SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
8,832
12-10-2017 10:38:43
ఈ జడ్జీల రెమ్యునరేషన్ తెలిస్తే ‘వామ్మో’ అంటారు
ముంబై: ఇటీవలి కాలంలో నినీతారలు టీవీ ఛానళ్లు నిర్వహించే కార్యక్రమాలకు జడ్జీలుగా వ్యవహరించడం మామూలైపోయింది. అయితే ఇందుకోసం వీరు తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. టీవీ షోలకు సంబంధించి బాలీవుడ్ తారలు తీసుకునే రెమ్యునరేషన్ వివరాలు..  మాధురీ దీక్షిత్ (ఝలక్ దిఖలా జా) - రూ. కోటి(ఎపిసోడ్)కరణ్ జోహార్ (ఝలక్ దిఖలా జా) - రూ. 10 కోట్లు(సీజన్)రెమో డిసౌజా (డాన్స్ ప్లస్) - రూ. 2.5 లక్షలు(ఎపిసోడ్)రుతిక్ రోషన్ (జస్ట్ డాన్స్) - రూ. కోటి(ఎపిసోడ్)షాహిద్ కపూర్ (ఝలక్ దిఖలా జా) - రూ. 1.75 కోట్లు (ఎపిసోడ్)మలైకా అరోరా (ఝలక్ దిఖలా జా) - రూ. కోటి(సీజన్)జాక్లీన్ ఫెర్నాండిజ్ (నచ్ బలియే) - రూ. 1.25 కోట్లు(ఎపిసోడ్)సోనాక్షీ సిన్హా (నచ్ బలియే) - రూ. కోటి(ఎపిసోడ్)కిరణ్ ఖేర్ (ఇండియన్ గెట్ టాలెంట్) - రూ. 2 కోట్లుసోహెల్ ఖాన్ (కామెడీ సర్కస్) - రూ. 3 కోట్లు (సీజన్)
entertainment
20,963
17-02-2017 00:25:04
సౌతజోన్‌ను గెలిపించిన మిలింద్‌, మయాంక్‌
ముంబై: సీవీ మిలింద్‌ (3/41), విజయ్‌ శంకర్‌ (2/21) రాణించడంతో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో సౌత్‌జోన్‌ 5 వికెట్లతో వెస్ట్‌జోన్‌పై గెలుపొందింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత వెస్ట్‌జోన్‌ నిర్ణీత ఓవర్లలో 140/9 పరుగులు చేసింది. హుడా (32) టాప్‌ స్కోరర్‌. అనంతరం మయాంక్‌ అగర్వాల్‌ (70) మెరుపు అర్థ శతకంతో చెలరేగడంతో సౌత్‌జోన్‌ 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వినోద్‌ (36) కూడా రాణించాడు. ఇర్ఫాన్‌ పఠాన్‌, శౌర్య, ఈశ్వర్‌, ప్రవీణ్‌ తాంబే ఒక్కో వికెట్‌ పడగొట్టారు.
sports
3,792
25-03-2017 00:53:22
పాఠశాల విద్యకు శాపం సీసీఈ
పాఠశాల విద్యలో ప్రయోగాలన్నింటిని తరచి చూస్తే ఒక్క అంశం బోధపడుతుంది. పాపం చిన్న పిల్లలకు వాళ్ళపై జరుగుతున్న ప్రయోగాలు తెలియవు. విద్యావంతులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థి సంఘాల మిత్రులారా ఇప్పటికైనా ఈ విద్యార్థుల పక్షాన మాట్లాడండి. పాఠశాల విద్యపై ప్రయోగాల మీద ప్రయోగాలు. ప్రయోగాల పాడుకాలం ఇది! పాపం పిల్లలను చూస్తే జాలేస్తుంది. మార్చి 17 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2012లో ఉన్నత పాఠశాలల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ) ఈ బ్యాచ్‌ 6వ తరగతిలోకి ప్రవేశించిన నాటి నుంచే ప్రారంభమైంది. ఐదేళ్ళు సీసీఈ విధానంలో చదువుకున్న మొదటి బ్యాచ్‌ 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలను మార్చి 17 నుంచి రాస్తున్నారు. పాఠశాల విద్యలో ఈ విధానం ప్రారంభించిన నాటినుంచే దీనిని తెలంగాణ టీచర్స్‌ సంఘం (టీటీయూ) వ్యతిరేకిస్తున్నది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) వారు ఈ విధానాన్ని పాఠశాల విద్యలో 2009లో ప్రవేశపెట్టడం జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల నమూనాలను ఇక్కడ ప్రవేశపెట్టడం అంత మంచిదికాదని అనాడే చాలా మంది అభిప్రాయబడ్డారు. దేశ విద్యార్థుల సంఖ్యలో 1% విద్యార్థులు కూడా లేని సీబీఎస్‌ఈ పాఠశాలల్లో విఫలమవుతున్న దశలో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు మన పాఠశాల విద్యారంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత దీనిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొనసాగించింది. ఎపెప్‌, డిపెప్‌, క్లిప్‌, క్లాప్‌ లాంటి అనేక ప్రయోగాలు పాఠశాల విద్యలో జరిగి పాఠశాల విద్యను మొత్తం భ్రష్టుపట్టించారు. ఒక విధానాన్ని అమలుపరిచేటప్పుడు ఆ విధానం ఏ దేశంలో లేదా ఏ రాష్ట్రంలో సత్ఫలితాలను ఇచ్చిందో, లేదా పరిశీలన చేయకుండానే ఎస్‌సీఈఆర్‌టీలోని కొంతమంది మేధావులు అధికార వ్యవస్థకు అనేక భ్రమలు కల్పించి పాఠశాల విద్యలో ప్రవేశపెడుతున్నారు. అవగాహన కోసం పాఠశాల సముదాయ సమావేశాలంటూ ఉపాధ్యాయుడి సమయాన్ని మొత్తం నాశనం చేయడమే కాక పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్ళైనా ఇప్పటికీ ఇంకా అర్థం కాని పరిస్థితి ఉపాధ్యాయులలో నెలకొని ఉంది. కొద్ది రోజులు బోధనలో సంస్కరణలు, మరికొద్ది రోజులు పరీక్షల విధానంలో సంస్కరణలు, పాఠ్య పుస్తకాలలో సంస్కరణలు ఇలా పూటకో ఆలోచన, గడియకో నిర్ణయంతో ఉపాధ్యాయులను గజిబిజికి గురిచేస్తున్నారు. అట్లాంటి నిర్ణయాలలో భాగంగా వచ్చిందే ఈ సీసీఈ! ఈ విధానంలో విద్యార్థి సంతోషం (జాయ్‌ఫుల్‌)గా విద్యను అభ్యసిస్తాడని చెప్పారు. కానీ సంతోషం దేవుడెరుగు విద్యార్థులకు చుక్కలు కనబడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకోకుండానే ఈ విధానం ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఇది సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలుచేస్తున్న పాఠశాలల్లో విఫలమవుతున్న దశలో మన రాష్ట్రం దీనిని తలకెత్తుకున్నది. విద్యార్థికి ఉపాధ్యాయుడు బోధించేది ఏమీలేదు. అంతా విద్యార్థే నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు కేవలం ఒక గైడ్‌ మాత్రమే. పాఠ్యపుస్తకాల పాఠాల దగ్గర ప్రారంభమైన ఈ సంస్కరణ మొదటి సంవత్సరంలోనే విద్యార్థులపై పెనుభారాన్ని మోపుతూ విపరీతమైన సిలబస్‌ను పెట్టడంతో మరుసటి సంవత్సరానికి చాలా సిలబస్‌ను తొలగించాల్సి వచ్చింది. అయినా ఇప్పటికి ఇంకా సిలబస్‌ భారం విద్యార్థులపై ఎక్కువగానే ఉంది. దీనికి తోడు అదనంగా 1. కళలు, సాంస్కృతిక విద్య, 2. ఆరోగ్య, వ్యాయామ విద్య (యోగ, ధ్యానం), 3. పని, కంప్యూటర్‌ విద్య, 4. విలువల విద్య, జీవన నైపుణ్యాలు లాంటి నాలుగు సహా పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. వీటిని బోధించడానికి ఏ పాఠశాలలో కూడా ఒక్క బోధకుడిని కూడా నియామకం చేయలేదు! వీటిపై కించెత్తు అవగాహన లేని ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులే వీటిని బోధించాలట! ఉపాధ్యాయుల్లో ఎంతమందికి కంప్యూటర్‌ విద్య, సంగీతం, కళలు, నృత్యం పట్ల అవగాహన ఉంటుంది? కనీసం వాటిల్లో శిక్షణ ఏమైనా ఎవరికైనా ఇచ్చారా అంటే అదీ లేదు! సీసీఈ విధానం విద్యార్థిని ఒక రిపోర్టర్‌గా, ఒక రచయితగా, ఒక కవిగా, ఒక నటునిగా, ఒక కొరియోగ్రాఫర్‌గా, ఒక నాటక కర్తగా, ఒక చిత్రకారునిగా, ఒక గాయకునిగా, ఒక వ్యాసకర్తగా ఇంకా ఇలా అనేక రకాలుగా మార్చాలనే సంకల్పం పైకి చూస్తే బాగానే ఉన్నట్టు, విద్యావ్యవస్థలో ఓ అద్భుత విద్యార్థిని సృష్టించబోతున్నట్లు అనిపిస్తుంది. విద్యార్థిని ఒక మంచి పౌరుని తయారు చేసే ప్రక్రియ ఈ విధానంలో లేదు. పాత పరీక్షల పద్ధతిలో అయితే ప్రతి సబ్జెక్ట్‌కు 100 మార్కులకు ప్రశ్న పత్రం ఇచ్చేవారు. హిందీకి మినహా మిగిలిన సబ్జెక్ట్‌లన్నింటికీ కూడా రెండు పేపర్ల విధానం అమలులో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు అనేక తర్జనభర్జనల అనంతరం హిందీ మినహా మిగిలిన సబ్జెక్ట్‌లన్నింటికి రెండు పేపర్ల విధానం కొనసాగించినప్పటికి 80 (40+40) మార్కులకు ఒక సబ్జెక్ట్‌కు పరీక్ష నిర్వహిస్తారు. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్‌ మార్కులుగా నిర్ణయించడం జరిగింది. ప్రతి ఫార్మటీవ్‌ టెస్ట్‌లో (నిర్మాణాత్మక పరీక్ష) విద్యార్థి పరిశీలనాంశాలు, విద్యార్థి వ్రాయవలసిన నోట్స్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌, వ్రాత పరీక్ష మొత్తం ఈ నాలుగు అంశాలకు కలిపి 20 మార్కులుగా నిర్ణయించారు. ఈ విధంగా ఆ నాలుగు ఫార్మటీవ్‌ టెస్ట్‌లకు సంబంధించిన 80 మార్కులను సరాసరి చేసి 20 కి కుదించగా వచ్చేవే ఇంటర్నల్‌ మార్కులు. ఇందులో 10వ తరగతి విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో నమోదు చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు చెందిన వీటి రికార్డ్స్‌ను పాఠశాలలో భద్రపరుచవలసి ఉంటుంది. ఈ మార్కులు సరియైన విధంగా నమోదు చేసారా లేదా పరిశీలించడం కోసం ప్రతి ఫార్మటీవ్‌ టెస్ట్‌ అనంతరం ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పరచడం జరుగుతుంది. పులులు వస్తున్నాయి మేకల్లారా జాగ్రత్త అన్నట్లుగా ప్రకటనలు ఉంటాయి. అయితే ఈ బృందాల పరిశీలనలో తేలిన అంశమేమిటంటే 60 శాతం ప్రైవేటు పాఠశాలలకు ఈ విధానం అర్థంకాలేదు. వీటికి సంబంధించిన విద్యార్థి రికార్డ్స్‌ను ఇప్పటి వరకు ఏవిధంగా రాయించాలో తెలియడంలేదు. సందర్శన బృందాలకు వాళ్ళే ఎదురు ప్రశ్న వేస్తూ ఎంతో కొంత ముట్ట జెప్పి తాము ఎటువంటి రికార్డ్స్‌ లేకుండా కాగితాలపై నమోదు చేసిన మార్కులకు అప్రూవల్‌ ఇవ్వమని కోరుతున్నారు. ఈ బృందాలకు విందులు, వినోదాలకు ఆటవిడుపుగా మారింది. ప్రైవేటు పాఠశాలలకైతే ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. మొత్తం ఫీజు వసూలు చేసుకోవడానికి ఇదో మాస్టర్‌ ప్లాన్‌లా ఉంది. మొత్తం ఫీజు కడితేనే మీ పిల్లలకు 20 మార్కులు వేస్తాం అంటున్నారు. మీ పిల్లలకు 20కి ఇరవై మార్కులు కావాలంటే అదనంగా మరో రెండు వేలో, మూడు వేలో సమర్పించండి అని బహిరంగంగా వసూలు చేసే పాఠశాలలు కోకొల్లలు. కొన్ని పాఠశాలలవారైతే దీనిని పాఠశాల ఫీజులో భాగం చేసారు. ఇంటర్నల్‌ మార్కులతో అమ్మాయిలు అనేక ఇబ్బందులు, వేధింపులను ఎదుర్కొంటున్నారు. కుల జాఢ్యం కూడా ఇందులో తగలడింది. కొన్ని పాఠశాలల్లోనైతే అందరికి ఇరవైకి ఇరవై మార్కులు వస్తున్నాయి. విద్యార్థులు సకాలంలో ఫార్మటీవ్‌ టెస్ట్‌లు రాసి, ప్రాజెక్ట్‌ పనులు, పరిశీలనాంశాలు, రాత పనిని సమర్పించి మార్కులు పొందాలి. ఈ పనులను సకాలంలో పూర్తి చేసి సమర్పించని విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగి, తప్పు ఉపాధ్యాయుని మీదకు నెట్టి విద్యాశాఖాధికారులు వారిని బలిచేశారు. పాఠశాలల్లో నిరంతరం ఇచ్చే ప్రాజెక్ట్‌ పనులతో విద్యార్థి కంప్యూటర్‌ సెంటర్స్‌ చుట్టే తిరుగుతున్నాడు. ఈ విధానం వేల రూపాయలను కంప్యూటర్‌ సెంటర్లకు దోచిపెడుతున్నదని తల్లిదండ్రులు అభిప్రాయపడటం మా యూనియన్‌ అధ్యయనంలో తేలింది. ఈ విధానంలో ప్రవేశపెట్టిన పనుల వలన చదవడంలో రాయడంలో విద్యార్థి వెనుకబడుతున్నాడు. విద్యార్థిపై మానసిక ఒత్తిడి భాగా పెరిగింది. పాఠశాలలోను, ఇంటి దగ్గర కూడా విద్యార్థికి ప్రైవేట్‌ జీవితాన్ని ఈ సీసీఈ విధానం దోచేసింది. అంతేకాదు ప్రతి ఉపాధ్యాయుడు తమ తమ సబ్జెక్ట్‌లకు చెందిన పనులను పదే పదే అడుగడంతో ఆ బాధలు భరించలేక విద్యార్థులు పాఠశాలకు రోజుల తరబడి హాజరు కావడం లేదు. ఈ నూతన అంశాలన్నింటిని ప్రవేశ పెట్టిన సందర్భాలలో కాని రాష్ట్ర విద్యాశాఖ, మేధావులు ఉపాధ్యాయులను కాని, ఉపాధ్యాయ సంఘాలను కాని మాట మాత్రంగా కూడా అభిప్రాయం అడుగలేదు. విద్యార్థుల స్థాయిని, సామర్థ్యాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఈ ప్రయోగాలన్నింటిని తరచి తరిచి చూస్తే ఒక్క అంశం బోధపడుతుంది. పాపం చిన్న పిల్లలకు వాళ్ళపై జరుగుతున్న ప్రయోగాలు తెలియవు. వాళ్ళ అభిప్రాయాలు అడిగేవాళ్ళులేరు, వాళ్ళకు తెలియజెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకు గొంతులేదు. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రయోగాల విషయంలో కళాశాల విద్యార్థుల్లాగా వాళ్ళకు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తెలియదు. విద్యావంతులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థి సంఘాల మిత్రులారా ఇప్పటికైనా ఈ గొంతులేని పాఠశాల విద్యార్థుల పక్షాన మాట్లాడండి. లేక పోతే చరిత్ర మనల్ని క్షమించకపోవచ్చు!డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడురాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్‌ సంఘం (టీటీయూ)  ఈ విధానంలో విద్యార్థి సంతోషం (జాయ్‌ఫుల్‌)గా విద్యను అభ్యసిస్తాడని చెప్పారు. కానీ సంతోషం దేవుడెరుగు విద్యార్థులకు చుక్కలు కనబడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకోకుండానే ఈ విధానం ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఇది సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలుచేస్తున్న పాఠశాలల్లో విఫలమవుతున్న దశలో మన రాష్ట్రం దీనిని తలకెత్తుకున్నది. విద్యార్థికి ఉపాధ్యాయుడు బోధించేది ఏమీలేదు. అంతా విద్యార్థే నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు కేవలం ఒక గైడ్‌ మాత్రమే. పాఠ్యపుస్తకాల పాఠాల దగ్గర ప్రారంభమైన ఈ సంస్కరణ మొదటి సంవత్సరంలోనే విద్యార్థులపై పెనుభారాన్ని మోపుతూ విపరీతమైన సిలబస్‌ను పెట్టడంతో మరుసటి సంవత్సరానికి చాలా సిలబస్‌ను తొలగించాల్సి వచ్చింది. అయినా ఇప్పటికి ఇంకా సిలబస్‌ భారం విద్యార్థులపై ఎక్కువగానే ఉంది. దీనికి తోడు అదనంగా 1. కళలు, సాంస్కృతిక విద్య, 2. ఆరోగ్య, వ్యాయామ విద్య (యోగ, ధ్యానం), 3. పని, కంప్యూటర్‌ విద్య, 4. విలువల విద్య, జీవన నైపుణ్యాలు లాంటి నాలుగు సహా పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. వీటిని బోధించడానికి ఏ పాఠశాలలో కూడా ఒక్క బోధకుడిని కూడా నియామకం చేయలేదు! వీటిపై కించెత్తు అవగాహన లేని ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులే వీటిని బోధించాలట! ఉపాధ్యాయుల్లో ఎంతమందికి కంప్యూటర్‌ విద్య, సంగీతం, కళలు, నృత్యం పట్ల అవగాహన ఉంటుంది? కనీసం వాటిల్లో శిక్షణ ఏమైనా ఎవరికైనా ఇచ్చారా అంటే అదీ లేదు! సీసీఈ విధానం విద్యార్థిని ఒక రిపోర్టర్‌గా, ఒక రచయితగా, ఒక కవిగా, ఒక నటునిగా, ఒక కొరియోగ్రాఫర్‌గా, ఒక నాటక కర్తగా, ఒక చిత్రకారునిగా, ఒక గాయకునిగా, ఒక వ్యాసకర్తగా ఇంకా ఇలా అనేక రకాలుగా మార్చాలనే సంకల్పం పైకి చూస్తే బాగానే ఉన్నట్టు, విద్యావ్యవస్థలో ఓ అద్భుత విద్యార్థిని సృష్టించబోతున్నట్లు అనిపిస్తుంది. విద్యార్థిని ఒక మంచి పౌరుని తయారు చేసే ప్రక్రియ ఈ విధానంలో లేదు. పాత పరీక్షల పద్ధతిలో అయితే ప్రతి సబ్జెక్ట్‌కు 100 మార్కులకు ప్రశ్న పత్రం ఇచ్చేవారు. హిందీకి మినహా మిగిలిన సబ్జెక్ట్‌లన్నింటికీ కూడా రెండు పేపర్ల విధానం అమలులో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు అనేక తర్జనభర్జనల అనంతరం హిందీ మినహా మిగిలిన సబ్జెక్ట్‌లన్నింటికి రెండు పేపర్ల విధానం కొనసాగించినప్పటికి 80 (40+40) మార్కులకు ఒక సబ్జెక్ట్‌కు పరీక్ష నిర్వహిస్తారు. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్‌ మార్కులుగా నిర్ణయించడం జరిగింది. ప్రతి ఫార్మటీవ్‌ టెస్ట్‌లో (నిర్మాణాత్మక పరీక్ష) విద్యార్థి పరిశీలనాంశాలు, విద్యార్థి వ్రాయవలసిన నోట్స్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌, వ్రాత పరీక్ష మొత్తం ఈ నాలుగు అంశాలకు కలిపి 20 మార్కులుగా నిర్ణయించారు. ఈ విధంగా ఆ నాలుగు ఫార్మటీవ్‌ టెస్ట్‌లకు సంబంధించిన 80 మార్కులను సరాసరి చేసి 20 కి కుదించగా వచ్చేవే ఇంటర్నల్‌ మార్కులు. ఇందులో 10వ తరగతి విద్యార్థులు సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో నమోదు చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు చెందిన వీటి రికార్డ్స్‌ను పాఠశాలలో భద్రపరుచవలసి ఉంటుంది. ఈ మార్కులు సరియైన విధంగా నమోదు చేసారా లేదా పరిశీలించడం కోసం ప్రతి ఫార్మటీవ్‌ టెస్ట్‌ అనంతరం ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పరచడం జరుగుతుంది. పులులు వస్తున్నాయి మేకల్లారా జాగ్రత్త అన్నట్లుగా ప్రకటనలు ఉంటాయి. అయితే ఈ బృందాల పరిశీలనలో తేలిన అంశమేమిటంటే 60 శాతం ప్రైవేటు పాఠశాలలకు ఈ విధానం అర్థంకాలేదు. వీటికి సంబంధించిన విద్యార్థి రికార్డ్స్‌ను ఇప్పటి వరకు ఏవిధంగా రాయించాలో తెలియడంలేదు. సందర్శన బృందాలకు వాళ్ళే ఎదురు ప్రశ్న వేస్తూ ఎంతో కొంత ముట్ట జెప్పి తాము ఎటువంటి రికార్డ్స్‌ లేకుండా కాగితాలపై నమోదు చేసిన మార్కులకు అప్రూవల్‌ ఇవ్వమని కోరుతున్నారు. ఈ బృందాలకు విందులు, వినోదాలకు ఆటవిడుపుగా మారింది. ప్రైవేటు పాఠశాలలకైతే ఇదో పెద్ద ఆదాయ వనరుగా మారింది. మొత్తం ఫీజు వసూలు చేసుకోవడానికి ఇదో మాస్టర్‌ ప్లాన్‌లా ఉంది. మొత్తం ఫీజు కడితేనే మీ పిల్లలకు 20 మార్కులు వేస్తాం అంటున్నారు. మీ పిల్లలకు 20కి ఇరవై మార్కులు కావాలంటే అదనంగా మరో రెండు వేలో, మూడు వేలో సమర్పించండి అని బహిరంగంగా వసూలు చేసే పాఠశాలలు కోకొల్లలు. కొన్ని పాఠశాలలవారైతే దీనిని పాఠశాల ఫీజులో భాగం చేసారు. ఇంటర్నల్‌ మార్కులతో అమ్మాయిలు అనేక ఇబ్బందులు, వేధింపులను ఎదుర్కొంటున్నారు. కుల జాఢ్యం కూడా ఇందులో తగలడింది. కొన్ని పాఠశాలల్లోనైతే అందరికి ఇరవైకి ఇరవై మార్కులు వస్తున్నాయి. విద్యార్థులు సకాలంలో ఫార్మటీవ్‌ టెస్ట్‌లు రాసి, ప్రాజెక్ట్‌ పనులు, పరిశీలనాంశాలు, రాత పనిని సమర్పించి మార్కులు పొందాలి. ఈ పనులను సకాలంలో పూర్తి చేసి సమర్పించని విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగి, తప్పు ఉపాధ్యాయుని మీదకు నెట్టి విద్యాశాఖాధికారులు వారిని బలిచేశారు. పాఠశాలల్లో నిరంతరం ఇచ్చే ప్రాజెక్ట్‌ పనులతో విద్యార్థి కంప్యూటర్‌ సెంటర్స్‌ చుట్టే తిరుగుతున్నాడు. ఈ విధానం వేల రూపాయలను కంప్యూటర్‌ సెంటర్లకు దోచిపెడుతున్నదని తల్లిదండ్రులు అభిప్రాయపడటం మా యూనియన్‌ అధ్యయనంలో తేలింది. ఈ విధానంలో ప్రవేశపెట్టిన పనుల వలన చదవడంలో రాయడంలో విద్యార్థి వెనుకబడుతున్నాడు. విద్యార్థిపై మానసిక ఒత్తిడి భాగా పెరిగింది. పాఠశాలలోను, ఇంటి దగ్గర కూడా విద్యార్థికి ప్రైవేట్‌ జీవితాన్ని ఈ సీసీఈ విధానం దోచేసింది. అంతేకాదు ప్రతి ఉపాధ్యాయుడు తమ తమ సబ్జెక్ట్‌లకు చెందిన పనులను పదే పదే అడుగడంతో ఆ బాధలు భరించలేక విద్యార్థులు పాఠశాలకు రోజుల తరబడి హాజరు కావడం లేదు. ఈ నూతన అంశాలన్నింటిని ప్రవేశ పెట్టిన సందర్భాలలో కాని రాష్ట్ర విద్యాశాఖ, మేధావులు ఉపాధ్యాయులను కాని, ఉపాధ్యాయ సంఘాలను కాని మాట మాత్రంగా కూడా అభిప్రాయం అడుగలేదు. విద్యార్థుల స్థాయిని, సామర్థ్యాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఈ ప్రయోగాలన్నింటిని తరచి తరిచి చూస్తే ఒక్క అంశం బోధపడుతుంది. పాపం చిన్న పిల్లలకు వాళ్ళపై జరుగుతున్న ప్రయోగాలు తెలియవు. వాళ్ళ అభిప్రాయాలు అడిగేవాళ్ళులేరు, వాళ్ళకు తెలియజెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకు గొంతులేదు. వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రయోగాల విషయంలో కళాశాల విద్యార్థుల్లాగా వాళ్ళకు ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తెలియదు. విద్యావంతులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థి సంఘాల మిత్రులారా ఇప్పటికైనా ఈ గొంతులేని పాఠశాల విద్యార్థుల పక్షాన మాట్లాడండి. లేక పోతే చరిత్ర మనల్ని క్షమించకపోవచ్చు!డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడురాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్‌ సంఘం (టీటీయూ)
editorial
16,325
08-11-2017 18:58:18
వినూత్నంగా టోల్ వసూళ్ళు : నితిన్ గడ్కరీ
ముంబై : జాతీయ రహదారులపై టోల్ వసూళ్ళ విధానంలో కొత్తదనం రాబోతోంది. వచ్చే నెల నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. డిజిటైజేషన్, నగదు రహిత లావాదేవీల నిర్వహణ పట్ల ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నగదు రహిత టోల్ వసూలు సులభంగా జరిగేందుకు వీలుగా డిసెంబరు 1 తర్వాత రోడ్డుపైకి వచ్చే వాహనాలన్నిటికీ ఎఫ్ఏఎస్‌ట్యాగ్‌ను ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 7.5 లక్షల వాహనాలకు ఎఫ్ఏఎస్‌ట్యాగ్‌లు ఉన్నట్లు తెలిపారు. వచ్చే మార్చినాటికి ఈ సంఖ్య 25 లక్షలకు పెరుగుతుందన్నారు. రాబోయే రెండు నెలల్లో దేశంలోని 3,800 రహదారులను ఎఫ్ఏఎస్‌ట్యాగ్‌కు అనువుగా మార్చుతామని తెలిపారు. ఎఫ్ఏఎస్‌ట్యాగ్‌ విధానంలో రోజుకు రూ.10 కోట్లు ఆదాయం వస్తోందని, ఇది వచ్చే మార్చినాటికి 30 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సమయం, ఇంధనం ఆదా అయ్యేందుకు దోహదపడే చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని గడ్కరీ తెలిపారు. అటువంటి చర్యల్లో జీఎస్‌టీ ఒకటి అని వివరించారు. జీఎస్‌టీ వల్ల రవాణాదారులకు అనేక రకాల ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో లారీల ప్రయాణ సమయం దాదాపు 20 శాతం వరకు తగ్గిందని తెలిపారు.
