SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
19,308
02-07-2017 01:42:45
మార్పులు ఖాయం?
మూడో వన్డేలో జట్టులో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సూచాయగా చెప్పాడు. అయితే తుది జ ట్టుపై ఇంకా నిర్ణయం తీసు కోలేదన్నాడు. ఈ సిరీస్‌లో ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కేలా చూస్తామని విరాట్‌ తెలిపాడు.జట్లు (అంచనా)భారత్‌: శిఖర్‌ ధవన్‌, అజింక్యా రహానె, కోహ్లీ (కెప్టెన్‌), యువరాజ్‌/రి షభ్‌ పంత్‌, ధోనీ (వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీవ్‌ యాదవ్‌, అశ్విన్‌, భువనేశ్వ ర్‌, ఉమేష్‌ యాదవ్‌.వెస్టిండీస్‌: లూయిస్‌, కైల్‌ హోప్‌, షై హోప్‌ (వికెట్‌ కీపర్‌), మహమ్మద్‌, ఛేజ్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), రోవ్‌మన్‌ పావెల్‌, అష్లే నర్స్‌, కెస్రిక్‌ విలియమ్స్‌, బిషూ, మిగుయెల్‌ కమిన్స్‌.
sports
9,541
05-09-2017 22:29:51
ట్రాక్‌ మార్చి చేసిన సినిమా ఇది
‘‘కేవలం కామెడీ సినిమాలే చేస్తున్న నాకు ట్రాక్‌ మార్చమని శ్రేయోభిలాషులు చాలా మంది చెప్పారు. వాళ్లు చెప్పిన మేరకే కొత్త తరహా కథను ఎంచుకున్నా’’ అని అల్లరి నరేశ్‌ చెప్పారు. జి.ప్రజిత్‌ దర్శకత్వంలో అల్లరి నరేశ్‌, నిఖిలా విమల్‌ జంటగా నటించిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. మలయాళంలో విజయవంతమైన ‘ఒరు ఒడక్కన్‌ సెల్ఫీ’కి రీమేక్‌ ఇది. బొప్పన చంద్రశేఖర్‌ నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. షాన్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల సీడీలను నిఖిల్‌ విడుదల చేశారు. నరేశ్‌ మాట్లాడుతూ ‘‘నీలో మంచి నటుడున్నాడు. కామెడీ సినిమాలే కాకుండా ‘గమ్యం’ తరహా కథలు చెయ్యమని నానీ లాంటి స్నేహితులు చెప్పారు. నాతో ‘కెవ్వు కేక’ సినిమా తీసిన చంద్రశేఖర్‌గారు అలాగే చెప్పారు. ఆయనే అది గుర్తుంచుకుని ఈ కథతో వచ్చారు. ఈ టైటిల్‌ ఐడియా కృష్ణభగవాన్‌గారిది. 2012లో రిజిష్టర్‌ చేయించా. ఇకపై నా నుంచి భిన్నమైన కథలు వస్తాయి. ఈ నెల 8న విడుదల కానున్న ఈ చిత్రం మాతృకను మించిన హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. తెలుగులో తొలి చిత్రమిదని దర్శకుడు ప్రజిత్‌ తెలిపారు. వినోదంతోపాటు భావోద్వేగానికి ప్రాధాన్యతనిస్తూ నరేశ్‌ చేసిన చిత్రమిదని నాని అన్నారు.
entertainment
13,831
04-01-2017 16:55:59
కావేరీ జల వివాదంపై ఫిబ్రవరి 7 నుంచి విచారణ
న్యూఢిల్లీ : కావేరి జలాల వివాదంపై ఫిబ్రవరి 9 నుంచి విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు బుధవారంనాడు ప్రకటించింది. కావేరీ జలాల విషయమై ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వును పొడిగిస్తూ, తదుపరి ఉత్వర్వులు వెలువరించేంతవరకూ తమిళనాడుకు రోజుకూ 2,000 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలో జస్టిస్ అమితవ్ రాయ్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తాజా ఆదేశాలు ఇచ్చింది. కావేరీ జలాల వివాదానికి తుది పరిష్కారం లభించేంతవరకూ విచారణ కొనసాగించాలని తమిళనాడు తరఫు న్యాయవాది శేఖర్ నఫ్డే కోరారు. ఇందుకు అంగీకరించిన త్రిసభ్య బెంచ్ ఫిబ్రవరి 7 నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడు వారాల పాటు విచారణ కొనసాగుతుందని పేర్కొంది. తద్వారా సమస్య పరిష్కారమయ్యేందుకు వీలుంటుందని తెలిపింది.
