title
stringlengths
1
90
url
stringlengths
31
120
text
stringlengths
0
504k
అష్టభాషా దండకం
https://te.wikipedia.org/wiki/అష్టభాషా_దండకం
thumb|అష్ట భాషలలో చినతిరుమలాచార్యుడు రాసిన దండకం కర్త శ్రీ వెంకటేశ్వరస్వామి అష్టభాషా దండకము శ్రీవెంకటేశ్వరునిపై ఎనిమిది భాషలలో చెప్పిన దండకం. దీనిని సా.శ. 1537లో తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు రాసాడు. విశేషాలు ఇది శ్రీ వేంకటేశ్వరుని పై చెప్పిన దండకము, మొత్తము ఎనిమిది భాషలలో చెప్పబడింది. ఆ భాషలు సంస్కృతము ప్రాకృతము శౌరసేనీ మాగధీ పైశాచీ = అపభ్రంశ భాషా ప్రాచీ భాషా అవంతీ భాషా సార్వదేశీ భాష అనునవి అష్ట భాషలుగా పేర్కొనబడినవి. అప్పకవి ప్రకారం అప్పకవి సా.శ. 1656లో తన గ్రంథమున అష్టభాషలను ఈ క్రింది విధంగా నిర్వచించాడు. సంస్కృతము, పాకృతంబును, శౌరసేని జగైపై మాగథియును బైశాచికయును జూళీకయు నవభ్రంశంబు సొరిది నంధ్ర భాషయును నివి చను నష్ట భాష లనగ అతని ప్రకారం సంస్కృతము, ప్రాకృతము, శౌరసేని, మాగథి, పైశాచి, చూళీక, అపభ్రంశము, ఆంధ్రభాష అనునవి అష్ట భాషలు అప్పకవి తెలుగును అష్ట భాషలలో చేర్చాడు. కానీ తాళ్లపాక చిన తిమ్మాచార్యుడు తెలుగును చేర్చలేదు. సార్వదేశీ తెనుగు భాష కాదు. అది ప్రాకృత భాషా భేదమే. అప్పకవి సమకాలికురాలు - రంగాజమ్మ మున్నారు దాస విలాసమను గ్రంథమున 1.చూళిక, 2. అపభ్రంశము, 3. ప్రాకృతము, 4. పైశాచి, 5. శౌరశేని, 6. మాగధి, 7. దేశ, 8. సంస్కృతము అని అష్ట భాషలలో సమస్యా పూరణము జరిగినట్లు స్పష్టపరచింది. సంస్కృతంధ్రములు - షడ్విధ ప్రాకృతములు ( ప్రాకృతము, శూరసేని, మాగధీ, పైశాచి, చూళీక, అపభ్రంశము) లను అష్ట భాషలు అంటారు. ఈ అష్ట భాషా ప్రశక్తి తెలుగున 14వ శతబ్దిన ప్రారంభమైనది. అంతకు ముందు లేదు అష్ట భాషలు - భారతి జూలై 1966. ప్రాకృత భాషలను గూర్చి తెలుగున జరిగిన పరిశ్రమ చాల తక్కువ చూ. ప్రాకృత భాషలు అను నా వ్యాసము. భారతి జూను 1966 కేవలం భాషా విషయమునే ఇతి వృత్తముగా తీసుకొని దండకము రచించిన వారిలో ప్రథముడు చిన తిరుమలాచార్యుడే. 19వ శతాబ్దిలో దీణి ననుసరించి గుండ్లూరి నరసింహ కవి భాషీయ దండకం రచించాడు. ఇందు తెలుగు దేశమున నాయా వర్ణమూల్ వారి వ్యవహారిక భాష చక్కగ ఉదాహరణలతో చూపబడినవి. మూలాలు వర్గం:తెలుగు కావ్యములు
జీవ శాస్త్రం
https://te.wikipedia.org/wiki/జీవ_శాస్త్రం
జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం (ఆంగ్లం biology) అంటారు. జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ) అనీ, జీవరసాయనశాస్త్రం (బయోకెమిస్ట్రీ) అనీ, జీవసాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) అనీ, అణుజన్యుశాస్త్రం (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (సెల్ బయాలజీ) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము (అనాటమీ) అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. 200px|right|జీవ వర్గీకరణ సోపాన క్రమం జీవశాస్త్రం-వర్గీకరణ జీవశాస్త్రాన్ని జీవశాస్త్ర పితామహుడిగా భావించే అరిస్టాటిల్ నుండి కెవాలియర్-స్మిత్ వరకు పలువురు శాస్త్రవేత్తలు వివిధ కాలాలలో వివిధ అంశాల ఆధారంగా పలురకాలుగా వర్గీకరించారు. + జీవుల వర్గీకరణ పట్టిక క్ర.సం. కాలం శాస్త్రవేత్త రాజ్యాల సంఖ్య వర్గాలు మూలం 1. బి సి 384 అరిస్టాటిల్ 2 1. జంతువులు 2. మొక్కలు 2. 1735 కరోలస్ లిన్నేయస్ 2 1. వెజిటేబిలియా, 2. అనిమాలియా 3. 1866 ఎర్నెస్ట్ హకెల్ 3 1. ప్రొటిస్టా, 2. ప్లాంటే, 3. అనిమాలియా 4. 1925 చాటన్ 2 1. కేంద్రక పూర్వజీవులు, 2. నిజకేంద్రక జీవులు 5. 1938 కోప్‌లాండ్ 4 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. అనిమాలియా 6. 1969 థామస్ విట్టేకర్ 5 1. మొనిరా, 2. ప్రొటిస్టా, 3. ప్లాంటే, 4. ఫంగీ, 5. అనిమాలియా జీవశాస్త్రం,9వ తరగతి తె/మా, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2019,పుట-62 7. 1990 ఉజ్ ఎట్ ఆల్ 3 1.బాక్టీరియా, 2. అరాకియా 3. యుకారియా 8. 1998 కెవాలియర్ - స్మిత్ 6 1. బాక్టీరియా, 2. ప్రొటొజోవా, 3.క్రొమిస్టా, 4. ప్లాంటే, 5. ఫంగీ, 6. అనిమాలియా జీవశాస్త్ర్ర భాగాలు బాహ్య స్వరూప శాస్త్రం: జీవుల బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం. అంతర స్వరూప శాస్త్రం: సూక్ష్మదర్శిని సహాయంతో జీవుల అంతర, అంతరాంతర భాగాలను అధ్యయనం చేసే శాస్త్రం. ఆవరణ శాస్త్రం: జీవులకు వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి తెలియజేసే శాస్త్రం. వర్గీకరణ శాస్త్రం: జీవులను వాటి లక్షణాల ఆధారంగా వివిధ విభాగాలుగా విభజించే శాస్త్రం. సూక్ష్మజీవ శాస్త్రం: కంటికి కనిపించని సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. పురాజీవ శాస్త్రం: గత కాలంలో జీవించి ప్రస్తుత కాలంలో శిలాజాలుగా లభ్యమయ్యే వాటిని గురించి తెలిపే శాస్త్రం జన్యుశాస్త్రం: జీవుల అనువంశిక లక్షణాలు, వాటి సంక్రామ్యత, వైవిధ్యం గురించి తెలియజేయు శాస్త్రం వృక్ష శాస్త్రము: మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రం జంతు శాస్త్రము: జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం వైద్య శాస్త్రము: జీవుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం. చిత్రమాలిక మూలాలు వెలుపలి లంకెలు వర్గం:జీవ శాస్త్రము వర్గం:విజ్ఞాన శాస్త్రం
కూరగాయలు
https://te.wikipedia.org/wiki/కూరగాయలు
thumb|right | మార్కెట్ లో కూరగాయలు కూరగాయలు భుజించేందుకు అనువైన మొక్కను గాని, మొక్కలోని భాగాలనుగాని కూరగాయలు అని అంటారు. ఒక్కొక్కప్పుడు పచ్చికాయలను (అనగా పక్వము కాని పండు), గింజలను కూరగాయలుగా వాడతారు. వృక్షశాస్త్రం రీత్యా మొక్కలలోని వివిధ భాగల నిర్మాణంలో భేదముంది. దీనివల్ల ప్రజలు ఒక్కో భాగాన్ని ఒక్కో రకంగా వాడతారు. కొన్ని పచ్చిగా తింటారు, కొన్ని వేయించి, కొన్ని ఉడకబెట్టి తింటారు. వేళ్ళు చిలగడదుంప, బంగాళాదుంప (ఆలుగడ్డలు), కంద, చేమ, పెండలం, క్యారట్, ముల్లంగి, అల్లం, మామిడి అల్లం, బీట్రూటు, అడవి దుంప, కర్ర పెండలము లశునము ఉల్లిపాయలు (లేదా) ఎర్రగడ్డలు, వెల్లుల్లిపాయలు (లేదా) తెల్ల గడ్డలు కాడలు లేదా కొమ్మలు, ఆకులు తోటకూర, బచ్చలికూర, పాలకూర, చుక్కకూర, పొన్నగంటికూర, కాబేజీ, అవిశాకు, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, కరివేపాకు, చింతాకు చిగురు, మునగాకు, ఉల్లి ఆకు, ఆవాల ఆకు, సరస్వతి ఆకు, తమలపాకు పువ్వులు మునగ పువ్వు, అవిశపువ్వు, కాలీఫ్లవరు, బ్రోకలీ, గుమ్మడిపువ్వు, అరటిపువ్వు, కుంకు చిక్కుడు, గోరు చిక్కుడు (లేదా) గోకరగాయ బీన్సు, పందిరి చిక్కుడు, బీర, కాకర, గుమ్మడికాయలు, తియ్యగుమ్మడి, బూడిద గుమ్మడి, దొండ కాయ, బెండ, దోస, టొమేటో, మిరప, అరటి, మెట్టవంగ, నీటివంగ, కాకర, పొట్ల కాయ, ఆనప (లేదా) సొర, బెంగళూరు వంకాయ, బుంగ మిరప లేదా బెంగళూరు మిరప, బీన్స్, బొబ్బర్లు, తంబకాయ, పచ్చిమిరప కాయలు, ఉస్తికాయలు చెట్లు, వృక్షాలు మునగ కాయలు లేదా ములగ కాడలు గింజలు బియ్యం, కందులు, బఠానీలు, శనగలు, పెసలు, మినుములు/ఉద్దులు, సోయా చిక్కుడు, రాగులు, బార్లీ, కాఫీ, వేరుశనగ కాయలు, అలచందలు, అలసందలు, రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, ఆవాలు, మెంతులు, జీలకర్ర, గోధుమలు, ఉలవలు, బొబ్బర్లు, సన్న సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం, కొర్రలు, ఆరెకలు, పెసలు, అనుములు, పచ్చి బఠానీలు / పప్పులు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు, దోసపప్పు, సారపప్పు, నువ్వుపప్పు, పొట్నాలపప్పు, పిండులు శనగ పిండి, పెసర పిండి, మినప పిండి, మైదా, గోధుమ పిండి, బియ్యపు పిండి, రాగి పిండి, జొన్న పిండి, మొక్కజొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి, పొడులు పసుపు, మెంతి పొడి, ఆవ పొడి, షొడా పొడి, పచ్చికారం పొడి, టీ పొడి, కాఫీ పొడి శరీరానికి పిండులు కుంకుడుకాయపొడి, గోరింటాకుపొడి, షీకాయపొడి, నలుగుపిండి, ఉసిరిపొడి, కాయలు వేరుశనగ కాయలు, బఠానీ కాయలు, ఏలకులు సుగంధ ద్రవ్యాలు గసగసాలు, ఏలకులు, లవంగాలు, సోపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వాము, మిరియాలు, ఇంగువ, జాజికాయ, జాపత్రి, అనాసపువ్వు, కుంకుమపువ్వు, ధనియాలు, వక్కలు, కరక్కాయ వృక్ష సంబంధమైనవి దాల్చినచెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి గింజ సంబంధమైనవి జీలకర్ర, మెంతులు, సోంపు, ధనియాలు ఇతరములు ఉల్లి , వెల్లుల్లి , మిరప, మిరియాలు, యాలకులు, పసుపు, అల్లం చెక్కలు గంధపుచెక్క, దాల్చినచెక్క, కొమ్ములు పసుపుకొమ్ము, సొంఠికొమ్ము, వసకొమ్ము, అల్లం ఆవిరి అయ్యే ద్రవ్యాలు కర్పూరము, పచ్చకర్పూరము, ముద్ద కర్పూరము, తీపి ద్రవ్యాలు పంచదార, బెల్లం, పటిక బెల్లం, పటికబెల్లం పలుకులు, ఖండసారి చక్కెర డ్రై లేదా ఎండిన ఫలాలు కిస్‌మిస్, ఎండు ఖర్జూరము, ఎండుద్రాక్ష పండే ఫలాలు మామిడి, టమాటో, అరటి, పనస ఖర్జూర పండు, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, లిచ్చీ, సపోట, సీతాఫలము, రామాఫలము, సీమ రేగు, జామ, బత్తాయి, నారింజ, కమల, రేగు, అత్తి, కరుబూజా. (ఖర్బూజ), (తర్భూజ), పంపరపనస, దబ్బ, నిమ్మ, వెలగ, ఆపిల్, బొప్పాయి, అనాస, నేరేడు, నిమ్మ, నారింజ, కమలా, కొబ్బరి, దోస, దానిమ్మ, పుచ్చ, తాటి, ఈత, జీడి ఫంగస్సు పుట్టగొడుగులు ఇలా కూరగాయలను రకరకాలగా విభజించ వచ్చు, మరొక రకమైన విభజన త్వరగా కుళ్ళిపొయ్యేవి కొంతకాలం నిలువ ఉండేవి కొన్ని రోజులు నిలువ ఉండేవి అరటి కాయ బీన్సు చిక్కుడు బెండకాయలు క్యాబేజీ (లేదా) కాబేజీ|కట్ట మడత పువ్వు) క్యాలిఫ్లవరు బ్రొక్కొలి వంకాయలు దోసకాయలు ఆలుగడ్డ, (లేదా) బంగాళాదుంప, లేదా (ఉర్ల గడ్డ) ఉల్లిపాయలు పచ్చి బఠానీలు బచ్చలి కూర చిలగడదుంప (లేదా) గనుసుగడ్డ టమాటో (లేదా) రామములక్కాయ బీరకాయ సొర కాయ పొట్ల కాయ దొండ కాయ కాకర కాయ గుమ్మడి కాయ (తీపి, బూడిద) కంద మునగ కాయ ఆకు కూరలు బీట్ రూట్ కారెట్ ముల్లంగి తంబ కాయలు అవిశ కాయ ఆకాకర కాయ పనస పొట్టు అరటి పువ్వు అరటి దూట చేమ తంబకాయ వర్గం:ఆహార పదార్థాలు వర్గం:కూరగాయలు వర్గం:వంటలు వర్గం:మొక్కలు వర్గం:జాబితాలు
ఉర్ల గడ్డ
https://te.wikipedia.org/wiki/ఉర్ల_గడ్డ
దారిమార్పు బంగాళదుంప
చిక్కుడు
https://te.wikipedia.org/wiki/చిక్కుడు
thumb|చిక్కుడు కాయలు thumb|చిక్కుడు కాయలు thumb|చిక్కుడుకాయ ముక్కలు thumb|right|170px|గోరు చిక్కుడు కాయలు. thumb|170px|చిక్కుడు పూలు చిక్కుడు ఫాబేసి కుటుంబానికి చెందినవి. రకరకాల చిక్కుడు గోరు చిక్కుడు సోయా చిక్కుడు పందిరి చిక్కుడు వంటలలో లేత చిక్కుడులో గింజలుండవు, తొక్కలతో తక్కువ సెల్యులోస్ ఉంటుంది, కనుక త్వరగా ఉడికి రుచిగా ఉంటుంది. మధ్యరకంగా ఉన్నవాటిలో గింజలు, తొక్కలు త్వరగా ఉడికి కూర రుచిగా ఉంటుంది. ముదిరిన చిక్కుడు ఉడకవు, సెల్యులోస్ గట్టిగా పీచువలె ఉంటుంది. అందువల్ల జీర్ణం కాదు. గోరుచిక్కుడు --- భారత దేశమున చాలా చోట్ల సాగు చేయబడు దేశీ కూరగాయ. భౌతిక వివరములు--ఇది చిక్కుడు జాతికి చెందినది. సుమారు రెండు మీటర్ల ఎత్తువరకు పెరుగును. కొన్ని అనుకూల పరిస్థితుల యందు ఇది మూడు మీటర్ల ఎత్తువరకు పెరుగును. గోరుచిక్కుడు సామాన్యముగా విత్తిన ఆరు ఏడు వారముల లోపున పూయనారంభించును. సాగు చేయు పద్ధతి---దీనిని అన్ని నేలలయందూ, అన్ని కాలములందూ సాగు చేయవచ్చు. దీనిని ఒంటిగా కానీ, అంతర పంటగా కానీ, మిశ్రమ పంటగా కానీ సాగు చేయవచ్చు. బాగుగ దున్ని సాగు చేయవలెను. దీనికి ఎరువు అంతగా అవసరములేదు, ఎందుకంటే ఇది సూక్ష్మ జీవుల సహాయముతో నేలలోని నత్రజని స్వీకరించును. వంటకములు thumb|చిక్కుడుకాయ ముక్కలు సామాన్యముగా పులుసు, బెల్లముపెట్టి వండెదరు. ఇంకా కొబ్బరి చేర్చి ఇగురు లేదా వేపుడు చేయుదురు. ఇది మంచి బలవర్థకమైన ఆహారము. -- సోయా చిక్కుడు చిక్కుడు జాతులలో ఒకటి. ఇది బలమైన ఆహారము. అధికంగా అమెరికా, బ్రెజిల్, అర్జెంటినా, చైనా, ఇండియాలు సోయాను ఉత్పత్తి చెస్తున్నాయి. అమెరికాలో లోవా, మిన్నెసొటా, ఇండియానా లలో, బ్రెజిల్లో మాంటాగొస్సా, పరగ, రియో గ్రాండెసుల్లలో సొయాను పండిస్తున్నారు. భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు. సోయామొక్క--విరివిగా కొమ్మలుండి గుబురుగా పొదలా పెరుగుతుంది. విత్తన రకాన్ని బట్టి 0.3-1.5 మీటర్ల ఎత్తు వుంటుంది. కాండం, ఆకులు, కాయమీద సన్నని కేశంల వంటి నూగును కల్గివుండును. ఆకులు 5-15 సెం.మీ. పొడ వుండును. గుల్లగా, పొడవుగా వుండు కాయ (pod) లో వరుసగా సాయా గింజలుండును. కాయ 5-10సెం.మీ వుండి, కాయలో 2-4 గింజలుండును.సోయా గింజ గోళాకారంగా వుండి (కొద్దిగా అండాకరంగా) 5-10 మి.మీ.ల వ్యాసం వుండును. సోయాబీన్స్ పసుపురంగులో, చిక్కటి బ్రౌను రంగులో వుండును (వంగడం రకాన్ని బట్టి). పసుపురంగు సొయాలో నూనె శాతం ఎక్కువగా వుండును.సొయాసాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. సోయాలో అధిక దిగుబడికై చాలా వంగడాలను అభివృద్ధి చేసారు.ఆయా దేశాలలోని భూసార లక్షణాలను బట్టి వంగడ రకాలను ఎన్నుకొనెదరు. సొయ గింజలో నూనె శతం 18-20% వరకు వుండును.సొయాలో ప్రోటీనులుకూడా అధికమే.నూనె తీసిన సొయా మీల్ (soya meal) లో ప్రొటిన్ శాతం 45-48%. ఉపయోగాలు 1. సొయా గింజలను ముఖ్యంగా నూనెను తీయుటకు వాడుచున్నారు. ఉత్పత్తి అయిన సొయాలో85-90%ను సోయానూనెను తీయుటకు వినియోగిస్తున్నారు. 2.5-10% వరకు సొయాను సొయా పిండి (flour), సొయా మీల్ చెయ్యుటకు వాడెదరు. 3.5-10% వరకు ఆహరపధార్దంలలో నేరుగా వాడెదరు. సొయా నుండి 'పిల్లల ఆహరపధార్దంలు, బిస్కత్తులు, ఫ్లోర్‌మీల్, బ్రెడ్ల తయారిలో వాడెదరు.అలాగే సొయామిల్క్ క్రీమ్, సొయాచీజ్, తయారు చెయ్యుదురు. సొయాలోని ప్రొటీన్లు (మాంసక్రుత్తులు), మాంసంలోని ప్రోటిన్లవంటివే. అందుచే సొయాసీడ్స్తో 'సొయమీట్‌ మీల్' చెయ్యుదురు. భారతదేశంలో కూడా వెజిటెరియన్ బిర్యానిలో సొయామీట్ మీల్ ను వుపయోగిస్తారు. నూనె తీసిన సొయ మీల్్‌ను పశువుల, కోళ్ల మేతలో వాడెదరు. సొయ గింజలలోని పోషక విలువలు పధార్ధం శాతం తేమ 9.5-14% ఫ్యాట్‌/నూనె 18-24 ప్రొటిను 39-47 పిండి పధార్ధం 3-20 పీచు పధార్ధం 4-8 పందిరి చిక్కుడు thumb|చిక్కుడు కాయలు thumb|చిక్కుడుకాయ, వంకాయ ముక్కలు పోపు కూర పందిరి చిక్కుడును ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. తమిళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో దీన్ని విస్తారంగా సాగుచేస్తున్నారు. ఇప్పుడిప్పడే ఉత్తర భారతదేశంలో ఇది ప్రాచుర్యం పొందుతోంది. రాష్ట్రంలో చిక్కుడుజాతి కూరగాయలు 12వేలకు పైగా హెక్టార్లలో పండిస్తూ ఏటా 70వేలకు పైగా టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. పందిరి చిక్కుడు కాయలను కూరగాయగా, ఎండిన విత్తనాలను పప్పుదినుసుగా వాడతారు. ఫ్రెంచిచిక్కుడుతో పోల్చితే దీనిలో పోషక విలువలు అధికం. ప్రతి వంద గ్రా. చి క్కుడు 48 కేలరీల శక్తిని ఇస్తుంది. -- బీన్స్ ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని కోస్టా రికా అధ్యయనంలో తేలింది. దాదాపు రెండువేల మంది మహిళలు, పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్‌ను తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో మధుమేహం తగ్గుముఖం పట్టిందని తేలింది. బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు డయాబెటిస్‌ను నియంత్రించవచ్చునని తెలిసింది. అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని బోస్టన్‌లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు. వరి అన్నం కంటే బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తుందని ఫ్రాంక్ వెల్లడించారు. అనపకాయ thumb|right|అనపకాయలు. పాకాల సంతలో తీసిన చిత్రము అనపకాయ లేదా "అనుములు" అనేది చిక్కుడు జాతికి చెందిన ఒక కాయ. ఇది తీగ చిక్కుడు జాతికి చెందినది. (గోరు చిక్కుడు కాదు) దీని కాయలు పలచగా చిక్కుడు కాయల వలేనుండి. దీని మొక్క తీగ జాతికి చెందినది. దీనిని ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో వర్షాధార పంటగా - వేరుశనగలో అంతర పంటగా - పండిస్తారు. దీని గింజలను అనేక విదములుగా ఉపయోగిస్తారు. కూరలకు, గుగ్గిళ్ళు చేయడానికి ఎక్కువగా వుపయోగిస్తారు. ఆనప కాయకు అనేది వేరు. ఆనపకాయ అనగా సొర కాయ అని అర్థము. బీన్స్‌తో గుండెకు మేలు thumb|చిక్కుడుకాయ పోపు కూర thumb|చిక్కుడు కాయలు thumb|చిక్కుడుకాయ పోపు కూర thumb|చిక్కుడుకాయ ముక్కలు thumb|చిక్కుడు కాయలు 'వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు' అంటున్నారు పోషకాహార నిపుణులు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్‌ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. అంటే ముప్ఫై గ్రాముల చికెన్‌, మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. ఉడికించిన తరువాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి. కాలేయం, చర్మం, కళ్లు, వెండ్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది. మూలాలు వర్గం:కూరగాయలు
బెండకాయ
https://te.wikipedia.org/wiki/బెండకాయ
thumb|బెండకాయలు అమెరికా ఖండమందలి ఉష్ణ ప్రదేశములు బెండకు (Okra, Lady Finger) జన్మ స్థానము అని ఒక అభిప్రాయం ఉంది. గోగు, ప్రత్తి, మందార, గంగరావి, మొదలగు పెక్కు జాతులును బెండయు జేరి బెండ కుటుంబముగా వ్యవహరింపబడును. బెండ వార్షిక కూరగాయ పంట. ఉష్ణ సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనిని పండిస్తారు. లేత బెండకాయలను కూరగా వండుతారు. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతోపాటు అయోడిన్‌ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్‌ వ్యాధి రాకుండా చేస్తుంది. బెండకాయలను కూరగాయగా, సలాడ్‌గా ఎండబెట్టి వరుగులను తయారుచేయడంలో వాడతారు. వీటి కాండాన్ని కాగితపు పరిశ్రమలో, నారతీయటానికి ఉపయోగిస్తారు. బెండకాయలను క్యానింగ్‌ చేసి, ఎండబెట్టిన వాటిని ఎత్తయిన ప్రాంతాల్లో వున్న సైనికులకు అవి దొరకని కాలంలో కూడా ఎగుమతి చేస్తారు. తాజా బెండకాయలకు గల్ఫ్‌ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. బెండను భారతదేశంలో వ్యాపార సరళిలో గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. 2007 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 21,569 హెక్టార్లలో సాగువుతూ 1.72 లక్షల టన్నుల దిగుబడి లభిస్తోంది. సగటు దిగుబడి హెక్టారుకు 8 టన్నులు. బెండను చలికాలం తప్ప సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. వేడి వాతావరణం ఈ పంటకు అనుకూలం. చెట్టు భౌతికముగా బెండ మొక్క సామాన్యముగా 1 నుండి రెండు మీటర్లు ఎత్తు పెరుగును. అనుకూల పరిస్థితులలో నాలుగు మీటర్లల వరకూ పెరుగును. మొక్క యందలి లేత భాగములందు బిరుసుగా ఉండు నూగు ఉండును. పై అంచులయందు తాళ పత్ర వైఖరి చీలి సంయుక్తమౌగా ఉండును. అండాశయము ఐదు అరలు కలిగి ఉండును. కీలము కొన ఐదుగా చీలి నిడివిగ ఉండును. కాయము ఐదు గదులు కలిగి ఉండును. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క వరుస గింజలు ఉండును. ఎండిన వెనుక కాయ పై నుండి క్రిందికి క్రమముగా ఐదు (అప్పుడప్పుడూ 10) భాగములుగ పగులు ఉండును. గింజలు చిన్న కందిగింజలంతేసి యుండును. గ్రామునకు 12 15 తూగును. నీలి వర్ణముతో కూడిన ధూమ్రవర్ణము కలిగి బొడ్డు వద్ద మాత్రము తెల్లగ ఉండును. అనువైన వాతావరణం చల్లటి వాతావరణంలో పంట సరిగా రాదు. పగటి ఉష్ణోగ్రత 25-40 డిగ్రీల సెం.గ్రే. రాత్రి 22 డిగ్రీల సెం.గ్రే. ఉంటే మొక్క పెరుగుదల బాగుంటుంది. 40 డిగ్రీల సెం.గ్రే. కన్నా ఎక్కువైతే పిందె కట్టడం తగ్గి పూత రాలి, దిగుబడులు తగ్గిపోతాయి. అందువల్ల ఈ పంట వర్షాకాలం, వేసవిలో పండించటానికి అనువైనది. thumb|left|బెండకాయలు/పాకాల సంతలో తీసిన చిత్రము నేలలు సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్లరేగడి నేలలు, గరుప నేలలు బెండ సాగుకు అనుకూలం. గుల్లగా ఉండే సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడి వస్తుంది. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.8 వరకు ఉండాలి. పంటకాలం ఖరీఫ్‌ పంటను జూన్‌-జులై (వర్షాధారపు పంట) మాసాల్లోను, వేసవి పంటగా ఫిబ్రవరి - మార్చి మాసాల్లోనూ విత్తుకోవాలి. వర్షాకాలంలో ఆలస్యంగా (ఆగస్టులో) విత్తుకుంటే మొక్కలు సరిగా పెరగవు. బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. వేసవిలో ఆలస్యంగా పంట విత్తితే మొక్క పెరుగుదల తగ్గి, పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. పోషక పదార్థాలు బెండకాయలో 90 శాతం నీరు, 6.4 శాతం పిండి పదార్థాలు, 1.9 శాతం మాంసకృత్తులు, 0.2 శాతం కొవ్వుపదార్థాలు, 1.2 శాతం పీచు, 0.7 శాతం ఖనిజలవణాలు ఉండి, 33 కిలో కేలరీలు శక్తిని ఇస్తాయి. 66 మి.గ్రా. సున్నం, 56 మి.గ్రా. భాస్వరం, 0.30 మి.గ్రా. ఇనుము ఉన్నాయి. కెరోటిన్‌ 52 మైక్రోగ్రాములు, 0.07 మి.గ్రా. థయమిన్‌, 0.1 మి.గ్రా. రైబోఫ్లేవిన్‌, 0.6 మి.గ్రా. నియసిన్‌, పోలిక్‌ ఆమ్లం 105 మైక్రో గ్రాములు, 'సి' విటమిను 13 మి.గ్రా.లు ఉన్నాయి. ఇవేగాక సూక్ష్మధాతువులైన మెగ్నీషియం (53 మి.గ్రా.), సోడియం (6.9 మి.గ్రా.), పొటాషియం (103 మి.గ్రా.), రాగి (113 మి.గ్రా.), మాంగనీస్‌ (149 మి.గ్రా.), జింక్‌ (417 మి.గ్రా.) లాంటి సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. బెండకాయ ఆరోగ్యకర ఉపయోగాలు బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్‌ ' సి ' దీనిలో చాలా ఎక్కువ . మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారము . దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల యూరినరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్‌ను నయము చేయడములో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును . చెక్కెర (డయాబిటీస్ ) నియంత్రణలోనూ సుగుణం చూపుతుంది. బెండకాయ నిలువుగా చీల్చి రెండు సగాల్ని గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి, మరునాటి ఉదయము ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా రెండు వారాలు పాటు త్రాగితే సుగర్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్‌ .. బ్లడ్ కొలెస్టిరాల్ ను తగ్గించును. బెండకాయ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. రకాలు సాధారణ రకాలు బెండలో హైబ్రిడ్‌ (సంకర) రకాలకు దీటుగా సాధారణ రకాలు దిగుబడినిస్తాయి. పూసా సవాన పూసా ముఖమలి పంజాబ్‌ పద్మిన అర్క అనామిక అర్క అభయ కో-1 ఎం.డి.యు-1 గుజరాత్‌ బెండ-1 హర్భజన్‌ పర్భని క్రాంతి పి-7 పి-8 సంకరజాతి రకాలు శంఖు రోగాన్ని తట్టుకునే రకాలు వర విజయ విశాల్ నాథ్‌శోభ ప్రియ సుప్రియ మహికో హైబ్రిడ్‌ నెం. 1, 6, 7, 8 మిగిలిన రకాలు ఐశ్వర్య మిస్టిక ఎస్‌-008 ఎస్‌-040 ఎస్‌-073 ఎగుమతి రకాలు ఎగుమతికి కాయలు లేతగా, ఆకుపచ్చగా 6-8 సెం.మీ. పొడవుతో ఉండాలి. పంజాబ్‌ పద్మిని వర్ష విశాల్‌ నాథ్‌శోభ ఉప జాతులు పెద్ద బెండ - ఇది చాల చోట్ల సాగునందున్న రకము. మొక్క పెద్దదిగా పెదురుగున్‌. కాపు ప్రారంభించుట కొంచెము ఆలస్యము. కాయ పలుకలు తీరి లేబసిమి వర్ణము కలిగి 12 - 18 సెంమీ పొడవుండును. ఏడాకుల బెండ నున్న బెండ పొడుగు బెండ ఎర్ర బెండ చీడపీడలు బెండకాయల పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలి. పురుగులు కాయతొలుచు పురుగు పచ్చ పురుగు తెల్ల దోమ పచ్చదోమ బూజు నల్లి (మీలీబగ్స్‌) తెగుళ్ళు పల్లాకు వైరస్‌ తెగులు బూడిద తెగులు ఆకు మచ్చ వంటలు thumb|right|250px|బెండకాయలు thumb|బెండకాయ కాయలుతో వేపుడు thumb|బెండకాయ కాయలుతో వేపుడు బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. బెండకాయలో జిగురు ఉండటంవల్ల విరివిగా అన్ని వంటలలో వీటిని వాడటం కుదరకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో బెండకాయను చాలా ఎక్కువగా వంటలలో వాడతారు. బెండకాయ వేపుడు బెండకాయ కుర్మా బెండకాయ కూరు బెండకాయ పచ్చడి బెండకాయ ఒరుగులు బెండకాయల సాంబారు బెండకాయ పులుసు బెండకాయ కూర సామెతలు బెండకాయలు ముదిరినా బ్రహ్మచారులు ముదిరినా ఎందుకు పనికిరారు అని సామెత. సూచన ముదిరిన బెండకాయలు చివర్లు వంచితే త్వరగా పుటుక్కున తెగవు, అవి వేలాడబడతాయి, చివర్లు పుటుక్కున విరుగుతే అదే లేత బెండకాయలు . Lady's finger - Abelmoschus esculentus, N.O. Malvaceae తమిళము వెండై; కన్నడము బెండె; మలయాళము వెండ; హింది ఖిండీ, ఖేండా, ఓక్రా; సంస్కృతము చతుష్పద. ఇవి కూడా చూడండి మూలాలు బయటి లింకులు FOREST FLORA OF ANDHRA PRADESH డయాబెటిస్ కోసం ఓకారా వర్గం:కూరగాయలు వర్గం:మాల్వేసి
కాబేజీ
https://te.wikipedia.org/wiki/కాబేజీ
thumb|260x260px|రెడ్ క్యాబేజి కాబేజీ (Cabbage) మధ్యధరా సముద్ర ప్రాంతములో కనిపించే ఆకులు మెండుగా ఉన్న అడవి ఆవాల మొక్క నుండి 100 వ సంవత్సరము ప్రాంతములో ఉద్భవించింది. కాబేజీ అన్న పదము నార్మన్-పికార్డ్ పదము కబోచే ("తల") నుండి వచ్చింది. క్యాబేజీ ఒక ఆకుకూర ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములో కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది . పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు శక్తి 20 kcal 100 kJ పిండిపదార్థాలు 5.8 g చక్కెరలు 3.2 g పీచుపదార్థాలు 2.5 g కొవ్వు పదార్థాలు 0.1 g మాంసకృత్తులు 1.28 g థయామిన్ (విట. బి1) 0.061 mg 5% రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.040 mg 3% నియాసిన్ (విట. బి3) 0.234 mg 2% పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.212 mg 4% విటమిన్ బి6 0.124 mg 10% ఫోలేట్ (Vit. B9) 53 μg 13% విటమిన్ సి 36.6 mg 61% కాల్షియమ్ 40 mg 4% ఇనుము 0.47 mg 4% మెగ్నీషియమ్ 12 mg 3% భాస్వరం 26 mg 4% పొటాషియం 170 mg 4% జింకు 0.18 mg 2% ఔషధ గుణాలు కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా "పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్" ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావటం అరుదుగా సంభవిస్తుందనీ, అయితే క్యాబేజీతో దానికి చెక్ పెట్టవచ్చు క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. అంతేగాకుండా.. పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి. అదే విధంగా అతిగా పొగతాగే పొగరాయుళ్లను ఆ అలవాటునుంచి మాన్పించేందుకు నానా కష్టాలు పడేవారికి క్యాబేజీ సాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగతాగటం మాన్పించటం కాదుగానీ.. పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజీ తినాల్సిందే. ఇతర ఉపయోగాలు thumb|క్యాబేజీ|260x260px thumb|క్యాబేజీ పోపు కూర|260x260px క్యాబేజీ ఒక ఆకుకూర. ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. మూలాలు వర్గం:కూరగాయలు వర్గం:బ్రాసికేసి
వంకాయ
https://te.wikipedia.org/wiki/వంకాయ
thumb|కూర వంకాయలు వంగ - వంకాయ (Brinjal) - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశానికి ఇతర దేశములకు వచ్చినదిగా భావింపబడుతున్నది, కానీ ఎప్పుడు ఎలా భారత దేశానికి వచ్చినదో సరిగ్గా తెలీదు. వంకాయలు రకరకాలుగా - చిన్న వంకాయలు, పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, గుత్తి వంకాయలు - లభిస్తున్నాయి. వివిధ భాషా నామములు thumb|వంకాయ టమాట చిక్కుడుకాయ పోపు కూర thumb|వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి వంగ శాస్త్రీయ నామము: Solanum melongena ఇంగ్లీషు: (బ్రింజాల్) brinjal (ఎగ్గ్ ప్లాంట్) eggplant (ఆబర్జీన్) aubergineOxford English Dictionary, 1st edition, 1891Oxford English Dictionary, 3rd edition, 2000, s.v. సంస్కృతం: (వార్తాకం, (భంటకి) भण्टाकी హిందీ: (బైంగన్ ) बैंगन, (బతియా) बतिया, (భంటా) भण्टा గుజరాతీ: (రింగాఏ) રીંગણ మరాఠీ: (వాంగీ) वांगी ఓఢ్రము: బంగినో కాశ్మీరి: (వాంగూన్) वाँगुन् తమిళం: (కత్తరి కాయ్) கத்தரிக்காய் కన్నడం: (బదనెకాయి) ಬದನೆಕಾಯಿ, (బదినె ) ಬದನೆ మలయాళం: (వజుతోనన్) വഴുതന ఉర్ధు:بینگن (బైగాన్, :ur:ھنٹااھنٹا (భా, تیا (బటియా) పంజాబీ: (బైగామ్) ਬੈਂਗਣ నేపాలీ: (భైంజని) बैजनी, (భాణ్ట్) भण्टा భౌతిక వివరణ వంగ సుమారుగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల యెత్తెదుగు చిన్న గుల్మము. సామాన్యముగా ఒక సంవత్సరము పెంచబడిననూ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నచో ఒకటి కన్నా ఎక్కువ సంవత్సరములు ఈ మొక్క పెరుగును. వేళ్ళు మొక్క యొక్క పైభాగమునకు తగినంత విరివిగ వ్యాపించవు. కాండము సామాన్యముగా 1.25 - 2.50 సెం. మీ. లావుగా పెరుగును. దీనికి చాలా కొమ్మలూ, రెమ్మలూ వచ్చును. ఆకులు పెద్దవిగా ఉంటాయి. సుమారుగా 15 సెంటీమీటర్లు పొడువూ, 10 సెంటీమీటర్లు వెడల్పు కలిగిఉంటాయి. అంచుకు కొద్ది గొప్ప తమ్మెలుగ చీలి ఉంటాయి. కొన్నిటిలో ఏకముగా ఉండుటనూ చూడవచ్చు. thumb|left|సారల వంకాయ ఆకులు అంతటనూ మృదువయిన నూగు కలిగి ఉండును. కొన్ని రకములలో ఆకులయందలి యీనెల పైననూ, కాండము మీదనూ, కాయల తొడిమల మీదనూ, ముచికలమీదను వాడియయిన ముళ్ళు స్వల్పముగా ఉండును. పూవులు తొడిమెలు కలిగి ఆకు పంగలందునూ, కొమ్మల చివరనుకూడా సామాన్యముగా జంట గుత్తులు బయలుదేరును. ఒక్కొక్క గుత్తిలో 1-3 వరకు పూవులుండును. ఒక్కొక్కచోట బయలుదేరు రెండు గుత్తులలో ఒకదానియందు సామాన్యముగ పిందె కట్టుటకు తగిన ఒకటే ఉండును, రెండవ గుత్తియందు పూవులు సాధారణంగా పిందెకట్టవు. ఇందు అండాశయము నామమాత్రముగా ఉండును. కానీ ఒకే గుత్తియందు కానీ, రెంటిలోనూ కలిపికానీ పిందెలు కట్టు పూవులు 2-3 ఉండుటయూ ఉంది. పుష్పకోశము సంయుక్తము. తమ్మెలు ఐదు. నీచమైనను కాయలతో కూడా పెరిగి తుదివరకూ ఉండును. దళ వలయమునూ సంయుక్తమే. తమ్మెలిందునూ ఐదే. ఎరుపుతో కూడిన నీలవర్ణము కలిగియుండును. కింజల్కములు ఐదు. వీని కాడలు దళవలయము నధిష్టించి యుండును. అండాశయము ఉచ్చము. కీలము పొడవుగ ఉండును. కాయలు అనేక గింజలు కలిగి యుండు కండకాయ. గింజ చిన్నది. గుండ్రముగానూ, బల్లపరుపుగానూ ఉండును. పది గ్రాములకు సుమారుగా 1600 గింజలు తూగును. ఉపజాతులు ఇందు గుండ్రని కాయలు, నిడివి కాయలు, పొట్టిశీఘ్రకాలపు కాయలు అని మూడు ఉపజాతులు గుర్తింపబడినాయి. thumb|right|ఇదొక రకం వంకాయ కాయల ఆకార, పరిమాణ, వర్ణభేదములనుబట్టియూ, ఆకులందును కాయల ముచికలందును ముళ్ళుండుటను లేకుండుటను బట్టియు, సాగునకనుకూలించు పరిస్థితులనుబట్టియునూ వంగలో అనేక రకములు గుర్తింపబడుచున్నవి. ఆకారమును తరగతులుగ విభజించవచ్చును. గుండ్రని రకములలో కొంచెమించుమించు గుండ్రములు, అడ్డు కురుచ రకాలు గూడగలవు. బాగా ఎదిగిన కాయలు కొన్ని 12, 15 సెంటీమీటర్లు మధ్య కొలత కలిగి, చిన్న గుమ్మడి కాలంతేసి యుండును. పొడవు రకాలలో సుమారు 30 సెంటీమీటర్లు పొడవు కలిగి సన్నగ నుండు రకాలు ఉన్నాయి. కోల రకాలు పొడవు, లావులందు రెండు తరగతులకును మధ్యమముగ నుండును. తూనికలో 25 గ్రాముల లోపునుండి 1000 గ్రాముల వరకు తూగు రకములు ఉన్నాయి. కాయల రంగులో ఆకుపచ్చ ఊదా రంగులు ముఖ్యములు. తెల్లని లేక దంతపు రంగు రకాలును ఉన్నాయి. ఆకుపచ్చ వర్ణములలో చాలా లేబనరు రంగు మొదలు, కారుపసరు రంగు వరకు కన్పడును. కొన్నిటిలో దట్టమగు ఆకుపచ్చ రంగుపైన లేత ఆకు పచ్చ రంగు చారలు కానీ, పట్టెలు కానీ ఉండును. ఇట్టే ఊదా రంగు నందును లేత ముదురు భేదములే కాక ఆకుపచ్చకును, ఊదా రంగుకును మధ్య అంతరములు అనేకములు ఉన్నాయి. సాగునకనుకూలించు పరిస్థితులననుసరించి వంగలో మెట్టవంగలనియూ, నీటి వంగలనియూ రెండు తరగతులేర్పడుచున్నవి. వంగపూవు పరసంపర్కమునకు అనుకూలించుటచే స్వతస్సిధ్ధ్ముగనూ మానవ కృషివలన కూడా అనేక రకములును, ఉపరకములునూ పుట్టుచున్నవి. వ్యవసాయదారులచే ప్రత్యేకముగ వ్యవహరింపవడు తోటలలోనే యిట్టివి కలసియుండుట ఉంది. ఆంధ్ర దేశమున ఆయా ప్రదేశములందు ప్రత్యేక రకములుగ పరగణింపబడుచున్న కొన్నిటిని గురించి ఈ క్రింద క్లుప్తముగా తెల్సుకుందాము. ముండ్ల వంగ దీనిని నీరు పెట్టకుండానే వర్షాధారమున సాగుచేయ వీలగును. మిగుల తక్కువ తేమతో పెరగగలుగును. ఆకులందు కాయలు తొడిమలందు, పుష్పకోశములపైనూ ముండ్లుండును. కాయ గుండ్రముగ నుండును. పెద్దదిగ ఎదిగి ఒక్కొక్కసారి 1కి.గ్రా. వరకూ తూగు కాయలు వచ్చును. పచ్చికాయపైన ఆకుపసరుగ ఉండి క్రింది భాగమున తెలుపుగా ఉండును. కొన్ని కాయలపై చారలుకానీ, మచ్చలు కాని ఉండును. కొండెవరం మొదలగు కొన్ని ప్రదేశములలో ముఖ్యముగా పాటినేలలందు పెంచవడును. ఈ రకపు వంగ మిగుల రుచివంతముగా ఉండుటచే చాలా ప్రసిద్ధి పొందినది. ఈ రకము వర్షాకాలాంతమున నాతి పెంచవడును. ఆయా ప్రదేశములందు వర్షాధారమున పెంచబడు రకములలో ఈ ముండ్ల రకమే చాలా శ్రేష్టమైనది. thumb|left|ఆకుపచ్చ వంకాయలు ఆత్రేయపురపు వంగ ఇది పొడువుగాను, సన్నముగాను ఉండు కాయలను కాయును. ఇది కూడా మెట్ట ప్రాంతములలో పండించు వంగ రకమే. ముండ్లుండవు. తూర్పుగోదావరి జిల్లాలోని మధ్య డెల్టాయందలి ఆత్రేయపుర ప్రాంతములందలి మెట్ట భూములలో కొంత విరివిగా పెంచబడి యీ పండ్ల నుండి వరుగు తయారు చేయబడెను. అందువల్లే ఈ పేరు వచ్చింది. పచ్చి కాయలు ఆకుపచ్చగానూ, చారలు కలిగియూ ఉండును. ఇదియూ వర్షాకాలాంతమున నాతి పెంచబడు రకమే. కస్తూరి వంగ ఇది తొలకరిలో నాటి పెంచదగు ముళ్ళు లేని మెట్టవంగ. కాయ మధ్యమ పరిమాణముగలిగి కోలగా ఉండును. ఆకు పసరువర్ణపు చారలు, బట్టలు కలిగి ఉండును. క్రిందిభాగము లేబసరుగ కానీ, తెలుపుగా కానీ ఉండుటయు ఉంది. వర్షాకాలమున పుట్టుటచే ఈ కాయలు మెట్టవంగ కాయలంత రుచికరముగా ఉండవు నీటి వంగ ఇది శీతాకాలాంతమున నాటి నీరుకట్టి పెంచబడు, ముళ్ళులేని రకము. ఇందు కాయలు సుమారొక అంగుళము లావు వరకూ, 25-30 సెం.మీ. పొడవు వరకునూ పెరిగి ఊదారంగు కలిగి యుండును. కానీ యీ రంగునందు రకభేదమునుబట్టి లేత ముదురు భేదములునూ, పసరువర్ణమిశ్రణములును కానవచ్చును. కాయల పొడువునందు కూడా రకభేదములను బట్టి కాల భేదములను బట్టీ నేల యొక్క సత్తువను బట్టి కురుచ పొడవు తారతమ్యములుండును. నీరు కట్టి పెంచబడుటచేత ఈ కాయలు సామాన్యముగ రుచివంతముగా ఉండవు. కానీ గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల పెంచబడు తోటలలో ఫలించు మధ్యమరకము పొడవుగ ఎదుగు కాయలు రుచికి ప్రసిద్ధముగా ఉన్నాయి. thumb|left|ఆకుపచ్చని పొట్టి వంకాయలు గుత్తి వంగ ఇది మిగుల చిన్నవిగా ఉండు కోల కాయలను గిత్తులుగగాయు మరియొక నీటివంగ రకము. సామాన్యముగా ఇతర రకములలో కూడా - ముఖ్యముగా నీటి వంగలోనూ, కస్తూరివంగలోనూ అరుదుగా రెండేసి కాయలొకే గెలలో బయలుదేరుచుండును, కాని యిందు తరచూ 2, 3 కాయలుగల గెలలు బయలుదేరును. కాయల సంఖ్య హెచ్చుగా ఉన్ననూ మొత్తమూపి దిగుబడి తక్కువగుటచేనీరకము విరివిగా సాగుచేయుటకు అనుకూలము కాదు. ఆంధ్రదేశమున ఈ గుత్తివంకాయ కూర బహుప్రసిద్ధి. ఈ కాయపైననే చలనచిత్రాలలో ఎన్నో పాటలూ, సంభాషణలు వ్రాయబడినాయి. పోచవారి రకము పోచావారి గుండ్రకాయలు రకము ఊదారకమును, దొడ్లలోనూ పెరళ్ళలోనూ నాటి పెంచదగిన ప్రశస్తమగు రకము. ఇవి రాష్ట్రములకు విదేశములనుండి తెప్పించబడింది. ఈ రకము యొక్క వ్యాప్తిలో వ్యవసాయ శాఖవారు శ్లాఘనీయమైన పాత్ర పోషించారు. పూసాపర్పుల్‌ లాంగ ఇది చిక్కటి ఊదారంగు కలిగి 8 - 10 అంగుళముల వరకు పొడవు ఉండును. ఈ రకము మంచి రుచి కలిగి యెక్కువ దిగుబడి నిచ్చును. ఇది వేసవి సాగుకు మిగుల ప్రశస్తమైనది. నాటిన 100 రోజులకు కాపు వచ్చును, తరువాత 75 రోజుల వరకూ కాయలు విపరీతముగా కాయును. ఈ రకము కాండము తొలిచే పురుగును తట్టుకొనగలదు. ఇది మొదట కాపు తగ్గిన తరువాత ఆకులను దూసి రెమ్మలను కత్తిరించి యెరువులు వగైరా దోహాదము చేసిన మరల చిగిర్చి కాపు కాయును. దీనిని 2 1/2 అంగుల వరసలలో 1 1/2 అడుగు దూరములో ఒక్కొక్క మొక్క చొప్పున నాటిన చాలును. ఢిల్లీ పరిశోధనా కేంద్రమువారు నాటిన రెండవ రోజూననే పారుదల నీటిని పెట్టి సాగు చేస్తున్నారు. పూసాపర్పుల్‌ రౌండ్‌ thumb|left|వంకాయ పుష్పము ఈ రకము కాయలు అర కేజీ వరకూ తూగును. ! కానీ మొక్కకు 10 వరకు కాయలు మాత్రమే వచ్చును. ఈ రకము కాండము తొలిచే పురుగును తట్టుకొనగలదు. కానీ కొక్కెర తెగులునకు తట్టుకోలేదు. పూసా క్రాంతి పూసా ఫల్గుని పూసా బర్సాత్‌ H 158, H 128, H129 సాగు చేయు పద్దతి వంగను వర్షాకాలపు పైరుగా సాగుచేసిన యెడల ఆ సంవత్సరము దాని తరువాత మెట్ట నేలలో మరియొక సస్యమౌను సాగు చేయుటకు సామాన్యముగా వీలుపడదు. దానిని శీతాకాలపు పైరుగా పెట్టుకొనినచో తొలకరిని నూవు, మెట్టవరి మొదలగువానిని సాగు చేయవచ్చును. కానీ వీనిని కోసిన వెనుక నేలను బాగుగ తయారుచేయుటకంతగా వ్యవధియుండదు. కనుక వంగకు ముందే పైరును పెట్టకుండుటయే మంచిది. తోటభూములలో పై సస్యములనే కాక అరటి, మిరప, పొగాకు మొదలగు వానితో కూడా వంగను మార్చి పెట్ట వచ్చును. నీటివంగ తోటలను సామాన్యముగా దంపనేలలో వరితో రెండవ పంటగ పరివర్తనము కావించుదురు. విత్తులను చిన్న చిన్న మళ్ళలో జల్లి నారు పెంచి ఆ మొక్కలను నాటుటయే వంగ తోటలను పెంచు సామాన్యమైన విధానము. విత్తులను జల్లుటకు కొంతకాలము ముందు నారు మడిని బాగుగ ద్రవ్వి పెంట విస్తారముగ బోసి కలిపి తయారు చేయవలెను. మొక్కలు నాటు దూరమును బట్టి 400-600 గ్రాముల విత్తులను 1/2 - 3/4 సెంట్లు విస్తీర్ణమున వేసిన యెడలలో బాగుగ నెదిగిన మొక్కలోక ఎకరమునకు సరిపోవును. చిన్న పెరళ్ళలో 6 గ్రాముల విత్తులను 50 చదరపు మీటర్ల మడిలో పోసి పెంచిన నారు ఒక సెంటునకు సరిపోవును. బలిష్ఠముగా ఎదిగిన మొక్కలనే నాటి తక్కిన వానిని వదలివేయవచ్చును. ముళ్ళు కట్టి చదును చేసి విత్తులను సమముగ జల్లి కలిపి పైన నీరు చల్లవలెను. గింజలు మొలచుటకు 7–10 రోజులు పడుతుంది. అంతవరకు నారుమడి పైన యీతాకులు కానీ యితర ఆకులుగానీ పరచి కప్పవలెను. పదును కనిపెట్టి అప్పుడప్పుడు నీరు చల్లుచుండవలెను. గింజలు మొలకలెత్తనారంభించగనే పై కప్పు తీసివేసి యెండ క్రమముగ తగలనీయవలెను. అవసరమగునపుడెల్ల కుండలతో నీరు చిమ్ముచుండవలెను. సామాన్యముగ 6 వారములు మొదలు 2 నెలల వరకు నెదిగిన పిమ్మట నారు నాటుటకర్హముగనుండును. మిగుల లేత వంగనారు కంటే కొంచెము ముదురునారే ప్రశస్తముగనెంచవడును. వంగ ముదురు, వరి లేత అని సామెత. నారుమడిలో వారం పదిరోజులకొకసారిగా మాత్రము నీరుపోసి నారును రాటుదేల్చినచో పంట హెచ్చుగా వచ్చునని తెలియుచ్చున్నది. వంగ మొక్కలను నాటు నేలను కూడా నారెదుగు లోపల తరచు బాగుగ ద్రవ్విగానీ, దున్నిగాని సిద్ధము చేయవలెను. శీతాకాలమున పెంచబడు మెట్టవంగతోటలకు నేలలను మరింత సమగ్రముగ తయారుచేయవలెను. లేనిచో నేలయందు తగిన పదును నిలచిన తోటయంత బాగుగగాని, హెచ్చు కాలముగాని కాయదు. పది టన్నుల వంగపంట నేల నుండి 120 కిలోగ్రాముల నత్రజనిను, 80 కిలోగ్రాముల ఫాస్పారిక్‌ ఆసిడును తీసికొనును. సామాన్యమయిన పంటకు హెక్టారుకు 50 కి. గ్రాముల నత్రజనిను 60 ఫాస్ఫారిక్‌ ఆసిడును, 60 పొటాషును వేయుట మంచిదని కొందరి అభిప్రాయము. చీడ పీడలు అక్షింతల పురుగు () ఇది పైన నల్లని చుక్కలు కలిగి చిన్నవిగను, గుండ్రముగనుండి ఒక జాతి. దీని శాస్త్రీయ నామం . వంగ మొక్కల ఆకులపై పచ్చని పొరను డింభదశయందునూ, పూర్ణదశయందునూ కూడా తినివేయును. డింభదశలో ఈ పురుగు ఎగురలేవు, కావున ఈ దశలో వీనిని సులభముగ ఏరి చంపవచ్చును. ఈ పురుగు చిస్తారముగా వ్యాపించినప్పుడు ఉల్లి పాషాణమునుగానీ, ఖటికపాషాణమును కానీ చల్లి చంపవచ్చును. పేలు, ఎర్రపేలు లేని చోట్ల డి డి టి 0.16 % చిమ్మవచ్చును. మాలాథియాన్‌ 0.16% ను కూడా దీనిని నివారించుటకు వాడవచ్చును తలదొలుపు పురుగు దీని శాస్త్రీయ నామం కాగా సాధారణ నామం shooter bore. ఇది ఇంచుక గులాబి వర్ణము కలిగియుండును. డింభము మొక్కల చిగుళ్ళను ఒక్కొక్కప్పుడు కాయలను కూడా తొలచును. పుప్పిపట్టిన చిగుళ్ళను, కాయలను వెంటనే కోసి గోతిలోవేసి కప్పవలెను. ఎండ్రిన్‌ 0.032% కాయలన్నిటిని కోసివేసిన పిదప చిమ్మవచ్చును. పిందెలను తీసివేసిన పిమ్మటనే దీని చిమ్మదగును. 0.25% కార్బరిల్‌ కూడా పనిచేయును. కాడదొలుపు పురుగు దీని శాస్త్రీయ నామం కాగా సాధారణ నామం step borer. ఇది దీపపు పురుగు. దీని డింభము కాండమును తొలిచి మొక్కను చంపును. ఈ పురుగుపట్టి చచ్చిన మొక్కలను కాల్చివేయుటయు, కాపు ముగిసిన వెనుక మోళ్ళను వెంటనే పీకి తగులబెట్టుటయు ఈ తెగులు బాధను తగ్గించుకొనుటకు చేయవలసిన పనులు. ఎండ్రిన్‌, ఉపయోగించవచ్చు. నువాన్‌ కూడా ఉపయోగించవచ్చును వంగపిండి పురుగు ఇది ఒక పిండిపురుగు. దీని శాస్త్రీయ నామం Phenacoccus insolitus కాగా సాధారణ నామం Brinjal mealy bug. మొక్కల లేత భాగములకు బట్టి యందలి రసమును పీల్చుకొనును. ఇది చురుకుగ ఎదుగు మొక్కలను సామాన్యముగ పట్టదు. ఎపుడైన అచటచట ఒక మొక్కకు బట్టినచో అట్టి మొక్కలను కనిపెట్టి వెంటనే లాగివ్యవలెను. చాలా మొక్కలను బట్టినచో 0.05% పారాథియాను చిమ్మవలెను. కాయలు ఏర్పడియున్నచో నువాను చల్లవచ్చును. సామాన్యముగ ఈ చీడ కాపు ముగిసి మరళ విగుర్చు ముదితోటలలోని లేతకొమ్మలకే పట్టును. డి.డి.టీ. చల్లిన పిమ్మట ఈ పురుగులు అధికమగును. క్రిస్టోలీమసు అను పెంకుపురుగులను తెచ్చివివ్డిచినచో అవి పిండిపురుగులను అదుపులో ఉంచును. వెర్రితల రోగము వంగ తోటలకు వచ్చు తెగుల్లలో వెర్రితల రోగము ముఖ్యము. ఇది సూక్ష్మదర్శని సహాయముననైనను కంటికి కానరాని వైరసువలన వచ్చు తెగులు. ప్రథమ దశలో తెగులుబట్టిన కొమ్మలను హెచ్చుగ బట్టిన యెడల మొక్కలను తీసివేసి తగులబెట్టవలెను. ఈ వైరసును ఒక మొక్కనుండి మరియొక దానికి మోసుకొనిపోవు జాసిడులవంటి పురుగులను డి.డి.టి. చల్లి నివారించుటచే ఈ తెగులుయొక్క వ్యాప్తిని అరికట్టవచ్చును. ఈ తెగులు తట్టుకోగల వంగడములు వాడుట శ్రేష్టము. వంటకములు thumb|చిక్కుడుకాయ వంకాయ పోపు కూర thumb|వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర thumb|వంకాయ చిక్కుడుకాయ పోపు కూర thumb|తరిగిన వంకాయలు (కూరకి సిద్ధం అవుతున్నాయి) వంకాయలను చప్పిడి కూరగకానీ, పులుసుపెట్టి కానీ వండి తినవచ్చును. ముదురుకాయలును, గిజరుకాయలను కారము పులుసుపెట్టి వండిననేగాని తిన బాగుండవు. ఇటువంటి కాయలను ముందు ఉడుకబెట్టి వార్చి వేసినచో అందలి గిజరు మరికొంత తగ్గును. లేత కాయలను ముందు ఉడకబెట్టకుండ పోపులో నూనెవేసి మ్రగ్గనీయవచ్చును. లేక చమురులో వేచి పైన మసాలాపొడి చల్లవచ్చును. నిడివిగనుండు నీటివంకాయలను ముచికవద్ద కొంతభాగము విడిచి క్రింది భాగమును నాలుగు లేక ఆరు చీలికలుగ దరిగి యందు మసాలా పొదిని కూరి మువ్వ లేక గుత్తివంకాయగ కూడా వండి తినవచ్చును. గుండ్రని మెట్ట వంకాయను కాల్చి అల్లమును చేర్చి యిగురు పచ్చడిగగానీ, పులుసు పచ్చడిగ గానీ పెరుగుపచ్చడిగగానీ చేయవచ్చును. వంకాయ ముక్కలను సామాన్యపు పులుసులోనూ, మజ్జిగ పులుసులోనూ కూడా తరచు వేయుచుందురు. వంకాయ ముక్కలను వాంగీబాత్ మొదలను చిత్రాన్నములలో కూడా ఉపయోగింతురు. బంగాళాదుంప మొదలగు ఇతర కూరలతో కలిపి వండుటయు ఉంది. వంకాయ ముక్కలను పలుచని బిళ్ళలుగ తరిగి సెనగ వగైరా పిండితో చేసిన చోవిలో ముంచి చమురులో వేచి బజ్జీలుగ చేయవచ్చుhttp://www.pennilessparenting.com/2011/09/vegan-meat-substitute.html. నానుళ్ళు, చాటుపద్యాలు తెలుగునాట వంకాయపై దాని కూర రుచిపై అనేక నానుళ్ళున్నాయి. వంకాయ వంటి కూర, పంకజముఖి అయిన సీత వంటి భార్య, భారతం వంటి కథ ఉండవని ఒక నానుడి. ఇదే నానుడి కొద్ది మార్పులతో చాటుపద్యంగా కూడా ప్రచారంలో ఉంది. కం।। వంకాయ వంటి కూరయు పంకజముఖి సీతవంటి భామా మణియున్ శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి రాజును గలడే!! వంకాయ వంటి కూరా, పంకజముఖి ఐన సీత వంటి భామామణి, శంకరుని వంటి దైవము, లంకకు రాజైన వాడికి శత్రువు (శ్రీ రాముడు) వంటి రాజు. వీటన్నిటికీ ప్రత్యామ్నాయాలున్నాయా? (లేవు) అని సారాంశం. అలాగే వంకాయతో వెయ్యి రకాలు అని కూడా ఒక నానుడి. వంకాయతో మేలు thumb|వంకాయ అల్లం, పచ్చిమిర్చి కూర thumb|వంకాయ కారప్పొడి కూర వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటో న్యూట్రియెంట్‌ను న్యాసునిన్ (nasunin) అంటారు. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఎక్కువైన ఇనుమును తొలగిస్తుంది. ఫ్రీరాడికల్స్‌ను నిరోధిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ కణాల దెబ్బతినటాన్ని నరోధించడం ద్వారా క్యాన్సర్‌ను నివారిస్తుంది. కీళ్లు దెబ్బతినటాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గిస్తుంది. మరింత వివరమైన వంకాయ వంటకాల కోసం ఈ క్రింది వివరములు చూడండి. వంకాయ వేపుడు కూర వంకాయ కారం పెట్టి కూర వంకాయ పచ్చి కారం కూర వంకాయ ముద్ద గుత్తి వంకాయ కూర వంకాయ ఇగురు వంకాయ పచ్చడి వంకాయ బండ పచ్చడి వంకాయ పులుసు పచ్చడి వంకాయ టమాటో కూర సాంబారు వాంగీబాత్ వంకాయ పచ్చడి మజ్జిగ పులుసు వంకాయ బజ్జీ వంకాయ కారప్పొడి కూర వంకాయలో పోషక విలువలు 100 గ్రాముల వంకాయలో ఈ క్రింది పోషక విలువలు ఉంటాయి. మొత్తం పిండి పదార్థాలు – 17.8g మాంసకృత్తులు – 8g సంతృప్త క్రొవ్వులు – 5.2g పీచు పదార్థం – 4.9g మొత్తం క్రొవ్వులు – 27.5g కొలెస్ట్రాల్ – 16 mg చక్కెరలు – 11.4g ఇనుము – 6 mg విటమిన్ A – 6.4 mg కాల్షియం – 525 mg సోడియం – 62 mg పొటాషియం – 618 mg వంకాయ పై పాటలు గుత్తి వంకాయ కూరోయ్ మామా............... కోరి వండి నాను మామా......... వంకాయలో ఔషధ విలువలు బల్ల వ్యాధికి వంకాయ అమోఘముగా పనిచేస్తుంది . పచ్చి వంకాయ పేస్టుకి పంచదార కలిపి పరగడుపున తినాలి . వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది, వంకాయ, టమటోలు కలిపి వండుకొని కూరగాతింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును. వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పుతో తింటే " గాస్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము తగ్గుతాయి. వంకాయ ఉడకబెట్టి ... తేనెతో కలిపి సాయంత్రము తింటే మంచి నిద్ర వస్తుంది . నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైద్యము . వంకాయ సూప్, ఇంగువ, వెళ్ళుల్లితో తయారుచేసి క్రమము తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము (flatulence) జబ్బు నయమగును . మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నము కొద్దిగ తినడము వలన, దీనిలోని పీచు పదార్థము మూలాన చక్కెర స్థాయిలు అదుపులో ఉండును . కొన్ని ఆఫ్రికా దేశాలలో మూర్ఛ వ్యాధి తగ్గడానికి వాడుతున్నారు . వంకాయ రసము నుండి తయారుచేసిన ఆయింట్ మెంట్లు, టించర్లు, మూలవ్యాధి (Haemorrhoids) నివారణలో వాడుతారు . దీన్ని పేదవారి పోటీన్‌ (మాంసము ) గా నూట్రిషనిస్టులు భావిస్తారు . జాగ్రత్తలు : ఎసిడిటీ, కడుపులో పుండు (అల్సర్ ) ఉన్నవారు వంకాయ తినకూడదు, గర్భిణీ స్త్రీలు వంకాయ తినడము మంచిది కాదు. ఎలర్జీలకు దారితీయును. వంకాయ చాలా మందికి దురద, ఎలర్జీని కలిగించును . శరీరముపైన పుల్లు, చర్మ వ్యాధులు ఉన్నవారు వంకాయ తినరాదు . మూలాలు English articles from --http://www.nutrition-and-you.com/ చిత్రమాలిక మూలాలు యితర లింకులు Solanum melongena L. on Solanaceae Source: Images, specimens and a full list of scientific synonyms previously used to refer to the eggplant. Plantation the Malaysian brinjal without fertilizers వర్గం:కూరగాయలు వర్గం:సొలనేసి వర్గం:ఈ వారం వ్యాసాలు
క్యాలిఫ్లవరు
https://te.wikipedia.org/wiki/క్యాలిఫ్లవరు
దారిమార్పు కాలీఫ్లవరు
దోసకాయలు
https://te.wikipedia.org/wiki/దోసకాయలు
దోస (అయోమయ నివృత్తి) కుకుర్బిటేసి కుటుంబంలో కొన్ని ప్రజాతులకి చెందిన కూరగాయల్ని దోసకాయలు అంటారు. 250px|right|thumb|తినే దోసకాయలు కీరా దోసకాయలు చల్లగా చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి ఆవస్యక ఫొలేట్‌తో పాటు విటమిన్‌- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి. పోషక విలువలు శక్తి: 13కి.కెలోరీలు; మాంసకృత్తులు: 0.4గ్రా; కార్బోహైడ్రేట్లు: 2.5గ్రా; కొవ్వు: 0.1 గ్రా; పీచు: 2.6; సోడియం: 10.2మి.గ్రా; పొటాషియం: 50మి.గ్రా ఉపయోగాలు రక్తపోటులో తేడా ఏర్పదినవారికి దోసకాయలో ఉన్న "పొటాసియం " రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది. దోస లోని లవణాలు గోళ్ళను అందంగా, చిట్ల కుండా ఉంచుతాయి . కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించును, కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి . శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్, సిలికాన్, దోహదపడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది . దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది . దోస తొక్కలో " విటమిన్ 'కే' " సమృద్ధిగా ఉన్నందున చేర్మానికి మేలుచేకురుతుంది. ఒక దోసకాయ ముక్కని 30 సెకన్ల పాటు నాలుకతో నోటి మీద పట్టుకొని ఉంటే చెడు శ్వాసకి కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది. తొక్కతోనే తినాలి thumb|దోసకాయ పప్పు thumb|దోసకాయ ఎండు కారం పచ్చడి దోసకాయను తోక్కతోనే తినాలి, దోసకాయను ఉరగాయగా చేసి తినకూడదు . ఆరోగ్య ప్రయోజనాలు : ఎసిడిటీ : కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది . అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది . రక్తపోటు : ఎటువంటి రంగులు లేని కీరదోసకాయ జ్యూస్ వలన రక్తప్రసరణ క్రమ బద్ధంగా ఉంటుంది . ఇందులోని ఖనిజాలు సోడియాన్ని నియంత్రణకు దోహదపడుతుంది. చలువ : వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోషకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది . మూత్ర విసర్జన : మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది . నొఫ్ఫితో కూడిన వావు : కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్ ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. ఆర్త్రైటిస్, గౌట్ వ్యాధులలో ఇది మంచి చేస్తుది. జట్తు పెరుగుదల : కీరదోసకాయలో గల సిలికాన్‌, సల్ఫర్ ఖనిజలవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది చర్మం మెరుగుదల: ఇందులోగల అధిక ' సి ' విటమిన్‌ వల్ల చర్మ పరిస్థితిని మెరుగుపరుస్తుంది . సౌందర్య పోషకాలలో కీరదోషకాయ తప్పక ఉంటుంది . ఎగ్జిమ, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులకు చికిత్సకోసం కీరదోషకాయ వాడవచ్చును . ఎండలో చర్మము కమిలిపోవడం : తీవ్రమైన ఎండవలన చర్మమము కమిలి పోతుంది. అప్పుడు కీరదోషకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశయనం కలుగుతుంది. శరీరంలో నీటినిల్వ : కీరదోషకాయ రసంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందువలన శరీరంలో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి. కళ్ళు చలువ : కీరదోషకాయ గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై ఉంచితే మంటలు తగ్గి ఉపశయనంతో పాటు కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది. కళ్ళ వాపు తగ్గుతుంది. దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుండియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు. గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్థము.దోస (cucumber) శాస్త్రీయ నామం - కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినవి. యితర భాషలలో తమిళము వెళ్ళరి: కన్నడము నౌదె హిందీ ఖీరా, కకడీ సంస్కృతము కర్కట, ఏర్వారు దోసకాయ అనబడే వేరు వేరు కూరగాయలు దేశవాళీ దోస 12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండి కేజీ వరకు ఉంటుంది. పండిన తరువాత పసుపు పచ్చగా ఉంటాయి. నక్క దోస చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి. ములు దోస పందిరి దోస బుడెం దోస కాయలు దోసకాయతో వంటకాలు thumb|దోసకాయ పప్పు దోసకాయ పప్పు కూరలు దోసకాయ కూర దోసకాయ + వంకాయ కూర దోసకాయ + టమాట కూర దోసకాయ + టమాట + ములగకాడ కూర దోసకాయ + ఉల్లిపాయ కూర దోసకాయ + వంకాయ + ఉల్లిపాయ కూర దోసకాయ + టమాట + ఉల్లిపాయ కూర దోసకాయ + టమాట + ములగకాడ + ఉల్లిపాయ కూర పచ్చడ్లు thumb|దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి (పచ్చిమిర్చి) దోసకాయ పచ్చడి (ఎండు మిర్చి) దోసావకాయ దోసకాయ కాల్చి పచ్చడి దోసకాయ + వంకాయ + టమాట పచ్చడి (ఉడకబెట్టి) దోసకాయ కాల్చి + వంకాయ (ఉడకబెట్టి) పచ్చడి దోసకాయ కాల్చి + టమాట (ఉడకబెట్టి) పచ్చడి దోసకాయ + వంకాయ పచ్చడి దోసకాయ + టమాట పచ్చడి పులుసు దోసకాయ పులుసు ముక్కలు ఇవి కూడా చూడండి మూలాలు బయటి లింకులు వర్గం:కూరగాయలు వర్గం:కుకుర్బిటేసి
బంగాళదుంప
https://te.wikipedia.org/wiki/బంగాళదుంప
బంగాళదుంప అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప కూర పిలవబడుతున్నది. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని కొన్ని ప్రాంతములలో బంగాళదుంప లేదా "బంగాల్ దుంప" అని పిలుస్తారు. (ఆంగ్లము లో .) ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము. బంగాళదుంప చరిత్ర thumb|right|250px|భారతదేశంలో తన పంటతో ఒక రైతు thumb|right|250px thumb|right|250px|2005లో ప్రపంచ దేశాలలోబంగాళ దుంపల ఉత్పత్తి 17వ శతాబ్దము వరకు బంగాళదుంప అనే కూరగాయ ఉన్నదని ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో తప్ప మిగిలిన ప్రపంచానికి తెలియదు. స్పానిష్ వారు దక్షిణ అమెరికా ప్రాంతమును ఆక్రమించి వారి దేశానికి వలస దేశాలుగా తమ అధీనము లోనికి తీసుకువచ్చిన తరువాత, ఈ కొత్త కూరగాయ గురించి ముందు ఐరోపా వాసులకు ఆ తరువాత వారి ద్వారా ఇతర ప్రాంతములకు తెలిసింది. భారతదేశానికి బంగాళాదుంప ఐరోపా వలసవారి నుండి వచ్చినదే. వారు మన దేశమును వారి అధీనములోనికి తెచ్చుకున్న సందర్భములో తమ తమ దేశాలనుండి ఇక్కడకు తెచ్చిన అనేకమైన వాటిలో బంగాళాదుంప ముఖ్యమయినది. అసలు మొట్టమొదటి బంగాళదుంప మొక్కను ఐరోపాకు తెచ్చినది ఎవరు అన్న విషయంమీద ఇదమిద్దమైన ఆధారాలతో కూడిన సమాచారం లేదు. కొంతమంది వాదన ప్రకారం, అనేక యాత్రా విశేషాలను తన పర్యటనల ద్వారా ప్రపంచానికి తెలియచేసిన సర్ వాల్టర్ రాలీ (Sir Walter Raleigh) ఈ మొక్కను మొదట ఐరోపాకు తెచ్చాడని అనిపిస్తుంది. ఈ విషయంలో 20 సంవత్సరాలకు పైగా ఎంతగానో కృషిజరిపిన డేవిడ్ స్పూనర్ (David Spooner) మరొక విచిత్రమైన విషయం చెప్పాడు. అదేమిటంటే, స్పానిష్ ఆక్రమణాక్రమంలో, 1568లో గొంజాలో జిమెనెజ్ దే కేసడా (Gonzalo Jimenez de Quesada) అనే సైనికాధికారిని, ప్రస్తుతం కొలంబియా దేశంగా పిలవబడుతున్న ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకురావటానికి, స్పెయిన్ ప్రభుత్వం 2000 మంది సైనికులనిచ్చి పంపింది. అతను, తన అనుచరులతో, అక్కడి బంగారాన్ని దోచుకురావచ్చని చాలా ఉత్సాహంగా బయలుదేరాడు. కాని, నాలుగు సంవత్సరాల తరువాత అతను ఖాళీ చేతులతో, 60 మంది తన మిగిలిన అనుచరులతో చాలా డీలా పడి ఓటమి భారంతో తమ దేశానికి తిరిగి వచ్చాడు. ఆ దెబ్బతో అతని పరువు పోయింది, అతని పై అధికారులు అతన్ని చాలా నిరసించారు. అతని ఓటమి మీద అనేక వ్యంగ రచనలు కూడా జరిగినవట. కాని, అతను బంగారానికి బదులు, దక్షిణ అమెరికా ఖండము నుండి, అక్కడి మొక్కలలో ఒకటయిన "పప" లేదా "పొటాటొ" మొక్కలను తీసుకుని వచ్చాడు. అతనికి తెలియకుండానే, బంగారాన్ని మించిన సంపదను స్పెయిన్ దేశానికి తీసుకుని వచ్చాడు. అక్కడనుండి ఈ మొక్క మొదట స్పెయిన్, ఆ తరువాత ఇతర ఐరోపా దేశాలకు, వారి వలసవాద దురాక్రమణల వల్ల ఇతర దేశాలకు వ్యాప్తి చెందినదట. అయితే, ఐరోపాలో దాదాపు ఒకటిన్నర రెండు శతాబ్దాలవరకు ఈ దుంపకూరను ఆదరించలేదు. ఇంగ్లాండులో నయితే, ఈ దుంపను "స్పడ్" (SPUD - Society for Pevention of Unhealthy - అనారోగ్య ఆహార అలవాట్ల నిరోధనా సంఘము) గా వ్యవహరించారట. కాని కొంతకాలమునకు, ఈ విధమయిన విపరీత వర్ణనల ప్రభావంనుండి బయటపడి, బంగాళాదుంప ఒక ముఖ్య భోజ్య పదార్థముగా మారినది. చరిత్రకారులు చెప్పిన ప్రకారం, పారిశ్రామిక విప్లవం విజయవంతము కావటానికి ఈ దుంపకూర ఎంతగానో దోహదపడినదట. బవేరియన్ యుద్ధాన్ని "పొటాటో యుద్ధం"గా అభివర్ణించారు. కారణం, యుద్ధం జరుపుతున్న దేశాల దగ్గర బంగాళాదుంపల నిల్వలు ఉన్నంతవరకే ఆ యుద్ధం జరిగినదట. అలాగే, దక్షిణ అమెరికాలో జరిగిన "ఇంకా" తెగల యుద్ధాలలో కూడ, మధ్యలో కొంత విరామం తీసుకుని, ఈ దుంపకూర పంటను ఇళ్ళకు చేర్చిన తరువాత మళ్ళీ కొనసాగించేవారట. బంగాళాదుంప ఐరోపా ప్రాంతానికి ఎలా వచ్చింది అన్న విషయం మీద అనేక వాదనలు ఉన్నాయి, అందులో ప్రధానమైనవి, పైన ఉదహరించటం జరిగింది. భారతదేశంలోకి బంగాళాదుంప దాదాపు 17వ శతాబ్దపు మొదటి అర్ధ భాగములోనే వచ్చిందనటానికి కొంత ఆధారాలు ఉన్నాయి. అందులో ప్రధానమయినది, సర్ థామస్ రో (Sir Thomas Roe) 1615లో ఇంగ్లాడ్ రాయబారిగా మొఘల్ వంశస్థుడు జహంగీర్ పరిపాలిస్తున్న సమయంలో భారతదేశానికి వచ్చాడు. అతనితో పాటుగా అతని స్వంత పూజారి ఎడ్వర్డ్ టెర్రీ (Edward Terry) కూడా వచ్చాడు. అతనికి కొత్త ప్రదేశాలలో తను చూసిన విషయాలమీద వ్రాయటం ఒక అభిరుచి. అతని "తూర్పు భారతావని యాత్ర " (Voyage to East India) అనే పుస్తకాన్ని వ్రాశాడు. ఆ పుస్తకంలో అతను అప్పటికే భారతదేశంలో బంగాళదుంప ఉన్నట్టు వ్రాశాడు. భారతదేశంలో ఈ దుంపకూర గురించి చెయ్యబడ్డ మొట్టమొదటి ప్రస్తావన ఇదే. అప్పట్లో, ఈ మొక్కని పెరటి తోటలలో వేడుకగా పెంచేవారట. పూర్తిగా ఒక పంటగా 1822 వరకు పండించబడలేదు. మనదేశంలో సిమ్లా నగరంలో కేంద్రీయ బంగాళదుంప పరిశోధనా సంస్థ (Central Potato Research Institute-CPRI) ఉంది. ఈ సంస్థకు చెందిన ఎస్.కె.పాండె (S.K.Pandey) చెప్పిన ప్రకారం, 1822వ సంవత్సరమువరకు, మనదేశములో బంగాళదుంపను ఒక పంటగా పండించలేదట. మొట్టమొదట, సల్లివాన్ అనే అంగ్లేయుడు, మద్రాసుకు దగ్గరలో తన వ్యవసాయ క్షేత్రంలో పంటగా మొదలు పెట్టాడట. బంగాళాదుంప పంట నుండి 2006వ సంవత్సరములో మొత్తం ప్రపంచములో 315 మిలియన్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ విధంగా చూస్తే, మొత్తం పంటలలో బంగాళదుంప నాలుగవ స్థానాన్ని అక్రమిస్తుంది - వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత. ప్రపంచవ్యాప్త బంగళాదుంప పంటలో నాలుగవ వంతు చైనా దేశంలో పండించబడుతున్నదట పంట సాగు, ఉత్పత్తి అనుకూల పరిస్థితులు ఈ పంటకు పగలుపూట తక్కువ సూర్యకాంతి, రాత్రిళ్ళు చల్లటి వాతావరణము కావాలి. ఈ విధమైన వాతావరణ పరిస్థితులు భారతదేశంలో చలికాలంలోనే ఉండటం వలన, ఈ పంటను భారతదేశంలో చలికాలంలోనే పండిస్తారు. ఈ పంటకు 90 నుండి 100 రోజుల సమయం చాలు. ఆందువలన, బంగాళాపంటను స్వల్ప కాలిక పంటగా పరిగణిస్తారు. వేడి ప్రాంతాలలో కూడా బంగాళదుంపను పండించటం జరుగుతున్నది కాని, అది మొత్తం దిగుబడిలో 8 నుండి 10 శాతము మాత్రమే. మన దేశంలో దాదాపు 25 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. భారతదేశంలో ఈ పంటను ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో పండిస్తారు. 1995లో బంగాళదుంపను "స్పేస్ సెంటర్"లో కూడా పండించారు. కాబట్టి, అంతరిక్షంలో పండించబడ్డ మొట్టమొదటి కూరగాయగా పేర్కొనవచ్చును. సాగు పద్దతి right|250px|thumb|అమెరికాలోని మెయిన్ రాష్ట్రం ఫొర్ట్ ఫైర్‌ఫీల్డ్ గ్రామంలోని బంగాళాదుంప పొలం బంగాళదుంపలు చెట్టుకు పండవు. పేరులోనే ఉన్నట్టు, దుంపగా భూమిలోపల, చెట్టు వేళ్ళకు పెరుగుతాయి. బంగాళదుంపలలో 80 శాతము నీరు మిగిలిన 20 శాతము ఘన పదార్ధములు. సాధారణంగా బంగాళదుంప మొక్కలు 60 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి. బంగాళాదుంప మొక్కలు భూమిపై కొంత ఎత్తుకు పెరిగి, పసుపు రంగు కేసరాలు కలిగిన పూలు పూస్తుంది. పూలు పూచిన తరువాత, కొన్ని జాతి మొక్కలు చిన్న, ఆకుపచ్చని (చిన్న టొమాటో సైజు) పళ్ళు కాస్తాయి. ఒక్కో పండులోను 300 దాకా గింజలుంటాయి. ఈ బంగాళదుంప పళ్ళలో విషపదార్ధాలుంటాయి గనుక అవి తినడానికి పనికిరావు. ఈ మొక్కలు తుమ్మెదల ద్వారా పరపరాగసంపర్కం చెందడమే కాకుండా స్వజాతి సంపర్కం కూడా చెందుతాయి. ఏ బంగాళాదుంప రకాన్నైనా శాఖీయంగా, దుంపలను, "కళ్ళు" కలిగి ఉన్న దుంప ముక్కలను నాటడం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. అంతే కాకుండా కత్తిరింపుల ద్వారా కూడా మంచి విత్తన దుంపలను పొందవచ్చు. ఈ పద్ధతిన హరిత గృహాలలో వినియోగిస్తారు. ఆధునిక రకాల మొక్కలను దుంపల కళ్ళ నుండి కాక గింజలనుండి పెంచుతున్నారు. గట్టిగా లోపలి భాగము సాధ్యమైనంత వరకు తెల్లగా ఉండాలి, ఆకుపచ్చనివి అసలు బాగుండవు. ఎక్కువ ఆలుగడ్డలు కొన్నచో వీటిని చల్లని చీకటి ప్రదేశాలలో దాచి ఉంచాలి. పండిన బంగాళాదుంపలను తవ్వి తీయటానికి ప్రత్యేక పనిముట్లు ఉపయోగిస్తారు. వీటి సహాయంతో భూమిలోని దుంపలను బయటికి తీస్తారు. పెద్దపెద్ద బంగాళాదుంప సాగుదారులు, దుంపలను భూమినుండి వెలికి తీయటానికి యంత్రాలను ఉపయోగిస్తారు. పంట నిలవ, అమ్మకం సామాన్యంగా బంగాళాదుంపలను భూమిలోనుండి తీసిన వెంటనే అమ్మకం చేయరు. కొంతకాలం నిల్వ ఉంచిన బంగాళాదుంపలకు ఎక్కువ ధర పలుకుతుంది. కొన్నిసార్లు పంటను వెంటనే "కొత్త బంగళాదుంపలు"గా అమ్మటం జరుగుతుంది. బంగాళదుంపలను నిలువ ఉంచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతయినా అవసరం. నిల్వ చేసే ప్రదేశం వెలుగు తక్కువగా, మంచి గాలి తగిలేట్టుగా ఉండాలి. ఎక్కువకాలం నిల్వ ఉంచాలనుకుంటే, నిలవ ప్రదేశంలో 40°ఫా ఉష్ణోగ్రత ఉంచాలి. వ్యాపారపరంగా నిల్వచేసే గిడ్డంగులలో అయితే అరు నెలల వరకు, ఇళ్ళల్లో అయితే కొన్ని వారాలవరకు నిల్వచెయ్యవచ్చు. ఆహార, వ్యవసాయ సంస్థ FAO లెక్కల ప్రకారం, 2006వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 315 మిలియన్ టన్నుల బంగాళదుంపల దిగుబడి వచ్చినదట. ఈ దిగుబడిలో నాలుగవ భాగం దిగుబడి ఛైనాలో జరిగినదట. రకరకాలైన వంటలు thumb|బంగాళాదుంప అల్లం, పచ్చిమిర్చి కూర thumb|బంగాళాదుంప చిక్కుడుకాయ పోపు కూర బంగాళదుంపతో రుచికరమైన వంటలు, కూరలు, చట్నీలు, ఫలహారాలు, ఇతర ఆహార పదార్ధాలు తయారుచేయవచ్చును. ఉడకబెట్టిన కూర, వేపుడు, కుర్మా వంటివి తరచు తెలుగు నాట చేసే కూరలు. ఇంకా బజ్జీల వంటి తినుబండారాలు చేస్తారు. ఊరగాయలు కూడా పడుతుంటారు. బంగాళదుంప చిప్స్ వంటి తినుబండారాలు మార్కెట్లో లభిస్తాయి. పాశ్చాత్య దేశాలలో బంగాళ దుంపతో చేసే పదార్ధాలు అక్కడి అలవాట్లకు తగినవిగా ఉంటాయి. ఇవి భారతీయ వంటకాలకంటే భిన్నమైనవి. ఏమైనా బంగాళ దుంపను తరిగి, లేదా ఉడకబెట్టి లేదా వేయించి అనేక రకాలైన, రుచికరమైన పదార్ధాలు తయారు చేయడం చాలా సమాజాలలో సర్వసాధారణం అయింది. బంగాళదుంప వేపుడు బంగాళదుంప ఇగురు కూర బంగాళదుంప చట్నీ హర భర కబాబ్ పౌష్టిక విలువలు ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్థం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్థం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చి‌లో కొద్ది భాగం పొట్టలోను, చిన్న ప్రేవులలోను స్రవించే ఎంజైములు వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం పెద్ద ప్రేవులోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి (resistant starch) వలన శరీరానికి ఆహార పీచు పదార్ధాలు (Dietary fiber) వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు (శరీర పౌష్టికత, కోలన్ క్యాన్సర్ నుండి భద్రత, Hylla S, Gostner A, Dusel G, Anger H, Bartram HP, Christl SU, Kasper H, Scheppach W. Effects of resistant starch on the colon in healthy volunteers: possible implications for cancer prevention. Am J Clin Nutr. 1998;67:136-42. గ్లూకోజ్ ఆధిక్యతను తట్టుకొనే శక్తి, Raban A, Tagliabue A, Christensen NJ, Madsen J, Host JJ, Astrup A. Resistant starch: the effect on postprandial glycemia, hormonal response, and satiety. Am J Clin Nutr. 1994;60:544-551. కొలెస్టరాల్ తగ్గింపు, ట్రైగ్లిజరైడులు తగ్గింపు వంటివిCummings JH, Beatty ER, Kingman SM, Bingham SA, Englyst HN. Digestion and physiological properties of resistant starch in the human large bowel. Br J Nutr. 1996;75:733-747.). దుంపను ఉడకపెట్టి ఆరబెడితే ఇలా జీర్ణంకాని స్టార్చి ఎక్కువవుతుంది. ఉడికిన వేడి దుంపలో ఉండే 7% జీర్ణంకాని స్టార్చి, దానిని ఆరబెట్టినపుడు 13%కు పెరుగుతుంది.Englyst HN, Kingman SM, Cummings JH. Classification and measurement of nutritionally important starch fractions. Eur J Clin Nutr. 1992;46:S33-S50. బంగాళ దుంపలలో పలువిధాలైన విటమిన్‌లు, ఖనిజ లవణాలు (minerals) ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 27 మిల్లీగ్రాముల విటమిన్-సి (ఒక రోజు అవసరంలో 45%), 620 మి.గ్రా. పొటాషియం ( అవసరంలో 18%), 0.2 మి.గ్రా. విటమిన్-B6 (అవసరంలో 10%) మాత్రమే కాకుండా కొద్ది మోతాదులలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు లభిస్తాయి. ఇంతే కాకుండా బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్థం కూడా చాలా ఉపయోగకరం. ఒక మాదిరి బంగాళ దుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. ఇంకా బంగాళదుంపలో కార్టినాయిడ్స్, పాలీఫినాల్స్ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది. అందానికి బంగాళాదుంప : బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది. కళ్లకి మెరుపు : ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి. ముడతలు పోయేలా : బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. చక్కని ఛాయకి : బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. . ఫేస్‌మాస్క్‌లు : ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరువాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రపరుచుకోండి. పొడి చర్మము ఉన్నవాళ్ళు తురిమిన బంగాళాదుంప, అర చెంచా పెరుగు కలిపి దానిని మూకానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుగుకుంటే మృదువుగా తయారవుతుంది. అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం right|thumb ఐక్య రాజ్య సమితి 2008 సంవత్సరాన్ని అధికారికంగా అంతర్జాతీయ బంగాళాదుంప సంవత్సరం గా ప్రకటించింది. వర్ధమాన దేశాలలో బంగాళాదుంప యొక్క ఆహారపు ప్రాముఖ్యతను చాటి చెప్పడానికే ఈ ప్రయత్నం. గతంలో 2004 సంవత్సరాన్ని అంతర్జాతీయ వరి సంవత్సరంగా ప్రకటించింది. ఒక సంవత్సరానికి బంగాళదుంప పేరు పెట్టి గుర్తించడంలో విశేష కారణాలు ఈ విధంగా ఉన్నాయి: ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధరలు పెరిగి పోతున్న ఈ తరుణంలో, బంగాళదుంప చాల చౌకైన ఆహార పదార్థం. ఈ పంటను ఎక్కువగా పండించటం వలన ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గించటానికి దోహదపడుతుంది. ప్రపంచంలో ధాన్యేతర (ధాన్యము కాని) ఆహార పంటలలో బంగాళదుంప ప్రధానమైనది. దీనిని తక్కువ అదాయం ఉన్న దేశాలలో బాగా వాడుతారు. అందువల్ల ఈ పంట మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరణ; మిగిలిన ఆహార ఉత్పత్తులలాగ, బంగాళదుంపకు ప్రపంచ వ్యాప్త వ్యాపారం జరగదు. ఎక్కువగా ప్రాంతీయ విఫణిలోనే వర్తకం జరుగుతుంది. కనుక, బంగాళదుంపల ధరలు ప్రాంతీయ విషయాల మీదనే అధారపడి ఉంటాయి. ప్రపంచ విఫణిలోని ఆటుపోట్లు, ఈ పంట ధరలమీద ప్రభావం చూపవు. దానివల్ల అనేకమంది రైతులు లాభపడే అవకాశం ఉన్నది, తప్పనిసరిగా ఖర్చులు పోను, రైతుకు అదాయం వచ్చే అవకాశం ఉంది. చిత్రమాలిక ఇవి కూడా చూడండి దుంపలు మూలాలు https://web.archive.org/web/20150405045845/http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AC%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B3%E0%B0%A6%E0%B1%81%E0%B0%82%E0%B0%AA&action=edit&section=12 6. ముత్తేవి రవీంద్రనాథ్, కూరగాధలు, విజ్ఞాన వేదిక, తెనాలి, 2014 వనరులు బయటి లింకులు GLKS Potato Database Centro Internacional de la Papa - CIP (International Potato Center) World Potato Congress British Potato Council Potato varieties available in Britain Online Potato Pedigree Database for cultivated varieties Potato Information & Exchange GMO Safety: Genetic engineering on potatoes Biological safety research on gm-potatoes International Year of the Potato 2008 Landline, 13.7.2008 వర్గం:సొలనేసి వర్గం:కూరగాయలు వర్గం:దుంపలు వర్గం:ఈ వారం వ్యాసాలు
ఉల్లిపాయలు
https://te.wikipedia.org/wiki/ఉల్లిపాయలు
దారిమార్పు ఉల్లిపాయ
బఠానీ
https://te.wikipedia.org/wiki/బఠానీ
thumb|బఠానీకాయలు|250x250px thumb|250x250px|పచ్చి బఠానీలు బఠానీ లేదా బఠానీలు (శాస్త్రీయనామం: పీసం సెటైవమ్) ఒక రకమైన గింజ ధాన్యాలు. వీటిని పచ్చిగానూ, ఎండబెట్టి కూడా వాడుతారు. పచ్చి బఠానీలను కూరల వినియోగంలోనూ, ఎండు బఠానీలను చిరుతిండి గానూ ఉపయోగిస్తారు. పచ్చి బఠానీలు బఠానీల తొక్కలు ముదిరి ముడతలు పడకూడదు, తొక్కలపై నల్లటి పసుపు రంగు మరకలుండరాదు మూలాలు బయటి లంకెలు Sorting Pisum names USDA plant profile https://web.archive.org/web/20150303184216/http://www.nal.usda.gov/fnic/foodcomp/search/ వర్గం:ధాన్యాలు వర్గం:కూరగాయలు వర్గం:ఫాబేసి
చిలగడదుంప
https://te.wikipedia.org/wiki/చిలగడదుంప
thumb చిలగడదుంప (Sweet Potato) ఒక విధమైన దుంప. దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్ (Ipomea batatas). దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు. ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి లేత పసుపు నారింజ గులాబి రంగు ఉపయోగాలు చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. --- పీచు బంగాళాదుంప కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. విటమిన్‌ బీ6 చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి. పొటాషియం ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది. విటమిన్‌ ఏ చిలగడదుంపల్లో విటమిన్‌ ఏ లేదా బీటా కెరటిన్‌ ఎక్కువ. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది. మాంగనీసు పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. విటమిన్‌ సి, ఈ వీటిల్లోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచితే.. విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. సహజ చక్కెరలు లగడదుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. ఇలా బరువు పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి. నలుపు మరకలు లేని, గట్టి దుంపలు మంచి రుచిగా ఉంటాయి మూలాలు వర్గం:దుంపలు వర్గం:కన్వాల్వులేసి వర్గం:కూరగాయలు
టమాటో
https://te.wikipedia.org/wiki/టమాటో
thumb|టమాటాలు thumb|right|వివిధ జాతుల టమేటాలు టమాటో (ఆంగ్లం: Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని తెలుగు పేర్లు కూడా ఉన్నాయి. టమాటో (Tomato) సొలనేసి కుటుంబములో జేరిన యొక విదేశీయపు కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పెరిగినదో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించినదని ఊహించబడుతున్నది. దీనికి సీమ వంగ, రామ ములగ అని చక్కని తెలుగు పేర్లు కూడా ఉన్నాయి. ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము చూడలేము. మనకు ఎక్కువగా లభించే ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టమాటోలు ఆరోగ్యానికు మేలు చేసస్తాయి . శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తాయి .సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెపుతారు . . . కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరుతో అవసరముండదని చెప్పవచ్చు. దీనిలో "లైకోపీన్ (Lycopene)" అనే పదార్ధము శక్తి వంతమైన anti- oxydent గా పనిచేస్తుంది . ఇంగ్లాండునకు 16 వ శతాబ్దమున ప్రవేశించింది. భారతదేశములో సుమారుగా 1850 లలో ప్రవేశించింది. త్వరగా ఇది దేశీ కూరగాయల స్థానములో ఆక్రమించింది. ఇప్పుడు టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణము చూడలేము. ఈ మొక్క గురించి left|thumb|250px|ప్రకాశం జిల్లా గిద్దలూరులో టమాటో మార్కెట్ఇది నేలపై ఎక్కువ ఎత్తు పెరగక, నేలపై పడి పెరుగును. ఈ మొక్కలు సామాన్యముగా ఒకటి, ఒకటిన్నర మీటర్ల ఎత్తువరకు పెరుగును. అనేక శాఖలను ఉపశాఖలగా పెరుగును. వేళ్ళు మొక్క పెరిగినంత త్వరగా వ్యాపించవు. కాండము బలహీనమయినది. లేత భాగమున నూగు కలిగి కొంచెమించుమించు గుండ్రముగ నుండును. ఆకు 10-20 చెంమీ వెడల్పు కలిగి ఉండును. ఇందలి రకములు దేశవాళీ అనగా మొదట ఐరోపా నుండి దేశానికి తెచ్చిన రకము. బాగుగా కాయలు కాయును. ఈ రకపు పండ్లు ఎరుపు రంగును కలిగి మధ్మ పరిమాణమున ఉండును. ఇందు రసము తక్కువ లోన అవకాశము ఉండుటయు ఉంది. చర్మము జిగియైనది. వీటిని కొన్ని ప్రాంతాలలో రామములక్కాయలు అని కూడా అంటారు. thumb|left|టమాటో పంట/ చిత్తూరు జిల్లా, కల్లూరు వద్ద గ్లోబ్‌ ఇది ఒక అమెరికా దేశపు రకము. కాయ మధ్యమ పరిమాణము కలిగి గుండ్రముగను నునుపుగాను ఉండును. లోన గుల్ల యుండదు. రసమయము. మార్‌ గ్లోబ్‌ పాండిరోజా బానీ బెస్టు ఆక్సుహర్టు చెర్రీరెడ్‌ సియూ పూసారూబీ పూసా రెడ్ప్లం తినే పద్దతులు thumb|టమాటా పచ్చడి thumb|పాలకూర, టమాట పప్పు|link=Special:FilePath/పాలకూర,_టమాట_పప్పు_(2).jpg thumb|టమాటా పప్పు పచ్చివిగా తినవచ్చు టమాటో వేపుడు టమాటో పచ్చడి టమాటో చారు లేదా టమాటో సూప్ టామాటో ఇతర కాంబినేషనులు టమాటా పప్పు టమాటో వంటకాలు thumb|టమాట పప్పు టమాటోను నిజంగా ఎన్నిరకముల కాంబినేషనులలో వాడవచ్చో తెలిస్తే మీరు ముక్కుమీద వేలు వేసుకుంటారు, టమాటో సొరకాయ టమాటో బంగాళదుంప టమాటో కోడిగుడ్డు టమాటో ఉల్లిగడ్డ టమాటో సాంబారులో టమాటో పెరుగు పచ్చడిలో టమాటో జాం టమాటో మిక్షుడ్ ఫ్రూట్ జాం టమాటో సాస్ టమాటో కెచప్ టమాటో అన్నము ఉపయోగాలు ఎసిడిటీ టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాల్లో సిట్రిక్ ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. మధుమేహ రోగులకు మధుమేహ రోగులకు టమోటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కంటి జబ్బులకు టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది. రోగనిరోధక టమోటా తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి రోగనిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది. వారానికి పదిసార్లు టమోటాలు తీసుకుంటే ప్రోస్టేట్‌, మలద్వార, జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గే అవకాశం ఉండటం విశేషం. బరువును నియంత్రించాలనుకుంటేః శరీర బరువును నియంత్రించాలనుకుంటే టమోటా అత్యద్భుతమైన పండు. సాధారణ సైజు కలిగిన టమోటాలో 12 కెలోరీలుంటాయి. ప్రతి రోజు టమోటాలు ఆహారంతోపాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలోవుంటుంది. బరువును తగ్గించే గుణము : టమాటోలు తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు . టమాటోలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను తక్కువగా తింటారు . టమాటోలు తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని, ఇతర పదార్దములు గాని తిననీయదు ... కాబట్టి ఆకలి మీద నియంత్రణ, తక్కువ ఆహారము తీసుకోవడం వల్ల బరువు పెరగరు . ఎముకలు బలపడడానికి : పాలు తాగితే ఎముకలు బలపడతాయి.. ఆస్టియోపోరోసిస్‌ వంటి వ్యాధులు దాడిచేయకుండా ఉంటాయి.. అయితే ఈ ఘనత ఒక్క పాలకే కాదు.. టమాటా రసానికీ చెందుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటా రసాన్ని తాగలేనివారు కెచప్‌, సాస్‌ రూపంలోనూ తీసుకోవచ్చు. జాతీయ సంస్థ ఆస్టియోపోరోసిస్‌ సూచనల ప్రకారం కాషాయరంగు, గులాబీ రంగులో ఉన్న ఏ కాయగూరలని తిన్నా క్యాల్షియం తగుపాళ్లలో అంది ఎముకలు బలపడతాయి. టమోటాలు విరివిగా తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది . టమోటాతో పక్షవాతం దూరం: చూడగానే ఎర్రగా, నోరూరించే టమోటాల్లో విటమిన్‌ సి, విటమిన్‌ ఏ దండిగా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెరగటానికి, విశృంఖల కణాలు తగ్గటానికి విటమిన్‌ సి దోహదం చేస్తే.. కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్‌ ఏ తోడ్పడుతుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్‌ కె కూడా వీటితో లభిస్తుంది. టమోటాలకు సంబంధించి ఇప్పుడు ఓ కొత్త సంగతి కూడా బయటపడింది. వీటిల్లోని యాంటీఆక్సిడెంటు గుణాలు గల లైసోపేన్‌.. పక్షవాతం ముప్పు 59% వరకు తగ్గటానికీ తోడ్పడుతున్నట్టు ఫిన్‌లాండ్‌లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవటం మూలంగా పక్షవాతం ముప్పు తగ్గుతుందనే విషయాన్ని ఈ అధ్యయనం మరింత బలపరిచింది. టమోటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయిలను నియంత్రించే మాంగనీసు వంటివీ ఉంటాయి. టమోటాలు తింటే కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి.టమోటాల్లో లైకోపేన్‌ అనే ఎర్రటి వర్ణద్రవ్యంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.రోజూ 25 మి.గ్రా. లైకోపేన్‌ తీసుకుంటే చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ 10 శాతం వరకు తగ్గుతుంది.లైకోపేన్‌ తీసుకోవటం వల్ల రక్తనాళాలు గట్టిపడటం, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు తగ్గుతుంది. (ఈనాడు20.5.20p tamotalu tisukuntay ఇవి కూడా చూడండి మూలాలు వనరులు బయటి లింకులు వర్గం:సొలనేసి వర్గం:కూరగాయలు వర్గం:పండ్లు
నీరు
https://te.wikipedia.org/wiki/నీరు
File:Te-నీరు.oga నీరు, ఉదకం లేదా జలం (సాంకేతిక నామం H2O) జీవులన్నింటికి అత్యవసర పదార్థం. భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనే జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం (సముద్రాలు, నదులు, తటాకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) భూతలం నాల్గింట మూడు వంతులు మహాసముద్రాలు, నదులు, తటాకాలు వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు. భాషా విశేషాలు తెలుగు భాషలో నీరు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. నీరే ప్రాణాధారం అని ఒక పద్యంలో ప్రయోగముంది. భగవద్గీత...... యజ్ఞంవలన వర్షం, వర్షంవలన నీరు లభింస్తుందని చెప్పబడింది. నీటి చక్రం right|thumb|300px|నీటి చక్రం.నీరు ఈ భూమండలంపై 71 శాతానికి పైగా ఆవరించి ఉంది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం ( సముద్రాలు, నదులు, తటకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) ఈ నీటి చక్రము అనగా నీరు ద్రవరూపంనుండి వాయు రూపంలోకి, అక్కడి నుండి తిరిగి ద్రవ రూపంలోనికి నిరంతరము మారుతూ వుంటుంది. నీటి స్థితులు భూమిపై నీరు మూడు స్థితులలో కాన వస్తుంది. ఘన, ద్రవ, వాయుస్థితులు.అనగా నీరు సూర్యుని వేడిమికి ఆవిరి రూపం ధరించి, (వాయు రూపం) మేఘాలుగా మారి చల్లదనానిని ద్రవ రూపంలోనికి మారి ఆకాశం నుండి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతుంది. ఆ ప్రక్రియలో ప్రకృతిలోని సమస్త జీవరాసులకు నీటిని అందించి భూగర్బజలం, నదులు, జలాశయాలు.... ఇలా ప్రవహించి తిరిగి సముద్రములో కలుస్తుంది. ఈ ప్రక్తియ నిరంతరము కొనసాగు తుంది. జలకాలుష్యము నాగరికత అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థములతోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రముద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడా కలుపుకొని వాయురూపంలో మేఘాలుగా మారి అక్కడి వాతావరణం అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆకలుషిత మేఘాలు వర్షించినపుడు రంగు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది. జీవ శాస్త్రం జీవం నీటి నుంచి మొదలైంది. జీవుల్లో జీవ రసాయన క్రియలన్నీ నీటి వల్లనే సంభవం. జంతువుల శరీరంలో 70-90 శాతం నీరు ఉంటుంది. నీరు ముఖ్యంగా రెండు రకాలు. అవి సముద్రపు నీరు, మంచి నీరు. మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరువేరు లోతులలో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. జంతువులు నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి. జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి, ఇందులో చాలా వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త దావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవపదార్ధాల రవాణాకు తోడ్పడుతుంది. ఉదా: రక్తం, శోషరసం, మూత్రం. మనిషి శరీరములో 2/3 వ వంతు నీరే. మనకు నీళ్ళవల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇది వాతావరణ పీడనాలనుండి మనల్ని కాపాడుతుంది శరీరంలో రవాణా సౌకర్యాలు కలిగిస్తుంది చెత్తని బయటకి పంపిస్తుంది నీటివనరులు నీరు లభించే ప్రదేశాలు భౌగోళిక పరిస్థితులను బట్టి మారుతుంది. వీటిని అన్నింటిని ఆ ప్రాంతపు నీటివనరులు (Water Resources) అంటారు. సముద్రాలు నదులు సరస్సులు చెరువులు నూతులు భూగర్బ జలాలు స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన నీరు త్రాగుటకు అవసరము. మనకు అందుబాటులో వున్న నీరు వివిధ రకాలుగా కలుషితమైనది. దీనిని త్రాగుటకు యోగ్యమైనదిగా చేయటానికి చాలా రకాల పద్ధతులున్నాయి. వేడి చేయుట ఆధునిక పద్ధతులు (రివర్స్ ఆస్మోసిస్) గ్రామాలలో రక్షిత మంచినీటి కేంద్రం ద్వారా త్రాగు నీటిని తక్కువ ఖర్చుతో ప్రజలకు అందచేస్తున్నారు. మంచి నీరు స్వచ్ఛమైన త్ర్రాగు నీరు ఎలా ఉండాలంటే?: లీటరు నీటిలో ఇనుము శాతం ఒక మిల్లీ గ్రాముకు మించి ఉండకూడదు. నైట్రైట్‌ కణాలు సున్నా శాతం ఉండాలి. ఒక లీటరు నీటిలో నైట్రేట్‌ వంద మిల్లీగ్రాముల మించి ఉండకూడదు. హెచ్‌.టు.ఎస్‌. కాగితాన్ని నీటిలో ఉంచితే నీరు నలుపురంగులోకి మారితే బ్యాక్టీరియా ఉన్నట్లే. ఒక లీటరు నీటికి 2500 మిల్లీగ్రాముల విద్యుత్‌ ప్రసరణ సామర్థ్యం ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. నీటి స్వచ్ఛతను పి.హెచ్‌. అనే కొలమానంతో కొలుస్తారు. తాగేనీటిలో పి.హెచ్‌. విలువ 6.5 నుంచి 9.2 మధ్యలో ఉండాలి. లీటరు నీటిలో 2 వేల వరకు వివిధ రకాల ఖనిజాలు కరిగి ఉంటే తాగేందుకు మంచిదే. అంతకు మించి ఖనిజాలు ఉండకూడదు. ఒక లీటరు నీటిలో ఆల్‌కలైనిటి 600 మిల్లీగ్రాముల వరకు ఉండొచ్చు. ఒక లీటరు నీటికి తలతన్యత 600 మిల్లీగ్రాములు దాటకూడదు. లీటరు నీటిలో కాల్షియం పరిమాణం 200 మిల్లీగ్రాములు మించకూడదు. ఇక్కడ 68 మిల్లీగ్రాములు 400 మిల్లీగ్రాముల సల్ఫేట్స్‌ ఉండాలి. లీటరు నీటిలో వెయ్యి మిల్లీగ్రాముల క్లోరైడ్‌ కణాలుండవచ్చు. మెగ్నీషియం కణాలు 100 వరకు మాత్రమే ఉండాలి. తాగునీటిని వృథా చేస్తే జైలు ముంబయిలో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే జైలు శిక్ష అనుభవించడం లేదా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో మొక్కలకు నీరు పట్టడం, భవన నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది. ముంబయిలో https://luckypatcherapk.wiki/జరుగుతున్నట్లు దేశం అంతాట జరుగాలి. తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్‌ ఉంది. ఇవి కూడా చూడండి భూమిపై నీటి పుట్టుక భారజలం మంచు నీటి ఆవిరి జల వైద్యం మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ద్రవ పదార్థాలు వర్గం:పంచ భూతములు వర్గం:విజ్ఞాన శాస్త్రం వర్గం:వాతావరణం వర్గం:నీరు
ధాన్యం
https://te.wikipedia.org/wiki/ధాన్యం
thumb|వారపు సంతలలో ఆహార ధాన్యాలు thumb|గోధుమలు thumb|బార్లీ గింజలు thumb|లెంటిల్ ధాన్యాలు అనునవి గట్టిగా, పొడిగా గల విత్తనాలు (పైకప్పు కల లేదా పైకప్పు లేనివి). యివి మానవుని లేదా జంతువుల ఆహారంగా ఉపయోగపడతాయిBabcock, P.G., ed. 1976. Webster's Third New International Dictionary. Springfield, Massachusetts: G. & C. Merriam Co. .. వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాలను యిచ్చే మొక్కలను "ధాన్య పంటలు"గా పిలుస్తారు. కోతలు కోసిన తర్వాత పొడిగా ఉన్న ధాన్యాలు యితర ఆహార పదార్థాలు అనగా పిండిపదార్థాలు కలవి ఉదా:అరటి పండ్లు, రొట్టెపండు) , వేర్లు (ఉదా:బంగాళా దుంపలు), దుంపలు, పెండలం దుంప, వంటి వాటికంటే నిల్వ ఉండటానికి, ఉపయోగించటానికి, , ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రత్యేకముగా ఈ లక్షణాలు యంత్రాలతో కోయుటకు, రైలు, ఓడలలో రవాణాకు, అనేక రోజులు నిల్వ ఉంచుటకు, అధిక పరిమాణంలో నూర్చుటకు , పారిశ్రామిక వ్యవసాయానికి ఉపయోగపడతాయి. సాధారణంగా మొక్కజొన్న, వరి, సోయాబీన్స్, గోధుమ , యితర ధాన్యాలు వంటివి అధిక సంఖలో ఎగుమతి, దిగుమతులు జరుగుతాయి. కానీ కాయగూరలు, దుంపలు , యితర పంటలు ఎగుమతులు తక్కువగా జరుగుతాయి. ధాన్యాలు , పప్పులు వృక్ష శాస్త్రంలో ధాన్యాలు , పప్పులు కెరీయోప్‌సెస్ గా పిలువబడుతాయి. గడ్డిజాతి కుటుంబ ఫలాలుగా వ్యవసాయ శాస్త్రంలో , కామెర్స్ లోనూ, యితర కుటుంబాలలో గల విత్తనాలు , ఫలాలు గానూ పిలుస్తారు. ఉదాహరణకు అమరనాథ్ అమ్మిన వాటిని "గ్రైన్ అమరనాథ్" అనీ,, అమరనాథ్ ఉత్పత్తులను "హోల్ గ్రైన్స్" అనీ పిలుస్తారు. వర్గీకరణ పప్పుధాన్యాలు పప్పు ధాన్యాల పంటలు అన్నీ గడ్డి జాతి కుటుంబానికి చెందుతాయి.Vaughan, J.G., C. Geissler, B. Nicholson, E. Dowle, and E. Rice. 1997. The New Oxford Book of Food Plants. Oxford University Press. పప్పు ధాన్యాలలో అధిక పిండి పదార్థం, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొన్ని ధాన్యాాలు వరి గోధుమ జొన్న మొక్కజొన్న సజ్జలు రాగులు బార్లీ నవధాన్యాలు గోధుమలు యవలు పెసలు శనగలు కందులు అలసందలు నువ్వులు మినుములు ఉలవలు ధాన్యం వృథా ఆకలితో అలమటించే జనం ఉన్న ఈ దేశంలో ఒక్క తిండిగింజను వృథాచేసినా అది నేరమేనని, ప్రజాపంపిణీ వ్యవస్థ ధాన్యాన్ని కొల్లగొట్టేవారిని ప్రాసిక్యూట్‌ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృథా అయ్యే ధాన్యం విలువ రూ.17వేల కోట్లు దేశవ్యాప్తంగా 1.78 కోట్ల టన్నుల గోధుమలు/బియ్యాన్ని టార్పాలిన్ల కింద నిల్వ ఉంచారు. ఇందులో కోటి టన్నులు కుళ్లి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటి విలువ దాదాపు రూ.17వేల కోట్లు. ఈ ధాన్యంతో 1.4కోట్ల మంది ఆకలి తీర్చవచ్చని అంచనా. మూడేళ్లనుంచి మురగపెట్టడంతో ఒక్క పంజాబ్‌లోనే 49వేల టన్నులను వృథాగా పారబోసే పరిస్థితి దాపురించింది. చిత్రమాలిక మూలాలు బయటి లింకులు వర్గం:ఆహార పదార్థాలు వర్గం:పంటలు
బియ్యము
https://te.wikipedia.org/wiki/బియ్యము
thumb|బస్తాలో బియ్యం బియ్యం, భారతదేశం ప్రధాన ఆహారపంట. వరిమొక్క కంకుల నుండి వేరుచేస్తారు. ఇందులో 75% కార్బోహైడ్రేటులు ఉంటాయి. సాధారణంగా దీనిని నీటిలో వండి అన్నం తయారుచేసి, కూరలతో కలిపి తింటారు. గంజి వంపక పోవడము మంచిది, కనుక బియ్యాన్ని తగినన్ని నీటిలో వండవలెను ఇంకా ఇతర పదార్థములు కూడా తయారు చేసుకొని తినవచ్చు అటుకులు బొరుగులు (లేదా బొంబుపేలాలు) ఇడ్లీ, దోసె ఉప్మా పులిహోర పాలిష్ బియ్యంతో మధుమేహం తెల్లటి పాలిష్ వరి అన్నాన్ని తింటే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గోధుమ రంగులో ఉండే ముతకబియ్యపు అన్నం తినడం వల్ల ఈ ముప్పు తగ్గుతుంది. పాలిష్డ్‌ బియ్యం బదులు ముడి బియ్యం వినియోగిస్తే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచుపదార్థం, ఖనిజాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్‌ వంటి అవసరమైన పోషకాలు గోధుమరంగు బియ్యంలో ఎక్కువగా ఉంటాయి. భోజనం చేశాక.. రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా ఎక్కువగా పెంచదు. బియ్యాన్ని పాలిష్‌ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, పోతాయి. నల్లబియ్యం తెల్లగానే కాదు... నల్లగానూ ఉంటాయని మీకు తెలుసా..? చైనాలో ఎప్పట్నుంచో వినియోగిస్తున్న ఈ నల్ల బియ్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు "సూపర్ ఫుడ్"గా అభివర్ణిస్తున్నారు. వీటిలో చక్కెర తక్కువగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా దండిగా ఉంటాయని లూసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లతో పోరాడటంలో దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. "చెంచాడు నల్లబియ్యం తవుడులో బ్లాక్‍బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్ ఆక్సిడెంట్లు ఉంటాయి. చక్కెర మోతాదు తక్కువగానూ పీచు, "విటమిన్ ఈ" ఎక్కువగానూ ఉన్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ జిమిన్ జు పేర్కొన్నారు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవటాన్ని ప్రోత్సాహించటానికి నల్లబియ్యం తవుడు ప్రత్యేకమైన, చవకైన మార్గమని ఆయన సూచించారు. బ్లూబెర్రీలు, ఎండు మిరప వంటి పండ్లు, కూరగాయలకు ఈ యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఇవి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. డీఎన్‍ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు వివరించారు. పూర్వకాలంలో ఈ నల్లబియ్యాన్ని "నిషిద్ద బియ్యం" అని పిలుచుకునేవారు. పురాతన చైనాలో కేవలం గొప్పవారికే వీటిని తినటానికి అనుమతి ఉండేదట! వీటిల్లో చక్కెర తక్కువ.పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగాఉంటాయి.ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లను రానివ్వవట.నల్లబియ్యం తవుడులో బ్లాక్‌బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్‌ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పండ్లు, కూరగాయలకు యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. రాష్ట్రంలో మిగులు ఉత్పత్తి రాష్ట్రంలో ఏటా కోటి టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర అవసరాలకు 75 లక్షల టన్నులు సరిపోతాయి. 25 లక్షల టన్నులు మిగులుండాలి. అవసరానికి మించి ఉత్పత్తి అవుతోంది గనక ధరలు పెరగాల్సిన పరిస్థితేలేదు. అయితే, భారీఎత్తున బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండటంతో రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నాయి. మిల్లర్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కి 75 కిలోల బియ్యం లెవీ కింద ఇస్తే 25 కిలోలు బహిరంగ మార్కెట్లో (రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా) అమ్ముకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు తరలించినందుకు వీటిపై ఒకశాతం పన్నును మిలర్ల నుంచి వసూలు చేయాలి. అయితే 2005 నుండి పన్ను రాయితీ ఇచ్చారు. ఇవి కుడా చూడండి సోనా మసూరి మూలాలు వర్గం:ధాన్యాలు
అటుకులు
https://te.wikipedia.org/wiki/అటుకులు
thumb|220x220px|అటుకులు|alt= thumb|అటుకుల ఉప్మా అటుకులు అనేవి వరి ధాన్యం నుండి తయారుచేయబడే ఆహారపదార్ధం. తయారుచేయు విధానం వరి ధాన్యాన్ని నానబెట్టి 24 గంటల తరువాత నీరు తీసివేసి, 60 - 70 సెల్సియస్ వద్ద వేయించవలెను. ఆ తరువాత రోటిలో వేసి రోకలితో దంచి చెరిగినచో అటుకులు సిద్దం. ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ప్రస్తుతం అటుకులు దంచడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. వీటిని పాలతో మిశ్రమం చేసుకోని తీసుకొనవచ్చు. అటుకులతో చేయబడు పదార్ధాలు thumb|అటుకుల ఉప్మా (పోహా) ఈ అటుకులను హిందువుల పండుగలలో ప్రముఖమైందిగా పరిగణింపబడే శివరాత్రి నాడు నానబెట్టి బెల్లం కలిపి నైవేధ్యం పెట్టడం ఆచారంగా వస్తుంది. పోహా లేదా అటుకుల ఉప్మా అటుకుల పులిహోర వర్గం:వంటలు వర్గం:ఫలహారాలు వర్గం:శాకాహారం వర్గం:ఆహార పదార్థాలు
పాలు
https://te.wikipedia.org/wiki/పాలు