nation
958
08-06-2017 00:48:39
ప్రభుత్వ అభ్యర్థనకు నో...
రేట్ల కోతను ఆశిస్తున్న ప్రభుత్వం ఈ నెల 1,2 తేదీల్లో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కావాలని ఎంపిసి సభ్యులను కోరింది. కాని స్వయంప్రతిపత్తిని పోగొట్టుకునేందుకు ఇష్టం లేని ఎంపిసి ఆ అభ్యర్థనను తిరస్కరించింది. మొత్తం ఆరుగురు సభ్యులూ ఆర్థిక శాఖ అధికారులను కలిసేందుకు విముఖత ప్రదర్శించారని ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు.
business
20,959
30-10-2017 15:37:52
ఆ సిక్సర్‌తో కోహ్లీ ప్రాణం లేచివచ్చింది..!
న్యూఢిల్లీ: కాన్పూర్‌ వేదికగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై చిరస్మరణీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సాధించిన అద్భుత సెంచరీతో భారత జట్టు కివీస్ ముందు భారీ లక్ష్యం ఉంచేందుకు, చారిత్రాత్మక సిరీస్ గెలుచుకునేందుకు ఉపయోగపడింది. ప్రత్యేకించి అతడి బ్యాంటింగ్‌లో జాలువారిన ఓ సిక్సర్‌పై బీసీసీఐ మరో కనువిందైన వీడియో విడుదల చేసింది. రోహిత్ కొట్టిన బంతిని కెప్టెన్ కోహ్లీ తదేకంగా చూస్తున్న ఆసక్తికర హావభావాలు ఇందులో రికార్డయ్యాయి. సిక్సర్ అని నిర్ధారణకు రాగానే కెప్టెన్ ముఖంలో ఆనందాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. కాన్పూర్ మ్యాచ్‌లో రోహిత్ 147 పరుగులతో ప్రత్యర్థి జట్టును పరుగులు పెట్టించగా... కోహ్లీ సైతం అంతే దూకుడుతో ఆడుతూ 113 పరుగులు రాబట్టాడు. అంతేకాదు అతి తక్కువ మ్యాచుల్లోనే 9 వేల పరుగుల మైలురాయిని దాటి ఔరా అనిపించాడు. వీడియో కోసం క్లిక్ చేయండి  ఆ ఒలింపిక్స్ ఈ సారి భారత్‌లోనేనట  క్రికెట్ అభిమానులకు ఓ శుభవార్త
sports
9,474
23-08-2017 11:59:46
బాగా సంపాదిస్తున్న టాప్ 10 నటుల్లో ముగ్గురు మనోళ్లే!
అందరి సంపాదనలందు.. యాక్టర్ల సంపాదన వేరయా అంటుంది ప్రేక్షక లోకం. వీరి సంపాదన ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. అందుకే వీరి సంపాదన ఎంతో తెలుసుకోవాలని సినీ ప్రియులు ఆసక్తిగా చూస్తుంటారు. ఈ ఏడాది కూడా ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక వివిధ రంగాల్లో బాగా సంపాదిస్తున్న సెలబ్రిటీల వివరాలను తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బాగా సంపాదిస్తున్న యాక్టర్లలో మనవాళ్లు ముగ్గురుండటం విశేషం. 2016 జూన్ 1 నుంచి 2017 జూన్ 1 మధ్య కాలంలో వివరాలను బేస్ చేసుకుని ఫోర్బ్స్ పత్రిక ఈ వివరాలను రిలీజ్ చేసింది.  అవునండీ మీరు చదువుతున్నది నిజమే. ఫోర్బ్స్ విడుదల చేసిన లిస్టులో టాప్ 10 లో మన ఇండియన్ స్టార్స్ ముగ్గురున్నారు. హాలీవుడ్ స్టార్స్ మార్క్ వాబర్గ్ 68 మిలియన్ డాలర్ల సంపాదనతో నెం.1 స్థానంలో, డ్వేన్ జాన్సన్ 65 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో, విన్ డీసెల్ 54.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 3వ స్థానంలో నిలిచారు. మన కరెన్సీ ప్రకారం ఈ ముగ్గురి సంపాదనలు వరుసగా.. రూ. 435, 416, 349 కోట్లు. మరో హాలీవుడ్ నటుడు ఆడమ్ సాండ్లర్ 50.5 మిలియన్ డాలర్లతో 4వ స్థానంలో.. ఇంటర్నేషనల్ నటుడు జాకీ చాన్ 49 మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో.. ఐరన్ మ్యాన్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ 48 మిలియన్ డాలర్లతో 6వ స్థానంలో.. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ 43 మిలియన్ డాలర్లతో 7వ స్థానంలో నిలిచారు. ఇక మన ఇండియన్ స్టార్ హీరోలు వరుసగా 8, 9, 10స్థానాల్లో నిలిచారు. షారుక్ ఖాన్ 38 మిలియన్ డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో ఉన్నారు. మన కరెన్సీ ప్రకారం రూ. 243.5 కోట్లు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ 37 మిలియన్ డాలర్ల సంపాదనతో 9వ స్థానంలో నిలిచారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.237 కోట్లు. అక్షయ్ కుమార్ 35.5 మిలియన్ డాలర్లతో 10వ స్థానంలో ఉన్నారు. మన కరెన్సీ ప్రకారం అక్షయ్ సంపాదన రూ. 227.5 కోట్ల రూపాయలు.
entertainment
13,241
08-12-2017 08:25:44
ఓమన్ విమాన కో పైలెట్‌కు లైసెన్స్ లేదని...విమానం నిలిపివేత
న్యూఢిల్లీ : వాహనం నడుపుతున్న డ్రైవరు తన డ్రైవింగ్ లైసెన్సును ఇంట్లో మరచిపోతే ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించడం సర్వసాధారణం. కాని...మస్కట్ దేశానికి చెందిన ఓమన్ విమాన కోపైలెట్ లైసెన్సు లేకుండానే విమానం నడిపేందుకు విధులకు హాజరైన ఘటన న్యూఢిల్లీలో సంచలనం రేపింది. ఓమన్ విమానం న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలు దేరాల్సి ఉండగా సాధారణ తనిఖీల్లో ఆ విమాన కో పైలెట్ కు లైసెన్సు లేదని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. అంతే ఓమన్ విమానం వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు నిరాకరించారు. ఓమన్ ఎయిర్ కు చెందిన ఢిల్లీ- మస్కట్ విమాన కోపైలెట్ వద్ద లైసెన్సు లేకపోవడంతో విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. లైసెన్సు లేకుండా పైలెట్లు విమానాలు నడుపుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
nation
13,579
06-10-2017 10:39:46
లేడీ డాక్టర్‌పై బురఖాలు ధరించిన ఇద్దరు దుండగుల హత్యాయత్నం
చెన్నై : స్థానిక పెరంబూరులో నివసిస్తున్న లేడీ డాక్టర్‌పై బురఖాలు ధరించిన ఇద్దరు దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రైవేట్‌ క్లినిక్‌ యజమాని అయిన డాక్టర్‌ సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పెరంబూరు పటేల్‌రోడ్డులో డాక్టర్‌ షణ్ముగసుందరం, డాక్టర్‌ రమ్య (33) దంపతులు నివసిస్తున్నారు. రమ్య కోయంబేడులో సంతాన సాఫల్య కేంద్రాన్ని నడుపుతున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని రమ్య కారులో ఇంటికి చేరుకుంది. కారును పార్కింగ్‌ చేసి రెండో అంతస్తులో ఉన్న తన ప్లాట్‌కు వెళుతున్న రమ్యను బురఖాలు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు. ఆమె పెట్టిన కేకలు విని చుట్టుపక్కలవారు పరుగెత్తుకొచ్చి రమ్యను చికిత్స నిమిత్తం పోరూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దుండగుల దాడిలో రమ్య తల, మెడ, వీపుపై కత్తిపోటు గాయాలయ్యాయి. సెంబియం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపగా పాతకక్షల నేపథ్యంలో రమ్యపై హత్యాయత్నం జరిగినట్లు తెలిసింది. చూళైమేడులో థామస్‌ అనే వ్యక్తి నడుపుతున్న ఫెర్టిలిటీ సెంటర్‌లో డాక్టర్‌ రమ్య పనిచేస్తుండేది. థామ్‌సతో గొడవల కారణంగా ఉద్యోగం మాని, కోయంబేడులో ఆమె కొత్తగా క్లినిక్‌ను ప్రారంభించింది. ఇటీవల థామస్‌ క్లినిక్‌ నుంచి ఇద్దరు ఉద్యోగం మానుకుని రమ్య ప్రారంభించిన క్లినిక్‌లో చేరారు. దీంతో ఆగ్రహించిన థామస్‌ రమ్యపై తన అనుచరులతో దాడి చేయించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు థామస్‌, పళనిసామి, యోనా, ముఖిలన్‌, సత్యకళ, భవానీ అనే ఆరుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
nation
13,827
15-09-2017 02:56:48
ఇరాక్‌లో ఆత్మాహుతి దాడులు..
74 మంది మృతిబాగ్దాద్‌, సెప్టెంబరు 14: ఆత్మాహుతి దాడులు, కాల్పులతో ఇరాక్‌ రక్తసిక్తమైంది. ఈ దాడుల్లో 74 మంది మృతి చెందగా.. 93 మంది గాయపడ్డారు. ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. నసిరియా నగరంలో ఓ రెస్టారెంట్‌పై, పోలీస్ చెక్‌పోస్టుపై టెర్రరిస్టులు విరుచుకుపడ్డారు. ఆత్మాహుతి దళ సభ్యుడొకరు రెస్టారెంట్‌లో తనను తాను పేల్చేసుకున్నాడు. అదే సమయంలో మరో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. మృతుల్లో ఎక్కువగా ఇరానియన్లు ఉన్నారు. అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీస్‌ చెక్‌పోస్టుపై మరో ఇద్దరు సూసైడ్‌ బాంబర్లు దాడి చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న వ్యాన్‌తో వచ్చి తమను తాము పేల్చేసుకున్నారు.
nation
7,071
28-03-2017 12:49:47
బికినీలో కూతురుతో మాజీ విశ్వసుందరి డాన్స్!
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌.. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. హీరోయిన్‌గా తప్పుకొన్నా.. పలు స్టేట్‌మెంట్లతో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. పెళ్లి చేసుకోకుండా కుమారిగానే మిగిలిపోయిన ఈ విశ్వ సుందరి.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకొంటోంది. వారితో కలిసి ఫారిన్ టూర్లకు వెళుతూ ఫెమినిజం, స్త్రీ స్వాతంత్ర్యం గురించి వారికి చెబుతోంది. దత్తత చేసుకున్నా ఇద్దరు కూతుళ్లను సొంత కూతుళ్లకన్నా ఎక్కువగా చూసుకుంటోంది సుష్మిత. ఇక, వారితో కలిసి ఎంజాయ్ చేసిన ఓ వీడియోను సుష్మిత గత రాత్రి సోషల్ మీడియాలో పెట్టింది. తన 12 ఏళ్ల కూతురు రెనీ, 7 ఏళ్ల కూతురు అలీసాతో డాన్స్ వేసిన వీడియోను పోస్ట్ చేసింది. ప్రముఖ పాప్ గాయకుడు ఎడ్ షెరాన్ కంపోజ్ చేసి.. ‘షేప్ ఆఫ్ యూ’ అనే పాటకు చిన్న కూతురుతో కలిసి బికినీలో డాన్స్ వేసింది. బికినీలో సుష్మిత మెరవడమే కాకుండా తన కూతురుకు కూడా బికినీ వేసి.. ఇండైరెక్ట్‌గా ఓ మెసేజ్ ఇచ్చేస్తోందని ఆ వీడియో చూసిన నెటిజన్లు అంటున్నారు. ‘‘అయితే కూర్చోవడం.. డాన్స్ చేయడం.. అని ఓ రెండు ఆప్షన్లిస్తే తాను మాత్రం కచ్చితంగా డాన్స్‌నే ఎంచుకుంటాను’’ అని చెబుతోంది సుష్మితా సేన్.
entertainment
18,489
19-12-2017 03:59:49
చిలీ అధ్యక్షుడిగా సెబాస్టియన్‌ పినెరా
శాంటియగో, డిసెంబరు 18: చిలీ అధ్యక్షుడిగా సెబాస్టియన్‌ పినెరా మరోసారి ఎన్నికయ్యారు. సోమవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో సెబాస్టియన్‌ పినెరా 55శాతం ఓట్లతో విజయం సాధించారు.
nation
18,664
10-02-2017 01:55:15
అమెరికా అటార్నీ జనరల్‌గా జెఫ్‌ సెషన్స్‌
వాషింగ్టన్‌, ఫిబ్రవరి 9: అమెరికా 84వ అటార్నీ జనరల్‌గా అలబామా సెనేటర్‌ జెఫ్‌ సెషన్స్‌ నియమితులయ్యారు. ఆయన నియామకానికి అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది. జెఫ్‌ నియామకాన్ని అడ్డుకొనేందుకు సెనేట్‌లో డెమోక్రాట్లు తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు 30 గంటలపాటు సెనేట్‌లో జెఫ్‌ నియామకంపై చర్చ నడిచింది. డెమోక్రాట్లు వ్యతిరేకించినా చివరకు 52-47 ఓట్లతో జెఫ్‌ అటార్నీ జనరల్‌గా ఆమోదం పొందారు. వెంటనే ఆయన సెనేటర్‌ పదవికి రాజీనామా చేశారు. తొలి నుంచీ హెచ్‌-1బి వీసాల జారీని జెఫ్‌ వ్యతిరేకిస్తున్నారు. కాగా, ఐఎస్‌ వంటి ఇస్లామిక్‌ ఉగ్రవాదులతో అమెరికాకు ముప్పు పొంచి ఉందని వైట్‌హౌస్‌ పేర్కొంది. అమెరికన్ల రక్షణకు ట్రంప్‌ తగిన చర్యలు తీసుకుంటున్నారని, ఈ విషయంలో ఆయన చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ తెలిపారు. కాగా.. ట్రంప్‌ పాలన 9/11 దాడుల సమయంలో అమెరికా పరిస్థితి కన్నా దారుణంగా ఉందని ద ప్రోగ్రెసివ్‌ మాన్‌హట్టన్‌ ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపల్‌ స్టీవ్‌ నెల్సన్‌ పేర్కొన్నారు.
nation
13,876
02-12-2017 17:35:42
బీజేపీ హిందుత్వ కార్డు...లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హిందుత్వ కార్డును ప్రధాన అస్త్రంగా బీజేపీ తెరపైకి తీసుకురానుందని బీఎస్‌పీ అధినేత్రి మాయవతి జోస్యం చెప్పారు. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ హిందుత్వ కార్డును తెరపైకి తీసుకురానుందని అన్నారు. ఇందులో భాగంగానే ఎన్నికలకు ముందు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా హిందుత్వ వాదాన్ని తెరపైకి తేనుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన 2019 ఎన్నికలను ముందస్తుగా నిర్వహించే అవకాశాలు కూడా లేకపోలేదన్నారు.  కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, విపక్షాలను లేకుండా చేసేందుకు కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతోందని మాయావతి మండిపడ్డారు. విపక్షాలపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు జరిపిస్తూ, సొంత వ్యక్తులపై వచ్చిన ఆరోపణలను మాత్రం కప్పిపుచ్చుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. బీఎస్‌పీని బలహీన పరచేందుకు దేశభక్తి పేరుతో బీజేపీ చేస్తున్న జిమ్మిక్కుల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2018లో ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ బలోపోతానికి బీఎస్‌పీ కార్యకర్తలు పట్టుదలగా కృషి చేయాలని మాయావతి పిలుపునిచ్చారు.
nation
7,546
21-03-2017 22:01:49
ఏడాదికి నాలుగు ‘బాహుబలు’లు రావాలి
‘‘నేను తమిళంలో చేసిన దాదాపు ప్రతి సినిమా తెలుగులో అనువాద రూపంలో వచ్చింది. ప్రతిసారీ తమిళంలో కంటే తెలుగులో పాటలు బాగా ఉన్నాయనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా పాటలను సీతారామశాస్త్రి గారు రాసిన విధానం కూడా అలాగే ఉంది. ‘బాహుబలి’ లాంటి సినిమాలతో ఇవాళ తెలుగు సినిమా ఎదిగిన విధానం చూసి గర్వంగా ఫీలవుతున్నా. ఏడాదికి నాలుగు ‘బాహుబలి’ లాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. మణిరత్నం నాకు సోదరుడు, మార్గదర్శకుడు, స్ఫూర్తిప్రదాత’’ అన్నారు ఆస్కార విజేత, ప్రఖ్యాత సంగీతకారుడు ఎ.ఆర్‌. రెహమాన్. మణిరత్నం దర్శకత్వంలో ఆయన సంగీతం సమకూర్చిన ‘చెలియా’ సినిమా పాటలు విడుదలయ్యాయి. కార్తీ, అదితీరావ్‌ హైదరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని మద్రాస్‌ టాకీస్‌ నిర్మించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు సమర్పిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఆడియో వేడుకలో గీత రచయిత సీతారామశాస్త్రి ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి ప్రతిని రెహమాన్‌కు అందజేశారు. సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి పాటలు రాయడంలో మణిరత్నంగారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. రెహమాన్ కేవలం మ్యూజిక్‌ డైరెక్టర్‌. దానికంటే ఇంకో స్థాయిపైన ఉండే వ్యక్తి. నేను తమిళ పాటల్ని అనువదించలేదు. అనుసృజన చేశాను. ఇందులో ‘మంచు ఆమని’ అనే పద బంధం ఉపయోగించాను. నాకు ఏడాదికో పాటనైనా ఇవ్వమని రెహమాన్ ను రిక్వెస్ట్‌ చేస్తున్నా’’ అన్నారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టాననీ, ఈ సినిమాకు డ్రీమ్‌ టీమ్‌తో పని చేశాననీ అదితి అన్నారు. కార్తీ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి పనిచేస్తుంటే మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లుగా అనిపించింది. ‘చెలియా’ నాకు స్పెషల్‌ ఫిల్మ్‌’’ అన్నారు. ఈ వేడుకలో నటి సుహాసిని, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నారు. మణిరత్నం మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ తెలుగులో మాట్లాడాలని అనుకుంటా. అది జరగదు. అందుకే ఈ సారి నా తెలుగు టీచర్‌, నా భార్యామణి, మణి భార్య.. సుహాసినిని తీసుకొచ్చాను. ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్‌డ్రాప్‌, అస్వాభావికమైన కార్తీ, అందమైన అదితితో మీ కోసం ‘చెలియా’ను తీశాను. ఈ సినిమాకు రెండు బలమైన స్తంభాలు.. ఎ.ఆర్‌. రెహమాన్, సీతారామశాస్త్రి. మా సినిమా, మా సంగీతం దిల్‌ రాజు చేతిలో భద్రంగా ఉంది’’ అని చెప్పారు.
entertainment
19,322
20-12-2017 01:34:33
పుజారాకు మూడో ర్యాంక్‌
దుబాయ్‌: భారత బ్యాట్స్‌మన్‌ చటేశ్వర్‌ పుజారా తాజా ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. పుజారా 54 టెస్టుల్లో 52.96 సగటుతో 4,396 పరుగులు సాధించి 873 పాయింట్లతో మూడో స్థానానికి చేరు కున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 945 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుం డగా, భారత కెప్టెన్‌ కోహ్లీ 893 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. స్మిత్‌ గత రెండే ళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతేగాక డాన్‌ బ్రాడ్‌మన్‌ ఆల్‌టైమ్‌ టాప్‌ 961 పాయింట్లకు కేవలం 16 పాయింట్ల దూరంలో నిలిచాడు. టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడు, నాలుగు స్థానాలలో ఉండగా ఇంగ్లండ్‌ ఓపెనింగ్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌, ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ జోష్‌ హాజల్‌వుడ్‌ టాప్‌ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విన్‌ రెండు, నాలుగు స్థానాలలో ఉన్నారు. పెర్త్‌ టెస్ట్‌తో డేవిడ్‌ మలాన్‌ (52), మిచెల్‌ మార్ష్‌ (65) తమ ర్యాంకింగ్‌ను గణ నీయంగా మెరుగుపరచుకున్నారు.
sports
21,352
25-03-2017 09:11:01
ఆసీస్ బ్యాటింగ్.. భారత జట్టులో సంచలన మార్పులు
ధర్మశాల: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సంగ్రామం క్లైమాక్స్‌కు చేరింది. నాలుగు టెస్టుల సిరీ్‌సలో 1-1తో సమంగా ఉన్న భారత, ఆస్ర్టేలియా మధ్య ఆఖరి పోరాటానికి రంగం సిద్ధమైంది. సిరీస్‌ విజేతను తేల్చే నాలుగో, చివరి మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. భారత కెప్టెన్ కోహ్లీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో రహానే జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కోహ్లీ స్థానంలో యువ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఇషాంత్ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకొచ్చారు. కుల్దీప్‌కు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కాగా, కెప్టెన్‌గా రహానేకు కూడా తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఆసీస్ మాత్రం రాంచీలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. పిచ్‌/వాతావరణంధర్మశాల పిచ్‌ సహజంగానే పేసర్లకు అనుకూలిస్తుంది. ఫాస్ట్‌ బౌలర్లు మంచి పేస్‌, బౌన్స్‌ను రాబట్టగలుగుతారు. అయితే, గతేడాది జరిగిన టీ-20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో వికెట్‌ స్లోగా, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం పిచ్‌పై పచ్చిక బాగా కనిపిస్తోంది. స్పిన్నర్లకు కూడా కాస్త సహకారం లభించేందుకు శనివారం ఉదయం నాటికి దాన్ని కత్తిరించే అవకాశం ఉంది. ఇక, ధర్మశాలలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అయితే, మూడో రోజు నుంచి ఇక్కడ తేలికపాటి వర్షం పడొచ్చని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. జట్లుభారత్: విజయ్‌‌, రాహుల్‌, పుజారా, రహానె(కెప్టెన్‌), కరుణ్‌ నాయర్‌, అశ్విన్‌, సాహా (వికెట్‌ కీపర్‌), జడేజా, కుల్దీప్, భువనేశ్వర్‌, ఉమేష్‌. ఆస్ట్రేలియా: వార్నర్‌, రెన్‌‌షా, స్మిత్ (కెప్టెన్‌), షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కోంబ్‌, మాక్స్‌వెల్‌, వేడ్‌ (వికెట్‌ కీపర్‌), ఒకీఫ్‌, కమిన్స్‌, లియాన్‌, హాజెల్‌వుడ్‌.
sports
20,429
27-12-2017 01:50:28
నేటినుంచి పోర్ట్స్‌ వాలీబాల్‌
కోచ్చి : బుధవారంనుంచి ఆరంభం కానున్న ఆలిండియా మేజర్‌ పోర్ట్స్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో ముంబయి, ట్యుటికోరన్‌, పరదీప్‌, చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం, మార్మగోవా, కొచ్చిన్‌ రేవుపట్టణాల జట్లు తలపడనున్నాయి. వాలీబాల్‌తోపాటు బీచ్‌వాలీబాల్‌ పోటీలనుకూడా నిర్వహించ నున్నారు. 100మందికిపైగా క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. రెండు క్రీడాంశాలలో కొచ్చిన్‌ రేవు పట్టణమే ప్రస్తుత చాంపియన్‌. పోటీలు డిసెంబర్‌ 29తో ముగుస్తాయి.
sports
11,887
24-01-2017 01:53:05
రోడ్ల పక్కన సైకిల్‌ ట్రాక్‌లు!
