SNo
int64
0
21.6k
date
stringlengths
19
19
heading
stringlengths
3
91
body
stringlengths
6
38.7k
topic
stringclasses
5 values
15,321
22-05-2017 02:37:10
క్వాజర్లు హద్దులుగా భారీ విశ్వ పటం
వాషింగ్టన్‌: విశ్వంలో భారీ నక్షత్ర మండలాలు, క్లస్టర్లను గుర్తిస్తూ అతిపెద్ద పటాన్ని అంతరిక్ష పరిశోధకులు తయారుచేశారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ పటానికి ఆధారంగా క్వాజర్లను తీసుకున్నట్లు ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సుదూరంగా ఉన్న ఈ క్వాజర్లను అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాలుగా చెప్పవచ్చు. కేంద్రకంలో కృష్ణ బిలాలు ఉండడంవల్ల ఈ క్వాజర్లు మన ఊహకు అందనంత గా ప్రకాశిస్తున్నాయని వివరించారు. సమీపంలోకి వచ్చిన చిన్నాపెద్ద నక్షత్రాలను, గ్రహాలను ఇతర పదార్థాలను కృష్ణబిలం స్వాహా చేయడం, తద్వా రా ఉష్ణోగ్రతలు పెరిగి క్వాజర్లు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయని అన్నారు. నిజానికి క్వాజర్లు చాలా దూరంలో ఉన్నాయట! విశ్వం ఏర్పడిన తర్వాత 3 నుంచి 7 బిలియన్‌ సంవత్సరాల మధ్యలో ఈ క్వాజర్లు తొలి కాంతి కిరణాలను ప్రసరించాయి. అప్పటికి భూమి ఇంకా ఏర్పడలేదని ఖగోళ పరిశోధకులు వివరించారు. క్వాజర్లకు ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల విశ్వంలో ఎక్కడున్నా సరే వాటిని స్పష్టంగా గుర్తించవచ్చన్నారు. ఈ నేపథ్యంలో స్లోవన్‌ ఫౌండేషన్‌ టెలీస్కోప్‌ సాయంతో క్వాజర్లను గుర్తిస్తూ తొలి సారిగా భారీ విశ్వ పటాన్ని రూపొందించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
nation
6,676
03-02-2017 13:59:04
లారెన్స్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ప్రెస్‌మీట్
చెన్నై: లారెన్స్ హీరోగా నటించిన ‘మొట్ట శివ కెట్ట శివ’ పాటల ట్యూన్లను కాపీ కొట్టినట్లు సంగీత దర్శకుడు టింకు చేసిన ఆరోపణలను ఈ చిత్ర సంగీత దర్శకుడు అమ్రిష్‌ తీవ్రంగా ఖండించారు. సీనియర్‌ నటి జయ చిత్ర వారసుడైన అమ్రిష్‌ తొలుత నటుడిగా ఆరంగేట్రం చేసి, ఆ తరువాత సంగీత దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. త్వరలో విడుదల కాబోతున్న ‘మొట్ట శివ కెట్ట శివ’ చిత్రానికి అతడే సంగీతం సమకూర్చాడు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన లభించిన తరుణంలో ట్యూన్లను కాపీ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ అమ్రిష్‌ చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలు చూపించారు.  ఈ సందర్భంగా అమ్రిష్‌ మాట్లాడుతూ... ‘సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో శ్రమపడి ‘మొట్ట శివ కెట్ట శివ’ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం సంపాదించగలిగాను. ఇందుకు దర్శకుడు సాయి రమణి, హీరో లారెన్స్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నా. టింకు ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు. కాపీ కొట్టినట్టు ఆధారాలుంటే చూపమనండి’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. ‘మొట్ట శివ కెట్ట శివ’లోని హర హర మహదేవకి, భజనై పాప.. పాటలకు తనే సంగీతం సమకూర్చానని, వీటితో టింకుకి ఎటువంటి సంబంధం లేదని అమ్రిష్‌ తేల్చి చెప్పారు.
entertainment
3,013
23-05-2017 01:07:20
బిట్‌కాయిన్లపై అభిప్రాయాలు కోరిన కేంద్రం
న్యూఢిల్లీ: వర్చువల్‌ కరెన్సీ బిట్‌కాయిన్లను దేశంలో నిషేధిద్దామా.. లేక క్రమబద్ధీకరిద్దామా.. లేక వాటిని స్వీయ నియంతణ్రకు వదిలేద్దామా..! మీ అభిప్రాయాలు చెప్పండి..’’ అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. బిట్‌కాయిన్ల జోలికి వెళ్లవద్దని ఆర్బీఐ ప్రజలను పదేపదే హెచ్చరిస్తున్నా ఎవరూ లెక్క చేయక పోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా ప్రజలు తమ అభిప్రాయాలు మైగవ్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలపాలని కోరింది.విమానాల తయారీకి జట్టుకట్టిన
business
17,558
03-12-2017 01:26:08
జీఈఎస్‌ భేష్‌!.. మోదీకి ట్రంప్‌ ఫోన్‌
వాషింగ్టన్‌, డిసెంబరు 2: హైదరాబాద్‌లో జీఈఎస్‌ సదస్సు తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతోషం వ్యక్తంచేశారు. 3రోజుల ఈ సదస్సుకు అమెరికా, భారత్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా ప్రతినిధుల బృందానికి ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ నేతృత్వం వహించా రు. ఈ నేపథ్యంలో సదస్సు జరిగిన తీరుపై మోదీకి ట్రంప్‌ ఫోన్‌ చేశారు. సమాజం సర్వతోముఖాభివృద్ధి కోసం మహిళలకు పూర్తిస్థాయిలో మద్దతివ్వాల్సిన అవసరంపై వారు మాట్లాడుకున్నారు.
nation
6,561
24-06-2017 11:17:38
‘డీజే’ క్లైమాక్స్‌ గురించి హరీష్‌ ఎందుకు అంతలా చెప్పాడు?
‘తెలుగు సినిమా విలన్లంతా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే చనిపోవాలా. తెలుగు సినిమాకు కొత్త క్లైమాక్స్‌లు వద్దా. అందుకే ‘డీజే’లో కొత్త క్లైమాక్స్‌ను ట్రై చేశాం. అద్భుతంగా వచ్చిందం’టూ దర్శకుడు హరీష్‌ శంకర్‌ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. హరీష్‌ చెప్పినట్టుగా సాధారణ కమర్షియల్‌ సినిమాల క్లైమాక్స్‌లతో పోల్చుకుంటే ఇది కొత్తగానే ఉంది. అప్పటివరకు హై వోల్టేజ్‌తో సాగిన సినిమాకు కామెడీ ఎండింగ్‌ ఇచ్చాడు హరీష్‌ శంకర్‌. కొంత మంది ఈ క్లైమాక్స్‌ కొత్తగా ఉందంటుంటే, మరికొంత మంది చప్పగా ఉందని ఫీలవుతున్నారు. నిజానికి ఈ వెరైటీ క్లైమాక్స్‌ కోసం ప్రేక్షకులను మెంటల్‌గా ప్రిపేర్‌ చేసేందుకే హరీష్‌ శంకర్‌ పదేపదే క్లైమాక్స్‌ గురించి మాట్లాడాడని అర్థమవుతోంది. అన్నట్టు, ఈ క్లైమాక్స్‌ విషయంలో బన్నీ చాలా హెల్ప్‌ చేశాడని, ఆయన సలహాతోనే క్లైమాక్స్‌ ఇలా వచ్చిందని కూడా దర్శకుడు చెప్పాడు.
entertainment
3,507
20-01-2017 02:06:54
‘దంగల్‌’ రాజకీయం
 ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని జైరా కలుసుకున్న తరువాతే వివాదం రేగిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి ఆమెను రోల్‌మోడల్‌గా, యువతకు స్ఫూర్తిగా అభివర్ణించడంతో విమర్శలు ఆరంభమయ్యాయి. తానూ జైరా అంటూ ముఖ్యమంత్రి వరుసగా ట్వీట్లు చేయడమూ, ఆమె విజయానికి రాష్ట్ర ప్రభుత్వమే దోహదపడినట్టుగా అంతర్లీనమైన వ్యాఖ్యలు చేయడమూ ఇందుకు ఒక కారణం. దీంతో జైరా విజయాన్ని మెహబూబా రాజకీయంగా వాడుకుంటున్నారన్న సాధారణ వ్యాఖ్యలనుంచి, జైరాను తీవ్రంగా భయపెట్టేంతవరకూ విమర్శలు వెల్లువెత్తాయి. వందలమంది యువకులను ఊచకోత కోసిన మెహబూబా తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సుద్దులు చెబుతున్నారన్నది వారి విమర్శ. వ్యక్తిగత విజయాలను పాలకులు ఇలా తమఖాతాలో వేసుకోవడం ప్రతిచోటా ఉన్నదే. మెహబూబా కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. రాజకీయనాయకులు సర్వసాధారణంగా చేసేదే ఇది. కానీ, ఆర్నెల్లకాలం సాగిన విధ్వంసంతో ఆమెపై పేరుకుపోయివున్న ఆగ్రహం జైరామీదకు మళ్ళడమే బాధాకరం. భద్రతాదళాల అకృత్యాలకు, వందమంది యువకుల మరణాలకు, జనజీవనం అస్తవ్యస్తం కావడానికీ ఆమె కారణం కాకున్నా, బుర్హన్‌వానీ మరణానంతర రాజకీయవాతావరణంలో ఆమె బలిపశువైపోయింది. ఆమెను భయపెట్టిన, వేధించిన వ్యాఖ్యలు ఏమిటన్నవి అటుంచితే, తీవ్రమైన అమానవీయమైన వ్యాఖ్యలు ఎవరు ఎవరిపక్షాన చేశారన్నది తెలుస్తూనే ఉన్నది. బాంబులకంటే, తుపాకి కాల్పులకంటే అత్యంత శక్తిమంతంగా సాగిన ఈ దాడికి చిన్నపిల్ల జైరా భయంతో వొణికిపోవడం సహజం. ‘దంగల్‌’ చిత్రంలో పోషించిన పాత్రకు తగినట్టుగానే ఆమీర్‌ఖాన్‌ స్పందన కూడా ఉన్నది. జైరాకు ఆయన కొండంత అండగా నిలబడ్డారు. ‘నేను ఎవరికీ రోల్‌మోడల్‌కాదు, ఇంకా ఎంతోమంది గొప్పవారున్నారు’ అంటూ కొందరి సంతృప్తికోసం ఆమె చేసిన వ్యాఖ్యలను అమీర్‌ఖాన్‌ తన ప్రకటనలో తుడిచిపెట్టేశారు. ఈ దేశానికీ, ప్రపంచానికీ, ముఖ్యంగా నాకూ నువ్వే రోల్‌మోడల్‌ అన్న వ్యాఖ్యతో ఆయన పరోక్షంగా వారి చెంపలు వాయించారు. ఆమీర్‌ఖాన్‌ స్పందన అనంతరం బాలీవుడ్‌ తారలూ, క్రికెట్‌ వీరులూ ఆమెకు అండగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. భయంలోకి జారిపోయిన ఆమెలో ఇది ధైర్యాన్ని నింపింది. కశ్మీర్‌లోనూ, దేశంలోనూ నెలకొనివున్న వాతావరణమే జైరా వివాదాన్ని సృష్టించింది. ఆమెకు అండగా ఉండటమనే పేరుతో సామాజిక మాధ్యమాల్లోనూ, టెలివిజన్‌ చానెళ్ళలోనూ సాగిన రచ్చంతా కశ్మీర్‌ను విమర్శించడానికీ సమాజాన్నంతా ఒకే గాటన కట్టడానికీ ఉపకరించింది. ఆమె ఆ సినిమాలో నటించినందుకు కశ్మీరీ సమాజం ఆగ్రహించలేదు. ఆమె సాహసోపేతమైన పాత్రకు, నటనకు మిగతా దేశమంతా ఎంతగా ముచ్చటపడిందో కశ్మీరీలు కూడా అంతే సంతోషించారు. కశ్మీరీ అయినందుకు గర్వించారు. ఆమెతో ఫోటోలు దిగేందుకూ, సోషల్‌ మీడియాలో ఆమెను అనుసరించేందుకు ఉత్సాహపడ్డారు. జైరా క్షమాపణ లేఖకు మిగతా సమాజం ఎలా స్పందించిందో కశ్మీర్‌కు చెందిన ప్రసిద్ధ కళాకారులు, నటులు అలాగే స్పందించారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న నువ్వు ఇలా భయపడిపోతే ఎలా, మేమంతా నీ పక్షానే ఉన్నామని అభయమిచ్చారు. కొంతమంది కారుకూతలకు వెరవవద్దనీ, జారిపోవద్దనీ హితవు చెప్పారు. కానీ, ఈ వాస్తవాన్ని పక్కనబెట్టి, కశ్మీర్‌ సమాజాన్నంతా ఒక మితవాద, తీవ్రవాద సమాజంగా నిర్థారించే ప్రయత్నం జైరా వివాదం ఆధారంగా జరుగుతున్నదని కశ్మీరీ విశ్లేషకుల వాదన. ఇప్పటికే పలురూపాల్లో సాగుతున్న ఈ దాడిని మరింత ధాటీగా సాగించడానికి జైరా క్షమాపణ లేఖ ఉపకరిస్తున్నదని వారి బాధ. సోషల్‌ మీడియాలో ఇలా వెంటాడి వేధించే వారు మిగతాచోట్ల ఉన్నట్టే, ఇక్కడా ఉన్నారు, వారి స్వభావాన్ని మొత్తం సమాజానికి కట్టబెడితే ఎలా అన్నది వారి ప్రశ్న. తమ విధానాలు ఏమైనప్పటికీ రాజకీయాలతో సంబంధం లేని ఒక బాలనటిని వేర్పాటువాదులు, రాజకీయపార్టీలు యుద్ధబరిలోకి లాగడం సమంజసం కాదు. ఆజాదీని కోరుతున్నవారే ఒక చిన్నపిల్ల ఆజాదీని సహించలేకపోతున్నారని జావేద్‌ అక్తర్‌ చేసిన విమర్శ సముచితమైనది. ఆటలు, సినిమా వంటి రంగాలను కూడా రాజకీయాలు కమ్ముకోవడం విషాదం.
editorial
21,431
07-02-2017 01:23:46
శుభ్‌మన్‌, పృథ్వీ సెంచరీలు
నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ చిత్తు3-1తో సిరీస్‌ భారత్ వశం
sports
4,737
23-05-2017 13:50:59
‘అలా కనిపించినంత మాత్రాన ఆయన వ్యాఖ్యలను సమర్థించినట్టేనా?’
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేసు కూడా నమోదైంది. ఈ వ్యాఖ్యలపై నాగార్జున, సమంత, రకుల్ ప్రీత్ పలువురు స్పందించిన సంగతి తెలిసిందే. అయితే హీరో నాగచైతన్య కూడా ఈ ఘటన గురించి స్పందించాడు. ఆడవాళ్లను గౌరవించడం తన జీవిత పరమార్థమని చైతూ ట్వీట్ చేశాడు. చలపతిరావు కామెంట్స్ చేసిన సమయంలో తన రియాక్షన్‌ను చూపిస్తూ దుష్ప్రచారానికి పాల్పడటం సమంజసం కాదని చైతూ అభిప్రాయపడ్డాడు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించినంత మాత్రాన ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లా అని చైతూ ప్రశ్నించాడు. కానే కాదని.. చలపతిరావు వ్యాఖ్యలతో ఏకీభవించబోనని నాగచైతన్య స్పష్టం చేశారు.
entertainment
17,037
09-01-2017 01:36:24
ఈ కాలంలోనూ మంత్ర తంత్రాలా?: అమర్‌సింగ్‌
న్యూఢిల్లీ: సైన్సు ఇంత అభివృద్ధి చెందినా.. ఇంకా మంత్ర తంత్రాల గురించి మాట్లాడటం ఏమిటని..అఖిలేశ్‌ వర్గంపై ఎస్పీ నేత అమర్‌సింగ్‌ మండిపడ్డారు. ములాయం నుంచి అఖిలేశ్‌ను వేరుచేయడంకోసం అమర్‌సింగ్‌, శివపాల్‌సింగ్‌ తంత్ర(వామతంత్రం) ప్రయోగానికి ప్రయత్నించారన్న రాంగోపాల్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కాగా, అమర్‌సింగ్‌కు రద్దయిన జడ్‌ కేటగిరి భద్రతను కేంద్రం పునరుద్ధరించింది.
nation
16,132
01-11-2017 16:19:38
వివాదాస్పద ఆదేశాలపై సీఎం వివరణ
ఛండీగఢ్: టీచర్లు పౌరోహిత్యంలో శిక్షణ తీసుకోవాలంటూ హర్యానా విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం కావడం, విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖత్తర్ స్పందించారు. ఆ ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. జిల్లా యంత్రాంగం అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉంటుందని అన్నారు. యమునా నగర్ ఆలయం వద్ద జరిగే ‘మేళా’ సందర్భంగా పూజారులు చేయగల అన్ని పనులు చేసేలా శిక్షణ తీసుకోవాలని ఇటీవల ఆదేశాలు జారీ కావడం సంచలనమైంది. అక్టోబర్ 29న జరిగిన శిక్షణా కార్యక్రమానికి టీచర్లంతా తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఆదేశాలు వెళ్లాయి. అయితే కొందరు ఉపాధ్యాయులు శిక్షణా కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో వారికి ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ ఉత్తర్వులపై కొందరు టీచర్లు బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్ధులకు చదువులు చెప్పడమే తమ పని కానీ, మతపరమైన పూజాదికాలు చేయడం కాదని వారన్నారు. దీంతో కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీల నేతలు ఖత్తర్ సర్కార్ ఆదేశాలపై మండిపడ్డారు. మతం, రాజకీయాలు వేర్వేరని, మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టరాదని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్. వ్యాఖ్యానించారు. చదువులు కన్నా పూజలే ఎక్కువా అని ప్రశ్నించారు. యమునా నగర్ ఆలయం వద్ద జరిగే తిరునాళ్ల సందర్భంగా పూజలు నిర్వహించడం, ప్రసాదాలు పంచిపెట్టడం వంటి పనులు టీచర్లు చేయాలంటూ జారీ అయిన ఆదేశాల చుట్టూ వివాదం ముసురుకోవడంతో సీఎం ఖత్తర్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.
nation
1,124
22-08-2017 02:22:13
యమహా ఫేజర్‌ 25 వచ్చేసింది..
ధర రూ.1.28 లక్షలుముంబై: యమహా కంపెనీ 250 సిసి ఇంజన్‌ కలిగిన ఫేజర్‌ 25 బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోర్‌ స్టోక్‌, సింగిల్‌ సిలిండర్‌ కలిగిన ఈ బైక్‌ ధర 1.28 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, ముంబై). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో 15 శాతం వృద్ధిని సాధించడంతోపాటు డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను 700కు పెంచుకోవాలని ఇండియా యమహా మోటార్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈ ఏడాదిలో మార్కెట్లోకి వచ్చిన రెండో బైక్‌ ఫేజర్‌ 25 అని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మసకి అసనో తెలిపారు. గత ఏడాదిలో 7.50 లక్షల టూవీలర్లను కంపెనీ విక్రయించింది. ఈ ఏడాదిలో స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు కలిపి 9 లక్షలు విక్రయించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) రాయ్‌ కురియన్‌ తెలిపారు. ఈ ఏడాదిలో మరో 100 కొత్త ఔట్‌లెట్లను జత చేసుకోనున్నట్టు ఆయన చెప్పారు. కొత్త వాహనాలు విడుదల చేయడం పట్ల బుల్లి్‌షగా ఉన్నామని, ఫలితంగా మంచి వృద్ధిని సాధించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
business
16,102
10-09-2017 00:56:51
అమెరికా గాయకుడు విలియమ్స్‌ కన్నుమూత
లాస్‌ఏంజెలిస్‌, సెప్టెంబరు 9: పాటే ధ్యాస, శ్వాసగా బతికి.. తన స్వరంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమెరికాకు చెందిన సుప్రసిద్ధ గాయకుడు డాన్‌ విలియమ్స్‌ (78) ఇకలేరు. ‘జెంటిల్‌ జెయింట్‌’ అనే ముద్దుపేరుతో లబ్ధప్రతిష్ఠుడైన డాన్‌.. తీవ్ర అస్వస్థతతో శుక్రవారం కన్నుమూశారు. డాన్‌ స్వస్థలం టెక్సాస్‌. 1972లో ‘‘ది షల్టర్‌ ఆఫ్‌ యువర్‌ ఐస్‌’’ అనే ఆల్బమ్‌తో సంగీత ప్రపంచంలోకి అరంగేట్రం చేశారు. ఆయన పాటల్లో.. ఐ బిలీవ్‌ ఇన్‌ యూ, తుల్సా టైం, లార్డ్‌.. ఐహోప్‌ దిస్‌ డే ఈజ్‌ గుడ్‌’, ఇట్‌ మస్ట్‌ బి లవ్‌’ గీతాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఆయన నుంచి చివరిసారిగా 2014లో రిఫ్లెక్షన్‌ అనే ఆల్బమ్‌ విడుదలైంది. 2010లో ‘కంట్రీ మ్యూజిక్‌ హాల్‌ ఫేమ్‌’లో ఆయనకు స్థానం లభించింది.
nation
11,872
18-05-2017 02:50:53
ఎదురులేని మమత
బెంగాల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఎంసీ హవాలెఫ్ట్‌, కాంగ్రెస్‌కు పరాభవం, బీజేపీకి నిరాశకోల్‌కతా, మే 17: పశ్చిమబెంగాల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. ఎన్నికలు జరిగిన ఏడు మున్సిపాలిటీలలో నాలుగింటిని టీఎంసీ కైవసం చేసుకుంది. పర్వత ప్రాంతాల్లో గోర్ఖా జన్ముక్తి మోర్చాకు పట్టున్న చోట్ల టీఎంసీ విజయం సాధించింది. ఇక జీజేఎం మూడు మున్సిపాలిటీలను గెల్చుకుంది. బెంగాల్‌లో తమ పార్టీకి ఎదురులేదని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరూపించుకోగా.. ప్రతిపక్షాలు లెఫ్ట్‌, కాంగ్రెస్‌ పార్టీలకు పరాభవం ఎదురైంది. ఇక ఈ రాష్ట్రంలో పాగా వేయాలని చూసున్న బీజేపీకి నిరాశ తప్పలేదు. డోమ్‌కల్‌, రాయ్‌గంజ్‌, పుజాలి, మిరిక్‌లో టీఎంసీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. పర్వత ప్రాంతాల్లోని డార్జిలింగ్‌, కుర్సియాంగ్‌, కలిమ్‌పాంగ్‌ మున్సిపాలిటీలను జీజేఎం దక్కించుకుంది. లెఫ్ట్‌, కాంగ్రెస్‌ పార్టీలు కలసి కేవలం 6 వార్డులు నెగ్గాయి. ఇక బీజేపీ మూడు సీట్లతో సరిపెట్టుకుంది.
