచర్య తీసుకొనవలెనని నిర్ణయం తీసుకొనబడింది. 2012 జూలైలో గొర్నొ- బదఖ్షన్ ఘర్షణలు తలెత్తాయి. 2015లో రష్యా తజికిస్థాన్‌కు మరిన్ని సైనిక బృందాలను పంపింది.2015 మే మాసంలో తజకిస్థాన్ నేషనల్ సెక్యూరిటీ తీవ్రమైన వెనుకబాటుకు గురైంది. రాజకీయాలు thumb|Presidential Palace స్వతత్రం వచ్చిన వెంటనే తజికిస్థాన్‌లో అంతర్యుద్ధం మొదలైంది. రష్యా, ఇరాన్ నేపథ్యంలో పలు వర్గసంఘర్షణలు ఒకరితో ఒకరు పోరాడుకున్నారు. . యుద్ధం కారణంగా పరిశ్రమలలో నియమించబడిన 40,000 మందిలో 25,000 మంది రష్యాకు పారిపోయారు. 1997లో యుద్ధం ఉపశమించింది. 1999లో జరిగిన శాంతిపూరితమైన వాతావరణంలో ఎన్నికల తరువాత తజికిస్థాన్ ప్రభుత్వం రూపొందించబడింది. thumb|left|upright|President of Tajikistan, Emomalii Rahmon has ruled the country since 1994. Greenberg, Ilan, "Media Muzzled and Opponents Jailed, Tajikistan Readies for Vote," The New York Times, 4 November 2006 (article dateline 3 November 2006), page A7, New York edition అధికారిక రిపబ్లిక్ తజికిస్థాన్ అధ్యక్షపీఠానికి, పార్లమెంటు సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలను నిర్వహిస్తుంది. ఆధిక్యత కలిగిన పార్టీ విధానంలో పాలన నిర్వహించబడుతుంది. " పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ తజికిస్థాన్ " వరుసగా పార్లమెంటులో ఆధిక్యత కలిగి ఉంది. ఎమోమల్లి రహమాన్ 1994 నవంబరు నుండి అధ్యక్ష పీఠాన్ని అలంకరించాడు. కొఖిర్ రసుల్జొడా ప్రధానమంత్రి పదవి బాధ్యత వహించాడు. మతుబ్ఖాన్ దవ్లతొవ్ మొదటి ఉపముఖ్యమంత్రిగా మురొదలి అలిమర్దన్, రుక్వియా కుర్బనివ సహాయ ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు. 2005 పార్లమెంటరీ ఎన్నికలలో ప్రతిపక్షాలు, విదేశీ పర్యవేక్షకుల నుండి పలు ఆరోపణలు ఎదురైయ్యయి. అధ్యక్షుడు ఎమోమలి రహమాన్ ఎన్నికల ప్రక్రియను లంచాలను ఇచ్చి దారిమళ్ళించాడని ఆరోపణలు ఎదురైయ్యాయి. 2010 ఫిబ్రవరిలో ఎన్నికలలో రూలింగ్ పార్టీ (పి.డి.పి.టి) 4 పార్లమెంటరీ స్థనాలను కోల్పోయింది. అయినప్పటికీ తగినంత మెజారిటీ సాధించింది. " ఆర్ఘనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో- ఆపరేషన్ ఇన్ యూరప్" ఎన్నికల పర్యవేక్షకులు ఈ ఎన్నికలు పలు డెమొక్రటిక్ ప్రమాణాలను అతిక్రమిచాయని భావించింది. The government insisted that only minor violations had occurred, which would not affect the will of the Tajik people. 2006 నవంబరు 6 ఎన్నికలను ప్రధానప్రతిపక్షాలు బహిష్కరించాయి. తజిక్ అధ్యక్షుడు, ఇరాన్ విదేశాంగ మంత్రి సమావేశం తరువాత తజికిస్థాన్ సంఘై కోపరేషన్ ఎన్నికలలో ఇరాన్ సభ్యత్వానికి తజికిస్థాన్ మద్దతు తెలిపంది. పత్రికాస్వతంత్రానికి ప్రభుత్వం అధికారికంగా మద్దతు ఇస్తుంది. అయినప్పటికీ పత్రికలమీద షరతులు విధిస్తూనే ఉంది. " వార్ & పీస్ " ఇంస్టిట్యూట్ నివేదిక అనుసరించి తజిక్ న్యూస్, ఫర్ఘన, సెంట్రాసియా, ప్రాంతీయ, విదేశీ వెబ్ సైట్లను నిషేధించబడ్డాయి అని తెలియజేస్తుంది. పత్రికావిలేఖరులు వివాదాంశమైన వార్తలను అందించడానికి ఆటంకాలు ఉన్నాయి. భౌగోళికం thumb|Satellite photograph of Tajikistan తజికిస్థాన్ భూబంధిత దేశం. అలాగే వైశాల్యపరంగా తజికిస్థాన్ మద్య ఆసియాలో అతిచిన్న దేశంగా గుర్తించబడుతుంది. ఇది ఉత్తర అక్షాంశంలో 36°, 41° N (a small area is north of 41°, తూర్పురేఖా ంశం 67° - 75° ఉంది. ఇది పామిర్ పర్వతాలతో నిండి ఉంది.Mughal, Muhammad Aurang Zeb. 2013. "Pamir Alpine Desert and Tundra." Robert Warren Howarth (ed.), Biomes & Ecosystems, Vol. 3. Ipswich, MA: Salem Press, pp. 978-980. దేశవైశాల్యంలో సముద్రమట్టానికి 3000 మీ ఎత్తున ఉంది. దిగువ భూభాగం ఫర్గన కఫర్నేషన్ లోయ, వఖ్ష్ నదికి (అము దర్యా నుండి ప్రవహిస్తున్నాయి) దక్షిణ తీరంలో ఉంది. దుషంబే కఫర్నేషన్ లోయ దక్షిణంలో ఉంది. పర్వతంఎత్తుప్రదేశం ఇస్మాయిల్ సొమొని శిఖరం (అత్యంత ఎత్తైనది) 7,495 మీ24,590 అడుగులుగొర్నొ బదక్షన్ వాయవ్యంలో కిర్గిస్థాన్ దక్షిణ సరిహద్దు. ఐ.బి.ఎన్. సినా శిఖరం. (లెనిన్ పీక్) 7,134 మీ23,537 అడుగులుట్రాంస్ అలే పర్వాతావళి ఉత్తర సరిహద్దు. ఇస్మాయిల్ సొమొని శిఖరం ఈశాన్యం. కొర్ఝనెవ్స్కయ శిఖరం7,105 మీ23,310 అడుగులుఇస్మాయిల్ సొమొని శిఖరం ఉత్తరం.ముక్సు నది దక్షిణతీరం. స్వతంత్ర శిఖరం (రివల్యూషన్ పీక్) 6,974 మీ22,881 అడుగులుగొర్నొ బదక్షన్ మద్యభాగం ఇస్మాయిల్ సొమొని శిఖరం ఆగ్నేయం అక్డమియా పర్వతావళి 6,785 మీ 22,260 అడుగులుగొర్నొ బదక్షన్ వాయవ్య సరిహద్దుకరి మార్క్ శిఖరం 6,726 మీ 22,067 అడుగులుజి.బి.ఒ, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో. కరకొరం పర్వతావళి ఉత్తర కొన.గొర్నొ శిఖరం6,595 మీ21,637 అడుగులువాయవ్య గొర్నొ - బదక్షన్ మయకొవ్స్కి శిఖరం.6,096 మీ20,000 అడుగులుజి.బి.ఒ నైరుతి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో.కాంకర్డ్ పీక్.5,469 మీ17,943 అడుగులుకొరకొరం పర్వతావళి ఉత్తర కొన దక్షిణ సరిహద్దు. కిజిలర్ట్ పాస్ 4,280 మీ14,042 అడుగులుట్రాంస్ అలే పర్వతావళి ఉత్తర సరిహద్దు. అము దర్య, పంజ్ నదులు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్నాయి. తజికిస్థాన్ పర్వతాలలో ఉన్న గ్లాసియర్లు నదీజలాలకు ప్రధాన ఆధారంగా ఉంది. ఇవి ఆరా సముద్రంలో సంగమిస్తున్నాయి. తజికిస్థాన్‌లో 10కి.మీ పొడవైన నదులు 900 ఉన్నాయి. పాలనా విభాగాలు thumb|Mountains of Tajikistan తజకిస్థాన్‌లో 4 పాలనా విభాగాలు ఉన్నాయి. ప్రాంతాలు (ప్రొవింస్ ) ; (విలోయత్) సుఘ్ద్, ఖత్లాన్, స్వయం ప్రతిపత్తి కలిగిన గొర్నొవ్- బదాక్షన్ (జి.బి.ఎ.ఒ),, సుబోర్దినేషన్ రిపబ్లిక్. ప్రతివిభాగం పలు ఉపవిభాగాలుగా (జిల్లాలు) (నొహియా, రైన్) విభజించబడి ఉన్నాయి. జిల్లాలు జమోత్స్ (స్వయంపాలిత గ్రామాలు), గ్రామాలు (క్వాష్లోక్విస్). 2006 గణాంకాలను అనుసరించి 367 జమోత్‌లు ఉన్నాయి. విభాగం ఐ.ఎస్.ఒ. 3166-2 మ్యాప్ సంఖ్య రాజధాని ప్రాంతం (చ.కి.మి) Population of the Republic of Tajikistan as of 1 January 2008, State Statistical Committee, Dushanbe, 2008 పి.ఒ.పి. గణాంకాలు సుఘ్ద్ ఐ.టి.జె-ఎస్.యు. 1 ఖుజంద్ 25,400 2,233,500 సుబోర్దినేషన్ రిపబ్లిక్ ప్రాంతం. టి.జె-ఆర్.ఆర్. 2 దుషంబే 28,600 1,722,900 ఖట్లాన్ టి.జె- కె.టి 3 క్యూర్ఘొంతెప 24,800 2,677,300 గొర్నొ- బదక్షన్ ప్రొవింస్ (స్వయంప్రతిపత్తి) టి.జె-బి.జె 4 ఖొరుఘ్ 64,200 206,000 దుషంబే 5 దుషంబే 10 724,800 సరసులు thumb|Karakul lake దేశం వైశాల్యంలో దాదాపు 2% సరస్సులతో నిండి ఉంది. గుర్తించతగిన సరసుల జాబితా; కెరక్కుం రిజర్వాయర్ (కెరక్కుం) (సుఘ్ద్) ఇస్కందర్కుల్ (ఫన్ పర్వతాలు) కులికలోన్ సరసులు (ఫన్ పర్వతాలు) న్యురెక్ ఆనకట్ట (ఖట్లన్) కారాకుల్ (టాజీకిస్తాన్) (; తూర్పు పామిర్ పర్వతాలు. సరెజ్ సరసు (పామిర్ పర్వతాలు ) షదౌ సరసు (పామిర్ పర్వతాలు) జొర్కుల్ (పామిర్ పర్వతాలు ) ఆర్ధికం thumb|A Tajik dry fruit seller సోవియట్ యూనియన్‌, మద్య ఆసియాలో అత్యంత వెనుకబడిన రిపబ్లిక్ తజికిస్థాన్. ప్రస్తుతం 47% తజికిస్థాజ్ జి.డి.పి. విదేశాలలో నివసిస్తున్న తజికిపౌరుల నుండి లభిస్తుంది. (తజికీలు అధికంగా రష్యాలో పనిచేస్తుంటారు). "Remittance man". The Economist. 7 September 2013.Tajikistan: Building a Democracy (video), United Nations, March 2014, http://www.youtube.com/watch?v=C1ey-4PO7fE దేశం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది. లంచగొండితనం, అసమానమైన ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక నిర్వహణలో అసమర్ధత. విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా అందుతున్న ధనం, అక్యూమినియం, పత్తి అమ్మకాలద్వారా లభిస్తున్న విదేశీ ఆదాయం తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలకు సహకారిగా ఉంటుంది. 2000 లో మునుపటి అంతర్యుద్ధంలో చిన్నభిన్నమైన దేశపరిస్థితి చక్కదిద్దడానికి శాంతిస్థపనకు విదేశీధనసహాయం సహాయకారిగా ఉంది. రెండు సంవత్సరాల తీవ్రమైన కరువు వలన ఆహారపదార్ధాల కొరతను విదేశీ ఆర్థికసహాయం తీర్చింది. 2001 ఆగస్టులో రెడ్ క్రాస్ కరువు బాధిత దేశాలైన తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లకు సహకరించవలసిందిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితికి కూడా సహాయం కొరకు పిలుపును అందించింది. అయినప్పటికీ దేశంలో ఇప్పటికీ ఆహారం సమస్యగానే ఉంది. 2012 జనవరిలో తజకిస్థాన్ ప్రజలలో 6,80,152 మంది ఆహార అబధ్రతతో జీవిస్తున్నారు. వీరిలో 6.70,852 మంది ఫేస్ 3 (నిశితమైన ఆహారం, జీవనోపాధి సమస్య) ఆహార అబధ్రత, 3000 మంది ఫేస్ 4 (హ్యూమనిటేరియన్ ఎమర్జెంసీ) సమస్యలో చిక్కుకున్నారు. thumb| The Tajik aluminium smelting plant, TadAZ, in Tursunzoda, is the largest aluminium manufacturing plant in Central Asia, and Tajikistan's chief industrial asset. యుద్ధం తరువాత 2000-2007 మద్యకాలంలో తజికిస్థాన్ గణనీయమైన ఆర్థికాభివృద్ధి సాధించింది. తజికిస్థాన్ జి.డి.పి. 9.6% నికి చేరుకుందని వరల్డ్ బ్యాంకు డేటా తెలియజేస్తుంది. ఇది మద్య ఆసియా దేశాలలో తకకిస్థాన్ ఆర్థికస్థితి పరంగా అభివృద్ధి సాధించింది. ప్రత్యేకంగా ఆర్థికంగా క్షీణస్థితితికి చేరిన తుర్క్మేనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ కంటే తజికిస్థాన్ అభివృద్ధి స్థాయికి చేరుకున్నాడు. తజికిస్థాన్ ఆర్థికరంగానికి అల్యూమినియం, పత్తి ఉత్పత్తి, విదేశీ ఉద్యోగుల సంపాదన సహకరిస్తుంది. పత్తి పంట వ్యవసాయంలో 60% ఆక్రమించి ఉంది, 75% గ్రామీణులకు పత్తి పంట మద్దతు ఇస్తుంది, 45% నీటిపారుదల అందుతున్న భూమి పత్తి పంటకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి స్వంతమైన తజిక్ అల్యూమినియం కంపెనీ మద్య ఆసియాలో అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమగా గుర్తించబడుతుంది. అలాగే ప్రంపంచం లోని అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమలలో ఒకటిగా గుర్తించబడుతుంది. తజకిస్థాన్ నదులు వఖ్ష్ నది, పంజ్ నదులు జలవిద్యుత్తుకు ఆధారంగా ఉన్నాయి. ప్రభుత్వం జలవిద్యుత్తు ఉత్పత్తిచేసి దేశీయ వాడకానికి, విద్యుత్తు ఎగుమతి కొరకు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తుంది. తజికిస్థాన్ లోని న్యూరెక్ డాం ప్రపంచంలోని ఎత్తైన ఆనకట్టగా గుర్తించబడుతుంది. 670 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన సంగ్తుడా-1 జలవిద్యుత్తు కేంద్రంలో 2008 జనవరి 18 నుండి రష్యాకు చెందిన " ఆర్.ఎ.ఒ ఎనర్జీ జెయింట్ " యు.ఇ.ఎస్ పనిచేస్తుంది. సంగ్తుడా-2 లో ఇరాన్, జరఫ్షన్ కొరకు చైనాకు చెందిన సినో- హైడ్రో పనిచేస్తున్నాయి. 335 మీ ఎత్తైన రోగన్ పవర్ ప్లాంటు నిర్మాణం పూర్తయితే ప్రంపంచంలో ఎత్తైనదని గుర్తించబడుతున్న న్యూరెక్ ఆనకట్టను అధిగమిస్తుంది. సి.ఎ.సి.ఎ. 1000 ప్లాంటు తజికిస్థాన్ నుండి పాకిస్థాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ పవర్ ట్రాన్స్‌మిట్ ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్తును తరలించడానికి ప్రణాళిక రూపొందించబడింది.. ట్రాంస్ మిషన్ మొత్తం పొడవు 750 కి.మీ. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేయనున్న ఈ ప్రణాళికలో డబల్యూ.బి, ఐ.ఎఫ్.సి, ఎడి.బి, ఐ.డి.బి సంస్థలు పనిచేయనున్నాయి. ఈ ప్రణాళిక మొత్తం విలువ 865 మిలియన్ల అమెరికన్ డాలర్లు. మిగిలిన విద్యుత్తు అవసరాలకు చిన్న మొత్తంలో సహజవాయువు, పెట్రోలియం వనరులు, తగినంత బొగ్గు నిలువలు విద్యుత్తు ఉతపత్తికి సహకరిస్తున్నాయి. thumb|left|Graphical depiction of Tajikistan's product exports in 28 color-coded categories. 2014లో ప్రపంచంలోని అధికంగ విదేశీ వలస ఉద్యోగుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలలలో తజికిస్థాన్ మొదటి స్థానంలో ఉంది. 2014కు ముందు విదేశీ ఉద్యోగుల సంపాదన జి.డిపిలో 45% ఉండగా రష్యాలో సంభవించిన ఆర్థిక సంక్షోభం కాతణంగా 2015 నాటికి అది 40%కి పతనం చెందగలదని భావించారు. రష్యాలోని తజిక్ శ్రామికులు మిలియన్ల తజికిస్థాన్ ప్రజల ఆర్థికస్థితికి ఆధారంగా ఉన్నారు. 2014-2015 రష్యన్ ఆర్థికస్థితి దిగజారడం కారణంగా తజికిస్థాన్ యువకులు రష్యా నుండి మాతృదేశానికి తిరిగి రాగలరని చెప్పింది. 20% తజికిస్థానీయులు 1.25 అమెరికన్ డాలర్ల దినసరి ఆదాయంతో జీవిస్తున్నారని కొన్ని అంచనాలు తెలియజేస్తున్నాయి. తజికిస్థాన్ నుండి వలసపోవడం, విదేశీసంపాదన ఆర్థికంగా తీవ్రమైన ప్రభావం కలిగించలేదు. 2010 లో తజికిస్థాన్ విదేశీ ఉద్యోగుల ఆదాయం 2.1 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఇది 2009 కంటే అధికం. 2006 తజికిస్థాన్ వరల్డ్ బ్యాంక్ తజికిస్థాన్ విధానం నివేదికలో తగత కొన్ని సంవత్సరాలుగా జికిస్థాన్ ఆర్థికరంగాన్నీ విదేశీ ఉద్యోగుల ఆగాయం నడిపించి పేదరికాన్ని కొంత తగ్గించిందని వివరించింది. మాదకద్రవ్యాలు చేరవేయడం తజికిస్థాన్ చట్టవిరుద్ధమైన ఆదాయాలలో ఒకటి.MEET THE STANS -- episodes 3&4: Uzbekistan and Tajikistan, BBC, 2011, http://www.youtube.com/watch?v=RFVcQ7ZxC1oSilk Road Studies, Country Factsheets, Eurasian Narcotics: Tajikistan 2004 అంతర్జాతీయ సేవాసంస్థలైన యు.ఎన్.ఒ.డి.సి., యు.ఎస్, రష్యా, ఆఫ్ఘన్ అధికారుల కృషిఫలితంగా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల తరలింపును అదుపులోకి వచ్చింది. తజికిస్థాన్ హెరాయిన్, ఓపియం జప్తు ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.Overview of the drug and crime situation in Central Asia. Factsand Figures, Coordination and Analysis Unit of the UNODC Regional Office for Central Asia మాదకద్రవ్యాల ద్వారా లభిస్తున్న ధనం ప్రభుత్వాన్ని కలుషితం చేస్తుంది. తజికిస్థాన్ అంతర్యుద్ధంలో రెండువైపులా పాల్గొని ప్రస్తుతం అధికారపదవులు చేపట్టిన వారిలో పలువురికి మాదకద్రవ్యాల వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. యు.ఎన్.ఓ.డి.సి. తజికిస్థాన్‌తో పనిచేస్తూ సరిహద్దు రక్షణలో శిక్షణ ఇస్తుంది. అలాగే సమైక్య సరిహద్దు దళాను నియమించి " తజికిస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఏజెంసీ " స్థాపనలో భాగస్వామ్యం వహించింది.Fighting Drugs, Crime and Terrorism in the CIS Dushanbe, 4 October 2007 తజికిస్థాన్ " ఎకనమిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్ " (ఇ.సి.ఒ) లో శాశ్వత సభ్యత్వం కలిగి ఉంది. ప్రయాణవసతులు thumb|Dushanbe railway station 2013 తజకిస్థాన్ ఇతర మద్య ఆసియా దేశాలవలె ప్రయాణవసతులలో ప్రధాన అభివృద్ధి సాధించింది. భూబంధితదేశంగా తజికిస్థాన్‌లో రేవుపట్టణాలు ఏమీ లేవు. అందువలన అత్యధికమైన ప్రయాణాలు రహదారి, రైలు, వాయు మార్గంలోనే జరుగుతుంటాయి. సమీపకాలంగా రేవు ప్రయాణా వసతుల కొరకు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్, పాకిస్థాన్లను చేరుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2009లో పాకిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో 1,300 కి.మీ పొడవైన రహదారి, రైలు నిర్మాణం, అభివృద్ధిపనులు చేపట్టాడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రహదారి, రైలు మార్గం మూడు దేశాలను అనుసంధానిస్తూ పాకిస్థాన్ రేవును చేరేలా నిర్మించబడుతుంది. ప్రతిపాదించబడిన మార్గం దేశానికి తూర్పున ఉన్న గొర్నో - బదఖ్షన్ స్వయంప్రతిపత్తి ప్రాంతం మీదుగా పయనిస్తుంది. 2012లో మూడు దేశాలను అనుసంధానం చేస్తూ రహదార్లు, రైలుమార్గాలు, గ్యాస్, ఆయిల్, నీటిపైపు లైన్ నిర్మించడానికి తజికిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షులు ఒప్పందం మీద సంతకం చేసారు. రైలు రైలురోడ్డు మొత్తం పొడవు 680 కి.మీ. రైలు గేజ్ 1530మి.మీ ఇది రష్యా గేజ్ పరిమాణం. దేశం దక్షిణప్రాంతంలోని ప్రధాన భూభాగాలను, రాజధానిని పారిశ్రామిక ప్రాంతాలను (హిసార్, వఖ్ష్ లోయలు), ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, కజక్స్థాన్, రష్యాలను అనుసంధానిస్తూ రైలు మార్గం నిర్మించబడుతుంది. అంతర్జాతీయ సరుకు రావాణా ఈ మార్గంలో చేరవేయబడగలదని భావించారు. ప్రస్తుతం నిర్మించబడిన క్వర్ఘంతెప్ప - కులాబ్ రైలు మార్గం కులాబ్ జిల్లా దేశం కేద్రభాగాలను అనుసంధానిస్తుంది. వాయుమార్గం thumb|The old terminal building at Dushanbe International Airport 2009లో తజికిస్థాన్‌లో 26 విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో 18 విమానాశ్రయాలకు రన్‌వేలు ఉన్నాయి. అందులో రెండింటికి 3,000 మీ పొడవైన రన్‌వేలు ఉన్నాయి.CIA World Factbook. Tajikistan 2015 ఏప్రిల్ నాటికి దేశం ప్రధాన విమానాశ్రయం దుషంబే నుండి రష్యాలోని ప్రధాన నగరాలు, మద్య ఆసియాకు అలాగే ఢిల్లీ, దుబాయ్, ఫ్రాంక్‌ఫర్ట్, ఇస్తాంబుల్, కాబూల్, ఉరుంక్వి నగరాలకు విమానసేవలు అందించబడుతున్నాయి. రష్యా నుండి ఖుజంద్ వరకు అంతర్జాతీయ విమానాలు నడుపబడుతున్నాయి. కులాబ్, ఖుర్గోంతెప నుండి విమానసేవలు పరిమితంగానే లభిస్తున్నాయి. ఖొరోగ్ విమానాశ్రయం దేశీయ విమానసేవలు అందిస్తుంది. తజికిస్థాన్‌లో రెండు ప్రధాన విమానసేవలు ( సోమన్ ఎయిర్ లైన్, తజిక్ ఎయిర్ లైన్) ఉన్నాయి. అవి రహదారి తజికిస్థాన్ రహదార్ల మొత్తం పొడవు 27,800 కి.మీ. ప్రయాణ సౌకర్యాలలో 90% ఆటోమొబైల్స్ పూర్తిచేస్తున్నాయి. సరుకురవాణాలో 80% రహదారి మార్గంలో చేరవేయబడుతుంది. 2004లో తజికిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తజిక్- ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ నిర్మించబడింది. ఇది దేశాన్ని దక్షిణాసియా దేశాలతో అనుసంధానిస్తుంది. ఈ వంతెనను యునైటెడ్ స్టేట్స్ నిర్మించింది. 2014 నాటికి రహదారి, కనుమ మార్గం పూర్తికాగలదని భావించారు. దుషంబే - కుల్మ (చైనా సరిహద్దు), కుర్గాన్- ట్యూబ్- నిఝ్మి ప్యాని (ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు) రహదారుల పునర్నిర్మాణం, పర్వతమార్గాలలో అంజాబ్ కనుమ, షక్రిస్తాన్, షర్ షర్, చొర్మాజక్ కనుమ మార్గాల నిర్మాణం ప్రళాళికలుగా చేపట్టబడ్డాయి. Shar-Shar auto tunnel links Tajikistan to China, The 2.3km Shar-Shar car tunnel linking Tajikistan and China opened to traffic on Aug. 30.,Siyavush Mekhtan, 2009-09-03Chormaghzak Tunnel renamed Khatlon Tunnel and Shar-Shar Tunnel renamed Ozodi Tunnel, 12/02/2014 15:49, Payrav Chorshanbiyev, http://news.tj/en/news/chormaghzak-tunnel-renamed-khatlon-tunnel-and-shar-shar-tunnel-renamed-ozodi-tunnel వీటికి అంతర్జాతీయ సంస్థలు నిధిసహాయం చేస్తున్నాయి.Trade, tunnels, transit and training in mountainous Tajikistan, May 7, 2013, http://blogs.fco.gov.uk/leighturner/2013/05/07/trade-tunnels-transit-and-training-in-mountainous-tajikistan/ గణాంకాలు thumb|Tajikistan: trends in its Human Development Index indicator 1970-2010 2009 జూలై గణాంకాలను అనుసరించి తజికిస్తాన్ జనసంఖ్య 7,349,145. వీరిలో 70% 30 సంవత్సరాల లోపు వారు. 30% ప్రజలు 14-30 సంవత్సరాల వయస్కులు.Tajikistan: Building a Democracy (video), United Nations, March 2014,http://www.youtube.com/watch?v=C1ey-4PO7fE తజికీలు తజిక్ భాషను మాట్లాడుతుంటారు ( పర్షియన్ యాసలలో ఇది ఒకటి). తజికీలు ప్రధాన సంప్రదాయ ప్రజలుగా ఉన్నారు. అయినప్పటికీ ఉజ్బెకీయులు, రష్యన్లు కూడా తగినంత సంఖ్యలో ఉన్నారు. వసల కారణంగా వీరి సంఖ్య క్షీణిస్తుంది. Russians left behind in Central Asia, Robert Greenall, BBC News, 23 November 2005. బదఖ్షన్ లోని పమిరి ప్రజలు, స్వల్పసంఖ్యలో యగ్నొబీలు, గణీయమైన సంఖ్యలో ఇస్మైలీలు కూడా తజికీప్రజలుగా భావించబడుతున్నారు. తజికిస్థాన్‌లోని ప్రజందరూ తజికిస్థానీయులుగా పిలువబడుతున్నారు. thumb|left|Group of Tajik children 1989లో తజికిస్థాన్‌లోని సంప్రదాయ రష్యన్లు 7.6% ఉన్నారు. అంతరుద్ధం తరువాత రష్యాకు వలస వెళ్ళిన కారణంగా వారు ప్రస్తుతం 0.5% కంటే తక్కువగా ఉన్నారు.Tajikistan - Ethnic Groups. Source: U.S. Library of Congress. " రష్యా , సోవియట్ యూనియన్ లోని జర్మన్ చరిత్ర " 1979లో 38,853 మంది తజికిస్థాన్ నుండి వలస వెళ్ళారని తెలియజేస్తుంది. Russian-Germans in Tajikistan . Pohl, J. Otto. "Russian-Germans in Tajikistan", Neweurasia, 29 March 2007. తజికిస్థాన్ ప్రాంతీయ భాష తజికీ అధికారభాషగా ఉంది. సమాచారచేరవేతకు, వ్యాపారానికి రష్యా భాష వాడుకలో ఉంది. రాజ్యాంగం " రష్యాభాష " సంప్రదాయ ప్రజల వాడుక భాష" గా ఆమోదించబడినప్పటికీ 2009 రాజ్యాంగ సవరణ తరువాత రష్యాభాష రద్దుచేయబడింది. పేదరికం ఉన్నప్పటికీ సోవియట్ పాలనలో ఉచిత విద్య ఫలితంగా తజికిస్థాన్ అక్షరా శ్యత అధిక్ంగానే ఉంది. ప్రజలలో 95.5% వ్రాత, చదవే శక్తిని కలిగి ఉన్నారు. ప్రజలలో అత్యధికులు సున్నీ ఇస్లాం మతాన్ని అవలంబిస్తున్నారు. 2009 గణాంకాలను అనుసరించి తజిక్ పురుషులు, పలువురు స్త్రీలు విదేశాలలో (ప్రత్యేకంగా రష్యాలో) పనిచేస్తున్నారు.Deployment of Tajik workers gets green light. Arab News. 21 May 2007. 70% కంటే అధికమైన స్త్రీలు సంప్రదాయ గ్రామాలలో నివసిస్తున్నారు. సంస్కృతి thumb|upright|Tajik family celebrating Eid తజికిస్థాన్ లోని 80% ప్రజలకు తజిక్ భాష మాతృభాషగా ఉంది. ప్రస్తుత తజికిస్థాన్ లోని దుషంబే (రాజధాని), ఖుజండ్, కులాబ్, పంజకెంట్, కుర్గొంటెప, ఖొరుఘ్, ఇస్తరవ్షన్ మొదలైన నగరకేంద్రాలలో ఉజ్బెకీలు, కిర్గీజులు, రష్యన్లు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. తజికిస్థాన్ ఆగ్నేయంలో ఉన్న గొర్నొ- బదఖ్షన్ అటానిమస్ ప్రొవింస్‌లో చైనా, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పమిరిప్రజలు ఉన్నారు. వీరిని తజికీ సంప్రదాయ ప్రజలుగా భావిస్తారు. అయినప్పటికీ వీరు తజికీ ప్రజలకంటే భాషాపరంగా, సాంస్కృతికంగా వేరుపడి ఉంటారు. తజికిస్థాన్ లోని మిగిలిన ప్రాంతాలలో నివసిస్తున్న అధికమైన సున్నీ ముస్లిములు, పమిరీలు ఉత్సాహంగా ఇస్లామైలీ మతాన్ని అనుసరిస్తుంటారు. అలాగే షుఘ్ని, రుషని, ఖుఫి, వాఖి మొదలైన పలు ఇరానీ భాషలు మాట్లాడుతుంటారు. ఎత్తైన పమిరీ పర్వతంలో ఒంటరిగా నివసిస్తున్న వీరు పలు పురాతన సస్కృతి, సంప్రదాయాలను సంరక్షిస్తుంటారు. దేశమంతటా కనుమరుగౌతున్న జానపద కళలు వీరి వద్ద సజీవంగా ఉన్నాయి. ఉత్తర తజికిస్థాన్ లోని పర్వతప్రాంతాలలో యఘ్నొబి ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుతం యఘ్నొబి ప్రజల సంఖ్య 25,000 ఉండవచ్చని భావిస్తున్నారు. 20వ శతాబ్దంలో బలవంతపు వలసలు వీరి సంఖ్యను క్షీణింపజేస్తున్నాయి. వీరు యఘ్నొబి భాషను మాట్లాడుతుంటారు. పురాతనమైన సొగ్డియన్ భాష ఆధునిక రూపమే యఘ్నొబి. తజికిస్థాన్ కళాకారులు దుషంబే టీ హౌస్ రూపొందించారు. అది 1988లో బౌల్డర్, కొలరాడో సిస్టర్ సిటీకి కాముకగా ఇవ్వబడింది. .The Dushanbe-Boulder tea house. Retrieved on 2 May 2009 మతం thumb|upright|A mosque in Isfara, Tajikistan సున్ని ఇస్లాంకు చెందిన హనాఫి స్కూల్ 2009లో అధికారికంగా ప్రభుత్వ అనుమతి పొందింది. తజికిస్థాన్ తనతాను లైకిక రాజ్యంగా ప్రకటించుకుంది. దేశంలో ప్రజలకు పూర్తి మతస్వాతంత్ర్యం ఇవ్వబడింది. ప్రభుత్వం ఈద్- ఉల్- ఫితిర్, ఈద్ అల్ అధా పండుగలకు శలవు దినంగా ప్రకటించింది. యు.ఎస్ స్టేట్ డిపార్ట్మెంటు, పీ రీసెర్చ్ నివేదిక అనుసరించి తజికిస్థాన్ ప్రజలలో 98% ముస్లిములు ఉన్నారు. వారిలో దాదాపు 87%-95% సున్నీ ముస్లుములు, దాదాపు 3% ప్రజలు షియా ముస్లిములు, 7% ఏశాఖను వెల్లడించని ముస్లిములు ఉన్నారని తెలియజేస్తున్నాయి. మిగిలిన 2% ప్రజలు రష్యన్ ఆర్థడాక్స్ . కాథలిక్ క్రైస్తవులు, జొరాష్ట్రియన్, బుద్ధిజానికి చెందినవారై ఉన్నారు. అత్యధిక ముస్లిములు రంజాన్ ఉపవాసం ఉంటారు. గ్రామాలలో మాడింట 1 వంతు, పట్టణాలలో 10% ప్రజలు దినసరి ప్రార్థనలలో పాల్గొంటారు. బుఖారన్ యూదులు తజికిస్థాన్‌లో క్రీ.పూ 2వ శతాబ్దం నుండి నివసిస్తుండేవారు. ప్రస్తుతం వారిలో ఎవరూ జీవించి లేరు. వివిధ మతస్థుల మద్య సంబంధాలు సాధారణంగా సుముఖంగానే ఉంటాయి. ప్రధానమైన ముస్లిం నాయకుల మద్య కొంత భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అల్పసంఖ్యాక మతస్థులు వివక్షకు గురౌతున్నారని నాయకుల భావన. మత సంస్థలు దేశరాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇస్లామిక్ రినైసెంస్ పార్టీ తజకిస్థాన్ అంతర్యుద్ధం (1992-1997) యుద్ధంలో ప్రధాన పోరాటవీరులుగా ఉన్నారు. వారు తజికిస్థన్‌ను ముస్లిం దేశంగా ప్రకటించాలని కోరుకుంటున్నారు. శుక్రవార ప్రార్థనలు జరిపే మసీదులు పరిమితంగానే ఉన్నాయి.కొందరు ఇది వివక్ష అని భావిస్తున్నారు. . చట్టపరంగా మతసంస్థలు స్టేట్ కమిటీ, ప్రాంతీయ అధికారుల ద్వారా నమోదు చేసుకోవాలి. 10 మంది సభ్యులు ఉండాలి. ప్రాంతీయ ప్రభుత్వాధికారులు ప్రార్థనాప్రదేశాన్ని పరిశీలించాలి. సభ్యులు బహిరంగంగా ప్రార్థనకు మనుషులను సమీకరించకూడదు. నమోదు చేయడంలో వైఫల్యం పెద్ద ఎత్తున జరిమానా చెల్లించడానికి దారితీస్తుంది. అంతేకాక ప్రర్ధనా ప్రాంతాన్ను మూతవేయడం సంభవిస్తుంది. అనుమతి పొందండంలో ప్రాంతీయస్థాయిలో సమస్యలు ఉన్నాయని ప్రజల భావన. 18 సంవత్సరాల లోపు వారు బహిరంగ ప్రార్థనలకు అనర్హులు.U. S. Department of State International Religious Freedom Report for 2013, Executive Summary retrieved 2 August 2014. ఆరోగ్యం thumb|A hospital in Dushanbe తజికీ ప్రభుత్వం ఆరోగ్యసంరక్షణా విధానాలను అభివృద్ధిచేసి విస్తరించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆరోగ్యసంరక్షణ అవసరమైనదానికంటే తక్కువగా, ఔషధాల సరఫరా కొరతతో బలహీనంగా ఉంది. లేబర్, సోషల్ వెల్ఫేర్ 2000లో తజికిస్థాన్‌లో 1,04,272 ఆరోగ్యసేవలకొరకు నమోదుచేసుకున్నారని వెల్లడించింది. వీరు తజికిస్థాన్‌లోని పేదరికంతో బాధపడుతున్న ప్రజలు. తజికిస్థాన్ ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు ఈ ప్రజలకు సహాయంగా నిలిచి పేదరికాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. 2004 ప్రజారోగ్యం కొరకు ప్రభుత్వం జి.డి.పిలో 1% ఖర్చుచేస్తుంది.2012 గణాంకాలను అనుసరించి ప్రజల ఆయుఃప్రమాణం 66.38 సంవత్సరాలు. 2012 గణాంకాలను అనుసరించి శిశుమరణాల శాతం 1000 మందికి 37. 2011 గణాంకాలను అనుసరించి ప్రతి 1,00,000 మంది ప్రజలకు 170 మంది వైద్యులు ఉన్నారు. 2010 గణాంకాలను ఆనుసరించి 457 పిల్లలు, పెద్దలు పోలియోబారిన పడగా నియంత్రణలోకి తీసుకువచ్చే ముందు వీరిలో 29 మంది ప్రాణాలను విడిచిపెట్టారు.. విద్య thumb|Tajik State National University in Dushanbe. తజికిస్థాన్‌లో విద్య 11 సంవత్సరాల ప్రాథమికవిద్య, సెకండరీ విద్యావిధానం అనుసరిస్తుంది. అయినప్పటికీ 2016 నుండి ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలను యోచిస్తుంది. . తజికిస్థాన్‌లో అధిక సంఖ్యలో విద్యాసంస్థలు ఉన్నాయి. ఖుజంద్ స్టేట్ యూనివర్శిటీలో 76 డిపార్ట్మెంట్లు, 15 ఫాకల్టీలు ఉన్నాయి. "తజికిస్థాన్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ లా, బిజినెస్ & పాలిటిక్స్ ", ఖొరుఘ్ స్టేట్ యూనివర్శిటీ, అగ్రికల్చరల్ యూనివర్శిటీ ఆఫ్ తజికిస్థాన్, తజిక్ స్టేట్ నేషనల్ యూనివర్శిటీ, పలు విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో అధికమైన యూనివర్శిటీలు సోవియట్ శకంలో స్థాపించబడ్డాయి. 2008 ప్రాంతీయ విద్య టెర్టియరీ అభ్యసించింన విద్యార్థుల శాతం 17%. సబ్ రీజనల్ సరాసరి (37%) కంటే ఇది తక్కువ. . విద్యాశిక్షణ, వృవిద్యా నిపుణులకు తగినన్ని ఉద్యోగావకాశాలు లేనికారణంగా తజికీలు విద్యను కొనసాగించడం వదిలివేస్తున్నారు. ప్రభుత్వం విద్య కొరకు 2005-2012 కొరకు గి.డి.పి నూండి 3.5% నుండి 4.1% వ్యయం చేస్తుంది.Tajikistan, Public spending on education, total (% of GDP) World Bank ఒ.ఇ.సి.డి చేస్తున్న వ్యయం (6%) కంటే ఇది తక్కువ. ఐక్యరాజ్యసమితి దేశంలోని విద్యావసారాలకు తజికిస్థాన్ చేస్తున్న వ్యయం చాలదని అభిప్రాయపడుతుంది. అకాడింగ్ యు.ఎన్.ఎస్.ఎఫ్ సర్వే అనుసరించి తజికిస్థాన్ బాలికలలో 25% మంది నిర్భంధ ప్రాథమిక విద్యను అభ్యసించడంలో పేదరికం, బాలికల పట్ల చూపుతున్న వివక్ష కారంణంగా వైఫల్యం చెందుతున్నారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తజికిస్థాన్ అక్షారాశ్యతా శాతం అధికంగానే ఉంది. Sport thumb|Tajikistan is a popular destination amongst mountaineers. తజికిస్థాన్ పర్వతాలు హిల్ క్లైంబింగ్, మౌంటెన్ బైకింగ్, రాక్ క్లైంబింగ్, స్కీయింగ్, స్నోబోర్డింగ్, పర్వతారోహణ మొదలైన పలు ఔట్ డోర్ క్రీడలకు అవకాశం కల్పిస్తుంది. వసతులు పరిమితంగా ఉన్నప్పటికీ ఫాన్, పామిర్ పర్వతాలకు హైకింగ్ టూర్లు, తజికిస్థాన్‌లో ఉన్న 7,000 శిఖరాలకు దేశీయ, అంతర్జాతీయ పర్యటనలు ఏర్పాటు చేయబడుతున్నాయి. అసోసియేషన్ ఫుట్ బాల్ తజికిస్థాన్‌లో అత్యంత ప్రాబల్యం సంతరించుకుంది. తజకిస్థాన్ నేషనల్ ఫుట్ బాల్ టీం ఎఫ్.ఎఫ్.ఎ, ఆసియన్ ఫుట్ బాల్ కాంఫిడరేధన్‌లో పాల్గొన్నాయి. తజికిస్థాన్ లోని ప్రముఖ క్లబ్బులు తజిక్ లీగ్ లో పోటీ చేస్తున్నాయి. 2012లో తజికిస్థాన్ క్రికెట్ ఫెడరేషన్ ప్రారంభించబడింది. ఇది తజకిస్థాన్ ప్రభుత్వం తరఫున క్రీడలలో పాల్గొంటుంది. అదే సంవత్సరం దీనికి ఆసియన్ క్రికెట్ కైంసిల్ సభ్యత్వం లభించింది. తజికిస్థాన్ రగ్బీ టీం ఇప్పుడిప్పుడే అభివృద్ధిపధంలో సాగుతుంది. తజికిస్థాన్ స్వతంత్రం పొదాక తజికిస్థానీ అథెట్లు ముగ్గురు ఒలింపిక్ పతకాలు సాధించారు. వారు వరుసగా రెస్ట్లర్ యూసప్ అబ్దుసల్మొవ్, (2008 రెస్టిలింగ్), సమ్మర్ ఒలింపిక్స్ - మెంస్ ఫ్రీస్ట్రైల్ 84 కి.గ్రా. (నీజింగ్ 2008), జుడోకా రసూల్ (జుడో 2008 సమ్మర్ ఒలింపిక్స్- మెంస్ 73 కి.గ్రా; కాంశ్యం: బీజింగ్), బాక్సర్ మవ్జున చొరీవ (బాక్సొంగ్ 2012 ఒలింపిక్స్- వుమెన్ లైట్ వెయిట్; కాంశ్యం). గొర్నొవ్ - బదఖ్షన్ అటానిమస్ రీజియన్ రాజధాని ఖొరుగు (తజకిస్థాన్ అత్యధిక ఆటిట్యూడ్ ) వద్ద బండీ క్రీడ నిర్వహించబడుతుంది. మూలాలు తజికిస్తాన్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు ఇవీ చూడండి వర్గం:తజికిస్తాన్ వర్గం:మధ్య ఆసియా దేశాలు వర్గం:ప్రపంచ దేశాలు వర్గం:ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్
ఉజ్బెకిస్తాన్
https://te.wikipedia.org/wiki/ఉజ్బెకిస్తాన్
thumb|right|270px రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ (Republic of Uzbekistan) మధ్య ఆసియా లోని భూపరివేష్టిత దేశం (నలువైపులా భూమితో చుట్టబడిన దేశము). ఈ దేశానికి పడమర, ఉత్తరాన కజకస్తాన్, తూర్పున కిర్గిజ్ స్తాన్, తజికిస్తాన్, దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ ఒకప్పుడు గొక్తర్స్ (టర్కిక్ ఖగ్నాటే), తరువాత తింరుద్ సామ్రాజ్యం భాగంగా ఉండేది. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్ ప్రాంతాన్ని 16వ శతాబ్దంలో టర్కీ మాట్లాడే నొమాడ్స్ ఆక్రమించుకున్నారు. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం రష్యా సామ్రాజ్యంలో ఉంది. 1924లో ప్రస్తుత ఉజ్బెకిస్థాన్ ప్రాంతం సోవియట్ యూనియన్ సరిహద్దు రిపబ్లిక్‌గా (ఉజ్బెక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్) అయింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తరువాత 1991 ఆగస్టు 31న ఉజ్బెకిస్థాన్ " ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ "గా ప్రకటించబడింది. మరుసటి అధికారికంగా స్వతంత్ర దినం జరుపుకుంది. ఉజ్బెకిస్థాన్ అధికారిక డెమొక్రటిక్, లౌకిక, యూనిటరీ స్టేట్, రిపబ్లిక్ రాజ్యాంగం వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం. దేశ అధికారిక భాష ఉజ్బెకి. ప్రజలలో 85% ప్రజలకు టర్కీ భాష వాడుకలో ఉంది, అయినప్పటికీ రష్యన్ భాష దేశమంతటా వ్యాపించి ఉంది. ఉజ్బెకి ప్రజలు 81%, రష్యన్లు 5.4%, తజకీలు 4%, కజఖ్ ప్రజలు 3% ఇతరులు 6.5% ఉన్నారు. ఉజ్బెకిస్థాన్ ప్రజలలో అత్యధికులు ముస్లిములు "Chapter 1: Religious Affiliation". The World’s Muslims: Unity and Diversity. Pew Research Center's Religion & Public Life Project. 9 August 2012. Retrieved 4 September 2013. ఉజ్బెకిస్థాన్ కామ్ంవెల్త్ దేశాలు, ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్, యునైటెడ్ నేషంస్ (ఐఖ్యరాజ్యసమితి) , షంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం కలిగి ఉంది. ఉజ్బెకిస్థాన్ ఆర్ధికరంగం ప్రధానంగా పత్తి, బంగారం, యురేనియం , సహజవాయువు మొదలైన కమ్మోడిటీ ఉత్పత్తి మీద ఆధారితమై ఉంది. చరిత్ర thumb|Female statuette wearing the kaunakes. Chlorite and limestone, Bactria, beginning of the 2nd millennium BC. thumb|Alexander the Great at the Battle of Issus. ఉజ్బెకిస్థాన్‌లో మొదటిగా నివసించిన ప్రజలు ప్రస్తుతం కజక్‌స్థాన్ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చిన ఇరానియన్ నోమాడ్‌లని భావిస్తున్నారు. వీరు క్రీ.పూ 1వ శతాబ్ధానికి చెందినవారని భావిస్తున్నారు. వీరికి ఇరానియన్ భాషలు వాడుకలో ఉండేవి. వీరు మద్య ఆసియాలో స్థిరపడి నదుల వెంట విస్తారమైన నీటిపారుదల విధానాన్ని స్థాపించారు. ఈ సమయంలో బుహొరొ (బుకారా) సమర్క్వండ్ (సమర్కండ్) , తాష్కెంట్ ప్రభుత్వం , ఉన్నత సాంస్కృతిక కేంద్రాలుగా ఉద్భవించాయి. బి.సి 5వ శతాబ్దం నాటికి బాల్ట్రియన్, సొఘడియన్ , యుఫ్హేహి (టొఖరియన్) ఈ ప్రాంతంలో ఆధిక్యత సాధించి ఈ ప్రాంతంలో పాలన సాగించారు. చైనా పశిమప్రాంతంలో పట్టువ్యాపారం అభివృద్ధి చేసింది. ఈ వ్యాపారాన్ని అవకాశంగా తీసుకున్న ఇరానియన్ నగరాలు వ్యాపార కేంద్రాలుగా వర్ధిల్లాయి. ఉజ్బెకిస్థాన్ ప్రాంతంలోని నగరాలు , ట్రాంసొక్సియానా (మౌవాయుర్నా) (అరబు విజయం తరువాత ఇవ్వబడిన పేరు) గ్రామీణ నివాసిత ప్రాంతాలు , తూర్పు ప్రాంతాం (ప్రస్తుత చైనాలోని క్సింజియాంగ్), సొగడియన్ ప్రాంతాలు ఇఆరానియన్ వ్యాపారవేత్తలు చేసిన వ్యారాభివృద్ధితో సంపన్నమైనాయి. " సిల్క్ రోడ్డు" (పట్టు రహదారి), బుఖారా,, సమరక్వాడ్ అతి సంపన్న నగరాలుగా అభివృద్ధిచెందాయి. ఆ సమయంలో ట్రాంస్క్సియానా అతిపెద్ద ప్రతిభావంతమైన, శక్తివంతమైన అలాగే పురాతన పర్షియన్ ప్రాంతంగా విలసిల్లింది. Lubin, Nancy. "Early history". In Curtis. అలెగ్జాండర్ thumb|right|Triumphant crowd at Registan, Sher-Dor Madrasah thumb|right|Russian troops taking Samarkand in 1868. మక్డోనియన్ పాలకుడు అలెగ్జాండర్ కంక్వర్డ్ సొగడియానా, బచిరాలను జయించాడు. అలెగ్జాండర్ అచమెనింద్ సామ్రాజ్య చక్రవర్తి మూడవ డారిస్ కుమార్తె రొక్సియానాను వివాహమాడాడు. పర్షియన్ సామ్రాజ్యం అచమెనింద్ భూభాగాలు ఆధునిక ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నాయి. ఈ విజయం అలెగ్జాండరుకు ప్రాబల్యత తీసుకువచ్చింది. రాజ్యం తరువాత క్రీ.పూ 1 వ శతాబ్ధానికి యుయేజీ ఆధీనంలోకి వచ్చింది. ఉజ్బెకిస్థాన్‌ను పలు సంవత్సరాలు పర్షియన్ పాలకులు పార్ధియన్, సస్సనిద్ పాలకుల ఆధీనంలో ఉంది. అలాగే టర్కీకి చెందిన హెప్తలైట్, గొక్తుర్క్ ప్రజలు కూడా కొంతకాలం ఈ ప్రాంతానికి పాలకులు అయ్యారు. అరబ్బులు 8వ శతాబ్దంలో అము దర్యా, సిర్ దర్యా నదుల మద్య ప్రాంతం ట్రాంసొక్సియానాను అరబ్బులు (అలి ఇబ్న్ సత్తొర్) జయించారు. అరబ్బులు ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించారు. పలు ఇస్లామిక్ స్వర్ణయుగంలో ప్రఖ్యాత పరిశోధకులు ఇక్కడ నివసించి ఈ ప్రాంతం అభివృద్ధికి పాటుపడ్డారు. ఈ కాలంలో కళాకారులు ట్రిగ్నోమెటీ, ఆప్టిక్స్, జ్యోతిషం, కవిత్వం, తాత్వికం, కళలు, సుందర దస్తూరి, ఇతర కళలను అభివృద్ధిచేసారు. ఇది ముస్లిం పునరుద్ధరణకు పునాది వేసింది. 9-10 శతాబ్ధాలలో ట్రాక్సియానా సనిద్ రాజ్యంలో చేర్చబడింది. తరువాత ట్రాక్సియానా టర్కీకి చెందిన కరఖనిదుల ఆధీనం అయింది. అలాగే సెలియుకులు (సుల్తాన్ సనీర్), కర- ఖితన్లు ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించారు. చెంఘిజ్ ఖాన్ 13వ శతాబ్దంలో చెంఘిజ్ ఖాన్ నాయకత్వంలో మంగోల్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని జయించింది. మంగోల్ విజయం ఈ ప్రాంతంలో మార్పులు తీసుకువచ్చింది. మద్య ఆసియాలో మంగోల్ విజయం ఈ ప్రాంతంలోని ఇరానియన్ భాష మాట్లాడే ప్రజలను ఈ ప్రాంతం వదిలి వెళ్ళేలా చేసింది. తరువాత వచ్చిన మంగోలియన్- టర్కిక్ ప్రజలు ఇరానియన్ సంస్కృతి, వారసత్వాన్ని అణిచివేసింది. బుఖారా, సమర్ఖండ్, కొనేయుర్జెంక్ (ఉర్గెంచ్), ఇతర ప్రాంతాలు మంగోలియన్ దాడుల ఫలితంగా విధ్వంసం అయ్యాయి. ఈ సమయంలో మూకుమ్మడి హత్యలు, అమానుషమైన విధ్వంసం ఈ ప్రాంతాన్ని పీడించాయి. విచ్చిన్నత చెంఘిజ్ ఖాన్ మరణం తరువాత 1227లో మంగోల్ సామ్రాజ్యం ఆయన నలుగురు కుమారులు, సభ్యులకు విభజించబడింది. విభజన తరువాత మంగోల్ చట్టాన్ని అనుసరించి పలు తరాలవరకు ఈ ప్రాంతంలో మంగోలు వంశస్థుల పాలన కొనసాగింది. ట్రాంసొక్సియానా పాలన చెంఘిజ్ ఖాన్ రెండవ కుమారుని వారసుడు ఛగతై ఖాన్ ఆధీనంలో ఉండేది. ఛగతై ఖాన్ పాలనలో ఈ ప్రాంతంలో సంపద పెరిగి, శాంతి నెలకొన్నది. అలాగే సమైక్య మంగోలు సామ్రాజ్యం శక్తివంతమైన సామ్రాజ్యంగా నిలిచింది. Lubin, Nancy. "Rule of Timur". In Curtis. thumb|190px|left|Two Sart men and two Sart boys in Samarkand, c. 1910 తైమూర్ 14వ శతాబ్దంలో మంగోలు సామ్రాజ్యం విచ్ఛిన్నత చెందింది. ఛగతై భూభాగం మీద వివిధ జాతులకు చెందిన గిరిజన రాజకుమారుల మద్య జరిగిన ఆధిపత్య పోరాటంలో విచ్ఛిన్నమైంది. గిరిజన రాకుమారులలో ఒకడు తైమూర్.Martin Sicker (2000). Greenwood Publishing Group. p. 154. ISBN 0-275-96892-8 తైమూర్ 1380 నాటికి ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించాడు. చెంఘిజ్ ఖాన్ వారసుడు కానప్పటికీ తైమూర్ ట్రాంసొక్సియానా ప్రాంతంలో సమర్ధుడైన పాలకుడిగా ప్రాబల్యత సంతరించుకున్నాడు. తరువాత తైమూర్ పశ్చిమ, మద్య ఆసియా ప్రాంతాలలోని ఇరాన్, కౌకాసస్, మెసొపొటేమియా, ఆసియా మైనర్, ఏరియల్ సీ ఉత్తర భూభాగంలోని సదరన్ స్టెప్పే ప్రాంతం జయించాడు. చైనాలో మింగ్ సామ్రాజ్యం పాలన కాలం (1405) లో తైమూర్ మరణించే ముందు రష్యా భూభాగాలను కూడా జయించాడు. తైమూర్ ఆక్రమిత నగరాలలో తీవ్రమైన హింస, మూకుమ్మడి హత్యలు చోటుచేసుకున్నాయి.Samuel Totten, Paul Robert Bartrop, Dictionary of genocide: M-Z, p.422 సాంస్కృతిక అభివృద్ధి తైమూర్ తాను జయించిన విస్తారమైన భూభాగం నుండి పలు కళాకారుల, విద్యావేత్తలను రాజధాని సమరఖండ్‌లో సమీకరించడం ద్వారా ఈ ప్రాంతాన్ని చివరిగా వర్ధిల్లజేసాడు. వీరి మద్దతుతో తైమూర్ తన సామ్రాజ్యాన్ని సుసంపన్నమైన ఇస్లామిక్ సంస్కృతితో నింపాడు. తైమూర్, ఆయన వారసుల పాలనా కాలంలో సమరఖండ్, ఇతర ప్రాంతాలలో మతపరమైన, ఘనమైన నిర్మాణకళాఖండాల పని చేపట్టబడింది.Forbes, Andrew, & Henley, David: Timur's Legacy: The Architecture of Bukhara and Samarkand (CPA Media). అమీర్ తైమూర్ వైద్యపరిశోధనలు, భౌతికశాస్త్రం పరిశోధకులు, కళాకారులను పొరుగుదేశాలతో (భారతదేశంతో చేర్చి) పరస్పర మార్పిడి చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టాడు. Medical Links between India & Uzbekistan in Medieval Times by Hakim Syed Zillur Rahman, Historical and Cultural Links between India & Uzbekistan, Khuda Bakhsh Oriental Library, Patna, 1996. pp. 353–381. తైమూర్ మనుమడు ఉలఘ్ బెగ్ ప్రపంచపు ఉత్తమ జ్యోతిష్కులలో ఒకడుగా గుర్తించబడ్డాడు. తైమురిదీలు స్థానికంగా పర్షియన్లు అయినప్పటికీ తైమూరిద్ కాలంలో ట్రాంసొక్సియానా ప్రాంతంలో ఛగతై భాష లిఖితరూపం చేయబడింది. ఛగయియద్ రచయిత " అలి షిర్ నవై " నగరంలో ప్రఖ్యాతి గడించాడు. నోమాడిక్ తౌమూర్ రాజ్యం తౌమూర్ మరణం తరువాత రెండుగా విభజించబడింది. తింరుదియన్ల అంతర్గతయుద్ధం ఉజ్బెకిస్థాన్ లోని ఆరల్ సీ ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్న నొమాడిక్ గిరిజనులను ఆకర్షించింది. 1501 లో ఉజ్బెకిస్థాన్ సైన్యం ట్రాంసొక్సియానా మీద దండేత్తింది. . ఎమిరేట్ బుఖారా (ఖనాటే బుకారా) లో బానిసవ్యాపారం ప్రాముఖ్యత సంతరించుకుని స్థిరంగాపాతుకుంది. 1821 దాదాపు 25,000 నుండి 60,000 వరకు తజిక్ బానిసలు ఉన్నారని భావిస్తున్నారు. Scott Cameron Levi The Indian diaspora in Central Asia and its trade, 1550–1900(2002). p. 68. ISBN 90-04-12320-2. రష్యన్లు ప్రవేశించక ముందు ప్రస్తుత ఉజ్బెకిస్థాన్ ఎమిరేట్ ఆఫ్ బుఖారా, ఖనాటే ఆఫ్ ఖివా మద్య విభజించబడింది. రష్యా 19వ శతాబ్దంలో రష్యన్ సామ్రాజ్యం మద్య ఆసియా వరకు విస్తరించబడింది. 1942లో ఉజ్బెకిస్థాన్‌లో 2,10,306 రష్యన్లు నివసించారు. Vladimir Shlapentokh, Munir Sendich, Emil Payin The new Russian diaspora: Russian minorities in the former Soviet republics(1994). p. 108. ISBN 1-56324-335-0. 1813లో ఆరంభమైన గ్రేట్ గేం పీరియడ్ ఆంగ్లో-రష్యన్ కాంవెంషన్ (1907) వరకు కొనసాగింది. 1920 ఆరంభంలో మద్య ఆసియా రష్యా ఆధీనంలో ఉండేది. తరువాత సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న బొలోషెవ్కి, ఉజ్బెకిస్థాన్, మద్య ఆసియాలోని ఇతర ప్రాంతాలు తిరుగుబాటు ఆరంభం అయింది. 1924 అక్టోబరు 27న " ఉజ్బెక్ సోవియట్ సోధలిస్ట్ రిపబ్లిక్ " రూపొందించబడింది. 1941 నుండి 1945 వరకు " రెండవ ప్రపంచ యుద్ధం "లో 14,33,230 మంది ఉజ్బెకీయులు రెడ్ ఆర్మీ తరఫున నాజీ జర్మనీతో పోరాడారు. జర్మనీ తరఫున అస్టొజినియన్ ప్రజలు యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో 2,63,005 ఉజ్బెకి సైనికులు ఈస్టర్న్ ఫ్రంట్ (రెండవ ప్రంపంచ యుద్ధం) యుద్ధభూమిలో మరణించారు. 32,670 మంది తప్పిపోయారు.Chahryar Adle, Madhavan K.. Palat, Anara Tabyshalieva (2005). "Towards the Contemporary Period: From the Mid-nineteenth to the End of the Twentieth Century". UNESCO. p.232. ISBN 9231039857 1991 ఆగస్ట్ 31న సోవియట్ యూనియన్ విచ్చిన్నం తరువాత ఉజ్బెకిస్థాన్ స్వతంత్రదేశంగా ప్రకటించబడింది.సెప్టెమర్ 1 జాతీయ స్వతంత్ర దినంగా ప్రకటించబడింది.. భౌగోళికం thumb|left|540px|Map of Uzbekistan. ఉజ్బెకిస్థాన్ వైశాల్యం 447400 చ.కి.మి. వైశాల్యపరంగా ఉజ్బెకిస్థాన్ ప్రంపంచదేశాలలో 56వ స్థానంలోనూ , జనసంఖ్యాపరంగా 42వ స్థానంలోనూ ఉంది. " కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సి.ఐ.ఎస్) " దేశాలలో ఉజ్బెకిస్థాన్ 5వ స్థానంలోనూ, జనసంఖ్యా పరంగా 3వ స్థానంలోనూ ఉంది. ఉజ్బెకిస్థాన్ ఉత్తర అక్షాంశంలో 37°, 46° తూర్పురేఖాంశంలో 56°, 74° ఉంది. ఉజ్బెకిస్థాన్ తూర్పు పడమరలుగా 1425 కి.మీ, ఉత్తర దక్షిణాలుగా 930కి.మీ విస్తరించి ఉంది. దేశ ఉత్తర, వాయవ్య సరిహద్దులలో కజకస్తాన్, ఆరల్ సముద్రం, నైరుతీ సరిహద్దులో టుర్క్‌మెనిస్తాన్, ఆగ్నేయ సరిహద్దులో తజికిస్తాన్, ఈశాన్య సరిహద్దులో కిర్గిజిస్తాన్ ఉన్నాయి. మద్య ఆసియాలోని పెద్దదేశాలలో ఉజ్బెకిస్థాన్ ఒకటి. అలాగే నాలుగు సరిహద్దులలో మధ్య ఆసియా దేశాలు ఉన్న ఒకే దేశంగా గుర్తించబడుతుంది. ఉజ్బెకిస్థాన్ దక్షిణ సరిహద్దును 150 కి.మీ పొడవున ఆఫ్ఘనిస్థాన్తో పంచుకుంటుంది. ఉజ్బెకిస్థాన్ శుస్కిత (డ్రై) భూబంధిత దేశం. అంతేకాక ప్రపంచంలో అన్నివైపులా భూబంధిత దేశాల మద్య ఉన్న రెండు దేశాలలో ఉజ్బెకిస్థాన్ ఒకటి. మరొక దేశం లీక్కిన్‌స్టైన్. ఉజ్బెకిస్థాన్‌లో బంధిత జలసముద్రాలు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్‌ నదులు సముద్రాన్ని చేరవు. ఉజ్బెకిస్థాన్‌ నదీముఖద్వారం సమీపంలో 10% వ్యవసాయభూములు ఉన్నాయి. మిగిలిన దేశం ఎడారి, పర్వతాలతో నిండి ఉంటుంది. ఉజ్బెకిస్థాన్‌ లోని అత్యున్నత శిఖరం ఖజ్రెత్ సుల్తాన్. ఇది సముద్రమట్టానికి 4643 మీ ఎత్తున సుఖందర్యా ప్రాంతంలోని గిస్సార్ పర్వతశ్రేణికి దక్షిణ ప్రాంతంలో తజికిస్తాన్ సరిహద్దులో దుషంబే వాయవ్యంలో ఉంది.Uzbekistan will publish its own book of records – Ferghana.ru . 18 July 2007. Retrieved 29 July 2009. ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్‌లో కాంటినెంటల్ వాతావరణం నెలకొని ఉంటుంది. వార్షికంగా వర్షపాతం 100- 200 మి.మీ ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటి గ్రేడ్ చేరుకుంటుంది. శీకాల ఉష్ణోగ్రత 23-9 డిగ్రీల సెంటిగ్రేట్ ఉంటుంది.Climate, Uzbekistan : Country Studies – Federal Research Division, Library of Congress. పర్యావరణం thumb|left|Comparison of the Aral Sea between 1989 and 2014. ఉజ్బెకిస్థాన్ వైవిధ్యమైన సహజత్వంతో నిండిన, సుసంపన్నమైన దేశం. బృహత్తర పత్తి ఉత్పత్తి కేంద్రం ముసుగులో దశాబ్ధాల తరబడి సోవియట్ యూనియన్ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురైయ్యాయి. వ్యవసాయ క్షేత్రాలు దేశంలో అధికరించిన కాలుష్యానికి ప్రధాన కారణం అయ్యాయి. అలాగే దేశంలోని జలం, వాయువు అత్యంత కలుషితం అయ్యాయి. భూగోళంలోని అతిపెద్ద భూబంధిత సముద్రాలు నాల్గింటిలో ఆరల్ సముద్రం ఒకటి. భూమి ఉపయోగించడానికి వాయువులో ఆర్ధత అధికరించడానికి ఇది చాలా సహకరిస్తుంది. 1960 నుండి ఆరల్ సముద్రజలాలు దుర్వినియోగం చేస్తున్న కారణంగా సముద్రవైశాల్యం 50%, జలాలు మూడు భాగాలు క్షీణించాయి. విశ్వనీయమైన అధికారిక ఏజెంసీ లేక ఆర్గనైజేషన్ డేటా సేకరించబడ లేదు. ఇందులోనిజలాలు అధికంగా పత్తిపొలాలకు మళ్ళించబడ్డాయి. పత్తి పంట పెరగడానికి అధిక మొత్తంలో నీరు అవసరం.Aral Sea CrisisEnvironmental Justice Foundation Report సోవియట్ ప్రభుత్వం ఆనకట్ట కట్టాడానికి తగినంత నిధి మంజూరు చేయని కారణాంగా 1960 లో సోవియట్ శాస్త్రవేత్తలు, రాజకీయవాదులు ఆరల్ సముద్రజలాలను పత్తిపంటకు ఉపయోగించడానికి మార్గదర్శకం వహించారు. ఆరల్ సముద్రతీరంలో ఉజ్బెకిస్థాన్ లోని కరకల్పక స్థాన్ ప్రాంతంలో అధిక శాతం ఉప్పు, కలుషిత మట్టి విస్తరుంచి ఉంది. దేశంలోని జలవనరులలో అత్యధికశాతం వ్యవసాయానికి ఉపకరించబడుతున్నాయి. వ్యవసాయానికి 84% జలాలు ఉపకరించడం కారణంగా సముద్రజలాలలో ఉప్పు శాతం అధికరిస్తుంది. పత్తిపంట పెరగడానికి క్రిసంహారకాలు, ఎరువులు పెద్ద మొత్తంలో ఉపయోగించడం మట్టి కాలుష్యానికి కారణం ఔతుంది. ఉజ్బెకిస్థాన్‌లోని " యు.ఎన్.డి.పి క్లైమేట్ రిస్క్ మేనేజిమెంట్ " దేశం పర్యావణాన్ని చదిద్దాలని అభిలషిస్తుంది. రాజకీయాలు thumb|right|The Legislative Chamber of the Supreme Assembly (Lower House). thumb|Islam Karimov, president of Uzbekistan, during a visit to the Pentagon in 2002. 1991లో సోవియట్ యూనియన్ నుండి ఉజ్బెకిస్థాన్‌కు స్వాతంత్ర్యం లభించిన తరువాత నిర్వహించిన ఎన్నికలలో ఇస్లాం కరిమోవ్ ఉజ్బెకిస్థాన్ అధ్యక్షునిగా ఎన్నిక చేయబడ్డాడు. 2009 డిసెంబరులో 27లో ఉభయసభలకు నిర్వహించబడిన ఎన్నికల తరువాత 150 మంది సభ్యులు కలిగిన ఓలి మజిల్స్, ది లెజిస్లేటివ్ చాంబర్, 100 మంది సభ్యులు కలిగిన సెనేట్ 5 సంవత్సరాల క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి. రెండవ ఎన్నికలు 2004-05 లో నిర్వహించబడ్డాయి. 2004లో ది ఓలి మజిల్స్ సమఖ్యసభగా ఉండేది. 1994 లో సభ్యులసంఖ్య 69, 2004-05 లో 120, ప్రస్తుతం సఖ్య 150. 2007 డిసెంబరు పార్లమెంటు చట్టం (రిఫరెండంతో) ఇస్లాం కరిమోవ్ పదవీకాలం పొడిగించబడింది. పలువురు అంతర్జాతీయ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించారు. వారు ఫలితాకి ఆమోదముద్ర తెలుపలేదు. 2002 డిసెంబరు రిఫరెండం ఉభయసభల (పార్లమెంటు ఎగువసభ (ఓలి మజిల్స్ ), దిగువ సభ (సెనేట్)) కొరకు ప్రణాళిక రూపొందించింది. దిగువసభ సభ్యులు పూర్తిసమయ లెజిస్లేటివ్లుగా పనిచేస్తారు. దిసెంబర్ 26న ఉభయసభలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మానవహక్కులు ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ రాజ్యాంగం ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్ డెమొక్రసీ " కామన్ హ్యూమన్ ప్రిన్సిపల్ " ఆధారంగా నిర్మితమైనదని దృఢంగా చెప్తుంది.Embassy of Uzbekistan to the US, Press-Release: "The measures taken by the government of the Republic of Uzbekistan in the field of providing and encouraging human rights" , 24 October 2005 ఉజ్బెకిస్థాన్ తన పౌరునికి రక్షణ, విశ్వసనీయమైన మానవహక్కులు కలిగిస్తుంది. ఉజ్బెకిస్థాన్ అధిక మానవీయ సాంఘిక రూపకల్పనకు చట్టలలో మరిన్ని మార్పులు చేస్తూ ఉంది. 300 చట్టాలకంటే అధికంగా పౌరుల హక్కులు, ఆధారభూతమైన స్వతంత్రం సంరక్ష ణకొరకు రూపొందించబడ్డాయి. Uzbekistan Daily Digest, , 25 December 2007 2005 ఆగస్టు 2 అధ్యక్షుడు ఇస్లాం కరిమొవ్ ఉజ్బెకిస్థాన్‌లో 2008 జనవరి1 నుండి మరణశిక్షను రద్దుచేస్తూ సంతకం చేసాడు .http://www.academia.edu/5627639/Civil_Society_reforms_in_Uzbekistan_More_than_government_chicanery Old Uzbek man from central Uzbekistan.|thumb ప్రభుయ్వేతర సేవాసంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ డాగ్స్, ఇంటర్నేషనల్ హెల్సింకీ ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, కౌంసిల్ ఆఫ్ ది యురేపియన్ యూనియన్ " ఉజ్బెకిస్థాన్ పరిమిత పౌరహక్కులను కలిగి ఉన్న నిరంకుశ దేశంగా " నిర్వచించాయి. US Department of State, 2008 Country Report on Human Rights Practices in Uzbekistan, Bureau of Democracy, Human Rights, and Labour, 25 February 2009 అలాగే వారు " ఉజ్బెకిస్థాన్‌లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని" ఆందోళన వెలిబుచ్చారు. IHF, , 23 June 2004 నివేదికలను అనుసరించి పెద్ద ఎత్తున హింస, దౌర్జన్యం, అక్రమ నిర్బంధం, స్వతంత్రాన్ని నిరోధించే పలు చర్యలు సంభవించాయని తెలియజేస్తున్నాయి. మతం, ఉపన్యాసాలు, మాధ్యమాలు,సమావేశాలు, సభానిర్వహణ మొదలైన వాటి మీద నిర్ధంధాలు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం గ్రామీణ స్త్రీలకు బలవంతపు స్టెరిలైజేషన్ మంజూరు చేసిందని భావిస్తున్నారు.OMCT and Legal Aid Society, Denial of justice in Uzbekistan – an assessment of the human rights situation and national system of protection of fundamental rights, April 2005. మతసంస్థల సభ్యులు, స్వతంత్ర పత్రికాసంపాదకులు, హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలకు వ్యతిరేకంగా దౌర్జన్యం చేయడం, నిరోధ చర్యలు తీసుకోవడం పతిపక్ష పార్టీ సభ్యుల మీద నిషేధం విధించడం మొదలైన మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని నివేదికలు తెలియజేస్తున్నాయి." 2005 సివిల్ అంరెస్ట్ ఇన్ ఉజ్బెకిస్థాన్ " సంఘటనలో 100 మంది ప్రజలు మరణించారు. ఉజ్బెకిస్థాన్ మానవహక్కుల చరిత్రలో ఇది ఒక గుర్తించతగిన సంఘటనగా భావించబడుతుంది. Jeffrey Thomas, US Government Info 26 September 2005 , మానవహక్కుల ఉల్లంఘన విషయంలో ఆందోళన కనబరుస్తూ స్వతంత్రంగా పరిశోధన చేయడానికి యునైటెడ్ స్టేట్స్, ఉరేపియన్ యూనియన్, ది యునైటెడ్ నేషన్స్, ది ఒ.ఎస్.సి.ఇ చైర్నన్ - ఇన్- ఆఫీస్, ది ఒ.ఎస్.సి.ఇ ఆఫీస్ ఫర్ డెమొక్రటిక్ ఇంస్టిట్యూషంస్, హ్యూమన్ రైట్స్ అభ్యర్ధన చేసుకున్నాయి. ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం పౌరుల హాక్కులను నిరాకరించడం, చట్టవిరోధంగా మానవ హక్కుల ఉల్లంఘన చేయడం, ప్రతిస్పందన తెలియజేయడానికి స్వతంత్ర నిరోధం, సభానిర్వహణా స్వతంత్రనిరోధం మొదలైన ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది. నిర్వహణా విభాగాలు ఉజ్బెకిస్థాన్ 12 పాలనా విభాగాలుగా విభజించబడింది (విలోయత్లర్ ఏకవచనంలో విలోయత్), ఒక అటానిమస్ రిపబ్లిక్ (రెప్పబ్లిక), ఒక స్వతంత్ర నగరం (షహర్) ఉన్నాయి. thumb|right|350px|Political Map of Uzbekistan విభాగం రాజధాని నగరం ఏరియా (km²) జనసంఖ్య (2008)! Key అండిజన్ రీజియన్ అండిజన్ రీజియన్ అండియన్ అండియన్ 4,200 2,477,900 2 'బుఖారా రీజియన్ బుక్ష్సొరొ విలోయతి బుఖారా బుక్సొరొ 39,400 1,576,800 3 ఫర్గన రీజియన్ ఫర్గొన విలోయతి | ఫర్గొన ఫర్గొన || 6,800 || 2,997,400 || 4 |- | '''జిజ్జాఖ్ రీజియన్ జిజ్జాక్ విలోయతి | జిజ్జాక్ జిజ్జాక్ || 20,500 || 1,090,900 || 5 |- | కరకల్పక్‌ స్థాన్ రిపబ్లిక్ కరకల్పక్ భాష : క్వరక్వల్పక్వస్థాన్ రెస్పబ్లికసి ʻ ఉజ్బెక్ భాష : క్వొరక్వల్పగ్ రెస్పబ్లికసి | నుకుస్ నొక్స్ నుకుస్ || 160,000 || 1,612,300 || 14 |- | క్వాష్క్వడర్యో రీజియన్ (కష్కడరియా రీజియన్) క్వాష్క్వడర్యొ విలొయతి | క్వర్షికర్షి క్వర్షి || 28,400 || 2,537,600 || 8 |- | క్సొరజ్ం రీజియన్ క్సొరజ్ం విలొయతి | ఉర్గెంచ్ ఉర్గెంచ్ || 6,300 || 1,517,600 || 13 |- | నమంగన్ రీజియన్ నమంగన్ విలోయతి | నమంగన్ నమంగన్ ||7,900 || 2,196,200 || 6 |- | నవియి రీజియన్ నవొయి విలొయతి | నవొయి నవొయి || 110,800 || 834,100 || 7 |- | సమర్ఖండ్ రీజియన్ సమఖండ్ విలొయతి | సమర్ఖండ్ సమర్ఖండ్ || 16,400 || 3,032,000 || 9 |- | సుర్క్సొడర్యొ రీజియన్ సుర్క్సొడర్యొ వొలోతి | టెర్మెజ్ టెర్మెజ్ || 20,800 || 2,012,600 || 11 |- | సిడర్యొ రీజియన్ సిర్యొ విలోతి | గులిస్టన్ గులిస్టన్ || 5,100 || 698,100 || 10 |- | తాష్కెంట్ నగరం తాష్కెంట్ షహ్రి | తాష్కెంట్ తాష్కెంట్ || 335 || 2,352,900 || 1 |- | తాష్కెంట్ రీజియన్ 'తాష్కెంట్ విలోయతి | తాష్కెంట్ తాష్కెంట్ '' 15,300  2,537,500 12 తాష్కెంట్ విలోయతి గణాంకాలలో తాష్కెంట్ నగరం గణాంకాలు చేర్చబడ్డాయి. ప్రొవింసెస్ అదనంగా జిల్లాలు (తుమన్) లుగా విభజించబడ్డాయి. గణాంకాలు thumb|Newlywed couples visit Tamerlane's statues to receive wedding blessings. thumb|Uzbek children ఉజ్బెకిస్థాన్ మద్య ఆసియాలో అత్యంత జనసాంధ్రత కలిగిన దేశంగా భావించబడుతుంది. దేశ జనాభా 3,10,25,500. 2008 గణాంకాలను అనుసరించి ఉజ్బెకిస్థాన్‌లో 14 వయసు లోబడినవారు 34.1% ఉన్నారు. 1996 అధికారిక ఆధారాలను అనుసరించి ఉజ్బెకియన్లు 80% ఉన్నారని భావిస్తున్నారు. రష్యన్లతో కలిసి ఇతర సంప్రదాయానికి చెందినవారు 5.5%, తజిక్ ప్రజలు5%, కరకల్ప్కాలు 3%, తాతార్లు 1.5% ఉన్నారు. తజిక్ ప్రజలసంఖ్య గురించిన అభిప్రాయభేదాలు ఉన్నాయి. తజిక్ సంఖ్య తగ్గించబడిందని వారు 20-30% ఉండవచ్చని పశ్చిమదేశీయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.Karl Cordell, "Ethnicity and Democratisation in the New Europe", Routledge, 1998. p. 201: "Consequently, the number of citizens who regard themselves as Tajiks is difficult to determine. Tajikis within and outside of the republic, Samarkand State University (SamGU) academic and international commentators suggest that there may be between six and seven million Tajiks in Uzbekistan, constituting 30% of the republic's 22 million population, rather than the official figure of 4.7%(Foltz 1996;213; Carlisle 1995:88).Lena Jonson (1976) "Tajikistan in the New Central Asia", I.B.Tauris, p. 108: "According to official Uzbek statistics there are slightly over 1 million Tajiks in Uzbekistan or about 3% of the population. The unofficial figure is over 6 million Tajiks. They are concentrated in the Sukhandarya, Samarqand and Bukhara regions." ఉజ్బెకీయులు మద్య ఆసియాకు చెందిన టర్కో- పర్షియన్ ప్రజలతో (సార్ట్) మిశ్రితం అయ్యారు. ప్రస్తుతం ఉజ్బెకీయులు తమ పూర్వీకం మగోలీయులు, ఇరానీయులు అని తెలుపుతున్నారు. ఉజ్బెకిస్థాన్‌లో కొరియన్ సంప్రదాయానికి చెందిన ప్రజలు ఉండేవారు. వీరు 1937-38 లలో స్టాలిన్ చేత బలవంతంగా సోవియట్ యూనియన్ నుండి వెలుపలికి పంపబడ్డారు. ఉజ్బెకిస్థాన్‌లో తాష్కెంట్, సమర్ఖండ్ ప్రాంతంలో స్వల్పసంఖ్యలో అమెరికన్ ప్రజలు ఉన్నారు. దేశంలో 88% ముస్లిములు ఉండగా వీరిలో అత్యధికులు సున్నీ ముస్లిములు, 5% షియా ముస్లిములు ఉన్నారు, 9% ఈస్టర్న్ ఆర్థడాక్స్, 3% ఇతరమతాలకు చెందినవారు ఉన్నారు. ది యు.ఎస్ స్టేట్ డెవెలెప్మెంటు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం రిపోర్ట్ (2004) 0.2% బౌద్ధులు (కొరియన్ సంప్రదాయ ప్రజలు) ఉన్నారని రెలియజేస్తుంది. ఉజ్బెకిస్థాన్ లోని బుకారాలో నివసిస్తున్న యూదులు వేలాది సంవత్సరాలుగా నివసిస్తున్నారని భావిస్తున్నారు. 1989 గణాంకాలను అనుసరించి ఉజ్బెకిస్థాన్‌లో 94,900 మంది యూదులు నివసిస్తున్నారని భావిస్తున్నారు.World Jewish Population 2001 , American Jewish Yearbook, vol. 101 (2001), p. 561. 1989 గణాంకాలను అనుసరించి యూదులు 5% ఉండేవారని సోవియట్ యూనియన్ పతనం చెందిన తరువాత యూదులు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఇజ్రేల్‌కు వెళ్ళారు. 2007 నాటికి ఉజ్బెకిస్థాన్‌లో 5000 మంది యూదులు మాత్రమే నివసిస్తున్నారని అంచనా. World Jewish Population 2007 , American Jewish Yearbook, vol. 107 (2007), p. 592. ఉజ్బెకిస్థాన్‌లో రష్యన్లు 5.5% ఉన్నారు. సోవియట్ కాలంలో తాష్కెంటులో రష్యన్లు, ఉజ్బెకీయులు సరిసమానంగా ఉండేవారు. Edward Allworth Central Asia, 130 years of Russian dominance: a historical overview (1994). Duke University Press. p.102. ISBN 0-8223-1521-11970 గణాంకాలను అనుసరించి దేశంలో 1.5 మిలియన్ల రష్యన్లు ఉన్నారని (12%) అంచనా. "The Russian Minority in Central Asia: Migration, Politics, and Language " (PDF). Woodrow Wilson International Center for Scholars. సోవియట్ యూనియన్ పతనం తరువాత గణనీయమైన రష్యన్లు ఆర్థికప్రయోజనాల కొరకు ఇక్కడ నుండి తరలి వెళ్ళారు. The Russians are Still Leaving Uzbekistan For Kazakhstan Now . Journal of Turkish Weekly. 16 December 2004.1940లో క్రిమియన్ తాతర్లు, వోల్గా జర్మన్లు, చెచెన్లు, పొంటిక్ గ్రీకులు, కుమాక్స్, పలు ఇతర జాతీయులు మద్య ఆసియాకు తరిలి వెళ్ళారు.Deported Nationalities. World Directory of Minorities. 1,00,000 క్రిమియన్ తాతర్లు ఉజ్బెకిస్థాన్‌లో నివసిస్తున్నారు.Crimean Tatars Divide Ukraine and Russia. The Jamestown Foundation. 24 June 2009. తాష్కెంటులోని గ్రీకులు 1974 లో 35,000 ఉండగా 2004 నాటికి వీరి సంఖ్య 12,000 కు చేరుకుంది. .Greece overcomes its ancient history, finally . The Independent. 6 July 2004. మాస్కెటియన్ తుర్కులు 1989 ఫర్గన హిసాత్మక చర్యల తరువాత దేశం వదిలి వెళ్ళారు.World Directory of Minorities and Indigenous Peoples – Uzbekistan : Meskhetian Turks. Minority Rights Group International. ఉజ్బెకిస్థాన్ లోని 10% శ్రామికులు విదేశాలలో (అధికంగా రష్యా, కజక్ స్థాన్) లో పనిచేస్తున్నారు. International Crisis Group, , Asia Briefing N°67, 22 August 20072003 గణాంకాలను అనుసరించి ఉజ్బెకిస్థాన్ అక్షరాస్యత 99.3% . ఈ సాధన సోవియట్ యూనియన్ విద్యావిధానం కారణంగా సంభవించింది. మతం thumb|left|Shakh-i Zindeh mosque, Samarkand. thumb|right|Mosque of Bukhara. 2009లో యు.ఎస్ స్టేట్ డిపార్ట్మెంటు విడులల చేసిన వివేదిక అనుసరించి ఉజ్బెకిస్థాన్‌లో ఇస్లాం ఆధిక్యత కలిగి ఉంది. దేశంలో ముస్లిములు 90%, రష్యన్లు 5%, ఆర్థడాక్స్ 5% ఉన్నారు. అయినప్పటికీ " 2009 ప్యూ రీసెర్చ్ సెంటర్ " నివేదిక ఉజ్బెకిస్థాన్‌లో 96.3% ముస్లిములు ఉన్నారని తెలియజేస్తుంది.Mapping the Global Muslim Population. A Report on the Size and Distribution of the World’s Muslim Population . Pew Forum on Religion & Public Life (October 2009) ఒకప్పుడు దేశంలో 93,000 యూదులు ఉన్నారని భావిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్ ఇస్లాం దీర్ఘకాలంగా ఆధిక్యతలో ఉన్నప్పటికీ గతంలో ఈ ప్రాంతంలో పలు మతాలు ఆచరించబడ్డాయి. 54% ప్రత్యేకత ప్రతిపాదించబడని ముస్లిములు, 18% సున్నీ ముస్లిములు, 1% షియా ముస్లిములు ఉన్నారు. Pew Forum on Religious & Public life. 9 August 2012. Retrieved 29 October 2013. ఉజ్బెకిస్థాన్‌లో సోవియట్ శక్తి ముగింపుకు వచ్చిన తరువాత హేతువాదం స్థానంలో మతావలంబన చోటుచేసుకుంది. యూదులు 2000 సంవత్సరాలకు ముందు యూదులు ఈ ప్రాంతంలో స్థిరపడడం ఆరంభం అయింది. 2000 సంవత్సరాలకు ముందు బాబిలోనియన్లు యూదులను ఇజ్రేల్ నుండి తరిమివేసిన తరువాత యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. సిల్క్ రోడ్డు పరిసరాలలో నివసిస్తున్న యూదుల మీద ఇతర సంప్రదాయాలు దృష్టి కేంద్రీకరించాయి. యూదులు ఇక్కడకు వచ్చిన తరువాత 1,500 పూర్వం పర్షియన్ల వేధింపుకు గురైయ్యారు. యూదులు పలు శతాబ్దాలుగా సమయాలలో పాలకుల వలన సంభవించిన కష్టనష్టాలను సహిస్తూ వర్ధిల్లారు. 14వ శతాబ్దంలో తమర్లనే పాలనాకాలంలో సమర్ఖండ్ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆ కారణంగా సమఖండ్ యూదుల ప్రధాన కేంద్రం అయింది. తమర్లనే మరణించిన తరువాత యూదులు ముస్లిముల తీవ్రమైన శతృత్వం, కఠిన నియమాలు,యూదులు ఊరికి వెలుపల యూదుల క్వార్టర్లలో మాత్రమే నివసించాలన్న నిబంధనలు వంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. యూదుల ద్వారాలు, దుకాణాలు ముస్లిముల కంటే దిగువన ఉండాలన్న నిబంధన ఉండేది. యూదులు నల్లటి టోపీలు, కార్డ్ బెల్టు ధరించాలన్న నియమంతో యూదుల వాదన సభలలో చెల్లుబాటు కాకూడదన్న నియమం ఉండేది. Jewish Virtual Library retrieved 29 December 2013 1868లో ఈ ప్రాంతం రష్యన్ల ఆధీనంలోకి మారిన తరువాత యూదులకు ప్రాంతీయ పౌరులకు సమానహక్కులు ఇవ్వబడ్డాయి. ఆ సమయంలో సమఖండ్ ప్రాంతంలో 50,000 మంది యూదులు, బుఖారా ప్రాంతంలో 20,000 మంది యూదుకు ఉన్నారని భావిస్తున్నారు. 