thumb|పాలు పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్థము. పాలను ఉత్పత్తి చేసే జంతువులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు. హిందువులు పవిత్రంగా పూజించే ఆవు యొక్క పాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలలోనూ వాడతారు. భాషా విశేషాలు thumb|left|ఆవు పాలపొదుగు తెలుగు భాషలో పాలు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.బ్రౌన్ నిఘంటువు ప్రకారం పాలు పదప్రయోగాలు. పాలు నామవాచకంగా పాలు, పాలవంటి ద్రవాలకు ఉపయోగిస్తారు, సంస్కృతంలో క్షీరము [ kṣīramu ] అనగా n. Milk, పాలు.బ్రౌన్ నిఘంటువు ప్రకారం క్షీరము పద ప్రయోగాలు. The milky sap of plants. జిల్లేడు మొదలైన వాటి పాలు. Water ఉదకము. క్షీరాన్నము rice and milk boiled together. పరమాన్నము. క్షీరోదక న్యాయము intimate union as milk and water mixed with each other. నీళ్లును పాలును కలిసినట్లు ఒక్కటిగా కలిసియుండు ధర్మము. వారు క్షీరోదక న్యాయముగా నున్నారు they are intimately associated or related. క్షీరాబ్ధి or క్షీర సాగరము kshīr-ābdhi. n. The sea of milk పాల సముద్రము. క్షీరాబ్ధి తనయ the goddess who sprung from this sea, i.e., Lakshmi. పాల సముద్రం నుండి జన్మించిన లక్ష్మి. పోషక విలువలు కొవ్వు పదార్థాలు 4 % పిండి పదార్థాలు ('కార్బోహైడ్రేట్‌'లు) - 4.7 % మాంసకృత్తులు ('ప్రోటీన్‌'లు) - 3.3 % నీరు - 88 % మనిషి పాలలో 71 కిలో కేలరీలు, ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు, మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది. రకాలు : బూత్ పాలు . తల్లి పాలు. ఆవు పాలు మేక పాలు, గాడిద పాలు, గొఱ్ఱెపాలు. ఒంటె పాలు పిల్లలకు త్రాగించే పాలు : పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అయితే, పిల్లలకు ఏ పాలు ఇవ్వడం మంచిదన్న విషయాన్ని పరిశీలించాలి. ఆవు, గేదె, మేకపాలు, స్కిమ్డ్‌ మిల్క్‌ లభిస్తాయి. ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమయినవి. కొంతమంది, పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. ఆ పాలను గుమ్మపాలు అంటారు. పొదుగు నుంచీ పిండగానే అలాగే పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాద ముంటుంది. ఆ పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను, వ్యాధిని కలిగిస్తాయి. ఏ పాలనయినా బాగా కాచి (వేడి చేసి) పొంగించిన తర్వాతనే పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాశ్చరైజ్డ్‌ మిల్క్‌ను కనీసం పది నిముషాలయినా కాచినట్లయితే అందులోని బాక్టీరియా నశిస్తుంది. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి. చల్లారిపోయిన పాలను, నిలవ ఉన్న పాలను పిల్లలకు త్రాగించకూడదు. చిక్కగా ఉన్న పాలల్లో నీళ్ళు కలిపి త్రాగించాలంటే పాలు కాగుతున్నప్పుడే కొంచెం నీటిని కలపాలి. వేడిపాలల్లో చన్నీళ్ళు కలిపితే, ఆ నీటి ద్వారా బాక్టీరియా పాలల్లోకి ప్రవేశించి పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలు పడకపోతే వాంతులు, విరేచనాలు, అజీర్తి వ్యాధులు కలుగుతాయి. పిల్లల వైద్యుని సంప్రదించి, పిల్లలకు ఏ పాలు త్రాగించాలన్నదీ తెలుసుకోవాలి. పశువులపాలు త్రాగించేటప్పుడు పశువులకు చేపువచ్చి పాలివ్వటానికి ఇంజెక్షన్‌ ఇస్తారు కొంతమంది పాల వ్యాపారస్తులు. ఆ ఇంజెక్షన్‌లోని రసాయనిక మందు పాలలో ప్రవేశిస్తుంది. పశువులకు వ్యాధులోస్తే, ఆ సంగతి తెలియక పిల్లలకు ఆ పాలను త్రాగించినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా పసిబిడ్డకు త్రాగించే పాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో, పట్టణాల్లో పశువుల పాలవాడకం తగ్గిపోయి బూత్‌పాలను ఉపయోగిస్తున్నారు. స్కిమ్డ్‌ మిల్క్‌నే అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే, ఆ పాలల్లోంచి కొవ్వు తొలగించబడుతోంది. పిల్లలకు ఆ పాలు త్రాగించడం ఆరోగ్య కరమే. ఆ పాలల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఆ పాలల్లోంచి కొవ్వు పొర మాత్రమే తొలగిపోతుంది, పోషక పదార్థాలేమీ తొలగిపోవు. ఆ పాలల్లో ఖనిజాలు అలాగే నిక్షిప్తమై ఉంటాయి. కొవ్వు ద్వారా లభించేవి ఎ, డి విటమిన్‌లు. 'ఎ' విటమిన్‌ ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది. డి విటమిన్‌ సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందుతుంది. ఆ విధంగా ఆ రెండు విటమినులను వారి శరీరానికి భర్తీ చేయవచ్చు. స్కిమ్డ్‌ మిల్క్‌లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లలు పాలు త్రాగటానికి ఇష్టపడకపోతే, ఏ రూపంలోనైనా పాలతో తయారుచేసిన పదార్థాలను ఇవ్వవచ్చు. పెరుగు, మజ్జిగ, పాయసం, పాలకోవా, జున్నులాంటి ఎన్నెన్నో పదార్థాలను పాలతో తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, నూతన శక్తికీ, శారీరక దృఢత్వానికీ వారికి ప్రతిరోజూ పాలను లేదా పాలతో తయారయ్యే పదార్థాలను ఇవ్వడం ఎంతో ముఖ్యం. పసిపిల్లలకు పోతపాలు వచ్చేటప్పుడు, అవి ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు, బూత్‌పాలు ఏవయినా కానీ, పలుచని వస్త్రంలో చిటికెడు వామును వేసి మూటకట్టి, పాలను కాచేటప్పుడు, ఆ మూటను ఆ పాలల్లో వేసి కాచినట్లయితే పాపాయికి అరుగుదల బాగా ఉండి, అజీర్తి బాధలు కలుగవు. జీర్ణక్రియ బాగుంటుంది. ఆకలి కూడా బాగా ఏర్పడుతుంది. బరువు తగ్గడానికి పాలు పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది అందరికీ తెలుసు. పాల వలన బరువు తగ్గడము కూడా సాధ్యమే ... మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ, డి-విటమిన్‌ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబడింది . ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. వీరి వయసు 45-60 మధ్య ఉంది. ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడంతో పాటు పిండి పదార్థాలు ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అదే సమయములో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు. అందుకే పాలలోని కాల్షియం, విటమిన్‌ డి బరువు తగ్గడములో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది. ఎసిడిటీని తగ్గించే పాలు : పాలు పౌష్టికాహారమన్న సంగతిని మనం తరచూ వింటుంటాము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క రూపంలో పాలను తమ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రోగాల్ని కుదర్చడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన 'పరిపూర్ణ పౌష్టికాహారం' కింద చెబుతుంటారు. పాలను మానవులు అనాది నుంచి వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఆవుపాలు, బర్రెపాలు, మేకపాలు మొదలైనవి. ఆవుపాలలో తల్లి పాలలో కంటే రెట్టింపు ప్రొటీన్లు ఉంటాయి. కాని చక్కెర తక్కువ ఉంటుంది. బర్రె పాలలో ఆవు పాలలో కంటే కొవ్వు అధికంగా ఉంటుంది. పాలు పడకపోవటం కొందరి వొంటికి పాలు సరిపడవు. అలాంటి వాళ్ళకు పాలు తాగగానే కడుపులో గ్యాస్‌ ఉత్పత్తి అయి కడుపు ఉబ్బరించినట్లుగా అవుతుంది. ఇందుకు కారణం ఏమిటంటే... పాలలో ఉన్న కార్బోహైడ్రేట్ జీర్ణం గావించే లాక్టోస్‌ అనబడే ఎంజైమ్‌ వీళ్ళలో సరిగా ఉత్పత్తి కాకపోవటం! లాక్టోస్‌ సరిగా ఉత్పత్తి కాని మనుషులకు కడుపులో గ్యాస్‌ అధికంగా ఉత్పత్తి కావటం, కడుపు ఉబ్బరించటం, కడుపులో నొప్పి, అజీర్ణం, విరేచనాలు లాంటి ఇబ్బందులు ఎదరవుతాయి. పాలు తాగగానే లేక పాల ఉత్పత్తి పదార్థాలను తినగానే ఇలాంటి ఇబ్బంది ఏర్పడే వాళ్ళు తమకు తాము ఒక సింపుల్‌ టెస్ట్‌ను చేసుకోవచ్చు. వీళ్ళు ఒక పది రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవటం మానేసి పై లక్షణాలు తొలగి పోతాయేమో చూడాలి. పాలు మానేయగానే పై లక్షణాలు తొలగి పోయి, తిరిగి పాల ఉత్పత్తులను తీసుకోవటం మొదలు పెటగానే మళ్ళీ ఆ లక్షణాలు మొదలైతే తమకు పాలు పడవని అర్థం చేసుకుని పాలను మానేయాలి. ఇలా పాలు పడని వాళ్ళు శాకాహారులైతే వాళ్ళు తమ ఆహారంలో గుడ్లు, సోయా, చిక్కుళ్ళు, మిగతా పప్పు ధాన్యాల ద్వారా తమ శరీరానికి అవసరమైన పాల ద్వారా లభించని ప్రొటీన్లను పొందటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రొటీన్లు తక్కువయితే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడి సులభంగా రోగాల బారినపడే అవకాశం ఉంది. పాలలో ఔషధోపయోగాలను లావెక్కడానికి : బక్కగా బలహీనంగా ఉన్న వాళ్ళకు లావెక్కటానికి పనికివచ్చే ఆహారం పాలు! ఉండాల్సిన బరువుకంటే తక్కువ బరువున్న వాళ్ళు సరిపడా పాలు తాగటం ద్వారా వారానికి 3 నుంచి 5 పౌన్ల దాకా బరువెక్క గలుగుతారు. నిదానం మీద శరీరం బరువు ఉండాల్సిన స్థితికి వచ్చేస్తుంది. పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది. సజావుగా రక్తప్రసరణ : శరీరంలో రక్తప్రసరణ సరిగా లేని వాళ్ళకు పాలు అద్భుతమైన ఆహారం! పాలు తాగటంవల్ల కడుపు, ప్రేవులలోని ద్రవాంశం వృద్ధిచెంది, శరీరంలో రక్తప్రసరణ సహజసిద్ధంగా మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవటంవల్ల చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. రక్తప్రసరణ సజావుస్థితికి చేరుకున్నాక ఇవి మళ్ళీ జవాన్ని పుంజుకొని కొద్ది రోజులకే ఆ వ్యక్తి నవనవలాడే చైతన్యంతో కనిపిస్తాడు. కడుపులో వాయువు : కడుపులో యాసిడ్‌ తయారవుతూ హైపర్‌ ఎసిడిటీతో బాధపడే వాళ్ళకు పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావటానికి యాసిడ్‌ అధికంగా కావాల్సివస్తుంది. పాలలో ఉండే ఆల్కలైన్‌ని తయారుచేసే పదార్థాల వల్ల శరీరంలోని యాసిడ్‌ స్థితిని ప్రేరేపించే పరిస్థితులు చాలా త్వరగా సాధారణ స్థితికి వచ్చేస్తాయి. నిద్రలేమి : నిద్రలేమితో బాధపడే వాళ్ళకు పాలు పరప్రసాదం లాంటివి. నిత్యం నిద్రపట్టక బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసెడు పాలలో తేనెను కలుపుకుని తాగాతే కొన్నాళ్టికి కమ్మని నిద్రకు చేరువవుతారు! శ్వాస సంబంధవ్యాధులు : జలుబు, గొంతు బొంగురుపోవటం, ఉబ్బసం, టాన్సిలైటిస్‌, బ్రాంకైటిస్‌ లాంటి వ్యాధులకు పాలు దివ్యౌవషధంలా పనిచేస్తాయి. గ్లాసెడు మరగ కాచిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని రోజూ రాత్రుల తాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులకు మూడు రోజులలో సత్ఫలితం లభిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి: పాలు విటమిన్ డి, ప్రోటీన్, కాల్షియంని కలిగివుంటాయి. ప్రతిరోజు పాలు తగడము వలన ఎముకలు బలముగ తయారు అవుతాయి.గర్భిణీ స్త్రీలు ప్రతి రోజు మూడు కప్పుల పాలు తాగాలని  USDA సిఫార్సు చేసింది.హృదయ వ్యాధి : ఇటీవల జరిగిన వెల్ష్ మెన్ అధ్యయనం ప్రకారం పాలు ఎక్కువ తాగే వాళ్ళలో కంటే తక్కువ తాగే వాళ్ళలో గుండె పోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.చర్మవ్యాధులు : పాలపైని మీగడలో కొద్దిపాటి వినెగార్‌, చిటికెడు పసుపు కలిపి గాయాలు, పుళ్ళు, గజ్జి మొదలైన వాటిమీద పూస్తే అవి త్వరలోనే తగ్గిపోతాయి. సౌందర్య సాధనంగా : కాస్మెటిక్స్‌లాంటి సౌందర్య సాధనాలలో కూడా పాలు చక్కగా ఉపకరిస్తాయి. రాత్రులు మరగ కాచిన గ్లాసెడు పాలలో ఒక తాజా నిమ్మకాయ రసాన్ని పిండి పది నిమిషాల తర్వాత చేతులు, మొహం, మెడ, భుజాలకు రాసుకుని ఆరబెట్టాలి. అలాగే పడుకుని మర్నాడు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే కొన్నాళ్టికి శరీరంలో మెరుపు, మృదుత్వం వస్తాయి. పచ్చిగుడ్డు సొనను పాలలో కలుపుకుని ప్రతిరోజూ ఆ మిశ్రమంతో తలంటుకంటే జుట్టు పెరగటమే కాదు. ఏరకమైన మాడుకు సంబంధించిన చర్మవ్యాధులూ ఇంక మీ దరికి చేరవు. పాల ఉత్పత్తులు మనం ప్రతిరోజూ తాగే టీ, కాఫీ లను పాలను ఉపయోగించి తయారుచేస్తారు. పాలును తోడుపెట్టినచో పెరుగు తయారవుతుంది. పెరుగును పలుచగా నీటితో బాగా కలిపితే మజ్జిగ, లస్సీ తయారవుతాయి. మరిగించిన పాలు మీద, తోడుపెట్టిన పెరుగుమీద మీగడ తయారవుతుంది. మజ్జిగను బాగా చిలికితే వెన్న తయారవుతుంది. వెన్నను మరగబెట్టిన నెయ్యి వస్తుంది. పాలుతో కోవా మొదలైన అనేక రకాల మిఠాయిలు తయారుచేస్తారు. ఇంకా బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, రొట్టెలు మొదలైన వాటి తయారీలో పాలను విరివిగా ఉపయోగిస్తారు. పాలు ఉత్పాదకత అత్యధిక పాల ఉత్పాదకులు — 2005 (1000 టన్నులు) 91,940 80,264.51 32,179.48 31,144.37 29,672 28,487.95 26,133 23,455 14,577 14,500World Total 372,353.31Source: UN Food & Agriculture Organisation పాడి పరిశ్రమలో ఆవుపాలు, గేదెపాలు ఉత్పత్తి చేసినా ప్రపంచ వ్యాప్తంగా ఆవు పాలు మాత్రమే అధిక స్థాయిలో ఉత్పత్తిచేస్తున్నారు. ఇదే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో 90 శాతం పాలు జెర్సీ ఆవులనుంచే తయారౌతుంది. పాల ఉత్పత్తిలో భారతదేశం, అమెరికా మొదటి, రెండు స్థానాలలో ఉన్నాయి.FAO Food outlook: International dairy product prices are turning down: how far, how fast? FAO online publication, 1 June 2006 భారతదేశంలో అమూల్ సహకార సంస్థ అత్యంత విస్తృతమైనది. పాలవెల్లువ గ్రామాల్లో గతంలో ఏ ఇంట చూసినా పాడిగేదెల పోషణ ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో కొనేవారు తక్కువగా ఉండేవారు. అప్పట్లో పాలు, పెరుగు అమ్ముకోవడం నామోషిగా భావించేవారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా గేదెల పెంపకం తగ్గిపోవడంతో పాలకు కొరత ఏర్పడుతోంది. అమ్మకాలకు అనుగుణంగా పాలు ఉత్పత్తి కావడం లేదు.లీటరు పాల ధర రూ. 45లకు విక్రయిస్తేనే గిట్టుబాటవుతుందని ఉత్పత్తిదారులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలను పోషించే వారు తాము వినియోగించుకోగా మిగిలిన పాలను విక్రయిస్తున్నందువలన గిట్టుబాటు ధర గురించి ఆలోచించడం లేదు. అయితే వ్యాపార ధోరణితో ఈ వృత్తిని చేపట్టినవారు గిట్టుబాటు కాకపోవడంతో ఆ వృత్తిని వదిలేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాల కేంద్రాల వద్ద ప్రస్తుతం పాలు పోసేవారి కంటే పాలు కొనేవారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. పురాణాలలో విష్ణువు పాల సముద్రములో శేషపానుపు మీద పవళిస్తాడు. శ్రీకృష్ణుడు వినాయక వ్రతకల్పములో పాలభాండములో చవితి నాడు చంద్రున్ని చూడడం వల్ల నీలాపనింద కలిగింది. ఇవి కూడా చూడండి క్షీరదాలు పాలకోవా ఉగ్గుపాలు నోసిల్లా మూలాలు https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&action=edit&section=10 వర్గం:పానీయాలు వర్గం:పాలు వర్గం:ఆహార పదార్థాలు వర్గం:హిందూమతం
పండు
https://te.wikipedia.org/wiki/పండు
thumb|220x220px|స్పెయిన్‌లోని పండ్ల దుకాణం. thumb|ఆలుబుఖార ఫలాలు లేదా పండ్లు (జర్మన్: Früchte, ఫ్రెంచ్, ఆంగ్లం: Früits, స్పానిష్: Frutas ) చెట్టు నుంచి వచ్చు తిను పదార్దములు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలం లోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు పడుతుంది. ఫలాలు రకాలు అనృత ఫలాలు (False fruits) ఫలదీకరణ ఫలితంగా అండాశయంతో పాటు మరియే ఇతర పుష్పభాగం అయినా ఫలంగా పెరిగితే దానిని 'అనృత ఫలం' అంటారు. ఉ. ఆపిల్లో పుష్పాసనం, జీడిమామిడిలో పుష్పవృంతం ఇలా ఏర్పడిన అనృత ఫలాలు. నిజ ఫలాలు (True fruits) నిజ ఫలాలు ఫలదీకరణ చెందిన అండాశయం నుంచి ఏర్పడతాయి. నిజఫలాలలో ఫలకవచం, విత్తనాలు అనే రెండు భాగాలుంటాయి. నిజఫలాలు మూడు రకాలు. సరళ ఫలాలు (Simple fruits) ఒక పుష్పంలోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని 'సరళ ఫలం' అంటారు. సరళ ఫలాలలోని ఫలకవచ స్వభావాన్ని బట్టి రెండుగా విభజించారు. 331x331px|thumb|రకరకాల బెర్రీ మృదుఫలాలు. కండగల ఫలాలు (Fleshy fruits) : ఈ ఫలాలలో ఫలకవచం పక్వస్థితిలో గుజ్జుగాగాని, రసయుతంగాగాని తయారవుతుంది. దీనిలో మూడు స్పష్టమైన పొరలుంటాయి. అవి- వెలుపలి వైపున ఉండే బాహ్యఫలకవచం (Epicarp), మధ్యలో ఉండే మధ్యఫలకవచం (Mesocarp), లోపలి వైపు ఉండే అంతఃఫలకవచం (Endocarp). వివిధ రకాల ఫలకవచ స్వభావం ఎక్కువ వైవిధ్యతను చూపిస్తుంది. మృదుఫలం లేదా బెర్రి (Berry) : ఇది ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని అండాశయంనుంచి ఏర్పడి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విత్తనాలు ఉండే ఒక కండగల ఫలం. బాహ్యఫలకవచం పలుచగా ఉండి, మధ్య, అంతఃఫలకవచాలు సంయుక్తంగా గుజ్జును ఏర్పరుస్తాఅయి. ఉదా: స్ట్రాబెర్రి, వంగ, టమాటో, అరటి. పోమ్ (Pome) : ఈ కండగల ఫలం ద్విఫలదళ లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని నిమ్న అండాశయం నుంచి ఏర్పడి, కండ కలిగిన పుష్పాసం చేత ఆవరించబడి ఉంటుంది. ఉదా: ఆపిల్. వాటర్ ఆపిల్ పెపో (Pepo) : ఇది కుకుర్బిటేసి కుటుంబపు ముఖ్య లక్షణం. ఈ ఫలం త్రిఫలదళ సంయుక్త అండకోశంలోని ఏకబిలయుత, నిమ్న అండాశయం నుంచి ఏర్పడుతుంది. బాహ్యఫలకవచం గట్టి పొరవంటి పుష్పాసనంతో సంయుక్తమై ఫలం చుట్టూ పెచ్చులాగా ఏర్పడుతుంది. మధ్యఫలకవచం గుజ్జులాగా ఉంటుంది. అంతఃఫలకవచం మెత్తగా ఉంటుంది. అనేక విత్తనాలు ఫల కుడ్యం లోపలి తలంపై అమర్చబడి ఉంటాయి. ఉదా: దోస, గుమ్మడి. హెస్పరీడియమ్ (Herperidium) : ఇది రూటేసి కుటుంబానికి చెందిన అతి ముఖ్యమైన కండగల ఫలం. ఇది బహుఫలదళ సంయుక్త అండకోశంలోని బహుబిలయుత, ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. దీనిలో విత్తనాలు మధ్యన ఉండే అక్షం మీద ఉంటాయి. ఫలకవచం 3 పొరలుగా విభేదన చెంది ఉంటుంది. వెలుపలగా చర్మలమైన, తైల గ్రంథులు ఉన్న బాహ్యఫలకవచం ఉంటుంది. మధ్యఫలకవచం పలుచగా, తెల్లని దూదిలాగా గాని, నారతో కూడిన పొరలాగా గాని ఉండి బాహ్యఫలకవచంతో సంయుక్తమై ఉంటుంది. అంతఃఫలకవచం అనేక గదులుగా విభజించబడి, వాటిల్లో రసయుత కేశాలు (ముత్యాలు) ఉంటాయి. ఉదా: నిమ్మజాతి పండ్లు. టెంకగల ఫలం (Drupe) : ఇది ఒకే విత్తనం ఉన్న కండగల ఫలం. ఇది ఏక లేదా బహుఫలదళ సంయుక్త అండకోశంలోని ఏకబిలయుత, ఊర్ధ్వ అండాశయం నుంచి ఏర్పడుతుంది. అంతఃఫలకవచం గట్టిగా టెంకగాలా ఉండటం ఈ ఫలం ప్రధాన లక్షణం. ఉదా: మామిడి, కొబ్బరి. మామిడిలో బాహ్యఫలకవచం చర్మిలంగాను, మధ్యఫలకవచం రసభరితంగా, కొద్దిగా పీచుతో గుజ్జులాగా తినడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కొబ్బరిలో బాహ్యఫలకవచం చర్మిలంగాను, మధ్యఫలకవచం పీచులాగా ఉంటాయి. అంకురచ్ఛదం తినవలసిన భాగం. శుష్క ఫలాలు (Dry fruits) : శుష్క విదారక ఫలాలు (Dry dehiscent fruits) శుష్క అవిదారక ఫలాలు (Dry indehiscent fruits) శుష్క భిదుర ఫలాలు (Dry schizocarpic fruits) thumb|220x220px|In some plants, such as this noni, flowers are produced regularly along the stem and it is possible to see together examples of flowering, fruit development, and fruit ripening సంకలిత ఫలాలు (Aggregate fruits) ఒకే పుష్పంలోని బహుఫలదళ అసంయుక్త అండకోశంలోని అండాశయాల నుంచి ఏర్పడే నిజఫలాలు. ప్రతిఫలదళంలోని అండాశయం ఒక చిరుఫలంగా (Fruitlet) అభివృద్ధి చెందుతుంది. ఈ చిరుఫలాలన్నీ ఒకే పుష్పవృంతం మీద సంకలితం చెంది (గుమిగూడి) ఒక సంకలిత ఫలాన్ని ఏర్పరుస్తాయి. ఉ. సీతాఫలం సంయుక్త ఫలాలు (Compound fruits) పుష్పవిన్యాసం, దాని అనుబంధ భాగాలు మొత్తం ఒకే ఫలంగా అభివృద్ధి చెందితే దాన్ని 'సంయుక్త ఫలం' అంటారు. అన్ని పుష్పాల నుంచి ఏర్పడే ఫలాలన్నీ కలసిపోయి, పక్వదశలో ఒకే ఫలంగా మారతాయి. ఇవి రెండు రకాలు. సోరోసిస్ : కంకి పుష్పవిన్యాసం నుంచిగాని, స్పాడిక్స్ నుంచిగాని లేదా కాట్ కిన్ పుష్పవిన్యాసం నుంచిగాని ఏర్పడుతుంది. ఉ. పనస, మల్బరీ, అనాస, సరుగుడు. సైకోనస్ : ఇది హైపన్ థోడియమ్ పుష్పవిన్యాసం నుంచి ఏర్పడే సంయుక్త ఫలం. దీనిలో పుష్పవిన్యాసవృంతం కండ కలిగిన గిన్నె వంటి నిర్మాణంగా ఏర్పడి, చూడడానికి ఒక ఫలంగా కనబడుతుంది. దీనిలోపలి అంచులలోని స్త్రీ పుష్పాలు ఫలాలుగా ఏర్పడతాయి. ఈ ఫలాలు ఎఖీన్ ల రూపంలో ఉంటాయి. ఉ. పైకస్ జాతులు thumb|right|అత్తిపండ్లు (హైదరబాద్) thumb|వాటర్ ఆపిల్ ఉపయోగాలు === ఆహార పదార్ధాలు === చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారము. ఉదా: మామిడి, పుచ్చ, ఆపిల్ మొదలైనవి. వీటిని కొంతమంది పండు మొత్తంగా గాని లేదా జామ్ ల రూపంలో తింటారు. పండ్ల నుండి ఐస్ క్రీమ్ లు, కేకులు మొదలైనవి తయారుచేస్తారు. కొన్ని పండ్లనుండి తీసిన ఫలరసం పానీయంగా తాగుతాము. ఉదా: నిమ్మ రసం, ఆపిల్ రసం, ద్రాక్ష రసం. కొన్నింటినుండి ఆల్కహాల్ తయారుచేస్తారు. ఉదా: విస్కీ, బ్రాందీ మొదలైనవి. చాలా వరకు కూరగాయలు వృక్షశాస్త్రం ప్రకారం పండ్లు. ఉదా: టొమాటొ, గుమ్మడి, దోస మొదలైనవి. ఆలివ్ పండ్ల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఆపిల్ పండ్లనుండి వినేగార్ తయారుచేస్తారు. కొన్ని మసాలా దినుసులు బెర్రీ మృదుఫలాలు ఉదా: మిరియాలు. ఇతరమైనవి నల్లమందు ఫలాల నుండి నల్లమందు, మార్ఫిన్ తయారుచేస్తారు. నారింజ తొక్కల రసాన్ని బొద్దింకలను తరమడానికి వాడతారు. చాలా రకాల పండ్లనుండి ప్రకృతి సిద్ధమైన రంజనాలు తయారుచేస్తారు. ఉదా: చెర్రీ, మల్బరీ . ఎండబెట్టిన దోస జాతి పండ్లనుండి నీటి జగ్గులు, పక్షి గూళ్ళు, సంగీత వాద్యాలు, కప్పులు, పాత్రలుగా ఉపయోగిస్తారు. కొబ్బరిపీచు నుండి బ్రష్ లు, తివచీలు, పరుపులు మొదలైనవి తయారుచేస్తారు. కొబ్బరిపెంకు నుండి కప్పులు, సంగీత వాద్యాలు, పక్షి గూళ్ళు తయారుచేస్తారు. పండ్లను కాల్షియం కార్బైడ్‌తో మగ్గబెట్టడం స్థానే ఇథలీన్‌ను ఉపయోగించడం సురక్షితమని భావిస్తున్నారు. thumb|293x293px|పాషన్ ఫ్రూట్స్ (హైదరబాద్) తెలుగు రాష్ట్రాల్లో విదేశీ పండ్ల సాగు (Exotic Indian fruits) థాయ్‌ పింక్‌ పండ్లు - వీటిని మనదేశంలో కశ్మీరీ ఆపిల్‌ బేర్‌గా పిలుస్తున్నారు. ‘తెలంగాణ లాల్‌ సుందరి’ అనే బ్రాండు పేరుతో రాష్ట్ర ఉద్యానశాఖ పంట సాగు చేయిస్తోంది. థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఈ మొక్కలను సిద్దిపేట జిల్లా ములుగులోని పంటల ప్రయోగ క్షేత్రంలో నాటి సాగుకు ఉద్యానశాఖ ఏర్పాట్లు చేయడమేకాక ఆసక్తిగల రైతులను కూడా మొక్కలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ పండ్ల సాగుకు తెలంగాణ భూములు, వాతావరణం అనుకూలం. అందుకని శరీరానికి కావాల్సిన పోషక విలువలు ఎన్నో ఉన్న థాయ్‌ పింక్‌ పండ్లను తక్కువ ధరలో అందించగల అవకాశముంది. తైవాన్ జామ - దేశి జాతుల రకాలతో పాటు ఎన్నో రకాల జామపండ్లు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. అందులో అధిక పోషకాలు కలిగిన తైవాన్ జామకు డిమాండ్ మరింత ఎక్కువ. సేద్యం పరంగా ఈ పంట సాగు తక్కువ నీటి వినియోగంతో రైతులకు లాభసాటిగా ఉంటుంది. పైగా ప్రకృతి విధానంలో తైవాన్ జామ సాగు జరుగుతుంది. తద్వారా వినియోగదారులకు రసాయనాలు లేని చక్కని పోషకాలు కలిగిన జామపండ్లు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి. డ్రాగన్‌ పండు - పిటాయ మొక్కకు కాసే వాటిని డ్రాగన్ పండ్లు (ఆంగ్లం: Dragon Fruits) అని అంటారు. ఇందులో శరీరానికి శక్తినిచ్చే ఫైబర్‌, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌లాంటి పోషకాలు కూడా అందుతాయి. విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఒకప్పుడు సంపన్నదేశాలకే పరిమితమైన డ్రాగాన్ ఫ్రూట్ కొంతకాలంగా ఇండోనేషియా, తైవాన్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌, పిలిప్పీన్స్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, దక్షిణ భారతదేశంలోనూ విరివిగా సాగు చేస్తుండడంతో అందరికీ చేరువైంది. వీటి సాగుకు నీరు ఇంకిపోయే నేలలు ఉత్తమం. సుమారు 20 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరం. ఇవి ఎడారిలో పెరిగే ముళ్ల చెట్లలా ఉంటాయి. పాషన్ ఫ్రూట్ - ఇది పాసిఫ్లోరా జాతికి చెందిన మొక్కల పండు. పండులో గుజ్జు భాగం తినడానికి రుచిగా ఉంటుంది. పాషన్ ఫ్రూట్‌లను పిండుకుని కూడా జ్యూస్‌గా చేసుకోవచ్చు. పాషన్ ఫ్రూట్స్ గుండ్రంగా ఉంటాయి. అవి పసుపు, ఎరుపు, ఊదా, ఆకుపచ్చ రంగులో ఉండవచ్చు. ఈ పండ్లు పెద్ద సంఖ్యలో విత్తనాలతో కూడి జ్యూసీగా ఉంటాయి. ఇవి కూడా చూడండి పండ్ల జాబితా మూలాలు వర్గం:పండ్లు వర్గం:ఆహార పదార్థాలు వర్గం:వృక్ష శాస్త్రము వర్గం:ఈ వారం వ్యాసాలు
అరటి
https://te.wikipedia.org/wiki/అరటి
అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (హెర్బ్-herb). ఇది మూసా అను ప్రజాతికి, మ్యుసేసియె (musaceae) కుటుంబానికి చెందినది.https://www.howtopronounce.com/musaceae కూర అరటికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా 2 నుండి 3 మీటర్లు పొడుగు) 4 నుండి 8 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. అరటి పండులో 80% లోపల ఉన్న తినగల పదార్థము ఉండగా, పైన తోలు 20% ఉంటుంది. వ్యాపార ప్రపంచములోనూ, సాధారణ వాడకములోనూ వేలాడే అరటికాయల గుంపును గెల అంటారు. గెలలోని ఒక్కొక్క గుత్తిని అత్తము (హస్తము) అంటారు. చరిత్ర పరంగా అరటిచెట్లను పశ్చిమ పసిఫిక్, దక్షిణ ఆసియా దేశాలలో (భారత దేశంతో సహా) సాగు చేశారు. చాలా రకాల అరటి పండ్ల రంగూ, రుచి, వాసన అవి పక్వానికి వచ్చే దశలో ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడయిపోయి పాలిపోవడం వల్ల వీటిని ఇండ్లలోని రిఫ్రిజిరేటర్లలో పెట్టరు. అలాగే రవాణా చేసేటప్పుడు కూడా 13.5 డిగ్రీ సెల్సియసు కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచరు. 2002 లోనే సుమారు 6.8 కోట్ల టన్నుల అరటిపండ్లు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడ్డాయి. ఇందులో 1.2 కోట్ల టన్నులు దేశాల మధ్య వ్యాపారపరంగా రవాణా చేయబడ్డాయి. ఈక్వడార్, కోష్టరికా, కొలంబియా, ఫిలిప్పైన్సు దేశాలు ప్రతి ఒక్కటీ పది లక్షల టన్నుల కన్నా ఎక్కువ అరటి పండ్లు ఎగుమతి చేస్తున్నాయి. అరటిలో పిండిపదార్థాలు/చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల పిండిపదార్థాలు, 1 గ్రాము మాంసకృత్తులు, 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నాయి. అరటి సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. భారతదేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు: పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం. వీటి నుండి చిప్సు కూడా తయారు చేస్తారు. 250px|right|thumb|అరటిపండ్లు thumb|right|అరటిపళ్లు చరిత్ర thumb|చక్రకేళీ అరటి చెట్టు ఆసియా వాయువ్య దేశాలలో పుట్టింది. ఇప్పటికీ కూడా చాలా రకాల అడవి అరటి చెట్లు న్యూ గినియా, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్సు లలో కనపడతాయి. ఇటివల దొరికిన పురావస్తు, శిలాజవాతావరణ శాస్త్ర ఆధారాలను బట్టి పపువా న్యూ గినియా లోని పశ్చిమ ద్వీప ఖండములోని కుక్‌ స్వాంపు వద్ద క్రీస్తు పూర్వం 8000 లేదా 5000 సంవత్సరాల నుండే అరటి తోటల పెంపకం సాగినట్లు నిర్ధారించారు. కాబట్టి న్యూ గినియాలో తొలి అరటి తోటల పెంపకం జరిగినట్లు నిర్ధారించవచ్చు. తరువాత ఇతర అడవి అరటి జాతులు దక్షిణ ఆసియా ఖండములో పెంపకము చేసినట్లు భావించవచ్చు. వ్రాత ప్రతులలో మొదటిసారిగా అరటి ప్రస్తావన మనకు క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో వ్రాసిన బౌద్ధ సాహిత్యంలో కనపడుతుంది. అలెగ్జాండరు తొలిసారిగా క్రీస్తు పూర్వం 327 వ సంవత్సరములో భారత దేశంలో వీటి రుచి చూశాడు. చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరము నుండి అరటి తోటల పెంపకం సాగినట్లుగా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. క్రీస్తు శకం 650 వ సంవత్సరములో ముస్లిం దండయాత్రల వల్ల అరటి పాలస్తీనా ప్రాంతానికీ, తరువాత ఆఫ్రికా ఖండానికీ వ్యాప్తి చెందింది. వందగ్రాముల అరటిలో వున్న పోషకాలు నీరు - 70.1 గ్రా. ప్రోటీన్ - 1.2 గ్రా. కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా. పిండిపదార్థాలు - 27.2 గ్రా. కాల్షియం - 17 మి.గ్రా. ఇనుము - 0.4మి.గ్రా. సోడియం - 37 మి.గ్రా. పొటాషియం - 88 మి.గ్రా. రాగి - 0.16 మి.గ్రా. మాంగనీసు - 0.2 మి.గ్రా. జింక్ - 0.15 మి.గ్రా. క్రోమియం - 0.004 మి.గ్రా. కెరోటిన్ - 78 మైక్రో గ్రా. రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా. సి విటమిన్ - 7 మి.గ్రా. థయామిన్ - 0.05 మి.గ్రా. నియాసిన్ - 0.5 మి.గ్రా. శక్తి - 116 కిలోకాలరీలు క్రీస్తుశకం 1502 లో పోర్చుగీసు వారు తొలిసారిగా అరటి పెంపకాన్ని కరేబియన్, మధ్య అమెరికా ప్రాంతములలో మొదలుపెట్టారు. వర్ణన right|250px|thumb|'ఆంధ్ర ప్రదేశ్ లో అరటి తోట' thumb|అమలాపురంలో అరటి చెట్టు అరటిపండ్లు రకరకాల రంగులలో, ఆకారాల్లో లభిస్తున్నాయి. పండిన పండ్లు తేలికగా తొక్క వలుచుకొని తినడానికీ, పచ్చి కాయలు తేలికగా వంట చేసుకుని తినడానికీ అనువుగా ఉంటాయి. పక్వ దశను బట్టి వీటి రుచి వగరు నుండి తియ్యదనానికి మారుతుంది. 'పచ్చి' అరటికాయలను వండటానికి ఉపయోగిస్తారు. కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లోని ప్రజలకు ఇది ప్రధాన ఆహారం. నిఖార్సయిన అరటి పండ్లు చాలా పెద్ద పెద్ద విత్తనాలను కలిగి ఉంటాయి, కానీ విత్తనాలు లేకుండా రకరకాల అరటి పండ్లను ఆహారం కోసం అభివృద్ధి చేసారు. వీటి పునరుత్పత్తి కాండం యొక్క తొలిభాగాల ద్వారా జరుగుతుంది. వీటిని పిలకలు, అరటి పిల్లలు అంటారు. కొన్ని పర్యాయములు ఈ పిలకలను పూలు అనికూడా పిలవడం పరిపాటి. ఒకసారి పంట చేతికి వచ్చిన తరువాత అరటి చెట్టు కాండాన్ని నరికివేసి, ఈ పిలకలను తరువాతి పంటగా ఎదగనిస్తారు. ఇలా నరికిన కాండం బరువు సుమారుగా 30 నుండి 50 కేజీలు ఉంటుంది. అరటి పువ్వులు అరటి చెట్లతో పాటు అరటి పువ్వును (దీనిని తరచూ అరటి పుష్పం లేదా అరటి హృదయం అని అంటారు) బెంగాలీ వంటలలో, కేరళ వంటలలో ఉపయోగిస్తారు. అరటి కాండములోని సున్నితమైన మధ్య భాగం (దూట) కూడా వంటలలో ఉపయోగిస్తారు - ముఖ్యముగా బర్మా, కేరళ, బెంగాలు, ఆంధ్ర ప్రదేశ్ లలో. అరటి పూవు జీర్ణ క్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును . ఇందులోని ఐరన్, కాల్సియం, పొటాసియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమముగా పనిచేసేటట్లు దోహదపడును . ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ధి చేయును . ఆడువారిలో బహిస్టుల సమయంలో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును. మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడును. అరటి ఆకులు అరటి ఆకులు చాలా సున్నితంగా, పెద్దగా సౌలభ్యంగా ఉంటాయి. ఇవి తడి అంటకుండా ఉంటాయి, అందువల్ల వీటిని గొడుగుకు బదులుగా వాడతారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోను, చైనా, జోంగ్జీ, మధ్య అమెరికాలలో వీటిని వంటకాలు చుట్టడానికి ఉపయోగిస్తారు. అరటిలో రకాలు అరటి పండు ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. భారతదేశంలో, మామిడి పండు తరువాత, రెండవ ముఖ్యమైన పండ్ల పండు అరటి, సంవత్సరం పొడవునా లభిస్తుంది, సరసమైన, పోషకమైనది, రుచికరమైనది,ఔషధ విలువలను కలిగి ఉంది, ఇతర దేశాలకు అరటి పళ్లను ఎగుమతి చేయవచ్చును. ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ రకాల అరటిపండ్లు ఉన్నాయి. అయితే, భారతదేశంలో 15 నుండి 20 రకాలు మాత్రమే ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించబడుతున్నాయి. వాణిజ్యపరంగా, అరటిని తినే పండ్ల (డెజర్ట్) రకాలు & వంటలలో ఉపయోగించే (పాక) రకాలుగా వర్గీకరించారు. పాక రకాల్లో పిండి పదార్ధాలు ఉండి, అవి పరిపక్వం చెందని రూపంలో కూరగాయలుగా ఉపయోగించబడతాయి. రోబస్టా, మంథన్, పూవాన్, మరుగుజ్జు కావెండిష్, నంద్రన్, ఎర్ర అరటి, బస్రాయి, అర్ధపురి, నయాలీ, సఫేద్ వెల్చి రస్తాలీ, కర్పుర్వల్లి మొదలైనవి ముఖ్యమైన పంటలు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పండించే అరటి రకాలు: కర్ణాటక - రోబస్టా, రస్తాలీ, డ్వాఫ్ కావెండిష్, పూవన్, మంథన్, ఎలకిబలే కేరళ - నెండ్రన్ (అరటి), పాలయంకోడన్ (పూవన్), రస్తాలీ, మంథన్, రెడ్ బననా, రోబస్టా ఆంధ్రప్రదేశ్ - డ్వాఫ్ కావెండిష్, రస్తాలీ, రోబస్టా, అమృత్పంత్, తెల్లాచక్రేలి, చక్రకేలి, మంథన్, కర్పూర పూవన్, యెనగు బొంత, అమృతపాణి బంగాళా తమిళనాడు - రోబస్టా, విరూపాక్షి, రెడ్ బనానా, పూవన్, రస్తాలీ, మంథన్, కర్పూరవల్లి, నేంద్రన్, సక్కై, పెయాన్, మత్తి అస్సాం - జహాజీ, చిని చంపా, మల్భోగ్, హోండా, మంజహాజీ, బోర్జాజీ (రోబస్టా), చినియా (మనోహర్), కాంచ్కోల్, భీమ్కోల్, డిగ్జోవా, కుల్పైట్, జతికోల్, భరత్ మోని జార్ఖండ్ - బస్రాయి, సింగపురి బీహార్ - చినియా, డ్వాఫ్ కావెండిష్, అల్పోన్, చిని చంపా, కోథియా, మాల్బిగ్, ముథియా, గౌరియా గుజరాత్ - లకాటన్, డ్వాఫ్ కావెండిష్, హరిచల్ (లోఖండి), గాందేవి సెలక్షన్, బస్రాయ్, రోబస్టా, జి-9, శ్రీమతి మధ్యప్రదేశ్ - బస్రాయ్ మహారాష్ట్ర - డ్వాఫ్ కావెండిష్, శ్రీమంతి, బస్రాయ్, రోబస్టా, లాల్ వెల్చి, సఫేడ్ వెల్చి, రాజేలి నేంద్రన్, గ్రాండ్ నైన్, రెడ్ బనానా ఒరిస్సా - డ్వాఫ్ కావెండిష్, రోబస్టా, చంపా పశ్చిమ బెంగాల్ - మోర్ట్మాన్, చంపా, డ్వాఫ్ కావెండిష్, జెయింట్ గవర్నర్, సింగపురి. ప్రపంచములో ఇతర దేశాలలో దేశాలలో సాగుబడిలో ఉన్న ఇతర జాతి అరటి పండ్లు ఈ విధంగా ఉన్నాయి. అవి డ్వాఫ్ కావెండిష్, జెయింట్ కావెండిష్, పిసాంగ్ మసాక్ హిజావు, ఐస్ క్రీం, 'ఎనానో గిగాంటే, మాచో, ఒరినోకో. బ్రెజిల్ దేశములో రోబస్టా, శాంటా కాటారినా సిల్వర్, బ్రెజిలియన్. చైనా దేశములో డ్వాఫ్ కావెండిష్ దక్షిణ ఆఫ్రికా దేశములో డ్వాఫ్ కావెండిష్, గోల్డెన్ బ్యూటీ ఆస్ట్రేలియాలో రోబస్టా, విలియమ్స్, కోకోస్, తూర్పు ఆఫ్రికా, థాయ్ లాండ్ దేశాలలో బ్లగ్గో, మారికోంగో, కామన్ డ్వాఫ్ ఫిలిప్పీన్స్ లో కామన్ డ్వాఫ్, ఫిలిప్పైన్ లకాటన్ తైవాన్ లో జెయింట్ కావెండిష్ ఇతిహాసాలలో ప్రస్తావన అరటి శుభ సూచకం అందుచేత అరటిని శుభకార్యాలలో తప్పకుండా వినియోగిస్తారు. దీని వెనుక ఒక ఇతిహాస సంబంధమైన కథ కూడా ఉంది. ఒకప్పుడు దుర్వాసమహాముని సాయంసంధ్యవేళ కూడా ఆదమరచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య (కదలీ) సంధ్యావందనం సమయం అయిన కారణమున ఆయనను నిద్ర నుండి మేలుకొల్పుతుంది. దుర్వాసుడు నిద్ర నుండి లేచి చూస్తే ఆయన నేత్రాల నుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ భస్మరాశి అయిపోతుంది. కొన్ని రోజుల తరువాత దుర్వాస మహర్షి మామ గారు తన కూతురు గురించి అడుగగా ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయినది అని చెప్పి, తనమామ గారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు దుర్వాసముని తన భార్య శుభపద్రమైన కార్యాలన్నింటిలో కదలీ ఫలం (సంస్కృతంలో కదలీ ఫలం అంటే అరటిపండు) రూపంలో వినియోగించబడుతుంది అని వరాన్ని ఇస్తాడు. కూర అరటిలోని రకాలు అరటి కాయలలో రెండు రకాలున్నాయి. ఒక రకం పండించి పండు మాగిన తరువాత తినడానికి ఉపయోగపడేవి. రెండో రకం కేవలం కూరలలో ఉపయోగపడేవి. ఇవి కూడా పండు మాగుతాయి కాని అంత రుచిగా వుండవు. వీటికి తోలు చాల మందంగా, గట్టిగా ఉంటుంది. వీటిని కూరలలో, ఇతర వంటకాలలో మాత్రమే ఉపయోగిస్తారు. కూర అరటి రకాలు పచ్చబొంత బూడిద బొంత పచ్చబొంత బత్తీసా బూడిద బొంత బత్తీసా పచ్చగుబ్బబొంత పలకల బొంత నూకల బొంత సపోటా బొంత నేంద్రం సిరుమల అరటి వామనకేళి అరటి సాగు నేలలు thumb|right|చీకటిగల కోసము అరటిచెట్ల పరిశీలన అరటి పంటకు మంచి సారవంతమైన ఒండ్రునేల కలిగిన డెల్టా భూముల్లో, నీరు బాగా ఇంకిపోయే భూములు అనుకూలం. ఇసుకతో కూడిన గరపనేలల్లో కూడా ఈ పంట పండించవచ్చు. భూమి 1మీ. కంటే లోతుగా ఉండి, 6.5-7.5 మధ్య ఉదజని సూచిక కలిగి, ఎలక్ట్రికల్ కండక్టివిటి 1.0 మీ.మోస్ కంటే తక్కువ కలిగిన భూములు అనుకూలము. నీరుసరిగా ఇంకని భూముల్లో, చవుడు భూములు, సున్నారపు నేలలు, గులక రాల్లు, ఇసుక భూములు ఈ పంటకు పనికి రావు.అరటి సాగు (ఈఫ్రెష్ ఇండియా) సాగు ఇబ్బందులు అరటికి చీడపీడల బెడద కొద్దిగా ఎక్కువ. దానికి కారణాలలో ఒకటి జన్యుపరమైన వైవిధ్యము లేకపోవడము అని భావిస్తారు. ఇవి ఎక్కువగా స్వపరాగ సంపర్కము వల్ల వృద్ధిపొందటము వల్ల జన్యుపరమైన వైవిధ్యము లేకపోవడానికి కారణంగా భావిస్తారు. కాండము ద్వారా ఫలదీకరణము చేయుపద్ధతి వల్ల వైరసులు చాలా తేలికగా వ్యాపిస్తాయి. బనానా బంచీ అనునది ఆసియాలో చాలా ప్రమాదకరమైన అరటి తెగులు. ఇది వ్యాపించిన చేయగలిగినదేమీ లేదు - పంటను తగలబెట్టి మిగిలిన పొలాలకు వ్యాప్తి చెందకుండా చూడటము తప్ప. బలమైన గాలులు వీచినప్పుడు ఎత్తుగా ఉన్న అరటి మొక్కలు విరిగిపోవడం, పడిపోవడం జరుగుతుంది. దీని వల్ల రైతులు నష్టపోతారు. అరటి గెల వేసినప్పుడు బరువుకి చెట్టు వంగి పోతుంది. పడి పోకుండా ఉండడానికి చెట్టుకు మద్దతుగా పంగాల కర్రలతో నిలబెట్టాలి. తల్లి చెట్టు చుట్టూ పిల్లలు మొక్కలు అధికంగా పుట్టి చాలా వేగంగా పెరుగుతాయి. వీటిని ఎప్పటికప్పుడు నరికి వేయాలి. లేకపోతే తల్లి చెట్టు ఎదుగుదల నెమ్మదించడం లేదా బలహీనంగా ఎదగడం, గెల సరిగ్గా రాకపోవడం జరుగుతుంది. కనీసం వారం లేదా పది రోజులకు ఓ సారి అరటి పిలకలు లేదా పిల్లలు నరకవలసి ఉంటుంది. పోషక విలువలూ, ఆహార పద్ధతుల మీద ప్రభావము 250px|thumb|right|శ్రీలంకలోని ఎర్ర అరటి రకము అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23% కార్బోహైడ్రేటులు, 1% ప్రోటీనులు, 2.6% ఫైబరు ఉంటుంది. ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్ధతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి. కాని, అరటి పండు చవక, ఆపిలు పండు ఖరీదు. ఆయుర్వేదంలో అరటి పళ్లలోని పోషక విలువల గురించి దాదాపు అందరికీ తెలుసు. పండిన అరటి పళ్లలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బీ3, విటమిన్ సీలతోపాటు కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉన్నాయి. భారతదేశంలో పూర్వము నుంచి వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. పళ్లు, ఆకులు, పువ్వులు, అరటి దవ్వ ఇలా అన్నింటినీ వైద్యంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో భాగంగా మధుమేహ నివారణకు అరటి పువ్వు, దవ్వలను ఉపయోగిస్తుంటారు. అరటి కాండం లోపలి రసాన్ని కీటకాలు కుట్టినప్పుడు, కుష్టు రోగ నివారణలో ఉపయోగిస్తుంటారు. రక్తపోటు, నిద్రలేమి లాంటి ఒత్తిడి సంబంధిత వ్యాధుల నివారణలోనూ అరటి ఉపయోగం ఉన్నది. అరటి వాడకం, ప్రయోజనాలు అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర, అరటి వేపుడు, అరటి బజ్జీ మొదలైనవి. అరటితో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. బనానా చిప్స్‌ అనునది అరటి కాయ నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. చాలా కంపెనీలు దీని వ్యాపారం లాభదాయకంగా నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో, ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాలు, పట్టణాలలో ఇవి చాలా విరివిగా లభిస్తాయి. మామూలు బంగాళదుంప లేదా ఆలూ చిప్స్‌ కన్నా కొద్దిగా మందంగా ఉంటాయి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్‌ సలాడ్‌ లలోనూ, ఉపయోగిస్తారు. అరటి పండ్లలో సుమారుగా 80% నీళ్ళు ఉన్నప్పటికీ, చారిత్రకంగా వీటినుండి రసం తీయడం అసాధ్యంగా ఉండినది, ఎందుకంటే వీటిని మిక్సీలో పట్టినప్పుడు అది గుజ్జుగా మారిపోతుంది. కానీ 2004 వ సంవత్సరంలో భాభా ఆటామిక్‌ పరిశోధనా సంస్థ (బార్క్‌) వారు ఓ ప్రతేకమైన పద్ధతి ద్వారా అరటి పండ్లనుండి రసాలు తయారు చేయడం రూపొందించి, పేటెంటు పొందినారు. ఈ పద్ధతిలో అరటి పండ్ల గుజ్జును సుమారుగా నాలుగు నుండి ఆరు గంటల పాటు ఓ పాత్రలో చర్యకు గురిచేయడం ద్వారా పండ్ల రసాన్ని వెలికితీస్తారు. thumb|right|అరటి కాయలు\పాలకొల్లు సంతలో తీసిన చిత్రము అరటి పండు సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఆహారంగా ప్రధానమైనది. భోజనం తరువాత అరటి పండు తినడం ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. పెళ్లి భోజనాలలో అరటి పండు ఖచ్చితంగా ఉండాల్సిందే. అలంకారణలో కూడా బాగా వాడుతారు. అరటి చెట్టు నుండి గెలను కోసిన తర్వాత అరటి బోదెను విడదీస్తే అది అర్ద చంద్రాకరంగల పొడవాటి దళసరిగా వున్న పట్టలు వస్తాయి. వాటినుండి సన్నని పట్టు దారం లాంటి దారాన్ని తీసి దాంటో అందమైన అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. అవి చాల మన్నిక కలిగి చాల అందంగా వుంటాయి. అయ్యప్ప స్వాములు పూజలు చేసేప్పుడు పడికట్టు నిర్మాణానికి, పూజకు వాడుతారు. ఇది చూడడానికి చాలా అందంగా, శోభాయమానంగా ఉంటుంది. అరటి చెట్టు శుభ సూచకం. అందువల్ల శుభకార్యాలలో బాగా వాడుతారు. ఆకులు బాగా ఉన్న అరటి పిల్లలను మొదలుకు నరికి పెళ్లిలలో మండపాల అలంకరణకు, పండుగలకు దేవాలయం, దేవుడి మెరమణకు, జాతర వంటి విశేషాల్లోనూ, దేవుని ఊరేగింపు రథం స్తంభాలకు, దేవాలయ స్తంభాలకు కడతారు. పల్లెల్లో ఇది బాగా వాడుకలో ఉంది. అరటి ఆకులు భోజనానికి విస్తరిగా వాడుతారు. గ్రామీణ ఆచార సంప్రదాయాలలో అరటి ఆకు చాలా కాలంగా వాడబడుతోంది. హోటల్లలో కూడా ఇటీవల అరటి ఆకులు బాగా వాడుతున్నారు. అరటి ఆకులో భోజనం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. చాలా మంది ఆరోగ్యరీత్యా పరిమిత ఆహారం తీసుకునేవారు(డైటింగ్ చేసేవారు), వ్యాయామశాలకు వెళ్ళేవారు తగిన శక్తి కోసం ముందు అరటి పండు తింటారు. ఇందులో సరైన పోషకాలు ఉంటాయి. పచ్చి అరటికాయలతో రుచికరమైన కూరలు, వేపుడులు చేయవచ్చు. చిప్స్ తయారీ లోనూ వాడుతారు. రోజు అరటి పండు తినడం వల్ల బరువు, ఊబకాయం, ప్రేగు సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం ఉపశమనం, విరేచనాలు, రక్తహీనత, క్షయవ్యాధి, ఆర్థరైటిస్, గౌట్, మూత్రపిండాలు, మూత్ర రుగ్మతల నుండి అరటి పండు కాపాడుతుంది. అరటిని ఆనారోగ్యానికి ఔషధంగా వాడతారు. రోజు అరటి పండు తినడం వల్ల రక్తపోటును తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, రోగనిరోధకత పెంచడం లొ సహాయపడుతుంది. అరటి ని తినడం వలన కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి. బలమైన ఎముకలను నిర్మించడం వల్ల శరీర పెరుగుదలకు, ఎముకల దృఢత్వానికి మంచిది.అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అరటి సాగు ఉద్యాన రైతులకు ఓ ఆదాయ వనరు. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా మట్టిలో కలిసి పోతుంది. అరటి ఆకులు పాడి ఉన్నవారు గేదెలకు మేతగా వేయవచ్చు. దీనిలో అత్యధికంగా ఉండే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్) ను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు. అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి. అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది. పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే ఓ అరటిపండు తినండని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి ప్రకృతిసిద్ధ యాంటాసిడ్‌గా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటాసిడ్‌ల ప్రభావం పొట్టలో పుండ్లను తగ్గిస్తుంది. అమెరికాలో పాయిజన్ ఐవీ (poison ivy) అనబడే చెట్లు చర్మానికి తగిలిన వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధిని అరటిపండు తోలు లోపలి భాగంతో రుద్ది నయం చేస్తుంటారు అరటికి ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే 'బాన్‌లెక్‌' అనే రసాయనం ఎయిడ్స్‌ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్‌ నిరోధానికి వాడుతున్న 'టీ20, మారావిరాక్‌' మందులతో సమానంగా ఈ రసాయనం పనిచేస్తుంది..అరటిలోని లెక్టిన్‌ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది.ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్‌ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది. అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి. అరటి తొక్క లోపల బాగాన్ని దోమ కరచిన దగ్గర రుద్దడం వలన దురద, వాపు తగ్గిపోతుంది. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలకు మంచిది. కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇది ఉపకరిస్తుంది. వారానికి 2-3 అరటి పండ్లు తినే మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. అరటి పండ్లు కణ నష్టాన్ని నివారిస్తాయి. సంప్రదాయ విశేషాలు పూర్వం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు అరటి ఆకులో భోజనం పెట్టేవారు. అరటి ఆకులోని భోజనంలో విషం కలిపితే ఆకు నల్లగా మారిపోతుంది. అందుకే ఇంటికి వచ్చిన అతిథుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరటి ఆకులో భోజనం పెట్టేవారు.https://telugu.oneindia.com/jyotishyam/feature/is-there-any-rules-take-food-201060.html ఇతరుల ఇండ్లకు లేదా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు భోజనం చేసిన తరువాత అరటి ఆకు మనవైపు మడవాలి. అటువైపు మడిస్తే సంబంధాలు చెడిపోతాయని నమ్మకం. అంతరించే ప్రమాదం thumb|చక్రకేళీ ఓ దశాబ్దంలో ఆహారంగా స్వీకరించు అరటి జాతి అంతరించు ప్రమాదంలో ఉంది. ప్రస్తుతము ప్రపంచ వ్యాప్తముగా తిను కావెండిషు అరటి (మన పచ్చ అరటి ?) జన్యుపరంగా ఎటువంటి వైవిధ్యాన్నీ చూపలేకపోవడం వల్ల వివిధ రకాల వ్యాధులకు గురిఅవుతుంది. ఉదాహరణకు 1950 లో పనామా వ్యాధి, ఇది నేల శిలీంధ్రము (ఫంగస్) వల్ల వచ్చి ‌బిగ్ మైక్ రకానికి చెందిన అరటి జాతిని పూర్తిగా తుడిచిపెట్టినది. నల్ల సిగటోక (black sigatoka) వ్యాధి. ఇది కూడా మరో రకం శిలీంధ్రము వల్ల వచ్చిన వ్యాధే కానీ చాలా త్వరితగతిన వ్యాపించింది. ముఖ్యముగా మధ్య అమెరికా లోనూ ఆఫ్రికా, ఆసియా ఖండములలో ఇది వ్యాపించింది. ట్రోపికల్ జాతి 4 అనబడు ఓ క్రొత్త వ్యాధికారకము కావెండిషు (పచ్చ అరటి?) జాతికి చెందిన అరటితోటలపై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావము వల్ల... వాయువ్య ఆసియాలో అందువల్ల ఇక్కడినుండి వచ్చే అరటి ఎగుమతులపై కొద్దిగా జాగ్రత్త వహించడం ప్రారంభం అయింది. ఈ వ్యాధి వ్యాపించకుండా ఇతర దేశాలవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొంటూ మట్టినీ, అరటి పండ్లను జాగ్రత్తగా పరిశీలించసాగారు. గ్రాస్ మికేలు లేదా బిగ్ మైక్ అను రకానికి చెందిన అరటిది ఒక విషాద కథ. ఇది పనామా వ్యాధి వల్ల 1950లో పూర్తిగా తుడిచిపెట్టబడింది. ఈ బిగ్ మైక్ రకం సమ శీతల, లేదా శీతల దేశాలకు ఎగుమతి చేయడానికి చాలా అనువుగా ఉండేది. కొంతమంది ఇప్పటికీ దీని రుచిని మరిచిపోలేక ప్రస్తుతము లభిస్తున్న పచ్చ అరటి కన్నా బిగ్ మైక్ రుచికరంగా ఉంటుంది అంటూ వాదిస్తుంటారు! అంతే కాకుండా రవాణాకు కూడా బిగ్ మైక్ చాలా అనుకూలంగా ఉండేది, అదే పచ్చ అరటి రవాణా విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. అరటి వ్యాపారం అరటి ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. కానీ చాలామంది అరటి సాగుబడిదారులకు మాత్రం మిగిలేది, లేదా గిట్టుబాటయ్యేది చాలా స్వల్ప మొత్తాలలోనే. మధ్య అమెరికా ఎగుమతులలో అరటి, కాఫీ సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఎగుమతులలో ఇవి రెండు కలిపి 1960లో 67 శాతం వాటా కలిగిఉన్నాయి. బనానా రిపబ్లికు అను పదం స్థూలంగా మధ్య అమెరికాలోని అన్ని దేశాలకూ వర్తించినప్పటికీ నిజానికి కోస్టారికా, హోండూరస్, పనామాలు మాత్రమే నిజమైన బనానా రిపబ్లికులు. ఎందుకంటే వీటి ఆర్థికవ్యవస్థ మాత్రమే అరటి వ్యాపారంపై ఆధారపడి ఉంది. అరటిపండు పట్ల జనాల వైఖరి అరటి పండు చాలా ప్రముఖమైన, ప్రసిద్ధి పొందిన పండు. ఇది చాలా మందికి ఇష్టమైన పండు. కానీ కోతులు, కొండముచ్చులు అరటిపండును రకరకాల పద్ధతిలో తినే ఫోటోలు చాలా ప్రసిద్ధి పొందటంవల్ల ఈ అరటి పండు అనే పదాన్ని కొన్ని ప్రాంతాలలో జాతిపరమైన అపహాస్యములకు ఉపయోగించారు. ముఖ్యముగా ఆటగాళ్ళపై అరటిపండు తొక్కలు విసిరివేయడం, కుళ్ళిన టమాటాలు, కోడిగుడ్లు అంత ప్రసిద్ధి. మలేషియాలోనూ, సింగపూరులోనూ అరటిపండును చైనీసు భాష రాని, లేదా ఎక్కువగా ఆంగ్లేయుడిలాగా ప్రవర్తిస్తున్న చైనీయునికి పర్యాయపదంగా వాడతారు. ఎందుకంటే అరటిపండుకూడా పైన పసుపు, లోన తెలుపు కాబట్టి. అరటిపాట బాల సాహిత్యంలో "అరటిపాట" అనే పాట ప్రాచుర్యం పొందింది. సరళమైన ఈ పాట ఆరంభ తరగతుల పుస్తకాలలో పాఠ్యాంశంగా కూడా చేర్చారు. చూడండి బనానా రిపబ్లిక్ - అవినీతిలో కూరుకునిపోయిన దేశాన్ని (సాధారణంగా ఓ మిలటరీ నియంత ఆధీనంలోని దేశాన్ని) పిలిచే ఓ హీనమైన పేరు. మూలాలు గ్రంథ పట్టిక Denham, T., Haberle, S. G., Lentfer, C., Fullagar, R., Field, J., Porch, N., Therin, M., Winsborough B., and Golson, J. (2003) Multi-disciplinary Evidence for the Origins of Agriculture from 6950-6440 Cal BP at Kuk Swamp in the Highlands of New Guinea. సైన్స్, జూన్, 2003 సంచిక బయటి లింకులు సంపూర్ణ న్యూట్రిషను వివరాలు . అరటి పండు యొక్క అంతర్జాతీయ నెట్వర్కు (INIBAP) జూలియా మోర్టిన్ గారు రచించిన ఉష్ణ మండలపు పండ్లు లోని అరటి పండు వ్యాసము , pp. 298211;46. అరటిపండ్లు మంచికోసం చీలును అను బీబీసి వ్యాసం ఐక్యరాజ్య సమితి ఆహార మరియూ వ్యవసాయ సంస్థ నుండి మరిన్ని వివరాలు . అరటి లుప్తమవ్వును అను పుకార్లపై వృక్ష శాస్త్రవేత్తల విమర్శ అరటి విశేషాలు - కాలిఫోర్నియా అరుదైన పండ్ల పెంపక సంఘము . పపువా కొత్త గునియాలో అరటి పెంపకపు మూలాల శోధన వర్గం:కూరగాయలు వర్గం:పండ్లు వర్గం:ఈ వారం వ్యాసాలు
బొరుగులు
https://te.wikipedia.org/wiki/బొరుగులు
thumb|250px|right|మరమరాలు. thumb|right|బొరుగులు మరమరాలను వివిధ ప్రాంతాల్లో బొరుగులు, ముర్ముర్లు, మురీలు (ఆంగ్లం: Puffed rice) అని కూడా అంటారు.జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి చేసిన పేలపిండిని రైతులు తొలి ఏకాదశి రోజున కచ్చితంగా తింటారు. తయారుచేసే విధానం వరిని ఉడకబెట్టండి నీరు వంచి వెయ్యండి ఎండ బెట్టండి పొట్టు తీసివెయ్యండి ఒక గిన్నెలో ఇసుక వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించండి జల్లెడ పట్టి ఇసుకని తీసివెయ్యండి ఉపయోగాలు మరమరాలు చాలా తేలినకైన ఆహారం. చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. సోడియం తక్కువగా ఉండటం లన రక్తపోటు స్థిరంగా ఉంటుంది ఇది సాధారణంగా అల్పాహారం తృణధాన్యాలు, ఉప్మా, బేల్ పూరి వంటి చిరుతిండ్లు, మిఠాయి లలో ఉపయోగించబడుతుంది. వీటిలో తరచుగా కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇవి ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన చిరుతిండి కోసం చూస్తున్నవారికి ప్రసిద్ధ ఎంపిక. మూలాలు వర్గం:ఫలహారాలు
జానపద గీతాలు
https://te.wikipedia.org/wiki/జానపద_గీతాలు
జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు. ఆంధ్రప్రదేశ్ లో జానపద కళలు ఒగ్గు కథ, బుర్రకథ, కోలాటం, తోలుబొమ్మలాట, తప్పెటగుళ్ళు, శారదగాండ్రు, చెంచుబాగోతం, కొమ్ముకథ, వీధి నాటకం, పిచ్చుకకుంట, వీరముష్టి, దొమ్మరాట, కొఱవంజి, గొల్లసుద్దులు, జంగం కథ, జక్కుల కథ, కాటిపాపలకథ, దాసరికథ, చెక్క భజన, యక్షగానం, పులివేషాలు ...తెలుగువారి జానపద కళారూపాలు అనే పుస్తకంలో మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు వీటిని విపులంగా చర్చించారు. కొండవీడు మందేరా - కొండపల్లి మందేరా కాదనువాడుంటే - కటకం దాకా మందేరా చూసినారా ఎంత వీర పదమో, ఈ పదము వెనక ఒక చిన్న కథ ఉన్నది, శ్రీ కృష్ణదేవరాయలు కటకంపై యుద్ధానికి వెళ్తూ శకునం చూడగా ఒక రజకుడు ఈ పాట పాడుతూ తన బిడ్డడిని నిద్రపుచ్చుతున్నాడంట. అలాగే ఈ దిగువ మాయలేడి కోలాటం పాట చుడండి కోలాటం పాట రామయ్య గట్టించే కోలు రత్నాల మేడ కోలు సీతమ్మ గట్టించే కోలు సిరిపరినా సోల కోలు సిరిపర్నసోలాలా కోలు సిత్తారీ ముగ్గు కోలు సిత్తారి ముగ్గు పైనా కోలు రత్నాల కమ్మడీ కోలు రత్నాల కమ్మడీ పైనా కోలు వాలు చిలకాలు కోలు వాలు చిలుకలపినా కోలు వారిద్దరయ్యా కోలు రామయ్యా సీతమ్మా కోలు జూదమాడంగా కోలు ఆడుతాడుత వచ్చే కోలు అది మాయలేడి కోలు మాయాలేడికైనా కోలు మడిమే లందమ్మూ కోలు అటుజూడురామయ్య కోలు అటుజూడావయ్యా కోలు .....ఇలా సాగి పోతుంది దీనిని శ్రీ బిరుదురాజు రామరాజు గారు 1956లో నల్లగొండ జిల్లా కేతేపల్లి గ్రామంలో కట్టెకోత వృత్తివాల్ల దగ్గర నుండి సేకరించారు. ఇహ జానపదాలను రకరకాలుగా విభజించ వచ్చు వివిధ రస పోషణనును బట్టి, అనగా హాస్యాది నవరస పోషణను బట్టి వివిధ వస్తు నిర్ణయాన్ని బట్టి, అనగా భక్తి, చారిత్రిక, స్త్రీల పాటలు ఇత్యాది ఇంకా వాటి లోని కవిత్వ నిర్ణయాన్ని బట్టి కవిత్వాంశాలను బట్టి జానపద విభజనము thumb|right|జానపద గాయకులు జోల పాటలు లాలి పాటలు పిల్లల పాటలు బతుకమ్మ పాటలు గొబ్బిళ్ళ పాటలు సుమ్మీ పాటలు బొడ్డేమ్మ పాటలు ఏలెస్సా, ఓలెస్సా పాట వానదేవుని పాటలు తుమ్మెద పాటలు సిరిసిరి మువ్వ పాటలు గొల్ల పాటలు జాజఱ పాటలు కోలాటపు పాటలు తలుపుదగ్గర పాటలు ఏల చిలుక సువ్వాల భ్రమర గీతాలు నాట్ల పాటలు కలుపు పాటలు కోతల పాటలు చెక్కభజన పాటలు జట్టిజాం పాటలు వీధిగాయకుల పాటలు పెళ్ళి పాటలు గ్రామదేవతల పాటలు తత్త్వాలు భిక్షుకుల పదాలు ఇంకా వర్గీకరింపబడని గీతాలు ఇవికూడా చూడండి రాయలసీమ జానపద గీతాలు జానపదసాహిత్యం - మానవతా దృక్పథం: రంజని తెలుగు సాహితీ సమితి ప్రచురణ మునెయ్య - ప్రముఖ జానపద గాయకుడు వర్గం:జానపద సాహిత్యం
యాదగిరిగుట్ట
https://te.wikipedia.org/wiki/యాదగిరిగుట్ట
thumb|యాదగిరిగుట్ట గ్రామం యాదగిరిగుట్ట, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016ఇది జనగణన పట్టణం. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగష్టు 2న పురపాలక సంఘం గా మారింది. ఇది హైదరాబాదు నుండి వరంగల్లు వెళ్లు రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉంది.తెలంగాణలో పేరు పొందిన ఆద్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది. స్థల చరిత్ర thumb|శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ముఖద్వారం. యాదగిరిగుట్ట పూర్వం యాద మహర్షి అనబడే ముని ఇచ్చట తపస్సు చేసి ఆ నారసింహుని దర్శనం పొందాడు. ఆ ముని కోరిక ప్రకారంగా ఈ కొండ యాదగిరి అని పిలవబడుతుంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం thumb|శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రధాన ఆలయ గోపురం. యాదగిరిగుట్ట ప్రధాన వ్యాసం: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దివ్య క్షేత్రం. యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏంకావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము thumb|శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్ట మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునకు గుర్రముమీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆదారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్తలక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంనందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు. రవాణా సౌకర్యం రాయగిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైద్రాబాదు, వరంగల్, నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి.హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము (ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.లకు మొదటి బస్సు ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపోలో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం. 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి యాద‌గిరిగుట్ట పట్టణంలో ప్రస్తుతం ఉన్న 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఏరియా ఆసుప‌త్రిగా మారుస్తూ 2022 నవంబరు 30న తెలంగాణ ప్ర‌భుత్వ వైద్యా విధాన ప‌రిష‌త్ ఉత్త‌ర్వులు జారీచేస్తూ, దీని నిర్మాణానికి 45.79 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. దీంతో పాటు ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా 13 ప్రాథ‌మిక ఉప కేంద్రాల‌ను మంజూరు చేసింది ప్ర‌భుత్వం. ఒక్కో ఆస్ప‌త్రి నిర్మాణానికి రూ. 20 ల‌క్ష‌లు కేటాయించింది. ప్రభుత్వ వైద్య కళాశాల యాదగిరిగుట్ట పట్టణంలో 183 కోట్ల రూపాయలతో యాదాద్రి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు 2023 జూలై 5న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా 2023 సెప్టెంబరు 16న పరిపాలనా అనుమతులతో జిఓ 162ను జారీ చేసింది. 20 ఎకరాల్లో వైద్య కళాశాల, దానికి అనుబంధంగా 300 పడకల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నిర్మించబడనున్నాయి. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు వర్గం:తెలంగాణ రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
కంప్యూటరు భాషలు
https://te.wikipedia.org/wiki/కంప్యూటరు_భాషలు
350px|thumbnail కంప్యూటరు భాషలు భాష నునది మనిషి మనిషి మాట్లాడుకోవడానికే కాకుండా కంప్యూటర్లుతో మాట్లాడటానికి కూడా ఉపయోగ పడతాయి అసలు కంప్యూటరునకు అర్దమవ్వునది రెండే రెండు సున్నా, ఒకటి వీటినుండి మెషను భాష లేదా యాంత్రిక భాష తయారు చేసారు కాని వీటిలో మనము కంప్యూటరుతో మాట్లాడటం కష్టం కనుక ఇతర భాషలు తయారు చేసారు వీటిని మూడు రకాలగా విభజించవచ్చు భాష రకాలు. మెషిన్, అసెంబ్లీ భాషలు. అల్గోరిథమిక్ భాషలు. వ్యాపార ఆధారిత భాషలు. COBOL. ఎస్ క్యూఎల్. విద్య-ఆధారిత భాషలు. హైపర్ టాక్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ భాషలు. డిక్లేరేటివ్ భాషలు మొదలైనవి. ఇవి కంప్యూటర్ కు ఆదేశాలను కమ్యూనికేట్ చేయడం కొరకు డిజైన్ చేయబడ్డ కృత్రిమ భాషలు. మెషీను స్థాయి భాషలు ఇవి కంప్యూటరు నేరుగా అర్దము చేసుకొను భాషలు మధ్య స్థాయి భాషలు ఇవి మిడిల్ లెవెలు భాషలు అన్నమాట, వీటిని మనుషులు కూడా తేలికగా అర్ధము చేసుకొనవచ్చు. కంప్యూటర్లు ఈ భాషలను అర్ధము చేసుకొవాలంటే పూర్తిగా మెషిను భాషలోనికి మార్చుకొని మాత్రమే అర్ధము చేసుకుంటాయి ఉదాహరణ: సీ, సీ ప్లస్ ప్లస్, ఇతరములు ఉన్నత స్థాయి భాషలు ఇవి మనకు తేలికగా అర్ధము అవ్వడానికి కంప్యూటర్ భాషల రకాలు కన్ స్ట్రక్షన్ లాంగ్వేజ్, కాన్ఫిగరేషన్, టూల్ కిట్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లను కలిగి ఉండే ఒక సాధారణ కేటగిరీ కమాండ్ లాంగ్వేజ్, ఇతర ప్రోగ్రామ్ లను ప్రారంభించడం వంటి కంప్యూటర్ యొక్క విధులను నియంత్రించడానికి ఉపయోగించే భాష. ఆకృతీకరణ భాష, ఆకృతీకరణ ఫైళ్లను వ్రాయడానికి ఉపయోగించే భాష ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మెషిన్ కు, మరిముఖ్యంగా కంప్యూటర్ కు ఆదేశాలను కమ్యూనికేట్ చేయడం కొరకు డిజైన్ చేయబడ్డ ఫార్మల్ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్ యొక్క ఒక కుటుంబానికి దగ్గరగా ఉండే భాష,, ఇది రాయడం సులభతరం చేయడానికి నిమోనిక్స్ ని ఉపయోగిస్తుంది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, టాస్క్ ల యొక్క అమలును ఆటోమేట్ చేసే ప్రత్యేక రన్ టైమ్ ఎన్విరాన్ మెంట్ కొరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్; మానవ ఆపరేటర్ ద్వారా ఒక-ద్వారా అమలు చేయబడ్డ టాస్క్ లను ప్రత్యామ్నాయంగా అమలు చేయవచ్చు. మెషిన్ లాంగ్వేజ్ లేదా మెషిన్ కోడ్, కంప్యూటర్ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా నేరుగా అమలు చేయబడ్డ ఆదేశాల సెట్ మార్కప్ లాంగ్వేజ్, HTML వంటి టెక్ట్స్ నుంచి సింటాక్టికల్ గా వేరు చేసే విధంగా డాక్యుమెంట్ ని యానోటేట్ చేయడానికి ఒక గ్రామర్. లైట్ వెయిట్ మార్కప్ లాంగ్వేజ్ మోడలింగ్ లాంగ్వేజ్, సమాచారాన్ని లేదా పరిజ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించే ఒక సంప్రదాయ భాష, తరచుగా కంప్యూటర్ సిస్టమ్ రూపకల్పనలో ఉపయోగించడానికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లను మోడల్ చేయడానికి ఉపయోగించే హార్డ్ వేర్ వివరణ భాష పేజీ వివరణ భాష, వాస్తవ అవుట్ పుట్ బిట్ మ్యాప్ కంటే అధిక స్థాయిలో ప్రింట్ చేయబడ్డ పేజీ యొక్క అప్పియరెన్స్ ని వివరిస్తుంది. క్వైరీ లాంగ్వేజ్, డేటాబేస్ లు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ల్లో క్వైరీలను చేయడానికి ఉపయోగించే భాష. అనుకరణ భాష, అనుకరణలను వర్ణించడానికి ఉపయోగించే ఒక భాష స్టైల్ షీట్ లాంగ్వేజ్, సిఎస్ ఎస్ వంటి నిర్మాణాత్మక డాక్యుమెంట్ ల యొక్క ప్రజంటేషన్ ని వ్యక్తీకరించే కంప్యూటర్ లాంగ్వేజ్. మూలాలు వర్గం:గణక ప్రక్రియ
పద్య కవిత
https://te.wikipedia.org/wiki/పద్య_కవిత
పద్య కవిత ఒక ఛందోబద్దమైన నడకలో కూర్చబడేది. మనం అక్షరాలను, వాటిని పలకడానికి పట్టే సమయాన్ని బట్టి అంటే ఒక లిప్తకాలంలో పలికే అక్షరాలను లఘువుఅని, రెండు లిప్తలకాలం పట్టే అక్షరాలను గురువు అని అంటారు. ఈ లఘువు,గురువులు రెండు కన్నా ఎక్కువగా కలిసినప్పుడు దానిని గణము అంటారు. వీటిలో రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి. ఇటువంటి గణములతో కూర్చిన నియమబద్ధమైన గతిలో అక్షరాలను కూర్చడమే ఛందస్సు. పద్యాలభేదాలను బట్టి గణాల అమరికి ఉంటుంది. పద్యాలలో వృత్తాలు, జాతులు, ఉపజాతులు అనే భేదాలు కనిపిస్తాయి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మొదలైనవి వృత్తాలు. కందము, ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనేవి ఉపజాతులు. లయబద్దంగా సాగుతున్న పద్యంలో వచ్చే విరామస్థానాన్ని యతి అంటారు. అలాగే ప్రాస అంటే పద్యం ప్రారంభంలో కానీ, పద్యపాదాల చివరగానీ ఒకే అక్షరం పదే పదే రావడం. దీనివల్ల పద్యం ఇంపుగా వినబడుతుంది.తెలుగు పద్యాలలో యతి ప్రాసలు పద్య లక్షణాలను బట్టి నియమబద్ధంగా వస్తాయి. మొత్తానికి తెలుగు సాహిత్యానికే ప్రత్యేకమయిన పద్య రచన గురించి, పద్యాలలో ఛందస్సు నియమాలగురించి ఏమాత్రం అవగాహన లేకుండా పద్య రచన కుదరదన్నమాట. గణ, యతి, ప్రాస నియమాలను తెలుసుకుంటేనే ఆయా రీతులలో పద్యరచన సాగుతుంది. ఇవి కూడా చూడండి కవిత వచన కవిత గేయకవిత ఛందస్సు మూలాలు బయటి లింకులు వర్గం:తెలుగు సాహిత్యం
కాణిపాకం
https://te.wikipedia.org/wiki/కాణిపాకం
కాణిపాకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, ఐరాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఐరాల నుండి 16 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1267 ఇళ్లతో, 4960 జనాభాతో 729 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2500, ఆడవారి సంఖ్య 2460. షెడ్యూల్డ్ కులాల జనాభా 1531 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 21. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 596496. ఇది ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అనేక ప్రాచీన ఆలయాలున్నాయి.ఈ ఊరు నాలుగింట మూడవవంతు (3/4 వంతు) వివిధ దేవాలయాలతో నిండి ఉంది. భౌగోళికం కాణిపాకం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. సమీప గ్రామాలు కొత్తపల్లె 1 కి.మీ. చిగరపల్లె 1 కి.మీ. కొత్తపల్లె 2 కి.మీ. ఉత్తర బ్రాహ్మణ పల్లె 2 కి.మీ. పట్నం 2 కి.మీ. దూరములో ఉన్నాయి. జనగణన గణాంకాలు 2011 జనగణన ప్రకారం 1267 ఇళ్లతో మొత్తం 4960 జనాభాతో 729 హెక్టార్లలో విస్తరించి ఉంది. జనాభాలో పురుషులు 2,500 - స్త్రీలు 2,460. గృహాల సంఖ్య 1,267 పేరు వెనుక చరిత్ర కాణి అంటే ఎకరం పావు మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. వరసిద్ధి వినాయక దేవాలయం thumb|280x280px|కాణిపాకం ఆలయ సమూహం కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు.దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు, ఒక వినూతమైన మండపం ఉన్నాయి ఇతర ఆలయాలు thumb| వరసిద్ధి వినాయక దేవాలయం|270x270px స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మరకతంభికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం. దీనితో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. "బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది ఉంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక పాము నాగుపాము తిరుగుతూ వుంటుందంటారు. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కూడా ఉంది. ఆంజనేయస్వామి గుడి రవాణా సౌకర్యాలు బస్సు సౌకర్యం సమీప ప్రధాన బస్సు స్టేషన్లు తిరుపతి, చిత్తూరు. రైలు సౌకర్యం సమీప రైల్వే స్టేషన్లు చిత్తూరు, రేణిగుంట గూడూరు విమాన సౌకర్యం సమీప విమానాశ్రయం తిరుపతి విద్యా సౌకర్యాలు ఈ గ్రామములో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రైవేటు ప్రాథమిక పాఠశాల, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రైవేటు మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాలలు వున్నాయి. సమీప బాలబడి, అనియత విద్యా కేంద్రం (ఐరాలలో), సమీప ఆర్ట్స్, సైన్స్, కామర్సు డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు చిత్తూరులో, వైద్య కళాశాల, మేనేజ్మెంట్ సంస్థలు తిరుపతిలో వున్నాయి. భూమి వినియోగం గ్రామంలో భూమి వినియోగం ఇలా ఉంది (హెక్టార్లలో): వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 93.89 వ్యవసాయం సాగని, బంజరు భూమి: 114.12 వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 10.12 సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 6.47 బంజరు భూమి: 2.43 నికరంగా విత్తిన భూ క్షేత్రం: 501.97 నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 434.38 నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 76.49 నీటిపారుదల సౌకర్యాలు బావులు/గొట్టపు బావుల ద్వారా 76.49 హెక్టార్లకు వ్యవసాయ నీటి పారుదల వ్యవస్థ వుంది. ప్రధాన పంటలు చెరకు, వరి, మామిడి, వేరుశనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు. ఆలయాల చిత్రమాలిక ఇవి కూడా చూడండి ఆంధ్రప్రదేశ్ విశిష్ట దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు వర్గం:చిత్తూరు జిల్లా దర్శనీయ స్థలాలు వర్గం:చిత్తూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
శ్రీకాళహస్తి
https://te.wikipedia.org/wiki/శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలో ఒక పట్టణం, శ్రీకాళహస్తి మండల కేంద్రం. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇక్కడ గల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వలన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా పేరుపొందింది. కళంకారీ కళకు పుట్టినిల్లు. పేరు వ్యుత్పత్తి శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ఇక్కడ శివలింగాన్ని పూజించినందున, వాటి పేరుతో శ్రీకాళహస్తి ఏర్పడింది. చరిత్ర thumb|left|250px|దక్షిణ గోపురం సా.శ.పూ. మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రంను గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది. ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది. సాశ. 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు. భౌగోళికం పట్టణ విస్తీర్ణం: 24.50 చ.కి.మీ. శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి 38 కి.మీ.ల దూరంలో, నెల్లూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనగణన వివరాలు 2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా 80,056. ప్రయాణ సౌకర్యాలు మదనపల్లె - నాయుడుపేట పట్టణాలను కలిపే జాతీయ రహదారి 71 పై ఈ పట్టణం వుంది. సమీప నగరమైన తిరుపతి నుండి బస్సు సౌకర్యముంది.గూడూరు-తిరుపతి దక్షిణ రైలు మార్గంలో ఈ పట్టణం వుంది. సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం. విద్యా సౌకర్యాలు thumb|250px|right|శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాల శ్రీకాళస్తీశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్నది. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల , మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, సంక్షేమ పాఠశాలలు కూడా ఉన్నాయి. వైద్య సౌకర్యాలు బస్ స్టాండుకు సమీపంలోనున్న అయ్యలనాయుడు చెరువులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఆదాయ వనరులు ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ మార్గాలు వ్యవసాయం, వ్యాపారం , పర్యాటకం. ప్రధాన పంటలు వరి, వేరుశనగ, , చెరకు. వందల కొద్దీ కలంకారీ కళాకారులు కూడా ఆదాయాన్ని చేకూరుస్తున్నారు. ఇంకా చేనేత కళాకారులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు. వీరు ప్రధానంగా పట్టణంలోగల "సాలిపేట" అనే ప్రాంతమందు కేంద్రీకృతమై ఉన్నారు. పట్టణంలో జరిగే నిర్మాణాల పనులకు, ఇతర కూలిపనులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు. బీడీ కార్మికులు కూడా ఎక్కువే. పరిపాలన శ్రీకాళహస్తి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. ఆచారాలు, సంస్కృతి , నాగరికత ఇక్కడి ప్రజలు ప్రధానం తెలుగు మాట్లాడుతారు. కానీ తమిళనాడుకు దగ్గరలో ఉండటం వలన చాలామంది తమిళం కూడా మాట్లాడుతారు. విద్యా రంగంలో మంచి అభివృద్ధిని సాధించడం వలన చాలామంది ఆంగ్లమును కూడా అర్థం చేసుకోగలరు. వస్త్రధారణలో పంచె, చీరలు, లుంగీలు, ధోతీలే కాకుండా ఆధునిక వస్త్రధారణలైన ప్యాంటు, చొక్కా, చుడీదార్ వంటివి కూడా సాధారణమే. ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ పట్టణం యొక్క సంస్కృతిని ప్రతిబింబజేస్తుంది. కర్ణాటక సంగీత మొట్టమొదటి స్వరకర్తలలో ఒకడైన ముత్తుస్వామి దీక్షితార్ "శ్రీకాళహస్తీశ" అనే భజనల్లో ఈ ఆలయాన్ని కీర్తించాడు. క్రీడలు క్రికెట్ ఇక్కడి ప్రజలు బాగా ఆడే, అభిమానించే క్రీడ. అంతేకాక కొన్ని ప్రాంతీయ క్లబ్బులు టెన్నిస్ ను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది 1916లో స్థాపించబడిన రిపబ్లిక్ క్లబ్. ఈ క్లబ్ 2004లో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంటును కూడా నిర్వహించింది. ఇంకా గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో మొదలైనవి కూడా ఒక మాదిరి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మాధ్యమాలు తెలుగులో ప్రధాన పత్రికలైన తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. ఇంతేకాక ప్రాంతీయంగా వెలువడే చైతన్య, ఆదర్శిని వంటి కొన్ని చిన్న వార్తాపత్రికలు కూడా ఉన్నాయి. పండుగలు thumb|right|250px|పట్టణం ప్రవేశం రోడ్ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు: వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ. నవరాత్రి ఉత్సవాలు: ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు: ఇవి ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో కచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఏడు గంగల జాతర: ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. పర్యాటక ఆకర్షణలు thumb|శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రవేశ ద్వారం|250x250px thumb|478x478px|స్వామివారి రథం. మహాశివరాత్రి మరుసటి రోజు, రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు. ఇతరాలు thumb|250x250px| చూడదగ్గ ప్రదేశాల గురించి దేవాలయం వారు ఏర్పాటు చేసిన ఒక బోర్డు thumb|right|250px|నందనవనంలో కల అందమైన కోనేరు గుడికి దక్షిణాన ఒక కిలోమీటరు దూరంలో శుకబ్రహ్మాశ్రమం ఉంది. దీనిని విద్యా ప్రకాశానందగిరి స్వామి స్థాపించాడు.ఇక్కడ ఏర్పాటు చేసిన భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ద్వారా పేదరోగులకు ఉచితంగా కంటి వైద్యం, ఆపరేషన్లు నిర్వహిస్తారు. గుడికి దగ్గర్లోనే కల "నందనవనం" ("లోబావి") భరధ్వాజ మహర్షి తపస్సు నాచరించిన పుణ్య స్థలం. ఈ సరస్సులో ఒక నాలుగు పలకల మండపం ఉంది. ఇక్కడికి కొద్ది దూరంలో ఉండే వేయిలింగాల కోన కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒక కొండ ఎక్కి దిగి మరల ఒక కొండ ఎక్కితే కనిపించే ఒక చిన్న ఆలయంలో ఒకే లింగం పై చెక్కిన వేయి శివ లింగాలను (యక్షేశ్వర లింగము) సందర్శించవచ్చు. దీనికి దగ్గర్లోనే ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది. ప్రత యేటా జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడికి ఎక్కవగా భక్తులు సందర్శనార్థం విచ్చేస్తుంటారు. జ్ఞాన ప్రసూనాంబ ఇక్కడ దేవతలకు జ్ఞానోపదేశం చేస్తుందట. శ్రీకృష్ణదేవరాయల మంటపం, జలకోటి మంటపం పాలగర్ మంటపం తొండమనాడు ఆలయం: తొండమాను చక్రవర్తి నిర్మించిన ప్రాచీనా వేంకటేశ్వరాలయం. దక్షిణ కాళీమాత దేవాలయం (వేడాం) (2005 లో విగ్రహ పునస్థాపన జరిగింది). దుర్గాంబ కొండ. ఇక్కడ వీర శృంగార మూర్తియైన కనకదుర్గ ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి కొండ చక్రేశ్వర స్వామి ఆలయం, జెట్టిపాళెం శ్రీ నింబజాదేవి ఆలయం, జెట్టిపాళెం ద్రౌపదీ సమేత ధర్మరాజులు స్వామి గుడి సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి మణికర్ణిక దేవాలయం ఇతర విశేషాలు విజయలక్షి సినిమా హాలు అన్నింటికన్నా ప్రాచీనమైనది.దీనిని సుమారు 80 సంవత్సరాలకు మునుపు నిర్మించి ఉన్నారు. ప్రముఖులు ధూర్జటి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, మాజీ శాసన సభ్యులు ఎస్సీవీ నాయుడు, శాంతారాం పవార్, మాజీ శాసన సభ్యులు తాటిపర్తి చెంచురెడ్డి, ప్రముఖ విద్వాంసులు పూడి వెంకటరామయ్య గారు. ప్రముఖ కళాకారులు మోహన్ భార్గవ్, గురప్ప చెట్టి (పద్మశ్రీ). ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఒక సంవత్సరం పాటు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదవడం విశేషం. ఇవి కూడా చూడండి శాసనసభ నియోజక వర్గం తిరుపతి పార్లమెంటు నియోజక వర్గం ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట దేవాలయాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా శ్రీకాళహస్తి మండలం మూలాలు వనరులు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వారి సమాచార పత్ర పుస్తకం (2000) బయటి లింకులు శ్రీకాళహస్తి భక్తులు నిర్వహిస్తున్న సైటు వర్గం:తిరుపతి జిల్లా పుణ్యక్షేత్రాలు వర్గం:తిరుపతి జిల్లా పర్యాటక ప్రదేశాలు వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు వర్గం:ప్రసిద్ధ శైవక్షేత్రాలు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:తిరుపతి జిల్లా పట్టణాలు
పరిక్షిత్తు
https://te.wikipedia.org/wiki/పరిక్షిత్తు
REDIRECT పరీక్షిత్తు
నాస్తికత్వం
https://te.wikipedia.org/wiki/నాస్తికత్వం
thumb|పాల్ హెన్రీ 18వ శతాబ్దపు నాస్తికత్వ వాది భగవంతుడు ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను నాస్తికులు అని పిలుస్తారు. చాలా మంది నాస్తికత్వాన్ని, ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడంతో సమానంగా చూస్తారు, అయితే కొన్ని సార్లు నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని పాటించని వాళ్లుగా చూడొచ్చు. ఉదాహరణకు బౌద్ధమతంలో దేవుడున్నాడనే భావనకు విలువలేదు, కాబట్టి ఆ మతాన్ని ఆచరించే వారందరినీ నాస్తికులుగానే చూడొచ్చు. కమ్యూనిస్టులు ప్రాథమికంగా నాస్తికులై ఉండాలి. ఆస్తికవాదం ఎంత ప్రాచీనమో నాస్తిక వాదం కూడా అంతే ప్రాచీనం. ఈశ్వరవాదం, నిరీశ్వరవాదం, నాస్తికత్వం... ఇలా అనేక అంశాలమీద శతాబ్దాలుగా చర్చ, వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. నాస్తిక సూత్రాలు ఆస్తికుల దృక్పథం విశ్వంనుంచి ప్రారంభమై మనిషి వరకూ వస్తుంది. నాస్తికుల దృక్పథం మనిషినుంచి ప్రారంభమై విశ్వంవైపు వెళ్తుంది. ఆస్తికులు కష్టనష్టాలకు దేవుడిని, సంఘాన్ని, ప్రభుత్వాన్ని కారకులుగా భావిస్తారు. ఆస్తికులు తాము సంఘంలో ఒక భాగం అనుకొంటారు. అయితే నాస్తికులు సంఘం, ప్రభుత్వం... వంటివన్నీ తమలో ఒక భాగంగా భావిస్తారు. అందువల్ల నాస్తికులకు జీవితం పట్ల స్తబ్దత పోయి శ్రద్ధ కలుగుతుంది! తామ చేసే ప గురించి ఆలోచిస్తారు. వాస్తవిక విజ్ఞాన దృష్టి పెరుగుతుంది. సొంత వ్యక్తిత్వం అలవడుతుంది. సామాజిక దృష్టి ఎక్కువవుతుంది. నాస్తికులకు యుద్ధాలు, దౌర్జన్యాలు పట్ల ఆసక్తి ఉండదు. సాటి మనుషులపట్ల ద్వేషం ఉండదు. మత కలహాలుండవు. నియంతృత్వ భావనలుండవు. సమానత్వం, స్వేచ్ఛ, వాస్తవిక విజ్ఞానం, నీతివర్తనం అలవడతాయి. ప్రభుత్వం ఏదైనా ప్రజలందరికీ సమానమే. వారు ధనికులైనా, పేదలైనా ఏ కులం, మతం, జాతికి చెందినవారైనా వృద్ధులు, పురుషులు, స్త్రీలు... ఎవరైనా అందరికీ సమానంగా చెందుతుంది. అయితే ఆస్తికులు తమ బానిస ప్రవృత్తివల్ల అలా ఆలోచించక అది కొందరికే చెందిందనుకుంటారు. నాస్తికులు అందుకు భిన్నంగా ఆస్తికులు ప్రభుత్వం ద్వారా సాధించలేని ఫలితాలను సాధించగలుగుతారు. ధనికులు నాస్తికులవడానికి ఇష్టపడరు. పైగా నాస్తికత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. వారికి దేవుడిమీద నమ్మకమున్నా లేకున్నా ప్రజల్లో మత విశ్వాసాలను మాత్రం పోషిస్తారు. అసమానతలు తొలగిపోకూడదన్నదే వారి లక్ష్యం. ఎవర్నీ దేవుడు సృష్టించలేదు. అసలుంటే కదా ఆయన సృష్టించడానికి మానవుల కష్టాలకీ - దేవుడికీ ఏవిధమైన సంబంధం లేదు. ఎంతో కాలంనుంచీ దేవుళ్లని ప్రార్థిస్తున్నవారు తమ కష్టాల్ని దేవుడు తీర్చాడని నిరూపించగలరా? ఎక్కడాలేని దేవుడు కష్టాలు ఎలా తీరుస్తాడు? ఈ మతాలు కలిగించే భావదాస్యమే ఆర్థిక దాస్యానికి కారణం. ప్రజల్లో మూఢనమ్మకాలు, మతభావాలు లేకుండా చెయ్యగలిగితే దోపిడీ దానంతట అదే పోతుంది. ప్రకృతిలో నియమాలంటూ లేవు. మానవుడు ప్రకృతిని చూసి తన బుద్ధి కుశలత వలన దాన్ని అర్థంచేసుకుంటున్నాడు. అప్పుడు కొన్ని నియమాలు ప్రకృతికి ఉన్నాయని ఊహించి, వాటిని ప్రకృతికి ఆరోపించి వాటి ద్వారా ప్రకృతిని అర్థం చేసుకొంటున్నాడు. భారతదేశం లాంటి దేశంలో పుట్టి నాస్తికులుగా ఉండటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మనిషి పుట్టుక నుంచి చావు వరకు కేవలం దేవుడి ఆంక్షల వల్లే సంభవిస్తున్నాయని నమ్మే మనుషుల మధ్య ఉంటూ తార్కిక ధోరణి అలవరచు కోవటం నిజంగా గొప్ప విషయమే..ఎంత తక్కువ వయసులో ఈ ధోరణి మనకు అలవడింది అనేది మన జీవిత వికాసానికి ఆనందానికి మూలనగా ఉంటుంది... నాస్తికత్వం వల్ల ప్రతికూలతలు జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనపుడు దాని పరిష్కారం దొరకణుపుడు ఎదురయ్యే వత్తిడిని భరించడం చాలా కష్టంగా ఉంటుంది.. దీనికి చాలా హేతుబద్దంగా ఆలోచిన్చగలిగే పరిపక్వత చాలా అవసరం.. ఇది లేని వాళ్ళు ఆ భారాన్నంతా దేవుడి పి వేసి జీవితాన్ని సాగిస్తుంటారు.. దేవుడి పేరుతో లేదా ఆచారాలు సంప్రదాయాల పేరుతో ఇతరుని మోసం చేసేవారిని చూస్తే విపరీతమయిన కోపం కలిగి అది మన ఆరోగ్యానికి నఅష్టాన్ని కలిగించును.. మన జీవితాలను ఎవరూ నియంత్రించటం లేదని, కేవలం మన చుట్టూ ఉన్న మనుషులు లేదా మనం ఫైనాన్సియల్ గా, ఎమోషనల్ గా ఆధారపడ్డ వల్లే మన జీవితాన్ని కంట్రోల్ చేయగలుగుతారు.. కావున సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్ గా జీవితాన్ని ముఖ్యంగ ఆర్థిక పరంగా మన మీద మనం ఆధారపడాలి.. ఆస్తికులైన బందు మిత్రుల మధ్య ఇమడటం కొంచెం ఇబ్బందే.. కావున వారితో దేవుడి గురించి వాగ్వాదానికి దిగి సంబంధాన్ని తెంచుకోవడం కంటే, వారి మూర్కత్వన్ని నాస్తికులే అర్తం చేసుకొనే జీవితాన్ని సాగించడం మేలు.ముఖ్యంగ మధ్య తరగతి కుటుంబాలలో ఈ విధానం మరి మంచిది.. ప్రతి మానవుడు తన దైనందిన జీవితంలో చేసే పనులకు వాస్తవికతను జోడించి ఆలోచిస్తే అర్ధమౌతుంది. ఫలితం మనం చేసే పనులద్వార జరుగుతుందని అప్పుడు దైవం దేవుడు అనే మాటలపై ఆలోచన ఉండదు. ఆస్తికత ఎవరికి ఇబ్బంది కలిగించదు. తెలుగు హేతువాదులు, నాస్తికులు ఆవుల గోపాల కృష్ణమూర్తి గోరా త్రిపురనేని రామస్వామి శ్రీశ్రీ ఎస్.ఎస్ రాజమౌళి బాబు గోగినేని అక్కినేని నాగేశ్వరరావు రామ్ గోపాల్ వర్మ గుడిపాటి వెంకట చలం రంగనాయకమ్మ త్రిపురనేని గోపీచంద్ కొడవటిగంటి కుటుంబరావు తాపీ ధర్మారావు బొర్రా గోవర్ధన్ సమరం నార్ల వెంకటేశ్వరరావు కొత్త సత్యనారాయణ చౌదరి బొడ్డు రామకృష్ణ ఈశ్వరప్రభు చిత్తజల్లు వరహాలరావు రావిపూడి వెంకటాద్రి ఎన్.ఇన్నయ్య కొడాలి శ్రీనివాస్ పెన్మెత్స సుబ్బరాజు కత్తి పద్మారావు భూపతి నారాయణమూర్తి డా.జయగోపాల్ ఇంటూరి సాంబశివరావు నసీర్ అహ్మద్ జ్వాలాముఖి నళినీ మోహన్ కుమార్ కాల్వ M.S.V.S.P.వర్మ బొడ్డు అణుబాబు హజరత్ అలి అభిలాష/రచయిత్రి హేమలతా లవణం రావి నారాయణరెడ్డి నవదీప్ ఇవికూడా చూడండి హేతువాది Nastik Nation మూలాలు వెలుపలి లంకెలు వర్గం:సామాజిక శాస్త్రాలు వర్గం:నాస్తికత్వం
కూర్మావతారం
https://te.wikipedia.org/wiki/కూర్మావతారం
హిందూ ధర్మ పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారం. కూర్మం అనగా తాబేలు. దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం. అవతార గాథ ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు. దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. ఆ అవతారాన్ని పోతన తన భాగవతంలో ఇలా వర్ణించాడు. సవరనై లక్ష యోజనముల వెడల్పై కడు గఠోరంబైన కర్పరమున నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతురాసులనెల్ల మ్రింగి లోగొనునట్టి మేటి కడుపు విశ్వంబుపై వేఱు విశ్వంబు పైబడ్డ నాగిన గదలనియట్టి కాళ్ళు వెలిగి లోనికి జనుదెంచు విపుల తుండ మంబుజంబుల బోలెడి యక్షియుగము సుందరంబుగ విష్ణుండు సురలతోడి కూర్మి చెలువొందనొక మహా కూర్మమయ్యె. అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనం చేయగల హాలాహలము ఉద్భవించింది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభం, ఉచ్ఛైశ్రవం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు. స్తోత్రం జయదేవుని స్తోత్రంలో కూర్మావతార వర్ణన క్షితిరతి విపులతరే తవ తిష్ఠతి పృష్టే ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే కేశవ! ధృత కచ్ఛప రూప! జయ జగదీశ హరే! దేవాలయాలు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి మండలానికి చెందిన కంచుమర్రు గ్రామంలో కూర్మావతారుని ఆలయం ఉంది. కాలువలోంచి గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకు డిప్పపై విష్ణుమూర్తి నామాలు సహజంగా కలిగిన ఓ తాబేలు కనిపించింది. దానిని తగిన ఏర్పాటుచేసి కాపాడుకుంటూ, పూజిస్తూ వచ్చాకా కొన్నేళ్ళకు తాబేలు మరణించింది. దాని శరీరం పెట్టి దాని రూపాన్ని నిర్మించి అక్కడే ఆలయాన్ని నిర్మించారు. చిత్తూరు జిల్లా లోని పెలమనేరు మండలంలోని కూర్మాయి గ్రామంలో "కూర్మ వరదరాజ స్వామి దేవాలయం" కలదు. కాకినాడ జిల్లా లోని రౌతులపూడి మండలంలోని ములగపూడి గ్రామంలో శ్రీరామగిరి పై " శ్రీకోదండరామ స్వామి దేవాలయంలో "ఉత్తర దిక్కును చూస్తూ కుర్మా నాద స్వామి ఆలయం కలదు. ఈ దేవాలయం 12వ శతాబ్దకాలం నాటిది.http://books.google.com/books?id=dobtZ61vCp0C&pg=PA774&lpg=PA774&dq=kurma+etymology&source=web&ots=2FQ-OIZwjm&sig=ISJA6kqyrwRO4ZjncIIcTfgg1C8&hl=en&sa=X&oi=book_result&resnum=10&ct=result#PPA775,M1 చిత్రమాలిక మూలాలు ఇవి కూడా చూడండి క్షీర సాగర మథనం భాగవతం బయటి లింకులు శ్రీకూర్మనాథ మందిరం వెబ్ సైటు వర్గం:భాగవతము వర్గం:విష్ణుమూర్తి అవతారాలు
వామనావతారము
https://te.wikipedia.org/wiki/వామనావతారము
right|thumb|200px|పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు యడవల్లి గ్రామంలో ఆలయంలో వామనావతార శిల్పం వామనుడు లేదా త్రివిక్రముడు, హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం. వామనుడు అదితికి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు. వామనుడు అనగానే తెలుగు వారికి "ఇంతై ఇంతై వటుండంతై " అన్న పోతన భాగవత పద్యము తెలుగునాట సుపరిచితం. దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడి పోయిన బలి, రాక్షస గురువైన శుక్రాచార్యుల దయ వలన బ్రతికి, గురూపదేశంతో విశ్వజిత్‌యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయతూణీరములు, కవచము, శంఖములు పొందుతాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమణిచేందుకు, రాక్షసులనందరినీ ఒకచోటచేర్చి, యుద్ధమునకు సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తుతాడు. ఆ దుర్భర దానవ శంఖా విర్భూత ధ్వనులు నిండి, విభుదేంద్ర వధూగర్భములు పగిలి, లోపలి శిశువులు ఆవురని ఆక్రోశించుచుండ, దేవతలు బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు. ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన పదనఖ నీరజ నతజన పావన కేశవ ధృత వామన రూప జయ జగదీశహరే -- జయదేవుని దశావతార స్తోత్రము ఈ వామనావతార గాథను విన్న వారు, చదివిన వారు సకల శుభాలను పొందుతారు. దైవారాధన సమయంలో ఎవరైతే త్రివిక్రమ పరాక్రమాన్ని స్మరించుకుంటారో వారికి నిత్య సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి. thumb|250px|త్రివిక్రముడైన వామనుడు- ఒక కాలు భూమిని, ఒక కాలు ఖగోళాన్ని ఆక్రమించగా మూడవ కాలు బలి నెత్తి మీద ఉంచుతున్నట్లు చూపబడింది. నేపాల్ దేశంలోని చిత్రం. వామన జననం దేవతల దుస్థితిని చూసి, సురమాత అదితి, తన భర్తయైన కశ్యపబ్రహ్మను వేడుకున్నది. అంతట కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆమె ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరిసమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా, భగవదంశతో, శ్రవణ ద్వాదశి (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణద్వాదశి అంటారు), ఆనాడు శ్రోణ అభిజిత్‌ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించునప్పుడు, గ్రహ తారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు. వామనుడు పుట్టినప్పుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, బిశంగ వర్ణ వస్త్రాలతో, మకరకుండల మండిత గండ భాగుడై, శ్రీ విరాజిత లోలంబ, కదంబ వనమాలిగా సమస్త అలంకారాలతో, నిఖిల జన మనోహరుడిగా అవతరించాడు. రూపాంతరంబున తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని, కపట వటుని వలె, ఉపనయ వయస్కుండై వామన బాలకుడయ్యాడు. శివుడా - హరుడా? thumb|ఎడమ|బావి నుంచి నీటిని తీసుకురావటానికి వెళుతున్న వామనుడు. అతనిని చూచి జనులు గుజగుజలు పోవుచూ, గజిబిజి పడుచూ, కలకలములై ఎవరీ పొట్టి బాలుడు? శివుడా? హరియా? బ్రహ్మయా? సూర్యుడా? అగ్నియా? ఈ బ్రహ్మచారి ఎవరు? అని విస్మయం చెందారు. కొందరితో చర్చించుచూ కొందరితో జటలు చెప్పుచూ, గోష్ఠిలో పాల్గొనుచూ, తర్కించుచు, ముచ్చటలాడుచు, నవ్వుచూ అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచూ, వెడవెడ నడకలు నడుచుచూ, బుడి బుడి నొడువులు నొడుచుచు, జిడిముడి తడబడగ, వడుగు రాజును సమీపించి "స్వస్తి ! జాగత్త్రయీ భావన శాసన కర్తకు! హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్ర స్తుత మంగళాధ్వ విధాన విహర్తకు, దానవ లోక భర్తకు స్వస్తి అని దీవించెను. మూడు అడుగుల నేల thumb|200px|బలిని దర్శిస్తున్న వామనుడు - పాతకాలపు చిత్రం. బలి అతనికి సముచితాదరమిచ్చి గౌరవించి...వడుగా ! ఎవ్వరి వాడవు? నీకేమి కావలయును కోరుకొమ్మన్నాడు. "ఒంటి వాడను నేను. నాకు ఒకటి, రెండడుగుల మేర యిమ్ము . అయినను అడుగమంటివి కనుక అడిగితిని. దాత పెంపు సొంపు తలపవలెను గదా! కావున నాకు మూడడుగుల నేలనిమ్ము, చాలు అని మాయావడుగు పలికెను. ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారించెను. బలి గురువుకు వినయముగా నమస్కరించి ...ఇచ్చెదనని పలికితిని. ఆడిన మాట తప్పను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు నీవిచ్చినచో అఖిలంబు పోవును. అంతేకాక... వారి జాక్షులందు, వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మరక్షణయందు బొంకవచ్చు.....తప్పు లేదు. అది పాపము కాదు. అని శుక్రాచార్యుడు వివరించెను. దానికి బలి చక్రవర్తి ..కారే రాజులు రాజ్యముల్‌ కలుగవే, గర్వోన్నతింబొందరే వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనంగలదే! శిబి లాంటి దాతల పేరు ఈనాటికీ స్థిరములైనవి కదా! భార్గవా! అని పలుకుతూ తన మాటను తోసి పుచ్చిన రాజును పదభ్రష్ఠునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు. శుక్రాచార్యుడు ఏకాక్షుడగుట అయినను బలిచక్రవర్తి హరిచరణములు కడిగి, త్రిపాద ధరిణిం దాస్యామి అనుచు నీటిధార విడిచాడు. ఆ కలశములో సూక్ష్మకీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు. అప్పుడు హరి కుశాగ్రముతో కలశరంధ్రమును బొడువగా కన్ను పోగొట్టుకొని శుక్రాచార్యుడు ఏక నేత్రుడయ్యెను. పుట్టి నేర్చుకునెనో, పుట్టక నేర్చెనో.. ఈ పొట్టి వడుగునకీ చిట్టి బుద్ధులెట్లబ్బెనో, ఈతని పొట్టనిండా అన్నీ భూములే.. అని నవ్వుతూ మూడడుగుల నేలను బలి వడుగుకు దానమిచ్చెను. ఇంతింతై...వటుడింతయై అలా ధారా పరిగ్రహంబు చేసి, ఇంతితై వటుడింతయై, దానింతై, నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశి పైనంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహార్వాటి పైనంతై, బ్రహ్మాండాంత సంవర్థియై, సత్యపదోన్నతుడైన విష్ణువునకు అప్పుడే ఉదయించిన సూర్యబింబము మొదట గొడుగులా, తదుపరి శిరోరత్నమై, చెవి కుండలమై, మెడలోని ఆభరణమై, బంగారు కేయూరమై, కంకణమై వడ్డాణపు ఘంటమై, నూపురప్రవరమై, చివరకు పాదపీఠమై ఒప్ప అతడు బ్రహ్మాండము నిండినాడు - అని బమ్మెర పోతన భాగవతంలో పద్య రచన అద్భుతంగా చేశాడు. మూడో అడుగు ఒక పాదంబులో భూమిని కప్పి, దేవ లోకమును రెండవ పాదమున నిరోధించి, జగములెల్ల దాటి చనిన త్రివిక్రముడు మరల వామనుడై బలినవలోకించి నా మూడవ పాదమునకు స్థలము జూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ తృతీయ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి, ప్రహ్లాదునితో సుతలలోకమునకు పంపి, తానే ఆలోకమునకు ద్వారపాలకుడాయెను. బలి నడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రున కిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి. స్తోత్రాలు, స్మరణా సంప్రదాయాలు దేవాలయాలు thumb | త్రివిక్రమగా విష్ణు, మహాబలిపురం ఉపశమనం వామనుడు దేవాలయాలు ఉన్నాయి వామన కంచిలో అద్భుతమైన వామన అవతారం గుడి ఉంది. మిత్రానందపురము వామన మూర్తి దేవాలయం, చెరుపు, త్రిస్సూర్, కేరళ థ్రికక్కర (థ్రికక్కర ఆలయం), కొచ్చిన్, కేరళ. కాంచీపురం సమీపంలోని కామాక్షి ఆలయం . ఖజురహో, మధ్యప్రదేశ్. వామనుడు, లో ఉలగలంథ పెరుమాళ్ దేవాలయం తిరుకొయిలూర్, విల్లుపురము జిల్లా, తమిళనాడు. ఇవి కూడా చూడండి విష్ణు పురాణము ఓనం భాగవత పురాణం విష్ణు వనరులు ఆంధ్రజ్యోతిలో డా.లంకా శివరామప్రసాద్ రచన వర్గం:విష్ణుమూర్తి అవతారాలు వర్గం:హిందూమతం
రామావతారం
https://te.wikipedia.org/wiki/రామావతారం
రామావతారము త్రేతాయుగములోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖులు. ఆధార సాహిత్యం వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు ఏడవ అవతారం అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలున్నాయి. భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు, సంబంధిత గ్రంథాలు, జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడు వ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణ కర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని, ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది.Fallon, Oliver. 2009. Bhatti’s Poem: The Death of Rávana (Bhaṭṭikāvya). New York: Clay Sanskrit Library . ISBN 978-0-8147-2778-2 | ISBN 0-8147-2778-6 | ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి కంబర్ వ్రాసిన కంబరామాయణము; 16వ శతాబ్దికి చెందిన తులసీదాస్ రచన రామచరిత మానసం. తెలుగులో లెక్క పెట్టలేనన్ని రామాయణ రచనలు, అనుబంధ రచనలు వచ్చాయి. వాటిలో కొన్ని - తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణము; గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణము; భాస్కరుడు రచించిన భాస్కర రామాయణము; విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షము. రామాయణ కథ భారతదేశం ఎల్లలు దాటింది. అగ్నేయాసియాలో అనేక జానపద గాథలు, కళారూపాలుగా ప్రసిద్ధి చెందింది. అక్కడి స్థానిక గాథలు, ప్రదేశాలు, భాష, సంస్కృతులతో కలిసి ప్రత్యేకమైన ఇతిహాసంగా రూపుదిద్దుకొంది. జావా దీవి (ఇండొనీషియా) లోని కాకవిన్ రామాయణ, బాలి దీవిలోని రామకవచ, మలేషియాలోని హికయత్ సెరి రామ (Hikayat Seri Rama), ఫిలిప్పీన్స్లోని మరదియా లవన (Maradia Lawana), థాయిలాండ్‌లోని రామకీన్ - ఇవన్నీ రాముని కథనే ఆయా ప్రదేశాల సంస్కృతితో రంగరించి చెబుతాయి.బ్యాంగ్‌కాక్ నగరంలోని వాట్ ఫ్రా కేవ్ మందిరంలో రామాయణ గాథకు చెందిన అనేక దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరింపబడి ఉన్నాయి. మయన్మార్ దేశపు జాతీయ ఇతిహాసం యమ జత్‌దా కూడా బర్మా భాషలో రూపుదిద్దుకొన్న రామాయణమే అనవచ్చును. ఈ కథలో రాముని పేరు యమ. కంబోడియాలోని రీమ్‌కర్ లో రాముని పేరు ఫ్రీ రీమ్ (Preah Ream). లావోస్కు చెందిన ప్ర లక్ ప్రా లామ్ కథలో రాముని అవతారమే గౌతమ బుద్ధుడు అని చెప్పబడింది. జీవితం సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో, హిందూ ధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగిఉంది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు) గా విభజింపబడింది. బాల కాండం (77 సర్గలు) : కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము అయోధ్యా కాండం (119 సర్గలు) : కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము అరణ్య కాండం (75 సర్గలు) : వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము కిష్కింధ కాండం (67 సర్గలు) : రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము సుందర కాండం (68 సర్గలు) : హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట యుధ్ధ కాండం (131 సర్గలు) : సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము ఉత్తర కాండం: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.) బాలకాండం right|thumb|శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని హతం చేయడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు కిష్కిందలో ఉన్నాడు. కులగురువు వశిష్టుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలనూ అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగసంరక్షణార్థమై రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ఎన్నో అస్త్రవిద్యారహస్యాలను బోధించాడు. దారిలో రామ లక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాపవిమోచనమైనది. రామ లక్ష్మణుల రక్షణలో యాగము జయప్రథముగా జరిగింది. మారీచ సుబాహులూ, ఇతర రాక్షసగణములూ దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధానియైన మిథిలానగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరచి, సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తి శతృఘ్నుల వివాహం కనుల పండువుగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామనకు తాము ఇద్దరూ విష్ణుస్వరూపులే అని తెలిసింది. మహా వైభవముగా నలుగురు జంటలూ అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యా కాండం ఎడమ|thumb|350px|భరద్వాజాశ్రమంలో సీతారామలక్ష్మణులు దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లియైన కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితోబాటు ఆత్మయైన సీతా, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగను దాటించాడు. రామునికై విలపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు. భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది. అరణ్యకాండం thumb|రామునితో బంగారు లేడిని తెమ్మని చెబుతున్న సీత - రాజా రవివర్మ చిత్రం సీతారామలక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి, పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడకి శూర్పణఖ అనే కామరూపియైన రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోదిస్తున్న శూర్పణఖ కసి తీరడానికి తన సోదరులైన ఖర దూషణులనే రాక్షసులు 14 వేల మంది గల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరిని హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామ లక్ష్మణులను దూరంగా వెళ్ళేలా చేసి, తాను సీతను ఎత్తుకుపోయాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు. కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి, ఋష్యమూకపర్వతానికి బయలుదేరారు. కిష్కింధకాండం thumb|ఎడమ|వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం రాముడూ, వానరుడైన సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకూ సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణదిశకు వెళ్ళినవారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడూ, జాంబవంతుడూ, నీలుడూ, మైందుడూ, ద్వివిధుడూ, సుషేణుడూ వంటి మహావీరులున్నారు. వారు అనేక అవాంతరాలను అధిగమించి దక్షిణసముద్ర తీరానికి చేరుకొన్నారు. ఇక నూరు యోజనాల విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతను వెదకడానికి హనుమంతుడు మహాతేజంతో సిద్ధమయ్యాడు. సుందరకాండం thumb|హనుమంతుని తోకకు నిప్పు అంటిస్తున్న రాక్షసులు c.1910's నాటి చిత్రం. హనుమంతుడు దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపై నుండి లంఘించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షస కాంతలచే పీడింపబడుతూ, భీతయై కృశించిన సీతను చూచాడు. ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది. ఇక హనుమంతుడు ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, చివరకు [ఇంద్రజిత్తు] వేసిన [బ్రహ్మాస్త్రము|బ్రహ్మాస్త్రానికి]వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. "చూచాను సీతను" అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు. యుద్ధకాండం హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది. రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో జరిగింది. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. thumb|left|300px|రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగిస్తున్న ఇంద్రజిత్తు ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధం జరిగింది. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు. అనేకమంది రాక్షస వీరులు వానరుల చేత, రామలక్ష్మణులచేత హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణుని బాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. మరునాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి అందరూ వివశులయ్యారు. హనుమంతుడు పర్వత సమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యథాస్థానంలో ఉంచి వచ్చాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, ఇంద్రజిత్తును చంపేశాడు. right|thumb|పట్టాభిషిక్తులైన సీతారాములు ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. హనుమంతుడు మరల గిరిశిఖరానికి వెళ్ళి, శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు". రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు. రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. అనంతరం రాముని నిరాకరణతో క్రుంగిపోయిన సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది. రాముని నిర్యాణం బాలకాండలో శ్రీమహావిష్ణువు అభయమిచ్చిన ప్రకారము, “దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ “ పది వందల యేండ్లు, పది వేల యేండ్లు”, అనగా మొత్తము పదకొండు వేల సంవత్సరములు శ్రీరాముడు రాజ్యము చేసిన పిదప, “రావణాది దుష్టులెల్లరును మడసిరి కావున రామా నీవీ అవతారమును చాలింపుము అని యముడు అనెను. రాముడు, ఆతని సోదరులెల్ల సరయూనదిలో దిగి వారి అవతారములు చాలించిరి.” (పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు) ఇవికూడా చూడండి రామాయణం రామాలయాలు సీత లక్ష్మి విష్ణువు హనుమంతుడు హిందూ మతం మూలాలు వర్గం:హిందూ దేవతలు వర్గం:రామాయణం వర్గం:పురాణ పాత్రలు వర్గం:విష్ణుమూర్తి అవతారాలు
కల్క్యావతారము
https://te.wikipedia.org/wiki/కల్క్యావతారము