nation
16,200
18-03-2017 19:45:39
యూపీ డిప్యూటీ సిఎంలుగా మౌర్య, శర్మ
లక్నో: యూపీలో సిఎంగా యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ ఎంపికయ్యారు. లక్నోలో ఆదివారం వీరు ప్రమాణం చేస్తారు. లక్నోలో ఇవాళ జరిగిన బిజెపి మిత్రపక్షాల సమావేశంతో పాటు, బిజెపి శాసనసభాపక్ష సమావేశంలో వీరిని ఎంపిక చేశారు. మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కీలకంగా వ్యవహరించి వీరి ఎంపిక ఏకగ్రీవంగా జరిగేలా చూశారు. డిప్యూటీ సిఎంలలో కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ బిజెపి అధ్యక్షుడు. యూపీలో బిజెపి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరో డిప్యూటీ సిఎంగా ఎంపికైన దినేశ్ శర్మ లక్నో మేయర్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు.
nation
3,117
04-01-2017 23:23:41
సేవల రంగం మటాష్‌
న్యూఢిల్లీ : నోట్ల రద్దు ప్రభావం సేవల రంగంపై వరుసగా రెండో నెలలోనూ పడింది. వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా తగ్గడంతో డిసెంబరులో కొత్త ఆర్డర్లు మూడేళ్ల కాలవ్యవధిలో భారీ క్షీణతను నమోదు చేశాయి. అలాగే వ్యాపార విశ్వాసం 11 ఏళ్ల చరిత్రలో మూడో కనిష్ఠ స్థాయిని నమోదు చేసినట్టు నిక్కీ ఇండియా పర్చేజ్‌ మేనేజర్‌ ఇండెక్స్‌ (పిఎంఐ) నివేదిక తెలిపింది. డీమానిటైజేషన్‌ (నోట్ల రద్దు) వల్ల ఏర్పడిన క్షీణత నుంచి తక్షణ రికవరీ అవకాశాలు కూడా లేవని తేల్చి చెప్పింది. నిక్కీ ఇండియా సర్వీస్‌ పిఎంఐ డిసెంబరు నెలలో 46.8 పాయింట్ల వద్ద నిలిచింది. నవంబరులో ఇది 46.7 పాయింట్లుంది. ఈ ఇండెక్స్‌ 50 పాయింట్లకు దిగువన ఉంటే సేవలరంగం తిరోగమనంలో ఉన్నట్టుగా భావిస్తారు. 2013 సెప్టెంబరు నెల తర్వాత కొత్త వ్యాపార ఆర్డర్లు భారీ క్షీణతను నమో దు చేయడం ఇదేనని ఆ నివేదికలో పేర్కొన్నారు. సోమవారం ప్రకటించిన తయారీ రం గం పిఎంఐ కూడా తిరోగమనాన్ని నమో దు చేసిన విషయం విదితమే. ఈ రెండు పిఎంఐలు దిగజారడం స్థూలంగా జిడిపి వృద్ధిరేటుపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. అలాగే అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో సగటు పిఎంఐ కూడా 2014 ప్రారంభం తర్వాత కనిష్ఠ స్థాయికి దిగజారిందని సంస్థ ఆర్థికవేత్త పోల్యానా డిలిమా చెప్పారు. ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా క్షీణించడంతో ప్రైవేటు రంగం కార్యకలాపాలు కూడా మూడు సంవత్సరాల తర్వాత భారీ క్షీణతను నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. తయారీ, సేవల రంగాల కార్యకలాపాలన్నింటికీ దర్పణం పట్టే నిక్కీ ఇండియా కాంపోజిట్‌ పిఎంఐ ఔట్‌పుట్‌ ఇండెక్స్‌ కూడా నవంబరులో నమోదైన 49.1 పాయింట్ల నుంచి డిసెంబరులో 47.6 పాయింట్లకు దిగజారింది. క్యు3లో వృద్ధిరేటు మందగిస్తుందనేందుకు ఇది సంకేతమని ఆయన తెలిపారు. అయితే డిసెంబరులో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో భారత సర్వీస్‌ ప్రొవైడర్లు రానున్న 12 నెలల కాలానికి ఆశావహ దృక్పథమే ప్రకటించినా అది 11 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్నట్టు నివేదిక తేల్చి చెప్పింది. వారిలో వ్యాపార విశ్వా సం ఇంత కనిష్ఠ స్థాయికి దిగజారడాన్ని బట్టి కరెన్సీ రద్దు ప్రభావం నుంచి కోలుకునేందుకు కొంత సమయం పడుతుందనేందుకు సంకేతంగా చెబుతున్నారు. వచ్చే 12 నెలల్లో పునరుజ్జీవం సాధ్యమేనన్న నమ్మకం వ్యక్తం అయినా రికవరీలో వేగం తక్కువగానే ఉంటున్నట్టు సర్వే తేల్చింది. నోట్ల రద్దు ప్రభావం వల్ల ఎఫ్‌ఎంసిజి కంపెనీల నికర లాభాలు మూడో త్రైమాసికంలో 5-6 శాతం వరకు క్షీణతను నమోదు చేస్తాయని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తాజా నివేదికలో అంచనా వేసింది. ఆదాయాలు కూడా 0.2 శాతం మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు క్యు3 ఫలితాల సీజన్‌ ప్రారంభం కావడానికి ముందు నివేదికలో తేల్చి చెప్పింది. నోట్ల రద్దు ప్రభావం వల్ల ఎఫ్‌ఎంసిజి కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.2 లక్షల కోట్ల మేరకు (10.2 శాతం) పడిపోయినట్టు ఆ నివేదిక తెలిపింది. ఇందులో 99 వేల కోట్ల రూపాయల నష్టం కంపెనీల షేరు విలువల్లో క్షీణత వల్లనే ఏర్పడిందని పేర్కొంది. నవంబరు తర్వాత వినియోగ వస్తువుల విభాగంలో అమ్మకాలు 40 నుంచి 70 శాతం క్షీణించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే క్యు3లో ఆభరణాలు, పెయింట్స్‌ కంపెనీలు కాస్తంత మెరుగైన స్థితిలో ఉండవచ్చునని అంచనా వేసింది. విచక్షణాపూర్వక వ్యయాలతో ముడిపడి ఉన్న కంపెనీలు కాస్తంత మెరుగ్గా ఉండవచ్చునని, వాటి ఆదాయంలో 1.5 శాతం వృద్ధి నమోదు కావచ్చని తెలిపింది.
business
7,373
23-06-2017 19:12:05
ఆ బ్యూటీకి సినిమాలపై అనురాగం.. చదువుపై మమకారం
కెరీర్ సంగతెలా ఉన్నా అందాల పోటీల నుంచి సినిమాల వైపునకు వచ్చిన పూజా హెగ్డే... ఇప్పుడు చదువుల్లో పోటీపడతానంటోంది. అంతేకాదు సరైన హిట్ పడితే స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని తహతహలాడుతోంది ఈ డీజే భామ. సినిమాలపై మోజుతో సగంలోనే చదువుకు స్వస్తి చెప్పి నటులు అయిన వారిని చాలామందినే చూశాం. అయితే నటులుగా గుర్తింపు వచ్చాక కూడా చదువు కంటిన్యూ చేసేవారూ లేకపోలేదు. 'బడిలో గుడిలో' అంటూ 'డీజే' మూవీ సాంగ్‌లో బ్లాక్ డ్రెస్‌లో భలేగా కవ్వించిన పూజా హెగ్డే.. ఇప్పుడలాగే బడికి వెళ్తానంటోంది. అవయవ శౌష్టవంలో అందగత్తెలనే ఆశ్చర్యపరచే ఈ బ్యూటీకి.. ఇప్పుడు ఆంథ్రోపాలజీ చదవాలనే బుద్ది పుట్టిందట. అనుకుందే తడవుగా.. ముంబైలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ లో పీజీ కోర్సులో జాయిన్ అయింది పూజా హెగ్డే. ఆకట్టుకునే అందం, మెప్పించగల అభినయం ఉన్నప్పటికీ పూజా హెగ్డేకు ఇప్పటివరకూ సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. తెలుగులో ఇప్పటికే 'ముకుందా', 'ఒక లైలా కోసం' సినిమాల్లో నటించిన పూజా హెగ్డే.. మరోవైపు హిందీలో హృతిక్ రోషన్ సరసన 'మొహంజోదారో'లో నటించింది. అయితే.. ఇవేవి పూజా హెగ్డేకు విజయాన్ని అందించలేదు సరికదా.. ఐరన్ లెగ్ ట్యాగ్‌ను అంటకట్టేసాయి. ఈ నేపథ్యంలో బన్నీ సరసన ఛాన్స్ అందుకున్న పూజ.. 'డీజే' మూవీ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసేసింది.  ఇక ఈ సినిమా హిట్ అయితే మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పూజాను వరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో.. 'డీజే' సక్సెస్ కోసమే ఆశగా ఎదురుచూస్తోంది ఈ అందాల రాశి. మరి.. " దువ్వాడ జగన్నాథం" అమ్మడి ఆశలు నెరవేరుస్తాడేమో చూడాలి..!
entertainment
13,712
21-03-2017 02:55:58
దంత సంరక్షణపై అవగాహనకు పోర్టల్‌
న్యూఢిల్లీ, మార్చి 20: దంతాలు, నోటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. మార్చి 20న ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దీనిని ప్రారంభించింది. దీంతోపాటు ఇన్ఫర్‌మేషన్‌, ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌(ఐఈసీ) పేరుతో మెటీరియల్‌నూ విడుదల చేసింది. నోరు, దంతాల సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో వివరించారు. ప్రజారోగ్యంపైనే దేశ సమగ్ర అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, పలు కార్యక్రమాలనూ చేపట్టిందని ఆయన తెలిపారు. దంత సంరక్షణ విషయంలో ప్రజలలో అవగాహన పెరగడం శుభ పరిమాణమని అన్నారు. కాగా, మారుతున్న జీవనశైలి, పొగాకు, ఆల్కహాల్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోతుండడంతో నోటి సంరక్షణపై ఆందోళన వ్యక్తమవుతోందని ఆరోగ్యశాఖ కార్యదర్శి సీకే మిశ్రా పేర్కొన్నారు.
nation
21,315
09-12-2017 00:04:56
మాల్యా స్థానంలో సింఘానియా
పారిస్‌: భారత మోటార్‌ స్పోర్ట్స్‌ క్లబ్బుల సమాఖ్య (ఎఫ్‌ఎంసీఐ) నా మినీ గౌతమ్‌ సిం ఘానియా.. ప్రపం చ మోటార్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూఎం ఎస్‌సీ) సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక్కడ జరిగిన కౌన్సిల్‌ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. విజయ్‌ మాల్యా స్థానంలో భారత్‌ నుంచి డబ్ల్యూఎంఎస్‌సీ సభ్యుడిగా సింఘానియా ప్రాతినిధ్యం వహిస్తారు. రేమండ్‌ గ్రూప్‌ చైర్మన్‌ అయిన గౌతమ్‌ రేసింగ్‌ సర్క్యూ ట్‌లోనూ ప్రసిద్ధుడు.
sports
9,503
03-08-2017 21:30:22
'సీక్రెట్ సూపర్ స్టార్' ట్రైలర్ రిలీజ్
ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సరికొత్త కథాంశాలతో సినిమాలను నిర్మిస్తుంటాడు బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. తాజాగా ఆమిర్ ప్రొడక్షన్ హౌజ్ నుండి వస్తోన్న 'సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది. సంగీత ప్రధానంగా విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మిస్తోన్న చిత్రం 'సీక్రెట్ సూపర్ స్టార్'. ఓ మారుమూల గ్రామానికి చెందిన ముస్లిం విద్యార్థిని సంగీతంపై ఆసక్తితో తండ్రికి తెలియకుండా యూట్యూబ్ ద్వారా తన పాటలతో ఎలా పాపులర్ అయ్యింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో ఆ 'సీక్రెట్ సూపర్ స్టార్'గా జైరా వసీమ్ నటించింది. చాన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్‌లో సినిమా కథాంశాన్ని క్లుప్తంగా చెప్పిన మేకర్స్ ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో కథాంశాన్ని మరింత విపులంగా వివరించారు. 'దంగల్' వంటి భారీ విజయం తర్వాత ఆమిర్ ఖాన్ వెండితెరపై కనిపించబోయే సినిమా 'సీక్రెట్ సూపర్ స్టార్'. తన స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నాడు ఆమిర్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌లో ఆడియెన్స్ ముందుకు రానుంది. మరి ఆమిర్ ఖాన్ సంస్థ నుంచి చిన్న సినిమాగా వస్తోన్న 'సీక్రెట్ సూపర్ స్టార్' పెద్ద విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.
entertainment
18,645
23-05-2017 20:18:11
కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగువెలిగిన 'స్వామి' ఇకలేరు...
న్యూఢిల్లీ: వివాదాస్పద స్వామిగా పేరు పొందిన చంద్రస్వామి మూత్రపిండాలు చెడిపోవడంతో మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. డయాలసిస్ తీసుకుంటున్న చంద్రస్వామికి స్ట్రోక్ రావడం, పలు శరీర భాగాలు చికిత్సకు సహకరించపోవడంతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. 1948లో జన్మించిన ఆయన అసలు పేరు నేమి చంద్. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన స్వామి ఆ తర్వాత పలు వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. ఆయనను మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సన్నిహితుడిగా, ఆధ్యాత్మిక సలహాదారుగా చెబుతారు. 1991లో పీవీ ప్రధాని అయ్యాక ఢిల్లీ కుతుబ్ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియాలో 'విశ్వ ధర్మయతన్ సనాతన్' పేరుతో చంద్రస్వామి ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. దీనికి ఇందిరాగాంధీ హయాంలో స్థలం కేటాయింపు జరిగింది. బ్రూనే, బహ్రాన్ సుల్తాన్‌కు, నటి ఎలిజిబెత్ టేలర్, బ్రిటిష్ ప్రదాని మార్గరెట్ థాచర్, ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గి, నేరప్రపంచ సామ్రాట్ దావూద్ ఇబ్రహీం తదితరులకు ఆయన ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చేవారని చెబుతారు. ఆయనపై వచ్చిన వివాదాలకూ కొదవలేదు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి జైన్ కమిషన్ నివేదికలోనూ ఆయన పేరు చోటుచేసుకుంది. దీంతో ఆయన విదేశీ పర్యటనలపై నిషేధం విధించారు. అయితే ఆ నిషేధాన్ని 2009లో సుప్రీంకోర్టు ఎత్తివేసి చంద్రస్వామి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. విదేశీ మారకద్రవ్య రెగ్యులేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించారనే కారణంగా 2011 జూన్‌లో సుప్రీంకోర్టు ఆయనకు రూ.9 కోట్లు ఫైన్ వేసింది.
nation
20,331
06-01-2017 19:58:14
యువకులంతా ధోనీ చుట్టూ ఉండాలని కోరుకుంటారు : కోహ్లీ
న్యూఢిల్లీ: కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్న తర్వాత అన్ని ఫార్మెట్లకు సారధిగా విరాట్ కోహ్లీ నిర్ణయించబడ్డాడు. సరైన సమయంలో ధోనీ సరైన నిర్ణయం తీసుకున్నాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ధోనీని కొనియాడారు. పలువురు ధోనీ నిర్ణయంపై వారి స్పందన తెలియజేశారు. ఈ క్రమంలో విరాట్ కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచాడు. యువ క్రికెటర్లంతా తన చుట్టూ ఉండాలనుకుని, మార్గదర్శకంగా భావించే నాయకుడిగా ఉంటున్నందుకు కృతజ్ఞతలంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఎల్లప్పుడూ నువ్వే నాకెప్టెన్‌వి ధోనీ భాయ్ అంటూ ఒకింత భావేద్వేగంగా స్పందించాడు విరాట్ కోహ్లీ.
sports
21,098
15-05-2017 01:37:28
ప్లే ఆఫ్‌కు స్టోక్స్‌ దూరం
పుణె: ప్లేఆ్‌ఫకు చేరిన రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు మేటి ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌ అనంతరం విలేకరుల సమావేశంలో పుణె కెప్టెన్‌ స్మిత్‌ ఈ విషయం చెప్పాడు. ‘బెన్‌ లేకపోవడం తీవ్రమైన లోటు. స్టోక్స్‌ స్థానం భర్తీ చేయడం కోసం ఒకరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయ’ని స్మిత్‌ అన్నాడు. ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న వన్డే సిరీస్‌ కోసం స్టోక్స్‌ తన దేశానికి తిరిగి వెళ్తున్నాడు.
sports
20,112
17-10-2017 20:57:30
బీసీసీఐ మరో పొరపాటు.. కుంబ్లేకు అవమానం!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి, మాజీ కోచ్ అయిన అనిల్ కుంబ్లేను బీసీసీఐ అవమానించింది. మంగళవారం పుట్టిన రోజు జరుపుకున్న కుంబ్లేకు బీసీసీఐ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. సరిగ్గా ఇదే వివాదానికి కారణమైంది. కుంబ్లేకు విషెస్ చెప్పిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అనిల్ కుంబ్లే భారత అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. నిన్నమొన్నటి వరకు కోచ్‌గానూ జట్టుకు సేవలందించాడు. జట్టుకు ఇన్ని సేవలు అందించిన కుంబ్లేను సాధారణ బౌలర్‌గా పరిగణిస్తూ.. ‘టీమిండియా బౌలర్‌ అనిల్ కుంబ్లేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ చాలా సాధారణంగా ట్వీట్ చేసింది. బీసీసీఐ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. దేశ క్రికెట్ గౌరవాన్ని పెంచిన కుంబ్లేకు శుభాకాంక్షలు చెప్పేది ఇలాగేనా? అంటూ బీసీసీఐ దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన బీసీసీఐ మరో ట్వీట్ చేస్తూ.. టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండ్ అనిల్ కుంబ్లేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని మరో ట్వీట్ చేసి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రికార్డు ఇప్పటికీ కుంబ్లే పేరుమీదే ఉంది. 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు.
sports
13,521
23-03-2017 03:39:31
రెండాకుల చిహ్నం ఎవరికీ లేదు
చెన్నై, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండు ఆకుల’ను ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. పన్నీర్‌ సెల్వం వర్గానికీ, శశికళ వర్గానికీ కేటాయించకుండా నిలిపివేసింది. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలో అభ్యర్థులెవరైనా ‘స్వతంత్రులు’గానే, మరేదైనా గుర్తుతో పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో 37 ఏళ్ళ తరువాత అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం లేకుండానే ఎన్నికల బరిలోకి దిగనుంది. చిహ్నాన్ని గురువారం ఉదయం 10 గంటల్లోపు ఎన్నుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన సూచించింది. రెండాకుల చిహ్నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అభ్యర్థి ఎవరై నా ఈ గుర్తును చూడగానే ఓటేసే వారు ఎంతోమంది వున్నారు. అందుకే ఈ చిహ్నం కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. అయితే బుధవా రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరువర్గాల వారు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన ముందు వాదనలు వినిపించారు. దీంతో ఏ క్షణంలోనైనా తీర్పు వెలువడే అవకాశముందని అన్ని వర్గాల వారు ఎదురు చూశారు. ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నామినేషన గడువు గురువారం ముగియనున్న తరుణంలో రెండాకుల చిహ్నం కోసం ఢిల్లీలోని కేం ద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఈ రెండు వర్గాల తరఫున కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రులు వీరప్పమొయిలీ, సల్మాన ఖుర్షీద్‌, మాజీ సొలిసిటర్‌ జనరల్‌ పరాశరన సీనియర్‌ న్యాయవాదులు సీఎస్‌ వైద్యనాధన, జి.కృష్ణకుమార్‌, బి.శ్రీనివాసనలు వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నజీమ్‌ జైదీ, కమిషనర్లు ఏకే జ్యోతి, ఓపీ రావతల ఎదుట వినిపించారు.  పన్నీర్‌సెల్వం వర్గం తరఫు న మాజీ ఎంపీ మనోజ్‌పాండ్యన, గురుకృష్ణకుమార్‌, సీఎస్‌ వైద్యనాథన హాజరయ్యారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి పార్టీ చిహ్నం కేటాయించాలని ఎన్నికల సం ఘాన్ని కోరే అర్హత లేదని పన్నీర్‌సెల్వం వర్గీయులు వాదించారు. పార్టీ గుర్తును కేటాయించే అధికారం తమ వర్గంలో ఉన్న ప్రిసీడియం చైర్మన మధుసూదనకు మాత్రమే ఉందన్నారు. కాగా, రాష్ట్రంలో సరిపడా శాసనసభ్యుల మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తమకే పార్టీ చిహ్నం రెండాకుల గుర్తుపై అధికారం ఉంటుందని శశికళ వర్గీయులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు మైత్రేయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రెండాకుల గుర్తు తమ వర్గానికే దక్కే అవకాశముందని, తమ తరఫున బలమైన వాదనలను వినిపించామని, ప్రత్యేకించి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికే ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు ఆమెకు పార్టీ చిహ్నం కేటాయించే అధికారం ఉండదని అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రెండాకుల గుర్తు తమవర్గానికి దక్కుతుందని, లేకుంటే ఎన్నికల సంఘం ఆ చిహ్నాన్ని స్తంభింపజేసే అవకాశముందన్నారు. ఇక శశికళ వర్గం తరఫు రాజ్యసభ ఎంపీ నవనీత కృష్ణన మాట్లాడుతూ న్యాయపరంగా ఉన్న తమ వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించి రెండాకుల గుర్తును తమకే కేటాయిస్తుందన్నారు. అయితే ఎన్నికల కమిషన రెండాకుల గుర్తును ఎవ్వరికీ లేకుండా చేసింది.
nation
19,914
07-02-2017 02:01:41
స్టంప్‌ తగిలి ఫీల్డర్‌ మృతి
ఢాకా: మైదానంలో ఓ బ్యాట్స్‌మన్‌ ఆవేశం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తాను బౌల్డ్‌ కావడాన్ని తట్టుకోలేని ఆటగాడు స్టంప్‌ను గాల్లోకి విసిరేయడంతో అది తలకు బలంగా తాకి మరో ప్లేయర్‌ మైదానం లోనే కన్నుమూశాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. చిట్టగాంగ్‌లో జరిగిన స్థానిక మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మన్‌ స్టంపౌట్‌ కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో స్టంప్‌ను గాల్లోకి విసరడంతో వికెట్లకు దగ్గర్లో ఫీల్డింగ్‌ చేస్తున్న 14 ఏళ్ల ఫైసల్‌ హుస్సేన్‌ అనే కుర్రాడి మెడ, తల భాగం మధ్య బలంగా తాకడంతో అతను గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అతను అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు.
sports
3,941
06-12-2017 02:04:57
నేరాల లెక్కలు
రానురాను దేశం హింసాత్మకంగా మారుతోంది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తన కొత్త నివేదికలో నేరాలూ ఘోరాలూ వేగంగా పెరుగుతున్న వాస్తవాన్ని తెలియచెప్పింది. గత ఏడాది నేరాలను విశ్లేషిస్తూ నాలుగు నెలల క్రితమే విడుదల కావాల్సిన ఈ నివేదిక, ఆలస్యంగా వచ్చినా అనేక కొత్త సమస్యలను కూడా ఎత్తిచూపింది. పాశ్చాత్యదేశాల్లో ఇటువంటి నివేదికలు ప్రజల కంటే పాలకులకు ఎక్కువ ఆందోళన కలిగిస్తాయి. తమ ఏలుబడిలో పరిస్థితి దిగజారినందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సిగ్గుపడతాయి. వీటి ఆధారంగా జనం తమ పనితీరు బేరీజు వేస్తారని భయపడతాయి. కానీ, భారతదేశంలో ప్రజలకూ, ప్రభుత్వాలకూ ఇటువంటి నివేదికలు పెద్దగా పట్టవు. వీటి ఆధారంగా జనం రోడ్లమీదకు రారు, ఎన్నికలమీద వీటి ప్రభావం ఉండదు కనుక పాలకులు కూడా ఖాతరుచేయరు. ఈ నివేదిక ప్రధానంగా మహిళలు, పిల్లలపై శరవేగంగా పెరుగుతున్న దారుణాలను ఎత్తిచూపింది. కులవివక్ష పల్లెల్లో మాత్రమే అమలు జరుగుతుందన్న భ్రమలో ఉన్నవారికి ఇది పట్టణాల్లోనూ ఉన్నదని చెప్పింది. దేశంలో రోజూ వందకుపైగా జరుగుతున్న అత్యాచారాల్లో దేశరాజధాని ఢిల్లీ తొలిస్థానంలో ఉన్నది. మహిళల రక్షణ విషయంలో తెలుగు రాష్ట్రాలు విఫలమయ్యాయి. ఈ నివేదికలో వివిధ రాష్ట్రాలు, నగరాలకు ఏయే వైఫల్యాల ఆధారంగా ర్యాంకులు దక్కాయన్నది అటుంచితే, ఈ నివేదిక మొత్తంగా చెప్పినది ఒక్కటే. నిర్భయ వంటి చట్టాలు వచ్చినా, మహిళల రక్షణ కోసం ప్రత్యేక మహిళా దళాలంటూ ఏర్పడినా వారిపై దాడులు, దారుణాల నియంత్రణలో పెద్దగా సాధించిందేమీ లేదని. మహిళలపైనా, పిల్లలపైనా పెరిగిన ఈ దారుణాలకు కారకులు వారి బంధువులో, పరిచయస్తులోనన్న వాస్తవం మరింత కఠినమైనది. 95 శాతం కేసుల్లో రక్షకులే భక్షకులన్నప్పుడు అరెస్టులు, శిక్షలు మరింత సులభంగా జరిగిపోవాలి.  కానీ, కేసులు వీగిపోవడం, నిందితులు తప్పించుకుపోవడం ఎక్కువగా జరుగుతున్నది. చాలా సందర్భాల్లో పోలీసుల వైఖరి కారణంగా బంధువుల ఒత్తిడి మేరకు బాధితులే రాజీపడవలసి వస్తున్నది. నిందితుల అరెస్టు నుంచి విచారణ వరకూ గొలుసుకట్టు చర్యలన్నీ వేగంగా సాగినప్పుడు మాత్రమే లొసుగులకు తావు లేకుండా ఉంటుంది. పిల్లలపై అత్యాచారాలు ఏడాది కాలంలో 80 శాతం పెరిగాయన్నది సమాజం అవమానపడాల్సిన అంశం. చివరకు పసిపిల్లలను కూడా వదిలిపెట్టనంత రాక్షసత్వం సమాజంలో హెచ్చడానికి కారణం చౌకగా అందరి గుప్పిట్లోకీ వచ్చిచేరుతున్న హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ మొబైల్స్‌ కూడా కావచ్చు. మహిళలు, పిల్లల తరువాత నేరాలు అధికంగా చవిచూసే దళితుల విషయంలోనూ పరిస్థితి బాగా దిగజారిందని ఎన్సీఆర్‌బీ నివేదిక చెబుతున్నది. తొలిసారిగా ప్రధానగరాల్లో వివక్షను కూడా ఇది లెక్కగట్టినందువల్ల గ్రామీణ ప్రాంతాలకు నగరాలు ఏమీ తీసిపోవని అర్థమవుతున్నది. దళితులపై జరిగే నేరాల్లో మహిళలే ప్రధాన బాధితులు కావడం ఈ సమాజం ఆలోచనాతీరుకు అద్దం పడుతున్నది. ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని లెక్కలన్నీ ఠాణాల్లో నమోదైన కేసుల ఆధారంగా జరిగినవే కనుక, అసలు పరిస్థితి ఇంతకు ఎన్నో రెట్లు ఉంటుందన్నది వాస్తవం. నమోదు కాని నేరాలకు, ఘోరాలకు ఈ దేశంలో కొదువలేదు. పోలీసుల వైఖరి కారణంగానో, న్యాయం జరగదన్న నమ్మకం వల్లనో కేసులు పెట్టే లక్షణం ఈ దేశంలో తక్కువ. కేసులుపెట్టిన వారిని మరిన్ని కష్టాలపాల్జేసే దారులు ఇక్కడ అనేకం. నిర్భయ ఘటన తరువాత అన్ని పోలీసు స్టేషన్లు కచ్చితంగా తమ వద్దకు వచ్చేవారినుంచి ఫిర్యాదులు స్వీకరించాలనీ, నమోదుచేయాలనీ కేంద్రప్రభుత్వం నుంచి విస్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. దీనిని రాష్ట్రాలు పాటిస్తున్న దాఖలాలేమీ లేవు. అదే జరిగివుంటే నివేదిక లెక్కలు పదులూ వందలకు పరిమితమయ్యేవి కావు. పాలకులకు కావాల్సింది కూడా ఈ పరిమిత ప్రమాణాలే.  క్షేత్రస్థాయి వాస్తవాలతో వారికి నిమిత్తం లేదు. వారు వాటిని చూడదల్చుకోవడం లేదు. దేశరాజధాని ఢిల్లీ నేరాల్లో అగ్రస్థానంలో ఉన్నదని ఈ నివేదిక చెబుతున్నది. అక్కడ గత ఏడాది వరకూ మూడేళ్ళపాటు కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి చొరవవల్ల ప్రతి పోలీసుస్టేషన్‌ తమ వద్దకు వచ్చిన ఫిర్యాదును నమోదు చేయడమే ఈ పెరుగుదలకు కారణమని ఓ విశ్లేషణ.  ఒక్కముక్కలో చెప్పాలంటే, అంతకుముందు నాలుగేళ్ళకాలంలో నేరాలు ఐదోవంతు తగ్గినట్టుగా కనిపించడానికీ, ఇప్పుడు హెచ్చడానికీ కారకులు పోలీసులే. పోలీసులు ప్రతి ఫిర్యాదునీ స్వీకరించవలసిందేననీ, అదే న్యాయానికి తొలిమెట్టు అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈ పని జరగడం లేదు. పోలీసుల పనితీరుకు ఇవి ప్రాతిపాదికలు కనుక వాస్తవాలను దాచిపెట్టడమే అధికంగా జరుగుతున్నది. శాంతిభద్రతల పరిరక్షణలో తాము నెంబర్‌వన్‌ అని చెప్పుకోవడానికి పాలకులకు వీలుకలుగుతున్నది. దొంగతనాలు సరేసరి, దాడులను, అత్యాచారాలను ఫిర్యాదు చేయడానికి కూడా సామాన్యులు ధైర్యంగా ముందుకు రాలేని వాతావరణం దేశంలో కొనసాగుతున్నంత కాలం ఎన్‌సీఆర్‌బీ లెక్కలు సముద్రంలో కాకిరెట్ట.రానురాను దేశం హింసాత్మకంగా మారుతోంది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తన కొత్త నివేదికలో నేరాలూ ఘోరాలూ వేగంగా పెరుగుతున్న వాస్తవాన్ని తెలియచెప్పింది. గత ఏడాది నేరాలను విశ్లేషిస్తూ నాలుగు నెలల క్రితమే విడుదల కావాల్సిన ఈ నివేదిక, ఆలస్యంగా వచ్చినా అనేక కొత్త సమస్యలను కూడా ఎత్తిచూపింది. పాశ్చాత్యదేశాల్లో ఇటువంటి నివేదికలు ప్రజల కంటే పాలకులకు ఎక్కువ ఆందోళన కలిగిస్తాయి. తమ ఏలుబడిలో పరిస్థితి దిగజారినందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సిగ్గుపడతాయి. వీటి ఆధారంగా జనం తమ పనితీరు బేరీజు వేస్తారని భయపడతాయి. కానీ, భారతదేశంలో ప్రజలకూ, ప్రభుత్వాలకూ ఇటువంటి నివేదికలు పెద్దగా పట్టవు. వీటి ఆధారంగా జనం రోడ్లమీదకు రారు, ఎన్నికలమీద వీటి ప్రభావం ఉండదు కనుక పాలకులు కూడా ఖాతరుచేయరు. ఈ నివేదిక ప్రధానంగా మహిళలు, పిల్లలపై శరవేగంగా పెరుగుతున్న దారుణాలను ఎత్తిచూపింది. కులవివక్ష పల్లెల్లో మాత్రమే అమలు జరుగుతుందన్న భ్రమలో ఉన్నవారికి ఇది పట్టణాల్లోనూ ఉన్నదని చెప్పింది. దేశంలో రోజూ వందకుపైగా జరుగుతున్న అత్యాచారాల్లో దేశరాజధాని ఢిల్లీ తొలిస్థానంలో ఉన్నది. మహిళల రక్షణ విషయంలో తెలుగు రాష్ట్రాలు విఫలమయ్యాయి. ఈ నివేదికలో వివిధ రాష్ట్రాలు, నగరాలకు ఏయే వైఫల్యాల ఆధారంగా ర్యాంకులు దక్కాయన్నది అటుంచితే, ఈ నివేదిక మొత్తంగా చెప్పినది ఒక్కటే. నిర్భయ వంటి చట్టాలు వచ్చినా, మహిళల రక్షణ కోసం ప్రత్యేక మహిళా దళాలంటూ ఏర్పడినా వారిపై దాడులు, దారుణాల నియంత్రణలో పెద్దగా సాధించిందేమీ లేదని. మహిళలపైనా, పిల్లలపైనా పెరిగిన ఈ దారుణాలకు కారకులు వారి బంధువులో, పరిచయస్తులోనన్న వాస్తవం మరింత కఠినమైనది. 95 శాతం కేసుల్లో రక్షకులే భక్షకులన్నప్పుడు అరెస్టులు, శిక్షలు మరింత సులభంగా జరిగిపోవాలి.  కానీ, కేసులు వీగిపోవడం, నిందితులు తప్పించుకుపోవడం ఎక్కువగా జరుగుతున్నది. చాలా సందర్భాల్లో పోలీసుల వైఖరి కారణంగా బంధువుల ఒత్తిడి మేరకు బాధితులే రాజీపడవలసి వస్తున్నది. నిందితుల అరెస్టు నుంచి విచారణ వరకూ గొలుసుకట్టు చర్యలన్నీ వేగంగా సాగినప్పుడు మాత్రమే లొసుగులకు తావు లేకుండా ఉంటుంది. పిల్లలపై అత్యాచారాలు ఏడాది కాలంలో 80 శాతం పెరిగాయన్నది సమాజం అవమానపడాల్సిన అంశం. చివరకు పసిపిల్లలను కూడా వదిలిపెట్టనంత రాక్షసత్వం సమాజంలో హెచ్చడానికి కారణం చౌకగా అందరి గుప్పిట్లోకీ వచ్చిచేరుతున్న హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ మొబైల్స్‌ కూడా కావచ్చు. మహిళలు, పిల్లల తరువాత నేరాలు అధికంగా చవిచూసే దళితుల విషయంలోనూ పరిస్థితి బాగా దిగజారిందని ఎన్సీఆర్‌బీ నివేదిక చెబుతున్నది. తొలిసారిగా ప్రధానగరాల్లో వివక్షను కూడా ఇది లెక్కగట్టినందువల్ల గ్రామీణ ప్రాంతాలకు నగరాలు ఏమీ తీసిపోవని అర్థమవుతున్నది. దళితులపై జరిగే నేరాల్లో మహిళలే ప్రధాన బాధితులు కావడం ఈ సమాజం ఆలోచనాతీరుకు అద్దం పడుతున్నది. ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని లెక్కలన్నీ ఠాణాల్లో నమోదైన కేసుల ఆధారంగా జరిగినవే కనుక, అసలు పరిస్థితి ఇంతకు ఎన్నో రెట్లు ఉంటుందన్నది వాస్తవం. నమోదు కాని నేరాలకు, ఘోరాలకు ఈ దేశంలో కొదువలేదు. పోలీసుల వైఖరి కారణంగానో, న్యాయం జరగదన్న నమ్మకం వల్లనో కేసులు పెట్టే లక్షణం ఈ దేశంలో తక్కువ. కేసులుపెట్టిన వారిని మరిన్ని కష్టాలపాల్జేసే దారులు ఇక్కడ అనేకం. నిర్భయ ఘటన తరువాత అన్ని పోలీసు స్టేషన్లు కచ్చితంగా తమ వద్దకు వచ్చేవారినుంచి ఫిర్యాదులు స్వీకరించాలనీ, నమోదుచేయాలనీ కేంద్రప్రభుత్వం నుంచి విస్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. దీనిని రాష్ట్రాలు పాటిస్తున్న దాఖలాలేమీ లేవు. అదే జరిగివుంటే నివేదిక లెక్కలు పదులూ వందలకు పరిమితమయ్యేవి కావు. పాలకులకు కావాల్సింది కూడా ఈ పరిమిత ప్రమాణాలే.  క్షేత్రస్థాయి వాస్తవాలతో వారికి నిమిత్తం లేదు. వారు వాటిని చూడదల్చుకోవడం లేదు. దేశరాజధాని ఢిల్లీ నేరాల్లో అగ్రస్థానంలో ఉన్నదని ఈ నివేదిక చెబుతున్నది. అక్కడ గత ఏడాది వరకూ మూడేళ్ళపాటు కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి చొరవవల్ల ప్రతి పోలీసుస్టేషన్‌ తమ వద్దకు వచ్చిన ఫిర్యాదును నమోదు చేయడమే ఈ పెరుగుదలకు కారణమని ఓ విశ్లేషణ.  ఒక్కముక్కలో చెప్పాలంటే, అంతకుముందు నాలుగేళ్ళకాలంలో నేరాలు ఐదోవంతు తగ్గినట్టుగా కనిపించడానికీ, ఇప్పుడు హెచ్చడానికీ కారకులు పోలీసులే. పోలీసులు ప్రతి ఫిర్యాదునీ స్వీకరించవలసిందేననీ, అదే న్యాయానికి తొలిమెట్టు అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈ పని జరగడం లేదు. పోలీసుల పనితీరుకు ఇవి ప్రాతిపాదికలు కనుక వాస్తవాలను దాచిపెట్టడమే అధికంగా జరుగుతున్నది. శాంతిభద్రతల పరిరక్షణలో తాము నెంబర్‌వన్‌ అని చెప్పుకోవడానికి పాలకులకు వీలుకలుగుతున్నది. దొంగతనాలు సరేసరి, దాడులను, అత్యాచారాలను ఫిర్యాదు చేయడానికి కూడా సామాన్యులు ధైర్యంగా ముందుకు రాలేని వాతావరణం దేశంలో కొనసాగుతున్నంత కాలం ఎన్‌సీఆర్‌బీ లెక్కలు సముద్రంలో కాకిరెట్ట.
editorial
14,672
11-08-2017 12:30:33
మావాళ్ళను పంపించేసినందుకు థ్యాంక్స్... మాకు ఖర్చులు తగ్గాయి : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ధన్యవాదాలు తెలిపారు. రష్యా నుంచి వందలాది మంది అమెరికా దౌత్యవేత్తలను బహిష్కరించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు థ్యాంక్స్ అని ట్రంప్ అన్నారు. పుతిన్ నిర్ణయం వల్ల అమెరికా ప్రభుత్వం వేతనాల వ్యయం తగ్గిందని తెలిపారు. పేరోల్‌ను తగ్గించుకోవాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నామన్నారు. పుతిన్ నిర్ణయం వల్ల తమ వేతన చెల్లింపుల భారం తగ్గిందన్నారు. తమకు చాలా సొమ్ము ఆదా అవుతోందన్నారు. ఆ ఉద్యోగులు రష్యాలో పనిచేయవలసిన అవసరం తనకు కనిపించడం లేదన్నారు.
nation
2,972
04-08-2017 02:01:26
పతంజలి రెడీమేడ్‌ దుస్తులు
త్వరలో మార్కెట్లోకి.. తొలి ఏడాది రూ.5,000 కోట్ల వ్యాపారంపై కన్నుఆహార , ఆయుర్వేద , కాస్మెటిక్‌ ఉత్పత్తుల మార్కెట్లో అదరగొడుతున్న పతంజలి ఆయుర్వేద్‌.. రెడీమేడ్‌ దుస్తుల రంగంలోకి ప్రవేశించనుంది. త్వరలోనే ఈ కంపెనీ బ్రాండెడ్‌ దుస్తులు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్నాయి. ఏ బ్రాండ్‌ పేరుతో దుస్తులను తీసుకురావాలన్న దానిపై ప్రస్తుతం కంపెనీ కసరత్తు చేస్తోంది. పురుషులు, మహిళలు, పిల్లలు ధరించే స్వదేశీ శ్రేణి దుస్తులను తీసుకురానున్నామని, తొలి ఏడాదిలో 5,000 కోట్ల రూపాయల అమ్మకాలను సాధించాలన్న లక్ష్యంతో ఉన్నామని పతంజలి ఆయుర్వేద్‌ ఉన్నతాధికారి ఎస్‌కె తిజరావాలా తెలిపారు.  ప్రతి కేటగిరీలోనూ విభిన్న రకాల దుస్తులు ఉంటాయని, కస్టమర్లు చెల్లించే సొమ్ముకు తగిన విలువను ఇచ్చే దుస్తులు ఉంటాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 250 ఎక్స్‌క్లూజివ్‌ రిటైల్‌ స్టోర్లలో పతంజలి దుస్తులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. తొలుత నేత దుస్తులు, నైట్‌వేర్‌, మెషిన్‌ మేడ్‌ దుస్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సొంత స్టోర్లతో పాటు ఇతర భారీ మాల్స్‌లోనూ పతంజలి దుస్తులు అమ్ముతారని తెలుస్తోంది. ఇప్పటికే పతంజలి బిగ్‌బజార్‌తో ఒప్పందం కుదుర్చుకుని తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. గత మే నెలనాటికి పతంజలి ఆయుర్వేద్‌ 10,561 కోట్ల రూపాయల టర్నోవర్‌ను నమోదు చేసుకుంది. వచ్చే ఐదేళ్ల కాలంలో దీన్ని పదింతలు పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉంది.
business
2,299
24-08-2017 01:33:47
వార్తా పత్రికల ప్రకటనల జిఎ్‌సటిపై స్పష్టత
న్యూఢిల్లీ: వార్తా పత్రికల ప్రకటనలపై విధించే జిఎస్‌టిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఏదైనా ఏజెన్సీ ఒక పత్రికకు కమీషన్‌ పద్ధతిలో ఏజెంట్‌గా పని చేస్తూ ప్రకటనల కోసం పత్రికలో కొంత భాగాన్ని అమ్మితే వచ్చే కమీషన్‌పై 18 శాతం జిఎస్‌టి ఉంటుందని తెలిపింది. అయితే ఏదైనా ఏజెన్సీ పత్రికలో కొంత భాగాన్ని ముందుగానే కొనుక్కుని ఆ భాగాన్ని ప్రకటనల కోసం అమ్ముకుంటే వచ్చే ఆదాయంపై మాత్రం ఐదు శాతం జిఎ్‌సటి చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ఉదాహరణకు ఒక ఏజెన్సీ ఒక వార్తా పత్రికలో రూ.100 విలువైన కొంత స్థలాన్ని ప్రకటనల కోసం 15 శాతం డిస్కౌంట్‌తో రూ.85కు కొనుక్కుని దాన్ని రూ.100కు అమ్ముకుంటే పత్రికకు వచ్చే రూ.85 ఆదాయంపై ఐదు శాతం చొప్పున, ఏజెన్సీకి వచ్చే రూ.100 ఆదాయంపై ఐదు శాతం చొప్పున జిఎ్‌సటి చెల్లించాలి.  అదే ఏదైనా ప్రకటనల ఏజెన్సీ ఒక పత్రికకు కమీషన్‌ పద్ధతిలో ప్రకటనల ఏజెంట్‌గా పని చేస్తూ ప్రకటనల స్థలం విక్రయిస్తుంటే మాత్రం అమ్మకం కమీషన్‌పై 18 శాతం జిఎ్‌సటి చెల్లించాలి. ఈ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంపైనా పత్రిక ఐదు శాతం జిఎ్‌సటి చెల్లించాలి. అయితే తనకు ముట్టిన కమీషన్‌పై ప్రకటనల ఏజెన్సీ చెల్లించే పన్నుపై పత్రిక ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ పొందవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రకటనల ఏజెన్సీ ప్రకటనల కోసం పత్రికలో స్థలమే కాకుండా డిజైనింగ్‌ లేదా ఆ ప్రకటనకు సంబంధించిన డ్రాఫ్టింగ్‌ వంటి సేవలు అందిస్తే వాటిపైనా 18 శాతం జిఎ్‌సటి భారం పడుతుంది. అయితే ఇవన్నీ వార్తా పత్రిక, ప్రకటనల ఏజెన్సీ, క్లయింట్‌ మధ్య కుదిరే కాంట్రాక్ట్‌ షరతులపై ఆధారపడి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
business
16,126
13-09-2017 19:33:09
జపాన్ ప్రధాన మంత్రితో మశీదుకు వెళ్ళిన మోదీ
అహ్మదాబాద్ : జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే, ఆయన సతీమణి అకీ అబేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా ఆత్మీయంగా ఆతిథ్యమిస్తున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో అబే దంపతులకు మోదీ సాదరంగా స్వాగతం పలికారు. వారితో కలిసి 8 కి.మీ. మేర రోడ్ షో నిర్వహించారు. అనంతరం సబర్మతి ఆశ్రమానికి వెళ్ళి, మహాత్మా గాంధీకి సంబంధించిన విశేషాలను మోదీ వివరించారు. అబే దంపతులు రోడ్‌ షోలో పూర్తిగా భారతీయ శైలిలో వస్త్రాలను ధరించి, కనువిందు చేశారు. అబే దంపతులను మోదీ 16వ శతాబ్దంనాటి సీదీ సయ్యద్ ని జాలీ మశీదుకు తీసుకెళ్ళారు. దీనిలోని వాస్తు శైలిని వివరించారు.
nation
2,167
23-12-2017 02:00:40
జనవరి నుంచి పెరగనున్న హీరో మోటార్‌ సైకిళ్ల ధరలు
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌... 2018 జనవరి 1 నుంచి అన్ని మోటార్‌సైకిళ్లను ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్‌పుట్‌ వ్యయాలు పెరిగిపోవటంతో ప్రతి మోడల్‌ ధరను 400 రూపాయల వరకు పెంచుతున్నట్లు తెలిపింది. మోడల్‌, మార్కెట్‌ను బట్టి ధరల్లో తేడాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఎంట్రీ లెవల్‌ బైక్‌ హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ ధర 42,432 రూపాయలుగా ఉండగా హైఎండ్‌ బైక్‌ కరిజ్మా జెడ్‌ఎంఆర్‌ ధర సుమారు 1.10 లక్షల రూపాయల వరకు ఉంది.
business
3,185
29-09-2017 00:36:45
మహీంద్రా సరికొత్త బొలేరో మాక్సీట్రక్‌ ప్లస్‌
ధర రూ.5.24 లక్షలుహైదరాబాద్‌ : మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్త బొలేరో మాక్సీట్రక్‌ ప్లస్‌ (బిఎంటి ప్లస్‌)ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని, వాహన యజమానుల లాభదాయకత పెరగడానికి అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో దీని ధర 5.24 లక్షల రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌). దీని పేలోడ్‌ సామర్థ్యం 1200 కిలోలుగా ఉందని, లీటరు ఇంధనానికి 17.7 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. బిఎస్‌4 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఈ పికప్‌ వెహికిల్‌ ద్వారా తమ మార్కెట్‌ వాటా మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎం అండ్‌ ఎం ఆటోమోటివ్‌ డివిజన్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ చీఫ్‌ విజయ్‌ రామ్‌ నక్రా తెలిపారు.
business
13,014
19-04-2017 17:19:19
గుండు చాలదు.. మెడలో చెప్పుల దండతో దేశమంతా ఊరేగాలి..
కోల్‌కతా: బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కేవలం గుండు చేయించుకుంటే చాలదని, మెడలో చెప్పుల దండ వేసుకుని దేశమంతా ఊరేగితే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని పశ్చిమ బెంగాల్ మైనారిటీ యునైటెడ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ షా ఆతిఫ్ అలీ అల్ ఖాదరీ అన్నారు. సోనూ నిగమ్ అజాన్ వ్యాఖ్యలపై ఆయన ఫత్వా జారీ చేశారు. సోనూకు గుండు గీసి, మెడలో చెప్పుల దండ వేసి, దేశమంతా తిప్పిన వారికి వ్యక్తిగతంగా రూ.10 లక్షల నజరానా ఇస్తానని ఖాదరీ ప్రకటించారు.  దీనిపై స్పందించిన సోనూ మధ్యాహ్నం వరకు తన ఇంట్లోనే ఉంటానని, ఎవరైనా వచ్చి గుండు గీయవచ్చన్నారు. ఆ తర్వాత తనకు తానే గుండు చేసుకున్నారు. ఖాదరీ రూ.10 లక్షలిస్తే చారిటీకి ఇస్తానని సోనూ చెప్పారు. దీనిపై స్పందించిన ఖాదరీ మిగతా రెండూ కూడా చేస్తే ఆ రివార్డు ఇస్తామని వెల్లడించారు.
nation
15,180
17-10-2017 15:23:28
విప్లవానికి ఇదే మంచి సమయం : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ఆయుర్వేదం నేతృత్వంలో ఆరోగ్య విప్లవానికి సమయం వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి అఖిల భారత ఆయుర్వేద సంస్థను జాతికి అంకితం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రపంచం మళ్ళీ ప్రకృతివైపు మళ్ళుతోందని చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానం మన దేశ బలమని పేర్కొన్నారు. దీనిని పునరుజ్జీవింపజేయాలని ఈ రంగంలో కృషి చేస్తున్నవారిని కోరారు. ఎలాంటి పరోక్ష ప్రభావాలు లేకుండా, అల్లోపతి మందుల మాదిరిగా తక్షణ ఉపశమనాన్ని ఇవ్వగలిగే ఔషధాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు సంస్థలు కూడా ఆయుర్వేదాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. గత 30 ఏళ్ళలో ఐటీ రివల్యూషన్‌ను మనం చూస్తున్నామని, ఆయుర్వేదం నేతృత్వంలో ఆరోగ్య విప్లవానికి సమయం ఆసన్నమైందని చెప్పారు. ఆయుర్వేదాన్ని పునరుజ్జీవింపజేసేందుకు, బలోపేతం చేసేందుకు మనమంతా ప్రతిజ్ఞ చేద్దామన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బానిస యుగంలో భారతదేశ బలాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని మోదీ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయుర్వేదానికి ప్రాధాన్యం దక్కలేదని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ మంచి ఆయుర్వేద ఆసుపత్రి ఉండేలా ఆయుష్ మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందన్నారు. అన్ని రకాల వైద్య విధానాలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. రైతులు తమ పొలాల్లో ఔషధ మొక్కలు పెంచేవిధంగా ఆయుష్, వ్యవసాయ మంత్రిత్వ శాఖలు మార్గదర్శనం చేయాలని కోరారు. 2022నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతాయని, అప్పటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఔషధ మొక్కల పెంపకం వంటి చర్యలు దోహదపడతాయని వివరించారు.
nation
18,131
20-04-2017 03:40:57
6న ఏం జరిగింది?
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. సుమారు 25 ఏళ్ల కిత్రం 1992 డిసెంబరు 6న అయోధ్యలో అసలేం జరిగింది.. నాటి మసీదు కూల్చివేత ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకులు ఎవరు.. పరోక్షంగా సహకరించిన నేతలు ఎవరు.. కూల్చివేత ఘటన జరిగిన 10 రోజులకు నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన లిబర్హన్‌ కమిషన్‌ ఏం చెప్పింది..? నాటి ఘటనల సింహవలోకనమే ఈ కథనం. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర చేస్తున్న బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే ఆడ్వాణీ 1992 డిసెంబరు 5న అయోధ్యకు చేరుకున్నారు. అదే రోజు మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి తదితర ముఖ్య నేతలు అయోధ్యకు వచ్చారు. తన రథయాత్ర సమయంలో.. డిసెంబరు 6నపెద్ద ఎత్తున కరసేవకులు అయోధ్యకు రావాలని ఆడ్వాణీ పిలుపునిచ్చారు. డిసెంబరు 5న అయోధ్యలో భజరంగ్‌ దళ్‌ వ్యవస్థాపకుడు వినయ్‌ కతియార్‌ నివాసంలో రహస్య సమావేశం జరిగింది. ఈ సమవేశానికి ఆడ్వాణీ, జోషి సహా మరికొంత మంది కీలక నేతలు హాజరయ్యారని లిబర్హన్‌ కమిషన్‌ తేల్చింది. బాబ్రి మసీదును కూల్చివేయడానికి కావాల్సిన ప్రభుత్వ మద్దతుపై ఆ భేటీలో చర్చ జరిగిందని సమాచారం. పలు అవసరాలను గుర్తించిన నేతలు అప్పటి యూపీ సీఎం కల్యాణ్‌ సింగ్‌కు వాటిని నివేదించారు. కరసేవకులు మసీదును కూల్చివేస్తున్నప్పుడు పోలీసుల పాత్ర నామమాత్రంగా ఉండేలా చూడాలని కల్యాణ్‌ సింగ్‌కు ఆడ్వాణీ బృందం సూచించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి యూపీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ ప్రత్యక్షంగా అయోధ్యలో లేకపోయినప్పటికీ మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించారని జస్టిస్‌ లిబర్హన్‌ కమిషన్‌ పేర్కొంది. ఆర్‌ఎ్‌సఎస్‌ సూచనలకు అనుగుణంగా ఆయన పనిచేశారని ఘాటుగా వ్యాఖ్యానించింది. మసీదు కూల్చివేత సమయంలో ‘సైలెంట్‌’గా ఉండాలని పరిపాలన, పోలీసు అధికారులకు కల్యాణ్‌ ఆదేశాలు జారీ చేశారని కమిషన్‌ స్పష్టం చేసింది. కల్యాణ్‌ సింగ్‌కు అన్నీ తెలిసినా మౌనంగా ఉన్నారని, కూల్చివేతను అపడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేల్చింది. కాగా, ఆడ్వాణీ, జోషితోపాటు మాజీ ప్రధా ని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పాత్రనూ విస్మరించలేమని, ఆయన కూడా వెనుక నుండి సిద్ధాంతపరంగా సహకారాన్ని అందించారని కమిషన్‌ పేర్కొంది.
nation
16,183
09-11-2017 01:36:07
భారత్‌లో మత స్వేచ్ఛ లేదు!
అమెరికా తీవ్ర ఆరోపణలుముస్లింలు, క్రైస్తవులకు రక్షణ కరవైందని ఆందోళనవాషింగ్టన్‌, నవంబరు 8: భారత్‌లో మత స్వేచ్ఛ లేదా? మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయా? అవుననే అంటోంది అమెరికా! ఈ అంశం ఆధారంగా భారత్‌పై తీవ్రస్థాయిలో విషం కక్కింది. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులకు రక్షణ లేదన్నట్టుగా అమెరికా ప్రకటన ఉంది. వీరిపై దాడులు చేసి బెదిరిస్తున్నది హిందువులేనని స్పష్టంగా చెప్పడం విశేషం.! అందుకే భారత్‌లో మత స్వేచ్ఛను ప్రోత్సహిస్తామంటూ తనదైనశైలిలో దాతృత్వం చాటుకుంది. దాదాపు 5 లక్షల డాలర్ల నిధులు కేటాయించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వేతర సంస్థలకు అంటే ఎన్జీవోలకు అందజేస్తారు. సమాజాన్ని, జర్నలిస్ట్‌లను చైతన్య పర్చడం, మత స్వేచ్ఛను కాపాడటం, మత సంబంధ దాడులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, చట్టం ఏం చెబుతుంది, మానవహక్కులు ఏమిటో చెప్పడం ఈ మిషన్‌లో భాగమని అమెరికా వెల్లడించింది.   దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో మానవహక్కుల ఉల్లంఘన, కార్మికుల రక్షణ తదితర 28 అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇందుకోసం 17 మిలియన్‌ డాలర్లు కేటాయించారు. విచిత్రం ఏమంటే....అమెరికా నిధులు అందజేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం విమర్శలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఆఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, తజకిస్థాన్‌, తుర్కుమెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ మాత్రమే జాబితాలో ఉన్నాయి. భారత్‌తోపాటు శ్రీలంకకు కూడా ఇదే విషయంలో భారీగా నిధులు అందజేయబోతున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌ రిపోర్ట్‌ ప్రకారం భారత్‌, శ్రీలంక దేశాల్లో క్రైస్తవులు, ముస్లింలపై ఎక్కువుగా దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని గుర్తించినట్టు అమెరికా వెల్లడించింది.
nation
1,049
17-10-2017 02:20:12
ట్రయంఫ్‌ నుంచి స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌
ధర రూ.10.55 లక్షలున్యూఢిల్లీ: యుకెకు చెందిన హై ఎండ్‌ మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌.. మార్కెట్లోకి సరికొత్త స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌ను తీసుకువచ్చింది. ఈ బైక్‌ ధర 10.55 లక్షల రూపాయలు. అప్‌డేటెడ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎ్‌సను 765సిసి ఇంజన్‌తో తీసుకువచ్చినట్లు ట్రయంఫ్‌ మోటార్‌ సైకిల్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ విమల్‌ సంబ్లీ తెలిపారు. ఫెర్‌ఫార్మెన్స్‌, సరికొత్త స్టైల్‌తో కూడిన ఈ బైక్‌ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పారు. 2013లో పది మోడల్స్‌లో ట్రయంఫ్‌ భారత మార్కెట్లోకి అడుగుపెట్టగా ప్రస్తుతం ఐదు కేటగిరీల్లో 17 మోడల్స్‌ను విక్రయిస్తోందని తెలిపారు. దేశీ మార్కెట్లో కంపెనీ ఇప్పటి వరకు 4,500 యూనిట్లను విక్రయించిందని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో హై ఎండ్‌ బైక్‌లకు డిమాండ్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, ఇందుకు తగ్గట్టుగానే ట్రయంఫ్‌ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను తీసుకువస్తోందని సంబ్తీ తెలిపారు. కాగా కంపెనీకి దేశవ్యాప్తంగా 17 డీలర్‌షి్‌పలుండగా గోవా, మంగళూరు, గురుగ్రామ్‌లో కొత్తగా మూడు షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సంబ్లీ తెలిపారు.
business
21,349
31-08-2017 02:17:03
ఫిక్సింగ్‌ స్కామ్‌లో షర్జీల్‌పై ఐదేళ్ల నిషేధం
కరాచీ: స్పాట్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌లో బ్యాట్స్‌మన్‌ షర్జీ ల్‌ ఖాన్‌పై పాకిస్థాన్‌ క్రికె ట్‌ బోర్డు (పీసీబీ) అవినీతి వ్యతిరేక ట్రైబ్యునల్‌ ఐదేళ్ల నిషేధం విధించింది. ఫిబ్ర వరిలో జరిగిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) లో షర్జీల్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ట్రైబ్యునల్‌ తేల్చింది. అయితే ఐదేళ్ల నిషేధాన్ని రెండు దశల్లో అమలు చేయనున్నారు. తొలి రెండున్నరేళ్లు బ్యాన్‌ కొనసాగుతుంది. తర్వాత అతడి నడవడిక ఆధారంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. పాకిస్థాన్‌ తరఫున షర్జీల్‌ ఒక టెస్ట్‌, 25 వన్డేలు, 25 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. షర్జీల్‌తోపాటు ఖలీద్‌ లతీఫ్‌పై కూడా ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. షర్జీల్‌పై జీవితకాల నిషేధం విధించాలని పీసీబీ గట్టిగా వాదించింది.
sports
6
14-01-2017 01:31:36
సర్వీస్‌ టాక్స్‌ వద్దు : ఇండిపే
కార్డుల ద్వారా చెల్లింపులు జరిగే అన్ని రకాల లావాదేవీలపై సర్వీస్‌ టాక్స్‌ రద్దు చేయాలని పేమెంట్స్‌ సంస్థ ‘ఇండిపే నెట్‌వర్క్స్‌’ ప్రభుత్వాన్ని కోరింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా బ్యాంకింగ్‌ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ద్వారా జరిగే కార్డు లావాదేవీలపైనా ఎలాంటి సర్వీస్‌ ఛార్జీలు ఉండకూడదని ఆ సంస్థ ప్రెసిడెంట్‌, సిఇఒ రాజీబ్‌ సాహ చెప్పారు.
business
20,757
16-09-2017 15:30:54
కొరియా ఓపెన్ ఫైనల్లోకి పీవీ సింధు
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై 21-10, 17-12, 21-16 తేడాతో సంచలన విజయం సాధించింది. గేమ్‌ను 66 నిమిషాల్లో ముగించి శెభాష్ అనిపించుకుంది. తొలిరౌండ్‌లో సింధూ సునాయాసంగా పైచేయి సాధించగా.. రెండో రౌండ్లో బింగ్జియావో నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే సుదీర్ఘంగా సాగిన చివరి రౌండ్‌లో మాత్రం సింధూ తన ప్రత్యర్థిని ఏమాత్రం గుక్కతిప్పుకోనివ్వలేదు. ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చిన బింగ్జియావో మధ్య మధ్యతో అనవసర తప్పిదాలు చేయగా... వాటిని సమర్థంగా వినియోగించుకున్న సింధూ చెలరేగిపోయింది. నిర్ణయాత్మకమైన చివరి రౌండ్‌లో స్కోరు 17-14 వద్ద ఉండగా... తర్వాతి ఆరు పాయింట్లలో నాలుగు పాయింట్లను సింధూ తన ఖాతాలో వేసుకుంది. దీంతో 21-16 వద్ద సింధూ జయకేతనం ఎగురవేసింది. కాగా ఆదివారం సియోల్ వేదికగా జరిగే ఫైనల్ పోరులో పీవీ సింధూ మళ్లీ జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహారాతో తలపడనుంది. గత నెలలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నమెంటులో వీరిద్దరూ హోరాహోరీ తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో సింధూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ... తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా తృటిలో ట్రోఫీని కోల్పోయింది. మళ్లీ అదే క్రీడాకారిణితో తలపడే అవకాశం రావడంతో సింధూ ఈసారి ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని భావిస్తున్నారు.
sports
10,608
12-11-2017 11:56:39
మా దగ్గర బాలల సినిమాలు ఫేమస్‌
ఇరాన్‌ దర్శకుడు గోలామ్‌రేజ షాగర్‌చియాన్‌‘తల్లి లేనిదే బిడ్డ లేదు.. నీరు లేనిదే సాగులేదు. నీరు అమ్మతో సమానం’ అన్నది నిజం. దానినే సినిమా రూపంలో చెప్పాలనుకున్నాడు ఇరాన్‌కు చెందిన దర్శకుడు గోలామ్‌రేజ షాగర్‌చియాన్‌. ఫరాబి సినిమా ఫౌండేషన్‌ సహకారంతో ఆయన తెరకెక్కించిన ‘హురా’ చిత్రం చిత్రోత్సవాల్లో శనివారం ప్రదర్శించగా చిన్నారులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్ర రూపకర్తతో ‘ఆంధ్రజ్యోతి’ స్పెషల్‌ చిట్‌చాట్‌... అది నాకు చాలా ఈజీ...నీటి సమస్య నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. చిన్నారులతో సినిమా తీయడం చాలాకష్టమని చాలామంది చెబుతారు. కానీ.. నాకు చాలా ఈజీ. ఎందుకంటే రచయిత, దర్శకుడు, సింగర్‌, నిర్మాతగా రాణించడం కన్నా ముందు నేనొక స్కూల్‌ టీచర్‌ని. చిన్న పిల్లలను బుజ్జగించడం, వాళ్లతో పని చేయడం నాకు ఈజీ. ఈ సినిమా నిర్మాణంలో ఒక్క చోటే ఇబ్బంది పడ్డా. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం పిల్లల్ని, రెండు జంతువులను తీసుకొని అవుట్‌డోర్‌ వెళ్లాల్సి వచ్చింది. 300 కిలోమీటర్ల దూరం అది. ఆ ప్రయాణం చాలా ఇబ్బంది కలిగించింది. ఈ సినిమా కోసం లక్ష డాలర్లు ఖర్చయింది. నా తర్వాతి చిత్రం కూడా చిన్నపిల్లల మీదే ఉంటుంది. చిత్రోత్సవాల్లో మా సినిమాను ప్రదర్శించడం, ఇక్కడి పిల్లల నుంచి చక్కని స్పందన రావడం ఆనందంగా ఉంది. ఎక్స్‌పర్ట్‌లున్నారు...ఇరాన్‌లో బాలల చిత్రాలకు ఆదరణ బాగుంటుంది. నిర్మించేవారు కూడా ఆసక్తిగా ఉంటారు. బాలల సినిమాలు తీయడానికి ఇరాన్‌లో ఎక్స్‌పర్ట్‌లున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా బాలల చిత్రాలకు ప్రాముఖ్యతనిస్తోంది. ఏడాదికి ఐదారు సినిమాలొస్తాయి. మా దగ్గర బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు కూడా ఉన్నాయి. అందుకు ఇరాన్‌లో బాలల చిత్రాలు ఫేమస్‌. ఆ పద్ధతి మారింది...ఇరాన్‌ ఇస్లామిక్‌ దేశం కాబట్టి మహిళలు సినిమాలు చూడకూడదు. బయటికి రాకూడదు అన్న పద్ధతి ఒకప్పుడు ఉండేది. మారుతున్న కాలాన్ని బట్టి ఆ పద్ధతి మారింది. అక్కడ కూడా మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించే స్థాయికి వస్తున్నారు. టీచర్లుగా, ఆర్టిస్ట్‌లుగా, డైరెక్టర్లుగా, డ్రైవర్లుగా ఇలా అన్ని రంగాల్లోనూ మా దేశపు మహిళలు రాణిస్తున్నారు. భావ సారూప్యత ఒకటే...భారతీయులు, ఇరాన్‌ దేశస్థుల భావ సారూప్యత చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే భారతీయులకు ఇరానీ సినిమాలు బాగా కనెక్ట్‌ అవుతాయి.
entertainment
13,694
07-05-2017 02:46:13
ఢిల్లీలో విష వాయువు లీక్‌.. 460 మంది విద్యార్థినులకు అస్వస్థత
న్యూఢిల్లీ, మే 6: దేశ రాజధాని ఢిల్లీలో ఓ కంటెయినర్‌ డిపో నుంచి విషపూరిత రసాయనాలు లీకై 460 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తుగ్లకాబాద్‌ ప్రాంతంలో జరిగింది. డిపో నుంచి వెలువడిన రసాయనాలు పక్కనే ఉన్న రాణి ఝాన్సీ పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాలలోకి వ్యాపించాయి. దీంతో విద్యార్థులు కళ్లలో మంటలు, శ్వాసతీసుకోవటానికి ఇబ్బం ది పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వాళ్లందరినీ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన విషయం తెలియగానే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లో నడుస్తున్న ఆస్పత్రులన్నీ బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్యులను కేంద్ర మంత్రి జేపీనడ్డా ఆదేశించారు. అత్యవసర స్థితిని ఎదుర్కొనేందుకు ఎయిమ్స్‌లో వైద్య బృందాన్ని ఏర్పాటు చేయించారు. విషపూరిత వాయువుల లీకేజీపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ సర్కార్‌ న్యాయవిచారణకు ఆదేశించింది. పర్యావరణ సంరక్షణ చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే, ఐసీయూలో ఉన్న విద్యార్థులతో సహా ఆడపిల్లలందరూ ఆరోగ్యంతోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, విజేందర్‌ గుప్తా పరామర్శిం చారు. కాగా, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ ఆరోపించారు.
nation
10,454
13-01-2017 11:27:29
‘ఖైదీ’ స్పెషల్‌ షో చూసిన పవన్‌!
గుంటూరులో అద్భుతంగా జరిగిన ‘ఖైదీ నెంబర్‌ 150’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ గైర్హాజరవడంతో అన్నదమ్ముల మధ్య విభేదాలున్నాయని వార్తలు పుట్టుకొచ్చేశాయి. వారి వారి అభిమానుల మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే అదంతా అబద్ధమేననే విషయం గురువారంతో తేలిపోయింది. గురువారం రాత్రి అన్నయ్య సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ని పవన్‌ ప్రత్యేంగా వీక్షించాడట.
entertainment
8,277
26-12-2017 19:38:21
అప్పుడు యువరాజు.. ఇప్పుడు దిల్ రాజు: హరీష్ శంకర్
నిర్మాత దిల్ రాజు 2017 సంవత్సరానికి గానూ డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఎస్.వి.సి. సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ డబుల్ హ్యాట్రిక్ చిత్రాలలో అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన డీజే చిత్రం కూడా ఉంది. ఈ చిత్ర యూనిట్ కూడా ఈ వేడుకకు హాజరైంది. ఇక ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ''అంచనాలను తట్టుకుంటూ ఆరు సక్సెస్‌లను సాధించడం అంత చిన్న విషయమేమీ కాదు. రెండు మూడేళ్ల క్రితం క్రికెట్‌లో ఆరు సిక్సర్స్‌ కొట్టింది యువరాజు అయితే..సినిమాలో ఒకే ఏడాదిలో ఆరు సిక్సర్స్‌(హిట్స్‌) కొట్టింది దిల్‌రాజు. ఆయన గ్యాప్‌ లేకుండా 48 గంటలు కూడా కష్టపడటం చూశాను. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్‌ అలాంటిది. ఓసారి నేను రాజుగారితో.. 'అన్నా నీకు ఏ చెడు అలవాట్లు లేవు.. చాలా హెల్దీగా ఉన్నావు. ఇలాగే చేసుకుంటూ వెళితే వంద సినిమాలు చేసేస్తావన్నయ్యా' అన్నాను. దానికి ఆయన 'హరీశ్‌ నేను వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతాను. అవి 80..90 లేక వంద సినిమాలు అవుతాయో నాకు తెలియదు. కానీ వంద సినిమాలు చేయాలనే టార్గెట్‌తో సినిమాలు చేయడం లేదు' అన్నారు. ఆ మాట నాకెంతో ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. ఈ ఏడాది ఆయనకు వచ్చిన ఆరు సక్సెస్‌లు ఆయన ప్యాషన్‌కు దేవుడు ఇచ్చిన గిఫ్ట్‌లుగా నేను బావిస్తున్నాను. ఇంత మంచి జర్నీలో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌'' అన్నారు.
entertainment
19,188
11-09-2017 09:43:57
స్టాలిన్ సంచలన నిర్ణయం.. ఈపీఎస్‌ ప్రభుత్వం మనగలగడం కష్టమే.!
దినకర్‌వర్గంతో కలుపుకుని ఎమ్మెల్యేల లెక్కచెన్నై: లుకలుకలతో కొట్టుమిట్టాడుతున్న అన్నాడీఎంకేను పక్కనబెట్టి అధికారం కైవసం చేసుకునేందుకు డీఎంకే వ్యూహం పన్నిందా..? దినకరన్‌ వర్గంతో స్టాలిన్‌ చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి చెప్పిన మాటలు నిజమవుతున్నాయా..? అందుకే స్టాలిన్‌ నోటివెంట తొలిసారిగా దినకరన్‌వర్గ ఎమ్మెల్యేలతో కలిపి గణాంకాలు వెల్లడయ్యాయా..? అవుననే వ్యాఖ్యానిస్తున్నాయి రాజకీయవర్గాలు. ఈపీఎస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్టు వార్తలు వెలువడగానే గత నెల 27వ తేదీన డీఎంకే సీనియర్‌ నేత దురైమురుగన్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగరరావును కలుసుకున్నాయి.  తక్షణం మెజారిటీ నిరూపణకు ఈపీఎస్‌ను ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేశాయి. అయితే అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోబోనంటూ గవర్నర్‌ వ్యాఖ్యానించడంతో మిన్నకుండిపోయిన ప్రతిపక్షాలు.. తాజాగా ఆదివారం డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని మళ్లీ విద్యాసాగరరావుతో భేటీ అయ్యాయి. స్టాలిన్‌ వెంట ఆ పార్టీ సీనియర్‌ నేతలైన దురైమురుగన్‌, పీకే శేఖర్‌, పొన్ముడి, జె.అన్బళగన్‌, ఏవీ వేలు, ఎం.సుబ్రమణ్యం, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత కేఆర్‌ రామస్వామి, ఐయూఎంఎల్‌ ఎమ్మెల్యే అబూబ్‌కర్‌ వున్నారు. వారంతా సంతకాలు చేసిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. మెజారిటీ కోల్పోయిన ఈపీఎస్‌ ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలని, ప్రజాస్వా మ్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఏ పక్షం బలమెంతో కూడా గణాం కాలతో సహా గవర్నర్‌కు వివరించారు. మొత్తం 234 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో జయ మరణించడంతో ఆ సంఖ్య 233కు పడిపోయింది. ఇందులో స్పీకర్‌ ధనపాలన్‌ను కూడా కలుపుకుంటే అన్నాడీఎంకే సంఖ్యాబలం 135. అయితే ఇందులో 22 మంది ఎమ్మెల్యేలు ఈపీఎస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఇప్పటికే గవర్నర్‌కు వేర్వేరుగా లేఖలు అందజేశారు.  అయితే ఇందులో ఎమ్మెల్యే జక్కయ్యన్‌ తిరిగి ఈపీఎస్‌ గూటికి చేరుకోవడంతో ఆయనకు వ్యతిరేకంగా వున్న దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేల సంఖ్య 21గా మిగిలింది. అంటే మొత్తం ఈపీఎస్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య కేవలం 114 మాత్రమే. కాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్‌కు 8 మంది, ఐయూఎంఎల్‌కు ఒకరు వున్నారు. ప్రతిపక్ష సంఖ్యాబలం 98. దినకరన్‌ వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటే ఈపీఎస్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య 119గా పెరిగింది. సంఖ్యాపరంగా ఈ లెక్కలు చూసుకుంటే ఈపీఎస్‌ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లేనని స్టాలిన్‌ గణాంకాలతో సహా గవర్నర్‌కు వివరించారు. వ్యూహం మారుతోందా?ప్రజల్లో బలం పెంపొందించుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, దొడ్డిదారిన అధికారం చేపట్టే ప్రసక్తే లేదని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన స్టాలిన్‌.. వ్యూహం మార్చుకుంటున్నట్టు వుందని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎందుకంటే ఆయన గవర్నర్‌ను కలిసిన అనంతరం తొలిసారిగా దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలతో కలుపుకుని ప్రతిపక్ష బలం గురించి ప్రస్తావించారు. నిజానికి గవర్నర్‌ బలనిరూపణకు ఆదేశిస్తే.. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం ఈపీఎస్‌ ప్రభుత్వం మనగలగడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే ఈలోగా ఏవేని సమీకరణాలు జరుగకుండాపోవని, ఈ లెక్కలు మారే అవకాశముందని ఈపీఎస్‌ వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  కానీ ఒకవేళ ఈపీఎస్‌ ప్రభుత్వం కుప్పకూలితే స్టాలిన్‌ ఏం చేస్తారన్నదానిపైనే అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అధికారం చేపట్టాలనుకుంటే దినకరన్‌ వర్గంతో కలిసి పనిచేయడం, లేదా అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలను దరి చేర్చుకోవడమే ఆయన ముందున్న మార్గాలు. అందువల్ల ఆయన గతానికి భిన్నంగా వ్యూహం మార్చినట్టుగా కనిపిస్తోందని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయన ఆ సాహసం చేస్తారా, లేక ఈపీఎస్‌ ప్రభుత్వం దానికదే కుప్పకూలే వరకూ ఎదురు చూస్తారా అన్నదానిపై డీఎంకే వర్గాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.
nation
13,508
24-03-2017 16:04:30
అయోధ్యకు 27న వెళ్తున్న యోగి?
లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనే విషయంలోనూ చురుకుగా పావులు కదపనున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంపై కోర్టు వెలుపల చర్చించి ఏకాభిప్రాయ సాధనతో సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా సూచించిన నేపథ్యంలో టెంపుల్ టౌన్ అయోధ్యలో యోగి పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది. యోగి పర్యటనను అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్టు అత్యున్నత వర్గాల సమాచారం. ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం, ఫైజాబాద్ నగర్ పాలిక సంయుక్తంగా యోగి పర్యటించే ప్రాంతాలను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ ప్రకారం యోగి ఆదిత్యనాథ్ నాలుగు ప్రాంతాల్లో పర్యటించి డజనుకు పైగా సాధుసంతులను కలుసుకుంటారు. రామజన్మభూమి ప్రాంతాన్ని సందర్శించే అవకాశాలున్నాయి. హనుమాన్ గర్హి, కనక్ భవన్‌లోని దేవుళ్ల ఆశీస్సులు తీసుకుని, తన పాత మిత్రులలో ఒకరైన హరిధామ్ పీఠానికి చెందిన జగద్గురు రామ్‌దినేషాచార్యను కలుసుకుంటారు. రామ జన్మభూమి న్యాస్‌‌కు చెందిన రామ్‌చరణ్ దాస్ పరమహంస వారసుడు శ్రీ సురేష్ దాస్‌ను, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి, నృత్య గోపాల్ దాస్‌ను కూడా యోగి ఆదిత్యనాథ్ కలుసుకుంటారని తెలుస్తోంది.
nation
5,608
22-12-2017 21:02:56
యాడ్స్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటోన్న సామ్..!
సమంత కొత్త స్ట్రాటజీస్ అప్లై చేస్తోంది. పెళ్లయ్యాక సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ.. హీరోయిన్లకు గురువుగా మారుతోంది. ఇంతకీ సామ్ వెళ్తోన్న ఆ కొత్త రూట్ ఏంటి?  సమంత అంత లక్కీ హీరోయిన్ ఎవరూ ఉండరని టాలీవుడ్‌లో చాలామంది చెబుతుంటారు. షార్ట్ టైంలోనే స్టార్ హీరోయిన్ కావడం, అక్కినేని వారి కోడలుగా టాలీవుడ్ బిగ్ ఫ్యామిలీ మెంబర్ కావడం సామ్ అదృష్టం అని స్టేట్మెంట్స్ కూడా ఇస్తుంటారు. అయితే ఈ ఫేమ్ అంతా లక్ కాదని, సమంత టాలెంట్ తోనే వచ్చిందని ప్రూవ్ చేస్తున్నాయి కొన్ని డీల్స్. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు, ఆ క్రేజ్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంది. కమర్షియల్ యాడ్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌తో పాటు తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. ఇప్పుడు పెళ్లయ్యాక కూడా ఈ లెక్కలతోనే క్రేజీ డీల్ సెట్ చేసుకుంది సమంత.  సమంత పెళ్లయ్యాక కూడా సినిమాలు కంటిన్యూ చేస్తూ తెలుగులో 'రంగస్థలం 1985', 'మహానటి' సినిమాలు చేస్తోంది. అలాగే తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఆ కాల్షీట్స్ లో ఇప్పుడు ఓ తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ప్రచార బాధ్యతలను చేర్చింది సామ్. ఇంతకుముందు తమన్న బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసిన ఛానెల్ కు ఇప్పుడు సమంత ప్రచారం చెయ్యబోతోంది. ఈ ప్రమోషన్ డీల్ కోటిన్నర వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ హీరోయిన్, మేరీడ్ అనే ట్యాగ్‌తో ఆఫర్స్ తగ్గుతోన్న టైంలో కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటోన్న సమంత, కమర్షియల్ లెక్కల్లో చాలా మంది హీరోయిన్స్‌కు గురువు అనే చెప్పాలి.
entertainment
2,795
27-12-2017 00:18:51
ఐపిఒకు ఇరెడా
సెబి వద్ద డిఆర్‌హెచ్‌పి దాఖలు న్యూఢిల్లీ: ఇండియన్‌ రెన్యూ వబుల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఇడిఎ) పబ్లి క్‌ ఆఫరింగ్‌ (ఐపిఒ)కు వచ్చే ప్రయత్నాల్లో ఉంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబి వద్ద సంస్థ డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్ట్‌స (డిఆర్‌హెచ్‌పి)ను దాఖలు చేసింది. దేశంలో పర్యావరణహిత ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తుండటం గమనార్హం. సెబికి సమర్పించిన డిఆర్‌హెచ్‌పి ప్రకారం.. ఐపిఒ ద్వారా కంపెనీ 13.90 కోట్ల షేర్లను విక్రయించనుంది. అందులో 6.95 లక్షల షేర్లను అర్హులైన ఉద్యోగులకు కేటాయించనుంది. ఐపిఒ ద్వారా సేకరించిన నిధులను భవిష్యత్‌ అవసరాల కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నది. ప్రభుత్వ రంగ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) అయిన ఐఆర్‌ఇడిఎను మార్చి 1987లో ప్రారంభించారు.
business
18,665
19-08-2017 14:12:14
ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు స్లీపర్ సెల్స్ రెడీ?
చెన్నై : అన్నాడీఎంకేలోని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనంపై చర్చలు జరుపుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కూలిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నాయి. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీ టీ వీ దినకరన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురవుతుందోనని భయపడుతున్నాయి. అందుకే పన్నీర్ సెల్వం వర్గంలోని నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి స్పష్టత కావాలని కోరుతున్నారని సమాచారం. టీ టీ వీ దినకరన్ శుక్రవారం శశికళను జైలులో కలిశారు. ఆ తర్వాత మాట్లాడుతూ తనకు చాలామంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని, వారు ప్రస్తుతం స్లీపర్ సెల్స్‌గా ఉన్నారని, అవసరమైనపుడు వారిని చైతన్యపరుస్తానని చెప్పారు. తన వ్యూహాన్ని ఇప్పుడే బయటపెట్టేది లేదన్నారు. ఇటీవల మేలూరులో ఆయన ఓ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభలో 20 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని కూలదోయాలంటే ఆ బలం సరిపోతుంది. దినకరన్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు తమ స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారని, తాము పార్టీ కేడర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నదంతా (విలీనం కోసం చర్చలు) కేడర్ ఆకాంక్షలకు విరుద్ధమని తెలిపారు.
nation
7,804
05-10-2017 10:59:02
రకుల్ తీసుకున్న ఈ సెల్ఫీ ఎవరితోనో తెలుసా?
ఓ చిన్న సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ అయి.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఈమె కెరీర్‌లో చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ బాట పట్టాయి. అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇటీవలే తన రెమ్యునరేషన్‌ని కూడా భారీగా పెంచేందనే వార్తలు వెలుగు చూశాయి. ఆన్ స్క్రీన్ విషయాలన్నీ దాదాపు మనకు తెలిసినవే. ఆమె ఆఫ్ స్క్రీన్.. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారో తెలియదు కదా. ఇటీవల రకుల్ తన అన్నయ్యతో ఉన్న పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చాలా చిలిపిగా తన అన్నతో సెల్ఫీ తీసుకుంది రకుల్. "హిలేరియస్ పర్సన్ అయిన అన్నయ్యతో ఇంట్లో గడపడం.. చాలా బాగుంది." అంటూ కామెంట్ పెట్టింది. ఈ పిక్ దాదాపు లక్షన్నర మంది అభిమానాన్ని సంపాదించింది.
entertainment
6,541
18-10-2017 22:31:34
నాగ్‌, నాని, అశ్వినీదత్‌ ట్రిపుల్‌ ధమాకా
యువ కథానాయకులతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తోన్న అక్కినేని నాగార్జున.. తాజాగా నానితో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో భారీ స్థాయిలో పలు మల్టీస్టారర్‌ చిత్రాలు నిర్మించి రికార్డుల్లోకెక్కిన వైజయంతీ మూవీస్‌ అధినేత చలసాని అశ్వినీదత్‌ ఈ కాంబినేషన్‌తో ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా వెలుగులోకి వచ్చిన శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీరామ్‌ చెప్పిన కథకు నాగార్జున, నాని.. ఇద్దరూ ఫిదా అయ్యారు. వెంటనే కలిసి నటించేందుకు సరేనన్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుందని అశ్వినీదత్‌ తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ రిచెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందనీ, వైజయంతీ మూవీస్‌ ప్రస్థానంలో ఈ సినిమా మరో కలికితురాయి అవుతుందనీ ఆయన చెప్పారు. ‘రాజుగారి గది 2’ తర్వాత రామ్‌గోపాల్‌వర్మతో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపిన నాగార్జున.. దానితో పాటే ఈ సినిమానీ చేయనున్నారు. మరోవైపు నాని.. ‘ఎంసీఏ’ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
entertainment
4,842
10-08-2017 17:25:12
‘సంఘమిత్ర’ నుంచి తప్పుకున్న మరో ముద్దుగుమ్మ
చాలాకాలం నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఆ సినిమాకు హీరోయిన్ కష్టాలు తొలగిపోవడం లేదట. తాజాగా సినిమాలో నటిస్తుందని అనుకున్న మరో ముద్దుగుమ్మ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది! కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న శ్రుతి హాసన్ కొద్ది రోజుల క్రితం హఠాత్తుగా 'సంఘమిత్ర' అనే సినిమా నుంచి డ్రాప్ అయ్యింది. సినిమా కోసం కత్తి విన్యాసాలు కూడా నేర్చుకున్న శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ చాలామందికి అర్థంకావడం లేదు. కమల్ కూతురు తప్పుకున్న తరువాత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే భామ కోసం అన్వేషణ మొదలుపెట్టిన దర్శకనిర్మాతలు... ఇప్పటివరకు హీరోయిన్ ను ఫైనల్ చేయలేకపోయారు. అయితే 'సంఘమిత్ర' సినిమా కోసం భారీగా డేట్స్ అవసరం ఉండటంతో దర్శకుడు సుందర్ సి హన్సికను ఎంపిక చేసుకున్నాడని చాలా రోజుల క్రితమే ప్రచారం మొదలైంది. సుందర్ సి తెరకెక్కించిన పలు సినిమాల్లో హన్సిక నటించడంతో 'సంఘమిత్ర'గా నటించబోయేది ఆమే అని తమిళ సినీ వర్గాలు ఫిక్స్ అయ్యాయి. హన్సికతో చర్చలు పూర్తయిన తరువాత దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని చర్చించుకోవడం మొదలుపెట్టాయి. 'సంఘమిత్ర' కోసం శ్రుతి హాసన్ తరహాలోనే హన్సిక కూడా ఫోటో షూట్‌లో పాల్గొందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఈ ప్రాజెక్టు నుంచి హన్సిక కూడా తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చిందని కొందరు సినీజనం చర్చించుకుంటున్నారట. సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ వైరల్‌గా మారడంతో అసలు సంఘమిత్రగా నటించేందుకు హన్సిక కమిటైందా లేదా అనే దానిపై చిత్ర యూనిట్ వర్గాలే ఓ క్లారిటీ ఇవ్వాలని కోలీవుడ్ వర్గాలు కోరుతున్నాయి. మొత్తానికి 'బాహుబలి'తో పోటీ అని ప్రచారం జరుపుకున్న 'సంఘమిత్ర'ను హీరోయిన్ కష్టాలు ఇంకా వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది.
entertainment
4,877
16-03-2017 10:53:48
‘కాటమరాయుడు’ ఫంక్షన్‌ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
 ఈ ఈవెంట్‌కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తొలి సినిమా ‘అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి’ 1997లో విడుదలైంది. అంటే ఇప్పటికి పవన్‌కల్యాణ్‌ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి రెండు దశాబ్దాలు గడిచింది. ఈ సందర్భంగా ఓ ఫంక్షన్‌ నిర్వహించాలని పవన్‌ను ఫ్యాన్స్‌ కోరారట. దాన్ని సున్నితంగా తిరస్కరించిన పవన్‌.. ‘కాటమరాయుడు’ ఈవెంట్‌లోనే దాన్నీ కానిచ్చేయమని సూచించాడట. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారట.
entertainment
15,851
31-03-2017 20:01:40
లొంగిపోయిన.. 33 మంది మావోయిస్టులు
రాయ్‌పూర్: మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోయారు. 33 మంది నక్సల్స్ శుక్రవారం సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఐజీ ఎదుట వీరు లొంగిపోయారు. తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. 33 మంది మావోయిస్టుల్లో 29 మంది మగవారు కాగా నలుగురు మహిళలు. వీరు జీవన స్రవంతిలోకి రావడాన్ని బస్తర్ ఐజీ స్వాగతించారు. ఉపాధి కోసం ప్రభుత్వ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
nation
5,264
10-11-2017 15:41:34
అచ్చం తాతలాగే.. రజినీ మనవడు
అచ్చం తాతలాగే.. మనవడు అంటూ తన తనయుడిని చూసి సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య మురిసిపోతోంది. రజినీ మనవడి పేరు వేద్. ఈ చిన్నారి ఆటోలన్నీ చుట్టూ పెట్టుకుని ఆడుకుంటుండగా ఫోటో తీసిన సౌందర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రజినీ కాంత్ నటించిన భాషా సినిమా గుర్తుందా? అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాలో నేను ఆటోవాణ్ని.. ఆటోవాణ్ని.. అన్నగారి రూటువాణ్ని.. అంటూ ఓ సాంగ్ ఉంటుంది. అలాగే వేద్ కూడా ఆటోలన్నీ ముందర వేసుకుని ఆడుకుంటుంటే సౌందర్యకు ఆ పాట గుర్తొచ్చింది. వెంటన్ ఆ పిక్.. దానికి "నాన్ ఆటో కారన్.. ఆటో కారన్.. జస్ట్ లైక్ తాత.." అంటూ ట్వీట్ చేశారు. సౌందర్య గ్రాఫిక్ డిజైనర్‌గా, డైరెక్టర్‌గా, ఓచర్ పిక్చర్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా రాణిస్తున్నారు.
entertainment
18,079
19-01-2017 20:03:35
బ్రిటన్‌లో దారుణం.. సూట్‌కేస్‌లో భారతీయ మహిళ మృతదేహం
లండన్: బ్రిటన్‌లో ఓ దారుణం వెలుగుచూసింది. భారత్‌కు చెందిన ఓ మహిళ మృతదేహాన్ని సూట్‌కేస్‌లో గుర్తించారు. 46 ఏళ్ళ కిరణ్ ఇంగ్లండ్‌లోని ఈస్ట్ మిడ్‌ల్యాండ్ ప్రాంతంలోని ఓ ప్రముఖ రిటైల్ సంస్థ కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారు. విధుల తర్వాత నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు.  అయితే ఓ వ్యక్తి వాకింగ్‌కి వెళ్తుండగా ఓ సూట్‌కేస్ కనిపించింది. తెరిచి చూడగా అందులో కిరణ్ మృతదేహం ఉంది. పోలీసులకు సమాచారం అందించడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు. కిరణ్ మాజీ భర్త 50 ఏళ్ళ అశ్విన్‌పై అనుమానంతో అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసుపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
nation
14,337
09-05-2017 08:28:34
మెట్రో రైలు నిర్ణయం... ప్రయాణికుల జేబుకు భారం...
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో రైలు ప్రయాణం బుధవారం నుంచి మరింత ప్రియం కానుంది. టిక్కెట్ ధరలను పెంచాలని ఢిల్లీ మెట్రో రైలు (డీఎంఆర్‌సీ) యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం కనీస ఛార్జి రూ.8 కాగా దీనిని రెండు రూపాయలు పెంచి రూ.10గా చేసింది. ప్రస్తుతం గరిష్ఠ టిక్కెట్ ధర రూ.50 కాగా పది రూపాయలు పెంచి రూ.60 చేసింది. పెంచిన ఛార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి. వినూత్నంగా మరో పిడుగులాంటి వార్తను కూడా డీఎంఆర్‌సీ చెప్పింది. అక్టోబరు ఒకటి నుంచి మరోసారి టిక్కెట్ ఛార్జీలను పెంచుతామని తెలిపింది. టిక్కెట్ ధరల నిర్ణాయక కమిటీ గత ఏడాది సెప్టెంబరులో ఇచ్చిన నివేదకలో గత ఏడాది అక్టోబరు నుంచి టిక్కెట్ ఛార్జీలను పెంచాలని సలహా ఇచ్చింది. రెండో విడతలో 2017 అక్టోబరు నుంచి పెంచితే ప్రయాణికులు భారంగా భావించరని తెలిపింది. కానీ డీఎంఆర్‌సీ బోర్డు ఈ ప్రతిపాదనలను ఆమోదించేందుకు చాలా సమయం తీసుకుంది. ప్రయాణికులకు ఓ శుభవార్త కూడా ఉంది. ఆదివారాలు, జాతీయ సెలవు దినాల్లో మెట్రో రైళ్ళలో ప్రయాణించేవారికి డిస్కౌంట్లు ఇవ్వాలని డీఎంఆర్‌సీ నిర్ణయించింది. రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో (ఆఫ్ పీక్ అవర్స్ ) ప్రయాణించేవారికి స్మార్ట్ కార్డ్ యూజర్లు పొందే రిబేటుపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను ఇవ్వాలన్న సిఫారసును కూడా ఆమోదించింది. ఆఫ్ పీక్ అవర్స్ అంటే ఉదయం 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి సర్వీసులు ముగిసే వరకు.
nation
9,463
11-11-2017 13:02:50
బాహుబలి ప్రభాస్‌కి.. 15 ఏళ్లు..
ప్రభాస్‌కి 15ఏళ్లు ఏంటి అని ఆశ్చర్యపోకండి. ప్రభాస్ తెరంగేట్రం చేసి నేటికి 15సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్‌కు బాహుబలి సినిమా నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు. "15సంవత్సరాల కింగ్ ప్రభాస్‌కి.. శుభాకాంక్షలు. నీ కెరీర్‌లో సాధించబోయే మరెన్నో అచీవ్‌మెంట్స్‌ని మేము చూడాలనుకుంటున్నాం. నీ రాబోయే ప్రాజెక్టులకు మా బెస్ట్ విషెస్." అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో సినిరంగానికి పరిచయమయ్యారు. ఛత్రపతి సినిమాతో స్టార్ హీరోల సరసన స్థానం సంపాదించారు. బాహుబలితో ఇంటర్నేషనల్ లెవల్‌కి ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ ఇంకెన్నో విజయాలు సాధించాలని మనం కూడా ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ ప్రభాస్.
entertainment
9,177
03-03-2017 11:47:54
అనుష్క ‘సైజ్‌ జీరో' చేసింది ఆ నమ్మకంతోనేనా..?
యోగాతో ఎంత స్లిమ్‌గా అన్నా తయారు కావచ్చు అన్నది టాలీవుడ్‌ స్వీటీ నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎవరూ చేయని సాహసం చేసి ‘సైజ్‌ జీరో’ కోసం బోండాంలాగా మారిపోయింది. ఆ సినిమా వచ్చింది, వెళ్లింది. అనుష్క సైజులో మాత్రం మార్పు లేదు. రవ్వంత బరువు తగ్గకుండా బొద్దుగా ఉండిపోయింది. యోగాతో బరువు తగ్గొచ్చులే అని అతి బరువును లైట్‌ తీసుకుంది అనుష్క. ఇప్పుడు ఆ అతినమ్మకమే ఆమె కెరీర్‌ను ముంచేలా ఉంది అంటున్నారు టాలీవుడ్‌ జనాలు మునుపటి అనుష్కను మరిచిపోలేకా, ఇప్పటి అనుష్కను తెరమీద చూడలేక సగటు ప్రేక్షకులే కాదు ఆమె అభిమానులు కూడా ఇబ్బంది పడుతున్నారట! దాంతో గతంలో ఆమెతో సినిమా చేయాలని ముచ్చటపడ్డవారు ఇప్పుడు ఆమె వైపు చూడడానికే భయపడుతున్నారట! ప్రస్తుతం అనుష్క చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అది పూర్తయితే ఖాళీనే! ఎటూ పెళ్లి వయసు కూడా దాటబోతోంది. కనుక పెళ్లి చేసుకుని ఓ ఇంటిదయితే బాగుంటుందని ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులూ కోరుకుంటున్నారట.
entertainment
16,336
25-03-2017 16:51:31
కేజ్రీవాల్‌పై విచారణకు సన్నాహాలు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విచారణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కేజ్రీవాల్‌తో పాటు మరికొందరు ఆప్ నేతలపై పరువు నష్టం నోటీసును ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్ దాస్ శనివారం నమోదు చేశారు. కేజ్రీవాల్, తదితర నిందితులు తాము తప్పు చేయలేదని వాదించి, విచారణ నిర్వహించాలని కోరారు. మే 20 నుంచి కేసు విచారణ ప్రారంభం కాబోతోంది. 2015లో జైట్లీ ఈ కేసును దాఖలు చేశారు. ఆప్ నేతలు కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా, దీపక్ బాజ్‌పేయీ తనకు పరువు నష్టం కలిగించేవిధంగా ప్రకటనలు చేసినట్లు జైట్లీ ఆరోపించారు. నష్ట పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో జైట్లీ అక్రమాలకు పాల్పడినట్లు నిందితులు ఆరోపించారు.
nation
1,895
17-04-2017 23:40:27
థర్డ్‌ పార్టీ బీమా రేట్లు తగ్గించిన ఐఆర్‌డిఎఐ
న్యూఢిల్లీ : థర్డ్‌ పార్టీ బీమా రేట్లను తగ్గిస్తున్నట్లు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఎఐ ప్రకటించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు వారాల క్రితం ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రక్కులకు సంబంధించి జారీ చేసిన థర్డ్‌ పార్టీ బీమా రేట్లను సవరిస్తున్నట్లు తెలిపింది. మోటార్‌ థర్డ్‌ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్‌ కవర్‌ కోసం సవరించిన ప్రీమియం రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఐఆర్‌డిఎఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రీమియం రేట్లు సవరించినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఎక్కువగా ఉండటం గమనార్హం. మిడ్‌ సెగ్మెంట్‌ కార్ల (1000-1500 సిసి)కు సంబంధించి ప్రీమియం మొత్తాన్ని 3,132 రూపాయల నుంచి రూ.2,863కు తగ్గించినట్లు ఐఆర్‌డిఎఐ తెలిపింది. అలాగే ప్రీమియం కార్ల (1500 సిసి పైగా ఇంజన్‌ సామర్థ్యం) బీమా ప్రీమియంను రూ.8,630 నుంచి రూ.7,890కు తగ్గించిం ది. ఇంజన్‌ సామర్థ్యం 1000సిసి కన్నా తక్కువ కార్లకు సంబంధించిన బీమా ప్రీమియంలో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొంది.
business
18,828
26-01-2017 03:37:16
యునానీ నిపుణుడు.. అబ్దుల్‌ వాహీద్‌
న్యూఢిల్లీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): బొల్లి వ్యాధి నియంత్రణకు ఫార్ములాలను రూపొందించిన హైదరాబాదీ డాక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ వాహీద్‌ యునానీ వైద్య నిపుణుడు. ఆయన ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు. సీసీఆర్‌ఐఎంహెచ ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు. ఓయూ నుంచి యునానీ వైద్యం, శస్త్రచికిత్సలో పట్టభద్రుడైన వాహీద్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లాస్‌ ఏంజిల్స్‌, న్యూఢిల్లీ ఎయిమ్స్‌ తదితర సంస్థల్లో పరిశోధనలు చేశారు.
nation
20,839
03-05-2017 03:32:32
క్వార్టర్స్‌లో పాండురంగయ్య
చెన్నై: ఆర్‌. మురుగేష్‌, చింతామణి స్మారక ఆలిండియా స్నూకర్‌ టోర్నీలో రైల్వే్‌సకు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ఆటగా డు పాండురంగయ్య క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌ గేమ్‌లో పాండురంగయ్య 4-3తో గిరీష్పై నెగ్గాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన కమల్‌ చావ్లా 4-1తో అభిమన్యు గాంధీపై నెగ్గి రౌండ్‌-8కు చేరుకున్నాడు. మరో ప్రీ క్వార్ట ర్స్‌ మ్యాచ్‌లో సదరన్‌ రైల్వే్‌సకు చెందిన దిలీప్‌ కుమార్‌ 4-2తో సిసోడియాపై నెగ్గగా.. వరుణ్‌ కుమార్‌ (చెన్నై) కూడా ఇదే స్కోరుతో అశుతో్‌షపై గెలిచాడు.
sports
8,044
27-09-2017 12:23:57
స్పైడర్‌ చూసిన కత్తి మహేశ్ రివ్యూ
సినీ సమీక్షకుడిగా కత్తి మహేశ్ కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ షో ద్వారా కత్తి మహేశ్ ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు, కత్తి మహేశ్‌కు మధ్య మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో వార్తల్లో నిలిచాడు. పవన్ ఫ్యాన్స్‌తో మాట్లాడిన సందర్భంలో మహేశ్ బాబు తెలుగులో టాప్ హీరో అని కత్తి మహేశ్ కామెంట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అలాంటి కత్తి మహేశ్ స్పైడర్ చూసి రివ్యూ ఎలా ఇచ్చి ఉంటాడనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రివ్యూ యథాతథంగా.... స్పైడర్ అనేది ఫోన్ డేటా ఆధారంగా ప్రజలను రక్షించే ఒక సూపర్ హీరో సినిమా. విలన్ ప్రజల ఏడుపులు విని ఆనందించే ఒక సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విలన్‌ను పట్టుకుని, జరుగుతున్న నేరాలను హీరో ఎలా అరికట్టాడనేదే సినిమా. వినడానికి చాలా కొత్తగా అనిపించిన ఈ ఆలోచనను కథగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సినిమా ఇది. ఆకట్టుకోని గ్రాఫిక్స్, పాత్రల పరిధిని ఇరికించినట్టుగా రాసుకోవడం సినిమాకు మైనస్ అయ్యాయి. మహేశ్ బాబు కనబర్చిన నటన, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను సీటులో నుంచి లేచి వెళ్లిపోకుండా కూర్చోబెడతాయి. హారిశ్ జైరాజ్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈ సినిమాలో ప్రాధాన్యం లేదు. ప్రియదర్శి పులికొండ, ఆర్జే బాలాజీని సరిగా వినియోగించుకోలేదు. మొత్తం మీద ఏఆర్ మురుగదాస్ ఒక నిరుత్సాహకరమైన సినిమాను అందించాడనే చెప్పాలి.    స్పైడర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు   ‘జై లవ కుశ’ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?
entertainment
18,525
06-07-2017 03:18:40
టార్గెట్‌.. రాజకీయ విరాళాలు!
మోదీ సర్కారు తదుపరి అడుగు అటేవిరాళాల వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం: జైట్లీబాంబు పేల్చిన కేంద్ర ఆర్థిక మంత్రిముంబై, జూలై 5: పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు.. ఈ రెండింటి తర్వాత మోదీ సర్కారు మరో కీలక అంశం మీద దృష్టిపెట్టింది. తమతో సహా మొత్తం దేశంలో రాజకీయ పార్టీలన్నింటినీ ప్రభావితంచేసే నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేయడం తమకు ఇప్పుడు అత్యధిక ప్రాధాన్య అంశమ ని చెప్పి.. ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మరో బాంబు పేల్చారు. జీఎస్టీ అమలు వ్యవహారం మొత్తం పూర్తయిన తర్వాత ప్రభుత్వం చేపట్టే కొన్ని కీలకమైన చర్యల వల్ల మొత్తం రాజకీయ విరాళాల వ్యవస్థ ప్రక్షాళన అవుతుందని తెలిపారు.  70 ఏళ్ల క్రితం ఉన్న ఈ విరాళాల వ్యవస్థ వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశానికి ఎలాంటి పేరు రావట్లేదని, అందువల్ల ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీ చెబుతున్నారని, దీనికి ప్రజామద్దతు కూడా బలంగా ఉందని జైట్లీ చెప్పారు. రాజకీయ పార్టీలకు విరాళాలను నగదు కాకుండా ఎలక్టొరల్‌ బాండ్ల రూపంలో ఇవ్వాలని బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించారు. నియమ నిబంధనల రూపకల్పనలో ప్రభుత్వం మునిగి తేలుతోంది. అయితే బాండ్లతో రాజకీయ విరాళాలలో పారదర్శకత తేవాలన్న ప్రయత్నాలపై ప్రతికూల ప్రభా వం పడుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీమ్‌ జైదీ అంటున్నారు.
nation
16,904
25-12-2017 02:46:34
డీఎంకే, దినకరన్‌ కుట్రే కారణం:ఈపీఎస్‌, ఓపీఎస్‌
ఆర్‌కే నగర్‌ ఎన్నికలో డీఎంకే, దినకరన్‌ కలిసి కుట్రపన్నడం వల్లే అన్నాడీఎంకే ఓటమి చవి చూడాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ఆరోపించారు. ఈ మేరకు ఇరువురూ ఆదివారం సాయంత్రం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో అఽన్నాడీఎంకే ఓడిపోలేదని, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేనే చిత్తుగా ఓడిపోయిందని అన్నారు. దినకరన్‌ గెలుపును రాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన తీర్పుగా పరిగణించలేమన్నారు. ఓటమిపై సమీక్షించేందుకు అన్నాడీఎంకే నేతలు సోమవారం ఉదయం సమావేశం కానున్నారు.
nation
9,628
18-07-2017 18:28:40
చెక్కుచెదరని ఆ హీరోయిన్ స్థానం
యావత్ దక్షిణాదిని తన అందాల అభినయంతో కట్టిపడేసింది అభినేత్రి సౌందర్య... జూలై 18న సౌందర్య జయంతి. సౌందర్య అభినయాన్ని చూసి ఆమెను మరో సావిత్రి అని అభివర్ణించిన వారు ఎందరో... తెలుగు చిత్రాల ద్వారానే స్టార్‌డమ్‌ను చవిచూసింది ఈ కన్నడ తార... తెలుగునాట టాప్ స్టార్స్ అందరితోనూ నటించి మురిపించారు సౌందర్య... అందం, అభినయం కలబోసుకున్న సౌందర్య కోసమే జనం థియేటర్ల ముందు బారులు తీరిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో రాజేంద్రప్రసాద్ సరసన నటించిన నాయికలు అగ్రపథాన్ని చేరుకుంటారనే సెంటిమెంట్ ఉంది. సౌందర్యకు కూడా ఆ సెంటిమెంట్ కలసి వచ్చింది. ఆరంభంలో రాజేంద్రప్రసాద్‌తో సౌందర్య నటించిన చిత్రాలు అనూహ్య విజయం సాధించాయి. ఆ తరువాతే సౌందర్య జైత్రయాత్ర మొదలయింది. ఇక సౌందర్యకు పలు ఘనవిజయాలను అందించిన వెంకటేశ్ ఆమెకు హిట్ పెయిర్‌గా నిలిచారు.టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాజ్యమేలిన సౌందర్య అభినయం ఆమె మాతృభాషలోనూ అలరించింది. తమిళనాట కూడా తధిగిణతోమ్ అనిపించింది. అయితే సౌందర్యకు తెలుగు చిత్రసీమనే అత్యధిక విజయాలను అందించింది. ఏ భాషలో నటించినా, సౌందర్య తమ నటిగానే భావించి ఆదరించారు తెలుగువారు. ఈ నాటికీ సౌందర్య స్థానం చెక్కుచెదరకుండా పదిలంగానే నిలచి ఉంది.
entertainment
15,635
15-04-2017 17:24:51
ఈవీఎంలపై ఈసీ సమాధానం చెప్పాలి : అఖిలేశ్
లక్నో : ఈవీఎం ట్యాంపరింగ్ కేసులపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు.. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలన్నారు. దేశ భవిష్యత్తు రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాబోయే కాలంలో ఏర్పడే కూటమిలో తమ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తనను హిందువుగా బీజేపీ గుర్తించే స్థితిలో లేదన్నారు. తాను గుడికి వెళ్ళినపుడల్లా ఓ ఫొటోను ట్వీట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
nation
20,591
23-04-2017 02:45:00
భారత బధిరుల క్రికెట్‌ జట్టుకు రాష్ట్రపతి అభినందనలు
హైదరాబాద్‌: తెలంగాణ క్రికెట్‌ ఫెడరషన్‌ ఆఫ్‌ డెఫ్‌ (టిఎ్‌ససిఎ్‌ఫడి) ఆధ్వర్యంలో గత నెల 14నుంచి 19 వరకు ఎల్‌బి స్టేడియంలో జరిగిన డెఫ్‌ ఆసియా కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో ఘనంగా సన్మానించారు. డెఫ్‌ ఆసియా కప్‌ సిరీస్‌కు భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఫైనల్లో శ్రీలంకపై భారత ఘనవిజయం సాధించింది. హైదరాబాద్‌ ఆటగాడు సయ్యద్‌ కరీం అద్భుతంగా రాణించి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ సొంతం చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో ఆసియా క్‌పకు అతిధ్యం ఇచ్చిన తెలంగాణ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ డెఫ్‌తోపాటు డెఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆల్‌ ఇండియా కమిటీ సభ్యులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఢిల్లీలోని తన నివాసంలోకి ఆహ్వానించి ఘ నంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుంచి డెఫ్‌ క్రికెటర్‌ సయ్యద్‌తోపాటు తెలంగాణ క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ డెఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్‌, కార్యదర్శి చిరంజీవి, భారతి పాల్గొన్నారు.
sports
12,527
11-12-2017 03:54:27
ఎప్పుడు..ఎక్కడ..ఎంత?
‘ఆర్‌కే నగర్‌’లో సర్వత్రా ఇదే చర్చఓటుకు నోటుపై భారీగా అంచనాలు‘ఏప్రిల్‌’ అనుభవాలతో ఓటర్లలో ఆశలుచెన్నై, డిసెంబరు 10: ‘ఎప్పుడు..ఎక్కడ..ఎంత..?’ ఉప ఎన్నిక జరుగనున్న ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ఏ ఓటరును కదిలించినా ఇవే ప్రశ్నలు వస్తున్నాయి. ఏప్రిల్‌ అనుభవాల దృష్ట్యా ఓటర్లు అభ్యర్థుల నుంచి తాయిలాలు ఆశిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. తొలుత ఏప్రిల్‌లో ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రకటించినప్పుడు ‘సామి కుంబితాచా?(మీరు దేవుని ప్రార్థించారా?)’ తదితర కోడ్‌లను ఏజెంట్లు ఉపయోగించడం పతాకస్థాయికి చేరిన ప్రలోభాలను తేటతెల్లం చేశాయి. మీకు నగదు అందిందా? అనేది దీని అర్థం. అప్పుడు తారస్థాయికి చేరిన ప్రలోభాలను ఇప్పటికీ ఓటర్లు మర్చిపోలేకపోతున్నారు. కనీసం రెండు గులాబీ రంగు నోట్లతో అభ్యర్థులు తమ తలుపు తడతారని ఓటర్లు చాలా నమ్మకంతోనే ఉన్నారు. ఓటు ఉన్నా ఓటరు గుర్తింపు కార్డు లేనివారు వాటిని పొందే పనిలో బిజీగా ఉన్నారు. ‘ఇలాంటి అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకొంటారు’ అని శాస్ర్తినగర్‌లోని ఓ షాపు నిర్వాహకుడు కన్నన్‌ అన్నారు. ‘ఇది భారీ అంచనాల రాజకీయ యుద్ధం. అయితే ఈ అభ్యర్థులెవరికీ నియోజకవర్గంపైనా, ప్రజలపైనా రవ్వంత కూడా శ్రద్ధలేదు’ అని కొరుక్కుపేట్‌లోని మరిముత్తు వీధివాసి అన్బు వ్యాఖ్యానించారు. ‘ఈ నాలుగైదు వేలు తీసుకొని నేను సాధించేదేముంది. మహా అయితే ఒక నెల అద్దెకు సరిపోతాయి’ అని కేశవ వీధిలో నివసించే ఎస్‌.పళనిస్వామి అన్నారు. ప్రభుత్వ తీరు వల్లే ఇదంతా జరుగుతోందని స్వయం ఉపాధి పొందుతున్న రంజిత్‌కుమార్‌ లాంటివారు అంటున్నారు. ‘ఓటేసేందుకు డబ్బు తీసుకోవద్దని ప్రజలకు ఉపన్యాసాలు ఇస్తే మారేదేమీ లేదు. నిజంగా నగదు రహిత ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి అధికారులకు ఉంటే బయటివారిని నియోజకవర్గంలోకి రాకుండా చూడాలి’ అని అన్నారు. ఓటర్లకు తాయిలాలు ఇస్తూ పట్టుబడిన వారిని శిక్షించడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైనందునే ఈ పరిస్థితి దాపురించిందని వీకేసీ అనే సంస్థ ప్రతినిధి డి.రవికుమార్‌ విమర్శిస్తున్నారు. కాగా ‘ఓటర్లను తప్పుపట్టడం దీనికి పరిష్కారం కాదు. మొత్తం ఎన్నికల వ్యవస్థే అలా ఉంది’ అని అన్నారు. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి వి.సురేశ్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
nation
1,890
16-01-2017 23:16:18
ఉదయం మెరుగు
 నిఫ్టీ : 8412.80 (+12.45)  ట్రేడింగ్‌ వ్యూహం...  గమనిక: ఇది పూర్తిగా ఆస్ర్టో టెక్నికల్‌ అం శాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్‌ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.
business
14,363
26-12-2017 01:44:59
మేం చెప్పిన బ్యాంకులోనే ఖాతా తీయాలి
విదేశీ నిధులపై ఎన్జీవోలకు కేంద్రం షరతున్యూఢిల్లీ, డిసెంబరు 25: విదేశాల నుంచి నిధులు పొందాలంటే తాము సూచించిన బ్యాంకుల్లోనే ఖాతా తెరవాలని ఎన్జీవోలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(పీఎ్‌ఫఎంఎ్‌స)తో కలిసిన 32 బ్యాంకుల జాబితాను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌(రెగ్యులేషన్‌)- 2010 ప్రకారం జాతి ప్రయోజనాలకు నష్టం కలగకుండా చూడటంలో భాగంగా విదేశీ నిధులపై నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
nation
19,118
16-07-2017 19:36:43
ఇరాక్‌లో తప్పిపోయిన భారతీయులపై సుష్మ భరోసా
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అపహరించుకుపోయిన 39 మంది భారతీయుల ఆచూకీ విషయంలో ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. అపహరణకు గురైన వారంతా వాయవ్య మోసుల్‌లోని బదుష్ జైళ్లలో బందీలుగా ఉండి ఉండవచ్చని చెప్పారు. ఇరాక్ విదేశాంగ మంత్రి ఇబ్రహిం అల్ జాఫరి ఈనెల 24న ఇండియా వస్తున్నందున ఆయన నుంచి తాజా సమాచారం వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అవపహరణకు గురైన భారతీయుల కుటుంబసభ్యులు ఆదివారంనాడు సుష్మాస్వరాజ్‌ను కలుసుకుని తామ పడుతున్న ఆందోళనను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు. ఐఎస్ఐఎస్, ఇరాక్ దళాల మధ్య పోరుసాగుతున్న నేపథ్యంలో అపహరణకు గురైన భారతీయులను తొలుత ఓ ఆసుపత్రి నిర్మాణ స్థలంలో ఉంచి ఆ తర్వాత ఓ వ్యవసాయ క్షేత్రానికి తరలించారని, అక్కడ నుంచి బదూష్ జైలుకు తరలించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఉందని స్వరాజ్ వారికి తెలిపారు. 'తూర్పు మోసుల్ ప్రాంతం ఐఎస్ఐఎస్ చెర నుంచి విముక్తి పొందింది. ప్రస్తుతం శిథిల భవానాలను శుభ్రం చేసే పనులు జరుగుతున్నాయి. అయితే ఇంకా బాంబులు, పేలుడు పదార్ధాలు ఉండొచ్చనే అనుమానంతో పౌరులను మాత్రం అనుమతించడం లేదు' అని సుష్మ మోసుల్‌లో పరిస్థితిని వివరించారు. వెస్ట్ మోసుల్‌లో ఇంకా పోరాటం సాగుతున్నట్టు చెప్పారు. బదుష్‌లో పోరాటం ముగియగానే మరింత తాజా సమాచారం తమకు అందుతుందని తెలిపారు. వివిధ దేసాల విదేశాంగ కార్యదర్శులకు కూడా అదృశ్యమైన భారతీయుల సమాచారం తెలుసుకోవడంలో సహకరించాల్సిందిగా కూడా తాను కోరినట్టు సుష్మ చెప్పారు.
nation
2,435
06-09-2017 02:31:30
చోదక శక్తుల్లో ఫార్మా
13.5 శాతం వృద్ధితో రెండో స్థానంన్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగానికి చోదక శక్తులుగా నిలుస్తున్న మూడు కీలక రంగాల్లో ఫార్మా ఒకటిగా ఉంది. ఎరువులు, ఫార్మా, రసాయనాలు-పెట్రోరసాయనాల విభాగాలు 13.5 లక్షల కోట్ల రూపాయల ఉమ్మడి టర్నోవర్‌తో ఆర్థిక రంగం ముందుకు సాగేందుకు చోదక శక్తులుగా ఉన్నాయని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ తెలిపారు. మోదీ ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే విభాగంగా రసాయనాలు, ఎరువుల శాఖ ఉన్నదని ఆయన చెప్పారు. ఈ మూడు రంగాల్లో 18.67 శాతం వృద్ధితో ఎరువుల రంగం ముందువరుసలో ఉండగా 13.5 శాతం వృద్ధితో ఫార్మా రంగం రెండో స్థానంలోను. 11-12 శాతం వృద్ధితో రసాయనాలు-పెట్రోరసాయనాల విభాగం మూడో స్థానంలోను నిలిచాయి.  ఈ మూడు రంగాలు 13.5 లక్షల కోట్ల ఉమ్మడి టర్నోవర్‌తో కోట్ల సంఖ్యలో ఉపాధి అకాశాలు కల్పిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ శాఖపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా తమ శాఖను ప్రస్తావించారని రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అనంత్‌కుమార్‌ విలేకరులకు తెలిపారు. తమ ప్రభుత్వం 1100 ఔషధాల ధరలను తగ్గించడంతో పాటు హృద్రోగులకు ఉపయోగించే స్టెంట్లు, కృత్రిమ మోకాలి చిప్పల ధరలకు పగ్గాలు వేసినట్టు చెప్పారు. ఔషధాలు సరసమైన ధరల్లో విక్రయించేందుకు 2400 జన్‌ ఔషధి కేంద్రాలు ప్రారంభించామన్నారు.
business
9,894
23-06-2017 11:11:27
సుకుమార్‌తో, దిల్‌ రాజు గొడవకు కారణమేంటి?
ఎంతో మంది ట్యాలెంటెడ్‌ డైరెక్టర్లను తెలుగు తెరకు పరిచయం చేశారు నిర్మాత దిల్‌ రాజు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ను కూడా ‘ఆర్య’తో డైరెక్టర్‌ను చేసింది దిల్‌ రాజే. అయితే తర్వాత వారిద్దరూ కలిసి పనిచేయలేదు. దానికి కారణం వారిద్దరి మధ్య ఓ సినిమా విషయంలో విభేదాలు తలెత్తడమేనట. ఆ సినిమా రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘జగడం’. ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు దిల్‌ రాజు.‘నేను కథల విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉంటాను. ఏవైనా డౌట్లు ఉంటే వెంటనే అడిగేస్తుంటాను. సుకుమార్‌ రెండో సినిమా ‘జగడం’ను కూడా నేనే నిర్మించాల్సింది. మొదట ఆ సినిమాలో కూడా బన్నీనే హీరోగా అనుకున్నాం. అయితే పూర్తి కథ విన్నాక నాకు కొంచెం భయం వేసింది. ఇది వర్కవుట్‌ కాదని అనిపించింది. బన్నీకి కూడా ఆ స్ర్కిప్టు నచ్చలేదు. స్ర్కిప్టు మార్చమని సుక్కూకు చెప్పా. కానీ, సుకుమార్‌ రాజీ పడలేదు. రాత్రికి రాత్రే వేరే నిర్మాతకు కథ చెప్పి ఒప్పించి రామ్‌తో ‘జగడం’ మొదలెట్టేశాడు. అయినా సుకుమార్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఆ సినిమా ఓపెనింగ్‌కు నేను, బన్నీ హాజరయ్యామ’ని చెప్పారు దిల్‌ రాజు. కళ్లను చూసి హీరో పేరు చెప్పండి.. నగదు బహుమతులు గెలుచుకోండి మానవుని శుక్రకణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి?
entertainment
12,450
10-06-2017 10:08:55
బయల్దేరుతూనే నిలువునా కూలిన హెలికాప్టర్.. రెక్కలే మృత్యువుగా మారి...
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్‌లో ఓ ప్రయివేటు హెలికాప్టర్ బయల్దేరుతూనే నిలువునా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ హెలికాప్టర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం బద్రినాథ్ నుంచి హరిద్వార్‌కు తీసుకుని హెలికాప్టర్ బయల్దేరింది. అయితే టేకాఫ్ తీసుకోవడంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తగినంత ఎత్తు ఎగరలేక ప్రమాదానికి గురైంది. ఘటనా సమయంలో హెలికాప్టర్‌లో ఐదుగురు భక్తులు, ఇద్దరు పైలట్లు, ఓ ఇంజినీర్‌ ఉన్నారు. పైలట్, ప్రయాణికులు కొద్దిపాటి గాయాలతో బయటపడినప్పటికీ... ఇంజినీర్ మాత్రం హెలికాప్టర్ రెక్కల మధ్య చిక్కుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
nation
14,516
27-01-2017 12:54:44
నేను అమాయకుడిని... కోర్టులో సల్మాన్
జోధ్‌పూర్: కృష్ణజింకలను చంపిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ శుక్రవారం జోధ్‌పూర్ కోర్టులో విచారణకు హాజరయ్యాడు. 1998లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా తాను కృష్ణజింకలను చంపినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని... తనకు అనవసరంగా ఇరికించారని కోర్టుకు నివేదించారు. సల్మాన్‌తో పాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలి బింద్రే, నీలమ్ తదిరులు కూడా శుక్రవారం విచారణకు హాజరయ్యారు. 1998లో హమ్ సాత్ సాత్ హైన్ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ నాలుగు జింకలను వేటాడినట్టు పలు కేసులు నమోదయ్యాయి. ఆయనతో పాటు ఉన్న సహ నటులు జింకల వేటకు ప్రేరేపించినట్టు ఆరోపణలు రావడంతో వారిపైనా విచారణ జరుగుతోంది. కాగా ప్రాసిక్యూషన్ 18 ఏళ్లనుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణలో ఇప్పటికి 28 మందిని సాక్షులుగా ప్రవేశపెట్టింది.
nation
13,756
24-09-2017 02:40:31
మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించిన ఇరాన్‌
అమెరికాతో ఒప్పందం బేఖాతర్‌!టెహ్రాన్‌: ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం నిర్వహించింది. అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ... పలు రకాల వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల మధ్యశ్రేణి క్షిపణి ‘ఖొర్రంషహర్‌’ని విజయవంతంగా ప్రయోగించింది. ఇది 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ప్రయోగ నిర్వహణకు సంబంధించిన వీడియోను ప్రభుత్వ టీవీలో ప్రసారం చేశారు. అయితే, అంతకుమించిన వివరాలను వెల్లడించలేదు. ఇది పరిమాణంలో చిన్నగా ఉన్నా వ్యూహాత్మంగా పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చని బ్రిగేడియర్‌ జనరల్‌ ప్రకటించారు. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో... ఇరాన్‌ ఇలా క్షిపణి ప్రయోగాలు నిర్వహించడం గమనార్హం. అణు ఒప్పందానికి ఇరాన్‌ లోబడి ఉందో లేదో వచ్చే నెల 15న కాంగ్రె్‌సకు ట్రంప్‌ తెలియచేయాల్సి ఉంది.
nation
18,832
12-07-2017 07:50:40
మూడు హోటళ్లలో సెక్స్‌రాకెట్ గుట్టురట్టు
ఫరీద్‌కోట్ : మూడు హోటళ్లలో గుట్టుగా అమ్మాయిలతో వ్యభిచారం సాగిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్న ఘటన ఫరీద్‌కోట్ నగరంలో జరిగింది. ఫరీద్‌కోట్ నగరంలోని మూడు హోటళ్లలో సెక్స్ రాకెట్ తన కార్యకలాపాలు సాగిస్తుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అర్ధరాత్రి మూడు హోటళ్లపై ఆకస్మికంగా దాడులు చేశారు. హోటల్ గదుల్లో విటులతో రాసక్రీడలు సాగిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. మూడు హోటళ్లలో ఏడుగురు మహిళలతో సహా 21 మందిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. పోలీసుల దాడులతో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది.
nation
15,161
14-08-2017 02:03:49
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌
ఇద్దరు మావోయిస్టుల మృతిచింతూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీసు స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఘటన స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతోపాటు 12 బోర్‌ తుపాకీ, పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
nation
16,744
01-02-2017 11:12:47
లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే సిట్టింగ్ ఎంపీ ఈ. అహ్మద్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది. స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను ప్రారంభిస్తూ అహ్మద్‌కు నివాళులర్పించారు. అహ్మద్ ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారని తెలిపారు. ఆయన గౌరవార్థం గురువారం సభ సమావేశాలు జరగబోవని ప్రకటించారు. కాంగ్రెస్ నేత ఖర్గే మాట్లాడుతూ సభను ఈరోజు వాయిదా వేసి, బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు కూడా ఖర్గేకు మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు.
nation
7,868
29-10-2017 16:57:17
లైంగిక వేధింపులపై రాశీఖన్నా ట్వీట్!
సోషల్‌మీడియాలో మీటూ(#Metoo) ఉద్యమం ఓ ప్రభంజనంగా మారింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ ప్రముఖ హాలీవుడ్ నటి అలిసా చేసిన ట్వీట్ సంచలనం రేకెత్తిస్తోంది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై గళమెత్తాలని మీటూ హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ఎంతో మంది తమ ఆవేదనను #Metoo అంటూ వెళ్లగక్కుతున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీఖన్నా స్పందించింది. సోషల్‌మీడియాలో #Metooకు వస్తున్న స్పందనను చూసి.. ‘‘వేధింపులు ఒక్క ఆడవాళ్లకే కాదు..’’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై గతంలోనూ రాశీఖన్నా ప్రస్తావించిన విషయం తెలిసిందే. మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా ఒకట్రెండు సందర్భాల్లో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. తాజాగా #Metooతో ఉద్యమం ఊపందుకోవడంతో రాశీఖన్నా మళ్లీ తన స్పందనను తెలియజేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారిలో పురుషులు కూడా ఉన్నారని ఇదే విషయంపై సింగర్ చిన్మయి శ్రీపాద ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
entertainment
2,740
09-04-2017 23:41:07
గ్రహగతులు
కన్యలోని హస్త పాదం 2 నుంచి తులలోని విశాఖ పాదం 2 మధ్య చంద్ర సంచారం మీనంలోని రేవతి పాదం 3,4 మధ్యలో రవి సంచారం మేషంలోని అశ్విని పాదం 4 లో వక్రగతిలో బుధ సంచారం మీనంలోని ఉత్తరాభాద్ర పాదం 1, పూర్వాభద్ర పాదం 4 లో వక్రగతిలో శుక్రసంచారం మేషంలోని కృతిక పాదం 1 నుంచి వృషభంలోని కృతిక పాదం 2 మధ్యలో కుజ సంచారం ధనుస్సులోని మూల పాదం 2లో వృషభ నవాంశలోని మూల పాదం 2లో శని సంచారం (ఈ వారంలో వక్రగతి) కన్యలోని చిత్త పాదం 1లో సింహ నవాంశలో బృహస్పతి సంచారం సింహంలో రాహువు, కుంభంలో కేతువు మిథునం, ధనుస్సు నవాంశల్లో సంచారం గత సోమ, బుధవారం మధ్య చంద్రుడు కుంభంలోని పూర్వాభాద్ర నుంచి మీనంలోని రేవతి మధ్య సంచరించిన సమయంలో 9025-9153 పరిధి ఏర్పడింది. ఈ పరిధిలో గరిష్ఠ స్థాయిని ఛేదించినందు వల్ల బుల్లిష్‌గా మారింది.
business
6,977
18-12-2017 11:04:09
`అజ్ఞాత‌వాసి` గురించి క‌త్తి మ‌హేష్ కామెంట్‌!
`బిగ్‌బాస్‌` షోతో రెండు తెలుగు రాష్ట్రాల‌తోనూ పాపుల‌ర్ అయిన క‌త్తి మ‌హేష్.. ఆ త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మీద విమర్శ‌లు చేసి మ‌రింత పాపులారిటీ సంపాదించాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ అభిమానుల‌తో ఆయ‌న యుద్ధం చేస్తున్నాడు. ప‌వ‌న్ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నా ప‌వ‌న్‌ను విమ‌ర్శించ‌డంలో మాత్రం ఆయ‌న వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌కీయంగా మాత్ర‌మే ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన మ‌హేష్ తాజాగా `అజ్ఞాత‌వాసి` గురించి కూడా విమ‌ర్శ‌లు చేశాడు. త్రివిక్ర‌మ్ రూపొందించిన `అజ్ఞాత‌వాసి` ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అని అర్థం వ‌చ్చేలా పోస్ట్ పెట్టాడు. 2008లో వచ్చిన హాలీవుడ్ సినిమా `లార్జో వించ్` అనే సినిమా ట్రైల‌ర్‌ను త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసి.. `ఎందుకైనా మంచిది.. ఈ సినిమాను బాగా చూసి గుర్తు పెట్టుకోండి` అని కామెంట్ చేశాడు. పవన్ ఫ్యాన్స్ మహేశ్‌పైకి ఎందుకు ‘కత్తి’ దూశారు?  వివాదాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా?
entertainment
4,717
11-01-2017 11:34:54
‘మెగా’ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నానంటున్న అనసూయ!
హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం వెండితెర మీద తన మెరుపులు మెరిపిస్తోంది. సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌లు చేస్తూ, స్పెషల్‌ రోల్స్‌లో కనిపిస్తూ చాలా బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే ఈ భామ ఓ విషయంలో తెగ బాధపడిపోతోంది. మెగాస్టార్‌ కమ్‌బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నెంబర్‌ 150’కి సంబంధించి ఓ మంచి అవకాశాన్ని జారవిడుచుకోవడమే ఆ బాధకు కారణమట.  ఇటీవల జరిగిన ‘ఖైదీ నెంబర్‌ 150’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను యాంకర్‌ సుమ దగ్గరుండి నడిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాంకరింగ్‌ ఛాన్స్‌ మొదట అనసూయకే వచ్చిందట. ‘నిజానికి జనవరి 4న జరగాల్సిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు నేనే యాంకరింగ్‌ చేయాలి. కానీ, అనుకోకుండా ఆ కార్యక్రమం జనవరి 7కు వాయిదా పడింది. ఆ మేరకు చరణ్‌ సిబ్బంది నాకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. అయితే అప్పటికే ఆ కాల్షీట్‌ నేను వేరే వారికి ఇచ్చేశాను. అందుకే ఈ ప్రెస్టేజియస్‌ ఈవెంట్‌ను మిస్సయ్యాను. అయితే ‘ఖైదీ నెంబర్‌ 150’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాన’ని అనసూయ తెలిపింది.
entertainment
5,363
09-01-2017 08:51:32
‘కత్తి’ వర్సెస్‌ ‘ఖైదీ’
ఈ పొంగల్‌కి విడుదల కాబోతున్న చిత్రాల్లో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్‌ 150’ ఏ స్థాయిలో ఉంటుందా అని తెలుగు ప్రేక్షకులతోపాటు కోలీవుడ్‌ (తమిళ ప్రేక్షకులు) కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో విజయ్‌ హీరోగా నటించిన ‘కత్తి’ చిత్రానికి ఇది రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. దీంతో సహజంగానే రెండు చిత్రాల మధ్య అభిమానులు పోలికలు చూస్తున్నారు. విజయ్‌ కెరీర్‌లోని మైలురాళ్లలో ఒకటిగా ‘కత్తి’ నిలిస్తే.. చిరంజీవి కెరీర్‌లో 150వ మైలురాయి ‘ఖైదీ నెంబర్‌ 150’. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం ఆడియోకు విపరీతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో కలెక్షన్లపై అభిమానుల దృష్టి పడింది. తమిళ చిత్రం ‘కత్తి’ కలెక్షన్లను ‘ఖైదీ..’ అధిగమిస్తాడని చిరంజీవి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ‘గౌతమిపుత్ర’ వర్సెస్‌ ‘ఖైదీ’ అంటుంటే.. కోలీవుడ్‌లో మాత్రం ‘కత్తి’ వర్సెస్‌ ‘ఖైదీ’ అంటున్నారు.
entertainment
11,773
20-11-2017 01:23:41
ముగాబేకు పార్టీ అధ్యక్ష పదవీ పాయె..
హరారే, నవంబరు 19: సైన్యం నిర్బంధంలో ఉన్న జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేకు అధికార జాను-ఎఫ్‌ పార్టీ అధ్యక్ష పదవీ పోయింది. ఆదివారం హరారేలో సమావేశమైన ఆ పార్టీ నేతలు ముగాబేను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. జింబాబ్వే మాజీ ఉపాధ్యక్షుడు ఎమ్మర్సన్‌ మంగాగ్వాను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మంగాగ్వాను దేశ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
nation
17,791
16-11-2017 01:35:39
2016లో తగ్గిన ఉగ్ర మరణాలు.
గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ నివేదికలండన్‌, నవంబరు 15: ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఉగ్రవాదం ప్రధానమైనది. తీవ్రవాదుల దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే 2016లో జరిగిన ఉగ్రదాడుల్లో మృతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో ఉగ్రవాదం వల్ల ప్రభావితమైన దేశాల సంఖ్య మాత్రం పెరిగింది. ఆస్ట్రేలియాకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అండ్‌ పీస్‌ విడుదల చేసి గ్లోబల్‌ టెర్రిరిజం ఇండెక్స్‌(జీటీఐ)లో వెల్లడైంది. గత ఏడాది జరిగిన ఉగ్రదాడుల్లో 25,673 మంది ప్రాణాలు కోల్పోయారని, 2014తో పోలిస్తే మృతుల సంఖ్య 22 శాతం తగ్గిందని ఆ సంస్థ తెలిపింది. కానీ 17 ఏళ్లలో గత ఏడాదే అత్యధికంగా 77 కనీసం ఒక్క ఉగ్రదాడినైనా ఎదుర్కొన్నాయని వెల్లడించింది.
nation
17,208
24-01-2017 04:19:16
రోహిత్ మృతిపై నివేదిక ఇప్పుడు బహిరంగ పత్రమే!
 న్యూఢిల్లీ, జనవరి 23: రోహిత్ వేముల మృతిపై ఇచ్చిన నివేదికను పార్లమెంట్‌లో సమర్పించేశారని.. ఇకపై దీన్ని ఎవరైనా ఆర్టీఐ ద్వారా పొందవచ్చని కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది. ఈ నివేదిక కోసం గతంలో ఒకరు ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. దాన్ని అప్పటికి పార్లమెంట్‌లో సమర్పించకపోవడంతో ఇవ్వలేదు. డిసెంబరు 15న ఈ నివేదికను పార్లమెంట్‌లో సమర్పించారు. రోహిత మృతిపై జస్టిస్‌(రిటైర్డ్‌) రూపాన్వాల్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చింది.
nation
4,654
29-10-2017 12:05:52
సైరా సినిమా సూపర్‌హిట్టే: దర్శకుడు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న సైరా సినిమా సూపర్‌హిట్‌ అయ్యేలా నిర్మిస్తామని డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి తెలిపారు. రూపనగుడిలో నరసింహారెడ్డి వంశస్థులను శనివారం కలిశారు. అనంతరం ఉయ్యాలవాడలో నరసింహారెడ్డి గృహాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నామని, చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ హైదరాబాదులోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతోందని తెలిపారు. వచ్చే ఏడాది సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కెమెరామెన్‌ రత్నవేలు, అసిస్టెంట్‌ డైరె ఉమాశంకర్‌, సనత్‌, నరసింహారెడ్డి వంశస్థులు కర్నాటి ప్రభాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, ప్రతా్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
entertainment
15,028
15-02-2017 01:38:06
చెదిరిన శశి‘కల’
ఆదిలోనే అందలం.. అంతలోనే పతనంచెన్నై, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): 33 ఏళ్లపాటు తను సపర్యలు చేసిన ‘అమ్మ పీఠం’పైనే కూర్చోవాలనుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కల చెదిరింది. జయ మరణంతో అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన ఆమె.. ప్రభుత్వ పగ్గాలు కూడా చేజిక్కించుకునేంతలోనే సుప్రీం తీర్పు అడ్డుకట్ట వేసింది. అక్రమార్జన కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించటంతో పదేళ్ల వరకూ ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆమె భవిష్యత్తులోనూ ప్రభుత్వ పదవులెక్కడం కష్టమేనని తేలిపోయింది. పోయెస్‌గార్డెన సంరక్షకురాలిగా ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ.. గత డిసెంబరు 31న పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.  జయ మరణంతో ఖాళీ అయిన ప్రధానకార్యదర్శి పదవిని చేజిక్కించుకున్నారు. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ప్రతిరోజూ పోయెస్‌గార్డెన ముందు బారులు తీరి పార్టీ పదవి చేపట్టాలంటూ ఆమెను బుజ్జగించారు. వంగివంగి దండాలు పెడుతూ ‘అమ్మను మైమరిపించేలా’ ఆమెను అనునయించారు. దాంతో శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవినెక్కారు. అది జరిగిన రెండు రోజుల నుంచే ముఖ్యమంత్రి పదవి కూడా ఆమే చేపట్టాలంటూ కొంత మంది మంత్రులు ప్రకటనలు చేయడం ప్రారంభించారు. పక్కనే పన్నీర్‌సెల్వం ఉన్నా పట్టించుకోని మంత్రులు.. చిన్నమ్మే సీఎం పీఠమెక్కాలంటూ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో 5వ తేదీన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా తమ నేతగా శశికళను అనుకున్నారు.  అప్పటి నుంచే పార్టీలో హైడ్రామా ప్రారంభమైంది. 7న పన్నీర్‌సెల్వం జయ సమాధి దీక్షగా తిరుగుబావుటా ఎగురవేయడంతో ఆమె పతనం ప్రారంభమైంది. ఈ నెల 9న గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లేఖను అందజేశారు. ఆరోజు రాత్రి నుండే మద్రాసు విశ్వవిద్యాలయం సెంటినరీ హాలులో సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టారు. అంతేగాక ఆమెకు అనుయాయులైన కొంతమంది అధికారులు ‘ముఖ్యమంత్రి శశికళ’ పేరుతో ట్విట్టర్‌ ఖాతా కూడా తెరిచారు. తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఖాతాను ప్రభుత్వ వెబ్‌సైట్‌కు బదులుగా అన్నాడీఎంకే వెబ్‌సైట్‌కు అనుసంధానించారు. అనంతరం సీఎంగా ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్‌ జాప్యం చేస్తుండడం పట్ల ఆదిలో కొంత సంయమనం పాటించిన శశికళ.. రెండు రోజులకే స్వరం పెంచారు. తన సహనానికీ హద్దు ఉంటుందని, అది దాటిన రోజు పరిస్థితులు వేరేగా ఉంటాయంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ హెచ్చరికలు పనిచేయకపోవడంతో స్వరం తగ్గించి శాంతియుతమార్గంలో ఆందోళన చేస్తామని ప్రకటించారు. అనంతరం ప్రత్యర్థులపై వాక్బాణాలు సంధించిన శశికళ.. సోమవారం సాయంత్రం నుంచి పూర్తిగా బేలగా మారిపోయారు. సుప్రీంకోర్టు తీర్పు మంగళవారం వెలువడడం ఖాయమని తేలగానే ఆమె మెత్తబడ్డారు.  జయకు తాను ఎంతగా సేవలందించానో ప్రజలకు వివరించడంతోపాటు తన పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైతే ప్రాణాలు అర్పించేందుకు కూడా వెనుకాడనని ప్రకటించారు. అయితే రిసార్టులో జరిగిన సమావేశంలో ఆమె ఎమ్మెల్యేలను బుజ్జగించి, బతిమలాడాల్సి వచ్చింది. నిజానికి అన్నాడీఎంకేకు చెందిన 135 మంది ఎమ్మెల్యేల్లో 70 మందికి పైగా కేవలం ఆమె సిఫారసులతో గత ఎన్నికల్లో టికెట్లు సంపాదించుకోగలిగారు. ఇన్నాళ్లూ కనుసైగలతో ఆదేశాలు జారీ చేసిన చిన్నమ్మ.. చివరికి బేలగా పార్టీని వీడరాదని, ఏం కావాలన్నా చేస్తానని రిసార్టులో ఎమ్మెల్యేలను రకరకాలుగా బతిమలాడుకోవాల్సి వచ్చింది.
nation
13,493
19-04-2017 15:19:07
గుండు కొట్టించుకున్న సోనూనిగమ్
కోల్‌కతా: తనపై జారీ చేసిన ఫత్వాకు సింగర్ సోనూనిగమ్ దీటైన జవాబిచ్చారు. నున్నగా గుండు కొట్టించుకుని మీడియా ముందుకు వచ్చారు. ఫత్యాపై నిరసనగా సోనూ ఈ చర్యకు దిగారు. లౌడ్ స్పీకర్ల ద్వారా మసీదులు, గడులు, గురుద్వారాలు చేసే ఉపన్యాసాలు, ప్రార్థనా పిలుపును గూండాగిరిగా సోనూ నిగమ్ అభివర్ణించడంతో అసలు వివాదం మొదలైంది. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కోల్‍కతాకు చెందిన ఓ ముస్లిం మతగురువు సోనూకు గుండు కొడితే రూ.10 లక్షలు ఇస్తానంటూ ఫత్వా జారీ చేశారు. దీనిపై సోనూ మంగళవారం వరుస ట్వీట్లలో స్పందించారు. తాను మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇంటిలోనే ఉంటానని, ఎవరైనా వచ్చిన గుండు చేయెుచ్చని, రూ.10 లక్షలు మౌల్వీ రెడీ చేసుకోవాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను లైడ్ స్పీకర్లకు వ్యతిరేకంగానే మాట్లాడాడని, ఏ మతానికి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యానించలేదని సోనూ మీడియా ముందు వివరణ ఇచ్చారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు తనకు ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న సమాజంలో మనం ఉన్నామని, ఫత్వాలు జారీ చేయడమేమిటని ప్రశ్నించారు. తాను ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. అనంతరం, తనపై జారీ చేసిన ఫత్యాకు నిరసనగా స్వయంగా గుండు చేయించుకుని ఆయన మీడియా ముందుకు వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మౌల్వి ప్రకటించిన రూ.10 లక్షలు తనకు ఇస్తే ఛారిటీ కార్యక్రమాల కోసం విరాళంగా ఇస్తానని సోనూ తెలిపారు.
nation
19,790
15-09-2017 02:18:08
భార్యకు అనారోగ్యం.. 3 వన్డేలకు ధవన్‌ దూరం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు ఇది చేదు వార్త. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ తొలి మూడు వన్డేలకు దూరమయ్యాడు. భార్య ఆయేషా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమె దగ్గర ఉండేందుకు అనుమతించాలని ధవన్‌ బీసీసీఐని కోరా డు. దీనికి అంగీకారం తెలిపినట్టు బోర్డు గురువారం ప్రకటించింది. అయితే, ఈ మూడు వన్డేల్లో ధవన్‌ స్థానంలో ఎవరినీ ఎంపిక చేయడం లేదని సెలెక్షన్‌ కమిటీ తెలిపింది.
sports
12,869
18-11-2017 01:21:43
అత్త అంత్యక్రియలకు వెళ్లి మరదలిపై రేప్‌
ముంబై, నవంబరు 17: తల్లిని కోల్పోయిన పదహారేళ్ల బాలికను ఆదుకోవాల్సిన బావ.. ఆమెపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ముంబైలోని బాంద్రాలో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి కొన్ని రోజుల క్రితం చనిపోయింది. అంత్యక్రియలు జరగాల్సి ఉండగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నివాసముంటున్న ఇర్షాద్‌ సిద్దిఖీ(28), తన భార్యతో కలిసి అత్తవారింటికి వచ్చాడు. ఆదివారం ఇం ట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇరుగుపొరుగువారితో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
nation
14,702
11-12-2017 11:41:40
భారీగా మోహరించిన చైనా దళాలు.. డోక్లాంలో మళ్లీ అలజడి...
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లోని డోక్లాం వద్ద మరోసారి అలజడి రేగింది. భూటాన్ ట్రైజంక్షన్ సమీపంలోని ఈ ప్రాంతంలో 1600 నుంచి 1800 మంది చైనా దళాలు మోహరించడంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది. శీతాకాలంలో సైతం పెద్దమొత్తంలో సైన్యాన్ని మోహరించిన డ్రాగన్... ఇప్పటికే రెండు హెలీపాడ్లు, సైనికుల బసకోసం స్థావరాలు, స్టోర్‌లను నిర్మిస్తున్నట్టు సమాచారం. తాజా పరిణామాలను బట్టి చైనా ఆర్మీ డోక్లాం వద్ద శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్నట్టు స్పష్టంమైన సంకేతాలు పంపినట్టైంది. ఈ ప్రాంతం చైనాదేననీ.. శీతాకాలంలో డోక్లాం వద్ద తగినంత పరిమాణంలో సైనిక పహారా కొనసాగిస్తామని చైనా ఆర్మీ ఇంతకు ముందే సంకేతాలివ్వడం గమనార్హం.  డోక్లాం వద్ద రోడ్డు నిర్మించేందుకు చైనా దళాలు ప్రయత్నించడంతో భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 16 నుంచి ఆగస్టు 28 వరకు ఇక్కడ చైనా, భారత దళాలు ఎదురెదురు మోహరించడంతో సుదీర్ఘ ప్రతిష్టంభన నెలకొంది. భారత్ ఈ ప్రాంతాన్ని ‘డోకా లా’ అని పిలుస్తుండగా... భూటాన్ దీనిని డోక్లాంగా గుర్తించింది. అయితే ఇది తమ ప్రాంతమే అంటున్న డ్రాగన్ మాత్రం.. దీన్ని డోంగ్‌లాంగ్‌గా పిలుచుకుంటోంది. కాగా ఇది తమ ప్రాంతమేనంటూ భూటాన్ కూడా చెబుతోంది. ఈ ఏడాది ఆగస్టులో చైనాలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ చైనా వెళ్లనుండడంతో... ఇరు దేశాలు డోక్లాం నుంచి తమ సైన్యాలను వెనక్కి తీసుకున్నాయి.
nation
10,062
30-05-2017 23:03:36
తెలుగు సినిమా ఒక గొప్ప వ్యక్తిని, శక్తిని కోల్పోయింది: వి.వి.వినాయక్
హైదరాబాద్: తెలుగు సినిమా ఒక గొప్ప వ్యక్తిని, శక్తిని కోల్పోయిందని దర్శకుడు వి.వి.వినాయక్ తెలిపారు. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన దాసరి నారాయణరావు అందరి హృదయాల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారని వినాయక్ చెప్పారు
entertainment
7,964
05-07-2017 15:02:08
చెర్రీతో మురుగదాస్.. బడా నిర్మాణ సంస్థ ప్రయత్నాలు!
ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో మురుగదాస్ స్పైడర్ సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. స్పైడర్ తర్వాత కోలీవుడ్ ఇళయదళపతి విజయ్‌తో మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీదకు ఇంకా వెళ్లకుండానే ఆ తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తున్నారట మురుగదాస్. ఆ సినిమాను మరో తెలుగు హీరోతోనే చేయాలని ప్లాన్ చేస్తున్నారట కోలీవుడ్ నిర్మాతలు. మెగా ఫ్యామిలీ వారసుడు రామ్ చరణ్‌తో మురుగదాస్ జోడీ కట్టేలా కోలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది.           ధృవతో మంచి సక్సెస్‌ను అందుకుని సుకుమార్ డైరెక్షన్‌లో రంగస్థలం అనే సినిమాను చేస్తున్న చెర్రీతో.. క్రియేటివ్ సినిమాలు తీసే మురుగదాస్‌ను జోడీ కట్టించేందుకు ఆ బడా నిర్మాతలు ప్లాన్ వేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150, ప్రస్తుతం రోబో 2.0 సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్.. మురుగదాస్-చెర్రీ కాంబినేషన్ కోసం ట్రై చేస్తోందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, స్పైడర్ తర్వాత విజయ్‌తో మురుగదాస్ మూవీ చేయబోతున్నారు కాబట్టి.. ఈ కాంబినేషన్ వాస్తవ రూపం దాల్చాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే. కాగా, గతంలో చెర్రీ తండ్రి చిరంజీవితో మురుగదాస్ స్టాలిన్ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే.
entertainment
15,266
29-09-2017 01:01:35
వాజ్‌పేయి ఓటు తొలగింపు
లఖ్‌నవూ: స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ఓటు గల్లంతైంది. లఖ్‌నవూలో ఆయన ప్రస్తుతం నివసించడం లేదని.. అందుకే కార్పొరేషన్‌ ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరును తొలగించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గతంలో బాస్‌మండిలోని రాజేంద్రస్మృతి భవన్‌లో వాజ్‌పేయి ఉండేవారు. ఇప్పుడు ఆ భవనంలో కిసాన్‌సంఘ్‌ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వాజ్‌పేయి ఢిల్లీలోని ల్యూటెన్‌ జోన్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఐతే బీజేపీ సీనియర్‌నేత అడ్వాణీ, కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాత్రం అప్పుడప్పుడూ ఇంటికి వెళ్లి పరామర్శిస్తుంటారు. వాజ్‌ పేయి చివరిసారిగా 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటువేశారు. అనారోగ్యం కారణంగా ఎన్నికల ఓటింగ్‌కు ఆయన దూరంగా ఉంటున్నారు.
nation
13,894
11-11-2017 15:10:31
కిమ్‌ను చంపేందుకు ద.కొరియాతో కలిసి అమెరికా కొత్త స్కెచ్!
ఉత్తరకొరియా పని అంతేనా..? అమెరికా, దక్షిణ కొరియా కలిసి సంయుక్త విన్యాసాలు ఎందుకు ప్రారంభించాయి..? డోనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటనలో ఉండగానే డ్రిల్స్ ప్రారంభించడం వెనుక ఆంతర్యం ఏంటి..? ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ను అమెరికా చంపేస్తోందన్న వార్తల్లో ఎంతవరకూ నిజం ఉంది..? క్షిపిణి ప్రయోగాలు, అణు ప్రయోగాలతో అగ్రరాజ్యం అమెరికాతో సహా పొరుగు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉత్తరకొరియాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అమెరికా సిద్ధమైంది. ఉత్తరకొరియా బెదిరిస్తున్న పట్టించుకోకుండా దక్షిణ కొరియాతో కలిసి నేవీ డ్రిల్స్ చేపట్టింది. దక్షిణ కొరియా తూర్పు తీరంలో ఆ దేశంతో కలిసి అమెరికా సంయుక్త నావికదళ విన్యాసాలు చేసింది. యుఎస్ఎస్ రోనాల్డ్ రేగన్, థియోడోర్ రూస్వెల్ట్, నిమిట్స్ బ్యాచ్‌ గ్రూప్‌లు విజయవంతంగా సముద్ర జలాల్లోకి వెళ్లాయి. అమెరికాకు చెందిన 11, ద.కొరియాకు చెందిన 7 భారీ నౌకలు ఈ వార్ డ్రిల్‌లో పాల్గొన్నాయి. ఈ డ్రిల్ నాలుగురోజుల పాటు జరుగుతుంది. ట్రంప్ ఆసియాలో ఉండగానే ఈ డ్రిల్స్ ప్రారంభించడం అంటే ఉత్తరకొరియా బెదిరింపులకు అమెరికా భయపడటం లేదనే అనిపిస్తుంది. తేడా వస్తే ఆ దేశం అధ్యక్షుడు కిమ్‌ను అంతమొందించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఉత్తరకొరియాను బెదిరించేందుకే ఈ డ్రిల్స్ చేపట్టినట్టు అమెరికా సైనికాధికారులు తెలిపారు. కిమ్‌ తమ జోలికి వస్తే అటో.. ఇటో తేల్చేస్తామని హెచ్చరించారు. క్షిపిణులు ప్రయోగిస్తే షిప్‌ల పైనుంచే వాటిని పేల్చేసే టెక్నాలజీని సైతం పరీక్షిస్తున్నట్లు తెలిపారు. 2007 తర్వాత దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా చేపట్టిన అతి పెద్ద విన్యాసాలు ఇవే. అటు ఉత్తర కొరియా సైతం అణు యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇటీవలే యుద్ధం వస్తే జనావాసాలు ఎలా ఖాళీ చేయాలే అనే విషయమై యుధ్ద విన్యాసాలు నిర్వహించింది. వీటిని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యవేక్షించారు. శత్రువుకు తమ జాడ తెలియకుండా దొంగదెబ్బ తీస్తామని, ఇలాంటి భయంకర డ్రిల్స్ చరిత్రలో ఎప్పుడూ చేయలేదని ఆయన హెచ్చరిస్తున్నారు. 1950లో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య తొలి కొరియన్ వార్ జరిగింది. ఇప్పుడు మళ్లీ అలాంటి యుద్ధ మేఘాలే అలుముకున్నాయి.
nation
17,462
22-09-2017 01:42:40
రైల్వే కోచ్‌లపై రిజర్వేషన్‌ చార్ట్‌లకు స్వస్తి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: కోచ్‌లపై రిజర్వేషన్‌ చార్ట్‌లను అతికించే విధానానికి స్వస్తి పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. చెట్లను సంరక్షించడంలో భాగంగా కాగితాన్ని తక్కువగా వినియోగించేందుకు ఈ చర్య తీసుకున్నామని అధికారులు తెలిపారు.ఈ ప్రయోగాన్ని తొలుత 3 నెలలు అమలు చేస్తామని, ప్రయాణికుల స్పందనను బట్టి కొనసాగించడంపై నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.
nation