1997లో రష్యన్ తిరుగుబాటు తరువాత సోవియట్ పాలన ఆరంభం అయిన తరువాత యూదుల మతజీవితం మీద షరతులు విధించబడ్డాయి. 1935 నాటికి 35 సినగోగ్యులలో ఒక్కరు మాత్రమే సమర్ఖండ్‌లో ఉన్నా డు. అయునప్పటికీ సోవియట్ శకంలో కమ్యూనిటీ జీవితం రహస్యంగా కొనసాగింది. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో సోవియట్ యూనియన్‌కు చెందిన యురేపియన్ ప్రాంతాల నుండి లక్షలాది యూదులు (స్టాలిన్ చేత బహిస్కరించ బడినవారు) ఉజ్బెకిస్థాన్‌కు శరణార్ధులుగా చేరుకున్నారు. 1970 నాటికి ఉజ్బెకిస్థాన్ రిపబ్లిక్‌లో 1,03,000 మంది యూదులు నమోదు అయ్యారు.1980లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ధ్వంసం చేయబడిన ప్రాంతాలలో యూదుల అండిజాన్ క్వార్టర్ ఒకటి. తరువాత యూదులు అధికంగా ఇజ్రేల్, యు.ఎస్ కు వలస వెళ్ళారు. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో కొన్ని వేలమంది యూదులు మాత్రమే నివసిస్తున్నారు. తాష్కెంటులో 7000 మంది, బుఖారాలో 3000, సంర్ఖండులో Euro-Asian Jewish Congress (retrieved 29 December 2013) భాషలు thumb|upright|A page in Uzbek language written in Nastaʿlīq script printed in Tashkent 1911 ఉజ్బెకిస్థాన్‌లో ఉజ్బెకీ భాష మాత్రమే అధికారభాషగా ఉంది. 1992 దీనీని వ్రాయడానికి అధికారికంగా లాటిన్ లిపిని వాడుతున్నారు. తజిక్ సంప్రదాయ ప్రజలు అధికంగా నివసిస్తున్న బుఖారా, సమర్ఖండ్ నగరాలలో తజిక్ భాష అధికంగా వాడుకలో ఉంది. తజిక్ భాష కాసన్, చస్ట్,ఫర్గన నదీతీరంలో ఉన్న రిష్టన్ లోయ, అహంగరన్, మిడిల్ సిర్ దర్యాలోని బఘిస్తాన్, షహ్రిషబ్జ్, కితాబ్, కఫిరింగన్, చగనియన్ నదీ లోయ ప్రాంతాలలో అధికంగా వాడుకలో ఉంది. ఉజ్బెకిస్థాన్ జనసంఖ్యలో 10-15% ప్రజలలో తజికిభాష వాడుకలో ఉంది.Karl Cordell, "Ethnicity and Democratisation in the New Europe", Routledge, 1998. p. 201: "Consequently, the number of citizens who regard themselves as Tajiks is difficult to determine. Tajikis within and outside of the republic, Samarkand State University (SamGU) academic and international commentators suggest that there may be between six and seven million Tajiks in Uzbekistan, constituting 30% of the republic's 22 million population, rather than the official figure of 4.7%(Foltz 1996;213; Carlisle 1995:88).Lena Jonson (1976) "Tajikistan in the New Central Asia", I.B.Tauris, p. 108: "According to official Uzbek statistics there are slightly over 1 million Tajiks in Uzbekistan or about 3% of the population. The unofficial figure is over 6 million Tajiks. They are concentrated in the Sukhandarya, Samarqand and Bukhara regions." టర్కిక్ భాషలలో ఒకటైన కరకల్పక్ భాష (కజక్ భాషకు సమీపంలో ఉంటుంది) కరకల్పక్స్థాన్ రిపబ్లిక్‌లో వాడుకభాషగా, అధికారిక భాషగా ఉంది. రష్యన్ భాష సంప్రదాయక ప్రజల వాడుక భాషగా ఉంది. ప్రత్యేకంగా నగరాలలో సాంకేతిక, సైంటిఫిక్, ప్రభుత్వ, వ్యాపార అవసరాలకు రష్యన్ భాష వాడుకలో ఉంది. రష్యన్ భాష 14% ప్రజలకు వాడుక భాషగా ఉంది. రష్యన్ భాష అత్యధికులకు ద్వితీయభాషగా వాడుకలో ఉంది. గ్రామీణప్రాంతాలలో రష్యన్ భాష మితంగానే వాడుకలో ఉంది. ప్రస్తుతం నగరప్రాంత విద్యార్థులలో కూడా రష్యన్ భాషానైపుణ్యం తక్కువగా ఉంది. 2003 గణాంకాలను అనుసరించి దాదాపు సగంకంటే అధికంగా రష్యాభాషను మాట్లాడే, అర్ధం చేసుకునే శక్తి కలిగి ఉన్నారు. ఉజ్బెకిస్థాన్, రష్యాల మద్య ఉన్న స్నేహపూరిత రాజకీయ వాతావరణం కారణంగా అధికారిగా రష్యాన్ భాష పట్ల నిర్లక్ష్యం వహించడం వదిలి వేయబడింది. 1920కి ముందు ఉజ్బెకిస్థాన్ వ్రాతభాషను టర్కీ (పశ్చిమ శాస్త్రవేత్తలు చగటే అంటారు) ఉజ్బెకిస్థాన్ వ్రాయడానికి నస్తా'లీక్వి లిపిని ఉపయోగించారు. 1926లో లాటిన్ అక్షరాలు ప్రవేశపెట్టబడి 1930 వరకు పలు మార్పులకు గురైంది. సోవియట్ ప్రభుత్వం సిరిలిక్ లిపిని ప్రవేశపెట్టింది. సోవియట్ పతనం అయ్యే వరకు సిరిలిక్ భాష వాడుకలో ఉండేది. 1933లో ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం లాటిన్ భాషను తిరిగి ప్రవేశపెట్టింది. 1996లో లాటిన్ ఆధినీకరణ చేయబడి 2005 నుండి పాఠశాలలో సైన్సు బోధించడానికి వాడుకలో ఉంది. పలు గుర్తులు, నోటిసులు (వీధులలోని అధికారిక ఫలకాలు కూడా) ఉజ్బెకి సిరిలిక్ లిపిలో వ్రాయబడుతున్నాయి. . ఆర్ధికం thumb|left|Tashkent thumb|left|Samarkand బంగారు నిలువకలిగిన దేశాలలో ఉజ్బెకిస్థాన్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఉజ్బెకిస్థాన్ నుండి వార్షికంగా 80 టన్నుల బంగారాన్ని వెలికితీస్థుంది. ఉజ్బెకిస్థాన్ రాగి నిల్వలు ప్రపంచంలో 10వ స్థానంలో, యురేనియం నిల్వలు ప్రపంచంలో 12వ స్థానంలోనూ ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ యురేనియం ఉత్పత్తి అంతర్జాతీయంగా 7వ స్థానంలో ఉంది. Supply of Uranium . World Nuclear Association. August 2012.Uranium resources . European Nuclear SocietyThe World Mineral Statistics dataset: 100 years and counting. British Geological Survey ది ఉజ్బెకి నేషనల్ గ్యాస్ కంపెనీ, ఉజ్బెక్నెఫ్త్‌గ్యాస్, గ్యాస్ 60 నుండి 70 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తితో అంతర్జాతీయంగా 11వ స్థానంలో ఉన్నాయి. . దేశంలో గుర్తించబడని ఆయిల్, సహజవాయు నిల్వలు ఉన్నాయి: ఉజ్బెకిస్థాన్‌లో 194 హైడ్రోకార్బన్ ఉన్నాయి. వీటిలో 98 కండెంసటే, సహజవాయు నిల్వలు, 96 కండెంసతే నిలువలు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్ పెద్ద సంస్థలలో ఉజ్బెకిస్థాన్ ఎనర్జీ సెక్టర్‌కు చెందిన చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ (సి.ఎన్.పి.సి), పెట్రోనస్, ది కొరియా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, గజ్‌ప్రొం, లుకొయిల్, ఉజ్బెకిస్థానెఫ్తెగ్యాస్ ప్రధానమైనవి. " కామంవెల్త్ ఆఫ్ ఇండిపెండెంస్ స్టేట్స్ " (సి.ఐ.ఎస్ ఎకనమీ)లతో ఉజ్బెకిస్థాన్ ఎకనమీ మొదటి సంవత్సరంలో పతనం అయింది. ఉజ్బెకిస్థాన్ విధానంలో మార్పులు, సంస్కరణలు మొదలైన ఏకీకృత ప్రయత్నం కారణంగా 1995 తరువాత ఉజ్బెకిస్థాన్ ఎకనమీ కోలుకున్నది. 1998, 2003 మద్యకాలంలో వార్షికంగా 4% అభివృద్ధి తరువాత 7-8% అభివృద్ధితో ఉజ్బెకిస్థాన్ ఆర్థికరంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఐ.ఎం.ఎఫ్ నివేదిక అనుసరించి IMF World Economic Outlook Database, October 2007 2008 ఉజ్బెకిస్థాన్ జి.డి.పి దాదాపు రెండింతలు అయింది. 2003 నుండి వార్షిక ద్రవ్యోల్బణం 10%ని కంటే తక్కువగా ఉంది. ఉజ్బెకిస్థాన్ వార్షిక జి.ఎన్.ఐ తలసరి (1,900 అమెరికన్ డాలర్లు. కొనుగోలు శక్తి (2013) 3,800 అమెరికన్ డాలర్లు).Field Listing :: GDP – per capita (PPP) . The World Factbook ఉత్పత్తి కమ్మోడిటీల మీద కేంద్రీకృతం చేయబడింది. ఉజ్బెకిస్థాన్ పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలో 7వ స్థానంలో ఎగుమతిలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. అలాగే బంగారు ఉత్పత్తిలో ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఉజ్బెకిస్థాన్ గణనీయంగా సహజవాయు ఉత్పత్తి, బొగ్గు, రాగి, ఆయిల్, వెండి, యురేనియం ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయం ఉజ్బెకిస్థాన్ వ్యవసాయం 26% శ్రామికులకు ఉపాధి కల్పిస్తూ 18% జి.డి.పి అభివృద్ధికి సహకరిస్తుంది. వ్యవసాయ భూములు 4.4 మిలియన్లు (10%) ఉన్నాయి. పత్తి పంట కోత సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటికీ వేతనరహిత ఉపాధ్యాయులుగా వ్యవసాయభూములలో పనిచేయడానికి తరలించబడుతుంటారు. ఉజ్బెకిస్థాన్ పత్తిని దక్షిణకొరియాలో బ్యాంక్ పత్రాలను తయారుచేయడానికి ఉపయోగిస్తుంటారు. ఉజ్బెకిస్థాన్‌లో బాలకార్మికులు టెస్కో మొదలైన పలు సంస్థలలో పనికి నియమించబడుతున్నారు. చి.ఎ. మార్క్స్ & స్పెంసర్, గాప్, హెచ్&ఎం. సంస్థలు ఉజ్బెకిస్థాన్ పత్తిని బహిష్కరించాయి. ఆర్ధిక సంస్కరణలు స్వతంత్రం వచ్చిన తరువాత ఆర్థికసవాళ్ళను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. దిగుమతులు తగ్గించడం, సరిపడిన విద్యుదుత్పత్తి స్వయంగా సాధించడం సంస్కరణలలో చోటుచేసుకున్నాయి. 1994 నుండి విజయవంతమైన " ఉజ్బెకిస్థాన్ ఎకనమిక్ మోడెల్ " గురించి ప్రభుత్వ మాధ్యమాలు ప్రకటిస్తున్నాయి. Islam Karimov's interview to Rossijskaya Gazeta, 7 July 1995 (in Russian). ఆర్థిక స్థబ్ధత, దిగ్భ్రాంతి, పౌపరిజం (భిక్షమెత్తడం) కంటే సంకరణలు చక్కని మార్గమని కూడా ప్రకటించింది. క్రమమైన ఆర్థిక సంస్కరణ వ్యూహం స్థూల ఆర్థిక సంస్కరణలు, నిర్మాణాత్మకమైన సంస్కరణలను పక్కకు నెట్టింది. ప్రభుత్వం మీద సరికొత్తగా బ్యూరోక్రసీ ప్రభావం అధికరించింది. దేశంలో లంచగొండితనం వేగవంతంగా అధికరించింది. 2005 ఉజ్బెకిస్థాన్ లంచగొండితనం అంతర్జాతీయంగా 159 దేశాలలో 137 వ స్థానంలో ఉంది. 2007 ఉజ్బెకిస్థాన్ లంచగొండితనం అంతర్జాతీయంగా 179 దేశాలలో 175 వ స్థానంలో ఉంది. దేశంలోని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ పత్తి, బంగారం, మొక్కజొన్న, గ్యాస్ ఉతపత్తి ద్వారా ఆదాయాన్ని అధికరించ్చని సలహా ఇచ్చింది.Gary Thomas . Voice of America. 16 February 2006 సమీపకాలంలో ఉన్నత స్థాయి లంచం సంబంధిత మోసాలు ప్రభుత్వం,స్టెల్లా సొనెరియా మొదలైన అంతర్జాతీయ సంస్థల ఒప్పందాల మీద ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఉజ్బెకిస్థాన్ లోని లంచగొండితనం మోసాల కారణంగా వ్యాపారం బాధించపడుతుందని భావిస్తున్నాయి. ఎకనమిస్ట్ ఇంటెలిజెంస్ యూనిట్ నివేదిక అనుసరించి ప్రభుత్వం ప్రైవేట్ రంగం అభివృద్ధికి వ్యతిరేకంగా ఉందని తెలియజేస్తుంది. ఉజ్బెకిస్థాన్ విదేశీ పెట్టుబడులను తిప్పి కొడుతున్నారు. సి.ఐ.ఎస్ లో తలసరి లోయస్టుగా ఉంది.2011 Investment Climate Statement – Uzbekistan. US Department of State, March 2011 ఉజ్బెకిస్థాన్‌లో ప్రవేశిస్తున్న సంస్థలు ఉజ్బెకిస్థాన్ మార్కెట్‌లో కరెంసీ మార్పిడి చేయడం శ్రమతోకూడుకున్న పని అని తెలియజేస్తున్నాయి. ద్రవ్యోల్భణం ఉజ్బెకిస్థాన్ స్వతంత్రం పొందిన తరువాత 1992-1994 అనియత్రిత ద్రవ్యోల్బణం (1000%)ఎదుర్కొన్నది. ఐ.ఎమెఫ్ పర్యవేక్షణలో క్రమపరిచే విధానాలు చేపట్టింది.Uzbekistan's Ministry of Foreign Affairs on IMF's role in economic stabilisation . Retrieved 22 June 2009 1997 నాటికి ద్రవ్యోల్బణం 50% తీసుకువచ్చింది. 2002 నాటికి 22% వచ్చింది. 2003 వార్షిక ద్రవ్యోల్బణం 10%, నిర్భంధమైన ఆర్థిక విధానాల ఫలితంగా 2004లో ద్రవ్యోల్భణం 3.8% నికి చేరుకుంది. 2006 నాటికి 6.9%, 2007 నాటికి 7,6% ఉంది. దిగుమతి విధానాలు ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం విదేశీ దిగుమతులను పలు మార్గాలలో కట్టిదిట్టం చేసింది. అధికమైన దిగుమతి సుంకం అందులో ఒకటి. ప్రాంతీయ ఉత్పత్తులను సంరక్షించడానికి ఎక్సిజ్ డ్యూటీ వివక్షాపూతితంగా అత్యధికంగా ఉంటుంది. అధికారిక అనధికార పన్నులు మిశ్రితమై ఉంటాయి. ఈ కారణంగా వస్తువుల ధరలు 100 నుండి 150% అధికరిస్తుంటాయి. అందువలన దిగుమతి వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రావడం శ్రమతో కూడుకున్నది.. NTE 2004 FINAL 3.30.04 దిగుమతి ప్రతిబంధన అధికారింగా ప్రకటించబతూ ఉంది. పలు సి.ఐ.ఎస్ సంస్థలు అధికారిక ఉజ్బెకిస్థాన్ దిగుమతి సుంకాలను తప్పించుకుంటున్నది. అత్యావసర వస్తువుల దిగుమతికి ప్రభుత్వం పన్నురాయితీ ప్రకటిస్తుంది. స్టాక్ మార్కెట్ 1994లో ది తాష్కెంటు స్టాక్ ఎక్స్‌చేంజ్ (రిపబ్లికన్ స్టాక్ ఎక్స్‌చేంజ్) ప్రారంభించబడింది. ఉజ్బెక్ జాయింట్ స్టాక్ కంపెనీలు (1250) మొత్తం షేర్లు ఆర్.ఎస్.సిలో విక్రయించబడుతుంటాయి. 2013 జనవరి నాటికి స్టాక్ మార్కెట్టులో నమోదైన సంస్థల సంఖ్య 119. 2012 సెక్యూరిటీల మార్కెట్ విలువ 2 ట్రిలియన్లు. సంస్థల ఆసక్తి అధికరించడం కారణంగా ఈ సఖ్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సెంట్రల్ డిపాజిటరీ నివేదిక అనుసరించి 2013 సెక్యూరిటీల మార్కెట్ విలువ 9 ట్రిలియన్లకు చేరుకుంది. 2003 నుండి ఉజ్బెకిస్థానార్ధికరంగం శక్తివంతంగా మారింది. అందుకు ప్రపంచ మార్కెట్తులో అధికరించిన బగారం, పత్తి ధరలు, అభివృద్ధి చేయబడిన సహజవాయువు, ఎగుమతులను అధికరించడం, విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య అధికరించడం సహకరిస్తున్నాయి. ప్రస్తుతం దేశజి.డి.పి మిగులు 9%-11% (2003-2005) ఉంది. విదేశీ మారకం, బంగారం నిలువలు రెండింతలు (3 బిలియన్ అమెరికన్ డాలర్లు) అయింది. 2010 విదేశీమారకం 10 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. హెచ్.ఎస్.బి.సి. బ్యాంక్ సర్వే అనుసరించి ఉజ్బెకిస్థాన్ ఆర్థికరగం తరువాతి దశాబ్ధాలలో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికరంగాలలో ఒకటిగా (మొదటి 26 ) గుర్తించబడుతుంది. సంస్కృతి thumb|left|Traditional Uzbek pottery. thumb|Embroidery from Uzbekistan thumb|left|Navoi Opera Theater in Tashkent ఉజ్బెకిస్థాన్ పలు సంప్రదాయ, సాంస్కృతిక ప్రజల మిశ్రితం. వీరిలో ఉజ్బెకీయులు అధికంగా ఉన్నారు. 1995 71% ఉజ్బెకిస్థాన్ ప్రజలు ఉజ్బెకీయులే. అల్పసంఖ్యాకులలో ప్రధానులు రష్యన్లు (8%). తజికీలు (5-30%).Lena Jonson, "Tajikistan in the New Central Asia", Published by I.B.Tauris, 2006. p. 108: "According to official Uzbek statistics there are slightly over 1 million Tajiks in Uzbekistan or about 4% of the population. The unofficial figure is over 6 million Tajiks. They are concentrated in the Sukhandarya, Samarqand and Bukhara regions." కజఖ్ ప్రజలు (4%), తాతర్ ప్రజలు (2.5%), కరకల్పకులు (2%) ఉన్నారు. ఉజ్బెకిస్థాన్ లోని ఉజ్బెకేతర ప్రజలు క్రమంగా క్షీణిస్తున్నారు. రష్యా, ఇతర అల్పసంఖ్యాక ప్రజలు ఉజ్బెకిస్థాన్ వదిలి సోవియట్ యూనియన్‌లోని ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉజ్బెకిస్థాన్ 1991లో స్వతంత్రదేశం అయింది. దేశంలో ముస్లిం ఛాందసవాదం విస్తరిస్తుందని కొందరు ఆదోళన చెందుతున్నారు. దేశం మతస్వతంత్రం ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నారు. 1994లో ఉజ్బెకిస్థాన్ ప్రజలలో సగం మంది ముస్లిములున్నారు. సంగీతం thumb|Sevara Nazarkhan thumb|Dance of a Bacha in Samarkand between 1905 and 1915 thumb|right|Westminster International University main building in Summer thumb|Silk and Spice Festival in Bukhara మద్య ఆసియన్ సంప్రదాయ సంగీతం షష్మక్వాం. ఇది 16వ శతాబ్దంలో బుఖారా ఆప్రాంతానికి రాజధానిగా ఉన్న సమయంలో నూతనంగా రూపొందించబడింది. షష్మక్వాం అజబైజని, ముగాం, ఉయుఘూర్ ముక్వాం సంగీతాలకు సామీప్యంలో ఉంటుంది. ఇందులో ఆరు ముక్వాములు (శాఖలు) ఉన్నందున ఈ సంగీతానికి ఈ పేరు వచ్చింది. ఇందులోని శాఖలు ఆరు పర్షియన్ సంప్రదాయ రీతులు శాఖలుగా ఉంటాయి. కచేరీలో మద్య మద్యలో సూఫీ కవిత్వం వచనరూపంలో చోటు చేసుకోవడం దీని ప్రత్యేకత. వివాహాది శుభకార్యాలలో కూడిన సమయంలో ఈ కచేరీలు శ్రోతలను ఆనందింపజేయడం వలన ఉజ్బెకిస్థాన్‌లో ఫోల్క్- పాప్ శైలి కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉజ్బెకిస్థాన్ సంప్రదాయ సంగీతం పాప్ సంగీతానికీ మద్య ఎంతో వ్యత్యాసం కనిస్తుంది. పురుషులు సోలో సంగీతం వినడంలో ఆసక్తి కనబరుస్తారు. పురుషుల మద్య జరిగే ఉదయం, సాయంకాల సమయాలలో సంగీతం కచేరీలు చోటుచేసుకుంటుంది. సంప్రదాయ సంగీతంలో షాష్ మక్వం ప్రధానమైనది. దీనిని సంపన్నకుటుంబాల మద్దతు లభిస్తూ ఉంది. కొన్ని మార్లు రెండు భాషల మిశ్తితంగా పాటలు రూపొందించబడుతుంటాయి. కొన్ని మార్లు సంగీతంలో పద్యసాహిత్యం కూడా సంగీతంలో చోటుచేసుకుంటుంది. 1950లో ఫోల్క్ సంగీతానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇది రేడియో స్టేషన్లలో ప్రసారం చేయడం నిలిపివేయబడింది. దీనికి ఫ్యూడల్ సంగీతం అని పేరు మార్చి దీని మీద నిషేధం విధించబడింది. జానపద సాహిత్యం వారి స్వంతబాణిలో ప్రచారం చేయబడుతూనే ఉంది. పలువురు ఇది స్వతంత్రమైన అనుభూతిని అందిస్తుందని అభిప్రాయపడుతుంటారు. విద్య ఉజ్బెకిస్థాన్ అక్షరాస్యతా శాతం 99.3%. అయినప్పటికీ ప్రస్తుతం 15 సంవత్సరాలకు లోబడిన వారిలో 76% మాత్రమే పాఠశాలలో ప్రవేశించారు. 3-6 సంవత్సరాల బాలబాలికలు ప్రి స్కూల్‌లో 20% మాత్రమే హాజరు ఔతున్నారు. ఇది ఇంకా భవిష్యత్తులో క్షీణిస్తుందని భావిస్తున్నారు. విద్యార్థులు సోమవారం నుండి శనివారం వరకు పాఠశాలకు హాజర్ ఔతుంటారు. 9వ సంవత్సర విద్యాసంవత్సరంతో మాధ్యమిక విద్య ముగుస్తుంది. మాద్యమిక విద్య తరువాత వాణిజ్య, సాంకేతిక విద్యను అభ్యసిస్తారు. ఉజ్బెకిస్థాన్‌లో రెండు అంతర్జాతీయ పాఠశాలలు ఉన్నాయి. రెండూ తాష్కెంటులో ఉన్నాయి. అవి తాధ్కెంటు ఇంటర్నేషనల్ స్కూల్ కె- 12. ఇంటర్నేషనల్ కరికులం స్కూల్. ఉజ్బెకిస్థాన్ విద్యావిధానం తీవ్రమైన లోటు బడ్జెట్ సమస్యను ఎదుర్కొంటుమ్న్నది.విద్యా చట్టవిధానంలో 1992 నుండి సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. అయినప్పటికీ భౌతిక విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. కరికులం రివిషన్ కూడా బలహీనంగా ఉంది. ఉపాద్యాయులకు ఇవ్వబడుతున్న తక్కువ స్థాయి జీతాలు ఇందుకు ప్రధాన కారణగా ఉన్నాయి. భవననిర్మాణం వంటి మౌలిక సదుపాయాలకు తగినంత వ్యయం చేయకపోవడం విద్యానాణ్యత లోపించడానికి మరొక కారణం. విద్యావిధానంలో లంచగొండితనం సంపన్నులు ఉపాధ్యాయులను, పాఠశాల అధికారులను ప్రలోభపెట్టి పాఠశాలలకు, పరీక్షలకు హాజరు కాకుండా హయ్యర్ గ్రేడు సాధించడానికి సహకరిస్తుంది. Kozlova, Marina (21 January 2008) Uzbekistan: Lessons in Graft. Chalkboard.tol.org ఉజ్బెకిస్థాన్ విశ్వవిద్యాలయాలు వార్షికంగా 6,00,000 మంది పట్టభద్రులను తయారు చేస్తున్నాయి. తాష్కెంటు వెస్ట్ మినిస్టర్ యూనివర్శిటీ, ఇషా యూనివర్శిటీ తాధ్కెంటు ఆంగ్లమాధ్యమంలో విద్యాధ్యయనం చేయడానికి సహకరిస్తున్నాయి. శలవు దినాలు జనవరి 1: కొత్తసంవత్సరం. (యంగి యిల్ బయ్రమి). జనవరి 14: డే ఆఫ్ డిఫెండర్స్ ఆఫ్ ది మదర్లాండ్. (వతన్ హిమొయచిలరి కుని). మార్చి 8: ఇంటర్నేషనల్ వుమంస్ డే, (క్సల్క్వరొ క్సొటిన్ - క్విజార్ కుంజ్) మార్చి 21: నైరుజ్ (నౌరొజ్ బయ్రమి). మే 9: రొమెంబరెంస్ డే (క్సొతిర వ క్వాదిర్లాష్ కుంజ్. సెప్టెంబరు 1: ఇండిపెండెంస్ డే (ముస్తక్విల్లిక్ కుంజ్). అక్టోబరు 1: టీచర్స్ డే (ఓ' క్వితువ్చి వ మురబ్బియ్లర్). 8 డెసెంబర్ : కాన్‌స్టిట్యూషన్ డే (కాన్‌స్టిట్యూషియా కుంజ్) వైవిధ్యమైన తేదీ రంజాన్ 70 రోజుల తరువాత క్వుర్బన్ హయిత్ ఈద్ అల్- అధ. ఆహారసంస్కృతి thumb|right|Palov thumb|right|Uzbek manti ఉజ్బెకి ఆహారసంప్రదాయం మీద ప్రాంతీయ వ్యవసాయప్రభావం అధికంగా ఉంది. ఉజ్బెకిస్థాన్‌లో ధాన్యం అధికంగా పండించబడుతుంది. అందువలన రొట్టెలు, నూడిల్స్ ఉజ్బెకీయుల ఆహారంలో అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఉజ్బెకీయుల ఆహారంలో నూడిల్స్ ఆధిక్యత వహిస్తుంది. దేశంలో గొర్రెలు విస్తారంగా ఉన్నందున ఆహారంలో మటన్ ప్రధాన మాంసాహారంగా ఉంది. ఉజ్బెకిస్థాన్ చిహ్నంగా భావించబడుతున్న ఆహారం పులావ్. బియ్యం, మాంసం ముక్కలు, తురిమిన కేరెట్లు, ఎర్రగడ్డలు కలిపి తయారు చేయబడుతుంది. వివాహనిశ్చయం వంటి సందర్భాలలో అతిధులకు ఒషీ నహార్, నహార్ లేక మార్నింగ్ పులావ్ ప్రతి ఉదయం ఉదయపు అల్పాహారంగా (ఉదయం 6-8 గంటల మధ్య ) వడ్డించబడుతుంది. ఇతర ముఖ్యమైన ఆహారాలలో కొవ్వుతో చేర్చిన పెద్ద మాంసపు ముక్కలను (ప్రధానంగా మటన్), తాజా కూరగాయలు చేర్చి తయారుచేయబడే షుప్రా (షుర్వ్ లేక షొర్వ) అనే సూప్ ప్రధానమైనది. వీటిలో నర్యన్ సూప్, లాఘ్మన్ సూప్ ఉన్నాయి. నూడిల్స్ ఆధారిత వంటకాలు సూప్ లాగా లేక ప్రధాన ఆహారంగా కూడా అందించబడుతుంది. మంటి (డంప్లింగ్), చూచ్వర, సమోసా, స్టఫ్డ్ పొకెట్స్ చిరుతిండిగ లేక ప్రధాన ఆహారంగా తింటారు. కూరగాయలు, మాంసం కలిపి చేయబడిన డిమ్లమ, పలు కబాబులు సాధారణంగా ప్రధాన ఆహారంగా అందించబడుతుంది. గ్రీన్ టీ జాతీయ వేడి పానీయం రోజంతా సేవిస్తుంటారు. టీ హౌసెస్ (చాయ్ ఖానా) సాంస్కృతిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. తాధ్కెంటులో బ్లాక్ టీకి ప్రాధాన్యత ఇస్తారు. అయినా గ్రీన్ టీ, బ్లాక్ టీలను పాలు, పంచదార లేకుండా సేవిస్తుంటారు. టీ సాధారణంగా ప్రధాన ఆహారంతో సేవించినా అతిథులకు మర్యాదాపూర్వకంగా గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ అందించడం అలవాటు. చల్లని యోగర్ట్ పానీయం అయ్రన్ వేసవి పానీయంగా సేవించబడుతుంది. అయినప్పటికీ ఇది టీ, కాఫీలకు ప్రత్యామ్నాయం కాదు. మద్యపానం దేశంలో పశ్చిమదేశాలకంటే తక్కువగానే వ్యాపించింది. ముస్లిందేశాలలో ద్రాక్షారసం ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. లౌకిక దేశమైన ఉజ్బెకిస్థాన్‌లో 14 వైనరీలు ఉన్నాయి. వీటిలో 1927లో సమర్ఖండ్‌లో స్థాపించబడిన కువ్రెంకో వైనరీ ప్రబలమైనది. సమర్ఖండ్‌ వైనరీ నుండి ప్రాంతీయ ద్రాక్షపండ్ల నుండి డిసర్ట్ వైన్ తయారు చేయబడుతుంది. ఉజ్బెకిస్థాన్‌లో గుల్యకండోజ్, షిరిన్, అలీటికో, కబర్నెట్ లికర్నొ (లిబర్నొ సౌవిగ్నన్: రష్యన్) డిసర్ట్ వైనులు తయారుచేయబడుతున్నాయి. ఉజ్బెకిస్థాన్ వైన్‌లు అంతర్జాతీయ అవార్డులను గెలిచాయి. వీటిని రష్యా, ఇతరదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. క్రీడలు ఉజ్బెకిస్థాన్ గత రేసింగ్ సైకిలిస్ట్ " డ్జమొలిడైన్ అబ్దౌజపరోవ్ స్వస్థలం. అబ్దౌజపరోవ్ టౌర్ డీ ఫ్రాంస్ " గ్రీన్ జర్సీ పాయింట్ పోటీ" లో మూడుమార్లు విజయం సాధించాడు. అబ్దౌజపరోవ్ ప్రమాదకరమైన విన్యాసాలు ప్రదర్శించడంలో సిద్ధహస్థుడు కనుక ఆయనకు "తాష్కెంటు టెర్రర్ " అనే మారుపేరు ఉంది. ఆర్తూర్ టేమజోవ్ " 2000 వేసవి ఒలింపిక్ క్రీడా పోటీ " లలో మల్లయుద్ధం (రెస్ట్లింగ్) విజయం సాధించాడు. అలాగే 2004 వేసవి ఒలింపిక్ క్రీడ " , 2008 వేసవి ఒలింపిక్ క్రీడ , 2012 వేసవి ఒలింపిక్ క్రీడలలో పురుషుల 120 కి.గ్రా పోటీలో బంగారు పతకాలు సాధించాడు. ప్రొఫెషనల్ బాక్సర్ రుస్లన్ చగెవ్ ఉజ్బెకిస్థాన్ డబల్యూ.బి.ఎ పోటీలలో పాల్గొన్నాడు. 2007 డబల్యూ.బి.ఎ చాంపియన్ పోటీలో నికొలవి వాల్యూవ్‌ను ఓడించి రుస్లన్ చగెవ్ విజయం సాధించాడు. రుస్లన్ చగెవ్ రెండుమార్లు చాంపియన్ షిప్ సాధించిన తరువాత 2009 లో వ్లాదిమీర్ కిలిత్‌స్చొకొ చేతిలో అపజయం పొందాడు. ప్రపంచ చాంపియన్ మైకేల్ కొల్గ్నొవ్ స్ప్రింట్ కనొయర్ కె.1 500 మీ ఒలింపిక్ పోటీలో కాంశ్య పతకం సాధించాడు. జిమ్నాసిస్ట్ అలెగ్జాండర్ షతిలోవ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ కాంశ్య పతకం సాధించాడు. , జిమ్నాసిస్ట్ ఒక్సన చౌసొవితిన దేశం కోసం మొత్తంగా 70 పతకాలు సాధించాడు. ఉజ్బెకిస్థాన్ అంతర్జాతీయ కురష్ అసోసియేషన్ స్వస్థలం. ఉజ్బెక్ యుద్ధకళను ఆధునికీకరణ , అంతర్జాతీయీకరణ చేసి రూపొందించిన యుద్ధకళ కురష్. ఉజ్బెకిస్థాన్‌లో " అసోసియేషన్ ఫుట్ బాల్ " అత్యంత ప్రాబల్యత సంతరిం ఉకుంది. ఉజ్బెకిస్థాన్ ప్రీమియర్ ఫుట్ బాల్ లీగ్ (ఉజ్బెక్ లీగ్) తరఫున 2015 నుండి 16 టీంలు క్రీడలలో పాల్గొంటున్నాయి. ప్రస్తుత చాంపియన్లు (2014) ఎఫ్.సి. పఖ్తకొర్. ఎఫ్.సి. పఖ్తకొర్ 10 ఉజ్బెకిస్థాన్ టైటిల్స్ సాధించి ఉజ్బెకిస్థాన్ ఫుట్ బాల్ బృందంలో ప్రధమ స్థానంలో ఉంది. 2014 ఉజ్బెకిస్థాన్ ఫుట్ బాల్ టీం (ప్లేయర్ ఆఫ్ ది ఇయర్) గా ఒదిల్ అఖ్మెదొవ్ గుర్తించబడ్డాడు. ఉజ్బెకిస్థాన్ ఫుట్ బాల్ క్లబ్ కప్ వరుసగా " ఎ.ఎఫ్.సి. కప్ " క్రీడలలో పాల్గొంటూనే ఉన్నారు. " 2011 ఎ.ఎస్.ఎఫ్. కప్ (ఎ.ఎఫ్.సి. కప్) " 2011 లో నసాఫ్ సాధించాడు. మొదటి ఉజ్బెకిస్థాన్ ఇంటర్నేషనల్ క్లబ్ కప్‌గా ఎ.ఎఫ్.సి. కప్‌కు ప్రత్యేకత ఉంది. 1991 లో ఉజ్బెకిస్థాన్‌కు స్వతంత్రం లభించడానికి ముందు ఉజ్బెకిస్థాన్ సోవియట్ యూనియన్‌లోని సోవియట్ యూనియన్ రగ్బీ యూనియన్ టీం, సోవియట్ యూనియన్ నేషనల్ ఐస్ హాకీ టీం, సోవియట్ యూనియన్ నేషనల్ హాకీ టీంలలో ఉజ్బెకీయులు పాల్గొన్నారు. ఉజ్బెకిస్థాన్ సోవియట్ యూనియన్ నుండి విడిపోయిన తరువాత ఉజ్బెకిస్థాన్ తనస్వంత " ఉజ్బెకిస్థాన్ నేషనల్ ఫుట్ బాల్ టీం, ఉజ్బెకిస్థాన్ రగ్బీ యూనియన్ టీం, ఉజ్బెకిస్థాన్ నేషనల్ ఫుత్సల్ టీం వంటి నేషనల్ టీంలను ఏర్పాటు చేసుకుంది. 1991లో ఉజ్బెకిస్థాన్ స్వతంత్రం పొందాక ఉజ్బెకిస్థాన్‌లో టెన్నిస్ క్రీడ అత్యంత ప్రజాదరణ పొందింది. 2002లో ఉజ్బెకిస్థాన్ " ఉజ్బెకిస్థాన్ టెన్నిస్ ఫెడరేషన్ " పేరిట తన స్వంత టెన్నిస్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుంది. ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంటులో డబల్యూ. టి. ఎ. టెన్నిస్ టోర్నమెంటు (తాష్కెం టు ఒపెన్) కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నమెంటు 1999 నుండి ఔట్ డోర్ హార్డ్ కోర్టులలో నిర్వహించబడుతుంది. డెనిస్ ఇష్టోమిన్, అక్గుల్ అమన్మురదొవ ప్రఖ్యాత ఉజ్బెకిస్థాన్ టెన్నిస్ క్రీడకారులుగా గుర్తింపబడుతున్నారు. ఉజ్బెకిస్థాన్‌లో చెస్ క్రీడ కూడా ప్రజాదరణ కలిగి ఉంది. చెస్ క్రీడాకారుడు రుస్టం కసింద్ఝనొవ్ 2004లో ఎఫ్.ఐ.డి.ఇ వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. ఉజ్బెకిస్థాన్ అదనంగా జూడో, టీం హ్యాండ్ బాల్, బేస్ బాల్, టీక్వండో, బాస్కెట్ బాల్, ఫుత్సల్ క్రీడలను ఆదరిస్తుంది. బయటి లింకులు ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వము లైబ్రరీ ఆఫ్ కాంగ్రేస్ - ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ రాయబార కార్యాలయము ఉజ్బెకిస్తాన్ ఆన్‌లైన్ ఫోరం ఉజ్బెకిస్తాన్ - పర్యటనా సమాచారము , ఫోటోలు ఉజ్‌రిపోర్ట్.కాం తాష్కెంట్ ఊజ్ ఉజ్బెక్ గురించిన సమాచారము సీ.ఐ.ఏ - వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ - ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్‌లో పర్యాటకం మూలాలు వర్గం:మధ్య ఆసియా దేశాలు వర్గం:ఉజ్బెకిస్తాన్ వర్గం:ప్రపంచ దేశాలు వర్గం:ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ వర్గం:భూపరివేష్టిత దేశాలు
మంగళగిరి
https://te.wikipedia.org/wiki/మంగళగిరి
మంగళగిరి, గుంటూరు జిల్లాలోని విజయవాడ నగరoలో దక్షిణ దిక్కున ఉంది ఇది విజయవాడ నగరంలోని ప్రధాన ప్రాంతాలలో ఒకటి జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. దీని పరిపాలన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ నిర్వహిస్తుంది. చరిత్ర మంగళగిరి సా.శ. పూ.225 నాటికే ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యకటకం రాజధానిగా సా.శ. పూ.225 నుండి సా.శ.పూ. 225 వరకు పాలించిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. సా.శ.225 నుండి సా.శ.300 వరకు ఇక్ష్వాకులు పరిపాలించారు. ఆ తరువాత మంగళగిరి పల్లవుల ఏలుబడిలోకి వచ్చింది. పిమ్మట కంతేరు రాజధానిగా పాలించిన ఆనందగోత్రిజుల అధీనంలోకి వచ్చింది. సా.శ.420 నుండి సా.శ.620 వరకు విష్ణు కుండినులు మంగళగిరిని పరిపాలించారు. రెండవ మాధవ వర్మ విజయవాడ రాజధానిగా చేసుకొని మంగళగిరిని పరిపాలించాడు. సా.శ. 630 నుండి చాళుక్యుల ఏలుబడి సాగింది. 1182 నాటి పలనాటి యుద్ధం తరువాత మంగళగిరి కాకతీయుల పాలనలోకి వచ్చింది. 1323లో, ఢిల్లీ సుల్తానులు కాకతీయులను ఓడించాక మంగళగిరిపై సుల్తానుల పెత్తనం మొదలయింది. 1353లో, కొండవీడు రాజధానిగా రెడ్డి రాజులు పాలించారు. 1424లో, కొండవీడు పతనం చెందాక, మంగళగిరి గజపతులు|గజపతుల ఏలుబడిలోకి వచ్చింది. 1515లో శ్రీ కృష్ణదేవ రాయలు గజపతులను ఓడించిన తరువాత మంగళగిరి విజయనగర రాయల అధీనమయింది. విజయనగర రాజ్యంలోని 200 పట్టణాలలో మంగళగిరి ఒకటి. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంతో విజయనగర రాజ్య పతనం పరిపూర్ణమైన తరువాత, మంగళగిరికి గోల్కొండ కుతుబ్‌షాహీలు ప్రభువులయ్యారు. కుతుబ్‌షాహీలు కొండవీడు రాజ్యాన్ని 14 భాగాలుగా విభజించగా వాటిలో మంగళగిరి ఒకటి. మంగళగిరి విభాగంలో 33 గ్రామాలు ఉండేవి. 1750 నుండి 1758 వరకు ఫ్రెంచి పాలనలోను, 1758 నుండి 1788 వరకు నిజాం పాలనలో ఉంది. 1780లో మైసూరుకు హైదరాలీ రాజుగా ఉండేవాడు. అతని సేనాధిపతి నరసు మంగళగిరిని ఆక్రమించ ప్రయత్నించి, కుదరక, మంగళగిరినీ, చుట్టుపక్కల గ్రామాలైన కడవలకుదురు, వేటపాలెం, నిజాంపట్నం లను దోచుకొని పోయాడు. ఆ సమయంలో మంగళగిరి, నిజాము సోదరుడు బసాలత్‌ జంగు పాలనలో ఉంది. పిండారీ అనేది ఒక వ్యవస్థీకృత దోపిడీ ముఠా. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ లలోని ఒక తెగ ఇది. వీరు ముఠాలుగా ఏర్పడి, గుర్రాలపై వచ్చి, గ్రామాలపై మెరుపుదాడి చేసి నగలూ, ధాన్యం దోచుకుపోయే వారు. 1814లో దాదాపు 25,000 మంది పిండారీలు ఉండేవారు, 20,000 గుర్రాలుండేవి. 1816లో కేవలం పదకొండున్నర రోజుల్లో 339 గ్రామాలను వారు దోచుకున్నారు. 1816 మార్చిలో 2000 గుర్రాలపై వచ్చి గుంటూరు జిల్లాలో 40 గ్రామాలను దోచుకున్నారు. ఎంతో మందిని చంపి, ఊళ్ళను తగలబెట్టేసారు. స్త్రీలను చెరబట్టి, బానిసలుగా అమ్మేసారు. వారిలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. 1788, సెప్టెంబర్ 18న, హైదరాబాదు నవాబు అయిన నిజాము ఆలీ ఖాను గుంటూరును బ్రిటీషు వారికి ఇచ్చివేసాడు. బ్రిటీషు వారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడును ఈ ప్రాంతానికి జమీందారుగా నియమించారు. ఆయన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి గోపురం నిర్మింపజేసాడు. 1788 నుండి 1794 వరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి సర్క్యూట్‌ కమిటీ మంగళగిరిని పాలించింది. 1794లో సర్క్యూట్‌ కమిటీని రద్దుచేసి, 14 మండలాలతో గుంటూరు జిల్లాను ఏర్పాటు చేసారు. 1859లో, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాతో ఏకమై, మళ్ళీ 1904, జనవరి 10న విడివడి ప్రత్యేక జిల్లాగా రూపొందింది. అప్పటినుండి మంగళగిరి గుంటూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. సిఆర్డిఎ పరిధి గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. జనాభా సంవత్సరంజనాభా 1881 5,617 1893 6,426 1967 22,182 1969 29,000 1971 32,850 1991 58,289 1994 59,152 2001 63,24620111,07,197 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు. చరిత్ర ప్రాచీన కాలం నుండి, మంగళగిరి చేనేతకు, వైష్ణవ మతానికి ప్రసిద్ధి చెందింది. ఎందరో చారిత్రక ప్రముఖులు మంగళగిరిని సందర్శించారు. వారిలో అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని ప్రవచించిన రామానుజాచార్యులు, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు ప్రముఖులు. వల్లభాచార్యులు ఇక్కడి నుండే తన ప్రవచనాలను వినిపించాడు. చైతన్య మహాప్రభు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఆయన పాద ముద్రలు కొండ వద్ద కనిపిస్తాయి అంటారు. తాళ్ళపాక అన్నమాచార్యుని మనుమడు, తాళ్ళపాక చిన తిరుమలయ్య 1561లో రామానుజ సమాజానికి ఇక్కడ భూమి దానం చేసాడు. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఆయన మంత్రి తిమ్మరుసు మంగళగిరిని సందర్శించి, విజయస్థూపం నిర్మింపజేసాడు. కొండవీటి మంత్రి సిద్ధరాజు తిమ్మరాజు గుడిని అభివృద్ధి చేసి, దానికి భూదానం చేసాడు. అబ్బన కవి ఇక్కడి దేవాలయాన్ని అనేక సార్లు సందర్శించాడు. తన అనిరుద్ధ చరిత్రను నరసింహస్వామికి అంకితమిచ్చాడు. 1594లో గోల్కొండ సుల్తాను కుతుబ్‌ ఆలీ మంగళగిరిని సందర్శించాడు. వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జమీందారు హోదాలో అనేక పర్యాయాలు పర్యటించాడు. మహమ్మద్ ఆలీ కుతుబ్‌ షా మంగళగిరికి వచ్చినపుడు పన్ను భారాన్ని తగ్గించి, శాసన స్తంభాన్ని నిర్మించాడు. 1679, మార్చి 22న ఈస్ట్‌ ఇండియా కంపెనీ ముఖ్య అధికారి - స్ట్రైన్‌ షాం మాస్టర్‌ ఇక్కడి దేవాలయాన్ని దర్శించాడు. 1820, నవంబరు 20న తంజావూరు రాజు శరభోజి గుడిని దర్శించి, దక్షిణావర్త శంఖాన్ని బహూకరించాడు. 1962, ఫిబ్రవరి 16 న రామానుజ జియ్యరు (పెద జియ్యరు)స్వామి శ్రీ రామనామ కృతు స్థూపాన్ని స్థాపించాడు. 1982లో మదర్‌ తెరీసా డాన్‌ బోస్కో వికలాంగుల పాఠశాలను దర్శించింది. శాసనాలు లక్ష్మీనరసింహస్వామి గుడిమీద (కొండ కింది గుడి)గల రాతి చెక్కడాలకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1558లో సదాశివ రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించేటపుడు, అప్పటి కొండవీటి సామంతుడు తిమ్మరాజయ్యచే ఈ చెక్కడం లిఖించబడింది. అప్పట్లో రాజ్యంలోని వారసుల్లో తిరుమల రాజు ఒకడు. అతడు తిమ్మరాజయ్యకు మేనమామ. ఈ 143 పంక్తుల చెక్కడంలో తిమ్మరాజయ్య ఇచ్చిన దానాల వివరాలు ఉన్నాయి. అందుకే దీనిని ధర్మ శాసనం అని అంటారు. చెక్కడాలపై నున్న వివరాలు ఇలా ఉన్నాయి: పన్నులు తొలగించబడ్డాయి. విజయనగర సామంత రాజైన తిరుమలరాజు 28 గ్రామాలలోని 200 కుంచాల భూమిని (10 కుంచాలు = 1 ఎకరం) గుడికి దానమిచ్చాడు. నంబూరు, తాళ్ళూరు, నల్లపాడు, మేడికొండూరు, వీరంభొట్ల పాలెం (రాంభొట్ల వారి పాలెం?), తాడికొండ, పెదకొండూరు, గొడవర్త్గి, దుగ్గిరాల, ఉప్పలపాడు, వడ్లమాను, కుంచెన పల్లి, కొలనుకొండ, ఆత్మకూరు, లాం, గోరంట్ల, గోళ్ళమూడిపాడు, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో భూమిని దానం చేసాడు. వాణిజ్య మండలి ముఖ్యుడైన పాపిశెట్టిని మంగళగిరికి అధికారిగా నియమించారు. ఈ చెక్కడంపై ముగ్గురు రాజ వంశీకుల ప్రస్తావన ఉంది. వారు: సదాశివ రాయలు, తిరుమల రాజు, తిమ్మరాజు. వారు జరిపిన ఉత్సవాలు, గుడికి చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రసక్తి ఉంది. గుడి కొరకు 5 విధాల విగ్రహాలను, 10 రకాల ఉత్సవ రథాలను తయారు చేయించారు, కోనేటిని తవ్వించారు, పూల తోటలను పెంచారు. వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలనా కాలంలో చెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికిలోనయ్యాడు. పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. 1807-09లో నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడు.written to maila.devi sree id-mr.siri 9515 గాలిగోపురం మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది.రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది.మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలోనూతనంగా కొత్త గోపురం నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి...కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది.దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ఈ రాతి కట్టడానికి అన్నీ వైపులా పగుళ్లు వచ్చాయి.గోపుర పీఠభాగం త్రీడీ లేజర్ స్కానర్‌తో పునాదుల అంతర్భాగాన్ని స్కానింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు.మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.ఆంధ్రజ్యోతి గుంటూరు 23.9.2010 పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ మచిలీట్నం నుంచి మద్రాసు వెడుతూ 1679 మార్చి 22వ తేదిన మంగళగిరి చేరుకున్నాడు. ఆ రాత్రి ఆయన ఇక్కడే బసచేసి, ఈ మహత్తును గురించి విని, స్వయంగా కొండపైకి వెళ్లి పానకాలరాయుని సన్నిధిని పరిశీలనగా చూశారు. ఇదేదో గమ్మత్తుగా ఉందని, తనకైతే నమ్మశక్యంగా లేదన్నారు. మంగళగిరిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హేతువాదులు మంగళగిరి కొండ ఓ అగ్ని పర్వతమని, దీనిలో గంధకం ఉందని, ఎప్పటికైనా పేలిపోయే ప్రమాదముందని, ఆ విపత్తు నుంచి మంగళగిరిని రక్షించేందుకే, గంధకాన్ని ఉపశమింపజేసేందుకే, నిత్యం పానకాన్ని నివేదించాలని, పూర్వీకులు దేవుని పేరిట ఈ ఏర్పాటు చేశారని వాదిస్తుంటారు. శాసన స్తంభం ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసన స్తంభం వీధి అనే వీధి ఉంది. ఈ వీధిలో ఎనిమిది ముఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ కారణం చేత ఈ వీధికి ఆ పేరు వచ్చింది. ఈ శాసనంలో 46 పంక్తులు తెలుగులోను, 4 పర్షియన్ ‍లోను వ్రాసి ఉన్నాయి. 1565 నుండి మంగళగిరి గోల్కొండ కుతుబ్‌ షాహిల పాలనలో ఉండేది. 1593లో కుతుబ్‌ షాహి వృత్తి పన్ను బాగా పెంచేసాడు. అది కట్టలేని చేనేత కార్మికులు మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన సుల్తాను వాళ్ళను వెనక్కి రప్పించమని తన సేనాధిపతి ఖోజా ఆలీని ఆదేశించాడు. ఖోజా ఆలీ పుల్లరి తీసివేస్తున్నట్లు, ఇతర పన్నులను నాలుగు వాయిదాలలో కట్టవచ్చని ప్రకటించి అదే విషయాన్ని ఈ శాసనంపై వ్రాయించాడు. పెద్ద కోనేరు మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. 1558లో విజయనగర రాజుల అధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం ఉంది. 1832 నాటి కరువులో కోనేరు ఎండిపోయి, 9,840 తుపాకులు, 44 గుళ్ళు బయట పడ్డాయి. ఇవి పిండారీలకు చెందినవి. కోనేటి అడుగున బంగారు గుడి ఉందని ప్రజలు అనుకుంటారని 1883లో గార్డన్‌ మెకెంజీ కృష్ణా జిల్లా మాన్యువల్‌న్‌లో రాసాడు. 19వ శతాబ్దం|19వ శతాబ్దిలో మారెళ్ళ శీనయ్యదాసు కోనేటిలో ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి రెండెకరాల స్థలాన్ని దానమిచ్చాడు. శతాబ్దాలపాటు ప్రజలీ కోనేటి నీటితో దేవునికి అభిషేకం జరిపించారు. 2004లో కృష్ణా పుష్కరాల సందర్భంగా కోనేటికి ప్రహరీగోడ నిర్మించారు. జయ స్తంభం - కృష్ణదేవరాయల శాసనం పానకాలస్వామి దేవాలయం (కొండమీది గుడి) మెట్ల మొదట్లో ఈ శాసనం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. వాస్తవానికి ఇది రాయల మహామంత్రి సాళువ తిమ్మరుసుకు చెందినది. 1515 జూన్‌ 23 న శ్రీ కృష్ణదేవరాయలు కొండవీటిని జయించి ఈ శాసనం వ్రాయించాడు. రాయల విజయాన్ని సూచించే ఈ స్తంభాన్ని జయ స్తంభం అన్నారు. అమరావతి పాలకుడైన నాదెండ్ల తిమ్మయ్య ఇచ్చిన 19 దానశాసనాల ప్రసక్తికూడా దీనిపై ఉంది. దీనిలోని 198వ వరుస నుండి 208వ వరుస వరకు మూడు ముఖ్యమైన చారిత్రక సమాచారాలు ఉన్నాయి. 198. గతి మిధున క్రోధఖెలా మనోగ్నం ప 199. రా వారాంకాకారం తటపుట ఘటితొత్థ 200. లతాలం థటాకం కృత్వా నాదిండ్లయప్ప 201. భు రక్రుతతరాం విప్రసాధాథుకూరౌ 202. శాకాబ్దే గజరామ వార్ధిమహిగే ధాథ్రా 203. ఖ్యవర్షే ఘనం ప్రాసాదం నవహేమకుం 204. భకలిథం రమ్యం మహామంతపం స్రిమన్మం 205. గళ షైల నఢ హరయే నాదింద్లయప్ప ప్రభు 206. గ్రామం మంగళ శైలవామకమపి ప్రాధాత్‌ 207. నృసింహాయచ శాకబ్దే బ్రహ్మవహ్ని శృ 208. తిశశిగణితే చేశ్వరాఖ్యే వర్షే రేటూరి గ్రామ 1516లో ఒక మండపం తొమ్మిది కుంభాలను నిర్మించారు. ఇప్పటి 11 అంతస్తుల గాలి గోపురానికి అప్పట్లో మూడంతస్థులే ఉండేవి. ఆ మూడింటిని తిమ్మయ్య కట్టించాడని ప్రతీతి. శాసనం ప్రకారం నరసింహస్వామి గుడికి ఈ పట్టణాన్ని దానమిచ్చారు. దేవునికి దానమిచ్చిన ఈ భాగాలను దేవభూమి లేదా దేవస్థాన గ్రామంగా పిలిచేవారు కనుక విజయనగర రాజ్యంలో మంగళగిరి ఒక దేవభూమి. చిత్రమాలిక ప్రముఖులు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కైవారం బాలాంబ మూలాలు బయటి లింకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ పట్టణాలు వర్గం:గుంటూరు జిల్లా పట్టణాలు వర్గం:గుంటూరు జిల్లా పుణ్యక్షేత్రాలు వర్గం:శ్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
కొండపల్లి
https://te.wikipedia.org/wiki/కొండపల్లి
thumb|right|ఆంధ్ర సంస్కృతి జన జీవనం. ఆంధ్రుల కట్టు బొట్టు వేషదారణలను చూపిస్తున్న కొండపల్లి బొమ్మలు కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఈ కొండపల్లి ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన పట్టణం. కొండపల్లి విజయవాడ గుండా పోయే జాతీయ రహదారి 221 మీద విజయవాడకు 16 కి.మీ. దూరములో ఉంది. సమీప గ్రామాలు ఈ గ్రామానికి సమీపంలో ఈలప్రోలు,ఇబ్రహీంపట్నం, పైదూరుపాడు, గడ్డమనుగు, వెలగలేరు, జి.కొండూరు గ్రామాలు ఉన్నాయి. రవాణా సౌకర్యాలు హైదరాబాదు-విజయవాడ రైల్వే లైను పై ఈ గ్రామం వుంది. విద్యా సౌకర్యాలు జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న ఎం.సుభద్ర అను విద్యార్థిని 2013 నవంబరు 10న మహారాష్ట్రలోని పూణేలో జరుగనున్న జాతీయస్థాయి బాల్ బాడ్మింటను పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొనే జట్టుకి ఎన్నికైనది. శాంతినగర్ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల. కొండపల్లి బొమ్మలు ఈ గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు. తేలికైన పొనికి చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి.right|thumbఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం, ఎంత కళాదృష్టి, ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం, దృష్టి, ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం కొండపల్లి బొమ్మలు. వీటిని తేలికైన పొనికి అనే చెక్కతో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడితో కావలసిన ఆకారములో మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నంపై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలో ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలో తలపాగా పంచె కట్టుకొన్న పురుషుల సంఖ్య, చీరలు కట్టుకొన్న స్త్రీల సంఖ్య కల జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి. పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్ధ యాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ బొమ్మల తయారీలో ఉన్న శైలి, 17 వ శతాబ్దంలో రాజస్థాన్ రాష్ట్రములో బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు రాజస్థాన్ నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు. కొండపల్లిలో పూర్వం 150 వరకు కుమ్మరి కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15మంది మాత్రమే ఈ వృత్తిలో ఉన్నారు.center|800pxthumb|కొండపల్లి కోటలోని గద్దె కొండపల్లి కోట ముసునూరి కమ్మరాజుల కాలంలో ఈ కోట నిర్మితమైనది. ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని పరాయిపాలన నుంచి విముక్తి చేసిన తెలుఁగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభక్షింగా, శత్రు దుర్బేధ్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు. అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ కాలంలో పూర్తి అయింది. కాపయ ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు. అడపా, దాసరి, అట్లూరి అనే గృహనామాలు కలిగిన కమ్మరాజులు సుమారు 100 ఏళ్లు ఈ కోటని గజపతుల సామంతులుగా పాలించారు. ముసునూరి కమ్మ రాజులని కొండపల్లి కమ్మరాజులు అని వ్యవహరిస్తారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడ విరూపాక్ష దేవాలయం ఉంది. కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజమహల్ గోడలపై కళాఖండాలను తీర్చిదిద్దారు. దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, నర్తనశాల, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం -ఇవన్నీ ఒక కొండపైనే ఉన్నాయి. కొండపల్లి కోటను ప్రస్తుతము పునర్నిర్మిస్తున్నారు. క్రీశ1687 మధ్య కాలంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు, తరువాత గోల్కొండ నవాబులు అనంతరం నాజర్ జంగ్ పరిపాలించారు. సా.శ. 1766లో జనరల్ కాలియేడ్ కోటను ఆక్రమించి, కెప్టెన్ మాడ్గే ఆధ్వర్యంలో ఈ కోటకు కొన్ని మరమ్మతులు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. చివరగా కీశ 1767లో బ్రిటీష్ వారు కొండపల్లి కోటను తమ ఆధీనంలోకి తీసుకుని తమ సిపాయీలకు శిక్షణ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక సమస్యలతో క్రీశ1859లో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు. ఆ తరువాత దీనిని పట్టించుకున్నవారు లేరు. 1962 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక రక్షిత కట్టడంగా ప్రకటించారు.thumb|ప్రోలయ వేమారెడ్డి నిర్మించిన కొండపల్లి కోట శిథిలాలు కొండపల్లి ఖిల్లాకి వెళ్ళేందుకు జూపూడి మీదుగా కొండపైకి రోడ్డుమార్గం ఉంది. కొండపల్లి నుండి నడక మార్గం కూడా ఉంది. thumbnail|కొండపల్లి కోట -అభివృద్ధి చేసిన తరువాత గత 10 నెలల నుండి కొండపల్లి కోటకు మరమ్మత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా గజశాల తూర్పువైపు కోట గోడలను పటిష్ఠ పరచే పనులు జరుగుచుండగా, 2016,జనవరి-14వతేదీనాడు దేవతామూర్తుల విగ్రహాలు ఆలయ స్తంభాలు వెలుగు చూసినవి. ఈ విగ్రహాలను పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు, వీటిని ముసునూరి కమ్మరాజులు, శ్రీ కృష్ణదేవరాయల కాలంనాటివిగా గుర్తించారు. ఇతర దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శ్రీ చెన్నకేశవ రామాలయం:- ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. 2014, జూన్-18, బుధవారం నాడు, ఈ ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూడు ధ్వజస్తంభాలు, రెండు సింహద్వారాలు, ఒక మంటపం ఏర్పాటు చేసెదరు. ఈ పనులకు దేవాదాయ శాఖ రు. 16 లక్షలను మంజూరు చేసింది. ఆలయ యాజమాన్యం రు. ఆరులక్షలను అందించింది. [3] & [9] ఈ గ్రామంలో శివుడు గిరి విరేశ్వర విశ్వేశ్వర స్వామిగా కొలువై సేవలందుకొనుచున్నాడు. ఈ ఆలయంలో కార్తీకమాస మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా నెలరోజులూ నిర్వహించెదరు. ఈ ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కళ్యాణోత్సవం, 2015, ఫిబ్రవరి-18వ తేదీనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయానికి 17 ఎకరాల మాన్యంభూమి ఉంది. [4] & [10] శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక ఖిల్లా రహదారిపై, జనార్ధననగర్ లోఉంది. కొండపల్లి గ్రామ మార్కెట్ సెంటర్లో శిథిలావస్థకు చేరిన గంగానమ్మ ఆలయానికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పొలిమేరలలోని 13 గ్రామ దేవతల విగ్రహాలకు ప్రత్యేకపూజలు, శాంతిపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి హోమాన్ని జరిపించి, గ్రామ శాంతికోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అందంగా అలంకరించిన ఎడ్లబండ్లపై అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. [7] ఇక్కడికి దగ్గరలోని బి-కాలనీలో నెలకొన్న నూకాలమ్మ కొలువు తిరునాళ్ళు, 2014,మార్చి-30 న (ఉగాదికి ముందురోజున) ముగిసి2వి. ఈ సందర్భంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం నిర్వహించారు. అమృతఘడియలలో అమ్మవారికి పంచామృత ఫలాలతో విశేషస్వపన అభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకులు, వేదమంత్రాలతో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి మహా అఖండ భక్తిదీప కార్యక్రమం, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సహపంక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. [8] శ్రీ కోదండరామాలయం:-ఈ ఆలయ షష్టమ వార్షికోత్సవం, 2015,మార్చి-5వ తేదీ గురువారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణమహోత్న్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్దల ఆధ్వర్యంలో పూజాధికాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాటకార్యక్రమాలు మనోరంజితంగా ఉన్నాయి. [11] శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ కోదండరామాలయం:- శాంతినగర్ లో నూతనంగా నిర్మితమైన ఈ ఆలయంలో, విగ్రహావిష్కరణ కార్యక్రమాలు 2015,మార్చి-8వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమైనవి. 10వ తేదీ మంగళవారం నాడు, క్షీరాధివాస కార్యక్రమ, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సప్త కలశారాధన, నవకలశారాధన, సర్వకుండేషు శాంతిహోమం, క్షీరాధివాసం, ప్రధాన హోమాలు, విశేషార్చన ప్రవచనాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హోమ, పూజాధికాలలో పాల్గొన్నారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, వేదపఠనం, నిత్యహోమం, ఆదివాసప్రధానహోమం, మంత్రపుష్పం నిర్వహించారు. 11వ తేదీ బుధవారం నాడు, పుత్రకామేష్టి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు, ఈ సందర్భంగా స్వస్తివాచకం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. రాత్రి మంగళవాయిద్యాలతో స్వామివారల గ్రామోత్సవం నిర్వహించారు. కుంభపూజ,విశేషజీవకళాన్యాసం, పంచగవ్యాధివాసాన్ని చేసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 12వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు, ఉదయపు పూజలలో భాగంగా, స్వస్తి విష్వక్సేన ఆరాధన, త్రిషవణస్నానం, రత్నన్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ఆ పిమ్మట, అర్చకుల బృందం ఆధ్వర్యంలో హోమాలు, విగ్రహావిష్కరణ కార్యక్రమాలను, భక్తిశ్రద్ధలతో అంగరంగవైభవంగా నిర్వహించారు. అనంతరం కుంభదృష్టి,శాంతికర కళ్యాణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. [12] 2015,జూన్ నెలలో, కొండపల్లి కోట సమీపంలో, గ్రామస్థులు ఒక వెంకటేశ్వరస్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారు. అప్పటి నుండి గ్రామస్థులు ఆ విగ్రహానికి పూజలు నిర్వహించుచున్నారు. [14] శ్రీ లక్ష్మీ గణపతి, భద్రావతీ సమేత శ్రీ భావనాఋషి ఆలయం. గ్రామ పంచాయతీ కొండిశెట్టి మస్థాన్ రావు, ఈ గ్రామానికి సర్పంచిగా 1959 నుండి 1964 వరకు, 1970 నుండి 1982 వరకు మరియూ జూన్-1982 నుండి 1988 వరకు సర్పంచిగా పనిచేసారు. ఇతను 2015,మే-24 న కాలధర్మం చెందినారు. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వెనిగళ్ళ అమ్మాజీ, సర్పంచిగా ఎన్నికైంది. ప్రముఖులు ఆచంట వెంకటరత్నం నాయుడు: రంగస్థల కళాకారుడు. రమేష్ నాయుడు, సంగీత దర్శకులు ఇతర విశేషాలు కొండపల్లిలో పద్మసాలీలు ఎక్కువ. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ వృత్తి చేస్తున్నాయి. వీరిలో దామెర్ల ఇంటి పేరుగల వారు ఉన్న ప్రాంతం దామెర్ల వారి వీధిగా పేరు గాంచింది. వీరు నరసరావుపేట దగ్గర వున్న కుంకలగుంట గ్రామం నుండి వలస వచ్చారని తెలుస్తుంది. వీరు పూర్వీకులు దాసాంజనేయస్వామి విగ్రహాన్ని కొండపల్లి ఖిల్లా మీద నుండి తీసుకువచ్చి దామెర్ల వారి వీధిలో ప్రతిష్ఠించారు. దీనికి మరల దామెర్ల సత్యనారాయణ పున:ప్రతిష్ఠ చేసారు. గణాంకాలు 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 29868. ఇందులో పురుషుల సంఖ్య 15347, స్త్రీల సంఖ్య 14521, గ్రామంలో నివాసగృహాలు 6938 ఉన్నాయి. మూలాలు వెలుపలి లంకెలు కొండపల్లి బొమ్మలు గురించి వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు వర్గం:ఎన్టీఆర్ జిల్లా పర్యాటక ప్రదేశాలు వర్గం:విజయవాడ పర్యాటకం వర్గం:ఎన్టీఆర్ జిల్లా పట్టణాలు
ఉదయగిరి
https://te.wikipedia.org/wiki/ఉదయగిరి
ఉదయగిరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం లోని గ్రామం, ఇది మండల కేంద్రం. ఇది శాసనసభ నియోజకవర్గానికి కూడా కేంద్రం . ఇది సమీప పట్టణమైన బద్వేలు నుండి 56 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3814 ఇళ్లతో, 15870 జనాభాతో 4268 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8011, ఆడవారి సంఖ్య 7859. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2463 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 546. గ్రామ లొకేషన్ కోడ్ 591640. ఉదయగిరి నెల్లూరుకు వాయవ్యాన 96 కి.మీ దూరములో ఉంది. 14వ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించిన కోట శిథిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన సంజీవ కొండ వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. ఈ గిరిలో 365 దేవస్థానాలు 101 కోనేరులు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల, చోళుల కాలం నాటి దేవాలయాలు ఉన్నాయి. చరిత్ర చరిత్రలో ఉదయగిరి పట్టణ తొలి ప్రస్తావన 14వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఒడిషా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 1512లో ఉదయగిరి కృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశలనుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు. గజపతుల పాలనలోనూ ఆ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించాడు. మొత్తం పట్టణాన్ని, దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్ఠమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. అందులో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి. ఈరాజ్యమొకప్పుడు భోగభాగ్యములతో తులతూగుతూ ఉండేది. పండితులు, కవులు, గాయకులు పలువురు ఈరాజ్యానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు పూర్వవైభవమంతాపోయింది. పూర్వవైభవాన్ని సంరింపజేసే ఉదయగిరికొండ, ఉదయగిరిదుర్గము మాత్రమూ ఉన్నాయి. కలివి కర్రతో చక్కని చెంచాలూ, చిన్నవీ పెద్దవీ, నేడు ఈకడి శిల్పులు తయారుచేస్తున్నారు. చేతికర్రలు, పాంకోళ్ళు, కవ్వాలు, గరిటెలు-అన్నీ కర్రవే ఇప్పటికీ తయారు చేస్తున్నారు. విజయనగర సామ్రాజ్యము స్థాపించినప్పటినుంచీ అనగా 14వశతాబ్దము మొదటిభాగంనుంచీ ఉదయగిరి రాజప్రతినిధి ఉండే స్థలముగా ఏర్పాటైనది. ఉదయగిరి రాజ్యములో నేటి నెల్లూరు కడప జిల్లాలు చేరాయి. ఉదయగిరి రాజ్యమునకే ములికనాడు అని పేరు. అనాటి కవులూ, వారు వ్రాసిన కావ్యాలూ పెక్కు ఉన్నాయి. సమిరకుమారవిజయం రచించిన పుష్పగిరి తిమ్మన్న ఆత్మకూరుతాలూకావాడు. విక్రమార్క చరిత్రం వ్రాసిన వెన్నలకంటి సిద్ధనకు జక్కన కవి కృతి ఇచ్చెను. ఈ సిద్ధనమంత్రి ఉదయగిరి రాజ్యమున మత్రిగా ఉండెను. ఉదయగిరి దుర్గమునేలే బసవరాజు మంత్రియైన గంగన్నకు దుగ్గనకవి తాను రచించిన నాసికేతూపాఖ్యానము కృతి ఇచ్చెను. ఈకాలమున ఉదయగిరి దుర్గము విజయనగరరాజుల చేతులలో నుండి గజపతుల చేతులలో పడెను. బసవరాజే గజపతుల తరుపున ఉదయగిరి దుర్గమును స్వాధీనము చేసుకొని తన యేలుబడిలో నుంచుకొనెనట. ప్రబోధచంద్రోదయమును రచించిన మల్లనసింగనలు పై గంగన్నకే తన కావ్యమును కృతి ఇచ్చిరి. దూబగుంట నారాయణకవి తాను రచించిన పంచతంత్రమును పై బసవరాజుకు అంకితమిచ్చెను. ఉదయగిరి రాజ్యము సంగీతవిద్యలో కూడా పేరు తెచ్చుకొన్నది. అచ్యుతరాయ రామరాయల కాలములలో ఉదయగిరి రాజ్యమునకు రాజప్రతినిధగా రామామాత్యుడుండెను. ఇతడు సర్వమేళకళానిధి అనే ప్రసిద్ధ సంగీత గ్రంథంను రచించెను. దానిని రామరాయలకు అంకితమిచ్చెను. ఇతనికి వాగ్గేయకారతోడరుమల్లు అను బిరుదు ఉంది. అక్బరు కాలమున ఆర్థికమంత్రిగా నుండిన తోడరుమల్లు చూపిన ప్రతిభవంటి ప్రతిభను ఇతడు మంత్రిగానుండి చూపుటచేత, సర్వకళానిధి రచించుటవల్లనూ ఈబిరుదు ఇతనికి ఇచ్చిరట.ఉదయగిరి గ్రామమునకు కొండాయపాలెం అని పేరుకూడ. ఉదయగిరి కొండమీద ఒక ఆలయమున్నది. దానికి వల్లభరాయ దేవాలయమని పేరు. వల్లభరాయడను మంత్రి దానిని నిర్మించెనట. దేవాలయము పక్కన చక్కని కోనేరు ఉంది. ఈ వల్లభరాయుడు శ్రీకృష్ణదేవ రాయల ప్రతినిధి యట. క్రీదాభిరామం న శ్రీనాధుడు వల్లభరాయని పేర వ్రాసినట్లున్నూ, ఆ వల్లభరాయడు ఉదయగిరిసీమలోని మోపూరు గ్రామమున వెలసిన భైరవస్వామి భక్తుడనిన్నీ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసియున్నారు. ఈ ఇద్దరు వల్లభరాయలు ఒకరేనని పరిశోధకులు చెప్పుదురు. రావూరుతాలూకా మొలకలపుండ్లకు కొద్ది దూరంలో ఒక కొండ ఉంది. దానిని సిద్ధులయ్యకొండ అంటారు. దానిపై గుహాలయమొకటి ఉంది. ఆలయములో మూడు ప్రతిమలున్నవి. ఒకప్రతిమ నవకోటిసిద్ధుల పేరను, రెండవ ప్రతిమ నవనాధసిద్ధుల పేరను, మూడవది సారంగధరుని పేరను ప్రసిద్ధిచెంది యున్నవి. పై సిద్ధులు కొండపై తపస్సు చేసుకొనుచుండగా సారంగధరుడు వారిని దర్సించుకోవడానికి పోయినాడట. ఈ సారంగధరుడొక సిద్ధుడు. గ్రామ నామ వివరణ ఉదయగిరి అనే గ్రామనామం ఉదయ అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. ఉదయ అన్న పదం సాదృశ్యబోధకసూచి విద్యా సౌకర్యాలు ప్రభుత్వ ఆర్ట్స్/సైన్స్ డిగ్రీ కళాశాల ఏ.ఆర్.ఆర్.ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంకా గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నెల్లూరులో ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం ఉదయగిరిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో9 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. 10 మందుల దుకాణాలు ఉన్నాయి. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు ఉదయగిరిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం ఉదయగిరిలో భూ వినియోగం కింది విధంగా ఉంది: అడవి: 1688 హెక్టార్లు వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 578 హెక్టార్లు శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 12 హెక్టార్లు తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 50 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 1633 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 25 హెక్టార్లు బంజరు భూమి: 37 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 245 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 73 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 234 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు ఉదయగిరిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 142 హెక్టార్లు చెరువులు: 92 హెక్టార్లు ఉత్పత్తి ఉదయగిరిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి, సజ్జలు ప్రముఖులు సింగీతం శ్రీనివాసరావు దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శ్రీ కృష్ణ, ఆంజనేయస్వామి దేవాలయము. ఉదయగిరి గ్రామ విశేషాలు ఉదయగిరి ఐ.సి.డి.ఎస్.ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ ప్రాజెక్టులో ప్రతి సంవత్సరం లగానే, 2020-ఆగస్టు మొదటివారంలో నిర్వహించిన "తల్లిపాల వారోత్సవాల నిర్వహణ" కార్యక్రమంపై తీసిన డాక్యుమెంటరీ చిత్రాన్ని "బి.పి.ఎస్.ఐ" సంస్థకు పంపించగా, ఆ సంస్థ వారు, ఊదయగిరి కేంద్రాన్ని ఊత్తమ ఫీడింగ్ కేంద్రంగా గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 3 కేద్రాలను ఉత్తమ కేంద్రాలుగా గుర్తించగా, వాటిలో ఉదయగిరి కేంద్రం ఒకటి. [1] మూలాలు వెలుపలి లింకులు
చినగంజాం
https://te.wikipedia.org/wiki/చినగంజాం
చినగంజాం ప్రకాశం జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన చీరాల నుండి 27 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5104 ఇళ్లతో, 19060 జనాభాతో 4308 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9479, ఆడవారి సంఖ్య 9581. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2281 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1360. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591029.పిన్ కోడ్: 523135. గణాంకాలు 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 18,358. ఇందులో పురుషుల సంఖ్య 9,099, మహిళల సంఖ్య 9,259, గ్రామంలో నివాస గృహాలు 4,356 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4,308 హెక్టారులు. గ్రామ చరిత్ర ఈ గ్రామ సమీపంలోని కొమ్మమూరు కాలువ వద్ద అనేక బౌద్ధ ఆనవాళ్ళు కనబడినవి. ఇటీవల రెండు ఎకరాలస్థలంలో త్రవ్వకాలు కొనసాగినవి. బొద్ధభిక్షువులకోసం పలకరాళ్ళతో నిర్మించిన విహారాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మూడు చిన్న చిన్న స్థూపాలు వెలికి తీసినారు. వీటి నిర్మాణానికి పూర్తిగా ఇటుకలే వాడినారు. బుద్ధ విగ్రహం మట్టికుండలు, పాళీభాషలో వ్రాసిన శాసనాలు లభించినవి. ఇంకా త్రవ్వకాలు జరపవలసి ఉంది. గ్రామం పేరు వెనుక చరిత్ర దీనికి గంధపురి అనే పేరు కూడా ఉంది. గ్రామ భౌగోళికం చీరాల - ఒంగోలు రాష్ట్ర రహదారిలోని ఈ సముద్ర తీర గ్రామం, ముఖ్యంగా ఉప్పు తయారీకి ప్రసిద్ధి. గుండ్లకమ్మ నది ఇక్కడే బంగాళా ఖాతంలో కలుస్తుంది. చారిత్రకమైన మోటుపల్లె రేవు ఇక్కడికి 12 కి.మీ.ల దూరంలో ఉంది. సమీప గ్రామాలు కడవకుదురు 3.7 కి.మీ, పెదగంజాం 5.2 కి.మీ, సంతరావూరు 7.1 కి.మీ, గొనసపూడి 7.5 కి.మీ, పుల్లరిపాలెం 7.5 కి.మీ. విద్యా సౌకర్యాలు గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 16, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల వేటపాలెంలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ వేటపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం వేటపాలెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం చినగంజాంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. పారిశుధ్యం గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు చినగంజాంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండిప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం చినగంజాంలో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 2018 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 93 హెక్టార్లు తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 298 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 188 హెక్టార్లు బంజరు భూమి: 405 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 1306 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 1307 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 404 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు చినగంజాంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 312 హెక్టార్లు బావులు/బోరు బావులు: 92 హెక్టార్లు ఉత్పత్తి చినగంజాంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి, శనగ మౌలిక వసతులు బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ళ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరకు సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం, కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. మూలాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు
మోటుపల్లి