right|thumb|200px|1726లో చిత్రించిన ఒక కల్కి అవతారం బొమ్మ కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు. "కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన.The Kalki Parana కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం. బౌద్ధ కాలచక్ర గాధా సంప్రదాయంలో "శంభల" రాజ్యాన్ని పాలించారనబడే 25 మంది పురాణపురుషులకు కల్కి, కులిక, కల్కిరాజు వంటి సంబోధనలున్నాయి "అవతారం" అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగివచ్చిన (అవతరించిన) రూపం. గరుడ పురాణంలో విష్ణువు దశావతారాలలో పదవ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది. భాగవత పురాణంలో ముందుగా 22 అవతారాలు చెప్పబడ్డాయి. తరువాత మరొక మూడు అవతారాలు చెప్పబడ్డాయి. మొత్తం 25 అవుతాయి. వీటిలో 22వ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది. సాధారణంగా కల్కి అవతారం "ధూమకేతువు వంటి ఖడ్గం చేబట్టి దూకు గుర్రమునెక్కి దుష్టులని వధించు" మూర్తిగా వర్ణిస్తారు. పురాణాలలో బాగా ముందు వచ్చిందని (7వ శతాబ్దపు గుప్తులనాటిదని) చెప్పబడే విష్ణు పురాణంలో కల్క్యావతారం ప్రస్తావన ఉంది. అగ్ని పురాణం (గౌతమ బుద్ధుడు దశావతారాలలో ఒకడని అగ్నిపురాణంలో మొదటిసారిగా వ్రాశారు) లో కూడా కల్కి గురించి చెప్పారు. వీటికి చాలా తరువాతి కాలందని భావింపబడే కల్కి పురాణంలో కల్కి అవతారం గురించి విపులంగా చెప్పారు. అగ్ని పురాణం - దుష్టులు (అనార్యులు) సత్పురుషులను పీడించే సమయంలో, కల్కి భగవానుడు విష్ణుయశుని పుత్రునిగా, యాజ్ఞవల్క్యుని శిష్యునిగా అవతరిస్తాడు. చతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరిస్తాడు. జనులు తిరిగి సన్మార్గోన్ముఖులవుతారు.(16.7-9). అనంతరం కల్కి అవతారాన్ని సమాప్తి గావించి హరి వైకుంఠానికి వెళతాడు. తిరిగి సత్యయుగం ఆరంభమవుతుంది. (16.10) విష్ణు పురాణం - వేదోక్త ధర్మ విధులు క్షీణించినపుడు కలికాలాంతం సమీపిస్తుంది. అపుడు విరాట్పురుషుడు కల్కిగా శంభల గ్రామంలో విష్ణుయశుని ఇంట అవతరిస్తాడు. తన పరాక్రమంతో మ్లేచ్ఛులను, చోరులను నాశనం చేస్తాడు. దర్మాన్ని పునరుద్ధరిస్తాడు. జనులు సన్మార్గాన్ని అనుసరించ మొదలు పెడతారు. అలాంటివారి సంతానం కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తారు. సూర్యుడు, చంద్రుడు, lunar asterism Tishya, బృహస్పతి ఒకే రాశిలో ఉన్నపుడు కృతయుగం ఆరంభమవుతుంది.(4-24) పద్మ పురాణం - కల్కి దేవుడు కౄరులైన మ్లేచ్ఛులను సంహరించి, విపత్తులను తొలగించి సద్బ్రాహ్మణులకు సత్యం బోధిస్తాడు. వారి క్షుధార్తిని పరిహరిస్తాడు. అప్రతిహతంగా ధర్మరాజ్యాన్ని పరిపాలిస్తాడు.(6.71.279-282) భాగవతం - కలియుగాంతంలో సాధువుల ఇంట కూడా దైవచింతన నశిస్తుంది. శూద్రులు ఎన్నుకొన్న వారే పాలకులౌతారు. యజ్ఞయాగాదులు మచ్చునకైనా కానరావు. అపుడు భగవంతుడు అవతరించి ఈ విపత్తును దూరం చేస్తాడు.(2.7.38) భగవానుడు దేవదత్తమనే తెల్లని గుర్రాన్ని అధిరోహించి, ఖడ్గము చేతబట్టి భూమండలంపై విహరిస్తూ సకలసద్గుణైశ్వర్యాలను ప్రదర్శిస్తాడు. రాజులుగా నటించే దుష్టులను హతమారుస్తాడు (12.2.19-20) కల్కి పురాణం -లో ఈ భావాలన్నీ కలిసి ఉన్నాయ. కల్కికి పరశురాముడు యుద్ధవిద్యలు బోధిస్తాడని చెప్పబడింది. ఇవి కూడా చూడండి విష్ణువు చతుర్యుగాలు మూలాలు బయటి లింకులు వర్గం:విష్ణుమూర్తి అవతారాలు
భాగవతం - ఐదవ స్కంధము
https://te.wikipedia.org/wiki/భాగవతం_-_ఐదవ_స్కంధము
భాగవత పంచమ స్కందము పంచమ స్కందములో ఈ క్రింది విషయములు ఉన్నాయి. ప్రియవ్రతుని చరిత్ర ప్రియవ్రతుడు స్వాయంబువుని కుమారుడు, ఇతడు ఆదిలో సంసారంపై విరక్తి కలిగి విష్ణుమూర్తి పాదపద్మాలయందు మనస్సుని లగ్నం చేసిన వాడైనప్పటికీ, తరువాత బ్రహ్మదేవుని ఉపదేశముతో తండ్రి ఆజ్ఞపై రాజ్యభారము వహించి విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహమాడి పదిమంది కొడుకులనూ, ఇద్దరు కుమారులనూ పొందినాడు. ఇతను రాత్రులను పగళ్ళుగా చేస్తాను అని అతి ప్రకాశవమ్తుడై రథముపై సూర్యుని చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు, తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞపై విరమించుకుంటాడు. అతని ఏడు ప్రదక్షిణాలకు ఏరడినవే ఏడు సముద్రాలు, ఏడు ద్వీపాలు :-) సప్త ద్వీపాలు , సప్త సముద్రాలు॥ ఇందులోని ఇతర భాగాలు ఋషభావతారము భరతోపాఖ్యానము భరతుని, కిరాతులు కాళికాదేవికి బలి ఇవ్వ పూనుట భరతుడు సింధుదేశపు రాజైన రహూగణునికి తత్వోపదేశము చేయుట పరలోక వర్ణనము: దీనిని శుకయోగి పరిసిత్తునకు తెలిపినాడు. వర్గం:హిందూమతం
సప్త ద్వీపాలు
https://te.wikipedia.org/wiki/సప్త_ద్వీపాలు
బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ఉంది. బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ఈయనకు మొదటి భార్యవలన ఉత్తమ, తామస, రైవతులు జన్మించారు.రెండవ భార్య బర్హిష్మతి. ఈమెవలన అగ్నీధ్ర, ఇధ్మజహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతస, గృహపుష్ఠ, సవన, మేధాతిధి, వీతిహోత్ర, కలి, ఊర్జస్వతీ, అనేవారు జన్మించారు.వీరిలో మహావీర, సవన, కలి అనేవారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు.స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు జంబూద్వీపం - అగ్నీంద్రుడు ప్లక్షద్వీపం - మేధాతిథి శాల్మలీద్వీపం - వపుష్మంతుడు కుశద్వీపం - జ్యోతిష్మంతుడు క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు శాకద్వీపం - హవ్యుడు పుష్కరద్వీపం - సేవనుడు. ఈ క్రిందివే సప్త ద్వీపాలు : జంబూద్వీపం (ప్రస్తుతం మనము ఉంటున్నది) జంబూ అనగా నేరేడు పండ్లు, లేదా గిన్నెకాయలు. ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రస్తుతము మనము ఉంటున్న ద్వీపాన్ని జంబూద్వీపము అంటారు. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడింది. అవి ఇలావృత (హిమాలయాలు, టిబెట్ ప్రాంతము) భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు హరి (అరేబియా) - దక్షిణము కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము కురు (మంగోలియా) ఉత్తరము కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము భరత (భారత ఉపఖండము) ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము. తన తండ్రి ఆస్తిలో జంబూద్వీపానికి అగ్నీధ్రుడు అధికారి అయినాడు.ఈయనకు 9 మంది పిల్లలు కలిగి ఉన్నారు.మొదటివాని పేరు అజ, అజనాభి, నాభి అని కంపిస్తుంది. మిగిలినవారి పేర్లను బట్టి కింపురుష, హరి, ఇలావృత, రమ్యక, హిరణ్మయి, కురు, భద్రాశ్వ, కేతుమాల వర్షాలు వచ్చినవి.అజ శబ్దమునుంచి ఆసియా వచ్చింది. జంబూ శబ్దము వృక్షనామము. ఈ వృక్షాలు విరివిగా కనిపించే దేశము జంబూద్వీపము.నేటికి కూడా మనదేశములో ఒక భాగాన్ని జమ్ము అనిపిలుస్తున్నాము.హిమాలయాలలో ప్రవహించే నదులకు టిబెట్ దేశస్థులిచ్చినపేరు చివర సంపో లేక త్సంసో అనే శబ్దం కంపిస్తుంది. ఇది జంబూ శబ్దమే. ప్లక్షద్వీపం ఇది జంబూద్వీపంకంటే రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి. పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము. నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత శాల్మలీద్వీపం ఇది ప్లక్ష ద్వీపంకంటే పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి. పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి. నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి. కుశద్వీపం ఇది శాల్మలీ ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి. పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ. క్రౌంచద్వీపం ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి. పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిధగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి. నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక. దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము శాకద్వీపం ఇది క్రౌంచ ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి. పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి. విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి. పుష్కరద్వీపం ఇది శాక ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి. పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర. నదులు - లేవు. ఈ ద్వీపాలకు-ఈజిప్టు దేశములకు సంబంధము జంబూ ద్వీపస్థులు ఈజిప్టు దాకా వలసపోయినారని చెప్పటానికి చాలా ఆధారాలున్నాయి.ఈజిప్టు చరిత్రలో కంపించే హోవనిభు శబ్దము అజనాభా శబ్దమునుంచి వచ్చినదే.గ్రీకు దేశపు దేవుడగు బాకస్, ఈజిప్టులోనున్న ఒసిరస్ అనే దేవత ఒకటె.మేరోస్ అనే పర్వతం మీద ఈ దేవత విద్యనభ్యసించచెనని లెంప్రీర్ నిఘంటువులో సహితం చెప్పబడింది.ఇది మేరు పర్వతము. ప్లినీ ఈ ప్రదేశమున నైస అని పిలిచినప్పుడు నిషధశబ్దభవము. ఈజిప్టులో నైలునది ప్రధానమైనది. దీనిని వారు నీలపునైల్ అని ఆప్యాయంగా పిలుస్తారు.వస్తుతః నైల్ శబ్దము సంస్కృత నీలశబ్దము నుంచి వచ్చినదే కావటముచేత నీలపునైల్ అనేవారు.అసలు అయిప్టస్ నైలునది మొదటి పేరు. ఈ శబ్దము అజశాబ్దమునుంచి వచ్చింది.అజమనగా మేక.ఖ్నుము అనే దేవతకు వెనుక రోజులలో ఈజిప్ట్ దేశస్థులు మేకతలనిచ్చారు.అమలెయియా అనే మేక పెంచటం చేతను, మేకతోలును డాలుగా కట్టుకొనటం చేతను జుపిటర్ అనే దేవతను వీరు జుపిటర్ అయియోకప్ అన్నారు.మేకపాదాలుండటం చేతను పాక్ అనే దేవుడిని పాక్ ఆయిపాక్ అన్నారు.దక్ష ప్రజాపజాపతికి మేకతల ఉన్నట్లు ఖ్నుము అనే దేవతకు మేకతల నిచ్చారు.ఈజిప్టును పాలించిన ఫారోలుర అనే సూర్యదేవుని సంతతివారుట!ఈర అనే దేవతను రని అంటారు. ఈ రనిని ఈజిప్టుదేశంలో వానరాలని పోలిన రెండు జంతువులతో పోలుస్తారు.నాగలోకంలో సూర్యుని హయశిరస్ అని అంటారని ఉద్యోగపర్వం (99.5) చెప్పుతున్నది. ఈజిప్టులో సూర్యుడికి మరొక పేరు హోరుస్ అనే గరుడుడు, ఉరెయిస్ అనే ఉరగము కూడా ఉండేవి. పరశురాముడు, ఆయన గండ్రగొడ్డలి లేకపోతే ఈజిప్టుదేశపు ప్రాచీన చరిత్రయే లెదని అంటారు.గరుడుడు, నాగులు శాల్మలీ ద్వీపానికి వలసపోయినారని సంప్రదాయమే చెబుతున్నది. ఈజిప్టును క్రీ.పూ 7వ శతాబ్దములో తర్హక అనే ఇధియోపియా రాజు పాలించాడు.ఇది తారకాసుర శబ్దముమనటంలో సందేహములేదు.అజనాభాుని సంతతివారైన భారతీయులు ఆఫ్రికాలో కూడా స్థిరనివాసులైరి అని చెప్పవచ్చును. అగ్నీధ్రుని సంతతిలో ఇలావృత శాబ్దము కనిపిస్తున్నది.అలై పర్వతాలకు చెందిన జుంగరియా శ్రేణిలో ఇలి అనే నది ఉంది. దీని ఉపనది ఒడ్డున వెర్నో అనే నగరంన్నది.ఇది వరుణ శబ్దము. వరుణిని నగరాన్ని నిమలోనని భాగవతము పేర్కొన్నది.ఇది అస్సీరియాలో నిమ్రోద్ అనిపిస్తున్నది.దీనికి దక్షిణముగా యముడు నగరమైన సంయమని పురమున్నదన్నారు.అరేబియా సముద్రము లోకి దారితీసే సొన్మియస్ అఖాతపు తెరములో సాన్మియని ఊరు నేటికి ఉంది. ఇలావృత వర్షములలో మధ్యగా మహామేరు ఉంది. దీనికి తూర్పుగా భద్రాశ్వ వర్షము, పశ్చిమంగా కేతుమూలవర్షము లున్నవని వాయు పురాణము, మత్స్య పురాణములు చెప్పుచున్నవి. ఈ మేరు పర్వతం నుంచి అనేక పర్వతాలు బయలు దేరినవి.వీటిలో కురంగ (కుయుక్లెన్), కురకర (కరకోరం), కుసుంభ (హిందుఖుష్), వైకంటక (విటిం), శంఖ (ఖింగన్), రుచక (రుష్య), అనే పేర్లు కనిపిస్తున్నవి. ఇధ్మజిహ్వునకు సంక్రమించినది ప్లక్ష ద్వీపము.అస్సీరియా దేశచరిత్రలో ఇష్మిదగోన్ అనే మొట్ట మొదటి రాజు కనిపిస్తాడు.ఈయన కుమారుడు షమష్ రమన్. ఈపేరునకు పూర్వరూపము క్షేమ శబ్దంలో కనిపిస్తుంది.ఇధ్మజిహ్వునకు శివ, యశస్య, సుభద్ర, శాంతక్షేమ, అభయ, అమృతులనే 7గురు కొడుకులునారని భాగవతు చెబుతున్నది.అస్సీరియా పాలించిన రెండవరాజు షమష్ రమన్.ఇంతే కాకుండా నిమ్రోద్ పాలించిన మేషరాజు పూజించిన దేవుళ్ళలో ఖేమోష్ అనే దెవుడున్నాడు.అసియాలో గల తుర్కిస్థానును శివులు పాలించారు.సుభద్ర శబ్దము కబర్దగాను, అభయ శబ్దము అరేబియాగాను మారింది. అమృతశబ్దము అర్మీనియా కావచ్చును.ఇర్మక్ నదీ తీరము అమెసియాలో నున్నది. ప్లక్ష ద్వీపానికి లవణ సముద్రమును చెప్పినారు. దీనిని క్షార సముద్రమని అంటారు.నేడు ఖొరొసాక్ అని పిలువబడేది క్షారసముద్రమే.ఈద్వీపంలో అరుణ, అంగిరసీ, సత్యంభరా, సుప్రభాతా, సృమణ అనే నదులుండేవి.సిరియాలోని ఒరెంటిస్కు ప్రాచీన నామము అరుణ.అంగిరసీ నది - అనటోలియాలోని సింగరియస్.నేడు టైగ్రిస్ అని పిలవబడే నదిని ప్రాచీనకాలంలో షత్తెలమర అన్నారు.ఇసి సత్యంభర.సుప్రభాత నది యూప్రటిస్ గా మారినది.స్మర్నా అనే నగరం నేడుండేచోట సృమణానది ఉండవచ్చును.ఈద్వీపంలో మణికూట (మనిష్ఠ్) ధూమ్రపర్ణ (ధూమన్లు) మేఘమాల (మేర్ఖుంచ్) ఇంద్రసేన (అందిష్) వజ్రకూట (బజర్గొట్ప) పర్వతాలున్నవి.ఈ పేర్లను పరిశీలిస్తే అర్ధవంతమైన నామములు సంస్కృతములో కనిపిస్తున్నవి.భారతీయులే ఈపేర్లను స్థిరపరచినారని స్పష్టముగా తెలియుచున్నది. శాల్మలీ ద్వీపము యజ్ఞబాహువునకు వచ్చింది.ఇచ్చట ఇస్ఖుసముద్రమున్నదన్నారు.ఈజియన్ సముద్రములో ఒకభాగానికి నేటికీ మర్క్ ఇకారియం అని పేరున్నది.ఇక్షు శాబ్దము ఇక అని మారినది.ఉత్తర ఆఫ్రికాలోని నూబియా ప్రాంతంలో శాల్మి, ఎల్ సొలిమనిష్లు ఉన్నాయి.సొమాలి దేశముకూడా ఉంది.యజ్ఞబాహువు యొక్క 7గురు కొడుకులు వారి వారిపేర్లను ఆయా ప్రాంతా ల కిచ్చారు.సోమాలికి పడమరగా సురొ ఉంది.ఇది సురొచునకి చెందినది.సౌమనస్యుని ద్వారా సొనాన్, రమణకుని వలన మూరాకోలోని రిహ్మన, దేవబర్హుని నుంచి ధేబయిద్ అని పిలవడు ఉత్తర ఈజిప్ట్, పరిబర్హుని వలన బర్చరి, ఆప్యాయునినుంచి అబిస్సీనియా, అభిజ్ఞాతుని ద్వారా అబైనది ప్రవహించు ప్రాంతము అంవర్ధములైనవి.దక్షిణ ఈజిప్ట్ లో చాలా కాలము వరకు గరుడుడే పతాకచిహ్నముగా గ్రహించబడినాడు. హిరణరేతుసునికి వచ్చినది కుశద్వీపము.ఇచట ఘృతోదధి ఉన్నదన్నారు.ఘృతశబ్దము నేడు క్రీట్ అని పిలవబడి కృతశబ్దమునకు మూలరూపము.హిరణ్యరేతుసునకు 7గురు పుత్రులున్నారు.వసుదానుడు మసెదోనియాను, గుప్త అనువాడు కోపియస్ ను, సత్యవ్రతుడు స్పార్టాను, లిప్రుడు ఎపిరస్ ను, వామదేవుడు ఎమధియా అనబడ్డ ధెస్సలీని బయటకు తెచ్చారు.కుశద్వీపానికి చివర దధిమంతో దధి ఉంది.ఇది నేటి దల్మాషియా కావచ్చును. వస్తుతః హిరణ్యరేతశబ్దము ట్రోజను వీరుడగు ఈనియంపేరులో కనిపించును.ఈ శబ్దాలు సంస్కృత భాషను భారతదేశమును సూచించేవి. గృహపృష్టునకు క్రౌంచద్వీపము వచ్చింది.దధి మంధసముద్రము ఇచ్చట గలదన్నారు.మెడిట రేనియన్ సముద్రమున గల మొదటపదానికి అంతర్మధనమని అర్ధము సరిపోతుంది.ఈతని 7గురు కొడుకులు మధువహుని నుంచి మాల్బేలియా, సుదాముని ద్వారా స్వీడన్ ఋషిజ్యుని వలన రష్యా, లోహితార్ధుని ద్వారా లిధునేనియా వనస్పతినుంచి ఆస్త్రియాలోని బనత్ బయలుదేరినవి.మేఘపృష్టుడు పాలించిన ప్రాంతము ప్రష్యా కావచ్చును. శకద్వీపాన్ని గ్రహించినవాడు మేధాతిధి.ఈయన సంతతిలో పురోజన (బరీషేవ), మనోజవ ( మెజెక్), విశ్వచార (పెట్చొర), వేపమాన, ధూంరానీక, చిత్రరధ, బహురూపులున్నారు.ఈ ప్రాంతంలో ఊరుశృంగ (ఊరల్) పర్వతమున్నది.ఈశాన, బలభద్ర, శతకేసర, సహస్రస్రోత, దేవపాల, మహాన పర్వతాలు ఆల్ప్స్ లోని, రష్యా, జర్మనీలలో ఉండవీలున్నది.దీనికి ఉత్తరముగా శ్వేతద్వీపమున్నది. ఇది విపరీతమైన ఉష్ణగోళమని శాంతిపర్వము (335,335) చెప్పుతున్నది. వీతిహోత్రునకు పుష్కరద్వీపం వచ్చింది.ఇది అత్యుత్తర ప్రాంతం కావచ్చును.కాని ఇతనిపుత్రులు రమణక, ధాతకులని చెప్పబడుటచేత ఇది ధనునికోహ్ ప్రాంతం కావచ్చును.ఇచట కనిపించే అర్వాచీన పర్వతమే అరల్, ఐరుక పర్వతములు.ప్రాచీన పర్వతము పరక్టెచేసెగా కనిపిస్తున్నది.ఇచ్చట సాగ్దియానమున్నది.దీనినే భారతీయులు స్వర్గదేవయాన మని అంటారు.ఈ పుష్కర ద్వీపంలో లోకపాలుర నగరాలునాయన్నారు. ఆర్యులు భారతదేశము నుండి పశ్చిమముగాను, ఉత్తరముగాను మాత్రమే ఇతర దేశాలను కనుగొనలేదు.ఆ ప్రాచీన భారతీయులు దక్షిణంగాను, తూర్పుగాను కూడా వెళ్ళినారు.భారతదేశానికి దక్ష్ణంగా మహాసముద్రంలో విద్యుత్వాక్ పర్వతశ్రేణులలో అనేక ద్వీపాలు బయలుదేరినవి.ఇందలి ప్రజలు పొట్టివారు, మేఘశ్యామ వర్ణము కలవారు.ఫలపుష్పాలను తినువారు. అల్పాయువు గలవారని వాయుపురాణము చెప్పినది.ఇవి కాక బర్హణద్వీపముతో కలసిన 7 ద్వీపాలు ఇచట ఉన్నవన్నారు.బర్హణ (బోర్నియా), అంగ, యవ (జావా), మలయ, శంఖ (సయూం, కుముద (కాంబోడియా), కుశ (కూప్), వరాహ (ఆస్ట్రేలియా) ద్వీపాలిక్కడ ఉన్నాయి.అంగ ద్వీపము బాలిద్వీపము కావచ్చును.నాగజాతికి ప్రధానమైన కేంద్రము అంగ ద్వీపమని, ఇచట మ్లేఛ్చులున్నారని, చక్ర పర్వతాలిక్కడ కలవని వాయుపురాణము (48,17-18) చెప్పినది.వెండి బంగారు గనులు, గంధపుచెట్లు, మహామలయపర్వతము గల మలయ ద్వీపమున మ్లేఛ్చులు గలరని, ఇచటనే అగస్యుని ఆశ్రమము కలదని వాయు పురాణము (48,20-29), మత్స్య (163,74-78) చెప్పినవి. ఈవిధంగా రేఖాంశలను నిఋనయించినవారు భారతీయులే అని కొందరి అభిప్రాయము. భూమిపై పలు ప్రాంతాలకు వీరు గావించిన నామములే నేటికీ ప్రసిద్ధిలో ఉన్నవందురు.ఇతూవంటి సందర్భములో ఆర్యులు భారతదేశానికి ఎక్కడనుండో వలసవచ్చినవారు కారని వారిది భారతదేశమే స్వదేశమని, వీరే ఇచట నుండి ఇతరదేశాలకు వలసవెళ్ళిరని పలువురి అభిప్రాయము. ఇవి కూడా చూడండి బ్రహ్మాండ పురాణము==మూలాలు, వనరులు== అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007) మూలములు 1957 భారతి మాస పత్రిక - వ్యాసము- సప్తద్వీపావసుమతీ - శ్రీ పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి.
సప్త సముద్రాలు
https://te.wikipedia.org/wiki/సప్త_సముద్రాలు
సప్త సముద్రాలు అనగా ఏడు సముద్రాలు అని అర్థము. కానీ పురాణాల ప్రకారం అవి నీరుతో నిండి ఉన్నవి అని కాదు అవి. సప్తసముద్రాలు లవణ (ఉప్పు) సముద్రము ఇక్షు (చెరకు) సముద్రము సురా (మద్యం/ కల్లు) సముద్రము సర్పి (ఘృతం/ నెయ్యి) సముద్రము క్షీర (పాల) సముద్రము దధి (పెరుగు) సముద్రము నీరు (మంచినీటి) సముద్రము వాటి పరిమాణాలు  లవణ సముద్రం 1 లక్షయోజనాలు. .  ఇక్షు సముద్రం 2 లక్షల యోజనాలు.  సుర సముద్రం 4 లక్షల యోజనాలు.  ఘృత సముద్రం 8 లక్షల యోజనాలు.  క్షీర సముద్రం 16 లక్షల యోజనాలు.  దధి సముద్రం 32 లక్షల యోజనాలు.  ఉదక సముద్రం 64 లక్షల యోజనాలు. మూలాలు
భాగవతం - పదకొండవ స్కంధము
https://te.wikipedia.org/wiki/భాగవతం_-_పదకొండవ_స్కంధము
భాగవతం - పదకొండవ స్కంధమును పోతన గారి శిష్యులు రచించారు. విషయములు ఉపోద్ఘాతము భూభారంబువాపుట యాదవులహతంబు కృష్ణసందర్శనంబు వసుదేవ ప్రశ్నంబు విదేహర్షభసంభాషణ కవి సంభాషణ హరిమునిసంభాషణ అంతరిక్షుసంభాషణ ప్రబుద్ధునిసంభాషణ పిప్పలాయనభాషణ ఆవిర్హోత్రుని భాషణ నారయణఋషి భాషణ వైకుంఠం మరలగోరుట ప్రభాసంకుబంపుట ఉద్ధవునకుపదేశం అవధూతసంభాషణ శ్రీకృష్ణ నిర్యాణంబు పూర్ణి మూలాలు బాహ్య లంకెలు
ఊరగాయలు
https://te.wikipedia.org/wiki/ఊరగాయలు
దారిమార్పుఊరగాయ
పౌండు కేకు
https://te.wikipedia.org/wiki/పౌండు_కేకు
thumb|పౌండు కేకు మూమూలు కేకులులా మెత్తగా, చెమ్మగా ఉండకుండా ఈ పౌండు కేకు కొంచెం గట్టిగా, చెమ్మదనం లేకుండా – దిబ్బ రొట్టి మాదిరి - ఉంటుంది. ఈ కేకు చెయ్యటానికి ఒక పౌను పిండి, ఒక పౌను పంచదార, ఒక పౌను వెన్న, ఒక పౌను గుడ్లు కావాలి. అందుకని దీనికి పౌండు కేకు అన్న పేరు వచ్చింది. భారతదేశంలో ఆవకాయను పెట్టటానికి కూడా ఈ రకమైన తూకమే ఉపయోగిస్తారు. ఒక తవ్వెడు ఆవ పిండి, ఒక తవ్వెడు ఉప్పు, ఒక తవ్వెడు కారం కలిపి అందులో తవ్వెడు నువ్వుల నూనె పోసి తయారు చేస్తే శ్రేష్ఠమైన ఆవకాయ వస్తుంది. వర్గం:జనరంజక శాస్త్రము
సి
https://te.wikipedia.org/wiki/సి
thumb| కెన్ థాంప్సన్తో డెన్నిస్ రిచి, సి భాష సృష్టికర్త సి ఒక కంప్యూటర్‌ భాష. దీనిని మధ్య స్థాయి భాషగాను లేదా క్రింది స్థాయి భాషగాను ఉపయోగించుకోవచ్చు. 'సి' ని 1970లో కెన్ థాంప్సన్, డెన్నిస్ రిచీ అను శాస్త్రవేత్తలు తయారు చేసారు. ఇప్పుడు ఈ భాషను కంప్యూటింగ్ రంగంలో చాలా విస్త్రుతంగా వాడుతున్నారు. అంతే కాదు, ఈ భాషకు ఉన్న కొన్ని ప్రత్యేకతల వలన క్రింది స్థాయి అప్లికేషన్ల డెవలప్మెంట్ కు చాలా మంచి భాషగా ప్రాముఖ్యత పొందింది. చరిత్ర ప్రోగ్రామింగ్ భాష అంటే ఒక యంత్రానికి (ముఖ్యంగా కంప్యూటరుకు) అది చేయవలసిన పనులను తెలియచెప్పడానికి రూపకల్పన చేసిన కృత్రిమమైన భాష. ప్రోగ్రామింగ్ భాషలతో యంత్రము యొక్క ప్రవర్తనను నియంత్రించడానికి ప్రోగ్రాములు తయారుచేయవచ్చు. అంతేగాక వీటిని మనిషికి-యంత్రానికి మధ్య సంభాషణ కొరకు ఒక మార్గముగా పరిగణించవచ్చు. ఇవి అనేక రకాలు. ఉదాహరణకు జావా సి సీ ప్లస్ ప్లస్ కోబాల్. 'సి' భాష మొట్టమొదట ఏటీ & టీ బెల్ పరిశోధనాలయంలో (AT&T Bell Labs) 1969కు 1973 మధ్యన తయారు చేయటం జరిగింది. ఎక్కువ భాగం 1972లో తయారయింది. 'సి' కంటే ముందు 'బి' అనే కంప్యూటరు భాష ఉండేది. 'సి'కి సంబంధించిన చాలా విశేషాలను 'బి' నుండే తీసుకున్నారు. ఆంగ్లములో 'బి' తరువాత 'సి' వస్తుంది. ఈ రెండు కారణాల వలన 'సి' కి ఆ పేరు పెట్టడము జరిగింది. 1973 వచ్చేసరికి సి భాష మంచి రూపును సంతరించుకుంది, అటు తరువాత సి భాషను ఉపయోగించి యునీక్సు (ఆపరేటింగ్ సిస్టమ్) కెర్నలుని మరలా నిర్మించారు. సి నేర్చుకొనేందుకు కావలిసినవి సి-భాష నేర్చుకొనేముందు మీకు కంప్యూటరు గురించి ప్రాథమిక పరిజ్ఞానము ఉండవలెను. అయితే మీకు ప్రోగ్రామింగుకి సంబంధించిన పరిజ్ఞానము పెద్దగా అవసరము లేదు. సి-భాష నేర్చుకొనేందుకు మీకు ఒక సి-కంపైలరు (సాఫ్ట్వేర్) కావలెను. మీరు విండోసు ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నట్లయితే gcc కోసం Cygwin, కానీ MinGW కానీ వాడవలెను. లేదా ఏదయినా వాణిజ్యపరమయిన సి-కంపైలర్లు/IDEలు కూడా వాడవచ్చును. మీరు లినక్స్ ని వాడుతున్నట్లయితే gcc ఈపాటికే మీ కంప్యుటరులో ఉండాలి. విశేషములు ఉపోద్ఘాతము సి కంఫైలర్ ఉపయెగించే పద్థతి 'సి' భాష అసెంబ్లీ భాష (assembly language)కు బాగా దగ్గరగా ఉంటుంది. అందుకనే, సి భాషను అప్పుడప్పుడు "portable assembly" అని పిలుస్తారు. ఒకసారి సి భాషలో రాసిన ప్రోగ్రాముని దాదాపు ఏ యంత్రములోనయినా కంపైలు (compile) చేసుకొని వాడుకోవచు. కానీ అసెంబ్లీ భాషలో ఇలా అన్ని యంత్రాలకు సరిపోయేటట్లు ప్రోగ్రాములను వ్రాయటము కుదరదు. అసలు 'సి' భాషను సులువుగా నేర్చుకోడానికి, ముందుగా మనకు అల్గారిథం (algorithm), క్రమచిత్రం (flowchart) ల గురించి తెలియాలి. ఆల్‌గారిధమ్ (ALGORITHM): కంప్యూటర్ పై ఒక సమస్యను పూరించేందుకు మనం ఆజ్ఞల సమితిని జారి చేయడానికి వాడే సోపాన క్రమవిధానాన్ని సాంకేతికంగా "ఆల్‌గారిధమ్" అంటారు. (లేదా) ఒక పనిని పూర్తి చేయడానికి కొన్ని సూచనలను ఒక క్రమ పధ్ధతిలో ఉపయోగించుకోనే విధానాన్ని "ఆల్‌గారిధమ్" అంటారు ఆల్‌గారిధమ్ అనేది ఏ కంప్యూటర్ భాషకుకి అయిన పునాది వంటిది. ఆల్‌గారిధమ్ (algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకొలేదు, ఏందుకు అంటే ఆల్‌గారిధమ్ (algorithm) ను మనం మన సొంత భాషలో వ్రాసుకొవచ్చు. ఆల్‌గారిధమ్ (algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకోవాలి అంటే దానిని మనం కంప్యూటర్ అర్దం చేసుకునే విధంగా వ్రాయలి. కంప్యూటర్ అర్దం చేసుకునే భాషను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (Programming language) అంటారు. ఒక సమస్యను తీసుకుంటే దానికి ఆల్‌గారిధమ్ ఏలా వ్రాస్తారు ఇప్పుడు చూద్దాం.. ఇచ్చిన రెండు సంఖ్యలను కూడడం (add) : (a=2 b=3 c=a+b) ? step1: start చేయాలి step2: మొదటి నంబరును తీసుకోవాలి (a=2) step3: రెండవ నంబరును తీసుకోవాలి (b=3) step4: తర్వాత రెండు సంఖ్యలను add చేయాలి add=a+b step5: ప్రింట్ చేయాలి print / display add step6: తర్వాత end చేయాలి. వివరణ: మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి. అందుకే ప్తెన problem1 లో step1 అనేది start చేయడం. తర్వాత steps అనేవి మనం Slove చేసే Problem మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏద్తెన పనిని start చేస్తే దానికి Ending కూడా ఉంటుంది. అందుకే last step (step6)అనేది End చేయడం 'క్రమచిత్రం (FLOW CHAT):' సమస్య సాధనకు రాసిన ఆల్‌గారిధమ్ కి బోమ్మలతో కూడిన వర్ణనను క్రమచిత్రం అనవచ్చు. క్రమచిత్రం (flowgraph)ని వివిధ రకాల boxes, symbols తో గీయాలి చేయవలసిన పనిని (operation)box లోపల వ్రాస్తారు. మొత్తం boxes, symbols అనేవి Arrow ద్వారా connect చేయబడి వుంటాయి .ఈ విధంగా arrow తో connect చేయడం వలన algorithm యొక్క క్రమాన్ని మనం తేలుసుకోవచ్చు. క్రింది figure క్రమచిత్రంలో ఉపయోగించే వివిధ రకాల symbols and boxes గురించి చేబుతుంది.. thumbnail|క్రమ చిత్రం|link=Special:FilePath/C:\Users\Aditya\Desktop\flowchartmain.jpg ఇచ్చిన రెండు సంఖ్యలను add చేయడం (a=2 b=3 c=a+b) ? దీనికి క్రమ చిత్రం ఎలా గీయలో చూద్దాం.. (Draw a Flow Chat Diagram For Addition Of Two Numbers) thumbnail|రెండు సంఖ్యలను కూడుటకు క్రమ చిత్రం|link=Special:FilePath/C:\Users\Aditya\Desktop\ft1.JPG వివరణ: మనం ఏద్తెన పనిని చేయాలి అంటే ముందు దానిని start చేయాలి. అందుకే ప్తెన సమస్యలో step1 అనేది start చేయడం. అందుకని దీనిని oval లో వ్రాసం .తర్వాత 2 & 3 steps అనేవి values ని తీసుకొవడం అందుకని సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. తర్వాత 4 step అనేది కూడికని perform చేయడం అందుకని దీర్ఘచతురస్రం [Rectangle] లో వ్రాసం .తర్వాత 5th steps అనేది output ని print చేయడం. అందుకని సమాంతచతురస్రం [parallelogram] లో వ్రాసం. మనం ఏద్తెన పనిని start చేస్తే దానికి Ending కూడా ఉంటుంది .అందుకే last step (step6) అనేది End చేయడం అందుకని దీనిని oval లో వ్రాసం. "హలో, ప్రపంచం!" ఉదాహరణ మామూలుగా ఎవరయినా చిన్నపిల్లలకు భాషను నేర్పేటప్పుదు "ఓం" అనో, "అమ్మ" అనో, ఓం నమఃశివాయ అనో (ఓనమాలు అనే పదం ఇక్కడనుండే వచ్చినది అని చెప్తారు)వ్రాయించి ఓనమాలు దిద్దిస్తారు. అలాగే కంప్యూటరు భాషలను నేర్చుకునేటప్పుడు ఈ "హలో, ప్రపంచం!" ఉదాహరణతో మొదలు పెడతారు. ఈ ప్రోగ్రాము "హలో, ప్రపంచం!" అని మీ కంప్యూటరు మానిటరు మీద చూపిస్తుంది. సి భాషలో "హలో, ప్రపంచం!" ఉదాహరణ ఈ క్రింది విధముగా ఉంటుంది. main() { printf("హలో, ప్రపంచం!\n"); } పైన ఇచ్చిన ప్రోగ్రాము దాదాపు అన్ని కంపైలరు (compiler)లలో పని చేయక పోవచ్చును. ఎందుకనగా అది ANSI C ప్రమాణాల ప్రకారం రాయబడలేదు. ఆ ప్రోగ్రాముకు చిన్నచిన్న మార్పులు చేర్పులు చేస్తే, ప్రమాణాలకు తగ్గట్లుగా మార్చు కోవచును. #include <stdio.h> int main(void) { printf("హలో, ప్రపంచం!\n"); return 0; } అయితే ఇప్పుడు మనము పైన ఇచ్చిన ప్రోగ్రాములోని ఒకొక్క వాక్యాన్ని అర్ధము చేసుకుందాము <nowiki>#include <stdio.h> </nowiki> సి-భాషలో #తో మొదలయే వాక్యాలను "ప్రీప్రోసెసింగ్ డైరెక్టీవ్స్" ("preprocessing directive") అని అంటారు. #include అను ప్రీప్రోసెసింగ్ డైరెక్టీవ్, ప్రీప్రోసెసర్ను-ఆ వాక్యంలో పేర్కొన్న ఫైలులో ఉన్న మొత్తము సమాచారముతో, ఈయొక్క వాక్యము బదులుగా చేర్చుటకు సూచన ఇచ్చును. <nowiki>int main(void) </nowiki> తరువాతి వాక్యములో main అను ఒక ఫంక్షనుని "వివరించటం" (define) జరిగింది. సి-భాషలో main-ఫంక్షనుతో ఒక ప్రత్యేక ఉపయోగము ఉంది. ప్రోగ్రాముని ఎక్సిక్యూట్ చేసినప్పుడు ఈ ఫంక్షనునే మొటమొదట కాల్ చేస్తారు. కాబట్టి ఈ main-ఫంక్షను ప్రతీ ప్రోగ్రాములో తప్పని సరిగా ఉండాలి. int అనునది ఆ ఫంక్షను తిరిగి పంపించు సమాచారము యొక్క రూపును తెలుపును. ఇక్కడ int అనగా ఆ సమాచారము integer రూపములో ఉంటుందని అర్థము. (void) అనగా main-ప్రోగ్రామును పిలుచుటకు ఎటువంటి ఆర్గ్యుమెంట్సు (agruments)ని పంపించనవసరము లేదు అని తెలుపుతున్నది. { తెరుచుకునే మీసాల బ్రాకెట్లు main-ఫంక్షను మొదలును సూచించును. printf("హలో, ప్రపంచం\n"); ఈ వాక్యము printf అను ఫంక్షనుని కాల్ (call) చేయును. ఈ ఫంక్షను stdio.h అను హెడ్డరు ఫైలులో నిర్మింపబడింది. ఈ ఫంక్షను, దానిలోకి పంపించిన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చి మీ మానిటరు పైన చూపించును. "హలో, ప్రపంచం!\n"లో \n అనునది ఎస్కేప్ సిక్వెన్స్ ("escape sequence") అని అంటారు, అది కర్సరుని ఇంకో క్రొత్త లైనులోకి వెళ్ళుటకు అదేశించును. ఇచట మామూలు సమాచారము మధ్యలో అడెశములు కూడా ఉండటము వలన ఎస్కేప్ సిక్వెన్స్ అని పిలవటం జరుగుతుంది. printf-ఫంక్షను int రూపములో ఉన్న సమాచారమును తిప్పి పంపించును, కానీ దాని వలన మనకు పెద్ద ఉపయోగములు ఏమీ ఉండవు. return 0; ఈ వాక్యము main-ఫంక్షను ఎక్సిక్యూషన్ని అంతము చేసి '0' అనే సంఖ్యను తిప్పి పంపించును. } మూసుకునే మీసాల బ్రాకెట్లు main-ఫంక్షను చివరను సూచించును. సి కంపైలర్ ఉపయోగించే పద్థతి సి భాషను కంఫ్యూటర్ కీ అర్థమయ్యే భాషలొకి మార్చాలంటే కంపైలర్ వుండాలని ఇంతకు ముందు చదివాం. అభిప్రాయములు - వ్యాఖ్యలు సాధారణంగా కొన్ని వాక్యముల ప్రోగ్రాముని రాసి, ఆ వాక్యములు ఏమి చేస్తాయి అనే దానిని మనము ఈ వ్యాఖ్యలుగా రాసుకోవచ్చును. సి-భాషలో వ్యాఖ్యలను /*, */ ల మధ్యన ఉంచవలెను. కావున /* */ మధ్యన ఏమి ఉన్నా కంపైలరు అసలు పట్టించుకోదు. అయితే అభిప్రాయములు తెలుపుటకు మనము "//" కూడా ఉపయోగించ వచ్చును. కాక పోతే // ఉపయోగించినప్పుడు వాటి తరువాత ఆ లైనులో ఉన్నదంతా వ్యాఖ్య కిందకు వస్తుంది. వీటిని కూడా చూడండి సి-ప్రీప్రాసెసర్ సి-ప్రామాణిక నిధి (Standard Library) సి-వ్యాకరణము (Syntax) సి-ఆపరేటర్లు ఇవి కూడా చూడండి బ్రయాన్ కెర్నిగన్, డెన్నీస్ రిచీ రాసిన ద సి ప్రోగ్రామింగ్ లాగ్వేజీ, దీనిని K&R అని కూడా పిలుస్తారు. మూలాలు వర్గం:సాఫ్టువేరు వ్రాయు భాషలు
సంస్కృతి
https://te.wikipedia.org/wiki/సంస్కృతి
right|200px|thumb|ప్రాచీన ఈజిప్ట్ కళ. thumb|200px|అజర్‌బైజాన్‌లో క్రీ.పూ. 10,000 సంవత్సరాలనాటి రాతి చెక్కడాలు - గోబుస్తాన్ సంస్కృతి (లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ Cultura, ఫ్రెంచ్, ఆంగ్లం Culture, జర్మన్, స్వీడిష్ Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి.Harper, Douglas (2001). Online Etymology Dictionary. ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.Findley, Carther Vaughn and John Alexander Rothney (2006). Twentieth-century World. Sixth edition, p. 14. ISBN 978-0-618-52263-7. ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును.Williams, Raymond. Keywords, "Culture" ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి సంస్కృతి నిర్వచనం ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి. (1976) :en:Keywords: A Vocabulary of Culture and Society. Rev. Ed. (NewYork: Oxford UP, 1983), pp. 87-93 and 236-8. ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి.John Berger, Peter Smith Pub. Inc., (1971) Ways of Seeing వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం. 1874లో సామాజిక పురా శాస్త్రము గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత"ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు , సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును. ("సంస్కృతి లేదా నాగరికత, దాని విస్తృత ఎథ్నోగ్రాఫిక్ కోణంలో తీసుకున్న, జ్ఞానం, నమ్మకం, కళ, నీతులు, చట్టం, ఆచారం కలిగి సంక్లిష్ట మొత్తంగా ఉంటుంది , ఏ ఇతర సామర్థ్యాలు , అలవాట్లు సమాజంలో సభ్యుడిగా మనిషికి సొంతం") Tylor, E.B. 1874. Primitive culture: researches into the development of mythology, philosophy, religion, art, and custom.''' ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే.UNESCO. 2002. Universal Declaration on Cultural Diversity. ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ఆల్ఫ్రెడ్ క్రోబర్, క్లైడ్ క్లుఖోన్ అనే రచయితలు తమCulture: A Critical Review of Concepts and Definitions అనే Kroeber, A. L. and C. Kluckhohn, 1952. Culture: A Critical Review of Concepts and Definitions. సంకలనంలో "సంస్కృతి"కి 161 నిర్వచనాలను సేకరించారు సంస్కృతి, నాగరికత సంస్కృతిలో మార్పులు భారతీయ సంస్కృతి ప్రపంచదేశాలలో భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి సనాతనమైనది తెలుగువారి సంస్కృతి (తెలుగుదనం) thumb|పుట్టింటి సారె తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పండుగలు వినాయకచవితి, ఉగాది, ఏరువాక, అట్ల తద్దె, భోగి, సంక్రాంతి, కనుమ, బోనాలు, bathukamma, graama devathala poojalu, తెలుగు నెలలు పండుగలు, దీపావళి ఇవి కూడా చూడండి నాగరికత చరిత్ర విద్య భాష మూలాలు బయటి లింకులు Define Culture A compilation of over 100+ user submitted definitions of culture from around the globe. Centre for Intercultural Learning Detailed article on defining culture Dictionary of the History of Ideas "culture" and "civilization" in modern times Global Culture Essays on global issues and their impact on culture Reflections on the Politics of Culture by Michael Parenti What is Culture? - Washington State University వర్గం:సంస్కృతి వర్గం:హిందూమతం diq:Portal:Zagon
కృష్ణ (అయోమయ నివృత్తి)
https://te.wikipedia.org/wiki/కృష్ణ_(అయోమయ_నివృత్తి)
కృష్ణ అన్న పేరు ఈ క్రింది వాటిని సూచిస్తుంది: మండలాలు కృష్ణ మండలం - తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం దేవుళ్ళు, పురాణ వ్యక్తులు శ్రీ కృష్ణుడు - కృష్ణ భగవానుడు - హిందూమతంలో దేవుడు. ద్రౌపది - ఈమె మరొక పేరు కృష్ణ అర్జునుడు - ఇతని నామాలలో "కృష్ణ" కూడా ఉంది దుర్గ - విరాటపర్వంలో "కృష్ణ" అని సంబోధించారు వ్యాసుడు - కృష్ణ ద్వైపాయనుడు భౌగోళికం కృష్ణా నది, దక్షిణ భారతదేశంలో ప్రముఖ నది. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లా. వ్యక్తులు ఘట్టమనేని కృష్ణ, తెలుగు సినీ నటుడు, నిర్మాత. కె.బి.కృష్ణ లేదా కాట్రగడ్డ బాలకృష్ణ జాతీయవాది. కాస్ట్యూమ్స్ కృష్ణ, సినీ నటుడు, నిర్మాత జి.కృష్ణ, జర్నలిస్టు. వి.ఎస్.కృష్ణ, ఆర్థికవేత్త, విశ్వవిద్యాలయ నిర్వాహకులు. టి. కృష్ణ - సినిమా దర్శకుడు, నిర్మాత ఎస్.ఎమ్. కృష్ణ - కర్ణాటక రాజకీయ నాయకుడు జిడ్డు కృష్ణమూర్తి - తాత్వికుడు ఎన్. కృష్ణ - తమిళ సినిమా దర్శకుడు సినిమాలు కృష్ణ (2008 సినిమా) - రవితేజ నటించింది. కృష్ణ (2008 మలయాళ సినిమా) - అల్లు అర్జున్ పరుగు సినిమాకు మలయాళ అనువాదం కృష్ణ (1996 హిందీ సినిమా) - సునీల్ షెట్టి, కరిష్మాకపూర్ నటించింది. కృష్ణ (2006 యానిమేషన్ సినిమా) - హిందీలో మొదటి యానిమేషన్ సినిమా
తుంగభద్ర
https://te.wikipedia.org/wiki/తుంగభద్ర
తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ, భద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి. పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు. కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః నదీ ప్రయాణం right|thumb|శివమొగ్గ జిల్లా కూడ్లి వద్ద తుంగ, భద్రల సంగమస్థలంలో ఉన్న చిన్న నంది ఆలయం తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమలకు తూర్పు వాలులో ప్రవహించే కూడ్లి వద్ద తుంగా నది, భద్ర నది సంగమం ద్వారా ఏర్పడుతుంది. ఈ రెండు నదులు కర్ణాటక చిక్కమగళూరు జిల్లా ముడిగిరి తాలూకాలో నేత్రావతి (పడమటి వైపు ప్రవహించే నది, మంగళూరు సమీపంలో అరేబియా సముద్రంలో చేరుతుంది) నదితోపాటు పుడతాయి, తుంగ, భద్ర నదులు వరాహ పర్వతం పశ్చిమ కనుమలలోని గంగమూల వద్ద 1198 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తాయి (సామ్సే గ్రామం దగ్గర). హిందూ పురాణాల ప్రకారం, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని చంపిన తర్వాత, వరాహ స్వామి (విష్ణువు యొక్క మూడవ అవతారం) బాగా అలసిపోతాడు. అతను ఇప్పుడు వరాహ పర్వతం అని పిలవబడే ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడు. అతను ఆ శిఖరంపై కూర్చున్నప్పుడు, అతని నెత్తి నుండి చెమట ప్రవహించడం ప్రారంభమైంది. అతని నెత్తికి ఎడమ వైపు నుండి ప్రవహించే చెమట తుంగ నదిగా మారింది, అతని కుడి వైపు నుండి ప్రవహించే చెమట భద్ర నదిగా మారింది. మూలం నుండి ఉద్భవించిన తరువాత, భద్ర నది కుద్రేముఖ పర్వత ప్రాంతం, తరికెరె తాలూకా, పారిశ్రామిక నగరమైన భద్రావతి గుండా ప్రవహిస్తుంది. తుంగా నది శృంగేరి తాలూకా, తీర్థహళ్లి తాలూకా, షిమోగా తాలూకాల గుండా ప్రవహిస్తుంది. 100 కంటే ఎక్కువ ఉపనదులు, ప్రవాహాలు, వాగులు, ఈ రెండు నదులలో చేరుతాయి. శివమొగ్గ నుండి సుమారు దూరంలో, హోలెహోనూరు సమీపంలోని కూడ్లీలో, సుమారు 610 మీ. ఎత్తులో, ఈ రెండు నదులు ఏకమౌతాయి. ఆ చోటు వరకు తుంగ, భద్రల ప్రయాణం, వరుసగా, , . తుంగ, భద్ర నదులు రెండూ ఒకే మూలం (గంగమూల) వద్ద ప్రారంభమైనప్పటికీ, అవి కొంత దూరం విడివిడిగా ప్రవహిస్తాయి, తరువాత అవి కూడలి గ్రామంలో ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అందువల్ల అక్కడ నుండి, మిశ్రమ పేరు, తుంగభద్ర వచ్చింది. అలా తుంగభద్ర మైదానాల గుండా పయనిస్తుంది. సంగమం తరువాత, శక్తివంతమైన తుంగభద్ర నది దావంగెరె జిల్లాలోని హొన్నాలి, హరిహర తాలూకాల గుండా ప్రవహిస్తుంది. తర్వాత బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి, హూవిన హడగాలి, హగరిబొమ్మనహళ్లి, హోస్పేట్, సిరుగుప్ప తాలూకాల గుండా ప్రవహిస్తుంది. బళ్లారి జిల్లాలోని సిరుగుప్ప తాలూకాలో దాని ఉపనదైన వేదవతి నదిని అందుకుంటుంది. ఈ నది బళ్లారి, కొప్పల్ జిల్లాల మధ్య తరువాత బళ్లారి, రాయచూర్ జిల్లాల మధ్య సహజ సరిహద్దును ఏర్పరుస్తుంది. కర్నూలు జిల్లా కౌతాలం మండలం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన తరువాత, అది మంత్రాలయం గుండా తరువాత కర్నూలు గుండా ప్రవహిస్తుంది. ఇది కర్నూలు సమీపంలో దాని ఉపనది హంద్రీ నదిని అందుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాలోని గుండిమల్ల గ్రామ సమీపంలో తుంగభద్ర కృష్ణలో కలిసిపోతుంది. తుంగభద్ర, కృష్ణ నదుల సంగమం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం - సంగమేశ్వరం దేవాలయం. శివమొగ్గ, ఉత్తర కన్నడ, హవేరి జిల్లాల గుండా ప్రవహించే వరదా నది, కర్ణాటకలోని చిక్కమగళూరు, చిత్రదుర్గ, బళ్లారి జిల్లాలలో ప్రవహించే వేదవతి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ప్రవహించే హేండ్రైల్ తుంగభద్రకు ప్రధాన ఉపనదులు. అనేక ఉపనదులు, ప్రవాహాలు ఈ ఉపనదులలో చేరతాయి. కన్నడలో "తుంగ పాన, గంగా స్నాన" అనే ప్రసిద్ధ సామెత ఉంది, అంటే "రుచికరంగా, తీపిగా ఉండే తుంగ నీటిని త్రాగండి, పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయండి" అని అర్థం. తుంగభద్ర నది తూర్పుకు ప్రవహిస్తుంది, తెలంగాణలో కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ నుండి కృష్ణ తూర్పుకు కొనసాగి బంగాళాఖాతంలో కలుస్తింది. తుంగభద్ర, కృష్ణ మధ్య తుంగభద్ర నదికి ఉత్తరాన ఉన్న భూభాగాన్ని రాయచూర్ దోబ్ అని పిలుస్తారు. తుంగభద్ర పుష్కరాలు పుష్కరాలు హిందువులకు పవిత్రమైన పుణ్యదినాలు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్రనది పుష్కరాలు 2008 డిసెంబర్ మాసంలో తుంగభద్ర నది యొక్క ప్రముఖ తీరప్రాంతాలలో జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కర్నూలు, తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లాలలో మాత్రమే నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న ప్రముఖ ప్రాంతాలలో పుష్కరఘాట్‌లు ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనానికి వసతులు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు నిర్వహించింది. కర్నూలు, మంత్రాలయం, ఆలంపూర్ తదితర ప్రాంతాలలో పుష్కరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దేవాలయాలు కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున హులిగేమ ఆలయం ఉంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా శివాపూర్ గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున శివుడికి అంకితం చేయబడిన మార్కెండేశ్వర ఆలయం ఉంది. కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలో తుంగా నది ఒడ్డున శ్రీ శృంగేరి శారదాంబ ఆలయం ఉంది. తుంగభద్ర నది ఒడ్డున అనేక పురాతన, పవిత్ర స్థలాలు ఉన్నాయి. హరిహర వద్ద హరిహరేశ్వరుని ఆలయం ఉంది. ఆధునిక హంపి పట్టణం చుట్టూ విజయనగర శిథిలాలు ఉన్నాయి, ఇది శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం, ఇప్పుడు ప్రపంచ వారసత్వ ప్రదేశం. విజయనగర ఆలయ కాంప్లెక్స్ శిథిలాలతో సహా ఈ ప్రదేశం పునరుద్ధరించబడుతోంది. గురువు రాఘవేంద్ర స్వామి మూల బృందావనం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఒడ్డున ఉంది. అలంపూర్‌లో దక్షిణ కాశిగా పిలువబడే శ్రీ జోగుళాంబ ఆలయం కర్నూలు నుండి 25 కి.మీ. దూరంలో ఉంది, ఇక్కడ, తుంగభద్ర నదికి ఉత్తర ఒడ్డున, ప్రారంభ చాళుక్యులు దేవాలయాల సమూహాన్ని నిర్మించారు. నవ బ్రహ్మ దేవాలయాల సముదాయం భారతదేశంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన తొలి నమూనాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో, అనేక పవిత్ర నదులు కలిసే ఈ ప్రదేశంలో, శివుడికి అంకితం చేయబడిన సంగమేశ్వరం ఆలయం ఉంది. పురాణాల ప్రకారం, ఒకసారి పాండవులు తమ వనవాస సమయంలో కర్నూలుకు వచ్చారు. శ్రీశైలం మల్లికార్జున దేవాలయాన్ని సందర్శించిన తర్వాత వారు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు.thumb|left|219x219px|కర్నూలు వద్ద తుంగభద్ర నదిపై రైల్వే వంతెనకావున ధర్మరాజి (యుధిష్ఠిరుడు) తన సోదరుడు భీమునితో కాశీ నుండి ఒక శివలింగాన్ని తీసుకురావాలని చెప్పాడు. తరువాత వారు, కృష్ణా, తుంగభద్ర, ఇతర ఐదు ఉపనదుల సంగమం వద్ద లింగాన్ని ప్రతిష్ఠించారు. అందువల్ల, లింగానికి సంగమేశ్వరుడు (నదులు కలిసే సంగమం) అన్న పేరొచ్చింది. ఆనకట్టలు thumb|212x212px|ఆలంపూర్ వద్ద తుంగభద్ర నదిషిమోగా నుండి ప్రవాహానికి దాదాపు 15 కి.మీ. ఎదురుగా గజనూరు వద్ద తుమో నది మీదుగా ఒక ఆనకట్టను నిర్మించారు. లక్కవల్లి వద్ద భద్రావతి నుండి సుమారు 15 కి.మీ. ప్రవాహానికి ఎదురుగా భద్రా నది మీదుగా మరొక ఆనకట్ట నిర్మించబడింది. అవి బహుళార్ధసాధక ఆనకట్టలు, షిమోగా, చిక్కమగళూరు, దావణగెరె, హవేరిలోని భూములకు సాగునీటిని అందిస్తాయి. తుంగభద్ర నది మీదిగా తుంగభద్ర ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్ట కర్ణాటకలోని హోసపేట్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇది బహుళార్ధసాధక ఆనకట్ట (బహుళార్ధసాధక ఆనకట్టలు విద్యుత్ ఉత్పత్తి,నీటిపారుదల, వరదల నివారణ, నియంత్రణ మొదలైన వాటికి సహాయపడతాయి). దీని నిల్వ సామర్థ్యం 135 టిఎంసీలు. ఒండ్రు చేరడం కారణంగా, సామర్థ్యం 30 టీఎంసీలు తగ్గింది. కాలానుగుణ, ఆలస్య వర్షాలు పడితే, ఆనకట్ట 235 టిఎమ్‌సీల నీటిని విడుదల చేస్తుంది. వర్షాకాలంలో కాలువల్లోకి నీరు చేరినప్పుడు అది నిండిపోతుంది. ఆనకట్ట ప్రధాన వాస్తుశిల్పి మద్రాసుకు చెందిన తిరుమలై అయ్యంగార్, వీరు ఒక ఇంజనీర్; ఒక సాధారణ-ప్రయోజన హాలుకి అతని పేరు పెట్టబడింది. ఇది గత సంవత్సరాలలో పర్యాటక ప్రదేశంగా మారింది. తుంగభద్ర ఆనకట్ట వారసత్వ ప్రదేశమైన హంపికి సమీపంలో ఉంది. ఈ ఆనకట్టతో ముడిపడి ఉన్న ప్రధాన సమస్యలలో ఒకటి ఒండ్రు చేరడం. దీని కారణంగా నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. మరో ప్రధాన సమస్య పెరుగుతున్న కాలుష్యం, ఫలితంగా చేపల జనాభా తగ్గుతుంది. ఇది నదిపై ఆధారపడి జీవించే మత్స్యకారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కర్నూలు నగరానికి సమీపంలోని పొడువైన సుంకేశుల ఆనకట్టరాయలసీమకు భగీరథడుగా ప్రశంసించబడే బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ద్వారా 1860 లో తుంగభద్ర నదిమీదిగా నిర్మించబడింది. వాస్తవానికి దీన్ని బ్రిటిషర్ల సమయంలో నౌకాయానం కోసం నిర్మించారు. కడప జిల్లాకు సాగునీటి సరఫరా అందించడానికి కోట్ల విజయభాస్కర రెడ్డి తుంగభద్ర బ్యారేజీని పునర్నిర్మించారు. రోడ్డు, రైలు రవాణా పెరిగినందున, ఇది ఇప్పుడు కెసి కాలువ ద్వారా కర్నూలు, కడప జిల్లాలకు నీటిని సరఫరా చేస్తోంది. ఈ ఆనకట్ట దాదాపు నీటిని నిల్వ చేస్తుంది. కర్నూలు, కడప జిల్లాలలోని సుమారు భూమికి సాగునీటిని అందిస్తుంది. సమస్యలు పారిశ్రామిక కాలుష్యం తుంగభద్ర నదిని దెబ్బతీసింది, తీస్తుంది. కర్ణాటకలోని చిక్కమగళూరు, శివమొగ్గ, దావంగెరె, హవేరి, బళ్లారి, కొప్పల్, రాయచూర్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర ఒడ్డున ఉన్న పరిశ్రమలు,మైనింగులు అపారమైన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి సంవత్సరం దాదాపు మూడు కోట్ల లీటర్ల వ్యర్థాలు శివమొగ్గ నుండి తుంగలో విడుదలవుతున్నాయి.The Hindu, 6 June 2008 ఇది భద్రావతి, హోస్పేట్ లాంటి పారిశ్రామిక నగరం కాని శివమొగ్గ నుంచి విడుదల అవుతున్న కాలుష్యం. తుంగభద్ర దేశంలో అత్యంత కలుషితమైన నదులలో ఒకటి. పరిశ్రమల నుండి ప్రవాహానికి కిందిగా గమనిస్తే, నీరు ముదురు గోధుమ రంగులోకి మారి తీవ్రమైన వాసన కలిగి ఉంటాయి. పరీవాహక ప్రాంతంలో చాలా గ్రామాలు నది నీటిని తాగడానికి, స్నానం చేయడానికి, పంటలకు నీరు పెట్టడానికి, చేపలు పట్టడానికి, పశువుల నీటికి ఉపయోగిస్తాయి, తుంగభద్ర నది కాలుష్యం ఇలాంటి 10 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసింది. క్రమంగా సంభవిస్తున్న చేపల మరణాల వల్ల తుంగభద్ర మత్స్య సంపద తరిగిపోయింది, గ్రామ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింది. చిత్రలహరి మూలాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు వర్గం:కర్ణాటక నదులు వర్గం:మహబూబ్ నగర్ జిల్లా నదులు వర్గం:కర్నూలు జిల్లా నదులు వర్గం:కృష్ణానది ఉపనదులు
విజయవాడ
https://te.wikipedia.org/wiki/విజయవాడ
విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో జనాభా పరంగా రెండవ పెద్ద నగరం. ఇది ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉంది, దీనికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగా బుడమేరు నది కలిగి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా, మద్రాసు-ఢిల్లీ రైలు మార్గాలకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామం, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు, బ్లేజువాడ అన్నాడట. స్థల పురాణం మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేదవ్యాసుని సలహా మేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సుచేయగా, శివుడు పరీక్షించడానికి నిర్ణయించాడు. ఆ పరీక్ష మేరకు, మాయా మృగాన్ని ఒకదాన్ని సృష్టించి అర్జునుడు, తాను ఒకేసారి దాన్ని బాణాలతో కొట్టేలా చేస్తాడు. ఆ వేట నాదంటే నాథని తగవు ప్రారంభమై అది యుద్ధంలోకి దిగుతుంది. చివరకు శివుడు తనతో సమానంగా యుద్ధం చేసిన అర్జునుడి వీరత్వానికి, ఘోరమైన తపస్సుకు మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. అర్జునుడు తపస్సుచేసిన ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడలో నేడు కనకదుర్గ ఆలయం కొలువైన చోటనే స్థలపురాణం ప్రాచుర్యంలో ఉంది. 11వ శతాబ్దిలోనూ, బహుశా 12వ శతాబ్దిలోనూ వేసిన రెండు శాసనాలు విజయవాడకు ఈ స్థలపురాణాన్ని ఆపాదిస్తున్నాయి. కవిత్రయం వారు తమ ఆంధ్ర మహా భారత ప్రస్తావనలో ఇదేమీ చెప్పకపోవడంతో పాటు ఇతర పురాణాధారాల్లోనూ దీనికి మూలాలు లభించవు. ఇలా సాహిత్యాధారాలు లోపించి కేవలం రెండు శాసనాల ఆధారంగా చలామణి అవుతున్న ఈ కథ ప్రజల నమ్మకాల్లో మాత్రం స్థానం బాగా సంపాదించుకుంది. పేరు వెనుక కథలు విజయవాడ అన్న పేరు ఇటీవల ప్రాచుర్యం చెందగా పూర్వం నుంచీ బెజవాడ అన్న పేరు ఉంది. ఇక్కడి శాసనాల్లో ప్రాచీనమైన యుద్ధమల్లుని శాసనం, కొండవీడులోని మరో శాసనం ఈ ప్రాంతాన్ని బెజవాడగానే పేర్కొన్నాయి. ఈ రెండు పేర్లలో ఏది ఎలా వచ్చిందన్నదానిపై పలు కథలు, సిద్ధాంతాలు ఉన్నాయి. అర్జునుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శివునికై తపస్సుచేసి, కిరాతరూపంలోని శివునితో పోరాడాడని చెప్పే స్థలపురాణం ఉంది. దీనితో విజయుడన్న అర్జునుడి పేరుమీదుగానే విజయవాడ వచ్చిందని చెప్తారు. అర్జునుడి పాశుపతాస్త్ర సంపాదన ఇక్కడే జరిగిందనే స్థలపురాణం వివరించే ఓ శాసనంలో ఈ ప్రాంతాన్ని వెచ్చవాడ అని వ్యవహరించారు. జల మార్గంలోనూ, భూమార్గంలోనూ కూడా కీలకమైన కూడలిగా నిలిచిన విజయవాడ ప్రాచీన కాలం నుంచీ వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఈ కారణంగా వెచ్చాలు అధికంగా లభించే ప్రాంతం కావడంతో వెచ్చవాడ అయిందని జాన్సన్ చోరగుడి అభిప్రాయపడ్డాడు. బెజవాడ అన్న పేరు బ్లేజ్ వాడ నుంచి వచ్చిందనీ, విపరీతమైన ఎండలు ఉండడంతో దీన్ని బ్రిటీష్ వారు బ్లేజ్ వాడ అని పిలవగా, పిలవగా జనవ్యవహారంలో బెజవాడ అయిందనీ కొందరు చెబుతారు. అయితే ఇది జన నిరుక్తే. బ్రిటీష్ వారి రాకకు వేల సంవత్సరాల క్రితమే దీనికి బెజవాడ అన్న పేరు శాసనాల్లో కనిపిస్తూ ఉంది. నిజానికి విద్యావేత్త, రాజకీయవేత్త కట్టమంచి రామలింగారెడ్డి ఒకమారు బెజవాడను బ్లేజ్ వాడ అని మార్చి చమత్కరించగా, ఆ చమత్కారం జన నోళ్ళలో నాని ఈ కథగా తయారైంది. చరిత్ర సా.శ. 3-7 శతాబ్దాలు thumb|మొగల్రాజపురం గుహలు|alt=|ఎడమ|250x250px విజయవాడ విష్ణుకుండినుల్లో కొందరి రాజధానిగా ఉండేది. సా.శ.565 ప్రాంతంలో విష్ణుకుండిన వంశ రాజైన మాధవ వర్మ విజయవాడ కేంద్రంగా పరిపాలించాడు. అతని కుమారుడు నగరంలో రథం నడుపుతూ బాటపక్కన చింతచిగురు అమ్మే ముసలమ్మ కుమారుడిపై రథాన్ని ఎక్కించాడు. ఆ పిల్లాడు చనిపోయాడు. మహారాజు పుత్రవాత్సల్యాన్ని పక్కనపెట్టి శిక్షగా అదే రథం మీద ఎక్కించి రాకుమారుడిని చంపాలని ఆజ్ఞాపించాడు. మల్లీశ్వరాలయంలో బయటపడ్డ విష్ణువర్ధనుని శాసనం, మరోచోట లభించిన కల్యమబోయ శాసనం, విజయనగరం జమీందారుల వంశ చరిత్ర, మరికొన్ని చాటువులు ఈ సంఘటనను పేర్కొంటున్నాయి. అక్కన్న, మాదన్న గుహలు, మొగల్రాజపురం గుహలు 3, 4 శతాబ్దాలకు చెందినవి. ఇవి బౌద్ధారామాలనీ, తర్వాతి కాలంలో శైవులకు ఆలవాలమై శైవ దేవతా ప్రతిమలు అక్కడ ఏర్పడ్డాయని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. మరికొందరు ఆ వాదాన్ని తిరస్కరిస్తూ ఇవి హిందూ సంబంధ ఆరాధనా స్థలాలేనని వాదిస్తున్నారు. వీటిని విజయవాడను పరిపాలించిన శాలంకాయనులు కానీ, కృష్ణకు దక్షిణాన పాలించిన పల్లవులు కానీ నిర్మించారని భావిస్తున్నారు. సా.శ. 739లో చైనీస్ యాత్రికుడు యుఁఆన్‌ చ్వాంగ్‌ బెజవాడను సందర్శించాడు. ఈ నగరం తెనకచక రాజ్యంలో భాగంగా ఉండేదని రాసుకున్నాడు. ఈ తెనకచక అంటే ధాన్యకటకానికి రూపాంతరం. యుఁఆన్ చ్వాంగ్ ఇక్కడ బెజవాడ, సీతానగరం, ఉండవల్లి కొండల మీద గుహల్లో ఎందరో బౌద్ధ భిక్షువులు ఉండేవారని, సాయంత్రం అయితే అక్కడ వెలిగించిన దీపాల వెలుగులో బెజవాడ ప్రాంతమంతా కన్నుల పండువగా ఉండేదని రాసుకున్నాడు. ఇంద్రకీలాద్రి కొండమీద బౌద్ధ భిక్షువులు నివసించేందుకు కొండను తొలిపించి పలు చావడులు, వసారాలు నిర్మించి ఉన్నాయని రాశాడు. ఇక్కడి బౌద్ధ తంత్రజ్ఞుల నుంచి మాయలు, మహత్తులు ప్రసాదిస్తాయని నమ్మే ధారణ మంత్రాలను అతను నేర్చుకున్నాడు. నదీతీరాన సకల వ్యాధులను హరింపజేసే వనౌషధాల పర్వతం ఉండేదనీ, దానిని వైద్యులు వినియోగించుకునేవారనీ, ఇక్కడ పర్వత సానువుల్లో సంచరించే సాధువులకు బంగారం తయారుచేసే హేమవిద్య ఉండేదనీ రాశాడు. సా.శ. 8-10 శతాబ్దాలు వేంగి చాళుక్యుల కాలంలో విజయవాడ రాజకీయంగానూ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇదే సమయంలో విజయవాడ మీద రాష్ట్రకూటులు పలు దండయాత్రలు చేశారు. నగరం యుద్ధాల్లో చిక్కుబడిపోయి ఉండేది. పలుమార్లు చేతులు మారింది. సా.శ.927లో వేంగి చాళుక్య రాజు రెండవ యుద్ధమల్లుడు రాష్ట్రకూటులతో ఒప్పందం చేసుకుని వారి సహాయంతో విజయవాడను తిరిగి ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత చోళులకు, చాళుక్యులకు మధ్య యుద్ధాలతో విజయవాడ రణరంగంగా మారింది. 70 సంవత్సరాల పాటు సాగిన పోరాటాలు, యుద్ధాల్లో విజయవాడ అరాచకంగా ఉండేది. పౌరులకు శాంతి భద్రతలు కరువై జీవితం దుర్భరమైంది. సా.శ.999లో చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు చాళుక్యులతో జరిగిన యుద్ధంలో నిర్ణయాత్మకంగా జయించి, విజయవాడను ఆక్రమించాడు. రాజరాజ చోళుడు మొదటి శక్తివర్మను విజయవాడలో తనకు సామంత రాజుగా నియమించాకా ఈ రాజకీయ అనిశ్చితి, అరాచక పరిస్థితులు తొలగిపోయాయి. వేంగి చాళుక్యులు ఆ ఓటమితో తమ రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చారు. సా.శ.11-18 శతాబ్దాలు 11వ శతాబ్ది నుంచి విజయవాడ రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయింది. అయితే వాణిజ్య కేంద్రంగా మాత్రం అభివృద్ధి చెందింది. పురాతత్వ శాస్త్రవేత్త సీవెన్ ప్రకారం విజయవాడ ప్రాంతంలో క్రీ.పూ.11 శతాబ్ది నాటివే 47 శాసనాలు లభించాయి. ఇవి కాక పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల ప్రకారం చూసినా వెయ్యేళ్ళ క్రితమే ఇక్కడ విశాలమైన నగరం ఉండేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచీ కృష్ణా నది మీదుగా సముద్ర మార్గంలోకి సాగే జలమార్గంలోనూ, కళింగం (ఒడిశా), మధ్యదేశం (మధ్యప్రదేశ్), మహారాష్ట్ర, కర్ణాటక, దక్షిణ ప్రాంతాల నుంచి వచ్చే భూమార్గాల్లోనూ కూడలిగా ఉండేది. ఈ కారణంగా బెజవాడ కీలకమైన వ్యాపార కూడలిగా అభివృద్ధి చెందింది. ఆంధ్రదేశంలోని ప్రధానమైన నగరాలు, రేవు పట్టణాలను కలుపుతూ ఉండే రాచబాటలను కలుపుతూ, కీలకమైన వాణిజ్య కేంద్రాలుగా వెలిగిన పట్టణాల్లో బెజవాడ కూడా ఉండేది. వ్యాపారపరంగా విజయవాడకు ఎంత ప్రఖ్యాతి ఉన్నా 11 శతాబ్ది నుంచి ఏ సామ్రాజ్యానికీ రాజధానిగా ఉండేది కాదు. కాకతీయులు, రెడ్డి రాజులు, గజపతులు వంటి పలువురు శక్తిమంతులైన రాజ్యాలు, సామ్రాజ్యాలు విజయవాడను ఒక వ్యాపార కేంద్రంగానే పరిగణించేవారు. రాజకీయంగా ప్రాముఖ్యత ఉండేది కాదు. పలువురు సామంత రాజుల పరిపాలనలో నగరం ఉండేది. 15వ శతాబ్దిలో ఆంధ్ర క్షత్రియులులో వశిష్ట గోత్రానికి చెందిన పూసపాటి రాజ వంశస్థులు విజయవాడ నగరాన్ని పాలించారు.No. 45. (A.R. No. 491 of 1906.) Pulivendla, Pulivendla Taluk, Cuddapah District. On a slab set up at the entrance of the Ranganathasvamin temple. Krishnaraya, AD 1509. This is dated Saka 1431, Sukla, Kartika su. 12, corresponding to AD 1509, October 24, which was, Wednesday. It records a gift of the village Kunddal Kundu to the god Sri Ranga Raju of Pulivindla by Narasayya Deva Maharaju, brother of Basava Raju, son of Tamma Raju, grandson of Valla Bharaya and great-grandson of Bejawada Madhava Varma of Vasishtha-gotra and Surya-vamsa. The gift village is said to be situated in Pulivindalasthala, a subdivision of Mulkinadu in Gandhi Kotasima of Udayagiri Rajya. గజపతులపై తీరాంధ్ర ప్రాంతం మీదుగా దండయాత్రకు తరలివెళ్లినప్పుడు శ్రీ కృష్ణదేవ రాయలు విజయవాడలో విడిది చేశాడు. సమీపంలోని శ్రీకాకుళ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువును సందర్శించి, ఆంధ్ర విష్ణువు ఆనతి మేరకు ఆముక్తమాల్యద కావ్యాన్ని ప్రారంభించినట్టుగా అవతారికలో రాసుకున్నాడు. సా.శ. 1800 - 2000 విజయవాడ 16వ శతాబ్ది తర్వాత పూర్తిగా తన ప్రాధాన్యత కోల్పోయింది. 2 శతాబ్దాల పాటు తన పూర్వ వైభవం పోగొట్టుకుని కొద్దిపాటి ప్రాంతానికి పరిమితమైపోయింది. ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో 1832లో సంభవించిన తీవ్రమైన కరువు తర్వాత ఆర్థర్ కాటన్ 1839లో కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మించి నదీ జలాలతో సేద్యాన్ని అభివృద్ధి చేయాలని నివేదిక తయారుచేశాడు. ఈ నివేదిక 1850లో లండన్లోని కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల ఆమోదంతో పాటుగా అనువైన స్థలాన్ని ఎంపికచేయమన్న ఆదేశం వెలువడింది. కాటన్ నేటి పలనాటి ప్రాంతంలోని గనికొండ ప్రాంతంలో, ముక్త్యాలలో, ఇబ్రహీంపట్నంలోనూ పరిశీలించి, వాటన్నిటినీ పక్కనపెట్టి తుదకు విజయవాడను బ్యారేజికి అనువైన స్థలంగా ఎంపిక చేశాడు. 19వ దశకం మధ్యలో జరిగిన ఈ పరిణామం తిరిగి విజయవాడకు ప్రాధాన్యత తెచ్చిపెట్టడానికి ఒక ముఖ్యకారణమైంది. 1940ల వరకూ విజయవాడ వన్ టౌన్ ప్రాంతమంతా చిన్న చిన్న అడవులు, వాగులు, కొండలతో జనావాసాలకు వీల్లేకుండా ఉండేది.1949 తర్వాత వన్ టౌన్ జనసాంద్రత హఠాత్తుగా పెరిగిపోయింది. 1947 తర్వాత తెలంగాణలో జరుగుతున్న సాయుధ పోరాటం, రజాకార్ల అకృత్యాల నేపథ్యంలో ఎందరో తెలంగాణ ప్రాంతం నుంచి తరలివచ్చి విజయవాడలో స్థిరపడ్డారు. ఆ దశలో కమ్యూనిస్టు నాయకుల ప్రాబల్యంలో కొండలు తొలచి, అడవులు కొట్టి మరీ వన్ టౌన్లో జనావాసాలు ఏర్పాటుచేసుకున్నారు. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతాలు విడదీసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసేప్పుడు తాత్కాలిక రాజధానిగా విజయవాడను నిర్ణయించాలని ప్రతిపాదన వచ్చింది. ప్రధానంగా విజయవాడపై రాజకీయంగా పట్టుసాధిస్తున్న కమ్యూనిస్టులు విజయవాడను కానీ, విజయవాడ-గుంటూరు కానీ రాజధాని చేయాలని ప్రతిపాదించగా ఒక్క ఓటు తేడాతో ప్రతిపాదన వీగిపోయింది. ఆంధ్ర రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా కర్నూలు మూడేళ్ళు, ఆపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాదు 1956 నుంచి 58 ఏళ్ళు కొనసాగాయి. 19, 20వ శతాబ్దాల్లో కృష్ణా జిల్లా కేంద్రంగా కూడా వందల ఏళ్ళుగా ఓడ రేవు పట్టణంగా కీలక స్థానంలో ఉన్న మచిలీపట్నమే ఉండేది కానీ విజయవాడ కాలేదు. విజయవాడ మాత్రం రాజధానిగానో, జిల్లా కేంద్రంగానో లేకున్నా వ్యాపార, సాంస్కృతి, రాజకీయ, మీడియా కేంద్రంగా అభివృద్ధి చెందింది. 21వ శతాబ్ది 2000 నాటికే కోస్తాలో పలు రంగాలకు కేంద్రంగా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి కోస్తా-రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ మిగలడంతో విజయవాడ గుంటూరులకు దగ్గరగావున్న అమరావతి రాజధాని అయింది. భౌగోళికం thumb|విజయవాడ పట్టణంభౌగోళికంగా విజయవాడ నగరం కృష్ణానది తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల. నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది. కొండపల్లి అడవులు విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి. జనాభా గణాంకాలు జనాభాపరంగా ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ రెండవ పెద్ద నగరం. చదరపు కిలో మీటరుకు 31,200 జనసాంద్రతతో ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత గల నగరాలలో మూడవది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ పట్టణ జనాభా 1,021,806. దీనిలో పురుషుల సంఖ్య 524,918 స్త్రీల సంఖ్య 523,322, లింగనిష్పత్తి 997స్త్రీలు 1000 పురుషులకు ఇది జాతీయ సగటు 940 కంటే ఎక్కువ. సగటు అక్షరాస్యత 82.59% (పురుషులు 86.25%; స్త్రీలు 78.94%) తో మొత్తం 789,038 అక్షరాస్యులున్నారు. ఇది జాతియ సగటు 73.00% కంటే ఎక్కువ. మతం, భాష నగరంలో వాడబడే ప్రధాన భాష తెలుగు. 2011 జనగణన ప్రకారం నగరం (పరిసరాలలో నగరం పెరిగిన ప్రాంతాలతో కలిపి) జనాభా కాగా, తెలుగు భాషీయులు , ఉర్దూ భాషీయులు . అత్యల్పంగా హిందీ, తమిళ, ఒడిషా, గుజరాతీ, మరాఠీ భాషీయులు కూడా ఉన్నారు. Select "Andhra Pradesh" from the download menu. Data for "Vijayawada (M+OG)" is at row 11723 of the excel file. అదే జనగణన ప్రకారం హిందువులు (85.16%), ముస్లింలు (9.12%), క్రైస్తవులు (3.64%), జైనులు (0.50%), మతం వివరాలు తెలపని వారు (1.59%). Select "Andhra Pradesh" from the download menu. Data for "Vijayawada (M+OG)" is at row 2395 of the excel file. ఆర్ధికం కీలకమైన భౌగోళిక స్థానంలో నెలకొనివుండడంతో విజయవాడ పలు వ్యాపారాలకు కేంద్రమైంది. నీటి పారుదల సౌకర్యాలు పెరిగి వ్యవసాయ ప్రధాన జిల్లాలుగా రూపుదిద్దుకున్న కోస్తాంధ్ర జిల్లాలకు రవాణాపరంగా కేంద్రమైన విజయవాడ సహజంగానే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అయింది. చెరకు, వరి, మామిడి పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవసరాలను తీర్చే వర్తకం, రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), కాళేశ్వరరావు మార్కెట్‌ లలో జరుగుతుంది. గవర్నర్ పేట, బీసెంట్‌రోడ్‌లు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎమ్.జి.రోడ్‌లలోను, మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి తెలుగు సినిమా నిర్మాణం మొదట మద్రాసులో, తర్వాత హైదరాబాద్ లో కేంద్రీకృతమై ఉన్నా, తొలి నుంచీ పంపిణీ వ్యవస్థకు విజయవాడ కేంద్రంగా నిలిచింది. రెండు దశాబ్దాల పాటు ఇబ్బడిముబ్బడిగా తెలుగు సినిమా పంపిణీ వ్యాపారం జరిగింది. నవయుగ పిక్చర్స్, పూర్ణా పిక్చర్స్, అన్నపూర్ణా ఫిలింస్, లక్ష్మీ ఫిలింస్, లక్ష్మీ చిత్ర, రాజశ్రీ, విజయా వంటి పంపిణీ సంస్థలన్నీ ఇక్కడ నెలకొన్నాయి. విజయవాడ నగరం తెలుగు ముద్రణ, ప్రచురణ రంగాలకు ముఖ్యకేంద్రం. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో (ముఖ్యంగా నాలుగు జిల్లాలకు) హోల్‌సేల్ వ్యాపారం విజయవాడనుండి పెద్దయెత్తున జరుగుతుంది. వస్త్రాలు, ఇనుప సామానులు, పప్పుధాన్యాలు, ఎరువులు, మందులు వంటివి ఇక్కడినుండి సరఫరా చేయబడుతాయి. పరిపాలన thumb|విజయవాడ నగరపాలక సంస్థ 50 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కేసీపీ వారి స్తూపం, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బస్ స్టాండ్ రైల్వే స్టేషను లకు మధ్యన|333x333px|alt= స్థానిక పౌర పరిపాలన విజయవాడ నగర పౌర పరిపానా బాధ్యతలు విజయవాడ నగర పాలక సంస్థవి. భారతదేశంలోకెల్లా ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ సాధించిన స్థానిక సంస్థల్లో ఇది మొట్టమొదటిది. 1888 ఏప్రిల్ 1న పురపాలక సంఘం ఏర్పడగా, 1960లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా లభించింది. 1981లో నగర పాలక సంస్థ ఏర్పడింది. 2012 నాటికి నగరపాలక సంస్థ 61.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. 2017లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని గ్రేటర్ విజయవాడ (మెట్రో) ఏర్పాటుచేసింది. దాని పరిధి 160 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. మెట్రోనగరంలో విజయవాడ నగరపాలకసంస్థతో పాటు కలిసిపోయిన అంబాపురం, బుద్దవరం, దోనేటికూరు, ఎనికేపాడు, గంగూరు, గన్నవరం, గొల్లపూడి గ్రామాలు, మెట్రోపాలిటన్ ప్రాంతంలో గూడవల్లి, జక్కంపూడి, కానూరు, కీసరపల్లి, నిడమానూరు, నున్న, పాతపాడు, పెనమలూరు, ఫిర్యాదీనైనవరం, పోరంకి, ప్రసాదంపాడు, రామవరప్పాడు, తాడిగడప, యనమలకుదురు వుంటాయి. విజయవాడ నగరం ఎన్టీఆర్ జిల్లా పరిపాలనా కేంద్రం. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు విజయవాడ నగరపాలక సంస్థ (మునిసిపల్ కార్పొరేషన్)చే నిర్వహించబడుతాయి.. నగరంలోని 63 వార్డులనుండి ఒక్కో కార్పొరేటర్ ఎన్నికోబడుతారు. నగరానికి ఒక మేయర్‌ను ఎన్నుకొంటారు. ప్రభుత్వం ఒక మునిపల్ కమిషనర్‌ను నియమిస్తుంది. విజయవాడ నగరంలో ఒక సబ్-కలెక్టర్ ఉంటారు. నగరపాలక సంస్థ కార్యనిర్వహణ బాధ్యతలు మున్సిపల్ కమీషనర్ వి. కమీషనర్ కింద రెవెన్యూ, ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా, క్రీడలు మొదలైన 13 విభాగాల అధికారులు పనిచేస్తారు. వి.జి.టి.ఎం.వుడా విజయవాడ ద్వారా నగరంలో పచ్చదనం పార్కులు రహదారులు ఫ్లై ఓవర్లు నిర్మించబడ్డాయి. మురుగునీటి శుద్ధి నగరంలో నాలుగు (ఎస్‌టీపీ) సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు శివారు ప్రాంతాల్లో మరికొన్ని సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంప్‌లకు వివిధ ప్రాంతాల్లోని మురుగునీరు వచ్చి చేరుతుంది. సంప్‌ల నుంచి ఎస్‌టీపీలకు మురుగునీరు చేరుతుంది.అక్కడ మురుగునీరు శుద్ధి అవుతోంది. నగరంలో సాగునీటిని విడుదల చేసే కాలువలు ప్రధానంగా మూడు ఉన్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి డ్రెయినేజి నీరు ఈ కాలువలలోకి పోతోంది. డ్రెయినేజి కాలవలలోకి కలిసే విధానాన్ని రూపుమాపి, మురుగునీరంతా ప్రాజెక్టుకు మళ్ళిస్తారు.నగరంలోని మురుగునీటినంతటిని సంగ్రహించి పలు దశ ల్లో గ్రేడింగ్, ప్యూరిఫయింగ్ చేస్తారు. ముగుగునీరంతా పూర్తిగా శుద్ధి అయి రిజర్వాయర్‌లోకి వెళుతుంది. ఇక్కడ మళ్ళీ మంచినీటిని వివిధ దశల్లో శుభ్ర పరిచిన తర్వాత ముడి నీరుగా మరొక రిజర్వాయర్‌లోకి మళ్ళిస్తారు. చివరకు స్వచ్ఛమైన నీటి దశకు తీసుకొస్తారు.ఆ నీటిని గార్డెన్ల పెంపకానికి, పంట పొలాలకు, ఇండస్ట్రీలకు ఉపయోగిస్తారు.జూలై 16, 2010 ఆంధ్రజ్యోతి విజయవాడ అనుబంధం రాజకీయాలు విజయవాడ 1940ల నుంచీ కొన్ని దశాబ్దాలు కమ్యూనిస్టుల కంచుకోటగా కొనసాగింది. రవాణా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్. thumb|ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన అమరావతి బస్సు|alt=|250x250px రహదారులు నగరంలో రహదారులున్నాయి. వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలో, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం. నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు. జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 65, నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలుపుతుంది. జాతీయ రహదారి 30, చత్తీస్‌గఢ్లొని జగదల్‌పుర్ని నగర సమీపంలోని ఇబ్రహీంపట్నం వరకు కలుపుతుంది. నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, ఇన్నర్‌ రింగు రోడ్డు, జాతీయ రహదారి 16, 65కు అనుసంధానంగా అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. ప్రతిపాదనల్లో బైపాస్ రోడ్లు thumb|బెంజ్ సర్కిల్|alt=|250x250px గతంలో తాడేపల్లి మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్‌ రోడ్డు మంగళగిరి ఎన్‌.ఆర్‌.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై పెదవడ్లపూడి, నూతక్కి గ్రామాల మీదుగా కృష్ణానది దాటి విజయవాడ, మచిలీపట్నం (ఎన్‌.హెచ్‌-9) దాటి ఎన్‌.హెచ్‌-5లో నిడమానూరు వద్ద కలుస్తుంది. బస్ రవాణా సిటీ బస్సులు, ఆటోలు ప్రాథమికంగా నగర అంతర్గత ప్రజా రవాణా సేవలు. ఇవి కాకుండా మోటారు బైకులు, రిక్షాలు, సైకిళ్ళు కూడా రవాణా వ్యవస్థలో భాగం. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను రోడ్డు, రైలు రవాణాకు సంబంధించిన మౌలిక సదుపయాలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన విజయవాడ సిటీ డివిజణ్, రొజూ 400 వరకు బస్సులను నడుపుతూ, 300,000 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. విజయవాడ బీ.ఆర్.టి.ఎస్ మార్గాలు వేగవంతమైన సిటీబస్సు ప్రయాణానికి సహకరిస్తాయి. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లొ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ప్రదాన కార్యాలయం ఉంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషను, దేశంలోనే నాలుగవ అతి పెద్ద బస్సు టెర్మినల్. 678,004 నాన్-ట్రాంస్పోర్ట్, 94,937 ట్రాంస్పోర్ట్ వాహనాలు ఉన్నాయి. లారీలు వంటి భారీ వాహనాలు సరుకు రవాణాకు వాడుతారు, ఇది దేశంలో 18% వాటా కలిగి ఉంది. 27,296 ఆటోలు, తక్కువ దూరం ప్రయాణం కోసం, ప్రతీ రోజు నగర రోడ్డ్ల పైన సేవలు అందిస్తున్నాయి. రైలు thumb|250px|విజయవాడ జంక్షన్‌ రైల్వే స్టేషను సబర్బన్ రైళ్ళు విజయవాడ నుండి గుంటూరు, తెనాలి వరకు సేవలు అందిస్తునాయి. కొత్త సర్కులర్ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించారు, ఇది రాజధాని అమరావతి వరకు ఉంటుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు రెండు కారిడార్లలో కడుతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ A1గా గుర్తింపు పొందింది,, భారతీయ రైల్వేల్లో అత్యంత రద్ది జంక్షను. విజయవాడ రైల్వే డివిజను ప్రదాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. విమానం thumb|విజయవాడ విమానాశ్రయం|alt=|250x250px విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబై, జైపూర్, వైజాగ్, తిరుపతి, ఢిల్లీ నగరములకు విమాన సౌకర్యము ఉంది. 2017 మే 3న, విమానాశ్రయాన్ని ఆధునీకరించారు, అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో, 622,354 మంది దేశీయ ప్రయాణీకులు ప్రయానించారు, ఇది గత సంవత్సరంతొ పోలిస్తే 56.1% ఎక్కువ. అదే ఆర్థిక సంవత్సరంలో, 10,333 విమానాలతో, 54.8% వృద్ధి నమోదు చేసింది. విద్య విశ్వవిద్యాలయాలు thumb|250px|ఎన్.టి.ఆర్. ఆరోగ్య వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయం.|alt= ఇక్కడ ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం ఎన్.టి.ఆర్.యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయంగా పేరొందింది. ఇంటర్మీడియట్ స్థాయిలో విజయవాడ రాష్ట్రంలో పెద్ద విద్యా కేంద్రంగా స్థానం సాధించింది. ఇబ్బడి ముబ్బడిగా స్థాపించబడిన ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా ఇందుకు దోహదం చేశాయి. పాఠశాలలు సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల విజయవాడ మొగల్రాజపురములో ఉంది. సిద్ధార్థ ఎకాడెమీ వారిచే 1977లో స్థాపించబడింది. వీరమాచినేని పద్దయ్య దానమిచ్చిన భూమిలో ప్రారంభమైంది. వైద్యం సాధారణ ప్రభుత్వ వైద్యశాలని మరిన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలతో అత్యాధునిక ఆసుపత్రిగా తీర్చిదిద్దే ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. ప్రైవేట్ రంగంలో అత్యాధునిక ఆసుపత్రులున్నాయి. సమాచార. వినోద సాధనాలు thumb|బెంజి సర్కిల్ దగ్గర ట్రెండ్‌సెట్ మాల్|alt=|250x250px రేడియో ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేడియో శ్రోతలకు తెలుగు ప్రసారాలను అందించడంతో పాటు అందులో పనిచేసిన పలువురు సాహిత్యకారులు, కళాకారులకు విజయవాడను స్థిరనివాసం చేసింది. ఇది 1948 డిసెంబరు 1 న ప్రారంభించబడింది. దీని భవనం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరుబెట్టారు. ఆకాశవాణి ప్రసారాలు విజయవాడ, వివిధభారతి (రెయిన్ బౌ కృష్ణవేణి ఎఫ్ ఎమ్102.2MHz) . ఇవి కాక ప్రైవేట్ రంగంలో, రేడియో మిర్చి ఎఫ్‌ఎమ్ (98.3MHz), రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5MHz) ప్రసార కేంద్రాలున్నాయి. టెలివిజన్ దూరదర్శన్ సప్తగిరి విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నది. సినిమా విజయవాడ నగర సంస్కృతిలో సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921లోనే నగరంలో ప్రారంభమైన మారుతీ హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది. దుర్గా కళామందిరం (1923), రామా టాకీసు (1929) వంటి సినిమా హాళ్ళు తెలుగు సినిమా టాకీలు ప్రారంభం కావడానికి ముందే విజయవాడలో వెలిశాయి. తెలుగు సినిమా రంగం ప్రారంభమయ్యాకా నిర్మాణ కేంద్రం కాలేకపోయినా పంపిణీ కేంద్రంగా విజయవాడ అభివృద్ధి చెందింది. దానితో పాటుగా తెలుగు సినిమా రంగంపై చర్చాగోష్టులు, సమావేశాలు, అభిమాన సంఘాలు, సినిమా పత్రికలు వంటివాటన్నిటికీ కూడా స్థానంగా నిలిచింది. తెలుగు సినిమాల్లో విజయవాడతోనూ, పరిసర ప్రాంతాలతో అనుబంధం ఉన్న ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి వంటి నటీనటులు మంచి పేరు సంపాదించారు. నగరంలో విజయవాడ ఫిలిం సొసైటీ ఏర్పడి ఉత్తమ చిత్రాలను ఆదరించేలా ప్రేక్షకుల్లో అభిరుచి పెంపొందించాలన్న లక్ష్యంతో చాలాకాలం పనిచేసింది. ఈ పరిణామాలన్నీ నగర జన జీవితంలో సినిమా ప్రభావం చూపడానికి దోహదపడ్డాయి. ముద్రణ విశాలాంధ్ర విజయవాడ నుండి ప్రారంభమైన తొలి తెలుగు వార్తాపత్రిక. 2013–14 వార్షిక ప్రెస్ నివేదిక ప్రకారం, విజయవాడనుండి వెలువడే పెద్ద, మధ్యమ వార్తాపత్రికలలో ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, సూర్య, ఆంధ్రప్రభ, వార్త, ప్రజాశక్తి, ఉదయ భారతం ఉన్నాయి. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి. విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం, ప్రచురితమౌతున్నాయి. విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే కోల్కతా తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, జయంతి,అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి. విజయవాడలో పుస్తక ప్రచురణ సంస్థలు, పుస్తకాల షాపులు, గ్రంథాలయాలు సాహిత్య వాతావరణాన్ని కల్పించాయి. 1903లో ఇ.సుబ్బుకృష్ణయ్య ఆస్తిక పుస్తక భాండాగారం పేరిట గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1916లో దీనిని బకింగ్ హాం పేటలోని శాశ్వత భవనంలోకి మార్చి, శ్రీ రామ్మోహన ధర్మ పుస్తక భాండాగారంగా పేరు మార్చారు. దీన్నే సాధారణంగా శ్రీ రామ్మోహన గ్రంథాలయంగా వ్యవహరిస్తారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని, జైల్లో మరణించిన వెలిదండ్ల హనుమంతరావు పేరుమీదుగా హనుమంతరాయ గ్రంథాలయం 1934 డిసెంబరు 2న ప్రారంభమైంది. చిరకాలం నుంచి ఈ గ్రంథాలయాలు నగరంలో సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. హనుమంతరాయ గ్రంథాలయానికి అధ్యక్షులుగు నగరంలో పలువురు రాజకీయవేత్తలు, విద్యావేత్తలు వ్యవహరించి అభివృద్ధి చేశారు. రాజకీయాలు విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ కేంద్రంగా పేరొందింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈనగరంలో దాదాపు 20 ఐ.టీ. సంస్థలున్నాయి, 2006-07 ఆర్థిక సంవత్సరంలో ఇవి 42 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టాయి. ఆం.ప్ర.ఐ.ఐ.సి. సంస్థ గన్నవరంలో ఐ.టీ. పార్కు, ఎస్.ఇ.జెడ్. (స్పెషల్ ఎకనామిక్ జోన్) ఏర్పాటు చేసింది. వీటి నిర్మాణాలకోసం ఎల్.‍& టి. కంపెనీ కాంట్రాక్టు తీసుకుంది, దీని బడ్జెట్ 300 కోట్ల రూపాయలు. ఈ ఐ.టీ. పార్కులు దాదాపు 10,000 మంది ఐ.టీ. ప్రొఫెషనల్స్ కు ఉద్యోగావకాశాలు కలుగజేస్తుంది. ఇంకో ఐ.టీ.పార్కు, మంగళగిరిలో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నవి. సంస్కృతి కుడి|250px|thumb|పివిపి స్క్వేర్, విజయవాడ మ్యూజియంలు, పర్యాటక ప్రదేశాలు ఆకాశవాణి కేంద్రం, విజయవాడ బాపు మ్యూజియం (విక్టోరియా మ్యూజియం) కొండపల్లి కోట ప్రకాశం బ్యారేజి గాంధీ కొండ ఉండవల్లి గుహలు అక్కన్న మాదన్న గుహాలయాలు మంగళగిరి నరసింహ స్వామి ఆలయం గుణదల మేరీమాత చర్చి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ రాజీవ్‌ గాంధీ పార్కు రాఘవయ్య పార్కు మొగల్రాజపురం గుహలు అమరావతి బీసెంట్ రోడ్డు మహాత్మా గాంధీ రోడ్డు (బందరు రోడ్డు) (జ్యూవెలరీ దుకాణాలు) సొరంగం సత్యనారాయణ స్వామి ఆలయం భవాని ద్వీపం, కృష్ణానదీ గర్భంలో విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్యలో సహజసిద్ధంగా 1340 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మత విశ్వాసాలు, ప్రార్థనా స్థలాలు విజయవాడ నగరంలో ప్రాచీన కాలం నుంచి బౌద్ధం, జైనం, తర్వాత శైవం వృద్ధిచెందాయి. విజయనగర సామ్రాజ్య పరిపాలన అనంతరం 16వ శతాబ్దం నాటికి కొంతమేరకు వైష్ణవాలయాలు కూడా ఉండేవి. రామ, రాఘవ, కృష్ణ ఆలయాలు, వాటి మాన్యాలు కూడా శాసనాల్లో కనిపిస్తాయి. ఏ సంక్షోభం కారణంగా ఆ వైష్ణవాలయాలు రూపుమాశాయన్న చరిత్ర కూడా లేకుండా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వైశ్యులు వైష్ణవాన్ని పుచ్చుకుని, దాని అభివృద్ధికి దానధర్మాలు చేయడం ప్రారంభించడంతో నగరంలో 19వ శతాబ్ది నుంచి తిరిగి వైష్ణవాలయాలు ఏర్పడడం కనిపిస్తుంది. విజయవాడ జనాభాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లింలు ఉన్నారు. దాదాపు 15 శాతం అని 2000 నాటి ఒక అంచనా. 19వ శతాబ్దిలో విజయవాడ వన్ టౌన్లో సంఖ్యాధిక్యతే కాక సాంస్కృతిక ఆధిపత్యం కూడా ముస్లింలదే. షియా ముస్లింలకు సంబంధించిన పంజాలు, సూఫీలకు సంబంధించిన దర్గాలు విజయవాడ వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఆనాడు విజయవాడలో కీలకమైన ప్రాంతాల్లో ఆస్తుల్లో ఎక్కవ భాగం వీరివి. మొదట్లో బంగారు, వెండి దుకాణాలన్నీ వీరి చేతిలోనే ఉండేవి. కాలక్రమేణా ఆస్తులు చేతులు మారి, ముస్లింలు ప్రస్తుతం పాత ఇనుము, టైర్లు తిరిగి అమ్మకం, టైలరింగ్ వంటి వ్యాపారాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నా విజయవాడ ముస్లింల ఒకప్పటి సిరిసంపదలు వారిచేతిలో లేదని లంక వెంకటరమణ వ్యాఖ్యానించాడు. వీరు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న విజయవాడ పశ్చిమ శాసన సభ నియోజక వర్గంలో రాజకీయంగానూ ప్రభావం చూపుతున్నారు. సిక్ఖులూ నగరంలో నివసిస్తున్నారు. ఆటోనగర్ సమీపంలో ఒక కాలనీకి గురునానక్ కాలనీ అని పేరుపెట్టుకున్నారు. 2000 ప్రాంతంలో ఖల్సా 300 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నగరంలో వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించారు. కనక దుర్గ అమ్మ వారి దేవాలయం thumbnail|250x250px|విజయవాడ – కనక దుర్గ అమ్మ వారి దేవాలయం|alt= కనకదుర్గ అలయం, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. మరకత రాజరాజేశ్వరీ దేవాలయం - పటమట ఇది ఆధునిక యుగంలో అపురూపమైన శిల్పకళతో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో (పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో గణపతి సచ్చిదానంద చే ఈ గుడి కుంభాభిషేకం, ప్రతిష్ఠ జరుపబడింది. ఇతర దేవాలయాలు ఆంజనేయస్వామి వారి దేవాలయం - మాచవరం క్షిప్రగణపతి దేవాలయం - పటమట త్రిశక్తి పీఠం రామలింగేశ్వర స్వామి దేవాలయం - యనమలకుదురు, స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న పర్వతం పైన ఉంది. బెంజి సర్కిల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములో ఉంది. సమీప దేవాలయాలు పెనుగంచిప్రోలు, తిరపతమ్మ తల్లి వేదాద్రి నారసింహ క్షేత్రం మోపిదేవి శ్రీకాకుళం (ఘంటసాల) - ఆంధ్ర మహావిష్ణువు క్షేత్రం కొల్లేటికోట - పెద్దింట్లమ్మ నెమలి - వేణుగోపాలస్వామి పెదకళ్ళేపల్లి - నాగేశ్వరాలయం ఆగిరిపల్లి - వ్యాఘ్రనరసింహస్వామి గుణదల ౼ మేరీమాత చర్చి చెప్పుకోదగ్గ వ్యక్తులు ఇవి కూడా చూడండి విజయవాడ నగర పాలక సంస్థ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఇందిరా గాంధీ స్టేడియం కాళేశ్వరరావు మార్కెట్ విజయవాడ పర్యాటక ఆకర్షణల జాబితా విజయవాడ మెట్రో విజయవాడ రైల్వే డివిజను విజయవాడ పట్టణ మండలం మూలాలు ఆధార గ్రంథాలు చిత్రమాలిక బయటి లింకులు కనకదుర్గ అమ్మవారు సిద్దార్థ ఇన్స్తిటూట్ ఆఫ్ టెక్నోలజి వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు వర్గం:విజయవాడ వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:ఎన్టీఆర్ జిల్లా పర్యాటక ప్రదేశాలు
సామెతల జాబితా
https://te.wikipedia.org/wiki/సామెతల_జాబితా
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత, తాలింపు దినుసులు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు. సామెతలు నిప్పులాంటి నిజాలు. నిరూపిత సత్యాలు. ఆచరించదగ్గ సూక్తులు. సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం thumb|పిల్లికి ఇరకాటం ఎలుకకు ప్రాణ సంకటం "జాతీయములు" లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు. ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్ధం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్ధం - idiom as words collocated together happen to become fossilized, becoming fixed over time.[1]. అనగా తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా ఘనీభవించింది. కనుక భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును. (అకారాది క్రమంలో వివిధ జాతీయాలు ఇవ్వబడ్డాయి. ప్రక్కనున్న లింకుల ద్వారా ఆయా వ్యాసాలకు వెళ్ళవచ్చును) ఇక్కడ కొన్ని సామెతల జాబితా ఇవ్వబడ్డది. మరిన్ని సామెతల కొరకు,100 Telugu samethalu వాటి వివరణ కొరకు ఒక్కో అక్షరానికి చెందిన పేజీ చూండండి. రచయితలు గమనించండి: సామెతల ఉదాహరణ కోసం ఉద్దేశించిన పాక్షిక జాబితా ఇది. దీనిని ఇంకా పెద్దగా విస్తరించడం వల్ల పేజీ సైజు మరీ పెద్దదవుతుంది. అందుకు బదులుగా "భాషా సింగారం" మూసలో అకారాది క్రమంలో సామెతలకు ప్రత్యేక పేజీలు కేటాయించబడ్డాయి. ఆ పేజీలలో సామెతలు, వాటి వివరణలు కూర్చవచ్చును. అ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అటthumb|ఆడియో |20x20px అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు అందని పండ్లకు అర్రులు చాచినట్లు అందని ద్రాక్షలు పుల్లన అందితే సిగ అందకపోతే కాళ్ళు అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కు పెట్టేవాడు ఒకడు అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం అంధుడికి అద్దం చూపించినట్లు అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అగ్నికి వాయువు తోడైనట్లు అటునుండి నరుక్కు రా అడకత్తెరలో పోకచెక్క అడగందే అమ్మ అయినా పెట్టదు అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు అడిగేవాడికి చేప్పేవాడు లోకువ అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు అడుసు తొక్కనేల కాలు కడగనేల అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అతి వినయం ధూర్త లక్షణం అతిరహస్యం బట్టబయలు అత్త సొమ్ము అల్లుడు దానం అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు. అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు అద్దం అబద్ధం ఆడుతుందా ! అనగా అనగా రాగం తినగా తినగా రోగం అనువుగాని చోట అధికుల మన రాదు అనుమానం పెనుభూతం అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు అన్నం పెట్టే వాడికన్నా సున్నం పెట్టే వాళ్లే ఎక్కువ అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా? అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా? అప్పనుచూడబోతే రెప్పలు పోయినై అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా? అప్పిచ్చువాడు వైద్యుడు అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు అప్పు నిప్పులాంటిది... అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా? అప్పు చేసి కొప్పు తీర్చిందట అప్పుచేసి పప్పు కూడు అప్పులేని వాడే అధిక సంపన్నుడు అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు అబద్ధము ఆడితే అతికినట్లుండాలి అభ్యాసము కూసువిద్య అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అయితే అంగలూరు కాకపోతే సింగలూరు అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది అయిదోతనం లేని అందం అడుక్కుతిననా? అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం అరచేతిలో వైకుంఠం చూపినట్లు అవ్వాకావలెను బువ్వా కావలెను అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు... అరిచే కుక్క కరవదు అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు అర్దరాత్రి మద్దెల దరువు అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా... అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట అడుక్కునేవాడింటికి బుడబుక్కల వాడు వచ్చినట్టు. అంగట్లో అన్నీ ఉన్నా  అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఆ ఆ తాను ముక్కే ఆంతా ఆతాను ముక్కే ఆ మొద్దు లోదే ఈ పేడు ఆంబోతులా పడి మేస్తున్నావు ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట... ఆకారపుష్టి నైవేద్యనష్టి ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట ఆకులేని పంట అరవైఆరు పుట్లు... ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు... ఆడబోయిన తీర్థమెదురైనట్లు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఆత్రగాడికి బుద్ది మట్టం ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట ఆదిలోనే హంసపాదు ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి ఆయనే ఉంటే మంగలి ఎందుకు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆలస్యం అమృతం విషం ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట. ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా? ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో? ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేయునా? ఇ ఇంటికన్నా గుడి పదిలం ఇంట్లో పిల్లి వీధిలో పులి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు ఇద్దరు ముద్దు ఆపై వద్దు ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె ఇల్లలకగానే పండగకాదు ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు ఇల్లు ఇరుకుగా ఉండాలి, పెళ్ళాం చండాలంగా ఉండాలి ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం ఇల్లు పీకి పందిరి వేసినట్లు ఇసుక తక్కెడ పేడ తక్కెడ ఇల్లలకగానే పండగ కాదు ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు ఉ ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు ఉపాయం లేని వాడిని ఊళ్ళోనంచి వెళ్ళగొట్టమన్నారు ఉన్న మాటంటే ఉలుకెక్కువ ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు ఊ ఊరు ఊరు పోట్లాడుకుని మంగలం మీద పడి ఏడ్చినట్టు ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడి ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు ఊరికి ఉపకారి ఆలికి అపకారి ఊరికి చేసిన ఉపకారం శవానికి చేసిన శృంగారం వృథా ఎ ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు ఎంత చెట్టుకి అంత గాలి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి? ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి? ఎద్దు పుండు కాకికి ముద్దు ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు ఎవడి బ్లాగుకు వాడే సుమన్ అని ఎరువు సొమ్ము బరువు చేటు ఏ ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు ఏనుగులు పడితే ఏనుగులే లేపాలి కాని పీనుగుల వల్ల కాదు ఏమండీ కరణం గారూపాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని ఏరు ఏడామడ ఉండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య ఒ ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు ఒక దెబ్బకు రెండు పిట్టలు ఒల్లని భార్య చేయి తగిలినను ముప్పే, కాలు తగిలినను తప్పే ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఓ ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు ఓర్చినమ్మకు తేట నీరు ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి ఓరిస్తే ఓరుగల్లే పట్టణమవుతుంది అం అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే అంచు డాబే కాని, పంచె డాబు లేదు అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె. అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు. అంతంత కోడికి అర్థశేరు మసాలా. అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు అంతా మనమంచికే. అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు. అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు అందని ద్రాక్ష పుల్లన అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అందితే తల, అందకపోతే కాళ్లు అంధుడికి అద్దం చూపించినట్లు అంబలి తాగేవాడికి మీసాలొత్తేవాడొకడు క కంగారులో హడావుడి అన్నట్లు కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే కంచేచేను మేసినట్లు కంటికి ఇంపైతే నోటికీ ఇంపే కంటికి రెప్ప కాలికి చెప్పు కంటికి రెప్ప దూరమా కంటికి కనబడదు నూరుకు రుచి ఉండదు కండలేని వానికే గండం కందకి లేని దురద కత్తిపీటకెందుకు? కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద కందెన వేయని బండికి కావలసినంత సంగీతం కంపలో పడ్డ గొడ్డు వలె కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే కడుపుతో ఉన్నామె కనక మానుతుందా కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కణత తలగడ కాదు. కల నిజం కాదు గాడు దీని భావమేమి తిరుమలేశ కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు... కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకున్నట్లు కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది కలసి ఉంటే కలదు సుఖం కల కాలపు దొంగైనా ఏదో ఒకనాడు దొరుకుతాడు కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు కల్లు త్రాగిన కోతిలా కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది కాకి పిల్ల కాకికి ముద్దు కాగల కార్యం గంధర్వులే తీర్చారు కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు కాలు కాలిన పిల్లిలా కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు 'కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి అందిట. కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె కుక్క కాటుకి చెప్పు దెబ్బ కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ ...చెరకు తీపి తెలుస్తుందా కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు కుక్కతోక వంకరన్నట్లు...! కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు... కునుకు నక్క మీద తాటిపండు.. కూటికి లేకున్నా కాటుక మాననట్లు కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు కోడెల కొట్లాట మధ్య దూడలు నలిగి పోయి నట్లు కోరి కొరివితో తల గోక్కున్నట్టు కోటి విద్యలు కూటి కొరకే కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు కోస్తే తెగదు కొడితే పగలదు క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట కల్ల పసిడికి కాంతి మెండు గ గంగిగోవు పాలు గరిటడైన చాలు గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు గంతకు తగ్గ బొంత గతి లేనమ్మకు గంజే పానకము గాజుల బేరం భోజనానికి సరి గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట గుంపులో గోవిందా గుడ్డి కన్నా మెల్ల నయము కదా గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు గుడ్డోడికి కుంటోడి సాయం గుడ్డెద్దు చేలో పడినట్లు గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు గురివింద గింజ తన నలుపెరగదంట గుర్ఖాకు ఎక్కువ గూండాకు తక్కువ గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట గుర్రం ఎక్కుతా, గుర్రం ఎక్కుతా అని, గుద్దంతా కాయకాసి కూర్చున్నడంట..! గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా? గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా గూటిలో కప్ప పీకితే రాదు గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు గోటితో పోయేదానికి గొడ్డలెందుకు గోడకేసిన సున్నం గోతి కాడ నక్కలా గోరంత ఆలస్యం కొండొంత నష్టం గోరుచుట్టు మీద రోకటిపోటు గాడిదకు తెలియునా గంధం పొడి వాసన;పంది కేమి తెలియును పన్నిటి వాసన చ చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు చక్కనమ్మ చిక్కినా అందమే సన్న చీర మాసినా బాగుంటుంది. చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం చదవేస్తే ఉన్న మతి పోయినట్లు చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు చనిపోయిన వారి కళ్ళు చారెడు చల్లకొచ్చి ముంత దాచినట్లు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు చాప క్రింది నీరులా చారలపాపడికి దూదంటి కుచ్చు చారాణా కోడికి భారాణా మసాలా చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు చింత చచ్చినా పులుపు చావనట్టు చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద చిత్తశుద్ది లేని శివపూజలేల చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా! చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం చెట్టు చెడు కాలానికి కుక్క మూతి పిందెలు కాసి నట్టు చెడపకురా చెడేవు చెప్పేవాడికి వినేవాడు లోకువ చెరపకురా చెడేవు చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు చెముడా అంటే మొగుడా అన్నట్టు చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు చెవిలో జోరీగ చేతకాక మంగళవారమన్నాడంట చేత కానమ్మకి చేష్టలెక్కువ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు... చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు ఛ ఛారాన కోడికి బారాన మసాల. చెపితే వినని వాడిని చెడిపోనివ్వాలి. జ జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది జన్మకో శివరాత్రి అన్నట్లు జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు డ డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు డబ్బు కోసం గడ్డి తినే రకం డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా డబ్బుకు లోకం దాసోహం (సామెత)|డబ్బుకు లోకం దాసోహం డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు డౌలు డస్తు పగలు పస్తు ఢ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే డబ్బు ఇవ్వని వాడు ముందు పడవ ఎక్కినట్టు డబ్బు లేని వానికి బోగముది తల్లి వరస డొంకలో షరాఫు ఉన్నాడు, నాణెము చూపుకో వచ్చును త తల్లిని మించిన దైవం లేదు తంగేడు పూచినట్లు తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా తంబళ అనుమానము తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ తగిలిన కాలే తగులుతుంది తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు తడిశిన కుక్కి బిగిశినట్టు తడిశి ముప్పందుం మోశినట్టు తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు తద్దినము కొని తెచ్చుకొన్నట్టు తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును తనకు కానిది గూడులంజ తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట తడి గుడ్డతో గొంతులు కొయ్యడం తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట తంతే బూరెల బుట్టలో పడ్డట్టు తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది? తల ప్రాణం తోకకి వచ్చినట్లు తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది తవుడు తింటూ వయ్యారమా? తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు తాతకు దగ్గులు నేర్పినట్టు తాదూర సందు లేదు, మెడకో డోలు తానా అంటే తందానా అన్నట్లు తామరాకు మీద నీటిబొట్టులా తాను దూర సందు లేదు తలకో కిరీటమట తినటానికి తిండి లేదు మీసాలకు సంపెంగ నూనె తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు తిండికి ముందు,తగాదాకు వెనుక ఉండాలి తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట తిట్టను పోరా గాడిదా అన్నట్టు తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట తినగ తినగ వేము తియ్యగనుండు తినబోతూ రుచులు అడిగినట్లు తిన్నింటి వాసాలు లెక్కేయటం తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి? తీగ లాగితే డొంకంతా కదిలినట్లు తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి తుమ్మితే ఊడి పొయే ముక్కు ఉన్నా ఒక్కటె ఊడినా ఒక్కటె తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు... తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య తేలు కుట్టిన దొంగలా తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు తోక తెగిన కోతిలా తోక త్రొక్కిన పాములా తోక ముడుచుట తోచీ తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు ద దండం దశగుణం భవేత్ దంపినమ్మకు బొక్కిందే కూలిట|దంచినమ్మకు బొక్కిందే దక్కుదల దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు... దాసుని తప్పు దండంతో సరి దిక్కులేనివారికి దేవుడే దిక్కు దిగితేనేగాని లోతు తెలియదు దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు దున్నపోతు మీద వానకురిసినట్లు దురాశ దుఃఖానికి చేటు దూరపుకొ౦డలు నునుపు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు దొందూ దొందే దొరికితే దొంగలు లేకుంటే దొరలు ధ ధర్మో రక్షతి రక్షితః ధైర్యే సాహసే లక్ష్మి న నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు! నలుగురితో నారాయణా నల్లటి కుక్కకు నాలుగు చెవులు నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట నవ్విన నాపచేనే పండుతుంది నాగస్వరానికి లొంగని తాచు నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు నిండా మునిగిన వానికి చలేంటి నిండు కుండ తొణకదు నిఙ౦ నిప్పులా౦టిది నిజం నిలకడమీద తెలుస్తుంది నిత్య కళ్యాణం, పచ్చ తోరణం నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది నిప్పు ముట్టనిదే చేయి కాలదు నిప్పులేనిదే పొగరాదు నివురు గప్పిన నిప్పులా నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట నీటిలో రాతలు రాసినట్లు నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో నీతిలేని పొరుగు నిప్పుతో సమానం నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను నూరు చిలుకల ఒకటే ముక్కు నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు నేతిబీరలో నేతి చందంలా నేల విడిచి సాము చేసినట్లు నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది నా కొడి కుంపటి లేకపొతే తెల్లారదు అన్నట్టు ప పనిఒత్తిడికి వీడ్కోలు, పించనుకు స్వాగతం పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు పండగ నాడు కూడా పాత మొగుడేనా? పండిత పుత్ర: పరమ శుంఠ: పండితపుత్రుడు... కానీ పండితుడే... పందికేంతెలుసు పన్నీరు వాసన పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగి నట్లు పక్కలో బల్లెం పగలంతా బారెడు నేశా రాత్రికి రారా దిగ నేస్తా అన్నట్టు పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది పట్టుకోక ఇచ్చినమ్మ పీటకోడు పట్టుకు తిరిగిందంట పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు? పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి? పాకేటప్పుడు పంది నడిచేటప్పుడు నంది పావలా కోడికి ముప్పావలా దిష్టి పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా! పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేలు లెక్కెసు కుందట పాలు, నీళ్ళలా కలిసిపోయారు పిండి కొద్దీ రొట్టె పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి పిచ్చోడి చేతిలో రాయి పిచ్చోడికి పింగే లోకం పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ వుండవచ్చునన్నాడంట పిల్లికి కూడాబిచ్చం పెట్టనివాడు పిల్లికి ఇరకాటం ఎలుకకు ప్రాణ సంకటం పుండుకు పుల్ల మొగుడు పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదు పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు పుల్లయ్య వేమారం (వేమవరం) వెళ్ళొచ్చినట్లు పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు ప్రేమ గా ఏం వండిపెట్టనూ అంటే వెన్నతో అట్టేయమన్నాడంట పెరుగుట విరుగుట కొరకే పెళ్ళాము అంటే బెల్లము తల్లి తండ్రి అల్లము పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట పైన పటారం, లోన లొటారం పోనీలే అని పాత చీర ఇస్తే ఇంటెనక్కెళ్లి మూర వేసినట్టు పొట్టోడికి పుట్టెడు బుద్దులు పొమ్మనలేక పొగపెట్టినట్లు పొయ్యి దగ్గర పోలీసు పొరుగింటి పుల్లకూర రుచి పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు బ బతకలేక బడి పంతులని బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలి బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టు బర్రె పావలా బందె ముప్పావల బ్రతికుంటే బలుసాకు అమ్ముకుని బతకొచ్చు బ్రతికుంటే బలుసాకు తినొచ్చు బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం బుగ్గ గిల్లి జోల పాడటం బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు బెల్లం చుట్టూ ఈగల్లా బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు భోజరాజు వంటి రాజుంటే.. కాళిదాసు లాంటి కవి అప్పుడే పుడతాడు బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట భక్తిలేని పూజ పత్రి చేటు మ మంగలిని చూసి గాడిద కుంటినట్లు మంగలి కత్తితో మాకుకు నరకగలమా మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి తూలుతున్నడు మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి? మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు మంచి మనిషికొక మాట మంచి గొడ్డుకొక దెబ్బ మందుకని పంపిస్తే మాసికం నాటికి వచ్చే రకం మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె మింగ లేక మంగళవారం అన్నాడట మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె ముంజేతి కంకణానికి అద్దమేల ? మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు ముందు నుయ్యి వెనుక గొయ్యి ముందుంది ముసళ్ళ పండుగ ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే ముడ్డిలో పుండు మామగారి వైద్యం ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు మూతి కాలినా కుంపటే ముద్దు అన్నట్లు మూల విగ్రహానికే ఈగలు దోలుతుంటే,.. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగినట్టు మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు? మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మొండివాడు రాజు కన్నా బలవంతుడు మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా? మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట మొరిగే కుక్క కరవదు మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు మౌనం అర్ధాంగీకారం మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు ముహూర్తం చూసుకుని యాత్రకు బయల్దేరితే ముందరి మొగుడు ఎదురు వచ్చాడట మంచానికి అడ్డం, మతానికి ఎదురు ర రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా? రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది రాజుల సొమ్ము రాళ్ళ పాలు,దొరల సొమ్ము దొంగల పాలు రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...? రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట రెక్కాడితే గానీ డొక్కాడదు రెంటికీ చెడిన రేవడి చందాన రెడ్డొచ్చె మొదలాడు రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా? రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు రౌతు కొద్ది గుర్రం ల లంఖణం పరమౌషధం లంఖణం చెయ్యమంటేనే ఉపవాసానికి ఒప్పుకున్నట్టు లేడికి లేచిందే పరుగు లేని దాత కంటే ఉన్న లోభి నయం లోగుట్టు పెరుమాళ్ళ కెరుక వ వంగలేక మంగళవారం అన్నాడంట వండుకు తినేవాడికి ఒక కూర అడుక్కు తినేవాడికి అరవైనాలుగు కూరలు వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి వాశిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే, కారెడ్ల కామక్క వంకాయల భారం తూగిందట. వచ్చీరాని మాటలు రుచీ, ఊరీ ఊరని ఊరగాయ రుచీ వస్తే కొండ పోతే వెంట్రుక వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది వీపు విమానం మోత మోగుతుంది వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్ల దాగిన వాడిని చావ మోదినట్టు వేపకాయంత వెర్రి వేగం కన్నా ప్ర్రాణం మిన్న వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు వేసేటప్పుడు వేప మొక్క తీసేటప్పుడు అమ్మవారు వాడికి సిగ్గు నరమే లేదు విగ్రహపుష్టి నైవేద్యనష్టి వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది వెధవ ముండ యాత్రకు పోతే వెతకను కొందరు, ఏడవను కొందరు వంకరటింకర పోతుంది పాము కాదు వెంట్రుకలున్నమ్మ ఏ కొప్పైనా వేయ గలదు శ శంఖులో పోస్తేగాని తీర్థం కాదని శృతి ముదిరి రాగాన పడింది శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికొచ్చినోళ్లంతా నా పెద్దపెళ్లాలు అన్నాడట శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు శతకోటి లింగాలలో బోడిలింగం శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లు శొంఠి లేని కషాయం లేదు శ్వాస ఉండేవరకే ఆశ ఉంటుంది ష షండునికి రంభ దొరికినట్లు స సంక నాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి పొర్లించి ముడ్డి నాకాడట సంతులేని ఇల్లు చావడి కొట్టం సంతోషమే సగం బలం సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట సంపదలో మరపులు ఆపదలో అరుపులు సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట సుపుత్రుడి కోసం సప్తసముద్రాలు ములిగితె,ఉప్పు కలుగు తగిలి వున్నది కాస్తా ఊడింది సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు సత్రం భోజనం మఠం నిద్ర సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు... సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం సర్వేంద్రియాణాం నయనం ప్రధానం సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు సింగడు అద్దంకి వెళ్లినట్టు సింగినాదం జీలకర్ర సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది సూది కోసం సోది కెళితే పాత రంకంతా బయట పడిందిట సొమ్మొకడిది సోకొకడిది సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు హ హనుమంతుడి ముందా కుప్పిగంతులు హనుమంతుడు... అందగాడు... హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడు హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లు క్ష క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం వెయ్యాలి క్షేమంగా పోయి లాభంగా రండి క్షీరాబ్ది లంకలో జేరినప్పటికైన, కొంగ తిండికి నత్తగుల్లలేను మూలాలు వనరులు తెలుగు సామెతలు: కెప్టెన్ ఎం.డబ్ల్యు.కార్, వి. రామస్వామి శా స్త్రులు 1955 తెలుగు సామెతలు: సంపాదక వర్గం- దివాకర్ల వెంకటావధాని, పి.యశోదా రెడ్డి, మరుపూరి కోదండరామరెడ్డి.- తెలుగు విశ్వవిద్యాలయం మూడవ కూర్పు పునర్ముద్రణ 1986 తెలుగు సామెతలు: సంకలనం - పి. రాజేశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1993. తెలుగు సామెతలు: గీతికా శ్రీనివాస్, జే.పి.పబ్లికేషన్స్ 2002 తెలుగు సామెతలు:సంకలనం- రెంటాల గోపాలకృష్ణ, నవరత్న బుక్ సెంటర్ 2002 లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (సుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి - ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం సాటి సామెతలు (తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కె. నాయర్ ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం వర్గం:తెలుగు భాష వర్గం:సామెతలు