- నితిన్‌ గడ్కరి, కేంద్ర మంత్రి
nation
11,483
26-04-2017 16:28:54
సీఎంను తిరస్కరించి, పీఎంను ఎన్నుకున్నారు : యోగేంద్ర యాదవ్
న్యూఢిల్లీ : ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పొందడంతో కేజ్రీవాల్ మాజీ సహచరుడు, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రిని తిరస్కరించారని, ప్రధాన మంత్రిని ఎన్నుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఆప్‌పై ఉన్న ఆగ్రహం, వారికి బీజేపీపై ఉన్న నిరాశను అధిగమించిందన్నారు. ఆప్ ప్రభుత్వం మోసగించిందని ప్రజలు భావిస్తున్నారన్నారు. కౌన్సిలర్లను ఎన్నుకున్నారని, సీఎం (కేజ్రీవాల్)ను తిరస్కరించారని, పీఎం (నరేంద్ర మోదీ)ని ఎన్నుకున్నారని చెప్పారు. ఇదిలావుండగా ఎంసీడీ ఎన్నికల్లో తమ ఓటమికి కారణం ఈవీఎంలేనని, మోదీ ప్రభంజనం కాదని ఆప్ చెప్తోంది.
nation
5,738
29-06-2017 17:47:17
భామావిజయం @50 ఇయర్స్
ఎన్టీఆర్ హీరోగా సి. పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భామావిజయం’ నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. తెలుగునాట తరిగిపోని, చెరిగిపోని చరిత్ర సృష్టించిన లవకుశను రెండుసార్లు రూపొందిచిన దర్శకుడు సి.పుల్లయ్య.1963లో ఎన్టీఆర్‌తో తెలుగులో తొలిరంగుల చిత్రంలో లవకుశ తెరకెక్కించారు పుల్లయ్య. చాలామంది సి. పుల్లయ్య చివరి చిత్రం లవకుశ అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన పరమానందయ్య శిష్యుల కథ, భువనసుందరి, భామావిజయం చిత్రాలు రూపొందించారు. భామా విజయం ఆయన తీసిన చివరి చిత్రం.  1967లో సి.పుల్లయ్య రూపొందించిన గొల్లభామ ఆధారంగా 20 ఏళ్ల తర్వాత రూపొందడం విశేషం. గొల్లభామ అనే టైటిల్‌తోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా.. ఓ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతింటాయోమోనని ఈ చిత్రానికి భామావిజయం అనే పేరు పెట్టారు. లోకంలో ప్రసిద్ధమైన గొల్లభామ రాజు కథ ఇది. రాజు అందం చూసి మోహించిన దేవకాంత.. అతనితో పాటు ఆయన భార్యకు అమృతం తాగించడంతో వారు నిత్య యవ్వనంతో ఉంటారు. గొల్లభామ అందం చూసి ఆమె తల్లి అని తెలియక కన్న కొడుకే మోహిస్తాడు. చివరకు గోమాత ద్వారా నిజం తెలుసుకున్న తనయుడు...కన్నవారిని కలుసుకోవడంతో కథ ముగుస్తుంది. 1967 జూన్ 29న విడుదలైన ఈ చిత్రం... అప్పటి కంటే తర్వాతి రోజుల్లో విశేషాదరణ పొందింది.
entertainment
21,437
16-11-2017 09:05:37
లంక కెప్టెన్‌కూ కొత్తే.. ఆశలన్నీ వారిద్దరిపైనే
కోల్‌కతా: మొన్ననే శ్రీలంకను వారి దేశంలో చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై ఆ జట్టును మరోసారి మట్టికరిపించాలని భావిస్తోంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో గురువారం మొదలయ్యే తొలి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బలహీన లంకతో ఈ సిరీస్‌ను జనవరిలో దక్షిణాఫ్రికాలో రెండు నెలల సుదీర్ఘ పర్యటనకు సన్నాహంగా మార్చుకోవాలని ఆతిథ్య జట్టు కోరుకుంటోంది. అదే సమయంలో లంకను కోహ్లీసేన ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. కానీ 35 ఏళ్లుగా భారత్‌లో ఆడిన 16 టెస్టుల్లో గెలుపు రుచి చూడని లంకేయులు.. ఇప్పుడు అనుభవం లేని ఆటగాళ్లతో వచ్చారు. 2009లో చివరగా ఇక్కడ ఆడిన ఏంజెలో మాథ్యూ‌స్‌, రంగన హెరాత్‌ మాత్రమే ప్రస్తుత జట్టులోనూ ఉన్నారు. వారిపై కెప్టెన్‌ దినేశ్‌ చాందిమల్‌ గండపెడాశలు పెట్టుకున్నాడు. చాందిమల్‌కు కూడా మనదేశంలో ఇది తొలి టెస్టు కావడం విశేషం.           దాంతో, ఇక్కడ టెస్టు నెగ్గడం అంటే ఆషామాషీ కాదని అతనికీ తెలిసే ఉంటుంది. గెలుపు రుచి చూడాలంటే ఆతిథ్య బౌలర్లకు ఎదుదొడ్డి ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ క్రీజులో పాతుకొని ఉండాల్సిందే. లంక భావి ఆటగాడిగా భావిస్తున్న సదీర సమరవిక్రమ ఓపెనర్‌గా రానున్నాడు.. పాక్‌పై కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ (196) ఆడి వచ్చిన మరో ఓపెనర్‌ దిమూత్‌ కరుణరత్నె ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు. మాథ్యూస్‌ను లంక బ్యాటింగ్‌కే పరిమితం చేయనుంది. బలీయమైన భారత బౌలింగ్‌ను అడ్డుకోవాలంటే అతనితో పాటు ధనంజయ, కెప్టెన్‌ చాందిమల్‌, కీపర్‌ డిక్‌వెలా కూడా రాణించాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్‌లో హెరాత్‌పై లంక పూర్తిగా ఆధారపడనుంది. అయితే, అతనికి ఎవరు సహకారం అందిస్తారన్నది తెలియాలి.
sports
16,929
19-02-2017 00:34:38
శ్వాసకోశ, హృద్రోగులకు అన్ని సార్లు ఐసీయూ అక్కర్లేదు
అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి వాషింగ్టన్‌, ఫిబ్రవరి 18: ఏ మాత్రం కాస్త తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినా... వెంటనే వైద్యులు ఐసీయూలో ఉంచాలని చెప్పడం సరైన ది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, హృద్రోగాల బారిన పడిన వారిని అన్ని సందర్భాల్లో ఐసీయూ అక్కర్లేదని తెలిపారు. అసలు పూర్తిగా శ్వాస తీసుకోలేని పక్షంలోనే తప్ప మిగతా సమయాల్లో ఐసీయూలో ఉంచినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్నారు. అమెరికా లోని మిషిగాన్‌ మెడికల్‌ స్కూల్‌ శ్వాసకోశ, క్రిటిక ల్‌ కేర్‌ నిపుణుడు డాక్టర్‌ థామస్‌ వ్యాలీ ఆధ్యయ నంలో ఈ విషయం వెల్లడైంది. తీవ్ర మైన శ్వాస కోశ సంబంధ వ్యాధులు, గుండెపోటు, హృదయ వైఫల్యం వంటి సమస్యలతో బాధపడుతున్న 15 లక్షల మంది మెడికల్‌ రికార్డులను అధ్యయనం చేసి.. ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు.
nation
12,870
06-02-2017 03:40:51
హిమపాతానికి 100 మంది మృతి
కాబుల్‌/పెషావర్‌/చండీగఢ్‌, ఫిబ్రవరి 5: ఉత్తర భారతం సహా ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాలను భారీ హిమపాతం అతలాకుతలం చేస్తోంది. మంచు చరియలు విరుచుకు పడటంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఆఫ్ఘన్‌లోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా మంచు చరియలు విరిగి పడి వందమందికిపైగా చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విరిగిపడిన మంచు చరియలతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మధ్య, ఈశాన్య ప్రావిన్స్‌లలో రహదారులు మూసుకుపోయాయి. ఉత్తర పాకిస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్లోనూ దట్టమైన మంచుకింద ఇళ్లు కూరుకుపోయాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని పలుప్రాంతాల్లోనూ రాబోయే 24గంటలపాటు భారీ మంచు కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది.
nation
20,341
27-08-2017 03:16:04
గుజరాత్ కింగ్స్‌కు టైటిల్‌
అహ్మదాబాద్‌: తొలి అంచె క్యూ స్లామ్‌ ‘ఇండియన్‌ క్యూ మాస్టర్స్‌ లీగ్‌’లో గుజరాత్ కింగ్స్‌ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో గుజరాత్ కింగ్స్‌ 3-0తో ఢిల్లీ డాన్స్‌పై విజయం సాధించి.. టైటిల్‌ ఎగరేసుకుపోయింది. గుజరాత్ తరఫున సింగిల్స్‌లో ఆండ్రూ పెజెట్‌, అలోక్‌ కుమార్‌ గెలవగా.. డబుల్స్‌లో పెజెట్‌-డారియా సిరోతినా జోడీ విజయం సాధించింది. విజేత గుజరాత్ రూ.20 లక్షల ప్రైజ్‌ మనీ దక్కించుకుంది.
sports
11,959
21-08-2017 04:32:59
ఢిల్లీ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం!
న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రోన్‌లాంటి వస్తువులు ఆదివారం కలకలం సృష్టించాయి. సాయంత్రం 7.09 గంటలకు.. ఎయిర్‌ ఏసియా పైలట్‌ ఒకరు విమానాశ్రయంలో ల్యాండయ్యే సమయంలో రన్‌వేపై డ్రోన్‌ తరహా వస్తువును చూసి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్‌ ఆపరేషన్లను దాదాపు 40 నిమిషాలపాటు నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదం లేదని ఢిల్లీ పోలీసులు నిర్ధారించి రాత్రి 7.55 గంటల సమయంలో సేవలను పునరుద్ధరించారు. అంతకు ముందు.. ఉదయం 11.16గంటల సమయంలో చైనా పైలట్‌ ఒకరు ఇలాగే డ్రోన్‌లాంటి వస్తువును రన్‌వేపై చూసినట్టు ఏటీసీకి ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి పరిశీలించి అలాంటిదేమీ లేదని తేల్చారు.
nation
17,861
27-11-2017 08:17:01
చెన్నై సంద్రంలో జాలర్లకు ప్రాణగండం!
చెన్నై: ప్రాణాలు పణంగా పెట్టి సముద్రంలో చేపలవేటకు వెళ్తున్న రాష్ట్ర జాలర్లకు వరుస ప్రాణగండాలు క్రుంగదీస్తున్నాయి. ఇన్నాళ్లూ లంక నావికాదళం దాష్టీకానికి బలవుతూ వచ్చిన జాలర్లకు ఇప్పుడు భారత కోస్ట్‌గార్డ్‌ వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవి దురదృష్టవశాత్తూ, యాదృచ్ఛికంగా సంభవించినవే అయినప్పటికీ జాలరి సంఘాల్లో తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. రెండు వారాల క్రితం భారత్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది తమపై కాల్పులు జరిపారని జాలర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో నిజానిజాలు తేల్చేందుకు కేంద్రస్థాయిలో విచారణ జరుగుతున్న తరుణంలో మరో అనూహ్య ఘటన సంభవించింది.                                రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపంలోని పాంబన్‌ తీరం మండపం ప్రాంతానికి చెందిన జాలర్లు నలుగురు చేపలవేట కోసం నాటుపడవపై సముద్రంలోకి వెళ్లి, తీరానికి తిరుగు ప్రయాణమైన సమయంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న భారత కోస్ట్‌గార్డ్‌కి చెందిన హోవర్‌క్రాఫ్ట్‌ నౌక అనూహ్యంగా జాలర్ల పడవను ఢీకొంది. ఈ ప్రమాదంలో జాలర్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమై సముద్రంలో మునిగిపోతున్న జాలర్లను రక్షించారు. తీవ్ర గాయాలపాలైన నాగేంద్రన్‌ అనే జాలరిని తక్షణమే మండపం శిబిరానికి తరలించి ప్రాథమిక చికిత్సలు అందజేశారు.                    అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రామనాథపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జాలరి వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ ప్రతికూలత, సరిగ్గా కనిపించడంపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదం దురదృష్టవశాత్తూ సంభవించినా ఒకే నెలలో భారత కోస్ట్‌గార్డ్‌ వల్ల ఏర్పడ్డ రెండు ప్రమాదాలు జాలరి సంఘాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
nation
8,355
10-10-2017 23:15:42
హోటల్‌ పెట్టాలనుకున్నా!
నటుడు కాకపోయుంటే ప్రభాస్‌ ఏమయ్యేవారు? ఒక హోటల్‌ యజమాని అయ్యేవారు! అవును. ఇదే విషయాన్ని ఒక న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘‘నేను సోమరిపోతును కాబట్టి ఉద్యోగాలు చేయలేను. అందుకని ఏదో ఒక వ్యాపారం చేద్దామనుకున్నా. మా కుటుంబానికి ఆహారం అంటే ఇష్టం కాబట్టి బహుశా హోటల్‌ బిజినెస్‌లోకి వెళ్లుండేవాణ్ణి. పైగా హైదరాబాద్‌లో ఉత్తరాది తిండికి మంచి గిరాకీ’’ అని చెప్పారు ప్రభాస్‌. అలాంటప్పుడు ఆయన నటుడిగా కెరీర్‌ను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న వస్తుంది.  ‘‘ఒక రోజు బాపుగారి దర్శకత్వంలో మా పెదనాన్న నటించిన ‘భక్త కన్నప్ప’ సినిమా చూస్తుంటే, ఆ కేరక్టర్‌లో నన్ను ఊహించుకున్నా. బహుశా అప్పట్నించే నటుణ్ణి కావాలనే ఆలోచన నా మనసులో మొదలైందనుకుంటాను’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే నటుడు కావడం అసాధ్యమని ఒక దశలో ఆయన అనుకున్నారు.  ‘‘పెదనాన్న నటుడు, నాన్న నిర్మాత. ‘నటన మీద నీకు ఆసక్తి ఉందా?’.. అని వాళ్లడిగారు. ‘లైట్ల మధ్య అనేకమంది మనుషులు చుట్టూ చూస్తుండగా భావాలు పలికిస్తూ ఎవరైనా ఎలా నటిస్తారు?’ అనే ఫీలింగ్‌ నాది. అందుకే చెప్పడానికి సిగ్గుపడ్డా. ఒకటికి రెండు సార్లు అమ్మానాన్నలు ఈ విషయం అడిగితే అది నా వల్ల కాదని చెప్పాను. కానీ చివరకు ‘ఈశ్వర్‌’ (2002)తో కెమెరా ముందుకు వచ్చాను’’ అని చెప్పారు ప్రభాస్‌. పదిహేనేళ్ల కెరీర్‌ తర్వాత ‘బాహుబలి’ సినిమాలతో వచ్చిన అమితమైన స్టార్‌డమ్‌ను ఎలా హ్యాండిల్‌ చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. ‘‘తమ హీరో ఎక్కువగా బయటకు రాడని నా అభిమానులు బ్యాడ్‌గా ఫీలవుతుంటారు. ఈ విషయంలో ఇదివరకటి కంటే ఇప్పుడు కాస్త బెటర్‌ అయ్యాను. ఇంకా మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నా’’ అన్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ‘సాహో’ సెట్స్‌పై ఉంది.
entertainment
714
10-05-2017 00:49:36
హడ్కో ఐపిఒకు భారీ స్పందన
 రెండో రోజునే మూడు రెట్ల ఓవర్‌ సబ్‌స్ర్కిప్షన్‌ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో పబ్లిక్‌ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇష్యూ ప్రారంభమైన రెండో రోజు మంగళవారం సాయంత్రానికే ఇష్యూ 3 రెట్లు ఎక్కువ సబ్‌స్ర్కైబ్‌ అయింది. ఇష్యూ ద్వారా 20.40 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేస్తుండగా 61.39 కోట్ల షేర్లకు బిడ్స్‌ వచ్చాయి. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులకు ఉద్దేశించిన షేర్లు దాదాపు 3 రెట్లు ఓవర్‌ సబ్‌స్ర్కైబ్‌ కాగా, రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ 4 రెట్లు ఓవర్‌సబ్‌ స్ర్కైబ్‌ అయింది. హడ్కో 56-60 రూపాయల ధర శ్రేణితో షేర్లను ఆఫర్‌ చేస్తోంది.
business
21,350
27-06-2017 00:24:07
భారత్‌ కోచ్‌ రేసులో లేను
కొలంబో: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ముగిశాక కోచ్‌ పదవి నుంచి అనిల్‌ కుంబ్లే వైదొలగడంతో ఆ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు రిచర్డ్‌ పైబస్‌, టామ్‌ మూడీ తమ దరఖాస్తులు పంపారు. మరింత మందికి అవకాశం కల్పించడం కోసం బీసీసీఐ గడువు కూడా పెంచింది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్‌ పదవికి శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్‌ మహేల జయవర్దనె కూ డా దరఖాస్తు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలకు మహేల కొట్టిపడేశాడు. తాను భారత కోచ్‌ రేసులో లేనని అన్నాడు. పూర్తిస్థాయి కోచ్‌గా పని చేయడానికి తాను సిద్ధంగా లేనని జయవర్దనె స్పష్టం చేశాడు. మహేలకు అనుభవం లేదు: ప్రధాన కోచ్‌ పదవి చేపట్టడానికి మహేలకు తగినంత అనుభవం రాలేదని శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపాడు. దీంతో ఇటీవలే ఫోర్డ్‌ రాజీనామాతో ఖాళీ అయిన శ్రీలంక ప్రధాన కోచ్‌ రేసులో కూడా జయవర్దనె లేడని స్పష్టమైంది.
sports
16,996
07-03-2017 01:02:55
‘ముంబై ముట్టడి’ మా ఉగ్రమూక పనే
న్యూఢిల్లీ, మార్చి 6: 2008లో ముంబై మారణహోమానికి పాల్పడింది పాక్‌ ఉగ్రమూకలేనంటూ భారత్ ఇంతకాలం చేసిన వాదన నిజమని స్పష్టమైంది. 26/11 ముంబయి ఉగ్రదాడులు తమ దేశ ఉగ్రవాద సంస్థల పనేనని పాకిస్థాన్‌ జాతీయ భద్రతా మాజీ సలహాదారు(ఎన్‌ఎ్‌సఏ) మహమూద్‌ అలీ దురానీ ఎట్టకేలకు సోమవారం అంగీకరించారు. ఈ ఉగ్రదాడికి పాక్‌ గడ్డపైనే కుట్ర జరిగిందని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి ఇది మంచి ఉదాహరణ అన్నారు. అంతేకాదు.. ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తాయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌పై చర్య తీసుకోవాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 166 మంది అమాయకులను బలి తీసుకున్న ముంబయి ఉగ్రదాడి సమయంలో పాక్‌ జాతీయ భద్రతా సలహాదారునిగానూ, ఐఎస్‌ఐ జనరల్‌గానూ పని చేసిన దురానీ ఈ దాడితో ఐఎ్‌సఐకు, పాక్‌కు సంబంధం లేదంటూ అప్పుడు బుకాయించారు.   ఇంతకాలానికి భారత గడ్డపై వాస్తవాన్ని అంగీకరించడం విశేషం. అయితే, ఈ దాడిలో పాకిస్థాన్‌ ప్రభుత్వానికి, ఐఎ్‌సఐకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదంపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలసిస్‌లో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హఫీజ్‌ సయీద్‌ వల్ల పాక్‌కు ఎలాంటి లాభం లేదని, అతడిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ నిప్పులు చెరిగారు. ఇదిలావుంటే, పాకిస్థాన్‌, మాలీలో జరిగిన ఉగ్రదాడుల్లో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్‌-ఆఫ్ఘన్‌ సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో గల పాక్‌ సైనిక ఔట్‌పోస్టులపై ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడులు జరిపారు.
nation
17,767
15-04-2017 03:03:24
నగదు రహిత ‘నగరాలు’
నాగ్‌పూర్‌, ఏప్రిల్‌ 14: దేశవ్యాప్తంగా 75 క్యాష్‌లెష్‌ టౌన్‌షిప్పులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. 12 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ టౌన్‌షిప్పుల్లో ఇప్పటికే రోజుకి 1.5 లక్షలు.. ఏడాదికి 5.5 కోట్ల నగదురహిత లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తం 76 టౌన్‌షిప్పుల్లో 56 గుజరాతలోనే ఉన్నాయి. ఈ టౌన్‌షిప్పుల్లో.. ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, సెయిల్‌, బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్పులతోపాటు సహకార రంగానికి చెందిన ఇఫ్కో, క్రిబ్‌కో టౌన్‌షిప్పులు, ప్రైవేటు సంస్థలకు చెందిన రిలయన్స్‌, అదానీ, ఎస్సార్‌, వంటి సంస్థల టౌన్‌షిప్పులు కూడా ఉన్నాయి. నగదురహిత బస్తీల ఆలోచనకు నీతి ఆయోగ్‌ శ్రీకారం చుట్టింది.  క్యాష్‌లెస్‌ టౌన్‌షిప్పుల ఎంపిక బాధ్యతను ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ సంస్థకు అప్పగించింది. నగదురహిత టౌన్‌షిప్పులుగా ఎంపికయ్యేందుకు.. ఆ బస్తీలో నగదురహిత లావాదేవీల నిర్వహణకు అవసరమైన పూర్తి మౌలికసదుపాయాలు ఉండాలి. దీంతోపాటు నగదురహిత లావాదేవీలపై ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పించాలి. బస్తీలో జరిగే లావాదేవీల్లో 80 శాతం డిజిటల్‌ పేమెంట్‌ విధానంలో జరగాలి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని నగదురహిత బస్తీని ఎంపిక చేస్తారు. ఎస్సార్‌ టౌన్‌షిప్పును ‘క్యాష్‌లెస్‌ రోల్‌ మోడల్‌ టౌన్‌షిప్పు’గా నీతి ఆయోగ్‌ ప్రకటించింది.
nation
4,537
19-03-2017 22:59:29
వచన కవితలకు ఆహ్వానం
- పెళ్ళూరు సునీల్‌
editorial
8,506
01-12-2017 17:47:04
‘సీత.. రాముని కోసం’.. నిహారిక పాటల కోసం
శ్రీరంగం శరత్, కారుణ్య హీరోహీరోయిన్‌లుగా అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సీత.. రాముని కోసం’. తస్మై చిన్మయ ప్రొడక్షన్స్ మరియు రోల్ కేమెరా యాక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో విడుదలకాబోతున్న ఈ చిత్ర ఆడియోని మెగా డాటర్ నిహారిక విడుదల చేశారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ‘‘టైటిల్ చాలా బాగుంది. సినిమా కూడా అంత మంచి విలువలతో ఉంటుందని నమ్ముతున్నాను. హారర్ సినిమాలు అంటే నాకు కొంచెం భయం. అయినా కూడా నేను ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎదురు చూస్తున్నాను. హీరో శ్రీరంగం శరత, కారుణ్య, అనిల్ లుక్స్ బాగున్నాయి. చిత్ర యూనిట్‌కి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు. చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. ‘‘మనిషికి, మనిషి మరణించిన తరువాత రూపాంతరం చెందే ఆత్మకు మధ్య గల ఒక బంధాన్ని ఈ సినిమాలో సరికొత్తగా అవిష్కరించాం. వాస్తవాలు మాట్లాడుకుంటే అసలు ఆత్మలు ఉన్నాయా..? లేవా..? అవి వట్టి ఊహాగానాలేనా...? మనిషి, ఆత్మ, ప్రేమ, మానవ సంబంధాలు, ఎమోషన్ అనే వాటిని అద్భుత స్క్రీన్‌ప్లేతో చూపించడం జరిగింది. డిసెంబర్ రెండో వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు.
entertainment
3,556
09-05-2017 01:27:08
రవాణా శాఖను ప్రక్షాళన చేయండి!
