title
stringlengths
1
90
url
stringlengths
31
120
text
stringlengths
0
504k
మొదటి పేజీ
https://te.wikipedia.org/wiki/మొదటి_పేజీ
వికీపీడియాకు స్వాగతం! వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.ఖాతా వలన లాభాలు లాగిన్ పేజీ ఎలా తోడ్పడవచ్చు?ప్రయోగశాల సహాయ కేంద్రం రోజుకొక చిట్కా పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము • తెలుగు టైపుచేయుట|style="font-size:95%; padding:10px 0; margin:0px; text-align: right; white-space:nowrap; color:#000;"| విహరణ • విశేష వ్యాసాలు •''' అ–ఱ సూచీ మార్గదర్శి __NOTOC__ __NOEDITSECTION__ వర్గం:వికీపీడియా
HomePage
https://te.wikipedia.org/wiki/HomePage
దారిమార్పు మొదటి పేజీ
గుంటూరు జిల్లా
https://te.wikipedia.org/wiki/గుంటూరు_జిల్లా
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం గుంటూరు. రాష్ట్ర రాజధాని అమరావతి. విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది. పొగాకు, మిరప జిల్లా ప్రధాన వ్యవసాయ ఎగుమతులు. 2022 లో జిల్లాల మార్పులలో భాగంగా, ఈ జిల్లాలోని భూభాగాలను కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లాలలో కలిపారు. 2022 లో విభజన పూర్వపు జిల్లా చరిత్ర thumb|అమరావతి స్థూపం|alt= thumb|అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం గుంటూరు ప్రాంతంలో పాతరాతి యుగం నాటినుండి మానవుడు నివసించాడనుటకు ఆధారాలు ఉన్నాయి. రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అమ్మరాజ (922-929) శాసనాలలో గుంటూరును గురించిన ప్రథమ ప్రస్తావన ఉంది. 1147, 1158 రెండు శాసనాలలో గుంటూరు ప్రసక్తి ఉంది. బౌద్ధం ప్రారంభం నుండి విద్యా సంబంధ విషయాలలో గుంటూరు అగ్రశ్రేణిలో ఉంటూ వచ్చింది. బౌద్ధులు ప్రాచీన కాలంలోనే ధాన్యకటకం (ధరణికోట) వద్ద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తారనాథుని ప్రకారం గౌతమ బుద్ధుడు మొదటి కాలచక్ర మండలాన్ని ధాన్యకటకంలో ఆవిష్కరించాడు. ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడు. సా.శ..పూ 200 నాటికే ఈ ప్రాంతంలో అభ్రకం (మైకా) ను కనుగొనబడింది. ప్రతీపాలపుర రాజ్యం (సా.శ. పూ 5వ శతాబ్ది) – ఇప్పటి భట్టిప్రోలు – దక్షిణ భారతదేశంలో ప్రథమ రాజ్యంగా గుర్తింపు పొందింది. శాసన ఆధారాలను బట్టి కుబేర రాజు సా.శ.పూ. 230 ప్రాంతంలో భట్టిప్రోలును పరిపాలించాడని, ఆ తరువాత సాల రాజులు పాలించారని తెలుస్తుంది. వివిధ కాలాల్లో గుంటూరును పరిపాలించిన వంశాలలో ప్రముఖమైనవి: శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రీకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీలు. గుంటూరు ప్రాచీనాంధ్రకాలంనాటి కమ్మనాడు, వెలనాడు, పలనాడులో ఒక ముఖ్యభాగం. కొందరు సామంత రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామంతుల మధ్య కుటుంబ కలహాలు, వారసత్వ పోరులు సర్వసాధారణంగా ఉండేవి. అటువంటి వారసత్వపోరే ప్రసిద్ధి గాంచిన పలనాటి యుద్ధం. జిల్లాలోని పలనాడు ప్రాంతంలో 1180 లలో జరిగిన ఈ యుద్ధం "ఆంధ్ర కురుక్షేత్రం"గా చరిత్ర లోను, సాహిత్యంలోను చిరస్థాయిగా నిలిచిపోయింది. 1687లో ఔరంగజేబు కుతుబ్‌ షాహి రాజ్యాన్ని ఆక్రమించినపుడు గుంటూరు కూడా మొగలు సామ్రాజ్యంలో భాగమైంది. సామ్రాజ్యపు రాజప్రతినిధి ఆసఫ్‌ ఝా 1724లో హైదరాబాదుకు నిజాంగా ప్రకటించుకొన్నాడు. ఉత్తర సర్కారులు అని పేరొందిన కోస్తా జిల్లాలను ఫ్రెంచి వారు 1750 లో ఆక్రమించుకొన్నారు. 1788లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలుబడి లోనికి వచ్చి, గుంటూరు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైంది. 1794లో 14 తాలూకాలతో జిల్లా ఆవిర్భవించింది. ఆవి: దాచేపల్లి, ప్రత్తిపాడు, మార్టూరు, ఠుంఠురుకొర, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, తెనాలి, గుంటూరు, కూరపాడు, కొండవీడు, నరసరావుపేట, వినుకొండ. 1859లో జిల్లాను రాజమండ్రి, మచిలీపట్నం జిల్లాలతో విలీనం చేసి కృష్ణా గోదావరి జిల్లాగా నామకరణం చేసారు. 1904లో తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పలనాడు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలను వేరు చేసి మళ్ళీ జిల్లాను ఏర్పాటు చేసారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం లోను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు లోను జిల్లా ప్రముఖ పాత్ర వహించింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంలో భాగమైంది. మద్రాసు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి. ఫలితంగా 1953లో 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినపుడు జిల్లా రూపురేఖలలో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒంగోలు తాలూకా మొత్తం, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాలో కలిపి ఏర్పాటు చేసారు. దీనితో జిల్లా వైశాల్యం 15032 చ. కి. మీ నుండి 11,347 చ. కి. మీకి తగ్గిపోయింది. 2002 లో కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాల కొరకు, జిల్లాను చీల్చడంతో జిల్లా విస్తీర్ణం 2,443 చ.కి.మీకు తగ్గింది. భౌగోళిక స్వరూపం తూర్పున ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, దక్షిణాన బాపట్ల జిల్లా, పశ్చిమాన బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ఉత్తరాన పల్నాడు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. చాలవరకు సమతల ప్రదేశం. కొన్ని కొండలు కూడా ఉన్నాయి. కృష్ణా డెల్టా కొంతభాగం దీనిలో ఉంది. నేల నేలతీరులో రకాలు. నల్లరేగడి నేల: కృష్ణానది వడ్డునగల ప్రదేశాలు, సత్తెనపల్లి, మాచర్లకు ఉత్తరంగా ఉన్నాయి. సున్నపురాయి మెత్తగా మారి ఇవి ఏర్పడుతాయి. ఇసుక నేల: సముద్రపు వడ్డున గోండ్వానా రాళ్లుగల ప్రదేశాల్లో ఇవి ఉన్నాయి. కొన్ని చోట్ల కంకర (కాల్కేరియస్ నేలలు) ఉన్నాయి. ఉప్పు నేల: సముద్రపు అలలు తీరంలోకి వచ్చే చోట ఉన్నాయి. రేపల్లె, కొత్తపాలెం, సర్లగొండి, నిజామ్ పట్నంలో ఇవి చూడవచ్చు. నీటివసతి thumb|ఉమ్మడి గుంటూరు జిల్లా నదులు, కాలువలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణా నది, చంద్రవంక, తుంగభద్ర, నాగులేరు ప్రధాన నదులు. గుంటూరు ఛానల్, గుంటూరు శాఖా కాలువ, రొంపేరు, భట్టిప్రోలు, రేపల్లె కాలువలు, దుర్గి దగ్గర గుండ్లకమ్మ నది, రెంటచింతల దగ్గర గోలివాగు, గురజాల దగ్గర దండివాగు ఉన్నాయి. కృష్ణానది మాచర్ల పర్వతశ్రేణిలో గనికొండ దగ్గర, సముద్రమట్టం నుండి 182 మీటర్ల ఎత్తున గుంటూరు జిల్లా లోకి ప్రవేశిస్తుంది. పెద్ద లోయలోకి పారుతూ మాచర్లను తెలంగాణ లోని అచ్చంపేటను వేరుచేస్తుంది. కుడవైపు జర్రివాగు, ఎడమవైపున దిండి వాగుని కలుపుకొని పారుతుంది. చంద్రవంక కృష్ణాకి ఉపనది. తూర్పు నల్లమల కొండలలో పుట్టి ముతుకూరు గ్రామ ప్రక్కగా పారి, దాని ఉపనదియైన ఏడిబోగుల వాగుతో కలసి (ఆత్మకూరు ప్రాజెక్టు దగ్గర) ఈశాన్య దిశగా పయనించి మాచర్లను తాకి ఉత్తరంగా పారుతుంది. తుమృకోట రక్షిత అడవిలోకి పారేముందు, 21మీటర్ల ఎత్తునుండి క్రిందకు పారుతుంది. దీనినే ఎత్తిపోతల జలపాతం అంటారు. ఉత్తరదిశగా కొంత ప్రవహించి కృష్ణాలో కలుస్తుంది. నాగులేరు నది, వినుకొండ శ్రేణిలో నాయకురాలి పాస్ దగ్గర నల్లమల కొండలలో పుట్టి, కారెంపూడి ప్రక్కగా ప్రవహించి ఉత్తరదిశగా మాచర్ల పర్వతశ్రేణులలో 32 కి.మీ. పారి రామపురం దగ్గర కృష్ణాలో కలుస్తుంది. తూర్పు తీరంలో సాధారణంగా వుండే తీరులో కృష్ణా నది చాలా వరకు సమతలప్రాంతంలో ప్రవహించటంతో, వర్షాకాలంలో చాలా మట్టి మేట వేస్తుంది . దిగువ కృష్ణా, కృష్ణా, గుండ్లకమ్మ ఓగేరు, రొంపేరు, కాలువలు నేరుగా సముద్రంలోకలిసే ప్రాంతం జిల్లాలోని నీటిపారుదల విభాగాలు. ఖనిజసంపద వజ్రాలు: కొల్లూరు గ్రామం దగ్గర,కృష్ణానది ఒడ్డున వజ్రాలు కోసం తవ్వేవారు. ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం ఇక్కడే వెలికితీసినట్లు చెపుతారు. వజ్రాల గనులు మాడుగుల, మల్లవరం, సారంగపాణి కొండలలో ఉన్నాయి. కంకర:సున్నపుతయారీలో వాడే కంకర చేబ్రోలు, మంగళగిరి, పెదకాకాని, వెంకటపాలెం,లో లభ్యమవుతుంది. వాతావరణం బంగాళ ఖాతంలో ఏర్పడే తుఫాన్లు, అల్పపీడనాలు, తూర్పుతీరం దాటితే అధిక వర్షం, బలమైన గాలులకు కారణమవుతాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి దాక: పొడి, చల్లని చలి కాలం. మార్చి నుండి మే: ఎండాకాలం జూన్ నుండి సెప్టెంబరు: నైరుతీ రుతుపవనాల వలన వానా కాలం. అక్టోబరు నుండి నవంబరు: తుపాన్ల వలన వానలు. వర్షపాతం ఉమ్మడి జిల్లా సగటు వర్షపాతం 830 మిమి. తూర్పు నుండి పడమరకు ఇది తగ్గుతుంది. నైరుతీ రుతుపవనాల వలన అవి తగ్గిపోయేటప్పుడు వర్షపాతం కలుగుతుంది. అక్టోబరులో వర్షాలు ఎక్కువ. సగటున 47 వర్షపు రోజులు. అత్యధికంగా 1879 నవంబరు 9 లో సత్తెనపల్లిలో 386 మిమి వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లా వార్షిక అత్యల్ప, అత్యధిక ఉప్ణోగ్రతలు 15 °C, 47 °C గా నమోదయ్యాయి. రెంటచింతల అత్యంత ఉప్ణోగ్రతకలప్రదేశం. 1948 మే 18 లో 49 °C నమోదయ్యింది. ఆర్ధిక స్థితి గతులు వ్యవసాయం ఉమ్మడి జిల్లాలో ప్రధాన పంటలు: ఆహార ధాన్యాలు:వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు: మినుములు, కందులు, వ్యాపార పంటలు: పత్తి, మిరప పసుపుమరియు పొగాకు తోటపంటలు: సపోటా, కొబ్బరి, అరటి, జీడిమామిడి, జామ, నిమ్మ, నారింజ, బొప్పాయి. ఉమ్మడి జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులలో ప్రకాశం బేరేజి ( పాత కృష్ణా ఆయకట్టు) క్రింద 2,02,032 హెక్టేర్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద 2,54,583 హెక్టేర్లు, గుంటూరు బ్రాంచి కాలువ క్రింద 10,823 హెక్టేర్లు సాగవుతుంది. వ్యవసాయ మార్కెట్ యార్డులు గుంటూరు, తెనాలి, దుగ్గిరాల, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ లలో ఉన్నాయి. పరిశ్రమలు పారిశ్రామిక వాడలు గుంటూరు, తెనాలి, పేరేచెర్ల, నౌలూరులలో, 4 ఆటోనగర్లు గుంటూరు,తెనాలి లలో, 2 దుకాణ సంకీర్ణాలు గుంటూరు, డోకిపర్రులలో కలవు . ప్రత్తి మిల్లులు,పాల పరిశ్రమలు, నార మిల్లులు, ఇతర చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. పరిపాలన విభాగాలు 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత 7 అసెంబ్లీ నియోజక వర్గాలు, 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు, 2 నగరపాలక సంస్థలు, 2 పురపాలక సంస్థలు,, 278 గ్రామపంచాయితీలు ఉన్నాయి; రెవెన్యూ విభాగాలు తెనాలి, గుంటూరు. మండలాలు గుంటూరు రెవెన్యూ డివిజను గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ తాడికొండ తుళ్ళూరు పెదకాకాని పెదనందిపాడు ప్రత్తిపాడు ఫిరంగిపురం మేడికొండూరు వట్టిచెరుకూరు తెనాలి రెవెన్యూ డివిజను కాకుమాను కొల్లిపర చేబ్రోలు తాడేపల్లి తెనాలి దుగ్గిరాల పొన్నూరు మంగళగిరి నగరాలు, పట్టణాలు నగరం: గుంటూరు, అమరావతి పట్టణాలు: పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి నియోజకవర్గాలు లోక్‌సభ నియోజకవర్గాలు గుంటూరు శాసనసభ నియోజక వర్గాలు (7) గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం లోని విభాగం ఇమడ్చబడింది. రవాణా వ్వవస్థ గుంటూరు నుండి హైదరాబాదు, చెన్నైకు రహదారి, రైలు మార్గాలు ఉన్నాయి. 72 కిమీ జాతీయ రహదారి, 511 కి.మీ. రాష్ట్ర రహదారులు ఉన్నాయి. జనాభా లెక్కలు 2011 జనగణన ప్రకారం 21.90 లక్షల జనాభా కలిగివుంది విద్యాసంస్థలు గుంటూరు జిల్లాలో సాధారణ విద్యతో బాటు, వృత్తివిద్యకు సంబంధించి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పలు విద్యాసంస్థలున్నాయి. వైద్యకళాశాలలు: గుంటూరు వైద్య కళాశాల, కాటూరి వైద్య కళాశాల, ఎన్ఆర్ఐ వైద్యకళాశాల విశ్వవిద్యాలయాలు:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం, కెఎల్ విశ్వవిద్యాలయం. ఆకర్షణలు ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను 2019లో 1,05,68,262 పర్యాటకులు దర్శించారు. అనంతపద్మనాభస్వామికి అంకితమివ్వబడిన గుహలు గల ఉండవల్లి గుహలు, పానకాలస్వామి అని పేరుగాంచిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంగల మంగళగిరి మూలాలు వెలుపలి లంకెలు వర్గం:గుంటూరు జిల్లా వర్గం:కోస్తా వర్గం:ఆంధ్రప్రదేశ్ జిల్లాలు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:భారతదేశం లోని జిల్లాలు
ఆంధ్రప్రదేశ్
https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. రాష్ట్రానికి వాయవ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. కేంద్రపాలితప్రాంత భూభాగం పుదుచ్చేరికి చెందిన యానాం రాష్ట్రం హద్దులలో ఉంది. విస్తీర్ణంతో ఇది ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశంలో గుజరాత్ తరువాత తో రెండవ పొడవైన తీరప్రాంతం కలిగివుంది. కోహినూర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు రాష్ట్రంలోని కోళ్లూరు గనిలో లభించాయి. భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన తెలుగు దీని అధికార భాష. తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. పంచారామ క్షేత్రాలు, శ్రీశైల క్షేత్రం, కోదండ రామాలయం వంటి అనేక పుణ్యక్షేత్రాలు, అమరావతి స్తూపంతో పాటు ఇంకా పలు ప్రదేశాలలో బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, విశాఖపట్నం సముద్ర తీరం, అరకు లోయ, హార్స్‌లీ కొండలు, కోనసీమ డెల్టా లాంటి సహజ ఆకర్షణలు ఉన్నాయి. పేరు వ్యుత్పత్తి సామాన్య శక పూర్వం (సా.శ.పూ.) 8 వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరేయ బ్రాహ్మణ లో ఆంధ్రస్ అనే వ్యక్తుల సమూహం ప్రస్తావించబడింది. ఆంధ్రులు ఉత్తర భారతదేశంలో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వామిత్ర సంతతి వారని, అస్సాక జనపదం (సా.శ.పూ. 700-300) ఆగ్నేయ భారతదేశంలోని గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణ, మహాభారత పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆంధ్రదేశానికి, భారతదేశానికి తొలి రాజులైన ఆంధ్రులు అని పిలవబడిన శాతవాహనులను ఆంధ్ర, ఆంధ్ర జాతీయ, ఆంధ్రభృత్య పురాణాలలో అనటం వలన కూడా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని తెలుస్తుంది. వారు వారి నాణేలు లేదా శాసనాలలో ఆంధ్రులమని చెప్పుకోలేదు. వారి జాతి కారణంగా లేదా వారి భూభాగం ఆంధ్ర ప్రాంతాన్ని కలిగి ఉన్నందున వారిని ఆంధ్రులు అని పిలిచిన అవకాశం ఉంది. చరిత్ర భారత స్వాతంత్ర్య పూర్వకాలపు చరిత్ర alt=|thumb| తెలుగు తల్లి thumb| చంద్రగిరి కోట రాజ్‌మహల్ అస్సాకా మహాజనపదం పదహారు వేల మహాజనపదాలలో ఒకటి. దీనిలో ప్రస్తుత ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణలు ఉన్నాయి. సా.శ.పూ. 5వ శతాబ్దంలో ప్రతీపాలపురం రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని భట్టిప్రోలు స్తూపం త్రవ్వకాలలో ఆధారాలు లభించాయి. అమరావతి, ధాన్యకటకం, వడ్డమాను వంటి ప్రదేశాల పురావస్తు ఆధారాలు ఆంధ్ర ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగమని సూచిస్తున్నాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకాన్ని సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. అశోక చక్రవర్తి మరణం (సా.శ.పూ. 232) తరువాత, మౌర్య పాలన సా.శ.పూ. 200 ప్రాంతంలో బలహీనపడింది. ఆంధ్ర ప్రాంతంలో అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. శాతవాహనులు సా.శ.పూ. 3 వ శతాబ్దం నుండి సామాన్య శకం (సా.శ.) 2 వ శతాబ్దం వరకు దక్కన్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించారు. శాతవాహనులు ధరణికోటని తమ రాజధానిగా చేసుకున్నారు. వారు సామ్రాజ్యాన్ని మరాఠా దేశం హద్దులు దాటి విస్తరించారు. బౌద్ధ గ్రంథాల ప్రకారం మహాయాన తత్వవేత్త నాగార్జున సా.శ. 2-3 వ శతాబ్దాలలో నివసించాడు. తరువాత ఆంధ్ర ఇక్ష్వాకులు, విజయపురి రాజధానిగా, సా.శ. 2 వ శతాబ్దం చివరి అర్ధ భాగంలో కృష్ణా నది లోయలో పాలించారు. మొదట శాతవాహన రాజుల క్రింద కార్యనిర్వాహక అధికారులుగా ఉన్న పల్లవులు, సా.శ. 2 వ శతాబ్దానికి ముందు గుర్తించబడిన రాజకీయ శక్తి కాదు. సా.శ. 7 వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో రెండవ పులకేశి నేతృత్వంలోని పశ్చిమ చాళుక్యుల దండయాత్రలో ఓడిపోయారు. సాలంకాయనులు ఆంధ్ర ప్రాంతాన్ని సా.శ. 300 నుండి సా.శ. 440 వరకు వేంగి రాజధానిగా పరిపాలించారు. ఇక్ష్వాకుల పతనం తరువాత, విష్ణుకుండినులు సా.శ. 5, 6 వ శతాబ్దాలలో మొట్టమొదటి గొప్ప రాజవంశంగా కళింగ, తెలంగాణలోని కొన్ని భాగాలతో సహా మొత్తం ఆంధ్రదేశంపై పట్టు సాధించారు. వారు ఏలూరు, అమరావతి, పురానిసంగం కేంద్రాలుగా ముఖ్యమైన పాత్ర పోషించారు. సా.శ 5వ శతాబ్దంలో రేనాటి చోళులు పాలించారు. తెలుగు భాష మూలాలు గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, ఇతరచోట్ల దొరికిన నాటి శాసనాలలో కనబడతాయి. వెంగీ (తూర్పు చాళుక్యులు) రాజవంశం సా.శ. 7 వ శతాబ్దం నుండి సా.శ. 1130 వరకు ఐదువందల సంవత్సరాలు కొనసాగింది. చివరికి చోళ రాజవంశంలో విలీనం అయ్యింది. వారు 1189 వరకు చోళ రాజవంశం రక్షణలో పాలన కొనసాగించారు. చివరిగా వారి రాజ్యం హొయసలు, యాదవులకు లొంగిపోయింది. కాకతీయులు సా.శ 12- 14 శతాబ్దాలలో ఈ ప్రాంతాలను పరిపాలించారు. వీరు అనేక కోటలను నిర్మించారు. వీరి తరువాత ముసునూరి నాయకులు పాలించారు. తెలుగు ప్రాంతాలలో ఢిల్లీ సుల్తాను పాలనను పడగొట్టడానికి ముసునూరి నాయకులు, ప్రాంతంలోని నాయకుల సమాఖ్యకు నాయకత్వం వహించారు. 14 వ శతాబ్దం ప్రారంభంలో ప్రోలయ వేమారెడ్డి చేత రెడ్డి రాజ్యం (సా.శ.1325–సా.శ.1448) స్థాపించబడింది. వీరు నేటి కొండవీడు నుండి పాలించారు. ఢిల్లీ సుల్తానుల ముస్లిం సైన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన రాష్ట్రాల సమాఖ్యలో భాగంగా ప్రోలయ వేమారెడ్డి కొండవీడు కోటను నిర్మించాడు. ఈ ప్రాంతం ఒరిస్సా గజపతుల స్వాధీనం లోకి పోయి, 1458 లో బహమనీ రాజ్యపు ముస్లిం పాలకులచే ధ్వంసం చేయబడింది. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు సా.శ.1516 లో దీనిని స్వాధీనం చేసుకున్నాడు. గోల్కొండ సుల్తాన్లు 1531, 1536, 1579 లలో కోట పై దాడి చేశారు. సుల్తాన్ కులీ కుతుబ్ షా 1579 లో దీనిని స్వాధీనం చేసుకుని, ముర్తుజానగర్ అని పేరు పెట్టాడు. తరువాత విజయనగర రాజులు మరల స్వాధీనం చేసుకున్నారు. విజయనగర సామ్రాజ్యం కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతాలలో లలిత కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించింది. ఈ కాలంలోనే కర్ణాటక సంగీతం ఆధునిక రూపంలోకి అభివృద్ధి చెందింది.Historians such as P. B. Desai (History of Vijayanagar Empire, 1936), Henry Heras (The Aravidu Dynasty of Vijayanagara, 1927), B. A. Saletore (Social and Political Life in the Vijayanagara Empire, 1930), G.S. Gai (Archaeological Survey of India), William Coelho (The Hoysala Vamsa, 1955) and Kamath (Kamath 2001, pp. 157–160) విజయనగర సామ్రాజ్య కాలంలో, పెమ్మసాని నాయకులు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించారు. వారు పెద్ద కిరాయి సైన్యాలను కలిగి ఉన్నారు, ఇవి పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి రక్షణగా ఉన్నాయి. లేపాక్షిలో శివ, విష్ణు, వీరభద్ర ఆలయాల సమూహం సాంస్కృతికంగా, పురావస్తుపరంగా ముఖ్యమైనవి. వీటిలో విజయనగర రాజుల కుడ్య చిత్రాలు, ద్రావిడ కళ, శాసనాలు ఉన్నాయి. ఆలయ సముదాయం దగ్గర పెద్ద గ్రానైట్ నంది శిల్పం ఉంది. సా.శ. 1347లో, దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తానుకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు ఫలితంగా అల్లావుద్దీన్ బహమన్ షా చేత బహమనీ సుల్తానేట్ స్వతంత్ర ముస్లిం రాజ్యంగా స్థాపించబడింది. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ బహమనీ సుల్తాన్ కొలువులో పనిచేశాడు. గోల్కొండను జయించి అధిపతి అయ్యాడు. 1518లో బహమనీ సామ్రాజ్యము పతనమై ఐదు దక్కన్ సుల్తనేట్ ఆవిర్భవించుచున్న సమయములో బహమనీ సుల్తానుల నుండి స్వతంత్రము ప్రకటించుకొని, "కుతుబ్ షా" అనే పట్టము స్వీకరించి గోల్కొండ కుతుబ్ షాహీ వంశమును స్థాపించాడు. కుతుబ్ షాహీ వంశం పదహారవ శతాబ్దం ప్రారంభం నుండి పదిహేడవ శతాబ్దం చివరి వరకు సుమారు రెండు వందల సంవత్సరాలు పట్టు సాధించింది. సా.శ.1687లో మొగల్ రాజు ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంతో మొగలుల ప్రత్యక్షపాలన ప్రారంభమైంది. సా.శ.1724 లో మొగల్ రాజప్రతినిధి గావున్న నిజామ్ ఉల్ ముల్క్ అనే బిరుదు గల చిన్ కిలిచ్ ఖాన్ ను అసఫ జా బిరుదుతో దక్కన్ పాలకుడుగా వుండుటకు అప్పటి మొగల చక్రవర్తి మహమ్మద్ షా అనుమతించడంతో అసఫజాహీ వంశ పాలనప్రారంభమైంది. సా.శ. 1766 లో నిజాం ఆలీఖాన్ పాలనలో ఉత్తర సర్కార్లను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించగా, అవి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమయ్యాయి. తరువాత ఇతర తీరప్రాంతాలు కూడా కంపెనీ పాలనలో చేరాయి. సా.శ.1800 లో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ సైన్యసహకారపద్ధతికి అంగీకరించి నిజాం ఆలీఖాన్ ఐదు భూభాగాలను (అప్పటి కర్నూలు, కడప, అనంతపూరు,చిత్తూరు, బళ్లారి భూభాగాలు) కంపెనీ వారికి అప్పగించాడు. స్థానిక స్వయంప్రతిపత్తికి బదులుగా బ్రిటిష్ పాలనను అంగీకరించి, నిజాం హైదరాబాద్ రాచరిక రాష్ట్రంగా అంతర్గత ప్రాంతాలపై నియంత్రణను సాధించాడు. 1947 లో భారతదేశం బ్రిటీషు పాలన నుండి స్వతంత్రమైంది. నిజాం హైదరాబాద్ రాచరిక రాష్ట్ర స్వాతంత్ర్యాన్ని నిలుపుకోవాలనుకున్నాడు, కాని ఆ ప్రాంత ప్రజలు భారతదేశంలో చేరడానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1948 లో హైదరాబాద్ రాచరిక రాష్ట్రం, ఆపరేషన్ పోలోతో భారతదేశంలో విలీనం చేయబడింది. మతం బౌద్ధమతం చరిత్ర ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ కు వ్యాపించింది. దాదాపు వెయ్యి సంవత్సరాలు కృష్ణా నది లోయ అసాధారణమైన బౌద్ధ కార్యకలాపాల ప్రదేశంగా విరాజిల్లింది.Davidson, Ronald. Tibetan Renaissance. Columbia 2005, pp. 29. అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేటతో సహా దిగువ కృష్ణ లోయలోని పురాతన బౌద్ధ ప్రదేశాలు కనీసంగా సా.శ.పూ. మూడవ శతాబ్దానివని గుర్తించారు.Padma, Sree. Barber, Anthony W. Buddhism in the Krishna River Valley of Andhra. SUNY Press 2008, pg. 2. ఈశాన్య భారతదేశంలో మగధతో పాటు మహాయాన బౌద్ధమతం అభివృద్ధిలో ఈ ప్రాంతం ప్రధాన పాత్ర పోషించింది.Padma, Sree. Barber, Anthony W. Buddhism in the Krishna River Valley of Andhra. SUNY Press 2008, p.1Peter Harvey (2013), An Introduction to Buddhism: Teachings, History and Practices, Cambridge University Press, p.108 ఎ.కె.వార్డర్ "మహాయాన భారతదేశానికి దక్షిణాన చాలవరకు కచ్చితంగా ఆంధ్రదేశంలో ఉద్భవించింది" అని పేర్కొన్నాడు.Warder, A. K. Indian Buddhism. 2000. p. 313 జింగ్ "దక్షిణ భారతదేశంలోని మహాసంఘికలలో ప్రజ్ఞాపారమిత బహుశా ఆంధ్రదేశంలో, కృష్ణా నదిపై అభివృద్ధి చెందుండొచ్చని పలువురు పండితులు సూచించారు" అని పేర్కొన్నాడు.Guang Xing. The Concept of the Buddha: Its Evolution from Early Buddhism to the Trikaya Theory. 2004. pp. 65–66 ప్రజ్ఞాపారమిత సూత్రాలు తొలి మహాయాన సూత్రాలకు చెందినవి.Williams, Paul. Buddhist Thought. Routledge, 2000, pages 131.Williams, Paul. Mahayana Buddhism: The Doctrinal Foundations 2nd edition. Routledge, 2009, pg. 47. తరువాత బౌద్ధమతం ఆదరణ తగ్గి, హిందూమతం ఆదరణ పెరిగింది. ఈ ప్రాంతంలో హిందూమత ఆధ్యాత్మిక వేత్తలలో ఆది శంకరాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మొదలైనవారున్నారు. మతాన్ని నిరసించిన వారిలో వేమన ప్రముఖుడు. స్వాతంత్య్రానంతర చరిత్ర మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నంలో, పొట్టి శ్రీరాములు 1952 లో నిరాహార దీక్షచేసి మరణించాడు. ఫలితంగా మద్రాస్ రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు 1953 అక్టోబరు 1 న విడగొట్టబడి, కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆంధ్రను, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా 1956 నవంబరు 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. హైదరాబాద్‌ను కొత్త రాష్ట్రానికి రాజధానిగా చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలు బొంబాయి రాష్ట్రంతో, కన్నడ మాట్లాడే ప్రాంతాలు మైసూర్ రాష్ట్రంలో విలీనం అయ్యాయి. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. 1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పు మూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడుకు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి.తరువాత, 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగస్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి. 1982 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నందమూరి తారక రామారావు 1982 లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, తొమ్మిది నెలలలోనే కాంగ్రెసును ఓడించి, రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టాడు. 1989 ఎన్నికలలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టటంతో, మరల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 1990 లో నేదురుమల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, 1992 లో మళ్ళీ విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. 1994 లో ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ మరోసారి గెలిచింది. ఎన్‌.టి రామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అతని అల్లుడు నారా చంద్రబాబునాయుడు 1995 లో తన మామకు వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీలో అధికశాతం శాసనసభ సభ్యుల మద్దతు కూడగట్టటంతో అధికారంలోకి వచ్చాడు. 1999 లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించింది. ఆ విధంగా నాయుడు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి (1995 - 2004)గా రికార్డును కలిగి ఉన్నాడు. రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలు, విభజన రాష్ట్రం ఏర్పడిన తరువాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, దానికి పోటీగా సమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. 2004 శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఐదేళ్ళ అనంతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి మహాకూటమి తరపున పోటీచేశాయి. చలన చిత్ర నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలవటంతో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరల ముఖ్యమంత్రి అయ్యాడు. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు ఆయన పాలించిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 2009 లో కె.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదమైన లక్ష్యం కొరకు ప్రయత్నించినప్పటికి సత్ఫలితాలివ్వలేదు. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపైబడి సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటును ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్, బిల్లు తయారీ జరిగింది. ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ, శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తికాకముందే, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి. 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా, ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది. ఫలితంగా నల్లారి కిరణకుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేయటంతో ఎన్నికలు దగ్గరబడుతున్నందున, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ఆసక్తి చూపనందున రాష్ట్రపతిపాలన విధించబడింది. హైదరాబాద్ పదేళ్లవరకు ఉమ్మడి రాజధానిగా ఉండే విధంగా 2014 జూన్ 2 న తెలంగాణ కొత్త రాష్ట్రంగా, సీమాంధ్ర ప్రాంతం అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినవి. హైదరాబాదు రాజధానిగా దాదాపు మూడు సంవత్సరాల వరకు కొనసాగింది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకుస్థాపన జరిగింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 చెల్లుబాటును ప్రశ్నించిన పిటిషన్లు అత్యున్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం ముందు 2014 ఏప్రిల్ నుండి తీర్పు కోసం వేచి ఉన్నాయి. భౌగోళిక స్థితి రాష్ట్రంలో తూర్పు కనుమలు నుండి బంగాళాఖాతం తీరం వరకు వైవిధ్యభరిత పర్యావరణ వ్యవస్థలు, వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. కృష్ణ, గోదావరి అనే రెండు ప్రధాన నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర తీరం శ్రీకాకుళం జిల్లా నుండి నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉంది. తూర్పు కనుమలకు తీరం మధ్య గల మైదానాలు చాలావరకు గోదావరి, కృష్ణ, పెన్నా నదులచే ఏర్పడిన డెల్టా ప్రాంతాలు. తూర్పు కనుమలు విడిపడి వుండడంతో ఈ విభాగాలకు స్థానిక పేర్లు ఉన్నాయి. ఇవి రాష్ట్ర భౌగోళికంలో ఒక ప్రధాన విభజన రేఖగా ఉన్నాయి. దీని రెండు వంపు శాఖలచే ఏర్పడిన కడప బేసిన్ ఖనిజ సంపన్న ప్రాంతం. కోస్తాంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములలో లక్షల హెక్టార్ల భూమి సాగు చేయబడుతుంది. రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పాక్షిక శుష్క పరిస్థితులు ఉన్నాయి. సహజ వృక్షసంపద, వాటి పరిరక్షణ alt=|thumb| కాకినాడ సమీపంలో మడ అడవి రాష్ట్రంలోని మొత్తం అడవుల విస్తీర్ణం . రాష్ట్రంలోని అటవీప్రాంతాన్ని విస్తృతంగా నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. దక్కన్ పీఠభూమి మధ్య పీఠభూమి తూర్పు ఎత్తైనభూములు తూర్పు తీర మైదానాలు తూర్పు కనుమల ప్రాంతం దట్టమైన ఉష్ణమండల అడవులకు నిలయంగా ఉంది. అయితే కొండప్రాంతాల నుండి దక్కన్ పీఠభూమివైపు వృక్షసంపద తక్కువగా, పొద వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. రాష్ట్రంలో లభించే వృక్షసంపద చాలావరకు పొడి ఆకురాల్చే రకాలైన టేకు, టెర్మినాలియా, డాల్బెర్జియా, స్టెరోకార్పస్, అనోజిస్సస్ మొదలైన వాటిని కలిగివుంది. ప్రపంచంలో అరుదైన మొక్కలైన ఎర్రచందనం, సైకస్ బెడ్డోమి, టెర్మినాలియా పల్లిడా, సిజీజియం ఆల్టర్నీఫోలియం షోరియా తలూరా మొదలైనవి రాష్ట్రంలో విస్తారంగా దొరకుతాయి. కొరింగ, కృష్ణ వన్యప్రాణుల అభయారణ్యం, నాగార్జున్‌సాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం, కంబలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాల, ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల వంటి అనేక అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జంతుప్రదర్శనశాలలు ఉన్నాయి . ఏటపాక, లేలపట్టు, తెలినీలపురం, తేలుకుంచి, పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యాలు అనేక వలస పక్షులను ఆకర్షిస్తున్నాయి. పులులు, నల్ల చిరుత పులి, దుమ్ములగొండి, కృష్ణ జింక, చిరుతపులి, సాంబార్ (లేడి), సముద్ర తాబేలు, అనేక పక్షులు, సరీసృపాలు రాష్ట్ర జంతుజాల వైవిధ్యతను సూచిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాలలో గొప్ప మడ అడవులతో పాటు బావురు పిల్లులు, నీటి కుక్కలు, కీస్టోన్ జాతి జంతువులున్నాయి రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర చెట్టుగా వేపచెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పువ్వుగా మల్లెపువ్వు 2018, జూన్ 6 న అమల్లోకి వచ్చాయి. వాతావరణం భౌగోళిక ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వాతావరణం గణనీయంగా మారుతుంది. మార్చి నుండి జూన్ వరకు వేసవికాలం ఉంటుంది. తీర మైదానంలో, వేసవి ఉష్ణోగ్రతలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రత మధ్య ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు ఉష్ణమండల వర్షాలు పడే కాలం. మొత్తం వర్షపాతంలో మూడింట ఒకవంతు ఈశాన్య రుతుపవనాల ద్వారా వస్తుంది. అక్టోబరు, నవంబరులో బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థలు, ఉష్ణమండల తుఫానులు ఏర్పడతాయి. ఇవి ఈశాన్య ఋతుపవనాలతో పాటు రాష్ట్రంలోని దక్షిణ తీర ప్రాంతాలకు వర్షాలు కలగజేస్తాయి. నవంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం సాగుతుంది. రాష్ట్రానికి పొడవైన తీరప్రాంతం ఉన్నందున శీతాకాలం మరీ చల్లగా ఉండదు. శీతాకాలపు ఉష్ణోగ్రత సాధారణంగా . చల్లని వాతావరణం గల విశాఖపట్నం జిల్లాలోని లంబసింగిని "ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్" అని పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత మధ్య వుంటుంది. జనాభా విషయాలు 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభా , జనాభా సాంద్రత . పోలవరం ఆర్డినెన్స్ బిల్లు 2014 ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసినందున జనాభా 2,47,515 పెరిగింది. ఈ విధంగా 2014 సంవత్సరంలో 2011 జనాభా లెక్కలు ఆధారంగా జనాభా 4,96,34,314, జనసాంద్రత . కాకేసియన్ (Caucasian), మంగోలాయిడ్ (mongoloid), ఆస్ట్రాలో మెలనేసియన్ (వెడ్డాయిడ్) జాతుల ప్రజలు ఆంధ్రప్రదేశ్ అంతటా కనిపిస్తారు. మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 70.4% అనగా 3,47,76,389, పట్టణ జనాభా 29.6% అనగా 1,46,10,410 గా నమోదైంది. 0–6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 52,22,384 మొత్తం జనాభాలో 10.6%గా ఉన్నారు. వారిలో 26,86,453 మంది బాలురు, 25,35,931 మంది బాలికలు ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధిక పట్టణ జనాభా 47.5%, శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గ్రామీణ జనాభా 83.8% ఉంది. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులం జనాభా 17.1%, షెడ్యూల్డ్ తెగ జనాభా 5.3%. 2,47,38,068 పురుషులు, 2,46,48,731 మహిళలుండగా, లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 996 స్త్రీలుగా ఉంది. ఇది జాతీయ సగటు 1,000 కి 926 కంటే ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత 67.41%. 2021 నాటికి నవ్యాంధ్ర రాష్ట్ర అక్షరాస్యత 91.1%కి చేరుకోవచ్చు. జిల్లాలను విశ్లేషిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక అక్షరాస్యత 74.6%, విజయనగరంలో అత్యల్ప అక్షరాస్యత 58.9% నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి సూచిక విలువ 0.416 తో భారతీయ రాష్ట్రాలలో పదవ స్థానంలో ఉంది. భాషలు తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష. ఇది దాదాపు 90% జనాభాకు మాతృభాష. 2008 లో తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించారు. ఉర్దూ అతిపెద్ద అల్ప సంఖ్యాకుల భాష. సరిహద్దు ప్రాంతాల్లో తమిళం, కన్నడ, ఒడియా మాట్లాడుతారు. లంబాడి, కోయా, సవారా, కొండా, గడాబా లాంటి అనేక ఇతర భాషలను రాష్ట్రంలోని ఆదివాసులు వాడతారు. మతాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది ప్రజలు హిందువులు కాగా, ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలోని ప్రధాన మత సమూహాలు హిందువులు (90.87%), ముస్లింలు (7.32%), క్రైస్తవులు (1.38%). కొద్ది సంఖ్యలో బౌద్ధులు, సిక్కులు, జైనులు, తమ మతాన్ని చెప్పడానికి నిరాకరించిన ప్రజలు ఉన్నారు. పరిపాలనా విభాగాలు ఆంధ్రప్రదేశ్ నైరుతిలో రాయలసీమ, తూర్పు, ఈశాన్యంలో బంగాళాఖాతానికి సరిహద్దులో ఉన్న కోస్తాంధ్ర ,ఉత్తరాంధ్ర అనే మూడు ప్రధాన ప్రాంతాలను కలిగి ఉంది. జిల్లాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటము|300px|right|thumb రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా 2022 ఏప్రిల్ 4న పునర్వ్యవస్థీకరించారు. గణాంకాలతో జిల్లాలు వ.సంఖ్యజిల్లాప్రధాన కార్యాలయంరెవిన్యూ డివిజన్లుమండలాలు సంఖ్య ( 2022 లో )వైశాల్యం (కి.మీ2)జనాభా (2011 ) లక్షలలో జనసాంద్రత (/కి.మీ2)అనకాపల్లిఅనకాపల్లి2244,29217.270402అనంతపురంఅనంతపురం33110,20522.411220అన్నమయ్యరాయచోటి3307,95416.973213అల్లూరి సీతారామరాజుపాడేరు22212,2519.5478ఎన్టీఆర్విజయవాడ3203,31622.19669ఏలూరుఏలూరు3286,67920.717310కర్నూలుకర్నూలు3267,98022.717285కాకినాడకాకినాడ2213,01920.923693కృష్ణామచిలీపట్నం4253,77517.35460గుంటూరుగుంటూరు2182,44320.91856చిత్తూరుచిత్తూరు4316,85518.730273కోనసీమఅమలాపురం3222,08317.191825తిరుపతితిరుపతి4348,23121.970267తూర్పు గోదావరిరాజమహేంద్రవరం2192,56118.323715నంద్యాలనంద్యాల3299,68217.818184పల్నాడునరసరావుపేట3287,29820.42280పశ్చిమ గోదావరిభీమవరం2192,17817.80817పార్వతీపురం మన్యంపార్వతీపురం2153,6599.253253ప్రకాశంఒంగోలు33814,32222.88160బాపట్లబాపట్ల3253,82915.87414విజయనగరంవిజయనగరం3274,12219.308468విశాఖపట్నంవిశాఖపట్నం2111,04819.5951870వైఎస్ఆర్కడప43611,22820.607184శ్రీకాకుళంశ్రీకాకుళం3304,59121.914477శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరునెల్లూరు43810,44124.697237శ్రీ సత్యసాయిపుట్టపర్తి3328,92518.400206 రెవెన్యూ విభాగాలు జిల్లాల సవరణలతో 50 రెవెన్యూ విభాగాలను 75 కు పెంచారు. కొత్తగా 25 డివిజన్లు ఏర్పడ్డాయి. వీటిలో కోనసీమ జిల్లాలో కొత్తపేట రెవిన్యూ డివిజన్ పునరుద్ధరణ, వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు, 2022 జూన్ లో జరిగాయి. బాపట్ల జిల్లాలో రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిక గెజెట్ 5 ఆగష్టు 2022 న ప్రకటించారు. సగటున 8 నుంచి 12 మండలాలు ఒక రెవెన్యూ విభాగంలో వున్నాయి. అయితే కుప్పం రెవిన్యూ డివిజన్ లో తక్కువగా నాలుగు మండలాలే వున్నాయి. విజయవాడ, విశాఖపట్నం నగర ప్రాంతాలలో ఐదారు మండలాలకే ఒక రెవిన్యూ డివిజన్ వుంది. మండలాలు రాష్ట్రాన్ని 679 మండలాలుగా విభజించారు. పట్టణ స్థానిక సంస్థలు center|thumb|800x800px|<center> విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభాగల, భారతదేశంలో 14 వ అతిపెద్దదైన నగరం.</center> రాష్ట్రంలో మొత్తం 125 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇందులో 16 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 32 నగర పంచాయతీలు ఉన్నాయి.విశాఖపట్నం, విజయవాడ నగరాలు పది లక్షల కంటే ఎక్కువ జనాభా గలవి. ప్రభుత్వం, రాజకీయాలు thumbnail|right|250px|అమరావతిలో సచివాలయ భవన సముదాయం 2014 జూన్‌ 2 న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విడిపోగా మిగిలిన భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది సభ్యులతో శాసనసభ, 58 మంది సభ్యులతో శాసనమండలి ఏర్పాటయింది. భారత పార్లమెంటులో రాష్ట్రానికి లోక్‌సభలో 25, రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాలలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 19, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 9 స్థానాలు ఉన్నాయి. 2014 లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని మండలాలు సీమాంధ్రలో కలవడంతో నవ్యాంధ్ర లేక నవ్యాంధ్ర ప్రదేశ్ అనే పేరు తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 లో జరిగిన చివరి ఎన్నికలలో, తెదేపాకు అవశేష (కొత్త) రాష్ట్రంలో ఆధిక్యం లభించింది. నారా చంద్రబాబునాయుడు 2014 జూన్ 8న, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. 2011 లో వైయస్ఆర్ కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికలలో భారీ ఆధిక్యత సాధించగా, వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. తెలంగాణాతో కొన్ని 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన, షీలా భిడే కమిటీ సిఫారసుల మేరకు 9వ షెడ్యూల్‌లోని 40 సంస్థల విభజన మరి ఇతర సమస్యలు ఇంకా పరిష్కరించబడవలసి ఉంది. జగన్ ప్రభుత్వం సమీకృత అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నరు ఆమోదముద్ర పడింది. ఈ చట్టాన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసినందున, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం అమరావతి రాజధానిగా కొనసాగుచున్నది. హైకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఈ శాసనం రద్దుచేసి, మరల కొత్త శాసనాన్ని ప్రవేశపెడతామని తెలిపింది. ఇది ఇలా వుండగా 2022 మార్చి ౩ న ఉన్నత న్యాయస్థానపు త్రిసభ్య ధర్మాసనం రాజధాని వికేంద్రీకరణ శాసనం చెల్లదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4 నుండి అమలయ్యేటట్లు 13 జిల్లాలను, ప్రధానంగా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికగా 26 జిల్లాలుగా మార్చింది. సుస్థిరాభివృద్ధి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) సూచీలో 2020-21గానూ కేరళ 75 పాయింట్లను సాధించి తన తొలి స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంది. బీహార్ ఈ సూచిలో చివరిస్థాయిలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఒక్కొక్కటి 74 పాయింట్లతో రెండో స్థానంలో, 72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానానికి చేరుకోగా, 69 పాయింట్లతో తెలంగాణ ఆరో స్థానానికి దిగజారింది. ఆర్థిక వ్యవస్థ కుడి|thumb| ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం విశాఖపట్నం alt=seaport distance view|thumb| విశాఖపట్నం వీక్షణ, ఓడరేవువైపు నుండి 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ఆధారంగా, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ₹12,01,736 కోట్లు (ముందస్తు అంచనా). గత సంవత్సరపు విలువ ₹10,14,374 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిగా ఏడాదిలో ₹ 1,87,362 కోట్ల పెరుగుదల నమోదైంది. వార్షిక వృద్ధి రేటు 18.47% దేశపు వృద్ధి రేటు 17 శాతం కంటే ఎక్కువ. వ్యవసాయరంగం : ₹3.9 లక్షల కోట్లు (+14.5%) పారిశ్రామిక రంగం : ₹2.5 లక్షల కోట్లు (+25.5% ) సేవా రంగం : ₹4.67 లక్షల కోట్లు (+18.9% ) 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత విలువ ప్రాతిపదికన, తలసరి ఆదాయం ₹2,00,771. అంతకు ముందు సంవత్సరంలో తలసరి ఆదాయం ₹176,000. ఏడాదిలో రాష్ట్రంలో ₹31 వేలు తలసరి ఆదాయం పెరగగా, దేశంలో తలసరి ఆదాయం ₹23 వేలు పెరిగింది. మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ) లో భారత రాష్ట్రాల్లో 27వ స్థానంలో ఉంది; వ్యాపార నిర్వహణ అనుకూలత ప్రపంచ బ్యాంకు జరిపే వ్యాపార నిర్వహణ అనుకూలత (Ease of doing business) లో రాష్ట్రం, దేశం మొత్తం మీద 2015 లో రెండవ స్థానంలోను, 2018 లో మొదటి స్థానంలోనూ నిలిచింది. 2010 నాటి ఫోర్బ్స్ పత్రిక అత్యధిక ధనవంతులైన 100 మంది జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు వ్యక్తులు ఉన్నారు. వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, పశు పోషణ మీద ఆధారపడి ఉంది. భారతదేశంలోని నాలుగు ముఖ్యమైన నదులు, గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర రాష్ట్రం గుండా ప్రవహిస్తూ వ్యవసాయానికి నీటిని అందిస్తున్నాయి. జనాభాలో 60 శాతం మంది వ్యవసాయం, దాని సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. వరి రాష్ట్రంలోని ప్రధాన ఆహార పంట. చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు, కూరగాయలకు, కృష్ణ జిల్లాలో మామిడికి, గుంటూరు జిల్లాలో మిరపకాయలకు మూడు వ్యవసాయ ఆర్థిక మండలాలు ఉన్నాయి. రైతులు వరితో పాటు జొన్న, సజ్జలు, మొక్కజొన్న, సిరిధాన్యాలు, అనేక రకాల పప్పులు, నూనె గింజలు, చెరకు, పత్తి, మిరపకాయ, మామిడి, పొగాకును పండిస్తారు. ఆయిల్ పామ్, ప్రొద్దు తిరుగుడు, వేరుశనగ వంటి పంటల నుండి వంట నూనె ఉత్పత్తి చేస్తారు. అనేక నీటిపారుదల ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి. ఉద్యానవన పంటల్లో బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, సపోటా ముఖ్యమైనవి. పశుపోషణ, కోళ్ల పెంపకం మరొక లాభదాయక వ్యాపారం. ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం చేపలు, రొయ్యలు సాగులో దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దేశం మొత్తంలో మత్యసంపదలో 10% చేపలు, 70% రొయ్యల ఉత్పత్తి రాష్ట్రంలో జరుగుతున్నది. వన్నమీ రొయ్యలు అత్యధికంగా ఎగుమతి చేయబడుతున్న సముద్ర ఎగుమతులు. వీటిద్వారా 2013–2014లో ఆదాయం ఒక బిలియన్ ను దాటవచ్చని భావిస్తున్నారు. పరిశ్రమలు alt=Front of large round building, with street and trees in front|thumb| టెక్ మహీంద్రా డెవలప్‌మెంట్ సెంటర్, విశాఖపట్నం రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఔషధ, ఆటోమొబైల్, వస్త్రాలు వంటి కీలక రంగాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీ ఒక సమగ్ర వ్యాపార నగరం, ఇది పెప్సికో, ఇసుజు మోటార్స్, క్యాడ్‌బరీ ఇండియా, కెల్లాగ్స్, కోల్‌గేట్-పామోలివ్, కోబెల్కో మొదలైన సంస్థలకు నిలయం. పెప్సికో సంస్థ శ్రీ సిటీలో భారతదేశంలో అతిపెద్ద ప్లాంటును కలిగి ఉంది. కృష్ణా జిల్లాలోని అశోక్ లేలాండ్, చిత్తూరు జిల్లాలో హీరో మోటార్స్, అనంతపురం జిల్లాలోని కియా ఇండియా వంటి సంస్థలతో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. 2012–2013లో విశాఖపట్నం కేంద్రంగా ఐటి / ఐటి ఆధారిత సేవలు రెవెన్యూ ₹ 14.45 బిలియన్లు. 2012-2013 లో, ఐటి / ఐటి ఆధారిత సేవలు ఆదాయాలు విజయవాడలో ₹ 1,153 మిలియన్, తిరుపతిలో ₹ 693 మిలియన్, కాకినాడలో ₹ 615 మిలియన్ గా నమోదైంది. వనరులు ఖనిజాలు విభిన్న భౌగోళిక నిర్మాణాలతో గొప్ప, వివిధ రకాల పారిశ్రామిక ఖనిజాలు, నిర్మాణాల్లో ఉపయోగించే రాళ్ళ నిల్వలున్నాయి. సున్నపురాయి, మేంగనీస్, రాతినార, ఇనుము, బంతి బంకమట్టి, అగ్ని మట్టి, వజ్రం, గ్రాఫైట్, డోలమైట్, స్పటికం, టంగ్‌స్టన్, స్టీటిటిక్, ఫెల్డ్‌స్పార్, సిలికా, బారియెట్స్, గెలాక్సీ గ్రానైట్, ఇసుక, యురేనియం, బాక్సైట్ మొదలైనవి ఉన్నాయి. భారతదేశంలో అభ్రకం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో, సున్నపురాయి నిల్వలలో మూడింట ఒక వంతు కలిగి ఉంది. తుమ్మలపల్లె యురేనియం గనిలో 49000 టన్నుల ముడి ధాతువు వున్నట్లు ధ్రువీకరించబడింది. దీనికంటె మూడు రెట్లు ఎక్కువ నిల్వలను కలిగి ఉండవచ్చని సూచనలు ఉన్నాయి. మెటల్ గ్రేడ్ బాక్సైట్ నిక్షేపాలు విశాఖపట్నం నౌకాశ్రయానికి సమీపంలో 700 మిలియన్ టన్నులు ఉన్నాయి. చమురు, సహజ వాయువు రిలయన్స్ ఇండస్ట్రీస్ కాకినాడ సమీపంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో దూరంలోగల కెజి బేసిన్ లో, తొమ్మిది ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువు నిల్వలను కనుగొనింది. 2016 లో, కెజి బేసిన్లో దాదాపు మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు వున్నట్లు కనుగొనబడింది. అవస్థాపనా వసతులు వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధికి రవాణా, విద్యుత్తు, డిజిటల్ నెట్వర్క్ లాంటి అవస్థాపన వసతులు కీలకం. రవాణా రహదారి, రైలు మార్గాలద్వారా ఇతర రాష్ట్రాలకు కలపబడివుంది. విమానయాన, సముద్రయాన మార్గాలు కూడా ఉన్నాయి. బంగాళాఖాతం తీరంలో, సముద్ర వ్యాపారానికి అనువుగా ఓడరేవులున్నాయి. విజయవాడలో అతి పెద్దదైన రైలు కూడలి, విశాఖపట్నంలో అతి పెద్ద ఓడరేవు ఉంది. రహదారులు thumb|విజయవాడ-గుంటూరు రహదారి (జాతీయ రహదారి NH-16లో భాగం)|alt=విజయవాడ-గుంటూరు రహదారి|250x250px రాష్ట్రంలోని మొత్తం రహదారుల పొడవు కాగా, దానిలో పొడవు జాతీయ రహదారులు, పొడవు రాష్ట్ర రహదారులు, పొడవు జిల్లా రహదారులు ఉన్నాయి. రాష్ట్రంలో జాతీయ రహదారి 16 పొడవు . ఇది బంగారు చతుర్భుజి ప్రాజెక్టులో భాగం. ఆసియా రహదారి 45 లో కూడా భాగమే. 2014 జూన్ 2 న నవ్యాంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులు 4,193 కి.మీ. కాగా 2021 డిసెంబరుకు 8,183 కి.మీకు అనగా సుమారుగా రెట్టింపు చేరుకున్నాయి. దీనికొరకు ₹35,000 కోట్లు ఖర్చు చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆసియా ఖండములోనే ఒక పెద్ద బస్ ప్రాంగణం. 2019 జనవరి 30 నుండి రాష్ట్రంలోని వాహనాల నమోదు AP-39 కోడ్ తో ప్రారంభమయి ఒక అక్షరము, నాలుగు అంకెల సంఖ్యతో నమోదు చేయటం ప్రారంభమైంది. కొన్ని రాష్ట్ర రహదారులను, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. వీటికి ఒక ఉదాహరణ నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి. జాతీయ రహదారులు +క్ర. సం. నెంబరుపొడవు కిమీ1 16చెన్నై - గూడూరు - నెల్లూరు - కావలి - ఒంగోలు - చిలకలూరి పెట - గుంటూరు - మంగళగిరి - విజయవాడ - ఏలూరు - రాజమహేంద్రవరం - తుని - విశాఖపట్నం - శ్రీకాకుళం - కోల్కతా1024 2 544 డిఅనంతపురం - తాడిపత్రి - వినుకొండ - నరసరావు పేట - గుంటూరు 417 3565హైదరాబాద్ - మాచెర్ల - వేంకటగిరి - తిరుపతి410 4 516 ఇ రాజమహేంద్రవరం - పాడేరు - విజయనగరం 406567పనాజి - గుంతకల్ - గుత్తి - తాడిపత్రి - ప్రొద్దటూరు - నెల్లూరు - కృష్ణపట్నం405 6216తుని - పిఠాపురం - కాకినాడ - నరసాపురం - మచిలీపట్టణం - రేపల్లె - బాపట్ల - చీరాల - ఒంగోలు391 740కర్నూలు - నంద్యాల - కడప - రాయచోటి - చిత్తూరు - చెన్నై381842బళ్ళారి - అనంతపురం - కదిరి - మదనపల్లి - పుంగనూరు - క్రిష్ణగిరి378 944శ్రీనగర్ - కర్నూలు - డొన్ - గుత్తి - అనంతపురం - కన్యా కుమారి 26110 716చెన్నై - నగరి - పుత్తూరు - తిరుపతి - రాజంపేట - కడప - ముద్దనూరు 23811167 బి కడప - కందుకూరు - సింగరాయకొండ1951271మదనపల్లి - తిరుపతి - శ్రీకాళహస్తి - నాయుడు పేట 1911365ముంబై - జగ్గయ్యపేట - కొండపల్లి - విజయవాడ - తాడిగడప - మచిలీపట్టణం 1501430నైనిటాల్ - చింతూరు - తిరువూరు - కొండపల్లి - విజయవాడ13515340 సికర్నూలు - దోర్నాల131 16216 ఎరాజమహేంద్రవరం - తణుకు - తాడేపల్లిగూడెం - ఏలూరు 12117167కోదాడ - ఆదోని - బళ్లారి11018165నరసాపురం - పాలకొల్లు - భీమవరం - గుడివాడ - పామర్రు107 రైల్వే ఆంధ్రప్రదేశ్ లో బ్రాడ్ గేజి రైలు మార్గం 3703.25 కిమీ. మీటర్ గేజి రైలు మార్గాలు లేవు. రైలు సాంద్రత 16.59. ఇది భారతదేశానికి సగటు 20 గా ఉంది. రాష్ట్రం గుండా పోయే హౌరా-చెన్నై ప్రధాన మార్గం డైమండ్ చతుర్భుజిలో భాగంగా అతివేగమైన రైలు మార్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి. రైలు నెట్వర్క్ రెండు జోనుల పరిధిలో ఉంది. దీనిని డివిజన్లగా విభాగించారు. దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజన్, గుంటూరు రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్., తూర్పు కోస్తా రైల్వే జోన్ లోని వాల్తేర్ రైల్వే డివిజన్. రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ప్రకటించారు. విమానాశ్రయాలు విశాఖపట్నం, విజయవాడ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు. రాష్ట్రంలో దేశీయ విమానాశ్రయాలు కర్నూలు, కడప, రాజమండ్రి, తిరుపతి లలో ఉన్నాయి. ఇంకా 16 చిన్న తరహా విమానాలు దిగడానికి సౌకర్యమున్న కేంద్రాలున్నాయి. ఓడ రేవులు దేశంలోనే రెండవ అతిపెద్ద కోస్తాతీరం రాష్ట్రంలో ఉంది. విశాఖపట్నం ఓడరేవు దేశంలోకెల్లా సరకురవాణాకి అత్యంత పెద్దదైన ఓడరేవు. మిగతా ప్రముఖ ఓడరేవులు కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ. గంగవరం అతిలోతైన పోర్టు కావడంతో అతి పెద్ద సముద్రపడవలు (200,000 – 250,000 టన్నులు సరకులు బరువు) కు అనుకూలమైంది. పెద్దవి కాని పోర్టులు భీమునిపట్నం, దక్షిణ యానాం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు లలో ఉన్నాయి. విద్యుత్తు thumb|రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం ముందుంది. అధిక విద్యుత్ ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో రాష్ట్రం విద్యుత్ మిగులుగా మారింది. 24 గంటల విద్యుత్ సరఫరాకు రాష్ట్రానికి సౌర శక్తి, జలవిద్యుత్ కేంద్రాలున్నాయి. వర్షాకాలంలో లభించే నీటిని నిల్వ చేయడం, ఏడాది పొడవునా ఎత్తిపోతల ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్వహించే వీలుంది. 2015 నాటికి రాష్ట్రంలో థర్మల్ ( సహజ వాయువు, బొగ్గు ఆధారిత), పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యం 21,000 MW . స్థానిక విద్యుత్ ప్లాంట్లు 9,600 MW  సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇందులో సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ 2000MW, వైజాగ్ థర్మల్ పవర్ స్టేషన్ 1040 MW, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ 1650 MW, శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 1600 MW, డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం 1760 MW. జలవిద్యుత్ కేంద్రాల సామర్థ్యం 1671 MW గా ఉంది. డిజిటల్ నెట్వర్క్, సేవలు ఎపిఎస్‌ఎఫ్‌ఎల్ (APSFL) రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెట్‌వర్క్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెలిఫోనీ, ఐపిటివి మొదలైన వాటిని ఫైబర్‌తో వివిధ వినియోగదారులకు అందిస్తుంది. చాలావరకు ప్రభుత్వ సేవలు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. సంస్కృతి నృత్యం thumb| కూచిపూడి నృత్యం కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక నృత్య రూపంగా గుర్తించబడింది. ఇది కృష్ణ జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఉద్భవించింది. విజయవాడలో మొత్తం 6,117 మంది నృత్యకారులతో ప్రదర్శించిన కూచిపూడి మహాబృంద నాట్యం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన ఈ నృత్యరీతి ఆంధ్రప్రదేశ్ మొత్తానికే కాక దేశవిదేశాల్లో ఎందరెందరో నేర్చుకుని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. కూచిపూడి వారు ప్రదర్శించే నృత్యనాటికలు భామా కలాపం, గొల్ల కలాపం వంటివి తెలుగు వారి సంస్కృతిలో భాగంగా నిలుస్తున్నాయి. దేవదాసీలు మాత్రమే ప్రదర్శిస్తూ ఆచారవంతులైనవారు నృత్యకారులను పంక్తిబాహ్యులని భావించే స్థితిలో కేవలం బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేస్తూ, విద్యావంతులైన వారితో కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించాడు. కాలక్రమేణా ఈ నృత్యరీతి తెలుగువారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది. 1950 నాటికి స్థానికంగా ఉండిపోయిన దీనికి జాతీయ స్థాయిలో మెప్పును, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపునూ తీసుకురావడానికి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి కృషి చేశాడు. ఈయన ఈ కళలోకి స్త్రీలను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేసి యావజ్జీవితాన్ని కళకు అంకితం చేశాడు. దేవదాసీల ప్రదర్శనల్లో విలసిల్లి క్రమంగా దేవదాసీ వ్యవస్థతో పాటుగా అంతరించిపోతున్న నృత్యరీతులను, లక్షణ గ్రంథాల్లో సైద్ధాంతికంగా ఉండి తరతరాల నుంచి ప్రదర్శనకు నోచుకోను నృత్యరీతులను, దేవాలయాల్లోని ప్రతిమల నాట్యభంగిమలను, లక్షణ గ్రంథాలతో కలిపి నటరాజ రామకృష్ణ అధ్యయనం చేసి ఆంధ్ర నాట్యం పేరిట సృజించాడు. భౌగోళిక గుర్తింపులు వస్తువుల భౌగోళిక సూచికలు(GI) (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) చట్టం, 1999 ప్రకారం వ్యవసాయ హస్తకళలు, ఆహార పదార్థాలు, వస్త్రాల విభాగాలలో ఆంధ్రప్రదేశ్‌లో భౌగోళిక గుర్తింపు సాధించినవి పదిహేను ఉన్నాయి. వీటిలో కొన్ని బనగానపల్లె మామిడి, బందర్ లడ్డూలు, బొబ్బిలి వీణ, బుడితి బెల్, ఇత్తడి హస్తకళలు, ధర్మవరం చేనేత పట్టుచీరలు, పావడాలు, గుంటూరు సన్నం, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారి, మంగళగిరి చీరలు, శ్రీకాళహస్తి కలంకారీ, తిరుపతి లడ్డు, ఉప్పాడ జమ్‌దానీ చీరలు, వెంకటగిరి చీర. కళలు, చేతిపనులు, కళాఖండాలు మచిలీపట్నం, శ్రీకాళహస్తికి చెందిన కలంకారి భారతదేశంలో రెండు ప్రత్యేకమైన వస్త్ర కళారూపాలు. దుర్గిలో దొరికే మృదువైన సున్నపురాయి, విగ్రహ శిల్పాలు వంటి ఇతర ముఖ్యమైన హస్తకళలు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఏటి కొప్పాక లక్క పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. కృష్ణాజిల్లాలో కొండపల్లి గ్రామం కొండపల్లి కొయ్య బొమ్మలకు పేరుపొందింది. రాష్ట్రంలోని ప్రదర్శనశాలలలో పురాతన శిల్పాలు, చిత్రాలు, విగ్రహాలు, ఆయుధాలు, వంటకు వాడే ఉపకరణాలు, శాసనాలు, మతపరమైన కళాఖండాలు ఉన్నాయి. అమరావతి పురావస్తు మ్యూజియం, విశాఖపట్నంలోని విశాఖ మ్యూజియంలో ఇవి చూడవచ్చు. విశాఖపట్నంలోని తెలుగు సాంస్కృతిక మ్యూజియం లో స్వాతంత్ర్యానికి పూర్వ కాలపు చరిత్ర చూడవచ్చు. విజయవాడలోని విక్టోరియా జూబ్లీ మ్యూజియం లో చాలా కళాఖండాలున్నాయి. సాహిత్యం రాష్ట్రానికి తెలుగు అధికార భాష. కవిత్రయమని పేరుగన్న నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. నన్నయ్య తెలుగు వ్యాకరణంపై ఆంధ్ర శబ్ద చింతామణి అనే మొదటి గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు. శ్రీ భాగవతంను తెలుగులో శ్రీమద్భాగవతం అనే పేరుతో పోతన అనువాదం చేశాడు. వేమన తన తాత్విక కవిత్వానికి పేరుపొందాడు. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు అముక్తమాల్యద రాశాడు. కందుకూరి వీరేశలింగం తరువాత తెలుగు సాహిత్యాన్ని ఆధునిక తెలుగు సాహిత్యం అని పిలుస్తారు. అతనిని గద్య తిక్కన అని పిలుస్తారు. తెలుగు సామాజిక నవల సత్యవతి చరితం వ్రాసిన రచయిత ఇతనే. జ్ఞానపీఠ పురస్కారం గ్రహీతలలోవిశ్వనాథ సత్యనారాయణ ఒకడు. విప్లవాత్మక కవి శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో కొత్త వ్యక్తీకరణ రూపాన్ని తీసుకువచ్చాడు. మాధ్యమాలు రాష్ట్రంలో ముద్రణ మాధ్యమాలలో ప్రధానంగా తెలుగు, ఆంగ్ల వార్తాపత్రికలు ఉన్నాయి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, ప్రజాశక్తి కొన్ని తెలుగు వార్తాపత్రికలు కాగా, ఆంగ్ల వార్తాపత్రికలలో ది హిందూ, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, దక్కన్ క్రానికల్, ది హన్స్ ఇండియా ఉన్నాయి.http://www.davp.nic.in/Upload/(S(pyatp4ydvoojmwmj340xys55))/davp_empanel_status.aspx ఎలెక్ట్రానిక్ మాధ్యమాలలో ప్రభుత్వరంగంలోని దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలతో పాటు, ప్రైవేటు రంగంలో పలు రేడియో కేంద్రాలు, టెలివిజన్ ఛానళ్లు పనిచేస్తున్నాయి. కళ, సినిమా కర్ణాటక సంగీతం వాగ్గేయకారులు అన్నమాచార్య, త్యాగరాజు, క్షేత్రయ్య, భద్రాచల రామదాసు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు. ఆధునిక కర్ణాటక సంగీత కారులు, గాయకులు ఘంటసాల, సుజాతా పులిగెల్ల, బాలమురళీకృష్ణ తెలుగు వారే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్. జానకి, పిబి శ్రీనివాస్ పేరొందిన సంగీతకారులు, నేపథ్య గాయకులు. రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో జానపద పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. బుర్రకథ, పోలి వంటి రూపాలు నేటికీ ప్రదర్శించబడతున్నాయి. ఆంధ్రలో ఉద్భవించిన హరికథా కాలక్షేపం (లేదా హరికథ ) కథనంతో పాటు సంబంధిత పాటలను కలిగివుంటుంది. బుర్రకథ అనేది మౌఖిక కథ చెప్పే విధానం. దీనిలో హిందూ పౌరాణిక కథ లేదా సమకాలీన సామాజిక సమస్యను ఇతివృత్తంగా ప్రదర్శిస్తారు. రంగస్థల నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రదర్శిస్తారు. గురజాడ అప్పారావు 1892 లో వ్రాసిన కన్యాశుల్కం అనే నాటకాన్ని తెలుగు భాషలో గొప్ప నాటకంగా భావిస్తారు.20th Century Telugu Luminaries, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005 సి. పుల్లయ్యను తెలుగు నాటక ఉద్యమ పితామహుడిగా పేర్కొంటారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రధానంగా తెలంగాణాలోని హైదరాబాదుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఉంది. తెలుగు చిత్ర సంస్కృతి (టాలీవుడ్) బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద చిత్ర పరిశ్రమ. చిత్ర నిర్మాత డి. రామానాయిడు అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సాధించాడు. 2005, 2006, 2008 సంవత్సరాల్లో, తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చిత్రాలను నిర్మించింది. ఈ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది. వంటకాలు thumb|ముఖ్యమైన సందర్భాలలో వడ్డించే శాకాహార ఆంధ్ర భోజనం తెలుగు ప్రజల సంప్రదాయ తీపి పూతరేకుల నుండి తూర్పు గోదావరి జిల్లా గ్రామమైన ఆత్రేయపురంలో పుట్టింది. పర్యాటకం alt=|thumb| ఉండవల్లి గుహలు, కొండను తొలిచి నిర్మించిన పురాతన వాస్తుశిల్పానికి ప్రతీక. thumb|కర్నూలులోని కొండారెడ్డి బురుజు thumb|పురావస్తు సంగ్రహాలయాలు ఆంధ్రప్రదేశ్ పటం ఆంధ్రప్రదేశ్ ను 2015 లో 121.8 మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పర్యాటకుల రాకలో 30% వృద్ధితో ఇది భారతదేశంలో అత్యధికంగా సందర్శించిన మూడవ రాష్ట్రంగా నిలిచింది. తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర ఆలయం సంవత్సరానికి 18.25 మిలియన్ సందర్శకులతో ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి. రాష్ట్రం తీరప్రాంత జిల్లాలలో రుషికొండ, మైపాడు, సూర్యలంక, విశాఖపట్నం, పేరిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం మొదలైన అనేక సముద్ర తీరాలు (బీచ్‌లు) ఉన్నాయి; బొర్రా గుహలు, ఉండవల్లి గుహలు, కొండను తొలిచి నిర్మించిన పురాతన వాస్తుశిల్పానికి ప్రతీకలు. దేశంలోని రెండవ పొడవైన గుహలు బెలూం గుహలు. లోయలు, కొండలలో ప్రముఖమైనవి అరకు లోయ, హార్స్‌లీ కొండలు, పాపి కొండలు. విశాఖపట్నం జిల్లాలో ఉన్న అర్మ కొండ శిఖరం తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. రాష్ట్రం వివిధ భక్తుల పుణ్యస్థలాలకు నిలయం. వీటిలో తిరుమల ఆలయం, తిరుపతి, ద్వారక తిరుమల (చిన్న తిరుపతి), సింహాచలం ఆలయం, అన్నవరం ఆలయం, శ్రీశైలం ఆలయం, కనక దుర్గ ఆలయం, అమరావతి, శ్రీకాళహస్తి, అహోబిలం, మహానంది, కాణిపాకం, పంచారామాలు, ఆదోనిలో షాహి జామియా మసీదు, విజయవాడలో గుణదల చర్చి, అమరావతి, నాగార్జున కొండ వద్ద బౌద్ధ కేంద్రాలు కొన్ని ముఖ్యమైనవి. విద్య, పరిశోధన కుడి|thumb| వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్షరాస్యత 67.41%గా నమోదైంది. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యను ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే, ఇంకా ప్రైవేట్ పాఠశాలలు అందిస్తాయి. వీటిని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నియంత్రిస్తుంది, ప్రభుత్వ పాఠశాలలను నిర్వహిస్తుంది. రాష్టంలో గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలలు కూడా ఉన్నాయి. పిల్లలు, పాఠశాల సమాచార నివేదిక 2018–19 ప్రకారం, మొత్తం 62,063 పాఠశాలల్లో 70,41,568 విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ఎస్సి) పరీక్షలు నిర్వహిస్తుంది. 2019 ఎస్ఎస్సి పరీక్షకు మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 5,464 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణతతో పాటు మొత్తంగా 94.88% ఉత్తీర్ణత నమోదైంది. బోధనా మాధ్యమాలు ప్రధానంగా తెలుగు, ఇంగ్లీష్ అయినప్పటికి, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒడియా, తమిళ భాషలు కూడా ఉన్నాయి. 2020-21 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలలో 1-6 తరగతుల బోధనా మాధ్యమంగా తెలుగును తొలగించి దాని స్థానంలో ఆంగ్లం ప్రవేశపెట్టాలని, ఆ తరువాత సంవత్సరం నుండి పై తరగతులకు ఈ పద్ధతిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ విద్యాహక్కు చట్టం ప్రకారం మాధ్యమ ఐచ్ఛికం పిల్లల తల్లిదండ్రులకుండాలని తీర్పు ఇవ్వగా, ప్రభుత్వం దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసి హైకోర్టు తీర్పును మధ్యంతరంగా నిలుపు చేయాలని కోరగా, ఆ కోరికను తిరస్కరించింది. ఇంటర్మీడియట్ విద్యను ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్రప్రదేశ్) నిర్వహణ, నియంత్రణ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను ఉన్నత విద్యా శాఖ నిర్వహిస్తుంది. సాంకేతిక విద్యను సాంకేతిక విద్యా శాఖ నియంత్రిస్తుంది. ఉన్నత విద్యా పరిషత్ అనే సంస్థ ఉన్నత విద్యను సమన్వయం చేస్తుంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), ఐఐఎం (IIM) విశాఖపట్నం, ఐఐటి (IIT) తిరుపతి, ఎన్ఐటి (NIT) తాడేపల్లిగూడెం, ఐఐఐటిడిఎమ్ (IITDM) కర్నూలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIOPAE), ఎన్ఐడివి (NIDV), సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఐఐటి (IIIT) శ్రీ సిటీ, ఐఐఎస్ఇఆర్ (IISER) తిరుపతి, వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు, ఐఐఎఫ్టి (IIFT) కాకినాడ ముఖ్యమైన కేంద్ర విశ్వవిద్యాలయాలు. గ్రామీణ యువకుల విద్యా అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 లో రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జియుకెటి) ను స్థాపించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం, గీతం, కెఎల్ విశ్వవిద్యాలయం, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడతాయి. ఉద్యానవన, న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, వేదాలు, జంతు వైద్య శాస్త్రాలలో ఉన్నత విద్యను అందించేందుకు 18 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో 1926 లో స్థాపించబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పురాతనమైనది. పరిశోధన నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, (NIO), విశాఖపట్నం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, జాతీయ వాతావరణ పరిశోధన ప్రయోగశాల (NARL), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), తిరుపతి, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER), విశాఖపట్నం, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CTRI), రాజమండ్రి, వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోపెదవేగి వద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (IIOPR) CCRH ప్రాంతీయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRI CCRH) గుడివాడ, క్లినికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRI) తిరుపతి రాష్ట్రంలో గల కొన్ని ముఖ్యమైన పరిశోధనా సంస్థలు; అంతరిక్ష పరిశోధన: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అనే ద్వీపంలో శ్రీహరికోట రేంజ్ (షార్) అని పిలువబడే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇది భారతదేశం ప్రాథమిక కక్ష్య ప్రయోగ ప్రదేశం. ఈ కేంద్రం నుండి 2008 అక్టోబరు 22 న చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. క్రీడలు thumb| విశాఖపట్నంలోని డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎసిఎ - విడిసిఎ క్రికెట్ స్టేడియం. ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి (స్పోర్ట్స్ అథారిటీ) క్రికెట్, ఫీల్డ్ హాకీ, అసోసియేషన్ ఫుట్‌బాల్, స్కేటింగ్, ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్, చెస్, జల క్రీడలు, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, సైక్లింగ్ మొదలైన వాటిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడలలో క్రికెట్ ఒకటి. విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియం (ACA-VDCA Stadium) ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు నిలయం. ఈ వేదికలో క్రమం తప్పకుండా అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్,, విజయనగరానికి చెందిన మహారాజ్కుమార్, MV నరసింహ రావు, ఎం. ఎస్. కె. ప్రసాద్‌, వివిఎస్ లక్ష్మణ్, తిరుమలశెట్టి సుమన్, అర్షద్ అయూబ్, అంబటి రాయుడు, వెంకటపతి రాజు, శ్రావంతి నాయుడు, ఎలకా వేణుగోపాలరావు, హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశానికి ప్రాతినిథ్యం వహించినవారిలో ముఖ్యులు. కృష్ణ జిల్లాలోని గుడివాడకు చెందిన హంపి కోనేరు భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి శ్రీకాకుళం జిల్లాకు చెందినది. ఆమె 2000 సెప్టెంబరు 19న విభాగంలో ఎత్తి, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భీమవరానికి చెందిన కృష్ణంరాజు గడిరాజు రూబిక్స్ క్యూబ్ ను పరిష్కరించడంలో నాలుగు-సార్లు ప్రపంచ రికార్డ్ గెలుచుకున్నాడు. పుల్లెల గోపీచంద్ మాజీ భారత బాడ్మింటన్ క్రీడాకారుడు. అతను 2001 లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని ప్రకాష్ పడుకోనె తర్వాత ఈ పురస్కారాన్ని గెలుచుకున్న రెండవ భారతీయుడు అయ్యాడు. చెరుకూరి లెనిన్ మలేషియాలోని ఆసియా గ్రాండ్ ప్రిక్స్‌లో రజత పతకం సాధించిన భారతీయ విలువిద్యాకారుడు, శిక్షకుడు. ఇవికూడా చూడండి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్ మండలాలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనికలు మూలాలు బయటి లింకులు వర్గం:భారతదేశ రాష్ట్రాలు, ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:దక్షిణ భారతదేశం
భూగోళ శాస్త్రం
https://te.wikipedia.org/wiki/భూగోళ_శాస్త్రం
thumb|భూమి భౌతిక పటం భూగోళ శాస్త్రము అంటే భూమికి సంబంధించిన విజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. దీనిలో భాగంగా దేశాలు భూగోళంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనడం. భూమి పై నదులు, పర్వతాలు, సముద్రాల స్థానాలను తెలుసుకొనడం, భూమి ఎలా ఏర్పడింది, ఏ మార్పులు పొందింది తెలుసుకోవడం. భూ గోళ శాస్త్ర చరిత్ర పూర్వకాంబ్రియన్ బలమైన ఆధారాలు లేక పోవటం వలన భూమిని గురించి 65 కోట్ల సంవత్సరాల ముందటి విషయాలను చిత్రాలను ఊహించలేకున్నాము. కావున 65 కోట్ల సంవత్సరాల నుంచి ఏం జరిగినదొ శాస్త్రవేత్తలు ఊహించి, నిర్ధారించారు. 110 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఒకే ఒక మహా ఖంఢము ఉండినది. దానిని రొదీనియా (rodinia) అని పిలుస్తాము. సుమారు 75 కోట్ల సంవత్సరాల క్రితం రొదీనియా రెండు ముక్కలై మధ్యలో పాంథలాస్సిక్ మహాసముద్రము (Panthalassic Ocean) ఆవిర్భవించింది. ఉత్తర అమెరికా హిమ పూరితమైన దక్షిణ ధృవము వైపు పయనించింది. అంటార్కటికా, ఆస్ట్రేలియా, భారతదేశం, అరేబియా, భావ్య కాలమున చైనాగా మారు ఖంఢ భాగాలతోనున్న రోదినియా యొక్క ఉత్తర సగ భాఘము ప్రతి గడియారపు దిక్కులో తిరిగి ఉత్తర దృవమునకేగినది. రొదినియా యొక్క రెండు భాగాల మధ్య ఉత్తర-మాద్యమ ఆఫ్రికచే నిర్మితమైన కాంగో క్రేటను (Congo Craton) మహాఖంఢము ఉండినది.55 కోట్ల సంవత్సరాల క్రితం రొదినియా రెండు సగ భాగములు కాంగో క్రేటనుతో సహా కలసి పనోషియా (Panotia) అను క్రొత్త మహాఖంఢముగా ఆవిర్భవించెను. పూర్వ కేంబ్రియన్ కాలపు జీవ లక్షణముల కల్పిత అంచనాల చార్టు. పూర్వ-కేంబ్రియన్ ఘటనలు. కాంబ్రియన్ పూర్వ కేంబ్రియన్ శకాంతమునకు పనోషియా మహాఖంఢము ఛీలడం మొదలై పాలియోజోయిక్ (paleozoic) శకము ఆరంభమైనది. ప్రాచీన ఖంఢాలైన లోరెన్షియా (Laurentia), బాల్టికా (Baltica), సైబేరియా మధ్య ఐయాపెటస్ (Iapetus) మహాసంద్రము ఉద్భవించింది. పాన్ ఆఫ్రికా (Pan-African) పర్వతాకార ఆవిరభం జరిగినప్పడు సమూహమైన గొండ్వానా (gondwana) మహాఖండము నాడీమండలము నుండి దక్షిణ ధృవము వరకు విస్తరించుకొని ఆ కాలపు అతి పెద్ద మహాఖండమైనది. అర్డోవిషియన్ (ordovician) శకములో గొండ్వానా యొక్క నాడీమండల ప్రాంతాలైన ఆస్ట్రేలియా, భారతదేశము, చైనా, అన్టార్కటికా ప్రదేశాలలో వెచ్చని నీటి బంధకములు అనగా సున్నపురాయి, ఉప్పు దొరికినవి. అదలా ఉండగా గొండ్వానా (gondwana) దక్షిణ ధృవ ప్రాతాలైన ఆఫ్రిక, దక్షిణ అమెరికాలలో మంచు, ఐసుకు సంభందంచిన పదార్థాలు దొరికినవి. సిలురీన్ 40 కోట్ల సంవత్సరాల క్రితం, పాలియోజోయిక్ శకం మధ్యలో లోరెన్షియా, బాల్టికా ఖండములు కలుస్తూ ఐయాపిటస్ మహాసముద్రమును మూసివేసినవి. ఈ మహాఖండముల సంఘట్టనము వలన అక్కడ అంచున ఉన్న ద్వీప వాలువంపులు ఒక దాని మీద ఒకటిగా ఏర్పడినవి, తద్వారా కాలెడొనైడ్ (Caledonide) పర్వతాలు స్కాండినేవియా (Scandinavia) లో, ఉత్తర మహా బ్రిటన్, గ్రీన్లాండ్,, ఉత్తర అమెరికా యొక్క తూర్పు సముద్రపు ప్రాంతాలలో ఉత్తర అప్లాచియన్ (Appalachian) పర్వతాలు ఏర్పడినవి. బహుశా పాలియోజోయిక్ శకం మధ్యలో, ఉత్తర దక్షిణ ఛైనా గొండ్వానా యొక్క ఇండో-ఆస్ట్రేలియన్ అంచును విదిలి, పాలియో-తెథిస్ (paleo-tethys) మహాసముద్రము మీదగా ఉత్తర దిశకు ఏగినది. పాలియోజోయిక్ శకము ఆరంభము మొదలుగొని మధ్య వరకు, ఉత్తర అర్ధగోళములో ఎక్కువ శాతం పాంథలాస్సిక్ మహాసముద్రము విస్తరించి ఉండినది. ఈ మహాసముద్రమును చుడుతూ, రెండు భూతల పొరలు ఒక మధ్య పొరపై ఆధారడుతూ ఇప్పటి పసిఫిక్ మహాసముద్రమును చుట్టిన "రింగ్-ఆఫ్-ఫైర్" పద్ధతిని అనుకరించు రీతిలో ఉండినది. కార్బోనిఫెరస్ 39 కోట్ల సంవత్సరాల క్రితం డెవోనియన్ (Devonian) శకారంభమైనది. ఈ శక ప్రారంభంలో పాలియోజోయిక్ నాటి మహాసముద్రాలు మూసుకు పోతూ పూర్వ పాంజియా తయారవటం మొదలైనది. ఈ శకం ప్రముఖముగా చేపలు జీవించిన కాలం. డెవోనియన్ ప్రారంభ దశలో చేపల దవడలు క్రమేణ వృద్ధి చెంది, శకాంతము వచ్చు సమయానికి చేపలు వేటాడు జీవులలో ఉత్తమ శ్రేణి లోకి చేరెను. మొక్కలు భూమిని విస్తరించుకొని మొట్ఠమొదటి బొగ్గు బంధకములు ఎండ మెండుగా మండే పర్రలతో (swamps) కనడియన్ ఆర్కటిక్ ద్వీపాలు, ఉత్తర గ్రీన్ లాండ్,, స్కాన్డినావియాలను కప్పి వేసినవి.ఆర్కటిక్ కెనడాలోని నాడీమండల ప్రదేశాలలో మొదటిసారిగా అడవులు పెరిగినవి. పాలియోజోయిక్ శకాంతములో, పన్నోషియా విభజన జరిగినప్పుడు తెరుచుకున్న అనేక మహాసముద్రములు మూసుకుపోయినవి. నాడీమండలము మధ్యగా ఉండి పాంజియా (Pangea) దక్షిణ ధృవం నుండి ఉత్తర ధృవం వరకు విస్తరించుకుని ఉండినది. దీనికి తూర్పు ప్రక్క పాలియో-తెథిస్ మహాసముద్రము పశ్చిమము వైపు పాంథలాస్సిక్ మహాసముద్రము ఆనుకొని ఉండినవి. right|thumb|250px|పేంజియా మహాఖండము right|thumb|250px|ట్రైయాస్సిక్ శకములో భూగోళము కార్బోనిఫెరస్ (Carboni-ferous) శకాంతము అగు సమయము పర్మియన్ (Permian) శకారంభంలో పేంజియా యొక్క దక్షిణ భాగములు (దక్షిణ 'దక్షిణ అమెరికా', దక్షిణ ఆఫ్రికా, అంటార్కటికా, భరత ఖండము, దక్షిణ భరత ఖండము, ఆస్ట్రేలియా) హిమపూరిత ప్రదేశాలుగా మారినవి. కార్బోనిఫెరస్ (Carboniferous) శకాంతములో నడీమండలము నడికట్టున మధ్య పేంజియా పర్వతములు బొగ్గు గనులకు కేంద్రమై ఉండెను. పర్మియన్ పర్మియన్ శకమధ్య దశలో మధ్యమ పేంజియా పర్వతములు ఉత్తర దిశగా కదిలి పొడి ప్రదేశముల వైపు జరుగుతూ తేమభరితమైన నాడీమండల గాలికి అడ్డు నిలిచి ఉత్తర అమెరికా ఉత్తర యూరోప్ ఆంతర్య ప్రదేశములు ఎడారి మాదిరిగా తయారగుటకు హేతువైనది. పేంజియా అనగా "సర్వమైన ప్రదేశము", పేంజియాను మనము మహామహాఖండముగా గుర్తించినను, అది ఆ కాలపు అన్ని ఖండములతో నిండినది కాదు.పూర్వార్ధ గోళములో పాలియో-తెథిస్ మహాసముద్రపు ఇరువైపుల కొన్ని ఖండములు దీని నుండి వేరుగా ఉండినవి. ఈ ఖండములలో ఉత్తర దక్షిణ చైనా, కారు యొక్క 'windshield wiper' అనగా అద్దము శుభ్రపరుచు చువ్వ ఆకారములో సిమ్మీరియా (cimmeria) మహాఖండము ఉండినవి. టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, ఇండో-చైనా, మలయ భాగాలతో నిండిన సిమ్మీరియా కార్బోనిఫెరస్ శకాంతములో గోండ్వానా యొక్క ఇండో-ఆస్త్రేలియన్ అంచునుండి కదిలి పోయింది . ట్రైయాస్సిక్ (Triassic) శకాంతములో సిమ్మీరియా చైనా ఖండంతో కలసి ఉత్తర దిశగా యూరేశియా వైపు జరిగి సైబీరియా దక్షిణ అంచుతో సంఘటించెను. ఈ సంఘటణ తరువాతనే ప్రపంచములోని అన్ని ఖండములు కలసి పేంజియా అను మహామహాఖంఢముగా పిలువబడినవి. కార్బోనిఫెరస్ శకారంభం 35 కోట్ల సం.క్రితం. ట్రైయాస్సిక్ , జురాస్సిక్ పేంజియా మహాఖండము ఆవిర్భవించటానికి హేతువైన ఖండముల సంఘట్టనములు డెవోనియన్ శకమునుండి ట్రైయాస్సిక్ శకాంతము వరకు కొనసాగినవి. పేంజియా ఒక్కసారిగా ముక్కలుగా చీలలేదు, దాని చీలిక మూడు ముఖ్య ఉపాఖ్యానములుగా నడిచింది. మొదటి చీలిక ఉపాఖ్యానము 18 కోట్ల సం.క్రి. మధ్య జురాస్సిక్ (Jurassic) లో మొదలైనది. ఉత్తర అమెరికా తూర్పు కోస్తా ప్రాంతాలలో, ఆఫ్రికా ఉత్తర-పశ్చిమ ప్రాంతాలలో జరిగిన అగ్నిమయమైన చురుకు చర్యల తరువాత ఉత్తర అమేరిక ఉత్తర-పశ్చిమ దిశలో కదులుతూ మధ్యమ అట్లాంటిక్ మహాసముద్రమును తెరిచింది. అదే సమయములో ఆఫ్రికా అవతల ప్రక్కన తూర్పు ఆఫ్రికా అంచులలో, అంటార్కటికాలో, మడగాస్కర్లో భీకరముగా జ్వాలాముఖులు పేలి భారత మహాసముద్ర ఆవిర్భవించుటకు సూచకమైనవి. మెసోజోయిక్ (Mesozoic) కాలమునందు ఉత్తర అమెరికా, యూరేసియా కలసి లౌరేసియా అను భాగముగా పిలువబడినవి. క్రమేణా మధ్య అట్లాంటిక్ తెరుచుకోవటంవలన లౌరేసియా గడియార దిశలో తిరిగి ఉత్తర అమెరికాను ఉత్తరమునకు, యూరేసియా దక్షిణమునకు పంపివేసింది. జురాస్సిక్ శకాంతములో ఆసియా తేమ భరిత ప్రదేశములనుండి పొడి ప్రదేశాలకు కదలడంతో, బొగ్గు గనులతో సంపన్నమైన పూర్వ ఆసియా ఎడారులతో, ఉప్పు బంధకములతో నిండిపోయింది. లౌరేసియా కదలికలవల్ల గోండ్వానాకు లౌరేసియాకు మధ్యనున్న తెథిస్ మహాసముద్రము మూసుకుపోయింది. క్రెటేషియస్ రెండవ చీలిక 14 కొట్ల సంవత్సరాల క్రితం క్రెటాషియసు శకారంభములో మొదలయినది. గొంద్వానా ముక్కలవుతూ ఉండగా దక్షిణ అమెరికా ఆఫ్రికా నుండి వేరగుచు దక్షిణ అట్లాంటికును తెరిచింది.భారతదేశం మడగాస్కరుతో సహా అంటార్కటికా, పశ్చిమ ఆస్ట్రేలియా అంచు నుండి విడిపోయి పూర్వ హిందూ మహాసముద్రమును తెరిచింది.దక్షిణ అట్లాంటికా ఒక్కసారిగా తెరుచుకోలేదు, అంచలంచలుగా దక్షిణం నుండి ఉత్తరంవైపుకి తెరుచుకుంటూ పోయింది అందుకే అది దక్షిణం వైపుకి వెదల్పుగా ఉంటుంది. ఇతర రేకు నిర్మాణ (plate tectonic) ఘఠణలు కూడా క్రెటాషియస్ శఖారంభంలో జరిగినవి.వీటిలో భాగంగానే ఉత్తర అమెరికా, యూరోపు మధ్యన చీలిక ప్రారంభము, ఐబీరియా అడ్డ గడియారపు దిశలో ఫ్రాన్స్ నుండి తిరగడము జరిగినవి.అంతే గాక మడగాస్కరు, భరత ఖండము విడిపోవడము, క్యూబా, హిస్పానియోలాలు పెసిఫికు మహాసముద్రము నుండి ఉత్పత్తి చెందుట, రాకీ పర్వతాలు ఉద్భవించుట, ఉత్తర అమెరికా పశ్చిమ అంచున అపరిచిత భూభాగాల (Wrangellia, Stikinia) రాకడ వంటి ఘఠణలు కూడా సంభవించినవి. ప్రపంచ వ్యాప్తంగా క్రెటాషియసు శకంలో వాతావరణం జురాస్సిక్, ట్రయాస్సిక్ లాగా ఈ కాలంలో కన్నా వెచ్చగా ఉండినది.ఉత్తర ఆర్కిటిక్ వ్రుత్తం, అంటర్కిటికా, దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతాలలో రాక్షస బల్లులు, పామ్ చెట్లు ఉండినవి. క్రెటాషియసు శకారంభంలో ధ్రువాల దగ్గిర హిమ భరిత మై ఉన్నా మెసొజోయిక్ శకంలో మాత్రం ఏమీ కనిపించలేదు. ఈ సామ్యమైన వాతావరణ పరిస్థితుల కారణం, భూభాగాలని లోతులేని సముద్రత్రోవలు (cretaceuos seaways) మూసివేసినవి. నాడీమండల ప్రాంతాల నుండి వెచ్చని నీరు ఉత్తరం వైపుకి తరళి ఉత్తర ధ్రువ ప్రాంతాలను వెచ్చపరిచింది.ఈ సముద్రత్రోవలు స్థానికమైన వాతావరణములని మెడితెర్రెనియన్ సముద్రములాగా సామ్యముగా చేస్తాయి, ఇందువల్ల యూరోపు వాతావరణం గుణమైన మార్పు చెందుతుంది. భూభాగాలన్నీ లోతులేని సముద్రత్రోవలతో కప్పబడటానికి కారణం అప్పటి కాలంలో సముద్ర నీటిమట్టం ఇప్పటి కన్నా 100 - 200 మీటర్లు ఎక్కువగా ఉండినది.అధిక సముద్ర నీటి మట్టనికి కారణం సముద్ర తటాకాలలో ఏర్పడిన క్రొత్త చీలికలతో భూభాగాలు నీరుతో స్థలము తప్పించబడినవి. ఈ శఖంలో సముద్రపుటరుగు వేగంగా వ్యాపించింది.విశాల గుణములతో దీర్ఘమైన ఒత్తిడితో వ్యాపించు సముద్రపుటరుగులు ఎక్కువ నీరుతో స్థలము తప్పించును . ఈ కారణంగానే సముద్రపు నీటి మట్టం పెరగడం జరుగుతుంది. ఇకోసీన్ మూడవది ఆఖరిదైన చీలిక ఘట్టము సెనోజోయిక్ శకారంభంలో జరిగింది. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్ యూరోపు నుండి విడిపోయినవి.అంటార్క్టికా ఆస్టేలియాను విడుదల చేస్తే అది 5 కోట్ల సం.క్రి. భరత ఖండం వలె ఉత్తరం వైపు ఆసియా దక్షిణ-పూర్వ భాగాన్ని గుద్దుకునే వేగంలో జరిగింది.గత రెండు కోట్ల సంవత్సరాలుగా జరిగిన చీలికలు : అరేబియా ఆఫ్రికా నుండి చీలి ఎర్ర సముద్రమును తెరవటం, జపాను పశిఫికులో పూర్వ దిశగా జరిగి జపాన్ సముద్రాన్ని తెరవటం, కాలిఫోర్నియా, ఉత్తర మెక్సికో ఉత్తరం వైపు జరిగి కాలిఫోర్నియా గల్ఫును తెరవటం. సెనోజోయికులో చాలా మహాసముద్రాలు తెరుచుకున్నప్పటికీ, గత 6 కోట్ల సంవత్సరాలను మహాఖంఢముల తీవ్ర సంఘట్టనములకు చిహ్నము.వీటిలో ప్రాముఖ్యతగలది 5 కోట్ల సం.క్రి. మొదలైన భారత ఖంఢమునకు యూరేసియాకు మధ్య జరిగిన సంఘట్టనము.క్రెటషియస్ శకాంతములో భారత ఖండము యూరేసియాను సంవత్సరానికి 15-20 సె.మీ.ల వేగంతో చేరుకున్నది, ఇది రేకు నిర్మాణ వేగాలలో ఇది పెద్ద రికార్డు.క్రెటేషియస్ శకాంతములో ద్వీపాల అంచులకు గుద్దుకొన్న తరువాత ఉత్తర భారత ఖండము యూరేసియా కింది నరముగా మారి టిబెటాన్ ప్లాటూను ఎత్తినది.ఆసక్తికరంగా, సంఘట్టణ వలన ఏర్పడిన విధ్వంసాన్ని భారత ఖండానికి బదులుగా ఆసియా ఖండమే భరించింది.దీనికి కారణం భారత ఖండము బలమైన సముద్రపు లిథోస్ఫియర్ పైన దృఢమైన రాతి వంటి లిథోస్ఫియర్ కాని ఆసియా ఇంకా సంఘట్టణల దెబ్బలతో వేడిగా ఉన్న వివిధ ఖండాల కుప్ప.భారత ఖండము వీటిని గుద్దుకోగానే ఇవన్నీ ఉత్తరంవైపునకు తూర్పువైపునకు నొక్కుకు పోయినవి.ఈ ప్రాంతాలలో భోకంపాలు ఇప్పటిదాకా కొనసాగుతోనే ఉన్నాయి. మైయోసీన్ ఆసియా-భారత ఖండాల సంఘట్టణ అనేక ఇతర సంఘట్టణాలతో కలసి టెథిస్ మహాసముద్రమును మూసివేసినవి.తూర్పు నుంచి పడమరకు ఈ సంఘట్టణలు : పైరినీస్ పర్వతములు స్పెయిన్-ఫ్రాన్స్ ద్వారా, ఆల్ప్స్ పర్వతములు ఇటలి, ఫ్రాన్స్, స్విట్జర్లాన్డ్ ద్వారా, హెల్లెనైడ్-డినరైడే పర్వతములు గ్రీస్, టర్కీ, బల్కన్ రాష్ట్రాల ద్వారా, జగ్రోస్ పర్వతాలు భారత, ఆసియాల ద్వారా ఉద్భవించినవి. మహాఖండాల సంఘట్టణాలతో లిథోస్ఫియర్ అడ్డంగా నలిగి ఎత్తైన పర్వతాలు ఆవిర్భవించాయి.ఖండాలు అదే విస్తారమును ఆక్రమించినా వాటి ప్రదేశము కొద్దిగా తగ్గినది.తద్వారా సెనోజోయిక్ శకంలో ప్రపంచ వ్యాప్తంగా సముద్ర ప్రదేశము కొద్దిగా పెరిగింది.సముద్రపు తట్టలు పెద్దవిగనుక అవి ఎక్కువ నీటిని నిలుపగలవు.తత్ఫలితంగా గత 6 కోట్ల సంవత్సరాలుగా సముద్రమట్టం తగ్గింది.ప్రధానంగా ఖండాల సంఘట్టణల (డెవోనియన్ శకారంభం, కార్బోనిఫెరస్ శకాంతం, పెర్మియన్, ట్రైయాస్సిక్) పర్యంతము సముద్ర మట్టము తక్కువగా ఉండినది. ఆఖరి మంచు శకం సముద్ర మట్టం తక్కువున్నప్పుడు భూఖండాలు అత్యావశ్యకమై, భూచరాలు క్రమముగా పెరిగి, ఖండాల మథ్య వలస దారులు తెరుచుకొని, వాతావరణం చాలా ఋతుపక్షంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రపంచ వాతావరణం చల్లబడుతుంది.దీనికి కారణం భూమి సూర్యుని శక్తిని ఆకాశములోకి తిప్పి వెనుకకి పంపివేసేది, కాని సముద్రాలు ఆ శక్తిని పీల్చుకొనేవి. అంతేగాక భూభాగాల మీద తెల్లటి శాశ్వతమైన మంచు రేకులు పెరిగి మరింత శక్తిని ఆకాశంలోకి తిప్పి పంపివేస్తాయి.ఖండాల మీద మంచు తయారవటం వలన సముద్ర మట్టం ఇంకా తగ్గి భూభాగాలు పెరిగి, భూమిని చల్లగా చేసి, మరింత మంచు తయారవుతోంది, ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడి సారాశం ఏమిటంటే: ఒక్కసారి భూమి చల్లబడటం (లేదా వేడెక్కట్టం) మొదలైతే నిశ్చయమైన బిస భూమి వాతావరణ సిద్ధాంతమును మరింత చల్లగా (లేదా వేడిగా) మార్చేస్తాయి.సెనోజోయిక్ శకాంతంలో భూమి చల్లబడటం మొదలైనది.మంచు రేకులు మొదట అంటార్క్టికాలో తయారై ఉత్తర అర్ధగోళమునకు వ్యాపించ సాగింది.గత 50 లక్షల సంవత్సరాలగా భూమి ఒక పెద్ద మంచు శకంలో ఉంది.ఇంత చల్లగా ఉండటం భూమి చరిత్రలో చాలా కొద్ది సార్లు మాత్రమే జరిగింది. ప్రస్తుత భూమి గత 150 సంవత్సరాలుగా మానవజాతి భూమి చుట్టూ గ్రీన్హౌస్ వాయువులు తీవ్రత పెంచారు, ముఖ్యంగా బొగ్గుపులుసు వాయువు (carbondiaoxide).తత్ఫలితంగా, ప్రపంచ వాతావరణం వేడిగా మారుతున్నది.భూమి వాతావరణం వెచ్చబడితే, క్రమేనా ధృవాల మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది.ఇది భూభాగాన్ని తగ్గిస్తుంది, ఇంకా తక్కువ శక్తి ఆకాశంలోకి తిరిగి వెళ్తుంది.ఈ అధిక వెచ్చదనంతో మంచు కరిగి సముద్రాలు భూభాగాలను వరదలతో ముంచెత్తుతాయి, ఫలితంగా వెచ్చదనం పెరుగుతుంది.ఈ పరిణామాల వల్ల నిశ్చయమైన బిస భూ వాతావరణాన్ని మంచు ఇంటి నుంచి పచ్చ ఇంటి తత్వానికి మార్చేస్తుంది, సరిగ్గా రాక్షస బల్లుల కాలం మాదిరిగా. వనరులు, మూలాలు రొదీనియా బొమ్మలు బయటి లింకులు వర్గం:భూగోళశాస్త్రం
ఖమ్మం
https://te.wikipedia.org/wiki/ఖమ్మం
ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఖమ్మం పట్టణం వ్యాపార, ఆర్థిక కేంద్రం. ఇది తెలంగాణ రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దాదాపు , సూర్యాపేట నుండి , వరంగల్ నుండి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఉత్తరాన దాదాపు దూరంలో ఉంది. మున్నేరు నది ఈ నగరానికి పడమటి వైపున ప్రవహిస్తోంది. 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, ఖమ్మం పట్టణ సముదాయంలో 313,504 జనాభా ఉంది. 2012, అక్టోబరు 19న, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడింది. కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయబడిన తరువాత ఖమ్మం జనాభా సుమారు 3,07,000 గా ఉంది. పద చరిత్ర స్తంభాద్రి, కంబంమెట్టు, ఖమ్మంమెట్టు, కమ మెట్ట్, గంబంబుమెట్టు, కంబము మెట్టు, ఖమ్మం పేర్లతో పరిణామం చెందుతూ వచ్చిన చారిత్రిక ప్రదేశం. ఇచ్చటగల అతిపురాతనమైన స్తంభాద్రి నరసింహస్వామి ఆలయం దీనికి పేరు రావడానికి కారణం. ఖమ్మం నిజనామం "కమ్మమెట్టు". తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడిందిA Descriptive and Historical Account of the Godavery District in the Presidencyof Madras, H. Morris, 1878, London, p. 216A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D., K. R. Subramanian, p. 149A Handbook for India, Part I, Madras, John Murray, 1859, LondonThe Geography of India, J. Burgess, 1871, London, p. 48The Church Missionary Intelligencer,Volume 2,1866, London, p. 73. ఈ పేరును "కమోమెట్", "ఖమ్మమ్మెట్" అని కూడా ఆంగ్లీకరించారు.https://books.google.co.in/books?id=5zeBDwAAQBAJ&pg=PA155&redir_esc=y#v=onepage&q&f=false చరిత్ర తెలంగాణలో ఖమ్మం జిల్లా తూర్పు ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’కు 18.35’ మధ్యగాను ఉండి 15, 921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉంది. జిల్లాకు ఉత్తరమున చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్గొండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1901 నుండి 1981 వరకు ఖమ్మం పట్టణం తొమ్మిది వేల జనాభా ఉన్న చిన్న పట్టణం నుండి లక్ష మంది జనాభా ఉన్న నగరంగా ఎదిగింది. 24-3-1942 లో పట్టణం మునిసిపాలిటీగా ఏర్పడింది. ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడింది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలి రోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా లేదు ఈ జిల్లా భుభాగం అంతా వేరువేరు రాజ వంశాల (శాతవాహనులు, తూర్పు చాళిక్యులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, రాచర్ల దొరలూ, బహామనీయులు, కుతుబషాహీలు, మొగల్, అసఫ్జాహీ ) కాలాల్లో వేరుగా ఉంది. క్రీ.శ 591వ సంవత్సరంలో హిందూ రాజు మహాదేవ శర్మ ఈ ప్రాంతానికి పాలకుడు. ఆ రోజు అది అతని రాజధాని నగరం. సహదేవరాజు, ఈ రాజు తొమ్మిదవ తరం. 950 ప్రాంతంలో ఓరుగల్లు పట్టణం ఉనికిలో ఉన్న సమయంలో వచ్చిన దాచుకున్న డబ్బుతో రంగారెడ్డి, లకా్ష్మరెడ్డి వెలమారెడ్డి సోదరుల త్రయం ఖమ్మం వచ్చి ఆక్రమించుకున్నట్లు వెల్లడైంది. వారు ఖమ్మం దుర్గను నిర్మించారు. దీని నిర్మాణానికి పదేళ్లు పట్టిందని చెబుతున్నారు. ఇది సుమారు 300 అడుగుల ఎత్తులో క్రీ.శ.1006లో నిర్మించబడింది తరువాత మూడువందల సంవత్సరాలు రెడ్డి రాజుల పాలనలో ఉంది. తరువాత నంద పాణి, కాళ్ళూరు,గుడ్లూరు వంశాల వారు ఈ ప్రాంతంలో రాజ్యాధిపత్యం వహించారు. 1301 నిజాం ఈ ఖమ్మం దుర్గాన్ని నవాబు షౌకత్ జంగ్ పూర్వీకులకు జాగీరుగా ఇచ్చాడు ఆ తర్వాత 144లో గోల్కొండ నవాబుల రాజవంశంగా మారింది. ప్రాచీన కవులలో గొప్పవాడైన హరిభట్టు 1472-1535 మధ్య కంబమెట్టు నివాసి అని ప్రతీతి. గోల్కొండ నవాబుల రాజ్యంలో అంతర్భాగమైన ఖమ్మం 1905 వరకు జిల్లాకేంద్రంగా ఉంది. నిజాం పాలకులు తమ పరిపాలనా సౌలభ్యం మేరకు ఓరుగల్లును జిల్లా కేంద్రంగా చేసుకున్నారు. 1901వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం ఐదువేల జనాభాను "పబ్లిసిస్ సపై"గా ప్రకటించింది.వీటిపై స్థానిక నిధి కమిటీకి అన్ని అధికారాలు ఉన్నాయి.కలెక్టర్ ప్రెసిడెంట్ నామినేట్ చేసిన కమిటీ దీని కోసం పనిచేసింది. 1905 దాకా వరంగల్ జిల్లలో భాగంగా ఉండేది, 1948 లో హైదరాబాద్ రాజ్యం మీద భారత ప్రభుత్వం పోలీసు చర్య జరిపేంత వరకు ఈ పట్టణం ఎక్కువ శాతం జాగీరుల పాలనలో ఉన్నది,1952 లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి అప్పటి ఖమ్మం జనాభా 28 వేలు. 1953 ఖమ్మం పట్టణ కేంద్రంగా ఖమ్మం జిల్లా ఏర్పాటు అయింది. ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు, స్థంబాలకు కావలసిన రాళ్ళు తరలిస్తూ ఉండేవారు, అందుకే దీనికి స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉన్నది . చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦బాధ్రిగా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దూ భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన. నిజాం స్టేటు 1870 రైల్వే మ్యాపు ప్రకారం ఈ పట్టణం ఖమ్మంమెట్ట్ గా పేర్కొనబడినది .Nizam's Guaranteed State Railway 1870 చారిత్రక ఆధారాల ప్రకారం ఖమ్మం నిజనామం "కమ్మమెట్టు" A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80. తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడింది. చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక. భౌగోళికం ఖమ్మం భౌగౌళికంగా 17.25° ఉ 80.15° తూలో ఉంది. దీనికి ఉత్తరంగా ఛత్తీస్ ఘఢ్, ఒడిశా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణం కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణం అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉండగా సాగర్ నీరు లభించింది. ఖమ్మం జిల్లాలోని నేల ఎక్కువగా గోదావరి నదికి దక్షిణాన ఇసుక నేలలు, మధిర మండలంలో నల్లమట్టి, గోదావరి నదిని ఆనుకుని ఉన్న ప్రాంతాలు గోదావరి డెల్టా భూముల వలె సారవంతమైనవిగా ఉన్నాయి. జిల్లాలో ప్రధాన నేల చలక (43%), దుబ్బ (28%), నల్లమట్టి (29%). అటవీ సంపదలో ప్రధానంగా టేకు, నల్లమద్ది, చంద్ర, వెదురు ఉన్నాయి. జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 4% అటవీ విస్తీర్ణంలో, మొత్తం అటవీ విస్తీర్ణం 7,59,438 హెక్టార్లు. జిల్లాలోని వృక్షలలో కలప, సాఫ్ట్ వుడ్, ఇంధనం, వెదురు పొదలు, వివిధ రకాల అటవీ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు ఇచ్చే అనేక ఇతర చిన్న అటవీ ఉత్పత్తులుగా స్థూలంగా వర్గీకరించవచ్చు. గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు వన్యప్రాణుల భాండాగారాలు. జిల్లా అంతటా విషపూరితమైన, విషపూరితం కాని పాములు అనేకం కనిపిస్తాయి. జనాభా గణాంకాలు 2011 నాటి భారత జనాభా లెక్కలు ప్రకారం ఖమ్మం జనాభా (పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపి) 3,13,504 గా ఉంది. ఇందులో పురుషులు 155,461 మంది కాగా, స్త్రీలు 158,043 మంది ఉన్నారు. సగటు 1000 మంది పురుషులకు 1017 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఖమ్మం పట్టణ జనాభా 250,182 కాగా, ఖమ్మం గ్రామీణ జనాభా 63,322 గా ఉంది. 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 32,172 మంది ఉన్నారు. వీరిలో 16,725 మంది బాలురు, 15,447 మంది బాలికలు ఉన్నారు. బాలల సగటు నిష్పత్తి 1000కి 924 గా ఉంది. సగటు అక్షరాస్యత రేటు 79.40% (7 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) 223,380 అక్షరాస్యులతో, గణనీయంగా ఉంది. రాష్ట్ర సగటు 67.41% కంటే ఎక్కువగా ఉంది. కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రంలో ఖమ్మం వైరా ప్రధాన రహదారి వెంకటాయపాలెం వద్ద 53.20 కోట్ల రూపాయలతో 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 100 అడుగుల ఫేసింగ్‌, 11 వందల అడుగుల లోతు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2023, జనవరి 18న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తోపాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రలు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తోపాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కలిసి కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించారు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఖమ్మం పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటుచేసింది. 8.5 కోట్ల రూపాయలతో పట్టణంలోని పాత కలెక్టరేట్‌ భవనాన్ని ఆధునీకరించి ప్రభుత్వ వైద్య కళాశాలగా మార్చారు. 2023 సెప్టెంబరు 14న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు, రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్లు కలిసి వైద్య కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. 2023 సెస్టెంబరు 15న ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు. స్వాతంత్ర్యోద్యమం స్వాతంత్ర్య సంగ్రామంలో ఖమ్మం పట్టణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు. 1915: మొట్టమొదటి ఇనుము, ఉక్కు దుకాణము స్వతంత్ర సమరయోధుడు తవిడిశెట్టి సాంబయ్య గారిచే స్థాపించబడినది 1931 - ఖమ్మంలో మొదటి స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది. 1935 - ఖమ్మం పట్టణంలో మొదటి గ్రంథాలయం స్థాపించబడింది. 1945 - ఖమ్మంలో 12 వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం పెండ్యాల సత్య నారాయణరావు ప్రధాన కార్యదర్శిగా, అహ్వాన సంఘం నిర్వహించారు. ఆ సమావేశంలో బద్దాం ఎల్లారెడ్డిని అధ్యక్షుడిగా, 13 వ రాష్ట్రం ఆంధ్ర మహాసభకు ఉపాధ్యక్షుడిగా పెండ్యాల సత్య నారాయణరావు ఎన్నికయ్యారు. ఈ సమావేశం మార్చి 26–28 తేదీలలో జరిగింది. ఈ సమావేశంలో పుచ్చలపల్లి సుందరయ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి దాదాపు 40,000 మంది హాజరయ్యారు. 1946 - 1946 ఆగస్టు 5 న మహాత్మా గాంధీ ఖమ్మం మెట్ (ఖమ్మం పట్టణం) సందర్శన, 1947 ఆగస్టు, 7 - జమలాపురం కేశవరావు, కూరపాటి వెంకట రాజు, జగదీశ్వరయ్య నీలకందన్, బచ్చలకూర లక్ష్మయ్య, వట్టికొండ రామకోటయ్య, హీరాలాల్ మోరియా, తీగల హనుమంతరావు, కిలిపాక కిషన్‌రవు, గెల్ల కేశవరావు, యాదవల్లి వెంకటేశ్వర శర్మ, పుల్లభట్ల వెంకటేశ్వర్లు (హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు), ఊటుకూరి కమల (స్వాతంత్ర్య సమరయోధురాలు - తెలంగాణ విమోచన) సంస్కృతి శ్రీరామ భక్తుడు, కర్ణాటక సంగీత స్వరకర్త భక్త రామదాసు (కంచెర్ల గోపన్న)Kancherla Gopanna పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం భక్త రామదాసు కళా క్షేత్రం పేరుతో ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ థియేటర్ నిర్మించింది. వరదలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏటా ఖమ్మంలో అధిక వర్షపాతం నమోదవుతోంది. వర్షాకాలంలో వార్షిక వర్షపాతం 175 సెం.మీ. (60 అం.) గా ఉంటుంది. కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది వరదల కారణంగా ఖమ్మంలో చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 2007లో మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షంతో నదికి వరదలు వచ్చి బొక్కలగడ్డ ముంపునకు గురయింది. 2009లో వరదలు వచ్చినపుడు కూడా కొన్ని ముంపునకు గురయ్యాయి. ఖమ్మంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టోరేజీ కేంద్రాలు వరద బాధితుల కోసం ఎప్పటికప్పుడు ఆహారాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యం ఇక్కడ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి, మమత వైద్య కళాశాల ఉన్నాయి.thumb|ఖమ్మంలోని మున్నేరు నది|250x250px పర్యాటక కేంద్రాలు ఇక్కడున్న ఖమ్మం కోట సా.శ. 950లో కాకతీయ రాజవంశంచే నిర్మించబడింది. లకారం సరస్సు మరొక పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇవి కాకుండా నగరం చుట్టూ భద్రాచలం, పర్ణశాల, నేలకొండపల్లి, కూసుమంచి వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం ఖిల్లా శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం శ్రీ జలాంజనేయస్వామి ఆలయం లకారం చెరువు: ఈ చెరువుపై 11.75 కోట్ల‌ రూపాయలతో నిర్మించిన కేబుల్ వంతెన‌, మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌లను 2022, జూన్ 11న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దానవాయిగూడెం పార్కు తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం లకారం పార్క్/ట్యాంక్ బండ్ కిన్నెరసాని వన్యప్రాణి ఆశ్రయం నేలకొండపల్లి పర్ణశాల స్తంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తెలంగాణ అమరవీరుల స్థూపం విద్యాసంస్థలు శ్రీరామ, భక్త గెంటాల నారాయణరావు డిగ్రీ కళాశాల ప్రముఖులు హీరాలాల్ మోరియా (పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు) అభిరామ్ వర్మ (సినీ నటుడు,రచయిత) ముమ్మినేని సుధీర్‌ కుమార్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అడపా వరలక్ష్మీ: సామాజికవేత్త. పట్టణంలోని నివాస ప్రాంతాలు ఈ క్రింది ప్రాంతాలు ఖమ్మం పురపాలక సంస్థచే అధికారికంగా గుర్తించబడిన నివాస, వాణిజ్య ప్రాంతాలు. ఖానాపురం గుట్ట్ల బజర్ నిజాంపేట్ సహకార నగర్ మామిళ్ళగూడెం బుర్హాన్ పురం వి డి ఓస్ కాలని బ్యాంకు కాలని రోటరి నగర్ గాంధి చౌక్ చెరువు బజార్ ప్రకాశ్ నగర్ శ్రీనివాస వగర్ కమాన్ బజార్ నెహ్రూ నగర్ సంభాని నగర్ రిక్కా బజార్ భక్థ పొథన వీధి సాహితి నగర్ నయా బజార్ ఇందిరా నగర్ రాపర్తి నగర్ గట్టయ్య సెంటర్ ద్వారకా నగర్ రోటరి నగర్ చర్చి కాంపౌండ్ శ్రీ చైతన్య నగర్ పోడు పట్టాల పంపిణీ ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రం 2023, జూన్ 30న మధ్యాహ్నం 3:30 గంటలకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కలిసి గిరిజన రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. మూలాలు ఇతర లంకెలు Official website of Khammam District. ఖమ్మం చిత్రాలు స్తంభాద్రి నరసింహస్వామి దేవాలయ చిత్రాలు వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు వర్గం:ఖమ్మం జిల్లా వర్గం:ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు
కంప్యూటరు
https://te.wikipedia.org/wiki/కంప్యూటరు
ఆటలు - సాఫ్ట్‌వేర్‌ - హార్డ్‌వేర్‌- చరిత్ర - ఇంటర్నెట్టు right|thumb| నాసా (NASA) వారి కొలంబియా సూపర్ కంప్యూటరు thumb|నిత్యం వాడుకునే కంప్యూటరు చిత్రం. కంప్యూటరు అనేది అనేకమైన ప్రక్రియల ద్వారా సమాచారాన్ని రకరకాలుగా వాడుకోటానికి వీలు కలుగచేసే యంత్రం. సమాచారం వివిధ రూపాలలో ఉండవచ్చును: ఉదాహరణకు సంఖ్యలుగా, బొమ్మలుగా, శబ్దాలుగా లేదా అక్షరాలగా ఉండవచ్చు. ఈ రోజుల్లో "కంప్యూటరు" అనేది ఒక విద్యుత్తు ఉపకరణం. ఈ ఉపకరణాన్ని కచ్చితంగా నిర్వచించాలంటే కష్టమనే చెప్పాలి. కంప్యూటరు అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటరు అని నిర్వచించటం కష్టమౌతుంది. ఈ క్రింది నిర్వచనాల ద్వారా గణనయంత్రం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు. thumb|"స్లిమ్‌లైన్" కంప్యూటర్ ప్రామాణిక భాగాలను ప్రదర్శించే వీడియో కన్సైజ్‌ ఆక్స్‌ఫ‌ర్డు ఆంగ్ల డిక్షనరి కంప్యూటరును "ముందుగా నిర్ధారించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక విద్యుత్తు పరికరం" అని నిర్వచిస్తోంది. ఈ నిర్వచనం గణనయంత్రాన్ని ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది.The Concise Oxford English Dictionary, http://www.askoxford.com/concise_oed/computer?view=uk , Accessed on 08.01.2009 వెబ్‌స్టర్స్ ఆంగ్ల డిక్షనరి కంప్యూటరుకు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుసంధానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్‌ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్‌-ఎలెక్ట్రానిక్ పరికరాలు కూడా కంప్యూటరులు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.Merriam Webster's Online Dictionary, http://www.merriam-webster.com/dictionary/computer, Accessed on 08.01.2009 సురేశ్‌ బసంద్ర తన కంప్యూటరుస్ టుడే అనే పుస్తకంలో ఈ పరికరాన్ని "విపులమైన ఆదేశాల అధారంగా, దత్తాంశాలను (డేటాను) స్వీకరించి, విశ్లేషించి, ఫలితాలను ప్రదానం చేస్తూ సమస్యలను పరిష్కరించగల యంత్రం," అని నిర్వచించారు. ఈ నిర్వచనంలో కంప్యూటరును 'సమస్యలను పరిష్కరించే యంత్రం' అని గుర్తించటం జరిగింది.Basandra, Suresh K, "Computers Today", Chapter-1, Pg#3, Galgotia Publications, 2005, ISBN 81-86340-74-2 చరిత్ర రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రోజులలో రెండు రకాల కంప్యూటరులు వాడుకలో ఉండేవి. అంక కలన యంత్రాలు (digital computers), సారూప్య కలన యంత్రాలు (analog computers). మధ్యలో కొన్నాళ్ళపాటు సంకర కలన యంత్రాలు (hybrid computers) వచ్చాయి. పోటీలో అంక కలన యంత్రాలు గెలవటం వల్ల ఇప్పుడు 'అంక' అన్న విశేషణాన్ని తీసేసి మామూలుగా కలన యంత్రం అని కానీ, గణనం చేసేది కనుక సంగణకం అని కాని లేదా కంప్యూటరు అని కానీ అంటున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ వాడుకలో ఉన్న కంప్యూటరు‌‌ను పోలిన యంత్రాలు మొట్టమొదట రెండవ ప్రపంచ యుద్ధం అంతం అయ్యే రోజులలో వెలిసేయి. పూర్వం ఈ కలన యంత్రాలు చాల భారీగా ఉండేవి. ఒకొక్క యంత్రానికి ఒకొక్క పెద్ద గది కావలసి వచ్చేది. పైపెచ్చు ఒక్కొక్కటి కోట్ల కొద్ది రూపాయలు ఖరీదు చేసేది. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన అధిస్థాపన (establishment) కనుక ఈ యంత్రాన్ని ఎంతోమంది ఉమ్మడిగా వాడుకొనే వారు. ఇటువంటి ఉమ్మడి యంత్రాలు ఇప్పుడు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇటువంటి వాటిని ప్రత్యేక వైజ్ణానిక అవసరాలకు ఉపయోగించుతున్నప్పుడు సూపరు కంప్యూటరు అని, పెద్దపెద్ద సంస్థల వ్యాపార లావాదేవీలు (transactions) సంవిధానం (processing) చేస్తున్నప్పుడు మెయిన్ ఫ్రేము కంప్యూటరు అని సంభోదిస్తూ ఉంటారు. ఇవి అపరిమితమయిన గణన సౌకర్యాలు కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో కంప్యూటరులు బాగా శక్తివంతమూ అయేయి, చవకా అయేయి; పైపెచ్చు బాగా చిన్నవీ అయేయి. దాని వల్ల భారీ యంత్రాల వాడుక పడిపోయింది; ఎవరి కంప్యూటరు వారే సొంతంగా కొనుక్కోగలిగే స్థాయికి ఎదిగేం. ఈ సొంత కంప్యూటరులనే ఆంగ్లంలో personal computer అనీ, హ్రస్వంగా PC అనీ, తెలుగులో వ్యక్తిగత కంప్యూటరు అనీ అంటున్నారు. ఈ సొంత కంప్యూటరులు బల్లమీద పెట్టుకునే రకాలు (desktop), ఒళ్ళో పెట్టుకునే 'ఉరోపరి' (laptop), చేత్తో పట్టుకునేవి (hand-held) అలా రకరకాల ప్రమాణాల్లో వస్తున్నాయి. పుస్తకం సైజులో ఉన్నవాటిని నోటుబుక్కు కంప్యూటరు అని పిలుస్తారు. ఇతర వస్తువులను నియంత్రించుటకు ఉపయోగించే వాటిని embedded computers అంటారు. ఉదాహరణకు డిజిటలు కెమెరాలు, ఉతికే యంత్రాలు (వాషింగు మెషీనులు) మొదలగు వాటిలో వాడే కంప్యూటరులు ఎంబెడెడు కంప్యూటరులు. అంతేకాదు పెద్ద విమానాలను సైతం నడిపే కంప్యూటరులను ఎంబెడెడు కంప్యూటరులు అనవచ్చు. పెద్దదైనా, చిన్నదైనా కంప్యూటరు పనిచేసే పద్ధతి ఒక్కటే. సిద్ధాంతమూ ఒక్కటే. మరొక విషయం. ఏపిల్ కంపెనీ వారి కంప్యూటరులు ప్రాచుర్యం లోకి వచ్చిన తరువాత PC అంటే "ఏపిల్ కంపెనీవి కానివి" అనే అర్థం వచ్చేలా వాడుక పెరిగిపోయింది. ఇంకా కొత్త కొత్త రకాల కంప్యూటరులు పరిశోధన స్థాయిలో ఉన్నాయి. క్వాంటం శాస్త్రపు సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి క్వాంటం కంప్యూటరులు. అలాగే DNA (అంటే జీవ కణాలలోని వారసవాహికలు) లో నిబిడీకృతమైన సూత్రాలని ఉపయోగించి నిర్మాణం జరిగితే అవి DNA కంప్యూటరులు. కంప్యూటరులు: ఒక విహంగావలోకనం పైపైకి వివిధ రూపాలలో అందుకే మన భారతదేశం అనేక రంగాలలో ముందు వుండే కంప్యూటరులు కనిపించినా మౌలికంగా అవి పనిచేసే సూత్రం ఒక్కటే. కంప్యూటరులు మనం ఇచ్చిన సమాచారాన్ని తీసుకుంటాయి. ఆ సమాచారాన్ని జీర్ణించుకుని, జీర్ణమైన ఆ సమాచారాన్ని తిరిగి మనకి మరొక రూపంలో ఇస్తాయి. ఆవు మనం పెట్టిన గడ్డి తిని, జీర్ణించుకుని మనకి తిరిగి పాలు ఇచ్చినట్లే. మనలో చాలమందికి, ఇప్పటికీ, పెరట్లో ఆవులు ఉంటాయి. వాటికి గడ్డి మేపుతాం, కుడితి పడతాం, పాలు పిండుకుంటాం. ఆ మేత ఏమైంది? ఆ పాలు ఎలా తయారయ్యాయి అన్న విషయాలు మనం పట్టించుకోము. అదే విధంగా కంప్యూటరుని కేవలం ఉపయోగించుకునే వారికి కంప్యూటరు లోగుట్టు తెలియక్కర లేదు. ఉపయోగించుకోవడం తెలిస్తే చాలు. కారు నడిపేవారందరికీ కార్లు ఎలా పనిచేస్తాయో తెలుస్తోందా? తెలియవలసిన అవసరం కూడా లేదు. కారు నడిపేవాడు కొద్దో, గొప్పో కారు గురించి తెలుసుకుంటే కారుని మరి కొంత బాధ్యతతో, సమర్ధతతో నడపవచ్చు కదా! అలాగే కేవలం వాడుకకే వినియోగించినా కంప్యూటరు గురించి కొద్దో, గొప్పో తెలిసి ఉంటే ఆ యంత్రాన్ని ఎంతో దక్షతతో వాడుకోవచ్చు. అలాగే కారు నడిపేవాడు కొద్దో, గొప్పో కారు గురించి తెలుసుకుంటే కారుని మరి కొంత బాధ్యతతో, సమర్ధతతో నడపవచ్చు కదా! పూర్వకాలంలో “కంప్యూటరు” (computer) అనే ఇంగ్లీషు పదాన్ని లెక్కలు చేసే వ్యక్తిని ఉద్దేశించి వాడేవారు; అంటే “కంప్యూట్” (compute) చేసే వ్యక్తి. బండిని తోలే వ్యక్తిని ఇంగ్లీషులో “డ్రైవర్” (driver) అనిన్నీ, కుండలు చేసే వ్యక్తిని “పాటర్” (potter) అనిన్నీ అన్నట్లే. క్రమేపీ లెక్కలు చెయ్యడానికి యంత్రాలు వచ్చేయి. మనిషి చేసే పనినే యంత్రాలు చేస్తూన్నప్పుడు అదే “కంప్యూటరు” అన్న పేరుని యంత్రాన్ని ఉద్దేశించి వాడడం మొదలు పెట్టేరు. ఈ రోజుల్లో కంప్యూటరు అంటే యంత్రమే; మనిషి కాదు. భారతీయ భాషలలో కలనం చెయ్యడం అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు వంటి లెక్కలు చెయ్యడం. మొదట్లో కంప్యూటరులని నిర్మించినప్పుడు వాటి చేత అంకెలతో ఈ రకం కలన కలాపాలే చేయించేవారు. అందుకనే వాటిని అంక కలనయంత్రాలు (digital computing machines) అనేవారు. కాలక్రమేణా కలనయంత్రాల చేత తార్కికమైన కలన కలాపాలు (logical calculations) కూడా చేయించడం మొదలు పెట్టేరు. అందుకని వాటిని అంక-తార్కిక యంత్రాలు (arithmetic-logic machines) అన్నారు. కొన్నాళ్లు పోయిన తరువాత కంప్యూటరుల చేత ఇంకా రకరకాల పనులు చేయించడం మొదలు పెట్టేరు. ఉదాహరణకి తెర మీద ఏది, ఎప్పుడు, ఎంతసేపు, ఎన్నిసార్లు చూపించాలో నిశ్చయించడం. కనుక ఈ రోజుల్లో కంప్యూటరు అంటే ఇచ్చిన సమాచారాన్ని జీర్ణించుకుని కొత్త సమాచారాన్ని వెళ్లగక్కే యంత్రం (information processing machine) అని మనం అర్థం చెప్పుకోవచ్చు. మనం కంప్యూటరుకి మేపే సమాచారం (information) రకరకాలుగా ఉండొచ్చు. ఉదాహరణకి “రేపు వర్షం పడుతుందా?” అన్న ప్రశ్నకి సమాధానం కావాలనుకుంటే ముందు కొంత విషయ సేకరణ చెయ్యాలి. ప్రస్తుతపు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియాలి: బయట ఎంత వేడిగా ఉంది? గాలి ఎంత జోరుగా వీచుతోంది? ఆకాశంలో మేఘాలు ఉన్నాయా? ఎలాంటి మేఘాలు? ఎంత ఎత్తులో ఉన్నాయి? వాతావరణ పీడనం ఎలా ఉంది? భారమితి ఏమిటి చెబుతోంది? సముద్రం హోరు పెడుతోందా? చంద్రుడు గుడి కట్టేడా? శివుడికి సహస్ర ఘటాభిషేకం చేసేరా? ఈ రకం విషయాల గురించి సమాచారం సేకరించి కంప్యూటరుకి ఇస్తాం. ఈ సమాచారాన్ని దత్తాంశాలు (data) అంటారు. ఈ సమాచారం అంతా ఆవుకి వేసే మేత లాంటిది. ఈ సమాచారాన్ని ఏమిటి చెయ్యాలో మనం కంప్యూటరుకి చెప్పాలి. పులుసు చేసే వ్యక్తికి పులుసులో పడే సంభారాల జాబితా ఇస్తే సరిపోతుందా? పులుసు చేసే పద్ధతి కూడా చెప్పాలి కదా. “నీళ్లు మరిగించు, చింతపండు వెయ్యి, చెంచాడు ఉప్పు వెయ్యి, చిటికెడు పసుపు వెయ్యి, ముక్కలు వెయ్యి, మరగనీ, పోపు వెయ్యి” ఇలా చెప్పాలి కదా. వీటిని ఆదేశాలు (instructions) అంటారు. సూక్ష్మంగా చెప్పాలంటే మనం కంప్యూటరుకి దత్తాంశాలు, ఆదేశాలు ఇవ్వాలి. వాటిని రంగరించి, జీర్ణించుకుని, మనకి కంప్యూటరు సమాధానాలు ఇస్తుంది. టూకీగా అదీ కంప్యూటరు చేసే పని. మనం కంప్యూటరుకి ఇచ్చే ఆదేశాలు సాధారణంగా మనం మాట్లాడుకునే భాషని పోలిన భాషలో ఉంటే బాగుంటుంది – అంటే ఇంగ్లీషులోనో, తెలుగులోనో, రష్యన్ లోనో అనుకోవచ్చు. కాని మనం కంప్యూటరు ఎదురుగా నిలబడి, “పులుసు వండు” అని ఎంతలా అరిచినా కంప్యూటరుకి అర్థం కాదు. (ఆ రోజులు కూడా వస్తున్నాయి, కాని ప్రస్తుతానికి సినిమాలలో తప్ప నిజ ప్రపంచంలో కంప్యూటరులు ఆ రకం పనులు చెయ్యడం లేదు.) “నీళ్లు మరిగించు, ఉప్పు వెయ్యి, చింతపండు వెయ్యి…” అని విడమర్చి చెప్పినా కంప్యూటరుకి అర్థం కాదు. మన మనస్సులో ఉన్న కోరికని కంప్యూటరుకి చెప్పడం అనేది చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మనం ఏ మానవ భాషలో మాట్లాడినా అపార్ధాలకి అవకాశాలు ఎక్కువ. మన మనస్సులో ఉన్న విషయం కంప్యూటరుకి అర్థం అయే భాషలో చెప్పడానికి ప్రత్యేకంగా తరిఫీదు పొందిన వ్యక్తులు కావాలి. వాళ్లనే మనం “ప్రోగ్రామర్లు” (programmers) అంటున్నాం. ఈ ప్రోగ్రామర్లు చేసే పని ప్రోగ్రాములు రాయడం. ప్రోగ్రాము అంటే కంప్యూటరుకి ఇచ్చే ఆదేశాలని ఒక క్రమ పద్ధతిలో పేర్చి రాయడం. ప్రోగ్రాము అంటే ఒక క్రమంలో ఉన్న ఆదేశాల సమాహారం. “ప్రోగ్రాము” అనే మాటకి “కార్యక్రమం” అనే తెలుగు మాట ఉంది. ఈ మాటని “వినోద కార్యక్రమం” వంటి ప్రయోగాలకి అట్టేపెట్టుకుని కంప్యూటరుకి మనం ఇచ్చే ఆదేశాలకి మరొక ప్రత్యేకమైన మాట వాడదాం. అందుకని వీటిని తెలుగులో “క్రమణికలు” అందాం. మన భాషలకి వ్యాకరణం ఉన్నట్లే ఈ కంప్యూటరు భాషలకి కూడా వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణ నియమాలని పాటిస్తూ క్రమణికలు రాయాలి. మేలు రకం క్రమణికలు రాయగలిగే వాళ్లకి మంచి గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. మనం కంప్యూటరుకి క్రమణికలు (programs), దత్తాంశాలు (data) ఇస్తాం. ఈ క్రమణికలు మనకి అర్థం అయే మానవ భాషకి దగ్గరలో ఉంటాయి. దత్తాంశాలు మనకి అర్థం అయే దశాంశ పద్ధతిలో ఉంటాయి. కాని కంప్యూటరుకి ఇవేమీ అర్థం కావు. వీటన్నిటిని కంప్యూటరుకి అర్థం అయే భాష (machine language) లోకి మార్చి, ఒక క్రమంలో కంప్యూటరుకి అందజేస్తే అది సరిగ్గా పనిచేస్తుంది. ఇదంతా పెద్ద తర్జుమా యంత్రాంగం. ఈ క్రమణికలని, వాటిని తర్జుమా చేసే యంత్రాంగాన్ని, కంప్యూటరు చెయ్యవలసిన పనులన్నిటిమీదా అజమాయిషీ చేసే యంత్రాంగాన్నీ, …, అంతటిని కలిపి “సాఫ్ట్‌వేర్” (software) అని పిలుస్తారు. కంప్యూటరుల గురించి మాట్లాడేటప్పుడు “కఠినాంగం” (hardware), “మృదులాంగం” లేదా “కోమలాంగం” (software) అని స్థూలంగా రెండు భాగాలుగా విడగొట్టి మాట్లాడడం సంప్రదాయికంగా వస్తూన్న ఆచారం. బ్రహ్మ మనని పుట్టించినప్పుడు ఒక భౌతిక శరీరం ఇచ్చేడు, నుదిటి మీద ఒక రాత రాసేడు. మన భౌతిక శరీరం కఠినాంగం (గట్టి సరుకు), నుదిటి మీద రాసిన రాత మృదులాంగం (మెత్త సరుకు). రాయడానికి వీలైన నుదురు అనే గట్టి ఫలకం లేకపోతే బ్రహ్మ మాత్రం ఎక్కడ రాస్తాడు? అలాగని రాయడానికి పలక ఒక్కటీ ఉండి, దానిమీద రాయడానికి ఏమీ లేకపోతే ఆ ఖాళీ పలక ప్రాణం లేని కట్టెతో సమానం. కంప్యూటరు రంగంలో “కఠినాంగం” అన్న మాటని ఇంకా విస్తృత భావంతో వాడవచ్చు. కంప్యూటరు లోని భౌతిక విభాగాలన్నీ (అంటే మనం చేత్తో పట్టుకో దలుచుకుంటే మన పట్టుకి దొరికేవి) – అంటే తెర (screen), కుంచికపలక (keyboard), మూషికం (mouse), మొదలైనవన్నీ కఠినాంగాలే. పోతే, కఠినాంగం లేకుండా మృదులాంగానికి అస్తిత్వం లేదు. కాలు మోపడానికి కఠినాంగం ఆసరా లేకుండా కేవలం మృదులాంగం గాలిలో ఉందంటే అది దయ్యంతో సమానం అన్నమాట. ఈ రకం దయ్యాలని మనం “కంప్యూటరు వైరస్‌లు” (computer viruses) అనవచ్చు. కంప్యూటరు పని చేసే తీరుకీ మనం వంటగదిలో వంట వండే తీరుకీ చాల దగ్గర పోలికలు ఉన్నాయి. మా ఇంట్లో ధాన్యం, దినుసులు, వగైరాలన్నీ కొట్టుగదిలో నిల్వ చేసుకుని, ఒక వారానికి కావలసిన సామానులు వంటగదిలో బీరువాలో పెట్టుకునేవాళ్లం. ఆ రోజుకి కావలసిన దినుసులు అప్పటికప్పుడు బయటకి తీసుకుని, తీనే మీద పెట్టుకుని, వంట చేసేవారు. ఇక్కడ, కంప్యూటరు పరిభాషలో, “తీనె”ని “కేష్” (cache) తోటీ, వంటగదిలో ఉన్న బీరువాని ప్రథమ స్థాయి కొట్టు (main memory) తోటీ, పొయ్యి మీద ఉన్న కలశాన్ని “ప్రోసెసర్” తోటీ పోల్చవచ్చు. అంటే నిజంగా కలనం (వంట) జరిగేది కలశంలో (గిన్నెలో) అన్న మాట. శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు, కలశంలో వండితే కాని వంట కాదు, ప్రోసెసర్‌లో పడితే కాని కలనం కాదు కనుక మనం “ప్రోసెసర్”ని కలనకలశం అని కాని, కలశం అని కాని అందాం. ఇక్కడ “ప్రోసెసర్” (processor) అనేది కఠినాంగం, ఈ కఠినాంగంలో జరిగే కలనకలాపం (process) మృదులాంగం జరిపే ఒక ప్రక్రియ. ఈ “ప్రోసెస్” అన్న మాటకి చాల లోతైన అర్థం ఉంది. ఆ విషయం ఇక్కడ చర్చించడానికి వీలు పడదు. 1. సమాచారాన్ని ఎక్కడ నిల్వ చెయ్యడం? మనం వంట చేస్తూన్నప్పుడు వంట సామగ్రి కోసం నిమిషనిమిషానికీ బజారుకి పరిగెట్టం కదా; వంటగదిలోనో, దగ్గరలో ఉన్న కొట్టు గదిలోనో దాచుకుంటాం. అలాగే వంట చేసే విధానాలు రాసిన పుస్తకం (పులుసు ఎలా చెయ్యాలో, పచ్చడి ఎలా చెయ్యాలో, అప్పాలు, అరిసెలు ఎలా చెయ్యాలో) కూడా వంట గదిలోనే అందుబాటుగా ఉంటే బాగుంటుంది కదా. అందుకని కలనయంత్రాలు కలనం చేస్తూన్నప్పుడు కావలసిన సరంజామా (అంటే దత్తాంశాలు, ఆదేశాలు) ఎక్కడో ఉంటే ప్రయోజనం లేదు; చేతికి అందుబాటులో ఉంటే బాగుంటుంది. అలాగని అన్నీ వంటగదిలో ఇమడవు కదా. అందుకని ముఖ్యంగా కావలసినవి, తరచుగా కావలసినవి దగ్గరగా పెట్టుకుంటాం; అప్పుడప్పుడు కావలసినవి కొట్టుగదిలో ఉంచుతాం, ఎప్పుడో కాని అవసరం లేనివి, అవసరం వెంబడి బజారుకి వెళ్లి తెచ్చుకుంటాం. అదే విధంగా కలన యంత్రాలు కూడా రకరకాల అమరికలతో కొంత సమాచారాన్ని దగ్గరగాను, కొంత సమాచారాన్ని దూరంగాను దాచుకుంటాయి. ఇలా తరతమ భేదాలని పాటిస్తూ సమాచారాన్ని నిల్వ చేసే పద్ధతిని నిల్వ సోపానక్రమం (storage hierarchy) అంటారు. నిల్వ సోపానక్రమం (storage hierarchy) లో చేతికి అందుబాటులో దాచుకునే స్థలాన్ని కోశం (cache, కేష్) అంటారు. తరచుగా కావలసిన సమాచారాన్ని జోరుగా దాచుకుని (లేదా రాసుకుని), జోరుగా బయటకి తీసుకోడానికి (లేదా చదువుకోడానికి) వీలయే ప్రదేశాన్ని ప్రథమ స్థాయి కొట్టు (primary storage) అని అందాం. దీనినే ఇంగ్లీషులో మెయిన్ మెమరీ (main memory) అని కాని, రేం (RAM, Random Access Memory) అని కాని అంటారు. కలశంలో కలనం ఎంత జోరుగా జరుగుతోందో అంత జోరుగా ఈ కొట్టు సమాచారాన్ని కలశానికి అందజేయాలి. ఈ వివరాలన్నీ తరువాత చూద్దాం కాని ఒక్క విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. కంప్యూటరుకి విద్యుత్ సరఫరాని ఆపేసినప్పుడు ఈ ప్రాథమిక స్థాయి కొట్లో రాసుకున్న సమాచారం అంతా చెరిగిపోతుంది. కనుక కంప్యూటరుని “ఆఫ్” చేసేసే ముందు ఈ కొట్లో దాచుకున్న దస్త్రాలని (files ని) మరొక చోట ఎక్కడైనా, చెరిగిపోని చోట, దాచు (రాసు) కోవాలి. ఇలా మరొక చోట రాసుకుందికి వీలుగా, ప్రాథమిక స్థాయి కొట్టుకి దన్నుగా, ద్వితీయ స్థాయి కొట్టు (secondary storage) మరొకటి ఉంటుంది. ఈ ద్వితీయ స్థాయి కొట్టుని నిర్మించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పళ్లేల దొంతిని వాడతారు కనుక దీనిని ఇంగ్లీషులో “డిస్క్ స్టోరేజ్” (disk storage) అంటారు. మనం వాడుకునే కంప్యూటరులకి తప్పనిసరిగా ఒకటో, రెండో, ఈ రకం నిల్వ పళ్లేల సదుపాయాలు ఉంటాయి. వీటన్నిటి గురించి తరువాత నేర్చుకుందాం. 2. కలనయంత్రాలతో సమాచార రవాణా కలనయంత్రాలు చేసే పని కలనం ఒక్కటే కాదు; అవి సమాచారాన్ని ఒక చోట నుండి మరొక చోటకి రవాణా కూడా చేస్తాయి. ఉదాహరణకి కొట్లో దాచుకున్న సమాచారాన్ని కలశం దగ్గరకి తీసుకురావాలి. కలనం జరిగిన తరువాత వచ్చిన సమాధానాలని మళ్లా కొట్లో దాచాలి. మనం కంప్యూటరు లోకి సమాచారాన్ని ఎక్కించాలంటే కుంచికపలక (keyboard) ద్వారా టైపుకొట్టినట్లు మీటలు నొక్కి ఎక్కించడం ఒక పద్ధతి. కుంచికపలక మీద మనం ఏ బొత్తాం (కుంచికం) నొక్కేమో అర్థం చేసుకుని ఆ బొత్తాం నిర్దేశించిన అక్షరాన్ని తెర మీద చూపించాలంటే సమాచారం రహదారుల వెంట రవాణా అవాలి. అనగా, ఆ బొత్తాం నిర్దేశించిన అక్షరం యొక్క ద్వియాంశ సంక్షిప్తాన్ని (binary code) కొట్లో దాచడానికి మరొక రహదారి కావాలి. ఈ రకం పనులని ఇంగ్లీషులో ఇన్‌పుట్/ఔట్‌పుట్ అంటారు. “ఇన్‌పుట్” అంటే లోపలికి రవాణా చెయ్యడం, ఔట్‌పుట్ అంటే బయటకి రవాణా చెయ్యడం. వీటిని తెలుగులో అంతర్యానం (input), బహిర్యానం (output) అని అనొచ్చు. కలనయంత్రాలకి కలనాంశాలని లోపలకి తీసుకోవడం, బయటకి వెలిగక్కడం అనే ఈ సామర్ధ్యత లేకపోతే మనం కంప్యూటరుతో సంభాషణలు జరపలేము. కంప్యూటరులు మానవులతోటే సంభాషణలు జరపాలని నియమం ఏదీ లేదు. ఒక కంప్యూటరు మరొక కంప్యూటరుతో కాని, మరొక రకం యంత్రంతో కాని మాట్లాడవచ్చు. ఉదాహరణకి మనం ఎవరికైనా విద్యుల్లేఖ (E-mail) ద్వారా వార్త పంపినప్పుడు ఆ వార్తని గమ్యానికి సురక్షితంగా చేర్చడం కూడా సమాచార రవాణా పరిధిలోకే వస్తుంది. ఇలాంటి సందర్భాలలో కంప్యూటరు వాడుకలో ఉన్న టెలిఫోను వంటి వార్తాప్రసార (communications) సౌకర్యాల మీద ఆధార పడవచ్చు. అప్పుడు కంప్యూటరుని ఆ వార్తాప్రసార సాధనాలకి తగిలించడానికి “మోడెం” (modem) వంటి ఉపకరణాలు వాడతాం. మోడెం చేసే పని కంప్యూటరుకి అర్థం అయే సున్నలని, ఒకట్లని తీసుకుని టెలిఫోను తీగల మీద ప్రసారానికి అనుకూలమైన విద్యుత్ తరంగాలుగా మార్చడము (modulation), విద్యుత్ తరంగాల రూపంలో ఉన్న వాకేతాలు (signals) ని సున్నలు, ఒకట్లు గాను మార్చడం (demodulation). తీగలు లేకుండా నిస్‌తంతి (wireless) వార్తలని పంపేటప్పుడు కూడా మోడెం వాడొచ్చు. ఈ రోజుల్లో చాల మందికి ఇంట్లోను, బయట - ఎక్కడపెడితే అక్కడా – అంతర్జాలం (Internet) అందుబాటులో ఉంటోంది. అరచేతిలో ఇమిడే కంప్యూటరు సహాయంతో, తీగల బెడద లేకుండా వీరు సమాచారాన్ని పంపగలరు, అందుకోగలరు. రోజురోజుకీ మారుతూన్న ఈ సాంకేతిక రంగం గురించి ఏది రాసినా ఆ సిరా ఆరే వరకే ఆ రాతకి సార్థకత. ఆపరేటింగ్ సిస్టం కంప్యూటరులో ముఖ్యమైన భాగాలు నాలుగు అని చెప్పుకోవచ్చు. మొదటిది కలనం జరిగే కలశం లేదా ఇంగ్లీషులో “ప్రోసెసర్” (processor). ఈ ప్రోసెసర్‌లో జరిగే కార్య కలాపాలని “ప్రోసెసింగ్” (processing) అనిన్నీ, ప్రత్యేకించి ఒక కార్యకలాపాన్ని ఉద్దేశించి చెప్పవలసి వచ్చినప్పుడు ప్రోసెస్ (process) అనిన్నీ అంటారు. సాంకేతికంగా వీటన్నిటికి లోతైన అర్థాలు ఉన్నాయి కనుక వీటిని కొంచెం జాగ్రత్తగా నిర్వచించి విపులీకరించ వలసిన అవసరం ఉంది. ముందు “ప్రోసెస్” (process) అనే ఇంగ్లీషు మాటనే తీసుకుందాం. కాలగమనంతో ఒక పద్ధతిలో మార్పు చెందుతూ నడిచే ప్రక్రియని ఇంగ్లీషులో “ప్రోసెస్” అంటారు. దీనిని ప్రక్రియ లేక పరికర్మ అని తెలుగులో అనొచ్చు. ఈ ప్రక్రియ లేదా పరికర్మ ఎవరో ఒకరో, ఏదో ఒకటో చెయ్యాలి కద. “డ్రైవు" చేసే దానిని డ్రైవర్ అన్నట్లే "ప్రోసెస్" చేసేదానిని ప్రోసెసర్ అంటారు. దీనిని మనం తెలుగులో ప్రక్రియకారి అనో పరికర్మరి అనో అనాలి. (మనకి తెలుగులో ఈ రకం ప్రయోగాలు లేకపోలేదు. అల్లేవాడు అల్లుడు, జాలంతో పని చేసే వ్యక్తి జాలరి, కుండలు చేసేవాడు కుమ్మరి, మొదలైనవి.) ఈ రోజుల్లో చూపుడు వేలు గోరంత పరిమాణం ఉన్న చిన్న సిలికాన్ చితుకు (silicon chip) మీద ఈ పరికర్మరి అంతా పట్టెస్తుంది కనుక దీనిని “సూక్ష్మపరికర్మరి” అని కూడా అనొచ్చు. దీనినే మైక్రోప్రోసెసర్ (microprocessor) అని ఇంగ్లీషులో అంటారు. “మైక్రో” అంటే సూక్ష్మమైన అని అర్థం. “నయా పైస” కాలక్రమేణా పైస అయినట్లు ఈ రోజుల్లో “మైక్రో” అన్నా అనకపోయినా పరవాలేదు. ఈ కర్మరి లోనే లెక్కలు అన్నీ జరుగుతాయి. పోతే, రెండవ భాగం పేరు కొట్టు లేదా కోఠీ (store) లేదా ధారణి (memory). ఈ కొట్టు రూపురేఖలు కూడా సాంకేతిక రంగంలో జరుగుతూన్న విప్లవాలతో మారుతున్నాయి. పూర్వం అయస్కాంతపు ఉంగరాలు, టేపులు, పళ్లేలు, చిల్లుల కాగితపు టేపులు వాడేవారు. ఇప్పుడు సిలికాన్ చితుకులు, లేసర్‌తో చదవగలిగే పళ్లేలు వాడుకలోకి వచ్చేయి. ఇక్కడ సాంకేతికమైన వివరాలు చాలా చెప్పుకోవచ్చు. సాంకేతికమైన మార్పులకి అతీతంగా కోఠీలని తార్కికమైన దృష్టితో సందర్శించడం మంచిది. తార్కికంగా కొట్టు అమరికని పోస్టాఫీసుల్లో ఉత్తరాలు బట్వాడా చెయ్యడానికి వాడే గదుల బీరువాలా ఉహించుకోవచ్చు. ప్రతి గదికి ఒక చిరునామా లేదా విలాసం (address) ఉంటుంది. ప్రతి గదిలోను ఒక అష్టా (అంటే, ఎనిమిది ద్వింకముల మాల) పడుతుందని అనుకుందాం. పైన ఉదహరించిన రెండు అంశాలు మనకి సాధారణంగా బయటకి కనపడవు; డబ్బా లోపల ఎక్కడో ఉంటాయి. కనపడినా, చూడడానికి చిన్న చిళ్ల పెంకులాగో, పళ్లేల దొంతరలాగో కనిపిస్తాయి తప్ప, చూసినంత మాత్రాన అవి పని చేసే విధానం అవగాహన కాదు. మూడు, సమాచారాన్ని లోపలికి పంపడానికీ, బయటకి తియ్యడానికి కావలసిన సదుపాయాలు. ఇవి రకరకాలుగా ఉండొచ్చు. వీటన్నిటిని కలిపి ఇంగ్లీషులో input/output అంటారు. తెలుగులో అంతర్యానం/ బహిర్యానం అన్నాం ఇదివరలో. మనం ఏ కంప్యూటరుతో ఏ పనిచేసినా వీటి మధ్యవర్తిత్వం ఉంటుంది కనుక ఇవి మనకి పరిచయమైన తెర (screen), ముద్రాపకి (printer), కుంచికపలక (keyboard), మూషికం (mouse), కేమెరా, మోడెం, వగైరా రూపాలలో కనిపిస్తాయి. ఇవి కాకుండా సమాచార రవాణాకి రహదారులు ఉంటాయి. ఇవి చూడడానికి రకరకాల ఆకారాలలో ఉన్న తీగలలా ఉంటాయి. వీటిని ఇంగ్లీషులో “బస్” (bus) అంటారు. ఈ “బస్” అనే పదం లేటిన్ లోని “ఆమ్నిబస్” (omnibus) అనే మాటకి సంక్షిప్తమే తప్ప మనం ప్రయాణం చేసే బస్సుకీ దీనికీ ఏ విధమైన సంబంధమూ లేదు. “ఆమ్నిబస్” అంటే “అందరికీ” అని అర్థం. విద్యుత్తుని అందరికి పంచి ఇచ్చే సాధనం కనుక మొదట్లో (అంటే, కంప్యూటరు యుగానికి ముందే) దీనికి ఆ పేరు వచ్చింది. కంప్యూటరు రంగంలో ఈ మాటకి అర్థం, “విద్యుత్ వాకేతాలని అన్నిచోట్లకి తీసుకెళ్లే రహదారి” అని చెప్పుకోవచ్చు. అంటే వాకేతాలు ప్రవహించే తీగల కట్ట. స్వయంబోధకంగా ఉంటే బాగుంటుంది కనుక మనం “బస్”ని అందాకా “తీగలకట్ట” (చీపురుకట్టలా) అందాం. సంస్కృతం మీద అభిమానం ఉన్నవాళ్లు దీనిని “తంతివారం” అనొచ్చు. ఈ మూడు కఠినాంగం లేక “హార్డ్‌వేర్” (hardware) కోవ లోకి వస్తాయి. ఈ మూడు కాకుండా కంటికి కనబడని నాలుగో భాగం ఒకటి ఉంది. ఇది కలనకలశంలో కూర్చుని కథ నడిపిస్తుంది. కంప్యూటరులో ఉన్న అన్ని భాగాలు, ఎప్పుడు, ఎలా పనిచెయ్యాలో ఇది నిర్ణయిస్తుంది. అంటే పెత్తనం దీనిది. నిరవాకం దీనిది. దీని పర్యవేక్షణలోనే కంప్యూటరు నడుస్తుంది. చూద్దామంటే కనబడదు. పట్టుకుందామంటే పట్టుబడదు. ఇలా సర్వశక్తి సంపన్నమైన ఈ “ఇది”ని ఇంగ్లీషులో “ఆపరేటింగ్ సిస్టం” అంటారు. దీనిని తెలుగులో ఉపద్రష్ట అనొచ్చు లేదా నిరవాకి అనొచ్చు. లేదా నిర్వహణ వ్యవస్థ అనొచ్చు. ఉపద్రష్ట అంటే యజ్ఞయాగాదులని దగ్గర ఉండి నడిపించే వ్యక్తి. నిరవాకి అంటే నిరవాకం చేసేది. ఈ నిరవాకి మృదులాంగం (లేదా కోమలాంగం, లేదా software) కోవలోకి వస్తుంది. కఠినాంగాన్ని ఒక భవనపు పునాదితో పోల్చితే, ఈ నిరవాకిని గోడలు, తలుపులు, మెట్లు వగైరాలతో పోల్చవచ్చు. పునాదులు లేకుండా గోడలని లేవనెత్తలేము. పునాదులు, గోడలు, గదులు, గుమ్మాలు, టొపారం ఉంటే ఏవో కొన్ని కనీస అవసరాలని తీర్చుకోవచ్చేమో కాని భవనం పూర్తిగా ఉపయోగం లోకి రాదు; అది ఒక డొల్ల (shell) మాత్రమే. ఆ “డొల్ల” భవనాన్ని ఎవరికి కావలసిన హంగులతో వారు మలుచుకోవాలి. కొందరు ఆ భవనాన్ని పాఠశాలగా వాడుకోవచ్చు. మరొకరు అదే భవనాన్ని నివాసయోగ్యమైన ఆవాసికలు (apartments or flats) గా విడగొట్టి వాడుకోవచ్చు. వేరొకరు అదే భవనాన్ని కచేరీగానో, ఆసుపత్రిగానో వాడుకోవచ్చు. అంటే ఎవరికి కావలసిన సదుపాయాలు వారు కొనుక్కుని, ఆ డొల్లలో అమర్చుకుని, ఆ భవనాన్ని వాడుకోవాలి. ఈ రకం సదుపాయాలని అనువర్తనాలు (ఇంగ్లీషులో applications అని కాని applications programs అని కాని) అంటారు. బ్రౌజరు (browsers), ఇ-మెయిలు (E-mail), “పద పరికర్మరి” (word processor), స్ప్రెడ్‌షీట్లు (spreadsheets), పవర్‌పోయింట్ (powerpoint), వగైరాలన్నీ ఈ కోవకి చెందుతాయి. ఈ అనువర్తనాలు అన్నీ, అందరికీ అవసరం ఉండవు. ఎవరికి కావలసినవి వారు కొనుక్కుని, కలనయంత్రంలో కీల్కొల్పుకుని (install చేసుకుని) వాడుకుంటారు. పూర్వపు రోజుల్లో మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ వారు అమ్మిన నిరవాకిని “డిస్క్ ఆపరేటింగ్ సిస్టం” (Disk Operating System) లేదా ముద్దుగా “డాస్” (DOS) అనేవారు. దీనినే MS-DOS అని కూడా అంటారు. ఆ రోజుల్లో ఈ నిరవాకి చేసే పని, ముఖ్యంగా, పరికర్మరి (లేదా కలనకలశం) లో ఉన్న దస్త్రాలు (files) తీసుకుని వాటిని కొట్లో పళ్లేల మీద రాయడం, అక్కడ నిల్వలో ఉన్న దస్త్రాలని పరికర్మరి లోకి తీసుకు రావడం. అందుకని ఆ రోజుల్లో ఆ పేరు సరిపొయింది. ఈ రోజుల్లో నిరవాకి ఇంకా ఎన్నో పనులు చేస్తుంది; కంప్యూటరు డబ్బాలో ఉన్న కఠినాంగాలకీ, వినియోగదారులు (users) కి మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. ఈ రోజుల్లో బాగా ప్రచారంలో ఉన్న నిరవాకులు చాల ఉన్నాయి. వాటిల్లో కొన్ని పేర్లు: విండోస్-ఎన్‌టి (Windows NT), ఒ-ఎస్/2 (OS/2), యూనిక్స్ (Unix), డాస్/విండోస్ (DOS/Windows), విండోస్ 2000 (Windows 2000), మొదలైనవి. “విండోస్ 2000” వంటి నిరవాకి ఉండడం వల్లనే మనం కీబోర్డు (కుంచికపలక) మీద టైపు కొట్టిన అక్షరాలు వెనువెంటనే తెర మీద కనిపిస్తున్నాయి. ఈ నిరవాకి ఆధ్వర్యం లోనే మూషికాన్ని ఒక్క సారి “క్లిక్” చెయ్యగానే ముద్రాపకి కాగితం మీద అచ్చుకొట్టడం మొదలు పెడుతుంది. ఈ నిరవాకి ప్రమేయం లేకుండా విద్యుల్లేఖలు (E-mails) పంపలేము. నిరవాకి చేసే ఈ చాకిరీ అంతా మన అనుభవ పరిధిలో ఉన్న పనులు. మనకి తెలియకుండా మరెన్నో సాంకేతికమైన ఇంటి పనులు (housekeeping operations) నిరవాకి నేపథ్యంలో చేసుకు పోతూ ఉంటుంది. ఇవన్నీ అవసరం వెంబడి తెలుసుకుందాం. ఈ పనులన్నీ చెయ్యడానికి నిరవాకికి తోడు ఉంది. నిరవాకితో చేతులు కలిపి సహాయం చేసే వాటిల్లో ముఖ్యమైనదానిని ఇంగ్లీషులో “బయాస్” (BIOS) అంటారు, అంటే Basic Input Output System అని అర్థం. ఈ బయాస్‌లో శాశ్వతంగా నిలచిపోయే రీతిలో కొన్ని ఆదేశాలు ఉంటాయి. అంటే ఈ రకం కొట్లో ఉన్న దత్తాంశాలు, ఆదేశాలు మనం చదవగలం కాని, ఉన్న వాటిని చెరిపేసి కొత్తవి రాయలేము. అందుకని బయాస్ నిర్మాణానికి వాడే సాధనాలలో CD-ROM (అంటే, Compact Disk – Read Only Memory) ముఖ్యమైనది. దీని “నిల్వ చేసే సామర్ధ్యం” దరిదాపు 680 MB (అంటే, 680 మిలియను అష్టాలు) వరకు ఉంటుంది. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు, కంప్యూటరు ప్రాణం ఈ బయాస్‌లో ఉంటుందనుకోవచ్చు. ఇందులో ఉన్నవి ఏ కారణం వల్లనైనా చెరిగిపోతే, కంప్యూటరు ప్రాణం పోయినట్లే. అందుకనే చెరపడానికి వీలుకాని కొట్లో బయాస్ క్రమణికలు దాచుతారు. బయాస్‌లో దాచిన ఆదేశాలు అటు కఠినాంగాలకీ, ఇటు నిరవాకికీ మధ్యవర్తిలా పని చేస్తాయి. ఉదాహరణకి నిరవాకిని నడిపే మృదులాంగం నకలు ఒకటి పళ్లెం మీద ఉంటుంది. కంప్యూటరుని “ఆన్” చెయ్యగానే ఈ మృదులాంగం లోని కొన్ని ముఖ్యమైన క్రమణికలు (programs) ప్రాథమిక స్థాయి కొట్లోకి రావాణా కావాలి. ఈ పని చెయ్యడానికి కావలసిన ఆదేశాలు బయాస్‌లో ఉంటాయి. మరొక ఉదాహరణ. కంప్యూటరుని “ఆన్” చేసిన వెంటనే మనం కీబోర్డు మీద ఏదో టైపు చెయ్యవలసిన అవసరం వస్తుంది. అంటే అంతవరకు ప్రాణం లేకుండా పడున్న కుంచికపలకకి ప్రాణం పోసి లేవగొట్టాలి. ఇలా లేవగొట్టడానికి కావలసిన క్రమణికలని “కుంచికపలక చోదరి” (keyboard driver) అంటారు. దీనిని కూడా బయాస్ లోనే దాచి ఉంచుతారు. ఇలాగే కంప్యూటరుతో సంభాషించడానికి కావలసిన మృదులాంగ చోదరులు (software drivers) అన్ని కూడా బయాస్ లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఇదే విధంగా పళ్లెం మీద నిక్షిప్తం అయి ఉన్న నిరవాకిలోని క్రమణికలు అవసరం వెంబడి ప్రాథమిక స్థాయి కొట్లోకి రవాణా చెయ్యడానికి కావలసిన క్రమణికలు కూడా ఈ బయాస్ లోనే దాచుకోవాలి. ఇంటికి తీసుకెళ్లవలసిన అంశం. నిరవాకి లేదా ఉపద్రష్ట లేదా ఆపరేటింగ్ సిస్టం లేని కఠినాంగం (hardware) ప్రాణం లేని కట్టె లాంటిది. రెండూ ఉంటేనే ఏ పని అయినా చెయ్యగలిగే స్తోమత వస్తుంది.thumb|కంప్యూటరు కంప్యూటరులు చెయ్యగలిగే పనులు ఈ రోజుల్లో కంప్యూటరుల చేత మనం చేయించలేని పనులు లేవు. కంప్యూటరుల సహాయం లేకుండా రైల్వే రిజర్వేషన్లు జరగవు, విమానాలు నడవవు, రాకెట్లు ఎగరవు, బేంకులో డబ్బు ధరావరతు కాదు, కార్లు నడవవు, కర్మాగారాలు నడవవు, టెలిఫోనులు పని చెయ్యవు, ఆఖరికి కంప్యూటరుల సహాయం లేకుండా కొన్ని శస్త్ర చికిత్సలు కూడా జరగవు. కంప్యూటరులు ఆగిపోతే ఆధునిక సమాజం ఆగిపోతుంది. కంప్యూటరులు ఇంత ప్రతిభ చూప గలుగుతున్నాయంటే దానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి: కంప్యూటరులు అత్యంత వేగంతో పని చేస్తాయి. అలుపు లేకుండా చేసిన పనినే పదే పదే చెయ్యగలవు. చేసే పని తప్పులు లేకుండా చేస్తాయి. వచ్చిన చిక్కల్లా కంప్యూటరులు ఎప్పుడు ఏ పని చెయ్యాలో అంతా మనం అరటిపండు ఒలిచినట్లు విడమర్చి చెప్పాలి. మనం చెప్పటంలో తప్పుంటే కంప్యూటరు తప్పు చేస్తుంది కాని తనంత తాను తప్పు చెయ్యదు. కంప్యూటరు ఎప్పుడు ఏమిటి చెయ్యాలో విడమర్చి చెప్పే ఆదేశాలని ఇంగ్లీషులో instructions అని కాని commands అని కాని అంటారు. ఇలా ఆదేశాలని ఒక క్రమంలో రాసినప్పుడు దానిని తెలుగులో 'క్రమణిక' అనిన్నీ ఇంగ్లీషులో ప్రోగ్రామ్‌ (program) అని అంటారు. ఇలా ప్రోగ్రాములు రాసే ప్రక్రియని ప్రోగ్రామింగ్ (programming) అంటారు. ఈ ప్రోగ్రాములు రాసే వ్యక్తిని ప్రోగ్రామర్‌ (programmer) అంటారు. కంప్యూటరులో రకరకాల పనులు చెయ్యటానికి రకరకాల క్రమణికలు వాడతారు. ఒకొక్క రకం ప్రోగ్రాముకు ఒకొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకి ఎసెంబ్లర్‌, కంపైలర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మొదలైనవి కొన్ని రకాల ప్రోగ్రాములు. ఈ ప్రోగ్రాములన్నిటిని కలిపి ఇంగ్లీషులో సాఫ్‌ట్‌వేర్‌ (software) అంటారు. ఇలా ప్రోగ్రామర్లు రాసిన సాఫ్‌ట్‌వేర్‌ని కంప్యూటరు లోనే ఒకచోట భద్రపరుస్తారు. ఇలా భద్రపరచిన ప్రదేశాన్ని కొట్టు (store or memory) అంటారు. ఈ కొట్టు గదిలో దాచిన సాఫ్‌ట్‌వేర్‌ లోని ఆదేశాలని ఒకటీ ఒకటి చొప్పున కంప్యూటరు బయటకి తీసి, చదివి, అర్ధం చేసుకొని, ఆ ఆదేశాన్ని ఆచరణలో పెడుతుంది. ఇదంతా దరిదాపు విద్యుత్‌వేగంతో జరిగిపోతుంది. సెకెండుకి మిలియను ఆదేశాలని ఆచరణలో పెట్టగలిగే కంప్యూటరులు సర్వసామాన్యం. కంప్యూటరులని రెండు విభిన్న కోణాల నుండి అధ్యయనం చెయ్య వచ్చు. మనిషికి స్థూలమైన భౌతిక శరీరం, కంటికి కనిపించని సూక్ష్మమైన ఆత్మ ఉన్నట్లే కంప్యూటరులకి స్థూలకాయం (హార్డ్‌వేర్‌), సూక్ష్మకాయం (సాఫ్ట్‌వేర్) అని రెండు భాగాలు ఉన్నాయి. సూక్ష్మ కాయం నివసించడానికి స్థూలకాయం కావాలి. అలాగే సూక్ష్మ కాయం లేక పోతే స్థూలకాయం ప్రాణం లేని కట్టె లాంటిది. సిద్ధాంతపరంగా చూస్తే ఎటువంటి సమాచారమునయినా సంవిధానపరుచుటకు మనము కంప్యూటరులను ఉపయోగించవచ్చు. చర్చి-టూరింగు సిద్దాంతం ప్రకారం, ఒక నిర్దేశిత కనీస సామర్థ్యము ఉన్న కంప్యూటరుతో - అది పాకెటు డైరీ కానీవండి లేదా పెద్ద సూపరు కంప్యూటరు కానీయండి - మనము చేయగలిగే ఎటువంటి కార్యమునయినా నియంత్రించవచ్చు. కాబట్టి ఒకే రూపకల్పనను మనము వివిధ కార్యములను నెరవేర్చేటందుకు మలచవచ్చు. అవి కంపెనీలో జీతాల జాబితాలను నియంత్రించేది కావచ్చు లేదా ఫ్యాక్టరీలలో యంత్రాలను పనిచేయించే రాబోటులను నియంత్రించేవి అయినా అవచ్చు. కంప్యూటరు పనిచేయు విధానం: భద్రపరిచిన ప్రోగ్రాం అనే ఊహ కంప్యూటరుకు సంబంధించిన సాంకేతిక అంశాలు ఎన్ని మార్పులు చెందినా, 1940ల నుండి ఇప్పటి వరకు మార్పు చెందనిది ఈ "స్టోర్డ్ ప్రోగ్రాం ఆర్కిటెక్చరు" ('భద్రపరిచిన ప్రోగ్రాము' అనే ఊహపై ఆధారపడ్డ నిర్మాణము) మాత్రమే. దీనిని "ఫాన్ నోయిమన్ రూపశిల్పం" (von Neumann architecture) అని కూడా పిలుస్తారు. ఈ రూపకల్పన వలన కంప్యూటరు అనేది ఒక వాస్తవ రూపము దాల్చగలిగింది. ఈ నిర్మాణము ప్రకారము మనము కంప్యూటరును నాలుగు ముఖ్య భాగములుగా విభజించవచ్చును. ఈ భాగములనన్నిటిని అనుసంధానించుటకు 'బస్' అను తీగల కట్టను ఉపయోగిస్తారు. వీటిని ఒక క్రమపద్ధతిలో నడిపించుటకు 'టైమరు' లేదా గడియారము అను ఒక వ్యవస్థను ఉపయోగిస్తారు. ఉదాహరణ right|thumb|ఒక ట్రాఫిక్ లైటు - ప్రస్తుతం ఎరుపు చూపిస్తుంది. పెద్ద పట్టణాలలో, నాలుగు వీధుల మొగలలో సంచార దీపాలు (traffic lights) వాడుతున్నారు ఈ రోజుల్లో. సాధారణంగా ఈ సంచార దీపపు గుత్తిలో మూడు దీపాలు ఉంటాయి: ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. ఎదురుగా ఎర్ర దీపం కనిపిస్తూ ఉన్నంత సేపూ వాహనాలు ఆగి ఉండాలి. ఎదురుగా పసుపుపచ్చ దీపం కనిపిస్తే త్వరగా కూడలి (junction)లో ఉన్న వాహనాలు కూడలిని ఖాళీ చెయ్యాలి, కూడలిలో లేనివి కూడలి లోపలికి ప్రవేశించ కూడదు. ఎదురుగా ఆకుపచ్చ దీపం కనిపిస్తూ ఉన్నంత సేపూ వాహనాలు స్వేచ్ఛగా కూడలి గుండా పోవచ్చు. ఇవీ నిబంధనలు. ఇంతే కాకుండా ఎర్ర దీపం నిమిషం పాటు వెలగాలి. పసుపు దీపం మూడు సెండ్లు వెలగాలి. పచ్చ దీపం నిమిషం పాటు వెలగాలి. ఏ రెండు రంగుల దీపాలు ఒకే సారి వెలగ కూడదు అని కూడా నిబంధనలు విడమర్చి చెపుదాం. ఇప్పుడు ఆ సంచార దీపాన్ని నియంత్రించటానికి ఒక క్రమణిక (program) ఈ కింది విధంగా రాయవచ్చు. 1. ముందు మూడు దీపాలనీ ఆర్పు 2. ఎర్ర దీపం వెలిగించు 3. నిమిషం సేపు వెలగనీ 4. ఎర్ర దీపం ఆర్పు 5. ఆకుపచ్చ దీపం వెలిగించు 6. నిమిషం సేపు వెలగనీ 7. ఆకుపచ్చ దీపం ఆర్పు 8. పసుపుపచ్చ దీపం వెలిగించు 9. మూడు సెకండ్లు సేపు వెలగనీ 10. పసుపుపచ్చ దీపం ఆర్పు 11. 2 వ అంచె దగ్గరకి వెళ్ళు. ఈ క్రమణికలో పదకొండు ఆదేశాలు (instructions) ఉన్నాయి. కంప్యూటరు ఈ పదకొండు ఆదేశాలనీ ఒక దాని తరువాత మరొకటి అమలు పరుస్తూ, అలా అంతు లేకుండా పనిచేస్తుంది. కంప్యూటరు పనిచేయు విధానం: ప్రోగ్రాం ఎలా పని చేస్తుంది? కంప్యూటరు సమాచారాన్ని బక్షించి, మర్దనా చేసి, రంగరించి, జీర్ణించికుని, కొత్త సమాచారాన్ని మనకి ఇస్తుందని చెప్పుకున్నాం. మచ్చుకి ఈ ప్రశ్నలు చూడండి: బయట ఎన్ని డిగ్రీలు వేడిగా ఉంది? కారు ఎంత జోరుగా పరిగెడుతోంది? ఫలానా వాడి వయస్సు ఎంత? సాధారణంగా ఈ రకం ప్రశ్నలకి నిర్దిష్టంగా సమాదానాలు చెప్పడం కుదరదు. వయస్సు ఎంత అంటే ఏ 26 అనో 33 అనో చెబుతాం. చిన్న పిల్లలని అడిగితే మూడున్నర ఏళ్లు అని చెప్పినా ఆశ్చర్యపోము. కాని నిజానికి మన వయస్సు క్షణక్షణానికీ పెరుగుతూ ఉంటుంది. కాని మనం సాధారణంగా “నా వయస్సు 33 ఏళ్ల, ఆరు నెలల, మూడు రోజుల, ఎనిమిది గంటల, మూడు నిమిషాల,…. అంటూ చెప్పం. ఇలా సమాచారాన్ని కత్తిరించి కుదిమట్టంగా గుళికలలా చెయ్యడాన్ని “గుళికరించడం” (quantization) అందాం. ఇటుపైన ఉష్ణోగ్రత, వయస్సు, వేళ, మొదలైనవి కంప్యూటరులోకి ఎక్కించవలసి వచ్చినప్పుడు వాటిని కత్తిరించి, గుళికరించి వాడదాం. గుళికరించగా వచ్చిన సంఖ్యలని అదే పళంగా కంప్యూటరు వాడుకోలేదు. ఉదాహరణకి 33.14 అనే సంఖ్యనే తీసుకుందాం. దీన్ని గుళికరించి 33 చేసి ఆ పళంగా కంప్యూటరుకి ఇస్తే దానికి అర్థం కాదు. అందుకని ఆ 33 ని 100001 అని ఒకట్లు, సున్నలు ఉన్న పద్ధతిలో రాసి కంప్యూటరుకి ఇవ్వాలి. మనం కంప్యూటరులో దత్తాంశాలు (data), ఆదేశాలు (instructions or commands) దాచినప్పుడు వాటిని ఎక్కడ దాచేమో తెలియాలి కదా. అందుకని కొట్టు (store or memory) అనే గదిని అరల పెట్టెలా ఊహించుకుందాం. అంటే, పోస్టాఫీసులో ఉత్తరాలు బట్వాడా చేసే బీరువాలా కాని, పోపు సామానులు దాచుకునే పెట్టెలా కాని ఉంటుందని ఊహించుకుందాం. ప్రతి “అర”కి ఒక చిరునామా లేదా విలాసం (address) ఉంటుంది. ప్రతి అర ఒక అష్టా (byte) పొడవు ఉంటుంది అని కూడా ఊహించుకుందాం. అంటే, ప్రతి అర లోనూ 8 ద్వింకములు (bits) పొడుగున్న సంఖ్య పడుతుంది. ఇలాంటి అరలు 1024 ఉంటే వాటిల్లో సున్న నుండి 1023 వరకు, మొత్తం 1024 ఏకైక ద్వియాంశ సంఖ్యలని దాచవచ్చు. కనుక అష్టా పొడుగున్న అరల పెట్టేలలో 0, 1, 2, 3, 4,…, 9 వరకు అంకెలు, A, B, C, D, …, Z వరకు పెద్ద బడిలో అక్షరాలు, a, b, c, d, …, z అనుకుంటూ చిన్న బడిలో అక్షరాలు, !, @, $, ^, &, *, (, ), _, +, -, /, <, >,? వంటి చిహ్నాలు సునాయాసంగా దాచవచ్చు. ఈ శాల్తీ (character) లు అన్నీ కలుపుకున్నా 1024 కంటె తక్కువే ఉంటాయి కనుక ఇవి సునాయాసంగా మన కొట్లో పడతాయి. పట్టగా ఇంకా ఖాళీలు కూడా మిగిలిపోతాయి. ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకుందాం. ఏమిటా ఒప్పందం? : 0 ని 0000 0000 గాను, A ని 01000 0001 గాను, M ని 1101 0101 గాను అనుకుంటూ, కుంచికపలక (keyboard) మీద కనిపించే ప్రతి శాల్తీని ఒక ఏకైక పద్ధతిలో, ద్వియాంశ మాల (binary string) రూపంలో రాద్దాం. అలా రాసినప్పుడు కుంచికపలక మీద ఉన్న కొన్ని శాల్తీలు ఎలా ఉంటాయో ఈ దిగువ పట్టికలో చూడండి. దీనినే ASCII code అంటారు. ఈ సున్నలని, ఒకట్లని పదే పదే రాయడం కష్టం కనుక వీటిని షోడశాంశలో ఎలా రాయవచ్చో కూడా చూపించేను. దశాంశ ద్వియాంశ షోడశాంశ 0 0000 0000 00 1 0000 0001 01 2 0000 0010 02 A 0100 0001 41 B 0100 0010 42 M 1101 0101 D5 a 0110 0001 61 b 0110 0010 62 ఉదాహరణ ఉదాహరణకి చాల చిన్న కంప్యూటరులలో “ముద్రాపకి” (printer) విలాసం షోడశాంశలో 378 అయి ఉండడం రివాజుగా వస్తూన్న ఆచారం. అంటే మనం అచ్చు కొట్టవలసిన అక్షరాన్ని ఈ విలాసం ఉన్న గదిలో దాచి, “ఇప్పుడు ముద్రించు” అని ఆదేశం ఇచ్చేమంటే కంప్యూటరు తిన్నగా 378 విలాసం ఉన్న గదిలోకి వెళ్లి, అక్కడ ఏది కనిపిస్తే దాని నకలు తీసుకుని ఆ నకలుని ముద్రాపకికి పంపుతుంది. ఇదీ టూకీగా కంప్యూటరు పని చేసే విధానం. ఇప్పుడు కంప్యూటరు ఎలా పనిచేస్తుందో మరి కొంచెం వివరంగా చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణతో చెబుతాను. ఈ వివరణ ఒకటికి రెండు సార్లు చదివితే కాని గభీమని అర్థం కాదు. కొంచెం ఓపిక పట్టి చదవాలి. ఒక కథో, వ్యాసమో రాసే ఉద్దేశంతో కంప్యూటరు ఎదురుగా కూర్చుని, కుంచికపలక (keyboard) మీద M అనే ఇంగ్లీషు అక్షరం ఉన్న కుంచిక (key) ని నొక్కేమని అనుకుందాం. అప్పుడు ఆ M అనే అక్షరం తెర మీద కనిపించడానికి ఎంత తతంగం ఉందో చవి చూద్దాం. 1. కుంచికపలక మీద ఒక బొత్తాం నొక్కినప్పుడు ఈ దిగువ చెప్పిన సంఘటనలు, ఒక దాని తరువాత మరొకటి, జరుగుతాయి. సాంకేతిక పదజాలంతో కూడిన ఈ వర్ణన చదవగానే అర్థం కాకపోతే కంగారు పడవద్దు. ఈ వివరణ ఇంగ్లీషులో రాసినా గభీమని అర్థం కాదు; ఎందుకంటే భావజాలం కొత్తది కావడం వల్ల. 2. కుంచికపలక ఒక విద్యుత్ వాకేతం (signal) ని కంప్యూటరు పెట్టెలో ఉన్న అనేకమైన విభాగాలలో ఒక విభాగానికి పంపుతుంది. వాకేతం అంటే వార్తకి సంకేతం. ఈ సందర్భంలో ఈ వాకేతాన్ని ఇంగ్లీషులో స్కేన్ కోడ్ (scan code) అంటారు. M కి బదులు 6 ఉన్న బొత్తాన్ని నొక్కితే మరొక వాకేతం (అంటే మరొక scan code) పుడుతుంది. అంటే మనం నొక్కే ప్రతి బొత్తానికి ఒక ఏకైక (unique) స్కేన్ కోడ్ కేటాయించబడి ఉంటుందన్న మాట. సర్వసాధారణంగా ఈ స్కేన్ కోడ్ ASCII కోడు అవుతుంది. (ఒక వాకేతాన్ని అంకెల రూపంలో మార్చి రాసినప్పుడు దానిని మనం “కోడు” అందాం.) 3. కంప్యుటర్ పెట్టె లోపల ఈ స్కేన్ కోడ్ ని అర్థం చేసుకో గలిగే స్తోమత గల గోరంత పరిమాణం గల చిన్న సిలికాన్ చితుకు (chip) ఉంటుంది. ఈ చితుకు చూడడానికి చితికిపోయిన చిల్లపెంకులా కాని, పలక ముక్కలా కాని ఉంటుంది. ఈ చితుకులో, కంటికి కనబడని పరిమాణంలో, వందలాది ట్రాన్‌సిస్టర్లు ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్ల సహాయంతో ఈ చితుకు కుంచికపలక కార్యకలాపాలని నియంత్రిస్తుంది కనుక ఈ చితుకుని “కుంచికపలక నియంత్రణి” (keyboard controller) అంటారు. ఈ చితుకు ఈ స్కేన్ కోడ్ ని చదివి, అర్థం చేసుకుని, M అనే అక్షరం ఉన్న మీట మనం నొక్కేమని నిర్ద్వందంగా నిర్ధారిస్తుంది. 4. అప్పుడు ఆ “స్కేన్ కోడ్”ని ఒక అరలో తాత్కాలికంగా దాచుతుంది. ఇలా తాత్కాలికంగా దాచుకుందికి వాడే అరలని ఇంగ్లీషులో “బప్ఫర్” (buffer) అంటారు. ఈ బప్ఫర్ అనే మాట అనేక రంగాల్లో వస్తూ ఉంటుంది. రెండు పెద్ద రాజ్యాల మధ్య ఉండే బడుగు దేశాలని “బప్ఫర్” అనొచ్చు. భారతదేశం, చైనాల మధ్య ఉన్న నేపాలు, భూటాను బప్ఫర్ రాజ్యాలు. అలాగే మందు తీక్షణతని అదుపులో పెట్టడానికి వాడే ఘటక ద్రవ్యాలని బప్ఫర్ అంటారు. చిన్నప్పుడు తరగతిలో కూర్చుని విన్న పాఠాన్ని చిత్తు పుస్తకంలో రాసుకుని ఇంటికొచ్చి “మంచి పుస్తకం”లో తిరగ రాసుకునే పద్ధతిలో చిత్తు పుస్తకం బప్ఫర్ లాంటిది. కనుక ఈ సందర్భంలో బప్ఫర్ అంటే “చిత్తు కొట్టు” లేదా “చిత్తు పలక.” మనం వాడుతూన్న ఉదాహరణలో M అనే అక్షరాన్ని నొక్కేము కనుక, M యొక్క ASCII కోడు D5 కనుక, చిత్తు పలక మీద D5, అనగా 1101 0101, నమోదు అవుతుంది. (ఇక్కడ కీబోర్డ్ కంట్రోలర్ లో ఒక పెద్ద జాబితా ఉన్నట్లు ఊహించుకొండి. ఆ జాబితాలో, ఒకొక్క బొత్తాం నుండి ఒకొక్క తీగ చొప్పున వచ్చి ఆ జాబితాకి తగిలించినట్లు ఊహించుకొండి. ఈ తీగ ఒక పక్క, దానికి ఎదురుగా మనం నొక్కిన బొత్తానికి సంబంధించిన అక్షరాంకం (alphanumeric) యొక్క ASCII కోడు ఉన్నట్లు ఊహించుకొండి. అప్పుడు జాబితాలో ఏ అడ్డు వరసలో M ఉందో చూసుకుని దానికి ఎదురుగా ఉన్న అష్టా (byte) మనకి కావలసిన ASCII కోడు అనుకోవచ్చు.) 5. చిత్తు పలక (buffer) అనేది తాత్కాలికంగా రాసుకుందుకి వాడే పలక లాంటిది. ఇక్కడ ఎక్కువ సేపు దాచుకోడానికి కుదరదు. ఎందుకంటే M తరువాత మరొక అక్షరం టైపు కొట్టవచ్చు కదా. అప్పుడు ఇదే పలక మీద మరొక అక్షరం రాయవలసి వస్తుంది. అందుకని పలక మీద ఉన్న అష్టాని త్వరగా కొట్లోకి పంపెయ్యాలి. ఈ పని చెయ్యడానికి కలనకలశం అనబడే పరికర్మరి (processor) సహాయం కావాలి. 6. అందుకని జోరుగా పనిచేస్తూన్న పరికర్మరి (processor) ని ఒక్క క్షణం ఆపి “ఎవరో కుంచికపలక మీద కుంచికని నొక్కేరు. దానికి సంబంధించిన దత్తాంశాన్ని త్వరగా పంపాలి” అని అర్జీ దాఖలు చేసుకుందుకని పరికర్మరి చేస్తూన్న పనికి అంతరాయం కల్పించాలి. ఈ పని “ఇంటరప్ట్ కంట్రోలర్” అనే మరొక చితుకు (chip) చేస్తుంది. ఎలా? “అంతరాయం” (interrupt) అనే వాకేతాన్ని పంపి. ఎవరికి పంపుతుంది? పరికర్మరిని నడిపిస్తూన్న నిరవాకి లేదా ఉపద్రష్ట (operating system) కి. ఈ నిరవాకి ఎన్నో పనుల మీద, ఎంతో జోరుగా అజమాయిషీ చేస్తూ ఉంటుంది కదా? ఇప్పుడు మన దగ్గర ఉన్న M అందుకోమని మరొక పని పురమాయిస్తున్నాం. పాఠం చెప్పుకుంటూ పోతూన్న మేష్టారిని ప్రశ్న అడగాలంటే ఏమిటి చేస్తాం? చెయ్యి ఎత్తి ఆయన అనుమతి కోసం ఎదురు చూస్తూ వేచి ఉంటాం. మేష్టారు ఆయన చెబుతూన్న వాక్యాన్ని పూర్తి చేసి, ఆయన పాఠంలో ఎక్కడ ఉన్నారో పుస్తకంలో గుర్తు పెట్టుకుని, మన ప్రశ్న కొరకు ఎదురు చూస్తారు. అదే విధంగా తన దగ్గర దత్తాంశం ఒకటి ఉందని చెప్పడానికి అంతరాయ నియంత్రకి (interrupt controller) పరికర్మరికి ఒక “అంతరాయ వాకేతం” (interrupt signal) పంపుతుంది. ఇటువంటి వాకేతం కుంచికపలక నుండి రావచ్చు, మూషికం (mouse) నుండి రావచ్చు, మోడెం నుండి రావచ్చు, మరెక్కడనుండైనా రావచ్చు. కనుక అంతరాయ వాకేతం అందగానే పరికర్మరిని నడుపుతూన్న నిరవాకి (లేదా ఉపద్రష్ట లేదా operating system) తన పనికి అంతరాయం ఎవరివల్ల కలిగిందో అర్థం చేసుకుని, ఆ సందర్భానికి ఉచితమైన కార్యక్రమాలని నెరవేర్చాలి. 7. విద్యార్థి చెయ్యి ఎత్తిన సమయంలోనే ప్రిన్సిపాలు గారు గుమ్మం దగ్గర నిలబడి తలుపు మీద టకటక కొట్టేరనుకుందాం. అది మరొక అంతరాయం. ఇలా కంప్యూటరు ఎన్నో అంతారాయాలని ఎదుర్కుంటూనే ఉంటుంది. ఏ అంతరాయానికి ఏ పరిచర్య (service) చెయ్యాలో ఉపద్రష్టకి తెలుసు. ఒకొక్క పరిచర్యని నడపడానికి ఒకొక్క క్రమణిక (interrupt service program) ఉంటుంది. ఇప్పుడు తరువాయి కార్యక్రమం చిత్తులో ఉన్న M అనే అక్షరాన్ని కొట్లో రాసుకోవడం కనుక ఈ పని చెయ్యడానికి కావలసిన ఆదేశాలలో మొదటిది కొట్లో ఎక్కడ ఉందో అక్కడకి వెళ్లి అక్కడ నుండి కలనం కొనసాగిస్తుంది. 8. ఉదాహరణకి మనం విండోస్ (Windows) వంటి బహుళబాహు (multi-tasking) ఉపద్రష్టని వాడుతునాం అనుకుందాం. అప్పుడు మన ఉపద్రష్ట పై పనులన్నిటితోపాటు మనం M అనే అక్షరం ఏ “విండో”లో పనిచేస్తున్నప్పుడు నొక్కెమో కూడా జ్ఞాపకం పెట్టుకుంటుంది. (ఇక్కడ “విండో” అంటే ఏమిటో సందర్భానుసారంగా మీరు అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను.) 9. మనం కథో, వ్యాసమో రాస్తూ M అనే మీట నొక్కేము కనుక, అంతా సవ్యంగా జరిగితే తెర మీద M అనే అక్షరం మన “విండో”లో కనిపించాలి. ఇలా కనిపించేటట్లు చెయ్యాలంటే దృశ్యకపు కొట్టు (video store) అనే మరొక కొట్లోకి మన M ని బదిలీ చెయ్యాలి. 10. దృశ్యకపు కొట్లో ఏది ఉంటే దానిని సెకండుకి 100 సార్లు చొప్పున ఉపద్రష్ట మనకి చూపిస్తుంది. ఒక్క చిన్న పని చెయ్యడానికి ఇంత హడావిడా? పైపెచ్చు ఇదంతా త్రుటి కాలంలో జరిగిపోయినట్లు మనకి భ్రమ కలుగుతుంది. కలనకలశం మన జ్ఞానేంద్రియాల కంటే ఎన్నో రెట్లు జోరుగా పని చెయ్యడమే ఈ భ్రమకి కారణం. పైన రాసినది కేవలం ఒక నఖచిత్రం అని మరచ పోకండి. ఈ ఒక్క పని చెయ్యడానికి లోపల జరిగే తతంగం కూలంకషంగా వర్ణించాలంటే ఎన్నో కాగితాలు ఖరాబు చెయ్యాలి. ఇలాంటి పనులు సెకండుకి వెయ్యికి పైబడి కలశం చేస్తూ ఉంటుంది. ఇదంతా చదివి కంప్యూటరులని అర్థం చేసుకోవాలనే ఆశ వదలుకోకండి. ఏ ఒక్క వ్యక్తికి, అన్నీ అర్థం కావు. కంప్యూటరులతో రోజూ పని చేసేవాళ్లకి కూడా కొద్ది భాగమే అర్థం అవుతుంది. కంప్యూటరు లో భాగాలు 220px|thumb|right|ఒక పర్సనల్ కంప్యూటరులో ముఖ్య భాగాలు. 220px|thumb|right|పర్సనల్ కంప్యూటరు లోపల ఇలా కనిపిస్తుంది. గణిత-తర్క విభాగం - అరిత్‌మెటిక్ అండ్ లాజికల్ యూనిట్ (ఏ ఎల్ యు) ఏ ఎల్ యు. ఇది రెండు రకాల పనులు నిర్వర్తించును: గణిత కార్యకాలాపాలు అనగా కూడికలు (additions), తీసివేతలు (subtractions), గుణింతములు (multiplications), భాగాహారములు (divisions). రెండవ రకమయిన కార్యములు తర్కమునకు (logic) సంబంధించినవి. ఇది సెంట్రల్‌ ప్రోసెసింగ్‌ యూనిట్ లో (సి.పి.యు) ముఖ్యమైన భాగం. నియంత్రించు విభాగం - కంట్రోలు యూనిట్ నియంత్రణ వ్యవస్థ. దీనికి కేటాయించిన ముఖ్యమయిన పనులు: ఆదేశములను, డేటాను మెమరీ నుండి లేదా ఐ/ఓ నుండి చదవటం, ఆ ఆదేశములను అర్ధం చేసుకోవటం, ఏ ఎల్ యుకు ఆదేశానుసారము సరిఅయిన సంఖ్యలను అందించటం, ఏ ఎల్ యుకు ఆ సంఖ్యలతో ఏమి చేయాలో చెప్పటం, వచ్చిన ఫలితములను తెరిగి మెమరీ వద్దకు గానీ ఐ/ఓ వద్దకు గానీ పంపించటం. ఈ విభాగములో కౌంటరు అను ఒక లెక్కపెట్టే పరికరము ప్రస్తుత ఆదేశము నిల్వ ఉన్న చిరునామా యొక్క జాడను ఎల్లప్పుడూ తెలుపుతూ ఉంటుంది. సాధారణంగా ఒక ఆదేశము నిర్వర్తించగానే ఈ కౌంటరు యొక్క లెక్క పెరుగును. దీని వలన తరువాతి ఆదేశమును చదువుటకు వీలగును. అప్పుడప్పుడు ప్రసుత ఆదేశమే తరువాతి ఆదేశము యొక్క చిరునామాను తెలుపును. అటువంటి సమయాలలో కౌంటరు యొక్క లెక్కను సరిచేయటమే ఆదేశముగా భావించవలెను. 1980ల నుండి ఏ ఎల్ యు, నియంత్రించు విభాగము భౌతికంగా ఒకే చిన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూటులో ఉంచబడినవి. దానిని కేంద్రీయ సంవిధాన విభాగము - సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సి పి యు) అంటారు. కొట్టు- జ్ణాపక విభాగం - మెమొరీ యూనిట్ కంప్యూటరు యొక్క జ్ణాపకశక్తిని వరుసగా పేర్చిన గదుల పెట్టెలుగా భావించవచ్చు. ప్రతీ గదికీ ఒక ప్రత్యేక సంఖ్య చిరునామాగా ఉంటుంది. ప్రతీ గదిలో సమాచారమును భద్రపరచవచ్చు. ఈ సమాచారము కంప్యూటరుకు ఇవ్వవలసిన ఆదేశములు అయి ఉండవచ్చు, లేదా దత్తాంశాలు (డేటా, అంటే ఆదేశాలను నిర్వర్తించుటకు కావలిసిన సమాచారము) అయినా అయిఉండవచ్చు. శాస్త్ర ప్రకారం మనము ఆదేశాలను కానీ దత్తాంశాలను కానీ భద్రపరుచుటకు ఏ గది నయినా ఉపయోగించవచ్చు.క ప్రవేశ/బహిర్గ విభాగం - ఇన్‌పుట్ /ఔట్‌పుట్ యూనిట్ -(ఐ/ఓ) ఈ విభాగము బయట ప్రపంచము నుండి సమాచారము సేకరించుటకు,, ఫలితములను బయట ప్రపంచమునకు తెలుపుటకు ఒక సాధనముగా ఉపయోగపడును. ఒక మామూలు వ్యక్తిగత కంప్యూటరులో సమాచారమును ప్రవేశపెట్టుటకు కీబోర్డు, మౌసులను, బహిర్గపరుచుటకు కంప్యూటరు మానిటరు, ప్రింటరు మొదలగు వాటిని ఉపయోగిస్తాము. ఇవి కాక ఇంకా ఎన్నో సాధనములను కంప్యుటరుకు బయట ప్రపంచమునకు మధ్య మార్పిడికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఇటువంటి కంప్యూటరు యొక్క పనిచేయు విధానము చాలా సూటిగా ఉంటుంది. కౌంటరు యొక్క లెక్క పెరిగిన ప్రతీసారి ఒక క్రొత్త ఆదేశమును, దానికి సంబంధించిన డేటాను మెమరీ నుండి చదివి దానిని నిర్వర్తించడము, తిరిగి ఫలితములను మెమరీలో బద్రపరచటం, మళ్ళీ తరువాతి ఆదేశమును స్వీకరించటం. ఈ విధముగా హాల్ట్ (ఆగుము) అను ఆదేశము వచ్చు వరకు జరుగుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద కంప్యూటరులలో ఈ నమూనాలో కొంచం తేడా ఉండును. వాటిలో ఒక సిపియు బదులుగా అనేక మయిన సిపియులు ఉండును. సూపరు కంప్యూటరులలో ఈ నిర్మాణము మరింత తేడాగా ఉండును. వాటిలో కొన్ని వేల సిపియులు ఉండును, అట్టి నిర్మాణములు ప్రత్యేకమయిన కార్యములకు మాత్రమే ఉపయోగించుతారు. కంప్యూటరు శాస్త్ర విద్య కొన్ని విశ్వవిద్యాలయాలలో కంప్యూటరు శాస్త్రాన్ని థీయరిటికల్ స్టడీ ఆఫ్ కంప్యుటేషన్ గా, అల్గారిదమిక్ రీజనింగుగా భోధిస్తారు. ఈ బోధనలో మామూలుగా థీయరీ ఆఫ్ కంప్యుటేషన్, అల్గారిథంల విశ్లేషణ, ఫార్మల్ పద్ధతులు, కాంకరెన్స్, డేటాబేసులు, కంప్యూటరు గ్రాఫిక్సు, సిస్టం విశ్లేషణ వంటి కోర్సులు చెపుతారు. ఇంకా కంప్యూటరు ప్రోగ్రామింగు కూడా చెపుతారు, కానీ దీనిని ఇతర విభాగాలకు సహాయకారిగా ఎక్కువగా భావిస్తారు, ఉన్నత కోర్సుగా కాకుండా! ఇక కొన్ని కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, సెకండరీ స్కూళ్ళు కంప్యూటరు శాస్త్రాన్ని వృత్తి విద్యగా చెపుతారు, ఈ కోర్సులలో కంప్యూటరు థీయరీ అల్గారిథంల పై కాకుండా కంప్యూటరు ప్రోగ్రామింగుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ సిలబసు కంప్యూటరు విద్యను సాఫ్టువేర్ ఇండస్ట్రీకి ఉపయోగపడే ఉద్యోగులను తయారు చేయడంపైననే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తుంది. కంప్యూటరు శాస్త్రము యొక్క ప్రాక్టికల్ విషయాలను సాధారణంగా సాఫ్టువేర్ ఇంజినీరింగ్ అని పిలుస్తారు. కాకపోతే దేనిని సాఫ్టువేర్ ఇంజినీరింగు అన వచ్చు అనే విషయము పై ఏకాభిప్రాయము లేదు. ఉదాహరణకు చూడండి పీటర్ జే. జెన్నింగ్ కంప్యూటరు సిలబస్‌లో గొప్ప సూత్రాలు , టెక్నికల్ సింపోసియం ఆన్ కంప్యూటరు సైన్సు ఎడుకేషన్, 2004. భారతీయ భాషల కంప్యూటరు ప్రక్రియ కంప్యూటరులను భారతీయభాషలలో వాడటానికి కావాలసిన ప్రామాణిక పద్ధతులను వివరిస్తుంది. కంప్యూటింగు వృత్తులు , నియమాలు ప్రస్తుత సమాజములో దాదాపుగా అన్ని వృత్తుల వారు కంప్యూటరులను ఉపయోగించుచున్నారు. కాకపోతే విద్యాలయాలలో, కంప్యూటరులను ఉపయోగించుటకుగాను, వాటిని నడుపుటకు కావలిసిన ప్రోగ్రాములను వ్రాయుటకు ప్రత్యేక పద్ధతులను నేర్పుటకు గాను, ప్రత్యేక వృత్తివిద్యలు అవతరించినాయి. కానీ ప్రస్తుతానికి ఈ వృత్తివిద్యలకు ఉన్న నామములు, పదజాలము నిలకడగాలేవు అని చెప్పవచ్చును, కొత్త కొత్త విభాగములు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. వీటిలో ముఖ్యమయినవిగా ఈ క్రింది వాటిని పేర్కొన వచ్చు: కంప్యూటరు ఇంజినీరింగు దీనిని ఎలక్ట్రానిక్ ఇంజినీరింగుకు ఒక శాఖగా భావించవచ్చు. ఈ విభాగములో మనము కంప్యూటరుల యొక్క భౌతిక లక్షణాలు, వాటి నిర్మాణ ప్రక్రియ, నిర్మాణమునకు కావలిసిన విడిభాగముల గురించి వివరములు నేర్చుకొనవచ్చును. కంప్యూటరు సైన్సు సాఫ్టువేరు ఇంజినీరింగు కంప్యూటరుచేత పనులు చేయించే ప్రోగ్రాములకు సంబంధించిన పద్ధతులు నేర్చుకొనుటకు,, ఈ ప్రక్రియను వేగవంతము చేయుటకు, ఖర్చు తగ్గించుటకు మార్గములు, ప్రామాణికమయిన లేదా నాణ్యమయిన ప్రోగ్రాముల వ్యవస్థను సృస్టించుటకు, అవసరమైన వివిధ అచరణీయమయిన పద్ధతుల గూర్చిన అధ్యయనము జరుగును. సాఫ్ట్‌వేరు పరీక్షా ఉద్యోగాలు: ఈ ఉద్యోగాలని స్థూలంగా రెండు మూడు విధములుగా చెప్పవచ్చు। స్వహస్త పరీక్షకులు: సాధారణ వినియోగదారులు ప్రోగ్రామును ఎలా ఉపయోగిస్తారో అలా అన్ని సంయోజనాలలోనూ ఉపయోగించి పరీక్షిస్తారు। యాంత్రిక పరీక్షకులు: ప్రోగ్రామును యాంత్రికంగా పరీక్షించేందుకు అవసరమైన ప్రోగ్రాములను వీరు రాస్తారు టెష్ట్ టూల్స్ డెవలపరు వీరు పరీక్షకుల బృందానికి కావలసిన రక రకాల పనిముట్లని తయారు చేస్తూ ఉంటారు। ఉదాహరణకు మెమరీ లీకు టెష్టులు, సెక్యూరిటీ టెష్టులు మొదలగున్నవి। ఈ టూల్సును అన్ని ప్రోగ్రాములవారూ ఉపయోగించవచ్చు। కంప్యూటరు ప్రాథమికాంశాల పుస్తకాలు,ప్రజంటేషన్లు ఐటిలో ప్రాథమికాంశాలు సి-డాక్ వారి "కంప్యూటరు పరిఙ్ఞానం" ఇ-శిక్షక్ పుస్తకం కంప్యూటరులలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్ వేర్ల పరిచయంలో కంప్యూటరు పరిచయం right|thumb| కంప్యూటరులలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్ వేర్ల పరిచయం కంప్యూటరు పత్రికలు కంప్యూటరు ఎరా కంప్యూటరుల చరిత్రలో మైలురాళ్ళు 1823లో చార్లెస్‌ బాబేజ్‌ ఆవిరి ద్వారా పనిచేసే క్యాలిక్యూలేటింగ్‌ యంత్రాన్ని రూపొందించాడు. ఆధునిక కంప్యూటరుకు దీనిని తొలిమెట్టుగా భావిస్తారు. తొలిసారి బైనరీ అర్థమెటిక్‌ను ఉపయోగించినది కొనార్డ్‌ యూస్‌. ఈయన 1934లో బైనరీ అర్థమెటిక్‌ను ఉపయోగించి కొన్ని రకాల కంప్యూటరులను రూపొందించాడు. కంప్యూటరు సైన్స్‌ పితామహుడిగా అలెన్‌ ట్యూరింగ్‌ను పిలుస్తారు. 1937లో ట్యూరింగ్‌- “On computable Numbers, with an application to the Entsheidungsproblem” అనే సిద్ధాంత వ్యాసాన్ని ప్రచురించారు. కంప్యూటరుకు సంబంధించి తొలి హైలెవెల్‌ ప్రొగామింగ్‌ లాంగ్వేజి ఫోట్రాన్‌. దీనిని 1956లో ఐబీఎం కంపెనీకి చెందిన జాన్‌ బేకస్‌, ఆయన బృందం అభివృద్ధి చేసింది. ఇది 1957లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. ‘పర్సనల్‌ కంప్యూటరు’ అనే పదం 1976లో తొలిసారి బైట్‌ మ్యాగిజైన్‌లో ప్రచురితమయింది. ఆ తర్వాత ఇది ప్రపంచమంతా వ్యాపించింది. తొలిసారి పర్సనల్‌ కంప్యూటరును ఐబీఎం కంపెనీ 1981లో తయారుచేసింది. దీనిలోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను, బేసిక్‌ కంప్యూటరు భాషను మైక్రో సాఫ్ట్‌ రూపొందించింది. ‘బగ్‌’ అనే పదాన్ని కంప్యూటరు సంబంధిత విషయాల్లో తొలిసారి వాడింది అడ్మిరల్‌ గ్రేస్‌ హోపర్‌. అమెరికా నావికాదళానికి చెందిన ఒక స్థావరంలో బొద్దింక వల్ల కంప్యూటరు పాడైపోయింది. అప్పుడు ఆయన తొలిసారి ఈ పదాన్ని వాడారు. టీసీపీ, ఐపీల గురించి 1973లో వింటన్‌ సెర్ఫ్‌, రాబర్ట్‌ కాన్‌లు ఒక పరిశోధనా పత్రాన్ని రాశారు. ఇది ఇంటర్నెట్‌ ఆవిర్భావానికి కారణమయింది. అందువల్లే వింటన్‌ సెర్ఫ్‌ను ఇంటర్నెట్‌ పితామహునిగా పిలుస్తారు. 1973లో న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త లారీ టెస్లర్ క‌ట్‌, కాపీ, పేస్ట్‌ లాంటి క‌మాండ్లును రూపొందించాడు. ఇవి కూడా చూడండి సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్ హార్డ్ డిస్క్ డ్రైవు ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ అండ్ కంప్యూటరు వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) ఇస్కి మూలాలు వనరులు వేమూరి వేంకటేశ్వరరావు, కంప్యూటరులు, తెలుగు భాషా పత్రిక, అట్లాంటా (అమెరికా) నుండి 1967 నుండి అయిదేళ్ళ పాటు, ఏడాదికి నాలుగు సంచికల చొప్పున, వెలువడ్డ వైజ్ఞానిక (రాత) పత్రిక. ఈ పత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు కంప్యూటరులు ఎలా పనిచేస్తాయో తెలుగులో వివరించబడింది. వేమూరి వేంకటేశ్వరరావు, కంప్యూటరు పని చేసే విధానం, లోలకం, lolakam.blogspot.com/, Aug 30, 2013 వేమూరి వేంకటేశ్వరరావు, ఆపరేటింగ్ సిస్టం అంటే ఏమిటి?, లోలకం, lolakam.blogspot.com/, Aug 24, 2013 వేమూరి వేంకటేశ్వరరావు, కలన యంత్రాలు: ఒక విహంగావలోకనం, లోలకం, lolakam.blogspot.com/, Aug 03, 2013 వర్గం:కంప్యూటర్ వర్గం:సాంకేతికం వర్గం:ఆంగ్ల పదజాలము
ఊరగాయ
https://te.wikipedia.org/wiki/ఊరగాయ
ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉపోధ్ఘాతం తెలుగువారికి ఆవకాయ గురించి ఉపోద్ఘాతం అవసరంలేదు. వారికి ఇంటింటా సుపరిచితమైన వంట. అమెరికా వెళ్ళే తెలుగువారు చాలామంది తప్పక తీసుకువెళ్ళే పదార్థం.కట్టా గోపాలకృష్ణ మూర్తి, Department of Industrial and Operations Engineering, University of Michigan, Ann Arbor. కొన్ని"తెలుగుదనాలతో" నా అనుభవాలు , పేజీ 64, తెలుగు వంటలతో కొన్ని అమెరికన్ల అనుభవాలు తింటున్న అన్నానికి వేరువేరు రుచులు కలపడానికి నంజుకునే వంటకాన్ని "ఊరగాయ" అంటారు. ఉదాహరణకు, కొత్తగా తోడుపెట్టిన తియ్యటి పెరుగన్నం తినేటప్పుడు దబ్బకాయ ఊరగాయ నంజుకుంటే పులుపు, కారం, ఉప్పు, కొద్దిగా దబ్బతొక్క చేదు కలిసి జిహ్వకు ఎంతో సుఖం కలిగిస్తుంది. పచ్చడి, పికిలు. ప్రాచీన గ్రంథాలలో ఊరుగాయ అని కూడా ఉంటుంది. రకాలు పుల్ల పచ్చి మామిడి ముక్కలతో చేసే ఆవకాయ, మాగాయ, లేక దాని కోరుతో చేసే మామిడికోరు ఊరగాయ; నిమ్మ, దబ్బ, ఉసిరి, గోంగూర, చింతకాయ, పండుమిరప, ఉల్లి, వెల్లుల్లి ఊరగాయలూ తరతరాల నుంచీ తెలుగువాళ్ళు వాడుతున్నారు. ఈ మధ్య టమోటా, దోస, కారట్టు, కాలిఫ్లవరు ఊరగాయల్లాంటివి గూడా వాడడం మొదలుపెట్టారు. మామిడి ఆవకాయ తయారీ విధానం కావలసిన పదార్థాలు మామిడికాయ ముక్కలు – 1 కి.గ్రా నువ్వుల నూనె – 1/4 కి.గ్రా అల్లం, వెల్లుల్లి ముద్ద – 1/4 కి.గ్రా కారం పొడి – 125 గ్రాములు ఉప్పు – 250 గ్రాములు జీలకర్ర పొడి – 25 గ్రాములు మెంతిపొడి – 10 గ్రాములు ( 1 టేబుల్ స్పూన్) పసుపు – 10 గ్రాములు (1 టేబుల్ స్పూన్) ఇంగువ – చిటికెడు ఆవాలు – 1 tsp జీలకర్ర – 1 tsp తయారీ పద్ధతి మామిడికాయలను తడిబట్టతో తుడిచి, ముక్కలు చేసి అందులో జీడి తీసేయాలి. ఒక గిన్నెలో కారంపొడి, ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. మరో గిన్నెలో నువ్వులనూనె వేడి చేయాలి . ఈ నూనె బాగా కాగిన తర్వాత ఇంగువ వేసి చిటపటలాడాక ఆవాలు, జీలకర్ర కూడా వేసి పోపు పెట్టాలి. గిన్నెను పొయ్యి మీదనుండి దింపేయాలి. నూనె చల్లారనివ్వాలి. నూనె కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి. దీనివల్ల అందులోని తడి పోయి కమ్మగా ఉంటుంది. పూర్తిగా చల్లారాక కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని వేసి మొత్తం కలపాలి. తర్వాత మామిడి ముక్కలు వేసి మొత్తం మసాలా ముక్కలకు పట్టేటట్టుగా కలపాలి. మొత్తం కలిపి శుభ్రమైన, తడిలేని జాడీలో ఆవకాయ వేసి జాగ్రత్తగా మూత పెట్టి ఉంచాలి. మూడు రోజుల తర్వాత మరోసారి ఆవకాయనంతా కలియబెట్టాలి. అంతే నోరూరించే కమ్మని ఆవకాయ తినడానికి తయారవుతుంది. చరిత్ర పలురకాల ఊరగాయలు (ముఖ్యంగా ఆవకాయ, మాగాయ, గోంగూర ఊరగాయలు) తయారుచేసే విధానాన్ని తెలుగువారే మొదట కనిపెట్టారు. ఊరగాయలు వాడడం ప్రాచీనకాలంనుంచీ జరుగుతోందని చెప్పడానికీ చాలా నిదర్శనాలున్నాయి. ఇప్పుడు ఊరగాయలవాడకం ఇండియా అంతటా వ్యాపించింది. ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఊరగాయల గురించి ప్రస్తావన ఉంది కూడా. 18వ శాతాబ్దంలో ప్రస్థావన ప్రాచీన సాహిత్యంనుంచి జెజ్జాల కృష్ణమోహన రావు రచ్చబండ గూగుల్ గ్రూపులో లేఖ ఊరగాయల గురించి ఒక మంచి పద్యం: సీ. మామిడికాయయు, మారేడుగాయయు, గొండముక్కిడికాయ, కొమ్మికాయ గరుగుకాయయు, మొల్గుకాయ, యండుగుకాయ, లుసిరికెకాయలు, నుస్తెకాయ, లెకరక్కాయయు, వాకల్వికాయయు, జిఱినెల్లికాయయు, జిల్లకాయ, కలబంద, గజనిమ్మకాయ, నార్దపుకాయ, చిననిమ్మకాయయు, జీడికాయ, తే.గీ. కుందెనపుకొమ్ము, మామెనకొమ్ము, బుడమ కాయ, యల్లము, మిరియంపుకాయ, కలివి కాయ, కంబాలు, కరివేపకాయ లాది యైన యూరుగాయలు గల వతని యింట. ఈ పద్యం నుంచి 18వ శతాబ్దంలో తెలుగువాళ్ళు ఎన్నో రకాల ఊరగాయలని చేసుకొని తినేవారని తెలుస్తుంది.అయ్యలరాజు నారాయణామాత్యుడు, హంసవింశతి, 4.135, శృంగార కావ్య గ్రంథ మండలి ప్రబంధ పరంపర - 4 originally published in the later half of eighteenth century, మచిలీపట్టణం, 1938. ఈ పద్యం చదివినప్పుడల్లా ఏ తెలుగువారికైనా నోరు ఊరుతుంది. 16వ శతాబ్దంలో ప్రస్థావన 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద, 1, 79-82, originally written in 16th century, వావిళ్లరామశాస్త్రి & సన్స్ మూడవకూర్పు 1907 ముద్రణ , పునర్ముద్రణ, తెలుగువిశ్వవిద్యాలయము, 1995.] గ్రంథంలో కూడా ఊరగాయల గురించి ఉంది. గోదాదేవి కథ ఆముక్తమాల్యద శ్రీకృష్ణుడి భక్తురాలైన గోదాదేవి కథ, చాలా విచిత్రమైనది. తన జీవితాన్ని శ్రీకృష్ణుడికే అంకితం చెయ్యదలచుకొని ఈవిడ పెళ్ళి చేసుకోలేదు. ఈవిడనే మొదటి ఆండాళ్‌ అంటారు. ఈవిడ విష్ణుచిత్తుడి కూతురు. విష్ణుచిత్తుడు ప్రతిరోజూ ఒక కొత్త పూలదండ తయారుచేసి, శ్రీకృష్ణుడి విగ్రహానికి వెయ్యమని కూతురికి ఇచ్చేవాడు. గోదాదేవికి తన నాథుడైన శ్రీకృష్ణుడికి దండ మంచిదైతేనేగానీ వెయ్యడం ఇష్టంలేదు. అదిమంచిదో కాదో తెలుసుకోవడానికి దాన్ని ముందు తను ధరించి, మంచిదనిపించినతర్వాతే శ్రికృష్ణుడి విగ్రహానికి వేసేది. ఒకరోజు విష్ణుచిత్తుడు పూజ చేసే సమయంలో విగ్రహానికి వేసియున్న దండలో పొడుగాటి వెంట్రుకను చూస్తాడు. కూతురు దండను తను ముందు ధరించి తర్వాత దాన్ని విగ్రహాంమీద వేసిందని అతను అప్పుడు తెలుసుకుంటాడు. వాడిన పూలదండను దేవుడికి వెయ్యడం మహాపాపం అంటూ కూతుర్ని కోపగించి, ఆ వాడిన దండ తీసేసి, ఒకకొత్తదండ తయారుచేసి తనే వేస్తాడు. ఆ రాత్రి విష్ణుచిత్తుడికి కృష్ణుడు కలలో కనిపించి "నాకు ఇవ్వాళ నువ్వు వేసిన దండ ఏమీ బాగాలేదు. మళ్ళీ రేపటినుంచీ నాకు మీ అమ్మాయి ఇంతకుముందువేశే దండల్లాంటివే వెయ్యమను" అని హెచ్చరిస్తాడు. విష్ణు చిత్తులవారి అతిధి భోజనాల వంటకాలు ఆ కాలంలో విష్ణుచిత్తిడు తన అతిధుల భోజనానికి వివిధ ఋతువుల్లో ఏ ఏ వంటకాలు వడ్డన చేశేవాడో, ఈ వంటకాలు చెయ్యడానికి అతని భార్య ఎలాంటి వంటచెరుకు (కట్టెలు, కొబ్బరిచిప్పలు) వాడేదో, ఈ గ్రంథంలో 3 పద్యాల్లో వర్ణిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ప్రతిపద్యం క్రిందా బ్రాకెట్టుల్లో దాని తాత్పర్యంకూడా యివ్వబడింది. చం. గగనము నీటిబుగ్గ కెనగా జడి వట్టిన నాళ్ళు భార్య క న్పొగ సొరకుండ నారికెడపుం బొఱియ ల్దగిలించి వండ న య్యగవల ముంచిపెట్టు గలమాన్నము, నొల్చిన ప్రప్పు, నాలు గే న్పొగవిన కూరలు, న్వడియముల, వరుగు, ల్పెరుగు, న్ఘృతప్లుతిన్‌ (వరి అన్నము, ఒలిచిన పప్పు, నాలుగైదు కూరలు, వడియము, వరుగు, పెరుగు, నెయ్యి- ఇవి వర్షాకాలపు వంటకాలు.) చం. తెలినులి వెచ్చ యోగిరము, దియ్యని చారులు, దిమ్మనంబులున్‌, బలుచని యంబళు, ల్చెఱకుపా, లెడనీళ్ళు, రసావళు, ల్ఫలం- బులును, సుగంధి శీతజలము, ల్వడపిందెలు, నీరుజల్లయు, న్వెలయగ బెట్టు భోజనము వేసవి జందనచర్చ మున్నుగన్‌ (వెచ్చని అన్నము, చారు, తీయని చారు, అంబలి, చెఱకు పాలు, కొబ్బరినీళ్ళు, ఇతర రసములు, పండ్లు, చల్లని నీళ్ళు, వడమామిడిపిందెలు, నీరుమజ్జిగ- ఇవి వేసవికాలపు వంటకాలు.) మ. పునుగుందావి నవోదనంబు, మిరియంపుం బొళ్ళతో జట్టి చు- య్యను నాదాఱనికూరగుంపు ముకుమందై, యేర్చునావం, జిగు- ర్కొను పచ్చళ్ళును, బాయసాన్నములు, నూరుంగాయలున్‌, జే సుఱు- క్కను నేయుం, జిఱుపాలు వెల్లువగ నాహారంబిడు న్సీతునన్‌ (పునుగు వాసనగల అన్నము, మిరియాల పొడులు, ఘమఘమలాడు వేడి కూరలు, ఆవ, చిగురు పచ్చళ్ళు, పాయసము, ఊరుగాయలు, కరిగిన నేయి, పాలు- ఇవి శీతాకాలపు వంటకాలు.) ఇరపమొక్కలు భారతదేశానికి అమెరికాఖండం నుంచి వచ్చాయి. కారం రుచికి మిరియాలను వాడినట్లు చెప్పాడు. ఈ గ్రంథం వ్రాశిన కాలానికి మిరపమొక్కలు ఇంకా భారతదేశానికి రాలేదేమో!) 14వ శతాబ్దంలో ప్రస్థావన ఆముక్తమాల్యదకు ముందే 14వ శతాబ్దంలో రచింపబడిన క్రీడాభిరామంలో వినుకొండ వల్లభరాయడు ,క్రీడాభిరామము, Originally written in 14th century, పునర్ముద్రణ వేటూరి ప్రభాకరశాస్త్రి( సం)శ్రీ ప్రభాకర పరిశోధక మండలి, మణిమంజరి, హైద్రాబాదు, 1960 (డిఎల్ఐ డిజిటల్ ప్రతి ), ఎమెస్కో బుక్స్‌, 166, 1997.] కూడా ఊరగాయల గురించి ఒకపద్యం రూపంలో ప్రస్తావన ఉంది. ఉ. కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్‌, గుప్పెడు పంచదారయును, గ్రొత్తగ గాచిన యాల నే, పెస- ర్పప్పును, గొమ్ము నల్లనటి పండ్లును, నాలుగు నైదు నంజులున్‌, లప్పలతోడ గ్రొంబెరుగు, లక్ష్మణవజ్ఝల యింట రూకకున్‌. (మంచి సన్నన్నము, గోధుమపిండి వంట (రొట్టె), పంచదార, ఆవు నేయి, పెసరపప్పు, అరటి పండ్లు, నాలుగైదు ఊరుగాయలు, పెరుగు ఇవన్నియు ఒక రూకకు లభించును.) చేసే విధానం మిగతా వంటకాలకూ, ఊరగాయలకూ ముఖ్య భేదం ఏమిటంటే ఊరగాయలు చెయ్యడానికి వేడి అవసరం లేదు. ఊరగాయ చేసే పద్ధతి ఇలా ఉంటుంది: ఊరగాయగా చెయ్యబోతున్న కాయలను బాగా శుభ్రంచేసి, తడి ఆరాక వాటిని ముక్కలుగా కొయ్యాలి (ముక్కల ఊరగాయ చెయ్యడానికి), లేక కోరుగా తురమాలి (కోరు ఊరగాయ చెయ్యడానికి). అప్పుడు వాటిలో ఉప్పు, పసుపు, కారం, ఆవ పిండి, జీలకర్ర పిండి, ఆవాలు, వెల్లుల్లి, వేరుశనగ పప్పు, నువ్వుల నూనె, బెల్లం మొదలైన దినుసులు సరైన మోతాదులలో బాగా కలిపి, మిశ్రమాన్ని ఒక జాడీలో ఉంచాలి. కొన్నిరోజులు ఊరి, కాయముక్కలు మెత్తబడ్డాక అది ఊరగాయ అవుతుంది. కలిపిన దినుసుల సమూహంలో కాయ ఊరడంవల్ల తయారయింది కనుక దానికి "ఊరగాయ" అని పేరు పెట్టారు. తక్కువ ఉప్పుతో ఊరగాయలు చెయ్యడం నిలవ ఉంచినప్పుడు బూజు పట్టకుండా ఉండడానికి కాబోలు ఊరగాయల్లో ఉప్పు మరీ ఎక్కువ వేసే వారు పూర్వ కాలంలో. కానీ ఉప్పు ఎక్కువ తింటే బ్లడ్‌ ప్రెజరు పెరుగుతుందని తెలుసుకున్నాం గదా ఇప్పుడు. అందుకనే తక్కువ ఉప్పుతో ఊరగాయలు చేసే విధానాలు అమలులోకి వచ్చాయి. కానీ ఇలా చేసిన ఊరగాయలు ఎక్కువ కాలం నిలువజేయాలంటే వాటిని రెఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఊరగాయలకూ, మిగతావాళ్ళ పికిల్సుకూ తేడా ఇండియన్లు చేసే ఊరగాయలకూ, మిగతా దేశస్థులు చేసే పికిల్సు అనే వంటకాలకూ చాలా భేదాలున్నాయి. అమెరికా, యూరప్‌ల్లో చేసే కుకుంబర్‌ పికిలు, కుకుంబర్‌ని వినెగర్‌లో నానబెట్టడంతో తయారవుతుంది. జర్మన్‌లు చేశే సవర్‌క్రౌట్‌ తురిమిన కాబేజిని వినగర్లో నానబెట్టడంతో తయారవుతుంది. అలానే కొరియన్‌లు చేసే కిమ్చి కూడా, తురిమిన కాబేజి, చేపలూ, మాంసం ముక్కలూ వినగర్లో నానబెట్టడంతో తయారవుతుంది. వీళ్ళ పికిల్సన్నిటిలోనూ ముఖ్యంగా తగిలే రుచి పులుపు మాత్రమే. మన ఊరగాయల్లో ఆవ పిండీ, కారం, పసుపు, నువ్వుల నూనె (కొన్నిట్లో కొద్దిగా బెల్లం) మొదలైన దినిసులు ఉండడం ఒక గొప్ప విశేషం. దీనివల్ల మన ఊరగాయల్లో అన్నిరుచులూ తగుల్తాయి. పచ్చళ్ళు, ఊరగాయలు సాధారణంగా మనం ఇడ్లీ, దోశల్లాంటివి తినేటప్పుడు నంచుకోవడానికి "పచ్చళ్ళు" (కొబ్బరి పచ్చడి, దోసపచ్చడి, బీరతొక్కు పచ్చడి వగైరా) వాడతాం. ఈ పచ్చళ్ళు నిలువ ఉండవు, వాటిని సాధారణంగా చేసిన రోజునే వాడేస్తారు (ముఖ్యంగా రెఫ్రిజిరేటర్లు లేని పూర్వ కాలంలో). ఊరగాయలు అలా కాకుండా చాలారోజులు నిలువ ఉంటాయి. ఇదీ పచ్చళ్ళకూ, ఊరగాయలకూ ముఖ్య భేదం. కానీ ఈ మధ్య ఊరగాయలను కూడా పచ్చళ్ళని పిలవడం పరిపాటి అయిపోయింది. పికిలు అనే పేరు ఎలా వచ్చింది? ఇంగ్లీషు వాళ్ళు భారతదేశం మొదట వచ్చినప్పుడు మన ఊరగాయలను రుచి చూశారు. ఇలాంటి వంటకాన్ని ఎప్పుడూ చూడకపోవడం చేత, వాటిని ఇంగ్లీషులో ఏమని పిలవాలో వారికి తెలియలేదు అప్పుడు. కానీ వారి పికిల్సులాగా పులుపుగా ఉండడంచేత ఊరగాయలను "పికిల్సు" అని పిలవడం మొదలుబెట్టారు. ఇండియాలో ఇంగ్లీషు వాడకం పెరిగిన కొద్దీ ఊరగాయలను పికిల్సు అని చెప్పుకోవడం వాడుకలోకి వచ్చింది. మార్కెటులో ఊరగాయల లభింపు ఇప్పుడు చిన్నిచిన్ని పల్లుటురుల్లో తప్పించి చాలామంది ఊరగాయల్ని స్వయంగా చేసుకునే బదులు, తయారుచేయ్యబడ్డ ఊరగాయల్ని మార్కెటులో కొనుక్కుంటున్నారు. దీనివల్ల ఊరగాయల తయారీ, అమ్మకం పెద్ద బిజినెస్‌ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఊరగాయలు చేశే పెద్దపెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఊరగాయల్ని సీసాల్లోనూ, ప్లాస్టిక్‌ పౌచిల్లోనూ పాక్‌ చేశి ప్రపంచమంతటా సరఫరా చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి చాలామంది ఉప్పు, నూనె వాడకం తగ్గించాలనుకుంటున్నారుకదా ఈ రోజుల్లో. ఈ రెండు దినుసుల్నీ తక్కువగా వాడి ఊరగాయల్ని చెయ్యడం మొదలుపెట్టితే ఈ కంపెనీలు వారి బిజినెస్‌ వాల్యూముని ఇంకా బాగా పెంచుకోవచ్చు. ఊరగాయల్ని గురించిన మూడనమ్మకాలు కొంతమంది, ఊరగాయల్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందనో, లేక దాంట్లోని కారంవల్ల తిన్న మర్నాడు టాయిలెట్‌ వాడినప్పుడు కడుపునొప్పి లేక మంట కల్గుతుందనో అపోహ పడ్తారు. నిజానికి, ఇలా భయపడనవసరం లేదు. అన్ని ఆహారపదార్ధాలనీ తగుమోతాదులలోనే తినాలన్నది మాత్రం సత్యం. ఏ ఆహారపదార్ధమైనాసరే, మోతాదుమించితింటే శరీరానికి అపాయం కల్గవచ్చు. ఉత్తి మంచినీళ్ళైనా సరే తక్కువకాలంలో విపరీతంగా తాగేస్తే శరీరనికి చాలా హాని కల్గుతుంది. ఊరగాయలో ఉప్పు ఎక్కువగా ఉంటే, దాన్ని అతిగా తినడంవల్ల బ్లడ్‌ప్రెజరు పెరగవచ్చు. కానీ కారంగానీ, కారంఉన్న ఊరగాయలుగానీ మోతాదులో రోజూ తినడంవల్ల ఆరోగ్యం చెడిపోదని కచ్చితంగా చెప్పవచ్చు. నిజానికి దానివల్ల మెరుగవుతుందికూడా. రోజూ మోతాదులో ఊరగాయలు తినడం జీర్ణశక్తిని పెంచుతుందనీ, మనిషిలోని చలాకీతనాన్నీ, సరదాతనాన్నీ పెంచుతుందనీ పరిశోధనలవల్ల తెలిశింది. ఇంకొకరి మాటలు నమ్మడమెమ్దుకు. మీకు ఊరగాయలు తినే అలవాటు లేకపోతే, నచ్చిన ఊరగాయల్ని కొద్దిగా ప్రతిరోజూ తినడం మొదలుబెట్టి చూడండి. కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది వాటివల్ల మీ జీవితం మెరుగవుతోందని. ఊరగాయలూ, ఆధ్యాత్మిక చింతనా ఉప్పు, కారం వగైరా రుచులతో ఉండే ఊరగాయలు మనిషిలో చలాకీతనం, చురుకుదనం, హుషారుతనం పెంపొందిస్తాయని చెప్పాను కదా. కనుక ఊరగాయలు తినడంవల్ల మోహ, కామోద్రేకాలూ; లైంగికవాంఛలూ పెరుగుతాయని అనుకోవడం సహజం. 1979-లో రిలీజు అయిన ``ఇంటింటి రామాయణం'' సినిమా నుంచి ఈ ఆలోచనని సమర్ధించే "ఉప్పూ కారం తినకతప్పదూ-తప్పో ఒప్పో నడక తప్పదూ" అనే పాట పాడుతారు. సినిమాలో ఈ పాటను, ప్రేమించుకొని పెళ్ళికని ఉవ్విళ్ళూరుతున్న ఒక జంట పాడతారు. పాటలో, ఉప్పు, కారం తినడం మూలాన శరీరవాంఛలు పెరుగుతాయనే భావన గ్రహించండి. ఊరగాయలు చెయ్యడానికి వాడే మిగతా స్పైసుదినిసులకు గూడా ఈ లక్షణం ఉన్నట్లు ప్రతీతి. దీంట్లో ఆవగింజంత సత్యం లేకపోలేదు. అందుకనే కాబోలు, దైవభక్తీ, భగవచ్చింతనా, ఆద్యాత్మికచింతనా అలవరచుకోమని బోధించే స్వాములు సాధారణంగా ఊరగాయలు తినవద్దని చెప్తుంటారు. నా సలహా మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేశే ఉప్పు, కారం రుచులుగల ఊరగాయల్లాంటి పదార్ధాలని విసర్జించమనడం కన్నా, చిన్నతనం లోనే పిల్లలందరికీ; ప్రాపంచిక, ఐహిక, శరీర వాంఛలను అదుపులో పెట్టుకోగల్గే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యమని నేను చెప్తాను. ఇలాంటి క్రమశిక్షణ నేర్చుకున్నవారు మోతాదులో ఊరగాయలూ, స్పైసులూ తింటే వారి జీవితం చాలా మెరుగవుతుంది. సామెతలు వచ్చీరాని మాట ఊరీ ఊరని ఊరగాయ రుచి. గోంగూర గిడసబారినా ఊరగాయలో రుచి తగ్గదు. ఉప్పు ఊరగాయ కాదు. ఉప్పులేని పప్పు, ఊరగాయలేని సద్ది. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. సినిమా పాటలు రెండు జెళ్ళ సీత సినిమాలో ‘కొబ్బరి నీళ్ళా జలకాలాడ’ పాటలో వచ్చే ఊరగాయ స్తోత్రం మాగాయే మహా పచ్చడి పెరుగేస్తే మహత్తరి అది వేస్తే అడ్డ విస్తరి మానిన్యాం మహా సుందరి. మూలాలు ఇతర లింకులు గాయత్రి వంటిల్లులో ఆవకాయ తయారీ ఆంధ్రా ఆవకాయ తయారీ పద్ధతి మాగాయ చేసే విధానం ఆంధ్రా ఆవకాయ తయారీ విధానం-యూట్యూబ్ లో కాలీప్లవర్ ఆవకాయ తయారీ వర్గం:తెలుగుదనం వర్గం:శాకాహార వంటలు వర్గం:ఊరగాయలు వర్గం:మామిడికాయ వర్గం:ఈ వారం వ్యాసాలు
తెలుగుదనం
https://te.wikipedia.org/wiki/తెలుగుదనం
thumb|తెలుగు తల్లి విగ్రహం సాధారణంగా తెలుగు వారి ప్రవర్తనలో కనిపించే అలవాట్లనూ, వాళ్ళు పాటించే ఆచారాలను తెలుగుదనాలు అంటారు. విశేషాలు thumb|లంగా జాకెట్టు వస్త్రధారణలో బాలికలు వస్త్రధారణ లంగా ఓణి లతో ఉన్న అమ్మాయిని చూసి తెలుగుదనం ఉట్టి పడుతుంది అంటారు, రూపాయికి వంద పైసలు లేదా పదహారు అణాలు అందువల్ల వందశాతం తెలుగుదనంతో అచ్చమైన తెలుగు సంస్కృతి అలవాట్లు కలబోసుకున్న తెలుగు అమ్మాయిని ‘పదహారణాల తెలుగమ్మాయి’ అంటారు. పురుషులు ధోవతులుచొక్కాలు,  ఆడవాళ్ళూ చీరలు రవికెలు వస్త్రధారణ చేయడం తెలుగు వారి సంప్రదాయాలలో ఉంది. తెలుగు భాష పూర్వ ఔన్నత్యం అన్నప్పుడు మనకు గిడుగు రామమూర్తి గారు కందుకూరి , గురజాడ ,రాయప్రోలు, దేవులపల్లి, జాషువా వీరందరూ మనసులో మెదులుతారు. వారందరు ధోవతులు, చొక్కాలు ధరించిన వారే. తెలుగు భాషాభిమానం సాంప్రదాయ వేషభాషలతో మొదలవుతుంది. ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవిని పొందినా సరే తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయక ధోవతి, చొక్కాను ధరిస్తాడు. సుభాష్ చంద్రబోస్ కూడా కొన్ని సమయాలలో ధోవతి కట్టేవాడు. ఆచారాలు, సాంప్రదాయాలు తెలుగు వారు తమ గడపలకు పసుపు రాయడం, ఇంటి ముందర ముగ్గులు పెట్టడం, గుమ్మానికి తోరణాలు కట్టడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, సాంప్రదాయక దుస్తులు ధరించడం వంటి ఆచారాలు ఉన్నాయి. పెద్దలు కనపడం  గానే నమస్కారం చేయటం .బయటనుంచి వచ్చినపుడు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావటం మొదలైనవి కూడా తెలుగు వారి సంప్రదాయాలే. కవిత్వం అంటే  పద్యాలలోనే రాయాలి. వ్యాకరణం పాటించాలి. ఆహార పదార్థాలు తెలుగువారి అచ్చతెలుగుదనం తెలుగు వారి వంటకాల్లోనే ఉట్టిపడుతూ ఉంటుంది. మనవంటకాల్లోనే మనప్రత్యేకత ఉందన్న విషయం దృఢంగా తెలియాలంటే తెలుగు వారి తినుబండారాలు తినడం చేతనవాలి. తెలుగు వారు గర్వించదగ్గ వంటకాలు ఏవని అడిగితే ఎవరైనా ఇడ్లీ, మసాలాదోసె వంటి అనేక వంటకాల పేర్లు చెబుతారు. కానీ తెలుగువారిని గుర్తించే వంటకం "దిబ్బరొట్టె". ఇప్పుడు ఈ దిబ్బరొట్టెని కొన్ని మార్పులు చేసి "ఊతప్పం" గా దక్షిణాదివారు మార్చారు. ఇప్పుడు తెలుగువాళ్ళకి ఊతప్పమే తెలుసు గానీ దిబ్బరొట్టె తెలియకుండా పోయింది. పెసరట్టు తెలుగు వాడి తినుబండారం. పెసరట్టులోనే తెలుగుదనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తెలుగు వాడు తప్ప మరొకడు వండలేనిది పెసరట్టు. పెసరట్టు ఏలూరులో పవరుపేట లో పుట్టింది. కాలవ ఒడ్డున కాకి వారి వీధిలో పెసరట్ల రామయ్య గారి కొట్లో పెసరట్టు పుట్టింది. కాలానుగుణ్యంగా పెసరట్టు ఇతర కోస్తా జిల్లాల వాళ్ళకి అలవాటయ్యింది. ఊరగాయలు తినడం ఒక ముఖ్య తెలుగుదనం. ఎక్కడున్నా సరే, తెలుగువారు తినడానికి ఊరగాయల కొరకు ఉవ్విళ్ళూరుతుంటారు. ఇంకొక ప్రాంతంలో కానీ, దేశంలో కానీ స్థిరపడడానికి వెళ్తున్నా తెలుగువారు తమ ఊరగాయలని తప్పకుండా తమతో తీసుకు వెళ్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగువారు నివసించడం మొదలుపెడితే, ఆ ప్రాంతంలో త్వరలో ఊరగాయ సీసాలు అమ్మే షాపులు వెలుస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు. పండగలు పండుగ పూట వేకువనే లేచి సున్నిపిండితో నలుగు పెట్టుకుని తలంటు పోసుకోవడం తెలుగువారి సంప్రదాయం. చలిపొద్దులు, గంగిరెద్దులు, భోగిమంటలు, తలంటులు, పిండివంటలు, జడగంటలు, కొత్త పంటలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, బంతిపూలు, భోగిపళ్లు, పాశురాలు, దాసరి కీర్తనలు, పిళ్ళారి ఆరగింపులు, సాతాని జియ్యర్లు, రంగవల్లులు, రథం ముగ్గులు, బొమ్మల కొలువులు అన్నీ కలిస్తే... సంక్రాంతి. కనుమరుగవుతున్న తెలుగుదనం అత్తయ్య, మావయ్య, తాతయ్య, బాబయ్య, బామ్మ, పిన్ని వంటి కమ్మని వరుసలలో బంధువులని పిలుచుకోవడం తెలుగువారి సంప్రదాయం. బంధువుల వరస లేమిటి, అమ్మ అన్న కమ్మని పిలుపే నేడు కరువయింది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లతోనే తప్ప- పిచ్చుకలు, పావురాలు, తూనీగలు, గోరువంకలు, లేగదూడలు, కుక్కపిల్లల వంటి సజీవ సహజీవులతో సావాసాలను బాల్యం మరిచేపోయింది. అసలవి మానవ పరివారంలోంచే తప్పుకొన్నాయి. చెట్లతో, ఏటిగట్లతో, పైరగాలితో స్నేహం చెడిపోయింది. పసివాళ్ల బతుకులు బోన్‌సాయి మొక్కలైపోయాయి. మొదళ్లు గిడసబారిపోయాయి. నిరంతరం యంత్రాలతోనే గడిపేస్తూ, పిల్లలు తామూ వాటిలో భాగం అయిపోతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఏ దశలోంచి కరవైపోయిందో అప్పుడే విద్యావ్యవస్థలోంచి తెలుగుదనం తప్పుకొంది. పసితనంలోనే ఆదర్శ జీవనానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి, సంస్కార వికాసానికి దోహదం కూర్చే శతక వాఞ్మయం వూసే లేకుండాపోయింది. వ్యవస్థలో నైతిక విద్యార్జన, బోధన అడుగంటిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే- మన తిండి మనది కాదు. మన ఆలోచనలు మనవి కావు. మన మాటలు మనవి కావు. మన సినిమాలు మనవి కావు. మన బతుకే మనది కాకుండాపోయింది. అన్నింటా తెలుగుదనాన్ని, మనల్ని మనమే పోగొట్టుకుంటున్నాం. తెలుగుదనం పెంచే అంశాలు సభల్లో, సమావేశాల్లో, ఉత్సవాల్లో తెలుగుజాతి ప్రత్యేక కళారూపాన్నొకదాన్ని విధిగా వ్యాప్తిలోకి తేవాలి. స్వచ్ఛమైన జానపద సాహిత్యం, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, విభిన్నమైన కట్టుబాట్లను పునరుద్ధరించాలి. వారి ఔషధ విజ్ఞానం ప్రాచుర్యంలోకి రావాలి. ఇతరములు కోతికొమ్మచ్చులు, గోటింబిళ్లలు, గోదారీతలు, ఇసుకగుళ్లు, పాకంజీళ్లు, పప్పుబెల్లాలు, తొక్కుడుబిళ్లలు, వామనగుంటలు, వల్లంకి పిట్టలు, పట్టుపరికిణీలు, వెండిపట్టీలు, వైకుంఠపాళీలు, రుక్మిణీ కల్యాణాలు...వంటివి తెలుగువారి సంప్రదాయక విధానాలు. సినిమాలలో తెలుగుదనం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే సన్నివేశాలున్నాయి. ఈ సినిమా అనే పేరు వినగానే తెలుగు కొంగొత్తగా గుభాళించినట్టు  అనిపించింది చిత్రసీమకు. తెలుగుదనాలకి సంబంధించిన ఆరోపాలు ఊరగాయ గోడకుర్చీ గారెలు గోంగూర ఉగాది పచ్చడి తలపాగా పంచెకట్టు 116 చదివీయడం పేర్లు, ఇంటిపేర్లు మూలాలు బాహ్య లంకెలు వర్గం:తెలుగు సంస్కృతి
ఖగోళ శాస్త్రం
https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం
thumb|right|250px| హబుల్ టెలీస్కోపు నుండి వచ్చిన నానా వర్ణములు గలక్రాబ్ నెబ్యులా, ఒక సూపర్నోవా శేషము. ఖగోళ శాస్త్రము (astronomy) అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు, నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది. ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. దూరదర్శిని (టెలిస్కోపు) కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడింది. అవి: పరశీలక ఖగోళశాస్త్రం (Observational Astronomy): టెలిస్కోపులు, కంప్యూటర్లు వగైరా పరికరాలతో ఖగోళ వస్తువులను పరిశోధించి సంగ్రహించిన విషయాలను ప్రాథమిక భౌతికశాస్త్ర సూత్రాలతో వివరించడం, వాటి ఫలితాలను విశ్లేషించడము. సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం (Theoretical astrophysics): విశ్వ రహస్యాలను వివరించడానికి గణిత సంభూతమైన విశ్లేషక నమూనాలను కనుక్కోవడము/ అభివృద్ధి చేయడం. ఖగోళశాస్త్రానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే, ఔత్సాహిక శాస్త్రజ్ఞులు (ఉత్సాహవంతులైన, నూతన, అనుభవము లేని శాస్త్రజ్ఞులు) కూడా చాలా ముఖ్యమైన విషయాలు కనుక్కున్నారు.(టెలిస్కోపు, ఉత్సాహము ఉంటే చాలు మరి). లక్షల గేలెక్సీ(నక్షత్ర కూటమి) లతో, కోట్లాది నక్షత్రాలతో ఈ విశ్వము అనంతమైనది కనుక ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. చరిత్ర భారతీయ జ్యోతిష శాస్త్రము(astrology)లో ఖగోళశాస్త్రానికి విశేష ప్రాముఖ్యత ఉంది. సూర్యసిద్ధాంతము అతి ప్రాచీన ఖగోళశాస్త్ర గ్రంథం. దీని రచయిత ఎవరో తెలియదు. ఆర్యభట్ట, వరాహమిహిరుడు ప్రఖ్యాత భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు. ప్రాచీన ఖగోళశాస్త్రం మామూలు కంటికి కనిపించే ఖగోళ వస్తువుల గమనాన్ని పరిశీలించడం ద్వారా వేసుకున్న అంచనాలతో ఉండేది. భారతదేశంతో పాటు ప్రాచీన బాబిలోనియా, పర్షియా, ఈజిప్టు, గ్రీసు, చైనా లలో ఖగోళ వేధశాల(astronomical observatories)లు నిర్మించబడ్డాయి. సూర్య, చంద్ర, నక్షత్రాదుల గమనము ఆధారంగా ఋతువులు, వర్షాలను నిర్ధారించి వాటిని బట్టి పంటలను వేసుకునేవారు. భూమి విశ్వకేంద్రమనీ, భూమి చుట్టూ నక్షత్రాలు గ్రహాలు పరిభ్రమిస్తున్నాయనీ నమ్మే వారు (టాలెమీ భూకేంద్ర/జియోసెంట్రిక్ సిద్ధాంతము) టెలిస్కోపు కనుగొనక ముందు కూడా రోదసి (space) గురించి చాలా ముఖ్యమైన విషయాలు కనుగొనబడ్డాయి. వాటి లో కొన్ని భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య యొక్క కోణము, సూర్య, చంద్ర గ్రహణాలు వచ్చే కాలాన్ని ముందే అంచనా వెయ్యడము, చంద్రుని వైశాల్యము, భూమికి చంద్రునికి ఉన్న దూరము. పరిశీలక ఖగోళశాస్త్రములో 13 వ శతాబ్దపు పర్షియా(పర్షియన్ సామ్రాజ్యము) లో, ఇతర మహ్మదీయ సామ్రాజ్యములలో ఖగోళ శాస్త్రము లో ఎన్నో నూతన విషయాలు కనుగొనబడ్డాయి. ముస్లీo ఖగోళశాస్త్రజ్ఞులు పెట్టిన నక్షత్రముల పేర్లు ఇంకా వాడుకలో ఉన్నాయి. విజ్ఞాన శాస్త్ర విప్లవము రెనసాన్స్ కాలములో, నికోలస్ కోపర్నికస్ సౌరకుటుంబానికి సౌరకేంద్ర/హీలియోసెంట్రిక్ నమూనాను ప్రతిపాదించెను. కోపర్నికస్ పరిశోధనలను గెలీలియో గెలీలి, యోహాన్స్ కెప్లర్లు పరిరక్షించి, సవరించి, విస్తరించారు. గెలీలియో మొదటి సారి పరిశోధనల కోసము టెలిస్కోపులు తయారుచేసి వాడెను. కెప్లర్ గ్రహ గతులను వాటి కక్ష్య లను మొదటిసారి కచ్చితముగా కనుగొనెను. కెప్లర్ న్యాయము లను ఋజువు చేసే సిద్ధాంతాలను కనుగొనడానికి మటుకు ఐజాక్ న్యూటన్ చేత కనుగొనబడిన ఆకాశ యంత్రశాస్త్రము, గురుత్వాకర్షణ శక్తి ఉపయోగపడ్డవి. న్యూటన్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోపును కనుగొనెను. ఆ తరువాత జరిగిన ఎన్నోపరిశోధనలు టెలిస్కోపు పరిమాణమును, నాణ్యతను పెంచాయి. నికోలాస్ లూయీ డి లాకాయె విపులమైన నక్షత్ర సూచీ పట్టీ (కేటలాగు) లను తయారు చేసెను. విలియమ్ హెర్షెల్ విస్తారమైన నెబ్యులా, క్లస్టర్ కేటలాగులను తయారు చేసెను. ఆయన 1781 లో యూరెనస్ గ్రహమును కనుగొనెను. 1838 లో ఫ్రెడరిక్ బెస్సెల్ మొదటిసారి ఒక నక్షత్రము నకు దూరమును కనుగొనెను. పందొమ్మిదవ శతాబ్దంలో లియోనార్డ్ ఆయిలర్, అలెక్సిస్ క్లాడ్ క్లైరాట్, జాన్ లె రాండ్ డిఅలెంబర్ట్లు గుర్తించిన 3 బాడీ ప్రాబ్లెమ్, చంద్రుడు, గ్రహములగతులను కచ్చితముగా కనుగొనెను. వీరి పరిశోధనలను జోసెఫ్ లూయీ లాగ్రాంజ్, పియర్ సైమన్ లాప్లాస్లు క్రోడీకరించి గ్రహముల, ఉపగ్రహముల కంపనము బట్టి వాటి బరువులను కనుగొనే విధమును కనుగొనిరి. నూతన సాంకేతిక పరిజ్ఞానముతో పాటు ఖగోళ శాస్త్రములో కూడా విశేషమైన అభివృద్ధి సంభవించెను. స్పెక్ట్రోస్కోపు, ఫోటోగ్రఫిలు ఖగోళశాస్త్రానికి బాగా ఉపయోగపడ్డవి. జోసెఫ్ వాన్ ఫ్రాన్ హోఫర్ 1814-15 ల లో సూర్యకాంతి లో 600 పట్టీ (bands) లను కనుగొనెను. ఈ పట్టీలకు కారణము 1859 లో గస్టావ్ కిర్కాఫ్ 'సూర్యుని లో వివిధ మూలకాలు ఉండడము' అని తేల్చెను. ఇతర నక్షత్రములు కూడా సూర్యుని వలే ఉండును కాని వివిధ ఉష్ణోగ్రతలు, బరువులు కలిగి ఉండునని కనుగొన్నారు. భూమి, సౌరకుటుంబము ఉన్న పాలపుంత నక్షత్రకూటమి (మిల్కీవే గేలెక్సీ)వలే అంతరిక్షము (space)లో ఇతర నక్షత్రకూటములు ఉన్నవని 20వ శతాబ్దములో కనుగొనడము జరిగింది. విశ్వము విస్తరిస్తున్నదని మిగతా గేలెక్సీలు మన గేలక్సీకు దూరంగా జరుగుతున్నాయని కనుగొన్నారు. నూతన ఖగోళ శాస్త్రములో క్వాజార్లు, పల్సార్లు, బ్లాజర్లు, రేడియో గేలెక్సీలు వంటి విశేష వస్తువులు కనుగొనబడ్డాయి. ఈ పరిశోధనల నుండి విడుదలైన సిద్ధాంతాల వల్ల కాలబిలము(బ్లాక్ హోల్) లు, న్యూట్రాన్ స్టార్ లను వివరించడము జరిగింది. Physical cosmology 20వ శతాబ్దములో సాధించిన అభివృద్ధితో మహావిస్ఫోట(బిగ్ బ్యాంగ్) వాదము నకు భౌతిక,ఖగోళ శాస్త్రముల నుండి cosmic microwave background radiation, హబుల్ నియమము, cosmological abundances of elements మద్దతు వచ్చెను. రోదసి వస్తువులను గమనించడము thumb|250px|left|రేడియో టెలిస్కోపులు ఖగోళ శాస్త్రజ్ఞులు వాడే పరికరాలలో కొన్ని బాబిలోనియా, ప్ర్రాచీన గ్రీసుదేశము లలో ఖగోళశాస్త్రము లో చాలా మటుకు ఆస్ట్రోమెట్రీ ( ఆకాశంలోనక్ష త్రాలు,గ్రహాల ఉనికిని కనుక్కోవడము) మాత్రమే ఉండేది. ఆ తరువాత జోహాన్స్ కెప్లర్, ఐజాక్ న్యూటన్ లవల్ల రోదసి గతి శాస్త్రము (celestial mechanics) అభివృద్ధి చెందింది. ఖగోళ శాస్త్రము లో గణితాన్ని ఉపయోగించి రోదసి వస్తువవులకు గురుత్వాకర్షణ బలాలతో గలిగిన గమనాలను అంచనా వేయడము జరిగేది. సౌరమండలం లో గల గ్రహములు, ఉపగ్రహములు, ఆస్టరాయడ్స్ వగైరా మీద దృష్టి కేంద్రీకరించడము జరిగేది. ఈ రోజుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము వల్ల రోదసి వస్తువుల స్థితి గతులు కనుక్కోవడము తేలికైంది కనుక, నూతన ఖగోళ శాస్త్రము రోదసి వస్తువుల భౌతిక ధర్మములను అర్థము చేసుకోవడము లో నిమగ్నమై ఉంది. సమాచారము సంగ్రహించు విధానములు ఖగోళ శాస్త్రము లో సమాచారమును సేకరించడము కాంతి, ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను కనుగొనడము, వాటి పరిశీలనల వల్ల సాధ్యమవుతుంది. అయితే న్యూట్రినో డిటెక్టర్ల వల్ల సూర్యుని నుండి వచ్చే న్యూట్రినో లు, సూపర్ నోవా ల నుండి న్యూట్రినోల వల్ల కూడా ఇంకా సమాచారము సేకరించవచ్చు. కాస్మిక్ కిరణాల ప్రభావమును కనుక్కొనే పరికరాలు కూడా ఉన్నాయి. గురుత్వాకర్షణ తరంగము లను కనుక్కొనే ప్రయోగములు కూడా జరుగుతున్నాయి. విద్యుదయస్కాంత వర్ణమాల(స్పెక్టృమ్) లో ఉన్న తరంగదైర్ఘ్య (వేవ్ లెంగ్త్) విభజనల వలే ఖగోళ శాస్త్రములో కూడా విభజనలు ఉన్నాయి. స్పెక్ట్రమ్ లో తక్కువ పౌనఃపున్యాల వద్ద రేడియో ఖగోళ శాస్త్రము, మిల్లీమీటరు-డెకామీటరు ల మధ్య ఉండే తరంగ దైర్ఘ్యా లను గమనిస్తుంది. ఈ రేడియో టెలీస్కోపు రిసీవరులు మనము రోజూ వినే రేడియో లో వాడే రిసీవరుల లాగే ఉండును కాని చాలా సున్నితముగా ఉండును. మైక్రోవేవులు రేడియో లో మిల్లీమీటరు పరిధి లో పని చేయును. మైక్రోవేవు ల వల్ల కాస్మిక్ మైక్రోవేవు బ్యాక్ గ్రౌండు రేడియేషన్ గురించి తెలుస్తున్నది. పరారుణ ఖగోళ శాస్త్రము, అతి పరారుణ ఖగోళ శాస్త్రము లలో పరారుణ కిరణాల (ఎరుపు రంగు కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యము కల కాంతి]ను కనుగొనడము అధ్యయనము చెయ్యడము జరుగుతోంది. ఈ పరిశోధనలకు ప్రత్యేక టెలిస్కోపు (పరారుణ కిరణాలను కచ్చితంగా గుర్తించేది). పరారుణ కిరణాలు వాతావరణములోని నీటి ఆవిరిని పీల్చుకుంటాయి కనుక, పరారుణ అబ్జర్వేటరీ లను చాలా ఎత్తైన, చాలా పొడిగా ఉన్న (నీటి ఆవిరి లేని) ప్రదేశాలలో కాని, అంతరిక్షము లో (భూమి వాతావరణానికి ఆవతల కాని) ఉంచడము జరుగుతుంది. అంతరిక్ష టెలీస్కోపు ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాతావరణము లో ఉండే ఉష్ణ ప్రసారాలు,మబ్బులు ఇతర అస్వచ్ఛత, వాతావరణ ప్రభావము లను నిరోధించవచ్చును. పరారుణ కిరణాలు నక్షత్ర కూటముల మధ్య ఉండే ధూళి, ఇతర అణువుల పరిశీలన లో ఉపయోగపడును. 300px|right|thumb| సముద్రమట్టము నుండి తగినంత ఎత్తు కలిగి కాలుష్యము లేని హువాయి లో కల మౌనా కీ అబ్జ్ ర్వేటరీ ఈ భూమిమీద అంతరిక్ష పరిశోధనలు చెయ్యడానికి అత్యంత వీలు ఉన్న ప్రదేశాలలో ఒకటి ఇప్పటి వరకు, చాలా వరకు సమాచారము దృశ్య కాంతి/సామాన్య ఖగోళ శాస్త్రము లో సేకరించడము జరిగింది. దర్పణములు, కటకములు,ఛార్జ్-కపుల్డ్ డివైస్, ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్ లు ఉపయోగ పడును. సాధారణ కంటికి కనపడే 1 E-7 m|400 - 700 nm కాంతి తరంగదైర్ఘ్యము ఉపయోగ పడును. సాధారణ టెలీస్కోపు స్పెక్ట్రోగ్రాఫ్ లు, ఎలక్ట్ర్రానిక్ ఇమేజర్లు కలిగిన టెలీస్కోపును సాధారణంగా వాడెదరు; అధిక శక్తి ఖగోళ శాస్త్రము లో ఎక్స్ రే ఖగోళ శాస్త్రము, గామా రే ఖగోళ శాస్త్రము, అతి నీలలోహిత ఖగోళ శాస్త్రము ల ఉపయోగముతో విశ్వము లోని అత్యంత శక్తి కేంద్రాలను అధ్యయనము చెయ్యడము, నూట్రినో లు, కాస్మిక్ కిరణాలను అధ్యయనము చెయ్యడము జరుగుతున్నది. రోదసి నౌక (space ship), రోదసి వాహనాల (spacecraft) వల్ల గ్రహాల అధ్యయనము ముందంజ వేసింది. వీటిలో గ్రహాల చుట్టూ పరిభ్రమిస్తూ రీడింగులు తీసుకునే కాసినీ హైజెన్స్ వంటి మానవ నిర్మిత ఉపగ్రహాలు, మార్స్ పాత్ ఫైండర్ వంటి ల్యాండింగ్ వెహికిల్ లు(ఇతర గ్రహము మీదకు దిగగలిగే వాహనము) ల వల్ల గ్రహాలు, ఉప గ్రహాల గురించి చాలా సమాచారము గ్రహించబడింది. డిస్కవరీ, కొలంబియా వంటి అంతరిక్ష వాహనము (స్పేస్ షటిల్) (అంతరిక్షము లోకి వెళ్ళి మళ్ళీ ఈ భూమ్మీదకు వెనక్కు రాగలిగే వాహనము) ల వల్ల అంతరిక్షము లో పరిశోధనలు సాధ్యమవుతున్నాయి సంబంధిత విజ్ఞానశాస్త్రములు ఖగోళ శాస్త్రము ఇతర విజ్ఞాన శాస్త్రములతో చాలా సన్నిహిత సంబంధాలను పెంచుకుంటున్నది. ఆ విధముగా కనుగొన బడ్డ ఉపశాస్త్రములు ఖగోళ భౌతిక శాస్త్రము ఖగోళ జీవ శాస్త్రము చారిత్రిక ఖగోళ శాస్త్రము ఖగోళ రసాయన శాస్త్ర్రము ఇవికూడా చూడండి విశ్వం హాబుల్ అంతరిక్ష టెలిస్కోపు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చదవదగ్గ గ్రంథాలు వేమూరి వేంకటేశ్వరరావు, విశ్వస్వరూపం, ఇ-పుస్తకం, కినిగె ప్రచురణ, https://web.archive.org/web/20181025164023/http://kinige.com/kbook.php?id=4247 మూలాలు వర్గం:ఖగోళ శాస్త్రం వర్గం:విశ్వం వర్గం:విజ్ఞాన శాస్త్రం
శాస్త్రము
https://te.wikipedia.org/wiki/శాస్త్రము
ఎడమ|thumb|234x234px|కార్ల్ ఫ్రెడరిక్ గాస్, గణిత శాస్త్రవేత్తల యువరాజుగా ప్రశస్తుడు. శాస్త్రము అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం "సూత్రం, నియమాలు, నిబంధనల పత్రం, సంకలనం, పుస్తకం లేదా గ్రంథం". ఈ పదాన్ని సాధారణంగా భారతీయ సాహిత్యంలో, నిర్వచించిన ప్రదేశంలో సాంకేతిక లేదా ప్రత్యేక జ్ఞానం కోసం ప్రత్యయం వలె ఉపయోగిస్తారు.James Lochtefeld (2002), "Shastra" in The Illustrated Encyclopedia of Hinduism, Vol. 2: N-Z, Rosen Publishing, , page 626 శాస్త్రానికి ఆంగ్లపదమైన -లజీ (logy) కి సమానమైన అర్ధం ఉంది. ఉదా. ఎకాలజీ, సైకాలజీ. అంటే ప్రత్యేకమైన అంశంపై శాస్త్రీయ, ప్రాథమిక జ్ఞానమును శాస్త్రం అనవచ్చు. ఆంగ్లంలో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతారు. ఉదాహరణకి ఆంగ్లంలో మాథమెటిక్స్ కు తెలుగులో గణితం లేదా గణితశాస్త్రం అంటారు. ఆంగ్లంలో "ఫిజిక్స్" అన్న మాటని భౌతికం అని అనకుండా భౌతిక శాస్త్రం అంటారు. అలాగే "కెమిస్ట్రీ" ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటారు. ఆంగ్లపదాలైన "బయాలజీ", "జుయాలజీ" పదాలలో ఉన్న "లజీ" ( -logy) ని కూడా శాస్త్రం అనే పదంగా వాడుతారు. ఇక్కడ "లజీ" అన్న పదం అర్థం "అధ్యయన శాఖ". ఇక జెనెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనమిక్స్ వంటి పదాలు -ics తో అంతమవుతాయి. ఇక్కడ ఈ పదం "శాస్తం" గా పిలువబడి ఆయా పదాలకు అర్థాలు జన్యుశాస్త్రం, గణాంకశాస్త్రం,అర్థశాస్త్రంగా మారుతాయి. ఆస్ట్రానమీ, ఎకానమీ వంటి -nomy తో అంతమయ్యే పదాలలో -nomy కూడా శాస్త్రంగా పిలువబడుతుంది. వాటిని ఖగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అనే అనువదిస్తాము. జాగ్రఫీ అనే పదంలో "జియో" అనగా భూమి, "గ్రఫీ" అనగా గియ్యడం, రాయడం అని అనుకుంటే జాగ్రఫీకి భూమిని గురించి బొమ్మలు గియ్యడం అనే అర్థం స్పురిస్తుంది. దీన్ని కూడా మనం భూగోళశాస్త్రం అనే తెలిగిస్తున్నాం. శాస్త్రము అనగా సైన్సు అని ఒక అర్థము. రాయబడినది అని మరొక అర్దము కూడా చెప్పుకొనవచ్చు. ఉదాహరణకు మనము శాస్త్ర బద్దముగా అను పదానికి according to science అని అర్దము చెప్పుకొనడము చూడవచ్చు. అలాగే పురాణాలు, వేదాలు మొదలైన వాటిని అన్నింటినీ శాస్త్రాలు అని అంటారు. పై ఉదాహరణలని బట్టి "శాస్త్రము" అన్న మాటకి బిగువైన నిర్వచనం లేదని తెలుస్తోంది. ఒకానొకప్పుడు ఉండేది. ఈ మధ్య పోయింది. ఈ పరిస్థితి తెలుగులోనే కాదు, ఇంగ్లీషులో కూడా ఉంది. పొలిటికల్‌ సైన్సు, సోషల్‌ సైన్సు మొదలైన మాటలు ఈ పరిస్థితికి ఉదాహరణలు. ఈ వ్యత్యాసాలని గుర్తిస్తూ, ప్రస్తుతం పబ్బం గడవాలి కనుక, ఈ శీర్షిక కింద వచ్చే "సైన్సు" అన్న మాట యొక్క అర్థం గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాలు, వాటిమీద ఆధారపడ్డ అనువర్తిత (applied) శాస్త్రాలకి పరిమితం చేసి, మిగిలిన వాటిని వీటితో కలబెట్టకుండా ఉంటే సందిగ్ధతకి తావు ఉండదు. మూలాలు వర్గం:జ్ఞానము వర్గం:శాస్త్రాలు
డిజిటల్‌ కంప్యూటర్‌
https://te.wikipedia.org/wiki/డిజిటల్‌_కంప్యూటర్‌
redirectకంప్యూటరు
కంప్యూటర్ హార్డ్‌వేర్
https://te.wikipedia.org/wiki/కంప్యూటర్_హార్డ్‌వేర్
thumb|250px|పెర్సనల్ కంప్యూటర్ భాగాలను విడదీసినట్లు చూపే చిత్రం(exploded view): <li>స్కానర్ <li>సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సిపియు) (మైక్రోప్రాసెసర్) <li>ప్రైమరీ స్టోరేజి (రాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్)) <li>ఎక్స్‌పాన్షన్ కార్డులు (గ్రాఫిక్ కార్డులు వంటివి) <li>పవర్ సప్లై <li>ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ <li>సెకండరీ స్టోరేజి (హార్డు డిస్కు) <li>మదర్ బోర్డు <li>స్పీకర్లు <li>మానిటర్ <li>సిస్టమ్ సాఫ్టువేరు <li>అప్లికేషన్ సాఫ్టువేరు <li>కీబోర్డు <li>మౌస్ <li>బయటి హార్డ్ డిస్క్ డ్రైవ్ <li>ప్రింటర్ హార్డ్‌వేర్‌ అనే మాటకి కంప్యూటర్ పరిభాషలో ఒక ప్రత్యేకమైన అర్ధం ఉంది. చేతితో ముట్టుకోడానికిగాని, పట్టుకోడానికికాని వీలైన భాగాలన్నీ స్థూలకాయం (hardware) నిర్వచనంలో ఇముడుతాయి. ఉదాహరణకి, బల్ల మీద ఇమిడే సొంత కంప్యూటరు (desk-top personal computer) కొనగానే మన చేతులతో తడిమి చూడడానికి వీలైనవి ముఖ్యంగా మూడు: (1) కంప్యూటర్‌ యొక్క అంతర్భాగాలన్నిటిని కప్పుతూ పైకి కనిపించే రేకు పెట్టె లాంటిది ఒకటి, (2) మనం రాసేవి, చూసేవి కనపడడానికి వీలుగా ఒక గాజు తెర (దీన్నే monitor అంటారు), దానితోపాటు టైపు చెయ్యడానికి వీలైన ఒక మీటల ఫలకము (దీనినే keyboard అంటారు), వగైరా, (3) వీటన్నిటిని అనుసంధించడానికి తీగలు. ఇవీ బయటకి కనిపించే స్థూలకాయం యొక్క ముఖ్య భాగాలు. కంప్యూటర్ హార్డ్‌వేర్ అనునది కంప్యూటరుకు సంబంధించిన ఒక భౌతిక విభాగం. ఒక కంప్యూటరు లోని విడి భాగాలు, వాటిని కలిపే సాంకేతిక పరికరాల సముదాయమే హార్డ్‌వేర్. ఐతే ఇది కంప్యూటరు సాఫ్ట్‌వేర్కు పూర్తిగా భిన్నం. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అనేది హార్డ్‌వేర్ లోనే అంతర్గతంగా పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ లోనే మరో రకం ఫర్మ్ వేర్. వీటిని ఎప్పటికప్పుడు మార్చవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇవి రీడ్-ఓన్లీ మెమోరీ (ROM) లాంటి హార్డ్‌వేర్ భాగాల లోనే నిక్షిప్తం చేయబడతాయి. కొన్ని మినహా చాలా వరకు కంప్యూటరు హార్డ్‌వేర్ సాధారణ ప్రజలు చూసి ఉండరు. ఎందుకంటే అవన్నీ సీపీయూ అని పిలువబడే ఒక క్యాబినెట్ లో ఉంటాయి. తెలుగు పేర్లు 220px|thumb|right|ఒక పర్సనల్ కంప్యూటర్‌లో ముఖ్య భాగాలు. 220px|thumb|right|పర్సనల్ కంప్యూటర్ లోపల ఇలా కనిపిస్తుంది. హార్డ్‌వేర్‌ కి, సాఫ్‌ట్‌వేర్‌కి ఇంతవరకు మంచి తెలుగు పేరు ఎవ్వరూ పెట్టలేకపోయారు. ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలు: తెలుగులో యంత్రం, తంత్రం అని రెండు మాటలు ఉన్నాయి. హార్డ్‌వేర్‌= యంత్రం అనీ, సాఫ్‌ట్‌వేర్‌ = తంత్రం అనీ అర్ధం చెప్పుకోవచ్చు. హిందీలో 'ఖానా' అనే ఉత్తర ప్రత్యయం ఉంది. దీని అర్ధం 'దొరికే చోటు' అని. కనుక 'దవాఖానా' అంటే మందుల కొట్టు. ఇదే ఒరవడిలో హార్డ్‌వేర్‌ = యంతర్‌ఖానా, సాఫ్‌ట్‌వేర్‌ = తంతర్‌ఖానా అని తెలుగు పేర్లు పెట్టవచ్చు. తెలుగులో సామాను, సామగ్రి అని రెండు మాటలు ఉన్నాయి. ఇంగ్లీషులోని 'ware' కి ఈ రెండూ సమానార్ధకాలు. కనుక హార్డ్‌వేర్‌ = యంత్రపు సామాను = యంత్రమాను, సాఫ్‌ట్‌వేర్‌ = తంత్రపు సామాను = తంత్రమాను అని తెలుగు పేర్లు పెట్టవచ్చు. మరొక ధోరణిలో ఆలోచించవచ్చు. కంటికి కనిపించేది బోదె. బోదెకి ఒక వ్యక్తిత్వం ఇచ్చేది మేధ. కనుక హార్డ్‌వేర్‌ = బోదె, సాఫ్‌ట్‌వేర్‌ = మేధ. ఇదే ధోరణిలో హార్డ్‌వేర్‌ = స్థూలకాయం అనీ సాఫ్‌ట్‌వేర్‌ = సూక్ష్మకాయం అనీ ప్రయత్నించవచ్చు ముఖ్య భాగాలు పెట్టె మూత జాగ్రత్తగా తీసి, తెలిసీ తెలియకుండా దేనినీ ముట్టుకోకుండా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ దిగువ వర్ణించిన భాగాలుకనిపిస్తాయి. మన శరీరపు చర్మాన్ని ఒలిచి లోపలికి తొంగి చూస్తే గుండె, మెదడు మొదలైన అవయవాలలాగే, ఈ పెట్టెలో ఎన్నో ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. మైక్రోప్రోసెసర్‌ (microprocessor): అంటే అతి సూక్ష్మ మైన కంప్యూటరు అని అర్ధం. పూర్వం గదంతా ఆక్రమించేసిన కంప్యూటరు ఇప్పుడు వేలి గోరంత మేర ఆక్రమిస్తుంది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. దీనిని మన మెదడుతో పోల్చవచ్చు. నిజానికి ఇదీ అసలైన సిసలైన కంప్యూటరు. పైకి చూడడానికి చిన్న పలక ముక్కలా, చిన్న చిల్ల పెంకులా ఉంటుంది కాని దీని కట్టడి అధ్యయనం చెయ్యడానికి చాల దీక్ష ఉండాలి. కొట్టు (store)ని మెమరీ (memory) అని కూడ అంటారు. దీనిలో దత్తాంశాలు (data), ఆదేశాలు (commands) దాచుతాం. ఇందులో రెండు రకాలు. ఒకటి రాం (ROM = Read Only Memory), రెండోది రేం (RAM = Random Access Memory). ROM అచ్చు పుస్తకం లాంటిది. దీనిలో ఉన్న దత్తాంశాలని కంప్యూటరు చదవ గలదు కానీ, చెరిపేసి కొత్తవి రాయ లేదు. RAM పలక లాంటది. దీంట్లో దత్తాంశాలని రాయనూ వచ్చు, రాసి ఉంటే చదవనూ వచ్చు, ఉన్న వాటిని చెరిపేసి కొత్తవి రాయనూ వచ్చు. చిన్న ఉపమానం. మనం పుట్టినప్పుడు మన లలాట ఫలకం మీద బ్రహ్మదేవుడు రాసినదాని ప్రకారం మన జీవితం నడుస్తుందని మనం అనుకుంటాం కదా. ఈ లలాట లిఖితం ROM లాంటిది. అదే ఎవరైనా వారింటికి దారి చెప్పినప్పుడు కాని, వారి టెలిఫోను నంబరు చెప్పినప్పుడు కాని అది మనం మెదడులో దాచుకుంటాం. అవసరం తీరిపోయిన తర్వాత అది చెరిపేసి (మరచిపోయి), ఆ స్థానంలో మరొక విషయం “రాసుకుంటాం”. కనుక ఇది RAM లాంటిది అన్నమాట. తీగల కట్ట (bus): పై రెండింటి తర్వాత చెప్పుకోదగ్గది తీగలు. ఈ తీగల కట్టలనే ఇంగ్లీషులో bus అంటారు. వీటిని మనం పట్టాలు లేదా పటకాలు అందాం. ఊళ్ళ మధ్య ప్రయాణం చెయ్యడానికి రైలు పట్టాలు ఉపయోగపడ్డట్లే రేకు పెట్టెలో ఉన్న మైక్రోప్రోసెసర్‌ ని, రామ్‌ నీ రేమ్‌ నీ కలపడానికే కాకుండా, పెట్టె బయట ఉన్న గాజు తెరనీ, మీటల ఫలకాన్నీ కలపడానికీ, ఇంకా అనేక కార్యాలకి ఈ తీగల రహదారిని వాడతారు. విద్యుత్‌ సరఫరా (Power Supply): కంప్యూటరుకి కావలసిన విద్యుత్తు అంతా ఈ పెట్టె సరఫరా చేస్తుంది. ఈ పెట్టెలో ముఖ్యంగా ఒక transformer ఉంటుంది. మన ఇంట్లో ఉన్న వోల్టేజిని అవసరం మేరకి తగ్గించి మిగిలిన భాగాలకి సరఫరా చెయ్యడమే ఈ పెట్టె చేసే పని. Hard Drive: పైకి కనిపించదు కానీ, లోపలకి చూడగలిగితే ఇది ఒక దొంతిగా అమర్చిన గ్రామఫోను పళ్ళేల మాదిరి ఉంటుంది. గ్రామఫోను రికార్డుల మీద మనం పాటలు “రాసుకుని” అవసరం వచ్చినప్పుడు తిరిగి పాడించుకుని ఎలా వింటామో అలాగే ఈ పళ్ళేలమీద దత్తాంశాలు రాసుకుని అవసరం వెంబడి తిరిగి "చదువుకుని" వాడుకోవచ్చు. నిత్యం అవసరమైన అంశాలని అన్నింటిని దీని మీద రాసి దాచుకుంటాం. Floppy Drive: ఈ రోజులలో దీని వాడకం బాగా తగ్గి పోయింది. దీనికీ hard drive కీ ఒకే ఒక చిన్న తేడా. దీంట్లో పళ్ళేలని మనం బయటకి తీసి మనతో పట్టుకు పోయి, మరో కంప్యూటర్‌లో దోపి వాడుకోవచ్చు. ఒక కంప్యూటర్‌ నుండి మరొక కంప్యూటర్‌కి దత్తాంశాలు రవాణా చెయ్యటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. దీనిలో వాడే పళ్ళేలు పల్చగా, ఒంచితే ఒంగే రకంగా ఉంటాయి కనుక వాటిని floppy disks అంటారు. CD-ROM Drive: ఇక్కడ CD అంటే compact disk అని అర్ధం. సినిమాలు చూచుటకు,గేములు లోడ్ చేయుటకు ఉపయోగపడును. బజారులో కొనుక్కున్న software లోడ్ చేయుటకు ఉపయోగపడును. ఈ పళ్ళేలలో ఉరమరగా 650 MB వరకు దత్తాంశాలు దాచవచ్చు. CD-ROM/ DVD Drive: ఇక్కడ DVD అంటే digital versatile disk అని అర్ధం. ఈ పళ్ళేలలో 8-16 GB వరకు దత్తాంశాలు దాచవచ్చు. Ports: నదులమీద, సముద్రం మీద రేవులు చేసే పని ఏమిటి? జలభాగం మీది రహదారులని భూభాగం మీది రహదారులతో కలపడం. అదే విధంగా కంప్యూటరు లోపలి రహదారులని బయటి మార్గాలతో అనుసంధించడానికి వాడే సాధనాలే పోర్టులు. వీటిని తెలుగులో రేవులు అని అనొచ్చు. గోడ మీద విద్యుత్ ప్లగ్‌ చేసే పని కూడా ఇదే – ఇంట్లో ఉన్న విద్యుత్‌ ఉపకరణాలని బయటి నుండి సరఫరా అయే విద్యుత్తుతో కలపడానికి ప్లగ్‌ వాడతాం. అదే విధంగా కంప్యూటర్‌ని బయట ఉన్న ప్రింటర్‌తో, మీటల ఫలకంతో, మోడెమ్‌ తో, ఇంటర్‌నెట్‌ తో, కలపడానికి ఈ రేవులని వాడతారు. వీటిలో ముఖ్యమైనవి కొన్ని -- (1) మీటల ఫలకాన్ని (keyboard) తగిలించే రేవు (2) గాజుతెర (monitor) కి బొమ్మల (video) వాకేతాలని (signal) తగిలించే రేవు (3) చుంచు (mouse) ని తగిలించే రేవు (4) Universal Serial Bus (USB) (5) ప్రింటర్‌ని తగిలించటానికి సమాతర రేవు (Parallel Port) (6) Sound cards (7) మోడెమ్‌ తగిలించటానికి BIOS: లేదా Basic Input/Output System. కంప్యూటర్‌ యొక్క స్థూలకాయానికీ, సూక్ష్మ కాయానికీ మధ్య ఉండే మధ్యవర్తి లాంటిది. సూక్ష్మ కాయంలో ముఖ్యాతి ముఖ్యమైన ఆపరేటింగ్ సిస్టమ్ (Operating System) లేదా (O.S.) ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటే ఏయే ఉత్తర్వులు ఏయే సూక్ష్మ కాయపు భాగాన్ని చేరాలో ఈ BIOS పర్యవేక్షణలో జరుగుతాయి. అమాంబాపతులు: పైన చెప్పిన ముఖ్య భాగాలేకాకుండా కంప్యూటర్‌లో ఇంకా ఎన్నో చిన్న చిన్న అంతర్భాగాలు ఉంటాయి. వనరులు Ron White, How Computers Work, Que: MacMillan Computer Publishing, Indianapolis, IN, USA, 1999 వర్గం:కంప్యూటరు హార్డువేర్
జనరంజక శాస్త్రము
https://te.wikipedia.org/wiki/జనరంజక_శాస్త్రము
thumb|జనరంజక విజ్ఞాన శాస్త్ర పుస్తకానికి ఒక ఉదాహరణ - నిత్యజీవితంలో భౌతికశాస్త్రం జనరంజక శాస్త్రం (జనరంజక విజ్ఞానశాస్త్రం ) (ఆంగ్లం:popular science) సాధారణ ప్రేక్షకుల కోసం ఉద్దేశించిన విజ్ఞాన శాస్త్ర వివరణ. సైన్స్ జర్నలిజం ఇటీవలి శాస్త్రీయ పరిణామాలపై దృష్టి సారించినప్పటికీ, జనాదరణ పొందిన శాస్త్రం మరింత విస్తృతమైనది. దీనిని వృత్తిపరమైన విజ్ఞానశాస్త్ర జర్నలిస్టులు లేదా శాస్త్రవేత్తలు రాయవచ్చు. ఇది పుస్తకాలు, చలనచిత్రాలు, టెలివిజన్ డాక్యుమెంటరీలు, పత్రిక కథనాలు, వెబ్ పేజీలతో సహా అనేక రూపాల్లో ప్రదర్శించబడుతుంది. పాత్ర జనరంజక శాస్త్రం అనేది శాస్త్రీయ పరిశోధనల యొక్క వృత్తిపరమైన మాధ్యమంగా శాస్త్రీయ సాహిత్యానికి మధ్య వారధి. ఇది ప్రజాదరణ పొందిన రాజకీయ, సాంస్కృతిక ఉపన్యాసం. భాష యొక్క ప్రాప్యతను, విజ్ఞాన శాస్త్ర పద్ధతుల ఖచ్చితత్వాన్ని సంగ్రహించడం ఈ కళా ప్రక్రియ లక్ష్యం. ప్రసిద్ధ శాస్త్ర పుస్తకాలు, ప్రచురణలలో అనేక శాస్త్ర-సంబంధిత వివాదాలు చర్చించబడ్డాయి. జీవసంబంధమైన నిర్ణయాత్మకత, మేధస్సు యొక్క జీవసంబంధమైన అంశాలపై దీర్ఘకాల చర్చలు, ది మిస్మీజర్ ఆఫ్ మ్యాన్ , ది బెల్ కర్వ్ వంటి గుర్తింపు పొందిన పుస్తకాలలో ప్రచురించబడ్డాయి.Murdz William McRae, "Introduction: Science in Culture" in The Literature of Science, pp. 1–3, 10–11 పరిశీలనలు, సిద్ధాంతాల ప్రామాణికత, పద్ధతుల వ్యవహారికమైన సమర్థత గురించి సహచరులకు తెలియజేయడం, ఒప్పించడం శాస్త్రీయ సాహిత్యం ముఖ్య ఉద్దేశ్యం. ప్రాచుర్యం పొందిన శాస్త్ర సమచారాన్ని, ఫలితాల ప్రాముఖ్యతను శాస్త్రీయంగా బయటి వ్యక్తులకు (కొన్నిసార్లు ఇతర రంగాలలోని శాస్త్రవేత్తలతో పాటు) తెలియజేయడానికి, ఒప్పించడానికి, ఫలితాలను పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. జనాదరణ పొందిన విజ్ఞానం ప్రత్యేకత, సాధారణతను నొక్కి చెబుతుంది. Jeanne Fahnestock, "Accommodating Science: The Rhetorical Life of Scientific Facts" in The Literature of Science, pp. 17–36 జనాదరణ పొందిన విజ్ఞాన సాహిత్యాన్ని శాస్త్రవేత్తలు కాని వారు వ్రాసే విషయంపై పరిమిత అవగాహన కలిగి ఉండవచ్చు. నిపుణులు కానివారు తప్పుదోవ పట్టించే ప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఇది నిజమైన శాస్త్రం, కల్పిత శాస్త్రాల మధ్య సరిహద్దులను కూడా అస్పష్టం చేస్తుంది. ఏదేమైనా, కొన్నిసార్లు మంచి శాస్త్రీయ నేపథ్యం, బలమైన సాంకేతిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన వారు శాస్త్రవేత్తలు కానప్పటికీ మంచి జనాదరణ పొందిన విజ్ఞాన రచనలను చేస్తారు. తెలుగులో విజ్ఞానశాస్త్ర ప్రచారకులు అనాది నుంచి మేధో సంపత్తి గల గొప్ప వ్యక్తులు కొందరు నిరంతరం శ్రమించి, ప్రాణాలకు సైతం తెగించి, జీవితం ధారపోస్తూ వస్తున్నారు. తమ తరానికి, భావి తరాలకు కొత్తబాటలు వేస్తున్నారు. కొత్త ద్వారాలు తెరుస్తున్నారు. జ్ఞానాన్ని వెదజల్లి నాగరికత అభివృద్ధికి పాటు పడుతున్నారు. వీళ్ళే వివిధ రంగాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, సైన్స్‌ రచయితలు. ఈ విధంగా శాస్త్రజ్ఞుడికీ, సామాన్యుడికీ మధ్య దూరాన్ని తగ్గిస్తూ వచ్చిన సుగమ విజ్ఞాన రచయితలు ఎంతోమంది ఉన్నారు. గోటేటి జోగిరాజు - వ్యవసాయ సంబంధిత పుస్తకాలు రచించాడు. 'పాడిపంటలు' అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. 1947-50లలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులు 'పరిశోధన' అనే పత్రిక నడిపారు. దానికి యం.ఎన్‌.శాస్త్రి ఆధ్వర్యం వహించాడు. 1950-58లలో గుంటూరుకు చెందిన రావి వెంకటాద్రి చాలా పుస్తకాలు రాశాడు. వసంతరావు వెంకటరావు పదార్థ విజ్ఞాన శాస్త్రాన్ని పద్యాల్లోనూ, పాటల్లోనూ కూర్చారు. ఎ వి యస్‌ రామారావు రాసిన ఖగోళశాస్త్ర గ్రంథానికి మద్రాసు విశ్వవిద్యాలయం బహుమతి ప్రకటించింది. 1950లో విస్సా అప్పారావు అణుశక్తి మీద పుస్తకం రాశారు. నక్షత్రాల గురించి పిల్లల కోసం ఒక పుస్తకం రాశాడు. 1951-53లలో హరి ఆదిశేషువు, విద్యుత్‌ శక్తి, ఆప్లయిడ్‌ కెమిస్ట్రీ, ఖగోళ శాస్త్రం అనే పుస్తకాలు రాశాడు. మచిలీపట్నానికి చెందిన కంచి శేషగిరిరావు 'విద్యుత్తు' అనే పుస్తకం రాశాడు. 1957-60 ప్రాంతంలో గణిత శాస్త్రం మీద పుస్తకాన్ని భేతనభట్ల విశ్వనాథం రాశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డా.జి. గోపాలరావు శాస్త్రీయ విషయాలపై ఉపన్యాసాలిస్తూ జన చైతన్యానికి దోహదం చేసేవాడు. నండూరి రామమోహనరావు సామాన్యుడికి సైన్సు విశేషాలు అందించాలన్న బాధ్యతను తనపై వేసుకుని ఎంతో విశిష్టమైన గ్రంథాలను రచించాడు. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 'అణువులు - నేడు - రేపూనూ' 'ఆధునిక విజ్ఞాన విజయములు' అనే రెండు పుస్తకాల్ని రాశాడు. ఆర్‌.వి.జి. సుందరరావు 'శాస్త్రము - విజ్ఞానము - నాగరికత' ను రాసాడు. నిత్యజీవితంలో భౌతిక శాస్త్రము, ప్రగతి ప్రచురణాలయం, మాస్కో ప్రచురించింది. దీనిలో వి.షెలా యెల్‌; ఎన్‌. రికోవ్‌ రష్యన్‌లో రాసిన జంతుశాస్త్రాన్ని డా. వుప్పల లక్ష్మణరావు అనువదించాడు. 'సైన్సు మేక్స్‌ సెన్స్‌ - రీచ్చీ కాల్డర్‌' పుస్తకాన్ని 'శాస్త్ర విజ్ఞానము - మానవ జీవితము' (1971) అనే పేరుతో అయ్యగారి వీరభద్రరావు అనువదించాడు. విస్సా అప్పారావు "విజ్ఞానం - విశేషాలు"( (1964) అనే శీర్షికతో ఒక పుస్తకాన్ని అనువదించాడు. ''అందరికీ అవశ్యమైన జీవశస్త్ర విజ్ఞానం'' (1960) డా.పి. దక్షిణామూర్తి అనువాదం చేసాడు. శాస్త్ర విజ్ఞానాన్ని జన సామాన్యానికి అందజేయాలన్న ఉత్సాహంతో రావూరి భరద్వాజ కూడా సులభ శైలిలో 'ప్లాస్టిక్‌ ప్రపంచం' (1966) వంటి ఎన్నో పుస్తకాలు రాశాడు. 1966లోనే డా|| గాలి బాలసుందరరావు 'వైటమినులు' రాసాడు. 1967లో ఆర్వీ, జమ్మి కోనేటిరావు వ్యాసాల్ని 'పుస్తక ప్రపంచం' మాస పత్రిక సీరియల్‌గా ప్రచురించింది. వీరిరువురూ జంతుశాస్త్ర విశేషాల్ని రాశారు. 'మైక్రోబో హంటర్స్‌' పాల్‌ డి క్రూఫ్‌ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా గొప్పపేరు సంపాదించుకుంది. దానిని 'క్రిమి అన్వేషకులు' శీర్షికతో జమ్మి కోనేటిరావు తెలుగు చేశాడు. 1970లలో మనకు తెలిసిన విజ్ఞానం మన భాషలోనే రాసే లక్ష్యంగా, అమెరికా ఆంధ్రులు ప్రచురించిన అర్థసంవత్సర పత్రిక 'తెలుగు భాషా పత్రిక' కొన్ని సంచికలు వచ్చాయి. ఏప్రిల్‌ 1975: సంపుటి-5 విజ్ఞాన పత్రికగా వెలువడింది. తెలుగు అకాడమీ వారు 'తెలుగు' అనే వైజ్ఞానిక పత్రికను కొంతకాలం నడిపారు. డా.యం. సుబ్బారావు 'సైన్స్‌వాణి' అనే పత్రిక నిర్వహించాడు. మహీధర రామమోహనరావు సంపాదకత్వంలో కొంత కాలం వెలువడిన 'అవంతి' పత్రిక పేరు మార్చుకుని 'సైన్స్‌ ప్రపంచం'గా మరికొంత కాలం వెలువడింది. త్రిపురనేని రామస్వామి చౌదరి, తాపీ ధర్మారావు, కొడవటిగంటి కుటుంబరావు, నార్ల, గోరా, డా.కొవూర్‌ (అనువాదాలు) డా.మిత్ర, హేమలతా లవణం, నండూరి ప్రసాదరావు, రావిపూడి వెంకటాద్రి, ఈశ్వర ప్రభు మొదలైన రచయితల ఉపన్యాసాలు, రచనలు మూఢ నమ్మకాల్ని చేధించడంలో ఉపయోగపడ్డాయి. వృత్తిరీత్యా వైద్యుడయిన డా.జి. సమరం "సెక్స్‌ సైన్స్" జనాన్ని విశేషంగా ఆకర్షించింది. ఈయన మనస్తత్వ శాస్త్రం పైన కూడా వ్యాసాలు రాశాడు. డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ హరీష్‌ మొదలైన వారు వైద్య విషయాల మీద వ్యాసాలు రాశారు. డాక్టర్‌ విశ్వనాథ అరుణాచలం, కందుల నాగభూషణం గణిత శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలు రాశారు. విజ్ఞాన విశేషాల్ని సి.వి. సర్వేశ్వర శర్మ చాలా కాలంగా వారం వారం రాస్తున్నాడు. కోనసీమ సైన్స్‌ అసోసియేషన్‌ స్థాపించి, ఉపన్యాసాలు, సెమినార్లు విరివిగా నిర్వహిస్తున్నాడు. ముద్దుకృష్ణ, యం.కె.రావు మొదలైనవారు సైన్స్‌ వ్యాసాలు రాశారు. మూలాలు గ్రంథావళి McRae, Murdo William (editor). The Literature of Science: Perspectives on Popular Scientific Writing. The University of Georgia Press: Athens, 1993. ISBN 0-8203-1506-0
కారము
https://te.wikipedia.org/wiki/కారము
link=|thumb|300x300px|టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని ఒక సూపర్ మార్కెట్‌లో కారపు మిరియాలు, స్కోవిల్లే స్కేల్ ప్రదర్శన కారము ఒక ప్రధానమైన రుచి. ఇది షడ్రుచులులో ఒకటి. ఇది గాఢమైన రుచిని, వాసనను కలిగి ఉంటుంది. ఈ రుచి ఎక్కువగా మిరపకాయల ఆహార పదార్థాలలో ఉంటుంది. అధిక కారం రుచి కల పదార్థాలు తినే వారికి అయిష్టతను కల్పిస్తాయి. ఈ రుచిని కొన్ని సందర్భాలలో "స్పైసీనెస్" లేదా "హాట్‌నెస్" లేదా "హేట్" వంటి పదాలలో కూడా చూచిస్తారు. పిక్వాన్సీ అనే పదం తక్కువ స్థాయి కారం రుచికల ఆహార పదార్థాల విషయంలో వాడుతారు. ఉదాహరణకు ఆవాలు, కూర కలిగిన ఆహార పదార్థాలు. కారపు పదార్థాలు గుమ్మడికాయ కాయ కూర వేడిగా (పొయ్యి వెలుపల), కారంగా ఉంటుంది. దీనికి కారణం అందులో కలిపే దాల్చిన చెక్క, జాజికాయ, మసాలా దినుసులు, జాపత్రి, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు చేర్చబడతాయి. ఆహార విమర్శకుడు అటువంటి కూరలను వివరించడానికి "పిక్వాంట్" అనే పదాన్ని ఉపయోగించవచ్చు, ఇతర విషయాలు కారం తింటే పొట్టలో పుండు పుడుతుందనే గాథ ఒకటి ఆధ్రేతర రాష్ట్రాలలోనూ – ముఖ్యంగా తమిళనాడులో – ఇతర దేశాలలోనూ చలామణీలో ఉంది. ఇది ఎంత వరకు వచ్చిందంటే తమిళ సోదరులు చెప్పిన మాటలని విని కాబోలు తెలుగు డాక్టర్లు కూడా సై అంటే సై అంటున్నారు. ఇవన్నీ పునాదులు లేని పేకమేడలని డాక్టర్‌ గ్రేం అంటున్నారు. ఈయన టెక్సస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగరంలో ఉన్న బేలర్‌ కాలేజ్‌ అఫ్‌ మెడిసిన్‌ లో ఒక పేరు మోసిన ఘనాపాటీ. టెక్సస్‌ మెక్సికో దేశపు సరిహద్దులో ఉంది కాబట్టి కాబోలు మెక్సికో దేశపు కారం తినే అలవాటు టెక్సస్‌లోనూ కనిపిస్తుంది. అందుకని ఈయనకి కారం అంటే ఇష్టమో ఏమో నాకు తెలియదు కాని ఈయన కూడ ఈ పుకారులూ వదంతులూ విన్నాడు. విసిగెత్తే వరకూ విన్నాడు. తాడో, పేడో తేల్చేద్దామని ఒక ప్రయోగం చేసేడు. ఆరోగ్యంగా ఉన్న మనుష్యులని కొంతమందిని కూడ గట్టి వాళ్ళని మూడు జట్లు గా విడగొట్టేడు. అందులో ఒక జట్టుకి కారం ఏమీ లేని చప్పిడి తిండి పెట్టేడు. రెండవ జట్టుకి అదే చప్పిడి తిండిలో అరడజను ఏస్పిరిన్‌ మాత్రలు కలిపి పెట్టేడు. మూడవ జట్టుకి బాగా కారం కలిపిన తిండి పెట్టేడు. మరునాడు ఒక బుల్లి విడియో కేమెరాని ఒక గొట్టానికి తగిలించి ఆ గొట్టాన్ని ఈ మూడు జట్ల వాళ్ళ పొట్టలలోకి దింపి క్షుణ్ణంగా పొట్ట గోడలని పరిశీలించేడు. ఏస్పిరిన్‌ తిన్న రెండవ జట్టు వాళ్ళ పొట్ట గోడలలో చిన్న చిన్న చిల్లుల గుండా రక్తం స్రవించడం చూసేడు తప్ప కారం తిన్న వాళ్ళ పొట్టలు, చప్పిడి తిండి తిన్న వాళ్ళ పొట్టలు ఒక్క లాగే, ఏ దోషం లేకుండా ఉన్నాయిట. ఇలాంటి ప్రయోగమే భారత దేశంలో కూడ ఎవరో రెండు జట్ల మీద చేసేరుట. ఓకరి తిండిలో మిరప పొడి బాగా జల్లేరుట. మరొక జట్టు తిండిలో మిరప పొడి పొడ కూడా లేదుట. ఈ రెండు జట్ల మధ్య ఏమీ తేడా కనిపించ లేదుట. ఈ రెండు ప్రయోగాల వల్ల తేలిందేమిటంటే మిరపకాయల వల్ల పొట్టలో పుండు పుట్టదని. నేను కూర్చున్న కుర్చీ లోంచి కదలకుండా స్పురణ ప్రయోగం (థాట్‌ ఎక్స్పరిమెంట్‌) ఒకటి చేసేను. దాని సారాంశం ఇది. సర్వ సాధారణంగా వేడి దేశాలలో ఉన్న ప్రజలు కారం ఎక్కువ తినడం నేను గమనించేను. వేడి దేశాలలో ఉన్న వాళ్ళకి చర్మం నల్లగా ఉండడం వల్ల ఉపయోగం ఉన్నట్లే, కారం తినాలనే కోరిక ఉండం వల్ల కూడా మనుగడకి పనికొచ్చే లాభం ఏదైనా ఉందేమో? డార్విన్‌ ని అడిగి చూడాలి. వివరణ దీనికి ఒక చక్కని వివరణ ఒకసారి నేను టెలివిజన్ కార్యక్రమములో విన్నాను - వేడి ప్రాంతాలలో ప్రజలు కారము ఎక్కువగా తినడం వల్ల తప్పనిసరిగా మంచినీరు ఎక్కువగా త్రాగుతారు. ఇది వారికి చాలా అవసరం. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుదు మన శరీరం లోంచి నీరు ఎక్కువగా ఆవిరి అయి పోతు ఉంటుంది. మూలాలు వర్గం:రుచులు
విభూతి
https://te.wikipedia.org/wiki/విభూతి
link=https://en.wikipedia.org/wiki/File:A_Hindu_man_with_Tripundra_Tilaka_forehead_markings.jpg|thumb|విభూదితో త్రిపుండ్రం ధరించిన హిందూ వ్యక్తి హోమంలో దర్బలు, ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని కూడా అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి (విభూది) ప్రతి శివాలయంలోనూ తప్పక ఉంటుంది. వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగ్ను. బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగును. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును. అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. హోమగుండంలో హోమం చేసినప్పుడు, ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు. హోమగుండం, ధుని – రెండూ పరమ పవిత్రమైనవి. హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు. ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు (Hairy Coconuts), పిడకలు (cakes made of cows dung), రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు (Pieces of Peepal, Tulasi and Medi), నవధాన్యాలు (Nine different grains), గంధపుచెక్కలు (Pieces of Sandal wood), నేరేడు (Camphor ), సాంబ్రాణి (Sambrani), ఆవునెయ్యి (Cows ghee ), సాంబ్రాణి sambrani powder), అగరొత్తులు (Incense Sticks) వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి. విభూతిని విషెషమైన ఐష్వర్యము అని అంటారు. విభూతి ధరించే విధానం కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికిగాని ధరించకూడదు. విభూతిధారణ దేవతాపూజ, జపము, యజ్ణ్జము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం, తిలకం కాని నొసట ధరించనిదే భగవంతుని తీర్ధప్రసాదములు స్వీకరించ కూడదు. విభూతి పేర్లు - వర్ణములు 1. భస్మం - శ్వేత వర్ణము 2. విభూతి - కపిల వర్ణము, 3. భసితము -కృష్ణ వర్ణము 4. క్షారము - ఆకాశ వర్ణము 5. రక్షయని - రక్త వర్ణము కొన్ని విశ్వాసాలు హోమ భస్మం (విభూతి) ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి. హోమ భస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి. హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పనులు నిరాటకంగా జరుగుతాయి. భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి. వివిధ హోమభస్మాలు చేసే మేలు: శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది. శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు. శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది. శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు. శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు. శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి. హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు. గమనిక: హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు. విభూతి స్నానం స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం, లేదా బూడిద. కాలడానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్థం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి ఉండాలి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే. కాని నీళ్ళూ కూడా మరొక రకం బూడిదే. ఉదజని వాయువును ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్థం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. మూలాలు వర్గం:హిందూమతం
ఆకురాలు కాలం
https://te.wikipedia.org/wiki/ఆకురాలు_కాలం
thumb|మోడువారిన చెట్టు కొమ్మలు ఉష్ణమండలంలో ఉన్న ఆంధ్రదేశంలో చెట్లు ఆకులు రాల్చడం అంతగా కనిపించదుకాని, సమశీతల దేశాలలోను, శీతల మండలాలలోను చలికాలం వచ్చే సరికి కొన్ని చెట్లు ఆకులన్నిటిని పూర్తిగా రాల్చేసి మోడులలా బోడిగా కనిపిస్తాయి. మన దేశంలో కులూ లోయ లోను, కాశ్మీరు లోను ఈ విశేషం చూడవచ్చు. శీతల దేశాలలో కూడా అన్ని చెట్లూ ఆకులని రాల్చవు. పైను, ఫర్‌ మొదలైన చెట్ల ఆకులు సన్నగా సూదులలా ఉంటాయి; ఇవి ఆకులని రాల్చవు. ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి. కాని వెడల్పాటి ఆకులు ఉన్న చెట్లన్నీ చలికాలంలో ఆకులని రాల్చుతాయి. ఈ ప్రవర్తనకి చాల కారణాలు చూపించవచ్చు. మొదటి కారణం. ఆకులు వెడల్పుగా ఉన్న చెట్టు వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వైశాల్యం ఉన్న చెట్టు ఎక్కువ వేడిని నష్టపోతుంది. ఈ విషయాన్నే మరొక విధంగా చెప్పాలంటే, ఎక్కువ వైశాల్యంగా ఉన్న చెట్టుకి ఎక్కువ చలి వేస్తుంది. మనకి చలి వేసినప్పుడు మన వైశాల్యం తగ్గించడానికి ముడుచుకుని కూర్చుంటాం. అలాగే చలి కాలంలో చెట్లు తమ వైశాల్యాన్ని తగ్గించడానికి ఆకులని రాల్చివేస్తాయి. రెండవ కారణం. ఆకులు ఆహారపదార్ధాలని తయారుచేసే కర్మాగారాల్లాంటివి. వేసవి కాలంలో ఎండ మెండుగా ఉన్న రోజులలో ఆ సూర్యరస్మిని పీల్చుకోడానికి ఎక్కువ వైశాల్యం ఉన్న ఆకులు కావాలి. శీతాకాలం వచ్చేసరికి ఎండ తగ్గిపోతుంది కనుక ఆకులకి సరిపడా సూర్యరస్మి తగలదు. కనుక అవి పూర్వంలా పని చెయ్యలేవు. పని చెయ్యని ఆకులతో నాకేం పని అని చెట్టు ఆ ఆకులని రాల్చేస్తుంది. వర్గం:కాలం
భూగర్భం
https://te.wikipedia.org/wiki/భూగర్భం
మన భూమి పుట్టి 4 500 000 000 సంవత్సరాల చిల్లర అయింది. భూమి పుట్టిన దగ్గరనుండి భూగర్భం లోనుండి నిరంతరం వేడి అలా బయటకి వస్తూనే ఉంది. అగ్ని పర్వతాలు పగిలినప్పుడు, భూగర్భం నుండి వేడి ఊటలు బయటకి ఉబికి వచ్చినప్పుడు, లోపల వేడి ఉందని దాఖలా అవుతోంది కదా. ఇలా వేడి బయటకి వచ్చేస్తూ ఉంటే భూమి కొంత కాకపోయినా కొంతైనా చల్లారాలి కదా. భూమి నుండి సతతం వేడి బయటకి ప్రసారమవుతూనే ఉంటుందనే సత్యం విజ్ఞాన శాస్త్రపు విద్యార్ధులకి ఎరుకే. నాలుగు వందల ఏభై కోట్ల సంవత్సరాలనుండి ఇలా చల్లారుతూన్న భూమి ఈపాటికి పూర్తిగా చల్లారి పోయి ఉండొద్దూ? ఇంకా లోపల ఎందుకీ కుతకుతలు? ముందస్తుగా అగ్ని పర్వతాలు మనం అనుకున్నంతగా పేలడం లేదు. పేలెనుపో, పేలిన అగ్ని పర్వతాలవల్ల భూమి చల్లారేది బహు కొద్దిగా. రెండు. రోదసిలోకి ప్రసారితమయే వేడి కన్న భూగర్భంలో రేడియో ధార్మిక మూలకాల విచ్చిత్తి వల్ల పుట్టే వేడి చాల ఎక్కువ. ఆఖరుగా మరొక్క ముఖ్య విషయం. పార్కు లోని పచ్చిక మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూన్న మనకి భూగర్భంలో ఉన్న 1760 సెల్సియస్‌ డిగ్రీల వేడి యొక్క ధాటి ఏమాత్రం తెలియడం లేదంటే దానికి కారణం భూమి పైపెచ్చు. ఇది ఎంతో సమర్ధవంతంగా లోపల వేడిని బయటకి పోకుండా ఆపుతోంది. నిజానికి మన అదృష్టం బాగుండబట్టి భూమి పుట్టి నాలుగున్నర బిలియను సంవత్సరాలైనా బహు కొద్దిగానే చల్లారింది. ఈపాటికి భూమి పూర్తిగా చల్లారిపోయి ఉండుంటే మన పుట్టి ములిగి ఉండేది. భూమి పూర్తిగా చల్లారిపోతే మరింక భూకంపాలు రావు. అగ్ని పర్వతాలు పేలవు. సముద్ర గర్భంలో భూమి ఉపరితలం మీద ఉన్న ఫలకాలు విస్తరణ చెందవు. భూఫలకాల పయనాలు ఆగిపోతాయి. తద్రూపేణా సరికొత్త పర్వతాలు పుట్టవు. ఉన్న పర్వతాలు ఎదగవు. అంటే భూమిలో చైతన్యం పూర్తిగా చల్లారి పోతుందన్న మాట. అగ్ని పర్వతాలు పేలక పోతేనూ, భూకంపాలు రాక పోతేనూ వచ్చిన నష్టం ఏమిటని మీరు అడగొచ్చు. జ్వరం వస్తే కస్టమని కాళ్ళూ, చేతులూ చల్లబడి పోవాలని కోరుకుంటామా? భూమిలో చైతన్యం చచ్చిపోతే ఏమిటవుతుందో ఒక్క నిమిషం ఆలోచించండి. ఇంకొక పది కోట్ల సంవత్సరాలలో మన పర్వతాలన్ని గాలి పోటుకీ వర్షపు ధాటికీ అరిగిపోతాయి. ఎత్తు పల్లాలన్నీ చదునుగా అయిపోతాయి. అప్పుడు సముద్రం నెమ్మదిగా భూభాగాన్ని కప్పెస్తుంది. అప్పుడు మన మనుగడకే ముప్పు. వర్గం:భూగోళశాస్త్రం
తెలుగు
https://te.wikipedia.org/wiki/తెలుగు
thumb|తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభం, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలం. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం|500x500px తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన నుడి. దీనిని మాట్లాడే ప్రజలుఎక్కువగా ఆంధ్ర, తెలంగాణాలో ఉన్నారు. ఇది ఆ రాష్ట్రాలలో అధికార భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాషా హోదా కలిగిన కొద్ది నుడులలో హిందీ, బెంగాలీలతో పాటు ఇది కూడా ఉంది. పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక నుడి. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు నుడులలో ఇది ఒకటి. భారతదేశంలో అమ్మనుడులుగా మాట్లాడే నుడులలో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. భారతదేశంలో 2011 జనాభా లెక్కలను బట్టి దాదాపు 82 మిలియన్ల మంది మాట్లాడేవారున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమ్మనుడులుగా మాట్లాడే నుడులలో ఎథ్నోలాగ్ జాబితాలో 15 వ స్థానంలో ఉంది. ఇది ద్రావిడ భాషా కుటుంబంలో ఎక్కువమంది మాట్లాడే భాష. భారతదేశంలో ఇరవై రెండు షెడ్యూల్ భాషలలో ఇది ఒకటి. ఇది అమెరికాలో వేగంగా మెరుగు పొందుతున్న నుడి. తెలుగు నుడిలో సుమారు 10,000 పాత శాసనాలు ఉన్నాయి. కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు నుడిని 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని పొగిడినారు. కన్నడ, తెలుగు వర్ణమాల చాలా వరకు పోలికగలిగి వుంటాయి. పేరు, పుట్టుక: తెలుగు మాట్లాడేవారు వారిని తెలుగు వారు అని అంటారు. తెలుగు పాత రూపాలు తెనుంగు, తెలింగా. 13వ శతాబ్దంలో అథర్వణ ఆచార్య తెలుగు వ్యాకరణాన్ని త్రిలింగ శబ్దానుశాసన (లేదా త్రిలింగ వ్యాకరణం) అని పిలిచారు. 17వ శతాబ్దానికి చెందిన అప్పకవి త్రిలింగ నుండి తెలుగు ఉద్భవించిందని స్పష్టంగా రాశాడు. అప్పకవి పూర్వీకులకు అటువంటి వ్యుత్పత్తి గురించి తెలియదు కాబట్టి ఇది "విచిత్రమైన భావన" అని పండితుడు చార్లెస్ పి. బ్రౌన్ వ్యాఖ్యానించాడు. జార్జ్ అబ్రహం గ్రియర్‌సన్, ఇతర భాషావేత్తలు ఈ వ్యుత్పత్తిపై సందేహం వ్యక్తం చేశారు. తెలుగు పాత పదం. త్రిలింగ దానికి సంస్కృతీకరణ అయితే, ట్రిగ్లిఫమ్, త్రిలింగం, మోడోగలింగం పురాతన గ్రీకు మూలాల్లో ధృవీకరించబడినందున, ఈ వ్యుత్పత్తి చాలా పురాతనమైనది అయి ఉండాలి, వీటిలో చివరిది " త్రిలింగ " యొక్క తెలుగు అనువాదంగా అర్థం చేసుకోవచ్చు. మరొక కథనం ప్రకారం తెనుగు అనేది ప్రోటో-ద్రావిడ పదం *తెన్ ("దక్షిణం") నుండి "దక్షిణం/దక్షిణ దిశలో నివసించిన ప్రజలు" నుండి కలిగినది. తెలుగు అనే పేరు "న" నుండి "ల" మార్పు వలన వచ్చింది. చరిత్ర thumb|ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు", " పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"|335x335px భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. అనగా తెలుగు – హిందీ, సంస్కృతం, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ నుడుల గుంపుకు (లేదా భారత ఆర్య నుడుల గుంపుకు) చెందకుండా, తమిళము, కన్నడం, మలయాళం, తోడ, తుళు, బ్రహూయి, గోండి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ నుడుల గుంపుకు చెందినదిగా భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'దక్షిణ మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టింది. ఈ కుటుంబంలో తెలుగుతో పాటు గోండి, కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి. సా.శ. 940 ప్రాంతంలో పంపన కాలంలోనే తెలుగు నుడి ఒక నిండైన సాహిత్యం కలిగిన నుడిగా వ్రాతల రూపంలో మనకు కనిపించిందని పరిశోధనల్లో తేలింది. సామాన్యశకం 1100–1400 మధ్య పాత తెలుగు- కన్నడ లిపి నుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు పుట్టినాయని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయి అనే సిద్ధాంతం ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నుడులతో పాటుగా మొత్తం 26 నుడులు నేడు వాడుకలో ఉన్న ద్రావిడ నుడులు. సంస్కృతం భారతదేశంలో అడుగుపెట్టక ముందు ద్రావిడ నుడులు భారతదేశమంతా విస్తరించి ఉండేవని ఎందరో భాషా చరిత్రకారుల నమ్మకం. నాటి సింధు లోయ నాగరికత నివాసులు ద్రవిడ జాతికి చెందినవారైనందున వారి భాష కూడా ద్రావిడనుడే, లేదా ద్రావిడ నుడులకు చెందినది అయివుంటుందని వారి నమ్మకం. శిలాశాసన, సాహిత్య ఆధారాలు ఎన్నో ఇతర ద్రావిడ నడులవలె కాక తెలుగునుడి మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు వ్రాత అయిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర సామాన్య శక పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనం తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనం సామాన్య శకం 6వ శతాబ్దం నుండి ఉన్న ఆధారాలను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందింది. శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం "నాగబు". సామాన్య శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడిందిగా గమనించవచ్చు. ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు గ్రంథ ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదహరింపబడింది.:జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది' పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి ఇది ఉద్యోతనుడు ప్రాకృత భాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం: "అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్ళున్నూ,అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు". భాష పర్యాయ పదాల వాడుక ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రం, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. వీటి మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.తెలుగు సంస్కృతి - మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాసము సా.శ.పూ. 700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము) లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. సా.శ..పూ. 4వ శతాబ్దిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించాడు. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులని అవి క్రమంగా మిళితమైనవనీ కొందరి అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను.Ancient India: English translation of Kitab-ul Hind by Al-Biruni, National Book Trust, New Delhi. సా.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలోగాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభము నుండి "తెలుంగు భూపాలురు", "తెల్గరమారి", "తెలింగకులకాల", 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలంనాటికి తెలుగు రూపాంతరంగా "తెనుగు" అనే పదం వచ్చింది. 13వ శతాబ్దంలో మహమ్మదీయ చారిత్రకులు ఈ దేశాన్ని "త్రిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దం పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు. ధర శ్రీ పర్వత కాళే శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా కరమగుట నంధ్రదేశం బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్ తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం – అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు"గా పరిణామం పొందిందని ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేనని, తెలుగు అనేదే ప్రాచీన రూపమని చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజం లేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు. 12వ శతాబ్దిలో పాల్కురికి సోమనాథుడు "నవలక్ష తెలుంగు" – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర – అనే పదాలు భాషకు, జాతికి పర్యాయపదాలుగా రూపుదిద్దుకొన్నాయి. తెలుగు భాషా విస్తృతి తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలోని యానాంలో అధికార భాష. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు లలో అదనపు అధికార భాషగా గుర్తించబడింది. ఇంకా తమిళనాడులో తెలుగు మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశాలోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురం పర్లాకేముండిలలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళ ప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవములోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. భాష స్వరూపం శబ్దము తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదం ఒక అచ్చుతో అంతం అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డి కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి. అఆఇఈఉఊఋౠఌౡఎఏఐఒఓఔఅంఅః తెలుగు భాషను సాధారణంగా ఒకపదంతో మరొకపదం కలిసిపోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి. మాండలికాలు తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి. సాగరాంధ్ర లేదా కోస్తా మాండలిక భాష: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అని అంటారు. రాయలసీమ భాష:కడప, కర్నూలు,చిత్తూరు,అనంతపురం ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అని అంటారు. తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాషను తెలంగాణ మాండలికం అని అంటారు. కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం లేదా ఉత్తరాంధ్ర మాండలికం అని అంటారు. లిపి ప్రధాన వ్యాసం: తెలుగు లిపి thumb|center|700px తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుండియు, ప్రాచీన కన్నడ భాష 'హలెగన్నడ 'లిపినుండియూ తెలుగు లిపి ఉద్భవించింది. తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపితో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలెనే కనిపిస్తుంది. తెలుగు లిపి చాలవరకు ఉచ్ఛరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" (వొవెల్స్ లేదా స్వర్), "హల్లులు" (కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారం మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికి, చదవడానికి, అచ్చు "అ"ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చు అంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్న సంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, ఇండో అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేష అచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి. తెలుగు అంకెలు పేరు తెలుగుసంఖ్య ఇండో అరబిక్ అంకెలుసున్నా 0 0ఒకటి ౧ 1రెండు ౨ 2మూడు ౩ 3నాలుగు ౪ 4ఐదు ౫ 5ఆరు ౬ 6ఏడు ౭ 7ఎనిమిది ౮ 8తొమ్మిది ౯ 9 తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండరులో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు కంప్యూటరులో తెలుగు తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072–3199) కేటాయించబడింది. ఆగష్టు 15, 1992న తొలి తెలుగు న్యూస్ గ్రూప్ (soc.internet.culture.telugu) ఆవిర్భవించింది.రాతమార్చిన అంతర్జాలం- సురేష్ కొలిచాల తెలుగు వెలుగు ఆగష్టు 2013 పే 32 1985లో డిటిపి కొరకు ఆపిల్ కంప్యూటర్ విడుదలయ్యింది. తొలుత ఆంగ్ల భాషకే మాత్రమే పరిమితమైనా తరువాత భారతీయ భాషలకు విస్తరించాయి. చెన్నైకి చెందిన ఉమా కళ్యాణరామన్ అనే మహిళ తెలుగు ఖతి(ఫాంటు)ని రూపొందించింది. ఆ తరువాత కృష్ణ, గోదావరి అనే ఖతులు వాడకంలోకి వచ్చాయి. 1998 లో సిడాక్ భారతీయభాషల తోడ్పాటుకు పర్సనల్ కంప్యూటర్ కు జిస్ట్ కార్డు విడుదలచేయటం ఆ తరువాత సిడాక్ లీప్,లీప్ ఆఫీస్, ఐలీప్, వివిధ భాషల ఖతులు విడుదలచేసింది. 2001 లో పోతన(ఫాంటు) స్వేచ్ఛానకలుహక్కులత తిరుమలకృష్ణ దేశికాచారి విడుదలచేశాడు.ఆ తరువాత అన్ని కంప్యూటర్ వ్యవస్థలకు,తెలుగు తోడ్పాటు అందుబాటులోకి వచ్చింది. 2011 ప్రాంతంలో తొలి స్మార్ట్ ఫోన్లలో తెలుగు వాడకం వీలైంది. తెలుగు సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును. సా.శ. 1020 వరకు – నన్నయకు ముందు కాలం 11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ. శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. ఇది కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది. అంతకు ముందు కాలానికి చెందిన అమరావతి శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది. 1020–1400 – పురాణ యుగం దీనిని నన్నయ్య యుగము అనవచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయ దురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులు పామరులు మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారైనా నన్నయ్య అడుగుజాడలను అనుసరించినవారే. నన్నయ తరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటుచేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం) లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి. 1400–1510 – మధ్య యుగం (శ్రీనాథుని యుగం) ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన, తాళ్ళపాక తిమ్మక్క, గోన బుద్దారెడ్డి పేరెన్నికగన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తిమ్మక్క సుభద్రా కళ్యాణం, గోన బుద్ధారెడ్డి తొలి తెలుగు రంగనాథ రామాయణము మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు. 1510–1600 – ప్రబంధ యుగం విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యదతో "ప్రబంధం" అన్న కవిత్వ రూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది. 1600–1820 – దాక్షిణాత్య యుగం కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసుగా పేరొందిన కంచెర్ల గోపన్న కొందరు ముఖ్యులు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు. 1820 తరువాత – ఆధునిక యుగం 1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డుస్ వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు. గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు నన్నయకు పూర్వము నుండి గ్రాంథిక భాష, వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20వ శతాబ్దము తొలినాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది. మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదానికి దారితీసింది. ఆ తరువాత రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, చలన చిత్రాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి. ఇవి కూడా చూడండి ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్రవిడ విశ్వవిద్యాలయం ఛందస్సు పొడుపు కథలు సామెతలు జాతీయాలు తెలుగు ప్రథమాలు తెలుగు భాష విధానం తెలుగు లిపి తెలుగు అక్షరాలు తెలుగు పదాలు తెలుగు సభలు మూలాలు ఉపయుక్త గ్రంథసూచి ఆంధ్ర భాషా చరిత్రం 1-వ భాగం, రచయిత, చిలుకూరి నారాయణరావు, సంవత్సరం,1937, ప్రచురణకర్త ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, చిరునామా, వాల్తేరు Telugu in Thirty Days -Dr Divakarla Venkatawadhani ముప్పది రోజులలో తెలుగు (ఇంగ్లీషుద్వారా) -డా. దివాకర్ల వేంకటావధాని బయటి లింకులు సాహితీ స్రవంతి (సిపిబ్రౌన్ అకాడమీ వారు ఏప్రిల్ 2009 నుండి జులై 2011 వరకు నిర్వహించిన పత్రిక సంచికలు (ఆర్కైవ్ లో) వర్గం:భారతీయ భాషలు వర్గం:ద్రావిడ భాషలు వర్గం:ఈ వారం వ్యాసాలు
గోడకుర్చీ
https://te.wikipedia.org/wiki/గోడకుర్చీ
గోడకుర్చీ తెలుగువారు ప్రాచీన కాలంలో కనిపెట్టిన ఒక అద్భుత యోగాసనం. తెలుగుపంతుళ్ళు అసభ్యప్రవర్తన చేసిన విద్యార్ధులకు క్రమశిక్షణ చర్యలో భాగంగా వాడే ఒక దండనాపద్ధతే గోడకుర్చీ వేయించటం. thumb|గోడకుర్చీ చేసే విధానం గోడకు ఆనుకొని ఉన్న ఒక కుర్చీని ఊహించండి. శరీరాన్ని ఆ కుర్చీ పోజులో ఇమిడ్చి, కొంతసేపు ఒణక కుండా, కదలకుండా ఉంచడాన్నే `గోడకుర్చీ వెయ్యడం (లేక చెయ్యడం) అంటారు. ఇది చేయడానికి గోడకు సుమారు అడుగు దూరంలో పాదాలు రెంటినీ సుమారు అడుగు వ్యత్యాసంలో ఉంచి నిటరుగా నుంచోండి. మోకాలునుంచి పాదాలవరకూ కాళ్ళను నిటారుగా ఉంచుతూ వంగి, మోకాటినుంచి పిరుదులవరకూ ఉండే శరీర మధ్య భాగాన్ని భూమికి సమానంతరంగా చేసి, శరీర పైభాగాన్ని (పిరుదులనుంచి తలవరకూ) నీటారుగా చేస్తే ఈ పైభాగం గోడకు ఆనుతుంది. అప్పుడు చేతులు బార్లా చాపి భూమికి సమానాంతరంగా పెడితే అవీ గోడకు ఆనుకొని ఉంటాయి. ఇప్పుడు మీరు గోడకుర్చీ పోజుకి వస్తారు. అలానే కదలకుండా, పడిపోకుండా, సుమారు 5 నిముషాలు (మీ ఓపికను బట్టి) ఉండండి. చరిత్ర తెలుగువాళ్ళు ప్రాచీనకాలంనుంచీ గోడకుర్చీ చేస్తున్నారు. కానీ, మిగతాప్రాంతం ప్రజలకు గోడకుర్చీ గురించి ఇంతవరకూ తెలియదు. ఇంగ్లీషువాళ్ళు, స్కూల్లో అసభ్యంగా ప్రవర్తించిన పిల్లల్ని బెంచిమీద నిలబడమని శిక్ష వేస్తారు. ఇంగ్లీషువాళ్ళహయాంలో ఇన్ని సంవత్సరాలు ఉండడంవల్ల మన పంతుళ్ళు కూడా ఈ పద్ధతినే ఇప్పుడు అవలంబిస్తున్నారు. కానీ దీనిముందు తెలుగుపంతుళ్ళు అసభ్యప్రవర్తన చేసిన విద్యార్ధులకు క్రమశిక్షణ చర్యలో భాగంగా వాళ్ళచేత గోడకుర్చీ వేయించేవారు. ఈ వ్యాయామాలవల్ల ఫలితం ఏమిటీ? రక్తనాళాల్లో ప్లాకు పేరుకుంటే వాటిలో రక్తప్రసారం అడ్డగించబడుతుంది. హై బ్లడ్‌ప్రెజర్‌కీ, గుండెజబ్బుకీ ఇదే ముఖ్య కారణం. ప్రతిరోజూ షుమారు ఒక గంటసేపు ఈ వ్యాయామాలు చేశ్తే శరీరంలో రక్తప్రసరణ బాగా పెరిగి రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. ముసలితనంలో చాలామందికి సెనిలిటీ, ఆల్‌జైమర్సు వ్యాధి వచ్చి, వాళ్ళు క్రమేపీ జ్ఞాపకశక్తిని పోల్గోటం జరుగుతోంది. ఇవి పేషంట్లకూ, వారికుటుంబాలఖూ ఎన్నో ఇక్కట్లు కల్గించే ఘోరమైన వ్యాధులు. ఈ వ్యాధులకు ముఖ్యకారణం మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడమే అని ఈ మధ్య తెలిసింది. దొర్లింగు, వణుకుల్లో తల తిప్పడంవల్ల, మెడ, మెదడుల్లో రక్తప్రసారం బాగా పెరిగి, మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. కొంతమంది దిప్రెషన్‌ తో బాధ పడుతుంటారు. మెదడుని శరీరంక్రిందిభాగంతో కలిపే వేగాస్‌ నర్వుని (ఇది మెడ ఎడమభాగం గుండా దిగుతుంది) ఉత్తేజ పరిస్తే వారి పరిస్థితి మెరుగవుతుందని ఈ మధ్య కనిపెట్టారు. దొర్లిగు, వణుకుల్లో తలతిప్పడం మూలాన వేగాస్‌ నర్వుకి ఈ ఉత్తేజం రోజూ కల్గి దిప్రెషన్‌ రాకుండా చేస్తుంది. ఈ మధ్య ఇండియన్స్‌లో డయాబెటీసు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఈ వ్యాధికి తెలుగులో చాలా పేర్లు ఉన్నాయి: ప్రమేహం, అతిమూత్రం, మధు మూత్రం, మధుమేహం, అని. కానీ ఇప్పుడు డయాబెటీసు అనే పదం బాగా వాడుకలోకి వచ్చేశింది. ప్రతిరోజూ శరీరంలో అవయవాలనన్నిటినీ బలంగా కదిలించే వ్యాయామాలు చేస్తే డయాబెటీసు వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని పరిశోధనలవల్ల తెలిసింది. ప్రతిరోజూ గోడకుర్చీ వెయ్యడంవల్ల మోకాటికీ, మోకాటిచిప్పకూ, కాళ్ళలోని, తుంటిలోని ఎముకలకూ; బలం చేకూరి, ఎముకలబలహీనతకు చెందిన వ్యాధులు రాకుండా చేస్తుంది. సరిపోయినంత కాల్షియం తమ భోజనంలో తీసుకుంటూ, రోజూ గోడకుర్చీ వేశేవారి కాలి ఎముకలకు ఆస్టియోపొరోసిస్‌ రాదు. నా చిన్నప్పటి అనుభవం మా పెద్దతాతయ్య గోడకుర్చీమీద ఒక మంచి సామెత చెప్పేవాడు. అది చెప్తాను. నా చిన్నప్పటికే పెద్దతాతయ్య ముసలివాడు. కానీ ప్రతిరోజూ కనీసం 5 నిమిషాలపాటు గోడకుర్చీ వేశేవాడు. "మీరూ వెయ్యండిరా మీ కాళ్ళు బలపడ్తాయీ" అని చెప్పేవాడు కానీ ఎవ్వరూ వీనేవాళ్ళం కాదు. దానికి ఆయన వాడే గోడను అందరూ "తాతయ్య గోడా" అని పిల్చేవారు. ఇండియాలో, రాత్రి పడుకున్న మంచాన్ని పగపూట ముడిచి గోడకు ఆన్చి ఉంచుతారుగదా. తాతయ్య గోడకు మాత్రం ముడిచిన మంచాలు ఆన్చడం నిషేధమ మా కుటుంబంలో. నేను ఎప్పుడైనా మర్చిపోయి నా మంచాన్ని ఆ గోడకు ఆనిస్తే మా అమ్మ "తాతయ్య గోడకు ఎందుకాన్చావురా నీ మంచాన్ని" అంటూ కోప్పడేది. ఒకసారి మాకుటుంబమంతా ఏదో పుణ్యక్షేత్రదర్శనానికి వెళ్ళాం. ఆ రోజల్లా చాలా నడవాల్సి వచ్చింది, కొండలు, మెట్లు చాలా ఎక్కాల్సివచ్చింది. సాయంత్రం బసకు చేరుకున్నవెంటనే చాలామంది "నాకాళ్ళు నొప్పిపెడ్తున్నాయి మొర్రో" అంటూ మంచాలమీద కూలారు. కానీ తాతయ్య మాత్రం కాయగూరలు కడిగి తరగడం మొదలుపెట్టాడు. "నీ కాళ్ళు నొప్పిపెట్టడం లేదా తాతయ్యా" అని అడిగితే "గోడకుర్చీతో గట్టిపడ్డ కాళ్ళు ఎంతదూరమైనా వెళ్ళగలవురా" అన్నాడు!. మూలాలు కట్టా గోపాలకృష్ణ మూర్తి, ``కొన్నితెలుగుదనాలతో నా అనుభవాలూ'. వర్గం:తెలుగుదనం వర్గం:వ్యాయామ పద్ధతులు
Main Page
https://te.wikipedia.org/wiki/Main_Page
దారిమార్పు మొదటి పేజీ
భాష
https://te.wikipedia.org/wiki/భాష
thumb| హార్వర్డ్ మ్యూజియంలో ఉన్న మొట్టమొదటి రాత భాష ఫలకం thumb|బ్రెయిలీ లిపి భాష (నుడి): ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే నుడి. భాషకు లిపి, భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యం ముఖ్యమైన అంశాలు. భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తిగాదు. భాష (నుడి) సంగతులు తెలుగు భాషలో భాష పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.బ్రౌన్ నిఘంటువు ప్రకారం భాష పదప్రయోగాలు. భాష నామవాచకంగా A language, speech, dialect. A word, phrase, expression. మాట, A solemn undertaking, vow, engagement: what one gives his word for, an oath, ప్రతిజ్ఞ, ప్రమాణము అని అర్ధాలున్నాయి. దేశ భాష the vernacular of a country. భాషణము v. n. అనగా Speaking, speech. మాటాడుట. భాషాంతరము n. అనగా Another language: a translation. భాషాగ్రంథము n. A poem in a modern or vernacular language, not in Sanskrit. భాషామంత్రము n. A spell or charm, written in any vernacular language, not in Sanskrit. భాషించు v. n. అనగా To speak, use language, converse, talk, మాటలాడు. భాషితము n. Speech, language. మాట. adj. Spoken, మాటాడిన. భాష్యము n. అనగా A commentary, a paraphrase or exposition either of scripture or a work on science, సూత్రవ్యాఖ్యానగ్రంథము. భాష్యకారులు లేదా భాష్యకార్లు n. అనగా A commentator or expounder of technical texts; బాసికములు fillets worn at weddings పెళ్ళిలో నుదుట ధరించేవి. తెలుగు నుడి ఉపోద్ఘాతం చరిత్ర లిపి పుట్టు పూర్వోత్తరాలు వ్యాకరణము తెలుగు ధ్వనులు తెలుగు అక్షరాలు గుణింతాలు సాహిత్యం భారతీయ భాషలు (నుడులు) హిందీ బెంగాళీ తెలుగు సంస్కృతం పంజాబీ కన్నడ మళయాళం తుళు తమిళం మరాఠీ ఒరియా ఉర్దూ కాశ్మీరీ సింధీ కొంకణి అస్సామీ గుజరాతీ మొదళ్ళు మూలాలు వెలుపలి లంకెలు
ఆటలు
https://te.wikipedia.org/wiki/ఆటలు
శరీరక సౌష్టవం కొరకు, మానసిక ఉల్లాసం కొరకు తర తరాలనుండి ఆటలు ఒక అద్భుతమైన సాధనముగా ఉన్నాయి.ఎవరికి తగిన ఆటలు వారు ఆడుతూ ఉంటారు. దాడి కుడి|100x100px ఆడే పద్ధతిః ఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనిది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్యవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న కోణాలలో వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు. పులి-మేక కుడి|115x115px ఆడే పద్ధతిః ఆటగాళ్ళుః యిద్దరు, కావలసినవిః 3-పులులు, 15-మేకలు పైనున్నది కొండ, క్రింద గళ్ళు అడవి, పులులు 3 కొండపైనే వుండాలి. ముందుగా ఒక మేకని అడవిలో వదలాలి, దాన్ని చంపేందుకు ఒక పులిని కొండమీంచి అడవిలోకి దించాలి. పులి కదలికలను బట్టి, మొదటి మేకకు కాపుగా ఇంకో మేకని నప్పాలి. అవసరాన్నిబట్టి ఒక్కొక్క పులిని కొండమీంచి దింపనూనచ్చు, కొండమీదకు పంపనూవచ్చు. ఇలా పులుల కదలికల్ని బట్టి, వాటికి అందకుండా 15 మేకల్ని క్రాస్ ల మీద పేర్చాలి, పులి తన తర్వాతి క్రాస్ మీద ఇన్న మేక మీంచి పైనుండి క్రిందికి కాని, అడ్డంగా గాని దూకవచ్చు. అలా దూకితే ఆ మేక చని పోయినట్లు భావించి ఆటలోనించి తీసేయ్యాలి. ఆయితే ఒక గడి ఎడంగాఉన్నా, లేదంటే వరుసగా వున్న రెండు మూడు మేకల మీంచి గాని పులి దూకకూడదు. ఆలాగే 15 మేకల్తోనూ 3 పులుల్ని కదలకుండా కట్టెయ్యచ్చును. అలా ఎక్కువ మేకలు చనిపోతే పులుల పార్టీ, పులులు కట్టుబడిపోతే మేకల పార్టీ నెగ్గినట్లు. మేకలు పులుల మీంచి దూకలేవు సుమా! ఆడటం అలవాటైతే చదరంగం లాగానే ఆడుకోవచ్చు. అష్టా చెమ్మ కుడి|100x100px ఆడే పద్ధతిః అష్టా చెమ్మ ఆటలో 4 గవ్వలు ఉంటాయి. వీటిని చేతితో పట్టుకొని తిప్పి నేలమీద వేస్తారు. అవి పడిన తీరును బట్టి గడులలో ఉంచిన కాయలను ముందుకు జరుపుతారు. వైకుంఠ పాళీ గోటిబిళ్ళ / బిళ్ళంగోడు / గిల్లి డండా / ఛిల్లా కట్టే మూరెడు పొడుగున్న (గోడు), జానెడు పొడుగున్న (బిళ్ళ) కావాలి. జానెడు పొడుగున్నబిళ్ళ చివరలని నున్నగా అటూ ఇటూ కదురు లాగా చెక్కాలి. మూరెడు పొడుగున్న గోడుని ఒక పక్క కదురు లాగా చెక్కాలి. నేల మీద సన్నగా చిన్న గుంట తీసి దాని మీద అడ్డంగా చిన్న కర్ర (బిళ్ల) ని పెట్టి, పెద్ద కర్రతో లేపి ఎగిరేలా కొడతారు. 1. అవతలి జట్టు వాళ్ళు ఎగిరిన బిళ్ళ పట్టుకోజూస్తారు. పట్టుకుంటె కొట్టిన వాడు దొంగ అవుతాడు. అంటే ఆట లోంచి తప్పుకోవాలి. 2. కొట్టిన బిళ్ల ఎంత దూరం వెళితే, అంత మంచిది. గుంట నుండి బిళ్ల పడిన పడిన చోటకి ఉన్న దూరాన్ని గోడుతో కొలుస్తారు. ఎవరిది ఎక్కువ దూరం పడితే వాళ్ళు గెలిచినట్టు కబడ్డీ 150x150px|thumb|గ్రామాలలో కబడ్డీ ఆడుతున్న దృశ్యం కోతి కొమ్మచ్చి ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు. నేల-బండ ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంత మందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల), రాతి పృదేశము (బండ) ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో, దొంగ నేల మీద, మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చి దొంగని ఆటపట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించవలెను. ఇదియే దొంగ యొక్క ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ స్థానమును భర్తీ చేస్తారు. ఈ ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట. తొక్కుడు బిళ్ళ బొమ్మల పెళ్ళి పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు ఆట బొమ్మలను తెచ్చుకుని పెళ్ళి ఆట ఆడుకునేవారు. ఆట బొమ్మలకు పెళ్ళి వస్త్రాలు తొడిగి, వియ్యపువారి బొమ్మలను కూడా పెట్టేవారు. పిల్లలందరూ పెద్దల వేషధారణలో వచ్చి కూర్చుంటారు. పెళ్ళిలోని కన్యాదానం, జీలకర్ర-బెల్లం వంటి ఘట్టాలను నిర్వహించి చివరకు వరుడి బొమ్మ చేతికి చిట్టి మంగళ సూత్రాన్ని తగిలించి వధువు బొమ్మ మెడలో పడేలా చేస్తారు. అయితే సంసారపు శిక్షణ ఇచ్చే ఈ ఆట ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, ఆధునిక చధువులు, పాశ్చాత్య పోకడల వల్ల నేడు ఆట పూర్తిగా అంతరించిపోయింది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబంబించే ఈ ఆటను పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావానికి గురైన నేటి పిల్లలకు తల్లిదండ్రులు తెలిపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. గుజ్జన గూళ్ళు దాగుడుమూతలు 150x150px|right|అడవిలో దాగుడు మూతలాట ఆడుతున్న పిల్లలు క్రికెట్ భారతదేశంలో బాగా ఆడే ఆట ఈ క్రికెట్. ఈ ఆట ఆడటానికి రెండు టీంలు వుండాలి. ఒక్కొక్క టీంలో 11 మంది వుంటారు. రమ. హాకీ వివిధ రకాల హాకీ గురించి తెలుసు కోవడానికి ప్రధాన వ్యాసం చదవండి. టెన్నిస్ చదరంగం thumb|ఎడమ నుండి వరుసగా సిపాయి, ఏనుగు, గుర్రం, శకటు, మంత్రి, రాజు|150x150px భారతీయులచే కనిపెట్ట బడిన ఈ క్రీడ చాలా పురాతనమైనది. ఈ ఆటలో 12 నిలువు 12 అడ్డం వరసలతో కూడిన గళ్ళ బోర్డు ఉంటుంది. ఒకటి నల్ల గడి అయితే ఒకటి తెల్ల గడి. ఆడటానికి పావులు ఉంటాయి. నల్లవి 24 పావులు, తెల్లవి 24 పావులు. వీటిల్లో 12 సిపాయిలు లేదా కాలి బంట్లు, 2 ఏనుగులు,2 శకటాలు,2 గుర్రాలు,1 రాజు,1 మంత్రి లేదా రాణి. ఆడే విధానం ముందు పావులు పేర్చే విధానం.బోర్డు మన ఎదురుగా పెట్టుకున్నప్పుడు మన ఎడమ పక్క చివర నల్ల గడి ఉండాలి. ఆ చివరి గడిలో, ఈ చివరి గడిలో 2 ఏనుగులూ పెట్టాలి. వాటికి లోపలి పక్కన రెండు వైపులా 2 గుర్రాలూ పెట్టాలి. తరువాత శకటాలు, ఇప్పుడు 2 గళ్ళు మిగులుతాయి. 1 నల్లది, 1 తెల్లది. నల్ల పావులు ఐతే నల్ల రాజు తెల్ల గడిలో, తెల్లవైతే తెల్ల రాజు నల్ల గడిలో ఉంచాలి. మిగిలిందాంట్లో మంత్రి లేదా రాణిని ఉంచాలి. ఎత్తులు సిపాయి మొట్టమొదట 2 లేదా 1 గడి ముందుకు జరగచ్చు. అక్కడ నుంచి ఒక్క గడి మాత్రమే ముందుకి జరుగుతుంది. చంపడం మాత్రం ఐమూలగా ఎదుట ఉన్న వాటిని చంపుతుంది. ఏనుగు అడ్డంగా గాని, నిలువుగా గానీ ఏవీ అడ్డం లేకపోతే ఆచివరి నుంచి ఈచివరి దాకా రావచ్చు. చంపడంకూడా అలానే చంపుతుంది. గుర్రం ఒక గడి నిలువు, రెండు గళ్ళు అడ్డంగా లేదా రెండు గళ్ళు నిలువు ఒక గడి అడ్డంగా జరుగుతుంది. చంపడం అది ఉన్న చోటి నుంచి ముందు చెప్పినట్లు వెళ్ళి అక్కడ మూడో గళ్ళో పావుని చంపుతుంది. శకటు ఐమూలగా అడ్డం లేకపోతే ఆ చివర నుండి ఈ చివరదాకా వెళ్ళచ్చు. చంపడం కూడా అలానే చంపుతుంది. మంత్రి లేదా రాణి అడ్డం, నిలువు, ఐమూలగా అడ్డం లేకపోతే ఆ చివర నుంచి ఈ చివర దాకా వెళ్ళచ్చు. చంపడం కూడా అలానే చంపుతుంది. రాజు అడ్డం, నిలువు, ఐమూల ఎటైనా ఒక్క గడి జరుగుతుంది. మొదట పావులు కదిపేది మాత్రం ఎప్పుడైనా తెల్ల పావులతో ఆడేవాళ్ళే. కప్ప తల్లి ఆట వర్షకాలం ఆరంభమైన, వానలు అనుకున్న సమయానికి రాకుంటే వానల కోసం  గ్రామాల్లో బాలలు ఆటలాడుతూ కప్ప కు పూజలు చేస్తారు. వామనగుంటలు thumb|ఆధునిక వామన గుంటల పీట|150x150px ఐదు రాళ్ళ ఆట ఇంటిపట్టున ఉండే ఆడపిల్లలు ఆడుకునే ఈ ఆటను అచ్చెనగండ్లు అని కూడా అంటారు. ఈ ఆటను చింతగింజలతోను, గచ్చకాయలతో కూడా ఆడుకొందురు. నాలుగుస్తంభాలాట మూలాలు వెలుపలి లంకెలు వర్గం:క్రీడలు
కంప్యూటర్ సాఫ్ట్‌వేర్
https://te.wikipedia.org/wiki/కంప్యూటర్_సాఫ్ట్‌వేర్
కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, లేదా క్లుప్తంగా సాఫ్ట్‌వేర్ అనేది కంప్యూటర్ వ్యవస్థలో ఉపయోగించే కంప్యూటర్ ప్రోగ్రాములు, కంప్యూటర్ ప్రక్రియలు సంబంధిత రచనలు అన్నింటినీ కలిపి వర్ణించడానికి అధికంగా వాడే అర్థంలో సాఫ్ట్ వేర్ అనగా కంప్యూటర్లు పనిచెయ్యడానికి ఇచ్చే ఆదేశాల వరుస. ఈ వరుసనే ప్రోగ్రాము అంటారు. ఇటువంటి ప్రోగ్రాములు చాలా రాస్తే ఒక పెద్ద పని చెయ్యడము వీలు అవుతుంది. అలాంటి పెద్ద ప్రోగ్రాముల గుంపుని సాఫ్ట్ వేర్ అంటారు. thumb|360px|ఓపెన్ ఆఫీస్ రైటర్ యొక్క తెరపట్టు సాఫ్ట్వేర్ అనే పదం క్రింది వాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతారు. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ - ఉదాహరణకు వర్డ్ ప్రాసెసర్ వంటి ప్రోగ్రాములు. మైక్రోసాఫ్ట్ వర్డ్, అడోబి ఫొటోషాప్, అడాసిటీ వంటివి కొన్ని ప్రసిద్ధమైన అప్లికేషన్ సాఫ్ట్వేర్లు. ఫర్మ్‌వేర్ - కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉండే ముఖ్య గణాంక పరికరం యొక్క మెమరీలో అలా ఉండిపోయేలా రూపొందించబడిన సాఫ్ట్‌వేర్. మిడిల్‌వేర్ - డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటర్ సిస్టమ్, విడియో గేమ్లు, వెబ్ సైటులు వంటి పరికరాలు లేదా వ్యవస్థలు పని చేయడానికి, వ్యవస్థల మధ్య అనుసంధించడానికి వాడే సాఫ్ట్‌వేర్. ఇలాంటివి అధికంగా సీ, సీ++ వంటి ప్రోగ్రామింగ్ భాషలో వ్రాయబడుతాయి. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ - ఆపరేటింగ్ సిస్టమ్‌లు పనిచేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్. ఈ విధమైన సాఫ్ట్‌వేర్ కంప్యూటర్ హార్డువేరు పనితో సంబంధం కలిగి ఉంటుంది. Testware which is an umbrella term or container term for all utilities and application software that serve in combination for testing a software package but not necessarily may optionally contribute to operational purposes. As such, testware is not a standing configuration but merely a working environment for application software or subsets thereof. "Software" is sometimes used in a broader context to mean anything which is not hardware but which is used with hardware, such as film, tapes and records.software..(n.d.). Dictionary.com Unabridged (v 1.1). Retrieved 2007-04-13, from Dictionary.com website: http://dictionary.reference.com/browse/software సాఫ్టువేరులు చాలా రకాలుగా విభజించవచ్చు ఆపరేటింగు సిస్టంలు చిన్న అప్లికేషన్లు పెద్ద ఆప్లికేషన్లు హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఐఎస్) నేడు వైద్య సంరక్షణలో అతిపెద్ద సవాళ్లను అధిగమించడానికి వైద్య సదుపాయాలను కల్పించే ఒక ఆధునిక పరిష్కారం. తన ఆసుపత్రులను అనుమతిస్తుంది, సులభంగా అన్ని విభాగాలు, రోగులు, సిబ్బందిని నిర్వహించండి రోగి అనుభవాన్ని మెరుగుపరచండి తగ్గిన రాబడి లీకేజీలు, స్టాక్ ఫ్లైఫేజ్లను నిర్ధారించండి సమర్థవంతమైన బిల్లింగ్, కాగితాలు లేని కార్యకలాపాలు అధునాతన రిపోర్టింగ్ ఫీచర్లతో మెరుగైన నిర్ణయం తీసుకోండి నేపియర్ అతను ఒక వెబ్-స్థానిక, ఇంటిగ్రేటెడ్, బహుళ-సౌకర్యం, బహుళ భాషా, స్కేలబుల్ వేదిక. మాధ్యమం యొక్క పరిపాలనా, కార్యాచరణ, క్లినికల్ విభాగాల యొక్క అన్ని సమాచారం, కమ్యూనికేషన్ అవసరాలను చాలా పెద్ద ఆసుపత్రులకు, నెట్వర్క్లకు కలిసేలా కాన్ఫిగర్ చేయవచ్చు. నికల్ మేనేజ్మెంట్ కోహెరెంట్ లాంతిట్యూడ్ సారాంశం వీక్షణలు కంప్యూటరీకరించిన వైద్యుడు ఆర్డర్ ఎంట్రీ (CPOE) సమగ్ర తెరలు, గ్రాఫికల్ ప్రాతినిధ్యాలు వినియోగదారు నిర్వచించదగిన క్లినికల్ డాక్యుమెంటేషన్ టెంప్లేట్ కోడెడ్ రోగ నిర్ధారణ, ప్రక్రియలతో క్లినికల్ డెలివరీ సపోర్ట్ సిస్టం రికార్డు, నవీకరణ, ఆర్కైవ్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులు MIMS డేటాబేస్ తో ఇంటిగ్రేషన్. * 1973లో న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త లారీ టెస్లర్ క‌ట్‌, కాపీ, పేస్ట్‌ లాంటి క‌మాండ్లును రూపొందించాడు. agriculture education- agriculture software ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు పంట ఉత్పత్తి, పంట దిగుబడి పెంచుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. రైతులు ట్రాక్, కొలిచేందుకు, కొన్ని వేరియబుల్స్ కు స్పందించాలి. వారు సరైన ఫలితాలను పొందడానికి వాతావరణ పరిస్థితులు వంటి గత దిగుబడి డేటా, పర్యావరణ కారకాల ఆధారంగా ఆదర్శ నాటడం, నిర్వహణ, సాగు సీజన్ల గురించి తెలుసుకోవాలి. రైతులకు నేల యొక్క రాష్ట్రాన్ని, ప్రత్యేక నేలలో కనిపించే కీటకాలు, ఇతర ముఖ్యమైన వ్యవసాయ అంశాలలో నేల తేమ గురించి తెలుసుకోవాలి. వ్యవసాయ దిగుబడి, ఆదాయాలు పెంచడానికి, రైతులు డేటా ఆధారిత ఆలోచనలు ఉపయోగించాలి. ప్రతి పంటకు వ్యవసాయ దిగుబడులను ఆప్టిమైజ్ చేయడానికి కచ్చితమైన డేటా అంతర్దృష్టులు రైతులు, రైతులకు సహాయం చేస్తాయి. వారు ప్రతి వృద్ధి చక్రంలో విత్తనాల ప్రణాళికలు, అంతరిక్ష ఉపయోగాలను పర్యవేక్షిస్తారు. కచ్చితమైన వ్యవసాయం అనేది పంట ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా చేస్తుంది ఆధునిక వ్యవసాయ పద్ధతి. టాప్ ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్: ఫార్మ్ వర్క్స్, SMS, మ్యాప్షాట్స్, AgDNA, సెంటెరా, ఆగ్రోసెన్స్ టాప్ అప్రసిస్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్. ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి? ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ అనేది క్లౌడ్-ఆధారిత సాధనం, ఇది రైతులు సంరక్షించేటప్పుడు రైతులకు, పంట దిగుబడిని, ఆదాయాన్ని పెంచడానికి, నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఊహించిన దిగుబడి పరిమాణం, పంట వ్యర్థాలు, ఆదాయాల గురించి అంచనా వేయడానికి రైతులు ఈ అంచనా విశ్లేషణ సాధనాలను ఉపయోగిస్తారు. ఇది వినియోగదారుడు పంట, పంటల భ్రమణ మార్గదర్శిని, నేల నిర్వహణ యొక్క పరిస్థితులపై సమాచారాన్ని పొందటానికి సహాయపడుతుంది. రియల్-టైమ్ ఇన్సైట్స్: ప్రెసిషన్ అగ్రికల్చర్ టూల్స్ టూల్ రియల్ టైమ్ రిపోర్టులు ఆఫర్ ఫర్ లేబర్, ఇన్పుట్స్ అండ్ అదర్ కారెక్టర్స్ ఇన్ దట్ పంట ప్రొడక్షన్. సెన్సింగ్ పరికరాలు ఎంపిక పారామితుల నిరంతర పర్యవేక్షణను అనుమతిస్తాయి, మొత్తం సమయం, ఫీల్డ్ పరామితుల యొక్క ప్రస్తుత స్థితిని నిర్ధారించడానికి రియల్ టైమ్ డేటాను అందజేస్తాయి. దిగుబడి పర్యవేక్షణ: దిగుబడి పర్యవేక్షణ లక్షణం ఒక నిర్దిష్ట ప్రదేశంలో వినియోగదారు కొలత ఫలప్రథమైన దిగుబడికి దోహదపడుతుంది, మ్యాప్లో వివిధ సీడ్ రకాలు పనితీరును సరిపోల్చండి. ఇది పంట దిగుబడులను పర్యవేక్షించటానికి GPS- పొందిన సమాచారంతో అనుసంధానించబడుతుంది. అంతర్నిర్మిత అకౌంటింగ్: అకౌంటింగ్ ఫీచర్ అంతర్నిర్మిత తో, కచ్చితమైన వ్యవసాయ సాఫ్ట్వేర్ యూజర్ రికార్డులు ఉంచడానికి, పంట దిగుబడి, లాభదాయకత ట్రాక్ అనుమతిస్తుంది. ఫీల్డ్ మేనేజ్మెంట్: ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ వినియోగదారుని పంట భ్రమణ, ఎరువు, పైరు, నీటిపారుదల, నేల పరీక్ష ఫలితాలను పర్యవేక్షిస్తుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్: రైతులు తయారీదారుల నుండి గిడ్డంగులకు వ్యవసాయ వస్తువుల ప్రవాహాన్ని ట్రాక్ చేయవచ్చు, నిర్వహించవచ్చు. వినియోగదారు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వను కూడా ట్రాక్ చేయవచ్చు. లేబర్ మేనేజ్మెంట్: ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ వినియోగదారుని ఉత్పాదకతను పర్యవేక్షించటానికి అనుమతిస్తుంది. ట్రేసెబిలిటీ: ఆహార ఉత్పత్తిలో ఎక్కువ ఆధారపడడానికి వీలు కల్పిస్తుంది, ఎందుకంటే ఆహార ఉత్పత్తికి వెళ్లేమిటో వినియోగదారులకు తెలియజేసే వ్యవసాయ విధానాలు, ఇన్పుట్లను కచ్చితమైన సమాచారాన్ని పొందడానికి వినియోగదారుని అనుమతిస్తుంది. వాతావరణ రికార్డ్స్: ప్రెసిషన్ అగ్రికల్చర్ సాఫ్ట్వేర్ వారి క్యాలెండర్ను ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో సమకాలీకరించడానికి అనుమతిస్తుంది, అందువలన వినియోగదారు ఫీల్డ్ కార్యకలాపాలను షెడ్యూల్ చేయవచ్చు. సహకార: ప్రెసిషన్ అగ్రికల్చరల్ సాఫ్ట్వేర్ సహకార విశేషణం వినియోగదారుల విశ్వసనీయ సర్కిల్ తో సహకరించడానికి యూజర్ భాగస్వామ్య సమాచారాన్ని అనుమతించండి. దిగుబడి, పెట్టుబడులను ఆప్టిమైజ్ చేయడానికి రైతులు పంట ఉత్పత్తిని పర్యవేక్షించటానికి వీలు కల్పించే ఒక ముఖ్యమైన సాధనం కచ్చితమైన వ్యవసాయ సాఫ్ట్వేర్ . సాఫ్టువేరు అభివృద్ధి జీవ చక్రం (Software Development Life Cycle) అవసరాల విశ్లేషణ (Requirement Analysis) కల్పన (Design) సంకేతించు (Coding) పరీక్ష (Testing) నమూనాలు సాప్టువేరును అభివృద్ధి చెయ్యడానికి చాలా రకాలైన నమూనాలు ఉన్నాయి. జలపాతపు నమూనా (Waterfall Model) సాఫ్టువేరు టెస్టింగ్ సాఫ్టువేరు టెస్టింగ్ అనగా సాఫ్టువేరును దాని వాడుకరులకు అందించే ముందు అందులో ఎటువంటి లోపాలూ లేవని నిర్ధారించటం, లేదా ఉన్న లోపాలన్నిటినీ వెలికి తీయటానికి చేసే ఒక ప్రక్రియ. సాధారణంగా సాఫ్టువేర్లను రెండు రకాల పరీక్షిస్తారు. అవి మాన్యువల్ (అనగా మనుషుల ద్వారా పరీక్షించడం), ఆటోమేషన్ (అనగా సాఫ్టువేర్లను పరీక్షించడానికి ప్రోగ్రాములను రాయడం). సాధారణంగా సాఫ్టువేర్లపై మనుషులే మొదటగా లోపాలను పట్టుకోవడానికి పరీక్షలు మొదలుపెడతారు. ఈలోగా సాఫ్టువేరు తయారీలో ఉత్పన్నమయ్యే సాధారణ లోపాలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాటిని పరీక్షించడానికి ప్రోగ్రాములు (ఆటోమేషన్) తయారవుతాయి. సాఫ్టువేరు వ్రాయు భాషలు చూడండి భారతీయ భాషల కోసం సాంకేతిక విజ్ఞానాభివృద్ధి సాఫ్టువేరు కంపెనీలు స్క్విడ్ (సాఫ్ట్‌వేర్) సాంబా (సాఫ్ట్‌వేర్) మూలాలు వర్గం:కంప్యూటర్ వర్గం:ఆంగ్ల పదజాలము
తెలుగు సాహిత్యం
https://te.wikipedia.org/wiki/తెలుగు_సాహిత్యం
thumb|నన్నయ భట్టారకుడు, సాహితీకారుడు తెలుగు సాహిత్యమునకు వెయ్యేళ్ల నాటి చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాథా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది. చరిత్ర, యుగ విభజన కాలానుగుణ తెలుగు సాహితీ చరిత్ర కోసం తెలుగు సాహితీ చరిత్రను చూడండి. తెలుగు సాహితీకారుల గురించిన మరిన్ని వివరముల కోసం తెలుగు సాహితీకారుల ను చూడండి. తెలుగు సాహిత్య చరిత్రను కొన్ని యుగాలుగా విభజించ వచ్చును. ప్రాఙ్నన్నయ యుగము : సా.శ. 1000 వరకు నన్నయ యుగము : 1000 - 1100 శివకవి యుగము : 1100 - 1225 తిక్కన యుగము : 1225 - 1320 ఎఱ్ఱన యుగము : 1320 - 1400 శ్రీనాధ యుగము : 1400 - 1500 రాయల యుగము : 1500 - 1600 దక్షిణాంధ్ర యుగము లేదా నాయకరాజుల యుగము : 1600 - 1775 క్షీణ యుగము : 1775 - 1875 ఆధునిక యుగము : 1875 నుండి సా.శ. 1000 వరకు - నన్నయకు ముందు కాలం 11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉంది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. సా.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో నాగబు అనే పదం కనిపిస్తుంది. 1000 - 1100 : నన్నయ యుగం దీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు. నన్నయ్య ఆది కవి. ఈయన మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని, ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులు పామరులు మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ,నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగుజాడలను అనుసరించిన వారే. నన్నయ్య ఆది కవి. 1100 - 1225 : శివకవి యుగం నన్నయ తరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవం భక్తిమార్గం ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. 1225 - 1320 : తిక్కన యుగం తిక్కన మహాభారతం లోని 15 పర్వాలను పూర్తి చేసాడు. దీని ద్వారా ఈయన గొప్ప కవి అయ్యరు. 1320 - 1400: ఎఱ్ఱన యుగం ప్రధాన వ్యాసము: ఎఱ్ఱన యుగం 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెనుగించబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది. తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగి ఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు. ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్య నిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథుని వంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. 1400 - 1500: శ్రీనాథ యుగం తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి. అందువలననే ఈ కాలాన్ని పురాణ యుగము అంటారు. ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. ప్రబంధము అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నికగన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధం, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కల్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు. ఈ సందర్భంలో రామాయణము కవుల గురించి కూడా చెప్పకోవచ్చును. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం మనకు అందిన మొదటి రామాయణం. ఈ కాలాన్నే "మధ్యయుగం" అని కూడా అంటారు. 1500-1600: రాయల యుగం దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యదతో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది. 1600 - 1775: దక్షిణాంధ్ర యుగం కర్ణాటక సంగీతపు ప్రముఖులు ఎంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితాలోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు. 1775 - 1875: క్షీణ యుగం There is no much information about this. 1875 తరువాత - ఆధునిక యుగం 1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి ఆంగ్ల కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావకవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు. మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), గిడుగు రామ్మూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం), సురవరం ప్రతాపరెడ్డి మొదలైన తెలుగు సాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం, వ్యావహారిక భాషా వాదమునకు దారితీసింది. తెలుగు సాహితీ చరిత్ర - ముఖ్యమైన ఘట్టాలు స్త్రీల కోకిల కంఠములలో, కర్షక శ్రామికుల స్వేదంలో, జానపదుల సంతోషములలో, తెలుగువారి ఘనమైన పండుగలలో తెలుగు సాహితీ చరిత్ర మొదలయింది. తరువాత సా.శ. తొమ్మిదవ శతాబ్దం నుండి శిలా శాసనాలకు ఎక్కింది. సా.శ. పదకొండవ శతాబ్దములో ఆదికవి నన్నయ్య చేతిలో, ఆంధ్ర మహాభారతం రూపంలో ఆదికావ్య రచన మొదలయింది. ఈ ఆంధ్ర మహాభారతమును పద్నాలుగవ శతాబ్దాంతానికి తిక్కన, ఎర్రనలు పూర్తి చేసారు. ఈ ముగ్గురూ తెలుగు కవిత్రయము అని పేరుపొందినారు. పదనేనవ శతాబ్దంలో గోన బుద్ధారెడ్డి రామాయణమును తెలుగువారికి తెలుగులో అందించాడు. పదునేనవ శతాబ్దంలో బమ్మెర పోతనామాత్యుడు భాగవతమును తేట తెలుగులో రచించి, తెలుగువారిని ధన్యులను గావించాడు. పోతనకు సమకాలికుడైన శ్రీనాథ కవిసార్వభౌముడు తన ప్రబంధాలతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసాడు. పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు. పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది పదకవితా పితామహుడైన అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరునిపై రచించి, పాడిన ముప్పైరెండువేల పద్యాలు ఓ ప్రత్యేక సాహితీ భాండాగారం. క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు వ్రాసిన కీర్తనలు నేటికీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. త్యాగరాజ కీర్తనలు కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టు వంటివి. తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు" అంటారు. ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు, చేస్తున్నారు. తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్విక, ప్రబోధాత్మక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ; ముహమ్మద్‌ హుస్సేన్‌ భక్త కల్పద్రుమ శతకం (1949) మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం సుమాంజలి. హరిహరనాథ శతకము, నుగుబాల నీతి శతకము, తెనుగుబాల శతకము మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు మాతృ భాష యొండు మాన్యము గదా మాతృ శబ్దము విన మది పులకింపదా? వినుత ధర్మశీల తెనుగు బాల" షేక్‌ దావూద్‌ 1963లో రసూల్‌ ప్రభు శతకము అల్లా మాలిక్‌ శతకము సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌ సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము ముహమ్మద్‌ యార్‌ సోదర సూక్తులు గంగన్నవల్లి హుస్సేన్‌దాసు హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య హాజీ‌ ముహమ్మద్‌ జైనుల్ అబెదీన్‌ ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము తక్కల్లపల్లి పాపాసాహెబ్‌ వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమనియె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట షేక్‌ ఖాసిం సాధుశీల శతకము కులము మతముగాదు గుణము ప్రధానంబు దైవచింత లేమి తపముగాదు, బాలయోగి కులము పంచమ కులమయా, సాధులోకపాల సత్యశీల షేక్‌ అలీ గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం మానస ప్రబోధము శతకం ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన పాండితీ ప్రకర్ష పట్టుబడదు పరులభాష గాన భాధను గూర్చును గురుని మాట యశము గూర్చు బాట దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ వభ్యసించ వలయు నర్భకుండ మాతృ భాష నేర్చి మర్యాదలందుమా గురుని మాట యశము గూర్చు బాట షేక్‌ రసూల్‌ మిత్రబోధామృతము అనే శతకం ఉమర్‌ ఆలీషా బ్రహ్మ విద్యా విలాసము. "తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడు షేక్ మస్తాన్ గారికి 1991 లో నాగార్జున యూనివర్శిటీలో పి.హెచ్.డి వచ్చింది. ఉర్దూ మాతృభాషగా గల ఎందరో ముస్లిములు కూడా తెలుగు సాహిత్యాన్ని ఉత్పత్తి చేశారు. సయ్యద్ నశీర్ అహ్మద్ "అక్షర శిల్పులు" పేరుతో 333 మంది తెలుగు ముస్లిం కవులు,రచయితల వివరాలతో 2010 లో పుస్తకం ప్రచురించారు. సయ్యద్ సలీం నవల "కాలుతున్న పూలతోట"కు 2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వేంపల్లె షరీఫ్ కథలపుస్తకం "జుమ్మా''కు కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం లభించింది. షేక్ అబ్దుల్ హకీం జాని,  తెనాలి - బాలసాహితీవేత్తగా, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న రచయిత షేక్ అబ్దుల్ హకీం జాని.  వీరు తెలుగు దిన, వార, మాస పత్రికలకు 1991  నుండి వ్యాసాలు రాయగా 2021  నాటికి 1370  ఆర్టికల్స్ ప్రచురితమైనాయి.  వీటిలో 780  ఆర్టికల్స్ కు పైగా  రంగులలో ముద్రితమైనాయి.  2021  నాటికి ఆదివారం అనుబంధాలలో 35 కు పైగా ఆర్టికల్స్ కవర్ పేజీ కథనాలుగా ప్రచురితమైనాయి. ఈ నేపథ్యంలో వీరి పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనది.   హకీం జాని బాలసాహిత్యంలో 31  పుస్తకాలు, 260  కథలతో  పాటు  30  వయోజన వాచకాలు -  మొత్తం 65 పుస్తకాలు రచించారు. 2019  లో  పూణే లోని మహారాష్ట్ర పాఠ్య పుస్తక నిర్మిత పరిశోధన సంస్థ వారు   11  వ తరగతి పాఠ్య పుస్తకం  యువభారతి లో హకీం జాని రచించిన `బాధ్యతాయుత పౌరులు` అనే కథను పాఠ్య అంశంగా పొందుపరచారు.  ఆ తరువాత 2020 లో `కొత్త వెలుగు` అనే కథను 12  వ తరగతికి పాఠ్య అంశంగా పొందుపరచారు.  తెలుగు సాహిత్యానికి వీరు చేసిన సేవలకు గాను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం,   తెలుగు విశ్వవిద్యాలయ ధర్మనిధి పురస్కారం, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ వారి  ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం తో పాటు మొత్తం 20 కు పైగా పురస్కారాలు అందుకున్నారు.   స్వాతంత్రానికి పూర్వం ముస్లిములు నడిపిన తెలుగు పత్రికలు 1842-"వర్తమాన తరంగిణి "వార పత్రిక ---1842 జూన్ 8 న సయ్యద్ రహమతుల్లా మద్రాసు.సయ్యద్ రహమతుల్లా తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం.మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము.హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి" 1891-"విద్వన్మనోహారిణి "—మీర్ షుజాయత్ అలీ ఖాన్,నరసాపురం.తరువాత ఈ పత్రిక వీరేశ లింగం గారు నడిపిన "వివేకవర్ధని "లో కలిసిపోయింది. 1892 -- "సత్యాన్వేషిణి "—బజులుల్లా సాహెబ్,రాజమండ్రి. 1909 --"ఆరోగ్య ప్రబోధిని " షేక్ అహ్మద్ సాహెబ్,రాజమండ్రి. 1944 -- "మీజాన్ " దినపత్రిక—కలకత్తావాలా,హైదరాబాదు.అడవి బాపిరాజు సంపాదకుడు. తెలుగు సాహితీ పద్దతులు తెలుగుసాహిత్యములో ప్రపంచ సాహిత్యములో వలెనే వివిధ రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ క్రింది విషయములు చెప్పుకొనవచ్చు. జానపద సాహిత్యము వచన కవితా సాహిత్యము పద కవితా సాహిత్యము పద్య కవితా సాహిత్యము చంపూ సాహిత్యము శతక సాహిత్యము నవలా సాహిత్యము చిన్న కథలు అవధానములు ఆశుకవిత సినిమా సాహిత్యము ప్రముఖ కావ్యాలు తెలుగులో వివిధ సాహిత్య రీతుల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎన్నో కావ్యాలు వచ్చాయి. వాటి వివరాలు ఇక్కడ చూడండి. ప్రస్తుత పరిస్థితి, ఓ అవలోకనం ప్రస్తుతము విప్లవ సాహిత్యము, అవధానములు, ఇంటర్నెట్టు తెలుగు సాహిత్యము, వివిధ ఇజములుకు చెందిన సాహిత్యములు, నవలలు,టీ. వీ. సాహిత్యము, సినీ సాహిత్యము, రీ మిక్సులు, చిన్న కథలు వంటివి తెలుగు సాహిత్య ముఖ చిత్రాన్ని చాలా వరకు పూర్తి చేస్తున్నాయి ఇవి కూడా చూడండి వ్యాకరణము ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా వికీపీడియా:వికీప్రాజెక్టు/సాహిత్యం వనరులు చరిత్ర కాళ్ళకూరు వెంకటనారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము (1936) - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004) ఆరుద్ర - సమగ్రాంధ్ర సాహిత్యం ప్రక్రియలు విమర్శ విమర్శ ఒక సాహిత్య పక్రియ.ఈ ప్రక్రియ సర్వ స్వతంత్రమైనది. వచన రచన పక్రియ కాదు. ఏదో ఒక సృజనాత్మక సాహిత్య పక్రియ ఆధారం లేకుండా విమర్శ ఉండదు. సంకలనాలు ఇతరాలు మూలాలు బయటి లింకులు తెలుగు సాహిత్యము ను తిరగ రాయాలా, చీకోలు సుందరయ్య, ఈనాడు సాహిత్య శీర్షిక వ్యాసము వర్గం:భారతీయ సాహిత్యం