పొడుపు కథలు
https://te.wikipedia.org/wiki/పొడుపు_కథలు
అక్షర క్రమంలో పొడుపు కథలు అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష __NOTOC__ thumb|చాప చుట్టగ లేము.. రూక లెంచగ లేము | ఆకాశంలో నక్షత్రాలు తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడా వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆశక్తీ కలిగించే పొడుపు కథలంటే యిష్టపడని వారుండరు. ఇది పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. పొడుపు కథలో చమత్కారం, నిగూఢ భావం యిమిడి ఉండటమే దీనికి కారణం. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనె కుతూహలం ఒకవైపు, దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనె తపన ఒకవైపు పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు. ఆలోచనా శక్తిని పదును పెట్టే పొదుపు కథలంటే పిల్లలు ఎక్కువ యిష్టపడతారు. పిల్లలకు రకరకాల పొడుపు కథలు చేసి వారి మెదడును పదును పెట్టాలి. సాంప్రదాయకంగా వస్తున్న పొడుపు కథలనె కాకుంటే ఆధునిక కాలానికి సంబంధించిన విషయాలపైన పొదుపు కథలు తయారు చేసి పిల్లల్లో ప్రచారం చేయాలి. పిల్లల చేత వారి సృజనాత్మకత పెంచుటకు కొన్ని పొడుపు కథలు తయారు చేయించాలి. పొడుపు కథలను తయారు చేయటం కష్టం కాదు. పొడుపు కథలో లయ, ప్రాస, రాగం, వంటివి ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవటానికి అనువైన పద వాక్య విన్యాసం ఉండాలి. మరీ కష్టంగా ఉండకూడదు. చాలా సులభంగా ఉండకూడదు. కొద్ది సేపు ఆలోచించగానే అర్థమత్తేటట్లు ఉన్నప్పుడే ఆసక్తి కలుగుతుంది. మరీ కష్టంగా ఉంటే మనం చెప్పలేమనే ఆలోచన వచ్చి ఆసక్తి కోల్పోతారు. ఎలా తయారు చేయాలి ముందుగా ఏ విషయం పై పొడుపు కథ తయారు చేయాలనుకుంటామో దాని గుణగణాల గురించి నాలుగు వాక్యాలు రాసుకోవాలి. ఆ వాక్యాలను లయ బద్దంగా ఉండేటట్లు తయారు చేసుకోవాలి. ఒక వాక్యం లోనూ రెండు, మూడు వాక్యాలలోను ఉండవచ్చు. పేనా, చాక్లెట్, టీచర్, సైకిల్, సినిమా, రేడియో, టి.వి.టెలిఫోన్, ఇలాంటి వాటిపై పొడుపు కథలు పిల్లలలు సన్నిహితంగా ఉంటాయి. ఉదాహరణ "కలం" పై పొడుపు కథ తయారు చేయాలంటే, దాని లక్షణాలను ఈ క్రింది విధంగా రాసుకోవాలి. చిన్న కర్రపుల్లలా ఉంటుంది. లోన డొల్లగా ఉంటుంది. లోన రంగు ద్రవం ఉంటుంది. చివర నాలుక ఉంటుంది. కాగితంపై కదిలిస్తూ ఉంటె రాస్తుంది. కవులు ఉపయోగించేది . కత్తి కంటే గొప్పది. పొడుపు కథగా మారిస్తె, కాగితంపై కదులుతుంది - కార్చుకుంటూ వెళుతుంది.నాలుకతో చెప్పడం - నాలుకతో రాయటం కవి పట్టే కత్తి- కథలల్లె కత్తి - కలకాలం నిలిచేకత్తి. అనేక రూపాలలో పొడుపు కథలు 1.కానిది ఇందులో ఒకటి రెండు అక్షరాలు అదనంగా చేర్చితే చాలు మనకు కావలసిన జవాబు దొరుకుతుంది. ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. ఎక్కువ పద పరిచయం ఏర్పడుతుంది. కొన్నింటికి రెండు మూడు జవాబులు కూడా ఉండవచ్చు. కాయ గాని కాయ - మెడకాయ, తలకాయ (అదనంగా పదం చేర్చటం) - ఇలాంటివి తయారు చేయటం చాలా సులభం.దారం కాని దారం - మందారం మొదలగునవి. 2.ఆధారాలు కొన్ని ఆధారాలు యిచ్చి దాని ఆధారంగా పొడుపు కథ విప్పటం తెలిసేటట్లు పూస్తుంది. తెలియకుండా కాస్తుంది? - వేరుశెనగ. 3.వర్ణన చాలా వివరంగా వర్ణించి పొడుపు కథను విప్పమని చెప్పటం నాలుగు రోళ్ళు నడవంగారెండు చేటలు చెరగంగానోట్లో పాము వ్రేలాడంగాఅందమైన దొరలు ఊరేగంగా - ఏనుగు 4.కాదు(నిషేధం) మొదటి వాక్యంలో ఆథారం ఉంటుంది. రెండవ వాక్యంలో నిషేధం ఉంటుంది. ఆకాశంలో ఎగురుతుంది - పక్షి కాదు (విమానం)నీటిలో వెళ్ళుతుంది - చేప కాదు (పడవ) అక్షర క్రమంలో వివిధ పొడుపు కథలు పైన సూచించిన పట్టికలో మనకు ఏ అక్షరంతో ప్రారంభమైన పొడుపు కథ కావాలో ఆ అక్షరాన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ప్రారంభ అక్షరంతో పొడుపు కథలను సులువుగా చూడవచ్చు. Adavilo seetamma muggu vestundi అక్కడిక్కడి బండి అంతరాల బండి: మద్దూరి సంతలోన మాయమైన బండి.ఏమిటది? జవాబు:సూర్యుడు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది జవాబు: చల్లకవ్వం అడవిన పుట్టాను, నల్లగ మారాను: ఇంటికి వచ్చాను, ఎర్రగ మారాను: కుప్పలో పడ్డాను, తెల్లగ మారాను. జవాబు:బొగ్గు అడ్డం కోస్తే చక్రం - నిలువు కోస్తే శంఖం జవాబు:ఉల్లిపాయ అన్నదమ్ములం ముగ్గురం మేముశుభవేళల్లో కనిపిస్తూ వుంటాము;అయితే బుద్ధులు వేరు -నీళ్ళలోమునిగే వాడొకడుతేలే వాడొకడు కరిగే వాడొకడుఅయితే మేమెవరం? జవాబు:ఆకు, వక్క, సున్నం అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు జవాబు: పెదవులు అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి జవాబు: పెదవులు అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ జవాబు: తేనె పట్టు అరచేతిలో కుంకుమ - గోటిమీద కుంకుమ - బీరాకు కుంకుమ - అందాల కుంకుమ జవాబు: గోరింటాకు అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది: చెంబులో నీళ్ళని, చెడత్రాగుతుం ది. జవాబు:గంధపుచెక్క అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది; మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి. ఎవరు ? జవాబు:గడప అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది; మా ఇంటి కొచ్చింది, తైతక్కలాడింది. ఎవరు? జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు. కవ్వము అన్నదమ్ములం ముగ్గురం మేము, శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము: అయితే బుద్ధులు వేరు --jbnj నీళ్ళలో మునిగే వాడొకడు: తేలే వాడొకడు; కరిగే వాడొకడు: అయితే మే మెవరం? జవాబు: ఆకు, వక్క, సున్నం. అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు ఛాయ చెట్టుకి కట్టిన ఉట్టి, ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది? (ఊయల) పచ్చటి దుప్పటి కప్పుకొని తియ్యటి పండ్లు తింటుంది? (చిలుక) ఎంత ప్రయత్నించినా చేతికి చిక్కదు, ముక్కుకి మాత్రమే దొరుకుతుంది. ఏమిటది ? (వాసన) పిఠాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా బతికిన పిట్టను కొట్టవద్దు, చచ్చిన పిట్టను తేనువద్దు, కూర లేకుండా రానువద్దు, మరేం తెచ్చాడు? (కోడి గుడ్డు ) మూతి వేలెడు, తోక బారెడు? (సూది, దారం) ఆకాశాన వేలాడే వెన్నముద్దలు ? (వెలగ పండ్లు) ఆకు బారెడు తోక మూరెడు ? (మొగలి పువ్వు) ఆకు చిటికెడు కాయ మూరెడు? (మునగ కాయ) చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు? (అద్దం) అమారా దేశం నుంచి కొమారా పక్షి వచ్చింది. ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది. (ప్రమిద) ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన (రామచిలుక) మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత (తుపాకి) కోట గాని కోట ఇంటికో కోట? (తులసి కోట) కన్నులు ఎర్రగా ఉంటాయి, రాకాసి కాదు, తలనుండి పొగొస్తుంది, భూతం కాదు చరచర పాకుతుంది పాముకాదు ( రైలు ) కత్తులు లేని భీకర యుద్ధం, గెలుపూ ఓటమి చెరిసగం (చదరంగం) కతకత కంగు, మాతాత పింగు, తోలు తీసి మింగు (అరటి పండు) పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల పాము (నాలుక) అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను, నీచే దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయినాను (పిడక) అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, మహాలక్ష్మిలాగుంది. (గడప) అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. (చల్లకవ్వం) అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, అన్నిపువ్వుల్లో రెండేకాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యుడు) సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. ఏమిటది? (శంఖం) ముగ్గురన్నదమ్ములు, రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటారు. ఎవరువారు? (గడియారం ముళ్ళు) ఆ ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు జవాబు:విమానం ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు జవాబు: టెంకాయ ఆకాశమంతా అల్లుకు రాగా:చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:కడివెడు నీరు కారుకు రాగా:అందులో ఒక రాజు ఆడుతుంటాడు. జవాబు: గానుగ ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,కడుపులో చొచ్చి లేపింది పిచ్చి. జవాబు:కల్లు ఆకాశంలో చెట్టు - చెట్టు నిండా పువ్వులు ఎంత కొట్టినా రాలవు జవాబు: నక్షత్రాలు ఆకులోడు కాదమ్మా ఆకులుంటాయి బాలింత కాదమ్మా పాలుంటాయిసన్యాసోడు కాడమ్మా జడలుంటాయి జవాబు:మర్రి చెట్టు ఆమడ నడిచి అల్లుడొస్తే,మంచం కింద ఇద్దరూ, గోడ మూల ఒకరూ,దాగుకున్నారు. జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర మీ అమ్మ పడుకుంటే మా అమ్మ దాటి పాయే జవాబు :-గడప ఇ ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది జవాబు: చీపురు ఇంతింతాకు బ్రహ్మంతాకుపెద్దలు పెట్టిన పేరంటాకు. జవాబు: మంగళ సూత్రం ఇంతింతాకు ఇస్తరాకురాజులు మెచ్చిన రత్నాలాకు. జవాబు: తామలపాకు. ఇక్కడి నుంచి చూస్తే యినుము;దగ్గరికి పోతే గుండు;పట్టి చూస్తే పండు;తింటే తీయగనుండు. జవాబు: తాటిపండు. ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది. జవాబు: సైకిలు ఇక్కడ ఉంటుంది - అక్కడ ఉంటుంది -పిలిస్తె పలుకుతుంది - మనలాగే మాట్లాడుతుంది జవాబు:టెలిఫోన్ ఉ ఉద్యోగం సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే జవాబు: కుక్క ఉదయం నాలుగు కాళ్లతో నడిచేది,మధ్యాన్నం రెండు కాళ్ల తో నడిచేది,సాయంత్రం మూడు కాళ్ళతో నడిచేది. జవాబు: పసితనం లో నాలుగు కాళ్ళు, పెద్దయ్యాక రెండు కాళ్ళు, వృద్ధా ప్యం లో మూడు కాళ్ళు ఉడికిందొకటి,ఉడకందొకటి,కాలిందొకటి,కాలందొకటి, ఏమిటది ? జవాబు: వక్క,ఆకు,సున్నం,పొగాకు ఊ ఊరంతకీ ఒక్కటే దుప్పటి జవాబు: ఆకాశం ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది? జవాబు: చెప్పులు ఊళ్ళో కలి,వీధిలో కలి,ఇంట్లో కలి,ఒంట్లో కలి. జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి. ఎ ఎర్రని రాజ్యం,నల్లని సింహాసనం,ఒక రాజు ఎక్కితే,ఒక రాజు దిగుతాడు,ఏమిటది? జవాబు: మిరపచెట్టు. ఏ Edu kondalu ekina maa thata tirigi venakaku vachesadu ఐదుగురు భర్తలు ఉంటారు కానీ ద్రౌపది కాదు? ఐదుగిరిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు జవాబు: చిటికెన వేలు ఐదుగురు, ఐదుగురు, దొంగలు రెండు జట్లు గా పోయి ఒక జీవాన్ని తెచ్చారు.వెంటనే చంపారు. జవాబు: పేను ఐదు తంత్రాలు గలది.పిల్లలకు మహాఇష్టమైనది జవాబు: పంచతంత్రం ==ఒళ్లంతా ముల్లులు వాసన గుమగుమ Oka ఓ ఓహోహో హాలయ్య - వల్లంతా గరుకయ్యా - కరకర కోస్తె కడుపంతా తీపయ్యా! జవాబు: పనస పండు. ఔ అం అంగడిలో పెట్టి అమ్మేది కాదు, తక్కెడలో పెట్టి తూచేది కాదు, ఆలోచించటానికి ఆధారమైనది. అది లేకుండా మనిషేకాదు జవాబు: మెదడు. అందమైన గోపురం - మధ్య దూలం - మంచి గాలి లోనికెళ్ళి చెడ్డ గాలి బయటకొచ్చు జవాబు: ముక్కు అందమైన వస్త్రంపై అన్నీ వడియాలే జవాబు: ఆకాశంలో నక్షత్రాలు క కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి? విప్పితే:కనురెప్పలు కొండ మీద బండరాయి - రాతి మీద లోతు బావి - బావిలోపల ఊరే జల - ఆడే పాము జవాబు: తల - నోరు ఉమ్ము - నాలుక కొండల్లో పుట్టి కోనల్లో నడిచి, సముద్రంలో చేరే నెరజాణ జవాబు:నది ఖ Gattu kalaanga battalu endestharu గట్టు కాలంగా బట్టలు అందిస్తారు చ చిటారు కొమ్మన మిఠాయి పొట్లం జవాబు: తేనెపట్టు చిత్రమైన చీరకట్టి - షికారుకెళ్ళె చిన్నది - పూసిన వారింటికే గాని - కాసిన వారింటికి పోదు జవాబు:సీతాకోక చిలుక చుట్టింటికి మొత్తే లేదు జవాబు: కోడి గుడ్డు చూస్తే సురాలోకం - పడితే నీటికుండ - పగిలితే పచ్చ బంగారం జవాబు:తాటిపండు చూస్తే చూపులు - నవ్వితే నవ్వులు జవాబు: అద్దం చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు. జవాబు: టెంకాయ . చొట్టల చొట్టల కుండ - బోనాలకుండ - సీతమ్మ పేరు చెప్పి మెల్లంగా దించుకో జవాబు: సీతాఫలం ఛ జ జేబులో తాను ఉంటే ఎవరిని ఉండనివ్వద ఝ ట ఠ డ డబ్బా నిండ ముత్యాలు. ఏమిటది ? జవాబు: దానిమ్మ కాయ. ఢ ణ తండ్రి గరగర,తల్లి పీచుపీచు,బిడ్డలు రత్నమాణిక్యాలు,మనుమలు బొమ్మరాళ్ళు. జవాబు: పనసకాయ తిత్తిలో నుండి తీయగలమేమో గాని, పొయ్యలెము జవాబు:పాలు తెలిసేటట్లు పూస్తుంది - తెలియకుండ కాస్తుంది జవాబు:వేరుశెనగ తెల్లని బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి జవాబు: జాబిలి తెల్లని విస్తరిలో నల్లని మెతుకులు జవాబు:అక్షరాలు తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది జవాబు:ఉత్తరం తోకలో నిప్పు పెడితే ఆకాశానికి ఎగురుతుంది - అక్కడ పగులుతుంది, కింద పడుతుంది జవాబు:తారాజువ్వ థ tel laga vuntadi kani guddu kadu gundranga vntadi kani banthi kadu kalustharu kani tinaru? ద దేశదేశాలకు ఇద్దరే రాజులు జవాబు: సూర్యుడు, చంద్రుడు ధ న నల్ల బండ క్రింద నలుగురు దొంగలు జవాబు: బర్రె (గేదె, ఎనుము) క్రింది పొదుగులు నల్లని చేనులో తెల్లని దారి ఏమిటది? జవాబు:పాపిడి. నాలుగు రోళ్ళు నడవంగా - రెండు చేటలు చెరగంగా - నోటినుండి పాము వ్రేలాడంగా - అందమైన దొరలు ఊరేగంగా జవాబు: ఏనుగు నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు జవాబు : ఆకాశములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు నీటి ఒరుగు - రాతి బురద జవాబు:ఉప్పు-సున్నం నీ నా చెట్టుకు ఎన్నో ఆకులు, ఆకు ఆకుకి ఎన్నో మాటలు, ఆరగిస్తే డబ్బుల మూటలు జవాబు: నెమలికి కన్నీళ్లు వేస్తే ముద్ద అన్నట్లు పాకని పాము పడగ విప్పదు ఆకుల నడుమ వేలాడుతోంది పలుకుగాని పలుకు :ఎమిటది? జవాబు:వక్క పలుకు పచ్చ పచ్చని తల్లి: పసిడి పిల్లల తల్లి: తల్లిని చీలిస్తే తియ్యని పిల్లలు జవాబు: పనసపండు పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది: తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది? జవాబు: మొగలిపువ్వు పచ్చపచ్చని తోటలో ఎర్ర ఎర్రని సిపాయిలు జవాబు: మిరప పండ్లు పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా జవాబు: దీపం పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది. జవాబు: దూరవాణి పిఠాపురం చిన్నవాడా, పిట్టలకు వేటగాడా,బతికిన పిట్టను కొట్టా వద్దు,చచ్చిన పిట్టను తేనూ వద్దు, కూరకు లేకుండా రానూ వద్దు జవాబు:పక్షి గుడ్డు పిల్లికి ముందు రెండు పిల్లులు - పిల్లికి వెనుక రెండు పిల్లులు - పిల్లికీ పిల్లికీ మధ్య ఒక పిల్లి, మొత్తం ఎన్ని పిల్లులు? జవాబు:మూడు పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది? జవాబు:తన నీడ ప్రవహిస్తుంది కాని నీరుకాదు, పట్టుకుంటె ప్రాణం పోతుంది జవాబు:కరెంటు ఫ బ బంగారు భరిణలో రత్నాలు: పగుల గొడితేగాని రావు. జవాబు: దానిమ్మపండు. భ భూమిలో పుట్టింది - భూమిలో పెరిగింది - రంగేసుకొచ్చింది రామచిలుక జవాబు: ఉల్లిగడ మ ముందుగా పలకరిస్తుంది మళ్ళీ తిడుతుంది తర్వాత మర్యాదగా అంటుంది జవాబు: చందమామ! మాట్లాడుతుంది కానీ మనిషి కాదు జవాబు: రేడియో మూడు కళ్ళ ముసలిదాన్నినేనెవరిని? జవాబు:తాటి ముంజ మూడు కళ్ళుంటాయి కానీ ఈశ్వరుడు కాదు జవాబు: కొబ్బరి కాయ. మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారుచెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ ! జవాబు: నాగలిదున్నే రైతు ముక్కుతో చూడగలం - కంటితో చూడలేము జవాబు:వాసన మేసేది కాసంత మేత: కూసేది కొండంత మోత. జవాబు:తుపాకి/తూట మంచం కింద మామయ్యా:,ఊరికి పోదాం రావయ్య. జవాబు:చెప్పులు య ర రాతి శరీరం - మధ్యలో నోరు - తిరుగుతూ ఉంటుంది. తింటూ కక్కుతుంది జవాబు: తిరగలి రెక్కలు ముయ్యని పక్షి - రెప్పలు ముయ్యని జాణ జవాబు: తూనీగ, చేప ల యంత్రం కాని యంత్రం-కాదిది మంత్రం జవాబు: సాయంత్రం యర్రని రాజ్యం, నల్లని సింహాసనం,ఒక రాజు ఎక్కితే ఒకరాజు దిగుతాడు జవాబు: దోసెలు యాదగిరి నా పేరు గుట్ట ను మాత్రం కాను,ఒక ముఖ్యమంత్రి నా మీద ప్రయానించే వాడు కాని కారు ను కాదు.మరినేనెవరిని ? జవాబు: హెలికాప్టర్ లోకమంతటికి ఒకటే పందిరి-ఒకటే అరుగు జవాబు: ఆకాశము-భూమి లక్కబుడ్డి నిండా  లక్షల వరహాలు తినేవారే గాని,దాచి పెట్టుకొనేవారు లేరు. జవాబు: దానిమ్మ కాయ లక్ష్మి దేవి పుట్టకముందు ఆకు లేని పంట పండింది.ఇప్పటికీ ప్రతి ఇంట ఉంది. జవాబు: ఉప్పు వ వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు జవాబు: పొలం గట్టు వందమంది అన్నదమ్ములు - కట్టి పడేస్తే - కావలసినప్పుడు కదులుతారు - దుమ్ము ధూళీ దులుపుతారు జవాబు : చీపురు కట్ట వానొస్తే పడగ విప్పు - ఎండ వస్తే పడగ విప్పు - గాలి వేస్తే గడ గడ వణుకు జవాబు: గొడుగు వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచుఅంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ ! జవాబు : గాలిపటం శ శంకు లో పెంకు,పెంకు లో తీర్థం,తీర్థం లో మొగ్గ జవాబు: టెంకాయ శాస్త్రం చెన్నప్ప,నేల గీరప్ప, మూల నక్కప్ప జవాబు: పార శిత్తి లో ఇద్దరు దొంగలు కూర్చున్నారు జవాబు: వేరుశనక్కాయ శెల లో శెల్వరాజు, పట్నాన పచ్చ రాయి, పేలూరు తెల్ల రాయి, నెల్లూరు నల్ల రాయి, నాలుగున్నూ చేర్చి ముప్పయి ఇద్దరు,తొక్కగ కారింది రక్తం జవాబు: తాంబూలం ష సూది వెళ్ళింది చుక్కలాంటిది పొడుపు కథ జవాబు ఏంటి హ హంస ముక్కు కీ ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది జవాబు: ప్రమిద హడవిడిగా తిరిగే రంగయ్య -అమ్దరి ఇండ్లు నీవేనయ్యా జవాబు: కుక్క హద్దు లేని పద్దు ఎన్నడూ ఆడొద్దు జవాబు: అబద్దం హస్త ఆరు పాళ్ళు చిత్త మూడు పాళ్ళు జవాబు: వర్షం హుస్సేన్ సాబ్ ఉరకాలంటాడు ఖాదర్ సాబ్ కాదంటాడు జవాబు: ఎనుముపగ్గం హనుమంతరావు గారి పెండ్లాం గుణవమ్తురాలు.తెట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవంచుకొన్నది. జవాబు: జొన్నకంకి ళ క్ష మూలాలు వర్గం:తెలుగు భాష *
ఆలు లేదు, సూలూ లేదు కాని కొడుకు పేరు సోమలింగం.
https://te.wikipedia.org/wiki/ఆలు_లేదు,_సూలూ_లేదు_కాని_కొడుకు_పేరు_సోమలింగం.
దారిమార్పు ఆలు లేదు, చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం.
చిట్కా వైద్యాలు
https://te.wikipedia.org/wiki/చిట్కా_వైద్యాలు
thumb|గోల్డెన్ మిల్క్ - ఇవి దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు తీసుకోవడం ఎంతో మంచిది. పల్లెటూళ్లలో, మారుమూల ప్రాంతాలలో ప్రజలు తమకు వచ్చిన జబ్బులను తమకు అందుబాటులో ఉన్న వాటితో నయం చేసుకొనే గృహవైద్యమే చిట్కావైద్యం. పురాతన కాలం నుంచి కొన్ని రుగ్మతలకు నాయనమ్మ అమ్మమ్మలు ఇంట్లో లభ్యమయ్యే పదార్ధాలతోనో పెరటిలో దొరికే ఆకులతోనో చికిత్స చేసి స్వస్థత కలిగించడం అందరికి తెలిసినదే. నాగరికత పెరిగే కొలది ఇంటి వైద్యం విలువ కోల్పోయింది. చాలా జబ్బులకు ఇంట్లో తేలిగ్గా లభించే పదార్ధాలు వాడితే స్వస్థత చేకూరుతుంది. ఇంటివైద్యం రోగాలు ప్రారంభదశలో వున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. రోగం తీవ్రత పెరిగితే తప్పని సరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఇంటి వైద్యం ద్వారా తగ్గించగలిగే జబ్బులుః జలుబు చేస్తే వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి త్రాగితే తెల్లారేసరికల్లా జలుబు మాయం. పొద్దున్నే వేడి పాలలో, మిరియాల పొడి (వీలుంటే శోంఠి ) వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగండి. ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని అందులో పసుపు వేసుకొని చెమటలు పట్టే దాకా ఆవిరి పడితే చాలా తేడా కనిపిస్తుంది. దానిలో కాస్త అమృతాంజనం వేస్తే ఇంకా ప్రభావం కనిపిస్తుంది. తులసి, అల్లపు ముక్కల రసం తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది. శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని కషాయం కాచాలి. దానికి చక్కెర చేర్చి, వేడిగా తాగితే పడిశం తగ్గుతుంది. ఇరవై గ్రాముల దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి ఒక గ్లాసు నీటితో మరిగించి, వడగట్టి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగాలి. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి, రోజు పరగడుపున తాగితే నిమ్మలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది. నాలుగు తులసి ఆకుల రసమ్ తాగాలి. జ్వరం వస్తే కడుపునొప్పి ఎండు మిరపకాయల గింజలు కొన్ని పావు గ్లాసు నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పి మాయం. విరేచనాలు ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా చక్కెర, ఒక చిటికెడు ఉప్పు వేసి, బాగా కలియబెట్టి త్రాగవలెను. గొంతునొప్పి దగ్గు కోరింత దగ్గు నోటి దుర్వాసన నీళ్లు ఎక్కువగా త్రాగాలి భోజనం అయిన వెంటనే సోపు గింజలు తినాలి చెవిలో ఏదైనా గుచ్చుకొంటేః చెవి మార్గంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చెవిలో నీరు పోకుండా చూసుకోవాలి. వీలైనంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్ళాలి మధు మేహము, నివారణ r ju మొటిమలు సెగగడ్డలు గ్యాస్ ట్రబుల్ గ్లాసు మజ్జిగలో ఒక స్పూను నల్లఉప్పు కలుపుకొని తాగవలెను. పచ్చకామెర్లు మధుమేహం లేదా చక్కెర వ్యాధి వేప ఆకులను తిన వలెను. వర్గం:వైద్యము
అసలే కోతి, ఆపై కల్లు తాగినది.
https://te.wikipedia.org/wiki/అసలే_కోతి,_ఆపై_కల్లు_తాగినది.
దారిమార్పు అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు
కల్లు
https://te.wikipedia.org/wiki/కల్లు
thumb|right|150px|అప్పుడే చెట్టు నుండి దించిన ముంతలో నురుగుకట్టిన కల్లు కల్లు ఒక ఆల్కహాలు కలిగిన పానీయము. దీనిని తాటి చెట్టు, ఈత చెట్టు మొదలైన పామే కుటుంబానికి చెందిన అనేక చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండము, దక్షిణ భారతదేశము, ఫిలిప్పీన్స్ మొదలైన ప్రాంతాలలో వాడతారు. దీని లాంటి మరికొన్ని మత్తు పానీయాలు భంగు, సారాయి. దీనిని వారుణి అని కూడా పిలుస్తారు. ఈత కల్లు thumb|left|ఫిలిప్పీన్స్ లో ఒక కల్లు గీత కార్మికుడు ఈత చెట్లనుండి ఈ కల్లు లభిస్తుంది. ఈత చెట్లకు కల మట్టలలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆమట్టల నుండి వచ్చే కల్లును కుండలు కట్టి సేకరిస్తారు. మొదటగా లోపలి మట్టను చెక్కి వారం రోజుల పాటు దానిని అలాగే వదిలిపెడతారు. వారం రోజుల అనంతరం మళ్ళీ చెక్కుతారు. అప్పటి నుండి కల్లు కారడం మొదలవుతుంది. మట్టలకు కట్టిన కుండను మూడు రోజుల తరువాత తీస్తారు. అప్పటి ముందు కారిన కల్లు పులిసి తరువాత కారిన కల్లుతో కలసి మరింత నిషానిచ్చేదిగా మారుతుంది. తాటి కల్లు thumbnail|తాటి కల్లు అమ్ముతున్న తాటి కల్లుగీత కార్మికుడు. thumb|తాటి కల్లు thumb|తాటి కల్లు పోస్తున్న గౌడ్ తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ లిమ్కా రుచిని కలిగి ఉంటుంది. కొబ్బరి కల్లు కొబ్బరి చెట్లకున్న మువ్వలకు కొస భాగాన్ని కోసి అక్కడ కల్లు కుండను కడతారు: ఈత, తాటి మొదలైన చెట్లకు ఒక కుండనే కడ్తారు. కాని కొబ్బరి చెట్లకు ఎన్ని మువ్వలు వుంటే అన్ని కుండలను కడతారు. ఇది దీని ప్రత్యేకత: ఇది చాల రుచిగాను నిషా తక్కువగను వుంటుంది. తాజా కొబ్బరి కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు. తాజా కొబ్బరి కల్లును నీరా అంటారు. అత్తి కల్లు అత్తి చెట్ల నుండి దీనిని సేకరిస్తారు: విప్ప చెట్టు సమీపంలో ఒక గొయ్యి త్రవ్వి అక్కడ కనిపించిన విప్ప చెట్టు వేరును కొంత మేర కోసి దానికింద ఒక చిన్న కుండను కట్టి పైన మూత పెడతారు. ఆ వేరులో నుండి కారిన రసాన్ని సేకరిస్తారు. ఇది గిరిజనులు ఎక్కువగా తయారు చేస్తారు: ఇది ఆరోగ్యానికి చాల మంచిది. పౌడర్ కల్లు ఇది సర్వసాధారణంగా ఈత, తాటి చెట్లు లేని పట్టణ ప్రాంతాలలో తయారు చేస్తారు. ఒకరకమైన పౌడర్ నీటిలో కలిపి తయారు చేసే ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారి. ఇటువంటి కల్లు పట్టణాల మధ్య ప్రధాన రహదారులలో బాటిళ్ళలో నింపి, బల్లలపై ఉంచి అమ్మడం చూడవచ్చు. File:కల్లు గీత కార్మికుడు/Toddy drawer at Mangal palle village.jpg జలిగ కల్లు ఇది అడవి ప్రాంతంలో దొరుకుతుంది వివిధ దేశాలలో కల్లు ఫిలిప్పీన్స్ లో దీనిని 'టూబా' అని వ్యవహరిస్తారు. thumb|right|ఈతచెట్టుకు కట్టిన కల్లు కుండ/నిజామాబాద్ వద్ద తీసిన చిత్రము పేర్లు దేశం / ప్రాంతం వాడుక పేరు</tr> మింబో http://iteslj.org/Articles/Anchimbe-CameroonEnglish.html</tr> malafu, panam culloo </tr> toutou</tr> doka, nsafufuo, palm wine, yabra, akpeteshi</tr> కల్లు (கள்ளு) (കള്ള്) a, Tamil tadib, toddy</tr> కల్లు (கள்ளு), నీర, tuak, toddy</tr> htan yay</tr> emu, ogogoro, palm wine, tombo liquor, Nnmaya ngwo</tr> segero, tuak</tr> టూబా, lambanog</tr> ubusulu</tr> poyo</tr> కల్లు (கள்ளு), రా (රා) </tr> మూలాలు వర్గం:మత్తు పానీయాలు
సీ భాషకు ముందుమాట
https://te.wikipedia.org/wiki/సీ_భాషకు_ముందుమాట
సి భాష, అందులోని వ్యాకరణము వగైరా, నేర్చుకునే ముందు మీరు ఆ భాషలోని కొన్ని పదాల (terms) కు అర్ధం తెలుసుకోవటం మంచిది. అవి సీ-భాషను మరింత బాగా నేర్చుకోవడానికి పనికివస్తాయి. కంపైలు: సి-భాష ఎలా పని చేస్తుంది? ఇతర ప్రోగ్రామింగు భాషలలాగానే సీ-భాషను కంప్యూటరు సరాసరి అర్ధం చేసుకోవాలంటే కుదరదు. సి-భాష ముఖ్యోద్దేశము మనుషులచే కంప్యూటరుకు సూచనలు ఇచ్చుటకు, అదే సమయములో మనము ఇచ్చిన సూచనలను కంప్యూటరుకు అర్ధం అయ్యే యాంత్రిక భాష లోకి మార్చే ప్రక్రియను సులభంచేయటం. మీరు వ్రాసిన సి-భాష ప్రోగ్రామును, నడిపించగలిగే (executable) యాంత్రిక భాషలోకి మార్చుటకుగాను కంపైలరు అనే ప్రోగ్రామును ఉపయోగించవలెను. మనము సీ-భాషలో వ్రాసిన ప్రోగ్రామును యాంత్రిక భాషలోకి మార్చుటకు కంపైలరు అనే ప్రోగ్రామును ఉపయోగించాలి. మీరు సీ-భాషలో వ్రాసిన ప్రోగ్రాము ఒకటి కంటే ఎక్కువ ఫైళ్ళలో ఉంటే, వాటిని కలిపి ఒక నడిపించగలిగే ప్రోగ్రాముగా లేదా లైబ్రరీగా తయారు చేయుటకుగాను లింకర్ (linker) అను ప్రోగ్రామును వాడాలి. లైబ్రరీ అనునది ఇతర ప్రోగ్రాములలో వాడుకొనుటకు అవసరమైన చిన్న చిన్న ప్రోగ్రాములను దాచుకొనుటకు ఉపయోగిస్తారు, అంతేగానీ దానిని ఒక్కదానినే నడిపించటం కుదరదు. అయితే సాధారణముగా కంపైలు చేయటం, లింకు చేయటం అనేవి చుట్టాల వంటివి. ఉపయోగించినప్పుడు రెండింటినీ ఉపయోగించవలసి వస్తుంది. కాబట్టి చాలామంది ఆ రెండిటినీ ఒకే పనిగా చూస్తారు. మీరు ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, అది ఏమిటంటే - సీ-భాషలో ఒక దిక్కులోనే కంపైలు చేయవచ్చు: అనగా మీ సీ ప్రోగ్రామును యాంత్రిక భాషలోకి కంపైలు చేయవచ్చు, ఇది సులభమే. కాని డీకంపైలు (యాంత్రిక భాష నుండి సీ-భాష ప్రోగ్రామును పొందటం) మాత్రం చాలా కష్టం. డీకంపైలర్లు ఉన్నాయి, కానీ అవి పెద్దగా ఉపయోగపడే సీ-ప్రోగ్రాములను సృష్టించలేవు. మీకు అత్యంత నాణ్యమైన, ప్రముఖమైన GNU సీ-కంపైలరు http://gcc.gnu.org/లో దొరుకుతుంది. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్స్ (IDEs) ఇంటిగ్రేటెడ్ డవలప్‌మెంట్ ఎన్విరాన్‌మెంట్ అనేవి మీ ప్రోగ్రాములు వ్రాసుకొని భద్రపరచుకొనుటకు, కంపైలు చేసుకొనుటకు, లింకు చేసుకొనుటకు కావలిసిన వివిధ ప్రోగ్రాముల సమూహము అని చెప్పవచ్చు. మనము ఒక ప్రోగ్రాము తయారు చేయుటకు కావలిసినవి అన్నీ ఒకే దగ్గర దొరకటం వలన IDEలు ప్రోగ్రాముల తయారీకి చాలా సౌకర్యవంతముగా ఉంటాయి. అంతేకాదు, మనము వ్రాసిన ప్రోగ్రాములో ఉన్న తప్పులను కనిపెట్టుటకు సహాయపడు డిబగ్గరు (debugger) అను ప్రోగ్రాము కూడా IDE లలో ఉంటాయి. ఈ డిబగ్గరుతో మనము ఒక్కొక్క వాక్యమును నడిపి, అసలు తప్పు ఏ వాక్యములో ఉన్నదో మనము తెలుసుకునేటట్లు చేయును. IDEలలో Microsoft Visual C++ (MS VC++) చాలా పేరెన్నికగన్నది, కానీ ఉచితముగా లభించదు. ఉచితముగా దొరికే IDEలలో DevC++ ప్రముఖమయినది, http://www.bloodshed.net/లో మీకు లభించగలదు. http://www.smorgasbordet.com/pellesc/లో లభించు Pelles C కూడా మంచి IDE. అన్నీ సీ-ప్లస్.ప్లస్ అని ఉన్నాయి కదా మరి సీ-భాషకు పని చేస్తాయా అని మీరు సందేహ పడనవసరం లేదు, ఎందుకంటే సీ-భాషలో ఉన్న అన్ని ప్రత్యేకతలు మనకు సీ-ప్లస్.ప్లస్ భాషలో కూడా ఉంటాయి. కాబట్టి చాలా సి-ప్లస్.ప్లస్ కంపైలరులు సీ-కంపైలరుతో బాటుగా వస్తాయి. మీరు సీ-భాషను నేర్చుకునే ముందు ఒక మంచి IDE ని సమకూర్చుకోవటం ఎంతయినా మంచిది. బ్లాక్ స్ట్రక్ట్చరు, స్కోపు మనము ఇప్పుడు సీ-ప్రోగ్రాము యొక్క స్వరూపము యొక్క ప్రాథమిక అంశాల గురించి తెలుసుకుందాము. బ్లాకు అనగా కొన్ని వాక్యముల సమూహము. వీటిని మనము ఒకే ఒక్క వాక్యముగా పరిగణించ వచ్చు. సీ-భాషలో బ్లాకులు "తెరుచుకునే మీసాల బ్రాకెట్ల"తో { మొదలు అయ్యి "మూసుకునే మీసాల బ్రాకెట్ల"తో } ముగుస్తాయి. బ్లాకులలో బ్లాకులు, వాటిలో లోపల మళ్ళీ బ్లాకులు ఇలా కూర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. సమాచారము లేదా ఫంక్షనులు ఏ రకంగా వాడబడుతున్నాయో లేక చూడబడుతున్నాయో తెలుపుటను మనము స్కోపు అని వ్యవహరిస్తాము. సీ-భాషలో రెండు రకాల స్కోపులు ఉన్నాయి. local (ప్రాంతీయం), global (విశ్వవ్యాప్తం). మనము దేని గురించయినా గ్లోబల్ అని మాట్లాడుతున్నప్పుడు దానిని ప్రోగ్రాములో ఎక్కడయినా చూడవచ్చు లేదా వాడుకోవచ్చు. దేనినయినా లోకల్ అని పిలిచినచో అప్పుడు వాటిని అవి పుట్టిన (declared) బ్లాకులో మాత్రమే చూడవచ్చు లేదా వాడుకోవచ్చు. (బయట బ్లాకులలో ఉన్న వాటిని లోపలి బ్లాకులలో కూడా వాడవచ్చు, కానీ లోపలి వాటిని బయట వాడుట కుదరదు.) ఫంక్షనులు వాడుటకు సూత్రములు ఫంక్షనులు సీ-భాషలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఫంక్షను అనునది కొన్ని పనులు చేయుట కోసం తయారు చేయబడిన ఒక ప్రత్యేక బ్లాకు అని చెప్పవచ్చు. ఫంక్షనుని బాగా తయారు చేసినచో ఇతర ప్రోగ్రామరులు, అది చేయు పనిని, ఎలా చేస్తుంది అనేది తెలుసుకోనవసరము లేకుండా, ఉపయోగించుకోగలుగుతారు. ఫంక్షను చేయు పనిని ఉపయోగించుట అను క్రియను ఫంక్షను-కాల్ (function call) అని పిలుస్తారు. చాలా ఫంక్షనులు వాటికి నిర్దేశించిన పనిని చేయుటకు కొంత సమాచారము అవసరం పడుతుంది, ఆ సమాచారమును ఆర్గుమెంట్సు (arguments) అని పిలుస్తారు. చాలా ఫంక్షనులు వాటి ఫలితమును ఒక విలువగా వాటిని పిలిచిన దానికి తిరిగి పంపిస్తాయి, వీటిని రిటర్న్ వాల్యు (return value) అని పిలుస్తారు ఒక ఫంక్షనుని పిలిచే ముందు మీరు ఆ ఫంక్ష గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి: ఆ ఫంక్షను ఏ పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఎటువంటి సమాచారం (datatype) ఆర్గుమెంట్సుగా తీసుకుంటుంది, వాటి అర్ధమేమిటి. ఎటువంటి సమాచారాన్ని రిటర్న్ వాల్యుగా పంపిస్తుంది, దాని అర్ధమేమిటి. అన్ని ఫంక్షనులను గ్లోబల్ సమాచారముగా పరిగణిస్తారు. అంటే ఒక ఫంక్షను లోపల ఇంకో ఫంక్షనుని రాయటం కుదరదు. గ్లోబలు సమాచారము కాక మిగతా సమాచారమునంతటినీ ఫంక్షను లోపలే సృష్టించాలి. ప్రతీ నడిపించగలిగే ప్రోగ్రాములో main () అను ఒక ఫంక్షను తప్పని సరిగా ఉండాలి. సి-భాష లైబ్రరీ 1983 లో సీ-భాషను స్థిరీకరణ చేస్తున్నప్పుడు, ఆ కమిటీవారు, కొన్ని ప్రాథమిక ఫంక్షనులు దాదాపుగా అన్ని ప్రోగ్రాములకు అవసరమని గుర్తించారు. ఈ ఫంక్షనులన్నీ కలిపి సీ-భాష లైబ్రరీగా వ్యవహరిస్తున్నారు. సీ-భాష లైబ్రరీలో మనకు గణితము, ఫైళ్ళు, వగైరా వాటికి సహాయపడు పనులన్నిటికీ ఫంక్షనులను చేర్చారు. అయితే లైబ్రరీ మనకు హార్డువేరు, మొదలయిన వాటికి సంబంధించిన ఫంక్షనులను మాత్రం ఇవ్వదు. "Hello, World" ప్రోగ్రాములో మనము printf అనే ఒక లైబ్రరీ ఫంక్షను ఉపయోగించాము. ఈ ఫంక్షను కంప్యూటరు స్క్రీను పైన అక్షరములను ముద్రించుటకు ఉపయోగించుతారు. అభిప్రాయములు - వాటిని ఉపయోగించు పద్ధతి అభిప్రాయములు (comments) మనము వ్రాసిన ప్రోగ్రాము గురించి వివరించుటకు ఉపయోగించు కోవచ్చు. మనము వ్రాసే ప్రోగ్రాములో సందర్భానుసారముగా ఎక్కడయినా అభిప్రాయములను ఉంచవచ్చును. సీ-భాషలో అభిప్రాయమును /*తో మొదలు పెట్టి */తో ముగిస్తాము. మంచి పద్ధతిలో అభిప్రాయములను చేర్చటం అనేది సాఫ్టువేరు తయారీలో చాలా ముఖ్యమైన అవసరంగా పరిగణిస్తారు. అభిప్రాయములను చేర్చటం అనేది ఇతరులు మీ ప్రోగ్రామును అర్ధము చేసుకోవటనికే కాదు భవిష్యత్తులో మీ ప్రోగ్రామును మీరే తొందరగా అర్ధము చేసుకోవటానికి, అది ఎలా పనిచేస్తుందో గుర్తుకు తెచ్చుకోవడానికి చాలా పనికి వస్తాయి. సాధారణముగా ఏవయితే అంత తొందరగా అర్ధమవవు అని అనుకుంటామో అక్కడ అభిప్రాయమును చేర్చటం అనునది చాలా మంచి ఆలోచన. అయితే అలాగని ప్రతీ వాక్యానికి అభిప్రాయమును చేర్చటం అనేది మంచి ఆలోచన కాదు. అలా చేయటం వలన మీ ప్రోగాము చదువుటకు కష్టం అయిపోయే అవకాశం కూడా ఉంది మరి. మంచి ప్రోగ్రామింగు పద్ధతి అవలంభించటం అనేది ప్రోగ్రాములను సులువుగా చదువుటకు, అర్ధవంతముగా ఉంచుటకు మరియూ మంచి ప్రోగ్రాము అన్న భావన కల్పించుటకు ఎంతయినా అవసరము. ఇది అన్ని ప్రోగ్రామింగు భాషలకు వర్తిస్తుంది అని చెప్పవచ్చు. సాధారణముగా అయితే, సరిపడా ఖాళీలను వదలటం, క్రొత్త బ్లాకులను మొదలు పెట్టినప్పటి నుండి మూసివేసే వరకు అన్ని వాక్యములను ఒకే స్థానములో మొదలు పెట్టటం (aligning), ఉపయోగించే ఫంక్షనులకు, వేరియబుల్సులకు అర్ధవంతమైన పేర్లు పెట్టటం, మొదలయినవన్ని చాలా అవసరం. సీ-ప్రీప్రాసెసరు కొన్ని సార్లు మీరు కంపైలరుకు ప్రత్యేకమైన సూచనలు ఇవ్వాలని అనుకుంటారు. ఈ సూచనలను మనము "ప్రీప్రాసెసర్ డైరెక్టీవు"లు అను ప్రోగ్రాములో కూర్చి ఇవ్వవచ్చు. మీరు మీ ప్రోగ్రామును కంపైలు చేయటం మొదలు పెట్టినప్పుడు, "ప్రీప్రాసెసరు" అనబడే ఒక ప్రోగ్రాము మీ ప్రోగ్రాములో ఉన్న ఈ సూచనల కోసం వెతికి, ఆ సూచనలకు అనుగుణముగా మీ అసలు ప్రోగ్రామును మారుస్తుంది, ఆ తరువాతే మీ ప్రోగ్రాము కంపైలు చేయబడుతుంది. మీరు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ప్రీప్రాసెసరు డైరెక్టీవులు ప్రోగ్రాములో ఉన్నా కూడా, వాటిని మీ ప్రోగ్రాముతో పాటుగా కంపైలుచేయ బడవు, వాటిని కంపైలు ప్రక్రియకు సూచనలు ఇచ్చుటకు మాత్రమే ఉపయోగించుకోవచ్చును. సీ-భాషలోని అన్ని ప్రీప్రాసెసరు డైరెక్టీవులు కూడా # ('హాష్' అని పలుకుతారు) అనే అక్షరముతో మొదలవుతాయి. మీరు "Hello, World!" ప్రోగ్రాములో ఇది వరకే #include అను ప్రీప్రాసెసరు డైరెక్టివుని చూసి ఉంటారు. #include అను ప్రీప్రాసెసరు డైరెక్టీవు ఒక ఫైలుని తెరిచి అందులో ఉన్న సమాచారమును #includeకి బదులుగా చేర్చును. #define అను ప్రీప్రాసెసరు డైరెక్టీవు కూడా చాలా విరివిగా ఉపయోగించుతారు. వర్గం:సాఫ్టువేరు వ్రాయు భాషలు
భారతదేశం
https://te.wikipedia.org/wiki/భారతదేశం
భారతదేశం ప్రపంచదేశాలలో నుటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో గల అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. ఇది 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య. ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది. దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. ఇది సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు. హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతములకు జన్మనిచ్చింది. ఇది బహుభాషా, బహుళ జాతి సంఘము. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం. జనాభాలో భారతదేశం 2023 ఏప్రిల్ లో చైనాను దాటేసింది. మౌర్య సామ్రాజ్య కాలంలో ప్రస్తుత సరిహద్దులలో కొద్దిభాగం మినహాయించి, సరిహద్దులు దాటిన ప్రాంతాలతో పాటు ఒకే చక్రవర్తి పాలనలోవున్నా, తదుపరి పలు చిన్న రాజ్యాలుగా విడిపోయింది. 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా ఈ రాజ్యాలను స్వాధీనం చేసుకోవడంతో బ్రిటీష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ పాలనలోకివచ్చింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం జరిగిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది. అయితే, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది. + భారతదేశం జాతీయ చిహ్నాలు (అధికారిక జాబితా) జాతీయ వారసత్వ జంతువు 50px జాతీయ పక్షి 50px జాతీయ చెట్టు 50px జాతీయ పుష్పం 50px జాతీయ జంతువు 50px జాతీయ జల సముద్ర క్షీరదం 50px జాతీయ సరీసృపాల 50px జాతీయ వారసత్వ పైగా పాలిచ్చు జంతువు 50px జాతీయ పండు 50px జాతీయ ఆలయం 50px జాతీయ నది 50px జాతీయ పర్వతం 50px పేరు పుట్టుపూర్వోత్తరాలు భారతదేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య స్థానే...). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది.ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల కుమారుడు. తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధూనది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధూనదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు. తరువాత హిందూదేశం రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు (ఆంగ్లేయులు) వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారతదేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు ఉన్నాయి. అవి ఇండియా, భారతదేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూదేశం రూపాంతరమే. చరిత్ర thumb|260x260px|అశోకుడిచే క్రీ.పూ.3 వ శతాబ్దంలో మధ్య ప్రదేశ్ లోని సాంచీలో నిర్మించబడిన స్థూపం.|alt= మధ్య ప్రదేశ్‌ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. క్రి.పూ. 7000 సమయంలో, మొట్టమొదటి నియోలిథిక్ స్థావరాలు పశ్చిమ పాకిస్తాన్ లో మెహర్గర్, ఇతర ఉపఖండపు ప్రాంతాల్లో కనిపించింది. ఈ విధంగా సింధుాలోయ నాగరికత అభివృద్ధి, దక్షిణ ఆసియాలో మొదటి పట్టణ సంస్కృతి అభివృద్ధి చెందాయి. ఇదే క్రీ.పూ.26 వ శతాబ్దం, క్రీ.పూ.20 వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయిxe. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. అశోకుడు ఈ వంశంలోని ప్రముఖ రాజు. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రం, కళలు, సారస్వతం, భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు. అయినా, ముఖ్యంగా దక్షిణాన స్థానిక సామ్రాజ్యాలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. రెండవ సహస్రాబ్ది మధ్యల, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బ్రిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన దేశంగా భారతదేశం – జాతి, మత పరమైన సంఘర్షణలను చవిచూసింది. అయినా, తన లౌకిక, ప్రాజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకుంటూనే వచ్చింది. 1975, 1977 మధ్యకాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే పౌర హక్కులకు భంగం వాటిల్లింది. భారత దేశానికి చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా 1962లో యుద్ధం జరిగింది. పాకిస్తాన్తో 1947, 1965, 1971లోను యుద్ధాలు జరిగాయి. అలీనోద్యమంలో భారతదేశం స్థాపక సభ్యురాలు. 1974లో, భారత్ తన మొదటి అణు పరీక్షను నిర్వహించింది. 1998లో మరో ఐదు పరీక్షలు నిర్వహించింది. 1991లో జరిగిన ఆర్ధిక సంస్కరణలతో ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారింది. ప్రభుత్వం, రాజకీయాలు thumb|390x390px|నృసింహావతారం లో ఉన్న విష్ణుమూర్తి.|alt= (భారత రాజకీయ వ్యవస్థ) భారతదేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించింది. భారత రాజ్యాంగం ప్రకారం అధికారం లెజిస్లేచర్, న్యాయవ్యవస్థ, నిర్వహణ వ్యవస్థల ద్వారా అమలవుతుంది. ఇది పలు రాష్ట్రాల సమాఖ్య. దేశాధినేత అయిన రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజి ద్వారా 5 సంవత్సరాల కాలపరిమితికి ఎన్నుకోబడతారు. ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధికారాలు గల పదవి. లోక్‌సభలో అత్యధిక సంఖ్యాక రాజకీయ పార్టీ, లేదా సంకీర్ణం సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంది. ప్రధానమంత్రి సలహా మేరకు, రాష్ట్రపతిచే నియమించబడ్డ మంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకారిగా ఉంటుంది. మంత్రులచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. భారతదేశపు శాసన వ్యవస్థలో ద్విసభా పద్ధతి ఉంది. ఎగువ సభను రాజ్య సభ అని, దిగువ సభను లోక్ సభ అని అంటారు. లోక్ సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. రాజ్య సభ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకోబడతారు. న్యాయవ్యవస్థలో పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు, అప్పిలేట్ కోర్టులు, హైకోర్టులు ఉంటాయి. కోర్టులకు సూచనలు, ఆదేశాలు, రిట్లు ఇచ్చే అధికారం ఉంది. రిట్లలో హెబియస్ కార్పస్, మాండమస్, నిషేధం, కోవారంటో, సెర్టియోరారి అనే వివిధ రకాలుగా ఉన్నాయి. భారతీయ కోర్టులు రాజ్యాంగ శక్తులు; ఇవి రాజకీయ జోక్యం లేనివి. న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు అరుదుగా ఏర్పడే ఘర్షణను రాష్ట్రపతి మధ్యవర్తిత్వం వహించి నివారిస్తారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక భాగం, కేంద్ర ప్రభుత్వంలో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం అతిపెద్ద రాజకీయ పక్షం కావడం చేత, స్వాతంత్ర్యం తరువాత దాదాపు 40 ఏళ్ళపాటు దేశరాజకీయాల్లో కాంగ్రెసు గుత్తాధిపత్యం వహించింది. 1977లో జనతా పార్టీగా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఇటీవలి కాలంలో, భారత ఓటర్లపై గల పట్టును కాంగ్రెసు పార్టీ కోల్పోతూ వచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెసు పార్టీ, వివిధ చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందూ వాద పార్టీ అయిన భాజపా ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం కారణంగా 1996 తరువాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ సంకీర్ణాలేకాగా 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయింది .ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదిశాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం కూడా కష్టంకాగా భారతీయ జనతా పార్టీ మాత్రం మొదటిసారిగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం విశేషం. భౌగోళిక స్వరూపం, వాతావరణం thumb|260x260px|హిమాలయాలు ఉత్తరాన జమ్మూ కాశ్మీరు నుండి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి భారతదేశపు ఉత్తర సరిహద్దుగా విలసిల్లుతున్నాయి.|alt= thumb|260x260px|భారతదేశం, ఉపగ్రహ చిత్రం.|alt= భారతదేశం విశిష్ట లక్షణాలు గల ఒక ఉపఖండం అని పేర్కొనవచ్చు. భారతదేశంలో అనేక భౌతిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక తారతమ్యాలున్నాయి. భారతదేశంలో ఆనాది నుంచి అనేక మతాలు, జాతులు, కులాలు,భాషలు, కులాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉండుటచే దీన్ని భౌగోళిక బిన్నత్వంలో ఏకత్వంగల దేశంగా గుర్తించవచ్చు. భారతదేశపు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు హిమాలయ పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. మిగిలిన ఉత్తర భారతం, మధ్య, ఈశాన్య ప్రాంతాలు సారవంతమైన గంగా మైదానంతో కూడి ఉన్నాయి. పశ్చిమాన, పాకిస్థాన్కు ఆగ్నేయ సరిహద్దున థార్ ఎడారి ఉంది. దక్షిణ భారత ద్వీపకల్పం దాదాపు పూర్తిగా దక్కను పీఠభూమితో కూడుకుని ఉంది. ఈ పీఠభూమికి రెండువైపులా తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్నో ప్రముఖ నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని: గంగ, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి. దేశపు దక్షిణాన ఉష్ణ వాతావరణం ఉండగా, ఉత్తరాన సమశీతోష్ణ వాతావరణం నెలకొని ఉంది. హిమాలయ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం (టండ్రా) ఉంది. భారతదేశంలో వర్షాలు ఋతుపవనాలు వలన కలుగుతాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశం 28 రాష్ట్రాలుగా, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి. ఢిల్లీ,పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్ లకు ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రభుత్వం వుంటుంది. రాష్ట్రాలు: సంఖ్య పటంలో చూపబడింది ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బీహార్ చత్తీస్ గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ ఒడిషా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు తెలంగాణ త్రిపుర ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమబెంగాల్ కేంద్రపాలిత ప్రాంతాలు:ప్రక్కన గల పటంలో ఆంగ్ల అక్షరంతో సూచించబడినవి భారతదేశం అంటార్క్‌టికాలో ప్రాదేశిక వాదన చేయలేదు కానీ దక్షిణ గంగోత్రి, మైత్రి అను రెండు శాస్త్రీయ స్థావరాలు ఉన్నాయి. చూడండి: జనాభా వారిగా భారతదేశ రాష్ట్రాల జాబితా ఆర్ధిక వ్యవస్థ thumb|1300 కోట్ల డాలర్ల ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఆర్ధికవ్యవస్థ, ద్రవ్య మారకం పరంగా ప్రపంచంలోనే పదో పెద్ద వ్యవస్థ. పర్చేసింగ్ పవర్ పారిటీ ప్రకారం ఇది నాలుగో స్థానంలో ఉంది. 2003లో అత్యధిక వృద్ధి రేటు – 8 శాతం – నమోదు చేసుకుంది. అయితే, అధిక జనాభా కారణంగా, పి. పి. పి ప్రకారం తలసరి ఆదాయం కేవలం 2,540 డాలర్లుగా ఉంది; ప్రపంచ బాంకు జాబితాలో ఇది 143 వ స్థానం. భారత విదేశీమారక నిల్వలు 30 వేల 900 కోట్ల డాలర్లు. దేశానికి ఆర్ధిక రాజధానిగా ముంబై నగరం భాసిల్లుతోంది. భారతీయ రిజర్వ్ బాంక్ కేంద్ర కార్యాలయం, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇక్కడే ఉన్నాయి. 25% ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం విస్తరణ కారణంగా మధ్య తరగతి వర్గం విస్తరిస్తోంది. పరిశ్రమ భారత్ లోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. చిత్రంలో ఉన్నది అగ్రశ్రేణి ఐ.టి సంస్థ, ఇన్‌ఫోసిస్.|alt=|260x260px చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడిన వ్యవసాయం పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25% కంటే తక్కువే. ముఖ్యమైన పరిశ్రమలు గనులు, పెట్రోలియం, వజ్రాలు, సినిమాలు, జౌళి, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హస్త కళలు. భారత్ దేశపు పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది. 2003–2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు. చిన్న పట్టణాలు, పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ, జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే. అమెరికా, చైనా, యు.ఏ.ఇ, ఐరోపా సమాఖ్యలు భారతదేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు. జనాభా వివరాలు భారతదేశం ప్రపంచదేశాలలో నూటనలబైరెండుకోట్లకు పైగా జనాభాతో చైనాను అధిగమించి ఒకటో స్థానంలో నిలిచింది. ఎన్నో భిన్నత్వాలు గల జనాభా సామాజిక, రాజకీయ వర్గీకరణలో భాష, మతం, కులం అనే మూడు ప్రముఖ పాత్ర వహిస్తాయి. దేశంలోని అతిపెద్ద నగరాలు - ముంబై (వెనుకటి బాంబే), ఢిల్లీ, కోల్‌కాతా (వెనుకటి కలకత్తా), చెన్నై (వెనుకటి మద్రాసు), హైదరాబాద్, 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం భారతదేశ జనాభా మొత్తం 121,01,93,422. భారతదేశం ఆక్షరాస్యత 83,04%, ఇందులో పురుషుల అక్షరాస్యత 82,14%, మహిళల అక్షరాస్యత 75,7%. ప్రతి 1000 మంది పురుషులకు 1010 మంది స్త్రీలు ఉన్నారు. 2022 జనగణన ప్రకారం, దేశంలోని 83.80% ప్రజలు హిందువులైనప్పటికీ, ప్రపంచంలోని రెండో అత్యధిక ముస్లిం జనాభా ఇక్కడ ఉన్నారు (17.23%). ఇతర మతాలు: క్రైస్తవులు (5.30%), సిక్కులు (3.72%), బౌద్ధులు (8.70%), జైనులు (0.36%), ఇతరులు (0.9%) (యూదులు, పార్సీలు, అహ్మదీయులు, బహాయీలు మొదలగునవి). అధిక ముస్లిం మతస్తులు గల ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. దేశంలో ఎన్నో మత సంబంధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా, బహిరంగంగా జరుపుకుంటారు. అనేక మతాల కలగలుపు అయిన భారతదేశంలో పండుగలు అందరూ కలిసి జరుపుకుంటారు. వీటిలో బాగా విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలు శ్రీరామనవమి, వినాయక చవితి, సంక్రాంతి, దీపావళి, హొలీ, దసరా. భారతదేశం రెండు ప్రముఖ భాషా కుటుంబాలకు జన్మస్థానం. అవి, ఇండో-ఆర్యన్, ద్రావిడ భాషలు. భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలలో హిందీ, ఇంగ్లీషు భాషలను ఉపయోగిస్తుంది. దేశంలోని నాలుగు ప్రాచీన భాషలు సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళం. దేశంలో మొత్తం 1652 మాతృ భాషలు ఉన్నాయి. భారతదేశంలోని 10 పెద్ద నగరాలు ముంబై ఢిల్లీ బెంగుళూరు హైదరాబాదు కోల్‌కాతా చెన్నై అహమ్మదాబాదు పూణే సూరత్ విశాఖపట్నం ప్రాచీన భార‌తంలో ర‌వాణా వ్య‌వ‌స్థ‌ రవాణా సౌకర్యాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర వహించే రవాణా సౌకర్యాలలో భారతదేశం మంచి ప్రగతిని సాధించింది. మొత్తం 4 రకాల రవాణా సౌకర్యాలు భారతదేశంలో ఉన్నాయి. రైలు మార్గాలు దేశంలో రైలు మార్గాలు అతిముఖ్యమైన రవాణా సౌకర్యము. 1853 లో ముంబాయి నుండి థానే మధ్య ప్రారంభమైన రైలు మార్గము ప్రస్తుతం 62 వేల కిలోమీటర్లకు పైగా నిడివిని కల్గి ఉంది. భారతీయ రైల్వే 17 జోన్లుగా విభజితమై ఉంది. అఖండ భారత్ రైలు ఢాకా-ఢిల్లీ-లాహోర్ రైలు. ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మధ్య తిరిగే రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. దక్షిణాసియా దేశాల మధ్య రైలు సర్వీసులు ప్రారంభించాలనే భారత ప్రతిపాదనకు పాకిస్థాన్ పచ్చజెండా వూపింది. మూడు దేశాలను కలుపుతూ రైళ్లను నడిపిస్తామని భారత రైల్వేశాఖ పంపిన ప్రతిపాదనకు పాక్ రైల్వే మంత్రిత్వ శాఖ సాంకేతిక అనుమతిని మంజూరు చేసింది.ఢాకా-ఢిల్లీ-లాహోర్‌ల మధ్య రైలు నడిపించటం లాభదాయకమేననీ, అవసరమైతే కరాచీ, ఇస్లామాబాద్ వరకూ పొడిగించుకోవచ్చని నిపుణులు సూచించినట్లు పాక్ రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా కంటైనెర్ రైళ్లను నడిపించి, తర్వాతి దశలో ప్రయాణికుల బండ్లను నడిపించాలనే యోచనలో ఉన్నారు. ఇటీవల ఇస్లామాబాద్-టెహ్రాన్-ఇస్తాంబుల్ రైలు సర్వీసును ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేయటంతో భారత రైల్వేశాఖకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. దక్షిణాసియా రైళ్ల వల్ల పాకిస్థాన్, ఇతర సార్క్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని మనదేశం ప్రతిపాదనల్లో వెల్లడించింది. దీనివల్ల నేపాల్, భూటాన్ వంటి దేశాలకూ రైలు సర్వీసులు నడిపించవచ్చని సూచించినట్లు తెలిసింది. దక్షిణాసియా రైలు సర్వీసులు వాణిజ్యపరంగా ప్రయోజనకరమేనని నిపుణులు సైతం కితాబునిస్తున్నారు. ఈ మార్గంలో రైళ్లను నడిపించటమూ తేలికేననీ పేర్కొంటున్నారు. భారత్, పాక్, బంగ్లాదేశ్‌లలో బ్రిటిష్ పాలకులు రైలు మార్గాలను నిర్మించినందువల్ల మూడు దేశాల్లోనూ బ్రాడ్‌గేజి రైలు పట్టాలు ఉండటం, నిర్వహణ శైలీ ఒకేమాదిరిగా ఉండటం కలిసివస్తుందని అభిప్రాయపడుతున్నారు. రోడ్డు మార్గాలు మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించిన రవాణా మార్గాలు రోడ్డు మార్గాలే. రోడ్డు మార్గాలలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామ పంచాయతి రహదారులు అని 4 రకాలు. దేశంలోని మొత్తం రోడ్ల నిడివిలో కేవలం 2% ఆక్రమించిన జాతీయ రహదారులు, ట్రాఫిక్ లో మాత్రం సుమారు 40% ఆక్రమిస్తున్నాయి. వాయు మార్గాలు ఆతి వేగంగా జరిగే రవాణా వ్యవస్థగా వాయు మార్గాలు పస్రిద్ధి చెందాయి. మనదేశంలో రాష్ట్ర రాజధానులు, ప్రధాన పట్టణాలను కల్పుతూ విమాన మార్గాలు ఉన్నాయి. ఇది అధిక వ్యయంతో కూడుకొనినప్పటికినీ సౌకర్యవంతంగా, అతి వేగంగా ఉంటుంది. కేవలం దేశంలోని పట్టణాలు, నగరాలనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలనుండి ఇతరదేశాలను కూడా కల్పే అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. జల మార్గాలు జల మార్గాలు రవాణా సౌకర్యాలలో ఆలస్యం అయినప్పటికినీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ముడి చమురు, ఇతర ఖనిజాలు తెప్పించుకోవడానికి, మనదేశం నుంచి ఇతరదేశాలకు ముడి ఇనుము, ఇతర ఖనిజాలు ఎగుమతి చేయడానికి ఈ రవాణా మార్గం చాలా అనువైనది. భారతదేశం – కొన్ని ముఖ్య విషయాలు విస్తీర్ణం పరంగా ప్రపంచములో 7 వ పెద్ద దేశం జనాభా పరంగా ప్రపంచములో 1 వ పెద్ద దేశము ఒక దేశం పేరుమీదుగా మహాసముద్రం ఉన్న ఏకైక దేశం అత్యధిక ప్రధాన మతాలకు పుట్టినిల్లయిన దేశం 7,517 కిమీ సముద్రతీరం కలదు సంస్కృతి thumb|260x260px|ఆగ్రా లోని తాజ్‌మహల్ - భారతదేశపు అత్యంత ప్రజాదరణ కలిగిన పర్యాటక స్థలం|alt= thumb|260x260px|బౌద్ధుల సంవత్సరాది — లోసార్ నాడు టిబెటు బౌద్ధులు చేసే గుంపా నృత్యం.|alt= భారతదేశం తన ఉత్కృష్టమైన, ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని, తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చింది. ఆక్రమణదారులు, వలస వచ్చినవారి సంప్రదాయాలను కూడా తనలో ఇముడ్చుకుంది. తాజ్‌మహల్ వంటి కట్టడాలు, మరెన్నో సంస్కృతీ, సంప్రదాయాలు మొగలు పాలకులనుండి వారసత్వంగా స్వీకరించింది. భారతీయ సమాజము భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో కూడిన బహుళ సమాజం. వివిధ మత కార్యక్రమాలు సంఘ దైనందిన జీవితంలో ఒక భాగం. అన్ని సామాజిక, ఆర్ధిక వర్గాలలోను విద్యను ఉన్నతంగా భావిస్తారు. సాంప్రదాయికమైన సమష్టి కుటుంబ వ్యవస్థలోని ఆర్ధిక అవరోధాల దృష్ట్యా చిరు కుటుంబాలు ఎక్కువైపోతున్నప్పటికీ, సాంప్రదాయిక కుటుంబ విలువలను పవిత్రంగా భావిస్తారు, గౌరవిస్తారు. భారతీయ సంగీతం వివిధ రకాల పద్ధతులతో కూడినది. శాస్త్రీయ సంగీతంలో రెండు ప్రధాన పద్ధతులున్నాయి. దక్షిణాదికి చెందిన కర్ణాటక సంగీతం ఒకటి కాగా, ఉత్తరాదిన చెందిన హిందూస్తానీ సంగీతము రెండోది. ప్రజాదరణ పొందిన మరో సంగీతం సినిమా సంగీతం. ఇవికాక ఎన్నో రకాల జానపద సంగీత సంప్రదాయాలు కూడా ఉన్నాయి. శాస్త్రీయ నృత్య రీతులు కూడా ఎన్నో ఉన్నాయి – భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, కథక్, కథకళి మొదలైనవి. ఇవి ఇతిహాసాలపై ఆధారపడిన కథనాలతో కూడి ఉంటాయి. ఇవి ఎక్కువగా భక్తి, ఆధ్యాత్మికత మేళవింపబడి ఉంటాయి. ప్రాచీన సారస్వతం ఎక్కువగా మౌఖికమైనది. తరువాతి కాలంలో అది అక్షరబద్ధం చేయబడింది. దాదాపుగా ఇవన్నీ కూడా హిందూ సంస్కృతిలో నుండి ఉద్భవించినవే. పవిత్ర శ్లోకాలతో కూడిన వేదాలు, మహాభారతం, రామాయణం వీటిలో ఉన్నాయి. తమిళనాడుకు చెందిన సంగమ సాహిత్యం భార్తదేశపు ప్రాచీన సాంప్రదాయిక లౌకిక తత్వానికి అద్దం పడుతుంది. ఆధునిక కాలంలో, భారతీయ భాషలలోను, ఇంగ్లీషు లోను కూడా రాసిన ప్రసిద్ధి చెందిన రచయితలెందరో ఉన్నారు. నోబెల్ బహుమతి సాధించిన ఒకేఒక భారతీయుడైన రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ రచయిత. ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మించేది భారతదేశమే. దేశంలో అన్నిటికంటే ప్రముఖమైనది ముంబైలో నెలకొన్న హిందీ సినిమా పరిశ్రమ. అధిక సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్న ఇతర భాషా పరిశ్రమలు – తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ. బెంగాలీ సినిమా దర్శకుడైన సత్యజిత్ రే ప్రపంచ సినిమా రంగానికి భారత్ అందించిన ఆణిముత్యం. వరి అన్నం, గోధుమ (బ్రెడ్, రొట్టెల రూపంలో) లు ప్రజల ముఖ్య ఆహారం. విభిన్న రుచులు, మసాలాలు, పదార్థాలు, వంట విధానాలతో కూడిన భారతీయ వంటలు ఎంతో వైవిధ్యమైనవి. ఎన్నో రకాల శాకాహార వంటలకు దేశం ప్రసిద్ధి చెందింది. భారతీయ ఆహార్యం కూడా ఆహారం వలెనే బహు వైవిధ్యమైనది. చీర, సల్వార్ కమీజ్ స్త్రీలు ఎక్కువగా ధరించే దుస్తులు. పురుషులు పంచె, కుర్తా ధరిస్తారు క్రీడలు జనాభా పరంగా అతి పెద్ద దేశం భారతదేశం. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశానికి సముచిత స్థానం ఉంది. ఒలంపిక్ క్రీడలలో 8 పర్యాయాలు హాకీలో బంగారు పతకాలు సాధించిన భారత దేశానికి ప్రస్తుతం ఘనత దేశానికి ఉంది. చదరంగంలో విశ్వనాథన్ ఆనంద్ రెండు పర్యాయాలు ప్రపంచ టైటిల్ సాధించగా, టెన్నిస్లో లియాండర్ పేస్,మహేష్ భూపతి, సానియా మీర్జాలు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు సాధించిపెట్టారు.ప్రస్తుతము ఆడుతున్నవార్లలోpv sindhu and సైనా నెహ్వాల్ చెప్పుకోదగినది. భారతదేశము ఒలింపిక్‌ క్రీడలు లాంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పెద్దగా రాణించలేదు. గత మూడు ఒలంపిక్‌ క్రీడలలో కేవలం ఒక్కొక్కటే పతకం సాధించగలిగినది. ఆసియా క్రీడల లో కూడా చిన్న చిన్న దేశాల కంటే మన పతకాలు చాలా తక్కువ. కబడ్డీలో మాత్రం వరుసగా బంగారు పతకాలు మనమే సాధించాము. కొన్ని సాంప్రదాయ ఆటలు అయిన కబడ్డీ, ఖో-ఖో, గోడుంబిళ్ళ (గిల్లీ-దండా) లకు దేశమంతటా బహుళ ప్రాచుర్యము ఉంది. చదరంగము, క్యారమ్‌, పోలో, బ్యాడ్మింటన్‌ మొదలైనటువంటి అనేక క్రీడలు భారతదేశంలో పుట్టాయి. ఫుట్‌బాల్‌ (సాకర్‌) కు కూడా యావత్‌ భారతదేశంలో చాలా ప్రజాదరణ ఉంది. జాతీయ చిహ్నాలు జాతీయ పతాకం: త్రివర్ణ పతాకము. జాతీయ ముద్ర: నాలుగు తలల సింహపు బొమ్మ. జాతీయ గీతం: జనగణమన. జాతీయ గేయం: వందేమాతరం.... జాతీయ పక్షి: నెమలిపావో క్రిస్టాటస్. జాతీయ జంతువు: పెద్దపులి (రాయల్ బెంగాల్ టైగర్). జాతీయ వృక్షం: మర్రిచెట్టు. జాతీయ క్రీడ: హాకీ జాతీయ పుష్పం: కమలము (తామర) జాతీయ క్యాలెండర్: శక క్యాలెండర్ (శక సం. పు క్యాలెండర్) జాతీయ ఫలం: మామిడి పండు శెలవు దినాలు భారతదేశంలో జాతీయ శెలవుదినాలు మూడే. పండుగలు, పర్వదినాలు, నాయకుల జన్మదినాలకు సంబంధించిన ఇతర శెలవుదినాలు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. తేదీ శెలవుదినము విశేషము జనవరి 26గణతంత్ర దినోత్సవం 1950లో ఈ రోజున భారతదేశం గణతంత్ర దేశమైనది. ఆగష్టు 15స్వాతంత్ర్య దినోత్సవం 1947లో ఈ రోజున భారతదేశానికి బ్రిటీష్‌ పరిపాలన నుండి స్వాతంత్ర్యం లభించింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి మహాత్మా గాంధీ జన్మ దినోత్సవం. అల్ప విషయాలు వాహనాలు రోడ్డుకు ఎడమ పక్కన నడుస్తాయి. డ్రైవరు స్థానం వాహనంలో కుడి పక్కన ఉంటుంది. భారతీయులు మాట్లాడే: హిందీ; బెంగాలీ; మరాఠీ; తెలుగు; తమిళం; ఉర్దూ; కన్నడ; మలయాళం; ఒరియా; పంజాబీ; అస్సామీ; మైథిలి; కాశ్మీరీ; నేపాలీ; సింధ్; కొంకణి; మణిపురి. తేది పద్ధతి: సంఖ్యా మానం: 10,000,000 = 1 కోటి. 100,000 = 1 లక్ష. పోస్టలు కోడు (PIN): 6 అంకెలు. అధికారిక కొలమానం: SI విద్యుత్ సరఫరా 230 V; 50 HZ విద్యుత్ ప్లగ్గులు: Type C, D & M (CEE 7/16; CEE 7/17; BS 546) టెలివిజన్ సిగ్నలు: PAL B/G ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 న మొదలవుతుంది. ఇవికూడా చూడండి భారతదేశ బడ్జెట్ భారతదేశ వాతావరణం భారత జాతీయ వనాలు భారతదేశపు రాజకీయ పార్టీలు భారతీయ నగరాలు, పట్టణాలు భారతదేశంలో మతాలు భారత్‌లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా భారతీయుల ఇంటిపేర్లు భారతీయ వంటకాలు భారతదేశ చరిత్ర భారతీయ సంస్కృతి భారతీయ చిత్రకళ భారతీయ మహిళా వ్యాపారవేత్తల జాబితా భారత అమెరికా సంబంధాలు ఇండియాలో ఇ- పరిపాలన భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా భారతీయ భాషలు – మాట్లాడే ప్రజల సంఖ్య భారతీయ శిల్పకళ భారతదేశ ఆర్ధిక వ్యవస్థ కరంతై తమిళ సంఘం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 వలస భారతదేశం భారత జాతీయవాదం వెల్లూరు తిరుగుబాటు శరద్ అరవింద్ బాబ్డే భారతదేశంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థలు భారతదేశ చరిత్ర – ముఖ్యమైన ఘట్టాలు భారతదేశ సైనిక చరిత్ర చిత్రమాలిక గమనికలు మూలాలు ఉపయుక్త గ్రంథాలు మనోరమ ఇయర్ బుక్ 2003 – ISBN 81-900461-8-7 డిస్కవరీ ఆఫ్ ఇండియా — జవహర్‌లాల్ నెహ్రూ—ISBN 0-19-562359-2 లోన్లీ ప్లానెట్ ఇండియా — ISBN 1-74059-421-5 వెలుపలి లంకెలు Ethnologue report on Languages of India CIA — The World Factbook — India — CIA's Factbook on India Country Profile: India — BBC's Country Profile on India పర్యాటక సమాచారం భారత చారిత్రక పటం భారత రాష్ట్రాలు స్టేటాయిడ్స్ అధికారక వెబ్సైట్లు భారత ప్రభుత్వ వెబ్ చిరునామాలు రాష్ట్రపతి అధికారిక వెబ్‌సైటు భారత పార్లమెంటు అధికారిక వెబ్‌సైటు రక్షణ శాఖ అధికారిక వెబ్‌సైటు జనగణన అధికారి సుప్రీం కోర్టు విదేశీ వ్యవహారాల శాఖ పాద పీఠిక జమ్మూ కాశ్మీరు పూర్తిగా భారత్‌లో భాగమేనని భారత ప్రభుత్వం భావిస్తున్నది. ఈ రాష్ట్రానికి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక సరిహద్దుగా ఉంది. 1948లో ఐక్యరాజ్యసమితి కుదిర్చిన సంధి ప్రకారం భారత, పాక్ అధీనంలో ఉన్న భూభాగం యథాతథ స్థితి కొనసాగుతోంది. ఈ కారణంగా, ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దుగా నున్న ఈ రాష్ట్రపు భూభాగం ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనములో ఉంది. వర్గం:భారతదేశం వర్గం:దక్షిణ ఆసియా వర్గం:ఈ వారం వ్యాసాలు
మహాభారతం
https://te.wikipedia.org/wiki/మహాభారతం
thumb|250x250px|వ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని వ్రాశాడని పురాణ కథనం|alt= మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది.Molloy, Michael (2008). Experiencing the World's Religions. p. 87. ISBN 9780073535647Brockington, J. (1998). The Sanskrit Epics, Leiden. p. 26The Mahabharata and the Sindhu-Sarasvati Tradition - by Subhash KakVan Buitenen; The Mahabharata Vol. 1; The Book of the Beginning. Introduction (Authorship and Date)Story of Hindusthani Classical Music, by ITC Sangeet Research Academy, 500 B.C - 200 B.CAn Introduction to Epic Philosophy, edited by Subodh Kapoor, Cosmo Publications, New Delhi, India దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటి. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగు లోకి అనువదించారు. గ్రంథరచనా చరిత్ర, నిర్మాణం thumb|వ్యాసుడు పఠిస్తుండగా గణేశుడు మహాభారతం లిఖించుట|alt=|250x250px ఈ ఇతిహాసం సాంప్రదాయకంగా వ్యాసుడు అనే ఋషికి ఆపాదించబడింది. ఆయన ఇతిహాసంలో ప్రధాన పాత్ర కూడా వహించాడు. వ్యాసుడు దీనిని ఇతిహాసం (చరిత్ర) గా అభివర్ణించాడు. ఆయన గురువులందరిని గురించి వేద కాలంలోని వారి విద్యార్థులను గుర్తించే గురు-శిష్య పరంపర గురించి కూడా వివరించాడు. మహాభారతం మొదటి విభాగంలో వ్యాసుడు పఠిస్తుండగా గణపతి (శివ పార్వతుల కుమారుడు) గ్రంథాన్ని లిఖించాడని పేర్కొనబడింది. ఇతిహాసం కథను కథా నిర్మాణంలో ఉపయోగిస్తుంది. లేకపోతే దీనిని ఫ్రేమెటెల్సు అని పిలుస్తారు. ఇది అనేక భారతీయ పురాతన రచనలలో ప్రముఖ పద్ధతి. ఇది మొదట తక్షశిల వద్ద వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయన అనే ఋషి, పాండవ వంశస్థుడు అర్జునుడి మనవడు అయిన జనమేజయ రాజుకు వినిపించాడు. ఈ కథను చాలా సంవత్సరాల తరువాత సౌనకుడు అనే సౌతి అనే పురాణ కథకుడు తిరిగి వినిపించాడు. నైమిశారణ్యం అనే అడవిలో సౌనక కులపతి ఋషులకు తెలియజేసాడు. thumb|సౌతి మహాభారతం శ్లోకాలను పఠించడం|alt=|401x401px ఈ వచనాన్ని 20వ శతాబ్దం ప్రారంభంలో పాశ్చాత్య ఇండోలాజిస్టులు నిర్మాణాత్మకంగా, అస్తవ్యస్తంగా అభివర్ణించారు. అసలు కవిత ఒకప్పుడు అపారమైన "విషాద శక్తిని" కలిగి ఉండాలని హెర్మను ఓల్డెనుబర్గు భావించాడు. కాని పూర్తి వచనాన్ని "భయంకరమైన గందరగోళం" అని కొట్టిపారేశాడు. "అసమాన మూలం భాగాలను క్రమం లేని మొత్తంగా ముద్ద చేయగలిగారు.Hermann Oldenberg, Das Mahabharata: seine Entstehung, sein Inhalt, seine Form, Göttingen, 1922, మోర్టిజు వింటర్నిట్జి (గస్చిచ్తె డరు ఇండిస్చెను లిటరాటురు 1909) ఇది " కవిత్వరహిత థియాలజిస్టులు - క్లంసీ స్క్రైబ్సు విడివిడిగా క్రమరహితంగా ఉన్న మూల భాగాలను ఒకే కథగా కూర్చాడని పేర్కొన్నాడు."The Mahabharata" at The Sampradaya Sun చేర్పులు మహాభారతంపై పరిశోధన వచనంలోని పొరలను గుర్తించడానికి, ఎడిటింగు చేయడానికి అపారమైన ప్రయత్నం చేయబడింది. ప్రస్తుత మహాభారతంలోని కొన్ని అంశాలను వేద కాలానికి చెందినవిగా గుర్తించవచ్చు.A History of Indian Literature, Volume 1 by Maurice Winternitz మహాభారతం నేపథ్యం ఇతిహాసం మూలం " ప్రారంభ వేద కాలం తరువాత", "మొదటి భారతీయ 'సామ్రాజ్యం' క్రీ.పూ. 3 వ శతాబ్దం ఇది క్రీ.పూ. "8 లేదా 9 వ శతాబ్దం నుండి చాలా దూరం తొలగించబడని తేదీ."గా ఉండే Buitenen (1973) pp. xxiv–xxv అవకాశం ఉంది. మహాభారతం రథసారధులు మౌఖికంగా ప్రచారం చేయబడిన కథగా ప్రారంభమైంది. "అక్షర-పరిపూర్ణతను సంరక్షించాల్సిన వేదాల మాదిరిగా కాకుండా ఇతిహాసం ఒక ప్రసిద్ధ రచన. దీని పఠనం అనివార్యంగా భాష, శైలిలో మార్పులకు అనుగుణంగా ఉంటుంది" కాబట్టి దీని ప్రారంభ 'మనుగడ' భాగాలు ప్రభావవంతమైన పురాణానికి మనకు ఉన్న 'బాహ్య' ప్రపంచవ్యవహారాల కంటే పాతది కాదని విశ్వసిస్తున్నారు. ప్రారంభ గుప్తులకాలం నాటికి (సా.శ. 4 వ శతాబ్దం) సంస్కృత రూపం "తుది రూపం"కు చేరుకుందని అంచనా. మహాభారతం మొదటి గొప్ప విమర్శనాత్మక ఎడిషను సంపాదకుడు విష్ణు సూక్తంకరు ఇలా వ్యాఖ్యానించారు: "ఒక ద్రవ వచనాన్ని అక్షరాలా అసలు ఆకారంలో ఒక ఆర్కిటైపు, స్టెమా కోడికం ఆధారంగా పునర్నిర్మించడం గురించి ఆలోచించడం పనికిరానిది. అప్పుడు ఏమి సాధ్యమవుతుంది? మనది ఏమిటి? అందుబాటులో ఉన్న వ్రాతప్రతుల అంశం ఆధారంగా చేరుకోగలిగే టెక్స్టు పురాతన రూపాన్ని పునర్నిర్మించడం మాత్రమే లక్ష్యం. "Sukthankar (1933) "Prolegomena" p. lxxxvi. Emphasis is original. ఆ వ్రాతప్రతుల సాక్ష్యం కొంతవరకు ఆలస్యం అయ్యింది. దాని భౌతిక కూర్పు, భారతదేశ వాతావరణం ఆధారంగా కానీ అది చాలా విస్తృతమైనది. మహాభారతం (1.1.61) 24,000 శ్లోకాల ప్రధాన భాగాన్ని వేరు చేస్తుంది: భారత సరైనది. అదనపు ద్వితీయ విషయాలకు విరుద్ధంగా అవాల్యాన గ్యాయసత్ర (3.4.4) ఇదే విధమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. రచన కనీసం మూడు పునరావృత్తులు సాధారణంగా గుర్తించబడతాయి: 8,800 శ్లోకాలతో జయ (విక్టరీ) వ్యాసవిరచితం, వైశంపాయనుడు పఠించిన భారతంలో 24,000 శ్లోకాలు, చివరికి ఉగ్రశ్రవ సూతుడు పఠించిన మహాభారతం 100,000 పద్యాలు.Gupta & Ramachandran (1976), citing Mahabharata, Critical Edition, I, 56, 33SP Gupta and KS Ramachandran (1976), p.3-4, citing Vaidya (1967), p.11 అయినప్పటికీ జాను బ్రోకింగ్టను వంటి కొంతమంది పండితులు, జయ, భారతం ఒకే కథనాన్ని సూచిస్తుందని వాదించారు. ఆదిపర్వం (1.1.81) లోని ఒక పద్యం పొరపాటుగా జయ సిద్ధాంతాన్ని 8,800 శ్లోకాలతో పేర్కొన్నారు. ఈ మహాఇతిహాస గ్రంథం విస్తరించిన రూపంలో 18 పర్వాలు ఉన్నాయి.18 books, 18 chapters of the Bhagavadgita and the Narayaniya each, corresponding to the 18 days of the battle and the 18 armies (Mbh. 5.152.23) 12 సంఖ్యలను నొక్కిచెప్పే అధికారిక సూత్రాల తరువాత ఈ పెద్ద రచన పునర్నిర్మాణం జరిగింది. "స్పిట్జరు" వ్రాతప్రతులలో అనుశాసన-పర్వం విరాట పర్వాలు లేకపోవడం వల్ల తాజా భాగాల కలయిక తేదీని సూచిస్తుంది.The Spitzer Manuscript (Beitrage zur Kultur- und Geistesgeschichte Asiens), Austrian Academy of Sciences, 2004. It is one of the oldest Sanskrit manuscripts found on the Silk Road and part of the estate of Dr. Moritz Spitzer. మనుగడలో ఉన్న పురాతన సంస్కృత రచన కుషాను కాలం (క్రీ.పూ. 200) నాటిది. మహాభారతంలోని ఒక పాత్ర చెప్పినదాని ప్రకారం. 1.1.50, ఇతిహాసం మూడు వెర్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా మను (1.1.27), అస్తికా (1.3, ఉప పర్వ 5) లేదా వాసు (1.57) తో మొదలయ్యాయి. ఈ సంస్కరణలలో ఒకటి మరొక 'ఫ్రేం' సెట్టింగుల కలయికకు అనుగుణంగా ఉంటాయి. వాసు వెర్షను ఫ్రేం సెట్టింగులను వదిలివేసి, వ్యాసుడు పుట్టినకాలంతో ప్రారంభమవుతుంది. ఆస్తిక వెర్షను బ్రాహ్మణ సాహిత్యం సర్పయాగం అంశాలను జోడించి మహాభారతం అనే పేరును పరిచయం చేస్తుంది. వ్యాసుడిని రచన రచయితగా గుర్తిస్తుంది. ఈ చేర్పుల రచయితలు బహుశా పెకారాట్రిను పండితులు, వారు ఒబెర్లీసు (1998) అభిప్రాయం ఆధారంగా దాని చివరి పునర్నిర్మాణం వరకు రచన మీద నియంత్రణను కలిగి ఉంటారు. భీష్మ-పర్వంలో హునా గురించి ప్రస్తావించినప్పటికీ, ఈ పర్వం 4 వ శతాబ్దంలో సవరించబడిందని సూచిస్తుంది.. thumb|జనమేజయ సర్పయాగం|alt=|346x346px ఆది-పర్వంలో జనమేజయ సర్పయాగం (సర్పసత్ర) ప్రస్తావన ఉంది. దాని ప్రేరణను వివరిస్తుంది. ఈ యాగం ఉనికిలో ఉన్న అన్ని సర్పాలను ఎందుకు నాశనం చేయాలని ఉద్దేశించిందో వివరిస్తుంది. ఇది ఉన్నప్పటికీ ఇప్పటికీ పాములు ఎందుకు ఉన్నాయి. ఈ సర్పయాగం అంశం మహాభారతం సంస్కరణకు "నేపథ్య ఆకర్షణ" (మింకోవ్స్కి 1991) గా జోడించబడిన స్వతంత్ర కథగా పరిగణించబడుతుంది. వేద (బ్రాహ్మణ్యం) సాహిత్యానికి ప్రత్యేకించి దగ్గరి సంబంధం ఉందని భావించారు. పాకవిమ్య బ్రాహ్మణ్యం (25.15.3 వద్ద) ఒక సర్పయాగం! అధికారిక పూజారులను వివరిస్తాడు. వీరిలో ధతరాత్ర, జనమేజయ పేర్లు, మహాభారత సర్పయాగంలోని రెండు ప్రధాన పాత్రలు. అలాగే మహాభారతంలో ఒక పాము పేరు తక్షకుడు.J.A.B. van Buitenen, Mahābhārata, Volume 1, p.445, citing W. Caland, The Pañcaviṃśa Brāhmaṇa, p.640-2 సుపర్ణోఖ్యానం కవిత్వం తొలి ఆనవాళ్ళలో" ఒకటిగా పరిగణించబడే పద్యం, విస్తరించిన గరుడపురాణానికి ఇది పూర్వగామి, ఇది మహాభారతం ఆదిపర్వంలో, ఆస్థికపర్వంలో చేర్చబడింది. చారిత్రక ఆధారాలు మహాభారతం దాని ప్రధాన భారత గురించి మొట్టమొదటి ప్రస్తావనలు పాణిని అష్టాధ్యాయి సూత్రం (సూత్రం 6.2.38) (క్రీ.పూ. 4 వ శతాబ్దం) అశ్వలాయన గృహ్యసూత్రాలు (3.4.4) ఉన్నాయి. దీని అర్థం భారతం అని పిలువబడే ప్రధాన 24,000 శ్లోకాలు, అలాగే విస్తరించిన మహాభారతం ప్రారంభ వెర్షను, క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటికి కూర్చబడ్డాయి. గ్రీకు రచయిత డియో క్రిసోస్టోం (మ .40 - సి. 120 CE) ఇచ్చిన నివేదిక హోమరు కవిత్వం భారతదేశంలో కూడా పాడటం గురించి వివరించింది.Dio Chrysostom, 53.6-7, trans. H. Lamar Crosby, Loeb Classical Library, 1946, vol. 4, p. 363. ఇలియడు సంస్కృతంలోకి అనువదించబడిందని సూచిస్తుంది. అయినప్పటికీ భారతీయ అధ్యయనకారులు సాధారణంగా ఈ తేదీలో ఒక మహాభారతం ఉనికికి సాక్ష్యంగా తీసుకున్నారు. దీని ఎపిసోడ్లు డియో లేదా అతని మూలాలు ఇలియడు కథగా గుర్తించాయి.Christian Lassen, in his Indische Alterthumskunde, supposed that the reference is ultimately to Dhritarashtra's sorrows, the laments of Gandhari and Draupadi, and the valor of Arjuna and Suyodhana or Karna (cited approvingly in Max Duncker, The History of Antiquity (trans. Evelyn Abbott, London 1880), vol. 4, p. 81). This interpretation is endorsed in such standard references as Albrecht Weber's History of Indian Literature but has sometimes been repeated as fact instead of as interpretation. మహాభారతంలోని అనేక కథలు శాస్త్రీయ సంస్కృత సాహిత్యంలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపులను పొందాయి. ఉదాహరణకు గుప్తరాజవంశం యుగంలో నివసించినట్లు భావిస్తున్న ప్రఖ్యాత సంస్కృత కవి కాళిదాసు (క్రీ.పూ. 400) అభిజ్ఞానశాకుంతలం, మహాభారతానికి పూర్వగామి అయిన కథ ఆధారంగా రూపొందించబడింది. కాళిదాసుకు ముందు నివసించినట్లు భావిస్తున్న భాసమహాకవి రాసిన సంస్కృత నాటకం ఊరుభాగా, భీముడి తొడలను చీల్చడం ద్వారా దుర్యోధనుడిని హతమార్చడం మీద ఆధారపడింది. ఖోహు (సత్నా జిల్లా, మధ్యప్రదేశు) నుండి వచ్చిన మహారాజా శర్వనాథ (సా.శ. 533–534) రాగి పలక శాసనం మహాభారతాన్ని "100,000 పద్యాల సమాహారం" (శత- సహశ్రీ సహ్హిత) గా అభివర్ణిస్తుంది. 18 పర్వాలూ పుస్తకాలు 18 పర్వాల విభాగాలు దిగువన ఇవ్వబడ్డాయి: పర్వం శీర్షిక ఉప- పర్వాలు అంశాలు 1ఆది పర్వము1–19తక్షశిలలో (ఆధునిక తక్షశిల (పాకిస్థాను) ) జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం తరువాత వైశంపాయనుడు భారతం వినిపించిన తరువాత నైమిశారణ్యంలో ఋషులందరూ వినుచుండగా సూతుడు భారతకథను ప్రసంగించాడు. కురు వంశానికి మూలమైన భరత, భృగువంశాల వంశవృక్షాలు వివరించబడ్డాయి (ఆది అంటే మొదటి).2సభా పర్వము 20–28దానవుడైన మయుడు ఇంద్రప్రస్థ వద్ద రాజభవనం, సభామండపం నిర్మించాడు. యుధిష్టరుడి సభలో జీవితం, రాజసూయ యాగం. మాయాజూదం ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల వనవాసం ఇందులో వర్ణించబడింది.3వన పర్వం లేదా అరణ్యపర్వం29–4412 సంవత్సరాల పాండవుల అరణ్యవాసం. (అరణ్య) 4విరాట పర్వము 45–48విరాటరాజు సభలో పాండవులు ఒక సంవత్సరకాలం గడుపిని వివరం వర్ణించబడింది.5 ఉద్యోగ పర్వము 49–59పాండవులు, కౌరవుల మద్య నిర్వహించబడిన విఫలమైన సంధిప్రయత్నాలు, యుద్ధానికి సన్నద్ధం జరగడం. (ఉద్యోగఅంటే పనిచేయడం).6 భీష్మ పర్వము 60–64భీష్ముడు కౌరవుల పక్షం సైన్యాధ్యక్షుడుగా యుద్ధం మొదటి భాగం. భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడం, (ఇందులో గీతోపదేశం 25-42 అధ్యాయాలలో) వర్ణించబడింది.7 ద్రోణ పర్వము 65–72ద్రోణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం. " బుక్ ఆఫ్ వార్ " పుస్తకంలో ఇది ప్రధానమైనది. ఈ పుస్తకం చివరిలో ఇరుపక్షాలలో మహావీరులలో అనేకులు యుద్ధం కారణంగా మరణించారు.8 కర్ణ పర్వము 73కౌరవపక్షంలో కర్ణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం.9శల్య పర్వము 74–77కౌరవపక్షంలో శల్యుని సారథ్యంలో కొనసాగి ముగిసిన యుద్ధం చివరి రోజు. ఇందులో సరస్వతీ నదీతీరంలో బలరాముడి యాత్ర, భీముడు, దుర్యోధనుల మద్య యుద్ధం, భీముడు దుర్యోధనుడి తొడలు విరచుట.10 సౌప్తిక పర్వము 78–80అశ్వమేధ పర్వము కృపాచార్యుడు, కృతవర్మ మిగిలిన పాండవుల సైన్యాలను నిద్రపోతున్న సమయంలో వధించడం. కౌరవుల వైపు 3, పాండవుల వైపు 7 మంది మిగిలి ఉన్నారు.11 స్త్రీ పర్వము 81–85గాంధారి, కౌరవ స్త్రీలు, పాండవులు యుద్ధంలో మరణించిన వారిని గురించి ధుఃఖించుట. గాంధారి శ్రీకృష్ణుడిని శపించుట. 12 శాంతి పర్వము 86–88చక్రవర్తిగా యుధిష్ఠరుడి పట్టాభిషేకం. భీష్ముడి నుండి ధర్మరాజాదులు ఉపదేశాలు గ్రహించుట. ఆర్థిక, రాజకీయాల గురించి అనేక విషయాలు చర్చించబడిన ఈ పుస్తకం మహాభారతంలో సుదీర్ఘమైనది. ఈ పుస్తకంలో తరువాత చొరబాట్లు అధికంగా జరిగాయని " కిసారి మోహను గంగూలి " అభిప్రాయపడ్డాడు.13 అనుశాసనిక పర్వము 89–90భీష్ముడు చెప్పిన ది ఫైనల్ ఇంస్ట్రక్షంసు (అనుశాసన). 14 అశ్వమేథ పర్వము The Ashvamedhika-parva is also preserved in a separate version, the Jaimini-Bharata (Jaiminiya-ashvamedha) where the frame dialogue is replaced, the narration being attributed to Jaimini, another disciple of Vyasa. This version contains far more devotional material (related to Krishna) than the standard epic and probably dates to the 12th century. It has some regional versions, the most popular being the Kannada one by Devapurada Annama Lakshmisha (16th century).The Mahabharata91–92యుధిష్టరుడు నిర్వహించిన అశ్వమేథయాగం. అర్జునుడి విజయయాత్ర. అర్జునుడికి శ్రీకృష్ణుడు అనుగీత బోధించుట.15 ఆశ్రమవాస పర్వము 93–95ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అంతిమయాత్ర. (సజీవంగా కార్చిచ్చులో పడి కాలిపోయి మరణించారు). విదురుడు యోగిగా శరీరయాత్ర ముగించి ధర్మరాజులో ప్రాణాలను విలీనం చేయుట. తమతో ఉన్న సంజయుడిని హిమాలయాలకు పోయి ప్రాణాలను రక్షించుకొమ్మని ఆఙాపించుట.16 మౌసల పర్వము 96గాంధారి శాపఫలితంగా యాదవులు అంతర్యుద్ధం చేసుకుని మౌసలం (ముసలం) కారణంగా మరణించుట.17 మహాప్రస్థానిక పర్వము 97యుధిష్టరుడు తన సోదరులు, భార్య ద్రౌపదితో సుదీర్ఘమైన అంతిమయాత్రతో జీవనయాత్ర ముగించుట. ఇందులో యుధిష్టరుడు మినహా అందరూ శరీరాలు చాలించగా, యుధిష్టరుడు సశరీరుడుగా స్వర్గలోకం చేరుకుంటాడు.18 స్వర్గారోహణ పర్వము 98 యుధిష్టరుడు చివరి పరీక్ష తరువాత స్వర్గంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించుట.khilaహరివంశ పర్వము 99–10018 పర్వాలలో చెప్పబడని శ్రీకృష్ణుడి గురించి వివరించుట. కావ్య ప్రశస్తి "యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును. ఈ కావ్యవైభవాన్ని నన్నయ: మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు. మహాభారతాన్నిచెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. మహాభారతంలోని విభాగాలు మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది: ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం. సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత. వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం. విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం. ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు. భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం. ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం. కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం. శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం. సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం. స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం. శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు. అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు) అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం. ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం. మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు. మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం. స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం. హరివంశ పర్వము: శ్రీకృష్ణుని జీవితగాథ వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు. మహాభారతం ప్రత్యేకతలు మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు (5000 B.C-3000 B.C). మహాభారతకథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు . మహాభారతకథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు. అంతకు పూర్వం దేవాసురయుధ్దంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు. ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11 అక్షౌహిణి భారతీయ కొలమానంలో అక్షౌహిణి ఒక కొలత. సైన్యాన్ని అక్షౌహిణిలో కొలుస్తారు. కంబ రామాయణంలో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆదిపర్వం బట్టి సైన్యగణాంకాలలో పునాది నిష్పత్తి 1 రథము: 1 ఏనుగు: 3 గుర్రాలు: 5 కాలిబంట్లు. అక్షౌహిణిరథములుఏనుగులుగుఱ్ఱములుకాలిబంట్లు121,87021,87065,6101,09,350 వివిధ ప్రమాణాలు పత్తి ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, ఐదు కాలిబంట్లు కలిస్తే ఒక "పత్తి" అంటారు. 1 రథములు + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు సేనాముఖము మూడు పత్తులు ఒక సేనాముఖము అనగా సేనాముఖము = 3 X పత్తి 3 రథములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు గుల్మము మూడు సేనాముఖములు ఒక గుల్మము. అనగా గుల్మము = 3 X సేనాముఖము 9 రథములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు గణము గణము అనగా మూడు గుల్మములు అనగా గణము = 3 X గుల్మము 27 రథములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు వాహిని వాహిని అనగా మూడు గణములు. అనగా గణము =3 X గణము 81 రథములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు పృతన పృతన అనగా మూడు వాహినులు అనగా పృతన=3 X వాహినులు 243 రథములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు చమువు చమువు అనగా మూడు పృతనల సైన్యము. అనగా 3 Xపృతన 729 రథములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు అనీకిని అనీకిని అనగా మూడు చమువుల సైన్యము. అనగా 3 Xచమువు. 2187 రథములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు అక్షౌహిణి అక్షౌహిణి అనగా పది అనీకినుల సైన్యము అనగా 10 X అనీకిని 21870 రథములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధములో పాల్గొన్నాయి. అంటే - 3,93,660 రథములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే, రథబలం 7,87,320 కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,320 కి చేరుకుంటుంది. రకంఎన్నింతలురథములుఏనుగులుగుర్రాలుకాలిబంట్లుసారథిపత్తి11135పత్తిపాలుడుసేనాముఖము333915సేనాముఖిగుల్మము3*3992745నాయకుడుగణము33272781135గణనాయకుడువాహిని348181243405వాహినిపతిపృతన352432437291,215పృతనాధిపతిచమువు (సేనా)367297292,1873,645సేనాపతిఅనీకిని372,1872,1876,56110,935అనీకాధిపతిఅక్షౌహిణి10*3721,87021,87065,6101,09,350మహా సేనాపతి మరిన్ని ప్రమాణాలు అక్షౌహిణి X '18' = ఏకము ఏకము X '8' = కోటి (ఈ కోటి మన కోటి కాదు) కోటి X '8' = శంఖము శంఖము X '8' = కుముదము కుముదము X '8' = పద్మము పద్మము X '8' = నాడి నాడి X '8' = సముద్రము సముద్రము X '8' = వెల్లువ అంటే 36,691,71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు. ఇటు వంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది. అంటే 366917139200 X 70 = 25684199744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు. వీరికి నీలుడు అధిపతి. 25684199744000 మంది బలవంతులు కలిసి త్రేతాయుగములో (1,700,000 సంవత్సరాల పూర్వం) లంకకు వారధి కట్టారన్నమాట. మూలాలు అక్షౌహిణులు. పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు. ఈ యుద్ధం జరిగిన ప్రదేశం శమంతక పంచకం. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు. పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంథరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు. వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే వినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు. మహాభారతంలోని ఉపపర్వాలు 100. పైష్యమ, ఆస్తీకము, ఆదివంశావతారం, సంభవపర్వము, జతుగృహదాహము, హైడంబము, బకవధ, చైత్రరధము, ద్రౌపదీస్వయంవరం, వైవాహికం, విదురాగమనము, రాజ్యార్ధలాభము, అర్జునతీర్ధయాత్ర, సుభద్రాకల్యాణం, హరణహారిక, ఖాండవదహనం, మయదర్శనం, సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, బర్ఘ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమ్మీరవధ, కైరాతము, ఇంద్రలోకాభిగమనం, ధర్మజతీర్ధయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, అజగరం, మార్కడేయోపాఖ్యానం, సత్యాద్రౌపదీ సంవాదం, ఘోషయాత్ర, ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణాఖ్యానం, ద్రౌపదీహరణం, కుండలాహరణం, ఆరణేయం, వైరాటం, కీచకవధ, గోగ్రహణం, అభిమన్యువివాహం, ఉద్యోగం, సంజయయానం, ధృతరాష్ట్రప్రజాగరణం, సానత్సుతజాతం, యానసంధి, భగవద్యానం, సైనానిర్యాత, ఉలూకదూతాభిగమనం, సమరధ, అతిరధ సంఖ్యానము, కర్ణభీష్మవివాదం, అబోపాఖ్యానం, జంబూఖండవినిర్మాణం, భూమిపర్వము, భీష్మాభిషేకం, భగవద్గీత, భీష్మవధ, ద్రౌణాభిషేకం, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రధ వధ, ఘటోత్కచ వధ, ద్రోణవధ, నారాయణాస్రప్రయోగం, కర్ణపర్వం, శల్యపర్వం, హ్రదప్రవేశం, గదాయుద్ధం, సారసత్వం, సౌప్తిక పర్వం, వైషీకం, జలప్రదానం, స్త్రీపర్వం, శ్రాద్ధపర్వం, రాజ్యాభిషేకం, చార్వాక నిగ్రహం, గృహప్రనిభాగం, శాంతిపర్వం, రాజధర్మానుకీర్తనం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, ఆనుశాసనికం, భీష్మస్వర్గారోహణం, అశ్వమేధం, అనుగీత, ఆశ్రమవాసం, పుత్రసందర్శనం, నారదాగమనం, మౌసలం, మహాప్రస్థానం, హరివంశం, భనిష్యత్పర్వం. చారిత్రక పరిశీలనలు కథల్లోను, కావ్యాల్లోను నిజమైన ప్రదేశాల పేర్లను పేర్కొనడం ఎక్కువమంది రచయితల్లో కనిపించే లక్షణం. రచయిత చనిపోయిన లక్షల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయల్పడిన ఆ రచయిత వ్రాతల ప్రకారం పరిశోధిస్తే ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి కనుక ఎవరైనా ఆ వ్రాతలు చదివినప్పుడు అందులోని కథ నిజంగా జరిగినట్లు అనిపిస్తుందని ఒక అభిప్రాయం ఉంది. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకూ ఆర్యుల భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, మహాభారత కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు క్రీస్తు పూర్వం 800 - క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య ఆర్యుల తెగకు చెందిన వేదవ్యాసుడు అను కవి రచించిన కావ్యము అని, మహా భారతములోని సన్నివేశాలు కల్పితాలు అని, హిందువులకు తమ మతముపై యున్న గట్టి విశ్వాసాలే కల్పిత కావ్యాన్ని చరిత్రగా చేశాయని పరిశోధకుల భావన. గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ద్వారకా నగరం వద్ద అరేబియన్ సముద్ర తీర గర్భంలో బయల్పడిన ఓడ రేవు క్రీస్తుపూర్వం 3000 సంవత్సారాలనాటిదని, అది సింధూ (హరప్పా) నాగరికతకు చెందినది అని, ఆ కాలంలో భాషకు లిపి లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences, A. S. Gaur* and K. H. Vora, Marine Archaeology Centre, National Institute of Oceanography, Dona Paula, Goa 403 004, IndiaArcheology of Dwaraka Land, by Sundaresh and A.S Gaur, Marine Archeology Center, National Institute of Oceanography, Goa 403004. తెలుగు సినిమాలలో భారతగాథ మహాభారత కథ ఇతివృత్తంగా ఎన్నో తెలుగు సినిమాలు వెలువడ్డాయి. పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో తెలుగువారికున్న నైపుణ్యం కారణంగా వాటిలో చాలా సినిమాలు చిరస్థాయిగా జనాదరణ పొందాయి. వాటిలో కొన్ని: మాయాబజార్ (కల్పిత కథ) పాండవ వనవాసం శ్రీకృష్ణ పాండవీయం నర్తనశాల విరాటపర్వం కురుక్షేత్రం దానవీరశూరకర్ణ భీష్మ బాలభారతం మహాభారతంలో మంచి కథలు (వ్యాసాలు) "మహాభారతం" లోమంచి కథలు ( వ్యాసాలు) Videos ఇవి కూడ చూడండి త్రివిక్రమ దేవాలయం మాండవ్య మూలాలు బయటి లింకులు http://larryavisbrown.homestead.com/files/xeno.mahabsynop.htm http://www.ece.lsu.edu/kak/MahabharataII.pdf http://www.itcsra.org/sra_hcm/sra_hcm_chrono/sra_hcm_chrono_500bc.html http://www.iisc.ernet.in/currsci/jul10/articles29.htm మహాభారతంలోని 18 విభాగాలు శ్రీమదాంధ్ర మహాభారతం -18 పర్వాల PDF దిగుమతి - ఆన్ లైన్ పఠనము వర్గం:పురాణాలు వర్గం:హిందూమతం వర్గం:మహాభారతం వర్గం:హిందూ గ్రంథాలు
గంగ
https://te.wikipedia.org/wiki/గంగ
గంగ అనగా భారతదేశంలోని పవిత్రమైన గంగా నది గంగ అనగా తెలుగు భాషలో నీరు అని కూడా అర్థం. గంగ (సినిమా), 1991 లో విడుదలైన తెలుగు సినిమా. గంగ గౌరీ సంవాదం, 1958 లో విడుదలైన తెలుగు సినిమా. గంగ మంగ, 1973 లో విడుదలైన తెలుగు సినిమా. గంగ యమున సరస్వతి, 1977 లో విడుదలైన తెలుగు సినిమా. గంగరావి (Thespia populnea) పెద్ద సతత హరిత వృక్షం. గంగరేగు ఒక రకమైన పెద్ద రేగు పండ్లు.