https://te.wikipedia.org/wiki/మోటుపల్లి
మోటుపల్లి ప్రకాశం జిల్లా, చినగంజాం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చినగంజాం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చీరాల నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1068 ఇళ్లతో, 3567 జనాభాతో 1602 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1820, ఆడవారి సంఖ్య 1747. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 165. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591028.పిన్ కోడ్: 523181. గ్రామ చరిత్ర 1298లో ప్రసిద్ధ యాత్రికుడు మార్కోపోలో ఇక్కడే తీరాన్ని చేరాడని భావిస్తారు. చరిత్రకారులకు, పరిశోధకులకు ఈ ప్రదేశము చాలా ముఖ్యమైనది. ప్రాచీన ఓడ రేవైన మోటుపల్లి 1వ శతాబ్దము నుండి అనేక రాజ వంశాల పాలనలో విరాజిల్లినది. పూర్వము బౌద్ధ క్షేత్రమైన మోటుపల్లిలో అనేక బౌద్ధ స్థూపాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. మోటుపల్లిలో ఒక ప్రాచీన రామాలయం ఉంది. కాకతీయ గణపతి దేవుడు తన పాలనాకాలములో కట్టించిన ఏకైక దేవాలయము మోటుపల్లిలో 1249 ప్రాంతంలో కట్టించిన ఆలయమే.Precolonial India in Practice: Society, Region, and Identity in Medieval Andhra By Cynthia Talbot పేజీ.131 మార్కోపోలో సందర్శనా కాలములో మోటుపల్లిని ఒక తెలివైన రాణి పాలించేదని, ఆమె తన ప్రజలను న్యాయముగా సమానముగా పాలించేదని పేర్కొన్నాడు. ఆమె రాజ్యములోని ప్రజలు బియ్యము, మాంసము, పాలు, పండ్లు, చేపలు తిని జీవించేవారని రాసాడు. ఇతరత్రా చెప్పుకోదగిన విషయాలలో రాజ్యంలోని వజ్రాల ఉత్పాదన గురించి, రాజులకు తగినటువంటి సున్నితమైన వస్త్రాల గురించి, పుష్కలమైన మృగసంపద, భారీ గొర్రెలను గురించిన సంగతులు రాసాడు. ఈ గ్రామానికి తూర్పుదిశలో అరమైలు విస్తీర్ణంలో బౌద్ధమత స్థల ఆనవాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. 200 అడుగుల విస్తీర్ణం, 12 అడుగుల ఎత్తు ఉన్న దీనిని కాసులదిబ్బ అనిపిలుస్తున్నారు. ఇక్కడ నీటిగుంతలకోసం త్రవ్వడంతో ఇత్తడిసామాగ్రి, స్థూపానికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించినవి. ఒకప్పుడు ఇక్కడ మహా వెలుగు వెలిగిన బౌద్ధస్థూపం ఉన్నట్లు, తరువాత కాలగర్భంలో కలిసిపోయి, ఇక్కడ వీరభద్రస్వామి, కోదండరామస్వామి ఆలయాల నిర్మాణం జరిగినట్లు తెలియుచున్నది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ ఓడరేవుగా దాదాపు 2000 సంవత్సరాలు విరాజిల్లిన ఘన చరిత్ర మోటుపల్లి కే దక్కింది. సా.శ. పూర్వం 260 వ సంవత్సరం నుండి సా.శ. 15వ శతాబ్దం వరకు మోటుపల్లి ఓడరేవు విదేశీ వర్తకంతో ప్రాముఖ్యత సంతరించుకున్నట్లు పురాతన చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మోటుపల్లి పేరు చెవిన పడగానే కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి పాలించిన రోజులు ఇప్పటి తరం ప్రజానీకానికి గుర్తుకు వస్తాయి. కానీ అంతకు పూర్వం సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం నుండే మోటుపల్లి ఓడరేవు ద్వారా విదేశీ వర్తకం జరిగిందనేది అందరికీ తెలియదు. ఇక్ష్వాకులు, బృహత్వాలయనులు, సాలంకాయనులు, విష్ణుకుండినులు, ఆంధ్ర శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, కొండవీటి రాజులు, విజయ నగర రాజులు మోటుపల్లి ఓడరేవు ప్రధాన కేంద్రంగా చేసుకొని విదేశీ వాణిజ్యం చేశారు. ఆ రాజుల పాలన అంతరించడంతో ఓడరేవుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న మోటుపల్లి పట్టణానికి ఆలనా పాలనా కరువై ప్రకృతి వైపరీత్యాలకు లోనై కాలగర్భంలో కలిసిపోయి ఉంటుందని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆనాడు నిర్మించిన వీరభద్ర స్వామి దేవాలయం, కోదండ రామ స్వామి దేవాలయం శిథిలావస్థలో నేటి తరానికి నాటి చారిత్రక ఆధారాలుగా మిగిలాయి. మోటుపల్లి ఇప్పుడు బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం అయినా వేటపాలెం మండలం లోని పందిళ్లపల్లి గ్రామం నుండి మాత్రమే మోటుపల్లికి రోడ్డు వసతి ఉంది. మోటుపల్లి సహజసిద్ధమైన ఓడరేవుగా ఆనాటి విదేశీ రాయబారులు పేర్కొన్నారు నౌకలు సముద్రం ఒడ్డుకు చేరేందుకు తగిన లోతు, అంతకు మించిన ప్రశాంతత మోటుపల్లి ఓడరేవులో ఉండేది. శ్రీ గంధం, పచ్చ కర్పూరం, చీనీ కర్పూరం, రత్నాలు, ముత్యాలు, రవసెల్లాలు, పన్నీరు, జువ్వాజి, దంతములు, కర్పూర తైలం, రాగి, సీసం, తగరం, పట్టు, పగడం, పత్తి, నార, అబ్రకం, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, సన్నని వస్త్రాలు, సమస్త ధాన్యాలు, ఏనుగులు మోటుపల్లి ఓడరేవు నుండి విదేశాలకు ఎగుమతి జరుగుతుండేవి. అప్పటి లోనే అరేబియా, ఈజిప్ట్, ఇటలీ, గ్రీసు, జర్మనీ, రొమేనియా, పారశీకం, జపాన్, చీనా, బర్మా, సుమిత్ర, జావా, బోర్నియో, సింహాళం దేశాలకు సముద్రయాన వాణిజ్య సంబంధాలు మోటుపల్లి ఓడరేవుతో ముడిపడి ఉన్నాయి. జామునకు ఏడు వేల బస్తాల వజ్రవైడూర్యాలు వారానికి కోటి వరహాల విలువ కలిగిన వస్త్రాలు నెలకు లక్ష సంచుల ఔషధాలు, జామునకుకు ఏడు లక్షల సంచుల అపరాలు మోటుపల్లి ఓడరేవు నుండి ఎగుమతి జరుగుతుండేది అని చరిత్ర చెబుతోంది . చంద్రగుప్తు మౌర్యుని కాలంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ క్రీస్తుపూర్వం 305వ సంవత్సరంలో భారతదేశం వచ్చాడు. పట్టణ వీధుల్లో రేగిపండ్లు మాదిరిగా రత్నాలు ముత్యాలు బంగారు ఆభరణాలు రాసులుగా పోసి అమ్ముతున్నట్లు మోటుపల్లి ఓడరేవు ప్రాముఖ్యత మెగస్తనీసు ప్రస్తావించాడు. క్రీస్తుశకం 405-411 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు పాహియాన్ నౌకాయానం ప్రాముఖ్యత తెలుపుతూ గంగానది తీరంలోని తామ్రలిప్తి నుండి సముద్రము తూర్పు తీరంగా విదేశీ వర్తకం దక్షిణ భారతదేశంలో మోటుపల్లి ఓడరేవు నుండి ప్రశస్తంగా జరుగుతున్నట్లు పేర్కొన్నాడు. 13వ శతాబ్దంలో కాకతీయ రాణి రుద్రమ దేవి పాలనా కాలంలో విచ్చేసిన ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తూర్పు పశ్చిమ దేశాలకు మోటుపల్లి ఓడరేవు నుండి వజ్రాలు నాణ్యమైన వస్త్రాలు ఎగుమతి అవుతున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాక ప్రసిద్ధ దేవాలయాలు కలిగిన పట్టణం అయినందున మోటుపల్లి ప్రముఖ యాత్రా కేంద్రంగా పేరెన్నికగన్న ట్లు తెలిపాడు. అప్పట్లో విదేశీ వర్తకులు మోటుపల్లి ఓడరేవు సముద్రతీరానికి సమీపంలో ఉన్న వీరభద్ర స్వామిని దర్శించుకుని దేవాలయ మండపంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. అందువలననే కాకతీయ గణపతి దేవుడు వీరభద్ర స్వామి దేవాలయం మండపంలో అభయ శాసనాలు చెక్కించడం జరిగింది. ముకులపురం, మోహనపురం, దేశీయుయాకకొండ, ముసలాపురము, వేలా నగరము, కరపట్టణము, మోహనగిరి పట్టణం, ముటఫీలి అనే పేర్లు కాలక్రమంలో రూపాంతరం చెందుతూ చివరకు మోటుపల్లి పేరు వాడుకలో ఉంది. క్రీస్తుశకం 106- 130 సంవత్సరాలలో గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి హయాంలో బౌద్ధమత వ్యాప్తి జరిగింది. ఆ సమయంలో బౌద్ధ సన్యాసులు మోటుపల్లి ఓడరేవు నుండి ఇతర దేశాలకు బౌద్ధమత వ్యాప్తికై ప్రయాణం చేసినట్లు ఆనాటి శిలాశాసనాలు వెల్లడిస్తున్నాయి. మోటుపల్లి ఓడరేవు సమీపంలోని కోదండరామ స్వామి దేవాలయంలో అగస్త్య మహాముని సీత రామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు కథ ప్రచారంలో ఉంది. దానికి ముందుగా మల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయాలను ఏడెనిమిది శతాబ్ద కాలంలో నిర్మించి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ దేవాలయాలలోని అంత్రాలయాల పైభాగంలో, మండపాలలో మహాబలిపురం తరహా శిల్ప కళ కనిపిస్తుంది. దేవాలయాల నిర్మాణం నల్ల రాతి స్తంభాలు గోడలకు నల్లరాయి వినియోగించారు. ఆలయ నిర్మాణంలో కేవలం ఒక రాయి పై మరొక రాయి పేర్చడం కనిపిస్తుంది. పల్లవులు 7, 8 శతాబ్ద కాలంలో సముద్ర వర్తకాన్ని ప్రోత్సహించిన దాఖలాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో మోటుపల్లి ఓడరేవుకు సమీపములో మల్లేశ్వర స్వామి, కోదండరామ స్వామి దేవాలయాలు నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మల్లేశ్వర స్వామి దేవాలయం ఉత్తరముఖంగాను, కోదండరామ స్వామి దేవాలయం దక్షిణ ముఖంగాను ఉన్నాయి. ఇది దేవాలయ నిర్మాణం లోని అరుదైన విషయం. అయితే ఈ రెండు దేవాలయాల పై గోపురాలు ఆలయ నిర్మాణానికి భిన్నంగా ఇటుక రాయి సున్నంతో కట్టి ఉన్నాయి. గోపురాల పై ఉన్న శిల్పాలు చోళుల సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్న ట్లు చెబుతున్నారు. ఆలయాల ఆవరణలోని బావులు కూడా లోపల నల్ల కొండ రాయి పలకలతో పైభాగము ఇటుక రాయి, సున్నము కట్టుబడితో ఉన్నాయి. కోదండరామ స్వామి దేవాలయ ఆవరణలో ఆ కాలంలో అతి తక్కువ లోతులో తవ్వి ఉన్న బావి లోని నీరు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఆ నీళ్ళు ఎంతో తియ్యగా ఉంటాయి. 1060 సంవత్సరాల ప్రాంతంలో ఉదయనుడు అనే మహారాజు కనపర్తిలో 101 శివలింగాలను ప్రతిష్ఠించి పెదగంజాంలో భావనారాయణ స్వామి దేవాలయం నిర్మించాడు. ఆ తరువాత మోటుపల్లి ఓడరేవు పై ఆసక్తి కనబరిచి ఈ పట్టణము నిర్మించి మోహనాపురము అని పేరు పెట్టాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న రెండు దేవాలయాలకు విశాలమైన మండపాలను నిర్మించాడు. ఆ తర్వాత ఆప్రాంతములో 95 శివలింగాలు ప్రతిష్ఠించి నూట ఒక్క బావులు తవ్వించాడు. ఆరు విష్ణు ఆలయాలు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతము అవి ఎక్కడా కనిపించడం లేదు. 13వ శతాబ్దంలో మోటుపల్లి ఓడరేవు ద్వారా వర్తకము జరిపి వారిని సముద్రపు దొంగల బారి నుండి రక్షించేందుకు కాకతీయ గణపతి దేవుడు తగిన కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నాడు. అందులో భాగంగా మోటుపల్లి వీరభద్ర స్వామి దేవాలయంలో తెలుగు సంస్కృత భాషల్లో అభయశాసనాలు చెక్కించాడు. అదేవిధంగా 14వ శతాబ్దంలో తమిళంలో కొండవీటి రాజు అనపోతారెడ్డి అభయ శాసనం చెక్కించాడు. కాకతీయ గణపతి దేవుని కుమార్తెలు రాణి రుద్రమదేవి, గణపమాంబ హయాంలో తూర్పు పశ్చిమ దేశాలతో మోటుపల్లి ఓడరేవు నుండి వర్తకము ఎంతో గొప్పగా జరిగినట్లు మార్కోపోలో స్పష్టం చేశాడు. దక్షిణ ప్రాంత పర్యటన సందర్భంగా మోటుపల్లి వీరభద్ర స్వామిని రాణి రుద్రమదేవి గణపమాంబలు పూజిస్తూ ఉండేవారని, ప్రజలను కన్న బిడ్డల్లా పాలించే వారని మార్కోపోలో పేర్కొన్నాడు. ఆ తరువాత 1362-80 సంవత్సరాల మధ్యకాలంలో అనవేమారెడ్డి తన తండ్రి అనపోతారెడ్డి పాలనా పద్ధతులను అనుసరించి మోటుపల్లి నుండి సముద్ర వర్తకాన్ని అభివృద్ధి పరిచేందుకు అనేక రాయితీలు ప్రకటించాడు విజయనగర సామ్రాజ్య అధినేత రెండవ హరిహర రాయలు మోటుపల్లి ఓడరేవును స్వాధీనపరచుకొని దేవరాయ వైద్యులకు పాలనా బాధ్యతలు అప్పగించాడు. సముద్ర వర్తకము సరళంగా సాగిపోయేందుకు 1390 సంవత్సరంలో ధర్మ శాసనం జారీ చేయడం జరిగింది. కర్ణాటక నుండి జరగవలసిన ఎగుమతులను మోటుపల్లి ఓడరేవు ద్వారా జరిగే విధంగా చేశారు. రెండవ హరిహర రాయలు మరణానంతరం ప్రోలయ వేమారెడ్డి మోటుపల్లి ఓడరేవు తిరిగి స్వాధీనం చేసుకొన్నాడు. ఆయన పాలనలో 1402-20 వరకు మోటుపల్లి ఓడరేవుకు పూర్వ వైభవం లభించినట్లు హరవిలాసం గ్రంథంలో శ్రీనాథుడు పొందుపరిచాడు. వేమారెడ్డి మరణానంతరం కొండవీడు సామ్రాజ్యం పతనమైంది. దీంతో 15వ శతాబ్దం నాటికి మోటుపల్లి ఓడరేవు ప్రాధాన్యత సన్నగిల్లింది. గోల్కొండ పాలకులైన బహమనీ సుల్తానులు మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధిని ప్రోత్సహించారు. ఈ విధంగా రెండు వేల సంవత్సరాల పాటు ప్రసిద్ధ ఓడరేవుగా విరాజిల్లిన మోటుపల్లిలో ఆ రూపు రేఖలు కనుమరుగయ్యాయి. కొన్నాళ్ళకు ప్లేగు వ్యాధి సంభవించి ప్రజలు అనేక మంది అసువులు బాశారు . దీంతో మోటుపల్లి పట్టణంలోని ప్రజలు సమీప ప్రాంతాలకు తరలి వెళ్ళారు. ఆనాటి ప్రసిద్ధ పట్టణం పలు దేవాలయాలు క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయాయి. కాగా సముద్ర తీరానికి సమీపములో ఇసుక మేట వేసిన తిన్నెల నడుమ కోదండ రామ స్వామి దేవాలయం, వీరభద్ర స్వామి దేవాలయం శిథిలావస్థలో గత చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలాయి. గుప్త నిధులు దొంగిలించే ప్రయత్నంలో 1960 సంవత్సరం నుండి ఒక దశాబ్ద కాలంలో పలు పరిణామాలు చోటు చేసుకొని చివరకు దేవుడు లేని కోవెలలుగా మిగిలాయి. 1960వ సంవత్సరంలో వీరభద్ర స్వామి ఆభరణాలు దోపిడీకి గురి అయ్యాయి. 1963వ సంవత్సరంలో వీరభద్ర స్వామి దేవాలయం లోని నాలుగు పంచలోహ ఉత్సవ విగ్రహాలు దొంగల పాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు, పోయిన వీరభద్ర స్వామి ఆభరణాలు, నాలుగు ఉత్సవ విగ్రహాలు కొంతకాలానికి తిరిగి దొరికాయి. కానీ 1971 వ సంవత్సరములో మరలా దొంగలపాలు అయ్యాయి. 1971 సంవత్సరం జూన్ 22వ తేదీ రాత్రి వీరభద్ర స్వామి మూలవిరాట్టును పీఠముతో పాటు లేవనెత్తి పక్కన పెట్టి ప్రతిష్ఠ సమయంలో శాస్త్రయుక్తంగా ఉంచే వజ్రవైడూర్యాలను దొంగిలించారు. పీఠం కింద ఉన్న నేల పాటి మట్టి అయినందున వజ్రాలతో కూడిన బిందెను తొలగించినట్లు ఆ సంఘటన చూసిన వారు చెబుతున్నారు. ఆ సందర్భంలో వీరభద్ర స్వామి విగ్రహం చాతి పక్క భాగం పగిలింది. ఆ వీరభద్రుని మూలవిరాట్టు విగ్రహాన్ని వేళ్ళ గోటితో కొడితే ఖంగున శబ్దం రావడం విశేషం. ఆ తరువాత వీరభద్ర స్వామి దేవాలయం లోను, కోదండరామ స్వామి దేవాలయంలో అనేక పర్యాయములు అక్కడక్కడా తవ్వకాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. 1972 వ సంవత్సరంలో కలెక్టర్ కత్తి చంద్రయ్య వీరభద్ర స్వామి దేవాలయానికి సమీపంలోలో 80 మంది మత్స్యకారులకు నివాస వసతి కల్పించి ఆ గ్రామానికి రుద్రమాంబ పురం అని పేరు పెట్టారు ఆ గ్రామానికి చెందిన కఠారి వీరభద్రయ్య కూరగాయలు సాగు చేసుకునేందుకు నీటి వసతి కై పొలంలో దొరువు తవ్వుతున్న సమయంలో 1973 వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన 11 పంచలోహ దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. అందులో మూడున్నర అడుగుల ఎత్తు ఉన్న నటరాజ విగ్రహంతో పాటు పార్వతి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, భద్రకాళి, ఆళ్వారులు 2, మరో నాలుగింటిలో రెండు పురుష, 2 స్త్రీ మూర్తులు విగ్రహాలు ఉన్నాయి. వీటిని మొదట చీరాల సబ్ ట్రెజరీ కార్యాలయానికి తరలించి తదుపరి హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో ఉంచారు. అదేవిధంగా వీరభద్ర స్వామి విగ్రహాన్ని విజయవాడలోని విక్టోరియా మ్యూజియంలో భద్రపరిచారు. ఆ ప్రాంతంలో బయటపడిన దేవతామూర్తుల రాతి విగ్రహాలు కొన్నింటిని కనపర్తి మ్యూజియంలో భద్రపరిచారు. కోదండ రామ స్వామి దేవాలయం లోని సీతారామ లక్ష్మణ పంచలోహ ఉత్సవ విగ్రహాలను ఇప్పటి మోటుపల్లిలో కొత్తగా నిర్మించిన కోదండరామ స్వామి దేవాలయంలో కొలువుదీర్చారు. పురావస్తు శాఖ వారు 1973 సంవత్సరంలో బయటపడిన పంచలోహ విగ్రహాలను చోళ రాజుల కాలం నాటివిగా గుర్తించారు. 1974 సంవత్సరంలో మోటుపల్లి లోని కాసుల దిబ్బలో జరిగిన తవ్వకాలలో 22 ఇన్ టూ 5.5 మీటర్లు కస్టమ్స్ హాల్ పునాది, 11 12 శతాబ్దాల నాటి చైనా నాణెములు, రాజరాజు, రాజేంద్ర చోళ, గయాజుద్దిన్ తుగ్లక్ కాలం నాటి నాణేలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ వారు నిషేధాజ్ఞలు జారీ చేస్తూ చేసిన ప్రకటనల వల్ల ప్రయోజనమేమీ చేకూరలేదు. వీరభద్ర స్వామి దేవాలయాన్ని సంరక్షించేందుకు కాపలా ఉంచిన ఉద్యోగి కూడా ఇటీవల ఆ ప్రాంతంలో కనిపించడం లేదు. పురాతన కట్టడాలు, శిల్ప సంపదతో ప్రాధాన్యత సంపాదించుకున్న మోటుపల్లిని అభివృద్ధి పరిచి ప్రముఖ యాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సముద్రతీరంలో అతిథి గృహం, బస్ షెల్టర్ నిర్మించి సక్రమమైన రోడ్డు వసతి కల్పిస్తే మోటుపల్లిని సందర్శించేందుకు యాత్రికుల రద్దీ పెరుగుతుందని ఆ ప్రాంత వాసులు ఆశపడుతున్నారు. కాలగర్భంలో మాటు మణిగిన మోటుపల్లి ఏనాటికైనా మహా పట్టణంగా విరాజిల్లే రీతిగా కాలం అనుకూలిస్తుందని ఆశిద్దాం. thumb thumb నటరాజ ఛోళుల కాలంనాటి నటరాజుని కంచు విగ్రహం. ఆఘమశాస్త్ర సూత్రాధారం మైన అంసుమద్భేదగమలో చెప్పిన అన్ని లక్షణాలతో, గుణగణాలతో పరిపూర్ణ నిర్మాణాకృతిని కలిగిన అద్భుతమైనది ఈ నటరాజ విగ్రహం. బధ్రపీఠము మీద ఉన్న పద్మపీఠం పైన అపస్మారపురుషుడ్ని వేసిన నటరాజు వాడి వీపుపై కుడిపాదం ఉంచి అణగతోక్కుతున్నాడు. ముప్పైఐదు జ్వాలా కుమ్ములు వాణ్ణి చుట్టుముట్టి  మంటలు రేపుతున్నాయి. ముప్పైఐదు జ్వాలా కుమ్ములు నటరాజును పరివేష్ఠించి వెలుగులు చిమ్ముతున్నాయి. గిటకబారిన మానవాకార పిచాచ భయంకరుడు ముయాలకుడనే రాక్షసుడు. దారుణ విధ్వేషాగ్నుల్ని రగల్చడంలో అపార శక్తి సామర్థ్యలు కలవాడు. అజ్ఞానాంధకారము మూర్తీబవించినవాడు, పేరాసకు ఆనవాలు, తన స్వార్దము తన సౌఖ్యము తన సంపదకోసం ఇతరులను పీడించేవాడు ఈ ముయాలకుడు. అలాంటి వాడి వీపుమాద ఉక్కు పాధము మోపి నడ్డివిరగగొట్టటం అంటే ఏమిటో సరిగ్గా నటరాజు అదే చేస్తున్నాడు. కుడికాలి పాదంక్రింద వాణ్ణి అణగదొక్కుతున్నాడు.  నటరాజు డమరుకాన్ని ఒక పైచేతిలో, అగ్నిని ఇంకొక పైచేతిలో పట్టుకొని, క్రింది ఎడమచేతిని గజ హస్త ముద్రలోను కుడిచేతిని అభయముద్రలోను ఉంచారు. కుడికాలుని కొంచం వంచి ఎడమకాలుని పైకిలేపి కుడివైపుకు తిప్పినట్టుగా కనిపిస్తుంది.  జడలు సమాంతరంగా వ్యాపించి ఉన్నాయి. ఒకవైపు గంగ ఒకవైపు చంద్ర జడలను అంటిపెట్టుకొని ఉన్నారు. తలపాగాలో నెమలీకలు పొదగి నాగుపాము పడిగ ఒక కొసన కప్పిఉంది. ఫాలభాగములో త్రినేత్రం అధిష్టించిఉంది. సర్పకుండలాలని దరించి ఉన్నాడు. బుజకీర్తులు, మెడలో దండలు, కడియాలు, మొలత్రాడు, వేళ్ళకు ఉంగరాలు, అందెలు, వస్త్రాల అంచులకు వ్రేలాడే కుచ్చులు ఇరువైపులా ఊగుతున్నట్లుగా ఉన్నాయి. ముయాలకుడు తన కుడిచేతిలో ఒకపాముని పట్టుకొని తర్జని ముద్ర (భయకంపిత) లో ఉన్నాడు. ఇతను తలపాగా, హారము, కేయురము, మోలత్రాడుతో బొడ్డులో పిజిబాకుని  దరించి ఉన్నాడు. నోటి కోరలు కూడా కనిపిస్తున్నాయి. మోటుపల్లిలో (ఇప్పటి రుద్రమాంభాపురం లో) 1972లో దొరువు తవ్వుతూ ఈ విగ్రహంతో పాటు ఇంకా పది విగ్రహాలని వెలికితీసిన వీరభద్రునికి నా సాష్టంగ దండ ప్రమాణం విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి చినగంజాంలోను, మాధ్యమిక పాఠశాల కడవకుదురులోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల చినగంజాంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు వేటపాలెంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ వేటపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల ఒంగోలులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం వేటపాలెంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం మోటుపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. పారిశుధ్యం మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం మోటుపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది: అడవి: 266 హెక్టార్లు వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 149 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 149 హెక్టార్లు తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 419 హెక్టార్లు బంజరు భూమి: 170 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 437 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 543 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 64 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు మోటుపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 36 హెక్టార్లు బావులు/బోరు బావులు: 28 హెక్టార్లు ఉత్పత్తి మోటుపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి, కూరగాయలు గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటయినప్పటినుండి 1963-64 నుండి 1989 వరకూ, 5 విడతలుగా శ్రీ పండ్రాజు వెంకటరామారావు, మొత్తం 25 సంవత్సరాలు, ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. మొదటి ధరావతు రు. 100-00. ఈయనకు పెద్దలు సంపాదించిన 120 ఎకరాలూ, 1989 నాటికి 50 ఎకరాలకు వచ్చింది. అంతా గ్రామానికి ఖర్చు చేశారు. కృష్ణానగరులో పేదలకు ఎసైన్ మెంట్, సీలింగు భూములు 40 ఎకరాలు, అడవీధిపాలెంలో 20 ఎకరాలు, రుద్రమాంబాపురంలో 70 ఎకరాలు, పేదలకు పంపిణీ చేయించారు. ప్రభుత్వ పాఠశాలలు, పేదలకు ఇళ్ళు, రహదర్ల అభివృద్ధి చేశారు. గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం. శ్రీ కోదండస్వామివారి ఆలయం. గ్రామంలో ప్రధాన వృత్తులు వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు గామ విశేషాలు మోటుపల్లి గ్రామ పంచాయతీ యానాదిసంఘంలో, 2015, ఏప్రిల్-30వతేదీనాడు, సింహవాహనంపై ఉన్న, లోహంతో చేసిన కనకదుర్గమ్మ ప్రతిమ బయటపడింది. గణాంకాలు 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,838. ఇందులో పురుషుల సంఖ్య 1,433, మహిళల సంఖ్య 1,405, గ్రామంలో నివాస గృహాలు 763 ఉన్నాయి. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ చారిత్రక స్థలాలు
వెంకటగిరి
https://te.wikipedia.org/wiki/వెంకటగిరి
వెంకటగిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలోని ఒక చారిత్రక పట్టణం, అదే పేరు గల మండల కేంద్రం. పేరు వ్యుత్పత్తి thumb|వెంకటగిరి రైల్వే స్టేషన్ వెంకటగిరి అనే గ్రామనామం వెంకట అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. వెంకట అనేది దైవ సూచి, శ్రీనివాసుని మరో పేరు వెంకట. చరిత్ర మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9 లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, వరంగల్ రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతన్ని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో లార్డ్ క్లైవు కాలంలో సనద్ ను పొందారు. తమ వంశం జమీందార్లు "రాజా" అనే బిరుదును వాడుతూ వచ్చారు. వెంకటగిరి జమీందారుల పూర్వీకుడైన యాచమనాయుడు 1614లో రెండవ తిరుమల దేవరాయల తర్వాతి విజయనగర సామ్రాజ్య వారసత్వంపై జరిగిన పోరాటంలో తిరుమల దేవరాయలు వారసునిగా నిర్ణయించిన శ్రీరంగరాయలకు అనుకూలంగా పోరాడారు. వారసత్వపు తగాదాల్లో జగ్గరాయుడు అనే రాచబంధువు శ్రీరంగరాయల కుటుంబాన్ని అంతా చంపేసినా, రంగరాయల కుమారుడు కుమారుడైన రామదేవరాయలను సింహాసనంపై నిలిపారు. భౌగోళికం ఈ పట్టణం అక్షాంశ రేఖాంశాలు . జనగణన వివరాలు జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ. రవాణా సౌకర్యాలు వెంకటగిరిలో రెండు బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుకు బస్సులు ఉన్నాయి. చుట్టుపక్కల చిన్న ఊర్లకు పల్లెలకు బస్సులు మాత్రమే కాక ఆటోలు, వ్యానులు ఉన్నాయి. ఇక్కడ రైల్వేస్టేషను గూడూరు - శ్రీకాళహస్తి మార్గం మధ్యలో వుంది. దగ్గర లోని పెద్ద జంక్షన్ గూడూరు, రేణిగుంట. అతి దగ్గరలోని విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం ఉత్పత్తులు వెంకటగిరి పట్టణం పట్టుచీరలకు ప్రసిద్ధి. దర్శనీయ ప్రదేశములు శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని,తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసన వినాయక చవితి తర్వాత వచ్చే మూడో బుధవారం నాడు గ్రామస్తులు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది ఈ జాతరను చూడడానికి చుటుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది వస్తారు. ఈ జాతరను ఏపీ గవ్నమెంట్ రాష్ట్ర పండుగగా ప్రకటించింది. వెంకటగిరి లో యం.టి.ర్ కాలనీ 6 వ వార్డు లో రామ్ సాయి అనే వ్యక్తి ఉన్నాడు. 6 వ వార్డు టాంక్ ఇక్కడ ప్రత్యేకమైనది. వ్యక్తులు శ్రీధర లక్ష్మీనరసింహం ఇవీ చూడండి వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం మూలాలు వర్గం:తిరుపతి జిల్లా పట్టణాలు
మంజీరా నది
https://te.wikipedia.org/wiki/మంజీరా_నది
మంజీరా (; ), గోదావరి యొక్క ఉపనది. మహారాష్ట్రలో దీనిని మాంజ్రా లేదా మాంజరా అని కూడా వ్యవహరిస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని బీఢ్ జిల్లా, పటోడా తాలూకాలోని బాలాఘాట్ పర్వతశ్రేణి యొక్క ఉత్తరపు అంచుల్లో 823 మీటర్ల ఎత్తున పుట్టి, గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నది యొక్క పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు మంజీరా నది సాధారణంగా తూర్పు, ఆగ్నేయంగా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్, కర్ణాటకలోని బీదర్, తెలంగాణలోని మెదక్ జిల్లాల గుండా 512 కిలోమీటర్లు ప్రవహించి, సంగారెడ్డి వద్ద దిశను మార్చి ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఆ దిశగా మరో 75 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాదు జిల్లాలో ప్రవహిస్తుంది. 102 కిలోమీటర్ల దిగువ నుండి ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుగా ఉంది. ఈ నది యొక్క జన్మస్థానం నుండి గోదావరిలో కలిసే దాకా మొత్తం 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 823 మీటర్ల ఎత్తు నుండి 323 మీటర్లకు దిగుతుంది. మంజీరా నది యొక్క ప్రధాన ఉపనదులు, తిర్నా నది. ఘర్నీ, దేవన్ నది, తవర్జా, కారంజ నది, హలయి, లెండీ, మనర్ నది. ఉపనదులతో సహా మంజీరా నది యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు. పరీవాహక ప్రాంతంలో సాలీనా 635 మి.మీ.ల వర్షపాతం కురుస్తుంది.మంజీరా నది బేసిన్ వివరాలు, Hydrology and Water Resources Information System for India, National Institute of Hydrology పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలో 15,667 చ.కి.మీ.లు కర్ణాటకలో 4,406 చ.కి.మీ.లు, తెలంగాణలో 10,772 చ.కి.మీ.లు విస్తరించి ఉంది. ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రవహించి, నైరుతి దిక్కునుండి నిజామాబాదు జిల్లాలో ప్రవేశించి, రెంజల్‌ మండలములోని కందకుర్తి గ్రామం వద్ద గోదావరిలో కలుస్తుంది. మంజీరానది పై, ఇదివరకటి బాన్స్‌వాడ బ్లాక్‌ లోని అచ్చంపేట గ్రామం వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణము జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగముగా 35 M.V.A.ల స్థాపక సామర్ధ్యము కలిగిన జలవిద్యుత్‌ కేంద్రము కూడా ఉంది. నదిపై ప్రాజెక్టులు మంజీరా నది యొక్క నీటిని వినియోగించుకోవటానికి మొట్టమొదట నిర్మించిన ప్రాజెక్టు మెదక్ జిల్లాలోని ఘన్‌పూర్ ఆనకట్ట. ఈ ఆనకట్ట ద్వారా నీటిని మళ్ళించి మెదక్ జిల్లాలోని ఐదు వేల ఎకరాలకు నీరు అందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కుడి కాలువ (మహబూబ్ నహర్)ను కూడా నిర్మించారు. 1904లో నిర్మించబడిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 18 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. ఆ తరువాత ఈ ప్రాజెక్టు మరింతగా సద్వినియోగ పరచుకొనేందుకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదుర్ ఎడమ కాలువ (ఫతే నహర్)ను నిర్మించాడు. ఘన్‌పూర్ ఆనకట్ట యొక్క ప్రస్తుత ఆయకట్టు 30 వేల ఎకరాలు. మూలాలు వర్గం:తెలంగాణ నదులు వర్గం:గోదావరి నది ఉపనదులు
ఆలంపూర్
https://te.wikipedia.org/wiki/ఆలంపూర్
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాలోని అలంపురం గ్రామం కొరకు చూడండి.) ఆలంపూర్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న అలంపూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది. చరిత్ర 11, 12 శతాబ్దాల నాటికే ఆలంపూర్ ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా పేరొందింది. కర్ణాటక ప్రాంతానికి వెళ్ళే రాచబాటలో నెలకొనడంతో పట్టణంలో వ్యాపారం వృద్ధి చెందింది. ఉభయ నానాదశ వర్తక కేంద్రం పట్టణంలో నెలకొన్నట్టు ఆలంపూర్లో దొరికిన శాసనాల్లో ఒకటి పేర్కొంది. గణాంకాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2442 ఇళ్లతో, 12609 జనాభాతో 5247 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6790, ఆడవారి సంఖ్య 5819. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2875 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 81. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576440. సౌకర్యాలు విద్యా సౌకర్యాలు - మాంటిస్సోరి విద్యాలయం జిల్లాలోనే అతి పెద్ద గురుకుల విద్యాలయం.గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కర్నూలులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కర్నూలులో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలులో ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం - ఆలంపూర్లో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం - గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి. తాగు నీరు - గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. పారిశుధ్యం - మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు - ఆలంపూర్లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.అలంపురానికి హైదారాబాదు, కర్నూలు, మహబూబ్‌ నగర్‌ ల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు - గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు - గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. విద్యుత్తు - గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. నీటిపారుదల సౌకర్యాలు - ఆలంపూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 238 హెక్టార్లు భూమి వినియోగం ఆలంపూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 362 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 134 హెక్టార్లు శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 1 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 283 హెక్టార్లు బంజరు భూమి: 1226 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 3238 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 4510 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 238 హెక్టార్లు ప్రధాన పంటలు వరి, జొన్న విశేషాలు , చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఇది ఒక చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశం.ఇక్కడ ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం ఉంది. భారతదేశంలోని 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి.నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 245 ఇది హైదరాబాదు నకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావింపబడింది. (సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరంలు దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలుగా భావింపబడినాయి). తుంగభద్ర, కృష్ణా నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి. ఇక్కడి తొమ్మిది నవ బ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపూర్ చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. తుంగభద్ర నది ఎడమ గట్టున అలంపూర్ ఆలయం ఉంది. శాతవాహన, బాదామీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది. జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి. దేవాలయాలు thumb|220x220px|బాల బ్రహ్మేశ్వర దేవాలయం, అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలు - నవబ్రహ్మ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు సుమారుగా ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి రెండువందల సంవత్సరములు పాలించారు. ఈ బాదామి చాళుక్యులు కర్ణాటక, తెలంగాణ లలో చాలా దేవాలయములు నిర్మించారు. ఇక్కడి కొన్ని శిల్పాలను దగ్గరలోని ఆలంపూర్ మ్యూజియంలో ఉంచారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ అనునవి ఆ తొమ్మిది దేవాలయములు. ఇవి అన్నీ కూడా తుంగభద్రానది ఒడ్డున ఉన్నాయి. వీటిలో బాల బ్రహ్మేశ్వరాలయం పెద్దది, ఇక్కడి శాసనాల ఆధారంగా దీనిని క్రీస్తు శకం 702 కాలం నాటిదిగా గుర్తించారు. ఇక్కడ శివరాత్రి పండుగను ఘనంగా చేస్తారు. తారక బ్రహ్మ దేవాలయం - ఈ ఆలయం పాక్షికంగా శిథిలాలలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహంకూడా లేదు! దీనియందు ఆరు, ఏడవ శతాబ్దాలకు చెందిన తెలుగు శాసనాలు ఉన్నాయి. స్వర్గ బ్రహ్మ దేవాలయం - అలంపూర్ లోని దేవాలయాలలో సుందరమైందిగా చెప్పబడుతుంది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక. ఇందులో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చాలా శాసనాలు ఉన్నాయి. పద్మ బ్రహ్మ దేవాలయం. - ఇది కూడా పాక్షికంగా శిథిలమైంది, ఇందులో ఓ అద్భుతమైన స్పటిక శివలింగం ఉంది. విశ్వబ్రహ్మ దేవాలయం - చాలా మంచి చూడ చక్కని నిర్మాణం, ఇక్కడ రామాయణ మహాభారత దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కారు. బాల బ్రహ్మేశ్వరాలయం - నవ బ్రహ్మ ఆలయాలలో ముఖ్యమైంది. జోగులాంబాలయం పునర్నిర్మాణం జరిగే వరకు ఇక్కడ ప్రధానార్చకాలయం ఇదే. జోగులాంబ పూర్వపు గుడి విధ్వంసం జరిగాకా, కొత్త ఆలయం నిర్మించేదాకా ఈ స్వామి ఆలయంలోనే పూజలందుకుంది. ఈ దేవాలయం చుట్టూ బహిఃప్రదిక్షణాపథాన్ని, ప్రాకారాన్ని, ముఖమంటపాన్ని చాళుక్య విజయాదిత్యుడు కట్టించినట్లు తెలుస్తుంది. ఈ నిర్మాణాలలో శిల్పి ఈశాన్యాచారుడి కృషి చెప్పుకోదగినదని అంటారు. thumb|220x220px|జోగులాంబ దేవాలయం, అలంపూర్ జోగులాంబ ఆలయం - జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశగా నెలకొని ఉంది. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు. సూర్యనారాయణస్వామి దేవాలయం - 9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది. శక్తిపీఠాన్ని సందర్శించడానికి వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. thumb|220x220px|సంగమేశ్వర దేవాలయం, అలంపూర్ సంగమేశ్వరాలయం - అలంపూర్‌కు ఈశాన్యంలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో కూడవెల్లి అను గ్రామం ఉండేది. ఇక్కడే సంగమేశ్వరాలయం ఉండేది. ఈ గ్రామం, ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామంలోని ప్రజలు సమీప గ్రామాలలో పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోగా, ఇక్కడి సంగమేశ్వరాలయాన్ని తరలించి అలంపూర్‌లో పునర్నిర్మించారు. గ్రామంలో జూనియర్ కళాశాలకు సమీపంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించారు. ఈ ఆలయ శిల్పసంపద ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలిలోనిదే. శివరాత్రి పర్వదినాన ఇక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విశాలమైన తోటలో ఆలయం అలరారుతుంది. తారక బ్రహ్మాలయం - ఈ ఆలయము గోపురములు శిథిలమై పోయినవి. ఇందలి గోడలపై అద్భుతమైన శిల్పములు ఉన్నాయి. ఇందొక ముఖమండపము, దానివెనుక ఒక ప్రవేశమంటపము, దానిని చేరి గర్భాలయము ఉన్నాయి.ప్రవేశమంటపము చుట్టును సన్నను వసారా ఉంది.దీనిలో నడుచుచు ప్రదక్షిణము చేయవచ్చును.ఆలయములో స్తంభములు బలిష్ఠముగా కట్టాబడినవి. శూలక బ్రహ్మాలయం -ఈ దేవాలయం ప్రాజ్ముఖంగా ఉంది. దీని యెదుట ఒక ప్రాంగణం ఉంది. అటుపై ఒక వసార ప్రవేశ మంటపె ఉంది. దీనిలో ప్రదక్షిణం చేయవచ్చును.పిమ్మట అంతరాళమంటపం, అటుపై గర్భాలయం ఉన్నాయి. ఈ గుడిలో ఒక వేదికపై లింగం ప్రతిష్ఠింపబడింది. ఈవేదికకు నాలుగు వైపులను రాతిస్తంభాలు ఉన్నాయి. వేదిక చుట్టూన్న ప్రదేశం రెండవ ప్రదక్షిణ మార్గంగా ఉంది.ఈ ఆలయెలో తాండవనృత్యం చేయు శివుని విగ్రహ శిల్పం, ప్రణయగోష్ఠిలో నున్న గంధర్వ దంపతుల బొమ్మలు ఉన్నాయి. కుమార బ్రహ్మాలయం - ఆలయం ఒక రాతిచపటాపై ప్రాజ్ముఖంగా నిర్మింపబడింది.ఇందు ముఖమంటపం, ప్రవేశమంటపం, వానివెనుక గర్భాలయాలు ఉన్నాయి. ఇచటి స్తంభాలపై చెక్కడపుపని ఎల్లోరా అజంతా శిల్పాలను స్మృతికి తెచ్చును. అర్క బ్రహ్మాలయం - ఈ ఆలయం కుమారబ్రహ్మ గుడివలెనే నిర్మించబడింది.ఇందులో ప్రదక్షిణకుపయోగించు చుట్టువసారా ఒక విశేషము.గోడలి వెలుపలిభాగమున చక్కని నగిషీ పని కల స్తంభములతో నిర్మింపబడిన గూళ్ళు కలవు వీనినడుమ హిందూదేవతల విగ్రహములున్నవి. మసీదు దేవాలయం - ఇది పూర్వమొక శివాలయంగా ఉండేది. ఇందు ముఖమంటపంను, ప్రవేశమంటపంను, దీనిచుట్టును ప్రదక్షిణార్ధం ఉపయోగించెడి వసారా, వానివెనుక గర్భాలయం ఉండేవి. గర్భాలయాలలో వేదిక ఉండేది. స్థలంలో ఒక అడ్డగోడ పెట్టబడింది. దీని కెదురుగనే నేడు మహమ్మదీయులు నమాజ్ చేస్తున్నారు. ఈకట్టడపు గోడవెలుప భాగాన నాల్గు శాసనాలు చెక్కబడినవి. బాల బ్రహ్మాలయం - అలంపురం ఆలయాలలో కెల్లా ఇది ముఖ్యమైంది.ఇందు నిత్యపూజాదికాలు జరుగుతాయి.తూర్పుముఖంగా నున్న ఈఆలయంలో చిన్న నంది మంటపంను, దానివెనకల విశాలమగు ముఖమంటపం, అటుపై అంతకంటే పెద్దదైన ప్రవేశ మంటపం, అటుపై అంతరాళ మంటపం దానిని చేరి గర్భాలయం ఉన్నాయి.గర్భాలయం చుట్టూనున్న వసార ప్రదక్షిణకు ఉపయోగిస్తారు. ఈగుడిలో సప్తర్షులు విగ్రహములు, ఇతర శైవదేవతల విగ్రహాలున్నవి. ఈఆలయం చుట్టును చిన్నచిన్న గుడులు ఉన్నాయి. ఈ ఆలయంలోని లింగం వింతగా నుండును. వేదికపై నున్న శిలాలింగం మధ్యనొక బిలం ఉంది. దానిలో మరియొక లింగం ఉంది. పైకవచాన్ని తీసి సవిమర్సనగా చూచినగాని ఈఅంతర్లింగం కనబడదు.ఈ ఆలయపు ఆవరణలో నున్న విగ్రహములలోకెల్లా ఒక విగ్రహం వింతగా నున్నది. ఒక నల్లరాతిపైన నగ్నమై, రెండు మోకాళ్ళను దౌడలకు తగులునట్లు మడచుకొని కూర్చొని ఉన్న స్త్రీ మూర్తి చెక్కబడి ఉంది. ఇది భూదేవి విగ్రహమట. పాపనాశనం - అలంపురం సమీపంలోని పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకేచోట ఉండటం వల్ల అలంపురం ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఏడవ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకూ దక్షిణాపథాన్ని పరిపాలించిన రాజవంశీయుల శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రాచీన శిల్పకళకు కాణాచి అయిన ఈ ఆలయం అడుగడుగునా విజ్ఞాన విశేషాలకు ఆలవాలంగా ఉంది. వైదిక మతానికి చెందిన ఆలయాలు, జైన, బౌద్ధుల కాలం నాటి శిల్పనిర్మాణాలు ఇక్కడ ఎన్నో దర్శనమిస్తాయి.ఆలయం తోటను ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఇటీవల త్రవ్వకాలు జరపగా, శాతవాహనుల కాలం నాటి నాణాలు, పూసలు, శంఖాలు, పాత ఇటుకలు, మట్టి పాత్రలు బయటపడ్డాయి. ఈ ఆలయం మహాద్వారాన్ని రాష్ట్ర కూటుల హయాంలో నిర్మించినట్టు చారిత్రక కథనం. కాకతీయుల కాలంలో ఇక్కడ మండపాలను నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయులు రాయచూర్‌ నుంచి ఈ ఆలయానికి వచ్చి కొన్ని దానాలు చేసినట్టు కూడా చారిత్రక కథనం. గతంలో ఇక్కడ ప్రసిద్ధమైన విద్యాపీఠం ఉండేదనీ, మహావిద్వాంసులు ఎంతో మంది ఉండేవారని కూడా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. thumb|right|300px|పురావస్తు ప్రదర్శనశాల, ఆలంపూర్ ఆలంపూర్ పురావస్తు ప్రదర్శనశాల - ఆలంపూర్ జోగుళాంబ దేవాలయ సమీపంలో పురావస్తు ప్రదర్శనశాల ఉంది. దీనిని 1952లో ఏర్పాటుచేశారు. ఇందులో సా.శ.6 వ శతాబ్దము నుంచి సా.శ.12వ శతాబ్దము వరకు కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం గం.10.30 నుంచి సాయంత్రం గం.5.00 వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు. దేవాలయానికి వచ్చే యాత్రికులు దీనిని కూడా సందర్శిస్తారు. రక్షణ గోడ - అలంపూర్ పట్టణానికి చుట్టూ అన్ని వైపులా రక్షణ గోడ ఉంది. నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో అలంపూర్ కూడా ఒకటి. కాని ముంపుకు గురై పట్టణాన్ని వేరేచోట నిర్మిస్తే, పట్టణంలోని ఆలయాలు పాడై, పునర్నిర్మాణ అసాధ్యమై, వాటి ప్రాభవాన్ని కోల్పోతాయని భావించి, అది ఊరికి అరిష్టంగా తలచి, అప్పటి ఆలయ ధర్మకర్త, ప్రముఖ కవి, చారిత్రక పరిశోధకులు గడియారం రామకృష్ణ శర్మ గారు ఊరి పెద్దలను ఒప్పించి, గ్రామ పున నిర్మాణానికి దక్కే నష్టపరిహారపు సొమ్మును వినియోగించి పట్టణం చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటుచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి, నిర్మించారు. ఈ రక్షణ వలయం ఊరి చుట్టూ ఉన్నప్పటికి పశ్చిమం వైపు ఎత్తు తక్కువగానూ, తూర్పు వైపు నది ఉండటం వలన అత్యంత ఎత్తులోనూ ఉండి, కోటగోడను తలపిస్తుంది, వర్షా కాలంలో నది జోరుగా ప్రవహించినా ఈ నిర్మాణం వలన నీరు పట్టణంలోకి రాదు. పట్టణంలోని మురికి నీరంతా ఊరి మధ్యలోని జోగులాంబ వాగులోకి చేరుతుంది. ఈ నీరు తుంగభద్ర వైపు వెలుతుంది. అయితే రక్షణ గోడ అడ్డు ఉండటం వలన నీటిని మోటారులతో ఎత్తి నదిలోకి చేరుస్తుంటారు. ఇతర విశేషాలు 2009 అక్టోబరు వరదలు: 2009 అక్టోబరు 2న తుంగభద్ర నది ఉప్పొంగడంతో ఆలంపూర్ గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009 అధికారులు గ్రామం మొత్తం ఖాళీచేయించారు. తుంగభద్ర నది ఒడ్డున నిర్మించిన రక్షణ గోడపై నుంచి నీరు ప్రవహించడంతో వరదనీరు గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్థులందరినీ నిరాశ్రయులుగా చేసింది. పురాతన ఆలయాలు అన్నీ నీటమునిగాయి. గ్రామ ప్రముఖులు అబ్దుల్ ఆజీం దఢాఖ: వాగ్గేయకారుడు. జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, లోకాయుక్త మాజీ జస్టిస్‌, ఎమ్మెల్సీ. అలంపూర్ ఆలయాల చిత్రాలు ఇవి కూడా చూడండి షా అలీ పహిల్వాన్ దర్గా ఆలంపూర్ శాసనసభ నియోజకవర్గం మూలాలు బయటి లింకులు ట్రావెల్ మస్తిలో వ్యాసం టెంపుల్ నెట్ లో వ్యాసం అలంపురం జోగుళాంబ వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు వర్గం:జోగులాంబ గద్వాల జిల్లా పుణ్యక్షేత్రాలు
మాచర్ల
https://te.wikipedia.org/wiki/మాచర్ల
మాచర్ల, పల్నాడు జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ పట్టణంలో హైహవ రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి దేవాలయం ఉంది.పురాతన కాలంలో దీనిని మహాదేవిచర్ల అని పిలిచేవారు.The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.: Administration, literature and society By Yashoda Devi పేజీ.39 ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇక్కడికి దూరప్రాంతాాల నుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయం 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయం ఎదురుగా ఓ పెద్ద ధ్వజస్తంభం చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి. చరిత్ర సా.శ. 1182 లో పలనాటి యుద్ధంగా పేరొందిన దాయాదుల పోరు మాచర్ల, గురజాల పట్టణాల మధ్య జరిగింది. ఈ యుద్ధం పల్నాటి హైహయ వంశంతో పాటు తీరాంధ్రలోని రాజవంశాలన్నింటినీ బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. హైహయరాజుల కాలంలో ఈ ప్రాంతంలో గొప్పచెరువు వుండేదని, దానిమధ్యలో మహాదేవి ఆలయం వుండడం వలన ఈ ప్రాంతానికి మహాదేవిచర్ల అనే పేరు, వాడుకలో మాచర్లగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల కథనం. తరువాతికాలంలో బ్రహ్మనాయుడు మలిదేవరాజుకి పల్నాటిరాజ్యంలో కొంతభాగమిప్పించి, గురజాలనుండి విడిపోయి మాచర్ల రాజధానిగా పాలింపజేశాడు. భౌగోళికం ఇది సమీప నగరమైన గుంటూరుకు 110 కి.మీ. దూరంలోను, జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు వాయవ్య దిశలో 80 కి.మీ దూరంలో వుంది. పరిపాలన మేజర్ పంచాయతీ స్థాయినుండి పురపాలకసంఘంగా 1987లో రూపాంతరం చెందింది. పట్టణంలో 29 వార్డులున్నాయి. మాచర్ల పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. రవాణా సౌకర్యాలు జాతీయ రహదారి 565 పై పట్టణం వుంది. గుంటూరు-మాచర్ల రైలు మార్గంలో ఈ పట్టణం వుంది. విద్యారంగం మాచర్ల, చుట్టు పక్కల గల గ్రామాలకు చెప్పుకోదగ్గ విద్యాకేంద్రం. ప్రాథమికి విద్య నుండి ఇంజనీరింగ్ విద్య వరకూ చదువుకునే సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి ముఖ్యమైన విద్యా సంస్థలు: శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాల (డిగ్రీ కళాశాల) న్యూటన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ. శ్రీ త్యాగరాజ గాత్ర సంగీత శిక్షణాలయం వ్యయసాయం, సాగునీటి సౌకర్యం దేవళ్ళమ్మ చెరువు:- పట్టణంలోని 400 సంవత్సరాల(2020 నాటికి) చరిత్ర కలిగిన ఈ చెరువు, 58 ఎకరాలలో విస్తరించిఉంది. 1950 వరకు ఈ చెరువు కేవలం మంచినీటి చెరువుగానే ఉపయోగపడింది సాగర్ కుడి కాలువలు నిర్మాణం జరుగక ముందు, ఈ చెరువు పల్నాడులోనే ఒక పెద్ద త్రాగునీటి చెరువుగా గుర్తింపు పొందింది. సాగర్ కాలువ వచ్చిన తరువాత నిరాదరణకు గురై, ప్రస్తుతం ఆక్రమణల పాలై, క్రమేణా కుంచించుకు పోయింది. ప్రధాన ఉత్పత్తులు ప్రత్తి, మిరప, వరి ప్రధాన వాణిజ్యపంటలు. నాణ్యమైన నాపరాయికి ఈ ప్రాంతంలోని క్వారీలు ప్రసిద్ధి. ఇక్కడి నుండి నాపరాయి ఇతర రాష్ట్రాలకూ,విదేశాలకూ ఎగుమతి అవుతుంది. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు నాగార్జునసాగర్: ఇక్కడకు 25 కి.మీ. దూరంలో ఉంది. ఎత్తిపోతల జలపాతం: ఇక్కడకు 16 కి.మీ. దూరంలో, తాళ్ళపల్లె గ్రామం వద్ద ఉంది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామివారి ఆలయం thumb|మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ప్రధాన ఆలయం thumb|మాచర్లలో చెన్నకేశవ స్వామి వారి ఆలయం|alt= చరిత్ర ప్రసిద్ధిచెందిన శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం ఉన్న ప్రదేశం. చంద్రవంక నది తీరంలోనున్న చెన్నకేశవస్వామి వారి ఈ ఆలయంలో ఐదు తలల బ్రహ్మాండమైన తెల్లరాతి నాగప్రతిమ భక్తిభావం ఉట్టిపడేలా మలచబడి ఉంంది.ఈ ఆలయంలోని కృష్ణుడు భగవానుని విగ్రహాన్ని పలనాటి నాయుడే ప్రతిష్ఠించాడు. గర్భగుడియొక్క స్తంభాలు అందమైన శిల్పాలతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున వీరభద్రస్వామి, భద్రకాళీ విగ్రహాలు, శనీశ్వరుడు విగ్రహాలు ఉన్నాయి. వీటి తరువాత శ్రీ కామేశ్వరీ అమ్మవారి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, చైత్రమాసంలో స్వామివారి బ్రహ్మొత్సవాలు 15 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. శ్రీ వీరభధ్రస్వామి ఆలయం thumb|వీరభద్రేశ్వరాలయం ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రక్కన ఉంది. ఈ దేవాలయం గోడలమీద పురాతన కాలంలో చెక్కిన శిల్పసంపద దాగి ఉంది. శ్రీ ముత్యాలమ్మతల్లి అలయం మాచర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వస్వామివారి ఆలయ సమీపంలో నెలకొనియున్నది. ఓటిగుళ్ళు పలనాడులో బ్రహ్మనాయుడు, మలిదేవుల పాలనకు పూర్వం, జైనులు ఈ ప్రాంతంలో ఓటిగూళ్లను కట్టించారు. మూలవిరాట్‌ లేకుండా దేవాలయం మాత్రమే ఉండే వాటిని ఓటిగుళ్లుగా పిలుస్తారు. ప్రస్తుతం మాచర్ల ఆదిత్యేశ్వర ఆలయంలో శిథిలమైన గుడిని ఓటిగుడిగా ప్రముఖ రచయిత గుర్రం చెన్నారెడ్డి తన పలనాటి చరిత్ర పుస్తకంలో రాశారు. దేవళమ్మ చెరువు సమీపంలోని కట్టడం కూడా ఓటిగుడిగా ఆయన పేర్కొన్నారు. ఇతర విశేషాలు రామా టాకీసు వీధి: ఈ వీధిలోనే ప్రధాన వాణిజ్యసముదాయాలూ, ఆసుపత్రులూ,మందులషాపులూ, సినిమాహలు వుండడంతో ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూవుంటుంది. కె.సి.పి.సిమెంటు ఫాక్టరీ:1958 లో స్థాపించబడి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు, శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టుకు సిమెంటు సరఫరా చేసింది. ప్రస్తుతం దక్షిణభారతదేశంలోనే అత్యధికంగా సిమెంటు ఉత్పత్తిచేసే కర్మాగారాల్లో ఒకటిగావుంది. మాచర్లకు దగ్గరలో బ్రహ్మనాయుడు చెరువు ఉంది. శ్రీ వాసవీ వృద్ధాశ్రమం. స్వామి వివేకానంద అనాథ శరణాలయం. ప్రముఖులు బ్రహ్మనాయుడు, దిఅమరావతివాయిస్ దినపత్రిక ఎడిటర్. మాచర్ల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యక్తి. Skbr కళాశాలలో ఆర్ట్స్ గ్రూపులో చదివి,జర్నలిజంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.న్యాయవిద్య పూర్తి చేశారు.9848343195 షేక్ చిన లాలుసాహెబ్, ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు చిత్రమాలిక ఇవీ చూడండి మాచెర్ల శాసనసభ నియోజకవర్గం మూలాలు బయటి లింకులు మాచర్ల దేవాలయాలు, శిల్పాలు వర్గం:పల్నాడు జిల్లా పట్టణాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_ముఖ్యమంత్రుల_జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి. ముఖ్యమంత్రుల జాబితా ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి సంఖ్యపేరుచిత్రంఆరంభంఅంతం వ్యవధి 1 టంగుటూరి ప్రకాశం పంతులు70px 1953 అక్టోబరు 1 1954 నవంబరు 15 రాష్ట్రపతి పాలన70px 1954 నవంబరు 15 1955 మార్చి 28 2 బెజవాడ గోపాలరెడ్డి 70px 1955 మార్చి 28 1956 నవంబరు 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు 1956 నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన వివిధ ముఖ్యమంత్రుల పదవీకాలం కింది పట్టికలో చూడవచ్చు. సంఖ్యపేరుచిత్రంఆరంభంఅంతం వ్యవధిరాజకీయ పార్టీ 1 నీలం సంజీవరెడ్డి70px 1956 నవంబరు 1 1960 జనవరి 11 2 దామోదరం సంజీవయ్య70px 1960 జనవరి 11 1962 మార్చి 12 (1) నీలం సంజీవరెడ్డి70px 1962 మార్చి 29 1964 ఫిబ్రవరి 29 3 కాసు బ్రహ్మానంద రెడ్డి70px 1964 ఫిబ్రవరి 29 1971 సెప్టెంబరు 30 4 పి.వి.నరసింహారావు70px 1971 సెప్టెంబరు 30 1973 జనవరి 10 రాష్ట్రపతి పాలన70px 1973 జనవరి 10 1973 డిసెంబరు 10 5 జలగం వెంగళరావు70px 1973 డిసెంబరు 10 1978 మార్చి 6 6 మర్రి చెన్నారెడ్డి 1978 మార్చి 6 1980 అక్టోబరు 11 7 టంగుటూరి అంజయ్య70px 1980 అక్టోబరు 11 1982 ఫిబ్రవరి 24 8 భవనం వెంకట్రామ రెడ్డి 1982 ఫిబ్రవరి 24 1982 సెప్టెంబరు 20 9 కోట్ల విజయభాస్కరరెడ్డి70px 1982 సెప్టెంబరు 20 1983 జనవరి 9 10 నందమూరి తారక రామారావు70px 1983 జనవరి 9 1984 ఆగష్టు 16 11 నాదెండ్ల భాస్కరరావు70px 1984 ఆగష్టు 16 1984 సెప్టెంబరు 16 (10) నందమూరి తారక రామారావు70px 1984 సెప్టెంబరు16 1985 మార్చి 9 (10) నందమూరి తారక రామారావు70px 1985 మార్చి 9 1989 డిసెంబరు 2 11 మర్రి చెన్నారెడ్డి 1989 డిసెంబరు 3 1990 డిసెంబరు 17 12 నేదురుమిల్లి జనార్ధనరెడ్డి70px 1990 డిసెంబరు 17 1992 అక్టోబరు 9 (9) కోట్ల విజయభాస్కరరెడ్డి70px 1992 అక్టోబరు 9 1994 డిసెంబరు 12 (10) నందమూరి తారక రామారావు70px 1994 డిసెంబరు 12 1995 సెప్టెంబరు 1 13 నారా చంద్రబాబునాయుడు70px 1995 సెప్టెంబరు 1 2004 మే 14 14 వై.యస్.రాజశేఖరరెడ్డి70px 2004 మే 14 2009 సెప్టెంబరు 2 15 కొణిజేటి రోశయ్య70px 2009 సెప్టెంబరు 3 2010 నవంబరు 24 16 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి70px 2010 నవంబరు 25 2014 ఫిబ్రవరి 28 రాష్ట్రపతి పాలన70px 2014 మార్చి 1 2014 జూన్ 7 గమనిక: తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కె. చంద్రశేఖర్ రావు 2014 జూన్ 2 నుండి 2023 నవంబరు వరకు కొనసాగాడు. ప్రస్తుతం ఎ. రేవంత్ రెడ్డి 2023 డిసెంబరు నుండి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు ఆంధ్రప్రదేశ్ (2014 నుండి) సంఖ్యపేరుచిత్రంఆరంభంఅంతం వ్యవధిరాజకీయ పార్టీ 1నారా చంద్రబాబునాయుడు70px2014 జూన్ 8 2019 మే 30 2వై.యస్ జగన్ మోహన్ రెడ్డి70px2019 మే 30ప్రస్తుతం ఇవీ చూడండి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణా ముఖ్యమంత్రులు మూలాలు బయటి లింకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైటు అధినేతలు, నాయకులు ముఖ్యమంత్రులు వర్గం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వర్గం:జాబితాలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితా
https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_గవర్నర్ల_జాబితా
ఆంధ్రప్రదేశ్ గవర్నరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిపతి. ఈ జాబితా 1953 నుండి ఇప్పటి వరకు ఉన్న ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ల జాబితా. విజయవాడలో ఉన్న రాజ్ భవన్ గవర్నర్ అధికారిక నివాసం. ఈ రాష్టానికి ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అత్యధిక కాలం గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి. 2023 ఫిబ్రవరి 13 నుండి ప్రస్తుత గవర్నరుగా ఎస్ . అబ్దుల్ నజీర్ 2023 ఫిబ్రవరి 12 నుండి బాధ్యతలు నిర్వర్తించుచున్నాడు. అధికారాలు, విధులు thumb| ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) పటం (2014- ప్రస్తుతం) |260x260px thumb| అవిభక్త ఆంధ్రప్రదేశ్ పటం (1956-2014) |260x260px గవర్నరు అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు: పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే శాసనసభ, లేదా శాసన మండలి రూపొందించిన చట్టాన్ని ఆమోదించటం, విచక్షణాధికారం ప్రకారం గవర్నరు నిర్వహించాల్సిన విచక్షణాధికారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్లు 1953 నుండి పనిచేసిన గవర్నర్లు జాబితా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్లు కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కలిగి ఉన్నారు. ఈ రాష్ట్రం 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోర్టల్ నుండి డేటా. #పేరుపోర్ట్రెయిట్ఎప్పటి నుండిఎప్పటి వరకుకాల నిడివిమునుపటి పదవినియమించినవారు 1 చందులాల్ మాధవ్‌లాల్ త్రివేది138x138px 1953 అక్టోబరు 1 1956 అక్టోబరు 31 daysపంజాబ్ గవర్నర్రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ 1956 నవంబరు 1న, హైదరాబాద్ రాష్ట్రం ఉనికిలో లేదు; దాని గుల్బర్గా, ఔరంగాబాద్ డివిజన్లు వరుసగా మైసూర్ రాష్ట్రం, బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయబడ్డాయి. దాని మిగిలిన తెలుగు - మాట్లాడే భాగం, ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయబడింది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా 2014 జూన్ 2న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించబడింది. సంఖ్యపేరుచిత్రంఆరంభంఅంతం 1 సి.ఎం.త్రివేది 75px 1953 అక్టోబరు 1 1957 ఆగస్టు 1 2 భీంసేన్ సచార్ 75px 1957 ఆగస్టు 1 1962 సెప్టెంబరు 8 3 ఎస్.ఎం.శ్రీనగేష్ 1962 సెప్టెంబరు 8 1964 మే 4 4 పీ.ఏ.థాను పిల్లై 1964 మే 4 1968 ఏప్రిల్ 11 5 ఖండూభాయి దేశాయి 1968 ఏప్రిల్ 11 1975 జనవరి 25 6 ఎస్.ఓబులరెడ్డి 1975 జనవరి 25 1976 జనవరి 10 7 మెహనలాల్ సుఖాడియా 1976 జనవరి 10 1976 జూన్ 16 8 ఆర్.డీ.భండారే 1976 జూన్ 16 1977 ఫిబ్రవరి 17 9 బీ.జె.దివాన్ 1977 ఫిబ్రవరి 17 1977 మే 5 10 శారద ముఖర్జీ 1977 మే 5 1978 ఆగస్టు 15 11 కె.సి.అబ్రహాం 75px 1978 ఆగస్టు 15 1983 ఆగస్టు 15 12 రామ్ లాల్ 75px 1983 ఆగస్టు 15 1984 ఆగస్టు 29 13శంకర్ దయాళ్ శర్మ 75px 1984 ఆగస్టు 29 1985 నవంబరు 26 14 కుముద్ బెన్ జోషి 1985 నవంబరు 26 1990 ఫిబ్రవరి 7 15 కృష్ణకాంత్ 1990 ఫిబ్రవరి 7 1997 ఆగస్టు 22 16 జి.రామానుజం 1997 ఆగస్టు 22 1997 నవంబరు 24 17 సి.రంగరాజన్ 1997 నవంబరు 24 2003 జనవరి 3 18 సుర్జీత్ సింగ్ బర్నాలా 75px 2003 జనవరి 3 2004 నవంబరు 4 19 సుషీల్‌ కుమార్‌ షిండే 75px 2004 నవంబరు 4 2006 జనవరి 29 20 రామేశ్వర్ ఠాకూర్ 2006 జనవరి 29 2007 ఆగస్టు 22 21 నారాయణదత్ తివారీ 2007 ఆగస్టు 22 2009 డిసెంబరు 27 22 ఈ.ఎస్.ఎల్.నరసింహన్ 2009 డిసెంబరు 27 2019 జూలై 2323బిశ్వ భూషణ్‌ హరిచందన్‌‌ 2019 జూలై 23 2023 ఫిబ్రవరి 1224ఎస్. అబ్దుల్ నజీర్ 2023 ఫిబ్రవరి 12 ప్రస్తుతం ఇవి కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు జాబితా మూలాలు బయటి లింకులు Official Website of the Governor of Andhra Pradesh List on Andhra Pradesh State Government's Web Site వర్గం:ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన జాబితాలు వర్గం:జాబితాలు వర్గం:భారతీయ రాష్ట్రాల గవర్నర్ల జాబితాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు వర్గం:భారతదేశ రాజకీయ కార్యాలయ అధిపతుల జాబితాలు
సిక్కిం
https://te.wikipedia.org/wiki/సిక్కిం
