SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
414
11-05-2017 00:39:13
ఐడిబిఐపై ఆర్‌బిఐ నజర్‌
భారీ ఎత్తున మొండిబకాయిలు పెరిగిపోవడంతో ఐడిబిఐ వ్యవహారాలపై భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ఒక కన్నేసింది. ఐడిబిఐ బ్యాంకును ఆర్‌బిఐ వాచ్‌లి్‌స్టలో చేర్చినట్టుగా తెలిసింది. నికర మొండిపద్దుల మొత్తం 6 శాతం దాటడం, వరసగా రెండేళ్ల పాటు నష్టాలను ప్రకటించడం, కాపిటల్‌ అడెక్వసీ నిర్దేశిత ప్రమాణాల కంటే తగ్గడం... ఈ సందర్భాల్లో బ్యాంకులను ఆర్‌బిఐ వాచ్‌ లిస్ట్‌లో చేరుస్తుంది. తమ బ్యాంకుకు సంబంధించి ఆర్‌బిఐ ప్రాంప్ట్‌ కరెక్టీవ్‌ యాక్షన్‌ (పిసిఎ) చేపట్టినట్టు ఐడిబిఐ వెల్లడించింది. గతంలో ఓవర్సీస్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌కు సంబంధించి కూడా ఆర్‌బిఐ పిసిఎ చేపట్టింది. పిసిఎ వల్ల బ్యాంకుపై ఆర్థికంగా భారం పడదనీ, దీనివల్ల అంతర్గత నియంత్రణలు మెరుగుపడటంతో పాటు, కార్యకలాపాలు మెరుగవుతాయని ఐడిబిఐ వివరించింది. ఆర్‌బిఐ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు మూలధనాన్ని పొదుపుగా వినియోగించడంపై ఐడిబిఐ దృష్టి సారించాల్సి ఉంటుంది.ఇందులో భాగంగా పరపతిపై నియంత్రణలు విధించడం, నియామకాలను నిలిపేయడం, కొత్త పెట్టుబడి పథకాలను పక్కన బెట్టడంవంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుం ది. బ్యాంకు సరైన రీతిలో స్పందించని పక్షంలో మరో బలమైన బ్యాంకులో విలీనానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.
business
2,668
12-06-2017 00:40:32
బ్యాంకింగ్‌ చీఫ్‌లతో నేడు జైట్లీ భేటీ
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్ బి) చీఫ్‌లతో సమావేశంకానున్నారు. దాదాపు రోజంతా జరిగే ఈ సమావేశంలో పిఎస్ బిలకు గుది బండగా మారిన మొండి బకాయి(ఎన్‌పిఎ)ల వసూళ్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా పిఎస్ బిల పనితీరు, ఒత్తిడిలో ఉన్న రుణాల పరిస్థితి, బ్యాలెన్స్‌ షీట్ల ప్రక్షాళన కోసం బ్యాంకులు తీసుకున్న చర్యలు కూడా చర్చకు రానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం పిఎస్ బిల చీఫ్‌లతో జైట్లీ జరుపుతున్న తొలి సమావేశం ఇదే. మొండి బకాయిల వసూలు కోసం 1949నాటి బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశాక జరుగుతున్న ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఆర్డినెన్స్‌తో ఎన్‌పిఎల వసూళ్ల కోసం చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించే అధికారం ఆర్‌బిఐకి ఏర్పడింది. ఇంకా ఈ సమావేశంలో ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన పథకాలపైనా సమీక్షించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ముందే జైట్లీ సార్వత్రిక కనీస ఆదాయం (యుబిఐ), బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నట్టు చెప్పడం విశేషం.
business
19,923
19-01-2017 19:51:31
కీలక వికెట్ తీసిన జడేజా..
కటక్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్‌లో భారత జట్టు మూడో వికెట్ పడగొట్టింది. 82 పరుగులతో దూసుకెళుతున్న ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్‌ను జడేజా ఔట్ చేశాడు. 27వ ఓవర్ మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ 27 ఓవర్లు ముగిసే సమయానికి 172/3. మ్యాచ్ గెలిచేందుకు ఇంగ్లండ్ ఇంకా 209 పరుగులు చేయాల్సి ఉంది.
sports
15,762
23-11-2017 17:29:04
మరో రెచ్చగొట్టే చర్యకు దిగిన పాకిస్థాన్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాది హపీజ్ సయీద్‌ స్వేచ్ఛనిచ్చి, భారతదేశానికి ఆగ్రహం తెప్పించింది. 24 గంటలు గడవక ముందే మరో రెచ్చగొట్టే చర్యకు దిగింది. కశ్మీరు అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. కశ్మీరులో నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించింది. తమ నిఘా వర్గాల కనుసన్నల్లోనే ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశంలోకి పంపిస్తున్న పాకిస్థాన్ తీవ్రమైన ఆరోపణలతో భారతదేశంపై విరుచుకుపడటం చాలా దారుణం. మరోవైపు హఫీజ్ సయీద్ భారత వ్యతిరేక బహిరంగ సభలో త్వరలోనే మాట్లాడబోతున్నట్లు సమాచారం.
nation
8,624
03-04-2017 15:48:23
గోవాలో కొడుకుతో కలిసి అల్లు అర్జున్ స్విమ్మింగ్!
స్టార్‌ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడిపే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడం లేదు ఇప్పటి సినిమా హీరోలు. ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు అలవాటు. వృతిపరమైన విషయాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం కూడా బన్నీకి అలవాటు.
entertainment
19,527
17-08-2017 02:04:06
ఆఫీసు బేరర్లను తొలగించండి..!
సుప్రీం కోర్టుకు సీవోఏ మధ్యంతర నివేదికన్యూఢిల్లీ: బీసీసీఐ పగ్గాలను పూర్తిగా తమ చేతికే అందించాలని కమిటీ ఆఫ్‌ అడ్మిస్ట్రేటర్స్‌ (సీవోఏ) సుప్రీం కోర్టును కోరింది. సంస్కరణల అమలుపై కోర్టుకు సమర్పించిన ఐదో మధ్యంతర నివేదికలో ఆఫీసు బేరర్ల ఉదాసీన వైఖరిని ఎండగట్టింది. లోధా కమిటీ సిఫారసుల అమల్లో విఫలమైన బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, కోశాధికారి అనిరుధ్‌ చౌదరిలను తొలగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. తదుపరి ఎన్నికలు జరిగేంత వరకు బోర్డు పరిపాలన, కార్యనిర్వహణ అధికారాలను తమకే అప్పగించాలని వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జీ సభ్యులుగా ఉన్న సీవోఏ.. సుప్రీంను కోరింది. సీఈవో రాహుల్‌ జోహ్రీ లాంటి ప్రొఫెషనల్స్‌ నిర్వహిస్తున్న కార్యకలాపాలను కూడా తమకిందకే తీసుకురావాలని తెలిపింది. 26 పేజీల నివేదికలో లోధా సంస్కరణ అమల్లో విఫలమైన ఖన్నా, అమితాబ్‌, అనిరుధ్‌లను మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, కార్యదర్శి అజయ్‌ షిర్కే తరహాలో తొలగించాలని సీవోఏ పేర్కొంది. ఆరు నెలలు దాటినా కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో వీరు విఫలమయ్యారని.. అందుకే వీరిపై వేటు వేయడం సరైనదే అని అభిప్రాయపడింది. జూలై 26న జరిగిన బీసీసీఐ ఏజీఎంలో సీఈవో, లీగల్‌ టీమ్‌ను సమావేశం నుంచి బయటకు వెళ్లమని కోరిన ఆఫీసు బేరర్లు.. కోర్టు ఆదేశాలను తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఆఫీసు బేరర్లపై అనర్హత, అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటును బీసీసీఐ పట్టించుకోవడం లేదని తెలిపింది. బోర్డు తీరు లోధా సిఫారసులకు వ్యతిరేకంగా ఉందని ఎస్‌జీఎంలో డీడీసీఏ అడ్మినిస్ట్రేటర్‌, రిటైర్డ్‌ జస్టిస్‌ విక్రమ్‌జిత్‌ సేన్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన దాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కొత్త అంబుడ్స్‌మన్‌ నియామకంతో పాటు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై సవరణలు, నిధుల పంపిణీలో కొత్త నిబంధలను అమలు చేయడంలో బోర్డు విఫలమైందని సీవోఏ.. సుప్రీం కోర్టుకు నివేదించింది.
sports
16,516
25-02-2017 18:20:59
‘అమెరికాలో భారతీయులు మాతృభాషలో మాట్లాడొద్దు’
కన్సాస్ : విద్వేషపూరిత దాడుల నేపథ్యంలో ప్రవాస భారతీయుల్లో ఆందోళన తారస్థాయికి చేరింది. మనసారా మాతృభాషలో మాట్లాడుకోవాలన్నా భయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు ఆంగ్లంలోనే మాట్లాడుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పుకుంటున్నారు. ‘‘అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో కలుసుకున్నపుడు హిందీలోగానీ, ఏదైనా ఇతర భారతీయ భాషలో మాట్లాడుకోవద్దు. దానివల్ల మీకు తీవ్ర ఇబ్బందులు రావచ్చు’’ అని ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాల్లో ఒకరికొకరు సందేశాలు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిలపై దాడి అనంతరం అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు, ఆందోళనతో విలవిలలాడుతున్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విక్రమ్ జంగమ్ కొన్ని ముందు జాగ్రత్తలను సూచించారు. మిగతా విషయాల కన్నా ప్రాణం చాలా విలువైనదని చెప్పారు. క్రింద పేర్కొన్న జాగ్రత్తలను దక్షిణాసియా దేశాలవారు, తెలుగువారు పాటించాలని తెలిపారు. - బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాదనకు దిగవద్దు. - ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, ఎదురు మాట్లాడకుండా అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోండి. - మన మాతృ భాషలో మాట్లాడటాన్ని మనం ఎంతగా ఇష్టపడితే అంతగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లిష్‌లో మాట్లాడుకోగలరేమో చూసుకోండి. - ఏకాంత ప్రదేశాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఒంటరిగా వెళ్ళడం కానీ, ఒంటరిగా ఉండటం కానీ చేయకండి. - అత్యవసర పరిస్థితుల్లో 911కు ఫోన్ చేయడానికి సందేహించవద్దు. అటువంటి పరిస్థితుల్లో అధికారులు వచ్చి సహాయపడతారు. - మీ పరిసరాలను గమనిస్తూ ఉండండి, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే చెప్పండి.
nation
20,186
17-06-2017 02:38:00
సూపర్‌ సండే !
అటు క్రికెట్‌.. ఇటు హాకీ రెండింటిలో దాయాదుల సమరంన్యూఢిల్లీ : ఈ ఆదివారం ఇతర ఏ కార్యక్రమాలూ పెట్టుకోకండి..! ఆటలపై అమితాసక్తి ఉ న్న వారైతే మరీను..! ఒకవేళ తప్పకుండా పాల్గొనాల్సిన కార్యక్రమం అయితే కనీసం మధ్యా హ్నం ఒంటి గంటకల్లా పూర్తి చేసుకొనేలా ప్లాన్‌ చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు రెండు అతి ము ఖ్యమైన మ్యాచ్‌లు ఉండడమే. ఆ రెండూ దాయాదులు భారత్‌-పాకిస్థాన్‌లు తలపడుతున్నవే. అందులో ఒకటి క్రికెట్‌ అయితే మరొకటి జాతీయ క్రీడ హాకీ మ్యాచ్‌. రెండు మ్యాచ్‌లూ ఒకే రోజు.. అదీ ఒకటే నగరంలో జరగనుండడంతో మజాయే మజా! చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌-పాకిస్థాన్‌లు ఫైనల్‌కు చేరడంతో టోర్నీకి అద్భుత ముగింపు లభించనుంది. ఇక జరగబోయేది టైటిల్‌ ఫైట్‌. అం చనాలను పటాపంచలు చేస్తూ తుది సమరానికి దూసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసిన పాక్‌.. లీగ్‌ దశలోలా చేతులెత్తేస్తుందా లేక కీలక పోరులో శక్తులన్నీ కూడదీసుకుని మ్యాచ్‌ను ఉ త్కంఠ భరితంగా మారుస్తుందా చూడాలి. కొద్దిరోజులుగా వరుణుడి జాడలేకపోవడంతో ఓ వల్‌ లో ఫైనల్‌ సాఫీగా సాగుతుందని భావిస్తున్నారు.  హాకీ సెమీస్‌లోనూ దాయాదులే..అదే లండన్‌లో దాయాదులు వరల్డ్‌ హాకీ లీగ్‌ టోర్నీలో ఢీకొననున్నాయి. శనివారం కెనడాతో తలపడనున్న భారత్‌.. ఆదివారం జరిగే పూల్‌-బి లీగ్‌ పోరులో పాకిస్థాన్‌ను ఎదుర్కోనుంది. ప్రస్తుత హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ది ఆరో స్థానంకాగా పాక్‌ 13లో ఉంది. ఈ టోర్నీనుంచి క్వాలిఫై అయ్యే జట్లు భువనేశ్వర్‌లో జరిగే వరల్డ్‌ హాకీ లీగ్‌ ఫైనల్లో ఆడతాయి. క్రికెట్‌ మాదిరి భారత్‌-పాక్‌ హాకీ పోటీ అంటే కూడా అభిమానులకు అదే ఉత్సాహం.. అదే ఉత్కంఠ..మొత్తంగా ఈ ఆదివారం దేశంలోని సింహభాగం ప్రజలు టీవీల చెంతనే! అటు కోహ్లీ సేనకు ఇటు మన్‌ప్రీత్‌ సింగ్‌ దళానికి ఆల్‌ ది బెస్ట్‌.
sports
5,149
17-03-2017 14:34:15
ఏటీఎం వర్కింగ్ రివ్యూ
నిర్మాణ సంస్థ:  డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్తారాగ‌ణం: ప‌వ‌న్‌, కారుణ్య‌, రాకేష్‌, మ‌హేంద్ర‌, నారాయ‌ణ‌, ఆషా, మ‌హేశ్‌, అంబ‌టి శీను, కిశోర్ దాస్, తిరుప‌తి దొరై, వీర‌బాబు, చిల్ల‌ర రాంబాబు, ఆంజ‌నేయులు త‌దిత‌రులుకూర్పు: శామ్యూల్ క‌ళ్యాణ్‌సంగీతం: ప్ర‌వీణ్ ఇమ్మ‌డిఛాయాగ్ర‌హ‌ణం: శివ‌రామ్ నిర్మాతలు: కిశోరి బ‌సిరెడ్డి, య‌క్క‌లి ర‌వీంద్ర బాబు ద‌ర్శ‌క‌త్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం దేశంలో ఎవ‌రూ ఊహించ‌నిది. న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు గురించి ప్ర‌క‌టించ‌గానే జ‌నాలంద‌రూ మిగిలిన అన్ని విష‌యాల‌నూ మ‌ర్చిపోయి ఏటీఎంల గురించి, చెల్లే నోట్ల గురించి, కొత్త‌గా బ్యాంకులు ఇచ్చిన రెండు వేల నోట్ల గురించి, న‌ల్లకుబేరుల గురించి, క‌మిష‌న్ల మార్పిడి గురించి, బంగారు కొనుగోలు గురించి, చిల్ల‌ర స‌మ‌స్య గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. స‌రిగా అదే స‌మ‌యంలో ఆ విష‌యాల‌ను గమ‌నించి సునీల్‌కుమార్ రెడ్డి ఆ ఇష్యూతో సినిమా చేసి `ఏటీఎం వ‌ర్కింగ్‌` అని సినిమా తీశారు. శ్రావ్య ఫిలిమ్స్ తెర‌కెక్కించిన టుమ్రీ సినిమాగా ఈ చిత్రానికి ప్ర‌చారం చేశారు. ఇంత‌కీ ఆ సినిమా ఎలా ఉంది? క‌రెంట్ ఎఫైర్‌తో వెండితెర‌మీద‌కు వచ్చి ఆక‌ట్టుకుందా?  లేదా?  అనేది తెలియాలంటే ఓ లుక్కేసేయండి మ‌రి... క‌థ‌:అనంత్ (ప‌వ‌న్‌), త్రిలోక్ ( రాకేష్‌), మ‌హేంద్ర (మ‌హేశ్‌) ముగ్గురూ స్నేహితులు. పెద్ద క‌ష్టాలేమీ ప‌డ‌కుండా చేతిలోకి డ‌బ్బులు రావాల‌నుకుని ఆలోచించే మ‌న‌స్త‌త్వం ఉన్న‌వారు. వారికి ప‌రిచ‌య‌మైన ఓ వ్య‌క్తి దొంగ‌నోట్ల వ్యాపారం గురించి చెబుతాడు. దాంతో ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ చోటా రౌడీని బ‌తిమాలుకుని రూ.2ల‌క్ష‌లు అప్పుచేసి దొంగ‌నోట్ల ముద్ర‌ణ‌కు ప్లాన్ చేస్తారు. క‌ష్ట‌ప‌డి మూడు కోట్ల రూపాయ‌ల‌ను ముద్రించి పార్టీ కోసం వెతుక్కుని డ‌బ్బు తీసుకుని వెళ్ల‌డానికి స‌ర్వం స‌న్నాహాలు చేసుకుంటారు. అనూహ్య‌మైన రీతిలో అదేరోజు నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది. అక్క‌డి నుంచి ఆ నోట్ల‌ను ఏం చేశారు? ఏటీఎం క్యూల‌లో వాళ్లు ఎలా నిలుచున్నారు?  చిల్ల‌ర దొర‌క్క వాళ్లు చేసిన ప‌నులేంటి? అస‌లు పెద్ద‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం ఆ ముగ్గురి జీవితాల‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపింద‌నే అంశాలతో మిగిలిన క‌థ సాగుతుంది.  ప్ల‌స్ పాయింట్లుఆబాల‌గోపాలానికి ప‌రిచ‌య‌మైన పెద్ద‌నోట్ల ర‌ద్దును తెర‌పై చూపించారు. కాబ‌ట్టి సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగిపోతుంటుంది. కొత్త‌వారైనా న‌టీన‌టులు చ‌క్క‌గా న‌టించారు. హీరోయిన్ కొన్ని యాంగిల్స్ లో ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ర‌క్త‌దానం ఆవ‌శ్య‌క‌త‌, ఏటీఎం కార్డుల నెంబ‌ర్ల‌ను, పిన్నులను ఫోనుల్లో అప‌రిచితుల‌కు చెప్ప‌కూడ‌దు... వంటి అంశాలను ఇత‌రుల‌కు చెప్ప‌కూడ‌ద‌నే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం బావుంది. మైన‌స్ పాయింట్లుటీవీల్లో ఈ మ‌ధ్య మొత్తం ఊద‌ర‌గొట్టిన స‌మ‌స్య‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. డ‌బ్బున్న వారు వాటిని మార్చుకోవ‌డానికి ఎన్ని ర‌కాల తిప్ప‌లు ప‌డ్డారు?  బ్యాంకుల్లో మేనేజ‌ర్లు ఎలా వ్య‌వ‌హ‌రించారు? వ‌ంటి అంశాల గురించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. ఉగ్ర‌వాదుల గురించి ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారో అర్థం కాదు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆ షాట్‌లు ఎందుకు ప‌డ‌తాయో అంత తేలిగ్గా అర్థం కాదు. కెమెరాప‌నిత‌నం మెప్పించ‌దు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ క్లోజ‌ప్ షార్ట్ ల ఆవ‌శ్య‌క‌త ఏంటో అర్థం కాదు. సంగీతం విన‌సొంపుగా లేదు. క‌థ‌న‌మే నిదానంగా ఉంద‌నుకుంటున్న త‌రుణంలో పాట‌లు మ‌రింత చికాకు తెప్పిస్తాయి. విశ్లేష‌ణ‌సునీల్‌కుమార్‌రెడ్డికి సామాజిక కోణంలో సినిమా తీస్తార‌నే పేరు ఉంది. అంద‌రికీ తెలిసిన అంశాల‌నే తెర‌కెక్కించినా, అందులోనూ జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌లిగించే విష‌యాల‌ను ఎక్కువ‌గా చొప్పించి చెబుతార‌నే పేరు ఉంది. కానీ ఎటీఎం వ‌ర్కింగ్ సినిమా విష‌యంలో ఆయ‌న త‌న‌కున్న పేరును పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేరు. బ్ల‌డ్ బ్యాంక్ వ్య‌వ‌హారాలు, పిన్ సీక్రెట్‌లు వంటివాటి గురించి చెప్పినా మిగిలిన అంశాల గురించి తేలిగ్గా వ‌దిలేసిన‌ట్టు అనిపిస్తుంది. ఏటీఎం క్యూలో నిలుచుని, ఒక సారి న‌వ్వుకుని, మ‌రో ఏటీఎంకి ఒకే బండిమీద వెళ్లినంత మాత్రాన ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌పుడుతుందా? ఈ సినిమాలో ఉన్న‌ట్టే చూపించారు ద‌ర్శ‌కుడు. మిగిలిన స‌న్నివేశాలు కూడా బ‌లంగా అనిపించ‌లేదు. హ‌డావిడిగా తీసి విడుద‌ల చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా, ఇదే అంశాన్ని ఇంకాస్త లోతుగా స్పృశించి తెర‌కెక్కించిన‌ట్ట‌యితే సునీల్‌కుమార్‌రెడ్డి బ్రాండ్‌ని నిలిపే సినిమానే అయి ఉండేదన‌డంలో అనుమానం లేదు.బాట‌మ్ లైన్:  సాగ‌దీత‌గా `ఏటీఎం వ‌ర్కింగ్‌`రేటింగ్‌: 2/5నిర్మాణ సంస్థ:  డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్తారాగ‌ణం: ప‌వ‌న్‌, కారుణ్య‌, రాకేష్‌, మ‌హేంద్ర‌, నారాయ‌ణ‌, ఆషా, మ‌హేశ్‌, అంబ‌టి శీను, కిశోర్ దాస్, తిరుప‌తి దొరై, వీర‌బాబు, చిల్ల‌ర రాంబాబు, ఆంజ‌నేయులు త‌దిత‌రులుకూర్పు: శామ్యూల్ క‌ళ్యాణ్‌సంగీతం: ప్ర‌వీణ్ ఇమ్మ‌డిఛాయాగ్ర‌హ‌ణం: శివ‌రామ్ నిర్మాతలు: కిశోరి బ‌సిరెడ్డి, య‌క్క‌లి ర‌వీంద్ర బాబు ద‌ర్శ‌క‌త్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం దేశంలో ఎవ‌రూ ఊహించ‌నిది. న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు గురించి ప్ర‌క‌టించ‌గానే జ‌నాలంద‌రూ మిగిలిన అన్ని విష‌యాల‌నూ మ‌ర్చిపోయి ఏటీఎంల గురించి, చెల్లే నోట్ల గురించి, కొత్త‌గా బ్యాంకులు ఇచ్చిన రెండు వేల నోట్ల గురించి, న‌ల్లకుబేరుల గురించి, క‌మిష‌న్ల మార్పిడి గురించి, బంగారు కొనుగోలు గురించి, చిల్ల‌ర స‌మ‌స్య గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. స‌రిగా అదే స‌మ‌యంలో ఆ విష‌యాల‌ను గమ‌నించి సునీల్‌కుమార్ రెడ్డి ఆ ఇష్యూతో సినిమా చేసి `ఏటీఎం వ‌ర్కింగ్‌` అని సినిమా తీశారు. శ్రావ్య ఫిలిమ్స్ తెర‌కెక్కించిన టుమ్రీ సినిమాగా ఈ చిత్రానికి ప్ర‌చారం చేశారు. ఇంత‌కీ ఆ సినిమా ఎలా ఉంది? క‌రెంట్ ఎఫైర్‌తో వెండితెర‌మీద‌కు వచ్చి ఆక‌ట్టుకుందా?  లేదా?  అనేది తెలియాలంటే ఓ లుక్కేసేయండి మ‌రి... క‌థ‌:అనంత్ (ప‌వ‌న్‌), త్రిలోక్ ( రాకేష్‌), మ‌హేంద్ర (మ‌హేశ్‌) ముగ్గురూ స్నేహితులు. పెద్ద క‌ష్టాలేమీ ప‌డ‌కుండా చేతిలోకి డ‌బ్బులు రావాల‌నుకుని ఆలోచించే మ‌న‌స్త‌త్వం ఉన్న‌వారు. వారికి ప‌రిచ‌య‌మైన ఓ వ్య‌క్తి దొంగ‌నోట్ల వ్యాపారం గురించి చెబుతాడు. దాంతో ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ చోటా రౌడీని బ‌తిమాలుకుని రూ.2ల‌క్ష‌లు అప్పుచేసి దొంగ‌నోట్ల ముద్ర‌ణ‌కు ప్లాన్ చేస్తారు. క‌ష్ట‌ప‌డి మూడు కోట్ల రూపాయ‌ల‌ను ముద్రించి పార్టీ కోసం వెతుక్కుని డ‌బ్బు తీసుకుని వెళ్ల‌డానికి స‌ర్వం స‌న్నాహాలు చేసుకుంటారు. అనూహ్య‌మైన రీతిలో అదేరోజు నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది. అక్క‌డి నుంచి ఆ నోట్ల‌ను ఏం చేశారు? ఏటీఎం క్యూల‌లో వాళ్లు ఎలా నిలుచున్నారు?  చిల్ల‌ర దొర‌క్క వాళ్లు చేసిన ప‌నులేంటి? అస‌లు పెద్ద‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం ఆ ముగ్గురి జీవితాల‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపింద‌నే అంశాలతో మిగిలిన క‌థ సాగుతుంది.  ప్ల‌స్ పాయింట్లుఆబాల‌గోపాలానికి ప‌రిచ‌య‌మైన పెద్ద‌నోట్ల ర‌ద్దును తెర‌పై చూపించారు. కాబ‌ట్టి సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగిపోతుంటుంది. కొత్త‌వారైనా న‌టీన‌టులు చ‌క్క‌గా న‌టించారు. హీరోయిన్ కొన్ని యాంగిల్స్ లో ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ర‌క్త‌దానం ఆవ‌శ్య‌క‌త‌, ఏటీఎం కార్డుల నెంబ‌ర్ల‌ను, పిన్నులను ఫోనుల్లో అప‌రిచితుల‌కు చెప్ప‌కూడ‌దు... వంటి అంశాలను ఇత‌రుల‌కు చెప్ప‌కూడ‌ద‌నే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం బావుంది. మైన‌స్ పాయింట్లుటీవీల్లో ఈ మ‌ధ్య మొత్తం ఊద‌ర‌గొట్టిన స‌మ‌స్య‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. డ‌బ్బున్న వారు వాటిని మార్చుకోవ‌డానికి ఎన్ని ర‌కాల తిప్ప‌లు ప‌డ్డారు?  బ్యాంకుల్లో మేనేజ‌ర్లు ఎలా వ్య‌వ‌హ‌రించారు? వ‌ంటి అంశాల గురించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. ఉగ్ర‌వాదుల గురించి ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారో అర్థం కాదు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆ షాట్‌లు ఎందుకు ప‌డ‌తాయో అంత తేలిగ్గా అర్థం కాదు. కెమెరాప‌నిత‌నం మెప్పించ‌దు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ క్లోజ‌ప్ షార్ట్ ల ఆవ‌శ్య‌క‌త ఏంటో అర్థం కాదు. సంగీతం విన‌సొంపుగా లేదు. క‌థ‌న‌మే నిదానంగా ఉంద‌నుకుంటున్న త‌రుణంలో పాట‌లు మ‌రింత చికాకు తెప్పిస్తాయి. విశ్లేష‌ణ‌సునీల్‌కుమార్‌రెడ్డికి సామాజిక కోణంలో సినిమా తీస్తార‌నే పేరు ఉంది. అంద‌రికీ తెలిసిన అంశాల‌నే తెర‌కెక్కించినా, అందులోనూ జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌లిగించే విష‌యాల‌ను ఎక్కువ‌గా చొప్పించి చెబుతార‌నే పేరు ఉంది. కానీ ఎటీఎం వ‌ర్కింగ్ సినిమా విష‌యంలో ఆయ‌న త‌న‌కున్న పేరును పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేరు. బ్ల‌డ్ బ్యాంక్ వ్య‌వ‌హారాలు, పిన్ సీక్రెట్‌లు వంటివాటి గురించి చెప్పినా మిగిలిన అంశాల గురించి తేలిగ్గా వ‌దిలేసిన‌ట్టు అనిపిస్తుంది. ఏటీఎం క్యూలో నిలుచుని, ఒక సారి న‌వ్వుకుని, మ‌రో ఏటీఎంకి ఒకే బండిమీద వెళ్లినంత మాత్రాన ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌పుడుతుందా? ఈ సినిమాలో ఉన్న‌ట్టే చూపించారు ద‌ర్శ‌కుడు. మిగిలిన స‌న్నివేశాలు కూడా బ‌లంగా అనిపించ‌లేదు. హ‌డావిడిగా తీసి విడుద‌ల చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా, ఇదే అంశాన్ని ఇంకాస్త లోతుగా స్పృశించి తెర‌కెక్కించిన‌ట్ట‌యితే సునీల్‌కుమార్‌రెడ్డి బ్రాండ్‌ని నిలిపే సినిమానే అయి ఉండేదన‌డంలో అనుమానం లేదు.బాట‌మ్ లైన్:  సాగ‌దీత‌గా `ఏటీఎం వ‌ర్కింగ్‌`రేటింగ్‌: 2/5నిర్మాణ సంస్థ:  డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్తారాగ‌ణం: ప‌వ‌న్‌, కారుణ్య‌, రాకేష్‌, మ‌హేంద్ర‌, నారాయ‌ణ‌, ఆషా, మ‌హేశ్‌, అంబ‌టి శీను, కిశోర్ దాస్, తిరుప‌తి దొరై, వీర‌బాబు, చిల్ల‌ర రాంబాబు, ఆంజ‌నేయులు త‌దిత‌రులుకూర్పు: శామ్యూల్ క‌ళ్యాణ్‌సంగీతం: ప్ర‌వీణ్ ఇమ్మ‌డిఛాయాగ్ర‌హ‌ణం: శివ‌రామ్ నిర్మాతలు: కిశోరి బ‌సిరెడ్డి, య‌క్క‌లి ర‌వీంద్ర బాబు ద‌ర్శ‌క‌త్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం దేశంలో ఎవ‌రూ ఊహించ‌నిది. న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు గురించి ప్ర‌క‌టించ‌గానే జ‌నాలంద‌రూ మిగిలిన అన్ని విష‌యాల‌నూ మ‌ర్చిపోయి ఏటీఎంల గురించి, చెల్లే నోట్ల గురించి, కొత్త‌గా బ్యాంకులు ఇచ్చిన రెండు వేల నోట్ల గురించి, న‌ల్లకుబేరుల గురించి, క‌మిష‌న్ల మార్పిడి గురించి, బంగారు కొనుగోలు గురించి, చిల్ల‌ర స‌మ‌స్య గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. స‌రిగా అదే స‌మ‌యంలో ఆ విష‌యాల‌ను గమ‌నించి సునీల్‌కుమార్ రెడ్డి ఆ ఇష్యూతో సినిమా చేసి `ఏటీఎం వ‌ర్కింగ్‌` అని సినిమా తీశారు. శ్రావ్య ఫిలిమ్స్ తెర‌కెక్కించిన టుమ్రీ సినిమాగా ఈ చిత్రానికి ప్ర‌చారం చేశారు. ఇంత‌కీ ఆ సినిమా ఎలా ఉంది? క‌రెంట్ ఎఫైర్‌తో వెండితెర‌మీద‌కు వచ్చి ఆక‌ట్టుకుందా?  లేదా?  అనేది తెలియాలంటే ఓ లుక్కేసేయండి మ‌రి... క‌థ‌:అనంత్ (ప‌వ‌న్‌), త్రిలోక్ ( రాకేష్‌), మ‌హేంద్ర (మ‌హేశ్‌) ముగ్గురూ స్నేహితులు. పెద్ద క‌ష్టాలేమీ ప‌డ‌కుండా చేతిలోకి డ‌బ్బులు రావాల‌నుకుని ఆలోచించే మ‌న‌స్త‌త్వం ఉన్న‌వారు. వారికి ప‌రిచ‌య‌మైన ఓ వ్య‌క్తి దొంగ‌నోట్ల వ్యాపారం గురించి చెబుతాడు. దాంతో ముగ్గురు స్నేహితులు క‌లిసి ఓ చోటా రౌడీని బ‌తిమాలుకుని రూ.2ల‌క్ష‌లు అప్పుచేసి దొంగ‌నోట్ల ముద్ర‌ణ‌కు ప్లాన్ చేస్తారు. క‌ష్ట‌ప‌డి మూడు కోట్ల రూపాయ‌ల‌ను ముద్రించి పార్టీ కోసం వెతుక్కుని డ‌బ్బు తీసుకుని వెళ్ల‌డానికి స‌ర్వం స‌న్నాహాలు చేసుకుంటారు. అనూహ్య‌మైన రీతిలో అదేరోజు నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది. అక్క‌డి నుంచి ఆ నోట్ల‌ను ఏం చేశారు? ఏటీఎం క్యూల‌లో వాళ్లు ఎలా నిలుచున్నారు?  చిల్ల‌ర దొర‌క్క వాళ్లు చేసిన ప‌నులేంటి? అస‌లు పెద్ద‌నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం ఆ ముగ్గురి జీవితాల‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపింద‌నే అంశాలతో మిగిలిన క‌థ సాగుతుంది.  ప్ల‌స్ పాయింట్లుఆబాల‌గోపాలానికి ప‌రిచ‌య‌మైన పెద్ద‌నోట్ల ర‌ద్దును తెర‌పై చూపించారు. కాబ‌ట్టి సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగిపోతుంటుంది. కొత్త‌వారైనా న‌టీన‌టులు చ‌క్క‌గా న‌టించారు. హీరోయిన్ కొన్ని యాంగిల్స్ లో ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ర‌క్త‌దానం ఆవ‌శ్య‌క‌త‌, ఏటీఎం కార్డుల నెంబ‌ర్ల‌ను, పిన్నులను ఫోనుల్లో అప‌రిచితుల‌కు చెప్ప‌కూడ‌దు... వంటి అంశాలను ఇత‌రుల‌కు చెప్ప‌కూడ‌ద‌నే అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం బావుంది. మైన‌స్ పాయింట్లుటీవీల్లో ఈ మ‌ధ్య మొత్తం ఊద‌ర‌గొట్టిన స‌మ‌స్య‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. డ‌బ్బున్న వారు వాటిని మార్చుకోవ‌డానికి ఎన్ని ర‌కాల తిప్ప‌లు ప‌డ్డారు?  బ్యాంకుల్లో మేనేజ‌ర్లు ఎలా వ్య‌వ‌హ‌రించారు? వ‌ంటి అంశాల గురించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌నే తెర‌పై చూసిన‌ట్టు అనిపించింది. ఉగ్ర‌వాదుల గురించి ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారో అర్థం కాదు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆ షాట్‌లు ఎందుకు ప‌డ‌తాయో అంత తేలిగ్గా అర్థం కాదు. కెమెరాప‌నిత‌నం మెప్పించ‌దు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ క్లోజ‌ప్ షార్ట్ ల ఆవ‌శ్య‌క‌త ఏంటో అర్థం కాదు. సంగీతం విన‌సొంపుగా లేదు. క‌థ‌న‌మే నిదానంగా ఉంద‌నుకుంటున్న త‌రుణంలో పాట‌లు మ‌రింత చికాకు తెప్పిస్తాయి. విశ్లేష‌ణ‌సునీల్‌కుమార్‌రెడ్డికి సామాజిక కోణంలో సినిమా తీస్తార‌నే పేరు ఉంది. అంద‌రికీ తెలిసిన అంశాల‌నే తెర‌కెక్కించినా, అందులోనూ జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌లిగించే విష‌యాల‌ను ఎక్కువ‌గా చొప్పించి చెబుతార‌నే పేరు ఉంది. కానీ ఎటీఎం వ‌ర్కింగ్ సినిమా విష‌యంలో ఆయ‌న త‌న‌కున్న పేరును పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్టు లేరు. బ్ల‌డ్ బ్యాంక్ వ్య‌వ‌హారాలు, పిన్ సీక్రెట్‌లు వంటివాటి గురించి చెప్పినా మిగిలిన అంశాల గురించి తేలిగ్గా వ‌దిలేసిన‌ట్టు అనిపిస్తుంది. ఏటీఎం క్యూలో నిలుచుని, ఒక సారి న‌వ్వుకుని, మ‌రో ఏటీఎంకి ఒకే బండిమీద వెళ్లినంత మాత్రాన ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌పుడుతుందా? ఈ సినిమాలో ఉన్న‌ట్టే చూపించారు ద‌ర్శ‌కుడు. మిగిలిన స‌న్నివేశాలు కూడా బ‌లంగా అనిపించ‌లేదు. హ‌డావిడిగా తీసి విడుద‌ల చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా, ఇదే అంశాన్ని ఇంకాస్త లోతుగా స్పృశించి తెర‌కెక్కించిన‌ట్ట‌యితే సునీల్‌కుమార్‌రెడ్డి బ్రాండ్‌ని నిలిపే సినిమానే అయి ఉండేదన‌డంలో అనుమానం లేదు.బాట‌మ్ లైన్:  సాగ‌దీత‌గా `ఏటీఎం వ‌ర్కింగ్‌`రేటింగ్‌: 2/5
entertainment
12,151
02-10-2017 01:28:39
గీత తల్లిదండ్రుల ఆచూకీ చెబితే లక్ష: సుష్మా
న్యూఢిల్లీ: బధిర యువతి గీతను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన వారికి రూ.లక్ష నగదు అందజేస్తామని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటించారు. భారత్‌కు చెందిన గీతను పదిహేనేళ్ల క్రితం లాహోర్‌లో ఆగి ఉన్న సంఝౌతా ఎక్స్‌ప్రె్‌సలో పాకిస్తాన్‌ సైనికులు గుర్తించారు. ప్రభుత్వం చొరవతో 2015లో భారత్‌లో అడుగుపెట్టిన గీత ఇప్పటికీ తల్లిదండ్రులను చేరుకోలేకపోయింది.