nation
15,419
12-10-2017 13:57:27
నేడు శశికళ బెంగుళూరు పయనం
టి.నగర్‌(చెన్నై): ఐదు రోజుల పెరోల్‌పై చెన్నై చేరుకున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకనే నిరాశతో మళ్లీ జైలుకు బయలుదేరనున్నారు. బుధవారం ఆమె పెరోల్‌గడువు ముగిసింది. గ్లోబల్‌ ఆస్పత్రిలో కిడ్నీ, లివర్‌ మార్పిడి ఆపరేషన్లు చేసుకుని చికిత్స పొందుతున్న భర్త నటరాజన్‌ను పరామర్శించే నిమిత్తం 15 ఐదు రోజుల పాటు పెరోల్‌ కోరినా కర్ణాటక జైలుశాఖ అధికారులు కఠినమైన నిబంధనలతో ఐదు రోజులకే పెరోల్‌ మంజూరు చేశారు. స్థానిక టి.నగర్‌ హబీబుల్లా రోడ్డులోని బంధువు ఇళవరసి కుమార్తె నివాసగృహంలో ఆమె బసచేశారు. ప్రతిరోజూ ఉదయం షోళింగనల్లూరు సమీపంలోని గ్లోబల్‌ ఆస్పత్రికి కారులో వెళ్లి భర్త నటరాజన్‌ పరామర్శిస్తూ గడిపారు. ఆ సమయంలో తన బంధువులను మాత్రమే కలుసుకున్నారు. అంతకు మించి పార్టీ నాయకులను గానీ, అనర్హత వేటు పడిన తన వర్గం శాసనసభ్యులనుగానీ కలుసుకోలేక పోయారు. నగరంలో బసచేసిన ఐదు రోజులూ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని చక్కదిద్దాల నుకున్నా వీలుపడలేదు. అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు దినకరన్‌ ఒకటి రెండుసార్లు పోలీసుల అనుమతితో శశికళను కలుసుకున్నారు. ఇక త్యాగరాయనగర్‌ నివాస గృహంలో తన బంధువులతో శశికళ ఆస్తి వివాదాలపైనే సమగ్రంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. శశికళతో ఎనిమిది మంది మంత్రులు, 19 మంది శాసనసభ్యులు రహస్యంగా చర్చలు జరిపారని తెలుస్తోంది. వీరంతా శశికళకు సానుభూతిని మాత్రమే ప్రకటించారని, ముఖ్యమంత్రి ఎడప్పాడిని వ్యతిరేకించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని చెబుతున్నారు. కొంత మంది శాసనసభ్యులు మాత్రం ముఖ్య మంత్రి ఎడప్పాడితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోమని సలహా ఇచ్చారని తెలిసింది. దీనితో తీవ్ర నిరాశకు గురైన శశికళ పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించే బాధ్యత దినకరన్‌దేనని ప్రకటించి చేతులు దులుపు కున్నారు. ఇదిలా ఉండగా పార్టీ సీనియర్లు కొం దరు రహస్యంగా శశికళతో ఫోన్‌లో మాట్లాడి దినకరన్‌ తీరు సంతృప్తికరంగా లేదని ఫిర్యాదు చేశారు. సీనియర్లను పట్టించు కోవడమే లేదని, సర్వాధికారిలా వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి వర్గం లోని నాయకుల, మంత్రుల పార్టీ పదవులను వరుసగా తొలగించడం వల్ల పార్టీలో ప్రతికూల పరిస్థితులే అధిక మయ్యాయని మొర పెట్టుకున్నారు. దినకరన్‌ను మార్చి మరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని కూడా వారు సూచించారు. అంతా ఓపికగా విన్న శశికళ దినకరన్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కది ద్దుతానని అంతవరకు ఓపిక పట్టమని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక శశికళ గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటరాజన్‌ను చూసిరావటానికి మాజీ ముఖ్య మంత్రి జయలలిత ఉపయోగించిన లగ్జరీ కారును వాడటం చర్చనీయాంశమైంది. ఆసు పత్రి వద్ద గుమికూడిన పార్టీ కార్యకర్తల పసి బిడ్డలకు జయలలిత, జయకుమార్‌ అని నామకరణాలు చేయడం మినహా శశికళ పార్టీని చక్క దిద్దేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయ లేకపోయారు. కారణం బెయిలు నిబంధనలు కఠినంగా ఉండటమే. దీనికి తోడు శశికళ చెన్నైలో అడుగుపెట్టినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆమె కదలికలపై తీవ్ర నిఘా వేశారు. శశికళను రోజూ కలుసుకునేందుకు వస్తున్నవారి వివరా లను, ఆమెను కలుసుకునేందుకు ప్రయత్నిం చినవారి వివరాలను సేకరించారు. శశికళతో ఫోన్‌లో సంభాషించినవారి వివరాలను కూడా సేకరించినట్టు తెలుస్తోంది. ఇక శశికళ చెన్నై రాకతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయని, ప్రత్యేకించి ఎడప్పాడి వర్గంలో గుబులు కలిగిస్తుందని అటు దినకరన్‌ వర్గం ఇటు ఎడప్పాడి వర్గం అనుకున్నా, చివరకు ఎలాంటి సందడి లేకనే శశికళ పెరోల్‌ గడువు ముగిసింది. గురువారం సాయంత్రం ఐదు గంటలలోపున ఆమె బెంగుళూరు పరపన అగ్రహారం జైలుకు చేరుకోనున్నారు.
nation
4,811
15-02-2017 00:05:59
సినిమా చూసి నాన్న కౌగలించుకున్నారు: సూర్య
‘‘చాలా రోజుల క్రితం ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలో నాన్నను నేను, కార్తీ కౌగలించుకున్నాం. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా చూసి నాన్న నన్ను కౌగలించుకోవడం ఉద్వేగాన్ని కలిగించింది’’ అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యస్‌ 3.. యముడు 3’. హరి దర్శకత్వం వహించారు. తెలుగులో మల్కాపురం శివకుమార్‌ విడుదల చేసిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో సూర్య మాట్లాడుతూ ‘‘ఇది నాకు చాలా ముఖ్యమైన సినిమా. ‘సింగమ్‌’ బ్రాండ్‌ అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండటం వల్లే సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్‌ కలెక్షన్లను మించి ప్రజల ఆదరణ, ఆత్మీయతను మర్చిపోలేను. మొదటిసారి విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఏదో ఒక అవాంతరం రావడం, వాయిదా వేయడం, ఇలా వంద రోజుల్లో నాలుగైదుసార్లు వాయిదాపడి విడుదలైన సినిమాకు ఇంత చక్కని స్పందన రావడంతో ఈ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఇందులోని డైలాగ్స్‌కు, ఎమోషనల్‌ సీన్సకు ప్రేక్షకులు బాగా కనెక్టవుతున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఈ సినిమా చూసి మెచ్చుకుంటుంటే నా బాధ్యత మరింత పెరిగిందనిపిస్తోంది. దర్శకుడు హరితో పన్నెండేళ్లుగా ప్రయాణం చేస్తున్నాను. సినిమా తీసేప్పుడు ఆయన అంకితభావం చూసి ఎంతో నేర్చుకున్నా. ఆ సమయంలో పూర్తి శాకాహారిగా మారిపోయి ఓ నిష్ఠతో సినిమా తీస్తారు. ప్రస్తుతం నేను విఘ్నేశ శివన దర్శకత్వంలో ‘తాన సెరెంద కూట్టమ్‌’ సినిమా చేస్తున్నా. తెలుగులో టైటిల్‌ ఇంకా అనుకోలేదు. కీర్తి సురేశ హీరోయినగా చేస్తోంది’’ అని చెప్పారు. దర్శకుడు హరి మాట్లాడుతూ ‘యస్‌ 3’ తెలుగులోనూ పెద్ద హిట్టవడం సంతోషంగా ఉందన్నారు. ఐదేళ్ల తర్వాత ‘సింగమ్‌ 4’ చేస్తాననీ, ప్రస్తుతం విక్రమ్‌తో ‘సామి’కి సీక్వెల్‌ ప్లాన చేస్తున్నాననీ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా విడుదలైనప్పటికీ ‘యస్‌ 3’ని ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుకు చాలా ఆనందంగా ఉందని నిర్మాత శివకుమార్‌ చెప్పారు.
entertainment
15,236
10-11-2017 10:22:56
గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో సంచరిస్తున్న ఐదు పాకిస్తానీ బోట్లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. శుక్రవారం ఉదయం భుజ్ సమీపంలో సరిహద్దు దాటి వచ్చిన ముగ్గురు జాలర్లను కూడా అరెస్టు సైనికులు చేశారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న నిలువుదారి హరామీ నాలా గుండా చొరబడిన జాలర్లను బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోని తీసుకున్నారు. ఇలా మరికొందరు ప్రవేశించి ఉండవచ్చునని భావిస్తున్న బీఎస్ఎఫ్.. గాలింపు తీవ్రతరం చేసింది. గత నెలలో కూడా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఓ పాకిస్తాన్ జాలరి సరిహద్దు దాటి రావడంతో అతడిని అరెస్టు చేసి, బోటును స్వాధీనం చేసుకున్నారు.
nation
20,237
12-04-2017 01:35:40
ఆసియా స్కూల్‌ హాకీ విజేత భారత్
భోపాల్‌: భారత జట్టు ఆసియా పాఠశాలల హాకీ చాంపియన్‌గా నిలిచింది. మలేసియాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత 5-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది.
sports
10,296
02-02-2017 12:18:11
చిరు,ఎన్టీఆర్ వల్ల కాజల్‌కు దక్కిందేమిటి..?
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే కేవలం గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదు. అందంతో పాటు అందుకు అదృష్టం కూడా తోడవ్వాలి. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్‌ను ఎంజాయ్ చేస్తున్న కాజల్‌కు లక్ బాగా ఉందని... ఆమె కెరీర్ గ్రాఫ్‌ను బట్టి అర్థమవుతోంది. లేటెస్ట్‌గా ఆమె తెలుగులో మరోసారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకోవడంతో... అమ్మడి కెరీర్‌కు ఇప్పుడప్పుడే వచ్చిన ముప్పేమీ లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.  లేటేస్ట్‌గా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో 2016 మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆఫ్ ది ఇయర్‌గా కాజల్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయట. గతేడాది పవన్ కళ్యాణ్ సరసన 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేశ్ సరసన 'బ్రహ్మోత్సవం' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది కాజల్. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టడంతో ముద్దుగుమ్మ పనైపోయిందనే ప్రచారం జరిగింది.                   కానీ... ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ 'జనతా గ్యారేజ్'లో ఐటం సాంగ్ చేసిన కాజల్... ఎవరూ ఊహించని విధంగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. దీనికి తోడు చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150'లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోవడం కూడా కాజల్ టాప్ పొజిషన్‌కు చేరుకోవడానికి హెల్ప్ అయ్యింది. మొత్తానికి లాస్ట్ ఇయర్ సత్తా చాటుకున్న ఈ అందాల భామ... ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తుందా... అన్నది తెలియాలంటే... మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.
entertainment
13,641
20-12-2017 04:16:32
హిమాచల్‌ సీఎం రేసులో నడ్డా, జైరామ్‌
షిమ్లా, డిసెంబరు 19: హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కానీ.. సుజన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ మాత్రం ఓడిపోయారు. దీంతో ఇప్పుడిక్కడ సీఎం ఎవరనేది ఆసక్తిగా మారింది. అయితే కేంద్రమంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డాతోపాటు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైరామ్‌ ఠాకూర్‌ సీఎం రేసులో ఉన్నారు. సీఎం అభ్యర్థిపై బీజేపీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ.. నడ్డావైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలవడంతో వీరభద్ర సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు.
nation
17,288
20-05-2017 03:00:10
సతతహరిత విప్లవం అవసరం
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌పై పుస్తకాల ఆవిష్కరణ ప్రధాని నరేంద్ర మోదీన్యూఢిల్లీ: సతతహరిత విప్లవంతో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాల్‌ను అధిగమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘మనం ఇప్పటికీ హరిత విప్లవం-1, 2 గురించే మాట్లాడుతూ ఉన్నాం. వ్యవసాయ రంగంలో సవాళ్లు మాత్రం అలాగే ఉన్నాయి. సతతహరిత విప్లవం మన లక్ష్యం కావాలి. సమృద్ధిగా వ్యవసాయోత్పత్తులు సాధించాల’ని అన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామి నాథన్‌పై రెండు భాగాలుగా ప్రచురించిన పుస్తకాలను (ది క్వెస్ట్‌ ఫర్‌ ఏ వరల్డ్‌ వితవుట్‌ హంగర్‌) శుక్రవారం తన నివాసంలో మోదీ ఆవిష్కరించారు. 2022 నాటికి.. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కలను నిజం చేసే దిశగా తమ ప్రభుత్వం కృషి సాగిస్తోందని చెప్పారు. దీనిపై స్వామినాథన్‌ తనకు కొన్ని సూచనలు చేశారని, వాటిపై కసరత్తు చేస్తున్నానని తెలిపారు. ‘ఆహార భద్రత’ స్థాయి నుంచి ‘పౌష్టికాహార భద్రత’కు ఆలోచన మారాల్సిన అవసరం ఉందని, దీనికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల మధ్య ఆర్థిక అసమతుల్యతలపై దృష్టి సారించవలసి ఉందని, ఇటువంటి పరిస్థితులు ఉంటే దేశం ముందుకుపోలేదని చెప్పారు. పారిశ్రామిక క్లస్టర్ల మాదిరిగా వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధనల అవసరాన్ని ఆయన గుర్తు చేస్తూ తక్కువ వ్యయంతో ఎక్కువ దిగుబడి సాధించాలన్నదే లక్ష్యం కావాలని చెప్పారు. వేప పూత యూరియా వల్ల చౌర్యం తగ్గిందని, దిగుబడిపై ఎటువంటి ప్రభావం లేకుండా వినియోగం కూడా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. నీటి కొరత పెద్ద సమస్య అని, కనీసం 50 ఏళ్ల ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడాకారులు, సినీ నటులు, రాజకీయ వేత్తల నుంచి స్ఫూర్తి పొందుతున్న యువత స్వామినాథన్‌ వంటి శాస్త్రవేత్తల నుంచి స్ఫూర్తి పొందడం లేదని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ మాట్లాడుతూ బెంగాల్‌ కరువు తర్వాత అటువంటి క్షామం పునరావృతం కానప్పటికీ చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు.
nation
20,882
13-06-2017 04:30:36
ఇంగ్లండ్‌ జెర్సీలో వార్న్‌..!
పందెంలో ఓడిన షేనలండన్: ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్‌ షేన్ వార్న్‌.. ఇంగ్లండ్‌ టీమ్‌ జెర్సీ వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. చాంపియన్స్  ట్రోఫీ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీతో వేసిన పందెంలో షేన్ ఓడిపోయాడు. దీంతో షరతు ప్రకారం ఇంగ్లండ్‌ జెర్సీ వేసుకోనున్నట్టు వార్న్‌ ట్వీట్‌ చేశాడు. గత శనివారం చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో విజేత ఎవరు? అని గంగూలీ, వార్న్‌ మధ్య చర్చ జరిగింది. ఆసీస్‌తో పోల్చితే ఇంగ్లండ్‌ బలంగా ఉందని.. మోర్గాన్ సేనదే గెలుపు అని గంగూలీ అన్నాడు.          కానీ సౌరవ్‌ అభిప్రాయాన్ని వ్యతిరేకించిన వార్న్‌.. కంగారూలు నెగ్గితే ఆస్ట్రేలియా జెర్సీ వేసుకోవాలని, తనకు డిన్నర్‌ ఆర్డర్‌ చేయాలనే బెట్‌ కట్టాడు. ఇందుకు ఇరువురూ అంగీకరించారు. అయితే ఈ మ్యాచ్ లో స్మిత్ సేనపై ఇంగ్లండ్‌ 40 పరుగుల తేడాతో విజయం సాధించి. దీంతో పందెం ప్రకారం ఇంగ్లండ్‌ జెర్సీ వేసుకోనున్నట్టు వార్న్‌ తెలిపాడు.
sports
13,905
17-12-2017 02:12:54
ఆ శక్తి రాహుల్‌కు ఉంది!
 ధైర్యంగా పార్టీని నడపగలరు దేశం సవాళ్లను ఎదుర్కొంటోంది మతతత్వశక్తులు రెచ్చిపోతున్నాయివాటిని నిలువరించేందుకు త్యాగాలకు కాంగ్రెస్‌ సిద్ధమవ్వాలి ఇందిర కన్నకూతురిలా చూసుకున్నారుఅధ్యక్షురాలిగా ఇదే నా చివరి ప్రసంగం భావోద్వేగానికి గురైన సోనియాఇందిరా గాంధీ మరణించిన తర్వాత ఏడేళ్లకు రాజీవ్‌ గాంధీ హత్యకుగురయ్యారు. దీంతో జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలా మిగిలాను. ఆ పరిస్థితి నుంచి సాధారణ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా. కానీ కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంలో ఉందని, మతతత్వశక్తులుబలపడుతున్నాయని పార్టీ నేతలు, కార్యకర్తలు విన్నవించడంతో వారి కోరిక మేరకు బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చా.సోనియా గాంధీఇందిరా గాంధీ మరణించిన తర్వాత ఏడేళ్లకు రాజీవ్‌ గాంధీ హత్యకుగురయ్యారు. దీంతో జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలా మిగిలాను. ఆ పరిస్థితి నుంచి సాధారణ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా. కానీ కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంలో ఉందని, మతతత్వశక్తులుబలపడుతున్నాయని పార్టీ నేతలు, కార్యకర్తలు విన్నవించడంతో వారి కోరిక మేరకు బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చా.సోనియా గాంధీఇందిరా గాంధీ మరణించిన తర్వాత ఏడేళ్లకు రాజీవ్‌ గాంధీ హత్యకుగురయ్యారు. దీంతో జీవితంలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలా మిగిలాను. ఆ పరిస్థితి నుంచి సాధారణ స్థితికి రావడానికి చాలా కాలం పట్టింది. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా. కానీ కాంగ్రెస్‌ పార్టీ సంక్షోభంలో ఉందని, మతతత్వశక్తులుబలపడుతున్నాయని పార్టీ నేతలు, కార్యకర్తలు విన్నవించడంతో వారి కోరిక మేరకు బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చా.సోనియా గాంధీన్యూఢిల్లీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రిగా ఇది నా చివరి ప్రసంగం’ అంటూ 19 ఏళ్లపాటు కాంగ్రెస్‌ అధినేత్రిగా వ్యవహరించిన సోనియా గాంధీ తన వీడ్కోలు ప్రసంగాన్ని ప్రారంభించారు. శనివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌కు అప్పగించిన తర్వాత ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ‘సుమారు 20ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి నేను తీవ్రమైన భయాందోళనతో ఉన్నాను. ఇదే వేదికపై నిలుచుని ప్రసంగిస్తున్నప్పుడు నా చేతులు వణికాయి. రాజకీయ అనుభవం లేకుండా ఎంతో చరిత్రగల పార్టీని ఎలా ముందుకు నడపాలన్న ఆందోళన ఉండేది’ అని సోనియా నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. రాహుల్‌ తనలా కాదని, ఎన్నో ఎదురుదాడులను ఎదుర్కొని బలమైన, శక్తివంతమైన వ్యక్తిగా రూపొందాడని పేర్కొన్నారు. ‘రాహుల్‌ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విద్వేషపూరిత వ్యక్తిగత దాడులు అతన్ని మరింత బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి’ అని సోనియా పేర్కొన్నారు. రాహుల్‌ ధైర్యంగా చిత్తశుద్ధితో పార్టీని ముందుకు నడపగలరన్న ధీమాను సోనియా వ్యక్తం చేశారు. దేశంలో నానాటికీ రెచ్చిపోతున్న మతతత్వశక్తులను నిలువరించేందుకు ఎలాంటి త్యాగాలకైనా పార్టీ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశం సవాళ్లను ఎదుర్కొంటోందని, అయినా కాంగ్రెస్‌ వెనకడుగు వేయబోదన్నారు. ఇందిర స్మరణలో..దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప కుటుంబంలో ఇందిరాగాంధీ జన్మించారని, ఆమె తనను కన్న కూతురిలా చూసుకున్నారని సోనియా పేర్కొన్నారు. ఆమె నుంచి భారతీయ సంస్కృతిని నేర్చుకున్నానని తెలిపారు. ఆమె హత్యకు గురైనప్పుడు సొంత తల్లిని కోల్పోయినంతగా బాధపడ్డానని చెప్పారు. ఇందిర మరణంతో రాజకీయాలకు దూరంగా ఉందామని, తన భర్త, పిల్లలను కూడా వాటిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించానని, కానీ, తాను ఎంత చెప్పినా వినకుండా తన భర్త రాజీవ్‌ గాంధీ ప్రధానిగా బాధ్యతలు తీసుకొని దేశసేవకు సిద్ధమయ్యారని వివరించారు. పార్టీ అధ్యక్షురాలిగా తాను బాధ్యతలు తీసుకునేప్పుడు 3రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉందని, కార్యకర్తల మద్దతుతో అనతికాలంలోనే 12కుపైగా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామన్నారు.  2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చామని, అప్పటి నుంచి పదేళ్ల పాటు మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో ప్రజలకు బాధ్యతాయుతమైన, ప్రగతిశీల పరిపాలనను అందించామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌కు అభినందనలు తెలియజేశారు. పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాహుల్‌ గాంధీ ఆశావహ రాజకీయాలకు బాటలు వేస్తారని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఆ పరిస్థితికి చరమగీతం పాడి ఆశావహ రాజకీయాలకు తెరదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. సోనియాను శక్తివంతమైన నాయకురాలిగా అభివర్ణించారు. 2019లో రాయబరేలి నుంచే సోనియా: ప్రియాంక సోనియా గాంధీ 2019 ఎన్నికల్లో కూడా రాయబరేలి లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తారని ప్రియాంక గాంధీ తెలిపారు.రాయబరేలీ నుంచి తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తన తల్లి ఎంతో ధైర్యవంతురాలని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 19 ఏళ్లపాటు కాంగ్రెస్‌ అధ్యక్షబాధ్యతలను నిర్వర్తించారని ప్రియాంక పేర్కొన్నారు. ఆశావహ రాజకీయాలకుతెరదీయాలి: మన్మోహన్‌ రాహుల్‌ గాంధీ ఆశావహ రాజకీయాలకు బాటలు వేస్తారని మన్మోహన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఆ పరిస్థితికి చరమగీతం పాడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మరింత ఎత్తుకు ఎదుగుతుందని అన్నారు. సోనియా నాయకత్వ పటిమపై మన్మోహన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆశావహ రాజకీయాలకుతెరదీయాలి: మన్మోహన్‌ రాహుల్‌ గాంధీ ఆశావహ రాజకీయాలకు బాటలు వేస్తారని మన్మోహన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఆ పరిస్థితికి చరమగీతం పాడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మరింత ఎత్తుకు ఎదుగుతుందని అన్నారు. సోనియా నాయకత్వ పటిమపై మన్మోహన్‌ ప్రశంసల వర్షం కురిపించారు.ఆశావహ రాజకీయాలకుతెరదీయాలి: మన్మోహన్‌ రాహుల్‌ గాంధీ ఆశావహ రాజకీయాలకు బాటలు వేస్తారని మన్మోహన్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఆ పరిస్థితికి చరమగీతం పాడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మరింత ఎత్తుకు ఎదుగుతుందని అన్నారు. సోనియా నాయకత్వ పటిమపై మన్మోహన్‌ ప్రశంసల వర్షం కురిపించారు.
nation