నన్నయ్య
https://te.wikipedia.org/wiki/నన్నయ్య
నన్నయ్య భట్టారకుడు (నన్నయ లేదా నన్నయ్య గానూ సుప్రఖ్యాతుడు) (సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు. అతడు వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగవిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి, వాగనుశాసనుడు. సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు. సంస్కృత మహాభారతానికి అనుసృజనయైన శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన కవిత్రయం (ముగ్గురు కవులు) లో మొదటివాడు. మహాభారతమే తెలుగులో తొలి కావ్యంగా ప్రసిద్ధిచెందింది. మహాభారతానికి తెలుగు సాహిత్యంలో ఎంతో సాహితీపరమైన విలువ కలిగివుంది. చంపూ కవిత శైలిలోని మహాభారతం అత్యుత్తమ రచనాశైలికి అద్దంపడుతూ నిలిచింది. నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచించారని భావిస్తారు. సంస్కృత భాషా వ్యాకరణాలైన అష్టాధ్యాయి, వాల్మీకి వ్యాకరణం వంటివాటి సరళిని అనుసరించారు. అయితే పాణిని పద్ధతికి విరుద్ధంగా ఐదు విభాగాలుగా తన వ్యాకరణాన్ని విభజించారు. అవి సంజ్ఞ, సంధి, అజంత, హలంత, క్రియ. ఆదికవిగానే కాక శబ్దశాసనుడు, వాగనుశాసనుడు అన్న పేర్లతో ఆయన ప్రఖ్యాతుడయ్యారు. నన్నయ భారతంలోని అత్యుత్తమ, అత్యంత అభివృద్ధి చెందిన భాషను గమనిస్తే, నన్నయ భారతానికి పూర్వమే తెలుగు సాహిత్యంలో రచనలు ఉండి వుంటాయన్న సూచన కలగుతుంది. నన్నయకు ముందేవున్న పద్యశాసనాల్లోని పద్యాలు, అనంతరకాలంలోని పాల్కురికి సోమన రచనలో సూచించిన అనేక ప్రక్రియల సాహిత్యరూపాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. కవిప్రశంసలు. . చరిత్ర నన్నయ వేంగిదేశానికి రాజైన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. వేంగిదేశము 8000 చదరపుమైళ్ళ వైశాల్యం కలిగి ఉండేది. పడమటన తూర్పుకనుములకు, తూర్పున [[సముద్కు, ఉత్తరాన గోదావరినదికి, దక్షిణాన కృష్ణానదికి మధ్యస్థమయిన తెలుగుదేశము అను వేగిదేశము గలదు. ఈ వేంగిపురమును పరిపాలిస్తున్న రాజమహేంద్రుని బట్టి ఈ నగరానికి రాజమహేంద్రవరము అనే పేరు వచ్చింది. thumb|ఆంధ్రమహాభారతం రచించమని నన్నయను కోరినరాజరాజ నరేంద్రుడు|రాజరాజ నరేంద్రుని]] (సా.శ. 1019–1061) విగ్రహం (రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద]] ఈ వేగిదేశ పాలకుడు, చాళుక్యరాజు విమలాదిత్యుడు. ఇతని పుత్రుడు రాజరాజనరేంద్రుడు. రాజనరేంద్రుడికి విష్ణువర్థనుడు అను బిరుదు ఉంది. రాజరాజనరేంద్రుడు సా.శ.1022 నుండి సా.శ.1063 వరకు 41 సంవత్సరములు పరిపాలించాడు. నన్నయ దానశాసనము రచించాడని, నదంపూడి శాసనము కూడా వేయించాడని భావనవుంది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రాయడం మొదలుపెట్టి, అందులో ఆది, సభా, అరణ్య-పర్వాలను పూర్తి చేసి, కీర్తిశేషు డయ్యాడు. నన్నయ తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించినవారే. నన్నయ్య రాజమహేంద్రవరం లేదా రాజమండ్రిలో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో రచించాడు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని, తన రాజయిన రాజరాజనరేంద్ర మహారాజు గారికి చెప్పినదే ఈ మహాభారతము. రాజరాజనరేంద్రుని పాలన సా.శ. 1045-1060 మధ్య కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది. నన్నయ ముద్గల గోత్రజాతుడగు వైదికబ్రాహ్మణుడు. అతడు రాజరాజ నరేంద్రుని ఆస్థానపురోహితుడు. ఆ విషయాన్ని తాన స్వయంగా క్రింది పద్యంలో తెలిపాడు. సీ తనకుల బ్రాహ్మణు ననురక్తు నవిరత జప హోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహాండాది నానా పురాణ విజ్ఞా న నిరతు బాత్రు నప స్థంభ సూత్రు ముద్గల గోత్ర జాతు సద్వినుతావ దాత చరితు లోకజ్ఞను భయ భాషా కావ్య రచనాభి శోభితు సత్ప్రతిభాభి యోగ్యు ఆ.వె నిత్య సత్య వచను మత్యమరాధిపా చార్యు సుజను నన్న యార్యుఁ జూచి పరమ ధర్మ విధుడు వర చాళుక్యా న్వ యా భరణు డిట్టులనియె గరుణ తోడ 'ఆంధ్రభాషానుశాసనం లేదా ఆంధ్రశబ్దచింతామణి' అనే వ్యాకరణం రచించినాడని ప్రసిద్ధ. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయభట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు. తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు. ఆంధ్రకవులలో మొదటివాఁడు. వేగిదేశాధీశుఁడైన రాజరాజనరేంద్రుఁడు రాజమహేంద్రమున రాజ్యము చేయుకాలమున అతనియొద్ద ఇతఁడు ఆస్థానపండితుఁడుగా ఉండెను. ఇతఁడు తన యేలినవాని ప్రేరేఁపణచేత భారతమున మొదటి మూడుపర్వములను, తెనిఁగించి కాలధర్మమును పొందెను. (విరాట పర్వము మొదలు స్వర్గారోహణ పర్వము వరకుతిక్కన సోమయాజియు, అలభ్యమైన అరణ్యపర్వ శేషమును ఎఱ్ఱాప్రెగ్గడయు, తెనిగించిరి. చూ|| తిక్కన.) మఱియు ఈయన ఆంధ్రశబ్దచింతామణి అను పేర తెనుఁగునకు ఒక వ్యాకరణమును రచియించి దానికి లక్ష్యముగా ఈ భారతమును రచియించెను అని చెప్పుదురు. ఈ హేతువును బట్టియే ఇతఁడు వాగనుశాసనుఁడు అనఁబడెను. రచనా ప్రశస్తి నన్నయ తన రచన భారతంలో అవతారికలో షష్ఠ్యంతములు వేయలేదు. భాస్కరరామాయణం ఈ విషయములో దీనిని పోలి ఉంది. స్వప్నకథను, షష్ట్యంతములను మొట్టమొదట చేర్చినవాడు తిక్కన సోమయాజి. నన్నయ తన మహాభారత రచనకి నారాయణభట్టు సహకరించాడని పేర్కొనెను. వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యయథామూలానువాదశ్లోకానికి ఒక్కో పద్యం అన్న పద్ధతి పెట్టుకోలేదు. ’భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం’ అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే ప్రణాళికను అనుసరించి అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే. నన్నయ్య ఈ మార్గం తొక్కడానికి ఒక చారిత్రక కారణం ఉంది. పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి దిగుమతి అయ్యింది. అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ ఘంటం అందుకున్నాడు. అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు. త్రిమూర్తులను స్తుతించే ఈ సంస్కృత శ్లోకముతో నన్నయ ఆంధ్ర మహాభారత రచనకు శ్రీకారం చుట్టాడు. భారతంలో నన్నయ రచించిన ఒకే ఒక్క సంస్కృత శ్లోకం ఇది. శ్రీవాణీగిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే | లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం | తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషాస్సంపూజితా వస్సురై | ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్శ్రేయసే || తాత్పర్యం: లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుడు మీకు శ్రేయస్సు కూర్తురు గాక! భారతాంధ్రీకరణలో ఆయన మూడు లక్షణములు -ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము - తన కింది పద్యంలో ప్రత్యేకముగా చెప్పుకొన్నాడు సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకవితార్థయుక్తి లో నారసి మేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప, నా నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా భారసంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్. నన్నయ రచించిన చివరిపద్యం (అరణ్యపర్వంలోనిది) - శారదరాత్రుల వర్ణన శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై తాత్పర్యం శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు. వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలితో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు. సప్తమాత్రికలు అనగా బ్రహ్మ, మాహేశ్వరి, కౌముది, వైష్ణవి, వారాహి, ఇంద్రాని, చాముండ అనునవి సప్తమాత్రికలు. ఆ కాలములో చరిత్రకాంశములిని తెలెపె గ్రంథములు రెండు ఉన్నాయి. అవి 1.జయంకొండన్ అఱవములో రచించిన కళింగట్టుపరణి (1063 నుండి 1112 వరకు చోళదేశముని పాలించిన కులోత్తుంగ చోడదేవుని విజయాలను తెలెపెను) 2.బిల్హణుడు సంస్కృతములో రచించిన విక్రమాంకదేవచరిత్ర. (1076 నుండి 1126 వరకును కుంతల దేశముని పాలించిన పశ్చిమచాళుక్య రాజైన విక్రమాదిత్యుని విజయాలను తెలెపెను) చాళుక్యులు చంద్రవంశపు రాజులు చోళులు సూర్యవంశపు రాజులు తెలుగు సాహిత్యం - నన్నయ యుగము (1000 - 1100) నన్నయ అకాల మరణంపై ఒక కథనం నన్నయ తాను తలపెట్టిన భారతరచన ముగించక ముందే మరణించడానికి కారణం భీమన అను మహాకవియొక్క శాపము అని ప్రతీతి. ఆ కథనం ఇలా ఉంటుంది.. ’’భీమన ఇతఁడు భారతమును తెనిఁగించుటకు మునుపే ఒక భారతమును తెనుఁగున రచియించి ఆ గ్రంథమును నన్నయభట్టారకునివద్దకు కొనివచ్చి దానియందలి లోపములను పరిశీలించి రాజునకు చూపి తనకు సన్మానము కలుగఁజేయవలయును అని అడుగఁగా దానినతఁడు చదివిచూచి అందలి ప్రయోగపద్ధతులు మొదలగునవి మిక్కిలి శ్లాఘనీయములు అయి ఉండఁగా అది బయటవచ్చినయెడల తన భారతము అడఁగిపోవును అని ఎంచి ఆ యభిప్రాయమును బయలుపఱపక భీమకవి తో నేను రాజు ప్రేరేఁపణచేత ఒక భారతము రచియించుచు ఉన్నాను. ఆదిపర్వముమాత్రము ఇప్పటికి అయినది. ఇప్పుడు ఈగ్రంథమును రాజునకు చూపిన యెడల తన ప్రయత్నము నెఱవేఱుటకు భంగముగా ఇది ఒకటి వచ్చెను అని తిరస్కరించునుగాని అంగీకరింపఁడు. కనుక సమయముచూచి నీ గ్రంథమును అతనికి చూపి సన్మానము చేయింతును అని చెప్పి అది తీసి తన ఒద్ద ఉంచుకొని, ఆయనను పంపి దానిని కాల్చివేసెను. ఈసంగతి భీమన ఎఱుఁగడు కనుక కొన్ని దినములు తాళి నన్నయభట్టారకుని యింటికివచ్చి అప్పుడు ఆయన ఇంటలేకపోఁగా ఆయన భార్యను పిలిచి నీ భర్త చేయుచు ఉన్న భారతము ముగిసెనా అని అడిగాడు. అంతట ఆమె ఆరణ్యపర్వము జరుగుచు ఉన్నది అని చెప్పెను. అది విని అతఁడు తనకు ఏసమాచారమును తెలియఁజేయకయే ఇతఁడు గ్రంథరచన జరపుచు ఉన్నాఁడు కనుక తన గ్రంథమును ముందుకు రానీయఁజాలఁడు అని తలఁచి, దానివలని సంతాపముచే ఇంకను ఆరణ్యములోనే పడి ఉన్నాడా అని అన్నాడు. అదియే శాపముగా తగిలి ఆ కాలమందు ఏమో పని కలిగి ఊరిముందరి అడవికి పోయి ఉండిన నన్నయభట్టారకుఁడు అక్కడనే దేహత్యాగము చేసెను.’’ (పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 ) మూలాలు, వనరులు వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:తెలుగు రచయితలు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా కవులు వర్గం:సంస్కృతం నుండి తెలుగు లోకి అనువాదాలు చేసినవారు
ఆది కవి
https://te.wikipedia.org/wiki/ఆది_కవి
నన్నయ - తెలుగులో ఆదికవిగా ప్రసిద్ధుడు వాల్మీకి - సంస్కృతంలో ఆదికవిగా ప్రసిద్ధుడు
తిక్కన
https://te.wikipedia.org/wiki/తిక్కన
thumbnail|తిక్కనసోమయాజి చిత్రపటం తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి. జీవిత విశేషాలు తిక్కన శిష్యుడు మారన. ఇతడు రాసిన మార్కండేయ పురాణం ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో ఒకడైన నాగయగన్న మంత్రికంకితం చేసెను. గణపతిదేవుని ఆస్థానంలోకి చేరేటప్పటికి తిక్కన సోమయాజి యజ్ఞము చేయలేదు. భారతమును కూడా రచించలేదు. అతని తల్లిదండ్రులు కొమ్మన, అన్నమ్మలు. కేతన, మల్లన, పెద్దన ఇతని పెదతండ్రులు. తిక్కన సోమయాజి పెదతండ్రి కుమారుడు అయిన సహోదరుడు ఖడ్గతిక్కన. తిక్కన కుమారుడు కొమ్మన. తిక్కన మనుమరాలి భర్త యల్లాడమంత్రి. ఈ యల్లాడమంత్రి మనుమడు కవి సింగన్న. ఈ సింగన్న తండ్రి అయ్యలమంత్రి. తిక్కనసోమయాజి తాత మంత్రి భాస్కరుడు. తిక్కన కవి గౌతమిగోత్రుడు. ఈ తిక్కన నియోగిబ్రాహ్మణుడు. ఈయన పూర్వుల నివాసస్థలము మొట్టమొదట కృష్ణామండలంలోని వెల్లటూరు గ్రామం. ఉద్యోగరీత్య ఇతని తాత కాలమున గుంటూరునకు వచ్చారు. తరువాత నెల్లూరు రాజగు మనుమసిద్ది ఇతని కుటుంబమును ఆదరించి నెల్లూరుకి తీసుకొనివచ్చి పూర్వము హరిహర దేవాలయము ఉండిన ఇప్పటి రంగనాయకస్వామి ఆలయ సమీపమున గృహము కట్టించి ఇచ్చి తిక్కనసోమయాజులను అందుంచాడు. కేతన రాసిన దశకుమార చరిత్రనుబట్టి చూడగా తిక్కన ఇంటి పేరు కొత్తరువుయరయినట్టు తెలియవచ్చునది. తిక్కనకి అంకితం చేయబడిన దశకుమారచరిత్రము అను గ్రంథమునందు తిక్కన వంశావళి సమగ్రముగా వర్ణించబడింది. తిక్కన తను రచించిన నిర్వచనోత్తర రామాయణము నందు సారకవి తాభిరామ గుంటూరివిభుని మంత్రి భాస్కరు మత్పితామహునిన్ దలచి యైన మన్ననమెయి లోక మాదరించు వేఱ నాకృతి గుణములు వేయు నేత? అని తన కావ్యము స్వగుణముచేత కాకపోయిననూ తన తాత అయిన మంత్రిభాస్కరుని సారకవిత్వమహిమచేత అయిననూ లోకాదరణమునకు పాత్రయగునని చెప్పియున్నాడు. సూర్యవంశపు రాజైన మనుమసిద్ది ఆస్థానకవిగా తిక్కన ఉండడమే కాదు అతనితో సమానుడిగా గౌరవం పొందేవాడు. రాజునకు, కవికి మామవరుస ఉంది. తిక్కన నిర్వచనోత్తర రామాయణముని మనుమసిద్దికి అంకితం చేసెను. దీనితో మనుమసిద్ది ఏనిన్ను మామ యనియెడ దీనికిన్ దగనిమ్ము భారతీకన్యక నా కీ నర్హుడావగు దనినని భూ నాయకు పలుకు చిత్తమునకిం పగుడున్ నిన్ను మామా అని పిలుచునందుకైనా భారతమును నాకు అంకితం ఇమ్మని అడిగినట్లు చెప్పబడియున్నది. తిక్కన నన్నయని ఆదికవిగా చెప్పలేదు. భారతమున మొదట మూడుపర్వాలను వ్రాసెనని చెప్పాడు. తిక్కన కావ్యములు రెండు.1. నిర్వచనోత్తర రామాయణం. దీనినంతటిని పద్యములుగానే రచించెను. ఇది బాల్యమునందు రచించబడింది. ఇందలికథ సంస్కృతంలో ఉన్నంత లేక మిక్కిలి సంగ్రహపరచబడింది. పలుచోట్ల శైలి నారికేళపాకం అని చెప్పవచ్చును. అందుచేత ఈ గ్రంథం భారతమువలె సర్వత్ర వ్యాపింపకున్నది. యితడు 10 ఆశ్వాసములు ఈ గ్రంథమున రచించినను పుస్తకమును మాత్రము ముగింపలేదు. రామనిర్యాణకథను చెప్పుటకు భీతిల్లి దానిని వదిలిపెట్టినయెడల తిక్కన భారతమునందు స్త్రీపర్వకథయు కృష్ణనిర్యాణ మును చెప్పుటకేల భయపడలేదని ఒకరు ప్రశ్న వేయుచున్నారు. ప్రతీమరణకథకును భయపడి దానిని విడుచుచూ వచ్చినచో భారతమును రచింపకయే యుండవలెను. తిక్కన భారతమును మనుమసిద్దికి ఇచ్చినచో నరాంకితం అవుతుందని మనుమసిద్దికి ఇవ్వక శ్రీ భద్రాద్రిరామునికి అంకితం హరిహరోపాసన తన కాలం నాటి సంఘములోని మతవైషమ్యాలను గమనించి శైవ వైష్ణవ మత కలహాలకు అతీతంగా హరిహరాద్వైతాన్ని సృష్టింఛాడు. సంఘసంస్కర్తగా నిలిచాడు. తన భారత రచనను హరిహరనాధునకు అంకితమిచ్చారు. శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు: శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్ మంత్రిత్వ పటిమ మనుమసిధ్ది దాయాదుల వలన రాజ్యం కోల్పోయినాడు. తిక్కన, అప్పుడు ఓరుగల్లును పాలించిన కాకతి గణపతి దేవ చక్రవర్తిని దర్శించి మనుమసిధ్దికి కలిగిన కష్టాన్ని వివరించి ఆయన సాయముతో మనుమసిధ్దిని సింహాసనముపై పునఃప్రతిష్ఠ గావించాడు. సమకాలీనులు, శిష్యులు మారన, కేతన, గురునాధుడు మహాకవి తిక్కన రుద్రాక్షమాల లభ్యం మహాకవి తిక్కన 12వ శతాబ్దంలో ఉపయోగించిన రుద్రాక్షమాల బయటపడింది. నెల్లూరులో నివసిస్తున్న ఆయన వంశస్థురాలు లక్ష్మీప్రసన్నకు ఆ మాల వంశపారంపర్యంగా సంక్రమించింది. నెల్లూరులోని పెన్నానది ఒడ్డున తిక్కన పార్కులో రుద్రాక్షమాల, పగడాన్ని . మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగం రచించి గతించెను. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. అరణ్యపర్వము వరకును నన్నయ వ్రాసి మరణించగా, తరువాత ఈ మహాకవి, తిక్కన అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి, విరాటపర్వము మొదలుకొని 15 పర్వములను వ్రాసాడు.అరణ్యపర్వమును ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతిచెందాడని, అందుకే నేనుకూడా మృతిచెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టినాడు అని కొందరు అంటారు. గ్రంథరచనకు పూర్వము మనుమసిద్ది తిక్కనచే యజ్ఞము చేయించి భారతమును సంపూర్ణముగా తిక్కనచే రచింపజేసినట్లు చెప్పుదురు. కాని ఈ మనుమసిద్దిరాజు తనని రాజరాజ నరేంద్రుని ఆస్థానమునకి పొమ్మనగా తిక్కన పోనని మారాం చేయడంతో, ఈ విషయాన్ని ఎరిగిన రాజరాజనరేంద్రుడు తిక్కనకి నీవు ఎక్కడనుండైనా రచనచేయవచ్చని సమాచారం పంపగా, అప్పుడు తిక్కనచే మనుమసిద్ది నెల్లూరులో యజ్ఞము చేయించెను. అయిననూ తిక్కన మనుమసిద్ధిపై కోపంతో, భారతముని మనుమసిద్దికి అంకితం ఇవ్వక, హరిహరనాథునికి అంకితం చేసెను అని కొందరి వాదన. తిక్కన మొదట రచించిన పర్వములను చూసి వానియందు విశేషవృత్తములు లేకపోగా పండితులు, అతడు సామాన్య వృత్తములుతో కాలము గడుపుతున్నాడే కాని అపూర్వవృత్తరచనా కుశలుడు కాడని ఆక్షేపించిన మీదట తిక్కన స్త్రీ పర్వమునందు బహువిధ వృత్తములను రచించాడని చెప్పుదురు. తిక్కన రచించిన 15 పర్వములలో 45 ఆశ్వాసముల కంటే ఎక్కువ గ్రంథము లేదు. ఒక్కొక్క ఆశ్వాసమునకు 445 పద్యములు చొప్పున లెక్క చూసిననూ, భారతంలో తిక్కన 25000 పద్యముల కంటే అధికముండవు. దినమునకు 10 పద్యములు చొప్పున రచించినచో ఇంత మహాభారత గ్రంథము 5 లేదా 6 సంవత్సరములలో రచించవచ్చును. కాబట్టి ఇట్టి గ్రంథము ఒకరివల్ల రచించడం అసాధ్యము కాదు. సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాని తిక్కన శైలితో సమానముగా వ్రాయుట మాత్రము ఎవ్వరికి సాధ్యముకాదు. తెలుగుభాష యందు ఎన్నిగ్రంథములు ఉన్నానూ, తిక్కన కవిత్వముతో సమానముగా కాని దానిని మించియున్నట్లుగాని కవిత్వము చెప్పగలిగిన వారు నేటివరకు ఒక్కరును కనబడలేదు. తిక్కన కవిత్వము ద్రాక్షాపాకము మిక్కిలి రసవంతముగా ఉండును. ఇతని కవిత్వమునందు పాదపూరణము కొరకు వాడిన వ్యర్థపదములు అంతగా కనిపించవు. ఈయన కవిత్వము లోలోక్తులతో కూడి జాతీయముగా ఉండును. ఇతని కవిత్వములో ఒకవంతు సంస్కృతము, రెండువంతుల తెలుగుపదములు కనిపిస్తాయి. నన్నయవలె తన గ్రంథమును మూలమునకు సరిగా వ్రాయలేదు. విరాటపర్వమునందు కథ కొంత పెంచెను. తక్కిన పర్వములందు మిక్కిలిగా కథను సంగ్రహపరిచెను. ఉద్యోగపర్వములోని సనత్కుమార ఉపదేశమును మూలమున పదిపండ్రిపత్రములున్నా, తెలుగున 2లేదా 3పద్యములతో సరిపెట్టెను. భగవద్గీతలు, ఉత్తరగీతలు మొదలైనవానిని వ్రాయనేలేదు. భగవద్గీతలోని కొన్నిశ్లోకములకు దగ్గరగా కొన్ని పద్యములను వ్రాసాడు. ఉదాహరణకు ఈ క్రింది శ్లోకమును చూడుము. భగవద్గీత శ్లోకం ;; ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సువః! మామ కాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః!! పద్యం ;; క;;మ్మానుగ ధర్మక్షేత్రం బైన కురుక్షేత్రమున మహాహవ మునకున్ బూని మనబలమున్ బాండవ సేనయు నిటు సన్నీ యేమి చేసెంజె పుమా! అని తిక్కన ఆంధ్రీకరించాడు.భగవద్గీతను అనువదించకపోవడానికి కారణం ఏమిటన్నది చెప్పనకకరలేదు. భగవద్గీత స్వయంగా ఒక గ్రంథంగా ప్రామాణికంగా ఉన్నపుడు తెలుగు భారతంలో విశదీకరించనక్కరలేదని తలచియుండవచ్చును. ఈయన సంస్కృతమును తెనిగించినరీతిని తెలుపుటకై మూలగ్రంథములోని కొన్ని శ్లోకములను వాని అర్థమును తెలుపు పద్యములును కొన్నింటిని వివరించడం చూడవచ్చును. విరాటపర్వం శ్లోకము ఆలో కయసి కిం వృక్షం సూద దారుక్రుతేనవై ! యది తే దారుభిః కృత్యం బహిర్వ్రుక్షాన్ని గృహ్యతామ్ !! అనువాద పద్యము వలలుం డేక్కడన్ జూచె ?నొండెడ నపెవ్యక్ష్మాజముల్ పుట్టవే? ఫలితంబై వరశాఖ లోప్పన్ గ ననల్పప్రీతి సంధించుచున్ విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికి న్విశ్రాంతిన్ గావింపన్ గాన్ గల యీ భుజము వంట కట్టయలకై ఖండింపన్ గా నేటికిన్ ? తిక్కన పద్యాలు: ద్రౌపది కీచకునితో దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం ధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా దక్షిణ గోగ్రహణ సమయమున విరాటుడు సుశర్మపై యుద్ధమునకు పోవునపుడు సీ.        గంధ దంతావళ కర్ణమారుతహతిఁ గాంతారములు చాఁపకట్టువడఁగ, రథ ఘోషమునఁ బ్రతిరవమిచ్చునద్రులు భయమున వాపోవు భంగి నుండఁ, దురగ ఖురోద్ధూత ధూళి దన్బెరసిన వననిధి పిండలివండు గాఁగ, బహుళపదాతి దుర్భరభార మడరిన నురగకూర్మంబు లొండొదంటిఁ బొంద తే.        సైన్యముల నడిపించె నుత్సాహలీల యతిశయిల్లంగ సంరంభ మగ్గలింప బరవసము మిక్కుటంబుగఁ బసులు సన్న జాడఁ గై కొని యమ్మత్స్యజనవిభుండు.         ( మదపుటేనుగు సమూహముల చెవులు విదిలించే గాలి దెబ్బలకు అడవులు చాపచుట్టల వలె పడిపోవుచుండ, కదిలే రథముల ధ్వనికి  ప్రతిధ్వనించు పర్వతములు భయముతో దుఃఖించునట్లు కనిపించుచుండ, గుఱ్ఱములు కాలిగిట్టలచే ఎగురకొట్టబడిన ధూళి తనలో కలియుటచే సముద్రము బురదముద్ద అవుచుండ, విస్తృతమైన కాల్బలముల భరించజాలని తాకిడి బరువుకు అణగిన  భూమిని భరించునట్టి ఆదిశేషువు, ఆదికూర్మములు ఒకదానినొకటి ఊతగా దగ్గఱకు రాగా, మత్స్యదేశాధిపతి తన సైన్యములను ఉత్సాహము అధికమవ, ఆటోపము అతిశయించ, ధైర్యము పెంపార పశువులు వెళ్ళిన త్రోవలో నడిపించెను.) ఉత్తర గోగ్రహణ సమయమున ద్రోణుడు సింగంబాకటితో గుహాంతరమునన్ జేర్పాటుమై యుండి మా తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్ కౌరవసేనను చూసి భయభ్రాంతుడైన ఉత్తరకుమారుడుతో అర్జునుడు ఉ.  అంతిపురంబులోనఁ గల యంగన లెల్లను నెమ్మనంబులన్‌ సంతసమందఁగాఁ బసులఁ జయ్యనఁ దెచ్చెద నంచుఁ బూని, నీ వెంతయు మేటివై, యరదమెక్కి రయంబున వచ్చి, యిచ్చటన్‌ దంతితురంగ సద్భటకదంబముఁ జూచి కలంగు టొప్పునే!’ ఈ కవి ఇంకా కవివాక్భంధనం అనే లక్షణగ్రంథముని కృష్ణశతకముని, విజయసేననము అనువాటిని రచించాడని భావన. ముగింపు తిక్కన మనుమసిద్ది రాజ్యము అంతరించిన తరువాత కూడా చిరకాలము జీవించి, సర్వజనులచే గౌరవిమ్పబడేవాడైనా, మరణకాలమునకు విశేషవృత్తవంతుడిగా కనబడడు .అందుచే అతని కుమారుడు కొమ్మన పాటూరి కరినణమును సంపాదించవలసి వాడయ్యేన తిక్కన తిరుగాడిన నేల తిక్కన (1205 - 1288) మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆది కవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి. క్రీస్తు శకం 1253 సంవత్సరంలో తిక్కన కోవూరు మండల పరిధిలోని పాటూరు గ్రామ సిద్దేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆశయసిద్ధి కోసం ఈశ్వరాలయంలో యజ్ఞం చేసినందువల్ల ఆ ఆలయాన్ని సిద్ధేశ్వరాలయంగా పిలిచారు. యజ్ఞం పూర్తి చేసిన తరువాత తిక్కన సోమయాజిగా మారి మహాభారత రచనకు ఉపక్రమించారు. అప్పటి యజ్ఞానికి సంబంధించిన అనేక అవశేషాలు నేడు శిథిలావస్థకు చేరుకొన్నాయి. తిక్కన తిరుగాడిన జాడలేవీ?'వింటే భారతం వినాలి .... తింటే గారెలు తినాలి' అనే నానుడికి జీవం పోసింది తిక్కన. మహాభారత కథనాలకు అంతటి ఖ్యాతిని ఆర్జించిన కవిబ్రహ్మ తిక్కన మెచ్చిన ప్రదేశం, ఆయన పూజించిన ఆలయం నేడు దయనీయ స్థితికి చేరుకొన్నాయి. మానవుడు పంజరంలోని చిలుకలాంటి వాడు' అనే ఉపమానం, నానుడి తిక్కన చాలా పర్యాయాలు ఉపయోగించారు. నిర్వచనోత్తర రామా యణంలో మొదటి మనుమసిద్ధిని వర్ణిస్తూ "కీర్తి జాలము త్రిలోకీ శారీకకు అభిరామరాజిత పంజరంబుగజేసి'' అని చెప్పారు. అలాంటి తిక్కనే పూజించి, యజ్ఞం చేసిన సిద్దేశ్వరాలయం, రాతివిగ్రహాలు నేడు నిర్లక్ష్యమనే పంజరంలో చిక్కుకొని శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆయన పూజలు చేసిన నందీశ్వరుడ్ని అపహరించారు. మహాభారతాన్ని రసరమ్యంగా వర్ణించేందుకు తిక్కనకు సహకరించింది కోవూరు ప్రాంతమే. తిక్కన పూర్వీకులు 'కొట్టురువు' ఇంటి పేరుతో పాటూరు గ్రామాధిపతులుగా పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది. మనుమసిద్ధి కాలంలో తిక్కన ఇంటిపేరు 'పాటూరుగా' మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. యజ్ఞయాగాదులు అంటే తిక్కనకు చాలా ఇష్టం. పదకొండు పర్యాయాలు ఆయన పాటూరులోని సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లుగా కేతన తన దశకుమార చరిత్రలో పేర్కొన్నారు. వేప, రావి చెట్లు మొలచి ఆలయం ధ్వంసమవుతోంది. ఆలయ ప్రాంగణాన ఉన్న బావిలో తిక్కన నిత్యం స్నానమాచరించి, సంధ్యావందనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బావి వర అంతర్భాగంలో చెక్కిన చంద్రుడు, వినాయకుని శిల్పాలు సుందరంగా ఉండేవట కానీ, బావి పూర్తిగా ముళ్లపొదలతో నిండిపోవడం చేత ఆ శిల్పాల్ని ఇప్పుడు చూడలేము. మహాభారత రచనకు తిక్కన ఉపయోగించినట్లుగా చెప్పే 'ఘంటం' పాటూరుకు చెందిన తిక్కన వారసుల వద్ద ఉందని చెబుతారు. 'ఘంటం' ఉంచే ఒరకు ఒక వైపు సరస్వతీ దేవి, వినాయకుని ప్రతిమల్ని చెక్కారని, తాము చాలా సంవత్సరాల క్రిందట దానిని చూశామని పాటూరు గ్రామ వయోవృద్ధులు చెప్పారు. నెల్లూరుకు చెందిన సాహిత్య సంస్థ 'వర్ధమానసమాజం' కొన్నేళ్ల కిందట నిర్వహించిన 'తిక్కనతిరునాళ్ళ'లో దానిని ప్రదర్శించారు. ఆ తరువాత ఒర చిరునామా లేకుండా పోయింది. తిక్కన రూపాన్ని దశకుమార చరిత్రలో కేతన వర్ణించారు. ఆయన వర్ణన ఆధారంగా 1924 సంవత్సరంలో గుర్రం మల్లయ్య అనే చిత్రకారుడు ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో తిక్కన రూపాన్ని చిత్రీకరించారు. ఆ చిత్రపటమే నేడు నెల్లూరు పురమందిరంలోని వర్ధమాన సమాజంలో పూజలందుకుంటోంది. 1986 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణానికి రెండు లక్షల రూపాయల్ని మంజూరు చేసింది. అయితే - సిద్ధేశ్వరాలయం, తిక్కన పూజించిన శిలలు అన్నీ తమ సొంతమని, ప్రభుత్వానికీ దేవాదాయశాఖకూ సంబంధం లేదని పాటూరు వంశస్థుడు ఒకాయన ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకొన్నారట. పదేళ్ల కిం దట మాత్రం ఒక భక్తుడు శిథిల ఆలయానికి వెల్ల వేయించి తన భక్తిని చాటుకొన్నారని చెబుతారు. పాటూరు గ్రామంలో తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటికీ లేకపోవడం విచారకరమని గ్రామస్థులు అన్నారు. తిక్కన గురించి రాసిన వ్యాసాలు, గ్రంథాలతో ఒక గ్రం«థాలయం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. హైదరాబాదులోని టాంకుబండ్‌పై తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన నివసించిన పాటూరు గ్రామాన్ని మరచిపోవడం బాధాకరం. ఆయన పూజించి, యజ్ఞం చేసిన సిద్ధేశ్వరాలయాన్ని ప్రభుత్వం దర్శనీయ స్థలాల జాబితాలో చేర్చాలని జిల్లా వాసులు, సాహిత్యాభిలాషులు కోరుతున్నారు. బ్రిటిషువారు నిర్మించిన కట్టడాల్ని సైతం చారిత్రక కట్టడాలుగా ప్రాధాన్యత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తిక్కన తిరుగాడిన నేల స్మృతులు ... శిల్పాల్ని, ఘంటాన్ని, ఒరను, నందీశ్వరుడ్ని పదిలపరచకపోవడం విచారకరం. తెలుగు జాతి గుండెల్లో తీయ తేనియ నుడుల్ని ఆచంద్రార్కం నిల్పిన తిక్కన జ్ఞాపకార్థం ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. చిత్రమాలిక మూలాలు బయటి లింకులు తిక్కన భారతం-శల్యపర్వం ప్రతి https://www.facebook.com/photo.php?fbid=1966274320324213&set=a.1566661776952138.1073741828.100008249912771&type=3&theater వర్గం:సంస్కృతం నుండి తెలుగు లోకి అనువాదాలు చేసినవారు
ఎఱ్రాప్రగడ
https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ
కుడి|200x200px|ఎర్రాప్రగడ right|200px|ఎర్రాప్రగడ thumb|right|250px|ఎర్రాప్రగడ తైలవర్ణచిత్రం చిత్రకారుడు:పి.ఎస్.చంద్రశేఖర్ ఎఱ్ఱాప్రగడ మహాభారతములో నన్నయ అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. నన్నయ భారతాన్ని చదివి, ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయే వ్రాసాడేమో అనిపిస్తుంది. అలాగే తిక్కన భారతము చదివి ఎర్రన వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కనే వ్రాసాడేమో అనిపిస్తుంది. సంస్కృతంలో రాసిన మహాభారతానికి తెలుగు అనువాదం 11 నుంచి 14 శతాబ్దాల మధ్య జరిగింది. ఎర్రన 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతనిని ఎర్రయ్య, ఎల్లాప్రగడ, ఎర్రన అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. ఈయనకు "ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది. వంశము thumbnail|ఎఱ్ఱన చిత్రపటం ఎర్రన తన నృసింహపురాణంలో చేసిన వంశవర్ణననుబట్టి అతని వివరాలు తెలుస్తున్నాయి. ఎఱ్ఱాప్రగడ పాకనాడు సీమ ((ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామము))లో జన్మించాడు. ఈయన ప్రస్తుత గుంటూరు జిల్లా వేమూరు మండలములోని చదలవాడ గ్రామములో నివసించాడు. వీరు "శ్రీవత్స" గోత్రము "అపస్తంబు" శాఖకు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సూరన, తల్లి పొత్తమ్మ (పోతమాంబ). ఎఱ్రన్నకు అతని తాత గారి నామధేయమయిన ఎఱపోతనను నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్ఱాప్రగడ మామ్మ పేరు పేర్రమ్మ (పేరమాంబ, ప్రేంకమాంబ). ఎఱ్ఱాప్రగడ ముత్తాత బొల్లన (ఆతని భార్య పోలమ్మ లేదా ప్రోలమాంబ). ఎఱ్ఱాప్రగడ కుటుంబ ఆరాధ్య దైవం శివుడు. గురువు గారి పేరు శ్రీ శంకర స్వామి. ఎఱ్రన్న కుటుంబ ఆరాధ్య దైవం శివుడైనా, విష్ణువుని కూడా పూజించేవాడు. జీవితం ఎర్రన బహుశా సా.శ. 1280లో జన్మించి, 1364వరకు జీవించి ఉంటాడని సాహితీ చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. (కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి కందుకూరు మొదలు గోదావరీ తీరం వరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు). ఆ సమయంలోనే ఎర్రన 45ఏండ్ల వయసుగల ప్రౌఢకవి ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవి అయ్యాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు. 1353లో ప్రోలయ వేముడు మరణించాడు. ఎర్రన శేషజీవితం గురించి వివరాలు స్పష్టంగాలేవు. అయితే 1364లో అనపోతవేమారెడ్డి వేయించిన దానశాసనం (కొల్లూరు శాసనం) ప్రకారం కనీసం 1364వరకూ, బహుశా ఆ తరువాత మరికొంతకాలం కూడా, ఎర్రాప్రగడ జీవించి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. (ఈ విషయమై ఏకాభిప్రాయం లేదు.) బిరుదులు ఎర్రనకు రెండు బిరుదులున్నాయి (1) శంభుదాసుడు (2) ప్రబంధ పరమేశ్వరుడు. మొదటి బిరుదు అతని ఆధ్యాత్మిక ప్రవృత్తినీ, రెండవ బిరుదు అతని సాహిత్య విశిష్టతనూ తెలుపుతాయి. 'శంభుదాసుడు'గా తాను ప్రశస్తుడవుతాడని తన తాతగారు కలలో కనిపించి ఆశీర్వదించారని నృసింహపురాణం పీఠికలో ఎర్రన వ్రాసుకొన్నాడు. అతని బిరుదు శంభుదాసుడు అయినప్పటికీ అతడు గ్రహించినవన్నీ విష్ణుకథలే. ఈ విధంగా ఎర్రన హరిహరాద్వైతమును జీవితంలోనూ, రచనలలోనూ కూడా పాటించాడని తెలుస్తుంది. 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే ప్రశస్తి అరణ్య పర్వశేష రచన వలన కలిగి, తరువాత అది బిరుదంగా కొనసాగిందని నృసింహపురాణంలోని ఒక పద్యం ద్వారా తెలుస్తున్నది. ఎర్రన పురాణకవుల కోవకు చెందినవాడయనా గాని, అద్భుతమైన తన వర్ణనాత్మకత ద్వారా తరువాతి ప్రబంధ కవులకు మార్గదర్శకమైనాడు. అతని ప్రబంధశైలి నృసింహపురాణంలో ఉన్నత స్థాయిని చేరుకుంది. రచనలు ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలో చేరడానికి ముందు ఎర్రన చేసిన రచనల గురించి ఏ విధమైన వివరాలూ లేవు. అప్పటికే ఎర్రన మాన్యుడైన కవి గనుక కొన్ని రచనలు చేసి ఉండవచ్చును కాని వాటిని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. నేడు మనకి తెలిసిన ఎర్రన రచనలన్నీ వేమారెడ్డి ఆస్థానంలో ఉండగానే సాగాయి. రామాయణము thumb|left|ఎఱ్రాప్రగడ విరచితంబైన హరివంశం గ్రంథము ప్రోలయ వేముని కోరికపై ఎర్రన ముందుగా రామాయణాన్ని రచించాడు. కాని అది ఇప్పుడు దొరకడంలేదు. ఎర్రన వంశంవాడైన చదలవాడ మల్లన, ఎర్రన రచనల గురించి వ్రాస్తూ "వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్ర ప్రబంధంబు జేసె" అని చెప్పాడు. అనగా ఇది వాల్మీకి రామయణానికి ఆంధ్రీకరణమేననీ, అదీ ఒక ఉద్గ్రంధమైన ప్రబంధమనీ తెలుస్తుంది. అయితే హుళక్కి భాస్కరాదులు వ్రాసి, సాహిణి సూరనకంకితమిచ్చిన భాస్కర రామాయణములోని కొన్ని ఘట్టాలు పాఠాంతరాలుగా చాలాపద్యాలు కనిపిస్తున్నాయి.ఈ పద్యాలు ఎర్రాప్రగడవే కావచ్చునని పండితుల ఊహ. అలాంటి 46 పద్యాలను ఎంతో శ్రమతో సేకరించి వేటూరి ప్రభాకరశాస్త్రి భారతి పత్రికలో "ఎర్రాప్రగడ రామాయణం" అనే శీర్షికతో ప్రకటించాడు. హరివంశము ఇది కూడా ప్రోలయవేముని కోరికపై రచించి ఎర్రన ఆ రాజుకే అంకితమిచ్చాడు. ఈ రచన 1335 - 1343 మధ్యకాలంలో జరిగి ఉండవచ్చును (అమరేశ్వరాలయ శాసనం, ముట్లూరి శాసనం ఆధారంగా). ఇది ఖిలపురాణము. సంస్కృతంలో హరివంశం హరివంశ, విష్ణు, భవిష్య పర్ాలుగా విభజింపబడిఉన్నది. ఎర్రాప్రగడ మాత్రం దాన్ని పూర్వోత్తర భాగాలుగా విభజించాడు. ఈ హరివంశం ఆరంభంలో ఎర్రన తన గురువునూ, నన్నయనూ, తిక్కననూ ప్రశంసించాడు. ఈ రచనలో మూలకథ ప్రాశస్త్యం చెడకుండా దాన్ని సంగ్రహించి, అందులోని కథలను ఔచిత్యశుద్ధంగా, క్రమబద్ధంగా వ్రాయడంలో ఎర్రన ఎంతో నేర్పును కనబరచాడు. (హరివంశాన్ని ఎర్రన సమకాలికుడైన నాచన సోమన కూడా మహాభారతము అరణ్యపర్వశేషము ఎఱ్ఱాప్రగడ కవిత్రయంలో మూడవ కవి, కాని ఆయన అనువదించినది మధ్య భాగము. నన్నయ మహాభారత అనువాదం అరణ్య పర్వం మధ్యలో ఆగిపోయింది. ఈ శేషభాగాన్ని మహాకవి తిక్కన ఏ కారణం చేతనో అనువదించలేదు. అలా మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని తెలుగు లోకి ఎఱ్ఱన అనువదించాడు. అరణ్యపర్వములోని మొదటి మూడు ఆశ్వాసాలనూ, నాలుగవ ఆశ్వాసంలో 142 పద్యాలనూ నన్నయ వ్రాశాడు. తరువాత బహుశా నన్నయ మరణం కారణంగా ఆ కార్యం అక్కడితో ఆగిపోయింది. 143వ పద్యంనుండి ఎఱ్ఱన వ్రాశాడు. ఈ రచన బహుశా ప్రోలయ వేమునికాలంలోనే, హరివంశం రచన తరువాత, జరిగినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అరణ్యపర్వ శేషాన్ని కూడా ఆంధ్రీకరించడంతో తెలుగులో మహాభారత సమగ్రతను సాధించిన గౌరవం ఎర్రనకు దక్కింది. ఎర్రనకున్న సౌజన్యమూ, వినయమూ కారణంగా ఈ అరణ్యపర్వశేషాన్ని నన్నయ రచనతో కలిపే వ్రాసి, దానిని రాజరాజనరేంద్రునికే అంకితమిచ్చాడు. "ప్రయత్నించి తత్కవితా రీతియు గొంత దోప దద్రచనయకా నారణ్యపర్వశేషం" పూరించినట్లు చెప్పుకొన్నాడు."నన్నయభట్ట మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తి తన్ను జెందుటయే" అందుకు కారణమని కూడా ఎర్రన చెప్పుకొన్నాడు. అరణ్యపర్వశేషం ఎర్రన వ్రాయలేదనీ, నన్నయ పూర్తిగా వ్రాసినదానిలో కొంతభాగం పాడు కాగా దానిని ఎర్రన పూరించాడనీ ఒక వాదం ఉన్నది (ఉత్సన్నవాదము - శతఘంటం వేంకటరంగశాస్త్రి). అలా కాదు నన్నయ వ్రాసినదానిలో కొన్ని పద్యాలు చెదలు తినడంవల్ల లోపించాయనీ, వాటిని ఎర్రన పూరించాడనీ మరొక వాదం ఉన్నది (శిథిల పూరణ వాదము - నడికుదుటి వీరరాజు). కాని ఈ రెండు వాదనలూ నిర్హేతుకమైనవనీ, ఎర్రన నిస్సందేహంగా అరణ్యపర్వాన్ని పూరించాడనీ పండితులు అభిప్రాయానికి వచ్చారు. పైగా శైలి, భాషావిషయకమైన ఆధారాలద్వారా కూడా ఎర్రన స్వతంత్రరచనను కవులు నిర్ణయించారు. మూలరచనను గౌరవిస్తూనే ఎర్రన స్వతంత్ర రచనను సాగించాడు. అతని రచనలలో నన్నయ కథనా గమనాన్ని, తిక్కన నాటకీయతను, ఎర్రన వర్ణనాత్మకతను గమనింపవచ్చును. నృసింహపురాణము నృసింహ పురాణము (లక్ష్మీనృసింహావతార కథ) అనేది ఎఱ్ఱన స్వతంత్ర రచన. దీనిని ఎర్రన తన ఇష్టదైవమైన అహోబిలం నరసింహావతారము అంకితమిచ్చాడు. ఇది పేరుకే పురాణం గాని ప్రబంధలక్షణాలున్న కావ్యం. ఐతిహ్యం ప్రకారం ఒకరోజు ఎర్రన ధ్యానంలో మునిగి ఉండగా అతని తాత కనబడి ఈ రచనను చేయమని సలహా ఇచ్చాడు. ఇది బ్రహ్మాండపురాణంలోని కథ. విష్ణు పురాణం ఆధారంగా వ్రాయబడింది. "బ్రహ్మాండాది పురాణోక్తంబయిన శ్రీనృసింహావతారంబను పురాణంబు తెనుగు భాష బ్రకటింపవలయు" అన్నాడు. కాని అధికభాగం వర్ణనాదులు ఎర్రన స్వతంత్ర రచనలు. ఇందులో తెనుగు నుడికారపు సొగసులు, పద్యాలకూర్పు ఎంతో హృద్యంగా ఉంటాయి. ఎర్రన యుగము తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగు చేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంథిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది. తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగి ఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు. ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాథ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి పింగళి లక్ష్మీకాంతం తెలిపిన అభిప్రాయం ఇది - "తిక్కన అనంతరం, శ్రీనాథునికి ముందు ఎఱ్ఱన, నాచన సోమన, భాస్కరుడు వంటి మేటికవులవతరించారు. అంతేగాక తెలుగు సారస్వతానికి త్రిమూర్తులైన కవిత్రయం తరువాతనే ఎంతటివారైనా పేర్కొనదగినవారౌతారు. ఆ మువ్వురును ఆంధ్ర కవి ప్రపంచానికి గురుస్థానీయులు. కనుక ఆ మువ్వురిపేరు మీద మూడు యుగాలుండడం ఉచితం. అంతేగాక ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే, వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. కనుక ఎఱ్ఱనను యుగకర్తగా సంభావించుట ఉచితం."పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం రచనాశైలి, విశేషాలు సాహిత్య అకాడమీ ముద్రించిన అరణ్య పర్వము ముగింపులో ఆ భాగం సంపాదకులు డా. పాటిబండ్ల మాధవశర్మ ఇలా వ్రాశాడు - తననాటి కవీశ్వరులచే ప్రబంధ పరమేశ్వరుడని కొనియాడబడిన ఎఱ్ఱన, నన్నయభట్ట తిక్కనకవినాథులకెక్కిన భక్తి పెంపున అరణ్యపర్వ శేషమును పూరించి, గంగాయమునలవంటి ఆ మహనీయుల కవితా నదీమతల్లుల నడుమ సరస్వతీనదివంటి తన కవితను అంతర్వాహినిగా చేసి ఆంధ్రమహాభారతమునకు కవితా త్రివేణీసంగమ పవిత్రతను సమకూర్చెను. ఎఱ్ఱన ఎంత సౌమ్యమతియో ఆయన కవిత అంత సౌందర్యవతి. విఖ్యాతమాధుర్యమనోహరముగా ఆయన రచించిన అరణ్యపర్వశేషము ప్రతిపద్యరమణీయమైన పుణ్యకథాప్రబంధ మండలి. దానియందములు సవిస్తరముగా వర్ణించుటకు ఈ పీఠిక చాలదు. నాకు శక్తియు చాలదు. తెలుగు వైతాళికులు ప్రచురణాక్రమంలో ఎర్రాప్రగడ పుస్తకాన్ని రచించిన ఆచార్య వి. రామచంద్ర తన రచన ముగింపులో ఇలా వ్రాశాడు. ఎర్రన శివపదాబ్జ సంతతాధ్యయన సంసక్తచిత్తుడు. పూజిత ధూర్జటి చరణాంబుజుడు. అతని బిరుదం శంభుదాసుడే అయినా గ్రహించిన కథలన్నీ విష్ణుకథలే. అతడు తాత్వికుడు. అతని జీవితమే హరిహరాద్వైతానికొక వ్యాఖ్యానం. ఆయన మహాపండితుడు. గురుభక్తి తత్పరుడు. వినయోదయ సంభరితుడు. ... సరళ హృదయుడు. సరళ సుందరమైన శైలే ఆయనకెక్కువ ఇష్టం. ఒక ప్రభువు కొలువులో ఆస్థానకవిగా ఉన్నా మహర్షివలె జీవితాన్ని గడపగలిగిన ధన్యుడాయన. రచనల నుండి ఉదాహరణలు హరివంశం ఉపోద్ఘాతంలో ఎర్రన చెప్పిన పద్యం నన్నయభట్ట తిక్క కవినాథులు చూపిన త్రోవ పావనం బెన్నఁ బరాశరాత్మజ మునీంద్రుని వాఙ్మయ మాదిదేవుఁడౌ వెన్నుని వృత్త మీవు కడు వేడుకతో విను నాయకుండ వి ట్లెన్నియొ సంఘటించె మదభీప్సిత సిద్ధికి రాజపుంగవా! ఎర్రనరామాయణంలోనిదని నేలటూరు వేంకటరమణయ్య భావించిన పద్యం. హనుమంతుడు సాగరాన్ని దాటిన విధం. చువ్వన మేను వంచి రవి సోకఁగ దోఁక విదల్చి పాదముల్ వివ్వఁగ బట్టి బాహువులు వీచి మొగంబు బిగించి కొండ జౌ జవ్వన నూగి ముందఱికి జాగి పిఱిందికిఁదూగి వార్ధిపై ఱివ్వన దాటె వాయుజుడు ఱెక్కలతోడి సురాద్రియోయనన్ మహాభారతం అరణ్యపర్వములో నన్నయ రచించిన చివరి పద్యము - శరత్కాలపు రాత్రులను వర్ణించునది. శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క ర్పూర పరాగ పాండు రుచిపూరము లంబరి పూరితంబులై అదే వర్ణనను ఎర్రన కొనసాగిస్తూ సూర్యోదయాన్ని వర్ణించాడు. ఇది ఎర్రన భారతాంధ్రీకరణలో మొదటి పద్యం స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా వరణములై దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల, మ ద్దురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళఁ జూడగన్ అరణ్యపర్వములోని మరొక పద్యము. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్న మాటలు. ద్యూత వ్యాజమునన్ సభాంగణములో దుర్యోనుండట్లు దు ర్నీతిం గూరి యొనర్చినట్టి యఘముల్ నిష్కంప ధైర్యోన్నతిన్ జేతఃస్ఫారుఁడవైన నీ కొకనికిం జెల్లెన్ సహింపంగ వి ఖ్యాత క్షాంతులు లేరె ధార్మికులు నిక్కంబిట్టిరే యెవ్వరున్ నృసింహపురాణము పీఠికలో నన్నయ తిక్కలను గురించీ, తన యభీష్టసిద్ధి గురించీ ఎర్రన ఇలా అన్నాడు. భాసుర భారతార్థముల భంగులు నిక్క మెఱుంగ నేరమిన్ గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెనుంగు వారికిన్ వ్యాసముని ప్రణీత పరమార్థము తెల్లఁగఁజేసినట్టి య బ్జాసన కల్పులం దలతు నాద్యుల నన్నయ తిక్కనార్యులన్ విష్ణుభక్తులకు కలిగే మేలు గురించి నృసింహపురాణంలో వర్ణన పొందవు దుఃఖముల్ భయము పొందరు పొందరు దైన్యమెమ్మెయిన్ బొందవు తీవ్రదుర్దశలు పొందుఁ బ్రియంబులు పొందు సంపదల్ పొందు సమగ్ర సౌఖ్యములు పొందు సమున్నత కీర్తులెందు గో వింద పదారవింద పదవీ పరిణద్ధ గరిష్ట చిత్తులన్ నన్నయను గూర్చి పొగుడుతూ ఎర్రన చెప్పిన పద్యం: ఉన్నతగోత్ర సంభవము నూర్జిత సత్త్వము భద్రజాతి సం పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్కటము న్నరేంద్ర పూ జోన్నయనోచితంబునయి యెప్పుడు నన్నయ భట్ట కుంజరం బెన్న నిరంకుశోక్తి గతి నెందును గ్రాలుటఁ బ్రస్తుతించెదన్‌ బాలకృష్ణ లీలా వర్ణన (హరివంశంలో) నోరం జేతులు రెండు గ్రుక్కుకొనుచున్‌, మోమెల్ల బాష్పాంజన స్మేరంబై తిలకింపనేడ్చుచు, బొరిన్‌ మీజేతులం గన్నులిం పారం దోముచు, జేవబూని పిరుదొయ్యన్‌ మీద కల్లార్చుచున్‌ శ్రీరమ్యాంఘ్రియుగంబు గింజికొనుచుం జెల్వంబు రెట్టింపగా శ్రీ కృష్ణుని శైశవోత్సవ వర్ణన (హరివంశంలో) పాలుపారగా బోరగిలి పాన్పు నాల్గుమూలలకును వచ్చుచు మెలగి మెలగి లలి గపోలమ్ములు గిలిగింతలువుచ్చి నవ్వింప గలకల నవ్వినవ్వి ముద్దులు దొలుకాడ మోకాల గేలను దడుపుచు నెందును దారితారి నిలుచుండబెట్టి యంగుళు లూతసూపగా బ్రీతితప్పడుగులు వెట్టిపెట్టి అన్నగంటి దండ్రినిగట్టి నయ్యగంటి నిందురావయ్య విందుల విందవంచు నర్ధిదను బిలువంగ నడయాడియాడి యుల్లసిల్లె గృష్ణుడు శైశవోత్సవముల వెన్నెవెట్టెద మాడుమాయన్న యన్న మువ్వలును మొలగంటలు మొరయు నాడు నచ్యుతుండు, గోపికలు దమయాత్మ బ్రమసి పెరువు దరువను మరచి సంప్రీతిజూప మందలు మేపుకు వచ్చిన నందగోపుని వర్ణన (హరివంశం) పరిమిత పలితైక భాసురంబగు కేశసంచయ మారణ్య సంచరమునఁ దరువులరాయి కేసరముల నత్యంతదూసరంబై కడు మాసరమున గోఖురోద్ధుతరేతు కుంఠితంబగు మోము చెమటబొట్టులఁజాలఁ జెన్నుమిగులఁ గట్టిన చెంగావికాసె వేఁజిగురులజిగినూని తను పతిస్నిగ్ధకాంతి నలరఁ గర్కశగ్రంథిలయష్టి చేతఁ బట్టి గోపాలపరివార బహువిధోక్తు లెలసి చెలఁగంగఁ గదువుల వలననుండి వచ్చే నందగోపుఁడు నిజా వాసమునకు ఆలమందల బృందావన వలస (హరివంశం) బండ్లమెట్టింపుపై బరువులెక్కింపుమీ దళ్లుసుబూన్పు, కావళ్లనునుపు పదిలంబుగా నేటివనటులు, కొత్తగోనెల బిములు పట్టు నివరివడ్లు నోడబెరుగపాలు నొనరంగబోసి చాపలుమంచములుమీద బలియంగప్పు దామెనలును వల్లె త్రాళ్లును దలుగులు గవ్వము ల్గొడవలి కత్తిసూడు గొడుపువాదోళ్లు మొదలుగా జెడకయుండ వలయు ముట్లెల్లదెమ్ము గందలపుటెడ్ల గంపమోపులు ముందరగదలు మనుము. హరివంశం నుండి గద్యం - మహాఘోష వర్ణన ''పుష్పిత ఫలితానేక తురుషండ మండితంబు కాళిందీ తటంబున నలుదెసలం బొడవుగా నమర్చిన బలితంపుములు వెలుంగు లంగరము. జతనంబులై యొప్పు పెనుదొడ్లం గ్రమంబునం బ్రంఓదంబున వేఁకువం బోకు మేసివచ్చి రోమంధన వదనంబుల విహిత శయనలై సుఖియించు కదుపులలోన బేరు పేరంబిలువం బంచతిల్లుచు సుల్లసిత హుంకా రంబులగు వదనంబులతో నున్ముఖలగు తల్లులకు నఖిముఖంబులై హర్ష ప్రతినినందంబులు వొదలం బొదులనుండి యొండొంటిం దాటుకొని కలయు బాలవత్సంబుల యుత్సప సంచారంబులవల్ల, పెదయావుల వెనుకందగిలి యొండొంటిం జేరనీక బలియు రంకెలం బొదివి కాల ద్రవ్వి క్రోడాడుచు బొగరుమిగుల కరకెక్కిన మెడలును, పలుద మూపురంబులును, వెడద వీపులును, దోరంబు గంగడోళ్లునునై క్రాలు వృషంభుల దర్ప వికారంబు వలనను, మొదలనోరి సురువులుం, బెయ్యల రేణంబులుం, బాలకుండల మసులునుందమ యుడళులకు నెడపడనితొడవులుగా బిదికి యురుద్రాళ్లుం, దలుగులు తలమొల లంజుట్టి యిట్టునట్టులుం గలయంబాఱి క్రేపుల నేర్పరించు వారును, పల్లియలువైచి కోడెలంబట్టిపెనంచి కారూళ్ల జట్టికారులకు వశంబు సేయు బరవసం బెసంగ గ్రుమ్మరువారును, జూడుగొడపులుసు వాదోళ్లు ముకుబంతులు మొదలుగాగల సాధనంబులు గొనివచ్చి తెవులు గొంటులం జికిత్సించువారును, గ్రేపులంగొనని యావులందొ లంగం గట్టి పిళ్లువెట్టియు, మందులు సల్లియుల్లం, జాల దు:ఖపడి చేపెరింగించు వారును................" మూలాలు, వనరులు ఉపయుక్త గ్రంథసూచి ఎఱ్ఱాప్రగడ-పి.యశోదారెడ్డి డీఎల్ఐలో గ్రంథప్రతి ఎర్రా ప్రగడ - రచన: ఆచార్య వి. రామచంద్ర - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వద్యాలయం ప్రచురణ (2006) - బయటి లింకులు ఇంటర్నెట్ ఆర్చీవులో అరణ్యపర్వము - సాహిత్య అకాడమీవారి ప్రచురణ తెలుగు పరిశోధన లో ఎఱ్ఱన నృసింహ పురాణం - సాహిత్య అకాడమీవారి ప్రచురణ ఎర్రాప్రగడ గురించి వి.రామచంద్ర వ్రాసిన గ్రంథం వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:తెలుగు కవులు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:ప్రకాశం జిల్లా కవులు వర్గం:14వ శతాబ్ద జననాలు వర్గం:సంస్కృతం నుండి తెలుగు లోకి అనువాదాలు చేసినవారు
ఆతుకూరి మొల్ల
https://te.wikipedia.org/wiki/ఆతుకూరి_మొల్ల
thumb|right|200px|<center>200px|మొల్ల<center> thumb|269x269px|2017లో భారత ప్రభుత్వం మొల్ల జ్ఞాపకార్థం విడుదల చేసిన తపాలా బిళ్ల ఆతుకూరి మొల్ల, (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయం (16వ శతాబ్దం) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైంది, రమణీయమైంది. జీవిత కాలం మొల్ల జీవించిన కాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనని కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా సా.శ. 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు. కులాన్నిబట్టి కుమ్మరి మొల్ల అని వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు కేతనపెట్టి. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాథుడిని స్మరించియుండుటచే ఈమె శ్రీనాథుని తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది. చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు. స్వస్థలం మొల్ల స్వస్థలం కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామం. ఈ గ్రామం కడప పట్టణానికి 56 కి.మీ దూరంలో, బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈమె ఈ ప్రాంతానికి చెందినదని మొల్ల రామాయణంలోని ఈ క్రింది పద్యం ద్వారా తెలుస్తుంది. నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయం గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన, తెనాలి రామలింగడు కూడా గోపవరం వచ్చి మహా భక్తురాలైన కవయిత్రి మొల్లను దర్శించినట్లు ఆమెపై చేసిన దూషణను మన్నించవలసినదిగా ప్రాధేయపడినట్లు చెబుతారు. వాఙ్మయ మూలాల ఆధారంగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి ఈమెను గారాబంగా పెంచెనని తెలుస్తుంది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం. చివరి దాకా తండ్రి ఇంటి పేరునే ఉపయోగించడం మూలాన మొల్ల పెళ్ళి చేసుకోలేదని అనుకోవచ్చు. మొల్ల రామాయణం మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో* వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా 600 బీ.సీ. టు ద ప్రెజెంట్ - సూసీ థారూ, కే.లలిత వాల్యూం 1 పేజీ 94-97 (ఆంగ్లములో) కూడుకుంది. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉంది. మొల్ల శైలికి ఉదాహరణలు తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్ తోయదపథంబున నమేయరుచి తోడ నుదురాయడును మించి వడ గాయగ గడంగెన్ కోయిలలు కీరములు కూయగ నళివ్రజము లేయెడల జూచినను మ్రోయుచు చెలంగెన్ నాయెడల కృపారసము నీయకవివేకమున నీయెడల నుండుతిది న్యాయమె లతాంగీ జడలు దాలిచి తపసుల త్సందమునను తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు కూరగాయలు కూడుగా కుడుత్సునట్టి రాముడేరీతి లంకకు రాగలండు విశేషాలు తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదంవల్లనే కవిత్వం చెబుతున్నాననీ ఆమె అన్నది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండిఉండాలనిపిస్తున్నది. తనకు పాండిత్యం లేదని మొల్ల వ్రాసినది సంస్కృతిలో భాగమైన అణకువ, విధేయత వంటి లక్షణాల కారణంగానే తప్ప వేరే కాదని స్త్రీ రచయిత్రుల చరిత్ర వ్రాసిన నిడదవోలు మాలతి భావించారు. గ్రంథావతారికను బట్టి ఈమె తక్కిన కవయిత్రులవలె గురువునొద్ద విద్యనభ్యసించలేదని, గోపవరపు శ్రీకంఠ మల్లేశుకృపను కవిత్వం చెప్పనేర్చినదనియు తెలియుచున్నది. ఈమె కావ్యలక్షణాదికముల నేమియు నెరుంగక పోయినను నన్నయ తిక్కనాది కవుల గ్రంథములను మాత్రము క్షుణ్ణముగా చదివినదని ఈమె పద్యముల తీరు నడకలను బట్టి చెప్పవచ్చును. ఈమెపై పోతన కవితా ప్రభావము ఎక్కువగాగలదు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట... అని పోతన చెప్పిన మాదిరిగనే ఈమె రామాయణమందు చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన, మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్ అని పల్కినది. సర్వగుణాకరుడు శ్రీరాముని చరితమును ఎందరెన్ని విధముల రచన గావించినను నవ్యతకలిగి వీనులవిందై, యమృతపు సోనలపొందై యలరారుచుండుట తానీ గ్రంథమును చేపట్టుటకు కారణమని చెప్పినది. అట్టి మహాత్ముని చరితమును కందువ మాటల్ నందముగా కూర్చి పఠితలకు శ్రోతలకు విందును గూర్తునని ముందంజ వేసింది. గ్రంథావతారిక యందు చెప్పబడిన విషయముల వల ఈమె పూర్వకవుల సంప్రదాయమునే అనుసరించి కావ్యారంభమున అయోధ్యాపుర వర్ణనతో ప్రారంభమై, దశరథుని పుత్రకామేష్ఠి, శ్రీరామచంద్రుని జననమాదిగా రావణవధానంతరము ముగియుచున్నది. ఉత్తరరామాయణముని స్పృశించలేదు. సాధారణంగా కవులు వర్ణనాదులయందు జటిలమై, సుదీర్ఘమైన సమాసము ల నొడగూర్చితమ పాండిత్యప్రకర్షను చూపింతురు. శబ్దాడంబరమునకు ప్రాధాన్యమిచ్చిన ప్రబంధయుగమున పుట్టిన మొల్ల శబ్దాడంబరమునకు లోనుగాక యలతి యలతి పదములతోనే రచన సాగించి పేరొందినది. చిన్ని చిన్ని గీతములలో పెద్ద భావముల నిముడ్చుట ఈమె సహజ గుణము. జడలు ధరియించి తపసుల చందమునను, దమ్ముడును దాను ఘోరదురమ్ములందు కూరగాయలు కూడుగాగుడుచునట్టి, రాముడేరీతి లంకకు రాగలడు. పదబంధముల యందు ఈమెకు చక్కని నేర్పు ఉంది. తిక్కన వలె ఈమె పాత్రలను కండ్లకు కట్టునటుల చింత్రించ గలదు. హనుమంతుడు సముద్రమున దాటునపుడు ఈమె ఆప్రాంతమును చూచినది గాబోలు అనిపించును, ఆసముద్రోల్లంఘన మెంత సత్యసముపేతముగా వర్ణించెనో చూడండి: మొగము బిగించి, పాదముల మొత్తముగానట నూదిత్రొక్కి, నీ టుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున వార్చి బాహు ల త్యగణితలీలమాచి, వలయంబుగ వాలముద్రిప్పి వ్రేగునన్ నగము సగంబు క్రుంగ గపినాథుడు నింగి దాటే రివ్వునన్!!! ఇవి కూడా చూడండి మొల్ల రామాయణం కథానాయిక మొల్ల సినిమా మూలములు, వనరులు బయటి లింకులు మొల్ల రామాయణము మొల్ల (తెలుగు వైతాళికులు సిరీస్ లో) - రచన: సి. వేదవతి - ప్రచురణ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2006) 1957 భారతి మాస పత్రిక. వ్యాసము - ఆంధ్రకవయిత్రులు-మొల్ల వ్రాసినవారు నరసింహం. మొల్లరామాయణము-అవతారిక మొల్లరామాయణము-బాలకాండ మొల్లరామాయణము-అయోధ్యకాండ మొల్లరామాయణము-ఆరణ్యకాండ మొల్లరామాయణము-కిష్కింధకాండ మొల్లరామాయణము-సుందరకాండ వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:తెలుగు కవులు వర్గం:తెలుగు కవయిత్రులు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:1440 జననాలు వర్గం:1530 మరణాలు వర్గం:కడప జిల్లా కవయిత్రులు
శ్రీనాథుడు
https://te.wikipedia.org/wiki/శ్రీనాథుడు
శ్రీనాథుడు (1380-1470) 15 వ శతాబ్దికి చెందిన తెలుగు కవి. దివ్యప్రబంధన శైలికి ఆదరణ కల్పించాడు. చిన్నారి పొన్నారి చిఱుత కూకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది. రాజాశ్రయం శ్రీనాథుడు 15వ శతాబ్దమున జీవించాడు. వీరు కొండవీటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించారు. శ్రీనాధుడు రెడ్డిరాజుల కడనున్న విద్యాధికారి అన్నమాట లోక విదితం. అద్దంకి రెడ్డిరాజులు క్రమముగా కొండవీడు, రాజమహేంద్రవరములలో రాజ్యమేలినారు. శ్రీనాధభట్ట సుకవి కొన్నాళ్ళు విస్తృతముగా ఆంధ్రదేశముననే కాక కర్ణాటక ప్రాంతమునందు కూడ సారస్వత యాత్రలు నెరపి తన భాషకు ఎనలేని సేవ చేసినాడు. శ్రీనాధామాత్యుని తాతగారు కమలనాభామాత్యుడు తన మనుమని ముద్దు పలికులలో ఇట్లు వర్ణించినాడు "కనకక్ష్మాధర ధీరు, వారిధి తటీ కాల్ పట్టణాధీశ్వరున్ అనుగుందాత, కమనాభామాత్య చూడామణిన్" సాగర తటమునందున్న కాల్ పట్టణమునకు అధిపతి కమలలాభామాత్యుడు నేటి ప్రకాశం జిల్లా గుండ్లకమ్మనదికి దక్షిణ తటమున బంగాళాఖాతమునకు పడమరగా సుమారు ఇరువది కిలోమీటర్ల దూరములోనున్న నేటి ఊరు కొలచనకోట. ఈ కొలచనకోట యే కొలసనకోట (కాల్ సనకోట) అదే శ్రీనాధుని జన్మస్థలమని పలువురి చరిత్రకారుల అభిప్రాయము. ఈ కాల్పట్టణం ఆ సమీపంలోని పాదర్తి అని మరికొందరు అందురు. ఏది ఎమైనా శ్రీనాధుడు ప్రకాశం సీమలోనివాడని, జన్మస్థలము ఈ ప్రాంతములోనే జరిగినదని తెలియుచున్నది. ఘనత - బిరుదులు డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదము ఉంది. రచనలు ఇతను ఎన్నో కావ్యాలు రచించాడు. వాటిలో కొన్ని: భీమఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగునవి. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంతా బహు ప్రశస్తి పొందాయి. మరుత్తరాట్చరిత్ర శాలివాహన సప్తశతి శృంగార నైషధము ధనుంజయ విజయము కాశీ ఖండము హర విలాసము శివరాత్రి మాహాత్యము పండితారాధ్య చరిత్రము నందనందన చరిత్రము మానసోల్లాసము పల్నాటి వీరచరిత్రము క్రీడాభిరామము రామాయణము పాటలు కాశీఖండమునందు చెప్పుకున్నట్టుగా చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితిమరుత్తరాట్చరిత్ర. నూనుగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి. సంతరించితి నిండు జవ్వనంబునయందు హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని యాడితి భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ గాశికాఖండ మను మహాగ్రంథ మేను తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని. శ్రీనాథుని చాటువులు శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ రెండుపద్యాలూ అవధరించండి. కుల్లాయుంచితి, కోకసుట్టితి, మహాకూర్పాసమున్ బెట్టితిన్, వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్, తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ . కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధాకష్టంబె, యీ భోగపుం జవరాండ్రేగద భాగ్యశాలినులు, పుంస్త్వంబేటికే పోగాల్పనా ? సవరంగాసొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించుచో యెవరేనిన్ మదిమెచ్చి ధనంబులిత్తురుగదా నీరేజపత్రేక్షణా! నీలాలకా జాల ఫాల కస్తూరికా తిలకంబు నేమిట దిద్దువాడ నంగనాలింగనా నంగ సంగర ఘర్మ శీకరం బేమిట జిమ్మువాడ మత్తేభగామినీ వృత్తస్తనంబుల నెలవంక లేమిట నిల్పువాడ భామామణీ కచాభరణ శోభితమైన పాపట నేమిట బాపువాడ ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి … అహహ పోయె నా గోరు తన చేతి పోరు మాని ఒకసారి శ్రీనాథ కవిసార్వభౌములు పల్నాటిసీమ కు వెళ్లారు. అక్కడి నీటి ఎద్దడి చూసి ఈ కంద పద్యాన్ని చాటువుగా చెప్పేరట - సిరిగలవానికిజెల్లును తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశాగంగవిడువు పార్వతిచాలున్ సమకాలీకులు ఈయన పోతనకు సమకాలీనుడు. పోతనకు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్ని సర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.శ్రీనాథుని బావమరుదులలో ఒకరి పేరు పోతన(దగ్గుపల్లి పోతన). ఇతడు కూడ కవే. తెలియని వారు ఈ పోతనను బమ్మెర పోతనగా పొరపడి ఉంటారు. చరమాంకం శ్రీనాథుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాథుని ప్రభ మసకబారింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న బొడ్డుపల్లి గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టని కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంతా తిప్పారని ఆయన చాటు పద్యం ద్వారా తెలుస్తుంది. కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము బిలబిలాక్షులు తినిపోయె తిలలు పెసలు బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి నెట్లు చెల్లింతు సుంకంబు నేడు నూర్లు?దీనారటంకాల దీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల, పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య నైషధగ్రంథ సందర్భమునకు, పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి గౌడడిండిమభట్టు కంచుఢక్క, చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద పాదుకొల్పితి సార్వభౌమ బిరుద, మెటుల మెప్పించెదో నన్ను నింకమీద రావు సింగ మహీపాలు ధీవిశాలు నిండుకొలువున నెలకొనియుండి నీవు సకలసద్గుణ నికురంబ! శారదాంబ! కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా పురవీధినెదురెండ బొగడదండ, సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా నగరివాకిటనుండు నల్లగుండు, ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబున దగలియుండెనుగదా నిగళయుగము, వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత వియ్యమందెనుగదా వెదురుగొడియ, కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు? కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి రత్నాంబరంబు లే రాయడిచ్చు? కైలాసగిరి బండె మైలారువిభుడేగె దినవెచ్చ మేరాజు దీర్పగలడు? రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు కస్తూరి కేరాజు ప్రస్తుతింతు, స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు? భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె కలియుగంబున నిక నుండ కష్టమనుచు దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి. వ్యక్తిత్వం చాటు పద్యాల్లో కనిపించే శ్రీనాథుడి వ్యక్తిత్వం ఇది - ఆయన విశాల లోక సంచారి, ఐక్యాంధ్ర సామ్రాజ్యపు సరిహద్దులేమిటో తొలిగా చూపిన వాడు (వెల్చేరు ప్రతిపాదన ప్రకారం) సౌందర్యారాధకుడు, మహా రసికుడు, సరసుడు భోజనప్రియుడు సర్వ స్వతంత్రుడు, దేవుణ్ణైనా లెక్కచెయ్యని వాడు విలాసి, జీవితాన్ని విపరీతంగా ప్రేమించి అనుభవించిన వాడు బాహ్యప్రేరణలకు వెంటనే స్పందించే వాడు అసౌకర్యాలను భరించలేని వాడు కులమత విభేదాలు లేనివాడు సున్నిత మనస్కుడు గొప్ప చమత్కారి ఉపసంహారం శ్రీనాథుడు తన గ్రంథాలతో ఎంతగా లబ్ధప్రతిష్ఠుడయాడో చాటువుల ద్వారా కూడా అంతే. ఐతే శ్రీనాథుడివిగా చెప్పబడేవన్నీ ఆయన చెప్పినవేనా అనేది ఎవరూ తేల్చలేని విషయం. కాని, రసవేత్తలైన పాఠకుల దృష్టిలో శ్రీనాథుడి వ్యక్తిగత జీవనచిత్రణని చూపిస్తాయివి. ఈ చాటుపద్యాలలో కనిపించే శ్రీనాథుడు ఎంతో ఆధునిక భావాలున్నవాడు. ఈ కాలపు సమాజంలో హాయిగా ఇమిడిపోగలవాడు. ఆనాటి సమాజానికి ఆయన జీవనశైలి మింగుడుపడనిదై ఉండాలి. అందుకే అంతటి మహానుభావుడూ చివరిదశలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యాడు. ఎవరూ ఆయన్ని ఆదుకోవటానికి రాలేదంటే తన బంధుమిత్రులకు ఎంత దూరమయాడో తెలుస్తుంది. సర్వస్వతంత్రుడిగా, నిరంకుశుడిగా జీవితాన్ని తన మనసుకు నచ్చిన రీతిలో సాగించిన శ్రీనాథుడి మూలంగా మనకు మిగిలిన సంపదలో ముఖ్యభాగం ఈ చాటువులు. బయటి లింకులు శ్రీనాథుడి చాటు పద్యాలు హరవిలాసము మూలాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన శ్రీనాథ మహాకవి శృంగార నైషధం వర్గం:తెలుగు కవులు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:ప్రబంధ యుగపు కవులు వర్గం:15 వ శతాబ్ది తెలుగు కవులు
తెనాలి రామలింగడు
https://te.wikipedia.org/wiki/తెనాలి_రామలింగడు
దారిమార్పు తెనాలి రామకృష్ణుడు
బమ్మెర పోతన
https://te.wikipedia.org/wiki/బమ్మెర_పోతన
right|250px|బమ్మెర పోతన|thumb బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు. జననం అతను నేటి జనగామ జిల్లా లోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేసన దంపతులకు జన్మించాడు. అతని అన్న తిప్పన. ఇతను బమ్మెర వంశానికి చెందివాడు, శైవ కుటుంబం. ఇతని గురువు ఇవటూరి “సోమనాథుడు”.అతను ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు. భాగవత రచన తెలంగాణాపై మహమ్మదీయ దండయాత్రలు ప్రారంభ మైన దశలోనే ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు అనేక మంది రాయలసీమ ప్రాంతాలకు; కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు తరలిపోయారు.బహమనీల కాలంలో ఈ వలసలు మరింత ఉధృతమయ్యాయి. కడప జిల్లా లోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి ఆలయసమీపంలో కల ఒక చిన్న గుట్టపై పోతన విగ్రహం ఉంది. ఆలయంలో స్వామివారికి పోతన పేర తాంబూలం సమర్పించే ఆచారం ఉంది. ఆలయానికి 1-1/2 కి.మీ. ల దూరంలో "బమ్మెర గడ్డ" అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో కల చెరువు క్రింద "పోతన మడి" ఉంది. అభినవ పోతన బిరుదాంకితులు వానమామలై వరదాచార్యులు పోతన జన్మస్థలం బమ్మెర అయినప్పటికీ ఒంటిమిట్టలోనే తన భాగవతాన్ని రచించాడని అభిప్రాయపడ్డాడు. కాని, అతని భాగవత రచనను రాచకొండలో ప్రారంభించి ఒంటిమిట్టలో పూర్తి చేసాడు.right|250px|పోతన ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలుడు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చాడు. శ్రీమదాంధ్ర భాగవతం మొత్తం పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడంతో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉంది. ఇతర రచనలు thumbnail|పోతన చిత్రపటం|alt=|333x333px యవ్వనంలో ఉండే సహజచాపల్యంతో పోతన భోగినీ దండకం అనే రచన చేశాడు. ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన ఈ దండకం, తెలుగులోనే తొలి దండకమని భావించేవారు లేకపోలేదు. ఆ తరువాత దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాసాడు. దానశీలము అనే ఒక పద్యాన్ని రాసాడు. పోతన - శ్రీనాధుడు పోతన, శ్రీనాథ కవిసార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది. కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరి మధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. కవిత్వం-విశ్లేషణ పోతన కవిత్వంలో భక్తి, మాధుర్యం, తెలుగుతనం, పాండిత్యం, వినయం కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభం పలికి రచన ఆరంభించిన సుగుణశీలి అతను. సి.నారాయణరెడ్డి వ్యాసం భక్తి కవితా చతురానన బమ్మెర పోతన తెలుగు సాహిత్యంలో పోతనగారి విశేష స్థానాన్ని వివరిస్తుంది. డిజిటల్ మ్యూజియం వరంగల్లులోని పోతన విజ్ఞాన పీఠంలో బమ్మెర పోతన పేరుమీద బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియం ఉంది. మహాకవి బమ్మెర పోతన తాళపత్ర గ్రంథాలను ఆధునిక సాంకేతికతతో డిజిటలైజ్‌ చేసి, భావితరాలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది. పోతన స్మృతివనం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బమ్మెర గ్రామంలో పోతన స్మృతివనం నిర్మించబడుతోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2017 ఏప్రిల్‌ 28న బమ్మెరలో పోతన స్మృతివనం ఏర్పాటుపనులకు శంకుస్థాపన చేశాడు. ఇక్కడ పోతనామాత్యుని భారీ విగ్రహం, పోతన మ్యూజియం, థియేటర్‌, స్మృతివనం, లైబ్రరీ, కల్యాణమండపం, గార్డెనింగ్‌ ఏర్పాటుచేస్తున్నారు. పోతన సమాధి, పోతన పొలం వద్ద బావిని సుందరీకరించి, ఆ ప్రాంతంలో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. అయన చాలా గొప్ప కవి అయన చాలా మంచి రచనలు రాసారు. వీరభద్ర విజయం, భోగినీ దండకం, శ్రీమదాంధ్రభాగవతం 8 స్కందాలు, నారాయణ శతకం మూలాలు బయటి లింకులు తెలుగు భాగవతం పోతన భాగవతం రాసింది ఒంటిమిట్టలోనే! - విద్వాన్ కట్టా నరసింహులు వ్యాసం సి. నారాయణ రెడ్డి వ్యాసం "కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే?" పద్యం మీద కె.వి.ఎస్. రామారావు వ్యాసం వర్గం:తెలుగు కవులు వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:భాగవతము వర్గం:హిందూమతం వర్గం:తెలంగాణ చారిత్రిక వ్యక్తులు వర్గం:సంస్కృతం నుండి తెలుగు లోకి అనువాదాలు చేసినవారు
అన్నమయ్య
https://te.wikipedia.org/wiki/అన్నమయ్య
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (1408, మే 9 - 1503, ఫిబ్రవరి 23 ) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు, గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా కొందరి అభిప్రాయం. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి. జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా అనేక రకాలైన శైలిలో పాటలు రాశాడు అన్నమయ్య. అన్నమయ్య పూర్వీకుల చరిత్ర "అన్నమాచార్య చరితము" ఆధారంగా right|150px|thumb|అన్నమయ్య left|150px|thumb|ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో అన్నమయ్య విగ్రహం అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి. నందవరీకుల గాధ నందవరీకులు సా.శ. 10వ శతాబ్దంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్ధవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. సా.శ. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రాహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచింది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. ఊరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒక బాలుడు జన్మిస్తాడని చెప్పిందట. అన్నమయ్య వంశీకులు భారద్వజ గోత్రులైన అన్నమయ్య పూర్వుల ప్రస్తావన నాలుగు తరాలకు సంబంధించిన వివరాలను చిన్నన్న అన్నమాచార్య ద్విపద వల్లను, అష్టమహిషి కల్యాణం వల్లను గ్రహించవచ్చును. భరద్వాజ ఋషి → నారాయణయ్య → విఠలయ్య → నారాయణయ్య → విఠలుడు → నారాయణుడు → నారాయణసూరి → అన్నమాచార్య అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి ల కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలజ్ఞులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్ధులు ప్రతి రోజూ పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామవాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లో నారాయణయ్య చాల ప్రసిద్ధుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పితృ పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటూ జీవితం గడిపేవారు. ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ధ ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్లా రాజంపేట తాలూకాలో ఉంది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నారాయణి మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచేసారు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం. నారాయణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచేసినందుకు మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయణుడు ఒంటరిగా గుడికి చేరి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా, నారాయణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకుబాబూ ఈ అఘాయిత్యం? నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి? వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయణయ్యను అనుగ్రహించి అంతర్థానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్ళపాక చేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయణయ్య కుమారుడే నారాయణసూరి. అన్నమయ్య తండ్రి - నారాయణసూరి అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాదురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నం తాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట. అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్ర వ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగదగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు. అన్నమయ్య జననం ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రణామం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట.కామిశెట్టి శ్రీనివాసులు రచన - అన్నమాచార్య (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ) అలా పుట్టిన శిశువే అన్నమయ్య. లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు. "అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్ఞుల విశ్వాసం. అన్నమయ్య బాల్యం "హరి నందకాంశజుం డగుట డెందమున పరమ సుగ్యాన సంపద పొదలంగ........." అన్నమయ్య బోసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటిమాటికీ వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు.ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు. అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు. అన్నమయ్యకు - అహినాయకాద్రి వెన్నుని వరముచే విద్య లన్నియును నమితంబు లగుచు జిహ్వరంగసీమ తము దామె సొచ్చి నర్తనమాడ దొడగె అన్నమయ్య ఆడిన మాటల్లా అమృతకావ్యంగ, పాడినదల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వేంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొదినది తన పదహారవ సంవత్సరంలోనే! వేంకటేశ్వరస్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకులమీద తొలి వ్యాక్యాలవల్ల కూడా స్పష్టమవుతున్నది. అన్నమయ్య ఏక సంథాగ్రాహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినవెంటనే అప్పచెప్పేవాడు. వాళ్లు ఆశ్చర్యపడేవాళ్లు. ఇంక అన్నమయ్యకు నేర్పించవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి "బుజ్జి కేశవా" అని పిలిచేవాడు. బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు చిరునవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెరువు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర పాడుతూంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడీ, తాళం వేసీ చూపేవాడు. "మీకేం తెలీదు పొ"మ్మని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవిల పాటల్లో జానపదులతో బాటు శ్రుతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ వూరి వాళ్లు ఎంతో సంబరిపడిపోయే వాళ్లు. నారాయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్థం లేనివి కావు. ఇంతలో తగువులాడతారు. అంతలో కలిసిపోతారు.అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలల్లో పనులు తప్పవు. అందుకనే అన్నమయ్య ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరు కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. "ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా? ఇంట్లో పనీపాటా ఎవరు చూస్తారు? "అని ఇంటివాళ్లు దెప్పి పొడిచారు. "గాలి పాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్." ఏ విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పనీచేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిటా చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు. అన్నమయ్యకు అడవికి వెళ్ళడం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే ఉంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి ఉంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లేచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి ఉంది. ’పాపవల్లరుల శ్రీపతినామహేతి నే పార దఋగు యోగీంద్రు చందమున ’ అంటూ కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్నా మనసంతా శ్రీహరి మీదనే ఉంది. అందుకే మరికొంత పచ్చికను కొయబోతున్న అన్నమయ్య ఒక్కసారి "అమ్మా!!" అని కేక పెట్టాడు. చిటికినవేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తనబంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి, భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తిరసావేశానికి నాంది పలికింది. "అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పని లేదనుకున్నాడు. "అయ్యోపోయ బ్రాయముగాలము మయ్యంచు మనసున నే మొహమతినెత్తి|| తగు బంధూలా తనకు దల్లులును దండ్రులును వగలబెట్టుచు దిరుగువారేకాక మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ దగిలించలేక చింతాపరుడనైతి || అని చింతించి...... "తల్లియుదండ్రియు దైవంబు గురువు నెల్ల సంపదలునై యెల్ల చందముల ననుబ్రోచు శెశాద్రినాధుని,గొలిచి మనియెద........." అని నిర్ణయించుకొంటాడు. తిరుమల పయనం అదే సమయాన తిరుమల వెళ్ళే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలొ వున్న కొడవలిని విసిరేసాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరోకారు, సనకాదులనే భక్తబృందం. వాళ్ల వేశం తమాషాగా వుంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము, ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టెనామాలు, శంఖ చక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలున్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెల మ్రోగిస్తూ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో "గోవిందా! గోవింద!"........ "వేడ్కుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని|| ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే వాడు తోమని పళ్యలవాడే దురితదూరుడే || ......." అంటూ చిత్రగతుల పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య. తిరుపతి పొలిమేరలోకల గ్రామసక్తి తాళ్ళపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేశాలమ్మ, కాళెమ్మ, నేరెళ్ళమ్మ, కావమ్మ, మారలయ్య అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు. పూర్వం తిరుపతికి వచ్చే భక్తబ్రుందం మొదట తాళ్ళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్సించే ఆచారం వుండేది. నేటికి తిరుపతిలో మేనెలలో గ్రామసఖ్తి గంగమ్మజాతర వైభవోపేతంగా జరుగుతుంది. గంగమ్మని దర్సించిన అనంతరం అన్నమయ్య - "అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము లందు వెలుగొంది ప్రభమీరగాను " అని ౧౦౮ తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు, దేశాంత్రుల మఠాలు, తపస్వుల గృహాలు, విశ్రాంతదేశాలను సందర్శిస్తాడు. తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అళిపురిసింగరి, తలయేరుగుండు, పెద్దయెక్కుడు, కపురంపు కాలువలను సందర్శిస్తాడు. ఇక్కడ అళిపురిసింగరి, తలయేరుగుండు, కురువమండపం, పెద్దయెక్కుడు, కపురంపు కాలువ, మోకాళ్ళముడుపులను గూర్చి వివరించడం సమంజసం. అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు. తిరుమల దర్శనం తన ఎనిమిదవ ఏట అన్నమయ్య ఒకనాడు ఎవరికీ చెప్పకుండా కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది.సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి సంపుటి, 1958 ప్రచురణ, పేజీ సంఖ్య 203 అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠగోపంతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు. thumbnail|అన్నమయ్య చిత్రపటం తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు. అళిపురిసింగరి(అలిపిరి) కొండ ఎక్కుటలో తొలిమెట్టుగల ప్రాంతం అళిపురి. అడిపడి, అలిపిరి అని కూడా పిలుస్తారు. అలిపిరి చేరాడు, అక్కడ వెలసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం. సంసారం, సంకీర్తనం అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి. రాజాశ్రయం విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట. అంత్య కాలం రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు. ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (1503 ఫిబ్రవరి 23) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి. ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట. అన్నమయ్య కీర్తనలు, రచనలు పూర్తి అన్నమాచార్య కీర్తనలు : అన్నమయ్య కీర్తనలు వికీసోర్స్ లో అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు. అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 14,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.) సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంథం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంథాలు లభించలేదు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిద్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే" అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు. ఉదాహరణలు "అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగల మయము." "అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల " "కులుకక నడవరో కొమ్మలాలా జలజల రాలీని జాజులు మాయమ్మకు" "క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం" "జోఅచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామ గోవింద " "చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ- పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా" ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడె అదనెరిగి రాడాయెనమ్మా నా విభుడు కవి కుటుంబం అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య. తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాథుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు. చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము. ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు. దొరికిన పెన్నిధి right|thumb|200px|తిరుమల సంకీర్తనా భండారంలో లభించిన రాగిరేకులలో ఒకటి 1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు) లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది. ప్రాజెక్టులు, సంస్మరణా కార్యక్రమాలు right|thumb|250px|2004 లో అన్నమయ్య స్మృత్యర్ధం విడుదల చేసిన తపాలా బిళ్ళ అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని, శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడింది. అన్నమాచార్య ప్రాజెక్టులో సంగీతం, పరిశోధన, ప్రచురణ, రికార్డింగ్‌ అనే మూడు భాగాలున్నాయి. యువకళాకారులను తయారు చేసే దిశగా సంగీత విభాగం పనిచేస్తుంది. పరిశోధన, ప్రచురణ విభాగంలో భాగంగా అన్నమాచార్య సంకీర్తనల మీద, అన్నమాచార్యుల జీవిత చరిత్ర మీద పరిశోధన చేసేవారికి ప్రోత్సాహం లభిస్తుంది. రికార్డింగు విభాగం ద్వారా అన్నమయ్య సంకీర్తనలను ఆడియో క్యాసెట్ల రూపంలో తయారుచేసి మార్కెట్టులో అమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహించే ధర్మ ప్రచార పరిషత్ తప్పితే మిగతా ప్రాజెక్టులన్నీ అన్నమాచార్య ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. అన్నమాచార్య ప్రాజెక్టుతో దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అవి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, భాగవత ప్రాజెక్టు, వేద రికార్డింగు ప్రాజెక్టు. అన్నమయ్య ఆరు వందల జయంతి సందర్భంగా తాళ్ళపాకలో 19-5-2008 నుండి 22-05-2008 వరకు వుత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 108 ఆడుగుల విగ్రహాన్ని 108 రోజులలో నిర్మించారు. తి.తి.దే వారు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య 12 వ తరము వారు అగర్బ దరిద్రములో కొట్టుమిట్టాడు తున్నారని, ప్రభుత్వము వారు పించన్లు ఏర్పాటు చెయ్యడానికి వొప్పుకొన్నారు. అన్నమయ్య సాహితీ సంపదను తరతరాల వారికి అందించ డానికి, వారి వంశస్థులను వినియోగించ వచ్చును. విశేషాలు అన్నమాచార్యులువారు రచించిన కీర్తనలు చాలావరకూ అదృశ్యం కాగా మనకు మిగిలిన కీర్తనలు 15 వేలు. బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ 600 సంవత్సరాలు క్రితమే మనషులంతా సమానమేనంటూ అన్నమయ్య సంకీర్తనలు రచించారు. అన్నమయ్య రచించిన కీర్తనలలో ఎక్కువగా శృంగార కీర్తనలే ఉన్నాయి. బాహ్య అర్థమొకటి, అంతరార్థమొకటి. ఆయన రచనల్లో కడప, రాయలసీమ యాస ఎక్కువగా ఉంటుంది. నిఘంటువు తయారు కావాలి కొందరు గాయకులు అన్నమయ్య పాటల ద్వారా ప్రసిద్ధులైన కొందరు గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ శోభారాజు కొండవీటి జ్యోతిర్మయి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి శ్రీ నల్లాన్‌చక్రవర్తుల బుచ్చయాచార్యులు. శ్రీ సత్తిరాజు వేణుమాధవ్ శ్రీ మోదుమూడి సుధాకర్ (AIR) శ్రీమతి టేకుమళ్ళ (పులిగండ్ల) చిదంబరి. షణ్ముఖప్రియ, హరిప్రియ (ప్రియ సిస్టర్స్) శ్రీ పప్పు సదాశివ శాస్త్రి ఇవి కూడా చూడండి సాహిత్యము తెలుగు అన్నమాచార్య ప్రాజెక్టు లక్షగళ సంకీర్తనార్చన అన్నమయ్య పాటలు వికీసోర్స్ లో అన్నమయ్య కీర్తనలు వికీసోర్స్ లో అన్నమయ్య కీర్తనల వ్యాఖ్యాతలు: శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు, శ్రీ కామిసెట్టి శ్రీనివాసులు, శ్రీ తాడేపల్లి పతంజలి, శ్రీ జి.బి శంకర రావు, శ్రీగరికపాటి వెంకట్, శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య. చిత్రాలు మూలాలు వనరులు అన్నమాచార్య - కామిశెట్టి శ్రీనివాసులు - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ (2006) - (తెలుగు వైతాళికులు సిరీస్ ప్రచురణలో భాగంగా) తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు (2006) https://web.archive.org/web/20050227080722/http://www.geocities.com/hkssv/annamayya.html శ్వాస - Sri Venkateswara Annamacharya Society of America (SVASA) బయటి లింకులు తాళ్ళపాక కవులకు సంబంధించిన కొన్ని రచనలు, పరిశోధనా గ్రంథాలు ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్నాయి. అన్నమయ్య దర్శించిన ఆలయాలు “ఆంధ్రభారతి”లో తి.తి.దే. 29 సంపుటములలో ప్రచురించిన అన్నమాచార్యుల, పెదతిరుమలాచార్యుల, చినతిరుమలాచార్యుల 14,911 సంకీర్తనలు. అన్నమాచార్య సంకీర్తన సుధ - ఆచార్య ఎస్. గంగప్ప అన్నమాచార్య, ప్రముఖ వాగ్గేయ కారులు - తులనాత్మ అధ్యయనం - - ఆచార్య ఎస్. గంగప్ప Sri Annamacharya - A Philosophical Study - H. Chandra Sekhara నందక విజయము లేక అన్నమాచార్య చరిత్ర - నాటక రూపము - రామాయణం వేంకట నారాయణ రాజు శ్రీ అన్నమాచార్య సంకీర్తనా మంజరి (తమిళం) మహాభక్త అన్నమాచార్య (నాటకం) - గూడూరు చిన్న పెంచల్ రాజు (తాళ్ళపాక) అన్నమయ్య పదసౌరభము - 1 స్వరకర్త : నేదునూరి కృష్ణమూర్తి అన్నమయ్య శృంగార సంకీర్తనలలో స్త్రీ ధర్మాలు - డా. పొన్నా లీలావతమ్మ అన్నమయ్య - డా ముట్నూరి సంగమేశం (యువభారతి ప్రచురణ) శృంగార సంకీర్తనలు (తాళ్ళపాకవారి గేయములు 12వ భాగం - రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ పరిష్కృతం - తి.తి.దే. ప్రచురణ పరమయోగి విలాసము - తాళ్ళపాక తిరువేంగళనాధుని ద్విపద కావ్యము - తి.తి.దే. ప్రచురణ - వి.విజయరాఘవాచార్య పరిష్కరించినది (1938) శ్రీ అన్నమాచార్యుని శృంగార సంకీర్తనలు - మధుర భక్తి - డా. అంగలూరి శ్రీరంగాచారి - పరిశోధనా గ్రంథము - తాళ్ళపాక చిన్నన్న - సాహిత్య సమీక్ష - డా. శ్రీమత్తిరుమల వెంకట రాజగోపాలాచార్య అన్నమాచార్యులు - చిల్లర భవాని (సంక్షిప్త పరిచయం, బొమ్మలతో) అన్నమయ్య కీర్తనల బ్లాగు అన్నమయ్య కీర్తనల బ్లాగు అన్నమయ్య పదమంజరి గూగుల్ బృందము అన్నమయ్య పాటల వెబ్ సైట్ (కొన్ని పాటలు .వేవ్ ఫార్మాట్లో డౌనులోడు చేసుకోవచ్చు) అన్నమయ్య పాటల సాహిత్యం శ్వాస - Sri Venkateswara Annamacharya Society of America (SVASA) అన్నమయ్య కీర్తనలు అన్నమయ్య కీర్తనల బ్లాగు 1 అన్నమయ్య కీర్తనల బ్లాగు 2 అన్నమయ్య కీర్తనల బ్లాగు అన్నమయ్య పదమంజరి గూగుల్ బృందము అన్నమయ్య పాటల వెబ్ సైట్ (కొన్ని పాటలు .వేవ్ ఫార్మాట్లో డౌనులోడు చేసుకోవచ్చు) డి.ఎల్.ఐలో ఆధ్యాత్మిక సంకీర్తనలు గ్రంధప్రతి అన్నమయ్య ఆధ్యాత్మికానంద లహరి - Tekumalla Venkatappaiah - http://maalika.org/magazine అన్నమయ్య శృంగార నీరాజనం - Tekumalla Venkatappaiah - http://sujanaranjani.siliconandhra.org వర్గం:సంగీతకారులు వర్గం:కర్ణాటక సంగీత విద్వాంసులు వర్గం:తెలుగు కవులు వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:1408 జననాలు వర్గం:1503 మరణాలు వర్గం:సంకీర్తనలు వర్గం:వాగ్గేయ కారులు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:కడప జిల్లా కవులు వర్గం:ఈ వారం వ్యాసాలు
తాళ్ళపాక తిమ్మక్క
https://te.wikipedia.org/wiki/తాళ్ళపాక_తిమ్మక్క
తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మ తొలి తెలుగు కవయిత్రి. వీరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఇల్లాలు, మొదటి భార్య. ఈమె నన్నయ భారతము ఆధారముగా 1163 పాదాలతో సుభద్రా కల్యాణము అనే ద్విపద కావ్యము రాసినది. ప్రథమాంధ్ర భాషా కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. మహాకవి, వాగ్గేయకారుడు అయిన అన్నమయ్య ఇల్లాలు తిమ్మక్క అని వేటూరి ప్రభాకరశాస్త్రి గారి నిర్ణయం. ఈమె సుభద్రా కల్యాణం అనే కావ్యాన్ని రచించింది. సుభద్రా కల్యాణానికి ఆధారం నన్నయ భారతమే. నన్నయ ఆది పర్వంలో 135 గద్య పద్యాలలో విజయ విలాసం రచించాడు. అతనిని అనుసరిస్తూ తిమ్మక్క 1163 పాదాల ద్విపద కావ్యాన్ని రచించింది. కడుమంచి తేటపలుకులతో చెప్పిన పాటగా తన కావ్యాన్ని పేర్కొంది. కొన్ని కొన్ని ఘట్టాలలో నన్నయలాగానే మూలాతిక్రమణం చేసింది. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ - అమర అహోబళంబా వెంకటాద్రి వరుస నాపై కంచి వరదుల గొలిచె-అని తిరుపతి వెంకటేశ్వరులకు అర్జునునిచేత మొక్కులందించింది. నన్నయ మహాభారతంలో లేని బావా మరదుల హాస్యం తిమ్మక్క సుభద్రా కల్యాణంలో నింపి రచించింది. సుభద్ర పాత్రను సమయోచితంగా తీర్చిదిద్దింది. సుభద్ర చేత ఈడుకు తగిన ఆటలు ఆడించింది. చేమకూర వెంకటకవి తన విజయ విలాసంలో తిమ్మక్కను అనుసరించాడు. సుభద్ర అర్జునుని వర్ణించిన సందర్భంలో రచించిన- "ఎగుభుజమ్ములవాడు మృగరాజు నడుము నడచి పుచ్చుకొను నెన్నడుము గలవాడు" - అన్న తిమ్మక్క రచనను చేమకూర వెంకటకవి - "ఎగుభుజములవాడు మృగరాజ మధ్యంబు పుదికి పుచ్చుకొను నెన్నడుమువాడు"- అనుసరించాడు. సుభద్రా కల్యాణం స్త్రీలకోసం స్త్రీ రచించిన గ్రంథం అన్న విషయం కావ్యాన్ని చదివితే అర్థమవుతుంది. సుభద్రా కల్యాణాన్ని తిమ్మక్క రచించలేదన్న వాదోపవాదాలు పండితలోకంలో ఉన్నాయి. తాళ్లపాక వంశవృక్షం బయటి లింకులు తెలుగు కవయిత్రుల గురించి ఒక గొప్ప జాబితా తెలుగు కవయిత్రుల జాబితా గత 1000 సంవత్సరాలలో తెలుగు కవయిత్రులు తాళ్ళపాక వారి కుటుంబము మీద తిరుమల తిరుపతి దేవస్థానము వారి వ్యాసము తాళ్ళపాక తిమ్మక్క వర్గం:తెలుగు కవయిత్రులు వర్గం:తెలుగు రచయిత్రులు వర్గం:కడప జిల్లా కవయిత్రులు
మధుబాబు
https://te.wikipedia.org/wiki/మధుబాబు
మధుబాబుగా ప్రసిద్ధుడైన వల్లూరు మధుసూదన రావు ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఎక్కువగా పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవలలు ప్రచురించాడు. వీరి చాలా నవలలో షాడో కథానాయకుడిగా కనిపిస్తాడు. కొన్ని నవలలలో వాత్సవ్‌ని కూడా కథానాయకుడిగా చేసి రాస్తూ ఉంటారు. ఈయన రచనా శైలిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ విషయాన్ని రచయతగా చెప్పారు. దానిని కథ లోని పాత్రలు మాట్లాడుకునేటట్లు చేస్తారు. ఈయన వ్రాసిన జానపద నవలలు కూడా ఇంతే స్థాయిలో చదువరులను ఆకట్టుకున్నాయి. విజయవాడకు దగ్గరున్న హనుమాన్ జంక్షన్కు చెందిన ఈయన 100కి పైగా నవలలను ప్రచురించాడు. ఈయన నవలలు ప్రాచుర్యము పొందడానికి పాత్రలలోని మానవీయత, హాస్యమేనని పాఠకులు భావిస్తారు. ప్రారంభదశలో మధుబాబు నవలలు మద్రాసులోని ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్ ప్రచురించింది. ఆ తరువాత ఈయన మధుబాబు పబ్లికేషన్స్ పేరుతో సొంత ప్రచురణాలయము ప్రారంభించారు. మధుబాబు నవలలు స్వాతి వార పత్రికలో చాలా సంవత్సరాలు వారం వారం ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి వారి నవ్య వీక్లీలో మధుబాబు నవలలు ధారావాహికలుగా ప్రచురించబడుతున్నాయి. మధుబాబు చాలా కాలం వరకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈమధ్యనే పదవీ విరమణ చేసారు. మెర్కురి ఎంటర్‌టైన్‌మెంట్ అనే చలన చిత్ర నిర్మాణ సంస్థకి ఒక కథను సమకూర్చారు. ఈయన పేరుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా మధుబాబును అనుకరిస్తూ మధురబాబు, శ్రీ మధుబాబు వంటి రచయితలు వెలశారు. బాల్యం, విద్యాభ్యాసం మధుబాబు జులై 6, 1948 న కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు గ్రామంలో జన్మించాడు. సూర్యనారాయణ రావు, భారతి ఈయన తల్లిదండ్రులు. తండ్రి కరణంగా పనిచేసేవాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. మధుబాబుకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. ఏడో తరగతి వరకు తోట్లవల్లూరు లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. చదువు అనుకున్నట్టుగా సాగకపోవడంతో తండ్రి ఈయనను ఎ. కొండూరు మండలం, కంభంపాడు గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబాయి దగ్గరకు పంపించాడు. అక్కడ చదువుతున్నప్పుడే నాటకాలమీద, సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడ్డాయి. ఎస్. ఎస్. ఎల్. సి కోసం మళ్ళీ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తండ్రి స్వతహాగా సాహిత్యాభిమాని. ఆయన ఎక్కువగా శరత్ సాహిత్యం చదివేవాడు. వీరి ఇంట్లో సుమారు 2000 దాకా పుస్తకాలు ఉండేవి. మధుబాబు వీటిలో చాలా పుస్తకాలు చదివాడు. మచిలీపట్నంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాడు. కానీ ఆ వృత్తిలో ఎదుగుదల ఉండదని మొదట్లో అందులో చేరలేదు. వృత్తి హైదరాబాదులో దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభ లో అకౌంటెంట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి కళాశాలలో చదువుతూ పి. యు. సి, తర్వాత బి. కాం పూర్తి చేశాడు. తన పని చేసే చోటనే ఉన్న గ్రంథాలయంలో చాలా పుస్తకాలు చదివాడు. కొద్దికాలం హైదరబాదు రిజర్వు బ్యాంకులో కాయిన్, నోట్ ఎక్జామినర్ కూడా పనిచేశాడు. అదే సమయంలో నాటకాల మీద ఆసక్తితో చాలా నాటకాల్లో పాల్గొన్నాడు. జీవితంలో ఏదో సాధించాలనే తపనతో అనేక ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టాడు. 1972 నాటికి మద్రాసు చేరుకున్నాడు. అక్కడే రచనలు మొదలు పెట్టాడు. తన మొదటి రచన ప్రారంభించక మునుపే ఎం. వి. ఎస్. పబ్లిషర్స్ అనే సంస్థకు వెళ్ళి తన దగ్గర ఒక నవల ఉన్నదనీ ప్రచురిస్తారా అని అడిగాడు. విషయం బాగుంటే ప్రచురిస్తామన్నారు వాళ్ళు. దాని తర్వాత ఆయన కేవలం మూడు రోజుల్లో వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్ అనే నవలను రాసి వారికి ఇచ్చాడు. ఇది 15 సార్లు పునర్ముద్రితమైంది. ఆయన అందుకున్న తొలి పారితోషికం 50 రూపాయలు. ఈయన రచయిత కావడం వెనుక స్నేహితుడు బొర్రా సుబ్బారావు ప్రోత్సాహం ఉంది. ఈయన మధుబాబును మరిన్ని రచనలు చేసేలా ప్రోత్సహించాడు. నవలలు రాస్తూ దాదాపు ఏడు సంవత్సరాల పాటు మద్రాసులో గడిపి రచయితగా మంచి గుర్తింపు సాధించాడు. తర్వాత 1979 లో స్వస్థలానికి తిరిగి వచ్చి తనకున్న విద్యార్హతలతోనే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఉద్యోగంలో కొనసాగుతూనే ఖాళీ సమయాల్లో తన రచనా ప్రస్థానం కొనసాగించాడు. పుస్తక పఠనం అనే అలవాటు మరుగున పడిపోయిన నేటి అంతర్జాల యుగంలో కొత్త తరానికి తన రచనలను దగ్గర చేద్దామనే ఉద్దేశ్యంతో ఇటీవలే 'షాడో మధుబాబు (అఫిషియల్) ఆడియోబుక్స్' అనే యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించారు. రచనలు + మధుబాబు రచనలు రచన పేరు విభాగం ప్రచురణ పబ్లికేషన్ సంవత్సరం2 మైల్స్ టు ది బోర్డర్పాస్ట్ లైఫ్డైరెక్ట్ఎం.వి.యస్అతనుక్రైమ్స్వాతిశ్రీ శ్రీనివాసాఅపరిచితుడుక్రైమ్స్వాతిశ్రీ శ్రీనివాసాఆనందజ్యోతిజానపదంస్వాతిశ్రీ శ్రీనివాసాఆపరేషన్ అరిజోనాషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1976ఆపరేషన్ కాబూల్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1992ఆపరేషన్ కౌంటర్ స్పైషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ఆపరేషన్ డబుల్‌క్రాస్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ఆపరేషన్ బెంగాల్ టైగర్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఆర్తిక్రైమ్డైరెక్ట్సత్యవాణిఇన్స్‌పెక్టర్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ఎ జర్నీ టు హెల్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ హర్రర్స్ ఆఫ్ డార్క్‌నెస్ (భాగం-3)షాడో ఎడ్వెంచర్, హర్రర్డైరెక్ట్ఎం.వి.యస్1985ఎ బుల్లెట్ ఫర్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ఎ మినిట్ ఇన్ హెల్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ఎసాల్ట్ ఆన్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిఎసైన్‌మెంట్ కరాచీషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ఎసైన్‌మెంట్ లవ్‌బర్డ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1992 హర్రర్స్ ఆఫ్ డార్క్‌నెస్ (భాగం-2)షాడో ఎడ్వెంచర్, హర్రర్డైరెక్ట్ఎం.వి.యస్కంకణ రహస్యంవాత్సవ & శ్యామ్డైరెక్ట్ కాళికాలయం (భాగం-2)జానపదండైరెక్ట్ఎం.బికమాండర్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ కాళికాలయం (భాగం-3)జానపదండైరెక్ట్ఎం.బికార్నివాల్ ఫర్ కిల్లర్స్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్కాల కన్యజానపదండైరెక్ట్ఎం.వి.యస్కాల నాగుజానపదండైరెక్ట్ఎం.వి.యస్కాళికాలయం (భాగం-1)జానపదండైరెక్ట్ఎం.బికిల్ క్విక్ ఆర్ డైషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1979కిల్ దెమ్ మిష్టర్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్కిస్ కిస్ కిల్ కిల్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్కిస్ మి డార్లింగ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1973కెండో వారియర్షాడో ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.బికౌంటర్ ఫీట్ కిల్లర్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్క్రైమ్ కార్నర్క్రైమ్డైరెక్ట్సత్యవాణిగండు చీమజానపదండైరెక్ట్ఎం.వి.యస్గన్ ఫైట్ ఇన్ గ్రీన్‌లాండ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్గన్స్ ఇన్ ది నైట్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్గోల్డెన్ రోబ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిగ్రనేడ్ గ్రూప్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ఘర్షణవాత్సవ & శ్యామ్శ్రీ శ్రీనివాసాచక్రతీర్థంక్రైమ్స్వాతిశ్రీ శ్రీనివాసాచతుర్నేత్రుడు (భాగం-1)జానపదంస్వాతిశ్రీ శ్రీనివాసాచతుర్నేత్రుడు (భాగం-2)జానపదంస్వాతిశ్రీ శ్రీనివాసాచిచ్చర పిడుగుషాడో ఎడ్వెంచర్డైరెక్ట్చైనీస్ పజిల్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1980చైనీస్ బ్యూటీషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1977చైనీస్ మాస్క్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిజాగ్వార్ జస్వంత్జానపదండైరెక్ట్ఎం.వి.యస్1977జూనియర్ ఏజెంట్ శ్రీకర్శ్రీకర్ ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.వి.యస్జ్వాలాముఖివాత్సవ & శ్యామ్డైరెక్ట్శ్రీ శ్రీనివాసాటాప్ సీక్రెట్టార్గెట్ ఫైవ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్టార్గెట్... షాడోషాడో స్పై థ్రిల్లర్స్వాతిసత్యవాణి2021టెంపుల్ ఆఫ్ డెత్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్టెన్ ఎగైనెస్ట్ షాడో (భాగం - 1)షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిటెన్ ఎగైనెస్ట్ షాడో (భాగం - 2)షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిటెర్రర్ ఐలండ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1987టెర్రా 205 (భాగం-1)షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్టెర్రా 205 (భాగం-2)షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్టేస్ట్ ఫర్ డెత్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిటైగర్ మున్నాషాడో ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.వి.యస్టైగర్ వాత్సవవాత్సవ & శ్యామ్శ్రీ శ్రీనివాసాడర్టీ డెవిల్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్డాక్టర్ జీరోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్డాక్టర్ శ్రీకర్ ఎంబిబియస్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిడాక్టర్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బి చిచ్చర పిడుగు (భాగం-2)షాడో ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.వి.యస్డియర్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్డెడ్లీ స్పై (భాగం-1)షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ డెడ్లీ స్పై (భాగం-2)షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్డెత్ వారెంట్క్రైమ్డైరెక్ట్సత్యవాణిడెవిల్స్ ఇన్ నికోబార్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1974డెవిల్స్ డిన్నర్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్డేంజరస్ గేమ్ (భాగం-1)షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిడేంజరస్ గేమ్ (భాగం-2)షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిడేంజరస్ డయబాలిక్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1986డేర్ డెవిల్వాత్సవ & శ్యామ్నవ్య2015డైనమైట్ డోరాషాడో స్పై థ్రిల్లర్డౌన్ స్ట్రీట్ మిస్టరీక్రైమ్డ్యుయల్ ఎట్ డబుల్ రాక్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1982ది కర్స్ ఆఫ్ కుంగ్‌ఫూపాస్ట్ లైఫ్ఎం.బిది కిల్లర్ ఫ్రం సిఐబిషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ది గర్ల్ ఫ్రం సిఐబి-ది బ్రెయిన్ వాషర్స్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్దుర్మార్గుడుపాస్ట్ లైఫ్నవ్యసత్యవాణి2019దొంగ... దొంగ... దొంగ పట్టుకోండి... పట్టుకోండిషాడో ఎడ్వెంచర్స్వాతి2010నందినివాత్సవ & శ్యామ్సత్యవాణినరుడుజానపదంనవ్య2014నల్లతాచుషాడో ఎడ్వెంచర్నిశాచరుడుజానపదంనవ్య2018నిశ్శబ్దనాదంవాత్సవ & శ్యామ్నవ్య2013నెంబర్ 28షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్నెవర్ లవ్ ఎ స్పైషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్నైట్ వాకర్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బి1993పాముక్రైమ్డైరెక్ట్పులి మడుగుక్రైమ్డైరెక్ట్సత్యవాణిప్రొఫెసర్ షాడో-ప్లీజ్ హెల్ప్ మిహర్రర్డైరెక్ట్ఎం.వి.యస్ఫినిషింగ్ టచ్వాత్సవ & శ్యామ్ఫిస్ట్ ఆఫ్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిఫైటింగ్ ఫూల్పాస్ట్ లైఫ్డైరెక్ట్ఎం.బిఫైటింగ్ ఫోర్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిఫైనల్ వార్నింగ్క్రైమ్ఫ్లయింగ్ ఫాల్కన్షాడో ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.వి.యస్1977ఫ్లయింగ్ బాంబ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్ఫ్లయింగ్ హార్స్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిబంజాయ్పాస్ట్ లైఫ్డైరెక్ట్ఎం.బి1982బద్మాష్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్బఫెలో హంటర్స్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1979బర్మా డాల్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిబాబాపాస్ట్ లైఫ్డైరెక్ట్ఎం.బిబాబింగ్ స్క్వాడ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్బైరాగిక్రైమ్స్వాతిశ్రీ శ్రీనివాసాబొమ్మవాత్సవ & శ్యామ్శ్రీ శ్రీనివాసాబ్రోకెన్ రివాల్వర్షాడో స్పై థ్రిల్లర్బ్లడీ బోర్డర్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్బ్లడ్ హౌండ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్భవానిక్రైమ్డైరెక్ట్మధుప్రియ2007భోలా శంకర్ (భాగం-1)పాస్ట్ లైఫ్స్వాతిఎం.బిభోలా శంకర్ (భాగం-2)పాస్ట్ లైఫ్స్వాతిఎం.బిమచ్చల గుర్రంజానపదంమధుమాలినిజానపదంఎం.బిమరకత మంజూష (బాగం-1)జానపదంనదిమధుప్రియ2017మరకత మంజూష (బాగం-2)జానపదంనదిమధుప్రియ2017మర్డరింగ్ డెవిల్స్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్1983మిడ్‌నైట్ ఎడ్వెంచర్ (భాగం-1)పాస్ట్ లైఫ్స్వాతిఎం.బిమిడ్‌నైట్ ఎడ్వెంచర్ (భాగం-2)పాస్ట్ లైఫ్స్వాతిఎం.బిమిడ్‌నైట్ ప్లస్ ఒన్ (భాగం-1)షాడో స్పై థ్రిల్లర్స్వాతిఎం.బిమిడ్‌నైట్ ప్లస్ ఒన్ (భాగం-2)షాడో స్పై థ్రిల్లర్స్వాతిఎం.బిమిషన్ టు పెకింగ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిమిస్సింగ్ నెంబర్క్రైమ్ఎం.బిమేరా నామ్ రజూలాషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్యక్షకన్యజానపదంయముడుషాడో ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.బిరన్ ఫర్ ది బోర్డర్షాడో ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.వి.యస్రన్ ఫర్ ది హైలాండ్స్షాడో ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.వి.యస్రన్ షాడో రన్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్రహస్యంక్రైమ్రివెంజ్ రివెంజ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్రుద్రనాగుజానపదంరుద్రభూమిక్రైమ్సత్యవాణిరుద్రాణిషాడో ఎడ్వెంచర్రుద్రుడుజానపదంరెడ్ అలెర్ట్క్రైమ్రెడ్ షాడో (భాగం-1)షాడో ఎడ్వెంచర్రెడ్ షాడో (భాగం-2)షాడో ఎడ్వెంచర్రెడ్ సిల్వర్క్రైమ్సత్యవాణిలైసెన్స్ టు కిల్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్లోన్ వోల్ఫ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్వన్స్ ఎగైన్ షాడోపాస్ట్ లైఫ్సత్యవాణివాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్విప్లవం వర్థిల్లాలిషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్వెన్నెల మడుగుక్రైమ్డైరెక్ట్సత్యవాణిశంకర్ దాదా (బాగం-1)క్రైమ్స్వాతిశంకర్ దాదా (బాగం-2)క్రైమ్స్వాతిశశిబాలజానపదండైరెక్ట్ఎం.వి.యస్శిక్ష (భాగం-1)క్రైమ్స్వాతిశిక్ష (భాగం-2)క్రైమ్స్వాతిశివంగిజానపదండైరెక్ట్సత్యవాణిశివుడు (భాగం-1)క్రైమ్శివుడు (భాగం-2)క్రైమ్శ్రావణివాత్సవ & శ్యామ్షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.బిషాడో ఇన్ కొచ్చిన్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో ఇన్ జపాన్షాడో ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో ఇన్ ది జంగిల్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో ఇన్ బాగ్దాద్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో ఇన్ బోర్నియోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో ఇన్ సిక్కింషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో ఇన్ హైదరాబాద్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో ది ఎవెంజర్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో ది స్పై కింగ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో వస్తున్నాడు జాగ్రత్తషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్షాడో! షాడో!! (భాగం-1)పాస్ట్ లైఫ్స్వాతిఎం.బి2004షాడో! షాడో!! (భాగం-2)పాస్ట్ లైఫ్స్వాతిఎం.బి2004షాడో!షాడో!!షాడో!!!షాడో ఎడ్వెంచర్డైరెక్ట్ఎం.వి.యస్సాధనవాత్సవ & శ్యామ్1985సాలభంజికవాత్సవ & శ్యామ్శ్రీ శ్రీనివాసాసి.ఐ.డి. షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్సిల్వర్ కింగ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్సిసీలియన్ ఎడ్వెంచర్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్సీక్రెట్ ఏజెంట్ మిష్టర్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్సెవెన్త్ కిల్లర్షాడో స్పై థ్రిల్లర్ఎం.బిసైంటిస్ట్ మిస్ మాధురిషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్సైంటిస్ట్ షాడోషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్స్టార్ ఫైటర్పాస్ట్ లైఫ్నవ్య2017స్పందనక్రైమ్ఎం.బిస్పైడర్ వెబ్షాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్స్వర్ణ ఖడ్గం (భాగం-1)జానపదంస్వాతిస్వర్ణ ఖడ్గం (భాగం-2)జానపదంస్వాతిహంటర్ షాడోషాడో స్పై థ్రిల్లర్నవ్యమధుప్రియహర్రర్స్ ఆఫ్ డార్క్‌నెస్ (భాగం-1)షాడో ఎడ్వెంచర్, హర్రర్హూ ఆర్ యూషాడో స్పై థ్రిల్లర్డైరెక్ట్ఎం.వి.యస్హెచ్చరికవాత్సవ & శ్యామ్శ్రీ శ్రీనివాసా టీవీ ధారావాహికలు చక్ర తీర్థం (ఈ టీవీ) కాళికాలయం ( జెమిని టీవీ) శంకర్ దాదా శిక్ష మూలాలు బయటి లింకులు వర్గం:తెలుగు నవలా రచయితలు వర్గం:1948 జననాలు వర్గం:జీవిస్తున్న ప్రజలు
యండమూరి వీరేంద్రనాథ్
https://te.wikipedia.org/wiki/యండమూరి_వీరేంద్రనాథ్
యండమూరి వీరేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు.యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం ఈయన తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. బాల్యం, విద్యాభ్యాసం యండమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు. ఉద్యోగం వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూరి ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు చిన్న తరహా పరిశ్రమల విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కుటుంబం ఆయనకు 10-03-1974 లో అనుగీతతో వివాహం జరిగింది. వారి కుమారుడి పేరు ప్రణీత్. పురస్కారాలు రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి 1982 లో సాహిత్య అకాడెమీ అవార్డు 1996 లో వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహికకు ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం. రచనా శైలికి ఉదాహరణలు వివిధ నాటకాలు, నాటికలు, నవలలు, సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో ఈయన వ్రాసిన ఈ పంక్తులు, చెప్పిన మాటలు ఈయన శైలి ఏమిటో చెబుతాయి. ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు! ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే! నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం. మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి. వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది? దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు. దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒక గీతకి కేవలం అటూ ఇటూ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం. కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!! జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది. ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు. విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా? దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో. అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్చిన ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది. thumb|మైండ్ పవర్ బుక్ కవర్ యండమూరి పుస్తకాలు (ఫిక్షన్) వీళ్ళనేం చేద్దాం? డేగ రెక్కల చప్పుడు ఒక వర్షాకాలపు సాయంత్రం రెండు గుండెల చప్పుడు వెన్నెల్లో ఆడపిల్ల ఆనందో బ్రహ్మ అంతర్ముఖం డబ్బు టు ది పవరాఫ్ డబ్బు కాసనోవా 99 డబ్బు మైనస్ డబ్బు తులసీ దళం తులసి అష్టావక్ర ప్రియురాలు పిలిచె ది డైరీ ఆఫ్ మిసెస్ శారద మరణ మృదంగం రాక్షసుడు ప్రేమ ధ్యేయం అనైతికం అతడే ఆమె సైన్యం లేడీస్ హాస్టల్ చీకట్లో సూర్యుడు థ్రిల్లర్ అతడు ఆమె ప్రియుడు సిగ్గేస్తోంది అంకితం మరో హిరోషిమా ప్రార్థన పర్ణశాల వెన్నెల్లో గోదారి మంచు పర్వతం 13-14-15 అభిలాష నల్లంచు తెల్లచీర చెంగల్వ పూదండ అగ్ని ప్రవేశం భార్యా గుణవతి శత్రు స్వర భేతాళం దుప్పట్లో మిన్నాగు యుగాంతం ఋషి క్షమించు సుప్రియా! నిశ్శబ్థం-నీకూ నాకూ మధ్య రాధ - కుంతి ఒక రాధ, ఇద్దరు కృష్ణులు రక్త సింధూరం ఆఖరి పోరాటం స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్ అభిషిక్తం....ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్ యండమూరి పుస్తకాలు (నాన్‌- ఫిక్షన్) భేతాళ ప్రశ్నలు ఇడ్లీ-వడ-ఆకాశం - తరువాత దీని పేరును "ఇడ్లి - ఆర్కిడ్ - ఆకాశం" మార్చారు. విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథకు ఇది స్వేచ్ఛానువాదం. మంచుపూల వర్షం విజయ రహస్యాలు తప్పు చేద్దాం రండి విజయానికి ఆరో మెట్టు విజయానికి ఐదు మెట్లు మైండ్ పవర్ - నెం.1 అవటం ఎలా? విజయంలో భాగస్వామ్యం చదువు - ఏకాగ్రత పిల్లల పేర్ల ప్రపంచం విజయం వైపు పయనం మిమ్మల్ని మీరు గెలవగలరు మీరు మంచి అమ్మాయి కాదు మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే? గ్రాఫాలజీ పడమటి కోయిల పల్లవి మంచి ముత్యాలు పాపులర్ రచనలు చేయడం ఎలా? లోయనుంచి శిఖరానికి సినిమాలుగా వచ్చిన యండమూరి నవలలు నవల పేరుసినిమా పేరువెన్నెల్లో ఆడపిల్లహలో ఐ లవ్ యూతులసిదళంతులసిదళంతులసికాష్మోరాఅభిలాషఅభిలాషడబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బుఛాలెంజ్అగ్నిప్రవేశంఅగ్నిప్రవేశంఆఖరి పోరాటంఆఖరి పోరాటంమరణ మృదంగంమరణ మృదంగంనల్లంచు తెల్లచీరదొంగమొగుడు*ఒక రాధ-ఇద్దరు కృష్ణులుఒక రాధ-ఇద్దరు కృష్ణులుస్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్రుద్రనేత్రరుద్రనేత్రరాక్షసుడురాక్షసుడుధ్రిల్లర్ముత్యమంత ముద్దుఅంతర్ముఖం సంపూర్ణ ప్రేమాయణం దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచు తెల్లచీర నవల వ్రాయబడింది. రెండింటి మధ్య చాలా తేడాలు (పాత్రలు, కథ) ఉన్నాయి. వ్యక్తిత్వ వికాస రచనలు విజయానికి అయిదు మెట్లు విజయానికి ఆరవ మెట్టు చిన్న కథలు....విజయానికి ఆరవ మెట్టు విజయ రహస్యాలు మీరు మంచి అమ్మాయి కాదు మిమ్మల్ని మీరు గెలవగలరు, మిమ్మల్ని మీరు గెలవగలరు (అర్కీవ్.అర్గ్ లో పుస్తకం) విజయంలో భాగస్వామ్యం విజయం వైపు పయనం విజయం వైపు పయనం..దిగులు అంటే ఏమిటి మైండ్ పవర్ నెంబర్ ఒన్ అవడం ఎలా? గ్రాఫాలజీ తప్పు చేద్దాం రండి నాటికలు కుక్క మనుషులోస్తున్నారు జాగ్రత్త చీమకుట్టిన నాటకం రుద్రవీణ ఇతర రచనలు చదువు ఏకాగ్రత మంచి ముత్యాలు (కొటేషన్స్) పడమటి కోయిల పల్లవి (కవిత్వం) పిల్లల పేర్ల ప్రపంచం పాపులర్ రచనలు చేయడం ఎలా? మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే? మిమ్మల్ని పిల్లలు ప్రేమించాలంటే (అర్కీవ్.అర్గ్ లో పుస్తకం) మంచి రచనలు చేయడం ఎలా? సినిమా మాటల/స్క్రీన్ ప్లే రచయితగా కొండవీటి దొంగ అభిలాష మంచు పల్లకి స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ - కథ ప్రియరాగాలు - కథ అనామిక సినీ దర్శకుడిగా అగ్నిప్రవేశం స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ దుప్పట్లో మిన్నాగు (2019) అతడు ఆమె ప్రియుడు (2022) నటుడిగా విలేజ్ లో వినాయకుడు బన్నీ అండ్ చెర్రీ (2013) బయటి లింకులు యండమూరి వీరేంద్రనాథ్ అధీకృత వెబ్సైటు imdb లొ యండమూరి యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు యండమూరి ఫెస్ బుక్ యండమూరి ట్విట్టర్ యండమూరి అంతర్ముఖం సినిమా మూలాలు వర్గం:తెలుగు నవలా రచయితలు వర్గం:1948 జననాలు వర్గం:జీవిస్తున్న ప్రజలు వర్గం:తూర్పు గోదావరి జిల్లా సినిమా నటులు వర్గం:తూర్పు గోదావరి జిల్లా సినిమా రచయితలు వర్గం:తూర్పు గోదావరి జిల్లా రచయితలు వర్గం:తూర్పు గోదావరి జిల్లా సినిమా దర్శకులు
వేమన
https://te.wikipedia.org/wiki/వేమన
వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగు వారికి సుపరిచితాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు. వేమన ఏ కులానికి చెందినవాడు అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. CP బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు. జీవితం వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఎన్. గోపి పరిశోధనలు చేశారు. వేమన పద్యాలలో అతని జీవితం వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదహరిస్తారు. నందన సంవత్సరమున పొందుగ కార్తీకమందు బున్నమినాడీ వింధ్యాద్రి సేతువులకును నందున నొక వీరు డేరుపడెరా వేమా! ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి మూకచింతపల్లె మొదటి వీడు అరశి చూడ బయలు అది ముక్తి శివుడయా విశ్వదాభిరామ వినురవేమ! </div> బండారు తమ్మయ్య విశ్లేషణ ప్రకారం వేమన పూర్వులు మొదట మూగచింతపల్లి ఇల్లుగా కలవారు. వేమన కాలంనాటికి వారి ఊరు కొండవీడు. పశ్చిమ వీధిలో శివాలయం దగ్గర వారు ఉండేవారు. ఈ విశ్లేషణ హేతుబద్ధంగా వుందని వేమనపై పి.హెచ్.డి. చేసిన పరిశోధకుడు ఎన్ గోపి అంగీకరించాడు. కోమటి వేమన్నకథ రెడ్డిరాజులకు మూలపురుషుడైన దొంతి అలియరెడ్డి అనుమకొండలో వుండి వ్యవసాయం చేసేవాడు. వేమన్న అనే కోమటి శ్రీశైలానికి వెళ్లి స్వామి దర్శనం తరువాత పాతాళగంగలో పచ్చబండని చూడసాగాడు. అర్చకుడు ప్రశ్నించడంతో ఆరు నెలలు స్వామిని సేవించుకుంటానన్నాడు. అర్చకుడు ఉత్తర దిక్కుకు పోవద్దన్నాడు. కాని వేమన్న అదే దిక్కుకు నువ్వులు చల్లుకుంటూ సాగాడు. రెండు రోజుల తరువాత పరుసవేది ద్రవం కనిపించితే దానిని కుండలలో సేకరించి అనుమకొండ చేరేసరికి రాత్రయ్యింది. అలియరెడ్డి తన గొడ్ల చావడిలో వుండమనగా పరుసవేది కుండలను నాగలి పనిముట్లు పక్కనపెట్టి భోజనానికి వెళ్లాడు. అంతలో అలియరెడ్డి వచ్చినపుడు నాగలి బంగారంగా మారి ప్రకాశించసాగింది. దీనితో పరుసవేది కుండలను దాచి, గొడ్లను బయటకుదోలి చావడికి నిప్పుపెట్టాడు. అప్పుడు వేమన్న వచ్చి విషాదంతో ఆ మంటలలో దూకి చనిపోయాడు. తరువాత అలియరెడ్డికి పుట్టిన బిడ్డలు బ్రతకలేదు. వేమన్న కలలో కనబడి తన పేరు బిడ్డలకు పెట్టమని కోరి అలా చేస్తే సంతతి పెరిగి రాజులవుతారని అనగా, చివరిగా మిగిలిన బిడ్డకు పిచ్చిపుల్లాయ్ కు బదులుగా పుల్లయ వేమారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. గొల్లడు, గోసాయి కథ కొండవీటిని పరిపాలించిన అనపోత వేమారెడ్డి అంతకు ముందు పరిపాలించిన అలియరెడ్డి తమ్ముడు. ఆయన కాలంలో కొండవీడు కొండ మీదు గోసాయి వుండేవాడు. దగ్గరలో పశువులు మేపే గొల్లవాడొకడు ప్రతిరోజు పాలు సమర్పించి సేవించేవాడు. గోసాయి వారించినా అలాగే సేవకొనసాగించాడు. గోసాయి దగ్గరలో రెండు గజాల లోతు గొయ్యిని తవ్వమన్నాడు. ఆ గోతిలో ఎండుపుల్లలు వేసి మంటరాజేశాడు. గొల్లవాడికి మేలుచేస్తానని ఆ గోతి దగ్గరకు తీసుకెళ్లి గోతిలో తొయ్యబొయ్యాడు. గొల్లవాడు తప్పించుకొని గోసాయినే గోయిలో పడవేశాడు. మరుసటిరోజు వచ్చి చూడగా మనిషి ఎత్తున వున్న రెండు బంగారు బొమ్మలు కనబడ్డాయి. వాటిని ఇంటికి తీసుకెళ్లి అవసరానికి బొమ్మనుండి కొద్ది ముక్కలు తీసుకొని వాడుకొనేవాడు. ఈ విషయం రాజుగారికి తెలిసి రాజుగారు ఆ బొమ్మలను స్వాధీనంచేసికొని ధనవంతుడయ్యాడు. రాజకుటుంబపు వేమన్న వేశ్యాలోలత్వం నుండి యోగిగా మారే కథ కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అనే మారు పేరుగల అనువేమారెడ్డి చిన్న తమ్ముడు వేమన్న. వేమన్న వదిన నరసాంబారాణి. వేమన్న రాజకీయాలు పట్టించుకోక ఒక వేశ్యవలలో చిక్కుకుంటాడు. ఆ వేశ్య రాణి ఆభరణాలు ధరించి అద్దంలోచూసుకోవాలని కోరుతుంది. మాతృపేమ గల నరసాంబారాణి బులాకి తప్ప మిగతా అభరణాలు యిచ్చింది. వేశ్య బులాకీ కూడా కావాలని పట్టుబట్టింది. చీకట్లోకూడా దీపంలాగే వెలిగే బులాకీని, ఆభరణాలు అన్నీ వేసుకున్న తరువాత వేశ్య నగ్న దేహం చూడమనే షరతుతో ఇస్తుంది. అలా చూసిన వేమనకు మగువంటే విరక్తికలిగి రోతపుట్టి, కోటకు వెళ్లి పడుకుంటాడు. నరసాంబ వేమనకు జ్ఞానము కుదిరిందని లేపటానికి భటులను పంపుతుంది. వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవాడు. కోటలో బంగారపు పని జరిగే భవనంలో వేమన్న కూర్చొనేవాడు. అభిరామయ్య రోజు పనికి ఆలస్యంగా రావటం గ్రహించి, రహస్యంగా అభిరామయ్యను వెంబడించి, అభిరామయ్య దగ్గరలోని కొండగుహలో అంబికాశివయోగిని సేవించటం గమనించాడు. యోగి సంతోషించి మరుసటిరోజు మంత్రోపదేశం చేస్తానని అంటాడు. మరుగున ఉండి ఈ విషయం విన్న వేమన మరుసటి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, వేమన అభిరామయ్య శిష్యునిగా వెళతాడు. యోగి చెవిలో మంత్రోపదేశం చేసి, నాలుకపై బీజాక్షరాలు వ్రాస్తాడు. అభిరామయ్యను వంచించినందుకు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకుంటాడు. పరిహారంగా అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాల మకుటంలో చేరుస్తానని చెప్పాడు. వేమన మోతుబరి రైతు బిడ్డ అనే కథ వేమన పద్యాలను పరిశోధించి ఊహించిన కథ ఈ విధంగా సాగుతుంది. వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయి. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగాడు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడా ఒక ఇల్లు (విడిది) ఉంది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకొన్నాడు. సంస్కృతము, గణితము నేర్చుకొన్నారు. (ఒకటి క్రింద నొక్కటొనర లబ్ధము పెట్టి వరుసగా గుణింప వరుస బెరుగు - geometric progression - తెలుసుకొన్నాడు). పద్దులు వ్రాయగలడు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నారు. నీతిని తెలిసినవారు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు. కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డాడు (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటాడు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు - ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును. అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనాడు. దాని గురించి మరల మరల ప్రస్తావించాడు. అతను ఎందరో యోగులను, గురువులను దర్శించాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నాడు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం వున్నాయో గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నాడు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించాడు. వేమన భార్య, కూతురి పెళ్ళి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్నది. వేమనను వెనుకకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది కాని వేమన తిరస్కరించాడు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగాడు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే "వెర్రి వేమన్న" అని అభివర్ణించుకొన్నాడు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రబోధించాడు. ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు (పామూరు గుహలోనో లేక కడప జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో మహాసమాధి చెందాడు. వేమన కులం కులమత బేధాలను నిరసించిన వేమన కులం చరిత్ర తెలుసకొనటానికే అయినా, పరిశోధకులు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. వేమన బ్రాహ్మణుడు కాదు కాపు(రైతు) అని బ్రౌన్ తొలుత భావించినా తరువాత జంగం(శైవసంస్కర్తలు కులం) అని భావించాడు. వేమన రెడ్డి కులానికి, కాపు అనే కులానికి చెందినవాడు అని ఆయన పద్యాలను బట్టి కొందరు భావించినా కాపు, రెడ్డి అనే కులాలు దత్త మండలల్లో పర్యాయపదాలుగా వాడబతున్నవి, కృష్ణా, గోదావరి మండలాల్లో వేరుగా వున్నవి. కావున ఏ కులమని నిర్ధారించలేకపోయినా, పద్యాలలో కన్పించే వ్యావసాయిక పరిజ్ఞానంవలన రాజవంశీయుడు కాడని, రైతుకుటుంబానికి చెందిన వాడని నిర్ధారించవచ్చు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని, కొండవీడు రెడ్డి రాజుల వంశానికి సంబంధం కలిగినవారు. కొండవీడు రెడ్డి చెప్పిన ప్రకారం ఇతను రెడ్డి వంశానికి చెందిన శివకవి. ఇంకొక పరిశోధన ప్రకారం గుంటూరు జిల్లా లోని కొండవీడు రెడ్డి రాజుల వంశంలో మూడో వాడు వేమారెడ్డి అంటారు. తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు (1999) వేమన ప్రాంతం వేమన పద్యాలలో వాడిన ప్రాంతాన్ని సూచించే పదాలు (పచ్చ, దుడ్డుట, బిత్తలి లాంటివి) రాయలసీమ ప్రాంతంలో మాత్రమే వాడుకలోనున్నందున, రాయలసీమ వాడని చెప్పవచ్చు. వేమన పద్యాల తీరు వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లో నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదా: అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ! విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు కొలది హంసల కడ కొక్కెర లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ! </div> కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ఉదా: అనగననగరాగ మతిశయించునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ. </div> నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం. ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి. వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదను, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడిని మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని పండితులు ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు. బ్రౌను ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు. వేమన్న మానవతావాదం మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశాడు. దీనికి ఆయనవాడిన ఆయుధం హేతువు లేక తర్క శీలత్వం. మానవతా ధర్మం చంపదగినయట్టి శత్రువు తనచేత చిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ వినుర వేమ </div> సర్వమానవ సమానత్వం ఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టి పొత్తుగుడిపి పొలము కలయజేసి తలను చెయ్యిబెట్టి తగనమ్మజెప్పరా విశ్వదాభిరామ వినుర వేమ </div> కులవిచక్షణలోని డొల్లతనం గురించి మాలవానినంటి మరి నీటమునిగితే కాటికేగునపుడు కాల్చు మాల అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో విశ్వదాభిరామ వినుర వేమ</div> నైతికత్వం గురించి ఇంటియాలి విడిచి ఇల జారకాంతల వెంటదిరుగువాడు వెర్రివాడు పంటచేను విడిచి పరిగె ఏరినయట్లు విశ్వదాభిరామ వినుర వేమ </div> మూఢనమ్మకాల ఖండన పిండములను జేసి పితరుల దలపోసి కాకులకును పెట్టుగాడ్దెలార పియ్యిదినెడుకాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినుర వేమ </div> సంఘసంస్కరణను ప్రబోధించే సర్వమానవ సమానత్వం,అశ్పృస్యత ఖండన, నైతికప్రభోధం, మూఢనమ్మకాల ఖండన, ఆర్ధిక భావాలను సూచించే పై పద్యాలను బట్టి వేమనను మానవతావాదిగా చెప్పవచ్చు. స్తీల గురించి సాంప్రదాయవాది ఆలి తొలుత వంచ కధముడైతా వెనుక వెనుక వంతు ననుట వెర్రితనము చెట్టు ముదరనిచ్చి చిదిమితే బోవునా విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యం: "భార్యను తొలిగానే అదుపులోపెట్టుకోవాలి. తరువాత అదుపులోపెట్టుకోవచ్చులే అనుకొనుట వెర్రితనం. చెట్టుపెద్దదైన తరువాత సులభంగా పీకలేము" పతిని విడువరాదు పదివేలకైనను పెట్టి జెప్పరాదు పేదకైన పతిని తిట్టరాదు సతి రూపవతియైన విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యం: "భర్తను ఎప్పుడూ విడవకూడదు. పేదవాడికి దానంచేసి ఎవరికీ చెప్పకూడదు. అందమైన రూపంకల భార్య భర్తని తిట్టకూడదు" కలిమినాడు మగని కామముగాజూచును లేమిజిక్కునాడు, లేవకుండు మగువ మగనినైన మడియంగ జూచును విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యం: "సంపద వున్నప్పుడు భార్య భర్తను ప్రేమతో చూస్తుంది. పేదరికంలో మంచంపైనుండి లేవకుండా ఇటువంటి భర్త చనిపోయినా బాగుండుననుకుంటుంది"</div> పై పద్యాలవంటివి స్త్రీలను చులకనగా చూపించుతూ, సాంప్రదాయ పితృస్వామ్యాన్ని సమర్ధిస్తూ చెప్పటం వేమన ప్రగతిశీల వ్యక్తిత్వానికి మచ్చగా వున్నది. వేమన గురించి పరిశోధన వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. భారతదేశం సందర్శించిన ఒక ఫ్రెంచి మిషనరీ జె ఎ దుబాయ్ 1806లో హిందువుల అలవాట్లు ఆచారాలు, పండుగలు అనే గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో వ్రాశాడు. దీనిని 1887 లో హెన్రీ కె బ్యూకేంప్ ఆంగ్లలోకి అనువదించాడు. దీనిలో ఆత్మ పవిత్రతని చర్చించేటప్పుడు బురదని తయారుచేసేది, శుభ్రపరచేది నీరు లాగా, తన సంకల్పమే పాపం చేయటానికి కారకము, సంకల్పము చేతనే పవిత్రంగా వుండగలం అనే వేమన చెప్పిన పద్య అర్ధాన్ని ఉటంకించాడు. 1816 లో భారతదేశం వచ్చిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించాడు. దాదాపు 18 ఏళ్లు వేమన సాహిత్యంపై ధ్యాస పెట్టాడు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు. తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయడానికి కృషి చేసినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి రెడ్డి కృషి చేశాడు. వేమనకు గుర్తింపు తెలుగు సాహిత్య చరిత్రకారులలో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోను వేమన చరిత్రను చేర్చలేదు. దీనిగూర్చి నార్ల వేంకటేశ్వరరావు "ఇట్టి మూగకుట్ర, ఒక మహావ్యక్తి పేరైనను ఉచ్ఛరించక మరుగుపరచిన మౌనకుతంత్రము ప్రపంచ భాషా చరిత్రలందెచ్చటనుకానము, ఇది ఒక పెద్ద విస్మయము "అని అన్నాడు. అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలనుదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు. బ్రౌన్ తరువాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్వవిచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తరువాత 1928 లో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలిచ్చాడు. ఆ తరువాత ఏభై ఎళ్లకు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన్న గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు. యోగివేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన జీఓ (నెంబర్‌ 164)ను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 2023లో విడుదల చేసింది. వేమన గురించి అభిప్రాయాలు శ్రీశ్రీ ఇలా అన్నాడు: "కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ" రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ: "వేమన కవిత్వం గాయపు మందు గాయానికి కాక, కత్తికే పూసినట్లుండును" స్మరణలు శిలా విగ్రహాలు హైదరాబాదులో టాంకుబండ్ పై తెలుగుజాతి వెలుగుల విగ్రహాలలో వేమన విగ్రహం ప్రతిష్ఠించారు. పోస్టు స్టాంపు right|thumb| పోస్టు స్టాంపుపై వేమన 1972 లో భారత తపాలాశాఖ స్టంపు విడుదల చేసింది (చిత్రం కుడివైపు) పుస్తకాలు వ్యాసంలో ఉదహరించినవే కాక, వేమన పద్యాలను వివిధ ప్రచురణ కర్తలు ముద్రించారు. విస్తృతంగా పరిశోధనల పుస్తకాలు వెలువడ్డాయి. వాటిలో కొన్ని వేమన యోగి - వర్ణ వ్యవస్థ: డా. రాపెల్లి శ్రీధర్ (వ్యాఖ్యాత)- 2002 వేమన యోగి - అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతము :డా. రాపెల్లి శ్రీధర్ (వ్యాఖ్యాత)- 2000, మన వేమన, ఆరుద్ర, 1985. వేమన జ్ఞానమార్గ: 1958 నాటికి అత్యధికంగా 3002 పద్యముల సంకలనం అక్షరమాల క్రమంలో కూర్పు, కూర్పు: ముత్యాల నారసింహ యోగి, ప్రకాశకులు: సి.వి.కృష్ణా బుక్ డిపో, మదరాసు, 1958. దృశ్యశ్రవణ మాధ్యమాలు యోగివేమన (1947 సినిమా) చిత్తూరు నాగయ్య-వేమన శ్రీ వేమన చరిత్ర (1986) - సినిమా విజయ చందర్-వేమన యోగివేమన - ధారావాహిక, నిర్మాత: గుమ్మడి గోపాలకృష్ణ ఆంధ్రజ్యోతి టివిలో(?) ప్రసారమైంది. ఖతులు వేమన (ఫాంటు) మూలాలు బయటి లింకులు 1981 - విశ్వదాభిరామ వినురవేమ - రచన: త్రిపురనేని వెంకటేశ్వరరావు, ప్రచురణ: వేమన వికాస కేంద్రం 1982 - వేమన - వివిధ దృక్కోణాలు - రచన: త్రిపురనేని వెంకటేశ్వరరావు, ప్రచురణ: వేమన వికాస కేంద్రం 2002 - వేమన యోగి - వర్ణ వ్యవస్థ - వ్యాఖ్యాత: డా॥ శ్రీ బ్రహ్మానంద శ్రీధర స్వామి 1986 - వేమన - రచన: బండ్ల సుబ్రహ్మణ్యం - ప్రచురణ: బండ్ల సుబ్రహ్మణ్యం, చీరాల 1950 - Saint Vemana - రచన: Ishwara Topa - ప్రచురణ: తెలుగు అకాడమీ 1949 - వేమనశతకము (టీకా తాత్పర్య సహితం) వెంకట్రామా అండ్ కో (1949) వర్గం:తెలుగు కవులు వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:ప్రాచీన తెలుగు కవులు వర్గం:శతక కవులు వర్గం:ఈ వారం వ్యాసాలు
మహాభాగవతం
https://te.wikipedia.org/wiki/మహాభాగవతం
ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసంతెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి. thumb|250px|కృష్ణునికి స్నానమాడించే యశోద - భాగవత కథా గ్రంథానికి కూర్చిన చిత్రం. సుమారు 1500 సం. కాలానికి చెందింది. భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత, ధర్మశాస్త్రం సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భాగవత అవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తం ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడింది. భాగవతం ప్రాముఖ్యత వేదాంత పరంగా భాగవతం ప్రాముఖ్యత భాగవతంలోనే క్రింది శ్లోకంలో చెప్పబడింది. సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్ శ్రీమద్భాగవతం సకల వేదాంత సారంగా చెప్పబడింది. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు (12.13.15) వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్యగా పరిగణింపబడుతున్నది. పురాణాలలో ఇది ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది.A Sanskrit-English Dictionary. Sir Monier Monier-Williams. Oxford: Oxford University Press, 1899. Page 752, column 3, under the entry Bhagavata. భాగవతం ప్రాముఖ్యత గురించి ఏల్చూరి మురళీధరరావు ఇలా వ్రాశాడు - అష్టాదశ మహాపురాణాలను ప్రస్తావించిన దేవీభాగవతంలోని శ్లోకంలో భాగవతం ఉపపురాణంగా చెప్పబడింది. అప్పటిలో (దేవీభాగవతం 12వ శతాబ్దంలో రచింపబడిందని ఒక అభిప్రాయం) శాక్తేయమతానికి ప్రాధాన్యత కల్పించే ప్రయత్నంలో ఇలా వ్రాయబడి ఉండవచ్చునని ఒక అభిప్రాయం ఉంది. లోకంలో మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు. "ఈ మహా గ్రంథం ఆసేతుశీతాచల వ్యాప్త పండిత మండలీ కంఠస్థగిత విపుల మణిహారమై, నానా మత ప్రస్థాన సిద్ధాంతావిరుద్ధ ప్రమాణ తర్క సాధనోపాలంభ పూర్వక దుర్విగాహ భక్తి స్వరూప నిరూపణ ఫల వ్యాచి ఖ్యాసువులకు ఆలవాలమై, గీర్వాణ వాణీ తరుణారుణ చరణారవింద మరందాస్వాదలోల హృన్మత్త మిళింద చక్రవర్తులచే బహుభాషలలోనికి అనూదితమై, మోక్షాభిలాషుల మనస్సులలో భద్రముద్రాంకితమై, నిజానికి పురాణమంటే ఇదేనన్నంత అవిరళమైన ప్రచారాన్ని గడించింది. .. ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన ఈ ఉద్గ్రంథం భారతదేశంలోని సారస్వతేయుల మహాప్రతిభకు ప్రధమోదాహరణమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది." శ్రీ మద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు (కీ.శే. శతఘంటం వేంకటశాస్త్రుల వారి "దొడ్డభాగవతము"నకు ఆధునిక వచనంలో తిరుగు వ్రాత) భాగవత రచనా కాల నిర్ణయం చారిత్రికంగా భాగవతం 9వ, 10వ శతాబ్దాల సమయంలో, భక్తి మార్గం ప్రబలమైన సమయంలో, రూపు దిద్దుకొన్నదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.Viraha-Bhakti - The Early History of Krsna Devotion in South India - Friedhelm Hardy. ISBN 0-19-564916-8; Werba, Verba Indoarica 1997:8 places it in the 10th century. కాని హిందూ మత సంప్రదాయాలలోని విశ్వాసం ప్రకారం కలియుగారంభంలో వేద వ్యాసునిచే రచింపబడినదని చెబుతారు. కొందరి వాదనల ప్రకారం వేదాలలో సరస్వతీ నదిని ఒక మహానదిగా ప్రస్తావించినందున ఈ రచన చాలా పురాతనమైనది అయ్యుండాలి. ఎందుకంటే సరస్వతీ నది సుమారు సా. పూర్వం 2000 BCE సమయంలో కనుమరుగయ్యింది.Horacio Francisco Arganis Juarez. Dating Srimad Bhagavatam. http://www.veda.harekrsna.cz/encyclopedia/sb.htm#3 . భాగవతం ప్రస్తుత పాఠం సా.శ. 6వ శతాబ్ది కాలంలో రూపొంది ఉండాలని, అయితే మత్స్యపురాణంలో ఉన్న భాగవత ప్రశంసను బట్టి అంతకు పూర్వమే (సా.శ. 4వ శతాబ్ది ముందే) ఒక మూలపాఠం ఉండి ఉండొచ్చునని ప్రొఫెసర్ హజరా భావించాడు. "ఫిలాసఫీ ఆఫ్ భాగవత" అనే విపుల పరిశోధన గ్రంథం ఉపోద్ఘాతంలో ప్రొఫెసర్ సిద్ధేశ్వర భట్టాచార్య ఇలా చెప్పాడు - "మొత్తం మీద శ్రీ మద్భాగవతానికి మూడు దశలలో మార్పులు, చేర్పులు జరిగాయని నిర్ణయించవచ్చును. మొదటి దశలో అతి ప్రాచీనమైన విషయ జాతకం మాత్రమే మాతృకాప్రాయమై సమకూడింది. సాధారణ యుగారంభ కాలానికి రెండవ దశలో దీనికి మహాపురాణ లక్షణాలకు అనురూపమైన సంసిద్ధి లభించింది. ఇక చిట్టచివరి దశలో తముళదేశపు సాధుమండలి కృషి వలన నేటి రూపం సిద్ధించింది.ఈదృక్కోణంనుండి పరిశీలిస్తే శ్రీమద్భాగవత ప్రకృత పాఠం ఆళ్వారులకు సమకాలంలో రూపొందిందని నమ్మవచ్చును. భాగవతం అవతరణ భాగవత పురాణము సంభాషణల రూపంలో రచించబడింది. పరీక్షీత్తు మహారాజు ( పాండవ మద్యముడైన అర్జునుని మనుమడు) ఒక బ్రాహ్మణునిచే శాపగ్రస్తుడై ఏడు దినములలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కనబెట్టి ప్రతీ జీవి యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలియగోరాడు. అదే సమయంలోనే తను సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి బోధించాలో తెలియక, ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతున్న శుకుడు అనే ముని రాజుకు తారసపడి ఆ రాజుకు బోధించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపిలేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి యొక్క అంతిమ లక్ష్యం, నిత్య సత్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవడమేనని వివరిస్తాడు. పురాణ లక్షణాలు పురాణాలలో వర్ణించవలసిన విషయాలను క్రీ..శ. 6వ శతాబ్దిలో అమర సింహుడు తన "నామలింగానుశాసనం"లో ఇలా చెప్పాడు. సర్గము: గుణముల పరిణామమైన సృష్టి సామాన్యం ప్రతి సర్గము: భగవంతుడు విరాడ్రూపాన్ని గ్రహించడం వంశము: దేవతల, రాక్షసుల, మనువుల, ఋషుల, రాజుల వంశావళి మన్వంతరము: ఆయా కాలాలలో వర్ధిల్లినవారి ధర్మావలంబన వంశానుచరితం: రాజ వంశాల వర్ణన వ్యాస భాగవతంలో పది మహాపురాణ లక్షణాలున్నాయి: (1) సర్గము (2) విసర్గము (3) వృత్తి (4) రక్షణము (5) మన్వంతరము (6) వంశము (7) వంశానుచరిత (8) నిరోధము (9) హేతువు (10) అపాశ్రయం. ఈ లక్షణాలన్నీ భాగవతంలో ఉండడం వల్లనే అది మహాపురాణంగా ప్రసిద్ధమైనది. భాగవత కథా సంక్షిప్తం భాగవతంలోని వివిధ స్కంధాలలో ఉన్న ముఖ్య విషయాలు సంక్షిప్తంగా క్రింద తెలుపబడ్డాయి. (మరింత విపులమైన వివరాలకోసం ఆయా స్కంధాల గురించిన ప్రత్యేక వ్యాసాలు చూడండి) ప్రధమ స్కంధము భాగవత అవతరణ నారదుని పూర్వజన్మ వృత్తాంతము అర్జునుడు అశ్వత్థామను పరాభవించుట ఉత్తరకు పరీక్షిత్తు జనించుట గాంధారి, ధృతరాష్ట్రుల దేహత్యాగం ధర్మరాజు దుర్నిమిత్తములను చూచి చింతించుట అర్జునుడు ద్వారకనుండి వచ్చి కృష్ణనిర్యాణంబు తెల్పుట ధర్మరాజు పరీక్షిత్తునకు పట్టము కట్టుట పరీక్షిన్మహారాజు భూ ధర్మ దేవతల సంవాదం వినుట కలి పురుషుడు ధర్మదేవతను తన్నుట శృంగి వలన పరీక్షిత్తు శాపము పొందుట ద్వితీయ స్కంధము శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గం ఉపదేశించుట నారదుడు బ్రహ్మను ప్రపంచ ప్రకారం అడుగుట శుకుడు పరీక్షిత్తునకు భక్తి మార్గం చెప్పుట శ్రీమన్నారాయణుని లీలావతారములు శుకయోగీంద్రుడు పరీక్షిత్తునకు చెప్పిన సృష్టి ప్రకారం బ్రహ్మ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు వరమిచ్చుట తృతీయ స్కంధము విదురుని తీర్ధయాత్రలు విదుర మైత్రేయ సంవాదము హిరణ్యాక్ష హిరణ్య కశిపుల జన్మ వృత్తాంతము చతుర్ముఖుడొనర్చిన యక్ష దేవతా గణ సృష్టి కర్దముడు దేవహూతిని పరిణయమాడుట కర్దమ ప్రజాపతి గృహస్థ జీవనం కపిలావతారం కపిలుడు దేవహూతికి తత్వజ్ఞానం ఉపదేశించుట గర్భస్థుడగు శిశువు భగవానుని స్తుతించుట చతుర్ధ స్కంధము కర్దమ ప్రజాపతి సంతతి దక్ష ప్రజాపతి సంతతి ఈశ్వరునకు, దక్షునకు వైరము సతీదేవి దక్షయజ్ఞానికరుగుట వీర భద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయుట బ్రహ్మాదులు ఈశ్వరుని స్తుతించుట శ్రీమన్నారాయణుని బ్రహ్మాదులు స్తుతించుట ధ్రువోపాఖ్యానము అంగపుత్రుడైన వేనుని చరిత్ర పృథు చక్రవర్తి చరిత్ర పృథువు గోరూపధారిణి యైన భూమినుండి ఓషధులు పితుకుట ఇంద్రుడు పృథువు యజ్ఞాన్ని అపహరించుట పృథువు సభలో సద్ధర్మమునుపదేశించుట పృథువు జ్ఞాన వైరాగ్యవంతుడై ముక్తినొందుట పృథు చక్రవర్తి వంశక్రమం రుద్ర గీత నారదుడు బర్హికి జ్ఞానమార్గం తెలియజేయుట పురంజనోపాఖ్యానము ప్రచేతసులకు భగవంతుడు వరాలిచ్చుట పంచమ స్కంధము మనువు పుత్రుడైన ప్రియవ్రతుని కథ అగ్నీధ్రుని కథ ఋషభావతారం ఋషభుడు పుత్రులకు నీతిని బోధించుట భరతుని కథ బ్రాహ్మణ జన్మలో భరతుడు యమలోక వర్ణన షష్ఠ స్కంధము అజామిళుని చరిత్ర దక్షుని హంస గుహ్య స్తవము బృహస్పతి దెవతలను విడనాడుట విశ్వరూపుడు దేవతలకు నారాయణ స్తవమును ఉపదేశించుట వృత్రాసుర చరిత్ర చిత్రకేతువు కథ పార్వతీదేవి చిత్రకేతుని శపించుట సూర్యవంశ అనుక్రణిక సప్తమ స్కంధము వైకుంఠములో ద్వారపాలకులైన జయ విజయులకు శాపములు కలుగుట సుయజ్ఞుని కథ హిరణ్య కశిపుడు బ్రహ్మ వలన వరములు పొందుట ప్రహ్లాద చరిత్ర శ్రీనారసింహమూర్తి ఆవిర్భావము హిరణ్యకశిపుని వధ బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని స్తుతించుట ప్రహ్లాదుడు శ్రీనారసింహుని స్తుతించుట త్రిపురాసుర సంహారము నారదుడు ధర్మరాజునకు వర్ణాశ్రమ ధర్మాలు తెలుపుట ప్రహ్లాద అజగర సంవాదము నారదుని పూర్వజన్మ వృత్తాంతము అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము క్షీరసాగర మధనం కూర్మావతారం పాల కడలిలో ఐరావతాదులు ఉద్భవించుట జగన్మోహిని అవతరణ దేవాసుర యుద్ధం శ్రీహరి జగన్మోహినియై పరమేశ్వరుని మోహింపజేయుట వామనావతారం వామనుడు బలిచక్రవర్తివద్దకు వచ్చుట వామనుడు త్రివిక్రముడై ముల్లోకములను ఆక్రమించుట మత్స్యావతారం నవమ స్కంధము అంబరీషుని కథ ఇక్ష్వాకు వంశ క్రమం సౌభరి మహర్షి చరిత్ర సగర చక్రవర్తి కథ శ్రీరామకథ భవిష్యత్తు రాజుల కథ పరశురాముని కథ యయాతి కథ శుక్రాచార్యుడు యయాతిని శపించుట భరతుని చరిత్ర రంతిదేవుని చరిత్ర యదువంశము వసుదేవుని వంశక్రమం దశమ స్కంధము దశమ స్కంధము - మొదటి భాగము బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్తుడైన విష్ణువును కీర్తించుట శ్రీకృష్ణావతారం దేవకీ వసుదేవుల పుర్వజన్మ వృత్తాంతము వ్రేపల్లెకు వచ్చిన పూతన మరణము బాలకృష్ణుడు శకటాసురుని సంహరించుట తృణావర్త సంహారము శ్రీకృష్ణ బలరాముల క్రీడలు కృష్ణుడు మన్నుతిని నోటిలో యశోదకు విశ్వరూపము చూపుట నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతము యశోద కృష్ణుని వెంబడించి పట్టుకొని కట్టివేయుట కృష్ణుడు మద్దిచెట్టును కూల్చివేయడం నందాదులు బృందావనానికి తరలి వెళ్ళడం వత్సాసుర, బకాసురుల సంహారం శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దియన్నములారగించుట అఘాసురుని కథ బ్రహ్మ లేగలను, గోపాలురను మాయం చేయుట కాళీయ మర్దనం, కాళీయుని వృత్తాంతం, శ్రీకృష్ణస్తుతి శ్రీకృష్ణుడు కార్చిచ్చును కబళించుట బలరాముడు ప్రలంబుడనే రాక్షసుని సంహరించుట గోపికా వస్త్రాపహరణం మునిపత్నులు అన్నముతెచ్చి బాలకృష్ణునికి ఆరగింపు చేయుట గోవర్ధనోద్ధరణ శ్రీకృష్ణుడు నందగోపుని వరుణనగరంనుండి కొనితెచ్చుట శరద్రాత్రులలో వేణుగానం, గోపికాకృష్ణుల క్రీడలు సుదర్శన శాపవిమోచనం శంఖచూడుడు, వృషభాసురుడు, కేశి అనే రాక్షసుల వధ బృందావనానికి అక్రూరుడు వచ్చుట, బలరామకృష్ణులను దర్శించుట బలరామకృష్ణులు మధురలో ప్రవేశీంచుట కువలయాపీడనము అనే ఏనుగును కృష్ణుడు సంహరించుట బలరామకృష్ణులు చాణూరముష్ఠికులు అనే మల్లులను సంహరించుట కంస వధ, ఉగ్రసేనుని పట్టాభిషేకం భ్రమర గీతాలు ఉద్ధవ సహితుడైన కృష్ణుడు కుబ్జను అనుగ్రహించుట కాలయవనుడు కృష్ణుని పట్టుకొనబోవుట ముచికుందుని వృత్తాంతము జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించుట రుక్మిణీ కళ్యాణము శ్రీకృష్ణుడు కుండిన నగరానికి వచ్చుట బలరాముడు రుక్మిణీదేవిని ఓదార్చుట దశమ స్కంధము - రెండవ భాగము శ్రీకృష్ణుడు అపనిందను పోగొట్టుకొనుట, జాంబవతిని, సత్యభామను పెండ్లాడుట శ్రీకృష్ణుడు పాండవులను చూచుటకు ఇంద్రప్రస్థానికి వెళ్ళుట శ్రీకృష్ణుడు కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ యనువారల పెండ్లాడుట నరకాసుర సంహారం ఉషాపరిణయం, బాణాసురుని కథ, చిత్రరేఖ యోగశక్తి, అనిరుద్ధుడు నాగపాశబద్ధుడగుట, బాణుడు, శ్రీకృష్ణుడు యుద్ధము చేయుట నృగమహారాజు చరిత్ర బలరాముడు గోపాలకులవద్దకు వెళ్ళుట పౌండ్రక వాసుదేవుని కథ ద్వివిధవానర సంహారం బలరాముడు తన నాగలితో హస్తినను గంగలో త్రోయబూనుట పదహారువేల స్త్రీజనంతో కూడియున్న కృష్ణుని మహిమను నారదుడు గుర్తించుట జరాసంధ భీతులైన రాజులు శిశుపాల వధ సాల్వుడు సౌభక విమానం పొంది ద్వారకపై దండెత్తుట శ్రీకృష్ణుడు దంతవక్తృని సంహరించుట బలభద్రుని తీర్ధయాత్ర కుచేలుని కథ శ్రీకృష్ణుడు బంధుగణంతో గ్రహణ స్నానం చేయుట లక్షణ తన వివాహ వృత్తాంతాన్ని ద్రౌపదికి చెప్పుట నారదాది మహర్షులు వసుదేవునితో యాగం చేయించుట కృష్ణ బలరాములు మృతులైన తమ అన్నలను దేవకీవసుదేవులకు చూపుట సుభద్రా పరిణయం శ్రీకృష్ణుడు ఋషి సమేతుడై మిథిలకు పోవుట శ్రుతిగీతలు విష్ణుసేవా ప్రాశస్త్యం వృకాసురుడు విష్ణుమాయకు లోబడి నశించుట భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట శ్రీకృష్ణుడు మృత్యువు వాత బడిన విప్రకుమారులను తిరిగి బ్రతికించి తెచ్చుట శ్రీకృష్ణుని వంశానుక్రమ వర్ణన ఏకాదశ స్కంధము విశ్వామిత్ర వశిష్ట నారదాది మహర్షులు శ్రీ కృష్ణ సందర్శనంబునకు వచ్చుట వసుదేవునకు నారడుండు పురాతనమైన విదేహర్షభ వివరములు చెప్పుట ఋషభ కుమారులైన ప్రబుద్ధ పిప్పలాయనులు చెప్పిన పరమార్ధోపదేశం బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువ వచ్చుట కృష్ణుడు యాదవులను ప్రభాసతీర్దం పంపుట కృష్ణుడు ఉద్దవునికి పరమార్థోపదేశము చేయుట అవదూత యుదు సంవాదము శ్రీ కృష్ణ బలరాముల వైకుంఠ ప్రయాణము ద్వాదశ స్కంధము శుకమహర్షి పరీక్షిత్తునకు భావి చరిత్ర చెప్పుట యుగధర్మం, ప్రళయ చతుష్టయం కల్ప ప్రళయ ప్రకారం తక్షకుడు పరీక్షిత్తును కాటు వేయుట జనమేజయుని సర్పయాగం వేద పురాణాల వ్యాప్తి మార్కండేయోపాఖ్యానం ద్వాదశాదిత్య మూర్తులు భాగవత ప్రశస్తి శాస్త్రీయ పరిశీలన ఆధునిక కాలంలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనల ద్వారా తరచి చూస్తున్న కొన్ని విషయాలు భాగవతంలో అప్పటి సిద్ధాంతాల ప్రకారం ప్రస్తావించబడ్డాయి. మూడవ స్కంధం (11వ అధ్యాయం) లో సమయ విభాగం గురించి చెప్పబడింది. అందులో సూక్ష్మకాలం పరమాణు ప్రక్రియలకు పట్టే కాల పరిమాణం రేంజిలో ఉంది. స్థూల కాలం విశ్వం వయస్సుగా చెప్పబడే కాలం పరిధిలో ఉంది. అలాగే 9వ స్కంధంలో తన కకుద్ముడు అనే రాజు తన కుమార్తె రేవతిని బ్రహ్మ లోకానికి తీసికొని వెళ్ళి, కొద్ది సమయం (నిముషాలు, గంటలు?) బ్రహ్మను దర్శించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చే సరిగి భూలోకంలో ఎన్నో వేల సంవత్సరాలు గతించాయి. ఈ సంఘటన ఆధునిక సాపేక్ష సిద్ధాంతంలో చెప్పబడే "కాలం వ్యవధి కుంచించుకుపోవడం లేదా పెరగడం" (Time Dilation) అనే విషయానికి సారూప్యతను కలిగి ఉంది.Bhag-P, 9.3.32 (see texts 29-32) 3వ స్కంధంలో గర్భం ఏర్పడిన దగ్గర నుండి పిండం పెరిగే ప్రక్రియ వర్ణింపబడింది. భాగవతంలో చెప్పబడిన భగవంతుని స్వరూపం right|300px|thumb|వరాహావతారం - ఒక ప్రాచీన చిత్రం. భగవంతుని దివ్య స్వరూపం భాగవతంలో ఒకచోట ఇలా వర్ణించబడింది. తేజోమయాలైన ఆయన కన్నులు సమస్త సృష్టికి మూల స్థానాలు. సూర్యాది సకల గ్రహనక్షత్రాలు ఆయన కనుగ్రుడ్లు. అన్ని దిశలా వినగలిగిన ఆయన చెవులు సకల వేదనాదాలకు నిలయాలు. ఆయన శ్రవణం ఆకాశానికి, శబ్దానికి ఆదిస్థానం.Srimad-Bhagavatam, second canto, "The Cosmic Manifestation", part one, chapter 6:3 and 1:39, translated by A.C. Bhaktivedanta Book Trust, 1972, pp. 59 and 275-276. భాగవతంలో విష్ణువు యొక్క 25 అవతారాల లీలలు వర్ణించబడ్డాయి."Srimad-Bhagavatam " by A.C. Bhaktivedanta Swami Prabhupada, Bhaktivedanta Book Trust. కృష్ణస్తు భగవాన్ స్వయం యమునా నది తీరాన బృందావనంలో కృష్ణుని బాల్య లీలలు భాగవతంలో విపులంగా వర్ణించబడ్డాయి. వెన్నదొంగగా, గోపాల బాలకునిగా, గోపీజన మానస చోరునిగా, నందగోకుల సంరక్షకునిగా బాలకృష్ణుని చేష్టలు, తల్లికి తన నోట సకల భువనాలు చూపిన లోకాధినాధుని స్వరూపము, గోవర్ధన గిరిధారిగా కొండనెత్తిన వాని మహిమ - ఇవన్నీ శ్రీకృష్ణావతారం కథలో ముఖ్యమైన విశేషాలు. కృష్ణుడు తమనుండి దూరమైనపుడు గోపికలు పడే వేదన భక్తి భావానికి సంకేతంగా వర్ణిస్తారు. వివిధ భాషలలో అనువాదాలు, భాగవతానికి సంబంధించిన రచనలు తెలుగులో 15వ శతాబ్దిలో బమ్మెర పోతన, అతని శిష్యుడు వెలిగందల నారయ, ఇంకా గంగన, ఏర్చూరి సింగన ఆంధ్రీకరించిన భాగవతానికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. పోతన రచనా శైలి, భక్తి భావం, పద్యాలలోని మాధుర్యం తెలుగునాట బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. దీనిలో ఎన్నో పద్యాలు నిత్య వ్యవహారంలో ఉదహరింపబడుతున్నాయి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక ప్రచురణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఒక ప్రచురణ సాధారణంగా అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తెలుగులో భాగవతానికి, సంబంధిత పురాణాలకు సంబంధించిన పెక్కు రచనలు సంప్రదాయ సాహితయంలోను, ఆధునిక సాహిత్యంలోను, జానపద సాహిత్యంలోను ప్రముఖ స్థానం వహిస్తున్నాయి. వాటిలో కొన్ని అంతరార్ధ భాగవతం - వేదుల సూర్యనారాయణ శర్మ భాగవత చతుశ్లోకీ - దోర్బల విశ్వనాధ శర్మ, మేళ్ళచెరువు వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి భాగవత హృదయము - ధారా రాధాకృష్ణమూర్తి భాగవత రత్నాకరము - విద్యాప్రకాశానందగిరి స్వామి భాగవత యోగం - మల్లాది పద్మావతి బృందావన భాగవతము - సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గీతా భాగవత ప్రసంగాలు - ఉత్పల సత్యనారాయణాచార్య కుచేలోపాఖ్యానము - మండపూడి వెంకటేశ్వర్లు పోతన మహాభాగవతం - పడాల రామారావు పోతనగారి రామాయణం - అక్కిరాజు రమాపతిరావు రాస పంచాధ్యాయి - ఉత్పల సత్యనారాయణాచార్య శ్రీకృష్ణ చంద్రోదయం - ఉత్పల సత్యనారాయణాచార్య రమణీయ భాగవత కథలు - ముళ్ళపూడి వెంకట రమణ పోతన భాగవతము - ముసునూరు శివరామకృష్ణారావు శ్రీ మహాభాగవతము - యామిజాల పద్మనాభ స్వామి శ్రీమద్భాగవతము - పురిపండా అప్పల స్వామి శ్రీమన్నారాయణియమ్ - పాతూరి సీతారామాంజనేయులు శ్రీ భాగవత రసామృతము - డా.వేదవ్యాస శ్రీ భాగవతము-ఉపాఖ్యానములు - ప్రభల వేంకనాగలక్ష్మి శ్రీకృష్ణావతారం - శ్రీకృష్ణతత్వ దర్శనం - శార్వరి శ్రీ మహాభాగవతము - బులుసు వేంకటరమణయ్య శ్రీరాస పంచాధ్యాయీ - సాతులూరి గోపాలకృష్ణమూర్తి శ్రీమద్భాగవతము - ఏల్చూరి మురళీధరరావు శ్రీమద్భాగవతము - తత్వ ప్రకాశిక - తత్వవిధానంద స్వామి శ్రీమద్భాగవతము కథలు - వేదుల చిన్న వెంకట చయనులు శ్రీమద్భాగవత పురాణమ్ - చదలువాడ జయరామశాస్త్రి శ్రీమద్భాగవతం - ఉషశ్రీ శ్రీమద్భాగవతంలోని ముఖ్యపాత్రలు - ఎమ్.కృష్ణమాచార్యులు ఇతర భాషలలో గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ వారు భాగవతాన్ని దాని హిందీ, ఇంగ్లీషు అనువాదాలను ప్రచురించారు. ఆంగ్ల భాషలో 'కమలా సుబ్రహ్మణ్యం' ఒక సంక్షిప్త భాగవతాన్ని వెలువర్చింది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థకు ప్రారంభాచార్యుడైన ఎ.సి.భక్తివేదాంత స్వామి ప్రభుపాద, అతని శిష్యులు కలసి భాగవత పురాణాన్ని ప్రతి శ్లోకానికీ సంస్కృత మూలం, ఆంగ్ల లిప్యాంతరీకరణ, ప్రతిపదార్ధం, భావం, విపుల విరణ, వ్యాఖ్యలతో ప్రచురించారు. భాగవతానికి సంబంధించిన రచనలలో (ముఖ్యంగా ఇంగ్లీషులో చదివేవారికి) ఇది చాలా ప్రసిద్ధి చెందింది. అస్సామీ భాషలో శంకరదేవ భాగవతం ఆ ప్రాంతంలో మహాపురుక్షీయ ధర్మానికి మౌలికమైన ప్రామాణిక గ్రంథంగా పరిగణింపబడుతున్నది. కేరళకు చెందిన మేల్పత్తూరు నారాయణ భట్టాద్రి 1586లో సంస్కృతంలో రచించిన నారాయణీయం భాగవత సారంగాను, పారాయణ గ్రంథంగాను భక్తులచే విశ్వసింపబడుతున్నది. 2003లో ఎడ్విన్ బ్రియాంట్ వ్రాసిన భాగవతం 10వ స్కంధం ఆంగ్లానువాదాన్ని పెంగ్విన్ ప్రచురణల వారు వెలువరించారు. రామకృష్ణ మఠం వారు స్వామి తపస్యానంద నాలుగు భాగాలుగా వ్రాసిన ఆంగ్లానువాదాన్ని ప్రచురించారు. స్వామి ప్రభవానంద The Wisdom of God: Srimat Bhagavatam అనే పేరుతో అనువాద, భావ, వ్యాఖ్యా సహితమైన ఆంగ్ల రూపకాన్ని రచించాడు. భాగవత పురాణ చిత్రాలు ఇవి కూడా చూడండి పురాణాలు త్రిమూర్తులు హిందూధర్మశాస్త్రాలు భగవద్గీత రామాయణం మహాభారతం పోతన భాగవతము-సాంఖ్యము దశావతారాలు హిందూ మతము గమనికలు, మూలాలు వనరులు శ్రీమన్మహా భాగవతము (12 స్కంధములు సంగ్రహ వచనము) - ఆచార్య డా.జోస్యుల సూర్యప్రకాశరావు - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్స్, కోటగుమ్మం, రాజమండ్రి (2005) శ్రీ మద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు (కీ.శే. శతఘంటం వేంకటశాస్త్రుల వారి "భాగవతము"నకు ఆధునిక వచనంలో తిరుగు వ్రాత) బయటి లింకులు శ్రీమద్భాగవతం లోని నీతికథలు పోతన తెలుగు భాగవతము భాగవతము (తెలుగు) Complete Srimad Bhagavatam Online with original Sanskrit and purports translated by A.C. Bhaktivedanta Swami Prabhupada and disciples. GRETIL etext: The transliterated Sanskrit text for the entire work Srimad Bhagavatam - glories, subjects, dating, concordance to Vedanta-sutra Bhagavata Purana - As an online readable story Some Srimad Bhagavatam commentaries Pothana Andhra Maha Bhagavatam (Telugu) select verses- Audio Tales From The Bhagavatham Retold For Children by P.S. Krishna Iyer Proshtapadi Bhagavata discourse in Kannada by Dr. V. Prabhanjanacharya వర్గం:హిందూమతం వర్గం:పురాణాలు వర్గం:హిందూ గ్రంథాలు
భాగవతం - ఒకటవ స్కంధము
https://te.wikipedia.org/wiki/భాగవతం_-_ఒకటవ_స్కంధము
భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతము లోని వివిధ అవతారములను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. వేదాలు విభజించి, మహాభారతం రచించి, 17 (17) పురాణాలు రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువు గారు అయిన నారద మహర్షి విచ్చేసిభాగవతము రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు. తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడింది. మహాభారతము ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము, భీష్ముని నిర్యాణము, శ్రీ కృష్ణ భగవానుని ద్వారకా ప్రయాణము, ద్వారకలో వారు ప్రవేశించడము, పరిక్షిత్తు జననము, దృతరాష్ట్రుడు అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము, పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్ళడము, పరిక్షిత్తు, కలి సంవాదము, పరిక్షిత్తు కలి పురుషుడుని దండించడము, దయచూపడము, పరిక్షిత్తుకి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, శుకదేవ మహర్షి ఆగమనము, పరిక్షిత్తు వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రథమ స్కంధములో గలవు . అర్జునుడు అశ్వత్థామను పరాభవించుట కురుక్షేత్రం అయిపోయిన రోజు రాత్రి పాండవ శి బిరంలో అందరూ నిద్రిస్తుండగా, అశ్వత్థామ వీరావేశంతో వచ్చినిద్రిస్తున్న ఉప పాండవులను హాతమార్చెను. పాండవులు చంపబడ్డారన్న వార్త తెలుసుకున్న అర్జునుడు వీరావేశంతో వీరిని చంపిన వాడిని తీసుకువచ్చి నీ పాదాల వద్ద పడివేస్తానని ద్రౌపదితో శపథం చేసి, కురుక్షేత్రంకి వచ్చి అక్కడ ఉన్న భటుల ద్వారా చంపినవాడు అశ్వత్థామ అని తెలుసుకొని, వాడితో యుద్ధము చేసెను. సవ్యసాచి ప్రతిభ ముందు తాళలేక అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించగా, ఆ అస్త్రం లోకాలన్నిటిని కమ్మేస్తుండగ అది చూసిన కృష్ణుడు అర్జునుడిని కూడా బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించమనగా, అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించినాడు. పిమ్మట రెండు బ్రహ్మశిరోనామాస్త్రలను కూడా ఉపసంహరించి, అశ్వత్థామను కట్టి ద్రౌపది ఎదుట నిలబెట్టగా. మూలాలు
ఏకవింశతి అవతారములు
https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు
thumb|విష్ణువు లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. 21 అవతారాలు మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాథలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించ బడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది. శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు - అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం. బ్రహ్మ అవతారము: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రాహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు. యజ్ఞ వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు. నారద అవతారము: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు. నర నారాయణ అవతారము: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు. కపిల అవతారము: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. దత్తాత్రేయ అవతారము: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు. యజ్ఞుడుయజ్ఞ అవతారము: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు. ఋషభ అవతారము: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. పృధు అవతారము: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు. మత్స్య అవతారము: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు. కూర్మ అవతారము: దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు. ధన్వంతరీ అవతారము: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు. మోహినీ అవతారము: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు. వరాహావతారం:వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము . రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి. నృసింహ అవతారము: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు. వామన అవతారము: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. పరశురామ అవతారము: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్క మారులు దండెత్తి వారిని దండించాడు. వ్యాస అవతారము: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు. రామ అవతారము: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు. బలరామ అవతారము, కృష్ణ అవతారము: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు. కల్కి అవతారము: కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగలడు. బుద్ధ అవతారము: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. (బుద్ధుడు, బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.) లీలావతారాలు భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి. వరాహావతారం - భూసముద్ధరణం సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం నరనారాయణావతారం - కామజయం ధ్రువావతారం - ధ్రువపదారోహం పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం హయగ్రీవావతారం - వేదజననం మత్స్యావతారం - వేద సంగ్రహం కూర్మావతారం - మందర ధారణం ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం వామనావతారం - బలిరాజ యశోరక్షణం హంసావతారం - భాగవత యోగోపదేశం మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం పరశురామావతారం - దుష్టరాజ భంజనం రామావతారం - రాక్షస సంహారం కృష్ణావతారం - లోకకళ్యాణం వ్యాసావతారం - వేద విభజనం బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం ఇవి కూడా చూడండి అవతారం విష్ణువు దశావతారములు వనరులు శ్రీమన్మహా భాగవతము - ఆచార్య డా.అప్పజోస్యుల సూర్యప్రకాశరావు - ప్రచురణ:గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు వర్గం:హిందూ దేవతలు వర్గం:విష్ణుమూర్తి అవతారాలు
భాగవతం - పన్నెండవ స్కంధము
https://te.wikipedia.org/wiki/భాగవతం_-_పన్నెండవ_స్కంధము
ద్వాదశ స్కంధము చివరి స్కంధము, కాని ఇక్కడ మంచి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. శుకయోగి పరిక్షిత్తునకు భావికాలగతులను చెప్పుట, యుగధర్మ ప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము, పరిక్షిత్తు మృతిచెందుట, జనమేజయుడు సర్ప యాగము చేయుట, వేద వ్యాసుడు పురాణములు, వేదములు ప్రచారము చేయుట, మార్కండేయోపఖ్యానము, చైత్రాది మాసంబుల సంచెరించెడు ద్వాదశాదిత్యుల క్రమంము తెలుపుటతో భాగవతము ముగుస్తుంది. బృహద్రధుడు అనే రాజుకు పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడనే అమాత్యుడుంటారు. అతడు పురంజయుని సంహరించి తానే గద్దెనెక్కి రాజ్యం పరిపాలిస్తుంటాడు. అతనికి కొంతకాలానికి ఒక కొడుకు పుడతాడు. వాడికి ప్రద్యోతుడని పేరు పెట్టి రాజ్యం కట్టబెడతాడు. ప్రద్యోతునికి విశాఖరూపుడు, అతనికి నందివర్దనుడు పుడతాడు. ఈ రాజు లైదుగురు నూటముప్పైయ్యెనిమిది సంవత్సరాలు భూమిని పరిపాలించి వృద్ది చెందుతారు. ఆ తరువాత శిశునాగుడు అనే రాజు జన్మిస్తాడు. అతనికి కాకవర్ణుడు కొడుకవుతాడు. ఆ కాకవర్ణుని కొడుకు క్షేమవర్ణుడు. క్షేమవర్ణ మహారాజుకు క్షేత్రఙ్నుడు పుత్రుడు. అతనికి విధిసారుడు, అతనికి అజాతశత్రువు, అతనికి దర్బకుడు, అతనికి అజయుడు, అతనికి నందివర్దనుడు, అతనికి మహానంది ఉదయిస్తారు. శిశునాగులు అన్న పేరుతో ప్రసిద్దులయిన యీ పదిమంది మహారాజులు కలికాలంలో మూడు వందల అరవైయేళ్ళు అవిచ్ఛిన్నంగా అవనీ పాలన చేస్తారు. ఆ పిమ్మట మహానందికి శూద్రవనిత కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహాబలవంతు డవుతాడు. అయినప్పటికీ, అతనితో క్షత్రియ వంశం అంతరించిపోతుంది. ఆ సమయంలో రాజులు శూద్రప్రాయులైపోతారు;ధర్మహీనులైపోతారు. మహాపద్మునికి సుమాల్యుడు మొదలైన తనయులు ఎనమండుగురు కలుగుతారు. వంద సంవత్సరాల పాటు వారి పరిపలన సాగుతుంది. ఆ పిమ్మట కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారికి నవనందు లని వ్యవహారము. ఆ నవనందులకు ఒక అవనీసుర శ్రేష్టుడు అంతరింపజేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలంపాటు మౌర్యులు పరిపాలన చేస్తారు. ముందు చెప్పిన అవనీసురశ్రేష్టుడు చంద్రగుప్తునికి అభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు ఆవిర్బవిస్తాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్దనుడు, అతని తనయుడు సుయశస్సు, వాని సుతుడు సంయుతుడు, అతని నందనుడు శాలిశూకుడు, వాని పుత్రుడు సోమశర్ముడు, వాని తనూభవుడు శతధన్వుడు, వాని కొమరుడు బృహద్రథుడు వరుసగా రాజు లవుతారు. మౌర్యునితో కలసి ఆ పదిమంది రాజులు మొత్తం మేద నూటముప్పయ్యేడు సంవత్సరాలు నిరాఘాటంగా రాజ్యపాలన చేస్తారు. ఆ సమయములో బృహద్రథుని సైన్యాధినేత శుంగవంశజుడయిన పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని అపహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు పుట్టి రాజవుతాడు, అతని తరువాత సుజ్యేష్టుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరసగా తమ తండ్రినుంచి సంక్రమించిన రాజ్యాన్ని తాము గ్రహించి పరిపాలిస్తారు. పైని చెప్పిన పదిమంది శుంగులు నూటపన్నెండు సంవత్సరాలు రాచరికం నిలుపుకుంటారు. శుంగవంశజులలో చివరివా డయిన దేవభూతిని కణ్వమంత్రి అయిన వసుదేవుడు వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిత్రుడనే పుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభావునికి నారాయణుడనే కొడుకుపుడతాడు. కణ్వ వంశస్థులు మొత్తంమీద మూడువందల నలభైఅయిదు సంవత్సరాలు ప్రభువులై పరిపాలన చేస్తారు. అటుపిమ్మటి విషయం విను. కణ్వ వంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. కాని, అతనికి బృత్యుడయిన ఆంధ్రజాతీయుడు వృషలుడనేవాడు అతనిని వధిస్తాడు. అధర్మ మార్గంలో సంచరిస్తూ ఆ రాజ్యాన్ని అవక్రవిక్రమంతో పరిపాలిస్తాడు. అతని తరువాత అతని తమ్ముడు కృష్ణుడు రాజవుతాడు. ఆ తరువాత శామ్తకర్ణుడు, పౌర్ణమానుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, హాలేయుడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీష సేతుడు, సునందనుడు, వృకుడు, జటావుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కందుడు, యఙ్నశీలుడు, శ్రుతస్కందుడు, యఙ్నశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే రాజులు పైతృకంగా వచ్చిన రాజ్యసంపదను క్రమంగా అనుభవిస్తారు. వారందరూ పరిపాలించిన కాలం నాలుగు వందలయేభై ఆరు సంవత్సరాలు. ఆ తరువాత నాభీరవంశంజులేడుగురు, గర్దభవంశజులు పదిమంది, కంకవంశజులు పదహారుగురు భూభారాన్ని ధరించి పరిపాలిస్తారు. ఆ తరువాత ఎనిమిది మంది యవనులు, పదునలుగురు బర్బరులు ప్రభువులవుతారు. ఆ పిమ్మట గురుండులు పదముగ్గురు, మౌనులు పదకొండుమంది గర్వంతో కన్నూ మిన్నూ కానకుండా పందొమ్మిదివందల తొమ్మిది సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు. ఆ పిమ్మట మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది మూడు వందల సంవత్సరాల పాటు మత్సరగ్రస్తులై పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు అనే యవనులు అవనీపాలకులవుతారు. ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతని తమ్ముడయిన యశోనందుడు, ప్రవీరకుడు అనేవారు వీరులై నూటారు సంవత్సరాలు పాలకు లవుతారు. ఆ రాజులకు పదముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఆరుగురు బాహ్లికదేశానికి అధిపతులవుతారు. మిగిలిన యేడుగురు కోసలదేశానికి అధిపతులవుతారు. అప్పుడు వైడూర్యపతులు నిషధదేశానికి అదీశ్వరు లవుతారు. పురంజయుడు మగధదేశప్రభువుగా ప్రభవిస్తాఉ. పుళిందులూ, యుదువంశస్థులూ, మద్రదేశీయులూ అయిన హీనజాతి జనులు బ్రహ్మ ఙ్నానహీనులూ, హరిభక్తివిహీనులూ కాగా వారికి ధర్మాన్ని ఉపదేశించి నారాయణుని పట్ల భక్తి తాత్పర్యం కలుగజేస్తాడు. శక్తి శౌర్యసమన్వితు లయిన క్షత్రియుల నుంచి ప్రయోగ వరకు గల భూమిని పరిపాలిస్తాడు. శూద్ర ప్రాయులైన రాజులు, వ్రాత్యులునాస్తికులు అయిన బ్రాహ్మణులు సౌరాష్ట్రమూ, అవంతీ, అభీరమూ, అర్బుదమూ, మాళవమూ అనే దేశాలకు అధిపతు లవుతారు. సింధుతీరంలోనూ, చంద్రభగ పరిసరాలలోనూ, కాశ్మీరదేశంలోనూ మ్లేచ్చాకారు లయిన రాజులు పరిపాలన చేస్తారు. వారికి తెలివితేటలుండవు; ధర్మమూ, సత్యమూ, దయాఉండవు. క్రోధమాత్సర్యాలతో పెచ్చరిల్లి స్త్రీలనూ, బాలకులనూ, గోవులనూ, బ్రాహ్మణులనూ వధించడానికి వెనుదీయరు. పరధనాసక్తి అల్పాయువులూ, అల్పబలులూ అవుతారు. శ్రీ విష్ణు పాదపద్మమకరందంలోని రుచి వారికి తెలియదు. ఒకరి పట్ల ఒకరు వైరం పెంచుకొని యుద్ధాలకు సిద్దపడి ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయంలో ప్రజలు కూడా వారి వేషభాషలనూ, శీలవృత్తులనూ అనుసరిస్తారు. వర్గం:హిందూమతం
బలరాముడు
https://te.wikipedia.org/wiki/బలరాముడు
thumb|150px|బలరాముడు thumb|300px|ఎడమ|తన హలముతో గంగను హస్తినాపురము వైపు లాగుతున్నబలరాముడు బలరాముడు, బలదేవుడు లేదా బలభద్రుడు, వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము, నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు. వీరి భార్య రేవతి. ఒకసారి కోపం వచ్చి యమునా నది దిశ మార్చారు, మరొకసారి హస్తినాపురాన్నే [నేటి ఢిల్లీని] తన హలాయుధంతో యమునలో కలప ఉద్యుక్తులయినారు. వీరు కురుక్షేత్ర యుద్దమప్పుడు శాంతి కాముకులై తీర్థ యాత్రలు చేసారు. అప్పుడు దర్శించిన ప్రదేశాలలో తిరుమల కూడా ఉంది. ఇతర పేర్లు బలభద్రుడు ప్రలంభఘ్నుడు బలదేవుడు అచ్యుతాగ్రజుడు రేవతీరమణుడు కామపాలుడు హలాయుధుడు నీలాంబరుడు రోహిణేయుడు తాలాంకుడు (తాటి చెట్టు గుర్తు కలవాడు) సంకర్షణుడు (ఒక గర్భము నుండి మరియొక గర్భమునకు లాగబడిన వాడు) సీరపాణి కాళినేఛేదనుడు (కాళిందిని భంగ పరచినవాడు) మూలాలు వర్గం:భాగవతము వర్గం:హిందూమతం
నరసింహావతారం
https://te.wikipedia.org/wiki/నరసింహావతారం
నరసింహావతారం, శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారాన్ని వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. స్వామి ప్రార్థనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం: 250px|right|thumb|విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్థిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు. ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్ | వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ || ప్రార్థన శ్లోకం: సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్| త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్ ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే|| అవతార విశిష్టత విష్ణువు ప్రతి అవతారానికీ ఒక ప్రత్యేకత ఉంది. అలాగే నరసింహావతారములో కొన్ని ప్రత్యేకతలను గమనించవచ్చును. భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి. అలాగే సేవకుని శాపాన్నించి ముక్తుని చేసిన మూర్తి. సర్వాంతర్యామిత్వం (అన్ని చోట్లా ఉండటం) అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది. హిరణ్యకశిపుని చంపడానికి ఇలా కుదరదు, అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా, మరొక ఉపాయం సాధ్యమయ్యింది. చివరకు రాక్షస వధ తప్పలేదు. భగవంతుడు సగం మనిషి, సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు. ఇంక ఈ అవతారాన్ని స్మరించడంలో తెలుగువారికి మరికొన్ని విశేషమైన వనరులు ఉన్నాయనవచ్చును. తెలుగునాట నృసింహాలయాలు మిక్కిలిగా ఉన్నాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట, మంగళగిరి, ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం), సింహాచలం, అహోబిలం వంటి ఆలయాలు ప్రసిద్ధం. వెంకటేశ్వర స్వామి, నరసింహ స్వామి (ఇద్దరూ ఒకరే) తెలుగునాట ఎన్నో ఇండ్లలో కులదైవాలు. సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన భాగవతాన్ని బమ్మెర పోతన మృదుమధురంగా తెనిగించాడు. అందులో నృసింహావతారానికి సంబంధించిన పద్యాలు తెలుగునాట బహు ప్రాచుర్యాన్ని పొందాయి. (పోతన రచనలోని భాగాలను ఈ వ్యాసంలో విరివిగా వాడడం జరిగింది.) జయ విజయుల శాపవృత్తాంతము జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను. ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు. హిరణ్యాక్షుడు కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీవరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీమహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. హిరణ్యకశిపుడు సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవమనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపసులను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు - "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళారు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని నప్పగించాడు. ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు. చదవనివాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ చదువగ వలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలకునకు చదువుచెప్పి నీతికుశలుని గావించి, రక్షించమని గురువులను ప్రార్థించాడు.గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు. చదువులలో మర్మం ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు. ఆందుకు ప్రహ్లాదుడు మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు? నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునె తరంగిణులకు? లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు? అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల? విష్ణు భక్తి నాకు దైవయోగం వల్ల సహజంగా సంభవించింది. అని జవాబిచ్చాడు. కోపించిన రాక్షస రాజుకు సర్దిచెప్పి, మరల వివిధోపాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దుచేసి - "గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో, విద్యా సారమెరుంగకోరెద, భవదీయోత్కర్షమున్ జూపవే ననుగన్న తండ్రీ" -అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ! - అని చెప్పెను. మరి ఆ మర్మమమేమిటి? "తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రము. శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి." - అని వివరించాడు. ఏడీ విష్ణువు? హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు. క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్ గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్ గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? - అన్నాడు బాలుడు. ఇంకా "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు. హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స త్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతినుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరో త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్ధండ ప్రభావంబుతోన్ ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను (సర్వాంతర్యామిత్వం) అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు. శ్రీ నరసింహావిర్భావం బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. " ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు. ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు. భక్త పాలన thumb|హిరణ్యాకశిపుని చంపుతున్న నరసింహ అవతారము స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు. "స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు. "నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి. శంకరుడు, బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని ప్రస్తుతించారు. "దేవ దేవా! నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారికి యమునిగురించిన భయముండదు" అన్నాడు బ్రహ్మ. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి. ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు. శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సం చారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభా కారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా! తెలుగులో శ్రీనృసింహ గాధలు శ్రీ భాగవతం - పోతన నృసింహ పురాణం - ఎర్రాప్రగడ ప్రహ్లాద విజయం - త్యాగరాజు అన్నమాచార్య సంకీర్తనలు ఓం నమో శ్రీ నారసింహాయ" - భండారు పర్వతాలరావు సింహగిరి వచనములు - కృష్ణమాచార్యులు శ్రీనృసింహాలయాలు Sri Laxmi Narsimha Swamy Devasthanam, Sundilla, Peddapelli District + కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం కనకగిరి కనకాచలపతి కర్ణాటక పెన్నహోబిళం శ్రీ లక్ష్శీనరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, యాదగిరిగుట్ట. శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము, సింహాచలం. శ్రీ కనకవల్లి భూతనరసింహుల ఆలయం, ఐ.ఎస్‌.జగన్నాధపురం శ్రీ పానకాల నరసింహ స్వామి, మంగళగిరి శ్రీ నవనారసింహాలయాలు, అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము, ధర్మపురి, కరీంనగర్ జిల్లా. వేదాద్రి, కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, వేపంజేరి ఖమ్మం అంతర్వేది కోరుకొండ తిరుమలాయపాలెం , శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయం, గోకవరం మండలం తూ" గో" జిల్లా ఆగిరిపల్లి చింతలవాడి పెద్దముడియం నరసింహకొండ, నెల్లూరు శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము, పెంచలకోన, నెల్లూరు పెన్నహోబిలం లింబాద్రి బీంగల్,నిజామాబాధ్ భైంసా హేమాచలం - మల్లూరు, వరంగల్ ఘటికాచలం - షోలింగాపూర్, తమిళనాడు మేల్కోటె, కర్ణాటక దాళ వాటం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, దాళ వాటం, హిందూపురం దగ్గర సాలిగ్రామ, ఉడుపి, కర్ణాటక సావనదుర్గ, కర్ణాటక దేవరాయనదుర్గ, కర్ణాటక వెల్చాల్ నరసింహస్వామి గుడి కొరగుట్ట నరసింహ స్వామి దేవస్థానం - నరసింహుల గూడెం, వరంగల్ జిల్లా ,తెలంగాణా ఛీర్యాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, ఛీర్యాల, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్. పాలెం శ్రీ సుందర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము-పాలెం గ్రామం- నల్లగొండ జిల్లా- (తెలంగాణా) శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావననరసింహస్వామి దేవాళయం,రవ్వలకొండ,బనగానపల్లె,కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ శ్రీ మాల్యద్రి లక్ష్మినరసింహ స్వామి మాలకొండ, వలేటివారిపాలెం మండలం ,ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం కొడవటంచ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ ప్రార్థనలు ఆది శంకరాచార్యులు - లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నృసింహ సహస్రనామ స్తోత్రము నరసింహ శతకము విశేషాలు ప్రత్యేకించి ఆరోగ్యంకోసం నరసింహ స్వామిని ఆరాధించడం ఒక ఆచారం. నరసింహాలయాలు ఉన్న కొండలను "వేదాద్రి" అని పిలవడం చాలాచోట్ల జరుగుతుంది. మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ప్రహ్లాదుని అవతారమని కథ, భక్తుల విశ్వాసం తెలుగునాట బాగా ప్రసిద్ధి చెందిన పౌరాణిక నాటకాలలో "భక్త ప్రహ్లాద" ఒకటి. "భక్త ప్రహ్లాద" వంటి నాటకాలు వేసేప్పుడు నరసింహపాత్రధారిగా కాస్త చిన్న బాలుడిని తీసుకొంటారు (స్తంభంలో పట్టడానికి అనువుగా). నరసింహావిర్భావం సీనులో స్తంభం చీలి (ఉగ్రమూర్తిగా)స్వామి (పాత్రధారి) బయటకు రాగానే శాంతింపజేయడానికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తెలంగాణాలో యాదగిరిగుట్ట చుట్టుప్రక్కల జిల్లాలలో "యాదగిరి" అనేది సర్వ సాధారణమైన పేరు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో (అప్పల నరసింహస్వామి పేరుమీద) అప్పారావు, అప్పలరాజు, అప్పలసామి, అప్పలమ్మ, నరసరాజు, నరసమ్మ వంటివి సాధారణమైన పేర్లు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో (పానకాల నరసింహస్వామి పేరుమీద) పానకాలు పేరు పెట్టుకొంటారు. అలాగే నరసింహ, సింహ, నరహరి వంటి పదాలతో కూడిన పేర్లు అతిసాధారణం. అన్నమయ్య కీర్తనలలో శ్రీవేంకటేశ్వరుని రూపాన్ని స్తుతించేవి అధికాధికం. తరువాత శ్రీనారసింహుని స్తుతించే కీర్తనలు కూడా చాలా ఉన్నాయి. తెలుగు సినిమా పేర్లలో కూడా "సింహ" బాగా ప్రాచుర్యాన్ని పొందింది. (సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహాద్రి, లక్ష్మీనరసింహా, నరసింహుడు, బొబ్బిలిసింహం ) చెంచులక్ష్మి సినిమాలో నృసింహావతారం ఉత్తరభాగంగా చెప్పబడే కథ ఉంది. మూలాలు వెలుపలి లంకెలు వర్గం:పురాణాలు వర్గం:హిందూమతం వర్గం:విష్ణుమూర్తి అవతారాలు
బుద్ధావతారం
https://te.wikipedia.org/wiki/బుద్ధావతారం
బుద్ధావతారం జిష్ణువు దశావతారాలలో ఒకటి. బుద్దావతారము క్షణ కాలము మాత్రమే ఉంది. జిష్ణుమూర్తి(దేవేంద్రుడు)రాక్షసుని చంపడానికి దిగంబర అవతారము ఎత్తుతాడు. అందుకని ఈ అవతారమును పూజించరు. అంతకు ముందరి అవతారమైన అర్జునుడి అవతారం పూజిస్తారు. ఇంద్రభగవాన్. బుద్దార్పణం అంటారు. పురాణ గాథ త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేక పోతారు.అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింప చేయడానికి, లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా జిష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు. ఇదే విషయం "ఆపన్నివారక స్తోత్రము "లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్ధం. అన్నమయ్య వర్ణన పైన వృత్తాంతాన్ని అన్నమయ్య "దశావతార వర్ణనలో" పేర్కొన్నాడు. 'పురసతుల మానములు పొల్లజేసినచేయి. ఆకాసాన బారేపూరి అతివలమానముల కాకుసేయువాడు" ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు. వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది. ఇవీ చూడండి ఏకవింశతి అవతారాలు మూలాలు ఇతర లింకులు వర్గం:విష్ణుమూర్తి అవతారాలు
నర నారాయణ అవతారము
https://te.wikipedia.org/wiki/నర_నారాయణ_అవతారము
REDIRECT నరనారాయణులు
శ్రీ కృష్ణుడు
https://te.wikipedia.org/wiki/శ్రీ_కృష్ణుడు
శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారము. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను,రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దొచుకున్నవాడిగాను యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి.. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు. హిందూమతంలో, ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణునిపూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మథురలో బాలకృష్ణునిగా, పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాధ్‌జీగా, తిరుమలలో వేంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాఐరోపాపగా కృష్ణుని పూజిస్తారు. ఇంతే కాకుండా కృష్ణుని ఆలయాలు, విష్ణువు ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోను, వర్గాలలోను అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి. వీటిలో ప్రధానమైన భావం: శ్రీమహా విష్ణువు తన సృష్టి లోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈవిధంగా అవతరించడాన్నిలీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు, భాగవతం ప్రకారం, భగవంతునికి ఇరువది రెండు (22) ఉన్నాయి. శ్రీమహావిష్ణువు లీలావతారాలలో ఇరువది ఐదవ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు ఇరవైరెండింటి లోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణావతారం కొన్నిచోట్ల చెప్పబడుతుంది. కొన్నిచోట్ల చెప్పారు. ("రామోరామశ్చరామశ్చ"). యుగాలలో రెండవదయిన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగ రావణాది రాక్షస శిక్షకుడుగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదయిన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. నామాలు, రూపం left|thumb|200px|ఒడిషా జగన్నాథ మందిరంలో ఉన్న బలభద్రుడు (బలరాముడు), సుభద్ర, కృష్ణుడు విగ్రహాల నమూనా. thumb|right|200px|భగవాన్ శ్రీకృష్ణుని సాధారణ చిత్రీకరణ "కృష్ణ" అనగా నలుపు అని అర్ధం. కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహ్యం. ఇంకా ఈ పేరుకు అనేక వివరణలున్నాయి. మహాభారతం ఉద్యోగపర్వం (5.71.4) ప్రకారం 'కృష్' అనగా దున్నుట (నాగలి మొన నల్లగా ఉంటుంది గనుక ఈ పేరు వచ్చింది). భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు (వ్యవసాయానికి ప్రాముఖ్యతను తెలిపే పేరు). వల్లభ సాంప్రదాయం బ్రహ్మసంబంధ మంత్రం ప్రకారం పాపాలను నాశనం చేసే మంత్రం "కృష్ణ". చైతన్య చరితామృతంలో చెప్పిన అర్థం ప్రకారం మహాభారత వాక్యం (5.71.4) ఆకర్షించేవాడు కృష్ణుడు. భాగవతం ఆత్మారామ శ్లోకం (1.7.10) లో కూడా ఈ భావం చెప్పబడింది. విష్ణుసహస్రనామం 57వ పేరుగా వచ్చిన "కృష్ణ" అనగా సచ్చిదానంద స్వరూపమును సూచించునది అని ఆదిశంకరాచార్యుడు వివరించాడు.Vishnu sahasranama, Swami Tapasyananda's translation, pg. 51. ఇంకా కృష్ణునికి గోవిందుడు, గోపాలుడు, వాసుదేవుడు వంటి అనేకనామాలున్నాయి. జగన్నాథుడు, విఠోబా వంటి పేర్లు కొన్ని ప్రాంతాలలో లేదా సంప్రదాయాలలో ప్రాచుర్యం కలిగి ఉన్నాయి. in విష్ణు సహస్రనామ స్తోత్రంలో "కృష్ణ" అనే నామం రెండు సార్లు వస్తుంది (1) అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః (2) వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః - ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు. అవి క్లుప్తంగా క్రింద ఇవ్వబడినాయి* కృష్ణమాచారి విపుల వ్యాస పరంపర. ఒక్కొక్క నామమునకూ అనేక వ్యాఖ్యలనుండి తీసుకొన్న విషయాన్ని రచయిత ఇక్కడ సమర్పించాడు."శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము" సంగ్రహ తాత్పర్య వివరణ - గీతా సాహిత్య శిరోమణి పండిత పెమ్మరాజు రాజారావు రచన - గొల్లపూడి వీరాస్వామి సన్స్ ప్రచురణ."శ్రీ కైవల్య సారథి" - విష్ణు సహస్రనామ భాష్యము -శ్రీ విద్యా విశారద డా.క్రోవి పార్థసారథి రచన. సృష్ట్యాది లీలావిలాసాల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు. నల్లని వర్ణం కలవాడు. నీలమేఘ శ్యాముడు. తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు. నాగలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు. కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు. వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయం కలిగించి జ్ఞానం పండించువాడు. కానరాని, తెలియరాని, అందజాలనివాడు. సంపూర్ణభక్తికి మాత్రమే లభ్యమయ్యేవాడు. అనేక దేవాలయాల విగ్రహాలలోను, ఇతర శిల్పాలలోను, చిత్రాలలోను, ప్రార్థనలలోను, కావ్యాలలోను, సాహిత్యంలోను, పురాణాలలోను, సినిమాలలోను కృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉంది. ఉదాహరణగా "కృష్ణాష్టకం" అనే ప్రార్థనలో కృష్ణుని వర్ణించిన విధానం - దేవకీవసుదేవుల నందనుడు, కంసచాణూర మర్దనుడు, నల్లని మేనికాంతి (అతసీపుష్ప సంకాశం) కలవాడు, నెమలి పింఛము, వివిధ ఆభరణములు, మందారమాల, పీతాంబరాలు, తులసి మాలలు ధరించినవాడు, మెలిదిరిగిన ముంగురులు కలవాడు, రుక్మిణీసత్యభామాది భామలతో విహరించువాడు, గోపికల కుచముల కుంకుమ అంటిన వక్షస్థలం, శ్రీవత్స చిహ్నం కలవాడు, వనమాల, శంఖచక్రాలు ధరించినవాడు. తెలుగునాట పోతన శ్రీమదాంధ్ర భాగవతం అత్యంత ప్రాచుర్యం కలిగిన గ్రంథం. ఇందులో కృష్ణుని రూప స్వభావ వర్ణన అనేక పద్యాలలో ఉంది. పోతన వాడిన కొన్ని వర్ణనలు - నల్లనివాడు, పద్మ నయనమ్ములవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, సుధారసమ్ము పైజల్లెడువాడు, యదుభూషణుడు, నర (అర్జునుని) సఖుడు, శృంగార రత్నాకరుడు, లోకద్రోహి నరేంద్ర వంశదాహకుడు, లోకేశ్వరుడు, నిర్వాణ సంధాయకుడు, భక్తవత్సలుడు, బ్రాహ్మణ్యుండు, గోవిందుడు, - పాండవులకు సఖుడు, సారథి, సచివుడు, నెయ్యం, వియ్యం, విభుడు, గురువు, దేవుడు - ఇలా లెక్కలేనన్ని వర్ణనలున్నాయి. అన్నమయ్య చెప్పిన కొన్ని వర్ణనలు - ముద్దుగారే యశోద ముంగిట ముత్యము, కాళింది పడగలపైని కప్పిన పుష్యరాగము, రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము జీవితం వివిధ గ్రంథాలలో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం ప్రజలకు సుపరిచితమైనది. ఇందులో నవమ స్కంధములో వసుదేవుని వంశక్రమం ఉంది. తరువాత దశమ స్కంధం, ఏకాదశ స్కంధములలో కృష్ణుని జీవిత వృత్తాంతము ఉంది. సంభాషణలో శ్రీకృష్ణుని లాక్షాగృహదహనానంతరం కృష పరవేశం అవుతుంది. అక్కడినుండి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణం ఉంది. భాగవతం కథారంభంలోనే కృష్ణుని నిర్యాణం చెప్పబడింది. వీటిలోనుండి సంగ్రహింపబడిన కృష్ణుని కథ క్రింద ఇవ్వబడింది. జననం thumb|శ్రీ కృష్ణుని జననం - రాజా రవివర్మ చిత్రం లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు. మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర, కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడుగా రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది రెండుగా చీలి పోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పోయి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు. వ్రేపల్లెలో thumb|ఇరువురు గోపాలకులతో కలసి గోవులను ఇంటికి తోలుకు వస్తున్న కృష్ణుడు. మధురానగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే వ్రేపల్లె లోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితం గడిపాడు. పాలుత్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. చిరు ప్రాయంలో యశోదకు తననోటిలో అండ పిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనందాశ్చర్యచకితురాలిని చేశాడు. దోగాడే వయసులో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో రెండు మద్ది చెట్లను కూల్చి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం గావించాడు. అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు. వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు. కాళిందీనదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యంచేసి "తాండవకృష్ణుడు" అయ్యాడు. కాళీయుని మదమణచి, కాళిందిని విడిచి దూరంగా పంపి వ్రేపల్లె వాసుల మన్ననలను పొందాడు. ప్రళయకాలంలో గోవర్ధన గిరిని తన చిటికెన వేలుతో ఎత్తి వ్రేపల్లె వాసులను ఆ గిరి కిందకు చేర్చికాపాడి వ్రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి, ఆపత్కాలంలో ఆదుకుని, ధైర్యసాహసాల ప్రదర్శనతో వ్రేపల్లెను మురిపించాడు. కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని, ఉద్ధవుని దూతగా పంపి, కృష్ణబలరాములను మధురకు రప్పించాడు. బలరామకృష్ణులు చాణూర ముష్టికులనే మల్లులను, తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తుని గావించారు. చెరలోఉన్న తల్లి, తండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు. దేవకీ వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమం చేరుకొని అక్కడ కుచేలుని చెలిమిని పొందారు. గురుదక్షిణగా అంతకుపూర్వమే మరణించిన గురుపుత్రుని బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించారు. విద్యాధనంతో తన తల్లి తండ్రులవద్దకు చేరుకున్నారు. కుటుంబం thumb|పెంపుడుతల్లితో బాలకృష్ణుడు దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు. చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణబలరాములు యశోదా నందులవద్ద వ్రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి. శ్రీ కృష్ణుడు రాధా దేవిని ప్రేమించి, బ్రహ్మదేవుని సమక్షంలో వివాహం చేసుకున్నారు. కానీ ఆమె శ్రీకృష్ణుని ప్రేయసిగా పరిగణించబడుతుంది. రాధాదేవి అనేక పురాణాలలో లక్ష్మీదేవి అవతారంగా వర్ణించబడింది. శ్రీ కృష్ణుడు అష్ట మహిషులను వివాహమాడాడు. విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మి అతడిని ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించాడు. రుక్మిణి పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణుడు ఆమె అభీష్టం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి వివాహం చేసుకుంటాడు. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. కృష్ణుడు శమంతకమణిని తనకిమ్మని కోరగా అతడు అంగీకరించలేదు. ఒకసారి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహము అతనిని చంపి, మణిని హరించింది. జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె జాంబవతి కిచ్చాడు. మణి కొరకై ప్రసేనుడిని కృష్ణుడే హతమార్చెనన్న అపవాదు వ్యాపించింది. కృష్ణుడు మణిని అన్వేషిస్తు పోయి పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు. జాంబవంతునికీ, కృష్ణునికీ జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడైనాడు. శ్రీకృష్ణుని శ్రీరాముని అవతారంగా గుర్తించిన జాంబవంతుడు మణితో సహా కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు. మణిని తెచ్చి సత్రాజిత్తునకిచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు మణితోపాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేసెను. కాళింది, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ అతని ఇతర భార్యలు. భద్ర శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుని చెల్లెలైన శ్రుతకీర్తి పుత్రిక. మిత్రవింద కూడా అవంతీ రాజు పుత్రిక, మేనత్త కూతురు. ఆమెను స్వయంవరంలో వరించి కృష్ణుడు చేపట్టాడు. కోసల దేశాధిపతి నగ్నజిత్తుకు ఏనుగుల వంటి బలం కలిగిన ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. కృష్ణుడు ఏడు రూపాలు దాల్చి ఏడు ఎద్దులను బంధించాడు. రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశాడు. లక్షణ మద్ర దేశాధిపతి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది. ఈ విధంగా కృష్ణుని ఎనమండుగురు భార్యలు అష్టమహిషులుగా విలసిల్లారు. సుభద్రను అర్జునునికి ఇచ్చి పెళ్ళి చేశారు. వారి కొడుకు అభిమన్యుడు (కృష్ణునికి మేనల్లుడు) శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి 16వేలమంది (కొన్ని గ్రంథాలలో 16100 అని ఉన్నది) భార్యలతో శారీరక బంధము కలిగియుండలేదు. 16వేల గోపికా స్త్రీలను నరకాసురుని బారినుండి కాపాడి సంఘములో సముచిత స్థానము కల్పించాడు. "భర్త అనగా భరించువాడు" అను నానుడి ప్రకారము, ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు. కానీ పైన చెప్పబడిన అష్ట అష్టమహిషులతోనే శ్రీకృష్ణునికి సంతానము కలిగినది అని గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి. . ద్వారకానగరంలో thumb|left|కంసుడ్ని చంపిన తరువాత వసుదేవుడ్ని విడిపిస్తున్న బలరామ కృష్ణులు లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు. ఒకమారు పారిజాత పుష్పం కారణంగా కృష్ణుడు ఇంద్రునితో పోరి స్వర్గలోకంనుండి పారిజాతతరువును తెచ్చి సత్యభామకు ప్రీతికూర్చాడు. లోకాళను బాధిస్తున్న నరకాసురుని వధించి అతని కొడుకు భగదత్తునికి పట్టం కట్టాడు. నరకునిచే బంధింపబడిన రాజకన్యలను కృష్ణుడు పెండ్లాడి అందరిపట్ల తనమాయాప్రభావంతో సంసారం నెరపాడు. శ్రీకృష్ణుని అతిశయాన్ని చూసి ఓర్వలేక కాలయవనుడు, జరాసంధుడు, సాళ్వుడు వంటివారు కృష్ణునిపై దండెత్తారు. శ్రీకృష్ణుడు వారిని ఓడించాడు. ఇంకా ద్వివిధుడు, దంతవక్త్రుడు మొదలైనవారు కూడా కృష్ణుని చేత హతులైనారు. మహాభారతంలో మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీ కృష్ణుని అనుబంధం మరువరానిది. పాండవ మద్యముడైన అర్జునునితో చెలిమి విడదీయరానిది. పాండవుల జీవితములో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుని పాత్ర ఉంది. శ్రీకృష్ణుని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము తప్పమిగిలినవన్నీ శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతో జరిగినవే. కీలకమైన సమస్యలన్నీ కృష్ణుని సహాయంతో తీరినవే. ద్రౌపదిని శ్రీకృష్ణుడు స్వంత చెల్లెలికన్నామిన్నగా చూసుకున్నాడు. వస్ర్తాపహరణ అవమానమునుండి ఆమె శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది. పాండవవనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాతో పరిష్కారం చేసుకున్నారు. వారి రాజ్యం మీదకు అనేకమార్లు దండెత్తిన జరాసంధుని భీముని సాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు. ద్వారక సముద్రగర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్తంచేసి వారిని ఆపదనుండి రక్షించాడు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ సమయంలో మేనత్తకి ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించిన తరువాత అతనిని చక్రాయుధంతో వధించాడు. right|300px|thumb|యుద్ధసమయంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి గీతాబోధ చేయటం. పాండవుల వనవాసం తరువాత వారి తరఫున కురుసభలో రాయబారము చేశాడు. కురుక్షేత్రంలో యుద్ధసమయంలో అర్జునునికి గీతాభోధ చేసి అతనిని యుద్ధోన్ముఖుని చేశాడు. అర్జునునికి సారథియై యుద్ధం ముగిసేవరకూ పాండవులకు రక్షణగా ఉన్నాడు. అశ్వత్థామ అస్త్రంవల్ల ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యవును ఎదుర్కోగా కృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు. నిర్యాణం thumb|left|శ్రీ కృష్ణుని మరణం మహాభారత యుద్ధానంతరం యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. అలాగే యాదవకులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టిన ముసలం ( రోకలి ) అందరి మరణానికీ కారణమయ్యింది. బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడినుండి కృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది. అయితే ఒక నిషాదుని ( పూర్వజన్మలో వాలి) బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది. పురాణాలలో తెలిపిన ప్రకారం The Bhagavata Purana (1.18.6), Vishnu Purana (5.38.8), and Brahma Purana (212.8) state that the day Krishna left the earth was the day that the Dvapara Yuga ended and the Kali Yuga began. శ్రీకృష్ణుని నిర్యాణంతో ద్వాపరయుగం అంతమయింది. కలియుగం ఆరంభమయింది. ఇది క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17/18 తేదీలలో జరిగిందని కొన్ని అంచనాలున్నాయిSee: Matchett, Freda, "The Puranas", p 139 and Yano, Michio, "Calendar, astrology and astronomy" in (అయితే ఈ అంచనాలలో పలు అభిప్రాయ భేదాలున్నాయి) రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు, గౌడీయ వైష్ణవుల విశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుడు జరామరణ రహితుడు. మహాభారతంలో యుద్ధఘట్టం వర్ణనలో కొన్నిచోట్ల శ్రీకృష్ణుడి దేహం గాయపడినట్లు వర్ణించినా గాని, మరికొన్ని ఘట్టాలలో అతను చరాచరవిశ్వాత్మకుడని, ఆదిమధ్యాంతరహితుడని, సామాన్యమైన పాంచభౌతిక దేహానికి అతీతుడనీ గ్రహించాలి. ఇదే విషయాన్ని కృష్ణుడు ఉద్యోగపర్వంలో చెప్పాడు కూడాను. "Knowest thou not sinless Govinda, of terrible prowess and incapable of deterioration?" చారిత్రక అంశాలు ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్‌లో లభించిన క్రీ.పూ. 800 నాటి ఒక చిత్రంలో సుదర్శన చక్రం ధరించిన రథసారథిని కృష్ణుడని అనుకోవచ్చును.D.D.Kosambi(1962), Myth and Reality: Studies in the Formation of Indian Culture, New Delhi, CHAPTER I: Social and Economic Aspects of the Bhagavad-Gita, paragraph 1.16. కృష్ణుని గురించిన ప్రస్తావన లభించిన మొట్టమొదటి గ్రంథం (చరిత్ర కారుల అంచనా ప్రకారం) ఛాందోగ్యోపనిషత్తు. ఇందులో కృష్ణుడు దేవకి సుతుడని, ఘోర అంగీరసుని శిష్యుడని చెప్పబడింది.See Chandogya Upanishad(III, xvii, 6) in "నారాయణ అధర్వశీర్ష", "ఆత్మబోధ" వంటి ఉపనిషత్తులలో కృష్ణుడు భగవంతుడని, నారాయణుని అవతారమని చెప్పబడింది. తైత్తరీయారణ్యకము (X,i,6) లో వాసుదేవుడు, నారాయణుడు, విష్ణువుల గురించిన ప్రస్తావన ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన వ్యాకరణకర్త పాణిని "అష్టాధ్యాయి"లో"వాసుదేవకుడు" అనగా "వాసుదేవుని భక్తుడు" అని తెలిపాడు. అదే సందర్భంలో అర్జునుని ప్రస్తావన కూడా ఉండడం వలన ఈ వాసుదేవుడే కృష్ణుడు అనుకొనవచ్చును.Page 10: Panini, the fifth-century BC Sanskrit grammarian also refers to the term Vaasudevaka, explained by the second century BC commentator Patanjali, as referring to "the follower of Vasudeva, God of gods." వేదకాలంలో ఎప్పుడో "వాసుదేవుడు", "కృష్ణుడు" ఒకరిగా భావింపబడడం మొదలయ్యుండవచ్చును. ప్రస్తుతం మనకు లభిస్తున్న మహాభారతం కాలం నాటికి కృష్ణుడు విష్ణువు అవతారమనే భావన స్థిరపడింది. మధురలో ఉండే శూరసేనుడు "హెరాకిల్స్"ను పూజించాడని క్రీ.పూ. 4వ శతాబ్దంలో చంద్రగుప్తుని ఆస్థానాన్ని దర్శించిన మెగస్తనీస్ వ్రాశాడు. మెగస్తనీస్ వ్రాసిన ఇతర వ్రాతలను బట్టి "హెరాకిల్స్", "కృష్ణుడు" ఒకరే అనుకోవచ్చును. క్రీ.పూ. 180-165 కాలంలో గ్రీకో-బాక్ట్రియన్ పాలకుడు "అగాథకిల్స్" (Agathocles) కృష్ణ బలరాములున్న నాణేలను ముద్రించాడు. చితోర్ ఘర్ జిల్లా నగరి వద్ద ఘోసుండి, హాథిబాడలలో లభించిన క్రీ.పూ. 2వ శతాబ్దం నాటి శాసనాల ప్రకారం - సంకర్షణ (బలరాముడు), వాసుదేవులను (కృష్ణుడు) పూజించడం కోసం గజాయనసర్వతాత అనే రాజు "నారాయణ వటం"లో ఒక "పూజా శిలా ప్రాకారం" (గుడి వంటిది) నిర్మించాడు.D.C.Sircar (1942), Select inscriptions bearing on Indian history and civilisation Vol 1, From sixth century BC to sixth century AD, Calcutta. These are four renderings of the same text. అదే కాలంనాటి శాతవాహనుల శాసనాలలో కూడా ఇతర దేవతలో పాటు సంకర్షణ, వాసుదేవుల ప్రస్తుతి ఉంది.D.C.Sircar (1942), Select inscriptions bearing on Indian history and civilisation Vol 1, From sixth century BC to sixth century AD, Calcutta. frame|క్రీ.పూ. 110లో భాగవత ధర్మాన్ని అవలంబించిన హెలిడోరస్ వేయించిన శాసనం క్రీ.పూ. 1వ శతాబ్దంలో గ్రీస్‌కు చెందిన హెలిడోరస్ (Heliodorus) భిల్సా సమీపంలో బేసన్‌గర్ వద్ద ఒక స్తంభ శాసనాన్ని (Heliodorus pillar) వేయించాడు. ఆ శాసనంపై వ్రాసిన విషయం: " దేవదేవుడైన వాసుదేవుని కొఱకు ఈ గరుడ స్తంభాన్ని వేయించిన భాగవత ప్రభువు భక్తుడు హెలియోడోరస్. అతను తక్షశిలకు చెందిన గ్రీకు వ్యక్తి (Diya Greek Dion) కొడుకు, గ్రీకుమహారాజు అంటాలికిట (Great King Amtalikita [Greek Antialcidas]) రాయబారిగా కాశీపుత్రభగభద్రుని ఆస్థానానికి వచ్చియున్నాడు. కాశీపుత్ర భగభద్రుడు తన 14వ సంవత్సరపు పాలనలో ఉన్నాడు. [...] మూడు అమృత ధర్మాలు [...] పాటిస్తే స్వర్గానికి మార్గం లభిస్తుంది. ఆత్మ సంయమనం, దానగుణం, శ్రమ". ఇలాగే ఇదే కాలానికి చెందిన మరికొన్ని శాసనాలు లభించాయి.S Jaiswal (1967), The origins and development of Vaisnavism, New Delhi - Manhorlal Munshiram.Gavin Flood (2003), The Blackwell Companion to Hinduism సా.శ.పూ. 150 కాలానికి చెందిన వ్యాకరణకర్త పతంజలి రచనలలో కృష్ణుడు, సంకర్షణుడు, జనార్దనుడు, బలరాముడు, కేశవుడు వంటి దేవతల ప్రస్తావనలున్నాయి. క్రీ.పూ. 1వ శతాబ్దంలో వృష్ణివంశానికి ఐదుగురు వీరుల పూజ గురించి ( బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు ) ప్రస్తావన ఉన్న శాసనం మధుర సమీపంలో "మోరా" వద్ద లభించింది. అయితే శ్రీకృష్ణుడు చారిత్రక పురుషుడు కాదని, కేవలం మహాభారత కావ్యంలో కల్పిత పాత్ర అని, మహాభారత కావ్యం వేద కాలం తర్వాత, సుమారు 800 B.C - 500 B.C మధ్య రచించబడినది అని, ఆర్యుల రాక మునుపు భారతదేశంలో సంస్కృత భాష వాడుకలో లేదని వాదించేవారు లేకపోలేదు. ఆరాధన శ్రీవైష్ణవం కృష్ణభక్తి హరేకృష్ణ ఉద్యమం కొన్ని ప్రసిద్ధ శ్రీకృష్ణ మందిరాలు పూరి, ఒడిషా - జగన్నాథ మందిరం గురువాయూరు, కేరళ - గురువాఐరోపాప మందిరం నాథద్వార, గుజరాత్ - శ్రీనాధ్ జీ మందిరం మధుర, బృందావనం -ఉత్తర ప్రదేశ్ ఉడిపి - కర్ణాటక ద్వారక - గుజరాత్ మన్నార్ గుడి - విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ - రాజగోపాల మందిరం హరేకృష్ణ మందిరాలు - మాయాపూర్, బెంగళూరు, ముంబై, తిరుపతి నార్కెట్ పల్లి - నల్గొండ - తెలంగాణ - వారిజాల వేణుగోపాలస్వామి శ్రీకృష్ణారాధన ద్వారా ప్రసిద్ధులైనవారు మీరాబాయి చైతన్యప్రభు సూరదాసు మధ్వాచార్యుడు భక్తి వేదాంత ప్రభుపాద ఇవి కూడా చూడండి దశావతారములు మహాభాగవతం భగవద్గీత శ్రీ కృష్ణ జన్మభూమి మూలాలు బయటి లింకులు The Search for the Historical Krishna, by Prof. N.S. Rajaram (veda.harekrsna.cz) Sri Krishna - Differences in Realisation & Perception of the Supreme (stephen-knapp.com) Hindu Wisdom - Dwarka (http://www.hinduwisdom.info/Dwaraka.htm) Vedic Archeology (A Vaishnava Perspective) (gosai.com) The Devious God: Mythological Roots of Krishna’s Trickery in the Mahabharata by Elaine Fisher Exploits of Lord Krishna Article on the chronology of Krishna (timesofindia.indiatimes.com) వర్గం:హిందూ దేవతలు వర్గం:పురాణ పాత్రలు వర్గం:విష్ణుమూర్తి అవతారాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
నిఘంటువు
https://te.wikipedia.org/wiki/నిఘంటువు
right|thumb| తెలుగు అకాడమి వారి తెలుగు కన్నడ నిఘంటువు నిఘంటువు (అనగా ఆక్షర క్రమములో పదములు, వాటి అర్థములు కలిగినది. దీనినే పదకోశము, వ్యుత్పత్తి కోశము అనికూడా అంటారు. తెలుగు భాష యందు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన నిఘంటువు ప్రఖ్యాతి గాంచింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు సవర పదకోశం చేశారు. నిఘంటువులలో యాస్కుడు కశ్యపుడు మున్నగు ముని పుంగవులు రచించిన నిరుక్తములు అను నామము కలవి వేదమునకు చెందినవి. ఏయే మహర్షి ఏయే వేదములోని పదములనే రీతిన రచించెనో ఆ నిరుక్తము ఆ వేదము యొక్కది అగును. ఇందువలన ఒక్కొక్క నిరుక్తము ఒక్కొక్క వేదసంబంధమైనదిగ ఉండును. కొంతకాలము నుంచి కొందరు పండితులు ఈ నిరుక్తములవలనే ఒక్కొక్క గ్రంథమునకు, ఒక్కొక్క కవి రచించిన అన్ని గ్రంథములకు ఆ గ్రంథముల పేరుతో నిఘంటువులను, ఆ కవి పేరుతో నిఘంటువులను రచించుట జరిగింది. ఈ నిఘంటువులు పలు రకాలు. పర్వాయపదములను బోధించునవి కొన్ని, ఉదాహరణకు అమరకోశము, నామలింగానుశాసనము, అభిదాన చింతామణి మొదలగునవి. శబ్దములయొక్క నానార్థములను తెలుపునవి మరికొన్ని.వీటినే నానార్థ నిఘంటువులు అంటారు. ఉదాహరణకు దండినాథుని నానార్థరత్నమాల, మేదినీ కోశము, విశ్వప్రకాశము మొదలైనవి. సంస్కృత భాషలో శబ్దబోధక నిఘంటువులు శబ్ద వ్యుత్పత్తిని వివరించునవి మరికొన్ని. తెలుగులో నానర్థ నిఘంటువును సూరయామాత్యుడు రచించిన నానార్థరత్నమాల మాత్రమే అని చెప్పవచ్చును.అలానే సంస్కృతములో ఏకాక్షర నిఘంటువులు కొన్ని ఉన్నాయి. అవి తెలుగులో మనకు లేవు. అలానే సంస్కృతములో లేని నిఘంటువు ఒకటి తెలుగులో లభించును. అదియే రామయణము కృష్ణయామాత్యుడు రచించిన దేశ్యనామార్థకోశ, తెలుగులూ వివిధ దేశ్యములైన పేళ్ళతో కల నిఘంటువు. అష్టాదశ మహాపురాణములలో చేరిన శ్రీమద్వేద మహర్షి ప్రణీతమైన అగ్నిపురాణములోను నిఘంటు నిర్మాణ ప్రక్రియయే అనంత నిఘంటు నిర్మాతలకు మార్గదర్శకము. సా.శ.1900 సంవత్సరానికి పూర్వపు తరువాతి తెలుగు, ఇతరభాషల నిఘంటువులు వేంకటేశాంధ్రము ఇది సా.శ.1860 ప్రాంతమున గణపవరపు వేంకటకవిప్రణీతమైన సర్వలక్షణశిరోమణి అను నామాంతరము గల శ్రీ వేంకటేశాంధ్రము. ఇందు దేశీయములు, తబ్ధవములు అచ్చ తెలుగు పదములు దైవతమానవస్థావర తిర్య జ్ఞానార్ధవర్ధులను విభజనమున 128 సీస పద్యములలో నిఘంటువుగా కూర్చబడింది. కవి అమరకోశముతో సమానముగా దీనిని రచించి వేంకటేశునికి అంకితమిచ్చినట్లు చెప్పియున్నాడు.ఇది కొంచెం ఇంచుమించుగా పర్యాయపద నిఘంటువుగా అనవచ్చును. పెరుమాళ్ళు నల్లదేవర కర్రిసంగాతి వెడవిల్తునయ మచ్చయెడదమేటి.. వెన్నుడన నీదు పేళ్ళు శ్రీవేంకటేశ అను పద్ధతిలో రచించబడెను. కవిచౌడప్పసీసపద్యనిఘంటువు 1590-1670 మధ్యలో కవిచౌడప్ప సీసపద్యనిఘంటువు అను పేర ఒక నిఘంటువు రచించినట్లు ఉంది. చౌడప్ప శతకము అనుసరించి ఈతడు కుకుత్థ్సవిజయగ్రంధయగు అనంతభూపాలునకును, విజయవిలాసిదికృతిభర్తయగు తంజావూరి రఘునాధ నాయకుడును సమకాలికుడు అంటారు.ఇది అచ్చతెలుగు నిఘంటువు. ఇందు 30 సీస పద్యములలో సంగ్రహముగా కూర్చబడింది. ఈ నిఘంటువు స్వరూపమును తెలుపుటకు ఈ క్రింది పద్యము చాలును. విరియనా పువ్వు సీవిరియనా కల్లు వా విరియనా చెట్టు కావిరియు పొగయు పరియనా డాలు రూపరియనా సొగసు మే పరియనా తిండి తేపరన తెగువ తరలునా వళుల బిత్తరులునా చెలులుచి త్తరులు నా బొమ్మత్తరులు వలపు కణియనా కప్పు సాకిరియినా సాక్షి బూ కరియనా నదలు టక్కరస దొంగ వరియనా చేను లావరియనా బంటును సరియనా దండ కేసరులు వడ్లు.. నూరిజనకల్ప వరదందశూకతల్ప డంబు కరివేల్పు పిట్టసిడంబుదాల్ప. ఆంధ్రనిఘంటువుల ప్రాథమికావస్థను తెల్పుటకిది చాల తోడ్పడుచున్నది. ఆంధ్రభాషార్ణవము పద్యమ ఆంధ్రనిఘంటువులలో ఆంధ్రభాషార్ణవమే ఎక్కువ సమగ్రామంగను, మిక్కిలి ఉపయోగకరమైనది. ఇది కూడా రమారమి తంజావూరి రఘునాధ నాయకుడు కాలమునాటిదే. దీనిని రచించినది విద్వత్కవియగు నుదురుపాటి వెంకనార్యుడు. ఇద్ము ప్రథమ కాండమున స్వ్రగ, వ్యోమ, ది, క్కాల, ధీ, వా, క్చబ్దాది, నాట్య, పాతాళ, భోగి, నరక వారి వర్గములు; ద్వితీయ కాండమున భూ,పుర, శైల, వనౌషధి, సింహాది,మనుష్య, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య,శుద్ర వర్గములును; తృతీయ కాండమున విశేష్యనిఘ్న, సంకీర్ణ నానా, ర్ధావ్యయ,క్రియావర్గములును ఉన్నాయి. ఇందలి శైలి మిగుల రమ్యము. పలుకవెలఁదిమగఁడు బంగారుకడుపువాఁ డంచతేజి నెక్కునట్టి రౌతు బమ్మ తాత నలువ తమ్మిచూలి దుగినుఁ డనఁగ బ్రహ్మపేరు లబ్జమౌళి. ఇట్టి పద్యములు దీనికి ఉదాహరణములు. దీనిని ఉప్దయోగించే ఇటీవలి శబ్దరత్నాకరము, సుర్యరాయాంధ్ర నిఘంటువు అనేకపదుములు నేర్చుకొనిరి. ఆంధ్రనామసంగ్రహము దీనిని రచించినది పైడిపాటి లక్ష్మణకవి.ఇందు దైవతమానవస్థావర తిర్య జ్ఞానార్ధవర్ధులను విభజనము ఉంది.దీనిని కవి తన ఇష్టదైవమైన విశ్వేశ్వరునికి అంకితమిచ్చాడు.ఇందు పద్యములు పదములు కూడా ప్రశస్తములే. <poem> వలపులగౌరు చౌదంతి వెల్లయేనుఁ గనఁగ నై రావతంబున కాఖ్య లమరు వేల్పుదొరతేజి యనఁగను వెల్లగుర్ర మనఁగ నుచ్చైశ్రవం బొప్పు నంబికేశ. ఆంధ్రనామశేషము ఆంధ్రనామసంగ్రహమున చేరక మిగిలిపోయిన మరికొన్ని పదములతో ఆంధ్రనామశేషము అను పేరిట సా.శ.1750 ప్రాంతమున ఆడిదము సూరకవి మరియొక సంగ్రహనిఘంటవును రచించెను.చర్విత చర్వణముగా మరల మరియొక నిఘంటువును రచించక ఆంధ్రనామసంగ్రహమునకు అనుబంధముగా దీనిని రచించెను. ఈరెండు పెక్కు పదములు తెలుపుచున్నవి. సాంబనిఘంటువు దీనిని రచించినది సా.శ. 18వ శతాబ్దమునకు చెందిన వెచ్చ కస్తూరిరంగకవి. దీనిని ఇతడు సాంబమూర్తికి అంకితమిచ్చాడు.ఆనంద రంగరాట్చందోగ్రంధకర్త యగు కస్తూరిరంగకవి ఈ నిఘంటువును ప్రామాణికముగనే అంగీకృతమైయున్నది. ఆంధ్రపదాకరము ఇది సా.శ.1840ప్రాంతమున వెలువడినది.దీనిని శ్రీ.రాజా త్యాడిపూసపాటి వీరపరాజు రచించెను. ఇది ఒక పద్య నిఘంటువు.ఇందు సుర, నర, గుణ, పరికర, చర, అచర, నానరధవర్గులు ఉన్నాయి. ఇది యతిసామాన్య నిఘంటువు. ఆంధ్రదీపిక దీనిని మామిడి వెంకయ్య అను బందరువాసి 1810 సం. న రచించగా ఇది చెన్నపురిలో 1848లో ముద్రితమయ్యెను. ఇది అసమగ్రము, అవిశ్వసనీయమని బ్రౌను దొర వ్రాసెను.నిజమే కాని, ప్రాచీనప్రబంధములందలి కొన్ని పదములు దీసి అకారాదిగా గూర్చి వివిధార్ధమలను వచనములో నొసగుటయే ఇందలి విశేషము. క్యాంబెల్ నిఘంటువు ఇది అకారక్రమముగా ఆంగ్లపద్ధతిన రచించిన మొదటి నిఘంటువు ఇదియే. ఇది తెలుగు రాని ఆంగ్లేయులకు తెలుగు తెలిసికొనుటకు ఉపయోగించునట్లు తెలుగు పదముల ఆంగ్ల అర్ధములతో రచించబడింది. క్యాంబెలు తెలుగుపాండిత్య అల్పమగుట నిందు చేరనిపదములు, చేర్చిన పదములకు ఈయని అర్ధములు, ఇచ్చిన వానిలో పెక్కు తప్పులు ఉన్నాయి. బ్రౌణ్యనిఘంటువు క్యాంబెలు తప్పులు సరిదిద్ది బ్రౌణు దొర తెలుగు పాండిత్యము సంపాదించి దీని చాలా ప్రశాస్తముగా వ్రాసియున్నాడు.తెలుగు పదములకు ఆంగ్లార్ధములతో ఒకటి, ఆంగ్లపదముల ఆంధ్రార్ధములతో ఒకటి, అన్యదేశ్యపదజాలముతో అర్ధములతో మిశ్రనిఘంటువు ఇతడు మరియొకటి రచించి కీర్తిగాంచెను.ఇందు మొదటిదానిలో అనేక తెలుగు పదములను జేర్చి వానివాని అర్ధములకు లభ్యములైన పూర్వకవిప్రయోగములను వ్యావహారిక వాక్యములను ఈతడు ఉదహరించియున్నాడు. ఇది క్రీ,శ. 1852లో ప్రకటింపబడింది. 1806లో అల్పారంభమైనను 1830 వరకు ఆంధ్రగ్రంధము లచ్చ్వడుటకే నోచుకొననిదినములలో ఎన్నియో ప్రాచీన ప్రబంధముల సంపాదించి, కొన్ని టీకలు వ్రాయించి కొన్నిటిని ప్రకటించి తెలుగున వ్యాకరణము, నిఘంటువులు రచించి తెలుగుపండితులను కొనియాడి తెలుగు భాషకు బ్రౌను దొర నిరుపమానమగు సేవచేసియున్నాడు.ఈతని నిఘంటువే శాబ్దరత్నాకరమునకు, ఇటీవలి నిఘంటువులకును ప్రతిపాదికయై యెంతయో మేలుకూర్చెను. చిన్నయసూరి నిఘంటువు బ్రౌను తరువాత పండితాదరణ పాత్రమైన సమగ్రాంధ్రనిఘంటువును సమర్ధతతో నిర్వహింప సమకట్టినవాడు పరవస్తు చిన్నయసూరి. ఈ పవిత్రసంకల్పముతో సా.శ. 1875-80 ప్రాంతమున అకారక్రమమున పదముల్క పట్టికలు తయారుచేసి ప్రతిపదమునకు ప్రతియర్ధమునకు ప్రాచీనకవిప్రయోగములను పరమనిర్ధారకములుగా నున్నవి మాత్రమే కొన్నిటిని కొన్నిటిని జేర్చుకొని యుంచాడు కాని చిన్నయసూరి అర్ధనిర్ణయాదుల జేసి నిఘంటువు పూర్తిచేయుటకు నోచుకొనక దెవంగతుడు అగుటచే ఆతని నిఘంటురచనాద్యోమమే పెక్కురకు దెలియలేదు. ఇది ఆంధ్రుల దురదృష్టమే. శబ్దరత్నాకరము దీనిని శ్రీ. బహుజనపల్లి సీతారామాచార్యులు వారు సా.శ. 1885లో రచించారు. ఇందు శబ్దార్ధస్వరూపనిర్ణయము శాస్త్రసమ్మతమగను, సమంజసముగను జేయబడుట నిది శ్రీఆచార్యులవారి సామర్ధ్యమును వేనోళ్ళ చాటునదై యున్నది. పదపదార్ధములకు పూర్వకవిప్రయోగములెన్నియో నొసగబడుట ఈ నిఘంటువునకు ప్రామణికత సిద్ధించింది. ఇది పూర్వ నిఘంటువులన్నింటికంటె ఉత్తమమైనది. కాని యతివిస్తృతమగు ఆంధ్ర్హభాషలోని పదజాలమెంతయో చేరవల్సైయున్నది. దీని మొదటి ప్రచురణ:1996.ముద్రణ:అసియన్ ఎడ్యుకెసనల్ సర్విసెస్,న్యూఢిల్లి. ఆంధ్రపదపారిజాతము దీనిని సా.శ. 1888లో శ్రీ ఓగిరాల జగన్నాధకవి గారు రచించిరి. అకారక్రమమున ఆచ్చికపదముల అర్ధములు, అర్ధాంతరములు ఇందులో నున్నవి. కొన్నిచోట్ల పూర్వగ్రంధములనుండి ఆశ్వాసపద్యసంఖ్యారహితముగ కొన్ని ప్రయోగములు ఈయబడినవి.కాలక్రమమున పదములు అర్ధములు మారుచుండుటచె సుప్రశిద్ధప్రయోగశూన్యములైన నిఘంటువులు ప్రమాణికములు కాజాలవనుటకిది సాక్ష్యము.కాని నేడు మరుగుపడిన దేశ్యపదములు ఎన్నియో ఇందు ఉన్నాయి. సంవత్సరం, నిఘంటు నిర్మాత, నిఘంటువు పేరు, ప్రచురించ బడిన ప్రదేశం. 1818: డబ్ల్యు. బ్రవున్‌, A Vocabulary of Gentoo and English, మద్రాస్‌. 1821: ఎ.డి. కేంప్‌బెల్‌, A Dictionary of the Teloogoo Language, మద్రాస్‌. 1835: జె.సి.మోరిస్‌, A Dictionary, English and Teloogoo, మద్రాస్‌. 1839: డబ్ల్యు. కార్పెంటర్‌, A Dictionary of English synonyms, లండన్‌. 1841: సి. రామకృష్ణ శాస్త్రులు, A Vocabulary, in English and Teloogoo, మద్రాస్‌. 1841: జె. నికోలాస్‌, A Vocabulary of English and Teloogoo, మద్రాస్‌. 1844: ఇ. బాల్పోర్‌, Vocabularies Telagoo, కలకత్తా . 1847: డబ్ల్యు. ఇల్లియట్‌, Language of the Goands with terms in Telugu, కలకత్తా . 1849: బి.హెచ్‌. హాడ్జ్‌సన్‌, Vocabularies of Southern India, కలకత్తా . 1852: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, A DICTIONARY, Telugu and English, మద్రాస్‌. 1854: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, బ్రౌణ్య మిశ్రభాషా నిఘంటువు A Dictionary of the Mixed Telugu మద్రాస్‌.బ్రౌణ్య మిశ్రభాషా నిఘంటువు అర్కైవ్.ఆర్గ్ లో 1862: రెవరండ్‌ పెర్సివల్‌, Telugu - Eng1ish DICTIONARY, మద్రాస్‌. 1868: సర్‌.ఏ.జె. ల్యాల్‌, A Vocabulary in Hindustani, English, Telugu, నాగపూర్‌. 1886: రెవరండ్‌ పెర్సివల్‌, Anglo-Telugu Dictionary, మద్రాస్‌. 1889: వీరస్వామి మొదలియార్‌, Vocabulary in English and Telugu, మద్రాస్‌. 1891: పి. శంకర నారాయణ, English - Telugu Dictionary, మద్రాస్‌.లో పిశంకరనారాయణ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు 1898: జి.డబ్ల్యు. టేలర్‌, An English-Telugu Vocabulary, మద్రాస్‌. 1900: పి. శంకర నారాయణ, Telugu - English Dictionary, మద్రాస్‌. 1900: పి. హోలర్‌, Telugu Nighantuvulu, రాజమండ్రి. 1900 తరువాతి నిఘంటువులు శబ్దార్ధచంద్రికాదులు దీనిని సా.శ. 1903లో సరస్వతుల సుబ్బరామశాస్త్రి గారు రచించిరి. ఇది అచ్చతెలుగు నిఘంటువు.శ్రీ పం.తిరువెంకటాచార్య రచిత మగు శబ్దార్ధకల్పతరువు, శ్రీ తాటికొండ తిమ్మారెడ్డి విరచితమగు శబ్దార్ధచింతామణి చెప్పుంకొనుటకు విశేషణములు లేని లఘునిఘంటువులు. శబ్దార్ధచంద్రిక దీనిని 1906లొ శ్రీమహంకాళి సుబారాయుడు రచించిరి. దీనిని చిన్న శబ్దరత్నాకరము అంటారు. ఇది పాఠశాలలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు చాల ఉపయోగకరముగ ఉండును. లక్ష్మీనారాయణీయము దీనిని 1903లో శ్రీ కొట్రలక్ష్మీనారాయణశాస్త్రి రచించిరి. ఇది ఒక శుద్ధాంధ్రప్రతిపదార్ధ పదనిఘంటువు. ఇదియును పిల్లశబ్దరత్నాకరమే. విద్యార్థులకు ఉపయోగికారియే. శబ్దకౌముది దీనిని 1905లో శ్రీశిరోభూషణము రంగాచార్యులు గారు రచించిరి.ఇది ఇపుడు అలభ్యము. పురుషోత్తమియము దీనిని 1908లొ శ్రీ నాదెళ్ళ పురుషోత్తమకవిగారు రచించిరి. దీని యందు ప్రకృతి రూపప్రకాశిక, అన్యరూపదీపిక, విశేషరూపదర్శిక అను పలు విభజనలు ఉన్నాయి. ఇది పూర్వ నిఘంటువులనుండి ఈవిభజనములకు నౌవుగా పలుపదములను కొనికూర్పబడినవి. ఆంధ్రవాచస్పత్యము 1920 లో సూర్యరాయనిఘంటువు రచనము జరుగుచుండగా "ఆధ్రవాచస్పత్య" అను పేర శ్రీ కొట్రశ్యామలకామశాస్త్రి గారు నాలుగు సంపుటములలో ఒక పెద్ద నిఘంటువును ప్రకటించిరి. అందు తొలి సంపుటము 1934 సం.లో, మలి సంపుటము 1938సం.లో,మూడునాలుగు 1939,1940 లలోను ప్రకటితమయ్యెను. ప్రతిపదమునకు ప్రతిఅర్ధమునకు ఇందు ప్రామాణ్యములు ఒసగబడలేదు, ఇది సరియైన శాస్త్రదృష్టిని (Scientific method) జరుగని కారణమున రావలసిన కీర్తి దీనికి రాలేదు. శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు ఆంధ్ర నిఘంటు రచనమున ఆధునికముగా అగ్రగణ్యస్థానమంద దగిన సూర్యరాయనిఘంటు రచనము 1920 సం.ప్రాంతమున చెన్నపురిలో ఆరంభమైనది. దీనికి శ్రీ పీఠికాపురాధీశులు అగు శ్రీ జయంతి రామయ్య పంతులు ఆశ్రయము. ఈ బృహన్నిఘంటువున అనేక తత్సమ శాబ్దములు పరిశీలనా పూర్వకముగా సంస్కృత నిఘంటువుల నుండి గైకొనబడినవి. వానికి సంస్కృత కావ్య నాటకాదుల నుండియు, ఆంధ్ర ప్రబంధములనుండియు నటనటనావశ్యకములని తోచిన చోటులను, అర్ధ విశేషములు గల చోటులను ప్రయోగములీయబడినవి. ప్రతిపదమునకును ప్రతి అర్ధమునకును ప్రామాణిక ప్రయోగములనో, నిఘంటువులనో, లేక శిష్టవ్యవహారమునో ఈనిఘంటువు చూపుచుండుటచే దీని కొక ప్రామాణికత ఇచ్చినట్లయినది. ఒక్కొక్క పదమునకు అర్ధమునకు ఒక్కొక్క పయోగమునేకాక పూర్వ పూర్వతర పూర్వతమ ప్రయోగములను ప్రధాన పదములక్రింద ఇచ్చి వాని అర్ధాంతరములను ప్రయోగ సహితముగా ఇందు వివరించిరి. శబ్దముల జన్య జనక సంబంధము కూడనిందు వివరింపబడింది.లోకవ్యవహారము నుండియు ప్రాచీన శిలాశాసనములనుండియు కొన్ని కొన్ని శబ్దములిందు గైకొనబడినవి. వానివానికి సముచితార్ధములు, అర్ధాంతరములు ఇందు పొందు పరచబడినవి. thumb|right|200px|శబ్దరత్నాకరము.తెలుగు-తెలుగు నిఘంటువు వావిళ్ల నిఘంటువు, 1949 , వావిళ్ల నిఘంటువు,1949(భారత డిజిటల్ లైబ్రరీ) తెలుగు వ్యుత్పత్తి కోశం లకంసాని చక్రధరరావు,ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంపాదకత్వంలో "తెలుగు వ్యుత్పత్తి కోశం " పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది. అ-ఔ (1978) 412 పేజీలు, పొట్టి శ్రీరాములు కిఅంకితం.ఎమ్.ఆర్.అప్పారావు తొలిపలుకులు.12219 పదాలు. క-ఘ (1981) 455 పేజీలు, కట్టమంచి రామలింగారెడ్డికి అంకితం. ఆవుల సాంబశివరావు ముందుమాట.19670 పదాలు చ-ణ (1981) 277 పేజీలు, ........... కిఅంకితం, ఆవుల సాంబశివరావు ముందుమాట.11000 పదాలు త-న (1985) 440పేజీలు, వాసిరెడ్డి శ్రీకృష్ణకి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి.16000 పదాలు. ప-భ (1987) 498 పేజీలు, లంకపల్లి బుల్లయ్యకి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి.19000 పదాలు. మ (1987) 268 పేజీలు, ఎమ్.ఆర్.అప్పారావుకి అంకితం కోనేరు రామకృష్ణారావు ముందుమాట.9754 పదాలు య-వ (1989) 272 పేజీలు, ఆవుల సాంబశివరావుకి అంకితం కనిశెట్టి వెంకటరమణ తొలిపలుకు.10132 పదాలు శ-హ (1995) 315 పేజీలు, కోనేరు రామకృష్ణారావుకి అంకితం మద్ది గోపాలకృష్ణారెడ్డి ప్రవచనం. 6651పదాలు. 3904 (అ-హ) అనుబంధం. తెలుగు-తెలుగు నిఘంటువు : తెలుగు అకాడమి, హైదరాబాదు, 2001. ఆంతర్జాల నిఘంటువు తెలుగు-తెలుగు నిఘంటువులు శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు, సంకలనకర్త జయంతి రామయ్య పంతులు, 8 సంపుటాలు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ ద్వారా 1982 లో పునర్ముద్రణ అయ్యాయి.6 సంపుటం (మ-లౌ),శ్రీ సుర్యారాయాంధ్ర నిఘంటువు 6 సంపుటం(మ-లౌ) (డిఎల్ఐ లో) 7 సంపుటం (వ-వ్రై),శ్రీ సుర్యారాయాంధ్ర నిఘంటువు 7సంపుటం(వ-వ్రై) (డిఎల్ఐ లో) 8 సంపుటం (శ-హ్వ)శ్రీ సుర్యారాయాంధ్ర నిఘంటువు 8 సంపుటం(శ-హ్వ) (డిఎల్ఐ లో) భారత డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. పూర్తి పాఠం యూనికోడ్ లోకి మార్చి వెతుకుటకు అనువుగా వున్నది ఆంగ్లం-తెలుగు నిఘంటువులు అక్షర మాల నిఘంటువు, బ్రౌణ్య ఆంగ్లం-తెలుగు నిఘంటువు . స్వేచ్ఛ యూనికోడ్ లోకి మార్చిన ( ప్రజోపయోగ పరిధిలో ) లిటిల్ మాస్టర్స్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, సంకలనం:ఎస్ కె వెంకటాచార్యులు, 1992 జనవరి,లిటిల్ మాస్టర్స్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు సాహితి ఆన్ లైన్ నిఘంటువులు ఇందులో బ్రౌన్, వేమూరి నిఘంటువులు ఉన్నాయి. ఇవి తెలుగు, తెలుగు (ISCII), యూనికోడ్లో పనిచేస్తుంది. వేమూరి. ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు - 2002 (గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే )ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు - వేమూరి (గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే) వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు) ఇది తెలుగు వికీపీడియాలో పూర్తిగా ఉంది. ఈ నిఘంటువు "సైంసు"కి పెద్ద పీట వేసిన నిఘంటువు. తెలుగు-ఆంగ్లం నిఘంటువులు గ్విన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు నిఘంటువు చికాగో విశ్వవిద్యాలయము వారు ప్రచురించిన గ్విన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు . తెలుగు పదాలు ఇంగ్లీషులిపిలో ఉన్నాయి. బ్రౌన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు చికాగో విశ్వవిద్యాలయము వారు ప్రచురించిన బ్రౌన్ తెలుగు-ఆంగ్లము నిఘంటువు తెలుగు లిపి వాడబడిన 1903 ప్రచురణ. పి.శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు - (గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే) తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు - పి.శంకరనారాయణ (గూగుల్ బుక్స్‌లో ఉచిత మునుజూపు కొన్ని పేజీలుమాత్రమే) వెబ్స్టర్స్ తెలుగు -ఆంగ్లం వేమూరి నిఘంటువు (తెలుగు-ఇంగ్లీషు) ఇది తెలుగు వికీపీడియాలో పూర్తిగా ఉంది. ఈ నిఘంటువు "సైంసు"కి పెద్ద పీట వేసిన నిఘంటువు. బహు భాషా నిఘంటువులు ఆంధ్రభారతి నిఘంటువు ద్వారా వివిధ తెలుగు నిఘంటువులను యూనికోడ్తో వెతకవచ్చు. భాషా సాంకేతికాల పరిశోధన కేంద్రం నిఘంటువు: ఆంగ్లం నుండి తెలుగుకు, కన్నడ మరాఠి, బెంగాలి నుండి హిందీ ఉర్దూ కు, ఇంకా ఎన్నో భారతదేశభాషల నుండి వివిధమైన భాషలకు తర్జుమా చేయుటకు భాషా సాంకేతికాల పరిశోధన కేంద్రం, ఐఐఐటి, హైదరాబాదు, నిఘంటువులు భాషా సాంకేతికాల పరిశోధన కేంద్రం, ఐఐఐటి, హైదరాబాదు నిఘంటువులు తయారుచేసింది. అయితే ఇవి యూనికోడ్ కు ముందు తరానివి, పాత కోడింగ్ పద్ధతులు (ISCII, Shusha, RomanReadabale, itrans, RomanWX కోడులు అంటే ఇంగ్లీషు అక్షరాల వాడి తెలుగు రాయాలి)వాడబడినవి. విక్షనరీ వ్యాసము,విక్షనరీ సైటు గూగుల్ అనువాదం గూగుల్ అనువాదం ప్రత్యేకమైన నిఘంటువులు పారిభాషిక పదకోశం, గణిత, సాంఖ్యక శాస్త్రాలు, (పారిభాషిక పదావళి-2), తెలుగు అకాడమి, 1973 పారిభాషిక పదకోశం, భౌతిక శాస్త్రం, (పారిభాషిక పదావళి-8), తెలుగు అకాడమి, 1979 పారిభాషిక పదకోశం, జంతుశాస్త్రం, (పారిభాషిక పదావళి- ), తెలుగు అకాడమి, పారిభాషిక పదకోశము-, సంకలనం. తిరుమల వెంకట రంగాచార్యులు, ప్రకాశకులు కాశీనాధుని నాగేశ్వరరావు,1936, ఆంధ్ర గ్రంథమాల-27 ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు పారిభాషా పదకోశము ఇంటర్నెట్ ఆర్కైవ్ నకలు ఆధునిక వ్యవహార పదకోశము, బూదరాజు రాధాకృష్ణ పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ పరిష్కర్త: బూదరాజు రాధాకృష్ణ,,2004 పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ పరిష్కర్త: బూదరాజు రాధాకృష్ణ,ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ,2004 తెలుగు పర్యాయపద నిఘంటువు సంకలనం:ఆచార్య జి.ఎన్.రెడ్డి, 1990 జూన్, విశాలాంధ్ర పబ్లిషర్స్ ( 1998 మే) పాలనా పరిభాష మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ పరిభాష మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ పరిభాష తరచూవాడేస్థానికీకరణ పదాలు (FUEL) కొత్త పదాల సృష్టి, సమన్వయం ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు (క్లుప్త సందేశ సేవ (SMS), ఇంగ్లీషు భాషా, సమాచార సాధనాలు, దృశ్య శ్రవణ మాధ్యమాలలో ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడుక) ప్రజల జీవనశైలి, వారి భాషపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితులలో తెలుగు భాషని సజీవంగా పుంచడానికి, కొత్తగా తయారయ్యే పరభాషా పదాలకి అనుగుణంగా తెలుగు పదాల నిర్మాణం జరగాలి. దీనికి ప్రస్తుతం ఎవరికి వారే యమూనాతీరే అన్నట్లుగా జరుగుతున్న పనిని కొంతవరకు సమన్వయం చేస్తున్న జాల స్థలాలున్నా తెలుగుపదం.ఆర్గ్ ప్లైలీగాట్ లాంచ్పాడ్ తెలుగు స్థానికీకరణ జట్టు మరింత మెరుగు చేయటానికి తెలుగు భాషా సంస్ధలు ముందుకి రావాలి. నిఘంటువుల భవిష్యత్ ప్రింట్‌ రూపంలో ఉన్న నిఘంటువులకు గిరాకీ తగ్గిపోతోంది కాబట్టి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే ఉండేలా ఆక్స్‌ఫర్డ్ ప్రెస్‌ వ్యూహం మార్చింది. ఇవి కూడా చూడండి బూదరాజు రాధాకృష్ణ తెలుగు భాషా పరిరక్షణ బయటి లింకులు తెలుగులో ప్రామాణిక నిఘంటువు కావాలి! , సాయి బ్రహ్మానందం గొర్తి, పాలపిట్ట, అక్టోబరు2010 తెలుగు థీసిస్.కామ్ లో పి.డి.ఎఫ్ రూపంలో వివిధ నిఘంటువులు (ఉచితసభ్యత్వంపొందాలి) వనరులు వర్గం:నిఘంటువులు వర్గం:తెలుగు
మన కవులు
https://te.wikipedia.org/wiki/మన_కవులు
దారిమార్పు తెలుగు సాహిత్యం
తెలుగు వ్యాకరణం
https://te.wikipedia.org/wiki/తెలుగు_వ్యాకరణం
తెలుగు వ్యాకరణం పై సిద్ధాంత గ్రంథాన్ని నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు. 19వ శతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణాన్ని బాలవ్యాకరణం అనే పేరుతో రాశారు. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది. తెలుగు అక్షరాలు తెలుగు పదాలు తెలుగు వాక్యాలు విభక్తి వచనములు సంధి సమాసం ఛందస్సు అలంకారాలు ప్రకృతి - వికృతి భాషాభాగాలు పుస్తకాలు తెలుగు వ్యాకరణం: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999. లిటిల్ మాస్టర్స్ తెలుగు వ్యాకరణం-యం.విశ్వనాథరాజు ఎం.ఎ, నవరత్న బుక్ సెంటర్ విజయవాడ ఇవికూడా చూడండి ఉపసర్గలు - సంస్కృత వ్యాకరణంలో ఉపసర్గలు మూలాలు బయటి లింకులు వర్గం:తెలుగు వ్యాకరణం వర్గం:తెలుగు భాష వర్గం:తెలుగు అక్షరాలు
గోదావరి
https://te.wikipedia.org/wiki/గోదావరి
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు.Eenadu special edition, 12 July, 2015 ఈ నది ఒడ్డున భద్రాచలము, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. గోదావరి నది ఇతిహాసం పూర్వం బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడంతో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు. ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం. పుష్కరాలు దేశంలో ప్రతీ జీవ నదికీ పుష్కరం ఉన్నట్లే, గోదావరికి కూడా పుష్కరం ఉంది. పంచాంగం ప్రకారం గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరం వస్తుంది. 2015, జూలై నెలలో గోదావరికి మహాపుష్కరం వచ్చింది. గోదావరి నదిపై ప్రాజెక్టులు { "type": "FeatureCollection", "features": [ { "type": "Feature", "properties": { "title": "శ్రీరాంసాగర్ ప్రాజెక్టు", "marker-symbol": "-number", "marker-color": "302060" }, "geometry": { "type": "Point", "coordinates": [ 78.343056, 18.9675 ]}}, { "type": "Feature", "properties": { "title": "శ్రీపాదసాగర్ ప్రాజెక్టు", "marker-symbol": "-number", "marker-color": "302060" }, "geometry": { "type": "Point", "coordinates": [ 79.368056,18.845833 ] }}, { "type": "Feature", "properties": { "title": "కాళేశ్వరం ఎత్తిపోతల పథకం", "marker-symbol": "-number", "marker-color": "302060" }, "geometry": { "type": "Point", "coordinates": [ 79.906667,18.811389] }}, { "type": "Feature", "properties": { "title": "పోలవరం ప్రాజెక్టు", "marker-symbol": "-number", "marker-color": "302060" }, "geometry": { "type": "Point", "coordinates": [ 81.6564,17.2611 ] }}, { "type": "Feature", "properties": { "title": "సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట", "marker-symbol": "-number", "marker-color": "302060" }, "geometry": { "type": "Point", "coordinates": [ 81.7658,16.9308] }} ]} ఉప నదులు thumb|250px|రాజమండ్రి వద్ద గోదావరి నదిపై రైల్వే వంతెన గోదావరి నది పరీవాహక ప్రాంతం 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఈ నది ప్రధాన ఉపనదులు: వైన్‌గంగా పెన్ గంగ వార్ధా నది మంజీరా నది ఇంద్రావతి నది బిందుసార శబరి నది ప్రవర ఫూర్ణా ప్రాణహిత: ఈ నది ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది. ఇది మంచిర్యాల పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీలేరు నది కిన్నెరసాని మానేరు గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రాలు thumb|250px|రాజమహేంద్రవరం వద్ద గోదారమ్మ విగ్రహం త్రయంబకేశ్వర్, నాసిక్, బాసర, కోటిలింగాల, మంథని కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, పట్టిసం (పట్టిసీమ), రాజమహేంద్రవరం, కొవ్వూరు, మందపల్లి, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది అప్పన్నపల్లి శ్రీ బాల బాలాజీ వారి దేవస్థానం. మురమళ్ళ, శ్రీ వీరేశ్వరస్వామి దేవాలయం (మురమళ్ళ) గోదావరి ప్రాంతపు కవులు తెలుగులో తొలి కావ్యరచన కాలం నుండి గోదావరి ప్రాంతంలో అనేకమంది కవులు చాలా కావ్యాలను రచించారు. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. ప్రాచీనకాలం నుండి 1980 ప్రాంతం వరకు గోదావరి ప్రాంతంలో వెలసిన కవులలో కొందరు.గోదావరి ప్రాంతపు కవులు, డా. గల్లా చలపతి, మాతల్లి గోదావరి, పుష్కర ప్రత్యేక సంచిక, 2003, పేజీలు: 52-59. ఏనుగు లక్ష్మణకవి కూచిమంచి జగ్గకవి కూచిమంచి తిమ్మకవి జగన్నాథ పండితరాయలు తామరపల్లి తిమ్మయ్య నింబార్కుడు యథావాక్కుల అన్నమయ్య చిత్రమాలిక ఇవి కూడా చూడండి కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ భౌగోళిక చరిత్ర మూలాలు వెలుపలి లంకెలు వర్గం:భారతదేశ నదులు వర్గం:మహారాష్ట్ర నదులు వర్గం:ఆంధ్రప్రదేశ్ నదులు వర్గం:ఆదిలాబాదు జిల్లా నదులు వర్గం:కరీంనగర్ జిల్లా నదులు వర్గం:వరంగల్లు పట్టణ జిల్లా నదులు వర్గం:ఖమ్మం జిల్లా నదులు వర్గం:తూర్పు గోదావరి జిల్లా నదులు వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా నదులు వర్గం:కోనసీమ జిల్లా నదులు వర్గం:అల్లూరి సీతారామరాజు జిల్లా నదులు వర్గం:ఏలూరు జిల్లా నదులు
త్రేతాయుగం
https://te.wikipedia.org/wiki/త్రేతాయుగం
thumb|రామాయణం త్రేతాయుగంలో జరిగిందని భావిస్తారు వేదాల ననుసరించి యుగాలు నాలుగు.నాలుగు యుగాలలో త్రేతా యుగం రెండవది ఈ యుగంలో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు.ఈ యుగం పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరాలు. ఇందు ధర్మం మూడు పాదములపై నడుస్తుంది.వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగం ప్రారంభమైంది. నాలుగు యుగాలు సత్యయుగం త్రేతా యుగం ద్వాపరయుగం కలియుగం ఇవి కూడా చూడండి చతుర్యుగాలు (సత్యయుగాన్ని క్రుతయుగం అని కూడా అంటారు.) మన్వంతరము మూలాలు బయటి లింకులు https://web.archive.org/web/20090515112243/http://www.omsriram.com/page10.html వర్గం:యుగాలు వర్గం:కాలమానాలు
సత్యయుగం
https://te.wikipedia.org/wiki/సత్యయుగం
thumb|250x250px|కేదరేశ్వర్ గుహ ఆలయం అహ్మద్ నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగడ్ అనే కొండ కోట వద్ద ఉంది. లింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఒకే స్తంభం మాత్రమే చెక్కుచెదరకుండా ఉంది.ఈ స్తంభాలు యుగం లేదా కాలానికి చిహ్నాలు అని నమ్ముతారు. అవి సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలకు చిహ్నాలుగా భావిస్తారు. సత్య యుగం (సంస్కృత: सत्ययुग), హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృత యుగం అని కూడా అంటారు. "సత్య యుగం (యుగము లేదా యుగం)", మానవత్వం దేవతలచే మానవత్వంతో పరిపాలించబడినప్పుడు, ప్రతి వ్యక్తి ఆచరించే పని స్వచ్ఛమైన ఆదర్శానికి దగ్గరగా ఉంటుంది. మానవత్వం, అంతర్గత మంచితనం కలిగి పాలించటానికి సర్వశ్రేష్టమైన పరమాత్మ అనుమతిస్తుంది. దీనిని కొన్నిసార్లు "స్వర్ణయుగం" అని పిలుస్తారు.సత్య యుగం 1,728,000 సంవత్సరాలు లేదా 4800 దైవిక సంవత్సరాలు ఉంటుంది.నైతికతకు ప్రతీకగా ధర్మ దేవుడు (ఆవు రూపంలో చిత్రీకరించబడింది) సత్యయుగంలో నాలుగు కాళ్లపై నిలబడ్డాడు.తరువాత త్రేతా యుగంలో ఇది మూడు కాళ్లపై, తరువాత ద్వాపరా యుగంలో రెండు కాళ్లపై నిలబడ్డది. ప్రస్తుతం జరుగుచున్న అనైతిక యుగంలో (కలియుగం) ఇది ఒక కాలు మీద నిలుచుని పరిపాలిస్తుంది. వివరణ ప్రతి మతానికి దాని నియమాలు, భావాలు ఉన్నాయి.హిందూ అనేది మతం కాదు ధర్మం. సమయం, విశ్వోద్భవ శాస్త్రం వివేక సిద్ధాంతాలు హిందూ ధర్మాన్ని ప్రత్యేకమైనవిగా చేసాయి.సమయం సృష్టి, విధ్వంసం, చక్రంగా పరిగణించబడ్డాయి.హిందూధర్మసమయం ప్రకారం నాలుగు యుగాలుగా విభజించబడింది.ఇవి ఒకదాని తరువాత ఒకటిగా అనుసరిస్తాయి.వేదాల ప్రకారం సమయం గతించిపోయే చక్రంలాగా నాలుగు యుగాలుగా విభజించబడింది.అందులో మొదటిది సత్య యుగం -- 4 * 432000 సంవత్సరాలు, త్రేతా యుగం -- 3 * 432000 సంవత్సరాలు, ద్వాపర యుగం - 2 * 432000 సంవత్సరాలు, కలియుగం -- 432000 సంవత్సరాలుగా వేదాలు ప్రకారం నిర్వచించబడింది.సత్యయుగం నుండి యుగాలు గతించేకొద్దీ యుగాలు ధర్మం, జ్ఞానం,మేధో సామర్థ్యం, భావోద్వేగం, శారీరక బలం క్రమంగా క్షీణించడం జరుగుతుంది.భగవంతుడిని ధర్మం, అమల, యోగేశ్వర, పరమాత్మ, అవ్యక్త పేర్లతో పిలిచేవారు. సత్య యుగం పరిపాలన ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు.అకాలమరణాలుండవు.వైవశ్వత మన్వంతరములో సత్యయుగం కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.ధర్మం సుప్రీం. మానవని పొట్టితనం 21 మూరలుగా ఉంటుంది.మానవుడు అన్ని భ్రమల నుండి విముక్తి పొందుతాడు.శివుడు, సతీదేవి వివాహ కర్మ సత్య యుగంలో జరిగింది.ధర్మ స్తంభాలన్నీ పూర్తిగా ఉన్నాయి. సత్య యుగంలో, ప్రజలు మంచి, ఉత్కృష్టమైన పనులలో మాత్రమే నిమగ్నమయ్యారు.సత్య యుగంలో, విష్ణువు నాలుగు రూపాల్లో అనగా,మత్స్య,కూర్మ,వరాహ,నరసింహ అవతారలలో అవతరించాడు.సత్య యుగంలో మానవుడి సగటు ఆయుర్దాయం సుమారు 1,00,000 సంవత్సరాలు. జ్ఞానం, ధ్యానం, తపస్సు ఈ యుగంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇవి కూడా చూడండి చతుర్యుగాలు మన్వంతరము మూలాలు వెలుపలి లంకెలు వర్గం:యుగాలు వర్గం:కాలమానాలు
సత్య యుగము
https://te.wikipedia.org/wiki/సత్య_యుగము
దారిమార్పు సత్యయుగం
ద్వాపరయుగం
https://te.wikipedia.org/wiki/ద్వాపరయుగం
link=https://en.wikipedia.org/wiki/File:Kurukshetra.jpg|thumb|[{karipe charan Kumar kankapur }]🙏మహాభారత యుద్ధం ద్వాపర యుగంలో జరిగిందని భావిస్తారు ద్వాపరయుగం హిందూ మత గ్రంథాలలో వివరించబడిన నాలుగు యుగాలలో మూడవది. దీని కాల పరిమితి 864,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలో నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించి పాపసంహారం చేసాడు. సంస్కృతంలో ద్వాపర అంటే "రెండు ముందు", అంటే మూడవ స్థానంలో ఉంది. ద్వాపర యుగం త్రత యుగం తరువాత, కలియుగానికి ముందు ఉంటుంది. పురాణాల ప్రకారం, కృష్ణుడు తన శాశ్వతమైన వైకుంఠ నివాసానికి తిరిగి వచ్చిన క్షణంలో ఈ యుగం ముగిసింది. భాగవత పురాణం ప్రకారం, ద్వాపర యుగం 864,000 సంవత్సరాలు లేదా 2400 దైవిక సంవత్సరాలు ఉంటుంది 12.2.29-33. ద్వాపర యుగంలో మతం రెండు స్తంభాలపై మాత్రమే ఉంది. అవి: కరుణ, నిజాయితీ. విష్ణువు పసుపు రంగును కలిగి ఉంటాడు. వేదాలను ఋగ్వేదం, సామ వేదం, యజుర్వేదం, అధర్వ వేదం అనే నాలుగు భాగాలుగా వర్గీకరించారు. ఈ కాలంలో, బ్రాహ్మణులు వీటిలో రెండు లేదా మూడు గురించి పరిజ్ఞానం కలిగి ఉంటారు. కాని అరుదుగా నాలుగు వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారుంటారు. దీని ప్రకారం, ఈ వర్గీకరణ కారణంగా, విభిన్న చర్యలు, కార్యకలాపాలు ఉనికిలోకి వస్తాయి. వివిధ తరగతుల పాత్రలు ద్వాపర యుగంలోని ప్రజలందరూ ప్రతి తరగతికి సూచించబడిన, శూరులైన, ధైర్యవంతులైన, ప్రకృతితో పోటీపడేవారుంతారు. వీరు తపస్సు, దాతృత్వాలలో మాత్రమే నిమగ్నమైన గ్రంథ ధర్మాన్ని సాధించాలని కోరుకుంటారు. వారు వివ్యమైన ఆనందం కోరుకుంటారు. ఈ యుగంలో, దైవిక తెలివి ఉనికిలో ఉండదు, అందువల్ల ఎవరైనా పూర్తిగా సత్యవంతులు కావడం చాలా అరుదు. ఈ మోసపూరిత జీవితం ఫలితంగా, ప్రజలు అనారోగ్యాలు, వ్యాధులు, వివిధ రకాల కోరికలతో బాధపడుతుంటారు. ఈ రోగాలతో బాధపడుతున్న తరువాత, ప్రజలు తమ దుశ్చర్యలను గ్రహించి, తపస్సు చేస్తారు. కొందరు భౌతిక ప్రయోజనాలతో పాటు దైవత్వం కోసం కూడా యజ్ఞాన్ని నిర్వహిస్తారు. బ్రాహ్మణులు ఈ యుగంలో, బ్రాహ్మణులు యజ్ఞ, స్వీయ అధ్యయనం, బోధనా కార్యకలాపాలలో పాల్గొంటారు. వారు తపస్సు, మతం, ఇంద్రియాల నియంత్రణ, సంయమనంలో పాల్గొనడం ద్వారా దివ్యమైన ఆనందాన్ని పొందుతారు. క్షత్రియులు క్షత్రియుల ముఖ్యమైన విధి ప్రజలను రక్షించడం. ఈ యుగంలో వారు వినయపూర్వకంగా ఉంటారు. వారి భావాలను నియంత్రించడం ద్వారా తమ విధులను నిర్వర్తిస్తారు. క్షత్రియులు శాంతిభద్రతల అన్ని విధానాలను కోపంగా లేదా క్రూరంగా చేయకుండా నిజాయితీగా అమలు చేస్తారు. వారు సాధారణ పౌరులపై అన్యాయం లేకుండా ఉంటారు. తత్ఫలితంగా ఆనందాన్ని పొందుతారు. రాజు పండితుల సలహాలను తీసుకుంటాడు. తదనుగుణంగా తన సామ్రాజ్యంలో శాంతిభద్రతలను నిర్వహిస్తాడు. దుర్గుణాలకు బానిసైన రాజు కచ్చితంగా ఓడిపోతాడు. సామ, దాన, భేద, దండోపాయాలు, ఉపక్ష నుండి ఒకటి లేదా రెండు లేదా అన్నీ వాడుకలోకి తీసుకురాబడ్డాయి. కావలసిన వాటిని సాధించడంలో సహాయపడతాయి. ప్రజా అలంకారం, క్రమాన్ని కాపాడుకోవడంలో రాజులు శ్రద్ధ చూపుతారు. కొంతమంది రాజులు, పండితులతో పాటు కుట్రను రహస్యంగా పథకలు చేస్తారు. విధానాల అమలులో బలమైన వ్యక్తులు పనిని అమలు చేస్తారు. మతపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి రాజు పూజారులను నియమిస్తాడు. ఆర్థికవేత్తలు, మంత్రులను ద్రవ్య కార్యకలాపాలకు నియమిస్తాడు. 'సూర్య వంశం', 'చంద్ర వంశం' అనే రెండు క్షత్రియ రాజవంశాలు ఉన్నాయి. వైశ్యులు వైశ్యులు ఎక్కువగా భూస్వాములు, వ్యాపారులు. వైశ్యుల విధులు వాణిజ్యం, వ్యవసాయం. వైశ్యులు దాతృత్వం, ఆతిథ్యం ద్వారా ఉన్నత గతులను సాధిస్తారు. శూద్రులు అధిక శారీరక పనిని కోరుకునే పనులను చేయడమే సుద్రుల విధి. ప్రతి ఒక్కరూ జన్మతః శూద్రులు, వారి పనులతో వారు క్షత్రియ, బ్రాహ్మణ లేదా వైశ్యులవుతారని వేదాలు చెబుతున్నాయి. హస్తినాపుర ప్రఖ్యాత ప్రధాని విదురుడు, విధులు చూపిన ధర్మం సమాజంలో నేటికీ పాటిస్తుంది సుద్ర సమాజంలో జన్మించాడు. అతని జ్ఞానం, ధర్మం, అభ్యాసం కారణంగా బ్రాహ్మణ హోదా పొందాడు. అతను ఒక సత్యశీలి శాంతి స్వరూపుడు ఎప్పుడు కూడా ధర్మాన్ని పాటిస్తూ నిలబడిన వ్యక్తిగా గుర్తింపుకు పొందాడు. ఇవి కూడా చూడండి సత్య యుగం త్రేతా యుగం కలి యుగం మూలాలు వెలుపలి లంకెలు వర్గం:యుగాలు వర్గం:కాలమానాలు వర్గం:మహాభారతం
కలియుగం
https://te.wikipedia.org/wiki/కలియుగం
కలి యుగం (దేవనాగరి: कली युग) హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగం. ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాల ననుసరించి యుగాలు నాలుగు, సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగము కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంత ప్రకారం సా.శ.పూ. 3102 ఫిబ్రవరి 13 (00:00) కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు . కలియుగం సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుత సా.శ.  సంవత్సరానికి ఇంకా సంవత్సరాలు మిగిలివుంది. సా.శ. 428,899లో అంతమవుతుంది. కలియుగ లక్షణాలు కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాభర్తలు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి. ఇవి కూడా చూడండి చతుర్యుగాలు మన్వంతరము మూలాలు వర్గం:యుగాలు వర్గం:కాలమానాలు
యతి
https://te.wikipedia.org/wiki/యతి
అర్కునిమూర్తి సర్వకళలందుఁ బ్రవీణుఁడు సంగరస్థలిం యతి, యతి మైత్రి పద్య పాదంలో మొదటి అక్షరానికి ఆ పద్యం లక్షణములలో చెప్పబడిన యతి స్థానంలో మైత్రి గల అక్షరాన్ని వాడటాన్నే "యతి మైత్రి" అంటారు. యతి అంటే విరామం అని అర్థం. లయబద్ధమైన పద్య నడకలో సహజంగా వచ్చే విరామాన్ని యతి స్థానం అంటారు. సంస్కృతంలో యతి విరామాన్ని సూచిస్తుంది. కానీ తెలుగు పద్యాలలో ఇది అక్షర సామ్యాన్ని నియమిస్తుంది. అంటే ఈ యతి స్థానంలో ఉండే అక్షరం పాదం మొదటి అక్షరంతో "యతి మైత్రి"లో ఉండాలనేది నియమం. ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం యతి మైత్రిలో ఉంటాయి. అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః ఇ, ఈ, ఎ, ఏ, ఋ ఉ, ఊ, ఒ, ఓ క, ఖ, గ, ఘ, క్ష చ, ఛ, జ, ఝ, శ, ష, స ట, ఠ, డ, ఢ త, థ, ద, ధ ప, ఫ, బ, భ, వ ణ, న ర, ల, ఱ, ళ పు, ఫు, బు, భు, ము, పొ, ఫొ, బొ, భొ, మొ ఇతర నియమములు హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి మైత్రి పాటించాలి. అంటే: "చ", "జ" ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా "చ"కి "జి"తో మైత్రి కుదరదు. హల్లులకి యతి మైత్రి లేకపోయినా, అవి రెండూ ఋ అచ్చుతో కలిస్తే వాటి మధ్య యతి చెల్లుతుంది. ఉదాహరణకు, "ద"కు "గ" యతిమైత్రి లేకపోయినా, "దృ"కు "గృ"కు యతి కుదురుతుంది. సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు. ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ"గా గానీ "రొ"గా గానీ భావించ వచ్చు. ప్రతి వర్గములో చివర ఉన్న అనునాసిక అక్షరానికి (ఙ, ఞ, ణ, న, మ), ఆ వర్గంలో ముందు ఉన్న నాలుగక్షరాలతో అవి బిందు పూర్వకములైతే యతి చెల్లుతుంది. ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన "న"కు "కంద" లోని "ద"కు యతి చెల్లుతుంది. ఉచ్చారణ పరంగా "కంద"ని "కన్ద" అని పలుకుతాం. అందువలన "న్ద"లోని "న"తో యతి కుదురుతుంది. "మ"కు పూర్ణబిందుపూర్వకమైన య, ర, ల, వ, శ, ష, స, హ లతో యతి కుదురుతుంది. ఇదే విధంగా, ఒక అక్షరం ముందున్న అక్షరం పొల్లుతో అంతమైతే, ఆ పొల్లుతో కూడా యతిమైత్రి జరుగుతుంది. ఉదాహరణకి యీ కింద పద్యంలో చివరి పాదం చూడండి: జననీస్తన్యము గ్రోలుచున్ జరణ కంజాతంబునన్ గింకిణీ స్వన మింపారగ దల్లి మేన మృదుల స్పర్శంబుగా దొండ మ ల్లన యాడించుచు జొక్కు విఘ్నపతి యుల్లాసంబుతో మంత్రి వె న్ననికిన్ మన్నపు పొంపుమీర నొసగున్ భద్రంబు లెల్లెప్పుడున్ చివరి పాదంలో మొదటి అక్షరం "న". యతిస్థానంలోని అక్షరం "భ". ఈ రెండు హల్లులకీ యతి చెల్లదు. కానీ, "భ"ముందు పదం "నొసగున్"లో "న్" ఉంది కాబట్టి, దానికి "న"తో యతి చెల్లుతుంది. యతిస్థానంలో సంధి జరిగినప్పుడు, సాధారణంగా సంధి జరగకముందు ఉన్న అక్షరంతోనే యతిమైత్రి జరుగుతుంది. ఉదాహరణకు, ఈ కింద పద్యంలో రెండు, నాలుగు పాదాలు గమనించండి: అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్! రెండవ పాదంలో, మొదటి అక్షరంలో సంధి జరిగింది, "బాల్య + అంక". అలాగే యతిస్థానంలో (10వ అక్షరం) కూడా సంధి జరిగింది, "తొండమునన్ + అవ్వలి". సంధి జరగక ముందున్న అక్షరాలు "అం"కు, "అ"కు యతిమైత్రి జరిగింది. అలాగే నాల్గవ పాదంలో, "మృణాళ + అంకుర", "గజ + ఆస్య". అక్కడ "అం"కు "ఆ"కు యతిమైత్రి. యతి అక్షరాలలో ఒకటి అచ్చు అక్షరం మరొకటి హల్లు అక్షరం అయితే, వాటి మధ్య యతి కుదరదు. ఉదాహరణకి పాదంలో మొదటి అక్షరం "అ" అయితే, యతిస్థానంలో "క" అనే అక్షరం ఉండాలంటే, యతిమైత్రి కుదరదు. అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది. సంబోధనలో చివరి అక్షరం హల్లయినా, దానికి అచ్చుతో యతిమైత్రి కుదురుతుంది. ఉదాహరణకి మొదటి అక్షరం "అ" అయినప్పుడు, "అక్కా!", "ఔరా!" వంటి పదాలలోని "క్కా", "రా" అక్షరాలు యతిస్థానంలో ఊండవచ్చు, వాటికి "అ"తో యతిమైత్రి చెల్లుతుంది. పై చెప్పినవి కాక మరికొన్ని ప్రత్యేక యతి మైత్రులు ఉన్నాయి. కాని అవి అరుదు. సంస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు సంస్కృత భాషయందు ఏలాక్షణికుడు విరచించిన చ్చందశాస్త్ర గ్రంధము నందైనను ప్రతిశ్లోకముయొక్కయు యతిస్థాన నిర్దేశములో భేదము కనిపించదు. ఆంధ్రములో ఈ యతిస్థాన నిర్దేశము ద్వివిధముగా కనిపిస్తున్నది. యతిర్విచ్చేధః అనెడు లక్షణ యుక్తమైన స్థానమునందే పద్యములో యతి నిర్దేశము చేయుటొకటి. రెండవది చిత్రకవి పెద్దనార్యుని లక్షణసార సంగ్రహమునందును అనంతుని చంధోదర్పణము నందును శార్దూల విక్రీడిత వృత్తలక్షణము చెప్పునప్పుడు వివరించినారు. ఇట్లే మరికొన్ని చంధోగ్రంధములలో యతిస్థాన నిర్దేశమునందు ఈ క్రింద బొమ్మలో వివరించబడినది. thumbnail|center|700px|సంస్కృతాంధ్రములో చంధశాస్త్ర యతులు బాహ్య లంకెలు యతి అనగా ముని, యోగి అనే అర్ధాలు కూడా ఉన్నాయి. సిలికానాంధ్ర సృజనరంజనిలో యతి-ప్రాస నియమాలు వ్యాసం వర్గం:పద్యము వర్గం:ఛందస్సు
ప్రాస
https://te.wikipedia.org/wiki/ప్రాస
ఒక పద్యం లోని ప్రతి పాదం లోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ విధంగా ఉంటుందో తక్కిన పాదాలన్నింటిలో రెండవ అక్షరం ఆ విధంగానే ఉండాలి. దీనినే ప్రాస మైత్రి అంటారు. నియమాలు ప్రథమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును. ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను. ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను. ప్రాస పూర్వాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ పూర్వాక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను. ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును. తెలుగు పద్యరీతులలో వృత్తాలలో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, తరలము, మత్తకోకిల వంటి రీతులలో ప్రాస నియమము పాటించవలెను. జాతులలో కందము, తరువోజ పద్యాలలో ప్రాస నియమము ఉంది. ద్విపదలో ప్రాసనియమము ఉన్ననూ, ఈ నియమాన్ని పాటించని ద్విపదని మంజరీ ద్విపద అంటారు. ఆటవెలది, తేటగీతి, సీసము (పద్యం) వంటి ఉపజాతి పద్యాలలో ప్రాస నియమము లేదు. కానీ వీటిలో, ప్రాసయతి చెల్లును. ప్రాసభేదాలు ప్రాస భేదాలు 17 రకాలుగా ఉన్నాయని అప్పకవి చెప్పడం జరిగింది. అర్థబిందు సమప్రాసం పూర్ణబిందు సమప్రాసం ఖండాఖండ ప్రాసం సంయుతాక్షర ప్రాసం సంయుతాసంయుత ప్రాసం రేఫయుత ప్రాసం లఘుద్విత్వ ప్రాసం వికల్ప ప్రాసం ఉభయ ప్రాసం అనునాసిక ప్రాసం ప్రాసమైత్రి ప్రాసం ప్రాసవైరం స్వవర్గజ ప్రాసం ఋప్రాసం లఘుయకార ప్రాసం అభేద ప్రాసం సంధిగత ప్రాసం బాహ్య లంకెలు సిలికానాంధ్ర సృజనరంజనిలో యతి-ప్రాస నియమాలు వ్యాసం వర్గం:పద్యము వర్గం:ఛందస్సు
మత్తేభ విక్రీడితము
https://te.wikipedia.org/wiki/మత్తేభ_విక్రీడితము
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి. మత్తేభము నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపాస భ ర న మ య వ లక్షణములు +మత్తేభము వృత్తమునందు గణములుసభరనమయవ I I U U I I U I U I I I U U U I U U I Uసి రి కింజె ప్ప డుశం ఖ చక్ర యు గముం జే దోయి సం ధింప డే పాదాలు: నాలుగు ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20 ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు ఉదాహరణలు సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా నవలీలం దునుమాడె రాము డదయుండై బాలుడై కుంతల చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్ జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకన్ దాటకన్. సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై మూలాలు వర్గం:పద్యము వర్గం: ఛందస్సు
శార్దూల విక్రీడితము
https://te.wikipedia.org/wiki/శార్దూల_విక్రీడితము
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి. శార్దూలం సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్శార్థూలం వృత్తమునందు గణములు పాదాలు: నాలుగు ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19 ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు ఉదాహరణలుసవరించు తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో,  శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్, భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్ హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్. మూలాలు. లక్షణములు +శార్థూలం వృత్తమునందు గణములుమసజసతతగ U U U I I U I U I I I U U U I U U I U తా టం కాచ ల నంభు తో, భుజ న టద్ద మ్మి ల్లబం డం బుతో పాదాలు: నాలుగు ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19 ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల EXAMPLES తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో, శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్, భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్ హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్. మూలాలు వర్గం:పద్యము వర్గం: ఛందస్సు
చంపకమాల
https://te.wikipedia.org/wiki/చంపకమాల
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి. చంపకమాల నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్ త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్. లక్షణములు పాదాలు: 4 పదాలు కలవు ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21 ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర యతి : ప్రతిపాదంలోనూ 1 వ అక్షరముకు 11 వ అక్షరముకు యతిమైత్రి చెందుతుంది ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు గణ విభజన +చంపకమాల వృత్త పాదము యొక్క గణ విభజననజభజజజర I I I I U I U I I I U I I U I I U I U I Uపదములబట్టినందలకుబా టొకయింతయులేకశూరతన్ ఉదాహరణ thumb|పోతన పోతన తెలుగు భాగవతంలో 486 చంపకమాల వృత్త పద్యాలను వాడారు. పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్ మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్ వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్. మూలాలు బయటి లింకులు వర్గం:పద్యము వర్గం: ఛందస్సు
ఉత్పలమాల
https://te.wikipedia.org/wiki/ఉత్పలమాల
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి. ఉత్పల మాల <poem> భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్ Uttpala mala <poem> Bhanusamaana vinbarana baaralagambhulu goodi visrama Sthanamu nandu jadhmaja yuthambuga nuthpalamaalayi chanun లక్షణములు పాదాలు: నాలుగు ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20 ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ యతి స్థానం : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము ప్రాస నియమం: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు. గణవిభజన +ఉత్పలమాల వృత్త పాదములో గణవిభజనభరనభభరవU I IU I UI I IU I IU I IU I UI Uపుణ్యుడురామచంద్రుడటపోయిముదంబునగాంచెదండకా ఉదాహరణలు పోతన తెలుగు భాగవతంలో 475 ఉత్పలమాల వృత్త పద్యాలను వాడారు. వాటిలో రెండింటిని ఉదాహరణగా ఇక్కడ. ఉదాహరణ 1 పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్ ఉదాహరణ 2 ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్తిక్కన చెప్పిన ప్రసిద్ధమైన పద్యం [సారపు ధర్మమున్ విమల సత్యము]ఉత్పలమాలకు మరొక ఉదాహరణ. మూలాలు బాహ్య లంకెలు వర్గం:పద్యము వర్గం:ఛందస్సు
సినిమా
https://te.wikipedia.org/wiki/సినిమా
సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది. సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. కళ, నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు భారత దేశంలో తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయులపైన, ప్రత్యేకించి తెలుగువారిపైన బాగా ఎక్కువ. సినిమా అంటే సినిమా, ఫిలిమ్, మూవీ, టాకీ అనేవన్నీ ఆంగ్లపదాలు. వీటి మధ్య కాస్త తేడాలున్నాయి గాని వీటన్నింటినీ ఇంచుమించు సమానార్ధకంగా వాడడం జరుగుతుంది. సినిమా - తెలుగులో ఎక్కువగా ఉపయోగించే పదం. ఇది "cinema" అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది, ఇది గ్రీకు పదం "κίνημα" నుండి ఉద్భవించింది, దీని అర్థం కదలిక. ఇది అనేక ఐరోపా భాషలలో కూడా ఉంది. ఫిలిమ్ - ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా హిందీలో ఎక్కువగా ఉపయోగించే పదం. ఇది కెమెరాలలో ఉపయోగించిన చలనచిత్రాన్ని సూచించే "film" (ఫిల్మ్) అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది. ఆంగ్లంలో, ఇది ఎక్కువగా యునైటెడ్ కింగ్‌డమ్, ఐరోపాలో ఉపయోగించబడుతుంది. మూవీ - అమెరికన్ ఆంగ్లలో చాలా సాధారణ పదం, కానీ ఐరోపా, భారతదేశంలో అంత సాధారణం కాదు. ఇది "movie" అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది. టాకీ - ఒక పాత పదం, ఆంగ్ల "talkie" నుండి, చలనచిత్రం ధ్వనిని ఉపయోగించడం ప్రారంభించిన రోజులను సూచిస్తుంది. ఇక "Motion Picture" అనే ఆంగ్లపదానకి సరైన అనువాదపదంగా తెలుగులో చలనచిత్రం (సంస్కృత పదం నుండి "चलच्चित्रम्" అంటే "కదిలేబొమ్మ" అంటే అనేక భారతీయ భాషలలోకి మార్చబడింది) అంటారు. కాని సినిమా అనేదే బాగా జనబాహుళ్యంలో వాడే పదం. ఇంకా వెండితెర అనే పదాన్ని కూడా సినిమాను సూచిస్తూ వాడుతారు. ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్ పై కెమేరాతో వరుసలో చిత్రాలు ముద్రంచడం అన్నది సినిమాకు ప్రధానమైన ప్రక్రియ. ఫిల్మ్‌ను ప్రొజెక్టర్‌లో వేగంగా కదపడం వలన వరుస చిత్రాలన్నీ ఒకదానితో ఒకటి కలసిపోయి ఆ చిత్రాలు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. దీనిని "Persistence of vision" అంటారు. మొదట మూగగా ప్రారంభమైన సినిమాలకు తరువాత ధ్వని తోడయ్యింది. ఆపై రంగులు అద్దారు. అలా సినిమా చాలా కాలం నుండి వర్ధిల్లుతూ వస్తోంది. అయితే అన్ని రంగాలలోలాగానే సినిమారంగంలో కూడా ఇటీవల చాలా సాంకేతికమైన మార్పులు సంభవించాయి. ముఖ్యంగా కంప్యూటర్లు, డిజిటల్ టెక్నిక్కులు, యానిమేషన్ వంటి సాంకేతిక ఆవిష్కరణలు సినిమా నిర్మాణాన్ని, ప్రదర్శనలను అనూహ్యంగా ప్రభావితం చేశాయి. సినిమా చరిత్ర ఆరంభ దశ సినిమాకు అత్యవసరమైన సాంకేతిక సిద్దాంతం "Persistence of Vision with Regard to Moving Objects" అనే పరిశోధనా వ్యాసంలో 1824లో పీటర్ మార్క్ రోజెట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఎడిసన్ లాబొరేటరీస్‌లో పనిచేసే లారీ డిక్సన్ అనే వ్యక్తి ప్రప్రథమంగా వరుసక్రమంలో చిత్రాలుండే "సెల్యులాయిడ్ ఫిలిమ్‌"ను తయారు చేశాడు. తరువాత 1894లో థామస్ ఎడిసన్ "కైనెటో గ్రాఫ్" (కెమెరా), "కైనెటోస్కోప్" (ప్రొజెక్టర్) అనే రెండు పరికరాలను ఆవిష్కరించాడు. ప్రేక్షకులు ఒక చూపుడు గొట్టం (eye piece) ద్వారా అద్దంపై ప్రతిబింబించబడిన "కదిలే బొమ్మ"ను చూడడం సాధ్యమయ్యింది. "కైనెటోస్కోప్ పార్లర్లు" అమెరికాలోను, యూరోప్‌లోను విస్తరించాయి. thumb|200px|లూమిరె సోదరులు అదే సమయంలో యూరోప్‌లో క్రొత్త కెమేరాలు, మరొకొన్ని పరికరాలు కనుగొన్నారు. బ్రిట్‌పాల్ అనే పరిశోధకుడు 1895లో యూరోప్‌లో ఒక "ఫిల్మ్ ప్రొజెక్టరు" పరికరాన్ని తయారు చేశాడు. ఫ్రాన్స్‌లో లూమిరె సోదరులు (ఆగస్టు లూమిరె, లూయిస్ లూమిరె) 1895లో ఒక సూట్‌కేసు సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు. ఇందులో కెమెరా, ఫిల్మ్ డెవెలప్‌మెంట్, ప్రొజెక్టర్ పనులన్నీ కలిపి చేయడం సాధ్యమయ్యింది. వారు తిరణాలవంటి జనసందోహాలలో ప్రజలవద్ద డబ్బులు తీసుకొని తమ కదిలే చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఆధునిక సినిమాకు ఇదే నాంది అనవచ్చును. ఇతరులు కూడా ఇదే విధానాన్ని కొద్దిమార్పులతో (సాంకేతికంగానూ, వ్యాపారపరంగానూ) అనుకరించారు. మూగ చిత్రాలు చిత్రాలకు ధ్వనిని చేర్చడానికి చేసిన ప్రయత్నాలు 1920 దశకం వరకు విజయవంతం కాలేదు. కనుక మొదటి 30 సంవత్సరాలు మూగబొమ్మలే రాజ్యమేలాయి. ప్రదర్శన సమమయంలో వ్యాఖ్యాతలు తోడవ్వడం, లేదా వాద్యబృందాల సహకారం ఇలా రకరకాల హంగులు సమకూర్చేవారు. మాటలు నేర్చిన చిత్రాలు మొదట 1900 సంవత్సరంలో పారిస్‌లో చిత్రాలతో ధ్వని ప్రక్రియ కనుగొన్నారు. 1906లో లండన్‌లో యూజీన్ లాస్టే ఫిలిమ్‌తో ధ్వని విధానానికి పేటెంట్ పొందాడు. 1910లో ఇది ప్రయోగాత్మకంగా "J'entends très bien maintenant" అనే మాటలతో ధ్వనించింది. 1922లో బెర్లిన్‌లో ప్రేక్షకులముందు ధ్వనితో కూడిన చిత్రాన్ని ప్రదర్శించారు. 1923 నుండి న్యూయార్క్‌లో ప్రేక్షకులు డబ్బులిచ్చి "టాకీ" (శబ్ద చిత్రం)ను చూడడం ప్రారంభించారు. 1926లో వార్నర్ బ్రదర్స్ వారు "వైటాఫోన్" అనే సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. 1927లో వారి "The Jazz Singer" చిత్రం కొంత మూగ గానూ, కొంత మాటలు, పాటలు కలిపి విజయవంతంగా ప్రదర్శింపబడింది. 1928లో "The Lights of New York" అనే పూర్తి ధ్వనితో కూడిన చిత్రం వచ్చింది. ఆ తరువాత అంతా టాకీల యుగమే. సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది. సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. కళ, నటన, పర్వవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి. భారతీయ భాషలలో తొలి టాకీ చిత్రాలు {| class="wikitable" |- ! భాష ! సినిమా పేరు ! సంవత్సరం ! ! భాష ! సినిమా పేరు ! సంవత్సరం |- | హిందీ | ఆలం ఆరా | 1931 | | తెలుగు | భక్తప్రహ్లాద | 1931 |- | తమిళం | కాళిదాసు |1931 | | బెంగాలి | జమైసస్తి |1931 |- | మరాఠీ | అయోధ్యకె రాజా |1932 | |గుజరాతి | నరసింగ్ మెహతా | 1932 |- | అస్సామీస్ | జ్యోతిమర్తి | 1933 | |కన్నడం |సతీ సులోచన | 1934 |- | పంజాబి | హీరో రాంజీ | 1934 | | ఒరియా | శిలత్ బిబాస్ | 1936 |- | మలయాళం | బాలన్ | 1938 | | రాజస్థానీ | నజ్ రానా | 1942 |- | సింధి | ఏక్ తా | 1942 | | ఇంగ్లీష్ | బ్లాక్ మెయిల్ | 1929 |- |} రంగుల యుగం తొలినాళ్ళలో సినిమాలు నలుపు తెలుపులలోనే ఉండేవి. 1906లో జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ "కైనెమాకలర్" పేరుతో రెండు రంగుల చిత్రాన్ని తయారుచేశాడు. 1909లో ఈ విధానం వాణిజ్యపరంగా ప్రదర్శనకు అమలుచేయబడింది. కాని ఇందులో చాలా సమస్యలుండేవి. 1932లో "టెక్నికలర్" అనే మూడు రంగుల ప్రక్రియ ఆరంభమైంది. తెలుగు సినిమా ఇవి కూడా చూడండి భారతీయ సినిమా తెలుగు సినిమా ఆస్కార్ పురస్కారాలు సినిమారంగం గురించిన తెలుగు సాహిత్యం మూలాలు, వనరులు ఆంగ్ల వికీ వ్యాసం మరొక ఆంగ్ల వికీ వ్యాసం సినిమా చరిత్ర గురించి సినిమా చరిత్ర గురించి ఇది కూడా బయటి లింకులు సినిమాల సమాచారం క్లాసిక్ ఫిల్మ్ సైటు ఇంటర్నెట్ మోవీ డేటాబేస్ (IMDb) History exhibit of filmmaking in Florida, presented by the State Archives of Florida American Cinematographer - January, 1930, THE EARLY HISTORY OF WIDE FILMS History of Film Formats Technicolor History What is a Camera Obscura? Film Sound History at FilmSound.org An Introduction to Early cinema Reality Film Film History by Decade Cinema: From 1890 To Now A Brief, Early History of Computer Graphics in Film Film History @ Video-Film.info https://web.archive.org/web/20090318225748/http://www.suryaa.com/showSunday.asp?category=5&subCategory=2 *
వార్తాపత్రిక
https://te.wikipedia.org/wiki/వార్తాపత్రిక
thumb|స్వాతంత్ర్యం సిద్ధించిన వార్తతో ఆంధ్రపత్రిక తెలుగు వార్తా పత్రికలలలో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి దినపత్రికలు తెలుగు దినపత్రికలు ప్రతి ఒక్క జిల్లా కేంద్రం నుండి ప్రచురణ మొదలుపెట్టి, స్థానిక వార్తలను జిల్లా సంచికలలో ప్రచురించటంతో, ప్రజలకు పత్రికలు చేరువయ్యాయి. 2010 లో కొన్ని పత్రికలు శాసనసభ నియోజక వర్గ వారీగా ప్రత్యేక పేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. వీటిలో కొన్ని అంతర్జాలంలో కూడా చదివే అవకాశం కలిగి ఉన్నాయి. అయితే ఏ పత్రిక కూడా ముఖ్యమైన వ్యాసాలను అంతర్జాలంలో శాశ్వతంగా నిల్వ చేయకపోవటంతో, చారిత్రక, విశ్లేషణ వ్యాసాల వల్ల పరిశోధకులకు ఉపయోగం లేకుండా పోతుంది. ఆంగ్ల పత్రికలలో ముఖ్యంగా ది హిందూ మాత్రమే శాశ్వతంగా వార్తా వ్యాసాలను నిల్వ చేస్తున్నది. 2012 నాటికి వెలువడుతున్నవి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఆంధ్రభూమి ఈనాడు కృష్ణా పత్రిక ప్రజాశక్తి సాక్షి సూర్య వార్త చైతన్యవారధి విశ్వం వాయిస్ తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ తెలంగాణ కలం యువ తెలంగాణా ప్రయోక్త మాసపత్రిక గతం ఆంధ్రపత్రిక ఉదయం తెలుగుజ్యోతి ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల దినపత్రికలు ది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా దక్కన్ క్రానికల్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ మూలాలు వెలుపలి లంకెలు వర్గం:తెలుగు పత్రికలు
దర్శనీయ స్థలాలు
https://te.wikipedia.org/wiki/దర్శనీయ_స్థలాలు
దర్శనీయ స్థలాలు, భారతదేశంలో చాలా ఉన్నాయి.ఈ శీర్షికలో ముఖ్యమైన దర్శనీయ స్థలాలు వివరాలు ఉంటాయి..వీటిని రెండు రకాలుగా విభజించ వచ్చు పుణ్య క్షేత్రాలు పర్యాటక కేంద్రాలు పుణ్య క్షేత్రాలు భారతదేశం అంటేనే మొదట గుర్తు వచ్చేది పుణ్య క్షేత్రాలే. కాశ్మీరు నుండి, కన్యాకుమారి వరకు అడుగుకొక పుణ్య క్షేత్రం ఉంటుంది, వీటిలో ప్రధానమైన వాటిని తెలుసుకుందాం. సముదాయంగా ఉన్న పుణ్యక్షేత్రాలు వీటిలో ఇవి ఒక సమూహములాగా విఖ్యాతి వహించినవి. ద్వాదశ జ్యోతిర్లింగాలు 108 వైష్ణవ క్షేత్రాలు ఆది శంకరాచార్యుల మఠాలు పంచ శివక్షేత్రాలు రాష్ట్రాల ప్రకారం వివిధ పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ తిరుపతి తిరుమల అంతర్వేది మహానంది అన్నవరం కాణిపాకం శ్రీ కాళహస్తి శ్రీశైలం యాదగిరి గుట్ట సింహాచలం విజయవాడ మంత్రాలయం ద్రాక్షారామం అమరావతి సామర్లకోట పాలకొల్లు భీమవరం ద్వారకతిరుమల అరసవిల్లి శ్రీకూర్మం అప్పనపల్లి జొన్నవాడ పిఠాపురం ర్యాలి అహోబిళం మందపల్లి ఐనవిల్లి కోటప్ప కొండ మంగళగిరి మాచెర్ల పొన్నూరు లేపాక్షి సత్య సాయి ప్రశాంతి నిలయం తెలంగాణ భద్రాచలం చిల్కూరు బాసర వరంగల్ వేములవాడ వాడపల్లి, నల్గొండ జిల్లా తమిళనాడు రామేశ్వరం కంచి ధనుష్కోడి శ్రీరంగం తిరువణ్ణామలై (అరుణాచలం) మామల్లాపురం (మహాబలిపురం) చిదంబరం మదురై పళని తంజావూరు తిరునల్వేలి తిరుత్తణి తిరుచెందూరు కన్యాకుమారి స్వామిమలై కుంభకోణం తిరుప్పరంకుండ్రం కర్ణాటక హంపి శ్రీరంగపట్నం ధర్మస్థల ఉడిపి కుక్కే సుబ్రహ్మణ్య శృంగేరి మఠం హొరనాడు శ్రావణబెళగొళ కేరళ గురువాయుర్ శబరిమల తిరువనంతపురం అట్టుకల్ త్రిశూర్ ఒడిషా [[కొణార్క్ odisha temples పూరి భువనేశ్వర్ మహారాష్ట్ర షిర్డి నాసిక్ కొల్హాపూర్ ఉత్తర ప్రదేశ్ కాశి/వారణాసి అయోధ్య రాజస్థాన్ పుష్కర్ జైసల్మేర్ కోట మెహరాన్ ఘర్ కోట గుజరాత్ ద్వారక అక్షరధామ్ సోమనాథ్ ఉత్తరాఖండ్ గంగోత్రి యమునోత్రి రిషికేష్ బద్రీనాథ్ కేదార్ నాథ్ హరిద్వార్ ప్రయాగ బీహార్ గయ పర్యాటక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్ బొర్రా గుహలు ఉండవల్లి గుహలు బెలూం గుహలు అరకులోయ పాపికొండలు రాజమండ్రి అంతర్వేది సాగరసంగమం బీచ్ విశాఖపట్నం హైదరాబాద్ హార్సిలిహిల్స్ తమిళనాడు చెన్నై ఊటీ కొడైకెనాల్ ఏలగిరి కర్ణాటక బెంగళూరు మైసూరు కూర్గ్ చిక్‌మగళూరు కేరళ మున్నార్ కొచ్చిన్ అలెప్పి ఇడుక్కి కాలికట్ (కొజికొడ్) వాయనాడ్ పాలక్కాడ్ ఒడిషా చిల్కా సరస్సు మహారాష్ట్ర మహాబలేశ్వర్ లొనావాల అజంతాగుహలు ఎల్లొరాగుహలు ఎలిఫెంటాగుహలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా లక్నో సారనాథ్ ఝాన్సి హిమాచల్ ప్రదేశ్ సిమ్లా కులు మనాలి డల్ హౌసి ధర్మశాల ఉత్తరాఖండ్ నైనిటాల్ ముస్సొరి అల్మొరా పశ్చిమ బెంగాల్ కోల్‌కాతా డార్జిలింగ్ సిలిగురి రాజస్థాన్ జైపూర్ జోధ్ పూర్ ఉదయపూర్ జైసల్మేర్ అజ్మీర్ మూలాలు వెలుపలి లంకెలు
ద్వాదశ జ్యోతిర్లింగాలు
https://te.wikipedia.org/wiki/ద్వాదశ_జ్యోతిర్లింగాలు
శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు.... అవి... రామనాథస్వామి లింగం - రామేశ్వరం శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) - శ్రీశైలం భీమశంకర లింగం - భీమా శంకరం ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం - ఎల్లోరా గుహలు త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్) సోమనాథ లింగం - సోమనాథ్ నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక) ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం మహాకాళ లింగం - ఉజ్జయిని వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (దేవఘర్) విశ్వేశ్వర లింగం - వారణాశి కేదార్‌నాథ్‌ ఆలయం జ్యోతిర్లింగ స్త్రోత్రం thumb|ద్వాదశ జ్యోతిర్లింగాలు|333x333px ఈ జ్యోతిర్లింగ స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్ ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్ ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్ సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జ్యోతిర్లింగాలు thumb|త్రయంబకేశ్వర ఆలయం|333x333px సోమనాథుడు - విరవల్ రేవు, ప్రభాస్ పటాన్, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్ - దీనిని ప్రభాస్ క్షేత్రం అంటారు. చంద్రునిచే ఈ లింగం ప్రతిష్ఠింపబడిందని స్థలపురాణం. మల్లికార్జునుడు - శ్రీశైలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ - ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటి. ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి. మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్ - క్షిప్రానది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 84 సిద్ధ లింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి. ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరం, మధ్య ప్రదేశ్ - నర్మద (రేవా) నదీతీరాన వెలసింది. ఇక్కడ ఒకే లింగం రెండు బాగాలుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతుంది. అమ్మవారు అన్నపూర్ణ. వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవఘర్, బీహార్ - బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపంలో ఉంది. సహ్యాద్రి కొండల అంచునుంది. అమృతమధనానంతరం ధన్వంతరిని, అమృతాన్ని ఈ లింగంలో దాచిరనీ, సృశించిన భక్తులకు అమృతం లభించుననీ నమ్మకం. భీమశంకరుడు - డాకిని, భువనగిరి జిల్లా, పూనే వద్ద, మహారాష్ట్ర - చంద్రభాగ (భీమ) నది ఒడ్డున, భీమశంకర పర్వతాలవద్ద - త్రిపురాపుర సంహారానంతరం మహాశివుడు విశ్రాంతి తీసికొన్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు కూడా యున్నవి. మోక్ష కుండము, జ్ఙాన కుండం ఉన్నాయి. రామేశ్వరుడు - రామేశ్వరం, తమిళనాడు - శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం - కాశీ గంగా జలాన్ని రామేశ్వరంనకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి. నాగేశ్వరుడు (నాగనాథుడు)- (దారుకావనం) ద్వారక వద్ద, మహారాష్ట్ర - ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు. విశ్వనాథుడు - వారణాసి, ఉత్తర ప్రదేశ్ - కాశీ అని కూడా ప్రసిద్ధం - వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానం - పరమపావన తీర్థం - ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి. త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర - గౌతమీ తీరాన - ఇక్కడి లింగం చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగాలున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరం ఉంది. కుశావర్త తీర్థం, గంగాధార తీర్థం, వరాహ తీర్థం ముఖ్యమైనవి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థపర్వం పెద్ద పండుగ. కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో- మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనానికి తెరచి ఉంటుంది. ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర - (దేవగిరి లోనిదే జ్యోతిర్లింగమని కూడా చెప్పుదురు) ఇవి కూడా చూడండి శక్తిపీఠాలు మూలాలు వనరులు శైవం వారి వెబ్ సైటు జ్యోతిర్లింగాలగూర్చిన వెబ్ సైటు వర్గం:హిందూ దేవతలు
కందం
https://te.wikipedia.org/wiki/కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే. క. కందము త్రిశర గణంబుల, నందము గా భ జ స నలము లటవడి మూటన్ బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్ యిందు గణములు +కంద పద్యములో ఉండవలసిన గణములు గ గ భ జ స నల U U U I I I U I I I U I I I I లక్షణములు పాదాలు=4 కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలు మాత్రమే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు. 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు. 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి. 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు, అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి. పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతోనే మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతోనే మొదలుకావాలి. యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి. ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు. ఉదాహరణ 1 నడువకుమీ తెరువొక్కట గుడువకుమీ శత్రు నింటు గూరిమి తోడన్‌ ముడువకుమీ పరధనముల నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ! ఉదాహరణ 2 భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం ఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్ +ఉదాహరణ 2 కు గణములు లెక్కిస్తేభభభ భూ త ల నా థు డు రా ము డుగ గగ గజ నలస ప్రీతుం డై పెం డ్లి యాడె బృథుగుణ మణి సం గ గ గ గ గ గ ఘాతన్ భాగ్యో పేతన్ గ గ స నల స గ గ సీతన్ ముఖకాం తి విజిత సితఖ ద్యోతన్ కంద పద్యమునందు గణముల వివరణ గగ గణము = UU { గురువు, గురువు } భ గణము = UII { గురువు, లఘువు, లఘువు } జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు } స గణము = IIU {లఘువు, లఘువు, గురువు} నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు } మూలాలు వర్గం:పద్యము
తేటగీతి
https://te.wikipedia.org/wiki/తేటగీతి
తేటగీతి ఉదాహరణ 1: విని దశగ్రీవు డంగజ వివశు డగుచు నర్థి బంచిన బసిడిఱ్రి యై నటించు నీచు మారీచు రాముడు నెఱి వధించె నంతలో సీత గొనిపోయె నసురవిభుడు లక్షణాలు ఆ. "సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి" - అప్పకవీయము పాదాలు: 4 ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం + రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు ఉంటాయి యతి ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి ప్రాసయతి చెల్లును ప్రాసయతి చెల్లించిన పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు. అయితే అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు. ప్రాస ప్రాస నియమం లేదు ఉదాహరణ 2: అఖిలరూపముల్ దనరూపమైన వాడు నాదిమధ్యాంతములు లేక యడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడె చూడడె తలపడె వేగ రాడె; మూలాలు ఇది మహా పండితులు రచించినది వర్గం:పద్యము
ఆటవెలది
https://te.wikipedia.org/wiki/ఆటవెలది
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. లక్షణములు సూత్రము: ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును హంస పంచకంబు ఆటవెలది. ఇందు నాలుగు పాదములుంటాయి. 1, 3 పాదాలు మొదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి. ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి ప్రాసయతి చెల్లును ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును. ఉదాహరణలు 'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే. ఉదా: ఉప్పుకప్పురంబు ఒక్కపోలికనుండు, చూడచూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమ. అనువుగానిచోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువగాదు కొండ అద్దమందు కొంచెమై యుండదా విశ్వదాభిరామ వినురవేమ. ఇతరాలు <blockquote> రామహేశు నాదు నవ్యక్తు నధ్యాత్మ యోగగమ్ము బూర్ణు నున్న తాత్ము బ్రహ్మ మైన వాని బరుని నతీంద్రియు నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు. నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు నుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు, నిష్కారణునకు న మస్కరింతు నన్ను మనుచు కొఱకు. </blockquote> వర్గం:ఛందస్సు వర్గం:పద్యము
సీసము (పద్యం)
https://te.wikipedia.org/wiki/సీసము_(పద్యం)
సీస పద్యం చాలా ప్రాచీనమైనది. మొదటగా ఈ పద్యాన్ని గుణగ విజయాదిత్యుని కందుకూరు శాశనం (సా.శ.850 సం) లో చూశారు. అంతకు ముందే ఎన్నో సవంత్సరాలనుంచీ ఉండి ఉండవచ్చు. ఈ పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఇచ్చారు. సీస పద్యం వరుస "శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు శివ పద వర రాజ్య సేవితుండ ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు దయా నిలయుండును భండన నండన పండరంగు ...................................కొలది లేని కొట్టము ల్వోడిచి గుణక నల్ల తాని పక్ష పాతి................ ....................విభవ గౌరవేంద్ర.. ఈ పద్యంలో ఒక విశేషం ఏమిటంటే.. కొలది లేని అనే మాట వచ్చేదాకా అన్నీ తత్సమ పదాలే కావడం విశేషమే! ఈ పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోకుండా వుండే "గునుగు సీసం" కావడం మరొక విశేషమని పెద్దలు చెప్తున్నారు. నాహవరావ దండమోద్య సిఘాసనుండగణిత దానమాన్యుండు అనే పెద్ద పెద్ద సమాసాలు అప్పుడే మొదలైన విశేషం గమనించారు గదా. కొమర్రాజు లక్ష్మణరావు నన్నయ యుగానికి చెందిన ద్రాక్షారామంలోని సీసపద్యశాసనాన్ని ప్రకటించారు. గిడుగు రామమూర్తి పంతులు ప్రకటించిన దీర్ఘసీసపద్యశాసనం మరొకటి నన్నయ కాలం నాటిదే అయివున్నది. ఉదాహరణ 1: కలుగడే నాపాలి కలిమి సందేహింప గలిమిలేములు లేక కలుగువాడు; నా కడ్డపడ రాడె నలి న సాధువులచే బడిన సాధుల కడ్డపడెడువాడు చూడడే నా పాటు జూపుల జూడక చూచువారల గృపజూచువాడు; లీలతో నా మొఱాలింపడే మొఱగుల మొఱ లెఱుంగుచు దన్ను మొఱగువాడు; లక్షణములు క. నల నగ సల భ ర త ల లో పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం బులఁ దగి నాలుగు పదములఁ జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా ! పాదముల సంఖ్య = 4 ఈ పద్యం లో, నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి. ఆ నాలుగు పెద్ద పాదాలనూ..మళ్ళీ నాలుగు పెద్ద పాదాలుగా, నాలుగు చిన్న పదాలుగా విడగొట్టి రాస్తారు. ప్రతి పాదంలోనూ 6 ఇంద్ర గణాలు, + 2 సూర్య గణాలు కలిపి మొత్తం ఎనిమిది గణాలు ఉంటాయి. ఈ పద్యాలు పెద్దవి కావడం చేత ప్రతి పాదాన్నీ రెండు భాగాలుగా చూపుతారు. ఈ నాలుగు పాదాలకూ చివర ఆటవెలది కానీ, తేటగీతి గానీ ఉండవలెను, ఇది తప్పనిసరి. ఒకటో పాదం .... ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - ఇంద్ర - పెద్ద పాదం. రెండో పాదం.. ఇంద్ర - ఇంద్ర - సూర్య - సూర్య- చిన్న పాదం. మూడు నాలుగూ... ఐదూ ఆరు... ఏడు ఎనిమిది.. పదాలు వరుసగా ఉంటాయి. ఇలాగే.. ప్రతి చిన్న పాదం లోని మొదటి గణం మొదటి అక్షరానికీ.. మూడవ గణం మొదటి అక్షరానికీ యతి చెల్లాలి. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ఈ పద్యానికి ప్రాస నియమము లేదు. యతి యతి 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ మైత్రి కుదరాలి. ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే). ఉదా: లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక ప్రాస ప్రాస నియమం లేదు. ఉదాహరణ 2: వరధర్మకామార్థ వర్జితకాములై విబుధు లెవ్వాని సేవించి యిష్ట గతి బోందుదురు? చేరి కాంక్షించువారి క వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ? ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు? రానందవార్ది మగ్నాంతరంగు లేకాంతు లెవ్వని నేమియు గోరక భద్రచరిత్రంబు బాడుచుందు? ఉదాహరణ 3: సీసపద్యం ఎట్లా ఉండాలనేది ఒక ఆటవెలది పద్యంలో ఈ విధంగా చెప్పబడింది. ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు పాదపాదమందు పల్కుచుండు ఆటవెలదినైన తేటగీతియు నైన చెప్పవలయు మీద సీసమునకు సీస పద్యాన్ని ఒకేలాగా ఉండే నాలుగు పెద్ద పాదాలుగా కాని (1,1,1,1), ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1,2,1,2,1,2,1,2) - మొత్తం ఎనిమిది పాదాలుగా - గాని వివరించవచ్చు. సీస పద్యంలో భాగం కాకపోయినా, సీస పద్యం తరువాత ఒక గీత పద్యం ("ఆటవెలది" లేదా "తేటగీతి") వస్తుంది. ఒక పెద్ద పాదంలో వరుసగా 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వస్తాయి. ప్రాస నియమం లేదు. యతి: 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోను, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోను మైత్రి కుదరాలి. ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే) ఈ అచ్చ తెనుగు పద్యరీతులలో కచ్చితమైన గణాలు చెప్పకపోవటం వల్ల అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలు) ఒకే లయలో ఉండనవసరం లేదు. కాని వీటి లయను గుర్తించడం అంత కష్టం కాదు. పద్యాలు పైకి చదువుతుంటే లయ దానంతటదే అవగతం అవుతుంది. ఉదాహరణ సీసము తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ? కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి? లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి? ఆటవెలది మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక? బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు సర్వలఘు సీసము నవవికచసరసిరుహనయన నిజయుగచరణ గగనచరనదిజనిత నిగమవినుత ఙలధిసుతకుశకలశ లలితమృగమదరుచిర మూలాలు వర్గం:పద్యము
శ్రీశైల క్షేత్రం
https://te.wikipedia.org/wiki/శ్రీశైల_క్షేత్రం
శ్రీశైలక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది. చరిత్ర ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము గోకర్ణ ఖండము లోని, గోకర్ణ పురాణము అను సంసృత గ్రంథము ౬౬ వ. అధ్యాయము నుండి .... పర్వతాగ్రే నదీతీరే బ్రహ్మ,విష్ణు,శివై శ్రితే..........అను శ్లోక ప్రమాణముగా శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రము అనుటలో ఎలాంటి సందేహము లేదు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది. శాసనాధారాలు శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది సా.శ.6వ శతాబ్ది నాటిది. ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది. సాహిత్యాధారాలు తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. సా.శ. 6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంథం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం (శ్రీపర్వతం) అని పేర్కొన్నారు. సా.శ.14వ శతాబ్దం నాటి శైవకవియైన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో కరమొప్పు దక్షిణ కైలాసము అంటూ శ్రీశైలాన్ని కీర్తించారు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ ప్రాంతం కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూ, క్రూరమృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు, కందనూరు నవాబు తరఫున యాత్రికుల నుంచి హాశ్శీలు తీసుకునే ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. శ్రీశైలానికి వెళ్ళే నాలుగు బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కాని సామాన్యమైన దినాల్లో వెళ్లేందుకు వీలే లేని స్థితిలో ఉండేవి. చెంచువాళ్ళ భయం, అడవి జంతువుల భయం విస్తరించివుండేది. చెంచువాళ్ళు ఆటవికులైనా అప్పట్లో చాలామంది దారినపోయే యాత్రికులను యాచించి తినే అలవాటు పడ్డారని వ్రాసుకున్నారు. ప్రతిరోజూ పల్లకీసేవ జరిగేది. చైత్రమాసంలో భ్రమరాంబ అమ్మవారికి తామసపూజలు జరిగేవి. అర్చకులు ఒకరొకరు మార్చి మార్చి డ్యూటీలు చేసుకునేవారని ఉంది. స్థల పురాణం పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి. కృతయుగమున పుత్రార్ధియై ఘోరతప మాచరించిన శిలాద మహర్షికి పరమేశ్వరానుగ్రహంబున జన్మించిన నందికేశ్వర, పర్వతనామ ధేయులగు కుమార రత్నములు తమతీర్వతపోగ్ని జ్వాలలచే త్రిలోకంబుల గడగడలాడించి పరమేశ్వరుని ప్రత్యక్షము గావించుకొనిరి. వారిలో నందీశ్వరుడు ప్రమథగణాధిపత్యమును, ఈశ్వర వాహనత్వమును వరములుగా బడెసెను. పర్వతుడు తాను పర్వతాకారముదాల్చుదునని, తన శిఖరముపై పరమేశ్వరుడు త్రిశత్కోటి దేవతలతో ప్రమధులతో సర్వతీర్థక్షేత్ర రాజములతో స్వయంభూ లింగరూపమున పార్వతీ సమేతుడై వెలయవలయునని, తన శిఖర దర్శన మాత్రంబుననే జనులకు ముక్తి నొసంగ వలయునని వేడుకొనిన నాటినుండి శ్రీశైలము మహామహిమోపేతమై ప్రఖ్యాతిగాంచింది.శ్రీశైలమని పేరువచ్చుటకు గల కారణము-కృతయుగాంతమున గల 'సుమతి' నామధేయుడగు మునీంద్రుని పుత్రికామణియగు 'శ్రీ' తన ఉగ్రతపంబుచే ఈశుని మెప్పించి ' ఈ పర్వతమున ఎల్లకాలము నాపేరు ముందునిడి ప్రజలు పిలుచు నట్లు పరమేశుని వరమనుగ్రహింపమని ప్రార్థించి, సఫల మనోరధురారైనప్పటి నుండి ఈ పర్వతము శ్రీ పర్వతమనియు, శ్రీశైలమనియు వ్యవహరింపబడింది. స్వామికి మల్లికార్జున నామ ధేయము కలుగుటకు కారణం: శ్రీశైల సమీపమందలి మల్లికాపుర మహారాజగు చంద్రగుప్తుడు శత్రువిజేతయై, స్వదేశానికి ద్వాదశ వర్షానంతరము మేగుదెంచి, పరమేశ్వరానుగ్రహ సంజాతయు, అపురూప లావణ్య పుంజమును, తన పుత్రికా రత్నమును అగు చంద్రమతి గాంచి కామించెను.ఎవరెన్ని విధముల వలదని వారించు చున్నను వినక మోహవివశతచే కామాంధుడై అనుచితముగా ప్రవర్తింప ఆమె తప్పించుకొని శ్రీశైలమునకేగి శివుని మల్లికా కుసుమంబుల బూజించి ప్రత్యక్షము గావించుకొనినది. కామ్మంధుడగు తన తండ్రిని శిక్షించి, మల్లికాపురమున దగ్ధమొనరింప వలసిన దనియు, తనకు దృఢమగు శివభక్తినొసగి సర్వజన భజనీయుడగు, అంబారూపంబు నొసగి మల్లికార్జునాఖ్యచే పరమేశ్వరుడు సుప్రసిద్ధిడు కావలెనని వరములు కోరినది.అది మొదలు మల్లికార్జునడు అను పేరుకలుగుట, చంద్రమతి భ్రమరకీటక న్యాయమున అంబా స్వరూపముగా భ్రమరాంబ నామమున సర్వలోక భజనీయుడగుట జరిగింది.పరమేశ్వర శాప దగ్ధమై మల్లికాపురము నిర్ములన అగుటయు, చంద్రగుప్తుడు పచ్చబండై పాతాళ గంగలో బడుటచే ఆజలము పచ్చగా మారుటయు జరిగింది. నామవివరణ శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం మొదలైన నామాతరాలున్నాయి. శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం వుండడమూ ఉంది. సా.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారని ఉంది. భౌగోళికం ఈ క్షేత్రం కర్నూలు నుండి 180 కి.మీ., హైదరాబాదు నుండి 213 కి.మీ, గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గాలు హైదరాబాదు నుండి ఎన్ఎచ్-765 రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా ఎన్ఎచ్-765 రహదారి లో ప్రయాణం చేయాలి.. రైలు మార్గం సమీప రైల్వే స్టేషన్లు మార్కాపురం, తర్లుపాడు విమాన మార్గం సమీప విమానాశ్రయాలు కర్నూలు, కడప హైదరాబాద్, తిరుపతి, విజయవాడ శ్రీశైల దర్శనీయ ప్రదేశాలు శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు ఉన్నాయి. చూపులకు కానరానంతగా విస్తరించుకొన్న శ్రీశైలము క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా మూడు భాగాలుగా విభజించవచ్చు.అవి 1.శ్రీశైల దేవాలయ ప్రాంతము. 2.మండపాలు, పంచమఠాల ప్రాంతము, 3.అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు శ్రీశైల దేవాలయ ప్రాంతం శ్రీమల్లికార్జునుని దేవాలయం: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా,, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ గల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు. భ్రమరాంబిక అమ్మవారి గుడి: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయములో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే భ్రమరనాదం వినవస్తుంది. మనోహర గుండం: శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉంది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ నాణెం వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది. నాగ ప్రతిమలు: పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్ఠించిరి. అద్దాల మండపం: వృద్ద మల్లికార్జున లింగం: ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది! thumb|రుద్రాక్ష మఠము మండపాలు, పంచమఠాల ప్రాంతం పంచమఠాలు అని పిలువబడే మఠాలు ఇక్కడ ఉన్నాయి. ఘంటా మఠం భీమ శంకరమఠం విభూతి మఠం సారంగధర మఠం: మిగిలిన మఠాలలో నిర్వహణలో, అభివృద్ధిలో ప్రసిద్దమైనది సారంగధర మఠం. రుద్రాక్షమఠం: ఇక్కడి మఠంలో శివలింగము రుద్రాక్ష రూపంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. విశ్వామిత్రమఠం: నంది మఠం మొదలైనవి. అడవిలో గల పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు పాతాళ గంగ శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు. 2004లో పాతాళగంగకు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడింది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి. సాక్షి గణపతి ఆలయం ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని. ఇతనిని సాక్షి గణపతి అంటారు. శ్రీశైల శిఖరం శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్ముతారు. ఫాలధార, పంచధారలు శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరానికి సమీపాన అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒక ధార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది. ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నప్పుడు, వివిధ దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారుగాని, వాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న సమయంలో జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదికథర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ పీఠాలను స్థాపించి విస్తృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశానికి ఒక మంచి కథనము ఉంది. శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందు, శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి, కొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ దృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు. అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు ఉన్నాయి. శివాజీ సాంస్కృతిక , స్మారక భవనం శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు. అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక, స్మారక భవనంలో- అతడి జీవిత విశేషాల కథనం, చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహం కొరకు రెండవ అంతస్తును కేటాయించారు. హటకేశ్వరం శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిసరాలలోనే శ్రీ ఆదిశంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిసరాలలో పలు ఆశ్రమములు, మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు ఉన్నాయి. శిఖరం శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖరదర్శనం చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు,అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి.అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు. కదళీవనం శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి. భీముని కొలను శ్రీశైలంలోని సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు పాపనాశనం తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాట భీముని కొలనుకు దారితీస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కిందట రెడ్డిరాజులు మెట్లు కట్టించడం విశేషం. మెట్ల దారిలో ఒక కిలోమీటర్‌ వెళ్లాక.. దట్టమైన అడవితో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడున్న మహాద్వారం.. అందమైన లోకంలోకి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు.. వీటికి ఇరువైపులా చెట్లు.. వాటికి అల్లుకున్న లతలు.. మనిషంత ఎత్తుండే పుట్టలు.. దారి పొడుగునా కనిపించే దృశ్యాలివి. ఈ దారిలో రెండు కిలోమీటర్లు నడక సాగిస్తే.. త్రివేణీ, త్రి పర్వత సంగమానికి చేరుకుంటారు.వందల అడుగుల లోతున్న లోయల మధ్య తూర్పు నుంచి ఒక సెలయేరు, దక్షిణం నుంచి మరో సెలయేరు వచ్చి.. చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి లపాతాలు ఏర్పరిచే కొలను మనోహరంగా ఉంటుంది. అదే భీముని కొలను. అంటే పెద్ద కొలనని అర్థం. అయితే ఇది మరీ అంత పెద్దగా ఏం ఉండదు. కానీ చాలా ప్రత్యేకమైనది. తూర్పు సెలయేరు, దక్షిణ సెలయేరు సంగమించి.. జలపాతంగా మారి ఒక గుండంలో దూకుతాయి. అక్కడ దూకిన జలాలు.. అనూహ్యంగా మాయమవుతాయి. ఒక పరుపు బండ కింది నుంచి రెండు వందల అడుగులు ప్రయాణించి మళ్లీ బయటకు వస్తాయి. భారీ పరుపు బండ మీద నిలబడితే.. దాని కింది నుంచి నీళ్లు పారుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. పరుపు బండ కింది నుంచి వెలుపలకు వచ్చిన నీళ్లు కొలనులోకి చేరడంతో నిరంతరం అలలు పుడుతుంటాయి. వేసవిలోనూ ఇక్కడ నీటి జాడ కనిపించడం విశేషం. అహోబిలం నరసింహస్వామి.. చెంచులక్ష్మిని వరించి భీముని కొలనులో సయ్యాటలాడాడని స్థానిక కథనం. కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడికి సమీపంలోని పురాతన శివాలయం ఉంది. దీనిని సందర్శించి.. మరోసారి లోయల అందాలను చూస్తూ.. పొద్దుగూకే లోగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు. వసతి సౌకర్యాలు శ్రీశైలంలో వసతిగా దేవస్థానమువారి సత్రములు, అతి పెద్ద కాటేజీలు, హొటల్స్ ఉన్నాయి. ఆంధ్రదేశములో ఎక్కడా లేని విధంగా కులప్రాతిపదికగా ఎవరికి వారుగా ప్రతి కులపువారికీ ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములు, కార్తీకమాసంలో తప్ప మిగిలిన దినాలలో ఏసత్రములోనైనా ఎవరికైనా వసతి లభించును. ఈ సత్రములే కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రముల, ప్రైవేటువారి సత్రములతోనూ శ్రీశైలం భక్తజనులతో కళకళలాడుతుంటుంది. ఇంకా చూడండి శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం హటకేశ్వరం శ్రీశైల శిఖరం శ్రీశైలం (శ్రీశైలం మండలం) మూలాలు బయటి లింకులు శ్రీ శైల దేవస్థాన అధికారిక వెబ్ సైట్ శైలంలో నెలకొన్న పంచ మఠాల వెబ్ సైట్ వర్గం:లింగాయత వర్గం:కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలు వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు వర్గం:ప్రసిద్ధ శైవక్షేత్రాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
తిరుమల
https://te.wikipedia.org/wiki/తిరుమల
తిరుమల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహిస్తుంది, ఇది టిటిడి అధిపతిని కూడా నియమిస్తుంది, పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తుంది. తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం. కొండలు సముద్ర మట్టానికి పైన ఎత్తులో ఉన్నాయి. కొండలశ్రేణిలోగల ఏడు శిఖరాలు, ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని "ఏడు కొండల ఆలయం" అని కూడా పిలుస్తారు. తిరుమల పట్టణం విస్తీర్ణం సుమారు . ఈ ఆలయం నిర్మాణం ద్రావిడ శైలిలో సా.శ. 300 లో ప్రారంభమైందని నమ్ముతారు. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తోండైమండలం తమిళ పాలకుడు తొండమాన్ సా.శ. 8 వ శతాబ్దంలో గాలిగోపురం, ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు.  గర్భగుడిని ఆనందనిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది. ఈ ఆలయం వైఖానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇది ఎనిమిది విష్ణు స్వయంభు క్షేత్రాలలో ఒకటి. ఇది 108 దివ్యదేశాలలో చివరి భూసంబంధమైన దివ్యదేశంగా 106 స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు (తంజావూరు), పాండ్య రాజులు (మదురై), 13-14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి రెండు ఆధునిక వేచివుండే (క్యూ) భవనాలు ఉన్నాయి. ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం, తలనీలాలు సమర్పించు భవనాలు, అనేక యాత్రికుల బస స్థలాలు ఉన్నాయి. అందే విరాళాలు, సంపద పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిరోజూ 50,000 నుండి 100,000 మంది యాత్రికులు (సంవత్సరానికి సగటున 30 నుండి 40 మిలియన్ల మంది) సందర్శిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు, పండుగలలో, యాత్రికుల సంఖ్య 500,000 వరకు వుండి ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్రమైన ప్రదేశమైంది. 2016 నివేదిక ప్రకారం 27.3 మిలియన్ల మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శించారు. స్థల పురాణం ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశాడు, శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు. పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది. హిరణ్యాక్షుని చంపిన తరువాత, వరాహుడు ఈ కొండపై నివసించాడు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహాత్యం. కలియుగం కాలంలో, త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకొనేందులకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ, శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు. చివరికి అతను విష్ణువును సందర్శించినపుడు విష్ణువు భృగుని గమనించనట్లుగా వ్యవహరించాడు. కోపంతో, భృగు విష్ణువు ఛాతీపై తన్నాడు. దానికి విష్ణు క్షమాపణ చెప్పి, ఋషి పాదాలను వత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిదిమేశాడు. విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్లాపూర్ వెళ్తుంది. కొల్లాపూర్‌లో ఉన్న సమయంలో, లక్ష్మీ కొల్హాసుర అనే రాక్షసుడిని ఓడిస్తుంది. ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబయి అని అంటారు. ఆమె ఇక్కడి మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్లో దేవతగా పూజలందుకుంటున్నది. విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి, శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని, బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు, బ్రహ్మ ఆవు, దూడగా మారుతారు. వాటిని తిరుమల కొండలప్రాంతాన్ని పాలించే చోళ రాజుకు అప్పగిస్తుంది. ఆవు మేత కోసం వెళ్లినప్పుడు ప్రతిరోజూ శ్రీనివాసునికి పాలు ఇస్తుంది. ఒక రోజు ఆవులకాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళ రాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు. రాజు శాపవిమోచనం కోసం ప్రార్థించగా, రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో వున్న విష్ణునికి వివాహం చేయమని చెప్తాడు. శ్రీనివాసుడు అక్కడ నుండి వకుళా దేవి ఆశ్రమానికి వెళ్లాడు. ఆ ప్రయాణంలో నీలా అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టు పోయి ఏర్పడిన మచ్చను గమనించింది. భక్తి పూర్వకంగా, ఆమె తన జుట్టును కత్తిరించి, మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది. శ్రీనివాసుడు, ఆమె భక్తితో చలించి, కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమెను దేవతగా మార్చి, తన భక్తులు జుట్టు కత్తిరించుకుని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు. గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోదయైన వకుళా దేవి, శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. గతజన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా, కృష్ణుడు వకుళాదేవిగా జన్మంచినపుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని, ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత, అతను "అమ్మా" అని పిలవగా వకుళా దేవి దత్తత తీసుకున్నది. మరొక వైపు, శ్రీనివాసుడి చేత శపించబడిన తరువాత, చోళ రాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని, సంతానం కోసం యజ్ఞం చేయగా, బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతిగా పెంచుతాడు. ఈమె లక్ష్మీ ప్రతిరూపమే. పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది. ఒక రోజు, శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు, అతను పద్మావతి దేవిని గమనించి, ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్రతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరుగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది. ఆ ఏనుగు గణేశుడే. పద్మావతి, ఆమె స్నేహితురాండ్లు, శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలపగా, ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుని వెళ్లగొడతారు. శ్రీనివాసుడు వకుళాదేవి వద్దకు వెళ్లి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి మాట్లాడుతానని చెపుతుంది. రాజు తిరస్కరిస్తాడని భయపడి, శ్రీనివాసుడు సోదిచెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్లి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ, పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహమాడుతుందని, వకుళా దేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని, పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు, రాణి అంగీకరిస్తారు. రాజకుమార్తెయైన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాసులు ఉన్నాయి. శ్రీనివాసుడు, తన తల్లి పేదవారైనందున, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థించాలని సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు. ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు. శ్రీనివాసుడు, పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు. వెంకటేశ్వర మూర్తిలో, పద్మావతి లక్ష్మీగా ఛాతీ ఒక వైపు వుంటుంది, అలాగే మరొక వైపు లక్ష్మీ మరో అవతారమైన భూదేవి వుంటుంది. ఈ పురాణానికి కొంచెంతేడాలతో ఇతర కూర్పులున్నాయి. మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు, వేదవతి పునర్జన్మ. ఈ సంస్కరణలో, శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తరువాత, లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకుని, శ్రీనివాసుడిని ప్రశ్నించడానికి తిరుమల కొండలకు వెళ్తుంది. లక్ష్మీ, పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో వున్న వారికి - కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవజాతి విముక్తి కోసం 7 కొండలపై ఉండాలనే ప్రభువు కోరికవలన అలా జరిగినట్లు చెప్తారు. లక్ష్మీ, పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలని కోరుకుని రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీ అతని ఛాతీపై ఎడమ వైపున ఉంటుంది, పద్మావతి అతని ఛాతీ కుడి వైపున ఉంటుంది. తిరుమల ఆలయం లోని లోపలి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. చరిత్ర thumb|right|240px|తిరుపతిలో హాథీరాంజీ మఠం... భవనము తిరుమల హిందూ పుణ్యక్షేత్రంగా 15 వందల ఏళ్ల పైగా చరిత్ర ఉంది. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. మధ్యయుగ చరిత్ర పల్లవ రాజు శక్తి విటంకన్ భార్యయైన రాణి సామవై పెరిందేవి సా.శ. 966 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అర్చకులు సూచించిన విధంగా శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్ఠింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. ఆమె అనేక ఆభరణాలు, రెండు ప్రాంతాలలో భూమిని (10 ఎకరాలు, 13 ఎకరాలు విస్తీర్ణంగల) విరాళంగా ఇచ్చింది. ఆ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని ఆలయంలో ప్రధాన పండుగ వేడుకలకు ఉపయోగించుకోవాలని ఆదేశించింది. పల్లవ రాజవంశం (9 వ శతాబ్దం), చోళ రాజవంశం (10 వ శతాబ్దం), విజయనగర రాజులు (14, 15 వ శతాబ్దాలు) వెంకటేశ్వరస్వామిని ఆరాధించారు. తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు సా.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు సా.శ.1429లో, హరిహరరాయలు సా.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ ఆలయం ప్రస్తుత సంపద, పరిమాణంలో చాలా భాగం విజయనగర సామ్రాజ్యం రాజులు వజ్రాలు, బంగారాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా పొందింది. సాళువ నరసింహరాయలు 1470 లో భార్య, ఇద్దరు కుమారులు, తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలలో నాలుగు స్తంభాల మండపాలను నిర్మించాడు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. కృష్ణదేవరాయలు సా.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఇచ్చిన బంగారం, ఆభరణాల దానం, 1517 లో ఆనంద నిలయం (గర్భగుడి) పైకప్పుకు బంగారు పూత పూయడానికి వీలు కల్పించింది. 1517 జనవరి 2 న కృష్ణదేవరాయ ఆలయంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆలయానికి ఇంకొన్ని విరాళాలు ఇచ్చాడు. అచ్యుత రాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో, అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు. 1320-1369 మధ్య శ్రీరంగపట్నం రంగనాథ ఆలయ విగ్రహాలను భద్రపరచడానికి ఈ ఆలయంలో ఉంచారు. ఆధునిక చరిత్ర thumb|250x250px| తిరుమలకు చెందిన స్వామి పుష్కరిణి thumb|240px|అలిపిరి మెట్ల దారిలో సాష్టాంగ నమస్కార ముద్రలో శిల్పం, అలిపిరి వద్ద తీసిన చిత్రం విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తరువాత, మైసూర్ రాజ్యం, గద్వాల్ సంస్థానం వంటి రాష్ట్రాల నాయకులు భక్తులుగా పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులను ఇచ్చారు. ఈ ఆలయం 1656 జూలైలో గోల్కొండ నవాబు చేతుల్లోకి వెళ్లింది. తరువాత అది కొద్ది కాలం పాటు ఫ్రెంచ్ పరిపాలనలో వుండి, ఆ తరువాత సా.శ.1801 వరకు కర్ణాటక నవాబు పరిపాలనలో ఉంది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్కు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు, ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. మరాఠా సైనికాధికారి రాఘోజీ I భోంస్లే ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ఆరాధన కోసం శాశ్వత పరిపాలనను ఏర్పాటు చేశారు.  19 వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో, ఆలయ నిర్వహణ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. వారు ఆలయానికి ప్రత్యేక హోదాను ఇచ్చి కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఉన్నారు. మద్రాస్ ప్రభుత్వం 1817 లో జారీచేసిన ఏడవ రెగ్యులేషన్‌ను ప్రకారం, ఆలయం ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ మండలి నియంత్రణలోనికి తెచ్చింది. 1821 లో, బ్రూస్ అనే బ్రిటీషు అధికారి ఆలయ నిర్వహణ కోసం నియమాలను రూపొందించారు, దీనిని బ్రూస్ కోడ్ అని పిలుస్తారు. 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ఆలయానికి 8,000 విరాళంగా ఇచ్చాడు. 1843 లో ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుపతిలోని ఇతర దేవాలయాలతోపాటు తిరుమల ఆలయ పరిపాలనను హథీరాంజీ మఠం మహంతులకు బదిలీ చేసింది. 1870లో యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించారు. 19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అతికొద్దిగా ఉండే ఇళ్ళు అత్యంత సంకుచితంగా ఉండేవి. కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండపై మనుష్యుల నడుమ నడుస్తూనే వుండేవి. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1933 లో టిటిడి చట్టం ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడే వరకు అనగా 90 ఏళ్ళ పాటు ఆరు తరాల మహంతుల పాలనలో ఉంది. 1933లో రూ.26 వేల ఖర్చుతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. 1951లో మద్రాస్ హిందూ మత, ఛారిటబుల్ ఎండోమెంట్ చట్టం పరిధిలోకివచ్చింది. 1966 లో, ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్, హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్టం. 1979 ప్రకారం, 1966 చట్టం రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం ఏర్పరచారు. దీని ప్రకారం ఆలయ పరిపాలన కార్యనిర్వాహకాధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించే ముగ్గురు సభ్యుల మండలికి అప్పగించబడింది. 1974లో రెండవ ఘాట్‌రోడ్డును (ప్రస్తుత ఎగువ రోడ్డు) కూడా నిర్మించారు. 1980లో తితిదే బోర్డు మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది. ఈ ఆలయంలో కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు భాషలలో సుమారు 640 శాసనాలు ఉన్నాయి. తాళ్లపాక అన్నమచార్యులు, అతని వారసుల తెలుగు సంకీర్తనలు 3000 రాగి పలకలపై చెక్కబడినవి ఉన్నాయి. ఈ సేకరణ సంగీత శాస్త్రవేత్తలకు, తెలుగు చారిత్రక భాషా శాస్త్రవేత్తకు విలువైన మూలం. 2006 లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల కొండలపై చర్చిని నిర్మించాలని నిర్ణయించింది. తిరుమల ఏడు కొండలలో రెండు మాత్రమే హిందూ ఆరాధనకు వాడుకొని మిగిలిన వాటిని ఇతర ఉపయోగాలకోసం వాడుకోవచ్చని, క్రైస్తవం పాటించే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో నిర్ణయం చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమవగా చివరకి, ఏడు పవిత్ర కొండల విస్తీర్ణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రకటించింది. భౌగోళికం తిరుపతి నుండి 22 కి.మీ. దూరంలో తిరుమల ఉంది. ఇది విజయవాడ నుండి సుమారు , హైదరాబాద్ నుండి , చెన్నై నుండి, , బెంగళూరు నుండి , విశాఖపట్నం నుండి దూరంలో ఉంది. రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గం తిరుపతిలో నాలుగు బస్ ప్రాంగణాలున్నాయి. వీటినుండి బస్సుల ద్వారా తిరుమల చేరవచ్చు. మొదటిది రైల్వే స్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్‌స్టేషను. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టేషను‌కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టేషను (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషను వెనకవైపు శ్రీ పద్మావతీ బస్‌స్టేషను ఉంది. రైలు మార్గం తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్‌స్టేషను నుంచి కొండమీదకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వచ్చే ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే స్టేషను నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లవచ్చు విమాన మార్గం సమీప విమానాశ్రయం రేణిగుంట దగ్గర తిరుపతి విమానాశ్రయం. ఇక్కడ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు మొదలైన ప్రదేశాలకు నేరుగా విమాన సేవలు ఉన్నాయి. తిరుపతి నుండి కాలి నడకన చేరుకునే విధం right|thumb|250px|కాలిదారిలో కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"! తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది, భక్తులు ఈ దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు। ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది, కడప నుండి ఉందని ప్రతీతి. అలిపిరి కాలిబాట: ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం చాలా మంది భక్తులు కష్టసాధ్యమైన ఏడు కొండలూ దాటితే తమ కోరికలు తీరతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల (తితిదే) వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం. బస్సు ద్వారా గాని, రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తరువాత, అక్కడి నుండి తితిదే వారు నడుపుతున్న ఉచిత బస్సు / ఆటో / ప్రయివేటు బస్సు / టాక్సీ / జీపు ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని (ఏడు కొండలకు ఏడు అని అమ్ముతుంటారు), దారి మొదట్లో ఉన్న "వేంకటేశ్వరుని పాదాల గుడి" దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్లదారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటన వచ్చేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తొందరగా దైవదర్శనం అయ్యే విధానాన్ని అమలులో ఉంది. భక్తుల సామాను పెట్టెలను పైకి పంపించుటకు ఉచిత రవాణా సేవ ఉంది. ఈ కాలిబాటకు ప్రవేశం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. శ్రీవారి మెట్టు కాలిబాట: తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట. దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. ఈ కాలిబాట ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆలయ పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి లేక తితిదే) అనేది తిరుమల వెంకటేశ్వర ఆలయ కార్యకలాపాలను పర్యవేక్షణ,నిర్వహణ చేస్తుంది. దీనికి చట్ట సవరణల వలన ధర్మకర్తలమండలి సభ్యుల సంఖ్య 5 (1951) నుండి 18 (2015) కి పెరిగింది. టిటిడి రోజువారీ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కార్యనిర్వాహణాధికారి చేస్తారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజూ సుమారు 75,000 మంది యాత్రికులు సందర్శిస్తారు. 2015–16 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్, 2530.10 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. సంస్థ ఆలయ ఆదాయం, భక్తుల విరాళాలనుండి ధార్మిక, సేవా సంస్థలను నడుపుతుంది. ఆదాయంలో ఎక్కువ భాగం శ్రీవారి హుండి ద్వారా వస్తుంది. వాస్తుశిల్పం thumb|ఆలయ ముఖభాగ దృశ్యం thumb|332x332px| నారాయణగిరి కొండపై శ్రీవారీ పాదాల నుండి చూసినట్లుగా తిరుమల ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (ముందు భాగంలో అర్ధ వృత్తాకార భవనం) ద్వారములు, ప్రాకారములు బయట నుండి గర్భగుడి చేరటానికి మూడు వాకిళ్లు ఉన్నాయి. పడికావలి అని కూడా పిలువబడే మహద్వారం మహాప్రాకారానికి (బాహ్య సమ్మేళనం గోడ) గల మొదటి ప్రవేశ ద్వారం. ఈ మహాద్వారం మీదుగా 50 అడుగుల, ఐదు అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారు, దాని శిఖరాగ్రంలో ఏడు కలశాలు ఉన్నాయి. వెండివాకిలి గల నడిమి పడికావలి రెండవ ద్వారం సంపంగి ప్రాకారం (లోపలి ప్రాంగణం గోడ) లో ఉంది. దీనిపై మూడు అంతస్తుల గాలిగోపురం, శికరాగ్రంలో ఏడు కలశాలతో కూడి ఉంది. గర్భగృహానికి ప్రవేశం బంగారువాకిలి ద్వారా వుంటుంది. దీనికి ఇరువైపులా ద్వారపాలకులైన జయ-విజయల రెండు పొడవైన రాగి చిత్రాలు ఉన్నాయి.మందపాటి తలుపు విష్ణువు దశావతారాలను వర్ణించే బంగారు పలకలతో కప్పబడి ఉంటుంది. ప్రదక్షిణాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయటానికి రెండు ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి. మొదటిది మహాప్రాకారం, సంపంగిప్రాకారం మధ్య ఉన్న ప్రాంతం. దీనిని సంపంగి ప్రదక్షిణం అని అంటారు. ఈ దారి ప్రక్క మండపాలు, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలికుని శిల, ప్రసాద పంపిణీ గది మొదలైనవ ఉన్నాయి. ఆనందప్రదక్షిణ అనే రెండవ ప్రదక్షిణం, ఆనంద నిలయం విమానం చుట్టూ వున్నమార్గం. ఈ మార్గంప్రక్కన వరదరాజ ఆలయం, యోగా నరసింహ ఆలయం, పోటు (ప్రధాన వంటగది), బంగారు బావి (బంగారు బావి), అంకురార్పణ మండపం, యాగశాల,పరకామణి (హుండీలో వేసిన విరాళాలు లెక్కించేగది), చందనపు అర, రికార్డుల గది, భాష్యకారులు సన్నిధి, శ్రీవారి హుండీ, విష్వక్సేన విగ్రహం వున్నాయి . ఆనందనిలయ గోపురం, గర్భగుడి ఆనంద నిలయ గోపురం, ఇతర అనుబంధ పనుల నిర్మాణం ప్రారంభానికి తొండమాన్ రాజు ఈ ప్రదేశంలో పునాది వేశారు. గర్భగుడిలో ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని తోపాటు ఇతర దేవతల విగ్రహాలున్నాయి. బంగారు వాకిలి, గర్భగుడికి మధ్య రెండు వాకిళ్లున్నాయి. ప్రధాన దేవత నాలుగు చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది, ఒకచేయి వరద భంగిమలో, ఒకటి తొడపై వుండగా రెండు చేతులు శంఖువు, సుదర్శన చక్రాలను పట్టుకొని వుంటాయి. దేవుని విగ్రహం ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. దేవుని కుడి ఛాతీపై లక్ష్మీదేవి, ఎడమవైపు పద్మావతి దేవి వుంటారు. భక్తులకు కులశేఖరపడి (మార్గం) దాటి గర్భగుడిలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు. ఆనంద నిలయం విమానం 'గర్భగుడి'పై నిర్మించిన ప్రధాన గోపురం. ఇది మూడు అంతస్తుల గోపురం. దాని శిఖరాగ్రంలో ఒకే కలశం ఉంది. దీనికి బంగారు పూతపూసిన రాగి పలకలతో కప్పబడి ఉంది. దీనిపై అనేక దేవతల బొమ్మలను చెక్కారు. ఈ గోపురంపై చెక్కిన వెంకటేశ్వరుడిని "విమాన వెంకటేశ్వరుడని" పిలుస్తారు, ఇది లోపల ఉన్న దేవుని ప్రతిరూపమని నమ్ముతారు. ఆలయంలో దేవతలు విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడు ఆలయానికి ప్రధాన దేవత . మూలవిరాట్ స్వయంభు (స్వయంగా వెలసినది) అని నమ్ముతారు. thumb|250x250px| గర్భగుడికి నకలు: ఎడమ - శ్రీదేవి - భూదేవి, మలయప్ప స్వామి, మధ్య - వెంకటేశ్వర ప్రధాన దైవం (ధ్రువ బేరం), మధ్య క్రింద - భోగ శ్రీనివాస, కుడి - ఉగ్ర శ్రీనివాస, సీతా, లక్ష్మణ రామ, కృష్ణ, రుక్మిణి . పంచ బేరములు వైఖానాస అగామాల ప్రకారం, వెంకటేశ్వరుని ప్రాతినిధ్యం ఐదు దేవతల (బేరమ్‌లు) రూపంలో వుంటుంది, వీటిని మూలావిరాట్‌తో సహా పంచ బేరములు (పంచ అంటే ఐదు; బేరం అంటే దేవత) అని పిలుస్తారు. ఐదు దేవతలనగా ధ్రువ బేరం (మూలావిరాట్), కౌతుకా బేరం, స్నపనా బేరం, ఉత్సవ బేరం, బలి బేరం. అన్ని బేరములను ఆనంద నిలయం విమానం కింద గర్భ గుడిలో ఉంచారు. మూలవిరాట్ లేదా ధ్రువ బేరము - గర్భగుడి మధ్యలో ఆనంద నిలయం విమానం క్రింద, వెంకటేశ్వరుని విగ్రహం కమలంపై నిలిచివున్నభంగిమలో నాలుగు చేతులు కలిగి, రెంటిలో శంఖము, చక్రము ధరించి, ఒకటి వరద భంగిమలో, ఇంకొకటి కటి భంగిమలో వుంటుంది. ఈ దేవత ఆలయానికి ప్రధాన శక్తిగా పరిగణించబడుతుంది. వజ్ర కిరీటం, మకరకుండలాలు, నాగభరణం, మకర కాంతి, సాలిగ్రామ హరం, లక్ష్మీ హారం వంటి ఆభరణాలతో అలంకరించబడింది. వెంకటేశ్వరుని భార్య లక్ష్మి వ్యూహ లక్ష్మిగా మూలవిరాట్ ఛాతీపై ఉంటుంది. భోగ శ్రీనివాస లేదా కౌటుకా బేరం - ఇది ఒక అడుగు (0.3 మీ) పరిమాణంలో గల వెండి దేవతావిగ్రహం. దీనిని క్రీస్తు శకం 614 లో పల్లవ రాణి సమావై పండుగలు నిర్వహించడం కోసం ఆలయానికి ఇచ్చారు. భోగ శ్రీనివాస విగ్రహం ఎల్లప్పుడూ మూలవిరాట్ ఎడమ పాదం దగ్గర ఉంచబడుతుంది. ఎల్లప్పుడూ పవిత్ర సంభంధ క్రూచ చేత ప్రధాన దేవతతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ దేవత మూలవిరాట్ తరపున అనేక రోజువారీ సేవలను (ఆనందాలను) అందుకుంటుంది కనుక భోగ శ్రీనివాస అని పిలుస్తారు. ఈ దేవత ప్రతిరోజూ ఏకాంతసేవను, బుధవారంనాడు సహస్రకళాభిషేకను అందుకుంటుంది. ఉగ్ర శ్రీనివాస లేదా స్నపనా బేరం - ఈ దేవత వెంకటేశ్వరంలోని భయంకరమైన అంశాన్ని సూచిస్తుంది. క్రీస్తుశకం 1330 వరకు ఈ దేవతను ప్రధాన ఊరేగింపుకు వాడేవారు. ఉగ్ర శ్రీనివాస గర్భగుడి లోపల ఉండి సంవత్సరంలో ఒక రోజు అనగా కైషికా ద్వాదసినాడు సూర్యోదయానికి ముందు మాత్రమే ఊరేగింపుగా వస్తుంది . ఈ దేవత మూలవిరాట్ తరపున రోజువారీ అభిషేకం అందుకుంటుంది, సంస్కృతంలో స్నపన అంటే ప్రక్షాళన లేక అభిషేకం కావున స్నపన బేరం అనే పేరు వచ్చింది. మలయప్ప స్వామి లేదా ఉత్సవ బేరం - మలయప్ప ఆలయం ఊరేగింపు దేవత (ఉత్సవ బేరం), అతని భార్యలైన శ్రీదేవి, భూదేవి దేవతలచే ఎల్లప్పుడూ చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ దేవత బ్రహ్మోత్సవాల, కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపలంకరణ సేవా, పద్మావతి పరిణ్యోత్సవం, పుష్పపల్లకి, అనివర అస్థానం, ఉగాది అస్థానం వంటి అన్ని పండుగరోజులలో పూజలందుకుంటుంది. కొలువు శ్రీనివాస లేదా బలి బేరం - కొలువు శ్రీనివాస బలి బేరమును సూచిస్తుంది. కొలువు శ్రీనివాస ఆలయం ఆర్థిక వ్యవహారాలకు అధ్యక్షత వహించే ఆలయ సంరక్షక దేవతగా పరిగణించబడుతుంది. రోజువారీ కొలువు సేవ (తెలుగు: కొలువు అంటే సభ) ఉదయం జరుగుతుంది, ఈ సమయంలో, మునుపటి రోజు సమర్పణలు, ఆదాయం, ఖర్చులు ఈ దేవతకు తెలియజేయబడతాయి. ఖాతాల ప్రదర్శనతో నాటి పంచాంగ శ్రవణం జరుగుతుంది, ఇతర మూర్తులు పంచ బేరములతో పాటు, గర్భ గుడిలో సీతా, రామ, లక్ష్మణ, రుక్మిణి, కృష్ణ, సుదర్శనచక్రం పంచలోహ విగ్రహాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో గరుడ, నరసింహ, వరదరాజ, కుబేర, హనుమంతుని దేవతల గుడులు, అనంత, గరుడ, విశ్వక్సేన, సుగ్రీవ దేవతల విగ్రహాలతో పాటు రామానుజుని విగ్రహం కూడా ఉన్నాయి. ఆనంద నిలయం విమాన రెండవ శ్రేణి వాయవ్య మూలలో చెక్కబడిన వెంకటేశ్వరుని విమాన వెంకటేశ్వరుడుగా పిలుస్తారు. ఇది గర్భగుడిలోని వెంకటేశ్వరుని విగ్రహానికి కచ్చితమైన ప్రతిరూపం. ఆరాధన పూజ ఋషి వైఖానసుడు ప్రతిపాదించిన, అతని శిష్యులు అత్రి, భృగు, మరీచి, కశ్యపు కొనసాగించిన " వైఖానస ఆగమ " ఆరాధన సంప్రదాయాన్ని ఈ ఆలయం అనుసరిస్తుంది హిందూ మతం యొక్క ప్రధాన సంప్రదాయాలలో ఒకటైన ఇది ప్రధానంగా విష్ణువును, అతని అనుబంధ అవతారాలను పరమ దేవుడిగా ఆరాధిస్తుంది. దీని ప్రకారం విష్ణువుకు రోజుకు ఆరు సార్లు పూజలు (ఆరాధన) చేయాలి, వీటిలో కనీసం ఒక పూజ తప్పనిసరి. దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. సేవలను రోజువారీ, వారాన్నిబట్టి, ఆవర్తన (మరల మరల) జరిగేవిగా వర్గీకరించారు. ఆలయంలోని రోజువారీ సేవలలో (సంభవించే క్రమంలో) సుప్రభాత సేవ, తోమాల సేవా, అర్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం (ఉంజల్ సేవా), అర్జిత బ్రహ్మోత్సవం, అర్జిత వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ, ఏకాంత సేవా ఉన్నాయి. ఆలయ వారపు సేవలలో సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టాదల పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం నిజపాద దర్శనం, సడలింపు,నేత్ర దర్శనం,తిరుప్పావడ,పూలంగిసేవ ఉన్నాయి. శనివారం, ఆదివారం వారపు సేవలు లేవు. ఆవర్తన సేవలలో జ్యైష్ఠాభిషేకం, ఆనివారా అస్థానం, పవిత్రోత్సవం, కోయిల్ అల్వార్ తిరుమంజనం ఉన్నాయి. నైవేద్యం thumb|తిరుమలలోని వెంకటేశ్వర ఆలయం ప్రసాదం లడ్డు ప్రపంచ ప్రఖ్యాత " తిరుపతి లడ్డు "ను తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు. తిరుపతి లడ్డుకు భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది. దీని వలన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి లేదా విక్రయించడానికి అర్హమైన గుర్తింపు పొందినది. అనేక ఇతర ప్రసాదాలను వెంకటేశ్వరునికి అర్పిస్తారు. వాటిని అన్న-ప్రసాదాలు, పణ్యారములుగా విభజించారు. అన్నప్రసాదాలలో చక్రపొంగలి (తీపి), పులిహోరా, మిర్యాల పొంగలి, కదంబం, దద్దోజనం ఉన్నాయి. పణ్యారములలో లడ్డు, వడ, దోస, ఆప్పం, జిలేబి, మురుకు, బొబ్బట్టు, పాయసం ఉన్నాయి. యాత్రికులకు ప్రతిరోజూ ఉచిత భోజనం పెడతారు. గురువారాలలో, తిరుప్పవాడ సేవలో భాగంగా తిరుమ్మని మండపం (ఘంట మండపం) లో పులిహోరను పెద్ద పిరమిడ్ ఆకారంలో కుప్ప వేయడం ద్వారా దేవునికి నివేదిస్తారు. దర్శనం సాధారణ దినాలలో రోజుకు 50,000 నుండి 100,000 భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకొంటుండగా, బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక సందర్భాలు,పండుగ రోజులలో 500,000 మంది దర్శించుకొంటున్నారు. కావున ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర స్థానంగా రికార్డులకెక్కింది. భారీ సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించడానికి, తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వేచివుండు మండపాలను ( వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లను)1983, 2000 సంవత్సరాలలో నిర్మించింది. సాంప్రదాయం ప్రకారం, భక్తులు ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర దర్శనానికి ముందు స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉన్న భువరాహ స్వామి ఆలయాన్ని దర్శించాలి. ఇటీవల, పాదచార యాత్రికుల కోసం ప్రత్యేక క్యూను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక క్యూలో ప్రవేశించడానికి ఉచితమైన, పరిమిత సంఖ్యలో బయోమెట్రిక్ టోకెన్లు జారీ చేయబడతాయి. టోకెన్లు మొదట వచ్చినవారికి, మొదట ఇచ్చే ప్రాతిపదికన ఇస్తారు. భక్తులు టోకెన్‌లో కేటాయించిన సమయాలలో వెంకటేశ్వరుని దర్శించవచ్చు. తలనీలాల సమర్పణ చాలా మంది భక్తులు తమ తలనీలాలను సమర్పిస్తారు. దీనిని "మొక్కు"గా పిలుస్తారు. మొత్తం రోజువారీ సేకరించిన టన్నుకు పైగా బరువుగల తలనీలాలను అంతర్జాతీయంగా అమ్మగా దేవాలయానికి చాలా ఆదాయం చేకూరుతుంది. పురాణాల ప్రకారం, వెంకటేశ్వర తలపై ఆవులకాపరి కొట్టినప్పుడు, అతని నెత్తిమీద ఒక చిన్న భాగం బట్టతల అయింది. గంధర్వ యువరాణి నీలా దేవి ఈ విషయాన్ని గమనించి ఆమె జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి, తన మాయాజాలంతో, అతని నెత్తిపై అమర్చింది. జుట్టు స్త్రీ రూపానికి అందమైన ఆస్తి కాబట్టి, ఆమె త్యాగాన్ని వెంకటేశ్వరుడు గమనించి తన ఆలయానికి వచ్చే తన భక్తులందరూ తమ జుట్టును తనకు అర్పిస్తారని, అందుకున్న వెంట్రుకలన్నింటినీ ఆమె స్వీకరించాలని కోరాడు. అందువల్ల, భక్తులు అందించే జుట్టును నీలా దేవి స్వీకరిస్తుందని నమ్ముతారు. ఏడు కొండలలో ఒకటైన నీలాద్రి అనే కొండకు ఆమె పేరు పెట్టారు.  సాంప్రదాయకంగా తలనీలాలు తీసే మంగళ్లు మగవారు. స్త్రీ భక్తులు ఆడ మంగలిని ప్రవేశపెట్టమన్న కోరిక తొలిగా విఫలమయింది కగ్గనపల్లి రాధాదేవి నేతృత్వంలోని నిరసన తరువాత ఆలయం మహిళా మంగళ్లను నియమించింది. దేవిని 2017 లో ఆంధ్రప్రదేశ్ గుర్తించబడగా,2019 లో భారత రాష్ట్రపతి నారి శక్తి పురస్కార్ తో సమ్మానించిబడింది. హుండి స్థల పురాణం ప్రకారం, శ్రీనివాసుడు పద్మావతితో వివాహాఖర్చులకు కుబేరుడు నుండి 1 కోటి 14 లక్షల బంగారు నాణాలను అప్పుగా పొంది, దేవ శిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరతాడు. ఆ అప్పు తన భక్తుల సమర్పించే వాటితో చెల్లించుతానని చెప్తాడు. భక్తులు హూండీలో వేసే ధనం, విలువైన ఆభరణాలు రోజుకి 2.25 కోట్ల రూపాయలవరకు వుండవచ్చు. తులాభారం తులాభారం సాంప్రదాయంలో ఒక భక్తుడు తన బరువుతో సమానబరువుతూగే చక్కెర, బెల్లం, తులసి ఆకులు, అరటి, బంగారం, నాణేలు సమర్పిస్తారు. నవజాత శిశువులు లేదా పిల్లలతో ఈ కార్యక్రమం ఎక్కువగా జరుగుతుంది. పండుగలు కుడి|thumb|250x250px| తిరుమల వద్ద పండుగ సందర్భంగా ఏనుగుల కవాతు తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం పండుగలకు స్వర్గదామం, ఇక్కడ సంవత్సరానికి 365 రోజులలో 433 ఉత్సవాలు "నిత్య కళ్యాణం పచ్చ తోరణం " అనే నినాదానికి ప్రతీకగా ప్రతి రోజు పండుగగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబరు నెలలో జరుపుకునే తొమ్మిది రోజుల కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రధాన కార్యక్రమం. దీనిలో మలయప్పస్వామి భార్యలు శ్రీదేవి, భూదేవితో, నాలుగు మాడ వీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. వాహనాలలో ముఖ్యమైనవి ధ్వజారోహనం, పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వ భూపాల వాహనం, మోహిని అవతారం, గౌడ వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, స్వర్ణరథం, అశ్వ వాహనం, చక్ర స్నానం. వైకుంఠ ఏకాదశి నాడు గరుడ వాహన ఊరేగింపును అత్యధికంగా లక్షలాది మంది భక్తులు చూస్తారు. ఆరోజు గర్భగుడి చుట్టుగా వున్న వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వరుని దర్శనం పొందుతారు. ఫిబ్రవరిలో జరుపుకునే రథసప్తమి పండుగ రోజున, మలయప్ప స్వామి ఊరేగింపు ఏడు వేర్వేరు వాహనాలలో తెల్లవారుజాము నుండి అర్థరాత్రి వరకు జరుగుతుంది. ఇతర వార్షిక ఉత్సవాలలో ముఖ్యమైనవి రామ నవమి, జన్మాష్టమి, ఉగాది, తెప్పోత్సవం, శ్రీ పద్మావతి పరిణయోత్సవం, పుష్ప యాగం, పుష్ప పల్లకి, మార్చి-ఏప్రిల్‌లో జరుపుకునే వసంతోత్సవం (వసంత పండుగ) మొదలగునవి ఉన్నాయి. పాటలు, స్తోత్రాలు తిరుమల ఆలయ గర్భగుడి లోపల శయన మండపం వద్ద వెంకటేశ్వరునికి ఉదయాన్నే చేసే తొలి సేవ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. 'సుప్రభాతం' అనగా భగవంతుడిని నిద్ర నుండి మేల్కొల్పటం. 13 వ శతాబ్దంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని ప్రతివాధి భయంకరం అన్నాంగరాచార్య స్వరపరిచారు. దీనిలో సుప్రభాతం (29), స్తోత్రం (11), ప్రపత్తి (14), మంగళశాసనాలనే (16) నాలుగు భాగాలతో మొత్తం 70 శ్లోకాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం యొక్క పదమూడవ శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది: <center> దేవనాగరి श्रीमन्नभीष्ट-वरदाखिललोक-बन्धो श्रीश्रीनिवास-जगदेकदयैकसिन्धो । श्रीदेवतागृहभुजान्तर-दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् ॥ <center> తెలుగు శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో । శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం ॥ వెంకటేశ్వరునికి గొప్ప భక్తుడు, గొప్ప తెలుగు కవిగా పేరొందిన తాళ్లపాక అన్నమచార్య (అన్నమయ్య) వెంకటేశ్వరుని ప్రశంసిస్తూ సుమారు 32000 పాటలు పాడారు. తెలుగు, సంస్కృత భాషలలో ఉన్న అతని పాటలను సంకీర్తనలు అని పిలుస్తారు. వాటిని శృంగార సంకీర్తనలు, అధ్యాత్మ సంకీర్తనలు అని వర్గీకరించారు. ఏడు కొండలు ఈ ఆలయం ఏడు కొండలపై ఉంది. ప్రధాన దేవతను సప్తగిరీషుడు లేదా ఏడు కొండల దేవుడు అని కూడా పిలుస్తారు. ఏడు కొండలు ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయని నమ్ముతారు. ఏడు కొండలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: thumb| తిరుమలలోని పెద్దదైన హనుమంతుడి విగ్రహం వృషభాద్రి - నంది కొండ, శివుడి వాహనం, విష్ణు అవతారం అంజనాద్రి - హనుమంతుని కొండ. నీలాద్రి- నీలా దేవి కొండ గరుడాద్రి లేదా గరుడాచలం - గరుడ కొండ, విష్ణువు వాహనం శేషాద్రి లేదా శేషాచలం - విష్ణువు దాసుడైన శేషుని కొండ, ప్రధాన ఆలయం ఈ కొండపై ఉంది. నారాయణాద్రి - నారాయణ కొండ. శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి. వెంకటాద్రి - వెంకటేశ్వరుని కొండ ఉప దేవాలయాలు వరదరాజ ఆలయం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వెండివాకిలి ఎడమ వైపున విమాన-ప్రదక్షిణంలో వరదరాజుకు అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం ఉంది. ఈ దేవత ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు. ఈ దేవతా శిల్పం రాయితో కూర్చున్న స్థితిలో చెక్కబడి పడమరకు చూస్తున్నట్లు నిర్మించబడింది. యోగ నరసింహ ఆలయం విమాన ప్రదక్షిణం ఈశాన్య మూలలో నరసింహ దేవాలయం ఉంది. 1330 – 1360 కాలంలో నిర్మించబడింది. యోగ నరసింహ విగ్రహం కూర్చొని వున్న భంగిమలో శంఖము, చక్రాలను పై రెండు చేతుల్లో, రెండు దిగువ చేతులను యోగ ముద్రలో వున్నట్లుగా వుంటుంది. గరుత్మంత ఆలయం వెంకటేశ్వర వాహనమైన గరుత్మంతునికి అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం జయ-విజయలు కావలి కాచే బంగారువాకిలికి సరిగ్గా ఎదురుగా ఉంది. ఇది గరుడమండపంలో భాగం. ఈ విగ్రహం ఆరు అడుగుల ఎత్తుతో పశ్చిమంవైపు గర్భగుడి లోపలి వెంకటేశ్వరుని చూస్తున్నట్లుగా వుంటుంది. భూవరాహ స్వామి ఆలయం భూవరాహ స్వామి ఆలయం విష్ణువు అవతారమైన వరాహవతారానికి అంకితం చేసిన ఆలయం. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం కంటే పురాతనమైనదని నమ్ముతారు. ఈ ఆలయం స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉంది. సాంప్రదాయం ప్రకారం, మొదట నైవేద్యం భూవరాహ స్వామికి ముందు ఇచ్చి ఆ తరువాత ప్రధాన ఆలయంలోని వెంకటేశ్వరునికి ఇవ్వాలి. సాంప్రదాయం ప్రకారం, భక్తులు ముందు భూవరాహ స్వామి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి.. బేడి-అంజనేయ ఆలయం బేడీ-అంజనేయ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడిన ఉప మందిరం. ఈ ఆలయం అఖిలాండం (కొబ్బరికాయలు అర్పించే ప్రదేశం) మహాద్వారానికి సరిగ్గా ఎదురుగా ఉంది. ఈ ఆలయంలోని దేవత తన రెండు చేతులూ కట్టకట్టినట్లు (బేడీలు) ఉంది. వకుళమాత సన్నిధి వకుళమాత వెంకటేశ్వరుని తల్లి. ప్రధాన ఆలయంలో వరదరాజ మందిరానికి కొంచెం ముందు ఆమెకు అంకితం చేసిన విగ్రహం ఉంది. దేవత కూర్చొని ఉన్న భంగిమలో ఉంది. పురాణాల ప్రకారం, ఆమె తన కొడుకుకు అందించే ఆహారాన్ని తయారు చేయడాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ కారణంగా వకులమాత సన్నిధికి శ్రీవారి పోటుకు మధ్యగల గోడకు రంధ్రం చేయబడింది. కుబేరుని సన్నిధి విమానప్రదక్షిణలో కుబేరుడికి అంకితం చేసిన ఉప మందిరం ఉంది. ఈ దేవత గర్భగుడి కుడి వైపున వెంకటేశ్వరుని దక్షిణం వైపు చూస్తున్నట్లుగా వుంటుంది. రామానుజ మందిరం శ్రీ రామానుజ మందిరం విమాన ప్రదక్షిణం యొక్క ఉత్తరం వైపు ఉంది. దీనిని భాష్యకార సన్నిధి అని కూడా అంటారు. ఈ మందిరం సా.శ. 13 వ శతాబ్దంలో నిర్మించబడింది ప్రముఖ భక్తులు thumb| తిరుమల వెంకటేశ్వర ఆలయం అధికారిక సంకీర్తానాచార్యుడు, పద-కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య (లేదా అన్నమయ్య) - విగ్రహం రామానుజాచార్యుడు (1017–1137) శ్రీ వైష్ణవంలో అతి ప్రధాన ఆచార్యుడు . శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆరాధన విధానాలు, ఇతర వ్యవహారాల నిర్వహణ బాధ్యత వహించాడు. విష్ణువు ఆయుధాలైన పవిత్ర శంఖం, చక్రం తన సందర్శనలో సమర్పించాడు. అతను పెద్ద జీయర్ మఠం స్థాపించాడు. ఆయనకు ఆలయం లోపల సన్నిధి (పుణ్యక్షేత్రం) ఉంది. తాళ్లపాక అన్నమాచార్య (లేదా అన్నమయ్య) ( 1408 మే 22 - 1503 ఏప్రిల్ 4) తిరుమల వెంకటేశ్వర ఆలయం అధికారిక సంకీర్తనాచార్యుడు. వెంకటేశ్వరుని స్తుతిస్తూ తెలుగులో సుమారు 36,000 కీర్తనలను రచించాడు. అయోధ్యకు చెందిన ఒక సాధువు హథీరాం బావాజీ, సా.శ. 1500 లో తిరుమల తీర్థయాత్రకు వచ్చి వెంకటేశ్వరుని భక్తుడు అయ్యాడు. మతపరమైన ప్రాముఖ్యత ఈ ఆలయం విష్ణువు ఎనిమిది స్వయంభు క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఇక్కడ దేవత స్వయంగా వ్యక్తమైందని నమ్ముతారు. ఇలాంటివే దక్షిణ భారతదేశంలోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, భూవరాహ స్వామి ఆలయం, వనమలై పెరుమాల్ ఆలయం, నేపాల్ లోని సాలిగ్రామ, ఉత్తర భారతదేశంలోని నైమిశారణ్య, పుష్కర్ బద్రీనాథ్ ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాన్ని అల్వారుల దివ్య ప్రబంధం గ్రంథంలో ఆరాధిస్తారు. ఈ పుస్తకాలలో పేర్కొన్న 108 విష్ణు దేవాలయాలలో ఒకటైన ఈ ఆలయాన్ని దివ్యదేశం అని పేర్కొన్నారు. వెంకటాచల తీర్థయాత్ర ద్వారా పొందే ప్రయోజనాలు ఋగ్వేదం, అష్టాదశ పురాణాలలో పేర్కొనబడ్డాయి. ఈ ఇతిహాసాలలో, వెంకటేశ్వరుడు వరాలు ఇచ్చే దేవుడని, తిరుమలకు సంబంధించిన అనేక కథనాలున్నాయి. ఇతర ప్రదేశాలు మాడ వీధులు: తిరుమల శ్రీ వారి ఆలయం చుట్టూ వున్న ప్రధాన రహదారులను మాడ వీధులు అంటారు. ఉత్సవ సందర్భాలలో స్వామి వారిని వివిధ వాహనాలపై, రథాల పై వూరేగింపుగా ఈ మాడ వీదులలో ఊరేగిస్తారు. నాలుగు దిక్కులలో ఉన్న వీధులను దిక్కుల పేరు మీదుగా తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తర మాడ వీధి అని పిలుస్తారు. గొల్ల మండపం: వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్లమండపం. గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది. శ్రీవారి గునపం: అనంతాళ్వార్ పూల తోట నీళ్ళ కోసం బావి తవ్వటానికి బాలుని రూపంలో సహాయం చేయవచ్చాడు వెంకటేశ్వరుడు. అతడు సహాయం వద్దనగా అతని భార్య సహాయం పొందగా మట్టి తట్టని దూరంగా పోసిరావడంలో సహాయపడతాడు. దీనికి కోపపడి, గునపం విసిరితే బాలుని గడ్డానికి తగులుతుంది. ఆ సాయంత్రం గుడిలో విగ్రహం గడ్డంపై రక్తం కారడం చూసి, వేంకటేశ్వరుడే సహాయం చేయటానికి వచ్చాడని తెలుసుకుంటాడు. కల్యాణకట్ట: భక్తులు మొక్కుగా తలనీలాలు సమర్పించే స్థలము. పాప వినాశనము: తిరుమలకు 8 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ నీటితో స్నానమాచరిస్తే సమస్త పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నుండి తిరుమలకు నీరు సరఫరా జరుగుతుంది. ఇక్కడ జలాశయానికి కట్టిన ఆనకట్ట పేరు గోగర్భం ఆనకట్ట. సమీప ఆలయాలు తిరుమల సమీపంలో చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి.  తిరుపతి నుండి 5 కి.మీ. దూరంలో గల తిరుచానూరులో శ్రీ వెంకటేశ్వరుని భార్య పద్మావతి ఆలయం ఉంది. తిరుపతి నుండి 38 కి.మీ. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఉంది. తిరుపతి నుండి 75 కి.మీ దూరంలోని కాణిపాకలో 10 వ శతాబ్దపు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ఉంది. ఇవి కాక, గోవిందరాజ ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర ఆలయం (శ్రీనివాస మంగపురం), కోదండరామ ఆలయం, కపిల తీర్థం వంటి ఆలయాలు తిరుపతి నగరంలో ఉన్నాయి. చిత్రమాలిక బయటి లింకులు ప్రయాణ, సేవల సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఈ-పుస్తకాలు OSM పటముపై తిరుమల ప్రాంతపు ఛాయాచిత్రాలు ఇవి కూడా చూడండి వేంకటేశ్వరుడు తిరుమల శ్రీవారి ఆభరణాలు ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట దేవాలయాలు ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా మూలాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు వర్గం:తిరుపతి జిల్లా పుణ్యక్షేత్రాలు వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు వర్గం:తిరుమల వర్గం:తిరుపతి జిల్లా దర్శనీయ స్థలాలు వర్గం:తిరుపతి జిల్లా పర్యాటక ప్రదేశాలు వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు వర్గం:తిరుపతి నగరం వర్గం:ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు వర్గం:ఈ వారం వ్యాసాలు
అహోబిలం
https://te.wikipedia.org/wiki/అహోబిలం
అహోబిలం, నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆళ్లగడ్డ నుండి 22 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అహోబిల మఠ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కారణంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా పేరొందింది. భౌగోళికం ఇది మండల కేంద్రమైన ఆళ్లగడ్డ నుండి 22 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. thumb|దిగువ అహోబిలం ఆలయం, ఆహోబిలం సమీప గ్రామాలు ఆలమూరు 9 కి.మీ, ఆర్.కృష్ణాపురం 11 కి.మీ, టి.లింగందిన్నె 11 కి.మీ, నరసాపురం 11 కి.మీ, ముత్తలూరు 13 కి.మీ. గణాంకాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1019 ఇళ్లతో, 3732 జనాభాతో 1350 హెక్టార్లలో విస్తరించి ఉంది. మగవారి సంఖ్య 1898, ఆడవారి సంఖ్య 1834.. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,280. ఇందులో పురుషుల సంఖ్య 1,641, మహిళల సంఖ్య 1,639, గ్రామంలో నివాస గృహాలు 771 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,350 హెక్టారులు. అహోబిల మఠం thumb|భవనాశని జలపాతం thumb|అహోబిలంలో ఉగ్రస్తంభానికి చేరుకునేందుకు వెళ్లాల్సిన మార్గం అహోబిల మఠం (శ్రీ అహోబిల మఠం అని కూడా పిలుస్తారు) అనేది వడకలై శ్రీ వైష్ణవ మఠం సా.శ. 1400 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, అవిభాజ్య కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం, అహోబిలంలో వేదాంత దేశిక వడకళై సంప్రదాయాన్ని అనుసరించి స్థాపించబడింది. ఇది ఆదివాన్ శతకోప స్వామి (వాస్తవానికి శ్రీనివాసాచార్య అని పిలుస్తారు)కి ఆపాదించబడింది.Pg.557 The History and Culture of the Indian People: The Delhi sultanate; Bharatiya Vidya Bhavan, Bhāratīya Itihāsa SamitiPg.211 Report on the inscriptions of the Devasthanam collection, with illustrations, Sadhu Subrahmanya Sastry, Kallidaikurichi Aiyah Nilakanta Sastri, K.P. Bagchi & Co., 1998Pg.105 The Temple of Lord Varadaraja, Kanchi: a critical survey of Dr. K. V. Raman's Sri Varadarajaswami Temple, Kanchi రవాణా సౌకర్యాలు రోడ్డు మార్గం: హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.కడప,తిరుపతి నుండి వచ్చువారు, చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, క్రిష్టాపురం, బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు. రైలు మార్గం: అహోబిలం దగ్గరలోని రైలు నిలయం నంద్యాల. చెన్నై-బొంబాయి రైల్వేమార్గంలో గల కడప స్టేషన్‌లోదిగితే, ఆళ్లగడ్డ మీదుగా 115 కి.మీ. దూరంలో రహదారిమార్గంలో చేరవచ్చు. విమాన మార్గం: అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం కర్నూలు విద్యా సౌకర్యాలు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి ఆళ్లగడ్డలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆళ్లగడ్డలోను, ఇంజనీరింగ్ కళాశాల కె. కందుకూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ నంద్యాలలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నంద్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలు లోనూ ఉన్నాయి. భూమి వినియోగం అహోబిలంలో భూ వినియోగం కింది విధంగా ఉంది: అడవి: 368 హెక్టార్లు వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 204 హెక్టార్లు వ్యవసాయం సాగని, బంజరు భూమి: 59 హెక్టార్లు శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 183 హెక్టార్లు తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 48 హెక్టార్లు సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 21 హెక్టార్లు బంజరు భూమి: 25 హెక్టార్లు నికరంగా విత్తిన భూమి: 440 హెక్టార్లు నీటి సౌకర్యం లేని భూమి: 423 హెక్టార్లు వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 63 హెక్టార్లు నీటిపారుదల సౌకర్యాలు వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 31 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 24 హెక్టార్లు* చెరువులు: 8 హెక్టార్లు ఉత్పత్తి ప్రధాన పంటలు వరి, కందులు, మినుములు ప్రధాన వృత్తులు వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు మూలాలు బయటి లింకులు వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు వర్గం:నంద్యాల జిల్లా పుణ్యక్షేత్రాలు వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు వర్గం:శ్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రాలు వర్గం:ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు
భద్రాచలం
https://te.wikipedia.org/wiki/భద్రాచలం
భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం లోని రెవెన్యూ గ్రామం, జనగణన పట్టణం. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము వలన పుణ్యక్షేత్రం. ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది. దీనిని భద్రాద్రి, శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లుతో కూడా పిలుస్తారుఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ.,కొత్తగూడెం 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై, కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయంలో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది. భద్రాచలం పట్టణం భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. G.O.Ms.No.118 (PR & RD) తేది. 08.04.2002న, ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడింది. హర్షభద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని గ్రామపంచాయితీగా మార్చుట జరిగింది. గణాంక వివరాలు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 89,048 - పురుషులు 44,029 - స్త్రీలు 45,019 రామాలయ ప్రశస్తి thumb|right|భద్రాచలంలో ఒక మండపం thumb|భద్రాచల దేవస్థానx వద్ద రామదాసు విగ్రహం|ఎడమ పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధంగా వరం పొందాడని అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + అచలం) అని పేరు స్థిరపడింది. గ్రామ చరిత్ర thumbnail|భద్రాచలం right|thumb|భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను, ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు అన్ని గ్రామాలు, భద్రాచలం మండలం లోని భద్రాచలం పట్టణం తప్ప అన్ని గ్రామాలు, బూర్గంపాడు మండలం లోని సీతారామనగర్, శ్రీధర-వేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, పెద్ద రావిగూడెం ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను 2014 మే 29న గెజిట్-లో ప్రచురించారు. భద్రాచలం దండకారణ్యం అని పిలువబడే అడవి ప్రాంతం. శ్రీరాముడు తన భార్య, తమ్ములతో వనవాసం చేస్తూ వున్నప్పుడు, ఈ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ వున్న భరద్వాజ మహర్షి దగ్గరకు వచ్చాడు. ఆయన సూచన ప్రకారం ప్రస్తుతం భద్రాచలానికి దగ్గరలోనే వున్న పంచవటి అనేచోట ఒక వర్ణశాల నిర్మించుకొని అందులో వుంటూ వుండేవాడు. ఆ పర్వతాల బయట, గోదావరి నది ఒడ్డున, ఒక రాతి మీద సీతారాములు కూర్చుండి విశ్రాంతి తీసుకుంటూ వుండేవారు. అలా ప్రతి రోజు తమకు సుఖాసనంగా వున్న రాతిని చూసి సీతాదేవి ఒకనాడు ఇంతకు ముందు రాతి రూపంలో వున్న అహల్యను కరుణించారు గదా, మరి ఈ రాతి మీద కూడా కరుణ చూపించగూడదా అని అడిగింది. దానికి శ్రీరాముడు, ఆ రాయి మరి కొంతకాలానికి తనకు మరింత ప్రీతిపాత్రమయ్యే జన్మ పొందుతుంది అని చెప్పాడు.        మేరువు అనే పర్వతరాజు హిమవంతుని తర్వాత మిక్కిలి శ్రేష్టుడు. ఆ మేరువునకు సంతానం లేదు. అందుకని ఆయన బ్రహ్మ దేవుని ప్రార్థిస్తూ తపస్సు చేశాడు. బ్రహ్మ యిచ్చిన వరంతో ఒక కొడుకు పుట్టాడు. అతనికి భద్రుడు అని పేరు పెట్టాడు. వశిష్ట మహర్షి వద్ద సకల విద్యలు నేర్పించాడు. ఆ భద్రుడు శ్రీరాముడు అంటే అమితభక్తి కలిగి నిరంతరమూ ఆయననే స్మరిస్తూ వుండేవాడు. ఒకనాడు వారి యింటికి నారద మహర్షి వచ్చాడు. అంత చిన్న వయస్సులోనే అమిత భక్తి వైరాగ్య లక్షణాలతో వున్న ఆ పిల్లవాడినిచూసి, నారద మహర్షి ఆశ్చర్యపడి, దివ్యదృష్టి ద్వారా భద్రుడు ఒకప్పుడు రాతి రూపమే అయినా ఇప్పుడు మేరు పర్వత రాజుకు కుమారుడుగా జన్మించాడని తెలిసికొన్నాడు. వెంటనే భద్రునకు రామతారక మంత్రం ఉపదేశించాడు. అప్పుడు భద్రుడు గోదావరి నది ఒడ్డున ఇంతకు ముందు తాను రాతిరూపంలో వున్న ప్రదేశానికి చేరుకుని, రామతారక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై, ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు.             శ్రీ రాముని పాదసేవ చేయడం తప్ప తనకు మరే వరము అక్కరలేదని చెప్పి, భద్రుడు, తన శిరస్సు మీద శ్రీరాముడు నిరంతరమూ నివసిస్తూ వుండేటట్లు వరం అడిగాడు. శ్రీరాముడు అలాగేనని చెప్పి, తనూ, తన భార్య, తమ్ములతో భద్రుని శిరస్సు మీద వెలసి ఉంటానని వరం యిచ్చాడు. భద్రుడు పర్వత రాజు యొక్క కుమారుడు గనుక, ఇక్కడ ఒక చిన్న కొండ రూపం ధరించి, సీతారామ చంద్రులను తన శిరస్సున మోస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రాంతానికి భద్రాచలం (భద్రునికొండ) అని పేరు వచ్చింది.        ఒకప్పుడు నాగలోకానికి రాజు అయిన ఆది శేషుడు రాక్షసుల వలన గొప్ప బాధలు ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన గోదావరి నది ఒడ్డుకు వచ్చి, ఒక అగ్నిగుండం రగిల్చి, హోమంచేసి, పరమ శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఒక శూలాన్ని ప్రసాదించాడు. ఆ శూలం ధరించి ఆదిశేషుడు రాక్షసులను సంహరించాడు. ఆయన హోమంచేసిన చోట ఒక చిన్న గుంట ఏర్పడి ఒక కొలనుగా మారింది. దానికి శేష తీర్థమని పేరు వచ్చింది. హోమం చేసిన గుంట వల్ల ఏర్పడింది గనుక ఆ కొలనులో నీళ్లు వేడిగా వుంటాయి. అందుకే దీనిని ఉష్ణుగుండం అని గూడ అంటారు. భద్రాచలం అనే వూరుకు కొంచెం దూరంగా ఈ శేష తీర్ధం ఉంది. శ్రీ సీతారాములు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు, శబరి అనే ఒకామె, ఈ అడవిలో దొరికే మధురమైన ఫలాలను వారికి యిచ్చి, స్వయంగా దగ్గరే కూచుని తినిపించింది. దానికి ఎంతో సంతోషించిన శ్రీరాముడు చరిత్రలో ఆమెపేరు శాశ్వతంగా వుండిపోయేటట్లు వరం యిచ్చాడు. ఆమె ఒక నది రూపంగా మారి ఇక్కడ ప్రవహిస్తూ, ఇప్పటికి శ్రీరాముని కొలుచుకుంటూ ఉంది. భద్రాచలం వూరుకు సుమారు ముప్పయి కి.మీ. దూరంలో వున్న ఈ శబరినది. ఇక్కడి నుంచి ప్రవహించుకుంటూ కొంత దూరం సాగిపోయి గోదావరి నదిలో కలుస్తుంది. క్రీ.శ. 1620 సం॥ ప్రాంతంలో ఈ భద్రాచలానికి దగ్గరలో వున్న ఒక గ్రామంలో ..దమ్మక్క అని ఒకావిడ వుండేది. ఒకనాడు రాత్రి ఆమెకు కలలో శ్రీరాముడు కనబడి, తను అక్కడకు దగ్గరలోనే అడవిలో, ఫలానా చోట పడివున్నానని చెప్పాడు. మరునాడు ఆమె గ్రామస్తులను పిలిచి తనకు వచ్చిన కల విషయం చెప్పి. వారిని వెంటబెట్టుకొని అడవిలోనికి వెళ్లి వెదకగా, రాళ్లు, ఆకుల మధ్య పడివున్న సీతారాముల విగ్రహాలు కనిపించాయి. ఆమె గ్రామస్తుల సహాయంతో ఆ విగ్రహాలను శుభ్రపరచి, అక్కడ ఒక చిన్న తాటియాకులు పాకవేసి అందులో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించింది. ప్రతి రోజూ తనే స్వామికి పూజాకార్యక్రమాలను నిర్వహిస్తూ వుండేది. ఒక రోజున ఆమె పని మీద పొరుగూరికి వెళ్తూ, పది, పన్నెండేళ్లువున్న తన కుమార్తెను పిలచి స్వామికి పూజచేసి నైవేద్యం పెట్టమని చెప్పి వెళ్లింది. ఆ పిల్ల పూజచేసి, నైవేద్యం స్వామి ఎదుట పెట్టి తినమని చెప్పింది. ఎంతసేపు గడిచినా ఆ నైవేద్యం అలాగే వుండిపోయింది. అమాయకురాలయిన ఆ చిన్న పిల్ల తను స్వామికి నైవేద్యం పెట్టలేదని తల్లి తిడుతుందేమోనని భయపడి నైవేద్యం తినకపోతే తను ప్రాణత్యాగం చేస్తానని స్వామితో చెప్పి, అందుకు సిద్ధ పడింది. ఆమె నిష్కల్మషమైన అమాయకపు భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై స్వయంగా ప్రసాదం ఆరగించాడు. తరువాత కొంత సేపటికి దమ్మక్క వూరినుంచి వచ్చి, స్వామికి నివేదన చేసిన ప్రసాదం ఏది అని కూతురిని అడిగింది. స్వామి తిని వేశాడని ఆ పిల్ల చెప్పింది. మామూలుగా అలా జరగదు కాబట్టి, ఆ పిల్ల తనే తినివేసి అలా అబద్దం చెబుతోందని భావించిన దమ్మక్క, కూతురిని దండించబోయింది. నిజంగా తనే ఆ ప్రసాదం తిన్నానని స్వామి చెప్పిన మాటలు విగ్రహాలలో నుంచి వినిపించాయి. ఇంతకాలంగా సేవ చేస్తూ వున్నా తనకు కలగని భాగ్యం, అమాయకురాలయిన ఆ చిన్న పిల్లకు కలిగినందుకు దమ్మక్క ఆనందపడిపోయింది. సరిగా, అదేకాలంలో, అంటే క్రీ.శ. 1620 సం॥ ప్రాంతంలోనే, నేలకొండపల్లి అనే గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ అనే దంపతులు వుండేవారు. వారికి గోపన్న అనే కుమారుడు వుండేవాడు. వారిది దైవభక్తి గల కుటుంబం కావడంచేత ఆ గోపన్నకు చిన్న తనం నుంచి దైవభక్తి అధికంగా వుండేది. ఒక తడవ ఆ గ్రామానికి సాధుమూర్తి అయిన కబీరు వచ్చాడు. అతను గోపన్న యొక్క దైవభక్తికి, ఉత్తమ లక్షణాలకు ఆనందపడి, అతనికి రామ తారక మంత్రం ఉపదేశించాడు. ఆనాటి నుంచిగోపన్న నిరంతరమూ ఆ మంత్రం జపించుకుంటూ శ్రీరాముని మనసులో నిలుపుకొని వుంటూ వుండేవాడు. ఇంతలో గోపన్న యొక్క తల్లి తండ్రులు ఇద్దరూ గతించారు. పేదవాడయిన గోపన్నకు కుటుంబ పోషణ పెద్ద భారంగా వుండేది.                             అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఈ ప్రాంతమంతా గోలుకొండ రాజధానిగా వున్న సామ్రాజ్యంలో భాగంగా వుండేది. గోలుకొండ ప్రభువు తానీషా అనే మహమ్మదీయ నవాబు, ఆయన ఆస్థానంలో అక్కన్న మాదన్న అనే అన్న దమ్ములు మంత్రులుగా వుండేవారు. వారిద్దరు గోపన్నకు మేనమామలు. వారు గోపన్న యొక్క దీన పరిస్థితిని గూర్చి విని, తానీషాతో చెప్పి, గోపన్నకు భద్రాచలం ప్రాంతానికి తహసీల్దారు ఉద్యోగం యిప్పించారు. గోపన్న ఆనందంగా వుద్యోగం చేసికొంటూ ఉన్నాడు.                   ఇంతలో శ్రీరామనవమి పర్వదినం సమీపించింది. శ్రీరాముడు అంటే గోపన్నకు గల భక్తి ప్రవత్తుల గూర్చి వివి వున్న దమ్మక్క, ఆయన దగ్గరకు వచ్చి తనకు అడవిలో సీతారాముల విగ్రహాలు దొరకడము మొదలైన వృత్తాంతం చెప్ని, శ్రీరామ నవమినాడు స్వామివారి కళ్యాణం జరిపించితే బాగుంటుందని అర్ధించింది. అప్పటికే గోపన్నకు శ్రీరాముడు ఇలవేలుపు. అందువలన అయాచితంగా లభించిన ఈ అవకాశానికి అనంద పడిపోయి, గ్రామస్తులందరను కూడగట్టుకొని, సీతారామకళ్యాణం వైభవంగా జరిపించాడు. అయితే, తన ఇష్టదైవమయిన రామచంద్రుడు దీనంగా తాటియాకుల పందిరికింద పడివుండటం గోపన్న మనసును కల్లోలపరచింది. ఆయన వెంటనే స్వామికి ఆలయం నిర్మించడం ప్రారంభించాడు. తన దగ్గర వున్న డబ్బు అంతా ఖర్చు అయి పోయింది. తహసీల్దారుగా తను వసూలు చేసి ఖజానాలో వుంచిన ప్రభుత్వపు వారి డబ్బు ఆరు లక్షల రూ॥లు తీసి ఖర్చు చేసి, ఆలయ నిర్మాణం పూర్తిచేశాడు. ఈ విషయం నవాబు తానీషాకు తెలిసింది. తన అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానాలోని సొమ్మును ఖర్చుచేసినందుకు మండిపడి వెంటనే ఆ డబ్బు చెల్లించమని గోపన్నకు ఆజ్ఞ జారీ చేశాడు.              గోపన్న దగ్గర చిల్లి గవ్వలేదు. తానీషా గోపన్ననను గోలకొండ కోటలోని చెరసాలలో బంధించాడు. పధ్నాలుగు సంవత్సరాల పాటు గోపన్న జైలులో అనేక కష్టాలు అనుభవించాడు. రాజుగారి సైనికులు ఆయనను కొరడాలతో కొట్టేవారు కూడ. ఆ బాధలు భరించలేక గోపన్న ప్రాణత్యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అదే రాత్రి అంతఃపురంలోవున్న రాజుగారి దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఆయనను నిద్రలేపి ఆరు లక్షల రూపాయలు వున్న ఒక సంచిని ఆయనకు యిచ్చారు. తాము గోపన్నగారి సేవకులమని, తమపేరు రామన్న, లక్ష్మన్న అని, గోపన్న గారు ఖజానాకు చెల్లించవలసిన డబ్బు తమ ద్వారా పంపించారని చెప్ని, తానీషా వద్ద రసీదుకుగూడ తీసుకుని వెళ్లిపోయారు. తానీషా మరునాడు గోపన్నను పిలిపించి విషయం వివరించగా, తనకు ఆ విషయమేమి తెలియదని గోపన్న అన్నాడు.                    అప్పుడు, రామలక్ష్మణులే స్వయంగా వచ్చి గోపన్న చెల్లించవలసిన డబ్బు చెల్లించి వేశారని అందరకూ అర్ధమయింది. రామలక్ష్మణుల దర్శన భాగ్యం కలిగిన తానీషా అదృష్టానికి ఆయనను గోపన్న ఎంతో కొనియాడాడు. తాను గోపన్నను ఎన్నో బాధలు పెట్టినా తిరిగి తననే పొగుడుతూ వున్న డు. ఆయన ఉత్తమ లక్షణాలకు తానీషా సిగ్గుపడి, గోపన్న కాళ్లమీద పడి తనను క్షమించమని వేడుకొన్నాడు.గా గోపన్నను గొప్పగా గౌరవించి, ఎన్నో కానుకలు యిచ్చి భద్రాచలానికి తిరిగి పంపించాడు. భద్రాచలంలోని ఆలయానికి ఎన్నో దానాలు వ్రాసి యిచ్చాడు. ప్రతిరోజు స్వామికి సకల సేవలూ జరిగేటందుకూ, టి ప్రతిఏడూ శ్రీరామనవమినాడు సీతారామకళ్యాణం ఘనంగా జరిగేటందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పరిచాడు. ప్రతి సంవత్సరమూ స్వామి కళ్యాణ సమయంలో గోలకొండనుండి ఎన్నో కానుకలు పంపించేవాడు. ఆ ఆనవాయితీ తప్పకుండా ఇప్పటికీ, శ్రీరామనవమినాడు జరిగే సీతారామకళ్యాణానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు. భద్రాచలం తిరిగి వచ్చిన గోపన్న స్వామి వారికి ఉత్సవం జరిపించి గ్రామంలోని వారి కందరికి అన్న సంతర్పణ చేశాడు. భోజన కార్యక్రమం జరుగుతూవుండగా, గోపన్న కుమారుడు పొరపాటున వంటశాలలోనికి వెళ్లి అక్కడ వున్న వేడిగంజి గుంటలోపల పడిపోయాడు. గోపన్న వచ్చి కుమారుని మృత దేహాన్ని తీసుకుని పోయి ఆలయంలో స్వామి ఎదుట వుంచి, ఎంతో ప్రార్థించాడు. స్వామి కరుణించి పిల్లవానిని బ్రతికించాడు. అంతకు ముందు వరకూ గోపన్న తను శ్రీరామచంద్రుని దాసుడని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఆయనకున్న రామభక్తి తత్పరత అన్ని దిక్కులకు వ్యాపించి, ఆయనకు రామదాసు అనే పేరు శాశ్వతంగా వుండిపోయింది. గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా,1645 - 1680 మధ్య కాలంలో భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది. దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు. భద్రాచలం మండలం రవాణా సౌకర్యాలు మండలకేంద్రమైన భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి మహబూబాబాద్, ఇల్లందు మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని రైల్వే స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి మూడు (కొల్లాపూర్ ఎక్స్ ప్రెస్, మణుగూరు ఎక్స్ ప్రెస్, కాకతీయ ప్యాసింజర్), మణుగూరు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి. గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది. వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్‌ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్‌ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది కొన్ని వివరాలు భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002లో శ్రీరామ దివ్యక్షేత్రం పట్టణంగా మార్చింది. భద్రాచలం రెవెన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్థిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది. లోక్‌సభ నియోజకవర్గం: మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం (పునర్విభజన అనంతరం) శాసనసభ నియోజకవర్గం: భద్రాచలం శాసనసభ నియోజకవర్గం రెవెన్యూ డివిజను: భద్రాచలం చూడదగ్గ ప్రదేశాలు భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి పర్ణశాల: భద్రాచలం పట్టణం నుండి కేవలం 35కి.మీ.ల దూరంలో వున్నది ఈ పవిత్రమైన పర్ణశాల. వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం. పాపి కొండలు: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. భద్రాచలం పరిసరప్రాంతాలలో సుందరమైనటువంటి అడవి,జలపాతాలు ఉన్నవి . భద్రాచలం చుట్టుపక్కల గిరిజన ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు కట్టుబొట్టు ధింస్సా నృత్యం కొమ్మునృత్యం జాతరలు పండగలు జరుపుకుంటారు. భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు సీతా రామ కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుతారు. సీత రాముల వనవాసం పర్ణశాలలో జరిగింది, శ్రీ రామ పాదాలు, సీత నారచీర గిరిజన భవన్‌ భద్రాచలంలో 1.10 కోట్ల రూపాయలతో నిర్మించిన గిరిజన భవన్‌ను 2022 జూలై 8న తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యావతి రాథోడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబుబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతం, అనుదీప్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన వ్యక్తులు పోరిక మౌనిక - 2022 సివిల్స్‌ ఫలితాల్లో 637వ ర్యాంకు సాధించింది. మూలాలు బయటి లింకులు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం వెబ్‌సైటు భద్రాద్రి రామదర్శనీ వెబ్‌సైటు వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు వర్గం:గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రములు వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు వర్గం:జనగణన పట్టణాలు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనగణన పట్టణాలు
నది
https://te.wikipedia.org/wiki/నది
thumb|నది వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికా లోని ఎడారులలోను, సౌదీ అరేబియా లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్‌ స్టోన్‌) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్‌) ఉంటే నీరు అంతగా ఇంకదు. ప్రపంచంలోని పెద్ద నదులు నైలు నది (6,695 కి.మీ.) అమెజాన్ నది (6,683 కి.మీ.) యాంగ్‌ట్జీ నది (చాంగ్ జియాంగ్) (6,380 కి.మీ.) మిసిసిపి నది (5,970 కి.మీ.) ఓబ్ నది (5,410 కి.మీ.) హువాంగ్ హో (4,830 కి.మీ.) కాంగో నది (4,630 కి.మీ.) లెనా నది (4,400 కి.మీ.) అమూర్ నది (4,350 కి.మీ.) యెనిసెయి నది (4,106 కి.మీ.) భారతదేశంలోని నదులు భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. నదుల అనుసంధానం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నదుల అనుసంధానానికి తాను వ్యతిరేకినంటూ ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వ్యతిరేకించారు. నదులను అనుసంధానం చేయాలని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే నిర్ణయించారని, యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) లో కూడా దీనిని చేర్చారని అన్నారు.నీటి కొరతను అధిగమించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారని, నదుల అనుసంధానంపై పరిశీలనకు 1982లోనే ఇందిరాగాంధీ జాతీయ నీటి వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. 2007లో జరిగిన జాతీయ అభివృద్ధి వేదిక సమావేశంలో కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయాలని కోరానని చెప్పారు. ముఖ్యమైన నదులు గంగ సింధు యమున బ్రహ్మపుత్ర సరస్వతి రావి నది బియాస్ నది సట్లెజ్ నది చీనాబ్ నది గోదావరి కృష్ణ పెన్న కావేరి నర్మద తపతి మహానది నాగావళి భరతపూయ దహీసార్ దామోదర్ ఘాగర్ గోమతి కోయెనా మండోవి మిధి ఓషివార సబర్మతి శరావతి ఉల్హాస్ వశిష్ఠి జువారి పంబా మూలాలు వెలుపలి లంకెలు వర్గం:నీటి వనరులు వర్గం:నదులు
చరిత్ర
https://te.wikipedia.org/wiki/చరిత్ర
thumb|274x274px|హెరోడోటస్ (క్రీ.పూ. 484 BC - క్రీ.పూ. 425), దీనిని తరచుగా "చరిత్ర పితామహుడు" గా భావిస్తారు గడిచిన కాలంలో మానవుని చర్యల అధ్యయనమే చరిత్ర (ఆంగ్లం: History). ఒక శాస్త్రంగా నిర్వచించినప్పుడు ప్రాథమికంగా జరిగిన కాలములోని విషయాలు రాతల ద్వారా , మనుషుల, కుటుంబాల, సమాజాల పరిశీలించి అధ్యయనం చేసి భద్రపరచబడినదానిని చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధంగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర జ్ఞానం సాధారణంగా జరిగిన సంఘటనల జ్ఞానంతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల జ్ఞానం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది. సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనం మానవీయ శాస్త్రాలలో భాగంగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గం చరిత్రను కాలక్రమం (క్రోనాలజీ), హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగాలతో సామాజిక శాస్త్రంలో భాగంగా వర్గీకరిస్తున్నారు. ఇవికూడా చూడండి భారతదేశ చరిత్ర జీవితచరిత్ర మూలాలు వెలుపలి లంకెలు వర్గం:చరిత్ర వర్గం:సామాజిక శాస్త్రాలు
కంపాక్ట్ డిస్క్
https://te.wikipedia.org/wiki/కంపాక్ట్_డిస్క్
కంపాక్ట్ డిస్క్ లేదా సి.డి. (Compact Disc లేదా CD), డిజిటల్ డేటాను భద్రపరచడానికి వాడే ఒక ఆప్టికల్ డిస్క్. ఆరంభంలో ఇది డిజిటల్ ఆడియోను రికార్డు చేయడానికి, భద్రపరచడానికి తయారుచేయబడింది. అక్టోబరు 1982నుండి కంపాక్ట్ డిస్కులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇప్పటికీ ఇవి డేటా, ఆడియో ఫైళ్ళకు సర్వసాధారణంగా వాడుతున్నారు. సాధారణంగా వాడే సి.డి.ల వ్యాసం 120 మి.మీ. ఇందులో 80 నిముషాల నిడివి గల ఆడియోను భద్రపరచవచ్చును. 60 మి.మీ. - 80 మి.మీ. మధ్య వ్యాసం ఉండే "మినీ సి.డి."లలో 24 నిముషాల ఆడియోను రికార్డు చేయొచ్చును. సీడీ పై భద్రపరిచిన డేటా ను బట్టి, లేదా భద్రపరచిన విధానాన్ని బట్టి (FORMAT) రకరకాల ఆ సీడీని వీసీడీ, ఆడియో సీడీ లేదా డేటా సీడీ అని పిలుస్తారు. వీసీడీ అంటే వీడియో సీడీ. దీనిలో సుమారు ఒక గంట సేపు నిడివి గల వీడియో భద్రపరచవచ్చు. సి.డి.లను రూపొదించడానికి వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం తరువాత మరింత అభివృద్ధి చెందింది. తత్ఫలితంగా మరిన్ని ప్రత్యేక సదుపాయాలున్న డిస్కులు ఆవిర్భవించాయి. CD-ROM, CD-R (ఒకేమారు "వ్రాయ"గలిగేవి), CD-RW (మళ్ళీ మళ్ళీ వ్రాయగలిగేవి), సూపర్ ఆడియో సిడి, విడియో కంపాక్ట్ డిస్క్ (VCD), సూపర్ విడియో కంపాక్ట్ డిస్క్ (SVCD), ఫొటో సిడి, పిక్చర్ సిడి, CD-i, Enhanced CD - ఇలా ఎన్నో రకాల డిస్కులు లభిస్తున్నాయి. CD-ROM , CD-R లు ఇప్పటికీ అత్యధికంగా వాడుతున్న మీడియా సాధనాలు. 2004లో ప్రపంచ వ్యాప్తంగా 30 బిలియన్ డిస్కులు (CD audio, CD-ROM, CD-R) అమ్ముడయ్యాయి.Compact Disc hits 25th birthday అంతకు ముందు వెలువడినా గాని అంతగా విజయవంతం కాని లేజర్ డిస్క్ టెక్నాలజీయే కంపాక్ట్ డిస్క్ ఆవిర్భావానికి పునాది. 1977లో ఫిలిప్స్ కంపెనీ ఆప్టికల్ లేజర్ డిస్క్ టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. 1979లో సోనీ , ఫిలిప్స్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్ ఫోర్స్ ఈ కంపాక్ట్ డిస్కులను రూపొందించింది. ఒక సంవత్సరం ప్రణాళిక , శ్రమ అనంతరం తయారైన ప్రమాణాలకు అనుగుణంగా తక్కిన పరిశోధన నడిచింది. ఈ ప్రయత్నంలో పారిశ్రామికంగా డిస్కులను తయారు చేయడానికి అవసరమైన నిర్మాణ పరిజ్ఞానాన్ని ఫిలిప్స్ అందించింది. ఇంకా ఫిలిప్స్ సమకూర్చిన Eight-to-Fourteen Modulation (EFM) మరింత "ప్లే టైమ్" అందించడానికి, గీతలు, ముద్రలనుండి రక్షణ కల్పించడానికి ఉపయోగపడే విధానం. సోనీ నుండి error-correction విధానం, CIRC విధానం సమకూరాయి. ఇలా కంపాక్ట్ డిస్క్ అనేది పలువురి సమష్టి కృషి ఆధారంగా రూపొందిన విజ్ఞానం. Compact Disc Story, లో ఈ ప్రయత్నంలో జరిగిన ప్రయోగాలు, చర్చలు, నిర్ణయాల గురించి చెప్పబడింది. ఇవి కూడా ఛూడండి మూలాలు బయటి లింకులు Philips history of the CD Sony's CD history Patent History (CD Player) - published by Philips 2005 Patent History CD Disc - published by Philips 2003 Sony History, Chapter 8, This is the replacement of Gramophone record ! (第8章 レコードに代わるものはこれだ)Sony web site in Japanese వర్గం:కంప్యూటరు హార్డువేర్ వర్గం:ఆంగ్ల పదజాలము
టీవీ
https://te.wikipedia.org/wiki/టీవీ
ఇది ఆంగ్లము లోని టెలీవిజను (television) పదము నుండి వచ్చింది. దీనిని తెలుగులో దూరదర్శిని అని కూడా అంటారు. ఇది మనకు బొమ్మలు, ధ్వనితో కలిపి వినిపిస్తుంది. చరిత్ర ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1926 జనవరి 26 న ఎలెక్ట్రికల్ ఇంజినీర్ జె.ఎల్.బర్డ్ టివిని ఆవిష్కరించారు. అలాగే కలర్ టివికి చెందిన పిక్చర్ ట్యూబు ని కనుగొన్నారు . భారతదేశంలో టీవి మాధ్యమ ప్రసారాలు 1990 లో మొదలయ్యాయి . మొదట ఒకే ప్రసార కేంద్రం 41 టీవి సెట్లతో ఒకటే ఛానెల్ తో వారానికి రెండు గంటలు మాత్రమే ప్రసారాలు నడిచేవి. 1959 సెప్టెంబర్ 15 వ తేదీన దూరదర్శన్ ఏర్పడింది. ఇది ఢిల్లీలో ఏర్పాటైంది. ప్రసారాలు చేసేందుకు సొంతగా ఉపగ్రహాలు లేకపోవడం వల్ల భారతదేశం అమెరికా అంతరిక్ష సంస్థ ఐన నాసా సాయంతో ప్రసారాలు చేసేది. 1979 లో భారతదేశం తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో సొంతగా టీవి ప్రసారాలు చేయగల సామర్ధ్యం సాధించింది. సాంకేతిక విషయాలు . ఆల్ ఇండియా రేడియోలో(AIR ) భాగంగా 1965లో రోజువారీ ప్రసారాలు తరువాత ముంబై, అమృత్సర్ కి విస్తరించారు. పరిణామ క్రమం తొలిరోజుల్లో విజ్ఞానాత్మక, విద్యావిషయిక కార్యక్రమాలు మాత్రమే ప్రసార౦ అయ్యేవి. అవి కూడా నలుపు-తెలుపులలో మాత్రమే. • 1980తర్వాత దేశ౦లోకి కలర్ టెలివిజన్ల ప్రసారాలు ప్రార౦భ౦ అయ్యాయి. కార్యక్రమాలలో నాణ్యత పెరిగి౦ది. • 1982-85 మధ్య కాల౦లో అన్ని ప్రా౦తీయ భాషల్లోనూ దూరదర్శన్ ఆధ్వర్య౦లో ప్రసారాలు మొదలయ్యాయి. • శాటిలైట్ టెలివిజన్ ఫర్ ది ఆసియా రీజన్ నెట్వర్కు(STAR) ద్వారా అనేక అ౦శాలలో టి.వి. ఛానళ్ళు పనిచేయడ౦ ప్రార౦భి౦చాయి. సమాజ౦లోని అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు తగిన కార్యక్రమాలతో ఛానళ్ళు ప్రసారాలను ప్రార౦భి౦చాయి. • స్టార్ నెట్వర్క్ తరువాత చెప్పుకోదగ్గ స్థాన౦ జీ-నెట్వర్కుది. ఇది ప్రా౦తీయ భాషలలో ఛానళ్ళను ప్రార౦భి౦చి౦ది. • దక్షిణాదిలో ఇటువ౦టి కార్యక్రమాలు సన్ నెట్వర్కుతో ప్రార౦భ౦ అయ్యాయి. ఈ స౦స్థ తమిళ భాషలో ఛానళ్ళను మొదలుపెట్టి, తరువాత కన్నడ౦, తెలుగు కార్యక్రమాలను ప్రసార౦ చేయడ౦ ప్రార౦భి౦చి౦ది. సాంకేతిక పరిజ్ఞానం మొదట ఆంటెనా ద్వారా ప్రసారాలు జరిగేవి. ప్రారంభంలో ఒక పెద్ద ఆంటెనా ఊరికి ఒకటి ఉండేది, క్రమ క్రమంగా ఆంటెనా పరిమాణం చిన్నదౌతూ ఇంటికి ఒకటి ఏర్పరుచుకున్నారు. పరిణామ క్రమంలో కేబుల్ టీవి ప్రవేశించింది. ఆ తరువాత డి‌టి‌హెచ్ (ఉపగ్రహం) పరిజ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఫైబర్ ద్వారా ప్రసారాలు అందుతున్నాయి. అమజోన్ ఫైర్ స్టిక పరిజ్ఞానం కూడా భారతదేశంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతోంది. భారతదేశంలో టీవి భారతదేశంలోని టీవీ చానల్లు స్టారు టీవీలు జీ టీవీలు అల్ఫా టీవీలు సోనీ టీవీలు దూరదర్శిని వివిధ వార్తా చానల్లు తెలుగు టీవీ చానల్లు దూరదర్శిని బ్రేకింగ్ న్యూస్ 24x7 వి6 న్యూస్ జెమినీ ఈ టీవీ జెమిని మూవిస్ ఈ టీవీ రెండు టీవీ 9 వీసా టీవీ మా టీవీ సిటీ కేబులు తేజా న్యూసు ఆదిత్యా మ్యూజికు మూలాలు వర్గం:టీవీ
శ్రీశ్రీ
https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ
శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ,వీరు హేతువాది, నాస్తికుడు. మహాప్రస్థానం అతను రచనల్లో పై మనసులో ఉన్న మాటలు రాసే వారు. జీవిత గమనం శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతను ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేసాడు. 1925లో ఎస్ ఎస్ ఎల్సి పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931లో మద్రాసు విశ్వ విద్యాలయంలో బి.ఏ (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు. 1935లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరాడు. 1938లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్‌ ఎడిటరుగా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు అతను రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది. 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. వీరి నలుగురి సంతానంలో చివరి అమ్మాయి నిడుమోలు మాలా మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో అతని ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు. వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించాడు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసాడు. 1970లో అతని షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది. కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15న శ్రీశ్రీ మరణించాడు. సాహితీ వ్యాసంగం శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని రాసేవాడు. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాశాడు. ఇలాచేయడం "గురజాడ అడుగుజాడ" అని అతను అన్నాడు . 1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలను రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని అతనికి తెలియదు. 1981లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో అతను ఈ విషయం స్వయంగా రాసాడు. ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది అతను సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షికను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది. రచనలు • మహాప్రస్థానం . ప్రభవ . వారంవారం . చమరాత్రి .మన గురజాడ .జాబులు .చైనాయానం . సిప్రాలి . వ్యూలు, రివ్యూలు .ప్రజా • మరో ప్రస్థానం • ఖడ్గ సృష్టి • అనంతం ( నవల ) - శ్రీశ్రీ స్వీయ చరిత్ర సినిమా రంగం ఇతడు మద్రాసులో ఉండడంతోనూ, ఆధునిక కవి కావడంతోనూ సినిమావారి పరిచయం బాగా వుండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం వుండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమయ్యింది. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి ఇతడు మాటలు, పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం "నీరా ఔర్ నందా"కి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చెయ్యడం ఇతడికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఇతను చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశాడు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో హెచ్.ఎం.రెడ్డి నెలకు 300 రూపాయల జీతమిచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా వేసుకున్నాడు. నిర్దోషి సినిమాకు కొన్ని పాటలు వ్రాశాడు. మూనాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయలు జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయలు రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డాడు. అలా ఈ ఉద్యోగాలు మూడేళ్ళపాటు సాగాయి. ఒక సారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు వ్రాయడానికి మైసూరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి బి.విఠలాచార్యతో పరిచయం కలిగింది. అతను కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలచి శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నాడు. ఇతడు మైసూరులో వుండి ఒక్కరోజులో 12 పాటలు వ్రాశాడు. ఇది ప్రపంచ చలనచిత్రలోకంలో ఒక రికార్డు! తరువాత ఇతడు డబ్బింగ్ రచయితగా, పాటల రచయితగా స్థిరపడ్డాడు. డబ్బింగ్ సినిమాలకు పాటలు, మాటలు వ్రాశాడు. మామూలు చిత్రాలకు కూడా పాటలు వ్రాశాడు. అన్ని రకాల పాటలు ముఖ్యంగా ఉద్రేకం, ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు వ్రాశాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన చాలా సినిమా పాటలను రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు అతను రాసిన "తెలుగు వీర లేవరా" అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. ఇతడు స్వయంగా చెవిలో రహస్యం అనే డబ్బింగ్ సినిమాను తీసి నష్టపోయాడు. తరువాత ఇతడు ఉషశ్రీ పిక్చర్స్ అన్న సంస్థను స్థాపించి రుక్మిణీ కళ్యాణం అనే సినిమాను తీయాలని ప్రయత్నించాడు కాని అది సఫలం కాలేదు. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాసాడు. వ్యక్తిత్వం శ్రీశ్రీ వ్యక్తిత్వంలో ఎన్నో విరుధ్ధమైన భావాలు, విచిత్రమైన సంఘర్షణలు కనిపిస్తాయి. అతను మొత్తంగా బహిర్ముఖుడు. తీవ్రవిమర్శలకు, పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు. సిద్ధాంతాల గురించి, తోటి కవుల గురించి అతను అభిప్రాయాలు అత్యంత వేగంగా, అతితక్కువ హేతుబద్ధంగా మారుతూండేవి. ఉద్యోగాల్లో ఇమడలేకపోవడం, మొదటి వివాహంలో పిల్లలు కలగకపోవడం, చివరి దశలో దాదాపు 50 ఏళ్ళ వయసు దగ్గరపడ్డాకే రెండో భార్యతో పిల్లలు పుట్టడం, సినిమాల్లో సంపాదించి, మొత్తం కోల్పోవడం, తన అస్థిరత వల్ల సాహితీసంఘాల్లో వివాదాలు రావడం ఇలా ఎన్నెన్నో ఒడిదుడుకులు అతను జీవితాన్ని తాకాయి. అతను గురించి జీవితచరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ "శ్రీశ్రీతో ఏ కొంతకాలమైనా పరిచయం గల వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైనా చురుకైనవాడనీ, అహంకారి అయినా తలవంచుతుంటాడనీ, విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతాడనీ, ఆకర్షకుడైనా ఏడిపించనూగలడనీ అంగీకరిస్తారు. కొన్ని అభిప్రాయాల విషయంలో అతడు జగమొండి. సరదా పడ్డప్పుడు అతణ్ణి అదుపుచేయడం కష్టం. విపరీతాలోచనా ధోరణిలో ఉన్నప్పుడు అతడు క్రమశిక్షణకు లొంగడు. దాపరికం లేకపోవడం, ఆలోచనలోనూ స్వభావంలోనూ చాటూమరుగూ లేకపోవడం విస్పష్టం. మాటల్లో మాత్రమే అతడు భయంకరుడు. మరో విధంగా పోరాడలేడు. వాస్తవజీవితంలో అతడు సమస్త సాంప్రదాయిక పద్ధతులకూ కట్టుబడ్డాడు. కానీ తన విప్లవభావాలతో వాటినెప్పుడూ వ్యతిరేకిస్తుండేవాడు" వ్యాఖ్యానించాడు. దాపరికంలేని స్వభావం వల్ల, అదొక చమత్కార ధోరణి అనుకోవడం వల్ల శ్రీశ్రీ స్వపర భేదం లేకుండా కఠోరమైన విమర్శలు, అనవసర వివాదాలకు కారణమైన వ్యాఖ్యలు ఎన్నో చేశాడు. పైగా అతను రాసిన ఆత్మకథ అనంతం సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఊహించని, పాఠకులకు మింగుడు పడని విడ్డూరమైన ప్రసంగాలతో నింపాడు. సమాచారం కూడా ఏ సందర్భశుద్ధీ లేకుండా నింపిన రచన అది. ఇవన్నీ కలిసి అతని వ్యక్తిత్వంపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు వేసినా అతను ఆకర్షణను ఇసుమంతైనా తగ్గించలేదు. విశ్వనాథ సత్యనారాయణ తో స్పర్థ శ్రీశ్రీకి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్య గల స్పర్థ ప్రసిద్ధమైనది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒకవిధమైన గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో అతనిపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. అతని శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవాడు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెప్తూ:మదరాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించినవారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్లు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నాడు. 1934లో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు వ్రాస్తున్న సమయంలో కవిత్వాన్ని గురించి, కవి గురించి గొప్ప తాత్త్వికత, వాస్తవికత మేళవించి వ్రాసిన ఆత్మాశ్రయ గేయం "కవితా ఓ కవితా" నవ్యసాహిత్య పరిషత్ వేదికపై చదివాడు. అప్పటి అధ్యక్షుడు, అప్పటికే కవిగా సుప్రఖ్యాతుడు అయిన విశ్వనాథ, నాటి వర్థమాన కవి అయిన శ్రీశ్రీని ఆనందబాష్పాలతో వేదికపైన నడిచివచ్చి గుండెలకు హత్తుకున్నాడు. ఆ గీతాన్ని ఎంతగానో పొగడి శ్రీశ్రీ కవితా సంకలనాన్ని(మహాప్రస్థానంగా వెలువడింది) తానే ప్రచురిస్తానని, దీనికి ముందుమాట రాయాలని చలాన్ని కోరాడు. ముందుమాట వ్రాయించేందుకు చింతా దీక్షితుల మధ్యవర్తిత్వాన్ని కూడా నెరిపాడు. కానీ అప్పటికి విశ్వనాథ పేరున్న కవే అయినా ఆర్థికంగా ఏ ఆధారంలేక దేశమంతా వాగ్మిగా తిరుగుతున్న నిరుద్యోగి. వేరొకరి పుస్తకం ప్రచురించగల సమర్థుడు కాదు. ఏవో కారణాల వల్ల మహాప్రస్థానాన్ని అతను ప్రచురించలేదు. నళినీమోహన్ అనే సాహిత్యాభిలాషి ముద్రించాడు. విశ్వనాథ శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా, శ్రీశ్రీకి విశ్వనాథ కవితాశక్తిపై చిన్ననాటి నుంచి ఎంతో అభిమానం (కొన్నేళ్ళు హీరోవర్షిప్) ఉన్నా వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకుచ్చాయి. భావాలకు మించి విశ్వనాథకున్న కుండబద్దలు గొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత ఆజ్యం పోశాయి. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షం గొప్ప రచన కాదని శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి తన అన్ని రచనల్లోనూ విశ్వనాథకు రామాయణంపైనే అభిమానం ఒక పాలు ఎక్కువ. దీనిని వెక్కిరిస్తూ ఒక్కడైనా రామాయణ కల్పవృక్షం చదివానంటే విశ్వనాథ పొంగిపోతాడనీ, సంస్కృతం రాకున్నా వాల్మీకం అర్థమైంది గానీ తెలుగు వచ్చినా కల్పవృక్షం అర్థంకాలేదని చాలాచాలా మాటలే మాట్లాడాడు. విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పడం కోసం, 'సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప పండితుడు' అని ప్రకటించాడు శ్రీశ్రీ. దీనిపై శ్రీశ్రీ జీవితచరిత్రకారుడు "శ్రీశ్రీకి విశ్వనాథ సంస్కృత పాండిత్యం ఈర్ష్య పుట్టించిందనిపిస్తుందని", లేని పక్షంలో దీనికి మరోకారణం కనిపించదని వ్యాఖ్యానించాడు. తనంతటి మహాకవి వెయ్యేళ్ళ వరకూ పుట్టడని విశ్వనాథ తన గురించి తానే ప్రకటించుకోగా, శ్రీశ్రీ నిజానికాయన వెయ్యేళ్ళ కిందటే పుట్టాడని అన్నాడు. ఈ వాగ్వాదాలకు పరాకాష్ఠగా మొదటి తెలుగు మహాసభల వివాదం సాగింది. దీనిలో విశ్వనాథ, శ్రీశ్రీ పేరున ఈ మహాసభలను వ్యతిరేకిస్తూ ఒక లేఖ పత్రికలకు విడుదల కాగా తన సంతకాన్ని శ్రీశ్రీయే ఫోర్జరీ చేశారని విశ్వనాథ ఆరోపించారు. ఆ మహాసభలకు విశ్వనాథ హాజరుకాగా, శ్రీశ్రీ వ్యతిరేకించడం, బహిష్కరణకు పిలుపునివ్వడం వల్ల ఒక రాత్రి బొలారం పోలీస్ స్టేషన్లో నిద్రచేశాడు. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు వారిద్దరి నడుమ సత్సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. మళ్ళీ విశ్వనాథను నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, ఐతే తిక్కన-వేమన-గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యలూ చేశాడు. విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలను చివరి వరకూ ప్రశంసించాడు. అతని మరణానంతరం విశ్వనాథను గొప్పగా ప్రశంసిస్తూ "కొండవీటి పొగమబ్బు/తెలుగు వాడి గోల్డునిబ్బు/మాట్లాడే వెన్నెముక/పాటపాడే సుషుమ్న/మాట్లాడే ద్విపద/సత్యానికి నా ఉపద" అంటూ రాసిన కవిత సుప్రఖ్యాతం. చివరి వరకూ వారిద్దరి నడుమ ఒకరు మరొకరి కవితా శక్తులను కొన్ని పరిమితులకు లోబడి ప్రశంసించుకోవడమూ, ఒక్కోమారు బయటపడి ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడమూ, తుదకీ అనురాగం-ద్వేషాల దాగుడుమూతలాట సాగింది. శ్రీశ్రీ పలుకులు చెణుకులు తనకేది తోస్తే అది నిర్భయంగానే కాక సందర్భశుద్ధి కూడా పట్టించుకోకుండా మాట్లాడడం అటుంచితే శ్రీశ్రీ మాటల్లో ఒకవిధమైన శబ్దాలంకారాలు, చమత్కారాలు దొర్లుతూండేవి. చమత్కార సంభాషణల లోను, శ్లేషల ప్రయోగం లోను శ్రీశ్రీ ప్రసిద్ధి చెందాడు. అతని చెణుకులు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని: ఒక మారు గోరాశాస్త్రి శ్రీశ్రీ తో,"శ్రీశ్రీ! నువ్వేమిటన్నా అనుకో. నా ఉద్దేశం మాత్రం ఇది! ఈ నాడు ఇండియాలోని రచయితలందరికన్నా నేనే గొప్పవాణ్ని" అన్నాడు."నా ఉద్దేశం కూడా అదే!" అన్నాడు శ్రీశ్రీ. రైల్వే స్టేషనులో కనపడిన ఒక స్నేహితుడు అతనును అడిగాడు, "ఊరికేనా?" అని. దానికి శ్రీశ్రీ ఇలా అన్నాడు - "ఊరికే". ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన మిత్రుడితో ఇలా అన్నాడు: "ఏ నాటికైనా రాస్తాను మిత్రమా" "వ్యక్తికి బహువచనం శక్తి" స్నేహితులతో కలిసి మద్రాసులో హోటలు కెళ్ళాడు. ఒకాయన అట్టు చెప్తానని అన్నాడు. దానికి శ్రీశ్రీ "అట్లే కానిండు" అన్నాడు. ఒకసారి అతనితో విసిగిన రచయత ఇలా అన్నాడు "శ్రీశ్రీ నీ నిర్వచనాలు ఒట్టి విరేచనాలు " వెంటనే శ్రీశ్రీ "అవి(విరేచనాలు )నీ నోటెమ్మట రావటం నా అదృష్టం తెలుగు భాష, సాహిత్యం గురించి తెలుగే మన జాతీయ భాష కావాలనేది నా అభిమతం. ఇది భాషా దురభిమానంతో అంటున్న మాటకాదు. తెలుగు భారతదేశం అంతకీ జాతీయభాష కాగల అర్హత గలదని జె.బి.యస్.హాల్డేన్ అన్నారు. సంస్కృత పదాలను జీర్ణించుకున్న కారణంచేత అటు ఉత్తరాదివారికీ, ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటి కావడంవల్ల ఇటు దక్షిణాది వారికీ తెలుగు నేర్చుకోవడం చాలా సులభమని హాల్డేన్ పండితుని వాదన. దేశంలో హిందీ భాషదే మొదటిస్థానమయినా, ఆ భాష మాట్లాడే వాళ్ళంతా కలిపి నలభై శాతానికి మించరు. అంతేకాక హిందీ ఒక చిన్నచెట్టుకు పరిమితం! రెండవ భాష అయిన తెలుగు సుమారు ఆరుకోట్ల మంది ఆంధ్రులకు మాతృభాష! పైగా తెలుగువారు దేశమంతటా, అన్ని రాష్ట్రాలలోనూ వ్యాపించి ఉన్నారు. తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ. ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం. ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను. (ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196.) శ్రీశ్రీ గురించి ప్రముఖుల పలుకులు right|thumb|శ్రీశ్రీ విగ్రహం, హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై, విగ్రహ వ్యాఖ్య: అభ్యుదయ కవితా యుగప్రయోక్త, సమసమాజ సంస్థాపనా ప్రవక్త"మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహా కావ్యం" - పురిపండా అప్పలస్వామి "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ" - చలం, యోగ్యతా పత్రంలో "కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను. అది శ్రీశ్రీలా వెలిగింది" - పురిపండా అప్పలస్వామి "తెలుగు కవిత్వ చరిత్రలో తిరుగు లేని మలుపు మహాప్రస్థానం" - డా. పాపినేని శివశంకర్. కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది - బూదరాజు రాధాకృష్ణ శ్రీశ్రీ పుట్టుకతో మనిషి, వృద్దాప్యంలో మహార్షి, మధ్యలో మాత్రమే కవి, ఏప్పటికీ ప్రవక్త. - వేటూరి ( శ్రీశ్రీ గారి మరణానంతరం ఈనాడు దిన పత్రికకు వేటూరి గారు వ్రాసిన వ్యాసం నుండి.) స్మరణలు విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో అతని నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీశ్రీ విగ్రహం, హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై ప్రతిష్ఠించారు. There is a status in Vijayawada in Tummala palli Kala kshetram. మూలాలు, వనరులు ఆధార గ్రంథం ఇవి కూడా చూడండి శ్రీశ్రీ రచనల జాబితా శ్రీశ్రీ సినిమా పాటల జాబితా మహాకవి శ్రీశ్రీ (పుస్తకం) కొంపెల్ల జనార్ధనరావు బయటి లింకులు ఆధునిక, విప్లవ సాహిత్య రూపశిల్పి శ్రీశ్రీ వర్గం:విప్లవ రచయితలు వర్గం:1910 జననాలు వర్గం:1983 మరణాలు వర్గం:నాస్తికులు వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు వర్గం:విప్లవ రచయితల సంఘ సభ్యులు వర్గం:విశాఖపట్నం జిల్లా కవులు వర్గం:విశాఖపట్నం జిల్లా రచయితలు వర్గం:ఆత్మకథ రాసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గం:పత్రికలలో శీర్షికలు నిర్వహించినవారు వర్గం:తెలుగులో పేరడీ రచయితలు వర్గం:దత్తత వలన పేరు మారిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు వర్గం:ఈ వారం వ్యాసాలు
అల్లసాని పెద్దన
https://te.wikipedia.org/wiki/అల్లసాని_పెద్దన
ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల ఆశువుగా చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయల వారికి సలహాలు ఇచ్చే వాడు . అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు. ఇతడు నంద వరీక బ్రాహ్మణుడు.‌ ఉ. ముద్దుగ గండ పెండేరమున్ గొనుడంచు బహూకరింపగా నొద్దిక నా కొసంగుమని యొక్కరు గోరగ లేరు లేరొకో అని రాయల వారు సగము పద్యము జదివగా, మిగతా పద్యమును అల్లసాని వారు ఈ విధముగా పూరించారు. పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీ వెరుంగవే పెద్దన కీ దలంచినను బేరిమి నా కిడు కృష్ణ రాణ్ణృపా! ఇతఁడు బళ్లారి ప్రాంతము నందలి దోపాడు పరగణా లోని దోరాల అను గ్రామము వాసస్థలముగా కలవాఁడు. ఈయన శాలివాహనశకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియఁబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థానపండితులు ఎనమండ్రలోను ఈతఁడు ఒక్కఁడు అయి ఉండినదికాక ఆరాజుచే ఆంధ్రకవితాపితామహుఁడు అను బిరుదాంకము సహితము పడసెను. ఈతని కృతి స్వారోచిషమనుసంభవము. ఇది మిక్కిలి ప్రౌఢకావ్యము.ఈ కావ్యానికి కృతి భర్త శ్రీ కృష్ణ దేవ రాయలు అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల/ దోర్నాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు. కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. ఒకప్పటి కడప జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట అగ్రహారం ఉంది. రాయలు గారు ఈ అగ్రహారమును దానముగా పెద్దన గారు ఇచ్చినారని ఒక పద్యము నందు చెప్పు కొన్నారు. సీ.ఎదురైనచో దన మద కరీంద్రము నిల్పి కేలూత యొసగి యెక్కించు కొనియె కోకట గ్రామాద్యనేకాగ్రహారంబు లడిగిన సీమలందునిచ్చె మను చరిత్రం బందుకొన వేళ బుర మేగ బల్లకి దన కేల బట్టి యెత్తె బిరుదైన కవిగండపెండేరమున కీవె తగుదని తానె పాదమును దొడిగె గీ.'ఆంధ్ర కవితాపితామహ అల్లసాని పెద్దన కవీంద్ర యని నన్ను బిలుచునట్టి కృష్ణరాయలతో దివి కేగ లేక బ్రదికి యున్నాడ జీవచ్ఛంబనగుచు.‌ ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు. రచనలు స్వారోచిషమనుసంభవము (మనుచరిత్ర) అలభ్య రచనలు హరికథాసారము రామస్తవరాజము అద్వైత సిద్ధాంతము చాటు పద్యాలు ఇవీ చూడండి తెలుగు సాహిత్యము మూలాలు అల్లసాని పెద్దన చౌడూరు నివాసి వర్గం:విజయనగర సామ్రాజ్య ప్రజలు
నంది తిమ్మన
https://te.wikipedia.org/wiki/నంది_తిమ్మన
నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ఇతని ముక్కు పెద్దదిగా ఉండటంవల్ల, మరియూ ఇతని కవితలలో ముక్కును చక్కగా వర్ణించడంవల్ల! ఇతను శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. ఇతను రాయల భార్య తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవి. నంది తిమ్మన, ఆరువేల నియోగ బ్రాహ్మణ కుటుంబంలో, నంది సింగన్న, తిమ్మాంబ దంపతులకు జన్మించాడు. ఈయన కౌశిక గోత్ర, అపస్తంభ సూత్రానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు. ఈయన అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది. తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడైనా, వైష్ణవ రాజాస్థానంలో ఉన్నందువలన, అప్పటి రాజకీయ-సామాజిక పరిస్థితుల వల్ల కొన్ని వైష్ణవ రచనలు కూడా చేశాడు. ఈయన తాత నంది మల్లయ్య, మేనమామ ఘంట సింగన్న (ఈయనకే మలయమారుత కవి అనికూడా మరోపేరు) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో జంటకవులుగా ఉండేవారు. 1521లో ముక్కు తిమ్మన రాయల తరఫున గయను సందర్శించి అక్కడ నావాడ నాయకులపై కృష్ణదేవరాయల విజయానికి ప్రతీకగా ఒక విజయశాసనం ప్రతిష్ఠించాడని చరిత్రకారులు భావిస్తున్నారు.Epigraphia Andhrica, Volume 1 ఈ ప్రసిద్ధి చెందిన కృష్ణదేవరాయల గయ శాసనం క్రింద రాజప్రశస్తిని కీర్తిస్తూ చెక్కబడిన కంద పద్యం ముక్కు తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణంలోనిది కావటం, కృష్ణదేవరాయలు గయను సందర్శించిన ఆధారం లేకపోవటం ఈ సంభావ్యతకు మద్దతునిస్తున్నాయి.Epigraphia Indica, Volume 2 రచనా శైలి తిమ్మన రచన పారిజాతాపహరణం ప్రసిద్ధి చెందింది. ఇతను "వాణీ విలాసము" అనే మరొక కావ్యాన్ని రచించినట్లు తెలుస్తున్నా అది లభ్యం కావడం లేదు. తన సమకాలికుడైన అల్లసాని పెద్దన వలే క్లిష్టమైన పదప్రయోగాలకు పోకుండా సున్నితమైన, సులువైన పద్ధతిలోనే రచనలు చేశాడు. ఈయన రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షించేవి. అందుకే ఆయన రచనలను ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు. పారిజాతాపహరణంలో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి. ముక్కు తిమ్మనాచార్యు ముద్దు పలుకు ఈ నానుడి తిమ్మన పద్యరచనారీతిని బట్టి, శైలీశయ్యాది సౌభాగ్యాన్ని బట్టి ఏర్పడి ఉంటుంది.పాత్రనుబట్టి శైలిని మార్చడం, నాటకీయతను పొందుపరచడం, సామెతలు, సూక్తులు ప్రయోగించడం, సమయోచిత ఉపమానాలు ప్రయోగించడం, తెలుగు నుడికారాన్ని వాడడం, చమత్కారంగా చెప్పడం మొదలైన వాటివల్ల ఇవి "ముద్దు పలుకులు" అనిపిస్తాయి.తెలుగు సాహిత్య చరిత్ర - డా. ద్వా.నా.శాస్త్రి కృష్ణుని చేష్టలకు సత్యభామ ఇలా తూలనాడింది ఏమేమీ కలహాసనుండచటికై యేతెంచి యిట్లాడెనా? ఆ మాటల్చెవియొగ్గి తా వినియెనా ఆ గోపికా వల్లభుం డేమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిన్ దాచెదే? నీ మోమాటలు మాని నీరజముఖీ, నిక్కంబెరింగింపవే సత్యభామ రోదించిన విధము ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిలి యేడ్చె ప్రానవిభు కట్టెదుటన్ లతాంగి పంకజ శ్రీసఖమైన మోముపయి చేలచెఱంగిడి బాలపల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్ పారిజాతాపహరణం ఇది ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు. నారదుడు పారిజాతం కృష్ణునకివ్వడం, ఆ సమయములో అతను రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని కృష్ణుడు రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం పారిజాత వృక్షం సత్య తీసుకోని రావడం, తులాభారంతో కథ సుఖాంతం అవుతుంది. ఫారిజాతాపహరణానికి సంస్కృత భారతంలో మూడు శ్లోకాలే అనే అని అంటారు కాని నిజానికి దీనికిని, సంస్కృత హరివంశమున వజ్రనాభుని వధ యనెడి కథకును సాన్నిహిత్యం ఉంది. ఏమైనా చాలా చిన్నదైన ఈ కథకు నంది తిమ్మన సంతరించిన అలంకార సౌకర్యములు, ప్రబంధోచిత పాత్రచిత్రణము, ఆయా పాత్ర జీవన వర్ణనము దీనిని సుందరమైన ప్రబంధకావ్యంగా తీర్చిదిద్దాయి.పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర విశేషాలు తిమ్మనగారి ముక్కు పెద్దది కావడం వలన ఆయనకి "ముక్కు తిమ్మన" అనే పేరు వచ్చి ఉండవచ్చును. ఆయన ముక్కు మీద చక్కని పద్యం వ్రాశారట. క్రింది ఆ పద్యాన్ని రామరాజ భూషణుడు కొనుక్కొని తన వసుచరిత్రములో చేర్చుకొన్నారట. నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే లా నన్నొల్లదటంచు గంధఫలి బల్కాకం తపంబంది యో షా నాసాకృతి బూని సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్ మూలాలు వర్గం:విజయనగర సామ్రాజ్య ప్రజలు
శ్రీకాళహస్తీశ్వర శతకము
https://te.wikipedia.org/wiki/శ్రీకాళహస్తీశ్వర_శతకము
ధూర్జటి తానీ శతకమును వ్రాసినట్టు గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ సా.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు కస్తూరి రంగ కవి తన యానంద రంగరాట్ఛందమున... ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ దీనిని ధూర్జటి వారి కాళహస్తీశ్వర శతకమున అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవి యే రచించెననుట నిర్వివాదాంశం. శ్రీకాళహస్తీశ్వరశతక కవి ధూర్జటి. ఈతఁడు శ్రీకృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజములు అనబడు ఎనిమిదిమందిలో ఒకడు అని వాడుక. శ్రీ కాళహస్తిమాహాత్మ్యమును బట్టి ఈ కవి సింగమ రమానారాయణ (జక్కయ నారాయణ) తనూభవుడు అని తెలియును. కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి మాటలలో ‘ఈ కాళహస్తిమాహాత్మ్యమువంటి గ్రంథము తెలుగులో మరియొకటి లేదు. తక్కినవారి కవిత్వము మనస్సునకు వాడి పెట్టి హృదయమును పాటునకు తెచ్చును. ఈ (ధూర్జటి) కవిత్వము మనస్సు వాడిమిని దాటి, గండెపాటు దాటి, దూరాన శివుడు కనిపించునట్లు చేయును’. ధూర్జటి రచనలుగా మనకు లభించునవి రెండు. (1) శ్రీకాళహస్తిమాహాత్మ్యము (2) శ్రీకాళహస్తీశ్వరశతకము. భాష విషయమున ఈ రెండు రచనలును రెండు వేరువేరు మార్గములలో నడచినట్లు కనబడును. శ్రీకాళహస్తిమాహాత్మ్యము, శ్రీకాళహస్తి క్షేత్ర పతియగు శ్రీకాళహస్తీశ్వరుని మహిమమును బహువిధములుగా తెలుపు స్థలపురాణము. కావ్యముగా ఇది ప్రబంధము. ఎందుకంటే ఇది పంచభూత లింగములలో ఒకటిగా వాయు లింగ రూపుడగు శివుడు వర్ణనీయుడుగా రచించబడిన వస్తుప్రధాన కావ్యము. శ్రీకాళహస్తీశ్వర శతకము, భక్తుడు తన మనస్సులోని భక్తి మొదలగు భావములను భగవంతునితో సూటిగా చెప్పుటకై రచించబడిన కావ్యము. కవి తన హృదయమును అనుదినమును మాటలాడు వాడుక భాషలోనే భగవంతుని ఎదుట ఉంచుటకై చేసిన రచన ఇది. అందుకు తగినట్లే ఈ శతక రచమలోని భాషను, అంటే వాక్యనిర్మాణాన్ని, వాడుక తీరులోనే చేయడమైంది. అంకితము శ్రీ కాళహస్తీశ్వరునకు విశేషాలు బహుశా దీనిని ధూర్జటి తన చివరి కాలములో వ్రాసి ఉండవచ్చును. ప్రఖ్యాత "రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజాక్షు చతురంతయాన తురగ భూషాదులాత్మవ్యదాబీజంబుల్" అనే పద్యము ఈ శతకము లోనిదే! ఇందు రాజులను రక రకాలుగా తిట్టినాడు. ఏ వేదంబు ఫఠించె లూత భుజంగం బే శాస్త్రముల్ ల్సూచె తా నేవిద్యాభ్యాసం బొనర్చె గరి చెంచే మంత్రం బూహించె భో దావిర్భావ విధానముల్ చదువులులయ్యా కావు మీపాద సంసేవా శక్తియే కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తిశ్వరా పద్యములు దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే చింతింపన్వలె నీపదాంభుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా! భావం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిథిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను. నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును. నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్ జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును. అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెఱింగిన్ సదా కాంత ల్పుత్త్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతిం జెంది జరించుఁ గాని పరమార్థంబైన నీయందుఁ దాఁ జింతాకంతయుఁ జింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వరా! శ్రీకాళహస్తీశ్వరా! ఆలోచించి చూస్తే, మనుజునకు అంతా మాయే అని తెలిసినప్పటికీ, తన కాంతలు (పతులు), పుత్రులు, ధనము, శరీరములే వాస్తవము, శాశ్వతములని తలచి వానికై తపిస్తూ మోహమనెడి సముద్రంలో కొట్టుమిట్టాడుతాడేగానీ, పరమార్థము, పరమాత్మవైన నీయందు చింతాకంతైననూ ధ్యానము నిలుపజాలకున్నాడు గదా. కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్ ! చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా ! ఐహికజీవనమనే మాయలో తగులుకున్న అవివేకులు తమకు పుత్ర సంతతి కలగలేదే అని చింతిస్తూ ఉంటారు. ఐతే, కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుగురు పుత్రులు కలిగినా వారి వలన ఆతడు ఏ ఉత్తమలోకాలను పొందగలిగాడు? బ్రహ్మచారిగానే యుండి సంతతియే లేని శుకునకు దుర్గతి ఏమయినా కలిగిందా? పుత్రులు లేని వారికి మోక్షపదం సిద్ధించకుండా పోదుకదా శ్రీ కాళహస్తీశ్వరా ! వనరులు, బయటి లింకులు కాళహస్తీశ్వర శతకము'
స్వారోచిష మనుసంభవము
https://te.wikipedia.org/wiki/స్వారోచిష_మనుసంభవము
మనుచరిత్ర, మనుచరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో "మనుచరిత్రము శాంత శృంగార రసములు సమ ప్రాధాన్యముతో సంగమించిన యొక తీర్థము. తత్కర్త సహజముగా శృంగార ప్రియుడు. ఆ చిత్తవృత్తి శాంతాభిముఖమయినప్పటి రచన యిది. శృంగారానుభవ రుచి, శాంతనిష్ఠయు రెండును మనోగోళమునావరించియున్నప్పటికిని శాంతివైపు చిత్తము మరలుచున్నదనవచ్చును" పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం right|thumb| "మనుచరిత్రము" వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ 1947 ముద్రణ ముఖచిత్రం కవి అల్లసాని పెద్దన, కృష్ణదేవరాల ఆస్థానంలో ఆష్టదిగ్గజాలలో ఒకడు. ఇతివృత్తము మారన మార్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. కాశీ నగరం దగ్గర అరుణాస్పద పురము అనే గ్రామములో ప్రవరుడు అనే పరమ నిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య సోమిదమ్మి ఎంతో అనుకూలంగా వుండే వారు. . వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. ఒక నాడు వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది. తిరుగు ప్రయాణమునకు మార్గం గాన రాక ఒక ఉపాయం‌ కోసం చూస్తున్న ప్రవరుడిని చూసి వరూధిని అనే గంధర్వ కన్య మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు. వారికి జన్మించిన స్వరోచి ఒక దేశానికి రాజయ్యాడు. ఆ స్వరోచి ఒకసారి వేటకు వెళ్ళి మనోరమ అనే యువతిని పెళ్ళాడాడు. వారి కొడుకే స్వారోచిష మనువు. రచనా వైభవం మనుచరిత్రంలో పెద్దన కథన కౌశలం, వర్ణనా చాతుర్యం పండితుల ప్రశంసలందుకొన్నాయి. పెద్దనను సమకాలికులు, అనంతర కవులు కూడా అనుసరించారు. మనుచరిత్రలోని కవితాశిల్పం అద్వితీయం. అక్షరాలా పెద్దన ఆంధ్ర ప్రబంధ కవితా పితామహుడే. మనుచరిత్రలో అనేక ఇతివృత్తాలున్నా గాని అందరినీ అలరించి పెద్దనకు కీర్తి తెచ్చిపెట్టినది వరూధినీ ప్రవరాఖ్యుల ఘట్టమే.తెలుగు సాహిత్య చరిత్ర - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004) పెద్దన రచనలో ముఖ్యాంశాలు వర్ణనా కౌశలం : హిమశైల వర్ణన, ఆరవ అశ్వాసంలో ఋతువర్ణనలు, యుద్ధ వర్ణనలు వంటి అనేక అద్భుతమైన వర్ణనలున్నాయి. ప్రబంధంలో ఉండవలసిన అష్టాదశవర్ణనలన్నీ ఇంచుమించుగా మనుచరిత్రలో కనబడుతాయి. మచ్చుకు ఈ పద్యం చూడండి. అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్. ------------ పెద్దన మనుచరిత్రము నుండి. పాత్ర పోషణ : వరూధినీ ప్రవరులు ఈనాటికీ మన సంభాషణలలో చోటు చేసుకోవడం పెద్దన పాత్ర పోషణలోని నైపుణ్యానికి చిహ్నం. రస పోషణ : శృంగారం, శాంతం, ధర్మం, అద్భుతం, బీభత్సం వంటి అనేక రసాలు ఆయా వృత్తాంతాలలో పాత్రలకు తగినంత ఔచిత్యంతో పెద్దన పోషించాడు. అలంకారిక రామణీయత : పాత్రలకు, సన్నివేశాలకు, రసానికి అనుగుణంగా అలంకారాలను ప్రయోగించాడు. కవితా శైలి : "అల్లసానివారి అల్లిక జిగిబిగి" అనే నానుడి ఉంది. "జిగి" అంటే కాంతి. "బిగి" అంటే కూర్పు, పట్టు. అంటే పదాల ఎంపికలోను, సమాసాల కూర్పులోను, పద్యాల ఎత్తుగడలోను చక్కదనం, చిక్కదనం ఉంటాయన్నమాట. ప్రశంసలు, విమర్శలు చీమలమర్రి బృందావనరావు : మార్కండేయ పురాణం లోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత కచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు. ... కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంథం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము. అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.ఈమాటలో వ్యాసం "నాకు నచ్చిన పద్యం - మనుచరిత్రలో సాయంకాల వర్ణన" - చీమలమర్రి బృందావనరావు విశేషాలు ఇది తొలి తెలుగు ప్రబంధము, దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము, తరువాతి ప్రబంధాలు దీని నుండి స్ఫూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి.ఇందు మొత్తం ఆరు అశ్వాసాలు ఉన్నాయి. ఈ ప్రబంధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదిగా చెపుతారు. ఉదాహరణలు వినాయక ప్రార్థన అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా: ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి ఆ: వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా: ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్‌: హిమాలయ వర్ణన అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ: పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన: స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌: కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌: తలమే బ్రహ్మకు నైన నీనగమహత్త్వం బెన్న? నే నియ్యెడన్: గలచోద్యంబులు ఱేపు గన్గొనియెదన్ గా కేమి, నేఁ డేఁగెదన్: నలినీ బాంధవభానుతప్తరవికాంతస్యందినీహారకందళచూ: త్కారపరంపరల్ పయిపయిన్ మధ్యాహ్నమున్ దెల్పెడిన్:. ఎండకు మంచు కరిగి దానితో పాదములకున్న పసరు కరిగి వెళ్ళుటకు అశక్తుడైనప్పుడు ఈ విధంగా చింతించును, నను నిముసంబు గానక యున్న నూరెల్ల: నరయు మజ్జనకుఁ డెం తడలు నొక్కొ: ఎపుడు సంధ్యలయందు నిలు వెళ్ళనీక న: న్నోమెడు తల్లి యెంతొఱలు నొక్కొ: యనుకూల గతి నాదుమనసులో వర్తించు: కులకాంత విది నెంత కుందు నొక్కొ: కెడఁ దోడునీడ లై క్రీడించు సచ్ఛాత్రు: లింతకు నెంత చింతింతు రొక్కొ: యతిథిసంతర్పణంబు లే మయ్యె నొక్కొ: యగ్ను లేమయ్యె నొక్కొ, నిత్యంబు లైన: కృత్యముఁ బాపి దైవంబ | కినుక నిట్లు: పాఱ వైచితె ? మిన్నులు పడ్డచోట:. నర్మగర్భంగా వరూధిని పలుకులు ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ: కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా: గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ: కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌: ప్రవరుడు వరూధినిని తిరస్కరించుట ప్రాంచద్భూషణ బాహుమూలగతితో పాలిండ్లుపొంగార పై: యంచుల్‌ మోవగ కౌగిలించి యధరంబాసింప హా శ్రీహరీ: యంచున్‌ బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయం బంటి పొ: మ్మంచున్‌ ద్రోచె కలంచునే సతులమాయల్‌ ధీరచిత్తంబులన్‌: మూలాలు వనరులు బయటి లింకులు మనుచరిత్ర (సవ్యాఖ్యానము) తెలుగుపరిశోధన లో "ఆంధ్ర భారతి"లో పూర్తి కావ్యము "ఈమాట" అంతర్జాల పత్రికలో కొంత భాగం - ఈ వ్యాసంలో ఉదాహరణ పద్యాలు "ఈమాట" నుండి కాపీ చేయబడ్డాయి. "ఈమాట" పత్రికకు కృతజ్ఞతలు. వర్గం:తెలుగు కావ్యములు
ప్రబంధము
https://te.wikipedia.org/wiki/ప్రబంధము
తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము. చరిత్ర ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉంది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. తర్వాత వచ్చిన వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహాత్మ్యము, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి. లక్షణాలు ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు. పింగళి లక్ష్మీకాంతం: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండి వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి.పింగళి లక్ష్మీకాంతం, విజ్ఞాన సర్వస్వము, సంపుటి 3, తెలుగు సంస్కృతి-1, పుట.603. కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును అష్టాదశ వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.కాకర్ల వేంకట రామ నరసింహము, ఆంధ్ర ప్రబంధములు : అవతరణ వికాసములు, పుట iv. దివాకర్ల వేంకటావధాని: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.దివాకర్ల వేంకటావధాని, 'ఆంధ్రవాజ్మయ చరిత్రము-II' సంగ్రహాంధ్రవిజ్ఞానకోశము, సంపు-I, పుట 576 సి.నారాయణరెడ్డి: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు. ఒకటి: కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియగుట. రెండు: శృంగారము అంగీరసముగా నుండుట. మూడు: వర్ణన బాహుళ్యము కలిగియుండుట. నాలుగు: రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.సి.నారాయణరెడ్డి, ''ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు, ప్రయోగములు. వెల్చేరు నారాయణరావు: పురాణామార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.తెలుగులో కవితా విప్లవాల స్వరూపం: వెల్చేరు నారాయణరావు, పుట 45 చరిత్ర రచనలో తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంధ యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి. ఉదాహరణలు మనుచరిత్ర సంస్కృతము లోని మాలవికాగ్నిమిత్రము ఆముక్త మాల్యద నాలాయిర దివ్య ప్రబంధము-తమిళము ముకుందవిలాసము వీరభద్ర విజయము సుపాణినీ పరిణయము అను అచ్చ తెలుగు ప్రబంధ కావ్యమును రచించిన సంబరాజు రామచంద్రకవి దీనిని వట్టెము చెన్నకేశవస్వామికి అంకితమిచ్చాడు. ఇది మూడాశ్వాసముల ప్రబంధము.సుపాణినీ కార్వవీర్యార్జునుల పరీణమిందలి యితివృత్తము. వట్టెము నాగర్ కర్నూలుకు దగ్గరలో ఒక గ్రామం.ఈ కవి తాతగారు వేంకటాచలరాజు పండితుడు; తండ్రి నరసింగరాజు సత్కవి. మూలాలు వర్గం:తెలుగు సాహిత్యం వర్గం:తెలుగు సాహిత్య ప్రక్రియలు
మనుచరిత్ర
https://te.wikipedia.org/wiki/మనుచరిత్ర
దారిమార్పు స్వారోచిష మనుసంభవము
ఆంధ్ర కవితా పితామహుడు
https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_కవితా_పితామహుడు
దారిమార్పుఅల్లసాని పెద్దన
ఉత్పల మాల
https://te.wikipedia.org/wiki/ఉత్పల_మాల
దారిమార్పు ఉత్పలమాల
దాశరథి రంగాచార్య
https://te.wikipedia.org/wiki/దాశరథి_రంగాచార్య
దాశరథి రంగాచార్య(ఆగస్టు 24, 1928 - జూన్ 8, 2015) సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. జీవిత విశేషాలు దాశరథి రంగాచార్యులు 1928, ఆగస్టు 24 న మహబూబాబాదు జిల్లా, చిన్నగూడూర్ మండలం,చిన్నగూడూర్ లో గ్రామం జన్మించారు. ఆయన అన్న కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు. ఉద్యమ రంగం నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. తండ్రి కుటుంబ కలహాల్లో భాగంగా తల్లినీ, తమనూ వదిలివేయడంతో అన్నతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో కౌమార ప్రాయం ముగిసేలోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథపాలకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనుదీయలేదు. పోరాటం కీలకదశకు చేరుకున్న కాలానికి లో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్టు దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు.డా.దాశరథి రంగాచార్యులు రచించిన వేదం-జీవన నాదం సాహిత్య రంగం తెలంగాణాసాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైనబానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, [[మోదుగుపూలు]], జనపదం నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు "జనపదం"లో అక్షరీకరించారు. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. " విశిష్టత, ప్రాచుర్యం దాశరథి రంగాచార్యులు రాసిన "చిల్లర దేవుళ్లు" నవల సినిమాగా తీశారు. టి.మాదవరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. పలు భాషలలోకి అనువాదమైంది. రేడియో నాటకంగా ప్రసారమై బహుళప్రాచుర్యం పొందింది. దాశరథి రంగాచార్యులు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ పోరాట క్రమానికి నవలల రూపం కల్పించడం, తెలంగాణ ప్రాంత చారిత్రిక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ "జీవనయానం" వంటివి సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. పురస్కారాలు, సత్కారాలు దాశరథి రంగాచార్యుల "చిల్లర దేవుళ్లు" నవలకు ఆంధ్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందు వల్ల రంగాచార్యులను అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు. 21-1-1994న ఖమ్మంలో సాహితీ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటాన్ని పెట్టి రంగాచార్యులు దంపతులకు సత్కరించారు. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో దాశరథి రంగాచార్యులకు విశేషమైన సత్కారాలు, సన్మానాలు జరిగాయి. 1990లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం. 2000లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యలో విశిష్ట పురస్కారం మరణం గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్ సోమాజిగుడాలోని యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న దాశరథి (86) 2015, జూన్ 8 సోమవారం ఉదయం కన్నుమూశారు. రచనారంగం రంగాచార్యులు నవలలు, ఆత్మకథ, వ్యాసాలు, జీవిత చరిత్రలు, సంప్రదాయ సాహిత్యం తదితర సాహితీప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు. నవలలు వట్టికోట ఆళ్వారుస్వామి నిజాం పాలనలో తెలంగాణా జనజీవితాన్ని ప్రతిబింబించే నవలలు రాయాలని ప్రారంభించి ప్రజల మనిషి, గంగు నవలలు రాసి మరణించారు. ఆయన ప్రారంభించి పూర్తిచేయని ప్రణాళికను రంగాచార్యులు స్వీకరించారు. ఆ క్రమంలో ప్రజలలో విప్లవబీజాలు పడుతున్నకాలాన్ని స్వీకరించి చిల్లరదేవుళ్ళు రాశారు. నిజాంపాలనలో ప్రజలపై జరిగిన దౌర్జన్యం, వెట్టిచాకిరీ, ఆడబాప వంటి వ్యవస్థలు, జనంలో పెరుగుతున్న అసహనం, అప్పటి ఆంధ్రోద్యమం, మతమార్పిడులు, వాటిని వ్యతిరేకిస్తూ తిరిగి హిందూమతంలోకి తెస్తున్న ఆర్యసమాజ్ వంటివన్నీ చిల్లరదేవుళ్ళు నవలలో చిత్రీకరించారు. విప్లవానికి నేపథ్యాన్ని చిత్రించేందుకు నవల పనికివచ్చింది. విప్లవబీజాలు ఎదిగి ప్రజాపోరాటానికి దారితీస్తున్న కాలాన్ని (1940 దశకం) స్వీకరించి తర్వాతి నవల మోదుగుపూలు రాశారు. ఈ నవలలో నిజాం రాజ్యంలో ఉండే జాగీర్దారు అధీనంలోని ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. పత్రిక చదవడం కూడా నిషేధమైన అనూహ్యమైన స్థితిగతుల్లో, ఊరికి వచ్చిన వ్యక్తి పత్రిక చదివించడమే కాక గ్రంథాలయం కూడా పెట్టించడం, అది తగలబడిపోతే అడవిలోని ఆటవికులను చేరదీసి విప్లవం రేకెత్తిస్తాడు. 1940ల్లో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా నైజాం ప్రాంతంలో ఏర్పడిన సాయుధపోరాట కాలాన్ని నవల ప్రతిబింబిస్తుంది. తెలంగాణాలో సాయుధ పోరాటం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, సాంఘిక స్థితిగతుల నేపథ్యంలో జనపథం నవల రాశారు. 1948లో తెలంగాణా నిజాం పరిపాలన నుంచి విముక్తం కావడం మొదలుకొని, 1970ల్లో అంకురించిన వామపక్ష తీవ్రవాద ఉద్యమాలు (నక్సలైట్ పోరాటాలు) వరకూ నవల సాగుతుంది. తెలంగాణా జనజీవితంలో 1938నాటి స్థితిగతులు ప్రతిబింబిస్తూ చిల్లర దేవుళ్లు, 1942 నుంచి 1948 వరకూ సాగిన తెలంగాణా సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ మోదుగుపూలు, 1948 నుంచి 1968 వరకూ జరిగిన పరిస్థితులు చూపిస్తూ జనపథం రాశారు. మొత్తంగా అలా తెలంగాణా సాయుధ పోరాటపు ముందువెనుకలను నవలల్లో చిత్రించాలన్న తన ప్రణాళిక నెరవేర్చుకున్నారు. దాశరథి రంగాచార్యులు సికిందరాబాద్ పురపాలక కార్పొరేషన్ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాకా ఆయనకు ప్రభుత్వం వెస్ట్ మారేడ్ పల్లిలో భూమి కేటాయిస్తే, ఇల్లుకట్టుకున్నారు. దగ్గరలో స్థిరపడ్డ పేదల ఇళ్ళు, స్థలాలు ఆక్రమించుకుని ఒక గూండా వారిని అన్యాయం చేస్తుంటే రంగాచార్యులు అతన్ని ఎదరించి నిలిచారు. మురికివాడల్లోని పేదల్లో కొందరిని ఆ గూండా కొనేయడంతో విఫలమైన ఆ ఉద్యమం ఫలితంగా మాయ జలతారు నవల వెలువడింది. బతికేందుకు నగరం చేరుకుని మురికివాడల్లో నివసించే పేదల జీవితాలు, వాటి చుట్టూ అల్లుకున్న ధనరాజకీయాలు మాయ జలతారు నవలలో వస్తువుగా స్వీకరించారు. అమృతంగమయ నవలలో ఓ గ్రామం పుట్టుక నుంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ పోవడాన్ని చిత్రీకరించారు. విశిష్టమైన శైలిలో రాసిన ఈ నవలలో మహాత్మా గాంధీ ప్రవచించిన గ్రామస్వరాజ్యం అంశాన్ని ప్రధానంగా స్వీకరించారు. గాంధేయవాదంతో పాటుగా నవలలో ఆధ్యాత్మికత వంటివి కూడా చూపించారు. గ్రామాల్లోని జనజీవనంలో ఆధునికత ప్రవేశించడంతో జరిగిన మార్పులు కథలో ముఖ్యంగా స్వీకరించారు. రానున్నది ఏది నిజం? నవలలో భారతదేశం భవిష్యత్తు గురించి కన్న కలలను అక్షరబద్దం చేశారు. ఆ నవల రెండు భాగాలుగా వెలువడ్డ జనపథం నవలకు కొనసాగింపు. 1970ల్లో తెలంగాణా ప్రాథమిక విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మకమైన పరిణామాల నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుని జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని చిత్రీకరిస్తూ రంగాచార్య రాసిన నవల పావని. వేదాలు-ఇతర అనువాదాలు దాశరథి రంగాచార్య వేదాలను తెలుగులోకి సంపూర్ణంగా అనువాదం చేసిన తొలి వ్యక్తిగా పేరుపొందారు. స్వయంగా మార్క్సిజాన్ని నమ్మే రంగాచార్య, వేదాల బోధనలు సమసమాజానికి దారులని నమ్మారు. మార్క్సునూ మహర్షిగా గౌరవించారు. ఆ నేపథ్యంలో తెలుగువారికి వేదాల సారం అందాలన్న ఆశయంతో వేదాలను తెలుగులోకి అనువదించారు. ఎమెస్కో విజయకుమార్ వాటిని ప్రచురించారు. తొలిప్రతిని ఒక గిరిజనుడు, ఒక దళితుడు, ఒక స్త్రీ చేతులకు అందించారు. ఉర్దూ సాహిత్యంలో కళాత్మకమైన, చారిత్రిక నవలగా నిలిచిపోయిన మీర్జా రుస్వా ఉమ్రావ్ జాన్ అదా'' నవలను అదే పేరుతో తెలుగులోకి అనువదించారు. 19వ శతాబ్దికి చెందిన లక్నో నగరపు వేశ్యాగృహాలను, సంగీత, సాహిత్య, నృత్యప్రదర్శనల సంస్కృతిని ఆధారం చేసుకుని రాసిన నవల అది. ఉమ్రావ్ జాన్ అనే సంగీత, సాహిత్య, నృత్యకారిణి, వేశ్య జీవితాన్ని నవలలో చిత్రించారు. ఉర్దూ సాహిత్యంలోనే తొలినవలగా పేరుపొందిన ఉమ్రావ్ జాన్ అదాను దాశరథి రంగాచార్య అందం చెడకుండా తెలుగులోకి అనువదించారు. రచనల జాబితా మోదుగుపూలు చిల్లర దేవుళ్ళు జనపదం రానున్నది ఏది నిజం? rangacharya navalalu కథాసంకలనాలు నల్లనాగు ఆత్మకథ జీవనయానం అనువాదాలు నాలుగు వేదాలు ఉమ్రావ్ జాన్ అదా దేవుని పేరిట రణరంగం ఇఖ్బాల్ కవితలు అనువాద కథలు ఉర్దూ మదిర కవిత్వం మానస కవిత జనరంగం భారత సూక్తము జీవిత చరిత్ర రచనలు శ్రీమద్రామానుజాచార్యులు బుద్ధుని కథ మహాత్ముడు సరళవచనాలు శ్రీమద్రామాయణం శ్రీ మహాభారతం వ్యాస సంకలనాలు శబ్దశ్వాస వేదం-జీవననాదం శతాబ్ది అక్షరమందాకిని ఇవి కూడా చూడండి దాశరథి కృష్ణమాచార్య బయటి లింకులు దాశరథి రంగాచార్యులు రచించిన మహాత్మా గాంధీ జీవిత చరిత్ర - మహాత్ముడు దాశరథి రచనలు తెలుగుపరిశోధనలో మూలాలు వర్గం:తెలుగు కవులు వర్గం:తెలుగు రచయితలు వర్గం:1928 జననాలు వర్గం:2015 మరణాలు వర్గం:తెలంగాణ సాయుధ పోరాట యోధులు వర్గం:మహబూబాబాదు జిల్లా రచయితలు వర్గం:ఆత్మకథ రాసుకున్న తెలంగాణ వ్యక్తులు వర్గం:మహబూబాబాదు జిల్లా కవులు వర్గం:మహబూబాబాదు జిల్లా అనువాద రచయితలు వర్గం:ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు వర్గం:పులుపుల వెంకటశివయ్య అవార్డు గ్రహీత
పారిజాతాపహరణం (ప్రబంధం)
https://te.wikipedia.org/wiki/పారిజాతాపహరణం_(ప్రబంధం)
thumb|నంది తిమ్మన కవి నంది తిమ్మన అంకితము శ్రీ కృష్ణదేవరాయలు విశేషాలు ఐదు అశ్వాసాలు గల ప్రబంధం. సంస్కృత భాగవతములోని మూడు పద్యాల కథని అద్భుతముగా పెంచి రచించాడు. పారిజాతాపహరణానికి సంస్కృత భారతంలో మూడు శ్లోకాలే అని అంటారు. కాని నిజానికి దీనికిని, సంస్కృత హరివంశమున వజ్రనాభుని వధ యనెడి కథకును సాన్నిహిత్యం ఉంది. ఏమైనా చాలా చిన్నదైన ఈ కథకు నంది తిమ్మన సంతరించిన అలంకార సౌకర్యములు, ప్రబంధోచిత పాత్రచిత్రణము, ఆయా పాత్ర జీవన వర్ణనము దీనిని సుందరమైన ప్రబంధకావ్యంగా తీర్చిదిద్దాయి.పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర ఇతివృత్తము నారదుడు పారిజాతం కృష్ణులవారికి ఇవ్వడం, ఆ సమయములో వారు రుక్మిణీదేవి మందిరములో ఉండటం, ఆ పారిజాతాన్ని రుక్మిణికి ఇవ్వడం, దానిని తెలుసుకొని సత్య ఆగ్రహించడం, అటుపై రకరకాల మలుపులు, పాద పీడనం, చివరకు దేవతలతో యుద్ధం, పారిజాత వృక్షం సత్య తీసుకొని రావడం, తులాభారంతో కథ సుఖాంతం. తెర వెనక కథ ఈ గ్రంథము వ్రాయడానికి నంది తిమ్మన గారికి ఒక కారణము ఉన్నది అంటారు. ఒక రోజు అనుకోకుండా తిరుమలదేవి రాయల వారిని పాదాలతో తాకుతుందట. దానితో రాయల వారు కోపగించుకొని, తిరుమలదేవిని చూడటం మానేస్తాడు, తిరుమలదేవికి అరణంగా వచ్చిన నంది తిమ్మన ఆ గొడవని రూపు మాపడానికి స్వయంగా కృష్ణులవారే తన్నించుకున్నారు మీదేముంది అని చెప్పడానికి ఈ కథ వ్రాసినాడు అని ఒక జనశ్రుతి. ఉదాహరణ పద్యాలు శ్రీ కృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చాడని చెలికత్తె చెప్పగానే సత్యభామ అనవినివేటువ్రడ్డయురగాంగనయంవలెనేయివోయభ గ్గన దరికొన్న హుతాశన కీల యనంగ లేచి హె చ్చిన కనుదోయి కెంపు తన చెక్కిలి కుంకుమపత్రభంగ సం జనితనవీన కాంతి వెదజల్లగ గద్గద ఖిన్న కంఠయై (తా. అలా చెప్పిన దానిని వినగా దెబ్బతిన్న పాము లాగ, నేయి పోయగానే భగ్గనే మంటవలె లేచి, కనులు ఎఱ్రబడడంతో ఆ కుంకుమ కాంతి చెక్కిలి మీద పడి కొత్త కాంతి వెదజల్లగా వణుకుతున్న కంఠంతో)చెలికత్తెను ఇలా ప్రశ్నించింది - ఏమేమీ కలహాసనుండచటికై యేతెంచి యిట్లాడెనా? ఆ మాటల్చెవియొగ్గి తా వినియెనా ఆ గోపికా వల్లభుం డేమేమాడెను రుక్మిణీ సతియు, నీ వింకేటికిన్ దాచెదే? నీ మోమాటలు మాని నీరజముఖీ, నిక్కంబెరింగింపవే చేరవచ్చిన శ్రీకృష్ణుని సత్యభామ జలజాతాసనవాసవాది సురపూజాభాంజనంబైతన ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్ తొలగంజేసె లతాంగి,యట్లయగు నాథుల్ నేరముల్ సేయపే రలకంజెందినయట్టి కాంతలుచితవ్యాపారముల్ నేర్తురే? సత్యభామ దండనకు శ్రీకృష్ణుని స్పందన ననుభవదీయదాసునిమనంబుననెయ్యపుకిన్కబూనితా చినయదినాకుమన్ననయ,చెల్వగునీపదపల్లవంబుమ త్తనుపులకాంతకటంకవితానముతాచిననొచ్చునంచునే ననియదయల్కమానవుకదాయికనైననరాళకుంతలా సత్యభామ రోదించిన విధము ఈసున బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిలి యేడ్చె ప్రాణవిభు కట్టెదుటన్ లతాంగి పంకజ శ్రీసఖమైన మోముపయి చేలచెఱంగిడి బాలపల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్ ప్రచురణలు పారిజాతాపహరణ ప్రబంధాన్ని ఆంధ్రపత్రిక ద్వారా 1929 లో ముద్రించారు.https://archive.org/details/in.ernet.dli.2015.373287/mode/2up దీనిలో నాగపూడి కుప్పుసామయ్య రచించిన పరిమళోల్లాసము అను వ్యాఖ్యానాన్ని కూడా జతపరిచారు. పారిజాతాపహరణాన్ని 1933 లో వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ వారు సురభివ్యాఖ్యాసహితముగా ముద్రించింది.https://archive.org/details/in.ernet.dli.2015.385649 దీనిని తిరిగి 1960 లో పునర్ముద్రించారు.https://archive.org/details/in.ernet.dli.2015.392064/mode/2up రెండింటికి దూశి రామమూర్తి శాస్త్రి విపులమైన భూమిక ను రచించారు. ఈ ప్రబంధం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి 1978 లో మొదటిసారిగా ముద్రించింది.https://archive.org/details/in.ernet.dli.2015.385637/mode/2up మూలాలు వర్గం:తెలుగు కావ్యములు
ఆశుకవిత
https://te.wikipedia.org/wiki/ఆశుకవిత
చతుర్విధ కవితా భేదాలలో ఆశు కవిత ఒకటి. కవులు సాధారణంగా ఆలోచించి సావధానంగా కవిత్వం చెప్పుతారు. అలా కాకుండా కొందరు కవులు వచనంలో మాట్లాడినంత వేగంగా భావాలను చంధోనియమ బద్ధంగా పద్య రూపంలో వ్యక్తం చేస్తారు. ఇలాంటి దానినే ఆశు కవిత్వం అంటారు. సమస్యా పూరణము వర్గం:కవిత్వం
ఉద్భటారాధ్య చరిత్ర
https://te.wikipedia.org/wiki/ఉద్భటారాధ్య_చరిత్ర
thumb|గ్రంథ కర్త తెనాలి రామలింగడు ఉద్భటారాధ్య చరిత్ర తెనాలి రామలింగడు రచించిన తెలుగు కావ్యము. పాల్కురికి సోమనాధుడు రచించిన బసవ పురాణంలోని ఏడవ అశ్వాసంలో కల 38 పద్యాల ఉద్భుటారాద్య వృత్తాంతము ఆధారముగా రచించబడిన ఈ కావ్యము, మూడు అశ్వాసాలు, 842 పద్యాలు గల శైవ గ్రంథము. దీనిలో కథానాయకుడు ఉద్భటారాధ్యుడు. ఇందులో మదాలస చరిత్ర, ముదిగొండ వారి మూల పురుషుడు అయిన ఉద్భటారాధ్యుని చరిత్ర ఉన్నాయి. రామలింగడు ఈ కావ్యాన్ని కొండవీటి దుర్గాధ్యక్షుడైన నాదెండ్ల గోపన వద్ద ముఖోద్యోగిగా ఉన్న ఊరదేచమంత్రికి అంకితమిచ్చాడు. కథాసంగ్రహం నైమిశారణ్యంలో శివపార్వతుల కేళీవిలాసానికి గంధర్వులు అంతరాయం కలిగించగా, శివుడు కోపించి, వాళ్లను పిశాచాలు కండని శపిస్తాడు. వాళ్లు శరణు వేడగా, శాంతించిన శివుడు కొంతకాలానికి తన మానసపుత్రుడైన ఉద్భటుడి వల్ల వారికి శాపవిమోచనం కలుగుతుందని అనుగ్రహిస్తాడు. శివుడి అంశతో పుట్టిన ఉద్భతుడు ముంజభోజుడనే రాజుకు దీక్షా గురువౌతాడు. ఇలా వుండగా, గంధర్వుల సంగతి గుర్తుకు వచ్చి, వాళ్ల శాపవిమోచనం కోసం ఉద్భటుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఉద్భటుడి కుమారులు అతని దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అతని దేహం నుండి వచ్చిన ధూమప్రసరణం చేత పిశాచాలకు శాపవిముక్తి కలిగి శివసాయుజ్యాన్ని పొందుతారు. ఇది ఈ కావ్యంలోని ప్రధాన కథ. కొన్ని పద్యాలు కవి ఈ క్రింది పద్యంలో శివ భక్తిరసంగా రచించి తద్వారా వేదాంత సారాన్ని బోధించాడు: కారణంబులు నీవ కార్యజాలము నీవ భావజ్ఞడవు నీవ భావమీవ జనకుండవును నీవ జన్యవస్తువు నీవ ప్రాపకుండవు నీవ ప్రాప్య మీవ ఆధారమును నీవ యాధేయమును నీవ భోక్తవ్యమును నీవ భోక్తవీవ రక్షకుండవు నీవ రక్షణీయము నీవ హార్యంబు నీవ సంహర్త వీవ పూజకుండ వీవ పూజ్యంపు బొడవు నీవ వాచకుండ వీవ తలపోయ వాచ్యమీవ జ్ఞానమును నీవ చూడంగ జ్ఞాని వీవ నిటలలోచన సకలంబు నీవ నీవ. కవి ఈ కావ్యంలో ఎన్నో వర్ణనలతో తన కావ్యాన్ని అందంగా తీర్చిదిద్దాడు. ఈ క్రిందీ పద్యంలో పార్వతీదేవి శివుడితో విహరించే వేళలో పంచశరు సామ్రాజ్యలక్షి లాగా ఉందట. ఈ పద్యంలోని మరో చమత్కారం ఉంది. ఇందులోని ప్రతి పాదంలోను శివుడికి ఉపమా నోపమేయాల్ని రెంటినీ చెప్పిన రామలింగడు పార్వతి విషయంలో ఉపమానాన్ని మాత్రమే ఉపయోగించాడు. ఇక్కడ కవి జగత్తున కాధారాధేయమైన శివ, శక్తి స్వరూపాన్ని ఆధ్యాత్మిక పరంగా మనోహరంగా వర్ణించాడు.ఉద్భటారాధ్య చరిత్ర, తెనాలి రామకృష్ణ కవి, కావ్య సమీక్షలు, సంపాదకులు: డా.ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం,1983, పేజీ: 155-66. తరుణ శశాంక శేఖర మరాళమునకు సారగంభీర కాసార మగుచు కైలాస గిరినాథ కలకంఠ భర్తకు గొమరారు లేమావి కొమ్మయగుచు సురలోక వాహినీధర షట్పదమునకు బ్రాతరుద్బుద్ధ కంజాత మగుచు రాజరాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజర స్థానమగుచు నురగవల్లభ హార మయూరమునకు జెన్ను మీరిన భూధర శిఖరమగుచు లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి..... మూలాలు బయటి లింకులు ఆర్కైవ్.ఆర్గ్‌లో ఉద్భటారాధ్య చరితము సంపూర్ణంగా తెనాలి రామలింగకవి వ్రాసిన ఉద్భటారాధ్య చరిత్రము వర్గం:తెలుగు కావ్యములు వర్గం:తెనాలి రామకృష్ణుడు రచనలు
పాండురంగ మహాత్మ్యము
https://te.wikipedia.org/wiki/పాండురంగ_మహాత్మ్యము
పాండురంగ మహాత్మ్యము తెనాలి రామలింగడు రచించిన ఐదు అశ్వాసాల గద్య పద్య కావ్యము. ఈ కావ్యంలో గత కవులు ఎవరూ వాడని కొత్త వర్ణనలు, అందునా తాను గతంలో వాడినవి మళ్ళీ వాడకుండా కవిత్వం చెప్పడంతో రామలింగడికి వికటకవి అన్న పేరువచ్చింది. చరిత్ర రచనలో పాండురంగ మహాత్మ్యం ప్రకారం ప్రపంచ దిగ్విజయానికి బయల్దేరే ముందు మన్మధుడు కొంతకాలం వెలిగుడారంలో విడిసినట్టు చెప్పబడింది.తెనాలి రామకృష్ణుడు:పాండురంగ మహాత్మ్యం. 4వ అధ్యాయం, 44 పద్యం 17వ శతాబ్ది నాటి విజయనగర సామ్రాజ్యపు అనే కవిలె, కృష్ణరాయలకు 50 ఏళ్ళ అనంతరపు రాయవాచకాల్లో రాయలు యుద్ధానికి వెళ్ళేప్పుడు అంత:పురం, నగరం వదిలి ఊరి బయట ఓ గుడారం వేసుకుని యుద్ధసన్నాహాలు పర్యవేక్షించేవారని, దానినే వెలిగుడారం అంటారని తెలుస్తోంది. ఇలాంటి చాలా విశేషాలు ఆనాటి సాంఘిక, రాజకీయ చరిత్రలను ప్రతిబింబిస్తున్నాయి. విశేషాలు ఇది ఐదు అశ్వాసాలు గో 1302 గద్య పద్యాలతో విలసిల్లిన గ్రంథము. ఇందు ఇతివృత్తము పాండురంగని కథ. దీనిలోనుండి రెండు పద్యాలను చూడండి తుంగభద్రానది వర్ణన: గంగా సంగమ మిచ్చగించునె మదిన్ గావేరి దేవేరిగా నంగీకార మొనర్చునే యమునతో నానందముంబొందునే రంగత్తుంగ తరంగ హస్తముల నారత్నాకరేంద్రుండు నీ యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ! పట్టె వ్ట్రువయును బరిపుష్టి తలకట్టు గుడుసున్న కియ్యయు సుడియు ముడియు నైత్వంబు నేత్వంబు నందంబు గిలకయు బంతులు నిలుపు పొలుపు నయము నిస్సందేహతయు నొప్పు మురువును ద్రచ్చి వేసిన యట్ల తనరుటయును షడ్వర్గశుద్దియు జాతియోగ్యతయును వృద్దిప్రియత్వంబు విశదగతియు గీలుకొవ రాయసంబుల వ్రాలు వ్రాయుగొంకుగొనరునుజేతప్పు గొనకయుండ లలిత ముక్తాఫలాకార విలాసనమున మతియరున్మంత్రి వేదాద్రి మంత్రివరుడు మూలాలు బయటి లింకులు పాండురంగ మహాత్మ్యం - పామర వ్యాఖ్యానంతో - తెలుగుపరిశోధనలో వర్గం:తెలుగు కావ్యములు వర్గం:తెనాలి రామకృష్ణుడు రచనలు
ఘటికాచల మహాత్మ్యము
https://te.wikipedia.org/wiki/ఘటికాచల_మహాత్మ్యము
ఘటికాచల మహాత్మ్యము తెనాలి రామలింగడు రచించిన ప్రబంధ కావ్యము. ఇది మూడు ఆశ్వాసాల ప్రబంధము. ఈ గ్రంథములో మొత్తము 475 గద్య పద్యాలు ఉన్నాయి. బహుశా ఇది తెనాలి చివరి రచన అయి ఉండవచ్చు. ఈ కావ్యాన్ని రామకృష్ణుడు మహారాష్ట్రీయుడైన ఖండోజీకి అంకితమిచ్చాడు. ఘటికాచలము నేటి తమిళనాడులో ఉన్న చోళంగి పురము (షోలింగూరు). ఇది 108 దివ్య తిరుపతులలో ఒక్కటి. ఇక్కడి దైవము లక్ష్మీ నరసింహస్వామి. కథ మొదటి ఆశ్వాసం అయోధ్యకు ప్రభువగు ధవళాంగుడు శాపముచే కిరాత రూపమును పొంది వశిష్ఠ మహర్షిని దర్శించుకొని శాపవిముక్తుడయ్యెను. రెండవ ఆశ్వాసం హరిశర్మ అను బ్రాహ్మణుడు, తరళయను పరిచారికను కామింపగా ఒక పుత్రుడు జన్మించెను. అతడు కౌండిన్యుని సేవించి, విష్ణుమంత్రమును ఉపదేశముగా పొంది ఘటికాచలమున ఘోర తపస్సు చేసి తరువాత జన్మలో బ్రహ్మ కుమారునిగా జన్మించి నారదునిగా ప్రసిద్ధి చెందెను. మూడవ ఆశ్వాసం సప్తఋషులు శతశృంగమున విష్ణువును గూర్చి తపస్సు చేయగా ఇంద్రుడు తపోభంగమునకు విఫలయత్నం చేసెను. సప్త ఋషులతో అశరీరవాణి ఘటికాచలమునకు పోయినచో తపస్సు సఫలమౌనని పలికెను. సప్తర్షులు పుణ్యక్షేత్ర దర్శణము చేయుచు జగన్నాథము, శ్రీకాకుళము, కృష్ణా తీరము, శేష శైలము, కాంచీపురం దర్శించి ఘటికాచలము చేరి తపస్సు చేసిరి. వారికి నరసింహుడు ఉగ్రరూపమున ప్రత్యక్షమయ్యెను. వారిని వరములు కోరుకోమనగా జీవులకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములనొసగు శక్తిని ఘటికాచలమునకు కలిగించమని కోరారు. బయటి లింకులు ఘటికాచలమున్న షోలింగూరు క్షేత్రము గురించిన వ్యాసం మూలములు తెనాలి రామకృష్ణకవి - ఆచార్య ఎక్కిరాల కృష్ణమాచార్య (ప్రచురణ: వరల్డ్ టీచర్స్ ట్రస్ట్, 1975) పేజీ.8,9 వర్గం:తెలుగు కావ్యములు వర్గం:తెనాలి రామకృష్ణుడు రచనలు
కందర్పకేతు విలాసము
https://te.wikipedia.org/wiki/కందర్పకేతు_విలాసము
thumb|గ్రంథ కర్త తెనాలి రామకృష్ణుడు కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణుడు రాసిన రచన. తెనాలి రామకృష్ణుడు కందర్ప కేతు విలాసము, హరిలీల విలాసము వంటి రెండు రచనలు చేసినట్లు పెదపాటి జగ్గన్న కవి తాను రాసిన "ప్రబంధ రత్నకరము"లో, ఉటంకించాడు. ఈ గ్రంథం కథాకావ్యం. ప్రథమాంధ్ర కవిజీవిత చరిత్రనిర్మాత గురజాడ శ్రీరామమూర్తి 1893లో ప్రకటించిన తమ కవిజీవితములు సంపుటంలో చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని వ్రాతప్రతుల ఆధారంగా, రామకృష్ణుని చాటుధారాపద్యములు అని ఉదాహరించిన వాటిలో కందర్పకేతు విలాసము లోని పద్యం ఉదాహరణగా చూడవచ్చు. ఉ.ఆ నలినాక్షి వేనలికి _నంబుధరంబు సమంబు గామిచేఁ దా నిరువ్రయ్యలై చనినఁ _ద ద్దశఁ జూచి దయార్ద్రులై బుధుల్ దాని పదాంతరంబునను _దారు వసించినవారు గావునన్ బూని తదంశమున్ సమతఁ _బోల్చిరి తత్సతి దృ క్కుచంబులన్.1915లో ‘తెనాలి కవులు’ వ్యాసంలో రామకృష్ణుడితోపాటు ఆ వంశపు ఇతర కవులను, వారి గ్రంథాలను గురించి రాశాడు. పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్రం, ఘటికాచల మహాత్మ్యాలే కాకుండా హరిలీలా విలాసం, కందర్పకేతు విలాసం’ అనే ప్రబంధాలనూ తెనాలి రామకృష్ణుడు రచించాడని అందులో చెప్పాడు. గ్రంథంలో కథాశం కందర్పకేతు విలాసం లోని నాయకుడు కందర్పకేతుడు చింతామణి మహారాజు కొడుకు. ఒకనాటి రాత్రి కలలో ఒక లోకోత్తరసౌందర్యరాశి సాక్షాత్కరించి అతని మనసు దోచుకొంటుంది. తెల్లవారగానే అతను మకరందుడనే తన ప్రియసఖుణ్ణి వెంటబెట్టుకొని ఊరుపేరులు తెలియని ఆమె కోసం గాలిస్తూ, రోజంతా ప్రయాణించి వింధ్య పర్వతాన్ని చేరుకొని అక్కడ ఒక చెట్టుకింద సేద తీరుతున్నప్పుడు ఆ చెట్టు కొమ్మల మీద వాలిన చిలుక, గోరువంకలు మాట్లాడుకోవటం వినిపిస్తుంది. కుసుమపుర మహారాజు శృంగారశేఖరుని కుమార్తె వాసవదత్త వంటి అందగత్తె మూడు లోకాలలోనూ లేదట. యుక్తవయసు వచ్చిన తర్వాత తండ్రి ఆమెకు వివాహం చేయదలిచి, స్వయంవరణాన్ని ప్రకటించాడట. దేశదేశాల నుంచి వచ్చిన రాకుమారులలో ఏ ఒక్కరూ ఆమెకు నచ్చలేదట. ఆ మునుపటి రోజే ఆమెకు రాత్రి కలలో కందర్పకేతుడనే అందగాడు కనిపించాడట. ఆమె అతనికి తన ప్రేమను వెల్లడిస్తూ ఉత్తరం వ్రాసి, తమాలిక అనే ప్రియమైన గోరువంక పక్షి ద్వారా అతనికి పంపించిందట. అదృష్టవశాత్తు అదే చెట్టుమీద వాలిన తమాలిక – ఆ మాటలను శ్రద్ధగా వింటున్న వాడు కందర్పకేతుడని గుర్తించి, అతనికి లేఖను అందించి, కుసుమపురానికి తీసుకొనివెళ్తుంది. అక్కడొక దివ్యసౌధంలో నాయికా నాయకులు కలుసుకొంటారు. కాని, అదే రోజున శృంగారశేఖరుడు వాసవదత్తను విద్యాధర రాజకుమారుడు పుష్పకేతునికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకొంటాడు. ప్రేమికులిద్దరూ మకరందుని ఎప్పటికప్పుడు వర్తమానాలు కనుక్కొంటుండమని రాజధానిలోనే ఉంచి, మనోజవమనే మాయాశ్వాన్నెక్కి వింధ్యాద్రికి వెళ్తారు. రాత్రంతా వారికి ఏకాంత ప్రణయలీలలతో గడిచిపోతుంది. తెల్లవారేసరికి వాసవదత్త నిద్రలేచి, ప్రియునికి పండ్లను తేవటానికి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఘోరయుద్ధం చేస్తున్న ఆటవికసైన్యాల మధ్య చిక్కుకొంటుంది. ఆమె అందానికి ముగ్ధులై వారు తమ కలహం మాట మరచి ఆమె వెంటపడతారు. వాసవదత్త ఒక యోగసిద్ధుని ఆశ్రమంలో తలదాచుకోబోతుంది. ఆటవికులు ఆశ్రమంలోకి జొరబడి కనబడినదల్లా చిందరవందర చేస్తారు. ఆ దురాగతానికి కారణం ఆమేనని మండిపడి ముని ఆమెను శిలామూర్తివి కమ్మని శపిస్తాడు. ఆ తర్వాత ఆమె దీనంగా వేడుకొనగా అతని మనస్సు కరిగి, ప్రియుని స్పర్శ సోకితే శాపమోక్షం కలుగుతుందని అనుగ్రహిస్తాడు. కందర్పకేతుడు మేలుకొన్నాక వాసవదత్త కనబడకపోయేసరికి సమీప ప్రాంతాలలో వెదకి నిరాశచెంది ఆత్మహత్య చేసుకోబోతాడు. ఆకాశవాణి అతనిని వారించి, ప్రేయసీ పునస్సమాగమం సిద్ధిస్తుందని చెబుతుంది. కందర్పకేతుని మనస్సు కుదుటపడుతుంది. ప్రాణేశ్వరిపై మళ్ళీ కోరిక ఉదయిస్తుంది. అపుడు అతను లలితాస్యాంబురుహంబు నీలకచరోలంబంబు నేత్రాసితో త్పల ముచ్చైఃస్తనకోక మోష్ఠవిలసద్బంధూక ముద్యత్కటీ పులినం బుద్గతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ జలజావాసము సొచ్చియాడక మనోజాతానలం బాఱునే’ అని అనుకుంటాడు. విమర్శలు కందర్పకేతు విలాసము తెనాలి రామకృష్ణకవి రచనమేనని, అది సంస్కృతంలో సుబంధుని వాసవదత్తా కథకూ, కన్నడంలో నేమిచంద్రుని లీలావతీ ప్రబంధానికీ సంయుక్తానువాదమని ఏల్చూరి మురళీధరరావు ప్రతిపాదించారు. మూలాలు బాహ్య లంకెలు వర్గం:తెనాలి రామకృష్ణుడు రచనలు
దిగంబర కవులు
https://te.wikipedia.org/wiki/దిగంబర_కవులు
thumb|242x242px|నగ్నముని thumb|165x165px|నిఖిలేశ్వర్ thumb|226x226px|చెరబండరాజు అది 1965, తెలుగు విప్లవ కవి లోకం నిశబ్దంగా ఉన్న రోజులు. ఒక కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడి మూడు సంవత్సరాలు అందరినీ ఆలోచింపచేసినది. http://saarangabooks.com/retired/2015/09/03/%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0-%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B1%87%E0%B0%82/అదే దిగంబర కవులు. వారికి వారే చెప్పుకున్నట్లు ఆ మూడు సంవత్సరాలు దిగంబర కవుల యుగము. 1960 ల్లో ’దిగంబర కవిత్వం’ తెలుగు సాహిత్యరంగంలో ప్రవేశించింది. దిగంబర కవులు మొత్తము ఆరుగురుhttp://saarangabooks.com/retired/2015/09/03/%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B0%82%E0%B0%AC%E0%B0%B0-%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B1%87%E0%B0%82/. స్వంత పేర్లతో కవిత్వం రాయకూడదన్నది ఈ కవుల నియమం. ఆ కవులు, వారి కలం పేర్లు ఇవి: మానేపల్లి హృషికేశవరావునగ్నముని యాదవ రెడ్డి - నిఖిలేశ్వర్ బద్దం బాస్కరరెడ్డి - చెరబండరాజు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు - మహాస్వప్న వీరరాఘవాచార్యులు - జ్వాలాముఖి మన్మోహన్ సహాయ - భైరవయ్యhttps://telugu.oneindia.com/sahiti/essay/2004/bhairavayya.html?story=1 వీరి కవితలు చాలా ఘాటుగా ఉంటాయి. వీరు తమ కవితల తొలిసంపుటిని 1965లో, రెండో సంపుటిని 1966 డిసెంబర్లో, మూడో సంపుటిని 1968 జూన్‌లో వెలువరించారు. మొదట సంపుటి దిగంబరశకం, నగ్ననామ సంవత్సరం ఆశ రుతువులో ఆవిష్కృతమయిందని వీరు ప్రకటించారు. 1970 లో ఈ దిగంబర ఉద్యమం ఆగిపోయింది. తరువాత వీరు విడిపోయి, నలుగురు విరసం లోను, ఇద్దరు అరసం లోనూ చేరారు. ఒక కవిత ఆకలి, కామం, కలలూ, కన్నీళ్ళూ మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే అమ్మ ఎవరయితేనేం? చనుబాలు తీపంతా ఒక్కటే బిక్క ముఖాలతో చూస్తారేం? పిచ్చివాణ్ణిగా కేసుపుటప్ చెయ్యండి నన్నెక్కనివ్వండి బోను విశేషాలు 1971 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వీరిలో నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖిని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం కింద అరెస్టుచేసి ముషీరాబాద్‌ జైలుకు పంపింది. సాహిత్యం ద్వారా వర్గపోరాటాన్ని రెచ్చగొట్టటం, పోరాటంలో నిర్భయంగా మృత్యువును ఎదుర్కోమని ఉద్భోదించారు. విద్యార్థుల, పౌరహక్కుల, విప్లవ రచయితల సభల్లో ప్రసంగించారంటూ...నేరారోపణలతో చార్జిషీట్లు తయారుచేశారు. దీనిపై కవితాలోకంలో నిరసన పెల్లుబికింది. తమ సాహిత్య రాజకీయ విశ్వాసాలను వివరిస్తూ వీరు నిర్బంధాన్ని కోర్టులో సవాల్‌ చేశారు. 1971 సెప్టెంబరు 20న హైకోర్టు బెంచి విచారణ జరిపి ఇరువైపుల వాదనలు విన్నారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం లేదని కేసు కొట్టివేస్తున్నట్టు చెబుతూ ముగ్గురూ స్వేచ్ఛాజీవులుగా కోర్టునుంచే వెళ్లవచ్చని తీర్పు చెప్పారు మూలాలు బయటి లింకులు https://www.sakshi.com/news/district/felicitation-to-naked-poets-388151 https://web.archive.org/web/20170426050840/http://lit.andhrajyothy.com/bookreviews/digambara-kavulu-6966 వర్గం:తెలుగు కవులు
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
https://te.wikipedia.org/wiki/చార్లెస్_ఫిలిప్_బ్రౌన్
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (; నవంబర్ 10, 1798 - డిసెంబర్ 12, 1884) తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు. జీవిత విశేషాలు సి. పి. బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు.తెలుగు భాషా సాహిత్యాల సముద్ధారకుడు సి.పి.బ్రౌన్ - జానమద్ది హనుమచ్ఛాస్త్రి, తెలుగు తేజం, డిసెంబర్ 2013, పేజి44-46 ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరాడు, బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగస్టు 4 న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రిక కావ్యాలను, నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ - ప్రచురణలను ముద్రింపచేసాడు. right|thumb|లండన్ యూనివర్సిటీ కాలేజీకి బ్రౌన్ రూపొందించిన తెలుగు కోర్సు పాఠ్యాంశాలు 'బ్రౌన్ లేఖలు'నుండి 1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడంలోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్థమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు. కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, కరువుగానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్గూగుల్ మాప్స్‌లో బ్రౌన్ నివసించిన ఇల్లులో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ శ్మశానంలో సమాధి చేశారు. పండితుల సాన్నిహిత్యం తాతాచారి బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు తాతాచారి అనే పేరుతో ప్రాచుర్యం పొందిన నేలటూరు వేంకటాచలం. తాతాచారి చెప్పిన కథలను విన్న సి. పి. బ్రౌన్ అందులోంచి 24 కథలను, దానితోపాటు శ్రీకృష్ణమాచారి చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే సంవత్సరం వీటి ఆంగ్లానువాదాన్ని 'పాపులర్ తెలుగు టేల్స్' అనే పేరుతో ప్రచురించారు. 1916లో 'తాతాచారి కథలు' గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి. 1951లో వావిళ్ల వారి తృతీయ ముద్రణ, 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి. తాతాచారి నెల్లూరు జిల్లా గూడూరు తాలూకా గునుపాడు గ్రామవాసి. తిరుపతి బాలబాలికలకు వీధి బడుల్లో చదువు చెబుతూ జీవితం సాగించారు. 1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌను కొలువులో ఏడేళ్లు తాను బ్రతికి వుండిన పర్యంతమున్నాడు. పల్నాటి వీర చరితం, వసు చరిత్ర మొదలైన గ్రంథాల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు. తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణముల యందు ప్రవీణత గలవాడు. తాతాచారి కథలు నీతి బోధకాలే కాక, ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగాను ఉన్నాయి. అందులోని శైలి శుద్ధ వ్యావహారికమైనందు వల్ల పండిత శైలికి దూరంగా ఉందనే బ్రౌన్ ప్రశంసకు యోగ్యమైంది. తాతాచారి కథల్లో- గ్రామశక్తికి పొంగలి పెట్టిన కథ, దేవరమాకుల కథ, వెట్టి వాండ్ల పట్టీ కథ, వాలాజీపేట రాయాజీ మసీదు కథ, హాలింఖాన్ మోసపోయిన కథ, మనిషి సద్గతి దుర్గతి తెలిపే కథ, పొగచుట్ట కథ లాంటివి ఉన్నాయి.ఆంధ్రజ్యోతి జాలస్థలి, 31 ఆగష్టు 2009 వివిధ ఏనుగుల వీరస్వామయ్య సి.పి.బ్రౌన్‌కు తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు, పండితుడు ఏనుగుల వీరాస్వామయ్యతో సాన్నిహిత్యం ఉండేది. వీరాస్వామయ్యకు, బ్రౌన్‌కు నడుమ తరచు ఉత్తరప్రత్యుత్తరాల్లో వారి అభిరుచియైన సారస్వత సంరక్షణలో జరిగిన ప్రగతి, చేసిన పనులు వంటివి పంచుకుంటూండేవారు. వీరాస్వామయ్య బ్రౌన్‌కు రాసిన లేఖలో తాను సంపాదించిన అరుదైన స్కాందం అనే గ్రంథమూ, దానికి గల తెలుగు అనువాదం గురించిన వివరాలు తెలిపి, వీటిని ప్రచురించగలరేమో పరిశీలించమన్నారు. తాను వ్రాసిన అపురూపమైన యాత్రాచరిత్ర కాశీయాత్ర చరిత్రను ప్రచురించగలరేమో పరిశీలించవలసిందిగా బ్రౌన్‌ను కోరారు. తెలుగు భాషకు చేసిన సేవ వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు. 1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు. "ఆంధ్రమహాభారతము", "శ్రీమద్భాగవతము" లను ప్రచురించాడు. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు. లండన్‌లోని "ఇండియా హౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు. "హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు. 1844లో "వసుచరిత్ర"', 1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు. 1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు. రచనలు ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827. లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కథల తెలుగు అనువాదం రాజుల యుద్ధములు, అనంతపురం ప్రాంత చరిత్ర. తెలుగు-ఇంగ్లీషు (1852), ఇంగ్లీషు-తెలుగు (1854), మిశ్రభాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ (తెలుగు వాచకాలకు అనుబంధమైన నిఘంటువు) తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం ఇతరుల ప్రశంసలు నాటి పండితుడు, అద్వైతబ్రహ్మ శాస్త్రి: "సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాస స్థానంగా కనపడుతున్నారు. ఎక్కడ ఏయే విద్యలు దాచబడి ఉన్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నవి... తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కార గ్రంథములు ఆకల్పాంతమున్నూ తమయొక్క కీర్తిని విస్తరిస్తూ ఉంటవి" ప్రముఖ పరిశోధకుడు బంగోరె (బండి గోపాల రెడ్డి) : "నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్" బంగోరె: "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు" "సి.పి.బ్రౌను అను నాతడు ఆంధ్రభాషామతల్లి సేవకే జన్మమెత్తినట్లు కానవచ్చుచున్నది. ఇతడు ఆంధ్ర వాఙ్మయాభివృద్ధికి చేసినంతటి పని ఇటీవలి వారెవ్వరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు" - కొమర్రాజు లక్ష్మణరావు "ఆంధ్రభాషోద్ధారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి.బ్రౌను" – వేటూరి ప్రభాకరశాస్త్రి స్మృతి చిహ్నం బ్రౌను స్మృతి చిహ్నంగా, కడపలో ఆయన నివసించిన బంగళా స్థలంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఆధ్వర్యంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ప్రభుత్వము, ప్రజల నిధులు, సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిర్మించింది. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు. అది 2006 నవంబర్ 10న భాషాపరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగమైంది. ఇటీవలి వార్తలు 150-175 ఏళ్ళనాటి బ్రౌను ఫోటో అంటూ 2007 జనవరి 20 న తితిదే శ్వేత ప్రాజెక్టు డైరెక్టర్‌ భూమన్‌ ఒక ఫోటోను పత్రికలకు విడుదల చేసాడు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన సంజీవిగారి సుబ్బారావు ఇంట్లో ఆయన అసలైన ఫొటో లభ్యమైనట్లు ఆయన చెప్పాడు. అయితే ఈ ఫోటో బ్రౌనుది కాదంటూ వార్తలు వచ్చాయి. http://www.andhrajyothy.com/archives/archive-2007-1-22/mainshow.asp?qry=/2007/jan/21main3 బయటి లింకులు, వనరులు సి.పి.బ్రౌన్ ఆంగ్ల వ్యాసము సీతారామయ్య అరి, శ్రీనివాస్ పరుచూరి ఆంధ్రభారతిలో బ్రౌన్ ఆన్‌లైన్ నిఘంటువులు వెతకవచ్చు బ్రౌన్ ప్రచురించిన వేమన పద్యాలు బ్రౌన్ గురించి కడప జిల్లా జాలస్థలి లో ఆంగ్ల వ్యాసం బ్రౌన్ పై వ్యాసంఈనాడు జాలస్థలి2007 జనవరి 21 బ్రౌను ఫోటో వివాదముపై హిందూపత్రికలో వివరణాత్మక వార్త బ్రౌన్ లేఖలు - బంగోరె పరిశోధన - శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రచురణ సి.పి బ్రౌన్ అకాడమి మూలాలు వర్గం:తెలుగునాట విదేశీయులు వర్గం:1798 జననాలు వర్గం:1884 మరణాలు వర్గం:నిఘంటుకారులు వర్గం:ఈ వారం వ్యాసాలు వర్గం:తెలుగు నుండి ఆంగ్లం లోకి అనువాదాలు చేసినవారు
గోన బుద్ధారెడ్డి
https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి
thumb|గోన బుద్ధారెడ్డి తన తండ్రి పేర రంగనాథ రామాయణము గ్రంథాన్ని రచించాడు గోన బుద్ధారెడ్డి ఒక తెలుగు కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను కాకతీయుల సామంతరాజుగా పనిచేశాడు. కందూర్ రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర రంగనాథ రామాయణము గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో సా.శ.1294-1300 కాలంలోతెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్ ఎస్వీ రామారావు, పేజీ 28 రచించబడింది. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168 ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు. గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి రామాయణ కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు తిక్కన రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని సంపూర్ణ రామాయణం కాదు.పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 8 కుటుంబ నేపథ్యం కాకతీయుల సైన్యంలో సేవలందించే ఉన్నతోద్యోగాలకు చెందిన కుటుంబంలోనివారు గోన గన్నారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అనుసరించి ఆయన పూర్వీకుల విశేషాలు తెలుసుకోవచ్చు. రామిరెడ్డి తండ్రి పేరు విట్ఠలభూపతి (లేదా విట్ఠలరెడ్డి). ఆయన తండ్రి పేరు కూడా బుద్ధారెడ్డియే. బుద్దారెడ్డి ముత్తాత పేరు గోన రుద్ర. తండ్రి గోనరెడ్డి. జీవిత విశేషాలు కాకతీయ రుద్రదేవుడు కందూరు చోడులను (నేటి మహబూబ్ నగర్ జిల్లా) లోని వర్ధమానపురం (నేటి నందివడ్డేమాన్, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది) నుంచి పారద్రోలడంతో, ఆ స్థానంలో గోరెడ్డిని తన సామంతుడిగా నియమించాడు. ఇతని కుమారుడు గన్నారెడ్డి రాజధానిగా పాలించాడు.తెలంగాణ చరిత్ర, సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచన, 2011, పేజీ 129 ఇతని అల్లుడు మాల్యాల గుండ దండధీశుడు వర్థమానపురం పాలకుడైనాడు. ఇతని మరణానంతరం గోన బుద్ధారెడ్డి గుండేశ్వరాలయం నిర్మించింది. ఈమె తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి చెందింది. సాహిత్యం గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు. ప్రాచుర్యం గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో సంస్కృత భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే పెద్ద పుస్తకం పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి: కవిత్రయం వారి ఆంధ్రమహాభారతం గోన బుద్ధారెడ్డి కృతమైన రంగనాథ రామాయణము పోతన భాగవతం గోన బుద్ధారెడ్డి ములికినాటి సీమకు రాజధాని అయిన గండికోటకు అతిచేరువలోని పెద్దపసుపల లేదా కొట్టాలపల్లెకు చెందినవాడు. నేటికీ గోనా వంశస్ధులు ఆగ్రామాలలో మరియూ జమ్మలమడుగులో నివసించుచున్నారు. గోన సంస్థానం కాకతీయ పరిపాలన కాలం (995-1323) లో గోన బుద్ధారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని రాజ్యాలైన వర్ధమానపురం (ప్రస్తుతం నంది వడ్డెమాన్), ఖిల్లా ఘన్‌పూర్ (ఘనపూర్ కోట) నుండి పరిపాలన చేసాడు. అతని కుటుంబం, గోనప్రసిద్ధమైనది. అతని మరణం తరువాత అతని సోదరుడూ గోన లుకుమా రెడ్డి రాజ్యపాలన బాధ్యతలను స్వీకరించాడు. మూలాలు వర్గం:తెలుగు కవులు వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రాచీన కవులు వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు వర్గం:తెలంగాణ కవులు వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తులు వర్గం:రామాయణం అనువాదకులు
రంగనాథ రామాయణము
https://te.wikipedia.org/wiki/రంగనాథ_రామాయణము
వర్థమానపురాన్ని ఏలిన గోన బుద్దారెడ్డి తండ్రి కోరిక మేరకు స.శ.1294-1300 కాలంలో ఈ రామాయణాన్ని రచించాడు.తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు పాల్కుర్కి సోమనాథుడు తర్వాత ద్విపద కవితను రచించిన వారిలో గోనబుద్దారెడ్డి రెండవవాడు. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు.ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు వ్రాశారు.కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168 ఐ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు. ప్రాచుర్యం thumb|రంగనాథ రామాయణము గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో సంస్కృత భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే పెద్దపుస్తకం పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి: కవిత్రయం వారి ఆంధ్రమహాభారతం గోన బుద్దారెడ్డి కృతమైన రంగనాథ రామాయణము పోతన భాగవతం "రంగనాథ రామాయణం ద్విపద కావ్యాలలొనే నగ్రగణ్యము, తెలుగు సాహిత్యమందలి యుత్తమోత్తమ కావ్యములలో నొకటి" అని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ప్రశంసించారు. 17-18 శతాబ్దాలలొ జానపదుల, బుర్రకథలలో ఈ కావ్యాన్ని ఉపయోగించారు. రంగనాథ రామాయణం కృతులు మనదేశంలోనే కాకుండా ఫ్రాన్సు, ఇంగ్లాండు లాంటి దేశాలలో కూడా లభ్యమైనాయి. దూరదర్శన్‌లో ప్రసారమై విశేష జనాదరణ పొందిన ధారావాహిక "రామాయణ్" రూపకల్పనలో దర్శక నిర్మాత రామానంద్ సాగర్ రంగనాథ రామాయణాన్ని కూడా ఆధారంగా స్వీకరించారు. మూలాలు వెలుపలి లంకెలు రంగనాథ రామయాణము తెలుగుపరిశోధనలో వర్గం:తెలుగు కావ్యములు వర్గం:రామాయణం వర్గం:అనువాద గ్రంథాలు
సిద్దేంద్ర యోగి
https://te.wikipedia.org/wiki/సిద్దేంద్ర_యోగి
right|264x264px|సిద్దేంద్ర యోగి right|220x220px|సిద్దేంద్ర యోగి సిద్ధేంద్ర యోగి (1672 - 1685) ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు. కూచిపూడి నాట్యానికి ఇతను మూలపురుషుడని జనశ్రుతిలోని మాట. ఇతడు ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామానికి చెందినవాడు. ఇతని గురువు నారాయణ తీర్థులు. జీవితం thumb|221x221px|గోలి శివరామ్‌ చిత్రించిన సిద్ధేంద్రయోగి వర్ణచిత్రం సిద్ధేంద్రయోగి జీవితాన్ని గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. కనుక జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథలే ప్రస్తుతం లభించిన ఆధారాలు. సిద్ధేంద్రయోగి పూర్వనామం సిద్ధప్ప అనీ, ఇతడు కూచిపూడి వాస్తవ్యుడనీ అనుకోవచ్చును. కూచిపూడి, మొవ్వ, శ్రీకాకుళం, ఘంటసాల ప్రాంతాలు అప్పుడు సమీపంలోనే ఉన్న సాంస్కృతిక కేంద్రాలు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణ తీర్ధులు 1580-1680 మధ్యకాలంవాడు కావడం వలనా, సిద్ధేంద్రయోగి సమకాలికుడైన క్షేత్రయ్య 1590-1675 కాలంలో ఉన్నాడనడంవల్లా, సిద్ధేంద్రయోగి 1600-1700 మధ్యకాలంలో జీవించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈయన గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. సిద్ధేంద్ర కాశీలో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్బాధానానికి సిద్ధమైనది అని కబురు వస్తుంది. యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో, ఆతురతతో, వేగంగా, ఉత్సాహంగా భార్య కడకు బయలుదేరి వస్తాడు, కాని, కూచిపూడి దగ్గరకు రాగానే కృష్ణానది పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అలలమీద అయినా నదిని దాటుదామని సిద్ధేంద్ర నదిలోకి దూకుతాడు. కాని దురదృష్టవశాత్తూ నది మధ్యలోకి రాగానే, నదిలో మునిగిపోవడం మొదలెడతాడు. 'ఇక ఎలాగైనా చావు తప్పదు' అని అనుకొని "కనీసం పుణ్యమైనా దక్కుతుందని" అక్కడికక్కడే తనకు తానే మంత్రం చెప్పుకొని సన్యాసం స్వీకరిస్తాడు. సంసార సాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, సిద్ధేంద్రను కృష్ణా నది కూడా దాటిస్తాడు. ఇక ఇంటికి వెళ్ళి, భార్యను పీటలపై కూర్చోమంటే, భార్య సిద్ధేంద్రను ఇతనెవరో గడ్డాలు, మీసాలు ఉన్న సన్యాసి, నా మొగుడు కాదు అని అంటుంది. అప్పుడు జరిగిన కథ చెప్పి, భార్యకి కృతజ్ఞతలు చెప్పి, మరలా పెద్దలందరి అనుమతితో సన్యాసం తీసుకుంటాడు. ఈ కథకే చిన్న చిన్న రూపాంతరాలున్నాయి. మరొక కథ ప్రకారం సిద్ధప్ప తల్లిదండ్రులు నిరుపేదలు, అంధులు కూడాను. ఎలాగోలా తల్లిదండ్రులను పోషిస్తున్న సిద్ధప్పను మెచ్చి శంకరాచార్యుడనే గురువు (లేక నారాయణ తీర్థులు) సిద్ధప్పకు కృష్ణమంత్రోపదేశం చేశాడట. మంత్రోపదేశం పొందిన సిద్ధప్ప శ్రీకృష్ణునిగురించి ఆడుతూ పాడుతూ ఉండేవాడట. శ్రీకృష్ణుడే స్వయంగావచ్చి అతనితో ఆడిపాడేవాడట. వారి సాంగత్యం మూలంగా సిద్ధప్ప తల్లిదండ్రులకూ శ్రీకృష్ణుని దర్శనమూ, ముక్తీ లభించాయట. ఆవెనక కూచిపూడి భాగవతులు భాగవతవేషం కట్టడం పరిపాటి అయినదట. మరొక కథప్రకారం సిద్ధప్ప శ్రీకాకుళంలోని పేదబ్రాహ్మణుడు. ఇల్లువదలివెళ్ళి ఉడిపిలో గురుశుశ్రూష చేసి సంగీత నృత్య పాండిత్యాలలో నిష్ణాతుడయ్యాడు. గురువు ఆశీస్సులతో తిరిగి శ్రీకాకుళం వచ్చి కృష్ణానదిని దాటే సమయంలో ఆపద్ధర్మంగా సన్యాసం తీసుకొన్నాడు. మరొక కథ ప్రకారం సిద్ధప్ప రాయలసీమనుండి దేశాటనచేస్తూవచ్చిన బ్రహ్మచారి. కూచిపూడిలో సువాణం జోగావధానులు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు. వివాహానంతరం అక్కడే స్థిరపడిన సిద్ధప్ప శాస్త్రాలను అభ్యసించి, అభినయంలో అద్భుతమైన పాండిత్యాన్ని గడించి క్రమంగా సిద్ధేంద్రయోగి అయ్యాడు. కూచిపూడి నాట్యం ఆంధ్రదేశంలో నృత్యసంప్రదాయం రెండు పద్ధతులలో వర్ధిల్లింది (1) నట్టువమేళ సంప్రదాయము - ఆలయాలలో జరిగే ఆరాధనా నృత్యాలు, కళ్యాణ మంటపాలలో చేసే నృత్యాలు. (2) నాట్యమేళ సంప్రదాయము - భరతుని నాట్యశాస్త్రంలో చెప్పిన విధానికి అనుగుణంగా ఉంది. ఇది నృత్యనాటకము. ఇందులో నర్తకుల సంఖ్య ఎక్కువ. నాట్యమేళాలలో "కలాపములు" ప్రసిద్ధి చెందినవి. వీటిలో భామాకలాపము రచించి, ప్రచారంలోనికి తెచ్చినవాడు సిద్ధేంద్రయోగి. ఈ కూచిపూడి గ్రామం కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉంది. దీనికి సమీపంలోనే మొవ్వ, పెదపూడి, ఘంటసాల, శ్రీకాకుళం వంటి ప్రసిద్ధ సాంస్కృతిక, చారిత్రిక ప్రదేశాలున్నాయి. thumbnail|సిద్ధేంద్ర యోగి చిత్రపటం ప్రస్తుత కూచిపూడి నాట్యరీతి, సిద్ధేంద్ర యోగి స్థాపించిన నృత్యనాటక సంప్రదాయం, భాగవత మేళనాటకం నుండి ఆవిర్భవించింది. సిద్ధేంద్రయోగికి ముందే, అనగా 14వ, 15వ శతాబ్దాలలో కూచిపూడి భాగవతులు ఊరూరా ప్రదర్శనలిచ్చేవారని "మాచపల్లి కైఫీయతు" ద్వారా తెలుస్తున్నది. రకరకాలుగా విస్తరించిన కూచిపూడి నాట్యాన్ని సిద్ధేంద్రయోగి క్రమబద్ధం చేశాడని మనం గమనించవచ్చును. కూచిపూడి నృత్యానికి ఆద్యుడై సిద్ధేంద్ర యోగి భామా కలాపం రచించాడు. ఇందులో కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి ప్రధాన పాత్రలు. తన ఊరిలోని మగవారితోనే ఆడవేషాలు వేయించి ఆడించాడు. సిద్ధేంద్ర యోగి యక్షగానాలకు మెరుగులు దిద్ది, భరతుని నాట్యశాస్త్ర రీతులను తన కూచిపూడి నాట్యంలో ప్రవేశపెట్టాడు. శాస్త్రీయ నాట్యరీతుల్ని జానపదకళా నృత్యాలతో మేళవించాడు. తనను కృష్ణానదిలో మునిగి పోకుండా కాపాడిన ఆ కృష్ణుని స్తుతిస్తూ, సిద్ధేంద్ర యోగి పారిజాతాపహరణం నృత్యనాటికను వ్రాశాడనీ, అది కూచిపూడి నృత్యనాటకాలలో అతి పురాతనమైనదనీ చెబుతారు. . ఇతర విశేషాలు భామా కలాపం సిద్ధేంద్రయోగి అంతకుముందే భాగవతులచేత అనేక వేషాలు వేయించియున్నాడు. శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు దేవాలయంలో దేవదాసీలు భగవంతుని సేవగా చేసే నృత్యాన్ని పరిశీలించియున్నాడు. ఉడిపిలో సంగీత, సాహిత్య అభినయాలను కూలంకషంగా అభ్యసించాడు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణతీర్ధులు సంస్కృతంలో రచించిన కృష్ణలీలా తరంగిణి, తెలుగులో రచించిన పారిజాతాపహరణమూ దక్షిణదేశంలో అప్పటికే ప్రచారంలో ఉన్నాయి. పారిజాతాపహరణం కథనే తెలుగులో "పారిజాతం" అనే పేరుతో నృత్యనాటికగా సిద్ధేంద్రయోగి రచించాడు. అదే "భామాకలాపం"గా ప్రసిద్ధి చెందింది. ఆ భామాకలాపాన్ని కూచిపూడిలోని బ్రాహ్మణుల పిల్లలకు బోధించాడు. కూచిపూడిలో పుట్టిన ప్రతిమగపిల్లవానికి సిద్ధేంద్రుని పేరుచెప్పి, ముక్కు కుట్టి, కాలిగజ్జె కట్టి, ఆ పిల్లవాడు పెద్దయ్యాక ఏ వృత్తిని అవలంబించినా గాని స్వామి సన్నిధిలో భామవేషం వేసి తీరాలని, స్త్రీలకు ఈ కళలో ప్రవేశం ఉండరాదని సిద్ధేంద్రుడు శాసించాడు. ఆ నియమం చాలాకాలంవరకూ కొనసాగింది. భామాకలాపం రచనావిధానం యక్షగానరీతిలో ఉన్నాగాని దాని ప్రదర్శన రీతి విశిష్టమైనది. భామాకలాపంలో నృత్యము, సంగీతము ప్రాధాన్యం వహిస్తాయి. ఇందులో నాయిక సత్యభామ. నాయకుడు కృష్ణుడు. చెలికత్తె మాధవి మరో ముఖ్యమైన పాత్ర. 'కలాపము' అంటే 'కలత' లేదా 'కలహము' అని అర్ధము.భామాకలాపము విఘ్నేశ్వరస్తుతితో (శ్రీ విఘ్నేశ్వర పాదపద్మములనే సేవించి నా యాత్మలో అని)ఆరంభమవుతుంది. ఆ వెనుక సరస్వతీప్రార్ధన ఉంటుంది. వెన్నెలపదం పాడుతూ సత్యభామ ప్రవేశించడంతో కథ ఆరంభమవుతుంది. నేవెవరవు అని చెలికత్తె అడుగుతుంది. అప్పుడు సత్యభామ భామనే సత్యభామనే భామరో శృంగార జగదభిరానే ముఖవిజిత హేమాధామనే ద్వారకాపురాఢ్యురామనే వయ్యారి సత్యాభామనే అనే దరువును పాడుతుంది. ఆ వెనుక అత్తమామల ప్రశస్తి చెప్పి, సత్యభామ హరి ఎక్కడున్నాడని అడిగి, అనంతరం భుదేవిని ప్రశస్తిస్తుంది. తరువాత దరువు, వెన్నెల పదము, మరికొన్ని దరువులు శ్రీకృష్ణునితో కలిసి పాడుతుంది. ఈ సందర్భంలోనే దశావతార వర్ణన సంవాదపూర్వకంగా సాగుతుంది. మంగళహారతితో భామాకలాపం ముగుస్తుంది. భామాకలాపం కొన్నిమార్పులు పొందింది. సిద్ధేంద్రుని పారిజాతంలో తొలిఘట్టమే భామాకలాపం. అయితే అనంతర ప్రదర్శనలలో పారిజాతం కథను తీసివేసి, సత్యభామ అష్టవిధ కథానాయికలుగా అభినయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలా మార్పులు చేసినవారిలో ముఖ్యుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆకివీడు వాస్తవ్యుడు మంగు జగన్నాధ పండితుడు. సిద్ధేంద్రునికి రెండువందల సంవత్సరాల తరువాతివాడు. తరువాత క్రమంగా మహిళలు భామాకలాపం ప్రదర్శనలో అగ్రగాములైనారు. భామా కలాపం సిద్ధేంద్రయోగి గొల్లకలాపాన్ని కూడా రచించాడు. కాని గొల్లకలాపము భాగవతుల రామయ్య రచన అని మరికొందరి అభిప్రాయము. (ఇది సిద్ధెంద్రయోగి రచన అనడంలో సందేహం లేదని డా. ఎన్. గంగప్ప తన రచనలో పేర్కొన్నాడు.) గొల్లకలాపంలో నాయిక రేపల్లెవాడలోని గొల్లభామ. "చల్లోయమ్మ చల్ల" అంటూ గొల్లవనిత బ్రాహ్మణ పండితులతో వివాదంలో పడడం ఈ రచన ఇతివృత్తం. ఈ వివాదంలో మానవుని జననంనుండి మరణంవరకు, చల్లనుండి వెన్న తీయడం మొదలు జీవాత్మ పరమాత్మల సంబంధం వరకు మానవజీవితాన్ని గురించి, సృష్టిని గురించి చర్చిస్తారు. ఇతని గురించిన కథ హంసలదీవి దీవి సుబ్బారావు రచించిన కవితల పుస్తకం నుండి చెప్పబోయేది సుమారు మూడు వందల యేబది యేళ్ళ క్రితం సంగతి చదువు కోసం కాశీ వెళ్ళి కూచిపూడి నుండి ఓ అబ్బాయి అక్కడే వున్నాడు పదిపన్నెండేళ్ళు అక్కడుండగా వచ్చింది కబురు ఇంటి దగ్గర భార్య ఈడేరిందనీ గర్బాధానానికి ముహూర్తం కూడా కుదిరిందనీ ఇంకేం బయలుదేరాడు సంతోషంగా ఉరుకులు పరుగులు దారంతా ఊరు దగ్గర పడుతుండగా కృష్ణ కనిపించింది వురవళ్ళు పరవళ్ళుగా యువకుడు గదా దిగాడు ధైర్యం చేసి తెలిసింది గాదు వరద వుధృతం దిగాక గాని సగం దూరం పనికి వచ్చింది వచ్చిన ఈత ఇక ఖాయమనుకొన్నాడు మునక సన్యాసం పుచ్చుకొన్నాడు అక్కడికక్కడ తనకు తానే మంత్రం చెప్పుకొని పోయే ముందు పుణ్యమన్నా దక్కుతుందని ఒకే సారి జరిగాయి అట్లా ఆయన చేతులెత్తేయటం ఇట్లా ఒక పెద్ద కెరటం వచ్చి ఒడ్డుకు తోసెయ్యటం ఇంటికొచ్చి పడ్డాడు బ్రతుకు జీవుడా అంటూ పీటల మీదకొచ్చి కూర్చోవాల్సిన భార్య ససేమిరా రానన్నది అనుకొన్న ముహూర్తానికి ఈయన ఎవరో గడ్డాలూ మీసాలూ ఉన్న సన్యాసిగాని నా భర్తకాదు పొమ్మన్నది అంతా తలో మాటా అన్నారు చిన్నపిల్ల మంకుపట్టు పట్టిందని కొందరు గాలో ధూళో సోకిందని ఇంకొందరు ఆ పిల్లదొక్కటే పాట ఎవరెన్ని అన్న ఈయనెవరో సన్యాసి నా భర్త కానే కాదు అని అప్పుడు పీటల మీద కూర్చొన్న యువకుడు పంచె వుత్తరీయం తీసి పక్కన పెట్టాడు వట్టి గోచీతో లేచి నుంచొన్నాడు అక్కడున్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్పాడు వరదతో వున్న కృష్ణను దాటలేక పోయిన వైనమూ ఆఖరు క్షణంలో ఆతుర సన్యాసం తీసుకొన్న తీరూ దాచకుండా చెప్పాడు ఇంకా శ్రీ కృష్ణ భగవానుడే తనను సంసారం నుండి రక్షించి ఒడ్డున పడేశాడనీ తన భార్యే తనను అధోగతి పాల్గోకుండా రక్షించిందనీ చెప్పాడు అట్లా చెప్పి అన్ని విషయాలు సన్యాసం స్వీకరించాడు యథావిధిగా అందరి అంగీకారంతో మరలా అతడే యోగి సిద్దేంద్రుడు జగన్నాటకంలో నిమిత్తమాతృడు యౌవనంలో శృంగార వాంఛ పూర్తిగా పోక అది పోయేటందుకుగా శృంగార రసప్రధానంగా సత్యభామా శ్రీ కృష్ణులు నాయికా నాయకులుగా పారిజాతాపహరణం యక్షగానం కూర్చాడనీ అదే భామాకలాపమనీ ఆ వూరి మగవాళ్ళతోనే వేషం కటించి ఆడింపజేస్తూ వచ్చాడనీ చెబుతారు విజ్ఞులు ఇవీ చూడండి కూచిపూడి నృత్యం నృత్యం మూలాలు, వనరులు సిద్ధేంద్రయోగి (తెలుగువైతాళికులు శీర్షికలో రచన) - రచన: డా. ఎన్. గంగప్ప - ప్రచురణ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (2006) బయటి లింకులు http://www.mapsofindia.com/who-is-who/art-culture/siddhendra-yogi.html మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్యాన్ని గురించిన పరిశోధన. వర్గం:టాంకు బండ పై విగ్రహాలు వర్గం:నృత్యకళాకారులు వర్గం:కృష్ణా జిల్లా నాట్య గురువులు
తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు
https://te.wikipedia.org/wiki/తాళ్ళపాక_చిన_తిరు_వేంగళనాథుడు
దారిమార్పుతాళ్ళపాక తిరువెంగళనాధుడు