nation
20,275
20-01-2017 18:08:43
యువీ గురించి సెహ్వాగ్ ఉద్వేగభరిత ట్వీట్
న్యూఢిల్లీ : కటక్‌ వన్డేలో శతకంన్నర కొట్టిన యువరాజ్ సింగ్ గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశాడు. ‘అతను క్యాన్సర్‌ను ఓడించాడు. ఇవాళ ఇంగ్లండ్ బౌలర్లను మాత్రమే ఓడించాడు. నిరాశ చెందకూడదని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల’ని వీరూ అన్నాడు. క్యాన్సర్‌తో యువీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటి ఫొటో కూడా సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. 2011 ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న యువరాజ్.. అదే ఏడాది క్యాన్సర్ బారినపడ్డాడు. ఆ వ్యాధితో పోరాడి జయించి.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. 35 ఏళ్ల యువీకి పలు అవకాశాలు వచ్చినా రాణించలేకపోయాడు. చివరకు రంజీలో తన ఫామ్‌ను, ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ద‌ష్ట్యా చివరిదన్నట్లు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఓ అవకాశం ఇచ్చారు. కటక్‌లో సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకున్నాడు.
sports
21,177
25-02-2017 01:40:49
తెల్ల గడ్డం తళతళ..
తళతళ మెరిసే తెల్ల గడ్డంతో ఉన్న ఈ వ్యక్తి టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా కోల్‌కతా వేదికగా జార్ఖండ్‌-కర్ణాటక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా మహీ ఇలా పూర్తిగా నెరిసిన గడ్డంతో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
sports
20,847
27-01-2017 21:15:14
అనుకున్నట్టే జరిగింది : కేదార్ జాదవ్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తన క్రికెట్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని కేదార్ జాదవ్ అన్నాడు. ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడంపై మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటి వన్డే తర్వాతనే దీన్ని ఊహించానని చెప్పాడు. ఇలానే తన ప్రదర్శన కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం తేలికేనని ఫస్ట్ వన్డే తర్వాత అనుకున్నట్టు తెలిపాడు. ఓడిపోతుందనుకున్న పరిస్థితిలో కేదార్ ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగి అద్భుతంగా 76 బంతుల్లోనే 120 పరుగులు చేసి గెలిపించాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తనకు పూర్తిగా ఆత్మ విశ్వాసం ఏర్పడిందని, ఏ ఆటగాడికైనా అలాంటి విశ్వాసం చాలా ముఖ్యమని చెప్పాడు. తానింకా కొన్ని సిరీస్‌ల వరకూ ఖచ్చితంగా టీంలో ఉండగలనని ఆత్మ విశ్వాసం వ్యక్తపరిచాడు కేదార్ జాదవ్.
sports
7,900
02-05-2017 11:02:49
బాహుబలి-2లో ఐదు త‌ప్పులున్నాయి: ద‌ర్శ‌కుడు విఘ్నేష్
గ‌త నెల 28న విడుద‌లైన బాహుబ‌లి-2 సినిమా సంచ‌ల‌నం సృష్టించే దిశ‌గా దూసుకుపోతోంది. అక్క‌డ‌క్క‌డ కొన్ని విమ‌ర్శలు ఎదుర‌వుతున్నా మెజారిటీ జ‌నాలు మాత్రం బాహుబ‌లి-2ను ఆద‌రిస్తున్నారు. సినీ ప్ర‌ముఖులు కూడా బాహుబ‌లి-2ను, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. కాగా, త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ బాహుబ‌లి-2లోని ఐదు త‌ప్పుల‌ను ప‌సిగ‌ట్టి వాటిని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. అవేంటో చూద్దాం.. 1) బాహుబ‌లి-2 సినిమాను కేవ‌లం 120 రూపాయ‌ల‌కే చూడాల్సి రావ‌డం మొద‌టి త‌ప్పు. అందుకు ప్ర‌తిగా నిర్మాత కోసం ప్ర‌తీ థియేట‌ర్ ద‌గ్గ‌రా ఓ క‌లెక్ష‌న్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలి. 2) సినిమా ర‌న్‌టైం చాలా త‌క్కువ‌గా ఉంది. కేవ‌లం మూడు గంట‌ల్లోనే సినిమా పూర్త‌యిపోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు.  3) ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇదే చివ‌రి సినిమా అవ‌డానికి వీల్లేదు. ఈ సిరీస్‌లో మ‌రో ప‌ది సినిమాల‌ను చూడాల‌నుకుంటున్నాం.  4) టూ మ‌చ్ డిటెయిలింగ్ అండ్ ప‌ర్‌ఫెక్ష‌న్‌. ఈ దెబ్బ‌తో తాము గొప్ప‌వాళ్ల‌మ‌ని విర్ర‌వీగే ద‌ర్శ‌కులంద‌రూ త‌మ హెడ్ వెయిట్‌ను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది.  5) బెంచ్‌మార్క్‌ను సెట్ చేయ‌డం చాలా క‌ష్టం. ఈ రికార్డుల‌ను అధిగ‌మించాలంటే చాలా ఏళ్లు ప‌డుతుంది. ఇవీ సోష‌ల్ మీడియాలో బాహుబ‌లి-2లోని త‌ప్పులంటూ విఘ్నేష్ శివ‌న్ రాసిన‌వి. నిజానికి త‌ప్పుల‌ను ఎత్తిచూపుతున్నాన‌ని చెప్పాడు గానీ, ప‌రోక్షంగా రాజ‌మౌళికి హ్యాట్సాఫ్ చెప్పాడు. బాహుబ‌లి-2 చూసి అంద‌రూ రాజ‌మౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్న నేప‌థ్యంలో విఘ్నేష్ ఇలా క్రియేటివ్‌గా త‌న ప్ర‌శంస‌ల‌ను అందించాడ‌న్న‌మాట‌.
entertainment
17,425
03-07-2017 18:30:05
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: ఇజ్రయెల్ పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధానిగా ఇప్పటికే ప్రత్యేక ఘనత అందుకున్న నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఇజ్రయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెన్ గురియన్ విమానాశ్రయంలో ఆయన మోదీకి ఎదురేగి స్వాగతం పలకనున్నారు. ఇప్పటివరకు కేవలం అమెరికా అధ్యక్షులు మాత్రమే ఈ ప్రత్యేక గౌరవం అందుకున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ సందర్శించిన డొనాల్డ్ ట్రంప్, పోప్‌లకు మాత్రమే ఈ తరహా రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. మరోవైపు మోదీ చారిత్రాత్మక పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇజ్రాయెల్ ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు సిద్ధం చేసింది. మూడు రోజుల పర్యటనలో నెతన్యాహు మోదీతోపాటే వెన్నంటి ఉంటారనీ... ఆయనకు తోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని ఇజ్రాయెల్ విదేశాంగ ప్రతినిధి యువాల్ రోటెమ్ వెల్లడించారు. ఇలాంటి సంప్రదాయం ఇంతకు ముందు ఏ దేశం ప్రధానితోనూ అనుసరించలేదని పేర్కొన్నారు. మోదీ పర్యటకు తాము ఇస్తున్న ప్రాధాన్యతలో ఇదికూడా ఓ భాగమన్నారు. సాధారణంగా నెతన్యాహు ఇజ్రయెల్ వచ్చిన దేశాధినేతలతో కేవలం ఒక్క సమావేశంలో మాత్రమే పాల్గొంటారు. అదికూడా డిన్నర్, లంచ్ సమయాల్లో మాత్రమే భేటీ అవుతారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మోదీకి ఆయన విశిష్ట ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.
nation
20,211
19-12-2017 01:11:51
నాయర్‌ అజేయ శతకం
పటిష్ఠ స్థితిలో కర్ణాటక కోల్‌కతా: కరుణ్‌ నాయర్‌ (148 బ్యాటింగ్‌) అజేయ శతకంతో రాణించడంతో.. విదర్భతో రంజీ సెమీస్‌లో కర్ణాటక పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 36/3తో రెండో రోజైన సోమవారం ఆటను కొనసాగించిన కర్ణాటక.. వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 294/8 స్కోరు చేసింది. నాయర్‌తోపాటు కెప్టెన్‌ వినయ్‌ కుమార్‌ (20) క్రీజులో ఉన్నారు. విదర్భ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 185కు కర్ణాటక 109 పరుగుల ఆధిక్యం సాధించింది. ముందు రోజు ఆటలో తడబడిన కర్ణాటక.. రెండోరోజు నింపాదిగా ఆడింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ నాయర్‌, చిదంబరం గౌతమ్‌ (73) విదర్భ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. అయితే అర్ధ శతకం సాధించిన గౌతమ్‌ను ఉమేష్‌ యాదవ్‌ (2/71) అవుట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. ఇక గుర్బానీ లోయర్‌ ఆర్డర్‌ పనిబట్టాడు. బిన్నీ (4), గోపాల్‌ (7), కృష్ణప్ప గౌతమ్‌ (1)ను అవుట్‌ చేసిన గుర్బానీ (5/90) సీజన్‌లో మరోసారి ఐదు వికెట్లు సాధించాడు. నాయర్‌ మాత్రం అజేయంగా రోజంతా బ్యాటింగ్‌ చేశాడు. గంభీర్‌, చండేలా సెంచరీల మోతగౌతమ్‌ గంభీర్‌ (127), కునాల్‌ చండేలా (113) శతకాలతో అదరగొట్టడంతో.. బెంగాల్‌తో రంజీ సెమీస్‌ మ్యాచ్‌లో ఢిల్లీ భారీస్కోరు దిశగా సాగు తోంది. బెంగాల్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఢిల్లీ.. రెండోరోజు ఆటముగిసేరికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు చండేలా, గంభీర్‌ శుభారంభాన్ని అందిం చారు. ఎంతో అలవోకగా బ్యాటింగ్‌ చేసిన గంభీర్‌ ఈ క్రమంలో 42వ ఫస్ట్‌ క్లాస్‌ శతకాన్ని సాధించా డు. అంతకుముందు ఓవర్‌ నైట్‌ స్కోరు 269/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బెంగాల్‌.. మరో 17 పరుగులు మాత్రమే జత చేసి మిగతా మూడు వికెట్లు చేజార్చుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 286 పరుగులకు పరిమితమైంది.
sports
9,688
09-01-2017 19:18:29
చిరు, బాలయ్య సినిమాలపై స్పందించిన వెంకటేష్
ఈసారి చిరు, బాలయ్య సినిమాలతో సంక్రాంతి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎవరి నోట విన్నా ఈ రెండు సినిమాల గురించి ప్రస్తావనే. ఇప్పటికే ఈ సినిమాల విడుదలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అభిమానులు కూడా సినిమా విడుదలకు ముందు చేసే కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంతో మంది అభిమానుల వలే తాను కూడా ఈ రెండు సినిమాల కోసం ఎదురు చూస్తున్నానన్నారు విక్టరీ వెంకటేష్. తన తోటి నటుల చిత్రాలపై స్పందించిన వెంకీ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి కానుకగా కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరు, బాలకృష్ణ సినిమాలపై సినీ నటుడు విక్టరీ వెంకటేష్ స్పందించారు. ‘ఖైదీ నెం 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాల హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి దిగిన పాత ఫోటోను పోస్ట్ చేసిన వెంకీ.. ‘‘ఇద్దరు గొప్ప నటులు, నా స్నేహితులు బాలకృష్ణ, చిరంజీవి సినిమాల కోసం ఎంతగానో వేచి చూస్తున్నా. ఈ రెండు సినిమాల వల్ల ఈసారి సంక్రాంతి ఘనంగా జరగబోతుంది. వీరిద్దరిని స్క్రీన్ మీద చూడడానికి తహతహలాడుతున్నా. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా రెండు సినిమాల చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అన్నారు. ఈనెల 11న చిరు ‘ఖైదీ నెం 150’, 12న బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల అవనున్న విషయం తెలిసిందే.
entertainment
11,185
11-05-2017 01:56:46
సబ్జెక్ట్‌ నిపుణులే తేలుస్తారు!
నీట్‌ ప్రశ్నపత్రంలో తప్పులపై సీబీఎస్ఈ.. పేపర్‌ లీక్‌ కేసులో కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడి అరెస్టున్యూఢిల్లీ/షేక్‌పురా, మే 10: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌) ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయంటూ అభ్యర్థులు, విద్యానిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్ఈ) ఈ అంశంపై బుధవారం స్పష్టత ఇచ్చింది. ప్రశ్నలకు సంబంధించి సందిగ్ధత ఉంటే సబ్జెక్ట్‌ నిపుణులు తేలుస్తారని తెలిపింది. ఈ నెల 7న జరిగిన నీట్‌లో తప్పు ప్రశ్నలు నాలుగు వరకు ఉన్నాయంటూ పలువురు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్టుగా ఉన్నాయని, మరొక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు సమాధానాలూ తప్పేనని నిపుణులు పేర్కొన్నారు. ప్రశ్నలపై అభ్యంతరాలు, సందేహాలను సబ్జెక్టు నిపుణులకు అప్పగిస్తామని సీబీఎ్‌సఈ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం ఆన్సర్‌ కీని అధికారికంగా వెబ్‌సైట్‌లో ఉంచుతామని, అప్పుడు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపొచ్చని వివరించారు. కాగా, నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో బిహార్‌లో షేక్‌పురా జిల్లాలోని కోచింగ్‌ సంస్థ నిర్వాహకుడు చందన్‌కుమార్‌ అలియాస్‌ లల్లూని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
nation
17,254
23-10-2017 16:04:14
జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో షింజో అబే ప్రభంజనం
న్యూ ఢిల్లీ: జపాన్ అధికార పీఠాన్ని షింజో అబే మరోసారి కైవసం చేసుకున్నారు. జపాన్‌లో తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ, మరోపార్టీతో కూడిన సంకీర్ణ కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో లిబర్ డెమోక్రాటిక్ పార్టీ కూటమీ 312 సీట్లు గెలుచుకుంది. దీంతో జపాన్‌లో షింజో అబే నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకానుంది. జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 465 స్థానాలు ఉన్నాయి. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అందులో 312 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ 310ని లిబర్ డెమోక్రాటిక్ పార్టీ దాటేసి.. రెండింట మూడొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. మరో నాలుగు స్థానాల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల్లో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ విజయం సాధించడంపై షింజో అబే హర్షం వ్యక్తం చేశారు. జపాన్ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తెలిపారు. ఉత్తర కొరియా అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూలంకశంగా చర్చిస్తామన్నారు. జపాన్ ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్న షింజో అబేకు పలు దేశాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ దేశంలో షింజో అబే విక్టరీ సాధించడంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. జపాన్ స్టాక్ మార్కెట్లో నిక్కీ 225 పాయింట్లు పెరిగింది. కొనుగోలు దారుల ఉత్సాహం కారణంగా నిక్కీ 21,670 పాయింట్లకు పెరిగిందని ఆర్థిక నిపుణులు తెలిపారు.
nation
6,092
25-11-2017 21:23:21
'భాగ్యనగరం' డ్రగ్స్‌పై సినిమా
కన్నడలో హిట్‌గా నిలిచిన 'రాజధాని' చిత్రాన్ని తెలుగులో సంతోష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సంతోష్‌ కుమార్‌ 'భాగ్యనగరం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కన్నడ బిగ్‌స్టార్‌ అయిన యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. షీలా హీరోయిన్‌గా నటించింది. వెర్సటైల్‌ యాక్టర్‌ ప్రకాష్‌ రాజ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రని పోషించారు. ముమైత్‌ఖాన్‌ మరో ముఖ్య పాత్రలో నటించింది. నిర్మాత సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ - ''డ్రగ్స్‌ అండ్‌ డ్రింకింగ్ వలన పెడదారి పట్టిన నలుగురు యువకుల కథే 'భాగ్యనగరం'. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న యువతీ, యువకులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మంచి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రకాష్‌రాజ్‌, హీరో యష్‌ల మధ్య సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే కథ, కథనం చాలా కొత్తగా వుంటుంది. దర్శకుడు కె.వి.రాజు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. అర్జున్‌ జన్య మ్యూజిక్‌ సినిమాకి ఒన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్‌గా నిలిచింది. సినిమా చూశాక ఒక గొప్ప చిత్రం చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. భాగ్యనగరంలాంటి ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. అకున్‌ సబర్వాల్‌గారు ఈ సినిమా ట్రైలర్‌ చూసి చాలా అద్భుతంగా వుంది. ఇలాంటి చిత్రాలు ఎన్నో రావాలి అని అప్రిషియేట్‌ చేశారు. త్వరలో ఆయన ట్రైలర్‌ లాంచ్‌ చేయనున్నారు'' అన్నారు.
entertainment
1,218
07-06-2017 01:01:29
ఎయిటెల్‌, టెలినార్‌ విలీనానికి ఆమోదం
న్యూఢిల్లీ: టెలికాం రంగంలోని టెలినార్‌ ఇండియాను విలీనం చేసుకునేందుకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపిందని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ రెండు కంపెనీలు విలీనం కోసం ఈ నెల ఫిబ్రవరిలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర, గుజరాత, యుపి (ఈస్ట్‌), పశ్చిమబెంగాల్‌ (వెస్ట్‌), అస్సాం సర్కిళ్ళు టెలినార్‌ ఇండియా చేతిలో ఉన్నాయి.
business
14,796
24-06-2017 09:35:25
100 మందిని మింగిన కొండచరియలు
బీజింగ్: చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఫ్రావిన్స్‌లో భారీ స్థాయిలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో 100 మంది వరకూ మరణించారని తెలుస్తోంది. జన్మో గ్రామంలో ఓ పర్వతంలోని చాలా భాగం కూలిపోవడంతో సమీపంలోని 40 గృహాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే మయోక్సియన్ కౌంటీలో కూడా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఇటీవలి కాలంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడం సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
nation
15,343
16-08-2017 02:54:17
గ్వామ్‌లో మోగిన ప్రమాద ఘంటికలు!