ఆది పర్వము
https://te.wikipedia.org/wiki/ఆది_పర్వము
వ్యాసుడు రచించిన, మహాభారతములో మొత్తం 18 ఉపపర్వాలు, 8 అశ్వాసాలు ఉన్నాయి. సంస్కృత భారతంలోని ఆది పర్వంలో మొత్తం 9,984 శ్లోకాలు ఉంటే, శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో మొత్తం పద్యాలు, గద్యాలు కలిపి 2,084 ఉన్నాయి. మహాభారతంలోని పద్ధెనిమిది పర్వాలలో విషయ క్రమణిక ఇలా ఉంది. thumb|250px|ఆది పర్వ మహాభారతాన్ని ఋషుల ముందు పఠించినట్లు వివరిస్తుంది ఎందుకంటే దాని పరిధిలో తెలిసిన జ్ఞానమంతా ఉంటుంది. ఆది పర్వము: పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం. సభా పర్వము: కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత. వన పర్వము (లేక) అరణ్య పర్వము: అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం. విరాట పర్వము: విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం. ఉద్యోగ పర్వము: కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు. భీష్మ పర్వము: భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం. ద్రోణ పర్వము: ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం. కర్ణ పర్వము: కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం. శల్య పర్వము: శల్యుడు సారథిగాను, అనంతరం నాయకునిగాను సాగిన యుద్ధం. దుర్యోధనుని మరణం. సౌప్తిక పర్వము: నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం. స్త్రీ పర్వము: గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం. శాంతి పర్వము: యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు. అనుశాసనిక పర్వము: భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు) అశ్వమేధ పర్వము: యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం. ఆశ్రమవాస పర్వము: ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం. మౌసల పర్వము: యదువంశంలో ముసలం, అంతఃకలహాలు. మహాప్రస్ధానిక పర్వము: పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం. స్వర్గారోహణ పర్వము: పాండవులు స్వర్గాన్ని చేరడం. వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు. ఇవి కాక తరువాతి కథ అయిన శ్రీకృష్ణుని జీవితగాథను తెలుగు మహాభారతంలో భాగంగా కాక హరివంశ పర్వము అనే ప్రత్యేక గ్రంథంగా పరిగణించారు. నన్నయ మొదలుపెట్టిన కథావిభాగాన్నే తిక్కన, ఎఱ్ఱన అనుసరించారు. ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును. శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే. ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది. రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది. ఉపపర్వాలు మహా భారతంలోని మొత్తం 100 ఉపపర్వాలలో 19 ఉప పర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు. సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు అనుక్రమణికా పర్వం (పర్వాల సంగ్రహం) పౌష్యం పౌలోమం ఆస్తిక పర్వం ఆదివంశావతరణం సంభవ పర్వము లాక్షాగృహ దహనం హిడింబాసురని వధ బకాసురుని వధ చైత్రరథం ద్రౌపదీ స్వయంవరం వైవాహిక పర్వము విదురాగమనం రాజ్యలాభ పర్వం అర్జునుని వనవాసం సుభద్రా కల్యాణం హరణ హారిక ఖాండవ వన దహనం మయసభా దర్శనం ఆంధ్ర మహాభారతం అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు విశేషాలు మూలాలు బయటి లింకులు కిశోరీ మోహన్ గంగూలి ఆంగ్ల అనువాదం ఆది పర్వము Videos
తెనాలి రామకృష్ణుడు
https://te.wikipedia.org/wiki/తెనాలి_రామకృష్ణుడు
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది (ఇక్కడ, వికటత్వం అంటే ఉదారత అని అర్ధం కూడా వచ్చును). ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామకృష్ణుడి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు.నూరేళ్ళ తెనాలి ఘనచరిత్ర, రచన బిళ్ళా జవహర్ బాబు, ముద్రణ 2010, పేజీ 21 రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. సా.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. రచనలు ఉద్భటారాధ్య చరిత్ర ఘటికాచల మహాత్మ్యము పాండురంగ మహాత్మ్యము ఉద్బటారాధ్య చరిత్ర ఉద్భటుడు అనే యతి గాథ. ఘటికాచల మహాత్మ్యము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలంలోని ఘటికాచల (ప్రస్తుతం షోళింగుర్) క్షేత్రంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి వారిని స్తుతిస్తూ వ్రాసిన కావ్యం. పాండురంగ మహాత్మ్యము స్కాంద పురాణము లోని విఠ్ఠలుని మహాత్మ్యాలు, ఇతర పాండురంగ భక్తుల చరిత్రల సంపుటం. అలభ్య రచనలు కందర్పకేతు విలాసము హరిలీలా విలాసము ఇవి అలభ్య గ్రంథములు. జగ్గన గారి ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి. శైలి తెనాలి వారు ప్రబంధ శైలిని అనుసరించేవారు. ఇంకనూ వారి కవిత్వంలో హాస్యము, వ్యంగ్యము రంగరించబడి ఉంటాయి చాటువులు వీరు చాటువులు చెప్పడంలో బహు నేర్పరి. అల్లసాని పెద్దన వారితో ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో "అమావాశ్యనిశి"ని ఛందస్సు కోసం "అమవసనిసి" అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు, ఎమి తిని సెపితివి కపితము బెమ పడి వెరి పుఛ్చ కాయ మరి తిని సెపితో ఉమెతకయలు తిని సెపితో అమవస నిసి యనుచు నేడు అలసని పెదనా || ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు. ధూర్జటి వారితో ధూర్జటి వారిని స్తుతిస్తూ రాయలు : స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ యతులిత మాధురీ మహిమ ? దానికి రామకృష్ణుని చమత్కార సమాధానం: హా తెలిసెన్! భువనైక మోహనో ద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం తత మధురాధరోద్గత సుధా రస ధారల గ్రోలుటం జుమీ !! అంటూ ధూర్జటి వారి వేశ్యా సాంగత్యాన్ని ఎత్తి చూపారు. కావలి తిమ్మడు మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పథకం వేసి వాకిటి కావలి తిమ్మా ! ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా ! నీకిదె పద్యము కొమ్మా ! నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !! అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి భట్టు మూర్తి కవిత్వం గురించి అవహేళన చేస్తూ చీపర బాపర తీగల చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ కాపు కవిత్వపు కూతలు బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !! ప్రెగడరాజు నరస కవి వారి పరాభవం ఒకమారు, ప్రెగడరాజు నరస కవి అనే ఒక ఉద్దండ పండితుడు రాయల వారి కొలువు సందర్శించి, వారికి ఒక క్లిష్ట సమస్య ఇచ్చారు. అదేమంటే, ఈ కొలువులో ఎవరైనా తను రాయలేనంత కఠినమైన చాటువు చెప్పగలరా అని. ఆ సమయములో రాయలు వారు మొదట అల్లసాని పెద్దన వారి వైపు చూసారట. అల్లసాని వారు కొంత సమయము తీసుకొంటుండగా, తెనాలి వారు అందుకొని పండితుల వారిని తికమక పెట్టేలా ఈ చాటువు వల్లించారట. త్బృ....వ్వట బాబా తల పై బు....వ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బువ్వట చూడగ హుళులు.... క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !!. మూలాలు తెనాలి రామలింగ Tenali Ramakrishna K.A. Nilakanta Sastry, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, OUP, New Delhi (Reprinted 2002) ISBN 0-19-560686-8 Golden age of Telugu Literature Literary activity in Vijayanagara Empire Tenali Ramakrishna's entry into Bhuvana Vijayam బయటి లింకులు Stories of Tenali Ramakrishna Kavi పాండురంగమాహాత్మ్యము-సవ్యాఖ్యానము వర్గం:గుంటూరు వర్గం:తెలుగువారు వర్గం:తెలుగు కవులు వర్గం:16 వ శతాబ్దపు భారతీయ ప్రజలు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:విజయనగర సామ్రాజ్య ప్రజలు
ఇండియా
https://te.wikipedia.org/wiki/ఇండియా
దారిమార్పు భారతదేశం
ప్రకాశం జిల్లా
https://te.wikipedia.org/wiki/ప్రకాశం_జిల్లా
ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలు. ఇది 1970 ఫిబ్రవరి 2న, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించింది. తరువాత 1972లో, జిల్లాలోని వినోదరాయునిపాలెము గ్రామములో పుట్టిన ఆంధ్ర నాయకుడైన టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది. 2022 ఏప్రిల్ 4 న కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గుంటూరు జిల్లానుండి చేరిన భాగం, బాపట్ల జిల్లాలో, నెల్లూరు నుండి చేరిన కొంత భాగం తిరిగి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపబడింది. భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ,సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. చరిత్ర ఉమ్మడి జిల్లా చరిత్రకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా , గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే. స్వాతంత్ర్యోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం, గిద్దలూరు) ఏర్పడినది. 1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా పేరు మార్చబడింది. 2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రకాశం జిల్లాలోని 13 మండలాలు బాపట్ల జిల్లాలో చేర్చబడ్డాయి. కందుకూరు శాసనసభ నియోజకవర్గం మండలాలు మరల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపబడ్డాయి. భౌగోళిక స్వరూపం ఉత్తరాన నాగర్‌కర్నూల్ జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన వైఎస్‌ఆర్ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. కొండలు త్యాగరాజు నల్లమల, వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. నల్లమల కొండలు గిద్దలూరు మండలం, మార్కాపురం మండలాలలో వ్యాపించి ఉండగా, వెలుగొండ కర్నూలు జిల్లా, వైఎస్‌ఆర్ జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి. నల్లమలలో నంది కనుమ (నంది కనుమ వద్ద పాతరాతి యుగపు (క్రీ.పూ 10000 - క్రీ.పూ 8000) నాటి రాతి పనిముట్ల పరిశ్రమ ఉన్నట్టు GSI వారు కనుగొన్నారు), మాబాల కనుమ అనే రెండు ముఖ్యమైన కనుమలు ఉన్నాయి. నంది కనుమ పశ్చిమాన గల కర్నూలు జిల్లా,బళ్ళారి జిల్లాలకు, తూర్పున కోస్తా జిల్లాలకు ప్రధాన మార్గం కాగా, మాబాల కనుమ పశ్చిమాన ఆత్మకూరు, కర్నూలును తూర్పున దోర్నాల, యర్రగొండపాలెం, మార్కాపురం లను కలుపుతుంది. జలవనరులు 350x350px|thumb|ఉమ్మడి ప్రకాశం జిల్లా నీటివనరుల పటము (2015) ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, మూసీ, మానేరు, పాలేరు, రొంపేరు, జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు. వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. మానేరు, పాలేరు, రొంపేరు సాగు తాగు నీటి అవసరాలు తీరుస్తాయి. కంభం వెలిగొండ, గుండ్లకమ్మ, మోపాడు, రాళ్లపాడు చెరువులు తాగు సాగునీటి అవసరాలకు ప్రధాన నదులపై నిర్మించారు. తమ్మిలేరు, సగిలేరు ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, వేడిమంగల వాగు వంటివి కూడా జిల్లాలో పరిమితంగా ప్రవహిస్తున్నాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయినవి నాగార్జునసాగర్ జవహర్ కాలువ ఎమ్ ఎస్ ఆర్ రామతీర్థం రిజర్వాయర్ ఒంగోలు శాఖా కాలువ M. 16-5-330 వద్ద 1.514 టిఎంసి నీటిని నిల్వకు రిజర్వాయర్ కట్టబడింది. ఇది ఓబచెత్తపాలెం గ్రామం, చీమకుర్తి మండలం దగ్గర 2009 లో నిర్మించబడింది. 72,874 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించగా, 32,475 ఎకరాలు 2013-14లో స్థిరీకరించబడింది. దీనికి 47.61కోట్లరూపాయలు 2015 మే వరకు ఖర్చయ్యింది.56గ్రామాలకు మంచినీటి సౌకర్యం లభిస్తుంది. కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు నిర్మాణంలో వున్నవి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు రాళ్లపాడు ప్రాజెక్టు మోపాడు ప్రాజెక్టు కంభం చెరువు వీరరాఘవునికోట ఆనకట్ట పాలేరు బిట్రగుంట ఆనకట్ట చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు నీటి చెరువుల ద్వారా కూడా వ్యవసాయం జరుగుతుంది. ఇవి 10 నుండి 40హెక్టార్ల విస్తీర్ణములో ఉన్నాయి. వాతావరణం, వర్షపాతం జిల్లా లోని కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్నికాలాల్లోను వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. జూన్‌- సెప్టెంబరులో నైరుతి ఋతుపవనాలు, అక్టోబరు - డిసెంబరులో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి. నేలలు ఎర్ర, నల్ల రేగడి, ఇసుక నేలలు జిల్లాలో ఉన్నాయి. వృక్ష సంపద కోస్తా ప్రాంతంలో కొత్తపట్నం, సింగరాయకొండ, ఉలవపాడులో జీడి మొదలైన చెట్లతో కూడిన అడవులు ఉన్నాయి. ఉలవపాడు మామిడి, సపొటా తోటలకు ప్రసిద్ధి. ఖనిజ సంపద పలకలు, బలపాలకు పనికివచ్చే రాయి విస్తారంగా గిద్దలూరు మండలంలోని ఓబయనాపల్లి నుండి మార్కాపురం మండలంలోని కుళ్లపేట వరకు దొరుకుతుంది. భారతదేశం వుత్పత్తిలో దాదాపు 80 శాతం ఇక్కడేజరుగుతుంది. కోగిజేడు, మార్లపాడు గ్రామంలో మాగ్నటైట్, ముడి ఇనుము నిక్షేపాలున్నాయి. ఇంకా క్వార్ట్జ్, జిప్సం, సిలికా, సున్నపురాయి, బేరియం సల్ఫేట్ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే అతి శ్రేష్ఠమైన గాలక్సీ గ్రానైటు జిల్లాలో దొరుకుతుంది. ఆర్ధిక స్థితి గతులు వ్యవసాయం thumb|ఒంగోలు జాతి గిత్త వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి చెందింది. వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, కొర్రలు, పప్పు ధాన్యాలు, మిరప, పత్తి,శనగ, వేరుశనగ, ఆముదం ఇక్కడ పండే ఇతర పంటలు. పత్తివుత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది. పరిశ్రమలు జిల్లాలో ఐరన్‌ ఓర్‌, గ్రానైట్‌, ఇసుక, సిలికా, బైరటీస్‌, సున్నపురాయి, పలకలకు సంబంధించిన గనులు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలు చీమకుర్తి, ఆర్‌.ఎల్‌.పురం, బూదవాడల్లో 8.60 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు, వివిధ రంగుల గ్రానైట్‌ నిక్షేపాలు జిల్లాలోని ఉప్పుమాగులూరు, దర్శి, కనిగిరి,, బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌ నిల్వలున్నాయి. ఇవేగాక ప్రత్తి జిన్నింగ్, పొగాకు, మంగుళూరు టైల్స్, పలకల తయారీ, జీడిపప్పు పరిశ్రమలు ఉన్నాయి. దేశానికి అవసరమైన రాతి పలకలో 80% మార్కాపురం నుండే 100కు పైగా పరిశ్రమలలో వుత్పత్తి చేయబడుతుంది. సముద్ర తీరం (పాకల,ఊళ్ళపాలెం,కేసుపాలెం,కరేడు ....మొదలైనవి. )పొడుగునా ఉప్పును పండిస్తారు. అవస్థాపన: జిల్లాలో ఆరు పారిశ్రామిక వాడలు ( ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు అభివృద్ధి కేంద్రము (Ongole growth center), ఒంగోలు ఆటోనగర్, వుడ్ కాంప్లెక్స్) ఉన్నాయి. +విభజన పూర్వపు ప్రకాశం జిల్లా పరిశ్రమల గణాంకాలు (2012 నాటివి) పరిశ్రమ రకం సంఖ్య పెట్టుబడి (కోట్లు) ఉపాధి వివరణలు భారీ, మధ్య తరహా 30 389 ఉదా: ఐటిసి, అమరావతి టెక్స్టైల్స్, జయవెంకటరమణ స్పిన్నింగ్ మిల్స్, ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్స్ సూక్ష్మ, చిన్న తరహా 28,088 150.661,65,728 డివిజన్లు లేదా మండలాలుు రెవెన్యూ డివిజన్లు (3): ఒంగోలు, కనిగిరి, మార్కాపురం మండలాలు మండలాలు: 38 ఒంగోలు రెవెన్యూ డివిజన్ ఒంగోలు కొండపి కొత్తపట్నం చీమకుర్తి జరుగుమల్లి టంగుటూరు తాళ్ళూరు నాగులుప్పలపాడు మద్దిపాడు ముండ్లమూరు సంతనూతలపాడు సింగరాయకొండ కనిగిరి రెవెన్యూ డివిజన్ కనిగిరి కురిచేడు కొనకనమిట్ల చంద్రశేఖరపురం పెదచెర్లోపల్లి దర్శి దొనకొండ మర్రిపూడి పామూరు పొదిలి పొన్నలూరు వెలిగండ్ల హనుమంతునిపాడు మార్కాపురం రెవెన్యూ డివిజన్ అర్ధవీడు కొమరోలు కంభం గిద్దలూరు పుల్లలచెరువు బేస్తవారిపేట తర్లుపాడు త్రిపురాంతకము దోర్నాల పెద్దారవీడు మార్కాపురం రాచర్ల యర్రగొండపాలెం గ్రామ పంచాయితీలు 715 గ్రామపంచాయితీలున్నాయి. నగరాలు, పట్టణాలు నగరం:ఒంగోలు పట్టణాలు(6): మార్కాపురం, కనిగిరి,చీమకుర్తి, గిద్దలూరు, పొదిలి, దర్శి నియోజకవర్గాలు లోక్‌సభ నియోజకవర్గములు(2) ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం : సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం తప్ప మిగిలిన ప్రకాశం జిల్లా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధి: బాపట్ల జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా లోని సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గములు (8) ఎర్రగొండపాలెం ఒంగోలు కనిగిరి కొండపి గిద్దలూరు దర్శి మార్కాపురం సంతనూతలపాడు రవాణా వ్యవస్థ thumb|ఒంగోలు రైల్వే స్టేషను ఎన్.హెచ్.16., రాష్ట్ర రహదారులు, జిల్లా పరిషత్ రహదారులు, ఇతర జిల్లా రహదారులు ఉన్నాయి. చెన్నై - ఢిల్లీ రైలు మార్గం, గుంతకల్లు -గుంటూరు రైలు మార్గం జిల్లాలోని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలిగిస్తున్నాయి. జనాభా లెక్కలు 2011 భారత జనగణన ప్రకారం, 2022 లో సవరించిన జిల్లా పరిధిలో జనసంఖ్య 22.88 లక్షలు, సంస్కృతి ఉమ్మడి ప్రకాశం సంస్కృతి రెండు ప్రాంతాల (రాయలసీమ, కోస్తా) మేళవింపుగావుంది. మార్కాపూర్ డివిజన్ లో కర్నూలు ప్రాంత, గుంటూరు ప్రాంత సంస్కృతులు కలసినవున్నాయి. ఒంగోలు, కందుకూరు డివిజన్లలో ప్రధానంగా బియ్యం ఆహారం తీసుకోగా, మార్కాపూర్ డివిజన్లో రాగి, మొక్కజొన్న, బియ్యం ఆహారంగావాడుతారు. ఈ జిల్లా తీరంలో వున్న మత్స్యకారుల సంస్కృతి ఈ జిల్లాకు వైవిధ్యాన్ని పెంచుతుంది. ఈ జిల్లా తెలుగు మాండలికం, బాగా ఎక్కువగా అర్థమయ్యే తెలుగు మాండలికాల్లో రెండవది. పశుపక్ష్యాదులు ఒంగోలు గిత్త ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అమెరికా, హాలండ్. మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి చాలా దేశాలకు ఎగుమతి చేయబడింది. మలేషియాలో ఒక ద్వీపం ఒంగోలు ద్వీపంగా పేరుపెట్టారు. ఈ జాతి పశువులు ప్రపంచంలో లక్షలలో వుంటాయి . 2002 భారత జాతీయ పోటీల చిహ్నం ఐన వీర1 ఒంగోలు గిత్త. పొట్టి కొమ్మల ఒంగోలు జాతి గిత్తలు, నంది శిల్పాలలాగా వుంటాయి. విద్య ఒంగోలు ప్రాంతంలో బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలలు లేని కాలంలో మొదటిసారిగా 1867లో అమెరికన్ బాప్టిష్ట్ మిషన్ కు చెందిన క్లైవ్ దంపతులు ఒక బాలికల పాఠశాలను 1867లో స్థాపించుటయే గాక, ఒక లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలు కూడా 1892లో స్థాపించారు. 2014-15 సంవత్సరంలో 4751 విద్యాసంస్థలలో 610126 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పర్యాటక ఆకర్షణలు thumb|చెన్నకేశవస్వామి దేవాలయం,మార్కాపురం thumb| శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టు. మల్లవరం thumb|భైరవకోన గుహాలయాల సముదాయం చెన్నకేశవస్వామి దేవాలయం,మార్కాపురం త్రిపురాంతకేశ్వరాలయం, త్రిపురాంతకం కంభం చెరువు, భైరవకోన మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మాలకొండ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టు. మల్లవరం పాకాల (సింగరాయకొండ) సముద్రతీరప్రాంతం పొలిమేర శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం, పావులూరు వైద్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 9 అల్లోపతి వైద్యశాలలు, 46 డిస్పెన్సరీలు, 90 అయుర్వేద వైద్యశాలలు, 1 యునాని వైద్యశాల ఉన్నాయి. సహకార సంఘాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2,62,000 మంది సభ్యులతో జిల్లాలో 1275 సహకార సంఘాలున్నాయి. వీటిలో 1086 సాధారణ, 69 చేనేత,68 పారిశ్రామిక, 31 మత్స్యకార, 21 పాలసరఫరా సహకార సంఘాలు. క్రీడలు జిల్లాలో ఎండాకాలంలో పలు చోట్ల ఎడ్ల బలప్రదర్శన నిర్వహిస్తారు . జిల్లా నలుమూలలనుండి రైతుల పాల్గొంటారు. ప్రముఖవ్యక్తులు ఆంధ్రకేసరి బిరుదాంకితులు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు, కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య. శాసనసభ స్పీకర్ దివికొండయ్య,పిడతల రంగారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఈ జిల్లావారే. సంగీత ప్రపంచంలో పేరుగాంచిన వారిలో త్యాగరాజు, శ్రీరంగం ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేసిన షేక్ చినమౌలానా . సినీరంగంలో ప్రముఖులు దగ్గుబాటి రామానాయుడు అత్యధిక చలన చిత్రాలు నిర్మించిన నిర్మాతగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకా గిరిబాబు,రఘుబాబు గోపిచంద్, టి.కృష్ణ ఈ జిల్లా వారే. ఇవీ చూడండి 2014 నాటి ప్రకాశం జిల్లా మండలాల పటం మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:కోస్తా వర్గం:ప్రకాశం జిల్లా వర్గం:వ్యక్తుల పేరుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు
ఒంగోలు
https://te.wikipedia.org/wiki/ఒంగోలు
ఒంగోలు నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం, ఒంగోలు మండలానికి కేంద్రం. ఒంగోలు గిత్త అనే ఎద్దుల స్థానిక జాతి పేరు ఒంగోలు నుండి వచ్చింది. చరిత్ర ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరువాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి, వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకిని రాజధానిగా పాలించారు. వంగవోలు రాజులు పరిపాలించారు కాబట్టి ఈ ప్రాంతానికి వంగవోలు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా వంగవోలు పేరు ఒంగోలుగా స్థిరపడి పోయింది. కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు ప్రాంతం కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది. ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ (Zebu) జాతి ఎద్దులలో ఇవి ఒకటి. thumb|ఒంగోలు గిత్త జనాభా వివరాలు 2011 జనగణన ప్రకారం, జనాభా 204,746. ఇందులో 102,835 మగవారు, 101,911 ఆడవారు ఉన్నారు. 0–6 వయసు లోపు వారు 19,744 మంది ఉన్నారు. ఇందులో 10,228 అబ్బాయిలు, 9,516 అమ్మయిలు. అక్షరాస్యత 83.04%. జనాభాపరంగా ఆంధ్రప్రదేశ్ లో 13వ పెద్ద నగరం. పరిపాలన 1876లో ఒంగోలు పురపాలకసంఘం ఏర్పాటుచేశారు. దీని ప్రస్తుత అధికార పరిది . రవాణా సౌకర్యం రహదారి మార్గం thumb|ఒంగోలు వద్ద జాతీయ రహదారి 16 (పాత సంఖ్య5) thumb|right|ఒంగోలు రైలు స్టేషను జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216 నగరం గుండా వెళ్ళే జాతీయ రహదార్లు. ఒంగోలు బస్ స్టేషన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపుతుంది. రైల్వేలు ఒంగోలు రైల్వే స్టేషను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉంది. ఇది విజయవాడ రైల్వే డివిజను లోని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన A-గ్రేడ్ రైల్వే స్టేషను. ప్రతిపాదనలు ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2014 ఫిబ్రవరిలో ఆమోదించారు. విద్యా సౌకర్యాలు ఉన్నత విద్య రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,, క్యు.ఐ.ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ, పేస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వంటి కళాశాలలు ఒంగోలులో వున్నాయి పాఠశాల విద్య ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఒంగోలు ఒక పెద్ద కేంద్రమే. పట్టణం చుట్టూ వున్నా పల్లెల వలన ఒంగోలుకు వచ్చి పాఠశాల చదువు పొందేవారు సంఖ్యా ఎక్కువే. వేదవిద్య భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి (అలూరి సీతారామమ్మ-రామకోటేశ్వరరావు పాఠశాల) వైద్య సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ తో పాటు పలు అల్లోపతి ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఆర్ధిక వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది. thumb|సమావేశ మందిరం, ఒంగోలు ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్థాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. ఎనభై, తొభైయవ దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆసుపత్రుల స్థాపనలు అధికమైనాయి. ఎనభైయ్యవ దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది. సంస్కృతి పండుగలు ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన సాంప్రదాయం 1902 నుంచి కొనసాగుతుండటం విశేషం. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగుస్తుంది. ఒంగోలు శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుగుతాయి. పట్టణంలోని తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం మొట్టమొదటి సారిగా ప్రారంభమైంది.ఒంగోలులో నరకాసుర వధ, ఈనాడు ఆదివారం 27, అక్టోబరు 2013 కళారంగం ప్రతీ యేడు ఇక్కడ ఎన్.టి.ఆర్ కళా పరిషత్, ఒంగోలు ఆధ్వర్యంలో జరిగే నాటకోత్సవాలు జరుగుతాయి. ఒంగోలు నుండి ఎంతో మంది ప్రముఖులు నాటక, చిత్ర రంగమందు ప్రసిద్ధి చెందారు. "కంచు కంఠం"గా పేరొందిన నటుడు కొంగర జగ్గయ్య ఈ ప్రాంతంనుండి భారత లోక్ సభ సభ్యుడిగా, ఎన్నికైన తొలి భారతీయ కళాకారునిగా కూడా చరిత్రకెక్కారు. దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు thumb|సాయిబాబ మందిరం, ఒంగోలు శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, (సంత పేట) శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- 15వ శతాబ్దానికి చెందిన ఒంగోలు రాజు శ్రీ మందపాటి రామచంద్రరాజు, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ఆలయ నిర్మాణం జరిపించారు. ఆయన తన గుర్తుగా, ఈ ఆలయానికి ఒక ఖడ్గాన్ని బహూకరించారు, ఆ ఖడ్గం ఇప్పటికీ ఆలయంలో చెక్కుచెదరకుండా భద్రంగా ఉంది.వైద్య సౌకర్యాలు ప్రకాశం/ఒంగోలు; Archived from ఈనాడు 2019,జూన్-25. ప్రముఖులు భానుమతీ రామకృష్ణ భద్రిరాజు కృష్ణమూర్తి గరికపాటి వరలక్ష్మి మాగుంట సుబ్బరామిరెడ్డి జి.వరలక్ష్మి బాలినేని శ్రీనివాస రెడ్డి లంకా దినకర్ దగ్గుబాటి రామానాయుడు. బత్తిన నరసింహా రావు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త. ఒంగోలులో ఉన్న ప్రముఖ విద్యాసంస్థలు ఏ.కె.వి.కె విద్యాసంస్థల వ్యవస్థాపకుడు. ఇవి కూడా చూడండి ఒంగోలు మండలం ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం మూలాలు వెలుపలి లింకులు వర్గం:ప్రకాశం జిల్లా పట్టణాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు
కవి
https://te.wikipedia.org/wiki/కవి
right కవిత్వము రాసేవాడు కవి. 'రవిగాంచని చోట కవి గాంచును ' అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వరీకరించి వెలుగులోకి తీసుకవచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. కవులలో చాలా గొప్పవారిని మహాకవిగా గౌరవిస్తారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు, శ్రీరంగం శ్రీనివాసరావులకు మహాకవి గౌరవం లభించింది. thumb|చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కవిత్వంలో వచ్చిన మార్పులు, వివిధ కాలాలలో చేపట్టిన ప్రక్రియలు, పలురకాల భావజాలం ఆధారంగా తెలుగులో కవులను పలు విభాగాలుగా చెప్పుకుంటారు. వాటిలో కొన్ని... thumb|తిక్కన జంట కవులు ఇద్దరు కవులు కలిసి ఏకాభిప్రాయంతో కావ్య రచన చేసినచో వారిని జంట కవులు అంటారు. తిరుపతి వేంకట కవులు - దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి శేషాద్రి రమణ కవులు సోదరులైన జంట కవులు, చరిత్ర పరిశోధకులు. దూపాటి శేషాచార్యులు, దూపాటి వెంకట రమణాచార్యులు కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు. పింగళి కాటూరి కవులు: పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వరరావు లను పింగళి కాటూరి కవులని అంటారు. కొప్పరపు సోదర కవులు: కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, కొప్పరపు వేంకటరమణ కవి కుమార సోదర కవులు: వీరు కొప్పరపు సోదర కవుల సంతానము. సీతారామప్రసాదరావు ( కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి కుమారుడు), మల్లికార్జునరావు ( కొప్పరపు వేంకటరమణ కవి కుమారుడు) గురువిశ్వనాథకవులు: మిన్నికంటి గురునాథశర్మ, పోతరాజు విశ్వనాథ కవి దేవులపల్లి సోదరకవులు: దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి వేంకట రామకృష్ణ కవులు: ఓలేటి వేంకటరామశాస్త్రి, వేదుల రామకృష్ణశాస్త్రి వేంకట పార్వతీశకవులు : బాలాంత్రపు వేంకటరావు, ఓలేటి పార్వతీశం రాజశేఖర వేంకటశేషకవులు : దుర్భాక రాజశేఖర శతావధాని, గడియారం వేంకట శేషశాస్త్రి రామ నారాయణ కవులు: సత్యదుర్గేశ్వర కవులు: ద్వివేది సత్యకవి సుబ్రహ్మణ్య రమణ కవులు: వేంకటేశ్వర వేంకటరమణ కవులు: పెరుమాళ్ళ వేంకటేశ్వరగుప్త, వనమా వేంకటరమణగుప్త దుగ్గిరాల కవులు: గౌరావఝల రామకృష్ణ సీతారామ సోదరకవులు: గౌరావఝల రామకృష్ణశాస్త్రి, గౌరావఝల సీతారామశాస్త్రి కడిమెళ్ళ - కోట కవులు: కడిమెళ్ళ వరప్రసాద్, కోట వెంకట లక్ష్మీనరసింహం వేంకట కాళిదాస కవులు: వజ్ఝల వేంకటేశ్వర్లు, వజ్ఝల కాళిదాసు సత్యాంజనేయ కవులు: విశ్వనాథ సత్యనారాయణ, కొడాలి ఆంజనేయులు కవిత్రయం‌ సంస్కృతంలో వ్యాసుడు రచించిన భారతాన్ని తెలుగులోకి అనువదించిన ముగ్గురు మహా కవులు . వీరిని కవిత్రయం‌ అని అంటారు. నన్నయ తిక్కన ఎర్రన రామాయణ కవులు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన కవులు రామాయణ కవులు. గోన బుద్దారెడ్డి మొల్ల thumb|అన్నమయ్య శివ కవులు శివునిపై భక్తితో కవిత్వం రాసిన కవులు శివ కవులు. 12, 13 వ శతాబ్దిలో ఈ సాహిత్యం ఎక్కువ వెలువడింది. నన్నెచోడుడు పాల్కురికి సోమన మల్లికార్జున పండితారాధ్యుడు ప్రబంధ కవులు 16 వ శతాబ్దిలో విరివిగా వెలువడిన సాహిత్యం ప్రబంధ సాహిత్యం. వీటికి మూల పురుషుడు అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన నంది తిమ్మన ధూర్జటి తెనాలి రామకృష్ణుడు రామరాజ భూషణుడు పింగళి సూరన శ్రీకృష్ణదేవరాయలు చేమకూరి వెంకట కవి పద కవులు అన్నమయ్య త్యాగరాజు క్షేత్రయ్య శతక కవులు వంద లేదా అంతకు ఎక్కువ పద్యాలను ఒక మకుటం రాసే రచన శతకం. శతకాలు రాసిన కవులు . వేమన బద్దెన ధూర్జటి రామదాసు thumb|శ్రీశ్రీ జాతీయోద్యమ కవులు కొండా వెంకటప్పయ్య చిలకమర్తి లక్ష్మీనరసింహం రాయప్రోలు సుబ్బారావు వేదుల సత్యనారాయణ శాస్త్రి దువ్వూరి రామిరెడ్డి తుమ్మల సీతారామమూర్తి చౌదరి దామరాజు పుండరీకాక్షుడు బసవరాజు అప్పారావు కవికొండల వెంకటరావు మారేపల్లి రామచంద్రశాస్త్రి మంగిపూడి పురుషోత్తమశర్మ భావ కవులు రాయప్రోలు సుబ్బారావు అబ్బూరి రామకృష్ణారావు దేవులపల్లి కృష్ణశాస్త్రి బసవరాజు అప్పారావు నండూరి సుబ్బారావు నాయని సుబ్బారావు thumb|ఆవంత్స సోమసుందర్ అభ్యుదయ కవులు శ్రీశ్రీ దాశరథి కృష్ణమాచార్యులు ఆరుద్ర సి.నారాయణరెడ్డి గజ్జెల మల్లారెడ్డి పురిపండా అప్పలస్వామి ఆవంత్స సోమసుందర్ అనిసెట్టి సుబ్బారావు బెల్లంకొండ రామదాసు రెంటాల గోపాలకృష్ణ గంగినేని వేంకటేశ్వరరావు సి.విజయలక్ష్మి thumb|వంగపండు ప్రసాదరావు దిగంబర కవులు అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసింది. అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. దిగంబర కవులు మొత్తము ఆరుగురు. 1. నగ్నముని - మానేపల్లి హృషికేశవరావు; 2. నిఖిలేశ్వర్ - యాదవ రెడ్డి; 3. చెరబండరాజు - బద్దం బాస్కరరెడ్డి; 4. మహాస్వప్న - కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు; 5. జ్వాలాముఖి - వీరరాఘవాచార్యులు, 6. భైరవయ్య - మన్మోహన్ సహాయ తిరుగబడు కవులు వరవరరావు అశోక్ లోచన్ విప్లవ కవులు శ్రీశ్రీ వరవరరావు అశోక్ లోచన్ జ్వాలాముఖి చెరబండరాజు నగ్నముని నిఖిలేశ్వర్ చలసాని ప్రసాద్ కె.వి.రమణారెడ్డి శివసాగర్ సుబ్బారావు పాణిగ్రాహి గద్దర్ వంగపండు ప్రసాదరావు కె.శివారెడ్డి thumb|గుర్రం జాషువా నయాగరా కవులు బెల్లంకొండ రామదాసు కుందుర్తి ఆంజనేయులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం చేతనావర్త కవులు కోవెల సుప్రసన్నాచార్య కోవెల సంపత్కుమారాచార్య పేర్వారం జగన్నాథం నరసింహారెడ్డి thumb|గరిమెళ్ల సత్యనారాయణ అనుభూతి కవులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇస్మాయిల్ మాదిరాజు రంగారావు వేగుంట మోహన ప్రసాద్ కృష్ణం రాజు దేశగాని కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ వాడ్రేవు చినవీరభద్రుడు వజీర్ రెహమాన్ రేవతీదేవి వై. శ్రీరాములు అశోకచక్రవర్తి తోలానా thumb|పైడి తెరేష్ బాబు స్త్రీవాద కవయిత్రులు ఓల్గా సావిత్రి మొక్కపాటి సుమతి మందరపు హైమవతి తుర్లపాటి రాజేశ్వరి ఎస్. రజియా బేగం శ్రీమతి విమల కొండేపూడి నిర్మల పాటిబండ్ల రజని బి. పద్మావతి జయప్రభ మానసీ ప్రధాన్ దళితవాద కవులు గుర్రం జాషువా బోయి భీమన్న కుసుమ ధర్మన్న కొలకలూరి ఇనాక్ మాస్టార్జీ గరిమెళ్ల సత్యనారాయణ సాంబశివరావు వెలమల సిమ్మన్న కొండపల్లి సుదర్శనరాజు జయధీర్ తిరుమలరావు త్రిపురనేని శ్రీనివాస్ బి.ఎస్.రాములు పైడి తెరేష్ బాబు మద్దూరి నగేష్‌బాబు సతీష్‌చందర్ జూలూరి గౌరీశంకర్ నాగప్పగారి సుందరరాజు కత్తి పద్మారావు ఎండ్లూరి సుధాకర్ చెరుకు సుధాకర్ పగడాల నాగేందర్ శిఖామణి సలంద్ర గుంటూరు ఏసుపాదం ముస్లిం మైనార్టీవాద కవులు ఖాదర్ మొహియుద్దీన్ ఖాజా షాజహానా ఇక్బాల్ చంద్ జావెద్ దిలావర్ సయ్యద్ గఫార్ అఫ్సర్ ఎస్.ఏ.అజీద్ ఆజం షేక్ మహ్మద్‌రఫి సికిందర్ షోయబుల్లా ఖాన్ ఇవి కూడ చూడండి ఆల్బర్ట్ డ్యూరాంట్ వాట్సన్ శతక కవులు వర్గం:తెలుగు కవులు వర్గం:కవులు వర్గం:కవిత్వం
ప్రవాసాంధ్రులు
https://te.wikipedia.org/wiki/ప్రవాసాంధ్రులు
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా! నీ తల్లి భూమి భారతిని నిలుపరా! నీ జాతి నిండు గౌరవము. - రాయప్రోలు సుబ్బారావు ప్రవాసాంధ్రుల జాబితా బయటి లింకులు ఆటా - అమెరికా తెలుగు సంఘము సిలికానాంధ్ర - ఆమెరికాలోని సిలికాన్ వాలీ లో తెలుగు సంస్కతిని అభివృద్ధి చేస్తున్న సంస్థ తెలుగు డయాస్పోరా- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి గురించి చేసిన పరిశోధనా ఫలితాలు తానా - ఉత్తర అమెరికా తెలుగు సమాఖ్య వర్గం:తెలుగు
సుప్రసిద్ధ ఆంధ్రులు-జాబితా
https://te.wikipedia.org/wiki/సుప్రసిద్ధ_ఆంధ్రులు-జాబితా
వివిధ రంగాలలో కృషిచేసి, గణుతికెక్కిన సుప్రసిద్ధ ఆంధ్రుల జాబితా ఇది. ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు, తత్త్వవేత్తలు, వేదాంతులు, పండితులు thumb|250x250px|పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాంస్య విగ్రహ చిత్రం పోతులూరి వీరబ్రహ్మం వేమన చిన్న జీయర్ స్వామి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వామి రామానంద తీర్థ జిడ్డు కృష్ణమూర్తి భగవాన్ సత్య సాయి బాబా కొత్త సచ్చిదానంద మూర్తి యు.జి.కృష్ణమూర్తి ముంతాజ్ అలి సత్‌సంగ్ సంస్థ మాష్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య మాష్టర్ సి.వి.వి స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా నాయకులు, ఉద్యమకారులు అల్లూరి సీతారామ రాజు టంగుటూరి ప్రకాశం పంతులు మగ్దూం మొహియుద్దీన్ వంకా సత్యనారాయణ టంగుటూరి అంజయ్య నందమూరి తారక రామారావు ఆచార్య రంగా కల్లూరి చంద్రమౌళి తెన్నేటి విశ్వనాథం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పుచ్చలపల్లి సుందరయ్య పొట్టి శ్రీరాములు కొండా వెంకటప్పయ్య బూర్గుల రామకృష్ణారావు భోగరాజు పట్టాభి సీతారామయ్య వరాహగిరి వేంకటగిరి సరోజినీ నాయుడు పి.వి.నరసింహారావు పెండేకంటి వెంకటసుబ్బయ్య కానూరు లక్ష్మణ రావు నీలం సంజీవరెడ్డి వావిలాల గోపాలకృష్ణయ్య కోట్ల విజయభాస్కరరెడ్డి దామోదరం సంజీవయ్య రామకృష్ణ రంగారావు వావిలాల గోపాలకృష్ణయ్య ప్రతివాది భయంకర వేంకటాచారి బులుసు సాంబమూర్తి కన్నెగంటి హనుమంతు మాడపాటి హనుమంతరావు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు అయ్యంకి వెంకటరమణయ్య రావి నారాయణరెడ్డి కొమరం బీమ్ కవులు, రచయితలు, పాత్రికేయులు, విమర్శకులు నన్నయ్య యోగి వేమన తిక్కన్న ఎర్రన్న పోతన శ్రీనాథుడు అల్లసాని పెద్దన ధూర్జటి తెనాలి రామకృష్ణ కవి పరవస్తు చిన్నయ సూరి చిలకమర్తి లక్ష్మీనరసింహం గురజాడ అప్పారావు పానుగంటి లక్ష్మీ నరసింహారావు దివాకర్ల తిరుపతిశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి శ్రీశ్రీ త్రిపురనేని రామస్వామి తుమ్మల సీతారామమూర్తి సంజీవదేవ్ త్రిపురనేని గోపీచంద్ పుట్టపర్తి నారాయణాచార్యులు గడియారం వెంకటశేషశాస్త్రి మునిమాణిక్యం నరసింహారావు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి విద్వాన్ విశ్వం కోలవెన్ను రామకోటీశ్వరరావు కొడవటిగంటి కుటుంబరావు రాచమల్లు రామచంద్రారెడ్డి రావూరి భరద్వాజ కాళీపట్నం రామారావు కేతు విశ్వనాథరెడ్డి విశ్వనాథ సత్యనారాయణ రాయప్రోలు సుబ్బారావు కాళోజీ నారాయణరావు పి.వి.నరసింహారావు గుడిపాటి వెంకటాచలం దాశరథి కృష్ణమాచార్యులు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి వేదం వేంకటరాయశాస్త్రి చెరబండరాజు వట్టికోట ఆళ్వారుస్వామి సి. నారాయణరెడ్డి అక్కిరాజు రమాపతిరావు వాసిరెడ్డి సీతాదేవి మాలతీ చందూర్ తుర్లపాటి కుటుంబరావు నార్ల వెంకటేశ్వరరావు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ పురిపండా అప్పలస్వామి ఆరుద్ర ఉషశ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ మధిర సుబ్బన్న దీక్షితులు మామిడిపూడి వెంకటరంగయ్య నామిని సుబ్రమణ్యం నాయుడు యండమూరి వీరేంద్రనాథ్ శేషం కృష్ణకవి శేషం రామానుజాచార్యులు సవరము చిననారాయణనాయకుడు ఉర్దూ సాహితీకారులు మహమ్మద్ కులీ కుతుబ్ షా మగ్దూం మొహియుద్దీన్ బర్ఖ్ కడపవి వాగ్గేయకారులు త్యాగయ్య ముత్తుస్వామి దీక్షితులు నారాయణ తీర్ధులు శ్యామశాస్త్రి అన్నమయ్య భక్త రామదాసు క్షేత్రయ్య సంగీతజ్ఞులు, సంగీత దర్శకులు, గాయకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఘంటసాల వెంకటేశ్వరరావు పి.సుశీల సాలూరు రాజేశ్వరరావు షేక్ చినమౌలానా ద్వారం వేంకటస్వామినాయుడు చిట్టిబాబు ఈమని శంకరశాస్త్రి నూకల చినసత్యనారాయణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బాలాంత్రపు రజనీకాంతరావు ఎస్.జానకి విఏకే రంగారావు జిక్కి కె.జమునరాణి సంఘ సంస్కర్తలు, సంఘ సేవకులు/సేవికలు కందుకూరి వీరేశలింగం సురవరం ప్రతాపరెడ్డి రఘుపతి వేంకటరత్నం నాయుడు పాణాకా కనకమ్మ కె.ఎన్.కేసరి శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు, అధ్యాపకులు, వైద్యరంగ ప్రముఖులు డా.యల్లాప్రగడ సుబ్బారావు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వేమూరి రామకృష్ణారావు సూరి భగవంతం కె.ఎల్.రావు కల్యంపూడి రాధాకృష్ణారావు యలవర్తి నాయుడమ్మ నార్ల తాతారావు డా.వి. రామలింగస్వామి శొంఠి దక్షిణామూర్తి డి.వి.గోపాలాచార్యులు సత్యవరపు నాగపరమేశ్వర గుప్తా చిత్రకారులు, శిల్పకారులు, నాట్యకారులు, ఇతర కళాకారులు జాయప నాయుడు బళ్ళారి రాఘవ ఆదిభట్ల నారాయణదాసు అడవి బాపిరాజు గరికపాటి రాజారావు సురభి కమలాబాయి వెంపటి చినసత్యం పాకాల తిరుమల్ రెడ్డి(పి.టి.రెడ్డి) పీసపాటి నరసింహమూర్తి‎ పన్నూరు శ్రీపతి సినీ నటులు ప్రధాన వ్యాసం: తెలుగు సినీ నటులు ప్రభాస్ సినిమా సాంకేతిక నిపుణులు, సినిమా వ్యాపారవేత్తలు రఘుపతి వెంకయ్య గూడవల్లి రామబ్రహ్మం బి.ఎన్.రెడ్డి ఎల్.వి.ప్రసాద్ బి.నాగిరెడ్డి చక్రపాణి కె.వి.రెడ్డి కమలాకర కామేశ్వరరావు రాఘవేంద్రరావు దాసరి నారాయణ రావు ఆదిరాజు వీరభద్రరావు ఎమ్మెస్ రామారావు కె.విశ్వనాథ్ బాపు డి.రామానాయుడు మార్కస్ బార్ట్లే పాత్రికేయులు కాశీనాథుని నాగేశ్వరరావు నార్ల వెంకటేశ్వరరావు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ముట్నూరు కృష్ణారావు తిరుమల రామచంద్ర రాచమల్లు రామచంద్రారెడ్డి గజ్జెల మల్లారెడ్డి ఎ.బి.కె.ప్రసాద్ పొత్తూరు వెంకటేశ్వర రావు పాలగుమ్మి సాయినాథ్ వ్యాపార రంగ ప్రముఖులు వెలగపూడి రామకృష్ణ లగడపాటి రాజగోపాల్ నిమ్మగడ్డ ప్రసాద్ కల్లం అంజిరెడ్డి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ప్రతాప్ సి. రెడ్డి జి.వి.కె.రెడ్డి ఎ.జి.కృష్ణమూర్తి గ్రంధి సుబ్బారావు అధికారులు కె.జె.రావు కందా మోహన్ పి.వి.ఆర్.కె ప్రసాద్ జయప్రకాశ్ నారాయణ్ ప్రఖ్యాత క్రీడాకారులు అర్షద్ అయూబ్ (క్రికెట్) కోనేరు హంపి (చెస్) పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్) మహమ్మద్ అజారుద్దీన్ (క్రికెట్) వి.వి.యెస్.లక్ష్మణ్ (క్రికెట్) సానియా మిర్జా (టెన్నిస్) కరణం మల్లేశ్వరి (వెయిట్ లిఫ్టింగ్) వెంకటపతి రాజు (క్రికెట్) ఎం.ఎల్.జయసింహ (క్రికెట్) శివలాల్ యాదవ్ (క్రికెట్) సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్) వర్గం:ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన జాబితాలు
భాషలు
https://te.wikipedia.org/wiki/భాషలు
దారిమార్పుభాష
వేమన శతకము
https://te.wikipedia.org/wiki/వేమన_శతకము
వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు. శతక విశిష్టత వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక చైతన్యంనకు సంబంధించినవి ఉంటాయి. అతను సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు. ఈ పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కృతులతో కల్పించి, నవ్వించి ఎదుటివారి లోపాలను, తన లోపాలను, గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు. సామాన్యాలు మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు. పద్య లక్షణము వేమన పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం. ఉదాహరణకు: అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ఉదా: అనగననగరాగ మతిశయించునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ. పద్య మకుటంపై వాదనలు "విశ్వదాభిరామ వినురవేమ" మకుటానికి భిన్న వాదనలున్నాయి. అవి: వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు. విశ్వద అంటే వేమన వద్ద ఉన్న వేశ్య అని, అభి రాముడు అంటే వేమన ఆప్తమిత్రుడైన స్వర్ణకారుడు,అనే వాదన కూడా ఉంది. బ్రౌన్ కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు. వేమన గురించి పరిశోధన వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు (1999) మూలాలు బయటి లంకెలు
విప్లవ రచయితల సంఘం
https://te.wikipedia.org/wiki/విప్లవ_రచయితల_సంఘం
విప్లవ రచయితల సంఘం (వి.ర.సం.) మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచ‌నతో భార‌త‌దేశంలో జ‌రుగుతున్న నూత‌న ప్ర‌జాస్వామిక విప్ల‌వ కార్య‌చ‌ర‌ణ‌ను ఎత్తిప‌డుతూ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కృషి చేస్తున్న సంస్థ‌. పరిచయము తెలుగు సాహిత్యంపై నక్సల్బరీ పతాకం. ఈ మాట ప్రతీకాత్మకం కాదు. వర్ణనామయం అంతకంటే కాదు. భారత సామాజిక చరిత్ర నక్సల్బరీలోకి ప్రవహించి విరసానికి జన్మనిచ్చింది. తెలుగు సాహిత్య కళా, మేధో రంగాల్లో నక్సల్బరీ చైతన్యానికి విరసం తల్లి వేరుగా నిలిచింది. శ్రీకాకుళ విస్ఫోటనలోంచి ప్రజ్వరిల్లిన ప్రత్యామ్నాయ పంథాను విరసం సాహిత్య రంగంలోకి తీసుకొని వచ్చి నక్సల్బరీకి సాంస్కృతిక ప్రతినిధి అయింది. సమూల మార్పు లక్ష్యంగా సాయుధపోరాటాన్ని స్వీకరించిన సామాజిక, రాజకీయ ఉద్యమంలో తాను అంతర్భాగమని సగర్వంగా ప్రకటించుకుంది. సాహిత్యంలో సాహసానికి, తిరుగుబాటుకు, ధిక్కారానికి చిరునామాగా నిలిచింది. అందువల్లే తీవ్ర అణచివేతను, నిర్బంధాన్ని, చివరికి నిషేధాన్ని ఎదుర్కొన్నది. ప్రజల మనిషిగా పునర్జీవమైంది. నక్సల్బరీ శ్రీకాకుళ ఆదివాసీ విప్లవ శిశువుగా విరసం.. విప్లవోద్యమం వెనువెంట నడుస్తూ భారత పోరాట ప్రజల చరిత్రలో విస్తరిస్తోంది. సమాజంలోని ధిక్కారధారలన్నిటినీ ప్రభావితం చేస్తూ తాను వాటితో ప్రభావితమవుతోంది. విప్లవమంటే.. ప్రగతి దిశగా నేర్చుకోవడం, నేర్పించడం, మార్చడం, మార్పుకు లోనుకావడం అనే గతితర్క భావనకు సాహిత్య, మేధో రంగాల్లో తానే ఒక ఉదాహరణగా నిలిచింది. నిరంతరం సామాజిక వైరుధ్యాలను తట్టి లేపడం, వాటి బృహద్రూపాలను వెలికి తీయడం, వాటితో తలపడుతూ ప్రజలను పరిష్కర్తలుగా తీర్చిదిద్దడం, ప్రజల నేతృత్వంలో మార్పు దిశగా సాగడం.. అనే విప్లవాచరణలో విరసం ఎల్లవేళలా విద్యార్థి. తెలుగు నేల సరిహద్దులు దాటి సువిశాల మధ్య భారతదేశంమంతా, ఉత్తరాంధ్ర నుంచి ఒడిషా మీదుగా లాల్‌గడ్‌ అంతా విప్లవోద్యమం సాధించిన విస్తృతిని విరసం తన చైతన్యంలో అంతర్వాహినిగా మార్చుకున్నది. ప్రత్యామ్నాయ సామాజిక అభివృద్ధికి ప్రయోగశాలగా దండకారణ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో విరసం తన సృజనశక్తినంతా ధారపోసి దాన్ని విశ్లేషిస్తున్నది. చిత్రిస్తున్నది. ఉత్పత్తి, వర్గపోరాటం, సాంఘిక విముక్తి లక్ష్యంగా సాగుతున్న దండకారణ్య విప్లవోద్యమంలోని సాహిత్య కళా వికాసాన్ని తెలుగు సాహిత్య సాంస్కృతికోద్యమంలో అంతర్భాగం చేస్తున్నది. ప్రజాసైన్యం, ప్రజాయుద్ధం అనే నుడికారం వాప్తవరూపం ధరించిన ఈ వర్తమానంలో ప్రజలపై భారత ప్రభుత్వం చేస్తోన్న యుద్ధంలో విప్లవం పక్షాన నిలబడదామని ఆలోచనాపరులతో చేయి కలపడమే విరసం తన ఏకైక సాంస్కృతిక కర్తవ్యంగా భావిస్తోంది. సభ్యులు శ్రీశ్రీ కొడవటిగంటి కుటుంబరావు చలసాని ప్రసాద్ చెరబండరాజు త్రిపురనేని మధుసూదనరావు కె.వి.రమణారెడ్డి నెల్లుట్ల కోదండరామారావు కృష్ణాబాయి సీఎస్ ఆర్ ప్ర‌సాద్‌ వరవరరావు రత్నమాల కళ్యాణరావు వి చె౦చయ్య న‌ల్లూరి రుక్మిణి పాణి వ‌ర‌ల‌క్ష్మి కాశీం అరసవెల్లి క్రిష్ణ మా భూమి సంధ్య రివేరా బాసిత్ చుక్కంబొట్ల రామ్మోహన్ బయటి లింకులు విరసం వెబ్సైటు వర్గం:విప్లవ రచయితలు వర్గం:విప్లవ రచయితల సంఘం
శ్రీశైలం మండలం
https://te.wikipedia.org/wiki/శ్రీశైలం_మండలం
శ్రీశైలం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటైన శ్రీశైల క్షేత్రం ఈ మండలంలో ఉంది. మండలం మొత్తం అడవులు, కొండల మయమైనందువలన వ్యవసాయ యోగ్యం కాదు. ఈ మండలం రాష్ట్రంలోనే అతి తక్కువ స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి గల మండలంగా 2001 జనాభా లెక్కలలో పేరొందొంది. మండలం లోని పట్టణాలు శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్‌షిప్ (ఆర్.ఎఫ్.సి) (సెన్సస్ టౌన్) మండలం లోని గ్రామాలు thumb|శ్రీశైల దేవస్థాన ప్రధాన ముఖద్వారం|280x280px రెవెన్యూ గ్రామలు హటకేశ్వరం శ్రీశైల శిఖరం శ్రీశైలం పర్యాటక ప్రాంతాలు, క్షేత్రాలు శ్రీశైల క్షేత్రం - మల్లికార్జున లింగం శ్రీశైలం ప్రాజెక్టు హటకేశ్వరం శిఖరేశ్వరం సాక్షి గణపతి శివాజీ స్మారక భవనం పంచమఠాలు పాతాళగంగ మూలాలు
కాళహస్తి
https://te.wikipedia.org/wiki/కాళహస్తి
దారిమార్పు:శ్రీకాళహస్తి
భాగవతం - తొమ్మిదవ స్కంధము
https://te.wikipedia.org/wiki/భాగవతం_-_తొమ్మిదవ_స్కంధము
ఇందులో రామాయణము కూడా ఒక భాగము, ఆ రామాయణము నుండి కొన్ని పద్యాలు చూడండి. శ్రీ రామచరిత్ర మత్తేభము: అమరేంద్రాశకుబూర్ణచంద్రుడుదితుండైనట్లునారాయణాం శమునం బుట్టె మదాంధ రావణశిరస్సంఘాతసంఛేదన క్రమణోద్దాముడు రాము డాగరితకు గౌసల్యకున్ నన్ను తా సమనైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్. తూర్పుదిక్కుకు నిండుచంద్రుండు ఉదయించినట్లుగా పొగడదగినదీ, పరిశుద్ధురాలూ, సంసారసాఫల్యాన్ని పొందినదీ, సాటిలేనిసాధ్వి అయినా కౌసల్యకు, గర్వాంధుడైన రావణుని తలలను ఖండించుటలో గడిదేరిన శ్రీ రాముడు నారాయణాంశతో జన్మించాడు. మత్తేభము: సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా నవలీలం దునుమాడె రాము డదయిండై బాలుడై కుంతల చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్ జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకమ్ దాటకన్. బాలుడైన ఆ రాముడు తండ్రి పంపగా యాగాన్ని కాపాడ్డానికి విశ్వామిత్రునివెంట వెళ్ళాడు. వెళ్ళి బంగారు రంగు జుట్టు కలదీ, కవటపు మాటలతో కూడిన నటనకలిగినదీ సూర్యుడి గుఱ్రాలకంటె వడిగా పరుగులెత్తేదీ, చేత డాలుకలిగినదీ అయిన తాటక అనే రాక్షసిని ఏ మాత్రం దయతలచక అవలీలగా నేలకూల్చాడు. కందము: గారామున గౌశికమఖ మా రాముడు గాచి దైత్యు నధికు సుబాహున్ ఘోరాజిద్రుంచి తోలెను మారీచున్నీచు గపటమంజులరోచున్ ఆ రాముడు బలవంతుడైన సుబాహుణ్ణి ఘోరయుద్ధంలో చంపి కపటమైన వేషాన్ని ధరించిన మారీచుణ్ణి తరిమికొట్టి విశ్వామిత్రుడి యాగాన్ని కాపాడాడు. మత్తేభము: ఒక మున్నూఱు గదల్చి తెచ్చిన లలాటో గ్రాక్షుచాపంబు బా లకరీంద్రంబు సులీలమై జెఱుకు గోలం ద్రుంచు చందంబునన్ సకలోర్వీశులు జూడగా విఱిచె దోశ్శక్తిన్ విదేహక్షమా ఒకగేహంబున సీతకై గుణమణి వ్రస్ఫీతకై లీలతోన్ కందము: భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెళ్ళి యాడె బృథుగుణమణి సం ఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్ లోకనాయకుడైన రాముడు గొప్ప గుణవంతురాలూ, అదృష్టవంతురాలూ, చంద్రుణ్ణి అతిశయించిన ముఖకాంతి కలదైన సీతను ప్రీతితో పెండ్లాడినాడు. కందము: రాముడు నిజబాహుబల స్థేమంబున భంగపఱిచె దీర్ఘకుఠారో ద్దామున్ విదళీకృతనృప భామున్ రణరంగభీము భార్గవరామున్. ఆ రాముడు గండ్రగొడ్డలికలిగిన గండరగండడు, రాజుల తేజస్సును పటాపంచలు చేసినవాడు, రణరంగంలో వరవీరభయంకరుడు అయిన పరశురాముణ్ణి భంగపరచాడు. కందము: దశరథుడు మున్ను గైకకు వశుడై తానిచ్చి నట్టి వరముకతన వా గ్దశ చెడక యడవి కనిచెను దశముఖముఖకమలతుహినధామున్ రామున్. దశరథుడు మునుపు కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి మాట తప్పక రావణునిముఖకమలాలకు చంద్రుడైన రామచంద్రుణ్ణి అడవికి పంపాడు. కందము: జనకుడు పనిచిన మేలని జనకజయును లక్ష్మణుండు సంసేవింపన్ జనపతి రాముడు విడిచెను జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్ తండ్రి ఆజ్ఞ తలదాల్చి ఆ రామ చంద్రుడు సీతాలక్ష్మణులు తన్ను సేవిస్తుండగా రాజులచే పూజింపబడేది, శత్రురాజులకు అసాద్యమైనదీ ఐన అయోధ్యను వదలి వెళ్ళాడు. కందము: భరతున్ నిజపదసేవా నిరతున్ రాజ్యమున నునిచి నృపమణి యెక్కెన్ సురుచిరరుచి పరిభావిత గురుగోత్రాచలము జిత్రకూటాచలమున్ ఆ రాజ శ్రేష్టుడు నిజచరణసేవానిరతుడైన భరతుణ్ణి రాజ్యంలో నిలిపాడు. పిమ్మట సుందరమైన కాంతులతో కులపర్వతాలను మించిన చిత్రకూటపర్వతంమీద కాలుపెట్టాడు. ఉత్పలమాల: పుణుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా వణ్యము గౌతమీ విమల వ్:కణ పర్యటన ప్రభూత సా ద్బుణ్య్అము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణయమున్. పుణ్యాత్ముడైన రామచంద్రుడు ఆ విధంగా వెళ్ళి ఋషులకు శరణ్యమూ, పురివిప్పి ఆడే నెమ్మళ్ళతో చూడముచ్చటైనది, పవిత్ర గోదావరీజలాలతొ భాసించేదీ, గొప్పచెట్లతో పొదరిండ్లతో కూడినదీ ఐన దండకారణ్యం అంతటా సంతోషంతో సందర్శించాడు. సీసము (పద్యం): ఆ వనంబున రాము డనుజ సమేతుడై సతితోడ నొక పర్ణశాల నుండ రావణు చెల్లెలు రతిగోరి వచ్చిన మొగి లక్ష్మణుడు దాని ముక్కు గోయ నది విని ఖరదూషణాదులు పదునాల్గు వేవురురా రామవిభుడు కలన బాణానలంబున భస్మంబు గావింప జనకనందన మేని చక్కదనము తేటగీతి: విని దశగ్రీవు డంగజ వివశు డగుచు నర్థి బంచిన జసిడిఱ్రి యై నటించు నీచు మారీచు రాముడు నెఱి వధించె నంతలో సీత గొనిపోయె నసురవిభుడు ఆ అడవిలో రాముడు తమ్ముదితో, భార్యతో ఒక కుటీరంలో ఉండగా రావణుని చెల్లెలైన శూర్పణఖ రాముణ్ణి కామించి వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు దాని ముక్కు కోశాడు. అది విని దండెత్తివచ్చి ఖరదూషణాదులను పద్నాలుగు వేలమందిని రాముడు తన భాణాగ్నితో భస్మం చేశాడు. సీత చక్కదనాన్ని విని మన్మథ పరవశుడైన రావణుడు పంపగా బంగారులేడిగా కపటవేషాన్ని ధరించి వచ్చిన నీచుడైన మారీచుణ్ణి రాముడు వచించాడు. ఆ సమయంలో రావణుడు సీతను అపహరించుకొని పోయాడు. ఉత్పలమాల: ఆ యసురేశ్వరుండు వడి సంబరవీధి నిలాతనూజ న న్యాయము సేసి నిష్కరుణుడై కొనిపోవగ నడ్డమైన ఘో రాయతహేతి ద్రుంచె నసహాయత రామునరే ద్రకార్యద త్తాయువు బక్షవేగపరివేగపరిహాసితవాయువు న జ్జటాయువున్. ఆ విధంగా రావణుడు అన్యాయంగా, ఏ మాత్రం దయలేకుండా ఆకాశమార్గంలో సీతాదేవిని గొనిపోయేటప్పుడు రామకార్యంకోసం ప్రసాదింపబడ్డ ఆయుర్థాయంకలవాడు, వాయువేగాన్ని మించిన వేగం కలవాడు ఐన జటాయువు అడ్డుపడ్డాడు. అప్పుడు రావణుడు నిస్సహాయుడైన జటాయువును కంఠోంమైన ఆయుధంతో ఖండించాడు. వచనము: పిమ్మట ఆ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి సీతను వెదుకుతూ వచ్చి తన కార్యానికై ప్రాణాలను కోల్పోయిన జటాయువుకు పరలోకక్రియలు చేసి ఋశ్యముకానికి వెళ్ళాడు. కందము: నిగ్రహము నీకు వల దిక నగ్రజు వాలిన్ వథింతు నని నియమముతో నగ్రేసరుగా నేలెను సుగ్రీవున్ చరణఘాతచూర్ణగ్రావున్. ఇత నీకి నిర్బంధం అక్కరలేదు. మీ అన్న వాలిని వధిస్తాను అని అభయమిచ్చి పాదాలరాపిడిచేతనే బండలను పొడిచేసే సుగ్రీవుణ్ణి ఆత్మీయులలో అగ్రేసరుణ్ణిగా చేసుకొన్నాడు శ్రీ రాముడు. వచనము: లీలన్ రామవిభుండొక కోలం గూలంగ నేసె గురు నయశాలిన్ శీలిన్ సేవిత శూలిన్ మాలిన్ వాలిన్ దశాస్యమానోన్మాలిన్ శ్రీ రాముడు ఒకే బాణంతో గొప్పనీతిశాలీ, ఈశ్వరుణ్ణి సేవించే వాడూ, రావణుని గర్వాన్ని హరించిన వాడూ ఐన వాలిని కూల్చివేశాడు. కందము: ఇలమీద సీత వెదకగ నలఘుడు రాఘవుడు పనిచె హనుమంతు సతి చ్ఛలవంతున్ మతిమంతున్, బలవంతున్ శౌర్యవంతు బ్రాబవవమ్తున్. గొప్పవాడైన రాముడు సీతను వెదకడానికి మహామహిమాన్వితుడూ, బుద్ధిమంతుడూ, బలవంతుడూ, శౌర్యవంతుడూ, సుగుణవంతుడూ ఐన హనుమంతుణ్ణి నియోగించాడు. కందము: అలవాటు కలిమి మారుతి లలితామిత లాఘవమున లంఘించెను శై వలినీగణసంబంధిన్ జలపూరిత ధరణి గగన సంధిన్ గంధిన్ ఆ హనుమంతుడు నదులకు బంధువూ, భూమికి ఆకాశానికీ గల వ్యవధానాన్ని నీటితో నింపినదీ ఐన సముద్రాన్ని అలవాటు మేఋఅకు అత్యంతలాఘవంతో దాటాడు. వర్గం:హిందూమతం
గజేంద్ర మోక్షం
https://te.wikipedia.org/wiki/గజేంద్ర_మోక్షం
thumb|విష్ణుమూర్తి గజేంద్రున్ని రక్షించడం. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు పల్కుతాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని అడుగగా ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను వివరిస్తాడు . ఇది పోతన రచించిన భాగవతం లోనిది. త్రికూట పర్వత విశేషాలు క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం ఇనుముతో, మరొకటి వెండితో అలరారుతూండేవి. ఆ కొండల మీద రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలముకొనేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకొన్నాయి. గజరాజు జల క్రీడలు ఆడడం అలా ఏనుగులు చేరుకొన్న ఆ సరోవరం అతి విశాలమైనది, ఆ సరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు. ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకొని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరం లోకి ప్రవేశించి నీళ్ళు తాగి, తొండం నిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. అలా నీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలోని కర్కాటక మీనాలు, రోదసిలోని మీన కర్కాటాకాలను చేరినట్లు కనిపించింది. కరిమకర సంగ్రామం ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకొంది. పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది. వేంటనే ఆ మొసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది. ఆ ఏనుగు తన దంతాలతో మొసలిని కుమ్మి విడిచింది. అప్పుడు మొసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. అలా ఆ కరి, మకరం ఒక దానిని ఒకటి కుమ్మి చీల్చుకొంటుండగా కరి బలం సన్నగిల్లుతోంది. జలమే తన నివాసస్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తోంది. ఈ సందర్భాన్ని పోతన తన గజేంద్ర మోక్షం కావ్యంలో ఇలా వర్ణించాడు.కరి దిగుచు మకరి సరసికిగరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్గరికి మకరి మకరికి గరిభర మనుచును నతల కుతల భటు దరుదు పడన్.మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణుడుకి ఈ విధంగా మ్రెక్కింది.కలఁ డందురు దీనులయెడఁ,గలఁ డందురు పరమయోగి గణములపాలంగలఁ డందు రన్ని దిశలను,గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్చె; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;రావే ఈశ్వర; కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా; కరి మొర విని శ్రీమహావిష్ణువు భూలోకానికి రావడం thumb|800x800px|వైకుంఠం తరలి వచ్చే చిత్రం|alt=|center అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై అక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓ మూల సౌధం ( మేడ). ఆమేడ పరిసరాల్లో మందార వనం, అందులో అమృత సరస్సు. అక్కడ పర్యంకము ( మంచం) పై లక్ష్మిదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడునికి ఏనుగు ‘పాహీ! పాహీ! ( రక్షించు,రక్షించు) అని పెట్టిన కేక వినిపించగనే వెంటనే బయలుదేరాడు. భక్తుని రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడేపరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాంతర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ చెప్పలేదు; శంఖచక్రాలను రెండు చేతుల్లోకీ తీసుకోలేదు; సేవకుల నెవరినీ పిలువలేదు; గరుడవాహనాన్నీ సిద్దపరచకోలేదు; చెవి దుద్దు వరకు జారిన జుట్టూ చక్కదిద్దుకోలేదు; ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొం గైనా వదల్లేదు. అలా వెళ్తున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తన మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది. ఏ దుష్ట దుశ్శాసనుడు కబంధ హస్తాలలోనైన చిక్కుకొని ద్రౌపది దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా! మళ్ళి పరమ మూర్ఖుడైన సోమకాసురుడు వేదాలు దొంగిలించడానికి వచ్చాడా! అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా! ప్రహ్లాదుని వంటి భక్తులను హింసించే హిరణ్యాక్షుడు మళ్ళీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది. శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం 800x800px|thumb|గజేంద్రుడిని మహావిష్ణువు రక్షించుట|alt=|centerఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరీచేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచి పెట్టగానే విస్ఫులింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలి తలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని (శంఖం) పూరిస్తాడు. ఆ పాంచజన్యం ధ్వని శత్రు జనానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది. నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకొంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని శ్రీదేవికి చెప్పగా, ఆ లక్ష్మి దేవి దీనుల మొర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది. గజరాజు మకరం జన్మ వృత్తాంతం దేవలుడు అనే ముని శాపం వల్ల హూహూ అనే గంధర్వుడు "మొసలి" రూపం ఎత్తి పరమేశ్వరుని కరుణతో శాపవిమౌచనం పోంది తన పూర్వ గంధర్వరూపాన్ని పోందాడు. ఇంద్రజ్ఞమునుడు అనే రాజు అగస్త్యమహర్షిని ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మ ఎత్తి నానాబాధలు పోంది శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడై వైకుంఠం చేరుకొన్నాడు. బయటి లింకులు తెలుగు వికీసోర్సులో గజేంద్ర మోక్షము, అష్టమ స్కంధములో భాగంగా చదవండి. గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షం - గజేంద్రుని మొర: గజేంద్ర మోక్షం-కొన్ని పద్యాలకు వీడియో పాఠం మూలాలు వర్గం:భాగవతము వర్గం:ఏనుగులు
తెలుగు సంవత్సరములు
https://te.wikipedia.org/wiki/తెలుగు_సంవత్సరములు
దారిమార్పుతెలుగు సంవత్సరాలు
సంగ్రహాలయం
https://te.wikipedia.org/wiki/సంగ్రహాలయం
thumb|School children in the Louvre. thumb|right|The Natural History Museum in London. thumb|right|The Topkapı Museum in Istanbul, Turkey. సంగ్రహాలయం లేదా మ్యూజియం' (museum) ను అంతర్జాతీయ మ్యూజియం కౌన్సిల్ వారు ఇలా నిర్వచించారు - సమాజావసరాలకోసం, జన బాహుళ్యానికి (పబ్లిక్) ప్రవేశ సదుపాయం కలిగిన, విద్యావసరాకు ఉపయోగపడే సంస్థ. (permanent institution). సంగ్రహాలయాలు మానవజాతికి సంబంధించిన దృశ్య, అదృశ్య వారసత్వ సంపద విషయాలను భద్రపరుస్తాయి. ప్రజల విజ్ఞాన, వినోద, సాంస్కృతిక అవసరాలకోసం వారి జీవితాలకు, పరిసరాలకు చెందిన వస్తువులు గాని (వస్తురూపంలో లేని) విషయాలను గాని సంపాదించి, జాగ్రత్తపరచి, పరిశోధన చేసి, సందర్శకులకు వాటిని దర్శించే అవకాశాన్ని సంగ్రహాలయాలు కలుగజేస్తాయి. ఇంకా వివిధమైన నిర్వచనాలున్నాయి. ప్రపంచంలో వేలాది మ్యూజియంలు ఉన్నాయి. కొన్ని ప్రసిద్ధ సంగ్రహాలయాలు ఆంధ్ర ప్రదేశ్‌లో సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాదు బిర్లా సైన్స్ మ్యూజియం, హైదరాబాదు భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం, కడప నాగార్జున కొండ మ్యూజియం, నాగార్జున సాగర్ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సంగ్రహాలయం, హైదరాబాదు భారతదేశంలో జాతీయ మ్యూజియం, న్యూఢిల్లీ ప్రభుత్వ సంగ్రహాలయం, చెన్నై నేషనల్ గేలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, న్యూఢిల్లీ ప్రపంచంలో గిన్నీస్ మ్యూజియం, న్యూయార్క్ ఇవి కూడా చూడండి మూలాలు బయటి లింకులు Tony Bennett, The Birth of the Museum: History, Theory, Politics, Routledge, 1995. సాధారణమైనవి: మ్యూజియంల చరిత్ర యూదు మ్యూజియంల డైరెక్టరి ICOM definition ICOM ఆఫ్రికా మ్యూజియంలు కౌన్సిల్ (AFRICOM) అంతర్జాతీయ మ్యూజియంల కౌన్సిల్ (ICOM) MOLLI (Museum On-Line Learning Initiatives) మ్యూజియం వార్తలు మ్యూజియం వెతుకు MuseumStuff.com -- మ్యూజియం వెబ్సైటుల డైరెక్టరీ మ్యూజియమ్స్ వికి on Wikia Rights and Reproductions Information Network మ్యూజియం నిపుణుల కోసం American Association of Museums అమెరికన్ మ్యూజియం అసోసియేషన్ వారి సమాచారం. మ్యూజియం టాప్ లెవెల్ డొమైనులు (Dot-museum) కళ -మ్యూజియంల మధ్య సహకారం ప్రపంచ మ్యూజియంల బొమ్మలు ప్రపంచ మ్యూజియంల డైరెక్టరీ దేశాల వారీగా మ్యూజియంలు: ఆఫ్రికా మ్యూజియంలు అర్జెంటీనా మ్యూజియంలు బెల్జియం మ్యూజియంలు బ్రెజిల్ మ్యూజియంలు బల్గేరియా మ్యూజియంలు కెనడా మ్యూజియంలు చైనా మ్యూజియంలు కొలంబియా మ్యూజియంలు కోపెన్ హాగెన్ (డెన్మార్క్) మ్యూజియంలు ఎస్టోనియా మ్యూజియంలు ఫిన్లాండ్ మ్యూజియంలు ఫ్రాన్సు మ్యూజియంలు జర్మనీ మ్యూజియంలు గ్రీస్ మ్యూజియంలు ఇండియా మ్యూజియంలు పెరూ మ్యూజియంలు పోలెండ్ మ్యూజియంలు రష్యా మ్యూజియంలు టర్కీ మ్యూజియంలు యు.కె. మ్యూజియంలు అమెరికా మ్యూజియంలు అమెరికా చారిత్రిక మ్యూజియంలు వర్గం:సంగ్రహాలయాలు
భారతీయ నాట్యం
https://te.wikipedia.org/wiki/భారతీయ_నాట్యం
thumb|నటరాజ శివతాండవం|alt=భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య, నృత్య రీతులను భారతీయ నాట్యం, భారతీయ నృత్యం అంటారు. దేశంలో అనేక నాట్యరీతులు కానవస్తాయి. శాస్త్రీయంగా చూస్తే ప్రతీ రాష్ట్రంలోనూ సాంస్కృతిక నృత్యాలు ఉన్నాయి. అలాగే భారతీయ సినిమా రంగంలో నాట్యం ప్రత్యేకత సంతరించుకొని, ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నది. నాట్యం(Dance) అనేది ఫ్రెంచి పదం డాన్సెర్ నుండి ఉద్భవించింది. దీనిని సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలుగా చెప్పుకోవచ్చు. అంటే లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం అన్నమాట. భారతీయ నాట్యరీతులు అనేక విధాలున్నా వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. అవి సంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు జానపద, గిరిజన నృత్యాలు. ఇవే కాకుండా ప్రస్తుతం అన్ని రీతులనూ, ప్రధానంగా పాశ్చాత్య, దేశీయ విధానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయి. సినిమా రంగంలో ఇవి ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. వీటిని ఆధునిక నృత్యాలు అనవచ్చు. భారతీయ శాస్త్రీయ నృత్యం భారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలుతో కళకళలాడుతోంది. భారతదేశంలో శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం. బిన్న సంస్కృతులతో కూడిన భారతదేశంలో సంస్కృతికి అనుగుణంగా భిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది, ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. నాట్యం శాస్త్రీయ నృత్యం కావాలంటే భరతముని బోదించిన నాట్య శాస్త్రంలో విధంగా అభినయం, నాట్యం కలిసి ఉండాలి. శాస్త్రీయ నాట్యరీతులు కూచిపూడి భరతనాట్యం కథక్ కథకళి మణిపురి ఒడిస్సీ మోహినీ ఆట్టం సత్త్రియ నృత్యం యక్షగానం జానపద నాట్యరీతులు ఆంధ్రా: వీధి నాటకం, బుర్రకథ, గంటమర్ధాల, కోలాటం, పేరిణి, తోలుబొమ్మలాట, ధింసా నృత్యం, చిందు నృత్యం అసోం: బిహు, ఖేల్ గోపాల్, రస్ లీల్, కనోయ్, తబల్ చోంగ్లి, అంకియనాత్ బీహార్: జతాజతిన్, జదుర్, ఛౌ, కథాపుత్లి, బఖో, జిజియా, సమోచక్వా, కర్మ, గాట్నా, నాట్నా గుజరాత్: గర్భ, దాఁడియారస్, టిప్పణి, గోంఫ్, భావై గోవా: ధక్తో, షిగ్మో, తలగడి, టోంగమేల్, మూసల్ ఖేల్, కొర్రిడింబో హర్యానా : జుమర్, ఫాగ్, దాఫ్, ఢమాల్, లూర్, గుగ్గ, ఖోరియా, గగోర్, స్వాంగ్ హిమాచల్ ప్రదేశ్ : జోరా, జూలి, దాఁగి, మహాసు, జద్దా, జైంతా, చర్హి, గిద్దా ఫర్హాన్, లుడ్డి, ముంజ్రా, గూర్ఖాలి జమ్ము కాష్మీర్ : రౌఫ్, హికత్, చక్రి, కుడ్, దమాలి, దండినాధ్ కర్ణాటక : హుత్తరి, సుగ్గి, కునిత, యక్షగానం కేరళ : కైకొత్తికళి, కలియాట్టం, తప్పటిక్కలి, కూడియాట్టం మహారాష్ట్ర : తమాషా, కథాకీర్తన్, లెజిమ్, దండానియా, గఫా, దహికల, లోవని, మౌని, దశావతార్ (బొహాడ) మధ్యప్రదేశ్ : మాచా ఒడిషా : గుమార సంచార్, చాద్యా దండనాధ పంజాబ్ : గిద్దా (మహిళలు), భాంగ్రా (పురుషులు), నక్వల్, భాంద్ రాజస్థాన్ : గినాడ్, గంగోర్, తెరహ్ తాల్, ఖయాల్, జులన్ లీలా, జుమా, సుయిసిని, గోపికాలీల, చామర్ గిందా తమిళనాడు : పిన్నల్ కోలాటం, కోలాటం, కుమ్మి, కావడి, కరగమ్, వెదురు నాట్యం, త్రాడు నాట్యం ఉత్తర ప్రదేశ్ : నౌతంకి, రస్ లీల, చప్పేలి, కజ్రి, జోరా, రామ్ లీల పశ్చిమ బెంగాల్ : కథి, జాత్ర, బౌల్, కథా కీర్తన్, లామా తెలంగాణ : పేరిణీ నృత్యం చిత్రమాలిక ఇవీ చూడండి జానపద సాహిత్యం జానపద నృత్యం నృత్యంలో భారతీయ మహిళల జాబితా మూలాలు "భిన్న సంస్కృతుల మేళవింపు భారతీయ నాట్యం" - వ్యాసం - ఈనాడు 30-12-2008 - రచన: సిహెచ్.కృష్ణప్రసాద్ బయటి లింకులు Dance: The Living Spirit of Indian Arts by Prof. P.C. Jain and Dr Daljeet Classical Dance forms of India Indian Dance in Australia at Australia Dancing Bollywood Dance New York వర్గం:నృత్యం
పురస్కారాలు
https://te.wikipedia.org/wiki/పురస్కారాలు
అంతర్జాతీయస్థాయి పురస్కారాలు thumb|మిన్నెసోటాలోని రోచెస్టర్‌లోని మాయో క్లినిక్‌లోని పరిశోధకులకు 1950 లో ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో నోబెల్ బహుమతి పతకాలలో ఒకటి (ముందు వైపు) నోబెల్ పురస్కారం: వివ్విధ శాస్త్ర, సాహిత్య, సామాజిక రంగాల్లో విశిష్ట సేవ చేసిన ప్రముఖులకు ఏటా ఇచ్చే పురస్కారం బుకర్ బహుమతి: ప్రతి సంవత్సరం సాహిత్యంలో ఉత్తమ నవలకు ఇచ్చే పురస్కారం. ఆస్కార్ పురస్కారం: చలచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే పురస్కారం జాతీయస్థాయి పురస్కారాలు భారతరత్న: ప్రసిద్ధి చెందిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారం పద్మ పురస్కారం: పద్మవిభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ పురస్కారాలు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: సినిమా రంగ ముఖ్యులకు ఇచ్చే పురస్కారం జ్ఞానపీఠ అవార్డు: భారతీయ సాహితీకారులకు ఇచ్చే పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు: వివిధ భారతీయ భాషల్లో వచ్చే అత్యుత్తమ పుస్తకాలకు ఇచ్చే ఏటా పురస్కారం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు: జాతీయ సాహస పురస్కారాలు - అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు భారత ప్రభుత్వం ప్రదానం చేసే అవార్డుల సముదాయం అశోక చక్ర పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారాలు నంది పురస్కారాలు: తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు రఘుపతి వెంకయ్య పురస్కారం: జీవిత కాలంలో అత్యుత్తమ కృషి చేసిన తెలుగు సినిమా కళాకారులకు ఇచ్చే పురస్కారం రాజాలక్ష్మీ ఫౌండేషన్ పురస్కారం: తెలుగు ప్రముఖులకు ఇచ్చే పురస్కారాలు కళాప్రపూర్ణ: కళాకారులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చే గౌరవ డాక్టరేట్. తెలంగాణ ప్రభుత్వ పురస్కారాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు: ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అందించే పురస్కాం. దాశరథి సాహితీ పురస్కారం: ప్రతి సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య జయంతి (జూలై 22) సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి అందజేసే పురస్కారం. కాళోజీ సాహిత్య పురస్కారం: ప్రతి సంవత్సరం కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబరు 9) సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలలో భాగంగా భాషా, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి అందజేసే పురస్కారం. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:పురస్కారాలు
చేతి పనులు
https://te.wikipedia.org/wiki/చేతి_పనులు
చేతివృత్తులు , కులవృత్తులు మన సమాజంలో అనాదిగా ఉన్నాయి. ఆయా వృత్తుల పేర్లతోనే కులాలు ఏర్పడ్డాయి. అయితే ఈనాడు కులవృత్తులు కుప్పకూలుతున్నాయి. ఈ వృత్తుల్నే నమ్ముకున్న వారి జీవితాలు తెల్లారిపోతున్నాయి. ఆధునిక పనిముట్లు ఉన్న ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. చేతిలో చేవఉన్నా పనిలేక బలహీనవర్గాలు నలిగిపోతున్నాయి. ఆధునిక పరిస్థితులకు తగ్గట్లుగా చేతివృత్తుల్ని తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలి. 11 బీసీ కులాలకు సమాఖ్యలు ఏర్పాటుచేసింది ప్రభుత్వం. చాకిరేవు thumb|313x313px|దోభీ ఘాట్ లో బట్టలు శుబ్రం చేయుచున్న చిత్రం రజక వృత్తి , చాకలిపని: డ్రై క్లీనింగ్ కేంద్రాలు, ఆధునిక వాషింగ్ యంత్రాలు చాకలివాళ్ళకు ఉపాధి అందనియ్యలేదు. డ్రై క్లీనింగ్ కేంద్రాలు పెడదామంటే పెట్టుబడిపెట్టే స్తోమతలేని బడుగు బతుకులు వీరివి. 1982లో రజక సహకార సంఘాల సమాఖ్యఏర్పడింది. రజక సహకార సంఘాల సమాఖ్య ద్వారా ఏటా రూ.50 లక్షలు దోభీ ఘాట్ల నిర్మాణానికి రుణాలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమాఖ్య పరిధిలో మూడున్నర వేలకు పైగా రజక సహకార సంఘాలున్నాయి. సెలూన్ నాయి బ్రాహ్మణ వృత్తి, మంగలిపని, క్షౌరం చేయటం.1989లో నాయి బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య ఏర్పాటయింది రాష్ట్ర నాయిబ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్యలో 2 వేల నాయిబ్రాహ్మణ సంఘాలున్నాయి. ఒక్కో సభ్యుడికి రూ. 10 వేల ఋణం ఇస్తారు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ రంగంలోకొస్తున్న నేపథ్యంలో ఆధునిక సెలూన్లు పెట్టుకోవడానికి రుణాలివ్వాలని ఆ వర్గాలు కోరుతున్నాయి. వడ్డెర వడ్డెర సహకార సంఘాల సమాఖ్య లో రాష్ట్రవ్యాప్తంగా 2016 సంఘాలున్నాయి. సంఘంలో ఒక్కో సభ్యునికి రూ.10వేలు రుణం వస్తోంది. వీటితో పలుగు, పార కొని, మట్టిపని, రాళ్లపని, కంకర తదితర పనులు చేసే వడ్డెర్లకు జేసీబీ, క్రషర్ల రూపంలో ఉపాధి గండిపడుతోంది. ఒక్కో యంత్రానికి రూ.3 లక్షలకు పైగా అవసరం. సంఘాలకు సంయుక్తంగా ఆధునిక యంత్రాలు అందించాలని వడ్డెర్లు కోరుతున్నారు. బొమ్మల తయారీ కలంకారీ , కొండపల్లి బొమ్మలు , నక్కపల్లి లక్క బొమ్మలు తయారీలో అన్ని కులాలవాళ్ళూ ఉన్నారు. చేతివృత్తుల సహకార సంఘాల సమాఖ్యలు 1982 రజక సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ 1989 నాయిబ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య --బీసీ సంక్షేమశాఖ 2009విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య--పరిశ్రమలశాఖ శాలివాహన సహకార సంఘాల సమాఖ్య--పరిశ్రమలశాఖ మేదరి సహకార సంఘాల సమాఖ్య--పరిశ్రమలశాఖ దర్జీ సహకార సంఘాల సమాఖ్య--పరిశ్రమలశాఖ దూదేకుల సహకార సంఘాల సమాఖ్య--మైనారిటీ సంక్షేమశాఖ పూసల /కృష్ణబలిజ సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ ఉప్పర (సగర) సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ బోయ /వాల్మీకి సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ భట్రాజు ల సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ సమాఖ్యలకు కార్యాలయాలు, సిబ్బంది , బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. ఒక్కో సమాఖ్యకు రూ.కోటి చొప్పున కేటాయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ గత ఏడాది అసెంబ్లీలో ప్రకటించారు. చేతి, వృత్తిదారులను ఆదుకునే పేరుతో 2005-06లో 'రాజీవ్ అభ్యుదయ యోజన'ను ప్రవేశపెట్టింది. పథకం కింద కులవృత్తులు చేసుకునే వారికి ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం అందజేస్తారు. ఒక్కో యూనిట్ కింద రూ.3 వేలకు మించి మంజూరుచేయడం లేదు. మూలాలు https://web.archive.org/web/20090822204052/http://www.eenadu.net/archives/archive-9-8-2009/panelhtml.asp?qrystr=htm%2Fpanel12.htm వర్గం:వృత్తులు
అలంకారం
https://te.wikipedia.org/wiki/అలంకారం
Ramabanam tagili Vali valipoyanu 1. శబ్దాలంకారాలు శబ్ద ప్రాధాన్యం గలవి శబ్దాలంకారాలు. వృత్త్యానుప్రాసాలంకారం: ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడింది ఉదాహరణ: చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్. మరొక్క ఉదాహరణ పద్యంలో గడన గల మగని జూసిన,అడుగడుగున మడుగులిడుదురు అతివలు తమలో, గడనుడిగిన మగని జూసిన నడుపీనుగ వచ్చె ననుచు నగుదురు సుమతీ. ఈ పద్యంలో డ అనే అక్షరం పలుమార్లు వచ్చి శబ్దాలంకారాన్ని చేకూర్చింది. అలాగే వచనములో కూడా శబ్ధాలంకరానికి మరొక ఉదాహరణ: (అల్లసాని పెద్దనగారి మనుచరిత్రము లో) అనినన్ జిటిలుండు పటపటమని బండ్లు గొరికి, యటమటంమ్మున విద్య గొనుటయుంగాక గుట గుటలు గురుతోనా యని ..... ఇందులో ట అను అక్షరము పలుమార్లు వచ్చింది. ఛేకానుప్రాసాలంకారం: అర్థ భేదము గల రెండేసి అక్షరములు వ్యవధానము లేకుండా వెనువెంటనే వచ్చుట. ఉదాహరణ: భీకర కర వికరముల్. హారతి హారతి కి ఇచ్చిరి. నందన నందన నీకు వంద వందనాలు సుందర దరహాస రుచులు. లాటానుప్రాసాలంకారం: అర్థభేధం లేక తాత్పర్య భేదం కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము. ఉదాహరణ: శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. మానవత్వము గలుగు మనిషి మనిషి . తల్లిదండ్రులను సేవించు సుతులు సుతులు . విద్య నభ్యసించు విద్యార్థులు విద్యార్థులు . ప్రభా ధనులు నా కనులలో కనుము కనుము . యమకాలంకారం: అర్థభేదముగల అక్షరాల సమూహమును మరల మరల ప్రయోగింపబడినచో దానిని యమకము అంటారు. ఉదాహరణ: పురమునందు నందిపురమునందు. ఓ హారికా జోహారికా మనసు భద్రమయ్యే మన సుభద్రకు . లేమా దనుజుల గెలవగ లేమా. ముక్తపదగ్రస్తాలంకారం: విడిచిన పద భాగము అవ్యవధానముగా మరల గ్రహించుచు వ్రాయబడిన అది ముక్తపదగ్రస్తము. ఉదాహరణ: ఓ రాజా! శత్రువులను జయించుము, జయించి రాజ్యమును పొందువు. పొంది ప్రజలను పాలింపుము. పాలించి సుఖమును పొందుము. మార సుందర, సుందర ధీర మూర్తి, మూర్తి గత లో ప పూజితాంగ, అంగ విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల దానం, దానం వల్ల సుఖం లభిస్తాయి. అంత్యప్రాసాలంకారం: మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. ఉదాహరణలు: 1. తోటలో నారాజు తొంగి చూసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. 2. భాగవతమున భక్తి జీవితమున రక్తి. 3. భాగవతమున భక్తి, భారతంలో యుక్తి, రామ కథ యే రక్తి 2. అర్థాలంకారాలు అర్థ విశేషములను బట్టి వచ్చునవి అర్థాలంకారములు. లాగా తెల్లగా ఉంది). (ఓ కృష్ణ నీ కీర్తిి హంసవలె ఆకాశగంగ యందు మునుగు చున్నది). (దూడ పాలు తాగుతున్న సేపు తల్లి ఆవు పైన ఈగ సోకినను పాషాణ దేనువు వలె కదలక నిలిచి ఉన్నది). ( స్వాతి ముఖం చంద్రబింబము వలె అందముగా వుంది) . ఉపమాలంకారము లో నాలుగు అంశాలు ఉంటాయి. అవి 1. ఉపమానము: పోలికగా చెప్ప బడినది. 2. ఉపమేయం: పోల్చబడింది. 3. సమాన ధర్మం: ఉపమేయ ఉపమానాలకున్ను సమాన ధర్మాన్ని తెలిపేది . 4. ఉపమా వాచకం: ఉపమేయ సమాన ధర్మాలను కలిపి చెప్పడానికి ఉపయోగించే అక్షరాలు, పదాలు. అన్వయాలంకారం: ఉపమానము, ఉపమేయము ఒకటే వస్తువగుచో అది అన్వయాలంకారం. ఉదాహరణ: (రచిత్ రచిత్ వలె అతిలోక సుందరుడు). (రామ రావణ యుద్ధము రామ రావణ యుద్ధము వలె ఉన్నది). (చంద్రుడు చంద్రుని వలె కాంతిలో గొప్పవాడు). ఉపమేయోపమ అలంకారం: రెండు వస్తువులకు పర్యాయ క్రమమున ఉపమేయ ఉపమానత్వమును కల్పించి చెప్పడం ఉపమేయోపమ అలంకారం. ఉదాహరణ: (రాజా నీయందు ధర్మము అర్ధము వలెను, అర్థముు ధర్మము వలెను శ్రీమంతులు). (ఆ నరసింహినుకిిిిి ఈ నరసింహ రాయలుు సాటి, ఈ నరసింహ రాయలకు నరసింహుడు సాటి). ప్రతీపాలంకారం: ఉపమానముగా ప్రసిద్ధమయిన దానిని, ఉపమేయంగా కల్పించి చెప్పడం ప్రతీపాలంకారం. అంటే ఉపమానం కావలసింది ఉపమేయంగా మారినందువల్ల రెండింటినీ ఉపమేయాలుగానే భావించవలసి వస్తుంది. ఉదాహరణ: (పద్మముు నీ లోచనము తో సమానం.) (సూర్యుడు నీ ముఖము తో సమానుడు). రూపకాలంకారం: ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని అరోపించడం రూపకాలంకారం. ఉపమేయమునకు ఉపమానం తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం రూపకం. ఒకటి అభేద రూపకం, రెండవది తాద్రూప్య రూపకం.ఉదాహరణలు: (ఓ రాజా నీ యశశ్చంద్రిక లు దిగంతాలకు వ్యాపించి ఉన్నాయి)( మా నాన్నగారి మాటలే వేదమంత్రాలు) (ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే.) (ప్రజస్వత్ తేనె పలుకులు అందరికీ ఇష్టమే) పరిణామాలంకారం: ఉపమానం ఉపమేయముతో తాదాత్మ్యమును పొంది క్రియను నిర్వహించిన అది పరిణామాలంకారం. ఉల్లేఖాలంకారం: ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా కనిపించడం ఉల్లేఖాలంకారం. ఉదాహరణలు:(ఆ రాజు ప్రజల చేత దేవుని గాను, యాచకుల చేత కల్ప వృక్షము గాను, విరోధుల చేత రౌద్రుని గాను చూడ బడుతాడు.) (శరత్ వక్తృత్వ మునందు బృహస్పతి, కీర్తి యందు అర్జునుడు, విలువిద్య యందు భీష్ముడునాడు) స్మృతి భ్రాంతిమద అలంకారం: ఒక దానిని చూచి మరొకటిగా భ్రమించినచో అది భ్రాంతిమద అలంకారం. ఉదాహరణ:(ఆ మేక ఈ రైతు ని కసాయివాడని అనుకొని,భయం తో అక్కడి నుండి పారిపోయింది. ) సందేహాలంకారం: సందేహం (అనిశ్చయ జ్ఞానం) వలన ఏర్పడే అలంకారం సందేహాలంకారం. ఉదాహరణ:(ఈమె ముఖము పద్మమో చంద్రుడో నిిశ్చయములేదు.) అపహ్నుతి ఉత్ప్రేక్షాలంకారం: ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం. ఉదాహరణలు: ( ఆ యేనుగు నడిచే కొండా అనిపించుచున్నది). (చీకటిలో నీడను చూసి దెయ్యం ఏమో అనుకున్నాను). (దూరముగా ఉన్న తాడుని చూసి పాము ఏమో అని భయపడ్డాను.) అతిశయోక్త్యలంకారం: చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం. తుల్యయోగిత దీపకాలంకారం: ప్రకృతాప్రకృతములకు ధర్మైక్యం చేసి చెప్పడం దీపకాలంకారం. ఆవృత్తిదీపకము ప్రతివస్తూపమాలంకారం: రెండు వాక్యముల కొక సామాన్య ధర్మముతో అన్వయం ఉంటే అది ప్రతి వస్తూపమాలంకారం. అంటే ప్రతి వాక్యార్ధంలోనూ ఒకే సమాన ధర్మాలను భిన్న పదాలచేత తెలియజేయడం. దృష్టాంతాలంకారం: రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెబితూ ఉంటే అది దృష్టాంతాలంకారం. ఉదాహరణలు:( ఓ రాజా నీవేే కీర్తిమంతుడు చంద్రుడే కాంతి వంతుడు)( సత్య పురుషుడు తననెవరూ కోరక పోయిన మేలుు చేస్తూ లోకానికి ఆనందం కలిగిస్తాడు. కలువలను వికసింప చేయమని చంద్రుని ఎవరు ప్రార్థిస్తారు) నిదర్శన వ్యతిరేకాలంకారం: ఉపమేయ ఉపమానములకు పోలికతో పాటు భేదమును కూడా చెప్పినచో అది వ్యతిరేకాలంకారం. సహోక్తి వినోక్తి సమాసోక్తి పరికరాలంకారం: సాభిప్రాయ విశేషణాలతో కూడినచో అది పరికరాలంకారం. పరికరాంకురం శ్లేషాలంకారము: అనేకార్థాల నాశ్రయించుకొని యుండిన ఎడల అది శ్లేషాలంకారం. ఉదాహరణ: మానవ జీవితం సుకుమారం. 1) మా నవ జీవితం సుకుమారమైనది మనవ జీవితం సుకుమారమైనది 2) మీ  సంగతి ఏమిటి? మీసం గతి ఏమిటి? 3) గురూజీ వనం బాగుందా? గురూ జీవనం బాగుందా? 4) మాట  మాట పెరిగింది.    మా  టమాట పెరిగింది. 5) ఆహారం చూడు ఎంత బాగుందో! ఆ హారం చూడు ఎంత బాగుందో! 6) మాతా తమరు నిమిషంలో చేరారు.     మా తాత మరునిమిషంలో చేరారు. 7) నావ లతలపై పడింది.   నా వల తలపై పడింది. 8) ఆమె కవితలతో జీవనం చేయును.   ఆమె కవి తలతో జీవనం చేయును. 9)మాతా  మరను పట్టుకో.   మా తామరను పట్టుకో. అప్రస్తుత ప్రశంసాలంకారం: ప్రస్తుతమును ఆశ్రయించుకొని, అప్రస్తుతమును తలచుకొన్నచో అది అప్రస్తుత ప్రశంసాలంకారం. ప్రస్తుతాంకురం పర్యాయోక్తము వ్యాజస్తుతి అలంకారం: పైకి నిందిస్తున్నట్లుగా కనిపించినా తరచిచూస్తే స్తుతి చేస్తున్న విధం కనిపిస్తుంది. పైకి స్తుతిస్తున్నా తరచిచుస్తే నిందిస్తున్నట్లు కనిపిస్తుంటే వ్యాజస్తుతి అలంకారం.ఉదాహరణలు:(ఓ గంగా పాపాత్ములను కూడా స్వర్గమునకు చేర్చు నీకు వివేకము లేదు) ( ఓ ధూ తిక, బాగు బాగు! నా కోసం నీవు దంతాల చేత, గోర్ల చేత గాయాలు పొందావు. ఇంతకంటే ఏమి చేయగలవు.) దూది కాక వ్యాజనిందాలంకారం: నింద చేత మరియొక నింద స్ఫురించటం వ్యాజనిందాలంకారం. ఆక్షేపము విరోధాభాసాలంకారం: విరోధమునకు అభాసత్వము కలుగుచుండగా విరోధాభాసం అవుతుంది. పైకి కనిపించే విరోధం విరోధంగా కాకుండా విరోధం ఉన్నట్లుగా అనిపించి, ఆలోచిస్తే ఆ విరోధం అభాసం (పోతుంది) అవుతుంది. కనుక ఇది విరోధాభాసాలంకారం. విభావన విశేషోక్తి అలంకారం: సమృద్ధంగా కారణం ఉండి కూడా కార్యోత్పత్తి జరగక పోవడం విశేషోక్తి అలంకారం. అసంభవము అసంగతి విషమాలంకారం: అనను రూపాలయిన (సమాలు కాని) రెండింటికి సంబంధం వర్ణింపబడిన ఎడల అది విషమాలంకారం. సమం చిత్రం అధికము అల్పము అన్యోన్యము విశేషము వ్యాఘాతం కారణమాల ఏకావలి మాలాదీపకము సారాలంకారం: పూర్వపూర్వముల కంటే ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటే తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు. యథాసంఖ్య అలంకారం: ఒక దాని తరువాత ఒకటిగా వరుసగా సమాన సంఖ్యాకాలయ్యే వాటి యొక్క సముదాయం యథాసంఖ్య లేదా క్రమ అలంకారం. పర్యాయము పరివృత్తి పరిసంఖ్య వికల్పము సముచ్చయము కారకదీపకము సమాధి ప్రత్యనీకము కావ్యార్థాపత్తి కావ్యలింగాలంకారం: సమర్థనీయమయిన అర్థానికి సమర్థనం కావ్యలింగాలంకారం. అర్థాంతరన్యాసాలంకారం: సామాన్యం చేత విశేషం గాని, విశేషం చేత సామాన్యం గాని సమర్థింప బడితే అది అర్థాంతరన్యాసాలంకారం. ఉదాహరణలు: (శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు వీరులకు సాధ్యము కానిది లేదు కదా!) ( ప్రవరుడు హిమాలయాలలో తిరుగుతూ తన పాద లేపనము కరిగిపోవడం తెలియలేదు దైవ కృతము నకు అసాధ్యం లేదు కదా.) వికస్వరము ప్రౌడోక్తి సంభావన మిథ్యాధ్యవసితి లలితము ప్రహర్షణము విషాదము ఉల్లాసము అవజ్ఞ అనుజ్ఞ లేశము ముద్ర రత్నావళి తద్గుణాలంకారం : స్వీయ గుణాన్ని వదిలేసి మరొక దాని గుణాన్ని స్వీకరించటం వర్ణించినట్లయితే అది తద్గుణాలంకారం. పూర్వరూపము అతద్గుణము అనుగుణము మీలితము సామాన్యము ఉన్మీలితము విశేషము ఉత్తరము సూక్ష్మము పిహితము వ్యాజోక్తి గూడోక్తి వివృతోక్తి యుక్తి లోకోక్తి అలంకారం: సందర్భాన్ని అనుసరించి ఒక సామెత లేదా నానుడి చెప్పడం లోకోక్తి అలంకారం. ఛేకోక్తి అలంకారం: లోకోక్తితో పాటు అర్థాంతర స్ఫురణం కూడా ఉండటం ఛేకోక్తి అలంకారం. వక్రోక్తి అలంకారం: శ్లేష వలన గాని, కాకువు వలన గాని అన్యార్ధం కల్పించబడిన అది వక్రోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం: జాతి, గుణ, క్రియాదుల చేత దాని స్వభావాన్ని వర్ణించిన ఎడల అది స్వభావోక్తి అలంకారం. ఉదాహరణలు:( శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడె పై పెదవితో, కదలాడే కనుబొమ్మ ముడితో, గొప్ప హుంకార ముతో, గర్జిస్తూ ఉన్నాడు.) భావికము ఉదాత్తాలంకారం: సమృద్ధిని గాని, అన్యోపలక్షిత మయిన శ్లాఘ్య చరిత్రను గాని వర్ణించిన ఎడల అది ఉదాత్తాలంకారం అవుతుంది. అత్యుక్తి నిరుక్తి ప్రతిషేధము విధి హేతువు ఇవి కూడా చూడండి సామెతలు తెలుగు సాహిత్యము తెలుగు మూలాలు తెలుగు వ్యాకరణము, వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999. అలంకారాలు - పాఠాలు పర్మినెంట్ మేకప్ు ాలోకము వెలుపలి లంకెలు వర్గం:తెలుగు వ్యాకరణం వర్గం:అలంకారములు
జాతీయములు
https://te.wikipedia.org/wiki/జాతీయములు
"జాతీయములు " లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు. ఆంగ్ల భాషలో "జాతీయము " అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - idiom as words collocated together happen to become fossilized, becoming fixed over time.Saeed, John I. (2003), Semantics. 2nd edition. Oxford: Blackwell. Page 60. అనగా తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా ఘనీభవించింది. కనుక భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును. పుట్టుక thumb|ప్రేమ గుడ్డిది సామాన్యంగా జాతీయాలను పని గట్టుకొని ఎవరు పుట్టించరు. అలా పుట్టించినా అవి కలకాలం ప్రజల నోళ్ళలో వుండవు. జాతీయములు ఒక భాషలో సహజంగా పుట్టి ప్రజల నోళ్ళలో నానుతుంటాయి. తరతరాలుగా అలా వాడుకలో వుంటూనే వుంటాయి. సామెతలతో పోలిక కొన్ని జాతీయాలను సామెతగాను, సామెతలను జాతీయాగాను పొరబడు సందర్భాలున్నాయి. నిజానికి ఈ రెండు వేరు వేరు. సామెతలోని అర్థం సంపూర్ణము. ఉదాహరణ: సామెత. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట./ కాకిపిల్ల కాకికి ముద్దు. / తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము. ఇలా... ఇందులో అర్థ సంపూర్ణము. దాన్ని అన్వయించడములో కొంత తేడా కనబడుతుంది. జాతీయములో అర్థం అసంపూర్ణం. సగం వాఖ్యమే వుంటుంది. జాతీయము: ఉదాహరణ:..కడతేర్చాడు / కడుపు మంట. / కన్నాకు./ అగ్గినిప్పు./ పంటపండింది. పంటికిందరాయి./పక్కలోబల్లెం ఇలా వుంటాయి. పైగా వాటి నిజార్థాలు వేరుగా వుంటాయి. మరొక అర్థంలో వాటిని వాడతారు. ఉదాహరణకు.... పంట పండింది. అనగా అతని వరిపంట పండిందని అర్థం కాదు. అతనొక గొప్ప విజయము సాదించాడని అర్థము. పప్పులో కాలేశాడు. అనగా పప్పులో నిజంగా కాలేశాడని కాదు గదా. అనగా పొరబడ్డాడు అని అర్థము. ఇంతటి గూడార్థమున్నా జాతీయాలు సామాన్య మానవులు.... చదువులేని వారికి సైతం అర్థం అయి వారే ఎక్కువగా వాడు తుంటారు. అందుచేత జాతీయాలు ఆ భాషకు ఆభరణాలు అని చెప్పవచ్చు. (అకారాది క్రమంలో వివిధ జాతీయాలు ఇవ్వబడ్డాయి. ప్రక్కనున్న లింకుల ద్వారా ఆయా వ్యాసాలకు వెళ్ళవచ్చును) ఇవి కూడా చూడండి సామెతలు పుస్తకాలు "తెలుగు జాతీయాలు" : బూదరాజు రాధాకృష్ణ, ప్రగతి పబ్లిషర్స్, 1999. జాతీయ సంపద - తెలుగు నేర్చుకునేవారికి సామెతలు, జాతీయాలు, భవిష్యనిధి వివరణలతో, ఆరి శివరామకృష్ణయ్య, 2008. తెలుగు జాతీయములు ప్రథమ భాగం-మధురకవి:నాళముకృష్ణ రావు మూలాలు బయటి లింకులు *
హనుమకొండ జిల్లా
https://te.wikipedia.org/wiki/హనుమకొండ_జిల్లా
హన్మకొండ జిల్లా, భారతదేశం, తెలంగాణ రాష్ట్రం లోని జిల్లా. ఈ జిల్లా పరిపాలన కేంద్రం హన్మకొండ పట్టణం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో లోగడ ఉన్న వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తూ 2021 ఆగస్టు 12 న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గణాంకాలు 250px|హన్మకొండ జిల్లా కార్యాలయం|alt=హన్మకొండ జిల్లా కార్యాలయం|thumb 2011 భారతీయ జనాభా గణాంకాలను అనుసరించి వరంగల్ జిల్లా జనాభా 759,594. వీరిలో పురుషుల శాతం 51%. స్త్రీల శాతం 49%. 2001 భారత జనగణన గణాంకాల ప్రకారం వరంగల్ జిల్లా అక్షరాస్యత 84.16%. ఇది జాతీయ అక్షరాస్యత 69.5% కంటే అధికం. వీరిలో పురుషుల అక్షరాస్యత 91.54%. స్త్రీల అక్షరాస్యత 76.79%. వరంగల్ జిల్లాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు 11% మంది ఉన్నారు. 1981 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ జిల్లా జనాభా: 22,99,61, స్త్రీ, పురుషుల నిష్పత్తి 987:1000, అక్షరాస్యత 23.84 శాతం (మూలం:ఆంధ్రప్రదేశ్ దర్శిని.1985) జిల్లా చరిత్ర thumb|11వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాధుని విగ్రహం ( రాష్ట్ర మ్యూజియం)|alt=|407x407px సా.శ.12-14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి మొదటి రాజధాని హనుమకొండ. కాకతీయుల నిర్మించిన ఎన్నో కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయ పాలకులు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు (1050-1080), రెండవ బేత రాజు (1080 - 1115), రెండవ ప్రోల రాజు (1115-1158), రుద్ర దేవుడు (1158-1195), మహా దేవుడు (1195-1199), గణపతిదేవ చక్రవర్తి (1199-1261), రుద్రమ దేవి (1258-1290), ప్రతాపరుద్రుడు ( 1290-1326). 14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమైంది. తరువాత అది ముసునూరి నాయకులు, రేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యంలో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో వరంగల్లుతో సహా హైదరాబాదు భారతదేశంలో కలిసి పోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరించిది.1996 వ సం.లో వరంగల్ పట్టణ అభివృద్ధికి కేంద్ర పభుత్వం నిధులను మంజూరు చేసింది. 1969లో తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం జరుగుతున్నట్లు మిగిలిన ఆంధ్రరాష్ట్ర ప్రజలపట్ల చూపుతున్న శ్రద్ధ తమ పట్ల చూపకుండా పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నట్లు తలచారు. ఫలితంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమం కారణంగా వరంగల్ జిల్లాలో విషాదపరిస్థితిని ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితిలో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణా ప్రజా సమితి (టి పి ఎస్) పార్టీ స్థాపించబడింది. 1956లో నిర్ణయించిన విధంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలని ఇతరనాయకులు కూడా తమ కోరికను వెలిబుచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఈ ఉద్యమానికి పక్కబలంగా నిలిచారు. విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయదారులు అందరూ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 400 కంటే అధికమైన విద్యార్థులు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పోయారు. భౌగోళిక స్వరూపం thumb|హన్మకొండ పద్మాక్షి అమ్మవారి చిత్రం|296x296px|alt= పూర్వపు వరంగల్ జిల్లా 2001 భారత జనాభా లెక్కలు ప్రకారం 12,846 చ.కి.మీ.లలో వ్యాపించి 32,31,174 జనాభా కలిగి ఉంది. బొగ్గు, గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి, పొగాకు పంటలు విరివిగా పండుతాయి.గాలిలోని తేమశాతం సగం మాత్రమే ఉండే తెలంగాణా భూభాగంలో ఉన్న కారణంగా వరంగల్ వాతావరణం వేడివాతావరణం కలిగి ఉంటుంది. మార్చి మాసంలో ఆరంభం అయ్యే వేసవి కాలం మే మాసానికి 42 ° (108 ° ఫారెన్ హీట్ ) సెంటీగ్రేడుల శిఖరాగ్రం చేరుకుంటుంది. జూన్ మాసానికంతా ఆరంభం అయ్యే వర్షాలు సెప్టెంబరు వరకు కురుస్తుంటాయి. వర్షపాతం 22 మిల్లీమీటర్ల (22 అంగుళాలు) వరకు కురుస్తుంది. నవంబరు మాసం నుండి మంచుకురవని తేమలేని స్వల్పమైన శీతాకాలం ఆరంభం అయి ఫిబ్రవరి మాసం ఆరంభం వరకు ఉంటుంది. శీతాకాలం సరాసరి ఉష్ణోగ్రత 22-23 ° సెంటీగ్రేడులు (72-73 ఫారెన్ హీట్ ) వరకు ఉంటుంది. వరంగల్ జిల్లా సందర్శనానికి ఇది తగిన సమయం. వరంగల్ జిల్లా సముద్రమట్టానికి 302 మీటర్ల (990 అడుగులు) ఎత్తులో ఉంటుంది. భారతదేశంలోని భూపర్యవేష్టిత జిల్లాలలో ఇది ఒకటి. అలాగే అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలలో కూడా ఇది ఒకటి. శాసనసభ నియోజక వర్గాలు. నియోజకవర్గాలు పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులు వివరాలు దాస్యం వినయ్‌భాస్కర్‌ - (ప్రస్తుత శాసన సభ్యుడు) గత రాజకీయాలు thumb|235x235px|2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటం|alt= 2010 శాసనసభ ఉప ఎన్నికలలో దాస్యం వినయ్‌భాస్కర్‌ 74.85% శాతం ఓట్లతో విజయం సాధించారు. 2009 శాసనసభ ఎన్నికలలో దాస్యం వినయభాస్కర్ 39.64% శాతం ఓట్లతో విజయం సాధించారు. పూర్వపు వరంగల్ జిల్లా - నేటి హన్మకొండ జిల్లా 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత, 2016 లో ప్రభుత్వం మొదటిసారిగా నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణ చేపట్టింది. పూర్వపు వరంగల్ జిల్లాలో ఉన్న --- మండలాల నుండి వరంగల్, హన్మకొండ, ధర్మసాగర్, హసన్‌పర్తి 4 మండలాలు, కరీంనగర్ జిల్లా నుండి ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ 3 మండలాలు, పాతమండలాల వరంగల్, హన్మకొండ, ధర్మసాగర్, హసన్‌పర్తి మండలాల నుండి వరుసగా ఖిలా వరంగల్, కాజీపేట, వేలేర్, ఐనవోలు అనే 4 మండలాలు విభజించి మొత్తం 11 మండలాలతో ఈ జిల్లా వరంగల్ పట్టణ జిల్లాగా ది.11.10.2016న ఏర్పడింది.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 231, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 వరంగల్ పట్టణ జిల్లాలో గతంలో ఉన్న 11 మండలాలలో వరంగల్ రెవెన్యూ డివిజను పరిధిలోని తొమ్మిది మండలాలు, పూర్వపు వరంగల్ గ్రామీణ జిల్లా ప్రస్తుత వరంగల్ జిల్లా, పరకాల రెవెన్యూ డివిజను లోని 5 మండలాలు కలిపి మొత్తం 14 మండలాలతో తిరిగి హన్మకొండ జిల్లాగా మారుస్తూ 2021 ఆగస్టు 12 న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.G.O.Ms. No.175 Revenue (DA), Dated:12.08.2021 జిల్లాలోని మండలాలు హన్మకొండ రెవెన్యూ డివిజను హన్మకొండ మండలం కాజీపేట మండలం * ఐనవోలు మండలం * హసన్‌పర్తి మండలం వేలేర్ మండలం * ధర్మసాగర్ మండలం ఎల్కతుర్తి మండలం భీమదేవరపల్లి మండలం కమలాపూర్ మండలం పరకాల రెవెన్యూ డివిజను పరకాల మండలం నడికూడ మండలం * దామెర మండలం ఆత్మకూరు మండలం శాయంపేట మండలం గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (4) గమనిక: హన్మకొండ జిల్లాగా మార్చకుముందు (పూర్వపు వరంగల్ పట్టణ జిల్లా) లో ఉన్న వరంగల్ మండలం, ఖిలా వరంగల్ మండలం ప్రస్తుత వరంగల్ జిల్లా (పూర్వపు వరంగల్ గ్రామీణ జిల్లా) లో చేర్చారు. గమనిక:పూర్వపు వరంగల్ గ్రామీణ జిల్లా (ప్రస్తుత వరంగల్ జిల్లా) లో ఉన్న పరకాల, దామెర, ఆత్మకూరు, శాయంపేట, పాత మండలాలు, 2018 ఆగస్టులో కొత్తగా ఏర్పడిన నడికూడ మండలం ఈ జిల్లాలో కొత్తగా ఏర్పడిన పరకాల రెవెన్యూ డివిజనులో చేర్చారు. రవాణా వ్వవస్థ వరంగల్ నగర శివార్లలో ఈశాన్యంలో ఉన్న మమ్నూరు గ్రామం వద్ద వరంగల్ - ఖమ్మం రహదారిలో వాయుసేన గ్లైడర్ శిక్షణా కేంద్రంగా ఉపయోగపడుతుంది. నిజాం నవాబు కాగజ్ నగర్ పేపర్ మిల్లు, అజం జాహీ మిల్లుకు చేరడానికి అనుగుణంగా నిర్మించబడిన ఈ విమానాశ్రయం 1947 వరకు దేశంలోనే పెద్ద విమానాశ్రయంగా ఉంటూ వచ్చింది. సమీపంలో ఉన్న విమానాశ్రయం వరంగల్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. రైలు మార్గం thumb|కాజీపేట రైల్వే జంక్షన్ ముఖద్వారం వరంగల్ రైలు మార్గం ద్వారా భారతదేశంలోని అనేక ప్రముఖ నగరాలతో అనుసంధానించబడింది. ఇది భారతీయ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే విభాగానికి చెందింది.వరంగల్‌కు 13 కి.మీ.సమీప దూరంలో ఉన్న ఖాజీపేట రైల్వే జంక్షన్, హైదరాబాదు, న్యూ ఢిల్లీ, విజయవాడ, చెన్నై, కొలకత్తా రైలు మార్గంలో ప్రముఖ రైలు కూడలి. వరంగల్ రైలు స్టేషను హైదరాబాద్, విజయవాడ, చెన్నై రైలు మార్గంలో ఉంది. ప్రతి రోజు ఈ స్టేషను ద్వారా గూడ్స్ రైళ్ళు కాక 132 రైళ్ళు దాటి వెళుతుంటాయి. దేశంలో రైలు స్టేషనులలో పెద్ద రైలు స్టేషనులలో వరంగల్ రైలు స్టేషను ఒకటి. రోడ్డు మార్గం హైదరాబాదు నుండి భోపాలపట్నం వరకు వేస్తున్న జాతీయరహదారి - 202 నిర్మాణదశలో ఉంది. ఈ రహదారిలో వరంగల్ నుండి పోతుంది. వరంగల్, హన్మకొండ వద్ద రెండు ప్రధాన బస్సు స్టాండ్లు ఉన్నాయి. వరంగల్ నుండి దూరప్రాంతాలకు వెళ్ళే డీలక్స్ బస్సులు బెంగుళూరు, మద్రాసు, హైదరాబాదు, తిరుపతి, అనంతపూరు, హుబ్లి, బెల్గాం లకు ఉన్నాయి. అలాగే స్టాండెడ్ ఎక్స్‌ప్రెస్ బస్సులు గుంటూరు వయా విజయవాడ, చెన్నై, చెరియాల్ మార్గంలో వరంగల్ ను చేరుకుంటాయి. ఆర్ధిక స్థితి గతులు వరంగల్ ఆర్థికంగా వ్యవసాయం మీద ఆధాపడి ఉంది. వరంగల్ సమీపంలో దేశాయిపేట వద్ద ఉన్న ఎనుమాముల గ్రామం వరంగల్ జిల్లా ధాన్యపు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఇక్కడ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉంది. ఈ ప్రాంతం బియ్యపు వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ప్రాంతీయ అవసరాలకు, వెలుపలి వాణిజ్యానికి అవసరమైన బియ్యం వ్యాపారం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. 1990 వరకు ఈ ప్రాంతంలో పత్తి ఉత్పత్తి ప్రధానంగా జరిగింది. ఇటీవలి కాలంలో పత్తి ఉత్పత్తిలో సమస్యలు ఎదురైయ్యాయి. ఈ జిల్లాలో 1997-1998 మధ్య పత్తిరైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదు అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ జిల్లాలో పరిశ్రమలకు ముఖ్యత్వం ఇవ్వడంలో శ్రద్ధవహించ లేదు. నిజాం కాలం నుండి సాగుతున్న కొన్ని పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. అజం జాహి క్లోత్ మిల్లు మూతపడింది. జిల్లాలో చిన్నతరహా పరిశ్రమలు మాత్రం నడుస్తున్నాయి. రెండవ స్థాయి నగరాలు సాంకేతిక రంగంలో జరుగుతున్న విప్లవాత్మక ఫలాలని అందునే ప్రయత్నంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టి పి ఐ) వరంగల్ జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించాలని అనుకుంటున్నారు. చక్కని ప్రయాణ వసతులు, నాణ్యమైన విద్యాసంస్థల నుండి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు, మంచి భవనవసతులు, తక్కువగా ఉన్న వాహనాల రద్దీ, హైదరాబాదుకు అందుబాటు దూరంలో ఉన్న కారణంగా వరంగల్ ఇందుకు తగి ఉంది. విదేశాలలో స్థిరపడిన ప్రవాసభారతీయుల నుండి ఈ జిల్లాకు విదేశీ పెట్టుబడులు అందుతున్నాయి. సంస్కృతి వరంగల్ జిల్లాలో ప్రజలు అధికంగా తెలుగు భాషను మాట్లాడుతుంటారు. వరంగల్ ప్రజలు సంప్రదాయమైన చీరె, ధోవతి వంటి దుస్తులతో అధునిక వస్త్రాలను కూడా ధరిస్తుంటారు.వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా యువత విదేశాలలో పనిచేస్తున్నారు. ప్రధానంగా అమెరికా వంటి దేశాలలో అధికంగా పనిచేస్తున్నారు. అత్యధికంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న వారే. అనేకంగా ప్రతి ఇంట్లో విదేశాలలో నివసిస్తున్న సభ్యులు ఉన్నారు. యువతలో అధికులు సాంకేతిక రంగంలో నైపుణ్యం ఉన్న కారణంగా ఐ.టి. సంస్థలు ఇక్కడ తమ శాఖలను స్థాపించడానికి ఉత్సుకత చూపుతున్నారు. వరంగల్ జిల్లాలోని ప్రజల అభిరుచులను తెలంగాణ సమాజం లోని ప్రజలు ఒక రకంగా ప్రామాణికంగా పరిగణిస్తారు. చుట్టూ పక్కల గ్రామీణ ప్రాంతాల నుండి వలస వచ్చి స్థిర పడిన వారి సంఖ్యనే అధికం. విద్యాసంస్థలు వరంగల్ జిల్లాలో దేశంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉన్నాయి. వరంగలు తెలంగాణ జిల్లాలలో 2 వస్థానంగా ఉంది. 1959లో పండిత జవహర్లాల్ నెహ్రుచే పునాది రాయి స్థాపించబడిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్ (పాత పేరు ఆర్.ఇ.సి వరంగల్), కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. ఎన్ ఐ టి భారతదేశం అంతా చక్కగా అభివృద్ధి చెందింది. వరంగల్ నిట్ (ఎన్ ఐ టి) దేశంలో అత్యుత్తమమైందిగా భావిస్తారు. 1959 లో దీనిని స్థాపించినప్పటి నుండి ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు అనేకులు దేశ విదేశాలలో ఉన్నారు. ఈ సంస్థ దేశం మొత్తం నుండి ప్రతిభావంతులని అనేక మందిని ఆకర్షిస్తుంది. దర్శనీయ స్థలాలు ◆ వేయి స్థంభాల గుడి: 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి, వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది. ◆ కాకతీయ జంతు ప్రదర్శనశాల లేదా వన విజ్ఞాన కేంద్రం తెలంగాణ అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడింది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది సందర్శకులు వరకు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్ హంటర్ రోడ్ వద్ద ఉంది. ◆ ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం:సమీపంలోని ఐనవోలులో ఈ దేవాలయం ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు (సా.శ.1076-1127) ని మంత్రిగా పనిచేసిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడు. ప్రముఖవ్యక్తులు కాళోజి నారాయణ రావు - కవి కాళోజీ రామేశ్వరరావు - కవి పి.వి.నరసింహారావు - భారత మాజీ ప్రధాని గోరుకంటి రవీందర్ రావు - హైదరాబాదులోని యశోదా హాస్పిటల్స్ అధినేత ఆనంది - సినిమా నటి పసునూరి రవీందర్ - తెలంగాణ తొలి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత అరుసం మధుసూదన్ - మైమ్‌ కళాకారుడు దేవులపల్లి రామానుజరావు రావాడ సత్యనారాయణ చిటిమెళ్ళ బృందావనమ్మ కొత్తపల్లి జయశంకర్ మాడభూషి శ్రీధర్ ఇవి కూడా చూడండి జిల్లా గ్రామాల జాబితా మూలాలు బయటి లింకులు వరంగల్ జిల్లా అధికారిక వెబ్‌సైటు ఈనాడు జాలస్థలిలో వరంగలో జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయం telangana official web site http://www.orugallutechnologyindia.co.in కాకతీయ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వరంగల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సైటులో వరంగల్ జిల్లా వివరాలు కాకతీయ శిలా తోరణం శ్రీ భధ్రకాళి అమ్మవారి గుడి వెబ్‌సైటు ఖుష్ మహల్ వర్గం:తెలంగాణ జిల్లాలు వర్గం:హన్మకొండ జిల్లా వర్గం:భారతదేశం లోని జిల్లాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
రాశి
https://te.wikipedia.org/wiki/రాశి
thumb|కాణిపాకంలోని శివాలయం వద్ద ఉన్న రాశీచక్రం. ఇందులో 12 రాశుల బొమ్మలు ఉన్నాయి జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనం మొదలగు రాశులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆతరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు. రాశులు మేషరాశి (March 21 నుండి [April 20) ]] వృషభరాశి (ఏప్రిల్‌ 21 నుండి మే 20 ) మిథునరాశి (మే 21 నుండి జూన్‌ 21) కర్కాటకరాశి (జూన్‌ 22 నుండి జూలై 20) సింహరాశి (జూలై 21 నుండి ఆగష్టు 20) కన్యారాశి (ఆగష్టు 21 నుండి సెప్టెంబరు 20) తులారాశి (సెప్టెంబరు 21 నుండి అక్టోబరు 20) వృశ్చిక రాశి (అక్టోబరు 21 నుండి నవంబరు 20) ధనూరాశి (నవంబరు 21 నుండి డిసెంబరు 20) మకరరాశి (డిసెంబరు 21 నుండి జనవరి 20) కుంభరాశి (జనవరి 21 నుండి ఫిబ్రవరి 20) మీనరాశి (ఫిబ్రవరి 21 నుండి మార్చి 20) ఒక రోజులో పన్నెండు లగ్నాలు ఉంటాయి. ప్రతి రెండు గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం ఔతుంది. మేషమునకు అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు. మిధునముకు అధిపతి బుధుడు. కటకముకు అధిపతి చంద్రుడు. సింహముకు అధిపతి సూర్యుడు. కన్యకు అధిపతి బుధుడు. తులకు అధిపతి శుక్రుడు. వృశ్చికముకు అధిపతి కుజుడు. ధనస్సుకు అధిపతి గురువు. మర, కుంభములకు వరుసగా శని అధిపతి. చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు. ఉపచయ రాశులు లగ్నము నుండి 3,6,10,11. అపోక్లిమ రాశులు లగ్నము నుండి 3,6,9,12. ఉపాంత్యము అంటే చివరి రాశికి ముందు రాశి. ఉచ్ఛ నీచ రాశులు సూర్యునకు ఉచ్ఛ రాశి మేషము. అలాగే నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న తులారాశి. చంద్రుడికి ఉచ్ఛ రాశి వృషభము. నీచరాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న వృశ్చికము. కుజుడికి ఉచ్ఛ రాశి మకరము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కటకము. బుధుడికి ఉచ్ఛరాశి కన్య. నీచ రాశి దానికి ఏడవ స్థానం ఉన్న మీనము. గురువుకు ఉచ్ఛ రాశి కర్కాటకం. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మకరము. శుక్రుడికి ఉచ్ఛ రాశి మీనము. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న కన్య. శనికి ఉచ్ఛ రాశి తుల. నీచ రాశి దానికి ఏడవ స్థానంలో ఉన్న మేషము. పురుష రాశులు :- మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభము. స్త్రీరాశులు :- వృషభము, కర్కాటకం, కన్య, వృశ్చికము, మకరము, మీనము. ఎరుపు వర్ణ రాశులు :- మేషము, సింహము, ధనస్సు. నలుపు :- మకరము, కన్య, మిధునము. పసుపు :- వృశ్చికము, కుంభము, మీనము. తెలుపు :- వృషభము, కటకము, తుల. బ్రాహ్మణ జాతి :- వృషభము, తులా, వృశ్చికము, మీనము. క్షత్రియ జాతి :- మేషము, సింహము, ధనస్సు. వైశ్యజాతి :- మిధునము, కుంభము. శూద్రజాతి :- కర్కాటకం, కన్య, మకరములు. రాశులు దిక్కులు :- తూర్పు దిక్కు :- మేషం, వృషభం, మిధునములు. దక్షిణం దిక్కు :- కటకం, సింహం, కన్య. ఉత్తర దిక్కు :- తులా, వృశ్చికం, ధనస్సులు. పడమర దిక్కు :- మకరం, కుంభం, మీనం. చరరాశులు:- మేషము, కర్కాటకం, తులా, మకరములు. సమరాశూలను ఓజ రాశులు అంటారు. రాశుల స్వరూపం మేషం :- మేక ఆకారం. వృషభం :- కుమ్ముతున్న ఎద్దు. మిధునం :- గదను ధరించిన పురుషుడు. కర్కాటకం :- ఎండ్రకాయ ఆకారం. సింహం :- సింహాకారము. కన్య :- సస్యమును, దీపమును చేత పట్టుకుని తెప్ప మీద ఉన్న కన్య. తుల :- త్రాసు ధరించిన పురుషుడు. వృశ్చికము :- తేలు ఆకారము. ధనస్సు :- ధనస్సు ధరించిన పురుషుడు. మకరము :- మృగము వంటి ముఖము కలిగిన మొసలి. కుంభము :- రిక్త కుంభము చేత పట్టిన పురుషుడు. మీనము :- అన్యోన్య పుచ్ఛాభిముఖమై ఉన్న రెండు చేపలు. రాశులు మరికొన్ని వివరాలు రాశులు లింగం స్వభావం తత్వం శబ్దం సమయం ఉదయం జల/నిర్జల జీవులు వర్ణం పరమాణం జాతి దిశ అధిపతి సంతానం ప్రకృతి కాలపురుషుని అంగం సమ/విషమ మేషరాశి పురుష చర అగ్ని అధిక రాత్రి పృష్ఠ పాదం పశువులు రక్తవర్ణం హస్వ క్షత్రియ తూర్పు కుజుడు అల్ప పిత్త శిరసు విషమ వృషభరాశి స్త్రీ స్థిర భూమి అధిక రాత్రి పృష్ఠ అర్ధ పశువులు శ్వేతం హస్వ బ్రాహ్మణ దక్షిణ శుక్రుడు సమం వాత ముఖము సమం మిధుననరాశి పురుష ద్విశ్వభావ వాయు అధిక రాత్రి శీర్షం నిర్జల మనుష్య ఆకుపచ్చ సమ వైశ్య పడమర బుధుడు సమం వాతం బాహువులు విషమ కర్కాటకరాశి స్త్రీ చర జల నిశ్శబ్దం రాత్రి పృష్ట పూర్ణ జల పాటల సమ శూద్ర ఉత్తర చంద్రుడు అధికం కఫం వక్షం సమ సింహరాశి పురుష స్థిర అగ్ని అధిక పగలు శీర్షం నిర్జల పశువులు ధూమ్ర, పాండు దీర్ఘం క్షత్రియ తూర్పు సూర్యుడు అల్పం పిత్తం గుండె విషమ కన్యారాశి స్త్రీ ద్విశ్వభావ భూమి అర్ధ పగలు శీర్షం నిర్జల మానవ చిత్రవర్ణం దీర్ఘం శూద్ర దక్షిణం బుధుడు అల్పం వాతం పొట్ట సమ తులారాశి పురుష చర వాయు నిశ్శబ్ధ పగలు శీర్షం పాద మానవ నీలవర్ణం దీర్ఘం వైశ్య పడమర శుక్రుడు అల్పం వాతం పొత్తికడుపు విషమ వృశ్చికరాశి స్త్రీ స్థిర జల నిశ్శబ్ధ పగలు శీర్షం పాద కీటక స్వర్ణవర్ణం దీర్ఘం బ్రాహ్మణ ఉత్తర కుజుడు అధికం కఫం మర్మస్థానం సమ ధనస్సురాశి పురుష ద్విశ్వభావం అగ్ని అధిక రాత్రి పృష్ట అర్ధ మనుష్య, పశు కపిల సమ క్షత్రియ తూర్పు గురువు అల్పం ఉష్ణ, పిత్త తొడలు విషమ మకరరాశి స్త్రీ చర భూమి అర్ధ రాత్రి పృష్ట పూర్ణ పశు, జలచర శుక్ల, కపిల సమ శూద్ర దక్షిణం శని అల్పం వాతం మోకాళ్ళు సమ కుంభరాశి పరుష స్థిర వాయు అర్ధ పగలు శీర్షం అర్ధ మానవ బబ్రు హస్వ వైశ్య పడమర శని సమ వాత, పిత్త, కఫ పిక్కలు విషమ మీనరాశి స్త్రీ ద్విశ్వభావ జల నిశ్శబ్ధ పగలు ఉభయ పూర్ణ జల స్వచ్ఛ హస్వ బ్రాహ్మణ ఉత్తరం గురువు అధికం కఫం పాదం సమ నవాంశ రాశులు నవాంశచక్రము జాతక నిర్ణయంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉత్తరభారతదేశంలో నవాంశను ఆధారంగా చేసుకుని జాతక నిర్ణయం చేస్తారు. ఫలితాలు తుల్యంగా ఉంటాయని పండితుల అభిప్రాయం. రాశిలోని తొమ్మిది నక్షత్ర పాదాలను తొమ్మిది భాగాలుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాశి ఆధిపత్యం వహిస్తుంది. మేషం, కటకం, తుల, మకరం వరుసగా నవాంశ ఆరంభ రాశులు. నవాంశను గ్రహం ఉపస్థిత రాశిని దానికి ఒక్కొక్క పాదంలో స్థానంలో ఉన్న రాశిని స్థానంలో ఉన్న రాశిని అనుసరించి నిర్ణయిస్తారు. వర్గం:జ్యోతిష శాస్త్రం వర్గం:ఖగోళ శాస్త్రం వర్గం:రాశులు
2004
https://te.wikipedia.org/wiki/2004
గ్రెగేరియను క్యాలాండరు లేదా గ్రెగేరియను కాలనిర్ణయ పట్టిక (లేదా గ్రెగేరియను పంచాంగము)లో 2004అనునది గురువారంతో మొదలవు లీపు సంవత్సరం. సంవత్సరాలు: 2001 - 2002 - 2003 - 2004 - 2005 - 2006 - 2007 దశాబ్దాలు: 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు శతాబ్దాలు: 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం సంఘటనలు మే 14: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు. మే 22: భారతప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పదవిని చేపట్టినాడు. జూన్ 4: భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు. ఆగష్టు 13: 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్ లో ప్రారంభమయ్యాయి. జననాలు మరణాలు thumb|ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జనవరి 12: రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి (జ.1926). ఫిబ్రవరి 26: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1912). ఫిబ్రవరి 26: శంకర్‌రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (జ.1920).. మార్చి 5: కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928) ఏప్రిల్ 17: సౌందర్య, సినీనటి. (జ.1972) ఏప్రిల్ 27: జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. ( జ.1928) జూన్ 3: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936) జూలై 23: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (జ.1932) జూలై 31: అల్లు రామలింగయ్య, హాస్యనటుడు. (జ.1922) ఆగష్టు 8: పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (జ.1925) ఆగష్టు 15: అమర్‌సిన్హ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ.1941). ఆగష్టు 16: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (జ.1937) సెప్టెంబర్ 7: కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923) సెప్టెంబర్ 22: బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1927) సెప్టెంబర్ 23: రాజా రామన్న, భారత శాస్త్రవేత్త . (జ.1929) సెప్టెంబర్ 24: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (జ.1929) సెప్టెంబరు 28: ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత (జ.1905) అక్టోబరు 14: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (జ.1920) అక్టోబరు 31: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు రచయిత. (జ.1935) డిసెంబరు 8: చిత్తజల్లు శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1924) డిసెంబరు 11: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (జ.1916) డిసెంబర్ 23: పి.వి.నరసింహారావు, పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921) డిసెంబర్ 31: గెరాల్డ్ డిబ్రూ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1921). : ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (జ.1920) పురస్కారాలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : అదూర్ గోపాలకృష్ణన్. జ్ఞానపీఠ పురస్కారం : రెహమాన్ రాహి‌ *
నెల్లూరు
https://te.wikipedia.org/wiki/నెల్లూరు
నెల్లూరు (విక్రమ సింహపురి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నగరం, జిల్లా కేంద్రం. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం ఉంది. నగరానికి పడమట గణపతి రుద్రదేవుడు తవ్వించిన నెల్లూరు చెరువు ఉంది. చెరువు గట్టుపయన నెలలోరే గ్రామ దేవత ఇరుకాలమ్మ గుడి ఉంది. ఇరుకాలమ్మను జైన శాసన దేవతగా చరిత్రకారులు గుర్తించారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన తెలుగు కవులలో ఒకడైన తిక్కన సోమయాజీ ఈ ప్రాంతంలో నివసించాడు. పేరు ఉత్పత్తి విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. వరికి అప్పటి వాడుకలో గల తమిళ భాషలో నెల్ అంటారు కావున నెల్ వూరు అనే పేరు వచ్చింది. ఇది కాలక్రమంలో నెల్లూరుగా రూపాంతరం చెందింది. పల్లవ రాజుల చిహ్నం సింహం కనుక, విక్రమసింహుని కాలంలో సింహపురి రాజధానిగా వున్నందున ఈ ఊరిని విక్రమసింహపురి అనికూడా అంటారు. రెండు పేర్లు శాసనాలలో ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి. ఇంకో కథనం ప్రకారం, నెల్లూరు పట్టణ మందు శ్రీ మూలస్థానేశ్వర ఆలయాన్ని ఆంధ్రరెడ్డిపాలకుడైన ముక్కంటి రెడ్డిరాజుగారు కట్టించారట. ఆ రాజుకి ఒక నాడు కలలో పరమశివుడు కనిపించి రాజా!నేను ఈ ప్రాంతమున వున్న ఉసిరిక చెట్టుమూలమున వెలసివున్నాను. నేను ఇప్పుడు భక్తకోటిని రక్షించుటకు రాదలచాను. కనుక అచట నాకొక ఆలయమును కట్టించు అని ఆజ్ఞాపించాడట. మరుసటి రోజు ఉదయమే ఆ రాజు ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించిచూడగా అచట లింగాకృతిలో వృక్షమూలమున పరమేశ్వరుడు కనబడినాడట. ఆనందంతో ఆ రాజు వెంటనే ఆలయాన్ని కట్టించి అందులో ఆ శివలింగమును ప్రతిష్ఠింపచేసి భక్తిప్రపత్తులతో ఆరాధించాడట. ఉసిరిచెట్టును తమిళమున నెల్లి అని అంటారు కావున ఆ నెల్లిపేరు మీదుగానే అచ్చట వెలసిన గ్రామం నెల్లూరు అయింది. ఇంకొక కథనం ప్రకారం వేసాలమారు అనే వర్తకుడిని నెల్లూరు నిర్మాతగా చెపుతారు,ఇతని వ్యాపార వస్త్రాలు దోచుకోబడి, చెప్పుకొనే అధికారి లేక ఒక బావివద్ద కొరడా పట్టుకొని అక్కడ నీళ్లు తోడుకొనే వారి దగ్గరనుండి సుంకం వసూలు చేసేవాడు, ఇది తెలిసిన అప్పటి గోల్కొండ రాజు అతనిని పిలిచి విచారిస్తే, రాజు దృస్థికి రావటం కోసం తాను ఈ పని చేసాను అని, వసూలు చేసిన మూడు లక్షల హన్నులు రాజుకు ఇస్తే ఆ రాజు, వేసాలమారు నడవడికకు మెచ్చి నెల్లూరు అధికారిగా నియమించి, వసూలు చేసిన ధనముతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయమని చెప్పాడట చరిత్ర పూర్వం పెన్నా నది ఇప్పటి రంగనాయకుల గుడికి పడమట, ఎగువన రెండుగా చీలి ఈ ప్రదేశానంతా ఒక అంతర్వేదిగా (Doab-దో ఆప్=రెండు నీళ్ళ పాయలు) చేసిఉన్నట్లు కనబడుచున్నది. శయన నారాయణ స్వాములు వెలసిఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్నం మొదలైనవన్నీ ఇట్టి ఏటిపాయల నదిఒడ్డుననే ఉన్నాయి. ఇక్కడి సంతపేటరేవు, చారిత్రక హరిహరనాధాలయం ఉన్నచోటని చరిత్రకారుల అభిప్రాయము.ఈ స్వామినే తిక్కన, నాచన సోమనలు ఆరాధించారు. పెన్నానది పూర్వం ఇక్కడనే ఇంకొకపాయగాచీలి, చిత్రకూటం-ఇసుకడొంక-జేంస్ గార్డెన్-ఉదయగిరివారి తోట (ఇప్పటి లక్ష్మీపురం) నవలాకుతోటల (9 లక్షల ఫలవృక్షాలను ఇచట నెల్లూరు, సర్వేపల్లి నవాబులు పెంచినారట) మీదుగా తూర్పుగా పారి, కొత్తూరు, ఇందుకూరుసేట మడుగులై, క్రింద మొత్తలు అనే కూడలిచోట ఉత్తరముఖమై, ఊటుకూరు దగ్గర మొదటి పినాకినీ శాఖలోకలసి, సముద్రంలో సంగమించింది. దీనికి భౌగోళిక ఆధారాలున్నాయి. ఈ ఏటిపాయ, పేరుకొని పోతూవచ్చి ఎప్పుడు పూర్తిగా పూడిపోయిందో చెప్పలేరు. ఈ పూడిపోయిన శాఖను వృద్ధ పినాకినీ అని అంటారు. కవిత్రయంలో ఒకరైన తిక్కన మహాభారతంలోని 15 పర్వాలు ఈ ప్రదేశం లోనే రచించినట్లు చెపుతారు. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరం లోని మూలాపేట ప్రాంతము అత్యంత పురాతన ప్రశస్తి కలిగి ఉంది. నెల్లూరులో టౌన్ హాలు, శిశు వైద్యశాల నిర్మాణం చేసిన రేబాల లక్ష్మీనరసా రెడ్డి, మొదటి కళాశాల నిర్మాణం చేసిన వెంకట గిరి రాజు ముఖ్య దాతలు. జనగణన విషయాలు 2011 జనగణన ప్రకారం నెల్లూరు జనాభా సుమారు 6 లక్షలు. వాతావరణం ఉమ్మడి జిల్లాలో వేసవి అత్యధిక ఉష్ణోగ్రత (36-46)సెంటీగ్రేడ్. శీతాకాల అత్యల్ప ఉష్ణోగ్రత (23-25)సెంటీగ్రేడ్. నైరుతీ ఋతుపవనాల వర్షపాతం 700-1000 మిల్లీమీటర్లు. నెల్లూరు తరచూ ఆయా కాలాలలో కరువుకు, వరదకు గురికావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. పరిపాలన నెల్లూరు నగరపాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది. నగర పరిధిలో కలసిన గ్రామాలు కొమరిక, రావూరు, పున్నూరు, కృష్ణ పట్ణణం, మైపాడు. రవాణా సౌకర్యాలు thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషను ముందు భాగం.పశ్చిమదిక్కు thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషనుప్లాట్‌ఫారాలు thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషను టికెట్ కౌంటరు (పశ్చిమదిక్కు) thumb|right|250px|నెల్లూరు రైల్వేస్టేషనులోని ఎస్కెలెటరు ఇది చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి (NH-16) మీద చెన్నై-ఒంగోలు ల మధ్య ఉంది. నెల్లూరు నగరం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. నెల్లూరు పాతపేరైనా సింహపురి పేరు మీద సింహపురి ఎక్స్‌ప్రెస్ అనే సూపర్ ఫాస్ట్ రైలు గూడూరు-సికింద్రాబాద్ ల మధ్య నడుస్తుంది. విద్యా సౌకర్యాలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వెంకటగిరి రాజా కళాశాల. దొడ్ల కౌసల్యమ్మ మహిళా డిగ్రీ కళాశాల, శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాల, కామిశెట్టి ఆదిశేషయ్య ప్రభుత్వ జూనియర్ కాలేజీ. నారాయణ ఇంజనీరింగ్ కళాశాల. ఆర్ధిక స్థితిగతులు పరిశ్రమలు బంగాళా ఖాతపు తీరం వెంట చేపల, రొయ్యల పెంపకానికి (ఆక్వా కల్చర్‌) నెల్లూరు చాలా ప్రసిద్ధి. అభ్రకం ఉత్పత్తిలో అగ్రగామి. పింగాణి, ముడి ఇనుము, జిప్సం, సున్నపురాయి నిధులున్నాయి. జిల్లాలో ట్రేడింగ్ రైసు మిల్లులు, నాన్ ట్రేడింగ్ రైసు మిల్లులు, షుగర్ మిల్లులు ఉన్నాయి. బ్యాంకులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు నెల్లూరు నగరంలో 15 శాఖలు ఉన్నాయి. సంస్కృతి పండుగలు , ఉత్సవాలు మహా శివరాత్రి - శివునికి అంకితమైన పండుగ) నవరాత్రి - 10 రోజుల హిందూ పండుగ, ఇక్కడ దుర్గాదేవిని పూజిస్తారు) దీపావళి - దీపాల పండుగ; భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, విస్తృతంగా జరుపుకునే పండుగ. సంక్రాంతి, సంక్రాంతిలో భాగంగా జరుపుకునే భోగి పిల్లలు పెద్దలు సంతోషంగా జరుపుకుంటారు. రొట్టెల పండుగ: మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిం ప్రజలు కలిసి నెల్లూరు చెరువు సమీపంలో బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతున్నది. వంటలు నెల్లూరు చేపల పులుసు మలైకాజ దేవాలయాలు thumb|అద్దాల మండపంలో పైకప్పున శ్రీకృష్ణుని బొమ్మ తీర్చి దిద్దిన వైనం.|250x250px శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం: ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి. (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం). శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు, (పురాతన ఆలయం) వేణుగోపాల స్వామి ఆలయం మూలపేట, శ్రీ ధర్మరాజస్వామి ఆలయం, నెల్లూరు. శ్రీ వేదాంత దేశికర్ దేవస్థానం, రంగనాయకులపేట. శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానం, దర్గామిట్ట.* బారా షహీద్ దర్గా, నెల్లూరు శ్రీ సాయిబాబా మందిరం, స్వతంత్ర పార్క్ ప్రక్కన, మస్తానయ్య దర్గా, నెల్లూరు. శ్రీ అయ్యప్పస్వామి గుడి, దర్గామిట్ట, నిప్పో ఫ్యాక్టరీ సమీపం, ఈశ్వరాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, ఉస్మాన్ సాహెబ్ పేట, నెల్లూరు, శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, మూలాపేట, నెల్లూరు. ఇతర విశేషాలు ఎమ్ జి బి మాల్ మల్టీప్లెక్స్ అయిదు ప్రదర్శన తెరలు కలిగివుంది. నెల్లూరు జిల్లా తీరం వెంట బకింగ్ హాం కాలువ ఉంది. పెన్నానుంచి సర్వేపల్లి చెరువు కాలువ ఉంది. ప్రముఖులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి హాస్యనటువులు టి.వి.రమణారెడ్డి రావు బహదూర్ రేబాల లక్ష్మీనరసారెడ్డి (టౌన్ హాల్ నిర్మాత) రేబాల లక్ష్మీనరసారెడ్డి జూనియర్ (మాజీ పార్లమెంటు సభ్యుడు) బెజవాడ గోపాలరెడ్డి విద్యాదాత వాకాటి సంజేవిశెట్టి (శ్రీ సర్వోదయ కాలేజీ స్థాపకుడు) వై.వి. రావు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం శైలజ వాణీశ్రీ పొంగూరు నారాయణ పి.పుల్లయ్య కుడుముల పద్మశ్రీ అశ్వని (నటి) చివుకుల ఉపేంద్ర పరిపూర్ణానంద స్వామి వెన్నెలకంటి సుబ్బారావు యోగి రామయ్య శిరోభూషణం వెంకట కృష్ణమాచార్యులు (రంగస్థల నటుడు, ఉపాధ్యాయుడు) మూలాలు బయటి లింకులు Nellore District Official Website Manual of the Nellore District in the Presidency of Madras. Manual of the Nellore District in the Presidency of Madras. Resource Type, : Book. Author, : Boswell, A. C.. Year/Date of Publication, : ... 1972 భారతి మాస పత్రిక- వ్యాసం నెల్లూరులో పెన్నా నది ఒడ్డున హరిహరనాధాలయం ఉందా?- వ్యాసకర్త మరుపూరు కోదందరామిరెడ్డి. వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వర్గం:ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు వర్గం:నెల్లూరు జిల్లా దర్శనీయ స్థలాలు వర్గం:నెల్లూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు వర్గం:పెన్న ముచ్చట్లు, కాళిదాసు పురుషోత్తం, పల్లవి ప్రచురణ, విజయవాడ.
కర్నూలు జిల్లా
https://te.wikipedia.org/wiki/కర్నూలు_జిల్లా
కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. జిల్లా కేంద్రం కర్నూలు. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో కలిపారు. తొలి ఆంధ్ర రాష్ట్రానికి జిల్లా లోని కర్నూలు ముఖ్యపట్టణంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో పర్యాటక ఆకర్షణలు చాలావరకు నంద్యాల జిల్లాలో భాగమైనవి. ఉమ్మడి కర్నూలు జిల్లా చరిత్ర బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది. 1565 లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687 లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. గియాసుద్దీన్ జయించిన ఈ ప్రాంతానికి ఔరంగజేబు మొఘల్ సేనానుల్లో ఒకడైన దావూద్ ఖాన్‌కు జాగీరుగా యిచ్చారు. 1733 లో అతని మరణానంతరం పాలన చేపట్టిన హిమాయత్ ఖాన్ మొదటి కర్నూలు నవాబుగా పాలకవంశాన్ని ప్రారంభించారు. ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741 లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది. 1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799 లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800 లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928 లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటి రాయలసీమ అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు. 1733 నుంచి 1838 వరకూ కర్నూలు, అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్‌ నవాబుల యొక్క రాజ్యభాగంగా ఉండేది. ఈ నవాబులు మొదట మొఘల్ సామ్రాజ్యానికి, ఆపైన క్రమంగా మైసూరు సామ్రాజ్యం, హైదరాబాద్ సామ్రాజ్యం, ఈస్టిండియా కంపెనీలకు సామంతునిగా వ్యవహరించారు. 1838 లో ఈ నవాబు యొక్క వారసుని, బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది. నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో బనగానపల్లె సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉంది. 1947 లో భారత దేశ స్వాతంత్ర్యానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953 లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956 లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు. 1830 లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో కర్నూలు జిల్లా గురించి నాటి విశేషాలు నమోదు చేశారు. అప్పట్లో కర్నూలు జిల్లాలో అడుగుపెట్టింది మొదలు ఆవులకు పాలు తీయడం చూడలేదన్నారు. ఆయన ఈ విషయాన్ని గురించి ఇట్లా వ్రాసుకున్నారు: కడప విడిచిన తర్వాత ఆవుపాలు, పెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని యితర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదు, దూడలకు విడిచిపెట్టు చున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పశువులను కాపాడిన్ని, దున్నడముకు ఎద్దులు నెల్లూరు సీమనుంచి తెచ్చేవారి వద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికేగాని అచ్చటి దున్నలు ఆ భూమిని నిగ్గి దున్ననేరవు. తడవకు 10 నుంచి 20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. సాధారణంగా ఆవులను పాల కోసమో లేక, ఎద్దుల కోసమో పెంచుతూండే అలవాటు వాడుక. ఇది చాలా విచిత్రమైన సంగతిగా చెప్పుకోవాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 మండలాలు వుండేవి. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో కలిపారు. భౌగోళిక స్వరూపం 2022 జిల్లా పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లా విస్తీర్ణం 7,980 చ.కి.మీ. ఉమ్మడి జిల్లా నదులు: తుంగభద్ర, హగరి, కుందేరు, సగిలేరు. తుంగభద్ర, హగరి కృష్ణానదికి ఉపనదులు. కుందేరు, సగిలేరు పెన్నానదికి ఉపనదులు. ఖనిజములు ఉమ్మడి జిల్లాలో నాపరాయి, సున్నపురాయి, ముగ్గురాయి, రంగురాయి, సీసము నిల్వలున్నాయి. పూర్వము రత్నాలకోట (ప్రస్తుత రామళ్ళకోట), జొన్నగిరి గ్రామాలలో రత్నములు లభ్యమయ్యేవి.సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, రెండవ భాగము, 1960 ప్రచురణ, పేజీ సంఖ్య 545 జనాభా లెక్కలు 2011 జనగణన ఆధారంగా, 2022 లో ఏర్పాటైన నూతన జిల్లా జనాభా 22.717 లక్షలు. 1981 నాటి జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లా జనాభా: 24,07,299, స్త్రీ పురుషుల నిష్పత్తి: 983:1000, అక్షరాస్యత శాతం, 28.42.ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1985 డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు నూతన కర్నూలు జిల్లాను మూడు రెవెన్యూ డివిజన్లుగా, 26 మండలాలుగా విభజించారు. కర్నూలు మండలాన్ని కర్నూలు (పట్టణ), కర్నూలు (గ్రామీణ) మండలాలుగా విడదీశారు. మండలాలు ఆదోని డివిజన్ ఆదోని కోసిగి కౌతాలం గోనెగండ్ల నందవరం పెద్ద కడబూరు మంత్రాలయం యెమ్మిగనూరు హోళగుంద కర్నూలు డివిజన్ వెల్దుర్తి ఓర్వకల్లు కర్నూలు (పట్టణ) (పాత మండలానికి లింకు) కర్నూలు (గ్రామీణ) (పాత మండలానికి లింకు) కల్లూరు కోడుమూరు గూడూరు సి.బెళగల్ పత్తికొండ డివిజన్ ఆలూరు ఆస్పరి క్రిష్ణగిరి చిప్పగిరి తుగ్గలి దేవనకొండ పత్తికొండ మద్దికేర తూర్పు హాలహర్వి నగరాలు, పట్టణాలు నగరం: కర్నూలు పట్టణాలు: ఆదోని, ఎమ్మిగనూరు రాజకీయ విభాగాలు లోక్‌సభనియోజకవర్గం: కర్నూలు శాసనసభ నియోజకవర్గాలు ఆదోని ఆలూరు ఎమ్మిగనూరు కర్నూలు కోడుమూరు (SC) పత్తికొండ పాణ్యం (పాక్షికం) కొంత భాగం నంద్యాల జిల్లాలో గలదు. మంత్రాలయం రవాణా వ్వవస్థ 1985 నాటికి ఉమ్మడి జిల్లాలో 2209 కి.మీ. ప్రభుత్వ రహదార్లు, 2146 కి.మీ. జిల్లా పరిషత్ రహదారులు, 1883 కి.మీ. సమితి రోడ్లు ఉన్నాయి. విద్యాసంస్థలు రాయలసీమ విశ్వవిద్యాలయం ఆర్ధిక స్థితి గతులు ఉమ్మడి జిల్లాలో ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారితమే అయినా కె.సి. కెనాల్, తెలుగుగంగ కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. వీటి పరీవాహక ప్రాంతాల్లో వరి పండిస్తారు. ఇవి కాకుండా వెలుగోడు ప్రాజెక్టు, అవుకు, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయాల కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. పరిశ్రమలు ఉమ్మడి జిల్లాలో టిజివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, తాడిపత్రి దగ్గరి ఎల్ అండ్ టి (L&T) ఉన్నాయి. పర్యాటక ఆకర్షణలు thumb|220px|కర్నూలులోని చారిత్రక కొండారెడ్డి బురుజు thumb|నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ సమాధి గోల్ గుమ్మజ్. అయ్యప్ప స్వామి ఆలయము,కర్నూలు కొండారెడ్డి బురుజు కర్నూలు జగన్నాథ గుట్ట ఆలయము,కర్నూలు రేవనూరు హుస్సేన్ స్వామి దర్గ చిత్రమాలిక ప్రముఖవ్యక్తులు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి: యోగి, కాలజ్ఞాన సృష్టికర్త. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి: స్వాతంత్ర్య సమరయోధుడు బుడ్డా వెంగళరెడ్డి: దాత- స్వాతంత్ర్యము రాక ముందు కరువు సమయాలలో తన సర్వ ఆస్తిని పంచిన గొప్ప వ్యక్తి. గాడిచర్ల హరి సర్వోత్తమరావు: స్వాతంత్ర్య సమర యోధుడు, గ్రంథాలయ ఉద్యమ స్థాపకుడు కొప్పెర క్రిష్ణ మూర్తి: నంద్యాల కె.సి కెనాల్ క్రింద ఉన్న గ్రామాలన్నింటికి నీరందించి జిల్లాకే నంద్యాలను అన్నపూర్ణగా మార్ఛిన సేవాతత్పరుడు చండ్ర పుల్లారెడ్డి : స్వాతంత్ర్య సమర యోధుడు, CPIML పార్టీ స్థాపకుడు. డక్క చిన్నన్న : కోవెలకుంట్ల పరిసర ప్రాంతాలలో నీటి పారుదలకు కృషి చేసిన వ్యక్తి,మల్ల యోధుడు మాచాని సోమప్ప : వై.డబ్ల్యు.సి.ఎస్. స్థాపకుడు, ఎమ్మిగనూరు అభివృద్ధికి నాంది వేసిన వ్యక్తి : పద్మశ్రీ గ్రహీత కోట్ల విజయభాస్కరరెడ్డి: ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు (1982-83, 1992-94) ముఖ్యమంత్రి. దామోదరం సంజీవయ్య: ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి (1960-62), పూర్వ అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు. పెరుగు శివారెడ్డి: నేత్ర వైద్య నిపుణుడు. వైద్యం వేంకటేశ్వరాచార్యులు: కవి, రచయిత, అవధాని, పరిశోధకులు పెండేకంటి వెంకటసుబ్బయ్య: పూర్వ కేంద్ర మంత్రి, బీహారు, కర్ణాటక గవర్నరు, ఆరు మార్లు నంద్యాల నియోజకవర్గ లోక్ సభ సభ్యులు. గుణంరెడ్డి పుల్లారెడ్డి: ప్రఖ్యాత వ్యాపారవేత్త, విద్యావేత్త పీ వీ నరసింహా రావు:భారత దేశ ప్రధానిగా సత్తా చాటారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి: రాయలసీమ పరిరక్షణ సమితి స్థాపకుడు. ఎం. హరికిషన్ : బాలసాహితీకారుడు, రచయిత. మూలాలు బయటి లింకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:రాయలసీమ వర్గం:కర్నూలు జిల్లా వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు
కరీంనగర్ జిల్లా
https://te.wikipedia.org/wiki/కరీంనగర్_జిల్లా
కరీంనగర్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf జిల్లా సరిహద్దులు జిల్లాకు ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లా, ఈశాన్యాన మహారాష్ట్ర, చత్తీసుగఢ్ రాష్ట్రాలు, దక్షిణాన హన్మకొండ జిల్లా, ఆగ్నేయాన మెదక్ జిల్లా, పశ్చిమాన నిజామాబాదు జిల్లా. జిల్లా పేరు వెనుక చరిత్ర కరీంనగర్, సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణం చేయబడింది. పురాతన కాలం నుండి వేద అభ్యాసన కేంద్రంగా ప్రసిద్ధిపొందింది. పూర్వం ఈ ప్రాంతానికి 'సబ్బినాడు' అని పేరు. కరీంనగర్, శ్రీశైలం లలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల, ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరినగరం కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున ఈ నగరానికి కరినగరం అని పేరు వచ్చింది, కాలక్రమేణా కరీంనగర్ అని పిలువబడుతుంది. జిల్లా చరిత్ర thumb|కరీంనగర్‌లో అప్పూలో రీచ్|230x230px నిజాం పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధాని. మాజీ భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, ప్రసిద్ధ కవులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె), వేములవాడ భీమకవి, గంగుల కమలాకర్ వంటి పలు సుప్రసిద్ధ వ్యక్తులు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. గోదావరి నది ఈ ప్రాంత సౌందర్యమును మరింత ఇనుమడింపజేస్తున్నది. కరీంనగర్ గోండ్లు, కోయలు, చెంచులు, లంబాడీలు, ఎరుకల, తొటి, మొదలైనటువంటి అనేక గిరిజన జాతులకు ఆవాసము. ఈ ప్రాంతీయులు సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో మంచి నిపుణులు. 1905కు పూర్వం ఎలగందల్ జిల్లాగా ప్రసిద్ధి చెందింది.1905లో పూర్వపు వరంగల్‌ జిల్లా నుండి పరకాల తాలూకాను జిల్లాలో కలిపి, లక్సెట్టిపేట, చెన్నూరు తాలూకాలను అదిలాబాద్‌ జిల్లాలో, సిద్దిపేట తాలూకాను మెదక్‌లో చేర్చి జిల్లాను 7 తాలూకాలతో పునర్‌వ్యవస్థీకరించి, కరీంనగర్ జిల్లాగా నామకరణం చేశారు. కరీంనగర్ కు 30. కి.మీ. దూరంలో గోదావరి నది శాఖైన మూలవాగు తీరంలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి, గోదావరి తీరాన గల ప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రం ఈ జిల్లాలో ఉంది. కరీంనగర్ కు ఉత్తరంగా 50 కి.మీ. దూరంలో గోదావరీ తీరంలోని ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇవికాక జగిత్యాల కొండగట్టు దగ్గర శ్రీఆంజనేయస్వామి ఆలయం ఎత్తైన పర్వతంపై ఉంది. హజూరాబాద్ సమీపానగల కొత్తగట్టు వద్ద అరుదైన శ్రీ మత్సగిరీంద్ర స్వామి వారి ఆలయం ఉంది. రామగుండం వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా బొగ్గు ముడిపదార్థంగా ఉపయోగించి ఎరువును తయారుచేసిన మొట్టమొదటి ఫ్యాక్టరీ. నల్ల బంగారం ఉత్పత్తిలో సిరులపంట పండిస్తున్న సింగరేణి కాలరీస్ కంపనీ కు, ఖజానాలో ఎక్కువ ఆదాయం లభించేది రామగుండం బొగ్గు గనుల నుంచే. భౌగోళిక స్వరూపం వర్షపాతం - 953 మి.మీ. అడవుల శాతం - 21.18 నదులు: మానేరు. గోదావరి నది దాదాపు 283 కిలో మీటర్లు ఈ జిల్లాలో ప్రవహిస్తోంది. నది ● మానేరు నది ప్రాజెక్టులు ● లోయర్ మానేరు డ్యాం పంటలు ● వరి, ● పత్తి, ● మొక్క జొన్న, పార్కులు ● జింకలు పార్కు, ఉజ్వల పార్క్ పరిశ్రమలు నేషనల్ ధర్మల్ పవర్ రామగుండం వద్ద 2,600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే నేషనల్ ధర్మల్ పవర్ స్టేషను‌లో ఒక భాగమైన ఎన్ టి పి సి (రామగుండం, తెలంగాణ, ఇండియా). ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద విద్యుదుత్పత్తి కేంద్రం. భారతదేశంలో ఐ ఎస్ ఓ 14001 సర్టిఫికేషన్ పొందిన సూపర్ ధర్మల్ పవర్ స్టేషను ఇది మాత్రమే. ఇది అంతర్జాతీయంగా 6వ శ్రేణిలో ఉన్న పవర్ జనరేటర్. దీని స్థాపిత పవర్ కెపాసిటీ 19,435 మెగావాట్లు. నవరత్న ఈ సంస్థ 25 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకుని ప్రభుత్వ సంస్థలలో నవరత్న స్థాయికి చేరుకుంది. సౌర విద్యుత్తు రామగుండం వద్ద 10 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తిని ఎన్.టి.పి.సి. సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ సౌరవిద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. సింగరేణి కొలరీస్ కంపెని లిమిటెడ్ గోదావరీ తీరంలో బొగ్గు అన్వేషణ, వినియోగానికి అధికారయుత సంస్థ సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిఆటెడ్. సింగరేణి బొగ్గు గని దక్షిణ భారతదేశం లోని ఏకక బొగ్గుగని. ప్రస్తుతం తెలంగాణలో అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, పూర్వపు వరంగల్ జిల్లాలలో ఈ సంస్థకు గనులు ఉన్నాయి. కెసోరామ్ సిమెంట్ కర్మాగారం కెసొరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ బిర్లా గ్రూప్ కంపెనీలలో ఒకటి. 1967లో ఇది అవతరించింది. ఒకరోజుకు 2500 మెట్రిక్ టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తూ ఈ సిమెంట్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన సిమెంట్ ఫ్యాక్టరీ. ఈ కంపెనీ సాంకేతికంగా జాతీయ సాంకేతికతను ఉపయోగిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే అంతర్జాతీయ సాంకేతికతను వాడుకుంటున్నది. గ్రానైట్ పరిశ్రమ టాన్ బ్రౌన్, మేపిల్ బ్రౌన్ జాతి గ్రానైట్‌కు కరీంనగర్ జిల్లా అంతర్జాతీయ గుర్తింపును పొందింది. కరీంనగర్ జిల్లాలోని ఒడియారమ్ గ్రామం లోని గ్రానైట్ 2008 ఒలింపిక్స్ క్రీడల సమయంలో చైనా ఉపయోగించుకున్నది. చైనా ఉపయోగించుకున్నప్పటి నుండి ఈ గ్రానైట్ అంతరజాతీయ ముఖ్యంగా ఆసియా దేశాలలో ప్రబలమైంది. జపాన్‌తో సహా ఆసియాదేశాలు కరీంనగర్ గ్రానైట్‌ను వివిధ ప్రాజక్ట్‌లకు ఉపయోగించుకుంటుంది. పలు దేశాలు గ్రానైటును ఉత్తమ నాణ్యత, తక్కువ వెలకు లభించిన కారణంగా వాడుకుంటున్నాయి. కరీంనగర్‌లో మనకొండూరు, మల్లైల్, కేశవపట్టణం, కరీంనగర్ మొదలైన మండలాలలో 600 లకు పైగా క్వారీలు విస్తరించి ఉన్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయంగా పేరొందిన క్వారీలు మాత్రం 20. ఒక మాసానికి 10,000 నుండి 12,000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఉత్పత్తులు కరీంనగర్ నుండి చైనా, ఇతర దేశాలకు ఎగుమతి ఔతుంది. కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఆదాయం ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఉంటుంది. రైల్వే శాఖ కూడా గ్రానైట్ ఎగుమతుల ద్వారా మంచి అదాయాన్ని పొందుతుంది. గ్రానైట్ రవాణా కొరకు కరీంనగర్, గంగదారా, ఉప్పల్ రైల్వే స్టేషను‌లలో ప్రత్యేక ప్లాట్‌ఫారములు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి గ్రానైట్ చెన్నై, కాకినాడ రేవుల ద్వారా చైనాదేశానికి ఎగుమతి చేయబడుతుంది. ఈ గ్రానైట్ చైనా దేశానికి పంపిన తరువాత అక్కడ పాలిష్ చేయబడి జపాన్ వంటి ఆసియాదేశాలకు అమ్మబడుతుంది. బృహత్తరమైన గ్రానైట్ రాళ్ళను పైకి ఎత్తి పెట్టడానికి ఉపయోగిస్తున్న క్రేన్లు కూడా అనేక లక్షలు సంపాదిస్తున్నాయి. అలాగే గ్రాఫైట్ ఎగుమతుల ద్వారా అనేకమందికి ఉపాధి కూడా లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ సంస్థలు కరీంనగర్ ఇప్పుడిప్పుడే అంకురిస్తున్న ఐటి ప్రొడక్ట్స్, స్టార్టప్స్ యొక్క నిలయం . వీటిలో కొన్ని కంప్లీట్ ఐటి సొల్యూషన్స్, స్ఫూర్తి ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లూ-రే టెక్నాలజీస్, పెన్సిల్ కోడర్స్ లాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెలంగో లాబ్స్ ఐ ఎన్ సి, డి ఐ ఎస్ సి కంప్యూటర్ ఆరోగ్య సంరక్షణ కరీంనగర్ గత రెండు దశాబ్ధాలుగా చుట్టుపక్కల తాలూకాలకు ప్రధాన ఆరోగ్యసంరక్షణా కేంద్రంగా ఉంటుంది. జగిత్యాల, సిరిసిల్ల, రామగుండం, కొడిమ్యాల్, చెప్పియల్, మంథని, హుజూరాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, మల్యాల్, గంగాధర తాలూకాలకు కేంద్రమై ఉన్న కరీంనగర్ ఆరోగ్యసంరక్షణా కేంద్రంగా కూడా ప్రధానమైంది. జిల్లా మొత్తం నుండి రోగులు ఆరోగ్యసంరక్షణ కొరకు కరీంనగర్ మీద ఆధారపడుతుంటారు. ప్రభుత్వాసుపత్రి కూడా రోగులకు తగిన చికిత్స అందజేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఆస్పత్రులు కరీంనగర్ జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలో అశ్వినీ హాస్పిటల్ ఉంది. జిల్లాలోనే మొదటి సారిగా పాము కాటుకు చికిత్స ప్రారంభించింది ఇక్కడే. పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు శాసనసభ నియోజకవర్గాలు 4 మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం, హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం, చొప్పదండి శాసనసభ నియోజకవర్గం లోక్‌సభ స్థానాలు: 2 పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం స్థానిక స్వపరిపాలన పురపాలక సంఘాలు: కరీంనగర్, జమ్మికుంట, హుజురాబాద్, గ్రామ పంచాయితీలు: జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీలుతో కలుపుకొని 306 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన మండలాలు భౌగోళికంగా కరీంనగర్ జిల్లాలో పునర్య్వస్థీకరణకు ముందు 57 మండలాలు ఉన్నాయి. పునర్య్వస్థీకరణలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 57 పాత మండలాలు నుండి, కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా 15 మండలాలతో,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 226, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 పెద్దపల్లి జిల్లా 11 మండలాలతో,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 227, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 రాజన్న సిరిసిల్ల జిల్లా 9 మండలాలతోతెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 228, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4 మండలాలు,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 233, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 సిద్దిపేట జిల్లాలో 3 మండలాలు,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 240, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 పూర్వపు వరంగల్ పట్టణ జిల్లాలో ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో 3 మండలాలుతెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 231, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 కలిసాయి. జగిత్యాల జిల్లాలో కలిసిన మండలాలు జగిత్యాల మండలం రాయకల్ మండలం సారంగాపూర్ మండలం ధర్మపురి మండలం పెగడపల్లి మండలం గొల్లపల్లి మండలం కొడిమ్యాల మండలం మల్యాల మండలం కోరుట్ల మండలం మెట్‌పల్లి మండలం మల్లాపూర్ మండలం ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి మండలం కథలాపూర్ మండలం వెల్గటూర్ మండలం పెద్దపల్లి జిల్లాలో కలిసిన మండలాలు పెద్దపల్లి మండలం ఓదెల మండలం సుల్తానాబాద్ మండలం జూలపల్లి మండలం ఎలిగేడు మండలం ధర్మారం మండలం రామగుండం మండలం శ్రీరాంపూర్ మండలం కమాన్‌పూర్ మండలం మంథని మండలం ముత్తారం మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలిసిన మండలాలు సిరిసిల్ల మండలం గంభీరావుపేట్ మండలం వేములవాడ మండలం చందుర్తి మండలం బోయినపల్లి మండలం యల్లారెడ్డిపేట్ మండలం ముస్తాబాద్ మండలం ఇల్లంతకుంట మండలం కోనరావుపేట మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిసిన మండలాలు మల్హర్రావు మండలం కాటారం మండలం మహదేవ్‌పూర్ మండలం మహాముత్తారం మండలం సిద్దిపేట జిల్లాలో కలిసిన మండలాలు హుస్నాబాద్ మండలం అక్కన్నపెట్ మండలం కోహెడ మండలం బెజ్జంకి మండలం పూర్వపు వరంగల్ పట్టణ (ప్రస్తుత హన్మకొండ జిల్లా) జిల్లాలో కలిసిన మండలాలు ఎల్కతుర్తి మండలం భీమదేవరపల్లి మండలం కమలాపూర్ మండలం కరీంనగర్ జిల్లాలోని మండలాలు పునర్య్వస్థీకరణ తరువాత కరీంనగర్ జిల్లాపరిధిలో 12 పాత మండలాలకు అదనంగా 4 కొత్త మండలాలు ఏర్పాటుతో కలిపి 16 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు (కరీంనగర్, హుజారాబాద్), 210 రెవెన్యూ గ్రామాలతో అవతరించింది. అందులో 5 నిర్జన గ్రామాలు.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 225, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో కరీంనగర్ జిల్లా తాలూకాల వివరాలు . జూలై 26, 2007న సేకరించారు. కరీంనగర్ మండలం మానకొండూరు మండలం తిమ్మాపూర్ మండలం గంగాధర మండలం రామడుగు మండలం చొప్పదండి మండలం చిగురుమామిడి మండలం హుజూరాబాద్ మండలం వీణవంక మండలం వి.సైదాపూర్ మండలం జమ్మికుంట మండలం శంకరపట్నం మండలం కొత్తపల్లి మండలం* కరీంనగర్ గ్రామీణ మండలం* గన్నేరువరం మండలం* ఇల్లందకుంట మండలం* గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (4) రవాణా వ్వవస్థ రహదారి మార్గం కరీంనగర్ హైదరాబాదుకు 162 కి.మీ., వరంగల్ 70 కిలోమీటర్లు, నిజామాబాదు నుండి150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ జోనల్ ప్రధాన కార్యాలయం కరీంనగర్ జిల్లాలో ఉంది. రోజుకు 2,500 బస్సులు దాటి వెళ్ళే చురుకైన బస్సు స్టేషను‌లలో కరీంనగర్ బస్‌స్టేషను ఒకటి. . ఇక్కడి నుండి హైదరాబాదు, సికింద్రాబాద్కు మాత్రం వాల్వో బస్సుల వంటి అధునాతన బస్సులతో పాటు 300 బస్సులను నడుపుతుంటారు. అలాగే అదిలాబాదు, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, నల్గొండ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ళ, ఒంగోలు, కావలి, కందుకూరు, నెల్లూరు, పుట్టపర్తి, తిరుపతి మొదలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని ఊర్లకు బస్సులు నడుస్తుంటాయి . అలాగే ఇతర ప్రాంతాలైన ముంబాయి, భివంది, శిరిడీ, చంద్రపూరు, గద్చిరోలి, గొండియా, రామ్‌టెక్, అహిరి వంటి మహారాష్ట్రంలోని ఊర్లకు బస్సులను నడుపుతుంటారు. అలాగే కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు వాల్వో బస్సులను నడుపుతుంటారు. రైలు మార్గం thumb|కరీంనగర్ రైల్వే స్టేషను వద్ద ఆగిన గూడ్స్ రైలు|230x230px కరీంనగర్ సింగిల్ రైల్వే బ్రాడ్ గేజి లైన్ చేత ఉత్తర తూర్పు రైల్వే (ఢిల్లీ నుండి చెన్నై) 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లి వద్ద అనుసంధానించబడి ఉంది.అలాగే కరీంనగర్ నుండి 48 కిలోమీటర్లదూరంలో ఉన్న జగిత్యాల వద్ద ఉత్తర పడమట రైల్వే లైన్‌తో అనుసంధానించబడి ఉంది. ప్రతిరోజు (జగిత్యాల-సిరిపుర్‌కు పుష్-పుల్ పాసింజర్ అప్ అండ్ డౌన్), వారానికి ఒక సారి జగిత్యాల-విజయవాడలకు రైళ్ళను నడుపుతున్నారు. ఈ రైలు ప్రతి మంగళ, గురువారాలలో కరీంనగర్ రైల్వే స్టేషను ద్వారా పోతుంది. గ్రానైట్ రవాణా ద్వారా భారతీయ రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే అతి తక్కువ పట్టణాలలో కరీంనగర్ జిల్లా ఒకటి. అతి సమీపంలోని రైల్వే కూడలి ఖాజీపేట. అక్కడ నుండి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో సహా 147 రైళ్ళు ఈ రైలు మార్గం నుండి నడుస్తుంటాయి. ఈ మార్గం గుండా రాజధాని ఎక్స్‌ప్రెస్, ఎ పి ఎక్స్‌ప్రెస్ నడుస్తుంటాయి. 2009లో భారతీయ రైల్వే గుడ్స్- ఫ్రైట్ రవాణా సమయంలో కరీంనగర్ - జగిత్యాల రైల్వే ప్రథమ స్థానంలో ఉంది. భారతప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రణాళికను అనుసరించి, కరీంనగర్ రైల్వే లైన్ల నిర్మాణం పూర్తి అయినట్లైతే, కరీంనగర్ రైల్వే జంక్షన్ తూర్పు- పడమర, ఉత్తర దక్షిణాల రైలు మార్గాను అనుసంధానించే పెద్ద రైల్వే కూడలిగా మారుతుంది. బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం. వాయు మార్గం కరీంనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగుండంలోని బసంత నగర్ కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న విమానాశ్రయం నుండి భారత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్న వాయుదూత్ విమానాలు నడిపే సమయంలో సర్వీసులు ఉండేవి. వాయుదూత్ విమాన సేవలను నిలిపి వేసిన తరువాత ఈ విమానాశ్రయం వాడుకలో లేదు. 2010 లో ఈ విమానాశ్రయం చాలా ప్రముఖ వ్యక్తుల విమానాలు నిలపడానికి అత్యవసర పరిస్థితిలో ఎయిర్ ఇండియా విమానాలు నిలపడానికి వాడబడుతుంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణాలోని రెండవ విమానాశ్రయంగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. కరీంనగర్‌కు సమీపంలోని ముఖ్య విమానాశ్రయం 162 కిలోమీటర్ల దూరంలో హైద్రాబాదు శివార్లలో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం . జనాభా లెక్కలు రాష్ట్ర వైశాల్యంలో జిల్లా వైశాల్యం శాతం - 4.29 రాష్ట్ర జనాభాలో జిల్లా జనాభా శాతం - 4.59 నగరీకరణ - 20.55% 2011 భారతదేశ గణాంకాలను అనుసరించి, కరీంనగర్ జనసంఖ్య 2,99,660. వీరిలో పురుషుల శాతం 51% స్త్రీల శాతం 49%. సరాసరి అక్షరాస్యత శాతం 86.75%, ఇది జాతీయ అక్షరాస్యత 74.04% కంటే అధికం: వీరిలో పురుషుల అక్షరాస్యత 92.61%, స్త్రీల అక్షరాస్యత 80.79%. కరీంనగర్‌లో, జనాభాలో 12% అరు సంవత్సరాలకంటే త్క్కువైన వారు. సంస్కృతి సంస్కృతి:- కరీంనగర్ జిల్లాలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. సంప్రదాయవస్త్రాలైన చీర, ధోవతి లే కాకుండా అధునిక వస్త్ర ధారణ కూడా చేస్తుంటారు. పండగలు:- కరీంనగర్ ప్రత్యేకత అయిన బతుకమ్మ పండుగను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంలో బతుకమ్మను అందమైన స్థానికంగా లభించే పూలతో అలకంకరించి సామూహికంగా సాంప్రదాయకమైన గీతనృత్యాలతో స్త్రీలు వేడుక చేసుకుంటారు. ఇతర హిందూ పండుగలైన ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి, హోలి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి, సంక్రాంతి, మహాశివరాత్రి పండుగలు జరుపుకుంటారు. అలాగే ముస్లిములు రంజాన్, మొహరమ్ వంటి పండుగలు జరుపుకుంటారు. అలాగే క్రైస్తవులు క్రిస్‌మస్, గుడ్‌ఫ్రైడే జరుపుకుంటారు. ఆహార సంస్కృతి:- కరీంనగర్ జిల్లా ప్రత్యేక ఆహారం పిండివంటలలో సకిలాలు ఒకటి. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంలో వీటిని ప్రతి ఇంట చేసుకుంటారు. బియ్యపు పిండి, నువ్వులు కలిపి తయారు చేసిన పిండిని నూనెలో దేవి వీటిని తయారు చేస్తారు. కరీంనగర్‌లో అత్యధికులు హిందువులు. అయినా ఈ ప్రదేశం భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు గుర్తించతగిన ముస్లిం పాలకుల చేత పాలించబడింది. కరీంనగర్‌లో హిందువుల శాతం 80%, ముస్లిముల శాతం 4%, సిక్కులు 1%. కరీంనగర్ జిల్లా అంతటా అనేక హిందూ ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఉన్నాయి. ప్రజలు ప్రతి మతాన్ని గౌరవిస్తూ ఒకరితో ఒకరు సహకారంతో జీవిస్తున్నారు. సినిమా థియేటర్లు 1 ప్రతిమ మల్టీప్లెక్సు థియేటర్ (2 తెరలు) 2 భారత్ థియేటర్ 3 శ్రీనివాస థియేటర్ ... మల్టీప్లెక్సు (3 తెరలు) 4 వెంకటసాయి థియేటర్ 5 శ్రీ తిరుమల థియేటర్ 6 రాజ థియేటర్ 7 వెంకటేశ్వర థియేటర్ 8 తిరందాజ్ థియేటర్ 9 శివ థియేటర్ 10 సాయికృష్న థియేటర్ 11 మమత థియేటర్ 12 రోజ్ థియేటర్ (మూసివేయబడింది) 13 బాలకృష థియేటర్ (మూసివేయబడింది) 14 నటరాజ్ థియేటర్ (మూసివేయబడింది) విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ వాయవ్యదిశలో ఉన్న విద్యావిషయ ప్రధాన కేంద్రాలలో కరీంనగర్ ఒకటి. కరీంనగర్ అనేక మేధావులను, రాజకీయ నాయకులను, కవులను, సాంకేతిక నిపుణులను పలు దశాబ్ధాలుగా తయారు చేసింది. ప్రధానమంత్రిగా సేవలందించిన పి. వి. నరసింహారావు వారిలో ఒకరు. కరీనగర్ జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు. శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్. జవహర్ లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ, కరీంనగర్, నాచుపల్లి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ ఎ సి ) ఈ విశ్వవిద్యాలయం ఒక ప్రాంతీయ విద్యాకేంద్రాన్ని కరీంనగర్ జిల్లా జగిత్యాల వద్ద స్థాపించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల. ఆకర్షణలు కరీంనగర్ జిల్లాలో అనేక విధాల పర్యాటకుల ఆకర్షించే అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అతి ప్రధానమైనవి క్రింద వర్ణించ బడ్డాయి. పుణ్య క్షేత్రాలు: వేములవాడ, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, కొండగట్టు, బిజిగిర్‌షరేఫ్ చొప్పదండి శివకేశవాలయం ఎక్కడా లేని విధంగా శివుడు, విష్ణువు ముఖద్వారం ఎదురెదురుగా ఉంటాయి.చొప్పదండి సరస్వతి ఆలయం నిర్మాణంలో ఉంది కరీంనగర్ జిల్లాలో సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో (సిల్వర్ పిలిగ్రి) నాణ్యమైంది.వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే ఈ కళకు కరీంనగర్‌ ప్రసిద్ధి . ఎల్గండల్ కోట కరీంనగర్ జిల్లాలో కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఎల్గండల్ కోట నిర్మించబడి ఉంది. చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్ - దౌలా చేత నిర్మించబడింది. ముస్లిమ్ సన్యాసులైన సైయద్ షాహ్ మునావర్ క్వాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్, వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి. ఉజ్వలా పార్కు కరీంనగర్ జిల్లా ఆకర్షణలలో ఉజ్వలా పార్కు ఒకటి. 2001లో ఈ పార్క్‌కు ప్రారంభోత్సవం జరిగింది. పొన్నం ప్రభకర్ పర్యవెక్ష్నలో ఉంధి ప్రకృతి మనోహరమైన వాతావరణంలో ఉన్న ఈ పార్క్‌ను సందర్శించడానికి కరీంనగర్ నుండి పర్యాటకులు అధికంగా వస్తుంటారు. కరీంనగర్ పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రదేశం ఇది. దిగువ మానేరు రిజర్వాయర్ thumb|కరీంనగర్ లోని మానేరు రిజర్వాయర్ దిగువ మానేరు రిజర్వాయర్ 1974లో ప్రారంభించబడి 1985లో నిర్మాణపు పనులు పూర్తి చేయబడ్డాయి. వర్షాకాలంలో ఈ రిజర్వాయర్ నీటి మట్టం అత్యధికంగా పెరుగుతుంది. రాజీవ్ డీర్ పార్కు దిగువ మానేర్ రిజర్వాయర్ సమీపంలో ఉన్న 30 ఎకరాల వైశాల్యంలో రాజీవ్ డీర్ పార్కు కరీంనగర్ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది కరీంనగర్ శివార్లలో ఉంది. వేములవాడ కరీంనగర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం హిందువులను విశేషంగా ఆకర్షించే అధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుంది. ఈ దేవాలయ కూడలికి అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ధర్మపురి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో హిందూ ఆలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ విష్ణుమూర్తి అవతారలలో ఒకటి అయిన నరసింహస్వామి ఆలయం, దక్షిణామూర్తితో ఉన్న శివాలయం, ఏక శిలలో చెక్కబడిన వినాయకుడు, సప్త మాతృకల శిల్పాలు, మహిషాసుర మర్ధిని అరవై స్తంభాలు కలిగిన ఆలయంలో ఉన్నారు, 5 వందల సంవత్సరాల పూర్వపు శ్రీ సీతారామ ఆలయం, అక్కాపల్లే రాజన్న మొదలైన పవిత్రక్షేత్రాలు ఈ జిల్లాను అధ్యాత్మిక సుసంపన్నం చేస్తున్నాయి. కొండగట్టు కరీంనగర్ 35 కిలోమీటర్లదూరంలో ఉన్న కొండగట్టు వద్ద ఉన్న ఆంజనేయుడి ఆలయం ఉంది. ఈ ఆలయం 300 సంవత్సరాల క్రితం ఒక కౌహర్డ్ చేత నిర్మించబడినదని భావిస్తున్నారు. 160 సంవత్సరాల క్రితం తిరిగి ఈ ఆలయం కృష్ణారావ్ దేశ్‌ముఖ్ గారి చేత పునరుద్ధరణ చేయబడింది. ఈ ఆలయంలో 40 రోజుల దీక్ష వహించి పూజ చేసిన స్త్రీ మాతృమూర్తి ఔతుందని విశ్వసిస్తున్నారు. వేములవాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కరీంనగర్‌ జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. ఎల్లారెడ్డిపేట కరీంనగర్కు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న ఎల్లారెడ్డిపేటలో పూర్వం రాజులు నివసించిన రాజ భవనం, ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలగా రూపుదిద్దుకుంది. ఈ పాఠశాల నుండి దక్షిణన ఉన్న జక్కుల చెరువుకు మధ్యలో ఒక సొరంగం ఉంది. అలాగే ఊరికి తూర్పున శ్రీ రేణుఖామాత ఆలయం ఉంది. ఆ దేవత ఊరి జనాలకు అండగా ఉండి అందరి బాధలను తీరుస్తూ నిత్యపూజలతో కొలువబడుతుంది. రాయికల్ జలపాతం రాయకల్ జలపాతం, వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ జిల్లా కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం దట్టమైన పచ్చని అటవీ ప్రాంతంలోని కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. 170 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకుతున్న ఈ జలపాతం చుట్టుప్రక్కల ప్రాంతంలోని ఈ సుందర ప్రదేశం పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు కనులవిందును కలిగిస్తుంది. బౌద్ధక్షేత్రాలు ధూళికట్ట, పడుకాపూర్ బౌద్ధక్షేత్రాలు కూడా పరిఢవిల్లాయి.శతవసంతాల కరీంనగర్ జిల్లా (1905-2005), మానేరుటైమ్స్ ప్రచురణ, పేజీ 95 క్రీడలు కరీంనగర్ జిల్లా అనేక క్రీడా సౌలభ్యాలు ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయి వివిధ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. తీగల వంతెన మానేరు నదిపై తీగల వంతెన నిర్మించబడింది. జిల్లాలో ప్రముఖులు పి.వి.నరసింహారావు, సి.నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జి.వెంకట స్వామి, సి.హెచ్.విద్యాసాగర్ రావు, జువ్వాడి చొక్కారావు, ఎం. సత్యనారాయణరావు, సి.హెచ్.హనుమంతరావు, ఘంటా చక్రపాణి, ఈటెల రాజేందర్, రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, దుద్దిళ్ల శ్రీపాదరావు, ముద్దసాని దామోదర్ రెడ్డి, దుగ్గిరాల వెంకట్రావు లాంటి ప్రముఖులు ఈ జిల్లాకు చెందినవారు. ● పైడి జై రాజ్,నటుడు, దర్శకుడు, నిర్మాత.తెలంగాణ నుండి మొదటి దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత. ఇవి కూడా చూడండి జిల్లా గ్రామాల జాబితా మూలాలు బయటి లింకులు కరీంనగర్ జిల్లా అధికారిక వెబ్‌సైటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సైటులో కరీంనగర్ వివరాలు ఈనాడులో జిల్లా వివరాలు
చిత్తూరు
https://te.wikipedia.org/wiki/చిత్తూరు
చిత్తూరు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా నగరం, జిల్లా కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్ కు దక్షిణాన, పెన్నానదిలోయలో, బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉంది. చిత్తూరు ద్రవిడ ప్రాంతం. ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతారు. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది.ఇది ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనెగింజలు, బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి. పేరు వ్యుత్పత్తి గతంలో ఈ ఊరి పేరు చిట్ర ఊర్ అని అరవంలో అనేవారు. అది ఆనాడు తమిళ దేసములో ఒక భాగము. చిట్ర అంటే చిన్నది, అనీ, ఊర్ అనగా గ్రామం అని అర్థము. ఆ పేరు కాలక్రమములో చిత్తూరుగా మార్పు చెందింది. చరిత్ర మద్రాసు ప్రొవిన్స్ లోని ఈ ప్రాంతం 1911 లో జిల్లాగా ఏర్పడి, 1953లో ఆంధ్రరాష్ట్రంలో భాగమైంది. పట్టణ స్వరూపం, జనవిస్తరణ 2011 జనగణన ప్రకారం, విస్తీర్ణం:35.75 చ.కి.మీ . సముద్రమట్టం నుండి ఎత్తు: 333.75 మీ (1,094.98 అ.) జనాభా మొత్తం: (పట్టణం+విస్తరించిన ప్రాంతం) 160722 పరిపాలన చిత్తూరు నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన జరుగుతుంది. సదుపాయాలు రవాణా ఈ నగరం బెంగుళూరు -చెన్నై రహదారి మీద ఉంది. చిత్తూరు రైల్వే స్టేషను పాకాల - కాట్పాడి రైలు మార్గములో ఉంది. సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం. ఆర్ధికం ఆర్ధికంగా చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవుకాని చుట్టుప్రక్కల పంటలకు మార్కెట్ యార్డ్ గా ఉంది పరిశ్రమలు చిత్తూరు జిల్లా సహకార చక్కెర మిల్లు శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర మిల్లు విజయ్ సహకార పాలు, పాలపదార్థాల డైరీ అమరరాజా గ్రూప్ కంపెనీ : ఈ కంపెనీ యందు 3,600 ఉద్యోగులు పనిచేస్తున్నారు. న్యూట్రిన్ కన్ఫెక్షనరీస్ (2007 లో గోద్రెజ్ కంపెనీ కొన్నది) సారా లీ బిస్కట్స్ (క్రితం న్యూట్రిన్ బిస్కట్స్) ఇస్రో రాడార్ కేంద్రం గాదంకి వద్ద. హెరిటేజ్ పాలు, పాలపదార్థాల డైరీ వ్యవసాయం రైతులు ప్రధానముగా ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగ ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వ్యాపారం చిత్తూరు పట్టణం జిల్లాలో వ్యాపారానికి కేంద్రముగా ఉంది. ఇక్కడి వ్యాపారస్తులు బెంగుళూరు - చెన్నై దగ్గరగా ఉన్నందున అక్కడనుండి సరుకులు దిగుమతి, ఇక్కడి నుండి ఆక్కడికి సరుకులు ఎగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా బెల్లము, మామిడి కాయల ఎగుమతికి చిత్తూరు పేరు గాంచింది. పర్యాటక ప్రదేశాలు thumb|240px|కాణిపాక గణపతి దేవాలయము కాణిపాక గణపతి:చిత్తూరుకు దగ్గరలో 10 కి.మీ దూరమున స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి ఉంది. చిత్తూరు నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కలదు . ఇక్కడ అసత్యప్రమాణాలు చెయడానికి భక్తులు జంకుతారు, ఇక్కడ అపద్దపు ప్రమాణం చెసినవారికి ఏదోఒక కీడు జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అందుకే ఈయనను సత్యప్రమాణాల కాణిపాక గణపతిగా పిలుస్తారు. ఏదైనా కార్యము మొదలుపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఆ కార్యము విఘ్నములు లేకుండా సాఫీగా సాగుతుంది అని ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామి వారు దినదినమూ పెరుగుతూ ఉంటారు దానికి సాక్షాలు చాలా ఉన్నాయి. అర్ధగిరి వీరాంజనేయ స్వామి: చిత్తూరుకు దగ్గరలో 20 కి.మీ దూరమున అరగొండ ఊరిలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ పుష్కరిణిలోని నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తటాకము లోని నీరు ఎన్ని సంవత్సరాలు అయిన చెడిపోవు. ఇక్కడి మట్టిని మండలం రోజులు పాటు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవని, ఉన్న చర్మ వ్యాధులు పొతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి పున్నమి నాడు "ఓంకార" నాదం వినబడుతుందని భక్తులు చెపుతుంటారు. మొగిలి : చిత్తూరుకు 20 కి.మీ. దూరంలో మొగిలీశ్వరాలయం ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన ఆలయ గర్భగుడిలో వెలసి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి నోటిలో నుంచి ప్రతీ క్షణము నీరు వస్తుంటుంది. ఈఆలయం చిత్తూరు - బెంగుళూరు రహదారిలో ఉంది. శ్రీ పొన్నియమ్మ ఆలయం, చిత్తూరు: పట్టణంలోని ఈ ఆలయం విశేషమైన ప్రాశస్తాన్ని సంతరించుకున్నది. భక్తుల కష్టాలను కడతేర్చడానికి శ్రీ పొన్నియమ్మ తల్లి స్వయంభూగా వెలసి భక్తుల పూజలందుకుంటున్నది. చూపరులను ఆకట్టుకునే వర్ణరంజితశోభతో, శిల్పకళానైపుణ్యంతో అలరారుతోంది. శ్రీ దనుమకొండ గంగమ్మ తల్లి ఆలయం, చిత్తూరు ఈనాడు జిల్లా ఎడిషన్ 2013 అక్టోబరు 23. ఇవి కూడా చూడండి చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం మూలాలు బయటి లింకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు వర్గం:రాయలసీమ వర్గం:చిత్తూరు జిల్లా
అనంతపురం జిల్లా
https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. జిల్లా కేంద్రం అనంతపురం. 2022 లో ఈ జిల్లాను విభజించి కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిరప,అరటి,నువ్వులు, చెరుకు, పట్టు. ఇక్కడి ముఖ్యమైన పరిశ్రమలలో సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం, ఆటోమొబైల్ ఉన్నాయి. జిల్లా చరిత్ర మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని అశోకుడు పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిర తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది. పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. అమరసింహుడు వీరిలో ముఖ్యుడు. ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయసలులు, యాదవులు మొదలగు వారి తరువాతి శతాబ్ద కాలం ఈ జిల్లాను పాలించారు. తర్వాత ఢిల్లీ నుండి పరిపాలన చేస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాం రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రాన్ని కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారానికి కాపలాగా ఉన్న మొదటి హరిహరరాయలు, బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది. బుక్కరాయల పేరు మీదుగా ఈ ప్రాంతంలో ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయసముద్రం అను పట్టణం ఏర్పడింది. ఈ ప్రాంతపు పట్టణానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశపు అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. 1677 లో ఈ ప్రాంతం మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్థులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని స్వాదీనపరచు కున్నాడు. 1800 సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్ధతి కారణంగా నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 1882 లో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి,మదిగుబ్బ,నల్లమాడ,నంబులిపులికుంట,తలుపుల,నల్లచెరువు, ఓబులదేవరచెరువు,తనకల్లు,ఆమడగూరు మండలాలు 1910లో అనంతపురం జిల్లాలో కలిశాయి. తిరిగి బళ్ళారి జిల్లాలో భాగంగా ఉన్న రాయదుర్గం, డి.హిరేహాల్, కణేకల్లు, బొమ్మనహళ్, గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు 2022 ఏప్రిల్ 4 న శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుకు జిల్లా నుండి 29 మండలాలను విడదీశారు. భౌగోళిక స్వరూపం జిల్లా విస్తీర్ణం: 10,205 చ.కి.మీ జనాభా వివరాలు 2011 జనాభా లెక్కల ప్రకారం 2022 లో సవరించిన హద్దులపు అనంతపురం జిల్లా జనాభా 22.411 లక్షలు. తెలుగు, ఉర్దూ జిల్లాలోని భాషలు. రెవెన్యూ డివిజన్లు, మండలాలు భౌగోళికంగా జిల్లాను 3 రెవెన్యూ డివిజన్లుగాను,31 మండలాలుగా విభజించారు. గుంతకల్ రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటైంది. మండలాలు అనంతపురం రెవెన్యూ డివిజన్ అనంతపురం ఆత్మకూరు కూడేరు గార్లదిన్నె తాడిపత్రి నార్పల పుట్లూరు పెద్దపప్పూరు బుక్కరాయసముద్రం యల్లనూరు రాప్తాడు శింగనమల కల్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ కణేకల్లు కళ్యాణదుర్గం కుందుర్పి కంబదూరు గుమ్మగట్ట డి.హిరేహాల్ బెళుగుప్ప బొమ్మనహళ్ రాయదుర్గం శెట్టూరు గుంతకల్ రెవెన్యూ డివిజన్ ఉరవకొండ గుత్తి గుంతకల్లు పామిడి పెద్దవడుగూరు బ్రహ్మసముద్రం యాడికి వజ్రకరూరు విడపనకల్లు అనంతపురం జిల్లాలో మొత్తం 503 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నగరాలు, పట్టణాలు నగరం:అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు. పట్టణాలు: కళ్యాణదుర్గం గుత్తి రాయదుర్గం ఉరవకొండ కణేకల్లు పామిడి రాజకీయ విభాగాలు లోక్‌సభ నియోజకవర్గాలు అనంతపురం హిందూపురం (పాక్షికం): రాప్తాడు శాసనసభ నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాలు. శాసనసభా నియోజక వర్గాలు మొత్తం 8 శాసనసభ నియోజకవర్గాలు: అనంతపురం పట్టణ ఉరవకొండ కళ్యాణదుర్గం గుంతకల్లు తాడిపత్రి రాప్తాడు (పాక్షికం): రాప్తాడు, అనంతపురం మండలం (గ్రామీణ భాగం), ఆత్మకూరు మండలాలు ఈ జిల్లాలో వుండగా, కనగానపల్లి, చెన్నే కొత్తపల్లి, రామగిరి మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలో వున్నవి రాయదుర్గం శింగనమల రవాణా వ్యవస్థ రహదారి సౌకర్యాలు NH-44, NH-42 జాతీయ రహదారులు జిల్లాలో అనంతపురం గుండా పోతున్నాయి. జిల్లాకు రైలు సదుపాయం కూడా ఉంది, జిల్లాలో ఉన్న గుంతకల్లు రైల్వే జంక్షన్ దక్షిణ మధ్య రైల్వే డివిజన్ లో రెండవ అతిపెద్ద జంక్షన్, ఇక్కడినుండి దేశ నలుమూలలకు రైలు సదుపాయం ఉంది. రైలు సౌకర్యాలు దక్షిణ మధ్య రైల్వేలో 3 వ పెద్ద డివిజన్ అయిన గుంతకల్లు ఈ జిల్లాలో ఉంది. ఇక్కడినుండి ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణిస్తూంటారు. ముంబై-చెన్నై ప్రధాన రైలు మార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది. అంతే కాకుండా గుంతకల్లు రైల్వే స్టేషను నుండి నాలుగు ప్రధాన రైలు మార్గాల ద్వారా ప్రయాణికుల రైళ్ళు వెళతాయి. విమానయాన సౌకర్యాలు 168 కిలోమీటర్ల దూరంలో బెంగుళూరు లోని దేవనహళ్ళి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. జిల్లాలో అనంతపూరుకు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో గుత్త విమానయాన సేవలకు మాత్రమే పరిమితమైన పుట్టపర్తి విమానాశ్రయం ఉంది. సంస్కృతి రాగి సంకటి, జొన్నరొట్టె ఎక్కువగా తీసుకుంటారు పరిశ్రమలు యాడికి, గత దశాబ్దకాలంగా ధర్మవరం తరువాత అతిపెద్ద పట్టు, జౌళి పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబరు కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవన విద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. శింగనమల, వజ్రకరూరు కూడేరు జిల్లాలోని కొన్ని ముఖ్య పవనవిద్యుత్కేంద్రాలు. పారిశ్రామికపరంగా గ్రానైటును శుద్ధి చేయు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారం, బీడీల పరిశ్రమ, మోటారు కారు (కియా) పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి. సప్తగిరి కేంఫర్ (దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద కర్పూరపు ఫ్యాక్టరీ ) విద్యాసంస్థలు అనంతపురం లోని గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజిని 1916లో స్థాపించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వ్యక్తులు ఈ కాలేజీలో చదివారు. ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థల వివరాలు: సంఖ్యవిద్యాసంస్థవివరణసంఖ్య1ప్రాథమిక పాఠశాలలుఆంగ్ల మాద్య పాఠశాలలు32 హైస్కూల్స్ ప్రభుత్వ, ప్రవేట్ హైస్కూపాఠశాల రెసిడెన్షియల్73జూనియర్ కాలేజులు బాలల, బాలబాలికల జూనియర్34కళాశాలలుప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు65ఉన్నతకళాశాలలుఎమ్ ఎస్ సి, పి జి, డిగ్రీ, పిజి కాలేజులు46విశ్వవిద్యాలయాలుకేంద్ర, జవహర్లాల్27మెడికల్ కాలేజీలుప్రభుత్వ మెడికల్ కాలేజ్18ఫార్మసీరాఘవేంద్రా కాలేజ్ 119ఇంజనీరింగ్ కాలేజీలుఇంజనీరింగ్ కాలేజీలు410పోలీస్ ట్రైనింగ్పోలీస్ ట్రైనింగ్111నర్సింగ్శ్రీ సాయీ నర్సింగ్112 ఇన్‌స్టిట్యూట్స్ ఎజ్యుకేషనల్, టెక్నో డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్స్1013టీచర్ ట్రైనింగ్ సత్యసాయీ, లిటిల్ ఫ్లవర్ సంస్థలకు చెందినవి214 ఫిజియోథెరఫీకస్తూర్భా ఫిజియోథెరఫీ1 దర్శనీయ ప్రదేశాలు అనంతపురం జిల్లాలోని జైన క్షేత్రాలు కొనకొండ్ల ఈ కొనకొండ్ల, అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండలానికి చెందిన గ్రామం. శాసనపరంగాను జినకథనం పరంగాను చూస్తే కుందకుందాచార్యుడు కొనకొండ్ల దాపున గల కొండపై నివసించినట్లు బోధపడుతున్నది. ఇంద్రనంది శృతావతారం పద్మనంది అనే జినగురువు ఇక్కడ నివచించినట్లు తెలుస్తున్నది. దీని అసలు పేరు కుంద కుంద పురం, కుందకుందాచార్యుని అసలు పేరు పద్మనంది అనియు అక్కడ లభించన శాసనాల వలన తెలుస్తున్నది. ప్రస్తుతం ఇక్కడ జినావాశేషములన్నియు కొనకొండ్ల దాపునగల రససిద్ధుల గుట్టపై మనం ఇప్పటికీ చూడవచ్చును. ఇందులో కాయచ్చర్గ భంగిమ బాగా ప్రసిద్ధి చెందినది. నిటారుగా ఏ వంపులు లేకుండా నిలబడి రెండు చేతులను మోకాలివరకు తిన్నగా వ్రేలాడువేయు భంగిమను కాయచ్చర్గ భంగిమ అంటారు. జిన మతానుసారం ఋషభనాధుడు, నేమినాఢుడు, మహావీరుడు మినహా మిగిలిన 21 తీర్ధంకరులు ఈ భంగిమలోనే సిద్ధి పొందారు. ఇక్కడ సిద్దచక్రం చెక్కబడి ఉంది. రాయదుర్గం రాయదుర్గం అంటే రాజాగారికోట. ఈ కోటదాటి ఉత్తరదిశగా 1 కి.మీ. పయనిస్తే మనకు శిద్ధుల గుట్ట కావవస్తుంది. ఇది అసలు జినక్షేత్రం. ఇది యాపనీయ శాఖకు చెందినది.యాపనీయులు జైనమతాచారాలన్నిటినీ సరళంచేసి సామాన్య ప్రజలకు సైతం ఆచరణయోగ్యంగా చేసేవారు.అటువంటి యాపనీయ సంఘమునకు చెందిన జినక్షేత్రం ఇది.జినులు స్త్రీలను మోక్షానికి అనర్హులుగా యెంచి వారిని జైనమతంలో చేర్చుకొనకపోతే యాపనీయులు స్త్రీలుకూడా మోక్షానికి అర్హులేఅని స్త్రీలకు జైనమతంలో ప్రవేశం కల్పించిరి. కంబదూరు ఇది కల్యాణదుర్గంలో తాలూకాలోనిది.ఇక్కడ ఉన్న మల్లేశ్వరస్వామి దేవాలయం ఒకప్పటి జినాలయం. జైన వీరశైవ మత కలహాల తరుణంలో వీరశైవులు విజృంభించి ఇక్కడ ఉన్న జిన్నమతాన్ని ఛ్హిన్నాభిన్నం చేసిరి.అందుకే ఈ ఆలయంలో ఇంకా జినప్రతిమలు కనబడుతున్నవి.శిక్షరం పైన పరియం కాసానం (పద్మాసనం) లో ఉన్న జైనమునిని మనం చూడవచ్చును. ఇక్కడే ఉన్న అక్కమగుడి ఆలయాకృతినిబట్టి ఇదికూడా జినాలయం అని తెలియుచున్నది. అమరాపురం ఈగ్రామం బాలేందు మలధారి అనే జినగురువుచే ప్రభావితమైనది.ఇతడు మూలసంఘము, దేశీయగుణము, పుస్తక్ గుఛ్చ, ఇనగలి బలికి చెందిన జిన సంఘారామానికి గురువు.జైనమతంలో కూడా బౌద్ధమతంలో వలే అనేక సంఘారామశాఖలు ఉన్నాయి. ప్రతి జినగురువును తెలిసేటప్పుడు ఆతని సంఘము, గుణము, గుఛ్ఛము విధిగా తెలుపవలెను.ఈ గ్రామం మొత్తం ఒకప్పటి జిన క్షేత్రం. రత్నగిరి ఇది విజయనగర రాజుల కాలంలో పరసిద్ధిగాంచిన జినక్షేత్రం. ఇచ్చట శాంతినాధుని దేవాలయం ఉంది.ఇది చాలా పెద్దది.స్థానిక జైనులతో మరమ్మత్తులు చేయించుకొనబడింది.శాంతినాధుడు జైనుల 16వ తీర్ధంకరుడు. తాడిపత్రి సా.శ. 12వ శతాబ్దంలో ఇది జైనుల క్షేత్రమని తెలియుచున్నది.సా.శ.1198లో ఉదయాదిత్యుడనే సామంత ప్రభువు ఇచ్చటగల చంద్రనాధ పార్స్వనాధ జినాలయానికి భూమిదానమిచినట్లు ఇక్కడ ఒక శాసనం ఉంది. తగరకుంట సా.శ. 11-12వ శతాబ్దంలో ఇది జైనుల చంద్రప్రభువు తీర్ధంకరుడి క్షేత్రమని తెలియుచున్నది. ఆరవ చాళుక్య విక్రమదిత్యుడు రాజ్యం చేస్తున్న తరుణంలో ఆతని సామంతరాజు ఇక్కడ జినాలయమునకు భూమిని దానం చేసినట్లు ఇక్కడ లభించిన శాసనం తెలుపుచున్నది. పెనుగొండ ఇది ప్రఖ్యాత జినక్షేత్రమని జినసారస్వతంలో కీర్తించబడింది.పైగా పెనుగొండ యావద్భారతంలో గల నాలుగు జినవిద్యాకేంద్రాలలో ఒకతిగా జిన కథన,ఉలు తెలుపుచున్నవి.మిగిలిన్ మూడు ఢిల్లీ, కొల్హాపూర్, జినకంచి.విజయనగర రాజుల పాలనలో కూడా పెనుగొండ జినక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అజితనాధుని, పార్స్వనాధుని బసదులను లేదా జినాలయములు ఇప్పటికీ తెలుయుచున్నవి.అజితనాధుడు రెండవ తీర్ధంకరుడు. ఏనుగు ఆతని లాంచనము.పార్స్వనాధుడు 23వ తీర్ధంకరుడు. ఇచట కల అజితనాధ దేవాల్యం దక్షిణ శిఖరం కలిగి ఉంది.అంటే హిందూ దేవాలయాల శిఖరాలను పోలిన శిఖరాకృతి. ఈ అజితనాధ జినాలయం శీఖరం మార్పు జైనమతం చివరి దశలో జరిగి ఉండవచ్చును.అదియును విజయనగర రాజులలోనే ఈ మార్పు జైరిగి ఉండవచ్చును. ఇతరాలు పెనుకొండ: (ఘనగిరి) హజారత్‌బాబా మసీదు (దర్గా), పెనుకొండ ప్రవేశంలో ఉన్న 14వ శతాబ్ధానికి చెందిన పెద్ద హనుమాన్ విగ్రహం, కోటగోడ, తిమ్మరుసు సమాధి, పెద్ద నరసింహస్వామి ఆలయం, కొండశిఖరం మీద ఉన్న కోనేరు, గగన్ మహాల్ (కృష్ణదేవరాయ వేసవి విడిది) గుత్తి కోట, గుత్తి: ఈ కోటలో సుమారు 101 దిగుడు బావులు ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, పెన్న అహోబిళం, ఉరవకొండ మండలం శ్రీ రామలింగేశ్వరాలయం,ఉరవకొండ మండలం జారుట్ల రాంపురం: ఈ ఆలయంలో శివలింగం నుండి సదా ఉత్తర దక్షిణాలుగా నీరు ప్రవహిస్తూఉండం ఒక ఆధ్యాత్మిక అద్భుతం. అందుకనే ఈ ఆలయాన్ని దక్షిణ కాశిగా పిలువబడుతుంది. ఈ ఆలయానికి ఒక పక్క పెద్ద కొండ, పెద్ద అడవి (500 ఎకరాలు పైగా విస్తరించి ఉంది) వెనుక పక్క పెన్నా నది ప్రహిస్తుంటుంది. అలాగే ఎమ్ పి ఆర్ ఆనకట్ట కూడా ఉంది. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం, కసాపురం, గుంతకల్లు మండలం క్రీడా సౌకర్యాలు ది అనంతపుర్ స్పోర్ట్స్ విలేజ్ (ఎ ఎస్ వి) జాతీయ రహదారి 44 పక్కగా ఉంది. ఇక్కడ ప్రధాన క్రీడా లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన సదుపాయాలు ఉన్నాయి. స్పెయిన్ దేశ టెన్నిస్ క్రీడాకారుడైన రఫేల్ నాడల్ అనంతపురం లోని స్పోర్ట్స్ విల్లేజ్ లో నాడల్ టెన్నిస్ పాఠశాలను (ఎన్ టి ఎస్) స్థాపించాడు. ఇలాంటి పాఠశాల ప్రపంచంలో ఇదే మొదటిది. 40 ఎకరాలలో ఏర్పాటు చేసిన అనంతపురం క్రికెట్ మైదానం అనంతపురంలో ఉంది. క్రీడల నిర్వహణ 1963-1964 లో ఇరానీ కప్పు, పలు బాస్కెట్ బాల్, బ్యాట్మింటన్ రంజీ ట్రోఫీ క్రీడలు అనంతపురంలో జరిగాయి. జిల్లా ప్రముఖులు నీలం సంజీవరెడ్డి: పూర్వ భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (రెండుమార్లు), లోక్‌సభ స్పీకరు (రెండుమార్లు), ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి, కేంద్రమంత్రి తరిమెల నాగిరెడ్డి: కమ్యూనిస్టు నాయకుడు, తాకట్టులో భారతదేశం పుస్తక రచయిత, పూర్వ లోక్‌సభ సభ్యుడు, నందమూరి తారక రామారావు: పూర్వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. కె. వి. రెడ్డి: తెలుగు సినీ దర్శకుడు బళ్ళారి రాఘవ: ప్రముఖ రంగస్థల నటుడు సత్య నాదెళ్ళ: మైక్రోసాఫ్ట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) చల్లా కోదండరామ్, హైకోర్టు న్యాయమూర్తి చిత్రమాలిక మూలాలు బయటి లింకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:రాయలసీమ వర్గం:అనంతపురం జిల్లా వర్గం:భారతదేశం లోని జిల్లాలు
వైఎస్‌ఆర్ జిల్లా
https://te.wikipedia.org/wiki/వైఎస్‌ఆర్_జిల్లా
వైఎస్‌ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లా. జిల్లా కేంద్రం కడప. 2022 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాను విభజించి కొంత భాగంతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాం నవాబులు, సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, కడప నవాబులచే పరిపాలించ బడింది. చరిత్రలో ప్రముఖ కవులు, కవయిత్రులు, తత్వవేత్తలు ఈ జిల్లాకు చెందినవారే. ఉమ్మడి జిల్లా చరిత్ర పూర్వం ఈ జిల్లాకు హిరణ్యదేశం అని పేరు ఉంది. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆ తరువాత శాతవాహనులు పాలించారు. శాతవాహనుల నాణేలు పెద్దముడియం, దానవులపాడు గ్రామాల్లో దొరికాయి. సా.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. సా.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో వైఎస్ఆర్ (కడప) జిల్లా ఒక భాగం. గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులు పొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడా ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. సా.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ థామస్ మన్రో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. పాలెగాళ్ళను అణచాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ప్రాంతపు అభివృద్ధికి బ్రిటీసు ప్రభుత్వంలో కొంతవరకు అభివృద్ధికి కృషి జరిగినట్లు భావించవచ్చు. మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగు భాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కోలిన్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2009 అక్టోబరు 5న విడుదల చేసిన G.O.Rt.No. 1480లో జిల్లా పేరును "డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జిల్లా"గా ప్రతిపాదించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించి, 2010 జూలై 8 నుండి ఈ జిల్లా పేరును వై.ఎస్.ఆర్. జిల్లాగా మారుస్తూ 2010 జూలై 7న తుది జి.ఒ.REVENUE (DA) DEPARTMENT G.O.Ms. No. 613 Dated:07-07-2010 విడుదల చేసింది. 2022 ఏప్రిల్ 4న జిల్లాను విభజించి అన్నమయ్య జిల్లా ఏర్పాటుచేశారు. భౌగోళిక స్వరూపం తూర్పున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమాన శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, దక్షిణాన అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా, ఉత్తరాన నంద్యాల జిల్లా,ప్రకాశం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వివరాలు కొండప్రాంతం, నైసర్గికంగా పీఠభూమి, నల్లనేల భాగాలుగా చెప్పుకోవచ్చు. శేషాచలం కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు. జిల్లాలో నల్లరేగడి, ఎర్రరేగడి, ఇసకపొర నేలలు ఉన్నాయి. వాతావరణం ఉష్ణోగ్రతలు వేసవికాలంలో 30°సె. - 44°సె, చలికాలంలో 21°సె. - 30°సెగా వుంటాయి. సగటు వర్షపాతము: 695 మి.మీ కొండలు పాలకొండలు (శేషాచలంకొండలు): వేంపల్లె దగ్గర వేంపల్లె గండి అనేచోట పాపఘ్ని నది కొండల మధ్యగా ప్రవహిస్తుంది. నల్లమల, లంకమల కొండలు: ఇవి దట్టమైన అడవులతో వన్యమృగాలతో వున్నాయి. వీటి సగటు ఎత్తు 2500-3500 అడుగులు. నదులు పెన్న, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు. అటవీ సంపద అడవుల విస్తీర్ణం 4,96,672 హెక్టార్లు. ఇది జిల్లా విస్తీర్ణంలో 32.3 శాతం. పులివెందుల మండలంలో తప్ప నల్లచేవ, ఎర్రచేవ,ఎపి మొదలైన కలప జాతులు, విదేశీమారకం తెచ్చిపెట్టే ఎర్రచందనము లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి. జలవనరులు తుంగభద్ర నది మీద సుంకేశుల ఆనకట్ట వద్ద మొదలై "కర్నూలు కడప కాలువ" కడప, కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ నాలుగు వేల హెక్టార్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తుంది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, పులివెందల కాలువ నిర్మాణంలో ఉన్నాయి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామం వద్ద పుల్లల మడుగు జలాశ్రయం నిర్మించబడింది. గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. పశు పక్ష్యాదులు లంకమలలో శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయం ఉంది. జనాభా లెక్కలు 2022 ఏప్రిల్ 4 నాడు సవరించిన జిల్లా పరిధి వరకు 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 20.607 లక్షలు. జిల్లా విస్తీర్ణం 11,228 చ.కి.మీ. ఆర్థిక స్థితిగతులు వ్యవసాయం ఉమ్మడి జిల్లాలో వరి, సజ్జ, జొన్న, రాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకు, పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది. ఉమ్మడి జిల్లాలో పెన్నానది, కె.సి.కాలువ ప్రధానమైన నీటి వనరులు. జిల్లా మొత్తంలో కాలువల క్రింద 24 వేల హెక్టార్లు, చెరువుల క్రింద 22 వేల హెక్టార్లు, బావుల క్రింద 66 వేల హెక్టార్లు, తక్కిన వనరుల క్రింద 11 వేల హెక్టార్లు సాగులో ఉన్నాయి. ఊటుకూరులో వ్యవసాయ పరిశోధనా కేంద్రము, కృషి విజ్ఞాన కేంద్రం, మైదుకూరులో జాతీయ ఉద్యనవనాల పరిశోధనాభివృద్ధి సంస్థ ఉన్నాయి. ఖనిజాలు-పరిశ్రమలు పులివెందుల ప్రాంతంలో రాతినార తీస్తున్నారు. నాప రాళ్ళకు కడప పెట్టింది పేరు. పులివెందుల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం ఉంది. యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ, విస్తరిస్తోంది. జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన ఆర్.టి.పి.పి. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగాపవర్ ప్రాజెక్టు. కడప, ప్రొద్దుటూరులో పారిశ్రామిక వాడలున్నాయి. రాయలసీమ అభివృద్ధి పథకం కింద కడపలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ నెలకొల్పడం జరిగింది. రెవెన్యూ డివిజన్లు, మండలాలు రెవెన్యూ డివిజన్లు (4): కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు మండలాలు మండలాలు (36). జిల్లా పునర్వ్యవస్థీకరణ తర్వాత పులివెందుల రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేశారు. కడప రెవెన్యూ డివిజన్ ఒంటిమిట్ట కడప కమలాపురం చింతకొమ్మదిన్నె చెన్నూరు పెండ్లిమర్రి యర్రగుంట్ల వల్లూరు సిద్ధవటం జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కొండాపురం జమ్మలమడుగు పెద్దముడియం ప్రొద్దుటూరు ముద్దనూరు మైలవరం రాజుపాలెం పులివెందుల రెవెన్యూ డివిజన్ చక్రాయపేట తొండూరు పులివెందుల లింగాల వీరపునాయునిపల్లె వేంపల్లె వేముల సింహాద్రిపురం బద్వేలు రెవెన్యూ డివిజన్ అట్లూరు కలసపాడు ఖాజీపేట గోపవరం చాపాడు దువ్వూరు పోరుమామిళ్ల బద్వేలు బి.కోడూరు బ్రహ్మంగారిమఠం మైదుకూరు శ్రీ అవధూత కాశినాయన నగరాలు, పట్టణాలు జిల్లా కేంద్రం కడప నగరం కాగా, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు పట్టణాలు. రాజకీయ విభాగాలు లోక్‌సభ స్థానాలు (2) కడప రాజంపేట (పాక్షికం) - ప్రధాన భాగం అన్నమయ్య జిల్లా లోవున్నది. శాసనసభ స్థానాలు కడప కమలాపురం జమ్మలమడుగు పులివెందుల ప్రొద్దుటూరు బద్వేలు మైదుకూరు రాజంపేట (పాక్షికం), మిగతా భాగం అన్నమయ్య జిల్లా లోవున్నది. రవాణా సౌకర్యాలు thumb|పులివెందుల-కడప నాలుగు వరసల రహదారి (పులివెందుల దగ్గర) thumb|కడప విమానాశ్రయం కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు రాష్ట్ర రహదారులు. నెల్లూరు-బళ్ళారిలను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. 1902 సెప్టెంబరు 12న భారీ వర్షాలకు ముద్దనూరు మండలం మంగపట్నం దగ్గర రైల్వే వంతెన కొట్టుకుపోవడం వల్ల భారతీయ రైల్వే చరిత్రలో మొట్టమొదటి రైలు ప్రమాదం జరిగి, 71 మంది చనిపోయినారు. ఈ ఘోర ప్రమాదానికి గుర్తుగా ఏర్పాటు చేసిన స్థూపం గండికోట వెనుక జలాల్లో మునిగిపోనుంది. ముఖ్య వాణిజ్య పట్టణమైన ప్రొద్దుటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం పూర్తి అయింది. బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. 2014లో తిరిగి దీనిని ప్రారంభించారు. విద్యా సౌకర్యాలు ఉమ్మడి జిల్లాలో విద్యాశాలలకు సంబంధించిన గణాంకాలు 2011 జనగణన ఆధారంగా క్రింది పట్టికలో చూడండి. ఇవేకాకబోధనా, సార్వత్రిక విద్య, కంప్యూటర్ విషయాలకు సంబంధించి శిక్షణా సంస్థలు కూడా ఉన్నాయి. +వైఎస్ఆర్ జిల్లా విద్యాసంస్థల గణాంకాలు విభాగం మొత్తం విద్యాశాలల సంఖ్య వ్యాఖ్యపాఠశాల విద్య 4543, 2010నాటికి 3322 ప్రాథమిక పాఠశాలలు, 490 ప్రాథమికోన్నత పాఠశాలలు,725 ఉన్నత పాఠశాలలు పారిశ్రామిక శిక్షణ (ఐటిఐ) 18, ప్రభుత్వసంస్థలు 3 ఇంటర్మీడియట్ 181వైఎస్ఆర్లో సాధారణ ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు, 41వృత్తి ఇంటర్మీడియట్ కళాశాలలు వైఎస్ఆర్లో వృత్తి ఇంటర్మీడియట్ కళాశాల వివరాలు పాలిటెక్నిక్ 15దొడ్ల నారపరెడ్డిw/SbtetinAP.aspx?districtid=5 వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలు కళాశాల విద్య (వృత్తేతర) (ఉన్నత విద్య)* ప్రభుత్వ సంస్థలు: వృత్తివిద్య (ఇంజనీరింగ్) * వృత్తి విద్య (ఎమ్.బి.ఎ.) * వృత్తి విద్య (ఫార్మసీ) * వృత్తి విద్య (ఎమ్.సి.ఎ.) * వైద్యవిద్య (సాధారణ వైద్యం) 1 వైద్యవిద్య (దంత వైద్యం) 1వైద్యవిద్య (నర్సు) *వైద్యవిద్య (వైద్య అనుబంధ) *‌విశ్వవిద్యాలయాలు లేక సమానస్థితిగలవి 2 కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, వైఎస్సార్ శిల్ప, లలితకళల విశ్వవిద్యాలయం, రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, కడప దంతవైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందులలో జె.ఎన్.టి.యు (జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల, కడపలో క్రీడా పాఠశాల, ప్రభుత్వ హోమియో కళాశాల ఉన్నాయి. ఇక కడపలో సి.పి.బ్రౌన్ నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది. ప్రసార సాధనాలు 1963 జూన్ 16న కడపలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ప్రసారాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు, బళ్ళారి, బెంగుళూరు, కోలారు, చెన్నై తదితర ప్రాంతాల్లోనే కాక 900 కి.మీ. పరిధిలోని తెలుగు ప్రజలకు అందుతున్నాయి. ఇది కాక కడపలో దూరదర్శన్ రిలే కేంద్రం ఉంది. ఆకర్షణలు thumb|కోదండ రామాలయం, ఒంటిమిట్ట thumb|సిద్ధవటం కోట కోదండ రామాలయం, ఒంటిమిట్ట దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం, కడప పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం,బ్రహ్మంగారిమఠం ఆస్తానయె మగ్దూమె ఇలాహి (పెద్ద దర్గా), కడప ఆస్తానయె షామీరియా (షామీరియా దర్గా), కడప శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కడపకు దగ్గరలో గండికోట దుర్గం, గండికోట సిద్ధవటం కోట, సిద్ధవటం భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం, కడప గండి ఆంజనేయస్వామి దేవాలయము, గండి క్షేత్రం ప్రముఖులు వేమన, తత్వవేత్త వై.యస్. రాజశేఖరరెడ్డి, రాజకీయ నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి,రాజకీయ నాయకుడు యాగా వేణుగోపాలరెడ్డి, ఆర్థిక వేత్త జయదేవ్, కార్టూనిస్టు దుర్భాక రాజశేఖర శతావధాని, శతావధాని నాటక రంగం, సినిమా రంగం కన్నాంబ పద్మనాభం మూలాలు బయటి లింకులు వైఎస్‌ఆర్ జిల్లా (వైఎస్సార్‌క‌డ‌ప‌.ఇన్ఫో) వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:రాయలసీమ వర్గం:వైఎస్‌ఆర్ జిల్లా వర్గం:వ్యక్తుల పేరుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:వ్యక్తుల పేరుతో ఉన్న జిల్లాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు
మెదక్ జిల్లా
https://te.wikipedia.org/wiki/మెదక్_జిల్లా
మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 మెదక్‌ పట్టణం హైదరాబాదుకు 100 కి మీ ల దూరంలో ఉంది. మెదక్ జిల్లాకు ముఖ్యపట్టణం మెదక్ పట్టణం. జనాభా లెక్కలు 1981 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా 18,07,139, స్త్రీ, పురుషుల నిష్పత్తి 98:100, అక్షరాస్యత 21.38 శాతం. (మూలం: ఆంధ్రప్రదేశ్ దర్శిని 1985) 2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా 30,31,877. జనసాంద్రత 313/కి.మీ² (811/చ.మై), పురుషులు 15,24,187, స్త్రీలు 15,07,690. 2001 భారతీయ జనాభా గణనను అనుసరించి అక్షరాస్యత 66 %. పురుషుల అక్షరాస్యత 74%. స్త్రీల అక్షరాస్యత 57%. జనాభాలో 6 సంవత్సరాలకు దిగువన ఉన్న వారి శాతం 13%. చరిత్ర పూర్వం సిద్దాపూర్‌ అని పిలువబడే నేటి మెదక్, కాకతీయుల కాలంలో ఉచ్ఛస్థితిలో ఉండేది. ఆ కాలం నాటి దుర్గం మెదక్ లో ఉంది. మెతుకుసీమగా తరువాతి కాలంలో పిలువబడేది. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో, కృష్ణానది దాటినది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని, ఐతే హైదరాబాద్ నగరం దాటిన తరువాత నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు. జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు నర్సాపూర్‌ రామాయంపేట తూప్రాన్ శంకరంపేట భౌగోళిక స్వరూపం 250px|alt=|కుడి మెదక్ జిల్లాను భౌగోళికంగా నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు 46 రెవెన్యూ మండలాలుగా విభజించారు.పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో మెదక్ జిల్లా తాలూకాల వివరాలు . జూలై 26, 2007న సేకరించారు.. పూర్వపు 46 మండలాలతో ఉన్న మెదక్ జిల్లా రేఖా పటం (కుడివైపు) ——→ ——→ మెదక్ జిల్లా నుండి కొత్తగా ఏర్పడిన జిల్లాలు 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా మెదక్ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 47 పాత మండలాల నుండి 19 మండలాలుతో సంగారెడ్డి, 13 మండలాలుతో సిద్దిపేట కొత్త జిల్లాలుగా ఏర్పడగా,15 పాత మండలాలుతో మెదక్ జిల్లాను పునర్య్వస్థీకరించారు. అధికారికంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన మండలాలు సిద్దిపేట జిల్లాలో చేరిన మండలాలు సిద్దిపేట మండలం నంగునూరు మండలం చిన్న కోడూరు మండలం తొగుట మండలం దౌలతాబాదు మండలం మిరుదొడ్డి మండలం దుబ్బాక మండలం చేర్యాల మండలం గజ్వేల్ మండలం జగ్దేవ్‌పూర్ మండలం కొండపాక మండలం ములుగు మండలం వర్గల్ మండలం సంగారెడ్డి జిల్లాలో చేరిన మండలాలు పూర్వపు మెదక్ జిల్లాకు చెందిన 19 పాత మండలాలతో సంగారెడ్డి జిల్లా కొత్తగా ఏర్పడింది.కొత్తగా 7 మండలాలు ఏర్పడినవి.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 239, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016 సంగారెడ్డి మండలం కొండాపూర్‌ మండలం సదాశివపేట మండలం పటాన్‌చెరు మండలం రామచంద్రాపురం మండలం మునిపల్లి మండలం జిన్నారం మండలం పుల్కల్ మండలం ఆందోల్ మండలం హత్నూర మండలం జహీరాబాద్ మండలం న్యాల్కల్ మండలం ఝరాసంగం మండలం కోహిర్‌ మండలం రాయికోడ్ మండలం నారాయణఖేడ్ మండలం కంగ్టి మండలం కల్హేరు మండలం మానూర్ మండలం మెదక్ జిల్లా ప్రస్తుత మండలాలు పునర్య్వస్థీకరణ తరువాత పాత మండలాలు 15 కాగా,మెదక్ జిల్లాల గ్రామాల నుండి వ.సంఖ్య16 నుండి 20 వరకు గలవి 5 కొత్తగా ఏర్పడిన మండలాలు.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 238, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016 21 సంఖ్య గల మాసాయిపేట మండలం 2020 డిసెంబరులో ఏర్పడింది. మెదక్ మండలం పాపన్నపేట మండలం శంకరంపేట (ఆర్) మండలం రామాయంపేట మండలం శంకరంపేట (ఎ) మండలం టేక్మల్ మండలం ఆళ్ళదుర్గ్ మండలం రేగోడు మండలం ఎల్దుర్తి మండలం చేగుంట మండలం తూప్రాన్ మండలం నర్సాపూర్ మండలం కౌడిపల్లి మండలం కుల్చారం మండలం శివంపేట మండలం హవేలిఘన్‌పూర్ మండలం * నిజాంపేట్ మండలం * నార్సింగి మండలం * మనోహరాబాద్ మండలం * చిలిప్‌చేడ్ మండలం * మాసాయిపేట మండలం * గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (5) గమనిక:* చివరి మాసాయిపేట 2020 డిసెంబరులో ఎల్దుర్తి మండలం లోని 6 గ్రామాలు, చేగుంట మండలంలోని 3 గ్రామాలు మొత్తం 9 గ్రామాలుతో కొత్తగా మండలంగా ఏర్పడింది. రవాణా వ్వవస్థ రోడ్డు రవాణా మెదక్ జిల్లా గుండా 2 జాతీయ రహదారులు వెళ్ళుచున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి ఉత్తర-దక్షిణముగా వెళ్ళుచుండగా, 9వ నెంబరు జాతీయ రహదారి తూర్పు-పడమరలుగా పోవుచున్నది. ఇవే కాకుండా సంగారెడ్డి-నాందేడ్ రహదారి, హైదరాబాదు-కరీంనగర్ రహదారి, మెదక్-నిజామాబాదు రహదారి, మెదక్ - సిద్ధిపేట్ రహదారి జిల్లా గుండా వెళ్ళు ప్రధాన రహదారులు. రైలురవాణా జిల్లాలో మొట్టమొదటిసారిగా 1886లో రైలుమార్గము వేయబడింది.Andhra Pradesh District Gazetteers, Medak District, Published in 1976, Page 86 సికింద్రాబాదు నుండి వాడి వరకు వేయబడిన రైలుమార్గము జిల్లాలో దక్షిణ ఆగ్నేయములో కొంతదూరం జిల్లా నుండి పోవుచున్నది. ఇది కాకుండా వికారాబాదు-పర్లివైద్యనాథ్ మార్గం, కాచిగూడ-మన్మాడ్ మార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నది. సంస్కృతి మెదక్ జిల్లాలో చాలా రకాల మతాలవారు,కులాలవారు నివసిస్తున్నారు. పశుపక్ష్యాదులు హైదరాబాదుకు 115 కిలోమీటర్ల దూరంలో అలాగే మెదక్‌కు 15 కిలోమీటర్ల దూరంలో పోచారం అటవీ ప్రాంతం ఉంది. ఇది 20వ శతాబ్దం ఆరంభంలోనే అడవి జంతువుల శరణాలయంగా ప్రకటించబడింది. ఇది ఒకప్పుడు నిజాంకు ప్రియమైనా వేటప్రదేశం. పోచారం సరస్సు రూపుదిద్దుకున్న తరువాత దీనికి ఈ పేరు పెట్టబడింది. ఇది 9.12 కిలోమీటర్లదూరం విస్తరించబడి ఉంది. ఇది దట్టమైన వృక్షాలతో అలరారుతుంది. జంతు సంపద, వృక్షసంపదలతో అలరారుతున్న ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇది బార్-హెడ్డెడ్ గూస్, బ్రహ్మిణీ బాతులు, ఓపెన్ బిల్డ్ స్ట్రోక్ వంటి విదేశీ పక్షులను ఆకర్షిస్తుంది. పరస్పరాధారిత పర్యావరణ వ్యవస్థకు పేరు పొందిన పర్యాటనకు ఇది ప్రసిద్ధి పొంది ఉంది. ఇక్కడ పర్యాటకులు జింకలు, దుప్పి జాతి మృగాలను సందర్శించ వచ్చు. వేసవి ఉష్ణోగ్రతలు 46°సెంటీగ్రేడ్, శీతాకాలం 6 ° సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ శరణాలయంలో చిరుత, అడవి పిల్లి, అడవి కుక్క, తోడేలు, గుంటనక్క, దక్షిణ ఎలుగుబంటు, కృష్ణజింక, నాలుగు కొమ్ముల దుప్పి వంటి జంతువులు ఉన్నాయి. విద్యాసంస్థలు మెదక్ జిల్లాలో ప్రముఖ విద్యాలయాలలో కొన్ని: ఐఐటి, హైదరాబాద్, ఎమ్ ఎన్ ఆర్ మెడికల్ కాలేజ్, ఎమ్ ఎన్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, పఠాన్ చెరువులోని గీతం (జి ఐ టి ఎ ఎమ్) విశ్వవిద్యాలయం, సుల్తంపుర్ లో జె.ఎన్.టి.యూ. ఆకర్షణలు కాకతీయ చక్రవర్తి, ప్రతాపరుద్రుని కాలంలో మెదక్ దుర్గం నిర్మించారు. వ్యూహాత్మకంగా ఒక గుట్టపైన నిర్మించిన ఈ దుర్గాన్ని మెతుకుదుర్గం అని ఈ ప్రాంతాన్ని మెతుకుసీమ అని అనేవారు. ముఖద్వారం వద్ద కాకతీయుల ముద్ర రెండు తలల గండభేరుండం ఠీవిగా ఉంటుంది. కాకతీయుల నిర్మాణ ధురీణతకు ఈ కోట తార్కాణంగా నిలుస్తుంది. కోటలోని ఒక బావినుండి గొట్టాల ద్వారా కోటలోకి నీటి సరఫరా జరిగేది. కోటకు మూడు ద్వారాలున్నాయి: "ప్రథమ ద్వారం", గర్జిస్తున్న రెండు సింహాల మూర్తులతో కూడిన "సింహ ద్వారం", ఇరువైపులా రెండు ఏనుగుల ప్రతిమలు కలిగిన "గజ ద్వారం". కోటలో 17 వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన శతఘ్నిని చూడవచ్చు. సహజ సిద్ధమైన భౌగోళిక రూపురేఖలను చక్కగా వినియోగించుకున్న ఈ కోటకు చుట్టు ఉన్న గండ శిలలు సహజ రక్షణగా నిలుస్తున్నాయి. నిర్మాణ, శిల్పకళల చాతుర్యాన్ని ప్రదర్శించే దేవాలయాలెన్నో మెదక్ జిల్లాలో ఉన్నాయి. బొంతపల్లి లోని వీరభద్ర స్వామి దేవాలయం (హైదరాబాదు నుండి 25 కి మీ), జరసంగం, మంజీరా నది ఒడ్డున గల ఏడుపాయలు లోని కనకదుర్గ ఆలయం (మెదక్‌ నుండి 8 కి మీ), నాచగిరి లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (హైదరాబాదు నుండి 55 కి మీ), సిద్ధిపేట లోని కోటి లింగేశ్వర స్వామి ఆలయం వీటిలో కొన్ని. సాంప్రదాయిక తెలంగాణా సంస్కృతికి మెదక్ జిల్లా నెలవు. మెదక్‌ నుండి 60 కి మీ ల దూరంలో గల కొండాపూర్‌ వద్ద జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి అవశేషాలు, బౌద్ధ నిర్మాణాలు బయట పడ్డాయి. పురావస్తు శాఖ వారు నిర్వహిస్తున్న సంగ్రహాలయం ఇక్కడ ఉంది. ఇక్కడ 8,100 పురాతన వస్తువులు ప్రదర్శన కోసం ఉంచారు. శాతవాహనుల నాణేలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నాణేలను బట్టి కొండాపూర్‌ కూడా శాతవాహనులకు చెందిన 30 నగరాల్లో ఒకటిగా కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. బౌద్ధ స్థూపాలు, చైత్యాల అవశేషాలు కూడా కొండాపూర్‌లో లభించడంతో ఈ ప్రాంతం ఒకప్పుడు గొప్ప బౌద్ధమత కేంద్రంగా వెలిగిందని కూడా తెలుస్తోంది. రోమను చక్రవర్తి ఆగస్టస్‌కు చెందిన బంగారు నాణెం కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంది. ఇంకా వెండి నాణేలు, పూసలు, మట్టి గాజులు, దంతం, రాగి, గాజుతో చేసిన అందమైన వస్తువులు ఉన్నాయి. మెదక్‌కు 15 కి మీ ల దూరంలో గల పోచారం అడవి నిజాము నవాబు వేటకు వెళ్ళే స్థలం.20 వ శతాబ్దపు తొలినాళ్ళలో దీనిని అభయారణ్యముగా ప్రకటించారు. పోచారం చెరువు పేరిట ఏర్పడిన ఈ అడవి 9.12 చ.కి.మీ ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఎన్నో రకాల వృక్ష, జంతు జాతులకు నెలవైన ఈ అడవికి ఏటా రకరకాలైన పక్షులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న పర్యావరణ యాత్రా స్థలంలో ఐదు రకాల లేళ్ళను, దుప్పులను చూడవచ్చు. వేసవిలో 46 °C‌ దాటే ఉష్ణోగ్రత, శీతాకాలంలో 6 °C‌కు పడిపోతుంది. ఈ అభయారణ్యంలో చిరుతపులి, అడవి పిల్లి, అడవి కుక్క, తోడేలు, నక్క, ఎలుగుబంటి, సాంబార్‌ దుప్పి, నీల్గాయి, చింకారా, నాలుగు కొమ్ముల దుప్పి మొదలైన జంతువులు ఉన్నాయి. ప్రకృతి ఆరాధకులకు మెదక్‌లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. హైదరాబాదుకు 35 కి మీ ల దూరంలో గల నర్సాపూర్ అడవి, గుమ్మడిదల, నర్సాపూర్‌ ల మధ్య 30 చ.కి.మీ ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఎన్నో రకాల చెట్లు, జంతుజాలం, ఎన్నో చెరువులతో ఈ అడవి కళకళలాడుతూ ఉంటుంది. మెదక్‌కు 75 కి.మీ ల దూరంలో ఉన్న మంజీర అభయారణ్యం 20 చకి మీ ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ అడవి సగటు వెడల్పు 500 నుండి 800 మీటర్లు. మంజీర, సింగూరు ఆనకట్టల మధ్య విస్తరించి ఉన్న ఈ అడవి తొమ్మిది చిన్న చిన్న దీవుల సమాహరం. ఎన్నో రకాల వలస పక్షులు, బురద మొసళ్ళు మొదలైన వాటికి ఈ ప్రాంతం ఆలవాలం. ఆలయాలు మెదక్ జిల్లా శిల్పకళా సౌందర్యం ప్రతిబింబిస్తున్న పలు ఆలయాలకు పుట్టిల్లు. గణేశ్‌గడ్డకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్దనూరు, ప్రతిసంవత్సరం వైభవోపేతంగా జాతర జరుపుకుంటున్న సంగారెడ్డి వద్ద ఉన్న ఇస్మాయిల్ఖాన్ పేటలో ఉన్న సౌధమ్మమాతా ఆలయం, హైదరాబాదు నుండి 35 కిలోమీటర్లదూరంలో ఉన్న సప్తప్రాకారయుత భవాని మాతా ఆలయం, హైదరాబాదుకు ఉత్తరంగా 25 కిలోమీటర్ల దూరంలో బొంతపల్లిలో ఉన్న వీరభద్రస్వామి ఆలయం, మెదక్‌కు 45 కిలోమీటర్లదూరంలో ఉన్న సంగమేశ్వరాలయం, మెదక్‌కు 15 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదీ తీరంలో ఉన్న కనకదుర్గాలయం, నాచగిరి ఆలయాలు, హైదరాబాదుకు 55 కిలోమీటర్లదూరంలో ఉన్న లక్ష్మీనారాయణాలయం, సైదాపేటలో ఉన్న కోటిలింగేశ్వరాలయం, శ్రీసరస్వతిక్షేత్రం, సైదాపేటకు 22 కిలోమీటర్లదూరంలో కరీంనగర్ వెళ్ళే దారిలో ఉన్న అనంతసాగర్ ఆలయం, కర్ణంపల్లి వద్ద ఉన్న చేగుంట సాయిబాబా దేవస్థానం, కల్యాణవేంకటేశ్వరస్వామి దేవస్థానం, వాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి దేవాలయం, స్వయంభూ మహాలక్ష్మీ దేవస్థానం, ఆంజనేయస్వామి ఆలయం ప్రముఖమైనవి. ఇంకా ఈ జిల్లాలో జోగిపేట పట్టణం ఆందోల్ మండలంలో చితుకుల పల్లెలో ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం, మంజీరా నదీతీరంలో రామయ్య చేత నిర్మించబడిన ప్రబలమైన శక్తి ఆలయం, జోగిపేటలో ఉన్న జోగినాధాలయం, అందొల్ గ్రామంలో కల శ్రీ రంగనాథ స్వామి దేవాలయం,  హైదరాబాదుకు 60 కిలోమీటర్లదూరంలో కౌడిపల్లి మండలంలో ఉన్న తుణికిలో ఉన్న పోచమ్మ ఆలయం, పుల్కల్ మండలంలోని బొమ్మారెడ్డి గూడెంలో ఉన్న జగదాంబమాతా, కర్నల్పల్లి, చేగుంటమండలంలో సాయిబాబా ఆలయం, ప్రబల రేణుకా ఎల్లం దేవీ ఆలయం, కర్నల పాల్లి వాసుల చేత నిర్మింపబడిన ఆంజనేయ ఆలయం ఉన్నాయి. సిద్ధిపేట సత్యనారాయణుని ఆలయం: సత్య దేవుని ఆలయం సిద్ధిపేటలో స్థానిక భక్తులు, దాతలు కలిసి విరాణాలు సేకరించి 2011 లో ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. గర్భగుడిచుట్టూ విష్ణుమూర్తి దశావతారల విగ్రహాలు చెక్కించారు. ఇందులోని అద్దాల మండపము ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రంగు రంగుల పాల రాతిని తెప్పించి అద్దాల మండపాన్ని నిర్మించారు.అదే విధంగా అనేక రంగుల అద్దాలను తెప్పించి అనేక డిజైన్ల ప్రకారం కోసి మండపానికి అతికించారు. మండపంలో పైభాగానికి అమర్చిన అష్టదళ పద్మం ఈ మండపానికే వన్నె తెచ్చింది. విద్యుత్తు దీపాల వెలుగులో ఈ అద్దాల మండపాన్ని చూడడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో ఏటా ధనుర్మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి వుత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరిలో గోదా దేవి కళ్యాణం నిర్వహిస్తారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయం సిద్ధిపేటకు తలమానికంగా వెలుగొందుతున్నది. మెదక్ నుండి 12 కి.మీ. దూరంలో గల తిమ్మానగర్ గ్రామంలో గల హరి హర దేవాలయం, గట్టు మైసమ్మ తల్లి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినవి thumb|220px| ఆసియాలోనే పెద్ద చర్చిగా భావించబడుతున్న చర్చ్ ఆఫ్ ఇండియా కాథలిక్ చర్చ్|alt= మెదక్ కేథలిక్ చర్చి - మెదక్ లోని మెదక్ కేథలిక్ చర్చి చర్చి ఒక అమూల్యమైన చారిత్రక వారసత్వం. ఇది ఆసియా లోకెల్లా పెద్దదైన డయోసీసే కాక వాటికన్‌ నగరం తరువాత ప్రపంచంలోనే పెద్దది కూడా. మొదటి ప్రపంచ యుద్ధసమయంలో వచ్చిన కరువు సందర్భంగా ఈ చర్చిని నిర్మించారు. ఛార్లెస్‌ వాకర్‌ పోస్నెట్‌ అనే ఆయన అప్పట్లో ఫాదర్ గా ఉండేవాడు. మూడేళ్ళపాటు పీడించిన కరువు బీభత్సానికి చలించిన ఆయన 1914లో ఈ చర్చిని నిర్మించ తలపెట్టాడు. కళాత్మకమైన ఈ చర్చి నిర్మాణం పూర్తి చెయ్యడానికి పదేళ్ళు పట్టింది. ఒకేసారి 5000 మంది పట్టగల అతి పెద్ద చర్చి ఇది. - ప్రపంచంలో రెండవ అతిపెద్ద చర్చి.నాలుగు గోపురాలతో 173 అడుగుల ఎత్తైన గోపురము కలిగి తెల్లని గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడిన చర్చి. గోట్టంగోట - జహీరాబాదుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. చారిత్రక ఆలయాలు, దట్టమైన అడవి, పెద్ద సరస్సు ఉన్న ప్రదేశం. పోచారం అడవి & అడవిజంతువుల అభయారణ్యం - ఇది పలు అడవి జంతువుల పుట్టిల్లు, నిజాం నవాబుకు ప్రియమైన వేటప్రదేశం. సీగూర్ ఆనకట్ట - సంగారెడ్డి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మెదక్ కోట - ఈ కోటను ముందుగా కాకతీయ రాజైన రుద్రుని చేత నిర్మించబడింది. కోటంతా ఇనుప పైపుల సహాయంతో నీటి వసతి కల్పించినట్లు ఈ కోట యాజమాన్యం సగర్వంగా చెప్పుకుంటున్నది. thumb|మెదక్ కోట నిజాం సాగర్ - నిజాం సాగర్ ఆనకట్ట - గోదావరీ నది ఉపనది అయిన మంజీరా నది మీద నిర్మించబడిన ఈ ఆనకట్ట మెదక్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సహజ అందాలకు ఈ ప్రదేశం పేరు పొందినది. మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ ఆనకట్ట మీద వాహనాలు నడుపగలిగిన వసతి ఉంది. మంజీరా అడవి & పక్షుల శరణాలయం - తొమ్మిది ద్వీపసమూహం కలిగిన ఈ శరణాలయం దేశీయ, విదేశీయ వలస పక్షులకు శరణాలయంగా ఉంది. సరస్వతీ క్షేత్రము - అనంతసాగరం - సిద్దిపేట విభాగం. ఈ ఆలయం అష్టకల నరసింహ శర్మ (అష్టావధాని)చేత 1980 నుండి 1990 ల మధ్య నిర్మించబడింది. వెలుగొండ తుంబురునాధ దేవాలయం - రాష్ట్రకూట రాజుల చేత నిర్మించబడింది. తుంబురునాధస్వామి (సంగీత దేవత) దేవాలయాలలో ఇది అతి పెద్దదిగా భావించబడుతుంది. స్త్రీలు పురుషులు నృత్యగానాలు చేస్తున్న అందమైన శిల్పాలకు ఇది ప్రసిద్ధి చెంది ఉంది. టెక్మల్ మండలంలోని ఎలుగొండలో ఉన్న ఈ ఆలయం మెదక్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడుపాయల దుర్గా భవానీ గుడి - ఈ ఆలయ దర్శనానికి తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్రా సమీప ప్రజలు లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఏడుపాయలు అనే ప్రదేశంలో మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి ప్రవహిస్తున్న కారణంగా ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది. ఈ ప్రదేశవర్ణన మహాభారతంలో ఉంది. అర్జునుడి మునిమనుమడైన జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు శాపానికి ప్రతీకారంగా ఇక్కడ సర్పయాగం చేసినట్లు విశ్వసించబడుతుంది. మంజీరా నది మైదానంలో ఇప్పటికీ బూడిద కనిపిస్తుంది. ఏడు పాయల వద్ద నిర్వహించబడే జాతరకు లక్షలాది మంది తరలి వస్తారు. దేవాలయాలు శ్రీ రంగనాధస్వామి ఆలయం- రంగంపేట గ్రామం. నరసింహస్వామిఆలయం - జక్కన్నపేట. సిద్ధ రామేశ్వర ఆలయం - మెదక్ పట్టణానికి 2 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ప్రముఖ వ్యక్తులు బర్రెంకల జయదేవులు మెదక్ పార్లమెంటు సభ్యుల జాబితా thumb|220x220px|2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము|alt= 1957, 1962 - పి. హనుమంతరావు. 1967 - సంగం లక్ష్మీభాయి. 1971,1977, 1980 - ఇందిరా గాంధీ (కాంగెస్). 1984 - పి . మానిక్ రెడ్డి. 1989, 1991, 1996, 1998 - మొగలిగుండ్ల బాగారెడ్డి. 1999 - ఆలె నరేంద్ర (బి.జె.పి) 2004 - ఆలె నరేంద్ర (టి ఆర్ ఎస్) 2009 - విజయశాంతి (టి ఆర్ ఎస్) 2014 - కొత్త ప్రభాకర్ రెడ్డి (టి ఆర్ ఎస్) 2019 - కొత్త ప్రభాకర్ రెడ్డి (టి ఆర్ ఎస్) ఇవి కూడా చూడండి జిల్లా గ్రామాల జాబితా మూలాలు వెలుపలి లంకెలు
శ్రీకాకుళం జిల్లా
https://te.wikipedia.org/wiki/శ్రీకాకుళం_జిల్లా
శ్రీకాకుళం జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య దిక్కులో గల చిట్టచివరి జిల్లా. జిల్లా కేంద్రం శ్రీకాకుళం.దీనిని కళింగపట్నం అని కూడా అంటారు. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, కొన్ని మండలాలను పార్వతీపురం మన్యం జిల్లాలో, విజయనగరం జిల్లాలలో చేర్చారు. శ్రీకాకుళం లోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి, శ్రీకూర్మంలో కూర్మావతార మందిరం, శాలిహుండంలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు, ముఖలింగంలోని శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం, కళింగపట్నంలోని దీప స్తంభం, తేలినీలాపురంలోని తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. పేరు వ్యుత్పత్తి బ్రిటిషు వారు శ్రీకాకుళం పేరును పలకలేక "చికాకోల్" అనేవారు. చికాకోల్ కు సంబంధించిన మరో కథనం ప్రకారం ఈ ప్రాంతం నైజాం ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసి, మూటకట్టి, ఆమూటను తీసికొనివచ్చి ఖుద్దున సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలన, ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్" అయి, శ్రీకాకుళంగా స్థిరపడింది అని అంటారు. ఈ పట్టణం పేరుతోనే జిల్లా ఏర్పడింది. జిల్లా చరిత్ర thumb|మందస వాసుదేవ ఆలయం|270x270px thumb|శ్రీముఖలింగం ఆలయం|270x270px ఈ జిల్లా తొలిగా విశాఖపట్నం జిల్లానుండి ఏర్పడినందున, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చరిత్రే దీనికి ఆధారం. ఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్యస్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ వంటి బౌద్ధారామాలు ఇక్కడ కనుగొన్నారు. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుడు కాలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించాడు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం శ్రీకాకుళం జిల్లాలోనే ప్రారంభమయింది. జిల్లా పరిధి మార్పులు విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగస్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. 1969లో ఈ జిల్లానుండి సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలి తాలూకాలోని 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పరచిన గజపతి నగరం తాలూకాకు బదలాయించారు. మళ్ళీ 1979 మేలో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పరచినపుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను కొత్తజిల్లాలో విభాగాలుగా చేశారు. thumb|270x270px|2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్ల పటం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ, జిల్లా జనాభా 2699471. జిల్లా శ్రీకాకుళం రెవెన్యూ డివిజను, టెక్కలి రెవెన్యూ డివిజను, పాలకొండ రెవెన్యూ డివిజను అనే మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజింపబడింది. జిల్లాలో మొత్తం 38 మండలాలు, 1865 రెవెన్యూ గ్రామాలు ఉండేయి. 1 నగరం, 5 పట్టణాలు ఉండేయి. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో ఉన్న 38 మండలాల నుండి కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 4 మండలాలు విలీనమయ్యాయి. పర్యవసానంగా, పట్టణాలలో పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలో చేరగా, రాజాం పట్టణం విజయనగరం జిల్లాలో చేరింది. పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన మండలాలు పాలకొండ సీతంపేట భామిని వీరఘట్టం విజయనగరం జిల్లాలో చేరిన మండలాలు వంగర రేగిడి ఆమదాలవలస సంతకవిటి రాజాం జనాభా గణాంకాలు 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,703,114, అందులో పురుషులు 1,341,738 కాగా, మహిళలు 1,361,376. 2001 జనాభా లెక్కల ప్రకారం, శ్రీకాకుళం జనాభా 2,537,593, అందులో పురుషులు 1,260,020, స్త్రీలు 1,277,573. 2001 జనాభాతో పోలిస్తే జనాభాలో 6.52 శాతం మార్పు ఉంది. భారతదేశం మునుపటి 2001 జనాభా లెక్కల ప్రకారం, శ్రీకాకుళం జిల్లా 1991తో పోల్చితే దాని జనాభాలో 9.33 శాతం పెరిగింది. 2001-2011 దశకంలో జనాభా వృద్ధి రేటు: 6.52% (మొత్తం రాష్ట్రం వృద్ధి రేటు 14.44%) జనసాంద్రత: చ.కి.మీ.కు 463 మంది (రాష్ట్రం జనసాంద్రత 308) అక్షరాస్యులు మగవారిలో 8,57,824 (71.61%), ఆడువారిలో 6,37,557 (52.08%) పట్టణ ప్రాంతాల జనాభా 4,36,703 లేదా 16.16% (రాష్ట్రం మొత్తంలో పట్టణ జనాభా 27.35%) శ్రామికులు: 48.6% (ఇందులో 78% వ్యవసాయం, 15% సేవల రంగం) +శ్రీకాకుళం జిల్లా జనాభా - 2011 జనాభా లెక్కలు ప్రకారంకేటగిరీమగఆడమొత్తం%మగ%ఆడఅందరు13,41,73813,61,37627,03,11449.64%50.36%ఎస్సీ1137301158792296099.02%9.07%ఎస్టీ75284759651512495.97%5.94%మైనారిటీస్2170623641442231.73%1.88% 2022 పునర్వ్యవస్థీకరణ తరువాత జనాభా గణాంకాలు 2011 జనగణన ప్రకారం, 2022 లో సవరించిన పరిధిలో జిల్లా జనాభా 21.914 లక్షలు భౌగోళిక స్వరూపం జిల్లాకు ఉత్తరాన పార్వతీపురం మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్రం, తూర్పున ఒడిశా గజపతి జిల్లా, బంగాళాఖాతం,, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన విజయనగరం జిల్లా, ఉన్నాయి. జిల్లాకు కొంత భాగం హద్దులుగా కందివలస గెడ్, వంశధార, బహుదా నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా వైశాల్యం 4,591 చ.కి.మీ. జిల్లాకు 193 కి.మీ. సముద్ర తీరం ఉంది. తూర్పు కనుమలు ఈశాన్యం నుండి కొంతభాగం విస్తరించి ఉన్నాయి. నదులు నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగడ్ ఇవి జిల్లాలలో ముఖ్యమైన నదులు. ఇవి తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వాతావరణం సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు -నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సం.లో వర్షపాతం 937.6 మి.మీ.) శ్రీకాకుళం పట్నం, జిల్లాలోని పలు ప్రాంతాలు పచ్చికబయల్లు, అడవులు, సశ్యస్యామలమైన పంట పొలాలతో ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో ఊటీని పోలి ఉంటుంది. ఈ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కాస్టాఫ్ లివింగ్ చాలా తక్కువ. అందుకే దీనిని పేదవాని స్వర్గమని పిలుస్తారు. సస్య సంపద జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును. దక్షిణ భారత తేమ ఆకురాల్చే అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు. దక్షిణ భారత సతత హరిత అడవులు జంతు సంపద జిల్లాలో మాంసాహార మృగాలలో పులి దాదాపు అంతరించింది. చిరుత పులి, హైనా (దుమ్ములగొండి), తోడేలు వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో ఎక్కువుగా మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, ఎలుగుబంట్లు సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా కౌజుపిట్టలు, బాతులు, పావురాలు వంటివి అధికంగా ఉన్నాయి. పాలనా విభాగాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లున్నాయి. శ్రీకాకుళం రెవెన్యూ డివిజను, టెక్కలి రెవెన్యూ డివిజన్లు గతంలో ఉన్నవి కాగా, పలాస రెవెన్యూ డివిజను కొత్తగా ఏర్పడింది. మండలాలు పలాస రెవెన్యూ డివిజను ఇచ్ఛాపురం కవిటి కంచిలి నందిగం పలాస మందస వజ్రపుకొత్తూరు సోంపేట టెక్కలి రెవెన్యూ డివిజను కొత్తూరు కోటబొమ్మాళి టెక్కలి పాతపట్నం మెళియాపుట్టి లక్ష్మీనర్సుపేట సారవకోట సంతబొమ్మాళి హిరమండలం శ్రీకాకుళం రెవెన్యూ డివిజను ఆమదాలవలస ఎచ్చెర్ల గంగువారి సిగడాం గార జలుమూరు నరసన్నపేట పొందూరు పోలాకి బూర్జ రణస్థలం లావేరు శ్రీకాకుళం సరుబుజ్జిలి రెవెన్యూ గ్రామాలు 1468 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నగరాలు, పట్టణాలు 1 నగరం, 3 పట్టణాలున్నాయి. నగరం: శ్రీకాకుళం పట్టణాలు: ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస కాశీబుగ్గ నియోజక వర్గాలు లోక్‌సభ నియోజకవర్గం శ్రీకాకుళం విజయనగరం (పాక్షికం), మిగతా విజయనగరం జిల్లాలో గలదు. శాసనసభ నియోజకవర్గాలు ఆమదాలవలస ఇచ్ఛాపురం ఎచ్చెర్ల టెక్కలి నరసన్నపేట పలాస పాతపట్నం శ్రీకాకుళం రవాణా వ్వవస్థ ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర రహదారుల నిడివి . జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి 10 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషను ఉంది. జిల్లాలోని ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లు ఆమదాలవలస, పలాస, నౌపాడ, సోంపేటలో ఉన్నాయి. జిల్లాకు సమీప విమానాశ్రయం విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం. విద్యాసంస్థలు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీకాకుళం (రిమ్స్) రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్, శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయం - ఎచ్చెర్ల ఐఐటి ఎచ్చెర్ల ఉమ్మడి జిల్లా ఆర్ధిక స్థితి గతులు వ్యవసాయం జిల్లాలో ముఖ్య పంటలు- వరి, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు, చెరకు, జనుం, వేరుశనగ, నువ్వులు, మిరప, పసుపు, నీరుల్లి. నీటివనరులు శ్రీకాకుళం జిల్లాలో బాహుద, ఉత్తర మహేంద్ర, తనయ, బెంజిగడ్డ, వరహాలు గడ్డ, వంశధార, నాగావళి, పెద్దగడ్డ, కందివలస అనే 9 నదులు ఉన్నాయి. వీటిలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ ముఖ్యమైన నదులు. జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 26.47%, నైఋతి ఋతుపవనాల ద్వారా 62.61% వర్షాలు లభిస్తాయి. మూడు ముఖ్య నదుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగం: నాగావళి 371 మి.క్యూ.మీ. (మిలియన్ క్యూబిక్ మీటర్లు) (36%), వంశధార 121 మి.క్యూ.మీ. (12%), మహేంద్ర తనయ 81 మి.క్యూ.మీ. (8%), చిన్న చెరువులు 140 మి.క్యూ.మీ. (14%), భూగర్భ జలాలు 300 మి.క్యూ.మీ. (30%). మొత్తం 1,013 మి.క్యూ.మీ. రాష్ట్రంలో రెండు ప్రధాన జలాశయాలు సుమారు 140 మి.క్యూ.మీ. నీటిని వ్యవసాయ నిమిత్తం సమకూరుస్తున్నాయి. అవకాశం ఉన్న నీటిలో 91% (5,763 మి.క్యూ.మీ.) బంగాళాఖాతంలోకి వృధాగా పోతున్నదని అంచనా. 9% నీరు మాత్రమే భూగర్భంలోకి ఇంకుతుంది. జిల్లాలో 3.3 లక్షల (0.33 మిలియన్) హెక్టేరులు భూమి సాగులో ఉంది. అందులో 1.9 లక్షల హెక్టేరులకు సాగునీటి వసతి ఉంది. కాలువల ద్వారా 91,946 హెక్టేరులు, చెరువుల ద్వారా 80,123 హెక్టేరులు, బోరు బావుల ద్వారా 6,923 హెక్టేరులు, ఇతర బావుల ద్వారా 8,866 హెక్టేరులు, ఇతర వనరుల ద్వారా 5,316 హెక్టేరులు భూమికి సాగునీరు లభిస్తుంది. అనిశ్చితమైన వర్షపాతం జిల్లాలో ప్రధాన సమస్య. చాలా సంవత్సరాలు అనావృష్టి సంవత్సరాలుగా పరిగణింపబడుతున్నాయి. అలాగే త్రాగు నీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఫ్లోరోసిస్ సమస్య కూడా కొన్నిచోట్ల ఉంది. నీటి వనరులను పరిరక్షించే విధానాలు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతంలోని "పోడు" వ్యవసాయం ఇందుకు ముఖ్యమైన కారణాలు. జిల్లాలో ఎక్కువ భాగం నేల ఉపరితలం గట్టిగా ఉన్నందున నీరు ఇంకే అవకాశం తక్కువ. అందుకు తోడు అధిక భూభాగం వాలుగా ఉన్నది గనుక నీరు నిలవదు. వరి, చెరకు పంటలకు ఎక్కువ నీటిని వాడుతారు. జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు: నారాయణపురం డాం (మద్దివలస రిజర్వాయిర్, నాగావళి), గొట్టా బారేజి (వంశధార), కళింగాంధ్ర ప్రాజెక్టు (మహేంద్ర తనయ) మచిలేశం, కళింగపట్నం, నువ్వలరేవు, భావనపాడు, బారువలు ముఖ్యమైన మత్స్య పరిశ్రమ కేంద్రాలు. పరిశ్రమలు జిల్లాలో ముఖ్యపరిశ్రమలు: చక్కెర, నూనె, జీడిపప్పు, జనపనార, పేపర మిల్లు కర్మాగారాలు ఉన్నాయి. మాంగనీసు, గ్రాఫైటు, సున్నపు రాయి, మైకా, గ్రానైట్, జిల్లా తీరప్రాంతంలోని ఇసుకలో మోనజైట్, ఇతర ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. పైడిభీమవరం, రాజాం, మడపాం, ఆమదాలవలస, సంకిలి పట్టణాలలో పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. సంస్కృతి ప్రధాన భాష తెలుగు. అయితే, ఒడిశా రాష్ట్రానికి సరిహద్దు కావడంచేత ఒడియా భాషను కొంతమంది అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు. పర్యాటకం right|thumb|కళింగపట్నం బీచ్ వద్ద దీపస్తంభం thumb|శాలిహుండం బౌద్ధారామ అవశేషాలు thumb|అరసవిల్లి ఆలయం thumb|శ్రీకూర్మం ఆలయం శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం, బలగ ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో రెండు కోట్లమంది పైచిలుకు, 2016లో కోటీ అరవైలక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్) పర్యాటకుల సంఖ్య విషయంలో 2017లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత రెండవ స్థానం పొందింది. శ్రీకాకుళం: శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి, కోటేశ్వరస్వామి ఆలయము (గుడివీధి), సంతోషిమాత ఆలయం (పాతశ్రీకాకుళం), వెంకటేశ్వరఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం, జమియా మసీదు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు. శ్రీకూర్మం: శ్రీకాకుళం నగరానికి 15 కి.మీ. దూరంలో ఉన్న శ్రీకూర్మం దేశంలో బహుశా ఒకే ఒక కూర్మావతార మందిరం. విశిష్టమైన శిల్పకళ కలిగిన ఈ మందిరంలో లభించిన శాసనాలు చారిత్రికంగా కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇక్కడ డోలోత్సవం ప్రధాన ఉత్సవం. శాలిహుండం: ఇది శ్రీకాకుళం పట్టణానికి 18 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ పురావస్తుశాఖ త్రవ్వకాలలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు బయటపడ్డాయి. శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం, ముఖలింగం కళింగపట్నం దీప స్తంభం, కళింగపట్నం కవిటి: సోంపేట, ఇచ్ఛాపురాల మధ్య ఉన్న కవిటిని 'ఉద్దానం' (ఉద్యానవనం) అని కూడా అంటారు. కొబ్బరి, జీడిమామిడి, పనస వంటి తోటలతో ఇది రమణీయంగా ఉండే ప్రదేశం. శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరం. ఇక్కడ చింతామణి అమ్మవారి, శ్రీ సీతారామ స్వామి ఆలయం ఉన్నాయి. బారువ: ఇది శ్రీకాకుళం పట్టణానికి 109 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహేంద్ర తనయ నది సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన ఓడరేవు. ఇది కొబ్బరి తోటలకు, కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్రం. తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం, తేలినీలాపురం: ఇది శ్రీకాకుళం పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఒక సంరక్షిత పక్షి ఆవాస కేంద్రం. సైబీరియా నుండి శీతకాలంలో పెలికన్ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. దంతపురి: ఇది శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉంది. దీనిని బౌద్ధ జ్ఞానదంతపురి అని కూడా అంటారు. క్రీ.పూ.261లో అశోకుని కళింగ యుద్ధం తరువాత ఇది కళింగరాజులకు ప్రాంతీయ రాజధానిగా ఉంది. ఇక్కడ పురావస్తు శాఖవారి త్రవ్వకాలలో అనేక పురాతన వస్తువులు లభించాయి. సంగం: శ్రీకాకుళానికి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నాగావళి, వంశధార, సువర్ణముఖి నదులు కలుస్తున్నాయి. ఇక్కడ సంగమేశ్వర మందిరం ఐదు లింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధం. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. పొందూరు: ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరు లోనే. ఇది జిల్లా కేంద్రానికి 21 కి.మీ. దూరంలో ఉంది. కొరసవాడ: ప్రఖ్యాతి గాంచిన మంచు తాతాయ్య చెనెత వస్త్రములు తయారయ్యేది జిల్లాలోని కొరసవాడ లోనే. ఇది శ్రీకాకుళానికి 55 కి.మీ. దూరంలో ఉంది. మందస: సోంపేటకు 26 కి.మీ. దూరంలో ఉంది. మహేంద్రగిరి కొండ దిగువున ఉన్న ఈ వూరిలో 700 సంవత్సరాల పురాతన వాసుదేవ ఆలయం ఉంది. ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా చెప్పబడుతుంది. రావివలస - ఎండలమల్లన్న దేవాలయం పాతపట్నం - నీలమణి అమ్మవారు దేవాలయం ప్రముఖులు thumb|గిడుగు రామమూర్తి పంతులు thumb|కోడి రామ్మూర్తి నాయుడు సాహితీవేత్తలు గిడుగు రామమూర్తి పంతులు - వ్యావహారిక భాష వాడకాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలుపరచిన వైతాళికుడు గరిమెళ్ళ సత్యనారాయణ - కవి, స్వాతంత్ర్య సమర యోధుడు కాళీపట్నం రామారావు - కథా రచయిత దీర్ఘాసి విజయభాస్కర్ - నాటక రచయిత, కవి, కథకులు, (కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత) రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి)-రచయిత, సాహితీ వేత్త గెడ్డాపు సత్యం - పద్యకవి, సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త. పింగళి నాగేంద్రరావు (రచయిత) వడ్రంగి రామారావు (భావశ్రీ)- రచయిత, సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు - రచయిత బలివాడ కాంతారావు - నవలా రచయిత ఛాయరాజ్ - రచయిత, సాహితీ పరిశోధకుడు మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి - రచయిత, సాహితీవేత్త దూసి ధర్మారావు - రచయిత, సాహితీకారుడు. కళాకారులు చట్టి పూర్ణయ్య పంతులు - నాటక రంగానికి ఎనలేని సేవ చేశాడు అమరపు సత్యనారాయణ - రంగస్థల కళాకారుడు యడ్ల గోపాలరావు - రంగస్థల కళాకారుడు దూసి బెనర్జీ భాగవతార్ - హరికథకుడు లోకనాథం నందికేశ్వరరావు - మిమిక్రీ కళాకారుడు శ్రీపాద పినాకపాణి - సంగీతకారుడు వడ్డాది పాపయ్య - చిత్రకారుడు జి.ఆనంద్ - (గాయకుడు) జె.వి.సోమయాజులు (తెలుగు చలనచిత్ర నటుడు) గజల్ శ్రీనివాస్ మిమిక్రీ శ్రీనివాస్ శరత్ బాబు (చలనచిత్ర నటులు) షకలక శంకర్ (జబర్దస్త్ ఫేమ్) రావి కొండలరావు జి.ఆనంద్, జె.వి.సోమయాజులు క్రీడాకారులు కోడి రామమూర్తి - పహిల్వాన్ కరణం మల్లీశ్వరి - ఒలింపిక్ విజేత పూజారి శైలజ - క్రీడాకారిణి నీలంశెట్టి లక్ష్మి - క్రీడాకారిణి స్వాతంత్ర్య సమరయోధులు వీర గున్నమ్మ - స్వాతంత్ర్య సమర యోధులు జననాయక్. చౌదరి సత్యనారాయణ - స్వాతంత్ర్య సమర యోధులు గౌతు లచ్చన్న - స్వాతంత్ర్య సమర యోధులు, ఇవి కూడా చూడండి శ్రీకాకుళం జిల్లా శాసనసభా నియోజకవర్గాలు - 2007 పునర్వ్యవస్థీకరణ మూలాలు బయటి లింకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:కోస్తా వర్గం:భారతదేశం లోని జిల్లాలు
విశాఖపట్నం
https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం
విశాఖపట్నం భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ లో అతి పెద్ద నగరం, అదే పేరుగల జిల్లాకు కేంద్రం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సముద్రం లోకి చొచ్చుకొని ఉన్న కొండ "డాల్ఫిన్ నోస్", అలల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉంది. విశాఖపట్నానికి విశాఖ, వైజాగ్‌, వాల్తేరు అనే పేర్లు కూడా ఉన్నాయి. 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రతిపాదించాడు.https://www.bbc.com/telugu/india-50914893 వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం, బౌద్ధ విహారాల అవశేషాలున్న తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ, బొజ్జన కొండ; సముద్రతీర ప్రాంతాలు, ఉద్యానవనాలు, ప్రదర్శనశాలలు ఇక్కడి ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. సరిహద్దు జిల్లాలలో గల పర్యాటక ప్రాంతాలైన అరకు లోయ, మన్యం అడవులు, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు చూడటానికి ఇది ప్రముఖ పర్యాటక కేంద్ర స్థావరం. పేరు వ్యుత్పత్తి విశాఖపట్నం అనే పేరు విశాఖ అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. విశాఖపట్నానికి ఈ పేరు రావడం వెనుక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా గజిట్ (పిపి 2–3) ప్రకారం శివుని కుమారుడు "వైశాఖ" (కార్తికేయుడు) పేరు పెట్టినందున "విశాఖ" అనే పూర్వపదం వచ్చినట్లు ఉంది. శివుడి కుమారుడు కుమార స్వామికి విశాఖ అనే పేరు కూడా ఉంది. అతని నక్షత్రం కూడా విశాఖే. అతని గుడి ఇక్కడ ఉండేదనీ, అతని పేరిటే ఈ నగరానికి ఆ పేరు వచ్చిందనే వాదన కూడా ఉంది. వైశాఖేశ్వరుని ఆలయం చుట్టూ నగరం విస్తరించినందువల్లే విశాఖపట్నంగా పేరు వచ్చిందనేది ఒక కథనం. ఈ నగరంలో విశాఖేశ్వరుని ఆలయం ఉన్నందున "విశాఖేశ్వరపురం" అనే పేరు ఉండేదని కాలక్రమంలో, పురానికి రూపాంతరం పట్నం కావున "విశాఖపట్నం"గా మారినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. ఉత్తర పదం "పట్నం" పట్టణానికి రూపాంతరం. దీనికి ఊర్ల పేర్ల నిఘంటువుకేతు విశ్వనాధ రెడ్డి, "కడప ఊర్ల పేర్ల ద్వితీయ నిఘంటువు" పేజీ 47, నుండి సేకరించిన వివరాలు గల పుస్తకం. ప్రకారం పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలున్నాయి. ఈ నగరం పూర్వం నుండి సముద్రతీర ప్రాంతం, ఓడరేవు ఉన్నందున ఉత్తర పదం "పట్నం" వచ్చినట్లు తెలియుచున్నది. ద్రాక్షారామం లోని భీమేశ్వరాలయంలో లభ్యమైన సా.శ. 1068 నాటి శిలాశాసనం లోనే విశాఖపట్నం అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది. 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళుడు ఈ ప్రాంతాన్ని జయించాడు. అతను ఈ నగరానికి "కులోత్తుంగపట్నం" అనే పేరు పెట్టాడు. విశాఖపట్నం నుంచి తంజావూరు వరకూ అతని రాజ్యం ఉండేది. కానీ అతని తదనంతరం ఆ పేరు కనుమరుగు అయిపోయింది. ఈ విషయాన్ని చరిత్రకారులు ధ్రువీకరించారు. 1102 నాటి శాసనంలో విశాఖపట్నం పూర్వపు పేరు "కులోత్తుంగ చోళ పట్టిణం" లేదా "విశాఖ పట్టిణం" అని ఉంది. అంటే కులోత్తుంగ చోళుడు ఈ పట్టణానికి "కుళోత్తుంగపట్నం"గా మార్చినప్పటికీ, అంతకు పూర్వమే "విశాఖ పట్టిణం" అని ఉన్నట్లు తెలియుచున్నది. ఉత్తర పదం "పట్టణం" లేదా "పట్టిణం" అనేది ఓడరేవు పట్టణం అయినందున వచ్చినట్లు తెలియుచున్నది. 1908 నాటి బ్రిటిషు ఇండియా వారి ఇంపీరియల్ గజటీర్ ఈ నగరాన్ని విజాగపటం (VIZAGAPATAM) అంటోంది. ఈ గజెట్ మొదటి కూర్పు 1880 లో వెలువడింది. ఇంగ్లీషులో వైజాగపటం అని రాసినా, తెలుగులో రాసేప్పుడు మాత్రం విశాఖపట్నం అనే రాశారు బ్రిటిష్ వాళ్లు. అప్పటి ప్రభుత్వ ముద్రలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. ఆ వైజాగపటంలోని మొదటి అక్షరాలతో వైజాగ్ ఇప్పుడు బాగా వాడకంలో ఉంది. చరిత్ర పౌరాణిక ప్రశస్తి శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖుడి పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతాలలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరిని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతంలోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల రాతి ఆయుధాలను చూడవచ్చు. చారిత్రిక ప్రశస్తి స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది. (9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీకి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై, తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు. ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి. గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది. 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డిరాజులు, చోళులు, కుతుబ్‌ షాహీలు, మొగలులు, నిజాం వంశస్థులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం ఒకటిగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, 18 వ శతాబ్దంలో బ్రిటిషు వారి వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం జిల్లాగా ఏర్పడింది. ఈ నగరం బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది. భౌగోళికం center|thumb|800x800px| విశాఖపట్నం నగరం   విశాఖపట్నం బంగాళా ఖాతం ఒడ్డున ఉంది. ఈ నగరపు అక్షాంశ రేఖాంశాలు; 17.688° ఉత్తర అక్షాంశం, 83.219° తూర్పు రేఖాంశం. ఈ నగరం మైదాన ప్రాంతం, తీరప్రాంతాలతో ఉంది. నగరం సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తున ఉంది. విస్తీర్ణం . నగరానికి పశ్చిమాన సింహాచలం కొండలు, ఆగ్నేయాన యారాడ కొండలు, వాయవ్యాన కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నాయి. 621.52 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఈ కొండలు విశాఖపట్నం పర్యావరణంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. విశాఖపట్నం లోని కొండలు తూర్పు కనుమలు సింహాచలం కొండలు యారాడ కొండలు ఎర్రమట్టి దిబ్బలు డాల్ఫిన్స్ నోస్ కైలాసగిరి కొండ వాతావరణం విశాఖపట్నంలో ఉష్ణమండల, తడి పొడి వాతావరణం (కొప్పెన్ Aw) ఉంటుంది. వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 24.7–30.6 °C (76–87 °F) మధ్య ఉంటాయి, గరిష్ఠ ఉష్ణోగ్రత మే నెలలోను, కనిష్ఠ ఉష్ణోగ్రత జనవరిలోనూ ఉంటుంది; కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17–27 °C (63–81 °F) మధ్య ఉంటాయి. ఇప్పటివరకు అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత 42.0 °C (107.6 °F) 1978 లోను, అత్యల్ప ఉష్ణోగ్రత 10.5 °C (51 °F) 1962 జనవరి 6 న నమోదైంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల నుండి వర్షపాతం లభిస్తుంది. సగటు వార్షిక వర్షపాతం 1,118.8 మిమీ (44.05 అంగుళాలు). 2014 అక్టోబరులో హుద్‌హుద్ తుఫాను విశాఖపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. జనగణన గణాంకాలు సంవత్సరం జనాభా పెరుగుదల శాతం 1901 40,892 -- 1931 57,303 28.16% 1951 1,08,042 53.81% 1961 2,11,190 95.47% 1971 3,63,504 66.91% 1981 5,65,321 60.37% 1991 10,57,118 86.99% 2001 13,45,938 25.76% 2011 20,35,922 భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం, విశాఖపట్నం జనాభా 1,728,128, వీరిలో పురుషులు 873,599, ఆడవారు 854,529, - లింగ నిష్పత్తి 1000 మగవారికి 978 మంది. జనాభా సాంద్రత 18,480 /చ. కిమీ (47,900 / చదరపు మైళ్ళు). 0–6 సంవత్సరాల వయస్సులో 164,129 మంది పిల్లలు ఉన్నారు, 84,298 మంది బాలురు, 79,831 మంది బాలికలు ఉన్నారు - లింగ నిష్పత్తి 1000 మంది అబ్బాయిలకు 947 మంది బాలికలు. మొత్తం 1,279,137 మంది అక్షరాస్యులతో సగటు అక్షరాస్యత రేటు 81.79%గా ఉంది, వారిలో 688,678 మంది పురుషులు, 590,459 మంది స్త్రీలు ఉన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో విశాఖపట్నం 122 వ స్థానంలో ఉంది. మొత్తం మురికివాడ జనాభా జనాభాలో 44.61%. అంటే 770,971 మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. నగర పరిమితుల విస్తరణ తరువాత జనాభా రెండు మిలియన్ల మార్కును దాటి 2,035,922 వద్ద ఉంది. భాష, మతం తెలుగు స్థానిక ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాష, అధికారిక భాష. సాధారణ మాండలికం,ఉత్తరాంధ్రా (ఈశాన్య ఆంధ్ర) మాండలికం వాడుకలోవున్నాయి. ఉత్తరాంధ్ర మాండలికం ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రజలు మాట్లాడతారు. విశాఖపట్నం కాస్మోపాలిటన్ జనాభాలో తమిళులు, మలయాళీలు, సింధీలు, కన్నడిగులు, ఒడియాస్, బెంగాలీలు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బిహారీ వలసదారులు ఉన్నారు. నగరపు మొదటి కాస్మోపాలిటన్లుగా పరిగణించబడే ఆంగ్లో-ఇండియన్ సముదాయం కూడా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, నగరంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు, 92.72% మాట్లాడేవారు, తరువాత ఉర్దూ (2.52%), హిందీ (2.15%), ఒడియా (1.00%), తమిళం (0.33%), మలయాళం (0.32%) ),, బెంగాలీ (0.31%). పౌరులలో హిందూ మతం ఎక్కువమంది ఆచరిస్తున్నారు, తరువాతి స్థానాలలో ఇస్లాం, క్రైస్తవ మతం ఉన్నాయి. ఈ ప్రాంతం పురాతన కాలంలో బౌద్ధమతం ప్రాబల్యంవుండేది అనేదానికి చిహ్నంగా దగ్గర ప్రాంతాల్లోని అనేక బౌద్ధ సంఘరామాలున్నాయి. ఇటీవలి జనాభా లెక్కల ఆధారంగా మొత్తం నగరంలో బౌద్ధమతస్తుల జనాభా సుమారు 0.03%గా ఉంది. పరిపాలన పరిపాలన కొరకు 1858లో పురపాలక సంఘం, 1979 లో నగర పాలక సంస్థ, 2005 నవంబరు 21 నాడు మహానగర పాలక సంస్థ ఏర్పడ్డాయి.. నగర ప్రాంత అభివృద్ధి కొరకు విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేయబడింది. రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గం చెన్నై-కోల్‌కతా లను కలుపు 16 వ నంబరు జాతీయ రహదారి, విశాఖపట్నం-రాయపూర్ లను కలుపు 26 వ నంబరు జాతీయ రహదారి విశాఖను దేశం లోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చే నిర్వహించబడు ద్వారకా బస్సు స్టేషన్ కాంప్లెక్స్ నుండి రాష్ట్ర సర్వీసులు, సరిహద్దు రాష్ట్రాలకు అంతరాష్ట్ర సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. నగరంలోని మద్దిలపాలెం,అనకాపల్లి బస్ స్టేషన్ ల నుండి కూడా బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి యాజమాన్యంలో నగర బస్సులు, నగర ప్రాంతాలకే కాక, పొరుగు జిల్లా కేంద్రాలైన విజయనగరం,శ్రీకాకుళంలకున్నాయి. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి శీఘ్రవంతమైన ప్రజా రవాణా కొరకు బి.అర్.టి.ఎస్ (Bus Rapid Transit System) వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. రైలు మార్గం దేశంలో నాల్గవ అత్యధిక ఆదాయం కలిగిన వాల్తేరు డివిజన్ ప్రధాన కేంద్రం విశాఖ పట్నంలో ఏర్పాటు చేయబడింది. హౌరా - చెన్నై రైలు మార్గంలో విశాఖపట్నం జంక్షన్ ఒక ప్రధాన రైల్వే స్టేషన్. దువ్వాడ, అనకాపల్లి, సింహాచలం రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. వాయు మార్గం విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది నౌకాదళం అధీనంలో నడిచే విమానాశ్రయం. ఇందులోనే ఐ.ఎన్.ఎస్. డేగ పేరుతో నౌకాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణిస్తుంటాయి. రుషి కొండలో నగర విహంగ వీక్షణం కొరకు సెలవుదినాలలో, పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాలలో హెలికాప్టర్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. విజయనగరం జిల్లా లోని భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేశారు. జల మార్గం ఇక్కడ సంవత్సరంలో అన్ని రోజులు నౌకలు నిలుపుదల చేయగల సహజ సిద్ద నౌకాశ్రయం కేంద్ర ప్రభుత్వ అధీనంలో లోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఇది కాకుండా దేశం లోనే లోతైన పోర్ట్ అయిన గంగవరం పోర్ట్ ద్వారా కూడా ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి. స్థానిక జాలర్ల కొరకు రాష్ట్రం లోనే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయబడింది. ఎగుమతులు,దిగుమతుల కోసం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ఏర్పాటు చేయబడింది. విశాఖ పోర్ట్ నుండి పోర్ట్ బ్లెయిర్ కి రవాణా సౌకర్యం ఉంది. పర్యాటకుల విహారం కొరకు ఫిషింగ్ హార్బర్ నుండి, రుషికొండ బీచ్ నుండి సాగరంలో బోటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ప్రతిపాదనలు మెట్రో రైలు వ్యవస్థ నగరంలో మూడు రైలు మార్గాలలో మెట్రో రైలు వ్యవస్థ ప్రతిపాదించబడింది. రైల్వే మండలి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా తూర్పు కోస్తా రైల్వే నుండి వాల్తేర్ డివిజన్ ని, దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ ల కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్ లోని ఒడిశా భాగాలూ నూతనంగా ఏర్పాటు చేయబడు రాయగడ డివిజన్ లో భాగం కానున్నాయి. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లోని మిగిలిన భాగాలు విజయవాడ డివిజన్ లో విలీనం చేసేలా సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యా వ్యవస్థ ఈ నగరం అనేక విద్యాసంస్థలకు నిలయంగా ఉంది. ఇక్కడ విశాఖపట్నం ప్రజా గ్రంథాలయం కూడా ఉంది. విశ్వ విద్యాలయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం గీతం విశ్వవిద్యాలయం ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయం వైద్య కళాశాలలు ఆంధ్ర వైద్య కళాశాల, గీతం మెడికల్ కాలేజ్, గాయత్రీ విద్య పరిషత్ మెడికల్ కాలేజ్, ఎన్నారై మెడికల్ కాలేజ్ ఇతర కళాశాలలు మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాల - హెరిటేజ్ భవనాలలో ఇది కూడా ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ పరిశోధనా వ్యవస్థ కలాం ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓషనోగ్రఫీ నేవల్ సైన్టిఫిక్ టెక్నాజికల్ లేబొరేటరీ ఫిషెరీ సర్వే ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వైద్య సేవలు ప్రభుత్వ రంగం లోని కింగ్ జార్జ్ హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్, విశాఖ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ తో పాటు, టాటా కాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండస్ హాస్పిటల్స్, సెవెన్ హిల్స్ హాస్పిటల్స్, ప్రథమ హాస్పిటల్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, పినాకిల్ హాస్పిటల్, మై క్యూర్, కేర్, అపోలో, ఓమ్ని వంటి హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి. క్రీడా రంగం క్రీడారంగ అభివృద్ధి కొరకు నగరం అనేక మైదానాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఏసీఏ వీడీసీఏ డా.వై.ఎస్.ఆర్.క్రికెట్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి అన్ని ఫార్మాట్ల క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇక్కడ డే అండ్ నైట్ మ్యాచ్ లకు సైతం ఆతిధ్యం ఇచ్చే సౌకర్యం ఉంది. ఇది కాక నగరంలో పోర్ట్ ఇండోర్ స్టేడియం, పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఉక్కు స్టేడియం, సౌత్ కోస్ట్ రైల్వే స్టేడియం, హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్ వంటి క్రీడా ప్రాంగణాలు ఔత్సాహికులు అయిన క్రీడా కారులను తీర్చిదిద్దుతున్నాయి. పరిశ్రమలు సాధారణ పారిశ్రామిక వాడలేకాక ఔషధ రంగం, వస్త్ర రంగం, ఆర్థిక రంగం కొరకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటయినాయి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (విశాఖపట్నం ఉక్కు కర్మాగారం:) భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. దీనిని జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించారు. హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (రిఫైనరీ) కోరమండల్ ఫెర్టిలైజర్స్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (హెవీ వెజల్స్ ప్లాంట్) హిందూస్తాన్ షిప్ యార్డ్ నేవల్ డాక్ యార్డ్ కంటైనర్ కార్పోరేషన్ అఫ్ ఇండియా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ఆంధ్ర సిమెంట్స్ ఆంధ్ర పెట్రో కెమికల్స్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్) హిందుజా థర్మల్ పవర్ స్టేషన్ ఎల్జీ పాలిమర్స్ ప్రత్యెక ఆర్థిక మండలి విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ (దువ్వాడ) APIIC ఐటి సెజ్ హిల్ నెంబర్ 3 (మధురవాడ) APIIC మల్టి ప్రోడక్ట్ సెజ్ (అత్చుతాపురం) APIIC ఐటి సెజ్ హిల్ నెంబర్ 2 (మధురవాడ) APIIC ఐటి సెజ్ (గంభీరం) రాంకీ ఫార్మా సెజ్ బ్రాండిక్స్ ఇండియా అప్పెరల్ సిటీ సత్యం కంప్యూటర్స్ ఐటి సెజ్ (రుషికొండ) అన్ రాక్ అల్యూమినియం లిమిటెడ్ (మాకవర పాలెం) దివిస్ లేబొరేటరీస్ (చిప్పాడ) హెటేరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ (నక్కపల్లి) డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ లిమిటెడ్ (రణ స్థలం) JSW అల్యూమినియం లిమిటెడ్ (ఎస్ కోట) డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఫిన్ టెక్ వ్యాలీ ఆంధ్ర ప్రదేశ్ మెడ్ టెక్ జోన్. సాయుధ దళాల స్థావరాలు thumb|800px|center|విశాఖపట్నం సముద్రం వీక్షణ దృశ్యం భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం ప్రధాన స్థావరం. పర్యాటకం thumb|విశాఖపట్నం, బీచ్ రోడ్డులోని ఒక పురాతన కాలపు నిర్మాణశైలి కలిగిన బంగ్లా thumb|విశాఖపట్నం, ఋషికొండ వద్ద సంధ్యా సమయం thumb|సింహాచలం ఆలయం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం తొట్లకొండ బౌద్ధ క్షేత్రం (రుషికొండ) బావికొండ బౌద్ధ క్షేత్రం (రుషికొండ) కొండకర్ల ఆవ ఆంధ్రా తాజ్ మహల్ (కురుపాం రాజులది) శ్రీ కనక మహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానం పోర్టు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి.ఒక కొండపై వెంకటేశ్వర స్వామి, ఒక కొండపై ముస్లిములకు పవిత్రమైన దర్గా, మరొక కొండపై (రాస్ కొండ) క్రైస్తవులకు పవిత్రమైన చర్చి ఉన్నాయి. శారదా పీఠం. (చిన ముషిడివాడ దగ్గర) కాళికాలయం. మూడు కాళికాలయాలు ఉన్నాయి. ఒకటి రామకృష్ణ బీచ్ దగ్గర, రెండవది ఉక్కు నగరంలో, మూడవది రైల్వే స్టేషను దగ్గర. డాల్ఫిన్స్ నోస్ (ఆంగ్లవికీ వ్యాసం) (డాల్ఫిన్ చేప ముక్కులాగ వుంటుందని, ఈ కొండకు, ఆ పేరు పెట్టారు). 174 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కొండమీద ఉన్న లైట్ హౌస్, సముద్రంలో ప్రయాణిస్తున్న నావికులకు, దారి చూపుతుంది. యాత్రికులు ఈ లైట్ హౌస్‌ను చూడవచ్ఛు. ఈ కొండ మీద నౌకాదళ సిబ్బందికి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ కొండ నుండి యారాడ అనే గ్రామం అరటి, కొబ్బరి పంట పొలాలు, కనకాంబరాల తోటలతో కనిపిస్తుంది. సాగర తీరాలు రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విస్తీర్ణం తగ్గింది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే కాళికాలయం, రామకృష్ణా మిషన్, హవా మహల్, జలాంతర్గామి (కాల్వరి) మ్యూజియం ఉన్నాయి. రిషికొండ బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చోటు. ఇంకా భీమునిపట్నం బీచ్, మంగమారిపేట బీచ్, యారాడ బీచ్, గంగవరం బీచ్, అప్పికొండ బీచ్ ఉన్నాయి. సంగ్రహాలయాలు విశాఖ మ్యూజియం నేవల్ మ్యూజియం INS కురుసుర జలాంతర్గామి మ్యూజియం TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం (సీ హారియర్ ప్రదర్శన శాల) తెలుగు మ్యూజియం జలాశయాలు ముడసర్లోవ రిజర్వాయిర్ మేఘాద్రి గడ్డ రిజర్వాయిర్ కణితి బేలన్సింగ్ రిజర్వాయిర్ పార్కులు, ఉద్యానవనాలు డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్క్ తెన్నేటి పార్క్ శివాజి పార్క్ కైలాసగిరి - శంఖం, ఛక్రం, నామాలు రాతిపూట కైలాసగిరి కొండ మీదనుంచి రాత్రివేళ మెరుస్తూ కనిపిస్తాయి. కొండమీద శివ పార్వతుల విగ్రహాలున్నాయి. ఇంకా నందమూరి తారక రామారావు సాగర తీరా ఆరామం (వుడా పార్క్), వైశాఖి జల ఉద్యానవనం ఉన్నాయి. ఇతర ప్రదేశాలు జగదాంబా సెంటరు - జగదాంబ సినీమా హాలు కట్టక ముందు, ఈ ప్రాంతాన్ని, ఎల్లమ్మ తోటగా పిలిచే వారు. నాగుల చవితి నాడు, ఇక్కడి చుట్టుపక్కల వున్న ప్రజలు పుట్టలో పాలు పోసేవారు. అన్ని పాము పుట్టలు వుండేవి. చిన్న అడవి లాగా వుండేది. ఇప్పటికీ, ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. ఇక్కడి భూములన్నీ 'దసపల్లా' రాజులకు చెందినవి. అందుకు గుర్తుగా ఇక్కడ కట్టిన సినిమా హాలు పేరు 'దసపల్లా చిత్రాలయ'. హోటల్ వేరు 'దసపల్లా హోటల్'. జగదాంబ 70 ఎమ్. ఎమ్. థియేటర్ కట్టిన తరువాత, ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల ఎర్రమట్టి దిబ్బలు సూర్య గడియారం (సన్ డయల్) - 1932లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని జైపూర్ విక్రమ దేవ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెనుక ఉన్న ఒక తోట మధ్యలో పైభాగంలో స్లాంట్ స్టోన్‌తో ఈ సూర్య గడియారాన్ని సూర్యగమనాన్ని అనుసరించి నిర్మించారు.Giduturi, Viswanadha. (2013). HERITAGE SITES IN VISAKHAPATNAM CITY: TYPOLOGIES, ARCHITECTURAL STYLES AND STATUS. European Scientific Journal. 930. 1857-7881. ఇంకా, కంబాల కొండ ఎకో పర్యాటకం పార్క్, జాతర శిల్పారామం, డా. రామానాయుడు స్టూడియోస్, అక్వేరియం,రాజీవ్ గాంధీ కర్ణాటక సంగీత భాండాగారం, VMRDA బుద్ధవనం,విక్టరీ ఎట్ సి మెమోరియల్ (Victory at Sea Memorial), హామిలిటన్ మెమోరియల్ మాసోనిక్ ఆలయం ఉన్నాయి. నగర ప్రాంతాలు సంప్రదాయ మార్కెట్లు పూర్ణా మార్కెట్: (సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్) కురుపాం మార్కెట్: మొదటి నుంచి ఈ ప్రాంతం బంగారం, వెండి వ్యాపారానికి ప్రసిద్ధి. విశాఖపట్నంలో మొట్ట మొదటి బంగారం, వెండి వ్యాపార కేంద్రం. కురుపాం రాజులు,వారి పాలనా కాలంలో ఈ మార్కెట్టును కట్టించారు. ఇప్పటికీ, కురుపాం మార్కెట్టు లోనికి వెళ్ళే ద్వారం మీద వారి పేరు వుంటుంది. ఈ ప్రాంతంలో దొరకని ఆయుర్వేద మూలిక వుండదు. అలగే, యజ్ఞాలు చేసే సమయంలో వేసే పూర్ణాహుతి సామాన్లు కోసం, పెళ్ళి చేసుకునే సమయంలో వేసే కర్పూరం దండలు వగైరా సామాన్లు దొరుకుతాయి. కాన్వెంట్ జంక్షన్ అని పిలిచే చావుల మదుం దగ్గరకి తెల్లవారు ఝామునే, లారీల మీద దేవరాపల్లి, మాడుగుల వంటి అటవీ (ఏజెన్సీ) ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల కూరగాయలు పండించే రైతులు, ఇక్కడికి తెచ్చి వేలంపాట ద్వారా కూరగాయలు అమ్ముతారు. విశాఖపట్నంలోని కూరగాయల వ్యాపారులు, హోటళ్ళ వారు వీటిని పెద్ద మొత్తంలో కొనుక్కుని వెళతారు. గాజువాక: గాజువాక మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే, పళ్ళ మార్కెట్ ఉంది. ఆరటి పళ్ళ గెలలు, కాలాన్ని బట్టి పండే, మామిడి, పుచ్చకాయలు వంటివి ఇక్కడ వేలంపాట ద్వారా అమ్ముతారు. ఆ పక్కనే, కణితి గ్రామానికి వెళ్ళే దారిలో, గాజువాక చుట్టుప్రక్కల గ్రామాల వారికి కావలసిన కిరాణా సరుకులు, కూరగాయలు, మాంసాహారం, చేపలు వగైరా అమ్ముతారు. ఇది ఈ చుట్టు ప్రక్కల చాలా పెద్ద మార్కెట్టు. రెండు, మూడు సార్లు పెద్ద అగ్నిప్రమాదాల పాలై, కోలుకున్న మార్కెట్టు ఇది. అక్కడికి దగ్గరలోనే వెండి, బంగారం దుకాణాలున్నాయి. వినోద సౌకర్యాలు సి ఎం ఆర్ సెంట్రల్ - ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ (4 స్క్రీన్ లు), ఐనాక్స్ - వరుణ్ బీచ్ (6 స్క్రీన్ లు), చిత్రాలయ - ఐనాక్స్ (3 స్క్రీన్ లు), విశాఖపట్నం సెంట్రల్ - ముక్తా ఎ2 సినిమాస్ (3 స్క్రీన్ లు) నగరంలో ఉన్నాయి. సాంస్కృతిక సంస్థలు కళాభారతి విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళల సేవా సంస్థ కళాభారతి 1991 మార్చి 3 న స్థాపించారు. సంగీతకారుడు సుసర్ల శంకర శాస్త్రి కలలకు ప్రతీకగా పుట్టిన ఈ ఆడిటోరియాన్ని 1991 మే 11 తేదీన పిఠాపురం కాలనీలో ప్రారంభించారు. ఇక్కడ నిత్యం, వివిధ సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు (సంప్రదాయ, జానపద), నాటకాలు జరుగుతాయి. విశాఖ మ్యూజిక్ డాన్స్ అకాడమీ ఈ సంస్థ విశాఖపట్నంలోని సంగీత (కర్ణాటక, హిందుస్థానీ), నృత్య కార్యక్రమాలకు కేంద్ర స్థానంగా ఉంది. సంగీత, నృత్య ప్రదర్శనల కార్యక్రమాలు, త్యాగరాజు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు విశాఖపట్నంలో లైన్స్ క్లబ్ (లయన్స్ క్లబ్), రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్. సావిత్రిబాయి ఫూలే ట్రస్టు, గోపాల పట్నం. ప్రతిజ్ఞ ఛారిటబుల్ ట్రస్టు, ఆర్.పి.పేట, మర్రిపాలెం, ప్రేమ సమాజం వంటి అనేక స్వచ్ఛంద సంస్థలున్నాయి చిత్రమాలిక ప్రముఖులు ఆరుద్ర గాము మల్లుదొర,విశాఖపట్నం మొదటి ఎం.పి,స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం పి.అప్పలనరసింహం,పెందుర్తి ఎమ్మెల్యే, అనకాపల్లి ఎం.పి అబ్బూరి గోపాలకృష్ణ చిత్రకారుడు,రచయిత,రంగస్థల కళాకారుడు. పి.జి.వి.ఆర్. నాయుడు,వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే, మాజీ పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పల నాయుడు,అనకాపల్లి ఎం.పి (3సార్లు),పరవాడ ఎమ్మెల్యే, వుడా ఛైర్మన్ లంక సుందరం మళ్ల విజయ ప్రసాద్,మాజీ వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే, వెల్ఫేర్ గ్రూప్ ఎం.డి దాడి వీరభద్రరావు,అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ,అనకాపల్లి ఎమ్మెల్యే, అనకాపల్లి ఎం.పి (2 సార్లు) పీలా గోవింద సత్యనారాయణ,అనకాపల్లి ఎమ్మెల్యే ద్రోణంరాజు సత్యనారాయణ,విశాఖపట్నం ఎం.పి రేణుకా చౌదరి కాంకోర్డియా మెరెల్ ఆంగ్ల నటి రచయిత్రి జ్యోతిర్మయి మళ్ళ - తొలి తెలుగు మహిళా గజల్ గాయకురాలు. నందివాడ రత్నశ్రీ అంతరిక్ష విజ్ఞాన రంగంలో పరిశోధకురాలు. లక్ష్మణయ్యర్ రామస్వామి రాగతి పండరి సెరిన్ జార్జ్ ఫ్రీలాన్స్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, మోడల్. సారిక శివ ప్రసాద్, క్రికెట్ అంపైర్ చార్లెస్ థామ్సన్, భారతీయ మాజీ క్రికెటర్, కోచ్ కె. అప్పలరాజు, ఫుట్‌బాల్ ఆటగాడు. అవని పంచాల్, రోలర్ స్కేటర్ చిలుకూరి శాంతమ్మ - విశాఖపట్నానికి చెందిన మహిళా ప్రొఫెసర్. మహారాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకుంది. పూడిపెద్ది వెంకటరమణయ్య - కథా రచయిత, పూలగుత్తి అనే పత్రికను నడిపాడు. అబ్బురి రామకృష్ణారావు - ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి మార్గదర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు భావకవి, పండితుడు, నవలా రచయత, నాటక కర్త, సాహితీవేత్త, విమర్శకుడు, అభ్యుదయ భావాలున్నవాడు, మానవతావాది, ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడు, గ్రంథాలయాధికారి. కట్టమంచి రామలింగారెడ్డి - సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్రా యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి (వైస్‌ ఛాన్సలర్‌) వాసిరెడ్డి శ్రీకృష్ణ (వి.ఎస్. కృష్ణ) - ఆంధ్ర విశ్వ కళాపరిషత్ మూడోవ ఉపాధ్యక్షులు రాచకొండ విశ్వనాధ శాస్త్రి (రావి శాస్త్రి) సుంకరి ఆళ్వార్ దాస్ అల్లు భానుమతి - 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. గ్రంధి మాధవి - 1983లో విశాఖపట్నం - I శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది వుడా చైర్మన్ల జాబితా: ద్రోణం రాజు సత్యనారాయణ-1978-1981 ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పల నాయుడు-1982-1983 పి.అప్పల నరసింహం-1984-1984 డివి సుబ్బారావు-1985-87 పి.కె. అగర్వాల్-1987-197 ఇవికూడా చూడండి కింగ్ జార్జి ఆసుపత్రి విశాఖపట్నం జమిందారి ఎస్టేట్స్ విశాఖపట్నం వార్డులు విశాఖపట్నం గ్యాస్‌ లీక్‌ ప్రమాదం బయటి లింకులు ఉడా వెబ్ సైటు ఇంటాక్ వైజాగ్ మూలాలు వెలుపలి లంకెలు వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ తీర పట్టణాలు వర్గం:విశాఖపట్నం జిల్లా వర్గం:కోస్తా
తూర్పు గోదావరి జిల్లా
https://te.wikipedia.org/wiki/తూర్పు_గోదావరి_జిల్లా
తూర్పు గోదావరి జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. రాజమహేంద్రవరం దీని ముఖ్యపట్టణం. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, దీనిలో కొన్ని ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చేర్చగా, గతంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు. గోదావరి తీరంలో పలు ఆలయాలు, ధవళేశ్వరం ఆనకట్ట,ధవళేశ్వరం లోని కాటన్ ప్రదర్శనశాల,, కడియం లోని పూలతోటలు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యాటక ప్రాంతాలైన పాపి కొండలు మొదలగు ప్రాంతాల విహారయాత్రలకు జిల్లా రాజధాని రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రం. జిల్లా చరిత్ర thumb|పాపికొండలు thumb|గోదావరి రైలు వంతెన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర ఆనవాళ్లు సా.శ.350 నుండి లభిస్తున్నాయి. తొలిగా, మౌర్యులు, నందులు పరిపాలించగా, 5 వశతాబ్దంలో విష్ణుకుండినులు పాలించారు. 7 వశతాబ్దంలో తూర్పు చాళుక్యుల పరిపాలనలో దాక్షరామంలో భీమారామం ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాత చాళుక్య చోళులు, వెలనాటి చోడులు, కాకతీయలు, ఢిల్లీ సుల్తానులు, విజయనగర రాజులు, కళింగ రాజులు, రెడ్డి రాజులు,గజపతులు, గోల్కొండ రాజులు, నిజాం పాలించిన పిదప బ్రిటీషు వారి పాలనలోకి వచ్చింది. ఈ జిల్లా బ్రిటిష్ అధీనంలోకి వచ్చే ముందు జమిందారుల ప్రాముఖ్యత అధికంగా ఉండేది. రంప, తోటపల్లి, జమ్మిచావడి, జద్దంగి, పెద్దాపురం, పిఠాపురం, కోట, రామచంద్రపురం జమిందారీలు కొన్ని ముఖ్యమైనవి. 1852లో సర్ ఆర్ధర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. దీనితో జిల్లాలో వరి, చెరకు విస్తారంగా సాగయింది. 20 సంవత్సరాలలో జిల్లా జనాభా మూడింతలయ్యింది. విశాఖ, గంజా తదితర ప్రాంతాల ప్రజలు వలస వచ్చారు. 1947 - 2014 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా అవతరించింది. ఈ జిల్లా 1953లో తెలుగు భాష మాట్లాడే జిల్లాలతో ఏర్పడ్డ కొత్త ఆంధ్ర రాష్ట్రంలో భాగమైంది. ఆ తరువాత 1956 లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే జిల్లాలతో కలిసి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. 2014 లో తెలంగాణ విభజన తర్వాత, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 59 మండలాలు ఉన్నాయి. జివో నంబరు 31 ద్వారా రౌతులపూడి మండలం అనే కొత్త మండలాన్ని 44 గ్రామాలతో ఏర్పరచారు. శంఖవరం మండలం నుండి 12 గ్రామాలు, కోటనందూరు మండలం నుండి 31 గ్రామాలు, తుని మండలం నుండి ఒక గ్రామాన్ని విడదీసి ఈకొత్త మండలాన్ని ఏర్పరచారు. దీనితో మొత్తం 60 మండలాలు అయ్యాయి. 2014 - 2022 thumb|తూర్పుగోదావరి రెవిన్యూ డివిజన్లు (2022 ఏప్రిల్ 4 కు ముందు) తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం (రామాలయమున్న భద్రాచలం రెవెను గ్రామం మినహా), చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం అనే 4 మండలాలు ఈ జిల్లాలో కలిసినవి. మొదట్లో ఈ 4 ముంపు మండలాలను రంపచోడవరం రెవెన్యూ డివిజనులో ఉంచినప్పటికీ, 2015లో ఎటపాక రెవెన్యూ డివిజను ఏర్పాటుచేస్తున్నప్పడు అందులోకి మార్చబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన భద్రాచలం గ్రామీణ మండలాన్ని నెల్లిపాక మండల కేంద్రంగా చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగానే కాక రెవెన్యూ మండలంగా మార్చబడటంతో, ఇక నెల్లిపాక మండలానికి బదులుగా ఎటపాక మండలంగా గుర్తించబడటం జరిగింది. పై మార్పుల ఫలితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్లు, మండలాలు 64, మండల ప్రజా పరిషత్తులు 57, పంచాయితీలు 1,012,మునిసిపాలిటీలు, కార్పొరేషనులు 9, పట్టణాలు 14, గ్రామాలు 1379 వుండేవి. రెవెన్యూ డివిజన్లు: 1.కాకినాడ 2.పెద్దాపురం 3.అమలాపురం 4.రాజమహేంద్రవరం 5.రంపచోడవరం 6. రామచంద్రపురం 7.ఏటపాక. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022 జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ పరిధితో జిల్లాపరిధిని సవరించుటకొరకు, దక్షిణంగా వున్న ప్రాంతాలు కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాలలో, ఉత్తరంగా వున్న గిరిజన ప్రాంతాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తర భాగంలో, గోదావరికి నదీతీరానికి పశ్చిమంగా వున్న కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు. 2022 వరకు కాకినాడ జిల్లా రాజధానిగా వుండగా, సవరించిన జిల్లాకు రాజమహేంద్రవరం రాజధాని అయ్యింది. భౌగోళిక స్వరూపం 2022లో జిల్లా పరిధి సవరించిన తరువాత జిల్లా వైశాల్యం 2,561 చ.కి.మీ (989 చ. మై). తూర్పు గోదావరి జిల్లాకు ఉత్తరాన ఏలూరు జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా,, తూర్పున కాకినాడ జిల్లా, దక్షిణాన పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమాన ఏలూరు జిల్లా,పశ్చిమ గోదావరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. గోదావరి, పంపా, తాండవ, ఏలేరులు జిల్లాలో ప్రవహిస్తున్న ప్రముఖ నదులు. వాతావరణం ఉమ్మడి జిల్లాలో ఈశాన్య ఋతుపవనాలు, నైరుతీ ఋతుపవనాల కారణంగా జూన్ నుండి అక్టోబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ జిల్లా పశ్చిమ కొండ ప్రాంతాలలో సుమారు 140 సెంటిమీటర్లు, ఉత్తర కోస్తా ప్రాంతంలో సరాసరి వర్షపాతం 100 సెంటిమీటర్లు ఉంటుంది. ఏడాది పొడుగునా వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు మాత్రం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరుగుతాయి. జిల్లా లోని సాధారణ వర్షపాతం - 1280.0 మి మీ. సగానికి పైగా వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలగగా మిగిలినది ఈశాన్య ఋతుపవనాల వలన కలుగుతుంది. జనగణన వివరాలు 2011 జనాభాగణాంకాలను అనుసరించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసంఖ్య 5,151,549. ఇది సంయుక్త అరబ్ ఎమిరేట్‌కు జనసంఖ్యకు సమానం లేక కొలరాడో రాష్ట్ర జనాభాకు సమానం. భారతదేశంలో జనసంఖ్యలో జిల్లా 19వ స్థానంలో ఉంది. అలాగే అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 1 కిలోమీటరుకు 477. 2001-2011 మధ్య జనసాంద్రత పెరుగుదల 5.1%. 2001-2011 కాలంలో అక్షరాస్యత 65.48% నుండి 71.35% నికి పెరిగింది, స్త్రీ:పురుషుల నిష్పత్తి 993 నుండి 1005 కు పెరిగింది, 6 సంవత్సరాల కంటే చిన్న పిల్లల సంఖ్య 12.5% నుండి 9.56%కు తగ్గింది. ఆరు సంవత్సరాలకంటె చిన్నపిల్లల లింగ నిష్పత్తి 978 నుండి 969 కి తగ్గింది. 2022 లో జిల్లా పరిధి సవరించిన తరువాత, 2011 జనగణన ప్రకారం జనాభా 18.323లక్షలు. పాలనా వ్వవస్ధ రెవెన్యూ డివిజన్లు 2022 ఏప్రిల్ 4 తరువాత జిల్లాలో రాజమండ్రి, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లున్నాయి. మండలాలు రాజమండ్రి రెవెన్యూ డివిజను కొవ్వూరు రెవెన్యూ డివిజను నగరాలు, పట్టణాలు నగరం: రాజమండ్రి పట్టణాలు: కొవ్వూరు నిడదవోలు గ్రామాలు 19 మండలాల పరిధిలో 271 గ్రామాలున్నాయి. రాజకీయ విభాగాలు జిల్లా పరిధిలో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం ఉంది. శాసనసభ నియోజకవర్గాలు రవాణా వ్యవస్థ చెన్నై, కోల్‌కతా లను కలిపే జాతీయ రహదారి 16, రైల్వే లైనులు జిల్లా గుండా పోతున్నాయి. రాజమండ్రి - కొవ్వూరును అనుసంధానిస్తూ పొడవైన రహదారి, రైలు వంతెన ఉంది. జిల్లా కేంద్రానికి 15 కి.మీ.ల దూరంలో మధురపూడి వద్ద రాజమండ్రి విమానాశ్రయం ఉంది. విద్యా సౌకర్యాలు జిల్లా రాజధాని రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం భారత స్వాతంత్ర్యం రాక ముందే స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు ప్రారంభించాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: దీని శాఖ రాజమండ్రిలో ఉంది. 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం: దీనిని 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కందుకూరి వీరేశ లింగం విద్యాసంస్థలు -శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా జూనియర్, డిగ్రీ, పి.జి కళాశాల, యస్.కే.వి.టి ఉన్నత ఆంగ్ల బోధనా పాఠశాల,యస్.కే.వి.టి ఉన్నత తెలుగు బోధనా పాఠశాల, యస్.కే.వి.టి జూనియర్ కళాశాల,యస్.కే.వి.టి డిగ్రీ & పి.జి కళాశాల ప్రభుత్వ కళాశాల (రాజమహేంద్రవరం): ఈ కళాశాల 1857లో స్థాపించబడింది. దీనికి మొదటి ప్రిన్సిపాల్ గా "మెట్కాఫ్" అనే ఆంగ్లేయుడు పనిచేశాడు. ఈయన పేరుతోనే విద్యార్థుల వసతి గృహం (మెట్కాఫ్ హాస్టల్) ఇప్పటికీ నడుస్తున్నది. అడివి బాపిరాజు ఇక్కడ చదువుకున్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడ ఈ కళాశాలలో ముఖ్యాధ్యాపకులుగా పనిచేశాడు. గౌతమీ గ్రంథాలయం: గౌతమీ గ్రంథాలయం అనబడేది వాసురయ గ్రంధ్రాలయం, రత్నకవి గ్రంథాలయాల సముదాయం. వాసురయ గ్రంధ్రాలయం వాసుదేవ సుబ్బారాయడు చేత, రత్నకవి గ్రంధ్రాలయం కొక్కొండ వేంకటరత్నం చేత స్థాపించబడ్డాయి. గౌతమీ గ్రంథాలయం పేరు 1898లో ఇవ్వబడింది, 1920 సంవత్సరంలో పేరు రిజిష్టరు చేయబడింది. సి.టి.ఆర్.ఐ సెంట్రల్ టొబాకో రీసర్చ్ ఇన్సిట్యూట్ (CTRI): ఇక్కడ పొగాకు, ఇతర అన్ని రకముల మొక్కలకు సంబంధించిన ప్రయోగములు జరుపుతారు. దీనిని 1947లో స్థాపించారు. పొగాకు సాగు విధానము మొట్టమొదట 1605 వ సంవత్సరములో పోర్ఛుగీసు దేశమునుండి మన దేశానికి వ్యాపించింది. ఆర్ధిక స్థితి గతులు గోదావరి డెల్టాలో అధికభాగం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నందున వ్యవసాయం, నీటిసంబంధిత వృత్తులు (అక్వా కల్చర్) జిల్లా ప్రజలకు ప్రధాన వృత్తులుగా ఉన్నాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా సహజవాయువు నిలువలు బయటపడడం వలన ఈ ప్రదేశం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో రెండు ఎరువుల కర్మాగారాలు, సహజ వాయువుతో తయారయ్యే విద్యుత్ వుత్పత్తి కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలున్నాయి. ప్రస్తుతం ఇది దేశంలో అతి పెద్ద చమురు, సహజవాయు ఉత్పత్తి కేంద్రంగా ఉంది. పరిశ్రమలు పేరు పొందిన పరిశ్రమలలో కొన్ని: కాగితం పరిశ్రమలు: ఏ.పి.పేపర్ మిల్స్, కోస్టల్ పేపర్ మిల్స్, కడియం పేపరు మిల్లు విద్యుత్తు తయారీ: సహజవాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం, విజ్జేశ్వరం మందుల పరిశ్రమలు ఆరోగ్యం కొరకు అదనపు పోషకాల తయారీ : హారిక్ల్స్ ఫ్యాక్టరీ పూల మార్కేట్, మొక్కల నర్సరీలు - కడియం సెరామిక్స్ టైల్స్ సంస్కృతి సంక్రాంతి ఉత్సవాలు సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు. జిల్లాలో కొత్త అల్లుళ్లకు, బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమలు సందడిగా ఉంటాయి. పర్యాటక ఆకర్షణలు right|thumb|ధవళేశ్వరం బ్యారేజి thumb|333x333px|కడియం పూలతోటలు ధవళేశ్వరం ఆనకట్ట కాటన్ ప్రదర్శనశాల, ధవళేశ్వరం పూలతోటలు, కడియం అష్ట సోమేశ్వరాలయాలు గోదావరి తీరంలో ఆలయాలు శివాలయం, పట్టిసీమ మహా నందేశ్వరాలయం, రామయ్యపేట, పట్టిసీమ : పట్టిసీమకు 3 కి.మీ. దూరములో ఉంది. మార్కండేయ దేవాలయము, రాజమండ్రి : పురాతన శివాలయం. ప్రముఖ వ్యక్తులు కందుకూరి వీరేశలింగం పంతులు, కవి గంటి మోహనచంద్ర బాలయోగి, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. రవితేజ, సినీ నటుడు ఆలీ, సినీ నటుడు దేవిశ్రీప్రసాద్, సంగీత కారుడు ఇవి కూడా చూడండి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పుణ్యక్షేత్రాల జాబితా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర మూలాలు బయటి లింకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:కోస్తా వర్గం:తూర్పు గోదావరి జిల్లా వర్గం:భారతదేశం లోని జిల్లాలు
ఖమ్మంమెట్టు (ఖమ్మం ఖిల్లా)
https://te.wikipedia.org/wiki/ఖమ్మంమెట్టు_(ఖమ్మం_ఖిల్లా)
ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. కాకతీయుల పాలనకాలం సా.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆదీనంలో ఉంది. ఈ కోట 300 సంవత్సరాల పాటు కాకతీయ రెడ్డి రాజుల ఆధీనంలో ఉంది. అప్పటి కాకతీయ రాజుల సైన్యాధిపతుల మధ్య విభేదాల కారణంగా, ఈ కోట పద్మనాయక వంశం (వెలమ రాజులు) చేతుల్లోకి వెళ్లింది, కొంతకాలం తర్వాత నందవాణి, కల్లూరు, గుడ్లూరు రాజులు వంటి వివిధ స్వతంత్ర పాలకులచే పాలించబడింది. ఆ తరువాత వచ్చిన ముసునూరి కమ్మరాజులు, కుతుబ్ షాహీ వంశస్థులు కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు. కుతుబ్ షాహీ వంశస్థులు దీని పేరు ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలు పెట్టారు. link=https://en.wikipedia.org/wiki/File:Steps_to_descend_along_the_walls.jpg|thumb|కోట గోడ|ఎడమ సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్ (సీతాపతిరాజు) ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. అప్పటి నుండి ఈ దుర్గం కుతుబ్‌షాహీల పాలనలో ఉంది. 17వ శతాబ్దంలో తక్కిన తెలంగాణ లాగ అసఫ్‌జాహీల పాలనలోకి వచ్చింది. గ్రానైటు రాళ్లతో నిర్మించిన ఈ పఠిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు పది ద్వారాలున్నాయి. పశ్చిమం వైపున్న దిగువకోట ప్రధానద్వారం. తూర్పు వైపున్న ద్వారాన్ని రాతి దర్వాజా లేదా పాత దర్వాజా అంటారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మొహరించే వీలుకలదు. కోటలోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహలు ఉన్నాయి. అరవై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ బౌలీ అనే బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవటానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. వర్షపు నీటిని నిలువ చేసుకోవటానికి నీటి కాలువలు కూడా ఉన్నాయి. ఇవికూడా చూడండి తెలంగాణ కోటలు మూలాలు బయటి లింకులు కట్టా శ్రీనివాసరావు అంతర్లోచన బ్లాగ్ లో ఖమ్మం ఖిల్లా గురించిన సమగ్ర సమాచారం మూలాలు వర్గం:ఖమ్మం జిల్లా వర్గం:తెలంగాణ కోటలు వర్గం:ఖమ్మం జిల్లా కోటలు
పర్ణశాల
https://te.wikipedia.org/wiki/పర్ణశాల
పర్ణశాల, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలంలోని గ్రామం.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. ఇది మండల కేంద్రమైన దుమ్ముగూడెం నుండి 36 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మణుగూరు నుండి 78 కి. మీ. దూరంలోనూ ఉంది. గణాంకాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 135 ఇళ్లతో, 505 జనాభాతో 518 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 256, ఆడవారి సంఖ్య 249. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 9 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 51. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 578931. పిన్ కోడ్: 507137. గ్రామం విశేషాలు thumb|220x220px|పర్ణశాల|alt= భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి 32 కి మీ ల దూరంలో పర్ణశాల ఉంది. హిందువుల ఆధ్యాత్మిక గ్రంథం రామాయణంలో పర్ణశాల ప్రసక్తి ఉంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినపుడు ఇక్కడ నివసించినట్లు ప్రతీతి. వాగు వద్ద సీత స్నానం చేసిన తరువాత ఇక్కడి రథంగుట్ట పై చీరలు ఆరవేయగా దానిపై ఆ చీరల ఆనవాళ్ళు ఏర్పడినవని ఒక కథనం. ఈ ఆనవాళ్ళు పర్ణశాలలో ఒక యాత్రా విశేషం.రాముడు బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుని ఇక్కడే చంపాడు. అప్పుడు రావణాసురుడు సీతను అపహరించగా నేలపై ఒక గుంట ఏర్పడింది. పర్ణశాలలో ఉన్న గుంట ఈ కారణంగా ఏర్పడినదే అని ప్రతీతి. విద్యా సౌకర్యాలు thumb|293x293px|alt=|Lord Rama and his consort Seeta statue at Pogallapalli Temple గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి దుమ్ముగూడెంలో ఉంది.సమీప జూనియర్ కళాశాల దుమ్ముగూడెంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు భద్రాచలంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఖమ్మంలోను, పాలీటెక్నిక్‌ ఎటపాకలోను, మేనేజిమెంటు కళాశాల పాల్వంచలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల దుమ్ముగూడెంలోను, అనియత విద్యా కేంద్రం పాల్వంచలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మం లోనూ ఉన్నాయి. వైద్య సౌకర్యం ప్రభుత్వ వైద్య సౌకర్యం పర్ణశాలలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రైవేటు వైద్య సౌకర్యం ఒక మందుల దుకాణం ఉంది. తాగు నీరు గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. పారిశుధ్యం మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. సమాచార, రవాణా సౌకర్యాలు పర్ణశాలలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి. మార్కెటింగు, బ్యాంకింగు గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం ఉంది. అంగన్ వాడీ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం, జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. విద్యుత్తు గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భూమి వినియోగం పర్ణశాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది: వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 118 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 206 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 192 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 150 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 41 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు పర్ణశాలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 41 హెక్టార్లు ఉత్పత్తి పర్ణశాలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రధాన పంటలు వరి, మిరప, ప్రత్తి, అపరాలు, కాయగూరలు గ్రామంలో ప్రధాన వృత్తులు వ్యవసాయం, వ్యవసాయధారిత వృత్తులు మూలాలు వెలుపలి లంకెలు వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు
పాపి కొండలు
https://te.wikipedia.org/wiki/పాపి_కొండలు