సిక్కిం (Sikkim) భారతదేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం (అన్నింటికంటే చిన్నది గోవా). 1975 వరకు సిక్కిం "చోగ్యాల్" రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము. 1975లో ప్రజాతీర్పు (రిఫరెండం) ను అనుసరించి సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైంది. ఈ చిన్న రాష్ట్రానికి ఉత్తరాన నేపాల్, తూర్పున, ఉత్తరాన టిబెట్ (చీనా), ఆగ్నేయాన భూటాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది. సిక్కిం అధికారిక భాష నేపాలీ. రాజధాని గాంగ్‌టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం. హిందూమతం, వజ్రయాన బౌద్ధం ప్రధానమైన మతాలు. చిన్నదే అయినా సిక్కింలో పలువిధాలైన భూభౌతిక ప్రాంతాలన్నాయి. దక్షిణ ప్రాతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది. ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్లలో విస్తరించి ఉంది. ఎంతో ప్రకృతి సౌందర్యాలను ఒనగట్టుకొన్నందువల్లా, ప్రశాంత రాజకీయ స్థిరత్వం వల్లా సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. పేరు వెనుక చరిత్ర నేపాలీ భాషలో సిక్కిం (లేదా శిఖిం) అనగా ముడిపడిన నేల. ('శిఖి' అనే సంస్కృత పదం నుండి). పొరుగునుండి దండెత్తిన నేపాలీ గూర్ఖాలు కొండలమయమైనందున సిక్కిం అనే పేరు వాడారంటారు. సిక్కిం మొదటి పాలకుడైన పంచేన్ నాంగ్యాల్ నిర్మించిన భవనాన్ని వర్ణిస్తూ 'లింబు' భాషలో 'సు'-క్రొత్త, 'ఖిమ్'-భవనం - నుండి - సిక్కిం అనే పదం వచ్చిందని కూడా చెబుతారు. టిబెటన్లు తమ భాషలో సిక్కింను "డెన్జాంగ్" - అనగా వరి ధాన్యం లోయ - అంటారు. ఒక నేపాలీ యువరాణి సిక్కింలోని "లెప్చా" రాజును పెళ్ళి చేసుకొని క్రొత్తగా వచ్చి "సు-హిమ్" (అనగా అద్భుతమైన మంచు ప్రదేశము) అన్నదని ఒక వివరణ చోగ్యాల్ పాలనా కాలంలో "సిక్కిం" పదానికి టిబెటన్ అనువాదమైన "విబ్రాస్ల్జోంగ్" (འབྲས་ལྗོངས་) ను అధికారికంగా వాడారు. చరిత్ర thumb|left|200px|సిక్కిం గురువైన గురు రింపోచే విగ్రహం. నామ్చీలోని 118 అడుగులు ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచం లోనే ఈ సాధువు విగ్రహలన్నింటిలో కెల్లా పెద్దది. 9వ శతాబ్దంలో "గురు రిపోంచే" అనే బౌద్ధమతగురువు కాలంనుంచీ సిక్కిం చరిత్ర ఆధారాలు లభిస్తున్నాయి. 13వ శతాబ్దంలో టిబెట్కు చెందిన గురుటాషి అనే రాకుమారుడు చోగ్యాల్ వంశానికి మూల పురుషుడు. అతని 5వ తరంవాడైన ఫున్త్సోగ్ నామ్గ్యాల్ ను సిక్కిం చోగ్యాల్ (రాజు) గా ముగ్గురు గౌరవనీయులైన లామాలు అభిషేకించారు. 1700 నుండి భూటానీలు, నేపాలీలు సిక్కింపై పలుమార్లు దండెత్తడం, టిబెటన్లు సిక్కింను కాపాడటం జరిగింది. చివరకు నేపాలీలు సిక్కింలో తెరాయి ప్రాతంతో సహా చాలాభాగాన్ని ఆక్రమించారు. బ్రిటిష్ వారి రాక తరువాత సిక్కిం బ్రిటిషువారితో చేతులు కలిపింది. ఫలితంగా బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి, నేపాలుకు 1814లో గూర్ఖా యుద్ధం జరిగింది. తరువాత జరిగి ఒడంబడికల ప్రకారం కోల్పోయిన ప్రాతం అంతా 1817లో సిక్కింకు తిరిగి లభించింది. కాని తరువాత సిక్కింకు, బ్రిటిష్ఇండియావారికి మధ్య సంబంధాలు క్షీణించాయి. 1861 తరువాత సిక్కిం బ్రిటిషువారి అధీనంలో మన్నే దేశమైంది. 1947లో ప్రజాభిప్రాయం సిక్కింను భారతదేశంలో విలీనం చేయాలని వచ్చింది. కాని భారత ప్రధాని నెహ్రూ భారతదేశ రక్షణలో సిక్కిం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడడానికి అంగీకరించాడు. మళ్ళీ ప్రజలలో ఉద్యమం బలపడింది. భారతదేశంలో విలీనం కావాలని 97.5% ప్రజలు తీర్పునిచ్చారు. 1975 మే 16న రాజరికం రద్దయి, సిక్కిం భారతదేశంలో విలీనమైంది. దీనిని అప్పటి చైనా గుర్తించలేదు. చివరకు 2003లో సిక్కింను భారతదేశంలో భాగంగా చూపెడుతూ చైనా అధికారికపటాన్ని విడుదల చేసింది. ప్రభుత్వం, రాజకీయాలు thumb|left|250x250px|సిక్కిం ముఖ్యమంత్రి, గవర్నర్ల నివాసాలు ఉన్న వైట్ హాల్ కాంప్లెక్స్ thumb|right|240px|సిక్కిం రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు సిక్కిం ప్రభుత్వ వ్యవస్థ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో వలెనే - కేంద్రంచే నియమించ బడ్డ గవర్నరు, పాలనా బాధ్యత గల ముఖ్యమంత్రి, ఒక శాసన సభ, ఒక హైకోర్టు (దేశంలో అతి చిన్న హైకోర్టు) - ఇలా ఉంటుంది. సిక్కింలో 32 శాసనసభ నియోజక వర్గాలు, ఒక లోక్‌సభ, ఒక రాజ్యసభ నియోజక వర్గాలు ఉన్నాయి. 1975 విలీనం తరువాత భారత జాతీయ కాంగ్రెసు 1979వరకు కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంది. 1979లో సిక్కిం పరిషత్ పార్టీకి చెందిన నర్బహదూర్ భండారీ ముఖ్యమంత్రి అయ్యాడు. 1994 ఎన్నికల్లో సిక్కిం ప్రజాస్వామ్య ఫ్రంట్‌కు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1999, 2004, 2009, 2014 శాసనసభ ఎన్నికలలో ఇదే పార్టీ విజయం సాధించింది.25 సంవత్సరాల సుదీర్ఘ పాలనా తర్వాత పవన్ చామ్లింగ్ పార్టీ 2019 లో ఓటమికి గురైంది కానీ ఇది మరీ ఘోరమైన ఓటమి కాదు ప్రధాన ప్రతిపక్షానికి సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించింది అంతకు ముందు పవన్ చామ్లింగ్ ప్రభుత్వంలో సరైన ప్రతిపక్షం కూడా లేదు. భౌగోళికం right|thumb|240px|ఉత్తర సిక్కింలోని హిమాలయ పర్వత శ్రేణి ఎక్కువగా పర్వతమయమైన సిక్కిం రాష్ట్రంలో వ్యవసాయానికి ఉపయోగపడే భూమి చాలా తక్కువ. కొద్ది కొండ వాలులు మాత్రం వ్యవసాయానికి అనుగుణంగా పైకప్పు వ్యవసాయం (టెర్రేస్ ఫార్మింగ్) కోసం మార్చబడ్డాయి. మంచునదులవల్ల కొన్ని లోతట్టులోయప్రాంతాలలో వ్యవసాయం సాగుతుంది.ముఖ్యంగా తీస్తా నది, దాని ఉపనదియైన రంగీత్ నది సిక్కిం ఆర్థిక వ్వస్థవకు చాలా కీలకమైనవి. దేశంలో మూడో వంతు దట్టమైన అరణ్యాలతో కూడి ఉంది. ఉత్తరం, తూర్పు, పడమర దిశలలో బ్రహ్మాండమైన హిమాలయ పర్వతశ్రేణులు అర్ధచంద్రాకారంలో రాష్ట్రాన్ని చుట్టి ఉన్నాయి. దక్షి భాగంలోనే ఎక్కువ జనావాసమైన ప్రదేశాలున్నాయి. మొత్తంమీద రాష్ట్రంలో 28 పర్వత శిఖరాలు, 21 హిమానీనదాలు (గ్లేషియర్స్), 227 ఎత్తైన ప్రాంతపు సరసులు, 5 ఉష్ణజలపు ఊటలు, 100కు పైగా నదులు, ఏరులు ఉన్నాయి. సరస్సులలో త్సోంగ్మో సరసు, ఖెంచియోపల్రి సరసు ముఖ్యమైనవి. రాష్ట్రాన్ని టిబెట్, భూటాన్, నేపాల్లతో కలుపుతూ 8 పర్వతలోయ మార్గాలున్నాయి. వాతావరణం సిక్కిం దక్షిణాన (ఎక్కువ జనావాసమైన ప్రాంతంలో) సమ ఉష్ణమండలం వాతావరణం ఉంటుంది . క్రమంగా ఉత్తరానికి వెళ్లేసరికి టుండ్రా వాతావరణం ఉంటుంది. సరాసరి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలు సెంటీగ్రేడ్. చలికాలంలో మంచు కురుస్తుంది. వర్షాకాలంలో వర్షపాతం చాలా ఎక్కువ. ఒకసారి 11రోజులు అవిరామంగా వర్షం కురిసింది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం బాగా ఎక్కువ. ఉత్తర ప్రాంతంలో మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడు కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. జంతు , వృక్ష సంపద thumb|358x358px| సిక్కింలో ప్రసిద్ధమైన ద్రో-దుల్ ఛోర్తెన్ స్థూపం సిక్కిం, దిగువ హిమాలయాల ప్రకృతివనాలలో ఉంటుంది మూడు భారతదేశ పర్యావరణ ప్రాంతాలలో ఇది ఒకటి. అడవులు కలిగి ఉన్న ప్రాంతాలలో వివిధ రకాల జంతువులు, చెట్లూ చేమలూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఎత్తుపల్లాలుగా ఉండటం వలన ఉష్ణమండలంలో కనిపించే చెట్లూ చేమలతో పాటుగా శీతల ప్రదేశాలలో పెరిగే మొక్కలు కూడా మనకు కనపడతాయి. ఇంత చిన్న ప్రాంతములో ఇంత వైవిధ్యాన్ని ప్రదర్శించే అతి కొన్ని ప్రాంతాలలో ఇది ఒకటి. రోడోడెండ్రాన్, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు చెట్టు. ఇది సిక్కింలోని అన్ని ప్రదేశాలలో (ఎత్తులలో) పెరుగుతుంది. ఆయా ప్రదేశాలలో లభించే ఉష్నోగ్రతల తేడాలతో ఈ చెట్టు జాతులు కూడా మారతాయి. ఆర్కిడ్లు, అత్తిచెట్లు, లారెల్, అరటి, సాల్ చెట్లు, వెదురు సిక్కింలోని తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి, ఈ చెట్లకు ఓ మాదిరి ఎండ తగలాలి. కొంచెం ఎత్తు ఉన్న ప్రదేశాలలో 1500 మీటర్ల నుండి మొదలుకుని ఓక్, చెస్ట్నట్ మాపెల్, బిర్చ్, ఆల్డర్, మాగ్నోలియా వంటి చెట్లు పెద్ద సంఖ్యలో కనపడతాయి. బాగా ఎత్తైన ప్రదేశాలలో (3500 నుంచి 5000 మీటర్లు) జునిపర్, పైను, ఫిర్, సైప్రస్, ర్హోడోడెన్డ్రాన్స్ పెరుగుతాయి. సిక్కింలో 5,000 కు పైగా పుష్పించే మొక్కలు, 515 అరుదైన ఆర్కిడ్లు, 60 ప్రిమ్యులా స్పీసీస్లు, 36 రోడోడెండ్రాన్ స్పీసీస్లు, 11 ఓక్ చెట్టు రకాలు, 23 వెదురు రకాలు, 16 కోనిఫర్ స్పీసీస్లు, 362 రకాల ఫెర్న్‌లు, ఫెర్న్ సంబంధిత మొక్కలు, 8 చెట్టు ఫెర్న్లు, 424 రకాలకు పైగా ఔషధ మూళికలు ఉన్నాయి. ఇక్కడ కనిపించే వన్యమృగాలలో మంచు చిరుత, కస్తూరి జింక, భోరల్, హిమాలయ థార్, ఎర్ర పాండా, హిమాలయ మర్మోట్, సెరోవ్, గోరల్, మొరిగే జింక సాధారణ లాంగుర్, హిమాలయాల నల్ల ఎలుగుబంటి, మచ్చల చిరుత, మార్బల్డ్ పిల్లి, చిరుత పిల్లి, అడవి కుక్క, టిబెట్ తోడేలు, హాగ్ బాడ్గర్, బింటూ-రాంగ్, అడవి పిల్లి, సివెట్ పిల్లి. ఆల్పైన్ ప్రాంతములో సాధారణంగా కనిపించే జంతువులలో జడల బర్రెలను (యాక్‌) ప్రధానంగా పాల కోసం, మాంసం కోసం, గాడిద లాగ బరువులు మోయించడానికి ఉపయోగిస్తారు. సిక్కిం పక్షిసంపదలో లింపేయన్ ఫీసంట్, ఎర్రకొమ్ముల ఫీసంట్, మంచు పాట్రిడ్జ్, మంచు కోడి, లామ్మెర్గేయర్ మరియూ గ్రిఫ్ఫన్ వాల్చర్లు, వీటితోపాటుగా బంగారు గ్రద్దలు, కవుజులు, ప్లోవర్లు, వుడ్కాక్లు, స్యాం పైపెర్లు, పావురాలు, ఫ్లైకాచర్లు, బ్లాబ్బర్లు, రాబిన్లు కనపడతాయి. సిక్కిం మొత్తం మీద 550 పక్షుల స్పీసీస్లు నమోదయ్యాయి. అందులో కొన్ని అంతరించిపోతున్న ప్రాణులుగా ప్రకటించబడ్డాయి. ఆర్ధిక వ్యవస్థ సిక్కిం ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఏలకులు, నారింజకాయలు, యాపుల్పళ్ళు, తేయాకు, ఆర్చిడ్ పూలు ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. భారతదేశంలో ఏలకుల ఉత్పత్తిలో సిక్కిందే అగ్రస్థానం. పర్వతమయమైన నేలకావడంవల్లా, రవాణా ఇబ్బందులవల్ల పరిశ్రమలు చాలా తక్కువ. మద్యం తయారీ, చర్మం ఉత్పత్తులు, వాచీలు వంటి కొద్ది పరిశ్రమలు దక్షిణాన మెల్లీ, జోర్థాంగ్ ప్టణాలలో ఉన్నాయి. కాని పారిశ్రామికంగా 8.3% వృద్ధితో సిక్కిం మంచి అభివృద్ధి సాధిస్తుంది. ఇటీవలి కాలంలో పర్యాటక రంగంపై శ్రద్ధ, పెట్టుబడులు పెరిగాయి. ఇందుకు సిక్కింలో ఎన్నో ఆకర్షణలున్నాయి. ఇంకా సిక్కింలో రాగి, డోలోమైట్, సున్నపురాయి, గ్రాఫైటు, మైకా, ఇనుపు, బొగ్గు ఖనిజాలు త్రవ్వబడుతున్నాయి. లాసా (టిబెట్) తో కలిపే "నాథులా" పర్వతమార్గం 1962 భారత్-చైనా యుద్ధం తరువాత మూసివేయబడింది. దీన్ని తిరిగి వినియోగించడం మొదలుపెడితే వాణిజ్యం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విభాగాలు సిక్కింలో 4 జిల్లాలున్నాయి - తూర్పు సిక్కిం (రాజధాని: గాంగ్టక్), పశ్చిమ సిక్కిం (రాజధాని: గేజింగ్), ఉత్తర సిక్కిం (రాజధాని: మంగన్), దక్షిణ సిక్కిం (రాజధాని: నమ్చి). దేశంలో అన్ని జిల్లాల లానే పాలనా పద్ధతులు ఉన్నాగాని, సరిహద్దురాష్ట్రమైనందున ఎక్కువ ప్రాతంలో భారతసైన్యానికి గణనీయమైన పాత్ర, అధికారాలు ఉన్నాయి. జన విస్తరణ 'లెప్చా' తెగలవారు సిక్కింలో పురాతనకాలం నుండి నివాసముంటున్నవారు. 'భూటియా'లు (భూటాన్ నుండి వలస వచ్చిన వారు), 'దమాయ్'లు కూడా స్థానికులే అని చెప్పవచ్చును . కాని 19వ శతాబ్దంలో వలసవచ్చిన నేపాలీలు సిక్కింలో అత్యధిక జనాభా గల జాతి. ఇంకా మార్వాడీలు, బీహారీలు, బెంగాలీలు వ్యాపార, ఉద్యోగాలలో ఎక్కువగా ఉన్నారు.హిందూమతం, బౌద్ధమతం ప్రధాన మతాలు. కొద్దిపాటి క్రైస్తవులు, చాలాకొద్దిమంది మహమ్మదీయులు ఉన్నారు. సిక్కింలో ఎప్పుడూ మత ఘర్షణలు జరుగలేదు. నేపాలీ భాష ఎక్కువగా మాట్లాడుతారు. హిందీ, ఇంగ్లీషు, సిక్కిమీస్, లెప్చా, లిమ్బూ, బెంగాలీ భాషల వినియోగం కూడా గణనీయం. మొత్తం సిక్కిం జనాభా 5,40,493 (భారతదేశంలో అతి తక్కువ జనాభా గల రాష్ట్రం) - ఇందులో పురుషులు 2,88,217 - స్త్రీలు 2,52,276. చదరపు కిలోమీటరుకు 76 మంది జనాభా మాత్రమే ఉంది. రాజధాని గాంగ్టక్ జనాభా 50,000. సగటు తలసరి ఆదాయం 11,356 రూపాయలు. ఇది భారతదేశంలో బాగా ఎక్కువ స్థానంలో ఉంది. సంస్కృతి సిక్కింలో దీపావళి, దసరా వంటి హిందువుల పండుగలు, లోసార్, లూసాంగ్, సగదవా, ల్హబాబ్, డ్యూచెన్, ద్రుప్కాతెషి, భుమ్చు వంటి బౌద్ధుల పండుగలు, ఇంకా క్రిస్టమస్, ఆంగ్లనూతన సంవత్సరాది - ఈ ఉత్సవాలన్నీ జరుపుకుంటారు. పాశ్చాత్య సంగీతము, హిందీ సినిమా పాటలు, స్థానిక నేపాలీ గీతాలూ కూడా జనప్రియమైనవి. నూడిల్స్ తో వండే వంటకాలు - తుప్కా, చౌమెయీన్, తంతుక్, ఫక్తూ, గ్యాతుక్, వాంటొన్ - ఎక్కువగా తింటారు. కూరగాయలు, మాంసము వాడకం కూడా ఎక్కువ. ఎక్సైజ్ పన్నులు తక్కువైనందున మద్యం చౌక, వఅడకం కూడా బాగా ఎక్కువ. సిక్కింలో ఎక్కువ ఇండ్లు వెదురుతో చేయబడుతాయి. పైన పేడతో అలుకుతారు గనుక చలికాలం లోపల వెచ్చగా ఉంటుంది. రవాణా వ్యవస్థ పక్యోంగ్ విమానాశ్రయం సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్ సమీపంలోని పకియోంగ్ పట్టణంలో గ్రీన్ ఫీల్డ్ ఆర్.సి.ఎస్ విమానాశ్రయం, రైలు మార్గాలు లేవు. పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి విమానాశ్రయం గాంగ్‌టక్ 124 కి.మీ. దూరంలో ఉంది. అక్కడికీ, బాగ్డోగ్రాకూ హెలికాప్టర్ సర్వీసు ఉంది. సిలిగురికి 16 కి.మీ. దూరంలోని 'క్రొత్త జల్పాయ్‌గురి' సిక్కింకు దగ్గరలోని రైలు స్టేషను. సిలిగురినీ గాంగ్‌టక్ నూ కలుపుతూ జాతీయ రహదారి 31ఎ ఉంది. మౌలిక సదుపాయాలు అధిక వర్షాల వల్లా, హిమపాతాల వల్లా, కొండ చరియలు పడడం వల్లా సిక్కిం రహదారులు కొన్ని తరచూ చెడిపోతూ ఉంటాయి. చాలా రహదారుల బాధ్యత భారతసైన్యానికి సంబంధించిన సరిహద్దు రోడ్ల సంస్థ (Border Roads Organisation) నిర్వహిస్తుంది. 1857 కి.మీ. రోడ్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉన్నాయి.సిక్కింలోని అధిక వర్షపాతం వల్లా, అనేక నదుల వల్లా ణిటి సదుపాయం పుష్కలంగా ఉంది. ఎన్నో జల విద్యుత్కేంద్రాలున్నాయి. చదువు అక్షరాస్యత 69.68% - అందులో మగవారిది 76.73%, మహిళలలో 61.46%. మొత్తం 1545 ప్రభుత్వ విద్యా సంస్థలు, 18 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. 12 ఉన్నత విద్యా కేంద్రాలున్నాయి. వాటిలో సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాగా పెద్ది. https://web.archive.org/web/20050813015822/http://www.manipal.edu/smit/ చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యకై పొరుగు రాష్ట్రంలోని సిలిగురి, కలకత్తా వెళుతుంటారు. మీడియా నేపాలీ పత్రికలు సిక్కింలో విరివిగా ప్రచురించబడుతాయి. ఇంగ్లీషు, హిందీ పత్రికలు పొరుగు రాష్ట్రాలనుండి ఎక్కువగా వస్తుంటాయి. 'సిక్కిం హెరాల్డ్' అనేది ప్రభుత్వం ప్రచురించే వార పత్రిక. రాష్ట్రంలో ఒక ఆకాశవాణి (అల్ ఇండియా రేడియో) ప్రసార కేంద్రం ఉంది. దేశమంతటా లభించినట్లుగానే టెలివిజన్ కార్యక్రమాలు 'డిష్'లద్వారా లభిస్తాయి. అలాగే 'సెల్ ఫోను' సదుపాయాలున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం పట్టణ ప్రాంతాలలోనే అధికంగా లభ్యం. పర్యాటక ఆకర్షణలు కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం చిత్రమాలిక ఇవి కూడ చూడండి సింగ్‌షోర్ వంతెన, పెల్లింగ్ హృషికేశ్ రాయ్ మూలాలు వనరులు హాలిడేయింగ్ ఇన్ సిక్కిం అండ్ భూటాన్ - నెస్ట్ అండ్ వింగ్స్ ప్రచురణ – ISBN 81-87592-07-9 సిక్కిం - లాండ్ ఆఫ్ మిస్టిక్ అండ్ స్ప్లెండర్ సిక్కిం పర్యాటక శాఖ ప్రచురణ. మనోరమ ఇయర్ బుక్ 2003 – ISBN 81-900461-8-7 సిక్కిం పర్యవరణం సిక్కిం చరిత్ర సిక్కిం రాష్ట్ర గణాంకాలు బయటి లింకులు సిక్కిం ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు సిక్కిం సమాచార పౌర సంబందాల శాఖ సిక్కిం పై ఒక విస్తృత వనరు జనగణన వివరాలు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
తమిళనాడు
https://te.wikipedia.org/wiki/తమిళనాడు
తమిళనాడు దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రం. దీని రాజధాని, అతిపెద్ద నగరం చెన్నై. తమిళనాడు భారత ఉపఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. కేంద్రంపాలిత ప్రాంతం పుదుచ్చేరి, దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా కలిగి ఉంది. దీనికి ఉత్తరాన తూర్పు కనుమలు, నీలగిరి పర్వతాలు, మేఘమలై కొండలు, పశ్చిమాన కేరళ, తూర్పున బంగాళాఖాతం, మన్నార్ గల్ఫ్, ఆగ్నేయంలో పాక్ జలసంధి, దక్షిణాన హిందూ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్రం శ్రీలంక దేశంతో సముద్ర సరిహద్దును పంచుకుంటుంది. ఈ ప్రాంతాన్ని చేరా, చోళ, పాండియన్ రాజులు పరిపాలించారు. వీటివలన వంటకాలు, సంస్కృతి, వాస్తుశిల్పాన్ని ప్రభావితమైంది. మైసూర్ రాజ్యం పతనం తరువాత, ఆధునిక కాలంలో బ్రిటిష్ వలసరాజ్యాల పాలన వలన చెన్నై (మద్రాస్) మెట్రోపాలిటన్ నగరంగా ఉద్భవించింది. భాషా పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత 1956 లో ఆధునిక తమిళనాడు ఏర్పడింది. ఈ రాష్ట్రం అనేక చారిత్రాత్మక భవనాలు, బహుళ-మత తీర్థయాత్రాస్థలాలు, హిల్ స్టేషన్లు, మూడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయం. విస్తీర్ణంలో తమిళనాడు భారతదేశంలో పదవ అతిపెద్దది. జనాభా ప్రకారం ఆరవ అతిపెద్దది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో రెండవ అతిపెద్దది, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి) ₹ 21.6 ట్రిలియన్. తలసరి జిఎస్డిపిలో ₹ 229,000 తో దేశంలో 11వ స్థానంలో వుంది మానవ అభివృద్ధి సూచికలో ఇది అన్ని భారత రాష్ట్రాలలో 11వ స్థానంలో ఉంది. తమిళనాడు భారతదేశంలో అత్యధిక పట్టణీకరణ రాష్ట్రం, అత్యంత పారిశ్రామిక రాష్ట్రాలలో ఒకటి; ఉత్పాదక రంగ రాష్ట్ర జిడిపిలో మూడోవంతు కంటే ఎక్కువ. దీని అధికారిక భాష తమిళం, ఇది ప్రపంచంలో ఎక్కువ కాలం జీవింస్తున్నప్రాచీనభాషలలో ఒకటి. తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు చారిత్రిక కాలంలో కణ్ణగి తిరువళ్ళువార్ కంబన్ మనునీధి చోళన్ రారాజచోళన్ (గంగైకొండ చోళన్) స్వాతంత్ర్య సమరయోధులు సుబ్రహ్మణ్య భారతి చిదంబరనార్ (కప్పలోట్టియతమిళన్) కొడికాత్త కుమరన్ ఆదునిక కాలంలో** సర్ సి.వి రామన్ సర్వేపల్లి రాదాక్రిష్ణన్ శ్రీనివాస రామానుజన్ ఎ.పి.జె అబ్దుల్ కలాం ఎమ్.ఎస్ స్వామినాధన్ విజయ్ అమృతరాజ్ కామరాజ్ రాజాజి (రాజగోపాలాచారి) అణ్ణాదురై తందై పెరియార్ శివాజీగణేశన్ ఎమ్.జి.రామ చంద్రన్ ఎమ్. కరుణానిధి ఎ.ఆర్.రహమాన్ జయలలిత కమల్ హాసన్ రజనీకాంత్ విశ్వనాధన్ ఆనంద్ ప్రపంఛ ఛెస్ క్రీడాకారుడు విలయనూర్ రామచంద్రన్ అలాన్ ట్యూరింగ్ (కంప్యూటరు సైంటిస్టు - బాల్యం మద్రాసులో గడిపాడు) చరిత్ర తమిళనాడు ప్రాంత చరిత్ర 6000 సంవత్సరాలు పైగా పురాతనమైనది. సింధునదీలోయలో (హరప్పా, మొహంజొదారో) మొదట ద్రవిడుల నాగరికత పరిఢవిల్లిందనీ, తరువాత ఆర్యుల దండయాత్రల కారణంగా ద్రవిడులు దక్షిణప్రాంతానికి (ప్రస్తుత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ ప్రాంతాలు) క్రమేపీ విస్తరించారని ఒక ప్రబలమైన వాదన. కానీ ఈ వాదనకు బలమైన వ్యతిరేకత కూడా ఉంది. ఏమయినా తమిళ సమాజం పట్ల చాలామంది అవగాహన 'ద్రావిడనాగరికత' అనే అంశం ఆధారంగా మలచబడింది. తమిళనాడు, చుట్టుప్రక్కల ప్రాంతాలలో వేరువేరు కాలాలలో పల్లవ, చేర, చోళ, పాండ్య, చాళుక్య, విజయనగర రాజుల రాజ్యం సాగింది. దాదాపు అన్ని సమయాలలోనూ 'కొంగునాడు' (కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్, సేలం ప్రాంతాలు) ఒక విశిష్టమైన స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకొంది. వ్యవసాయ ప్రధానమైన ఈ ప్రాంతాలలో ఇప్పటికీ సాంస్కృతిక విలక్షణత కనుపిస్తుంది. క్రీస్తు పూర్వం క్రీ.ఫూ. 6వ శతాబ్దములో మదురై, తిరునల్వేలి కేంద్రంగా కులశేఖరుడు స్థాపించిన పాండ్యరాజ్యం వర్ధిల్లింది. వారి కాలంలో గ్రీసు, రోములతో వాణిజ్య సంబంధాలు ఉండేవి. తరువాత చేర రాజులు మలబారు తీర ప్రాంతం (ఇప్పటి కేరళ) లో రాజ్యమేలారు. ఇది సైనికంగా బలమైన రాజ్యం. వారికాలంలో రోముతో వాణిజ్యం మరింత అభివృద్ధి చెందింది. సా.శ. 1 నుండి 9వ శతాబ్దం వరకు thumb|right|250px|7వ శతాబ్దములో పల్లవులు, మహాబలిపురములో నిర్మించిన సముద్రతీర ఆలయం 1 నుండి 4 వ శతాబ్దం వరకు చోళరాజులు పాలించారు. కరికాల చోళుడు వారిలో ప్రసిద్ధుడు. ఆ కాలంలోనే కావేరి నదిపై ఆనకట్ట కట్టారు (కల్లనాయి). ఇది అప్పటి సాంకేతికత ప్రజ్ఙకు చిహ్నము. 4వ శతాబ్దం తరువాత 400 సంవత్సరాలు దక్షిణాపధమంతా పల్లవుల అధీనంలో ఉంది. మహేంద్ర వర్మ, నరసింహ వర్మ వీరిలో ప్రసిద్ధులు. ఇది దక్షిణాపథంలో శిల్పానికి స్వర్ణయుగం. 9వ శతాబ్దము నుండి 13వ శతాబ్దం వరకు మరల 9వ శతాబ్దంలో రాజరాజచోళుని నాయకత్వంలోను, తరువాత అతని కుమారుడు రాజేంద్రచోళుని నాయకత్వంలోను చోళుల రాజ్యం బలంగా విస్తరించింది. చోళుల సామ్రాజ్యం ఒడిషా, బెంగాలు, బీహారుల వరకు విస్తరించింది. తూర్పు చాళుక్యులను, చేరరాజులను, పాండ్యరాజులను ఓడించారు. లంక, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీపాలు, సుమత్రా, జావా, మలయా, పెగూ ద్వీపాలను చోళరాజులు తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. 13వ శతాబ్దం తరువాత చోళుల పాలన అస్తమించింది. 14వ శతాబ్దం 14వ శతాబ్దంలో మరల మొదలైన పాండ్యరాజుల పాలన ఉత్తరాదినుండి 'ఖిల్జీ' దండయాత్రలవలన త్వరలోనే అంతరించింది. తరువాత దక్కన్ ప్రాంతంలో బహమనీ సుల్తానుల రాజ్యం వేళ్ళూనుకుంది. తదనంతరం హంపి కేంద్రంగా విజయనగర సామ్రాజ్యం దక్షిణాపధమంతా నడచింది. వారు (నాయకర్, నాయగన్) నాయకుల సహాయంతో ఏలిక సాగించరు. 1564లో తళ్ళికోట యద్ధంతో విజయనగరసామ్రాజ్యం అంతరించింది. తమిళనాట చాలా ప్రాంతాలు స్వతంత్ర నాయకుల అధీనంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. మదురై, తంజావూరు నాయకులు గొప్ప ఆలయాలు నిర్మింపజేశారు. 17వ శతాబ్దం ఇక ఐరోపా వారి యుగం ఆరంభమైంది. 1609లో డచ్చివారు పులికాట్ వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. 1639లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు మద్రాసులో స్థావరం నెలకొలిపారు. స్థానిక నాయకుల మధ్య తగవులు బ్రిటిష్ వారి విస్తరణకు మంచి అవకాశమిచ్చాయి. 1760లో ఫ్రెంచివారిని 'వందవాసి' (Wandywash war) యుద్ధంలోను, డచ్చివారిని 'తరంగంబడి' యుద్ధంలోను, తరువాత టిప్పు సుల్తానును మైసూరు యుద్ధంలోను ఓడించి, బ్రిటిష్ వారు దక్షిణభారతదేశంలో ఎదురులేని ఆధిపత్యాన్ని సాధించుకొన్నారు. అప్పటినుండి మద్రాసు ప్రెసిడెన్సీ రూపు దిద్దుకుంది. వీరపాండ్య కట్టబొమ్మన, మారుతుస్, పులితేవన్ వంటి కొందరు పాలెగాళ్లు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీనెదిరించి వీరోచితంగా పోరాడారు గాని ప్రయోజనం లేకపోయింది. 20వ శతాబ్దం బ్రిటిష్ రాజ్యం కాలంలో విశాలమైన మద్రాసు ప్రెసిడెన్సీలో ఇప్పటి తమిళనాడుతోబాటు ఆంధ్ర, కర్ణాటక, కేరళలలోని కొన్నిభాగాలు కలసి ఉండేవి. 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అదే మద్రాసు రాష్ట్రమైనది. భాషా ప్రాతిపదికన 1953లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంగా విభజించారు. బళ్ళారి ప్రాంతం మైసూరు రాష్ట్రంలో కలుపబడింది. 1956లో మద్రాసు రాష్ట్రంలోని పశ్చిమభాగాలు కొన్ని కేరళ, మైసూరు (ఇప్పటి కర్ణాటక) రాష్ట్రాలలో కలుపబడ్డాయి. 1968లో మద్రాసు రాష్ట్రానికి "తమిళనాడు" అని పేరు మార్చారు. తమిళ (ద్రవిడ) భాష, సంస్కృతి తమిళనాడు రాజకీయాలలో ఇప్పటికీ ప్రధానమైన అంశాలు. రాజకీయాలు లోక్ సభ నియోజక వర్గాలు: 39 అసెంబ్లీ నియోజక వర్గాలు: 234 1967 నుండి ప్రాంతీయ పార్టీలు తమిళనాడు రాజకీయాలలో ప్రముఖస్థానాన్ని వహిస్తున్నాయి. 1916లో ఏర్పడిన దక్షిణ భారత సంక్షేమ సంఘం (South Indian Welfare Association) క్రమంగా 'జస్టిస్ పార్టీ' గా అవతరించింది. 1944లో ఇ.వి. రామస్వామి నాయకర్ నాయకత్వంలో ఇది 'ద్రవిడకజగం' పార్టీ అయ్యింది. ఇది రాజకీయ పార్టీ కాదు. స్వతంత్ర 'ద్రవిడనాడు' సాధన వారి లక్ష్యం. అప్పటి నాయకులు అన్నాదురై, పెరియార్ ల మధ్య విభేదాల కారణంగా ఈ పార్టీ రెండుగా చీలింది. అన్నాదురై నాయకత్వంలో 'ద్రవిడ మున్నేట్ర కజగం' (డి.యమ్.కె, DMK) పార్టీ 1956లో ఎన్నికలలోకి దిగింది. 1960 దశకంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో డి.యమ్.కె బలం పుంజుకుంది. 1967లో కాంగ్రసును చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. 1969లో అన్నాదురై మరణించడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు. కరుణానిధి నాయకత్వంతో విభేదించిన సినీ నటుడు ఎమ్.జి.రామచంద్రన్ ( ఎం.జి.ఆర్, MGR)1972లో పార్టీనుండి విడిపోయి 'అఖిల భారత ద్రవిడ మున్నేట్ర కజగం' (AIADMK) స్థాపించాడు. 1977 నుండి 1987 వరకు ఎమ్.జి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1987లో ఎమ్.జి.ఆర్. మరణానంతరం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాని ఎమ్.జి.ఆర్. భార్య జానకి రామచంద్రన్ నాయకత్వంలోని భాగం నిలబడలేకపోయింది. జయలలిత నాయకత్వంలో ఎ.ఐ.డి.ఎమ్.కె. స్థిరపడింది. మొత్తంమీద 1967 నుండి డి.ఎమ్.కె, ఎ.ఐ.డి.ఎమ్.కె. ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటున్నది. ఐనా తమిళనాడులో కాంగ్రెస్, బి.జె.పి, కమ్యూనిస్టులు వంటి జాతీయ పార్టీలు, పి.ఎమ్.కె., ఎమ్.డి.ఎమ్.కె వంటి ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పుకోదగినంత ప్రాబల్యం కలిగి ఉన్నాయి. శ్రీ లంకలోని తమిళుల సమస్య కూడా తమిళనాడు రాజకీయాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. సినిమాలు బొంబాయి (బాలీవుడ్) తరువాత చెన్నై భారతదేశంలో సినిమారంగానికి ముఖ్యమైన నిలయం. సినిమా రంగానికి సంబంధించిన సదుపాయాలు ఎక్కువగా 'కోడంబాకం' ప్రాంతంలో ఉన్నందున తమిళనాడు సినిమా రంగాన్ని 'కోలీవుడ్' అని చమత్కరిస్తారు. ఒకప్పుడు నాలుగు దక్షిణ భారత భాషలకూ మద్రాసే ప్రధాన సినిమా పరిశ్రమ కేంద్రం. ఇప్పుడు తక్కిన రాష్ట్రాలలో చిత్ర పరిశ్రమ వృద్ధి చెందునందువల్ల 'చెన్నై' ప్రాముఖ్యత కాస్త పలచబడింది. అయినా తమిళ సినీ రంగం, తెలుగు సినీ రంగం కుడి ఎడమగా ఉంటూ వస్తున్నాయి. ఇక తమిళనాడు రాజకీయాలలో సినిమా ప్రభావం ప్రపంచంలో మరక్కడా లేనంత ప్రబలం. దాదాపు సినీపరిశ్రమ, రాజకీయ రంగం కలగలిపి ఉంటున్నాయి. ఆర్ధిక వ్యవస్థ భారతదేశం ఆర్థిక వ్యవస్థలో తమిళనాడు మూడవ స్థానం ఆక్రమిస్తుంది. పారిశ్రామికంగానూ, వ్యాపార పరంగానూ తమిళనాడు బహుముఖంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయం thumb|250px|నాగర్‌కోయిల్ దగ్గర వరిమళ్లు వస్త్ర పరిశ్రమ వస్త్రాలకు సంబంధించిన వ్వసాయోత్పత్తులు, యంత్రాలు, ముడి సరకులు, వస్త్రాల కర్మాగారాలు, చేనేత కార్మికులు కూడా తమిళనాడు ఆర్థికరంగంలో ముఖ్యమైన వనరులు. ఒక్క తిరుపూర్ పట్టణం నుండే 2004లో 5వేల కోట్ల విలువైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇక్కడ 7,000 దుస్తుల పరిశ్రమలు 10 లక్షల కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. ఉత్పత్తి పరిశ్రమలు చెన్నై చుట్టుప్రక్కల ఇంజినీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమలు ఇతోధికంగా ఉన్నాయి. ఫోర్ద్, హ్యుండై, మిత్సుబిషి కారు ఫ్యాక్టరీలు, ఎమ్.ఆర్.ఎఫ్, టి.ఐ.సైకిల్స్, అశోక్ లేలాండ్, కల్పక్కం అణు విద్యుత్ కర్మాగారము, నైవేలి లిగ్నైట్ పరిశ్రమ, సేలం స్టీల్స్, మద్రాస్ సిమెంట్, టైటాన్ వాచెస్, తమిళనాడు పేపర్ & పల్ప్, తోలు పరిశ్రమలు - ఇవి కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు. శివకాశి పట్టణం ముద్రణ, బాణసంచా, అగ్గిపెట్టెలు పరిశ్రమలకు భారతదేశంలో అగ్రగామి. సమాచార సాంకేతిక, సాఫ్ట్వేర్ రంగములు thumb|right|250px|చెన్నైలోని టైడల్ పార్క్, తమిళనాడులోని అతి పెద్ద సాఫ్ట్‌వేరు పార్క్ బెంగళూరు తరువాత చెన్నై రెండవ సాఫ్ట్వేర్ కేంద్రము. ఈ-పరిపాలన ప్రభుత్వసేవలను కంప్యూటరీకరంచడంలో తమిళనాడు అగ్రగామి. సామాజిక అభివృద్ధి ఇంకా చెన్నై వైద్య, పరిశోధన, విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా ప్రాథమిక విద్యకు ప్రభుత్వధనం బాగా వినియోగింపబడుతూ ఉంది. 'బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం' అనే పధకం తమిళనాడులోనే ప్రారంభమైంది. ఇక సామాజిక అంశాలలో వెనుకబాటు తనం కూడా కొన్ని విషయాలలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. వాఠిలో ఒకటి - కొన్ని ప్రాంతాలలో - ఆడ శిశువులను చంపివేయడం. జిల్లాలు తమిళనాడు రాష్ట్రములో 30 జిల్లాలు ఉన్నాయి. ధర్మపురి జిల్లాను రెండుగా విభజించి క్రిష్ణగిరి ముఖ్యపట్టణముగా క్రిష్ణగిరి జిల్లా, 30వ జిల్లాగా యేర్పడినది. పండగలు పొంగల్ (సంక్రాంతి) తమిళనాట ప్రధానమైన పండుగ. ఇంకా దీపావళి, విషు (తమిళ ఉగాది), దసరా, వినాయక చవితి కూడా జరుపుకుంటారు. అలాగే మహమ్మదీయ, క్రైస్తవ పండుగలు కూడా పెద్దయెత్తున జరుపబడతాయి. తమిళనాడులో ముఖ్యమైన కుంభాభిషేకం, తైపూసం, ఆడివెల్లి వంటి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వేలాంకిణి చర్చి, నాగూరు మసీదు లలో ఉత్సవాలలో అన్ని మతాలవారు పాలుపంచుకుంటారు. పర్యటన తమిళనాడు పర్యాటకులను ఎన్నోవిదాలుగా ఆకర్షిస్తుంది. పురాతన ఆలయాలు, నింగినంటే గోపురాలు, ఆధునిక నగరాలు, పల్లెటూరి జీవన విధానం, సాగర తీరాలు, పార్కులు, అడవులు, వేసవి విడుదులు, పరిశ్రమలు, సినీ స్టూడియోలు, పట్టుచీరలు, బంగారం దుకాణాలు, ఆధునిక వైద్యశాలలు - ఇలా అన్ని విధాల పర్యాటకులకూ తమిళనాడు చూడదగింది. ముఖ్యమైన పర్యాటక స్థలాలు thumb|right|300px|గాలి మరల నేపథ్యంలో అరల్వైమోయి రైల్వే స్టేషను thumb|right|300px| కొడైకెనాల్ thumb|right|300px| హోగెనక్కల్‌ జలపాతం నగరాలు చెన్నై మదురై కోయంబత్తూరు సాగరతీరాలు మెరీనా బీచ్ సిల్వర్ బీచ్ కన్యాకుమారి మహాబలిపురం గుళ్ళు, గోపురాలు కంచి శ్రీరంగం మదురై కుంభకోణం శ్రీవిల్లి పుత్తూరు పళని తిరుచి తంజావూరు రామేశ్వరం తిరుత్తణి తిరువళ్ళూరు ఛిదంబరం తిరువణ్ణామలై వేలూర్ గొల్డెన్ టెంపుల్ వేసవి విడుదులు ఊటీ కొడైకెనాలు వన్యస్థలాలు మదుమలై పిచ్చవరం జలపాతాలు హోగెనక్కల్‌ జలపాతం ఇతరాలు శ్రీ పెరంబదూరు అవీ, ఇవీ దేశంలో తమిళనాడుప్రాంతంలో మాత్రమే ఈశాన్య ఋతుపవనాలవల్ల అక్టోబరు - నవంబరు - డిసెంబరు మాసాలలో వర్షాలు పడతాయి. బంగాళా ఖాతంలోని అల్పపీడనాలవల్ల పడే వర్షాలు తమిళనాడు నీటివనరులలో ముఖ్యమైనది. కాని వాటివల్ల వచ్చే తుఫానులవల్ల నష్టాలకు కూడా తమిళనాడు తరచు గురి అవుతుంటుంది. 2004 డిసెంబరు 26 న వచ్చిన 'సునామీ' ఉప్పెనకు తమిళనాట తీరప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కావేరీ నది జలాల వినియోగం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిరకాలంగా ఉన్న వివాదం. రెండు రాష్ట్రాల వ్యవసాయానికీ ఈ నీరు చాలా అవసరం. చెన్నైలోని 'మెరీనా బీచ్' ప్రపంచంలో రెండవ పొడవైన బీచ్. కడలూరులోని 'సిల్వర్ బీచ్' మెరీనా బీచ్ తరువాత పొడవైనది. ఒకప్పుడు, తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా మద్రాసులో ఉన్నపుడు, మద్రాసు వెళ్ళిన తెలుగు వారికి ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ ల ఇళ్ళు చూడడం టూర్ లో చాలా ముఖ్యమైన భాగంగా ఉండేది. తమిళనాట తెలుగు బావుటా తమిళంలో ఉన్న తిరుప్పావై తెలుగునాట విష్ణుభక్తులు పాడినట్లే తెలుగులో ఉన్న త్యాగరాయ కీర్తనలను తమిళ, కన్నడ, మలయాళ భాషలలో సంగీత కళాకారులందరూ పాడగలరు. పొట్టి శ్రీరాములు నిరా హారదీక్ష చేసి మరణించి, తెలుగుకు గుర్తింపు తెచ్చినా, తమిళనాట ఉన్న తెలుగువారు అక్కడే ఉన్నారు తప్ప, అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి రాలేదు.క్రీస్తుపూర్వం నుంచి తెలుగు వారు తమిళ ప్రాంతాలకు వెళ్ళారు. తమిళ నాడుకు తెలుగువారి వలస సా.శ. 6వ శతాబ్దం పల్లవుల రాజ్యపాలన కాలం నుంచి ఉంది. శాతవాహనులు (క్రీ.పూ. 270) 13వ శతాబ్దంలో కాకతీయులు తమిళ నాడును పరిపాలించారు.తమిళనాట చోళ వంశం, తెలుగు రాజ్యమేలుతున్న చాళుక్య వంశం వియ్యం అందుకున్నాయి. దానితో వలసలకు ప్రోత్సాహం లభించింది. ఆ తరువాత కాకతీయుల కాలంలో తమిళనాట తెలుగు రాజ్యానికి మంచి పునాదులు ఏర్పడ్డాయి.15వ శతాబ్దం కృష్ణదేవరాయల ఏలుబడిలో 'తెలుగు వారికి స్వర్ణయుగం' అయింది. నాయక రాజులు, తంజావూరు ప్రాంతాలను పాలించి, తెలుగు సాంస్కృతిక వైభవానికి వన్నె తెచ్చే విధంగా, కవులను కళలను, కళారూపాలను పోషించి ఆదరించారు.తంజావూరును పాలించిన మరాఠా రాజ వంశీయులు 'సాహాజీ'లు కూడా తాము కవులై తెలుగులో యక్షగానాలు రచించారు.తంజావూరుసరస్వతీ గ్రంథాలయం తెలుగువారి సారస్వత భాండాగారంగా పేర్కొనవచ్చు.రెండవ 'సాహజీ' కాలంలో 1810 ప్రాంతాలలో బ్రిటీష్‌వారి సహకారంతో ఈ లైబ్రరీని దర్శించి, అందులో అప్పటికే శిథిలమై పోతున్న అనేక తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేశారు. దాదాపు 10 వేల సంస్కృత తాళపత్ర గ్రంథాలు, 3 వేలకు పైగా తెలుగు సాహిత్య, సంగీత గ్రంథాలు ఇందులో ఉన్నాయి. ఇది మనకు సంబంధించి ఒక 'ప్రాచీననిధి', మన సంపద . తంజావూరు 20 కి.మీ.లలో మేలట్టూరు అనే యక్షగాన నాటక కళాకారులుండే గ్రామం .అక్కడకు 20 కి.మీ.లలో తిరువయ్యూరు ఉన్నాయి. భారతదేశం గర్వించతగ్గ వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి నివసించిన ఊరు అది. అక్కడే కావేరి ఒడ్డున వారి సమాధి ఉన్నాయి.మేలట్టూరు భాగవత నాటకాలు 15వ శతాబ్ది నుంచి ప్రారంభమై, ఇప్పటి వరకు అజరామంగా నిలిచినాయి. కృష్ణదేవరాయ భార్య తిరుమలాంబ నాట్యకత్తె, మేలట్టూరు నివాసి. అందువల్ల వీరు తెలుగులోనే సాహిత్యం రూపొందించుకుని, కర్ణాటక సంగీత బాణీలో, భరతనాట్య సంప్రదాయంలో చక్కటి నాటకశైలిలో నడిచే నృత్య నాటకాలు ప్రదర్శిస్తుంటారు.అచ్యుతప్ప నాయకుడు వీరికి ఆ గ్రామం భరణంగా ఇచ్చారు.1810 ప్రాంతాలలో ఉన్న వేదం వెంకట్రాయశాస్త్రి గారిని వారి నాటకాల ఆధునీకరణకు కారణంగా చెపుతారు.ఈ నాటకాల తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. వారిది పురాతన తెలుగు నాటకశైలి. వీరు తెలుగులో పాడతారు.రాయడం మాత్రం తమిళంలో రాస్తారు. ఈ నాటక సంప్రదాయాన్ని తమిళ ప్రభుత్వం ఆదరించలేకపోవడానికి ఒక కారణం - అవి తెలుగులో ఉండడమే! తమిళంలో మార్చడానికి వీలుపడదు. వెంకట్రామ శాస్త్రిగారి నాటకాలే కన్యాశుల్కానికి ప్రేరణ అని గురజాడవారు పేర్కొన్నారు. మగవారు ఆడవేషం వేసిన, మేలట్టూరు నాటకాలు చూసి, మధురవాణి అనే పాత్రను కన్యాశుల్కానికి నాయకుడిని చేశారు గురజాడవారు. మన సాంస్కృతిక శాఖ ఈ మేల ట్టూరును మనదిగా చేసుకోవలసిన అవసరం ఉంది.త్యాగరాజ సమాధి స్థలం తిరువయ్యూరు తెలుగు గ్రామం. 16వ శతాబ్దపు తంజావూరు సంగీత సోద రులు వెంకట మఖి, క్షేత్రయ్య ఇత్యాదులు త్యాగరాజు కాలానికి పూర్వం అచ్చమైన తెలుగు సంగీత సంప్రదాయానికి పునాదులు వేశారు. త్యాగరాజస్వామి తెలుగులో రాసి, తెలుగుభాషకు ఉన్నతిని చేకూర్చారు.ఆయనకు సరైన స్మృతి నిర్మాణాన్ని చేపట్టి, తెలుగు జాతి ఆయన ఋణం తీర్చుకోవాలి.http://www.prajasakti.com/index.php?srv=10301&id=1020348&title=%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%20%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%9F%E0%B0%BE ---'కళామిత్ర' ఆర్‌. రవిశర్మ, 'నాటక కళ' సంపాదకులు ప్రజాశక్తి 18.12.2013 ఇవి కూడా చూడండి తమిళనాడు ముఖ్యమంత్రులు తమిళనాడు దేవాలయాల జాబితా కరంతై తమిళ సంఘం హేరంబ మలబార్ జిల్లా జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు (భారతదేశం) జోష్నా చినప్ప బయటి లింకులు తమిళనాడు శాసనసభ ఎన్నికలు 2006 తమిళనాడు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు తమిళనాడు పటాలు తమిళనాడు పర్యాటక శాఖా వెబ్ సైటు తమిళనాడులో మానవాభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి నివేదిక టిడ్కో - తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక వీక్షణం తమిళనాడు విశేషాలు ఒక తమిళనాడు పోర్టల్ మూలాలు వెలుపలి లంకెలు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:దక్షిణ భారతదేశం
త్రిపుర
https://te.wikipedia.org/wiki/త్రిపుర
త్రిపుర () ఈశాన్య భారతదేశం లోని రాష్ట్రం. రాష్ట్ర రాజధాని అగర్తాల, ఇక్కడ మాట్లాడే ప్రధాన భాషలు బెంగాళీ, కోక్‌బరోక్. త్రిపుర రాష్ట్ర శాసనసభకు 60 శాసనసభ నియోకవర్గాలు ఉన్నాయి చరిత్ర త్రిపుర స్వాతంత్ర్యానికి మునుపు ఒక రాజ్యంగా ఉండేది. 1949 లో భారతదేశంలో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టణంతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించారు. వీరి రాజ్యం రాజధాని దక్షిణ త్రిపురలో గోమతీ నది తీరాన రంగమతిగా పేరుపొందిన ఉదయపూర్ లో ఉంది. రాజధానిని తొలుత పాత అగర్తాలకు ఆ తర్వాత 19వ శతాబ్దంలో ప్రస్తుత అగర్తాలాకు తరలించబడింది. రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా గణముక్తి పరిషద్ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమ విజయానికి ఫలితంగా త్రిపుర భారతదేశంలో విలీనమైంది. దేశ విభజన తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రంలో ఇప్పుడు బెంగాళీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయం పొందిన వారే) స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనం సాగిస్తున్నారు.1970 దశాబ్దం చివరి నుండి త్రిపురలో సాయుధ ఘర్షణ కొనసాగుతుంది. రాజకీయాలు త్రిపుర రాష్ట్రాన్ని ప్రస్తుతం విప్లవ్ కుమార్ ముఖ్యమంత్రిగా భా.జ.పా పరిపాలిస్తుంది. 1977 వరకు రాష్ట్రాన్ని కాంగ్రేసు పార్టీ పరిపాలించింది. 1978 నుండి 1988 వరకు వామపక్ష కూటమి పరిపాలించి, తిరిగి 1993లో అధికారములోకి వచ్చింది. 1988 నుండి 1993 వరకు భారత జాతీయ కాంగ్రేసు, త్రిపుర ఉపజాతి యుబ సమితి సంకీర్ణ ప్రభుత్వం పాలించింది.2018లో జరిగిన ఎన్నికలలో అప్పటి వరకు ఉన్న వామపక్ష కోటను బద్దలుకొట్టి భాజపా అధికారంలోకి వచ్చింది. మూలాలు బయటి లింకులు త్రిపుర రాష్ట్ర ప్రభుత అధికారిక వెబ్‌సైటు త్రిపుర ఇంఫో.కాం వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు త్రిపుర
ఒడిశా
https://te.wikipedia.org/wiki/ఒడిశా
ఒడిశా () ( పాత పేరు ఒరిస్సా) తూర్పు భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం . దీనికి ఉత్తరాన ఝార్ఖండ్ రాష్ట్రం, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం సముద్రమున్నాయి. ఇది విస్తీర్ణంలో 8 వ అతిపెద్ద రాష్ట్రం, జనాభా ప్రకారం 11 వ అతిపెద్ద రాష్ట్రం. షెడ్యూల్డ్ తెగల జనాభా పరంగా భారతదేశంలో మూడవ స్థానంలో ఉంది. ఉత్తరాన పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హద్దులుగా ఉన్నాయి. బంగాళాఖాతం వెంబడి తీరం ఉంది. ఈ ప్రాంతాన్ని ఉత్కల అని కూడా పిలుస్తారు. ఈ పదం భారతదేశ జాతీయ గీతం " జన గణ మన "లో ప్రస్తావించబడింది. ఒడిశా భాష ఒడియా, ఇది భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటి .https://www.jagranjosh.com/current-affairs/cabinet-approved-odia-as-classical-language-1392954604-1 సా.శ.పూ 261 లో మౌర్య చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధంలో ఖారవేలుడు రాజును ఓడించినా ఖారవేలుడు మరల రాజ్యాన్ని పొందాడు. ఈ యుద్ధం ప్రతీకారవాంఛగల చక్రవర్తి అశోకుడిని బౌద్ధమతం స్వీకరణతో ప్రశాంతుడిగా మార్చడానికి కారణమైంది., అప్పటి ప్రాంతం, ఆధునిక ఒడిశా సరిహద్దులతో సరిపోలుతుంది. బ్రిటిష్ భారత ప్రభుత్వం ఒడిస్సా ప్రావిన్స్ ను 1936 ఏప్రిల్ 1 న స్థాపించబడినప్పుడు ఒడిశా యొక్క ఆధునిక సరిహద్దులను గుర్తించింది. ఇందులో బీహార్, ఒరిస్సా ప్రావిన్స్ లో ఒడియా మాట్లాడే జిల్లాలు ఉన్నాయి. ఏప్రిల్ 1ని ఉత్కల దిబసగా జరుపుకుంటారు. సా.శ. 1135 లో అనంతవర్మన్ చోడగాంగ రాజు కటక్ రాజధానిగా పరిపాలించాడు. తరువాత బ్రిటిష్ శకం వరకు ఈ నగరాన్ని చాలా మంది పాలకులు రాజధానిగా ఉపయోగించారు. ఆ తరువాత భువనేశ్వర్ ఒడిశా రాజధాని అయ్యింది. ఒడిశా ఆర్థిక స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ₹ 5.33 లక్షల కోట్లు, తలసరి స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ₹ 116.614 గా భారతదేశం లో16 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల రాష్ట్రంగా,ుంది.. మానవ అభివృద్ధి సూచికలో ఒడిశా భారత రాష్ట్రాలలో 32 వ స్థానంలో ఉంది. కోణార్క, పూరి, భువనేశ్వర్లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు. భౌగోళికం ఒడిశా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివసిస్తున్నారు. తూర్పు కనుమలకు, సముద్రానికి మధ్యభాగంలోని మైదాన ప్రాంతం సారవంతమైన వ్వవసాయభూమి. తీరప్రాంత మైదానాలు ప్రధాన జనావాసకేంద్రాలు. మహానది, బ్రాహ్మణి నది, బైతరణి నది డెల్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తీర రేఖ తిన్నగా (చీలకుండా) ఉండడంవల్ల మంచి నౌకాశ్రయాలకు అవకాశంలేదు. ఒక్క పరదీప్ మాత్రం నౌకలకు అనుకూలమైనది. తీర ప్రాంతాలు, మహానది డెల్టా సారవంతమైన నేలలు. సక్రమంగా మంచి వర్షపాతం ఉండడంవల్ల ఏటా రెండు వరి పంటలు పండుతాయి. బంగాళాఖాతంలో జనించే తుఫానుల తాకిడికి ఒరిస్సా తీరప్రాంతం తరచు నష్టపోతూ ఉంటుంది. 1999 అక్టోబరులో వచ్చిన తుఫాను వల్ల 10,000 మంది మరణించాఱు. తీవ్రమైన నష్టం వాటిల్లింది చరిత్ర thumb|ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఒడిశా ఎక్కువ కాలం ఒడిశా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉంది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు. మురుంద వంశము మరాఠ వంశము నల వంశము విగ్రహ, ముద్గల వంశము శైలోద్భవ వంశము భౌమకార వంశము నందోద్భవ వంశము సోమవంశి వంశము తూర్పు గంగుల వంశము సూర్య వంశి వంశము ( vaddi,od,vadde rajulu) ముస్లిం దండయాత్రల ప్రధానమార్గానికి ప్రక్కగా ఉన్నందువల్లా, కొద్ది దండయాత్రలకు బలమైన ప్రతిఘటన చేయగలగడం వల్లా ఈ ప్రాంతం చాలా కాలం మహమ్మదీయుల పాలనలోకి రాలేదు. కాని 1568లో ముఘల్ సామ్రాజ్యంలో కలుపబడింది. ముఘల్ రాజుల పతనం తరువాత ఒడిశాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో బీహారులో కొంతభాగం చేర్చి ఒడిశా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒడిశా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది. 1950లో ఒరిస్సా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. 2011 నవంబరు 4 న ఈ రాష్ట్రం యొక్క పేరును ఒడిశాగా మార్చారు. సంస్కృతి ఒడియా అధికారిక భాష. ఒడిశాలో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నమైనది. భువనేశ్వర్ లో మందిరాలు, పూరీ రథయాత్ర, పిపిలి హస్తకళలు, కటక్ వెండినగిషీలు, పట చిత్రాలు, వివిధ ఆదిమవాసుల (కొండజాతుల) వారి కళలు, ఆచారాలు - ఇవన్నీ ఒడిశా సాంస్కృతిక ప్రతీకలు. జన విస్తరణ thumb|ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని షెడ్యూల్డు తెగల ప్రజలు ఒడిశా జనాభాలో దాదాపు 24% వరకు ఆదిమవాసులు. ఇది చాలా రాష్ట్రాలకంటే ఎక్కువ. 87% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఎక్కువ భూమి కొద్ది మంది అధినంలో ఉండడంవలనా, అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసి ప్రాంతాలకు విస్తరిచకపోవడం వలనా ఒరిస్సాలో పేదరికం బాగా ఎక్కువనే చెప్పవచ్చును. 24% వరకు ఉన్న ఆదివాసజనులలో 62 వివిధ తెగలున్నాయి. వీరి జీవనవిధానం వన్య సంపద కేంద్రంగా ఉంటుంది. రైల్వేలు, ఆనకట్టలు, ఖనిజాల త్రవ్వకం వంటి ఆధునిక కార్యక్రమాలు వీరి బ్రతుకుతెరువును దుర్భరంచేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. 16% వరకు ఉన్న దళితులు దేశమంతటా ఉన్న సామాజిక వివక్షతల్ల, ఆర్థిక అసమానతల వల్ల బాగా వెనుకబడి ఉన్నారు. ఒడిశాలో శిశుమరణాలు 1000 కి 97. ఇది దేశంలో బాగా అధికం. 60% పైగాజనులకు సరైన సదుపాయాలు (నీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇల్లు వంటివి) అందుబాటులోలేవు. వీటికి తోడు తుఫానులు, వరదలు, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాలు ఒడిశా అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకులు. క్రీడాకారులు ప్రమోద్‌ భగత్‌: అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పర్యాటక స్థలాలు రాజధాని భువనేశ్వర్: మందిరాల నగరమని దీనికి పేరు. ఇక్కడ సుమారు 1000 మందిరాలున్నాయి. పూరి: జగత్ప్రసిద్ధమైన జగన్నాధ మందిరం ఉంది. జగన్నాధ రధయాత్ర ఏటా ఒక ముఖ్యమైన ఉత్సవం. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రలను ఊరేగించే ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు హాజరవుతారు. కోణార్క సూర్య మందిరం - ఒరిస్సా శిల్పకళా నైపుణ్యానికి, నిర్మాణకౌశలానికి ఒక చక్కని తార్కాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరంలోని శిల్పాలలో ఆనాటి సాంస్కృతిక జీవన విధానం ప్రతిబింబిస్తుంది. thumb|Stone work at Konark చిల్కా సరస్సు: మహానది ముఖద్వారానికి దక్షిణాన ఉన్న ఉప్పునీటి సరస్సు. ఎన్నో విధాల పక్షులకు ఆవాసం. రక్షితవనం. ఇక్కడ దాదాపు 150 జాతుల పక్షులు వలసకు వస్తుంటాయి. చర్చికా మాత మందిరం: రేణుకా నది ఒడ్డున రుచికా పర్వతంపై, బంకి వద్ద, సుందర ప్రకృతి సౌందర్యానికి దీటుగా నిర్మింపబడ్డ మందిరం. కటక్ కు 52 కి.మీ., భువనేశ్వర్ కు 60 కి.మీ. దూరంలో ఉంది. సునాదేయి మందిరం: మహానది ఒడ్డున ఉంది. వలస పక్షులకు ఆవాసం కూడాను. పిక్నిక్ లకు జనప్రియమైనది. రాజకీయాలు ఒడిశా రాష్ట్రపాలన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పాలనా విధానాన్ని అనుసరించే ఉంటుంది (గవర్నరు, ముఖ్య మంత్రి, కాబినెట్, అసెంబ్లీ మొదలగునవి) రాజకీయ నాయకులు నందిని శతపథి బిజు పట్నాయక్ హేమానంద బిశ్వాల్ నవీన్ పట్నాయక్ ఆర్థిక పరిస్థితి ఒడిశా ఆర్థిక స్థితికి ముఖ్యమైన వనరులు: మహానది డెల్టాలో పండే వరి. మంచి ఖనిజ నిక్షేపాలు - ముఖ్యంగా బొగ్గు, ఇనుము, మైకా, మాంగనీసు. తూర్పు కనుమలలో లభించే కలప. అటవీ ఉత్పత్తులు. కొన్ని గణాంకాలు: అభివృద్ధి రేటు 4.3 % (భారతదేశం సగటు 6.7 %) మొత్తం స్థూల ఉత్పత్తిలో వ్వసాయం పాలు 32% . మొత్తం జనాభాలో 62% వ్యసాయ పనులపై ఆధారపడి ఉన్నారు. సుమారు 1,75,000 మంది దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారు అక్షరాస్యత 50% (భారతదేశం సగటు 66%) జిల్లాలు ఇవికూడా చూడండి ఒరియా సురేంద్రనాథ్ ద్వివేది సారంగధర్ దాస్ మూలాలు బయటి లింకులు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైటు భారత ప్రభుత్వం వెబ్ సైటు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా శాఖ వెబ్ సైటు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు
తెలుగు భాష
https://te.wikipedia.org/wiki/తెలుగు_భాష
దారిమార్పుతెలుగు
కన్నడ భాష
https://te.wikipedia.org/wiki/కన్నడ_భాష
thumb|కన్నడ మాట్లాడతారు సిరిగన్నడగా పేరొందిన కన్నడ ( ಕನ್ನಡ) పురాతన ద్రావిడ భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక యొక్క అధికార భాష. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ్ ల తర్వాత అత్యధిక మంది ప్రజలు కన్నడ భాషను మాట్లాడుతారు. భాష కన్నడ భాష దాదాపుగా 2500 సంవత్సరములుగా మాట్లాడబడుచున్నది, దాని లిపి 1900 సంవత్సరములుగా వాడుకలో ఉంది. కన్నడ మూడు విధముల భేదములకు లోబడి ఉన్నది - అవి లింగ, సంఖ్య కాల భేదములు. thumb|150px|'కన్నడ భావుటా' - కన్నడ పతాకము ఈ భాషలో మౌఖిక, లిఖిత రూపములలో నిర్ధిష్టమైన తేడా ఉన్నది వ్యావహారిక భాష ప్రాంతము నుండి ప్రాంతమునకు మార్పు చెందును. వ్రాతపూర్వక భాష చాలావరకు కర్ణాటక ప్రాంతమంతా ఇంచుమించు ఒకలానే ఉంటుంది కానీ వ్యావహారిక భాషలో సుమారుగా 20 మాండలికాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొడవ (కూర్గ్ జిల్లాలో), కుండా (కుండపురా లో) హవ్యాక (ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ, సాగర, ఉడుపి లోని హవ్యక బ్రాహ్మణులది), అరెభాషె (దక్షిణ కర్ణాటక లోని సుళ్య ప్రాంతము), సోలిగ కన్నడ, బడగ కన్నడ, కలబురగి (గుల్బర్గా) కన్నడ, హుబ్బళ్ళి కన్నడ మొదలుగునవి. ఒక సమీక్ష ప్రకారం, భారత దేశంలోని ఆదళిత భాషాలల్లో అత్యధిక మాండలికం (Dialect) లలో మాట్లాడే భాషాలల్లో కన్నడ భాష అగ్రస్థానంలో ఉంది. right|thumb|250px|వికిపీడియాలో కన్నడ భౌగోళిక వ్యాప్తి కన్నడ భాషను ప్రధానముగా భారతదేశము లోని కర్ణాటక రాష్ట్రములో, అల్ప సంఖ్యలో ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ,, తమిళునాడు, కేరళ, మహారాష్ట్రలో మాట్లాడుతారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డం, కెనడాలలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్నారు. right|thumb|250px|A Kannada language sign board అధికారిక స్థాయి కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష, భారతదేశపు 22 అధికార భాషలలో ఒకటి. కన్నడ లిపి కన్నడ అక్షరమాలను ఇక్కడ చూడండి కన్నడ భాషలో 32 అక్షరాలు ఉన్నాయి. సంస్కృతము వ్రాయడానికి 16 అక్షరాలు ఉన్నాయి. తమిళం లాగే కన్నడలో కూడా మాహాప్రాణాక్షరాలు ప్రజలు పలుకరు. కేవలం బరహంలో దీన్ని వాడుతారు. కన్నడ లిపి కదంబ లిపినుంది ఉద్భవించింది. ఇతర భారతీయ భాషలలాగే ఒత్తులతో కూడి మూల అక్షరాలు అనేక ద్విత్వాక్షరాలు ఏర్పడటము వలన లిపి కొంత సంక్లిష్టమైనదే. మూలాక్షరాలు 52 అయినా అనేక గుణింతాలు, వత్తులతో కలిపి అనేక అక్షరాలు యేర్పడతాయి. లిప్యాంతరీకరణ ప్రామాణిక కీబోర్డు ఉపయోగించి కన్నడ అక్షరాలను టైప్ చేయడానికి అనేక లిప్యాంతరీకరణ పద్ధతులు ఉన్నాయి. అందులో ఐట్రాన్స్ పై అధారితమైన బరాహ, కర్ణాటక ప్రభుత్వ కన్నడ లిప్యాంతరీకరణ ప్రామాణికమైన నుడి ముఖ్యమైనవి. కొన్ని విశేషాలు భారతీయ భాషలలో తొట్టతొలి విజ్ఞానసర్వస్వము కన్నడ భాషలో వెలువొందినదని భావిస్తారు. అది తరువాత శివతత్వరత్నాకరమనే పేరిట సంస్కృతములోకి అనువదించబడింది. ఇవికూడా చూడండి కన్నడ సాహిత్యము భారతీయ భాషలు ద్రావిడ భాషలు అరవింద్ మాలగట్టి తరచూ వాడే కొన్ని వాక్యాలు నమస్కారము: నమస్కార, శరణు, తుళిలు వందనము: వందనెగళు దయచేసి: దయవిట్టు, దయమాడి ధన్యవాదము: ధన్యవాద, నన్నిగళు క్షమించండి: క్షమిసి, మన్నిసి అది: అదు ఎంత?: ఎష్టు అవును: హౌదు లేదు: ఇల్ల నాకు అర్ధం కాలేదు: ననగే తిళియలిల్ల మరుగు దొడ్డి ఎక్కడుంది?: బచ్చలు మనే ఎల్లిదే ? మీకు ఆంగ్లము తెలుసా?: తావు ఆంగ్ల నుడి బల్లిరా ? కర్ణాటకకు స్వాగతము!: కర్ణాటకక్కే నల్బరువు! కన్నడ నేర్చుకొనుట సహాయక గ్రంథాలు right|thumb| కన్నడ స్వయం బోధిని కన్నడ స్వయం బోధిని, కన్నడ అభివృద్ధి ప్రాధికార, బెంగళూరు, ఆంగ్ల మూలం:లింగదేవర హళెమనె, అనువాదం: జిఎస్ మోహన్, 2003 బయటి లింకులు కన్నడ భాషపై ఎథ్నోలాగ్ నివేదిక కన్నడ భాష యొక్క వర్ణన అధికారిక కన్నడ యూనీకోడ్ పటము కన్నడ భాషా చరిత్ర , సాహిత్యం కన్నడ నేర్చుకోండి (అడియోతో సహా) కన్నడ నేర్చుకోండి కన్నడలో మౌళిక వాక్యాలు కన్నడ లిప్యాంతరీకరణ పరికరం వర్గం:ద్రావిడ భాషలు వర్గం:భారతీయ భాషలు
ఒడియా భాష
https://te.wikipedia.org/wiki/ఒడియా_భాష
thumb|ఒడియా వర్ణమాల ఉచ్చారణ.|250x250px ఒరియా (ଓଡ଼ିଆ ), భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భారతీయ భాష. ఒరియా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వం తూర్పు భారతదేశంలో మట్లాడుతున్న మాగధి లేదా పాళీ అనే ప్రాకృత భాష నుండి నేరుగా ఉద్భవించిందని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన బెంగాళీ, అహోమియా (అస్సామీ) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై పర్షియన్, అరబిక్ భాషల ప్రభావం చాలా స్వల్పం. thumb|ఒడియా లిపిలో "ఒడియా" అనే మాట|250x250px ఒరియాకు 13వ శతాబ్దం నుండి ఘనమైన సాహితీ వారసత్వం ఉంది. 14వ శతాబ్దంలో నివసించిన సరళ దాస్, ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు.15వ, 16వ శతాబ్దాలలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవంలోకి వచ్చాయి. ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన కవులలో ఉపేంద్ర భంజ ఒకడు. ఆధునిక యుగంలో ఒరియాలో విశిష్ట రచనలు చేసిన వారిలో ఫకీర్ మోహన్ సేనాపతి, మనోజ్ దాస్, కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు. ఒరియా సాంప్రదాయకంగా బౌద్ధ, జైన మతాలచే ప్రభావితమైంది. ఒరియాను ఒరియా లిపిలో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు. మూలాలు బయటి లింకులు ఒడియా.ఆర్గ్, ఒరియా వార్తలు ‌రోమన్ లిపి నుండి ఒరియా యూనికోడ్ ట్రాన్స్‌లిటరేటర్ వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు వర్గం:భారతీయ భాషలు
నేపాలీ భాష
https://te.wikipedia.org/wiki/నేపాలీ_భాష
thumb|దేవనాగరి లిపిలో "నేపాలీ" అనే మాట thumb|నేపాలీ స్పీకర్, మయన్మార్‌లో రికార్డ్ చేయబడింది. నేపాలీ () ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. నేపాలీ భాషను నేపాల్, ఇండియా, భూటాన్, కొంత భాగము బర్మా దేశాలలో మట్లాడతారు. ఇది నేపాల్, భారత దేశాలలో అధికార భాష. నేపాల్లో దాదాపు సగ భాగము ప్రజలు నేపాలీని మాతృభాషగా మాట్లాడతారు. ఇంకా చాలా మంది నేపాలీలు ద్వితీయ భాషగా మట్లాడతారు. నేపాలీ తమ భాషను ఖస్కూరా అని పిలుచుకుంటారు. ఇదేకాక అనేక పేర్లతో చలామణి అవుతుంది. ఆంగ్లములో సాధారణంగా నేపాల్ కు చెందిన భాష కాబట్టి నేపాలీ లేదా నేపాలీస్ అని అంటారు. ఖస్కూరాను గోర్ఖాలీ లేదా గుర్ఖాలీ (గూర్ఖాల భాష), పర్బతీయ (పర్వత ప్రాంతాల భాష) అని కూడా అంటారు. హిమాలయ పర్వత సానువులలో తూర్పు నేపాల్ నుండి భారత రాష్ట్రాలైన ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ వరకు మాట్లాడే పహారీ భాషలలో నేపాలీ అన్నిటికంటే ప్రాచ్యమైనది. నేపాలీ అనేక టిబెటో-బర్మన్ భాషలకు, ప్రత్యేకముగా నేవారీ భాషకు సన్నిహితముగా అభివృద్ధి చెందినది. అందువలన నేపాలీపై టిబెటో-బర్మన్ ప్రభావాలు కనిపిస్తాయి. నేపాలీ భాషా హిందీకి చాల దగ్గరి బంధువు. అయితే నేపాలీ హిందీ కంటే కొంచెము సాంప్రదాయబద్ధమైంది. పర్షియన్, ఆంగ్ల పదాలు అరువుతెచ్చుకోకుండా సంస్కృతము నుండి అభివృద్ధి చెందిన పదాలు ఎక్కువగా ఉపయోగించబడినవి. ప్రస్తుతం నేపాలీ, దేవనాగరి లిపిలో రాయబడుతున్నది. నేపాల్లోనే అభివృద్ధి చెందిన భుజిమోల్ అనే పాతలిపి కూడా ఉంది. 19వ శతాబ్దము రెండవ అర్ధభాగములో నేపాలీ కొంత సాహిత్యము సంతరించుకొన్నది. అందులో చెప్పుకోదగినవి 1833లో సుందరానంద బారా రచించిన ఆధ్యాత్మ రామాయణ, ఒక అజ్ఞాత జానపదా కథల సంపుటి అయిన బీర్‌సిక్కా, భానుభక్త రచించిన రామాయణ. ఇవే కాక అనేక సంస్కృత గ్రంథాలు, ఒక బైబిల్ సంపుటి నేపాలీలోకి అనువదించబడినవి. కొన్ని నేపాలీ వాక్యాల ఉదాహరణలు: నమస్తే. नमस्ते - నమస్కారము మేరో నాం అలోక్ హొ.मेरो नाम आलोक हो -- నా పేరు అలోక్. ఖానా ఖానే థావూ కహా ఛా? खाना खाने ठाउँ कहाँ छ? -- (ఇక్కడ) తిండి తినే ప్రదేశము ఎక్కడ ఉంది? కాట్మండూ జానే బాటో ధేరై లామో ఛా. काठमाडौँ जाने बाटो धेरै लामो छ -- కాట్మండూ వెళ్లే దారి చాలా దూరము నేపాల్మా బనేకొ नेपालमा बनेको -- నేపాల్లో తయారయ్యింది. మా నేపాలీ హూ म नेपाली हूँ—నేను నేపాల్ వాన్ని పుగ్యో पुग्यो — వచ్చేసినది/ఇక చాలు వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు వర్గం:భారతీయ భాషలు వర్గం:భూటాన్ భాషలు వర్గం:నేపాల్ భాషలు
మలయాళం
https://te.wikipedia.org/wiki/మలయాళం
మలయాళం, (മലയാളം) దక్షిణ భారతదేశం లోని కేరళ రాష్ట్రములో అధికార భాష. నాల్గున్నర కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశ 22 అధికార భాషలలో ఒకటి. మలయాళం మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల తర్వాత మలయాళం అత్యధిక మంది ప్రజలు మాట్లాడుతారు. మలయాళం ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. మట్లాడే భాష, రాసే విధానం రెండూ తమిళ భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. మలయాళానికి సొంత లిపి ఉంది. భాషా పరిణామం thumb|తాళపత్రాలపై మలయాళ భాష |300x300px మలయాళం దక్షిణ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన నవీన భాష. తమిళం, కన్నడం, కోట, కోడగు భాషలు కూడా ఈ భాషా ఉపకుటుంబానికి చెందినవే. వీటిలో తమిళానికి మలయాళంతో పోలిక ఎక్కువ. తమిళ, మలయాళ భాషలకు మూలమైన ఆది తమిళ-మలయాళ భాష తొమ్మిదొ శతాబ్దం నుండి వేర్పడటం ప్రారంభమై ఆ తరువాత నాలుగైదు శతాబ్దాలుగా రెండుగా చీలిపోయిందని నమ్మకం. అలా మలయాళం తమిళం నుండి వేరుపడి స్వతంత్ర భాషగా వెలసింది. మలయాళం అవతరించిన తొలి దశలలో తమిళం అధికార భాష , పండిత భాష కావడం వల్ల దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మలయాళ సమాజంలో బ్రాహ్మణుల రాకతో భాష మీద సంస్కృత ప్రభావం హెచ్చింది. కానీ సంస్కృత ప్రభావంలేని కోదుం మలయాళం అను స్వచ్ఛమైన మలయాళ మాండలికం ఇప్పటికీ కేరళలోని కొన్ని చోట్ల వ్యవహరంలో ఉంది. నంబూద్రీలు కేరళ సాంస్కృతిక జీవితంలో అడుగుపెట్టడం, అరబ్బుల వర్తక సంబంధాలు, కేరళపై పోర్చుగీసు దండయాత్ర, సామంతరాజ్యాల స్థాపన అనేక రోమాన్స్, సెమెటిక్ , ఇండో-ఆర్యన్ భాషాగుణాలు మలయాళ భాషలో ఇమిడిపోవడానికి దోహదం చేశాయి. సాహిత్య అభివృద్ధి మలయాళంలో లభ్యమైన ప్రప్రథమ లిఖిత ఆధారం సా.శ. 830కి చెందిన వాయప్పళ్లి శాసనం. ఆది మలయాళ సాహిత్యాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి తమిళ పట్టు రీతిలో కృతులు సంస్కృత సాంప్రదాయంలో మణిప్రవాలం కృతులు మలయాళంలో జానపద గేయాలు ఇరవైయవ శతాబ్దం చివరి వరకు మలయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి. ప్రస్తుతము లభ్యమవుతున్న అతి ప్రాచీన మలయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్త్రం పై సరళ మలయాళంలో వ్రాయబడిన వ్యాఖ్యానం. విభిన్న కాలాల మలయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. అలా ప్రభావితం చేసిన భాషలు తమిళం, సంస్కృతం, ప్రాకృతం, పాళీ, హీబ్రూ, హిందీ, ఉర్దూ, అరబిక్, పర్షియన్, సిరియాక్, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచి , ఆంగ్లం. ప్రస్తుత మలయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు , సాహిత్య విమర్శలు విరివిగా ఉన్నాయి. 20వ శతాబ్ది తొలినాళ్ళలో సాహిత్య పునరుజ్జీవన యుగవైతాళికులుగా మహాకవిత్రయం ఆవిర్భవించింది. ఆ మహాకవిత్రయం కుమారన్, ఆశాన్, వళ్ళత్తోళ్ నారాయణ మీనన్, ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్‌లు. లిపి మలయాళ అక్షరమాల చూడండి అఖిల భారత బ్రాహ్మీ లిపి నుండి గ్రంథి లిపి ద్వారా వట్టెఱుతు (గుండ్రపాటి వ్రాత) గా మలయాళ లిపి ౧౩వ శతాబ్దంలో అవతరించింది. తెలుగులాగా మలయాళ లిపి కూడా syllabic గా ఉంటుంది, అంటే వీరు కూడా సంయుక్తాక్షరాలుగా వ్రాస్తారు. ౧౯౬౦లో మలయాళంలోని వివిధ స్వల్పంగా వాడే సంయుక్త పదములకు గల ప్రత్యేక అక్షరాలు తొలగించబడినవి. అలాగే అన్ని హచ్చులతోను ఉకారం ఒకేలాగా ప్రవర్తంచేలా చేసారు. ఉదాహరణకు అంతకు ముందు 'కు'లో ఉవత్తు 'గు'లో ఉవత్తు వేరేలా ఉండేవి. మలయాళంలో ప్రస్తుతం ౫౩ అక్షరాలు ఉన్నాయు. వీటిలో ౨౦ అచ్చులు, మిగిలినవి హల్లులు. ౧౯౮౧లో కొత్త వ్రాత పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఈ కొత్త పద్ధతి typeset లోని మొత్తం అక్షరాలను ౯౦౦ల నుండి ౯౦కి తగ్గించింది. ఇలా చేయడం వలన మలయాళ లిపి టైపురైటర్ల మీద కంప్యూటర్ కీబోర్డుల మీద ఇమడగలిగింది. ౧౯౯౯లో చిత్రజకుమార్ , కేహెచ్ హుస్సేన్ స్థాపించిన 'రచన అక్షర వేది' అనే సంస్థ మెత్తం ౯౦౦లకు పైబడి సంయుక్తాక్షరాలు గల ఫాంటులను తిరువనంతపురంలో విడుదల చేసింది. దీనితో బాటు ఒక editor software ను కూడా విడుదల చేసారు. ఇక ౨౦౦౪లో వీటినే ఫ్రీ సాఫ్టవేర్ ఫౌండేషన్, రిచర్డ్ స్టాల్మన్ GNU License క్రింద కొచ్చిన్లో విడుదల చేసారు. భాషలో అంతరాలు, బయటి ప్రభావాలు ప్రాంతం, కులం, వృత్తి, సామాజిక స్థాయి, శైలి , register లను బట్టి ఉచ్ఛారణా పద్ధతులు, vocabulary, and distribution of grammatical and phonological elements లో తారతమ్యాలు కనిపిస్తాయి. సంస్కృతం యొక్క ప్రభావం బ్రాహ్మణ మాండలికాలలో అధికంగాను, హరిజన మాండలికాలలో అత్యల్పంగానూ ఉంటుంది. ఆంగ్లం, సిరియాక్, లాటిన్ , పోర్చుగీసు భాషల నుండి అరువుతెచ్చుకున్న పదాలు క్రైస్తవ మాండలికంలోనూ, అరబిక్ , ఉర్దూ పదాలు ముస్లిం మాండలికంలో విరివిగా కనిపిస్తాయి. మలయాళం సంస్కృతం నుండి వేలకొద్ది నామవాచకాలు, వందలాది క్రియాపదాలు , కొన్ని indeclinables అరువుతెచ్చుకున్నది. కొన్ని పదాలు సంస్కృతం నుంచి మలయాళ భాషకు చేరుకున్నాయ్యి. సంస్కృతం తర్వాత మలయాళ భాషను అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఆంగ్లం. ఆధునిక మలయాళ భాషలోని వందలాది individual lexical items and many idiomatic expressions ఆంగ్లభాషా సమన్వితాలే. ప్రణాళిక , అభివృద్ధి అధికార భాషగా , పాఠశాలలు, కళాశాలలో బోధనా మాధ్యమంగా మలయాళం అభివృద్ధి చెందుతున్నది. భాషలో శాస్త్రీయ పరిభాష నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నది. ఉదార స్వభావులైన మలయాళీలు తమ భాషతో సహా ఇతరభాషలు సహజీవనం సాగించడానికి ఎల్లప్పుడూ ఆహ్వానించారు. ఇతర భాషలతో జరిగిన ఈ పరస్పరలే మలయాళ భాష యొక్క వృద్ధి అనేక రీతులలో దోహదం చేశాయి. చూడండి The lists of Malayalam words and words of Malayalam origin at Wiktionary, the free dictionary and Wikipedia's sibling project కేరళ ఒయరతు చందు మీనన్ ఒట్టపాలెం బయటి లింకులు Information on Malayalam language at Department of Public Relations, Government of Kerala Unicode Code Chart for Malayalam (PDF Format) Ethnologue report for Malayalam Malayalam Dictionary by Unicode Malayalam Online Dictionary Romanised to Unicode Malayalam transliterator మూలాలు వర్గం:ద్రావిడ భాషలు వర్గం:భారతీయ భాషలు
బంగ్లా భాష
https://te.wikipedia.org/wiki/బంగ్లా_భాష
బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ, సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి, స్థాయి ఉన్నాయి. బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత బంగ్లాదేశ్, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ లేదా 6వ స్థానములో ఉన్నది). బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష. thumb|1400 సంవత్సరంలో వెండి నాణేలపై ముద్రించిన బెంగాలీ భాష మూలాలు ఎన్గ్
హిందీ
https://te.wikipedia.org/wiki/హిందీ
right|thumb|300px|Hindi speaking areas in India హిందీ భాష (దేవనాగరి: हिन्दी) ఉత్తర, మధ్య భారతదేశములో మాట్లాడే ఒక భాష. అనేక మంది హిందీయేతర భారతీయులు కూడా భ్రమ పడుతున్నట్లుగా హిందీ భారతదేశ జాతీయ భాష (దేశ భాష) కానే కాదు. దేశ భాష అనే హోదాను రాజ్యాంగం ఏ భాషకూ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ దేశం వివిధ సంస్కృతులు, భాషలు కలిగిన అనేక రాజ్యాల కలయిక. ఇండో-ఆర్యన్ ఉప కుటుంబానికి చెందిన ఇండో-యూరోపియన్ భాష. మధ్యయుగమునకు చెందిన ప్రాకృత మధ్య యుగపు ఇండో-ఆర్యన్ భాషల నుండి, పరోక్షంగా సంస్కృతము నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి పొందింది. ఉత్త్రర భారతదేశములో ముస్లిం ప్రభావము వలన పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక ("శుద్ధ") హిందీ ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా రకాలుగా ఉండే హిందుస్తానీ భాష రకము. బాలీవుడ్ సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును. భాషా శాస్త్రజ్ఞులు హిందీ, ఉర్దూ లను, ఒకటే భాష కానీ హిందీను దేవనాగరి లిపిలోను, ఉర్దూను పర్షియన్ లిపిలోను వ్రాయడము మాత్రమే తేడా అని భావిస్తారు. భారత విభజనకు ముందు హిందీ, ఉర్దూలను ఒకటే భాషగా భావించేవారు కాబట్టి ఈ తేడా చాలా మటుకు రాజకీయము అని కూడా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ రెండు అధికార భాషల్లో హిందీ ఒకటి. కేంద్ర ప్రభుత్వంలో ఆంగ్లాన్ని కూడా తొలగించి హిందీని మాత్రమే దేశమంతటా ఉపయోగించేలా చేయాలని తొలుత రాజ్యాంగంలోనే రాసినా, ఇందుకు హిందీయేతర భారతీయులు ఒప్పుకోకపోతుండటంతో ఆ లక్ష్యం ఇప్పటికైతే నేరవేరలేదు. అయితే అఖిల భారత స్థాయిలో ఎంపికలు జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీ వాళ్ళకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనీ, దీనికి కారణం అనేక రకాల పరీక్షలను కేవలం ఇంగ్లీషు, హిందీల్లో మాత్రమే పెడుతుండటమేననే ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నవైనప్పటికీ వాటిలో ఉద్యోగాలకైతే ఆంగ్లంతోపాటు హిందీ కూడా రావడం తప్పనిసరి చేశారు. దీంతో అలాంటి సంస్థల్లోనైతే అత్యధిక శాతం ఉద్యోగాలు కేవలం హిందీ వాళ్ళకే దక్కుతున్నాయని హిందీయేతర భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ పద్ధతి మారాలని సామాజిక మాధ్యమాల్లో యువత పోస్టులు పెట్టడం ఈమధ్య సాధారణమైపోతోంది. హిందీ సాహిత్యం హిందీ సాహిత్య చరిత్రలో సా.శ. 1318 నుండి 1643 వరకు భక్తి యుగంగా ఆచార్య రామచంద్ర శుక్లా భావించారు. వీరిలో రామ భక్తులు కొందరు కాగా మరికొందరు కృష్ణ భక్తులు. రామభక్తులు తులసీదాసు నొ మమెస్ ఉఎ పెదొ చొన్ ఎస్త ఎస్చ్రితుర మనీచ అగ్రదాసు నాబాధాసు సేనాపతి కేశవదాసు కృష్ణభక్తులు సూరదాసు తెలుగు భాషలో ఉన్న హిందీ పదములు నాజూకు - హి.నాజూక్ (సన్నగా, వయ్యారంగా) బే, భయ్యా, భాయ్, భాయి, భే - హి.బే, భయ్యా, భాయ్, భాయి, భే (అన్న, అన్నయ్య, తమ్ముడు) ఇవీ చూడండి ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ వర్గం:హిందీ భాష వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు వర్గం:భారతీయ భాషలు
అస్సామీ భాష
https://te.wikipedia.org/wiki/అస్సామీ_భాష