భయంతో పోలీసులకు ఫోన్లు చేసిన ద్వీపవాసులుఅవి పొరబాటు హెచ్చరికలేనని తర్వాత వెల్లడిఇప్పుడే దాడులు చేయబోనన్న కిమ్‌హగట్నా (గ్వామ్‌), ఆగస్టు 15: అది.. అసలే ఉత్తరకొరియా అణుక్షిపణులకు అందేంత దూరంలో ఉన్న గ్వామ్‌ ద్వీపం. అమెరికా నౌకా, వైమానిక దళ స్థావరాలున్న ఆ ద్వీపం మీద ‘ఇహనో ఇప్పుడో ఆ ద్వీపం మీద మేం బాంబులు వేసేస్తాం’ అంటూ ఉత్తరకొరియా పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇలాంటి తరుణంలో.. సోమవారం అర్ధరాత్రి దాటాక 12.25 సమయంలో.. రెండు రేడియో స్టేషన్లు ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశాయి. అంతే! గ్వామ్‌వాసుల గుండెలు అదిరిపోయాయి. దీంతో.. వారు పోలీసులకు ఫోన్‌ చేసి రక్షించమని కోరారు. కానీ.. ఆ హెచ్చరికలు పొరబాటున వచ్చినవేనని అధికార వర్గాలు పేర్కొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దీవి సమీపంలో క్షిపణిదాడులకు సంబంధించి ఉత్తరకొరియా సైనిక కమాండర్లు ఆ దేశాధిపతి కిమ్‌జాంగ్‌కు నివేదించినట్టు వస్తున్న వార్తలు.. వారిని నిద్ర పోనివ్వడ లేదు. ఇప్పుడే దాడులు చేయబోమని కిమ్‌ చెప్పినట్టు వార్తలు వస్తున్నా వారి భయాందోళనలు తగ్గట్లేదు.
nation
10,341
31-05-2017 14:22:54
నేను ఎప్పుడూ అలా అనలేదు: నిత్యా మీనన్‌
తెలుగులో అభినయ ప్రాధాన్యమున్న పాత్రలతో ఆకట్టుకున్నారు మలయాళ కుట్టి నిత్యామీనన్‌. ఉన్నట్టుండి ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దానికి కారణం ఆమె ఆలోచనలు దర్శకత్వంపైపు మలుపు తిరగడమే అనే వార్తలు వినిపించాయి. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నిత్యామీనన్‌. ‘నాకు దర్శకత్వం మీద ఇష్టమున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. అది పూర్తిగా అసత్య ప్రచారం. నేను ఇప్పట్లో దర్శకత్వంవైపు వెళ్లాలనుకోవడం లేద’ని చెప్పారు నిత్యామీనన్‌. డైరెక్టర్‌గా మారాలనే ఆలోచనతోనే మణిరత్నం సినిమా అవకాశాన్ని కూడా నిత్య వదులుకున్నారని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
entertainment
7,796
26-01-2017 11:45:13
సొంత రాష్ట్రాన్ని వదిలేసి.. పక్క రాష్ట్రంపై ప్రేమ ఎందుకో?: వర్మ
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబుపై వివాదాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన డబ్బింగ్ మూవీలను ప్రమోట్ చేసుకోవడానికి తమిళ వికృత క్రీడ జల్లికట్టుకు మద్దతు తెలిపిన మహేశ్ బాబు.. తనను స్టార్‌గా నిలబెట్టిన ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం ఎందుకు మద్దతు తెలపట్లేదని ప్రశ్నించాడు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా.. పక్క రాష్ట్రాల వారు చేసే ఆందోళనకు మద్దతు తెలుపుతున్న మహేశ్ దేశ ద్రోహి అంటూ సంచలన వ్యాఖ్య చేశాడు. ఏపీ సమస్యలను పట్టించుకోకుండా పక్క రాష్ట్రం సమస్యపై వారి ఆందోళనకు మహేశ్ మద్దతు తెలపడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలపాల్సిందిగా మహేశ్‌కు చెప్పని అతడి అభిమానులు కూడా మహేశ్‌లాగానే దేశద్రోహులని వ్యాఖ్యానించాడు. మహేశ్ రాజకీయాల్లో లేనప్పుడు ఏపీ సమస్యలపై పవన్ పోరాడుతున్నా ఏం పట్టనట్టుండి.. తమిళ జల్లికట్టుపై తన ఆవేదనను వ్యక్త పరచడం దేనికి సంకేతం అని ప్రశ్నలు సంధించాడు. కాగా, మహేశ్‌పై విమర్శనాస్త్రాలు సంధించిన వర్మ.. పవన్‌పై మాత్రం పొగడ్తల వర్షం కురిపించాడు. ఆర్నాల్డ్, సిల్వెస్టర్ స్టాలోన్, బ్రూస్‌లీ వంటి వారు సాధారణ సమస్యలపైనే పోరాడితే.. పవన్ మాత్రం ప్రభుత్వాలపైనే పోరాడుతున్నాడని ప్రశంసించాడు. హీరోలంతా సినిమాల్లో రాజకీయ నాయకులు, పోలీసులపై పోరాడుతుంటే.. పవన్ మాత్రం నిజ జీవితంలో రాజకీయ నాయకులతో పోరాడుతున్నాడని ట్వీట్ చేశాడు.
entertainment
16,839
21-04-2017 00:31:12
ఉమాభారతి రాజీనామా చేయాలి: ఖర్గే
బెంగళూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సుప్రీం ఆదేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి ఉమాభారతి వెంటనే రాజీనామా చేయాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. గురువారం కలబురిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా కోరే బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. బాబ్రీమసీదు వివాదంలో ఉమాభారతితో పాటు ఇతరులపై చర్యలు తీసుకుంటామన్న ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అందరికీ ఒకే పద్ధతి ఉండాలన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణలో ఉమాభారతి, ఎల్‌కే ఆడ్వాణీ, మురళీమనోహర్‌ జోషి తదితరుల పేర్లు ఉన్నందున ప్రధాని వెంటనే స్పందించాలని కోరారు.
nation
6,218
07-12-2017 19:09:22
ఈ సినిమాకి వారు ముగ్గురు.. మూడు పిల్లర్స్: నిర్మాత డా.ర‌వికిర‌ణ్‌
సప్తగిరి కథానాయకుడిగా న‌టించిన చిత్రం `స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి`. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్‌పై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ప్రీమియ‌ర్ షో అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో... చిత్ర నిర్మాత డా.ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ - ``స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి చిత్రానికి హిట్ టాక్ రావడం ఎంతో హ్యాపీగా ఉంది. సాధార‌ణంగా ఏదో సినిమా తీయాల‌ని కాకుండా ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీయాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాం. నా ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ కంటే ఈ సినిమాకు అన్ని వ్య‌వ‌హ‌రాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాను. ఇలాంటి స‌బ్జెక్ట్‌ను చెప్పాల‌నుకుంటే ఇమేజ్ ఉన్న హీరో కంటే, ఇమేజ్ లేని నటుడైతేనే బావుంటుంద‌ని స‌ప్త‌గిరితో సినిమా చేశాను. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌గారు మంచి డైలాగ్స్ రాశారు. మాతృకలోని ఫ్లెవ‌ర్‌కి అన్యాయం చేయకుండా తెలుగులోనికి మార్చడానికి చాలా హార్డ్ వ‌ర్క్ చేశాం. శివ‌ప్ర‌సాద్‌గారు, సాయికుమార్‌గారు, స‌ప్త‌గిరిగారు.. మూడు పిల్ల‌ర్స్‌లా ఈ సినిమాకు వ‌ర్క్ చేశారు. ఓ మంచి సినిమాను నిర్మించినందుకు నిర్మాత‌గా సంతోషంగా ఉన్నాను. భ‌విష్య‌త్‌లో కూడా ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రాల‌నే నిర్మిస్తాను.  ఇక సినిమాలో న‌టించ‌డం అనేది యాదృచ్చికంగానే జ‌రిగింది. మ‌రి భ‌విష్య‌త్‌లో న‌టిస్తానా? లేదా? అనేది చెప్ప‌లేను. అంతా! ఆ భ‌గ‌వంతుడి చేతిలో ఉంది. చిన్న‌ప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ కావ‌డంతో ఆ అనుభ‌వం ఇక్క‌డ ప‌నికొచ్చింది. సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ, రీరికార్డింగ్ పెద్ద ప్ల‌స్ అయ్యాయి. స‌ప్త‌గిరితో మూడో సినిమా చేస్తాన‌ని ఇప్పుడే చెప్ప‌లేను. క‌థ డిమాండ్ చేస్తే త‌న‌తో చేస్తాను. లేదా మరో హీరోతో అయినా చేయ‌డానికి నేను సిద్ధ‌మే. ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్‌, స‌ప్త‌గిరి స‌హా అంద‌రికీ స‌మిష్టి కృషే ఇది. నాది ఆదిలాబాద్ జిల్లా. నేను పుట్టి పెరిగిన ఊరు కావ‌డంతో పాటు.. అక్క‌డి రైతుల ఆత్మ‌హ‌త్య‌లు న‌న్ను క‌లిచివేసింది. కాబ‌ట్టి వారి స‌మ‌స్య‌ల‌ను ఈ సినిమా ద్వారా తెర‌పై చూపాల‌నుకున్నాను. `ఫిదా` త‌ర్వాత తెలంగాణ‌లో అంద‌మైన లోకేష‌న్ ఉన్న ప‌ల్లెటూరిని మా సినిమాలోనే చూపించాం`` అన్నారు.
entertainment
8,625
12-09-2017 17:58:47
చిరు, బాలయ్య, వెంకీ, మహేశ్, రవితేజతో సినిమాలకు ప్లాన్
ఇప్పటికీ స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు విజయాలు మాత్రం రావడం లేదు. అయితే కొందరు హీరోలతో సినిమాలు చేయాలని ఆయన ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడట. సినిమాను జెట్ స్పీడుతో పూర్తి చేయడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ తరువాతే ఎవరైనా. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా తాను అనుకున్న సినిమాను అనుకున్న సమయం కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో పూరి మిగతా వాళ్ల కంటే కాస్త ముందుంటానే చెప్పాలి. అందుకే మిగతా స్టార్ డైరెక్టర్లతో పోలిస్తే ఆయన సినిమా కౌంట్ ఎక్కువగా ఉంటుంది. బాలకృష్ణతో 'పైసా వసూల్' తెరకెక్కించి హిట్ కొట్టలేకపోయిన పూరి జగన్నాథ్, వచ్చే ఏడాది ఆయనతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు. అయితే ఈలోపే తన కుమారుడు ఆకాశ్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు పూరి. అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.  ఇదిలా ఉంటే బాలయ్యతో పాటు పూరి జగన్నాథ్ సినిమాలు చేయాలనుకుంటున్న హీరోల లిస్టు చాలా పెద్దగానే ఉందని సినీ జనం చర్చించుకుంటున్నారు. ఇషాన్, బాలకృష్ణ, ఆకాశ్, రవితేజ, చిరంజీవి, మహేశ్, వెంకటేశ్ ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు హీరోల పేర్లు పూరి లిస్ట్‌లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మహేశ్ సినిమాకు 'జనగణమన' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసిన పూరి ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక మాస్ హీరో రవితేజ కోసం మరో మాస్ మసాలా స్టోరీ సిద్ధం చేశానని పూరి క్లారిటీ ఇచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి, వెంకటేశ్‌తోనూ సినిమాలు సెట్ అవుతాయనే నమ్మకంతో ఉన్నాడట పూరి జగన్నాథ్. ఇక రోగ్ హీరో ఇషాన్‌తో పూరి మరో సినిమా చేయాల్సి ఉందట. రోగ్ సినిమా టైమ్‌లోనే కుదిరిన 2 సినిమాల ఒప్పందం ప్రకారం టైమ్ చూసుకుని పూరి జగన్నాథ్ ఈ సినిమా చేస్తాడని కొందరు చర్చించుకుంటున్నారు. మరి సినిమాలు తప్ప సక్సెస్‌లు సాధించలేకపోతున్న పూరితో వీరిలో ఎంతమంది సినిమాలు చేస్తారన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
entertainment
7,897
11-11-2017 15:24:05
`బాహుబ‌లి-2` రికార్డు బ్రేక్‌!
ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి: ది కంక్లూజ‌న్‌` సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రికార్డుల మోత మోగించిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు కూడా `బాహుబ‌లి-2` ముందు నిల‌వ‌లేక‌పోయాయి. ఆ సినిమా ట్రైల‌ర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు న‌మోదు చేసింది. అత్యంత మంది లైక్ చేసిన ట్రైల‌ర్‌గా నిలిచింది.  దాదాపు ఆరున్న‌ర ల‌క్ష‌ల లైకుల‌తో ఆగ్ర‌స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన `టైగ‌ర్ జిందా హై` బ్రేక్ చేసింది. ఏడు ల‌క్ష‌ల‌కు పైగా లైకులు సాధించిన తొలి భార‌తీయ సినిమాగా నిలిచింది. అంతేకాదు వ్యూస్ విష‌యంలో కూడా రికార్డును ద‌క్కించుకునేందుకు ప‌రుగులు పెడుతోంది. ఈ ట్రైల‌ర్‌కు ఇప్ప‌టికే మూడు కోట్ల వ్యూస్ రావ‌డం గ‌మ‌నార్హం. ఇదే జోరు కొన‌సాగిస్తే వ్యూస్ విష‌యంలో కూడా `బాహుబ‌లి-2`ను త్వ‌ర‌లోనే దాటేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.
entertainment
12,981
12-03-2017 01:51:51
అతిపెద్ద విజయం!
నరేంద్ర మోదీ నేతృత్వంలో కమలదళం చరిత్ర తిరగరాసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో విజయబావుటా ఎగురవేసింది. 320కిపైగా సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 1951-52లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత ఓ పార్టీ ఇన్ని స్థానాలను గెలుచుకోవడం ఇదే ప్రథమం. అయితే అప్పుడు ఉత్తరప్రదేశ్‌ అవిభక్తంగా ఉండగా మొత్తం 430 అసెంబ్లీ స్థానాలుండేవి. వాటిలో కాంగ్రెస్‌ పార్టీ 388 స్థానాలను చేజిక్కించుకుంది. 1977లో దేశవ్యాప్తంగా వీచిన ప్రభంజనంతో జనతాపార్టీ యూపీలో 352 స్థానాలను గెలుచుకుంది. అయితే అప్పుడు కూడా మొత్తం స్థానాల సంఖ్య 430 కావడం విశేషం. మూడున్నర దశాబ్దాలుగా ఏ పార్టీకి కూడా ఇంత భారీ విజయాన్ని యూపీ ఓటర్లు కట్టబెట్టలేదు. 1991లో అయోధ్య ప్రభంజనంలో కూడా యూపీ ఓటర్లు బిజెపిని 221 స్థానాల్లో మాత్రమే గెలిపించారు. ఆ త రువాత 2007లో బీఎస్పీకి బొటాబొటిగా 207 స్థానాలు మాత్రమే లభించాయి. 2012లో సమాజ్‌వాదీ పార్టీకి 224 స్థానాలు లభించాయి. భిన్న సామాజిక వర్గాల సమీకరణాలు, మతాల సమీకరణాల్లో భారీ మెజారిటీ సాధించడం అసాధ్యమని 30 ఏళ్ల ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.
nation
4,305
03-02-2017 01:07:50
గోడలూ – మేడలూ
గొప్పవాళ్ళు తలుచుకుంటే గొడవలకు కొదవేముంటుంది? గోడలు కూడా గొడవలకు కేంద్ర బిందువులవుతాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమా అని ‘గోడ’ ఇప్పుడొక ప్రపంచ వార్త! గొడవలతో అధ్యక్ష ఎన్నికల బరిలో దునికిన ఆయన గోడలతో పాలనను ప్రారంభిచాడు. అమెరికా – మెక్సికో దేశాల సరిహద్దులో గోడను నిర్మించేందుకు ఉద్దేశించిన ఫైలుపై సంతకం చేసేశారు! శుభం!!గోడలు వేదికగా ఇకనుండి గొడవలే గొడవలు! ఆ గోడ కట్టడానికయ్యే ఖర్చును అణా పైసలతో సహా గోళ్ళు ఊడగొట్టి మరీ వసూలు చేస్తానంటున్నాడు డొనాల్డ్‌ ట్రంప్‌! ఆ పప్పులేవీ మా దగ్గర ఉడకవు పొమ్మంటున్నారు మెక్సికో అధ్యక్షుడు ఎన్రికో నీటో! ఈ ఉడుక్కోవడాలు ఇక్కడికే పరిమితమవుతాయా లేక రెండు దేశాలను రేపటి రోజున అట్టుడికిస్తాయా అన్నది ఇప్పటికిప్పుడు తేలే సమస్య కాదు. దేశదేశాల మధ్య గోడల్ని చెరిపివేసి ప్రపంచాన్ని గ్లోబల్‌ విలేజీగా మార్చే పనిని భుజానికెత్తుకున్న వాళ్ళకు తమచుట్టూ గోడలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నది ఇప్పటి ప్రశ్న! తమ దాకా వస్తే తప్ప ఎవరికైనా తత్వం బోధపడదన్న మాట! తాము మేడలు కట్టుకోవడానికి పొరుగువాళ్ళ గోడల్ని కూల్చాలి. కానీ తాము మాత్రం గోడల రక్షణలో సురక్షితంగా జీవించాలి. ఒకవేళ తమకు జీవించడం దుర్భరమైనట్లైతే ఇతరులెవరూ ప్రశాంతంగా బతకడానికి వీల్లేదు. గోడ(లు) ఇక్కడొక సాకు మాత్రమే! గొడవలు మాత్రం అనివార్యం! గోడల్ని నిర్మించి కొత్తగా మరికొన్ని గొడవల్ని సృష్టించడం –- తద్వారా తన భవిష్యత్‌ రాజకీయ జీవితానికి పటిష్టమైన కోటగోడను నిర్మించుకోవడమే ట్రంప్‌ మహాశయుడి ప్రథమ ప్రాధాన్యంగా కనిపిస్తున్నది. అమెరికన్ల కోసమే అమెరికా అనే నినాదం ఆ విధంగానే పుట్టుకు వచ్చింది. అధ్యక్షుల వారి అంతరంగాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తప్ప అందులోని అంతరార్థం అట్టే మనకు బోధపడదు. అందులో భాగంగానే ఇప్పుడు మరిన్ని కొత్త చట్టాలు, మరింత పదును తేలి ప్రపంచం పైకి దూసుకురాబోతున్నాయి. తాము చేసిందే చట్టం! తాము చెప్పిందే వేదం! ఇదే అమెరికన్ల రీతి! అమెరికా నీతి! అసలు ప్రపంచమే అమెరికన్ల కోసం! అందుకే అమెరికన్ల ‘గోడలు’ వర్థిల్లాలి! ఆ గోడల పునాదులపై నిర్మించుకున్న మేడలూ వర్థిల్లాలి! అమెరికన్ల అవసరాలు వర్థిల్లాలి! వారి ఆలోచనా విధానాలూ వర్థిల్లాలి! ట్రంప్‌ గారి విజయఢంకా, రెండోసారీ మోగితీరాలి! ప్రపంచం ఎప్పటిలాగే అమెరికా పాలకుల పడగనీడనే బిక్కుబిక్కుమంటూ తమ బతుకులు వెళ్లమార్చాలి.- గుండెబోయిన శ్రీనివాస్‌, హైదరాబాద్‌
editorial
21,394
03-06-2017 15:52:46
ఎమోషన్స్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళుతున్న ఇండియా-పాక్ మ్యాచ్!
ఆంధ్రజ్యోతి: సరిహద్దుల్లో టెన్షన్.. క్రికెట్ ఫీల్డ్‌లో రణరంగం.. కనీవినీ ఎరుగని ఉత్కంఠ. ఇండియా-పాక్ తలపడితే ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కంటే కూడా ఎక్కువ మంది చూస్తారు. వన్‌డే క్రికెట్‌కు క్రేజ్ పోయిందనుకుంటున్న టైమ్‌లో బ్లాక్ బస్టర్ క్లాష్. ఛాంపియన్స్ ట్రోఫీలో బ్లాక్ బస్టర్ ఫైట్ జరగబోతోంది. ఇండియా-పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉండగా ఛాంపియన్ ట్రోఫీలో రంజైన మ్యాచ్ జరగబోతోంది. ఇండియా-పాక్ తలపడితే సాధారణంగా ఎమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి. కొన్నేళ్లుగా ఐసీసీ వేదికలపైనే తలపడుతున్నందున ఉత్కంఠ మరీ ఎక్కువైంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎమోషన్స్ ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి.
sports
9,787
10-10-2017 15:29:28
రకుల్‌కి ఈ టైప్‌లో బర్త్‌డే విశెష్ ఎవరూ చెప్పి ఉండరేమో?
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, తనతో 'విన్నర్' చిత్రంలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌కి చాలా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'లకుల్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ తెలిపిన సాయిధరమ్, ఈ విశెష్‌తో పాటు ఓ ఫొటోని కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫొటో వైరల్ అవుతోంది. పుట్టిన రోజు అంటే ఎవరైనా కేక్ కట్ చేసే ఫొటోనో, లేదంటే నవ్వుతూ హాయిగా ఎంజాయ్ చేసే ఫొటోనో పోస్ట్ చేస్తారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ నోరు తెరచి నిద్రిస్తుంటే, ప్రక్కన 'చూడండి ఎలా నిద్రపోతుందో' అన్నట్లుగా తన ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఫొటోని పోస్ట్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు సాయిధరమ్. మరి ఈ ఫొటోపై రకుల్ ప్రీత్ ఎలా స్పందిస్తుందో తెలియదు కానీ, బర్త్‌డే రోజు సాయి నుండి ఇటువంటి ట్వీట్‌ను మాత్రం రకుల్ ఊహించి ఉండదు. రకుల్ పుట్టినరోజని తెలిసి అందరూ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కానీ, సాయిధరమ్ టైప్‌లో మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదు. రవితేజతో రకుల్ ‘నువ్వే నువ్వే’ అంటూ అదరగొట్టింది రకుల్ ప్రీత్ సింగ్ స్వస్థలం ఎక్కడో తెలుసా?
entertainment
10,920
30-11-2017 22:43:00
నలుగురు రాణులు
హిందీలో విజయవంతమైన ‘క్వీన్‌’ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రీమేక్‌ అవుతోంది. ప్రస్తుతం పారిస్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నాలుగు భాషల్లోనూ ‘క్వీన్‌’ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న తమన్నా, కాజల్‌, మంజిమా మోహన్‌, పారుల్‌ యాదవ్‌పారిస్‌లో ఇలా ఫొటోకు ఫోజ్‌ ఇచ్చారు.
entertainment
2,694
08-10-2017 00:56:45
గాజుపై పెరుగుతున్న మోజు
వ్యాపార విస్తరణలో మోడర్న్‌ సేఫ్టీ గ్లాస్‌..రూ.10 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపుబహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు, ఖరీదైన నివాస గృహాలు, కార్యాలయ భవనాలు... అన్నీ అద్దాల మేడలే. నిర్మాణంలో, డిజైనింగ్‌లో తమ కౌశల్యాన్ని ఆవిష్కరించేందుకు ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్‌ డెకొరేటర్స్‌ అత్యంత ఇష్టంగా ఎంచుకునేది గ్లాస్‌. గ్రీన్‌ బిల్డింగ్‌ల్లోనూ గ్లాస్‌కే ప్రాధాన్యం. గత కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో గ్లాస్‌ వినియోగం భారీ ఎత్తున పెరిగింది. నిర్మాణ రంగంలో ధృడంగా ఉండే సేఫ్టీ గ్లాస్‌ను విరివిగా ఉపయోగిస్తారు. ఈ విభాగంలో మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తోంది.  హైదరాబాద్‌కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాసుదేవ ప్రభు, సాదిక్‌ కపాడియా ప్రమోట్‌ చేసిన చిన్న తరహా పరిశ్రమ మోడర్న్‌ సేఫ్టీ గ్లాస్‌ సంస్థ హెర్క్యులస్‌ బ్రాండ్‌తో టఫెండ్‌ గ్లాస్‌, ఇన్సులేటెడ్‌ గ్లాస్‌, స్విచ్చబుల్‌ గ్లాస్‌ను తయారు చేసి మార్కెట్‌ చేస్తోంది. నగర శివార్లలో ఈ సంస్థకు ఏటా లక్ష టన్నుల గ్లాస్‌ ప్రాసెసింగ్‌ సామర్ధ్యం ఉన్న ప్లాంటు ఉంది. ఈ ప్లాంటు సామర్ధ్యాన్ని 10 కోట్ల రూపాయలతో రెండు లక్షల టన్నులకు విస్తరిస్తున్నట్టు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాదిక్‌ కపాడియా, డైరెక్టర్‌ ప్రభు చెప్పారు. రోబోటిక్‌ టెక్నాలజీతో పూర్తి ఆటోమేషన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలిపారు. కొత్త ప్లాంట్‌ 2020 నాటికి పూర్తవుతుంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలనుంచి ముడి గ్లాస్‌ను కొనుగోలు చేసి తమ ప్లాంట్‌లో ప్రాసెస్‌ చేసి భారీ నిర్మాణాల్లో వినియోగానికి వీలుగా సేఫ్టీ గ్లాస్‌గా మలుస్తున్నట్టు వారు చెప్పారు. ఫ్రాన్స్‌కు చెందిన సెయింట్‌ గోబైన్‌ నుంచి ముడి గ్లాస్‌ను కొనుగోలు చేస్తోంది. ఆస్ట్రేలియా సంస్థతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో భారీ నిర్మాణాల్లో సేఫ్టీ గ్లాస్‌ వినియోగం భారీగా పెరిగిందని ప్రభు చెప్పారు. అయితే నాణ్యతకు వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్మాణంలో గ్లాస్‌ వినియోగం పెరుగుతోందని ఆయన తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లోకి విస్తరణ... ఇప్పటి వరకు హైదరాబాద్‌తో సహా రెండు తెలుగురాష్ట్రాల మార్కెట్లకే పరిమితమైన తమ హెర్క్యులస్‌ బ్రాండ్‌ను కర్నాటక, తమిళనాడు, ఒడిషాలకు కూడా విస్తరిస్తున్నట్టు సాదిక్‌, ప్రభు తెలిపారు. ఇప్పటి వరకు సొంత మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా విక్రయాలు జరిపినప్పటకీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డీలర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోనే నిర్మాణాల్లో, ఇంటీరియర్‌ డిజైన్‌లో వినియోగించే వివిధ రకాల సేఫ్టీ గ్లాస్‌కు 150 కోట్ల రూపాయల విలువైన మార్కెట్‌ ఉంది. నిర్మాణ రంగం ఊపందుకుంటున్న నేపథ్యంలో డిమాండ్‌ మరింత రాజుకునే అవకాశం ఉంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని భవనాలను పూర్తిగా గ్రీన్‌ టెక్నాలజీతో డిజైన్‌ చేస్తున్నందున గ్లాస్‌కు డిమాండ్‌ మరింత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ‘2021 నాటికి కేవలం అమరావతిలోనే టఫ్‌ఎండ్‌, ఇన్సులేటెడ్‌ గ్లాస్‌కు రూ.150 కోట్ల విలువైన డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నాం’ అని సాదిక్‌ కపాడియా చెప్పారు. టెక్నాలజీనే దన్ను ఈ తరహా గ్లాస్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో టెక్నాలజీతో పాటు ఉత్పత్తుల నాణ్యత, కస్టమర్‌ సేవలు అత్యంత కీలకం. సెయింట్‌ గోబియన్‌ కంపెనీ సర్టిఫైడ్‌ గ్లాస్‌ ఉత్పత్తులు సరఫరా చేయడంతో అనేక మంది యుపివిసి విండోలు, డోర్ల తయారీదారులు మోడర్న్‌ సేఫ్టీ గ్లాస్‌నే వాడుతున్నారు. ఫసాడి ఫ్యాబ్రికేటర్లు, ఇంటీరియర్‌ ఆఫీసు పార్టిషన్ల మార్కెట్‌లోనూ తమ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉందని డైరెక్టర్‌ వి ప్రభు చెప్పారు. కంపెనీ ఎండితో పాటు తనకు ఈ రంగంలో ఉన్న సాంకేతిక అనుభవం కంపెనీని మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు బాగా ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ అనుభవంతోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో మరే గ్లాస్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ తయారు చేయని స్విచ్చబుల్‌ గ్లాస్‌ను మోడరన్‌ సేఫ్టీ గ్లాస్‌ కంపెనీలో ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. ఈ వ్యాపార విస్తరణతో గత ఏడాది రూ.8 కోట్లు ఉన్న టర్నోవర్‌ ఈ ఆర్థిక సంవత్సరం రూ.14 కోట్లకు, 2020 నాటికి రూ.25 కోట్లకు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.- హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి బిజినెస్‌
business
20,666
23-01-2017 17:37:54
6వ స్థానంలో ఆణిముత్యాన్ని కనుగొన్నాం.. : గవాస్కర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కేదార్ జాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి వన్డేలో 120 పరుగులు చేసి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించి రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. సెకండ్ వన్డేలో 22 పరుగులు చేయగా మూడో వన్డేలో అజేయంగా 90 పరుగులు చేసి దాదాపుగా మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. బ్యాటింగ్‌లోనే కాదు అటు బౌలింగ్‌లో కూడా తనదైన ముద్ర వేశాడు. ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను కూడా దక్కించుకున్నాడు. అయితే దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. జాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. టీమిండియా ఒక ఆణిముత్యాన్ని కొనుగొన్నదని, 6వ స్థానంలో బ్యాటింగ్‌కు జాదవ్ అతికినట్టు సరిపోతాడని అన్నారు. చివరి ఓవర్లలో మంచి ఫినిషర్‌గా అదరగొట్టగలడని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలను స్వీకరించిన కోహ్లీ సారధ్య బాధ్యతలు పెరిగినప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా రాణించడం గొప్ప విషయమని అన్నారు. ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ నెగ్గినందుకు కోహ్లీ సేనకు శుభాకాంక్షలు తెలిపారు.
sports
16,899
27-01-2017 03:22:57
ఆకాశ్‌ క్షిపణులు
 హరియాణా శకటం ‘బేటీ బచావో, బేటీ పఢావో’ థీమ్‌తో సాగడం విశేషం. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ శాఖ శకటాన్ని జీఎస్టీ థీమ్‌తో తీర్చిదిద్దడం ఆకర్షించింది. ఈ శకటం వచ్చినప్పుడు కేంద్ర విద్యుత శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టడం కనిపించింది. ఇక.. గోవా, గుజరాత, ఒడిసా, పశ్చిమబెంగాల్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల శకటాలు వివిధ రంగాల్లో దేశ పురోభివృద్ధిని ప్రతిబింబించాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, త్రిపుర.. వరుసగా యాక్‌ డాన్స్‌, జానపద నృత్యాలు, కరకాట్టం, గిరిజన నృత్యం హోజగిరి థీమ్‌లతో తమ శకటాలను తీర్చిదిద్దాయి. ఢిల్లీ శకటం ఆదర్శ ప్రభుత్వ పాఠశాల థీమ్‌తో సాగింది. 23 ఏళ్ల తర్వాత పెరేడ్‌లో పాల్గొంటున్న లక్షద్వీప్‌.. పర్యాటక థీమ్‌తో శకటాన్ని తీర్చిదిద్దింది. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ శకటం ‘క్లీన్‌ ఇండియా-గ్రీన్‌ ఇండియా’ థీమ్‌తో.. నైపుణ్యాభివృద్ధి శాఖ ‘స్కిల్‌ ఇండియా’ థీమ్‌తో.. అసోం శకటం కామాఖ్య ఆలయం థీమ్‌తో ఆకట్టుకున్నాయి.
nation
9,362
19-01-2017 18:16:18
అసభ్య పోస్ట్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్!
కొచ్చి : అందరినీ గౌరవించడమే నాగరికత. మహిళల పట్ల మరింత మర్యాదగా ప్రవర్తించాలి. అభివృద్ధి చెందుతున్నకొద్దీ నడవడిక మెరుగుపడాలి. చేతికి వస్తున్న కొత్త హంగులను సద్వినియోగం చేయడం తెలుసుకోవాలి. అంతేకానీ ఆధునిక సదుపాయలతో చాటుమాటున ఉంటూ ఎదుటివారిని, అందులోనూ మహిళలను కించపరచడాన్ని ఎవరూ సమర్థించరు. మళయాళ సినీ నటి కావ్య మాధవన్‌కు కొందరి వల్ల తీవ్ర మనోవేదన కలుగుతోందట. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు రాతలు రాస్తూ ఆమె మనసును గాయపరుస్తున్నారట. అందుకే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొచ్చి సిటీ పోలీసుల కథనం ప్రకారం మళయాళ సినీ నటి కావ్య మాధవన్‌కు నవంబరు 25న దిలీప్‌తో వివాహమైంది. ఆమెపైనా, దిలీప్‌పైనా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతుండటంతో దంపతులిద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆమె నిర్వహిస్తున్న డిజైన్ వెంచర్ లక్ష్య.కామ్ ఫేస్‌బుక్ పేజీలోనే ఈ చెడు వార్తలు పోస్ట్ అవుతుండటంతో మరింత బాధపడుతున్నారు. ఆమె ఎర్నాకుళం రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతంలో కూడా పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిగత జీవితంపై పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. ఆమె పేరుపై నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని గతంలో అరెస్టు చేశారు. ఆమె పేరుపై ఇటువంటి నకిలీ ప్రొఫైల్స్ 12 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
entertainment
17,732
10-05-2017 04:05:55
ఇంటికే రైలు టికెట్లు.. వచ్చాకే పైసలివ్వండి!
న్యూఢిల్లీ, మే 9: ఐఆర్‌సీటీసీలో టికెట్లు బుక్‌ చేస్తున్నారా? అయితే మీ కోసం ఐఆర్‌సీటీసీ ఒక సరికొత్త వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులతోపాటు.. పే-ఆన్‌-డెలివరీ(పీవోడీ) పేరుతో మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంటే, టికెట్లు బుక్‌ చేసి, అవి మీ ఇంటికి వచ్చాక అప్పుడు చెల్లించవచ్చన్నమాట. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం.. అదే సమయంలో, వినియోగదారులను ఆన్‌లైన్‌ విధానం వైపునకు మళ్లించడం కోసం తీసుకుంటున్న పలుచర్యల్లో భాగంగానే ఐఆర్‌సీటీసీ ఈ కొత్త సౌకర్యాన్ని కల్పించింది. టికెట్‌ బుకింగ్‌ ఏజెంట్ల ద్వారా బుక్‌ చేసుకునేవారు కూడా ఆ సమయంలో ఈ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ మొబైల్‌యాప్‌, పీసీ వెర్షన్‌.. రెండింటిలోనూ ఈ ప్రత్యామ్నాయాన్ని వినియోగించుకోవచ్చు. టికెట్లు ఇంటికి రాకమునుపే రద్దు చేస్తే.. క్యాన్సిలేషన్‌ చార్జీలతోపాటు, డెలివరీ చార్జీలు కూడా వినియోగదారే చెల్లించాలి.
nation
3,370
10-02-2017 03:04:42
పీడీఎస్‌యూ రాష్ట్ర సదస్సు
యూనివర్సిటీల పరిరక్షణకై ప్రగతిశీల, ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తోంది. ఓయూ వైస్‌ ఛాన్సలర్‌ రామచంద్రం, భోపాల్‌ ఎన్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్‌ బుర్ర రమేష్‌, ఓయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కొండా నాగేశ్వర్‌ , సమున్నత, పలువురు విద్యార్థి సంఘ నేతలు పాల్గొంటున్నారు.– జూపాక శ్రీనివాస్‌, కె.ఎస్‌.ప్రదీప్‌
editorial
527
13-02-2017 01:11:40
ఇన్ఫీపై సెబి కన్ను
'ముసలం' పై వివరణ కోరాలని ఎక్స్ఛేంజీలకు ఆదేశంన్యూఢిల్లీ: ఇన్ఫోసిస్లో వ్యవస్థాపకులు, యాజమాన్యం మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు సెబి సన్నాహాలు చేస్తోంది. ఇన్ఫోసిస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఒక కన్నేసి ఉంచింది. టాటాలు, యునైటెడ్‌ స్పిరిట్స్‌, రికో ఇండియా తర్వాత ఇటీవల రెగ్యులేటరీ దృష్టిని ఆకర్షించిన మరో సంస్థ ఇన్ఫోసిస్‌. ఆ సంస్థ వ్యవహారాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, సంస్థల్లో అంతర్గత విభేదాలపై పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తున్న వార్తలపై కంపెనీ నుంచి వివరణలు తీసుకోవాలని స్టాక్‌ ఎక్స్ఛేంజీలను ఆదేశించామని సెబి సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. భిన్న రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌, అంతర్గత పాలనాపరమైన వ్యవహారాలు రచ్చకెక్కడం, వార్తాపత్రికల్లో పతాక శీర్షికలకెక్కడం చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. సంస్థాగత, మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు ఇలాంటి సంఘటనల వల్ల దెబ్బ తినకూడదని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.ఇలాంటి కంపెనీలన్నీ వృత్తిపరమైన నైపుణ్యాలతో నడుస్తున్నవని, విదేశీ ఇన్వెస్టర్లలో కూడా ఎంతో గౌరవం గలవని చెప్పారు. ఈ కంపెనీల్లో ఇలాంటి సంఘటనలు రచ్చకెక్కడం వల్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా భారతకు గల ప్రతిష్ఠకు భంగకరమని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ పరిణామాలపై స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సేకరించే సమాచారం పరిశీలించిన అనంతరం అవసరమైతే సెబి నేరుగా వారి నుంచి వివరణలు కోరుతుందని సెబి అధికారి చెప్పారు. నేడు ఇన్వెస్టర్లతో సిక్కా భేటీ ఉన్నత స్థాయి యాజమాన్యానికి, సంస్థ వ్యవస్థాపకులకు మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరినట్టు వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇన్ఫీ సిఇఒ విశాల్‌ సిక్కా సోమవారం సంస్థాగత ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు. ఆ సమావేశంలో పాల్గొనే ఫండ్‌ మేనేజర్లకు సిక్కా సంస్థకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలను వివరించవచ్చునని భావిస్తున్నారు. కోటక్‌ చేజింగ్‌ గ్రోత కాన్ఫరెన్స్‌లో సిక్కా పాల్గొనబోతున్నారన్న విషయం కంపెనీ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.ఇన్ఫోసిస్లో ప్రస్తుత పరిణామాలు వెలుపలికి రావడం కన్నా ముందే ఈ సమావేశం ఖరారయిందని ఆయన చెప్పారు. సమావేశం ఖరారైన అనంతరం ఈ వార్తలన్నీ బట్టబయలైన నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్లు ఆ అంశాలపై సిక్కాను వివరణ కోరే అవకాశం ఉన్నదని కూడా భావిస్తున్నారు. సమావేశం అనంతరం సిక్కా కొందరు బోర్డు సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
business
1,175
06-07-2017 00:52:33
మార్కెట్లోకి మూడు కొత్త ఫోన్లు
దేశీయ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లోకి మరో మూడు కొత్త ఫోన్లు వచ్చాయి. అమెరికాకు చెందిన ఇన్‌ఫోకస్‌ ‘టర్బో5’, చైనాకు చెందిన లీఫోన్‌ ‘లీఫోన్‌ డబ్ల్యు2’, నుబియా ‘ఎన్‌2’ ఫోన్లను విడుదల చేశాయి. లీఫోన్‌ డబ్ల్యు2: ఈ ఫోన్‌ రెండు 4జి సిమ్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. 1.3 గిగాహెట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1జిబి రామ్‌, 8జిబి ఇంటర్నల్‌ మెమరీ (మైక్రో ఎస్‌డి కార్డుతో 32 జిబిలకు పెంచుకోవచ్చు), 2 ఎంపి వెనుక కెమెరా, ముందు భాగంలో విజిఎ కెమెరా, ఆండ్రాయిడ్‌ మార్ష్‌మల్లో ఔస్‌, 4.5 అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. తెలుగు సహా 22 ప్రాంతీయ భాషలకు ఈ మొబైల్‌ సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర 3,999 రూపాయలు. టర్బో 5: 4జి సర్వీసులకు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 5.2 అంగుళాల హెచ్‌డి ఐపిఎస్‌ 2.5డి గ్లాస్‌ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ ఔస్‌, 13 ఎంపి వెనుక కెమెరా, 5 ఎంపి సెల్ఫీ కెమెరా, 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. 2జిబి రామ్‌ 16జిబి ఇంటర్నల్‌ మెమరీ ఉన్న ఫోన్‌ ధర 6,999 రూపాయలుండగా.. 3జి రామ్‌ 32 జిబి ఇంటర్నల్‌ మెమరీ ఉన్న ఫోన్‌ ధర 7,999 రూపాయలుగా ఉంది. ఎన్‌2: ప్రీమియం సెగ్మెంట్లో అందుబాటులోకి వచ్చిన ఫోన్‌ ఇది. ఇందులో 5.5 అంగుళాల హెచ్‌డి అమోఎల్‌ఇడి డిస్‌ప్లే, 4జిబి రామ్‌, 64 జిబి ఇంటర్నల్‌ మెమరీ, 13 ఎంపి వెనుక కెమెరా, 16 ఎంపి ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ మార్ష్‌మల్లో ఔస్‌, 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, ఎంటికె ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌ ధర 15,999 రూపాయలు. ఇది అమెజాన్‌ డాట్‌ ఇన్‌లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.మార్కెట్‌కు తెచ్చే అవకాశం ఉంది.
business
16,809
03-04-2017 15:37:47
దావూజీ హాస్పిటల్ డైరెక్టర్‌పై కాల్పులు
ఆగ్రా: ఆగ్రాలోని ఓ పెట్రోల్ బంక్‌లో కాల్పుల కలకలం రేగింది. దావూజీ హాస్పిటల్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వైద్యుడు సునీల్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. కారులో పెట్రోల్ పోయిస్తుండగా ఈ ఘటన జరిగింది. ముగ్గురు దుండగులు ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరపడంతో సునీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సునీల్‌ అనుచరులతో దుండగులు గొడవ పెట్టుకున్నారు. వారిని కూడా ఇష్టం వచ్చినట్టు చితకబాదారు. ఈ దృశ్యాలు సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి. సునీల్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
nation
1,005
22-04-2017 00:13:07
హోవిట్జర్ల తయారీలో ఎల్‌ అండ్‌ టి
న్యూఢిల్లీ: భారత సైన్యానికి సెల్ఫ్‌ ప్రొపల్షన్‌ గల 100 హోవిట్జర్‌ శతఘ్నులు ఉమ్మడిగా తయారుచేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన రక్షణ సంస్థ హన్వా టెక్విన్‌తో ఇంజనీరింగ్‌ దిగ్గజం ఎల్‌ అండ్‌ టి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ హోవిట్జర్ల విలువ 4,500 కోట్ల రూపాయలు. ఇందులో 10 హోవిట్జర్లను దక్షిణ కొరియా నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటారు. మిగతా 90 శతఘ్నులను పుణె సమీపంలోని తాలేగాంలో ఉన్న ఎల్‌ అండ్‌ టి స్ర్టాటజిక్‌ సిస్టమ్స్‌ కాంప్లెక్స్‌లో తయారుచేస్తారు.  ఈ 155ఎంఎం/52 కాల్‌ ట్రాక్డ్‌ సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ కె9 వజ్ర-టి శతఘ్నుల మొదటి విడత డెలివరీ ఈ ఏడాది చివరిలో మొదలై 42 నెలల కాలంలో మొత్తం 100 శతఘ్నుల సరఫరా పూర్తి చేస్తారు. కె9 థండర్‌ శతఘ్నికి మరింత మెరుగులు దిద్ది తయారుచేసిన ఈ కొత్త కె9 వజ్ర-టి శతఘ్నులు ప్రపంచంలోని అత్యుత్తమ శతఘ్నుల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. 2015 సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోదీ సియోల్‌ సందర్శన సమయంలో కుదిరిన అంగీకారం మేరకు భారతతో రక్షణ సహాయాన్ని మరింతగా విస్తరించుకుంటామని దక్షిణ కొరియా రక్షణ కొనుగోళ్ల శాఖ మంత్రి చాంగ్‌ మ్యోంగ్‌ జిల్‌ తెలిపారు.  రక్షణ ఉత్పత్తుల రంగంలోని భారత ప్రైవేటు కంపెనీలు, విదేశీ దిగ్గజాల మధ్య ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి తయారీ కార్యకలాపాలకు ఈ ఒప్పందం కొత్త ఉత్తేజం ఇస్తుందని ఎల్‌ అండ్‌ టి డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ హెడ్‌ జయంత పాటిల్‌ అన్నారు. తమ రక్షణ వ్యాపారాల్లో ఇది ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. హన్వా టెక్విన్‌తో తమ సహకారం ఈ శతఘ్నులకే పరిమితంకాదని, భవిష్యత్తులో తాము చేపట్టే మరిన్ని కార్యకలాపాలకు కూడా విస్తరించుకుంటామని తెలిపారు. తాము ఉమ్మడిగా తయారుచేసే కె9 వజ్ర-టి శతఘ్నులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉన్నదని ఆయన అన్నారు.
business
6,199
21-05-2017 20:46:57
టైగర్.. తన మాట నిలబెట్టుకుంటాడా..?
హాలివుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలొన్ ‘రాంబో’ సినిమాతో యూనిర్సల్ స్టార్‌గా ఎదిగారు. ఇప్పటికీ యాక్షన్ ప్రియుల హాట్ ఫేవరెట్‌గానే కొనసాగుతున్న ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ కుర్రహీరో టైగర్ ష్రాఫ్ రాంబో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రాంబో సినిమాకు తొలుత హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా పేర్లు పరిశీలించినప్పటికీ చివరికి టైగర్ ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ నిపుణుడైన టైగర్ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడని ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. మరో వైపు తన క్లాసిక్ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ అవబోతుందని తెలుసుకున్న సిల్వెస్టర్ కూడా ట్విట్టర్‌లో స్పందించాడు. బాలీవుడ్‌లో రాంబో రీమేక్ అవుతుందని తెలుసుకున్నాని ట్వీట్ చేసిన సిల్వెస్టర్.. దీన్ని చెడగొట్టకుండా ఉంటారని ఆశిస్తున్నాను అంటూ తన మనసులోని భావాలను బట్టబయలు చేశాడు. దీనికి ప్రతిగా స్పందించిన టైగర్.. మిమ్మల్ని ఎప్పుడూ తలదించుకోనివ్వనంటూ రీట్వీట్ చేశాడు. మరి టైగర్ అన్న మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.
entertainment
7,576
18-01-2017 11:38:16
‘కాటమరాయుడు’పై ఆ ప్రభావం పడుతుందా?
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అజిత్‌ నటించిన ‘వీరమ్‌’ సినిమాకు అనధికార రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఈ కథాంశంతో ఇంతకుముందే తెలుగులో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అసలు విషయమేమిటంటే.. అజిత్‌ నటించిన ఆ ‘వీరమ్‌’ చిత్రాన్ని తెలుగులో ‘వీరుడొక్కడే’గా ఎప్పుడో అనువాదం చేశారు. ఆ సినిమా ఇప్పటికే టీవీల్లో చాలాసార్లు వచ్చేసింది. అయినా ఆ సినిమాను రీమేక్‌ చేయడానికి సిద్ధపడ్డాడు పవర్‌స్టార్‌. ఈ నేపథ్యంలో ‘కాటమరాయుడు’ కథ గురించి తెలుగు వాళ్లకు సస్పెన్స్‌ ఏమీ ఉండదు. కేవలం పవన్‌ నటిస్తున్నాడన్న కారణం తప్ప ఆ సినిమా కథ కొత్తగా ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం ‘కాటమరాయుడు’పై ప్రభావం పడుతుందని అనుకుంటున్నారు.
entertainment
13,547
11-08-2017 17:08:07
తొలిసారిగా నాలుగు కీలక రాజ్యాంగ పదవుల్లో బీజేపీ
న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేయడంతో భారత దేశ రాజకీయ చరిత్రలో తొలిసారి నాలుగు అత్యున్నత పదవులూ బీజేపీ నేతలకే దక్కినట్టయింది. వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ , ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బీజేపీ నుంచి వచ్చిన వారే. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా వీరికుంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం హమీద్ అన్సారీ స్థానంలో ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన రాజ్యసభ ఎక్స్‌ అఫీషియో చైర్మన్‌గా కూడా ఉంటారు. 2019 నాటికి 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అనేది ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నినాదంగా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలుంటాయి. కాగా, ప్రస్తుతానికి కీలకమైన రాజ్యంగ అత్యున్నత పదవుల్లో ఒకటైన రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ పోస్ట్ మినహాయింగా ఉంది. కాంగ్రెస్‌కు చెదిన పీజే కురియన్ ఆ పదవిలో ఉన్నారు. 2012 ఆగస్టు 21న ఆయన నియమితులయ్యారు. కురియన్ స్థానంలో ఒకవేళ మార్పు చోటుచేసుకుంటే ఐదు ఉన్నత రాజ్యాంగ పదవులతో బీజేపీ క్లీన్ స్పీప్ సాధించే అవకాశాలుంటాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో (1998-2004) రాష్ట్రపతి, ఉపరాష్ట్ర, లోక్‌సభ స్పీకర్ పదవులు బీజేపీ చేతుల్లో లేవు. వాజ్‌పేయి పదవీకాలంలో ఇద్దరు రాష్ట్రపతులను చూశారు. కె.ఆర్.నారాయణన్ 1997-2002 వరకు కొనసాగగా, ఏపీజే అబ్దుల్ కలాం 2002-2007 వరకూ కొనసాగారు. నారాయణన్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. కలాం రాజకేయతర వ్యక్తి. వాజ్‌పేయి హయాంలో రాష్ట్రపతి మాత్రమే కాదు...ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్లు కూడా బీజేపీకి చెందిన వారు కాదు. భైరనా సింగ్ షెకావత్ మాత్రం ఇందుకు మినహాయింపు. 2003-2007 వరకూ ఆయన ఉపరాష్ట్రపతిగా కొనసాగారు. షెకావత్ ముందున్న కృష్ణకాంత్ (1997-2002) కాంగ్రెస్ నేతగా ఆ పార్టీలో పలు పదవులు కూడా నిర్వహించారు. వాజ్‌పేయి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు తన ఇచ్ఛానుసారం లోక్‌సభ స్పీకర్‌ను నియమించే అవకాశం కూడా ఆయనకు దగ్గలేదు. రెండు సార్లు అవకాశం వచ్చినా ఆ రెండు సందర్భాల్లోనూ కీలకమైన ఆ పదవిని బీజేపీ భాగస్వాములకే కేటాయించాల్సి వచ్చింది. జీఎంసీ బాలయోగి (తెలుగుదేశం) లోక్‌సభ స్పీకర్‌గా రెండు సార్లు 1998, 1998లో ఎన్నికయ్యారు. 2002లో విమాన ప్రమాదంలో మరణించేంత వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. తరువాత శివసేనకు చెందిన మనోహర్ జోషి ఆ పదవిలో 2002 నుంచి 2004 వరకూ 13వ లోక్‌సభలో కొనసాగారు. కాగా, మూడేళ్లు వేచిచూసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, అనంతరం పలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు హవా కొనసాగించడం జరిగింది. అత్యున్నత పదవుల్లో తమ సభ్యులను స్వతంత్రంగానే బీజేపీ నియమించుకునేందుకు ఈ రెండు కారణాలూ దోహదపడ్డాయి.
nation
8,887
02-11-2017 15:27:14
గ్లామర్ రోల్స్‌కైనా రెడీ: నందితా శ్వేత
ఎక్కడి పోతావు చిన్నవాడా.. సినిమాలో నిఖిల్ సరసన అలరించిన భామ గుర్తుందా? నందితా శ్వేత. ఈ కోలీవుడ్ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ అవనుందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఆడిషన్‌లో పాల్గొన్నదని తెలుస్తోంది. దీంతో కొందరు ఫిల్మ్ మేకర్స్ కూడా తమ సినిమాల కోసం అమ్మడిని సంప్రదించారట. తన మొదటి సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో ట్రెడిషినల్‌గా కనిపించింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు గ్లామర్ రోల్స్‌లో కూడా నటిస్తానని చెప్పేసిందట. ఓ టాప్ ప్రొడ్యూసర్ కొడుకు హీరోగా నటిస్తున్న ఓ సినిమా కోసం కూడా నందితా శ్వేతను సంప్రదించారట.
entertainment
7,380
03-11-2017 21:37:24
అఖిల్‌పై ఈ వార్తలు నిజమేనా?
అఖిల్ అక్కినేనిపై ఓ వార్త నెట్ మాయాజాలంలో హల్‌చల్ చేస్తోంది. అఖిల్ నటించిన మొదటి చిత్రం భారీ పరాజయం చవిచూడటంతో.. రెండో సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నారు అఖిల్. రెండో చిత్రాన్ని మనం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో స్వయంగా నాగార్జునే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ 'హలో!'. అయితే అఖిల్ ఈ సినిమా విషయంలో దర్శకుడు విక్రమ్ కుమార్ వర్క్‌కి అడ్డుపడుతున్నాడనే వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఎందుకంటే నాగార్జున ఒక్కసారి ఓకే చెప్పాడు అంటే చాలు, దర్శకుడికి పూర్తి స్వాతంత్ర్యం ఇస్తాడనే క్లీన్ ఇమేజ్ నాగ్ సొంతం. అటువంటిది ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ స్టార్ట్ చేసిన ఈ చిత్రం విషయంలో ఇప్పుడు అఖిల్ జోక్యం చేసుకుంటున్నాడని వార్తలు రావడం నిజంగా విశేషమే మరి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ టైమ్‌లో అఖిల్‌పై ఇటువంటి వార్తలు రావడం అతని కెరియర్‌పై ప్రభావం చూపే అవకాశమైతే ఉంది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలవుతుందనే విషయం తెలిసిందే.
entertainment
1,596
12-12-2017 01:13:39
ఎవరిది తప్పు.. ఎవరు బాధ్యులు
మన దేశంలో బ్యాంకింగ్‌, బీమా, ఎంఎఫ్‌ రంగాల్లో నియంత్రణలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. ఆయా సంస్థలను నియంత్రించే ఆర్‌బిఐ, ఐఆర్‌డిఎ, సెబి సమన్వయంతో పని చేస్తూ ఆయా రంగాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇందుకు ఆ సంస్థల చేతిలో ఉన్న సమర్థవంతమైన నియంత్రణాధికారాలే కారణం. అయినా ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌డిఐ చట్టం వంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అవసరమా అన్న అంశంపై ప్రముఖ ఆర్థికవేత్త కె నరసింహమూర్తి విశ్లేషణ ఆంధ్రజ్యోతి పాఠకులకు ప్రత్యేకం. కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్న తరహాలో బ్యాంకులు ఎన్‌పిఎల ఊబిలో కూరుకుపోవడానికి కూడా కారణాలెన్నో ఉన్నాయి. ఒక ప్రాజెక్టుని సరిగా మదింపు చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ప్రమోటర్లు నిధులు స్వాహా చేయడం మరో కారణం. ప్రమోటర్ల అసమర్థ నిర్వహణ, రుణగ్రహీతల ఖాతాలను బ్యాంకులు సరిగా తనిఖీ చేయకపోవడం కూడా వాటిని కష్టాల్లోకి నెడుతుంది. బ్యాంకు అధికారులు, సంస్థ యాజమాన్యం ఉద్యోగులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడడం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇవన్నీ బ్యాంకును మోసం చేసే చర్యలే అయితే, ఎవరి ప్రమేయం లేకుండా కాలానుగుణంగా ఏర్పడే ఊహాతీతమైన పరిణామాల వల్ల ఎదురయ్యే ఒత్తిడులు ఆయా సంస్థలు రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడేందుకు కారణమవుతాయి.  అంతర్జాతీయంగా ఏర్పడే రాజకీయ, భౌగోళిక పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాల వంటివి వ్యాపారాలను దెబ్బ తీస్తూ ఉంటాయి. ప్రభుత్వాలపరంగా చూస్తే విధానాల్లో ఆకస్మిక మార్పులు వ్యాపారాలకు ప్రతిబంధకం అవుతాయి. ఇవన్నీ అలా ఉంచితే ఆర్‌బిఐ, సెబి, నబార్డ్‌, ఐఆర్‌డిఏ వంటి నియంత్రణ సంస్థల పర్యవేక్షణలోని లోపాలు, న్యాయస్థానాలు ఏదో ఒక కేసుని దృష్టిలో ఉంచుకుని మొత్తం వ్యవస్థనే ప్రభావితం చేసే విధంగా ఇచ్చే తీర్పులు కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను నష్టాల ఊబిలోకి నెడతాయి. ఉదాహరణకి ఐదేళ్ల క్రితం పర్యావరణ నిబంధనలను పాటించడంలేదన్న కారణంగా ఇనుప ఖనిజం మైనింగ్‌ను సుప్రీంకోర్టు నిషేధించింది. ఆ సమయంలో మైనింగ్‌ కార్యకలాపాలు స్తంభించిపోయి ఉక్కు రంగానికి ఇచ్చిన రుణాలు ఎన్‌పిఎలుగా మారిపోయాయి. అలాగే పర్యావరణవేత్తల ఆందోళనల కారణంగా ప్రాజెక్టులు స్తంభించిపోయి వాటి కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్‌పిఎలు పెరగడానికి ఇన్ని కారణాలుండగా ఆ బూచిని చూపించి ఆ నష్టాలు భరించమని సగటు డిపాజిటర్లను కోరడం అసమంజసం. ఆర్థిక సంస్థలు.. నియంత్రణ వ్యవస్థమన బ్యాంకింగ్‌, బీమా, మ్యూచువల్‌ ఫండ్‌ రంగాల నిర్వహణ ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. సంస్థల బోర్డుల్లో కొత్త డైరెక్టర్‌ని చేర్చుకోవడం దగ్గర నుంచి పలురకాల అనుమతులు మంజూరు చేయడం వరకు నిబంధనలు చాలా పటిష్ఠంగా ఉన్నాయి. చివరికి డైరెక్టర్ల బోర్డు పనిచేసే తీరును కూడా ఈ నిబంధనలు నిర్దేశిస్తాయి. బ్యాంకుల రుణ వితరణ, నిధుల వినియోగం, పెట్టుబడి విధానాలు, ఆడిట్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలు...ఈ విధంగా మొత్తం ఆర్ధిక సంస్థ నిర్వహణను నిబంధనలు నిర్దేశిస్తాయి. ఆర్‌బిఐ ప్రతి సంవత్సరం బ్యాంకుల పద్దులను తనిఖీ చేస్తూ ప్రతి నెలా ఆయా బ్యాంకుల ఆర్థిక స్థితిపై నివేదికలు తీసుకుంటూ నిరంతరం బ్యాంకులను తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఒక ఆర్థిక సంస్థను బెయిల్‌ ఇన్‌ చేయాలని సగటు డిపాజిటర్‌ను కోరడం ఎంతవరకు సమంజసం? నియంత్రణలు ఇంత పటిష్ఠంగా ఉన్నప్పుడు ఆయా బ్యాంకులు దివాలా తీసిన సందర్భాల్లో ఆర్‌బిఐకి బాధ్యత లేదా? ఆర్‌బిఐ, సెబి, ఐఆర్‌డిఎలపై నమ్మకం కోల్పోయి ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడుతోందా...? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 2008 సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో ప్రపంచశ్రేణి బ్యాంకులు దివాలా తీసినా కూడా మన బ్యాంకింగ్‌ రంగం తట్టుకుని నిలవగలిగిందంటే ఆ నియంత్రణలే కారణం.  2002లో అర్బన్‌ బ్యాంకుల సంక్షోభం తర్వాత వాటి రక్షణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనే ఇచ్చాయి.వాణిజ్య బ్యాంకుల విషయానికి వస్తే 1990 దశకంలో న్యూ ఇండియా బ్యాంకు కష్టాల్లో పడితే దాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేశారు. 2002-03 సంవత్సరాల్లో గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌ సంక్షోభంలో పడినప్పుడు దాన్ని ఒబిసిలో విలీనం చేశారు. ఈ సంఘటనలు మినహా మన దేశంలో వాణిజ్య బ్యాంకులు కుప్పకూలిన సంఘటనలేవీ ఇటీవల కాలంలో లేవు. ప్రభుత్వం, ఆర్‌బిఐ, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ చక్కని సమన్వయంతో పనిచేసి బ్యాంకింగ్‌ రంగాన్ని సంక్షోభంలో పడకుండా కాపాడగలిగాయి. బ్యాంకుల కష్టాలకు ఎవరెవరు బాధ్యులు, ఎందుకు అవి ఎన్‌పిఎల ఊబిలో కూరుకుపోయాయి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించకుండా సగటు డిపాజిటర్ల మీద పడడం వల్ల ఎన్నో చట్టపరమైన చిక్కులు ఎదురు కావచ్చు.   ఒకపక్క డీమానిటైజేషన్‌ చేదు అనుభవం నుంచి ప్రజలు ఇంకా బయటపడలేదు. మరోపక్క జిఎ్‌సటికి ఆర్థిక వ్యవస్థ అలవాటు పడాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో ఈ తరహా నిర్ణయం తీసుకోవడం కొరివితో తల గోక్కున్నట్టే అవుతుంది. బ్యాంకులు, నియంత్రణ సంస్థల వైఫల్యాలకు డిపాజిటర్లు శిక్ష అనుభవించాలా?
business
15,847
03-06-2017 03:04:18
2 లక్షలు నగదు లావాదేవీలొద్దు
 అతిక్రమిస్తే 100 శాతం జరిమానా వివరాలు తెలపాలని కోరిన ఐటీ శాఖన్యూఢిల్లీ, జూన్‌ 2: నల్లధనాన్ని అరికట్టడం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్రం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటోంది. రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం నగదు లావాదేవీలను నిర్వహించరాదని శుక్రవారం ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. నిబంధనలను అతిక్రమించి నగదు తీసుకున్నవారు అంతే మొత్తం జరిమానాగా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇలాంటి వ్యవహారాలు ఎవరి దృష్టికి వచ్చినా తమకు తెలియజేయాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ ప్రజలను కోరింది. వివరాలను blackmoneyinfo@inco metax.gov.in కు మెయిల్‌ ద్వారా తెలిపాలని సూచించింది. ఐటీ చట్టంలోని కొత్త 269ఎస్‌టీ సెక్షన్‌ ప్రకారం ఒకేరోజులో ఇలాంటి నగదు లావాదేవీలపై నిషేధం విధించారు. నగదు తీసుకున్నవారికి 100 శాతం జరిమానా విధిస్తామని ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. గత ఏప్రిల్‌ 1 నుంచి రెండు లక్షలు లేదా ఎక్కువ మొత్తం నగదు లావాదేవీలపై కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. 2017-18 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 3 లక్షల నగదు లావాదేవీలను నిషేధించాలని ప్రతిపాదించారు. కాగా ఆర్థిక బిల్లులో సవరణ చేసి ఈ పరిమితిని రెండు లక్షలకు తగ్గించగా లోక్‌సభ ఆమోదించింది. కాగా బ్యాంకులు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసు సేవింగ్స్‌ ఖాతాల ఉపసంహరణలకు ఈ నిబంధనలు వర్తించవు.
nation
112
31-08-2017 02:19:44
రూ. 9.8 కోట్ల బకాయిలు ఇప్పించిన ఇండస్ట్రియల్‌ కౌన్సిల్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రావాల్సిన సుమారు రూ.9.8 కోట్లకు పైగా బకాయిలను ఇండస్ట్రియల్‌ ఫెసిలిటేషన్‌ కౌన్సిల్‌ ఇప్పించింది. ఈ పరిశ్రమల ఉత్పత్తులను వినియోగించుకుని బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సంస్థలపై ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ అహ్మద్‌ నదీం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండస్ట్రియల్‌ ఫెసిలిటేషన్‌ కౌన్సిల్‌ వీటిని పరిశీలించి ప్రతివాదులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తమకు బకాయిలు ఇప్పించాలని కోరూతూ 122 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానులు ఫిర్యాదు చేశారు. ఇందులో సుమారు పది సంస్థలకు సంబంధించి దాదాపు రూ9.8 కోట్లకు పైగా బకాయిలు చెల్లించేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపినట్టు కౌన్సిల్‌ కార్యదర్శి, పరిశ్రమల శాఖ అదనపు కమిషనర్‌ ఆర్‌బి దేవానంద్‌ తెలిపారు.
business
20,955
16-12-2017 03:08:01
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు
కొలంబో: రవిశాస్త్రి.. యువరాజ్‌.. గిబ్స్‌ వీరంతా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వీరిని తలదన్నేలా 15 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్ల (ఒక బంతి నోబ్‌)తో చెలరేగాడు. అండర్‌-15 మురళీ గుడ్‌నెస్‌ కప్‌ ఫైనల్లో నవీందు పహసర (89 బంతుల్లో 109) ఎఫ్‌ఓజీ అకాడమీ తరఫున ఈ ఫీట్‌ సాధించాడు. లంక మాజీ స్పిన్నర్‌ మురళీధరన్‌ తన ఫౌండేషన్‌ తరఫున ఈ టోర్నీ నిర్వహిస్తున్నాడు. నవీందు అద్భుత ఇన్నింగ్స్‌తో కొట్టావాపై నెగ్గి ఎఫ్‌ఓజీ టైటిల్‌ సాధించింది.
sports
11,647
05-09-2017 17:26:30
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత యూనిఫాం
భువనేశ్వర్: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒడిశా ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచిత యూనిఫాం అందజేస్తుందని, అలాగే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు ఇస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారంనాడు ప్రకటించారు. గతంలో పేదరికపు రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకే ఉచిత యూనిఫాం సౌకర్యం ఉండేదని, ఇప్పుడు ఏపీఎల్ కుటుంబాలకూ ఆ సౌకర్యం విస్తరిస్తున్నామన్నారు. పదో తరగతి విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఉచిత సైకిళ్లు ఇప్పుడు తొమ్మిదో తరగతి విద్యార్థులకూ వర్తింపజేయాలని నిర్ణయించనట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో విద్యాప్రమాణాల పెరుగుదలకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, గత వారం టీచర్ల కోసం గ్రాంట్-ఇన్-ఎయిడ్ సిస్టం అమల్లోకి తీసుకువచ్చామని, ఇందువల్ల 40 వేల మంది టీచర్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. సర్వేపల్లి రాథాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన పట్నాయక్...విద్యారంగంలో అందించిన సేవలకు గాను 100 మంది టీచర్లను సన్మానించారు. ఒక్కొక్కరికి రూ.25,000 చెక్కులను బహూకరించారు.
nation
9,045
01-10-2017 23:39:38
టామ్‌ ఆల్టర్‌ కన్నుమూత
బాలీవుడ్‌ నటుడు టామ్‌ ఆల్టర్‌(67) కేన్సర్‌తో బాధపడుతూ ముంబైలో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ‘షత్రంజ్‌ కే ఖిలాడీ’, ‘జునూన్‌’, ‘క్రాంతి’ చిత్రాల్లో నటన ద్వారా ఆయన ప్రేక్షకులను కట్టిపడేశారు. టామ్‌ ఆల్టర్‌ రంగస్థల, టీవీ నటుడు, రచయిత, దర్శకుడు కూడా. శనివారం అంత్యక్రియలు ముగిసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. టామ్‌ ఆల్టర్‌ను ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
entertainment
15,865
16-10-2017 10:57:24
నీట మునిగిన మాజీ రాష్ట్రపతి కలాం అపార్ట్‌మెంట్‌
బెంగళూరు: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం బెంగళూరులో నివసించిన కేంద్రీయ విహార్‌ అపార్ట్‌మెంట్‌ నీటమునిగింది. ఇటీవల కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండడంతో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే యలహంక చెరువు మరవపోతోంది. రాజకాలువ సక్రమంగా లేకపోవడంతో మరవనుంచి వచ్చే వరద కేం ద్రీయవిహార్‌ అపార్ట్‌మెంట్‌లోకి చేరుతోంది. సెల్లార్‌ నీట మునగడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు బెంబేలెత్తుతున్నారు. అపార్ట్‌మెంట్‌లో 603 నివాసాలు ఉండగా ఎక్కువమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు అయినవారే ఉన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం మనవరాలు ఇదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. అబ్దుల్‌కలాం కూడా బెంగళూరుకు వచ్చిన పలుమార్లు అపార్ట్‌మెంట్‌కు వచ్చేవారు. ఇలా ఈ ప్రాంతంతో అబ్దుల్‌కలాంకు అవినాభావ సంబంధం ఉంది. సెల్లార్‌ నీట మునగడంతో ఆదివారం బయటకు వచ్చి నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అపార్ట్‌మెంట్‌ వాసులు ఇబ్బంది పడ్డారు. ఏకంగా పాలు, కూరగాయలు తెచ్చుకునేందుకు ఉద్యోగులు నీటినుంచే వెళ్ళాల్సి వచ్చింది. వృద్ధులు అపార్ట్‌మెంట్‌లకే పరిమితమయ్యారు. ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందోనని అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు భయపడే పరిస్థితి ఏర్పడింది. స్థానికులు రమేశ్‌, క్రిష్ణప్ప తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే విశ్వనాథ్‌కు సమస్యను వివరించామన్నారు. తాత్కాలికంగా సెల్లార్‌లోని నీటిని తోడేందుకు అగ్నిమాపకశాఖ మో టర్లు అమర్చింది. శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
nation
2,719
27-10-2017 01:49:39
అలుపెరుగని పరుగు
మళ్లీ కొత్త గరిష్ఠ స్థాయిలో సూచీలు.. 4 రోజుల్లోనే 764 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లో అలుపెరుగని పరుగు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజైన గురువారం నాడు కూడా మార్కెట్‌ బుల్స్‌ నియంత్రణలోనే ఉంది. తీవ్రమైన ఆటుపోట్ల మధ్య కూడా కీలక సూచీలు కొత్త ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిని చేరాయి. గురువారం అక్టోబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు కారణంగా షార్ట్‌ కవరింగ్‌ కోసం ఇన్వెస్టర్లు భారీ ఎత్తునే కొనుగోళ్లు సాగించారు. చమురు కంపెనీల షేర్లు, మెటల్‌, ఫార్మా షేర్లు బాగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 104 పాయింట్ల లాభంతో 33147 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 10343 వద్ద ముగిశాయి.  9 లక్షల కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రతిపాదించిన ఉద్దీపన ప్యాకేజీ ప్రభావం మార్కెట్లలో కనిపిస్తోంది. వాస్తవానికి ఉదయం సెషన్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారుకుంటున్న సూచనలు కనిపించాయి. అయితే మధ్యాహ్నం ట్రేడింగ్‌లో లభించిన మద్దతుతో సూచీలు దూసుకుపోయాయి. బుధవారంనాడు దుమ్మురేపిన బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో గురువారం మాత్రం మిశ్రమధోరణి కనిపించింది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 764 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్‌ 33025 పాయింట్ల వద్ద ప్రారంభమై ఒక దశలో 32835 పాయింట్లకు పడిపోయింది. ఆఖరులో మళ్లీ కోలుకోని ఇంట్రాడేలో 33196 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకి 33147 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 షేర్లలో 33 షేర్లు లాభాలతో ముగిశాయి. చమురు మార్కెటింగ్‌ కంపెనీల్లో బిపిసిఎల్‌ 5 శాతం, హెచ్‌పిసిఎల్‌ 4 శాతం, ఐఒసి 3.75 శాతం లాభపడ్డాయి. ఇవి కాకుండా సిప్లా 3.6 శాతం, హిండాల్లో 3 శాతం పెరిగాయి.హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ 5 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్‌ 3 శాతం, ఎస్‌బిఐ 2 శాతం నష్టపోయాయి. ఎస్‌బిఐ బుధవారం నాడు 28 శాతం పెరిగిన విష యం తెలిసిందే.బ్యాంకింగ్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌, పిఎన్‌బి, యస్‌బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌ 5 శాతం వరకు పెరిగాయి.2జి, 3జి సర్వీసులను నిలపివేసే యోచనలో ఉన్న వార్తలతో ఆర్‌కామ్‌ షేర్లలో పతనం కొనసాగుతోంది. షేరు ధర 4 శాతం పడిపోయింది.జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ క్యూ2 ఫలితాలు అదరగొట్టడంతో షేరు ధర 5 శాతం పెరిగింది. ఇంజినీర్స్‌ ఇండియా షేరుకు కూడా క్యూ 2 ఫలితాలు కిక్కునిచ్చాయి.ఎన్‌ఎల్‌సి షేర్ల కోసం ఎగబడిన రిటైల్‌ ఇన్వెస్టర్లుప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎల్‌సి ఇండియాలో వాటాల విక్రయానికి రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ 3 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఎన్‌ఎ్‌ససి ఇండియాలో వాటాల విక్రయం బుధవారం ప్రారంభమై గురువారం ముగిసింది. ఈ కంపెనీలో 5 శాతం వాటాను ప్రభు త్వం అమ్మకానికి పెట్టింది. ఒక్కో షేరును 94 రూపాయల కనీస ధరకు ఆఫర్‌చేశారు వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి సుమారు 750 కోట్ల రూపాయలు సమకూరే అవకాశం ఉంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా బుధవారం తొలి రోజే 3.2 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్‌ అయింది. పాదరక్షల తయారీ రంగంలోని ఖదీమ్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 543 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఆఫర్‌ ధర 745-750 రూపాయల శ్రేణిలో ఉంటుంది. ఇష్యూ నవంబర్‌ 2న ప్రారంభమై 6న ముగుస్తుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు సిద్ధార్థ రాయ్‌ బర్మన్‌, ఆయన కుటుంబ సభ్యులు 7.22 లక్షల ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెడుతున్నారు. ఫెయిర్‌విండ్స్‌ ట్రస్టీస్‌ సర్వీసెస్‌ 58.52 లక్షల షేర్లను విక్రయిస్తోంది. 50 కోట్ల రూపాయల మేర కొత్త ఈక్విటీలు జారీ చేస్తున్నారు. శ్రీరామ్‌-ఐడిఎఫ్‌సి విలీనం ప్రతిపాదనపై నీడలు కమ్ముకున్నాయి. వాల్యుయేషన్స్‌ విషయంలో రెండు సంస్థల వాటాదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా చెబుతున్నారు. వచ్చే వారం రెండు సంస్థల బోర్డులు విడిగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. విలీనం ప్రతిపాదన ముందుకు వెళ్తుందా లేదా అప్పుడే తేలిపోతుంది.
business
18,714
14-04-2017 09:58:37
కాంగ్రెస్‌పై వీరప్ప మొయిలీ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ సొంత పార్టీ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. ఓ పత్రికతో మాట్లాడుతూ 2019 లోక్‌సభ ఎన్నికల వ్యూహాన్ని పునఃసమీక్షించాలన్నారు. రాహుల్ గాంధీ తక్షణమే పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని, పూర్తి స్థాయిలో బాధ్యతలను స్వీకరించాలని చెప్పారు. ఆయన అధ్యక్షుడైతే తన బృందాన్ని తయారు చేసుకోగలుగుతారని, అప్పుడు పునరుజ్జీవనాన్ని చూడగలుగుతామని చెప్పారు. పార్టీ నిర్లక్ష్యానికి గురైందన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఏఐసీసీని ప్రక్షాళన చేయలేదన్నారు. ఓటములు ఎదురైన తర్వాత అయినా రాష్ట్రాల ఇన్‌ఛార్జులను మార్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరాజయాల తర్వాత కూడా పార్టీలో జవాబుదారీతనం ఉండటం లేదన్నారు. రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం ఉందని, అయితే కాంగ్రెస్‌కు తనపై తనకు నమ్మకం లేదని, ఇది యథార్థమని చెప్పారు. విశ్వాసం విషయంలో పార్టీలో సంక్షోభం ఉందన్నారు. దీని నుంచి తాము బయటపడవలసి ఉందని తెలిపారు.
nation
1,924
25-11-2017 03:46:58
కలవారి ఊళ్లు
టౌన్‌షిప్‌లను సకల సౌకర్యాలతో డెవలప్  చేస్తున్నారు. ఏ చిన్న పని కోసం బయటకెళ్లాల్సిన పని లేదు. ఇంటి కొనుగోలుదారు, నిర్మాణ సమయంలోనే అభిరుచుల ప్రకారం ఆర్డరిస్తే పూర్తిస్థాయిలో ఉడ్‌వర్క్‌ పూర్తిచేయడంతో పాటు ఫర్నిచర్‌, ఏసీలు, ఫ్రిజ్‌, మోడ్యులర్‌ కిచెన్‌, సోలార్‌ తో సహా సమస్త సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. టౌన్‌షి్‌పలో నివసించేవారు ఏ చిన్న అవసరం కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్‌, ఫార్మసీ, పండ్లు, కూరగాయల దుకాణం మొదలు, మాల్‌, ప్లేగ్రౌండ్‌, క్లబ్‌హౌజ్‌, పార్క్‌, స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌... వంటి వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వసతులు టౌన్‌షిప్‌ సైజు దాని లగ్జరీ స్వభావాన్ని బట్టి మారుతున్నాయి.
business
11,158
22-04-2017 10:12:31
పాకిస్తాన్‌లో భారీగా లొంగిపోయిన మిలిటెంట్లు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని కల్లోలిత బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో భారీ సంఖ్యలో మిలిటెంట్లు లొంగిపోయారు. నిషేధానికి గురైన వివిధ సంస్థల నుంచి 430 మందికి పైగా.... తమ ఆయుధాలను అధికారులకు అప్పగించి లొంగిపోయారు. బలోచ్ రిపబ్లికన్ ఆర్మీ (బీఆర్ఏ), బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సహా ఇతర వేర్పాటువాద గ్రూపులు భద్రతా సంస్థలపై, సైనిక దళాలపై దాడులకు దిగినట్టు ఆరోపణలున్నాయి. చాలా విదేశీ సంస్థలు తమ ప్రావిన్స్‌లోని అమాయక ప్రజలను ప్రేరేపించి ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నాయని బలూచిస్తాన్ సీఎం సనావుల్లా జెహ్రీ ఆరోపించారు.  కాగా మిలిటెంట్లు జనజీవన స్రవంతిలోకి తిరిగిరావాలనే ఉద్దేశ్యంతో లొంగిపోయారనీ.. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పాకిస్తాన్ సదరన్ కమాండ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ అమిర్ రియాజ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 1500 మందికి పైగా మిలిటెంట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయారని మరో ఉన్నతాధికారి వెల్లడించారు.
nation
7,876
23-09-2017 10:29:05
దసరా కానుకగా చెర్రీ నటిస్తున్న రంగస్థలం 1985 మూవీ..
విలేజ్ బ్యాక్ గ్రౌండ్‌తో తెరకెక్కుతున్న మూవీ రంగస్థలం 1985. రామచరణ్ కెరీర్‌లోని ఇలాంటి సినిమా చేయడం తొలిసారి. అలాగే ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో అలరించనున్నారు. వినికిడి లోపం ఉన్న యువకుడిగా చెర్రీ నటించనున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుండటంతో.. దీని షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని ఈ నెల 30న దసరా పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేయనున్నట్టు సమాచారం.
entertainment
7,687
13-05-2017 14:47:50
కె.విశ్వనాథ్ సంచలన నిర్ణయం
శంకరాభరణం సినిమాలో హీరో వయసు చాలా పెద్దది. అయినా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. కథలన్నీ జీవితాల్లో నుంచే వస్తాయి. అలాంటి అపూర్వ కథలతో ఉన్నతాభిరుచికి అంకురార్పణ చేసిన అద్వితీయ దర్శకుడు కె.విశ్వనాథ్. ఆయన కృషికి నిదర్శనంగా ఆయన తీసిన ప్రతి చిత్రం నిలుస్తుంది. సాగరసంగమం, స్వర్ణకమలం, స్వాతిముత్యం, సప్తపది, స్వరాభిషేకం ఇలా ఎన్నో చిత్రాలు ఆయన సంకల్పానికి నిదర్శనంగా చెప్పొచ్చు. కానీ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న తర్వాత విశ్వనాథ్ చెప్పిన మాట సినీ జనాల్నే కాదు.. యావత్ ప్రేక్షక జనాన్ని షాక్‌కు గురి చేసింది.  ఓ కళా తపస్వి నుంచి వినలేని మాట. ఆయన అనకూడని మాటగా దీనిని పలువురు భావిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార స్వీకరణ అనంతరం తెలుగువారు ఓ సన్మాన సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ తెలుగు వారు తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం ఇచ్చారని, కానీ ఇప్పుడు తనకు సినిమాలు చూసేంత ఓపిక, కొత్తగా ఓ ఊహా ప్రపంచం సృష్టించే ఉత్సాహం లేదన్నారు. మీరు ఇస్తున్న ఈ ఆదరాభిమానాలు స్వీకరిస్తూ సగౌరవంగా వెనుదిరుగుతున్నాను.. ఇంకా నేను సినిమాలు చేయను అన్నారు. దీంతో జనం షాకయ్యారు. కళా సృష్టికి వయసు అడ్డంకి కానేకాదు. ఏది ఏమైనా ఇక సినిమాలు చేయను అనడం మాత్రం కళా తపస్వి తీసుకున్న తీవ్ర నిర్ణయంగానే ప్రేక్షకులు భావిస్తున్నారు.
entertainment
13,755
13-01-2017 02:10:36
బ్రిటన్‌ బాట.. ముళ్లబాట
అక్కడ భారీగా తగ్గిన భారత విద్యార్థులు లండన్‌: బ్రిటన్‌ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో.. అక్కడకు వెళ్లి చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2011 నుంచి ఇప్పటి వరకు 44 శాతం మేర విద్యార్థులు బ్రిటన్‌కు వెళ్లడం మానేశారు. గురువారం బ్రిటన్‌ ఉన్నత విద్యా గణాంకాల సంస్థ ఈ వివరాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. గతేడాది కన్నా ఈ ఏడాది బ్రిటన్‌లో చదివే భారత విద్యార్థుల సంఖ్య బాగా తగ్గినట్లు తేలింది. 2015-16లో బ్రిటన్‌ వెళ్లే భారత విద్యార్థులు 9 శాతం తగ్గారు. 2011 నుంచి పరిశీలిస్తే ఇలా తగ్గిన మొత్తం 44 శాతం. 2015-16లో కేవలం 13,150 మంది విద్యార్థులే ఇక్కడ ప్రవేశాలు పొందారు. ఇది 2011-12కన్నా తక్కువ. కాగా చైనా విద్యార్థులు పెరుగుతున్నారు.
nation
13,180
07-04-2017 12:00:50
పెద్దల సభలో గందరగోళం
న్యూఢిల్లీ: ఆల్వార్‌లో గో సంరక్షకుల పేరిట కొందరు వ్యక్తులు ఓ ముస్లిం వ్యక్తిని కొట్టిచంపిన ఘటనపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపించాలనీ... కేంద్రహోంమంత్రి పార్లమెంటులో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభను వాయిదావేయాలంటూ పట్టుపట్టడంతో... రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తోందనీ... కనీసం సభాధ్యక్షుడి స్థానాన్ని కూడా గౌరవించడంలేదని పేర్కొంటూ సభను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. విపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలు హోరెత్తించడంతో గందరగోళం నెలకొంది. కాగా ఆల్వార్ ఘటనను మతానికి ముడిపెట్టవద్దంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేస్తారని వెల్లడించారు. కాగా హోంమంత్రి ఇవాళే దీనిపై పార్లమెంటులో మాట్లాడాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి.
nation
10,248
27-09-2017 14:36:56
పవన్ ఫ్యాన్స్‌కు దసరా నిరాశనే మిగిల్చనుందా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ అంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. పవన్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతే ఇక ఆ సినిమా గురించిన ఊసే లేదు. దసరాకు సినిమా టైటిల్ రిలీజ్ అవుతుందన్న పుకారు బాగా షికారు చేసింది. కానీ అదేమీ ఉండదని తెలుస్తోంది. అసలు మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ కూడా రిలీజ్ అయ్యే సూచనలు కనిపించేలా లేవు. మూవీ యూనిట్ కూడా ఎలాంటి అనౌన్స్‌మెంట్ కూడా చెయ్యలేదు. దీంతో అభిమానులకు నిరాశ తప్పదనిపిస్తోంది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
entertainment
18,856
23-09-2017 03:37:17
పెద్ద నోట్ల రద్దు పనిలేని పని
 ఆర్థిక వ్యవస్థ పతనమౌతోంది!.. జీఎస్టీ వల్ల కూడా వృద్ధి తగ్గిందిమాజీ ప్రధాని మన్మోహన్‌ వ్యాఖ్యమొహాలీ, సెప్టెంబరు 22: పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. సాంకేతికంగా చూసినా, ఆర్థికంగా చూసినా నిజానికది పనిలేని పని అని వ్యాఖ్యానించారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 1990ల ఆర్థిక సంస్కరణల రూపకర్త అయిన మన్మోహన్‌సింగ్‌ ఇండియన్‌ బిజినెన్‌ స్కూల్‌ సమావేశంలో మాట్లాడారు. కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు తప్ప ఇంతవరకు ఏ నాగరక సమాజంలోనూ నోట్ల రద్దు ప్రక్రియ విజయం సాధించలేదన్నారు. ఆర్థిక వ్యవస్థలో 86 శాతం నగదును తీసేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలికంగా జీఎస్టీ లాభదాయకమే అయినప్పటికీ ఈ కష్టకాలంలో ఇబ్బందులు కోరితెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేటు పెట్టుబడులు 37 శాతం నుంచి 30 శాతానికి తగ్గిపోయాయన్నారు. ప్రపంచీకరణను అడ్డుకుంటానని ఎన్నికల సందర్భంగా ట్రంప్‌ చెప్పినప్పటికీ అమెరికా ప్రజల ప్రపంచీకరణ ఆకాంక్ష నిలబడుతుందని చెప్పారు. చైనా ప్రపంచీకరణకు ఎక్కువగా మద్దతు ఇస్తోందని తెలిపారు. అది వయగ్రా బూస్ట్‌: కపిల్‌ సిబల్‌బీజేపీకి మసీదులు, ప్రభుత్వాలు కూల్చడం వచ్చే తప్ప ఆర్థిక వ్యవస్థను నడపడం చేతకాదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కపిల్‌సిబల్‌ అన్నారు. మోదీ సర్కారు పేదల జీవితాలతో అడుకుంటోందని దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు నెట్టడానికి 50 వేల కోట్ల వయగ్రా బూస్ట్‌ అవసరమని ఇప్పటికి మోదీ సర్కారు గుర్తించిందని అన్నారు. ప్రైవేటీకరణ, స్పెక్ట్రం వేలం మొత్తం లెక్కలు తప్పడంతో బడ్జెట్‌కు 65 వేల కోట్ల లోటు ఏర్పడిందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ఎన్‌పీఏల విలువ రూ.8.8 కోట్లు ఉంటుందని తెలిపారు. తాము దిగిపోయే సమయానికి ఎన్‌పీఏల విలువ 2.5 కోట్లు ఉండేదన్నారు. నోట్ల రద్దు లక్ష్యంనెరవేరింది: జైట్లీనోట్ల రద్దు పెద్ద కుదుపని, దాని ప్రధాన లక్ష్యాలన్నీ సాధించామని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. నగదు లావాదేవీలు తగ్గాయని, పన్ను ఆదాయం పెరిగిందని వివరించారు. నగదు వెనక్కి తీసుకోవడం తమ ప్రధాన ఉద్దేశం కాదన్నారు. చీకటి గదుల్లో మగ్గుతున్న డబ్బును చెలామణిలోకి తేవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
nation
8,262
10-12-2017 09:37:50
అంబానీ పార్టీలో ఐశ్వర్య మెరుపు... ఆమె డ్రెస్ ఖరీదు తెలిస్తే..
బిజినెస్‌మ్యాన్ ముఖేష్ అంబానీ ఏర్పాటు చేసిన ఒక పార్టీకి బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ పార్టీలో ఐశ్వర్యరాయ్ ఎల్లో కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ డ్రెస్ ఖరీదు రూ. 3.7 లక్షలు. భర్త అభిషేక్ బచ్చన్‌తో పాటు ఐశ్వర్య ఈ పార్టీకి హాజరయ్యారు. స్టయిలిష్ట్ ఆస్థా శర్మ ఐశ్వర్యకు గార్జియస్ లుక్‌నిచ్చారు. ఐశ్వర్య ధరించిన ఈ డ్రెస్‌ను 85 శాతం పాలిస్టర్, 15 శాతం సిల్క్‌తో రూపొందించారు. టక్సెడో కంపెనీ తయారుచేసిన ఈ డ్రెస్‌ను బాల్‌రూమ్ గౌన్ అంటారు. ఫ్యాషన్ డిజైనర్ అలెక్సిస్ మాబిల్లే ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు. పార్టీ జరిగిన రోజు రాత్రి ఐశ్వర్య ఫొటోను స్టయిలిష్ ఆస్థా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది.
entertainment
6,956
10-05-2017 18:09:58
ఎన్టీఆర్ అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్!
పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం రెండు అద్భుతమైన కానుకలను సిద్ధం చేస్తున్నారట యంగ్‌ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో ఆకట్టుకోవడంతో రాబోయే ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు అభిమానులు. మే 20న తన పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ మూవీ ఫస్ట్ లుక్‌ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట తారక్. అంతేకాదు ఈ సింగిల్ పోస్టర్‌లోనే ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు క్యారెక్టర్ల గెటప్‌ను మిక్స్ చేసి ఓ డిఫరెంట్ ఫస్ట్ లుక్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్‌తో పాటు.. మోషన్ పోస్టర్‌ కూడా రిలీజ్ కానుందట. ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉండబోతుందని చాన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. అయితే తారక్ ఎప్పుడూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మే 20న తన బర్త్‌డే సందర్భంగా త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది. లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్‌తోనే కాక, అప్‌కమింగ్ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనూ అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు యంగ్ టైగర్. మరి ఆ సర్‌ప్రైజ్ కోసం మే 20 వరకు వేచి చూడాల్సిందే.
entertainment
10,482
04-10-2017 20:12:14
బాలకృష్ణకు విలన్‌గా రక్తచరిత్ర హీరో
నటసింహ బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో నటించబోతున్నాడట. బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్‌ను విలన్‌గా ఫైనలైజ్ చేశారట.  రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర' రెండు వెర్షన్లలో పరిటాల రవిగా ప్రధాన పాత్రలో నటించిన వివేక్ ఓబెరాయ్. ఇప్పుడు బాలకృష్ణ 102వ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ ఏడాది తమిళంలో 'వివేగం'లో చిత్రంలోనూ వివేక్ విలన్‌గా నటించాడు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ సరసన నయనతార కథానాయిక. ఈ ఏడాది సంక్రాంతికి 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ రాబోయే సంక్రాంతికి ఈ సినిమాతో బరిలో దిగుతుండటం విశేషం. మరి ఈ సినిమాతో బాలయ్య ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
entertainment
9,571
09-09-2017 12:32:41
శిల్పాశెట్టితో డేరా హనీప్రీత్ దోస్తీ!
సిర్సా: గతంలో టాలీవుడ్ అగ్రహీరోలతో విజయవంతమైన సినిమాల్లో నటించిన హీరోయిన్ శిల్పాశెట్టి.. డేరా బాబా సహచరి హనీప్రీత్‌కు అత్యంత సన్నిహితురాలు. డేరా బాబా బంధువు భూపేంద్ర గోరా తాజాగా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. భూపేంద్ర చెప్పిన వివరాల ప్రకారం శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి పలుమార్లు హనీ ప్రీత్‌ను కలుసుకునేందుకు డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమంలో వారు గ్లామరస్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునే వారని భూపేంద్ర పేర్కొన్నారు.
entertainment
18,981
12-04-2017 15:22:42
మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జయ బచ్చన్
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తలను తీసుకొచ్చినవారికి బహుమతి ప్రకటించడంపై రాజ్యసభ సభ్యురాలు జయ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ మహిళలపై నేరాలు జరుగుతూండగా, కేంద్ర ప్రభుత్వం ఆవులను రక్షించేందుకు నిబద్ధత చూపుతోందని ఆరోపించారు. మహిళా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇటువంటి ప్రకటన చేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుత వాతావరణం మహిళలకు వ్యతిరేకంగా ఉందన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘మీరు గోవులను రక్షించగలరు కానీ, మహిళలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయ’’న్నారు. ఇదిలావుండగా, మమత బెనర్జీ తల తీసుకొచ్చినవారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించిన యోగేష్‌పై కేసు నమోదు చేసినట్లు అలీగఢ్ ఎస్ఎస్‌పీ రాజేశ్ కుమార్ పాండే ప్రకటించారు.
nation
12,914
16-05-2017 03:37:05
కేన్సర్‌ చికిత్సలో కాంతి మాయ
వాషింగ్టన్‌, మే 15: కేన్సర్‌ కణాల పీకమణిచేందుకు సులభంగా ఆచరించగలిగే వినూత్న విధానాన్ని రోచెస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో కాంతిని ఉపయోగించి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తారు. కేన్సర్‌ కణాల ఉనికిని తెలుసుకోవడానికి ఈ కాంతి ఉపయోగపడుతుంది. దీంతో కేన్సర్‌ కణాలను ఈ రోగనిరోధక కణాలు నిర్వీర్యం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా కేన్సర్‌ చికిత్సలో ఇమ్యునోథెరపీ, రేడియేషన్‌ లేదా కీమోథెరపీలను ఉపయోగిస్తారు. కేన్సర్‌ను ఎదుర్కోవడానికి శరీర రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించడాన్నే ఇమ్యునోథెరపీగా వ్యవహరిస్తారు. అయితే, ఈ ప్రేరణ కలిగించినపుడు రోగనిరోధక వ్యవస్థ మరీ అతిగా లేదా మరీ అల్పంగా స్పందించడం ఈ విధానంలో ఉన్న లోపమని, సరిగ్గా స్పందించేందుకు కాంతిని ఉపయోగించవచ్చని పరిశోధకులు తెలిపారు.
nation
3,898
02-05-2017 01:10:03
రైతన్న పేరుతో రెచ్చగొట్టే దీక్ష!
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణే కాదు, ఆంధ్రప్రదేశ్ రైతుల ఇళ్ళల్లో లక్ష్మీదేవి నడయాడాలి అనేదే మా లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మాతో కూడా కలిసి వస్తే రైతులకి మేలు చేసిన వాళ్ళవుతారు. కేవలం రాజకీయ కారణాలతో వ్యవహరిస్తే రైతులకు ఇంకాస్త అన్యాయం చేసిన వాళ్ళవుతారు. ఈవ్యాసం చదివే సమయానికి రైతుల కోసం అంటూ మీరు చేపట్టిన దీక్ష రెండో రోజుకి చేరుకుంటుందేమో. కొద్దిగా సమయం చేసుకొని ఈ వ్యాసం చదివి, మీ ఈ ధర్నా రైతులకు ఎందుకు ప్రయోజనకారి కాదో, ఒక్కసారి అవలోకనం చేసుకొని భవిష్యత్తులో ఆ విధంగా రైతులకి సహాయపడుతారని ఆశిస్తూ.... ఈ ప్రయత్నం. రైతు రుణమాఫీ, మిర్చి రైతుల కష్టాల పైనా ధర్నా చేస్త్తున్నాము అన్నారు. సంతోషం. కానీ రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ వుండి కూడా, దేశంలోనే, కేంద్ర పరిధిలో కాకుండా, ఒక రాష్ట్ర ప్రభుత్వం తను తానుగా, తన రాష్ట్ర రైతులకు బ్యాంకు రుణాలు రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మనదే అనే విషయం మీకు తెలుసు కదా! మరెందుకీ ధర్నా? ఒక్కొక్క రైతుకు రూ. 1,50,000/- ఆంధ్రప్రదేశ్ మాఫీ చేస్తే, పక్కనున్న తెలంగాణ, ఇటీవల ఉత్తరప్రదేశ్ కూడా, కేవలం లక్ష వరకే పరిమితం చేసిన సంగతి మీకు తెలుసు కదా? మరెందుకీ ధర్నా? యాభైవేల లోపు బ్యాంకు అప్పు వున్న సన్న, చిన్నకారు, రైతులకు ఏక మొత్తంలో వారి బ్యాంకు రుణాలన్నింటినీ మాఫీ చేసి పేద రైతులను ఆదుకొన్న రాష్ట్రం మనదే కదా? మరెందుకీ ధర్నా? విభజన తర్వాత రాష్ట్రం వున్న క్లిష్ట ఆర్థిక పరిస్థితులలో, రుణమాఫీ లాంటి పథకం అత్యంత కష్టమైనా, కనీసం రీషెడ్యూల్‌కి కూడా కేంద్రం అనుమతి ఇవ్వని తరుణంలో, రాష్ట్రమే ఆ మొత్తాన్ని తలకెత్తుకొని రూ. 24,000 కోట్లు రుణాన్ని మాఫీ చేయబూనడం సామాన్యమైన విషయమా? ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన వున్నవారు, మీకు తెలియదా? మరెందుకీ ధర్నా? సన్న చిన్న కారు రైతులకి కష్టం లేకుండా వారికి మొదట పూర్తి మాఫీ చేసి, అటు పిమ్మట, ప్రాధాన్యతా క్రమంలో మిగిలిన వారికి కంతుల వారీగా మాఫీ చేయబూనడం తప్పా? మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో వుంచుకొని చేసిన ఈ పనిని రైతులు హర్షించారు కదా! మూడు సంవత్సరాల తర్వాత కూడా, రుణమాఫీపైన, ఎందుకీ ధర్నా? ఇక మద్దతు ధరల విషయానికొస్తే, ఇప్పటి దాకా, దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా, కేంద్రమైనా, ఏ రాష్ట్రమైనా, మిర్చి లాంటి ఒక వాణిజ్య పంటకి, క్వింటాలుకి, రూ. 1500/- అదనపు మద్దతు ఇచ్చిన దాఖలా వుందా? మీకు తెలిసుంటే, మాకు చెప్పగలరు. మరెందుకీ ధర్నా? పోనీ మిర్చి పంటకి ఆంద్రప్రదేశ్‌లో ప్రభుత్వ సహాయంతో పాటుగా చెల్లిస్తున్న రూ. 8000 మార్కెట్ ధర, దేశంలో ఇంకెవ్వరైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, లేక కేంద్రప్రభుత్వమైనా ఇస్తోందా? మరెందుకీ ధర్నా? మీకు తెలిసే వుంటుంది, నిన్న ఖమ్మంలో రైతుల దాడుల తర్వాత కూడా, తెలంగాణలో మిర్చి రైతుకి చెల్లించిన మార్కెట్ ధర, కేవలం రూ. 5900- మాత్రమే! ఖమ్మం నుంచి నూట యాభై కిలోమీటర్లు కూడా లేని గుంటూరు మిర్చి యార్డులో ఆంద్రప్రదేశ్ ధర రూ. 8000. ఇంకో పక్క రాష్ట్రం తమిళనాడులో మిర్చి రైతుకి ఇస్తుండేది 7000 రూపాయలు మాత్రమే. కర్ణాటకలో రూ. 7500,- మహారాష్ట్రలో రూ. 6500- మాత్రమే. దేశంలోనే అందరికంటే ఎక్కువ మిర్చి రైతులకి చెల్లిస్తున్న మన రాష్ట్రంలో ఎందుకీ ధర్నా? ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న పసుపును తీసుకోండి. మార్క్‌ఫెడ్‌ని రంగంలోకి దించి, రైతుకి క్వింటాలుకి రూ. 6500- ధర నిర్ణయించేలా కృషి చేసాము. ఇదే కాదు, మన రాష్ట్రంలో వరికి రూ. 1510- వస్తుంటే ప్రధాన వరి రాష్ట్రాల్లో ఎక్కడా అంత ధర రావటం లేదు. శెనగలు, మన రాష్ట్రంలో రూ. 9000- లెక్కన కొనుగోలు చేయబడుతుంటే, తెలంగాణలో రూ. 7900-, తమిళనాడులో, రూ. 5775-, కర్ణాటకలో 6500 రూపాయల- లెక్కన కొంటున్నారు. చివరికి తెలంగాణలో బాగా పండే పత్తిని కూడా, అక్కడ రూ. 4500 కొంటుంటే, మన రాష్ట్రంలో కొనుగోలు, రూ. 5500- పైనే వుంది. దేశంలో అందరి కంటే, ఎక్కువ ధరలను ఇస్తున్నప్పుడు, మరెందుకీ ధర్నా? ఇక విద్యుత్‌కు వద్దాం. మీ నాన్నగారి హయాంలో ఉచిత కరెంటు ఇచ్చినా, అది ఎనిమిది గంటలు కాదు కదా, నాలుగు గంటలు కూడా, నిరాటంకంగా వచ్చేది కాదన్న సంగతి మీకు తెలియంది కాదు. అటు పిమ్మట, వేసిన సర్‌ చార్జీలు, తదితరాలు సరేసరి. ఇప్పుడు డంకా భజాయించి, ఏడు గంటలు ఇస్తాము అని చెప్పిన మాటని నిజం చేస్తూ, నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నాము. వేసవి కాలం అయినా ఇప్పుడు కూడా కరెంటు నిరంతరాయంగా వస్తూనే వుంది. పంటలు ఎండిపోవటం లేదు. మరెందుకీ ధర్నా? నదుల అనుసంధానం చేసినందువలన గత ఏడాది కృష్ణా డెల్టాలో రెండున్నర కోట్ల బస్తాల ధాన్యం పండింది. ఈ సంవత్సరం మూడు కోట్ల బస్తాలు. కేవలం రెండేళ్లలో 6600 కోట్ల రూపాయల ఆదాయం. ఎలా? కేవలం పట్టి సీమ వలన!! ఖర్చెంతయ్యింది? మొత్తం రూ. 1300 కోట్లు. అందులో పోలవరం పూర్తయ్యాక తిరిగి వేరేచోట వాడుకోగలిగిన సామాగ్రి పోను నికర ఖర్చు కేవలం రూ. 650 కోట్లు. అంటే ఖర్చు పెట్టిందానికి రెండేళ్లలోనే పదింతలు లాభం. ఇది చంద్రబాబు ఎకనామిక్స్! మీకేమన్నా ఇంతకంటే మంచి ఎకనమిక్స్ పద్ధతి తెలిసుంటే చెప్పండి సర్, బాగుంటే, ఖచ్చితంగా పాటిస్తాము. మాకేమీ భేషజాలు లేవు. మీరేమో పట్టిసీమ బ్లండర్ అన్నారు. కృష్ణా డెల్టా రైతులేమో, దాని వలన వస్తున్న లాభాలు చూసి శబాష్ అంటున్నారు. ఇక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 140 టీఎంసీల నీరు పారిన రాయలసీమకు అర్థమైంది. అక్కడి రైతులకు గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు ఇచ్చి, రాయలసీమకు కృష్ణా జలాలు ఇస్తున్న లాభం అర్థం అయింది కాబట్టే, జై కొడుతున్నారు. ఇన్ని లాభాలు తెస్తుంటే, మరెందుకీ ధర్నా? పంట కుంటలు, రెయిన్ గన్లు, త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణం, సాంకేతికతతో, మత్స్య పరిశ్రమలో దేశంలోనే మొదటి స్థానం, ఎరువులు, విత్తనాల కొరత కుండా చేయటం, చెరువుల కట్టలను, పటిష్ట పరచటం, లక్షలాది భూసార పరీక్షలు, రైతులకు సహాయకారిగా, 6000మంది ఎంపీఈవోల నియామకం, ఇవన్నీ మీకు కనపడలేదా? మరెందుకీ ధర్నా? రూ. 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టలేదు అని ఇంకొక ఆరోపణ. ధరల స్థిరీకరణ కోసం నిధిని ఖర్చు చేయడం మార్కెట్ ఇంటర్వెన్షన్‌లో ఒక భాగం. డిమాండ్, సరఫరాను, బ్యాలెన్స్ చేస్తూ, ధరను మనము అనుకొన్న స్థాయికి తేవడం అనేది వ్యవసాయ ఆర్థిక శాస్త్రం వాల్యూ చెయిన్ సిద్ధాంతం. ఆ నేపథ్యంలోనే, మొన్న, శెనగలు, నిన్న మిర్చి, నేడు, పసుపు, రేపు ఇంకేమన్నా వస్తే, ఆ పంట, దేనికైనా రైతుకి తగిన ధర తెచ్చే బాధ్యత మాదే. పోనీ, మీ పార్టీ ఏలుబడిలో ఇంతకన్నా బాగా చేసిన దాఖలాలు ఉన్నాయా? 2009లో కేంద్రం ఇచ్చిన రూ. 900, రూ. 930-లకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఎఫ్‌సీఐ కొనుగోలు చేయని కారణాన రైతులు మద్దతు ధర కన్నా తక్కువకి అమ్మలేక, మరుసటి సంవత్సరంలో క్రాప్ హాలిడేకు వచ్చిన మాట వాస్తవమే కదా! లెవీ ధాన్యసేకరణ కోసం గోడౌన్లు లేవన్నారు. అప్పట్లో. వున్న ఇతర రాష్ట్రాల సరుకుని ఖాళీ చేయించలేకపోయారు. ఇప్పుడు అలాంటి మాటలు ఎక్కడన్నా వినిపిస్తున్నాయా? మరెందుకీ ధర్నా?! ఈ రోజు నుంచి రైతు ఆత్మహత్యలు వుండవు అని వైఎస్ఆర్ గారు, 2004, మేలో ప్రమాణ స్వీకారంలో చెప్పారు. మరి అప్పట్లో 14,000 మంది రైతులు ఆత్మహత్య అని కేంద్రం లెక్కలు చేప్తోంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా? మరెందుకీ ధర్నా? రైతులకు రుణమాఫీ చేస్తే, బ్యాంకులు నష్టపోతాయని, ఫిబ్రవరి 2, 2008న స్వర్గీయ వైఎస్ఆర్ గారు కేంద్రానికి లేఖ రాసారు కదా! ఆ తోవలోనే, మీరు కూడా, మీ మ్యానిఫెస్టోలో రైతులకి రుణమాఫీ అంశం పెట్టడానికి ససేమిరా అన్నారు కదా? మరి ఇప్పుడు మేము చేస్తున్న రుణమాఫీ తక్కువ అనే నైతిక అర్హత మీకెక్కడ వుంది? ఆసలు రుణమాఫీనే వద్దు అన్న మీరు, ఈ ధర్నా ఎందుకు చేస్తున్నట్టు? ఎరువుల, విత్తనాల కోసం రోడ్దేక్కిన రైతులపై లాఠీ చార్జీ చేసారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు వాటిని సమయానికి మేమిస్తుంటే, మీరేమో ధర్నా చేస్తారు. ఇదెక్కడి ధర్నా? కృష్ణానదిపై మిగులు జలాలు కోరబోమని బ్రిజేష్ ట్రిబ్యునల్‌కి లేఖ ఇచ్చారు. గోదావరిపై బాబ్లీతో సహా 12 ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపలేదు. జలయజ్ఞంలో భాగంగా వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక ఎకరానికైతే కూడా నీళ్ళు రాలేదు. ఆ ప్రాజెక్టులు ఇప్పుడు మేము పూర్తి చేస్తుంటే మాత్రం మీరు ధర్నాలు చేస్తారు. ఇదెక్కడి న్యాయం అండీ? ప్రాజెక్టుల హెడ్ వర్క్ పనులు లేకుండా, కాల్వలపై స్ట్రక్చర్లు లేకుండా జలయజ్ఞంలో మట్టి పనులు చేసారు. ఇప్పుడు మేము వాటన్నింటినీ ఒక్కొకటిగా, పట్టిసీమ, ముచ్చుమర్రి, తోటపల్లి, అంటూ పూర్తిచేస్తుంటే, మీరేమో ధర్నా చేస్తారు. ఇదెక్కడి చోద్యం? పన్నెండేళ్ళ నుంచీ వున్న, వంశధార, గండికోట ప్రాజెక్టుల భూములు కోల్పోయిన రైతులకు పరిహారం మీ ప్రభుత్వాలు ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా, వేల కోట్లుగా, రైతులకి పరిహారం ఇచ్చాము. కానే మీరేమో ధర్నాలు చేస్తారు! ఇదెక్కడి అన్యాయం మాస్టారు? మీకు జవాబు చెప్పే శక్తి వుంటే ప్రశ్నలైతే వందలు వున్నాయి. మేమేదో ఇప్పటికే రైతుకి అన్నీ చేసేసామని చెప్పటం లేదు. రుణమాఫీ కూడా, పాతాళంలోకి పడిపోయిన రైతుకి ఒక చిన్న ఉపశమనం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా వుంది. చేస్తున్నాము కూడా. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణే కాదు, ఆంధ్రప్రదేశ్ రైతుల ఇళ్ళల్లో కూడా లక్ష్మీదేవి నడయాడాలి అనేదే మా లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మాతో కూడా కలిసి వస్తే రైతులకి మేలు చేసిన వాళ్ళవుతారు. కేవలం రాజకీయ కారణాలతో వ్యవహరిస్తే రైతులకు ఇంకాస్త అన్యాయం చేసిన వాళ్ళవుతారు. ఈ వ్యాసంలోని ‘స్పిరిట్’ని అవలోకిస్తారని ఆశిస్తూ....నీలయపాలెం విజయ్ కుమార్తెలుగుదేశం పార్టీ  రైతు రుణమాఫీ, మిర్చి రైతుల కష్టాల పైనా ధర్నా చేస్త్తున్నాము అన్నారు. సంతోషం. కానీ రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ వుండి కూడా, దేశంలోనే, కేంద్ర పరిధిలో కాకుండా, ఒక రాష్ట్ర ప్రభుత్వం తను తానుగా, తన రాష్ట్ర రైతులకు బ్యాంకు రుణాలు రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మనదే అనే విషయం మీకు తెలుసు కదా! మరెందుకీ ధర్నా? ఒక్కొక్క రైతుకు రూ. 1,50,000/- ఆంధ్రప్రదేశ్ మాఫీ చేస్తే, పక్కనున్న తెలంగాణ, ఇటీవల ఉత్తరప్రదేశ్ కూడా, కేవలం లక్ష వరకే పరిమితం చేసిన సంగతి మీకు తెలుసు కదా? మరెందుకీ ధర్నా? యాభైవేల లోపు బ్యాంకు అప్పు వున్న సన్న, చిన్నకారు, రైతులకు ఏక మొత్తంలో వారి బ్యాంకు రుణాలన్నింటినీ మాఫీ చేసి పేద రైతులను ఆదుకొన్న రాష్ట్రం మనదే కదా? మరెందుకీ ధర్నా? విభజన తర్వాత రాష్ట్రం వున్న క్లిష్ట ఆర్థిక పరిస్థితులలో, రుణమాఫీ లాంటి పథకం అత్యంత కష్టమైనా, కనీసం రీషెడ్యూల్‌కి కూడా కేంద్రం అనుమతి ఇవ్వని తరుణంలో, రాష్ట్రమే ఆ మొత్తాన్ని తలకెత్తుకొని రూ. 24,000 కోట్లు రుణాన్ని మాఫీ చేయబూనడం సామాన్యమైన విషయమా? ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన వున్నవారు, మీకు తెలియదా? మరెందుకీ ధర్నా? సన్న చిన్న కారు రైతులకి కష్టం లేకుండా వారికి మొదట పూర్తి మాఫీ చేసి, అటు పిమ్మట, ప్రాధాన్యతా క్రమంలో మిగిలిన వారికి కంతుల వారీగా మాఫీ చేయబూనడం తప్పా? మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో వుంచుకొని చేసిన ఈ పనిని రైతులు హర్షించారు కదా! మూడు సంవత్సరాల తర్వాత కూడా, రుణమాఫీపైన, ఎందుకీ ధర్నా? ఇక మద్దతు ధరల విషయానికొస్తే, ఇప్పటి దాకా, దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా, కేంద్రమైనా, ఏ రాష్ట్రమైనా, మిర్చి లాంటి ఒక వాణిజ్య పంటకి, క్వింటాలుకి, రూ. 1500/- అదనపు మద్దతు ఇచ్చిన దాఖలా వుందా? మీకు తెలిసుంటే, మాకు చెప్పగలరు. మరెందుకీ ధర్నా? పోనీ మిర్చి పంటకి ఆంద్రప్రదేశ్‌లో ప్రభుత్వ సహాయంతో పాటుగా చెల్లిస్తున్న రూ. 8000 మార్కెట్ ధర, దేశంలో ఇంకెవ్వరైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, లేక కేంద్రప్రభుత్వమైనా ఇస్తోందా? మరెందుకీ ధర్నా? మీకు తెలిసే వుంటుంది, నిన్న ఖమ్మంలో రైతుల దాడుల తర్వాత కూడా, తెలంగాణలో మిర్చి రైతుకి చెల్లించిన మార్కెట్ ధర, కేవలం రూ. 5900- మాత్రమే! ఖమ్మం నుంచి నూట యాభై కిలోమీటర్లు కూడా లేని గుంటూరు మిర్చి యార్డులో ఆంద్రప్రదేశ్ ధర రూ. 8000. ఇంకో పక్క రాష్ట్రం తమిళనాడులో మిర్చి రైతుకి ఇస్తుండేది 7000 రూపాయలు మాత్రమే. కర్ణాటకలో రూ. 7500,- మహారాష్ట్రలో రూ. 6500- మాత్రమే. దేశంలోనే అందరికంటే ఎక్కువ మిర్చి రైతులకి చెల్లిస్తున్న మన రాష్ట్రంలో ఎందుకీ ధర్నా? ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న పసుపును తీసుకోండి. మార్క్‌ఫెడ్‌ని రంగంలోకి దించి, రైతుకి క్వింటాలుకి రూ. 6500- ధర నిర్ణయించేలా కృషి చేసాము. ఇదే కాదు, మన రాష్ట్రంలో వరికి రూ. 1510- వస్తుంటే ప్రధాన వరి రాష్ట్రాల్లో ఎక్కడా అంత ధర రావటం లేదు. శెనగలు, మన రాష్ట్రంలో రూ. 9000- లెక్కన కొనుగోలు చేయబడుతుంటే, తెలంగాణలో రూ. 7900-, తమిళనాడులో, రూ. 5775-, కర్ణాటకలో 6500 రూపాయల- లెక్కన కొంటున్నారు. చివరికి తెలంగాణలో బాగా పండే పత్తిని కూడా, అక్కడ రూ. 4500 కొంటుంటే, మన రాష్ట్రంలో కొనుగోలు, రూ. 5500- పైనే వుంది. దేశంలో అందరి కంటే, ఎక్కువ ధరలను ఇస్తున్నప్పుడు, మరెందుకీ ధర్నా? ఇక విద్యుత్‌కు వద్దాం. మీ నాన్నగారి హయాంలో ఉచిత కరెంటు ఇచ్చినా, అది ఎనిమిది గంటలు కాదు కదా, నాలుగు గంటలు కూడా, నిరాటంకంగా వచ్చేది కాదన్న సంగతి మీకు తెలియంది కాదు. అటు పిమ్మట, వేసిన సర్‌ చార్జీలు, తదితరాలు సరేసరి. ఇప్పుడు డంకా భజాయించి, ఏడు గంటలు ఇస్తాము అని చెప్పిన మాటని నిజం చేస్తూ, నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నాము. వేసవి కాలం అయినా ఇప్పుడు కూడా కరెంటు నిరంతరాయంగా వస్తూనే వుంది. పంటలు ఎండిపోవటం లేదు. మరెందుకీ ధర్నా? నదుల అనుసంధానం చేసినందువలన గత ఏడాది కృష్ణా డెల్టాలో రెండున్నర కోట్ల బస్తాల ధాన్యం పండింది. ఈ సంవత్సరం మూడు కోట్ల బస్తాలు. కేవలం రెండేళ్లలో 6600 కోట్ల రూపాయల ఆదాయం. ఎలా? కేవలం పట్టి సీమ వలన!! ఖర్చెంతయ్యింది? మొత్తం రూ. 1300 కోట్లు. అందులో పోలవరం పూర్తయ్యాక తిరిగి వేరేచోట వాడుకోగలిగిన సామాగ్రి పోను నికర ఖర్చు కేవలం రూ. 650 కోట్లు. అంటే ఖర్చు పెట్టిందానికి రెండేళ్లలోనే పదింతలు లాభం. ఇది చంద్రబాబు ఎకనామిక్స్! మీకేమన్నా ఇంతకంటే మంచి ఎకనమిక్స్ పద్ధతి తెలిసుంటే చెప్పండి సర్, బాగుంటే, ఖచ్చితంగా పాటిస్తాము. మాకేమీ భేషజాలు లేవు. మీరేమో పట్టిసీమ బ్లండర్ అన్నారు. కృష్ణా డెల్టా రైతులేమో, దాని వలన వస్తున్న లాభాలు చూసి శబాష్ అంటున్నారు. ఇక చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 140 టీఎంసీల నీరు పారిన రాయలసీమకు అర్థమైంది. అక్కడి రైతులకు గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు ఇచ్చి, రాయలసీమకు కృష్ణా జలాలు ఇస్తున్న లాభం అర్థం అయింది కాబట్టే, జై కొడుతున్నారు. ఇన్ని లాభాలు తెస్తుంటే, మరెందుకీ ధర్నా? పంట కుంటలు, రెయిన్ గన్లు, త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణం, సాంకేతికతతో, మత్స్య పరిశ్రమలో దేశంలోనే మొదటి స్థానం, ఎరువులు, విత్తనాల కొరత కుండా చేయటం, చెరువుల కట్టలను, పటిష్ట పరచటం, లక్షలాది భూసార పరీక్షలు, రైతులకు సహాయకారిగా, 6000మంది ఎంపీఈవోల నియామకం, ఇవన్నీ మీకు కనపడలేదా? మరెందుకీ ధర్నా? రూ. 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టలేదు అని ఇంకొక ఆరోపణ. ధరల స్థిరీకరణ కోసం నిధిని ఖర్చు చేయడం మార్కెట్ ఇంటర్వెన్షన్‌లో ఒక భాగం. డిమాండ్, సరఫరాను, బ్యాలెన్స్ చేస్తూ, ధరను మనము అనుకొన్న స్థాయికి తేవడం అనేది వ్యవసాయ ఆర్థిక శాస్త్రం వాల్యూ చెయిన్ సిద్ధాంతం. ఆ నేపథ్యంలోనే, మొన్న, శెనగలు, నిన్న మిర్చి, నేడు, పసుపు, రేపు ఇంకేమన్నా వస్తే, ఆ పంట, దేనికైనా రైతుకి తగిన ధర తెచ్చే బాధ్యత మాదే. పోనీ, మీ పార్టీ ఏలుబడిలో ఇంతకన్నా బాగా చేసిన దాఖలాలు ఉన్నాయా? 2009లో కేంద్రం ఇచ్చిన రూ. 900, రూ. 930-లకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఎఫ్‌సీఐ కొనుగోలు చేయని కారణాన రైతులు మద్దతు ధర కన్నా తక్కువకి అమ్మలేక, మరుసటి సంవత్సరంలో క్రాప్ హాలిడేకు వచ్చిన మాట వాస్తవమే కదా! లెవీ ధాన్యసేకరణ కోసం గోడౌన్లు లేవన్నారు. అప్పట్లో. వున్న ఇతర రాష్ట్రాల సరుకుని ఖాళీ చేయించలేకపోయారు. ఇప్పుడు అలాంటి మాటలు ఎక్కడన్నా వినిపిస్తున్నాయా? మరెందుకీ ధర్నా?! ఈ రోజు నుంచి రైతు ఆత్మహత్యలు వుండవు అని వైఎస్ఆర్ గారు, 2004, మేలో ప్రమాణ స్వీకారంలో చెప్పారు. మరి అప్పట్లో 14,000 మంది రైతులు ఆత్మహత్య అని కేంద్రం లెక్కలు చేప్తోంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కదా? మరెందుకీ ధర్నా? రైతులకు రుణమాఫీ చేస్తే, బ్యాంకులు నష్టపోతాయని, ఫిబ్రవరి 2, 2008న స్వర్గీయ వైఎస్ఆర్ గారు కేంద్రానికి లేఖ రాసారు కదా! ఆ తోవలోనే, మీరు కూడా, మీ మ్యానిఫెస్టోలో రైతులకి రుణమాఫీ అంశం పెట్టడానికి ససేమిరా అన్నారు కదా? మరి ఇప్పుడు మేము చేస్తున్న రుణమాఫీ తక్కువ అనే నైతిక అర్హత మీకెక్కడ వుంది? ఆసలు రుణమాఫీనే వద్దు అన్న మీరు, ఈ ధర్నా ఎందుకు చేస్తున్నట్టు? ఎరువుల, విత్తనాల కోసం రోడ్దేక్కిన రైతులపై లాఠీ చార్జీ చేసారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు వాటిని సమయానికి మేమిస్తుంటే, మీరేమో ధర్నా చేస్తారు. ఇదెక్కడి ధర్నా? కృష్ణానదిపై మిగులు జలాలు కోరబోమని బ్రిజేష్ ట్రిబ్యునల్‌కి లేఖ ఇచ్చారు. గోదావరిపై బాబ్లీతో సహా 12 ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపలేదు. జలయజ్ఞంలో భాగంగా వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక ఎకరానికైతే కూడా నీళ్ళు రాలేదు. ఆ ప్రాజెక్టులు ఇప్పుడు మేము పూర్తి చేస్తుంటే మాత్రం మీరు ధర్నాలు చేస్తారు. ఇదెక్కడి న్యాయం అండీ? ప్రాజెక్టుల హెడ్ వర్క్ పనులు లేకుండా, కాల్వలపై స్ట్రక్చర్లు లేకుండా జలయజ్ఞంలో మట్టి పనులు చేసారు. ఇప్పుడు మేము వాటన్నింటినీ ఒక్కొకటిగా, పట్టిసీమ, ముచ్చుమర్రి, తోటపల్లి, అంటూ పూర్తిచేస్తుంటే, మీరేమో ధర్నా చేస్తారు. ఇదెక్కడి చోద్యం? పన్నెండేళ్ళ నుంచీ వున్న, వంశధార, గండికోట ప్రాజెక్టుల భూములు కోల్పోయిన రైతులకు పరిహారం మీ ప్రభుత్వాలు ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా, వేల కోట్లుగా, రైతులకి పరిహారం ఇచ్చాము. కానే మీరేమో ధర్నాలు చేస్తారు! ఇదెక్కడి అన్యాయం మాస్టారు? మీకు జవాబు చెప్పే శక్తి వుంటే ప్రశ్నలైతే వందలు వున్నాయి. మేమేదో ఇప్పటికే రైతుకి అన్నీ చేసేసామని చెప్పటం లేదు. రుణమాఫీ కూడా, పాతాళంలోకి పడిపోయిన రైతుకి ఒక చిన్న ఉపశమనం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా వుంది. చేస్తున్నాము కూడా. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణే కాదు, ఆంధ్రప్రదేశ్ రైతుల ఇళ్ళల్లో కూడా లక్ష్మీదేవి నడయాడాలి అనేదే మా లక్ష్యం. ఈ లక్ష్యసాధనలో మాతో కూడా కలిసి వస్తే రైతులకి మేలు చేసిన వాళ్ళవుతారు. కేవలం రాజకీయ కారణాలతో వ్యవహరిస్తే రైతులకు ఇంకాస్త అన్యాయం చేసిన వాళ్ళవుతారు. ఈ వ్యాసంలోని ‘స్పిరిట్’ని అవలోకిస్తారని ఆశిస్తూ....నీలయపాలెం విజయ్ కుమార్తెలుగుదేశం పార్టీ
editorial
1,304
26-06-2017 00:45:17
రిస్క్‌లేని రాబడులకు వాల్యూఫండ్స్‌
పెట్టుబడులకు ఢోకా లేకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులు ఆశిస్తున్నారా? అయితే వాల్యూ ఫండ్స్‌పై దృష్టి పెట్టండి. ఇంతకీ వాల్యూ ఫండ్‌ అంటే ఏమిటి? వాటిలో పెట్టుబడులు ఎలా పెట్టాలో పిపిఎ్‌ఫఎఎస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చైర్మన్‌, సిఇఒ నీల్‌ పరాగ్‌ పారిఖ్‌ వివరిస్తున్నారు.వాల్యూ ఇన్వెస్టింగ్‌ఏదైనా ఒక వస్తువు లేదా ఆస్తి విలువ దాని యజమానికి తెలుస్తుంది. అయితే ఇతర వ్యక్తులకు ఆ విలువపై వేరే అభిప్రాయం ఉండొచ్చు. వాల్యూ ఇన్వెస్టింగ్‌కూ ఇది వర్తిస్తుంది. నిజానికి వాల్యూ ఇన్వెస్టింగ్‌ అనేది ఒక పెట్టుబడి విధానం. అసలు విలువ కంటే తక్కువ ధర దగ్గర ట్రేడవుతున్న షేర్లలో పెట్టుబడి పెట్టడాన్నే వాల్యూ ఇన్వెస్టింగ్‌ అంటారు. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనుగోలు చేసే ముందు ‘మార్జిన్‌ ఆఫ్‌ సేఫ్టీ’కి ఢోకా లేకుండా చూసుకుంటారు. ఆ షేరు మార్కెట్‌ విలువ-అసలు విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్నే ‘మార్జిన్‌ ఆఫ్‌ సేఫ్టీ’ అంటారు. మార్కెట్‌లో ఏవైనా ఆటుపోట్లు ఎదురైనపుడు కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల ఆదరణ కోల్పోతాయి. అపుడు వాటి ధర అవసరానికి మించి పడిపోతుంది. వాల్యూ ఇన్వెస్టర్లకు ఇదో అవకాశం. షేరు మార్కెట్‌ ధర, అసలు ధర కంటే తక్కువగా ఉందని భావిస్తే వాల్యూ ఇన్వెస్టర్లు రంగ ప్రవేశం చేసి లాభాల కోసం ఆ షేర్లు కొనుగోలు చేస్తుంటారు. రెండు రకాలువాల్యూ ఇన్వెస్టింగ్‌కు సంబంధించి బెంజమిన్‌ గ్రాహం, వారెన్‌ బఫెట్‌ పేరుతో రెండు రకాల భావనలు ఉన్నాయి. ఇందులో బెంజమిన్‌ గ్రాహమ్‌ సిద్ధాంతాన్ని ‘సిగాల్‌ బట్‌’ విధానంగా చెబుతారు. స్పష్టంగా చెప్పాలంటే .... ఇది సగం కాల్చి పారేసిన సిగరెట్‌ను, ఫ్రీగా రెండు మూడు దమ్ములు పీకేందుకు ఏరుకోవడం లాంటిది. ఏదైనా ఒక వ్యాపారం బాగోక ఆ రంగానికి చెందిన కంపెనీల షేర్లు భారీగా తగ్గినపుడు, ఇక పెద్దగా తగ్గే అవకాశం లేదని భావించినపుడు వాల్యూ ఇన్వెస్టర్లు ఇదే పద్దతిలో ఆ కంపెనీల షేర్లను చౌకగా కొనుగోలు చేస్తుంటారు. వారెన్‌ బఫెట్‌ పద్దతిలో మాత్రం...ఏదైనా మంచి బిజినెస్‌కు సంబంధించి పోటీ కంపెనీలను మించి రాబడులు పెంచుకుంటున్న కంపెనీల షేర్లు సముచిత ధరలో కొనుగోలు చేస్తారు. నేను ఈ తరహా వాల్యూ ఇన్వెస్టింగ్‌ను నమ్మే వ్యక్తిని. పరిశీలించాల్సిన విషయాలుమేనేజ్‌మెంట్‌, ఇదే రంగానికి చెందిన ఇతర కంపెనీలతో పోటీ విషంలో కంపెనీకి ఉన్న సౌలభ్యం, అప్పులు, అధిక డివిడెండ్ల రాబడులు, తక్కువ మూలధనం, ఈక్విటీపై అధిక రాబడులు వంటి విషయాల ఆధారంగా కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్‌ చేయాలి. ఇక్కడ ఆ కంపెనీల షేర్లు సముచిత ధరలో లభించడం అన్నిటి కంటే ముఖ్యం. కనీసం ఐదేళ్లకు మించి పెట్టుబడులు కదిలించకుండా ఉండే ఇన్వెస్టర్లు మాత్రమే ఈ తరహా పెట్టుబడులకు సాహసించాలి. గుర్తించడం ఎలా?అయితే ఇలాంటి కంపెనీల షేర్లను గుర్తించడం అంత తేలిక కాదు. బుర్రలకు పదును పెట్టి చాలా కష్టపడితేగానీ మార్కెట్‌లో ఇలాంటి కంపెనీల షేర్ల ఆచూకీ తెలియదు. ఈ పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటపుడు భయాలు, అత్యాశలను పూర్తిగా పక్కన పెట్టాలి. సాహసాలకు పోకుండా సహేతుకమైన వాస్తవాల ఆధారంగానే ఇక్కడ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. వాల్యూ ఫండ్స్‌వ్యక్తిగత ఇన్వెస్టర్లు ఈ పని చేయడం కష్టం. వారిలో చాలా మందికి ఇందుకు అవసరమైన పరిజ్ఞానమూ ఉండదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫర్‌ చేసే మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న వాల్యూ ఫండ్స్‌ను ఎంచుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఈ ఫండ్స్‌ పెట్టుబడుల నిర్ణయాలను నిపుణులైన మేనేజర్లు తీసుకుంటారు. ఈ ఫండ్స్‌లో ‘మార్జిన్‌ ఆఫ్‌ సేఫ్టీ’ సూత్రం ఆధారంగా పెట్టుబడులు పెడతారు. కాబట్టి వీటి పెట్టుబడుల్లో పెద్దగా ఆటు పోట్లుగానీ రిస్కుగానీ ఉండవు. మార్కెట్లు ఎక్కువ కాలం పాటు నిస్తేజంగా ఉన్నా వాల్యూ ఫండ్స్‌ పెట్టుబడులు విలువ పెద్దగా పడిపోయే అవకాశమూ ఉండదు. మార్కెట్‌ అప్‌ట్రెండ్‌లోకి వెళ్లిన వెంటనే ఈ ఫండ్స్‌ మేనేజర్లు కొన్ని పెట్టుబడులు అమ్మి క్యాష్‌ చేసుకుంటారు. అయితే మార్కెట్‌ అదే పనిగా అప్‌ట్రెండ్‌లో కొనసాగితే మాత్రం స్వల్ప కాలంలో ఈ ఫండ్స్‌పై రాబడులు తక్కువగా ఉంటాయి. ఓపిక, క్రమశిక్షణ ముఖ్యంవాల్యూ ఫండ్స్‌లో మంచి రాబడులు పొందాలంటే అటు ఫండ్‌ మేనేజర్లతో పాటు ఇన్వెస్టర్లకూ ఓర్పు, క్రమ శిక్షణ, మార్కెట్‌పై దీర్ఘ కాలిక అభిప్రాయం తప్పనిసరి. అవసరమైతే ఒక్కోసారి పెట్టుబడుల్లో కొంత నష్టానికీ సిద్ధపడి ఉండాలి. సాధారణంగా ఈ ఫండ్‌ మేనేజర్లు తాత్కాలికంగా మార్కెట్‌ ఆదరణ తగ్గిన రంగాలకు చెందిన మంచి కంపెనీలు, లేదా ఏదైనా కారణం వల్ల బాగా తక్కువ ధరలకు లభిస్తున్న కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఓపిక పట్టే ఇన్వెస్టర్లు మాత్రమే ‘వాల్యూ ఫండ్స్‌’ ఎంచుకోవాలి. వాల్యూ ఫండ్స్‌ కీలక లక్ష్యంకష్ట కాలంలో పెద్దగా నష్ట భయం లేకుండా దీర్ఘకాలంలో మదుపరులకు మంచి రాబడులు పంచడం వాల్యూ ఫండ్‌ ప్రధాన లక్ష్యం. ఆటు పోట్ల సమయంలోనూ ఎన్‌ఎవిలో పెద్దగా మార్పులులేకుండా నిలకడతో కూడిన రాబడులు మరో ప్రధాన లక్ష్యం. ఫండ్‌ మేనేజర్లు ఈ లక్ష్యాల సాధన కోసం గొర్రెల మందలా ఎడాపెడా షేర్లు కొనకుండా ఆచితూచి అత్యంత క్రమశిక్షణతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటారు. దీని వల్ల మార్కెట్లు తీవ్ర దిద్దుబాటుకులోనైనా ఇన్వెస్టర్ల పెట్టుబడులకు పెద్దగా నష్ట భయం ఉండదు. ‘పెట్టుబడులు నష్టపోకపోతే స్టాక్‌ మార్కెట్‌ యుద్ధంలో సగం గెలిసినట్టే’ అనేది వాల్యూ ఫండ్‌ మేనేజర్ల ప్రధాన పెట్టుబడి సూత్రం.  ప్రతి పైసా కూడబెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్దగా రిస్కు, ఆటుపోట్లు లేకుండా మంచి ఆస్తులు సృష్టించవచ్చని వాల్యూ ఫండ్స్‌ నమ్మకం. ఈ లక్ష్యాలు ఉన్న ఇన్వెస్టర్లు వాల్యూ ఫండ్స్‌పై దృష్టిపెట్టడం మంచిది.
business
8,602
29-07-2017 19:25:21
హీరో నవదీప్‌కు మరో షాక్
హైదరాబాద్‌: సినీ తారలను డ్రగ్స్‌ కేసు వెంటాడుతోంది. డ్రగ్స్ కేసు టాలీవుడ్‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఒకవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వీరికి బ్యాంక్ అధికారులు షాక్ ఇచ్చారు. సినీ నటులకు లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నవదీప్‌కు ఓ కార్పొరేట్ బ్యాంక్ షాకిచ్చింది. కారు లోను కోసం నవదీప్ రెండు రోజుల క్రితం ఓ కార్పొరేట్ బ్యాంక్‌లో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ బ్యాంక్ సిబ్బంది నవదీప్‌కు షాక్ ఇచ్చింది. డ్రగ్స్‌ కేసులో  సిట్ విచారిస్తున్న విషయాన్నితెలుసుకున్న బ్యాంకు అధికారులు లోను ఇవ్వడానికి నిరాకరించారు. డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్ విచారణ 24 తేదీన ముగిసింది. ఉదయం నుంచి దాదాపు 11 గంటల పాటు సిట్ అధికారులు నవదీప్‌ను ప్రశ్నించారు. జీషన్‌అలీ, కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా మళ్లీ విచారించారు. అవసరమైతే మరోసారి ఫోన్ చేస్తామని.. అప్పుడు విచారణకు రావాలని అధికారులు నవదీప్‌కు తెలిపిన విషయం తెలిసిందే. అయితే బ్లడ్ శ్యాంపిల్స్ ఇచ్చేందుకు నవదీప్ అంగీకరించలేదని సమాచారం.
entertainment
15,333
21-06-2017 20:49:47
వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యక్షమైన శశికళ
చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి వీకే శశికళ బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యక్షమయ్యారు. ఫిబ్రవరి 15 తర్వాత ఆమె కనిపించడం ఇదే ప్రథమం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో పరప్పన అగ్రహార జైలులో ప్రస్తుతం ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఫెరా ఉల్లంఘన కింద ఆమెపై నాలుగు కేసులు ఉండటంతో అభియోగాల నమోదు కోసం ఆర్థిక నేరాల కోర్టు ఆమెను బుధవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. రెండు దశాబ్దాలకు పైగా ఆమెపై ఉన్న ఈ కేసులపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. బెంగళూరు నుంచి తాను వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా విచారణను ఎదుర్కొంటానని శశికళ గత నెలలో విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆర్థిక నేరాల విచారణ కోర్టు అంగీకరించింది. దీంతో చెన్నైలోని వీడియో కాన్ఫరెన్స్ రూమ్‌ నుంచి శశికళను విచారించారు. అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఆర్థిక నేరాల కోర్టు-1) ఎ.జకీర్ హుస్సేన్, ఈడీ ప్రాసిక్యూటర్, జ్యూడిషియల్ అధికారికి సహకరించే కొద్దిమంది అధికారులను మినహా ఎవరినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులోకి అనుమతించలేదు. ఈ విచారణలో రెండు కేసుల్లో (ఫెరా ఉల్లంఘన) మేజిస్ట్రేట్ ఆరోపణలు నమోదు చేయగా, తక్కిన రెండు కోసుల్లో అభియోగాల నమోదుకు విచారణను జూలై 1కి వాయిదా వేశారు.
nation
8,257
04-11-2017 11:32:54
బిగ్‌బాస్‌ క్రేజ్‌తో మళ్లీ సినిమా ఛాన్స్‌లు వచ్చేస్తున్నాయట..?
టాలీవుడ్‌లో వెనకబడిన ఆ ఇద్దరు యంగ్ హీరోలూ.. తాజాగా ఒక రియాల్టీ షో తో వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరితో ఒక సినిమా చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట.. ఇంతకీ ఎవరా ఇద్దరూ...?          శివబాలాజీ.. నవదీప్… ఇద్దరూ టాలీవుడ్ లో తమ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు కానీ.. అంతగా రాణించలేకపోయారు. కొన్ని చిత్రాల్లో సహాయక పాత్రలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే వీరిద్దరికీ .. ఇటీవల కాలంలో బిగ్ బాస్ రియాల్టీ షోతో మంచి గుర్తింపు లభించింది. శివబాలాజీ అయితే ఈ షోలో ఏకంగా విజేతగా నిలిచాడు.              ఇంతకు ముందు రెండు మూడు టీవీ షోస్ నిర్వహించిన నవదీప్ బిగ్ బాస్ సక్సెస్ తో మళ్లీ సినిమాల ఆఫర్స్‌ను అందిపుచ్చుకుంటున్నాడు. శివబాలాజీ కూడా బిగ్ బాస్ షో అనంతరం.. కొన్ని సినిమాలకు తన అంగీకారం తెలిపాడు. ఇదిలా ఉంటే .. వీరిద్దరితోనూ ఒక సినిమా తీయడానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందట. ఆల్రెడీ వీరిద్దరూ 'చందమామ'లో హీరోలుగా నటించి మంచి పేరే తెచ్చుకున్నారు.           కథ వినగానే... ఈ మూవీ చేయడానికి ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. వెండితెరపై అంతగా రాని గుర్తింపును బుల్లి తెరమీద తెచ్చుకున్నవీరిద్దరూ మళ్లీ వెండితెరమీద తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడం విచిత్రంగా అనిపిస్తున్నా.. బిగ్ బాస్ క్రేజ్ తో వీళ్ళు మరోసారి ప్రేక్షకులకు దగ్గరవుతారని అనుకుంటున్నారు సినీ జనం. మరి ఈ 'చందమామ' హీరోలకు ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
entertainment
7,754
05-11-2017 18:26:42
నటనకు గుడ్‌బై యోచనలో సమంత..!
పెళ్లి తరువాత సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న ఆ అందాల భామ. ఈ విషయంలో ముందుగానే ఒక నిర్ణయం కూడా తీసుకుందట. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుండగానే యంగ్ హీరో నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఇంటి కోడలిగా మారిపోయింది సమంత. అయితే పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని ఈ క్రేజీ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. అక్కినేని ఫ్యామిలీ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పకపోవడంతో సమంత హవా మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందని సినీజనం భావిస్తున్నారు. అయితే పెళ్లి తరువాత సమంత ఎంతకాలం హీరోయిన్‌గా కొనసాగుతుందనే విషయంలో మాత్రం ఎవరికీ అంతగా స్పష్టత లేదు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు పూర్తయిన తరువాత సమంత మెయిన్ హీరోయిన్‌గానే సినిమాలు ఒప్పుకుంటుందా అనే అంశంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే పెళ్లి తరువాత ఎంతకాలం సినిమాల్లో కొనసాగాలనే విషయాన్ని ఈ అందాల భామ ముందుగానే నిర్ణయించుకుందట. ఫ్యామిలీ లైఫ్‌లోకి పూర్తి స్థాయిలో ఎంటరైతే మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమని భావించిన సమంత పెళ్లి తరువాత రెండేళ్లు మాత్రమే సినిమాల్లో కొనసాగాలని డిసైడయ్యిందట. ఈ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీకి సైతం సమంత ముందుగానే చెప్పేసిందని ఆమె సన్నిహితులు కూడా గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలసి హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ మ్యారీడ్ హీరోయిన్ మరో రెండు వారాల తరువాత తాను నటించాల్సిన సినిమాల షూటింగ్స్‌కు హాజరవుతుందని తెలుస్తోంది. ఏదేమైనా పెళ్లి తరువాత నటించే విషయంలో సమంత చాలా రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.
entertainment
1,580
10-10-2017 03:15:50
సిఎను పిజి కోర్సుగా గుర్తించండి
ఇంటర్మీడియట్‌కు డిగ్రీ హోదా : ప్రభుత్వాన్ని కోరిన ఐసిఎఐన్యూఢిల్లీ: చార్టెర్డ్‌ అకౌంటెన్సీ (సిఎ) ఫైనల్‌ కోర్సును పోస్టు గ్రాడ్యుయేట్‌ (పిజి) డిగ్రీగా, సిఎ ఇంటర్మీడియట్‌ ప్రోగ్రామ్‌ను డిగ్రీగా గుర్తించాలని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. 1984లోనే అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఎఐయు) డిగ్రీ తర్వాత సిఎ చేసిన వారిని కామర్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్లుగా గుర్తిస్తూ పిహెచ్‌డికి అనుమతించిన విషయాన్ని గుర్తు చేసింది. దేశంలోని 101 యూనివర్సిటీలు, ఆరు ఐఐఎంలు, రెండు ఐఐటిలు కూడా సిఎను పిజిగా గుర్తించి పిహెచ్‌డి ప్రవేశాలకు అనుమతిస్తున్నాయని తెలిపింది.
business
1,493
18-08-2017 01:52:41
ఏడాది కాలానికి బిఎస్‌ఎన్‌ఎల్‌ డేటా ఆఫర్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆరు నెలలు, ఏడాది కాలపరిమితితో బిఎ్‌సఎన్‌ఎల్‌ తన ప్రీపెయిడ్‌ కస్టమర్ల కోసం సరికొత్త డేటా ఆఫర్లను తెచ్చింది. బిఎ్‌సఎన్‌ఎల్‌ ఆన్‌లైన్‌ రీచార్జ్‌ పోర్టల్‌, బిఎ్‌సఎన్‌ఎల్‌ యాప్‌ ద్వారా మాత్రమే వీటిని పొందవచ్చని సంస్థ తెలిపింది. 1,197 రూపాయల డేటా స్పెషల్‌ టారిఫ్‌ ఓచర్‌తో రీచార్జ్‌ చేసుకుంటే 14 జిబి డేటా ఉచితంగా లభిస్తుంది. దీని కాలపరిమితి 365 రోజులు. 597 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటే 180 రోజుల కాలపరిమితితో 6జిబిల డేటా ఉచితంగా లభిస్తుందని బిఎ్‌సఎన్‌ఎల్‌ తెలిపింది.
business
6,605
13-06-2017 02:01:27
ఎన్టీఆర్‌తో అలా పిలిపించుకున్న అరుదైన వ్యక్తుల్లో సినారె ఒకరు
ఎన్టీఆర్‌తో సినారెకు ప్రత్యేక అనుబంధం చాలా మందికి తెలిసిందే. గీత రచయితగా ( ‘గులేబకావళి కథ’) అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్‌ ఆయనతో స్నేహబంధాన్ని చివరి వరకు కొనసాగించారు. అప్పటి మదరాసు (నేటి చెన్నై) రైల్వే స్టేషన్‌కు స్వయంగా వెళ్లి ‘స్వాగతం’ పలకడంలోనే ఎన్టీఆర్‌ ఆయనకిచ్చిన విలువ అవగతమవుతుంది. దీనిని సినారె అపూర్వంగా చెప్పుకునేవారు. సినిమాలో అన్ని పాటలు రాస్తాను తప్ప ఒకటి, అర రాసే ప్రసక్తి లేదన్న నిబంధనను ఎన్టీఆర్‌ మన్నించారు. మొత్తం పది పాటలను ఆయనతోనే రాయించారు.సినారె వాటిని పది రోజుల్లో రాశారు. గీత రచయితగా బీఎన్ రెడ్డి లాంటి దర్శకులు ఇచ్చిన అవకాశాన్ని మృదువుగా తిరస్కరించిన సినారె..ఎన్టీఆర్‌ ఆహ్వానాన్ని కాదనలేకపోయారు. అదే సమయంలో ఆయనా గీత రచనలో స్వేచ్ఛనిచ్చారు. అనంతరం కాలంలో ఎన్ని గీతాలు రాసినా ప్రతి సందర్భంలోనూ ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరాసాని’ పాటనే సినారె ప్రస్తావించేవారు. .సినారె సినీ ప్రస్థానంలో సంభాషణలు రాసిన రెండు చిత్రాలు (ఏకవీర్,అక్బర్‌ సలీం అనార్కలి)ఎన్టీఆర్‌ నటించినవే కావడం గమనార్హం. వాటిలో ఒకటి ఆయన సొంత చిత్రం. సినారెలోని విద్వత్‌ను ఎన్టీఆర్‌ చక్కగా వినియోగించుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా తెలుగు వాడకాన్ని ముమ్మరం చేసే ప్రయత్నంలో సినారె సలహాలు, సూచనలు ఇచ్చేవారు. హుస్సేన్ సాగర్‌ ట్యాంక్‌ బండ్‌పై ఆవిష్కృతమైన మహనీయుల విగ్రహాలు, వాటి శిలాఫలకాలపై రాయించిన కవితా పంక్తుల వెనుక సినారె సహకారం ఉందంటారు. ఎన్టీఆర్‌ మానస పుత్రిక ‘తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతిగా, సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. ఎన్టీఆర్‌తో ‘మా’ అని ఆత్మీయంగా పిలిపించుకున్న అరుదైన వ్యక్తుల్లో నారాయణరెడ్డి ఒకరు. సీనియర్‌ సముద్రాలను ఉద్దేశించి ‘మా ఆచార్యులు గారు’అని చెప్పినట్లే సినారెను ‘మా రెడ్డిగారు’ అని సంబోధించేవారు.
entertainment
8,362
23-04-2017 09:12:10
పవన్‌కల్యాణ్ వల్లే ప్రత్యేక హోదాకు మద్దతిచ్చా: సంపూర్ణేష్‌
 ‘హుద్‌హుద్‌ వచ్చి వెళ్లిన తర్వాత వైజాగ్‌ను చూసి మనసు చలించిపోయింది. అందుకే ఏమీ ఆలోచించకుండా లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాను. అయితే నిజానికి నా వద్ద అంత డబ్బు లేదు. నా స్నేహితుల వద్ద కూడా అంత ఎమౌంట్‌ లేదు. దాంతో రెండు వారాల టైమ్‌ తీసుకుని అప్పు చేసి ఆ డబ్బు సీఎంగారికి అందచేశా. అది పబ్లిసిటీ కోసం చేసింది కాదు.  అలాగే ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో పవన్‌కల్యాణ్‌గారి స్పీచ్‌ల ద్వారా నేను ఉత్తేజితుడనయ్యాను. అందుకే వైజాగ్‌ వస్తానని మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి వైజాగ్‌ వెళ్లాను. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో నన్ను అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరిలోని స్టేషన్‌లో నన్ను బంధించారు. నిజానికి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణానికి టికెట్‌ తీసుకున్నాను. నన్ను ఎప్పుడు విడిచిపెడతారని పోలీస్‌ వాళ్లను అడిగితే.. ‘మాకు తెలీదండి. సీపీగారు మీ మీద కోపంగా ఉన్నార’ని చెప్పాడు. చివరకు సాయంత్రం ఏడు గంటల సమయంలో నన్ను విడిచిపెట్టారు. రాత్రి పది గంటల ఫ్లైట్‌కు హైదరాబాద్‌ వచ్చాను. ఇదంతా నిజాయితీగా చేసింది. పబ్లిసిటీ కోసం కాద’ని చెప్పాడు సంపూ.
entertainment
19,040
01-10-2017 19:23:20
ఈ ఒక్క సాయం చేస్తే రూ.1 లక్ష బహుమతి : సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన గీత తల్లిదండ్రులను గుర్తించడంలో సహాయపడాలని ప్రజలను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. గీత చెముడు, మూగ బాధితురాలనే విషయం తెలిసిందే. ఆమె తల్లిదండ్రులను గుర్తించడంలో సహకరించినవారికి రూ.1 లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. గీత బిహార్ లేదా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బాలిక అయి ఉండవచ్చునని తెలిపారు. గీత పాకిస్థాన్‌లో ఉన్నపుడు చాలా సహాయపడిన ఎధి ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. గీత పదకొండేళ్ళ వయసులో తప్పిపోయింది. ఆమె పాకిస్థాన్‌ చేరుకుంది. అక్కడ 13 ఏళ్ళపాటు ఉంది. ఆమెను మొదట లాహోర్‌లోని బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. ఆ తర్వాత ఎధి ఫౌండేషన్ కాపాడి, సంరక్షించింది. అక్కడ ఆమెకు ఫాతిమా అని పేరు పెట్టారు. 2015 అక్టోబరులో ఆమెను భారతదేశానికి ఎధి ఫౌండేషన్ ప్రతినిథులు తీసుకొచ్చారు.
nation
12,561
10-06-2017 17:09:02
కశ్మీరీల స్వీయ నిర్ణయాధికారానికి మద్దతు కొనసాగుతుంది : పాక్ ఆర్మీ
న్యూఢిల్లీ : పాకిస్థాన్ సైన్యం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, రెండు నాలుకల ధోరణి స్పష్టంగా వెల్లడైంది. ఆ దేశ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ‘‘మా కశ్మీరు సోదరుల స్వీయ నిర్ణయాధికారానికి మద్దతు కొనసాగిస్తామ’’ని పాక్ సైన్యం పేర్కొంది. పాక్ సైన్యం మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్‌ శనివారం ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.  స్వీయ నిర్ణయాధికారం కోసం కశ్మీరు సోదరులకు మద్దతిస్తామని చెబుతూనే నియంత్రణ రేఖ ఆవల (భారతదేశంలోని కశ్మీరుకు) మాత్రమే ఈ మద్దతిస్తామని, పాకిస్థాన్‌లోని కశ్మీరుకు మద్దతిచ్చేది లేదని సైన్యం ప్రకటించిందని పాక్ మీడియా పేర్కొంది.
nation
18,949
01-01-2017 12:25:24
పెద్దనోట్ల మార్పిడికి ఎన్నారైలకు గడువు పొడిగింపు
ముంబై: పాత ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఎన్నారైలకు ఆర్‌బీఐ మరో అవకాశం కల్పించింది. వారు జూన్ 30 వ తేదీ వరకు పెద్ద నోట్లను మార్చుకోవచ్చని, శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ అవకాశం విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులకు మాత్రమేనని స్పష్టం చేసింది. నవంబర్ 9 వ తేదీని గడువుగా తీసుకుని, విదేశీ పర్యటనలో ఉన్న భారతీయులు ఎవరైనా డిసెంబర్ 30వ తేదీలోగా మార్చుకోలేకపోతే, వారు మార్చి 31 వ తేదీ వరకు మార్చుకోవచ్చని ఆర్‌బీఐ సూచించింది. ఎన్నారైలకు మాత్రం 'ఫెమా' నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. అయితే భారత్‌లో ఉంటున్నవారికి ఇటువంటి నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది. నోట్ల రద్దు జరిగిన తరువాత విదేశీ పర్యటనకు వెళ్లిన భారతీయులు తమ గుర్తింపు పత్రాలతో పాటు ఆయా తేదీల్లో విదేశీ పర్యటనలో ఉన్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే తాము అంతకుముందు నోట్ల మార్పిడి చేసుకోలేదని ఒక ధృవీకరణ పత్రం కూడా దఖాలు చేయాల్సి ఉంటుందని తేలిపింది. ముంబాయి, కోల్‌కతా, నాగపూర్, దిల్లీ, చెన్నైలలో ఉన్న రిజర్వ్ బ్యాంకు శాఖల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది. నేపాల్, భూటాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఉంటున్న భారతీయులకు ఈ సదుపాయం వర్తించదని తెలిపింది.
nation
5,826
08-05-2017 17:15:49
సింగర్ సునీత కూతురి గురించి నీచమైన పోస్ట్... సునీత ఆగ్రహం!
కొన్ని యూట్యూబ్ చానళ్ల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. ఏదో ఉన్నట్లు హెడ్డింగ్ పెట్టి వీడియో క్లిక్ చేయగానే ఇంకేదో చూపించి జనాలను మోసం చేసి సొమ్ము చేసుకునే ధోరణి వెర్రితలలు వేస్తున్న రోజులివి. ఇదిలా ఉంటే, సెలబ్రెటీలను కొన్ని యూట్యూబ్ చానళ్లు పనిగట్టుకుని మరీ దిగజారుస్తున్నాయి. వ్యూస్ యావలో హెడ్డింగ్స్ మరింత నీచంగా పెడుతున్నారు. తాజాగా సింగర్ సునీత, ఆమె కూతురికి సంబంధించి ఓ యూట్యూబ్ చానల్ చూపించిన అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ‘సింగర్ సునీత కూతురుని చూశారా... కత్తి లాగా ఉంది’ అంటూ టీనేజ్ వయసులో ఉన్న సునీత కూతురి గురించి నీచమైన హెడ్డింగ్ పెట్టి, సునీత అప్పుడప్పుడూ కూతురితో కలిసి దిగిన ఫోటోలను కలిపి ఓ వీడియో సృష్టించారు. ఈ వీడియో యూట్యూబ్‌లో పెను దుమారమే రేపింది. సింగర్ సునీతకు ఈ విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలమైందట. ఒక టీనేజ్ వయసున్న అమ్మాయి గురించి మరీ ఇంత నీచంగా హెడ్డింగ్స్ పెడతారా అంటూ మండిపడిందట. తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా భావించిందట. అయితే ఇలాంటి యూట్యూబ్ చానళ్లు ఎన్నో ఉన్నాయని, ఎన్నింటి మీద ఫిర్యాదు చేయగలమని ఊరుకుందట. కానీ ఇంత నీచంగా ఓ అమ్మాయి గురించి పోస్ట్ పెట్టడానికి ఆ అడ్మిన్‌కు మనసెలా వచ్చిందోనని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. యూట్యూబ్ చానళ్లు ఇకనైనా పైత్యాన్ని తగ్గించుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
entertainment
1,423
29-08-2017 02:14:08
డాక్టర్‌ రెడ్డీస్‌పై అమెరికా కోర్టులో కేసు
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌పై క్లాస్‌ యాక్షన్‌ లాసూట్‌ నమోదైంది. యుఎస్‌ ఫెడరల్‌ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘిస్తూ తప్పుడు ప్రకటనలు ఇచ్చిందని ఆరోపిస్తూ ఒక ఇన్వెస్టర్‌ ఈ క్లాస్‌ యాక్షన్‌ లాసూట్‌ను దాఖలు చేశారు. తప్పుడు ప్రకటనల ద్వారా ఉద్దేశపూర్వకంగా షేరు ధర పడిపోయేలా కంపెనీ వ్యవహరించిందని పేర్కొంటూ కొంతమంది ఇన్వెస్టర్లు అమెరికాలోని న్యూజెర్సీ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఈ లాసూట్‌ను దాఖలు చేసిందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. అయితే ఈ లాసూట్‌ను ఇంకా అందుకోలేదని, పెండింగ్‌లో ఉన్న లిటిగేషన్‌పై ప్రత్యేకంగా ఆరోపించిన ఆరోపణలపై తాము మాట్లాడబోమని తెలిపింది.  కొంతమంది ఇన్వెస్టర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న లా ఫర్మ్‌ ఈ నెల 25న కంపెనీ సిఇఒ, సిఎ్‌ఫఒలపై న్యూజెర్సీ కోర్టులో ఈ క్లాస్‌ యాక్షన్‌ సూట్‌ను దాఖలు చేసినట్లు పేర్కొంది. 2015 జూన్‌- 2017 ఆగస్టు 17 మధ్య కాలంలో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతున్న షేర్లను ఈ లాసూట్‌లో భాగంగా ఉన్న ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని తెలిపింది. ఈ లాసూట్‌ను అందుకున్న తర్వాత ఈ ఆరోపణలకు స్పందించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. అమెరికా కోర్టులో కేసు నమోదు కావటంతో సోమవారం బిఎ్‌సఇలో కంపెనీ షేరు 2.01 శాతం నష్టపోయి 2,045.95 రూపాయల వద్ద క్లోజైంది. యుఎస్‌ మార్కెట్లోకి యాంటీ బాక్టీరియల్‌ ఔషధం..అమెరికా మార్కెట్లోకి బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ నివారణలో ఉపయోగించే ఔష ధం సెఫిగ్జైమ్‌ను విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. నోటి ద్వారా (ఓరల్‌ సస్పెన్షన్‌) తీసుకునే ఈ ఔషధాన్ని 100 ఎంజి/5ఎంఎల్‌, 200 ఎంజి/5ఎంఎల్‌ పరిమాణాల్లో విడుదల చేసినట్లు తెలిపింది. అస్టెల్లాస్‌ ఫార్మా ఇంక్‌... జెనరిక్‌ వెర్షన్‌ అయిన సుప్రాక్స్‌కు ఇది సమానమైనదని పేర్కొంది. జూన్‌తో ముగిసిన పన్నెండు నెలల కాలానికి గాను అమెరికాలో ఈ ఔషధ విక్రయాలు 5.05 కోట్ల డాలర్లుగా ఉన్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.
business
16,633
08-11-2017 02:54:06
‘నైతికం’గా మేలైన నిర్ణయం: జైట్లీ
న్యూఢిల్లీ, నవంబరు 7: పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ విరుచుకుపడ్డారు. ‘ఇది చరిత్రాత్మక నిర్ణయం. నల్లధనానికి వ్యతిరేకంగా మేం చేపట్టిన నైతిక చర్య. నైతికత విషయంలో బీజేపీకి కాంగ్రె్‌సకంటే ప్రత్యేక దృక్పథం ఉంది. మా ప్రాధాన్యం దేశ సేవ... కాంగ్రె్‌సకు ఒక కుటుంబానికి సేవ చేయడమే ముఖ్యం’ అని ఎద్దేవా చేశారు. ఆయన ప్రధానిగా ఉన్న కాలమంతా దోపిడీమయమని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, కానీ అది ఆర్థిక ఎజెండాను మార్చిందని... నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిందని అన్నారు. కాగా.. మన్మోహన్‌వి మనసులోంచి వచ్చిన మాటలు కావని, రాహుల్‌ లాంటి వ్యక్తులెవరో రాసిన మాటలను ఆయన చెబుతున్నారని అన్నారు.
nation
15,852
31-12-2017 13:04:03
రాజకీయాల్లో కొత్త కానీ..రాజకీయాలకు కాదు: రజినీ
చెన్నై: అనడానికి, చెప్పడానికి తేడా ఉంది. అనేటప్పుడు ఏదో ఒకటి అనొచ్చు కానీ చెప్పేటప్పుడు ఏదో ఒకటి చెప్పాలి. ఒకటి అన్నాక ఇంకోటి అనొచ్చు. కానీ, చెప్పాక ఇంకోటి చెప్పకూడదు. ఇంతవరకూ ఏదో ఒకటి అంటూ వచ్చిన తమిళ సూపర్‌స్టార్ ఇప్పుడు స్పష్టంగా 'రాజకీయాల్లోకి వస్తున్నా. కొత్త పార్టీ పెడుతున్నా. ఎన్నికల్లో పోటీ చేస్తా' అంటూ అభిమానుల సాక్షిగా చెప్పారు. సహజంగానే ఆధ్యాత్మికత మెండుగా ఉన్న రజినీకాంత్ భగవద్గీత శ్లోకాన్ని కూడా ఆశువుగానే వల్లిస్తూ 'కర్మణ్యే వాధికారస్తే' అంటూ... పని చేయడమే మన పననీ, ఫలితం భగవంతుడే ఇస్తాడని తన మాటల్లో చెప్పుకొచ్చారు. పనిలో పనిగా రాజకీయాల్లో కొత్తేమో కానీ....రాజకీయాలకు కొత్తకాదంటూ చెప్పుకొచ్చారు. అదెలాగో ఓసారి చూద్దాం... -1995లో వచ్చిన 'ముత్తు' సినిమాలో రజినీకాంత్‌పై చిత్రీకరించిన ఓ సాంగ్‌ ఉంది. 'ఇప్పుడెందుకు నేను పార్టీ పెట్టాలి...కాలమే చెబుతుంది' అంటూ రజినీపై ఆ లిరిక్ సాగుతుంది. -1996లో అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలితతో బహిరంగంగానే విభేదిస్తూ ఆమెకు ఓటు వేయవద్దని ప్రజలను రజినీ కోరారు. 'అన్నాడీఎంకే తిరిగి గెలిస్తే భగవంతుడు కూడా తమిళనాడును కాపాడలేరు' అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ తమిళనాట వినిపిస్తుంటాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో 'అమ్మ' ఓటమిపాలై డీఎంకే ఘనవిజయం సాధించింది. -డీఎంకే-టీఎంసీకి కూటమికి ఆ తర్వాత రజినీ దన్నుగా నిలిచినా 1998 పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే తిరిగి తన సత్తాచాటుకుంది. -రజినీ తన 'బాబా' (2002) చిత్రంలో రాజకీయ ప్రవేశంపై కొన్ని సంకేతాలు ఇచ్చారు. సినిమా కథ కూడా అలానే సాగుతుంది. పాత్రపరంగా నాస్తికుడైన కథానాయకుడుఅనుకోకుండా ఆధ్యాత్మికం వైపు మళ్లుతాడు. ఆ తరువాత కొన్ని పరిణామాల నేపథ్యంలో రాజకీయాల ప్రక్షాళనకు ఆయనను రాజకీయాల్లోకి రావాలని ప్రజలంతా కోరతారు. అటా...ఇటా తేల్చుకునే ప్రయత్నంలో చివరకు కథానాయకుడు జనం వైపే మొగ్గుచూపుతూ అంటువైపు అడుగులు వేస్తుండగా శుభం కార్డు పడుతుంది.-ఆ తర్వాత కాలంలో అన్నాడీఎంకేతో రజినీకాంత్ సంబంధాలు మెరుగవుతూ వచ్చాయి. రజినీని ఆకర్షించే ప్రయత్నం కూడా ఆ పార్టీ చేసింది. రజినీ సైతం జయలలితతో సత్సంబంధాలనే కొనసాగించారు. -నధుల అనుసంధానానికి బీజేపీ నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ-అన్నాడీఎంకే కంబైన్‌కే తన ఓటని రజినీ చెప్పుకొచ్చారు. అలా అయితేనే దేశానికి తాగునీటి సమస్యలు తీరుతాయని కూడా అన్నారు. -2008లో రజినీకాంత్ 'సమర్ధత, అనుభవం, కఠోర శ్రమతోనే రాజకీయాల్లో ఎవరైనా సక్సెస్ అయ్యారని చెబితే అంతకంటే తెలివితక్కువతనం ఉండదు. కాలం, పరిస్థితుల పైనే ఏదైనా ఆధారపడుతుంది. కాలం కలిసి రాకపోతే ఎదీ ఉపయోగపడదు' అని అన్నారు. -2014లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రజినీకాంత్‌ నివాసానికి వెళ్లి కలిశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మోదీ చెన్నై వచ్చినప్పుడు ఈ భేటీ జరిగింది. -ఈ ఏడాది ఫిబ్రవరిలో సోషల్ మిడియాలో రజినీ క్లుప్తంగా 'లైక్డ్ పవర్' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆ తర్వాత తాను ఆధ్యాత్మిక పవర్ గురించి చెప్పానే కానీ మెటీరియల్ పవర్ కాదంటూ ఆయన వివరణ ఇచ్చారు. -డిసెంబర్ 28 రజనీకాంత్ తాను భగవంతుడు, తల్లిదండ్రులకు మాత్రమే తలవంచుతానని చెప్పారు. -డిసెంబర్ 31న అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు రజినీ తెరదించారు. 'రాజకీయాల ప్రక్షాళన, మార్పు, జనం కోసం రాజకీయాల్లోకి వస్తున్నాను' అంటూ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు.
nation
18,838
03-01-2017 09:52:49
పీకలదాకా తాగి నిండు ప్రాణం తీసిన మంత్రి కారు డ్రైవర్.!
ఉత్తరప్రదేశ్: నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మంత్రిగారి కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం డ్రైవ్ చేయడంతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన మంత్రి ఓం ప్రకాశ్ సింగ్ కారు డ్రైవర్ ఈ ఘటనకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. హర్దోయి ప్రాంతంలో బండిలాగే వ్యక్తిని అతివేగంతో వచ్చిన మంత్రి కారు ఆయన్ను ఒక్కసారిగా ఢీ కొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంత్రి డైవర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందని ఆరా తీయగా కారులో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. దీంతో తప్పతాగి కారు డ్రైవర్ ఈ ప్రమాదం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంత్రి గారి కారు డ్రైవర్ కావడంతో పోలీసులు పెద్దగా కఠిన చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. మరోవైపు మృతుడి కుటుంబీకులు తమకు న్యాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సర్కార్‌‌ను వేడుకొంటున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినపుడు మంత్రి కారులో ఉన్నారా లేదా అన్న విషయం తెలియరాలేదు.
nation
10,856
10-10-2017 19:56:57
నిర్మాతగా మారిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
నటి అర్చన ఇప్పుడో షార్ట్ ఫిల్మ్‌కు నిర్మాతగా మారారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రేమమాలిని దర్శకత్వంలో అర్చన ‘ఐ లైక్ ఇట్ దిస్ వే’ పేరుతో గంట నిడివిగల షార్ట్ ఫిల్మ్ నిర్మించారు. అర్చన, శివ కీలక పాత్రలు పోషించిన ఈ షార్ట్ ఫిల్మ్ ను ఇటీవల ప్రదర్శించారు. పలువురు సినీ ప్రముఖులు ప్రీమియర్ షోకు హాజరై యూనిట్ సభ్యులను అభినందించారు.
entertainment
7,081
24-08-2017 18:58:05
బిజీయెస్ట్ లిరిక్ రైటర్ ఈయనేనట..
తెలుగు చిత్రసీమలో బిజీయెస్ట్ లిరిక్ రైటర్ ఎవరంటే రామజోగయ్య శాస్త్రి పేరే వినిపిస్తుంది. ఆయన పాట జనం నోట చిందులు వేస్తూ సాగుతోంది. నేడు రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రామజోగయ్య పాట టాపు రేపుతోంది. ఎంతలా అంటే టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి చిత్రాల్లోనూ జోగయ్య పాట మారుమోగుతోంది. థియేటర్లలో ఆయన పాటలు జనాన్ని చిందులు వేయిస్తున్నాయి. నిర్మాతల గల్లా పెట్టెలు నింపడంలో జోగయ్య పాట కూడా తోడ్పడుతోంది. సందర్భం ఏదైనా సరే, అందుకు అనుగుణంగా తన కలాన్ని పరుగులు తీయించి పసందైన పదాలను వేసి పాటలతో పరవశింపచేయగలరు రామజోగయ్య. ఆయన పాటలకు పలు అవార్డులూ, రివార్డులూ లభించాయి. నేటితో 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జోగయ్య మరిన్ని పాటలతో మనల్ని రంజింప చేస్తారని ఆశిద్దాం.
entertainment
18,406
06-11-2017 19:03:12
మన ఫోను చైనా వాడే రోజు రావాలి...
చంబా: 'మేడ్ ఇన్ ఇండియా' ఫోనును చైనా ప్రజలు వాడే రోజు చూడాలని ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు చైనా యువకుడు 'మేడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్', 'మేడ్ ఇన్ ఇండియా' అని రాసున్న ఫోన్లతో సెల్ఫీ తీసుకునే రోజులు రావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంబాలో జరిగిన ర్యాలీలో రాహుల్ తన మనోగతాన్ని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. కష్టపడే తత్వం ఉన్న వ్యక్తుల్లో వీరభద్ర సింగ్ ఒకరని అన్నారు. 'ఇందిరమ్మ రెండు రకాల వ్యక్తులుంటారని చెప్పేవారు. ఒకరు కష్టపడి పనిచేసేవారు. మరొకరు ఇతరుల కష్టాన్ని తమకు ఆపాదించుకునే వారు. మన సీఎం (వీరభద్రసింగ్) మొదటి కోవకు చెందినవారు. ప్రధాని మోదీ రెండో రకానికి చెందిన వ్యక్తి' అని రాహుల్ పోల్చారు. పరిశుభ్రత, ఉపాధి, విద్య, విద్యుదుత్పత్తిలో ఉత్తమ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచిందని అన్నారు. రాహుల్ సోమవారంనాడు మూడు చోట్ల సుడిగాలి పర్యటనలు చేశారు. సర్‌మౌర్, చంబా, గాంగ్రాల్లో మూడు ర్యాలీల్లో ప్రసంగించారు.
nation
7,493
09-11-2017 13:37:35
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్...
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్.. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఓ సినిమా పేరు. ఈ సినిమా పేరు చూస్తేనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ అని అనిపిస్తోంది కదూ. ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలైంది. "అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులే.. పక్కోడి స్క్రీన్‌ప్లేలో".. అంటూ టీజర్ చివరలో ఓ డైలాగ్ వినిపిస్తుంది. అది నిజమేననిపిస్తుంది. దాదాపు ఈ సినిమా కొత్త, క్యారెక్టర్ ఆర్టిస్టులతోనే రూపొందుతోంది. ధృవ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కార్తీక్ మేడికొండ డైరెక్షన్‌లో సుజన్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
entertainment
14,676
05-10-2017 12:07:44
కమల్, రజినీ రాజకీయాల్లోకి వస్తే అలా చేయాలి: సినీ నటుడు వివేక్
చెన్నై: రాజకీయ రంగప్రవేశం చేయడం సులభమని కానీ, నిలదొక్కుకుని రాణించడం కష్టమని సినీ నటుడు వివేక్‌ అభిప్రాయపడ్డారు. ఆయన సారథ్యంలోని పసుమై సైదై పథకం కింద సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని గతంలో డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా బుధవారం 2 వేల మొక్కల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా నటుడు వివేక్‌ మాట్లాడుతూ... ప్రజాబలమే శక్తిమంతమైనదన్నారు. తాము చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ సాయాన్ని ఎదురుచూడకుండా ప్రజలే స్వచ్చంధంగా ముందుకు వచ్చి తమ అసరాలను తీర్చుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదవు తున్నా యన్నారు. ఈ జ్వరం బారిన పడకుండా ప్రజలే తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. రాజకీయం అనేది ఒక సేవ అని, దాన్ని గ్రహించిన నేతలు గతంలో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తనకు రాజకీయాలు తెలియవన్నారు. కానీ, రాజకీయాల్లో లేకుండా సేవ చేయడం తెలుసన్నారు.             ఇపుడు తాను అదే చేస్తున్నట్టు చెప్పారు. రాజకీయాల్లో లేనివారు నిర్వహించే అన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానిస్తున్నారన్నారు. తమిళ సూపర్‌స్టార్లు రజినీకాంత్‌, కమల్‌హాసన్‌లు రాజకీయాల్లోకి వచ్చినట్టయితే వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలని ప్రజల తరపున కోరుతున్నట్టు చెప్పారు. అనంతరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎం. సుబ్రమణియన్‌ మాట్లాడుతూ.. సైదాపేట నియోజకవర్గంలో దాదాపు 3.25 లక్షల మంది ఓటర్లు ఉన్నారనీ, వీరిలో 2 లక్షల మంది తమ పుట్టిన రోజునాడు మొక్కలు నాటాలని కోరారు. వారు ఎలాంటి శ్రమకు లోనుకావాల్సిన పని లేదన్నారు. ఒక్క పిలుపుతో తామే వారి ఇంటి ముంగటకు వచ్చి మొక్కను అందజేస్తామన్నారు.
nation
21,035
02-11-2017 01:54:29
మెరిసిన భారత షూటర్లు
కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌బ్రిస్బేన్‌: కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు తమ జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం రెండో రోజు జరిగిన పోటీల్లో దేశానికి రెండు స్వర్ణాలతో పాటు రెండు రజతాలు, ఓ కాంస్యం దక్కింది. పురుషుల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో అయితే క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ ఈవెంట్‌లో యువ షూటర్‌ షహజార్‌ రిజ్వీ అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణంతో మెరవగా ఓంకార్‌ సింగ్‌ రజతం, జీతూ రాయ్‌ కాంస్యం దక్కించుకోవడంతో పతకాలన్నీ భారత్‌ వశమైనట్టయ్యింది. ఇక మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో పూజా ఘట్కర్‌ స్వర్ణం దక్కించుకోగా అంజుమ్‌ మౌడ్గిల్‌ రజతం సాధించింది.
sports
3,066
23-04-2017 00:19:43
మీరు వీసాలిస్తే.. మేం ఉద్యోగాలిచ్చాం..
బెంగళూరు : హెచ్‌-1బి వీసాలపై భారత స్వరం పెంచింది. ఈ వీసాలకు ప్రతిగా అమెరికాలో భారత కంపెనీలు అమెరికాలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాయని చెప్పారు. ఎస్‌టిపిఐ నిర్వహించిన ఒక సదస్సుకు హాజరైన కేంద్ర ఐటి శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు. భారత ఐటి కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయన్న ఆరోపణలను తోసిపుచ్చారు.  ‘అమెరికాతో పాటు అనేక దేశాల ఆర్థిక అభివృద్ధికి భారత ఐటి కంపెనీలు ఎంతో చేశాయి. ఇందుకు మనం గర్వపడుతున్నాం. గత ఐదేళ్లలో అమెరికాలోనే మన ఐటి కంపెనీలు 2,200 కోట్ల డాలర్లు పన్నుల రూపంలో చెల్లించాయి. నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాయి’ అన్నారు. ఈ వీసాలపై ట్రంప్‌ సర్కార్‌ విధించిన తాజా నియంత్రణలపై మన ఆందోళనను అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలకు తెలిపినట్టు రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.
business
10,744
07-03-2017 18:03:14
వివాదంలో చిక్కుకున్న టాలీవుడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్
టాలీవుడ్‌లో రెండు ప్రేమ కథా చిత్రాలను అందించిన దర్శకుడు విజయ్ కుమార్‌కు నిజ జీవితంలో సినిమా కష్టాలు ఎదురయ్యాయి. గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ కొండ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన ప్రసూన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ వివాహాన్ని యువతి తల్లి వ్యతిరేకించారు. వయసును దాచిపెట్టి, మాయమాటలు చెప్పి తన కుమార్తెను విజయ్ పెళ్లి చేసుకున్నాడని ప్రసూన తల్లి ఆరోపించారు. ఏకంగా విజయ్ కుమార్‌పై చెప్పు విసిరారు. తమకు రక్షణ కావాలంటూ విజయ్, ప్రసూన ఎస్‌ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రసూన మాత్రం తన ఇష్టపూర్వకంగానే విజయ్‌ను వివాహం చేసుకున్నానని చెబుతోంది. ఇరు వర్గాల ఆరోపణలు ఈ వీడియోలో చూడండి.
entertainment
15,261
04-08-2017 17:04:22
డెత్ సర్టిఫికెట్‌కూ ఇక 'ఆధార్' తప్పనిసరి
న్యూఢిల్లీ: మరణ ధ్రువీకరణ పత్రానికీ ఇకముందు ఆధార్ తప్పనిసరి. వ్యక్తుల గుర్తింపులో మోసాలు జరక్కుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. డెత్ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. జమ్మూకశ్మీర్, అసోం, మేఘాలయ మినహా మిగతా రాష్ట్రాలన్నిటీకీ ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత క్రమంలో ఈ రాష్ట్రాలకూ వర్తింపజేస్తామని హోం మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు తెలిపింది. ఆధార్ తప్పనిసరి చేయడం వల్ల మృతుల కుటుంబ సభ్యులు లేదా బంధువుల నుంచి నిక్కచ్చి సమాచారం లభించే అవకాశాలుంటాయని హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం తెలిపింది. గుర్తింపు మోసాలు నిరోధించేందుకు ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడుతుందని, మృతి చెందిన వ్యక్తి ఐడెంటినీని రికార్డు చేసేందుకు కూడా ఉపకరిస్తుందని పేర్కొంది. మృతుని గుర్తించేందుకు పలు డాక్యుమెంట్లు జతచేయాల్సిన ఆవశక్యత కూడా ఆధార్ జోడింపుతో తగ్గుతుందని తెలిపింది.
nation
7,520
30-05-2017 17:19:24
బాలకృష్ణతో మహేశ్ ఢీ అంటే ఢీ
బాలకృష్ణతో పూరీ జగన్నాథ్ తీస్తోన్న తాజా చిత్రం దసరా కానుకగా రానుంది. అదే సమయంలో మహేశ్ -మురుగదాస్ కాంబోలో వస్తోన్న 'స్పైడర్' కూడా జనం ముందు నిలవనుందట. ఇదే జరిగితే, బాలయ్యతో మహేశ్ ఢీ కొనడం ఇది మూడోసారి అవుతుంది. ఇంతకు ముందు ఎలా సాగారో చూద్దాం. నందమూరి కుటుంబానికి, ఘట్టమనేని ఫ్యామిలీకి బాక్సాఫీస్ వార్ కొత్తకాదు. మహానటుడు యన్టీఆర్ నటించిన పలు చిత్రాలతో కృష్ణ తన సినిమాలను విడుదల చేసి పోటీపడేవారు. ఆ సమయంలో ఎక్కువసార్లు యన్టీఆర్ దే పైచేయిగా సాగింది. ఆ తరువాత కృష్ణ సినిమాలతో బాలకృష్ణ చిత్రాలు పోటీపడ్డాయి. ఒకసారి బాలయ్యది పైచేయి అయితే, మరోమారు కృష్ణది పైచేయిగా సాగింది. దాంతో నందమూరి, ఘట్టమనేని అభిమానుల కోలాహలం బాక్సాఫీస్ వద్ద భలేగా ఉండేది. ఆ తరువాత బాలయ్య సినిమాల ముందు కృష్ణ చిత్రాలు మెత్తబడ్డాయి. తండ్రీకొడుకులు యన్టీఆర్, బాలకృష్ణతో కృష్ణ పోటీకి దిగినా, నందమూరి వారిదే పైచేయిగా సాగింది. అలాగే బాలకృష్ణ తండ్రి కృష్ణతో పోటీపడి, ఆయన తనయుడు మహేశ్ తోనూ బాక్సాఫీస్ వద్ద ఢీ కొన్నాడు. అయితే ఈ తరం హీరోలు తక్కువ చిత్రాల్లో నటించడం వల్ల పోటీ కేవలం రెండు సార్లకే పరిమితమయింది. 2002 సంవత్సరం జనవరి 11న 'సీమసింహం' విడుదల కాగా, అదే సమయంలో పొంగల్ బరిలో మహేశ్ బాబు కౌబోయ్ మూవీ 'టక్కరిదొంగ' రిలీజయింది. అయితే ఆ దఫా సంక్రాంతి సంబరాల్లో ఈ రెండు సినిమాలు పెద్దగా సందడి చేయలేకపోయాయి. బాలకృష్ణ, మహేశ్ చివరిసారిగా పోటీ పడింది 2006లో... మహేశ్ నటించిన 'పోకిరి' ఆ యేడాది ఏప్రిల్ 28న విడుదల కాగా, బాలకృష్ణ 'వీరభద్ర' మరుసటి రోజు అంటే ఏప్రిల్ 29న విడుదలయింది. 'పోకిరి' సాధించిన ఘనవిజయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలా ఒకసారి పొంగల్ బరిలోనూ, మరోమారు సమ్మర్ సందడిలోనూ పోటీపడ్డ బాలకృష్ణ, మహేశ్ తొలిసారి దసరా సంబరాల్లో పోటీకి సై అంటున్నారు. బాలకృష్ణ- పూరి కాంబో సినిమా ప్రారంభోత్సవంలోనే దసరా కానుకగా సెప్టెంబర్ 29న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు మహేశ్, మురుగదాస్ 'స్పైడర్' కూడా దసరాకే వస్తోందని హీరోనే ట్వీట్ చేశాడు. సో, ఈసారి కూడా దసరా బరిలో పోటీ మహారంజుగా సాగనుందని ఇట్టే తెలుస్తోంది. ఈ దఫా ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి...
entertainment