ఏసీబీ దాడుల్లో రాష్ట్ర రవాణా శాఖ అధికారుల అక్రమ ఆస్తులు వందల కోట్ల రూపాయల్లో పట్టుబడుతున్న వైనం ఆ శాఖలో అవినీతి ఏ మేరకు జరుగుతుందో చెప్పకనే చెబుతున్నది! వీరి వద్ద ఇన్ని అక్రమ ఆస్తులు ఉన్నాయంటే లబ్ధి పొందిన వారికి ఎన్ని వేలకోట్ల మేలు జరిగి ఉండాలి? ప్రభుత్వానికి ఎంతమేర నష్టం కలిగి ఉంటుందో అంచనాలకు అందదు. ప్రభుత్వ యంత్రాంగమంతా ఓ విష వలయంగా మారింది. పన్నుల మీద పన్నులు వేస్తూ, సామాన్యునిపై భారం మోపుతున్న పాలకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రజలకు న్యాయం జరగాలంటే అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. కేసులను త్వరితగతిన పూర్తిచేయటానికి తగిన యంత్రాంగాన్ని సమకూర్చాలి. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి విషయంలో పాలకులు, ప్రజా ప్రతినిధులు స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలి!- జి. రామకృష్ణ, ముస్తాబాద్‌, కృష్ణా జిల్లా
editorial
20,682
19-07-2017 09:05:59
క్రికెటర్ ఇర్భాన్ పఠాన్‌పై ముస్లిమ్‌ల ఆగ్రహం
న్యూఢిల్లీ : క్రికెటర్ ఇర్భాన్ పఠాన్ తన భార్య ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంపై ముస్లిమ్ పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ తండ్రి మసీదులో మౌజాన్‌గా పనిచేశాడని, ఇస్లాం మత సంప్రదాయాలకు కట్టుబడిన కుటుంబం నుంచి వచ్చి భార్య ఫోటో సోషల్ మీడియాలో పెట్టడం సిగ్గుచేటు అని మౌలానా సాజిద్ రష్దీ చెప్పారు. ఇస్లామ్ ప్రకారం భార్య తన ముఖాన్ని భర్తకు మాత్రమే చూపించాలని సాజిద్ పేర్కొన్నారు. కాని చట్టపరంగా ఆధార్ కార్డు, పాన్ కార్డుల కోసం భార్య ఫోటో దిగవచ్చని ఆయన చెప్పారు. గృహిణి అయిన భార్య ఫోటోను ఇలా సోషల్ మీడియాలో పెట్టడం తప్పని ఆయన ఆక్షేపించారు. ఫోటోలో ఇర్ఫాన్ భార్య చేతి గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకుందని, గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకోవడం కూడా ఇస్లాం ప్రకారం విరుద్ధమని సాజిద్ చెప్పారు. గోళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకొని నమాజ్ చేయరాదని ఆయన వివరించారు.
sports
13,484
11-03-2017 02:13:24
విజయం మాదే!
ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పవుతాయి: రాహుల్‌ గెలుపుపై అఖిలేశ్‌, మాయా విశ్వాసం బిహార్‌ తరహా ఫలితాలపై నమ్మకం 2/3 మెజారిటీ సాధిస్తామన్న బీజేపీ న్యూఢిల్లీ, మార్చి 10: ఐదింట నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వేస్తున్న అంచనాలను కాంగ్రెస్‌, ఇతర పక్షాలు తోసిపుచ్చాయి. అన్ని పార్టీలూ తమదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశాయి. ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి యూపీలో తప్పకుండా విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బిహార్‌లో కూడా సర్వే సంస్థలు బొక్కబోర్లా పడ్డాయని గుర్తు చేశారు. ఎన్నికల గురించి వివరంగా మార్చి 11నే మాట్లాడతానన్నారు. రాహుల్‌ మాట నిజమవుతుందని గులాం నబీ ఆజాద్‌ చెప్పారు. అదే నోటితో యూపీ ఎన్నికలు రాహుల్‌ పనితీరుపై రెఫరెండం కాదన్నారు. కాంగ్రెస్‌ మొత్తం ఐదు చోట్లా గెలుస్తుందని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా జోస్యం చెప్పారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ కూడా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హంగ్‌ వస్తే బీజేపీని అధికారంలోకి రాకుండా చూసేందుకు బీఎస్పీతో చేతులు కలపడానికి సిద్ధమన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎస్పీ కూటమికే అనుకూలంగా వచ్చాయని, బీజేపీ ఒత్తిడి మేరకు మీడియా సంస్థలు ఫలితాలను మార్చేశాయని ఎస్పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ ఆరోపించారు. బీఎస్పీ చిత్తుగా ఓడిపోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నా తాము గెలిచి తీరతామని పార్టీ అధినేత మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్‌ ఫలితాలను ఉదాహరణగా చూపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ పేరుతో చానల్స్‌ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి ఆరోపించారు. చానెళ్లపై వస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకోగలనన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ శాసీ్త్రయత ఎప్పుడూ ప్రశ్నార్థకమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎస్పీ కూటమి విజయం ఖాయమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ చెప్పారు. తాను యూపీలో ప్రచారం చేశానని, ఈవీఎంలు తెరిచాక ఎవరిసత్తా ఏమిటో తేలుతుందని అన్నారు. యూపీ ఫలితం కేంద్రంపైనా ప్రభావం చూపుతుందని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ పతనం యూపీతో మొదలవుతుందని అన్నారు. యూపీలో సర్వేలు చెప్పినట్లుగా సాధారణ మెజారిటీ కాకుండా మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తామని బీజేపీ ఎంపీ ఆదిత్యనాధ్‌ దాస్‌ అన్నారు. ఎస్పీ సంకీర్ణం గురించి మాట్లాడుతూ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ గెలవబోతోందని అమర్‌సింగ్‌ జోస్యం చెప్పారు. మణిపూర్‌లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి ఓక్‌రాం ఇబోబీ సింగ్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని కొన్ని, బీజేపీ వస్తుందనికొన్ని సర్వేలు చెప్పాయి.
nation
17,760
30-10-2017 02:25:55
40వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు!
న్యూఢిల్లీ, అక్టోబరు 29: అత్యధిక సైనిక బలగాలు ఉన్న రెండో అతిపెద్ద దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. అయితే మన సైన్యం వాడుతున్న ఆయుధాలు మాత్రం పాత కాలానికి చెందినవనే అపప్రధ కూడా ఉంది. సైన్యం ఉపయోగిస్తున్న పాత ఆయుధాలకు త్వరలోనే వీడ్కోలు చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఆయుధాల సేకరణకు సంబంధించిన భారీ ప్రణాళికకు భారత సైన్యం ఆమోదం తెలిపింది. పదాతిదళం ఆధునీకరణకు 40వేల కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది. పాకిస్థాన్‌, చైనాలకు దీటుగా సమాధానం ఇవ్వడంతోపాటు, రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఆయుధ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 7లక్షల రైఫిళ్లు, 44వేల లైట్‌ మెషిన్‌గన్స్‌(ఎల్‌ఎంజీ), 44600 కార్బన్‌ ఆటోమొబైల్స్‌ కొనుగోలు చేసే ఈ నిర్ణయానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా లభించింది.
nation
4,317
19-10-2017 02:28:49
కమ్మని పాటలాంటి కవి
అలంకారిక శాస్త్రాన్ని, ఆంతరంగిక రాగాన్ని మేళవించి అందంగా పాటైన కవి శేషేంద్ర శర్మ. వ్యాకరణాల్ని తొక్కుతూ మధుర స్వరాలు ఏరుకొంటూ వచ్చిన ఆ పాటకు మాటల్లేవు మధురిమలే ఉన్నాయి. రాగానికి మేళవించిన తీగెని మీటిన శ్రావ్యమైన పాటే శేషేంద్ర శర్మ. ‘మరచిన తలపింపగ నగు, ఎరుగని నాడెల్ల పాట నెరిగింపనగున్’ అని నన్నయ చెప్పిన మాటలో ఉన్నంత సత్యంగా పాటలాంటి కవి గుంటూరు శేషేంద్రశర్మ. సాహిత్య ప్రక్రియల్లో సర్వ శ్రేష్ఠమైన పాట ప్రక్రియలా ఆయన రచనలన్నీ ప్రజలకు చేరాయి. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని కూర్చిన ఆయన పాటలోని సారాంశం కూడా అదే. ఆయనకున్న కవితా శక్తి అపురూపమైంది. కవితా రంగంలో ఆయన ప్రయోగ శీలత అనితర శీలమైంది. 20వ శతాబ్ది కవితాకాశంలో ‘ఆధునిక మహాభారత’ మనే విశ్వమానవ కథా కావ్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆధునిక వచన కవితా శకాన్ని నెలకొల్పిన కవిగా ఆయన కీర్తి గడించారు. నదులు, కవులు కలలను ఫలింపజేసే శక్తులుగా నమ్మిన కవి శేషేంద్ర శర్మ: ‘నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి.కవులు కంటున్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి.ధరిత్రిని కలందున్నితే అవుతుంది అది ఒక ఇతిహాసం’ అంటున్న ఈ వచన కవి సృజనలో ఒక ప్రకృతి, మనోకృతి నడుమ సజీవ సంబంధం పరివ్యాప్తమై ఉంది. కవిత్వానికి తక్షణ ప్రయోజనం– కవిత్వం విని శ్రోత ఒక ఆత్మిక తృప్తిని పొందాలంటాడు శేషేంద్ర శర్మ. అందుకోసమే విశిష్ఠ భావం, విశిష్ఠ భాష తన రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదన్నాడు. నిరంతరం కవి అంతర్మథనం లోంచి పుట్టినదైతేనే పాటై ప్రజల పక్షం చేరుతుంది. కవి కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ, ‘మనిషి కన్నీరు తుడవడం నీ వంతు. శరీరం పోయినా నిలిచేది నీ గొంతు’ అనడంలో తాత్వికత అదే.‘ఆధునిక భారతం’ను పాటగా చేసుకొని పల్లవించాడు శేషేంద్ర శర్మ. కవితా వస్తువును పాటకు శీర్షికను చేసి చరణాల్లో భావాలను పొదిగాడు. కవితా స్వరూప మంతా తానే. కానీ పక్షి పాట గానో, వేణువు పాటగానో ప్రతిఫలింపజేయడంలో కవి తన లక్ష్యాన్ని చేరుకొన్నాడు. ‘ఓ పక్షి ఎక్కడ్నించో వస్తుంది రెక్కల మీదఈ బాటసారి చెవిలో ఒక పాట పాడేసి వెళ్లి పోతుంది ఒక నిజమైన అనుభూతిని మోసే వాక్యం పాటప్రాణం మోసుకొస్తున్న పక్షిలా నీ దగ్గర వాలుతుంది’ ఈ పాదాల్లో కవి ఆత్మీకరించుకొనే గుణం ప్రధానమై అలరించింది. అంతలోనే కవి పక్షికి కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. ‘ఓ! పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపోనీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’.... అడవిని పక్షి పాటతో కొలుస్తాను’అంటాడు శేషేంద్ర శర్మ. కవి మదిలో వెలసిన భావమే కావచ్చు కానీ ఈ పాట, ఈ పక్షీ ప్రతీకలై కవిత్వాశయాన్ని శాసిస్తాయి. అలాగే కవన శిల్పానికి తనదైన తీరులో భాష్యం చెప్పాడు కవి. ‘నా గొంతు ప్రజలకు దానం చేశాను, నా జాతే నా భాషకు ప్రాణ వాయువునా దేశం నా శిల్పానికి ఆయువు’ ఇది తన వ్యక్తిత్వం కోసం అనడమేగాదు,‘గాలిలో ఉన్న పక్షులన్నీ కలిసినా నా పాటతో పోటీ పడలేవునా పాట ఆర్కిటిక్ సముద్ర కన్య నా కంఠ సీమల్లో చెక్కిన శిల్పం’అని చెప్తూ అలంకారిక శాస్త్రాన్ని, ఆంతరంగిక రాగాన్ని మేళవించి అందంగా పాటైన కవి శేషేంద్రశర్మ. ఆ కవి వ్యాకరణాల్ని తొక్కుతూ మధుర స్వరాలు ఏరుకొంటూ వచ్చిన పాట. ఆ పాటకు మాటల్లేవు మధురిమలే ఉన్నాయి. రాగానికి మేళవించిన తీగెని మీటిన శ్రావ్యమైన పాటే ఆయన. కమ్మని పాటలాంటి ఈ కవి 90వ జయంతి సభ అక్టోబర్‌ 20 నాడు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరుపుకోవడం ముదావాహం.ప్రొ. ననుమాసస్వామిరాష్ట్ర అధ్యక్షులు, 1969 తెలంగాణ రాష్ట్ర పోరాటయోధుల సంఘం(నేడు శేషేంద్ర శర్మ 90వ జయంతి) ‘మరచిన తలపింపగ నగు, ఎరుగని నాడెల్ల పాట నెరిగింపనగున్’ అని నన్నయ చెప్పిన మాటలో ఉన్నంత సత్యంగా పాటలాంటి కవి గుంటూరు శేషేంద్రశర్మ. సాహిత్య ప్రక్రియల్లో సర్వ శ్రేష్ఠమైన పాట ప్రక్రియలా ఆయన రచనలన్నీ ప్రజలకు చేరాయి. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని కూర్చిన ఆయన పాటలోని సారాంశం కూడా అదే. ఆయనకున్న కవితా శక్తి అపురూపమైంది. కవితా రంగంలో ఆయన ప్రయోగ శీలత అనితర శీలమైంది. 20వ శతాబ్ది కవితాకాశంలో ‘ఆధునిక మహాభారత’ మనే విశ్వమానవ కథా కావ్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆధునిక వచన కవితా శకాన్ని నెలకొల్పిన కవిగా ఆయన కీర్తి గడించారు. నదులు, కవులు కలలను ఫలింపజేసే శక్తులుగా నమ్మిన కవి శేషేంద్ర శర్మ: ‘నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి.కవులు కంటున్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి.ధరిత్రిని కలందున్నితే అవుతుంది అది ఒక ఇతిహాసం’ అంటున్న ఈ వచన కవి సృజనలో ఒక ప్రకృతి, మనోకృతి నడుమ సజీవ సంబంధం పరివ్యాప్తమై ఉంది. కవిత్వానికి తక్షణ ప్రయోజనం– కవిత్వం విని శ్రోత ఒక ఆత్మిక తృప్తిని పొందాలంటాడు శేషేంద్ర శర్మ. అందుకోసమే విశిష్ఠ భావం, విశిష్ఠ భాష తన రక్తంలో ప్రవహించే ఒక అసాధారణ వాక్యం మాత్రమే కవిత కాగలదన్నాడు. నిరంతరం కవి అంతర్మథనం లోంచి పుట్టినదైతేనే పాటై ప్రజల పక్షం చేరుతుంది. కవి కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ, ‘మనిషి కన్నీరు తుడవడం నీ వంతు. శరీరం పోయినా నిలిచేది నీ గొంతు’ అనడంలో తాత్వికత అదే.‘ఆధునిక భారతం’ను పాటగా చేసుకొని పల్లవించాడు శేషేంద్ర శర్మ. కవితా వస్తువును పాటకు శీర్షికను చేసి చరణాల్లో భావాలను పొదిగాడు. కవితా స్వరూప మంతా తానే. కానీ పక్షి పాట గానో, వేణువు పాటగానో ప్రతిఫలింపజేయడంలో కవి తన లక్ష్యాన్ని చేరుకొన్నాడు. ‘ఓ పక్షి ఎక్కడ్నించో వస్తుంది రెక్కల మీదఈ బాటసారి చెవిలో ఒక పాట పాడేసి వెళ్లి పోతుంది ఒక నిజమైన అనుభూతిని మోసే వాక్యం పాటప్రాణం మోసుకొస్తున్న పక్షిలా నీ దగ్గర వాలుతుంది’ ఈ పాదాల్లో కవి ఆత్మీకరించుకొనే గుణం ప్రధానమై అలరించింది. అంతలోనే కవి పక్షికి కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు. ‘ఓ! పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపోనీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’.... అడవిని పక్షి పాటతో కొలుస్తాను’అంటాడు శేషేంద్ర శర్మ. కవి మదిలో వెలసిన భావమే కావచ్చు కానీ ఈ పాట, ఈ పక్షీ ప్రతీకలై కవిత్వాశయాన్ని శాసిస్తాయి. అలాగే కవన శిల్పానికి తనదైన తీరులో భాష్యం చెప్పాడు కవి. ‘నా గొంతు ప్రజలకు దానం చేశాను, నా జాతే నా భాషకు ప్రాణ వాయువునా దేశం నా శిల్పానికి ఆయువు’ ఇది తన వ్యక్తిత్వం కోసం అనడమేగాదు,‘గాలిలో ఉన్న పక్షులన్నీ కలిసినా నా పాటతో పోటీ పడలేవునా పాట ఆర్కిటిక్ సముద్ర కన్య నా కంఠ సీమల్లో చెక్కిన శిల్పం’అని చెప్తూ అలంకారిక శాస్త్రాన్ని, ఆంతరంగిక రాగాన్ని మేళవించి అందంగా పాటైన కవి శేషేంద్రశర్మ. ఆ కవి వ్యాకరణాల్ని తొక్కుతూ మధుర స్వరాలు ఏరుకొంటూ వచ్చిన పాట. ఆ పాటకు మాటల్లేవు మధురిమలే ఉన్నాయి. రాగానికి మేళవించిన తీగెని మీటిన శ్రావ్యమైన పాటే ఆయన. కమ్మని పాటలాంటి ఈ కవి 90వ జయంతి సభ అక్టోబర్‌ 20 నాడు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో జరుపుకోవడం ముదావాహం.ప్రొ. ననుమాసస్వామిరాష్ట్ర అధ్యక్షులు, 1969 తెలంగాణ రాష్ట్ర పోరాటయోధుల సంఘం(నేడు శేషేంద్ర శర్మ 90వ జయంతి)
editorial
13,429
14-07-2017 16:52:26
ప్రపంచంలో నెం.1 స్థానంలో మోదీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : ప్రభుత్వాలను ప్రజలు నమ్ముతున్నారా? ప్రపంచంలో ఏ దేశంలోని ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది? తమ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే అంశాలపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) నిర్వహించిన అధ్యయనంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అత్యధికులకు నమ్మకం ఉన్నట్లు వెల్లడైంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉన్నట్లు 73 శాతం మంది చెప్పారు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్న ప్రభుత్వాల జాబితాలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కెనడా ప్రభుత్వం ఉంది. ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడూ ప్రభుత్వంపై 62 శాతం మంది నమ్మకం ప్రకటించారు. ఎర్డోగాన్ నేతృత్వంలోని టర్కీ ప్రభుత్వంపై 58 శాతం మంది నమ్మకం వ్యక్తం చేశారు. రష్యా, జర్మనీ వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచాయి. ప్రధాన మంత్రి థెరెసా మే నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వంపై 41 శాతం మంది విశ్వాసం కనబరిచారు. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వంపై 30 శాతం మంది మాత్రమే నమ్మకం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరం. ఎన్టీఆర్‌ను రాజమౌళి అంతమాటన్నాడా..! రవితేజ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
nation
16,489
15-12-2017 14:52:16
క్రికెటర్ అజింక్యా రహానే తండ్రి అరెస్ట్...
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ అజింక్యా రహానే తండ్రి మధుకర్ బాబూరావు రహానేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయన డ్రైవ్ చేస్తున్న కారు ఓ మహిళను ఢీకొట్టడడంతో కొల్హాపూర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రహానే తండ్రి, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి 4వ నంబరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంగల్ ప్రాతానికి రాగానే ఆయన డ్రైవ్ చేస్తున్న హుందాయ్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో ఆశాతాయ్ కాంబ్లీ అనే మహిళను బలంగా ఢీకొట్టింది. బాధితురాలికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. రహానే తండ్రిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో పోలీసులు మధుకర్‌ రహానే‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
nation
10,768
24-11-2017 22:31:50
నో డ్యూయెట్స్‌.. నో రొమాన్స్‌!
‘శివ’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ 28 ఏళ్ల తర్వాత మళ్లీ నాగార్జునతో చేస్తున్న సినిమా మీదే దృష్టి పెట్టారు. నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. తదుపరి షెడ్యూల్‌ ముంబైలో ఉంటుంది. ఈ సినిమాలో డూయెట్లు కానీ, లవ్‌ సీన్లు కానీ ఉండవని అంటున్నారు. అయితే ఓ ఐటెం సాంగ్‌ మాత్రం ఉంటుందని చెబుతున్నారు. సినిమాలో ఓ ప్రముఖ హీరోయిన్‌ నటిస్తుందనీ, అయితే ఆమెకు నాగార్జునతో లవ్‌ ట్రాక్‌ ఉండదని యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి. ఆ హీరోయిన్‌ పాత్ర జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ జరిగే షెడ్యూల్‌లో ఎంటరవుతుందని అంటున్నారు. ఈ పాత్రకు అనుష్కను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే నిజమైతే ‘బాహుబలి’ తర్వాత ఆమె కమిట్‌ అయ్యే సినిమా ఇదే అవుతుంది.
entertainment
1,010
14-04-2017 01:41:25
యుఎస్‌ మార్కెట్‌ నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌: మతిమరుపు ఔషధం వెనక్కి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మతిమరుపు వ్యాధి చికిత్సలో వినియోగించే రివాటిజిమైన్ ట్రార్‌ట్రేట్‌ క్యాపూల్స్‌కు చెందిన 1728 బాటిళ్లను అమెరికా మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ తెలిపింది. ఇతర ఔషధాలతో క్రాస్‌ కంటామినేషన్‌ కారణంగా ఈ ఉత్పత్తులను వెనక్కు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆరోగ్యపరంగా అవాంతరాలు తలెత్తరాదనే ఉద్దేశంతో యుఎస్ఎఫ్‌డీఏ క్లాస్‌ 3కి అనుగుణంగా వీటిని ఉపసంహరించుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.
business
8,145
09-07-2017 00:19:16
వివాహితపై అత్యాచారం..
మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన ‘పుదియ నియమం’ చిత్రం ‘వాసుకి’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఎస్‌.కె.సాజన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.మోహన్‌ తెలుగులోకి అనువదిస్తున్నారు. శనివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను దామోదర ప్రసాద్‌ ఆవిష్కరించారు. ‘‘మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ఒకప్పుడు విజయశాంతి ఉన్నట్లు, ఇప్పుడు అనుష్క, నయనతార ఉన్నారు. ‘వాసుకి’ చిత్రంలో మంచి కథ, కథనం, సంగీతం ఉన్నాయి. తప్పకుండా మంచి విజయం అందుకుంటుంది’’ అని దాము అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘అత్యాచారానికి గురైన ఓ వివాహిత.. తన భర్తకు తెలియకుండా నిందితులకు ఎలా బుద్ధి చెప్పింది? అప్పటి వరకు రహస్యంగా ఉందనుకున్న ఆ విషయం.. తన భర్తకు తెలిశాక ఆ జంట మధ్య ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వారి జీవితం ఎలా సుఖవంతం అయింది’ అన్న ఇత్తివృత్తంతో రూపొందిన సినిమా ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు.
entertainment
16,597
09-01-2017 15:13:34
చైనాకు భారత్ చెక్... వియత్నాంకు 'ఆకాష్' క్షిపణులు
న్యూఢిల్లీ: శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూక్తితో పాకిస్తాన్‌కు అంతకంతకూ దగ్గరవుతున్న చైనాకు ధీటైన జవాబిచ్చేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఇందుకు అనుగుణంగా చైనాతో విభేదిస్తున్న వియత్నాంకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్ క్షిపణి వ్యవస్థల అమ్మకంపై భారత్ చర్చలు సాగిస్తోంది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఆకాష్ క్షిపణి సునాయాసంగా ఛేదిస్తుంది. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడును నిలువరించాలంటే వియత్నాంకు సాయపడాలన్నదే భారత్ ఆలోచనగా చెబుతున్నారు. 48 దేశాల అణు సరఫరా దేశాల గ్రూపులో (ఎన్ఎస్‌జీ) భారత్ చేరికను చైనా కొద్దికాలంగా అడ్డుకుంటోంది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితికి భారత్ చేసిన విజ్ఞప్తికి కూడా చైనా అడ్డుతగులుతూ వస్తోంది. ఈ తరుణంలో వియత్నాంతో వ్యూహాత్మక సైనిక ఒప్పందం ద్వారా చైనా ఎత్తుకు పైఎత్తు వేయాలన్నది భారత్ యోచనగా తెలుస్తోంది. 25 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, డ్రోన్‌లను కూల్చే సామర్థ్యం ఆకాష్ క్షిపణులకు ఉందని, వీటిని వియత్నాంకు అందించేందుకు చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియా గతంతో బ్రహ్మోస్ సూపర్ క్రూయిస్ మిసైల్స్, యాంటీ సబ్‌మెరైన్ టోర్పెడోలైన 'వారుణాస్త్ర'ను వియత్నాంకు భారత్ ఆఫర్ చేసింది. అలాగే, వియత్నాం కొనుగోలు చేసిన సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్సె‌ పైలట్స్‌కు ఈ ఏడాది నుంచి శిక్షణ ఇచ్చేందుకు కూడా భారత్ అంగీకరించింది. కాగా, వియత్నాంతో ద్వైపాక్షిక, రక్షణ సహకారం మరింత పెంచుకునేందుకు తాము సుముఖంగా ఉన్నాయని, భారత్‌కు వియత్నాం సన్నిహిత స్నేహితుడని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వియత్నాం దళాల సైనిక సామగ్ర అప్‌గ్రేడ్ చేయడం, ఫైటర్లు, సబ్‌మెరైన్ల వినియోగంలో వారికి శిక్షణ ఇవ్వడం విషయంలోనూ భారత్ సహకరిస్తుందన్నారు. ఆకాష్ క్షిపణుల సేకరణకు వియత్నాం ఎంతో ఆసక్తి చూపుతోందని, టెక్నాలజీ బదలాయింపు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంయుక్త తయారీకి కూడా ఆసక్తి చూపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
nation
19,932
15-04-2017 01:45:37
ప్రీ క్వార్టర్స్‌కు శరత్ కమల్‌
ఆసియా టీటీ చాంపియన్‌షిప్స్‌ఉక్సీ (చైనా): ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారుడు శరత్ కమల్‌ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన రౌండ్‌-32 మ్యాచ్‌లో శరత్ 11-5, 11-7, 14-12తో రొ క్వాంగ్‌ జిన్‌ (కొరియా)పై నెగ్గాడు. ప్రీ క్వార్టర్స్‌లో లమ్‌ సు హంగ్‌ (హాంకాంగ్‌)తో కమల్‌ తలపడనున్నాడు. కాగా, సౌమ్యజిత్ ఘోష్‌, హర్మీత్ దేశాయ్‌, సనిల్‌ షెట్టి రౌండ్‌-32లోనే ఓడి ఇంటి ముఖం పట్టారు. ఘోష్‌ 3-11, 4-11, 5-11తో కొకి నవా (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు.
sports
21,176
08-10-2017 02:15:38
సానియా జోడీ ఓటమి
బీజింగ్‌: చైనా ఓపెన్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా జోడీ పోరాటం ముగి సింది. శనివారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో మూడో సీడ్‌ సానియా-షూ పెంగ్‌ (చైనా) ద్వయం 6-2, 1-6, 5-10తో టాప్‌సీడ్‌ మార్టినా హింగిస్‌-చాన్‌ యుంగ్‌ జాన్‌ (తైవాన్‌) చేతిలో పరాజయం పాలైంది.
sports
21,184
24-04-2017 18:35:20
పరుగుపందెంలో గోల్డ్ మెడల్ గెలిచిన 101 ఏళ్ల భారతీయ వృద్ధురాలు
అక్లాండ్: న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో వరల్డ్ మాస్టర్స్ గేమ్స్‌ నిర్వహించిన 100 మీటర్ల పరుగుపందెంలో భారత్‌కు చెందిన 101 ఏళ్ల మాన్ కౌర్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. 17వ సారి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మాన్ కౌర్ 100 మీటర్ల పరుగుపందాన్ని 1 నిమిషం 14 సెకన్లలో(74 సెకన్లలో) పూర్తిచేసింది. ప్రపంచ పరుగుల రారాజు హుస్సేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగుపందాన్ని పూర్తిచేయడానికి 64.42 సెకన్లు పడితే.. 101 ఏళ్ల కౌర్‌ 74 సెకన్లలోనే పూర్తిచేయడం విశేషం. వందేళ్ల వయసులోనూ ఏమాత్రం పట్టుతప్పకుండా 100 మీటర్ల పరుగుపందాన్ని ఎనలేని ఉత్సాహంతో పూర్తిచేసింది కౌర్. పరుగు మొదలుపెట్టినప్పుడు ఏవిధంగా అయితే ఉందో.. లక్ష్యాన్ని చేరుకున్నాక కూడా అదే ఉత్సాహం ఆమెలో కనిపించింది. వరల్డ్ మాస్టర్ గేమ్స్‌లో 25 వేల మంది పాల్గొనగా.. 100 ఏళ్లు దాటిని ఏకైన మహిళ మన్ కౌర్ కావడం విశేషం. రేసులో విజయం సాధించిన అనంతరం కౌర్ మాట్లాడుతూ.. ఈ రేసులో గెలుపొందడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. పరుగెత్తడానికీ తానెప్పుడూ సిద్ధంగానే ఉన్నాననంది. ఇలాంటి మరిన్ని ఈవెంట్లలో పాల్గొని విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. కొడుకు గురుదేవ్ సింగ్ సహకారంతో అథ్లెట్‌గా మారిన కౌర్.. డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటుందట. గోదుమ గడ్డితో చేసిన జ్యూస్, గ్లాస్ పాలు ప్రతిరోజూ తాగుతుందట. మరోవైపు కౌర్‌పై న్యూజీలాండ్ వాసులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అందరికీ ఆరద్శంగా నిలిచిందని, చత్తీస్‌ఘడ్ నుంచి వచ్చిన సంచలనం అని పేర్కొంటున్నారు. కాగా, జపాన్‌కు చెందిన 106 ఏళ్ల హిడెకిచి మియాజాకి 100 మీటర్ల పరుగుపందాన్ని 29.83 సెకన్లలో పూర్తిచేసి ‘గోల్డెన్ బోల్ట్’గా పేరుపొందింది. ఫ్రెంచ్‌కి చెందిన 105 ఏళ్ల రాబర్ట్ మర్చండ్ సెక్లింగ్‌లో 22.547 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంటలో పూర్తిచేశాడు.
sports
14,243
16-12-2017 02:00:21
ఇక ‘వేడుకో’వద్దు!
‘ఐ బెగ్‌ టు’ పదాన్ని వాడొద్దని సూచన..రాజ్యసభలో తొలిరోజే వెంకయ్య మార్క్‌న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): చమత్కారం.. ఆగ్రహం.. పట్టుదల.. సూచనలు.. కఠినత్వం.. ఇలా సందర్భాన్ని బట్టి అన్ని భావోద్వేగాలను సమపాళ్లలో వాడుతూ పెద్దల సభను హుందాగా నడిపారు వెంకయ్యనాయుడు. రాజ్యసభ చైర్మన్‌గా తొలి రోజే ఆయన తనదైన శైలిలో వ్యవహరించారు. వలసపాలన అవశేషంగా మిగిలిపోయిన ‘ఐ బెగ్‌ టు’ (నేను వేడుకుంటున్నా) అనే పదానికి చరమగీతం పాడారు. ఇకపై ఆ పదాన్ని వాడొద్దని సూచించి సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. శుక్రవారం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో మంత్రులు, సభ్యులు ఏదైనా అంశంపై మాట్లాడాలన్నా, ఏవైనా పత్రాలను సభలో ప్రవేశపెట్టాలనుకున్నా చైర్మన్‌ను ఉద్దేశించి ‘ఐ బెగ్‌ టు..’ అని మొదలుపెడతారు. కొత్తగా నియమితులైన రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ఓ సందర్భంలో ‘ఐ బెగ్‌ టు’ అనే పదాన్ని వాడారు. స్పందించిన వెంకయ్య.. ఇకపై ఆ పదాన్ని వాడొద్దన్నారు. దాని స్థానంలో ‘ఐ రైజ్‌ టు సే’(నేను ఓ అంశాన్ని చెప్పేందుకు లేచాను) అని వాడాలని సూచించారు. ఐ బెగ్‌ టు అనేది వలస పాలన నాటిదని, స్వతంత్ర భారతంలో ఎవరినీ వేడుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అలాంటి పదాలు వాడొద్దని వెంకయ్య స్పష్టం చేశారు. మరోవైపు ఎవరైనా మాజీ సభ్యులు, సభ్యులు మరణిస్తే చైర్మన్‌ సంతాప సందేశాన్ని చదవుతారు. దీన్ని కూడా ఇతర చైర్మన్లలా కాకుండా వెంకయ్య లేచి నిలబడి చదివారు. తొలిరోజే ఇలా రెండు కొత్త సంప్రదాయాలకు తెరతీశారు. చమత్కారం.. హాస్యం..శరద్‌ యాదవ్‌, అన్వర్‌ అలీలపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఎంపీలు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తుండగా వెంకయ్య ‘ఆల్‌ ఇన్‌ వెల్‌.. నాట్‌ వెల్‌ ’ అని చమత్కరించారు. అలాగే, ఓ ఎంపీ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తి ఏదో మాట్లాడుతుండగా.. ఆయన లేవనెత్తిన అంశంలో ‘పాయింటూ’ లేదు ‘ఆర్డరూ’ లేదు అని వెంకయ్య అనడంతో సభలో నవ్వులు విరిశాయు. మరో సందర్భంలో వెంకయ్య డీఎంకే ఎంపీ తిరుచ్చి శివను పిలిచారు. అప్పుడాయన సభలో లేకపోవడంతో ‘శివ (దేవుడు) అంతటా ఉంటాడు. కానీ, ఇక్కడ లేరు’ అని చమత్కరించారు. ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ అమలుసభను సజావుగా నడిపించడానికి వెంకయ్య కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ సదస్సులో మాట్లాడుతూ.. సభను పదేపదే అడ్డుకునేవారిని కట్టడి చేయడానికి ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ విధానాన్ని ప్రతిపాదించారు. అంటే సభను అడ్డుకుంటున్న వారిని పేరుపెట్టి పిలవడం. శుక్రవారం ఆ విధానాన్ని అమలు చేసినట్లు కనిపించింది. ఓ ఎంపీ గట్టిగా మాట్లాడుతూ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. రెండు మూడు సార్లు ఆయన్ను పేరుపెట్టి పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ అమలుసభను సజావుగా నడిపించడానికి వెంకయ్య కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ సదస్సులో మాట్లాడుతూ.. సభను పదేపదే అడ్డుకునేవారిని కట్టడి చేయడానికి ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ విధానాన్ని ప్రతిపాదించారు. అంటే సభను అడ్డుకుంటున్న వారిని పేరుపెట్టి పిలవడం. శుక్రవారం ఆ విధానాన్ని అమలు చేసినట్లు కనిపించింది. ఓ ఎంపీ గట్టిగా మాట్లాడుతూ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. రెండు మూడు సార్లు ఆయన్ను పేరుపెట్టి పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు.
nation
21,510
15-01-2017 19:18:22
కోహ్లీకి పోటీగా బ్యాటింగ్ చేస్తున్న కేదార్ జాదవ్..
పూణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 351 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే టాప్ ఆర్డర్‌ను కోల్పోయింది. శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, యువరాజ్, ధోనీలు వరుసగా తక్కువ పరుగులకే ఔటయ్యారు. అయినప్పటికీ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తూ తన వన్డే కెరీర్‌లో 39వ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అయితే కోహ్లీతో పాటు క్రీజ్‌లో ఉన్న కేదార్ జాదవ్ కెప్టెన్‌కు పోటీగా బ్యాటింగ్ చేస్తున్నాడు. చాలా క్లాస్‌గా బ్యాటింగ్ చేస్తూ కోహ్లీ ఒంటరి కాదన్న భావన కలిగిస్తున్నాడు. 21 బంతుల్లోనే 39 పరుగులు చేసి చెలరేగుతున్నాడు. ప్రస్తుతం భారత స్కోర్ 19 ఓవర్లకు 125. మ్యాచ్ గెలిచేందుకు ఇంకా 226 పరుగులు చేయాల్సి ఉంది.
sports
11,825
11-11-2017 15:45:28
‘మహా’ ప్రభుత్వానికి చుక్కలుచూపించిన రైతు!
ముంబై: మహారాష్ట్రలో సచివాలయంలో శుక్రవారం సాయంత్రం హైడ్రామా జరిగింది. సచివాలయంలోని మంత్రాలయ బిల్డింగ్ ఏడో అంతస్తు ఎక్కి దూకెస్తానంటూ ఓ యువ రైతు సిబ్బందిని బెదిరించాడు. నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి ముచ్చమటలు పట్టించాడు. మరాఠ్వాడాలోని ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన జ్ఞానేశ్వర్ సాల్వే అనే రైతు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఓ పనికోసం వచ్చినట్టు సచివాలయం సిబ్బందికి చెప్పి లోపలికి ప్రవేశించాడు. తర్వాత సచివాలయం ఏడో అంతస్తులోకి చేరుకొని కిటికిలోంచి బాల్కనీలోకి దూకి అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. తమ ప్రాంతాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తమ ప్రాంతంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశాడు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఫోన్‌లో మాట్లాడించాలని సాల్వే కోరాడు. కాగా జ్ఞానేశ్వర్‌ను రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమపడ్డారు. జ్ఞానేశ్వర్‌కు ఎటువంటి హానీ జరుగకుండా అగ్నిమాపక సిబ్బంది కింద వలలు పట్టుకొన్నారు. పోలీసుల సూచన మేరకు వాళ్లతో మాట్లాడేందుక సాల్వే అంగీకరించాడు. ఓ చీటీపై జ్ఞానేశ్వర్ తన ఫోన్ నెంబర్ రాసి ఇవ్వగా.. పోలీసులు అతనితో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించారు. ఎట్టకేలకు పోలీసులు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రొద్బలంతో సాల్వే దిగొచ్చాడు. జ్ఞానేశ్వర్ నిరసను ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటుందని, అతనిపై ఎటువంటి కేసు నమోదు చేయమని మంత్రి వినోద్ తావ్డే తెలిపారు. మరఠ్వాడలో రైతుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం ఫడ్నవీస్ ప్రతేక చొరవ చూపిస్తారని చెప్పారు. తాను యువరైతునని, యువకులపై ప్రభుత్వం ఏలాంటి కేసులు నమోదు చేయలేదని జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే అతనిపై పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయడం విశేషం.జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే అతనిపై పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయడం విశేషం.
nation
9,017
08-02-2017 11:48:56
విలన్‌గా రానున్న మరో తెలుగు స్టార్ హీరో
కొన్ని సంవత్సరాల క్రితం వరకూ శ్రీకాంత్ హీరో! ఆ తరువాత నెమ్మదిగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారాడు. ఇప్పుడు విలన్‌ అవతారం ఎత్తబోతున్నాడు. కాకపోతే టాలీవుడ్‌లో బోలెడంత మంది విలన్లు ఇప్పటికే ఉన్నారు కనుక మాలీవుడ్‌కి వెడుతున్నాడు. మోహన్‌లాల్‌ సినిమాలో విలన్‌గా చేయబోతున్నాడు. ఇంతమంది విలన్లు ఉండగా శ్రీకాంత్‌ని తీసుకోవడంలో ఓ మెలిక ఉంది అంటున్నారు సినీజనాలు. ఈ సినిమాను టాలీవుడ్‌లో డబ్‌ చేసే అవకాశాలు ఉన్నాయట! ఆల్‌రెడీ ఉన్న విలన్లు తెర మీద బోలెడన్ని సార్లు కనిపించి బోర్‌ కొట్టించేశారు. శ్రీకాంత్ అయితే ఫ్రెష్‌గా కనిపిస్తాడని మాలీవుడ్‌ దర్శకనిర్మాతలు భావిస్తున్నారట! టాలీవుడ్‌లో శ్రీకాంత్ విలన్‌గా సక్సెస్‌ సాధిస్తే మరో మంచి విలన్‌ దొరికినట్టే అంటున్నారు సినీజనాలు. కాకపోతే సాఫ్ట్‌గా కనిపించే శ్రీకాంత్ విలనిజం పండించగలడా? అన్నదే కొందరి అనుమానం.
entertainment
18,147
11-07-2017 19:09:10
‘జీఎస్‌టీ వల్ల జర్నీ టైమ్‌ తగ్గుతోంది’
న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల రవాణా వాహనాలకు ప్రయాణ సమయం ఆదా అవుతోంది. దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను తొలగించడంతో వాహనాల ప్రయాణ కాలం గతం కన్నా దాదాపు 20 శాతం తగ్గింది. వాహనదారులు చెప్తున్న వివరాల ప్రకారం పన్నులను విధించే అధికారులు రోడ్లపై కనిపించకపోయినా, రవాణా శాఖ అధికారులు ఏదో సాకు చూపుతూ డబ్బులు గుంజుతున్నారు. జీఎస్‌టీ అమల్లోకి రావడానికి ముందు ఢిల్లీ - ముంబై మధ్య ప్రయాణానికి నాలుగు రోజులు పట్టేది. ప్రస్తుతం మూడు రోజుల్లోనే వాహనాలు గమ్యాన్ని చేరుకోగలుగుతున్నాయి. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళాలంటే గతంలో ఆరున్నర రోజులు పట్టేది, ఇప్పుడు 5 రోజులు సరిపోతోంది. పన్నులను విధించే అధికారులు ఎవరినీ నిర్బంధించరాదనే నిబంధన వల్ల వాహనాలు గమ్య స్థానానికి చేరడంలో జరిగే జాప్యం తగ్గడానికి దోహదపడుతోంది.
nation
4,780
28-06-2017 15:51:31
శ్రీశాంత్ వచ్చేస్తున్నాడు!
తన అగ్రెసివ్ ఆటతీరుతో క్రికె‌ట్‌లో మంచిపేరే సంపాదించుకున్నా.. పలు ఆరోపణలతో ఇండియన్ టీంకు దూరమయ్యాడు శ్రీశాంత్. ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్‌తో వివాదమూ శ్రీశాంత్ కెరీర్‌లో మరచిపోలేని విషయమే. అయితే.. క్రికెట్‌కు దూరంగా ఉంటున్నా మరో దారిలో జనాలకు చేరువ అవుతున్నాడు క్రికెటర్. ఆ దారే సినిమా. శ్రీశాంత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘టీమ్ 5’. సురేశ్ గోవింద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ జఖారియన్ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ జూలై 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఐదుగురు రేసర్ల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీశాంత్‌కు జోడీగా నిక్కీ గల్రానీ నటిస్తోంది.
entertainment
5,522
21-12-2017 18:03:23
చిరంజీవిగారిని చూసి నా కళ్లలో నీళ్లు వచ్చాయి: నాగార్జున
‘హలో’ విడుదలకి ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో చిత్ర నిర్మాత నాగార్జున స్వయంగా ప్రమోషన్ కోసం రంగంలోకి దిగారు. ఈ రోజు (డిసెంబర్ 21) ఈ సినిమా గురించి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఎలా వచ్చిందీ అనే విషయం ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పాను. అఖిల్‌ని ఎలా చూడాలనుకున్నానో.. ఈ సినిమాలో అలా చూశాను. అలాగే కల్యాణి కూడా. ఈ సినిమా మొత్తం అదృష్టంపైనే నడుస్తుంది. అంటే లిటిల్ బిట్ ఆఫ్ మ్యాజిక్ ఉంది ఇందులో. విక్రమ్ ప్రతి సినిమాలో అది ఉంటుంది. ఈ సినిమాకి.. నాతో ‘హలో గురూ ప్రేమ కోసమేరో..’ అని పాడించిన ప్రియదర్శన్‌గారి అమ్మాయి కల్యాణి. ఆయన కూతురని ఈ సినిమాలో తీసుకోలేదు. అలాగే విక్రమ్‌కి గురువు ప్రియదర్శన్. అయినా కూడా స్ర్కీన్ టెస్ట్‌లన్నీ చేసే తీసుకున్నాం. విక్రమ్ ఏదీ అంత సామాన్యంగా వదలడు. కొత్త అమ్మాయి అయినా ఈ సినిమాలో అద్భుతంగా చేసింది. ఈ సందర్భంగా ప్రియన్‌కి ధన్యవాదాలు. ఇక నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా చక్కగా జరిగింది. నాకే చూడడానికి చాలా బాగుంది అనిపించింది. అఖిల్ డ్యాన్స్‌లు చూస్తుంటే ముచ్చటేసింది. ఇక చిరంజీవిగారిని అఖిల్‌ని ఆశీర్వదించడానికి రమ్మని అగడగానే.. ఆయన వస్తాను అన్నారు. కానీ సినిమా చూశాక.. మీకు నచ్చితేనే రండి.. అని చెప్పి సినిమా చూపించాను. సినిమా నచ్చితేనే వచ్చి.. ఆశీర్వదించడండి. నచ్చకపోతే వద్దు అని చెప్పాను. సినిమా చూశాక నాకు కళ్లలో నీళ్లు వచ్చాయి. సినిమాలో విషయంని బట్టి వచ్చిన నీళ్లు కాదు. సినిమా చూశాక..  అఖిల్‌ని హగ్ చేసుకుని చిరంజీవిగారు రెండు నిమిషాలు మాట్లాడలేకపోయారు. ఆయన కళ్లలో నీళ్లు చూశాను. అది చూసి నాకు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. అప్పటి వరకు ఎంతో టెన్షన్‌తో ఉన్న నాకు అది చూశాక.. పెద్ద బరువు దిగిపోయినట్లయింది.  ఆ తర్వాత వేడుకకి వచ్చి.. అఖిల్‌ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రామ్ చరణ్‌కి కూడా. అఖిల్, చరణ్ వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇక మెగా అభిమానులు ఈ ఫంక్షన్‌కి వచ్చి అఖిల్‌ని ఆశీర్వదించడం అనేది చాలా సంతోషం కలిగించింది. మెగా, అక్కినేని అభిమానులు ఈ వేడుకకి వచ్చి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంని నెలకొల్పారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను..’’ అన్నారు.
entertainment
13,951
25-02-2017 15:13:58
మాజీ సీఎంపై మండిపడిన వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పచ్చి అవకాశవాది అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ, పిడీపీ కూటమిని ఫరూఖ్ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడంపై శనివారంనాడు మీడియా సమావేశంలో ఆయన మండిపడ్డారు. అధికారం కోల్పోవడం వల్లే ఫరూఖ్ స్వరం మారిందని తప్పుపట్టారు. 'మతతత్వ శక్తులతో చేతులు కలిపేది లేదని దివంగత ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ ప్రజలకు వాగ్దానం చేశారు. జమ్మూకశ్మీర్‌లో బీజేపీతో పీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు సహించరు' అని అబ్దుల్లా శ్రీనగర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు తిప్పికొడుతూ 'ఆయన మాటలు తప్పు. కేవలం అధికారంలో లేకపోవడం వల్లే ఆయన తన స్వరం మార్చారు. మతతత్వ శక్తులతో ముఫ్తీ మహమ్మద్ సయీద్ పార్టీ చేతులు కలపడంపై ప్రజలు సంతోషంగా లేరని ఫరూఖ్ చెబుతున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆయన బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు. మీరూ, మీ కుమారుడు ముఖమంత్రులు అయినప్పుడు బీజేపీ సెక్యులర్‌ పార్టీగా కనపడింది. ఇప్పుడు ముఫ్తి, ఆయన కుమార్తె ముఖ్యమంత్రులైతే బీజేపీ మతతత్వ పార్టీగా కనబడుతున్నట్టుంది' అని ఫరూఖ్‌పై వెంకయ్య విసుర్లు విసిరారు. ఇది ఆయన అవకాశవాదాన్ని, రెండు నాల్కల ధోరణిని తేటతెల్లం చేస్తోందని అన్నారు.
nation
17,773
18-10-2017 05:09:23
పెంటకుప్పపై ఆడశిశువు!
మండపేటలో ఓ తల్లి దారుణంమండపేట, అక్టోబరు 17 : ఒక తల్లి వద్దనుకొని పెంటకుప్పల్లోకి విసిరేసింది. మరో తల్లి ముందుకొచ్చి, పొత్తిళ్లలోకి తీసుకొంది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, సోమవారం రాత్రి అర్తమూరు గ్రామ సమీపంలో ఎవరో నవజాత ఆడశిశువుని వదిలేసిపోయారు. పెంటకుప్పలో పడిఉన్న ఆ పసికందు ఏడుపు విని నీలా సత్యనారాయణ అనే గ్రామస్థుగు అటువెళ్లాడు. పసికందు పరిస్థితికి చలించిపోయాడు. ఇంటికి తీసుకెళ్లి తన భార్య వెంకటలక్ష్మికి అప్పగించాడు. మంగళవారం తమ ఇంటికి వచ్చిన ఆడ శిశువుకి మహాలక్ష్మి అని పేరు పెట్టాలని దంపతులు ఆలోచిస్తున్నారు.
nation
11,553
25-12-2017 10:53:47
వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోవింద్, మోదీ
న్యూఢిల్లీ : భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయి 1924 డిసెంబరు 25న జన్మించారు. ఆయన సోమవారం 93వ ఏట అడుగు పెడుతున్నారు. ఆయన భారతదేశాన్ని న్యూ మిల్లీనియంలోకి సమర్థవంతంగా నడిపించారని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఓ పదవీ కాలం పూర్తిగా ప్రధాన మంత్రిగా కొనసాగిన మొదటి కాంగ్రెసేతర నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన మంచి వక్త. బీజేపీలో దిగ్గజ నేత. ఆయన ప్రత్యర్థులు కూడా ఆయనను వ్యక్తిగతంగా అభిమానిస్తారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. వాజ్‌పేయి పార్లమెంటులో తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునేవారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓ ట్వీట్‌లో వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అత్యంత లోకప్రియ నేత, గౌరవనీయ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ట్వీట్‌లో ‘‘మా ప్రియమైన అటల్‌జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అసాధారణ, దార్శనిక నాయకత్వం భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా చేసింది. ప్రపంచ వేదికపై మన గౌరవాన్ని పెంచింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
nation
3,275
12-11-2017 23:50:23
జీరో డిగ్రీ వద్ద అతనూ, మనమూ
కొండ లోయల మబ్బు నీడల్లో నడిచే దూడ మెడగంట చేసే చప్పుడు ఎంతది గనుక! అంతటిదే కవి గొంతు... కనులు మూసుకున్న జెన్‌ మౌని హుంకరించి చెబుతాడా ఏదయినా మన వెర్రిగానీ! దుఃఖం రుచి తెలిసిన కవీ అంతే. మోహన్‌ రుషీ ఇంతే. స్వాప్నికులకో, విదూషకులకో, కత్తిదూసే సామాజిక విశ్లేషకులకో వాల్‌ పోస్టర్‌లాగ ఏదేనా చెప్పడం మోహన్‌ రుషి పనయితే కాదు... మిలిటరీ పెరేడ్‌లో కృష్ణశాస్త్రిని చదివి వినిపిస్తున్నట్టు. నిజానికి దుర్మార్గ బాణహతులున్న చోట నోటి ముత్యాలో, విసిరే పూలగుత్తులో పనిచేయవని మన రుషికీ తెలుసు. తీరా యుద్ధానికి దిగాకా పూల బాణాలా ఎదురయేవి? తెలుసు... మన తెలుగు కవులందరికీ తెలుసు. అలాగని, తెలిసి తెలిసి లక్కపిడతల్లాటి హితవచనాలో, మొహం మీద కొట్టినట్టు కొన్ని మాటలేవో రాసి పడేసే పనయితే దానికి రుషి వంటి కవి దేనికి? ప్రతిదీ విడమరచి చెప్పుకొంటూపోతే అది తప్పకుండా వ్యాసమో, ‘పదకుండవ పత్ర’మో కావొచ్చుగానీ కవిత మాత్రం చచ్చిననూ కాదు. సరిగ్గా ఇక్కడే రుషి వంటి కవి ఆదేశాన్నయినా, అభ్యర్థననయినా ఆవేశపు చాటున అరిటాకు మాటున పచ్చిగెలలా కవితారూపంలో సలక్షణంగా చెప్పవలసిందే. కానిపక్షంలో చూస్తున్నాంగా... దారంతా విరుద్ధ దృశ్యంలో రాల్చిన వ్యర్థ పదాలు, వట్టి గావు కేకలూనూ... నయం... మోహన్‌ రుషి ఇలాటి పదాలు, కేకలూ పెట్టి కవిత్వమని మనల్ని భ్రమపెట్టే పనిలోకి దిగేడు కాదు. నా/ మనవంటి పాఠకులు, ముఖ్యంగా కవిత్వాన్ని మాత్రమే హత్తుకునేవారు ‘పారాహుషార్‌’ చెబుతూ నడుస్తున్నంత కాలం కవులకు సాయపడినవాళ్లం అవుతాం. రుషి పనితనం ఇదిగో మన చేతిలోని ‘జీరో డిగ్రీ’.రుషి ఒక మరణాన్నో, ఒక సంఘటననో, ఇంకెవరి అనుభవాన్నో సెంటిమెంటు చేర్చికూర్చి మనల్ని ఆ ఉచ్చులోకి లాగే పనిపెట్టుకోలేదు. తాను పలవరించని, స్వప్నించనిదేదీ కవితా వస్తువుగా దాదాపు తాకలేదు. ఔను, నిజమే... కొన్ని రాజకీయ, ప్రాంతీయపరమైనవి మినహాయిస్తే, తక్షణికమైనా, శాశ్వతమైనా ఒక జీవనదృశ్యం పూర్తి కవన రూపంలో ఇమడ్చడానికి రుషి కఠిన ప్రయత్నం చేయలేదు ఇక్కడ. ఒక జెన్‌ సూచన, ఒక హైకూ పదం, ఒక సూఫీ సూక్ష్మం సరళంగా ప్రత్యక్షం కావటంలోనే వాటి సత్తా వున్నట్టు అలా వచ్చి ఇలా ఆవిరికాని అంతర్ధ్వని, దాని సూక్ష్మం రుషి పట్టుకున్న దాఖలా అనేక కవితల్లో కనిపిస్తుంది. అనుభవాల తీరపు దుఃఖం, నిర్వేదం కళకు సంబంధించిన శైలిలో ఎంత పలకాలో అంతే పలికించటంలో కనబడని సంమయనం రుషి కవితల కవతల కనిపిస్తుంది. తాను పరితపించే వేదనను అవతలివాడి సహనం జోలికి పోకుండా తగినట్టుగా నిలువరించటం కవితల్లో పదాల బాధ్యత కదా. ఆ వొడుపు తెలిసినవాడే మోహన్‌ రుషి. వేట సఫలం చేసే బాణాలే అతని పదాలు. ‘‘బైటేం పన్లేదు, పోవాల్లోపలికే, లోపలికే ఇక’’ అన్నప్పుడు రుషి కవితలు కొన్ని బైరాగి తత్త్వాల్లాగే, పదాల్లాగే పాటలా పట్టుకుంటాయి మనల్ని. కవి చాలాసార్లు ‘‘ఏక్‌ అకేలా ఇస్‌ షెహరుమే - రాత్‌ మే దొపెహరు మే...’’లా అనిపించడమే కాదు, కనిపిస్తాడు. నిజానికి ఒకటి మరొకటిని గుర్తు చేసి వేదనాష్టకాన్ని తవ్వి తోడినట్టుంటుంది. వంటరి ఊటబావి ఊరిన ఏదో వేదన జలం. అదీ అందీ అందనంత లోతుల్లో. కొన్ని కవితలయితే వంటరితనాన్ని పలికే గజల్‌లా అనిపించాయి. చింత, చింతనా అంతలోనే ఆశను దట్టించే వ్యూహాల్లా ధ్వనిస్తాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక, నైతిక విలువలు అంతటా చీకట్లో కూలుతున్న భవనంలా వున్నవేళ... ‘‘ఏమీ లేదు నీకూ, నాకూ మధ్య. ఎడతెగని దూరం తప్ప... కనుచూపుమేర ఆవరించిన శూన్యం తప్ప’’ అని నగర జీవితం నుంచీ తనను తాను పోగొట్టుకునే కృషి అనాయాసంగా కనిపిస్తుంది. విషాదపు మబ్బులు కప్పిన మనుగడ, దాదాపు సినిక్‌లా అనిపించే వంటరి కేక నిశ్శబ్దంగా ప్రతిధ్వనించటం ఈ కవితల్లో చాలాసార్లు కనిపిస్తుంది. సకల సిద్ధాంతాలకు, స్వీయ ప్రతిపాదనలనే సలహా, ఆదేశాలకు బహుదూరంగా నడిచిపోతుండే తత్త్వం రుషిది. ఐతే ఫలానా ‘ఇజం’లో ఇంప్రిజన్‌ కాకుండానే అన వలసిన నాలుగు మాటలూ అనటం, అదీ కవిత్వ భాషలో చెప్పకుండా పోడు రుషి. ఒక దుస్థితిని, ఒక మోదాన్ని యథాతథంగా వున్న స్థితిలో చూపెట్టడంలో కథలు, నవలలు, వాటి పాత్రలూ సాధించినట్టు కవితా ముఖం పలకలేదు. పలికితే అది కవిత్వం కాకుండాపోయే ప్రమాదం వుంది. పఠాభి వేళాకోళం చేసినా, శ్రీశ్రీ ఆకలేసి కేకలేసినా, కృష్ణశాస్త్రి దిగులు పడినా, ఇస్మాయిల్‌ కరుణ ముఖ్యమన్నా-- అన్నీ కవితామయమైనవేనని రుషికి తెలుసుననీ ఇందులోని కవితలు చెబుతాయి. ఉడుకుతున్న చేతగానితనపు మధ్య తరగతి ఉక్కపోత, ఆధునిక నగర జీవన నిర్మోహత్వం, అన్నీ వరసన స్పృశించి, చూసి, తలమునకలయి రాసిన విస్తృతి కవితల్లో కనిపిస్తాయి. బాధగానీ, ఈసడింపుగానీ తన తెలంగాణా పదాల్లో రాసినప్పుడూ అవి పరిచయం కాని వారికి సైతం శ్వాస తీసుకున్నంత సహజంగా గుండెల్లోకి చేరుతుంది. పడే వేదనకి, వినే హృదయానికి భాషలు ఎప్పుడూ నిజంగా అడ్డం కావు. విస్తృత విశ్వ యాత్రీకులు, నిశ్చల తత్త్వవేత్తలూ ఏ భాషలో ఎలా చెప్పానని చూడలేదు-- ఎవరికయినా మనోయానం ముఖ్యం. ఏదో ఒక వాదానికి కట్టుబడనట్టే రుషి ఏదో ఒక ప్రవచనమూ చేయడు. అంతరంగయానం, స్వీయసమీక్ష సమాజమే చేసుకోవాలన్నట్టు ఎదురీత ధ్వనినే ఎంచుకున్నాడు. వినే చెవులుంటే చాలుననే నమ్మిక అది. అలాగే సురేంద్రరాజు తన ‘ముందుమాట’లో అన్నట్టు రుషిలో ‘‘అర్బేనిటీ అంతస్సూత్రంగా వుంది. అదే అతని భావుకతని డిఫైన్‌ చేస్తున్నది’’. సిద్ధాంతాల వాస్తవాధీన రేఖలు దాటితే, కవిత్వపరం చేయబోతే అప్పుడది సామర్థ్యాన్ని, ప్రయోజనాన్ని, రెండిటినీ ప్రశ్నిస్తుందని మరిచే కవులే విఫల ప్రయత్నం చేయటం చూడటం లేదా మనం?! అక్కడే రుషి లక్ష్యం కోసం వ్యూహాన్నీ, మార్గాన్నీ అత్యవసరంగా భావించలేదు. సమాజ ధోరణి ప్రస్తావించిన ప్రతి కవితలో ఇది ఎర్రటి అండర్‌లైన్‌లా పలకరిస్తుంది. ఉసిగొల్పాలన్న ఊహే పెద్ద సాధనం. అకవితలు, డికన్‌స్ట్రక్షన్‌ సంగతులు మాటాడేవారికి, రాసేవారికి ఈ వైనం తెలుసు. రుషికీ తెలుసు. అందుకే... ‘‘పొద్దు పొద్దున్నే వాడి కళ్ల వాకిళ్లు చీపురుకట్టతో ఎంత ఊడ్చినా వాడి అహం నిద్ర విచ్చుకోదు’’ అన్నప్పుడు గంధక ధూపం వొదిలే మాటల అవసరం పడదు-- వేదన సారం తెలిసిన కవికి. ‘దూప’ అనే కవిత చూడండి. తన చెవిలో తనే మాట్లాడుతున్నట్టుంది. ఐనా గడ్డకడుతున్న ఒక సమాజపు వెర్రికేక అది. వినబడక మానదు. అలాగే ఎన్నో, ఎన్నెన్నో స్వగతాలు పరగతం, సమాజగతం కావటం నేర్పుగా స్పందించటంలో వుంది... ‘‘ఎన్నో వున్నా ఏడ్వడం అలవాటయిన నేను, ఏమున్నా లేకపోయినా నవ్వటం తప్ప తెలీని నువ్వు. అదే అదే పదేపదే. అయినప్పటికీ పాతదైపోదే?! గుండెల్లోని తియతియ్యని అనుభూతికి అంతమనేదే లేదే?!’’  ‘‘చూసినవా, ఎన్నడన్న, నిజంగ ఒక విషాద క్షణం రంగూ, రుచీ, వాసనా?అది ఒక ఉల్కాపాతం కావచ్చు, లేదా ఎల్లెల్కల నువు తలవాల్చే మెత్త కిందే ఉండి ఉండొచ్చు...’’ ‘నేర్చుకున్నప్పటికీ’, ‘8పిఎం’, ‘పెళ్లాంపిల్లల్ని ప్రేమించేవాళ్లు’ మొదలయిన కవితల్లో పెద్ద పెద్ద విషాదాంతపు నవల్ని సంగ్రహంగా, అతిసులువుగా చెప్పినట్టు చెప్పాడు రుషి. ‘‘నువు బతికున్నావని చెప్పే బండ గుర్తు నీ నిర్లక్ష్యం’’ అనే స్వస్వరూపం మనం వుంటూనే అసలు లేనేలేనట్టు బతికే జీవన వ్యాఖ్యలా అనిపించేలా చేయడం మన కవి చాకచక్యం. నిర్భీతి. ‘మార్చురీ రూం లాంటి హోం’, ‘గాయం కాలాన్ని మాపుతుంది’, ‘రేపటెల్లుండ్లలోకి నిన్ను తరలిస్తూ’ వంటి మాటలు డాస్టోవ్‌స్కీ, చెహోవ్‌ పాత్రలు మాట్టాడినంత నైరూప్యం కనిపించే నైరాస్యం స్వీయ విశ్లేషణలా చెవికి చేరుతుంది. రుషి ఆధునికానంతరపు నవల రాయగలడన్న ఆశ వస్తుంది ‘సాయంత్రం’, ‘కిసీ సె అబ్‌ క్యా కెహ్నా’ వంటి కవితలు చదువుతోంటే. ‘బతికిన మనుషులు’ చదువుతోంటే ‘దిమాగ్‌ ఖరాబ్‌’కు ఊతం కావచ్చనిపించింది. ‘‘ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని/ అప్పట్నించి వాళ్లు/ కలిసి మెలిసి జీవించలేదు’’- అన్న ముగింపు నూతన జీవనారంభం అన్నంత చిరునవ్వు ఇచ్చి విషాదాన్ని ధ్వనించకపోదు. ఇక, రాజకీయ నాయకుల స్టేట్‌మెంట్లకు రుషి స్పందించటం అనవసర కాలక్షేపం అనిపిస్తుంది. అట్లాంటివి ఈ సంకలనానికి అవసరమా నేస్తమా?! ఐనను అభినందించి తీరవలె-- హత్తుకొనవలె.  శివాజీ99591 78453
editorial
13,296
02-08-2017 13:16:17
తమిళ రాజకీయాల్లో అనూహ్య సంచలనం ఈ వారంలోనే?
చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ కొత్త అవతారంలో కనిపించబోతోంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. తమలో తాము కలహించుకుంటున్న అన్నా డీఎంకే పార్టీ వర్గాలు ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్డీయేలో భాగస్వాములు కావాలని పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఈ వారంలోనే ఏర్పాటవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ ఆ లక్ష్యం దిశగా గొప్ప ముందడుగు వేసినట్లేనని చెప్పవచ్చు. అన్నా డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు లభించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి మార్పు ఉండకపోవచ్చని చెప్తున్నారు. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ, పన్నీర్ సెల్వంను రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకునేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. తమిళనాట బీజేపీ చొచ్చుకుపోతుండటం గొప్ప రాజకీయ పరిణామమని విశ్లేషకులు చె్ప్తున్నారు. కలహించుకుంటున్న ఇరు వర్గాలను చేరదీసి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు పరచడంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజయం సాధిస్తున్నారంటున్నారు.
nation
5,773
12-07-2017 17:48:41
సండే టు సాటర్ డే లవ్ సాంగ్ విడుదల
కుమారి 21 ఎఫ్ తో నిర్మాతగానూ మారిన దర్శకుడు సుకుమార్ ఇప్పుడు దర్శకుడు పేరుతో మిత్రులతో కలిసి ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తూ ఉండగా సాయి కార్తిక్ సంగీతం సమకూర్చారు. ఇందులోని సండే టు సాటర్ డే లవ్ అనే సాంగ్‌ను ఇటీవల సమంత లాంఛ్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఇదే నెల 15వ తేదీన ఆడియోనూ, ఆగస్టు 4న సినిమాను విడుదల చేయనున్నట్లు సుకుమార్ తెలిపారు.
entertainment
19,718
17-09-2017 11:44:38
కొరియా ఓపెన్ ఫైనల్ : తొలి సెట్‌లో పీ వీ సింధు గెలుపు
న్యూఢిల్లీ : కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి  సెట్‌ను పీ వీ సింధు గెలుచుకుంది. ప్రత్యర్థి నొజోమీ ఒకుహరాపై 22-20 తేడాతో విజయం సాధించింది.
sports
14,666
21-08-2017 18:23:46
బీజేపీ క్లీన్ స్వీప్...శ్రేణుల సంబరాలు
ముంబై: భారతీయ జనతా పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంటుంది. థానే జిల్లాలోని మీరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ)కు జరిగిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించింది. ఒంటిరిగానే బరిలోకి దిగిన బీజేపీ మొత్తం 95 స్థానాలకు గాను 61 సీట్లు గెలుచుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. శివసేనను వెనక్కి నెట్టేసింది. బీజేపీ-శివసేన గత ఎన్నికల్లో (2012) కలిసి పోటీ చేయగా, ఈసారి ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీలోకి దిగాయి. సోమవారంనాడు ఫలితాలు వెలువడటం, బీజేపీ మూడింట రెండువంతులు సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ కార్యకర్తలు సందడి చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో శివసేన 22 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లతో సరిపెట్టుకుంది. 2012 ఎన్నికల్లో 26 సీట్లతో రెండో పెద్ద పార్టీగా నిలిచిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఈసారి ఖాతా కూడా తెరవలేదు. బీజేపీ నుంచి గెలిచిన వారిలో ఎంబీఎంసీ మేయర్ గీతా జైన్, లేడీస్ బార్ ఓనర్ గణేష్ షెట్టి ఉన్నారు. ప్రస్తుత మున్సిపాలిటీ ఐదేళ్ల కాలపరిమితి ఈనెల 27తో ముగియనుంది.
nation
12,048
24-09-2017 09:32:59
భారతదేశంపై పాకిస్థాన్ దారుణ ఆరోపణలు
న్యూయార్క్ : భారతదేశంపై పాకిస్థాన్ నిరాధారమైన, దారుణమైన ఆరోపణలు చేసింది. కశ్మీరులో భారతదేశం నేరాలకు పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిథి మలీహా లోఢీ ఆరోపించారు. దక్షిణాసియాలో ఉగ్రవాదానికి తల్లి భారతదేశమేనని ఆరోపించారు. భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగం పాకిస్థాన్ పట్ల భారతదేశ నాయకత్వానికిగల శత్రుత్వాన్ని స్పష్టంగా బయటపెడుతోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 72వ సమావేశాల్లో సుష్మా స్వరాజ్ ప్రసంగంపై స్పందిస్తూ మలీహా ఈ ఆరోపణలు చేశారు. జమ్మూ-కశ్మీరు ప్రధాన సమస్యను భారతదేశం పట్టించుకోవడం లేదన్నారు. క్రూరత్వాన్ని ఉద్యమంలా విస్తరిస్తోందన్నారు. అమాయక కశ్మీరు బాలలను పెల్లెట్ గన్‌లతో అంధులను చేస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌ను ఉతికి ఆరేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తూ, ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రంగా తయారైందని ఆరోపించారు. పాక్ ఉగ్రవాదులను తయారు చేస్తూంటే, భారత్ డాక్టర్లు, సైంటిస్టులను తయారు చేస్తోందన్నారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తోందని చెప్పారు. భారత్ ఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేస్తే, పాకిస్థాన్ లష్కర్ ఎ తొయిబా, జైష్ ఎ మహ్మద్‌లను ఏర్పాటు చేసిందని సుష్మ ఎద్దేవా చేశారు. ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసిరావాలన్నారు. ఉగ్రవాదాన్ని సమాధి చేయాలని పిలుపునిచ్చారు.
nation
21,085
25-07-2017 01:54:22
రాహుల్‌కు జ్వరం తొలి టెస్ట్‌కు దూరం
గాలె : శ్రీలంకతో బుధవారం నుంచి ఇక్కడ జరిగే తొలి టెస్ట్‌ ముందు భారత్‌కు గట్టి ఎదు రు దెబ్బ తగిలింది. వైరల్‌ జ్వరంతో ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ టెస్ట్‌కు దూరమయ్యాడు. అయితే అతడు కోలుకుంటున్నాడని ముందు జాగ్రత్తగానే మొదటి టెస్ట్‌కు దూరంగా పెట్టిన ట్టు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలి పింది. గాయంతో 3నెలలు విశ్రాంతి తీసుకొన్న రాహుల్‌..శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్‌ లెవెన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో చక్క టి అర్ధ సెంచరీతో మొదటి టెస్ట్‌కు ముందు ఆత్మ విశ్వాసం కూడగట్టుకున్నాడు. రాహుల్‌ అందుబాటులోలేని నేపథ్యంలో తొలి టెస్ట్‌లో ధవన్‌, అభినవ్‌ ముకుంద్‌ భారత్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశముంది.
sports
15,528
26-10-2017 13:08:02
నవాజ్ షరీఫ్‌కు అవినీతి కేసులో గట్టి ఎదురు దెబ్బ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు అవినీతి నిరోధక కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆయనకు బెయిలు ఇవ్వదగిన అరెస్టు వారంటును జారీ చేసింది. పనామా పేపర్స్ లీక్‌లో వెల్లడైన రెండు అవినీతి కేసుల్లో ఈ చర్య తీసుకుంది. ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ కేసు, అల్-జజీరా స్టీల్ మిల్స్, హిల్ మెటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ కేసుల్లో ఈ వారంటు జారీ అయింది. షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఆయన సతీమణి కల్సుమ్ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకు లండన్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అవినీతి కేసుల్లో ఆయనపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆయన పాకిస్థాన్‌ వెళ్ళలేదు, కోర్టుకు హాజరు కాలేదు. నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఆయనను ప్రధాన మంత్రి పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అనంతరం నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో సెప్టెంబరు 8న మూడు కేసులను నమోదు చేసింది.
nation
17,293
01-01-2017 23:53:40
ఈపీఎఫ్‌వో పథకాల్లోకి రైల్వే కూలీలు!
టికెట్లపై 10 పైసలు సెస్‌ విధించనున్న ప్రభుత్వంన్యూఢిల్లీ, జనవరి 1: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎ్‌ఫవో) కల్పిస్తున్న సామాజిక భద్రతా పథకాల్లోకి రైల్వే కూలీలు కూడా రానున్నారు. రైల్వేలో ప్రస్తుతం సుమారు 20వేల మంది కూలీలు ఉన్నారు. అసంఘటిత రంగంలో 40కోట్లకుపైగా ఉన్న కార్మికులను కూడా ఈపీఎ్‌ఫవో పరిధిలోకి తీసుకురావాలనే చర్యల్లో భాగంగా రైల్వే కూలీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు అవసరమైన నిధులను ప్రతి రైల్వే టికెట్‌పైన 10 పైసల చొప్పున సెస్‌ విధించడం ద్వారా సేకరించాలని యోచిస్తోంది. రైల్వే ప్రతి రోజూ 10-12 లక్షల టికెట్లను విక్రయిస్తోంది. ఈ లెక్కన లక్షా 20వేల వరకూ ప్రతిరోజూ నిధులు వస్తాయి. వీటితో రైల్వే కూలీలకు పీఎఫ్‌, పెన్షన్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ చేయించొచ్చని భావిస్తోంది. గత నెలలో బెంగళూరులో జరిగిన ఈపీఎ్‌ఫవో ట్రస్టీల సమావేశంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ ఇందుకు అంగీకరించారు. దీనికి సంబంధించిన ప్రతపాదనను త్వరలోనే ఆర్థిక, రైల్వే శాఖల దృష్టికి తీసుకెళ్లనున్నారు. మొత్తానికీ రైల్వే కూలీలకు సంబంధించిన ఈ విషయాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించే అవకాశముందని అధికారులు ఆశిస్తున్నారు.
nation
13,558
24-04-2017 03:24:57
మాల్దీవుల్లో బ్లాగర్‌ దారుణ హత్య
మాలే, ఏప్రిల్‌ 23: మాల్దీవుల్లో యమీన్‌ రషీద్‌ (29) అనే బ్లాగర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. దేశ రాజధాని మాలేలోని ఆదివారం ఆయన నివసిస్తున్న అపార్టుమెంటు మెట్ల వద్ద కత్తి గాయాలతో పడి ఉన్న రషీద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో రాజకీయ అస్థిరత, నేతలపై సెటైర్లు వేస్తూ వ్యాసాలు రాస్తున్నందునే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
nation
7,150
09-04-2017 16:10:23
ఎవ్వరూ ఫాలో కాని కొత్త ఫార్మాట్‌లో....
లాంగ్ గ్యాప్ తరువాత 'ప్రేమమ్' మూవీతో హిట్ అందుకున్న నాగ చైతన్య.. మరోసారి ఆ సక్సెస్‌ను రిపీట్ చేయాలనుకుంటున్నాడట. అంటే మళ్లీ ఆ సినిమా డైరెక్టర్‌తోనే చేతులు కలపబోతున్నాడట. 'రారండోయ్ వేడుక చూద్దాం' అంటున్న నవ యువ మన్మథుడు నాగచైతన్య.. 'ప్రేమమ్' సినిమా విడుదలై ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా ఆ సక్సెస్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత వచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తున్న చైతూ మరోసారి అలాంటి కిక్ కోసం 'ప్రేమమ్' డైరెక్టర్ చందూ మొండేటితోనే చేతులు కలపబోతున్నాడట. తన యాక్టింగ్ స్కిల్స్‌ను ఎలా వాడుకోవాలో చందూకు బాగా తెలుసునని భావిస్తున్న చైతూ.. ఈసారి ఓ వైవిధ్యమైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడట. ఇటీవలే చైతన్యకు ఓ క్రేజీ కథను వినిపించిన చందూ మొండేటి.. ఫస్ట్ సిట్టింగ్‌లోనే అబ్బాయిని ఇంప్రెస్ చేసేశాడట. వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ మూవీ.. ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్‌ను అందించబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, నెరేషన్ విషయంలో.. ఇప్పటివరకూ ఎవ్వరూ ఫాలో అవ్వని కొత్త ఫార్మాట్‌ను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. నూతన నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరి.. సరికొత్తగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలనుకుంటున్న చైతన్య ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.
entertainment
19,888
09-07-2017 01:15:54
భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్‌
లండన్‌: దక్షిణాఫ్రికాతో లార్డ్స్‌లో జరుగు తున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు ఆధిక్యం చేజిక్కించుకున్న ఇంగ్లం డ్‌ మూడోరోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసింది. ఓపెనర్‌ కుక్‌ 59 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 214/5తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 147 పరుగులు జోడించి 361 వద్ద ఆలౌటైంది. డికాక్‌ (51), ఫిలాండర్‌ (52) హాఫ్‌ సెంచరీలు చేశారు.
sports
19,755
26-09-2017 02:01:17
సిరీస్‌ నుంచి అగర్‌ అవుట్‌
ఇండోర్‌: భారత్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయి డీలాపడిన ఆసీస్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. ఆ జట్టు లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ చేతివేలు విరగడంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఇండోర్‌లో మూడో వన్డేలో ఫీల్డింగ్‌ సందర్భంగా అగర్‌ కుడి చిటికన వేలుకు గాయమైందని జట్టు డాక్టర్‌ రిచర్డ్‌ సా సోమవారం ఓ ప్రకటనలో తెలిపాడు. ఫలితంగా అతడు స్వదేశం వెళతాడని పేర్కొన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అగర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టాడు. ఇక బెంగళూరులో జరిగే నాలుగో వన్డేలో అగర్‌ స్థానాన్ని లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాతో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
sports
17,583
24-08-2017 03:53:47
త్వరలో రూ.200 నోట్లు
దాదాను 50 కోట్ల నోట్ల విడుదల2వేల నోట్ల రద్దు భయం వద్దు: జైట్లీ న్యూఢిల్లీ: త్వరలో రూ.200 నోట్లు జారీ చేయబోతున్నట్టు అరుణ్‌ జైట్లీ చెప్పారు. దీంతో చిల్లర నోట్ల సమస్య కొంత వరకు తీరే అవకాశం ఉందన్నారు. రూ.200 నోట్ల ప్రింటింగ్‌ ఎప్పటి నుంచి చేపట్టాలనే విషయంపై ఆర్‌బిఐనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారం ఆర్‌బిఐ దాదాపు 50 కోట్ల నోట్లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. దేశంలో రూ.200 డినామినేషన్‌లో నోట్లు విడుదల చేయడం ఇదే మొదటిసారి. అలాగే రూ.2,000 నోట్లూ రద్దు చేస్తారన్న భయాలను జైట్లీ కొట్టి వేశారు. అసలు అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదన్నారు.
nation
14,710
12-09-2017 20:56:56
భారత్‌తో చెలిమి పాక్‌కు ఇష్టం లేదు
జమ్మూ: భారత్‌తో సంబంధాలు మెరుగుకు పాకిస్తాన్ ఎలాంటి ఆసక్తి చూపడం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు. జమ్మూకశ్మీర్‌లో పొరుగు దేశం నిరంతర కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉందని అన్నారు. భారత్‌తో సంబంధాలు ఇష్టంలేకే ఇలాంటి పనులకు పాక్ పాల్పడుతున్నట్టు కనిపిస్తోందని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజ్‌నాథ్ అన్నారు. ఈనెల 9 నుంచి హోం మంత్రి నాలుగు రోజుల పర్యటలో భాగంగా కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పదేపదే తూట్లుపొడుస్తున్నా మన సైన్యం, బీఎస్ఎఫ్ బలగాలు సమర్ధవంతంగా తిప్పుకొడుతున్నాయని, ఇవాళ కాకపోతే రేపైనా పాక్ తన ఆగడాలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితిని కల్పించి, దారికి తీసుకువస్తామని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. లెక్కల ప్రకారం 2014 నుంచి పాకిస్తాన్ ప్రతి ఏడాది 400కు పైగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన చెప్పారు. సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలు మన దేశానికి గర్వకారణమని, భారతదేశానికి తరగని సంపద వంటి వాళ్లని రాజ్‌నాథ్ ప్రశంసించారు.
nation
8,684
13-08-2017 18:23:03
ట్రంప్ గారూ మీకో దండం: హీరో నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస విజయాలతో జోరుమీదున్నాడు. ఇటీవల పెళ్లి వార్తలతో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారిన నిఖిల్ తాజాగా ప్రపంచ పెద్దన్న వైఖరిని ఎద్దేవా చేశాడు. ట్విట్టర్ సాక్షిగా ఉత్తరకొరియాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌ను నిఖిల్ ప్రస్తావిస్తూ ‘‘పూర్తిస్థాయి అణుయుద్ధం ప్రారంభించడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకోవచ్చని నేనింతకాలం ఊహించలేకపోయాను. మాస్టారూ ట్రంప్ గారూ.. మీకో దండం.’’ అని ట్వీట్ చేశాడు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఒక తెలుగు హీరో స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ శాంతి గురించి నిఖిల్ తన తపనను చెప్పకనే చెప్పాడని నెటిజన్లు అంటున్నారు. యుద్ధాల గురించి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియాలో చర్చించడం ద్వారా వచ్చే ప్రయోజనమేమీ లేదని, ప్రపంచ దేశాలు ఐక్యవేదికపై శాంతి కోసం చర్చలు జరపాలని నిఖిల్ అభిప్రాయం కాబోలు.
entertainment
10,380
22-06-2017 19:27:16
నీరుగారిపోతున్న యశ్ రాజ్ బ్యానర్ స్టార్‌డమ్
బాలీవుడ్‌లో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆ బ్యానర్.. ప్రస్తుతం పరువు దక్కించుకోవటానికి నానా కష్టాలు పడుతోందట. బాలీవుడ్‌లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కంటారు. ఎన్నో క్లాసిక్స్‌ను అందించిన ఈ బ్యానర్‌పై ఇటీవలి కాలంలో పలు చెత్త చిత్రాలు తెరకెక్కడంతో సినీజనాలతో పాటు, ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారట.ఈ మధ్యకాలంలో యశ్ రాజ్ బ్యానర్‌పై వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందకపోగా బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆదిత్యచోప్రా తెరకెక్కించిన 'బేఫిక్రే' విమర్శలపాలవ్వడమే కాదు, బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇదే తరహాలో 'బ్యాంక్ చోర్' కూడా ఉండటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. యశ్ రాజ్ సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఈ మూవీలేదని అంటున్నారు.రితేష్ దేశ్‌ముఖ్ హీరోగా తెరకెక్కిన 'బ్యాంక్ చోర్' నిండా చీప్ కామెడీనే ఉందట. గతంలో ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన ఈ సంస్థ నుంచి ఇలాంటివి రావడం ఏమిటనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే యశ్ రాజ్ బ్యానర్‌పై ఏర్పడిన మచ్చ పోవాలంటే.. 'టైగర్ జిందా హై', 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' వల్ల మాత్రమే సాధ్యమని తెలుస్తోంది. మరి నీరుగారిపోతున్న యశ్ రాజ్ బ్యానర్ వాల్యూను సల్మాన్, ఆమీర్ ఎంతవరకూ కాపాడతారో చూడాలి.
entertainment
17,227
21-03-2017 21:16:01
గుజరాత్‌లో బీజేపీ ముందస్తు ఎన్నికల వ్యూహం..!
అహ్మదాబాద్: మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, గోవా, మణిపూర్‌లోనూ రెండో స్థానంలో నిలిచినా వ్యూహాత్మకంగా వ్యవహరించి సర్కర్ ఏర్పాటులో సఫలీకృతం కావడంతో ఆ పార్టీలో ఉత్సాహం ద్విగుణీకృతమైంది. ఇదే ఊపులో గుజరాత్‌లో ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధమవుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మేలో ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమకు తిరుగుండదని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలోచన వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు కూడా చెబుతున్నారు. వర్షాకాలంలో రుతుపవనాల పరిస్థితి ఎప్పుడూ కూడా ప్రభుత్వాలను ఇరకాటంలో పెడుతుంటుంది. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే కరువు సమస్యలు వెంటాడుతుంటాయి. అదేవిధంగా వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)ను ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1 నుంచి అమలు చేయాలనే పట్టుదలతో కేంద్రం ఉంది. జీఎస్‌టీ ప్రభావం సహజంగానే రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయనే భయాందోళనలు ఉన్నాయి. రాష్ట్రాలకు ఏర్పడే నష్టాన్ని కొంతకాలం భరిస్తామని కేంద్ర భరోసా ఇచ్చినా ఆ ప్రభావం ఎలా ఉంటుందో వెంటనే చెప్పలేని పరిస్థితి. ఈ రెండు అంశాలనూ దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే గుజరాత్ అసెంబ్లీకి వెళ్తే మంచిదని బీజేపీ వ్యూహకర్తల ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఊహాగానాలకు అనుగుణంగానే గుజరాత్‌లో ముందస్తు ప్రచార సందడి మొదలైంది. 'యూపీలో 325, గుజరాత్‌లో 150' అనే ప్రధాన నినాదంతో భారీ హోర్డింగ్‌లు, పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. ప్రదాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పోస్టర్లు రాష్ట్రంలోని ప్రధాన హైవేలపై దర్శనమిస్తున్నాయి.
nation
12,860
07-09-2017 02:47:58
‘నీట్‌’పై తమిళనాట ఆగని ఆందోళనలు
చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉమ్మడి అర్హత పరీక్ష(నీట్‌) మినహాయింపు కోసం తమిళనాట రేగిన సెగ ఇంకా ఆరలేదు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. చెన్నై మెరీనా తీరంలోని జయ సమాధి వద్ద ధర్నా చేపట్టిన 27 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జల్లికట్టు ఉద్యమం తరహాలో నీట్‌ రద్దు కోసం కూడా విద్యార్థులు ఉద్యమం చేపడతారన్న అనుమానంతో మెరీనా సందర్శనపై ఆంక్షలు కూడా విధించారు. జయలలిత సమాధి వద్దకు సందర్శకులను నిషేధించారు. దీంతో మెరీనా తీర ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఇక తంజావూరు, కోవై, తిరుచ్చి ప్రాంతాల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్డెక్కారు. మరోపక్క, నీట్‌ అమల్లోకి వచ్చిన తర్వాత అడ్మిషన్‌ ప్రక్రియ క్లిష్టంగా మారడంతో వేలూరులోని ప్రసిద్ధ క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల(సీఎంసీ)లో ఎంబీబీఎస్‌, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల అడ్మిషన్‌లను నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు కేవలం ఇద్దరే అడ్మిషన్లు పొందగా, ఎంబీబీఎ్‌సలో 99 సీట్లు, సూపర్‌ స్పెషాలిటీస్‌ కోర్సులో 61 సీట్లు మిగిలిపోయాయని, ఈ కారణంగానే అడ్మిషన్లను నిలిపివేసిందని తెలిసింది. అయితే, ఇదంతా అవాస్తవమని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. నీట్‌ పరీక్షల్లో ఎంపికైన 300 మంది విద్యార్థులకు 3 రోజులపాటు కౌన్సిలింగ్‌ జరిపేందుకు ఆహ్వాన పత్రాలు పంపామని తెలిపింది.
nation
7,149
01-12-2017 15:48:34
శ్రీముఖితో లవ్ సీన్స్ గురించి చెబుతున్న హీరో..
నందు, శౌర్య‌, శ్రీముఖి, రోషిణి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్‌పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం ‘బీటెక్ బాబులు’. శ్రీను ఈ మంది దర్శకత్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 8న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా హీరో నందు మాట్లాడుతూ.. ‘పెళ్ళిచూపులు’ త‌ర్వాత చాలా మంచి పాత్ర ఈ సినిమాలో ద‌క్కింది. నా పాత్ర ప్ర‌తి ప్రేమికుడికి క‌నెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. శ్రీముఖికి, నాకు మ‌ధ్య‌ వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకుంటాయి. సీరియ‌స్‌గా ల‌వ్ ట్రాక్ న‌డుస్తూనే.. న‌వ్వులు పువ్వులు పూయించే కామెడీ స‌న్నివేశాలు కూడా హైలైట్‌గా ఉండేలా ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా తెరకెక్కించారు. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. సినిమాపై యూనిట్ అంతా చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం. ప్రేక్ష‌కులు కూడా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా... అని అన్నారు. నటుడు ఆలీ మాట్లాడుతూ... చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో మ‌ళ్లీ స్ఫూఫ్ చేశా. స‌రైనోడు స్ఫూఫ్ అద‌రొట్టాన‌ని అంతా అంటున్నారు. ఇప్పటికే స్ఫూఫ్ సోషల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయింది. శ్రీను కొత్త కుర్రాడైనా అనుభ‌వంగ‌ల డైరెక్ట‌ర్‌లా క‌థ‌ను డీల్ చేశాడు. సినిమా విజయం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా... అని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీను ఈ మంది మాట్లాడుతూ.. మంచి కంటెంట్‌తో తెర‌కెక్కించాం. ఇంజనీరింగ్ చ‌దువుకుంటోన్న న‌లుగురు విద్యార్ధుల జీవితాలు ఎలా ఉంటాయి? రెగ్యుల‌ర్‌గా వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ప్రియురాలి ప్రేమ గొప్ప‌దా? త‌ల్లిదండ్రుల ప్రేమ గొప్ప‌దా? అనే అంశాల‌కు హాస్యం, సెంటిమెంట్ స‌న్నివేశాలు జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే విధంగా తెర‌కెక్కించాం. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేసే సినిమా అవుతుంది. ఇప్ప‌టికే రిలీజైన ప్ర‌చార చిత్రాల‌కు అంద‌రి నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. చిన్న సినిమా అయినా క్వాలిటీ పరంగా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాం. మా సినిమాని అంద‌రూ ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం.. అని అన్నారు. శకలక శంకర్ మాట్లాడుతూ.. శంకర్ ఫ్రమ్ శ్రీకాకుళం అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉంటుంది. ఇందులో ద‌ర్శ‌కుడు నాతో చిన్న చిన్న స్టెప్పులు కూడా వేయించారు. సెంటిమెంట్ స‌న్నివేశాలు హైలైట్‌గా తీర్చిదిద్దారు. సినిమా తప్ప‌కుండా పెద్ద విజ‌యం సాధిస్తుంది.. అని అన్నారు. తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. ఇందులో తాగుబోతుగానే కాకుండా కామెడీ దొంగగా పూర్తి స్థాయిలో కనిపిస్తా. కథ నాతోనే మొద‌ల‌వుతుంది. నాతోనే ముగుస్తుంది. ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత రంగా ది దొంగగా అంద‌ర్నీ మెప్పిస్తాను. డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం.. అని అన్నారు.
entertainment
11,450
09-03-2017 09:29:36
ముస్లిమ్ బాలిక భజన గీతాలు పాడిన వేళ...
బెంగళూరు : హిజాబ్ ధరించిన ఓ ముస్లిమ్ బాలిక కన్నడ టీవీ ఛానల్ రియాల్టీ షోలో హిందూమతానికి చెందిన భజన గీతాలు పాడి అందరినీ ఆకట్టుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాకు చెందిన సయ్యద్ సుహానా హిజాబ్ ధరించి వచ్చి ఓ కన్నడ టీవీ ఛానల్ లో హిందూమత భజన గీతాలు పాడింది. ముస్లిమ్ బాలిక సుహానా భజన గీతాలు పాడి హిందూ ముస్లిమ్ ల ఐక్యతకు మారుపేరుగా నిలిచారని రియాల్టీ షో జడ్జీలు అభినందించారు. కాగా ఇలా భజనగీతాలు పాడటం తప్పని మంగళూరు ముస్లిమ్ లు కొందరు ఫేస్ బుక్ పేజీలో వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లు ముస్లిమ్ బాలికకు అండగా నిలవడంతో మంగళూరు ముస్లిమ్ లు పెట్టిన కామెంట్లను తొలగించారు. మొత్తంమీద సుహానా భక్తిగీతాలు పాడి మతసామరస్యాన్ని మరోసారి సమాజానికి చాటిచెప్పింది.
nation
21,558
21-11-2017 01:58:12
రాష్ట్ర బాడీ బిల్డింగ్‌ సంఘం చైర్‌పర్సన్‌గా కవిత
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బాడీ బిల్డింగ్‌ సంఘం చైర్‌పర్సన్‌గా నిజామాబాద్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్‌ కోరబోయిన విజయ్‌ కుమార్‌ ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యాయవాది ఆర్‌.మహదేవన్‌ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. తెలంగాణ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆదివారం సమావేశమైంది. ఎంపీ కవితను చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటున్నామని కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
sports
1,461
30-08-2017 01:40:28
సిగ్నిటీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనాధ్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సిగ్నిటీ టెక్నాలజీస్‌.. ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా శ్రీనాధ్‌ బత్ని నియమితులయ్యారు. ఇన్ఫోసిస్‌ డెలివరీ ఎక్సలెన్స్‌ హెడ్‌గా ఉన్న శ్రీనాఽధ్‌.. మే, 2000 నుంచి 2014 జూలై 14 వరకు సంస్థ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. డెలివరీ ఎక్సలెన్స్‌లో శ్రీనాధ్‌కు ఉన్న అనుభవం సంస్థకు ఎంతగానో తోడ్పడటమే కాకుండా భవిష్యత్‌లో సంస్థ వృద్ధిలో కీలకంగా ఉండనున్నారని సిగ్నిటీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సివి సుబ్రమణ్యం తెలిపారు.
business
11,635
14-02-2017 19:04:56
కేరళలో విస్తరిస్తున్న ఆరెస్సెస్
న్యూఢిల్లీ : కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) విస్తరిస్తోంది. గుజరాత్‌లో కేవలం 1,000 శాఖలు మాత్రమే పని చేస్తూండగా, కేరళలో 5,000 శాఖలు ఉన్నట్లు ఆరెస్సెస్‌కు చెందిన అఖిల భారతీయ సహ ప్రచార్ ప్రముఖ్ నంద కుమార్ చెప్పారు. తమ సంస్థలో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తమ కార్యకర్తలపై దాడులు జరగడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. కేరళలో రోజుకు 5000 శాఖలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో 8 వేలు, మహారాష్ట్రలో 4 వేలు శాఖలు రోజూ జరుగుతున్నాయన్నారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడానికి ముందే అంటే 2010-11 నుంచి ఆరెస్సెస్ శాఖలు పెరగడం ప్రారంభమైందని తెలిపారు. యువతతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తమ సంస్థ అనుసరించిన విధానాల ఫలితమేనన్నారు.