Assamese (অসমীয়া) or Asamiya or Oxomiyaగా పేరొందిన ఈ భాష ఈశాన్య భారత దేశంలో గల అస్సాం రాష్ట్రంలో మాట్లాడే భాష. ఇది అస్సాం రాష్ట్ర భాష. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో, మరికొన్ని ఈశాన్య భారత దేశంలోని రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఈ భాష ఉపయోగంలో ఉంది. కొంతమంది అస్సామీలు భూటాన్, బంగ్లాదేశ్ లలో కూడా ఉన్నారు. ప్రవాసులు తమతో భాషను ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళారు. ఇండో యూరోపియన్ భాషలలో అత్యంత తూర్పులో మాట్లాడే భాష అస్సామీనే. ఈ భాష సుమారుగా 2 కోట్ల మంది మాట్లాడుతారు అస్సామీ కూర్పు thumb|రుద్ర సింఘా హయాంలో అసామీస్ ఇంకా సంస్కృత భాషలతో ముద్రించిన నాణేలు మగధి ప్రాకృతము ఏకాదిగా అస్సామీ, బెంగాలీ, ఒరియా భాషలు అవిర్భవించాయి. మగధి ప్రాకృతము అపభ్రంశ భాషకు తూర్పు శాఖ. అస్సామీ లిపిలో లభ్యమైన మొట్ట మొదటి వ్రాత ప్రతులు ఆరు లేక ఏడవ శతాబ్దానికి చెందినవి. అప్పుడు కామరూప వర్మన్ రాజుల పరిపాలనలో ఉండేది. (ఇప్పటి అస్సాం రాష్ట్రం లోని చాలా భాగం అప్పటి కామరూప రాజ్యంలో భాగమై ఉండేది). అస్సామీ భాష గుర్తులు 9 వ శతాబ్ధానికి చెందిన 'చర్యపద' లో కనిపిస్తాయి. చర్యపద బౌద్ధ శ్లోకాలు 1911 లో నేపాల్లో కనుగొనబడ్డాయి, ఇవి అపభ్రంశ కాలంతమున వచ్చినవి. అస్సామీ భాష తొలి ఉదాహరణలు కమత రాజైన దుర్లభ నారాయణ కాలం 14 వ శతాబ్ధ తొలి రోజుల్లో కనిపిస్తాయి. చర్యపద తర్వాత అస్సామీ భాష పై టిబెటో-బర్మన్, ఆస్ట్రిక్ భాషా కుంటబాల ప్రభావంతో, ఆ భాషకు characteristic expressiveness మరియూ రమణీయతనును సమకూర్చాయి. లేఖనా సంప్రదాయం అస్సామీలో బలమైన లేఖనా సంప్రదాయము చరిత్రలో చాల ముందునుంచీ గమనించబడింది. ఉదాహరణలు, శాసనములలోను, భూమి పట్టాలలోను, మధ్య యుగ రాజులు వేయించిన రాగి ఫలకాలలోను కనుగొనవచ్చు. అస్సాంలో ధార్మిక, చారిత్రక గ్రంథాలు, కామరూపి గ్రంథాలు సాంచీ చెట్టు యొక్క బెరడు మీద వ్రాయబడినవి. అస్సామీ లిపికి, నగరిలిపితో దగ్గరి సంబంధాలు కనిపిస్తాయి. నగరి, హిందీ భాష ఉపయోగించే తొలి రూపలలోనిది. ప్రస్తుత ప్రమాణీకరించబడిన అస్సామీ లిపి ప్రమాణిక బెంగాలీ లిపిని కొద్దిపాటి మార్పులతో తీసుకోబడింది. అస్సామీ పూర్తిగా ధ్వన్యానుగుణంగా వ్రాయబడే భాష కాదు. కానీ రెండవ అస్సామీ నిఘంటువు అయిన హెమ్ కొహ్, అక్షరాలను వ్రాసే విధం (స్పెల్లింగ్) ను సంస్కృతాధారంగా ప్రమాణీకరించింది. మాండలీకాలు ప్రస్తుత కాలంలో ఉపయోగించే అస్సామీస్ వేర్లు తూర్పు అస్సాంకు చెందిన సిబసాగర్ పట్టణానికి చెందిన భాషలో ఉన్నాయి (1872లో బ్రిటిష్ రాజ్ ఆస్సామీని రాష్ట్ర అధికార భాషగా ప్రకటించింది), కానీ ఈ శతాబ్ధ ఆరంభంలో అన్ని కార్య కలాపాలు సిబసాగర్ నుండి గౌహతికి మార్పు చెందడంతో ప్రస్తుత భాష మీద గౌహతీ ప్రాభావం కూడా చాలా ఉంది. ప్రస్తుతము పాఠశాలలో చెప్పే, వార్తా పత్రికలలో ప్రచురించే అస్సామీ భాష వివిధ మండలీకాల కూర్పు అని చెప్పవచ్చు. బణికాంత కకతి భాషను రెండు మాండలీకాలుగా విభజించెను (1) తూర్పు మాండలీకము (2) పడమర మాండలీకము. కానీ ఈమధ్యనే జరిపిన linguistic studies నాలుగు మాండలీకాలను గుర్తించాయి (Moral 1992), ఈనాలుగు మాండలీకాలను తూర్పు నుంచి పడమర వైపుగా కింద పొందుపరచబదడినవి: తూర్పు మాండలీకం, సిబసాగర్ చుట్టు పక్క జిల్లాలో మాట్లడుతారు మధ్య మాండలీకము, నవగాంవ్ మరియి చుట్టు పక్కల జిల్లాలలో మాట్లాడుతారు కామరూపి, ఈ మాండాలీకాన్ని కామరూప్, నల్బరి, బార్పేట, దర్రంగ్, కొక్రాఝార్, బొంగైగాంవ్ జిల్లాలలో మాట్లాదుతారు. గువాల్ పరియ, ఈ మాండాలీకాన్ని గువాల్ పర, ధుభ్రి, కొక్రాఝార్, బొంగైగాంవ్ జిల్లాలలో మాట్లాడుతారు చరిత్ర అస్సామీ భాషా చరిత్రను స్థూలంగా మూడు కాలాలుగా విభజించవచ్చు. తొలి కాల అస్సామీ (6 నుండి 15 వ శతాబ్ధం) ఈ కాలాన్ని మళ్ళీ రెండు భాగాలుగా విభజించవచ్చు (1) Pre–Vaishnavite and (2) Vaishnavite ఉప కాలాలు. మనకు తెలిసినంత వరకు అస్సామీ తొలి రచయిత హేమా సరస్వతి, ఈయన 'ప్రహరాద చరిత' అనె చిన్న పద్యాన్ని రచించారు. ఇంద్ర నారాయణ రాజు కాలానికి (1350-1365) చెందిన కవి హరిహర విప్ర 'అశ్వమేధ పర్వ' రచించాడు. అదే కాలానికి చెందిన 'కవిరత్న సరస్వతి' 'జయ్ద్రధ వధ' ని రచించాడు. ఇంకొక కవి రుద్ర కందలి 'ద్రోణ పర్వ'ను అస్సామీలో అనువదించాడు. Vaishnavite ఉప కాలంలో ప్రసిద్ధి కెక్కిన కవి మాధవ కందలి. ఈయన పూర్తి రామాయణాన్ని అస్సామీలో అనువదించాడు. మాధవ కందలికి జయంతపుర కచారీ రాజైన మహా మాణిక్య అండదండలు ఉండేవి. హేమా సరస్వతి తన రచనలలో తనని కామరూపలో జన్మించిన వైష్ణవగా పరిచయం చెసుకున్నాడు. ఈయన ఉపయోగించిన భాష కామరూపి. మాధవ కందలి కూడా కామరూపినే ఉపయోగించాడు. మధ్య కాల అస్సామీ (17 నుండి 19 వ శతాబ్ధం) ఈ కాలము అహొం సభలలోని చారిత్రక వ్యాసాలకు సంబంధించింది. అహొంలు వారితో పాటు చరిత్రను లిఖించే ఒక ఆచారాన్ని కూడా పట్టుకొచ్చారు. మొదట అహొం సభలలో చారిత్రక గ్రంథాలను వారి 'టిబెటొ -చైనీస్' భాషలోనే రచించారు, కానీ అస్సామీను సభలో ఉపయోగించే భాషగా చేసినప్పటి నుండి, ఈ చారిత్రక గ్రంథాలను కూడా అస్సామీ భాషలోనే రచించేవారు. 17 వ శతాబ్ద ఆరంభం నుండి ఈ చారిత్రక గ్రంథాలు అధిక సంఖ్యలో రచించబడ్డాయి. వీటిని బురంజీ అని అస్సమీలో అంటారు. బురంజీలు ధార్మిక గ్రంథాలు రాసే శైలినుండి పూర్తి విరుద్ధంగా ఉండేవి. వయాకరణము, స్పెల్లింగులలో ఎవో కొద్దిపాటి మార్పులు తప్ప ఆధునిక భాషనే వాడారు. ఆధునిక అస్సామీ మిషనరీల ప్రభావం అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీలు 1819 లో అస్సామీలో ప్రచురించిన బైబిలుతో ఆధునిక అస్సామీ యుగము మొదలైనదని చెప్పవచ్చును. బణికాంత కకతి పుస్తకంలో "Assamese, its Formation and Development" (1941, Published by Sree Khagendra Narayan Dutta Baruah, LBS Publications, G.N. Bordoloi Road, Gauhati-1, Assam, India) – " చెప్పినట్టుగా మిషనరీలు తూర్పు అస్సాంకు చెందిన సిబసాగర్ ను తమ కార్య కలాపాలకు కెంద్రంగా చేసుకున్నయి. అదే విధంగా తూర్పు మాండలీకాన్ని వారి సాహిత్య ప్రయోజనాలకి ఉపయోగించుకున్నయి. 1836 లో మొట్ట మొదటి అచ్చు యంత్రన్ని ఈ మిషనరీలు సిబసాగర్ లో ప్రతిష్టించారు. 1846 లో అరునోదయ్ అనే మాస పత్రికను ఆరంభించారు. 1848 లో అస్సామీ వ్యాకరణం పై నాథన్ బ్రౌన్ వ్రాసిన ప్ుస్తకాని ప్రచురించారు. ఎం. బ్రాన్ సన్ కూర్చిన మొట్ట మొదటి అస్సామీ - ఆంగ్ల నిఘంటువు 1867 లో మిషనరీలు ప్రచురించయి. బ్రిటిష్ పాలనా ప్రభావం 1826 లో అస్సామీ రాష్ట్రాన్ని ఆక్రమించుకున్న తర్వాత, బ్రిటీషు ప్రభుత్వం బెంగాలీ భాషను అస్సాంపై రుద్దింది. కానీ ఆ తర్వాత జరిగిన వ్యతిరెక ఉద్యమాల వల్ల 1872 లో రాష్ట్ర భాషగా చేశారు. అప్పట్లో ప్రింటింగు, భాషా కార్యక్రమాలు తూర్పు అస్సాంలో ఎక్కువగా ఉండడం వల్ల తూర్పు మాండలీకం, పాఠశాలలోను, కార్యాలయలలోను, కచేరీలలోను ఉపయోగించబడి ప్రమాణీక అస్సమీగా గుర్తించబడినది. కానీ అ తర్వాత గౌహతి పెరుగుదలతో ప్రామాణిక అస్సమీ తూర్పు మండలీకం నుంచి మార్పు చెందుతూ ఉంది. ఆధునిక సాహిత్యం - ఆరంభం 1889 అస్సామీ పత్రిక జొనాకి ప్రచురణతో ఆధునిక సాహిత్య కాలం ఆరంభం అయింది. జొనాకి లొ 'లక్ష్మీనాథ్ బెజ్ బరువా' రాసిన చిన్న కథలు ప్రచురితమయ్యెవి. 1894 లొ రజనీకాంత బొర్దలొయ్ రాసిన మొట్ట మొదటి నవల 'మిరి జియోరి' ప్రచురితమైంది. జ్యోతీ ప్రసాద్ అగర్వల్లా,హేమ్ బరువా తదితరులు అధునిక అస్సామీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. 1917 లో అస్సామీ భాషా సాహిత్యాలను అభివృద్ధి చేయడానికి అహొం సాహిత్య సభను ఏర్పాటు చేసారు. అస్సామీ అనెది ఆంగ్ల ప్రభావం వలన వచ్చిన పదం, కానీ అసొం ప్రజలు అసోమియా (అహోమియా) భాషగ పిలుస్తారు. ISO 639-1: as ISO 639-2: asm కొన్ని సామాన్యంగా వాడే వాక్యాలు తెలుగు వాక్యం తెలుగు లిపిలో అస్సామీ వాక్యం అస్సామీ లిపిలో అస్సామీ వాక్యం నమస్కారం, బాగున్నారా? నమొస్కార్, భాల్నె? নমস্কাৰ, ভাল নে।మీ పేరు ఏమిటి?అపునార్ నామ్ కీ? আপোনাৰ নাম কি?ఆ హోటలుకి ఎలా వెళ్తారు?హెయ్ హోటెల్ లోయ్ కెనెకె జాయ్?সেই হোটেল লৈ কেনেকে যাই?నా పేరు పవన్మూర్ నామ్ పవన్মোৰ নাম পৱনఅస్సామీస్ నాకు తెలియదు అహొమియా మోయ్ నజాను.অসমিয়া মই নাযানো అస్సామీస్ నాకు కొంచెం కొంచెం తెలుసుఅహొమియా మోయ్ అలోప్ అలోప్ జానుঅসমিয়া মই অলপ অলপ যানো మీకు హిందీ వచ్చా?అపుని హిందీ జానేనె?অপুনি হিন্দি যানেনে। బయటి లింకులు The Creative Visionary: Jyoti Prasad Agarwalla (1903-1951) Assamese Language and Literature Assamese Poems Learn Assamese in Easy Steps Assamese Language Sample Ethnologue report for Assamese వర్గం:ఇండో-ఆర్యన్ భాషలు వర్గం:భారతీయ భాషలు వర్గం:బాంగ్లాదేశ్ భాషలు
తమిళ భాష
https://te.wikipedia.org/wiki/తమిళ_భాష
thumb|బ్రహదేశ్వర ఆలయ స్తంభాలపై లిఖించిన తమిళ భాష తమిళం (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. దక్షిణ భారతదేశం, శ్రీలంక, సింగపూర్ లలో తమిళం ఎక్కువగా మాట్లాడతారు. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు.1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో తెలుగు భాష తరువాత అత్యధికంగా మాట్లాడబడే భాష తమిళమే.ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషల్లో తమిళం 19వ స్థానంలో ఉంది.https://en.m.wikipedia.org/wiki/List_of_languages_by_number_of_native_speakers?wprov=sfla1}} చరిత్ర thumb|219x219px| ழ்గా వ్రాయబడే హల్లు తమిళం, మలయాళంతో పాటు మాండరిన్ మొదలైన మంగోలాయిడ్ భాషా కుటుంబానికి చెందిన భాషల్లో మాత్రమే కనిపిస్తుందని నమ్మకం. ద్రవిడ కుటుంబానికి చెందిన మిగిలిన భాషలతో పోలికలు ఉన్నప్పటికీ, తమిళం, భారతదేశంలో ఉన్న చాలా భాషలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మౌలికంగా సంస్కృతంతో ప్రమేయం లేకుండా ఈ భాష ఆవిర్భవించినదన్న భావన ఉంది. ద్రవిడ భాషల్లో కెల్లా సుదీర్ఘ (రెండు వేల సంవత్సరాలకు మించిన) సాహిత్య- చరిత్ర గల భాషగా తెలుగు, కన్నడ భాషల కంటే ముందే తమిళం గుర్తించబడింది. తమిళ భాషకి అత్యంత దగ్గర పోలికలు గల భాష మలయాళం అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దం వరకు తమిళ, మలయాళ భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పదునాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన. ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ, యెరుకుల మొదలైనవి తమిళ భాషకి ఉప భాషలుగా వాడుకలో ఉన్నాయి. మొట్టమొదటి తమిళ గ్రంథం రచన సా.శ..పూ.3వ శతాబ్దంలో జరిగినని ఆధారాలు ఉన్నాయి. 'సంగమ కాలం'గా పిలువబడే సా.శ..పూ.300 - సా.శ..300 మధ్య కాలంలో తమిళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖనాలు వ్రాయబడ్డాయి.దక్షిణ ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లేకపోవటం విశేషం. సంగమకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం నుంచి రక్షించబడుతూ ఇప్పటికీ లభ్యంగా ఉన్న గ్రంథాలు అనేకం ఉన్నాయి. తమిళ భాష సాహిత్యాన్ని, వ్యాకరణ పరిణామ క్రమాన్ని బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు: సంగమ కాలం (సా.శ...పూ.300 - సా.శ.. 300) సంగమ తరువాతి కాలం/సంగం మరువిన కాలం (సా.శ..300 - సా.శ..700) భక్తి సాహిత్య కాలం ( సా.శ..700 - సా.శ..1200) మధ్య కాలం ( సా.శ..1200 -సా.శ..1800) ప్రస్తుత కాలం (సా.శ...1800 - ఇప్పటి వరకు). భక్తి సాహిత్య కాలంలో, మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసాయి. తరువాతి కాలంలో 'పరిధిమార్ కళైఞర్' (1870 - 1903), 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది. తమిళం గురించి కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ ప్రాచీన తమిళ మహానాడు ఆమోదించిన తీర్మానాలపై ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్ననిర్ణయాలు ఇవి: తమిళానికి కేంద్రంలో అధికార భాషా హోదా కల్పించాలి.ఈ అంశంపై పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించి దానిపై చర్చించాలి. మద్రాసు హైకోర్టులో తమిళంలో వాదనలకు అనుమతించాలి. దీనిపై 2006లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తమిళ భాషాభివృద్ధికి పరిశోధనలకు అవసరమైన రాయితీ నిధులను కేంద్రం ఇవ్వాలి.రాష్ట్రంలో శాసన అధ్యయనా కేంద్రం నెలకొల్పాలి. తమిళంలో చదువుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో తమిళ ప్రాచీన భాషా శీర్షికను చేర్చాలి. తమిళ భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి. తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి, కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలి. అతని ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించాలి - జయలలిత. తమిళభాష, సంస్కృతం కన్నా చాలా పురాతనమైంది. తమిళ భాష 2600-1700 సా.శ..పూ. నుండే ఉంది. 1000 సా.శ...పూ. ముందు సింధు లోయలో కనబడిన ఋగ్వేదంలో కూడా ద్రావిడ తమిళ పదాలు ఉన్నాయి—అస్కో పర్పోలా, ఇండాలజీ ఆచార్యుడు, లోక సంస్కృతి సంస్థానం, హెల్సింకీ, ఫిన్లాండ్) సింధు లోయ నాగరికతా భాష తమిళమే - డా.అంబేద్కర్ తమిళ దినపత్రికలు దినకరన్ దినతంతి దినమలర్ దినమణి దినమేధ కొన్ని ప్రాథమిక పదాలు నాన్ - నేను నీ - నీవు నీంగళ్ - మీరు అవన్ - అతను అవళ్ - ఆమె అవర్గళ్ - వారు ఇవన్ - ఇతను ఇవళ్ - ఈమె ఇవర్గళ్ - వీరు తరచూ వాడే కొన్ని వాక్యాలు నమస్కారము: వణక్కమ్ బాగున్నారా?: నల్లా ఇరుకీంగళా/సౌక్యమా ఇరుకీంగళా.? మీ పేరు ఏంటి?: ఉంగళ్ పేరు ఎన్న? నా పేరు లక్ష్మి: ఎన్ పేర్ లట్చ్మి దయచేసి: దయవసెయిదు ధన్యవాదము: నన్ఱి (నండ్రి) నాకు తమిళం తెలియదు: ఎనక్కు తమిళ్ తెరియాదు క్షమించండి: మన్నిక్కవుం/మన్నిచిరుంగ అది: అదు ఇది: ఇదు ఏది: ఎదు రండి, కూర్చోండి :వాంగ, ఉట్కారుంగ (వ్యావహారికం: వక్కారుంగ) ఎంత?: ఎవ్వళవు ఎక్కడ: ఎంగ అవును: ఆమాం లేదు: ఇల్లై నాకు అర్ధం కాలేదు: ఎనక్కు పురియవిల్లై మరుగు దొడ్డి ఎక్కడ?: కళివరై ఎంగ ఇరుక్కు మీకు ఆంగ్లం తెలుసా?: ఉంగళుక్కు ఆంగిలం తెరియుమా? సమయం ఎంత - నేరం ఎన్నాచ్చు ఇవి కూడా చూడండి దేవకన్య (తమిళం ) మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ద్రావిడ భాషలు వర్గం:భారతీయ భాషలు
భారతదేశ రాష్ట్రాలు
https://te.wikipedia.org/wiki/భారతదేశ_రాష్ట్రాలు
దారిమార్పు భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా
https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_జిల్లాల_జాబితా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా కాగా, ప్రకాశం జిల్లా పెద్దది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అత్యధికజనాభా కలిగిన జిల్లా అయితే, పార్వతీపురం మన్యం జిల్లా అత్యల్పజనాభా కలిగిన జిల్లాగా గుర్తించబడ్డాయి. ప్రతి జిల్లాను రెండు లేదా అంతకంటే తక్కువ రెవెన్యూ డివిజన్‌లుగా విభజించబడ్డాయి. రెవెన్యూ డివిజన్లును పరిపాలనా ప్రయోజనాల కోసం మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి. చరిత్ర స్వాతంత్ర్యం వచ్చేనాటికినేటి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో భాగంగాఉండేది. తెలుగు మాట్లాడే ఆధిపత్య ప్రాంతాలైన కోస్తాాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రరాష్ట్రంగా ఇది అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి అనే 11 జిల్లాలను కలిగి ఉంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ఫలితంగా రాష్ట్ర సరిహద్దులు భాషాపరమైన మార్గాలను అనుసరించి పునర్వ్యవస్థీకరించబడ్డాయి.1956 నవంబరు 1న ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. దీనిని పునరాలోచనలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌గా సూచిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలతో కలిపి ఆంధ్రరాష్ట్రం లోని 11 జిల్లాల కలిపి మొత్తం 21 జిల్లాలతో ఏర్పడింది. 1959 సంవత్సరంలో, గోదావరి నదికి అవతలి వైపున ఉన్న తూర్పు గోదావరి జిల్లా లోని భద్రాచలం, నూగూరు వెంకటాపురం తాలూకాలు భౌగోళిక సామీప్యత, పరిపాలనా సాధ్యత దృష్ట్యా ఖమ్మం జిల్లాలో విలీనం చేయబడ్డాయి. అదే సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా లోని అశ్వారావుపేట కొంత భాగాన్ని ఖమ్మం జిల్లాకు, కృష్ణా జిల్లాకు చెందిన మునగాల తాలూకాను నల్గొండ జిల్లా లోకి చేర్చారు. 1970లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా, 1979లో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విజయనగరం జిల్లా ఏర్పడడంతో జిల్లాల సంఖ్య 21 నుండి 23కు పెరిగింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా విభజించబడిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌గా పిలవబడే ఆంధ్రప్రాంతం 13 జిల్లాలతో మిగిలిపోయింది. అయితే పోలవరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుండి అనేక గిరిజన ప్రాబల్య మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమయ్యాయి. ఈ మండలాలు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో చేర్చబడ్డాయి. 2022 జనవరి 26న, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం, 1974, సెక్షన్ 3 (5) ప్రకారం ప్రాథమిక ప్రకటన జారీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఆధారంగా ప్రతిపాదించింది. దీనికి మినహాయింపు విశాలంగా వున్న అరకు లోకసభ నియోజక వర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చటం. ప్రజల అభ్యర్ధనల మేరకు, మిగతా చోట్ల 12 అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్‌సభనియోజకవర్గం ప్రధానంగా గల జిల్లాలో కాక, ఇతర జిల్లాలలో వుంచారు. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ప్రభుత్వం 2022 ఏప్రిల్ 3న 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ను ప్రచురించింది. దాని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులోని షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలు 2022 ఏప్రిల్ 4 నుండి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 సాంస్కృతిక ప్రాంతాలలో 26 జిల్లాలు ఉన్నాయి కాలక్రమ స్థితి పటాలు పునర్య్వస్థీకరణ వివరాలు 2022 పునర్య్వస్థీకరణ, తదనంతర సవరణల ప్రకారం రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు గణాంకాలు. జిల్లాల సంఖ్య: 26 (మరిన్ని వివరాలకు దిగువ గణాంకాలతో జిల్లాల జాబితా చూడండి.) మొత్తం మండలాలు: 679 2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న మండలాలకు జరిగిన మార్పులు గుంటూరు మండలం -> గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం (2) కర్నూలు మండలం -> కర్నూలు పట్టణ, కర్నూలు గ్రామీణ మండలం (2) విజయవాడ పట్టణ మండలం -> విజయవాడ మధ్య మండలం, విజయవాడ ఉత్తర మండలం, విజయవాడ తూర్పు మండలం, విజయవాడ పశ్చిమ మండలం (4) నెల్లూరు మండలం -> నెల్లూరు పట్టణ మండలం, నెల్లూరు గ్రామీణ మండలం (2) విశాఖపట్నం పట్టణ మండలం + విశాఖపట్నం గ్రామీణ మండలం (కొంత భాగం) -> సీతమ్మధార మండలం, గోపాలపట్నం మండలం, ములగాడ మండలం, మహారాణిపేట మండలం (4) వివరణ:2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న 670 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం, విజయవాడ పట్టణ మండలం, గుంటూరు మండలం, నెల్లూరు మండలం, కర్నూలు మండలం ఈ 5 మండలాలు రద్దై, వాటిస్థానంలో పైన వివరించిన ప్రకారం 14 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వాటితో రాష్ట్రం లోని మండలాల సంఖ్య 679కి చేరుకుంది. రెవెన్యూ డివిజన్లు: 76 (మరిన్ని వివరాలకు ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా చూడండి) రద్దుఅయిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ డివిజన్లు - 1 (:వర్గం:చారిత్రాత్మక రెవెన్యూ డివిజన్లు) మండలాలు - 5 (:వర్గం:ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన మండలాలు) పునర్య్వస్థీకరణ తరువాతి జిల్లాలు, గణాంకాలు వ.సంఖ్య కోడ్ అధికారిక పేరు ప్రధాన కార్యాలయం రెవెన్యూ డివిజన్లు మండలాలు సంఖ్య జనాభా విస్తీర్ణం చ.కి.మీ. జనసాంద్రత చ.కి.మీ.1కి స్థితిని తెలిపే పటం 1 SR శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం33021,91,4714,591477.34100px 2PM పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం2159,25,3403,659252.89 100px 3 VZ విజయనగరం జిల్లా విజయనగరం32719,30,8114,122468.42100px 4 VS విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం21119,59,5441,0481869.79100px 5AS అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు2229,53,96012,25177.87100px 6AK అనకాపల్లి జిల్లా అనకాపల్లి22417,26,9984,292402.38100px 7KK కాకినాడ జిల్లా కాకినాడ22120,92,3743,019693.07100px 8 EG తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం21918,32,3322,561715.48100px 9KN డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం32217,19,0932,083825.30100px 10EL ఏలూరు జిల్లా ఏలూరు32820,71,7006,679310.18100px 11 WG పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం21917,79,9352,178817.23100px 12NT ఎన్టీఆర్ జిల్లా విజయవాడ32022,18,5913,316669.06100px 13 KR కృష్ణా జిల్లా మచిలీపట్నం32517,35,0793,775459.62100px 14PL పల్నాడు జిల్లా నరసరావుపేట32820,41,7237,298279.76100px 15 GU గుంటూరు జిల్లా గుంటూరు21820,91,0752,443855.95100px 16BP బాపట్ల జిల్లా బాపట్ల22515,86,9183,829414.45100px 17 PR ప్రకాశం జిల్లా ఒంగోలు33822,88,02614,322159.76100px 18 NE శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు43824,69,71210,441236.54100px 19 KU కర్నూలు జిల్లా కర్నూలు32622,71,6867,980284.67100px 20NN నంద్యాల జిల్లా నంద్యాల32917,81,7779,682184.03100px 21 AN అనంతపురం జిల్లా అనంతపురం33122,41,10510,205219.61100px 22SS శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి43218,40,0438,925206.17100px 23 CU వైఎస్ఆర్ జిల్లా కడప43620,60,65411,228183.53100px 24AM అన్నమయ్య జిల్లా రాయచోటి33016,97,3087,954213.39100px 25TR తిరుపతి జిల్లా తిరుపతి43421,96,9848,231266.92100px 26 CH చిత్తూరు జిల్లా చిత్తూరు43118,72,9516,855273.22100px జిల్లాల విశేషాలు అతి పెద్ద జిల్లా: ప్రకాశం జిల్లా అతి చిన్న జిల్లా: విశాఖపట్నం జిల్లా అతి తక్కువ మండలాలు గల జిల్లా: విశాఖపట్నం జిల్లా అతి ఎక్కువ మండలాలు గల జిల్లాలు: ప్రకాశం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 2011 నాటి గణాంకాల ప్రకారం అత్యల్ప జనసాంద్రత గల జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా 2011 నాటి గణాంకాల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల జిల్లా: విశాఖపట్నం జిల్లా 2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి పట్టణ జిల్లా: విశాఖపట్నం జిల్లా 2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి గ్రామీణ జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యక్తుల పేరుతో ఉన్న జిల్లాలు రాష్ట్రంలో 2022 పునర్య్వస్థీకరణ తరువాత ఈ దిగివ వివరించిన 7 జిల్లాలు వ్యక్తుల పేరుతో ఉన్నాయి. అన్నమయ్య జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్టీఆర్ జిల్లా కోనసీమ జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా ఆరు జోన్లు మల్టీ జోన్ 1 1.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి 2.పాడేరు, రాజమండ్రి, కాకినాడ, కోనసీమ, 3. ఏలూరు, విజయవాడ, బందరు మల్టీ జోన్ 2 4.గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు 5.తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప 6.నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కర్నూలు ఇవి కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా ఆంధ్రప్రదేశ్ మండలాలు భారతదేశ జిల్లాల జాబితా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు తెలంగాణ రెవెన్యూ డివిజన్లు తెలంగాణ మండలాలు తెలంగాణ పురపాలక సంఘాలు మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ పాలనా విభాగాలు వర్గం:భారతదేశ జిల్లాల జాబితాలు వర్గం:జాబితాలు వర్గం:ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన జాబితాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు
https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_నదులు,_ఉపనదులు
thumb|250x250px|ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల రేఖా పటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 25 నదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, నాగావళి, వంశధార ముఖ్య నదులు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదులు, ఉపనదులు గోదావరి thumb|250x250px|గోదావరి నది పరీవాహక ప్రాంతం గోదావరి నది, తొలుత మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరంలో పుట్టింది.https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-119614 భారతదేశంలో రెండవ పొడవైన నది గోదావరి. దీని మూలం ఇది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో పుట్టింది. ఇది 1,465 కి.మీ. (910 మైళ్ళు) తూర్పుకు ప్రవహిస్తుంది.దీని ప్రవాహం అది ప్రవహించే ప్రయాణ మార్గంలో మహారాష్ట్రలో (48.6%), తెలంగాణలో (18.8%), ఆంధ్రప్రదేశ్‌లో (4.5%), ఛత్తీస్‌గడ్లో (10.9%), ఒడిశాలో (5.7%) కి. మీ. దూరం ప్రయాణించి, చివరిలో విస్తారమైన ఉపనదుల ద్వారా బంగాళాఖాతం కలుస్తుంది. ఈ నది 312. 812 చదరపు కి.మీ. (120.777 చదరపు మైళ్ళు) విస్తీర్ణం కలిగి ఉంది. ఇది భారత ఉపఖండంలోని అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాలలో ఒకటిగా ఉంది, గంగా, సింధు నదులు మాత్రమే పెద్ద పారుదల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. పొడవు,పరీవాహక ప్రాంత పరంగా గోదావరి ద్వీపకల్పం భారతదేశంలో అతిపెద్దది, దీనిని దక్షిణా గంగా అని కూడా అంటారు.https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-127826# ! thumb|250x250px|నదిలో పుష్కరాల సమయంలో భక్తులు స్నానాలు ఈ నది అనేక సహస్రాబ్దాలుగా హిందూ మత గ్రంథాలలో ప్రస్తావించబడతుంది.అంతేగాదు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిఉంది, పోషిస్తుంది.గత కొన్ని దశాబ్దాలుగా నది మీద అనేక బ్యారేజీలు,ఆనకట్టల ద్వారా నీటిపారుదలను నియంత్రించబడుతుంది. దీని విస్తృత నది డెల్టాలో చదరపు కి.మీ.కు 729 మంది వ్యక్తులు ఉన్నారు. ఇది భారతీయ సగటు జనాభా సాంద్రతకు దాదాపు రెండింతలు ఉంటుంది.అధిక వర్షపాతం వలన నదికి వరదలు సంభవించే ప్రమాదం ఉంది.ఇది ప్రపంచ సముద్ర మట్టం పెరిగేకొద్దీ దిగువ భాగాలలో తీవ్రతరం అవుతుంది గోదావరి నదికి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి.ఈ పుష్కరాలలో రెండు తెలుగు రాష్ట్రాలనండి,పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. కృష్ణా thumb|250x250px|కృష్ణానది జన్మించిన ప్రదేశం (మహాబలేశ్వర్) కృష్ణా నదిని, కృష్ణవేణి అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు సమీపంలోని పడమటికనుమలలో మహాదేవ్ పర్వతశ్రేణిలో సముద్ర మట్టానికి సుమారు 1,300 మీటర్ల (4,300 అడుగులు) ఎత్తులో ఉద్భవించింది. ఇది భారతదేశంలో పొడవైన నదులలో ఒకటి. కృష్ణ నది పొడవు 1,400 కి. మీ. (870 మైళ్ళు) మహారాష్ట్రలో 282 కి. మీ. (175 మైళ్ళు) ప్రవహిస్తుంది.నది మూలం మహారాష్ట్రలోని సతారా జిల్లా, వాయి తాలూకాకు ఉత్తరాన, జోర్ గ్రామానికి సమీపంలో ఉన్న మహాబలేశ్వర్ వద్ద ఉంది. తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి (కోడూరు సమీపంలో) వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.ఇది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది.ఈ నది డెల్టా భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటి.ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద నగరం విజయవాడ కృష్ణానదీ తీరానఉంది. శ్రీశైలం డాం, నాగార్జునసాగర్ డాం ఈ నదిపై నిర్మించబడినవి.గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర నదుల తరువాత భారతదేశంలో నీటి ప్రవాహం,నదీ పరీవాహక ప్రాంతాల పరంగా కృష్ణ నది నాల్గవ అతిపెద్ద నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నీటిపారుదల ప్రధాన వనరులలో ఇది ఒకటి తుంగభద్ర thumb|250x250px|కర్నూలు వద్ద తుంగభద్ర నది తుంగభద్ర నది, కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుములలో తుంగ,భద్ర అనే రెండు నదులుగా ఆవిర్భవించినవి.రెండు కలసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య సరిహద్దులో ప్రవహించే ముందు, చివరికి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణా నదిలో కలుస్తుంది.రెండు నదులు కలసినందున దీనికి తుంగభద్ర అని పేరు వచ్చింది తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ఆనకట్ట నిర్మించబడింది.రామాయణ ఇతిహాసంలో, తుంగాభద్ర నదిని పంప అనే పేరుతో వ్యవహరించబడింది.ఈ నదీ తీరాన మంత్రాలయం అనే పుణ్యక్షేత్రం ఉంది. పెన్నా thumb|250x250px|గండికోటవద్ద పెన్నా నది. ఈ పెన్నా నదిని పెన్నార్, పెన్నేర్, పెన్నేరు, ఉత్తర పినాకిని అని కూడా అంటుంటారు. పెన్నానది కర్ణాటక రాష్ట్రం, మైసూరు జిల్లాలోని నంది కొండలలో పుట్టి, తూర్పు దిశగా ప్రవహించి, అనంతపురం జిల్లాలోని హిందూపూర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అనంతపురం, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల్లో 597 కి.మీ. ప్రవహిచి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని ప్రవాహ విస్తీర్ణం (బేసిన్) కర్ణాటకలో 6,937 చ. కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 48,276 చ. కి. మీ. మొత్తం కలిపి 55,213 చ. కి. మీ. ఉంది. కిన్నెరసాని కిన్నెరసాని నది, తెలంగాణలోని వరంగల్, భద్రాద్రి జిల్లాల గుందా ప్రవహించి, భద్రాచలానికి కాస్త దిగువన, పశ్చిమ గోదావరి జిల్లాలో బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది. ఇది గోదావరికి ముఖ్యమైన ఉపనది.తెలంగాణ రాష్ట్రం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ వద్ద ఈ నదిపై కిన్నెరసాని ఆనకట్ట అని పిలువబడే ఆనకట్టను ఈ నదిపై నిర్మించారు.ఆనకట్ట యొక్క వెనుక జలాలు చుట్టుపక్కల కొండలతో చుట్టుముట్టబడి కిన్నెరసాని వన్యప్రాణులను అభయారణ్యం పరిసరాల్లో రక్షించబడతాయి.ఈ నది తెలంగాణలోని గోదావరి కుడి ఒడ్డున ప్రవహిస్తుంది.ప్రధాన గోదావరి నదితో సంగమం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సాధారణ సరిహద్దును ఏర్పరుస్తుంది. కుందేరు కుందేరు నది కర్నూలు జిల్లాలోని ఎర్రమల కొండలలో ఉద్బవించింది.అక్కడ నుండి దక్షిణ దిశలో ప్రవహించి వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. నంద్యాల పట్టణం కుందేరు నది తీరాన ఉంది. కుందేరు నదిని కుందూ, కుముద్వతి అని కూడా వ్యవహరిస్తారు. గుండ్లకమ్మ గుండ్లకమ్మ నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు- మధ్య భాగం గుండా ప్రవహించే కాలానుగుణ జలమార్గం.తూర్పు కనుమల శాఖకు చెందిన నల్లమల అడవులలోని కొండలలో కర్నూలు జిల్లా, నంద్యాల, ఆత్మకూరు మండలాల సరిహద్దులో గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద 800 మీటర్ల (2900 అడుగులు) ఎత్తులో పుడుతుంది. దీని ప్రధాన రిజర్వాయర్ సముద్రమట్టానికి 425 మీటర్ల ఎత్తులో ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు గ్రామానికి 6 కి.మీ. దూరంలో ఉంది.దట్టమైన అటవీ కొండల నుండి అనేక వంపుల తిరుగుతూ ప్రయాణించేటప్పుడు అనేక పర్వత ప్రవాహాలు దీనిలో కలుస్తాయి. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రవహిస్తుంది. కుంభం పట్టణం సమీపంలో ఉన్న మైదానంలోకి ప్రవేశించి.అదే పేరుగల పట్టణం గుండా ప్రవహిస్తుంది. నల్లమల కొండల నుండి ఉద్భవించిన అన్ని నదులలో గుండ్లకమ్మ అతిపెద్దది. గోస్తినీ thumb|250x250px|భీమునిపట్నం వద్ద గొస్తినీ నది బంగాళాఖాతంలో కలయక దృశ్యం thumb|250x250px|సరిపల్లి వద్ద చంపావతి నది గోస్తినీ నది, తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించింది.నది మూలానికి సమీపంలో ఉన్న బొర్రా గుహల గుండా ఈ నది ప్రవహిస్తుంది. భీమునిపట్నం సమీపంలో తీరం ద్వారా బంగాళాఖాతం సముద్రంలో కలవటానికి ముందు 120 కి. మీ. దూరం ప్రవహిస్తుంది.నదీ పరీవాహక ప్రాంతం రెండు తీర జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం జిల్లాల గుండా సాగుతుంది.విశాఖపట్నం జిల్లా మొత్తం వైశాల్యంలో 3% గోస్తినీ నది పరీవాహక విస్తీర్ణం పరిధిలో ఉంది. ఈ నది వర్షాధారం ఆధారపడి ప్రవహిస్తుంది.సగటున 110 సెం.మీ. వర్షపాతం అందుతుంది.ఎక్కువ భాగం నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంది. చంపావతి చంపావతి నది, విజయనగరం జిల్లా, మెంటాడ మండలంలోని ఆండ్ర గ్రామానికి సమీపంలో సముద్ర మట్టానికి 1,200 మీటర్ల ఎత్తులో ఉద్భవించింది.http://www.indiamapped.com/rivers-in-india/champavathi-river/ India Mapped ఈ నది తూర్పువైపుకు ప్రవహిస్తుంది.కొనాడ గ్రామానికి సమీపంలో ఉన్న బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది విజయనగరం జిల్లాలోని గజపతినగరం, నెల్లిమర్ల, సరిపల్లి, డెంకాడ, పాలెం నాతవలాస గ్రామాల గుండా ప్రవహిస్తుంది. ఈ నదిలో నాలుగు ప్రధాన ఉపనదులు ఎడువంపుల గెడ్డ, చిట్టా గెడ్డ, పోతుల గెడ్డ, గాడి గెడ్డ కలుస్తాయి.దీని పారుదల విస్తీర్ణం 1,410 చ. కి.మీ.ఉంది. 1965 నుండి 1968 మధ్యకాలంలో చంపావతి నది మీద డెంకాడ అనకట్ట నిర్మించబడింది. 5,153 ఎకరాల (20.85 చ. కి. మీ.) అయకట్టుకు సాగునీరు కల్పించడానికి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని సరిపల్లి గ్రామానికి సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. 6,690 హెక్టార్లకు నీటిపారుదల నీటిని సరఫరా చేయడానికి తారకరామ తీర్థ సాగరం బ్యారేజీని కూడా ఈ నదిపై నిర్మించారు. చిత్రావతి thumb|250x250px|మహేంద్రతనయ నది thumb|250x250px|చిత్రావతి నది మీద పార్నపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయరు చిత్రావతి నది, కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్‌లో పుట్టి, అదే జిల్లా గుండా ప్రవహించి పెన్నా నదిలో కలిసే ముందు అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలగుండా ప్రవహించి గండికోట వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. అందువలన దక్షిణ భారతదేశంలో ఇది అంతర్రాష్ట్ర నదిగా, పెన్నా నదికి ఉపనదిగా పేర్కొంటారు. చిత్రావతి నది ప్రవాహ విస్తీర్ణ పరిమాణం (బేసిన్) 5,900 చ.కి.మీ. ఉంది. యాత్రాస్థలం పుట్టపర్తి దీని ఒడ్డునే ఉంది. మహేంద్రతనయ మహేంద్రతనయ నది, ఒడిషా రాష్ట్రం, గజపతి జిల్లాలోని తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండల్లో పుట్టి గజపతి, రాయగడ జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెడుతుంది. మహేంద్రతనయ నది శ్రీకాకుళం జిల్లాలో మధ్య తరహా నది.మహేంద్రతనయ నది వంశధార నదికి ప్రధాన ఉపనది,ఇది మహేంద్రగిరి కొండల నుండి ఉద్భవించింది.అందువలననే ఈ నదిని మహేంద్రతనయ అనే పేరు సార్థకంమైంది. నది పొడవు 90 కి.మీ. (56 మైళ్ళు) ఉంది. ఈ నది శ్రీకాకుళం జిల్లా,సోంపేట మండలం, బారువ గ్రామం సమీపంలోని బంగాళాఖాతంలో విలీనం అవుతుంది. చెయ్యేరు thumb|250x250px|చెయ్యేరు నది చెయ్యేరు నది, చిత్తూరు జిల్లాలో ఉద్భవించిన బాహుద, పంచ నదుల సంగమం ద్వారా చెయ్యేరు నది ఏర్పడింది. చెయ్యేరు నది పెన్నా నదికి ఉపనది. చెయ్యేరు నది కడప, చిత్తూరు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది మీద బాదనగడ్డ వద్ద అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించబడింది. వైఎస్ఆర్ జిల్లాలోని సిద్ధవటం మండలంలోని గుండ్లమడ వద్ద కుడి ఒడ్డు ఉపనదిగా పెన్నానదిలో చేరే ముందు 87 కి.మీ. దూరం ప్రవహించింది. చెయ్యేరు ఏర్పడటానికి బాహుద, పంచ నదుల రెండు ప్రవాహాలు రాయవరం వద్ద కలుస్తాయి. దీని మొత్తం చదరపు వైశాల్యం 7,325 కి. మీ. ఉంది.https://books.google.co.in/books?id=WF3VAAAAMAAJ&dq=cheyyeru+river&q=cheyyeru+&redir_esc=y#search_anchor గుంజనా నది చెయ్యేరు ఉపనది. గుంజనా లోయ వెంట అనేక పాతరాతియుగంనాటి స్థావరాలు కనుగొనబడ్డాయి. నది పరీవాహక ప్రాంతంలో అనేక ఇరుకు ప్రాంతాలు ఉన్నాయి. నది పెద్ద ప్రవాహంగా మారి బాలరాజుపల్లి మీదుగా నాపరాతి ప్రదేశంలో ప్రయాణిస్తుంది. నదీ ప్రవాహంలో ఎక్కువగా నాపరాయి ముక్కలు వున్నాయి.https://books.google.co.in/books?id=GlTWAAAAIAAJ&dq=cheyyeru+river&q=cheyyeru+&redir_esc=y#search_anchor ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అత్తిరాల ఈ నదీతీరాన్నే వెలసింది. తాండవ నది thumb|250x250px|తుని పట్టణం వద్ద తాండవ నది తాండవనది, తూర్పు కనుమలలో పుట్టింది.ఇది విశాఖపట్నం జిల్లా,పాయకరావుపేట మండలం,  తునికి సమీపంలో పెంటకోట గ్రామం దగ్గర సముద్రంలో కలుస్తుంది.ఇది తుని పట్టణానికి 10 కి.మీ.దూరంలో ఉంది.ఈ నది తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకి సరిహద్దుగా ఏర్పడింది. ఈ నదికి కుడి ఒడ్డున తుని, ఎడమ ఒడ్డున పాయకరావుపేట ఉన్నాయి. తాండవ నదికి తరచుగా వరదలు వచ్చి తునిని ముంచేసేవి.అందువలన నీటిని నియంత్రించటానికి తునికి ఎగువన 1965 -1975 మధ్యకాలంలో ఈ నదిపై శ్రీ రాజా సాగి సూర్యనారాయణ రాజు తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టును అనే పేరులో ఆనకట్ట నిర్మించి ఈ వరదలని అదుపులోకి తీసుకొచ్చేరు.ఈ ప్రాజెక్టు క్రింద విశాఖపట్నం జిల్లాలోని నాథవరం, నర్శీపట్నం, కోటి ఉరట్ల గ్రామాలకు చెందిన 32689 ఎకరాలు, తూ.గో. జిల్లాలోని కోటనందూరు, తుని. రౌతులపూడి గ్రామాలకు చెందిన 18776 ఎకరాల ఆయకట్టు భూమికి సాగునీటి సౌకర్యం కలిగింది.https://irrigationap.cgg.gov.in/wrd/static/approjects/thandava.html తుల్యభాగ తుల్యభాగ, నదిలో స్నానం చేస్తే, గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఆ పుణ్యానికి సమానమైన పుణ్యం తుల్యభాగలో స్నానం చేసినా లభిస్తుందంటారు.అందువలనే దీనికి పేరుబడిందని చెపుతారు.గోదావరి నది సముద్రంలో కలిసే ముందు ధవళేశ్వరం దగ్గర గోదావరి నది ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినీ నదులు. అ ఏడు పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.అందులో తుల్యభాగ ఒకపాయ.ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి, నది నీటిని వ్యవసాయపు కాలువల్లోకి మళ్ళించగా, స్వతస్సిద్ధమయిన ఈ పాయలలో ప్రవాహం తగ్గిపోయింది. thumb|250x250px|శ్రీకాకుళం వద్ద నాగావళి సేద్యం అయిన తరువాత వృధాగా మిగిలిన దరిదాపు మురికిగా తయారయిన నీరు ఈ పాయలలో ప్రవహిస్తూ ఉండటం వల్ల ప్రస్తుతం ఈ తుల్యభాగ నది స్నానానికి కూడా అనుకూలంగా లేదు. నాగావళి thumb|250x250px|శాలిహుండం వద్ద వంశధార నాగావళి నది, దక్షిణ ఒడిషా రాష్ట్రంలోని రుషికుల్య, ఉత్తర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరినది పరీవాహక ప్రాంతం మధ్య ప్రవహించే ప్రధాన నదులలో నాగావళి నది ఒకటి.దీనిని లాంగ్యుల అని కూడా పిలుస్తారు. ఈ నది ఒడిషా రాష్ట్రంలోని కలహండి జిల్లా, తువాముల్ రాంపూర్ ప్రాంతంలోని లఖ్‌బహాల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కొండ నుండి ఉద్భవించింది.ఇది అక్కడనుండి రాయగడ జిల్లాకు చెందిన కలహండి, కల్యాన్సింగ్‌పూర్, నక్రుండి, కెర్పాయ్ ప్రాంతాలను తాకి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం దాటిన తరువాత కల్లేపల్లి గ్రామ సమీపంలో బంగాళాఖాతం విలీనం అయ్యింది.ఇది దాని స్వంత పరీవాహక ప్రాంతం కలిగిన స్వతంత్ర నది.నది మొత్తం పొడవు సుమారు 256 కి.మీ. (159 మైళ్ళు) ఉంటుంది. వీటిలో 161 కి.మీ. (100 మైళ్ళు) ఒడిషాలో ప్రయాణించగా, మిగిలిన ప్రయాణం ఆంధ్రప్రదేశ్‌లో సాగింది. పరీవాహక ప్రాంతం 9,510 చ. కి.మీ. (3,670 చ. మైళ్ళు) కలిగి ఉంది. నది బేసిన్ ఎత్తైన ప్రాంతాలు ప్రధానంగా గిరిజన జనాభా కలిగిన కొండ ప్రాంతాలు.ఇది ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలలో ప్రవహిస్తుంది. వంశధార thumb|333x333px|పాపఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద పాపఘ్ని మఠంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి . వంశధార నది, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రుషికుల్య, గోదావరి మధ్య తూర్పు దిశలో ప్రవహించే నది వంశధార.దీనిని బాన్షాధర నది అని కూడా అంటారు,ఈ నది ఒడిషా రాష్ట్రంలోని కలహండి జిల్లాలోని తువాముల్ రాంపూర్, ఒడిషాలోని రాయగడ జిల్లాలోని కల్యాణసింగాపూర్ సరిహద్దులో ఉద్భవించి, 254 కి.మీ. దూరం ప్రయాణించి, కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది. నదీ పరీవాహక ప్రాంతం మొత్తం 10,830 చ. కి.మీ.శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం, కళింగపట్నం పర్యాటక ఆకర్షణలు ఈ నది ఒడ్డున ఉన్నాయి.మహేంద్రతనయ నది ఒడిషాలోని గజపతి జిల్లాలో ఉద్భవించిన వంశధార ప్రధాన ఉపనది నది.నీటిపారుదల ఉపయోగం కోసం నది నీటిని మళ్లించడానికి శ్రీకాకుళం జిల్లాలోని రేగులపాడు బ్యారేజీ నిర్మాణంలో ఉంది.Four years after laying stone river projects fail to take off - The Hindu 19 August 2012 పాపఘ్ని పాపఘ్ని నది కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలోని నందికొండలలో ఉద్భవించింది. ఇది దక్షిణ భారతదేశంలో శాశ్వత, అంతరరాష్ట్ర నది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నదికి కుడి వైపు నుంచి కలిసే ఉపనది. పాపఘ్ని అనేది పాప (పాపం), ఘ్ని (నాశనం చేసేది లేక చంపేది) అనే పదాల సమ్మేళనం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో నివసించే చెంచుల అమాయక గిరిజన నాయకుడిని చంపిన ఒక రాజు, తన పాపానికి శిక్షగా కుష్టు వ్యాధితో బాధపడ్డాడు. అతను పాపఘ్ని లోయలో తపస్సు చేసి, నదిలో మునిగిన తరువాత మాత్రమే అతనికి ఈ వ్యాధి తగ్గింది.http://vayusutha.in/vs4/temple47.html తద్వారా దీనికి పాపఘ్ని అనే పేరు వచ్చిందని అంటారు. ఈ నదీ ప్రాంతం ఏటా 60 నుండి 80 సెంటీమీటర్ల వర్షపాతం పొందుతుంది. ఇది గ్రానైట్ నిక్షేపాలు, ఎర్ర నేలల ద్వారా ప్రయాణిస్తుంది. ఇది నేలకోతకు తరచుగా గురవుతుంది. ఇది కర్ణాటకలోని కోలార్ జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలగుండా ప్రవహిస్తుంది. నది పరీవాహకప్రాంతం 8,250 చ. కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఈ నది ముప్పై మండలాల గుండా పారుతుంది. ఇది కమలాపురం సమీపంలో పెన్నార్‌లో కలుస్తుంది. పాపఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద అత్యంత పురాతనమైన పాపఘ్ని మఠం ఉంది. పెన్ గంగా thumb|250x250px|పెన్ గంగా నది పెన్ గంగా నది, మొత్తం పొడవు 676 కి.మీ. (420 మైళ్ళు).పెన్ గంగా నది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా శ్రేణులలో ఉద్భవించింది.అక్కడనుండి ఇది బుల్ధనా జిల్లా, వాషిమ్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది.ఇది వాషిమ్ జిల్లా రిసోడ్ తాలూకాలోని షెల్గావ్ రాజ్గురే గ్రామానికి సమీపంలో ఉపనదిగా కాస్ నదిని కలుపుకుంటుంది.వాషిమ్, హింగోలి జిల్లాల సరిహద్దు గుండా ప్రవహిస్తుంది.ఇది యావత్మల్ జిల్లా, చంద్రపూర్ జిల్లా, నాందేడ్ జిల్లా మధ్య సరిహద్దుగా గుర్తిపు పొందింది.ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు వెంట ప్రవహిస్తుంది. ఇది నాందేడ్‌లోని మహూర్ సమీపంలో పస్ నదితో సంగమం చేస్తుంది.చంద్రపూర్ జిల్లాలోని చంద్రపూర్ తాలూకా, వాధ అనే చిన్న గ్రామానికి సమీపంలో పెన్ గంగా వార్ధ నదిలో కలుస్తుంది.వార్ధా నది ప్రాణహిత నదిలోకి కలసి ఇది చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి తూర్పున బంగాళాఖాతంలో కలసి ముగుస్తుంది.http://www.telangana360.com/2016/11/penganga-river.html బుడమేరు thumb|250x250px|కృష్ణా జిల్లా,కంచికచర్ల వద్ద మున్నేరు నదిపై బ్రిడ్జి బుడమేరు, ఇది కృష్ణా జిల్లాలోని మైలవరం చుట్టుపక్కల ఉన్న కొండలలో ఉద్భవించి కొల్లెేరు సరస్సులోకి కలుస్తుంది. బుడమేరు వలన విజయవాడ పరిసరప్రాంతాలకు వరదలు ఎక్కువుగా ఉంటుంటాయి.అందువలన బుడమేరును విజయవాడ విపత్తు అని కూడా పిలుస్తారు.దీని వరదలను నియంత్రించడానికి వెలగలేరు గ్రామంలో ఆనకట్ట నిర్మించారు.ప్రకాశం బ్యారేజీవద్ద బుడమేరు కృష్ణా నదిలో చేరడానికి వెలగలేరు నుండి బుడమేరు డైవర్షన్ ఛానల్ (బిడిసి) అనే డైవర్షన్ ఛానల్ నిర్మించబడింది.మరొక నదీ పరీవాహక ప్రాంతం నుండి ప్రధాన కృష్ణా నదికి నీటి మళ్లింపు చేయబడింది. మున్నేరు thumb|250x250px|గిద్దలూరు పట్టణ శివార్లలో సగిలేరు నదిపై రైలువంతెన మున్నేరు నది, కృష్ణా నదికి ఎడమవైపు ఉన్న ఉపనది.http://lsi.gov.in:8081/jspui/bitstream/123456789/3000/1/37990_2001_KHA.pdf ఇది తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉద్భవించింది. అక్కడనుండి ఖమ్మం జిల్లాగండా ప్రవహించి, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తుంది.ఈ నదిని ఖమ్మంలో తపస్సు కర్మ చేసినట్లు చెబుతున్న రిషి మౌద్గళ్య తన ఆధ్యాత్మిక శక్తితో సృష్టించినట్లు కథనం ఒకటి ఉంది.అందువలనే గుర్తుగా ఆ పేరు పెట్టబడిందని అంటారు.ఇది డోర్నకల్లు ఏరు గుండా ప్రవహించి, కమంచికల్ మీదుగా ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం శివారు ప్రాంతానికి వస్తుంది. ఇక్కడ నీటి సేకరణకు ఒక చిన్న ఆనకట్ట ఉంది. మున్నేరు ఖమ్మం నగరానికి నీటి వనరుగా పనిచేస్తుంది.ఇది చివరగా పెనుగంచిప్రోలు, కీసర గ్రామాల గుండా ప్రవహించి, పులిచింతల ఆనకట్ట దిగువన నందిగామ సమీపంలోని ఏటూరు గ్రామవద్ద కృష్ణ నదిలో విలీనంమవుతుంది. 6,650 హెక్టార్ల భూమికి సాగు నీటిని సరఫరా చేయడానికి 1898 వ సం.లో జగ్గయ్యపేట సమీపంలో మున్నేరు బ్యారేజీని నిర్మించారు. సగిలేరు సగిలేరు నది, పెన్నార్ నదికి ఉపనది. సగిలేరు నది వెలిగొండ, నల్లమల కొండల మధ్య ఉంది. ఇది ఉత్తర-దక్షిణ దిశలగుండా ప్రవహిస్తుంది. నది పరీవాహక ప్రాంతంలో ఎరుపు, నలుపు, బంకమన్ను నేలలు ఉన్నాయి. తడి, పొడి నీటిపారుదల పంటలు ఈ ప్రాంతంలో సాగుబడి చేస్తారు. ఎక్కువగా సజ్జలు, రాగి, జొన్న, వేరుశనగ, కూరగాయలు పండిస్తారు. ఈ నదిపై నీటిపారుదల ప్రాజెక్టులు కడప జిల్లాలోని బి. కోడూరు, కలసపాడు మండలాల్లో ఉన్నాయి. వీటితో పాటు నదిపై అనేక లిఫ్ట్ ఇరిగేషన్, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. సువర్ణముఖి thumb|250x250px|శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి సువర్ణముఖి (స్వర్ణ ముఖి) నది, చిత్తూరు జిల్లాకు చెందిన నది.చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. పాకాల సమీపంలో ఉన్న పాలకొండలో ఆదినాపల్లి వద్ద చిన్నవాగులా పుట్టింది. ధూర్జటి తన రచనల్లో దీన్ని 'మొగలేరు' అని ప్రస్తావించాడు.స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది.ఈ నది భీమా, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.ఈ నదిని గురించి ఒక పురాణగాథ ఉంది.పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి, ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే నది వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలంగా దాని విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి సువర్ణముఖి, స్వర్ణముఖి అనే పేర్లు వచ్చాయి.25 మిలియన్ క్యూబిక్ మీటర్ల లైవ్ స్టోరేజ్‌తో కల్యాణి ఆనకట్టను 1977 లో దీనికి ఉపనదిగా ఉన్న కల్యాణి నది మీద నిర్మించబడింది. సువర్ణముఖి thumb|270x270px|శబరి నది ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ సువర్ణముఖి నది, ఒడిషా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో ఉద్బవించింది.ఈ నది విజయనగరం జిల్లా, వంగర మండలం కొండశేఖరపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుది. జిల్లాలో మొత్తం 17 కి.మీ. మేర ప్రవహించి వంగర మండలంలోని సంగం గ్రామం వద్ద నాగావళి నదిలో కలుస్తోంది. సువర్ణముఖి నదిపై మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణం చేయబడింది.దీనికి రెండు కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది.కుడి కాల్వ రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల పరిధిలో మొత్తం 50 కిలోమీటర్ల పొడవున ఉంది.ఎడమ కాల్వ వంగర మండలం పరిధిలో 5 కి.మీ. మేర విస్తరించి ఉంది. శబరి నది thumb|250x250px|కూనవరం వద్ద శబరి నది శబరి నది, గోదావరి నదికి ఉపనది. ఇది తూర్పు గోదావరి జిల్లా లోని కూనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఇది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో పడమరకు వాలుగాఉన్న సింకరం కొండ శ్రేణుల నుండి 1370 సముద్రపు మీటర్ల ఎత్తు నండి ప్రవహిస్తుంది. దీనిని ఒడిషాలో కోలాబ్ నది అని కూడా పిలుస్తారు.శబరి నదీ పరీవాహక ప్రాంతానికి దాదాపు 1250 మి.మీ. వార్షిక సగటు వర్షపాతం లభిస్తుంది. ఇది ఛత్తీస్‌గడ్, ఒడిషా రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దును ఏర్పరుస్తుంది. గోదావరి నదిలో విలీనం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది బహుదా బహుదా నది, ఒడిషా రాష్ట్రం, గజపతి జిల్లాలోని తూర్పు కనుమలలోని సింఘరాజ్ కొండల నుండి బాహుదా నది లూబా గ్రామానికి సమీపంలో ఉద్భవించింది. ఇది 55 కి.మీ. వరకు ఈశాన్యదిశలో ప్రవహిస్తుంది.తరువాత అది ఆగ్నేయ దిశకు మారి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ముందు ఒడిశాలో 17 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 18 కి.మీ. దూరం ప్రవహిస్తుంది. తిరిగి ఈశాన్య దిశకు మారి ఇది ఒడిశాలో 6 కి.మీ. దూరం ప్రవహించి సునాపురపేట గ్రామానికి సమీపంలో బంగాళా ఖాతంలో కలిసింది. దీని మొత్తం పొడవు 96 కిలోమీటర్లు, ఒడిషాలో 78 కి.మీ. ప్రవహించగా,18 కి.మీ. ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది.http://www.dowrodisha.gov.in/WaterResources/RiverSystemNBasinPlanning.pdf ఇది 1118 చ. కి.మీ.నదీ పరీవాహక ప్రాంతం కలిగి ఉంది.ఒడిశాలో 890 చ. కి.మీ. ప్రవహించగా ఆంధ్రప్రదేశ్లో 228 చ.కి.మీ.ప్రవహిస్తుంది. వేదావతి thumb|250x250px|నదిపై విశ్వేశ్వరయ్య డాం (పురాతనం) వేదావతి నది,పశ్చిమ కనుమలలో బాబాబుదనాగిరి పర్వతాలలో ఉద్బవించి, కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.వేదవతిని కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో హగారి అని కూడా పిలుస్తారు. బాబాబుదానగిరి పర్వత శ్రేణులలోని సహ్యాద్రి కొండ శ్రేణి తూర్పు భాగంలో వేదం, అవతి అనే రెండు నదులు కలసి తూర్పుగా ప్రవహించి పూరా సమీపంలో కలయకతో వేదవతి నది ఏర్పడంది.అక్కడి నుండి చిక్కమగళూరు జిల్లా కదూర్ తాలూకా గుండా నది ప్రవహిస్తుంది. అప్పుడు వేదవతి వరుసగా చిత్రదుర్గ జిల్లాకు చెందిన హోసదుర్గ తాలూకా, హిరియూర్ తాలూకా, చల్లకరే తాలూకాలలో ప్రవేశిస్తుంది.వేదావతి ఒడ్డున, హోసదుర్గ తాలూకాలోని కెల్లోడు వద్ద శ్రీ ఆంజనేయస్వామికి అంకితమైన ప్రసిద్ధ ఆలయం ఉంది.కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన బసరకోడు గ్రామాల సరిహద్దు గ్రామాల ప్రజలకి జీవనోపాదితోపాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడటానికి వేదవతి నదిఫై హై లెవెల్ వంతెన నిర్మాణం పని చేపట్టవలసిందిగా అప్పటి కర్నూలు ఎం.పి.రేణుక, కేంద్రరోడ్ రవాణా, నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారికి  వినతిపత్రం ఇచ్చారు.   ఇవి కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ జలవనరులు తెలంగాణ నదులు, ఉపనదులు మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు వర్గం:నీటి వనరులు వర్గం:ఆంధ్రప్రదేశ్ నీటి వనరులు
ఆంధ్రప్రదేశ్ దర్శనీయ స్థలాలు
https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_దర్శనీయ_స్థలాలు
ఆంధ్రప్రదేశ్‌లో చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని కింది విధాలుగా వర్గీకరించవచ్చు. పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు, రమణీయ ప్రకృతి గల స్థలాలు, సంగ్రహశాలలు, జంతుప్రదర్శనశాలలు, నదీలోయ ప్రాజెక్టులు పుణ్య క్షేత్రాలు thumb|తిరుమల వేంకటేశ్వర ఆలయం ముఖ ద్వారం, గర్భగుడిపైన బంగారు గోపురం చిత్రంలో వెనుక చూడవచ్చు తిరుమల తిరుపతి అంతర్వేది - శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మందిరం ద్రాక్షారామం అహోబిళం -కర్నూలు జిల్లా మహానంది - కర్నూలు జిల్లా అన్నవరం కాణిపాకం - చిత్తూరు జిల్లా దేవుని కడప - కడప జిల్లా తాళ్ళపాక - కడప జిల్లా బ్రహ్మంగారిమఠం - కడప జిల్లా పుష్పగిరి - కడప జిల్లా శ్రీ కాళహస్తి - చిత్తూరు జిల్లా శ్రీశైలం - కర్నూలు జిల్లా సింహాచలం కనకదుర్గ దేవాలయం - (విజయవాడ) వేదాద్రి నరసింహ క్షేత్రం పిఠాపురం మంగళగిరి మోపిదేవి అరసవిల్లి శ్రీముఖ లింగం ర్యాలి - ఆత్రేయపురం ద్వారకా తిరుమల మద్ది ఆంజనేయ స్వామి గుడి - జంగారెడ్డిగూడెం కోటప్ప కొండ మంత్రాలయం - కర్నూలు జిల్లా పావులూరు రాయదుర్గం చెన్నకేశవస్వామి ఆలయం (మాచర్ల) ఆంజనేయ స్వామి ఆలయం (పొన్నూరు), (గుంటూరు జిల్లా) ఆంజనేయ స్వామి ఆలయం (సింగరకొండ), (ప్రకాశం జిల్లా) శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు) శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం (నెల్లూరు) కామాక్షమ్మ గుడి, జొన్నవాడ (నెల్లూరు జిల్లా) శ్రీ నరసింహ స్వామి గుడి, నరసింహ కొండ (నెల్లూరు జిల్లా) శ్రీ నరసింహ స్వామి గుడి, పెంచలకోన (నెల్లూరు జిల్లా చెన్నకేశవ స్వామి గుడి, మార్కాపురం (ప్రకాశం జిల్లా) శ్రీ నరసింహ స్వామి గుడి (కదిరి) శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం (గొలగమూడి), (నెల్లూరు జిల్లా) క్షీరారామం (పాలకొల్లు) - ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం - పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా భీమారామం (గునుపూడి) - భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా కుమరాభీమారామం - సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది - (తూర్పు గోదావరి జిల్లా) కోటిపల్లి - (తూర్పు గోదావరి జిల్లా) వాసుదేవ పెరుమాళ్ దేవాలయం -మందస చారిత్రక స్థలాలు అమరావతి కొలనుపాక ద్వారకాతిరుమల నాగార్జునసాగర్ పాకాల సత్ర సాల చంద్రగిరి కోట - తిరుపతి దగ్గర రాయభూపాలపట్నం - తూర్పుగోదావరి జిల్లా ఆత్మకూరు - నెల్లూరు జిల్లా లక్ష్మినరసింహస్వామి ఆలయం, పామూరు (ప్రకాశం జిల్లా) కోదండ రామాలయం - ఒంటిమిట్ట కొండవీడు కోట రమణీయ ప్రకృతి గల స్థలాలు విశాఖపట్నం అరకులోయ బెలుం గుహలు - కర్నూలు జిల్లా బొర్రాగుహలు అంతర్వేది - సాగర సంగమం, గోదావరి బీచ్ తలుపులమ్మ లోవ మదనపల్లి పాపికొండలు మారేడుమిల్లి శిలాతోరణం తిరుమల తిరుపతి తలకోన - చిత్తూరు జిల్లా హొప్ ఐలాండ్ (కాకినాడ) ఉండవల్లి గుహలు వస్తు ప్రదర్శన శాల నాగార్జునసాగర్ విజయవాడ అమరావతి - గుంటూరు జిల్లా మృగ సంరక్షణ ప్రాంతాలు విశాఖపట్నం శ్రీశైలం - కర్నూలు జిల్లా నాగార్జునసాగర్ కొల్లేరు సరస్సు పులికాట్ సరస్సు నదీలోయ ప్రాజెక్టులు శ్రీశైలం - కర్నూలు జిల్లా నాగార్జునసాగర్ విజయవాడ మూలాలు బయటి లింకులు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక సంస్థ వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు వర్గం:పర్యాటక ప్రదేశాలు
హిమాచల్ ప్రదేశ్
https://te.wikipedia.org/wiki/హిమాచల్_ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ (हिमाचल प्रदेश) వాయువ్య భారతదేశం లోని ఒక రాష్ట్రం. రాష్ట్రానికి తూర్పున టిబెట్ (చైనా), ఉత్తరాన, వాయువ్యాన జమ్మూ కాశ్మీరు, నైఋతిన పంజాబ్, దక్షిణాన హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఆగ్నేయాన ఉత్తరాఖండ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ విస్తీర్ణం 55,658 చ.కి.మీలు (21,490 చ.కి.మైళ్లు), 1991 జనాభా ప్రకారం రాష్ట్రం జనాభా 5,111,079. 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభాగంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర రాజధాని సిమ్లా. ధర్మశాల, కాంగ్రా, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ, మనాలీ ఇతర ముఖ్య పట్టణాలు. రాష్ట్రంలో చాలా ప్రాంతం పర్వతమయం. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన శివాలిక్ పర్వతశ్రేణులు ఉన్నాయి. శివాలిక్ శ్రేణి ఘగ్గర్-హక్రా నది జన్మస్థలం. రాష్ట్రంలోని ప్రధాన నదులు సట్లెజ్ (భాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు ఈ నది మీదే ఉంది), బియాస్ నది. సట్లెజ్ నది మీద కంద్రౌర్, బిలాస్‌పూర్ వద్ద నున్న బ్రిడ్జి ఆసియాలో కెళ్లా ఎత్తైన వంతెనలలో ఒకటి. రాష్ట్రం లోని జిల్లాలు కాంగ్రా హమీర్‌పూర్ మండి బిలాస్‌పూర్ ఊనా చంబా లాహౌల్ స్పితి సిర్మార్ కిన్నర్ కుల్లు సోలన్ సిమ్లా సంస్కృతి కాంగ్రి, పహారీ, పంజాబీ, హిందీ, మండియాలీ ఈ రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భాషలు. హిందూ, బౌద్ధ, సిక్కు రాష్ట్రంలోని ప్రధాన మతాలు. రాష్ట్రంలోని పశ్చిమ భాగంలోని ధర్మశాల, దలైలామా, అనేక టిబెట్ శరణార్ధులకు ఆవాసం. రాజకీయాలు 2003 రాష్ట్ర శాసనసభలో భారత జాతీయ కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షం. రవాణా, సమాచార ప్రసరణ రోడ్లు ప్రధాన రవాణా మార్గాలు. రోడ్లు కురుచగా మెలికలు తిర్గుతూ తరచూ ఊచకోతలు, భూమి జారడాల మధ్య ఉండటం వలన ప్రయాణం చాలా మెల్లగా సాగుతుంది. ఋతుపవనాల కాలంలో పరిస్థితి మరింత భయానకంగా ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న హిమాచల్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ రాష్ట్రమంతటా బస్సులు నడుపుతుంది. దాదాపు అన్ని ప్రాంతాలకు టెలిఫోన్, మొబైల్ ఫోన్ సౌకర్యాలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలు ఖజ్జియార్ ఇవి కూడా చూడండి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు బాబా కాన్సీరామ్ - ఇతను భారతీయ కవి, భారత స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త. బి. రాచయ్య మూలాలు బయటి లింకులు వర్మ, వి. 1996. గద్దీస్ ఆఫ్ ధౌళాధర్: ఏ ట్రాన్స్ హ్యూమన్ ట్రైబ్ ఆఫ్ ద హిమాలయాస్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ. హందా, ఓ. సీ. 1987. బుద్ధిష్ట్ మొనాస్టరీస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్'. ఇండస్ పబ్లిషింగ్ కం., న్యూఢిల్లీ. ISBN 81-85182-03-5. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు హిమాచల్ ప్రదేశ్ గురించిన వెబ్‌సైటు హిమాచల్ ప్రదేశ్ - కళలు, సంస్కృతి పోర్టల్ హిమాచల్ ప్రదేశ్ గైడు హిమాచల్ ప్రదేశ్ గురించి వార్తలు ధర్మశాల.నెట్ - ధర్మశాల గురించిన సమాచారం వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:హిమాచల్ ప్రదేశ్
ఉత్తరాఖండ్
https://te.wikipedia.org/wiki/ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ (హిందీ:उत्तराखण्ड) ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు ఉత్తరాంచల్ గా పిలవబడింది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన చైనా (టిబెట్), నేపాల్ దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం నైనిటాల్లో ఉంది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న గైర్సాయిన్ అనే చిన్న గ్రామాన్ని ముందుముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది. ఉత్తరాఖండ్‌లో పశ్చిమప్రాంతాన్ని ఘఢ్వాల్ అనీ, తూర్పు ప్రాంతాన్ని కుమావూ అనీ అంటారు. ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకమైన జీవజాలాలు (భరల్, మంచుపులి వంటివి), వృక్ష సంపత్తి ఈ ప్రాంతానికి పరిమితం. భారతదేశానికి జీవనాడులైన గంగా, యమునా నదులు ఉత్తరాఖండ్‌లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ఒక ముఖ్యమైన ఆర్థికవనరు. బ్రిటిష్ కాలం నుండి ముస్సోరీ, ఆల్మోరా, రాణీఖేత్‌లు వేసవి యాత్రికులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. అంతే కాకుండా హరిద్వార్, ఋషీకేశ్, బదరీనాధ్, కేదారనాధ్ వంటి చాలా పుణ్య క్షేత్రాలు వేల సంవత్సరాలుగా భక్తులకు దర్శనీయ స్థానాలుగా పేరుగొన్నాయి. పర్వాటక పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇంకా వివాదాస్పదమైన తెహ్రీ ఆనకట్ట నిర్మాణం ఈ రాష్ట్రంలో భాగీరధీ-భిలంగనా నదిపై 1953లో ప్రారంభమైంది. ప్రజలు స్థానిక ప్రజలు తమను తాము "ఘర్వాలీలు", "కుమావొనీలు" అని చెప్పుకుంటారు. కుమావొనీలలో కొంతమంది "పహాడీ" అని చెప్పుకొంటారు. ఎక్కువమంది హిందూ మతస్థులు. ఇంకా గడచిన శతాబ్దంలో వలస వచ్చిన నేపాలీ సంతతి వారున్నారు. జధ్, మర్చా, సౌకా తెగలవారు భారత్-టిబెట్ సరిహద్దులలో నివసిస్తున్నారు. వీరందరినీ కలిపి "భోటియా"లంటారు. తెరాయి పర్వతప్రాంతాలలో "తారు", "భుక్షా" తెగలవారున్నారు. దక్షిణ తెరాయి ప్రాంతంలో "గుజ్జర్"లనే సంచార పశుపాలకజాతులవారు న్నారు. భౌగోళికము ఉత్తరాఖండ్ రాష్ట్రము అధికభాగం హిమాలయ పర్వతసానువులలో ఉంది. ఎత్తునుబట్టి వాతావరణమూ, భూస్వరూపమూ మారుతూ ఉంటాయి. ఎత్తయిన ప్రాంతాలలో మంచు కొండలూ, హిమానదాలూ ఉండగా, తక్కువ ఎత్తులున్నచోట ఉష్ణమండల వాతావరణమూ, దట్టమైన అడవులూ ఉన్నాయి. మరీ ఎత్తయిన స్థలాలు మంచుకొండలతోనూ, రాతినేలతోనూ ఉన్నాయి. 3000 - 3500 మీటర్ల ఎత్తున: హిమాలయ గడ్డి మైదానాలు, ఇంకా ఎత్తైన చోట్ల టండ్రా మైదానాలు 2600-3000 మీటర్ల ఎత్తిన: కోనిఫెరస్ అటవీ ప్రాంతాలు 1500-2600 మీటర్ల ఎత్తున: వెడల్పు ఆకుల చెట్లున్న అడవులు 1500 మీటర్ల లోపు ఎత్తున: తెరాయి-దువార్ సవాన్నా మైదానాలు ఇంకా దిగువన: గంగానదీతీర మైదానాలు, డెసిడ్యువస్ అడవులు - వీటిని "భాభర్"లు అంటారు. అక్కడి ప్రత్యేక భౌగోళిక లక్షణాల కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చక్కని రాష్ట్రీయ ఉద్యానవనాలున్నాయి. పూలలోయ (వాలీ ఆఫ్ ఫ్లవర్స్) నేషనల్ పార్కు నందాదేవి జాతీయవనం (చమోలీ జిల్లా) జిమ్ కార్బెట్ జాతీయవనం (నైనితాల్ జిల్లా) రాజాజీ జాతీయవనం (హరిద్వార్ జిల్లా) గోవింద పశువిహార్ జాతీయవనం (ఉత్తరకాశి జిల్లా) గంగోత్రి జాతీయవనం (ఉత్తరకాశి జిల్లా) అసెంబ్లీ ఎన్నికలు 2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న జరిగాయి. ప్రముఖులు రిషబ్ పంత్ 2021 డిసెంబరులో తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఇవి కూడ చూడండి అఫ్జల్‌ఘర్ గణాంకాలు thumb|250px|right|ఉత్తరాఖండ్ జిల్లాలు మొత్తం విస్తీర్ణం: 51, 125 చదరపు కి.మీ. పర్వత ప్రాంతం: 92.57% మైదాన ప్రాతం: 7.43% అడవి ప్రాతం: 63% స్థానిక వివరాలు రేఖాంశము తూర్పు 77° 34' 27" నుండి 81° 02' 22" అక్షాంశము: ఉత్తరం: 28° 53' 24" నుండి 31° 27' 50" మోత్తం జనాభా: 7, 050, 634 (పురుషులు, స్త్రీల నిష్పత్తి = 1000 : 976) పురుషులు % 51.91 స్త్రీలు % 48.81 గ్రామీణ జనాభా: 76.90 % నగర జనాభా: 23.10 % మైనారిటీ వర్గాలు: సుమారు 2.0 % అక్షరాస్యత 65% గ్రామాలు: 15620 నగరాలు, పట్టణాలు: 81 రైల్వే స్టేషన్లు: కొత్వారా, డెహ్రాడూన్, హరిద్వార్, రిషీకేష్, హల్ద్వానీ, లాల్ కువాన్, కాథ్ గొడామ్K, తనక్ పూర్ విమానాశ్రయాలు : పంత్ నగర్, నైనిసాయిన్, జాలీగ్రాంట్ ముఖ్యమైన పర్వతాలు ( సముద్ర మట్టం నుండి ఎత్తు) గౌరీ పర్వత్ (6590), గంగోత్రి (6614), పంచ్ చూలి( 6910), నందాదేవి (7816), నందాకోట్ (6861), కామెట్( 7756), బద్రీనాధ్ (7140), త్రిశూల్ (7120), చౌఖంబా(7138), దునాగిరి (7066) ముఖ్యమైన లోయలు (పర్వత మార్గాలు) మనా (5450), నితీపాస్ (5070), లిపులేఖ్( 5122), లుంపియాధుర (5650) పరిశ్రమలు పర్యాటక రంగము, పాడి పరిశ్రమ, వ్యవసాయం, పూలు పండ్ల తోటలు, చెఱకు, కొన్ని చిన్న పరిశ్రమలు పండుగలు ఉత్తరాణి, నందాదేవి మేళా, హోలి, దీపావళి, దసరా, కందాలీ, కొండజాతర, బిఖోటి, బగ్వాల్, హరేలా, ఘుగుటీ ఉత్సవాలు సర్దోత్సవ్, వసంతోత్సవ్, నందాదేవీ రాజ్ జాత్, చిప్లా కేదార్ జాత్, కేదారనాధ యాత్ర, బదరీనాధ యాత్ర, కుంభమేళా, అర్ధ కుంభమేళా, రామలీల వాణిజ్య కేంద్రాలు హల్ద్వానీ, రుద్రపూర్, తనక్ పూర్, డెహ్రాడూన్, హరిద్వార్, కొట ద్వార్, హృషీకేశ్ జిల్లాలు ఉత్తరాఖండ్ 13 జిల్లాలుగా విభజించ బడింది. మూలాలు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు
హర్యానా
https://te.wikipedia.org/wiki/హర్యానా
హర్యానా, భారతదేశ ఉత్తర భాగంలో ఉన్న ఒక రాష్ట్రం. ఇది భాషా ప్రాతిపదికన 1966 నవంబరు 1న పూర్వపు తూర్పు పంజాబ్ రాష్ట్రం నుండి వేరు చేయబడింది. ఇది భారతదేశ భూభాగంలో 1.4% (44,212 కిమీ2 లేదా 17,070 చదరపు మైళ్ళు) కంటే తక్కువ విస్తీర్ణంతో 21వ స్థానంలో ఉంది. రాష్ట్ర రాజధాని చండీగఢ్, ఇది పొరుగు రాష్ట్రం పంజాబ్‌తో సరిహద్దు పంచుకుంటుంది. అత్యధిక జనాభా కలిగిన నగరం ఫరీదాబాద్, ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో భాగమైంది. గురుగ్రామ్ నగరం భారతదేశ అతిపెద్ద ఆర్థిక, సాంకేతిక కేంద్రాలలో ఒకటి. హర్యానాలో 6 పరిపాలనా విభాగాలు, 22 జిల్లాలు, 72 ఉప-విభాగాలు, 93 రెవెన్యూ తహసీల్‌లు, 50 ఉప-తహసీల్‌లు, 140 కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, 154 నగరాలు, పట్టణాలు, 7,356 గ్రామాలు, 6,222 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. హర్యానాలో 32 ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌ల ) ఉన్నాయి, ఇవి ప్రధానంగా జాతీయ రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించే పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులలో ఉన్నాయి. Industrial Development & Economic Growth in Haryana , India Brand Equity Foundation, Nov 2017. గుర్గావ్ భారతదేశంలోని ప్రధాన సమాచార సాంకేతికత, ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. హర్యానా మానవ అభివృద్ధి సూచికలో భారతీయ రాష్ట్రాలలో 11వ స్థానంలో ఉంది. రాష్ట్ర చరిత్ర, స్మారక చిహ్నాలు, వారసత్వం, వృక్షజాలం, జంతుజాలం, పర్యాటకం, బాగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో సమృద్ధిగా ఉంది. దీనికి ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ, దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి, అయితే యమునా నది ఉత్తర ప్రదేశ్‌తో దాని తూర్పు సరిహద్దును ఏర్పరుస్తుంది. హర్యానా దేశ రాజధాని ఢిల్లీ భూభాగాన్ని మూడు వైపులా (ఉత్తరం, పశ్చిమం, దక్షిణం) చుట్టుముట్టింది, తత్ఫలితంగా, ప్రణాళిక, అభివృద్ధి ప్రయోజనాల కోసం హర్యానా రాష్ట్ర పెద్ద ప్రాంతం ఆర్థికంగా ముఖ్యమైన భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతంలో చేర్చబడింది. వ్యుత్పత్తి శాస్త్రం మహాభారతానంతర కాలంలో, వ్యవసాయ కళలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకున్న అభిరాలు ఇక్కడ నివసించినందున హర్యానాను ఈ పేరుతో పిలుస్తారని శాస్త్రవేత్తలు అభిప్రాయం. ప్రాణ్ నాథ్ చోప్రా అభిప్రాయం ప్రకారం, హర్యానాకు అభిరాయణ-అహిరాయణ-హిరాయణ-హర్యానా అనే పేరు వచ్చిందని తెలుస్తుంది . భౌగోళికం హర్యాణా ఉత్తరాన 27 డిగ్రీల 37' నుండి 30 డిగ్రీల 35' అక్షాంశాల మధ్య, 74 డిగ్రీల 28' నుండి 77 డిగ్రీల 36' రేఖాంశాల మధ్య ఉంది. హర్యాణా రాష్ట్రము సముద్రమట్టమునకు 700 నుండి 3600 అడుగుల ఎత్తున ఉంది. పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రం నాలుగు విభాగాలుగా విభజించారు. అవి అంబాలా, రోతక్, గుర్‌గావ్, హిస్సార్. రాష్ట్రంలో 1,553 చ.కి. విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. హర్యాణా నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు. శివాలిక్ పర్వతశ్రేణులు యమునా - ఘగ్గర్ -హక్కా (సరస్వతి) పల్లపు భూమి అర్ధ-ఎడారి ఇసుకమయమైన పల్లపు భూమి ఆరావళి పర్వత శ్రేణులు శ చరిత్ర ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద నాగరికతలలో, సింధు లోయ నాగరికత ఉంది. రాఖిగిరి వంటి అనేక తవ్వకాల ప్రదేశాలు పురావస్తు పరిశోధనల ముఖ్యమైన ప్రదేశాలు. అత్యంత అభివృద్ధి చెందిన మానవ నాగరికత సింధు నది వెంట వృద్ధి చెందింది. ఇది ఈ ప్రాంతం మధ్యలో ఒక సారి ప్రవహించింది.సింధు లోయలో సుగమం చేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పెద్ద ఎత్తున వర్షపునీటి సేకరణ వ్యవస్థ, టెర్రకోట ఇటుక, విగ్రహ ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన లోహపు పని (కాంస్య, విలువైన లోహాలు రెండింటిలోనూ) ఉన్నాయి. వాస్తవానికి సింధు నాగరికత ఆధునిక మానవ అభివృద్ధికి దారితీసింది. హర్యానాను సుల్తానేట్లు, మొఘలులు వంటి అనేక రాజవంశాలు పాలించాయి. ఇది ఆఫ్ఘన్లు, తిముత్ ఆక్రమణల క్రింద కూడా ఉంది.పంజాబ్ ప్రాంతములో అధికముగా హిందీ మాట్లాడే భాగం హర్యానా అయింది. పంజాబీ మాట్లాడే భాగం పంజాబ్ రాష్ట్రం అయింది. ప్రస్తుత హర్యాణా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. భాషా సరిహద్దు మీద ఉన్న ఛండీగఢ్కేంద్ర పాలిత ప్రాంతముగా ఏర్పడి రెండు రాష్ట్రాలకు రాజధానిగా వ్యవహరింపబడుతుంది. 4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యాణా వైదిక, హిందూ నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితం ఇక్కడే శ్రీ కృష్ణభగవానుడు మహాభారతయుద్ధ ప్రారంభ సమయాన గీతను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధం జరిగింది. మహాభారతములో (సా.శ..పూ.900) హర్యాణా బహుధాన్యక (సకల సంపదల భూమి) అని వ్యవహరింపబడింది. హరియానా అన్న పదం మొదట ఢిల్లీ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న 1328 ప్రాంతపు సంస్కృత శాసనములో కనిపిస్తుంది. ఈ శాసనములో ఈ ప్రాంతం భూతల స్వర్గముగా అభివర్ణించబడింది. ఆర్య సంస్కృతి ఇక్కడే పుట్టి పెరిగిన ప్రాంతం అని చాటుతుంది. నౌరంగాబాద్, భివానీలోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోని రాఖీగర్హీ, రోతక్ లోని రూఖీ, సిర్సాలోని బనావలి మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి, హరప్పా పూర్వ సంస్కృతుల ఆధారాలు లభించాయి. కురుక్షేత్ర, పెహోవా, తిల్‌పట్, పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారాలు సమకూర్చాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక (పెహోవ), తిలప్రస్థ (తిల్‌పట్), పానప్రస్థ (పానిపట్), సోనప్రస్థ (సోనిపట్) గా ఉల్లేఖించబడినవి. రాష్ట్ర గణాంకాలు అవతరణ - 1966 నవంబరు 1 , వైశాల్యం. 44,212 చ.కి. జనసంఖ్య -25,353,081, స్త్రీలు. 11,847,951 పురుషులు. 13,505,130, లింగనిష్పత్తి . 877 జిల్లాల సంఖ్య -21 గ్రామాలు - 6,764 పట్టణాలు.106 ప్రధాన భాషలు- హిందీ, పంజాబి ప్రధాన మతాలు- హిందు, ఇస్లాం, క్రిష్టియన్ పార్లమెంటు సభ్యుల సంఖ్య - 10 శాసన సభ్యుల సంఖ్య-90 హర్యానా జిల్లాలు వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)1 AM అంబాలా అంబాలా 11,36,784 1,569 7222 BH భివాని భివాని 16,29,109 5,140 3413CDచర్ఖీ దాద్రిఛర్ఖి దాద్రి5,02,27613703674 FR ఫరీదాబాద్ ఫరీదాబాద్ 17,98,954 783 2,2985 FT ఫతేహాబాద్ ఫతేహాబాద్ 9,41,522 2,538 3716 GU గుర్‌గావ్ గుర్‌గావ్ 15,14,085 1,258 1,2417 HI హిసార్ హిస్సార్ 17,42,815 3,788 4388 JH ఝజ్జర్ ఝజ్జర్ 9,56,907 1,868 5229 JI జింద్ జింద్ 13,32,042 2,702 49310 KT కైతల్ కైతల్ 10,72,861 2,799 46711 KR కర్నాల్ కర్నాల్ 15,06,323 2,471 59812 KU కురుక్షేత్ర కురుక్షేత్ర 9,64,231 1,530 63013 MA మహేంద్రగఢ్ నార్నౌల్ 9,21,680 1,900 48514MWనూహ్నూహ్10,89,4061,76572915PWపల్వల్పల్వల్10,40,4931,36776116 PK పంచ్‌కులా పంచ్‌కులా 5,58,890 816 62217 PP పానిపట్ పానిపట్ 12,02,811 1,250 94918 RE రేవారీ రేవారీ 8,96,129 1,559 56219 RO రోహ్‌తక్ రోహ్‌తక్ 10,58,683 1,668 60720 SI సిర్సా సిర్సా 12,95,114 4,276 30321 SO సోనీపత్ సోనీపత్ 14,80,080 2,260 69722 YN యమునా నగర్ యమునా నగర్ 12,14,162 1,756 687 ఇవి కూడా చూడండి హర్యాణా ముఖ్యమంత్రులు కాంబోజ్ మూలాలు బయటి లింకులు హర్యాణా చరిత్ర హర్యాణా ప్రజలు హర్యాణా సంస్కృతి హర్యాణా పక్షులు హర్యాణా ప్రభుత్వ వెబ్‌సైటు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు
గోవా
https://te.wikipedia.org/wiki/గోవా
గోవా (गोवा, Goa ) భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం.భారతదేశం రాష్ట్రాల వివరాలు స్టాటైడ్స్ నుండి డిసెంబర్ 5 2006న సేకరించబడినది. దీని ప్రకారం గోవా వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం జనాభా పరంగా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. సిక్కిం, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్లు గోవా కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి.2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ రాష్ట్రాలలో గోవా నాలుగవ అతిచిన్న రాష్ట్రం. దీనిని పోర్చుగీస్ భారతదేశం అని అంటారు గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది.గోవా ప్రభుత్వ పాలిటెక్నిక్ కలాశాలలో గోవా స్వాతంత్ర్యం గురించిగోవా స్వాతంత్ర్యం పొందిన విధానం వివరిస్తున్న భారత్-రక్షక్‌లోని ఒక వ్యాసం. చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద, అగ్వాడ కోట - ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి. గోవా పేరు గోవా లేదా గోమాంటక్ అని పిలిచే ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంపై స్పషష్టమైన ఆధారాలు లేవు. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ, ఇతర ప్రాచీన గ్రంథాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోవపురి వంటి పేర్లు వాడబడినాయి. ఆప్రాంత అనే పేరు కూడా వాడబడింది.గోవా చరిత్ర వివరిస్తున్న గోవా పర్యాటకశాఖ సైటు. చరిత్ర thumb|250px| గోవాలో హిందూ దేవాలయాలు రంగులు విరబోసుకొని ఉంటాయి. స్థానిక సాంప్రదాయిక నిర్మాణ శైలి వీటిలో కనిపిస్తుంది thumb|250px| అందమైన సముద్ర తీరాలకు గోవా ప్రసిద్ధం గోవా ప్రాంతాన్ని చరిత్రలో మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, సిల్హార వంశస్థులు, దక్కన్ నవాబులు పాలించారు. 1312 లో ఇది ఢిల్లీ సుల్తానుల వశమైనది. 1370లో విజయనగరరాజు మొదటి హరిహర రాయలు గోవాను జయించాడు. 1469లో బహమనీ సుల్తానులు దీనిని కైవసం చేసుకొన్నారు. అనంతరం బీజాపూర్ నవాబు ఆదిల్‌షా తన రెండవ రాజధానిగా చేసుకొన్నాడు.గోవాలో హిందూరాజుల పరిపాలన గురించిగోవాలో ముస్లిముల దండయాత్రలు , విజనరగర రాజుల పరిపాలన. 1498లో క్రొత్త సముద్రమార్గాన్ని కనుక్కొన్న మొదటి ఐరోపా వర్తకుడు వాస్కో డ గామా కేరళలో కోజికోడ్లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యము. కాని 1501 లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడి అల్ఫోంసో డి అల్బుకర్క్ (Afonso de Albuquerque) అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావరంగా చేయాలనేది వారి అభిమతం. thumb|250px| ఉత్తర గోవాలో అగూడా కోట(Fort Aguada) శిథిలాలు. ఫోర్చుగీసువారు తమ రక్షణ కోసం నిర్మించిన స్థావరాలలో ఒకటి. 1560-1812 మధ్య గోవా ఇంక్విజిషన్ క్రింద స్థానికులు బలవంతంగా క్రైస్తవ మతానికి మార్చబడ్డారు. ఈ నిర్బంధంనుండి తప్పుకోవడానికి వేలాదిగా ప్రజలు ఇరుగుపొరుగు ప్రాంతాలకు తరలిపోయారు. బ్రిటిష్‌వారు వచ్చిన తరువాత పోర్చుగీసు అధికారం గోవాకు, మరి కొద్ది స్థలాలకు పరిమితమైనది. పోర్చుగీసు వారికి గోవా విలువైన విదేశీ స్థావరమైనది. పోర్చుగీసు నుండి వచ్చినవారు ఇక్కడ స్థిరపడడం, స్థానికులను పెండ్లాడడం జరిగింది. 1843లో రాజధాని పాత గోవా నుండి పనజీకి మార్చారు. 1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా గోవాను వదులుకోవడానికి పోర్చుగీసువారు ఒప్పుకొనలేదు. ప్రపంచ సంస్థలు భారతదేశానికి అనుకూలంగా తీర్పు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. 1961 డిసెంబరు 12న భారత సైన్యం గోవాలో ప్రవేశించి, గోవాను ఆక్రమించింది. కొద్దిపాటి ఘర్షణ తరువాత డామన్, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి. కాని 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది. భౌగోళికం, వాతావరణం thumb|250px| గోవాకు పొడవైన సముద్ర తీరం ఉంది. అక్కడి బీచిలు అందమైనవి. పడమటి కనుమలులోని కొంకణ తీరాన ఉన్న గోవాకు 101 కి.మీ. సముద్ర తీరము ఉంది. మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్అనేవి గోవాలోని నదులు. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం మంచి సహజ నౌకాశ్రయం. జువారి, మాండవి నదులు, అంతటా విస్తరించిన వాటి ఉపనదులు గోవాలో మంచి నీటి వసతి, రవాణా వసతి కలిగించాయి. ఇంకా కదంబ రాజులు తవ్వించిన 300పైగా పాతకాలపు చెరువులు, 100 పైగా ఔషధిగుణాలున్న ఊటలు ఉన్నాయి. గోవా నేల ఎక్కువ భాగం ఖనిజలవణాలుగల ఎర్రనేల. లోపలి నదీతీరాలలో నల్లరేగడి నేల ఉంది. గోవా, కర్ణాటక సరిహద్దులలో మోలెమ్, అన్‌మోడ్ల మధ్యనున్న శిలలు భారత ఉపఖండంలోన అత్యంత పురాతనమైనవాటిలోకి వస్తాయి. కొన్ని శిలలు 3,600 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని గుర్తించారు.The Goa that you may not know , Dr. Nandkumar Kamat, Colaco.net, జులై 6, 2007న సేకరించారు. ఉష్ణవాతావరణ మండలంలో, అరేబియా సముద్రతీరాన ఉన్నందున గోవా వాతావరణం వేడిగాను, తేమగాను ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు సెంటీగ్రేడ్ వరకు వెళతాయి. వర్షాకాలం (జూన్ - సెప్టెంబరు) పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. డిసెంబరు - ఫిబ్రవరి కాలం చలికాలం. ఉష్ణోగ్రత 20 డిగ్రీలు సెంటీగ్రేడు వరకు జారుతుంది. ఆర్ధిక రంగం thumb|250px|ఓడలపై రవాణా గోవాలో ఒక ముఖ్యమైన జీవనోపాధి. thumb|250px|చపోరా నదిపై చేపలు పట్టడం ప్రజల తలసరి సగటు ఆదాయం తక్కిన భారతదేశంలో కంటే గోవాలో ఒకటిన్నర రెట్లు ఎక్కువ. గోవా ఆర్థికరంగం వృద్ధికూడా 1990-2000 కాలంలో 8.23% సాదింపబడింది. పర్యాటక రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీయాత్రికులలో 12% మంది గోవాను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా తీరప్రాంతంలో యాత్రికులు ఎక్కువ.గోయెంకార్.కాం వెబ్‌సైటు నుండి, Economy of Goa, ¹ భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీయాత్రికులలో 12% మంది గోవాను సందర్శిస్తున్నారు, ² ప్రభుత్వాధీనంలోని అరణ్యం సుమారుగా 1224.38 చ.కి.మీ, పైవేటు వ్యక్తుల చేతులలో 200చ.కి.మీ ఉంది. సందర్శించిన తేదీ: ఏప్రిల్ 2, 2005. ఇక్కడ ఆరంబల్ బీచ్ చాల ప్రసిద్ధి చెందిన బీచ్. లోపలి భాగంలో మంచి ఖనిజ సంపద ఉంది. ముడి ఇనుము, బాక్సైటు, మాంగనీసు, సిలికా వంటి ఖనుజాలు బాగా లభిస్తున్నాయి. వ్యవసాయం కూడా చాలామందికి జీవనోపాధి. వరి, జీడిమామిడి, పోక, కొబ్బరి ప్రధానమైన వ్యవసాయోత్పత్తులు. చాల మందికి వ్యవసాయం రెండవ ఆదాయపు వనరుగా ఉంటున్నది. 40 వేలవరకూ జనాభా మత్స్య పరిశ్రమ ఆధారంగా జీవిస్తున్నారు. పురుగు మందులు, ఎరువులు, టైరులు, ట్యూబులు, చెప్పులు, రసాయనములు, మందులు వంటి మధ్య తరహా పరిశ్రమలున్నాయి. ఇంకా చేపలు, జీడిమామిడి, కొబ్బరి వంటి ఉత్పత్తులపై ఆధారపడిన వ్యసాయిక పరిశ్రమలున్నాయి. ఆల్కహాలుపై తక్కువ పన్ను ఉన్నందున గోవాలో మద్యం ఖరీదు తక్కువ. విదేశాలలో పనిచేసే కార్మికులు స్వదేశంలో తమ కుటుంబాలకు పంపే ధనం కూడా గోవా ఆదాయంలో ముఖ్యమైనది. ప్రభుత్వం, రాజకీయాలు మండవి నది ఎడమ ఒడ్డున ఉన్న పనజి లేదా పంజిమ్‌లో గోవా అధికార కార్యాలయాలున్నాయ. మాండవి నది అవతలి ఒడ్డున ఉన్న పోర్వీరిమ్లో గోవా శాసన సభ ఉంది. న్యాయ విషయాలకొస్తే గోవా ముంబై, (బొంబాయి) హైకోర్టు పరిధిలోకి వస్తుంది. పనజిలో ఒక హైకోర్టు బెంచి ఉంది. జాతీయ స్థాయి పార్లమెంటులో గోవానుండి రెండు లోక్‌సభ స్థానాలు, ఒకరాజ్యసభ స్థానము ఉన్నాయి. గోవా అసెంబ్లీలో 40 మంది సభ్యులున్నారు. అన్ని రాష్ట్రాలలాగానే గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, శాసన సభ్యులుతో కూడిన పాలనా వ్యవస్థ ఉంది. 1990 వరకు నిలకడగా ఉన్న గోవా ప్రభుత్వాలు తరువాత వడివడిగా మారడం మొదలయ్యింది. 1990-2005 మధ్యకాలంలో 15 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారాయి హిందూ పత్రికలో జనవరి 31, 2005 పరికార్ ప్రభుత్వంపై , అనీల్ శాస్త్రి రాసిన కథనం, సేకరించిన తేదీ: జులై 6, 2007..2022 గోవా శాసనసభ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న జరిగాయి. గోవాలో ముఖ్యమైన రాజకీయ పార్టీలు: భారత జాతీయ కాంగ్రెసు భారతీయ జనతా పార్టీ యునైటెడ్ గోవన్స్ డెమోక్రాటిక్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మిగిలిన రాష్ట్రాలలో బ్రిటిష్ పద్ధతిలో మతం ప్రకారం పౌర చట్టాలు(civil laws) అమలులో ఉన్నాయి. కాని గోవాలో పోర్చుగీసు వారి పద్ధతి ప్రకారం యూనిఫాం సివిల్ కోడ్ అమలులో ఉంది. ముఖ్యమంత్రులు విల్ఫ్రెడ్‌ డిసౌజా మనోహర్ పారికర్ రాష్ట్ర గణాంకాలు అవతరణము. 1977 మే 30 వైశాల్యము.3,702 చ.కి. జనసంఖ్య. 1,457,723 స్త్రీలు. 717,912 పురుషులు. 740,711 నిష్పత్తి . 968. అక్షరాస్తత. స్త్రీలు. 87.40 పురుషులు.92.81 జిల్లాల సంఖ్య. 2 గ్రామాలు. 359 పట్టణాలు.44 ప్రధాన భాష. కొంకణి, మరాఠి ప్రధాన మతం. హిందు. క్రీస్తు. పార్లమెంటు సభ్యుల సంఖ్య, 3 శాసన సభ్యుల సంఖ్య.40 మూలము. మనోరమ యీయర్ బుక్ జన విస్తరణ thumb|250px| గోవాలో హిందూ దేవాలయాలు రంగులు విరబోసుకొని ఉంటాయి. స్థానిక సాంప్రదాయిక నిర్మాణ శైలి వీటిలో కనిపిస్తుంది గోవా నివాసిని ఆంగ్లంలో గోవన్ అని, కొంకణిలో గోయెంకర్ అని, మరాఠీలో గోవేకర్ అని, పోర్చుగీసు భాషలో మగవారిని గోయెస్ Goês అని, ఆడువారిని గోయెసా Goesa అని అంటారు. ఇప్పుడు గోవా జనాభా 13,47,668 - ఇందులో 6,87,248 మంది పురుషులు, 6,60,420 స్త్రీలు. మిగిలిన వివరాలు చదరపు కిలోమీటరుకు జనాభా: 364 పట్టణ జనాభా: 49.8% ఆడు, మగ నిష్పత్తి 960 స్త్రీలు: 1000 పురుషులు అక్షరాస్యత: 82.0 % (పురుషులు 88.4%, స్త్రీలు 75.4%) Manorama YearBook 2007 — pg 614 – ISBN 0542-5778 హిందువులు 65%, కాథలిక్కులు 30%,గోవా పర్యాటక శాఖ వెబ్‌సైటులో గోవా ప్రజల గురించి సమాచారం, పరిశీలించిన తేదీ: జులై 6, 2007. ముఖ్య నగరాలు: వాస్కో డ గామా, మడగావ్, మార్మగోవా, పంజిమ్, మపుసా ప్రధాన భాషలు: కొంకణి, మరాఠీ, (ఇండియన్) ఇంగ్లీష్, హింది. (పోర్చుగీసు భాష వాడకం క్రమంగా క్షీణిస్తున్నది). అధికార భాషగా మరాఠీ, కొంకణి భాషలు కావాలనుకొనే వారి మధ్య బలమైన స్పర్ధ ఉంది. జిల్లాలు thumb|250px| గోవా తాలూకాలు. ఉత్తర, దక్షిణ గోవాల తాలూకాలు వేర్వేరు రంగులలో చూపబడ్డాయి. గోవాను రెండు జిల్లాలుగా విభాజించారు. ఉత్తర గోవా దీనికి పనాజీ జిల్లా కేంద్రం. దక్షిణ గోవా దీనికి మార్‌గావ్ జిల్లా కేంద్రం. ఈ రెండు జిల్లాలను మొత్తం 11 తాలూకాలుగా విభజించారు. ఉత్తర గోవాలో బార్డేజ్, బికోలిం, పెర్నెం, పోండ, సతారి, తిస్వాది తాలూకాలు ఉంటే దక్షిణ గోవాలో కనకోన, మోర్ముగోవ, క్వేపెం, సాల్సెటె, సాంగ్వెం. రవాణా సౌకర్యాలు ప్రైవేటు ఆపరేటర్లు నడిపే బస్సులు గోవాలో ప్రధానమైన రవాణా సౌకర్యం. ప్రభుత్వ రంగంలో ఉన్న కదంబ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషను ముఖ్యమైన రూట్లలోను, కొన్ని గ్రామీణ ప్రాంతాలలోను బస్సులు నడుపుతుంది. కాని ఎక్కువ మంది ప్రయాణాలకు తమ స్వంత వాహనాలనే వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాల వినియోగం ఎక్కువ. ఇంకా టాక్సీలు, ఆటో రిక్షాలు ప్రజల ప్రయాణాలకు అద్దెకు దొరికే వాహనాలు. మోటారు సైకిలు టాక్సీ అనేది గోవాకు ప్రత్యేకమైన అద్దె టాక్సీ - ఇవి పసుపు, నలుపు రంగుల్లో ఉండే మోటారు సైకిళ్ళు. వీటిని నడిపేవారిని "పైలట్లు" అంటారు. ప్రయాణీకుడు వెనుక సీటులో కూర్చుంటాడు. ఇవ్వాల్సిన కిరాయి ముందుగానే బేరమాడుకుంటారు. కొన్ని చోట్ల నదులు దాటడానికి ఫెర్రీలు వాడతారు. గోవాలో రెండు రైల్వే లైనులున్నాయి - ఒకటి స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన వాస్కో డ గామా - హుబ్లీ మార్గం. మరొకటి 1990 దశకంలో నిర్మించిన కొంకణ్ రైల్వే మార్గం. ఎక్కువగా మిలిటరీ అవసరాలకు వాడే దబోలిమ్ ఎయిర్‌పోర్టు మాత్రమే గోవాలో ఉన్న ఎయిర్‌పోర్టు. మార్ముగోవా నౌకాశ్రయం ఎక్కువగా గోవాలో లభించే ఖనిజ సంపద రవాణాకు ఉపయోగపడుతుంది. పనజి పోర్టునుండి ముంబైకి ప్రయాణీకులను చేరవేసే స్టీమర్లు బయలుదేరతాయి. సంస్కృతి thumb|250px| గోవా సాంప్రదాయిక నిర్మాణానికి ఒక ఉదాహరణ గణేష్ చతుర్ధి, క్రిస్టమస్, ఆంగ్ల సంవత్సరాది, షిగ్మో పండుగ, గోవా కార్నివాల్ (కార్నివాల్ అంటే తిరనాళ్లు) - ఇవి గోవాలో పెద్ద ఎత్తున జరుపుకొనే ఉత్సవాలు. సాంప్రదాయిక కొంకణి జానపద గీతాలు, సాంప్రదాయిక "మందో" సంగీతం, పాశ్చాత్య సంగీతం, గోవా ట్రాన్స్ సంగీతం (గోవా ట్రాన్స్ సంగీతం) - వీటన్నింటికీ గోవాలో మంచి ప్రజాదరణ ఉంది. వరి అన్నము, చేపల కూరా - ఇవి గోవా వాసుల ప్రధాన దైనిక ఆహారము. కొబ్బరి, మసాలా దినుసులు, జీడిమామిడి, మిర్చి వంటి ద్రవ్యాలు వాడి తయారుచేసే ఎన్నో రుచికరమైన వంటలు గోవా ప్రత్యేకం. జీడి మామిడి పండునుంచి, కొబ్బరి కల్లునుంచి తయారు చేసే ఫెని అనే మద్యం గోవాలో అత్యంత సామాన్యం. గోవాలో రెండు ప్రపంచ వారసత్వ స్థలాలు (వరల్డ్ హెరిటేజ్ సైట్స్) ఉన్నాయి. బామ్ జీసస్ బసిలికా (Bom Jesus Basilica). ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహమును భద్ర పరచారు. ప్రతి పదేళ్ళకూ ఒకసారి ఈ శరీరాన్ని పూజకై వెలికి తీసి ప్రజలు చూసేందుకు అనుమతిస్తారు. 2004లో ఈ కార్యక్రమం జరిగింది. భారత-పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రాసాదాలు గోవాలో మరొక ఆకర్షణ. కాని ఇవి ప్రస్తుతం చాలావరకు శిథిలమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. పాంజిమ్‌లోని ఫౌంటెన్‌హాస్ (Fontainhas) అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తింపబడింది. గోవా జీవనాన్నీ, నిర్మాణాలనూ ప్రతిబింబించే పేట అని దీనిని చెప్పవచ్చును. కొన్ని హిందూ దేవాలయాలలో (ఉదాహరణ - మంగ్వేషి మందిరం) కూడా ఈ శైలి కనిపిస్తుంది. క్రీడా రంగం గోవాలో ఫుట్‌బాల్ బాగా జనాదరణ ఉన్న ఆట. మైదానాల్లోనూ, పొలాల్లోనూ వర్షాలు లేనపుడు ఫుట్‌బాల్ ఆట బాగా ఆడుతారు. గోవాలో చాలా ఫుట్‌బాల్ క్లబ్బులున్నాయి. ఇటీవలి కాలంలో క్రికెట్ పట్ల జనాకర్షణ బాగా పెరుగుతున్నది. మార్‌గావ్ లోని 'ఫటోరా స్టేడియమ్' ఈ ఆటల పోటీలకు ఉన్న మంచి వసతి. హాకీ మూడవ ప్రజాదరణ గల ఆట. వృక్ష సంపద thumb|200px| చపోరా నది ఒడ్డున సలీంఆలీ రక్షిత పక్షి ఆవాసం (Salim Ali Bird sanctuary) గోవాలోని 1,424 చ.కి.మీ. అరణ్యంలో ఎక్కువ భాగం ప్రభుత్వాధీనంలో ఉన్నది. ముఖ్యంగా పడమటి కనుమలలోని వనాలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీ ప్రాంతపు అరణ్యాలలాగానే వివిధ వృక్ష, జంతు జాలానికి ఆవాసమైన ఉష్ణమండలపు వనాలు. వెదురు, మరాఠా బార్క్స్s, chillar barks and the bhirand వంటి వన్యోత్పత్తులు ఈ అడవులలో లభిస్తాయి. గోవా అంతటా కొబ్బరి చెట్లు, తోటలు సర్వ సాధారణం. ఇంకా జీడి మామిడి, టేకు, మామిడి, పనస, పైనాపిల్, నేరేడు, బ్రెడ్ ఫ్రూట్ వంటి చెట్లుకూడా అడవులలో గాని, తోటలలో గాని బాగా ఉన్నాయి. గోవా అడవులలో నక్కలు, అడవి పందులు, వలస పక్షులు, కింగ్ఫిషర్ పక్షులు, మైనాలు, చిలుకలు వంటి జంతు సంపద ఎక్కువ. వివిధ రకాలైన చేపలు, సరోవర జీవులు, సముద్ర జీవులు ఉన్నాయి. గోవాలో పాములు కూడా ఎక్కువే. ఇవి ఎలుకల సంఖ్యను అదుపులో ఉంచుతాయి. గోవాలో పెక్కు జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని సలీమ్ ఆలీ పక్షి ఉద్యానవనం బోండ్లా వన్యప్రాణి రక్షితవనం మోలెమ్ వన్యప్రాణి రక్షితవనం కోటియాగో వన్యప్రాణి రక్షితవనం మహావీర్ వన్యప్రాణి రక్షితవనం. వార్తా సాధనాలు అన్ని ప్రాంతాలలాగానే ఆల్ ఇండియా రేడియో సర్వీసు, ప్రధాన టెలివిజన్ సర్వీసులు ఉన్నాయి. అన్ని ముఖ్యమైన మొబైల్ సెల్‌ఫోను సర్వీసులు ఉన్నాయి. ముఖ్యమైన వార్తా పత్రికలు: ఆంగ్లంలో హెరాల్డ్ (ఇది గోవాలో బాగా పాత పత్రిక. 1983 వరకు ఓ హెరాల్డో అనే పోర్చుగీసు పత్రిక) ), గోమంతక్ టైమ్స్, నవహింద్ టైమ్స్. ఇవి కాక జాతీయ వార్తా పత్రికలు చదువుతారు. విద్యా రంగం ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కూడా విద్యా సదుపాయాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలలో ఎక్కువగా మరాఠీ, కొంకణి మాధ్యమాలున్నాయి. దేశమంతటావలెనే ఇంగ్లీషు మీడియం చదువుకు జనాదరణ పెరుగుతున్నది. ఉన్నత విద్యకు కాలేజీలున్నాయి. గోవా విశ్వ విద్యాలయం అనేది గోవాలో ఒకే ఒక విశ్వ విద్యాలయం. రెండు ఇంజినీరింగ్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజి ఉన్నాయి. మెరైన్ ఇంజినీరింగ్, హోటల్ మానేజిమెంట్, టూరిజమ్ వంటి కోర్సులకు గోవా ప్రసిద్ధం. కొన్ని స్కూళ్ళలో పోర్చుగీసు భాష మూడవ భాషగా బోధిస్తారు. స్వాతంత్ర్య సమరయోధులు మిత్రా బీర్ మూలాలు బయటి లింకులు గోవా ప్రభుత్వపు అధికారిక వెబ్‌సైటు వికీట్రావెల్ వెబ్‌సైటులో గోవా విశేషాలు గీవా సమాచారం గోవాపై లోన్లీ ప్లానెట్లో టెర్రా గాలరియా వెబ్‌సైటులో గోవా ఫొటోలు వర్గం:ఈ వారం వ్యాసాలు
నాగాలాండ్
https://te.wikipedia.org/wiki/నాగాలాండ్
నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు, మయన్మార్ దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కోహిమా. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడింది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు.Nagaland – State Human Development Report United Nations Development Programme (2005) ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 అస్సామీలు, 14,000 బెంగాళీ ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలతో పంచుకొంటున్నది.Census of India 2011 Govt of IndiaCharles Chasie (2005), Nagaland in Transition , India International Centre Quarterly, Vol. 32, No. 2/3, Where the Sun Rises When Shadows Fall: The North-east (Monsoon-Winter 2005), pp. 253-264Charles Chasie, Nagaland , Institute of Developing Economies (2008) ఇటీవలి చరిత్ర నాగాలాండ్ డిసెంబర్ 1, 1963న రాష్ట్రముగా అవతరించింది. 1956 నుండి భారత దేశములో అంతర్భాగముగా,, దీనికి మునుపు స్వంతంత్ర భుభాగముగా దీని స్థాయి వివాదాస్పదమైనది. కొన్ని వర్గాలు దీన్ని ఆసరాగ తీసుకొని స్వతంత్ర ప్రతిపత్తికై ఆందోళన చేస్తున్నారు. 2004, అక్టోబర్ 2న జరిగిన దాడులలో, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు రెండు వేర్పాటువాద తిరుగుబాటుదారు గ్రూపులు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం, నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ చర్యలకు బాధ్యులని భావిస్తున్నారు. thumb|నాగాలాండ్‌లోని లాంగ్వా గ్రామంలో హెడ్‌హంటర్ ప్రజలు జానాభా: 15.5 లక్షలు (2000) జాతి వర్గాలు: నాగా (16 తెగలు) : 83.6% అస్సామీలు: 11.5% చిన్: 2.5% బెంగాళీ: 0.8% ఇతరులు: 1.6% మతము: క్రైస్తవులు: 87.5% (60%+ బాప్టిస్టులు) హిందూ: 10.1% ముస్లింలు: 1.7% రాజధాని: కోహిమా (జనాభా. 63,000) చిత్రమాలిక మూలాలు ఇవి కూడా చూడండి నాగాలాండ్ జిల్లాల జాబితా నాగాలాండ్ ముఖ్యమంత్రులు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 బయటి లింకులు నాగాలాండ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు నాగాలాండ్
మిజోరం
https://te.wikipedia.org/wiki/మిజోరం
మిజోరమ్ (Mizoram) భారతదేశం ఈశాన్యప్రాంతంలోని ఒక రాష్ట్రం. 2001 జనాభా లెక్కల ప్రకారం మిజోరమ్ జనాభా సుమారు 8,90,000. మిజోరమ్ అక్షరాస్యత 89%. ఇది దేశంలో కేరళ తరువాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. జాతులు, తెగలు మిజోరమ్‌లో అత్యధికశాతం జనులు మిజోతెగ (జాతి) కు చెందినవారు. వీరిలో కొన్ని ఉపజాతులున్నాయి. రెండింట మూడొంతులు 'లూసాయ్' తెగకు చెందినవారు. 'రాల్తే', 'హ్మార్', 'పైహ్తే', 'పోయ్', 'పవి' తెగలుకూడా 'మిజో'లోని ఉపజాతులే. అయితే 'చక్మా' అనే తెగవారు మాత్రం మిజో జాతికి చెందరు. వీరు 'అరకాన్' జాతికి సంబంధించినవారు. మతాలు మొత్తం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో కూడా క్రైస్తవమతం ప్రధానమైనది. ఎక్కువగా హిందువులు, తరువాత ముస్లిములు ఉన్న భారతదేశంలో ఈశాన్యరాష్ట్రాలలోని ఈ సోదరీరాష్ట్రాల విలక్షణతల్లో క్రైస్తవమతం ఒకటి. చక్మా తెగవారు ప్రధానంగా ధేరవాద బౌద్దమతస్తులు. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు (Animism) కలసి ఉంటాయి. ఇటీవలి కాలంలో కొందరు మిజోలు యూదు మతాన్ని అందిపుచ్చుకొంటున్నారు. యూదులలోనుండి దూరమైన తెగలలో మిజోలు ఒకరు అని ఒక స్థానిక పరిశోధకుడు వెలువరించిన పరిశోధనా పఠనము దీనికి స్ఫూర్తి. 1980 నుండి దాదాపు 5 వేలమంది మిజోలు, కుకీలు యూదుమతాన్ని స్వాగతించిన కుటుంబాలకు చెందినవారు. కాని స్థానిక చర్చివర్గాలు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. మిజోరమ్‌లో 7,50,000 పైగా జనాభాను ప్రభావితం చేయగలందున చర్చిలు గణనీయమైన ప్రతిష్ఠ కలిగిఉన్నాయి. 2005 ఏప్రిల్ 1 న ఇస్రాయెల్‌కు చెందిన 'షెఫర్డిక్ యూదు'ల మతగురువు ('రబ్బీ') ష్లోమో ఆమర్ చేత మిజోరమ్‌లోని ప్రస్తుత యూదు వర్గము ఇస్రాయెల్‌ యూదుల దూరమైన తెగ వారి సంతతి అని అధికారికంగా గుర్తించబడింది. అదే సమయంలో పురాతన యూదు సంప్రదాయానుసారము మతము మార్పు చేయడానికి మతగురువుల బృందమొకటి మిజోరమ్ వచ్చింది. తత్ఫలితంగా జరిగిన మార్పిడి వల్ల మెనాషే యూదు తెగ వారి సంతతిని చెప్పుకొనే మిజోలు ఇస్రాయెల్ పునరాగమనచట్టం ప్రకారం ఇస్రాయెల్ తిరిగి వెళ్ళడానికి అర్హులు. శాస్త్రీయవిశ్లేషణ ప్రకారం ఈ వర్గంలో మగవారిలో యూదుసంతతిని సూచించే జన్యువులు (Y-chromosomal_Aaron) కానరాలేదు గాని ఆడువారిలో మధ్యప్రాచ్యప్రాంతానికి చెందిన జన్యువులు గుర్తించబడ్డాయి. ఎప్పుడో మధ్యప్రాచ్యంనుండి వచ్చిన ఒక స్త్రీ స్థానికుడిని పెండ్లాడినందున ఇలా జరిగి ఉండవచ్చునని ఒక వివరణ. గణాంకాలు వైశాల్యం: 21,000 చ.కి.మీ. జనాభా: 890,000 (2001) తెగలు: మిజో / లూషాయి: 63.1% పోయి: 8% చక్మా: 7.7% రాల్తే: 7% పావి: 5.1% కుకి: 4.6% తక్కినవారు: 5.1% మతాలు: క్రైస్తవులు: 85% బౌద్ధులు: 8% హిందువులు: 7% రాజధాని: ఐజ్‌వాల్ (జనాభా 1,82,000) క్రీడాకారులు జెరెమీ లాల్రినుంగా మూలాలు బయటి లంకెలు మిజోరం ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు మిజోరం ప్రభుత్వం ఐజ్వాల్ పోర్టల్ హ్మర్.నెట్: హ్మర్ తెగకు చెందిన సమాచారం బిబిసి వార్తలు: ఇజ్రాయెలీ వీసాలు కోరుతున్న మీజో యూదులు బిబిసి వార్తలు: ఆశతో ఎదురుచూస్తున్న తప్పిపోయిన భారతీయ యూదులు బిబిసి వార్తలు: భారతీయ యూదులను వెనుకేసుచ్చిన రబ్బీ హారెట్జ్: అమర్: బేనీ మెనాషే ప్రాచీన దూరమైన యూదు తెగకు చెందినవారు. జోరాం.ఆర్గ్: మిజోరం గురించి, జో సంతతి వారి గురించిన వార్తలు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు మిజోరాం
ఉత్తర ప్రదేశ్
https://te.wikipedia.org/wiki/ఉత్తర_ప్రదేశ్
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh, హిందీ: उत्तर प्रदेश, ఉర్దూ: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రం. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రం. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రం లక్నో నగరం. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం అలహాబాదులో ఉంది. ఇంకా ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్ ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదానప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉంది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - చైనా, భారత్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండొనేషియా, బ్రెజిల్. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యత బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది) ప్రాచీన చరిత్ర గంగా యమునా పరీవాహక ప్రాంతం పురాతన నాగరికతకు నిలయమైనందున పురాణకాలం నుండి ఉత్తరప్రదేశ్, బీహార్, దాని పరిసర ప్రాంతాలు (ఢిల్లీతో సహా) భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎన్నో రాజవంశాలు, రాజ్యాలు ఈ ప్రాతంలో విలసిల్లాయి, అంతరించాయి. ఇటీవలి చరిత్ర అవధ్ (ఓధ్) రాజ్య సంస్థానమూ, బ్రిటిష్ రాజ్యభాగమైన ఆగ్రా కలిపి 1902 నుండి సంయుక్త పరగణాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) అని పిలువబడ్డాయి. తరువాత రాంపూర్, తెహ్రి సంస్థానాలు కూడా అందులో విలీనం చేయబడ్డాయి. 1947లో భారతస్వతంత్రము తరువాత దీనినే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పరచారు. ఇలా చేయడం వల్ల యు.పి. అనే సంక్షిప్తనామం కొనసాగింది. 2000 సం.లో దీనిలో కొంత వాయువ్యభాగాన్ని ఉత్తరాఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రంగా విభజించారు. ప్రాంతాలు వాయువ్య ప్రాంతం - రోహిల్ ఖండ్ నైఋతి ప్రాంతం - డోఅబ్, బ్రిజ్ (వ్రజభూమి) మధ్య ప్రాంతం - అవధ్ (ఓధ్) ఉత్తర భాగం - బాగల్ ఖండ్, బుందేల్ ఖండ్ తూర్పు భాగం - పూర్వాంఛల్ (భోజపురి ప్రాంతం) ఉత్తర ప్రదేశ్ లోని 70 జిల్లాలు 17 విభాగాలుగా పరిగణించ బడుతాయి. అవి ఆగ్రా, అజంగడ్, అలహాబాదు, కాన్పూర్, గోరఖ్‌పూర్ , చిత్రకూట్, ఝాన్సీ, దేవీపటణ్, ఫైజాబాద్, బాహ్రూచ్, బరేలీ, బస్తీ, మీర్జాపూర్, మొరాదాబాద్, మీరట్, లక్నో, వారాణసి, సహరాన్పూర్. భాషలు హిందీ, ఉర్దూ - రెండు భాషలూ రాష్ట్రంలో అధికార భాషలుగా గుర్తింపబడ్డాయి. పశ్చిమప్రాంతంలో మాట్లాడే "ఖరీబోలీ" (కడీబోలీ) భాష హిందీ, ఉర్దూ భాషలకు మాతృక వంటిది. 19వ శతాబ్దంలో హిందీ భాష ఇప్పుడున్న స్థితికి రూపు దిద్దుకొంది. లక్నోలో మాట్లాడే భాష "లక్నొవీ ఉర్దూ" ప్రధానంగా స్వచ్ఛమైన ఉర్దూగా పరిగణిస్తారు. ఈ భాషనే కవిత్వంలో విరివిగా వాడుతారు. ఇంకా కోషాలి, బ్రజ్ (2000 సంవత్సరాలు పురాతనమైన భాష), బాఘేలి, బుందేలి, భోజపురి భాషలు వేరువేరు ప్రాతాలలో మాట్లాడుతారు. భోజపురి భాష మాట్లాడేవారు ఉత్తరప్రదేశ్, బీహారు, నేపాల్ లలో విస్తరించి ఉన్నారు. రాజకీయాలు భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహాదుర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చరణ్ సింగ్, వి.పి.సింగ్ ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. అటల్ బిహారీ వాజపేయి కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు. ప్రస్తుత ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన యోగి ఆదిత్యనాద్ . విద్యా వ్యవస్థ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విద్యపై గణనీయమైన పెట్టుబడి పెట్టింది. ఫలితాలు ఒక మాదిరిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడువారు విద్యలో బాగా వెనుకబడి ఉన్నారు. 1991 గణాంకాల ప్రకారం 7 సంవత్సరములు పైబడిన బాలికలలో 25 % మాత్రం అక్షరాస్యులు. ఇదే సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 19%, వెనుకబడిన జాతులలో 8 నుండి 11% ఉండగా, వెనుకబడిన జిల్లాలలో మొత్తం అక్షరాస్యత 8% మించలేదు. అలాగని ఉన్నత విద్యకు అవకాశాలు గణనీయంగానే ఉన్నాయి. రాష్ట్రంలో 16 విశ్వ విద్యాలయాలు, 3 సాంకేతిక విశ్వ విద్యాలయాలు, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూరు), ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (లక్నో), చాలా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలీజీలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలు thumb|right|తాజ్ మహల్ తాజ్ మహల్ ( "తాజ్") మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది.ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది.లెస్లీ A. డ్యుటెంపుల్, "ది తాజ్ మహల్", లెర్నర్ పబ్లిషింగ్ గ్రూప్ (మార్చ్ 2003). pg 26: "ది తాజ్ మహల్, ఎ స్పెక్టాక్యులర్ ఎగ్జాంల్ అఫ్ మొఘుల్ నిర్మాణశాస్త్రం, బ్లెండ్స్ ఇస్లామిక్, హిందూ అండ్ పర్షియన్ స్టైల్స్" 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చింది., "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ ఆభరణంగా ఉదాహరించింది.అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది." ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ములాయం సింగ్ యాదవ్ మాయావతి రాజ్‌నాథ్ సింగ్ కళ్యాణ్ సింగ్ అఖిలేష్ యాదవ్ ధరం సింగ్ సైనీ రాజశ్రీ రాణి - నటి శ్వేతా తివారీ - నటి రామ్ నరేష్ యాదవ్ ఇవి కూడా చూడండి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు అఫ్జల్‌ఘర్ ముకుల్ గోయల్ ఛార్ బైట్ మూలాలు బయటి లింకులు ఉత్తర ప్రదేశ్ అధికారిక వెబ్‌సైటు రైల్వే పటం వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:ఉత్తర ప్రదేశ్
మధ్య ప్రదేశ్
https://te.wikipedia.org/wiki/మధ్య_ప్రదేశ్
మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) (హిందీ:मध्य प्रदेश) - పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. భౌగోళికం మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపంలో నర్మదా నది, వింధ్య పర్వతాలు, సాత్పూరా పర్వతాలు ప్రధాన అంశాలు. తూర్పు, పడమరలుగా విస్తరించిన ఈ రెండు పర్వతశ్రేణుల మధ్య నర్మదానది ప్రవహిస్తున్నది. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు తరతరాలుగా ఈ కొండలు, నది హద్దులుగా పరిగణింపబడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన గుజరాత్, వాయవ్యాన రాజస్థాన్, ఈశాన్యాన ఉత్తర ప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌గఢ్, దక్షిణాన మహారాష్ట్ర రాష్ట్రాలతో హద్దులున్నాయి. భాషా (యాస) పరంగాను, సాంస్కృతికంగాను మధ్యప్రదేశ్‌ను ఈ ప్రాంతాలుగా విభజింపవచ్చును. మాల్వా: వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న పీఠభూమి. విశిష్టమైన భాష, సంస్కృతి కలిగి ఉంది. పెద్ద నగరం ఇండోర్. బుందేల్‌ఖండ్ ప్రాంతపు అంచున భోపాల్ నగరం ఉంది. మాల్వా ప్రాంతంలో ఉజ్జయిని ఒక చారిత్రాత్మక పట్టణం. నిమర్ (నేమార్): నర్మదానదీలోయ పశ్చిమభాగం, వింధ్యపర్వతాలకు దక్షిణాన ఉంది. బుందేల్‌ఖండ్: రాష్ట్రానికి ఉత్తరభాగాన ఉన్న కొండలు, సారవంతమైన మైదానాలు. ఈ ప్రాంతం క్రమంగా ఉత్తరాన ఉన్న గంగామైదానం వైపు ఏటవాలుగా ఉంటుంది. బుందేల్‌ఖండ్‌లో గ్వాలియర్ ముఖ్య నగరం. బాగెల్‌ఖండ్: రాష్ట్రానికి ఈశాన్యాన ఉన్న పర్వతమయప్రాతం. వింధ్యపర్వతాల తూర్పుభాగం బాగెల్‌ఖండ్‌లోనే ఉన్నాయి. మహాకోషల్ (మహాకౌశాల్): ఆగ్నేయ ప్రాంతం - నర్మదానది తూర్పు భాగం, తూర్పుసాత్పూరా పర్వతాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మహాకోషల్‌లో ముఖ్యనగరం జబల్‌పూర్. జిల్లాలు మధ్య ప్రదేశ్‌లోని 48జిల్లాలను 9 డివిజన్‌లుగా విభజించారు. ఆ డివిజన్లు: భోపాల్, చంబల్, గ్వాలియర్, హోషంగాబాద్, ఇండోర్, జబల్‌పూర్, రేవా, సాగర్, ఉజ్జయిని. చరిత్ర ప్రాచీన చరిత్ర ఉజ్జయిని ("అవంతీ నగరం" అనికూడా పేరు) ఒకప్పటి "మాల్వా" రాజ్యానికి రాజధాని. క్రీ.పూ. 6వ శతాబ్దిలోనే భారతదేశంలో నగరాలు, నాగరికత రూపుదిద్దుకొటున్న సమయంలో ఇది ఒక ప్రధాన నాగరిక కేంద్రంగా వర్ధిల్లింది. ధానికి తూర్పున బుందేల్‌ఖండ్ ప్రాంతంలో "ఛేది" రాజ్యం ఉండేది. క్రీ.పూ. 320లో చంద్రగుప్త మౌర్యుడు ఉత్తరభారతాన్ని అంతటినీ మౌర్య సామ్రాజ్యం క్రిందికి తెచ్చాడు. అందులో ఇప్పటి మధ్యప్రదేశ్ అంతా కలిసి ఉంది. క్రీ.పూ. 321 నుండి 185 వరకు సాగిన మౌర్యసామ్రాజ్యం అశోక చక్రవర్తి అనంతరం పతనమయ్యింది. అప్పుడు మధ్యభారతంపై ఆధిపత్యంకోసం శకులు, కుషాణులు, స్థానిక వంశాలు పోరుసాగించాయి. క్రీ.పూ.1వ శతాబ్దం నాటికి పశ్చిమభారతంలో ఉజ్జయిని ప్రధాన వాణిజ్యకేంద్రం. గంగామైదానం ప్రాంతాలకు, అరేబియా సముద్రం తీరానికి మధ్యనున్న వాణిజ్యమార్గంలో ఉన్న నగరం. హిందూ, బౌద్ధ మతాల కేంద్రం. సా.శ. 1 నుండి మూడవ శతాబ్దం వరకు మధ్యప్రదేశ్‌లో కొంతభాగం శాతవాహనుల అధీనంలో ఉండేది. 4, 5 శతాబ్దాలలో ఉత్తరభారతదేశం గుప్త సామ్రాజ్యంలో స్వర్ణ యుగంగా వర్ధిల్లింది. అప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రం మధ్యభాగమైన దక్కన్ పీఠభూమిని పాలించే వాకాటకుల రాజ్యం గుప్తుల రాజ్యానికి దక్షిణపు హద్దు. 5వ శతాబ్దాంతానికి ఈ సామ్రాజ్యాలు పతనమయ్యాయి. మధ్యయుగం చరిత్ర "తెల్ల హూణుల" (Hephthalite) దండయాత్రలతో గుప్తసామ్రాజ్యం కూలిపోయింది. దానితో భారతదేశం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. 528లో యశోధర్ముడు అనే మాళ్వా రాజు హూణులను ఓడించి, వారి రాజ్యవిస్తరణకు అడ్డుకట్టవేశాడు. తానేసార్‌కు చెందిన హర్షుడు అనే రాజు ఉత్తరభారతాన్ని కొద్దికాలం ఒకటిగా చేయగలిగాడు. ఆయన 647లో మరణించాడు. తరువాతికాలంలో రాజపుత్ర వంశాల ప్రాభవం మొదలయ్యింది. మాళ్వా పారమారులు, బుందేల్‌ఖండ్ చందేలులు వీరిలో ముఖ్యులు. సుమారు 1010-1060 మధ్య పాలించిన పారమఅర రాజు భోజుడు గొప్ప రచయిత, విజ్ఞాని (polymath). 950-1050 మధ్యలో చందేలులు ఖజురాహో మందిరాలను నిర్మించారు. మహాకోసలలోని "గొండ్వానా"లో గోండ్ రాజ్యాలు నెలకొన్నాయి. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు మధ్యప్రదేశ్‌ను జయించారు. ఢిల్లీ సుల్తానుల పతనం తరువాత మళ్ళీ కొంతకాలం స్థానిక స్వతంత్రరాజుల పాలన సాగింది. గ్వాలియర్‌లో తోమార రాజపుత్రులు, మాళ్వాలో ముస్లిం సులతానులు (వీరి రాజధాని "మండూ") రాజ్యం చేశారు. 1531లో మాళ్వా సులతానులను గుజరాత్ సుల్తానులు జయించారు. ఆధునిక యుగ చరిత్ర అక్బరు చక్రవర్తి (1542-1605) కాలంలో మధ్యప్రదేశ్‌లో అధికభాగం ముఘల్ సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. గొండ్వానా, మహాకోసల రాజ్యాలు గోండ్‌‌రాజుల పాలనలోనే ఉన్నాయి. వీరు ముఘల్ సామ్రాజ్యానికి నామమాత్రంగా సామంతులుగా ఉండేవారు. 1707లో ఔరంగజేబు మరణానంతరం ముఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. అప్పుడే మధ్యభారతంలో మరాఠాలు తమ ప్రాభవాన్ని విస్తరింపజేసుకొనసాగారు. 1720-1760 మధ్య మధ్యప్రదేశ్ చాలాభాగం మరాఠాల అధీనంలోకి వచ్చింది. మరాఠా పేష్వాల అనుజ్ఞలకు లోబడి స్వతంత్ర మరాఠా రాజ్యాలు మధ్యప్రదేశ్‌లో నెలకొన్నాయి. ఇండోర్‌కు చెందిన హోల్కర్‌లు మాళ్వాను పాలించారు. నాగపూర్‌కు చెందిన భోంసలే‌లు మహాకోసల, గొండ్వానాలను, మహారాష్ట్రలోని విదర్భను పాలించారు. ఒక మరాఠా సేనాధిపతి ఝాన్సీ రాజ్యాన్ని స్థాపించాడు. ఆఫ్ఝన్‌ సేనాధిపతి దోస్త్ మొహమ్మద్ ఖాన్‌వంశానికి చెందిన వారు భోపాల్‌ను పాలించారు. 1761లో మూడవ పానిపట్టు యుద్ధం తరువాత మరాఠా విస్తరణకు కళ్ళెం పడింది. ఆ కాలంలో బ్రిటిష్‌వారు బెంగాల్, బొంబాయి, మద్రాసులలో స్థావరాలు ఏర్పరచుకొని భారతదేశంలో తమ అధీనాన్ని విస్తరించుకొనసాగారు. తత్కారణంగా 1775 - 1818 మధ్య మూడు ఆంగ్ల-మరాఠా యుద్ధాలు జరిగాయి. మూడవ యుద్ధం తరువాత బ్రిటిష్‌వారి అధిపత్యానికి దాదాపు ఎదురులేకుండా పోయింది. మహాకోసల ప్రాంతం (సౌగార్, నెర్బుద్ద విభాగాలు) బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోయింది. దీనిని మధ్య పరగణాలు (Central Provinces) అని పిలచేవారు. ఇండోర్, భోపాల్, నాగపూర్, రేవా, మరి చాలా చిన్న సంస్థానాలు బ్రిటిష్‌వారికి లోబడిన రాజ్య సంస్థానాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఉత్తరభాగరాజసంస్థానాలు Central India Agency పాలనలో నడచేవి. స్వాతంత్ర్యానంతర చరిత్ర 1950లో నాగపూర్ రాజధానిగా - మధ్యపరగణాలు, బేరార్, మక్రాయ్ సంస్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లను కలిపి - మధ్యప్రదేశ్‌ను ఏర్పరచారు. Central India Agency ప్రాంతాన్ని మధ్యభారత్, వింధ్యప్రదేశ్‌రాష్ట్రాలుగా ఏర్పరచారు. 1956లో భోపాల్, మధ్యభారత్, వింధ్యభారత్‌లను కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మరాఠీ భాష మాట్లాడే దక్షిణప్రాంతమైన విదర్భను, నాగపూర్‌తో సహా, వేరుచేసి బొంబాయి రాష్ట్రంలో కలిపారు. 2000 నవంబరులో మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (Madhya Pradesh Reorganization Act) క్రింద, మధ్యప్రదేశ్‌లోని ఆగ్నేయ భాగం కొంత విడదీశి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. చారిత్రిక నిర్మాణాలు మధ్యప్రదేశ్‌లో ఎన్నో ప్రదేశాలు సహజసౌందర్యానికి, అద్భుతమైన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి. మూడు స్థలాలు ప్రపంచ వారసత్వ స్థలాలుగా (World Heritage Sites) ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక సంస్థ (UNESCO) చే గుర్తింపబడ్డాయి. అవి రాణి కమలపతి మహల్ ఖజురాహో మందిరాలు (1986) సాంచి బౌద్ధారామాలు (1989) భింబెటక శిలావాసాలు (2003) ఇంకా చారిత్రిక నిర్మాణాలకు పేరుపొందిన స్థలాలు అజయ్‌గఢ్ అసిర్‌గఢ్ భోపాల్ ధార్ గ్వాలియర్ ఇండోర్ మహేశ్వర్ మండూ ఓర్చా పంచమర్హీ శివపురి ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో పర్యటనకు సంబంధించిన వివరాలకోసం వికిట్రావెల్ చూడండి. ప్రకృతి దృశ్యాలు మధ్యప్రదేశ్‌లో ఎన్నో జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని: బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం కన్హా జాతీయ ఉద్యానవనం సాత్పురా జాతీయ ఉద్యానవనం సంజయ్ జాతీయ ఉద్యానవనం మాధవ్ జాతీయ ఉద్యానవనం వనవిహార్ జాతీయ ఉద్యానవనం ఫాస్సిల్ జాతీయ ఉద్యానవనం పన్నా జాతీయ ఉద్యానవనం పెంచ్ జాతీయ ఉద్యానవనం ఇంకా కొన్ని ప్రకృతిసహజ విశేషాలున్న స్థలాలు: బాఘ్ గుహలు బోరి పంచ్‌మర్హి పన్‌పఠా షికార్‌గంజ్ కెన్ ఘరియల్ ఘటీగావ్ కునో పాల్‌పూర్ నర్వార్ చంబల్ కుక్‌దేశ్వర్ నర్సింగ్‌ఘర్ నొరాదేహి భాష మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా మాట్లాడే భాష హిందీ. ప్రామాణికమైన హిందీతోబాటు ఒకోప్రాంతంలో ఒకో విధమైన భాష మాట్లాడుతారు. ఈ భాషలను హిందీ మాండలికాలు అని కొందరూ, కాదు హిందీ పరివారానికి చెందిన ప్రత్యేకభాషలని కొందరూ భావిస్తారు. ఇలా మాట్లాడే భాషలు (యాసలు) : మాళ్వాలో మాల్వి, నిమర్‌లో నిమడి, బుందేల్‌ఖండ్‌లో బుందేలి, బాగెల్‌ఖండ్‌లో బాఘేలి. ఇంకా మధ్యప్రదేశ్‌లో మాట్లాడే భాషలు - భిలోడి భాష, గోండి భాష, కాల్తో భాష; ఇవన్నీ ఆదిమవాసుల భాషలు. మరాఠీ భాష మాట్లాడేవారు కూడా మధ్యప్రదేశ్‌లో గణనీయంగా ఉన్నారు. రాష్ట్రం లోని జిల్లాలు క్ర.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)1AGఅగర్అగర్2,7852ALఅలీరాజ్‌పూర్అలీరాజ్‌పూర్7,28,6773,1822293APఅనుప్పూర్అనుప్పూర్7,49,5213,7472004 BD అశోక్‌నగర్ అశోక్‌నగర్ 8,44,979 4,674 1815 BL బాలాఘాట్ బాలాఘాట్ 17,01,156 9,229 1846 BR బర్వానీ బర్వానీ 13,85,659 5,432 2567 BE బేతుల్ బేతుల్ 15,75,247 10,043 1578 BD భిండ్ భిండ్ 17,03,562 4,459 3829 BP భోపాల్ భోపాల్ 23,68,145 2,772 85410BUబుర్హాన్‌పూర్బుర్హాన్‌పూర్7,56,9933,42722111చచువారా-బీనాగంజ్చచౌరా12 CT ఛతర్‌పూర్ ఛతర్‌పూర్ 17,62,857 8,687 20313 CN ఛింద్వారా ఛింద్వారా 20,90,306 11,815 17714 DM దమోహ్ దమోహ్ 12,63,703 7,306 17315 DT దతియా దతియా 7,86,375 2,694 29216 DE దేవాస్ దేవాస్ 15,63,107 7,020 22317 DH ధార్ ధార్ 21,84,672 8,153 26818 DI దిండోరీ దిండోరి 7,04,218 7,427 9419 GU గునా గునా 12,40,938 6,485 19420 GW గ్వాలియర్ గ్వాలియర్ 20,30,543 5,465 44521 HA హర్దా హర్దా 5,70,302 3,339 17122 HO హోషంగాబాద్ హోషంగాబాద్ 12,40,975 6,698 18523 IN ఇండోర్ ఇండోర్ 32,72,335 3,898 83924 JA జబల్‌పూర్ జబల్‌పూర్ 24,60,714 5,210 47225 JH ఝాబువా ఝాబువా ఉవా10,24,091 6,782 28526 KA కట్నీ కట్నీ 12,91,684 4,947 26127 EN ఖాండ్వా (ఈస్ట్ నిమార్) ఖాండ్వా 13,09,443 7,349 17828 WN ఖర్‌గోన్ (వెస్ట్ నిమార్) ఖర్‌గోన్ 18,72,413 8,010 23329సాత్నాసాత్నా30 ML మండ్లా మండ్లా 10,53,522 5,805 18231 MS మంద్‌సౌర్ మంద్‌సౌర్ 13,39,832 5,530 24232 MO మొరేనా మొరేనా 19,65,137 4,991 39433 NA నర్సింగ్‌పూర్ నర్సింగ్‌పూర్ 10,92,141 5,133 21334నాగ్దానాగ్దా35 NE నీమచ్ నీమచ్ 8,25,958 4,267 19436నివారినివారి4,04,807117034537 PA పన్నా పన్నా 10,16,028 7,135 14238 RS రాయ్‌సేన్ రాయ్‌సేన్ 13,31,699 8,466 15739 RG రాజ్‌గఢ్ రాజ్‌గఢ్ 15,46,541 6,143 25140 RL రత్లాం రత్లాం 14,54,483 4,861 29941 RE రీవా రీవా 23,63,744 6,314 37442 SG సాగర్ సాగర్ 23,78,295 10,252 27243 ST సత్నా సత్నా 22,28,619 7,502 29744 SR సీహోర్ సీహోర్ 13,11,008 6,578 19945 SO సివ్‌నీ సివ్‌నీ 13,78,876 8,758 15746 SH షాడోల్ షాడోల్ 10,64,989 6,205 17247 SJ షాజాపూర్ షాజాపూర్ 15,12,353 6,196 24448 SP షియోపూర్ షియోపూర్ 6,87,952 6,585 10449 SV శివ్‌పురి శివ్‌పురి 17,25,818 10,290 16850 SI సిద్ది సిద్ది 11,26,515 10,520 23251SNసింగ్రౌలివైధాన్11,78,1325,67220852 TI టికంగఢ్ టికంగఢ్ 14,44,920 5,055 28653 UJ ఉజ్జయిని ఉజ్జయిని 19,86,864 6,091 35654 UM ఉమరియా ఉమరియా 6,43,579 4,062 15855 VI విదిశ విదిశ 14,58,212 7,362 198 మూలాలు బయటి లింకులు మధ్య ప్రదేశ్ పోర్టల్ మధ్యప్రదేశ్ ప్రరభుత్వం మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ మధ్యప్రదేశ్ పోలీసు మధ్యప్రదేశ్ మ్యాపు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు *
రాజస్థాన్
https://te.wikipedia.org/wiki/రాజస్థాన్
thumbnail|306x306px| రాజస్థాన్ రాష్ట్ర పక్షి బట్టమేక పిట్ట|alt= రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారతదేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు) రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశం థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయం, భరత్ పూర్ పక్షి ఆశ్రయం ఉన్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం. చరిత్ర రాజపుత్రులచే పాలింపబడింది గనుక రాజస్థాన్ "రాజపుటానా" రాష్ట్రంగా వ్యవహరించేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువకాలం యుద్ధప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటివారెవరూ పూర్తిగా ఆక్రమించలేకపోయారు. అయితే వేరు వేరు ఒడంబడికలద్వారా బ్రిటిష్ పాలకులు మాత్రం పెత్తనం చలాయించారు. ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్ లో చాలా చారిత్రిక నిర్మాణాలు, కోటలు, సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి. అందువల్లనే అక్కడ అభివృద్ధి కొరవడిందనీ, సమాజంలో అసమానతలు ప్రబలి ఉన్నాయనీ, స్త్రీలు బాగా వెనుకబడ్డారనీ కొదరి వాదన. కోటలు రాజస్థాన్ లో ఎన్నో కోట కట్టడాలు ఇప్పటికీ క్షత్రియుల రాచరికానికి, చరిత్రకి అద్దంపడుతుంటాయి. అచల్గర్ కోట: మౌంట్ అబూకి 11 కి. మీ. దూరంలో ఈ కోటను పరమార వంశస్థులు కట్టారు. తరువాత 1452లో ఈ కోటకు రాణా కుంభ అనే రాజు అచల్గర్ అని పేరు పెట్టాడు. ఈ కొటలో 1513 లో కట్టబడిన జైన్ దేవాలయాలు కూడా ఉన్నాయి. సంస్కృతి రాజస్థాన్ లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంది. ఆక్కడి స్త్రీలు ఆచారాలను, సంప్రదాయలను గౌరవిస్తారు, తూచా తప్పకుండా పాటిస్తారు. భారతదేశంలో విడాకుల సంఖ్య అతి తక్కువగా ఉన్న 2, 3 రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటి. దేశంలో ఇతర రాష్ట్రాలలో కాకుండా అక్కడి స్త్రీలు బయటకు ఒంటరిగా వెళ్ళుట, ఫ్యాషన్ గా ఉండుట కనిపించరు. సినిమా, మీడియా ప్రభావం అతి తక్కువగా ఉండటం, పురుషుల కట్టుబాట్ల పట్టింపు దీనికి కారణాలుగా చెప్పవచ్చు. అక్కడ ఇద్దరి వ్యక్తుల మధ్య వాగ్వివాదాలు అతి తక్కువ. పోలీసులు సాధారణంగా రోడ్ల పై కనిపించరు. జిల్లాలు రాజస్థాన్ లో 33 జిల్లాలు ఉన్నాయి.కొత్తగా మరో 19 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. thumb|రవివర్మ చిత్రించిన తైలవర్ణచిత్రం 134 రాజ్‌పుత్ సైనికుడు|alt= ప్రసిద్ధులైన వారు thumbnail|216x216px|రాజస్థాన్ చారిత్రిక కట్టడాలకూ, కోటలకూ, ఆసక్తికరమైన చరిత్రకూ ప్రసిద్ధం - భారతదేశంలో యాత్రికులను బాగా ఆకర్డించే రాష్ట్రాలలో ఒకటి - జైసల్మేర్కోటలో ఒకభాగం ఈ చిత్రంలో ఉంది.|alt= రాజస్థాన్ చరిత్ర, సాహిత్యం ఎన్నో వీరగాధలతో నిండి ఉన్నాయి. ఎందరో త్యాగశీలురూ, ధైర్యశాలురూ చరిత్రలో గుర్తుండిపోయారు. వారిలో కొందరి పేర్లు బలదేవ్ రామ్ మీర్ధా చౌదరి కుంభారామ్ ఆర్యా మహారాణా ప్రతాప్ మీరా బాయి జైమల్ రాథోడ్ వీర దుర్గాదాసు పన్నాబాయి వీరతేజ శేఖాజీ మహారాణీ గాయత్రీ దేవి - భారతీయ జనతా పార్టీ నాయకురాలు మహారాజా సవాయ్ జైసింగ్ మహారాజా సవాయ్ మాన్ సింగ్ మహారాజా సవాయ్ మధో సింగ్ మహారాజా సూరజ్ మల్ స్వామికేశవానంద రాజకీయ నాయకులు అర్జున్ రామ్ మేఘవాల్ వసుంధర రాజే గణాంకాలు thumbnail|216x216px|రాజస్థాన్ జిల్లాలు|alt= జనాభా: 5కోట్ల 65 లక్షలు (2001 లెక్కలు) జనాభాః 6 కోట్ల 85 లక్షలు (2011 లెక్కలు జిల్లాలు: 33 ముఖ్య నగరాలు: జైపూర్, జోధ్ పూర్, ఉదయపూర్, కోట, ఆజ్మీర్, బికనీర్, భిల్వాడా, ఆల్వార్ రోడ్లు: 61,520 కి.మీ. ( 2,846 కి,మీ. జాతీయ రహదారి) భాషలు: హిందీ, రాజస్థానీ అక్షరాస్యత: 61.03% మందిరాలు భారతదేశంలో చాలా పవిత్రంగా భావించే హిందూ, జైన మందిరాలు కొన్ని రాజస్థాన్‌లో ఉన్నాయి: బ్రహ్మ మందిరం: ఆజ్మీర్ వద్ద పుష్కర్‌లో ఉంది. సృష్టికర్త బ్రహ్మను పూజించే మందిరం ఇదొక్కటే. అచలేశ్వర్ మహాదేవ మందిరం: మౌంట్ అబూ వద్ద అచల్‌ఘర్‌లో ఉన్న శివాలయం. ఈ మందిరం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ శివలింగం బదులు శివుని మడమ శిల్పం, ఇత్తడి నంది విగ్రహం ఉన్నాయి. ఆదినాధ్ మందిరం: ఉదయపూర్ సమీపంలో రిఖాబ్‌దేవ్ వద్ద నున్న జైన మందిరం. 15వ శతాబ్దంలో నిర్మితం. ‌ బిజోలియా మందిరాలు: బుంది వద్ద బిజోలియాలో ఉన్న మందిరాల సమూహం. దాదాపు 100 మందిరాలలో మూడు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి. నాథ్‌ద్వారా: ఉదయ్‌పూర్‌కు 48 కి.మీ. దూరాన ఉన్న రాజసమండ్ జిల్లాలో ఉన్న శ్రీనాధ్‌జీ మందిరం. పుష్టిమార్గం అనుసరించేవారికి పూజాస్థలం. అంబికామాత మందిరం: ఉదయపూర్‌కు 50 కి.మీ. దూరంలో మౌంట్ అబూ వద్ద జగత్ గ్రామంలో ఉన్న దుర్గాదేవి మందిరం. సమస్యలు నీటి కొరత రాజస్థాన్ లో తీవ్రమైన సమస్య. ఇవీ చూడండి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గా - అజ్మీరు జంతర్ మంతర్ హవా మహల్ రాజస్థాన్ పర్యాటకం జైసల్మేర్ కోట మెహరాన్ ఘర్ కోట వనరులు Gahlot, Sukhvirsingh. 1992. RAJASTHAN: Historical & Cultural. J. S. Gahlot Research Institute, Jodhpur. Somani, Ram Vallabh. 1993. History of Rajasthan. Jain Pustak Mandir, Jaipur. Tod, James & Crooke, William. 1829. Annals & Antiquities of Rajasthan or the Central and Western Rajput States of India. 3 Vols. Reprint: Low Price Publications, Delhi. 1990. ISBN 81-85395-68-3 (set of 3 vols.) బయటి లంకెలు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం - అధికారిక వెబ్-సైట్ Tourism Department of Rajasthan - Tourism Home Page రాజస్థాన్ ట్రావెల్ వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:రాజస్థాన్
అసోం
https://te.wikipedia.org/wiki/అసోం
అసోం (పూర్వ పేరు అస్సాం) (অসম) ఈశాన్య భారతదేశం లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని దిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతం చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం ముఖ్య వాణిజ్య నగరమైన గౌహాతి సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారం. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అస్సాంకు పశ్చిమ బెంగాల్తో ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడిమెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతోతో సరిహద్దులు ఉన్నాయి. పేరు పుట్టుపూర్వోత్తరాలు కొందరు అస్సాం "అసమ" లేదా "అస్సమ" అనే సంస్కృత పదము యొక్క అపభ్రంశమని భావిస్తారు. ఈ పదము పర్వతమయమైన ఈ ప్రాంతము యొక్క వర్ణనకు కచ్చితంగా సరిపోతుంది. మరికొందరు ఈ పదము అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల పాటు పరిపాలించిన అహోంలకు సంబంధించినదని భావిస్తారు. 1228కి పూర్వం ఈ పదాన్ని ఉపయోగించిన ఆధారాలు లేకపోవడం, చారిత్రక గంథాలు అహోంలను అసాంలని కూడా పేర్కొనడం ఈ వాదానికి ఊతానిస్తున్నాయి. అసమ లేదా అస్సమ అన్న పదాలు "కామరూప"ను భాస్కర వర్మన్ పరిపాలించిన కాలములో వాడబడింది. ఆ కాలములో ప్రస్తుత ఉత్తర అసోం భూమి నుండి విషవాయువులు విరజిమ్ముతూ అనివాసయోగ్యముగా ఉండేది. కొంతమంది కామరూప నేరస్థులు శిక్షను తప్పించుకోవడానికి ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చారని చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ యాత్రా రచనల వల్ల తెలుస్తుంది. వీరే అసమ లేదా అస్సమ అని పిలవబడ్డారు. హ్యుయాన్ త్సాంగ్ అస్సమ ప్రజలు దాడిచేస్తారనే భయముతో చైనాకు ఈ మార్గము గుండా తిరిగి వెళ్లలేదు. కామరూపి భాషలో, ఈ పదానికి వింత మనిషి/పాపితో పాటు ఎవ్వరితో పోల్చలేని వ్యక్తి అనే అర్ధం కూడా ఉంది. అయితే పూర్వపు కామరూపి గ్రంథాలలో ఈ ప్రాంతాన్ని అసమ లేదా అసం లేదా అసోం అని వ్యవహరించనే లేదు. బ్రిటిషు జనరల్ పై ఏదేని కారణము వల్ల ఈ పేరు ఎన్నుకోలేదు. ఈయన ఆంథెరా అస్సమ అనే ఒక శాస్త్రీయ నామము నుండి ఆంథెరాను వదిలేసి మిగిలిన పేరును తీసుకున్నాడు అంటారు. ఈ పద ప్రయోగము తొలిసారిగా బ్రిటీషు వారు యాండబూ అకార్డ్ తరువాత ఎగువ అస్సాం రాష్ట్రమును సృష్టించినప్పుడు జరిగింది. కాని ఈ వాదన అంత నమ్మదగినదిగా లేదు. ఆంథెరా అస్సమ అనే ఒక విధమైన పట్టుపురుగు అస్సాం ప్రాంతంలో అంతటా ఉంది. కనుక అస్సాం ప్రాంతపు పేరు ఆ పురుగుకు తగిలి ఉండ వచ్చును కాని ఆ పురుగుపేరు ప్రాంతానికి వర్తించకపోవచ్చును. భౌగోళికం ఆంగ్ల అక్షరము T ఆకారములో ఉండే ఈ రాష్ట్రము భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన బ్రహ్మపుత్ర నదీలోయ, మధ్యన కర్బి, చాచర్ కొండలు, దక్షిణాన బరక్ లోయ. అసోం రాష్ట్రములో మార్చి నుండి సెప్టెంబరు వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి. అస్సాంలో జీవ సంపద, అడవులు, వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఒకప్పుడు కలప వ్యాపారము జోరుగా సాగేది అయితే భారతదేశ సుప్రీం కోర్టు దీన్ని నిషేధించడముతో అది తగ్గింది. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన కాజీరంగా జాతీయ వనము. రాష్ట్రములో అత్యధికంగా వెదురు ఉత్పత్తి అవుతుంది. కానీ వెదురు పరిశ్రమ ఇంకా ఆరఁభ దశలోనే ఉంది. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు, జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. అతివృష్టి, చెట్ల నరికివేత,, ఇతరత్రా కారణాల వల్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది. భూకంప బాధిత ప్రాంతములో ఉన్న అస్సాం 1897లో (రిక్టర్ స్కేలు పై 8.1 గా నమోదైంది), 1950లో (రిక్టర్ స్కేలు పై 8.6 గా నమోదైనది) రెండు అతిపెద్ద భూకంపాకలకు గురైనది. చరిత్ర thumb|9-10వ శతాబ్దానికి చెందిన కామరూప-పలాస్ వంశ చిహ్నంగా చెక్కబడిన శిల్పం|ఎడమ thumb|సంప్రదాయ దుస్తుల్లో సత్రియా నాట్యం చేస్తున్న యువతి|ఎడమ ప్రాచీన అస్సాం అస్సాం,, పరిసర ప్రాంతాలు పురాణకాలంలో ప్రాగ్జ్యోతిషం అనబడేవని మహాభారతంలో చెప్పబడింది. అక్కడి ప్రజలు కిరాతులనీ, చీనులనీ అనబడ్డారు. కామరూప రాజ్యానికి ప్రాగ్జ్యోతిషపురం రాజధాని. మధ్యయుగ అస్సాం మధ్యయుగంలో దీనిపేరు కామరూప, లేదా కమట. అక్కడ రాజ్యమేలిన వంశాలలో వర్మ వంశం ప్రధానమైనది. కనోజ్‌ను పాలించిన హర్షవర్ధనుని సమకాలీనుడైన భాస్కరవర్మ కాలంలో జువన్‌జాంగ్ అనే చైనా యాత్రికుడు కామరూప ప్రాంతాన్ని సందర్శించాడు. ఇంకా కచారి, చూటియా వంశాలు కూడా రాజ్యమేలాయి. వీరు ఇండో-టిబెటన్ జాతికి చెందిన రాజులు. తరువాత టాయ్ జాతికి చెందిన అహోమ్ రాజులు 600 సంవత్సరాలు పాలించారు. కోచ్ వంశపు రాజులు అస్సాం పశ్చిమభాగాన్నీ, ఉత్తర బెంగాల్‌నూ పాలించారు. ఈ రాజ్యం అప్పుడు రెండు భాగాలయ్యింది. పశ్చిమ భాగం మొగల్‌చక్రవర్తుల సామంతరాజ్యమైంది. తూర్పు భాగం అహోం రాజుల పాలన క్రిందికి వచ్చింది. మొత్తానికి బ్రిటిష్ వారి కాలం వరకూ ఎవరూ అస్సాంను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొనలేక పోయారు. బ్రిటీషు పాలన అహోం రాజులలోని అంతర్గత కలహాల కారణంగా అది 1821 నాటికి బర్మా పాలకుల సామంతరాజ్యంగా మారింది. దానితో బర్మావారికి, బ్రిటిష్ వారికి వైరం మొదలయ్యింది. మొదటి ఆంగ్ల-బర్మా యుద్ధము తరువాత 1826లో యాండబూ ఒడంబడిక ప్రకారం అస్సాం బ్రిటిషు అధీనంలోకి, బెంగాలు ప్రెసిడెన్సీలో భాగంగా, తీసుకోబడింది. 1905-1912 మధ్య అస్సాం ఒక వేరు పరగణా అయ్యింది. భారత స్వాతంత్ర్యం తరువాత అహోం రాజ్యభాగం, ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్, నాగా పర్వత ప్రాంతం, కచారి రాజ్య ప్రాంతం, లూషాయ్ పర్వత ప్రాంతం, గారో పర్వత ప్రాంతం, జైంతియా పర్వత ప్రాంతం - ఇవన్నీ అస్సాం రాష్ట్రంలో చేర్చ బడ్డాయి. రాజదానిగా షిల్లాంగ్ నగరం ఏర్పడింది. సిల్హెట్ ప్రాంతం వారు పాకిస్తాన్‌లో చేరారు. మణిపూర్, త్రిపుర సంస్థానాలు ప్రత్యేక పరగణాలయ్యాయి. స్వాతంత్ర్యం తరువాత అస్సాం స్వాతంత్ర్యం తరువాత 1960 - 1970 దశకాలలో అస్సాం రాష్ట్రంలోంచి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మిజోరామ్ రాష్ట్రాలు వేరుచేయబడ్డాయి. రాజధాని దిస్పూర్కు మార్చబడింది. పెరుగుతున్న గౌహతి నగరంలో దిస్పూర్ కలిసిపోతున్నది. అసోం అధికారిక భాషగా చేయాలని సంకల్పించినపుడ కచార్ జిల్లా వాసులూ, ఇతర బెంగాలీ భాష మాటలాడేవారూ ప్రతిఘటించారు. ఇది తీవ్రమైన ఉద్యమమైంది. 1980 దశకంలో ఆరు సంవత్సరాల పాటు తీవ్రమైన ఉద్యమం నడచింది. బయటి ప్రాంతనుండి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి వచ్చి స్థిరపడినవారిని వెళ్ళగొట్టాలనీ, వారు స్థానికుల జన విస్తరణను మార్చేస్తున్నారనీ అనేది ఈ ఉద్యమంలో ప్రధానాంశం. మొదట శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం క్రమేపీ హింసాత్మకమవసాగింది. కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం తరువాత ఈ ఉద్యమం చల్లబడింది. కాని ఆ ఒప్పందంలో చాలా భాగం ఇప్పటికీ అమలు కాలేదు. ఇది ప్రజలలో అసంతృప్తికి ఒక ముఖ్యకారణం. 1980-90 లలో బోడో తెగల వారు, మరికొన్ని తెగలవారు ప్రత్యేక ప్రతిపత్తి కోసము ఘర్షణలు ప్రారంభించారు. ఇవి క్రమంగా సాయుధ, హింసాత్మక పోరాటాలయ్యాయి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ United Liberation Front of Asom (ULFA) and నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ National Democratic Front of Bodoland (NDFB) వంటి తీవ్రవాద వర్గాలకూ, భారత సైన్యానికీ మధ్య పోరులు పెచ్చరిల్లాయి. సైన్యం మానవహక్కులను మంటకలుపుతున్నదనీ, విచక్షణా రహితంగా హింసను అమలు చేస్తున్నదనీ ఆరోపణలు బలంగా ఉన్నాయి. వర్గాల మధ్య పోరాటాలలో ఎన్నో మూక హత్యలు జరిగాయి భాషలు అస్సామీ, బోడో భాష రాష్ట్ర అధికార భాషలు. భాషా శాస్త్ర యుక్తముగా ఆధునిక అస్సామీ భాష తూర్పు "మాగధి ప్రాకృతం" నుండి ఉద్భవించింది. అయితే ఈ ప్రాంతములో మాట్లాడే ఇతర టిబెటో-బర్మన్, మోన్-ఖమెర్ భాషల యొక్క ప్రభావము కూడా అధికాముగానే ఉంది. బోడో ఒక టిబెటో-బర్మన్ భాష. బ్రిటీషు వారి రాకతో, బెంగాల్ విభజనతో బరక్ లోయలో బెంగాళీ (సిల్హెటి) ప్రాబల్యం హెచ్చింది. నేపాళీ, హిందీ రాష్ట్రంలో మాట్లాడే ఇతర ముఖ్య భాషలు రాష్ట్ర గణాంకాలు అవతరణము.1950 జనవరి 26 వైశాల్యము. 78, 438 చ.కి. జనసంఖ్య. 31, 169, 272 స్త్రీలు. 15, 214, 345 పురుషులు. 15, 954, 927, నిష్పత్తి . 954/1000 అక్షరాస్యత. స్త్రీలు. 73.18% పురుషులు. 78.81% ప్రధాన మతాలు. హిందు, ముస్లిం, బౌద్ధ మతం. ప్రధాన భాషలు. అస్సామీ, బెంగాలి, బోడో. జిల్లాల సంఖ్య.27 గ్రామాలు. 25, 124 పట్టణాలు.125 పార్లమెంటు సభ్యుల సంఖ్య, 14 శాసన సభ్యుల సంఖ్య. 126 మూలము. మనోరమ యీయర్ బుక్ సంస్కృతి ఆదిమవాసుల ఆచారాలు, అందిపుచ్చుకున్న సంప్రదాయాలు కలగలిపి ఉండటం వల్ల మిగిలిన ప్రాంతాలకంటే అస్సామీ సంస్కృతి కాస్త భిన్నమైన, సుసంపన్నమైన సంస్కృతిగా అభివృద్ధి చెందింది. గమోసా అస్సామీ ఆచార వ్యవహారాలలో గమోసాకు ఒక విశిష్టమైన స్థానముంది. ఇది ఒక దీర్ఘ చతురస్రాకారపు గుడ్డ. మూడు ప్రక్కల ఎరుపుగాని, వేరే రంగులో గాని అంచు ఉంటుంది. నాలుగవ ప్రక్క అల్లిక అంచుగా ఉంటుంది. దీనికి వళ్ళు తుడుచుకొనేది అనే సామాన్య అర్ధం చెప్పవచ్చును. నిజంగానే వళ్ళు తుడుచుకోవడానికి వాడినా, గమోసాను మరెన్నో విధాలుగా వాడుతారు. రైతులు మొలగుడ్డగా వాడుతారు. బిహూ నాట్యకారులు చిత్రమైన ముడివేసి తలగుడ్డగా వాడుతారు. ప్రార్థనా సమయంలో మెడలో వేసుకొంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకొనే విధంగా భుజాన వేసుకొంటారు. బిహు పండుగకు పెద్దవారికి గమోసాలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఏదయినా భక్తిగా, ఆదరంగా భావించే వస్తువును నేలమీద పెట్టరు. ముందుగా గమోసా పరచి, దానిపై ఉంచుతారు. గామ్+చాదర్ (అనగా పూజా గదిలో పురాణ గ్రంథాన్ని కప్పి ఉంచే గుడ్డ) - అనే కామరూప పదం గమోసాకు మూలం. అన్ని మతాలువారూ గమోసాను ఇదే ఆదరంతో దైనందిన జీవితంలో వాడుతారు బిహు బిహు పండుగ అస్సాంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ. ఇది సంవత్సరంలో మూడు సార్లు వస్తుంది. మాఘ్ (జనవరి), బోహాగ్ (ఏప్రిల్), కతి (అక్టోబరు) దుర్గా పూజ దుర్గాపూజ కూడా అస్సాంలో బాగా పెద్దయెత్తున జరుపుకొనే పండుగ. అస్సాంలో స్థిరపడిన లక్షలాది బెంగాలీయుల ప్రభావం కూడా ఈ పండుగ ప్రాచుర్యానికి కొంత కారణం కావచ్చును. సంగీతం భిన్నజాతులు, సంస్కృతుల సమ్మేళనం కారణంగా అస్సాం జానపద సంగీతంలో చాలా వైవిధ్యం కానవస్తుంది. దీనికి ఆధునిక సంగీతంలోని బాణీలు జోడించడం వల్ల మరింత సుసంపన్నమైనది. రుద్ర బారువా, భూపేన్ హజారికా, ఖాగెన్ మహంత, అనిమా చౌధురి - వీరు ప్రసిద్ధులైన సంగీతకారులలో కొందరు. దేవాలయాలు ఉమానంద దేవాలయం ఆర్ధిక వ్యవస్థ అస్సాం టీ తేయాకు ఉత్పత్తి అస్సాం ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది. సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో పండే అస్సాం తేయాకుకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కామెల్లియా అస్సామికా అనేది అస్సాం పేరుతో ప్రసిద్ధమైన ఒక తేయాకు రకం. (ఇటువంటి గౌరవం అస్సాంకూ, చైనాకు మాత్రమే దక్కింది కామెల్లియా సినెసిస్ అనే పేరుతో ఒక చైనా తేయాకు రకం ఉంది. అస్సాంలో తేయాకు వ్యవసాయం బ్రిటిషువారు వృద్ధి చేశారు. ఆ కాలంలో బీహారు, ఒడిషా ప్రాంతాలనుండి కూలీలుగా వచ్చి చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు. అస్సాంచమురు; ముడి చమురు, సహజవాయువు కూడా అస్సాం ఉత్పత్తులలో ప్రధానమైనవి. ప్రపంచంలో చమురు ప్రప్రథమంగా అమెరికాలోని టిటస్‌విల్లిలోలభించింది. రెండవ స్థలం అస్సాం. ఇక్కడ అప్పుడు త్రవ్విన బావిలో ఇప్పటికీ చమురు ఉత్పత్తి కొనసాగుతున్నది. అస్సాంలో సమస్యలు బ్రిటిషు అధికారం నుంచి అస్సాం ప్రాంతంలోని వేరువేరు పరగణాలు ప్రశాంతంగా స్వతంత్రభారతదేశంలో విలీనం చేయబడ్డాయి. కాని తరువాత ఈ ప్రాంతంలోని అభివృద్ధి బాగా కుంటుపడింది. ఫలితంగా తీవ్రవాద వర్గాలు, వేర్పాటు వాద వర్గాలు ప్రాభవం సంపాదించగలిగాయి. గ్రామీణ ప్రాంతంలోని తీవ్రమైన నిరుద్యోగ సమస్య వీరికి అనుకూలమైన పరిస్థితులను కూరుస్తున్నాయి. దీనికి తోడు వివిధ తెగల మధ్య వైరాలు, పొరుగు దేశాలనుంచి కొన సాగుతున్న వలసలు, వెనుకబాటుతనం - ఇవన్నీ అస్సాంను వెంటాడుతున్న సమస్యలు. కొన్ని తెగల మధ్య ఘర్షణలు చాలా తీవ్రంగ ఉంటున్నాయి. జిల్లాలు వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)1 BK బక్స జిల్లా ముషాల్‌పూర్ 953,773 2,400 3982 BA బాజాలి జిల్లా పట్శాల 3 BP బార్పేట జిల్లా బార్పేట 1642420 3245 5064 BS విశ్వనాథ్ జిల్లా విశ్వనాథ్ చారియాలి 5,80,000 1,100 530 5 BO బొంగైగావ్ జిల్లా బొంగైగావ్ 906315 2510 3616 CA కచార్ జిల్లా సిల్చార్ 1442141 3786 3817 CD చరాయిదేవ్ జిల్లా సోనారీ 471,418 1,064 4408 CH చిరంగ్ జిల్లా కాజల్‌గావ్ 481,818 1,468 3289 DR దర్రాంగ్ జిల్లా మంగల్‌దాయి 1503943 3481 43210 DM ధెమాజి జిల్లా ధెమాజి 569468 3237 17611 DU ధుబ్రి జిల్లా ధుబ్రి 1634589 2838 57612 DI డిబ్రూగర్ జిల్లా డిబ్రూగర్ 1172056 3381 34713 DH దిమా హసాయో జిల్లా (ఉత్తర కచార్ హిల్స్ జిల్లా) హాఫ్లాంగ్ 186189 4888 3814 GP గోల్‌పారా జిల్లా గోల్‌పారా 822306 1824 45115 GG గోలాఘాట్ జిల్లా గోలాఘాట్ 945781 3502 27016 HA హైలకండి జిల్లా హైలకండి 542978 1327 40917 JO హోజాయ్ జిల్లా హోజాయ్ 931,218 18 JO జోర్హాట్ జిల్లా జోర్హాట్ 1009197 2851 35419 KM కామరూప్ మెట్రో జిల్లా గౌహతి 1,260,419 1,528 82020 KU కామరూప్ జిల్లా అమింగావ్ 1,517,202 1,527.84 52021 KG కర్బి ఆంగ్లాంగ్ జిల్లా దిఫు 812320 10434 7822 KR కరీంగంజ్ జిల్లా కరీంగంజ్ 1003678 1809 55523 KJ కోక్రఝార్ జిల్లా కోక్రఝార్ 930404 3129 29724 LA లఖింపూర్ జిల్లా ఉత్తర లఖింపూర్ 889325 2277 39125 MJ మజులి జిల్లా గారమూర్ 167,304 880 30026 MA మారిగావ్ జిల్లా మారిగావ్ 775874 1704 45527 NN నాగావ్ జిల్లా నాగావ్ 2315387 3831 60428 NB నల్బరి జిల్లా నల్బరి 1138184 2257 50429 SV శివ్‌సాగర్ జిల్లా శిబ్‌సాగర్ 1052802 2668 39530 ST సోనిత్‌పూర్ జిల్లా తేజ్‌పూర్ 1677874 5324 31531 SM దక్షిణ సల్మారా జిల్లా హాట్సింగరి 555,114 568 98032 TI తిన్‌సుకియా జిల్లా తిన్‌సుకియా 1150146 3790 30333 UD ఉదల్గురి జిల్లా ఉదల్గురి 832,769 1,676 49734 WK పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లా హమ్రెన్ 3,00,320 3,035 99 ఇవికూడా చూడండి అసోం ముఖ్యమంత్రులు అసోం శాసనసభ ఎన్నికలు 2006 పరిణీత బోర్తకూర్ మూలాలు వెలుపలి లంకెలు అస్సాం.ఆర్గ్ అసోం ప్రభుత్వ వెబ్‌సైటు కామాఖ్య శక్తిపీఠం * అసోం అసోం వర్గం:ఈ వారం వ్యాసాలు
బీహార్
https://te.wikipedia.org/wiki/బీహార్
బీహార్ (बिहार) భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రం. రాజధాని పాట్నా. బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశం సరిహద్దుగా ఉంది. పశ్చిమాన ఉత్తర ప్రదేశ్, దక్షిణాన ఝార్ఖండ్, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి. బీహార్ రాష్ట్రం హిందీ మాట్లాడే ప్రాంతపు మధ్యనుంది. సారవంతమైన గంగానదీ మైదానం బీహార్‌లో విస్తరించి ఉంది. చరిత్ర పురాతన చరిత్ర బీహారు చరిత్ర పురాతనమైంది. ఒకప్పుడు ఇది మగధ ప్రాంతము.నేటి పాట్నా ఆనాటి పాటలీపుత్రనగరం. మౌర్యసామ్రాజ్యానికి రాజధాని. అప్పటినుండి వెయ్యేళ్ళకాలం ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా వెలిగింది. నలందా, విక్రమశీల విశ్వవిద్యాలయాలు ప్రపంచప్రఖ్యాతి గాంచినవి. 'విహారం' అనే సంస్కృతపదం నుండి 'బీహార్' పేరు రూపొందింది. మతాలకు జన్మస్థానం బౌద్ధ, జైన మతాలకు బీహార్ జన్మస్థలం. బోధ్‌గయలో గౌతమబుద్ధుడు జ్ఙానోదయం పొంది, ధర్మ బోధన ఆరంభించాడు. జైనమత ప్రవక్త మహావీరుడు బీహారులోని వైశాలిలో జన్మించాడు. మధ్యయుగపు చరిత్ర విదేశీయుల దండయాత్రలతో బీహార్ ప్రాభవం బాగా దెబ్బతిన్నది. 12వ శతాబ్దంలో మహమ్మదు ఘోరీ సైన్యం వశమైంది. మధ్యలో ససరాం నుండి వచ్చిన షేర్‌ షా సూరి ఆరేళ్ళు రాజ్యమేలినప్పుడు బీహార్ కొంత వైభవాన్ని మళ్ళీ చవిచూచింది. కలకత్తా నుండి పెషావర్ (పాకిస్తాన్) వరకు గ్రాండ్‌ట్రంక్ రోడ్డు ఆ కాలంలోనే వేయబడింది. 1557-1576 మధ్యకాలంలో అక్బర్ చక్రవర్తి బీహార్, బెంగాల్‌లను ఆక్రమించి మొత్తాన్ని బెంగాల్ పాలనలో కలిపాడు. ముఘల్ సామ్రాజ్య పతనానంతరం బీహార్ క్రమంగా బెంగాల్ నవాబుల అధీనంలోకి వెళ్ళింది. ఆధునిక చరిత్ర 1765లో బక్సార్ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి బీహార్, బెంగాల్, ఒడిషాలపై దివానీ (పన్ను) అధికారం లభించింది. అప్పటినుండి 1912 వరకు బీహార్ ప్రాంతం బ్రిటిష్‌వారి బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. 1912లో బీహార్‌ను వేరుచేశారు. 1935లో బీహారులో కొంతభాగాన్ని ఒడిషాగా ఏర్పరచారు. 2000లో బీహారులోని 18 జిల్లాలను వేరుచేసి ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామంలో ససరాంకు చెందిన బాబు కున్వర్ సింగ్, మరెందరో బీహార్ వీరులు ప్రముఖంగా పోరాడారు. తరువాత స్వాతంత్ర్యపోరాటంలో బీహారువారు ఘనంగా పాలు పంచుకొన్నారు. బీహారులోని చంపారణ్ నీలి సత్యాగ్రహంతో భారతదేశంలో మహాత్మా గాంధీ నాయకత్వం అంకురించిందనిచెప్పవచ్చును. అప్పుడు సత్యాగ్రహానికి తోడు నిలిచిన బాబూ రాజేంద్రప్రసాద్ తరువాత మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు. కాలరేఖ 560-480 BCE: బుద్ధుడు Before 325 BCE: మగధలో నందుల రాజ్యం, వైశాలిలో లిచ్ఛవిరాజ్యం 325-185 BCE: మౌర్య వంశం 250 BCE: 3వ బౌద్ధ సంఘము 185 BCE-80 CE: శుంగ వంశం 80 - 240: ప్రాంతీయ రాజ్యాలు 240 - 600: గుప్త వంశం 600 - 650: హర్ష వర్ధనుడు 750 - 1200: పాల వంశం 1200: ముహమ్మద్ ఘోరీ సైన్యం చేత నలంద, విక్రమశిల విద్యాలయాల నాశనం 1200-1250:బౌద్ధ మతం క్షీణత 1250-1526: ఢిల్లీ సుల్తానులుపాలన - టర్క్, తుఘ్లక్, సయ్యిద్, లోడీ సుల్తానులు 1526-1540: బాబర్చేత ఢిల్లీ సుల్తానుల పరాజయం, ముఘల్ వంశముl ఆరంభం 1540-1555: ముఘల్ రాజ్యాన్ని సూరి వంశము లోబరచుకొంది. షేర్‌షా సూరి ఈ వంశములోని వాడే. 1526-1757: మళ్ళీ ముఘల్ పాలన మొదలు 1757-1857: బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలన 1857: సైనిక తిరుగుబాటు 1857-1947: బ్రిటిష్ రాజ్యం పాలన 1912: బెంగాల్ నుండి బీహర్, ఒడిషాల విభజన 1935: బీహార్‌నుండి ఒడిషా వేరు 1947: భారత స్వాతంత్ర్యము, బీహారు రాష్ట్రం 2000: దక్షిణ బీహారును వేరుచేసి ఝార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు. భౌగోళికం బీహారు ఎక్కువ భాగం సారవంతమైన మైదాన ప్రాంతం. గంగ, శోణ, బాగమతి, కోసి, బుధి గండక్, ఫల్గు వంటి ఎన్నో నదుల బీహారు భూభాగంలో ప్రవహిస్తున్నాయి. దక్షిణ బీహారులో చిన్న కొండలున్నాయి. వాతావరణం డిసెంబరు, జనవరి మాసాలు చలికాలం ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీలు సెల్సియస్ వరకు నమోదవుతాయి. వేసవికాలం ఏప్రిల్, మే లలో 40-45 డిగ్రీలవరకు వెళ్తుంది. జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం. రాష్ట్ర గణాంకాలు అవతరణం. 1912 మార్చి 22 వైశాల్యం. 94,163 చ.కి.మీ జనసంఖ్య. 103,804,637 స్త్రీలు.49,619,290 పురుషులు. 54,185,347 నిష్పత్తి . 916 జిల్లాల సంఖ్య.38 గ్రామాలు. 39,015 పట్టణాలు.130 ప్రధాన భాష. హింది, ఉర్దూ, ఆంగిక, బొజ్ పురి, మఘధి, మిథిలి ప్రధాన మతం.హిందు, ఇస్లాం, బౌద్ధం, క్రీస్తు. పార్లమెంటు సభ్యుల సంఖ్య,40 శాసన సభ్యుల సంఖ్య. 243 మూలం. మనోరమ యీయర్ బుక్ ఆర్ధిక వ్యవస్థ 2000 సంవత్సరంలో ఖనిజ సంపద, పరిశ్రమలు బాగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రాన్ని విభజించిన తరువాత బీహారు ప్రధానంగా వ్యావసాయిక రాష్ట్రంగా మిగిలిపోయింది. సారవంతమైన గంగా పరీవాహక మైదానం బీహారు ఆర్థికరంగానికి ఆధారం. కాని వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలవలన తరచు దెబ్బతింటూ ఉంది. ప్రత్యేకంగా అభివృద్ధిచేసిన నీటివనరులు స్వల్పం. వ్యావసాయిక, ఇతర పరిశ్రమల అభివృద్ధికై కృషి జరుగుతున్నది గాని ఇప్పటికి ప్రగతి అంతగా లేదు. భారతదేశంలో బాగా పేదరాష్ట్రాలలో ఒకటిగా బీహారు గుర్తింపబడుతుంది. దీనికి చాలా కారణాలు చెబుతారు. తక్కువ అక్షరాస్యత, కేంద్రం నిర్లక్ష్యత (ఇదివరకు కలకత్తా, ఇప్పుడు ఢిల్లీ), కులాలవారీగా, మతాలవారీగా చీలిపోయిన సమాజం, సంస్కరణలు రాకపోవడం, నాయకుల అవినీతి - ఇలాంటి చాలా కారణాలున్నాయి. రాజకీయాలు బీహారు శాసన, పాలనా విధానం అన్ని రాష్ట్రాలవలెనె ఉంది. - గవర్నరు, ముఖ్య మంత్రి, శాసన సభ, సివిల్ సర్వీసు, న్యాయ వ్యవస్థ వగయిరా. దాదాపు దశాబ్దం పైగా బీహారు రాజకీయాలలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రముఖ వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. రాజకీయ నాయకులూ మేవాలాల్ చౌదరి జిల్లాలు ప్రయాణ,రవాణా సౌకర్యాలు బీహారులో రెండు విమానాశ్రయాలున్నాయి. పాట్నా, గయ రైల్వే వ్వస్థ బీహారులో బాగా విస్తరించి ఉంది. అన్ని ప్రధాన నగరాలకు రైలు కనెక్షన్లున్నాయి. బీహారు రోడ్డు రవాణా వ్యవస్థ అంత బాగా లేదు. రోడ్లు బాగుండకపోవడం ఇందుకొక కారణం. చూడదగినవి బౌద్ధ క్షేత్రాలు - బోధ్ గయ, నలంద, రాజగిరి. జైన క్షేత్రాలు- వైశాలి , పవపురి. సిక్ఖు క్షేత్రాలు- హర్‌మందిర్ సాహిబ్, పాట్నా (గురు గోబింద్ సింగ్ జన్మస్థానం). హిందూ క్షేత్రాలు - గయ (పిండదాన స్థలం), బైద్యనాథ ధామం, మహిసి తారామందిర్. ముస్లిం క్షేత్రాలు - బిహార్-ఎ-షరీఫ్ చారిత్రిక స్థలాలు - పైన చెప్పినవి మాత్రమే కాక, చంపారణ్, ససరాం మొదలైనవి సంస్కృతి పండుగలు అన్ని మతాలవారికి బీహారు నెలవైనట్లే అన్ని పండుగలు జరుపుకుంటారు.మకర సంక్రాంతి, దసరా, హోలీ, ఈద్-ఉద్-ఫిత్రా, బక్రీద్, ముహర్రం, శ్రీరామ నవమి, రథయాత్ర, రాఖీ, మహాశివరాత్రి, దీపావళి, లక్ష్మీపూజ, క్రిస్టమస్, మహావీర జయంతి, బుద్ధపూర్ణిమ, ఇంకా అనేక జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలు బీహారులో సంరంభంగా జరుపుకొంటారు అయితే దీపావళి తరువాతి వారంలో వచ్చే ఛత్ లేదా దలాఛత్ పండుగ మాత్రం బీహారుకు ప్రత్యేకం, బీహారీలకు చాలా ముఖ్యం. ఇది సూర్యుడిని ఆరాధించే పండుగ. ఈ ఆచారాన్ని వలస వెళ్ళిన బీహారీలు తమతో తీసుకెళ్ళినందున ఇప్పుడు దేశమంతటా ప్రధాన నగరాలలో ఛత్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. జానపద గేయాలు, సంగీతం బీహారులో గంగా మైదానంలో సంస్కృతి పురాతనమైనట్లే వారి జానపద సంగీతం చాలా పురాతనమైనది. ఎంతో వైవిధ్యము కలిగినది. జీవనంలో అన్ని సందర్భాలకూ, ఉత్సవాలకూ ఆయా విశిష్ట బాణీలలో జానపద గేయాలున్నాయి. ఇంకా హాస్యాన్నీ, ఆనందాన్నీ కలగలిపిన హోలీ పాటలు కూడా చాలా ఉన్నాయి. 19వ శతాబ్దంలో బ్రిటిష్‌వారి దుష్పాలన వల్ల, క్షీణించిన ఆర్థిక గతివల్లా చాలామంది ఫిజీ, మారిషస్ వంటి పరదేశాలకు వలసపోయారు. అప్పటి చేదు పరిస్థితులకు అద్దం పట్టే విషాదపూరిత గేయాలూ, నాటికలూ కూడా చాలా జనప్రసిద్ధమైనాయి. భాష, సాహిత్యం బీహారులో హిందీ, ఉర్దూ మాత్రమే కాకుండా మరెన్నో స్థానిక భాషలున్నాయి. భోజపురి, మైథిలి, మాగహి, ఆంగిక వంటివి. వీటిని కొంత వరకు హిందీ మాండలికాలని కూడా పరిగణిస్తూ ఉంటారు. వీటన్నింటినీ కలిపి బీహారీ భాష అని కూడా వ్యవహరిస్తుంటారు. బీహారు నండి ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలు ఉన్నారు. రాజా రాధికా రమణ సింగ్, శివ పూజన్ సహాయ్, దివాకర ప్రసాద్ విద్యార్ధి, నిరాలా, రామ్ బిక్ష్ బేనిపురి, దేవకీ నందన్ ఖత్రి (చంద్ర కాంత నవలా రచయిత), విద్యాపతి (మైథలి భాషా రచయిత) వంటి వారు. సినిమా బీహారులో భోజపురి భాష సినిమా పరిశ్రమ బాగా వేళ్ళూనుకొంది. కొద్దిపాటి మైధిలి సినిమా పరిశ్రమ కూడా ఉంది. విద్య ఒకప్పుడు విద్యలకు నిలయమై, ప్రపంచ స్థాయిలూ ఉండే నలందా, విక్రమశిల విశ్వవిద్యాలయాలు 13వ శతాబ్దంలో నాశనమయ్యాయి. తరువాత బీహారులో అంత గొప్ప విద్యాలయాలు వచ్చాయని చెప్పలేము. బీహారు జనాభాకు, మారుతున్నఅవసరాలకూ, ఆశయాలకూ అనుగుణమైన విద్యావకాశాలు బీహారులో అభివృద్ధి చెందలేదు. విద్యా వ్యవస్థ తక్కిన భారతదేశంలో లానే ఉంది. బడులు 1980 దశకంలో చాలా ప్రైవేటు యాజమాన్పు స్కూళ్ళను ప్రభుత్వం అధినంలోకి తీసుకొన్నది. ఇవన్నీ బీహారు స్కూల్ ఎక్జామినేషను బోర్డు అధ్వర్యంలో నడుస్తాయి. ఇంకా వివిధ పాఠశాలలు ICSE, CBSE బోర్దులకు అనుబంధంగా ఉన్నాయి. విశ్వ విద్యాలయాలు, కాలేజీలు బీహారులో 5 విశ్వ విద్యాలయాలున్నాయి. పాట్నా విశ్వవిద్యాలయం, పాట్నా: 1917లో సంస్థాపితం. భారత ఉపఖండంలో 7వ ప్రాచీన విశ్వవిద్యాలయం. ఇందులో 11 కాలేజీలున్నాయి. భాగల్పూర్ విశ్వవిద్యాలయం, భాగల్పూర్ లలిత్ నారాయణ్ మిథిల విశ్వవిద్యాలయం, దర్‌భంగా కామేశ్వర్ సింగ్ విశ్వవిద్యాలయం, దర్‌భంగా మగధ విశ్వవిద్యాలయం, బోధ్‌గయ బీహార్ విశ్వ విద్యాలయం, ముజఫర్‌పూర్ బీహారులో ప్రభుత్వాధీనంలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. - పాట్నా, భాగల్పూర్, ముజఫర్‌పూర్ ఇవి కూడా చూడండి బీహార్ ముఖ్యమంత్రులు అమీ మందిర్ (బీహార్) బుద్ధి మై దేవాలయం (బీహార్) శ్రీనివాస్ కుమార్ సిన్హా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 సయ్యద్ రఫత్ ఆలం బయటి లంకెలు Website of government of Bihar Districts of Bihar History of Bihar వర్గం:బీహార్ వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు
అరుణాచల్ ప్రదేశ్
https://te.wikipedia.org/wiki/అరుణాచల్_ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని ఒక రాష్ట్రం. భారతదేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతం ఒక భాగమని చైనా వాదన. భారత, చైనాల మధ్య వివాదాస్పదంగా మిగిలిన ప్రాంతాలలో అక్సాయి చిన్తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రం, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున బర్మా, పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇటానగర్ రాష్ట్ర రాజధాని. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రం ఉత్తర సరిహద్దైన మెక్‌మెహన్ రేఖను గానీ అధికారికంగా గుర్తించలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 పిన్యిన్:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించింది: (పశ్చిమం నుండి తూర్పుకు) కోన కౌంటీ, లుంఝే కౌంటీ, నంగ్ కౌంటీ, మైయిన్లింగ్ కౌంటీ, మేదోగ్ కౌంటీ, ఝాయూ కౌంటీ. అయితే అదే సమయంలో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక వాస్తవాధీన రేఖను నిర్ణయించాయి. ఈ వివాదం ఎటువంటి అందోళనలకు దారితీసే అవకాశం లేదని భావించారు. ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా పిలవబడుతున్న ఈ ప్రాంతం 1987 వరకు అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైంది.https://www.outlookindia.com/national/boundary-issues-what-are-the-border-disputes-in-northeast-india-why-are-they-so-comple-news-289528 చరిత్ర ఇక్కడి గిరిజనుల తొలి పూర్వీకులు అవగత చరిత్రకు మునుపే టిబెట్ నుండి ఇక్కడికి వలస వచ్చారు. తరువాతి కాలంలో థాయి, బుర్మా నుండి వలస వచ్చిన వారు వీరితో చేరారు. అపతానీ అనే తెగకు చరిత్ర గురించిన అవగాహన ఉన్నప్పటికీ, రాష్ట్ర వాయవ్య ప్రాంత భాగాల గురించి తప్ప మిగతా ప్రాంతం గురించి పెద్దగా తెలియదు. లభ్యమౌతున్న చరిత్ర 16 వ శతాబ్దం నాటి అహోం చరిత్ర గాథలు మాత్రమే. గిరిజన మోన్‌పా, షెర్దూక్‌పెన్ తెగలవారు స్థానిక పాలకుల గురించిన చరిత్రను రికార్డు చేస్తూ వచ్చారు. వాయవ్య ప్రాంతాలు సా.శ.పూ. 500, సా.శ. 600 మధ్య విలసిల్లిన మోన్‌పా రాజ్య ఏలుబడిలోకి వచ్చాయి. తరువాత ఉత్తర ప్రాంతాలు టిబెట్ పాలనలోకి వచ్చాయి. రాష్ట్రం లోని మిగత ప్రాంతాలు, ముఖ్యంగా మయాన్మార్ కు చేరువగా ఉన్న ప్రాంతాలు అహోంల పాలనలోకి వచ్చాయి. 1858లో ఈ ప్రాంతాలను బ్రిటిషు వారు భారత్ లో కలిపేసారు. పశ్చిమ సియాంగ్ లోని సియాంగ్ పర్వత పాదాల వద్ద గల 14 వ శతాబ్దపు హిందూ దేవాలయం, మాలినీతన్ గుడి శిథిలాల తవ్వకాల్లో రాష్ట్ర పురాతన చరిత్ర గురించిన కొత్త విషయాలు తెలిసాయి. హిందూ దేవతల బొమ్మలు, మండపాలు బయల్పడ్డాయి. స్థానికలకు ఇది తీర్థయాత్రాస్థలంగా మారిపోయింది. భిస్మాక్‌నగర్ వద్ద గల మరో సాంస్కృతిక స్థలం వద్ద లభించిన ఆధారాలను బట్టి ఇక్కడ స్థానిక నాగరికత వర్ధిల్లిందని తెలుస్తోంది. తవాంగ్ జిల్లాలో గల మూడో సాంస్కృతిక వారసత్వ స్థలం, తవాంగ్ బౌద్ధారామం వద్ద బౌద్ధ మతావలంబీకులైన తెగల ప్రజల చరిత్రకు చెందిన ఆధారాలు దొరికాయి. 1913-14లో బ్రిటిషు అధికారి, సర్ హెన్రీ మెక్‌మెహాన్ సిమ్లాలో జరిగిన ఒక సమావేశంలో భారత్ చైనాల మధ్య 550 మైళ్ళ పొడవైన ఒక సరిహద్దు రేఖను ప్రతిపాదించాడు. అదే మెక్‌మెహాన్ రేఖ. కానీ 1947లో చైనా ఈ సరిహద్దు రేఖను తిరస్కరించి, అసలా రేఖను ఎప్పుడూ అంగీకరించలేదని 1929 నాటి ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లోని మాపును ఉదహరిస్తూ వాదించింది. ఆ మాపులో సరిహద్దు రేఖ ఏకంగా అస్సాం లోని మైదాన ప్రాంతం వద్ద గుర్తించబడి ఉంది. ఈ వివాదాన్ని సాకుగా తీసుకుని, 1959 ఆగష్టు 26 న చైనా సైనికుల గుంపు ఒకటి మెక్‌మెహాన్ రేఖను దాటి భారత భూభాగంలోకి కొన్ని మైళ్ళు చొచ్చుకు వచ్చి, లాంగ్‌జు వద్దగల ఔట్‌పోస్టును పట్టుకుంది. 1961లో దీన్ని వదలి వెనక్కి వెళ్ళినా, తిరిగి 1962లో ససైన్యంగా చొచ్చుకువచ్చి, భారత చైనా యుద్ధానికి తెర లేపింది. ముందు భూటాన్ సరిహద్దుకు దగ్గరగా గల తాంగ్లా, తవాంగ్ ల వద్ద దాడి చేసి, తరువాత మొత్తం సరిహద్దు రేఖ పొడవునా దాడి చేసింది. అనేక చోట్ల బాగా లోపలికి చొచ్చుకు వచ్చారు. అయితే, వెనక్కి, మెక్‌మెహాన్ రేఖ వద్దకు తిరిగి వెళ్ళిపోవడానికి ఒప్పుకుని, 1963లో యుద్ధ ఖైదీలను వదలిపెట్టారు. అస్సాం మైదాన ప్రాంత పరిరక్షణలో భారత సంసిద్ధత, భారతీయ వైమానిక దళ పటిమ, చైనీయులకెదురైన ప్రతికూల పరిస్థితులు దీనికి కారణంగా భారత్ చెప్పుకోగా, కేవలం రాజకీయ కారణాల వల్లనే వెనుదిరిగామని చైనా చెప్పుకుంది. ఈ యుద్ధం తరువాత అప్పటి వరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం అస్సాంలో భాగమైంది. చైనాతో ఉన్న ఘర్షణాత్మక వైఖరిని దృష్టిలో ఉంచుకుని 1987 లో అరుణాచల్ ప్రదేశ్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను ఇచ్చారు. కానీ చైనా దీన్ని గుర్తించలేదు. భౌగోళికం అరుణాచల్ ప్రదేశ్ లోన్ ఎక్కువ భాగం హిమాలయాలు ఆక్రమించుకుని ఉన్నాయి. అల్థౌఘ్ పర్త్స్ ఒఫ్ లోహిత్ చాంగ్‌లాంగ్, తిరాప్ లలోని కొన్ని ప్రాంతాల్లో పట్‌కోయి కొండలు వ్యాపించి ఉన్నాయి. వాతావరణం అరుణాచల్ ప్రదేశ్ లో వాతావరణం ఎత్తును బట్టి మారుతూ ఉంటుంది. టిబెట్ సరిహద్ద్దుకు దగ్గరగా, ఎగువ హిమాలయాల వద్ద ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో అతిశీతల వాతావరణం నెలకొని ఉంటుంది. మధ్య హిమాలయాల వద్ద సమశీతోష్ణ స్థితి ఉంటుంది. యాపిల్, కమలా పండ్ల వంటివి పండుతాయి. దిగువ హిమాలయాలు, సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణ వాతావరణం ఉంటుంది. రాష్ట్రంలో వర్షపాతం చాలా ఎక్కువ; సాలుకు 2,000 నుండి 4,000 మి.మీ (80 నుండి 160 అంగుళాలు) వర్షపాతం నమోదవుతుంది. పర్వత సానువుల్లో రోడోడెండ్రన్, ఓక్, పైన్, మేపుల్, ఫర్, జూనిపర్ మొదలైన వృక్షాలతో కూడిన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. పాలనా విభాగాలు అరుణాచల్ ప్రదేశ్ ను పరిపాలనా సౌలభ్యం కొరకు 16 జిల్లాలుగా విభజించబడింది. ప్రతి జిల్లా పాలనా వ్యవహారాలు నిర్వర్తించడానికి, స్థానిక ప్రజల అవసరాలను తీర్చడానికి ఒక జిల్లా కలెక్టరు నియమించబడతాడు. చైనా యోచనలపై అపనమ్మకంతో ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా టిబెట్ సరిహద్దుపై భారత సైన్యం గట్టి నిఘా కొనసాగుతుంది. ఉత్తర ప్రాంతాలు, ఇండో-బర్మా సరిహద్దులో, నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాలలో నాగా-క్రైస్తవ తీవ్రవాద వర్గాలు స్థానిక ప్రజలను హింసిస్తున్నారని వచ్చిన ఆరోపణల వలన ఈ ప్రాంతాలను సందర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరం ఉంది జిల్లాలు అంజావ్ ఛంగ్‌లంగ్ తూర్పు కమెంగ్ తూర్పు సియాంగ్ కమ్లె క్రా దాడీ కురుంగ్ కుమె లేపా రాడా లోహిత్ లంగ్‌డంగ్ లోయర్ దిబాంగ్ వ్యాలీ లోయర్ సియాంగ్ లోయర్ సుబన్‌సిరి నామ్‌సాయ్ పక్కే కెస్సాంగ్ పపుమ్ పరె షి యోమి సియాంగ్ తవాంగ్ తిరప్ అప్పర్ దీబాంగ్ వ్యాలీ అప్పర్ సియాంగ్ అప్పర్ సుబన్‌సిరి వెస్ట్ కామెంగ్ వెస్ట్ సియాంగ్ ప్రజలు thumb|ఆపతాని తెగకు చెందిన మహిళలు 65% అరుణాచలవాసులు, 20 ప్రధాన సమష్టి తెగలు, 82 చిన్న తెగలకు చెందినవారు. ఈ తెగల సంస్కృతి, భాష, నమ్మకాలు పరిపుష్టం, విభిన్నమైనవి. వీరిలో అధికసంఖ్యాకులు టిబెట్ లేదా థాయి-బర్మా సంతతులకు చెందినవారు. మిగిలిన 35% మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినవారు. ఈ వలస ప్రజలలో 30,000 మంది బంగ్లాదేశీ కాందిశీకులు, చక్మా నిర్వాసితులు. ఇందులో భారతదేశ ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్ నుండి వలస వచ్చిన వారు కూడా ఉన్నారు.అరుణాచల్ ప్రదేశ్ స్థానిక తెగలలో ఆది, నిషి, మోన్పా తెగలు ప్రధానమైనవి. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 1991 లో ఉన్న 41.59% నుండి 54.74%కు పెరిగింది. ప్రస్తుత గణన ప్రకారం 487,796 మంది అక్షరాస్యులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు సగభాగం ప్రజలు డోన్యి పోలో మతాన్ని అవలంబిస్తారు. ఇంకొక 42% మంది ప్రజలు బౌద్ధ మతం, హిందూ మతానికి చెందినవారు. మిగిలిన వాళ్లు క్రైస్తవ, ఇస్లాం మతస్థులు. ఆర్ధిక వ్యవస్థ వ్యావసాయమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన ఆయువుపట్టు. స్థానికులు ఝుం అని వ్యవహరించే పోడు వ్యవసాయ పద్ధతిని గిరిజన జాతుల ప్రజలు విరివిగా అవలంబించేవారు. కానీ అది ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. వ్యవసాయం తర్వాత అంతే ముఖ్య ఆర్థిక వనరు అటవీ ఉత్పత్తులు.ఇక్కడ వరి, మొక్కజొన్న, జొన్న, గోధుమ, పప్పుదినుసులు, చెరుకు, అల్లం, నూనె గింజలు మొదలైన పంటలను పండిస్తారు. అరుణాచల్ వాతావరణం పండ్లు, పూల తోటలకు కూడా చాలా అనుకూలమైంది.చెక్క మిల్లులు, ప్లైవుడ్ తయారీ (ఈ రెండు పరిశ్రమలను ఇటీవల నిషేధించారు), బియ్యపు మిల్లులు, పండ్ల నిలువ కేంద్రాలు, చేనేత, హస్తకళలు రాష్ట్రంలోని ముఖ్య పరిశ్రమలు. రాజకీయాలు అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి ప్రేమ్ ఖాండు నాయకత్వాన అరుణాచల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అరుణాచల్ కాంగ్రెస్ (మిత్తి), కాంగ్రెస్ (డోలో), పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. రవాణా రాష్ట్రంలో, ఇటానగర్, దాపర్జియో, జీరో, అలోంగ్, తేజూ, పషిగత్ పట్టణాలలో ప్రభుత్వ విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతం పర్వతమయమైనందు వల్ల ఈ విమానాశ్రయాలన్నీ చాలా చిన్నవి. ఎక్కువ సంఖ్యలో విమానాలకు ఇవి ఆశ్రయం ఇవ్వలేవు. పర్యటన అరుణాచల్ ప్రదేశ్ ప్రశాంత నిర్మల వతావరణం దేశవిదేశాల నుండి అనేకమంది యాత్రీకులను ఆకర్షిస్తుంది. స్థానికంగా కూడా అనేకమంది ప్రజలు అరుణాచల్ ప్రదేశ్ విభిన్న సంస్కృతిని ఆస్వాదించడానికి బొండిలా, తవాంగ్, తిరప్ మొదలైన ప్రదేశాలను సందర్శిస్తుంటారు. రాష్ట్ర గణాంకాలు రాష్ట్ర అవతరణ 1987 పిబ్రవరి 20, వైశాల్యం.83,743 చ.కి., జనసంఖ్య.1,382,611 స్త్రీలు., 662,379 పురుషులు., 720,232 నిష్పత్తి . 920, జిల్లాల సంఖ్య. 16, గ్రామాలు, పట్టణాలు. 3,863, ప్రధాన భాష. ప్రధాన మతం., బౌద్ధమతం/హిందు మతం, క్రీస్తు మతం., పార్లమెంటు సభ్యుల సంఖ్య, 2 శాసన సభ్యుల సంఖ్య. 60 ఇవి కూడా చూడండి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్లు సురేంద్రనాథ్ ద్వివేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 మూలాలు బయటి లింకులు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ వివాదాస్పద ప్రాంతాన్ని సూచిస్తున్న పెద్ద పటము అరుణాచల్ పాలనా యంత్రాంగ లింకులు అరుణాచల్ ఫోటోలు * వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:ఏడు సోదర రాష్ట్రాలు వర్గం:వివాదాస్పద ప్రాంతాలు
పంజాబ్
https://te.wikipedia.org/wiki/పంజాబ్
పంజాబ్ (ਪੰਜਾਬ) (Punjab) భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన జమ్ము- కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, నైరుతిలో రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ దేశపు పంజాబు రాష్ట్రము ఉంది. 'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది. ప్రాచీన చరిత్ర భారత ఉపఖండంలో వికసించినట్లు కనుగొన్న ప్రథమ నాగరికత సింధునదీ నాగరికత ఈ ప్రాంతంలోనే ఉంది. భారతదేశంపై దండెత్తిన పాశ్చాత్యులకు (గ్రీకులు, అరబ్బులు, టర్క్‌లు, ఇరానియనులు, ముఘలులు, ఆఫ్ఘనులు) పంజాబు మొదటి యుద్ధభూమి. కనుక ఆత్మ రక్షణ, పోరాట పటిమ పంజాబీయుల చరిత్రలో అత్యంత ముఖ్యభాగాలైపోయాయి. పోరస్ (పురుషోత్తముడు) అనే రాజుతో యద్ధాన్ని చేస్తున్న గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తన తల్లికి వ్రాసిన లేఖలో ఇలా ఉన్నది - నేను సింహాలలాంటి ధైర్యవంతులైన వీరులతో యద్ధం చేస్తున్నాను. నా సైనికులకు ప్రతి అడుగూ ఉక్కులా అడ్డు తగులుతున్నది. నువ్వు ఒకే అలెగ్జాండరుకు జన్మనిచ్చావు. కాని ఇక్కడ ప్రతిఒకడినీ ఒక అలెగ్జాండరు అనవచ్చునుThe evolution of Heroic Tradition in Ancient Panjab, 1971, Dr Buddha Parkash. History of Porus, Patiala, Dr Buddha Parkash. History of the Panjab, Patiala, 1976, Dr Fauja Singh, Dr L. M. Joshi (Ed). Panjab Past and Present, pp. 9-10; History of Porus, pp. 12, 38, Dr. Buddha Parkash; Histoire du Bouddhisme Indien, p 110, E. Lamotte; Political History of Ancient India; 1996, p 133, 216-17, Dr H. C. Raychaudhury, Dr B. N. Mukerjee; Hindu Polity, 1978, pp 121, 140, Dr K. P. Jayswal. విభజన తర్వాత చరిత్ర 1947కు ముందు ఒకటిగా ఉండే పంజాబు స్వాతంత్ర్యసందర్భంగా విభజనకు గురైంది. మహమ్మదీయులు ఎక్కువగా ఉన్న (పశ్చిమ) పంజాబు పాకిస్తాను దేశంలో భాగమైంది. సిక్కు, హిందూ మతస్తులు అధికంగా ఉన్న (తూర్పు) పంజాబు భారతదేశంలో ఉంది. రాష్ట్ర విభజన పంజాబీయుల జీవితాలలో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. మత విద్వేషాలవల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జనులు కట్టుబట్టలతో ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి వలస పోయారు. పాటియాలా, మరి కొన్ని చిన్న రాజసంస్థానాలుకూడా భారతదేశంలో భాగమైనాయి. 1950లో భారతదేశంలో రెండు పంజాబు రాష్ట్రాలు ఏర్పరచారు - బ్రిటిష్‌పాలనలో ఉన్న పంజాబును "పంజాబు" రాష్ట్రమనీ, అక్కడి రాజసంస్థానాలనన్నిటినీ కలిపి "పాటియాలా, తూర్పు పంజాబు సంయుక్త రాష్ట్రము" (Patiala and East Punjab States Union-PEPSU) అనీ అన్నారు. 1956లో PEPSU కూడా పంజాబు రాష్ట్రంలో విలీనం చేశారు. హిమాలయ ప్రాంతంలో ఉన్న ఉత్తరాది జిల్లాలను మాత్రం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు. ఆంతకుపూర్వపు పంజాబు ప్రావిన్సు రాజధాని లాహోరు పాకిస్తాన్‌కు చెందిన పంజాబులో ఉన్నందున భారత పంజాబుకు కొత్త రాజధాని అవసరమయ్యింది. అప్పుడు చండీగఢ్ నగరాన్ని క్రొత్త రాజధానిగా నిర్మించారు. 1966 నవంబరు 1న పంజాబులో హిందువులు ఎక్కువగా ఉన్న ఆగ్నేయప్రాంతాన్ని వేరుచేసి హర్యానా రాష్ట్రంగా ఏర్పరచారు. రెండు రాష్ట్రాలకూ మధ్యనున్న చండీగఢ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా నిర్ణయించారు. పంజాబుకూ, హర్యానాకూ కూడా రాజధాని చండీగఢ్‌ రాజధానిగా కొనసాగుతున్నది. భాష సరిహద్దుకు అటూ, ఇటూ మాట్లాడేది ' పంజాబీ' భాష అయినా లిపులు మాత్రం వేరు. భారతదేశంలో పంజాబీ భాషను 'గురుముఖి' లిపిలో వ్రాస్తారు. పాకిస్తానులో పంజాబీ భాషను 'షాహ్‌ముఖి' లిపి (అరబిక్ లిపినుండి రూపాంతరం చెందినది) లో వ్రాస్తారు. సంస్కృతి పంజాబు సంస్కృతి ఎంతో సుసంపన్నమైనది. పంజాబీయులు తమ సాంఘిక బాధ్యతలకు మంచి విలువలనిస్తారు. మతం భారతదేశంలో హిందువులు ఆధిక్యత లేనటువంటి ఆరు రాష్ట్రాలలో పంజాబు ఒకటి. పంజాబులో దాదాపు 60% ప్రజలు సిక్ఖు మతస్తులు.అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయం అని ప్రసిద్ధమైన హర్‌మందిర్ సాహిబ్ సిక్ఖు మతస్తుల పరమ పవిత్ర స్థలము. సిక్ఖుల తరువాత హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అమమృత్‌సర్‌లో. ఇది జైన మతస్తులకు కూడా ఒక పవిత్రస్థలము. జిల్లాలు ఆర్ధిక వ్యవస్థ స్థూల ఆర్ధిక స్థితి పంజాబు స్థూల ఆర్థిక ఉత్పత్తి (మిలియన్ రూపాయలలో, మార్కెట్ ధరల ఆధారంగా) క్రింద ఇవ్వబడింది.భారత ప్రభుత్వ గణాంక విభాగం అంచనా . సంవత్సరం రాష్ట్రం స్థూల ఆర్థిక ఉత్పత్తి 1980 50,250 1985 95,060 1990 188,830 1995 386,150 2000 660,100 ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 2004లో పంజాబు స్థూల ఉత్పత్తి 27 బిలియన్ డాలర్లు అని అంచనా. మౌలిక సదుపాయాలు వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ పంజాబు ప్రశంసనీయమైన పురోగతి సాధించింది. మంచి మౌలిక సదుపాయాలు (ముఖ్యంగా రోడ్లు, కకాలువలు, విద్యుత్తు) పంజాబును వ్యవసాయానికి, పరిశ్రమలకు అనువైన రాష్ట్రంగా మలచాయి. పంజాబు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు - రోడ్డు, రైలు, విమాన రవాణా వ్యవస్థ - దేశంలో అత్యుత్తమమైనదని "భారత జాతీయ ప్రాయోగిక ఆర్ధిక పరిశోధనా సంస్థ" (Indian National Council of Applied Economic Research -NCAER) నివేదికలో పేర్కొనబడింది. ఈ సూచిక ప్రకారం భారతదేశపు సగటు 100 పాయింట్లు కాగా పంజాబుకు ఈ విషయంలో 210 పాయింట్లు లభించాయి. అలాగే పంజాబులో సగటు విద్యుత్తు వినియోగం దేశపు సగటుకంటే రెండున్నర రెట్లు ఎక్కువ. 1974 నాటికే పంజాబులో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కలుగజేయబడింది. మొత్తం రోడ్లు: 47,605 కి.మీ. - జాతీయ రహదారులు రాష్ట్రంలో దాదాపు అన్ని నగరాలకు, ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయి. 97% గ్రామాలకు పక్కా రోడ్లున్నాయి. జాతీయ రహదారులు: 1000 కి.మీ. రాష్ట్రం హైవేలు: 2166 కి.మీ. జిల్లా స్థాయి రోడ్లు: ముఖ్యమైనవి 1799 కి.మీ. + ఇతరం 3340 కి.మీ. లింకు రోడ్లు: 31,657 కి.మీ. వ్యవసాయం పంజాబు నేల సారవంతమైనది. దానికి తోడు మంచి నీటి వనరులు, ప్రాజెక్టులు, అభివృద్ధిశీలురైన రైతులు పంజాబును వ్యవసాయంలో అగ్రగామిగా చేశారు. గోధుమ ప్రధానమైన పంట. ఇంకా పత్తి, చెరకు, వరి, జొన్న, ఆవాలు, బార్లీ వంటి పంటలు, రకరకాల పండ్లు పంజాబులో ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు. పంజాబును "భారతదేశానికి ధాన్యాగారం" అంటారు. భారతదేశంమొత్తం గోధుమ ఉత్పత్తిలో 60%, వరి ఉత్పత్తిలో 40% పంజాబునుండే వస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో చూసినట్లయితే 2% గోధుమ, 1% వరి, 2% ప్రత్తి పంజాబులో పండుతున్నాయి. పరిశ్రమలు పంజాబులోని కొన్ని ముఖ్యమైన పారిశ్రామికోత్పత్తులు - విజ్ఞానశాస్త్రీయ పరికరాలు, విద్యుత్‌పరికరాలు, యంత్రభాగాలు, వస్త్రాలు, కుట్టు మిషనులు, క్రీడావస్తువులు, ఎరువులు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, ఉన్ని దుస్తులు, చక్కెర, నూనెలు. పర్యాటక రంగం పంజాబులో యాత్రికులను ఆకర్షించే అనేక స్థలాలున్నాయి. - చారిత్రిక స్థలాళు, ప్రకృతి అందాలు, మందిరాలు, నాగరికతానిలయాలు, గ్రామీణ సౌందర్యం, జానపద కళారూపాలు - వీటివలన పర్యాటక రంగం మంచి అభివృద్ధిని సాధిస్తున్నది. కొన్ని పర్యాటక స్థలాలు: అమృత్‌సర్ వాఘా సరిహద్దు భక్రా-నంగల్ లూధియానా జలంధర్ పాటియాలా విద్య పంజాబులో ఉన్నతవిద్యనందించే సంస్థలు క్రింద ఇవ్వబడ్డాయి. 1960-70 దశకంలో దేశంలో హరితవిప్లవం విజయవంతం కావడానికి పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యమైన పాత్ర వహించింది.ఇది లూథియానా లో ఉంది. అలాగే ఫగ్వారా లోని లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం (L.P.U) ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుకుంటున్నారు. గురునానక్‌దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్‌సర్. పంజాబీ విశ్వవిద్యాలయం, పాటియాలా. పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, లూధియానా. పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం, జలంధర్. పంజాబ్ వైద్య విశ్వవిద్యాలయం, ఫరీద్‌కోట్. పంజాబ్ పశువైద్య విశ్వవిద్యాలయం, తల్వాండీ సాబో. గురు అంగద్‌దేవ్ పశువైద్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం. నేషనల్ ఇనస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జలంధర్. థాపర్ ఇనస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, పాటియాలా. ఇతరాలు 1980 దశకంలో ఖలిస్తాన్ అనే ప్రత్యేక సిక్ఖుదేశం కావాలని తీవ్రవాద ఉద్యమం నడచింది. ఈ సమయంలో పంజాబు జీవితం, ఆర్థిక వ్యవస్థ బాగా అస్తవ్యస్తమైనాయి. క్రమంగా పంజాబు పోలీసులు, భారత మిలిటరీ కలిసి తీవ్రవాద ఉద్యమాన్ని అణచివేశారు. స్వర్ణదేవాలయంలో మకాం వేసిన తీవ్రవాదులను అధిగమించడానికి మిలిటరీ ఆలయంలోకి ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ చర్య సిక్ఖుమతస్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగించింది. ప్రముఖులు మన్మోహన్ సింగ్ అమరిందర్ సింగ్ చరణ్‌జిత్ సింగ్ చన్నీ భగవంత్ మాన్ జీవన్ జ్యోత్ కౌర్ లభ్ సింగ్ ఉగోకే హర్‌పాల్ సింగ్ చీమా యస్తికా భాటియా - భారత మహిళా క్రికెటర్‌ అభినవ్ శుక్లా మంగళ్ ధిల్లాన్ - సినిమా నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత రాజేశ్ బిందాల్ ఇవి కూడా చూడండి పంజాబ్ ముఖ్యమంత్రులు పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ కుటుంబాల జాబితా పంజాబ్ లో జరుపుకునే హిందూ పండగల జాబితా పంజాబ్ ఆర్థిక వ్యవస్థ కాంబోజ్ అల్లావుద్దీన్ ఖాల్జీ ముల్తాన్‌ను జయించడం మూలాలు బయటి లింకులు Welcome to Official Web site of Punjab, India Punjab Panjab News Colleges and Educational Institutes in Punjab Complete information about punjab, Punjab Encylopedia Official Government of Punjab tourism information site The Filming of the Hissar Famine Lokesewa.com is a portal on Punjab & its culture. It depicts Punjabiat A Western journalist’s report on his short tourism experience of Punjab Map of Punjab Punjab State Human Rights Commission (in Chandigarh), began 1997-03-17 Faridkot Moga District The Tribune - Major regional English newspaper Indian Express - Major regional English newspaper Punjab Newspaper - Major e newspaper in English Origin of Non Violence వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు
మేఘాలయ
https://te.wikipedia.org/wiki/మేఘాలయ
మేఘాలయ (मेघालय) (Meghalaya) భారతదేశపు ఈశాన్యప్రాంతంలో ఒక చిన్న రాష్ట్రము. ఇది 300 కి.మీ. పొడవు, 100 కి.మీ. వెడల్పు ఉన్న పర్వతమయ రాష్ట్రము. వైశాల్యం 22,429 చ.కి.మీ. మొత్తం జనాభా 21,75,000 (2000 సం. జనాభా లెక్కలు). మేఘాలయయకు ఉత్తరాన అస్సాం రాష్ట్రం హద్దుగా బ్రహ్మపుత్ర నది ఉంది. దక్షిణాన షిల్లాంగ్ ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ జనాభా 2,60,000. 1972 కు ముందు ఇది అస్సాం రాష్ట్రంలో ఒక భాగం. 1972 జనవరి 21న మేఘాలయ ప్రత్యేక రాష్ట్రంగా విభజింపబడింది. వాతావరణం thumb|250px|left|చిరపుంజి సైన్ బోర్డు మేఘాలయ వాతావరణం మరీ వేడికాదు. మరీ చల్లన కాదు. కానీ వర్షాలు మాత్రం భారతదేశంలోనే అత్యధికం. కొన్ని ప్రాంతాలలో 1200 సెంటీమటర్ల వరకు వర్షపాతం నమోదవుతున్నది. షిల్లాంగ్ దక్షిణాన ఉన్న చెర్రపుంజీ పట్టణం ఒక నెలలో అత్యధిక వర్షపాతం నమోదులో ప్రపంచరికార్డు కలిగి ఉంది. ఆ దగ్గరలోని మాసిన్రామ్ ఊరు ఒక సంవత్సరంలో అత్యధిక వర్షపాతం నమోదైన ఊరిగా ప్రపంచ రికార్డు కలిగిఉన్నది. thumb|right|250px|షిల్లాంగ్ సమీపాన ఉన్న ఉమియం సరస్సు మేఘాలయ రాష్ట్రంలో మూడోవంతు అటవీమయం. పశ్చిమాన 'గారో' పర్వత శ్రేణులు, తూర్పున 'ఖాసి', 'జైంతియా' పర్వతశ్రేణులు ఉన్నాయి కాని ఇవి మరీ ఎత్తైనవి కావు. 'షిల్లాంగ్ శిఖరం' అన్నింటికంటే ఎత్తైనది (1,965 మీటర్లు). పర్వతాలలో చాలా గుహలలో విలక్షణమైన 'స్టేలక్టైటు', 'స్టేలగ్మైటు' సున్నపురాయి ఆకృతులున్నాయి. ప్రజలు మేఘాలయలో 85% ప్రజలు కొండ, అటవీజాతులకు చెందినవారు. ఖాసీ, గారో తెగలవారు జనాభాలో ఎక్కువగా ఉన్నారు. ఇంక జైంతియా, హాజోంగ్ తెగలవారు 40,000 వరకు ఉన్నారు. రాష్ట్రంలో 15% జనులు కొండజాతులువారుకారు. వీరిలో 54,00 మంది బెంగాలీలు, 49,000 మంది షైక్లు. పొరుగు రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరామ్‌ల లాగా మేఘాలయలో కూడా క్రైస్తవులు ఎక్కువ. ఇంకా 16% వరకు జనులు పురాతన అటవీ సంప్రదాయాలు (Animism) ఆచరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నది. కాని, 'ఉల్ఫా' (ULFA, NDFB) వంటి తీవ్రవాదుల ప్రభావం వల్ల దీనికి అనేక అవరోధాలున్నాయి. కొండలు, పర్వతాలతో నిండిన భూభాగమూ, బంగ్లాదేశ్ సరిహద్దూ తీవ్రవాదులకు మంచి ఆశ్రయమిచ్చే స్థావరాలు. జిల్లాలు గణాంకాలు thumb|right|250px|జైంతియా కొండలలో ఒక బొగ్గగని బయట పనిచేస్తున్న కార్మికులు విస్తీర్ణము: 22,429 కి.మీ² జనాభా: 2,175,000 (2000) జాతి వర్గాలు: ఖాసీ: 49% గారో: 34% బెంగాళీ: 2.5% షేక్: 2.3% హాజోంగ్: 1.8% ఇతరులు: 10.4% మతములు: క్రైస్తవులు: 64.6% ఆనిమిస్టులు: 16.7% హిందువులు: 14.7% ముస్లింలు: 4% రాజధాని: షిల్లాంగ్ (జనాభా 260,000) ఇవి కూడా చూడండి డాకి బయటి లింకులు మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైటు ఖాసీల గురించిన నివేదిక * వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు మేఘాలయ
మణిపూర్
https://te.wikipedia.org/wiki/మణిపూర్
మణిపూర్ (মনিপুর, Manipur) భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఒక రాష్ట్రము. దీని రాజధాని ఇంఫాల్. మణిపూర్ రాష్ట్రానికి ఉత్తరాన నాగాలాండ్, దక్షిణాన మిజోరామ్, పశ్చిమాన అసోం రాష్ట్రాలున్నాయి. తూర్పున మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. మణిపూర్‌లో మెయితీ తెగకు చెందినవారు అధిక సంఖ్యాకులు. వారి భాష మెయితీ భాష. దీనినే మెయితిలాన్ అనీ, మణిపురీ అనీ అంటారు. 1992లో దీనిని జాతీయ భాషలలో ఒకటిగా గుర్తించారు, మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా పరిగణింపబడుతున్నది. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలులో ఉన్నాయి. మణిపూర్‌కు వచ్చే విదేశీయులు (మణిపూర్‌లో జన్మించిన విదేశీయులు కూడా) "నియంత్రిత ప్రాంత అనుమతి" (Restricted Area Permit) కలిగి ఉండాలి. ఈ అనుమతులు 10రోజులకు మాత్రమే చెల్లుతాయి. యాత్రికులు అనుమతింపబడిన ట్రావెల్ ఏజంట్ల ద్వారా ఏర్పాటు చేయబడిన టూర్లలో, అదీ 4 వ్యక్తుల గ్రూపులలో, మాత్రమే పర్యటించవలెను. ఇంకా వారు ఇంఫాల్ నగరానికి విమాన ప్రయాణం ద్వారానే అనుమతింపబడుతారు. చరిత్ర ఒకప్పుడు థాయ్‌లాండ్, బర్మాల మధ్య తగవులలో మణిపూర్, అస్సాంలు ఇరుక్కున్నాయి. బర్మావారు థాయ్‌లాండ్‌ను ఆక్రమించిన తరుణాన్ని అవకాశంగా తీసుకొని మణిపూర్ బర్మా భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళింది. ఆ కారణంగా బర్మావారు మణిపూర్, అస్సాంలపై దండెత్తారు. దీనితో ప్రక్కనున్న బెంగాల్‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్‌వారు కలుగజేసుకొనవలసి వచ్చింది. తమ ఆధిపత్యాన్ని నిలుపకోవడానికి, బర్మాను నిరోధించడానికీ బ్రిటిష్‌వారు 1891లో అస్సాంను, మణిపూర్‌ను బర్మానుండి జయించి, తమ సామ్రాజ్యంలో కలుపుకొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సేనలకూ మిత్రదళాల సేనలకూ (Allied forces) మధ్య జరిగిన భీకరయద్ధాలకు మణిపూర్ యుద్ధరంగమైంది. తూర్పు ఆసియాను జయించిన జపానీయుల సైన్యం మణిపూర్ సరిహద్దులకు చేరుకొంది. కాని వారు ఇంఫాల్‌లో ప్రవేశింపకముందే మిత్రదళాలు వారిని ఓడించారు. రెండవ ప్రపంచయుద్ధ గతిలో ఇది ఒక ముఖ్యమైన ఘటన. ఆయుధ్ధంలో నేలకొరిగిన భారతీయ, మిత్రదళాల సైనికుల స్మృత్యర్ధం "బ్రిటిష్ యుద్ధ సమాధుల కమిషన్" (British War Graves Commission) ఇప్పటికీ రెండు సమాధి స్థలాల పరిరక్షణను పర్వవేక్షిస్తున్నది. 1947లో భారత స్వాతంత్ర్య ప్రక్రియలో మళ్ళీ మణిపూర్ స్వతంత్ర రాజ్యమయ్యింది. మణిపూర్ రాజు మహారాజా ప్రబోధచంద్ర మణిపూర్ రాజ్యాంగాన్ని ఏర్పరచి, ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్యపాలనకు నాంది పలికాడు. 1949లో ప్రక్కనున్న భారతదేశపు అస్సాం≤ రాజధాని షిల్లాంగ్‌కు మహారాజు పిలువబడ్డాడు. మణిపూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పందంపై ఆయన సంతకం పెట్టాడు. 1949 అక్టోబరులో మణిపూర్ రాజ్యాంగ శాసనసభ రద్దుచేయబడింది. 1956 నుండి మణిపూర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబడింది. 1972లో మణిపూర్‌ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఎన్నికలు 2022 మణిపూర్ శాసనసభ ఎన్నికలు 60 అసెంబ్లీ స్థానాలకు 2022 ఫిబ్రవరి 28, మార్చి 5న ఎన్నికలు జరిగాయి. జిల్లాలు మణిపూర్ ఎదుర్కొంటున్న సమస్యలు మాదక ద్రవ్యాలు మణిపూర్ ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలలో ఒకటి మాదక ద్రవ్యాల అలవాటు (drug addiction). మాదక ద్రవ్యాల వ్యాపారంలో ముఖ్యస్థానమైన బంగారు త్రికోణం (Golden Triangle) దగ్గరలో ఉండటం ఈ సమస్య పెరగడానికి ఒక కారణం. ఇందువల్ల వేలాది యువజనులు నిర్వీర్యులై పోతున్నారు. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి కూడా ఇది కారణమైనది. భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధి ప్రబలంగా ఉన్నప్రాంతాలలో మణిపూర్ ఒకటి అయ్యింది. జాతి వైషమ్యాలు వివిధ జాతుల మధ్య ప్రబలుతున్న వైరుధ్యాలు మణిపురి సమాజానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయి. ఎన్నో తరాలుగా మెయితి జాతి ప్రజలు ఇరుగు పొరుగుతో సామరస్యంగా ఉంటూ వచ్చారు. కాని ఆర్థిక అసమానతలూ, తరుగుతున్న వనరులు, పెరుగుతున్న పోటీ, జనాభాకు సరిపడా పెరగని ఉద్యోగావకాశాలూ వివిధజాతుల మధ్య వైషమ్యాలకు ఆస్కారమిస్తున్నాయి. హిందూ ముస్లిము విభేదాలతో ఈ వైషమ్యాలు ఆగటంలేదు. కొండలలోని తెగలకూ విస్తరించాయి. ముఖ్యజాతులైన నాగా, కుకీ తెగల మధ్య దారుణ మారణకాండలు ప్రజ్వరిల్లాయి. ముఖ్యమంత్రులు ఒక్రామ్ ఇబోబి సింగ్ - 2002 నుండి 2017 వరకు సాయుధ వేర్పాటువాదం అయితే సాయుధ వేర్పాటువాదం మణిపూర్‌లో అన్నింటికంటే తీవ్రమైన సమస్య. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ నేతృత్వంలో భారత జాతీయ సేన (INA) త్రివర్ణ పతాకం మొదటిసారిగా ఎగురవేసిన భారతభూభాగమైన ఈ నేల ఇప్పుడు వేర్పాటువాదంతో కకావికలవుతున్నది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ప్రారంభమైన ఈ వేర్పాటువాదం ఎన్నో వర్గాలు, జాతులతో విస్తరించింది. మణిపూర్ జీవనంలో పోరాటాలు, మరణాలు, ఆందోళనలు అనుదిన సంఘటనలైపోయాయి. నెలనెలా ఉగ్రవాదుల దళాలకు ధనం ముట్టజెప్పడం సర్వ సాధారణమైపోయింది. పెచ్చరిల్లుతున్న నిరుద్యోగ సమస్య, భారత ప్రభుత్వం చూపిన అలక్ష్య ధోరణి, మణిపూర్‌వాసుల పట్ల ఇతర ప్రాంతాలవారు చూపే వివక్షత - ఇలా చాలా కారణాలు వేర్పాటు వాదానికి కారణాలని విశ్లేషకులు చెబుతారు. ప్రస్తుతం ఎన్నో వేర్పాటుపోరాఠం చేసే వర్గాలు ఉన్నాయి. (GlobalSecurity.org నుండి) HPC Hmar People's Convention (Also known as HRF - Hmar Revolutionary Front) KNF Kuki National Front NSCN (I-M) National Socialist Council of Nagaland (I-M) PLA Peoples' Liberation Army PREPAK People's Revolutionary Party of Kangleipak UNLF United National Liberation Front CKRF Chin Kuki Revolutionary Front HPC (D) Hmar People's Convention (Democratic) IKL Iripak Kanba Lup INF Islamic National Front IPRA Indigenous People's Revolutionary Alliance IRF Islamic Revolutionary Front KCP Kangleipak Communist Party KDF Kuki Defence Force KIA Kuki Independent Army KIF Kuki International Force KKK Kangleipak Kanba Kanglup KLF Kuki Liberation Front KLO Kangleipak Liberation Organisation KNA Kuki National Army KNF (P) Kuki National Front (?) KNV Kuki National Volunteers KRF Kuki Revolutionary Front KRPC Kom Rem People's Convention KSF Kuki Security Force KYKL (O) Kanglei Yawol Kanna Lup (Oken) KYKL (T) Kanglei Yawol Kanna Lup (Toijamba) MLTA Manipur Liberation Tiger Army MPA Manipur People's Army MPLF Manipur People's Liberation Front (Unified platform of UNLF, PLA and PREPAK) PRA People's Republican Army PULF People's United Liberation Front RPF Revolutionary People's Front UKLF United Kuki Liberation Front ZRA Zomi Revolutionary Army ZRV Zomi Revolutionary Volunteers సరిహద్దు తగవులు చాలాకాలంనుండి మణిపూర్‌కు మయన్మార్‌తో సరిహద్దువిషయంలో తగవులున్నవి. ఇంకా మణిపూర్, నాగాలాండ్‌ల మధ్య కూడా సరిహద్దు విభేదాలున్నాయి. నివారణా చర్యలు మణిపూర్ వాసుల అసంతృప్తిని పోగొట్టేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలు తీసికొంది. 1992లో రాజ్యాంగం 71వ సవరణ ద్వారా మణిపురి భాషను 8వ షెద్యూలులో చేర్చారు. ఇప్పుడు మణిపూర్‌కు స్వంత టెలివిజన్ స్టేషను ఉంది. 2004 నవంబరు 20న ప్రధాన మంత్రి మన్‌మోహన్ సింగ్ మణిపురి జనుల ఒక చిరకాల కోరికను నెరవేర్చాడు. చారిత్రాత్మకమైన కాంగ్లా కోట మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పబడింది. ఇంతకుముందు, 1915 నుండి ఇది అస్సామ్ రైఫిల్స్ పారా మిలిటరీ దళం ప్రధాన కార్యాలయంగా ఉండేది. 113 సంవత్సరాల తరువాత ఈ కోటను సామాన్యప్రజల సందర్శనకు అనుమతించారు. మణిపూర్ విశ్వవిద్యాలయంకు కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా కల్పించారు. 97.9 కి.మీ. పొడవైన జిరిబామ్-ఇంఫాల్ బ్రాడ్‌గేజి రైలు మార్గం పనులు ప్రారంభించారు. ఈ మార్గం ఇంఫాల్‌కు 25 కి.మీ. దూరంలోని తుపుల్ వరకు వేయబడుతుంది. రాష్ట్రానికి చెందిన ప్రముఖులు బింద్యారాణి దేవి అవీ-ఇవీ పోలో ఆట మణిపూర్‌లో మొదలయ్యింది. తరువాత బ్రిటిష్‌వారు ఆ ఆటను, కొంత మార్పులతో, ఇంగ్లాండులోను, ఆపై ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది. రోజా మాక్రొకర్పా (Rosa macrocarpa) అనే సుందరమైన గులాబీ జాతిని సర్ జార్జ్ వాట్ 1888లో మణిపూర్‌లో కనుగొన్నాడు. లార్ద్ ఇర్విన్ మణిపూర్‌ను భారతదేశపు "స్విట్జర్‌లాండ్" అని వర్ణించాడు. సరిత్ సరక్ (Sarit Sarak) అనే ప్రత్యేకమైన యుద్ధ క్రీడ (Martial Art) మణిపూర్‌లో ఆరంభమైనది. ఇది అంతగా ప్రసిద్ధం కాదు. మణిపురి నృత్యం ప్రసిద్ధమైనది. ఇందులో సుతారమైన రాసలీల నాట్యం ఉన్నది. పుంగ్ చొలొమ్ అనేది మణిపూర్‌లో చేసే వ్యాయామక్రీడ (Acrobatics). లోక్‌టాక్ సరస్సు లోని కైబూల్ లామ్జో నేషనల్ పార్కు, Brow antlered Deer (Cervus eldi eldi) అనబడే అరుదైన, అంతరించిపోతున్న జంతువులకు ఆవాసం. దీనిని స్థానికంగా సంగై అని పిలుస్తారు. ఆగ్నేయ ఆసియా లోని మూడు Elds deer జాతులలో ఇది ఒకటి. Siroi Lily (Lilium Macklinae Sealy) అనే అందమైన లిల్లీ పువ్వు మణిపూర్ ఉఖ్రుల్ జిల్లా సిరోయి కొడలలో మాత్రమే కనిపిస్తుంది. మణిపూర్‌లోని మొయిరాంగ్‌లో భారత జాతీయ సేన (INA) అధ్యక్షుడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. భారతదేశం నేలపై త్రివర్ణ పతాకం ఎగురడం ఇదే ప్రప్రథమం. మణిపూర్‌కు లోక్‌సభలో 2 స్థానాలు, రాజ్యసభలో 1 స్థానం ఉన్నాయి. బయటి లింకులు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు మణిపూర్ కు సంబంధించిన వెబ్‌సైటు మణిపూర్ ఆన్‌లైన్ మణిపూర్ వార్తలు మణిపూర్ వార్తలు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు మణిపూర్
కేరళ
https://te.wikipedia.org/wiki/కేరళ