thumb|right|180px|పాపికొండల మధ్య గోదావరి thumb|right|180px|పాపికొండల వద్ద సూర్యాస్తమయం పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. ఈ ప్రాంతం విస్తీర్ణంలో వ్యాపించివుంది. ఇది అంతరించడానికి చేరువలో వున్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో జీవవైవిధ్యం గల ప్రదేశం. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణ లోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో వున్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణము కారణంగా ఆంధ్రా కాశ్మీరం అని పిలుస్తారు. ఈ ప్రాంత అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం ఉంది. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉన్నాయి. సినిమా చిత్రీకరణ సీతారామయ్యగారి మనవరాలు, అంజి, గోదావరి, గోపి గోపిక గోదావరి వంటి సినిమాలు ఈ ప్రాంతంలోనే తీశారు. భౌగోళికం రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణ లోని భధ్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది. నది మార్గం రాజమహేంద్రవరం నుండి పాపికొండల విహార యాత్ర దేవిపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడినుండి లాంచిలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ మరింత రమణీయంగా వుంటుంది. భద్రాచలం నుండి తూర్పుగోదావరి జిల్లా లోని వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం చేసి పేరంటాలపల్లికి చేరవచ్చు.http://www.suryaa.com/features/article.asp?subcategory=4&contentId=130937 ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ పాపికొండల పర్యాటకం విహారయాత్రలకు 2021 జూలై 1 నాడు, 2019 సెప్టెంబరులో దుర్ఘటన జరిగిన 21 నెలల తర్వాత మరల అనుమతించింది రహదారి మార్గం పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, చీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పోలవరం వద్ద కట్టుతున్న ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది. రైలు దగ్గరి రైల్వే స్టేషన్ రాజమండ్రిలో ఉంది. వాయుమార్గం దగ్గరి విమానాశ్రయం రాజమండ్రిలో ఉంది. రాజమండ్రి నుండి విహారయాత్ర విశేషాలు రాజమండ్రినుండి రోడ్డు మార్గంలో పురుషోత్త పట్నం చేరి అక్కడనుండి లాంచీలో ప్రయాణం మొదలవుతుంది. గండి పోచమ్మ ఆలయం ఇక్కడ యాత్రికుల ఆలయ సందర్శన కోసం లాంచి ఆగుతుంది. పూడిపల్లి గ్రామం త్రిశూలం, బంగారు బుల్లోడు చిత్రాలకు చిత్రీకరణ ఇక్కడే జరిగింది. దేవీపట్నం దేవీపట్నం పోలీస్ స్టేషన్ లో ప్రయాణీకుల వివరాలు అందచేయటానికి లాంచి ఆగుతుంది. దీని తరువాత మొబైల్ ఫోనులు పనిచేయవు, రోడ్డు రవాణా ద్వారా అత్యవసర సేవలు అందుబాటులో వుండవు. ఇక్కడ సీతారామరాజు ముట్టడించిన పాత పోలీస్ స్టేషన్ చూడవచ్చు. కొల్లూరు రెండు రోజుల యాత్ర చేసేవారు బసచేయడానికి కొల్లూరులో దిగుతారు. ఇక్కడ వెదురుగుడిసెలున్నాయి. పేరంటాలపల్లి పశ్చిమగోదావరి జిల్లాలోని పేరంటాలపల్లి దగ్గర గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్దంలో రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. భద్రాచలంనుండి విహారయాత్ర విశేషాలు శ్రీరామగిరి పుణ్యక్షేత్రం భద్రాచలం నుండి పాపికొండల యాత్ర చేసేవారు తూర్పు గోదావరి జిల్లాలో శ్రీరామగిరి గ్రామంలో శ్రీరామగిరి పుణ్యక్షేత్రం సందర్శించవచ్చు. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తారు. పక్కనే ఎత్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటాయువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. గత దుర్ఘటనలు 2019 సెప్టెంబరులో పోలవరం నుండి పాపికొండలుకు బయలు దేరిన రాయల్ వశిష్ట పడవ కచులూరు సమీపంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది సురక్షితంగా బయటపడగా 45 పైగా ప్రయాణికులు చనిపోయారు. చాలా ప్రయత్నాల తరువాత, నెలరోజులకు ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం మునిగిపోయిన బోట్ ను వెలికీతీయటంలో విజయం సాధించింది. విహారయాత్ర మళ్లీ ప్రారంభం రెండేండ్ల క్రితం కట్టలూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన తర్వాత పర్యాటకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తరిగి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విహారయాత్రకు అనుమతించాయి. దీంతో 2021 డిసెంబరు 18న పరిమిత సంఖ్యలో బోట్లతో భద్రాచలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం పోచవరం నుంచి పాపికొండల విహార యాత్ర పునః ప్రారంభమైంది. యాత్ర సజావుగా సాగేందుకు రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి. ప్రతి బోట్‌లో శాటిలైట్ ఫోన్, జీపీఎస్ ట్రాకర్స్‌ అందుబాటులో ఉంటాయి. బోటులో చెక్ చేయడానికి రాజమండ్రి నుండి పట్టిసీమ రేవు/ పోలవరం రేవు/ పురుషోత్తపట్నం రేవు వరకు ఉదయం 7:30 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతుంది. పడవలోకి ప్రవేశించిన తరువాత పర్యాటకులు పోలవరం ప్రాజెక్ట్ సైట్‌ను చూడవచ్చు, ఇది పాపి హిల్స్ పర్యటనలో సివిల్ ఇంజనీరింగ్ అద్భుతం. భద్రాచలం బోట్ పర్యాటకం ద్వారా సందర్శించదగిన చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశం. రాజమండ్రిలో టిక్కెట్ బుకింగ్ చేయవచ్చు, ఎందుకంటే సాధారణ బోట్‌లకు ఒక పూర్తి రోజుకు పిల్లలు, పెద్దలకు ధర బ్యాండ్ రూ. 1,000 నుండి 1200 వరకు ఉంటుంది, ఎయిర్ కండిషన్డ్ బోట్‌లకు సింగిల్ డే ప్యాకేజీలో అదనపు మొత్తం చెల్లించాలి. చిత్ర మాలిక మూలాలు బయటిలింకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు వర్గం:భారతదేశపు అడవులు వర్గం:అడవులు వర్గం:తూర్పు కనుమలు వర్గం:ఆంధ్రప్రదేశ్ కొండలు
త్యాగరాజు
https://te.wikipedia.org/wiki/త్యాగరాజు
త్యాగరాజు (మే 4, 1767 ఇంకొక సాంప్రదాయం ప్రకారం, త్యాగరాజు పుట్టిన సంవత్సరం 1749. భారతీయ చాంద్రమాన పంచాంగం ప్రకారము సర్వజిత్నామ సంవత్సర 27వ సోమవారము చైత్ర శుక్ల సప్తమినాడు పుష్య నక్షత్ర లగ్నమందు జన్మించాడు. - జనవరి 6, 1847హిందూ పంచాంగం ప్రకారం ప్రభవనామ సంవత్సర పుష్య బహుళ పంచమి.) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై అతనుకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగరాజ స్వామి వారిలో మూర్తీభవించాయి. ఇతను కర్ణాటక సంగీత త్రయంలో మరో ఇద్దరైన శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు కూడా. వీరు ముగ్గురూ తమిళనాడులోని, తంజావూరు జిల్లా, తిరువారూరుకు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది. బాల్యం, విద్యాభ్యాసం త్యాగరాజు జన్మస్థలం, పుట్టిన తేదీల గురించి ప్రామాణిక సమాచారం అందుబాటులో లేదు. అతని శిష్య పరంపరల ద్వారా కొన్ని వివరాలు తెలియగా, అతను రాసిన కీర్తనల నుంచి కూడా మరికొన్ని వివరాలు లభ్యమవుతున్నాయి. చాలామంది ఆమోదించిన అతని జీవిత చరిత్రకు ఆధారాలు రెండు. మొదటిది త్యాగరాజు ప్రత్యక్ష శిష్యుడైన వలజాపేట వెంకటరమణ భాగవతార్ దగ్గరున్న తాళపత్రాలు, ఇంకొకటి వెంకటరమణ భాగవతార్ కొడుకు కృష్ణస్వామి భాగవతార్ దగ్గరున్న నోటు పుస్తకం. త్యాగరాజు 1767 మే 4 వ తేదీన ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉన్న తిరువారూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతను కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగబ్రహ్మం. వీరు ములకనాడు తెలుగు బ్రాహ్మణులు, భరద్వాజ గోత్రీకులు, త్రిలింగ వైదికులు, ఆపస్తంభ సూత్రులు. త్యాగరాజు పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా, కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తంజావూరు పరిసర ప్రాంతానికి (ప్రస్తుతం తమిళనాడులో భాగం) వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవారు. త్యాగరాజు తాత గిరిరాజ కవి తెలుగు వాగ్గేయకారుడు. ఇతనిని గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించారు. త్యాగయ్య విద్య కొరకు రామబ్రహ్మం తిరువారూర్ నుంచి తిరువయ్యూర్‌కు వెళ్ళారు. త్యాగయ్య అక్కడ సంస్కృతాన్ని, వేదవేదాంగాలను అభ్యసించారు. శొంఠి వేంకటరమణయ్య దగ్గర సంగీతం అభ్యసించారు. వేంకటరమణయ్య త్యాగయ్య చాకచక్యంను, సంగీతంనందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశం చేసారు. జీవిత విశేషాలు త్యాగయ్య తండ్రి పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య జగిగిన భాగపరిష్కారాలలో త్యాగయ్య భాగంలో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహాలు వచ్చాయి. ఆ ప్రతిమలను అతి భక్తితో పూజించేవాడు. త్యాగయ్య జీవితమంతయూ ఊంఛవృత్తిని అవలంబించి సామాన్యంగా సాగించేవారు. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన "శ్రీరాములు" పై కృతులు రచించుటలో నిమగ్నమైయ్యేవారు. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామాలు జపించి వారి దర్శనం పొంది, వారి ఆశీర్వాద పొందినట్లు కథనాలు. త్యాగరాజువారు మంచి వైణికులు కూడా. 18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ అతను 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత అతను పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడారు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరు కానీ అతను ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. సంగీత ప్రతిభ త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచారు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడారు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి, తంజావూరు రాజుకు చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించారు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా త్యాగరాజు భావించారు. సంగీతంలోని రాగ, తాళాలను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనంగా మాత్రమే చూసారు. తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక, దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయాలను, తీర్థాలను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించారు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందారు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నారు. త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, "స్వరార్ణవం" ఇచ్చారనీ, ఆ సందర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనే" అనీ చెపుతాడు. ఈ పుస్తకం వల్ల త్యాగయ్య సంగీతంలో అత్యుత్కృష్టమైన విషయాలను తెలిసికొనినట్లు తెలుస్తుంది. శంకరాభరణం లోని "స్వరరాగ సుధారసం" అను కృతిలో ఈ గ్రంథం గురించి త్యాగయ్య పేర్కొన్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించారు. "దివ్యనామ సంకీర్తనలు", "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అను బృంద కీర్తనలు కూడా రచించారు. "ప్రహ్లాద భక్త విజయం", "నౌకా చరిత్రం" అను సంగీత నాటకాలు కూడా రచించారు. జీవితం సంఘటనలు త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత అతను వేంకటేశ నిను సేవింప అనే పాట పాడారు. త్యాగయ్య పరమపదం చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపం ఆరాధనోత్సవాలు అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటక సంగీతానికి మూలస్తంభంగా చెపుతారు. ఇతను జన్మదినం రోజుని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూరులో అతను సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. అతను భక్తులు, సంగీత కళాకారులు మొదట ఊంఛవృత్తి భజన, తరువాత అతను నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి అతను సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు అతను రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల అతని సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు, కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచింది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల, సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది. సమాధి త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిథిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసి, ఆ స్థలాన్ని, దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా తన వశం చేసికొని పరిశుభ్రం చేయించి, గుడి, గోడలు కట్టించారు. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసలకోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించారు. 1921 అక్టోబరు 27లో పునాదిరాయిని వేయగా, 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకం జరిగింది. స్థలాభావం వలన ఇంకా నేల కొని ఒక మంటపం, పాకశాల 1938లో నిర్మించారు. ఈ నిర్మాణాలతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భంలో చిత్తూరు నాగయ్య నాగరత్నమ్మగారిని కలిశారు. ఆమె సలహాపై నాగయ్య త్యాగరాజ నిలయం అనే సత్రాన్ని కట్టించారు. రచనలు 'రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో 'స్వరార్ణవం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం: శ్రీ త్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. శ్రీ త్యాగరాజస్వామి రామభక్తామృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం. కీర్తనలు త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించారు. వీటిలో చాలావరకు అతని మాతృభాష తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతంలో, తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం', 'నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు. త్యాగరాజు కీర్తనల పూర్తి పట్టిక కోసం త్యాగరాజు కీర్తనలు అనే వ్యాసాన్ని చూడండి. త్యాగయ్య క్షేత్రాలకు వెళ్ళినపుడు, ఆయా క్షేత్రం మీదను, క్షేత్రంలోని దేవుని మీదను కృతులు రచించారు. అవి యేవనిన: కొవ్వూరు పంచరత్నాలు (కొవ్వూరు లోని శ్రీ సుందరేశ్వర స్వామిపై వ్రాసిన ఐదు కృతులు) సంఖ్య పాట మొదలురాగంతాళం 1 నమ్మివచ్చిన కల్యాణి రూపకం 2 కోరిసేవింప ఖరహరప్రియ ఆదితాళం 3 శంభోమహదేవ పంతువరాళి రూపకతాళం 4 ఈ వసుధ శహాన ఆదితాళం 5 సుందరేశ్వరుని కల్యాణి ఆదితాళం తిరువత్తియూరు పంచరత్నాలు (తిరువత్తియూరులో వెలసిన శ్రీ త్రిపుర సుందరీ దేవిపై రచించిన కృతులు) సంఖ్య పాట మొదలురాగముతాళం 1 సుందరి నన్ను బేగడ రూపకం 2 సుందరీ నీ దివ్య కళ్యాణి ఆదితాళం 3 దారిని తెలుసుకొంటి శుద్ధ సావేరి ఆదితాళం 4 సుందరి నిన్ను వర్ణింప ఆరభి చాపు 5 కన్నతల్లి నిన్ను సావేరి ఆదితాళం పంచ రత్నాలు ఘనరాగ పంచరత్నాలు : త్యాగయ్య రచింపబడిన ఘన రాగ కృతులు. సంఖ్య పాట మొదలురాగంతాళం 1 జగదానందనాట ఆది 2 దుడుకుగల గౌళ ఆది 3 సాధించినే ఆరభి ఆది 4 ఎందరో శ్రీ ఆది 5 కనకనరుచిరా వరాళి ఆది ఇవి కూడాచూడండి కర్ణాటక సంగీతం త్యాగరాజు కీర్తనలు ముత్తుస్వామి దీక్షితులు శ్యామశాస్త్రి తెలుగు తెలుగు సాహిత్యం పురందరదాసు చిత్ర మాలిక మూలాలు సంబంధిత పుస్తకాలు The Spiritual Heritage of Tyagaraja, by C. Ramanujachari with introduction by Dr V. Raghavan, Ramakrishna Math, Chennai. Tyagaraja Kritigal (in Malayalam) by Prof P. R. Kumara Kerala Varma, Dept of Cultural Publications, Govt of Kerala, Trivandrum, 2000. Tyagaraja Kirtanalu (in Telugu) by Smt Dwaraka Parthasarathy and Sri N.C. Parthasarathy, Tagore Publishing House, Kachiguda, Hyderabad, 1995 (Balasaraswati Book Depot, Kurnool). Ramachandran, K.V., "The Melakarta: A Critique", The (Madras) Music Academy Platinum Jubilee Commemoration Volume, Vol. I, 1930-1940. (Original publication in the Journal of the Music Academy in 1938.) బయటి లంకెలు Biography of Tyagaraja Poems of Tyagaraja Website dedicated to Tyagaraja వర్గం:సంగీతకారులు వర్గం:కర్ణాటక సంగీత త్రిమూర్తులు వర్గం:కర్ణాటక సంగీతం వర్గం:1767 జననాలు వర్గం:1847 మరణాలు వర్గం:తెలుగు కవులు వర్గం:వాగ్గేయ కారులు వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:ప్రకాశం జిల్లా సంగీత విద్వాంసులు వర్గం:ప్రకాశం జిల్లా కవులు వర్గం:ఈ వారం వ్యాసాలు
భారతీయ సంగీతం
https://te.wikipedia.org/wiki/భారతీయ_సంగీతం
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అన్నారు పెద్దలు. ఆది ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉధ్బవించినదిగా చెప్పబడే సంగీతం గురించి చూద్దాం. thumb|277x277px|సురజ్కుండ్ అంతర్జాతీయ మేళాలో డోలు వాయిస్తున్న సంగీతకారులు సంగీతం-పరిణామం సంగీత నాట్యకళలు భారతజాతి అంత ప్రాచీనమైనది. భారతీయ సంగీతానికి మూలం వేదాలు - వేదాలలోని స్వరాలు. ఋగ్వేదం మంత్రాల గురించి వివరిస్తుంది. ఈ మంత్రాలకు మొన్ని లయాత్మక పదాలు చేర్చి పాడేవారు. వీటిని 'స్తోభాలు' అంటారు. రుగ్వేద కాలంలో ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే స్వరాలు ఉచ్ఛరించేవారు. కాలక్రమేణా వీటిని ఉచ్ఛ, వచ, స్వర, విశిష్టలతో సృష్టించారు. ఈ విధానం తరువాత ఏకస్వరమైన ఆర్చిక పఠనంగా మరింది. యజ్ఞయాగాలు జరిపే సమయంలో హాత, ఉద్గాత, సామిక అనే పేర్లతో స్వరాలను పాడేవారు. వేదకాలంలో ఏక (ఆర్చిక), ద్విశ్వరాలు (గాధిక్యం), దిస్వర (సామిక) పేర్లతో రూపొందింది. కాలక్రమేణా చతుస్వరి (నాలుగు), పంచస్వరి (ఐదు), షట్స్వరి (ఆరు), సప్తస్వరి (ఏడు) గా మారాయి. కాలక్రమంగా సప్తస్వర యుక్తమైన ఒక స్థాయిని మన పూర్వీకులు అందించారు. సామవేదము భారతీయ సంగీతానికి మూలం. ఇందులో ఏడు నుండి పది స్వరాలు వాటి సంగతులున్నాయి. ఇవి వికార, విశ్లేష, వికర్షణ, అభ్యాస, విరామ, స్తోభాలు మొదలైనవి. అవి ఈనాటికీ సంగీతంలో గమకాలుగా ఉంటాయి. మరికొంత కాలానికి సంగీతంలో వాది-సంవాది, ఆరోహణ-అవరోహణ, మంద్ర-తారా స్థాయిలు మొదలైన ప్రక్రియలు వచ్చాయి. సంగీతంలో రకాలు సంగీతమందు గల భిన్న సంప్రదాయములు భారతీయ సంగీతము అనేక సంప్రదాయ రీతులలో భాసిల్లుచున్నది. వాటిలో ముఖ్యమైనవిగా కర్ణాటక, హిందుస్థానీ సంగీత సంప్రదాయములు చెప్పబడుచున్ననూ, ప్రసిద్ధములైన యితర సంప్రదాయములూ ఉన్నాయి. వాటిని గురించి ఈ దిగువన ప్రస్తావించెదము. కర్ణాటక సంగీతము చెవుల కింపైన దేదైనా కర్ణాటక సంగీతమే. కాని దక్షిణాదిలో ప్రాచుర్యం పొందిన సంగీత బాణీని కర్ణాటక సంగీతమనీ, దాక్షిణాత్య సంగీతమని అంటారు. ఇందులో శాస్త్రీయ సంగీతం పండితరంజకంగా ఉంటే, ఇతర రకారలైన సంగీత రూపాలు దెశకాలపరిస్థితుల కనుగుణంగా, పామర రంజకంగా అభివృద్ధి చెందాయి. హిందూస్థానీ సంగీతము సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది నేడు ప్రచారంలో ఉన్న హిందూస్తానీ సంగీతంగా ప్రచారంలో ఉంది. ఇది ముఖ్యంగా రాజాస్థానాల్లో పాడబడేది. దీనిలో అనేక బాణీలు జనించాయి. భక్తి సంగీతము ఈ సంగీత సంప్రదాయము భక్తి రస ప్రధానము. ఈ సంప్రదాయము ఆయా వాగ్గేయకారుల పద్యములు, భజనలు, సంస్కృత శ్లోకములను కలిగి వుండును. సాధారణముగా శ్లోకముల వంటివాటికి తాళము చెప్పబడదు. కాలక్షేపము ఇది పురాణేతిహాసములలోని ప్రధాన ఇతివృత్తములను ఆధారముగా చేసికొని సాగే సంగీత కథనము. దక్షిణ భారతదేశమందు ప్రసిద్ధి చెందిన ఈ ప్రక్రియయందు ప్రధాన గాయకుడు కథాభాగమునకు శ్లోకములు, కీర్తనలు మేళవించి రసరమ్యముగా ఆలపించును. నాట్యమునందు సంగీతము దక్షిణ భారతదేశమందు ఖ్యాతినొందిన శాస్త్రీయ నృత్యములగు భరత నాట్యము, కూచిపూడి, మొదలగునవి కర్ణాటక సంగీతముపై మిక్కిలి ఆధారపడియున్నవి. తిల్లానా, పదము, జావళి, మొదలగునవి సంగీత కచేరీలయందును, నృత్య ప్రదర్శనలయందును ముఖ్య భాగములుగా పరిగణింపబడుచున్నవి. నృత్యమున ఉపయుక్తములగు కృతులు నృత్తమునకు, అభినయమునకు అనుగుణముగా మార్పు చేయబడును అనగా, కాల భేదము చూపబడును. జానపద సంగీతము భారతదేశము జానపద సంగీతానికి పట్టుకొమ్మ. కొన్ని జానపద గేయాలు శతాబ్దాలనుండి తరువాతి తరముల వారికి అందింపబడుతున్నాయి. ఇక పోతే, చక్కటి గతులతో హృదయాన్ని హత్తుకునేలా ఉండటం దీని ప్రత్యేకత. ఇప్పటికీ పల్లెటూర్లలో జానపదాలు వినవస్తాయి. శాస్త్రీయ సంగీతం లోని ఆనంద భైరవి వంటి రాగాలు కొన్ని జానపద సంగీతం నుండి వచ్చినవే. చాలా మటుకు సినిమా సంగీతం కూడా జానపదాల మీద ఆధారపడి ఉంది.) కర్ణాటక సంగీతంలోని వివిధ రచనలు కర్ణాటక సంగీతములో చాలా రకాల రచనలు ఉన్నాయి. అవి గీతములు వివిధ రాగ, తాళములకు కూర్చబడ్డ స్వరయుక్తమైన చిరు రచనలు గీతములు. తాళాధ్యయనము కొరకై నేర్వబడు అలంకారముల తరువాత గీతములు చెప్పబడును. విద్యార్థికి గీతముల ద్వారా రాగసంబంధమైన స్వరసంచారాదులు పరిచయం చేసెదరు. స్వరజతులు గీతముల తర్వాత స్వర సాహిత్య యుక్తమైన స్వరజతులు నేర్పబడును. స్వరజతులయందు పల్లవి అనుపల్లవి చరణములను మూడు భాగములుండును. వీటిని నృత్యమునందు ఉపయోగించరు. జతిస్వరము స్వరజతి వలె వుండే జతిస్వరంలో కేవలం జతులు స్వరములు మాత్రమే వుండును. ఇవి భరత నాట్యం లోని నృత్త వరుసలకు యుక్తములు. నృత్తమనగా కథనరహిత వరుసలు. స్వరము లేక పదముల బదులు వాడబడే ధీం, తాం, తోం, నం, ఝం, తకిట, తరికిట, మొదలైనవి జతులనబడును. వర్ణం నాట్యంలో మాదిరిగానే సంగీతంలో కూడా వర్ణానికి చాలా ప్రాముఖ్యముంది. గీతములు స్వరజతుల మల్లే రాగస్వరూపాన్ని నేర్చుట కోసం వర్ణములు ఉపయుక్తములు. సంగీత కచేరీలలో ప్రారంభంలో వర్ణమును పాడుట కూడా సంప్రదాయమున ఉంది. వర్ణములు ముఖ్యముగా తాన వర్ణములు, పద వర్ణములు, దరు వర్ణములు అని మూడు రకాలు. తాన వర్ణములు చిఱు సాహిత్యముతో ప్రారంభమవుతాయి. పల్లవి అనుపల్లవి చరణములు మాత్రమే సాహిత్యమును కలిగి వుంటాయి. చిట్ట ముక్తాయి స్వరములు సాహిత్యరహితములు. అదే పద వర్ణమయితే చిట్ట ముక్తాయి స్వరములకు కూడా సాహిత్యముండును. పద వర్ణములు నాట్యంలో బాగా ప్రసిద్ధములు. దరు వర్ణములో స్వర సాహిత్యములే గాక జతులు కూడా వుంటాయి. వర్ణములు రచించిన వారిలో రామస్వామి దీక్షితులు, పల్లవి గోపాల అయ్యర్, తంజావూర్ చతుష్టయము (చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానందం), పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మొదలైన వారు ముఖ్యులు. కీర్తన కీర్తనలలో సంగీతానికన్నా సాహిత్యానికి ప్రాముఖ్యత ఎక్కువ. అంటే రాగానికి కాక భావానికి ప్రాధాన్యత ఎక్కువన్నమాట. నవవిధ భక్తులలో ఒకటైన భగవంతుని కీర్తనకు అనువైనవి కీర్తనలు. ఇంకోలా చెప్పాలంటే కీర్తనలు భక్తిరస ప్రధానమైనవి. కీర్తనలనగానే మనకి గుర్తుకొచ్చేవి ఈనాడు అధిక ప్రాచుర్యంలో ఉన్న త్యాగరాజస్వామి వారి దివ్యనామ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలూ అన్నమయ్య కీర్తనలూ రామదాస పురందరదాస కీర్తనలూను. తమిళ కవులు ముత్తు తాండవర్, అరుణాచల కవిరాయర్, గోపాలకృష్ణ భారతి మున్నగువారి రచనలు కూడా ఈ కోవకే వస్తాయి. కృతి కృతులు కీర్తనలనుండే పుట్టాయని ఒక వాదం ఉంది. కృతులలో సంగీతం ప్రధానం. అయితే హిందుస్థానీ సంప్రదాయంలా కాక కర్ణాటక సంప్రదాయంలో సాహిత్యం తప్పనిసరి. రాగభావాన్ని వ్యక్తీకరించడం కృతుల ముఖ్య లక్షణం. కర్ణాటక సంగీతపు త్రిమూర్తులుగా పిలువబడే త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల రచనలు కృతుల ప్రపంచంలో అగ్రతాంబూలాన్ని అందుకుంటాయి. వీరు ముగ్గురే కాక మైసూరు వాసుదేవాచార్యులు, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, సుబ్బరాయ శాస్త్రి, మహారాజా స్వాతి తిరునాళ్, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్, పాపనాశం శివన్, కోటీశ్వర అయ్యర్ వంటి వాగ్గేయకారులు కృతి సాంప్రదాయంలో దిగ్గజాలు. రాగమాలిక రాగమాలిక అంటే రాగములతో కూర్చబడ్డ దండ. రాగమాలికలంటే ఒకే కృతిలోగానీ పదములలోగానీ వర్ణంలోగానీ వివిధ భాగాలు వివిధ రాగాలలో వుంటాయి. రాగమాలికలైన పల్లవులు, కల్పన స్వరములు కూడా మనోధర్మ సంగీతంలో ఉన్నాయి. ఒక రాగం నుండి మరొక రాగానికి మార్పిడి చాలా మృదువుగా వుంటుంది. ముత్తుస్వామి దీక్షితులు, మహారాజా స్వాతి తిరుణాళ్, సీతారామయ్య, రామస్వామి దీక్షితులు మున్నగువారలు రాగమాలికా రచనలలో ప్రసిద్ధులు. మహా వైద్యనాథ అయ్యర్ గారిచే రచింపబడిన ఒక 72 మేళకర్తరాగమాలిక కూడా ఉంది. తాళమాలిక తాళమాలికలంటే వివిధ తాళములకు కూర్చబడిన రచనలు. ఒకే కృతిలోగానీ తిల్లానాలోగానీ వివిధ తాళగతులుంటాయి. తిరువొట్రియూర్ త్యాగయ్య తాళమాలికలు బాగా ఆదరణ పొందాయి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వ్రాసిన గతిభేదతిల్లానా కూడా జనాదరణ పొందింది. రాగతాళమాలిక ఈ సంగీత ప్రక్రియలో ప్రతిభాగానికీ రాగమూ తాళమూ రెండూ మార్పుచెందుతాయి. 108 వివిధ రాగతాళములతో రామస్వామి దీక్షితులు ఒక రాగతాళమాలికను చేసారు. పదములు నృత్య సంగీతాలలో శృంగార, భక్తి రస ప్రధానమైన వీ పదములు. పదములు నాయికా నాయకుల మధ్య జరిగే ఆయా సంఘటనల గురించి చెప్పుచున్నట్లు కనపడినా, ప్రేమతో (శృంగారము) భక్తితో భగవంతునిలో ఏకమవ్వటం వీటి అసలు అంతరార్థం. సాధారణంగా పదములను మధ్యమకాలము లేదా అంతకన్నను నెమ్మదిగా పాడవలెను. పదరచనలో క్షేత్రజ్ఞులు (క్షేత్రయ్య), అన్నమాచార్యులు, పురందరదాసు, ఘనం సీనయ్య మొదలైనవారు ప్రసిద్ధులు. జావళీ శృంగారరసముతో ప్రేయసీ ప్రియుల లక్షణములను తెలిపే కృతులకు జావళీలని పేరు. వీటిలో పదములలో మాదిరిగా అంతర్లీనమైన భక్తి కనపడదు. జావళీలు గ్రామ్య భాషలో ఆది-రూపక-చాపు తాళములకు కూర్చబడి తేలికగా పాదుకొనేవిధంగా రచించబడతాయి. మహారాజా స్వాతి తిరుణాళ్, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరు, ధర్మపురి సుబ్బారావు, శివరామయ్య మున్నగువారు జావళీకర్తలు. తిల్లానా జతులు, స్వరసాహిత్యములతో మధ్యమగతిలో పాదుకొనుటకు అనుకూలంగా వివిధ రాగములలో వివిధ తాలములఓ చేయబడ్డ రచనలకు తిల్లానాలని పేరు. వీటి సంగీతము చాల సజీవముగానూ వేగంగానూ వుంటుంది. సాధారణంగా తిల్లానాలను కచేరీలలో చివరలో ప్రదర్శిస్తారు. మహారాజా స్వాతి తిరుణాళ్, పొన్నయ్య, పల్లవి శేషయ్య, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, లాల్గుడి జయరామన్ తిల్లానా రచనలో ప్రముఖులు. ఇంకా చూడండి త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితులు శ్యామశాస్త్రి ఊత్తుక్కాడు వేంకట కవి / వేంకటసుబ్బయ్యర్ వర్గం:సంగీతం వర్గం:కళలు
నల్గొండ జిల్లా
https://te.wikipedia.org/wiki/నల్గొండ_జిల్లా
నల్గొండ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nalgonda.pdf ఈ జిల్లా పరిపాలన కేంద్రం నల్గొండ. పూర్వం నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది.నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి జిల్లా, ఈశాన్యాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లా, తూర్పున కృష్ణా జిల్లాలు, పశ్చిమాన శంషాబాద్ మండలం, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురిటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో కమ్యూనిస్టులు, దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావునల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, రచన సీహెచ్ ఆచార్య, కాటం రమేష్, పేజీ సంఖ్య 167, గాంధేయవాది రావి నారాయణరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు పులిజాల రంగారావు, ఆర్యసమాజ ముఖ్యుడు నూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి,ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బీమ్ రెడ్డి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే. 1952 ఎన్నికల్లో 12 నియోజకవర్గ లలో 12 కమ్యూనిస్ట్ నాయకులే గెలిచారు. కవి, కమ్యూనిస్ట్ యోధుడు మగ్దుం మొహిణిద్దీన్ హుజుర్నగర్ మొదటి mla.అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి గారు సీపీఐ నుండి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ గెలిచాడు. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ లు వేలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచి సాయుధ పోరాట నికి ఊపిరి పోశారు. జిల్లా చరిత్ర శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్గొండగా మారింది. నల్గొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ధి, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయువుపట్టు. జనాభా లెక్కలు 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 34,83,648.అందులో పురుషులు 17,58,061 కాగా స్తీలు 17,25,587. 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84% నమోదైంది. పురుషులలో 70.19 %, స్త్రీలలో 45.07.% 1981 నాటి జనాభా లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా జనాభా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి:970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985) భౌగోళిక స్వరూపం alt=|కుడి|240x240px నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా నల్లగొండ జిల్లా 59 రెవెన్యూ మండలాలతో కలిగి ఉంది.పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో నల్లగొండ జిల్లా తాలూకాల వివరాలు . జూలై 26, 2007న సేకరించారు.. పూర్వపు 59 మండలాలతో ఉన్న నల్గొండ జిల్లా రేఖా పటం (కుడివైపు) ——→ ——→ నల్గొండ జిల్లా నుండి కొత్తగా ఏర్పడిన జిల్లాలు 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 59 పాత మండలాల నుండి 14 మండలాలతో భువనగిరి పరిపాలనా కేంధ్రంగా యాదాద్రి జిల్లా,18 మండలాలతో సూర్యాపేట జిల్లా కొత్తగా ఏర్పడగా 26 పూర్వపు మండలాలతో నల్గొండ జిల్లా పునర్య్వస్థీకరించారు.అధికారికంగా కొత్త జిల్లాలు ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన మండలాలు సూర్యాపేట జిల్లాలో చేరిన మండలాలు పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన 18 పాత మండలాలతో సూర్యాపేట జిల్లా కొత్తగా ఏర్పడింది.కొత్తగా 5 మండలాలు ఏర్పడినవి.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 246, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 ఆత్మకూరు (S) మండలం చివ్వేంల మండలం మోతే మండలం జాజిరెడ్డిగూడెం మండలం నూతనకల్లు మండలం పెన్‌పహాడ్‌ మండలం సూర్యాపేట మండలం తిరుమలగిరి మండలం తుంగతుర్తి మండలం గరిడేపల్లి మండలం నేరేడుచర్ల మండలం చిలుకూరు మండలం హుజూర్‌నగర్ మండలం కోదాడ మండలం మట్టంపల్లి మండలం మేళ్లచెరువు మండలం మునగాల మండలం నడిగూడెం మండలం యాదాద్రి - భువనగిరి జిల్లాలో చేరిన మండలాలు పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన 14 పాత మండలాలతో యాదాద్రి భువనగిరి జిల్లా కొత్తగా ఏర్పడింది. కొత్తగా 2 మండలాలు ఏర్పడినవి.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 247, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 ఆలేరు మండలం రాజాపేట మండలం మోతుకూరు మండలం తుర్కపల్లి మండలం యాదగిరిగుట్ట మండలం భువనగిరి మండలం బీబీనగర్ మండలం బొమ్మలరామారం మండలం ఆత్మకూరు (ఎం) మండలం బి.పోచంపల్లి మండలం రామన్నపేట మండలం వలిగొండ మండలం చౌటుప్పల్ మండలం నారాయణపూర్ మండలం జనగామ జిల్లాలో చేరిన మండలాలు గండాల మండలం 2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో జనగామ జిల్లాకు మారింది.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 234, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 తరువాత ఈ మండలం జనగామ జిల్లా నుండి, యాదాద్రి భవనగిరి జిల్లాకు మారింది. జిల్లాలో పునర్య్వస్థీకరణ తరువాత మండలాలు పునర్య్వస్థీకరణలో 26 పాత మండలాల కాగా, కొత్తగా 5 మండలాలు కలిపి 31 మండలాలుతో జిల్లా ఏర్పడింది.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 చండూరు మండలం చిట్యాల మండలం కంగల్ మండలం కట్టంగూర్ మండలం మునుగోడు మండలం నకిరేకల్ మండలం నల్గొండ మండలం నార్కెట్‌పల్లి మండలం తిప్పర్తి మండలం కేతేపల్లి మండలం శాలిగౌరారం మండలం దామెరచర్ల మండలం మిర్యాలగూడ మండలం వేములపల్లి మండలం అనుముల మండలం నిడమనూరు మండలం పెద్దవూర మండలం త్రిపురారం మండలం చందంపేట మండలం చింతపల్లి మండలం దేవరకొండ మండలం గుండ్లపల్లి మండలం గుర్రంపోడ్ మండలం మర్రిగూడ మండలం నాంపల్లి మండలం పెద్ద అడిశర్ల పల్లి మండలం అడవిదేవులపల్లి మండలం* మాడుగుల పల్లె మండలం * తిరుమలగిరి సాగర్ మండలం* కొండమల్లేపల్లి మండలం* నేరడుగొమ్ము మండలం* గట్టుప్పల్ మండలం* గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5) రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ డివిజన్లు (3): నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చండూరు శాసనసభ నియోజక వర్గాలు జిల్లాలో 6 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి. దేవరకొండ శాసనసభ నియోజకవర్గం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం నల్గొండ శాసనసభ నియోజకవర్గం నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం మునుగోడు శాసనసభ నియోజకవర్గం లోక్‌సభ స్థానాలు లోక్‌సభ స్థానాలు (ఒకటి): నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం ముఖ్య సాగునీటి ప్రాజెక్టులు జిల్లాలో ముఖ్య సాగునీటి ప్రాజెక్టులు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ముఖ్యమైన జీవ నదులు, కృష్ణా నది మూసీ నది ఆలేరు దిండి పాలేరు ఆర్ధిక స్థితి గతులు సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. రవాణా వ్వవస్థ పగిడిపల్లి - నడికుడి రైలుమార్గం, సికిందరాబాద్ - వరంగల్-ఖమ్మం-విజయవాడ రైలుమార్గం విద్యాసంస్థలు జిల్లాలో 2007 లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఆకర్షణలు right|thumb|యాదగిరి గుట్టలోని లక్ష్మీ నరసింహ దేవస్థానం thumb|వేమలకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం thumb|భువనగిరి కోట బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. సా.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది.జిల్లాలోని యాదగిరి గుట్ట, తెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ధి చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో ఉన్నాయి. వాడపల్లి తీర్థం ఈ జిల్లాలో అతి పెద్ద శైవ క్షేత్రము.శివరాత్రి నాడు పుణ్యస్నానాలు అచరించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు.ఇది కృష్ణా,మూసీ, అంతర్వేది సంగమం. బుద్ధుడి శిల్పం హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్తుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది. ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిథిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జునకొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉంది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం, పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి. నాగార్జునకొండ మానవ నిర్మిత సరస్సు మధ్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జునకొండ త్రవ్వకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసాంస్కృతిక స్థూపం బయటపడ్డాయి.ఈ కొండను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. చంద్రవంక జలపాతము ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు. ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంక నది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జునకొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది. నందికొండ కోట నందికొండ అంటే కృష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు, బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది. పోచంపల్లి 1950 లో ఆచార్యా వినోభాభావే ఇక్కడి నుండి తన ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇది బోంగిర్ నుండి 14.48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బీబీనగర్ నుండి 9.66 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిల్లలమర్రి ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్తంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం. కొలనుపాక ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిథిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్దం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. చెర్వుగట్టు శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన చెర్వుగట్టు దేవస్థానం నల్లగొండ జిల్లా కేంద్రం నుండి 18 కి.మీ దూరంలో వెలిసింది. ఇంకా కొన్ని ముఖ్య ప్రాంతాలు రాచకొండ, గాజుల కొండ, ఏలేశ్వరం, ఫణిగిరి, భోంగిర్ ఫోర్ట్, మటంపల్లి, వడపల్లి, పంగల్, సుంకి ప్రముఖ వ్యక్తులు రావి నారాయణరెడ్డి: ఈయన 1908 జూన్ 5 న భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జన్మించాడు. అప్పటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు. గవ్వా చంద్రారెడ్డి: వైద్యులు నల్లగొండ జిల్లాకు చెందిన వాడు. పెన్నా మధుసూదన్‌: సంస్కృత భాషలో రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రస్తుతం కవికుల గురు కాళిదాస్‌ సంస్కృత విశ్వవిద్యాలయానికి (రామ్‌టెక్‌, మహారాష్ట్ర) ఉపకులపతిగా నియమితులయ్యారు ఇవి కూడా చూడండి జిల్లా గ్రామాల జాబితా నల్లగొండ జిల్లా పుణ్యక్షేత్రాలు మూలాలు బయటి లింకులు నల్లగొండ జిల్లా గురించి నల్లగొండ.ఆర్గ్ వర్గం:తెలంగాణ జిల్లాలు
ఆదిలాబాద్ జిల్లా
https://te.wikipedia.org/wiki/ఆదిలాబాద్_జిల్లా
ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.పూర్వం ఎద్దుల పురం అని పిలుసేవారు దీని ముఖ్యపట్టణం ఆదిలాబాద్..బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు ఆదిలాబాదును 'ఎడ్లవాడ' అని పిలిచే వారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇది ఒకటి. తెలంగాణ 10 జిల్లాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ఇది ఆదిలాబాద్ జిల్లాకు పరిపాలనా కేంద్రం. జిల్లా పేరు వెనుక చరిత్ర ఆదిలాబాద్ జిల్లాకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద వచ్చింది. మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్థిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్థికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది. తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన వివరాలు వ్రాస్తూ ఈ నగరాన్ని ఎదులాబాదుగానే ప్రస్తావించారు. ఈ జిల్లా పెరు ఎదులపురంగా పిలుస్థారు జిల్లా చరిత్ర చారిత్రకంగా ఆదిలాబాద్ జిల్లా పలు సంస్కృతులకు పుట్టిల్లు. దక్షిణభారతదేశ సరిహద్దులలో ఉపస్థితమై ఉన్న కారణంగా ఇది ఉత్తరభారతదేశ సామ్రాజ్యాధినేతలైన ముగలాయిలు, మౌర్యులు, దక్షిణ భారతదేశ సామ్రాజ్యాధినేతలైన శాతవాహనులు, చాళుక్యులు, గోండ్ రాజులు పాలించారు. ప్రస్తుతం ఈ జిల్లా ప్రజలలో పొరుగున ఉన్న మరాఠీ సంప్రదాయం రాష్ట్ర తెలుగు సంప్రదాయంతో గుర్తించ తగినంతగా కలిసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ జిల్లాలో, పలు సంస్కృతులకి చెందిన వారైన బెంగాలి, మలయాళీ, గుజరాతీలు,పరస్పర సహకార జీవనం సాగిస్తున్నారు. భౌగోళిక స్వరూపం ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తరంలో మహారాష్ట్రంలోని యవత్మాల్ జిల్లా, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున చంద్రాపూర్ జిల్లా ఉంది, దక్షిణాన నిజామాబాద్ జిల్లా, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. నదులుపరంగా దక్షిణాన గోదావరి నది, తూర్పున ప్రాణహిత నది, ఉత్తరంలో వార్ధా నది, పెల్ గంగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 16203.8 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం పరంగా రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉంది. జిల్లాలో 40 శాతం ఉండే అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి.జిల్లాలో 75% భూభాగం ఉష్ణమండల తేమతోకూడిన అడవులతో నిండి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అటవీప్రాంతం కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉంది. అదిలాబాదు జిల్లాలో కుంతల జలపాతాలు, సహ్యాద్రి కొండలు మరియూ సత్మాల కొండలు అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, సానిటరీ పైపులు, ఇటుకలు, బెంగుళూరు పెంకుల తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది. ఈ జిల్లాలోని ప్రధాన నదులు ప్రాణహిత, పెన్‌గంగ, వార్థా. జిల్లా సరిహద్దులు ● ఉత్తరం- యావత్మాల్, మహారాష్ట్ర. ● ఈశాన్యం- చంద్రపూర్, మహారాష్ట్ర. ● దక్షిణ- నిర్మల్ ● ఆగ్నేయం-మంచిర్యాల ● తూర్పు- కుంరం భీం ఆసిఫాబాద్ ● పశ్చిమం- నాందేడ్,మహారాష్ట్ర. ఆర్ధిక స్థితిగతులు వ్యవసాయం ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా సాగుచేయబడే ఆహారపు పంట జొన్నలు, వడ్లు, మొక్కజొన్నలు, కందులు, మినుములు, సోయాబీన్, ఇతర పప్పులు, మిరపకాయలు, గోధుమలు, చెరకు. వాణిజ్యపంటలు పత్తి, పసుపు. నిర్మల్, లక్షింపేట్, ఖానాపూర్ సమీప మండలాలలో నీటిపారుదల వసతులు లభ్యం ఔతున్న కారణంగా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. 3.5% భూమిలో సాగుచేయబడే ఉద్యానవన సాగుబడి వలన విదేశీమారకం వంటి ఆదాయం, ఉపాధి లభిస్తుంది. సాధారణ వర్షపాత ప్రాంతం అలాగే నీటిపారుదల వసతులు స్వల్పంగా కలిగిన ఎగువ భూములలో ఉద్యానవన సాగుబడికి అనుకూలంగా ఉండి కూరగాయలు, పండ్లు, కూరగాయలు అలాగే సుగంద ద్రవ్యాలు, పూలు వంటి పంటలు కూడా పండుతున్నాయి.పట్టుపురుగుల పెంపకం కూడా జిల్లాకు కొంత ఆదాయం సమకూరుస్తుంది. పట్టుపురుగుల పెంపకం కొరకు 1000 ఎకరాలలో మలబరీ చెట్లు పెంచబడుతున్నాయి. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం కొరకు అనుకూల వాతావరణం ఉంది కనుక పట్టుపురుగుల పెంపకం అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రభుత్వ ప్రణాళిక కారణంగా జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకం వలన ఆదాయం, ఉపాధి లభిస్తుంది. జిల్లాలోఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు పెంచబడుతున్నాయి. జిల్లాలో భూపరిస్థితి పెంపుడు జంతువుల పెంపకానికి అనుకులంగా ఉంది. జిల్లాలో 87 పశువుల ఆసుపత్రులు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో ఉన్న పచ్చిక నిండిన కొండ ప్రాంతాలు గొర్రెలు, మేకలు పెంచడానికి అనుకూలంగా ఉంది. పరిశ్రమలు ఆదిలాబాదు జిల్లాలో బియ్యపు మిల్లులు, నూనె శుద్ధి కర్మాగారాలు, మొక్కజొన్న పిండి, శక్తినిచ్చే ఆహారపదార్థాలు, మినపప్పు మిల్లులు, సుగంధద్రవ్య పొడులు, బేకరీలు, ఐస్ క్రీం, అల్లం ముద్ద, సేమ్యా, మిరపకాయల కారం, నూడుళ్లు, బిస్కత్తులు, కాగితపు రుమాళ్ల తయారీ, ఊరగాయలు, అప్పడాలు, వేరుశనగ బర్ఫీ, పశుగ్రాసం, వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు జిల్లాలో ఉపాధి కల్పిస్తున్నాయి. ముడి, నాణ్యత పెంచబడిన తోలు, తోలు సంచులు, తోలు చెప్పులు, తోలు వస్తువులు తయారీ ఉపాధిని కలిగిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, అల్లికలు, పాఠశాల సమవస్త్రాలు, ఉపయోగానికి సిద్ధమైన దుస్తులు, స్క్రీన్ ప్రింటింగ్, వస్త్ర పరిశ్రమ సంబంధిత పరిశ్రమలున్నాయి. ప్లాస్టిక్ సంచులు, ఎలెక్ట్రానిక్ పరికరములు, గాజులు పూసలు, టైర్లు తయారీ పరిశ్రమలున్నాయి. సిమెంటి ఇటుకలు, మట్టి ఇటుకల తయారీ పరిశ్రమలు కూడావున్నాయి. బ్లాక్ & వైట్ ఫెనిలిజ్, బట్టలుతుకు పొడి తయారీ చేస్తున్నారు. పుస్తకాలు, ఆభినందన పత్రికలు, వివాహ పత్రికలు తయారు చేస్తున్నారు. శుద్ధనీరు తయారీ, డేటా ప్రొసెసింగ్, అల్యూమినియం పాత్రలు, ఫర్నీచర్, సైబర్ కేప్స్, యంత్రాలు మరమ్మత్తు పనులు వంటివికూడా వున్నాయి పరిపాలనా విభాగాలు కుడి|250x250px ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా అదిలాబాద్ జిల్లా పరిధిలో 52 మండలాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణ ముందు 52 మండలాలుతో కలిగియున్న జిల్లా రేఖా పటం → పునర్య్వస్థీకరణ తరువాత రెండు రెవెన్యూ డివిజన్లు (ఆదిలాబాద్, ఉట్నూరు), 18 రెవెన్యూ మండలాలు, 508 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 31 నిర్జన గ్రామాలు ఉన్నాయి.ఐదు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. స్థానిక స్వపరిపాలన జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 467 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. పునర్య్వస్థీకరణకు ముందు జిల్లా పరిధిలో పట్టణ ప్రాంతాలు ఆదిలాబాదు, మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమర్రి, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్ ఏడు పురపాలక సంఘాలున్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన మండలాలు 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా అదిలాబాద్ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 52 పాత మండలాల నుండి 14 మండలాలుతో మంచిర్యాల జిల్లా,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016 13 మండలాలుతో నిర్మల్ జిల్లా,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 223, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016 12 మండలాలుతో అషిఫాబాద్ పరిపాలన కేంద్రంగా కొమరంభీమ్ జిల్లాతెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 224, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016 కొత్తగా ఏర్పడ్డాయి.ఈ జిల్లాలు 11.10.2016 నుండి అధికారికంగా అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంచిర్యాల జిల్లాలో చేరిన మండలాలు. చెన్నూర్‌ మండలం జైపూర్‌ మండలం కోటపల్లి మండలం లక్సెట్టిపేట మండలం మంచిర్యాల మండలం మందమర్రి మండలం జన్నారం మండలం దండేపల్లి మండలం కాసిపేట‌ మండలం బెల్లంపల్లి మండలం వేమన్‌పల్లి మండలం తాండూర్ మండలం నెన్నెల్‌ మండలం భీమిని మండలం నిర్మల్ జిల్లాలో చేరిన మండలాలు నిర్మల్ గ్రామీణ మండలం దిలావర్ పూర్ మండలం కడం పెద్దూర్ మండలం మామడ మండలం ఖానాపూర్ మండలం లక్ష్మణ్‌చాందా మండలం సారంగపూర్‌ మండలం కుంటాల మండలం కుబీర్‌ మండలం బైంసా మండలం ముధోల్ మండలం లోకేశ్వరం మండలం తానూర్‌ మండలం కొమరంభీమ్ జిల్లాలో చేరిన మండలాలు సిర్పూర్ (టీ) మండలం జైనూర్ మండలం తిర్యాని మండలం ఆసిఫాబాద్‌ మండలం కెరమెరి మండలం వాంకిడి మండలం రెబ్బెన మండలం బెజ్జూర్‌ మండలం కాగజ్‌నగర్‌ మండలం కౌటల మండలం దహేగాం మండలం సిర్పూర్ (యు) మండలం పునర్య్వస్థీకరణ తరువాత జిల్లాలో మండలాలు ఆదిలాబాద్ జిల్లాలో పునర్య్వస్థీకరణ తరువాత 18 మండలాలు ఉన్నాయి.అందులో 13 పాత మండలాలుకాగా 5 కొత్తగా ఏర్పడిన మండలాలు.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 221, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016 ఆదిలాబాద్ పట్టణ మండలం గుడిహత్నూర్ మండలం బజార్‌హత్నూర్‌ మండలం బేల మండలం బోథ్ మండలం జైనథ్ మండలం తాంసీ మండలం తలమడుగు మండలం నేరడిగొండ మండలం ఇచ్చోడ మండలం ఇంద్రవెల్లి మండలం నార్నూర్‌ మండలం ఉట్నూరు మండలం ఆదిలాబాద్ గ్రామీణ మండలం* మావల మండలం* భీంపూర్ మండలం* సిరికొండ మండలం* గాదిగూడ మండలం* గమనిక:వ.నెం.1 నుండి 13 వరకు పాత మండలాలు కాగా, వ.నెం.14 నుండి 18 వరకు గల (ఐదు) మండలాలు కొత్తగా ఏర్పడినవి. లోక్‌సభ,శాసనసభ వివరాలు thumb|400x400px|2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము|alt= ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం: ప్రస్తుత ప్రతినిధి: గెడం నగేష్ శాసనసభ స్థానాలు (10): స్థానం ప్రతినిధిసిర్పూర్ కోనేరు కొన్నప్ప, తెరాసచెన్నూర్ బాల్క సుమన్, తెరాసబెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, తెరాస మంచిర్యాల యన్ . దివాకర్ రావు, తెరాస ఆసిఫాబాద్ ఆత్రం సక్కు,తెరాస ఖానాపూర్ రెఖాశ్యాం నాయక్, తెరాస ఆదిలాబాదు జోగు రామన్న - తెరాస, బోధ్ ఆర్ బపురావ్, తెరాసనిర్మల్ ఇంద్రకరన్ రెడ్డి, తెరాస ముధోల్ విఠల్ రెడ్ది, తెరాస రవాణా వ్యవస్థ 2003లో విభాలుగా విభజించిన రైల్వేశాఖలో దక్షిణమధ్య రైల్వే లోని హైదరాబాదు విభాగానికి చెందిన ముద్ఖేదు స్టేషను అదిలాబాదులో ఉంది. హైదరాబాదు రైల్వేశాఖను రెండు భాగాలుగా విభజించిన తరువాత అదిలాబాదు నాందేడ్ విభాగంలో చేరుతుంది. ఇక్కడి నుండి హైదరాబాదు, నిజామాబాదు, నాందేడు, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాట్నా, నాగపూరు, నాసిక్, ముంబాయి, వరంగల్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, ఔరంగాబాదు, మన్మద్, గుల్బర్గా, బీదర్, బీజపుర్, షోలాపూరు మొదలైన ఊర్లకు హైదరాబాదు ద్వారా నేరు రైళ్ళు ఉన్నాయి.కృష్ణా ఎక్స్ ప్రెస్ అదిలాబాదుకు ఒక ప్రధాన రైలు. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 44'' అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. ఇక్కడ వాయుమార్గం 1948లో జరిగిన పోలీస్ ఏక్షన్ ''' భారతీయ వాయు సేనలచేత నాశనం చేయబడింది. అతిసమీపంలో ఉన్న విమానశ్రయం నాగపూరులో ఉన్నా హైదరాబాదు విమానాశ్రయం మరింత ఉపయోగకరమైనది. జనాభా లెక్కలు 1981 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాభా-16,39,003, వీరిలో స్త్రీ పురుషుల నిష్పత్తి 990:1000, అక్షరాస్యత:18.97 శాతం. (మూలం: ఆంధ్రప్రదేశ్ దర్శిని. 985) 2011 జనాభా గణాంకాలను అనుసరించి ఆదిలాబాద్ జిల్లా జనసంఖ్య 27,37,738.http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03 వీరిలో పురుషులు 51%, స్త్రీలు 49%. అదిలాబాదు సరాసరి అక్షరాస్యత 80.51%. ఇది జాతీయ అక్షరాస్యతకు అధికమైనది. పురుషుల అక్షరాస్యత 88.18%. స్త్రీల అక్షరాస్యత 72.73%. ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్నా వారి శాతం 14%. అధికారిక భాష తెలుగు. తెలుగును ఎక్కువ మంది మాట్లాడుతారు. ఇక్కడ వాడుకలో ఉన్న ఇతర భాషలు గోండి, మరాఠీ, ఉర్ధూ. జిల్లాలో అత్యధికులు హిందూ మతానికి చెందిన వారు. ముస్లిముల సంఖ్య గుర్తించతగిన స్థాయిలో ఉంది. సంస్కృతి right|thumb|నిర్మల్ బొమ్మలు ఆదిలాబాద్ జిల్లాలో అడవులు అధికంగా ఉన్నాయి కనుక ఇక్కడ గిరిజన సంస్కృతి నేటికీ వర్ధిల్లుతూనే ఉంది. ప్రధాన్‌, గోండు లంబాడీలు,కొలాం, తోటి,అంద్ వంటి గిరిజన జాతులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒకప్పటి సంస్కృతిని చాటి చెప్పే కోటలు, కట్టడాలు, గుళ్ళూ, చెక్కిన రాళ్ళు, ఇంకా సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. నిర్మల్ బొమ్మలు ప్రసిద్ధి గాంచినవి. పశు పక్ష్యాదులు ఆదిలాబాద్ జిల్లా అరణ్యాలను రెండు విభాగాలుగా ఉంటుంది. ఎగువ భాగంలో తాలుక్, నల్లమద్ది, బిజసల్, చైర్మను, విప్ప, జిత్రేగి, ముష్టి వంటి వృక్షసంపద ఉంది. దిగువ భాగంలో ఉసిరి, మారేడు, మౌదుగు, వెదురు, సారపాపు వంటి వృక్షసంపద ఉంది. ఆదిలాబాదు జిల్లా దట్టమైన అరణ్యప్రాంతంలో పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, హైనాలు, తోడేళ్ళు, అడవి కుక్కలు వంటి జంతువులు నివసిస్తున్నాయి. అలాగే అరణ్య మైదానాలలో అలాగే పక్షి జాతులలో నెమలి, పావురాళ్ళు, అడవి కోళ్ళు, రామ చిలుకలు, మైనాలు ఉన్నాయి. నీలి ఆవులు, చుక్కల జింకలు, సంబార్ వంటి సాధు జంతువులు నివసిస్తున్నాయి. జలపాతాలు 1.కుంటాల జలపాతం-నేరడిగొండ, మండలం 2.పొచ్చెర జలపాతం-నేరడిగొండ, మండలం 3.గాయత్రి జలపాతం- ఇచ్చోడ మండలం. 4.కనకాయి జలపాతం- బజాహాత్నుర్ మండలం. 5. సహస్ర కుండ్ జలపాతం, కోరటికల్. జాతరలు 1.నాగోబా జాతర- కేస్లాపూర్,ఇంద్రవెల్లి మండలం 2.బుర్నుర్ జాతర-బుర్నుర్, ఉట్నూరు. 3.బుడందేవ్ జాతర- శ్యామ్ పూర్, ఉట్నూరు. 4.సేవాలాల్ దీక్ష భూమి జాతర, కొత్తపల్లి H, నార్నూర్ మండలం 5.ఖాందేవ్ జాతర- నార్నూర్ మండలం. దర్శనీయ ప్రదేశాలు 1.నాగోబా దేవాలయం-కేస్లాపూర్, ఇంద్రవెల్లి. 2.లక్ష్మీ నారాయణ ఆలయం- జైనథ్. 3. ఉట్నూరు రాజ్ గోండుల కోట 4. శ్రీ జగదాంబ దేవి శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం, సేవాలాల్ దీక్ష భూమి, కొత్తపల్లి -H,నార్నూర్ మండలం. విద్యా వ్యవస్థ జిల్లాలో మొత్తం 4,826 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3,354, ప్రాథమికోన్నత పాఠశాలలు 700, ఉన్నతపాఠశాలలు 772 ఉన్నాయి. దాదాపు 500278 మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని ఒక అంచనా. వీరికి 14,850 మంది ఉపాధ్యాయులు, 5031 మంది విద్యావాలంటీర్లు పాఠాలు బోధిస్తున్నారు.వికాస్ పీడియాలో అదిలాబాదు జిల్లాలో విద్యా సదుపాయాలపై సమాచారం సంఖ్యవిద్యాసంస్థవివరణసంఖ్య1 పాఠశాలలుప్రాథమిక పాఠశాలలు4,8262వివరణప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు700,7723జూనియర్ కళాశాలలుసరాసరి అన్ని మండలాలో1124కళాశాలలు325ఉన్నత కళాశాలలుమంచిర్యాల, ఆదిలాబాదు106ఇంజనీరింగ్ కళాశాలలుట్రిపుల్ ఐటీ, బాసర, ఆదిలాబాద్37 కంఫ్యూటర్ పాఠశాలలునిర్మల్, సిర్పుర్, అసిఫాబాదు, చెన్నూరు, ఖానాబాదు138బాలికల వృత్తి విద్యమండలానికి ఒకటి కస్తూరిభా విద్యాలయాలు329వైద్య కళాశాలలురిమ్స్110ఫార్మసీ11 వృత్తి విద్యాలయాలుపాలిటెక్నిక్, డైట్, ఐటీ, డీ ఎడ్, ఇతరాలు2512ఉపాధ్యాయ శిక్షణఉట్నూరు, నిర్మల్, అసిఫాబాదు, ఆదిలాబాదు5 ఆకర్షణలు right|200px|thumb|బాసరలో సరస్వతీ మందిరము జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 70 కి.మీ దూరంలో ఉంది.తెలంగాణలో కల ఏకైక సరస్వతీ ఆలయం ఇక్కడే ఉంది. భారతదేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. కుంటాల జలపాతం చాలా ఆకర్షణీయమైంది. పులి, మొసళ్ళు, దుప్పి వంటి అడవి జంతువుల సంరక్షణకోసం "ప్రాణహిత సంరక్షణ కేంద్రం" ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనీయ ప్రదేశాలు: బాసర, పోచంపాడు నిర్మల్, కుంటాల జలపాతం, కడెం ప్రాజెక్టు, బెల్లంపల్లి, మందమర్రి, సిర్పూర్, బుగ్గ రాజేశ్వరాలయం, కొకసమన్నూరు హనుమాన్ ఆలయం. ఇచోడా నారాయణస్వామి ఆలయం, జైనాధ్, నగొబా జాతర అదివాసులకు చాలా ప్రత్యేకం. దీక్షభూమి కొత్తపల్లి లంబాడీలు సేవాలాల్ దీక్షలు ఇచ్చటనే తీసుకుంటారు ప్రముఖ వ్యక్తులు కొమురం భీమ్ రాంజీ గోండు కొమురం సూరు శ్రీ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ కొండా లక్ష్మణ్ బాపూజీ సామల సదా శివ సముద్రాల వేణుగోపాలచారి రాథోడ్ రమేష్ జోగు రామన్న సోయం బాపూరావు - ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు రాథోడ్ జనార్దన్ - ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్‌ ఛైర్మన్‌ ఇవి కూడా చూడండి జిల్లా గ్రామాల జాబితా మూలాలు వెలుపలి లింకులు వర్గం:తెలంగాణ జిల్లాలు
నిజామాబాదు జిల్లా
https://te.wikipedia.org/wiki/నిజామాబాదు_జిల్లా
నిజామాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. నిజామాబాద్ నగరం ఈ జిల్లా ముఖ్య పట్టణం. నిజామాబాద్ను పూర్వం ఇందూరు, ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, ఆర్మూరు ఇతర ప్రధాన పట్టణాలు.నిజామాబాదు నగరం హైదరాబాదు, వరంగల్ తరువాత తెలంగాణాలో 3వ అతిపెద్ద నగరం. జిల్లా పేరు వెనుక చరిత్ర నిజామాబాద్ ను 8వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చింది. ఇందూరుకు పూర్వం పేరు ఇంద్రపురి. ఇంద్రపురి అని ఒక రాజు పేరు మీదుగా పేరు వచ్చిందని భావించబడుతున్నది. కానీ ఆ రాజు సా.శ.388 ప్రాంతంలో నర్మదా, తపతిల దక్షిణ ప్రాంతాన్ని పాలించిన త్రికూటక వంశానికి చెందిన ఇంద్రదత్తుడా, విష్ణుకుండిన చక్రవర్తి మొదటి ఇంద్రవర్మనా ఇదమిద్ధంగా తెలియడం లేదు. 20వ శతాబ్దం తొలినాళ్ళ వరకు కూడా ఈ ఊరు, జిల్లా ఇందూరుగానే పిలవబడింది.District Census Handbook, Andhra Pradesh, Census 1961: Nizamabad 1901వ సంవత్సరములో ఈ ప్రాంతములో నుండి (సికింద్రాబాద్ నుండి మన్మాడ్ వరకు) రైలు మార్గము ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడి ప్రాంతానికి అప్పటి రాజు నిజాం-ఉల్-ముల్క్ పేరు పెట్టి, జిల్లా పేరును నిజామాబాద్ గా మార్చడం జరిగింది. జిల్లా చరిత్ర జిల్లాలో చారిత్రక శిల్పసంపదకు కొదవలేదు. రాజులు ఏలిన సంస్థానాలలో నేటికీ చారిత్రక కట్టడాల ఆనవాళ్ళు దర్శనమిస్తున్నాయి. క్రీ.పూ.3000 నాటికే జిల్లాలో మానవుల ఉనికి ఆధారాలున్నాయి. అందుకు చరిత్రకారులకు దొరికిన 'కైరన్' (చనిపోయిన వారిని వారికి ఇష్టమైన వస్తువులతో కలిపి పూడ్చిపెట్టి దాని చుట్టూ కొన్ని గుర్తులను అమర్చడం)లే నిదర్శనం. దీని ద్వారానే ప్రాచీన కట్టడాలైన రాష్ట్ర కూటులు, బోధన్ చాళుక్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల ఆలయాలు, ముస్లిం నిర్మాణాలు తెలిశాయి. జిల్లాలోని సంస్థానాలు: రాజులకు సేవచేసిన కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేసేవారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారినే సంస్థానాధీశులుగా పేరుపొందారు. సంస్థానాలు అంటే చాలామొత్తంలో ఎక్కువ గ్రామాలు అధికారి ఏలుబడి కింద ఉండడం. ముస్లిం రాజుల పరిపాలనలో అధికార భాషలుగా ఫారసీ, ఉర్దూ ఉండేవి. జిల్లాలో దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్ సంస్థానాల ఆనవాళ్ళు నేటికీ పదిలం. కౌలాస్ కాకతీయ సామ్రాజ్యం అంతమైన తరువాత బహమనీ సుల్తానులు కౌలస్ దుర్గాన్ని వశపరచుకున్నారు. ఈ సంస్థానానికి ఔరంగజేబు ద్వారా రాజా పథంసింగ్ గౌర్ ను కౌలాస్ సంస్థానాధీశునిగా నియమితులయ్యారు. ఇతని వారసులు స్వాతంత్ర్యం వరకు అసఫ్ జాహి నైజాం రాజులకు సామంతులుగా వారి రాజ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషించారు. రాజా దీప్ సింగ్ 1857 తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి బ్రిటీషువారిచే శిక్షకు గురయ్యాడు. శత్రు దుర్భేద్యమైన అప్పటి కట్టడాలు ఇప్పటికీ వాటి నిర్మాణ చాతుర్యాన్ని చాటుతున్నాయి. సిర్నాపల్లి సంస్థానం జిల్లాలో సిర్నాపల్లి సంస్థానానికి ప్రత్యేకత ఉంది. నిజాంనవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం. 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు. చెరువులు, ఆనకట్టలు, కుంటలు, బావులు, కాలువలు కట్టించారు. ఆమె ఇందల్ వాయి, నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి, కోటగల్లిగడి, మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు, జానకంపేట, నవీపేట, రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు. సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్‌వాయి, డిచ్ పల్లిల మీదుగా వేస్తే, ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు. వెల్మల సంస్థానం జిల్లాలో వెల్మల్ సంస్థానం పురాతనమైనది. దీని క్రింద వెల్మల్, కల్లెడి, గుత్ప తదితర గ్రామాలుండేవి. దోమకొండ సంస్థానం ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్నది దోమకొండ. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. 1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది. హైదరాబాదు రాజ్యం యొక్క బీదరు సుబాలో, ఇందూరు జిల్లాగా ఉంది. 1905లో ఇందూరు తాలుకాలోని నిర్మల్, నర్సాపూర్ తాలూకాలను కొత్తగా ఏర్పడిన అదిలాబాదు జిల్లాలో చేర్చారు. మధోల్ తాలూకా, బాన్స్‌వాడలోని కొంతభాగం నాందేడ్ జిల్లాలో చేర్చారు. మిగిలిన బాన్స్‌వాడ తాలూకాను యెల్లారెడ్డి, బోధన్ తాలుకాలోకి చేర్చారు. భీంగల్‌ను ఆర్మూరు తాలూకాలో కలిపి, యెల్లారెడ్డిపేట, కామారెడ్డిపేట తాలూకాలో మరికొన్ని మార్పులు చేసి కొత్తగా ఏర్పడిన జిల్లాకు నిజామాబాదు జిల్లాగా నామకరణం చేశారు.Hyderabad State జిల్లా ఏర్పడినప్పుడు ఐదు తాలూకాలుండేవి - ఇందూరు, ఆర్మూరు, కామారెడ్డి, యెల్లారెడ్డి, బోధన్. 1930వ దశకంలో యెల్లారెడ్డి, బోధన్ తాలూకాల నుండి బాన్స్‌వాడ తాలూకాను తిరిగి ఏర్పరచారు. 1830లో కాశీయాత్రలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలలో మజిలీ చేస్తూ ప్రయాణించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఆనాడు ఈ ప్రాంతపు స్థితిగతుల గురించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రాజ్యంలో కృష్ణ దాటినది మొదలుకొని హైదరాబాద్ నగరం వరకూ ఉన్న ప్రాంతాల్లో (నేటి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగర జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో) సంస్థానాధీశుల కలహాలు, దౌర్జన్యాలు, భయభ్రాంతులను చేసే స్థితిగతులు ఉన్నాయని ఐతే హైదరాబాద్ నగరం దాటిని కొద్ది ప్రాంతం నుంచి గోదావరి నది దాటేవరకూ (నేటి నిజామాబాద్, మెదక్ జిల్లాలు) గ్రామాలు చాలావరకూ అటువంటి దౌర్జన్యాలు లేకుండా ఉన్నాయని వ్రాశారు. కృష్ణానది నుంచి హైదరాబాద్ వరకూ ఉన్న ప్రాంతాల్లో గ్రామ గ్రామానికి కోటలు, సైన్యం విస్తారంగా ఉంటే, హైదరాబాద్ నుంచి గోదావరి నది వరకూ ఉన్న ప్రాంతంలో మాత్రం కోటలు లేవని, చెరువులు విస్తారంగా ఉండి మెట్టపంటలు ఉంటున్నాయని వ్రాశారు. భౌగోళిక స్వరూపం జిల్లాకు సరిహద్దులుగా, ఉత్తరాన అదిలాబాదు జిల్లా, తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్ జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక లోని బీదరు జిల్లా, మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. 18-5', 19' ఉత్తర అక్షాంశాల మధ్య, 77-40', 78-37' తూర్పు రేఖాంశాల మధ్య జిల్లా విస్తరించి ఉంది. సముద్రతీరానికి సుదూరంగా ఉండటంచేత జిల్లా వాతావరణం భూమధ్యరేఖా వాతావరణం గాను, విపరీత ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు ఉంటాయి. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెం, సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 39.9 డిగ్రీల సెం గాను ఉన్నాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు సెం వరకు పడిపోవడం, వేసవిలో 47'డిగ్రీలు సెం వరకు పెరగడం కూడా కద్దు. జిల్లా విస్తీర్ణం 7956 చ.కి.మీ, అనగా 19,80,586 ఎకరాలు. జిల్లాలోని 36 మండలాల్లో ఉన్న 923 గ్రామాల్లో 866 నివాసమున్నవి కాగా, 57 గ్రామాలు ఖాళీ చెయ్యబడినవి గానీ, లేక నీటిపారుదల ప్రాజెక్టులలో ముంపుకు గురయినవి గాని. ఇందూరు జిల్లా గణాంకాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా....25,52,073, అందులో పురుషులు 1252191,స్త్రీలు 1299882, జనసాంద్రత.321/కి.మీ² (831/చ.మై),అక్షరాస్యత శాతం మగ ...66.27, ఆడ .... 40.57. ఇందూరు జిల్లా ఆర్ధిక స్థితి గతులు 2006లో భారత ప్రభుత్వం నిజామాబాదు జిల్లాను, దేశంలోని మొత్తం 640 జిల్లాలలోకెల్లా ఆర్థికంగా వెనుకబడిన 250 జిల్లాలలో ఒకటిగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి పథకం క్రింద ఆర్థిక సహాయాన్ని పొందుతున్న పదమూడు జిల్లాలలో నిజామాబాదు జిల్లా కూడా ఒకటి. పునర్య్వస్థీకరణ ముందు నిజామాబాదు జిల్లా alt=2016 పునర్య్వస్థీకరణ ముందు నిజామాబాదు జిల్లా మండలాలు|కుడి|220x220px|2016 పునర్య్వస్థీకరణ ముందు నిజామాబాదు జిల్లా 2016 పునర్య్వస్థీకరణ ముందు 7,956 చదరపు కిలోమీటర్ల విస్తీరణం కల నిజామాబాద్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కొరకు మూడు రెవెన్యూ డివిజన్లుగానూ, 36 రెవెన్యూ మండలాలుగానూ విభజించారు.పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో నిజామాబాద్ జిల్లా తాలూకాల వివరాలు . జూలై 28, 2007న సేకరించారు. జిల్లాలో మొత్తం 922 గ్రామాలున్నాయి. అందులో 64 నిర్జన గ్రామాలు. మొత్తం 718 గ్రామపంచాయితీలున్నాయి. జిల్లాలో ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ నిజామాబాద్ అయితే, బోధన్, కామారెడ్డి, ఆర్మూరు మునిసిపాలిటీలు ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. పునర్య్వస్థీకరణకు ముందు ఉన్న36 మండలాలతో కలిగిన జిల్లా పటం. పునర్య్వస్థీకరణ తరువాత నిజామాబాదు జిల్లా 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా నిజమాబాదు జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 36 పాత మండలాల నుండి 17 మండలాలు విడగొట్టి కామారెడ్డి జిల్లాను కొత్తగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కామారెడ్డి జిల్లాలో చేరిన మండలాలు కామారెడ్డి మండలం బిక్నూర్ మండలం తాడ్వాయి మండలం దోమకొండ మండలం మాచారెడ్డి మండలం సదాశివనగర్ మండలం బాన్స్‌వాడ మండలం బీర్కూర్ మండలం బిచ్కుంద మండలం జుక్కల్ మండలం పిట్లం మండలం మద్నూరు మండలం నిజాంసాగర్ మండలం ఎల్లారెడ్డి మండలం నాగిరెడ్డిపేట మండలం లింగంపేట మండలం గాంధారి మండలం నిజామాబాదు జిల్లాలోని మండలాలు. పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట నిజామాబాదు జిల్లాలో 19 పాత మండలాలు కాగా,8 కొత్తమండలాలు ఏర్పాటుతో జిల్లా అవతరించింది.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 229, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 ఆ తరువాత చివరి రెండు మండలాలు ది.07.03.2019న కొత్తగా ఏర్పడినవి.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019 రేంజల్ మండలం నవీపేట్ మండలం నందిపేట్ మండలం ఆర్మూరు మండలం బాల్కొండ మండలం మోర్తాడ్ మండలం కమ్మర్‌పల్లి మండలం భీంగల్ మండలం వేల్పూర్ మండలం జక్రాన్‌పల్లి మండలం మాక్లూర్ మండలం నిజామాబాద్ సౌత్ మండలం ఎడపల్లి మండలం బోధన్ మండలం కోటగిరి మండలం వర్ని మండలం డిచ్‌పల్లి మండలం ధర్‌పల్లి మండలం సిరికొండ మండలం నిజామాబాద్ నార్త్ మండలం* నిజామాబాద్ గ్రామీణ మండలం* ముగ్పాల్ మండలం* ఇందల్‌వాయి మండలం* మెండోర మండలం* ముప్కాల్ మండలం* రుద్రూర్ మండలం* ఏర్గట్ల మండలం* మొస్రా మండలం* చందూర్ మండలం* సాలూరా మండలం* డొంకేశ్వర్ మండలం* ఆలూరు మండలం* గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (12) చివరి పేర్కొన్న 28,29 సంఖ్య గల మండలాలు మోస్రా మండలం, చందూర్ మండలం 2019 మార్చి 7 కొత్తగా ఏర్పడినవి. జిల్లాలో ముఖ్య పట్టణాలు ఆర్మూర్ బోధన్ భీంగల్ జక్రాన్‌పల్లి నందిపేట్ రవాణా వ్వవస్థ జిల్లా గుండా సికింద్రాబాదు- మన్మాడ్ మార్గం వెళ్ళుచుండగా, జానకంపేట నుంచి బోధన్ వరకు మరో మార్గం ఉంది. జిల్లాలో మొత్తం కిమీ పొడవు కల మార్గంలో 15 రైల్వేస్టేషనులు ఉన్నాయి.Handbook of Statistics, Nizamabad Dist, 2010, PNo 153 కరీంనగర్ నుంచి నిజామాబాదుకు కొత్తగా నిర్మిస్తున్న రైలుమార్గం పురోభివృద్ధిలో ఉంది. జిల్లా గుండా ఉత్తర-దక్షిణంగా 44వ నెంబరు జాతీయ రహదారి, నిజామాబాదు - భూపాలపట్నం జాతీయ రహదారి వెళ్ళుచున్నాయి. కామారెడ్డి, డిచ్ పల్లి, నిజామాబాదు, ఆర్మూరు జాతీయరహదారి పై ఉన్న ప్రధాన పట్టణాలు. జనాభా లెక్కలు నిజామాబాదు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా తర్వాత రెండవ అత్యల్ప జనాభా గల జిల్లా. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ జిల్లా జనాభా 25,52,073. స్త్రీ, పురుషుల నిష్పత్తి 1038:1000. భారతదేశ జనాభాతో పోల్చుకుంటే, జిల్లాలో పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం అక్షరాస్యత 53.26 శాతం (2001 జనగణన). జిల్లాలో ఏడు పట్టణాలు, 923 గ్రామాలు ఉన్నాయి. పశుపక్ష్యాదులు అలీసాగర్ అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ మానవ నిర్మిత జలాశయము 1930లో కట్టబడింది. నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా ఈ జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది. వన్య ప్రాంతంతో పాటు కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి, కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానంగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్, జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ. మల్లారం అడవి మల్లారం అడవి, నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉంది. చుట్టూ వన్య ప్రదేశములో ఒదిగి ఉన్న మల్లారం ప్రకృతి పర్యటణకు సరైన స్థలము. అడవి మార్గములు, ఒక గోపురము, ఒక దృశ్యకేంద్రమున్న టవర్ ఇక్కడి ముఖ్య ఆకర్షణలు. 1.45 బిలియన్ సంవత్సరాల పురాతనమైన శిల ఇక్కడ మిమ్మల్ని ప్రకృతి ఒడిలోకి పిలుస్తుంది. సాహసిక పర్యటనలకు, ఉత్తేజితమైన పిక్నికులకు చాలా అనువైన ప్రదేశము. విద్యాసంస్థలు నిజామాబాదు, అదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు పెంపొందించేందుకు 2006లో నిజామాబాదు జిల్లాలోని డిచ్‌పల్లి కేంద్రంగా తెలంగాణా విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇది వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉన్న బిక్నూరు పోస్టుగ్రాడ్యుయేట్ కేంద్రం 2011-12 విద్యాసంవత్సరం నుండి తెలంగాణా విశ్వవిద్యాలయం దక్షిణ క్యాంపసుగా మారింది. ఆకర్షణలు right|thumb|దోమకొండ దేవాలయం నిజామాబాదు నగరంలో చూడడానికి చాల ఉన్నాయి. నీలకంఠేశ్వరాయలయం, సారంగపూర్ హనుమాన్ మందిరము, తిలక్ గార్డెను, ఖిల్లా, తెలంగాణ విశ్వవిద్యాలయము మొదలయినవి. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్,, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, పోచారం, ఆలీసాగర్, నిజామాబాదు కోట, డిచ్‌పల్లి రామాలయం, తిలక్ గార్డెన్ వద్ద ఉన్న మ్యూజియం, దోమకొండ కోట, ఖిల్లా రామాలయం,భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర దేవాలయం, రామారెడ్డి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం,సంతాయిపేట్ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం, మల్లారం అడవి, అశోక్ సాగర్, సారంగాపూర్, ఆర్మూరు రోడ్డు లోని శిలలు మొదలైనవి జిల్లాలోని కొన్ని పర్యాటక ఆకర్షణలు. నిజామాబాదు కోట, రఘునాథదాసు నిర్మించిన ఒకప్పటి రామాలయంపై నిర్మించారు. ఆయనే నిర్మించిన పెద్ద చెరువు నేటికీ నిజామాబాదు నగర మంచినీటి అవసరాలు తీరుస్తోంది. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అందమైన తోటలతో, అతిథిగృహాల వంటి సౌకర్యాలతో యాత్రికులకు సౌకర్యవంతంగా ఉన్నాయి. పురాతత్వ ప్రదర్శనశాల నిజామాబాదులోని జిల్లా పురాతత్వ ప్రదర్శనశాలలో పాతరాతియుగం నుండి విజయనగర సామ్రాజ్య కాలం వరకు మానవ నాగరికత పురోగతిని తెలియజేసే పురాతన వస్తువులు ఉన్నాయి. 2001 అక్టోబరులో ప్రారంభమైన ఈ ప్రదర్శనశాలలో పురాతత్వ విభగం, శిల్పకళా విభాగం, కాంస్య, అలంకరణ విభాగం అనే మూడు విభాగాలు ఉన్నాయి. బిద్రీ వస్తువులు, అనేక రకములైన ఆయుధాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. అశోక్ సాగర్ అందమైన శిలలు, ఉద్యానవనాలతో దృశ్యసౌందర్యమైనది అశోక్ సాగర్ చెరువు. హైదరాబాదు - బాసర రోడ్డులో నిజామాబాదు నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉంది. ఇక్కడ ఉద్యానవనము చక్కగా తీర్చిద్దిబడి వెలిగించబడిన శిలలతో ఉంది. ఈ సరస్సులో పడవ విహారము కూడా చేయవచ్చు. పుణ్య క్షేత్రాలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో లింబాద్రి గుట్ట, బడా పహాడ్, బిచ్కుంద, సారంగాపూర్ మొదలైనవి ఉన్నాయి. లింబాద్రి గుట్ట లింబాద్రి గుట్టపై ప్రశాంత వాతావరణములో శ్రీ నరసింహ స్వామి ఆలయము నెలకొన్నది. ఈ ప్రదేశం భీమగల్ నుండి 4 కిలోమీటర్ల దూరములో ఉంది. ప్రతి సంవత్సరము కార్తీక సుద్ధ తదియ నుండి త్రయోదశి వరకు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. దీనిని నింబాచలం అని కూడా పిలుస్తారు. పచ్చని కొండల మధ్య ఎంతో అహ్లాదంగా ఉంది బడా పహాడ్ వర్ని, చండూరు మధ్య ఉన్న బడా పహాడ్ పైన సయ్యద్ సదుల్లా హుస్సేనీ దర్గాలో అనేక మంది ప్రజలు శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము జాతర కూడా జరుగును. సారంగాపూర్ నిజామాబాదు నుండి 8 కి.మీ.ల దూరంలో ఉన్న సారంగాపూర్ వద్ద హనుమంతుని దేవాలయం ఉంది. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు, దాదాపు 452 ఏళ్ళ కిందట ఈ ఆలయానికి శంకుస్థాపన చేసాడు. చక్కటి రవాణా సౌకర్యాలతో, భక్తులకు అవసరమైన వసతి వంటి అన్ని సౌకర్యాలు ఈ ప్రదేశం కలిగి ఉంది. శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవాలయం దక్షిణ కాశిగా పేరుగాంచిన, ప్రసిద్ధ శ్రీ భిక్కనూరు సిద్దరామేశ్వర స్వామి దేవాలయం, నిజామాబాదు నుండి 70 కిలోమీటర్ల దూరములో భిక్కనూరు మండల కేంద్రంలో ఉంది. శ్రీ కాలభైరవస్వామి దేవాలయం ఎంతో ప్రాచుర్యం కలిగిన శ్రీ కాల భైరవస్వామి దేవాలయం, సదాశివనగర్ మండలం, ఇస్సన్నపల్లి గ్రామంలో ఉంది. కంఠేశ్వర్ ఈ కంఠేశ్వర్ వద్ద ఉన్న నీలకంఠేశ్వరుని రూపంలో ఉన్న శివుని దేవాలయం పురాతనమైనది. ఉత్తర భారత వాస్తు శైలిలో ఉండే ఈ ఆలయాన్ని శాతవాహన చక్రవర్తి యైన రెండవ శాతకర్ణి జైనుల కొరకు కట్టించాడు. రథసప్తమి పండుగను ప్రతి ఏటా పెద్దెత్తున జరుపుతారు. డిచ్ పల్లి రామాలయం సా.శ. 1600 ప్రాంతంలో విజయనగర రాజులు డిచ్ పల్లి దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. 76 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాలపై ద్రావిడుల ప్రభావం కన్పిస్తుంది. విజయనగర రాజుల శిల్ప రీతి కనిపించడంతో 16వ శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో నిర్మించి ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్మాణం మొత్తం చాలావరకు నల్లరాయితో జరిగింది. ఈ దేవాలయానికి ఎదురుగా చెరువు మధ్యలో నిర్మించిన మండపం ప్రత్యేక ఆకర్షణ. ఖిల్లా రామాలయం ఇందూరు, ఇంద్రపురి అనేపేర్లు కలిగిన నిజామాబాదు పట్టణాన్ని, ఇక్కడి కోటను రాష్ట్రకూటులు నిర్మించారు. వారి కాలంలోనే నిర్మించిన 40 అడుగుల ఎత్తున్న విజయస్థూపం కూడా ఇక్కడ ఉంది. సా.శ. 1311లో ఈ కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించాడు. తరువాత అది బహమనీ రాజుల చేతుల్లోకి, ఆపై కుతుబ్ షాహీ, ఆసఫ్ జాహీల చేతుల్లోకి వెళ్ళింది. విశాలమైన ఈ కోట రాతి గోడలతో, నాలుగు మూలల బురుజులతో ఉంది. సా.శ.10 వ శతాబ్దపు ఈ రాష్ట్రకూటుల కోట ప్రస్తుతం ఆసఫ్ జాహీ ల శైలిలో విశాలమైన గదులతో ఉంది. కోటలో సమర్థ రామదాసు నిర్మించిన బడా రామాలయం మరో ఆకర్షణ. కంజర్లో కూడా హనుమంతుని దేవాలయం ఉంది. ఈ గుడి 1843లో నిర్మించబడ్డది. జిల్లా గణాంకాలు రెవెన్యూ మండలాలు: 27 రెవెన్యూ విభాగాలు: (3) బోధన్, ఆర్మూర్, నిజామాబాద్, లోక్‌సభ నియోజకవర్గాలు: (1) నిజామాబాదు, (2) జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గాలు: (9) జుక్కల్, బాల్కొండ, ఆర్మూర్, బాన్స్‌వాడ, బోధన్, నిజామాబాద్ నగర, నిజామబాద్ గ్రామీణ, డిచ్‌పల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి. నదులు: మంజీరా నది, గోదావరి నది ప్రముఖ వ్యక్తులు ఉర్దూ కవి పాగల్ అదిలాబాదీ ప్రముఖ రచయిత డా.కేశవరెడ్డి. రాయలసీమలో జన్మించిన ఈయన, జిల్లాలోని డిచ్‌పల్లిలో స్థిరపడి, పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాడు. ప్రముఖ సినిమా నిర్మాత రాజు ప్రముఖ యువ హీరో నితిన్ బయటి లింకులు నిజామాబాదు జిల్లా అధికారిక వెబ్‌సైటు నిజామాబాదు జిల్లా వార్తలు నిజామాబాద్ న్యుాస్.ఇన్ (www.nizamabadnews.in ఇవి కూడా చూడండి జిల్లా గ్రామాల జాబితా మూలాలు వర్గం:తెలంగాణ జిల్లాలు వర్గం:నిజామాబాదు జిల్లా వర్గం:ఈ వారం వ్యాసాలు
పశ్చిమ గోదావరి జిల్లా
https://te.wikipedia.org/wiki/పశ్చిమ_గోదావరి_జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనలో భాగంగా, ఉత్తర భాగంలో గల ప్రాంతాన్ని ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలలో కలిపారు. అవశేష జిల్లాకు కేంద్రం భీమవరం. గుంటుపల్లి (కామవరపుకోట) గుహాలయాలు, భీమవరంలోని భీమారామం, పాలకొల్లు లోని క్షీరారామం, నరసాపురం తీరప్రాంతం, కొల్లేరు సరస్సు ముఖ్య పర్యాటక ఆకర్షణలు. చరిత్ర right|thumb|225px|గుంటుపల్లిలోని బౌద్ధారామం గుహలు బౌద్ధుల కాలంనుండి ఇక్కడి చరిత్రకు స్పష్టమైన ఆధారాలున్నాయి. కామవరపుకోట మండలం జీలకర్రగూడెం, గుంటుపల్లిలలో ఉన్న బౌద్ధారామాలు సా.శ.పూ. 200 నుండి సా.శ. 300 మధ్యకాలానికి సంబంధించినవి. బుద్ధుని ప్రతిమలేవీ లేకపోవడం వలన ఇవి ముఖ్యంగా 'హీనయానం' (బౌద్ధం ఆరంభ సమయం) కాలానికి చెందినవని అనిపిస్తున్నది. భీమవరం దగ్గర పెదఅమిరం గ్రామంలోను, పెనుమంచిలి, ఆచంట లలోనూ జైన తీర్ధంకరుల మందిరాలున్నాయి. ఈ ప్రాంతం చారిత్రికంగా నందుల సామ్రాజ్యంలోనూ, తరువాత అశోకుని సామ్రాజ్యంలోనూ భాగంగా ఉండేది. తరువాత మిగిలిన దక్షిణ దేశంలాగానే (సా.శ. 1 నుండి 3వ శతాబ్దం వరకు) ఇది కూడా శాతవాహనుల యేలుబడిలోకి వచ్చింది. సా.శ.350 ప్రాంతంలో సముద్రగుప్తుడు ఈ ప్రాంతంపై దండెత్తాడు. తరువాత మహారాజు శక్తి వర్మతో ఆరంభమైన మఠరకుల వంశం వారు సా.శ. 375 నుండి 500 వరకు ఆంధ్ర తీర ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత రెండు శతాబ్దాలు పిఠాపురం (పిష్టపురం) కేంద్రంగా విష్ణు కుండినులు ఈ తీర ప్రాంతంలో రాజ్యపాలన చేశారు. వీరిలో విక్రమేంద్ర వర్మ ముఖ్యమైనవాడు. విక్రమేంద్ర వర్మ ప్రతినిధిగా రణ దుర్జయుడు పిఠాపురం నుండి పాలన చేశాడు. ఇంద్ర భట్టారకుడనే విష్ణు కుండిన రాజును జయించి, కళింగ గంగులు వారి రాజ్యంలో చాలా భాగాన్ని ఆక్రమించారు. 3వ మాధవ వర్మ విష్ణు కుండినులలో చివరి రాజు. తరువాత బాదామి చాళుక్యులు (పశ్చిమ చాళుక్యులు) వంశానికి చెందిన 2వ పులకేశి సోదరుడైన కుబ్జవిష్ణువు పిఠాపురాన్ని జయించి ఇక్కడ చాళుక్యుల పాలనకు నాంది పలికాడు. కుబ్జ విష్ణునితో తూర్పు చాళుక్య పాలన మొదలయ్యింది. వారి పాలనలో రాజధాని పిఠాపురం నుండి వేంగి (ఏలూరుకి సమీపంలోనిది), తరువాత రాజమండ్రికి మార్చబడింది. సా.శ. 892-921 మధ్య రాజైన 1వ చాళుక్య భీముడు ద్రాక్షారామ శివాలయాన్ని నిర్మించాడు. కాకతీయ వంశజ రాణి రుద్రమదేవి నిరవద్యపురము అనబడే ఈనాటి నిడదవోలును రాజధానిగా పాలించిన చాళుక్యుల ఇంటి కోడలు. తరువాత వివిధ రాజుల రాజ్యాలు సాగాయి. బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరి జిల్లాగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనలో భాగంగా, ఉత్తర భాగంలో గల ప్రాంతాన్ని ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలలో కలిపారు. భౌగోళిక స్వరూపం సవరించిన పరిధి ప్రకారం జిల్లా వైశాల్యం 2,178 చ.కి.మీ. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. జిల్లాకు ఉత్తరంగా ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, తూర్పున కోనసీమ జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమంగా ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా సముద్ర తీరం పొడవు 19.కి.మీ. జిల్లాలో సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు. జిల్లాలో కృష్ణా, గోదావరి నదుల కాలవలు ప్రధానమైన నీటి వనరులు. కొల్లేరు సరస్సులో సగభాగం జిల్లాలో ఉంది. జనగణన గణాంకాలు 2022 సవరించిన జిల్లా పరిధికి 2011 జనగణన ప్రకారం, జనాభా 17.80 లక్షలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం జనాభా 37.96 లక్షలు. ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాలలోను, 7.45 లక్షలు పట్టణ ప్రాంతాలలోను నివసిస్తున్నారు. జిల్లా వైశాల్యం 7742 చ.కి.మీ. కనుక జనసాంద్రత చ.కి.మీ.కు 490. జనాభాలో 70% పైగా జనులు వ్యవసాయ సంబంధితమైన ఉపాధిపై జీవిస్తున్నారు. రెవెన్యూ డివిజన్లు, మండలాలు జిల్లాలో నరసాపురం, భీమవరం అనే రెండు రెవెన్యూ డివిజన్లున్నాయి. వీటిని 19 మండలాలుగా విభజించారు. మండలాలు ఈ జిల్లాలో 19 మండలాలున్నాయి. నరసాపురం రెవెన్యూ డివిజను ఆచంట ఇరగవరం తణుకు నరసాపురం పాలకొల్లు పెనుగొండ పెనుమంట్ర పోడూరు మొగల్తూరు యలమంచిలి భీమవరం రెవెన్యూ డివిజను అత్తిలి ఆకివీడు ఉండి కాళ్ళ తాడేపల్లిగూడెం పాలకోడేరు పెంటపాడు భీమవరం వీరవాసరం పట్టణాలు ఆకివీడు తణుకు తాడేపల్లిగూడెం నరసాపురం పాలకొల్లు భీమవరం రాజకీయ విభాగాలు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధికి కుదించారు. జిల్లాలో గల శాసనసభ నియోజకవర్గాలు: రవాణా వ్వవస్థ జాతీయ రహదారుల 216, జాతీయ రహదారి 216A జిల్లాలో ప్రముఖ రహదారులు. హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము జిల్లాగుండా వెళుతుంది. జిల్లాలో కాలువల ద్వారా గోదావరి డెల్టాలో కొంత వినియోగం జరుగుతున్నది. జిల్లాలో తాడేపల్లిగూడెంలో విమనాశ్రయం ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉంది. సమీప విమానాశ్రయాలు విజయవాడ, రాజమండ్రిలో ఉన్నాయి. విద్యా సౌకర్యాలు జిల్లాలో ఎక్కువ కళాశాలలు నన్నయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి. ప్రముఖ విద్యా సంస్థలు నన్నయ విశ్వవిద్యాలయం పి.జి కళాశాల, తాడేపల్లిగూడెం డి.ఎన్.ఆర్. కళాశాల. భీమవరం వై.ఎన్ కళాశాల. నర్సాపురం వృత్తి విద్యాకళాశాలల గణాంకాలు ఇంజినీరింగ్ కళాశాలలు -13 (తాడేపల్లి గూడెం-3, తణుకు-1 భీమవరం-8,నరసాపురం-1) మెడికల్ కళాశాలలు 2 (పాలకొల్లు,భీమవరం) బి.ఎడ్.కళాశాలలు - 4 న్యాయశాస్త్ర కళాశాలలు - 1 (భీమవరం) నిట్ -1 - (తాడేపల్లి గూడెం) డా.వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, (తాడేపల్లి గూడెం) ఉమ్మడి జిల్లా ఆర్ధిక స్థితి గతులు జిల్లాలోని అధిక ప్రాంతం సాంద్ర వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధిచెందింది. జిల్లాలో మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. భీమవరం నగరం రాష్ట్రంలోనే ప్రముఖ మత్స్య పరిశ్రమ వ్యాపారకేంద్రం. వ్యవసాయం thumb|right|225px|ధాన్యమును తూర్పారబోస్తున్న రైతు thumb|right|225px|పంట నూర్పిడి కోసం సిద్దముగా ఉన్న ట్రాక్టరులు జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైనా, వ్యవసాయాధారిత సేవలు, పరిశ్రమలపైనా ఆధారపడి ఉంది. పనిచేసే వారిలో దాదాపు 78% జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే సాగిస్తున్నారు. వరి, చెరకు, పుగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, ఆయిల్ పాం, వేరుశనగ, అపరాలు, ప్రొద్దు తిరుగుడు పూలు - ఇవి ఈ జిల్లాలో ప్రధానమైన పంటలు. జిల్లాలోని వివిధ పంటల విస్తీర్ణం క్రింద ఇవ్వబడింది. thumb|right|225px|రంగాపురం గ్రామం వద్ద పాడిపశువులు పశ్చిమ గోదావరి జిల్లాలో పంటలు పంట విస్తీర్ణం హెక్టేరులు ఉత్పత్తి మెట్రిక్ టన్నులు వరి 219.6 వేల హె. 1,413,108 మొక్కజొన్న 11.5 వేల హె. 39,557 కంది 0.28 వేల హె. 191 మినుము 9.54 వేల హె. 3,885 పెసర 2.79 వేల హె. 1,130 వేరుశనగ 3.21 వేల హె. 6,476 చెరకు 32.22 వేల హె. 2,900,000 పుగాకు 5.76 వేల హె. 12,685 మామిడి 20,483 హె. 1,22,898 నిమ్మ 1,449 హె. 11,592 బత్తాయి 183 హె. 1,464 అరటి 5,021 హె. 3,26,365 జామ 657 హె. 13,140 సపోటా 568 హె. 4,544 జీడిమామిడి 44,744 హె. 22,372 పసుపు 530 హె. 1,855 మిరప 2,703 హె. 5,406 తమలపాకు 175 హె. 700 కొబ్బరి 22,183 హె. 3,327లక్షలు పామాయిల్ 10,250 హె. 61,500 కోకో 2,800 హె. 1,400 పోక చెక్క 125 హె. 125 కాఫీ 50 హె. 25 మిరియం 150 హె. 45 ఈ పంటలలో వరి, చెరకు సాగు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో సాగుతుంది. అపరాలు ఎక్కువగా డెల్టా ప్రాంతంలో అంతర పంటగా పండిస్తారు. మొక్కజొన్న, పుగాకు, కొబ్బరి వంటివి మెరక ప్రాంతంలోనూ, పల్లపు ప్రాంతంలోనూ కూడా పండుతాయి. జీడిమామిడి, మామిడి, నిమ్మ, ఆయిల్ పామ్ వంటి తోటల వ్యవసాయం అధికంగా మెరక ప్రాంతంలో జరుగుతుంది. జిల్లాలోని డెల్టా ప్రాంతలో సారవంతమైన నల్లరేగడి నేల ఉంది. కొద్దిభాగం పాటి నేల. ఎక్కువ భాగం ఎర్ర చెక్కు నేల, ఇసుక నేల కలిసి ఉంది. మొత్తం జిల్లాలోని 7.7 లక్షల హెక్టేరుల వైశాల్యంలో సుమారు 5.5 లక్షల హెక్టేరులు వ్యవసాయానికి అనుకూలమైన భూమి. 0.8 లక్షల హెక్టేరులు అడవి ప్రాంతము. 0.45 లక్షల హెక్టేరులు బీడు భూములు. 0.94 హెక్టేరులు ఇతర ఉపయోగాలకు వాడుతున్నారు. 1996-97లో మొత్తం 6 లక్షల హెక్టేరులలో వ్యవసాయం జరిగింది. వ్యవసాయానికి అనుబంధంగా సాగే పశుపాలన కూడా జిల్లా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యభాగం వహిస్తున్నది. జిల్లాలో 2.5 లక్షల ఆవులు, 4.2 లక్షల గేదెలు, 75వేల గొర్రలు, లక్ష మేకలు, 30 వేల పందులు, 84 లక్షల కోళ్ళు పెంచబడుతున్నాయని అంచనా. నీటి వనరులు right|thumb|225px|నిడదవోలు-నరసాపురం కాలువ. జిల్లాలో సరాసరి సంవత్సర వర్షపాతం 1076.2 మి.మీ. ఇందులో సుమారు 64% వర్షపాతం నైరుతి ఋతుపవనాల సమయంలో (జూన్ - సెప్టెంబరు కాలం) ఉంటుంది. జిల్లాకు తూర్పు హద్దుగా ఉన్న గోదావరి నది విజ్జేశ్వరం వద్ద గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి అనే రెండు పాయలుగా చీలుతుంది. అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఎర్రకాలువ, తమ్మిలేరు, బైనేరు, కొవ్వాడ కాలువ, జల్లేరు, గుండేరు ఇతర ప్రవాహ నీటి వనరులు. జిల్లాలో దాదాపు 20.2% నేల గోదావరి నది పరీవాహక ప్రాంతంలోనూ, 48.1 % యెర్రకాలువ పరీవాహక ప్రాంతంలోను, 26.8% తమ్మిలేరు ప్రాంతంలోను, 1.4% రామిలేరు ప్రాంతంలోను, 3.5% లోయేరు ప్రాంతంలోను ఉంది.. 245 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి, దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు కృష్ణా, గోదావరి నదుల మధ్యప్రాంతలో ఏర్పడిన పల్లపు జలాశయం. ఈ రెండు నదుల మధ్యలోను సహజంగా వరద నీటిని బాలన్స్ చేసే సరస్సుగా ఉపయోగ పడుతుంది. బుడమేరు, తమ్మిలేరు అనే రెండు పెద్ద యేరులతోబాటు సుమారు 30 చిన్న, పెద్ద కాలువలు కొల్లేరులో కలుస్తాయి. ఉప్పుటేరు ద్వారా కొల్లేరు నీరు సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఎన్నో ప్రత్యేకమైన వృక్ష, పక్షిజాతులకు ఇది ఆలవాలమైంది. ఇటీవలి కాలంలో ఇక్కడ చేపల పెంపకం పెద్దయెత్తున ఆర్థిక, సామాజిక మార్పులను తెచ్చింది. అక్రమంగా కొల్లేరు భాగాలను వ్యవసాయానికి, ఆక్వా కల్చర్‌కు ఆక్రమించుకోవడం వలన కొల్లేరు మనుగడకే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో వ్యవసాయానికి నీరందించేవాటిలో మూడు వ్యవస్థలు ఉన్నవి: గోదావరి డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (సర్ అర్ధర్ కాటన్ బారేజి ద్వారా - 2,10,000 హెక్టేరుల వరకు అవకాశం ఉంది.) కృష్ణా డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (ప్రకాశం బారేజి ద్వారా - 23,000 హెక్టేరుల వరకు అవకాశం ఉంది.) ఇవి కాక తమ్మిలేరు రిజర్వాయరు ద్వారా 3,700 హెక్టేరులు, జల్లేరు రిజర్వాయరు ద్వారా 1,700 హేక్టేరులు సాగుకు అవకాశం ఉంది. మెరక ప్రాంతంలో పెద్దయెత్తున గొట్టపు బావులద్వారా సాగునీరు వినియోగం జరుగుతున్నది. పోలవరం ప్రాజెక్టు నీలి విప్లవం ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో చేపల సాగుకు ప్రత్యేకమైన పద్ధతులంటూ ఏమీ లేవు. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో విస్తరించిన గోదావరి, దక్షిణం వైపున 19.5 కిలోమీటర్ల మేర సముద్రం కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో లభించే చేపలతోనే మత్స్యకారులు వ్యాపారం జరిపేవారు. చేపల అధికోత్పత్తి, వాణిజ్య రంగ విస్తరణకు ఎటువంటి పద్ధతులు అప్పట్లో లేవు. 1961 నాటికి జిల్లాలో తొమ్మిది మార్కెట్లే ఉండేవి. నాడు 460 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1969-70 మధ్య రూ. 10.25 లక్షల విలువైన 471 టన్నుల చేపలు, రూ. 1.61 లక్షల విలువ చేసే 73 టన్నుల రొయ్య అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలోనే మత్స్యపరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల కోసం 42 ఫిషర్‌మేన్ కోఆపరేటివ్ సొసైటీలు 5805 మంది సభ్యులతో ఏర్పడ్డాయి. 1981 నాటికి ఆ సంఖ్య 61 సొసైటీలకు పెరిగింది. 1960లో బాదంపూడిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతో జిల్లాలో చేపల పెంపకం చెరువుల్లో మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భీమవరం సమీపంలోని పెదఅమిరం, నరసాపురం, కొవ్వలి, తణుకు, ఏలూరు, కొవ్వూరు తదితర చోట్ల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వెలిశాయి. 80వ దశకం నుంచి విప్లవాత్మక మార్పులు శాస్త్రీయ పద్ధతుల్లో వాణిజ్య వ్యాపారంగా చేపల పెంపకం 1980 నుంచి ప్రారంభమైంది. తొలుత జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు పంట ప్రాంతాలుగా చేపల పెంపకం విస్తరించింది. ప్రారంభంలో 20 వేల ఎకరాల్లో మొదలైన ఈ సాగు 1985-86 ప్రాంతంలో వరి పంట నష్టాలకు గురవుతుండటంతో ఒకేసారి మరో 10 వేల ఎకరాలకు విస్తరించింది. భీమవరం, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురంలలో చేపల చెరువులు బాగా విస్తరించాయి. ప్రధానంగా భీమవరం ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం ఆనంద గ్రూపు-అమాల్‌గమ్ ఫిషరీస్ సంయుక్తంగా 1988లో కొత్త పద్ధతులను, ఫిష్ ప్యాకింగ్ గ్రేడింగ్ విధానాలను ప్రారంభించాయి. అప్పటి వరకు ఒక మోస్తరుగా రైళ్ళ ద్వారా చేపల ఎగుమతులు జరిగేవి. తదుపరి ప్యాకింగ్‌తో ట్రేడింగ్ విధానం ప్రారంభం కావడంతో భీమవరం చేపల ఉత్పత్తుల పెంపకానికి ప్రధాన కేంద్రంగా మారింది. అస్సాం, ఢిల్లీ, కలకత్తా తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల్లో 500 టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1985 నాటికిఉప్పునీటి చేపల ఉత్పత్తి 4 వేల టన్నులు, మంచినీటి చేపల ఉత్పత్తి 10546 టన్నులకు పెరిగింది.1990 నాటికి జిల్లాలో ఏలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, తణుకు, పడాల, కొవ్వలి ప్రాంతాలలో 200 టన్నుల ఐస్‌ను ఉత్పత్తి చేసే 24 ఫ్యాక్టరీల ఉత్పత్తిని పెంచుతూ నెలకొల్పారు. 1990 ప్రాంతంలో మరో 50వేల ఎకరాలు చేపల చెరువులుగా మారిపోయాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు హరిత విప్లవం నుంచి నీలి విప్లవం వైపు మరలాయి. రెండున్నర దశాబ్దాలలో 20 వేల ఎకరాల నుంచి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగాయి. 1990 నాటికి ప్రభుత్వం ప్రైవేటు రంగాలలో 7054 చెరువులు ఉండగా 20 వేలకు పెరిగినట్లు అంచనా. పరిశ్రమలు తణుకులో ఆంధ్రా సుగర్స్, అక్కమాంబ టెక్స్ టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 52 పెద్ద, మధ్య తరగతి పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 17వేల మందికి ఉపాధి లభిస్తున్నది. జిల్లాలో ఏలూరు, భీమవరం, తణుకు, పాలకొల్లులలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. మొత్తం జిల్లాలో పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఇలా ఉన్నాయి: లో టెన్షన్ (తక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 7125 హై టెన్షన్ (ఎక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 118 కుటీర పరిశ్రమ పారిశ్రామిక కనెక్షన్లు: 251 జిల్లాలో మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లు: 13,541 పరిశ్రమలకు విద్యుత్తునిచ్చే ప్రధాన విద్యుత్ సరఫరా లైనులు, హై వోల్టేజీ సబ్‌స్టేషన్లు ఉన్న స్థలాలు: నిడదవోలు, కొవ్వూరు, తణుకు, భీమవరం, దూబచర్ల, తాడిమళ్ళ, చాగల్లు, తాడేపల్లి గూడే, పాలకొల్లు, ఏలూరు. సంస్కృతి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం గ్రామీణ సంస్కృతి ఉంది. భీమవరం, జంగారెడ్డిగూడెం, తణుకు వంటి పట్టణాల్లో పాశ్చాత్య నాగరికత కనిపిస్తుంది. సంక్రాంతి ఉత్సవాలు సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు. కొత్త అల్లుల్లకు,బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమల సందడిగా ఉంటాయి. పర్యాటక ఆకర్షణలు thumb|రామెశ్వర స్వామి వారి ఆలయ గోపురం కొల్లేరు సరస్సు భీమవరము -భీమారామం, మావుళ్ళమ్మ దేవాలయము పాలకొల్లు - క్షీరారామము ఆచంటీశ్వరాలయం, ఆచంట క్రీడలు భీమవరం వాసి అయిన వెంకటపతి రాజు ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం తరపున 28 టెస్ట్ మ్యాచ్ లు, 53 వన్ డే మ్యాచ్ లు ఆడాడు. అతని పూర్తి పేరు సాగి లక్ష్మి వెంకటపతి రాజు. ప్రముఖవ్యక్తులు చిరంజీవి - సినీనటుడు, రాజకీయ నాయకుడు. ముళ్ళపూడీ హరిశ్చంద్రప్రసాద్ - పారిశ్రామికవేత్త బూరుగుపల్లి శేషారావు - శాసన సభ్యులు. నిడదవోలు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు - తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. కనుమూరి బాపిరాజు మాజీ ఎంపీ,టీటీడీ చైర్మన్ (ఆకివీడు) అడవి బాపిరాజు అల్లూరి సీతారామరాజు - భీమవరం దగ్గరలోని మోగల్లు గ్రామానికి చెందినవారు భూపతిరాజు రామకృష్ణంరాజు- విద్యావేత్త, రాజకీయవేత్త, మాజీ ఏ.పి.పి.యస్సీ సభ్యులు యల్లాప్రగడ సుబ్బారావు - శాస్త్ర వేత్త బి.వి రాజు పద్మభూషణ్ త్రివిక్రం శ్రీనివాస్ - సిని దర్షకుడు ఇందుకూరి సునీల్ వర్మ -సినిహీరో, హాస్య నటుడు రాజా రవీంద్ర - టాలీవుడ్ సినీ యాక్టర్ శివాజీ రాజా - టాలీవుడ్ సినీ యాక్టర్ ఎం.వి.రఘు మూలాలు బయటి లింకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:కోస్తా వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు