SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
5,769
11-03-2017 22:40:39
సావిత్రి కీర్తి సరితూగేలా తీస్తా!
వెండితెరపై సావిత్రి జీవితాన్ని ఆవిష్కరించబోతున్నానంటూ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న కుర్ర దర్శకుడు ఒక ‘మహానటి’ జీవితానికి న్యాయం చెయ్యగలడా? అనేది వాళ్ల మనసును తొలుస్తున్న సందేహం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ‘మహానటి’ చిత్రానికి సంబంధించి రిలీజైన పోస్టర్‌.. ఆ సందేహం స్థానంలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో సావిత్రి బయోపిక్‌ను తియ్యాలన్న ఆయన ఆలోచన వెనుక ఉన్న కథను, ఆ సినిమా కోసం ఆయన పడుతున్న తపనను తెలుసుకోవడానికి ప్రయత్నించింది ‘నవ్య’. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...  చిన్నప్పట్నించీ సావిత్రి సినిమాలు చూస్తూ పెరిగాను. నానమ్మవాళ్లు ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్‌’, ‘గుండమ్మకథ’, ‘డాక్టర్‌ చక్రవర్తి’ వంటి సినిమాల్ని ఎక్కువగా చూస్తుండేవాళ్లు. వాటన్నిట్లోనూ సావిత్రి కనిపించేవారు. దాంతో ‘ఎవరీమె?’ అనే క్యూరియాసిటీ చిన్నప్పట్నించీ ఉండేది. ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్‌’ సినిమాల్లో ఆమె చేయగలిగినట్లు ఇంకెవరూ తెలుగులోనే కాదు, హిందీలోనూ.. అప్పుడూ, ఇప్పుడూ ఎవరూ నాకు కనిపించలేదు, అనిపించలేదు. ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత వేరే యాంగిల్‌లో సినిమా చెయ్యాలని కథ రాసుకుంటున్నాను. ఆ టైమ్‌లో ఒక రేడియో టాక్‌ షో విన్నాను. ఆ షోలో పాల్గొన్నాయన సావిత్రిగారి గురించి ఆరు గంటలసేపు అదేపనిగా మాట్లాడారు. అందులో సావిత్రిగారు తన బాల్య స్నేహితురాల్ని కలుసుకొనే ఘట్టం వచ్చింది. అది విన్నప్పుడు ‘ఇది కదా సినిమా’ అనిపించింది. ఆమె కథలో అన్ని కమర్షియల్‌ అంశాలూ ఉన్నాయనిపించింది. ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత వేరే స్ర్కిప్టులు చేసుకుంటూ వచ్చాను. ఆ స్ర్కిప్ట్స్‌ ఉన్నాయి. అయితే వాటికన్నా ముందుగా ‘మహానటి’ తీద్దామనిపించింది. అందుకే ఆమె గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆమెపై వచ్చిన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆమె వెనుక ఇంత కథ ఉందా.. అనిపించింది. అదివరకు ఆమె గొప్పనటి అనీ, గొప్ప పేరు సంపాదించుకున్నదనీ తెలుసు. ఆమెపై రాసిన పుస్తకాలు చదివాక ‘ఆ పీక్స్‌ ఏమిటి.. ఆ ఫాల్స్‌ ఏమిటి!.. తప్పకుండా సినిమాకు కావాల్సిన కథ ఆమెది’.. అనుకున్నా. ఆమెతో చేసిన ఇంటర్వ్యూలు చదివాను. ఆమె గురించి ఏఎన్నార్‌గారు, జమునగారు, ఇంకా చాలామంది ఇచ్చిన ఇంటర్వ్యూలు చదివాను, విన్నాను. ‘విజయచిత్ర’ పత్రికలో పనిచేసిన వాళ్లతో మాట్లాడాను. ఇప్పుడున్న ఆ కాలంనాటి నిర్మాతలు, దర్శకులు, యాక్టర్లు, జర్నలిస్టులనందర్నీ కలిసి ఎన్నో వివరాలు సేకరించాను. సావిత్రిగారి కుమార్తె విజయ చాముండేశ్వరిగారినీ, కుమారుడు సతీశనూ కలిసి మాట్లాడాను. సావిత్రిగారితో పరిచయమున్న వారందర్నీ కనీసం ఒక్కసారయినా కలిశాను. పోయిన ఆగస్ట్‌ నుంచి ఆరు నెలల పాటు రీసెర్చిలోనే గడిపాను. ఎంత కాదనుకున్నా ఇది ఫిక్షనే, సినిమానే. ఆ కాలంలో ఏం జరిగిందో వాళ్లకు తప్ప వేరేవాళ్లకు తెలీదు. సావిత్రి, జెమినీ గణేశన ఎలా ప్రేమలో పడ్డారో వాళ్లిద్దరికీ తప్ప మరొకరికి తెలీదు. అందుకే సాధ్యమైనంత వరకు ఆ ప్రపంచంలోకి వెళ్లేందుకు నా స్ర్కిప్టులో ప్రయత్నించాను. ఆర్నెల్ల నుంచీ ఆ పాత సినిమాలు, ఆ పాత పాటలు అబ్జర్వ్‌ చేయడంలో గడిపాను. ఇప్పటికి మొత్తం స్ర్కిప్టు సిద్ధం చేశాను. సావిత్రి పూర్తి కథ.. అంటే బాల్యం నుంచీ చివరి దాకా.. ఈ సినిమాలో ఉంటుంది. కథ, స్ర్కీనప్లే అంతా నేనే రాసుకున్నాను. డైలాగ్స్‌ విషయంలో రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా సాయం తీసుకున్నాను. స్ర్కిప్టు రెడీ అయింది. కానీ సావిత్రి పాత్ర ఎవరు చేస్తారనేది పెద్ద ప్రశ్నగా నిలిచింది. ఇప్పుడున్న తారలందరిలోనూ సావిత్రి కోసం వెతికాను. చివరకు నా అన్వేషణ హీరోయిన కీర్తి సురేశ వద్ద ఆగింది. ఇప్పటి వరకూ కీర్తికి గొప్పగా పర్‌ఫార్మ్‌ చేసే రోల్స్‌ ఏమీ రాలేదు. కానీ ఆమె చేసిన సినిమాలు చూస్తే సావిత్రి పాత్రను ఆమె చేయగలదని నాకనిపించింది. ఆమె ముఖంలో అమాయకత్వం, ముగ్ధత్వం - రెండూ కనిపించాయి. కచ్చితంగా ఆమె ఏం చేయగలుగుతుందనేది సినిమా చూస్తే కానీ ప్రేక్షకులకు తెలీదు. అదే పెద్ద తారలైతే.. వాళ్ల నటన మనకు తెలుసు కాబట్టి.. వాళ్లేం చేస్తారనేది తెలుస్తుంది. కీర్తికైతే ఆ అంచనా ఉండదు. ఒక రకంగా ఆమేం చేస్తుందో నాక్కూడా తెలీదు. కానీ చేయగలుగుతుందని నాకనిపిస్తోంది. పేరు కూడా ‘మహానటి’ కాబట్టి సినిమాపై కచ్చితంగా చాలా అంచనాలుంటాయి. సావిత్రి బయోపిక్‌ అన్నప్పుడే చాలా ప్రెజర్‌ వస్తుందని తెలుసు. సమంతది కూడా కథలో సావిత్రితో పాటు నడిచే ఒక పారలల్‌ స్టోరీ. ఆమె ఏ పాత్ర చేస్తోందనేది ఇప్పుడే బయటకు చెప్పలేను. ఆమెది కూడా అప్పటి ఒక హీరోయిన్ పాత్రే. ఒకరకంగా ఆమె పాత్రకు కూడా టైటిల్‌ అన్వయిస్తుందని చెప్పుకోవచ్చు. కీర్తి కంటే ముందే సమంత ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. ఆమెకు సావిత్రి కేరక్టర్‌ చెప్పలేదు. ఆమెకు ఉద్దేశించిన కేరక్టర్‌ మాత్రమే చెప్పాను. పూర్తిగా చెప్పకముందే చేస్తానని చెప్పేసింది. మెయిన లీడ్‌ కాదు కదా, చేస్తుందో లేదో అనే డౌట్‌తోనే ఆమె వద్దకు వెళ్లి కేరక్టర్‌ గురించి చెప్పాను. ఆమెకు ఆ కేరక్టర్‌ చాలా నచ్చింది. సినిమా అంతా ఉండే ఒక మెయిన కేరక్టరే ఆమెది కూడా. అయితే మొదట సావిత్రిగా నిత్యా మీనన చేస్తోందనే ప్రచారం మీడియాలో ఎందుకొచ్చిందో తెలీదు. అందరికీ అలా అనిపించిందేమో. ఆమెతో డిస్కస్‌ చేయలేదు. సావిత్రి జీవితంలోని ప్రధానమైన వ్యక్తుల పాత్రలన్నీ ఇందులో ఉంటాయి. ఆ కేస్టింగ్‌ కొంచెం క్లిష్టమైనదే. ప్రస్తుతం ఆ ప్రాసె్‌సలోనే ఉన్నాం. సమంత, కీర్తిని కాకుండా ఇంకా ఎవర్నీ ఫైనలైజ్‌ చేయలేదు. జెమినీ గణేశన కేరక్టర్‌ ఎవరు చేస్తారో కానీ.. అది చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు తెలిసిన హీరోనే ఆ పాత్ర చేస్తారని మాత్రం చెప్పగలను. అలాగే టెక్నీషియన్లను కూడా ఫైనలైజ్‌ చేసే పనిలో ఉన్నాం. ఒక వారం పది రోజుల్లో వాళ్లను ఫైనలైజ్‌ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్‌ మధ్యలో షూటింగ్‌ మొదలు పెట్టాలనేది మా సంకల్పం. రిలీజ్‌ విషయానికొస్తే.. సావిత్రిగారి జయంతి (డిసెంబర్‌ 6)కి సినివనుఉ రిలీజ్‌ చెయ్యాలనేమీ ప్లాన చేసుకోలేదు. ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా పనిచేసుకుపోవాలనేది నా ఉద్దేశం. తెలుగులో బయోపిక్స్‌ లేవు. బాలీవుడ్‌లో కూడా స్పోర్ట్స్‌ బయోపిక్‌లే వస్తున్నాయి. ‘డర్టీ పిక్చర్‌’ని కూడా హానె్‌స్టగా తియ్యలేదనేది నా అభిప్రాయం. వేరే వాళ్లు ఎవరైనా సావిత్రి కథను తియ్యాలనుకొని, సరిగా తీయలేకపోతే ఎలా అనిపించి నేనే ఆ పని చెయ్యాలనే నిర్ణయానికొచ్చాను. నేను ఏదైనా నిర్ణయానికి రావడానికి చాలా సమయం తీసుకుంటాను. తీసుకున్నాక దానిపై గట్టిగా నిలబడతాను. నిజానికి సావిత్రి కథ చాలా పెద్ద సబ్జెక్ట్‌. ఆ కాలానికి వెళ్లాలి. దానికి సెట్స్‌ తప్పనిసరి. ప్రజల్లో చాలా గౌరవమున్న ఒక నటి కథ కాబట్టి సరిగా తియ్యాలి. ఎలాంటి మసాలాలూ జోడించకపోయినా ఆమె కథలో కమర్షియాలిటీ చాలా ఉంది. మంచి రచయిత రాసిన నవలలాగే ఉంటుంది ఆమె కథ. ఏమీలేని స్థాయి నుంచి శిఖర స్థాయికి ఎదిగిన నటి కథ ఇది. దానికంటే కమర్షియల్‌ ఏముంటుంది! అందుకనే సావిత్రి కీర్తి సరితూగేలా తీస్తాను. ఈ బయోపిక్‌కు బడ్జెట్‌ ఎంతవుతుందనేది కచ్చితంగా చెప్పలేను కానీ పెద్ద బడ్జెట్టే. పెద్ద ఎపిక్‌లానే అవుతుంది. ఇది పీరియడ్‌ ఫిల్మ్‌. పాతదాన్ని రీక్రియేట్‌ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫాంటసీ అంటే ఏదోలా మేనేజ్‌ చేయొచ్చు. ఈ సినిమాలో దానికి ఛాన్స లేదు. అన్నీ తయారు చేసుకోవాల్సిందే. ‘మాయాబజార్‌’ సెట్‌ను మళ్లీ సృష్టించాల్సిందే. కాబట్టి డెఫినెట్‌గా ఎపిక్‌ అవుతుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వనీదతగారు ప్రెజెంట్‌ చేస్తున్నారు. ఆయన సారథ్యంలోని వైజయంతీ మూవీస్‌ అంటే పెద్ద హీరోలతో చేస్తారనేది అందరికీ తెలిసిందే. ‘మహానటి’ చేయడం రిస్క్‌ అనుకోవట్లేదు. బాధ్యతతో తీయాలంతే. కమర్షియల్‌ గ్రాఫ్‌ లేకపోతే రిస్క్‌. దీనికి ఆ గ్రాఫ్‌ ఉంది కాబట్టి రిస్క్‌ అయితే కాదు. సొంతంగా రాసుకున్న కథకు పెద్ద బాధ్యత ఉండదు. బావుందనో, బాగోలేదనో అంటారు. ఇది బయోపిక్‌ కాబట్టి బాధ్యత ఎక్కువుంటుంది. అందర్నీ మెప్పించగలగాలి, ఒప్పించగలగాలి. సావిత్రిగారికున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా తియ్యాలి. బాలీవుడ్‌లో వస్తున్న బయోపిక్స్‌ అన్నీ డెబ్బైల తర్వాత కాలానికి సంబంధించినవే. నలభై నుంచి అరవైల మధ్య వాతావరణం ఎలా ఉండేదనేందుకు మనకు రిఫరెన్స లేదు. ఆ కాలానికి సంబంధించిన బయోపిక్‌లు ఎవరూ తియ్యలేదు. అందుకే ప్రీ ప్రొడక్షనకు ఎక్కువ టైమ్‌ పడుతోంది. మా రిసెర్చి డిపార్ట్‌మెంట్‌ దానికి సంబంధించి అధ్యయనం చేస్తోంది. రీసెర్చి, సెట్‌వర్క్‌, గ్రాఫిక్స్‌. సినిమాకు కీలకంగా మారాయి. ఇప్పుడు దీన్ని మేం సరిగ్గా తీస్తే, ఆ కాలానికి సంబంధించి ఈ సినిమా మంచి రిఫరెన్స అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో దీన్ని చేస్తున్నాం. సినిమాలో ఏదో ఒక విలువ, ఒక ప్రయోజనం ఉండాలనిపిస్తుంది నాకు. ‘ఎవడే సుబ్రమణ్యం’ కూడా అలాగే తీశాను. అలాగే ‘మహానటి’కి కూడా ఒక ప్రయోజనం ఉందనిపిస్తుంది. మారుతున్న కాలానికి ఆమె ప్రతినిధి. ఆమె కాలంలో నాటకాలున్నాయి, సినిమాలున్నాయి. టీవీలు, సినిమాస్కోప్‌లు వచ్చాయి. ఈ సినిమాను సరిగ్గా తీస్తే భవిష్యత తరాలకు ఆమె కథ తెలుస్తుంది. ఇప్పుడొస్తున్న తరానికి సావిత్రి తెలీదు. వాళ్లందరికీ సావిత్రిని ఈ సినిమా దగ్గర చేస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై నా సర్వశక్తులూ పెడుతున్నా. ఇది మా సిల్వర్‌ స్ర్కీన్ ట్రిబ్యూట్‌!  అమ్మపై సినిమా తీయాలనుకుంటున్నానని నాగ్‌ అశ్విన చెప్పగానే మొదట నేను ఇష్టపడలేదు. కాస్త భయపడ్డాను. అమ్మ వ్యక్తిగత జీవితంలోని కొన్ని అంశాలు చూపించడం ఇబ్బందిగా ఉంటుందనేది నా అభిప్రాయం. అమ్మ గురించి ఎవరు మాట్లాడినా ఆమె చివరి రోజుల విషాదం గురించి ప్రస్తావిస్తుంటారు. డబ్బులు పోగొట్టుకొని దీనావస్థలో చనిపోయిందంటూ ట్రాజెడీ క్వీనగా చూపించడం వల్ల ఎవరికి ప్రయోజనం? జీవితంలో అమ్మ ఎలా ఎదిగిందో, వ్యక్తిగా ఆమెది ఎంతటి గొప్ప మనసో, ఎంతటి దయాళువో చూపిస్తే స్ఫూర్తివంతంగా ఉంటుంది. ‘మహానటి’గా ఆమె ఎదిగిన క్రమం చాలా ఆసక్తికరం. అది చూపిస్తే బాగుంటుంది. అంతే కానీ ‘సావిత్రి చివరి రోజుల్లో ఇలా జరిగిందా? అయ్యో పాపం’ అనిపించేలా ఉండకూడదు. ఆ విషయమే నాగ్‌ అశ్వినకు చెప్పాను. ‘మీరు ఓకేనంటే చేస్తాను. మీకు ఏ మాత్రం అభ్యంతరకరమైనా ఆపేస్తాను. ఒక పాజిటివ్‌ కోణంలోనే ఆమె లైఫ్‌ను ప్రెజెంట్‌ చేస్తాను’ అని ఆయన చెప్పారు. ఆయన మునుపటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’ చూశాను. ఆ సినిమాను ఆయన తీసిన పద్ధతీ, ఆయన ఫిలాసఫీ నాకు బాగా నచ్చాయి. చాలా ప్రతిభావంతుడైన దర్శకుడనిపించింది. మిగతా దర్శకుల లాగా కాకుండా ఒక డిఫరెంట్‌ అప్రోచతో ఆ సినిమాని ఆయన రూపొందించారు. అమ్మ గురించి ఆయన చేసిన పరిశోధన, ఆమె గురించి ఆయన తెలుసుకున్న విషయాలు చెప్పాకనే ఆయనలోని తపన అర్థమైంది. కచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం ఏర్పడింది. అప్పుడు సరేనన్నా. ఇంకా లేదండీ. స్ర్కిప్టులోని విషయాల్ని రఫ్‌గానే ఆయన చెప్పారు. బాగుందనిపించింది. షూటింగ్‌ వెళ్లేలోపు పూర్తి స్ర్కిప్టును చూపిస్తామన్నారు. నేను సరేనంటేనే షూటింగ్‌కు వెళ్తానన్నారు. ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌ కాబట్టి ఈలోపు స్ర్కిప్టును చూపిస్తారనుకుంటున్నా. ఆమెను తీసుకోవడమనేది చాలా మంచి ఎంపికగానే నేననుకుంటున్నా. ఆమె చేసిన సినిమాలు చూశాను. ఎమోషన్స్‌ను చాలా చక్కగా పలికిస్తుంది. ఇటు చలాకీతనాన్నీ, అటు విషాదాన్నీ బాగా పలికించగలదనిపిస్తోంది. పాత హీరోయినలనైతే తనకు కావాల్సినట్లు పనిచేయించుకోవడం దర్శకుడికి కాస్త కష్టం. అదే కొత్తమ్మాయి అయితే తనకు కావాల్సినట్లు మౌల్డ్‌ చేసుకోవడం ఈజీ. అందుకే ఆమెను తీసుకున్నారని అనుకుంటున్నా. ఆయన ఎంపికను పూర్తిగా సమర్థిస్తున్నా. తెలుసండీ. కానీ డైరెక్టర్‌ ఆమె ఏ పాత్రను చేస్తోందో బయటపెట్టలేదు కదా. నేను బయటపెట్టడం కరెక్ట్‌ కాదు. - సమంత - కీర్తి సురేశ్
entertainment
10,604
09-10-2017 10:54:39
అప్పుడు ఆలీకి.. ఇప్పుడు రాజ్ తరుణ్‌కి!
టాప్ హీరో సినిమా గుర్తుందా? బాలకృష్ణ హీరోగా దుమ్ము రేపింది. ఈ సినిమాలో కమెడియన్ ఆలీకి ఓ జబ్బు ఉంటుంది. కిస్కా మిస్కా అనే కొత్తరకం కొరియా జబ్బు. ఈ జబ్బు లక్షణం సాయంత్రం 5 అయిందంటే దొంగతనం చేయాలన్న కోరిక పుట్టేస్తుంది. వెంటనే కనిపించిన బ్యాగులన్నీ కొట్టేసి బాగా నవ్వించారు ఆలీ. ప్రస్తుతం రాజ్ తరుణ్ కూడా తన నెక్ట్స్ మూవీలో ఇలాంటి జబ్బుతోనే కనిపించనున్నాడట. సంజనా రెడ్డి డైరెక్షన్‌లో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రాజుగాడు. ఈ సినిమాలో హీరో బలహీనత దొంగతనం చేయడం. తన ప్రమేయం లేకుండానే దొంగతనాలు చేస్తుంటాడట. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్‌ని ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ నటిస్తోంది.
entertainment
9,680
05-10-2017 09:53:06
ఉష వైపు ప్రియాంక పరుగు!
ముంబై: ప్రముఖ బాక్సర్ మేరీ‌కోమ్ బయోపిక్‌లో తన అద్భుత నటనతో అందరినీ కట్టిపడేసిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మరో బయోపిక్‌కు సిద్ధమవుతోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మన పరుగుల యంత్రం పీటీ ఉష బయోపిక్ నిర్మించేందుకు సన్నాహలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ సినిమా రూ 100 కోట్లతో నిర్మితమవుతున్నట్ల తెలుస్తోంది. ఈ సినిమాకు ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ బయోపిక్‌కు రేవతి ఎస్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను బాలీవుడ్‌తో పాటు ఇంగ్లీష్, చైనీస్, రష్యన్ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
entertainment
1,080
12-06-2017 00:21:11
సిగరెట్‌ కాలుస్తారా ? అయితే బీమా ప్రీమియం డబుల్‌
పొగ బాబులూ జర జాగ్రత్త. గుప్పు గుప్పున సిగరెట్‌ మీద సిగరెట్‌ లాగిస్తుంటే ఆరోగ్యమే కాదు... జేబూ గుల్లవుతుంది. మీలాంటి వారికి బీమా కవరేజ్‌ ఇచ్చేందుకు బీమా కంపెనీలూ ఆసక్తి చూపవు. ఒకవేళ ఇచ్చినా మిగతా వారి కంటే 60 నుంచి 80 శాతం ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. ఎందుకంటే...ధూమపానం శారీరక ఆరోగ్యానికే కాదు... ఆర్థిక ఆరోగ్యానికీ మంచిది కాదు. పొగబాబులకు అనారోగ్య సమస్యలతో పాటు మృత్యు భయమూ ఎక్కువ. అందుకే వీరికి పాలసీ ఇవ్వాలంటే బీమా కంపెనీలూ ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తాయి. ఒకవేళ ఇచ్చినా.. ప్రీమియం భారీగా ఉంటుంది. ఇతరుల కంటే 60-80 శాతం ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తుంటాయి. ఉదాహరణకు పొగ తాగే అలవాటున్న 30 సంవత్సరాల వ్యక్తి, 30 ఏళ్లకు కోటి రూపాయల విలువైన ఏదైనా జీవిత బీమా పాలసీ తీసుకుంటే, పొగ తాగని వ్యక్తి కంటే కనీసం 58 శాతం ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. ఉదాహరణకు మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆన్‌లైన్‌లో ఆఫర్‌ చేసే టర్మ్‌ పాలసీ కోసం పొగ తాగని వ్యక్తి ఏటా రూ.8,165 చెల్లించాల్సి వస్తే.. పొగ తాగే వ్యక్తి 11,615 చెల్లించాలి. ఐసిఐసిఐ ఐప్రొటెక్ట్‌ స్మార్ట్‌ పాలసీదీ ఇదే పరిస్థితి. ఈ పాలసీ కోసం పొగ బాబులు ఏటా రూ.14,773 చెల్లిస్తే.. పొగ తాగని వ్యక్తులు రూ.9,034 చెల్లిస్తే సరిపోతుంది. ఇక హెచ్‌డిఎ్‌ఫసి లైఫ్‌ క్లిక్‌ 2 ప్రొటక్ట్‌ టర్మ్‌ పాలసీ కోసం ధూమపానం చేసే వ్యక్తులు ఏటా రూ.14,773, పొగ తాగని వ్యక్తులు రూ.9,470 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్‌బిఐ లైఫ్‌ ఇషీల్డ్‌ పాలసీ కింద పొగ తాగని వ్యక్తులు ఏటా రూ.13,443 చెల్లిస్తే సరిపోతుంది. పొగ బాబులు మాత్రం దాదాపు 81 శాతం ఎక్కువగా అంటే రూ.24,403 వరకు చెల్లించాలి. పొగ తాగని వ్యక్తులతో పోలిస్తే ధూమపాన ప్రియులు త్వరగా మృత్యువాత పడే ప్రమాదం ఉండడమే ఈ అధిక ప్రీమియానికి కారణం. విషయం దాచొద్దు..కొంత మంది జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియం భారం తగ్గుతుందని పొగ తాగే అలవాటే లేదని పాలసీ అప్లికేషన్‌లో ప్రకటిస్తుంటారు. రోజులు బాగోక వీరు మధ్యలోనే కాలం చేస్తే.. బీమా కంపెనీలు తప్పుడు సమాచారం ఇచ్చారనే పేరుతో వీరి వారసుల క్లెయిమ్‌లను తిరస్కరిస్తాయి. వారసులకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే పాలసీ తీసుకునేటప్పుడే సరైన సమాచారం ఇవ్వాలి. పాలసీ తీసుకునేనాటికే పొగ బాబులైతే కనీసం ఏడాది పాటైనా ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉంటే తప్ప, బీమా కంపెనీలు నాన్‌ స్మోకర్‌గా గుర్తించవు. ఆరోగ్య బీమా ఓకే ఆరోగ్య బీమా పాలసీల విషయంలో మాత్రం పొగ తాగే అలవాటు బీమా ప్రీమియాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయదు. పాలసీ ఇచ్చే నాటికి ఉన్న పాలసీదారుడి ఆరోగ్య పరిస్థితిని మాత్రమే కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే కొన్ని బీమా కంపెనీలు మాత్రం ఇప్పుడిప్పుడే పొగ బాబులకు ఇచ్చే ఆరోగ్య బీమా పాలసీలపై అధిక ప్రీమియం వసూలు చేస్తున్నాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునైనా పొగ బాబులు తమ దురలవాటుకు స్వస్తి చెప్పడం మంచిది. లేకపోతే ఆరోగ్యంతో పాటు జేబూ గుల్లయ్యే ప్రమాదం ఉంది.
business
3,620
07-04-2017 03:53:41
ఆగమౌతున్న అధ్యాపకుల జీవితాలు
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకుల బతుకులు అధ్వాన్నంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు కారణంగా గత ఎన్నో ఏళ్లుగా పార్ట్‌టైం లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వారికి వర్క్‌లోడ్‌ ఏర్పడినా, కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులు కాలేక పార్ట్‌టైం లెక్చరర్స్‌గా మిగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ చూపి వీరందరిని కాంట్రాక్టు ఆధ్యాపకులుగా అప్‌గ్రేడ్‌ చేసి రెగ్యులరైజ్‌ చెయ్యాలి. మేధో సంపత్తిని పెంపొదించే లక్ష్యంతో గుణాత్మక విద్యను అందించడం ద్వారా విశ్వవిద్యాలయాలు విద్యార్థులను మేధావులుగా తీర్పిదిద్దుతాయి. అదే కోవలో సుదీర్ఘ ఘన చరిత్ర కలిగి, శతాబ్ది ఉత్సవాలకు నేడు సిద్ధమవుతున్నది మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. వందేమాతర ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అన్యాయాన్ని ప్రతిఘటించే పెక్కు ఉద్యమాలకు వేదికై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సుసంపన్నమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మేధో వారసత్వ సంపదను దేశ విదేశాలకు అందించ గలిగింది. యూనివర్సిటీలలో వరుసగా ప్రొఫెసర్లు పదవీ విరమణ చేస్తుండడం, సకాలంలో ఆ పద వుల్ని భర్తీ చేయలేకపోయిన కారణంగా ఖాళీగా ఉన్న టీచింగ్‌ పోస్టుల స్థానంలో కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులను నియమిస్తున్న ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. గత 22 ఏళ్లుగా ఓయూలో కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులను, పార్ట్‌టైం లెక్చరర్స్‌ను నియమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం యూనివర్సిటీలో ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు నిర్వహించారని పేర్కొంటూ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2014 జూన్‌ రెండో తేదీ, ఆ తరువాత కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకం చెల్లదని ఆ ఉత్తర్వు ఆదేశించింది. ఇక ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తీసుకోవద్దని నిర్దేశించింది. దీంతో ఓయూలో వివిధ డిపార్ట్‌మెంట్లలో నియమితులైన 36 మంది కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 150 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకాలను యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. అధ్యాపకుల అవసరం తప్పనిసరిగా ఉండడంతో పార్ట్‌టైం లెక్చరర్స్‌ను మాత్రమే తీసుకుంటున్నారు. అవసరం ఉన్నా, అర్హతలు ఉన్నా ఆయా డిపార్ట్‌మెంట్‌లలో వర్క్‌లోడ్‌ ఉన్నా కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలను 2014-–15 విద్యా సంవత్సరం నుంచి ఓయూలో చేపట్టడం లేదు. అలాంటి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్‌టైం ఆధ్యాపకుల బతుకులు అధ్వాన్నంగా మారాయి. అధ్యాపకుల పదవీ విరమణ నిరంతరం జరుగుతున్న సమయంలో వర్క్‌లోడ్‌ (అవసరం మేరకు) యూజీసీ నిబంధనల ప్రకారమే ఒక డిపార్ట్‌మెంట్‌కు అవసరమైన ఆధ్యాపకులను కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులుగా నియమితులైన వారికి ఏడాదికి 11 నెలల వేతనాలు వచ్చేవి. అనంతరం వారి పోరాట ఫలితంగా 11 నెలల 24 రోజుల వేతనాన్ని వర్సిటీ ఇస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు కారణంగా గత ఎన్నో ఏళ్లుగా పార్ట్‌టైం లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వారికి వర్క్‌లోడ్‌ ఏర్పడినా, కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులు కాలేక పార్ట్‌టైం లెక్చరర్స్‌గా మిగిలిపోతున్నారు. యూనివర్సిటీకి అవసరం ఉన్నటువంటి పార్ట్‌టైమ్‌ ఆధ్యాపకులకు అన్ని అర్హతలు ఉన్నా ఆయా డిపార్టుమెంటులలో వర్క్‌లోడ్‌ ఉన్నా కాంట్రాక్టు అసిస్టెంట్‌(ప్రొఫెసర్‌)గా అప్‌గ్రేడ్‌ కాలేకపోయారు. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయ పార్ట్‌టైం టీచర్స్‌ కాంట్రాక్టు అధ్యాపకులుగా నియమితులైన వారు ఏడాదికి 11 నెలల 24 రోజుల వేతనాన్ని పొందుతారు. కాని అంతే వర్క్‌లోడ్‌ తీసుకుని అవే బాధ్యతలు నిర్వహిస్తున్న పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వారు ఏడాదికి 6 నెలల వేతనాన్ని మాత్రమే పొందుతూ కుటుంబాలను పోషించుకోలేక దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే దాదాపుగా 200 మంది పార్ట్‌టైం అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. డిపార్టుమెంటులలో పదవీ విరమణ లేదా తదితర కారణాలతో ఏర్పడిన వర్క్‌లోడ్‌లో వీరిని పూర్తికాలం కాంట్రాక్టు అధ్యాపకులుగా కొనసాగించవచ్చు. 705 రెగ్యులర్‌ అధ్యాపక ఖాళీల్లో కేవలం 451 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంకా 254 ఖాళీలు అందుబాటులో వున్నాయి. ఈ ఖాళీలలో పార్ట్‌టైం లెక్చరర్లను పూర్తికాలం లెక్చరర్లుగా మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి ఆటంకాలు, నిబంధనలు అడ్డురావు. ప్రభుత్వ అనుమతి అంతకంటే అక్కరలేదు. కేవలం పూర్తికాలం కాంట్రాక్టు అధ్యాపకులను నియమించుకోవడానికి మాత్రమే ప్రభుత్వ అనుమతి అవసరం. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదనే సాకుతో పార్ట్‌టైం అధ్యాపకులను పూర్తికాలం అధ్యాపకులుగా మార్చడం లేదు. ఇప్పటికైనా వీరిని పూర్తికాలం అధ్యాపకులుగా మార్చాలి. పూర్తికాలం అధ్యాపకులుగా మార్చడం మూలాన మమ్మల్ని ప్రభుత్వం క్రమబద్దీకరించే అవకాశం ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. గతంలో విశ్వవిద్యాలయాల్లో పార్ట్‌టైమ్‌ ఆధ్యాపకులు ఉన్నప్పటికీ, కనీసం కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అప్‌గ్రేడ్‌ చెయ్యమని అనేకసార్లు యూనివర్సిటీ ఆధ్యాపకులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ చూపి వీరందరిని కాంట్రాక్టు ఆధ్యాపకులుగా అప్‌గ్రేడ్‌ చేసి రెగ్యులరైజ్‌ చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల స్థానంలోనే పార్ట్‌టైమ్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వర్క్‌లోడ్‌ ఉన్న డిపార్ట్‌మెంట్లలో పార్ట్‌టైం లెక్చరర్స్‌ను కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌గా నియమించాలి. అప్పుడే ఏడాదికి 11 నెలల 24 రోజుల వేతనం వస్తుంది. ప్రస్తుతం ఓయూలో దాదాపు 200 మంది పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు వివిధ డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్నారు. ఉన్న వర్క్‌లోడ్‌ ప్రకారం ఇందులో ఇప్పటికిప్పుడు పనిచేస్తున్న వారిలో చాలా మంది కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌గా పదోన్నతి పొందవచ్చు. ప్రభుత్వ ఉత్తర్వుల పేరుతో మమ్మల్ని పార్ట్‌టైం ఉద్యోగుల రెమ్యునరేషన్‌ను పీరియడ్‌కు ప్రస్తుతం ఉన్న రూ. 475ల నుంచి రూ.వెయ్యికి పెంచాలి. మా డిమాండ్లను నెరవేర్చాలని విశ్వవిద్యాలయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓయూలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ అధ్యాపకులందరినీ ప్రభుత్వం తక్షణమే బేషరతుగా రెగ్యులరైజ్‌ చేయాలి. పార్ట్‌టైమ్‌ అధ్యాపకులను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌)గా నియమించడానికి అడ్డుపడుతున్న ప్రభుత్వ ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ‘సమాన పనికి సమాన వేతనం’ చెల్లించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ అధ్యాపకులకు వారానికి 16 పీరియడ్స్‌ వర్క్‌లోడ్‌ ఇవ్వాలి. వారిని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(సి)గా అప్‌గ్రేడ్‌ చేసేవరకు కొత్త పార్ట్‌టైం అధ్యాపకులను నియమించరాదు.డాక్టర్‌ బోనకుర్తి సోమేశ్వర్‌ప్రెసిడెంట్‌, ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్‌టైమ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ మేధో సంపత్తిని పెంపొదించే లక్ష్యంతో గుణాత్మక విద్యను అందించడం ద్వారా విశ్వవిద్యాలయాలు విద్యార్థులను మేధావులుగా తీర్పిదిద్దుతాయి. అదే కోవలో సుదీర్ఘ ఘన చరిత్ర కలిగి, శతాబ్ది ఉత్సవాలకు నేడు సిద్ధమవుతున్నది మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. వందేమాతర ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అన్యాయాన్ని ప్రతిఘటించే పెక్కు ఉద్యమాలకు వేదికై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సుసంపన్నమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మేధో వారసత్వ సంపదను దేశ విదేశాలకు అందించ గలిగింది. యూనివర్సిటీలలో వరుసగా ప్రొఫెసర్లు పదవీ విరమణ చేస్తుండడం, సకాలంలో ఆ పద వుల్ని భర్తీ చేయలేకపోయిన కారణంగా ఖాళీగా ఉన్న టీచింగ్‌ పోస్టుల స్థానంలో కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులను నియమిస్తున్న ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. గత 22 ఏళ్లుగా ఓయూలో కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులను, పార్ట్‌టైం లెక్చరర్స్‌ను నియమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం యూనివర్సిటీలో ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు నిర్వహించారని పేర్కొంటూ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2014 జూన్‌ రెండో తేదీ, ఆ తరువాత కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకం చెల్లదని ఆ ఉత్తర్వు ఆదేశించింది. ఇక ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తీసుకోవద్దని నిర్దేశించింది. దీంతో ఓయూలో వివిధ డిపార్ట్‌మెంట్లలో నియమితులైన 36 మంది కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 150 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నియామకాలను యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. అధ్యాపకుల అవసరం తప్పనిసరిగా ఉండడంతో పార్ట్‌టైం లెక్చరర్స్‌ను మాత్రమే తీసుకుంటున్నారు. అవసరం ఉన్నా, అర్హతలు ఉన్నా ఆయా డిపార్ట్‌మెంట్‌లలో వర్క్‌లోడ్‌ ఉన్నా కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలను 2014-–15 విద్యా సంవత్సరం నుంచి ఓయూలో చేపట్టడం లేదు. అలాంటి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్‌టైం ఆధ్యాపకుల బతుకులు అధ్వాన్నంగా మారాయి. అధ్యాపకుల పదవీ విరమణ నిరంతరం జరుగుతున్న సమయంలో వర్క్‌లోడ్‌ (అవసరం మేరకు) యూజీసీ నిబంధనల ప్రకారమే ఒక డిపార్ట్‌మెంట్‌కు అవసరమైన ఆధ్యాపకులను కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులుగా నియమితులైన వారికి ఏడాదికి 11 నెలల వేతనాలు వచ్చేవి. అనంతరం వారి పోరాట ఫలితంగా 11 నెలల 24 రోజుల వేతనాన్ని వర్సిటీ ఇస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు కారణంగా గత ఎన్నో ఏళ్లుగా పార్ట్‌టైం లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వారికి వర్క్‌లోడ్‌ ఏర్పడినా, కాంట్రాక్ట్‌ ఆధ్యాపకులు కాలేక పార్ట్‌టైం లెక్చరర్స్‌గా మిగిలిపోతున్నారు. యూనివర్సిటీకి అవసరం ఉన్నటువంటి పార్ట్‌టైమ్‌ ఆధ్యాపకులకు అన్ని అర్హతలు ఉన్నా ఆయా డిపార్టుమెంటులలో వర్క్‌లోడ్‌ ఉన్నా కాంట్రాక్టు అసిస్టెంట్‌(ప్రొఫెసర్‌)గా అప్‌గ్రేడ్‌ కాలేకపోయారు. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయ పార్ట్‌టైం టీచర్స్‌ కాంట్రాక్టు అధ్యాపకులుగా నియమితులైన వారు ఏడాదికి 11 నెలల 24 రోజుల వేతనాన్ని పొందుతారు. కాని అంతే వర్క్‌లోడ్‌ తీసుకుని అవే బాధ్యతలు నిర్వహిస్తున్న పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌గా పనిచేస్తున్న వారు ఏడాదికి 6 నెలల వేతనాన్ని మాత్రమే పొందుతూ కుటుంబాలను పోషించుకోలేక దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే దాదాపుగా 200 మంది పార్ట్‌టైం అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. డిపార్టుమెంటులలో పదవీ విరమణ లేదా తదితర కారణాలతో ఏర్పడిన వర్క్‌లోడ్‌లో వీరిని పూర్తికాలం కాంట్రాక్టు అధ్యాపకులుగా కొనసాగించవచ్చు. 705 రెగ్యులర్‌ అధ్యాపక ఖాళీల్లో కేవలం 451 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంకా 254 ఖాళీలు అందుబాటులో వున్నాయి. ఈ ఖాళీలలో పార్ట్‌టైం లెక్చరర్లను పూర్తికాలం లెక్చరర్లుగా మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి ఆటంకాలు, నిబంధనలు అడ్డురావు. ప్రభుత్వ అనుమతి అంతకంటే అక్కరలేదు. కేవలం పూర్తికాలం కాంట్రాక్టు అధ్యాపకులను నియమించుకోవడానికి మాత్రమే ప్రభుత్వ అనుమతి అవసరం. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదనే సాకుతో పార్ట్‌టైం అధ్యాపకులను పూర్తికాలం అధ్యాపకులుగా మార్చడం లేదు. ఇప్పటికైనా వీరిని పూర్తికాలం అధ్యాపకులుగా మార్చాలి. పూర్తికాలం అధ్యాపకులుగా మార్చడం మూలాన మమ్మల్ని ప్రభుత్వం క్రమబద్దీకరించే అవకాశం ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. గతంలో విశ్వవిద్యాలయాల్లో పార్ట్‌టైమ్‌ ఆధ్యాపకులు ఉన్నప్పటికీ, కనీసం కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అప్‌గ్రేడ్‌ చెయ్యమని అనేకసార్లు యూనివర్సిటీ ఆధ్యాపకులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ చూపి వీరందరిని కాంట్రాక్టు ఆధ్యాపకులుగా అప్‌గ్రేడ్‌ చేసి రెగ్యులరైజ్‌ చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల స్థానంలోనే పార్ట్‌టైమ్‌ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వర్క్‌లోడ్‌ ఉన్న డిపార్ట్‌మెంట్లలో పార్ట్‌టైం లెక్చరర్స్‌ను కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌గా నియమించాలి. అప్పుడే ఏడాదికి 11 నెలల 24 రోజుల వేతనం వస్తుంది. ప్రస్తుతం ఓయూలో దాదాపు 200 మంది పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు వివిధ డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్నారు. ఉన్న వర్క్‌లోడ్‌ ప్రకారం ఇందులో ఇప్పటికిప్పుడు పనిచేస్తున్న వారిలో చాలా మంది కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌గా పదోన్నతి పొందవచ్చు. ప్రభుత్వ ఉత్తర్వుల పేరుతో మమ్మల్ని పార్ట్‌టైం ఉద్యోగుల రెమ్యునరేషన్‌ను పీరియడ్‌కు ప్రస్తుతం ఉన్న రూ. 475ల నుంచి రూ.వెయ్యికి పెంచాలి. మా డిమాండ్లను నెరవేర్చాలని విశ్వవిద్యాలయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓయూలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ అధ్యాపకులందరినీ ప్రభుత్వం తక్షణమే బేషరతుగా రెగ్యులరైజ్‌ చేయాలి. పార్ట్‌టైమ్‌ అధ్యాపకులను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌)గా నియమించడానికి అడ్డుపడుతున్న ప్రభుత్వ ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ‘సమాన పనికి సమాన వేతనం’ చెల్లించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ అధ్యాపకులకు వారానికి 16 పీరియడ్స్‌ వర్క్‌లోడ్‌ ఇవ్వాలి. వారిని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(సి)గా అప్‌గ్రేడ్‌ చేసేవరకు కొత్త పార్ట్‌టైం అధ్యాపకులను నియమించరాదు.డాక్టర్‌ బోనకుర్తి సోమేశ్వర్‌ప్రెసిడెంట్‌, ఉస్మానియా యూనివర్సిటీ పార్ట్‌టైమ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌
editorial
7,244
11-12-2017 20:30:29
ఆడిషన్స్‌కి వెళ్తే కోరిక తీర్చమన్నారు: సినీ నటి
హైదరాబాద్: ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వెండి తెరపై వెలిగిపోవాలనే తారలు ముందుగా ఆ పనిచేయాల్సిందేనా..?. పాత్రతో సంబంధం లేకుండా పరిశ్రమలోకి ప్రవేశించాలంటే ఆ ఆఫర్ ఇవ్వాల్సిందేనా..? అవుననే అంటున్నారు కొంతమంది. తెలుగు సినీ పరిశ్రమలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందంటూ బాంబు పేల్చింది గాయత్రి గుప్తా. టాలీవుడ్‌లో ఆమెకు ఎదురైన అనుభవాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు.  టాలీవుడ్‌‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను రెండుసార్ల అనుభవానికే భయపడిపోయి చాలా జాగ్రత్తగా తెలిసిన వాళ్ల ద్వారానే సినమాలు చేసుకుంటూ వెళ్లా. నాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు. బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. కాస్టింగ్ కౌచ్‌లాంటి ప్రాబ్లమ్స్‌కి ఒక్క సినీ ఇండస్ట్రీనే కాదు ఎక్కడైనా ఉంది. ఒక భయం నుంచి బయటకు రావాలి. ఉదాహరణకు ఈ జనరేషన్‌లో ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ధైర్యంగా ఉంటే ఈ ప్లాబ్రమ్స్ అరికట్టొచ్చు. ఆడ, మగ ఇక్వాల్‌గా ఉన్న ఈ ప్రపంచంలో మన రైట్, స్వేచ్ఛ మన కంట్రోల్‌లోనే ఉండాలి. దాని గురించి మాట్లాడమే కరెక్ట్ అనిపించింది. మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్టులు ఆ క్రూ కాకుండా మేనేజర్స్ లెవల్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్లు దీనికి ప్రిపేర్ అయి ఉన్నావా...? లేదా..? అని ఫస్ట్ అడుగుతారు. దానికోసం ఒక సెపరేట్ సెక్టార్ ఉంది. మూవీ అనేది ఒక కళ. ఆ కళకి ఇది ఎందుకు అటాచ్‌మెంట్..?. అంటే ట్యాలెంట్ ఉండాలి. యాక్టింగ్, సింగింగ్ పర్ఫామెన్స్ ఉందా..?. డాన్సు వచ్చా రాదా..? అని అడగాలి. కానీ కాస్టింగ్ కౌచ్ అర్హతలు ఎలా అవుతాయి...?. అంటే అందరూ అలా లేరు. కొంతమంది మాత్రమే. ఆ కొంతమంది కూడా ఆడపిల్ల పరువుకోసం బయట చెప్పదు కదా అనే ధైర్యంతో అలా జరిగిపోతుంది’’ అని గాయత్రి గుప్తా  పేర్కొన్నారు.  మరిన్ని విషయాలు చెబుతూ స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్లకే ఈ అనుభవం ఎక్కువగా ఉంటుంది. ఏం తెలియకుండా వస్తారు అందవల్లే ఇలా జరుగుతుంది. ఫ్యామిలీ సైడ్ కూడా భయం ఉంటుంది. ఆ భయం కొద్దీ ఇంట్లో చెప్పకుండా దాచి పెడుతుంటారు. సో జరిగినా కూడా చెప్పుకోలేరు. ఇది అనార్గనైజేషన్ సెక్టార్. ఒక కంపెనీలో అయితే హెడ్ ఉంటారు. ఇక్కడ అలా కాదు. మూవీ టు మూవీ డిఫరెంట్, డిఫరెంట్ మనుషులు ఉంటారు కాబట్టి ఇన్‌ఫామ్ చేయడానికి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు.’’ అని గాయత్రి గుప్తా అన్నారు.  హీరోయిన్ల స్వస్థలాలెక్కడో తెలుసా? హీరోల కళ్లపై స్పెషల్ క్విజ్
entertainment
10,284
14-11-2017 12:05:14
రవితేజ ఇరగదీశావ్‌ అన్నారు..
‘జోరు’, ‘జనతాగ్యారేజ్‌’, ‘అ.. ఆ’ ఇటీవల ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రలకు చైల్డ్‌ ఆరి్ట్‌స్టగా అలరించింది సంస్కృతి. ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఆమె ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం కొత్త అనుభూతి కలిగించిందని చెబుతోంది. ‘‘నేను నాలుగో తరగతి చదువుతున్నా. డాన్స్‌ అన్నా యాక్టింగ్‌ అన్నా చాలా ఇష్టం. ఛైల్డ్‌ ఆర్టి్‌స్టగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ‘రాజా ది గ్రేట్‌’లో మెహరీన్‌ చిన్నప్పటి పాత్ర చేశా. అందులో నా నటన చూసి రవితేజ అంకుల్‌ ‘ఇరగదీశావ్‌’ అన్నారు. స్కూల్లో కూడా నేను ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ని. చదువుని నిర్లక్ష్యం చేయను’’ అని సంస్కృతి పేర్కొన్నారు.- సంస్కృతి‘జోరు’, ‘జనతాగ్యారేజ్‌’, ‘అ.. ఆ’ ఇటీవల ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రలకు చైల్డ్‌ ఆరి్ట్‌స్టగా అలరించింది సంస్కృతి. ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఆమె ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం కొత్త అనుభూతి కలిగించిందని చెబుతోంది. ‘‘నేను నాలుగో తరగతి చదువుతున్నా. డాన్స్‌ అన్నా యాక్టింగ్‌ అన్నా చాలా ఇష్టం. ఛైల్డ్‌ ఆర్టి్‌స్టగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ‘రాజా ది గ్రేట్‌’లో మెహరీన్‌ చిన్నప్పటి పాత్ర చేశా. అందులో నా నటన చూసి రవితేజ అంకుల్‌ ‘ఇరగదీశావ్‌’ అన్నారు. స్కూల్లో కూడా నేను ఫస్ట్‌ క్లాస్‌ స్టూడెంట్‌ని. చదువుని నిర్లక్ష్యం చేయను’’ అని సంస్కృతి పేర్కొన్నారు.- సంస్కృతి
entertainment
15,531
12-08-2017 02:15:58
మీ సంగతి 2019లో చూస్తా..
పార్లమెంటుకు రారా?.. ఇలాగైతే టిక్కెట్లు ఇవ్వం.. బీజేపీ ఎంపీలకు మోదీ హెచ్చరికసభకు గైర్హాజరవడంపై ఆగ్రహంన్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘మీరు పార్లమెంటుకు ఎందుకు ఎన్నికయ్యారు? సభకు హాజరు కావడానికా లేక సంతకం చేసి ఇళ్లకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికా? మీలాగే పార్టీలో సేవ చేసిన వారు చాలామంది ఉన్నారు. వారందర్నీ కాదని మీకు సీట్లు ఇచ్చి గెలిపిస్తే పార్లమెంటుకు సరిగ్గా హాజరు కాకపోవడం శోచనీయం. మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే 2019లో మా ఇష్టం వచ్చినట్లు మేం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగింపు సందర్భంగా గురువారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని కన్నెర్ర చేశారు. ఎంపీల తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.  ఓబీసీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు తగినంత మంది బీజేపీ ఎంపీలు హాజరు కాకపోవడంతో ఆ బిల్లులో కాంగ్రెస్‌ కొన్ని సవరణలను ప్రవేశపెట్టి నెగ్గింది. ఓబీసీల చాంపియన్‌గా చెప్పుకునే బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళం పాడడాన్ని ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రాజ్యసభలో అడుగుపెడుతున్నారని, ఇకపై ఎంపీల ఆటలు సాగవన్న అర్థం వచ్చేలా మాట్లాడిన ప్రధాని రాబోయే ఎన్నికల్లో ఎంపీల పని తీరు ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని తేల్చి చెప్పారు. గతంలో ఇవే విషయాలను అమిత్‌ షా ఎంపీలకు చెప్పినా పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రధాని ఎంపీలతో కటువుగా మాట్లాడాల్సి వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు.  ఓబీసీ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు సీనియర్‌ మంత్రులతో పాటు 31 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. ప్రధాని తాజా హెచ్చరికతో బీజేపీ ఎంపీలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పనులు బాగానే చేస్తున్నామని, పార్లమెంటులో విప్‌లు తమకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వకపోవడంతో చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయని అంటున్నారు. మరి మోదీ హెచ్చరికలు ఎంపీలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో తెలియాలంటే వచ్చే పార్లమెంటు సమావేశాల వరకూ వేచిచూడాల్సిందే.
nation
2,152
04-03-2017 22:59:53
రూ.43 వేల ఎగువకు వెండి
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఇక్కడి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర శనివారం 375 రూపాయలు పెరిగి 30,100 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ట్రెండ్‌తోపాటు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్‌ సందర్భంగా జువెలర్స్‌ నుంచి ఏర్పడిన డిమాండ్‌ బంగారం ధర దూకుడుకు దారితీసింది. ఇక కిలో వెండి ధర 400 రూపాయలు పెరిగి 43,100 రూపాయలకు చేరింది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ల తయారీదారుల నుంచి డిమాండ్‌ వృద్ధి చెందడం వెండి పరుగుకు దోహదపడింది. న్యూయా ర్క్‌ మార్కెట్లో శుక్రవారంనాడే ఔన్స్‌ బంగారం ధర 1,234 డాలర్ల స్థాయికి చేరుకుంది. అదే విధంగా ఔన్స్‌ వెండి ధ ర 1.27 శాతం వృద్ధి చెంది 17.95 డాలర్లకు ఎగబాకింది.
business
10,713
23-03-2017 15:17:24
కాల్‌సెంటర్ స్కామ్‌పై మోహన్ బాబు ఆరా!
కాదేది మోసానికి అనర్హమన్నట్టు కొందరు వ్యక్తులు వక్రబుద్ధితో అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదనకు దిగుతున్నారు. 2జీ స్కామ్, కోల్ స్కామ్, శారదా చిట్ ఫండ్స్ స్కామ్.. ఒక్కటేమిటి అలాంటి స్కాములు ఎన్నో వెలుగు చూశాయి. అలాంటి స్కాముల్లో కాల్ సెంటర్ స్కామ్ కూడా చేరిపోయింది. రీసెంట్‌గా ‘మిరా రోడ్ కాల్ సెంటర్’ పేరుతో అమెరికా పౌరులకు టోకరా వేశారు దుండగులు. పన్ను ఎగవేత, పన్ను మోసాలపై ప్రశ్నించే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్) వాళ్లు వస్తున్నారని, రిటర్న్స్‌పై అధికారులు నిఘా వేశారంటూ ఫోన్లు చేస్తూ కోట్లలో డబ్బులు కొల్లగొట్టేశారు దుండగులు. చేసిన పాపం ఎంతోకాలం దాగదు అన్న చందాన.. వాళ్ల బాగోతం బయటకు పొక్కి ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు.          ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఆ స్కాంపై మోహన్ బాబు దృష్టి పడిందట. ఆ స్కామ్ గురించిన వివరాలను మంచు మోహన్‌బాబు సేకరిస్తున్నాడట. ఆ విషయం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ.. ఓ వ్యక్తితో ఠాణేలో దానికి సంబంధించి ఆరా తీయిస్తున్నాడట. అందుకోసం ఠాణే పోలీసుల నుంచి కూడా వివరాలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంత గోప్యంగా వివరాలు సేకరిస్తున్నా.. బాలీవుడ్ మీడియా చెవిన ఎలా పడిందో ఏంటో కానీ.. ఆ విషయం ఇప్పుడు బయటకు పొక్కేసింది. మరి, మోహన్ బాబు ఈ స్కామ్‌పై అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు పెట్టినట్టు? అంటే.. రీసెంట్‌గా వచ్చిన మంచు విష్ణు లక్కున్నోడు, మనోజ్ గుంటూరోడు, లక్ష్మి లక్ష్మిబాంబ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని సాధించలేదు. రొటీన్ కథలకు పోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని భావించిన మోహన్ బాబు.. నిజ గాథలనే కథలుగా మలచాలని భావిస్తున్నాడట. అందుకే కాస్తంత కొత్తగా ఉన్న ఈ కాల్ సెంటర్ స్కామ్‌పై ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడని బాలీవుడ్ మీడియా అంటోంది. ఇక, ఈ కథను మంచు హీరోల్లో ఎవరితో తీస్తాడనే దానిపై మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు గానీ.. సినిమానైతే మాత్రం పక్కా తీస్తాడని అంటున్నారు. మరి, ఈ నిజ గాథతోనైనా మంచు ఫ్యామిలీని విజయం వరిస్తుందా? చూడాలి.
entertainment
1,898
20-04-2017 03:10:41
ఫ్రెయిర్‌ ఎనర్జీ నుంచి ‘సన్‌ప్రొ’ మొబైల్‌ యాప్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఇపిసి సేవలు అందిస్తున్న ఫ్రెయిర్‌ ఎనర్జీ కంపెనీ ‘సన్‌ప్రొ’ పేరుతో మొబైల్‌ యాప్‌ విడుదల చేసింది. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్లతో ఈ యాప్‌ పని చేస్తుంది. సౌర ఇంధన రంగంలో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తులు, సంస్థలు కూడా ఈ యాప్‌ ద్వారా తమ రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్లను సులభంంగా నిర్వహించుకోవచ్చని ఫ్రెయిర్‌ ఎనర్జీ కంపెనీ ఎం డి సౌరభ్‌ మర్డా విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం భారతతో పాటు ఘనా దేశం లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. వచ్చే మూడేళ్లలో సన్‌ప్రొ యాప్‌ను 25 దేశాల్లో 50,000-60,000 సౌర విద్యుత్ ప్లాంట్లకు అందుబాటులోకి తీసుకు రావాలని కంపెనీ భావిస్తోంది.
business
11,052
16-06-2017 21:24:47
నల్ల కుబేరులకు భారీ షాక్.. బ్యాంక్ ఖాతాల సమాచారానికి స్విస్ అంగీకారం
బెర్నే: నల్ల కుబేరులకు స్విట్జర్లాండ్ భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు గుట్టుగా ఆ దేశ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల ధనవంతుల సమాచారాన్ని ఒప్పందం చేసుకున్న దేశాలకు ఇచ్చే ప్రతిపాదనకు శుక్రవారం ఆమోదం తెలిపింది.  భారత్‌తో పాటు 40 దేశాలకు చెందిన వ్యక్తుల పన్నులకు సంబంధించిన ఆర్థిక ఖాతాల సమాచారం ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ విధానానికి స్విస్ ఫెడరల్ కౌన్సిల్ అంగీకరించింది. 2018 నుంచి ఇది అమలులోకి వస్తుందని, 2019 నుంచి తొలి సమాచార మార్పిడి జరుగుతుందని వెల్లడించింది.  జీ20, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవెలప్మెంట్‌తో పాటు అంతర్జాతీయ సమాచార మార్పిడి ప్రమాణల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్విట్జర్లాండ్ స్పష్టం చేసింది. దీంతో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన నల్ల కుబేరులు స్విస్ బ్యాంకు ఖాతాల గుట్టు రట్టుకానుంది. ఈనేపథ్యంలో భారత్‌కు చెందిన నల్ల కుబేరుల సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించనున్నాయి.
nation
14,454
31-03-2017 02:57:41
ఆ 29 మందినీ కాపాడాం
న్యూఢిల్లీ, మార్చి 30: సౌదీ అరేబియాలో చిక్కుకున్న 29 మంది కార్మికులను కేంద్ర ప్రభుత్వం రక్షించిందని, వారి విమాన టికెట్ల ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. తెలంగాణకు చెందిన 29 మంది కార్మికులను సౌదీ అరేబియాలోని అల్‌ హజ్రీ ఓవర్సీస్‌ కంపెనీ నిర్బంధించిందని కోర్టు తీర్పును కూడా ధిక్కరించి వారికి ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. వాటికి స్పందించిన మంత్రి కేటీఆర్‌.. తెలంగాణ కార్మికులను కాపాడాలంటూ సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. అందుకు సానుకూలంగా స్పందించిన స్వరాజ్‌.. వారిని ఆదుకోవాలంటూ సౌదీ అరేబియాలోని భారత రాయబారి అహ్మద్‌ జావేద్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే, గురువారం రాత్రి ఆమె మాట్లాడుతూ, ఆ 29 మందినీ కాపాడామని తెలిపారు.
nation
6,312
01-03-2017 18:05:57
గురువుకు ప్రేమతో దేవిశ్రీ పాట
నాన్నకు ప్రేమతో సినిమాలో తనతండ్రికి నివాళిగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాట ఎందరి మనసులను హత్తుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘నాన్నకు ప్రేమతో...’ అంటూ సాగే ఆ పాట అందరి హృదయాలకు చేరువైంది. తాజాగా గురువు గురించి ఓ పాటను కంపోజ్ చేశాడు. ‘గురవే నమహా...’ పేరుతో ఓ పాటను కంపోజ్ చేసి రిలీజ్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ పాటకు అందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తన గురువు దివంగత మాండలిన్ శ్రీనివాస్‌కు నివాళిగా అందించాడు. ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు పాటను అతడే పాడాడు. సీనియర్ రచయిత జొన్నవిత్తుల కలం నుంచి ఆ పాట జాలువారింది. దాదాపు సంస్కృత భాషలో ఆ పాటను రచించాడు జొన్నవిత్తుల. అంతేగాకుండా మాండలిన్ శ్రీనివాస్‌ను స్మరించుకుంటూ ఓ కాన్సర్ట్‌ను కూడా దేవిశ్రీ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నాడట. శివమణి సహా పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు ఆ కన్సర్ట్‌లో పాల్గొంటారని సమాచారం. మాండలిన్ శ్రీనివాస్ 45 ఏళ్ల వయసులో 2014లో కన్నుమూశారు.
entertainment
5,049
21-09-2017 10:53:00
ఇంత చిన్న విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావ్ శృతి?
శృతిహాసన్‌ను ఆమె సన్నిహితులు "ఇంత చిన్న విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావ్" అని అడుగుతారట. తాను లైఫ్‌లో ప్రతి చిన్న విషయాన్నీ అంతలా పదిలపరుచుకుంటానంటోంది శృతి. లైఫ్‌లో మనకు ఎదురైన అనుభవాలు, గ్రేట్ విషయాలన్నీ సింపుల్‌గానే ఉంటాయని అమ్మడు చెబుతోంది. మరచిపోలేని జ్ఞాపకాలెప్పుడూ సాధారంణంగానే అనిపిస్తాయని చెబుతోంది. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేయడం నేర్చుకున్నానని.. ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాలను రివైండ్ చేసుకుంటుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుందంటోంది ముద్దుగుమ్మ. మనకు ఫ్రెండ్స్‌తో గడిపేటపుడు ఆ క్షణాలకున్న గొప్పదనం తెలియకపోవచ్చని.. కొన్నేళ్ల తర్వాత ఫోటోలను కానీ.. మన ఫ్రెండ్స్‌ని గానీ గుర్తు తెచ్చుకుంటే అవెంత గొప్ప క్షణాలో అనిపిస్తుందని శృతి తెలిపింది.
entertainment
11,507
05-04-2017 20:07:45
కోలుకున్న సీఆర్పీఎఫ్ అధికారి చేతన్.. ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన సీఆర్పీఎఫ్ అధికారి చేతన్ కుమార్ ఛీటా కోలుకున్నారు. దీంతో బుధవారం ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఫిబ్రవరి నెలలో జమ్మూకశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ చేతన్ కుమార్ ఛీటా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.  చేతులతోపాటు తలలోకి బులెట్లు దూసుకెళ్ళడంతో కొన్నివారాల పాటు కోమాలో ఉన్న చేతన్ కుమార్ మెల్లగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఎయిమ్స్ వైద్యులు బుధవారం డిశ్చార్జ్ చేశారు. దీంతో భార్య ఉమాసింగ్‌‌తో కలిసి ఢిల్లీలోని నివాసానికి వచ్చిన సీఆర్పీఎఫ్ అధికారి చేతన్ కుమార్ ఛీటాకు పలువురు స్వాగతం పలికారు.
nation
11,304
12-10-2017 02:25:35
‘చావు’ వీలునామా!
కోలుకోలేని కోమాలోకి వెళితే బతికించవద్దు.. ముందుగానే ‘వీలునామా’ రాసే అవకాశం.. సుప్రీం కోర్టులో వాదనలు... తీర్పు వాయిదాన్యూఢిల్లీ, అక్టోబరు 11: ‘‘నేను తీవ్ర అనారోగ్యం బారిన పడి, బయటికి రా లేని కోమాలోకి వెళ్లిపోతే నా జీవితానికి ముగింపు పలకండి! ప్రాణాధార వ్యవస్థలతో బలవంతంగా జీవితాన్ని పొడిగించ కండి! ఇది నేను పూర్తి ఆరోగ్యంతో, స్థిరమైన చిత్తంతో, ఇష్టపూర్వకంగా రాస్తున్న వీలునామా!’’ సుప్రీంకోర్టు సరేనంటే భవిష్యత్తులో ఇలాంటి వీలునామాలు కూడా వస్తాయి. తన ఆస్తులు ఎవరికి చెందుతాయో రాసేవీలునామాతో పాటు తన జీవితాన్ని బలవంతంగా పొడిగించవద్దనే వీలునామా కూడా రాసు కునే అవకాశం లభిస్తుంది. ప్రాణాధార వ్యవస్థలు తొల గించి మరణాన్ని ప్రసాదించడాన్ని(ప్యాసివ్‌ యుథనే షియా) చట్టబద్ధం చేసిన ఆరేళ్లకు ‘మరణ స్వేచ్ఛ వీలునామా’ (లివింగ్‌ విల్‌) అంశం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ‘కామన్‌ కాజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ‘‘పౌరులందరికీ జీవించే హక్కు ఉంది.  తిరిగి కోలుకోలేని కోమాలో ఉన్న తన జీవితాన్ని బలవంతంగా పొడిగించేందుకు నిరాకరించడం కూడా జీవించే హక్కులో అంతర్భాగమే’’ అని ఆ సంస్థ తరఫున వాదించిన సీనియర్‌లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే పరోక్ష కారుణ్య మరణాన్ని అనుమతించిందని ‘మరణించేస్వేచ్ఛ’ వీలునామా దీనికి కొనసాగింపుగా ఉంటుందన్నారు. రోగి వీలునామా అమలులో బంధువులు,కుటుంబ సభ్యుల పాత్ర ఉండదన్నారు. ‘ప్రాణాధార వ్యవస్థ లేకుండా ఈ రోగి జీవించే అవకాశమే లేదు’ అని వైద్యుల బృందం ధ్రువీకరించిన తర్వాతే ఇది అమలు చేయవచ్చన్నారు. సంక్లిష్టమైన అంశం: కేంద్రం‘మరణించే స్వేచ్ఛ’ వీలునామాపై కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పీఎస్‌ నరసింహ వాదనలు వినిపించారు. దీంట్లో మంచి చెడ్డలను పరిశీలించాల్సి ఉందన్నారు. దేశ సాంస్కృతిక విలువలు, మత సంప్ర దాయాలు, చట్టాల ప్రకారం చూస్తే ఇది అంత మంచి పద్ధతి కాకపోవచ్చని, సంక్లిష్టమైన అంశమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేంద్రం ‘పరోక్ష కారుణ్య మరణాన్ని’ అనుమతిస్తోందని కోలుకోలేని కోమాలో ఉన్న వ్యక్తి బంధువులు హైకోర్టుకు వెళ్లి, అనుమతి తెచ్చుకోవచ్చన్నారు. ‘‘వైద్య శాస్త్రం రోజురోజుకూ పురోగ మిస్తోంది. నేడు నయం కాదనుకున్న వ్యాధిని రేపు సులువుగా నయం చేసే పద్ధతులు రావొచ్చేమో’’ అని నరసింహ అన్నారు. కోర్టు స్పందిస్తూ.. ‘మరణించే స్వేచ్ఛ’ వీలునామాను బంధు వులు మోసపూరితంగా రాసే అవకా శాలూ ఉంటాయని తెలిపింది. దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ‘‘ఇదిసంక్లిష్టమైన అంశం. ఏం చేయగలమో చూద్దాం! యాతన లేకుండా, ప్రశాతంగా మరణించాలనుకోవడం 21వ అధికరణ కల్పించినహక్కు. అయితే... ఆత్మహత్య చేసుకోలేరు’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా పేర్కొన్నారు. ఇప్పుడేం జరుగుతోంది!?‘ప్యాసివ్‌ యుథనేషియా’ అనే పేరు వాడనప్పటికీ... చాలా కేసుల్లో ఇదే జరుగుతోంది. ఎంత ప్రయత్నించినా ఖర్చు తప్ప, రోగి బతికే అవకాశం లేదని చాలా సందర్భాల్లో వైద్యులు బంధువులకు చెబుతుంటారు. వెం టిలేటర్‌పైనో, ఇతర ప్రాణాధార వ్యవస్థతో కొనసాగించడమా... ఇంటికి తీసుకెళ్లడమో నిర్ణయించుకోవాలని కూడా సూచిస్తుంటారు. దీనిపై నిర్ణయం తీసుకోవడం రోగి బంధువులకు పరీక్షలాంటిది. తప్పని పరిస్థితుల్లో ‘డిశ్చార్జి’ చేయాలని కోరడం, ఇంటికి వెళ్లేలోపే రోగి మరణించడం జరుగుతుంటుంది.  నిజానికి... ‘రోగిని డిశ్చార్జి చేయండి’ అని కుటుంబ సభ్యులు అధికారికంగానే కోరవచ్చు. ‘కుదరదు’ అని చెప్పే చట్టాలేవీ లేవు. వెరసి... ఇలాంటివన్నీ ‘అనధికార’ ప్యాసివ్‌ యుథనేషియా కిందికే వస్తాయి. అంటే... రోగి వీలునామా, ఇష్టా ఇష్టాలతో సంబంధంలేకుండా ‘మరణించే స్వేచ్ఛ’ కూడా అమలవుతోందన్న మాట. ఎలా అనుమతించాలి?‘మరణించే స్వేచ్ఛ’ వీలునామాను ఎలా అమలు చేయాలనే అంశంపై సుప్రీం ధర్మాసనంలో ప్రాథమిక చర్చ జరిగింది. దీనిపై మార్గదర్శకాలను రూపొందిస్తామని తెలిపింది. దీని ప్రకారం... దీనిపై తుది ఆదేశాలను కోర్టు (మేజిస్ట్రేట్‌) జారీ చేయాలి. పూర్తి ఆరోగ్యమైన స్థితిలో, స్వచ్ఛందంగాఈ వీలునామా రాశారని మేజిస్ట్రేట్‌ నిర్ధారించుకోవాలి.‘రోగి కోమా నుంచి బయటపడే అవకాశం లేదు’ అని అధికారిక వైద్య బృందం ధ్రువీకరించాలి.రోగికి ప్రాణాధార వ్యవస్థను తప్పించేముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.
nation
4,494
04-11-2017 01:30:25
వారసత్వస్వామ్యంగా ప్రజాస్వామ్యం!
కాంగ్రెస్ బాటలోనే భారతదేశంలోని చాలా రాజకీయ పార్టీలు వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలుగా మారాయి. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిదిగానూ, ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలనగానూ కొనసాగి, ‘‘ప్రజాస్వామ్య సంస్థానాలు’’ ఆవిర్భవించేదిగా మారే ప్రమాదం పొంచి వుంది. నెహ్రూ–గాంధీ కుటుంబ వారసుడిగా ఆరో తరం నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా మళ్లీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే, భావి భారత ప్రధానిగా పలువురు భావిస్తున్న రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి రంగం సిద్ధమైంది. ఇక ఆయనే కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని అధికారిక నాయకుడు అవుతాడు. వందిమాగధులకు ఇక మీద ‘‘దేశ్ కీ నేతా రాహుల్’’ నినాదం అనివార్యం. విదేశీయుడైన అలన్ ఆక్టేవియన్ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారకుడైతే... మరో విదేశీ, ఇటలీ దేశానికి చెందిన భారతీయురాలు సోనియా గాంధీ, రెండు దశాబ్దాల క్రితం చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్ పార్టీని, ప్రక్షాళనచేసి, పునర్నిర్మించి, పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. రాజీవ్ గాంధీ మరణానంతరం, సోనియా నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టిన పీవీ నరసింహారావు 1996 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలవడంతో, సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. సీతారాం కేసరికి ఆ రెండు పదవులు దక్కాయి. కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు ధ్వజం ఎత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా ‘రక్షించమని’ కొందరునాయకులు చేసిన ‘అభ్యర్థన’ మేరకు, నెహ్రూ–గాంధీ వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధీ తొలుత పార్టీ ‘ప్రాథమిక సభ్యత్వం’ స్వీకరించారు. అచిర కాలంలోనే, ‘రెండు నెలల అపారమైన అనుభవంతో’, పార్టీ శ్రేయోభిలాషులు కోరడంతో కాదనలేక, 1998లో, కొందరు ఆమె ‘జాతీయత’ను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత ఇరవై ఏళ్లకు పైగా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా, నెహ్రూ–గాంధీ వారసత్వాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే, ‘ఏక వ్యక్తి అభిప్రాయమే’ చివరకు ‘ఏకాభిప్రాయం’గా అవుతోంది. నెహ్రూ–గాంధీ కుటుంబీకుల అనుకూల, ప్రతికూల శక్తుల-వ్యక్తుల, మధ్య జరిగిన– జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ నూటా నలభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. భారతజాతీయ కాంగ్రెస్‌లో ప్రతిసారీ నెహ్రూ–గాంధీ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిలపరచుకున్న విషయం జగమెరిగిన సత్యం. దానివల్ల దేశానికి, పార్టీకి మేలు జరిగితే జరిగి వుండొచ్చు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటై కూడా వుండొచ్చు. కాకపొతే ఆ క్రమంలోనే వారి నాయకత్వం మినహా గత్యంతరం లేని పరిస్థితులు నెలకొని ఇప్పటికీ కొనసాగుతోంది. భవిష్యత్‍లో కూడా అలానే జరగదన్న నమ్మకం లేదు. ఎదురుతిరిగిన వారిని మోతీలాల్ నెహ్రూ దగ్గర్నుంచి, ఆ వారసత్వ పరంపరలోని అందరూ, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీడడమో, చీల్చడమో, ‘‘మనస్సాక్షి చెప్పినట్లు’’ నడచుకోమని తమ వారిని ప్రోత్సహించడమో, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధీ తొలుత పార్టీ పగ్గాలను 1959–60లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. మొరార్జీ దేశాయ్‍తో సహా, ‘‘సంప్రదాయ వాదులందరినీ’’ బయటకు పంపేందుకు, 1969లో పార్టీని చీల్చింది ఇందిర. ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల, వామపక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది ఇందిరా గాంధీ. భారత జాతీయ కాంగ్రెస్‌- ఏఐసీసీ (ఐ) తెరపైకొచ్చింది. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. ఆమె వారసుడిగా ఎదుగుతున్న చిన్న కొడుకు సంజయ్ గాంధీ దుర్మరణం పాలవడంతో, పెద్దకొడుకు రాజీవ్ గాంధీని నెహ్రూ–గాంధీ కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. హత్యకు గురయ్యేంత వరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధీ తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధీని వారసుడిని చేసింది. రాజీవ్ గాంధీ నాయకత్వంలో, 1984 సార్వత్రక ఎన్నికల్లో, పార్టీ భారీ మెజారిటీ సాధించి, 1985లో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో, పీవీ నరసింహారావు ‘ఏకాభిప్రాయ అభ్యర్థి’గా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. పీవీ సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా అంతర్జాతీయ మన్ననలు అందుకోవడం సోనియాకు మింగుడు పడలేదు. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేసారు పీవీ. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి ఆయనను దయనీయంగా తొలగించారు. పీవీ స్థానంలో వచ్చిన కేసరికి కూడా అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది. అసలు ప్రజాస్వామ్యమే వారసత్వస్వామ్యంగా మారుతున్నదా? ఔననక తప్పదు. నెహ్రూ–గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో (మంచికో–చెడుకో) ఈ ప్రక్రియకు బీజాలు నాటితే, దేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగి, భారీ వట వృక్షాలుగా వూడలు పెంచి, పెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. ‘‘వారసత్వం జన్మ హక్కు’’ అని వాదించే స్థాయికి చేరుకుంది. ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు– కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్తును శాసించే దిశగా కదులుతున్నాయి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకు, అనాదిగా, రాజులు– మహారాజులు– చక్రవర్తులు తమ తమ కొడుకులను– కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులు, బహుశా వర్తమాన రాజకీయాలలోనూ, వారసత్వంగా సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చు. అలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చు. దీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనా? కాంగ్రెస్ బాటలోనే భారతదేశంలోని చాలా రాజకీయ పార్టీలు వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలుగా మారాయి. వీటి అధినాయకులు తమ కుటుంబీకులను తప్ప, వెలుపల వారిని పార్టీ నాయకత్వంలోకి అడుగుబెట్టనివ్వరు. లోపలున్న వారి గొంతు నొక్కేసి, అసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిది గానూ, ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలనగానూ కొనసాగి, ‘‘ప్రజాస్వామ్య సంస్థానాలు’’ ఆవిర్భవించేదిగానూ మారే ప్రమాదం పొంచి వుంది. ఈ ప్రమాదానికి, వారసత్వ సంస్కృతికి కారకులెవరంటే, జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారు. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే, తండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూ, చాలా వ్యూహాత్మకంగా– పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకు, తాను ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారు. వర్తమాన చరిత్రకారులెందరో దీన్ని ధృవీకరించారు. తన తదనంతరం కూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారు. ఆయన కోరిక నెరవేరింది. ఇందిరా గాంధీ కూడా తండ్రి– తాత బాటలోనే పయనించింది. మొదట చిన్న కొడుకు సంజయ్ గాంధీని, తర్వాత రాజీవ్ గాంధీని తెరపైకి తెచ్చింది తన వారసుడిగా. సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్, ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడు. ఆయన హత్యకు గురైన తర్వాత, కొంత విరామం తర్వాత, మకుటం లేని మహారాణిగా, సోనియా వారసత్వం స్వీకరించారు. ఇక ముందుంది రాహుల్ పర్వం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరగింది కాదా? ఏమో!వనం జ్వాలా నరసింహారావు నెహ్రూ–గాంధీ కుటుంబ వారసుడిగా ఆరో తరం నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా మళ్లీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే, భావి భారత ప్రధానిగా పలువురు భావిస్తున్న రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి రంగం సిద్ధమైంది. ఇక ఆయనే కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని అధికారిక నాయకుడు అవుతాడు. వందిమాగధులకు ఇక మీద ‘‘దేశ్ కీ నేతా రాహుల్’’ నినాదం అనివార్యం. విదేశీయుడైన అలన్ ఆక్టేవియన్ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారకుడైతే... మరో విదేశీ, ఇటలీ దేశానికి చెందిన భారతీయురాలు సోనియా గాంధీ, రెండు దశాబ్దాల క్రితం చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్ పార్టీని, ప్రక్షాళనచేసి, పునర్నిర్మించి, పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. రాజీవ్ గాంధీ మరణానంతరం, సోనియా నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టిన పీవీ నరసింహారావు 1996 ఎన్నికలలో పార్టీ ఓటమి పాలవడంతో, సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. సీతారాం కేసరికి ఆ రెండు పదవులు దక్కాయి. కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు ధ్వజం ఎత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా ‘రక్షించమని’ కొందరునాయకులు చేసిన ‘అభ్యర్థన’ మేరకు, నెహ్రూ–గాంధీ వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధీ తొలుత పార్టీ ‘ప్రాథమిక సభ్యత్వం’ స్వీకరించారు. అచిర కాలంలోనే, ‘రెండు నెలల అపారమైన అనుభవంతో’, పార్టీ శ్రేయోభిలాషులు కోరడంతో కాదనలేక, 1998లో, కొందరు ఆమె ‘జాతీయత’ను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత ఇరవై ఏళ్లకు పైగా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా, నెహ్రూ–గాంధీ వారసత్వాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే, ‘ఏక వ్యక్తి అభిప్రాయమే’ చివరకు ‘ఏకాభిప్రాయం’గా అవుతోంది. నెహ్రూ–గాంధీ కుటుంబీకుల అనుకూల, ప్రతికూల శక్తుల-వ్యక్తుల, మధ్య జరిగిన– జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ నూటా నలభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర. భారతజాతీయ కాంగ్రెస్‌లో ప్రతిసారీ నెహ్రూ–గాంధీ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిలపరచుకున్న విషయం జగమెరిగిన సత్యం. దానివల్ల దేశానికి, పార్టీకి మేలు జరిగితే జరిగి వుండొచ్చు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటై కూడా వుండొచ్చు. కాకపొతే ఆ క్రమంలోనే వారి నాయకత్వం మినహా గత్యంతరం లేని పరిస్థితులు నెలకొని ఇప్పటికీ కొనసాగుతోంది. భవిష్యత్‍లో కూడా అలానే జరగదన్న నమ్మకం లేదు. ఎదురుతిరిగిన వారిని మోతీలాల్ నెహ్రూ దగ్గర్నుంచి, ఆ వారసత్వ పరంపరలోని అందరూ, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీడడమో, చీల్చడమో, ‘‘మనస్సాక్షి చెప్పినట్లు’’ నడచుకోమని తమ వారిని ప్రోత్సహించడమో, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధీ తొలుత పార్టీ పగ్గాలను 1959–60లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. మొరార్జీ దేశాయ్‍తో సహా, ‘‘సంప్రదాయ వాదులందరినీ’’ బయటకు పంపేందుకు, 1969లో పార్టీని చీల్చింది ఇందిర. ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల, వామపక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది ఇందిరా గాంధీ. భారత జాతీయ కాంగ్రెస్‌- ఏఐసీసీ (ఐ) తెరపైకొచ్చింది. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. ఆమె వారసుడిగా ఎదుగుతున్న చిన్న కొడుకు సంజయ్ గాంధీ దుర్మరణం పాలవడంతో, పెద్దకొడుకు రాజీవ్ గాంధీని నెహ్రూ–గాంధీ కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. హత్యకు గురయ్యేంత వరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధీ తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధీని వారసుడిని చేసింది. రాజీవ్ గాంధీ నాయకత్వంలో, 1984 సార్వత్రక ఎన్నికల్లో, పార్టీ భారీ మెజారిటీ సాధించి, 1985లో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో, పీవీ నరసింహారావు ‘ఏకాభిప్రాయ అభ్యర్థి’గా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. పీవీ సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా అంతర్జాతీయ మన్ననలు అందుకోవడం సోనియాకు మింగుడు పడలేదు. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేసారు పీవీ. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి ఆయనను దయనీయంగా తొలగించారు. పీవీ స్థానంలో వచ్చిన కేసరికి కూడా అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది. అసలు ప్రజాస్వామ్యమే వారసత్వస్వామ్యంగా మారుతున్నదా? ఔననక తప్పదు. నెహ్రూ–గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో (మంచికో–చెడుకో) ఈ ప్రక్రియకు బీజాలు నాటితే, దేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగి, భారీ వట వృక్షాలుగా వూడలు పెంచి, పెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. ‘‘వారసత్వం జన్మ హక్కు’’ అని వాదించే స్థాయికి చేరుకుంది. ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు– కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్తును శాసించే దిశగా కదులుతున్నాయి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకు, అనాదిగా, రాజులు– మహారాజులు– చక్రవర్తులు తమ తమ కొడుకులను– కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులు, బహుశా వర్తమాన రాజకీయాలలోనూ, వారసత్వంగా సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చు. అలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చు. దీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనా? కాంగ్రెస్ బాటలోనే భారతదేశంలోని చాలా రాజకీయ పార్టీలు వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలుగా మారాయి. వీటి అధినాయకులు తమ కుటుంబీకులను తప్ప, వెలుపల వారిని పార్టీ నాయకత్వంలోకి అడుగుబెట్టనివ్వరు. లోపలున్న వారి గొంతు నొక్కేసి, అసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిది గానూ, ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలనగానూ కొనసాగి, ‘‘ప్రజాస్వామ్య సంస్థానాలు’’ ఆవిర్భవించేదిగానూ మారే ప్రమాదం పొంచి వుంది. ఈ ప్రమాదానికి, వారసత్వ సంస్కృతికి కారకులెవరంటే, జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారు. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే, తండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూ, చాలా వ్యూహాత్మకంగా– పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకు, తాను ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారు. వర్తమాన చరిత్రకారులెందరో దీన్ని ధృవీకరించారు. తన తదనంతరం కూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారు. ఆయన కోరిక నెరవేరింది. ఇందిరా గాంధీ కూడా తండ్రి– తాత బాటలోనే పయనించింది. మొదట చిన్న కొడుకు సంజయ్ గాంధీని, తర్వాత రాజీవ్ గాంధీని తెరపైకి తెచ్చింది తన వారసుడిగా. సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్, ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడు. ఆయన హత్యకు గురైన తర్వాత, కొంత విరామం తర్వాత, మకుటం లేని మహారాణిగా, సోనియా వారసత్వం స్వీకరించారు. ఇక ముందుంది రాహుల్ పర్వం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరగింది కాదా? ఏమో!వనం జ్వాలా నరసింహారావు
editorial
13,596
03-02-2017 15:19:36
శశికళ కొత్త నియామకాలు...సీనియర్లకు కీలక పోస్టులు
చెన్నై: అన్నాడీఎంకే ప్రధన కార్యదర్శి శశికళా నటరాజన్ కీలకమైన పార్టీ పదవులలో పలువురు సీనియర్లను శుక్రవారంనాడు నియమించారు. పార్టీ సీనియర్ నేతలు కేఏ సెంగోట్టయన్, గోకుల ఇంద్ర, సైదై ఎస్.దురై స్వామిలను పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా నియమించారు. మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌కు పలు పార్టీ పదవులు అప్పగించారు. అంబత్తూరు ఎమ్మెల్యే వి.అలెగ్జాండర్‌ను అన్నాడీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తున్నట్టు కూడా ప్రకటించారు. కొత్తగా నియమించిన సభ్యులకు అందరూ సహకరించాలని పార్టీ కార్యరక్తలకు శశికళా నటరాజన్ విజ్ఞప్తి చేశారు.
nation
5,279
22-01-2017 10:53:58
ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నా: టాప్ హీరోయిన్
ఇన్నాళ్లూ ఫ్యాషన్ స్టేట్మెంట్లు మాత్రమే ఇచ్చిన ఆ బాలీవుడ్ ఫ్యాషనిస్టా తొలిసారి తన బాయ్ ఫ్రెండ్ గురించి ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకూ ఎవరా బోల్డ్ బ్యూటీ? ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడే సోనమ్ కపూర్... ఇప్పటికే తన మాట తీరుతో ఇండస్ట్రీలో ఎంతో మంది ఆగ్రహానికి గురైంది. అయినా ఇలాంటి వాటికి బెదిరిపోని ఈ బంగారు బొమ్మ ఈ మధ్యకాలంలో ఓ అబ్బాయితో బాగా చనువుగా మెలగడం టిన్సెల్ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆనంద్ ఆహుజా అనే వ్యాపారవేత్తతో కలసి ఓపెన్‌గానే చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సోనమ్... తమ మధ్య ఉన్న బంధం గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గొన్న సోనమ్... ఎట్టకేలకు తన ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించకతప్పలేదు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నట్లు అంగీకరించిన సోనమ్.... ప్రియుడి గురించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. మిగతా విషయాలు తన వ్యక్తిగతమని స్పష్టం చేసేసింది. మరి ఎలాగూ ప్రేమ ముచ్చట చెప్పేసింది కాబట్టి, పెళ్లెప్పుడన్న సంగతి కూడా చెప్పేస్తే జనాల్లో క్యూరియాసిటీ సద్దుమణుగుతుంది. మరి అమ్మడు దీనిపై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.
entertainment
17,073
09-04-2017 16:25:36
చెన్నైలో అకస్మాత్తుగా కుంగిన రోడ్డు
చెన్నై: మౌంట్‌రోడ్డులో అక‌స్మాత్తుగా భూమి క‌ుంగింది. వాహనాలు రోడ్డుపై వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సు, కారు సహా పలు వాహనాలు కుంగిన గుంతలో పడ్డాయి. దాంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు ట్రాఫిక్ మళ్లించారు. గుంతలో పడిన వాహనాలు బయటకు తీసి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. కాగా అక్కడ మెట్రో రైలు సొరంగ పనులు జరుగుతున్నాయి. దానివల్లే రోడ్డు కుంగినట్లు అధికారులు భావిస్తున్నారు.
nation
5,781
07-11-2017 16:18:41
నాని, శర్వానంద్‌కు అంత క్రేజా..!
టాలీవుడ్‌లో ఆ ఇద్దరు యంగ్ హీరోలూ నిలకడైన విజయాలతో దూసుకుపోతున్నారు. అందుకే ఇప్పుడు ఏ కథా వారిద్దిరినీ దాటి ముందుకు పోవడం లేదట. దర్శక,నిర్మాతలందరికీ మోస్ట్ వాంటెడ్ అయిపోయిన ఆ హీరోలెవరు..? విజయం వెంటే పరుగులు తీసే సినీ ఇండస్ట్రీకి ఎంతటి స్టార్ హీరోలైనా సరే వాళ్ల ట్రాక్ రికార్డే ప్రాతిపదిక. ఇక్కడ సక్సెస్‌కు స్థాయితో పట్టింపు ఉండదు. అందుకే టాలీవుడ్‌లో ఇప్పుడు నిలకడగా విజయాలు సాధిస్తున్న యంగ్ హీరోలు నాని, శర్వానంద్‌లకి ఓ రేంజ్‌లో ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి.  కొత్తగా ఎవరైనా దర్శకుడిగా మారాలంటే ముందుగా నాని, శర్వానంద్‌లకు సరిపోయే కథల్ని రెడీ చేసుకోవడం పరిపాటిగా మారిందట. అంతేకాదు ఏ మంచి కథైనా వీరిద్దరినీ దాటి ముందుకు పోవడం లేదట. వీరిద్దరూ వేగంగా సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఒక సంవత్సరం ఆగినా తప్పులేదని అనుకుంటున్నారట దర్శక, నిర్మాతలు.  ఈ యేడాది శర్వానంద్ నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. నాని సినిమాలు రెండు రిలీజయ్యాయి. త్వరలో 'ఎమ్.సి.ఎ'తో జనంముందుకు రానున్నాడు నాని. అంటే నాని, శర్వానంద్ ఇద్దరూ ఈ సంవత్సరం మూడేసి సినిమాలు చేశారన్న మాట. దీన్నిబట్టి వీరిద్దరి వేగం ఎలా ఉందో అర్ధమవుతోంది. వచ్చిన కథను వచ్చినట్టుగా పట్టుకుపోతున్న ఈ ఇద్దరు హీరోలూ మిగతా హీరోలకు కంటగింపుగా తయారయ్యారని చెప్పుకుంటున్నారు సినీజనం. మరి నాని ,శర్వానంద్ ఎంత కాలం ఈ స్థాయిని కొనసాగిస్తారో చూడాలి.
entertainment
17,989
19-12-2017 04:55:18
సూపర్‌ ‘సిక్సర్‌’
గుజరాత్‌లో ఆరోసారి కమల వికాసంఅహ్మదాబాద్‌, డిసెంబరు 18: గుజరాత్‌లో గెలుపు గజమాల మళ్లీ బీజేపీని వరించింది. కమల దళం వరుసగా ఆరోసారి విజయకేతనం ఎగురవేసింది. ‘‘పటేళ్లు కొంప ముంచుతారు! ఓబీసీలు గుర్రుగా ఉన్నారు! దళితులూ దండెత్తుతారు. ముస్లింలు ఎలాగూ ఓటు వేయరు! జీఎస్టీ, నోట్ల రద్దు దెబ్బ గట్టిగా కొడుతుంది. బీజేపీ ఓటమి ఖాయం’’.... అనే వాదనలు పటాపంచలయ్యాయి. కొన్ని సీట్లు తగ్గాయన్న అసంతృప్తిని పక్కనపెడితే... అధికారం మాత్రం బీజేపీకి సొంతమైంది. రాష్ట్రస్థాయి నాయకులను పక్కనపెట్టి... ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ నేరుగా ఢీకొన్న ఎన్నిక ఇది! ప్రధాని స్థాయిలో ఉన్నప్పటికీ... ‘నేను లోకల్‌’ అంటూ గుజరాత్‌లో మోదీ చేసిన ప్రచారం ఫలించింది. ఇది అభివృద్ధిని మెచ్చి గుజరాతీలు ఇచ్చిన తీర్పుగా బీజేపీ అభివర్ణించింది. ఆది నుంచీ ఉత్కంఠ...గుజరాత్‌ ఎన్నికల పోరు, ప్రచారం ఎంత ఉత్కంఠ రేకెత్తించిందో... ఫలితాల సరళి కూడా అంతే హైటెన్షన్‌ సృష్టించింది. సోమవారం ఉదయం మొదలైన కౌంటింగ్‌లో... తొలి 2 గంటలపాటు ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా పోరు సాగింది. ‘విజయం’ కాంగ్రె్‌సతో దోబూచులాడింది. బీజేపీ 105 స్థానాల ఆధిక్యం దాకా దూసుకెళ్లింది. కానీ... చివరికి, 99 స్థానాలతో సరిపెట్టుకుంది. 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీలో మేజిక్‌ మార్కు 92కాగా... కమలం మరో ఏడు సీట్లు మాత్రమే అదనంగా సాధించగలిగింది. 2012 పోరుతో పోల్చితే... బీజేపీ 16 స్థానాలు కోల్పోయింది.  కాంగ్రెస్‌ సొంతంగా 77 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షాలు మరో 3 స్థానాల్లో నెగ్గాయి. గత ఎన్నికలతో పోల్చితే... ఏకంగా 19 సీట్లు అదనంగా నెగ్గింది! బీజేపీకి గతంలోకంటే సీట్లు తగ్గినా ఓట్ల శాతం పెరగడం గమనార్హం. అలాగే కాంగ్రెస్‌ కూడా ఓట్లలో తన వాటాను పెంచుకోగలిగింది. గుజరాత్‌లో ‘ఇతరుల’ ప్రభావం కూడా ఈసారి తగ్గింది. 2012 ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గగా... ఈసారి ఆ సంఖ్య మూడుకే పరిమితమైంది. రాజ్‌కోట్‌ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేసిన గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ఒక దశలో వెనుకబడ్డారు. ఆ తర్వాత అనూహ్యంగా ఘన విజ యం సాధించారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ మెహసానా స్థానం నుంచి గెలుపొందారు. ప్రచార దశ లో, అంతకుముందు బీజేపీకి ముచ్చమెటలు పట్టించిన దళిత నేత జిగ్నేశ్‌ మేవానీ కాంగ్రెస్‌ మద్దతుతో... ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. కాంగ్రెస్‌ తరఫున రంగంలోకి దిగిన ఓబీసీ నాయకుడు అల్పేశ్‌ కూడా విజయం సాధించారు. జిగ్నేశ్‌, అల్పేశ్‌, హార్దిక్‌ పటేల్‌ల అండతో... దళిత, ఓబీసీ, పటేల్‌ ఓట్లను కొల్లగొడతామని, గెలుపు తమదేనని కాంగ్రెస్‌ భావించింది. కానీ... ఈ లెక్క తప్పింది. గతంలోకంటే అధిక స్థానాలు దక్కించుకున్నామన్న తృప్తి ఒక్కటే కాంగ్రెస్‌ మిగిలింది. మోదీ అడ్డాలో బీజేపీ ఓటమి!మోదీ పుట్టి పెరిగిన ఊరు పడ్‌ నగర్‌. ఈ ఊరు ఉంజా నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ బీజేపీ దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆశా పటేల్‌కు 81,797 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి పటేల్‌ నారాయణ్‌భాయ్‌కు 62, 268 ఓట్లు దక్కాయి. పరిశీలకులుగా జైట్లీ, పాండేగుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కసరత్తు మొదలైంది. బీజేపీ అధిష్ఠానం కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ, పార్టీ ప్రధాన కార్యదర్శి సరోజ్‌ పాండేలను పరిశీలకులుగా నియమించింది. అయితే... ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీనే సీఎంగా కొనసాగిస్తామని ఎన్నికల ప్రచార సమయంలో అమిత్‌ షా ప్రకటించారు.
nation
20,524
25-07-2017 01:43:42
మాకూ ఐపీఎల్‌
లండన్‌: భారత మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఐపీఎల్‌ నిర్వహించాలని కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కోరింది. ఆస్ట్రేలియాలో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌)లో పాల్గొన్న స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆటలో ఎంతో మార్పు వచ్చిందని ఆమె చెప్పింది. మనదేశంలోనూ అలాంటి లీగ్‌ నిర్వహిస్తే జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని లార్డ్స్‌లో ఆదివారంనాటి ఫైనల్‌ అనంతరం రాజ్‌ అభిప్రాయపడింది. బీసీసీఐ, సీవోఏ సుముఖం ?ఇదిలాఉండగా ప్రపంచకప్‌ సందర్భంగా భారత మహిళా జట్టుకు ఊహించని విధంగా లభించిన పాపులారిటీని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ, క్రికెట్‌ పాలక కమిటీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మహిళా ఐపీఎల్‌కు రూపకల్పన చేయనున్నట్టు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
sports
13,141
11-09-2017 03:56:45
తుఫాను అలల ఫొటో తీస్తూ..
హరికేన్‌ వచ్చే మార్గంలో ఉండొద్దు.. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోండి మొర్రో అని అధికారులు మొత్తుకున్నా చాలా మంది దీన్నో సరదాగానే భావించి ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఒక వ్యక్తి.. హరికేన్‌ ప్రభావంతో విరుచుకుపడుతున్న అలలను తన ఫొన్‌లో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. అంతలోనే ఒక రాకాసి అల వచ్చి గట్టిగా కొట్టేయడంతో వెనక్కి పడ్డాడు.
nation
14,731
09-02-2017 00:20:24
ఎన్‌ఎస్‌జీ ఆడిటోరియానికి పఠాన్‌కోట్‌ అమరుడి పేరు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: పఠాన్‌కోట్‌ అమరుడికి జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్ జీ) ఘన నివాళి అర్పించింది. హరియాణాలోని మనేసర్‌లో గల ఎన్‌ఎస్ జీ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్తగా నిర్మించిన ఆడిటోరియానికి లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ఈకే నిరంజన్‌ పేరుపెట్టారు. ఎన్‌ఎస్ జీలో బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌గా పని చేస్తూ గత ఏడాది జనవరి 2న పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్ పై జరిగిన ఉగ్రదాడిలో నిరంజన్‌ అమరుడైన విషయం తెలిసిందే. ఈ ‘నిరంజన్‌ ఆడిటోరియం’ను కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోర్‌ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ నిరంజన్‌ తండ్రి శివరాజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిరంజన్‌ తల్లి రాధా శివరాజన్‌, సోదరుడు, ఎయిర్‌ఫోర్స్‌ అధికారి శారద్‌ పాల్గొన్నారు.
nation
5,316
06-08-2017 22:48:00
మా అమ్మకు కూడా చాలా ఇష్టం: శృతీహాసన్
‘‘తొలిసారి ఇం టి నుంచి బయటకు వెళ్లి ఉండే అనుభవాన్ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. నేను నా స్కూల్‌ డేస్‌లో ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌ కోసం తొలిసారి కేరళ వెళ్లాను. అందుకే ఇప్పటికీ నాకు కేరళ చాలా స్పెషల్‌’’ అని చెబుతున్నారు శ్రుతీ హాసన్‌. ఆమె మాట్లాడుతూ ‘‘చెన్నైలో నా పాఠశాలలో నన్నెవరూ ‘కమల్‌ హాసన్‌ తనయ’ అనే ట్యాగ్‌ వేసి బుజ్జగించేవారు కాదు. కానీ కేరళ స్కూల్‌కు వెళ్లగానే ‘కమల్‌ మోళే’ అంటూ అందరూ ముద్దు చేయసాగారు. మా నాన్నను వాళ్లెంత అభిమానిస్తారో నాకు అర్థమైంది. కేరళలో చేసే ఫిష్‌ వెరైటీలు, పుట్టు కడల, ఆప్పమ్‌ ఇప్పటికీ నాకు ఇష్టమైన వంటకాలు. మా అమ్మకు కూడా కేరళ అంటే చాలా ఇష్టం. అందుకే ఐ లవ్‌ కేరళ’’ అని వివరించారు శ్రుతీ హాసన్‌.
entertainment
17,080
24-01-2017 01:16:41
సంఘ విద్రోహుల పనే
చెన్నై, తేని, జనవరి 23(ఆంధ్రజ్యోతి): జల్లికట్టు కోసం జరిగిన ఆందోళనల్లోకి సంఘ విద్రోహశక్తులు జొరబడ్డాయని, ఆ శక్తులే విధ్వంసాలకు పాల్పడ్డాయని చెన్నై పోలీసు కమిషనర్‌ జార్జ్‌ ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... విద్యార్థులు శాంతియుతంగానే ఆందోళనలు నిర్వహించారని, సోమవారం ఉదయం కూడా వారు మరో గంటలో మెరీనాను వీడి వెళ్లిపోతామని అధికారులకు చెప్పారన్నారు. అయితే అంతలోనే పొంతనలేని ఆందోళనతో హఠాత్తుగా పోలీసులపై తిరగబడ్డారన్నారు. చెన్నై మొత్తమ్మీద 8 చోట్ల రాళ్లదాడి జరిగిందని చెప్పారు. 40 పోలీసు వాహనాలను, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారన్నారు. 98 చోట్ల రాస్తారోకోలు జరిగాయన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో కథనాలు ప్రసారం చేసిన వారినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.  ఓ పోలీసు ఆటోకు నిప్పు పెట్టడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు.. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి.. సోమవారం నాటి పరిణామాలకు కారణం పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ అని.. ఆ సంస్థ ఆర్థికసాయంతోనే సోమవారం హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపించారు. ‘‘సోమవారం అక్కడ ప్రభాకరన్‌, హఫీజ్‌ సయీద్‌ పోస్టర్లు కనిపించడం మొదలైంది. ప్రస్తుతం ఇది ఐఎ్‌సఐ అండతో నడుస్తున్న ఉద్యమం’’ అని స్వామి పేర్కొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు.. శ్రీశ్రీ రవిశంకర్‌ కూడా ఈ ఆందోళనను అసాంఘిక శక్తుల అదుపులోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని నిరసనకారులకు సూచించారు. మరోవైపు.. నిరసనకారులంతా దయచేసి ఆందోళన విరమించాల్సిందిగా తమిళ సూపర్‌స్టార్స్‌ రజనీకాంత, కమల్‌హాసన్‌ విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా సాగిన వారం రోజుల ఆందోళనలో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించడంతో అటు పోలీసులకు, ఇటు ఉద్యమకారులకు కళంకం అంటిందని రజనీ అన్నారు.
nation
12,620
11-03-2017 02:36:17
పార్టీలకు నగదు విరాళాలు రద్దు: జైదీ
న్యూఢిల్లీ, మార్చి 10: భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు నగదు రూపంలో విరాళాలు అందకపోవచ్చు. అవి తప్పకుండా ఆన్‌లైన్‌ లేదా చెక్కులు లేదా ఇతర క్యాష్‌లెస్‌ మార్గాల్లోనే విరాళాలను సేకరించాల్సి రావొ చ్చు. ఎందుకంటే పార్టీలకు విరాళాలను క్యాష్‌లెస్‌ రూపంలోనే ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. తాజా బడ్జెట్‌లో.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విరాళాల గరిష్ఠ పరిమితిని రూ.20 వేల నుంచి రూ.రెండు వేలకు కుదించారు. ఈ నేపథ్యంలో విరాళాలు మొత్తం ఆన్‌లైన్‌ చేస్తే.. పార్టీల్లో నల్లధనానికి అవకాశమే ఉండదని జైదీ తెలిపారు. ఇదే కాకుండా మరో 8-10 సంస్కరణలు అవసరమని.. వాటినీ తార్కిక ముగింపునకు తీసుకురావాల్సి ఉందన్నారు.
nation
20,048
17-05-2017 01:23:09
ఆ ఆసీస్‌ టూర్‌ ఎంతో కఠినం
ముంబై: ఇరవై నాలుగేళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో 1999 ఆస్ట్రేలియా టూర్‌ అత్యంత కఠినమైనదని బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ అన్నాడు. ‘ఎంతో కఠినమైన సిరీస్‌ ఏదంటే.. నిస్సందేహంగా 1999 ఆసీస్‌ పర్యటనే..! ఆ సమయంలో ఆసీస్‌ టీమ్‌ చాలా బలంగా ఉంది. 11 మందిలో ఏడు, ఎనిమిది మంది మ్యాచ్ విన్నర్లే. ఆ జట్టు ప్రపంచ క్రికెట్‌ను ఎన్నో ఏళ్లు ఏలింది. ఎంతో దూకుడుగా.. తమదైన శైలిలో ఆడేవార’ని సచిన్ మంగళవారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పాడు. నాడు స్టీవ్‌వా నేతృత్వంలోకి ఆసీస్‌ 3-0తో భారత్ ను వైట్‌వాష్‌ చేసింది. కాగా.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రానే బౌలింగ్‌ను ఎదుర్కో వడంలో ఇబ్బంది పడ్డానని సచిన్‌ అన్నాడు.
sports
5,144
09-09-2017 21:30:08
చెన్నైలో మహేష్ అభిమానుల కోలాహలం..
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న తాజాచిత్రం 'స్పైడర్'. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈచిత్ర ఆడియో వేడుకను చెన్నైలోని కలైవానర్ ఆరంగం వేదికపై ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమిళ్, తెలుగు పాటలను అక్కడే విడుదల చేయబోతున్నారు. మహేష్, రకుల్‌లను చూడటానికి పెద్దఎత్తున జనం అక్కడికి తరలివచ్చారు. అభిమానుల కోలాహలంతో స్టేడియం హోరెత్తిపోతోంది. చిత్ర యూనిట్‌తో పాటు ఆర్జే బాలాజీ, తమిళ హీరో విశాల్ సహా తదితరులు వేడుకకు హాజరయ్యారు. హరీష్ జైరాజ్ సంగీత సారథ్యంలో రానున్న ఈసినిమా సెప్టెంబర్ 27న భారీఎత్తున విడుదలకానుంది. ఈ సందర్బంగా వేదికపై మాట్లాడిన ఆర్జే బాలాజీ..'ఇంతవరకూ నేను కమల్, రజనీ, విజయ్, అజిత్ లాంటి హీరోలతో కలసి నటించలేదు. మొదటిసారి ఈ చిత్రంలో మహేష్‌తో కలసి నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. మహేష్ చక్కగా తమిళ్ మాట్లాడుతూ జోకులేస్తుంటారు. ఆయనతో నటించడం ఓ గొప్ప అనుభూతి. మహేష్ తన అభిమానులతో ఫోటోలు దిగేందుకు ఎప్పుడూ నిరాకరించారు. అదే మహేష్ స్టార్ డమ్' అని ఆర్జే బాలాజీ అన్నాడు.
entertainment
21,231
22-10-2017 04:20:19
కివీస్‌ అసాధారణంగా ఆడాలి: కృష్ణమాచారి శ్రీకాంత్‌
భారత్‌తో జరిగే స్వల్ప సిరీస్‌లో కోహ్లీసేన ను కంగుతినిపించాలంటే పర్యాటక కివీస్‌ జట్టు అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు మరోసారి యువ క్రికెట ర్లకు అవకాశాలు ఇస్తారని భావిస్తున్నా. స్వదేశంలో ఓ సాధారణ జట్టుపై సత్తా చాటేందుకు యువ ఆటగాళ్లకు ఇంతకంటే చక్కటి అవకాశం లభించబోదు. రాబోయే కాలంలో భారత్‌ పలు విదేశీ సిరీస్‌ల్లో ఆడాల్సి ఉంది. పటిష్ఠ దక్షిణాఫ్రికా, ఆసీస్‌, ఇంగ్లండ్‌లతో తలపడాల్సి ఉన్న తరుణంలో ముఖ్యంగా బ్యాటింగ్‌ విభాగం రిజర్వ్‌ బెంచ్‌ను మరింత పరీక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే శ్రీలంక, సౌతాఫ్రికా పర్యటనలకు సిద్ధమయ్యేందుకుగాను సీనియర్‌ ఆటగాళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరమూ ఉంది. ఇక ఆస్ర్టేలియాతో పోలిస్తే..న్యూజిలాండ్‌ మెరుగైన ఆల్‌రౌండ్‌ జట్టు. వారి బ్యాటింగ్‌ కేన్‌ విలియమ్సన్‌పై ఎక్కువగా ఆధారపడినా అవసరమైనప్పుడు సమష్టిగా రాణించగల సామర్థ్యమూ ఆ జట్టు సొంతం. అందుకే.. సంచలనాలు సృష్టించే సత్తా కివీస్‌కు లేకపోలేదు. భారత్‌ విజయాలు సహజంగానే ఓపెనర్లతోపాటు కోహ్లీపై ఆధారపడి ఉన్నాయి.(టీసీఎం)
sports
2,887
06-06-2017 02:05:28
మార్కెట్‌లో ‘పార్లే’ పప్పులు
ముంబై: ఇప్పటి వరకు బిస్కెట్లు, మిఠాయిల వ్యాపారంలో ఉన్న పార్లే ప్రొడక్ట్స్‌ కంపెనీ ఇపుడు ప్రీమియం పప్పుల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న మహారాష్ట్రలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ‘ఫ్రెష్‌ హార్వెస్ట్‌’ పేరుతో కందిపప్పు, మినప పప్పు, పెసర పప్పు,శనగ పప్పు, మసూర్‌ దాల్‌ విడుదల చేసింది. వచ్చే 12 నెలల్లో దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. నాణ్యమైన పప్పు ధాన్యాలకు వినియోగదారుల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్కెట్‌లో ప్రవేశించినట్టు తెలిపింది.
business
21,222
25-01-2017 00:20:13
మొదటి చాయిస్‌ సాహానే..!
చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ముంబై: భారత జట్టులో కీపింగ్‌ విషయంలో వృద్ధిమాన్‌ సాహా నెం:1 చాయిస్‌ అని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. దీంతో రాబోయ్‌ సీరిస్‌‌ల్లో భారత టెస్ట్‌ టీమ్‌లో సాహాకు చోటు దక్కనుందని ప్రసాద్‌ పరోక్షంగా సంకేతాలిచ్చాడు. ఇరానీ కప్‌లో గుజరాతతో జరిగిన మ్యాచ్‌లో సాహా ద్విశతకంతో రెస్టాఫ్‌ ఇండియాను గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్‌ సాహా ఫిట్‌నెస్‌ పరీక్ష కోసమే కానీ అతడి ఫామ్‌ను గురించి కాదన్నాడు.  ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సాహాకు గాయం కావడంతో అతడి స్థానంలో పార్థివ్‌ పటేల్‌ జట్టులోకి వచ్చాడు. ‘ప్రస్తుతానికి సాహా, పార్థివ్‌లు భారత్ నంబర్‌ 1, 2 కీపర్లు. ఈ మ్యాచ్‌ సాహా ఫిట్‌నెస్‌ టెస్ట్‌ మాత్రమేన’ని ఎమ్మెస్కే చెప్పాడు. పార్థివ్‌ కీపింగ్‌ నాణ్యత పెరిగింది.. కానీ సాహాది అంతకంటే మెరుగ్గా ఉందన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధోనీ, యువరాజ్‌ సింగ్‌ ప్రదర్శనను ఎంతో ప్రశంసించాడు. అయితే 2019 వరల్డ్‌కప్‌ వరకు వారు జట్టులో ఉంటారా? అనేది ఇంత ముందుగా చెప్పలేనన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా మిడిలార్డర్‌పై కొంత ఆందోళన నెలకొనడంతో యువీకి అవకాశం కల్పించామని చెప్పాడు. కేదార్‌ జాదవ్‌, యువీ ఆట చూసిన తర్వాత ఎంతో ధైర్యంగా ఉందని ప్రసాద్‌ అన్నాడు. ఓపెనింగ్‌పై మాట్లాడుతూ.. రోహిత్ శర్మ జట్టులోకి వస్తే అంతా సర్దుకుంటుందన్నాడు.
sports
1,949
22-06-2017 00:35:02
అలెంబిక్‌ రక్తపోటు ఔషధానికి అనుమతి
రక్తపోటు చికిత్సలో ఉపయోగించే కాండెసార్టాన్‌ సెలిక్సెటిల్‌ టాబ్లెట్లను అమెరికా మార్కెట్‌లో విడుదల చేయడానికి ఎఫ్‌డిఎ అనుమతి లభించినట్టు అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రకటించింది. ఆస్ర్టాజెనికా ఫార్మాకు చెందిన అటాకాండ్‌ టాబ్లెట్లకు ఇవి సమానమైనవని, అమెరికాలో ఈ టాబ్లెట్లకు 2.7 కోట్ల డాలర్ల మార్కెట్‌ ఉన్నదని పేర్కొంది.
business
11,403
10-07-2017 02:29:08
ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్‌
అహ్మదాబాద్‌, జూలై 9: తొలిసారిగా మన దేశంలోని ఓ నగరం ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందింది. అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. ‘భారత్‌లోని చారిత్రక నగరమైన అహ్మదాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరాల జాబితాలో చేరుస్తున్నాం’ అని యునెస్కో తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. అహ్మదాబాద్‌ను యునెస్కో వారసత్వ నగరంగా ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ హర్షం వ్యక్తం చేశారు.
nation
12,132
19-04-2017 20:52:03
అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్న ఉమాభారతి
న్యూఢిల్లీ: అయోధ్యలో పర్యటించి ప్రార్థనలు జరపనున్నట్టు ప్రకటించిన కేంద్ర మంత్రి ఉమాభారతి తన పర్యటనను చివరి నిమిషంలో విరమించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు బుధవారం రాత్రి కైఫియత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆమె టిక్కెట్లు బక్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె మీడియాతో చెప్పారు కూడా. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వివిధ అంశాలపై చర్చించేందుకు పార్టీ కోర్ గ్రూప్‌తో మోదీ సమావేశానంతరం ఉమాభారతి తన అయోధ్య పర్యటనను విరమించుకున్నట్టు చెబుతున్నారు. అయితే బీజేపీ కోర్ గ్రూ‌ప్‌లో ఆమె లేరు. కాగా, బీజేపీ చీఫ్ అమిత్‌ షాను ఉమాభారతి కలుసుకుని తన అయోధ్య పర్యటనను విరమించుకున్నట్టు తెలిపారు. అయోధ్య పర్యటన రద్దయిన నేపథ్యంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎంసీడీ ఎన్నికల ప్రచారంలో ఉమాభారతి పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
nation
16,189
21-12-2017 12:09:15
మీడియాకు స్వీట్లు పంచిన స్టాలిన్
చెన్నై: 2జీ కుంభకోణం కేసులో డీఎంకే నేత కనిమొళి, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది 'చరిత్రాత్మక తీర్పు' అని ఆయన అభివర్ణించారు. తీర్పు వెలువడగానే చైన్నైలోని స్టాలిన్, కనిమొళి ఇళ్లముందు కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సందడి చేశారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు వెలుపల కూడా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్టాలిన్ స్పందన కోసం ఆయన ఇంటికి వేరుకున్న మీడియా సిబ్బందికి స్టాలిన్ స్వయంగా స్వీట్లు పంచిపెట్టారు. 'తీర్పు చరిత్రాత్మకం. డీఎంకేను నాశనం చేసేందుకు కేసు పెట్టారు. పార్టీ ఎలాంటి తప్పూ చేయలేదని కోర్టు తీర్పుతో తేటతెల్లమైంది' అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. అన్ని స్కామ్‌ల విషయంలో మీడియా ఎంత ఉత్సాహంగా పనిచేసిందో అంతే ఉత్సాహంగా కోర్టు ఇచ్చిన తాజా తీర్పును కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. కాగా, కనిమొళి తల్లి రాజతైఅమ్మాళ్ కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. న్యాయమే గెలిపిచిందని అన్నారు. 'ఇప్పుడు నా కూతురికి, తక్కిన వారికి విముక్తి లభించింది' అని ఆమె అన్నారు. ఇది తప్పుడు కేసు అని తాము మొదట్నించీ చెబుతూనే ఉన్నామని, కోర్టు తీర్పుతో నిజం నెగ్గిందని డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళాంగోవన్ అన్నారు.
nation
6,433
23-06-2017 16:14:55
ప్రభాస్‌ ఆ డైరెక్టర్‌ను సీక్రెట్‌గా కలిశాడా?
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా తెలుగు, తమిళంతోపాటు హిందీలో కూడా భారీగా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ గురించి హిందీ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభాస్‌ ఇప్పటికే బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌జోహార్‌తో భారీ డీల్‌ కుదుర్చుకున్నాడని బాలీవుడ్‌ మీడియా రాసింది. తాజాగా ప్రభాస్‌ ఓ బాలీవుడ్‌ డైరెక్టర్‌ను సీక్రెట్‌గా కలిశాడని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ డైరెక్టర్‌ సాజిద్‌ నదియాద్‌వాలాను ప్రభాస్‌ సీక్రెట్‌గా కలిశాడన్నది ఆ వార్తల సారాంశం. కృతిసనోన్‌, టైగర్‌ ష్రాఫ్‌ వంటి నటులను బాలీవుడ్‌కు పరిచయం చేసింది సాజిద్‌నే. అందుకే తన బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఆయన చేతుల మీదుగానే జరగాలని ప్రభాస్‌ అనుకుంటున్నాడట. అందుకే సాజిద్‌ను రహస్యంగా కలిశాడని అంటున్నారు. మరి, ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే
entertainment
6,248
12-08-2017 15:45:51
స్వాతంత్ర్యదినోత్సవం రోజు రవితేజ కొత్తఅవతారం
మాస్ మహారాజా రవితేజ స్వాతంత్ర్యదినోత్సవం రోజు 'రాజా ది గ్రేట్' రూపంలో ఓ కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్తచిత్రం 'రాజా ది గ్రేట్'. దిల్‌రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈచిత్రంలో రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రానికి ఎస్.థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్ర టీజర్‌ను భారత స్వాతంత్ర్యదినోత్సవం రోజైన ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటిక్రితం నిర్మాత దిల్‌రాజు ప్రకటించాడు. ఈ సినిమాలో రవితేజను ముందెన్నడూ చూడనటువంటి కొత్తఅవతారంలో చుపిస్తున్నామని తెలిపాడు. రాజా కొత్త అవతారంలో వస్తున్నాడంటూ చిత్ర దర్శకుడు అనిల్ రావుపూడి కూడా ట్వీట్ పెట్టాడు. అతిత్వరలో విడుదలచేయాలని సన్నాహాలు చేస్తున్న ఈచిత్రం రవితేజ అంధుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈసినిమాతో పాటు రవితేజ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రాశిఖన్నా, సీరత్ కపూర్‌లతో జంటగా 'టచ్ చేసి చూడు' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
entertainment
5,851
30-12-2017 17:00:28
బాలయ్యపై నయనతార సంచలన వ్యాఖ్యలు
నందమూరి నటసింహం బాలకృష్ణ, బ్యూటీ క్వీన్ నయనతారల కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. అవే ‘సింహా, శ్రీరామరాజ్యం’. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న చిత్రం ‘జైసింహా’. షూటింగ్ అనంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందనే విషయం తెలిసిందే. తాజాగా నయనతార ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలకృష్ణకి, తనకి మధ్య ఉన్న బంధం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణగారిని అందరూ హీరోగా, కోస్టార్‌గా చూస్తారు. నేను మాత్రం ఆయనని తండ్రిలా భావిస్తాను. ఆయనని చూడగానే నాకు దణ్ణం పెట్టాలనిపిస్తుంది. అంత సౌమ్యుడు. ఆయనతో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాను. ఏ సినిమా విషయంలో కూడా ఆయనతో నాకు ఇబ్బంది కలగలేదు. అన్ని విషయాల్లో నా పట్ల జాగ్రత్త తీసుకుంటూ, ఒక తండ్రిలా నాకు మద్దతుగా నిలుస్తారు. ఆయనతో కలసి నటించడమంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. నా సొంత కుటుంబ సభ్యుడిగానే బాలకృష్ణగారిని భావిస్తాను..’’ అంటూ తెలిపారు. నయనతార చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బాలయ్య ‘పైసా వసూల్’ సినిమాపై కొన్ని ప్రశ్నలు  మన హీరోల రాజకీయాలపై స్పెషల్ క్విజ్
entertainment
8,918
23-04-2017 12:52:44
‘బాబు’ కంటే శ్రీముఖియే బిజీగా ఉందట!
బుల్లితెర మీద స్టార్‌ స్టేటస్‌ అనుభవిస్తోంది యాంకర్‌ శ్రీముఖి. రకరకాల ప్రోగ్రామ్‌లు, గేమ్‌ షోలు, స్టేజ్‌ షోలతో ఫుల్‌ బిజీగా ఉంది. వాటితోపాటే సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. ఆమె హీరోయిన్‌గా నటించిన అడల్డ్‌ కామెడీ మూవీ ‘బాబు బాగా బిజీ’ త్వరలో విడుదల కానుంది.
entertainment
2,180
04-09-2017 23:40:36
డిక్సన్‌టెక్‌ ఇష్యూ రేపే
ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తుల తయారీలోని డిక్సాన్‌ టెక్నాలజీస్‌ ఇష్యూ బుధవారం మార్కెట్లోకి రానుంది. ఇష్యూ ద్వారా 600 కోట్ల రూపాయలు సేకరించాలన్నది లక్ష్యంగా కంపెనీ ప్రకటించింది. ఇష్యూ ద్వారా సమకూరే నిధులను ప్లాంట్‌ విస్తరణకు, రుణభారం తగ్గించుకోవడానికి వినియోగించుకుంటామని పేర్కొంది.
business
7,585
06-06-2017 16:09:03
ఆ విషయంలో రాజమౌళి నా మాట విన్లేదు: కీరవాణి
 ‘రాజమౌళి నాకు కథ చెప్పే సమయంలో ఇది రెండు భాగాలు కాదు. ఒకే భాగంగా తెరకెక్కిద్దామనుకున్నారు. అయితే ఆ తర్వాత రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకున్నారు. అప్పుడు రాజమౌళి నా సలహా అడిగాడు. రెండు భాగాలుగా విడుదల చేయాలంటే ఎన్నో కష్టాలు పడాలి. ఎంతోమంది టెక్నీషియన్స్‌ను పెట్టుకోవాలి. అందుకే కథను కొద్దిగా ట్రిమ్‌ చేసి ఒకే భాగంగా తీయమన్నా. అయితే రాజమౌళి, నిర్మాతలు రెండు భాగాలుగా విడుదల చేయడానికే డిసైడ్‌ అయ్యారు. రెండూ విజయవంతమయ్యాయి. నా తీర్పు తప్పైనందుకు చాలా సంతోషంగా ఉంది. రెండు భాగాలుగా విడుదల కావడం వల్లే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించగలిగింద’ని కీరవాణి చెప్పారు.
entertainment
17,815
14-12-2017 02:37:15
ఎమ్మార్పీని మించి అమ్ముకోవచ్చు: సుప్రీం
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు మంచినీటి సీసాలను గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ) కంటే ఎక్కువకు అమ్ముకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మంచినీటి సీసాలు, ఇతర ప్యాకేజ్డ్‌ ఉత్పత్తులపై ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఇవికూడా సేవల కిందకే వస్తాయని, తూనికలు, కొలతల చట్టం వర్తించదన్నది. భారత హోటల్‌, రెస్టారెంట్‌ సంఘాల సమాఖ్య(ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది.
nation
3,262
06-10-2017 03:56:42
ఆదివాసుల్ని బతకనీయండి!
ఆదివాసులు నోరు లేనోళ్ళు. అడవిలో అడివై బతికే వాళ్ళను అడవి నుండి బయటకు వెళ్ళమంటే అడివినే అడివిలోంచి వెళ్ళమన్నట్టుంటుంది. ఆదివాసుల పట్ల అమానవీయత పనికిరాదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కొద్దిమంది రచయితలం, కవులం గుత్తికోయల మీద విధ్వంసం జరిగిన జలగలంచకు సెప్టెంబర్‌ 22న వెళ్లాం. వరంగల్‌ నుండి తాడ్వాయికి వెళ్ళే మార్గంలో, తాడ్వాయి మండలానికి దగ్గరగా ఉన్న లవ్వాల బస్టేజి వద్ద దిగాం. అక్కడి నుండి కాలిబాట. ఎగుడుదిగుళ్ళ బాట. దారిలో వెళ్తుంటే రెండు చిన్న వాగులు వచ్చాయి. పాదాలు మునిగే ప్రవాహం లవ్వాల స్టేజీ దగ్గర నుండి అడవి దట్టంగా మొదలై వెళ్తుంటే ఇంకా చిక్కబడ్తుంది. చిన్న చిన్న టేకు మొక్కలు, ఇప్ప చెట్లు, ఇతర చెట్లు కన్పిస్తున్నాయి. ఎక్కడా పెద్ద టేకు చెట్లు కాని, జిట్రేగు కాని, పెద్దేగ కాని కన్పించడం లేదు. గుత్తికోయల గూడెం చుట్టూ దట్టమైన అడవి. 18, 20 సంవత్సరాల నుండి జలగలంచ వారి నివాసం. మైదాన ప్రాంతీయులు గనుక అడవిలో నివాసముంటే ఆ ప్రాంతమంతా మైదానమయ్యేదే! కాని కోయలు, వారి గుడిసెలు, సాగు కూడా దగ్గరకు పోయే వరకు మనం గుర్తించలేం. మైదాన ప్రాంత వ్యవసాయంలోని ఆత్మహత్యల సాంప్రదాయం, ఆదివాసుల పోడు వ్యవసాయంలో లేదు. వారు అడవికి రక్షణ. అడవి వారికి రక్షణ. అడవి నరికి, అడవిలో అద్దాల మేడ కట్టుకున్న ఆదివాసెవరున్నారు? నిజానికి సెప్టెంబర్‌ 26వ తేదీన నాలుగు ఎడ్లబండ్లలో కలప తరలిస్తున్న స్మగ్లర్లు ఇద్దర్ని పట్టుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి ఫారెస్టోళ్ళు తరలిస్తాంటే దారికాచి 50 మంది దుండగులు గొడ్డళ్ళు, రాళ్ళతో దాడిచేసి, ఫారెస్టోళ్ళను తరిమి పట్టుబడినవారిని తీసుకొనిపోయినట్టు పత్రికల్లో చదివాం. అలాగే 28 నాడు 8 ఎడ్లబండ్లల్లో భూపాలపల్లికి స్మగ్లర్లు తరలిస్తుంటే ఫారెస్టోళ్ళు పట్టుకున్నట్టు పత్రికల్లో వార్తలొచ్చాయి. నాటి కుంరం భీం నుంచి నేటి జలగలంచ, దేవునిగుట్ట దాక అడవిని నాశనం చేస్తున్న వారు రాజ్యం కనుసన్నల్లో కదలాడుతున్న వారే కాని ఆదివాసులు కాదు. 200మంది ఫారెస్టోళ్ళు సెప్టెంబర్‌ 16న ఉదయం 8గంటల నుండి సాయం త్రం 4 గంటల వరకు జలగలంచ మీద విధ్వంసానికి తెగబడ్డారు. నిజాం కాలంలో కుంరం భీం సంకెనపెల్లి గూడెంలో చూచిన చాలా అనుభవాలు జలగలంచలో కూడా పిల్లలు చవిచూశారు. గుడిసెలు దుగ్గుదుగ్గు అయ్యాయి. తిరిగి గుడిసెల కోసం కర్రలను అడవి నుండి సేకరించుకోవాల్సిన పరిస్థితులు ఫారెస్టోళ్ళే కల్పించారు. కుంజం ఆర్మయ్య ఇంటిలోని 5 సేర్ల ఇప్పసార తాగాక ఫారెస్టోళ్ళ వీరంగానికి హద్దు లేకుండా పోయింది.  గర్భవతులని కూడా చూడకుండా మడావి అయితమ్మ, మునితల మీద విరుచుకుపడ్డారు. గర్భానికి తగిలిన దెబ్బలతో అయితమ్మ మేము వెళ్ళేనాటికి బాధపడుతుంటే, మునితకు సరిగా నడవరావడం లేదన్నారు. ఈ విషయం చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీల చీరల్ని లాగి, ఆ చీరలతోనే వారిని ఇప్పచెట్టుకు కట్టేయడం, కొట్టడం జరిగింది. ఆదివాసీల హాహాకారాలు, ఆర్తనాదాల మధ్య దుశ్శాసనపర్వం నిరాటంకంగా సాగింది. అడవిలో ఆకు పెరిగినట్టు, చెట్టు పెరిగినట్టు, జంతువులు పెరిగినట్టు స్వేచ్ఛగా ఆదివాసులూ పెరిగారు. ఆకు తెంపిండ్రనో, పోడు కొట్టిండ్రనో, జంతువును వేటాడిండ్రనో ఆదివాసుల పట్ల అమానవీయత పనికిరాదు. ప్రభుత్వం దగ్గరకు వాళ్ళను లాక్కొచ్చుకోవడం కాదు. వారి దగ్గరికే ప్రభుత్వం వెళ్ళాలి. అడవిలోనే వారి అభివృద్ధికి సహకరించాలి కాని, వారి మీద కేసులు పెట్టి, విధ్వంసానికి పూనుకోవడం ప్రభుత్వాలకు న్యాయం కాదు. పోలవరంలో ఆదివాసీలను ముంచి తెచ్చుకున్న తెలంగాణ, అడవిలో ఉన్న ఆదివాసీలకు శాపం కాకూడదు. జలగలంచైనా, దేవునిగుట్టైనా, ఆదివాసుల జీవితాన్ని ఆదివాసుల్నే బతకనీయండి. అడవుల్ని ధ్వంసం చేస్తున్నదెవరో, అడవులు నరికి కోట్లు సంపాదిస్తున్నదెవరో పాలకులకు తెలియంది కాదు. ‘‘ఈ గాలి, ఈ నీరు, ఇక్కడి ఆకాశం మొత్తం మనవైనప్పుడు, ఈ భూమి, ఈ అడవి మాత్రమే వాళ్ళవెట్లా అయినవి’’ కుంరం భీం బాలునిగా ఉన్నప్పుడు సంకెనపల్లి గూడెం, ఆదిలాబాద్‌ అడవుల్లో తన వదినె కుకుబాయితో నిజాం జంగ్లాతోళ్ళకు వ్యతిరేకంగా వేసిన ప్రశ్న. ఇది ప్రభుత్వం 9వ తరగతి తెలుగు పాఠ్య గ్రంథంలో ప్రచురించిన ‘కుంరం భీం’ ఉపవాచక పాఠ్యాంశంలోనిది. నిజాం కాలంలో కుంరం భీం వేసిన ప్రశ్న ఇవ్వాల్టి గుత్తికోయ పిల్లవాడి బుర్రలోనూ తిరుగుతోంది.వడ్డెబోయిన శ్రీనివాస్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కొద్దిమంది రచయితలం, కవులం గుత్తికోయల మీద విధ్వంసం జరిగిన జలగలంచకు సెప్టెంబర్‌ 22న వెళ్లాం. వరంగల్‌ నుండి తాడ్వాయికి వెళ్ళే మార్గంలో, తాడ్వాయి మండలానికి దగ్గరగా ఉన్న లవ్వాల బస్టేజి వద్ద దిగాం. అక్కడి నుండి కాలిబాట. ఎగుడుదిగుళ్ళ బాట. దారిలో వెళ్తుంటే రెండు చిన్న వాగులు వచ్చాయి. పాదాలు మునిగే ప్రవాహం లవ్వాల స్టేజీ దగ్గర నుండి అడవి దట్టంగా మొదలై వెళ్తుంటే ఇంకా చిక్కబడ్తుంది. చిన్న చిన్న టేకు మొక్కలు, ఇప్ప చెట్లు, ఇతర చెట్లు కన్పిస్తున్నాయి. ఎక్కడా పెద్ద టేకు చెట్లు కాని, జిట్రేగు కాని, పెద్దేగ కాని కన్పించడం లేదు. గుత్తికోయల గూడెం చుట్టూ దట్టమైన అడవి. 18, 20 సంవత్సరాల నుండి జలగలంచ వారి నివాసం. మైదాన ప్రాంతీయులు గనుక అడవిలో నివాసముంటే ఆ ప్రాంతమంతా మైదానమయ్యేదే! కాని కోయలు, వారి గుడిసెలు, సాగు కూడా దగ్గరకు పోయే వరకు మనం గుర్తించలేం. మైదాన ప్రాంత వ్యవసాయంలోని ఆత్మహత్యల సాంప్రదాయం, ఆదివాసుల పోడు వ్యవసాయంలో లేదు. వారు అడవికి రక్షణ. అడవి వారికి రక్షణ. అడవి నరికి, అడవిలో అద్దాల మేడ కట్టుకున్న ఆదివాసెవరున్నారు? నిజానికి సెప్టెంబర్‌ 26వ తేదీన నాలుగు ఎడ్లబండ్లలో కలప తరలిస్తున్న స్మగ్లర్లు ఇద్దర్ని పట్టుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి ఫారెస్టోళ్ళు తరలిస్తాంటే దారికాచి 50 మంది దుండగులు గొడ్డళ్ళు, రాళ్ళతో దాడిచేసి, ఫారెస్టోళ్ళను తరిమి పట్టుబడినవారిని తీసుకొనిపోయినట్టు పత్రికల్లో చదివాం. అలాగే 28 నాడు 8 ఎడ్లబండ్లల్లో భూపాలపల్లికి స్మగ్లర్లు తరలిస్తుంటే ఫారెస్టోళ్ళు పట్టుకున్నట్టు పత్రికల్లో వార్తలొచ్చాయి. నాటి కుంరం భీం నుంచి నేటి జలగలంచ, దేవునిగుట్ట దాక అడవిని నాశనం చేస్తున్న వారు రాజ్యం కనుసన్నల్లో కదలాడుతున్న వారే కాని ఆదివాసులు కాదు. 200మంది ఫారెస్టోళ్ళు సెప్టెంబర్‌ 16న ఉదయం 8గంటల నుండి సాయం త్రం 4 గంటల వరకు జలగలంచ మీద విధ్వంసానికి తెగబడ్డారు. నిజాం కాలంలో కుంరం భీం సంకెనపెల్లి గూడెంలో చూచిన చాలా అనుభవాలు జలగలంచలో కూడా పిల్లలు చవిచూశారు. గుడిసెలు దుగ్గుదుగ్గు అయ్యాయి. తిరిగి గుడిసెల కోసం కర్రలను అడవి నుండి సేకరించుకోవాల్సిన పరిస్థితులు ఫారెస్టోళ్ళే కల్పించారు. కుంజం ఆర్మయ్య ఇంటిలోని 5 సేర్ల ఇప్పసార తాగాక ఫారెస్టోళ్ళ వీరంగానికి హద్దు లేకుండా పోయింది.  గర్భవతులని కూడా చూడకుండా మడావి అయితమ్మ, మునితల మీద విరుచుకుపడ్డారు. గర్భానికి తగిలిన దెబ్బలతో అయితమ్మ మేము వెళ్ళేనాటికి బాధపడుతుంటే, మునితకు సరిగా నడవరావడం లేదన్నారు. ఈ విషయం చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివాసీల చీరల్ని లాగి, ఆ చీరలతోనే వారిని ఇప్పచెట్టుకు కట్టేయడం, కొట్టడం జరిగింది. ఆదివాసీల హాహాకారాలు, ఆర్తనాదాల మధ్య దుశ్శాసనపర్వం నిరాటంకంగా సాగింది. అడవిలో ఆకు పెరిగినట్టు, చెట్టు పెరిగినట్టు, జంతువులు పెరిగినట్టు స్వేచ్ఛగా ఆదివాసులూ పెరిగారు. ఆకు తెంపిండ్రనో, పోడు కొట్టిండ్రనో, జంతువును వేటాడిండ్రనో ఆదివాసుల పట్ల అమానవీయత పనికిరాదు. ప్రభుత్వం దగ్గరకు వాళ్ళను లాక్కొచ్చుకోవడం కాదు. వారి దగ్గరికే ప్రభుత్వం వెళ్ళాలి. అడవిలోనే వారి అభివృద్ధికి సహకరించాలి కాని, వారి మీద కేసులు పెట్టి, విధ్వంసానికి పూనుకోవడం ప్రభుత్వాలకు న్యాయం కాదు. పోలవరంలో ఆదివాసీలను ముంచి తెచ్చుకున్న తెలంగాణ, అడవిలో ఉన్న ఆదివాసీలకు శాపం కాకూడదు. జలగలంచైనా, దేవునిగుట్టైనా, ఆదివాసుల జీవితాన్ని ఆదివాసుల్నే బతకనీయండి. అడవుల్ని ధ్వంసం చేస్తున్నదెవరో, అడవులు నరికి కోట్లు సంపాదిస్తున్నదెవరో పాలకులకు తెలియంది కాదు. ‘‘ఈ గాలి, ఈ నీరు, ఇక్కడి ఆకాశం మొత్తం మనవైనప్పుడు, ఈ భూమి, ఈ అడవి మాత్రమే వాళ్ళవెట్లా అయినవి’’ కుంరం భీం బాలునిగా ఉన్నప్పుడు సంకెనపల్లి గూడెం, ఆదిలాబాద్‌ అడవుల్లో తన వదినె కుకుబాయితో నిజాం జంగ్లాతోళ్ళకు వ్యతిరేకంగా వేసిన ప్రశ్న. ఇది ప్రభుత్వం 9వ తరగతి తెలుగు పాఠ్య గ్రంథంలో ప్రచురించిన ‘కుంరం భీం’ ఉపవాచక పాఠ్యాంశంలోనిది. నిజాం కాలంలో కుంరం భీం వేసిన ప్రశ్న ఇవ్వాల్టి గుత్తికోయ పిల్లవాడి బుర్రలోనూ తిరుగుతోంది.వడ్డెబోయిన శ్రీనివాస్‌
editorial
8,893
13-05-2017 01:04:43
సావిత్రి కథలో భానుప్రియ
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపుదిద్దుకొనే ‘మహానటి’ చిత్రంలో సీనియర్‌ హీరోయిన్ భానుప్రియ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఆ పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌ అంటున్నారు దర్శకుడు నాగ అశ్విన్‌. సి. అశ్వినీదత్  సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాని నిర్మించనున్నారు. నాగ్‌ అశ్విన్ దర్శకుడు. కీర్తి సురేశ్ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. సమంత ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్ పోషిస్తారు. ఈ నెలాఖరు నుంచి చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. మిక్కీ జె మేయర్‌ సంగీత సారథ్యంలో రెండు పాటలు రికార్డ్‌ చేశారు. ఈ చిత్రానికిగానూ ఇప్పటికే వెటరన్ యాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, విజయ్‌ దేవరకొండ సంతకం చేశారు.
entertainment
6,078
20-11-2017 16:03:11
పవన్‌కి వచ్చిన అవార్డుపై కేసీఆర్ స్పందించాడట!
కాదేది సోషల్ మీడియాకి అనర్హం అన్నట్లుగా ఉంది కొందరు నెటిజన్లు చేస్తున్న పోస్ట్‌లు చూస్తుంటే. లేకపోతే ఏంటి? కేసీఆర్ ఏంటి? పవన్ కల్యాణ్ కి వచ్చిన అవార్డు గురించి రియాక్ట్ అవడం ఏంటి? చదువుతుంటేనే వింతగా ఉంది కదా! లండన్‌లో పవన్ కల్యాణ్ అందుకున్న అవార్డుపై కేసీఆర్ స్పందించినట్లుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ హల్‌చల్ చేస్తోంది. ఈ పోస్ట్‌ని షేర్ చేస్తూ కేసీఆర్‌కి జేజేలు కొడుతున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు. ఇక ఈ పోస్ట్‌లో ఉన్న మ్యాటర్ విషయానికి వస్తే.. ‘‘ఇది తెలుగువాడికి దక్కిన అరుదైన గౌరవం. దీన్ని సామాజికంగా చూడాలి తప్ప రాజకీయంగా చూడకూడదు. ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ అవార్డు’’ అంటూ పవన్ కల్యాణ్‌కి వచ్చిన అవార్డుపై కేసీఆర్ స్పందించినట్లుగా అభిమానులు పోస్ట్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే కేసీఆర్ ఎప్పుడు, ఎక్కడ ఈ అవార్డు గురించి ప్రస్తావించాడనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నెల వేతనం ఎంతంటే.. వివాదాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా?
entertainment
21,408
28-01-2017 19:11:03
క్రికెటర్ జడేజా కారుకు ప్రమాదం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కారుకు యాక్సిడెంట్ అయ్యింది. జడేజా తన భార్య రీవా సోలంకితో పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ కారు వెనకవైపు నుంచి ఒక మోపెడ్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో జడేజా దంపతులకు ప్రమాదమేమీ కాలేదు. అయితే విద్యానగర్‌లో చదువుకుంటున్న ప్రీతీ శర్మ అనే విద్యార్ధినికి మాత్రం ఈ ప్రమాద ఘటనలో గాయాలయ్యాయి. జడేజా వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఆమెకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని, ఎటువంటి ప్రమాదం కాలేదని సమాచారం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత 28 సంవత్సరాల జడేజాకు సెలక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
sports
5,420
23-06-2017 20:54:51
మళ్లీ హీరోగా అరవింద్ స్వామి
విలనిజానానికి కొత్త గ్లామర్ అద్దిన అరవింద్ స్వామి.. ఇప్పుడు మళ్లీ హీరోయిజంపై మోజుపడుతున్నాడట. ఒకానొక సమయంలో లవర్ బోయ్‌గా అమ్మాయిల మనసులు కొల్లగొట్టిన ఈ మెరుపు కలల హీరో.. మళ్లీ ఆ క్రేజ్‌ను రీక్రియేట్ చేసేందుకు నడుంబిగించాడట. ఇటీవలే ధృవ మూవీతో ప్రేక్షకులను అలరించిన అరవింద్ స్వామి.. తమిళనాట బీజీయెస్ట్ విలన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇకపై ఇదే విధంగా అలరిస్తానంటూ స్వామి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాడు. కానీ, ఇప్పుడు ఈ సినియర్ హీరో మనసు మార్చుకున్నాడని తెలుస్తోంది. మరోసారి తనలోని రొమాంటిక్ యాంగిల్‌ని తట్టిలేపిన అరవింద్ స్వామి ఒకేసారి నలుగురు ముద్దుగుమ్మల‌తో ఆడిపాడబోతున్నాడట. మ్యాజిక్ బాక్స్ బ్యానర్‌పై సెల్వ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రాల్లో అరవింద్ స్వామి హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో స్వామి ఏకంగా నలుగురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడట. సిమ్రాన్, రితికా సింగ్, నందితా శ్వేత, చాందినీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే అరవింద్ స్వామి, సిమ్రాన్ ఇందులో పోలీస్ ఆఫీసర్లగా కన్పించబోతున్నారని తెలుస్తోంది. మరీ లాంగ్ గ్యాప్ తర్వాత లవర్ బోయ్‌గా అవతారమెత్తబోతున్న అరవింద్ స్వామి ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తాడో చూడాలి.
entertainment
10,727
18-08-2017 22:13:15
బోయపాటి నన్ను ఆదుకున్నాడు: జగపతి
కృష్ణా: "మంచి సినిమా కోసం మూడేళ్లు వేచి చూశా.. ఇంట్లో ఖాళీగా కూర్చోని ల్యాండ్ ఫోన్, మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఒక్క అవకాశం ఇస్తారా అని వేచి చూశాను" అని జగపతి బాబు అన్నారు. ఇక సినిమా అవకాశాలు రావేమో అనుకున్న టైంలో బోయపాటి శ్రీను ఆదుకున్నాడని ఆయన చెప్పారు. అయితే అభిమానులెప్పుడూ తనతోనే ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్బంగా "జిట్టు మొండోడు... చంపుతా లేకుంటే చస్తా" అంటూ లెజెండ్ డైలాగ్ చెప్పారు జగపతి. తనకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి.. దాన్ని మంచిగా డిజైన్ చేయాలన్నది శ్రీను భాద్యతగా తీసుకున్నాడన్నారు.
entertainment
20,813
17-06-2017 13:02:14
రేపు ఫైనల్ ఫైట్: మైండ్ గేమ్ మొదలుపెట్టిన పాక్ క్రికెటర్స్..
ఆంధ్రజ్యోతి: ఇండో-పాక్‌ టైటిల్‌ ఫైట్‌పై యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడూ మ్యాచ్ ప్రారంభమవుతుందా అని వేయికళ్లతో క్రికెట్ వీరాభిమానులు వేచి చూస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ కీలకంగా మారింది. ఫిస్టేజ్‌‌ ఇష్యూగా తీసుకున్న కొహ్లీ ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఉన్నాడు. ఫైనల్లో మా సత్తా ఏంటో చూపుతామంటూ విరాట్ ఇటీవల చెప్పాడు. ప్రత్యర్థి బలాలు, బలహీనతలు బేరీజు వేసుకొని దానికి తగ్గ ప్రణాళికతో బరిలోకి దిగుతామని విరాట్ మీడియాకు వివరించాడు. ఈ తరుణంలో టీమిండియా ఆటగాళ్లపై.. పాక్ క్రీడాకారులు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఇటీవల వెన్నునొప్పితో బాధపడుతూ సెమీస్‌కు దూరమైన పాక్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో రేపు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. దీంతో పాక్ క్రీడాకారుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. కొహ్లీనే నాకు టార్గెట్.. ఫిట్‌‌నెస్‌తో ఫైనల్ చేరుకున్న అమీర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ.. ‘కొహ్లీనే నాకు టార్గెట్.. ఆయన వికెట్ పడగొట్టి తీరుతా’నంటూ జోస్యం చెప్పారు. అంతేకాదు కొహ్లీ కెప్టెన్ హోదాలో తొలి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ ఆడుతున్నాడు.. దీంతో అతనిపై ఒత్తిడి చాలా ఉంది.. వీలైనంత త్వరగా పెవిలియన్‌‌కు చేర్చడమే తన టార్గెట్ అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్‌ను ఔట్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నాలు చేస్తామన్నాడు. అమీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ క్రికెట్ అభిమానులు గుర్రుమంటున్నారు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం విరాట్‌ను తక్కువ చేసి వికెట్ పడగొడతా అంటూ బహిరంగంగా చెప్పడమేంటని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. కొహ్లీ మాత్రం పాక్‌ను మెచ్చుకున్నాడు..అద్భుతంగా పుంజుకొని ఫైనల్‌కు వచ్చిన పాకిస్థాన్‌ను కోహ్లీ ప్రశంసించాడు. ‘పాక్‌ ఆట నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ జట్టు పుంజుకొన్న విధానం నిజంగా అద్భుతం. ఈ విషయంలో పాక్‌ను మెచ్చుకోవాల్సిందే. ప్రతికూల పరిస్థితులను ఆ జట్టు సమర్థవంతంగా ఎదుర్కొన్నది. తమకంటే మెరుగ్గా కనిపించిన ప్రత్యర్థులను ఓడించింది. ఒక జట్టుగా పాక్‌ చూపిన సంకల్పం మాకు సవాల్‌ విసురుతోంద’ని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
sports
18,224
06-11-2017 13:17:43
సీఎంపై వ్యంగ్యచిత్రం... కార్టూనిస్టు బాలాకి బెయిల్..
న్యూఢిల్లీ: ఓ కార్మికుడి ఆత్మహత్యకు నిరసనగా తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామిపై వ్యంగ్యచిత్రం వేసిన కార్టూనిస్టు జి బాలాకి బెయిల్ లభించింది. సోమవారం తిరున్వేలి మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలైన అనంతరం మీడియాతో బాలా మాట్లాడుతూ... తన కార్టూన్ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ‘‘నేనేం హత్యానేరానికి పాల్పడలేదు. దీనిపై నాకెలాంటి చింతా లేదు. నా కార్టూన్ల ద్వారా ప్రభుత్వం చేతగాని తనాన్ని తూర్పారబడతాను. నేను ఏమాత్రం వెనక్కి తగ్గను... నా పని కొనసాగించి తీరుతా..’’ అని వ్యాఖ్యానించారు.  రెండు వారాల క్రితం తిరున్వేలి కలక్టరేట్ ముందు ఓ కార్మికుడి కుటుంబం ఆత్మహత్యకు పాడ్పడిన సంగతి తెలిసిందే. అధిక వడ్డీతో రుణదాత తమను వేధిస్తున్నాడనీ... తమకు న్యాయం చేయాలంటూ రెండు నెలలుగా ఆ కుటుంబం కలెక్టర్‌కు, జిల్లా పోలీసులకు ఆరు సార్లు ఫిర్యాదు చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ ముందే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి నిరసనగా ఇటీవల బాలా వేసిన కార్టూన్ సంచలనం సృష్టించింది.  కార్మికుడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంటే... సీఎం పళని, కలెక్టర్, కమిషనర్లు కళ్లు మూసుకున్నట్టు ఆయన తన కార్టూన్‌లో చిత్రీకరించారు. మంటల్లో తగలబడుతున్న పిల్లాడి చుట్టూ డబ్బుకట్టలు చాటుపెట్టుకుని ఈ ముగ్గురూ నగ్నంగా నిలబడినట్టు సదరు కార్టూన్లో ఉంది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో బాలాపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో తమిళనాడు క్రైమ్ బ్రాంచి పోలీసులు ఆదివారం ఆయనను అరెస్టు చేశారు.
nation
9,272
17-06-2017 17:46:39
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాగచైతన్య?
కెరీర్‌లో మాంచి మాస్ హిట్ కోసం ఎదురుచూస్తోన్న నాగచైతన్య.. ఓ మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకుంటున్నాడట. చైతన్య కోరికను మన్నించి ఆ డైరెక్టర్ కూడా ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. సినిమా సినిమాకు నటుడిగా నిరూపించుకుంటోన్న నాగచైతన్యకు.. ఇప్పటివరకూ అనుకున్నంత మాస్ ఇమేజ్ అయితే రాలేదు. 'ప్రేమమ్'తో ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకున్న చైతన్య.. లేటెస్ట్‌గా 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాతో కెరీర్‌లో పెద్ద హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఇంకా తన ఇమేజ్‌ను మరింత పెంచుకోవడానికి.. ఇప్పుడు టాలీవుడ్ మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలని డిసైడయ్యాడట చైతూ. కుమారులిద్దరినీ స్టార్ హీరోస్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న కింగ్ నాగార్జున.. నాగచైతన్య కోసం ఓ మాస్ స్టోరీని సిద్ధం చేయమని ఇప్పటికే బోయపాటి శ్రీను‌కు సూచించాడట. అందుకోసం బోయపాటికి.. భారీ పారితోషికాన్నికూడా ఆఫర్ చేశాడట నాగ్. దీంతో.. చైతూ కోసం ఓ మాస్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట బోయపాటి శ్రీను. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తోన్న 'జయ జానకి నాయక' సినిమా తర్వాత.. చిరంజీవి సినిమా చేయాల్సి ఉన్నా.. అది లేటయ్యే సూచనలు కనిపిస్తుండడంతో.. చైతన్య సినిమానే మొదట పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట బోయపాటి. మొత్తంమీద.. బోయపాటి -నాగ చైతన్య సినిమా కన్ఫమ్ అయ్యిందంటే.. అది అక్కినేని ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
entertainment
7,681
24-07-2017 17:14:52
సాయిపల్లవిపైనే ఆశలు పెట్టుకున్న యువహీరో
'ఫిదా'తో వరుణ్ తేజ్‌కు లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది సాయి పల్లవి. దీంతో.. ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో కూడా ఈ 'ప్రేమమ్' బ్యూటీపైనే తన హోప్స్ అన్నీ పెట్టుకున్నాడట.'ప్రేమమ్' సినిమాతో మలయాళం కుర్రకారును తనతో ప్రేమలో పడేటట్టు చేసిన సాయిపల్లవి.. 'ఫిదా' చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌ను తన నటనతో ఫుల్ ఫిదా చేసేసింది. తెలంగాణ అమ్మాయిగా పర్ఫెక్ట్ యాక్సెంట్‌లో.. ఓన్ డబ్బింగ్‌తో తెలుగులో అదరగొట్టేసింది సాయి పల్లవి.ఈ మాలీవుడ్ బ్యూటీ మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్‌తో.. 'ఫిదా' చిత్రం మంచి విజయం దిశగా పరుగులు తీస్తుండడంతో తనకు సరైన హిట్ లభిస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇక వరుణ్ విషయాన్ని పక్కనపెడితే మరో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా.. ఈ మాలీవుడ్ భామ సాయి పల్లవిపైనే ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడట. తనకు ఈ మలయాళీ ముద్దుగుమ్మ లక్‌ను తెచ్చిపెడుతుందని గంపెడాశతో ఉన్నాడట.టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య.. సాయి పల్లవిపై ఆశలు పెట్టుకోవడం ఏంటని అనుకుంటున్నారా? ఇంతకీ విషయం ఏమిటంటే.. నాగశౌర్య తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ.. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న బైలింగ్వల్ 'కారు' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో కాదు. 'ఫిదా' భామ సాయి పల్లవే. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న 'కారు' సినిమా ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ మూవీ తెలుగు, తమిళం భాషల్లో విడుదలకు ముస్తాబవ్వనుంది. మరి.. వరుణ్ తేజ్‌కు లక్కీ హీరోయిన్‌గా మారిన సాయి పల్లవి.. ఇప్పుడు నాగశౌర్యకి కూడా 'కారు' సినిమాతో తన లక్‌ను పంచుతుందేమో చూడాలి.
entertainment
17,753
06-01-2017 01:58:05
రేప్‌ చేసిన వ్యక్తినే పెళ్లాడిన మహిళ
పురులియా, జనవరి 5: తనను అత్యాచారం చేసిన వ్యక్తిని 7 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందో మహిళ. ఎట్టకేలకు పట్టు వదలకుండా తన డిమాండ్‌ను పోరాడి సాధించుకుంది. కోర్టు ఆదేశాలతో వారిద్దరూ బుధవారం పురులియా జైలులో పెళ్లి చేసుకున్నారు. బాధిత మహిళపై పశ్చిమ బెంగాల్‌లోని పురులియాకు చెందిన మనోజ్‌ బౌరి 2010లో అత్యాచారం చేశాడనే అభియోగంపై అరెస్టయ్యాడు. రెండు నెలల అనంతరం ఆమె గర్భవతయింది. అప్పటి నుంచి ఆమె తనను పెళ్లి చేసుకోవాలని బౌరిని అడుగుతోంది. తన కొడుకును స్కూల్లో చేర్పించే సమయంలో తండ్రి పేరు అడుగుతున్నారని, అటువంటి సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆ మహిళ తెలిపింది. 2016 డిసెంబరు 29న ఆమెపై బౌరి అత్యాచారం చేసినట్లు రుజువైంది. దీంతో, కోర్టు ఆమెను పెళ్లిచేసుకోవాలని బౌరిని ఆదేశించింది.
nation
1,926
01-07-2017 11:40:22
జీఎస్టీ తర్వాత టూవీలర్ ధరల్లో తగ్గింపు ఇలా ఉండబోతోంది!
ఇవాల్టి నుంచి జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగితే, మరికొన్ని వస్తువుల ధరలు తగ్గాయి. అలా ధరలు తగ్గిన జాబితాలో టూవీలర్స్ కూడా ఒకటి. జీఎస్టీలో భాగంగా టూవీలర్స్‌పై 28శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే. గతంలో ఈ పన్ను 30 శాతానికి పైగానే ఉండేది. దీంతో టూవీలర్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సగటును ఏయే కంపెనీ బైక్స్‌ ఎంతెంత ధర తగ్గనున్నాయో చూద్దాం. హీరో మోటార్‌కార్ప్:స్ప్లెండర్, ప్యాషన్, గ్లామర్, అచీవర్, హెచ్‌ఎఫ్ డీలక్స్, కరిజ్మా, డ్యుట్, ప్లెషర్, మాస్ట్రోఈ మోడల్స్‌పై గతంలో 30.2 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం 28శాతానికి తగ్గినందు వల్ల 1000 నుంచి 2వేల వరకూ ధర తగ్గే అవకాశముంది. బజాజ్ ఆటో: ఫుల్ పల్సర్, అవేంజర్ అండ్ వీ రేంజ్, డిస్కవర్, ప్లాటినా, కేటీఎమ్ డ్యూక్ 200, కేటీఎమ్ ఆర్‌సీ 200 1000 నుంచి 7వేల వరకూ తగ్గే అవకాశంహోండా: డ్రీమ్ సిరీస్, యునికార్న్, షైన్, లివో, సీడీ, యాక్టివా, డియో, ఏవియేటర్, నవీ, క్లిక్ 1000 నుంచి 5వేల వరకూ తగ్గే అవకాశంయమహా: శల్యూటో, ఎఫ్‌జడ్, ఎస్‌జడ్, ఫేజర్, ఆర్15, ఎఫ్‌జడ్25, ఫ్యాసినో, ఆల్ఫా, రే 1000 నుంచి 2500 వరకూ తగ్గే అవకాశంసుజుకీ: గిక్సర్ రేంజ్, హయతే, యాక్సెస్, లెట్స్ 1000 నుంచి 2500 వరకూ తగ్గే అవకాశం అయితే ఇక్కడ వినియోగదారుడు గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే ఇంజన్ సామర్థ్యం 350 సీసీ లోపు ఉన్న ద్విచక్ర వాహనాల ధరలే తగ్గుతాయి. 350 సీసీ పైగా ఉన్న బైక్‌లపై పన్ను గతంలో 30 శాతం ఉంటే అది 31 శాతానికి స్వల్పంగా పెరిగింది. రవితేజ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలెన్ని..? నదులు, ప్రాజెక్టులు, సరస్సుల్లో మంచినీటి శాతం ఎంత?
business
12,402
04-01-2017 03:30:55
ఢిల్లీలో 112 విమానాల ఆలస్యం
న్యూఢిల్లీ, జనవరి 3: దట్టమైన పొగమంచు ఉత్తరాదిని కమ్మేయడంతో రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడిచాయి. 112 విమానాలు ఆలస్యమయ్యాయి. అంతే సంఖ్యలో రైళ్ల రాకపోకలకూ అంతరాయం కలిగింది. 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, మరో 47 రైళ్లను రీషెడ్యూల్‌ చేశామని రైల్వే అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని లేహ్‌లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉష్ణోగ్రత మైనస్‌ 10.5 డిగ్రీల సెల్సియ్‌సకు పడిపోయింది. పంజాబ్‌-హర్యానా, రాజస్థాన్‌లలో మంచు దట్టంగా కురుస్తోంది.
nation
20,739
03-10-2017 01:58:52
రాణిస్తే వార్త.. విఫలమైతే ఇంకా పెద్ద వార్త..!
భారత టీ20 జట్టులో చోటు దక్కించుకొని అంతర్జాతీయ పునరాగమనానికి సిద్ధంగా ఉన్న ఆశీష్‌ నెహ్రా తాను విమర్శలను పట్టించుకోనని అంటున్నాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌, సెలెక్లర్లు తనపై ఉంచిన నమ్మకానికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇక ఈ వయసులో తనకు దీర్ఘకాలిక ప్రణాళికలేమీ లేవని అన్నాడు. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కే తాను ఎంపిక య్యానని, ఒకసారి ఒక గేమ్‌ మాత్రమే ఆడగలనని తెలిపాడు. ఈ సిరీస్‌లో తాను రాణిస్తే అది వార్త అని, ఒకవేళ విఫలమైతే అదే అతిపెద్ద వార్త అవుతుందని నెహ్రా పేర్కొన్నాడు. తానేమిటో, తన ఆటేమిటో కెప్టెన్‌కు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తెలుసని అన్నాడు.
sports
7,185
29-10-2017 22:49:28
ఆ క్షణాల్ని మరిచిపోలేను
కళ్లతో ఆకట్టుకునే అందం అనూ ఇమాన్యుయేల్‌ది. ఆ చూపుతోనే టాలీవుడ్‌ హీరోల దృష్టిని తనవైపు మళ్లీస్తోంది. తాజాగా ‘ఆక్సిజన్‌’ చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది. గోపీచంద్‌ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఐశ్వర్య నిర్మించారు. నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా అనూ ఇమాన్యుయేల్‌ ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న ఓ సమస్య ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ఇందులో నా పాత్ర పేరు గీత. డాక్టర్‌గా కనిపిస్తా. సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఎప్పుడు కనిపించినా హీరోని సర్‌ప్రైజ్‌ చేసేలా ఉంటుంది. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు చక్కని మెసేజ్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు మెయిన్‌ పిల్లర్‌ దర్శకుడు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చింది. అందుకే చేశా. గోపీచంద్‌ మంచి సపోర్టింగ్‌ యాక్టర్‌. మొదటి రోజు సెట్లో చాలా కొత్తగా అనిపించింది. తెలుగులో నేను చెప్పిన తొలి డైలాగ్‌ ‘మావయ్య’. అది చెప్పడం కూడా నాకు కష్టంగా అనిపించింది. అది నా అదృష్టం..జనరల్‌గా నాకు స్టార్‌ హీరోల సరసన నటించడమంటేనే ఇష్టం. స్టార్స్‌ పక్కన అవకాశాలు అంత ఈజీగా రావు. నాకు అతి తక్కువ సమయంలోనే పవన్‌కల్యాణ్‌గారి పక్కన, బన్నీ సరసన నటించే అవకాశం వచ్చింది. అది నా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే కథ, పాత్రకున్న ప్రాధాన్యత కూడా ముఖ్యమే. రొమాంటిక్‌, కామెడీ సినిమాలన్నా, రొమాంటిక్‌ సీన్స్‌ అన్నా చాలా ఇష్టం. గ్లామర్‌ పాత్రలు చేస్తాను కానీ అది వల్గర్‌గా ఉండకూడదు. గ్లామర్‌ అనేది దర్శకుల దృష్టిని బట్టి ఉంటుంది. త్రివిక్రమ్‌, వక్కంతం వంశీ, మారుతి హీరోయిన్‌లను చెడుగా చూపించడానికి ఇష్టపడరు. నేనీ సినిమాలు చెయ్యడానికి అది కూడా ఓ కారణం. ఆయనంటే భయం.. ఓ రోజు ఇంట్లో పడుకుని ఉంటే తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. మామూలుగా అయితే నేను అలాంటి కాల్స్‌ తియ్యను. కానీ ఆ కాల్‌ తీశా. పవన్‌కల్యాణ్‌గారి సినిమాలో అవకాశమంటూ వచ్చిన కాల్‌ అది. ఏదో సిస్టర్‌ క్యారెక్టర్‌ అనుకున్నాగానీ హీరోయిన్‌ అని సినిమా టీమ్‌ను కలిశాక గానీ తెలియలేదు. ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యడం వల్ల అవకాశం నా తలుపు తట్టింది. ఫస్ట్‌ డే కల్యాణ్‌ గారితో రొమాంటిక్‌ సీన్‌ షూట్‌ చెయ్యాలి. ఆ డైలాగ్‌లన్నీ ముందుగానే ప్రాక్టీస్‌ చేశా. ఆయన ముందుకెళ్లే సరికి ఒక్క పదం కూడా గుర్తొచ్చేది కాదు. కల్యాణ్‌గారితో కూర్చొని మాట్లాడటానికి కూడా భయపడేదాన్ని. సెట్లో సైలెంట్‌గానే ఉంటారు కానీ బాగా జోక్స్‌ వేస్తుంటారు. ఆయనతో పని చేయడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది. మొదటి రోజు షూటింగ్‌ను, ఆ క్షణాలను మరిచిపోలేను. ‘నా పేరు సూర్య’లో కూడా గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నా. ఎన్టీఆర్‌ సినిమాకు సైన్‌ చెయ్యలేదు. అది కూడా త్రివిక్రమ్‌గారిదే కాబట్టి వర్కవుట్‌ కావాలని కోరుకుంటా. రెండు వైపులా దృష్టి...‘మజ్ను’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ చాలా కంఫర్ట్‌గా ఉంది. తమిళ, మలయాళ సినిమాలూ చేస్తాను. ఇప్పుడైతే తెలుగు సినిమాలపైనే నా ఫోకస్‌. హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్‌ కొన్నా ఇక్కడే సెటిల్‌ అవ్వాలని డిసైడ్‌ అయ్యా.
entertainment
10,468
06-10-2017 23:01:01
జీరో స్థాయి అంటే ఇష్టం: అనుపమ
‘‘నిండు కుండలో అమృతాన్ని కూడా పోయలేం. కానీ ఖాళీ కుండలో కనీసం నీళ్లనైనా నింపగలం అనేది నేను బాగా నమ్మే సిద్ధాంతం’’ అని అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. ఇంతకీ ఏమిటి ఆ ప్రత్యేకత అని అడిగితే ‘‘నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే నేను ఇక నేర్చుకునేది ఏమీ ఉండదు. అందుకే నేనెప్పుడూ జీరో స్టేటస్‌లో ఉండటానికే ఇష్టపడతాను. నాకో స్టేటస్‌ ఉందనుకుంటే అభ్యాసన అక్కడితో కుంటుపడుతుంది. అలా కాకుండా నాకు తెలిసింది అణువంతేనని అనుకున్నప్పుడు ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటుంది. నాకు నిత్య విద్యార్థినిగా ఉండటమే ఇష్టం.సినిమాల్లోకి వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు. కోపం గురించి మాట్లాడుతూ ‘‘నాకు కోపం వస్తే నా మాట నేనే వినను. ‘అ..ఆ’లో నాగవల్లి తరహా కేరక్టర్‌గా మారిపోతాను. కానీ నా కోపం ఎంతో సేపు ఉండదు. తప్పు నాదే అయితే వెంటనే వెళ్లి అవతలివారికి సారీ చెబుతాను. ఒకవేళ అవతలివారే తప్పు చేశారనిపిస్తే అర్థం చేసుకుని క్షమించేస్తాను. స్పాట్‌లో మాత్రం ఆవేశంతో ఊగిపోతాను’’ అని నవ్వుతూ చెప్పారు.
entertainment
19,950
23-05-2017 02:29:47
ఆ వ్యూహంతో జాన్సన్ సక్సెస్‌ : రోహిత్
హైదరాబాద్‌ : పుణె కెప్టెన్ స్మిత్ కు వేగంగా బంతులు వేయకుండా చూడాలని బౌలర్‌ జాన్సన్ కు సూచించానని ముంబై సారథి రోహిత్ శర్మ చెప్పాడు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ ఆఖరి ఓవర్లో జాన్సన్ రెండు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. బంతిని వేగం గా సంధిస్తే స్మిత్ షాట్‌ కొడతాడని, అలా వేయకుం డా చూడాలని చెప్పానన్నాడు. గాలికి వ్యతిరేక దిశ లో జాన్సన్ బౌలింగ్‌ చేశాడని, ఆ తరుణంలో స్మిత్ గాల్లోకి షాట్‌కొట్టేలా చూడడమే తన వ్యూహమని వెల్లడించాడు.
sports
19,513
31-12-2017 23:23:04
పట్టు బిగించిన విదర్భ
అక్షయ్‌ వాడ్కర్‌ అజేయ శతకంతొలి ఇన్నింగ్స్‌ 528/7 ఢిల్లీపై భారీ ఆధిక్యంఇండోర్‌: తొలిసారిగా రంజీ ట్రోఫీని అందుకునేందుకు తహతహలాడుతున్న విదర్భ జట్టు ఆల్‌రౌండ్‌ షోతో అదరగొడు తోంది. బౌలింగ్‌లో గుర్బానీ చెలరేగి ఢిల్లీని కట్టడి చేయగా, ఇప్పుడిక బ్యాటింగ్‌లోనూ తమ సత్తా చూపిస్తోంది. ఆదివారం మూడో రోజు ఆటలో వికెట్‌ కీపర్‌ అక్షయ్‌ వాడ్కర్‌ (243 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌తో 133 బ్యాటింగ్‌) అజేయ శతకంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. దీంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 528 పరుగులు చేసింది. ఢిల్లీపై ఇప్పటికే 233 పరుగుల స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతోంది. వసీం జాఫర్‌ (150 బంతుల్లో 11 ఫోర్లతో 78), ఆదిత్య సర్వాతే (154 బంతుల్లో 11 ఫోర్లతో 79) అర్ధ సెంచరీల తో చెలరేగారు. ఇక ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన అక్షయ్‌ తన ఐదో మ్యాచ్‌లో తొలి ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీ సాధించాడు.  క్రీజులో ప్రస్తుతం అక్షయ్‌తో కలిసి సిద్దేశ్‌ నేరల్‌ (92 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 బ్యాటింగ్‌) ఉన్నాడు. వీరిద్దరి మధ్య ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 113 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. అంతకుముందు 206/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆరంభించిన విదర్భ.. జాఫర్‌ వికెట్‌ త్వరగానే కోల్పోయింది. అయితే ఢిల్లీ పేలవ ఫీల్డింగ్‌కు తోడు పలు క్యాచ్‌లు కూడా వదిలేసి మూల్యం చెల్లించుకుంది. అటు అక్షయ్‌, ఆదిత్య జోడి నిలకడైన బ్యాటింగ్‌తో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించింది. వీరిద్దరి మధ్య ఏడో వికెట్‌కు 169 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొంది. నవదీప్‌ సైనీకి మూడు, ఆకాశ్‌ సుడాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.ఉ. 9 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ 1లో
sports
3,358
26-09-2017 04:46:47
‘కమ్యూనల్‌ అవార్డు’ కావాల్సిందే!
నేడు దేశంలో దళితులపై దాడులు, అత్యాచారాలు సాధారణమై పోయాయి. ముఖ్యంగా గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో గోసంరక్షణ రాజకీయాలతో హిందూ అగ్రకులాలు దాడులకు తెగబడుతున్న స్థితి కనిపిస్తున్నది. ఇలాంటి ఘటనలు జరిగినపుడు దళిత ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? లోక్‌సభలో 81 మంది ఎస్సీ, 49 మంది ఎస్టీ ఎంపీలు ఉన్నారు. మొత్తంగా వీరి సంఖ్య 130. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నవారు ప్రభుత్వాల్ని వణికించటమే కాక, కూల్చవచ్చు కూడా. మరి ఎందుకని వీరు ఆవలింత వచ్చినపుడే నోరు తెరుస్తారనే వ్యంగ్యోక్తి పుట్టింది? స్వాతంత్ర్యానికి పూర్వం హిందూ అగ్రకులాలు బ్రాహ్మణ, బనియా నాయకత్వంలో స్వరాజ్యం కోసం పోరాడుతుంటే, మరొక వైపు అంబేడ్కర్‌ నాయకత్వంలో అణగారిన కులాలు ఆత్మగౌరవం కోసం ఉద్యమించాయి. ఈ క్రమంలోనే బ్రిటిష్‌ వారు లండన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో డాక్టర్‌ అంబేడ్కర్‌ చేసిన డిమాండ్‌కు అనుగుణంగానే 1932 ఆగస్టు 17న బ్రిటిష్‌ ప్రభుత్వం ‘కమ్యూనల్‌ అవార్డు’ను ప్రకటించింది. దీనితో దళితులకు రెండు ఓట్లు లభిస్తాయి. ఒక ఓటుతో దళితేతరులతో కలిసి సాధారణ అభ్యర్థిని ఎన్నుకుంటూ, మరొక ఓటుతో కేవలం ఎస్సీ ఓట్లతో ఎన్నికయ్యే ఎస్సీ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ విధంగా ఎన్నికైన ఎస్సీఅభ్యర్థికి ఎస్సీయేతర ఓట్ల అవసరం ఉండదు కాబట్టి అతను ఎస్సీల ప్రయోజనాలకే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టే జాతిపిత మహాత్మాగాంధీ ముస్లింలు, సిక్కులకు ఇచ్చిన ప్రత్యేక హక్కుల ఊసు వదిలేసి ఎస్సీల హక్కులకు వ్యతిరేకంగా మొట్టమొదటి సత్యాగ్రహం ఎరవాడజైల్లో ప్రారంభించారు. ‘‘హిందూ మతానికి సంబంధించినంత వరకు ఈ ప్రత్యేక నియోజకవర్గాలు సమాజాన్ని నిట్టనిలువునా చీల్చి చెడగొడతాయి. కాబట్టి ఈ ప్రత్యేక నియోజకవర్గాలు హిందూ మతానికి ప్రమాదకరం’’ అన్నది ఆయన అభిప్రాయం. అంబేడ్కర్‌ కమ్యూనల్‌ అవార్డుకే కట్టుబడి ఉండటంతో, ఒకవేళ గాంధీ ఈ నిరాహార దీక్ష వల్ల మరణిస్తే అందుకు బాధ్యత అంబేడ్కర్‌దే అన్నట్లు అగ్రకులాలు బెదిరింపులకు దిగాయి. ఈ నేపథ్యం నుంచి ౧932, సెప్టెంబర్ 24న పుట్టుకొచ్చిందే ‘పూనా ఒడంబడిక’. ఈ ఒడంబడిక వల్ల అగ్రకుల హిందూ పార్టీలు వారి అడుగులకు మడుగులొత్తే ఎస్సీ అభ్యర్థులను ఎంచుకునే అవకాశం కలిగింది. ఈ స్థితిని అంబేడ్కర్‌ వివరిస్తూ ‘‘ఉమ్మడి నియోజకవర్గాలు హిందువులకు ఒక వరం వలె దొరికాయి. వీటి ద్వారా శాసనసభలోకి నామమాత్రమైన, తమ చేతిలో కీలుబొమ్మల వలె ఆడే దళితులను మాత్రమే ప్రతినిధులుగా ఎంపిక చేస్తారు’’ అని అన్నారు. ఇలాంటి వారిని అంబేడ్కర్‌ ‘‘హిందువుల ఏజెంట్లు’’ అంటారు. కాన్షీరాం మాత్రం అందరికీ అర్థమయ్యే భాషలో చెంచాలుగా పిలుస్తారు. దీనికి తోడు, ప్రస్తుత ఎన్నికల విధానంలో వందలో 51 ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలవడం, 49 ఓట్లు వచ్చిన ఓడిపోవడం జరుగుతున్నది. ఈ పద్ధతి వల్ల భారతదేశంలో అణగారిన కులాలు, తరగతులకు ప్రాతినిధ్యం వహించే పార్టీల గొంతు వినబడకుండా పోయే ప్రమాదం ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 22 శాతం ఓట్లు వచ్చిన మాయావతి పార్టీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇందుకు ఉదాహరణ. కాబట్టి దామాషా ఎన్నికల విధానంతో పాటు, ‘పూనా ఒడంబడిక’ వల్ల పోగొట్టుకోబడిన ‘కమ్యూనల్‌ అవార్డు’ను తిరిగి సాధించుకోవడమే చెంచా రాజకీయాలకు ముగింపు. పట్టా వెంకటేశ్వర్లుకన్వీనర్‌, సెంటర్‌ ఫర్‌ దళిత్‌ థింకర్స్‌
editorial
11,661
06-10-2017 10:28:26
‘దావూద్‌’ ఆత్మహత్య!.. 10 మంది అనుచరుల అరెస్టు
కంబోడియాలో అనుమానాస్పద మృతిఅల్లర్లు జరగకుండా కంచిలో భద్రత పెంపుచెన్నై: తమిళనాడు దావూద్‌ ఇబ్రహీంగా పేరుగడించిన కాంచీపురానికి చెందిన రౌడీషీటర్‌ శ్రీధర్‌ ధనపాల్‌ కంబోడియా దేశంలోని అతని ఫామ్‌హౌస్‌లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. అతని మృతికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. అయితే శ్రీధర్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు పాతకక్షల కారణంగా ప్రత్యర్థులే మట్టుబెట్టి ఉండవచ్చని అనుమానాలూ రేగుతున్నాయి. కారణం ఏదైనా మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీ శ్రీధర్‌ మరణంతో అతని స్వస్థలమైన కాంచీపురంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న శ్రీధర్‌ ప్రధాన అనుచరులు 10 మందిని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాంచీపురం పరిసరాల్లో పోలీసు భద్రతను పెంచారు. ఆత్మహత్యా? హత్యా?44 ఏళ్ల శ్రీధర్‌ ధనపాల్‌పై 7 హత్యలు, 8 హత్యాయత్నం, 4 కిడ్నాప్‌లు, అనేక భూకబ్జా దందాలు మొత్తంగా 43 కేసులు వేర్వేరు పోలీసుస్టేషన్లలో నమోదై ఉన్నాయి. దశాబ్దాల క్రితమే అక్రమంగా సారాయి విక్రయించడం, రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో తనకంటూ ప్రత్యేక నెట్‌వర్క్‌ను సృష్టించుకుని కోట్లాది రూపాయల దంతాలకు పాల్పడడం వంటి చేసేవాడు. పోలీసులు, రాజకీయ నేతల అండ కూడా ఉండడంతో పెద్ద రౌడీగా ఎదిగి తమిళనాడు ‘దావూద్‌’గా పేరుగడించాడు. 2012-13లో ఓ కేసులో శ్రీధర్‌ అరెస్టై ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తరువాత పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసుల కన్నుగప్పి అతను మొదట దుబాయ్‌కి, అక్కడ నుంచి కంబోడియాకు పారిపోయి అజ్ఞాతంలో గడిపాడు. దుబాయ్‌లో డీజిల్‌ రాకెట్‌ను నడిపినట్టు కూడా తెలుస్తోంది. విదేశాల్లో ఉన్నప్పటికీ తన అనుచరులతో తమిళనాట తన రౌడీయిజాన్ని శ్రీధర్‌ విజయవంతంగా కొనసాగించాడు. దీంతో పోలీసులు అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలని ‘మోస్ట్‌ వాంటెడ్‌’ జాబితాలో చేర్చారు. గతేడాది కొలంబో మీదుగా దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన శ్రీధర్‌ కూతురు ధనలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఓ భూకబ్జా కేసులో ఆమెను రెండు గంటలపాటు విచారించి, తండ్రి ఆచూకీ గురించి ఆరా తీశారు. అనంతరం అతని ఇంట్లో సోదాలు నిర్వహించి, భార్య వద్ద కూడా విచారణ జరిపారు. అంతేకాదు, అతన్ని బయటకు రప్పించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను స్తంభింపజేశారు. దీంతో కొంతకాలంగా డిప్రెషన్‌కు గురైన శ్రీధర్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కంచి పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీ మరణంతో అతని అనుచరులైన మురుగన్‌, రాజ్‌కుమార్‌ సహా పలువురిని గురువారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం శ్రీధర్‌ మరణానికి గల కారణాల అన్వేషణలో పోలీసులు బిజీగా ఉన్నారు. నాకు ప్రాణహాని ఉంది: శ్రీధర్‌ఇదిలా ఉండగా, గతేడాది శ్రీధర్‌ ధనపాల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో... తాను ఇండియాకు తిరిగి వచ్చేందుకు, చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే న్యాయపరమైన విచారణ జరిపేలా తనకు హామీ ఇవ్వాలన్నాడు. తమిళనాడు పోలీసుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని, ఒకవేళ తనపై అసత్య అభియోగాలు మోపితే సినైడ్‌ మింగి ఆత్మహత్య చేసుకుంటానని కూడా తమిళనాడు ‘దావూద్‌’ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. రాధాకృష్ణన్‌ తదితరులు పరామర్శించారు.
nation
1,017
02-03-2017 00:18:03
పేదల ఇళ్ల నిర్మాణానికి మలబార్‌ రుణ సహాయం
హైదరాబాద్‌: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదలు, బలహీన వర్గాలకు రుణ సహాయం అందించనున్నట్టు రియల్టీ, జువెలరీ వ్యాపారాలు నిర్వహిస్తున్న మలబార్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనా, కేరళ ప్రభుత్వ పథకాల కింద రుణ సహాయం సమకూర్చనున్నట్టు మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపి అహ్మద్‌ తెలిపారు. మలబార్‌ హౌజింగ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఈ రుణ సహకారం అందుతుందని చెప్పారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఇప్పటికే 10,310 కుటుంబాలకు రుణ సహాయం అందించినట్టు ఆయన తెలిపారు. పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు సంస్థ లాభాల్లో ఐదు శాతాన్ని పక్కనబెడుతున్నట్టు చెప్పారు. కాగా నాలుగు సెంట్ల భూమి కలిగి ఉండి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారు రుణ సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి పత్రాలు, ఫొటో గుర్తింపు కార్డు, ఇంటి ప్లాన్‌తో కూడిన దరఖాస్తును మార్చి 10 వరకు సమీపంలోని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ స్టోర్‌, మలబార్‌ డెవలపర్స్‌ ఆఫీస్‌ లేదా మలబార్‌ హౌజింగ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ల వద్ద సమర్పించవచ్చు.
business
9,331
30-09-2017 17:41:12
పీకల్లోతు ప్రేమాయణంలో నమిత..!
కోలీవుడ్‌‌లో నిన్న మొన్నటి వరుకూ క్రేజీ హీరోయిన్ చక్రం తిప్పిన ఆ అందాల తార. ఇప్పుడు 60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందట. కోలీవుడ్ బ్యూటీ నమితకి ఇప్పుడు అవకాశాలే లేకుండా పోయాయి. ఆమె భారీతనానికి తగ్గ పాత్రలు ఇటు టాలీవుడ్లోనూ, అటు కోలీవుడ్లోనూ లభించడం లేదు. జనం తనని మరిచిపోకుండా ఉండేందుకు తమిళ్ బిగ్‌బాస్ షో‌లో పాల్గొని అదృష్టాన్ని పరిక్షించుకుంది నమిత, ఆమెకు అందులోనూ చుక్కెదురైంది. ఇప్పుడు నమిత ఓ 60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ అందాలతో తమిళ తంబీలను రెచ్చగొట్టిన నమిత ఇప్పుడు విలక్షణనటుడు శరత్ బాబు‌తో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగితేలుతోందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇప్పటికే రెండు పెళ్ళిళ్లు చేసుకున్న శరత్‌బాబు మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడట. ఇటీవల తానిప్పుడు మూడో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తున్నానని, ఆమె ఒక హీరోయిన్ అని చెప్పి అందరికీ షాకిచ్చాడట. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. థర్టీ ప్లస్ నమిత సిక్స్టీ ప్లస్ శరత్ బాబు‌తో పైనిజానిజాలు వెల్లడికావాల్సి ఉంది. అదే నిజమైతే వీరిద్దరి బంధం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
entertainment
8,666
22-04-2017 16:21:37
ఆర్తి విషం తాగడానికి, తరుణ్‌కు సంబంధం లేదు: రోజా రమణి
 ‘తరుణ్‌, ఆర్తి అగర్వాల్‌ మంచి స్నేహితులనే విషయం నాకూ తెలుసు. అంతకు మించి వారి మధ్య ఎటువంటి రిలేషనూ లేదు. ‘నువ్వు లేక నేను లేను’ సినిమా వంద రోజుల ఫంక్షన్‌లో ఒకసారి ఆర్తితో మాట్లాడాను. ఆమె చాలా మంచి అమ్మాయి. అయితే ఆమె విషం ఎందుకు తాగిందో నాకు తెలియదు. నా కంటే మీడియాకు బాగా తెలుసు. అయితే ఆమె ఆత్మహత్యా ప్రయత్నానికి తరుణ్‌తో రిలేషన్‌షిప్‌ మాత్రం కారణం కాదు.
entertainment
21,291
06-02-2017 01:39:41
కుర్రాళ్లు కేక..!
రామ్‌కుమార్‌, భాంబ్రీ గెలుపు4-1తో భారత ఘన విజయంన్యూజిలాండ్‌తో డేవిస్‌ కప్‌ పోరుపుణె: సీనియర్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ నిరాశపర్చినా.. కుర్రాళ్లు కుమ్మేశారు. డేవిస్‌ కప్‌ ఆసియా/ఓసియానియా గ్రూప్‌1లో భారత్ ను ముందంజ వేయించారు. న్యూజిలాండ్‌తో పోరులో భాగంగా తొలిరోజు సింగిల్స్‌లో అదరగొట్టిన రామ్‌కుమార్‌ రామనాథన్‌, యుకీ భాంబ్రీ ఆదివారం జరిగిన రివర్స్‌ సింగిల్స్‌లోనూ దుమ్ము రేపారు. దీంతో భారత 4-1తో కివీ్‌సను చిత్తుచేసి రెండోరౌండ్‌కు దూసుకెళ్లింది. ఏప్రిల్‌ 7 నుంచి 9 వరకూ జరిగే రెండో రౌండ్‌ పోరులో భారత.. ఉజ్బెకిస్థాన్‌తో తలపడనుంది. ఉజ్బెకిస్థాన్‌ తొలిరౌండ్‌లో దక్షిణ కొరియాపై నెగ్గి రెండో రౌండ్‌ చేరుకుంది. ఇక్కడి శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన తొలి రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో 276వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 7-5, 6-1, 6-0తో 414వ ర్యాంకర్‌ ఫిన్‌ టిర్నేపై అలవోక విజయం సాధించాడు. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో మాత్రమే టిర్నే కాస్త పోటీనిచ్చాడు. కచ్చితమైన సర్వీ్‌సలతో విజృంభించిన రామ్‌కుమార్‌ ఆ తర్వాత రెండు సెట్లనూ సునాయాసంగా గెలిచాడు. రామ్‌కుమార్‌ గెలుపుతోనే భారత తొలిరౌండ్‌ విజయం 3-1తో ఖరారైంది. దీంతో ఆ తర్వాత జరగాల్సిన భాంబ్రీ మ్యాచ్‌ నామమాత్రమే అయింది. దీంతో బెస్టాఫ్‌ త్రీ సెట్స్‌గా నిర్వహించిన ఈ ఆఖరి మ్యాచ్‌లో యుకీ భాంబ్రీ 7-5, 3-6, 6-4తో జోస్‌ స్టాథమ్‌పై విజయం సాధించాడు. ఏస్‌లతో హడలెత్తించాడు: రామనాథన్‌ ఈ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. తనకన్నా తక్కువ ర్యాంకర్‌ టిర్నేని ఫాస్టెస్ట్‌ సర్వీసులు, ఏస్‌లతో హడలెత్తించాడు. రామ్‌ 9 డబుల్‌ ఫాల్ట్స్‌ చేసినప్పటికీ మొత్తంగా 105 పాయింట్లు, 12 ఏస్‌లతో పైచేయి సాధించాడు. 15 బ్రేక్‌ చాన్స్‌ల్లో ఆరింటిని సద్వినియోగం చేసుకున్నాడు. కాగా.. ఒకే ఒక ఏస్‌ సంధించిన టిర్నే 16 డబుల్‌ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయలేకపోయాడు. ఉత్కంఠగా మొదలైన తొలి సెట్‌లో టిర్నే గట్టి పోటీ ఇవ్వడంతో పోరు హోరాహోరీగా సాగింది. ఇద్దరూ సర్వీ్‌సలు నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే 6-5తో ఉన్న దశలో 12వ గేమ్‌లో బ్రేక్‌ సాధించిన రామ్‌కుమార్‌ తొలిసెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. రెండో సెట్‌లో భారత ఆటగాడు మరింత రెచ్చిపోయాడు. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 35 నిమిషాల్లోనే ఈ సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక మూడో సెట్‌లో పూర్తిగా రామ్‌కుమార్‌ హవానే సాగింది. రామ్‌ ఏకంగా మూడు బ్రేక్‌లు సాధించి 6-0తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కూడా ముగించేశాడు. పోరాడిన యుకీ..: బెస్టాఫ్‌ త్రీ మ్యాచ్‌ కావడంతో 368వ ర్యాంకర్‌ యుకీ భాంబ్రీ అలవోకగా నెగ్గుతాడని అంతా భావించారు. కానీ.. 417వ ర్యాంకర్‌ స్టాథమ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఆరంభంలోనే యుకీ సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన స్టాథమ్‌ ఓ దశలో 5-3తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో అద్భుతంగా పుంజుకున్న యుకీ వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి తొలిసెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో సీన్‌ రివర్సైంది. స్కోరు 3-3తో ఉన్న దశలో యుకీ వెనకబడ్డాడు. ఎనిమిదో గేమ్‌లో యుకీ సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన కివీస్‌ ఆటగాడు ఆ తర్వాత సర్వీస్‌ నిలబెట్టుకుని సెట్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో మ్యాచ్‌ నిర్ణాయక మూడో సెట్‌కు దారితీసింది. మూడో సెట్‌లో యుకీ ఒకసారి సర్వీస్‌ కోల్పోయినప్పటికీ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసి 6-4తో ఈ సెట్‌ను దక్కించుకున్నాడు.
sports
10,331
11-06-2017 00:33:56
సినీ పరిశ్రమ, కార్మికులు పెద్ద అండను కోల్పోయారు - చిరంజీవి
‘‘విదేశాల్లో ఉండటం వల్ల పితృవాత్సల్యం చూపించే దాసరి నారాయణరావుగారిని కడసారి చూసే అవకాశాన్ని కోల్పోయాను. నా జీవితానికి అదొక తీరని అసంతృప్తి.. ఆ బాధ ఉన్నప్పటికీ వేదిక మీద నిండైన గొంతుతో ఆయన మాట్లాడిన రెండు కార్యక్రమాలు నావే కావడం, ఆసుపత్రిలో ఉండి కూడా ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా స్కోరింగ్‌ తెలుసుకుని విజయచిహ్నం చూపించిన సందర్భాలు నాకు సంతృప్తిని కలిగించాయి’’ అని చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలోని వివిధ సంఘాలు కలసి శనివారం సాయంత్రం దాసరి నారాయణరావు మృతికి సంతాప సభను ఏర్పాటు చేశాయి. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ మధ్యకాలంలో దాసరిగారింట్లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నా. అది పూర్తి చేసుకుని షూటింగ్‌కి వెళ్తుంటే పట్టుబట్టి మరీ మా జిల్లా నుంచి వచ్చిన బొమ్మిడాయల కూరతో దగ్గరుండి వడ్డించి పితృ వాత్సల్యాన్ని చూపించారు. ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఆయనతో ఎన్నో ఉన్నాయి. సినీ పరిశ్రమతోపాటు కార్మికులు దాసరి అనే పెద్ద అండను కోల్పోయారు’’ అని అన్నారు. ‘‘కష్టం అని తలుపు తడితే ఆదుకునే ఆపన్న హస్తాన్ని పరిశ్రమ కోల్పోయింది. దర్శకుడికి ప్రత్యేక గౌరవం తెచ్చిన వ్యక్తి దాసరిగారు. అన్ని శాఖల్లోనూ ఆయన సత్తా చూపించారు’’ అని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ‘‘దాసరిగారికి అవార్డులు రాలేదని అంటున్నారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలే పెద్ద అవార్డులు. నా దృష్టిలో దాదాసాహెబ్‌ ఫాల్కే కన్నా గొప్ప వ్యక్తి ఆయన’’ అని ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలిపారు. ‘‘ప్రముఖులెందరో మరణించిన తర్వాత కూడా భారతరత్నలాంటి అవార్డులను ప్రకటించారు. దాసరిగారికి దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు వచ్చేలా పరిశ్రమతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నించాలి’’ అని ఆర్‌.నారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. దర్శకుల సంఘం సంతాపందాసరి నారాయణరావుకి స్వర్గమైనా, నరకమైనా సినిమానే అని దర్శకుల సంఘం శనివారం ఉదయం ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు దర్శకులు కొనియాడారు. సమస్యను పరిష్కరించే అడ్రస్‌ ఇక కరువైందనీ, సయోధ్య చేసే వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనీ సభలో వాపోయారు. అయితే ప్రస్తుతం పరిశ్రమలో టాప్‌ దర్శకులుగా చలమణీ అవుతున్న ఏ ఒక్కరూ దర్శకుల సంఘం ఏర్పాటు చేసిన సభలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.
entertainment
5,153
09-07-2017 00:27:23
తెలంగాణ యాస కోసం శ్రమించా: చేతన్‌
‘‘స్వతహాగా నేను విశాఖ అబ్బాయిని కాబట్టి తెలంగాణ అబ్బాయి పాత్ర పోషణ కొంచెం క్లిష్టమైనదే. తెలంగాణ యాస కోసం శ్రమించాను. కథ ఎక్కడ నడుస్తుందో, అక్కడికే వెళ్లి షూటింగ్‌ చేయడం నాకు బాగా ఉపకరించింది’’ అని చెప్పారు. చేతన్‌ మద్దినేని. సునీల్‌కుమార్‌రెడ్డి రూపొందించిన ‘గల్ఫ్‌’ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. శ్రావ్య ఫిలిమ్స్‌ పతాకంపై యక్కలి రవీంద్రబాబు, యం. రామ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘ఇంట్లో గొడవపెట్టి గల్ఫ్‌కు వెళ్తాను. అక్కడ గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడతా. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లిన వారికి నా పాత్ర ప్రతినిథిగా కనిపిస్తుంది. రెబల్‌గా ఉంటాను’’ అని చెప్పారు చేతన్‌. శివ పాత్రలో ఇమిడిపోవడం కోసం సిరిసిల్లలో అక్కడి చేనేత కార్మిక కుటుంబాలు ఎలా ఉంటాయో, అక్కడివాళ్ల ఆచార వ్యవహారాలేమిటో, వాళ్లు మాట్లాడే, ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో ఆయన పరిశీలించారు. ‘‘సునీల్‌కుమార్‌రెడ్డిగారి సినిమాలన్నీ వాస్తవిక కథాంశాలతో ఆకట్టుకుంటాయి. ‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’ చూసి, ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే బాగుంటుంది.
entertainment
19,884
12-02-2017 01:52:57
కోహ్లీ బ్యాట్‌ సౌండే చెబుతుంది
హైదరాబాద్‌: నాలుగు టెస్ట్‌ సిరీస్‌ల్లో నాలుగు వరుస డబుల్‌ సెంచరీలతో ప్రపం చ రికార్డు నెలకొల్పిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్‌ కెరీర్‌లోనే అద్భుత ఫామ్‌లో ఉన్నాడని మాస్టర్‌ అన్నాడు. ‘కోహ్లీ ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో బంతిని కొట్టినప్పుడు అతని బ్యాట్‌ నుంచి వచ్చే శబ్దమే చెబుతుంది. స్కోరు బోర్డు చూడాల్సిన పనిలేదు. అతను ఎల్లప్పుడూ ఇలాగే రాణించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాన’ని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.
sports
4,313
30-05-2017 02:54:52
పర్యావరణహిత అభివృద్ధే మేలు
మానవ వనరులను మన ఆర్థికాభివృద్ధికి కీలక చోదక శక్తిగా వినియోగించుకోగలగాలి. వస్తూత్పత్తి రంగం కంటే సంగీతం, సినిమా, ఆరోగ్య సంరక్షణ, యూనివర్సిటీ విద్య వంటి సేవా రంగ ఉత్పత్తులపై మనం దృష్టికేంద్రీకరించాలి. పెద్ద పెద్ద వాహనాలు, ఎయిర్‌ కండిషన్ల వంటి ఉత్పత్తులకు సమానంగా ఈ సేవల రంగ ఉత్పత్తి కూడా జీడీపీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. వనరులపై క్రమబద్ధమైన ధర నిర్ణయం, అభివృద్ధి వ్యూహ కేంద్రీకరణ సేవల రంగం వైపు మళ్లించడం అనే విధానాలు వాతావరణహిత అభివృద్ధి నమూనాకు అవసరం.  చికాగో నగరాన్ని 1971లో సందర్శించాను. ఆ సమయంలో ఆ నగరంలో కార్ల కారణంగా ఊపిరాడనంత పొగ అలుముకొని ఉండేది. 1996లో మరోసారి చికాగో వెళ్ళాను. అప్పుడు చికాగో నగరంలో గాలి చాలా స్వచ్ఛంగా ఉంది. శబ్దం కానీ, పొగ కానీ లేదు. కార్లలోని నూతన కాలుష్య నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా పరిశుభ్రమైన గాలి ఏర్పడింది. అలా సాంకేతిక పరిజ్ఞానం ఎల్లప్పుడూ వాతావరణహితమైన వృద్ధికి దారిచూపే మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. అయితే ఈ వైఖరితో సమస్యలూ ఉన్నాయి. ఒకటి, కార్ల నుంచి వెలువడే సల్ఫర్‌, నైట్రోజన్‌ కాలుష్యాల పరిమాణం అదుపులోకి వచ్చిన్నప్పటికీ, కార్బన్‌ వెలువరింపులు అనేక రెట్లు పెరగడంతో అది భూతాపానికి దారితీసింది. రెండు, కాలుష్యాన్ని దేశాంతరాలకు తరలించి వేస్తున్నారు. గతంలో అమెరికాలోని డెట్రాయిట్‌ నగరంలోనే ఉక్కును తయారు చేసేవారు. అప్పుడు ఉక్కు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం అమెరికాలోనే ఉండేది. ప్రస్తుతం ఉక్కును, కార్లను చైనాలో తయారు చేసి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు. అలా కాలుష్యం చైనాకు ఎగుమతి అయింది. నిజంగా కాలుష్యం కట్టడి కావాలంటే వినియోగం స్థాయి మొత్తంగా తగ్గాలి. ఉదాహరణకు, సొంతంగా కారు కలిగి ఉండడమనే సంస్కృతి అమెరికాలో వృద్ధి చెందింది. ఒక చిన్న బ్రెడ్డు ముక్క కొనుగోలు చేయాలన్నా అమెరికాలో 4–5 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి ఉంటుంది. ఇలాంటి అనవసర రవాణా తగ్గిస్తేనే, ఇంధన వినియోగం తగ్గి కాలుష్యాల వెలువరింపు తగ్గుతుంది. అందువల్ల కార్లపై అధిక పన్ను వేసి, బస్సు, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థకు సబ్సిడీ అందజేయాల్సి ఉంటుంది. అదే విధంగా, భారత దేశంలో విద్యుదుత్పత్తి ప్రధాన కాలుష్యకారకంగా ఉంది. ముంబయిలో ఒక పారిశ్రామిక వేత్త ఇంటి విద్యుత్తు వినియోగ బిల్లు రూ.74 లక్షలు అవుతోంది. ఆ పారిశ్రామిక వేత్త ఇంట్లో అత్యంత ఖరీదైన రెండు వేడినీళ్ళ స్విమ్మింగ్‌ పూల్స్‌ వంటి విలాసాలు ఉండడం వలన విద్యుత్తు భారీగా వినియోగమవుతోంది.  విద్యుత్తు, పెట్రోలియంలపై మరింత క్రమబద్ధమైన ధరలను మనం నిర్ణయించాలి. ప్రస్తుతం, వంద యూనిట్ల కంటే తక్కువగా వినయోగిస్తున్న వ్యక్తి నుంచి యూనిట్‌కు రూ.6 లను వసూలు చేయవచ్చు. అదే విధంగా 250 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్‌ను వినియోగించినట్లయితే అలాంటి వారి నుంచి యూనిట్‌కు రూ.20 రూపాయలు వసూలు చేయాలి. అలాగే, చిన్న కార్లతో పోలిస్తే, ఇంజన్‌ సామర్థ్యం ఒక లీటరు కంటే ఎక్కువగా ఉండే కారు యజమానులకు పెట్రోలియంను అధిక ధరకు విక్రయించాలి. అలాగే, 200 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంగల ఇంటి యజమానులపై అధికంగా ఇంటి పన్ను విధించాలి. ఇలాంటి విధానం ఇంధన వినియోగం తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఈ క్షీణత వల్ల ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు తగ్గుతుందని భయపడనవసరంలేదు. ఆరోగ్యం, విద్య, ఆదాయం పునాదిగా అంచనా కట్టే మానవాభివృద్ధి సూచికకు అనుగుణంగా నేడు ఆర్థికాభివృద్ధిని గణించడానికి విశ్వజనీన ఆమోదం ఉంది. విద్యుత్తు అధికంగా ఖర్చయ్యే ఎయిర్‌ కండిషన్లు, పెట్రోలియంను బాగా తాగే పెద్ద కార్లను తక్కువగా వినియోగించడం వల్ల ప్రజా ఆరోగ్యం, విద్య, ప్రజల ఆదాయాల్లో ఏ మాత్రం మార్పూ ఉండదు. పన్నులను అధికంగా వసూలు చేసి, ఆ నిధుల ద్వారా అడవులు, నదుల సంరక్షణను చేపట్టి, తద్వారా వాతావరణ ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. దాంతో ఎయిర్‌ కండిషన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. పన్నులు అధికంగా వేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా రవాణా అభివృద్ధికి వినియోగించవచ్చు. అది పెట్రోలియం వ్యక్తిగత వినియోగాన్ని బాగా తగ్గిస్తుంది. పెద్ద పెద్ద ప్రైవేటు వాహనాల కొనుగోలు వల్ల ఎంత పెరుగుతుందో బస్సుల కొనుగోలు ద్వారానూ అంతే స్థాయిలో జీడీపీ వృద్ధి చెందుతుంది. ప్రకృతి వనరుల సంరక్షణకు అనుగుణమైన ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధిని చేపట్టడమే రెండవ దశ కార్యక్రమం. హర్యానా వంటి నిర్జల ప్రాంతాల్లో వరిని పండించేందుకు డీజిల్‌ పంపు సెట్ల ద్వారా భూగర్బ జలాల్ని తోడడంతో కాలుష్యం ఏర్పడుతుంది. అదే సమయంలో భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతాయి. అదే కేరళ వంటి ప్రాంతాల్లో వరి పండిస్తే కాలుష్యం ఏర్పడదు. అందువలన, హర్యానాలో అక్కడి నేలకు సరిపోయే, నీటి లభ్యతకు అనుగుణమైన సజ్జలు, జొన్నలు వంటి పంటలు పండించాలి. భారత దేశ మొత్తంగా ఈ తర్కం వర్తిస్తుంది. భారీ స్థాయిల్లో విద్యుదుత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గు, యురేనియం నిల్వలు మన దేశంలో లేవు. పెద్ద పెద్ద వాహనాల ఉత్పత్తికి అవసరమైన విస్తారమైన ఇనుప ఖనిజమూ ఇక్కడ లేదు. 12 లేన్ల అతి భారీ రహదారులు నిర్మించేందుకు అనువైన భూమి కూడా లేదు. ఇనుము వినియోగంలో ఆస్ట్రేలియాతోను, పెట్రోలియం వినయోగంలో సౌదీ అరేబియాతోను, హైవేల నిర్మాణంలో అమెరికాతోనూ మనం పోటీ పడినట్లయితే మన పరిమిత ప్రకృతి వనరులను మనమే విధ్వంసం చేసుకున్నట్లువుతుంది. అయినప్పటికీ మనకు పెద్ద ఎత్తున మానవ వనరుల సంపద ఉన్నది. ఈ మానవవనరులను మన ఆర్థికాభివృద్ధికి కీలక చోదక శక్తిగా వినియోగించుకోగలగాలి. వస్తూత్పత్తి రంగం కంటే సంగీతం, సినిమా, ఆరోగ్య సంరక్షణ, యూనివర్సిటీ విద్య వంటి సేవా రంగ ఉత్పత్తులపై మనం దృష్టి కేంద్రీకరించాలి. పెద్ద పెద్ద వాహనాలు, ఎయిర్‌ కండిషన్ల వంటి ఉత్పత్తులకు సమానంగా ఈ సేవల రంగ ఉత్పత్తి కూడా జీడీపీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. వనరులపై క్రమబద్ధమైన ధర నిర్ణయం, అభివృద్ధి వ్యూహ కేంద్రీకరణ సేవల రంగం వైపు మళ్లించడం అనే విధానాలు వాతావరణహిత అభివృద్ధి నమూనాకు అవసరం.(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్  ప్రొఫెసర్‌)  చికాగో నగరాన్ని 1971లో సందర్శించాను. ఆ సమయంలో ఆ నగరంలో కార్ల కారణంగా ఊపిరాడనంత పొగ అలుముకొని ఉండేది. 1996లో మరోసారి చికాగో వెళ్ళాను. అప్పుడు చికాగో నగరంలో గాలి చాలా స్వచ్ఛంగా ఉంది. శబ్దం కానీ, పొగ కానీ లేదు. కార్లలోని నూతన కాలుష్య నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా పరిశుభ్రమైన గాలి ఏర్పడింది. అలా సాంకేతిక పరిజ్ఞానం ఎల్లప్పుడూ వాతావరణహితమైన వృద్ధికి దారిచూపే మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. అయితే ఈ వైఖరితో సమస్యలూ ఉన్నాయి. ఒకటి, కార్ల నుంచి వెలువడే సల్ఫర్‌, నైట్రోజన్‌ కాలుష్యాల పరిమాణం అదుపులోకి వచ్చిన్నప్పటికీ, కార్బన్‌ వెలువరింపులు అనేక రెట్లు పెరగడంతో అది భూతాపానికి దారితీసింది. రెండు, కాలుష్యాన్ని దేశాంతరాలకు తరలించి వేస్తున్నారు. గతంలో అమెరికాలోని డెట్రాయిట్‌ నగరంలోనే ఉక్కును తయారు చేసేవారు. అప్పుడు ఉక్కు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం అమెరికాలోనే ఉండేది. ప్రస్తుతం ఉక్కును, కార్లను చైనాలో తయారు చేసి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు. అలా కాలుష్యం చైనాకు ఎగుమతి అయింది. నిజంగా కాలుష్యం కట్టడి కావాలంటే వినియోగం స్థాయి మొత్తంగా తగ్గాలి. ఉదాహరణకు, సొంతంగా కారు కలిగి ఉండడమనే సంస్కృతి అమెరికాలో వృద్ధి చెందింది. ఒక చిన్న బ్రెడ్డు ముక్క కొనుగోలు చేయాలన్నా అమెరికాలో 4–5 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి ఉంటుంది. ఇలాంటి అనవసర రవాణా తగ్గిస్తేనే, ఇంధన వినియోగం తగ్గి కాలుష్యాల వెలువరింపు తగ్గుతుంది. అందువల్ల కార్లపై అధిక పన్ను వేసి, బస్సు, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థకు సబ్సిడీ అందజేయాల్సి ఉంటుంది. అదే విధంగా, భారత దేశంలో విద్యుదుత్పత్తి ప్రధాన కాలుష్యకారకంగా ఉంది. ముంబయిలో ఒక పారిశ్రామిక వేత్త ఇంటి విద్యుత్తు వినియోగ బిల్లు రూ.74 లక్షలు అవుతోంది. ఆ పారిశ్రామిక వేత్త ఇంట్లో అత్యంత ఖరీదైన రెండు వేడినీళ్ళ స్విమ్మింగ్‌ పూల్స్‌ వంటి విలాసాలు ఉండడం వలన విద్యుత్తు భారీగా వినియోగమవుతోంది.  విద్యుత్తు, పెట్రోలియంలపై మరింత క్రమబద్ధమైన ధరలను మనం నిర్ణయించాలి. ప్రస్తుతం, వంద యూనిట్ల కంటే తక్కువగా వినయోగిస్తున్న వ్యక్తి నుంచి యూనిట్‌కు రూ.6 లను వసూలు చేయవచ్చు. అదే విధంగా 250 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్‌ను వినియోగించినట్లయితే అలాంటి వారి నుంచి యూనిట్‌కు రూ.20 రూపాయలు వసూలు చేయాలి. అలాగే, చిన్న కార్లతో పోలిస్తే, ఇంజన్‌ సామర్థ్యం ఒక లీటరు కంటే ఎక్కువగా ఉండే కారు యజమానులకు పెట్రోలియంను అధిక ధరకు విక్రయించాలి. అలాగే, 200 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంగల ఇంటి యజమానులపై అధికంగా ఇంటి పన్ను విధించాలి. ఇలాంటి విధానం ఇంధన వినియోగం తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఈ క్షీణత వల్ల ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు తగ్గుతుందని భయపడనవసరంలేదు. ఆరోగ్యం, విద్య, ఆదాయం పునాదిగా అంచనా కట్టే మానవాభివృద్ధి సూచికకు అనుగుణంగా నేడు ఆర్థికాభివృద్ధిని గణించడానికి విశ్వజనీన ఆమోదం ఉంది. విద్యుత్తు అధికంగా ఖర్చయ్యే ఎయిర్‌ కండిషన్లు, పెట్రోలియంను బాగా తాగే పెద్ద కార్లను తక్కువగా వినియోగించడం వల్ల ప్రజా ఆరోగ్యం, విద్య, ప్రజల ఆదాయాల్లో ఏ మాత్రం మార్పూ ఉండదు. పన్నులను అధికంగా వసూలు చేసి, ఆ నిధుల ద్వారా అడవులు, నదుల సంరక్షణను చేపట్టి, తద్వారా వాతావరణ ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. దాంతో ఎయిర్‌ కండిషన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. పన్నులు అధికంగా వేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా రవాణా అభివృద్ధికి వినియోగించవచ్చు. అది పెట్రోలియం వ్యక్తిగత వినియోగాన్ని బాగా తగ్గిస్తుంది. పెద్ద పెద్ద ప్రైవేటు వాహనాల కొనుగోలు వల్ల ఎంత పెరుగుతుందో బస్సుల కొనుగోలు ద్వారానూ అంతే స్థాయిలో జీడీపీ వృద్ధి చెందుతుంది. ప్రకృతి వనరుల సంరక్షణకు అనుగుణమైన ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధిని చేపట్టడమే రెండవ దశ కార్యక్రమం. హర్యానా వంటి నిర్జల ప్రాంతాల్లో వరిని పండించేందుకు డీజిల్‌ పంపు సెట్ల ద్వారా భూగర్బ జలాల్ని తోడడంతో కాలుష్యం ఏర్పడుతుంది. అదే సమయంలో భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతాయి. అదే కేరళ వంటి ప్రాంతాల్లో వరి పండిస్తే కాలుష్యం ఏర్పడదు. అందువలన, హర్యానాలో అక్కడి నేలకు సరిపోయే, నీటి లభ్యతకు అనుగుణమైన సజ్జలు, జొన్నలు వంటి పంటలు పండించాలి. భారత దేశ మొత్తంగా ఈ తర్కం వర్తిస్తుంది. భారీ స్థాయిల్లో విద్యుదుత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గు, యురేనియం నిల్వలు మన దేశంలో లేవు. పెద్ద పెద్ద వాహనాల ఉత్పత్తికి అవసరమైన విస్తారమైన ఇనుప ఖనిజమూ ఇక్కడ లేదు. 12 లేన్ల అతి భారీ రహదారులు నిర్మించేందుకు అనువైన భూమి కూడా లేదు. ఇనుము వినియోగంలో ఆస్ట్రేలియాతోను, పెట్రోలియం వినయోగంలో సౌదీ అరేబియాతోను, హైవేల నిర్మాణంలో అమెరికాతోనూ మనం పోటీ పడినట్లయితే మన పరిమిత ప్రకృతి వనరులను మనమే విధ్వంసం చేసుకున్నట్లువుతుంది. అయినప్పటికీ మనకు పెద్ద ఎత్తున మానవ వనరుల సంపద ఉన్నది. ఈ మానవవనరులను మన ఆర్థికాభివృద్ధికి కీలక చోదక శక్తిగా వినియోగించుకోగలగాలి. వస్తూత్పత్తి రంగం కంటే సంగీతం, సినిమా, ఆరోగ్య సంరక్షణ, యూనివర్సిటీ విద్య వంటి సేవా రంగ ఉత్పత్తులపై మనం దృష్టి కేంద్రీకరించాలి. పెద్ద పెద్ద వాహనాలు, ఎయిర్‌ కండిషన్ల వంటి ఉత్పత్తులకు సమానంగా ఈ సేవల రంగ ఉత్పత్తి కూడా జీడీపీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. వనరులపై క్రమబద్ధమైన ధర నిర్ణయం, అభివృద్ధి వ్యూహ కేంద్రీకరణ సేవల రంగం వైపు మళ్లించడం అనే విధానాలు వాతావరణహిత అభివృద్ధి నమూనాకు అవసరం.(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్డ్  ప్రొఫెసర్‌)
editorial
18,807
02-02-2017 04:46:22
ప్రణబ్‌, చిదంబరం, జైట్లీ... ముగ్గురూ ముగ్గురే..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సాధారణ బడ్జెట్‌లను ప్రవేశపెట్టడంలో ముగ్గురు కేంద్ర ఆర్థిక మంత్రులు ప్రణబ్‌ ముఖర్జీ, పి.చిదంబరం, అరుణ్‌ జైట్లీలకు వేర్వేరు విశిష్టతలున్నాయి. ముగ్గురిలోనూ ఎక్కువ బిజీగా గడిపేది మాత్రం ప్రణబ్‌దాయేనని చెప్పవచ్చు. వీరిలో ఎవరెవరి తీరు ఎలా ఉంటుందంటే..  చిదంబరం.. ఆరు దాటితే పని చేయరు  జైట్లీ.. పని పూర్తయితే జంప్‌..
nation
10,589
21-11-2017 13:05:54
రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న రజినీ కాంత్
సూపర్ స్టార్ రజినీ కాంత్ తాజాగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. రజినీ ప్రస్తుతం రోబో 2.0 సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఇటీవల దుబాయ్‌లో ఏ సినిమా జరుపుకోనంత గ్రాండ్‌గా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. షూటింగ్‌లో కొంత విరామం తీసుకున్న రజినీ రాఘవేంద్రస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రజినీకి ఘన స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు.
entertainment
14,240
31-05-2017 01:47:44
భత్యాల పెంపుపై ఉద్యోగులకు తీపికబురు?
న్యూఢిల్లీ, మే 30: ఏడోవేతన సంఘం సిఫారసులకు సంబంధించి కార్యదర్శుల సాధికార కమిటీ(ఈసీవోఎస్‌) గురువారం(1న) కేంద్ర కేబినెట్‌ కార్యదర్శిని కలవనుంది. ఈ భేటీ నేపథ్యంలో భత్యాల పెంపుపై ఉద్యోగులకు తీపికబురు అందే అవకాశాలున్నాయి. అధిక భత్యాలపై కమిటీ తన నిర్ణయాన్ని ఈ సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. అశోక్‌ లావాసా కమిటీ సిఫారసులపై ముసాయిదాను కమిటీ ఖరారు చేయనుంది. సవరించిన భత్యాలపై నివేదికను ఆర్థిక కార్యదర్శి అశోక్‌ లావాసా నేృత్వంలోని కమిటీ ఐదు నెలలు ఆలస్యంగా గత నెల 27న ఆర్థిక మంత్రి జైట్లీకి సమర్పించిన సంగతి తెలిసిందే.
nation
14,203
22-04-2017 13:25:27
ముస్లింలకు గుర్తింపు మీ దయ కాదు.. రాజ్యాంగమే ఇచ్చింది
హైదరాబాద్: ముస్లింలు తమకు ఓటు వేయకపోయినా కేంద్రం వారికి తగిన గౌరవం ఇచ్చిందంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ముస్లింలకు గుర్తింపు ఇచ్చింది రాజ్యాంగమే కానీ, రవిశంకర్ ప్రసాద్ కాదని ఒవైసీ తెగేసిచెప్పారు. రాజ్యాంగమే అందరికీ సుప్రీం అని, రాజ్యాంగం ముస్లింలకు హక్కులు ప్రసాదించిందనీ, వారి హక్కుల పరిరక్షణ బాధ్యత రాజ్యాంగానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇండియా వంటి ప్రజాస్వామిక దేశంలో నేతలను ఎన్నుకునే స్వేచ్ఛ తమకు ఉందని, రాజ్యంగమే సుప్రీం అనే విషయం రవిశంకర్ ప్రసాద్ గ్రహించడం మంచిదని ఒవైసీ హితవు పలికారు. శుక్రవారంనాడు ఓ కార్యక్రమంలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ముస్లింలు బీజేపీకి ఓటేయలేదని, అయినప్పటికీ ప్రభుత్వం వారికి తగిన గౌరవాన్ని ఇచ్చిందని అన్నారు. 12 రాష్ట్రాల్లో సొంతంగా తమ ముఖ్యమంత్రులు ఉన్నారని, పరిశ్రమలు, ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఏ ముస్లింను వేధింపులకు గురిచేయడం కానీ ఉద్యోగం నుంచి తొలగించడం కానీ చేయలేదని అన్నారు. బీజేపీకి ముస్లింలు ఓటు వేయకపోయినా వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు.
nation
16,477
01-04-2017 03:13:39
గుజరాత్‌లో మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు ఒట్టి బూటకం
కేంద్ర, రాష్ట్ర విధానాలను బట్టే రాయితీలు నానో కార్లు, అదానీ పరిశ్రమలకు భూములపై షా కమిషన్‌ నివేదిక మా నిజాయితీకి నిదర్శనం: ప్రభుత్వం గాంధీనగర్‌, మార్చి 31: గుజరాతలో మోదీ సీఎంగా ఉన్నప్పుడు పరిశ్రమలకు భూకేటాయింపుల విషయంలో ఎలాంటి అవినీతీ చోటుచేసుకోలేదని జస్టిస్‌ ఎంబీ షా కమిషన్‌ తేల్చింది. భూకేటాయింపుల్లో భారీగా అవినీతి జరిగిందంటూ నాడు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలన్నీ ఒట్టి బూటకమని స్పష్టం చేసింది. ఈ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2011లో టాటా నానో కార్ల పరిశ్రమకు, అదానీ గ్రూపునకు ముంద్రా పోర్టు-సెజ్‌, ఎల్‌అండ్‌టీ పరిశ్రమలకు చేసిన 9 భూకేటాయింపుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు ఆరోపణలు చేస్తూ అప్పట్లో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. మొత్తం 17 అవినీతి ఆరోపణలు చేశారు. బెంగాల్‌ నుంచి గుజరాతకు నానో కార్ల పరిశ్రమను తీసుకురావడానికి రూ.33వేల కోట్ల మేరకు రాయితీలు ఇచ్చారని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంబీ షా నేతృత్వంలో విచారణ కమిషన్‌ను మోదీ నియమించారు. కోర్టు పరిధిలో ఉన్న రెండు ఆరోపణలను మినహాయించి... మిగిలిన 15పైన ఈ కమిషన్‌ విచారించింది. ఆయా అంశాలపై మొత్తం 5,500 పేజీలు, 22 భాగాలతో 2012, 2013లలో విడివిడిగా రెండు నివేదికలు ఇచ్చింది. వాస్తవానికి ఈ కమిషన్‌ నివేదికను అందరికీ అందుబాటులో ఉండేలా... ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటరీ లైబ్రరీలో పెట్టింది. కానీ, ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు ఎలాంటి కాపీలనూ ఇవ్వలేదు. దీంతో, షా కమిషన్‌ నివేదికను బహిర్గత పర్చాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కోరడంతో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గుజరాతలోగానీ, ఇతర రాష్ర్టాల్లోగానీ రాయితీలు పొందుతున్న కంపెనీ టాటా నానో ప్రాజెక్టు ఒక్కటే కాదని షా కమిషన్‌ పేర్కొంది. నానో కార్ల పరిశ్రమకు అయాచిత రీతిలో ఏమీ ప్రయోజనం కల్పించలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరించిందని నివేదికలో వెల్లడించింది. అదానీ గ్రూపునకు భూకేటాయింపుల్లోనూ ఎలాంటి అక్రమాలూ జరగలేదని, కాంగ్రెస్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇక ఎల్‌అండ్‌టీకి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించిందన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ... ఆ కంపెనీకి భూములు కేటాయుంచినప్పుడు కాంగ్రెస్‌ సీఎం ఉన్నారంటూ షా కమిషన్‌ గుర్తు చేసింది. నాడు మోదీ ప్రభుత్వంపై ఈ భూకేటాయింపులతోపాటు... బడా పారిశ్రామికవేత్తలకు చెందిన ప్రైవేటు విమానాల్లో సీఎం ప్రయాణిస్తున్నారని, బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీ నుంచి పశువులకు మేత కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారని, ‘సుజలాం సుఫలాం’ సాగునీటి ప్రాజెక్టుల్లోనూ అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఆశ్చర్యకర విషయమేంటంటే... విచారణ సమయంలో షా కమిషన్‌ ముందుకు ఈ కాంగ్రెస్‌ నేతలు రాలేదు. దీంతో, ఈ నివేదికను సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా... ‘మా ప్రభుత్వం నిజాయితీకి, అవినీతి రహిత పాలనకు ఇదే నిదర్శనం. ఇందులో ప్రజలకు చెప్పకుండా దాచడానికేమీ లేదు’ అని డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు.
nation
19,007
10-09-2017 02:01:23
ఉత్తర భారతానికి ఉదరకుహర వ్యాధి!
ప్రతి వంద మందిలో ఒక్కరికి..చపాతీలు తింటున్నందుకే..ఎయిమ్స్‌ అధ్యయనంలో వెల్లడిన్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9: ఉత్తర భారతదేశంలోని ప్రతి వంద మందిలో ఒక్కరు ఉదర కుహర వ్యాధితో బాధపడుతున్నారని ఎయిమ్స్‌ అధ్యయనంలో తేలింది. ఈ వ్యాధికి గ్లూటెన్‌ అనే ప్రోటీన్‌ కారణం. ఈ ప్రోటీన్‌ను జీర్ణం చేసుకునే ప్రక్రియలో చిన్న పేగు దెబ్బతింటుంది. దీని కారణంగా రోగిలో బరువు, ఎత్తు పెరగడం, తరచుగా అతిసార వ్యాధికి గురవడం, రక్తహీనత, ఎముకల్లో బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. గోధుమలు, బార్లీ, కాయధాన్యాలు, తృణధాన్యాల నుంచి ఈ గ్లూటెన్‌ ప్రోటీన్‌ లభ్యమవుతుంది. ముఖ్యంగా గోధుమలతో తయారైన పదార్థాల్లో ఈ గ్లూటెన్‌ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల గోధుమల్లో 80 శాతం ఈ గ్లూటెన్‌ పోట్రీన్‌ ఉంటుంది.  ఈ ప్రోటీన్‌ పూర్తిగా జీర్ణమవడం కష్టం. దీన్ని జీర్ణం చేసుకునే ప్రక్రియలో చిన్న పేగు దెబ్బతింటుంది. గోధుమ సంబంధ ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే ఉత్తర భారతీయులు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నట్టు ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. ప్రతి వంద మందిలో ఒక్కరు ఈ వ్యాధికి గురువుతున్నట్టు కనుగొన్నారు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే గోధుమ సంబంధ ఆహారానికి పూర్తిగా దూరమవ్వాల్సిందే. ఈ ఉదరకుహర వ్యాధితో బాధపడుతున్నవారు ఒక్క చపాతీ తిన్నా కష్టమే. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ వ్యాధి గురించి ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా అవగాహన కల్పించాలని వైద్యులు సూచిస్తున్నారు.
nation
18,577
22-02-2017 14:33:03
కన్నీటి పర్యంతమైన ఉబెర్ సీఈవో!
బ్లూంబర్గ్ : ఆన్‌లైన్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్‌వర్క్ కంపెనీ ఉబెర్ టెక్నాలజీస్ సీఈవో ట్రావిస్ కాలనిక్... తన కంపెనీ ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. కంపెనీలో మహిళా సిబ్బందికి ఎదురవుతున్న లైంగిక వేధింపులపై ఓ మాజీ మహిళా ఉద్యోగి చేసిన తీవ్ర ఆరోపణలతో అప్రమత్తమైన ఆయన రెండు రోజుల్లోగానే కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు తాను నిర్లక్ష్యంగా వ్యవహరించిన అన్ని విషయాలపై నిజాయితీ ఒప్పుకున్నారనీ.. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరక్కుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారని సమాచారం. ఏరియానా హాఫింగ్టన్ కథనం ప్రకారం.... ఉబెర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు గత 48 గంటలుగా తాను తీసుకుంటున్న చర్యలను స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా సిబ్బంది ప్రస్తావించిన సమస్యలు విని ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయారని ఓ మహిళా ఉద్యోగి వెల్లడించారు. దాదాపు గంటన్నరపాటు మహిళా సమస్యలపై ఆయన చర్చించినట్టు వెల్లడించారు. గత ఎనిమిదేళ్లుగా శరవేగంగా ప్రపంచస్థాయి కంపెనీగా ఎదిగిన ఉబెర్... మానవ వనరుల విభాగంపై ఏమాత్రం దృష్టిపెట్టని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టు చెబుతున్నారు. ఉద్యోగ నియామకాల్లో సమతుల్యత పాటించపోవడంపైనా కాలనిక్ సుదీర్ఘంగా చర్చించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలపై అంతర్గత విచారణ పూర్తయిన తర్వాత మిగతా విషయాలపైనా దృష్టి పెడతానని చెప్పినట్టు సమాచారం.
nation
6,721
05-06-2017 12:46:21
నా భర్తతో 3 నెలలు మాట్లాడలేదు: శ్రీదేవి
శ్రీదేవి మూడు నెలల పాటు తన భర్త బోనీ కపూర్‌తో మాట్లాడలేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. మాట్లాడలేదంటే.. వారిద్దరి మధ్య ఏవైనా విభేదాలొచ్చాయా అంటే.. లేదు. ప్రస్తుతం ఆమె ‘మామ్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూలైలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా ట్రైలర్ లాంచ్‌లో మాట్లాడిన ఆమె ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో దానికి సంబంధించిన ప్రతి విషయమూ చాలా సీక్రెట్‌గా ఉంచాలని భావించిన శ్రీదేవి.. బోనీ కపూర్‌తో చాలా తక్కువగానే మాట్లాడారట.           ఆయన తన భర్త అయినా సరే.. మూడు నెలల పాటు బోనీకపూర్‌తో మాట్లాడలేదని శ్రీదేవి చెప్పారు. పొద్దున లేవగానే ‘గుడ్ మార్నింగ్’, షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక పడుకునే ముందు ‘గుడ్ నైట్’ అనే ముక్కలు తప్ప.. ఆయనతో నేను మాట్లాడింది లేదని ఆమె తెలిపారు. తాను పూర్తిగా డైరెక్టర్ నటినని, ఆయనకు అనుగుణంగానే సినిమాలో నటించానని, ఆ పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడి కావొద్దన్న ఉద్దేశంతోనే బోనీతో తాను మాట్లాడలేదని అన్నారు. తనకు నటిగా అంత సీనియారిటీ ఉన్నా.. కొత్తగా వచ్చిన నటిగానే ఉత్సాహంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. తానింకా చేయాల్సింది చాలానే ఉందని చెప్పారు.  రామాయణం గురించి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా..?
entertainment
14,800
10-02-2017 13:14:11
చిన్నమ్మకు మరో ఎదురు దెబ్బ
చెన్నై : శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెను అన్నా డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ చేసిన తీర్మానాన్ని తోసిపుచ్చవలసిందిగా కోరుతూ భారతదేశ ఎన్నికల సంఘానికి పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ లేఖ రాశారు. ఎన్నికల సంఘం కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే శశికళ అధ్యాయం ముగిసినట్లేనని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.  జయలలిత మరణానంతరం డిసెంబరు 29న శశికళకు ఈ పదవిని తాత్కాలికంగా కట్టబెడుతూ ఆమెను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. నాటి సమావేశానికి మధుసూదనన్ ప్రిసీడియం చైర్మన్‌గా వ్యవహరించినందున ఆయనే ఇప్పుడు ఎన్నికల సంఘానికి అప్పటి తీర్మానం చెల్లదంటూ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నిబంధనల ప్రకారం వరుసగా ఐదేళ్ళ పాటు పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పదవిని చేపట్టేందుకు అర్హులన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఇదిలావుండగా, శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న నేపథ్యంలో పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎన్నికల సంఘం ఇటీవల నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్మానం ప్రతిని తమకు పంపాలని కోరింది.  తాత్కాలిక హోదాలో ఉన్న శశికళకు పార్టీ నుంచి ఏ ఒక్కరినీ తొలగించే అధికారం లేదని పన్నీర్ సెల్వంతో పాటు ఆమె ద్వారా తొలగింపునకు గురైన నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నడుమ ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.
nation
5,652
26-12-2017 11:14:23
కావాలనే సాయిపల్లవిని కట్ చేశారా?
సాయి పల్లవిని కట్‌ చేయడం ఏమిటి అనుకుంటున్నారా? నిజమే... నాని, సాయి పల్లవి, భూమిక నటించిన ‘ఎంసిఏ’ సినిమాలో సాయి పల్లవి సీన్లకు చాలా వరకూ కటింగ్‌ పడిందట! దీనికీ ఓ కారణముంది. సినిమాలో సాయి పల్లవి ఉంటే ఇంక ఏ ఆర్టిస్టూ కనిపించరు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. సినిమా మొత్తం నాని, భూమికలకన్నా సాయి పల్లవే ఎక్కువ డామినేట్‌ చేస్తూండడంతో ఆమె సీన్లను ఎడిటింగ్‌లో చాలా వరకు కట్‌ చేశారట! సాయిపల్లవిని చూసి భయపడే ఆమె పాత్రని తగ్గించారని సినీ జనాలు అంటున్నారు.
entertainment
19,669
23-09-2017 01:27:20
నల్లగొండలో హాకీ టోర్నీ షురూ
నల్లగొండ స్పోర్ట్స్‌: తెలంగాణ రాష్ట్ర జూనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ బాలుర హాకీ టోర్నమెంట్‌ శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ స్టేడియంలో ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. టోర్నమెంట్‌లో రాష్ట్రంలోని పాత జిల్లాల నుంచి 10 జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు లీగ్‌ కమ్‌ నాటౌట్‌ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌, అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కె.చినవెంకట్‌రెడ్డి, కార్యదర్శి ఇమాం కరీం తదితరులు పాల్గొన్నారు.
sports
4,703
09-11-2017 18:26:34
'అయాన్ కుర్ది‌'ని ప్రస్తావిస్తూ.. సుమంత్ అశ్విన్ ట్వీట్
అయాన్ కుర్ది గుర్తున్నాడా? ఓ మూడేళ్ల చిన్నారి.. ప్రపంచానికి తన దేశ దుస్థితిని తెలియజేశాడు. అప్పటి వరకూ సిరియా పరిస్థితి గురించి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. అయాన్ మృతదేహం సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చినపుడు తీసిన పిక్ ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టించింది. ప్రపంచమంతా ఒక్కసారిగా సిరియా వైపు చూసేలా చేసింది. ఈనెల 10న అంటే రేపు ఒక్కడు మిగిలాడు సినిమా రిలీజ్ కాబోతోంది.  ఈ సందర్భంగా అయాన్ పిక్‌తో సుమంత్ అశ్విన్ ఓ ట్వీట్ చేశారు. "అతని పేరు అయాన్ కుర్ది. వయసు 3సంవత్సరాలు. అతనికి సాకర్ ఆడటమంటే చాలా ఇష్టం. అతని ఒకే ఒక్క నేరం? 2012లో సిరియాలో జన్మించడం" అంటూ అయాన్ గురించి ట్వీట్ పెట్టారు. ఇక ఒక్కడు మిగిలాడు సినిమా గురించి ప్రస్తావిస్తూ "ఒక్కడు మిగిలాడు శరణార్థులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావించింది. ఒకవేళ ఇండియా రేపు యుద్ధానికి సిద్ధమైతే.. అక్కడి బాధితులు పడుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుంది. వారు పడుతున్న బాధల్ని థియేటర్‌లో చూడండి." అంటూ ట్వీట్ చేశారు.
entertainment
16,652
24-07-2017 01:12:08
‘ఇందు సర్కార్‌’ను వ్యతిరేకించడం అసహనం కాదా?
దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీనే ఇప్పుడు అసహనం గురించి మాట్లాడుతోంది. ఎన్నికల్లో ఓడిపోయాక ఆ పార్టీకి లేవనెత్తడానికి ఏ అంశాలూ లేకపోవడంతో ఈ అసహనం అనే అంశాన్ని సృష్టించింది. ఎమర్జెన్సీపై సినిమా (ఇందు సర్కార్‌) తీస్తానని మధుర్‌ భండార్కర్‌ నన్ను సంప్రదించినప్పుడు అతణ్ని ప్రోత్సహించాను. ప్రజలు ఆ సినిమాను ఆదరిస్తారని.. వ్యతిరేకించేవారు సైతం దాన్ని పాపులర్‌ చేస్తారని, ఎందుకంటే ప్రజలు ఆ రోజుల్ని గుర్తుతెచ్చుకోవడం ఆ పార్టీకి ఇష్టం ఉండదని చెప్పాను. మరి ఇది అసహనం కాదా?-సుబ్రమణ్య స్వామి, బీజేపీ ఎంపీ
nation
488
11-02-2017 00:18:55
బిఒబి లాభంలో వృద్ధి
ప్రభుత్వరంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి 252.67 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు 3,342 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదు చేసింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం 11,726.95 కోట్ల రూపాయల నుంచి 12,181 కోట్ల రూపాయలకు చేరుకుంది. స్థూల మొండి పద్దులు 11.35 శాతం నుంచి 11.40 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పిఎలు మాత్రం 5.67 శాతం నుంచి 5.43 శాతానికి తగ్గాయి. మొండి పద్దుల కోసం కేటాయింపులు 6,474 కోట్ల రూపాయల నుంచి 1,637 కోట్ల రూపాయలకు తగ్గాయి.
business
21,279
10-09-2017 01:53:12
లాహోర్‌లో లంక-పాక్‌ టీ20!
కరాచీ: లాహోర్‌లో ఓ టీ20 మ్యాచ్‌ ఆడేందుకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు అంగీకరించింది. అయితే వచ్చేవారం పాకిస్థాన్‌లో వరల్డ్‌ లెవెన్‌ పర్యటన విజయవంతమైతేనే అక్టోబరు 29న తాము లాహోర్‌లో ఆ మ్యాచ్‌ ఆడతామని షరతు విధించింది. శ్రీలంకతో పాకిస్థాన్‌ స్వదేశీ సిరీస్‌ యూఏఈ వేదికగా ఈనెల 28న ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ షెడ్యూల్‌ను పాక్‌ క్రికెట్‌ బోర్డు శనివారం ప్రకటించింది.  ఇందులో భాగంగా ఓ డే/నైట్‌ సహా రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌-శ్రీలంక తలపడనున్నాయి. ఆఖరి టీ20 మ్యాచ్‌ను లాహోర్‌లో ఆడేందుకు లంక క్రికెట్‌ బోర్డు ఓకే చెప్పింది. కాగా, వరల్డ్‌ లెవన్‌-పాక్‌ జట్ల మధ్య వచ్చేవారం లాహోర్‌లో మూడు టీ20ల ఇండిపెండెన్స్‌ కప్‌ జరగనుంది. ఈ సిరీస్‌కు దేశాధ్యక్షుడి స్థాయి భద్రతను పాకిస్థాన్‌ ప్రభుత్వం కల్పించనుంది.
sports
20,419
11-07-2017 02:36:01
జొకోతో దీపిక అఫైర్‌..!
మాజీ ప్రేయసి సంచలన ఆరోపణలులండన్‌: సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మాజీ గాళ్‌ఫ్రెండ్‌ లిడిజా పొపోవిచ్‌ సంచలన ఆరోపణ లు చేసింది. జొకోవిచ్‌, బాలీవుడ్‌ బ్యూ టీ దీపిక పడుకోన్‌ మధ్య రహస్యంగా అఫైర్‌ నడుస్తోందంటూ బాంబు పేల్చింది. తన భార్యతో కంటే.. దీపికతో డేటింగ్‌లో జొకో ఎంతో ఆనందంగా ఉంటాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నొవాక్‌, జెలెనా రిస్టిచ్‌లు పదేళ్లపాటు సహజీవనం చేసిన అనంతరం 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు ఉండగా.. జెలెనా మళ్లీ గర్భవతి. రిస్టిచ్‌తో ఉన్న సమయంలోనే పొపోవి చ్‌తో కూడా జొకోకు సంబంధాలున్నాయని బ్రిటిష్‌ పత్రిక తెలిపింది. గత ఏడాది మార్చిలో లాస్‌ ఏంజిల్స్‌లో దీపికతో కలసి జొకో డేట్‌కు రావడం ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరూ హోటల్‌లో డిన్నర్‌కు హాజరయ్యారు. ఆ సమయంలో బ్రిటిష్‌ మీడియా జొకో పక్కన ఉన్నది ఎవరో గుర్తుపట్టలేదు. అయితే తన భార్య రిస్టిచ్‌ ఫ్రెండ్‌ దీపిక అని జొకో మీడియాకు చెప్పుకొచ్చాడు. 2015, వింబుల్డన్‌ ఫైనల్‌ సందర్భంగా జెలెనాతో పడుకోన్‌ మాట్లాడుతూ కనిపించింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్‌ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌) సందర్భంగా దీపిక, జొకోలు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు కూడా ఆడారు. కాగా, ఇటీవలి కాలంలో నొవాక్‌ ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. భార్య జెలెనాతో జొకో గొడవపడుతుండగా తీసిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.
sports
6,305
07-01-2017 20:44:12
నాగబాబు తిట్లకు స్పందించిన వర్మ
హైదరాబాద్: చిరంజీవి నటించిన 150 సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో సెన్సేషనల్ డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మపై నాగబాబు నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో దుమ్మెత్తిపోశారు. అక్షుపక్షి అంటూ విరుచుకుపడ్డారు. చిరంజీవి సినిమాపై కామెంట్లు కాకుండా మొదట సినిమాలు తీయడం నేర్చుకోవాలంటూ ధ్వజమెత్తారు. ఆన్‌లైన్‌లో చేరి కూతలు కూయవద్దని హితవు పలికారు. నాగబాబు వ్యాఖ్యలపై వర్మ తన స్టైల్లో ట్విట్టర్‌లో స్పందించారు. నాగబాబును ఉద్దేశించి.. ‘‘మీరు ట్విట్టర్‌లో లేరు కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్న ట్వీట్లు మీకు ఎవరైనా చూపిస్తారని అనుకుంటున్నా, మీరంటే నాకెంతో ఇష్టం’’ అని పేర్కొన్నారు. తానోదే తన స్టైల్లో అందరి మీద ఏదో అన్నింటి మీద ట్విట్టర్‌లో స్పందిస్తుంటానని, తన అభిప్రాయమేదో తాను చెబుతుంటానని పేర్కొన్నారు. నిజానికి తనమీద తానే చాలా కామెంట్లు చేస్తుంటానని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వరకు ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని అన్నారు. అయితే తన మాటలకు నాగబాబు హర్ట్ అయినట్టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జెన్యూన్‌గా నాగబాబుకు, ఆయన కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నట్టు ట్వీట్ చేశారు. ‘‘నా ఉద్దేశం వేరే అయినా హర్ట్ అయ్యారు కాబట్టి చిరంజీవి గారికి కూడా నా తరపున దయచేసి క్షమాపణలు చెప్పండి’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
entertainment
20,669
25-12-2017 02:07:03
భారత్‌తో పోరు సవాలే!
జొహాన్నెస్‌బర్గ్‌: గత కొన్నేళ్లుగా ఎంతో రూపాం తరం చెందిన టీమిండియా.. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌లో చరిత్ర సృష్టించే అవకాశం ఉందని సఫారీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిల్లీర్స్‌ అన్నాడు. సౌతాఫ్రికాలో భారత్‌ ఎప్పుడూ టెస్ట్‌ సిరీస్‌ నెగ్గలేదు. 2011 టూ ర్‌లో మాత్రం 1-1తో డ్రా చేసుకోవడం ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన. కాగా, సుమారు రెండేళ్లపాటు టెస్ట్‌లకు దూరంగా ఉన్న డివిల్లీర్స్‌.. మంగళవారం నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్ట్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘నిజంగా టీమిండియాను ఎదుర్కోవ డం పెద్ద సవాల్‌. గత కొన్ని సిరీస్‌ల్లో భారత జట్టు ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంద’ని డివిల్లీర్స్‌ అన్నాడు.
sports
18,154
28-07-2017 03:29:09
మా సర్కారును కూల్చబోయారు
జేడీయూ నేత త్యాగి వెల్లడిన్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): బిహార్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు సహకరిస్తామని బీజేపీ దగ్గర ఆర్జేడీ నెల క్రితం బేరం పెట్టిందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి వెల్లడించారు. ఆర్జేడీ ముఖ్యనేతలిద్దరూ బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారని తెలిపారు. లాలు ప్రసాద్‌ కుటుంబంపై కేసుల్లో మెతగ్గా వ్యవహరిస్తే బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని త్యాగం చేస్తామని వారు ప్రతిపాదించారని చెప్పారు. దాణా కేసులో జార్ఘండ్‌ హైకోర్టు లాలూకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.  ఈ కేసులో సీబీఐ మెతక వైఖరి అవలంభించేలా చేయాలని, తద్వారా తనకు ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించాలని లాలూ బీజేపీతో బేరం నడిపారు. నిఘా వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న నితీశ్‌ ఇతర మార్గాల్లో ధ్రువీకరించుకున్నారు. 23న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వీడ్కోలు విందుకు హాజరైన నితీశ్‌.. మోదీతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రపతిగా కోవింద్‌ ప్రమాణస్వీకారం జరిగిన వెంటనే లాలూను గెంటివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌, ఆయన కుటుంబ సభ్యులపై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదుచేసింది.
nation
9,254
15-08-2017 22:24:27
ఓ లండన్‌ బాబు కథ
‘సినిమా జీవితాన్ని పెద్దగా చూపిస్తే, టీవీ చిన్నగా చూపిస్తుంది. కానీ జీవితాన్ని జీవితంగా చూపెట్టేది నాటకం మాత్రమే. ఈ సినిమా టీజర్‌, సాంగ్‌ చూస్తుంటే నాకు నాటకాల్లో పనిచేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. నిర్మాతగా మారుతిగారు నాకు ఇన్‌స్పిరేషన్‌. కొత్త కాన్సెప్ట్‌ సినిమాలు ఆడితేనే కొత్త నటీనటులు, టెక్నీషియన్లు రావడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే ‘లండన్‌బాబులు’ చిత్రం హిట్‌ కావాలని కోరుకొంటున్నాను’ అన్నారు దర్శకుడు హరీశ్‌శంకర్‌. ఏవీఎస్‌ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్‌ సంస్థ నిర్మించిన ‘లండన్‌బాబులు’ చిత్రంలోని తొలి పాటను మంగళవారం ఆయన విడుదల చేశారు. రక్షిత్‌, స్వాతి జంటగా రూపొందిన ఈ సినిమాకి చిన్నికృష్ణ దర్శకుడు. తమ్మారెడ్డి భరద్వాజ స్పెషల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. మారుతి మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో వచ్చిన ‘ఆండవన్‌ కట్టళై’ సినిమాని స్వీట్‌ మ్యాజిక్‌ ప్రసాద్‌గారు చూడమన్నారు. నాకు బాగా నచ్చింది. రక్షిత్‌కు ఇది మంచి సినిమా అవుతుంది. స్వాతికి కథ నచ్చి చేస్తానని చెప్పింది. మాములుగా నేను నిర్మించే సినిమాలకు పేరు వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. కానీ నాకు బాగా నచ్చడంతో పేరు వేసుకొన్నాను’ అని తెలిపారు.
entertainment
14,144
07-02-2017 03:39:44
జవాబివ్వని కేంద్రానికి 30వేల ఫైన్‌: సుప్రీం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: జమ్మూకశ్మీరులో మైనారిటీలైన హిందువులకు దక్కాల్సిన ప్రయోజనాలు, సౌకర్యాలను మెజారిటీ వర్గమైన ముస్లింలు అనుభవిస్తున్నారంటూ ఆరోపిస్తూ దాఖలైన ఒక పిల్‌పై సమాధానమివ్వనందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి 30 వేల జరిమానా విధించింది. ఈ సొమ్మును 2 వారాల్లోగా జమచేసి జవాబివ్వాలంటూ సీజే ఖేహర్‌, జస్టిస్‌ ఎన్వీ రమణల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. ఇదెంతో ముఖ్యమైన అంశమనీ, సమాధానమిచ్చుకోడానికి కేంద్రానికి ఆఖరి అవకాశమిస్తున్నామని స్పష్టం చేసింది.
nation
13,875
25-03-2017 19:22:12
ఒడిశాలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు
భువనేశ్వర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో విజయోత్సాహంలో ఉన్న బీజేపీ రెండ్రోజుల జాతీయ కార్యనిర్వహక కమిటీ సమావేశాలకు సమాయత్తమవుతోంది. ఏప్రిల్ 15న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారంనాడు తెలిపారు. భువనేశ్వర్‌లో రెండు రోజుల సమావేశానికి ఆతిథ్యమిచ్చేందుకు స్వాగతించిన ఒడిశా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా ఒడిశాలో పర్యటించి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి అసాధారణ మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతారని అన్నారు. జాతీయ కార్యనిర్వహక కమిటీ సమావేశాలకు అవసరమైన సన్నాహక కార్యక్రమాలను ఒడిశా పార్టీ ఇన్‌చార్జి అరుణ్ సింగ్, జాతీయ సంయుక్త కార్యదర్శి సౌందర్ సింగ్ పర్యవేక్షిస్తారని చెప్పారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండ్రోజుల జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశాల్లో పాల్గోనున్నారు.
nation
10,601
09-11-2017 14:59:51
సింగర్ సునీత కూతురు, కొడుకుని చూశారా?
సింగర్ సునీత, పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో మధురమైన గీతాలను ఆలపించిన ఆమె ఎందరికో ఇష్టమైన గాయని. కానీ పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం కొన్ని అనుకోని సంఘటనలు ఆమె జీవితంలో చోటు చేసుకున్నాయి. అయినా ధైర్యంగా అన్నింటిని ఎదుర్కొంటూ.. తన కొడుకు, కూతురే తన ప్రపంచంగా భావిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఓ ఫొటోని తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. 'విత్ మై లవ్' అంటూ సునీత.. కూతురు, కొడుకుతో ఉన్న ఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటోలో కుమారుడు ఆకాష్, కూతురు శ్రేయాల మధ్యలో నవ్వుతూ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు సునీత. ఈ ఫొటోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ‘నిజంగా మీ కూతురేనా, కొడుకేనా’ అని కొందరు, ‘వాళ్ల కంటే మీరే యంగ్‌గా ఉన్నారు’ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘వారు మీ పిల్లలంటే ఎవరూ నమ్మరు, వాళ్లకి సోదరిలా ఉన్నారు మీరు’.. అంటూ నెటిజన్లు ఈ ఫొటోపై రియాక్ట్ అవుతున్నారు.
entertainment
7,238
07-04-2017 23:13:51
జాతీయ చలనచిత్ర అవార్డు విన్నర్స్ హృదయస్పందన
ఇలాగైనా తేరుకుంటానని..భగవంతుడు ఒక కష్టం తర్వాత సుఖాన్నిస్తాడని అంటారు. నాకు మొదటి నుంచీ కుటుంబవ్యవస్థమీద అపారమైన నమ్మకం ఉంది. మా సంస్థ నుంచి వచ్చిన చిత్రాలన్నీ కుటుంబ విలువలకు పెద్దపీట వేసినవే. సతీశ్ చెప్పిన ‘శతమానం భవతి’ పాయింట్‌ నన్ను హాంట్‌ చేసింది. వాకింగ్‌ చేస్తున్నప్పుడు కూడా గుర్తొచ్చింది. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు తప్పక నచ్చుతుందనే నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాం. ప్రేక్షకులు హిట్‌ చేసి ఆశీర్వదించారు. ఇటీవల నా సతీమణి అనిత కన్నుమూసింది. ఆ నష్టం భర్తీచేయలేనిది. ఆ బాధ నేను నుంచి తేరుకోవాలని, నా శక్తి సన్నగిల్లకూడదని భగవంతుడు ఇలా మానసిక ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడేమో.. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాగిరెడ్డి-చక్రపాణి అవార్డును ప్రకటించడం, ఇప్పుడు జాతీయ పురస్కారం రావడం అందులో భాగమేనేమోనని అనిపిస్తోంది. అవార్డు స్వీకరించిన ప్రతిసారీ నా బాధ్యత మరింత పెరిగినట్టు భావిస్తాను. ఇప్పుడు ఈ అవార్డులు ఇచ్చిన ఉత్సాహంతో మా సంస్థ నుంచి ఇంకా గొప్ప సినిమాలు నిర్మించడానికి త్రికరణశుద్ధిగా కృషి చేస్తాం.- దిల్‌రాజు (‘శతమానం భవతి’ నిర్మాత)అనుబంధాలకు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ తీసే సినిమాలకు ప్రేక్షకుల్లో క్రేజ్‌ తగ్గలేదని ‘శతమానం భవతి’ మరోసారి నిరూపించింది. మహిళలు టీవీ సీరియళ్లకు పరిమితమయ్యారని, థియేటర్లకు రావడం లేదనే అపోహను మా చిత్రం తొలగించింది. నేను దిల్‌రాజుగారి సంస్థలో రెండు సినిమాలకు స్ర్కీనప్లే విభాగంలో పనిచేశాను. ఆ చనువుతోనే ఒకరోజు ఆయనతో ‘శతమానం భవతి’ పాయింట్‌ను చెప్పాను. ‘చాలా బావుంది సతీశ తప్పకుండా చేద్దాం’ అని అన్నారు. ఇది నేను ఎప్పుడో రాసుకున్న కథ కావడంతో నేటి తరానికి తగ్గట్టు చాలా మార్పులు చేశాం. వాటికోసం దాదాపు ఏడాదిన్నర స్ర్కిప్ట్‌ మీద వర్క్‌ చేశాం. సినిమా విడుదలయ్యాక చూసిన ప్రతి ఒక్కరూ బావుందన్నారు. 2016 డిసెంబర్‌లో మా సినిమా సెన్సార్‌ అయింది. అవార్డులకు సెన్సార్‌ తేదీ ప్రామాణికం కాబట్టి రాజుగారు దాన్ని దృష్టిలో ఉంచుకుని అవార్డులకు పంపారు. ఈ సినిమాను నమ్మి, ‘శతమానం భవతి’ అని నామకరణం చేసిన ఆయనే జాతీయ పురస్కారం వచ్చిన విషయాన్ని కూడా చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది.-సతీశ్ వేగేశ్న (‘శతమానం భవతి’ దర్శక-రచయిత)ఇప్పటి వరకు నేను ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు అందుకున్నా. కానీ, 64 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో స్టంట్స్‌ విభాగంలో అవార్డు ఇవ్వడం, తొలి అవార్డు నాకే దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. స్టంట్‌ కొరియోగ్రాఫర్ల కష్టానికి ఇప్పటికైనా గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉంది. భారతీయ సినిమాకి, కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. చాలా మంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఈ అవార్డు నా ఒక్కదిడే కాదు. నిర్మాతల, దర్శకులు, నటీనటులు, ముఖ్యంగా స్టంట్‌మెన అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ‘పులిమురుగన’లో యాక్షన సీక్వెల్స్‌ చాలా రియల్‌గా ఉంటాయి. 85 శాతం నిజమైన పులితోనే షూటింగ్‌ చేశాం. వియత్నాం, బ్యాంకాంగ్‌, సౌతాఫ్రికా దేశాల్లో పులుల్ని పరిశీలించి మరీ ఎంపిక చేశాం. నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌ చూస్తూ, జూ పార్కుల్లో పులుల ప్రవర్తన గురించి ఎంతో సమాచారం సేకరించాను. షూటింగ్‌కి ముందు నెలన్నర పాటు పూర్తి పులితోనే ఉన్నాను. దాన్ని మచ్చిక చేసుకున్నాను. - పీటర్‌ హెయిన్స్‌ (ఉత్తమ యాక్షన్‌ డైరెక్టర్‌)జాతీయ అవార్డు రావడం పట్టరాని సంతోషంగా వుంది. దర్శకుడు విక్రమ్‌, నటుడు సూర్య, ఇతర సాంకేతిక నిపుణులు, మొత్తం ప్రొడక్షన యూనిట్‌ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. జాతీయ అవార్డు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. బాంబేలో వుండే బెంగాలీలమైన మేం ఇతర భాషలో సినిమా తీయడం, దానికి జాతీయ అవార్డు రావడం అంటే మాటలా? తమిళ సినిమా తీసినా మాకు తెలియని భాషా చిత్రం తీసినట్లుగా లేదు. సూర్య, విక్రమ్‌ అన్నీ తామై ఈ సినిమాను పూర్తి చేశారు. వారి సహకారం మరువలేనిది. ఈ విజయం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు.- సుబ్రతారాయ్‌, అమిత్ రాయ్‌, ‘24’ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్లు-తాప్సీ, ‘పింక్‌’ చిత్ర కథానాయికజ్యూరీ సభ్యుల మాట...
entertainment
20,883
14-07-2017 18:08:16
2011 ప్రపంచకప్‌పై రణతుంగ సంచలన వ్యాఖ్యలు
కొలంబో: 2011 క్రికెట్ ప్రపంచకప్‌పై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ (53) సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌ ఫిక్సింగ్ అయిందని, వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో తాను షాక్‌కు గురైనట్టు పేర్కొన్నాడు. ఆ సమయంలో తాను భారత్‌లో ఉన్నానని, కామెంటరీ చెప్పానని తెలిపాడు. ఆ మ్యాచ్‌లో లంక ఓడిపోవడం తనను కలచివేసిందని, అప్పుడే తనకు ఈ మ్యాచ్‌పై సందేహం కూడా కలిగిందని పేర్కొన్నాడు. ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగిందో తేలాలంటే తప్పకుండా విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశాడు. ప్రస్తుతానికైతే ఇంతకుమించి ఏమీ చెప్పలేనని, కానీ ఏదో ఒకరోజు మొత్తం పూసగుచ్చినట్టు చెబుతానని వివరించాడు. ఈ విషయంలో ఆటగాళ్లు ఎంతమాత్రమూ తప్పించుకోలేరని హెచ్చరించాడు. అయితే వారెవరన్నది చెప్పలేదు. తెల్లని క్రికెట్ దుస్తుల వెనక వారి మరకలను దాచలేరని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. సచిన్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో మ్యాచ్‌పై లంక పట్టుసాధించింది. అయితే చెత్త బౌలింగ్, ఫీల్డింగ్‌తో శ్రీలంక ఆ మ్యాచ్‌ను కోల్పోయింది. కాగా, రణతుంగా వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. మరికొన్ని రోజుల్లో శ్రీలంకలో భారత్ పర్యటన నేపథ్యంలో రణతుంగ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
sports
15,395
16-01-2017 19:24:21
ములాయం నెత్తిన ఈసీ మరో పిడుగు.. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కూడా హుష్‌కాకీ
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్‌ను గుర్తిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడను తానే అన్నట్లు చెప్పుకుంటున్న ములాయం సింగ్ యాదవ్ వాదన వీగిపోయింది. 77 ఏళ్ల ములాయం 25 ఏళ్ల క్రితం సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. అయితే కుటుంబంలో ఏర్పడ్డ విభేదాలతో పార్టీ పరువు బజారున పడింది. దీనికి తోడు సైకిల్ గుర్తుతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఈసీ గుర్తించడంతో ములాయం నెత్తిన పిడుగు పడినట్లైంది. చివరకు తానే స్థాపించి అధికారానికి తెచ్చిన పార్టీలో ములాయం ఒంటరి అయిపోయారు.
nation
2,070
06-01-2017 00:09:20
రాష్ట్రాల సహకారం కీలకం
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి) : దేశ ఎగుమతులు పెంచేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నొక్కి చెప్పారు. ‘దిగుమతులపై నియంత్రణ ద్వారా గత ఏడాది జనవరి నుంచి వాణిజ్య లోటును అదుపు చేయగలిగాం. దేశ ఎగుమతులు పెంచేందుకు వెంటనే కలిసికట్టుగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిలకడగా మన ఎగుమతులు పెంచుకోవాలంటే ప్రస్తుత అంతర్జాతీయ వాతావరణంలో అదొక్కటే మార్గం’ అన్నారు. గురువారం వాణిజ్య అభివృద్ధి, ప్రోత్సాహక మండలి’ (సిటిడిపి) సమావేశంలో సీతారామన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వాణిజ్య విస్తరణ కోసం రాష్ట్రాలతో భాగస్వామ్యం ఏర్పాటు చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. ఎగుమతి చేసే సరుకుల టెస్టింగ్‌, ప్యాకేజింగ్‌, లేబులింగ్‌, నిల్వ, శిక్షణ వంటి మౌలిక సదపాయాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు ముందుకు రావాలని కోరారు. ఇందుకోసం మరిన్ని నిఽధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి. మెడికల్‌ టూరిజం, నర్సింగ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌, ఎడ్యుకేషన్‌, ఆడియో విజువల్‌ మీడియా వంటి సేవల ఎగుమతికీ విస్తృత అవకాశాలున్నట్టు సీతారామన్‌ చెప్పారు.  పరిశీలనలో ‘యాపిల్‌’కు అదనపు రాయితీలుభారత్‌లో ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు యాపిల్‌ కంపెనీ మిగతా కంపెనీల కంటే అదనంగా కొన్ని రాయితీలు అడుగుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రభుత్వం ఈ విషయాన్నీ పరిశీలిస్తోందన్నారు. ‘దీనిపై చర్చిస్తున్నాం. దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరే మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ ఇలా అదనపు రాయితీలు కోరలేదు. యాపిల్‌ కంపెనీ ఒక్కటే అడిగింది’ అన్నారు.ఎగుమతిదారులు తీసుకునే రుణాలపై ప్రస్తుతం ఇస్తున్న మూడు శాతం సబ్సిడీ వచ్చే కేంద్ర బడ్జెట్‌లోనూ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కష్టంగా ఉన్న ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే ఈ మాత్రం వెసులుబాటు తప్పదని స్పష్టం చేశాయి. ‘మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించి ఈ పథకం కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎ్‌ఫఐఇఒ) డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ చెప్పారు.  ఎపిలో సౌకర్యాలు పెంచండిసిటిడిపి సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా రాష్ట్రం నుంచి ఆక్వా, పొగాకు, ఇతర వస్తువుల ఎగుమతికి అవసరమైన మౌలిక సదుపాయాలు భారీగా పెంచాలని కోరారు. ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అనుమతులు సింగిల్‌ విండో పద్దతిలో ఇవ్వాలని కోరినట్టు విలేకరులతో చెప్పారు. వాణిజ్య సౌలభ్యం విషయంలో ఇస్తున్నట్టుగానే ఎగుమతుల సౌలభ్యంలోనూ రాష్ట్రాలకు ఇవ్వాలని కోరగా కేంద్ర మంత్రి అందుకు అంగీకరించినట్టు తెలిపారు. గుంటూరులో సుగంధ ద్రవ్యాల బోర్డు జాయింట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఎపిలో ఏర్పాటు చేసే మారిటైమ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ యూనివర్సిటీకి మూలధన నిధి (కార్పస్‌ ఫండ్‌) సమకూర్చాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వీటికి తోడు రేవు ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వీలుగా కోస్తా నియంత్రణ జోన్‌ (సిఆర్‌జడ్‌) నుంచి కొద్దిగా మినహాయింపు కోరినట్టు మంత్రి నారాయణ చెప్పారు. వీటిని పరిశీలించి సానుకూలంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. సిటిడిపి సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా రాష్ట్రం నుంచి ఆక్వా, పొగాకు, ఇతర వస్తువుల ఎగుమతికి అవసరమైన మౌలిక సదుపాయాలు భారీగా పెంచాలని కోరారు. ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అనుమతులు సింగిల్‌ విండో పద్దతిలో ఇవ్వాలని కోరినట్టు విలేకరులతో చెప్పారు. వాణిజ్య సౌలభ్యం విషయంలో ఇస్తున్నట్టుగానే ఎగుమతుల సౌలభ్యంలోనూ రాష్ట్రాలకు ఇవ్వాలని కోరగా కేంద్ర మంత్రి అందుకు అంగీకరించినట్టు తెలిపారు. గుంటూరులో సుగంధ ద్రవ్యాల బోర్డు జాయింట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఎపిలో ఏర్పాటు చేసే మారిటైమ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ యూనివర్సిటీకి మూలధన నిధి (కార్పస్‌ ఫండ్‌) సమకూర్చాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వీటికి తోడు రేవు ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వీలుగా కోస్తా నియంత్రణ జోన్‌ (సిఆర్‌జడ్‌) నుంచి కొద్దిగా మినహాయింపు కోరినట్టు మంత్రి నారాయణ చెప్పారు. వీటిని పరిశీలించి సానుకూలంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు.
business