SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
3,521
10-12-2017 01:05:12
పవన్‌ మంచోడే... కానీ!
నాకు సంబంధించినంత వరకు రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇక నన్ను హెచ్చరించడానికి ఎవరు ప్రయత్నించినా వృథానే! పవన్‌ కల్యాణ్‌ కంటే బలవంతులే నన్ను తొక్కేయాలని చూశారు. వాటన్నింటినీ తట్టుకుని ఎదురొడ్డి నిలబడ్డాను. ఎవరెవరి సంస్థల్లో ఏయే కులాల వాళ్లు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీస్తాను అని కూడా పవన్‌ పరోక్షంగా నాకు వార్నింగ్‌ ఇచ్చారనే అనుకుంటున్నాను. ‘చలోరే చలోరే చల్‌’ ప్రోగ్రామ్‌ ఆఖరి దశ పూర్తయ్యింది కనుక ఆయనే స్వయంగా మా కార్యాలయాలకు వెళ్లి కులాలవారీగా లెక్కలు తీసుకోవచ్చు. ఆయన వస్తానంటే నేనే గుమ్మం వద్దకు వెళ్లి స్వాగతిస్తాను. ఎవరి కులం ఏమిటో తెలుసుకుని ఉద్యోగాలు ఇవ్వడం మా సంస్థకు తెలియదు. ప్రాంతాలు, కులాలకు అతీతంగానే మేం వ్యవహరిస్తున్నాం.  ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సంబంధాలు తెగిపోలేదు కనుక పవన్‌ అడుగుతున్న వాటిపై ప్రభుత్వం స్పందిస్తోంది. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియదు. ప్రభుత్వం నుంచి స్పందన ఆగిపోతే సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ను కలుస్తున్నవారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తారు. ఈ సూక్ష్మం తెలుసో తెలియదో గానీ, అధికారంలో లేకపోయినా సమస్యలు పరిష్కరించవచ్చునని పవన్‌ కల్యాణ్‌ నమ్ముతున్నారు. ఆయన విజిల్‌ బ్లోయర్‌ పాత్రకే పరిమితమైనంత కాలం లేదా అధికారపక్షంతో స్నేహం ఉన్నంత కాలమే ఈ వెసులుబాటు ఉంటుంది. అధికార పార్టీకి పోటీగా తయారైనప్పుడు అధికారపక్షం వైఖరి మారిపోతుంది. పవన్‌ కల్యాణ్‌ ఆలోచనా విధానం, రాజకీయ వైఖరిలో స్పష్టత ఉందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే, రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలన్న తపన మాత్రం ఆయనలో ఉందని స్పష్టమవుతోంది. సమాజంలో మార్పు రావాలనుకుంటున్న ఆయన ఆ మార్పు ఏ విధంగా ఉండాలన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయారన్న అభిప్రాయం ఆయన ప్రసంగాలు విన్నవారిలో ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఆచితూచి మాట్లాడటం! పవన్‌ కల్యాణ్‌ ఈ లక్షణాన్ని ఇంకా అలవర్చుకోలేదు. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేకపోవడం, రాజకీయాలలో మార్పు తేవాలన్న ఆకాంక్ష బలంగా ఉండటం పవన్‌లోని ద్వైదీభావాన్ని తెలుపు తున్నాయి. ఎన్టీఆర్‌ రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఆనాటి అధికారపక్షంతో చెడుగుడు ఆడటంతో పాటు ప్రజలకు తాను ఏమి చేసేదీ స్పష్టంగా చెప్పారు. అనుభవం లేనివారు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడన్న అర్థంవచ్చేలా మాట్లాడటం ద్వారా పవన్‌ తన భవిష్యత్తుకు తానే ఫుల్‌స్టాప్‌ పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రధాన అవరోధంగా ఉంటున్న కులాల విభేదాల గురించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుక్రవారంనాడు విజయవాడలో ప్రశ్నించడం ముదావహం. తెలంగాణలో లేని ఈ సమస్య ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం అని నేను గతంలో పలు సందర్భాలలో ఇదే కాలమ్‌లో ప్రస్తావించాను. ఇప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మున్ముందు కులాల ఉనికి పెరిగిపోయి, కులాభిమానం తలెత్తే ప్రమాదం లేకపోలేదు. కుల వైషమ్యాలు ఎక్కడ ఉన్నా ప్రగతికి అవరోధంగా మారతాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలో ఇప్పుడు మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో కుల విద్వేషాలు రాజుకుంటున్నాయి. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను తాను భారతీయుడిగా చెప్పుకోకుండా, అచ్చమైన గుజరాతీననీ, వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిననీ తాజాగా ప్రకటించుకున్నారు. గుజరాత్‌లో జరుగుతున్న ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఆయన ఈ ప్రాంతీయ, కుల అస్ర్తాన్ని ప్రయోగించారు. దీన్నిబట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే రాజకీయ నాయకులే తమ ప్రయోజనాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా దేశ ప్రజలను విభజిస్తున్నారు. ఒకప్పుడు గ్రామాలలో అన్ని కులాలవారు వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఆప్యాయంగా కలిసి మెలిసి ఉండేవారు. రాజకీయ నాయకుల పుణ్యమా అని ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న కులాల గోల గురించి తొలిసారిగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా పవన్‌ కల్యాణ్‌ స్పందించినందుకు ఆయనను అభినందించాల్సిందే!ఏపీ ప్రజలు కులాలకు అతీతంగా వ్యవహరించినప్పుడే రాజధాని అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని పవన్‌ కల్యాణ్‌ చెప్పడం కూడా అక్షర సత్యం! ‘చలోరే చలోరే చల్‌’ పేరిట నాలుగు రోజులుగా ఆయన జనంతో మమేకం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను జనసేన కార్యకర్తలతో పంచుకుంటున్నారు.పవన్‌ కల్యాణ్‌ ఆలోచనా విధానం, రాజకీయ వైఖరిలో స్పష్టత ఉందా? లేదా? అన్న విషయం పక్కనపెడితే, రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలన్న తపన మాత్రం ఆయనలో ఉందని స్పష్టమవుతోంది. సమాజంలో మార్పు రావాలనుకుంటున్న ఆయన ఆ మార్పు ఏ విధంగా ఉండాలన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయారన్న అభిప్రాయం ఆయన ప్రసంగాలు విన్నవారిలో ఏర్పడుతోంది.  రాజకీయాలకు కొత్త కనుక ఆచితూచి మాట్లాడటం ఆయనకు ఇంకా అలవడలేదు. ఈ కారణంగా ప్రత్యర్థులు తనను విమర్శించే అవకాశాన్ని ఆయన ఇచ్చుకుంటున్నారు. ‘‘నేను మా అన్నయ్య చిరంజీవి అంత మంచివాడిని కాదు– ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించేటంత మంచితనం నాకు లేదు. నన్ను కొట్టడానికి ఎవరైనా వస్తే నేనే ముందు కొడతాను. చంపడానికి వస్తే నేను ముందు చంపడానికి ప్రయత్నిస్తాను. ప్రజారాజ్యం పార్టీ విఫలం కావడానికి కొందరి స్వార్థం కారణం. చిరంజీవిని కొంతమంది మోసం చేశారు’’ అని అంటూ వారందరినీ పేరు పేరునా గుర్తుపెట్టుకుంటానని కూడా పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. నిజానికి ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయనకే నష్టం. నిజ జీవితంలో రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేసేవారు కూడా బహిరంగంగా మాట్లాడేటప్పుడు గాంధీ మహాత్ముడి వారసులం అన్నట్టుగా మాట్లాడతారు. పవన్‌ కల్యాణ్‌కు ఈ కపటం తెలియదు కనుక తన మనస్సులో ఎలాంటి భావాలు ఉంటే వాటినే బయటకు వదులుతారు. వీధి పోరాటాలకు సైతం వెరవనని చెప్పుకోవడం అంటే ఆయన నిజంగానే వీధి పోరాటం చేస్తారని కాదు. ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఆ మాటలు ఉపయోగపడతాయి. అయితే రాజకీయాలలో అలా ఉండదు. నాయకులు మాట్లాడే ప్రతీ మాటను వక్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. చిరంజీవి మంచివాడు అనడం వరకు ఫర్వాలేదు గానీ, నేను అంత మంచివాడిని కాదని చెప్పడం వల్ల అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. తనను ఎవరూ మోసం చేయలేరని చెప్పడానికి ఆయన అలా మాట్లాడి ఉంటారు. కానీ ప్రత్యర్థులకు కాలు ఇవ్వకూడదు కదా! అయినా ఎవరో మనల్ని మోసం చేశారంటే అది అవతలివారి గొప్పతనం కంటే మన చేతకానితనమే అవుతుంది. ఎవరైనా రెండు సందర్భాలలో మోసం చేస్తారు. ఒకటి.. దురాశకు పోయినప్పుడు. రెండవది.. అతి మంచితనం– దీన్నే చేతకానితనం అని కూడా అంటారు. మోసపోవడం అనేది మన వైఫల్యమే అవుతుంది. రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఆచితూచి మాట్లాడటం! పవన్‌ కల్యాణ్‌ ఈ లక్షణాన్ని ఇంకా అలవర్చుకోలేదు. నేను నేనుగానే ఉంటాను అని ఆయన అనుకుంటే అది ఆయన ఇష్టం!  లెక్కలు భేషుగ్గా తీసుకోవచ్చు!పవన్‌ కల్యాణ్‌ తన రెండవ రోజు పర్యటన సందర్భంగా రాజమండ్రిలో మాట్లాడుతూ, నాపై ఒక నింద వేశారు. నేను ఆయనకు కులం ఆపాదించే ప్రయత్నం చేశానన్నది ఆయన ఆరోపణ సారాంశం. నిజానికి 2015 జూలై 12వ తేదీన నేను రాసిన ఈ కాలమ్‌లో చెప్పిందేమిటంటే, ‘‘పవన్‌ కల్యాణ్‌ మంచివాడు మాత్రమే కాదు. ఆవేశపరుడు కూడా. రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలను ఆయన ఇంకా వంటబట్టించుకోలేదు. రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన యువత ఎక్కువగా హడావుడి చేసింది. నిజానికి పవన్‌ కల్యాణ్‌కు కుల పిచ్చి లేదు. అందరివాడుగా ఉండాలనే ఆయన కోరుకుంటారు. కానీ కొందరి అత్యుత్సాహం వల్ల కొందరివాడుగా ముద్ర వేయించుకునే ప్రమాదం ఉంది’’ అని! ఇందులో ఆయనకు నేను కులం ఆపాదించింది ఎక్కడో తెలియడం లేదు. ఆయనకు కులం లేదనే చెప్పాను. అయినా ఆయన ఎందుకు అలా అర్థం చేసుకున్నారో తెలియదు. దీనిపై అప్పట్లోనే పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా స్పందించారు. అప్పుడు కూడా 2015, ఆగస్టు 30వ తేదీన రాసిన కాలమ్‌లో వివరణ ఇచ్చాను. ‘‘పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా ఒకామె ఆయనను ఉద్దేశించి.. ‘మన వంగవీటి రంగా వస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారు. ఆయనకు మన గోడు చెబుతాను’ అని అన్నారు. తనను ఆవిడ వంగవీటి రంగాతో పోల్చినప్పుడే పవన్‌ కల్యాణ్‌ అభ్యంతరం చెప్పవలసింది. కానీ ఎందుకో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నష్టం జరిగేది పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే! అందరివాడుగా ఉండాలనుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ? రంగా ఎక్కడ? విజయవాడలో రంగా– రాధా ఒకవైపు, నెహ్రూ– గాంధీ ఒక వర్గంగా కొన్నేళ్లపాటు రౌడీ రాజకీయాలు చేశారు’’ అని ఆ కాలమ్‌లో రాశాను. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌లో ఆవేశంతోపాటు, అభ్యుదయ భావాలు కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ రాజకీయాలను సంస్కరించాలని ప్రయత్నించే ముందు అక్కడ నెలకొన్న కుల జాడ్యాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తే మరింత మంచి పేరు తెచ్చుకుంటారని కూడా అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఆయన కూడా ఈ కుల జాడ్యం పోవాలని చెప్పారు కనుక అభినందిస్తున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్న ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ, ‘‘వరంగల్‌ వెళ్లాను. ఆదిలాబాద్‌ వెళ్లాను. అక్కడ నా కులం ఉందా?తెలుగుదేశానికి మద్దతు ప్రకటించినప్పుడు మీరు ఎందుకు కులం గురించి రాయలేదు. మీకు సౌకర్యంగా ఉంటే ఒక మాట. లేకపోతే మరొక మాటా? నేను చిరంజీవిలా మంచి మనిషిని కాదు. మెతక మనిషిని కాదు. నాకు చావంటే భయం లేదు. ఇంకోసారి కులం గురించి మాట్లాడితే ఎవరెవరి సంస్థల్లో ఎవరెవరు ఉన్నారో లెక్కలు తీస్తా. ఆఫీసు బాయ్‌ నుంచి మేనేజర్‌ వరకు ఎవరెవరు ఏ కులమో లెక్కలు తీస్తా’’ అని అంటూ పరోక్షంగా నన్ను హెచ్చరించే ప్రయత్నం ఆయన చేశారు. ఇప్పుడు మళ్లీ మళ్లీ పవన్‌ కల్యాణ్‌కు స్పష్టంచేస్తున్నది ఒక్కటే! ఆయనకు కులాభిమానం లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే ఆయన తెలుసుకోవలసింది ఒకటి ఉంది. వరంగల్‌లో గానీ, ఆదిలాబాద్‌లో గానీ, బళ్లారిలో గానీ ఈ కులాల గోల లేదు. అందుకే ఆయనను అక్కడ ఎవరూ ఆ కోణంలో చూడరు. విజయవాడ పరిస్థితి వేరు! అక్కడ కులాన్ని బట్టి మనవాడా పరాయి వాడా అని చూస్తుంటారు.  పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ విషయం తెలుసు కనుకే శుక్రవారంనాడు విజయవాడ పర్యటనలోనే కులాభిమానానికి అతీతంగా ఎదగండి, ఆలోచించండి అని కార్యకర్తలకు సూచించారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమా? లేదా? అన్నది ఆయన ఇష్టం. తెలుగుదేశంపార్టీకి మద్దతు ఇవ్వాలని నేను ఏమన్నా ఆయనను కోరానా? నాకు సంబంధించినంత వరకు రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇక నన్ను హెచ్చరించడానికి ఎవరు ప్రయత్నించినా వృథానే! పవన్‌ కల్యాణ్‌ కంటే బలవంతులే నన్ను తొక్కేయాలని చూశారు. వాటన్నింటినీ తట్టుకుని ఎదురొడ్డి నిలబడ్డాను. ఎవరెవరి సంస్థల్లో ఏయే కులాల వాళ్లు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీస్తాను అని కూడా పవన్‌ పరోక్షంగా నాకు వార్నింగ్‌ ఇచ్చారనే అనుకుంటున్నాను. ‘చలోరే చలోరే చల్‌’ ప్రోగ్రామ్‌ ఆఖరి దశ పూర్తయ్యింది కనుక ఆయనే స్వయంగా మా కార్యాలయాలకు వెళ్లి కులాలవారీగా లెక్కలు తీసుకోవచ్చు. ఆయన వస్తానంటే నేనే గుమ్మం వద్దకు వెళ్లి స్వాగతిస్తాను. ఎవరి కులం ఏమిటో తెలుసుకుని ఉద్యోగాలు ఇవ్వడం మా సంస్థకు తెలియదు. ప్రాంతాలు, కులాలకు అతీతంగానే మేం వ్యవహరిస్తున్నాం. నిజానికి మా సంస్థలలో పనిచేసే చాలా మంది కులం ఏమిటో సహచరులకు కూడా తెలియదు. అలాంటి మమ్మల్ని లెక్కలు తీస్తానని భయపెడితే భయపడిపోవడానికి మేం ఏ తప్పూ చేయలేదు. చేయబోము కూడా! నిజానికి పవన్‌ కల్యాణ్‌ తొలి దశ పర్యటనకు అత్యధిక ప్రచారం ఇచ్చింది కూడా మేమే! పవన్‌ కల్యాణ్‌ మెచ్చి మేక తోలు కప్పుతాడని ఆ పని చేయలేదు. మార్పు కోసం పెట్టిన పార్టీ అంటున్నారు కనుక పవన్‌ కల్యాణ్‌ ఏమి మాట్లాడతారా అన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది. అందుకే ఎక్కువ కవరేజ్‌ ఇచ్చాం. ఈ నాలుగు రోజుల పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ ఎంతమందికి అర్థమయ్యారో, ఎంత మందికి అర్థంకాలేదో కాలం గడిస్తే కానీ తెలియదు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత విమర్శలను సంయమనంతో స్వీకరించాలి. అలా కాకుండా విమర్శించే వారికి వార్నింగ్‌లు ఇవ్వాలనుకుంటే నష్టపోయేది ఆయనే!  మహనీయుల్ని వదిలి..ఈ విషయం అలా ఉంచితే, కులాభిమానం గురించి మాట్లాడిన సందర్భంగా విజయవాడ రాజకీయాల గురించి మాట్లాడాలంటే వంగవీటి రంగా ప్రస్తావన లేకుండా మాట్లాడలేమని పవన్‌ కల్యాణ్‌ అనడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా ఆలోచిస్తే ఈ అభ్యంతరాలు సహేతుకంగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే విజయవాడ మాత్రమే కాదు– కృష్ణా జిల్లానే ఒకప్పుడు అభ్యుదయవాదులు, హేతువాదులు, దేశభక్తులకు పుట్టిల్లు. ఈ రంగా–రాధాలు, నెహ్రూ–గాంధీలు మధ్యలో వచ్చినవారు. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో దేశభక్తి భావాలు ఎక్కువగా ఉండేవి. ఆ కారణంగానే బాలగంగాధర్‌ తిలక్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి మహనీయుల పేర్లు తమ పిల్లలకు పెట్టుకున్నారు. దేవినేని గాంధీ, నెహ్రూలకు కూడా వారి తల్లిదండ్రులు ఆ దృష్టితోనే ఆ పేర్లు పెట్టారు. అయితే వారు రౌడీ రాజకీయాలకు పాల్పడతారని ఆ పేర్లు పెట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఊహించి ఉండరు. దేశభక్తి భావాలతో పాటు కమ్యూనిస్టు భావాలు, అభ్యుదయ భావాలు కూడా ఎక్కువగానే ఉండేవి. ఫలితంగానే అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుల పేర్లను తమ పిల్లలకు పెట్టుకున్నారు. విజయవాడ ఒకప్పుడు నాస్తికవాదానికి ప్రధాన కేంద్రం. ఈ సందర్భంగా గోరా కుటుంబం గురించి ప్రస్తావించకుండా ఎలా ఉంటాం? సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన నాస్తికవాదాన్ని మనసా– వాచా– కర్మణా– అనుసరించారు. ఆయన సంతానం కూడా అంతే నిబద్ధతతో నాస్తికవాదాన్ని అనుసరిస్తున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలను ఎందరో మహానుభావులు ప్రభావితం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు కూడా చేపట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి ఇవాళ ఎంత మందికి తెలుసు? ఆంధ్రాబ్యాంకును స్థాపించింది కూడా ఆయనే! అయ్యదేవర కాళేశ్వరరావు, డాక్టర్‌ కె.ఎల్‌.రావు వంటి మహనీయులు రాజకీయాలకు వన్నె తెచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ వంటి ఉద్ధండ పండితులకు విజయవాడ నెలవుగా ఉండేది. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి అభ్యుదయవాదుల పుట్టిల్లు కూడా కృష్ణా జిల్లానే! విజయవాడ, కృష్ణా జిల్లా గురించి చెప్పుకోవాలంటే ఇలాంటి మహనీయుల పేర్లను స్మరించుకుని, అంతటి మహోన్నతుల వారసులమైన మనం ఈ కులాల కుళ్లులో చిక్కుకోవడం ఏమిటి? అని ప్రశ్నించి ఉండాల్సింది. ఉదాత్తమైన వ్యక్తులను అందించిన జిల్లానే రౌడీ రాజకీయాలకు కూడా నెలవు కావడం విషాదం.  పుస్తకాలను విపరీతంగా చదివే అలవాటు ఉన్న పవన్‌ కల్యాణ్‌ వాటి వల్లనే ప్రేరణ పొందుతారని చెబుతారు. జాతీయ, అంతర్జాతీయ నాయకుల గురించి ఆయనకు బాగా తెలుసు. దేశ ప్రజలకు మార్గదర్శకులుగా ఉన్న వ్యక్తుల వారసులుగా ఎదగండి అని తన కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ సూచించి ఉంటే బాగుండేది. తమ రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలకు కులాలను కవచంగా వాడుకున్నవారు యుగ పురుషులు కాలేరు. జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులను సైతం చెరిపేసుకుని అభ్యుదయ మార్గంలో నడయాడిన విజయవాడ, కృష్ణా జిల్లాలో ఇవ్వాళ కుల జాఢ్యం పురివిప్పి నాట్యమాడటం విషాదకర సన్నివేశమేనని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు పవన్‌ కల్యాణ్‌లో కూడా అభ్యుదయ భావాలు ఎక్కువ! కష్టాలకు కరిగిపోయే మనసు ఆయనది! సినీ నటుడు కాకముందే ఏదైనా హోటల్‌లో భోజనానికి వెళితే అక్కడ తినగా మిగిలిపోయిన ఐస్‌క్రీమ్‌ వంటి పదార్థాలను తీసుకుని హోటల్‌ వెలుపల ఆకలితో అలమటించే బిచ్చగాళ్లకు పవన్‌ కల్యాణ్‌ ప్రేమగా పెడుతుండేవాడు అని చిరంజీవి ఒక సందర్భంలో నాతో చెప్పారు. ఆకలితో అలమటించే వాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచన ఎంతో గొప్పది. ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు పవన్‌ కల్యాణ్‌లో ఉన్నాయి. వీటితోపాటు ఆవేశం పాలు కూడా ఎక్కువే! ఆయన అభిమానులు పవన్‌ కల్యాణ్‌లోని మంచి లక్షణాలను పట్టించుకోకుండా ఆవేశాన్ని మాత్రం అందిపుచ్చుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పవన్‌ కల్యాణ్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలు పవన్‌ కల్యాణ్‌ వంటికి సరిపోవు. అయినా రాజకీయాలలో మార్పు కోసం ప్రయత్నిస్తానని ఆయన చెబుతున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సఫలీకృతుడు అవుతారో కాలమే చెప్పాలి. ఇంతకు ముందు కూడా డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలం అయ్యారు. జేపీతో పోల్చితే పవన్‌ కల్యాణ్‌కు అభిమానులు చాలా ఎక్కువ. అయితే రాజకీయాలలో రాణించాలంటే అభిమానుల బలం సరిపోదు. ప్రజల నమ్మకం చూరగొనాలి. ప్రజలు భయంతో, ఆశతో బతుకుతుంటారు. మధ్యలో కుల, మత దురభిమానాలు ఉంటున్నా ఈ రెండింటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పార్టీ నాయకుడిపై ప్రజలకు నమ్మకం కుదరాలి. ఫలానా నాయకుడు అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న భరోసా ఏర్పడాలి.  ఆ భరోసా ఏర్పడనప్పుడు నాయకుడిని ప్రజలు వాడుకుంటారు. కమ్యూనిస్టు పార్టీలకు ఎన్నికలలో ఓట్లు రావు కానీ మిగతా సమయాలలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వారిని ఆశ్రయిస్తుంటారు. ఇందుకు కారణం ఏమిటంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేనందునే ఎన్నికలలో ప్రజలు వారికి ఓట్లు వేయరు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ను కూడా కమ్యూనిస్టుల తరహాలో ప్రజలు వాడుకుంటున్నారు.ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యను పవన్‌ కల్యాణ్‌ వెలుగులోకి తీసుకురాగానే ప్రభుత్వం స్పందించింది. దీంతో పవన్‌ కల్యాణ్‌ను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజలలో ఏర్పడింది. ఫలితంగా ఆయా సమస్యలు ఉన్నవారు పవన్‌ను కలుస్తున్నారు. నిజానికి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తుంటారు. అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, అధికార తెలుగుదేశం పార్టీకి మధ్య ఉప్పు– నిప్పు అన్నట్టుగా ఉన్నందున సమస్యలతో బాధపడుతున్నవారు ఆ పార్టీ గడప తొక్కడం లేదు.ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సంబంధాలు తెగిపోలేదు కనుక పవన్‌ అడుగుతున్నవాటిపై ప్రభుత్వం స్పందిస్తోంది. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియదు. ప్రభుత్వం నుంచి స్పందన ఆగిపోతే సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ను కలుస్తున్నవారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తారు. ఈ సూక్ష్మం తెలుసో తెలియదో గానీ, అధికారంలో లేకపోయినా సమస్యలు పరిష్కరించవచ్చునని పవన్‌ కల్యాణ్‌ నమ్ముతున్నారు. ఆయన విజిల్‌ బ్లోయర్‌ పాత్రకే పరిమితమైనంత కాలం లేదా అధికారపక్షంతో స్నేహం ఉన్నంత కాలమే ఈ వెసులుబాటు ఉంటుంది. అధికార పార్టీకి పోటీగా తయారైనప్పుడు అధికారపక్షం వైఖరి మారిపోతుంది.  అది కాకుంటే మరేంటి?నాలుగు రోజుల రాష్ట్ర పర్యటన తర్వాత భవిష్యత్తులో పవన్‌ కల్యాణ్‌ గమ్యం ఏమిటన్న దానిపై ప్రజలలో స్పష్టత ఏర్పడలేదనే చెప్పవచ్చు. మనకు అధికారం ముఖ్యం కాదు. మార్పు తీసుకురావడమే మన లక్ష్యం అని ఆయన చెబుతున్నదాన్ని బట్టి వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా, అధికార పార్టీకి పోటీగా ఆయన ఎదగాలని కోరుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. అంతేకాదు జనసేన కార్యకర్తల సమావేశాలలో ఆయన చేస్తున్న ప్రసంగాలు వింటున్నవారు కూడా ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలు మంచివే గానీ, ఆయన రాజకీయ వైఖరే అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగాలలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేసుకున్నారు. జగన్‌ అవినీతిపరుడనే తాను నమ్ముతున్నానన్న భావం కల్పించారు. ముఖ్యమంత్రి అయితేనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని అనడం ఏమిటని జగన్మోహన్‌రెడ్డిని ఎగతాళి చేశారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితులలో ఏపీకి చంద్రబాబు అనుభవం అవసరమని, ఆయన దక్షతపై ఇప్పటికీ తనకు నమ్మకం ఉందని పవన్‌ చెబుతున్నారు. దీంతో వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ కూడా పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసుకుని ‘అది జనసేన కాదు, భజన సేన’ అని విమర్శించడం మొదలుపెట్టింది. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగాలలో ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి వ్యాఖ్యలూ చేయకుండా పరిస్థితిని గమనిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వ్యవధి ఉంది. అప్పటికి పవన్‌ కల్యాణ్‌ ఎటువంటి వైఖరి తీసుకుంటారో తెలియదు. వచ్చే ఎన్నికలలో మా వాడు చంద్రబాబుతోనే కలుస్తాడు అని చిరంజీవి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు. జనసేన పార్టీకి ప్రస్తుత రూపం తీసుకురావడానికి తాను ఎంతో కష్టపడ్డానని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం పొందడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తుంది. తమ లక్ష్యం అధికారం కాదని పవన్‌ చెబుతున్నారు కనుక ఆ పార్టీ మనుగడ, ఉనికి ఎప్పటికైనా ప్రశ్నార్థకమే అవుతుంది. సమాజంలో లేదా రాజకీయాలలో మార్పు తేవాలన్నా అధికారం అవసరం. అలా కానప్పుడు ప్రత్యామ్నాయంగా విజిల్‌ బ్లోయర్‌ పాత్రను పోషించాలి. మార్పు గురించి మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌ ఆ మార్పు ఏమిటో మాత్రం వివరించడం లేదు. దీంతో ఆయన రాజకీయ వైఖరిపై రాజకీయవర్గాలలో అయోమయం ఏర్పడింది. జనసేన బలమైన రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటుందా? లేక రాజకీయాలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే సంస్థగా ఉంటుందా? అన్నది తేలవలసి ఉన్నది. అధికార పార్టీని పల్లెత్తు మాట అనకపోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతపై తనకు ఇంకా నమ్మకం ఉందని ప్రకటించడం ద్వారా పవన్‌ కల్యాణ్‌ తనకు తానే పరిమితులు విధించుకున్నారు. తనకు అవకాశం ఇస్తే చంద్రబాబు కంటే సమర్థంగా, మెరుగ్గా పరిపాలిస్తానని ఆయన చెప్పడం లేదు. పైగా ముఖ్యమంత్రి కావాలంటే అనుభవం ఉండాలనీ, ఆ అనుభవం జగన్మోహన్‌రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు. దీంతో తనకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అనుభవం లేదని పవన్‌ కల్యాణ్‌ చెప్పకనే చెప్పుకొన్నారు.  కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినవాళ్లు ప్రారంభంలో మాట్లాడే ప్రతి మాటనూ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులను పంచెలూడదీసి తరుముతానని వ్యాఖ్యానించిన పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు ముఖ్యమంత్రి బట్టలూడదీస్తాం? అని అనడం ఏమిటని జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇది ఆయనలో అప్పటికి,ఇప్పటికివచ్చిన మార్పా? ఏమో! ఏమిటో అంతా కన్ఫ్యూజన్‌! పవన్‌ కల్యాణ్‌ను చూసి మురిసిపోతున్న అభిమానులు మాత్రం ‘సీఎం– సీఎం’ అని నినదిస్తున్నారు. ఆయనేమో మీరు అలా అనుకుంటున్నారేమో గానీ నాలో ఎలాంటి భావం కలగడం లేదని చెప్పేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేకపోవడం, మరోవైపు రాజకీయాలలో మార్పు తేవాలన్న ఆకాంక్ష బలంగా ఉండటం ఆయనలోని ద్వైదీభావాన్ని తెలుపుతున్నాయి. ఏది ఏమైనా పవన్‌ కల్యాణ్‌ విషయంలోగానీ, జనసేన విషయంలోగానీ ప్రజలకు మరింత స్పష్టత అవసరం. ఇప్పటికైతే ఈ స్పష్టత పూర్తిగా కొరవడిందనే చెప్పాలి. భవిష్యత్తులో అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తారా? లేక విడిగా పోటీ చేస్తారా? అనే విషయమై పవన్‌ కల్యాణ్‌ స్పష్టత ఇస్తే మంచిది. సొంతంగా పోటీ చేయాలని భావించే పక్షంలో ఎందుకు పోటీ చేస్తున్నది? గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తారు? ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? అధికారంలోకి రావాలనుకుంటున్నారా? లేదా? మొదలైన అంశాలలో కూడా స్పష్టత అవసరం. ఎన్టీఆర్‌ రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఆనాటి అధికారపక్షంతో చెడుగుడు ఆడటంతో పాటు ప్రజలకు తాను ఏమి చేసేదీ స్పష్టంగా చెప్పారు. ఎన్టీఆర్‌ మాటలను నమ్మిన ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అనుభవం లేనివారు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడన్న అర్థంవచ్చేలా మాట్లాడటం ద్వారా పవన్‌ కల్యాణ్‌ తన భవిష్యత్తుకు తానే ఫుల్‌స్టాప్‌ పెట్టుకున్నారు. భవిష్యత్తు రోజుల్లోనైనా స్పష్టత వస్తుందేమో చూద్దాం..! యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసంhttp://www.youtube.com/abntelugutv  రాజకీయాలకు కొత్త కనుక ఆచితూచి మాట్లాడటం ఆయనకు ఇంకా అలవడలేదు. ఈ కారణంగా ప్రత్యర్థులు తనను విమర్శించే అవకాశాన్ని ఆయన ఇచ్చుకుంటున్నారు. ‘‘నేను మా అన్నయ్య చిరంజీవి అంత మంచివాడిని కాదు– ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించేటంత మంచితనం నాకు లేదు. నన్ను కొట్టడానికి ఎవరైనా వస్తే నేనే ముందు కొడతాను. చంపడానికి వస్తే నేను ముందు చంపడానికి ప్రయత్నిస్తాను. ప్రజారాజ్యం పార్టీ విఫలం కావడానికి కొందరి స్వార్థం కారణం. చిరంజీవిని కొంతమంది మోసం చేశారు’’ అని అంటూ వారందరినీ పేరు పేరునా గుర్తుపెట్టుకుంటానని కూడా పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. నిజానికి ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయనకే నష్టం. నిజ జీవితంలో రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేసేవారు కూడా బహిరంగంగా మాట్లాడేటప్పుడు గాంధీ మహాత్ముడి వారసులం అన్నట్టుగా మాట్లాడతారు. పవన్‌ కల్యాణ్‌కు ఈ కపటం తెలియదు కనుక తన మనస్సులో ఎలాంటి భావాలు ఉంటే వాటినే బయటకు వదులుతారు. వీధి పోరాటాలకు సైతం వెరవనని చెప్పుకోవడం అంటే ఆయన నిజంగానే వీధి పోరాటం చేస్తారని కాదు. ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఆ మాటలు ఉపయోగపడతాయి. అయితే రాజకీయాలలో అలా ఉండదు. నాయకులు మాట్లాడే ప్రతీ మాటను వక్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. చిరంజీవి మంచివాడు అనడం వరకు ఫర్వాలేదు గానీ, నేను అంత మంచివాడిని కాదని చెప్పడం వల్ల అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. తనను ఎవరూ మోసం చేయలేరని చెప్పడానికి ఆయన అలా మాట్లాడి ఉంటారు. కానీ ప్రత్యర్థులకు కాలు ఇవ్వకూడదు కదా! అయినా ఎవరో మనల్ని మోసం చేశారంటే అది అవతలివారి గొప్పతనం కంటే మన చేతకానితనమే అవుతుంది. ఎవరైనా రెండు సందర్భాలలో మోసం చేస్తారు. ఒకటి.. దురాశకు పోయినప్పుడు. రెండవది.. అతి మంచితనం– దీన్నే చేతకానితనం అని కూడా అంటారు. మోసపోవడం అనేది మన వైఫల్యమే అవుతుంది. రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఆచితూచి మాట్లాడటం! పవన్‌ కల్యాణ్‌ ఈ లక్షణాన్ని ఇంకా అలవర్చుకోలేదు. నేను నేనుగానే ఉంటాను అని ఆయన అనుకుంటే అది ఆయన ఇష్టం!  లెక్కలు భేషుగ్గా తీసుకోవచ్చు!పవన్‌ కల్యాణ్‌ తన రెండవ రోజు పర్యటన సందర్భంగా రాజమండ్రిలో మాట్లాడుతూ, నాపై ఒక నింద వేశారు. నేను ఆయనకు కులం ఆపాదించే ప్రయత్నం చేశానన్నది ఆయన ఆరోపణ సారాంశం. నిజానికి 2015 జూలై 12వ తేదీన నేను రాసిన ఈ కాలమ్‌లో చెప్పిందేమిటంటే, ‘‘పవన్‌ కల్యాణ్‌ మంచివాడు మాత్రమే కాదు. ఆవేశపరుడు కూడా. రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలను ఆయన ఇంకా వంటబట్టించుకోలేదు. రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన యువత ఎక్కువగా హడావుడి చేసింది. నిజానికి పవన్‌ కల్యాణ్‌కు కుల పిచ్చి లేదు. అందరివాడుగా ఉండాలనే ఆయన కోరుకుంటారు. కానీ కొందరి అత్యుత్సాహం వల్ల కొందరివాడుగా ముద్ర వేయించుకునే ప్రమాదం ఉంది’’ అని! ఇందులో ఆయనకు నేను కులం ఆపాదించింది ఎక్కడో తెలియడం లేదు. ఆయనకు కులం లేదనే చెప్పాను. అయినా ఆయన ఎందుకు అలా అర్థం చేసుకున్నారో తెలియదు. దీనిపై అప్పట్లోనే పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా స్పందించారు. అప్పుడు కూడా 2015, ఆగస్టు 30వ తేదీన రాసిన కాలమ్‌లో వివరణ ఇచ్చాను. ‘‘పవన్‌ కల్యాణ్‌ పర్యటన సందర్భంగా ఒకామె ఆయనను ఉద్దేశించి.. ‘మన వంగవీటి రంగా వస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారు. ఆయనకు మన గోడు చెబుతాను’ అని అన్నారు. తనను ఆవిడ వంగవీటి రంగాతో పోల్చినప్పుడే పవన్‌ కల్యాణ్‌ అభ్యంతరం చెప్పవలసింది. కానీ ఎందుకో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నష్టం జరిగేది పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే! అందరివాడుగా ఉండాలనుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ? రంగా ఎక్కడ? విజయవాడలో రంగా– రాధా ఒకవైపు, నెహ్రూ– గాంధీ ఒక వర్గంగా కొన్నేళ్లపాటు రౌడీ రాజకీయాలు చేశారు’’ అని ఆ కాలమ్‌లో రాశాను. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌లో ఆవేశంతోపాటు, అభ్యుదయ భావాలు కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ రాజకీయాలను సంస్కరించాలని ప్రయత్నించే ముందు అక్కడ నెలకొన్న కుల జాడ్యాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తే మరింత మంచి పేరు తెచ్చుకుంటారని కూడా అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఆయన కూడా ఈ కుల జాడ్యం పోవాలని చెప్పారు కనుక అభినందిస్తున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్న ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ, ‘‘వరంగల్‌ వెళ్లాను. ఆదిలాబాద్‌ వెళ్లాను. అక్కడ నా కులం ఉందా?తెలుగుదేశానికి మద్దతు ప్రకటించినప్పుడు మీరు ఎందుకు కులం గురించి రాయలేదు. మీకు సౌకర్యంగా ఉంటే ఒక మాట. లేకపోతే మరొక మాటా? నేను చిరంజీవిలా మంచి మనిషిని కాదు. మెతక మనిషిని కాదు. నాకు చావంటే భయం లేదు. ఇంకోసారి కులం గురించి మాట్లాడితే ఎవరెవరి సంస్థల్లో ఎవరెవరు ఉన్నారో లెక్కలు తీస్తా. ఆఫీసు బాయ్‌ నుంచి మేనేజర్‌ వరకు ఎవరెవరు ఏ కులమో లెక్కలు తీస్తా’’ అని అంటూ పరోక్షంగా నన్ను హెచ్చరించే ప్రయత్నం ఆయన చేశారు. ఇప్పుడు మళ్లీ మళ్లీ పవన్‌ కల్యాణ్‌కు స్పష్టంచేస్తున్నది ఒక్కటే! ఆయనకు కులాభిమానం లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే ఆయన తెలుసుకోవలసింది ఒకటి ఉంది. వరంగల్‌లో గానీ, ఆదిలాబాద్‌లో గానీ, బళ్లారిలో గానీ ఈ కులాల గోల లేదు. అందుకే ఆయనను అక్కడ ఎవరూ ఆ కోణంలో చూడరు. విజయవాడ పరిస్థితి వేరు! అక్కడ కులాన్ని బట్టి మనవాడా పరాయి వాడా అని చూస్తుంటారు.  పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ విషయం తెలుసు కనుకే శుక్రవారంనాడు విజయవాడ పర్యటనలోనే కులాభిమానానికి అతీతంగా ఎదగండి, ఆలోచించండి అని కార్యకర్తలకు సూచించారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమా? లేదా? అన్నది ఆయన ఇష్టం. తెలుగుదేశంపార్టీకి మద్దతు ఇవ్వాలని నేను ఏమన్నా ఆయనను కోరానా? నాకు సంబంధించినంత వరకు రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇక నన్ను హెచ్చరించడానికి ఎవరు ప్రయత్నించినా వృథానే! పవన్‌ కల్యాణ్‌ కంటే బలవంతులే నన్ను తొక్కేయాలని చూశారు. వాటన్నింటినీ తట్టుకుని ఎదురొడ్డి నిలబడ్డాను. ఎవరెవరి సంస్థల్లో ఏయే కులాల వాళ్లు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీస్తాను అని కూడా పవన్‌ పరోక్షంగా నాకు వార్నింగ్‌ ఇచ్చారనే అనుకుంటున్నాను. ‘చలోరే చలోరే చల్‌’ ప్రోగ్రామ్‌ ఆఖరి దశ పూర్తయ్యింది కనుక ఆయనే స్వయంగా మా కార్యాలయాలకు వెళ్లి కులాలవారీగా లెక్కలు తీసుకోవచ్చు. ఆయన వస్తానంటే నేనే గుమ్మం వద్దకు వెళ్లి స్వాగతిస్తాను. ఎవరి కులం ఏమిటో తెలుసుకుని ఉద్యోగాలు ఇవ్వడం మా సంస్థకు తెలియదు. ప్రాంతాలు, కులాలకు అతీతంగానే మేం వ్యవహరిస్తున్నాం. నిజానికి మా సంస్థలలో పనిచేసే చాలా మంది కులం ఏమిటో సహచరులకు కూడా తెలియదు. అలాంటి మమ్మల్ని లెక్కలు తీస్తానని భయపెడితే భయపడిపోవడానికి మేం ఏ తప్పూ చేయలేదు. చేయబోము కూడా! నిజానికి పవన్‌ కల్యాణ్‌ తొలి దశ పర్యటనకు అత్యధిక ప్రచారం ఇచ్చింది కూడా మేమే! పవన్‌ కల్యాణ్‌ మెచ్చి మేక తోలు కప్పుతాడని ఆ పని చేయలేదు. మార్పు కోసం పెట్టిన పార్టీ అంటున్నారు కనుక పవన్‌ కల్యాణ్‌ ఏమి మాట్లాడతారా అన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది. అందుకే ఎక్కువ కవరేజ్‌ ఇచ్చాం. ఈ నాలుగు రోజుల పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ ఎంతమందికి అర్థమయ్యారో, ఎంత మందికి అర్థంకాలేదో కాలం గడిస్తే కానీ తెలియదు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత విమర్శలను సంయమనంతో స్వీకరించాలి. అలా కాకుండా విమర్శించే వారికి వార్నింగ్‌లు ఇవ్వాలనుకుంటే నష్టపోయేది ఆయనే!  మహనీయుల్ని వదిలి..ఈ విషయం అలా ఉంచితే, కులాభిమానం గురించి మాట్లాడిన సందర్భంగా విజయవాడ రాజకీయాల గురించి మాట్లాడాలంటే వంగవీటి రంగా ప్రస్తావన లేకుండా మాట్లాడలేమని పవన్‌ కల్యాణ్‌ అనడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా ఆలోచిస్తే ఈ అభ్యంతరాలు సహేతుకంగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే విజయవాడ మాత్రమే కాదు– కృష్ణా జిల్లానే ఒకప్పుడు అభ్యుదయవాదులు, హేతువాదులు, దేశభక్తులకు పుట్టిల్లు. ఈ రంగా–రాధాలు, నెహ్రూ–గాంధీలు మధ్యలో వచ్చినవారు. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో దేశభక్తి భావాలు ఎక్కువగా ఉండేవి. ఆ కారణంగానే బాలగంగాధర్‌ తిలక్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వంటి మహనీయుల పేర్లు తమ పిల్లలకు పెట్టుకున్నారు. దేవినేని గాంధీ, నెహ్రూలకు కూడా వారి తల్లిదండ్రులు ఆ దృష్టితోనే ఆ పేర్లు పెట్టారు. అయితే వారు రౌడీ రాజకీయాలకు పాల్పడతారని ఆ పేర్లు పెట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఊహించి ఉండరు. దేశభక్తి భావాలతో పాటు కమ్యూనిస్టు భావాలు, అభ్యుదయ భావాలు కూడా ఎక్కువగానే ఉండేవి. ఫలితంగానే అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుల పేర్లను తమ పిల్లలకు పెట్టుకున్నారు. విజయవాడ ఒకప్పుడు నాస్తికవాదానికి ప్రధాన కేంద్రం. ఈ సందర్భంగా గోరా కుటుంబం గురించి ప్రస్తావించకుండా ఎలా ఉంటాం? సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన నాస్తికవాదాన్ని మనసా– వాచా– కర్మణా– అనుసరించారు. ఆయన సంతానం కూడా అంతే నిబద్ధతతో నాస్తికవాదాన్ని అనుసరిస్తున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలను ఎందరో మహానుభావులు ప్రభావితం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు కూడా చేపట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గురించి ఇవాళ ఎంత మందికి తెలుసు? ఆంధ్రాబ్యాంకును స్థాపించింది కూడా ఆయనే! అయ్యదేవర కాళేశ్వరరావు, డాక్టర్‌ కె.ఎల్‌.రావు వంటి మహనీయులు రాజకీయాలకు వన్నె తెచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ వంటి ఉద్ధండ పండితులకు విజయవాడ నెలవుగా ఉండేది. త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి అభ్యుదయవాదుల పుట్టిల్లు కూడా కృష్ణా జిల్లానే! విజయవాడ, కృష్ణా జిల్లా గురించి చెప్పుకోవాలంటే ఇలాంటి మహనీయుల పేర్లను స్మరించుకుని, అంతటి మహోన్నతుల వారసులమైన మనం ఈ కులాల కుళ్లులో చిక్కుకోవడం ఏమిటి? అని ప్రశ్నించి ఉండాల్సింది. ఉదాత్తమైన వ్యక్తులను అందించిన జిల్లానే రౌడీ రాజకీయాలకు కూడా నెలవు కావడం విషాదం.  పుస్తకాలను విపరీతంగా చదివే అలవాటు ఉన్న పవన్‌ కల్యాణ్‌ వాటి వల్లనే ప్రేరణ పొందుతారని చెబుతారు. జాతీయ, అంతర్జాతీయ నాయకుల గురించి ఆయనకు బాగా తెలుసు. దేశ ప్రజలకు మార్గదర్శకులుగా ఉన్న వ్యక్తుల వారసులుగా ఎదగండి అని తన కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ సూచించి ఉంటే బాగుండేది. తమ రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలకు కులాలను కవచంగా వాడుకున్నవారు యుగ పురుషులు కాలేరు. జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులను సైతం చెరిపేసుకుని అభ్యుదయ మార్గంలో నడయాడిన విజయవాడ, కృష్ణా జిల్లాలో ఇవ్వాళ కుల జాఢ్యం పురివిప్పి నాట్యమాడటం విషాదకర సన్నివేశమేనని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు పవన్‌ కల్యాణ్‌లో కూడా అభ్యుదయ భావాలు ఎక్కువ! కష్టాలకు కరిగిపోయే మనసు ఆయనది! సినీ నటుడు కాకముందే ఏదైనా హోటల్‌లో భోజనానికి వెళితే అక్కడ తినగా మిగిలిపోయిన ఐస్‌క్రీమ్‌ వంటి పదార్థాలను తీసుకుని హోటల్‌ వెలుపల ఆకలితో అలమటించే బిచ్చగాళ్లకు పవన్‌ కల్యాణ్‌ ప్రేమగా పెడుతుండేవాడు అని చిరంజీవి ఒక సందర్భంలో నాతో చెప్పారు. ఆకలితో అలమటించే వాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచన ఎంతో గొప్పది. ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు పవన్‌ కల్యాణ్‌లో ఉన్నాయి. వీటితోపాటు ఆవేశం పాలు కూడా ఎక్కువే! ఆయన అభిమానులు పవన్‌ కల్యాణ్‌లోని మంచి లక్షణాలను పట్టించుకోకుండా ఆవేశాన్ని మాత్రం అందిపుచ్చుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పవన్‌ కల్యాణ్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలు పవన్‌ కల్యాణ్‌ వంటికి సరిపోవు. అయినా రాజకీయాలలో మార్పు కోసం ప్రయత్నిస్తానని ఆయన చెబుతున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సఫలీకృతుడు అవుతారో కాలమే చెప్పాలి. ఇంతకు ముందు కూడా డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇలాంటి ప్రయత్నమే చేసి విఫలం అయ్యారు. జేపీతో పోల్చితే పవన్‌ కల్యాణ్‌కు అభిమానులు చాలా ఎక్కువ. అయితే రాజకీయాలలో రాణించాలంటే అభిమానుల బలం సరిపోదు. ప్రజల నమ్మకం చూరగొనాలి. ప్రజలు భయంతో, ఆశతో బతుకుతుంటారు. మధ్యలో కుల, మత దురభిమానాలు ఉంటున్నా ఈ రెండింటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పార్టీ నాయకుడిపై ప్రజలకు నమ్మకం కుదరాలి. ఫలానా నాయకుడు అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న భరోసా ఏర్పడాలి.  ఆ భరోసా ఏర్పడనప్పుడు నాయకుడిని ప్రజలు వాడుకుంటారు. కమ్యూనిస్టు పార్టీలకు ఎన్నికలలో ఓట్లు రావు కానీ మిగతా సమయాలలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వారిని ఆశ్రయిస్తుంటారు. ఇందుకు కారణం ఏమిటంటే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేనందునే ఎన్నికలలో ప్రజలు వారికి ఓట్లు వేయరు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ను కూడా కమ్యూనిస్టుల తరహాలో ప్రజలు వాడుకుంటున్నారు.ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యను పవన్‌ కల్యాణ్‌ వెలుగులోకి తీసుకురాగానే ప్రభుత్వం స్పందించింది. దీంతో పవన్‌ కల్యాణ్‌ను ఆశ్రయిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజలలో ఏర్పడింది. ఫలితంగా ఆయా సమస్యలు ఉన్నవారు పవన్‌ను కలుస్తున్నారు. నిజానికి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రతిపక్షాన్ని ఆశ్రయిస్తుంటారు. అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, అధికార తెలుగుదేశం పార్టీకి మధ్య ఉప్పు– నిప్పు అన్నట్టుగా ఉన్నందున సమస్యలతో బాధపడుతున్నవారు ఆ పార్టీ గడప తొక్కడం లేదు.ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సంబంధాలు తెగిపోలేదు కనుక పవన్‌ అడుగుతున్నవాటిపై ప్రభుత్వం స్పందిస్తోంది. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియదు. ప్రభుత్వం నుంచి స్పందన ఆగిపోతే సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ను కలుస్తున్నవారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తారు. ఈ సూక్ష్మం తెలుసో తెలియదో గానీ, అధికారంలో లేకపోయినా సమస్యలు పరిష్కరించవచ్చునని పవన్‌ కల్యాణ్‌ నమ్ముతున్నారు. ఆయన విజిల్‌ బ్లోయర్‌ పాత్రకే పరిమితమైనంత కాలం లేదా అధికారపక్షంతో స్నేహం ఉన్నంత కాలమే ఈ వెసులుబాటు ఉంటుంది. అధికార పార్టీకి పోటీగా తయారైనప్పుడు అధికారపక్షం వైఖరి మారిపోతుంది.  అది కాకుంటే మరేంటి?నాలుగు రోజుల రాష్ట్ర పర్యటన తర్వాత భవిష్యత్తులో పవన్‌ కల్యాణ్‌ గమ్యం ఏమిటన్న దానిపై ప్రజలలో స్పష్టత ఏర్పడలేదనే చెప్పవచ్చు. మనకు అధికారం ముఖ్యం కాదు. మార్పు తీసుకురావడమే మన లక్ష్యం అని ఆయన చెబుతున్నదాన్ని బట్టి వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా, అధికార పార్టీకి పోటీగా ఆయన ఎదగాలని కోరుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. అంతేకాదు జనసేన కార్యకర్తల సమావేశాలలో ఆయన చేస్తున్న ప్రసంగాలు వింటున్నవారు కూడా ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలు మంచివే గానీ, ఆయన రాజకీయ వైఖరే అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగాలలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేసుకున్నారు. జగన్‌ అవినీతిపరుడనే తాను నమ్ముతున్నానన్న భావం కల్పించారు. ముఖ్యమంత్రి అయితేనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని అనడం ఏమిటని జగన్మోహన్‌రెడ్డిని ఎగతాళి చేశారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితులలో ఏపీకి చంద్రబాబు అనుభవం అవసరమని, ఆయన దక్షతపై ఇప్పటికీ తనకు నమ్మకం ఉందని పవన్‌ చెబుతున్నారు. దీంతో వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ కూడా పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసుకుని ‘అది జనసేన కాదు, భజన సేన’ అని విమర్శించడం మొదలుపెట్టింది. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగాలలో ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి వ్యాఖ్యలూ చేయకుండా పరిస్థితిని గమనిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వ్యవధి ఉంది. అప్పటికి పవన్‌ కల్యాణ్‌ ఎటువంటి వైఖరి తీసుకుంటారో తెలియదు. వచ్చే ఎన్నికలలో మా వాడు చంద్రబాబుతోనే కలుస్తాడు అని చిరంజీవి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు. జనసేన పార్టీకి ప్రస్తుత రూపం తీసుకురావడానికి తాను ఎంతో కష్టపడ్డానని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం పొందడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తుంది. తమ లక్ష్యం అధికారం కాదని పవన్‌ చెబుతున్నారు కనుక ఆ పార్టీ మనుగడ, ఉనికి ఎప్పటికైనా ప్రశ్నార్థకమే అవుతుంది. సమాజంలో లేదా రాజకీయాలలో మార్పు తేవాలన్నా అధికారం అవసరం. అలా కానప్పుడు ప్రత్యామ్నాయంగా విజిల్‌ బ్లోయర్‌ పాత్రను పోషించాలి. మార్పు గురించి మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌ ఆ మార్పు ఏమిటో మాత్రం వివరించడం లేదు. దీంతో ఆయన రాజకీయ వైఖరిపై రాజకీయవర్గాలలో అయోమయం ఏర్పడింది. జనసేన బలమైన రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటుందా? లేక రాజకీయాలలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే సంస్థగా ఉంటుందా? అన్నది తేలవలసి ఉన్నది. అధికార పార్టీని పల్లెత్తు మాట అనకపోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతపై తనకు ఇంకా నమ్మకం ఉందని ప్రకటించడం ద్వారా పవన్‌ కల్యాణ్‌ తనకు తానే పరిమితులు విధించుకున్నారు. తనకు అవకాశం ఇస్తే చంద్రబాబు కంటే సమర్థంగా, మెరుగ్గా పరిపాలిస్తానని ఆయన చెప్పడం లేదు. పైగా ముఖ్యమంత్రి కావాలంటే అనుభవం ఉండాలనీ, ఆ అనుభవం జగన్మోహన్‌రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు. దీంతో తనకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అనుభవం లేదని పవన్‌ కల్యాణ్‌ చెప్పకనే చెప్పుకొన్నారు.  కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినవాళ్లు ప్రారంభంలో మాట్లాడే ప్రతి మాటనూ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులను పంచెలూడదీసి తరుముతానని వ్యాఖ్యానించిన పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు ముఖ్యమంత్రి బట్టలూడదీస్తాం? అని అనడం ఏమిటని జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇది ఆయనలో అప్పటికి,ఇప్పటికివచ్చిన మార్పా? ఏమో! ఏమిటో అంతా కన్ఫ్యూజన్‌! పవన్‌ కల్యాణ్‌ను చూసి మురిసిపోతున్న అభిమానులు మాత్రం ‘సీఎం– సీఎం’ అని నినదిస్తున్నారు. ఆయనేమో మీరు అలా అనుకుంటున్నారేమో గానీ నాలో ఎలాంటి భావం కలగడం లేదని చెప్పేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేకపోవడం, మరోవైపు రాజకీయాలలో మార్పు తేవాలన్న ఆకాంక్ష బలంగా ఉండటం ఆయనలోని ద్వైదీభావాన్ని తెలుపుతున్నాయి. ఏది ఏమైనా పవన్‌ కల్యాణ్‌ విషయంలోగానీ, జనసేన విషయంలోగానీ ప్రజలకు మరింత స్పష్టత అవసరం. ఇప్పటికైతే ఈ స్పష్టత పూర్తిగా కొరవడిందనే చెప్పాలి. భవిష్యత్తులో అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తారా? లేక విడిగా పోటీ చేస్తారా? అనే విషయమై పవన్‌ కల్యాణ్‌ స్పష్టత ఇస్తే మంచిది. సొంతంగా పోటీ చేయాలని భావించే పక్షంలో ఎందుకు పోటీ చేస్తున్నది? గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తారు? ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? అధికారంలోకి రావాలనుకుంటున్నారా? లేదా? మొదలైన అంశాలలో కూడా స్పష్టత అవసరం. ఎన్టీఆర్‌ రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఆనాటి అధికారపక్షంతో చెడుగుడు ఆడటంతో పాటు ప్రజలకు తాను ఏమి చేసేదీ స్పష్టంగా చెప్పారు. ఎన్టీఆర్‌ మాటలను నమ్మిన ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అనుభవం లేనివారు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడన్న అర్థంవచ్చేలా మాట్లాడటం ద్వారా పవన్‌ కల్యాణ్‌ తన భవిష్యత్తుకు తానే ఫుల్‌స్టాప్‌ పెట్టుకున్నారు. భవిష్యత్తు రోజుల్లోనైనా స్పష్టత వస్తుందేమో చూద్దాం..!యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసంhttp://www.youtube.com/abntelugutv
editorial
8,868
25-11-2017 08:23:17
'సైరా'కు రెమ్యూనరేషన్‌ని 3రెట్లు పెంచేసిన నయనతార!
బాగా డిమాండ్ ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్లలో నయనతార ఒకరు. పెద్ద హీరోల సినిమా అంటే డైరెక్టర్లకు ముందుగా గుర్తొచ్చేది కూడా నయనతారే. త్వరలో సైరా నరసింహారెడ్డి సినిమాతో చాలా బిజీ అవనుందీ ముద్దుగుమ్మ. ఇప్పటికే అరమ్ మూవీలో కలెక్టర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ కోటి రూపాయలని టాక్. దీన్ని సైరా నరసింహారెడ్డి మూవీలో నటించేందుకు దాదాపు మూడు రెట్లు పెంచేంసిందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ నయన్ ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకునే నయన్... సైరా నరసింహారెడ్డి మూవీకి మాత్రం రూ.3.5కోట్లు తీసుకుంటోందని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.
entertainment
19,949
12-08-2017 03:47:40
6బంతుల్లో.. 6 వికెట్లు
13 ఏళ్ల బాలుడి సంచలనంలండన్‌: వరుసగా మూడు వికెట్లు పడిగొడి తే హ్యాట్రిక్‌ అంటాం.. నాలుగు కూల్చితే వావ్‌ అంటాం..! కానీ.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొడితే.. అది కూడా క్లీన్‌బౌల్డ్‌ అయితే వావ్‌.. గ్రేట్‌ అనాల్సిందేమరి! ఇంగ్లండ్‌కు చెందిన 13 ఏళ్ల స్కూల్‌ క్రికెటర్‌ లూక్‌ రాబిన్‌సన్‌ ఇదే ఘనత సాధించి శభాష్‌ అనిపించుకున్నాడు. ఫిలిడెల్ఫియా క్రికెట్‌ క్లబ్‌ తరఫున అండర్‌-13 క్రికెట్‌ టోర్నీలో బరిలోకి దిగిన రాబిన్‌సన్‌ ఆరు బంతుల్లో ఆరు వికెట్లు కూల్చి డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. ఈ సమయంలో అతని తల్లి హెలెన్‌ స్కోరర్‌గా వ్యవహరిస్తుండగా.. తండ్రి స్టీఫెన్‌ అంపైరింగ్‌ చేస్తూ అతి దగ్గరినుంచి ఈ ఫీట్‌ను చూశాడు. చిన్నన్న మాథ్యూ ఫీల్డింగ్‌ చేస్తుంటే.. తాత గ్లెన్‌ బౌండ్రీలైన్‌ బయట నుంచి ఈ మ్యాచ్‌ను వీక్షించాడు.
sports
9,809
04-08-2017 10:45:23
ఆ హీరోతో చేయడం ఇష్టం లేకనే రకూల్ నో చెప్పిందట..!
రకూల్‌కి టాలీవుడ్‌లో అవకాశాలు ఎలా వరుస కడుతున్నాయో కోలీవుడ్‌లో కూడా అలాగే క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో రెండు సినిమాలతో బిజీగా ఉన్న రకూల్‌ దగ్గరకి ఓ పెద్ద ఆఫర్‌ వచ్చిందట! అదేమిటంటే విజయ్‌ సరసన హీరోయిన్‌గా చేసే అవకాశం. మామూలుగా విజయ్‌లాంటి హీరో పక్కన చేయడం అంటే ఏ హీరోయిన్‌ అయినా ఎగిరిగంతేసి ఒప్పుకుంటారు. కానీ రకూల్‌ మాత్రం డేట్లు అడ్జస్ట్‌ చేయలేనంటూ నో చెప్పేసిందట! నిజానికి రకూల్‌ దగ్గర డేట్లు ఉన్నా నో చెప్పిందనీ, దీనికీ ఓ కారణం ఉంది అని అంటున్నారు. ఇటీవలి కాలంలో విజయ్‌ సినిమాలేవీ పెద్దగా హిట్‌ అయిన దాఖలాలు లేవు. ఇలాంటి సమయంలో అతగాడి పక్కన చేస్తే కోలీవుడ్‌లో తన రెప్యుటేషన్‌ దెబ్బతింటుందనిన రకూల్‌ ఆ విధంగా చెప్పిందని అంటున్నారు.
entertainment
1,910
21-07-2017 00:31:00
కాకినాడలో ఫారిన్‌ట్రేడ్‌, ప్యాకేజింగ్‌ సంస్థ
కాకినాడ (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ప్రత్యేక ఆర్థిక మండలి (కెఎ్‌సఇజెడ్‌)లో కేంద్ర ప్రభుత్వం ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ట్రేడ్‌ (ఐఐఎ్‌ఫటి), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ (ఐఐపి) ఏర్పాటు చేస్తోంది. ఈ ఇనిస్టిట్యూట్‌లకు ఇప్పటికే కాకినాడ సెజ్‌లో చెరో 25 ఎకరాలను కేటాయించారు. ఈ మేరకు కాకినాడ ఆర్‌డిఒ ప్రభుత్వం తరపున సెజ్‌ ప్రతినిధులకు ఈ పత్రాలను అందజేశారు. కొత్తపల్లి మండలం కోనపాపపేటలోని సెజ్‌ ప్రాంతంలో ఐఐఎ్‌ఫటి, ఐఐపి నిర్మాణాలకు ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించనున్నట్టు సమాచారం.
business
14,449
22-11-2017 01:13:56
ఫరూక్‌ నాలుక తెగ్గోస్తే 21 లక్షలు: ఫ్రంట్‌
న్యూఢిల్లీ, నవంబరు 21: కశ్మీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా నాలుక తెగ్గోసిన వారికి రూ.21లక్షల బహుమతి ఇస్తామని ‘యాంటీ టెర్రరిస్టు ఫ్రంట్‌ ఇండి యా’మంగళవారం ప్రకటించింది. పాకిస్థాన్‌కు అనుకూల వ్యాఖ్యలు చేసి భారత్‌ను అవమానించిన అబ్దుల్లాను అరెస్టు చేసి విచారణ జరపాలని ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు వీరేశ్‌ శాండిల్య డిమాండ్‌ చేశారు. కాగా, శాండిల్య మూర్ఖుడని ఫరూక్‌ కుమారుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా మండిపడ్డారు.
nation
571
18-07-2017 00:46:06
సత్యం కేసులో త్వరలో పిడబ్ల్యుసిపై సెబి చర్యలు!
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్‌ కేసులో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి త్వరలోనే బహుళ జాతి ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌ వాటర్‌హౌజ్‌ కూపర్స్‌ (పిడబ్ల్యుసి)పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రమోటర్లు కంపెనీ ఖాతాలను తారుమారు చేసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినందుకు సెబి.. ఫిబ్రవరి, 2009లోనే పిడబ్ల్యుసికి నోటీసులు జారీ చేసింది. దాంతో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసిఎఐ)కు తప్ప సెబికి తమకు నోటీసులు జారీ చేసే అధికారం లేని పిడబ్ల్యుసి బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. సెబికి ఆ అధికారం ఉందని కోర్టు స్పష్టం చేయడంతో సెబి అప్పటి నుంచి ఈ కేసును విచారిస్తోంది. ఆరు నెలల్లో ఈ కేసు విచారణ పూర్తి చేయాలని ఈ సంవత్సరం జనవరిలో సుప్రీంకోర్టు సెబిని కోరింది. దీంతో జూన్‌తో విచారణ ముగించిన సెబి, త్వరలోనే ఈ కుంభకోణంలో పిడబ్ల్యుసి పాత్ర, అందుకు విధించే శిక్షను ప్రకటిస్తుందని సమాచారం.
business
4,932
30-04-2017 16:59:05
బాహుబ‌లి2 సినిమా ఆడ‌టాన్ని త‌ట్టుకోలేక 2 క్యాన్ల పెట్రోల్ తీసుకెళ్లి...
క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ వ్య‌క్తి రెచ్చిపోయాడు. బాహుబ‌లి2 సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న హోస్కోట్ ప‌ట్ట‌ణంలోని అలంకార్ థియేట‌ర్ వ‌ద్ద‌కు సంతోష్ అనే 20 సంవ‌త్సరాల యువ‌కుడు వెళ్లి నానా ర‌చ్చ చేశాడు. పార్కింగ్ లో ఉంచిన 10 బైక్‌ల‌కు త‌న వెంట తెచ్చుకున్న 2క్యాన్ల పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న‌లో బైక్స్ మంట‌ల్లో కాలిపోయాయి. సెక్యూరిటీ గార్డ్ గ‌మ‌నించి ఆప‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయినా స‌రే, అత‌నితో సంతోష్ వాగ్వాదానికి దిగాడు. క‌న్న‌డ సినిమాకు బ‌దులుగా తెలుగు సినిమా ఎలా ప్ర‌ద‌ర్శిస్తార‌ని ప్ర‌శ్నించాడు.  శ‌నివారం మ్యాట్నీ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. బాహుబ‌లి2 సినిమా ఈ నెల 28న విడుద‌లై పాజిటివ్ టాక్‌తో, రికార్డ్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. విడుద‌లైన అన్ని భాష‌ల్లో హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. అంతా సాఫీగా సాగిపోతున్న ఈ త‌రుణంలో క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.
entertainment
20,319
26-12-2017 03:31:49
పరువుకోసం ఇంగ్లండ్‌
నేటి నుంచి ఆసీస్‌తో బాక్సింగ్‌ డే టెస్ట్‌మెల్‌బోర్న్‌: యాషెస్‌ సిరీస్‌ చేజారడంతో.. కనీసం పరువు దక్కించుకోవడానికి ఇంగ్లండ్‌ పోరాడనుంది. ఎంసీజీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య మంగళవారం నుంచి బాక్సింగ్‌ డే టెస్టు మొదలుకానుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో మొదటి మూడింటిలో జో రూట్‌ సేన దారుణ పరాజయాన్ని చవి చూడడంతో మిగిలిన రెండు టెస్టులు నామ మాత్రమ య్యాయి. కాగా, ఇప్పటికే సిరీస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా ఎంతో ఆత్మవిశ్వాసంతో క్లీన్‌ స్వీప్‌పై గురిపెట్టింది. ఆసీస్‌ సారథి స్మిత్‌ సూపర్‌ ఫామ్‌ ప్రత్యర్థులకు వణకుపు ట్టిస్తోంది. గత మూడు బాక్సింగ్‌ డే టెస్టుల్లోనూ స్మిత్‌ సెంచరీలతో మెరిశాడు. ఈ ఏడాది కూడా మరో శతకంపై కన్నేశాడు. ఉ. 5 గం నుంచి సోనీ సిక్స్‌లో...
sports
4,353
07-01-2017 02:27:18
చిన్న సవరణ...పెద్ద ఫలితం
ఇటీవల ముఖ్యమంత్రి అర్చకుల సమస్యల పరిష్కారం దిశగా అధికారులు, అర్చకనాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ లోపల తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణ అర్చక సమాఖ్య, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం తరపున ముఖ్యమంత్రి చొరవకు అమితంగా ఆనందిస్తున్నాము. 1987వ సంవత్సరంలో చల్లా కొండయ్య కమిషన్‌ సూచనల ప్రకారం రూపొందిన దేవాదాయ చట్టం 30/87 అర్చకుల పాలిట, ఆలయాల పాలిట అశనిపాతం అయింది. సదరు చట్ట /రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పలు అర్చక సంఘాలు సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌లు దాఖలు చేయగా 1996 సంవత్సరంలో ఆ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. ఆ తీర్పుకు కొనసాగింపుగా ఇచ్చిన పలు తీర్పులు పరస్పర విరుద్ధంగా వున్నాయంటూ అర్చకులు పలు రివ్యూ పిటిషన్‌లు దాఖలు చేశారు. 2004వ సంవత్సరంలో ఆ తీర్పును పునర్విమర్శ చేసిన విస్తృత ధర్మాసనం రివ్యూ పిటిషన్లను స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్చకులకు 1966 చట్టం కింద హక్కులను 30/87 తొలగించటం రాజ్యాంగబద్ధం కాదని అభిప్రాయపడింది.  అర్చకుల వంశపారంపర్య హక్కు మత సాంప్రదాయంలో భాగమేనని భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 25, 26 ప్రకారం ఇందుకు రక్షణ లభిస్తుందని చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకొని ఈ కేసులను విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ఇంతలో 2007 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ చట్టంలోని పలు కీలక సెక్షన్‌లను సవరణలు చేస్తూ దేవాదాయ సవరణ చట్టం 33/2007ను తీసుకువచ్చింది. ఈ సవరణ ద్వారా సెక్షన్‌ 34, 144 వంటి కీలక సెక్షన్‌లలో అర్చకుల పారంపర్య హక్కులు తిరిగి సంక్రమించాయి.  సదరు సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించిన మీదట అర్చకులు, ప్రభుత్వం, సుప్రీంకోర్టులోని రివ్యూ పిటిషన్‌లలో ఎవరికివారు తమ అఫిడవిట్లను దాఖలు చేశారు. అర్చకులకు 1987లో రూపొందించిన 30/87కు ముందున్న స్థితిని పునరుద్ధరిస్తూ శాసనసభా సవరణ చట్టం ఆమోదించడాన్ని పరిగణనలోనికి తీసుకొన్న సుప్రీంకోర్టు ఇంతకుముందు డివిజన్‌ బెంచ్ 1996లో నారాయణ దీక్షితులు కేసులో ఇచ్చిన తీర్పును పూర్వ పక్షం చేస్తూ ఇక మీదట ఏవైనా చట్ట నిబంధనలపై తిరిగి విచారణ కోరే హక్కును అర్చకులకు కల్పిస్తూ రివ్యూ పిటిషన్లలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అర్చకులకు 1987 నుంచి చేస్తున్న ఎడతెగని పోరాటంలో విజయం చేకూరినట్లైంది. అర్చకులకు గౌరవప్రదమైన పూర్వపు స్థితి కలిగినందుకు దేవాదాయ సవరణ చట్టం 33/2007ను సుప్రీంకోర్టు పరిగణనలోనికి తీసుకొనింది. 1996లో డివిజన్‌బెంచ్‌ ఎ.ఎస్‌. నారాయణ దీక్షితులు కేసులో తీర్పును సుప్రీంకోర్టు పూర్వపక్షం చేస్తూ విస్తృత ధర్మాసనం 2013లో జారీ చేసిన ఉత్తర్వులు అర్చకులకు చేకూరిన ఘన విజయంగా అర్చక సమాఖ్యలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. మన దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకు, చట్టబద్ధమైన పాలనకు ఇది ఒక ఘన విజయం. 1987 చట్టాన్ని సుప్రీంకోర్టు 1996లో సమర్థించినప్పటికీ శాసనసభలో 1987లో జరిగిన తప్పును తనకు తానుగా శాసనసభ సవరించడం శుభపరిణామం. సుప్రీంకోర్టులోని విస్తృత ధర్మాసనం 2007లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చేసిన ఈ సవరణ చట్టాన్ని ఆమోదించి రివ్యూ పిటీషన్‌ను తోసిపుచ్చింది. అలా అత్యున్నత న్యాయస్థానం అర్చకుల వ్యాజ్యంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. శాసనసభ ఉన్నతమైన స్థానాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో గుర్తించడమైనది. ప్రతి పౌరుడూ ఈ సందేశానికి సంతోషించాలి. గర్వపడాలి. 30/87 చట్టం అమలులో ఇబ్బందులను అధిగమించే నిమిత్తం చేసిన సవరణ చట్టం 33/2007లోని 144వ సెక్షన్‌ కింద అర్చకులకు లబ్ధి చేకూరుస్తూ చేయబడ్డ స్కీంను దేవాదాయ శాఖ నేటి వరకు అమలు జరపలేదు. ధార్మిక పరిషత్‌ సదరు 144వ సెక్షన్‌ కింద స్కీంను ఆరునెలల లోగా అమలు చేయాలని తీర్మానించినప్పటికీ నేటి వరకు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో 2013 ఫిబ్రవరి 1న సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్‌లో ఇచ్చిన తీర్పు ఆధారంగా 1966 చట్టం కింద అర్చకులకు ఒనగూడే అన్ని గౌరవాలు, లబ్ధి యథాప్రకారం చేకూరుతాయని అర్చకులందరూ ఆయా దేవాలయాల సదాచార రీత్యా దక్షిణా వగైరా తిరిగి తీసుకునే అవకాశం కలుగుతుంది. దాంతో ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉన్న అర్చకుల జీవితాల్లో వెలుగు వస్తుందని గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం కలుగుతుందని ఈ తీర్పు తెలియజేస్తుంది. దేవాలయాల పరిరక్షణ ఉద్యమం, తెలంగాణ అర్చక సమాఖ్య కోరుతున్నది ఏమనగా సాలీనా ఆదాయం 10 లక్షల లోపు ఉన్న దేవాలయాలను సెక్షన్లు 15, 16, 29, 34, 65(1), 144ల నుంచి మినహాయిస్తూ వాటి నిర్వహణను 1987కు పూర్వం ఎలా ఉండిందో అదే రీతిలో వ్యవహరించేట్టు చట్టంలోని 154సెక్షన్‌ను సవరించాలి. అర్చక ముతవల్లి ద్వారా తెలంగాణ ప్రాంత గ్రామీణ దేవాలయాలు నడిచేటట్టు ఉత్తర్వులు ఈ శాసనసభ ప్రస్తుత సమావేశాలలోనే చేసేస్తే ‘డెయిలీ పూజానిధి విధానం ద్వారా శాశ్వత నిధి’ని ఆయా దేవాలయాలు సమకూర్చుకుంటాయి. ఇది ఒక చిన్న సవరణ.. పెద్ద ఫలితం.. తెలంగాణలోని 14 వేల దేవాలయాలు ఊపిరి పీలుస్తాయి. -చిలుకూరు రంగరాజన్‌అధ్యక్షులు, తెలంగాణ అర్చక సమాఖ్య
editorial
6,436
19-05-2017 09:04:19
గుండె కుడి వైపు ఎవరికుందో బయటపెట్టిన నిఖిల్!
మనిషికి కుడి వైపు గుండె ఉంటే అతను ఎదుర్కొనే సమస్యలు, అతనికుండే లక్షణాలు, అలాంటి ఒక వ్యక్తి పగ తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే కలిగే పరిణామాలతో రూపొందిన సినిమా కేశవ. స్టోరీ సెలక్షన్‌లో ది బెస్ట్ అని నిరూపించకున్న నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ విడుదల కాబోతోంది. ట్రైలర్‌తో అంచనాలు అమాంతం పెంచేసిన ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిఖిల్ తన ఫేస్‌బుక్ పేజ్ ద్వారా లైవ్‌లోకి వచ్చాడు. అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ చిట్‌చాట్‌లో కేశవ సినిమాకు సంబంధించిన ఓ రహస్యాన్ని నిఖిల్ బయటపెట్టాడు. కేశవ సినిమాలో హీరోకి కుడివైపు గుండె ఉంటుందన్నారు... దాని గురించి వివరించగలరా అని ఓ అభిమాని ఫేస్‌బుక్ లైవ్‌లో కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్‌కు నిఖిల్ సమాధానమిస్తూ కమెడియన్ సత్య తమ్ముడికి గుండె కుడివైపు ఉంటుందన్న విషయాన్ని చెప్పాడు. షూటింగ్ స్పాట్‌కు అప్పుడప్పుడూ వస్తూ ఉండే వాడని, ఆ సమయంలోనే అతను ఎదుర్కొంటున్న సమస్యలను గురించి విన్నామని నిఖిల్ చెప్పాడు. అప్పుడు తమకు ఈ ఆలోచన వచ్చిందని, అలాంటి వ్యక్తి పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందనే ప్రశ్నకు సమాధానమే కేశవ సినిమా అని నిఖిల్ తెలిపాడు. మొత్తానికి ఇన్నాళ్లూ రహస్యంగా ఉన్న ఈ విషయాన్ని నిఖిల్ సినిమా రిలీజ్‌కు ముందు రోజు బయటపెట్టాడు.
entertainment
20,257
22-01-2017 13:09:38
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
కోల్‌కతా: ఈడెన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్టులో భారత్ ఒక మార్పు చేయగా, ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ సవాల్‌ను ఛేదించి మలిపోరులోనూ దుమ్మురేపిన టీమిండియా వన్డే సిరీస్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. టెస్టు సిరీస్‌లో ఇంగ్లిష్‌ జట్టును వైట్‌వాష్‌ చేయలేకపోయిన కోహ్లీసేన వన్డే సవాల్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు రెడీ అయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌ పరువైనా దక్కించుకోవాలని కోరుకుంటోంది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో 350 పైచిలుకు స్కోరు చేసినా ఓడిపోవడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. భారత పర్యటనలో ఇప్పటివరకూ విజయం సాధించనందున కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలుపు రుచి చూడాలని భావిస్తోంది. పిచ్‌, వాతావరణం ఈడెన్‌ గార్డెన్స్‌లో చివరిసారిగా జరిగిన వన్డేలో రోహిత శర్మ రికార్డు స్థాయిలో 264 రన్స్‌ సాధించాడు. అయితే ఇటీవల జరిగిన రంజీ సీజన్‌లో ఈ వికెట్‌ పేసర్లకు సహకరించింది. ఈడెన్‌ పిచ్‌ శనివారం పచ్చికతో కనిపించింది. కాబట్టి పేసర్లకు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వాతావరణం కూడా అనుకూలంగానే ఉంటుంది. వన్డేల్లో 150 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు అశ్విన్‌కు కావాల్సిన వికెట్లు 5.ఈడెన్‌ గార్డెన్స్‌లో మూడు వన్డేలాడిన ఇంగ్లండ్‌ ఒక్కదానిలోనూ గెలవలేదు. జట్ల వివరాలుభారత్: రహానే, రాహుల్, కోహ్లీ, ధోని, యువరాజ్, జాదవ్, అశ్విన్, జడేజా, పాండ్యా, భువనేశ్వర్, బూమ్రాఇంగ్లండ్: బిల్లింగ్, రాయ్, బెయిర్‌స్టో, మోర్గాన్, బట్లర్, అలీ, స్టోక్స్, వోక్స్, బాల్, ఫ్లంకెట్, విల్లీ
sports
3,042
13-05-2017 00:45:37
సత్యం కేసులో మళ్లీ ఉత్తర్వులు
సెబికి సాట్‌ ఆదేశాలుహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసులో రామలింగరాజు ఆయన సహచరులకు వ్యతిరేకంగా సెబి హోల్‌టైమ్‌ మెంబర్‌ జారీ చేసిన ఉత్తర్వులను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (సాట్‌) పక్కనబెట్టింది. నాలుగునెలల్లో మళ్లీ కొత్త ఉత్తర్వులను ఇవ్వాలని ఆదేశించింది. రామలింగరాజు ఆయన సోదరుడు రామరాజు, వి శ్రీనివాస్‌, జి రామకృష్ణ, విఎస్‌ ప్రభాకర్‌ గుప్తను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీల మార్కెట్లోకి అడుగుపెట్టరాదని సెబి హోల్‌టైమ్‌ మెంబర్‌ 2014 జూలైలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ తప్పుబట్టింది. అదే విధంగా కుంభకోణంలో నిందితులు అక్రమంగా పోగేసుకున్న సొమ్మును బయటకు కక్కాలంటూ జారీ చేసిన ఆదేశాల్లో కూడా పరస్పర వైరుధ్యాలున్నట్టు ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. అందరికీ ఒకే విధంగా 12 శాతం వడ్డీతో సహా 1848.93 కోట్ల రూపాయలను చెల్లించాలని ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమ ట్రేడింగ్‌లో లబ్దిదారుల విషయంలో సెబికే పూర్తి స్పష్టత ఉన్నట్టుగా లేదని వ్యాఖ్యానించింది. ఈ ఉత్తర్వులను పక్కనబెడుతూ కేసును మళ్లీ తాజా విచారణ కోసం సెబి హోల్‌ టైమ్‌ మెంబర్‌కు తిప్పిపంపింది. రామలింగరాజు ఆయన సహచరులపై సెబి ఎక్కుపెట్టిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, లాభార్జన కోసం అక్రమ లావాదేవీల వంటి అరోపణలతో మాత్రం అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఏకీభవించింది. పునర్‌విచారణ పూర్తి చేసి సాధ్యమైనంత తొందరగా వీలుంటే నాలుగునెలల లోపే కొత్త ఉత్తర్వులుజారీ చేయాలని కూడా హోల్‌టైమ్‌ మెంబర్‌కు సూచించింది. తాజా ఉత్తర్వులు వెలువడే వరకు రామలింగరాజు ఆయన సహచరులు సెక్యూరిటీల మార్కెట్‌ దూరంగా ఉండాలని కూడా స్పష్టం చేసింది.
business
1,494
10-08-2017 12:46:35
సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం నిరీక్షిస్తున్న వారికి శుభవార్త
బెంగళూరు: అమెజాన్ నిరుద్యోగులకు ఓ తీపి కబురందించింది. దాదాపు దేశవ్యాప్తంగా తమ సంస్థ కార్యకలాపాల నిమిత్తం వెయ్యి మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌ను నియమించాలని అమెజాన్ భావిస్తోంది. అమెజాన్ ఇండియా మొత్తం మీద 1245 పోస్టుల నియామకానికి తెరలేపింది. ఇందులో బ్రాంచీల వారీగా ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రణాళిక రూపొందించింది. బెంగళూరులో 557, హైదరాబాద్‌లో 403, చెన్నై 149, ఇతర కార్యాలయాల్లో 136 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని అమెజాన్ నిర్ణయించుకుంది. అమెజాన్ రీసెర్చ్ అండ్ డెవల‌ప్‌మెంట్ విభాగంలో ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. హైద్రాబాద్ కూడా అమెజాన్ జాబితాలో ఉండటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
business
15,096
17-01-2017 01:27:20
గాంధీ కన్నా అంబేడ్కరే ‘గొప్ప నేత’
మహాత్మా గాంధీ కన్నా బీఆర్‌ అంబేడ్కరే ‘గొప్ప నాయకుడు’. రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్‌ మనకు వర్గ భేద రహిత లౌకిక రాజ్యాంగాన్ని అందించారు. ఆయన లౌకిక రాజ్యాంగాన్ని అందించకపోయుంటే... దేశంలో అన్యాయం పెచ్చరిల్లేది. ప్రధాని మోదీ తాను గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పుకొంటూనే ఆయన స్థానాన్నే ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు మోదీ పాక్‌కు గట్టి సమాధానం చెబుతామని అన్నారు. కానీ సర్జికల్‌ సై్ట్రక్స్‌ తర్వాత 28 మంది భారత జవాన్లు అమరులైనా, ఇప్పటికీ మోదీ తన మాటను నిలుపుకోలేకపోతున్నారు. - ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ
nation
14,185
24-02-2017 18:56:14
పాకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం
లాహోర్: పాకిస్తాన్‌కి చెందిన ఓ ప్రయివేట్ ట్రైనర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మార్గమధ్యంలోనే కుప్పకూలింది. పాకిస్తాన్‌‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో విమానం నేర్పిస్తున్న ఇన్‌స్ట్రక్టర్ సహా ట్రైనీ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. షాహీన్ ఎయిర్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ స్కూల్ (ఎస్ఏఎఫ్‌టీఎస్)కి చెందిన ఈ రెండు సీట్ల తేలికపాటి విమానం... ప్రమాదం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:40 గంటలకు బయల్దేరిన ఈ విమానం 15 నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా పంజాబ్‌లోని ఫైసలాబాద్‌కు చేరుకోగానే కూలిపోయింది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ ప్రకటించింది. గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్‌కి చెందిన ఓ విమానం కుప్పకూలడంతో 47 మంది చనిపోయారు.
nation
10,663
21-10-2017 15:07:19
అఖిల్ ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నాడు?
అక్కినేని వారింట పెళ్లి సంబరాలు ముగిశాయి. ఇక నాగచైతన్య, సమంత వెడ్డింగ్ రిసప్షన్ భారీగా ఉంటుందని చెబుతున్నారు కానీ, అది ఎప్పుడు అనే విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ లేదు. అయితే పెళ్లి వార్తలు ముగిశాయో లేదో.. వెంటనే 'రాజు గారి గది 2' చిత్ర ప్రమోషన్‌లో పాల్గొని నాగార్జున, సమంతలు హడావుడి చేశారు. చైతూ మ్యారేజ్, 'రాజు గారి గది 2'లతో సుమారు నెల రోజుల పాటు అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ఇక ఈ ఫ్యామిలీ పేరుని మరోసారి తెరపైకి తీసుకువస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. తను నటిస్తున్న రెండో చిత్ర విషయాలను ట్వీట్ చేసి మరోసారి అక్కినేని బ్రాండ్‌ని వార్తల్లో నిలిపాడు. విషయంలోకి వస్తే.. 'మనం' దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకతంలో అఖిల్ తన రెండో చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. 'హలో!' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయబోతున్నట్లుగా అఖిల్ పోస్ట్ చేశారు. ‘‘హలో! చివరి షెడ్యూల్ మొదలైంది. డిసెంబర్ 22న హలో అంటూ మీ ముందుకు వస్తున్నాం. విడుదల తేదీ దగ్గరలో ఉండటంతో చాలా ఎగ్జైట్‌మెంట్‌గా ఉంది’’ అంటూ అక్కినేని అఖిల్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. నాగార్జున గురించి ఈ విషయాలు తెలుసా?  సమంత-చైతు పెళ్లి గురించి ఈ విషయం తెలుసా?
entertainment
10,789
18-08-2017 14:41:31
సరికొత్త యాక్షన్ ప్రపంచంలోకి వస్తున్నా : ప్రభాస్
బాహుబలి సినిమాతో ప్రపంచానికి తెలిసిపోయాడు టాలీవుడ్ హీరో ప్రభాస్. భారీ హిట్ సాధించి తెలుగోడి సత్తా చాటిన ఈహీరో తాజాగా నటిస్తున్న చిత్రం 'సాహో'. చిత్ర షూటింగ్ ఇదివరకే ప్రారంభమైనప్పటికీ.. షూటింగ్‌లో ఈరోజు(శుక్రవారం)నుండి హీరో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా తన పేస్‌బుక్ ద్వారా అందరికీ తెలియజేశాడు. 'ఇట్స్ షూట్ టైమ్.. దాదాపుగా నాలుగున్నరేళ్ల సుదీర్ఘ బాహుబలి ప్రయాణం తర్వాత ఓ యాక్షన్ ప్రపంచం 'సాహో' లోకి ప్రవేశించడం చాలా ఉత్సాహాన్నిస్తోంది' అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ పోస్ట్ ప్రభాస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై సుజీత్ దర్శకత్వంలో భారీబడ్జెట్‌తో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ ని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈసినిమాలో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా స్టైలిష్‌లుక్‌లో దర్శనమీయనున్నాడని తెలిసింది.
entertainment
14,775
03-06-2017 10:57:21
తుది ఘట్టానికి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
పారిస్: నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చివరి మజిలీ అయిన ఫ్రాన్స్‌లో అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన ఫ్రాన్స్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన నూతన అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్‌జీలో భారత్‌కు సభ్యుత్వం, పర్యావరణ పరిరక్షణ, తీవ్రవాదం తదితర కీలక అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. ఫ్రాన్స్‌లో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్లో స్పందిస్తూ... ‘‘ముఖ్య వ్యూహాత్మక భాగస్వాముల్లో ఒకటైన ఫ్రాన్స్‌‌తో సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు ఇక్కడికి చేరుకున్నాను..’’ అని పేర్కొన్నారు. శుక్రవారం రష్యా పర్యటనలో గడిపిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కావడంతో పాటు ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రష్యాకు ముందు జర్మనీ, స్పెయిన్ దేశాలలో ప్రధాని పర్యటించారు.
nation
2,632
02-02-2017 00:48:28
దేశపురోగతి లక్ష్య సాధనలో ఈ బడ్జెట్‌ విఫలమవుతుంది: భారతీయ మజ్దూర్‌సంఘ్‌
దేశపురోగతి లక్ష్య సాధనలో ఈ బడ్జెట్‌ విఫలమవుతుంది. దారిద్య్ర నిర్మూలనకు తగిన ప్రతిపాదనలు లేవు. నోట్ల రద్దుతో ఉత్పన్నమైన నిరుద్యోగం, తద్వారా వలసల నివారణకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి పరిష్కారమూ చూపలేదు. - భారతీయ మజ్దూర్‌సంఘ్‌
business
16,471
14-01-2017 16:22:46
ఫిజీలో భారీ భూకంపం
సువా: కొద్దిసేపటి క్రితం ఫిజీని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలజికల్ సర్వే తెలిపింది. నదీకి ఈశాన్యంగా 152 కిలోమీటర్లు, రాజధాని సువాకు 238 కిలోమీటర్ల దూరంలో భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. కాగా ఇదే ప్రాంతంలో వారం క్రితం 7.2 తీవ్రతతో భూంకంపం సంభవించింది. తాజా భూకంపం కారణంగా సంభవించిన నష్టం వివరాలు తెలియరాలేదు.
nation
21,572
07-08-2017 02:58:27
సెమీస్‌లో నిర్మల
లండన్‌: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో మహిళల 400మీ.లో భారత అథ్లెట్‌ నిర్మలా షరాన్‌ సెమీస్‌కు చేరుకుంది. కాగా, మిగతా అథ్లెట్లు తీవ్రంగా నిరాశపరిచారు. 22 ఏళ్ల నిర్మల.. 400మీ. హీట్స్‌లో 52.01 సెకన్ల టైమింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల మారథాన్‌లో టి. గోపీ 28వ స్థానంలో నిలవగా.. 110 మీ. హర్డిల్స్‌లో సిద్ధాంత్‌ థింగాలయ హీట్స్‌లోనే వెనుదిరిగాడు. పురుషుల మారథాన్‌లో కెన్యా అథ్లెట్‌ జొఫ్రీ కొప్కోరిరర్‌ కిరుయి స్వర్ణం సాధించాడు. మహిళల 10వేల మీటర్ల రేసులో ఇథియోపియా రన్నర్లు అయానా (30:16.32), దిబాబ (31.02.69) స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు. పురుషుల లాంగ్‌జంప్‌లో యువో మన్యోంగా 8.48 మీటర్లు దూకి స్వర్ణం అందుకున్నాడు.
sports
4,910
18-01-2017 14:54:17
పీకే, 3 ఇడియట్స్ కెమెరామెన్ సీకే మురళీధరనే.. ఎన్టీఆర్ సినిమాకు కూడా: ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎన్నో అనుమానాలు, ఎన్నెన్నో కథనాలు... ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో తీస్తున్నాడు? ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. కానీ, ఏ డైరెక్టరూ ఫైనల్ కాలేదు. చివరగా పవర్ ఫేం, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి ఫ్లాప్ ఇచ్చిన బాబీతో కన్‌ఫర్మ్. మూడు పాత్రల్లో కనిపిస్తాడు ఎన్టీఆర్ అంటూ తన అన్న నందమూరి కల్యాణ్ రామ్ ప్రకటించేశాడు. ఈ సినిమాకు అతడే నిర్మాత. సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయి. కానీ, టెక్నీషియన్లు, ప్రధాన తారాగణాల ఎంపికే జరగలేదు. తాజాగా దానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది కల్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ.. ఎన్టీఆర్ ఆర్ట్స్. పీకే, 3 ఇడియట్స్, మొహెంజోదారో వంటి చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన సీకే మురళీధరన్‌ను ఎన్టీఆర్ సినిమాకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో దాని గురించి పోస్ట్ చేశారు. ‘‘జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్.. మా ఎన్టీఆర్ 27వ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పనిచేస్తున్నారని చెప్పేందుకు చాలా సంతోషిస్తున్నాం. గర్వపడుతున్నాం. వెల్‌కమ్ అబోర్డ్ సర్’’ అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారిక ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. ఇక, ఆయన్నే ఎందుకు ఎంపిక చేశారంటే.. వరుసగా మూడు సినిమాలు హిట్టవడం, ఎన్టీఆర్‌పై ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోవడం ఓ కారణమైతే.. బాబి చెప్పిన కాన్సెప్ట్‌లో తారక్ మూడు పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఎక్కడా ఆ పాత్రల్లో తారక్ ఎబ్బెట్టుగా కనిపించకుండా చూపించగలిగే సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుందని కల్యాణ్ రామ్ భావించాడట. అందుకే ఎంత ఖర్చైనా ఫర్వాలేదు కానీ.. మంచి కెమెరామెన్‌నే ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో సీకే మురళీధరన్‌ను ఒప్పించాడట. కాగా, వచ్చే దసరా నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడట కల్యాణ్ రామ్.
entertainment
16,083
20-11-2017 01:59:49
నేరస్థులు పరిపాలించకూడదు!
ప్రజలు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది: కమల్‌చెన్నై, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నేరస్థులు పరిపాలించకూడదంటూ నటుడు కమల్‌హాసన్‌ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వమే దోచుకోవడం నేరం. ఆ నేరాన్ని గుర్తించిన తరువాత దాన్ని నిరూపించకపోవడం కూడా నేరమే. ఇప్పుడు ఆ విషయమై గంట కొట్టేశారు. నేరస్థులు పరిపాలించకూడదు. ప్రజలంతా సమైక్యంగా న్యాయనిర్ణేతలు అయ్యేందుకు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని ఆదివారం రాత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారో కమల్‌ స్పష్టం చేయలేదు.
nation
19,744
16-02-2017 01:48:18
ఆసియా మిక్స్‌డ్‌ బ్యాడ్మింటన్‌లో భారత బోణీ
హోచిమిన్‌ (వియత్నాం): ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్‌- డి పోరులో టీమిండియా 4-1తో సింగపూర్‌పై విజయం సాధించింది. తొలి మిక్స్‌డ్‌ మ్యాచ్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్‌ జోడీ 21-23, 17-21తో యాంగ్‌-వీ హాన్‌ ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ 21-9, 21-16తో కీన్‌ యో లోపై గెలిచాడు. డబుల్స్‌లో మను అత్రి-సుమిత రెడ్డి జోడీ 21-12, 21-17తో డానీ బవా క్రిశాంటా-హెండ్రా విజయ ద్వయాన్ని ఓడించింది. తర్వాత మహిళల సింగిల్స్‌ లో రితుపర్ణ దాస్‌ 23-21, 21-18తో లియాంగ్‌పై నెగ్గగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని-సిక్కిరెడ్డి జోడీ 19-21, 21-17, 21-17తో రెన్‌ నె ఆంగ్‌-జి యింగ్‌ ద్వయంపై గెలిచింది.
sports
1,766
14-11-2017 05:34:07
ఆటుపోట్ల కదలికలు
తిథి: కార్తీక బహుళ ఏకాదశి నక్షత్రం: ఉత్తర, హస్తఆర్ద్ర, స్వాతి, శతభిషం (మధ్యాహ్నానికి ముందు), విశాఖ, పునర్వసు, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, తుల, కుంభ రాశులవారు అప్రమత్తంగా ఉండాలి.నిఫ్టీ: 10224.95 (-96.80)టెండ్‌ మార్పు వేళలు: 12.35ధోరణి: గ్రహగతులను బట్టి నిస్తేజంగా ప్రారంభమై ఉదయం 9.55 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి 2.30 గంటల వరకు నిస్తేజంగా మారి చివర్లో మెరుగ్గా మారే ఆస్కారం ఉంది.ుఽ వి.సుందర్‌ రాజా
business
16,675
28-12-2017 03:49:21
మన్మోహన్‌ మంచోడే
ఆయన అంకితభావాన్ని శంకించలేదు.. మోదీ వ్యాఖ్యలపై జైట్లీ వివరణసమసిన వివాదం.. వెంకయ్య సమక్షంలో నాలుగుసార్లు సమావేశంన్యూఢిల్లీ, డిసెంబరు 27: గుజరాత్‌ ఎన్నికల సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల మీద రేగిన దుమారం ఎట్టకేలకు సద్దుమణిగింది. రెండు వారాలుగా రాజ్యసభలో రేగిన ప్రతిష్టంభన -సభాపతి వెంకయ్యనాయుడి చొరవతో సమసింది. ‘‘మోదీ తన ప్రసంగాల్లో ఎక్కడా దేశం పట్ల మన్మోహన్‌కు గల అంకితభావాన్ని శంకించలేదు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ చిత్తశుద్ధి పైనా ప్రశ్నించలేదు. ఆ భావన ఎవరికైనా ఉంటే అది తప్పు. వారిద్దరి పట్లా మాకు చాలా గౌరవం. దేశం మీద వారికున్న అంకితభావం మహత్తరం’’ అని అరుణ్‌ జైట్లీ బుధవారం నాడు రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. దీనికి కాంగ్రెస్‌ పక్షాన గులాం నబీ అజాద్‌ ధన్యవాదాలు చెప్పారు. ‘‘సభా నాయకుడి వివరణకు కృతజ్ఞతలు. ఆ వ్యాఖ్యలే వివాదం రేపాయి. ఈ సందర్భంలో మా పార్టీ తరఫున కూడా నేను ఓ వివరణ ఇస్తున్నాను. ఎన్నికల సమయంలో మా పార్టీ నేతలెవరెవరైనా ప్రధాని పదవికున్న ఔన్నత్యాన్ని దిగజారుస్తూ మాట్లాడి ఉంటే వాటికీ, పార్టీకీ సంబంధం లేదని తెలియజేస్తున్నాను’’ అని ఆజాద్‌ పేర్కొన్నారు.  గుజరాత్‌ ఎన్నికలను ప్రభావితం చేయడానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ -పాకిస్థాన్‌తో కుమ్మక్కయ్యారని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆరోపించడం, అది వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. కాగా ఈ గొడవను తీర్చడానికి వెంకయ్యనాయుడు నాలుగుమార్లు ఉభయపక్షాల నేతలను పిలిపించి మాట్లాడినా సంధి కుదరలేదు. పదజాలం విషయంలో అంగీకారం రాలేదు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్‌ గోయెల్‌ -గులాంనబీని, మన్మోహన్‌ను విడివిడిగా కలిసి చర్చలు కూడా జరిపారు. చివరికి జైట్లీ.. క్షమాపణ, విచారిస్తున్నాం అన్న పదాల్ని వాడకుండా మన్మోహన్‌ అంకితభావాన్ని మోదీ శంకించలేదు అని వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగినట్లయింది. ఈ వివాదం పూర్తయ్యాక విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటును ఆమోదిస్తూ చేసిన బిల్లు, అటవీశాఖ అధికారాల (సవరణ) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.హెగ్డే వ్యాఖ్యలతో రగడమతం ద్వారానే ఒక మనిషికి గుర్తింపు అనీ, తల్లిదండ్రుల జాతి మతాలు తెలీని వారు సెక్యులర్‌ అని చెప్పుకునేందుకు అనర్హులని, దీన్ని మార్చాలనీ, రాజ్యాంగాన్ని సవరించడానికే తాము అధికారంలోకి వచ్చామని కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయసభలూ దద్దరిల్లాయి. ఆయనను డిస్మిస్‌ చేయాలని కాంగ్రెస్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేసింది.  ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని రాజ్యసభలో మంత్రి విజయ్‌ గోయెల్‌ వివరణ ఇచ్చారు. గొడవ సద్దుమణగకపోవడంతో ఉభయసభలూ మధ్యాహ్నం వరకు వాయిదాపడ్డాయి. జైట్లీ క్షమాపణలపై రాహుల్‌ స్పందిస్తూ ‘‘జైట్‌-లై గారూ.. మోదీ చెప్పేదానికి ఆయన ఉద్దేశానికి ఎప్పుడూ పొంతన ఉండదని మరోసారి గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు.
nation
18,312
05-10-2017 05:06:02
రాష్ట్రాలూ పన్ను తగ్గించాలి
పెట్రోల్‌, డీజిల్‌పై జైట్లీ, ప్రధాన్‌ పిలుపుఢాకా/ఢిల్లీ, అక్టోబరు 4: పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించిందని.. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. మూడు రోజుల పర్యటనకు బంగ్లాదేశ్‌కి వెళ్లిన అరుణ్‌జైట్లీ.. బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంతో కేంద్రం రూ.26 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నా ప్రజల శ్రేయస్సు కోసం ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఢాకాలో భారత్‌ వీసా దరఖాస్తు కేంద్రాల్లో నగదు రహిత సేవలను జైట్లీ ప్రారంభించారు. మరోవైపు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. రాష్ట్రాలు 5 శాతం మేర వ్యాట్‌ను తగ్గించాలని సూచించారు. కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.2 తగ్గిందని మంత్రి చెప్పారు. కాగా.. బీజేపీ, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్కువ వ్యాట్‌ విధిస్తుండటం గమనార్హం. మహారాష్ట్రలో 46.52ు, ఏపీలో 38.82, మధ్యప్రదేశ్‌లో 38.79ు శాతం వ్యాట్‌ విధిస్తున్నారు.
nation
2,852
04-03-2017 23:21:35
తిరుమలలో విజయ బ్యాంకు శాఖ
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విజయ బ్యాంక్‌ తన తొలి శాఖను ఏర్పాటు చేసింది. ఈ శాఖను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు చైర్మన చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ సాన్సి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు బిఎస్‌ రామారావు, వై నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. దేవస్థానానికి విజయ బ్యాంక్‌తో సుదీర్ఘకాలంగా అవినాభావ సంబంధాలున్నాయన్నారు. బ్యాంకు 2000వ శాఖను తిరుపతిలో ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందని బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిశోర్‌ సాన్సి పేర్కొన్నారు. విజయవాడ రీజియన్‌లో తమకు ఇది 65వ శాఖ కాగా తిరుపతిలో రెండో శాఖ అన్నారు. విజయ బ్యాంక్‌ సేవలను తిరుమలకు వచ్చే భక్తులు మరింతగా వినియోగించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్ట్రాల్లో విజయ బ్యాంక్‌ మొత్తం 198 శాఖలను నిర్వహిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో బ్యాంకు వ్యాపారం 19,204 కోట్ల రూపాయలుంది.
business
15,560
10-01-2017 15:02:25
అమెరికా కొత్త రాయబారి టెల్లిస్..?
వాషింగ్టన్: వైట్‌హౌస్ మాజీ అధికారి, ప్రముఖ భారతీయ నిపుణుడు ఆష్లే టెల్లిస్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా నియమించనున్నట్టు సమాచారం. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఆసియా విధానాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నందున... 55 యేళ్ల ఆష్లేను భారత్‌కు రాయబారిగా నియమించే అవకాశాలున్నట్టు ట్రంప్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత భారత రాయబారి రిచర్డ్ వర్మను 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. ఈ నెల 20న అమెరికా భారత రాయబారి పదవి నుంచి తాను దిగిపోనున్నట్టు వర్మ ట్విట్టర్‌లో వెల్లడించారు. భారత్ కోసం పనిచేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా ఆష్లే టెల్లిస్ ప్రస్తుతం వాషింగ్టన్ సలహా కేంద్రం కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో సీనియర్ ఫెలోగా కొనసాగుతున్నారు. ముంబైలో పుట్టిపెరిగిన ఆయన ఆమెరికా చదువుకుని అక్కడే స్థిరపడ్డారు. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ సలహాదారుగా పనిచేసిన ఆయన... అమెరికా-భారత్ చారిత్రాత్మక న్యూక్లియర్ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఫారిన్ సర్వీసుల్లో పనిచేసిన టెల్లిస్... న్యూఢిల్లీలోని అమెరికా రాయబారికి సీనియర్ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టాఫ్ సహా పలు కీలక పదవులు నిర్వహించిన ఆయనకు ఆసియా వ్యవహారాల్లో మంచి నైపుణ్యం ఉన్నందున ట్రంప్ మొగ్గుచూపినట్టు చెబుతున్నారు.
nation
17,029
09-01-2017 07:05:56
రిపబ్లిక్‌డేలో ‘పన్నీర్‌‘ పతాకావిష్కరణ! రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
చెన్నై: నగరంలోని మెరీనా బీచ్‌లో ఈనెల 26న జరుగనున్న గణతంత్ర దినోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌కు బదులుగా ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌ సెల్వం జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్‌డేలో ముఖ్యమంత్రి పతాకావిష్కరణ చేయనుండటం విశేషం. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్ విద్యాసాగరరావు రాష్ట్రానికి ఇన్‌ఛార్జిగా ఉంటున్నారు. ముంబాయిలో జరిగే రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొని ఆయన పతాకావిష్కరణ చేయనున్నారు. ఈ మేరకు రిపబ్లిక్‌ డే రోజున జాతీయ పతాకావిష్కరణ చేయమంటూ స్థానిక రాజ్‌భవన్ కార్యాలయపు అధికారులు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు సమాచారం పంపారు. ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెయింట్‌ జార్జికోటపై ముఖ్యమంత్రి, మెరీనాబీచ్ గాంధీ విగ్రహం ప్రాంతం వద్ద జరిగే గణత్రంత వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఆనవాయితీగా జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికంటూ పర్మినెంట్‌ గవర్నరు లేకపోవడంతో ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం మెరీనాబీచ్ వద్ద జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
nation
14,347
08-02-2017 11:21:45
దీప మద్దతు తీసుకుంటాం : పన్నీర్ సెల్వం
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప మాతో కలిసి వస్తానంటే తప్పకుండా గౌరవిస్తామని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. జయలలిత మేనకోడలిగా ఆమెకు ఆ అర్హత ఉందనీ... ఆమెకు అండగా ఉంటామన్నారు. తాను ఈ స్థాయికి వచ్చేందుకు అమ్మే కారణమనీ.. ఆమె ఆత్మ తనను ఎప్పటికీ నడిపిస్తుందన్నారు. ప్రజల మనోభావాలకు తగిన విధంగా ఏఐఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని తమ పార్టీ సహచర ఎమ్మెల్యేలను కోరారు. శశికళ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఇప్పటికీ మధ్యంతర ప్రధాన కార్యదర్శిగానే భావిస్తున్నామనీ.. ఆమెకు పూర్తి బాధ్యతలు అప్పగించలేదన్నారు.
nation
18,834
24-01-2017 03:02:10
ఐఏఎస్‌ల కేసులను 90 రోజుల్లో తేల్చేయాలి
న్యూఢిల్లీ, జనవరి 23: అవినీతికి పాల్పడిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు త్వరితగతిన శిక్షపడేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం నూతన నిబంధనలను తీసుకు వస్తోంది. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అఖిలభారత సర్వీసు అధికారులపై ఉన్న కేసులకు సంబంధించినవిచారణను 90 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించింది.
nation
6,985
08-09-2017 23:01:23
నవ్వించడం తేలిక కాదు!
‘‘మనిషిలో నానాటికీ స్వార్థం పెరిగిపోతోంది. మనం అనే తత్వం నుంచి నేను అనే భావనలోకి మెల్లిగా జారుతున్నాడు. ఈ క్రమంలో డబ్బుమోజులో పడి నిలువెల్లా స్వార్థంలో మునిగితేలిన వ్యక్తి గురించి ‘ఉంగరాల రాంబాబు’లో చెప్పే ప్రయత్నం చేశాను’’ అని అంటున్నారు క్రాంతిమాధవ్‌. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ‘‘మా ‘ఉంగరాల రాంబాబు’ కామెడీ చిత్రం. ఈతిబాధల్లో ఉన్న ప్రేక్షకుడిని అలాంటి భావోద్వేగాలున్న కథలతో మమేకం చేయించే సినిమాలు చేయడం కాసింత తేలికే. కానీ సవాలక్ష ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిని వాటన్నిటినీ మరిపించేలా నవ్విస్తూ సినిమా చేయడం మాత్రం సులభమైన ప్రక్రియ కాదు. నేను ఈ సారి అలాంటి కథతోనే సినిమా చేశాను. స్వార్థపరుడైన ఉంగరాల రాంబాబు ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తాడు. ప్రతి వ్యక్తికీ ఎక్కడో ఏదో వీక్‌నెస్‌ ఉంటుంది. అలా రాంబాబుకు ఓ స్వామీజీ మీద భక్తి పెరుగుతుంది. అతను ఇచ్చే ఉంగరాలు పెట్టుకుంటాడు. అందుకే మా చిత్రానికి టైటిల్‌ కూడా ‘ఉంగరాల రాంబాబు’ అని పెట్టాం. సునీల్‌ గత చిత్రాలకు భిన్నంగా సాగే చిత్రమిది. నా కెరీర్‌లో నేను మహా అయితే 10 సినిమాలు చేస్తానేమో. అందుకే ప్రతి సినిమా కొత్త జోనర్‌లో ఉండేలా ప్లాన్‌ చేసి తీస్తున్నాను. నా తొలి చిత్రం ‘ఓనమాలు’ బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా సందడి చేయలేదు. కానీ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఉంగరాల రాంబాబు’ కూడా తప్పకుండా హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. విమర్శకులు రాసే ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా చదువుతుంటాను. ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువిస్తాను. ప్రతి సినిమా నాలో ఉత్సాహాన్ని, నమ్మకాన్ని పెంచుతున్నాయి’’ అని అన్నారు. తదుపరి చిత్రాల గురించి ప్రస్తావిస్తూ ‘‘విజయ్‌దేవరకొండ హీరోగా కె.ఎ్‌స.రామారావు దర్శకత్వంలో మంచి లవ్‌స్టోరీతో ఫిబ్రవరి నుంచి ఓ సినిమా మొదలుపెడతాను’’ అని చెప్పారు.
entertainment
15,187
02-12-2017 19:30:10
‘ఇంత భయానక సముద్రాన్ని ఎన్నడూ చూడలేదు’
తిరువనంతపురం : కేరళ మత్స్యకారులు ఓఖీ తుపాను సృష్టంచిన బీభత్సంతో అల్లాడిపోతున్నారు. నిరంతరం సముద్రంతోనే సహజీవనం చేసే వీరంతా ఇప్పుడు సముద్రాన్ని చూస్తే భయపడిపోతున్నారు. ఇంత భయానక సముద్రాన్ని ఎన్నడూ చూడలేదని చెప్తున్నారు. నావికాదళం, వాయుసేన, తీర రక్షక దళం సంయుక్తంగా నిర్వహించిన సహాయక చర్యల్లో సుమారు 200 మంది మత్స్యకారులను కాపాడారు. స్టెఫాన్ అనే మత్స్యకారుడు మాట్లాడుతూ ఓ సహాయక పడవ దూరంగా వెళ్ళిపోతుండటాన్ని చూసి తమకు చాలా ఆందోళన కలిగిందన్నారు. ఆ పడవలోని వారికి తమ అరుపులు వినిపించలేదన్నారు. నీటి కల్లోలం తీవ్ర ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. ఆహారం, తాగు నీరు లేకపోవడంతో చాలా కష్టాలు పడినట్లు తెలిపారు. మృత్యు దేవత తమ కళ్ళ ముందు కనిపించినట్లయిందని తెలిపారు. కెరటాలు, తరంగాలు భయానకంగా వచ్చాయన్నారు. తమ అదృష్టం కొద్దీ అదే సహాయక పడవ మళ్ళీ తమ వద్దకు వచ్చి, తమను కాపాడినట్లు తెలిపారు.
nation
1,440
23-03-2017 23:47:33
ఏడాదిలో 50 లక్షల ఫోన్ల విక్రయ లక్ష్యం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ నోట్‌5 లైట్‌ను కూల్‌పాడ్‌ ఇండియా విడుదల చేసింది. దీని ధర 8,199 రూపాయలు. ఇ-కామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని రిటైల్‌ దుకాణాల్లో కూడా విక్రయిస్తామని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ తాజుద్దీన్‌ గురువారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 30 లక్షల స్మార్ట్‌ ఫోన్లను విక్రయించామని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లో 50 లక్షల ఫోన్లను విక్రయించాలన్న లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు. ఇందుకోసం మరిన్ని మొబైల్‌ ఫోన్లను మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లోని రిటైల్‌ స్టోర్ల ద్వారా ఫోన్లను విక్రయించామని, రానున్న కాలంలో పది రాష్ర్టాల్లో స్టోర్ల ద్వారా విక్రయాలను పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉన్నామని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ ఒకే ధరకు ఫోన్లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారానే 70 శాతం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. కూల్‌పాడ్‌కు హైదరాబాద్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌ అని, కంపెనీ అమ్మకాల్లో 15 శాతం వాటా ఇక్కడి మార్కెట్‌ నుం చే లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ విక్రయిస్తున్న మొత్తం ఫోన్లలో 95 శాతం దేశీయంగానే తయారు చేస్తున్నామని, ఐదు శాతం ఫోన్లను మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.
business
9,613
27-11-2017 09:01:39
భర్తను విలన్‌గా చేసిన నిర్మాత
జేఎస్‌ అపూర్వ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహిళా నిర్మాత జయచంద్ర శరవణ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘తొడ్రా’. సీని యర్‌ దర్శ కుడు, నటుడు కె.భాగ్యరాజా దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన మధురాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంత కు ముందు ‘చెన్నై ఉంగళై అన్బుడన్‌ అళైక్కిరదు’, ‘చాకోబార్‌’ వంటి చిత్రాలను పంపిణీ చేశారు. దర్శకుడు కావాలన్న ఆశ తో మెగా ఫోన్‌ పట్టి ‘తొడ్రా’ చిత్రాన్ని తెర కెక్కిస్తున్నారు. హాస్యనటుడు పాండ్యరాజన్‌ తనయుడు పృథ్విరాజన్‌ హీరోగా నటిస్తుండ గా, వీణ అనే కొత్తమ్మాయి హీరోయిన్‌ గా పరిచయమవుతోంది. కథలో అత్యంత కీలకమైన చిన్నారి పాత్రలో అపూర్వ సహానా అనే బాలనటిని పరిచయం చేస్తున్నా రు. ఇంకా నిర్మాత శరవణకుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో విశేషాలు ఏమిటంటే... తన భర్త కోసం ఈ సినిమాను నిర్మిస్తున్నారు జయచంద్ర. పెళ్లయిన నాటి నుండే సినిమాల్లో నటించాలన్న భర్త కోరికను ఆమె ‘తొడ్రా’ చిత్రంతో నెరవేరుస్తున్నారు. అయితే ఇందులో శరవణకుమార్‌ హీరోగా నటించకుండా, విలన్‌ పాత్రలో నటించడం ఆశ్చర్యం కలిగించే అంశం. కాగా, నేటి తరం యువతకు ఎదురవుతున్న సమస్యల్లో ఒకటైన లవ్‌ బిజినెస్‌ను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు మధురాజ్‌ చెప్పారు. పొల్లాచ్చి, కృష్ణగిరి, పళని, కరూర్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ‘తోడ్రా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
entertainment
12,453
10-02-2017 17:46:35
విడ్డూరం!.. కాంగ్రెస్ ఫ్లెక్సీలో మోదీ మాట!
డెహ్రాడూన్: విడ్డూరమంటే ఇదేనేమో! కాంగ్రెస్ ఫ్లెక్సీలో ప్రధాని మోదీ తరచూ ఉపయోగించే మాట దర్శనమిచ్చింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌, హరిద్వార్‌లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈ వింత చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లో ఈనెల 15న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో ప్రధాని తరచూ ఉపయోగించే ‘మిత్రోం’ (స్నేహితులారా) అన్న పదం కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్ద నోట్ల రద్దు, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘మిత్రోం’ అనే పదంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మరోమారు అధికారాన్ని ‘హస్త’గతం చేసుకుని చరిత్ర సృష్టించాలని కాంగ్రెస్ భావిస్తుండగా ఎలాగైనా అక్కడ పాగా వేయాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
nation
15,222
02-02-2017 21:42:15
తాగి పోలీసులపై వీరంగం చేసిన యువతి
కాన్పూర్: ఓ యువతి తప్పతాగి పోలీసులపై వీరంగం చేసింది. మద్యం సేవించి బాయ్ ఫ్రెంట్‌తో కలిసి టూ వీలర్ డ్రైవ్ చేస్తున్న ఆమె ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దీనిపై ప్రశ్నించిన వారిపై మండిపడింది. పోలీసులు కూడా ఆ యువతిని అదుపుచేయలేకపోయారు. చివరకు ఆమెను బలవంతంగా ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
nation
7,948
12-03-2017 10:53:25
పవన్‌ టైటిల్‌ను రివర్స్‌ చేసిన ఫ్యాన్‌!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్‌ హీరోగా వెలుగొందుతున్నాడు. సామాన్యులననే కాదు, నితిన్‌ వంటి యువ హీరోలను కూడా తన అభిమానులుగా మార్చుకున్నాడు.
entertainment
20,629
21-01-2017 03:28:10
ప్రొడునోవా చేయులేను..
 కర్మాకర్‌ ఎంతో మందికి ఆదర్శం  అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ న్యూఢిల్లీ: భారత జిమ్నాస్టిక్స్‌ సంచలనం దీపా కర్మాకర్‌ ఎంతో ప్రతిభావంతురాలని, ఎంతో మంది ఔత్సాహిక చిన్నారులకు ఆమె ఆదర్శంగా నిలుస్తుందని ఒలింపిక్‌ చాంప్‌, అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ అభిప్రాయపడింది. రియోలో ఆమెతో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదని చెప్పింది. కానీ, ఈ క్రీడలో ఆమె చరిత్ర సృష్టించిందన్న విషయం తనకు తెలుసంది. అయితే, దీప అద్భుతంగా చేసే ప్రొడునోవా విన్యాసాన్ని మాత్రం తాను ప్రదర్శించలేనని రియోలో నాలుగు స్వర్ణాలు సహా ఐదు పతకాలతో రికార్డుకెక్కిన బైల్స్‌ చెప్పింది. ‘ఈ క్రీడలో ఒక్కొక్కరికి ఒక్కో విన్యాసం బాగా కుదురుతుంది. వాళ్లు దాన్నే పాటిస్తారు. అందువల్ల భవిష్యతలో నేను ప్రొడునోవా చేయలేను. వివిధ పద్ధతులు, నైపుణ్యాలు ఆయా వ్యక్తులకే నప్పుతాయి. అందువల్ల ఈ విన్యాసాన్ని దీపనే బాగా చేయగలదు. నా నైపుణ్యాలు నాకున్నాయ’ని వివరించింది.
sports
2,938
16-02-2017 23:42:59
హైదరాబాద్‌లో చిప్‌ డిజైన్‌ సెంటర్‌
 జూలైలో ‘డిఫెట్రానిక్స్‌ 2017’ సదస్సు హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : హైదరాబాద్‌ మరో జాతీయ కేంద్రానికి వేదిక కాబోతోంది. ఇక్కడి ఐఐటిలో జాతీయ స్థాయి చిప్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఇండియా ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ సెమికండక్టర్‌ అసోసియేషన్‌ (ఐఈ్‌సఎ) హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రారంభం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఈ్‌సఎ చైర్మన్‌ కె కృష్ణమూర్తి ఈ విషయం వెల్లడించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు రూ.35 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. హైదరాబాద్‌ ఐఐటికి ఇందుకు అవసరమైన నిఽధులు సమకూర్చుకోవడం ఏ మాత్రం సమస్య కాదన్నారు. మరో కేంద్రం ఉత్తర భారతలోని మరో రాష్ట్రంలో ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. వైమానిక, రక్షణ, అంతర్గత భద్రతకు సంబంధించిన ఎలకా్ట్రనిక్స్‌ ఉపకరణాల తయారీ కంపెనీలకు సంబంధించిన ‘డిఫెట్రానిక్స్‌ 2017’ జాతీయ సదస్సునూ ఈ ఏడాది జూలైలో నాలుగో వారంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎలకా్ట్రనిక్‌ పరికరాల డిజైన్‌, తయారీ (ఈ్‌సడిఎం) కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. నిధులు, నైపుణ్యాలే సమస్య దేశంలో ఎలకా్ట్రనిక్స్‌ పరికరాల పరిశ్రమ అభివృద్ధికి నిధులు, నైపుణ్యాల కొరతే ప్రధాన సమస్య అని కృష్ణమూర్తి చెప్పారు. దీనివల్లనే దేశ ఎలక్ర్టానిక్‌ ఉపకరణాల్లో నేటికీ 75 శాతం దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. 2020నాటికి ఈ దిగుమతుల విలువ 40,000 కోట్ల డాలర్లకు చేరుతుందని చెప్పారు. విధానపరమైన మార్పుల ద్వారా దేశీయ కంపెనీలను ప్రోత్సహిస్తే దిగుమతులను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకోసం ‘నేత్ర’ పేరుతో ఎపి, తెలంగాణతోపాటు 12 రాష్ట్రాల్లో ఐదు చొప్పున ఇంక్యుబేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి కాలేజీ స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
business
14,905
10-10-2017 14:19:54
దినకరన్‌కు స్వల్ప ఊరటనిచ్చిన హైకోర్టు
చెన్నై : అన్నా డీఎంకే బహిష్కృత నేత దినకరన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వ వ్యతిరేక కరపత్రాల కేసులో ఆయనపై ఈ నెల 24 వరకు ఎటువంటి చర్యలను తీసుకోరాదని ఆదేశించింది. దినకరన్‌తోపాటు మరో 16 మంది ఈ కేసులో దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐపీసీ సెక్షన్ 142ఏ ప్రకారం వీరిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దినకరన్ మద్దతుదారులు సేలం జిల్లాలో ఈ కరపత్రాలను పంపిణీ చేసినట్లు ఆరోపించారు. ఎన్నికల సంఘం స్తంభింపజేసిన అన్నా డీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండు ఆకులు’ను ఈ కరపత్రాలపై ముద్రించారని పేర్కొన్నారు.
nation
20,125
28-09-2017 01:45:24
పాండ్యా..నిఖార్సైన ఆల్‌రౌండర్‌ !
(కృష్ణమాచారి శ్రీకాంత్‌)ఆసీస్‌తో తొలి మూడు వన్డేలనుంచి భారత్‌కు ఎన్నో సానుకూలాంశాలు సిద్ధించినా..అందులో అతి పెద్దది హార్దిక్‌ పాండ్యా రూపంలో ఓ గొప్ప క్రికెటర్‌ లభించడం. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో మొదలైన ఈ బరోడా యువకుడి కెరీర్‌ గ్రాఫ్‌ నానాటికీ అద్భుతంగా పెరిగిపోతోంది. పాండ్యా లో ఆత్మవిశ్వాసం అంతగా పెంపొందడంలో పూర్తి క్రెడిట్‌ కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్ర్తిలదే! జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రోత్సాహం ఉంటే ఓ క్రికెటర్‌ విభిన్న ఆటగాడిగా రూపుదిద్దుకుంటాడని హార్దిక్‌ రాణిస్తున్న తీరుతో అర్థమవుతుంది. మొత్తంగా ఓ నిఖార్సైన ఆల్‌రౌండర్‌కోసం భారత్‌ చూస్తున్న ఎదురుచూపులు పాండ్యా రూపంలో ఎట్టకేలకు ఫలించాయి. నా దృష్టిలో వరల్డ్‌ కప్‌నకు సిద్ధమవుతున్న ఇండియాకు పాండ్యా ఎంతో కీలకం. విజయాలను అతడు ఆస్వాదించేలా చేద్దాం. అంతేతప్ప అతడిపై ఒక్కసారిగా భారం వేయకూడదు. అయితే కెరీర్‌ గడ్డు పరిస్థితులను హార్దిక్‌ ఎలా ఎదుర్కొంటాడన్నది చూడాలి. అలాం టి సమయం ఎదురై, దానినుంచి అతడు త్వరగా బయటపడితే జట్టుకు ఆణిముత్యం దొరికినట్టే. ప్రస్తుతానికి ఈ యువ క్రికెటర్‌ ఆటను ఎంజాయ్‌ చేద్దాం ! (టీసీఎం)
sports
12,605
09-04-2017 10:03:55
రూ.13కే అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలు
లక్నో : యోగి ఆదిత్యనాథ్ మరో ప్రజాకర్షక పథకాన్ని అమలు చేయబోతున్నారు. ‘అన్నపూర్ణ క్యాంటీన్’ పేరుతో మూడు పూటల ఆహారాన్ని అందించే పథకానికి రూపకల్పన చేస్తున్నారు. విద్యార్థులు, ప్రైవేట్ రంగంలో అల్పాదాయాన్ని ఆర్జించే కార్మికులు, రోగుల వెంట వెళ్ళే పరిచారకులకు ఆహారాన్ని రాయితీ ధరలపై అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. ఈ పథకం ప్రాథమిక వివరాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌ సమీక్షించారు. లక్నో, కాన్పూరు, గోరఖ్‌పూర్, ఘజియాబాద్‌లలో ప్రయోగాత్మకంగా అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొత్తం 14 నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. రూ.13లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉదయం అల్పాహారం ధర రూ.3 అని, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు రూ.5 చొప్పున విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. మూడు పూటల ఆహారాన్ని తీసుకునే ఒక్కొక్కరికి రూ.35 రాయితీ లభిస్తుందని చెప్పారు. ఈ క్యాంటీన్లలో ఆహారాన్ని తినాలనుకునేవారు ప్రీపెయిడ్ కార్డులు లేదా రీచార్జబుల్ టోకెన్లను తీసుకోవచ్చునని తెలిపారు. ఉదయం అల్పాహారంలో దాలియా, ఇడ్లీ, సాంబార్, పోహా, పకోడీలు లేదా కచోరీతో పాటు టీ కూడా ఉంటుందని చెప్పారు. భోజనాల్లో 6 చపాతీలు, పప్పు, కూర, అన్నం ఉంటాయన్నారు. ఆహారాన్ని స్టీల్ ప్లేట్లలో వడ్డిస్తామన్నారు. అన్ని క్యాంటీన్లలోనూ వాటర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
nation
17,994
22-03-2017 02:41:33
సభకు రావాల్సిందే!
ఎంపీగా అది మీ బాధ్యత బీజేపీ సభ్యులకు మోదీ హెచ్చరిక న్యూఢిల్లీ, మార్చి 21: పార్లమెంటు ఉభయ సభల్ని సజావుగా నడిపించుకొని, బిల్లులు ఆమోదింపజేసుకోవడం అధికారపక్షం బాధ్యతని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత సమావేశాల్లో బీజేపీ సభ్యుల గైర్హాజరీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారపక్ష సభ్యులు సరిగా సభకు రాకపోవడం వల్ల పలుమార్లు కోరం(కనీస సంఖ్య సభ్యు లు) లేక సభలు వాయిదా పడ్డాయని చెప్పా రు. ఈ పరిస్థితిని ఇక ఉపేక్షించేది లేదన్నారు. సభ్యుడు సభలో అందుబాటులో ఉన్నారా లేదా చూసేందుకు ఏ క్షణంలోనైనా ఏ సభ్యుడినైనా పిలుస్తానని హెచ్చరించారు. మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యుల కోసం ఏమైనా చేసి పెట్టగలను కానీ, వారి తరఫున సభకు హాజరు కాలేనన్నారు. ఉభయ సభలు కోరంలేక వాయిదా సందర్భాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత కుమార్‌ చదివి వినిపించారు. సోమవారం కూడా ఈ పరిస్థితి తలెత్తిందనగానే ప్రధాని జోక్యం చేసుకొని, పార్లమెంటుకు రావాలని విజ్ఞప్తి చేయబోమని, అది సభ్యుల ప్రాథమిక బాధ్యతని చెప్పారు. రోజంతా సభలో కూర్చొవాలని చెప్పడం లేదని, సభ్యులు సెంట్రల్‌ హాల్లో కూర్చున్నా తనకు అభ్యంతరం లేదని, కోరం బెల్లు మోగిన వెంటనే సభకు అందుబాటులో ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. గతంలోనూ కోరం గురించి ప్రధాని మాట్లాడినా ఆయన స్వరంలో ఇంతటి కఠినత్వం కనిపించడం ఇదే ప్రథమం. ఆర్‌ఎస్ఎస్ లో ఒక సభ్యుడు రోజంతా సంస్థ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నందున ‘శాఖ’కు హాజరు కాలేక పోతున్నానని చెప్పేవారని, పార్టీ ఎంపీలు కూడా సభకు హాజరు కాలేనంత బిజీగా ఉన్నట్లు కనిపిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. లక్షల మంది ప్రజల ప్రతినిధిగా సభ కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం ఎంపీ బాధ్యదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ ఆరున పార్టీ ఆవిర్భావ దినం, ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పార్టీ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాలని చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యులు 11 కోట్లు దాటారని, వీరంతా ఏప్రిల్‌ 6న గ్రామ కమిటీల్లో సమావేశమయ్యేట్లు చూడాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో ఎంపీలంతా పాల్గొనాలని చెప్పారు. ప్రభుత్వ విజయాలను చెప్పాలని, పార్టీ ప్రస్థానాన్ని వీడియోల ద్వారా విశదీకరించాలని ఆదేశించారు. కనీసం గంటసేపు పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనాలని, సాయంత్రం ర్యాలీ తీయాలని స్పష్టం చేశారు. చిన్న వ్యాపారులను, ఇతర సేవావృత్తుల్లో ఉన్న వారిని కలిసి భీమ్‌ యాప్‌ చెల్లింపుల గురించి వివరించాలని చెప్పారు.
nation
11,021
21-02-2017 00:38:44
నల్ల లెక్కలపై నజర్‌
వచ్చే నెల నుంచి రెండో విడత ‘ఆపరేషన్‌’ విశ్లేషణ ద్వారా ‘అనుమానాస్పదం’ గుర్తింపు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పెద్దనోట్ల రద్దు తర్వాత డిపాజిట్‌ అయిన భారీ మొత్తాలపై ఆదాయపు పన్ను శాఖ రెండో విడత ‘ఆపరేషన్‌’కు ముహూర్తం నిర్ణయించింది. ప్రస్తుతానికి రూ.5 లక్షలలోపు డిపాజిట్లను వదిలేసి, అంతకు మించిన మొత్తం డిపాజిట్‌ చేసిన వారి లెక్కలు విప్పాలని తీర్మానించుకుంది. ఐటీ శాఖ ‘ఆపరేషన్‌ క్లీన్‌మనీ’ పేరిట అనుమానాస్పద లావాదేవీల గుట్టు రట్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకేపేరు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ ఉన్న వ్యక్తులు వేర్వేరు ‘పాన్‌’లు, వేర్వేరు ఖాతాల్లో చేసిన డిపాజిట్లపై దృష్టి సారించారు. ఆయా లావాదేవీలన్నింటిపై ఇప్పటికే విశ్లేషణ జరిపారు. ‘బిగ్‌ డేటా అనాలిసిస్‌’ సంస్థ మొత్తం ఖాతాలను పరిశీలించి... అనుమానాస్పద ఖాతాల లెక్క తేల్చింది. ఒకే విడతలో రూ.5 లక్షలలోపు డిపాజిట్‌ చేసిన వారిని ప్రస్తుతానికి పక్కనపెట్టి... మిగిలిన ఖాతాలను లక్ష్యంగా చేసుకుని అడుగులు కదుపుతున్నారు. ‘‘పెద్దనోట్ల రద్దుకు ముందు, ఆ తర్వాత చేసిన డిపాజిట్ల వివరాలన్నీ రానున్న పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి అందుతాయి. మొత్తం రూ.4.5 లక్షల కోట్ల డిపాజిట్ల వివరాలు పరిశీలిస్తున్నాం. ఆయా ఖాతాదారుల ఆర్థిక నేపథ్యాన్ని గుర్తించి... వారి గత లావాదేవీలకు, అంతకుముందు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌కు, పెద్దనోట్ల రద్ద తర్వాత చేసిన డిపాజిట్లకూ పొంతన లేకుంటే దానిని అనుమానాస్పదంగానే పరిగణిస్తాం’’ అని ఐటీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’ తొలి దశలో భాగంగా ఐటీ శాఖ 18 లక్షల మందికి ఎస్‌ఎమ్మె్‌సలు, ఈ-మెయిల్స్‌ ద్వారా నోటీసులు పంపింది.
nation
2,225
10-07-2017 23:51:13
త్వరలో విశాఖ యూనిట్‌పై ఇంపోర్ట్‌ అలర్ట్‌ ఎత్తివేసే చాన్స్‌
 దివీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడిహైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంలోని యూనిట్‌ -2పై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యుఎస్‌ ఎఫ్‌డిఎ) విధించిన ఇంపోర్ట్‌ అలర్ట్‌ను ఎత్తివేసే అవకాశం ఉందని దివీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. యూనిట్‌ -2 పై విధించిన ఇంపోర్ట్‌ అలర్ట్‌ 99-32ను ఎత్తివేసే అవకాశాలున్నాయని ఎఫ్‌డిఎ తెలియజేసిందని దివీస్‌ తెలిపింది. విశాఖపట్నంలోని యూనిట్‌-2పై ఈ ఏడాది మార్చిలో 99-32, 66-40 క్లాజుల కింద ఎఫ్‌డిఎ ఈ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎఫ్‌డిఎ జారీ చేసిన హెచ్చరిక లేఖలతో పాటు ఫారమ్‌ -483 కి సంబంధించి సవివరమైన నివేదికలను నిర్ధేశిత సమయంలో అందజేసినట్లు దివీస్‌ తెలిపింది. ఎఫ్‌డిఎ లేవనెత్తిన అభ్యంతరాలకు అన్ని రకాలైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎఫ్‌డిఎ నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లు దివీస్‌ తెలిపింది.
business
13,942
27-10-2017 13:19:40
రాష్ట్రాన్ని అంగడిలో పెట్టడానికే వచ్చాను : ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : వాషింగ్టన్‌లో రోడ్ల కన్నా మధ్యప్రదేశ్‌లో రోడ్లు బాగున్నాయని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయన తన మాటలను గట్టిగా సమర్థించుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఢంకా బజాయించారు. ‘‘నేను చెప్పిన విషయం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమైంది. మధ్యప్రదేశ్‌ను అంగడిలో పెట్టడానికి (మార్కెటింగ్ చేయడానికి) ఇక్కడికి వచ్చాను. రోడ్లు బాగుంటే, ఆ విషయాన్ని నేను చెప్పవద్దా?’’ అని ప్రశ్నించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం అమెరికా - భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక సదస్సులో పాల్గొన్నారు. ‘‘నేను వాషింగ్టన్ విమానాశ్రయంలో దిగి, రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నపుడు, అమెరికా రోడ్ల కన్నా మధ్యప్రదేశ్‌లో రోడ్లు బాగున్నట్లు నాకు అనిపించింది’’ అని ఆయన చెప్పారు. చాలా మంది ఎగతాళి చేసినప్పటికీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. గురువారం ఆయన న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ వాషింగ్టన్ ఎయిర్‌పోర్టు నుంచి వాషింగ్టన్‌కు రోడ్డు మార్గంలో వెళ్ళడం కన్నా, సూపర్ కారిడార్ మీదుగా ఇండోర్ ఎయిర్‌పోర్టుకు వెళ్ళేందుకే ప్రాధాన్యమిస్తానన్నారు.
nation
14,874
14-03-2017 01:43:48
కరుణ పరమ స్వార్థపరుడు: స్వామి
‘డబ్బు పుచ్చుకుని కచ్చాదీవి అప్పగింత’ చెన్నై, మార్చి 13(ఆంధ్రజ్యోతి): డీఎంకే అధినేత కరుణానిధిలాంటి స్వార్ధపరుడు రాజకీయనేతల్లో ఎవ్వరూ లేరని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ..మనదేశ ఆధీనంలోని కచ్చాదీవిని శ్రీలంకకు ఇచ్చేసినందువల్లే రాష్ట్ర జాలర్లకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడు సీఎంగా పనిచేసిన కరుణానిధి భారీగా నగదు పుచ్చుకొని కచ్చాదీవి ఒప్పందపత్రంపై సంతకం పెట్టి తమిళ జాలర్లకు ద్రోహం చేశారని ఆరోపించారు. కేంద్ర పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా వున్నందువల్లే ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు బాగా పెరిగిందన్నారు. బాబ్రీ మసీదు గురించి మాట్లాడుతూ...ముస్లింలు వేరేచోట మసీదు కట్టుకుంటే బీజేపీకి ఎలాంటి అభ్యంతరం ఉండదని అన్నారు.
nation
20,046
15-08-2017 03:34:32
వెయిటింగే కొంప ముంచింది
లండన్‌: తన చివరి రేసులో గాయపడ్డ స్ర్పింట్‌ కింగ్‌ ఉసేన్‌ బోల్ట్‌ అత్యంత విషాదకరంగా కెరీర్‌ను ముగించాడు. కండరాల గాయంతో ట్రాక్‌పైనే బోల్ట్‌ కుప్పకూలిపోవడంతో 4్ఠ100 మీటర్ల రిలే ఫైనల్‌ రేసును జమైకా జట్టు పూర్తి చేయలేకపోయింది. అయితే, రిలే ఆలస్యం కావడం వల్లే ఉసేన్‌ గాయపడ్డాడని జమైకా జట్టు సభ్యులతో పాటు జస్టిన్‌ గాట్లిన్‌ ఆరోపించడంతో నిర్వాహ కులపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై బోల్ట్‌ స్పందించాడు. రేసు ఆలస్యం కావడాన్ని పట్టించుకోని బోల్ట్‌.. తమను చాలాసేపు కాల్‌ రూమ్‌లో వేచి ఉంచడాన్ని మాత్రం తప్పుపట్టాడు. అక్కడ ఉండడం వల్ల తీవ్రమైన చలిలో శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు జాగింగ్‌, రన్నింగ్‌ చేయలేకపోయామన్నాడు. ‘ఇలా ఎప్పుడూ జరగలేదు. రేస్‌కు ముందు వార్మ్‌గా ఉండాలని నాకు తెలుసు. మమ్మల్ని రెండో కాల్‌ రూమ్‌లోకి తీసుకురావడం వరకు సబబే. కానీ, రన్‌ కోసం సిద్ధంగా ఉండేందుకు తర్వాత బోర్డింగ్‌ వెనుకకు తీసుకెళ్లారు. అక్కడ 10-15 నిమిషాలు వేచి ఉంచారు. అప్పుడు వేరే వాళ్లకు పతకాలు అందించాలని నిర్ణయించారు. కానీ, అక్కడ నిలబడి ఉండడానికి మమ్మల్ని బయటకు ఎందుకు రమ్మన్నారు? అంతసేపు మేమేం చేసేది? మేం అథ్లెట్లం. నిబంధనలను పాటించాల్సిందేన’ని బోల్ట్‌ వాపోయాడు. ఇక సెలవు..: గాయంతో పరుగును పూర్తి చేయలేకపోయి విషాదంగా కెరీర్‌ను ముగించిన లైట్నింగ్‌ ‘బోల్ట్‌’ ఆదివారం జరిగిన ముగింపు వేడుకల సందర్భంగా అదే ట్రాక్‌పైకి నడిచి వచ్చాడు. అభిమానులు చప్పట్లతో ఉసేన్‌కు స్వాగతం పలకగా.. వారందరికీ చేతులు ఊపుతూ వీడ్కోలు పలికాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రెండోసారి 100 మీ.(9.63సె గేమ్స్‌ రికార్డు), 200మీ (19.32సె) టైటిళ్లు నెగ్గిన ట్రాక్‌ ఏడో లేన్‌ చిత్రించిన మెమెంటోను బోల్ట్‌కు అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో, లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ బహూకరించారు. ‘నా ఫ్యాన్స్‌కు, నా ఈవెంట్లకు గుడ్‌బై. అన్నింటికీ వీడ్కోలు పలుకుతున్నా. చివరి రేస్‌ ముగించనందుకు ఏడు పొచ్చింది. ఇక ట్రాక్‌పైకి నేను రాను’ అని అన్నాడు. తాను ఎన్నో రికార్డులు, మరెన్నో విన్యాసాలు చేసిన ఇక్కడి ట్రాక్‌కు ప్రణమిల్లాడు బోల్ట్‌.
sports
1,481
07-05-2017 12:27:44
రైతులకు ఏటా రూ.100 కోట్ల రుణాలు: బ్రాహ్మణి
గంగాధర నెల్లూరు: ఐదేళ్లలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ వ్యాపారాన్ని 6,000 కోట్ల రూపాయలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి వెల్లడించారు. శనివారం సుందరరాజపురంలోని హెరిటేజ్‌ డెయిరీ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పదిహేను రాష్ర్టాల్లో కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోందని చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌ 2,380 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించిదని ఆమె తెలిపారు. సంస్థ ద్వారా రైతులు పాడి గేదెల కొనుగోలు చేసేందుకు ఏటా 100 కోట్ల రూపాయల రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు పాడి రైతులకు బీమా సౌకర్యం, మొబైల్‌ వెటర్నరీ క్లినిక్స్‌ ద్వారా వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువరు రైతులకు రుణాలకు సంబంధించి చెక్కులను బ్రాహ్మణి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ చైర్మన్‌ ఎన్‌పి రామకృష్ణ, రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గా రామకృష్ణ, పశుసంవర్థకశాఖ జెడి శ్రీనివాసరావు, హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్లు రామచంద్రనాయుడు, ప్రసన్న కుమార్‌, సి రామచంద్రనాయుడు పాల్గొన్నారు.
business
17,321
26-06-2017 01:59:53
భిన్నత్వమే భారతదేశ బలం
మన్‌కీ బాత్‌లో ప్రధాని..ప్రజలకు ఈద్‌ శుభాకాంక్షలుఎమర్జెన్సీనీ గుర్తు చేసుకున్న మోదీన్యూఢిల్లీ, జూన్‌ 25: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ఈద్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సంతోషాన్ని పంచడానికి ఇలాంటి పండగల నుంచి స్ఫూర్తిని పొందాలన్నారు. భిన్నత్వమే మన దేశ బలమని మన్‌కీబాత్‌ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ముబారక్‌పూర్‌ గ్రామవాసులు అంతా కలిసి టాయిలెట్లు కట్టుకుంటామన్నారని, దాంతో ప్రభుత్వం వారికి రూ. 17 లక్షలు కేటాయించగా, వాళ్లు తమ సొంత శ్రమతో టాయిలెట్లు కట్టుకుని ఆ సొమ్ము వెనక్కి ఇచ్చేశారని తెలిపారు. సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ ఈ మూడు రాష్ట్రాలు బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రాలుగా ప్రకటించారని, ఇటీవలే హరియాణా, ఉత్తరాఖండ్‌ కూడా వీటిలో చేరాయని చెప్పారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా కూడా దేశవాసులకు మోదీ శుభాభినందనలు తెలిపారు. జగన్నాథుడు పేదల దేవుడని అంబేద్కర్‌ కూడా చెప్పారని గుర్తుచేశారు. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అయితే ఇప్పుడు రుతుపవనాల రాక శుభకరమని చెప్పారు. అలాగే ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొన్న తీరును, ఇస్రో ప్రయోగ విజయాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ఇండోనేసియా ఓపెన్‌ గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్‌ను ప్రధాని అభినందించారు. ఇక దేశ ప్రజాస్వామ్య చరిత్రలో 1975 సంవత్సరంలో ఈరోజు చాలా చీకటి రోజని ఎమర్జెన్సీని గుర్తుచేసుకుంటూ చెప్పారు. అప్పట్లో జైల్లో ఉండి వాజ్‌పేయి రాసిన ఓ పద్యాన్ని ఆయన చదివారు.
nation
799
16-09-2017 01:46:52
చివరి గంట కొనుగోళ్లతో ఊపిరి
స్వల్పలాభంతో ముగిసిన సెన్సెక్స్‌ముంబై: అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఉత్తర కొరియా తాజాగా క్షిపణి పరీక్షలు నిర్వహించడంపై ఇన్వెస్టర్లు అప్రమత్తమైనప్పటికీ చివరి గంటలో సాగిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ వరుసగా ఏడో రోజు కూడా లాభాలతో ముగిసింది. ఉదయం నుం చి నష్టాలతోనే ట్రేడయిన సెన్సెక్స్‌ చివరిలో అనూహ్యంగా రికవరీ సాధించి 30.68 పాయింట్ల లాభం తో 32272.61 రూపాయల వద్ద ముగిసింది.  దేశీ య సంస్థలు అందించిన పెట్టుబడుల మద్దతుతో వరుసగా ఏడు సెషన్లలో సెన్సెక్స్‌ 610 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మాత్రం 1.20 పాయింట్ల నష్టంతో 10085.40 పాయింట్ల వద్ద ముగిసింది. వారం మొత్తంలో సెన్సెక్స్‌ 585 పాయింట్లు, నిఫ్టీ 150.60 పాయింట్లు లాభపడ్డాయి. విదేశీ మార్కెట్ల నుంచి అందుతున్న బలహీన సంకేతాల కారణంగా నిఫ్టీ 10100 వద్ద గట్టి నిరోధం ఎదుర్కొంటున్నదని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. ఎఫ్‌పిఐల అమ్మకాలు, అమెరికా, కొరియా మధ్య ఉద్రిక్తతలు కూడా ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యేందుకు దోహదపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఐటి ఇండెక్స్‌ గరిష్ఠంగా 1.04 శాతం లాభపడింది. సెన్సెక్స్‌ షేర్లలో ఔన్‌జిసి 4.71 శాతం లాభంతో గరిష్ఠ స్థాయిలో నిలిచింది. బజాజ్‌ ఆటో, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, విప్రో, టిసిఎస్‌, లుపిన్‌, హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌ షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి.నష్టపోయిన షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటిసి, ఎన్‌టిపిసి, ఎస్‌బిఐ ఉన్నాయి.సెబి గణాంకాల ప్రకారం గురువారం ఎఫ్‌పిఐలు 1334.23 కోట్ల రూపాయల విలువ గల షేర్లను విక్రయించగా దేశీయ సంస్థలు 793.31 కోట్ల రూపాయల కొనుగోళ్లు సాగించాయి.పిరామల్‌ ఎన్‌సిడి ఇష్యూప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన ఎన్‌సిడిలు జారీ చేయడం ద్వారా 600 కోట్ల రూపాయలు సమీకరించేందుకు శుక్రవారం డైరెక్టర్ల బోర్డు అనుమతించిందని పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది. ఇష్యూ పరిమాణం 200 కోట్ల రూపాయలని, ఓవర్‌ సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చినట్టయితే మరో 400 కోట్ల రూపాయల వరకు ఉంచుకునే అవకాశం ఇచ్చారని ఆ ప్రకటనలో తెలిపింది. 546 రోజుల కాలపరిమితి గల ఈ బాండ్లు 2019 మార్చి 15వ తేదీన మెచ్యూర్‌ అవుతాయి. ఏ అవసరాలకు ఈ నిధులు ఉపయోగించుకునేంది కంపెనీ తెలుపలేదు.
business
17,312
19-07-2017 04:16:02
జకీర్‌ నాయక్‌ పాస్‌పోర్టు రద్దు
ముంబై, జూలై 18: వివాదాస్పద ఇస్లాం ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ పాస్‌పోర్టును విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం, మనీ లాండరింగ్‌ కేసుల్లో జకీర్‌ నిందితుడు. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ విజ్ఞప్తి మేరకు అతని పాస్‌పోర్టును రద్దు చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. గత ఏడాది జూలై 1న జకీర్‌ విదేశాలకు వెళ్లిపోయాడు. నవంబరు 18న అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముంబై కేంద్రంగా అతను నడిపిన ఇస్లామిక్‌ రీసెర్చి ఫౌండేషన్‌ (ఐఆర్‌ఎ్‌ఫ)ను చట్ట వ్యతిరేక సంస్థగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
nation
19,554
20-10-2017 15:25:11
తృటిలో పెనుప్రమాదం నుంచి బయటపడిన శ్రీలంక టాప్ క్రికెటర్!
అబుధాబి: శ్రీలంక టాప్ క్రికెటర్ చమర కపుగెదర పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఇక్కడి షేక్ జాయెద్ స్టేడియంలో పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఇమాముల్ హక్ అద్భుత సెంచరీతో 42.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదో ఓవర్ పూర్తయ్యాక శ్రీలంక కీపర్ నిరోషన్ డిక్‌వెల్లా కపుగెదర వైపు బంతిని విసిరాడు. తనవైపు బంతి వస్తోందన్న విషయాన్ని గమనించని కపుగెదర ముఖాన్ని బంతి బలంగా తాకింది. కంటికి కాస్తా కింద తగలడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే కన్ను పోయి ఉండేదే. బంతి బలంగా తాకడంతో కపుగెదర కిందపడి విలవిల్లాడిపోయాడు. ఆ వెంటనే కంటి కింద బంతి పరిమాణంలో వాచిపోయింది. వెంటనే అతడిని మైదానం నుంచి తరలించి చికిత్సకు పంపించారు. ప్రస్తుతం అతడు అబ్జర్వేషన్‌లో ఉన్నాడని, ఎక్కడా ఫ్రాక్చర్ కాలేదని శ్రీలంక మేనేజర్ అసాంక గురుసిన్హా తెలిపారు.  వీడియో సౌజన్యం: హితేష్ ఎస్కే క్రికెట్ బ్యాట్ దేనితో తయారు చేస్తారో తెలుసా?  ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క భారతీయుడు కోహ్లీ
sports
17,642
22-03-2017 02:06:48
ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో స్పోర్ట్స్‌ కోటా అడ్మిషన్లు
ఏప్రిల్‌ 15 నుంచి సెలక్షన్‌ ట్రయల్స్‌ చెన్నై, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో 2017-18 విద్యా సంవత్సరం స్పోర్ట్స్‌ కోటా అడ్మిషన్లకుగాను ఏప్రిల్‌ 15 నుంచి మూడు రోజులపాటు సెలక్షన ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స, హ్యుమానిటీస్‌, లా, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరాలనుకునే క్రీడాకారులు ఈ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చని విశ్వవిద్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నై శివారు ప్రాంతమైన కాట్టాన కొళత్తూర్‌లోని ఎస్‌ఆర్‌ఎం క్యాంప్‌సలో మూడు రోజులూ ఉదయం 8.30 గంటల నుంచి క్రీడల వారీగా ఈ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 15న క్రికెట్‌, బాల్‌ బ్యాడ్మింటన, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌ విభాగాల్లో, 16న చెస్‌, పుట్‌బాల్‌ (పురుషులు మాత్రమే), 17న అథ్లెటిక్స్‌, హాకీ (పురుషులు మాత్రమే), కబడ్డీ, బ్యాడ్మింటన, వాలీబాల్‌ విభాగాల్లో ట్రయల్స్‌ జరుగుతాయని తెలిపింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో పాల్గొన్న క్రీడాకారులు తమ క్రీడ, విద్యా ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని, మరిన్ని వివరాలకు 9443881007 (వైసీ లూయిస్‌ రాజ్‌), 9566033337(ఆర్‌.మోహనకృష్ణన)నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది.
nation
2,282
10-10-2017 03:23:47
టెక్‌ వ్యూ : మార్కెట్లో కన్సాలిడేషన్‌
నిఫ్టీ 10000 పాయింట్ల వరకు వెళ్లి సుదీర్ఘ కన్సాలిడేషన్‌ సాధిం చిన అనంతరం ఈ మానసిక అవధికన్నా స్వల్పంగా దిగువన క్లోజయింది. ఇది స్వల్ప అప్రమత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. టెక్నికల్‌గా మార్కెట్‌ ఇప్పటికీ మైనర్‌ రిలీఫ్‌ ర్యాలీలో ఉంది. మరింత కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. మంగళవారం స్థాయిలివే: మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఇంట్రాడే నిరోధం 10030కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 10100, 10200 పాయింట్లు.మైనర్‌ మద్దతు స్థాయి 9950 కన్నా దిగజారితే మైనర్‌ కరెక్షన్‌లో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 9900. భద్రత కోసం ఇక్కడ రికవరీ తప్పనిసరి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌లో పడుతుంది.బ్యాంక్‌ నిఫ్టీ స్వల్పకాలిక నిరోధం 24400, మద్దతు స్థాయి 24000 మధ్యన కదలాడుతూ అనిశ్చిత స్థితిని ప్రదర్శిస్తోంది.నిరోధం: 10030 మద్దతు: 9950సూచన: స్వల్పకాలిక ఇన్వెస్టర్లు/ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి.-వి.సుందర్‌ రాజా
business
7,980
23-07-2017 18:46:52
కొడుకే ముందు వస్తాడట..!
రారాండోయ్ వేడుక చూద్దాం.. సినిమాతో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు హీరో నాగచైతన్య. ఈ సినిమా తర్వాత యుద్ధం శరణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన యంగ్ హీరో ఆగస్టులో రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆగస్టు బరిలో అనేక సినిమాలు ఉండటంతో నాగచైతన్య నయా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో మాత్రం ఎవరూ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు.  అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం యుద్ధం శరణం సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. నిజానికి ఆగస్టు 4వ వారంలో నాగార్జున నాటిస్తున్న రాజుగారి గది-2 ప్రేక్షకుల ముందుకు వస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడిప్పుడే పూర్తయ్యే అవకాశం లేదట. సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ సైతం మరికొంత సమయం పట్టేఅవకాశం ఉండటంతో నాగార్జున సినిమా కోసం రిజర్వు చేసుకున్న ఆగస్టు 25న నాగచైతన్య నయా మూవీ యుద్ధం శరణం రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
entertainment
11,876
27-07-2017 03:23:51
కనీస వేతనంపై జైట్లీ మోసం: ఉద్యోగ సంఘాలు
న్యూఢిల్లీ, జూలై 26: ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలు తీరుపై నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. కనీస వేతనం విషయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తమను మోసం చేశారంటూ తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు కొందరు మండిపడ్డారు. ఆ వేతన మొత్తం పెంపుపై ఆయన అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. వేతన సంఘం కనీస వేతనాన్ని రూ.18 వేలుగా సిఫారసు చేసింది. కమిషన్‌ సిఫారసులను గత ఏడాది జూన్‌లో కేంద్రం కేబినెట్‌ ఆమోదించింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జైట్లీ తమకు విస్పష్ట హామీ ఇచ్చారన్నది ఉద్యోగ సంఘాల మాట. వేతన సంఘం రూ.18 వేలే సిఫారసు చేసినా, అందరితో చర్చించి దానిని మరింత పెంచుతామని ఆ రోజున ఆయన హామీ ఇచ్చారని సంఘ నేతలు గుర్తుచేస్తున్నారు. ఆ హామీని పూర్తిగా గాలికొదిలేశారని, కనీసం వెయ్యి రూపాయలు కూడా అదనంగా వేయలేదని మండిపడ్డారు. వాస్తవానికి కనీస వేతన మొత్తాన్ని రూ18 వేల నుంచి రూ.24 వేలకు పెంచాలన్నది ఉద్యోగుల డిమాండ్‌. దాదాపు ఏడాది గడిచిపోయాక ఇప్పుడిక దానిని సవరించే అవకాశం లేదన్నది ఆర్థిక శాఖ వర్గాల మాట!
nation
16,887
13-03-2017 01:32:03
కీమోథెరపీ దుష్ప్రభావాలకు వ్యాయామంతో చెక్‌
బెర్లిన్‌: కీమోథెరపీ చేయించుకున్న కేన్సర్‌ బాధితులకు ఎదురయ్యే దుష్ప్రభావాలను నడక, జాగింగ్‌ వంటి చిన్నపాటి వ్యాయామాలతో నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కీమోథెరపీ తర్వాత కనిపించే తీవ్రమైన అలసట, కండరాలపై పడే ఒత్తిడిని అధిగమించేందుకు ఈ వ్యాయామాలు మంచి థెరపీలా పని చేస్తాయని వారి పరిశోధనలో తేలినట్లు చెప్పారు. వారంలో కనీసం 150 నిమిషాల పాటు ఈ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. జర్మనీలోని జీయోథె యూనివర్సిటీ ఫ్రాంక్‌ఫుర్ట్‌, అగప్లెషన్‌ మార్కస్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు పలు రకాల కేన్సర్లతో బాధపడుతున్న వారిపై అధ్యయనం చేశారు.
nation
2,971
15-12-2017 00:49:22
బిట్‌ కాయిన్‌ లాభాలపై పన్ను
న్యూఢిల్లీ : బిట్‌కాయిన్‌ లావాదేవీలపై పన్ను విధించే అవకాశాల కోసం ఆదాయపు పన్ను శాఖ అన్వేషిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దేశవ్యాప్తంగా పని చేస్తున్న తొమ్మిది బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీలపై ఆదాయపు పన్ను చట్టం 133ఎ కింద నిర్వహించిన సర్వే నేపథ్యంలో ఈ అంశం పరిశీలనలో ఉందంటున్నారు. ఢిల్లీ, ముంబై, పూణె, బెంగళూరు, హైదరాబాద్‌లలోని బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సందర్శించారు. దేశంలో బిట్‌కాయిన్‌ వ్యవహారాలపై జరిగిన తొలి పెద్ద కార్యాచరణ ఇదే. ఈ సర్వే సందర్భంగా అధికారులకు ఆర్థిక గణాంకాలతో పాటు ఈ ఎక్స్ఛేంజిల పనితీరుకు సంబంధించిన సమాచారం సయితం అందుబాటులోకి వచ్చిందంటున్నారు.
business
16,859
30-06-2017 03:42:35
ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక
అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపుజూలై 4న నోటిఫికేషన్‌ విడుదలనామినేషన్లకు గడువు జూలై 18ఉపసంహరణకు చివరి తేదీ జూలై 21ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన ఈసీన్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల నగారా మోగింది. వరుసగా పదేళ్లు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన హమీద్‌ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. దీంతో ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నసీం జైదీ గురువారం ప్రకటించారు. జూలై 4న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్న కమిషన్‌ ఎన్నికల తేదీని ఆగస్టు5గా నిర్ణయించింది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు. నామినేషన్లకు చివరి తేదీ జూలై 18 కాగా ఉపసంహరణకు జూలై 21వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌కు ప్రత్యేక పెన్‌లను కమిషన్‌ ఏర్పాటు చేయనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్ధిని 20 మంది ఎంపీలు ప్రతిపాదించడంతో పాటు, మరో 20 మంది ఎంపీలు సమర్థించాల్సి ఉంటుంది. రహస్యంగా ఓటింగ్‌ జరుగుతున్నందువల్ల రాజకీయ పార్టీలు విప్‌ జారీచేయకూడదని జైదీ తెలిపారు.  ఎన్డీయే అభ్యర్ధి గెలుపు ఖాయంరాజ్యసభ, లోక్‌సభకు ఎన్నికైన ప్రతినిధులతోపాటు నామినేటెడ్‌ సభ్యులు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్‌కు ప్రతిపక్ష పార్టీలైన జేడీ(యూ), అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్‌, వైసీపీ మద్దతు ప్రకటించినందున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ వారంతా సానుకూలంగానే ఓటేస్తారనీ, ఎన్డీయే అభ్యర్ధి విజయం ఖాయమని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. 545 మంది సభ్యులున్న లోక్‌సభలో బీజేపీ బలం 281 కాగా, మిత్రపక్షాలతో కలుపుకొని ఎన్డీయేకు 338 మంది సభ్యులున్నారు. 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీ బలం 56 మాత్రమే కాగా కాంగ్రె్‌సకు 59 మంది ఎంపీలున్నారు. వచ్చే ఏడాదికి బీజేపీ రాజ్యసభలో మెజారిటీ సాధించనుంది. ఏడాది తరువాత జరిగే రాజ్యసభ ఎన్నికల అనంతరం బీజేపీ బలం దాదాపు 100కి చేరుకోనున్నది. ఎన్డీయేతో పాటు మద్దతునిస్తున్న ఇతర పార్టీల ఎంపీలను కలుపుకొంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ చాలా తేలికైన విషయమని బీజేపీ భావిస్తోంది.  ఎన్డీయే అభ్యర్ధి ఎవరు?జూలై 17న రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. జూలై 20న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా కోవింద్‌ పేరును నాలుగు రోజుల ముందు ప్రకటించారు. బీజేపీ ఇదే సంప్రదాయాన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలోనూ అనుసరించే అవకాశం ఉంది. ఉప రాష్ట్రపతి పదవి నామినేషన్‌కు చివరితేదీ జూలై 18 అయినందున రెండు మూడురోజుల ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థిని ప్రకటించవచ్చని పార్టీ సీనియర్‌ నేతలు తెలిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి ప్రతిపక్షాలు మద్దతు తెలపనందున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ స్వయంగా ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి దక్షిణాది నేతకు అవకాశం లభించవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. 93 నామినేషన్ల తిరస్కరణరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 93 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌ నామినేషన్లు మాత్రమే సక్రమంగా ఉండడంతో, బరిలో ఇద్దరే నిల్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 95 మంది నామినేషన్‌ వేశారు. వారిలో ఇద్దరు ప్రధాన అభ్యర్థులు మినహా మిగిలిన వారందరి నామినేషన్లను తిరస్కరించారు. ఏ ఒక్క అభ్యర్థీ నియమావళికి అనుగుణంగా కనీసం 50 మంది ఎంపీలు/ఎమ్మెల్యేల సంతకాలు పెట్టించలేకపోవడమే దీనికి కారణం.
nation
5,333
02-04-2017 21:57:28
చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది
‘‘తెలుగు పరిశ్రమ కమర్షియల్‌ అయిపోయింది. ఇక్కడంతా గుత్తాధిపత్యం నడుస్తోంది. ముగ్గురు నలుగురు చేతుల్లో థియేటర్లున్నాయి. చిన్న సినిమాలకు థియేటర్లు దక్కనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ జరుగుతున్నవన్నీ నాకు తెలుసు. ఎవరూ ధైర్యంగా ప్రశ్నించకపోవచ్చు. ఏదొక రోజు నేనే ధైర్యంగా అడుగుతా’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. ఆదివారం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (మా)నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం సీనియర్‌ దర్శకుడు కె.విశ్వనాథ్‌, శారద, కృష్ణ, విజయనిర్మలకు సన్మానం చేశారు. పలువురికి ఆర్థిక సహాయం, మరికొందరికి స్కూటర్‌లను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు ఏయన్నార్‌, ఎన్టీఆర్‌, ఆ తర్వాత చిరంజీవి తరం హీరోలు పరిశ్రమ అభివృద్దికి ఎంతో సహకరించేవారు. నేటితరం హీరోలు కూడా ఆ మార్గంలో పయనించాలి. ఆదర్శవంతమైన చిత్రాలొస్తేనే పరిశ్రమ మూడు పూలు, ఆరు కాయల్లా సంతోషంగా ఉంటుంది. త్వరలో సింగిల్‌ విండో విధానం అమల్లోకి వస్తుంది. చిన్న చిత్రాల కోసం అయిదో ఆట ప్రదర్శించడానికి ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. పరిశ్రమకు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం అండగా ఉంటుంది. వృద్ధ, పేదకళాకారులకు రూ.1000 పించన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏడాది ఉగాదికి అందజేసే నంది పురస్కారాలను ‘సింహ’ అవార్డు పేరుతో ఏడాది దసరాకు అందజేయబోతున్నాం’’ అని తెలిపారు. ‘‘తేనే మనసులు’ చిత్రం ఆదుర్తి సుబ్బారావుగారి దర్శకత్వంలో చేసినప్పటికీ నటనలో నాకు ఓనమాలు నేర్పించింది మాత్రం కె.విశ్వనాథ్‌గారే. ఆయన వల్లే నేనింత దూరం రాగలిగాను’’ అని కృష్ణ తెలిపారు. ‘‘మా’ అసోసియేషన్ మాటలతో కాదు చేతలతో ఏ పనైనా చేసి చూపిస్తుంది. కష్టంలో ఉన్నవారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణం కోసం కేసీఆర్‌ని కలుస్తాం. ఆయన సహకరిస్తే ఆ భవనానికి ‘కేసీఆర్‌ మా భవనం’ అని పెట్టుకుంటాం’ అని నూతన అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. నరేశ్, హేమ, నూతన కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
entertainment
14,783
03-06-2017 02:30:39
తమిళనాడులో ఏనుగు బీభత్సం
చిన్నారిసహా నలుగురిని చంపేసిన గజరాజు.. పోరాడి ఇద్దరు పిల్లల్ని రక్షించుకున్న దంపతులుచెన్నై, జూన 2(ఆంధ్రజ్యోతి): శుక్రవారం తెల్లవారు జాము. సమయం రెండు గంటలు దాటింది. పగలంతా ఇంటి పనుల్లో మునిగితేలిన దంపతులు.. తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రపోయారు. గాఢనిద్రలో ఉన్న వారిపై హఠాత్తుగా ఓ మదపుటేనుగు దాడి చేసింది. తొలుత ఇంటి యజమాని విజయ్‌కుమార్‌ను తొండంతో లాగి విసిరేసింది. ఆపై అతడి భార్య తంగమణి, వారి ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. ఏనుగు బారి నుంచి పిల్లల్ని రక్షించుకునేందుకు తంగమణి తీవ్రంగా శ్రమించింది. విజయ్‌కుమార్‌ కూడా తేరుకుని వచ్చి.. పిల్లల్ని రక్షించుకునేందుకు ఏనుగుతో తీవ్రంగా పెనుగులాడారు. ఈ గలాటాలో ఓ చెయ్యి, కాలు పోగొట్టుకున్న ఆ దంపతులు.. ఇద్దరి పిల్లల్ని ఏనుగు బారి నుంచి కాపాడుకోగలిగారు. మరో కూతురు గాయత్రి (12) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. అక్కడితో ఏనుగు శాంతించలేదు. మరో ఇద్దరు మహిళలను ఒక వృద్ధుడినీ చంపేసింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లా వెళ్లలూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ఏనుగు కొన్ని రోజులుగా ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. రెండు రోజుల కిందట వేట నిరోధక సిబ్బందిపై దాడి చేసింది. శుక్రవారం వేకువజామున వెళ్లలూరులోకి చొరబడి 10 గృహాలను ధ్వంసం చేసింది. అక్కడి నుంచి ఓ ఐదు కిలోమీటర్లు వెళ్లి.. పళనిసామి (70) అనే రైతుపై దాడి చేసి చంపేసింది. బహిర్భూమికి వెళ్లిన జ్యోతిమణి, నాగరత్నంలపైనా దాడి చేసింది. చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. దీంతో ఏనుగును బంధించేందుకు అటవీశాఖాధికారులు, సిబ్బంది రంగంలో దిగారు. గుంకీ ఏనుగులను రప్పించి.. సుమారు ఎనిమిది గంటలపాటు కష్టపడి.. ఆ ఏనుగుకి రెండు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పట్టుకున్నారు. దానిని లారీలోకి ఎక్కించి టాప్‌స్లిప్‌ ఏనుగుల సంరక్షణ శిబిరానికి తరలించారు. ఏనుగు దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఎడప్పాడి కె.పళనిసామి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు తలా రూ.4లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు నష్టపరిహారం ప్రకటించారు.
nation
13,373
14-06-2017 15:27:45
ఒక్కో రైతుకు కోటి రూపాయలు... చెక్కు రాసిచ్చిన సీఎం
మందసౌర్: ఇటీవల పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరామర్శించారు. బుధవారం మందసౌర్‌‌లో పర్యటించిన ఆయన... మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందజేశారు. మొత్తం ఆరు కుటుంబాలకు సీఎం స్వయంగా చెక్కులు అందజేశారు. ఇందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధుల కింద మంగళవారమే రైతు కుటుంబాలకు నిధులు మంజూరు చేసింది. పంటలకు మద్దతు ధరల పెంపు, రైతు రుణాలు మాఫీ తదితర డిమాండ్లపై మందసౌర్ రైతులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నెల 6న ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మధ్యప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. రైతులను శాంతింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించింది. కాల్పులు జరిపినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మరోవైపు ఇప్పటికీ మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన చల్లారలేదు. గత 24 గంటల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా... కేవలం ఈ వారంల్లోపే ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య ఐదుకు చేరింది.
nation
11,227
13-07-2017 09:25:11
ఏడుగురు భారతీయుల నిర్బంధం
చెన్నై: ఏడుగురు భారతీయులను శ్రీలంక సైన్యం నిర్బంధంలోకి తీసుకుంది. సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన తమిళనాడు వాసులు తమ సరిహద్దు దాటి వచ్చారంటూ అరెస్ట్ చేసింది. గురువారం ఉదయం పాల్క్ స్ట్రైట్ ప్రాంతంలోని నెడుంతీవు ద్వీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దర్యాప్తు కోసం వీరిని శ్రీలంకలోని కాంకెసంతురై పోర్టుకు తరలించారు. జాలర్లతో పాటు రెండు బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న ముగ్గురు భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక ఓ బోటును స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు కూడా పాల్క్ స్ట్రైట్ ప్రాంతంలో అక్రమంగా చేపలు పట్టారని శ్రీలంక ఆరోపిస్తోంది.
nation
14,307
19-12-2017 17:02:51
హిందువు కావాలంటే మతం ఒదులుకోనక్కర్లేదు...
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన 'హిందూ' వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య స్పందించారు. హిందువు కావాలంటే ఎవరూ తమ మతం వదులుకోవాల్సిన పని లేదని వివరణ ఇచ్చారు. 'హిందువు కావాలంటే ముస్లింలు ఖురాన్ వదలనవసరం లేదు. హిందూయిజం తమ సొంత మతంగా భావిస్తే చాలు' అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆలయానికి వెళ్లకపోయినా అతను కూడా హిందువేనని, హిందువు అనే పదానికి అర్ధం ఏమిటో ముందు తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. త్రిపురలో ఆదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ 'ఇండియాలో ఉన్న ముస్లింలు కూడా హిందువులే. ఎవరి పట్లా మాకు శత్రుత్వం లేదు. అందరి సంక్షేమాన్ని మేము కాంక్షిస్తున్నాం' అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై మతనాయకుల్లో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు హిందూ నాయకులు మోహన్ భగవత్ వ్యాఖ్యలను సమర్ధించగా, ఆయన అలాంటి ప్రకటన చేసి ఉండకూడదని, దీని ద్వారా హిందువులు, ముస్లింలకు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని భగవత్‌ను మరికొందరు ప్రశ్నించారు.
nation
19,113
16-02-2017 01:02:22
శశి, పళనిస్వామిపై కిడ్నాప్‌ కేసు!
కాంచీపురం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కూవత్తూరులోని గోల్డెన్‌ బే రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేసి అక్రమంగా నిర్బంధించారంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, శాసనసభాపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మదురై (సౌత) ఎమ్మెల్యే ఎస్‌ఎస్‌ శరవణన్‌ ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. రెండ్రోజుల క్రితం ఈ రిసార్ట్‌ నుంచి పారిపోయి వచ్చిన శరవణన్‌.. పన్నీర్‌సెల్వం వర్గంలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను శశికళ వర్గీయులు అక్రమంగా నిర్బంధించారని, బుధవారం డీజీపీని కలిసి శరవణన్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని కాంచీపురం డీఎస్పీకి ముత్తరసికి డీజీపీ ఆదేశించడంతో.. శశికళ, పళనిస్వామిలపై కూవత్తూరు పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.
nation
10,835
07-07-2017 11:14:11
ఆ టాప్‌ హీరోయిన్‌ ‘నిన్నుకోరి’ చేయనని చెప్పిందట!
నేచురల్‌ స్టార్‌ నాని, నివేదా థామస్‌, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రల్లో నటించిన ‘నిన్ను కోరి’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముందే సినీ వర్గాల నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నివేదా నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో హీరోయిన్‌ది చాలా ప్రాముఖ్యం ఉన్న పాత్ర అని సినీ వర్గాల సమాచారం. ఇలాంటి పాత్రకోసం ముందుగా ఓ టాప్‌ హీరోయిన్‌ను సంప్రదించారట. ఆమె కథ అంతా విన్న తర్వాత చేయనని చెప్పిందట. ఈ విషయాన్ని ‘నిన్ను కోరి’ నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్‌ వెల్లడించారు. ఆ టాప్‌ హీరోయిన్‌ కోన వెంకట్‌కు బాగా క్లోజ్‌ అట. అయినప్పటికీ ఈ సినిమాకు ఆమె ‘నో’ చెప్పిందట. దానికి కారణం నాని, కోన టీమ్‌తో పనిచేయడం ఇష్టంలేకేనని తెలుస్తోంది.
entertainment
15,267
29-07-2017 01:49:48
పాక్‌ ప్రధాని షరీఫ్‌ ఔట్‌
అనర్హత వేటు వేసిన సుప్రీంపనామా గేట్‌ కేసులో తీర్పురాజీనామా చేసిన నవాజ్‌ఎంపీగా షరీఫ్‌ను అనర్హుడిని చేస్తున్నాంప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధంషరీఫ్‌, పిల్లలపై కేసు నమోదు చేయండిఐదుగురు జడ్జిల బెంచి ఏకగ్రీవ తీర్పుతానెలాంటి తప్పు చేయలేదన్న నవాజ్‌మూడోసారీ అర్థాంతరంగా పదవీచ్యుతితదుపరి ప్రధానిగా తమ్ముడు షాబాజ్‌?ఇస్లామాబాద్‌, జూలై 28: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ అనూహ్యంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వ పదవులు చేపట్టకుండా సుప్రీం కోర్టు ఆయనపై నిషేధం విధించింది. పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడిని చేసింది. పనామా పేపర్ల కుంభకోణంలో ఆయనపైనా, ఆయన పిల్లలపైనా కేసు నమోదు చేయాలని జాతీయ జవాబుదారీ బ్యూరోకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి షరీఫ్‌ రాజీనామా చేశారు. పదవీ కాలం ముగియకుండానే అర్థాంతరంగా ప్రధాని పదవిని షరీఫ్‌ వదులుకోవడం ఇది మూడోసారి. అయితే, పాకిస్థాన్‌ ప్రస్తుతం ఆర్థిక సం క్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉగ్రవాదం కోరలు చాచింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో దాయాది దేశం తాజాగా రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. అసలు కేసు ఇదీ!పాకిస్థాన్‌ ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ తొలిసారి 1990లో బాధ్యతలు చేపట్టారు. 1993 వరకూ కొనసాగారు. తర్వాత 1997 నుంచి 1999 వరకూ ఉన్నా రు. ఈ సమయంలో లండన్‌ లో ఆస్తులు కొనడానికి ఆయన మనీ లాండరింగ్‌ చేశారు. ఈ విషయాన్ని గత ఏడాది బయటకొచ్చిన పనామా పేపర్లు వెలుగులోకి తెచ్చాయి. షరీఫ్‌ పిల్లలకు చెందిన ఆఫ్‌షోర్‌ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌ చేశారని పేర్కొన్నాయి. ఆ డబ్బుతో లండన్లో నాలుగు విలాసవంతమైన ఫ్లాట్లు కొనుగోలు చేశారని తెలిపాయి. దాంతో, తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌, అవామీ ముస్లిం లీగ్‌, జామా తే ఇస్లామీ పార్టీలు గత ఏడాది అక్టోబరులో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. రోజువారీ విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది మేలో ఆరుగురు సభ్యులతో జాయింట్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(జేఐటీ)ను ఏర్పాటు చేసిం ది. ఐఎ్‌సఐ, మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులతో కూడిన జేఐటీ ఎదుట షరీఫ్‌, ఆయన కుమారులు, కుమార్తె, తమ్ముడు, పంజాబ్‌ సీఎం షాబాజ్‌ షరీఫ్‌ హాజరయ్యారు. ఈ నెల పదో తేదీన జేఐటీ తన నివేదికను కోర్టుకు అందజేసింది. షరీఫ్‌ పై అనర్హత వేటుపాకిస్థాన్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 62, 63 ప్రకారం నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పార్లమెంటు సభ్యుడు నిజాయతీగా, సత్ప్రవర్తనతో ఉండాలని ఆ ఆర్టికళ్లు స్పష్టం చేస్తున్నాయి. ‘‘పార్లమెంటు సభ్యుడిగా నవాజ్‌ షరీఫ్‌ను అనర్హుడిని చేస్తున్నాం. అందువల్ల ప్రధాని పదవిలో కొనసాగడానికి ఆయనకు అర్హత ఉండదు’’ అని జస్టిస్‌ ఆసిఫ్‌ సయీద్‌ ఖోసా, జస్టిస్‌ ఎజాజ్‌ అఫ్జల్‌ ఖాన్‌, జస్టిస్‌ గుల్జా ర్‌ అహ్మద్‌, జస్టిస్‌ షేక్‌ అజ్మత్‌ సయీద్‌, జస్టిస్‌ ఇజాజుల్‌ అహ్సాన్‌ల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఏడా ది జనవరి నుంచి ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనం.. కిక్కిరిసిన కోర్టు హాలులో శుక్రవారం ముక్తకంఠంతో తీర్పు ను వెలువరించింది. ఆరు వారాల్లో షరీఫ్‌, ఆయన కుమారులు హుస్సేన్‌, హసన్‌, కుమార్తె మరియంపై కేసు నమోదు చేయాలని జాతీయ జవాబుదారీ బ్యూరోను ఆదేశించింది. విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. షరీ్‌ఫతోపాటు ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌, షరీఫ్‌ అల్లుడు, నేషనల్‌ అసెంబ్లీ సభ్యుడు కెప్టెన్‌ మహ్మద్‌ సఫ్దార్‌లపైనా కోర్టు అనర్హత వేటు వేసింది. నేనే తప్పూ చేయలేదు: షరీఫ్‌తాను ఎలాంటి తప్పు చేయలేదని నవాజ్‌ షరీఫ్‌ చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత షరీఫ్‌ ప్రధాని పద వి నుంచి తప్పుకొంటున్నట్లు పీఎంఎల్‌-ఎన్‌ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. పనామా స్కాంలో కోర్టు విచారణపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తామ న్నారు. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టిందని తప్పుబట్టారు.అనర్హత వేటు వేసిన సుప్రీంపనామా గేట్‌ కేసులో తీర్పురాజీనామా చేసిన నవాజ్‌ఎంపీగా షరీఫ్‌ను అనర్హుడిని చేస్తున్నాంప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధంషరీఫ్‌, పిల్లలపై కేసు నమోదు చేయండిఐదుగురు జడ్జిల బెంచి ఏకగ్రీవ తీర్పుతానెలాంటి తప్పు చేయలేదన్న నవాజ్‌మూడోసారీ అర్థాంతరంగా పదవీచ్యుతితదుపరి ప్రధానిగా తమ్ముడు షాబాజ్‌?ఇస్లామాబాద్‌, జూలై 28: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ అనూహ్యంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వ పదవులు చేపట్టకుండా సుప్రీం కోర్టు ఆయనపై నిషేధం విధించింది. పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడిని చేసింది. పనామా పేపర్ల కుంభకోణంలో ఆయనపైనా, ఆయన పిల్లలపైనా కేసు నమోదు చేయాలని జాతీయ జవాబుదారీ బ్యూరోకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి షరీఫ్‌ రాజీనామా చేశారు. పదవీ కాలం ముగియకుండానే అర్థాంతరంగా ప్రధాని పదవిని షరీఫ్‌ వదులుకోవడం ఇది మూడోసారి. అయితే, పాకిస్థాన్‌ ప్రస్తుతం ఆర్థిక సం క్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉగ్రవాదం కోరలు చాచింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో దాయాది దేశం తాజాగా రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. అసలు కేసు ఇదీ!పాకిస్థాన్‌ ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ తొలిసారి 1990లో బాధ్యతలు చేపట్టారు. 1993 వరకూ కొనసాగారు. తర్వాత 1997 నుంచి 1999 వరకూ ఉన్నా రు. ఈ సమయంలో లండన్‌ లో ఆస్తులు కొనడానికి ఆయన మనీ లాండరింగ్‌ చేశారు. ఈ విషయాన్ని గత ఏడాది బయటకొచ్చిన పనామా పేపర్లు వెలుగులోకి తెచ్చాయి. షరీఫ్‌ పిల్లలకు చెందిన ఆఫ్‌షోర్‌ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌ చేశారని పేర్కొన్నాయి. ఆ డబ్బుతో లండన్లో నాలుగు విలాసవంతమైన ఫ్లాట్లు కొనుగోలు చేశారని తెలిపాయి. దాంతో, తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌, అవామీ ముస్లిం లీగ్‌, జామా తే ఇస్లామీ పార్టీలు గత ఏడాది అక్టోబరులో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. రోజువారీ విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది మేలో ఆరుగురు సభ్యులతో జాయింట్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(జేఐటీ)ను ఏర్పాటు చేసిం ది. ఐఎ్‌సఐ, మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులతో కూడిన జేఐటీ ఎదుట షరీఫ్‌, ఆయన కుమారులు, కుమార్తె, తమ్ముడు, పంజాబ్‌ సీఎం షాబాజ్‌ షరీఫ్‌ హాజరయ్యారు. ఈ నెల పదో తేదీన జేఐటీ తన నివేదికను కోర్టుకు అందజేసింది. షరీఫ్‌ పై అనర్హత వేటుపాకిస్థాన్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 62, 63 ప్రకారం నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటు వేస్తున్నట్లు సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పార్లమెంటు సభ్యుడు నిజాయతీగా, సత్ప్రవర్తనతో ఉండాలని ఆ ఆర్టికళ్లు స్పష్టం చేస్తున్నాయి. ‘‘పార్లమెంటు సభ్యుడిగా నవాజ్‌ షరీఫ్‌ను అనర్హుడిని చేస్తున్నాం. అందువల్ల ప్రధాని పదవిలో కొనసాగడానికి ఆయనకు అర్హత ఉండదు’’ అని జస్టిస్‌ ఆసిఫ్‌ సయీద్‌ ఖోసా, జస్టిస్‌ ఎజాజ్‌ అఫ్జల్‌ ఖాన్‌, జస్టిస్‌ గుల్జా ర్‌ అహ్మద్‌, జస్టిస్‌ షేక్‌ అజ్మత్‌ సయీద్‌, జస్టిస్‌ ఇజాజుల్‌ అహ్సాన్‌ల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఏడా ది జనవరి నుంచి ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనం.. కిక్కిరిసిన కోర్టు హాలులో శుక్రవారం ముక్తకంఠంతో తీర్పు ను వెలువరించింది. ఆరు వారాల్లో షరీఫ్‌, ఆయన కుమారులు హుస్సేన్‌, హసన్‌, కుమార్తె మరియంపై కేసు నమోదు చేయాలని జాతీయ జవాబుదారీ బ్యూరోను ఆదేశించింది. విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. షరీ్‌ఫతోపాటు ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌, షరీఫ్‌ అల్లుడు, నేషనల్‌ అసెంబ్లీ సభ్యుడు కెప్టెన్‌ మహ్మద్‌ సఫ్దార్‌లపైనా కోర్టు అనర్హత వేటు వేసింది. నేనే తప్పూ చేయలేదు: షరీఫ్‌తాను ఎలాంటి తప్పు చేయలేదని నవాజ్‌ షరీఫ్‌ చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత షరీఫ్‌ ప్రధాని పద వి నుంచి తప్పుకొంటున్నట్లు పీఎంఎల్‌-ఎన్‌ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. పనామా స్కాంలో కోర్టు విచారణపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తామ న్నారు. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయాలను ప్రవేశపెట్టిందని తప్పుబట్టారు.
nation
16,042
15-02-2017 17:50:27
పరప్పన అగ్రహార జైలుకు శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో తక్షణం లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం మరోమారు తేల్చిచెప్పడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు. అనంతరం ఆమెను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. శశికళ భర్త నటరాజన్‌తో పాటు పెద్దఎత్తున మద్దతుదారులు అక్కడకి చేరుకోవడంతో జైలు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. అంతకుముందు చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా శశికళ బెంగళూరు చేరుకున్నారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కూడా న్యాయస్థానాన్ని ఆమె కోరారు. ఇంటి భోజనం, మినరల్ వాటర్, ఏసీ, టీవీ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు.
nation
21,388
13-06-2017 05:02:21
డివిల్లీర్స్‌కు సారథ్యం వద్దు
మాజీ సారథి వెస్సల్స్‌కేప్‌టౌన్ : చాంపియన్స్ ట్రో ఫీ నుంచి దక్షిణాఫ్రికా నిష్క్రమించడంతో ఆ జట్టు కెప్టెన ఏబీ డివిల్లీర్స్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా సౌ తాఫ్రికా మాజీ సారథి కెప్లర్‌ వెస్సల్స్‌.. డివిల్లీర్స్‌ కెప్టెన్సీని ప్రశ్నించాడు. వన్డే జట్టు కెప్టెనగా ఏబీ ఇక ఎక్కువ కాలం కొనసాగకూడదన్నాడు. చాంపియన్స ట్రోఫీలో దక్షిణాఫ్రికా.. టీమిండియాతోపాటు పాకిస్థాన చేతిలో కూడా ఓడింది. పైగా డివిల్లీర్స్‌ కొన్ని మ్యాచలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. ఇది ఎంత మాత్రం ఉపయోగకరం కాదని కెప్లర్‌ అన్నాడు. ‘ఏబీ కెరీర్‌లో చివరి దశకు చేరుకుంటున్నాడు. తనకు తానుగానే కొన్ని మ్యాచలకు దూరంగా ఉంటున్నాడు. పైగా జట్టులోకి వస్తూ.. పోతూ ఉండడం వల్ల అతడు ఏమాత్రం కెప్టెనగా కొనసాగకూడద’ని వెస్సల్స్‌ అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా డివిల్లీర్‌ వ్యూహాలను కూడా కెప్లర్‌ విమర్శించాడు. అతని కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నాడు.
sports
202
30-06-2017 00:13:39
సంపద సృష్టిలోనే ధీరూభాయ్‌కి ఆనందం
ఎంఎఫ్ లకు ఆద్యుడు ఆయనేఎఎంఎఫ్ఐ సభలో అనిల్‌ అంబానీ ముంబై: స్వర్గీయ ధీరూభాయ్‌ అంబానీ తన సంపద పెంచుకోవడంకన్నా జనం సంపద పెంచడంలోనే ఆనందం పొందేవారని ఆయన రెండో కుమారుడు, అడాగ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీ అన్నారు. గురువారం ముంబైలో భారత మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల సంఘం (ఎఎంఎఫ్ఐ) సమావేశంలో ఆయన మాట్లాడారు. కొఠారి పయనీర్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేరిట 1993లో ధీరూభాయ్‌ అంబానీ దేశంలో తొలి ప్రైవేటు మ్యూచువల్‌ ఫండ్‌ను ప్రారంభించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా వ్యాపారంలో ఏది మీకు ఆనందం కలిగించిన అంశం అని ఎవరైనా అడిగితే ‘‘సంపద సృష్టిలోనే నాకు ఆనందం.. అది కూడా ప్రజల కోసం సంపద సృష్టించడం మరింత ఆనందం’’ అని చెప్పేవారన్నారు. గుజరాత్‌లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా జీవితం ప్రారంభించిన ధీరూభాయ్‌కి భారత క్యాపిటల్‌ మార్కెట్‌ పితగా ఇన్వెస్టర్లలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1977లో ఆయన మార్కెట్లోకి తెచ్చిన రిలయన్స్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ర్టీస్‌ ఐపిఒలో రూ.1,000 ఇన్వెస్ట్‌ చేసిన వారి సంపద ఈ రోజు రూ.10 లక్షలై ఉండేదని అంచనా. ఆ విధంగా ఆయన లక్షలాది మందిని కోటీశ్వరులుగా చేశారని అనిల్‌ చెప్పారు. 1995లో రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను ప్రారంభించడం కూడా ధీరూభాయ్‌ చర్యలకు కొనసాగింపేనని ఆయన అన్నారు. 1995లో 60 కోట్ల రూపాయలున్న రిలయన్స్‌ ఎంఎఫ్‌ నిర్వహణలోని ఆస్తులు (ఎయుఎం) 2002 నాటికి 2200 కోట్ల రూపాయలకు, ఇప్పుడు 358 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని ఆయన చెప్పారు. అలాగే అప్పట్లో 5.7 కోట్ల రూపాయలున్న వ్యక్తిగత ఎంఎఫ్‌ ఖాతాల్లోని సొమ్ము ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని అనిల్‌ తెలిపారు. ఆర్థిక సమ్మిళితత్వంపై ప్రభుత్వ చర్యలను ప్రశంసించారు. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ డిజిటల్‌ వేదిక ద్వారా బ్యాంకింగ్‌ సదుపాయాలకు దూరంగా ఉన్న కోట్లాది మందిని ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని చెప్పారు. కెవైసి సరళం చేయండిబ్యాంకు ఖాతా ఉన్నవారెవరైనా మరోసారి కెవైసి అవసరం లేకుండా ఏ ఆర్థిక ప్రొడక్ట్‌లో అయినా ఇన్వెస్ట్‌ చేసే అవకాశం కల్పించాలని సెబిని అనిల్‌ కోరారు. అలాగే మ్యూచువల్‌ ఫండ్ల అడ్వర్‌టైజింగ్‌ నిబంధనలు సరళం కావాలన్నారు. దీంతో ఎఎంసిలు ఇన్వెస్టర్లకు తమ లక్ష్యం మరింత తేలిగ్గా తెలియచేయగలుగుతాయని ఆయ న పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్‌ కొనడం ఎంత తేలికో మ్యూచువల్‌ ఫండ్‌ లో ఇన్వెస్ట్‌ చేయడం అంతే తేలిక కావాలని ఆయన సూచించారు. దేశంలో 10 మందిలో 9 మందికి మొబైల్‌ ఫోన్లు, ముగ్గురికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని, కానీ 25 మందిలో ఒక్కరు మాత్రమే మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడి కలిగి ఉన్నారన్నారు. మారుమూల ప్రాంతాలకు చేరడానికి ఇ-కామర్స్‌ను వేదికగా ఉపయోగించుకోవాలని ఎంఎఫ్‌ పరిశ్రమకు ఆయన పిలుపు ఇచ్చారు. భారత మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ఇప్పుడే యవ్వన దశ నుంచి బయటపడిందని, ఈ రంగం పదింతలు వృద్ధి చెందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
business
4,515
19-12-2017 00:51:47
మోదీ విజయం
నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీ ఇద్దరి మొఖాలూ వెలిగిపోతున్నాయి. నెగ్గుకొచ్చినందుకు ఒకరూ, ఓడి గెలిచినందుకు మరొకరూ. గుజరాత్‌లో నూటయాభై స్థానాలు నెగ్గాలన్నది బీజేపీ అధ్యక్షుడి ప్రకటిత లక్ష్యం. సెంచరీకి ఒకటి తక్కువగా పరుగు ఆగిపోయినా, కనీస మెజారిటీ కంటే ఏడు స్థానాలే ఎక్కువ సాధించగలిగినా, ఉన్నవాటిలో పదహారు కోల్పోయినా ఇలా ఆరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం సాధారణ విజయమేమీ కాదు. భూ, జల, వాయుతలాల గుండా నరేంద్ర మోదీ ఇంత హోరాహోరీ యుద్ధం చేసిన తరువాత కూడా కాంగ్రెస్‌ పొరపాటును నెగ్గివుంటే అది దేశ రాజకీయాలను కుదిపేసి, విపక్ష శక్తులన్నింటికీ ప్రాణం పోసివుండేది. గుజరాత్‌లో రెండు దశాబ్దాలకుపైగా అధికారానికి దూరంగా ఉంటూ వ్యవస్థాగత నిర్మాణం విచ్ఛిన్నమైపోయివున్న స్థితిలోనూ కాంగ్రెస్‌ గతంలో కంటే గుప్పెడు స్థానాలు అధికంగా నెగ్గగలగడమే దాని విజయం. శత్రువుల కోటలు బద్దలుకొట్టడమే తప్ప రక్షించుకోవాల్సిన అవసరం ఇప్పటివరకూ రాని నరేంద్రమోదీ ఎంతో శ్రమకోర్చి స్వరాష్ట్రాన్ని కాపాడుకొని, హిమాచల్‌ను చేజిక్కించుకోగలిగారు. ఈ దెబ్బతో ఆయన పార్టీ 19 రాష్ట్రాల్లో పాతుకొని, కాంగ్రెస్‌ను నాలుగు రాష్ట్రాలకే పరిమితం చేయగలిగింది. బహుశా గుజరాత్‌ ఎన్నికలను అటు మోదీ, ఇటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నటికీ మరిచిపోలేకపోవచ్చు. ఐదుపర్యాయాలు అధికారంలో ఉన్న తరువాత సహజసిద్ధంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, తాను ఢిల్లీకి తరలిపోయిన తరువాత గతి తప్పిన పాలనవల్ల పుట్టుకొచ్చిన అసంతృప్తిని కూడా నరేంద్రమోదీ తన ప్రతిభతో చల్లార్చగలిగారు. మోదీ గుజరాత్‌ బంధం ఇప్పటికీ బలంగానే ఉన్నదని అర్థం. విపక్షాల రాష్ట్రాల్లో ఎన్నికలకు పోతే తాడెత్తున లేచి నేతలను తూర్పారబట్టవచ్చు. కానీ, స్థానిక అంశాలతో పాటు, తాను తెచ్చిన జీఎస్టీకి వ్యతిరేకంగా దేశంలో ప్రప్రధమంగా ఉద్యమాలు చేసిన స్వరాష్ట్రాన్ని తిరిగి అధీనంలోకి తెచ్చుకోవడం అంత సులభమేమీ కాదు.  జీఎస్టీమీద మండిపడి పదిహేనురోజుల పాటు గేట్లు మూసుకున్న సూరత్‌ కూడా ఎన్నికల్లో ఆయన పక్షానే నిలిచింది. జీఎస్టీ వ్యతిరేకతను పొదివిపట్టుకోగలనని అనుకున్న కాంగ్రెస్‌కు ఈ పారిశ్రామిక ప్రాతంనుంచి ఒకేస్థానం దక్కింది. బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్‌ను ఇప్పటికీ ప్రత్యామ్నాయంగా భావించలేని వాతావరణం ఆ రాష్ట్రంలోనే ఉన్నదో, లేదా వ్యతిరేకతను సొమ్ముచేసుకోలేకపోవడం కాంగ్రెస్‌ బలహీనతో తెలియదు. సూరత్‌ మాత్రమే కాక, పాటీదార్లు బలంగా ఉన్న అన్ని ప్రాంతాలూ బీజేపీ పక్షానే నిలిచాయి. బీసీ హోదా ఇస్తానని చెప్పినప్పటికీ పటేళ్ళు కాంగ్రెస్‌ పక్షాన మోహరించకపోవడంతో పాటు, బీసీలు కూడా దూరమైనారని కొందరి విశ్లేషణ. హార్దిక్‌ పటేల్‌ ప్రభావం పెద్దగా లేదంటున్నా, ఈ ఫలితాల్లో బీజేపీ గ్రామీణ ప్రాంతాలవారి ఆదరణకు దూరమైన పరిస్థితి మాత్రం కనిపిస్తున్నది. పట్టణప్రాంతాల్లో పెరగడమే తప్ప ఏమాత్రం తరగని మోదీ ప్రేమే ఈ ఎన్నికల్లో బీజేపీని ఎదురుగాలి నుంచి గట్టెక్కించింది. దేశంలో అత్యధిక పట్టణ జనాభా ఉన్న ఈ రాష్ట్రం మోదీని వికాసపురుషుడిగా భావిస్తున్నది. ఆకాశ హార్మ్యాలు, బుల్లెట్‌ రైళ్ళు, సీ ప్లేన్లు అభివృద్ధి చిహ్నాలుగా వీరిని ఆకర్షిస్తాయి. మత ఘర్షణల బారినపడి, మత చీలికలు కూడా బలంగా ఉన్నందున నగరాలే మోదీకి కంచుకోటలు. ఇందుకు భిన్నంగా గ్రామీణ గుజరాతే కాంగ్రెస్‌ను ఆదరించింది. వ్యవసాయ విధ్వంసం, దళితులపై దాడులు, రిజర్వేషన్ల ఉద్యమం ఇత్యాదివి ఇక్కడ పనిచేశాయి. కాంగ్రెస్‌ కులప్రాతిపదికన రాష్ట్రాన్ని విడదీస్తున్నదన్నది ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన విమర్శ.  కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కర్ఫ్యూల రాజ్యం వస్తుందన్న బహిరంగ నినాదం ద్వారా పాతికేళ్ళు అణిగివున్న ఒక మతవర్గం తిరిగి ఊచకోతలకు పాల్పడుతుందన్న రహస్య సందేశంతో బీజేపీ ఓటర్లను నిలబెట్టుకోగలిగిందని అంటారు. మతం ఆధారంగా పాతికేళ్ళుగా తనతో కట్టిపడేసుకున్న కులాలను గతంలో మాదిరిగా కులప్రాతిపదికన కాంగ్రెస్‌ తన్నుకుపోతుందన్న భయం బీజేపీలో అధికంగా కనిపించింది. అయ్యర్‌ మాటను అనుకూలంగా మార్చుకొని స్వయంగా ప్రధానే బీసీ కార్డు ప్రయోగించవలసి వచ్చింది. వేగంగా ఎదిగిన దళిత నేత జిగ్నేష్‌ మేవానీ, ఓబీసీ నేత అల్పేష్‌ ఠాకూర్‌ వంటివారు ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో నెగ్గుకురావడం అక్కడ మారుతున్న రాజకీయచిత్రానికి నిదర్శనాలు. చాలా చోట్ల స్వల్ప వ్యత్యాసంలో కాంగ్రెస్‌ ఓడిపోవడం కూడా ఓట్లుగా మార్చుకోలేకపోయిన దాని అసమర్థతతో పాటు రాహుల్‌ రాజకీయం బాగానే పనిచేసినట్టు చెబుతున్నది. పనితీరు కంటే ఓట్ల క్షేత్రంలో సూక్ష్మస్థాయి నిర్వహణే బీజేపీని పెద్ద ప్రమాదం నుంచి బయటపడవేసినట్టు కనిపిస్తున్నది. హిమాచల్‌ను అత్యంత అవమానకరంగా కోల్పోయినప్పటికీ కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి గుజరాత్‌ ఫలితాలు కొంత ఉత్తేజాన్ని ఇస్తాయి. ఆయన ప్రచారశైలి, పెరిగిన కాసిన్ని స్థానాలు మోదీతో పోరాడగలగడన్న నమ్మకం పార్టీలోనే కాదు, విపక్షాల్లోనూ కలిగిస్తుంది. బీఎస్పీ, ఎన్సీపీ వంటి పార్టీలను కొన్ని కారణాలవల్ల గుజరాత్‌లో కలుపుకోలేకపోయినా, సార్వత్రిక ఎన్నికల్లో మోదీని బలంగా ఢీకొనాలంటే చేతికి చేయూత అవసరమని ఈ ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ఫలితాల అనంతరం దేశవిదేశీ మీడియా మరో ఐదేళ్ళపాటు మోదీయే ప్రధాని అంటూ విశ్లేషించడంలో విశేషమేమీ లేదు. మోదీ యుద్ధనీతినీ, రీతినీ తట్టుకొని నిలవడం సులభం కాదని ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు తెలియచెప్పాయి. అలాగే, గతంలో మాదిరిగా రాహుల్‌ను పప్పు అంటూ తీసిపారేయడం సులభం కాదనీ, సార్వత్రిక ఎన్నికలు నల్లేరు మీద నడకకాబోదని బీజేపీకి గుర్తుచేస్తున్నాయి.
editorial
2,596
22-09-2017 00:28:05
ఆస్ర్టో వ్యూ : ద్వితీయార్థం బేరిష్‌!
తిథి: అశ్వయుజ శుక్ల విదియ/తదియ నక్షత్రం: చిత్తపుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, తుల/వృశ్చిక, కుంభ/మీన రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీ: 10121.90 (-19.25) ట్రెండ్‌ మార్పు వేళలు: 11.59 ధోరణి: గ్రహగతులను బట్టి బెటర్‌గా ప్రారంభమై 10 గంటల నుంచి 12.45 మధ్యలో మెరుగ్గా ట్రేడవుతూ 1 గంట తర్వాత నిస్తేజంగా మారి చివరి వరకు అదే ధోరణిలో సాగి క్లోజవుతుంది. ట్రేడింగ్‌ వ్యూహం: నిఫ్టీ ఫ్యూచర్స్‌ 9.30 గంటల సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లా్‌సతో లాంగ్‌ పొజిషన్లు తీసుకుని 10.30 సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి. 1 గంట తర్వాత ఎటిపికన్నా దిగువకు వస్తే షార్ట్‌ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్‌ చేసుకోవాలి.ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్‌ పొజిషన్లు శ్రేయస్కరం. నిరోధ స్థాయిలు: 10160, 10195 మద్దతు స్థాయిలు: 10070, 10035గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టో టెక్నికల్‌ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. -డా.భువనగిరి అమరనాథశాస్ర్తిwww.thefinanciala strologer.blogspot.in
business
1,623
31-12-2017 23:08:34
ఊగిసలాటలున్నా.. బుల్‌ హల్‌చల్‌
స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరింత పైకేనిఫ్టీ టార్గెట్‌ 11600-12000కొత్త ఏడాదిలోనూ దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌రన్‌ కొనసాగవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ప్రామాణిక సూచీలు తీవ్ర ఊగిసలాటలకు లోనుకావచ్చని వారు భావిస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయం గా పలు కీలక పరిణామాలు మార్కెట్లో ఒడిదుడుకులు పెంచవచ్చని హెచ్చరిస్తున్నారు. 2017లో కీలక నిరోధక స్థాయిలను బద్దలుకొడుతూ మిల్కా సింగ్‌లా పరుగెత్తిన స్టాక్‌ సూచీలు ఈ సంవత్సరంలో మాత్రం వేగాన్ని కొంత తగ్గించవచ్చని వారంటున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ నిర్ణయాలు ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. అలాగే, ఆరు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వర్షపాతం, ఆర్‌బిఐ రెపో రేట్లు, కేంద్రం చేపట్టబోయే సంస్కరణలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారిస్తారు. అంతర్జాతీయంగా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం కూడా మన మార్కెట్‌కు కీలకంగా నిలుస్తుంది. మొత్తం మీద కొత్త ఏడాదిలో కూడా బుల్‌రన్‌ కొనసాగి నిఫ్టీ 12000 పాయింట్ల స్థాయిని తాకే ఆస్కారం ఉన్నదని బొనాంజా పిఎంఎస్‌ ఫండ్‌ మేనేజర్‌ యోగేష్‌ నగావ్కర్‌ అంటున్నారు. వచ్చే ఏడాది కూడా బుల్‌రన్‌ కొనసాగే ఆస్కారం ఉన్నందు వల్ల సూచీలు దిద్దుబాటుకు లోనైనప్పుడల్లా పెట్టుబడికి అవకాశంగా మలుచుకోవాలన్నది ఆయన సూచన.  అయితే కోటక్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్లో బుల్‌రన్‌ విషయంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించింది. నిఫ్టీ ప్రస్తుత స్థాయి నుంచి 11 శాతం పెరిగి 11600 స్థాయికి చేరుకోవచ్చని ఆ సంస్థ అంచనా. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి ప్రభావాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో 2018లో ఆర్థిక వృద్ధి రేటు క్రమంగా మెరుగుపడనున్నట్టు తెలిపింది. ఏడాది రెండో అర్ధ భాగంలో ప్ర భుత్వం గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థను ఉ త్తేజితం చేయడం లక్ష్యంగా పెట్టుబడులు పెంచవచ్చునని, ప్రైవేట్‌ పెట్టుబడులు కూడా పుంజుకునే అవకాశం ఉందని పేర్కొంది. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభు త్వం పెట్టుబడులు పెరగనుండటం సానుకూలంగా ఉండనున్నట్లు తెలిపింది. ఈక్విటీ మార్కెట్‌ ట్రెండ్‌పై కొందరు విశ్లేషకుల అంచనాలు.. ఈ సంవత్సరంలో ఈక్విటీ సూచీలు తీవ్ర ఊగిసలాటకు లోనుకావచ్చు. గత ఏడాది 28 శాతానికి పైగా రాబడులు పంచిన నిఫ్టీ 2018లో మరో 15 శాతం మేర పుంజుకోవచ్చు. కొన్ని స్టాక్‌లు, సెక్టార్లు ప్రామాణిక సూచీల కంటే మెరుగైన రిటర్నులు పంచే అవకాశం ఉంది. 2018లో యుఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచవచ్చని అంచనా.- అజయ్‌ జైస్వాల్‌, స్టీవార్ట్‌ అండ్‌ మాకెర్టిచ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ మెరుగవుతున్న కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలతోపాటు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల దన్నుతో మార్కెట్లో ర్యాలీ కొనసాగనుంది. డిసెంబరు 2018కల్లా నిఫ్టీ 11500 స్థాయికి చేరుకోవచ్చని అంచనా. ఈ సంవత్సరం పారిశ్రామికోత్పత్తి, జిఎస్ టి వసూళ్లు, నిర్మాణం, గ్రామీణ రంగాలతోపాటు ఉద్యోగాల కల్పన పుంజుకోవచ్చు. ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మౌలిక రంగానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊతమిచ్చేందుకు మోదీ సర్కారు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఏడాది రెండో అర్ధభాగంలో ప్రైవేట్‌ పెట్టుబడుల్లో పునరుద్ధరణ కన్పించవచ్చు. - వినీత్‌ బోలింజ్కర్‌, వెంచురా సెక్యూరిటీస్‌ హెచ్‌ఒఆర్‌ ఈ ఏడాదిలో మార్కెట్లు అంతగా పరుగు తీయకపోవచ్చు. నిఫ్టీ 12-15 శాతం మేర వృద్ధి నమోదు చేసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్న నేపథ్యంలో వాణిజ్యావకాశాలు పుంజుకోవచ్చు. ఫలితంగా ఎగుమతి సంస్థలు ఆశాజనక పనితీరును ప్రదర్శించే అవకాశం ఉంది. బ్యాంకుల మొండి బకాయిల సమస్యను పరిష్కరించేందుకు చేపడుతున్న చర్యలతో పాటు వాటికి భారీగా మూలధన నిధులు కేటాయించనుండటం మార్కెట్‌ ఆదాయ వృద్ధిపై సానుకూల ప్రభావం చూపనుంది.- గౌరవ్‌ దువా, షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఈ ఏడాది దేశీయ సంస్థాగత పెట్టుబడులు ఈక్విటీలకు మద్దతుగా నిలువవచ్చు. కాకపోతే అమెరికాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉన్నందున విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. డిసెంబరు 2018కల్లా నిఫ్టీ ప్రస్తుత స్థాయి నుంచి 14 శాతం మేర పెరగవచ్చు.- దినేష్‌ రోహిరా, 5నాన్స్‌ డాట్‌ కామ్‌ వ్యవస్థాపకులు ఈ ఏడాది సూచీలు తీవ్ర ఊగిసలాటలకు లోనుకానుండటంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరగనుందని భావిస్తున్నాం. బడ్జెట్‌, ఆర్‌బిఐ ద్రవ్య పరపతి సమీక్షలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు, అమెరికాలో పన్నుల తగ్గింపు ఈ సంవత్సరంలో మార్కెటకు కీలకం.- దేవం మోదీ, ఈక్విరియస్‌ సెక్యూరిటీస్‌
business
2,115
25-07-2017 23:41:33
హీరో మోటోకార్ప్‌ లాభం రూ.914 కోట్లు
త్వరలో కొత్త మోడళ్ల విడుదలన్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 914.04 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది (883 కోట్ల రూపాయలు)తో పోల్చితే కంపెనీ నికర లాభం స్వల్పంగా 3.5 శాతం వృద్ధి చెందింది. సమీక్షా కాలంలో కంపెనీ కార్యకలాపాల రాబడులు 7.52 శాతం వృద్ధితో 8,010.66 కోట్ల రూపాయల నుంచి 8,612.91 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. జూన్‌ త్రైమాసికంలో మోటార్‌ సైకిళ్ల విక్రయాలు 17,45,389 యూనిట్లుగా ఉన్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మోటార్‌ సైకిళ్ల విక్రయాలు సరికొత్త గరిష్ఠ స్థాయిలను చేరుకోవటంతో దేశీ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నట్లు హీరో మోటోకార్ప్‌ చైర్మన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ పవన్‌ ముంజాల్‌ వెల్లడించారు. మార్కెట్‌ సెంటిమెంట్‌ సానుకూలంగా ఉండటం, డిమాండ్‌ గణనీయంగా పెరగటం వంటి అంశాలు దేశీయ మార్కెట్లో కంపెనీ వృద్ధికి దోహదకారిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉన్న హీర మోటో.. కొత్త పెట్టుబడులు, ఇన్నోవేషన్స్‌తో ఉత్పత్తి రంగంలో కీలకంగా ఉందని ముంజాల్‌ తెలిపారు. కాగా రానున్న త్రైమాసికాల్లో కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
business
16,063
28-04-2017 15:00:01
సుక్మా దాడికి పాల్పడింది మేమే...
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను ఇటీవల కాల్చిచంపిన ఘటనకు తామే బాధ్యులమని బస్తర్ ప్రాంతం మాయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు ఒక ఆడియో సందేశంలో తమ దాడికి కారణాలను ఆ సంస్థ వెల్లడించింది. నక్సల్స్ ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగానే తాము సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి జరిపినట్టు మావోయిస్టులు క్లెయిమ్ చేశారు. హిందీలో 16 నిమిషాల నిడివి కలిగిన ఈ ఆడియో సందేశంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై తమ సంస్థకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌జీఎల్) విజయవంతంగా దాడి జరపడాన్ని మావోయిస్టుల ప్రతినిధి ప్రశంసించారు. తమ యుద్ధం పారామిలటరీ సిబ్బందిపై కాదని, తిరుగుబాటును అణిచివేయాలని చూసే భద్రతా దళాలకు ఇదో హెచ్చరిక అని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇప్పటికైనా పోలీసు సిబ్బంది తమ ఉద్యోగాలను విడిచి వెళ్లాలని ఆయన సూచించారు. '2016లో ప్రభుత్వం 9 మంది మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్‌లో, 21 మందిని ఒడిసాలో కాల్చిచంపింది. ఈ మారణకాండకు, మా మహిళలపై జరిపిన లైంగిక హింసకు వ్యతిరేకంగానే మేమీ దాడి జరిపాం' అని మావోయిస్టు ప్రతినిధి వికల్ప్ ఆ వీడియోలో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారాలు, గ్రామస్థులను నకిలీ ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపినట్ట ఆయన ఆరోపించారు.
nation
3,362
08-06-2017 01:03:00
అంబేడ్కర్‌ అలా చెప్పలేదు!
ఆర్యులు విదేశీయులు కాదని అంబేద్కర్ తాను రాసిన ‘‘హూ ఆర్ శూద్రాస్’’ (Who are Shudras?) అనే పుస్తకంలో శాస్తీయంగా నిరూపించారు. అయినప్పటికీ దళిత మేధావులు పనిగట్టుకొని ఆర్యులు విదేశీయులని దుష్ప్రచారం చెయ్యడం దురదృష్టకరం.Who are Shudras? అనే పుస్తకంలో పేజీ నం.84, 86, 100 లో ఆర్యుల దండయాత్ర గురించి అంబేద్కర్ అభిప్రాయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అ)వేదాలలో ఎక్కడా ఆర్య, ద్రావిడ అనే పదాలు లేవు. ఆ)వేదాలలో ఎక్కడా ఆర్యుల దండయాత్ర గురించి ప్రస్తావన లేదు. ఇ)ఆర్యులు, దస్యులు రెండు వేర్వేరు జాతులని వేదాలలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ) ఆర్యులు, దస్యులు వేర్వేరు శరీర రంగు కలిగిన వారని వేదాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. దళిత మేధావులు ఆర్యులు విదేశీయులని ప్రచారం చేస్తే అది అంబేద్కరును,అంబేద్కర్ రచనలను అవమానించడమే. దేశ సమగ్రతను కోరుకునే ప్రతి ఒక్కరు ఈ దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది- పుట్లూరి రాంనర్సింహారెడ్డి, తిరుమలగిరి (సాగర్), నల్లగొండ జిల్లా.
editorial
19,873
13-04-2017 02:43:36
రైజర్స్‌కు చెక్‌
ముంబై: సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ కొట్టలేకపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిపోయింది. రైజర్స్‌ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఆరు వికెట్లు కోల్పోయి మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. నితీష్‌ రాణా (36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), పార్థివ్‌ పటేల్‌ (24 బంతుల్లో 7 ఫోర్లతో 39) సత్తా చాటగా, క్రునాల్‌ పాండ్యా (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37) మెరుపులు మెరిపించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 158 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 49), శిఖర్‌ ధవన్‌ (43 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 48) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జస్‌ప్రీత బుమ్రా ((3/24), హర్భజన్‌ సింగ్‌ (2/23) వార్నర్‌సేనను కట్టడి చేశారు. ముంబై సునాయాసంగా..: లక్ష్యం తక్కువే అయినా.. భువనేశ్వర్‌, నెహ్రా, ముస్తాఫిజుర్‌, రషీద్‌లతో హైదరాబాద్‌ బౌలింగ్‌ అత్యంత పటిష్టంగా ఉండడంతో ఛేదన ముంబైకి అంత సులువు కాదనిపించింది. కానీ, ఓపెనర్లు పార్థివ్‌ పటేల్‌, జోస్‌ బట్లర్‌ (14) వెంటవెంటనే ఐదు బౌండ్రీలు రాబట్టడంతో మూడు ఓవర్లకు 28 పరుగులు చేసిన ముంబై ఆరంభమే దక్కించుకుంది. అయితే, నాలుగో ఓవర్లో నెహ్రా స్లో బాల్‌తో బట్లర్‌ను బౌల్డ్‌ చేయగా.. కెప్టెన్‌ రోహిత (4)ను రషీద్‌ ఎల్బీ చేసి ముంబైకి షాకిచ్చారు. కానీ, ఈ ఆనందం రైజర్స్‌కు ఎంతోసేపు నిలువలేదు. మరో ఎండ్‌లో పార్థివ్‌ భారీషాట్లతో విరుచుకుపడగా.. గత మ్యాచ్‌లో వీరోచిత అర్ధ శతకంతో ముంబైని గెలిపించిన నితీష్‌ రాణా కూడా బ్యాట్‌ ఝుళిపించాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ముస్తాఫిజుర్‌కు ఆరో ఓవర్లో రాణా సిక్సర్‌తో స్వాగతం పలుకగా.. పార్థివ్‌ మూడు ఫోర్లు పిండుకున్నాడు. దాంతో, పవర్‌ప్లేలోనే ముంబై 61/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ దశలో రేసులోకొచ్చిన రైజర్స్‌ తర్వాతి మూడు ఓవర్లలో 15 పరుగులే ఇచ్చింది. పదో ఓవర్లో పార్థివ్‌ను అవుట్‌ చేసిన స్పిన్నర్‌ దీపక్‌ పర్యాటక జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. కానీ, అప్పటికే క్రీజులో కుదురుకున్న రాణా వెనక్కి తగ్గలేదు. అదే ఓవర్లో భారీ సిక్సర్‌ సాధించిన అతను నెహ్రా బౌలింగ్‌లో బౌండ్రీ కొట్టాడు. పొలార్డ్‌ (11).. ముస్తాఫిజుర్‌ వేసిన 13వ ఓవర్లో భారీ సిక్సర్‌తో జట్టు స్కోరు వంద పరుగులు దాటించాడు. కానీ, తర్వాతి ఓవర్లోనే అతణ్ణి అవుట్‌ చేసిన భువీ రైజర్స్‌లో ఆశలు రేపాడు. అయితే, పొలార్డ్‌ స్థానంలో వచ్చిన క్రునాల్‌ పాండ్యా భారీ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. రషీద్‌ ఓవర్లో సిక్సర్‌ కొట్టిన అతను.. నెహ్రా బౌలింగ్‌లో 6, 4తో పరుగులు.. బంతులను సమం చేశాడు. ఇక, కటింగ్‌ వేసిన 17వ ఓవర్లో మరో భారీ సిక్సర్‌, రెండు బౌండ్రీలు బాది వార్నర్‌సేన ఆశలపై నీళ్లు చల్లాడు. తర్వాతి ఓవర్లో క్రునాల్‌తో పాటు రాణాను భువీ అవుట్‌ చేసినా ఫలితం లేకపోయింది. ఈ సీజన్‌లో భారత అంపైర్ల చెత్త అంపైరింగ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అనేక, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న ఫీల్డ్‌ అంపైర్లు ఈ మ్యాచ్‌లోనూ గుడ్డిగా వ్యవహరించారు. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో.. ఆరో ఓవర్‌ చివరి బంతికి బౌండ్రీ కొట్టిన డేవిడ్‌ వార్నర్‌కు తర్వాతి ఓవర్లో స్ట్రయికింగ్‌ ఇచ్చి ఫీల్డ్‌ అంపైర్లు సీకే నందన్‌, నితిన్‌ మీనన్‌ పొరపాటు చేశారు. వార్నర్‌ ఏడో ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కోవడాన్ని ఈ ఇద్దరితోపాటు టీవీ అంపైర్‌ వై.సి. బార్డె కూడా గుర్తించకపోవడం ఆశ్చర్యకరం. ఇదే మైదానంలో జరిగిన గత మ్యాచ్‌లో ఇద్దరు ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ అవుటైనట్టు నందన్‌, నితిన్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. బంతి ఎడ్జ్‌ తీసుకున్నా తనను ఎల్బీగా ప్రకటించడంపై ముంబై కెప్టెన్‌ రోహిత.. అంపైర్‌ నందన్‌పై అసహనం వ్యక్తం చేసి రెఫరీ మందలింపునకు గురైన విషయం తెలిసిందే.స్కోరుబోర్డుసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: ధవన్‌ (బి) మెక్లెనగన్‌ 48, వార్నర్‌ (సి) పార్థివ్‌ (బి) హర్భజన్‌ 49, హుడా (సి) పొలార్డ్‌ (బి) హర్భజన్‌ 9, యువరాజ్‌ (బి) హార్దిక్‌ 5, బెన్‌ కటింగ్‌ (బి) బుమ్రా 20, నమన్‌ (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 9, శంకర్‌ (సి) రాణా (బి) మలింగ 1, రషీద్‌ (సి అండ్‌ బి) బుమ్రా 2, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 4, నెహ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 158/8; వికెట్ల పతనం: 1-81, 2-105, 3-114, 4-123, 5-146, 6-147, 7-153, 8-155; బౌలింగ్‌: హర్భజన్‌ 4-0-23-2, మలింగ 4-0-30-1, బుమ్రా 4-0-24-3, మెక్లెనగన్‌ 4-0-42-1, హార్దిక్‌ 3-0-22-1, క్రునాల్‌ 1-0-12-0.ముంబై ఇండియన్స్‌: పార్థివ్‌ (సి) భువనేశ్వర్‌ (బి) హుడా 39, బట్లర్‌ (బి) నెహ్రా 14, రోహిత (ఎల్బీ) రషీద్‌ 4, నితీష్‌ రాణా (బి) భువనేశ్వర్‌ 45, పొలార్డ్‌ (సి) ధవన్‌ (బి) భువనేశ్వర్‌ 11, క్రునాల్‌ (సి) కటింగ్‌ (బి) భువనేశ్వర్‌ 37, హార్దిక్‌ (నాటౌట్‌) 2 , హర్భజన్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 18.4 ఓవర్లలో 159/6; వికెట్ల పతనం: 1-28, 2-41, 3-79, 4-111, 5-149, 6-155; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-21-3, నెహ్రా 4-0-46-1, రషీద్‌ 4-0-19-1, ముస్తాఫిజుర్‌ 2.4-0-34-0, దీపక్‌ హుడా 2-0-18-1, కటింగ్‌ 2-0-18-0.
sports
11,471
10-06-2017 03:04:15
నీట్‌ ఫలితాల వెల్లడికి అవకాశమివ్వండి: సీబీఎస్ ఈ
న్యూఢిల్లీ, జూన్‌ 9: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌-2017 ఫలితాలను నిలిపివేయాలన్న మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సీబీఎస్ ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని అభ్యర్థించింది. నీట్‌ ప్రశ్నాపత్రంలో ఏకరూపత పాటించలేదజూట విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడంతో నీట్‌ ఫలితాలను నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
nation
7,708
25-01-2017 16:11:14
టచ్ చేసి చూడమంటున్న రవితేజ
'మాస్ మహారాజా' రవితేజ హీరోగా ఓ భారీ సినిమా తెరకెక్కబోతోంది. ఆ సినిమాకు 'టచ్ చేసి చూడు' అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. జనవరి 26 (గురువారం) రవితేజ బర్త్ డే సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమా వివరాలను దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ "మాకు చిరకాల మిత్రుడైన రవితేజతో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేసారు. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం" అని తెలిపారు. దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ "ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో ఇద్దరు కథానాయకులుంటారు. ఇప్పటికే రాశి ఖన్నాను ఎంపిక చేసాం. మరొక నాయికను త్వరలోనే ప్రకటిస్తాం. హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తున్నారు" అని చెప్పారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు. దీనికి ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8 సంగీతం అందిస్తున్నారు.
entertainment
7,564
15-12-2017 19:25:36
శేఖర్ కమ్ములతో విజయ్ దేవరకొండ..!
చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు 'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ ఓ ఊహించని షాక్ ఇచ్చాడు. త్వరలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించబోతున్నాడట విజయ్! ఇటీవల శేఖర్ చెప్పిన కథ నచ్చడంతో ఆ కథను వెంటనే డెవలప్ చేయమని కోరాడట విజయ్ దేవరకొండ. సో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఖరారైనట్టే! ప్రస్తుతం రాహుల్ అనే కొత్త దర్శకుడి సినిమాతో పాటు పరశురామ్ దర్శకత్వంలోనూ నటిస్తున్న ఈ యువ హీరో క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాల తర్వాత శేఖర్ కమ్ముల సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా 'అర్జున్ రెడ్డి'తో డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడమంటే విశేషమే మరి. ఓ వైపు చరణ్ వంటి స్టార్ హీరో వైపు 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అడుగులు వేస్తుండే... మరోవైపు ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దిశగా సాగుతున్నాడు 'అర్జున్ రెడ్డి' హీరో విజయ్. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి జర్నీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
entertainment
3,114
18-09-2017 01:02:24
కొరియా కన్నెర్రజేస్తే.. బంగారమూ భగ్గు
బంగారం ధరల్లో ఆటుపోట్లు ఇన్వెస్టర్లకు అంతుచిక్కడం లేదు. దసరా, దీపావళి. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గర పడుతున్నాయి. ఇదే సీజన్‌లో మన దగ్గర ఏటా పసిడి కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం రేటు పెరిగిపోతోంది. జిఎ్‌సటి ప్రభావంపై మార్కెట్‌ ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. దీనికి తోడు ప్రభుత్వం బంగారం కొనుగోళ్లనూ మనీ లాండరింగ్‌ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పండగలప్పుడు బంగారం కొనుగోలుచేయవచ్చా ? పసిడి మార్కెట్‌ ఎలా ఉంటుంది, ఇన్వెస్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి... వగైరా అంశాలపై ప్రత్యేక కథనం.గతవారం ఇలా... గత వారం ఒక దశలో రూ.31,000 దాటిన పది గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) పసిడి ధర తర్వాత కాస్త నీరసించింది. గత ఎనిమిదిన్నర నెలల్లో దేశంలో పసిడి ధర దాదాపు పది శాతం పెరిగింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం 16 శాతం వరకు లాభపడింది. వరుణుడు కరుణించడంతో గ్రామీణ ప్రాంతం నుంచీ ఈ ఏడాది పసిడికి మంచి డిమాండే ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా.  ప్రతికూల అంశాలునల్ల ధనంపై పోరు, మూలధన ఖాతా లోటు (క్యాడ్‌) కట్టడి వంటి విషయాలతో ప్రస్తుతం బులియన్‌ వ్యాపారంపై అనేక ఆంఽక్షలు అమలవుతున్నాయి. దీనికి తోడు అక్రమ నగదు లావాదేవీలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పసిడి అమ్మకాలపై నిబంధనలను మరింత తీవ్రం చేసింది. దీంతో నల్లధనంతో పసిడి కొనుగోలు చేసే వారు వెనుకాముందు ఆడే పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం లేదన్న సంకేతాలూ బులియన్‌ మార్కెట్‌ను నిరాశ పరుస్తున్నాయి. దీనికి తోడు చాలా మంది నగల వ్యాపారులు ఇంకా జిఎ్‌సటికి పూర్తి స్థాయిలో అలవాటు పడలేదు. దీంతో ఈసారీ పండగల సీజన్‌లో అమ్మకాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ధరలు ఎలా ఉండవచ్చంటే..మన దేశంలో బంగారం ధర డాలర్‌తో రూపాయి మారకం రేటు, అమెరికాలో వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు ఇప్పటికే ఆటుపోట్లకు లోనవుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు రూ.30,000 దిగువన ఉన్న 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం రూ.30,800-31,000 మధ్య ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి. పది రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 1,357 డాలర్లకు చేరింది. ప్రస్తుతం 1,320 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు శృతి మించితే ఇది వెంటనే 1,400 డాలర్లు దాటిపోవడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మన దేశంలోనూ పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,000- 33,000 వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. అయితే ఇదంతా భౌగోళిక ఉద్రిక్తతలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కొరియా సమస్య శాంతియుతంగా ముగిస్తే మాత్రం పసిడి ధర రూ.30,000 వరకు దిగొచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా పెళ్లిళ్ల వంటి అవసరాలకు తప్పించి, పసిడి కొనుగోళ్లు పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదని మార్కెట్‌ వర్గాల అంచనా. పెట్టుబడి లాభాల కోసం సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడం, ప్రతి అమ్మకం-కొనుగోళ్లకు ఆధార్‌ లేదా పాన్‌ కార్డులతో పక్కాగా లెక్క చెప్పాల్సి రావడం కూడా ఇందుకు కారణం.
business
7,580
24-06-2017 17:31:44
అభిషేక్‌‌తో నటించనంటున్న ఐశ్వర్యరాయ్
నాలుగు పదులు వయసు దాటినా.. ఇంకా వెండితెరపై హీరోయిన్‌గా వెలిగిపోవాలని కలలుకంటున్న ఐశ్వర్యరాయ్ ఆశలు అంతఈజీగా నెరవేరడంలేదు. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్‌ను కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ పాపపుట్టిన తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లుగా మళ్లీ ‘జస్బా’తో రీ ఎంట్రీ ఇచ్చిన ఐష్.. అప్పటినుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తూ ఉంది. గతేడాది ‘ఏ దిల్ హే ముష్కిల్‌’ సినిమాతో తనలోని హాట్ పెర్ఫామెన్స్‌ను ఆడియన్స్‌కు మరోసారి రుచి చూపించింది. ఇదిలావుంటే ప్రస్తుతం ఐష్ రెండు, మూడు సినిమాలను ఓకే చేసిందని టాక్ వినిపిస్తోంది. అందులో తన భర్త అభిషేక్ బచ్చన్ హీరోగా నటించబోయే ‘గులాబ్ జామ్’ సినిమా కూడా ఉందని ప్రచారం జరిగింది.  అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ‘గులాబ్ జామ్’ సినిమాలో నటించేందుకు ఐశ్వర్యరాయ్ అతగా ఆసక్తి చూపడంలేదట. ఇప్పటివరకూ ఈ సినిమాకు ఐష్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని, అదే సమయంలో అనిల్‌కపూర్ సరసన పనీఖాన్, మణిరత్నం నయా మూవీకి ఓకే చెప్పిందని వార్తలు మొదలయ్యాయి. దీంతో ఐష్ కావాలనే భర్తతో నటించేందుకు నిరాకరిస్తోందని గుసగుసలు జోరందుకున్నాయి. భర్తతో కలిసి నటిస్తే అంతహాట్‌గా కన్పించేందుకు అవకాశం ఉండదని అందుకే ఐశ్వర్య, అభిషేక్ సినిమా హోల్డ్‌లో పెడుతోందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. మరి కొందరైతే భర్తతో ఉన్న విభేదాల కారణంగానే ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోటంలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఐష్ తీరు చూస్తుంటే అభికీ, అమెకి మధ్య ఏదో జరుగుతోందన్నట్టుగా అనిపిస్తోంది.
entertainment
4,812
15-08-2017 14:53:32
సాయి పల్లవి అభిమానులకు ఈ విషయం తెలుసా?
తెలుగు ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. తెలంగాణ యాసతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇప్పుడు ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈమె సినిమా కోసం యూత్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే అందరికీ ఇదో గుడ్ న్యూస్. సాయిపల్లవి, దుల్కర్ సల్మాన్ జంటగా మలయాళంలో కలి మూవీ చేశారు. షార్ట్ టెంపర్ ఉన్న ఓ కుర్రాడుకి, కూల్‌గా ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయికు మధ్య జరిగే ప్రేమకథ 'కలి'. ఇది అక్కడ సూపర్ డూపర్ హిట్ కొట్టింది.  తెలుగులో ఒకే బంగారం సినిమాతో దుల్కర్ సల్మాన్ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ఇక సాయి పల్లవి గురించి చెప్పనక్కర్లేదు. ఫిదా మూవీతో అందర్నీ ఫిదా చేసేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కలి మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ డేట్లు మాత్రం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 1న ఆడియో రిలీజ్ చేసి, సెప్టెంబర్ 8వ తేదీన సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. లంచం తీసుకున్నాడని సొంత కొడుకునే చంపేసిన ఆర్మీ జవాన్
entertainment
16,472
21-05-2017 02:30:09
ఒకే కాటుతో మూడు రోగాలు
వాషింగ్టన్‌, మే 20: దోమ కుడితే ఏ మలేరియానో రావొచ్చు. మరీ ప్రమాదకరమైన ఎయిడస్‌ ఈజిప్టి లాంటి దోమలు కుడితే జికావైరస్‌ సంక్రమించవచ్చు. కానీ ఒకేసారి జికా, చికున్‌ గున్యా, డెంగ్యూ వైర్‌సలు వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఎయిడస్‌ ఈజిప్టి దోమ కుడితే ఈ మూడు వైర్‌సలు శరీరంలోకి ప్రవేశిస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరా డో శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో తేలిందట! ప్రయోగశాలలో దోమలకు జికా, చికున్‌ గున్యా, డెంగ్యూ వైరస్‌లను ఎక్కించారు. ఈ దోమలు మనుషులను కుట్టినప్పుడు ఒకదాని వెంట మరొకటిగా మూడు రకాల వైర్‌సలు సంక్రమిస్తున్నాయని వర్సిటీ పరిశోధకుడు క్లాడియా రక్కెర్ట్‌ వివరించారు.
nation
10,912
05-05-2017 18:32:01
అనుపమకు అప్పుడు మాటిచ్చారు.. ఇప్పుడు నిల‌బెట్టుకున్నారు!
ప్రేమ‌మ్‌, శ‌త‌మానం భ‌వ‌తి వంటి విజ‌యాల త‌ర్వాత మ‌ల‌యాళ న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగునాట స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుంద‌ని అంద‌రూ భావించారు. అందుకు త‌గిన‌ట్టుగానే మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోయే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కూడా వ‌చ్చింది. అయితే కొన్ని రోజుల త‌ర్వాత అనుప‌మ‌ను తొలగించి ఆమె స్థానంలో స‌మంత‌ను తీసుకున్నారు. దీంతో అనుప‌మ గురించి ర‌క‌ర‌కాల పుకార్లు వ్యాపించాయి. పారితోషికం ఎక్కువ‌గా డిమాండ్ చేయ‌డం వ‌ల్లే చ‌ర‌ణ్ సినిమా నుంచి అనుప‌మ‌ను త‌ప్పించార‌ని వార్త‌లు బ‌య‌ల్దేరాయి. అయితే అప్పుడే ఆ వార్త‌ల‌ను ఖండించారు నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ఆ సంద‌ర్భంగానే తమ భ‌విష్య‌త్ ప్రాజెక్టుల్లో అనుప‌మ‌కు క‌చ్చితంగా ప్లేస్ ఉంటుందని ప్ర‌క‌టించారు. ఆ మాట నిలబెట్టుకునే క్ర‌మంలో చందూ మొండేటీ డైరెక్ష‌న్‌లో నాగ‌చైతన్యతో తాము తీయ‌బోతున్న సినిమాలో అనుప‌మ‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. చైతూతో ప్రేమ‌మ్ త‌ర్వాత అనుప‌మ‌కు ఇది రెండో సినిమా.
entertainment
5,919
09-10-2017 17:33:37
మరో బాధ్యత చేపట్టనున్న బాలయ్య ?
నందమూరి నటసింహం బాలయ్యబాబు ప్రస్తుతం హీరోగా తిరుగులేని ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇటీవల తన 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'లో తనలోని ఎనర్జీ అంతా బయటపెట్టి నందమూరి అభిమానులకు కనువిందు చేసిన ఆయన.. ఆ తర్వాత పూరిజగన్నాధ్ దర్శకత్వంలో తన 101వ చిత్రం 'పైసా వసూల్' తో బాగా వసూళ్లు రాబట్టి తనకు తిరుగులేదని తెలిసేలా చేశారు. అయితే సీనియర్ హీరో అయిన బాలయ్య తాజాగా నిర్మాతగా మరో బాధ్యత చేపట్టనున్నారని తెలుస్తోంది. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ చేస్తానని తెలిపిన బాలయ్య మంచి దర్శకుడిని వెతికే పనిలోపడ్డ సంగతి తెలిసిందే. కాగా బాలయ్యకు తాజాగా ఓ దర్శకుడు దొరికేశాడని, ఇక అతిత్వరలో బాలయ్య బాబే ఎన్టీఆర్ బయోపిక్‌కి నిర్మాణ భాద్యతలు చేపట్టి ఆ సినిమా నిర్మించనున్నారని ఫిలింనగర్ వార్త. అంతేకాదు తన కుమారుడు మోక్షజ్ఞను కూడా హీరోగా పరిచయం చేయడానికి ఓ సినిమాకు బాలయ్యే స్వయంగా నిర్మాణ భాద్యతలు చేపట్టనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాలను త్వరలో తన సొంత బ్యానర్‌ని ప్రకటించి అదే బ్యానర్‌పై తెరకెక్కించనున్నారని సమాచారం.
entertainment
13,118
24-07-2017 13:41:05
తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఆనందీబెన్..?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఆనందీబెన్ రాబోతున్నారని వార్తలు హల్‌ఛల్ చేస్తున్నాయి. ఈ సమాచారం తెలిసే ఆనందీబెన్‌ను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిసినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం విజయసాయి, ఆనందీబెన్‌ను కలిశారన్న వార్త సంచలనం రేకెత్తిస్తోంది. ఆమెతో మాట్లాడినట్లు తెలియవచ్చింది. గతంలో కూడా ఆయన రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి కాకముందే ఆయనను కలవడం.. అలాగే విద్యాసాగరరావును కలవడం.. ఇప్పుడు ఆనందీబెన్ గవర్నర్‌గా రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమెను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయసాయికి ముందుగానే రాష్ట్రపతి ఎవరు కాబోతున్నారు? తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఎవరు రాబోతున్నారన్న అంశాలు లీక్ అవుతున్నాయి. దీంతో ఆయన ముందుగానే వెళ్లి వాళ్లను కలవడం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జగన్ గవర్నర్‌ను కలిసి సుమారు గంటసేపు చర్చలు జరపడం ఏపీ రాజకీయవర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరులో తెలుగు రాష్ట్రాల గవర్నర్ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.
nation
7,028
21-07-2017 19:54:57
రచయితపై రజనీకాంత్‌ కౌంటర్ పిటిషన్
చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘కాలా’ చిత్ర వ్యవహారానికి సంబంధించిన విచారణను న్యాయస్థానం వచ్చే 26కు వాయిదా వేసింది. గురువారం జరిగిన ఈ కేసు విచారణకు రజనీకాంత్‌ తరపున కౌంటర్ పిటిషన్‌ దాఖలైంది. చెన్నైకి చెందిన రాజేశేఖరన్‌ చెన్నై 6వ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వివరాలు ఇలా ఉన్నాయి... రజనీకాంత్‌ తాజాగా నటిస్తున్న ‘కాలా (ఎ) కరికాళన్‌ చిత్రానికి సంబంధించిన కథ తనదేనని, 1995,96లో రజనీకాంత్‌ కలుసుకొని ఈ కథను వినిపించానని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం ధనుష్‌ నిర్మాతగా, రంజిత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటోదని, తన కథ వాడుకోవడంపై నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు బదులు పిటిషన్‌ దాఖలు చేయాలని రజనీకాంత్‌కు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన విచారణలో రజనీ తరపు న్యాయవాది కౌంటర్ పిటిషన్‌ దాఖలు చేయడంతో పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే 26కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
entertainment
12,399
13-07-2017 01:04:08
పాక్‌ కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ముగ్గురు ఉగ్రవాదుల హతంశ్రీనగర్‌, జూలై 12: పాకిస్థాన్‌ మరోసారి నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం కశ్మీర్‌లో కుప్వారా జిల్లాలోని కెరన్‌ సెక్టార్‌లో పాక్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మరణించారు. గస్తీ బృం దంపై పాక్‌ దళాలు ఆకస్మికంగా కాల్పులు జరిపినట్టు ఓ సైనికాధికారి చెప్పారు. కశ్మీర్‌లో పూంచ్‌ జిల్లాలోనూ నియంత్రణ రేఖ వెంబడి భారత సైనిక స్థావరాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. డీఎస్పీ అయూబ్‌ హత్య కేసులో నిందితుడి హతం జమ్ము, కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రత దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో డీఎస్పీ అయూబ్‌ పండిత్‌ హత్య కేసులో నిందితుడు ఉన్నాడు. జూన్‌ 22న శ్రీనగర్‌లో ఆయన దారుణహత్యకు గురయ్యారు. కాగా, అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పహల్‌గామ్‌ మార్కెట్‌లో బంద్‌ పాటించారు.
nation
20,755
07-11-2017 02:18:22
సత్యేంద్రకు స్వర్ణం
గోల్డ్‌కోస్ట్‌ (ఆస్ర్టేలియా): కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో సోమవారం చివరి రోజున భారత్‌కు ఒక స్వర్ణం, రజతం దక్కాయి. పురుషుల 50మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో సత్యేంద్ర సింగ్‌ స్వర్ణం సాధించగా, సంజీవ్‌ రాజ్‌పుత్‌ రజత పతకం గెలిచాడు. చైన్‌ సింగ్‌ తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. ఓవరాల్‌గా భారత్‌ ఈ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్య పతకాలతో 20 పతకాలు సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్లో సత్యేంద్ర నాథ్‌ 454.2 పాయింట్లు సాధించి అగ్ర స్థానంలో నిలవగా రాజ్‌పుత్‌ 453.3 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
sports
3,632
29-08-2017 03:58:24
తెలుగును పరిరక్షించుకుందాం
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. నేడు తెలుగు రాష్ర్టాల్లో తెలుగు భాషకు సముచిత గౌరవం లభించడం లేదు. మనవారికి మన భాషలో మాట్లాడటం నామోషి. తమ పిల్లలను అత్యధిక ఫీజులు వసూలు చేసే ఆంగ్ల పాఠశాలలో చేర్చేందుకే ఎక్కువ మంది తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు మీడియం అంటేనే చిన్నచూపు. తెలుగు పద్యాల కంటే ఆంగ్ల పదాలపైనే వ్యామోహం పెరిగింది. అభివృద్ధికి ఆంగ్ల భాష చిహ్నమనే ధోరణితో అందమైన తెలుగు భాషకు తెగులు పట్టించి కురూపిలా చూస్తున్నారు. ఆది గురువైన మాతృమూర్తిని ‘అమ్మా’ అని పిలవడం అనాగరికమై ‘మమ్మీ’ అనే రోజులు దాపురించాయి. కన్నతల్లి జన్మభూమి మాతృభాషలను మరవకూడదని మన భారతీయ సంస్కృతి బోధిస్తున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో పాశ్చాత్య సంస్కృతి మన వేష భాష ఆచార వ్యవహారలన్నింటిపై విష ప్రభావం చూపిస్తూనే ఉన్నది. దానిని నివారించకుంటే సమీప భవిష్యత్తులో మన తెలుగు భాష అంతరించే ప్రమాదం లేకపోలేదు. తెలుగు భాషను ప్రాథమిక స్థాయి వరకు బోధించేలా ప్రభుత్వం నిర్బంధంగా అమలుపరచాలి. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తెలుగు భాష మాత్రమే ఉపయోగించాలి. అధికార భాషా కమిటీలో రాజకీయ జోక్యం ఉండకుండా స్వయం ప్రతిపత్తి కల్పించాలి. విద్యాలయాల్లో తెలుగు మాధ్యంలో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలి. ప్రసారమాధ్యమాల్లో తెలుగును అధికంగా ఉపయోగించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తెలుగును తీర్చిదిద్దేలా సరళతరం చేయాలి. దర్శక నిర్మాతలు తమ చిత్రాల పేర్లకు తెలుగును మాత్రమే వాడాలి. దూరదర్శన్‌ ప్రసారాల్లో వ్యాఖ్యానం తెలుగును గౌరవించేలా ఉండాలి. రచనా వ్యాసంగంలో తెలుగును వెలిగిస్తున్న కవులు రచయితలను ప్రోత్సహించి నవతరానికి ఉత్తమ సాహిత్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాల అధినేతలు సైతం తమ భాషకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పొరుగు రాష్ర్టాలు కర్ణాటక, తమిళనాడులు తమ భాషల కోసం చేస్తున్న కృషి చెప్పుకోతగ్గది. తెలుగువారిగా మన భాషను ఉభయ రాష్ర్టాల ప్రజలే రక్షించుకోవాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రీత్యా మనం ఏ భాష నేర్చుకున్నా మన ఆత్మీయులు ఎదురైనప్పుడు తెలుగులో పలకరించుకోవాలి. మన భాషపై సంపూర్ణ అవగాహన ఉంటేనే మిగతా భాషలపై పట్టు సాధించే అవకాశం ఉన్నది.బైతి దుర్గయ్య, రామునిపట్ల, సిద్ధిపేట జిల్లా
editorial
13,024
14-11-2017 03:02:38
స్కూల్‌ ట్యాంకులో విషం కలపాలనుకున్నా
ఇంటి పరిస్థితుల వల్లే హంతకుడినయ్యా!ప్రద్యుమన్‌తో క్లాసులకు వెళ్లేవాడినిసీబీఐ విచారణలో ‘రియాన్‌’ నిందితుడున్యూఢిల్లీ, నవంబరు 13: రియాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు హత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తోంది. పరీక్షలు, పేరెంట్స్‌ మీటింగ్‌ వాయిదా పడేందుకే ప్రద్యుమన్‌ను హత్యచేశానని, ఓ దశలో స్కూల్‌ వాటర్‌ ట్యాంకులో విషం కలుపుదామనుకున్నానని సీబీఐ విచారణలో జువైనల్‌ నిందితుడు వెల్లడించాడు. ‘‘మా ఇంట్లో వాతావరణం అస్సలు బాగోదు. అమ్మానాన్న ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు. అందుకే చదువు మీద ఆసక్తి తగ్గిపోయింది. ఆ పరిస్థితులే నన్ను ఇలా మార్చాయి’’ అని రియాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు సీబీఐ ఎదుట పేర్కొన్నాడు. సీబీఐ విచారణలో అతడు చెప్పిన వివరాల ప్రకారం.. సెప్టెంబరు 7న సోహ్నా మార్కెట్‌లో కత్తి కొన్నాడు. స్కూల్‌ వాటర్‌ ట్యాంకులో విషం కూడా కలుపుదామనుకున్నాడు. కానీ చివరకు సెప్టెంబరు 8న కత్తితోనే స్కూలుకు వచ్చాడు. స్కూల్‌ కారిడార్‌లో ప్రద్యుమన్‌ కనిపించడం, అతనితో పియానో క్లాసులకు వెళ్లిన పరిచయం ఉండటంతో.. తనతో పాటు టాయిలెట్‌కు రమ్మని చెప్పాడు. టాయిలెట్‌లోకి వెళ్లాక అదునుచూసి ప్రద్యుమన్‌ గొంతును కత్తితో కోసేశాడు. మొదటి సారి గొంతు కోసినప్పుడు రక్తం గక్కిన ప్రద్యుమన్‌.. రెండోసారి గొంతు కోయడంతో చనిపోయాడు. ప్రద్యుమన్‌ వేసుకున్న బ్యాగ్‌ అడ్డుగా ఉండటంతో నిందితుడికి రక్తం మరకలు అంటుకోలేదు. అ తర్వాత నిందితుడు కత్తిని టాయిలెట్‌లో పడేసి తోటమాలి, టీచర్ల దగ్గరకు పరిగెత్తాడు. మళ్లీ ఏమీ తెలియనట్లు.. ప్రద్యుమన్‌ను ఎవరో చంపేశారని చెప్పాడు. అంతేకాదు కత్తిపై వేలిముద్రలను ఎలా చెరిపివేయాలని ఇంటర్నెట్‌లో వెతికినట్లు తెలిసింది. ఇక కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి, స్కూల్‌ బస్సు కండక్టర్‌ అశోక్‌పై అభియోగాలు మోపిన హరియాణా పోలీసుల వ్యవహారంపై సీబీఐ దృష్టిపెట్టింది. కాగా, బాలల న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడిని ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని అబ్జర్వేషన్‌ హోమ్‌లో ఉంచారు.
nation
20,129
20-08-2017 05:04:45
హారికకు మరో డ్రా
అబుదాబి: భారత గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక.. అబుదాబి అంతర్జాతీ య చెస్‌ ఫెస్టివల్లో మరో గేమ్‌ను డ్రా చేసుకుంది. ఐదో రౌండ్‌లో సహచర క్రీడాకారిణి ఇషా కర్వాడేతో హారిక పాయింట్‌ పంచుకుంది. తెల్లపావులతో ఆడిన హారిక 16 ఎత్తుల అనంతరం డ్రాకు అంగీకరించింది. ఐదు రౌండ్ల అనంతరం హారిక 3 పాయింట్లతో ఉంది.
sports
16,776
27-12-2017 01:53:25
బీజేపీ నేతలకు మద్యం, పాశ్చాత్య దుస్తులపై నిషేధం
మద్యం సేవించడం, విదేశీ వలస విధానానికి నిదర్శనమైన పాశ్చాత్య దుస్తులు ధరించడం వంటి వాటికి బీజేపీ నేతలు దూరంగా ఉండేట్లు పార్టీ ఆదేశించాలి. రాజ్యాంగం ప్రకారం మద్యం సేవించరాదు. పార్టీ క్రమశిక్షణలో భాగంగా బీజేపీ నేతలపై మద్య నిషేధం విధించాలి. పార్టీ నాయకులు, మం త్రులు భారత సాంప్రదాయ దుస్తులు ధరించాలి.- సుబ్రమణ్యస్వామి, బీజేపీ సీనియర్‌ నేత
nation
17,854
18-02-2017 02:07:40
వెబ్‌వర్క్‌ డైరెక్టర్‌ అరెస్టు
నోయిడా, ఫిబ్రవరి 17: సోషల్‌ ట్రేడ్‌ తరహాలోనే రూ.200 కోట్ల ఆన్‌లైన్‌ స్కామ్‌కు పాల్పడిన వెబ్‌వర్క్‌ ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ గార్గ్‌ను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో వారు నాలుగు బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు. ఆ ఖాతాలు బ్యాంకు డైరెక్టర్లయిన అనురాగ్‌ గార్గ్‌, సందేశ్‌ వర్మ పేరు మీద ఉన్నాయి. వాటిలో రూ.26.74 కోట్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
nation
15,471
31-05-2017 20:11:56
గిరిజన తండాలో అమిత్‌షా సహపంక్తి భోజనం
చోటా ఉదయ్‌పూర్: ఎన్నికలకు సిద్ధమవుతున్న గుజరాత్‌లో గిరిజన కుటుంబాలతో అమిత్‌షా బుధవారంనాడు మమేకమయ్యారు. ఎన్నికల్లో గిరిజనులంతా బీజేపీకి సహకరించాలని కోరారు. గుజరాత్‌తోని మారుమూల గ్రామమైన చోటా ఉదయ్‌పూర్ జిల్లాలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టిన అమిత్‌షా ఒక గిరిజన కుటుంబం నుంచి ఆతిథ్యం స్వీకరించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గుజరాత్‌లో గిరిజన జాతులున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిపత్యం చాటుకుంది. 28 స్థానాల్లో 17 స్థానాలు గెలుచుకుంది. అదే ఎన్నికల్లో మొత్తం 182 నియోజకవర్గాలకు గాను బీజేపీ 115 సీట్లు గెలుచుకోగా, 61 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది.
nation