nation
3,407
08-02-2017 03:28:34
పదవీ విరమణ వయసు పెంచాలి
ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్ళకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం పదవీ విరమణ వయసును 60 ఏళ్ళకు ముందే పెంచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే పద్ధతి, ఒకటే విధానం అమలులో ఉంటే బావుంటుంది. తెలంగాణ ఉద్యోగులు పదవీ విరమణ వయోపరిమితి పెంచాలని ఇప్పటికే అనేకమార్లు డిమాండ్‌ చేశారు. ఇందుకు ప్రభుత్వం సత్వరమే స్పందించి పదవీ విరమణ వయసు 60 ఏళ్ళకు పెంచుతూ జీవో ఇవ్వాలి.- కె. రామచంద్రరావు, వరంగల్‌
editorial
6,113
25-01-2017 16:29:29
వామనుడిలా మొదలై.. రానాలా పెరిగిపోయింది: పీవీపీ
భారతీయ చలన చిత్ర పరిశ్రమది వందేళ్లకుపైగా చరిత్ర. అలాంటి చరిత్రలో ఎప్పుడూ రాని చిత్రం.. ఇప్పుడు రాబోతోందట. ఆ చిత్రం ఏంటి? ఆ మాటలు అన్నది ఎవరు? అంటే ‘ఘాజి’ చిత్ర నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఆ మాటలు అన్నాడు. ఘాజి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పీవీపీ మాట్లాడాడు. చిన్న ప్రాజెక్టుగా మొదలైన ప్రాజెక్టు నేడు.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భారీ ప్రాజెక్టుగా ఎదిగిందన్నాడు. ‘‘పోయన సంవత్సరం ఇదే సమయానికి మేం నిర్మించిన క్షణం సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. మళ్లీ అదే నెలలో ‘ఘాజి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలు అన్ని కలిపి భారత్‌లో ఇప్పటిదాకా కొన్ని వేల సినిమాలు వచ్చాయి. కానీ, ఈ వందేళ్లలో ఘాజి లాంటి చిత్రం మాత్రం రాలేదు. ఇలాంటి సినిమాను భారత స్క్రీన్లపై ఇప్పటిదాకా ఎవరూ చూసి ఉండరు. అంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాను ప్రారంభించినప్పుడు చిన్న సినిమానే. కానీ, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భారీ సినిమాగా మారిపోయింది. వామనుడిలా మొదలై.. రానా సైజుకు సినిమా పెరిగింది. మేము ఎంత మంచి సినిమా తీశామో సినిమా విడుదలయ్యే ఫిబ్రవరి 17న తెలుస్తుంది. భారతీయ సినీ జగత్తులో ఇది ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది’’ అని పీవీపీ అన్నాడు. మరి, పీవీపీ అన్నట్టు చరిత్రలో ఆ సినిమా నిలిచిపోతుందో లేదో విడుదలయ్యాక ప్రేక్షకులే తేల్చాలి.
entertainment
12,115
15-03-2017 02:53:56
లాయర్‌ వద్ద ‘పల్సర్‌ సుని’ సిమ్‌
నటి కేసులో కేరళ హైకోర్టు సీరియస్‌ కొచ్చి, మార్చి 14: మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసు మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని తరఫు న్యాయవాదిని ప్రశ్నించేందుకు పోలీసులకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. గురువారం పోలీసుల విచారణకు హాజరు కావాలని సదరు న్యాయవాదిని ఆదేశించింది. పల్సర్‌ సుని సహా ఆరుగురు కలిసి.. గత నెల కొచ్చిలో మలయాళ నటిని, ఆమె కారులోనే అపహరించి, లైంగిక వేధింపులకు గురి.. ఆ దృశ్యాలను సెల్‌లో బంధించి యూట్యూబ్‌లో పోస్టు చేయడం తెలిసిందే. ఈ కేసులో సుని సహా ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఘటన సమయంలో తాను ఉపయోగించిన సెల్‌, సిమ్‌ కార్డులను తమ లాయర్‌ వద్ద దాచినట్టు పల్సర్‌ సుని పోలీసులకు తెలిపాడు. అతడు చెప్పినట్టే.. లాయర్‌ కార్యాలయంలో సిమ్‌, మెమరీ కార్డులు దొరికాయి. దీనిపై తమ విచారణకు హాజరుకావాలని లాయర్‌కు పోలీసులు నోటీసులు జారీచేయగా, ఆయన హైకోర్టులో సవాల్‌ చేశాడు. కోర్టు పోలీసుల వాదననే సమర్థించింది.
nation
17,520
05-05-2017 16:55:05
వేడుకగా.. పుచ్చకాయల దినోత్సవం
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ స్కూల్ వేడుకగా పుచ్చకాయల దినోత్సవాన్ని నిర్వహించింది. దీంతో చిన్నారులంతా పుచ్చకాయలు తింటూ తెగ సందడి చేశారు. వేసవిలో పండ్లను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఫాస్ట్ ఫుడ్స్‌కు బదులు ఆర్యోగానికి మేలు చేసే ఫ్రూ‌ట్స్ తినాలని ఉపాధ్యాయులు వారికి సూచించారు.
nation
4,776
19-12-2017 20:44:27
'మహానటి'లో తన పాత్ర ఏంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ
చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ టాలీవుడ్ టాప్ హీరోల స్థాయి క్రెడిట్ కొట్టేశాడు విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత ఆయనకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఈ హీరో తాజాగా సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, సావిత్రి భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ చేస్తున్న పాత్రపై మాత్రం పలు వార్తలు బయటకు వచ్చాయి. ఈయన ఎన్టీఆర్ పాత్ర చేస్తున్నాడని కొన్ని వార్తలు రాగా.. కాదు కాదు ఎంజీఆర్ పాత్ర పోషిస్తున్నాడని మరికొన్ని వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ విషయమై స్పందించాడు విజయ్ దేవరకొండ. తాను 'మహానటి' సినిమాలో చేస్తున్నది నిడివి చాలా తక్కువ ఉన్నటువంటి ఓ జర్నలిస్ట్ పాత్ర అని చెప్పేశాడు. పాత్ర చిన్నదైనప్పటికీ ఓ మహానటి అయిన సావిత్రి జీవిత కథలో అవకాశం రావడం గొప్పగా భావించి ఈ పాత్రకు ఓకే చెప్పా అని తెలిపాడు.
entertainment
13,100
25-04-2017 03:09:30
హెచ్‌ఐవీ బాధితులకు ఉద్యోగ భద్రత
కొండంత అండలా కొత్త చట్టం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: హెచ్‌ఐవీ పాజిటివ్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉద్యోగ భద్రత లభించనుంది. ఆ వ్యాధిగ్రస్తులకు ఉద్యోగం తిరస్కరించడం.. లేదంటే ఉద్యోగం నుంచి తొలగించడం.. ఇక నుంచి కుదరదు. అలా చేసిన వారికి కనీసం 3 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించే విధంగా కొత్త చట్టం రూపుదిద్దుకుంది. ఈ మేరకు ‘హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణ-నియంత్రణ చట్టం-2017’కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. సంబంధిత బిల్లును రాజ్యసభ గత నెల 21న ఆమోదించగా, లోక్‌సభలో ఈనెల 11న ఆమోదించారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల సమాచారాన్ని బయట పెట్టినవారు కూడా శిక్షార్హులు కానున్నారు. వారిపై ఉద్యోగాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల్లో వైద్యం విషయాల్లో ఎలాంటి వివక్ష చూపినా జైలు శిక్ష, జరిమానా విధించేలా చట్టంలో నిర్దేశించారు.
nation
570
22-07-2017 23:59:28
41 శాతం తగ్గిన దివీస్‌ లాభం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దివీస్‌ లేబొరేటరీస్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం ఏకంగా 41.5 శాతం క్షీణించి 177 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం 301.81 కోట్ల రూపాయలుగా ఉంది. త్రైమాసిక కాలంలో విశాఖపట్నం ప్లాంట్‌పై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యుఎస్‌ ఎఫ్‌డిఎ) ఆంక్షలు విధించటం దివీస్‌ లేబొరేటరీస్‌ పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రాబడులు కూడా 1,033.50 కోట్ల రూపాయల నుంచి 850.88 కోట్ల రూపాయలకు తగ్గాయి. వామా ఇండస్ట్రీస్‌ రాబడి రూ.42 కోట్లు ఐటి, ఐటిఈస్‌ సర్వీసుల సంస్థ వామా ఇండస్ట్రీస్‌ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 14 లక్షల రూపాయల నుంచి 1.86 కోట్ల రూపాయలకు దూసుకుపోయింది. మరోవైపు కంపెనీ రాబడులు కూడా 695 శాతం వృద్ధి చెంది 5.98 కోట్ల రూపాయల నుంచి 41.62 కోట్ల రూపాయలకు పెరిగాయి.
business
13,917
17-03-2017 18:48:10
అశ్లీల సైట్లు.. గోప్యంగా చూస్తే తప్పా ?
ముంబై: ఓ వ్యక్తి అశ్లీల వెబ్‌సైట్లను తన గదిలో రహస్యంగా చూస్తే తప్పా?, దాన్ని అడ్డుకోవడానికి మీరెవరని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చైల్డ్ పొర్నోగ్రఫీకి ప్రభుత్వం వ్యతిరేకమని, అలాంటి సైట్లను నిరోధించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. అయితే అన్ని శృంగార వెబ్‌సైట్లను అడ్డుకోవడం ఆచరణ సాధ్యమేనా అని రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా ఎవరైనా ఏకాంతంగా వాటిని చూస్తే తప్పా అని ఆయన అన్నారు. దేశంలోని 125 కోట్ల జనాభాలో 108 కోట్ల మందికి సెల్‌ఫోన్స్ ఉన్నాయని, వచ్చే ఐదారేళ్ళలో భారత డిజిటల్ ఎకానమీ ట్రిలియన్ డాలర్లకు చెరుతుందని రవి శంకర్ ప్రసాద్ వివరించారు.
nation
16,903
22-03-2017 20:47:46
రెండాకుల గుర్తు...ఈసీపైనే అందరి చూపు
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తుపై జరుగుతున్న పోరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. గుర్తు ఎవరికి చెందాలన్న దానిపై ఎన్నికల కమిషన్ గురువారం నిర్ణయం ప్రకటించనుంది. పార్టీ గుర్తు తమకే కేటాయించాలంటూ అటు శశికళ వర్గీయులు, ఇటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులు ఈసీ ముందు బుధవారంనాడు తమ వాదన వినిపించారు. ఈ విచారణలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం అంశాన్ని చేర్చలేదు. ఇరువర్గాల్లో ఎవరికి గుర్తు కేటాయించాలన్న అంశంపైనే ప్రధానంగా విచారణ సాగింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు గురువారం ముగియనుండటంతో దీనికి ముందే ఈసీ నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి పన్నీర్ సెల్వం తరఫున న్యాయవాదులు సీఎస్ వైద్యనాథన్, గురుకృష్ణ కుమార్ తమ వాదనలు ఈసీకి వినిపించారు. అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలి శిక్ష పడిందని, అందువల్ల ఆమె ఉపఎన్నికలో పోటీ చేయడం కానీ, ఎవరినైనా నామినేట్ చేయడం కానీ కుదరదని వారు వాదించారు. తన మేనల్లుడు టీటీవీ దినకర్‌ను నామినేట్ చేయడానికి శశికళను అనుమతించరాదని ఈసీని కోరారు. శశికళ వర్గం తరఫున నలుగురు టాప్ లాయర్లు...సల్మాన్ ఖుర్షీద్, వీరప్ప మొయిలీ, మోహన్ పరాశరన్, ఆర్యమ సుందరం ఈసీకి తమ వాదన వినిపించారు. పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నారని, అందువల్ల పార్టీ గుర్తు తమకే చెందుతుందని వాదించారు.
nation
2,841
31-08-2017 14:31:25
ఎస్‌బీఐ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్...
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఖాతాల నుంచి కస్టమర్లకు తెలియకుండానే భారీమొత్తంలో సొమ్ములు తస్కరణకు గురవుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. గత రెండు వారాలుగా జరుగుతున్న భారీ ఆన్‌లైన్ మోసాలపై సైబర్ క్రైం సెల్‌కు ఫిర్యాదులు పోటెత్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్‌లో భారీగా సొమ్ములు పోగొట్టుకుంటున్నామంటూ... గత వారం రోజులుగా అనేకమంది గగ్గోలుపెడుతున్నారు. ఈ మేరకు టెక్నాలజీ నిపుణుడు శ్రీధర్ నల్లమోతు సైతం ఫేస్‌బుక్ ద్వారా పలుమార్లు వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డులు వాడే వినియోగ దారులు జాగ్రత్తగా ఉండాలని... టెక్నాలజీని తక్కువగా అంచనా వేయొద్దని ఆయన హెచ్చరిస్తున్నారు.  ఎస్‌బీఐ సైబర్ భద్రత విషయంలో ఎక్కడో తేడా జరుగుతోందనీ.. ప్రమాదకరమైన మాల్‌వేర్ కారణంగానే ఈ మోసాలకు కారణం కావచ్చుని అభిప్రాయం వ్యక్తం చేశారు.  తెలియకుండానే ఆస్ట్రేలియా, అమెరికా డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేకించి ఉబెర్, ఓలా క్యాబ్‌లతో పాటు అమెజాన్ వంటి సైట్లలో ఆన్‌లైన్ చెల్లింపులు చేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కస్టమర్లకు తెలియకుండానే క్రెడిట్ కార్డు గరిష్ట పరిమితి చేరేలా నకిలీ లావాదేవీలు జరగుతున్నాయనీ... నెట్‌బ్యాంకింగ్ ద్వారా భారీ మొత్తంలో సొమ్ములు చేజారుతున్నట్టు తాను గమనించానని వెల్లడించారు. ఎలాంటి లావాదేవీలు జరపకుండానే ఓటీపీలు వస్తున్నాయనీ.. నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు సైతం పనిచేయకుండా పోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల అప్రమత్తంగా ఉండాలనీ... రోజుకు మూడు నాలుగు సార్లు ఖాతాలో సొమ్ము చెక్ చేసుకోవాలని శీధర్ నల్లమోతు సూచించారు.   కాగా ఇంత జరుగుతున్నా ఈ విషయం ఇప్పటి వరకు వెలుగులోకి రాకపోవడం, ఎస్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తాము మోసపోతున్నట్టు బ్యాంకు మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
business
5,914
30-07-2017 23:00:36
రానా, వెంకీ మల్టీస్టారర్ !
పుష్కర్ గాయత్రీ దర్శకత్వంలో ఇటీవల తమిళంలో విడుదలైన సినిమా 'విక్రమ్ వేద'. విడుదైన రోజు నుండి ఈసినిమా భారీ కల్లెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించారు. మాధవన్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా నటించగా.. విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా అలరించాడు. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 'రానా, వెంకటేష్ లతో ఈ సినిమా తెలుగులో రీమేక్ చేసి టాలీవుడ్‌లో భారీవిజయం సాధించాలనుకుంటున్నాం. కానీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు' అని ఈ చిత్రయూనిట్ ఓ వార్తాసంస్థకు తెలియజేసిందని సమాచారం. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
entertainment
4,748
06-02-2017 12:12:28
పాపం రాజ్‌తరుణ్‌.. రెండు సూపర్‌హిట్లు మిస్‌ చేసుకున్నాడు!
 జడ్జిమెంట్‌ విషయంలో రాజ్‌తరుణ్‌ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే మంచి సినిమాలను మిస్‌ చేసుకుంటున్నాడట. సంక్రాంతికి విడుదలై మంచి హిట్‌గా నిలిచిన ‘శతమానం భవతి’ సినిమా సాయిధరమ్‌ తేజ్‌, శర్వానంద్‌ కంటే ముందు రాజ్‌తరుణ్‌ వద్దకే వెళ్లిందట. అయితే రాజ్‌తరుణ్‌ స్ర్కిప్టుకు మార్పులు చేయాలని చెప్పడంతో ఆ కథను సాయిధరమ్‌ వద్దకు తీసుకెళ్లాడట దిల్‌ రాజు. ఆ కథ తనకు సూట్‌ కాదని చెప్పి, స్వయంగా శర్వానంద్‌కు ఫోన్‌ చేసి ఈ స్ర్కిప్టు గురించి చెప్పాడట సాయిధరమ్‌.  అలా ఆ సినిమా శర్వానంద్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇక, నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘నేను లోకల్‌’ కూడా రాజ్‌తరుణ్‌ చేయాల్సిందే. అదీ అలా మారుతూ వచ్చి ఆఖరికి నానికి దక్కింది. ఈ సినిమా ఈ వీకెండ్‌లో తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలో అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఈ రెండు సినిమాలు రాజ్‌తరుణ్‌ ఖాతాలో పడి ఉంటే.. అతని కెరీర్‌ ఎక్కడికో వెళ్లిపోయి ఉండేది.
entertainment
10,451
06-07-2017 12:30:28
ప్రభాస్‌ గురించి రణ్‌బీర్‌ ఏమన్నాడంటే..!
బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ తను నటించిన తాజా చిత్రం ‘జగ్గా జాసూస్‌’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. హీరోయిన్‌ కత్రినతో కలిసి ప్రెస్‌మీట్‌లలో పాల్గొంటున్నాడు. తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ‘ఇటీవల విడుదలైన సినిమాల్లో ఏ హీరో నటన మీకు బాగా నచ్చింది’ అని ఓ జర్నలిస్ట్‌ రణ్‌బీర్‌ను ప్రశ్నించారు.దీనికి స్పందించిన రణ్‌బీర్‌.. ప్రభాస్‌ నటన తనకు ఎంతగానో నచ్చిందని చెప్పాడు. ‘‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ నటన నిజంగా నాకు నచ్చింది. ఆ సినిమాలో ఆయన ప్రదర్శించిన దర్పం, రాజసం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభాస్‌ ఓ అద్భుతమైన నటుడు’ అని ఈ సందర్భంగా రణ్‌బీర్‌ చెప్పాడు. కాగా, ఇటీవల జరిగిన సైమా-2017 వేడుకలో తనకు దక్షిణాదిన ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందని చెప్పిన విషయం తెలిసిందే.
entertainment
10,825
26-07-2017 19:55:52
పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో 'సువర్ణ సుందరి'
ప్రస్తుతం హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో దర్శకనిర్మాతలు అలాంటి సబ్జెక్ట్స్‌తోనే సినిమాలు తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఇటీవల వచ్చిన బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. తాజాగా కోవలో చరిత్ర నేపథ్యంలో.. చరిత్రను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'సువర్ణ సుందరి'. చరిత్ర ఎప్పుడూ భవిష్యత్‌ని వెంటాడుతుంది అనేది ట్యాగ్‌లైన్‌. ఎస్‌.టీమ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సూర్య దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌ లక్ష్మి నిర్మిస్తున్న ఈచిత్ర షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ - ''1509 సంవత్సరంలో ప్రారంభమై నేటి(2017) వరకూ.. అంటే నాలుగు శతాబ్ధాల్లో జరిగే కథ ఇది. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కాలాదుల్ని బట్టి వేర్వేరు లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. త్వరలోనే టీజర్ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చరిత్ర ఎప్పుడూ విజయాల గురించి చెబుతుంది. అయితే చరిత్రలో బయటికి తెలీని చీకటి కోణాలుంటాయి. అలాంటి ఓ చీకటి కోణం ఇప్పటివరకూ రకరకాల జనరేషన్లపై ఎలాంటి ప్రభావం చూపించింది అన్నదే ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం. అప్పటి జనరేషన్‌, ఇప్పటి జనరేషన్‌ గ్యాప్‌ని అర్థవంతంగా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఈ చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యం వుంటుంది" అన్నారు.పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
entertainment
6,322
12-11-2017 10:36:17
గరుడవేగ సినిమాపై మహేశ్ ట్వీట్ ఎఫెక్ట్?
చిన్న సినిమాలకు మహేశ్ బాబు తన మద్దతు తెలుపుతున్నారు. సినిమాలను చూడటమే కాకుండా తన అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది ఆ సినిమాలకు చాలా ప్లస్‌గా మారుతోంది. అర్జున్ రెడ్డి సినిమా చాలా కాంట్రవర్శీ అయింది. ఫుల్‌గా యాంటీ పబ్లిసిటీ వచ్చింది. ఆ సమయంలో మహేశ్ ఆ సినిమాకు మద్దతుగా నిలిచారు. సినిమాలో కంటెంట్ కూడా బాగుండటంతో చిన్న సినిమాగా విడుదలైనా భారీ బడ్జెట్‌ సినిమాలకు సమానంగా ప్రేక్షకుల్ని అలరించింది.  తాజాగా విడుదలైన పీఎస్వీ గరుడవేగ సినిమా హిట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ కుటుంబానికి అంత్యంత అవసరం. ఇప్పటికే తాను అప్పుల్లో ఉన్నానని రాజశేఖర్ బహిరంగంగానే చెబుతున్నారు. సినిమా కూడా సక్సెస్ బాటలోనే నడుస్తోంది. తాజాగా మహేశ్ బాబు గరుడవేగ సినిమాను చూసి చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు మహేశ్ అంతటి హీరో సినిమా బాగుందని చెప్పారంటే తప్పకుండా సినిమా చూస్తామంటూ కామెంట్లు పెట్టడం విశేషం. ఈ ట్వీట్ ఎఫెక్ట్ సినిమాపై తప్పకుండా ఎంతో కొంత ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
entertainment
642
04-08-2017 01:47:49
నారాయణ హృదయాలయలో వాటాల విక్రయం
ఆరోగ్య సంరక్షణ విభాగంలోని నారాయణ హృదయాలయలో 1.7 శాతం వాటాలను జెపి మోర్గాన్‌ మారిషస్‌ హోల్డింగ్స్‌, కాప్తాల్‌ మారిషస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు విక్రయించాయి. గత నెల ఆరో తేదీన జరిగిన ఈ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీలో ఒక్కో షేరును 299.93 రూపాయలకు విక్రయించారు. డీల్‌ విలువ 104.29 కోట్ల రూపాయలు.
business
8,160
24-11-2017 16:31:02
హలో.. 'బిగ్‎బాస్'
మొదటి సినిమా పరాజయంతో రెండో సినిమాతో ఎలాగైనా హీరోగా సత్తా చాటాలని అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘హలో’. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమెరబుల్ మూవీని ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అక్కినేని నాగార్జున నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలకానుంది. అయితే ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేయడంలో అఖిల్ ఓ వినూత్న పద్దతిలో వెళుతున్నాడు. 'హలో' చెప్పండి అంటూ ఒక్కో పాత్ర లుక్ బయటకు వదలడం ఆసక్తి కలిగిస్తోంది. మొదటగా తన పాత్రను పరిచయం చేసిన అఖిల్ ఇటీవల తన తల్లిదండ్రుల పాత్రలను (జగపతి బాబు, రమ్యకృష్ణ) పరిచయం చేసి వారికి హలో చెప్పించాడు. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితం నటుడు అజయ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ పెట్టాడు. ఇందులో అజయ్ కోపంగా ఓ వ్యక్తిని ఏదో అడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్‎ని అఖిల్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. 'తెరా వెనుక ఓ జెంటిల్‎మెన్.. తెరపై మాత్రం బిగ్‎బాస్. రిషికి హలో చెప్పండి' అని టాగ్ చేశాడు. ఈ పోస్టర్ చూస్తుంటే అజయ్ ఈ సినిమాలో విలన్‎గా కనిపిస్తాడని తెలుస్తోంది.
entertainment
8,998
06-09-2017 11:34:17
మళ్లీ ఆ బ్యూటీ వెండితెరపై కనిపిస్తుందట!
"కుటుంబ పరిస్థితుల వల్లే ఇంత విరామం.. డైరెక్షన్ చేయడానికి తగిన కథలు నా వద్ద లేవు. కాబట్టి కొద్ది నెలల్లో మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నాను. గతంలో నేను నటించిన మేల్‌ఫిసియంట్‌ మూవీ సీక్వెల్‌ కోసం చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క ఓ మూవీలో ఈజిప్ట్‌ రాణి క్లియోపాత్రా పాత్రలో నటించే ఆలోచన ఉంది. అయితే ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు" ఇదీ అందాల భామ ఏంజెలీనా జోలి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. ఫస్ట్‌ దే కిల్డ్‌ మై ఫాదర్‌ అనే మూవీని ఏంజెలీనా తెరకెక్కించింది.  ప్రస్తుతం వెనిస్‌లో జరుగుతున్న చిత్రోత్సవంలో ఆ సినిమా ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా జోలీ తన కెరీర్‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలిపింది. కొంతకాలంగా ఏంజెలీనా తన వైవాహిక జీవితంలో ఎదురైన విషమ పరిస్థితుల కారణంగా నటనకు దూరమైంది. తన భర్తతో ఆమె విడాకులు తీసుకుని తన సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది. అయితే ఇంతకాలం వెండితెరకు దూరమైనా దర్శకురాలిగా మాత్రం బిజీ బిజీగా గడిపింది.
entertainment