కేరళ (ఆంగ్లం: Kerala,കേരളം )తెలుగు రాష్టాలకు నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రం. కేరళ సరిహద్దులలో తూర్పు, ఉత్తరం కర్ణాటక, తూర్పు తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన తమిళనాడు కు చెందిన కన్యాకుమారి జిల్లా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే ఐదు రాష్ట్రాలలో కేరళ ఒకటి. సా. శ. పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి 1956 నవంబరు 1 న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు సంస్థానాలు చేపట్టిన సామాజిక సంస్కరణలు స్వాతంత్ర్యం తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించారు. అందువలన మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. అయితే, ఆత్మహత్యలు, నిరుద్యోగం, నేరాలు భారతదేశం లోని అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి.. కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి. ఈ రెండిటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన. ట్రావన్కోర్ (తిరువాన్కూరు) రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి అతని దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత అతని వారసులైన రాజులు కూడా ఆ విధంగానే చేసారు. రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందుకనే కేరళను "దేవుని స్వంత దేశం" అని భావిస్తారు. చరిత్ర ప్రాచీనం thumb|right|250px| కేరళ మరయూర్ ప్రాంతంలో క్రొత్తరాతియుగం జనులు నిర్మించిన పెద్ద రాతి సమాధులు - వీటిని మునియారాలంటారు thumb|right|250px| అగస్త్య మహర్షి పేరుమీద ప్రసిద్ధమైన అగస్త్యమలై - ఒక యాత్రాస్థలం -తిరువనంతపురం జిల్లా పడమటి కనుమలలో ఉన్నది - అగస్త్యుడు వైదిక హిందూమతాన్ని దక్షిణభారతానికి తెచ్చాడని చెబుతారు. పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి, కేరళను వెలికితీసాడని పురాణ గాథ... కొత్త రాతియుగం కాలంలో ఇక్కడి వర్షాటవులు మలేరియాకు ఆలవాలమై ఉండడంతో కేరళ ప్రాంతంలో మానవ నివాసాలు ఉండేవి కావు. అంచేత క్రీ.పూ.10వ శతాబ్దం నాటి కుండపెంకులు, సమాధులే ప్రజల నివాసానికి సంబంధించి ఇక్కడ లభించిన మొదటి దాఖలాలు. ప్రాచీన తమిళం మాట్లాడే ప్రజలు వీటిని నిర్మించారు. దీన్ని బట్టి, ప్రాచీన కాలంలో కేరళ, తమిళనాడు ప్రాంతాలు (తమిళకం లోని భాగం) ఒకే భాష, జాతి, సంస్కృతికి చెందిన వారని తెలుస్తూంది. 14 వ శతాబ్దపు తొలినాళ్ళకు, భాష పరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం - చేర వంశీకులు - వంచి రాజధానిగా కేరళను పాలించారు. పల్లవులతో కలిసి వారు చోళ, పాండ్య రాజులతో యుద్ధాలు చేసారు. 8- 14 శతాబ్దాల మధ్యకాలంలో చేరరాజుల పాలనా సమయంలో మళయాళం భాష అభివృద్ధి చెందింది. ఆదే సమయంలో కేరళీయులు తమిళప్రజలలో భాగంగా కాక ఒక ప్రత్యేకమైన జాతిగా గుర్తింపు ఏర్పడింది. లిఖితంగా కేరళ గురించిన ప్రస్తావన సంస్కృత ఇతిహాసం ఐతరేయారణ్యకంలో మొదటిగా లభిస్తున్నది. తరువాత కాత్యాయనుడు, పతంజలి, పెద్దప్లినీ (ప్లినీ ది ఎల్డర్) Pliny's Naturalis Historia, Book 6, Chapter 26 ల వ్రాతలలోనూ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ (Periplus of the Erythraean Sea) గ్రంథంలోనూ కేరళ ప్రస్తావనలున్నాయి. మధ్యకాలం thumb|right|250px|కేరళలో థామస్ అపోస్తలునిచే ప్రతిష్ఠింపబడినవని చెప్పబడే సిలువ గుర్తులలో ఒకటి. చేర రాజులు వర్తకంమీద ఆధారపడినందున పశ్చిమ ఆసియా వర్తకులు క్రమంగా వ్యాపారస్థావరాలు ఏర్పరచుకొన్నారు.Silapadhigaaram, Manimekalai, P.T. Srinivasa Iyengar's "History of the Tamils: from the earliest times to 600 AD", Madras, 1929 ఇంకా తమ దేశాలలో తమపై జరుగుతున్న అత్యాచారాలనుండి తప్పించుకోవడానికి యూదులు, క్రైస్తవులు వంటివారు ఇక్కడికి వలస వచ్చారు. అలా సిరియన్ మలబార్ క్రైస్తవ సమాజం,The Indian Christians of St Thomas, Leslie Brown, page 171 మప్పిల ముస్లిమ్ సమాజం వంటివి రూపు దిద్దుకొన్నాయి. యూదులు క్రీ.పూ. 573లో ఇక్కడకి వచ్చి ఉండవచ్చునని అంచనా.De Beth Hillel, David (1832). Travels (Madras publication).Lord, James Henry (1977). The Jews in India and the Far East; Greenwood Press Reprint; ISBN 0-8371-2615-0. అపోస్తలు థామస్ సా.శ. 52లో కేరళలోని ముజిరిస్కు వచ్చి అక్కడి యూదులలో క్రైస్తవబోధనలు ఆరంభించాడని తెలుస్తున్నది. Medlycott, A E. 1905 "India and the Apostle Thomas"; Gorgias Press LLC; ISBN 1-59333-180-0 కాని సుమారు సా.శ.345 లో యూదుల వలసకు (నస్రాని-యూదులు) కచ్చితమైన ఆధారం క్నాయి తోమా (Knai Thoma) రాక. 8వ శతాబ్దంలో ముస్లిం మతస్తులు కేరళలో స్థిరపడ్డారు.1498లో వాస్కో డగామా వచ్చిన తరువాత లాభసాటి సుగంధ ద్రవ్యాల వర్తకంలో ఆధిపత్యంకోసం పోర్చుగీసువారు స్థానికులను, వారి వర్తకాన్ని అదుపుచేయడానికి ప్రయత్నించారు. బ్రిటష్ కాలం డచ్చివారికి, పోర్చుగీసువారికి జరిగిన యుద్ధాలలో 1741లో డచ్చివారిది పైచేయి అయ్యింది. 1766లో మైసూరుకు చెందిన హైదర్ ఆలీ కేరళ ఉత్తరభాగమైన కోజికోడ్‌ను జయించాడు. 18వ శతాబ్దంలో హైదర్ ఆలీ కొడుకు టిప్పు సుల్తాన్‌కు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మధ్య జరిగిన రెండు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల ఫలితంగా మలబార్జిల్లా, దక్షిణ కెనరాలు 1790లో ఆంగ్లేయుల పరమయ్యాయి. 1791, 1795లలో కంపెనీవారు కోచి, తిరువాన్కూరు సంస్థానాలతో ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. మలబార్, దక్షిణకెనరా ప్రాంతాలు మద్రాసు ప్రెసిడన్సీలో భాగాలయ్యాయి. కేరళలో బ్రిటిష్ అధికారానికి ప్రతిఘటనలు తక్కువనే చెప్పవచ్చు. 1946 పున్నపర-వయలార్ తిరుగుబాటు అలాంటివాటిలో ఒకటి.. కాని నారాయణ గురు, చత్తంపి స్వామిగళ్ వంటి సంస్కర్తల నాయకత్వంలో అంటరానితనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా గట్టి ఉద్యమాలు నడచాయి. 1924లో జరిగిన వైకోమ్ సత్యాగ్రహం వీటిలో చెప్పుకొనదగినది. 1936లో తిరువాన్కూర్ చిత్ర తిరుణాల్ బాల రామ వర్మ అన్ని కులాలకూ ఆలయప్రవేశాన్ని కల్పిస్తూ ఆదేశాలను జారీ చేశాడు. కొచ్చిన్, మలబార్‌లలో కూడా ఇదే ప్రగతిశీల పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కేరళ రాష్ట్రం 1947లో భారతదేశం   స్వాతంత్ర్యం రాగా1941 జూలై 1న తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానాలను కలిపి తిరువాన్కూర్-కొచ్చిన్  ఏర్పరిచారు. 1950 జనవరి 1న దీనిని ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఇదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు రాష్ట్రం చేశారు. 1956 నవంబరు 1న, రాష్ట్రపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేరళ రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీనుండి మలబార్‌ప్రాంతాన్ని (4 తాలూకాలు మినహా) వేరుచేసి తిరువాన్కూర్-కొచ్చిన్ రాష్ట్రంలో కలిపారు. 1957లో క్రొత్త అసెంబ్లీ ఎన్నిల అనంతరం ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటివాటిలో ఇది ఒకటి. . . ఆ కమ్యూనిస్టు ప్రభుత్వం కార్మికులకు, కౌలుదారులకు అనుకూలమైన విధానాలను అనుసరించింది. తరువాతి ప్రభుత్వాలు కూడా ఇదే మార్గాన్ని అవలంబించారు. .. ప్రజల జీవన ప్రమాణాలు ఈ కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందాయి. భౌగోళికం thumb|250x250px| ఇడుక్కి జిల్లాలో మున్నార్ చుట్టుప్రక్కల ప్రాంతం బాగా పర్వతమయం. కేరళ భూవైశాల్యం 38,863 చ.కి.మీ. ఇది భారతదేశ వైశాల్యంలో 1.18%. ఎక్కువ భాగం పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్య ఉంది. ప్రపంచంలో జీవవైవిధ్యం బాగా ఉన్న 25 ప్రదేశాలలో కేరళ ఒకటి. (biodiversity hotspots) . ఉత్తర అక్షాంశాలు 8°18', 12°48' మధ్య, తూర్పు రేఖాంశాలు 74°52', 72°22' మధ్య . ఉన్న కేరళ పూర్తిగా భూమధ్య ఉష్ణమండల ప్రదేశంలో ఉంది. కేరళ తీరరేఖ 580 కి.మీ. పొడవైనది. కేరళ వెడల్పు వివిధ ప్రాంతాలలో 35 కి.మీ - 120 కి.మీ. మధ్య ఉంటుంది. భౌగోళికంగా కేరళను మూడు ప్రాంతాలుగా విభజింపవచ్చును - తూర్పు మెరక ప్రాంతం, మధ్య కొండ ప్రాంతం, పశ్చిమ పల్లపు (మైదాన) ప్రాంతం. భారత tectonic plate మధ్యలో ఉండడం వలన కేరళలో భూప్రకంపనల ప్రమాదం బాగా తక్కువ. thumb|250x250px| వయనాడ్ గ్రామీణ ప్రాంతపు చిత్రం. thumb|333x333px| కొల్లమ్ జిల్లా కోచి నీటికాలవలలో చీనా చేపలవల (చైనాలో తయారైనది) కేరళ తూర్పు భాగం పడమటి కనుమల వర్షచ్ఛాయప్రదేశానికి ఆనుకొని ఉంది. ఇక్కడ ఎత్తైన కొండలు, లోతైన లోయలు ఉన్నాయి. పడమటికి ప్రవహించే 41 నదులు, తూర్పుకు ప్రవహించే 3 నదులు ఇక్కడే ఆరంభమౌతాయి. పడమటి కనుమలు దాదాపు గోడకట్టినట్లున్నాయి. పాలఘాట్ దగ్గర మాత్రం ఖాళీస్థలం ఉన్నందున మిగిలిన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన ద్వారమయ్యింది. కనుమల సగటు ఎత్తు 1,500 మీ. 2,500 మీ. ఎత్తైన శిఖరాలున్నాయి. కనుమలకు ఆనుకొని పడమటి ప్రాంతంలో మధ్య పడమటి మైదానప్రాంతం ఉంది. ఇక్కడ ఎత్తుపల్లాల భూములు, లోయలు ఎక్కువ. 250 మీ, 1000మీ. మధ్య ఎత్తులున్న ఇక్కడి కొండలకు తూర్పు అంచున నీలగిరి కొండలు, పళని కొండలు, అగస్త్యమలై, అన్నామలై వంటి పర్వతప్రాంతాలున్నాయి. కేరళ పశ్చిమతీరమైదానం సమతలమైనది. ఇక్కడ అంతటా ఉప్పుటేరులు, నదీముఖద్వారాలు, కాలువలు చిలవలు పలవలుగా విస్తరించి ఉన్నాయి. వీటిని Kerala Backwaters అంటారు. వీటిలో అలప్పుళ్ళ, కోచిల మధ్యనున్న వెంబనాడ్ సరస్సు బాగా పెద్దది. దాని వైశాల్యం 200 చ.కి.మీ. మొత్తం దేశంలోని జలమార్గాలలో 8% కేరళలోనే ఉన్నాయి. . కేరళలో మొత్తం 44 నదులున్నాయి. వీటిలో పెరియార్(244 కి.మీ.), భరతపుళ్ళ (209 కి.మీ.), పంబ (176 కి.మీ.), చలియార్ (169 కి.మీ.), కదలుండిపుళ్ళ (130 కి.మీ.), అచన్‌కోవిల్ (128 కి.మీ.)-ముఖ్యమైన నదులు. మిగిలిన చిన్న నదులకు ఋతుపవన వర్షాలే పూర్తి జలాధారం. ఈ భౌగోళికకారణాలవల్ల పడమటి కనుమలలో కొన్ని ప్రాంతాలు సంవత్సరంపొడవునా నీటిమయమై ఉంటాయి. కుట్టనాడ్‌లో 500 చ.కి.మీ. ప్రదేశం సముద్రమట్టానికి దిగువున ఉంది. కేరళ నదులు చిన్నవైనందున వాటికి (ముఖద్వారాలలో) డెల్టాలు లేవు. కనుక పర్యావరణ ప్రభావాలు వీటిపై ఎక్కువ. వేసవిలో ఎండ్రు, ఆనకట్టలవల్ల ఇసుక మేటలు, కాలుష్యం వంటి సమస్యలకు కేరళ నదులు వేగంగా ప్రభావితమౌతాయి. కేరళ వ్యావసాయిక పర్యావరణం center|125px|కేరళ పర్యావరణ ప్రాంతాలు కేరళలో జీవజాలం, వాతావరణం, నేల రకాలు చూపే చిత్రపటం. Source: . సంవత్సరానికి 120 నుండి 140 వరకు వర్షపు రోజులున్నందున కేరళ వాతావరణం బాగా తేమమయం. . తూర్పు కేరళలో కాస్త పొడి వాతావరణం ఉంటుంది. కేరళ సగటు వర్షపాతం 3,107 మి.మీ. (భారతదేశపు సగటు 1,197 మి.మీ.). ఇడుక్కి పర్వతప్రాంతాలలో 5,000 మి.మీ. వరకు వర్షపాతం నమోదు అవుతుంది. కేరళ వర్షాలకు ప్రధానకారణం ఋతుపవనాలు. more anomalous factors resulted in the red rains of 2001. Kerala . వేసవిలో ఈదురుగాలులు, తుఫానులు, అల్పపీడనం కారణంగా వచ్చే వర్షాలు సామాన్యం. పర్యావరణ ఉష్ణోగ్రతలు పెరగడం (global warming) వలన కూడా అకాల వర్షాలు, సముద్ర మట్టం పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. .. . కేరళ సగటు ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు - 27 డిగ్రీలు సెంటీ గ్రేడ్ మధ్య ఉంటాయి. ఇవే తీరమైదానాలలో 20 డిగ్రీలు-22.5 డిగ్రీల మధ్య ఉంటాయి. దినసరి అధిక ఉడ్ణోగ్రతల సరాసరి 36.7 డిగ్రీలు సెంటీగ్రేడు. దినసరి అల్ప‌ఉష్ణోగ్రతల సరాసరి 19.8 డి.సెం.. వన్య, జంతు సంపద thumb|right|250px| ఇడుక్కి జిల్లా వాయవ్యాన మరయూర్ ప్రాంతంలో ఒక నది. కేరళ జీవవైవిధ్యం తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు, అంటే సుమారు 10,000 జాతులు కేరళలో ఉన్నాయి. 4,000 పుష్పజాతులలో 1,272 రకాలు కేరళకు (endemic) స్థానికం, 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధిమొక్కలు. .. కేరళలోని 9,400 చ.కి.మీ. అడవులలో, ఎత్తును బట్టి ఎన్నో విధాల ఉష్ణమండలపు, సమోష్ణమండలపు వృక్షజాతులున్నాయి. మొత్తం కేరళలో 24% అటవీ భూమి. . సస్థంకొట్ట చెరువు, వెంబనాడ్ చెరువు - ఇవి రెండు ప్రపంచంలో గుర్తింపబడిన (Ramsar Convention listed) తేమ పర్యావరణ ప్రదేశాలు. నీలగిరి జీవ పరిరక్షణా నిలయం (Nilgiri Biosphere Reserve) కూడా ఇదే గుర్తింపు పొందింది. ఇటీవలికాలంలో అడవులను వ్యవసాయభూములుగా మార్చడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని దృష్టిలో ఉంచుకొని కేరళ అడవులలో చాలా భాగాన్ని రక్షితప్రాంతంగా ప్రకటించారు. . కేరళ జంతుసంపదలో వైవిధ్యం, స్థానికత్వం గమనించదగిన విషయాలు. తీవ్రమైన పర్యావరణ వినాశనం (అడవల నరికివేత, చరియలు విరగడం, ఉప్పుపట్టడం, ఖనిజసంపద త్రవ్వకం వంటివి) వల్ల కేరళలోని ఈ జంతుసంపద మనుగడకు ప్రమాదం వాటిల్లుతున్నది. thumb|right|250px| ఇడుక్కి జిల్లా మరయూర్ అడవులలో ఒక Grizzled Giant Squirrel (Protoxerus stangeri). విభాగాలు కేరళలోని 14 జిల్లాలు చారిత్రికంగా మూడు విభాగాలుగా పరిగణింపబడుతాయి కేరళ జిల్లాలు center|125px| కేరళ జిల్లాలు - జనసాంద్రత (చ.కి.మీ.కు జనాభా)ప్రకారం రంగులు చూపబడ్డాయికేరళ జిల్లాలు - జనసాంద్రత (చ.కి.మీ.కు జనాభా)ప్రకారం రంగులు చూపబడ్డాయ. Source: . దక్షిణ కేరళ - తిరువాన్కూర్ ప్రాంతం ఇడుక్కి అలప్పుళా (అలెప్పి) కొట్టాయమ్ పతనమ్ తిట్ట కొల్లమ్ (క్విలన్) తిరువనంతపురం మధ్య కేరళ - కొచ్చి ప్రాంతం త్రిస్సూర్ (తిరుచూర్) ఎర్నాకుళం ఉత్తర కేరళ - మలబార్ ప్రాంతం కాసరగోడ్ కన్నూర్ (కననూర్) వైనాడ్ కోజికోడ్ లేదా కాలికట్ దీనిని మలయాళం, తమిళం లలో కోళిక్కోడ్ (kozhikode)േക ാഴിക് േകാട് అంటారు. మలప్పురం పాలక్కాడ్ (పాలఘాట్) కేరళ రాజధానితిరువనంతపురం రాష్ట్రంలో అత్యధిక జనాభా గల నగరం.కొచ్చి ఎక్కువ నగరపరిసర జనాభా కలిగినది (most populous urban agglomeration) కోజికోడ్, పాలక్కాడ్, కొల్లం, త్రిస్సూర్ముఖ్యమైన ఇతర వాణిజ్యనగరాలు. కేరళ హైకోర్టు ఎర్నాకుళంలో ఉంది. కేరళ భారతదేశం లోనే ప్రముఖ పర్యాతక ప్రదేశం. ప్రముఖ కృష్ణ మందిరం గురువాయూర్, అయ్యప్ప స్వామి, తిరువనంత పురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయాలను చూడ టానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.అలాగే మున్నార్ టీ తోటలు, అలెప్పి లోని బాక్ వాటర్స్, అద్భుత మైన బీచ్ లు, జల పాతాలు చూడ టానికి దేశ విదేశాల నుండి ఎందరో వస్తుంటారు. రాజకీయాలు కేరళ పాలనా వ్యవస్థ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలవలెనే ఉంటుంది. కేరళలో రెండు ప్రధాన రాజకీయ సంకీర్ణాలున్నాయి. ఒకటి యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఇండియా) (UDF-United Democratic Front,India ) - ఇది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నడుస్తంది. రెండవది లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (LDF-Left Democratic Front) - ఇది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (CPI-M)అధ్వర్యంలో ఉంటుంది. వామపక్ష రాజకీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. రాజకీయ కార్యక్రమాలలో కేరళ ప్రజలు చైతన్యవంతంగా పాల్గొంటారు. ఆర్ధిక వ్యవస్థ పన్నుల ద్వారా కేరళ రాష్ట్ర ప్రభుత్వపు ఆదాయం (కేంద్రం నుండి వచ్చే వాటాను మినహాయించి) 2005లో 11,124 కోట్ల రూపాయలు (2000 సంవత్సరంలో ఇది 6,360 కోట్లు). పన్నులు కాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం 2005లో 1,080 కోట్లు (2000లో 684 కోట్లు). Finance Commission (Ministry of Finance, Government of India) అయినా కేరళ బడ్జెట్ లోటు చాలా ఎక్కువ. అందువలన ప్రభుత్వఋణభారం ఎక్కువై సామాజికసేవలకు పెట్టే ఖర్చుకు ఇబ్బంది అవుతున్నది. thumb|250x250px|త్రివేండ్రంలో టెక్నోపార్కు. మొదటినుండి కేరళ ప్రభుత్వాలు సంక్షేమకార్యక్రమాలకు పెద్దపీట వేశాయి. ప్రధానంగా సామ్యవాద ప్రజాస్వామ్యం కేరళ రాజకీయాలలో ముఖ్యమైన సిద్ధాంతం. కాని ఇటీవల మిగిలిన రాష్ట్రాలవలెనే కేరళ కూడా ఆర్థిక సంస్కరణలపట్ల, సరళీకృత వాణిజ్య విధానాలపట్ల, విదేశీ పెట్టుబడులపట్ల మొగ్గు చూపుతోంది. 2004-2005లో కేరళ స్థూల ఉత్పత్తుల విలువ 89,451 కోట్ల రూపాయలు. . ఈ వృద్ధి రేటు 1980 దశకంలో 2.3%, 1990 దశకంలో 5.1%-5.99% ఉంటే 2003-2005 మధ్య 7.4%, 9.2% వృద్ధి నమోదయ్యింది. .. భారీ వ్యాపార సంస్థలు, బాంకులు తమవ్యాపారాలకు కేరళను పెద్దగా ఎన్నుకోవడంలేదు. . కాని విదేశాలలో పనిచేసే కేరళీయులు తమకుటుంబాలకు పంపే ధనంవల్ల ఈ లోటు భర్తీ అవుతున్నది. కేరళ స్థూల ఉత్పత్తిలో 20% వరకు విదేశాలలో ఉండేవారు పంపే ధనమే.. కేరళ తలసరి స్థూల ఆదాయం 1,819 రూపాయలు..ఇది మొత్తం భారతదేశం తలసరి స్థూల ఆదాయం కంటే బాగా ఎక్కువ, కాని ప్రపంచపు సగటుకంటే ఇంకా తక్కువే. ఇక కేరళ జనాభివృద్ధి సూచిక (Human Development Index), జీవన ప్రమాణాలు భారతదేశంలో చాలా ప్రాంతాలకంటే బాగా మెరుగైనవి.. ఇలా ఆర్థిక ప్రగతి లేకుండానే, గణనీయమైన జీవన ప్రమాణాలు సాధించడం కేరళ వ్యవస్థకున్న ప్రత్యేకత అని నిపుణులు భావిస్తారు. (Kerala model,Kerala phenomenon). కేరళలో ఉన్న పటిష్ఠమైన సేవారంగం (service sector) వల్లనే ఇది సాధ్యమైందని నిపుణుల విశ్లేషణ. .. thumb|right|250px| కేరళలో తేయాకు తోటలు సేవారంగం (టూరిజము, ప్రజాపాలన, బ్యాంకింగ్, ఫైనాన్స్, రవాణా, సమాచారం వంటివి కలిపి) కేరళ స్థూల ఆదాయంలో 63.8% సమకూరుస్తున్నాయి. వ్యవసాయం, మత్స్యపరిశ్రమల పాలు 17.2% . కేరళలో దాదాపు సగంమంది ఆదాయానికి వ్యవసాయంపై ఆధారపడుతున్నారు.. కేరళవాసుల ప్రధానాహారం వరి. దాదాపు 600 రకాల వరి .) కేరళలోని 310,521 హెక్టారుల పంటభూముల్లో పండుతుంది. (1990లో వరి సేద్యం జరిగే భూమి 588,340 హెక్టారులు ఉండేది. క్రమంగా ఇది తగ్గుతున్నది.) ) సంవత్సరానికి 688,859 టన్నుల ధాన్యం పండుతుంది. కొబ్బరి (899,198 హెక్టారులు), తేయాకు, కాఫీ (57,000 టన్నులు - భారతదేశపు ఉత్పత్తిలో 23%), . .) రబ్బరు, జీడిమామిడి, సుగంధద్రవ్యాలు (మిరియం, ఏలక, వనిల్లా, దాల్చీనీ,పోక వంటివి)కేరళలో ఇతర పంటలు. దాదాపు 10.50 లక్షల మత్స్యకారులు ఏటా 6,68,000 టన్నుల చేపలు పడతారు. (1999–2000 అంచనా); కేరళ 590 కి.మీ. తీరంలో 222 చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా ఉన్న పల్లెలున్నాయి. ఇంకా లోపలి భూభాగంలో 13 చేపలు పట్టే పల్లెలున్నాయి. పీచు పరిశ్రమ, చేనేత, హస్తకళలు వంటి వృత్తులలో 10 లక్షలమందికి జీవనాధారము. 1,80,000 చిన్న పరిశ్రమలలో 9,09,859మందికి జీవనోపాధి లభిస్తున్నది. కొద్దిగా ఖనిజాల త్రవ్వకం జరుగుతున్నది. (స్థూల ఉత్పత్తిలో 0.3%) ఇలెమినైటు, సిలికా, క్వార్ట్జ్, రుటైల్, జిర్కోన్, కావొలిన్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు లభిస్తున్నాయి. పెరటితోటలు, పశుపాలన కూడా లక్షలాదిమందికి ఉపాధి కలుగజేస్తున్నాయి. ఇంకా టూరిజము, పారిశ్రామిక ఉత్పత్తులు, business process outsourcing కేరళలో ఇతర సేవారంగ ఉపాధి వనరులు. కేరళ నిరుద్యోగుల శాతం 19.2% అని ఒక అంచనా. . 20.77% అని మరొక అంచనా . . . రాష్ట్రంలో దారిద్ర్యరేఖ దిగువన ఉన్నవారు 12.71% అని కొన్ని అధ్యయనాలు చెప్పగా . 36% వరకు ఉన్నదని మరికొన్ని అంచనాలు ఉన్నాయి. . రవాణా సదుపాయాలు కేరళలో 145,704 కి.మీ. రోడ్లున్నాయి (మొత్తం దేశంలో 4.2%) అంటే ప్రతి వెయ్యి జనాభాకు 4.62 కి.మీ. అన్న మాట. (భారతదేశం సగటు 2.59 km). దాదాపు అన్ని పల్లెలూ రోడ్లతో కలుపబడి ఉన్నాయి. కేరళ జనసాంద్రత ఎక్కువ కావడం వలన భారతదేశం సగటు రోడ్ల వ్వస్థకంటే కేరళ సగటు బాగా ఎక్కువ. మొత్తం దేశం హైవేలలో 2.6% (1,524 కి.మీ.) కేరళలో ఉన్నాయి. 8 జాతీయ రహదారులు (నేషనల్ హైవేలు) కేరళలో ఉన్నాయి. ట్రాఫిక్ కూడా వేగంగా పెరుగుతున్నది. NH 47, NH 17ల ద్వారా కేరళ పశ్చిమతీరం దాదాపు అంతా కలుపబడింది. జన విస్తరణ కేరళ జనాభా (1951-2026) center|250px|కేరళ జనాభా, వృద్ధిరేటు 1951–2026.కేరళ జనాభా, వృద్ధి రేటు 1951 నుండి –2001 (అంచనా), 2006–2026 (ముందస్తు అంచనా). Sources: , . కేరళలోని 3.18 కోట్ల జనాభా. ప్రధానంగా మళయాళీ, ద్రావిడ జాతి చెందినవారు. జాతిపరంగా ఇండో-ఆర్యన్,యూదు,అరబ్బు జాతులకు గాని, సంస్కృతికిగాని చెందినవారు. ఇంకా జనాభాలో 3,21,00 మంది(1.1%)) ఆదివాసి తెగలకు చెందినవారు... . మళయాళం కేరళ అధికార భాష. ; తమిళం, కొన్ని ఆదివాసి భాషలు కూడా ఆయా వర్గాలకు చెందినవారు మాట్లాడుతారు. దేశంలో 3.44% జనాభా కేరళలోనే ఉంది. చ.కి.మీ.కు 819 జనులున్నందున . కేరళ జనసాంద్రత భారతదేశపు జనసాంద్రతకంటే మూడురెట్లు ఎక్కువ. కాని కేరళ జనాభా వృద్ధిరెటు దేశంలోనే అతితక్కువ. . దశాబ్దంలో కేరళ జనాభా వృద్ధి 9.42 % (దేశం మొత్తంమీద వృద్ధిరేటు 21.34%). . కేరళలో జనాభా ఎక్కువగా తీరప్రాంతంలో ఉన్నారు. మొత్తం జనాభాలో ఆడువారు 51.42% మతపరంగా హిందువులు54.7%, ముస్లిములు 26.6%, క్రైస్తవులు 18.4% ఉన్నారు. . ఒకప్పుడు గణనీయంగా ఉన్న కొచ్చిన్ యూదులు ఇప్పుడు కొద్ది సంఖ్యలో ఉన్నారు. చాలామంది ఇస్రాయెల్‌కు వలస వెళ్ళారు(aliyah). చాలా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మతపరమైన ఘర్షణలు దాదాపు లేవు. కాని ఇటీవల మతపరంగా తీవ్రభావాలున్న సమాజాల కార్యకలాపాలు విస్తృతమౌతున్నాయి. .. కేరళలో నేరాలు, మానభంగాలు, హింసాత్మక చర్యలు మిగిలిన దేశంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. . — ఈ విషయంలో దేశంలో కేరళది మూడవ స్థానం. పితృస్వామ్య కుటుంబ విధానం తక్కిన మూడవ ప్రపంచంకంటే కేరళలో తక్కువ బలంగా ఉంది. .. చాలామంది కేరళీయులు (కొందరు హిందువులు, మలబారు ముస్లిములు) మాతృస్వామ్య కుటుంబ విధానం (మరుమక్కతాయం) అనుసరిస్తారు. క్రైస్తవులు, తక్కిన ముస్లిములు, కొదరు హిందువులు ఒకవిధమైన పితృస్వామ్యవిధానాన్ని (మక్కతాయం)అనుసరిస్తారు. . కేరళలో స్త్రీ-పురుష సమానత్వం మిగిలిన దేశంకంటే ముందంజలో ఉంది. . . H కాని ఇది కూడా క్రమంగా దెబ్బతింటున్నది. . ఆడువారిపై గృహహింస, అత్యాచారాలు పెరుగుతున్నాయి. .) ప్రపంచీకరణ, ఆధునికీకణ, సంస్కృతీకరణ (వెనుకబడిన పేదలు ధనికవర్గాల ఆచార వ్యవహారాలను అనుకరించడం) ఇందుకు ముఖ్యకారణాలు. కేరళ జనాభివృద్ధి సూచికలు— పేదరిక నిర్మూలన, ప్రాథమిక విద్యావకాశాలు, ఆరోగ్య సదుపాయాలు— భారతదేశంలో చాలా ఉత్తమస్థాయిలో ఉన్నాయి. ఉదాహరణకు కేరళలో అక్షరాస్యత 91%,. జీవన కాలప్రమాణం 73 సంవత్సరాలు. ఇవి భారతదేశంలో మిగిలిన ప్రాంతాలకంటే చాలా మెరుగైనవి. కేరళలో గ్రామీణ పేదరకం 1970–1971లో 69% ఉండగా 1993–1994 లో 19%కు తగ్గింది. అదే పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపితే 36% తగ్గింది. . 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు రాజులు ప్రారంభించిన సామాజిక సంక్షేమ కార్యక్రమాలే ఈ పరిణామాలకు మూలకారణం. . . స్వాతంత్ర్యం తరువాత రాష్ట్రప్రభుత్వాలు ఈ ఒరవడిని కొనసాగించాయి. . కేరళ ఆరోగ్య సదుపాయ వ్యవస్థ ఐక్యరాజ్యసమితి శిశు సంక్షేమ నిధి(UNICEF), ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వంటి సంస్థల నుండి "పిల్లలకు అనుకూలమైన రాష్ట్రము" అని మన్ననలు అందుకొన్నది.— ఉదాహరణకు 95% కంటే ఎక్కు జననాలు ఆసుపత్రులలో జరుగుతున్నాయి. . ఆయుర్వేదము, . సిద్ధ వైద్యము, యునాని, ఇంకా కొన్ని (ప్రస్తుతం కనుమరుగవుతున్న) సాంప్రదాయిక, నాటు వైద్యవిధానాలు — కలారి, మర్మచికిత్స, విషవైద్యం వంటివి . ఇంకా కేరళలో వాడబడుతున్నాయి. ఈ విజ్ఙానం గురుకుల విద్యా విధానం ద్వారా శిష్యులకు సంక్రమిస్తున్నది. . వీటిలో కొన్ని మూలికలు, మంత్రాల కలగలుపు విధానాలు. . వైద్య పర్యాటకులు కేరళ ప్రత్యేక వైద్యవిధానాల చికిత్సకోసం కేరళకు వస్తుంటారు (Health Tourism). కేరళ జనాభాలో వృద్ధుల శాతం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 11.2% కేరళీయులుఉ 60 సంవత్సరాల వయసు పైబడినవారు. ఇందుకు తోడు తరుగుతున్న జననాల రేటు — వెయ్యికి 18 — ఈ జనాభా పరిణామం(demographic transition)పరిస్థితి ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటుంది. కేరళ, క్యూబావంటి కొద్ది తృతీయ ప్రపంచం ప్రాంతాలలో మాత్రమే ఇలాంటి పరిస్థితి సంభవిస్తున్నది. సంస్కృతి, కళలు కూడియాట్టం నృత్య ప్రదర్శన ఇస్తున్న గురుపద్మశ్రీ మణి మాదవ చక్యార్. ప్రాచీన సంస్కృత నాటకరీతులలో ఇది ఒక్కటే ఇంకా మిగిలి ఉంది.|thumb|left|333x333pxకేరళ సంస్కృతి ప్రధానంగా ద్రావిడమూలాలనుండి ఆవిర్భవించింది. తమిళకం అనబడే ప్రాంతీయ సాంస్కృతిక వర్గంలో ఇది ఒక భాగం. తరువాత శతాబ్దాలపాటు సాగిన పొరుగు దేశాల సంస్కృతుల సంబంధాలు కూడా ఈ ద్రావిడ సంస్కృతిని ప్రభావితం చేశాయి. . కథాకళి, కూడియాట్టం, కేరళనటనం, మోహినియాట్టం, తుల్లాల్, పాదయని, తెయ్యం – ఇవి కేరళకు ప్రత్యేకమైన కళారూపాలు. ఇంకా చవిట్టు నడకొం, ఒప్పన వంటి మరికొన్ని కళలు మతాలకు, కొండజాతులకు సంబంధించినవి. కాని ఇవి ఎక్కువగా ప్రత్యేక ఉత్సవాలకు, పర్యాటకులకు, ప్రత్యేక ఆసక్తి ఉన్నవారికి ప్రదర్శింపబడుతున్నాయి. సామాన్య ప్రజానీకం సమకాలీన కళలపట్ల ఆసక్తి చూపుతున్నారు (మిమిక్రీ, పేరడీ వంటివాటిపై కూడా). ఇక మళయాళం సినిమా కూడా బాగా జనాదరణ కలిగి ఉంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకు దీటుగా మళయాళం సినిమాలు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. మళయాళం సాహిత్యం బాగాపురాతనమైనది. 14వ శతాబ్దంలో మాధవ పణిక్కర్, శంకర పణిక్కర్, రామ పణిక్కర్ వంటి "నిరణం కవులు" మళయాళ భాష ఆభివృద్ధికీ, ప్రత్యేకమైన కేరళ సాహిత్యం రూపుదిద్దుకోవడానికీ ఆద్యులు. ఆధునిక మళయాళ "కవిత్రయం" అని చెప్పబడే కుమారన్ ఆశన్, వల్లతోల్ నారాయణ మీనన్, ఉల్లూర్ ఎస్.పరమేశ్వర అయ్యర్‌లు కేరళకవితాసాహిత్యాన్ని పురాతనసంప్రదాయాల పట్టునుండి ఆధునిక శైలివైపు మళ్ళించారని గుర్తింపు పొందారు. 20వ శతాబ్దం ద్వితీయార్ధంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన జి.శంకర కురుప్, ఎస్.కె.పొట్టక్కాట్, ఎమ్.టి.వాసుదేవన్ నాయర్‌లు, ఇతర సాహితీకారులు మళయాల సాహిత్యానికి మరింత వన్నెతెచ్చారు. తరువాతి కాలంలో ఒ.వి.విజయన్, ఎమ్.ముకుందన్, అరుంధతీ రాయ్ (ఆమెకు 1996లో "బుకర్ బహుమతి" తెచ్చిపెట్టిన స్వీయచరిత్రతో ముడివడిన నవల The God of Small Things కథ కేరళ కొట్టాయం పట్టణం నేపథ్యంలో నడుస్తుంది.)— వంటి రచయితలు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. thumb|left|220x220px|త్రిస్సూర్‌ పూరమ్‌లో బారులు తీరిన కేరళ ఏనుగులు. thumb|293x293px|A మోహినియాట్టం నృత్యం కేరళ సంగీతం కూడా ప్రాచీన సంప్రదాయం గలది. స్వాతి తిరునాళ్ రామవర్మ కీర్తనలు 19వ శతాబ్దంలో ప్రజాదరణ పొందిన తరువాత కర్ణాటక సంగీతం కేరళ సంగీత రంగంలో ప్రధానపాత్ర వహిస్తున్నది. .. సోపానం అనబడే రాగయుక్తమైన పాటలు కథాకళి నృత్యంతో పాడబడతాయి. మేళం సంగీతప్రదర్శనలు మందిరాలలోనూ, ఉత్సవాలలోనూ ఇస్తారు. 4 గంటలకాలం కూడా సాగే ఒకో మేళంలో 150వరకు వాద్యగాళ్ళు పాల్గొంటారు. "పంచవాద్యం" అనే మరో సంగీతప్రదర్శనలో 100వరకూ మేళగాళ్ళు 5 వాయిద్యాలను వాడుతారు. అయితే, దేశమంతటిలాగానే, ఇటీవలికాలంలో సినిమా సంగీతం అత్యంత జనాదరణ పొందిన సంగీతం. కేరళ చిత్రకళలలో సాంప్రదాయిక కుడ్యచిత్రాలనుండి రాజా రవివర్మ చిత్రాలవరకు ఎంతో వైవిధ్యముంది. రవివర్మ అత్యంత ప్రసిద్ధి గాంచిన చిత్రకారుడు. కేరళకు ప్రత్యేకంగా మళయాళం కేలెండర్ ఉంది. దీనితో రైతులు తమ వ్యవసాయపనులు ప్లాన్ చేసుకొంటారు. మతసంబంధమైన (తిథి వగైరా)విషయాలు, పండుగలు ఈ కేలెండరు ఆధారంగా నిర్ణయిస్తారు. కేరళలో భోజనాన్ని "సద్య" అంటారు. అరటి ఆకులలో వడ్డించడం సంప్రదాయం. ఇడ్లి, పాయసం, పులిషెర్రి, పుట్టుకడల, పుళుక్కు, రసం, సాంబారు - ఇవి సాధారణమైన భోజన పదార్ధాలు. కేరళలో పురుషులు, స్రీలు కూడా సంప్రదాయకంగా కుట్టని, పొడవాటి దుస్తులు కట్టుకోవడం పరిపాటి. మగవారు ధరించే "ముండు" (పంచె), ఆడువారు ధరించే చీర సాధారణ దుస్తులు. ఇప్పుడు మగవారు పాశ్చాత్య విధానంలో దుస్తులు (ప్యాంటు, షర్టు) ధరించడం సర్వసాధారణం. ఇవి కూడా చూడండి కేరళ ముఖ్యమంత్రులు కేరళ గవర్నర్లు జీ శంకర కురుప్ కేరళలోని హిందూ దేవాలయాలు వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్ 2018 కేరళ వరదలు కేరళ రైల్వే స్టేషన్ల జాబితా తెన్హిపాలెం చెమ్మాడ్ కదలుండి నది వల్లతోల్ నారాయణ మీనన్ ఒట్టపాలెం లాల్ జోస్ టిని టామ్ కమల్ (దర్శకుడు) నాదిర్షా thumb|250px|కొట్టాయం జిల్లా తళత్తంగడిలోని ఒక సిరియా మలబార్ నస్రాని వలియపల్లి - యూదుల మందిరాలలో లాగా నగిషీల ఎర్ర పరదాతో కప్పబడిన Knanaya (tabernacle)ను గమనించవచ్చును. thumb|right|250px|పెద్ద హిందూమందిరాలలో రాత్రివేళల చుట్టూ దీపాలు వెలిగించడం పరిపాటి. thumb|బాక్ వాటర్స్ ఆఫ్ కేరళ మూలాలు బయటి లింకులు కేరళ ప్రభుత్వం అధికారిక వెబ్‌పోర్టల్ కేరళ ముఖ్యమంత్రి — పినరాయి విజయన్ కేరళ జనాభా గణాంకాలు కేరళ పోలీసు వికీవాయేజ్‌లో కేరళ కేరళ ట్రావెల్ వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు * వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:దక్షిణ భారతదేశం
జార్ఖండ్
https://te.wikipedia.org/wiki/జార్ఖండ్
జార్ఖండ్ (ఝార్ఖండ్) (Jharkhand), భారతదేశంలో ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన బీహార్, పశ్చిమాన ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తూర్పున పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఒడిషా రాష్ట్రాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధాని పారిశ్రామికనగరమైన రాంచి. ఇంకా ముఖ్యనగరాలైన జంషెడ్‌పూర్, బొకారో, ధన్‌బాద్ ‌కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు. 2000 నవంబరు 15న బీహార్ రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ఝార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు. చిరకాలం శాంతియుతంగా, ప్రజాస్వామికంగా జరిగిన పోరాటానికి ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున ఝార్ఖండ్‌ను "వనాంచల్" అనికూడా అంటారు. అడవులే కాదు. అపారమైన ఖనిజసంపద కూడా ఝార్ఖండ్ రాష్ట్రపు ప్రత్యేకత. భారత రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ తను రచించిన "Ignited Minds"అనే పుస్తకంలో వినియోగానికి వేచియున్న ఖనిజాల నిలయం అని చాలాసార్లు ఝార్ఖండ్ ను ప్రస్తావించారు. చరిత్ర బీహారు దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్యమం 1900 దశకం ఆదిలోనే మొదలయ్యింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జైపాల్ సింగ్ అనే హాకీ ఆటగాడు (1928లో ఒలింపిక్ జట్టుకు కెప్టెన్, స్వర్ణపతక విజేత కూడాను) ఈ నినాదానికి ఆద్యుడని చెప్పవచ్చును. తరువాత ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమం కొనసాగుతూ వస్తున్నది. 2000 ఆగస్టు 2న భారత పార్లమెంటులో "బీహారు పునర్వవస్థీకరణ బిల్లు" (Bihar Reorganization Bill) ఆమోదించబడింది. ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. దక్షిణ బీహారులో 18 జిల్లాలను వేరుచేసి 2000 నవంబరు 15న ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇది భారతదేశంలో 28వ రాష్ట్రం. కాని సాంస్కృతికంగా, భౌగోళికంగా, కొంత రాజకీయంగా ఝార్ఖండ్ ప్రత్యేకత చాలా పురాతనమైనది. మగధ సామ్రాజ్యంకాలం నుంచీ ఉంది. 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన "రాజా జైసింగ్" తనను ఝార్ఖండ్ రాజుగా ప్రకటించుకొన్నాడు. ముఘల్ సామ్రాజ్యంకాలంలో ఝార్ఖండ్‌ను "కుకర"ప్రాంతమనేవారు. బ్రిటిష్ పాలన సమయంలో ఎత్తుపల్లాల కొండలు, అడవులు, దిబ్బలతో నిండినందున ఝార్ఖండ్ అనే పేరు ఈ ప్రాంతానికి పరిపాటి అయ్యింది. ("ఝరీ" - అంటే పొద). చోటానాగపూర్ పీఠభూమి, సంథాల్ పరగణాలలో విస్తరించి ఉన్న ఈరాష్ట్రం దట్టమైన అడవులు, చిట్టడవులు, ఎత్తుపల్లాల కొండలు, గుట్టలు, సెలయేర్లు, జలపాతాలు, నదులు, ఊటలతో కనులకింపైన భూభాగము. స్వాతంత్ర్యపోరాటంలో ఝార్ఖండ్ పాత్ర బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దౌర్జన్యాలతో వేసారిన ఝార్ఖండ్ ఆదివాసుల తిరుగుబాటు 1857నాటి మొదటి స్వాతంత్ర్య సంగ్రామంకంటే నూరేళ్ల ముందే ప్రారంభమైనది. 1772-1780 పహారియా తిరుగుబాటు 1780-1785 తిల్కా మంజీ నాయకత్వంలో తిరగబడిన ఆదివాసులు బ్రిటిష్ సైనికాధికారిని గాయపరచారు. 1785లో భగల్పూర్‌లో తిల్కా మంజీని ఉరితీశారు. 1795-1800 తమర్ తిరుగుబాటు 1795-1800 విష్ణు మనాకి నాయకత్వంలో "ముండా"ల తిరుగుబాటు. 1800-1802 తామర్‌కు చెందిన దుఖాన్ మనాకి నాయకత్వంలో ముండాల తిరుగుబాటు. 1819-1820 భుకన్ సింగ్ నాయకత్వంలో ముండాల తిరుగుబాటు 1832-1833 భగీరధ్, దుబాయ్ గోసాయి, పటేల్ సింగ్‌ల నాయకత్వంలో ఖేవార్ తిరుగుబాటు. 1833-1834 బీర్‌భమ్ కు చెందిన గంగా నారాయణ్ నాయకత్వంలో భూమ్జీ తిరుగుబాటు 1855 లార్డ్ కారన్‌వాలిస్ రాచరిక పద్ధతులపై సంథాల్‌ల యుద్ధం 1855-1860 బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పాలన సాగంచడానికి, పన్నులు వసూలు చేయడానికి, పోరాటానికి సిద్ధూ 10వేల సంథాల్‌లను కూడగట్టాడు. సిద్ధూను, అతని సోదరుడు కన్హూను పట్టుకొటే 10వేల బహుమానం అని బ్రిటిష్‌వారు ప్రకటించారు. 1856-1857 మార్టియర్ షహీద్ లాల్, విశ్వనాధ సహదేవ్, షేక్ భిఖారి, గణపతిరాయ్, బుద్ధువీర్‌- అనే యోధులు 1857లోని మొదటి స్వాతంత్ర్య యుద్ధం, లేదా సిపాయి తిరుగుబాటు సమయంలో బ్రిటిష్‌వ్యతిరేక ఉద్యమాన్ని నడపారు. 1874 భగీరథి మంజీ నాయకత్వంలో ఖేర్వార్ ఉద్యమం 1895-1900 బిర్సా ముండా (జననం: 1875 నవంబరు 15) అనే యువకుని నాయకత్వంలో ఉద్యమం. తరువాత బిర్సాముండా రాంచీ జైలులో కలరా వ్యాధితో (1900 జూన్ 9) మరణించాడు. బ్రిటిష్ పాలకులు పెద్దయెత్తున సైన్యాలను మొహరించి ఈ ఉద్యమాలనన్నిటినీ తీవ్రమైన దౌర్జన్యాలతో అణచివేశారు. 1914- 26000 ఆదవాసీలు పాల్గొన్న తానా భగత్ ఉద్యమం. ఇది క్రమంగా మహాత్మా గాంధీ నాయకత్వంలోని సత్యాగ్రహోద్యమంలో విలీనమైంది. భౌగోళికం, వాతావరణం రాష్ట్రంలో అధికభాగం ఛోటానాగపూరు పీఠభూమిలో ఉంది. కోయల్, దామోదర్, బ్రహ్మణి, ఖర్కాయ్, సువర్ణ రేఖ వంటి నదులకు ఇది జన్మస్థానం. రాష్ట్రంలో చాలా భాగం అటవీమయం. పులులు, ఏనుగులకు కొన్ని చోట్లు ఆవాసం. ఎక్కువగా రాళ్ళు అరిగినందువల్ల ఏర్పడిన నేల. రాష్ట్రంలో ఉన్న నేలల రకాలు: ఎర్ర మట్టి నేల- దామోదర్ లోయ, రాజమహల్ ప్రాంతాలలో మైకేషియస్ నేల (Micacious soil - మైకా ఖనిజ రేణువులతో కూడిన నేల) - కోడెర్మా, ఝూమెరితిలైయా, బర్కాగావ్, మందర్ కొండలు ప్రాంతాలలో ఇసుక నేల - హజారిభాగ్, ధనబాద్ ప్రాంతాలలో నల్ల నేల - రాజమహల్ ప్రాంతం లేటరైట్ నేల (Laterite soil) -, పశ్చిమ రాంచీ, పలమూ, సంథాల్ పరగణాలు, సింగ్‌భమ్ ప్రాంతాలలో వృక్ష, జంతు సంపద ఝార్ఖండ్ లో వైవిధ్యంగల వృక్ష సంపద, జంతుసంపద పుష్కలంగా ఉంది. చాలా జాతీయోద్యానవనాలు, జంతు ప్రదర్శన శాలలు ఉన్నాయి. బెల్టా నేడనల్ పార్క్ - పలము - డాల్టన్‌గంజ్‌నుండి 25 కి.మీ.- వైశాల్యం 250 చ.కి.మీ. - పులులు, ఏనుగులు, "గౌర్" అనబడే అడవిదున్నలు (bison), సాంభార్‌లు (దుప్పి), అడవిపందులు, 15-20 అడుగుల పొడవుండే కొండచిలువలు, చుక్కల లేళ్ళు, చిరుతపులులు, కుందేళ్ళు, నక్కలు, లంగూర్లు, రీసెస్ కోతులు, నీలీగాయ్ లు, అడవి దున్నలు, ముళ్లపందులు, కుందేల్లు, అడవి పిల్లులు, తేనెకొక్కులు, తోడేళ్లు, మలబార్ రాక్షస ఉడుతలు, ముంగిస తోడేళ్ళు, దుప్పులు. 1974లో ఈ పార్కును "ప్రాజెక్ట్ టైగర్" రిజర్వు అడవిగా ప్రకటించారు. ఝార్ఖండ్ వన్యసంపద ఎంత సంపన్నమైనదో తెలుసు కోవడానికి ఒక ఉదాహరణ: పలములోని ప్రాజెక్ట్ టైగర్ రిజర్వులో ఒక్కో జాతికి ఎన్నిరకాలున్నాయో గమనించవలసింది - - క్షీరదాలు (39 రకాలు), పాములు (8వ రకాలు), తొండలు (4 రకాలు), చేపలు (6 రకాలు), కీటకాలు (21 రకాలు), పక్షులు (170 రకాలు), విత్తనపు మొక్కలు (97 రకాలు), పొదలు (46 రకాలు), తీగెలు, పరాధీనమొక్కలు Climbers, పరాన్నజీవ మొక్కలు & అర్ధపరాన్నజీవులు (25 రకాలు), గడ్డి-వెదురులు (17 రకాలు). హజారీబాగ్ వన్యప్రాణి అభయారణ్యం - రాంచీనుండి 135 కి.మీ. ఇదికూడా బెల్టా నేషనల్ పార్క్ వంటి పర్యావరణ వ్యవస్థలోనే ఉంది. రాంచీ నుండి 16 కి.మీ.లో మరొక జంతు ప్రదర్శన శాల. జనవిస్తరణ ఝార్ఖండ్ జనాభా 2కోట్ల 69 లక్షలు. మగవారు 1కోటి 39 లక్షలు. ఆడువారు 1కోటి 30 లక్షలు. (ఆడ:మగ నిష్పత్తి 941:1000) జనాభాలో 28% ఆదివాసీలు, 12% షెడ్యూల్డ్ కులాలవారు. 60% ఇతరులు. ప్రతి చదరపు కి.మీ.కు 274మంది జనాభా. (గుమ్లా జిల్లా జన సాంద్రత 148, ధన్‌బాద్ జిల్లా జనసాంద్రత: 1167) ఎంతోకాలం నుండి చాలామంది ఆదివాసులకు ఝార్ఖండ్ ఆవాసంగా ఉంటూ వచ్చింది. కొన్ని జిల్లాలలో ఆదివాసుల జనాభా మెజారిటీగా ఉంది. మొత్తం ఝార్ఖండ్‌లో 32 ప్రధాన ఆదివాసి తెగలున్నాయి. అవి అసుర్, బైగా, బంజారా, బతుడీ, బెడియా, బింఝియా, బిర్‌హోర్, బిర్జియా, చెరో, చిక్-బరైక్, గోడ్, గొరైత్, హో, కర్మాలి, ఖర్వార్, ఖోండ్, కిసన్, కొరా, కోర్వా, లోహ్రా, మహిలి, మల్-పహారియా, ముండా, ఒరావొన్, పర్హైయా, సంతల్, సౌరియా-పహారియా, సవర్, భుమిజ్, కోల్, కన్వర్ తెగలు. ఇంకా ఇక్కడి ఖనిజ సంపదల వల్లా, భారీ పరిశ్రమల వల్లా లభించే అవకాశాల కారణంగా చాలామంది బీహారు, బెంగాలు వగటి పొరుగు రాష్ట్రాలవారు (ఇంతకు ముందు బీహారు పొరుగు రాష్ట్రం కాదు. ఝార్ఖండ్ బీహారులో భాగం) ఇక్కడ. ముఖ్యంగా ధన్‌బాద్, జంషెడ్‌పూర్, రాంచీ వంటి పారిశ్రామిక నగరాలలో - స్థిరపడ్డారు. హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం - ఇవి ఝార్ఖండ్‌లో ప్రధానమైన మతాలు. ఆర్థిక రంగం పేద ప్రజలున్న ధనికరాష్ట్రమని ఝార్ఖండ్‌ను వర్ణింపవచ్చును. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడి జంషెడ్‌పూర్, ధన్‌బాద్, బొకారోలలో ఉన్నాయి. దేశంలో మొదటి ఇనుము-ఉక్కు కర్మాగారం జంషెడ్‌పూర్‌లో నిర్మించారు. సింద్రీలో ఒకప్పటి భారతదేశపు అతిపెద్ద ఎరువుల కర్మాగారం (ఇప్పుడు మూతపడింది) గోమియాలో అతిపెద్ద ప్రేలుడు పదార్ధాల కర్మాగారం మొదటి మిథేన్ గ్యాస్ కర్మాగారం. కాని చాలా వెనుకబడిన పల్లెలు, పట్టణాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. పట్టణ జనాభా 22.5%. సగటు తలసరి వార్షిక ఆదాయం $90 మాత్రమే ఝార్ఖండ్ రాష్ట్రం ఖనిజసంపదకు పెట్టింది పేరు. ఇనుము (దేశంలో మొదటి స్థానం) బొగ్గు (దేశంలో 3వ స్థానం) రాగి (దేశంలో మొదటి స్థానం) మైకా (దేశంలో మొదటి స్థానం) బాక్సైటు (దేశంలో 3వ స్థానం) మాంగనీస్ సున్నపు రాయి కైనైటు (దేశంలో మొదటి స్థానం) క్రోమైటు (దేశంలో 2వ స్థానం) ఆస్బెస్టాస్ (దేశంలో మొదటి స్థానం) థోరియం (దేశంలో మొదటి స్థానం) సిల్లిమనైటు యురేనియం (దేశంలో మొదటి స్థానం) - జాదుగుడా గనులు, నర్వా పహార్ బంగారం (దేశంలో 6వ స్థానం) - రఖా గనులు వెండి ప్రభుత్వం ఝార్ఖండ్ పాలనా వ్యవస్థ దేశంలో అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు 2000 నవంబరు 15 - 2003 మార్చి 18 బాబులాల్ మరండి (భా.జ.పా.) 2003 మార్చి 18 - 2005 మార్చి 2 అర్జున్ ముండా (భా.జ.పా.) 2005 మార్చి 2 - 2005 మార్చి 12 షిబు సోరెన్ (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) 2005 మార్చి 12 - 18 సెపటెమబెర 2006 అర్జున్ ముండా (భా.జ.పా.) 2006 సెప్టెంబరు 18 నుండి- మధు కోడా (స్వతంత్ర అభ్యర్థి) రాజకీయాలు 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి 33, భారతీయ జనతా పార్టీ కూటమి 36, ఇండిపెండెట్లు 12 స్థానాలలో విజయం సాధించాయి. ఎవరికీ పూర్తి మెజారిటీ దక్కలేదు. శిబూసోరెన్ రెండుసార్లు, స్వతంత్ర అభ్యర్థి మధుకోడా రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాలుగు సంవత్సరాలలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం మారింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలనలో ఉంది. 2009 లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది. 2010లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీకు చెందిన అర్జున్ ముండా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జిల్లాలు ఝార్ఖండ్‌ మొదట బీహారు రాష్ట్రంనుండి వేరుచేసి 18 జిల్లాలతో ఏర్పరచారు. తరువాత జిల్లాలను పునర్వ్యవస్థకరించి, మరో 4 జిల్లాలను ఏర్పరచారు. లాతెహార్, సరైకెలా ఖరస్వాన్, జమ్‌తారా, సాహెబ్‌గంజ్ అనేవి ఆ క్రొత్త జిల్లాలు. ఇప్పుడు మొత్తం 22 జిల్లాలున్నాయి. జిల్లాల భౌగోళిక చిత్రపటం భాష, సాహత్యం, సంస్కృతి మూడు ప్రధాన భాషా కుటుంబాలకు చెందిన భాషలు, యాసలు ఝార్ఖండ్‌లో మాట్లాడుతారు. ఇండో-ఆర్యన్ భాషలు - సద్రి భాష, హిందీ భాష, ఉర్దూ భాష, బెంగాలీ భాష ముండా భాషలు - కొర్కు భాష, సంతాలి భాష, ముండారి భాష, భుమిజ్ భాష, పహారియా భష, హో భాష ద్రావిడ భాషలు - కొర్వా భాష, ఒరవొన్ భాష, సౌరియా పహారియా భాష సామాజిక వ్యవస్థ ఆరోగ్యం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంవల్ల 1918లోనే రాంచిలో ప్రత్యేక మానసిక అవసరాలున్నవారికోసం మానసిక వైద్యసదుపాయ కేంద్రాన్ని నిర్మించారు (for treatment of mentally challenged) – కేంద్రీయ మానసిక వైద్య సంస్థ కొన్ని ప్రాంతాలలో పేదరికం, ఆహారలోపం వల్ల క్షయ వ్యాధి ప్రబలంగా ఉంది. రామకృష్ణామఠం వంటి సేవా సంస్థలు 1948నుండి అటువంటి వారికి కొన్ని వైద్య సదుపాయాలు నిర్వహిస్తున్నాయి.. కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం జంషెడ్‌పూర్‌లో టాటా మెమోరియల్ హాస్పిటల్ ఉత్తమసేవలను అందిస్తున్నది. అయినా వైద్య సదుపాయాలు ఇంకా మెరుగుపరచవలసిన అవసరం చాలా ఉంది. విద్య ఝార్ఖండ్‌లో అక్షరాస్యత 54.13% (2001) . ఆడువారిలో అయితే 39.38% మాత్రమే. విద్యా సదుపాయాలు ఒకోచోట బాగాను, చాలాచోట్ల అధమంగానూ ఉన్నాయి. కొన్ని క్రైస్తవ సంస్థలు మారుమూల ప్రాంతాలలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నాయి. ఝార్ఖండ్‌లో 5 విశ్వ విద్యాలయాలున్నాయి రాంచీ విశ్వవిద్యాలయం, రాంచీ సిద్ధుకన్హు విశ్వవిద్యాలయం, దుమ్కా వినోబా భావే విశ్వవిద్యాలయం, హజారీబాగ్ బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కన్కే, రాంచీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాంచీ ఇతర ముఖ్యమైన విద్యా సంస్థలు రీజియనల్ ఇంజినీరింగ్ కాలేజి, జంషెడ్‌పూర్ బిర్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సింద్రీ, ధన్‌బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ధన్‌బాద్ (1926 లో స్థాపితం) జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్, XLRI, జంషెడ్‌పూర్ ( 1949 లో స్థాపితం), కాని చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యలకోసం ఇతరరాష్ట్రాలకు వెళ్ళవలసి వస్తున్నది. వార్తాసాధనాలు రాష్ట్ర రాజధాని రాంచీ నుండి వెలువడే హిందీ పత్రికలు రాంచీ ఎక్స్‌ప్రెస్, ప్రభాత్ ఖబర్ ముఖ్యమైన వార్తా పత్రికలు. పెద్ద నగరాలలో దేశ నలుమూలలనుండి ప్రధానమైన పత్రికలు - ముఖ్యంగా హిందీ, ఆంగ్లం, బెంగాలీ భాషలవి- లభిస్తాయి. దేశంలో అన్ని ప్రాంతాలవలెనే రేడియో, టెలివిజన్, టెలిఫోన్ సౌకర్యాలున్నాయి. క్రీడలు ఝార్ఖండ్ రాష్ట్రములో హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలకు ఆదరణ ఉంది. భారత హాకీ జట్టుకు నాయకత్వం వహించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు జైపాల్ సింగ్, ప్రస్తుతం హాకీ జట్టు సభ్యుడు విమల్ లక్రా, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని ఈ రాష్ట్రం వారే. సినిమారంగం హేమెన్ గుప్తా: సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. హిందీ సినిమాలు, బెంగాలీ సినిమాలలో పనిచేశాడు. ఇవి కూడా చూడండి జార్ఖండ్ ముఖ్యమంత్రులు గీతా కోడా మూలాలు బయటిలింకులు ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రాంచీకి సంబంధించిన వార్తల కూర్పు రాంచీ ఎక్స్‌ప్రెస్ ప్రభాత్ ఖబర్ వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
మహారాష్ట్ర
https://te.wikipedia.org/wiki/మహారాష్ట్ర
మహారాష్ట్ర, (మరాఠీ: महाराष्ट्र ) భారతదేశంలో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం. మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా రాష్ట్రాలతోనూ, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా-నగరుహవేలి తోనూ సరిహద్దులున్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది. ముంబయి నగరం మహారాష్ట్ర రాజధాని, అతిపెద్ద నగరం. మహారాష్ట్ర ప్రాంతం ఋగ్వేదంలో రాష్ట్రఅనీ, అశోకుని శాసనాలలో రాష్ట్రీకం అనీ, అతరువాత హువాన్‌త్సాంగ్ వంటి యాత్రికుల రచనలలో మహారాష్ట్ర అనీ ప్రస్తావింపబడింది. మహారాష్ట్రి అనే ప్రాకృత పదం నుండి ఈ పేరు రూపాంతరం చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహాకాంతార (అంటే పెద్ద అడవులు) అన్నపదం నుండి మహారాష్ట్ర పదం పుట్టిందని అంటారు.Geographic Profile — Govt of Maharashtra అయితే ఈ విశ్లేక్షణలకు బలమైన ఆధారాలు లేవు. చరిత్ర thumb|217x217px| ఎల్లోరా గుహలలో శిల్పాలు ప్రాచీన, మధ్య యుగ చరిత్ర మహారాష్ట్ర గురించి సాశ.పూ. 3వ శతాబ్దం నుండే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించాయి. అప్పుడు మహారాష్ట్రి అనే భాషగురించి ప్రస్తావన జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతం "దండకారణ్యం" అనబడింది. తరువాత అశోకుడు పాలించిన మగధ సామ్రాజ్యంలో మహారాష్ట్ర ఒక భాగమైంది. ఇప్పటి ముంబాయి నగరానికి ఉత్తరాన ఉన్న సోపార రేవు పట్టణంనుండి కొచ్చి (భారతదేశం) తోను, తూర్పు ఆఫ్రికా, మెసపొటేమియా లతోను వర్తక సంబంధాలుండేవి. మౌర్యసామ్రాజ్యం పతనానంతరం సా.శ.పూ. 230 - సా.శ. 225 మధ్య మహారాష్ట్ర ప్రాంతం శాతవాహనసామ్రాజ్యంలో భాగమయ్యింది. ఈ కాలంలో ఇక్కడి సంస్కృతి, మరాఠీ భాష బాగా వృద్దిచెందాయి. సా.శ. 78 ప్రాంతంలో పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి పేరు మీద శాలివాహన శకం ఆరంభమయ్యింది. సా.శ. 3వ శతాబ్ది సమయంలో శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. సా.శ. 250-525లో వాకాటకులు విదర్భ ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో కళలు, సాంకేతిక పరిజ్ఞానము, నాగరికత బాగా వృద్ధిచెందాయి. 6వ శతాబ్దానికల్లా మహారాష్ట్ర ప్రాంతమును బాదామి చాళుక్యులు పాలించారు. 753వ సంవత్సరంలో రాష్ట్రకూటులు మహారాష్ట్రపాలకులయ్యారు. వారి సామ్రాజ్యం దాదాపు దక్కన్ అంతా విస్తరించింది. మరలా రాష్ట్రకూటులను ఓడించి బాదామి చాళుక్యులు 973-1189మధ్య మహారాష్ట్రలో కొంతభాగాన్ని పాలించారు. 1189 తరువాత దేవగిరి యాదవులు ఇక్కడి రాజులయ్యారు. సా.శ.13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకొన్నారు. మొదట అల్లాఉద్దీన్ ఖిల్జీ, ఆతరువాత ముహమ్మద్ బిన్ తుఘ్లక్ దక్కన్‌లో తమ అధికారాన్ని నెలకొలిపారు. 1347లో తుఘ్లక్‌ల రాజ్యం పతనమయినాక బీజాపూర్‌కు చెందిన బహమనీ సుల్తానులు తరువాత 150 సంవత్సరాలు ఇక్కడ రాజ్యం నెరపారు. 16వ శతాబ్దంనాటికి మహారాష్ట్ర మధ్యప్రాంతం ముఘల్ సామ్రాజ్యానికి అధీనులైన చిన్న చిన్న ముస్లిమ్‌రాజుల అధీనంలో ఉండేది. తీరప్రాంతంలో పోర్చుగీసువారు అధికారం చేజిక్కించుకొని, సుగంధ ద్రవ్యాల వర్తకం పై గుత్తాధిపత్యాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నారు . మరాఠాలు, పేష్వాలు thumb|right|శివాజీ మహారాజు చిత్రం 17వ శతాబ్దారంభంలో స్థానికులైన మరాఠాల నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం వ్రేళ్ళూనుకొనసాగింది. 1674లో శివాజీ భోన్సలే రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. శివాజీ మహారాజుగా ప్రసిద్ధుడైన ఈ నాయకుడు అప్పటి ముఘల్ ‌చక్రవర్తి ఔరంగజేబు సైన్యంతోను, బిజాపూర్ నవాబు ఆదిల్ షా సైన్యంతోను పలుయుద్ధాలు సాగించాడు. అప్పుడే మహారాష్ట్రలో తమఅధిపత్యాన్ని విస్తరిస్తున్న బ్రిటిష్‌వారితో కూడా కొన్ని చిన్న యుద్ధాలు చేశాడు. మహారాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రసిద్ధుడైన, జనప్రియుడైన, పరిపాలనా దక్షతగల రాజుగా శివాజీని పేర్కొనవచ్చును. 1680దశకంలో శివాజీ కొడుకు శంభాజీ భోన్సలే ఔరంగజేబు చేత చిక్కి ఉరితీయబడ్డాడు. శంభాజీ తమ్ముడైన రాజారామ్ భోన్సలే తమిళప్రాంతానికి పారిపోయి "జింజీ కోట"లో తలదాచుకొన్నాడు. 18వ శతాబ్దంలో రాజారామ్ కాస్త బలపడిన సమయానికి పరిస్థితులు మారిపోయాయి. శంభాజీ కొడుకు షాహు భోన్సలే అసలైన వారసునిగా, పినతల్లి తారాబాయితో కొంత ఘర్షణను ఎదుర్కొని, తన మంత్రి (పేష్వా)బాలాజీ విశ్వనాధ్ సహాయంతో సింహాసనం చేజిక్కించుకొన్నాడు. తరువాత 4దశాబ్దాలు భోన్సలేలు నామమాత్రంగా అధికారంలో ఉన్నారు పేష్వాలు నిజమైన అధికారాన్ని నెరపారు. ముఘల్‌లను ఓడించిన పేష్వాల అధికారం ఉత్తరాన పానిపట్ ‌నుండి దక్షిణాన తంజావూరు వరకు, గుజరాత్‌ లోని మెహసనా నుండి మధ్యప్రదేశ్‌ ‌లోని గ్వాలియర్, ఇండోర్‌ల వరకు విస్తరించింది. బాలాజీ విశ్వనాధ్, అతని కొడుకు బాజీరావు పేష్వా‌లు వారిపాలనలో ఉన్న ప్రాంతంలో రెవెన్యూ విధానాన్ని, పరిపాలనా విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఇందుకు వారు ముఘల్ చక్రవర్తుల విధానాలను తమ స్వంత విధానాలతో జోడించారు. పేష్వాల కాలంలో వర్తకం, బ్యాంకింగ్ వ్యవస్థలు పటిష్ఠంగా అభివృద్ధిచెందాయి. వ్యవసాయం మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. పేష్వాలు పశ్చిమతీరంలో నౌకాభద్రతను అభివృద్ధిచేయసాగారు. అందుకై కొలాబాలో నౌకాదళాన్ని ఏర్పాటు చేశారు. నౌకాబలంమీద, సముద్ర వర్తకంమీద ఆధారపడిన పాశ్చాత్యదేశాల స్థావరాల అధిపత్యానికి ఇది కలవరపాటు కలిగించింది. అదేసమయంలో మరాఠా ప్రాంతాలుకాని చోట్ల అధిపత్యం సామంతులకు కట్టబెట్టారు. అలా గ్వాలియర్‌లో సింథియాలు, ఇండోర్‌లో హోల్కర్‌లు, బరోడాలో గైక్వాడ్‌లు, ధార్‌లో పవార్‌లు స్థానిక రాజులయ్యారు. 1761లో మూడవ పానిపట్టు యుద్ధంలో అఫ్ఘన్ సేనాని అహ్మద్‌షా అబ్దాలీ సైన్యంతో జరిగిన యుద్ధంలో మరాఠాలు దారుణంగా పరాజితులయ్యారు. దీనితో మరాఠా సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలయ్యింది. పూణేలో మాత్రం పేష్వాకుటుంబాల రాజ్యం కొనసాగింది. స్థానిక సంస్థానాధీశులు తమ రాజ్యాలను చక్కబెట్టుకొనసాగారు. భోన్సలేలకు దక్కన్‌లో సతారా కేంద్రమయ్యింది. వారి కుటుంబంలో రాజారామ్ వంశానికి చెందినవారు (1708లో షాహు అధికారాన్ని ఒప్పనివారు)మాత్రంకొల్హాపూర్‌లో స్థిరపడ్డారు. 19వ శతాబ్దారంభం వరకు కొల్హాపూర్‌లో వీరి పాలన సాగింది. బ్రిటిష్ రాజ్య కాలం భారత రాజకీయాల్లోకి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రావడంతో వారికి, మరాఠాలకు పోరులు మొదలయ్యాయి. 1777-1818 మధ్య మూడు ఆంగ్ల-మరాఠా యుద్ధాలు జరిగాయి. తత్ఫలితంగా 1819నాటికి మహారాష్ట్రలో పేష్వాల పాలనలో ఉన్న భూభాగం ఆంగ్లేయుల పరమైంది. మరాఠా సామ్రాజ్యం అంతమైంది. బ్రిటిష్‌వారు ఈ ప్రాంతాన్ని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా పాలించారు. అది ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీనుండి ఉత్తర దక్కన్ వరకు విస్తరించి ఉండేది. చాలా మరాఠా రాజ్యాలు మాత్రం బ్రిటిష్ సామంతరాజ్యాలుగా మిగిలి ఉన్నాయి. వాటిలో నాగపూర్, సతారా, కొల్హాపూర్‌లు ముఖ్యమైనవి. 1848లో సతారా, 1853లో నాగపూర్, 1903లో బేరార్‌లు బ్రిటిష్ రాజ్యంలో కలిపివేయబడ్డాయి. మరాఠ్వాడా ప్రాంతం హైదరాబాద్ నిజాం రాష్ట్రంలో భాగంగా ఉండేది. బ్రిటిష్ కాలంలో సంఘ సంస్కరణలు ఊపందుకొన్నాయి. మౌలిక సదుపాయాలు కొంత మెరుగు పడినాయి. క్రమంగా తిరుగుబాటులు మొదలయ్యఅయి. 20వ శతాబ్దం ఆరంభంలో బాల గంగాధర తిలక్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్య పోరాటం వ్రేళ్ళూనుకొంది. తరువాత మహాత్మా గాంధీ నాయకత్వంలో ఇది అహింసాయుత పోరాటంగా విస్తరించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది. స్వాతంత్ర్యం తరువాత 1947లో స్వాతంత్ర్యం తరువాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం, విదర్భ, నాగపూర్, వాటితో మరికొన్ని రాజ సంస్థానాలు విలీనం చేసి 1950లో బొంబాయి రాష్ట్రం ఏర్పాటు చేశారు. 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. భౌగోళికం thumb|217x217px|మహారాష్ట్రలో పర్వతాలు మహారాష్ట్ర వైశాల్యం 308,000 చ.కి.మీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల తరువాత ఇది పెద్ద రాష్ట్రం. తీర ప్రాంతానికి సమాంతరంగా ఉన్న పడమటి కనుమలు సగటు ఎత్తు 1,200 మీటర్లు. వాటికి పశ్చిమాన కొంకణ్ తీరభూమి మైదానం ఉంది. పడమటి కనుమలకు తూర్పున దక్కన్ పీఠభూమి ఉంది. తమ్హిని ఘాట్, వరంధ ఘాట్, సవంత్‌వాడి ఘాట్ - ఇవి పడమటి కనుమలలో విభాగాల పేర్లు. పడమటి కనుమలు భారతదేశంలో మూడు వాటర్ షెడ్ ప్రాంతాలలో ఒకటి. దక్షిణభారతదేశపు ముఖ్యమైన నదులు చాలా పడమటికనుమలలో పుడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణ - ఇవి తూర్పువైపుకు ప్రవహించి బంగాళా ఖాతంలో కలుస్తయి. మహారాష్ట్ర మధ్య, తూర్పు ప్రాంతాలకు ఇవి ప్రధాన నీటి వనరులు. ఇంకా పడమటి కనుమలలో చాలా చిన్న నదులు పడమటివైపుకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయు. మహారాష్ట్రకు ఉత్తరాన, మధ్యప్రదేశ్ సరిహద్దులలో సాత్పూరా పర్వతశ్రేణులున్నాయి. నర్మద, తపతి నదులు మహారాష్ట్ర ఉత్తరభాగంలో నీటి వనరులు. ఇవి పడమటివైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. వైన గంగ వంటి నదులు దక్షిణదిశగా ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక బహుళార్ధ సాధక ప్రాజెక్టులున్నాయి. దక్కన్ పీఠభూమిలో చాలాభాగం నల్లరేగడినేల. ప్రత్తి వ్యవసాయానికి అనుకూలమైనది. అభయారణ్యాలు మహారాష్ట్ర ప్రాంతంలోని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు చాలా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (wildlife sanctuaries), జాతీయ ఉద్యానవనాలు (national parks), ప్రాజెక్ట్ టైగర్ ఏర్పాటు చేయ బడ్డాయి. 2004 మే నాటికి మొత్తం దేశంలో 92 జాతీయ ఉద్యానవనాలుండగా వాటిలో 5 మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఎక్కువ అటవీ ప్రాంతం విదర్భలో ఉంది. అక్కడ ఉన్న జాతీయ ఉద్యానవనాలు గుగమల్ నేషనల్ పార్కు, దీనినే మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ అని కూడా అంటారు - ఇది విదర్భ ప్రాంతంలో అమరావతి జిల్లాలో ఉంది. నవీగావ్ నేషనల్ పార్కు - విదర్భ ప్రాంతంలో నాగపూర్ దగ్గర - పలు జాతుల పక్షులకు, లేళ్ళకు, ఎలుగుబంట్లకు, చిరుతలకు ఆవాసం. పెంచ్ నేషనల్ పార్కు - నాగపూర్ జిల్లాలో ఉంది. ఈ పార్కు మధ్యప్రదేశ్‌లో కూడా విస్తరించింది. దీనిని టైగర్ ప్రాజెక్టుగా వృద్ధిపరచారు. సంజయ్ గాంధీ నేషనల్ పార్కు - దీనినే బోరివిలి నేషనల్ పార్కు అంటారు. ముంబాయి నగరంలో ఉంది. నగర పరిధిలో ఉన్న నేషనల్ పార్కులతో పోలిస్తే ప్రపంచంలో పెద్దది. తడోబా అంధారి టైగర్ ప్రాజెక్టు - విదర్భలో చంద్రాపూర్ వద్ద - ఇది ఒక ప్రముఖ టైగర్ ప్రాజెక్టు. ఇవికాక మహారాష్ట్రలో 35 వన్యప్రాణి అభయారణ్యాలున్నాయి. వాటిలో నాగ్‌జిరా (భంద్రా జిల్లా), ఫన్సాద్, కొన్యా అభయారణ్యాలు ముఖ్యమైనవి. ఆర్ధిక వ్యవస్థ స్థూల ఉత్పత్తి మహారాష్ట్ర స్థూల రాష్ట్రోత్పత్తి వివరాలు (మార్కెట్ ధరల ఆధారంగా, కోట్ల రూపాయలలో) క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. భారత ప్రభుత్వం గణాంకవిభాగం అంచనా. సంవత్సరం స్థూల రాష్ట్రోత్పత్తి (కోట్ల రూ.) 1980 1,663.1 1985 2,961.6 1990 6,443.3 1995 15,781.8 2000 23,867.2 2004లో మహారాష్ట్ర స్థూలాదాయం 106 బిలియన్ డాలర్లు అని అంచనా. ప్రభుత్వ ఆదాయవనరులు మహారాష్ట్ర ప్రభుత్వపు పన్ను ఆదాయం (కేంద్రం నుండి వచ్చే వాటాను మినహాయించి) క్రింద చూపబడ్డాయి. సంవత్సరం పన్ను ఆదాయం (కోట్ల రూపాయలు) 2000 19,882.1 2005 33,247.6 పన్నుల ద్వారా కాకుండా, కేంద్రం నుండి వచ్చే వాటఅను మినహాయించి, వచ్చే ఆదాయ వివరాలు. సంవత్సరం ఆదాయం (కోట్ల రూపాయలు)- పన్నులు కాక 2000 2,603.0 2005 3,053.6 పరిశ్రమలు 1970దశకంలో అవలంబించిన ఆర్థిక విధానాల ఫలితంగా భారతదేశంలో పారిశ్రామికంగా మహారాష్ట్ర బాగా అభివృద్ధి చెందింది. గుజరాత్ తరువాత మహారాష్ట్ర దేశంలో అత్యధిక పారిశ్రామిక రాష్ట్రం. ముంబాయి నగరంతో సహా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఆ ప్రాంతంవారు అన్ని అవకాశాలను చేజిక్కించుకొంటున్నారన్న అభిప్రాయం విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ప్రాంతంలో ప్రబలంగా ఉంది. విదర్భ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉద్యమం కూడా ఉంది. మొత్తం దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులలో 13% మహారాష్ట్రనుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో 64% ప్రజలు వ్యవసాయ, సంబంధిత వృత్తులపై ఆధారపడి ఉన్నారు. కాని స్థూల రాష్ట్రాదాయంలో 46% పరిశ్రమలనుండే వస్తున్నది. దేశంలో మొదటి 500 వ్యాపార సంస్థలలో 41% పైగా సంస్థలు (Over 41% of the S&P CNX 500 conglomerates) వాటి ప్రధాన కార్యాలయాలను మహారాష్ట్రలో కలిగి ఉన్నాయి. మహారాష్ట్రలో ముఖ్యమైన పరిశ్రమలు: రసాయన, అనుబంధ పరిశ్రమలు విద్యుత్ పరికరాలు, యంత్రాలు యంత్ర భాగాలు వస్త్ర పరిశ్రమ ఔషధాలు పెట్రోలియం ఉత్పత్తులు పానీయాలు ఆభరణాలు ఇంజినీరింగ్ ఉత్పత్తులు ఇనుం, ఉక్కు ప్లాస్టిక్ ఉత్పత్తులు వ్యవసాయం మహారాష్ట్రలో ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు మామిడి ద్రాక్ష నారింజ వరి గోధుమ జొన్న సజ్జ పప్పు ధాన్యాలు వేరు శనగ ప్రత్తి చెఱకు పసుపు పుగాకు మొత్తం రాష్ట్రంలో నీటివనరులున్న భూమి 33,500చ.కి.మీ. బ్యాంకింగ్, సినిమాలు భారతదేశానికి ఆర్థిక రాజధాని, సినిమా రాజధాని ముంబాయి నగరమేనని అంటారు. దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబాయ నగరంలో ఉన్నాయి. ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రం. ఇది ఆసియాలో అత్యంత పురాతనమైంది. ముంబాయిలో సినిమా పరిశ్రమను బాలీవుడ్ అని చమత్కరిస్తుంటారు. (అమెరికాలోని హాలీవుడ్ను పురస్కరించికొని). హిందీ సినిమాలకు, టెలివిజన్ పరిశ్రమకు ఇది ప్రధాన కేంద్రం. ఇటీవల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ ఊపందుకుంది. పూణే, నాగపూర్, ముంబాయి, నాసిక్ లలో సాఫ్ట్‌వేర్ పార్కులు నెలకొలుపబడ్డాయి. బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్తు (దేశంలో 13%), అణు విద్యుత్తు (దేశంలో 17%) - ఈ రెండింటిలోనూ మహారాష్ట్రదే దేశంలో అగ్రస్థానం. ఇటీవల జత్రోపా వ్యవసాయం మహారాష్ట్రలో విస్తరిస్తుంది. రాలెగావ్ సిద్ధి అనే ఊరు అహమ్మద్ నగర్ జిల్లాలో ఉంది. పర్యావరణ సంరక్షణ ఈ ఊరు ఒక ఆదర్శప్రాయంగా ఉంది. పరిపాలన 250px|thumb| మహారాష్ట్ర శాసన, పాలనా భవనం (మంత్రాలయ్) మహారాష్ట్ర పాలనా వ్యవస్థ అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది. రాజధాని ముంబాయి నగరం. ప్రధాన న్యాయ స్థానం బొంబాయి హైకోర్టు మహారాష్ట్రకు, గోవాకు, డామన్-డయ్యుకు కూడా హైకోర్టుగా వ్యవహరిస్తుంది. శాసన సభ బడ్జెట్, వర్షాకాలపు సమావేశాలు ముంబాయిలోను, శీతాకాలపు సమావేశాలు నాగపూర్‌లోను జరుగుతాయి. నాగపూర్‌ నగరం రాష్ట్రానికి ద్వితీయ రాజధాని అని వ్యవహరిస్తారు. మహారాష్ట్ర శాసనసభలో విధాన సభ (అసెంబ్లీ), విధాన పరిషత్ (కౌన్సిల్) అనే రెండు సభలున్నాయి. మహాహారాష్ట్రకు లోక్‌సభలో 48 స్థానాలు, రాజ్యసభలో 19 స్థానాలు ఉన్నాయి. స్వాతంత్ర్యం తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్రను చేజిక్కించుకొంటూ వచ్చింది. 1995వరకూ వారికి బలమైన ప్రత్యర్థులు లేరు. ఈ కాలంలో వై.బి.చవాన్ ప్రముఖ కాంగ్రెసు నాయకుడు. 1995లో బాల్ థాకరే అధ్వర్యంలోని శివసేన, భారతీయ జనతా పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత శరద్ పవార్ ప్రారంభించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరొక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది. 2004 ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనవిస్తరణ - గణాంకాలు మహారాష్ట్ర స్థానికులను మహారాష్ట్రియన్ అంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్ర జనాభా 96,752,247. ఇందులో మరాఠీ మాతృభాషగా ఉన్నవారు 62,481,681. రాష్ట్రం జనసాంద్రత చ.కి.మీ.కు 322.5. రాష్ట్రజనాభాలో పురుషులు 5.03 కోట్లు, స్త్రీలు 4.64 కోట్లు. ఆడ, మగ నిష్పత్తి 922/1000. పట్టణ జనాభా 42.4%. అక్షరాస్యులు 77.27%. స్రీలలో అక్షరాస్యత 67.5%, పురుషులలో 86.2%. 1991-2001 మధ్య జనాభా వృద్ధిరేటు 22.57%. అధికార భాష మరాఠీ. పెద్ద నగరమైన ముంబాయిలో మరాఠీతో బాటు హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషలు విస్తారంగా మాట్లాడుతారు. రాష్ట్ర వాయవ్యప్రాంతంలో అహిరాణి అనే మాండలికం కొద్దిమంది మాట్లాడుతారు. దక్షిణ కొంకణ ప్రాంతంలో మాల్వాణి అని పిలువబడే కొంకణి భాష మాట్లాడుతారు. దీనిని మరాఠీ భాష మాండలికం అనికూడా అనవచ్చు. దక్కన్ అంతర్భాగంలో దేశ భాషి అనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు. విదర్భ ప్రాంతంలో వర్హాదిఅనబడే మరాఠీ మాండలికం మాట్లాడుతారు. మతపరంగా హిందువులు 80.2%, ముస్లిములు10.6%, బౌద్ధులు 6%, జైనులు 1.3%, క్రైస్తవులు 1% ఉన్నారు. భారతదేశంలో అత్యధిక జైన, జోరాస్ట్రియన్ (పార్సీ), యూదు జనాభా మహారాష్ట్రలోనే ఉన్నారు. విభాగాలు, జిల్లాలు మహారాష్ట్రలోని 35 జిల్లాలని 6 విభాగాలు (డివిజన్లు)గా విభజిస్తారు. ఔరంగాబాదు విభాగం అమరావతి విభాగం కొంకణ విభాగం నాగపూర్ విభాగం నాసిక్ విభాగం పూణె విభాగం భౌగోళికంగానూ, చారిత్రికంగానూ, రాజకీయ భావాలను బట్టీ మహారాష్ట్రలో 5 ముఖ్యప్రాంతాలను గుర్తింపవచ్చును. విదర్భ లేదా బేరార్ - నాగపూర్, అమరావతి విభాగఅలు కలిపి మరాఠ్వాడా- ఔరంగాబాదు విభాగం, ఖాందేశ్, ఉత్తర మహారాష్ట్ర (నాసిక్) దేశ్ లేదా పశ్చిమ మహారాష్ట్ర - పూణే విభాగం కొంకణ ప్రాంతం రవాణా వ్యవస్థ thumb|250px| ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్ రహదారి మహారాష్ట్రలో అధికభాగంలో భారతీయ రైల్వే వారి రవాణా సదుపాయం విస్తరించి ఉంది. రైలు ప్రయాణం బాగా సామాన్యం. ముంబాయి కేంద్రంగా సెంట్రల్ రైల్వే ఎక్కువ భాగంలో ఉండగా, దక్షిణతీర ప్రాంతంలో కొకంణ్ రైల్వే ఉంది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (ఎం.ఎస్.ఆర్.టి.సి) వారి బస్సు రవాణా దాదాపు అన్ని పట్టణాలకు, గ్రామాలకు విస్తరించి ఉంది. ఇంకా ప్రైవేటు రవాణా వ్యవస్థ కూడా దూరప్రయాణాలకు వాడుతుంటారు. ముంబాయిలో పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. పూణే, నాగపూర్‌ల‌లో కూడా చిన్న అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. రత్నగిరి, కొల్హాపూర్, నాశిక్‌లలో విమానాశ్రయాలున్నాయి. ఫెర్రీ సర్వీసులు తీర ప్రాంత పట్టణాల మధ్య ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ ప్రమాణాలతో, టోల్‌గేటు ద్వారా అనుమతి లభించే పూణె-బొంబాయి ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. ముంబాయి నగరంలో మూడు నౌకాశ్రయాలు ఉన్నాయి - ముంబాయి, నవసేన, రత్నగిరి. సంస్కృతి మహారాష్ట్ర సంస్కృతి అన్ని మతాల, వర్గాల జీవనశైలికి కలయికగా రూపు దిద్దుకొంది. అత్యధిక సంఖ్యాక జనులు హిందువులైనందున మహారాష్ట్ర సంస్కృతిలో ఆ ప్రభావం కనిపిస్తుంది. మహారాష్ట్రలో చాలా పురాతనమైన మందిరాలున్నాయి. ఇక్కడి మందిరాలలో ఉత్తర, దక్షిణ భారతాల నిర్మాణశైలుల కలయిక ప్రతిబింబిస్తుంది. ఇంకా హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాల మేళవింపు మందిరాల్లోనూ, ఆచారాల్లోనూ చూడవచ్చును. మహారాష్ట్రలోని మందిరాలలో పండరిపూర్‌లోని విఠలుని ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. అజంతా చిత్రాలు,ఎల్లోరాశిల్పాలు, ఔరంగాబాదు మసీదు ప్రసిద్ధ పర్యాటక స్థలాలు. ఇంకా రాయగఢ్, ప్రతాప్‌గఢ్, సింధుదుర్గ్ వంటి కోటలు కూడా చూడదగినవి. గోంధల్, లవని, భరుద్, పొవడా వంటివి మహారాష్ట్ర జానపదసంగీత విధానాలు. ధ్యానేశ్వరుడు రచించిన "భావార్ధ దీపిక" (ధ్యానేశ్వరి) మరాఠీ సాహిత్యంలో మొదటి రచనలలో ఒకటి. ధ్యానేశ్వరుడు, తుకారామ్, నామదేవ్ వంటి భక్తుల భజన, భక్తి గీతాలు జనప్రియమైనవి. ఆధునిక మరాఠీ రచయితలలో కొందరు ప్రముఖులు - పి.యల్.దేశ్‌పాండే, కుససుమగ్‌రాజ్, ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే, వ్యాకంతేష్ మద్‌గుల్కర్. నాటక రంగం, సినిమా పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమ - మూడూ బొంబాయి నగరంలో కేంద్రీకృతమైనాయి. నటీనటులు, సాంకేతికనిపుణులు, కళాకారులు ఈ మూడు రంగాలలో ఒకదానినుండి మరొకదానికి మారడం సర్వసాధారణం. మహారాష్ట్ర వినోదరంగంలో కొందరు ప్రముఖులు: దాదా సాహెబ్ ఫాల్కే - భారత సినిమా పరిశ్రమకు పితామహుడు పి.యల్.దేశ్‌పాండే - రచయిత, దర్శకుడు, నటుడు అశోక్ సరఫ్ - నటుడు లక్ష్మీకాంత్ బెర్దే - నటుడు సచిన్ పిలగావ్‌కర్ - నటుడు, నిర్మాత మహేష్ కొథారె - నటుడు, నిర్మాత వి.శాంతారామ్ - నటుఉ, దర్శకుడు, నిర్మాత కొల్హాట్కర్ - నాటక రచయిత దేవల్ - నాటక రచయిత గడ్‌కారి - నాటక రచయిత కిర్లోస్కర్ - నాటక రచయిత బాల గంధర్వ - రంగస్థల నటుడు కేశవరావు భోన్సలే - రంగస్థల నటుడు భావురావ్ కొల్హాట్కర్ - రంగస్థల నటుడు దీనానాధ్ మంగేష్కర్ - రంగస్థల నటుడు లతా మంగేష్కర్ - ప్రముఖ నేపథ్యగాయని మహారాష్ట్ర వంటకాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కొకణతీరంలో వరిఅన్నం, చేపలు ప్రధాన ఆహారపదార్ధాలు. తూర్పు మహారాష్ట్రలో గోధుమ,జొన్న, సజ్జలతో చేసిన పదార్ధాలు ఎక్కువ తింటారు. పప్పులు, ఉల్లి, టొమాటో, బంగాళదుంప, అల్లం, వెల్లుల్లి వంటివి అన్నిచోట్లా వాడుతారు. కోడి, మేక మాంసాల వాడకం కూడా బాగా ఎక్కువ. సాంప్రదాయికంగా ఆడువారు 9 అడుగుల చీర ధరిస్తారు. మగవారు ధోతీ, పైజమా ధరిస్తారు ఇప్పుడు ఆడువారికి సల్వార్-కమీజ్, మగవారికి ప్యాంటు-షర్టు సాధారణ దుస్తులు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో. భారతదేశమంతటిలాగానే క్రికెట్ అత్యంత జనప్రియమైన ఆట. గ్రామీణ ఆటలలో కబడ్డి, విట్టి-దండు, గిల్లి-దండా, పకడా-పకడీ ఆటలు సామాన్యం. మహారాష్ట్రలో ముఖ్యమైన పండుగలు: గుడి-పాడ్వా, దీపావళి, రంగపంచమి, గోకులాష్టమి, వినాయక చవితి (గణేషోత్సవం) - గణేషోత్సవం పెద్ద ఎత్తున జరుపుతారు. ఈ ఊరేగింపులు దేశంలో అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. ఆషాఢమాసంలో పండరీపూర్‌కు వందలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం ఒక సంప్రదాయం. మూలాలు ఇవికూడా చూడండి వికట్ ఘడ్ కోట లేన్యాద్రి ఖండేష్ జిల్లా జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు (భారతదేశం) నాగ్‌పూర్‌కి చెందిన రఘోజీ I హరీష్ సాల్వే కులభూషణ్ జాదవ్ బయటి లింకులు Official site of the Maharashtra govt Maharashtra tourism official site Maharashtra Chamber of Commerce, Industry & Agriculture (MACCIA) వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు వర్గం:మహారాష్ట్ర వర్గం:ఈ వారం వ్యాసాలు
పశ్చిమ బెంగాల్
https://te.wikipedia.org/wiki/పశ్చిమ_బెంగాల్
పశ్చిమ బెంగాల్, భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం , వాయువ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి. చరిత్ర సా.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దంనుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది. thumb|200px|1757లో ప్లాసీ యుద్ధంలో గెలిచిన తరువాత బ్రిటీష్ ఈష్టిండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్. 1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్‌నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్‌గా అవతరించింది. ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది. రాష్ట్రం right|thumb|200px|బెంగాల్ పులి పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బంగ్లా భాష ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి. వాతావరణం right|thumb|200px|డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతంలో తీస్తా నది తీరం వెంట, కాలింపోంగ్ వద్ద మెలికలు తిరుగుతూ సాగుతున్న భారత జాతీయ రహదారి 31A పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉంది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము. సంస్కృతి right|thumb|200px|పశ్చిమ మిడ్నాపూర్‌లో ఒక గ్రామీణ దృశ్యం. రాష్ట్రంలోని 72% జనాభా గ్రామాలలో నివసిస్తారు. right|thumb|200px|కలకత్తాలో ఒక వామపక్ష రాజకీయ ప్రదర్శనభారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉంది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉంది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు. ప్రసిద్ధులైన వారు సాహితీ వేత్తలు రొబీంద్రనాధ టాగూరు: భారత దేశానికీ, బంగ్లాదేశ్ కూ జాతీయగీత రచయిత. కవి, చిత్రకారుడు, సంగీతజ్ఙుడు, తత్వవేత్త. 1913 లో నోబెల్ బహుమతి గ్రహీత. కాజీ నజ్రుల్ ఇస్లామ్ మైకేల్ మధుసూదన దత్తు శరత్‌చంద్ర ఛటర్జీ బంకించంద్ర ఛటర్జీ బిభూతి భూషణ బందోపాధ్యాయ్ రాజనారాయణ బసు సంగీతకారులు రవి శంకర్ విజ్ఙాన వేత్తలు జగదీశ్‌చంద్ర బోస్ సత్యేంద్రనాధ బోస్: బోస్-అయిన్ స్టయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాగస్వామి, బోసాన్ సూక్ష్మకణాలు ఈయన పేరుమీద నామకరణం చేయబడినాయి. బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు అమర్త్యసేన్ : 1988 లో నోబెల్ పురస్కారాన్ని అందుకొన్ని ఆర్థిక శాస్త్రజ్ఙుడు జాతీయోద్యమ నాయకులు నేతాజీ సుభాస్‌చంద్ర బోస్ బిపిన్ చంద్ర పాల్ రాజకీయ నాయకులు జ్యోతి బసు సౌగతా రాయ్ మమతా బెనర్జీ సాధన్ పాండే మహువా మోయిత్రా నుస్రత్ జహాన్‌ నిషిత్ ప్రమాణిక్ సుభాష్ సర్కార్ అర్జున్ సింగ్ విప్లవనాయకులు చారు మజుందార్ సంఘసంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్ తాత్వికులు అరబిందో ఘోష్ ఆధ్యాత్మిక గురువులు చైతన్య మహాప్రభు: 15 వ శతాబ్దిలో కృష్ణభక్తిని ప్రబోధించిన అవతారమూర్తి. రామకృష్ణ పరమహంస వివేకానంద భక్తివేదాంత ప్రభుపాద (అంతర్జాతీయ కృష్ణచైతన్యోద్యమ వ్యవస్థాపకులు) కళాకారులు అవనీంద్రనాధ టాగోర్ సినిమా కళాకారులు సత్యజిత్ రే కిషోర్ కుమార్ హిరణ్మయ్ ముఖర్జీ ఉత్తమకుమార్ మన్నా డే సంధ్యా ముఖర్జీ నుస్రత్ జహాన్‌ మిమీ చక్రవర్తి క్రీడాకారులు సౌరవ్ గంగూలీ: క్రికెట్ అర్పణరాయ్: టెన్నిస్ లియాండర్ పేస్ రిచా ఘోష్ - భారత మహిళా క్రికెటర్‌ ఝులన్ గోస్వామి - భారత మహిళా క్రికెటర్‌ జనవిస్తరణ పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ భాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రం కోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది. విభాగాలు పశ్చిమ బెంగాల్ లో 2019 నాటికి 23 జిల్లాలు ఉన్నాయి. ఇవి కూడ చూడండి రామ్ చంద్ర విద్యాబాగీష్ మూలాలు బయటి లంకెలు బాంగ్లా మ్యూజిక్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు పశ్చిమ బెంగాల్ స్థానము సూచిస్తున్న భారత పటం పశ్చిమ బెంగాల్ జిల్లాల పటం రైల్వే పటం పశ్చిమ బెంగాల్ వార్తలు వర్గం:పశ్చిమ బెంగాల్ వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు