inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 9,042 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ 240 పాయింట్లు నష్టపోయి 29,244 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా, ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,300గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.27,450కి అమ్ముడవుతోంది. కిలో వెండి ధర రూ.43,859 పలుకుతోంది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: ఎన్నికల ప్రచార నిమిత్తం రానున్నఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు స్వయంగా తానే స్వాగతం పలుకుతానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలుకుతానని చెప్పారు. ఇదిలా ఉండగా, రామ్ నాథ్ కోవింద్ విజయవాడలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే అంశంపై సమన్వయ కమిటీ భేటీలో చర్చించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థి స్వామిని దర్శించుకోవడం సరికాదని మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడిన్టటు సమాచారం. అయితే, దేవాలయానికి వెళ్లేది ఓట్లు అడగడానికి కాదు కనుక స్వామి వారి దర్శనం తప్పుకాదని మరికొందరు మంత్రులు తమ అభిప్రాయాలను చెప్పారు. కాగా, రేపు తెలుగు రాష్ట్రాల్లో కోవింద్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ఆయన హైదరాబాద్, అమరావతి సందర్శించనున్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'రామ్ నాథ్ కోవింద్ కు నేనే స్వయంగా స్వాగతం పలుకుతా: సీఎం చంద్రబాబు'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: వైఎస్ఆర్ పొలం బడి పర్యావరణ విశ్లేషణ
దర్శి నియోజక వర్గం దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో శుక్రవారం రైతులకు వైఎస్సార్ పొలం బడి కార్యక్రమంలో డిఆర్సి ఎడిఎ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వరిలో ఆకుముడత పురుగును గమనించడం జరిగిందని తెలిపారు. దీని నివారణకు వరి చేలో తాడును అడ్డంగా లాగడం వలన దీని ఉధృతిని తగ్గించవచ్చని తెలిపారు. అనంతరం చిత్ర పటం ద్వారా ఆకుముడత పురుగు జీవిత చక్రం రైతులకు చూపించారు. ఈ కార్యక్రమంలో విఎఎలు, రైతులు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను సీఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు. సీఎం కేసిఆర్తో ఫోన్లో మాట్లాడిన హర్షవర్థన్ ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సమీక్షా సమావేశానంతరం సీఎంకేసీఆర్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రికి సీఎం చేసిన సూచనలను తనకు వివరించారని తెలిపారు. "మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం మీ సూచనలకు అభినందనలు" అంటూ ప్రధాని సీఎంను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని, సీఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని ప్రధాని సీఎంకు హామీ ఇచ్చారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'సిఎం కెసిఆర్ ను పొగిడిన ప్రధాని మోడీ'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం
నేడు కాంగ్రెస్ శాసనసభా పక్షం అత్యవసర సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే వనమా రాఘవ అరాచకాలు. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: మితిమీరుతున్న పోకిరీల ఆగడాలు...విఫలమవుతున్న నిఘా
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం మహానగరంలో పోకిరీల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో నగరంలోని పోలీసుల నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాదులో కొందరు పోకిరీలు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఇతరులకు అంతులేని ఆవేదనను కలిగిస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసలుగా మారిన వీరు. మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిన్న రాత్రి ఇలాంటి ఘటనే మరొకటి నగరంలో చోటుచేసుకుంది. చైతన్యపురిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న భార్యాభర్తలను వేధింపులకు గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే, నిన్న రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న వీరిని చైతన్యపురి రోడ్డుపై పోకిరీలు ఆపేశారు. మహిళను వేధించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించాడు. దీంతో అతనిపై పోకిరీలు ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: రికార్డుల వేటలో రోహిత్, ధోని, కోహ్లీ
రెండు టీ20ల సిరిస్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ సిరిస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్లో కోహ్లీసేన తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది.విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు తన మార్కుని చూపించడంలో విఫలమయ్యారు. మరోవైపు ధోని సైతం 37 బంతుల్లో 29 పరుగులు చేసి విమర్శల పాలయ్యాడు. కేవలం కేఎల్ రాహుల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో ఫరవాలేదనిపించాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో గెలిచి మ్యాచ్ని సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, ధోని, విరాట్ కోహ్లీలు అనేక రికార్డులను అందుకోనున్నారు. రెండో టీ20లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ గుప్టిల్, క్రిస్గేల్ 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ప్రస్తుతం 102 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, భారత్ తరఫున టీ20ల్లో రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డ్లో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 72 సిక్సర్లతో ఉన్నాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సిక్సర్ల రికార్డుని అందుకోవడానికి ధోనికి ఒక సిక్స్, కోహ్లీకి రెండు సిక్సులు అవసరం.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం
బీజింగ్: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పరిశ్రమల రంగంలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయింది. ముఖ్యంగా స్టీల్ మరియు ఉక్కు సహా ఇతర భారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న 5 లక్షలమంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ మేరకు చైనా కార్మికశాఖ మంత్రి యిన్ వీమెన్ బుధవారం జారీ చేసిన ప్రకటన జారీ చేశారు. అదనపు మిగులు ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అదనపు ఉత్పత్తితో మార్కెట్లో ఉత్పత్తుల వెల్లువ కారణంగా గ్లోబల్ ధరలు నిరుత్సాహకంగా ఉన్నాయన్నారు. అయితే తొలగించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను కల్పించనున్నట్టు చెప్పారు. అలాగే ఆయా ఉద్యోగులు సొంత సంస్థలు ప్రారంభించడానికి లేదా ఉద్యోగ విరమణకు సాయం చేయనున్నట్టు చెప్పారు. గత ఏడాది 7లక్షల 26వేలమందికి పైగా తొలగించిన ఉద్యోగులకు ఇలాంటి సాయాన్ని అందించినట్టు తెలిపారు. చైనాకు చెంది స్టీల్ సహా ఉక్కు, బొగ్గు, అల్యూమినియం, సిమెంట్, గ్లాస్ లాంటి భారీ పరిశ్రమలు అధిక ఉత్పత్తి సామర్థ‍్యంతో నిండి ఉన్నాయి. అటు మిగులుఉత్పత్తి, ఇటు డిమాండ్ లేక ఇబ్బందులు పడుతున్న ఈ పరిశ్రమలను బైటపడేసేందుకు చైనా బహుళ సంవత్సరాలుగాకృషి చేస్తోంది. మరోవైపు కొన్ని కంపెనీలు మిగులు ఉత్పత్తిని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో తమ ఉద్యోగాలకు ఎసరుపెడుతున్నారంటూ అమెరికా, యూరోప్ మరియు ఇతర వ్యాపార భాగస్వామ్య దేశాలు ఆరోపిస్తున్నాయి.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: మొక్కలు నాటిన హీరో ప్రిన్స్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో ప్రిన్స్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో పాటు సీడ్ గణేష్ అనే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా హీరో ప్రిన్స్ అన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని హీరో ప్రిన్స్ అన్నారు. కమెడియన్ ఖయుమ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ కూకట్ పల్లి ప్రగతి నగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా. హీరో నాని, భీష్మ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల, నటుడు అరుణ్ ఆదిత్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు హీరో ప్రిన్స్
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: విజయవాడ : దసరా పురస్కరించుకుని ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్న భవానీ దీక్షా పరులు.భవానీ మాలధారణ విరమణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో అధికారుల ఆలసత్వం.సుదూర ప్రాంతాలనుండి అమ్మవారిని దర్శించుకుని మాల విరమణకు వస్తున్న భక్తులు.హోమగుండం ఏర్పాటు చేసినా వెలిగించక పోవటడంతో వెంట తెచ్చిన దీక్ష కొబ్బరికాయలు ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి.మంగళవారం దసరా కావడంతో వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తున్న భవానీ దీక్షాపరులు.తాము ముందే చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్న గురుస్వాములు.తప్పని పరిస్థితిలో హోమగుండం వద్ద భవానీ దీక్ష ఇరుముడి సామాగ్రిని వదిలి వెళ్తున్న భవాణీలు.ఇకనైనా అధికారులు స్పదించి భవానీ మాల విరమణ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని గురుస్వాముల డిమాండ్.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'వెలగని హోమగుండం భవానీల ఆగ్రహం'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. తెలంగాణకు చెందిన బూర్ల అరుణ్ కుమార్(41) అమెరికాలోని హ్యూస్టన్ లో పని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ అరుణ్ కుమార్ స్వస్థలం. 16 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అరుణ్ కుమార్ స్థిరపడ్డాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడి చనిపోయినట్లు బంధువులు చెబుతున్నారు
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రైల్వే ప్రయాణికులపై అదనపు భారం
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికులపై మరో భారం మోపనుంది. ఇకపై ట్రైన్లో ఉండి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే రూ.50 అదనంగా చెల్లించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రీమియం ట్రైన్లు అయిన శతాబ్ది ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, తేజాస్ ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్లలో న్యూ క్యాటరింగ్ ఛార్జెస్ అమలవుతాయని తెలిపింది.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో అదానీ
భారత పారిశ్రామిక వేత్త అదానీ మరో అరుదైన ఘనత సాధించారు. ఫోర్బ్స్ శుక్రవారం విడుదల చేసిన బిలియనీర్ జాబితాలో అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ $154.7 బిలియన్ల సంపదతో రెండవ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఎలాన్ మస్క్ $273.5 బిలియన్ల సంపదతో మొదటి స్థానంలో ఉన్నారు. $153.8 బిలియన్ల సంపదతో మూడో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్, 4వ స్థానంలో $149.7 బిలియన్లతో జెఫ్ బెజోస్ ఉన్నారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: హైదరాబాద్ లో జోరందుకున్న అక్రమ నీటి దందా
హైదరాబాద్: షేక్పేట మండల పరిధిలో అక్రమ నీటి దందా జోరందుకుంది. నివాస ప్రాంతాల్లో బోర్లు వేసిన నిర్వాహకులు ఇళ్లల్లోనే వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటిని తోడేస్తున్నారు. ముఖ్యంగా వేంకటేశ్వరకాలనీ డివిజన్లో ఫిల్టర్ నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నందినగర్ బస్స్టాప్ సమీపంలోని సన్రైజ్ స్కూల్ ఎదురుగా ఓ భవనంలో ఇటీవల కొత్తగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ బోర్వెల్లో నీళ్లు అంతంత మాత్రంగా ఉండడంతో ఏకంగా జలమండలికి చెందిన నల్లా నీళ్లనే ఫిల్టర్ చేసి బాటిళ్లలో పోసి విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నందినగర్లోని సీఎం కేసీఆర్ నివాసానికి కూతవేటు దూరంలో ఓ నాలుగంతస్తుల భవనంపై వాటర్ప్లాంట్ను ఏర్పాటు చేసి నీళ్ల దందాను నిర్వహిస్తున్నారు. వాటర్ప్లాంట్ భవనంపై ఉన్నా నీటి పైపు మాత్రం ఏకంగా రోడ్డుపైనే పెట్టి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 10 లోని క్రిసెంట్ స్కూల్ వీధిలో ఓ ఇంట్లో నిబంధనలను విరుద్దంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సొమ్ముచేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పాటించకుండా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లపై తెలంగాణ ప్రభుత్వం వైఖరి చెప్పాలని షబ్బీర్ అలీ అన్నారు. సిఏఏపై కేంద్రం పునరాలోచన చేయాలని తెలంగాణ కేబినెట్ తీర్మాన చేయడం కంటి తుడుపు చర్యే అన్నారు. శాంతియుత ఆందోళనలు చేస్తున్న మహిళలపై అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు అని అన్నారు. కేసీఆర్ గతంలో చెప్పినట్లు నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలి అని అన్నారు. టిఆర్ఎస్- ఎంఐఎంలది మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లపై తెలంగాణ ప్రభుత్వం వైఖరి చెప్పాలి: షబ్బీర్ అలీ'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: రామయ్యకు స్వర్ణ తులసి పూజలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం స్వర్ణ తులసి పూజలను అర్చకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులకు సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం గోదావరి తీర్థ జలాలతో మూలవరులకు అభిషేకం, తిరుమంజనం జరిపించారు. నిత్యకళ్యాణమూర్తులను మేళతాళాలతో ఆలయం నుంచి బేడ మండపానికి తీసుకువచ్చి ఘనంగా రామయ్య నిత్యకళ్యాణం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: వర్షాకాలంలో లభించే బోడకాకరకాయలో ఎన్నో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బోడకాకర కాయను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బోడకాకరకాయ అని అంటారు. దీంట్లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఎ, విటమిన్ బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 9, బి 12, విటమిన్ సి, విటమిన్ డి 2, 3, విటమిన్ హెచ్, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. బోడకాకర కాయ మనకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇది అనేక రకాల వ్యాధులకు దివ్యఔషధం. ఆయుర్వేదంలో బోడకాకర కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, దగ్గు, కడుపు ఇన్ఫెక్షన్, పైల్స్, కామెర్లు, డయాబెటిస్, హెర్పెస్, దురద, పక్షవాతం, జ్వరం, వాపు, అపస్మారక స్థితి, పాము కాటు, కంటి సమస్య, క్యాన్సర్, రక్తపోటు వంటి అనేక భయంకరమైన వ్యాధుల చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు. బోడ కాకర కాయనే కాకుండా దాని వేర్లు, పువ్వులు, రసం, ఆకులు మొదలైనవి అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. బోడకాకర కాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కిలోకు రూ.80 నుంచి రూ.150 వరకు పలుకుతుంది. వాస్తవానికి దాని ధర సీజన్, దాని లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'బోడకాకర కాయలతో ఎన్నో ప్రయోజనాలు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: పోలండ్కు చెందిన పోలాక్ బార్బర్ (45) అనే మహిళకు జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన మహ్మద్ షాదాబ్ (35)తో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన ఆరేళ్ల కూతురిని తీసుకుని భారత్కు వచ్చింది. పోలాక్కు ఇదివరకే పెళ్లై ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మహ్మద్తో అతని ఇంట్లోనే ఉంటుంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ప్రియుడి కోసం భారత్కు వచ్చిన పోలండ్ మహిళ'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: నూతన ఆర్డీ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్ గిరీషా
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లోని కార్యాలయ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శుద్ధ జలకేంద్రాన్ని కలెక్టర్ గిరీషా పీఎస్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి శనివారం ప్రారంభించారు. సమస్యలపై కార్యాలయానికి వచ్చే వారికి మంచినీరు ఉంచాలనే ఉద్దేశంతో ఆర్ ప్లాంట్ను ప్రారంభిం చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగస్వామి, కలెక్టరేట్ ఏఓ బాలకృష్ణ, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ జయరాజు, కలెక్టరేట్లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: అధిక బరువుతో బాధపడే వారు ఉదయాన్నే కొన్ని అలవాట్లను దినచర్యలో భాగం చేసుకోవాలి. ఈ అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే వేగంగా బరువు తగ్గవచ్చు.- ఉదయన్నే నిద్ర లేవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల బరువు అదుపులోకి వస్తుంది.- ప్రతిరోజూ ఉదయం 10-15 నిమిషాలు ధ్యానం చేయాలి. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.- బ్రెష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. శరీరంలోని కొవ్వును కరిగించడంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.- అధిక ప్రోటీన్ అల్పాహారం తీసుకోవాలి. తీవ్రమైన వ్యాయామంతో శరీరం అలసిపోతుంది. తక్కువ మోతాదులో ఎక్కువ ప్రోటీన్ ఉండేలా అల్పాహారం తీసుకోవాలి.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'బరువు తగ్గడానికి ఉదయం పూట ఇలా చేయండి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: బిజేపీ కురువృద్ధుడు మౌనం వీడారు
గాంధీనగర్ లోక్ సభ స్థానానికి అమిత్ షా ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలతో బీజేపీ అగ్రనాయకత్వంపై అలకబూనిన బిజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ఎట్టకేలకు బ్లాగ్ ద్వారా తన మనసులో మాటలను బయటపెట్టారు.నేషన్ ఫస్ట్.పార్టీ నెక్స్ట్.సెల్ఫ్ లాస్ట్ అన్న హెడ్ లైన్ తో 509 పదాలతో పొడవైన లేఖను తన బ్లాగ్ లో ఉంచారు.శనివారం బిజేపీ ఫౌండేషన్ సందర్భంగా కార్యకర్తలకు బ్లాగ్ ద్వారా దిశానిర్దేశం చేశారు అద్వానీ.1991నుంచి ఆరుసార్లు లోక్ సభకు పంపిన నా గాంధీనగర్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ణతలు అని అద్వానీ తెలిపారు. అద్వానీ తన బ్లాగ్ లో.బిజేపీలో ఉన్న మనందరికీ వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఇదొక ముఖ్యమైన సందర్భం.ముందుకు వెళ్దాం.బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకడిగా దేశ ప్రజలతో,మరీ ముఖ్యంగా నా పార్టీలోని లక్షలాది మంది కార్యకర్తలతో నా రిఫ్లెక్షన్స్ పంచుకోవడం నా బాధ్యతగా పరిగణిస్తాను.ఇద్దరూ కూడా తమ ఆపాయ్యత,గౌరవాలతో నన్ను రుణపడి ఉండేలా చేశారు.మొదట దేశం.ఆ తర్వాతే వ్యక్తిగతం ఇదే నా జీవితపు సిద్దాంతం అని అద్వాణీ తెలిపారు.అన్నీ సందర్భాల్లో ఈ సిద్దాంతానికి కట్టుబడి ఉన్నానని.ఇలానే భవిష్యత్తులో కూడా ఉంటానని తెలిపారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అంశం గురించి ప్రస్తావిస్తూ.భారతదేశ ప్రజాస్వామ్య గొప్పతనం. భావవ్యక్తీకరణను,భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించడమేనన్నారు.మొదటి నుంచీ కూడా రాజకీయంగా తమను వ్యతిరేకించేవాళ్లని బిజేపీ ఎప్పుడూ శతృవులుగా చూడలేదన్నారు.కేవలం విపక్షంగా మాత్రమే చూశామని తెలిపారు. నిజమైన ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ అని అద్వానీ తెలిపారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: 13న హైదరాబాద్కు ఉప రాష్టప్రతి హమీద్ అన్సారి రాక
పకడ్బందీ ఏర్పాట్లకు చర్యలు ఉర్దూ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి హాజరు హమీద్ అన్సారి రాక సందర్భంగా బందోబస్తు హైదరాబాద్, మేజర్న్యూస్ : భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి ఈనెల 13వతేదీన హైదరాబాద్ లో పర్యటించనున్న సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు పకడ్భంది ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధర్ సిన్హా మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతి ఈనెల13 న హైదరాబాద్ లోని ఉర్ధూ యూనివర్సిటీ లో జరిగే కార్యక్రమంలో స్మారక ఉపన్యాసం ఇవ్వనున్నారని తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా అవసరమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత, రహదారుల మరమత్తులు,బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు,నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు, త్రాగునీటి సరఫరా, వైద్య,ఆరోగ్య,అగ్నిమాపక సేవలు,ఉద్యాన, సమాచార పౌర సంబంధాలు, బిఎస్ఎన్ఎల్,తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసులు తదితర శాఖల ద్వారా నిర్వహించే పనులను చేపట్టాలని సూచించారు. ఈనెల 13 న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్టులో భారత ఉపరాష్ట్రపతికి స్వాగత కార్యక్రమం ఉంటుందని, భారత ఉపరాష్ట్రపతి ఎయిర్ పోర్టు చేరుకున్న అనంతరం ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఉర్ధూ యూనివర్సిటి కి చేరుకుంటారన్నారు. కార్యక్రమ అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుండి న్యూ ఢిల్లీకి బయలుదేరి వెళతారని తెలిపారు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, మునిసిపల్ శాఖ కార్యదర్శి మరియు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ నవీన్ మిత్తల్ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, సైబరాబాద్ కమీషనర్ సందీప్ శాండిల్య, పోలీస్ అధికారులు అంజనీ కుమార్ , యం.కె.సింగ్ , ఫైర్ సర్వీసెస్ డీజి రాజీవ్ రతన్ , ప్రోటోకాల్ డైరెక్టర్ అర్వీందర్ సింగ్ లతోపాటు జి.హెచ్.యం.సి, ఎయిర్ పోర్ట్ అథారిటి, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: గుంతకల్లు పట్టణంలో చిన్నారి కీర్తన మృతికి కారణమైన శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సీజ్ చేసి ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చిన్నారి మృతికి నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ఆ చిన్నారి కుటుంబానికి యాజమాన్యం 25 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'పాఠశాలను సీజ్ చేయాలి: విద్యార్థి సంఘాలు'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో శుక్రవారం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పోటీచేయుచున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి కి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి యం. వి. రామచంద్రారెడ్డి కి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల పట్టణ మరియు మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: ఉమ్మడి మహబూబ్ నగర్- హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపి బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపొందడం ఉపాధ్యాయుల విజయంగా భావిస్తున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు అభివర్ణించారు. దీంతో నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని 167 వ జాతీయ రహదారిపై స్వామి వివేకానంద చౌరస్తాలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల బిజెపి బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించడంతో శుక్రవారం బీజేపి, తపస్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని ఘనంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా తపస్, బిజెపి నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్- హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, భారతీయ జనతా పార్టీ బలపరిచిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపొందడం ఉపాధ్యాయుల విజయంగా అభివర్ణించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మక్తల్ మండల గౌరవ అధ్యక్షులు వి. భీమ్ రెడ్డి, అధ్యక్షులు బి. రవీందర్, ప్రధాన కార్యదర్శి రాకేష్ కుమార్, కోశాధికారి రవీందర్ రెడ్డి, నరేష్ కుమార్, నర్సిములు, సురేష్, తిరుమల రావు, కురుమయ్య, రాజగోపాల్, జైపాల్, లక్ష్మీనారాయణ, భాజాపా అసెంబ్లీ కన్వీనర్ కర్ని స్వామి, జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డి. నరసింహారెడ్డి, కాచువార్ ఎంపీటీసీ బలరాం రెడ్డి, బాల్చేడ్ మల్లికార్జున్, చిట్యాల ఎంపీటీసీ రామలింగం, చందాపురం చంద్రశేఖర్, కనకరాజు, వాకిటి మల్లేష్, బాబు గౌడ్, చందాపురం కొండయ్య, కావలి సత్యనారాయణ, రాజు, స్వాగత్ సత్యనారాయణ, భారతీయ కిసాన్ సంఘ జిల్లా అధ్యక్షులు కావలి వెంకటేష్, విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, బజరంగదళ్ ప్రతినిధులు భాస్కర్ రెడ్డి, వాకిటి రమేష్, నరేష్ కుమార్, ఏబీవీపీ నాయకులు వంశీ, వినయ్, శరణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ఏవిఎన్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల విజయం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: భూమా అఖిలప్రియ కు బెయిల్ మంజూరు చేసిన కర్నూలు కోర్టు
టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం అఖిలప్రియ కర్నూలు మహిళా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ లభించడంతో ఆమె సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. తొలుత నంద్యాల కోర్టులో అఖిలప్రియ తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే బెయిల్ ఇవ్వడానికి నంద్యాల కోర్టు తిరస్కరించింది. దీంతో వారు కర్నూలు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు జైలు నుంచి విడుదలవుతున్న తరుణంలో కర్నూలు జైలు వద్దకు అఖిలప్రియ అభిమానులు చేరుకుంటున్నారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో రోజుకు లక్షలాది కరోనా కేసువు నమోదవుతున్నాయి. దీంతో పలు దేశాలు చైనా నుండి ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ ఆంక్షలను చైనా ఖండించింది. దేశాలన్నీ కలిసి తమపై రాజకీయాలు చేస్తున్నాయని, రాజకీయాల్లో భాగంగానే తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్నాయని ఆరోపించింది. దీనిపై తాము ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, చైనాపై ఆంక్షలు విధించిన దేశాల్లో భారత్ తో పాటు అమెరికా, యూకే ఉన్నాయి.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ ''ఆ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటాం''.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: మేఘాలయలోని పశ్చిమ ఖాసీ హిల్స్లో 4.2 తీవ్రతతో భూకంపం
మేఘాలయలోని పశ్చిమ ఖాసీ కొండల్లో ఆదివారం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.ప్రాణనష్టం లేదా నష్టానికి సంబంధించిన నివేదికలు ఇంకా తెలియరాలేదు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: రెండు కుటుంబాల్లో చీకటి నింపిన రోడ్డు ప్రమాదం
ఒక్క రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో చీకటి నింపింది. తండ్రి చనిపోయి ఇంటి బాద్యతలు మోస్తున్న ఒక యువకుడు.రంజాన్ పండగ సంతోషంగా కుటుంబంతో జరుపుకుందాం అనుకున్న మరో యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. వారిని లారీ మృత్యు రూపంలో వచ్చి మింగేసింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. నారాయణఖేడ్ మండలం నిజాంపేటకు చెందిన దూదేకుల సలీం(25) మంగలి నిఖిల్(19) ఇద్దరు మిత్రులు. కాగా బైకుపై శనివారం వారిద్దరూ శంకరంపేటకు వెళ్తున్నారు. నిజాంపేట వద్ద సంగారెడ్డి-నాందేడ్ -అకోలా రహదారిపై బోర్ డ్రిల్లింగ్, జనరేటర్ పైపులతో వెళ్తున్న లారీ వీరి బైకును వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిఖిల్ స్పాట్ లోనే చనిపోగా సలీం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. కాగా నిఖిల్ తండ్రి గతంలో మృతిచెందడంతో నిఖిల్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇపుడు నిఖిల్ మృతి ఆ కుటుంబంలో తీవ్రవిషాదాన్ని నింపింది. సలీం కూడా సిటిలో కులీ పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. పండగకి ఇంటికి వచ్చిన సలీం మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్క ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: జమ్ముకశ్మీర్: రాష్ట్రంలోని గందెర్బాల్లో ఉన్న మెయిన్ బజార్లోని ఓ ఇంట్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అయితే. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'జమ్మకశ్మీర్లో అగ్ని ప్రమాదం'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: బంగారుపై మనస్సు ఉన్నా...ధరలు మాత్రం దూరం చేస్తున్నాయి
బంగారం అంటే ఎపుడూ డిమాండే. కానీ తాజాగా బంగారం దిగుమతుల్లో ఎప్పుడూ ముందుండే భారత్. గత డిసెంబర్ లో వెనుకబడింది. బంగారం దిగుమతులు ఏకంగా 79 శాతం తగ్గిపోయాయి. రెండు దశాబ్దాల కాలంలో ఒక నెలలో ఇంత కనిష్ఠ దిగుమతులు ఇవే. బంగారం ధరలు తిరిగి గరిష్ఠాలకు చేరుకోవడంతో ప్రజల నుంచి కొనుగోళ్లు తగ్గాయి. ఫలితంగా పసిడికి డిమాండ్ పడిపోయింది. బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. 2022 డిసెంబర్ నెలలో 20 టన్నుల బంగారం దిగుమతి అయింది. కానీ 2021 డిసెంబర్ నెలలో దిగుమతులు 95 టన్నులుగా ఉండడం గమనార్హం. విలువ పరంగా చూస్తే ఏడాది క్రితం 4.73 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకోగా, క్రితం నెలలో 1.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక 2022లో మన దేశం 706 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంది. 2021లో 1,068 టన్నుల బంగారం దిగుమతితో పోలిస్తే గతేడాది 30 శాతానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది. మన దేశ బంగారం అవసరాల్లో 90 శాతం దిగుమతుల రూపంలోనే తీరుతోంది. 2022లో బంగారం దిగుమతి కోసం ఏకంగా 33.6 బిలియన్ డాలర్లు ఖర్చయింది. ధరలు పెరగడంతో రిటైల్ కొనుగోళ్లు తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: హుస్సేన్ సాగర్లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం...
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్లో ఒక్కొక్కటిగా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్బండ్పై వాహనాలు అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపబడుతున్నాయి. వినాయక సాగర్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఒకవైపు నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుండగానే. జీహెచ్ఎంసీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. రోడ్లపై ఉన్న వ్యర్థాలు, చెత్తను శుభ్రం చేస్తున్నారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: కోహ్లి నీకే నా ఓటు: గంభీర్
బంగ్లాదేశ్తో కోల్కతాలోని ఈడెన్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి. మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. భారత జట్టు విదేశాల్లో విజయాలు సాధించడమనేది గంగూలీ సారథ్యంలోనే బీజం పడిందని కోహ్లి కొనియాడాడు. దానికి కొనసాగింపే తమ ప్రస్తుత విజయ పరంపర అని కోహ్లి పేర్కొన్నాడు. అయితే దీన్ని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ వ్యతిరేకించాడు. అసలు భారత్ జట్టు విదేశీ విజయాలు సాధించింది ఎప్పుడో 70-80 దశకాల్లోనేని తెలిపాడు. గంగూలీని పొగడాలనే ఉద్దేశంతోనే కోహ్లి ఇలా చేశాడన్నాడు. తాము విజయాలు సాధించే సరికి కోహ్లి ఇంకా పుట్టలేదంటూ కాస్త వ్యంగ్యంగా మాట్లాడాడు. కాగా, ఈ వ్యవహారంపై కోహ్లికి మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అండగా నిలిచాడు. కోహ్లి చెప్పింది అక్షర సత్యమన్నాడు. ‘ కోహ్లి చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. నీకే నా ఓటు. గంగూలీ కెప్టెన్సీలోనే భారత జట్టు విదేశీ విజయాల్ని ఎక్కువగా నమోదు చేసింది. విదేశీ విజయాలకు బీజం పడింది గంగూలీ కెప్టెన్సీలోనే. అది కోహ్లి వ్యక్తిగత ఆలోచనే కావొచ్చు. కానీ అందులో ఎటువంటి అవాస్తవం లేదు. భారత్ జట్టు విదేశీ గడ్డపై గెలుపుల్ని అలవాటు చేసుకుంది గంగూలీ నేతృత్వంలో అనేది నిజం. ఇక గావస్కర్, కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు స్వదేశీ విజయాలు నమోదు చేసింది. కాకపోతే విదేశాల్లో గంగూలీ కెప్టెన్సీలోనే భారత్ విజయాలు బాట పట్టింది. ఈ విషయంలో నేను కోహ్లితో అంగీకరిస్తా’ అని గంభీర్ పేర్కొన్నాడు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: US అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ మహిళ
వచ్చే ఏఢాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్నానని భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ(51) ప్రకటించారు. ఈ నెల 15నుండి ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు. అయితే రిపబ్లికన్ పార్టీ నుండి ట్రంప్ మరోసారి పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య పోటీ జరగనుంది. నిక్కీ హేలీ రెండు సార్లు గవర్నర్ గా, ఐరాసలో అమెరికా రాయబారిగా పనిచేశారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: నూతన హాస్పటల్ ను ప్రారంభించిన : ఈటెల
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ని మైలార్ దేవ్ పల్లి లో గురువారం శ్రీ శ్రీనివాస హాస్పిటల్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్, మరియు స్థానిక ప్రజా ప్రతినిధుల, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు
అమరావతి : గన్నవరం విమానాశ్రయాన్ని ఎన్టీఆర్ విమానాశ్రయంగా పేరు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే తిరుపతి విమానాశ్రయాన్ని శ్రీవేంకటేశ్వర విమానాశ్రయంగా పేరు మారుస్తూ ఎపి శాసనమండలి తీర్మానాన్ని ఆమోదించింది.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: తమిళనాడులోని మైలాడుదురైకి చెందిన రమణి అనే మహిళకు కొడుకు రవిచంద్రన్, కూతురు విజయలక్ష్మి ఉన్నారు. ఆమె భర్త 24 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి రమణి ఓ చేపల మార్కెట్ లో పని చేస్తోంది. ఇంటిని, నగల్ని అమ్మి తన కూతురిని రష్యాకు పంపి ఎంబీబీఎస్ చదివించింది. కూతుర్ని డాక్టర్ చేయడమే కాకుండా రక్తనాళాలకు సంబంధించిన క్యాన్సర్ తో బాధపడుతున్న కొడుకుని కూడా ఆమె కాపాడుకుంటోంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఈ మహిళ ఎందరికో స్ఫూర్తి'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: చిదంబరం సతీమణి పై సిబిఐ ఛార్జిషీట్
మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం భార్య నళిని చిదంబరంపై శుక్రవారం సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. శారద పోంజి కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందనే దర్యాప్తులో భాగంగా సిబిఐ నళిని చిదంబరంపై కోల్ కతాలోని బరాసత్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2010-2014 మధ్య నళిని చిదంబరం రూ.1.4 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు. పోంజి స్కీమ్ స్కామ్ లో నళిని చిదంబరం రూ.1.4 కోట్లు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శారదా గ్రూపు యజమాని, ప్రమోటర్ అయిన సుదీప్త సేన్ తో కలిసి నళిని చిదంబరం కుట్ర చేశారని సిబిఐ ఆరోపించింది. వీళ్లిద్దరూ ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో వ్యవహరించారని, నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పింది. ఇది శారదా కుంభకోణంలో సీబీఐ దాఖలు చేసిన 6వ అనుబంధ చార్జిషీటు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: విశాఖలో హనీట్రాప్ కలకలం,సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్
విశాఖలో హనీట్రాప్ కలకలంరేపింది. స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ పాకిస్తాన్ మహిళ తమీషా హనీట్రాప్లో పడ్డారు. తమీషా అనే మహిళతో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అతడి కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో నిఘా పెట్టారు. కేంద్ర నిఘా సంస్థల సమాచారంతో కపిల్ కుమార్ను అదుపులోకి తీసుకుని. అతడి మొబైల్స్ను స్వాధీనం చేసుకుని సీఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ విచారణకు పంపించింది. తదుపరి విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీస్స్టేషన్లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇంఛార్జ్ ఫిర్యాదు చేశారు. అధికారిక రహస్యాలు ఉల్లంఘన నేరం క్రైమ్ నెంబర్ 61/2003 సెక్షన్ 4,9 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. కపిల్ కుమార్ 2002 నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. అంతకు ముందు రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో విధులు నిర్వహించారు. కీలక సమాచారం పాకిస్తాన్ గూఢచార సంస్థకు చేరినట్టు అనుమానిస్తున్నారు. అత్యంత గోప్యంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా విశాఖపట్నంలో గూఢచర్యం కేసులో షేక్ అబ్దుల్ రెహమాన్ జబ్బార్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో అబ్దుల్ రహమాన్ భార్య సంతా జిన్ను కూడా అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ అమ్మాయిల పేర్లతో విశాఖ నేవీ దళ సభ్యులకు ఎరవేసి దేశ రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కుట్ర పన్నారనే విషయం తెలుసుకున్న ఎన్ఐఏ. ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా విజయవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే 11 మంది నేవీ అధికారులు సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత మరో సూత్రధారిని అరెస్ట్ చేసి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ద్వారానే నేవీ అధికారులకు డబ్బులు చేరవేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ హనీట్రాప్ కేసు సంచలనంగా మారింది. ఈ దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది చూడాలి.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: ఢిల్లీలో ఆదివారం గత 24 గంటల్లో 1,530 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి అని ఢిల్లీ ప్రభుత్వ హెల్త్ బులెటిన్ తెలిపింది.దేశ రాజధానిలో 5,542 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.ప్పటివరకు 3,88,76,508 కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.గత 24 గంటల్లో 8.41 శాతం పాజిటివిటీ రేటు నమోదయింది.నగరంలో గత 24 గంటల్లో 1,104 రికవరీలు నమోదయ్యాయి, మొత్తం రికవరీల సంఖ్య 18,90,315కి చేరుకుంది.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'ఢిల్లీ కరోనా అప్డేట్'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం హయాంలో చేసిన పనులు తప్పా. వీళ్లు తట్ట మట్టి వేయలేదు. కుప్పంలో అభివృద్ధి ఆగిపోయింది. కుప్పం అంటే వైసీపీ ప్రభుత్వానికి కక్ష. హంద్రీనీవా నుంచి వి.కోటకు నీళ్లు తెస్తే. కుప్పానికి నీళ్లు తీసుకురాలేకపోయారు. వైసీపీ దొంగలు జాగ్రత్త. నేనొస్తే తోకలు కట్ చేస్తా' అని అన్నారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: యువగళం యాత్రలో ఆసక్తికర సన్నివేశం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. ఇదిలావుంటే నారా లోకేష్ యాత్ర కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఉదయం పుప్పలదొడ్డిలో పాదయాత్ర కొనసాగుతుండగా ఆసక్తికర సీన్ కనిపించింది. ఈ క్రమంలో ఓ బాలుడు టీడీపీ నేతల ఫోటోలతో ఉన్న పసుపురంగు టీషర్టు వేసుకుని లోకేష్తో పాటూ అడుగులు వేశాడు. కొద్దిసేపటికి గమనించిన లోకేష్ పిల్లవాడిని దగ్గరకు పిలిచి మాట్లాడారు. అప్యాయంగా పలకరించారు. ఈ వయసులో రాజకీయాలు ఎందుకు అంటూ బాలుడి ఒంటిపై ఉన్న టీషర్టును లాగి పక్కనున్న వాళ్లకు ఇచ్చారు. రాజకీయాలు కాదు ముందు మంచిగా చదువుకోవాలని చెప్పారు లోకేష్. బాలుడ్ని అక్కడి నుంచి పంపించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ బాలుడ్ని పిలిచి టీ షర్ట్ లాగేయడంతో టీడీపీ నేతలు ఒకింత అవాక్కయ్యారు. తర్వాత ఏం జరిగిందో తెలియడంతో నవ్వుకున్నారు. మరోవైపు నారా లోకేష్ పాదయాత్ర 75వ రోజుకు చేరింది. ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతండగా. చిరుమాను దొడ్డికి చెందిన ఖాసింబీ లోకేష్ను కలిసి తన కష్టం చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. గత నెల 31న తన భర్త రైతు రంజన్ ఆత్మహత్య చేసుకున్నాడని. రూ.9 లక్షల వరకు అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి లేకపోవడంతో తన భర్త పొలంలోనే పురుగుల మందుతాగి ప్రాణాలు తీసుకున్నట్లు చెప్పింది. గత రెండేళ్లుగా నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో పంటనష్టం వచ్చిందని చెప్పారు. తన భర్త చనిపోయినా సరే అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి కొనసాగుతోంది. తాను వెళ్లి కలెక్టర్కు తన కష్టాన్ని చెప్పి మొరపెట్టుకున్నాను అన్నారు ఖాసింబీ. ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని. సాయం చేయమని లోకేష్ను ఆమె కోరింది. వెంటనే స్పందించిన లోకేష్. ఖాసింబీ కుటుంబానికి పరిహారం కోసం ప్రభుత్వానికి లేఖరాసి పరిహారం అందేలా కృషిచేస్తామని చెప్పారు. ఈ పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో ఉందని. రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. దీనికి ఖాసింబీ కుటుంబమే ఉదాహరణగా చెప్పారు. అంతకముందు వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభమైంది. లోకేష్ పార్టీ నేతలతో కలిసి స్థానిక మహిళలు, యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కొందరు స్థానికులు లోకేష్ను కలిసి తమ ఇబ్బందుల్ని చెప్పుకున్నారు. మంగళవారం జరిగిన సభలో లోకేష్ మంత్రి గుమ్మనూరు జయరాంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంజ్ మంత్రి అంటూ టార్గెట్ చేశారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గున్ గల్ అటవీ ప్రాంతంలో వ్యక్తిని దారుణ హత్య చేశారు.యాచారం మండలం గున్ గల్ అటవీ ప్రాంతంలో చౌదర్ పల్లి గ్రామానికి చెందిన అమీర్ పెట సత్తయ్య(40) దారుణ హత్య చేసి అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లిన దుండగులు. హత్యకి గల కారణాలు ఇంకా తెలియసి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్న యాచారం పోలీసులు. మృతదేహాని పోస్ట్ మార్టం నియమితం ఉస్మానియా ఆసుపత్రి తరలించిన పోలీసులు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: ఫిన్ల్యాండ్: అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 400 మీటర్ల ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకున్న హిమదాస్. ఆ మెడల్ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జనగణమన వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా ఆ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేవారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ఆయన తన ట్యాగ్లైన్లో పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్గా హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'జాతీయ గీతాన్ని ఆలపిస్తూ కన్నీరుపెట్టిన హిమదాస్'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: కరోనా వైరస్ కేసులు స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. జులై 19 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇదే సమయంలో ప్రజలకు కొంత వెసులుబాటును కల్పిస్తున్నట్టు పేర్కొంది. షాపులు మరో గంట సేపు అదనంగా తెరుచుకుని ఉంటాయని, రాత్రి 9 గంటలకు మూతపడతాయని ప్రభుత్వం తెలిపింది. రెస్టారెంట్లు, టీ షాపులు, బేకరీలు, రోడ్ సైడ్ ఈటరీలు రాత్రి 9 వరకు ఓపెన్ గా ఉంటాయని చెప్పింది. అయితే 50 శాతం కెపాసిటీకి మించి కస్టమర్లు ఉండరాదని షరతు విధించింది. ఇదే సమయంలో ఇవన్నీ కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని చెప్పింది. క్యూలలో సోషల్ డిస్టెన్స్ ఉండాలని తెలిపింది. పెళ్లిళ్లకు 50 మందికి మించి హాజరు కాకూడదని, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని షరతు విధించింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూళ్లు, జంతు ప్రదర్శనశాలలు మూసి ఉంటాయని చెప్పింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై నిషేధాన్ని కొనసాగించింది. అయితే పాండిచ్చేరికి మాత్రం బస్పు సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ ప్రొటోకాల్ ను పాటిస్తూ స్టేట్, సెంట్రల్ జాబ్స్ టెస్టులను నిర్వహిస్తామని తెలిపింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో యావజ్జీర కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపు బెయిల్ కోసం రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కరోనా బారిన పడ్డ తాను ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో చికిత్స చేయించుకునేందుకు అనుమతి కావాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సోకడంతో ఆయన ప్రస్తుతం జోథ్పూర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.గత బుధవారం శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కోవడంతో తొలుత మధుర దాస్ మథుర్ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఎయిమ్స్కు తరలించారు. కాగా జోథ్ పూర్ జైల్లో ఆశారంతో సహా 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా తాను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరగనుంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ఆయుర్వేద చికిత్స కోసం బెయిల్ ఇవ్వండి: ఆశారాం'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఈనెల 26న అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్
సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ఈనెల 17న సీఎం జగన జిల్లా పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 26న జిల్లాకు సీఎం రానున్నారు. ఆ మేరకు సోమవారం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. నార్పల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన రెడ్డి వసతి దీవెన సొమ్మును బటన నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు విడుదల చేయనున్నారు. 26న ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన బయల్దేరి ఉదయం 9.45 గంటలకు పుట్టపర్తి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్లో నార్పల మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర హైస్కూల్కు చేరుకుని అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన నార్పల క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చేరుకుని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రోడ్డు మార్గానా హెలీప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నాం 12.45 గంటల నుంచి మధ్యాహ్నాం 1.05 గంటల వరకూ వైసీపీ స్థానిక లీడర్లతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నాం 1.10 గంటలకు జిల్లాలో పర్యటన ముగించుకొని హెలిక్యాప్టర్లో పుట్టపర్తికి బయలుదేరి, ప్రత్యేక విమానంలో గన్నవరానికి వెళ్తారు.
1
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: పల్లెల్లో పంద్రాగస్టు నుంచి శ్రమదానం : మంత్రి జూపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి ప్రతి పల్లెలో శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. రాష్ర్టాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో 15వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో శ్రమదానం నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రమదానం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమవుతుందన్నారు. వర్షాకాలంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు రాకుండా ఉంటాయన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ప్రజల సహకారం అవసరమన్నారు. ఆరోగ్య తెలంగాణతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్న మంత్రి జూపల్లి. ప్రజలందరూ స్వచ్ఛందంగా శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: న్యూఢిల్లి : తమిళనాడులోని తిరువారూర్ నియోజక వర్గానికి ఈ నెల 28న జరుగనున్న ఉప ఎన్నిక వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉప ఎన్నిక నిర్వహణ వల్ల గజ తుపాన్ పునరావాస కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని, కనుక ఈ ఉప ఎన్నికను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పేర్కొంటూ సిపిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించక్కరలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'తిరువారూర్ ఉప ఎన్నిక వాయిదా పిటిషన్పై విచారణకు తొందరలేదు : సుప్రీంకోర్టు'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: చిన్నారి బాలికపై అత్యాచారయత్నం
శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది చోటు చేసుకుంది. సోంపేట మేజర్ పంచాయతీ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (4వ తరగతి)పై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. గతకొద్ది రోజులుగా బాలికతో సన్నిహితంగా ఉంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో బాలికను రెండురోజుల క్రితం వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో ఆ బాలిక కేకలు వేసింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని బాలికను రక్షించుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని మంగళవారం బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా ఎస్ఐ కేసు నమోదు చేశారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ వేగవంతం చేసింది. సోమవారం సీబీఐ అధికారులు పులివెందులలో పర్యటించారు. వివేకా నివాసంలో హత్య జరిగిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. అనంతరం వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతలను 3 గంటలు పాటు సీబీఐ బృందం విచారించింది. హత్య జరిగిన రోజు నుండి ఇప్పటి వరకు 16 నెలలు పాటు జరిగిన అన్ని పరిస్ధితులపై వివరాలను సేకరించినట్లు సమాచారం. 2019 మార్చి 14న వివేకానందారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'వివేకా కుటుంబసభ్యులను కలిసిన సీబీఐ'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై చెప్పడానికి పదజాలం కూడా లేదని కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి అన్నారు. శనివారం ఏబీఎన్తో మాట్లాడుతూ. సోదరిగా వెళ్లి అన్నా మీ ఆశీర్వాదం కావాలని ఎన్నోసార్లు కోరినా నమ్మకద్రోహం చేసేలా మాట్లాడటం బాధగా ఉందన్నారు. ధనబలానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతుంది మునుగోడు ఉప ఎన్నిక అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కంకణబద్ధులై పనిచేస్తున్న సమయంలో ఇలా చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి వెనుక జరుగుతున్న కుట్రలకు నిదర్శనమే ఈ సంఘటనలని చెప్పుకొచ్చారు. మహిళా అభ్యర్థికి అవకాశం వచ్చిందని అంతా మీ వెంటే ఉండి గెలిపిస్తామని చెబుతున్నారని స్రవంతి తెలిపారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'అన్న ఇలా చేస్తాడు అని అనుకోలేదు'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: దిశ హత్యాచార కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ స్పందించారు. నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో దేశ సామాన్య పౌరురాలిగా సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. దేశ ప్రజలు ఎలాంటి ముగింపు అయితే కోరుకున్నారో అదే జరిగిందన్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు మంచి న్యాయనిర్ణేతలు అని ఆమె పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని తాము కోరుకున్నామని రాగం సుజాత యాదవ్ అన్నారు. ఎన్ కౌంటర్ చేయడం కూడా మంచిదే అని ఇకముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండడానికి ఇదొక చక్కటి ఉదాహారణ అని చెప్పారు. దేశానికి దిశ చూపించిన మన తెలంగాణ పోలీసులకు మరొకసారి కౄఎతజ్ఞతలు తెలుపుతున్నానని రాగం సుజాత యాదవ్ అన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'దేశానికి దిశ చూపించిన మనపోలీసులు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి లో ఇవాళ ఫ్రీడమ్ 5 కె రన్ జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రమంత్రి వర్యులు శ్రీనివాసగౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజీత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపుది గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు , స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ , డాక్టర్ శిరీష నవీన్ లు కూడా హాజరయ్యారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'కూకట్ పల్లిలో ఫ్రీడమ్ 5కే రన్'.
2
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఒక్క రోజులో హెల్మెట్ లేని 27 మంది పోలీసులకు జరిమానా
కృష్ణ జిల్లామచిలీపట్టణం కేంద్రంలో 27 మంది పోలీసులకు ట్రాఫిక్ విభాగం అధికారులు శనివారం జరిమానాలు విధించారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బందరు ట్రాఫిక్ డీఎస్పీ భరత్మాతాజీ నగరంలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే పోలీసులను పట్టుకునేందుకు స్పెషల్డ్రైవ్ నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు పోలీసు క్వార్టర్స్ల వద్ద కాపు కాసి హెల్మెట్ లేకుండా రోడ్లపైకి వచ్చిన పోలీసులను పసిగట్టి మరీ పట్టుకున్నారు. 27 మంది హెల్మెట్ లేకుండా ప్రయాణించటాన్ని గమనించి అడ్డుకోవటంతో పాటు అక్కడికక్కడే ఆన్లైన్లో జరిమానాలు విధించారు. మరో 100 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. ఒక్క రోజులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 27 మంది పోలీసులకు జరిమానాలు విధించిన భరత్మాతాజీని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్నారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: నగరంలోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మగ్గం నేసారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో పాటు జయేశ్రంజన్, శైలజా రామయ్యార్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లాల నుంచి చేనేత కార్మికులు తరలివచ్చారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిద్ధంగా లేని మోడీ : మన్మోహన్సింగ్
న్యూఢిల్లి : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాఫెల్ డీల్పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నాయని ఆయన అన్నారు. అయితే ప్రధాని మోడీ ప్రభుత్వం దీనికి సిద్ధంగా లేదని ఆయన అన్నారు. అంటే దీనిలో ఏదో కుంభకోణం జరిగిందని అర్థమవుతోందని ఆయన చెప్పారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాు చేపట్టామని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ వ్యతిరేక శంఖారావం పూరించామని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా సాధించేదేమీలేదని, మోదీకి కేసీఆర్, జగన్ బానిసలని వర్ల రామయ్య విమర్శించారు. కేసు మాఫీ కోసం జగన్ నాటకాలాడుతున్నారని, జీవీఎల్ ఒక చెత్తని, పిచ్చోడిలా మాట్లాడుతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'వారు మోడీ బానిసలు : వర్ల రామయ్య'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ...తెరపైకి కొత్త వాదన!
ప్రపంచంలో వీడని మిస్టరీలలో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ. అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూరో రిక్టో మద్యన 7లక్షల చదరపు కిలోమేటర్ల మేర ఇది విస్తరించి ఉంది. డెవిల్ ట్రయాంగిల్గా పేరున్న ఈ ప్రదేశానికి దగ్గరగా వెళ్లే పెద్ద పెద్ద ఓడలే కాదు. దాని పైన వెళ్లే విమానాలు సైతం అదృశ్యమవుతాయి. గత వందేళ్లలో అటుగా వెళ్లిన సుమారు 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి. అయితే అవన్నీ అదృశ్యమవ్వడం వెనుక శాస్త్రవేత్తలు పలు రకాలు వాదనలు వినిపించారు. ఆ ప్రాంతంలో అగ్ని బిలాల వలనే ఇలా జరుగుతున్నాయని. ఏలియన్లే అటుగా వెళ్తోన్న నౌకలు, విమానాలను నాశనం చేస్తున్నాయని. సముద్రంలో పిరమిడ్లు ఉండటం వల్లే ఇలా జరుగుతుందని. ఆ ప్రాంతంలో భూమాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతుందని. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. కాగా తాజాగా ఈ మిస్టరీపై నమ్మశక్యమైన కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు యూనివర్సిటీ ఆఫ్ సౌతంఫ్టన్ రీసెర్చర్ డాక్టర్ సిమన్ బాక్సల్. ఆ ప్రదేశంలో ఉత్తర, దక్షిణాల నుంచి వచ్చే ఉద్రిక్త అలలకు తోడు ఫ్లోరిడా నుంచి వచ్చే భారీ అలల వలన రోగ్ వేవ్స్ ఏర్పాడుతాయని దాని వలనే భారీ ఓడలు సైతం అక్కడ అదృశ్యమవుతున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ రోగ్ వేవ్స్ వంద అడుగుల ఎత్తుకు ఎగిసిపడతాయని అందుకే విమానాలు సైతం అక్కడ గల్లంతవుతున్నాయని సిమన్ బాక్సల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ డాక్యుమెంటరీని కూడా ఆయన విడుదల చేశారు. కాగా ఆయన చెప్పిన దాంట్లో నిజమెంతుందో తెలీదు కానీ నమ్మశక్యంగా మాత్రం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: తుఫాన్ బీభత్సానికి తల్లడిల్లుతున్న ఆఫ్రికా
తుఫాన్, వరదల ధాటికి ఆఫ్రికా అతలాకుతలం అవుతోంది. ప్రకృతి బీభత్సానికి ఆఫ్రికాలోని దక్షిణాది ప్రాంతంలో ఇప్పటికే 700 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక్క మొజాంబిక్ లోనే 417 మంది చనిపోగా. జింబాబ్వేలో 259 మంది, మాలావిలో 56మంది చనిపోయినట్టు సమాచారం.అలాగే వేలాదిమంది ప్రజలు చెట్ల పైనా. ఇంటి పైకప్పుల పైనా కూర్చొని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మొజాంబిక్, జింబాబ్వే, మాలవిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.మూడు దేశాల్లో మొత్తం 20 లక్షల పైచిలుకు ప్రజలు వరదల బారిన పడినట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 1500 మంది వరదల్లో అత్యవసర సహాయం కోసం ఎదురుచూస్తున్నారని మొజాంబిక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ను అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నీచమైన కార్యక్రమాలు మానుకోవాలని హితువు పలికారు. ఇప్పటికైనా అక్రమ అరెస్టులు ఆపాలని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'అక్రమ అరెస్టులు ఆపాలి: ఎమ్మెల్యే గోరంట్ల'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: చెక్కు ద్వారా రూ. 2 వేల కంటే తక్కువ లావాదేవీలు జరిపితే జరిమానా
ఖాతాదారుల సేవలకు సంబంధించి ప్రతి చోటా కస్టమర్ల నుంచి డబ్బులు లాగేయడానికి ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. తాజాగా మరో నిర్ణయం ఎస్బీఐ తీసుకుంది. రూ. 2 వేలు కాని, అంతకంటే తక్కువ మొత్తం లావాదేవీలు కానీ చెక్కు ద్వారా జరిపితే రూ. 100 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి ఈ నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లో ఉందని అయితే, ఇక నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని తెలిపింది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఖాతాదారుల సేవలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు నడుం బిగించిన కేంద్రం అదే సమయంలో పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాలని యోచిస్తోంది. ప్రస్తుతం బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాదార్ అండ్ నాగర్ హవేలీకి గవర్నర్లు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం కేంద్రమంత్రులుగా ఉన్న కొందరిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపాలని యోచిస్తోంది. కల్రాజ్ మిశ్రా, లాల్జీ టాండన్, విజయ్కుమార్ మల్హోత్రా, కైలాస్ జోషీ, ఆనందీబెన్ పటేల్, మోత్కుపల్లి నర్సింహులు, సీపీ ఠాకూర్, జితిన్ రామ్ మాంఝీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక తెలంగాణ టీడీపీ సీనియర్ నేత అయిన మోత్కుపల్లికి ఈసారి గవర్నర్ గిరీ ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఏపీ, తెలంగాణకు కాకుండా మరో రాష్ట్రానికి ఆయనను పంపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఏపీ, తెలంగాణకు గవర్నర్ల నియామకంపై కేంద్రం కసరత్తు'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (26.11.2022) విజయవాడలో పర్యటించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఉదయం 11.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.20 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ...
హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రైవేటు ల్యాబరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, కార్యదర్శి శ్రీ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు, వైద్య నిపుణులు సమావేశంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నదని వారు చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని వెల్లడించారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. ‘‘హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఎక్కువ జనాభా కలిగిన నగరం. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరు ప్రఖ్యాతులు సుస్థిరంగా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎన్నోకొన్ని పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాల్సిన అవసరం ఉంది. వచ్చే వారం, పదిరోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్.బి.నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్ లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మలక్ పేట్, అంబర్ పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషా మహల్, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పుర, బహదూర్ పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు లాబరేటరీలు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలి. ప్రైవేటు హాస్పిటళ్లలో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్ గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి (హోం ట్రీట్ మెంట్)’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘హైదరాబాద్ ను కాపాడుకోవాలనే ముందు చూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వ సిద్ధంగా ఉంది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉంది’’ అని సీఎం ప్రకటించారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఇంధన డిపోలో పేలుడు... 34 మంది మృతి
నైజీరియా సరిహద్దు సమీపంలోని బెనిన్ లో శనివారం జరిగిన పేలుడులో 34 మంది మృతి చెందారు. దక్షిణ బెనిన్ పట్టణంలోని సెమె పోడ్జిలో నిషిద్ధ ఇంధన డిపో పేలడంతో ఆకాశంలో నల్లటి పొగ వ్యాపించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ కాలిన మృతదేహాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు శిశువులున్నట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఉద్యోగ వివరాలు పోస్టులు: ఆఫీస్ సూపరిండిండెంట్, వయసు: 56 సంవత్సరాలు మించకూడదు, దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్, దరఖాస్తుకు ఆఖరి తేదీ: 07-03-2020, వెబ్ సైట్: www.nmnh.nic.in/ నోటిఫికేషన్ పూర్తి వివరాలకు లింక్: bit.ly/383nfksప్రదేశం:డైరెక్టర్, నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, రూమ్ నెంబర్ 414, 4 వ ఫ్లోర్, బ్లాక్ నెంబర్ 3, సిజిఓ కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూ ఢిల్లీ 110003విద్య: డిగ్రీసంస్థ పేరు: నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీఉద్యోగ రకము: ఫుల్ టైంవేతనం: నెలకు 35,400/- వెబ్సైట్: jobs.getlokalapp.com/apply/?id=866893_uy9shrTn7b7oK-Vuz-_WWg==
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'డిగ్రీ అర్హతతో సూపరిండిండెంట్ ఉద్యోగాలు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బందర్రోడ్డులో విషాద సంఘటన చోటుచేసుకుంది. అపార్టుమెంట్లో లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. లిఫ్ట్ రాకముందే తలుపు తెరుచుకోవడంతో యువకుడు లోపలికి వెళ్లాడు. దీంతో లిఫ్ట్ లోపల ఐదో అంతస్థు నుంచి ఒక్కసారిగా కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని అదే అపార్ట్మెంట్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న షేక్ ఇర్ఫాన్గా గుర్తించారు. గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'లిఫ్ట్ రాక ముందే తెరుచుకున్న తలుపు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: రహదారి ప్రమాదాల నివారణకు విశిష్ట కృషి చేస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. అందులో భాగంగా నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తూ, సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్నది లేనిది, ప్రతి ఒక్కరు రహదారి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నది లేనిది తనిఖీ చేస్తున్నారు. దీని వలన ప్రమాదాలను అరికట్టే అవకాశం కలదు అలానే వాహన దొంగతనాలను కూడా అరికట్టగలము ధీమా వ్యక్త పరిచారు. వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అలానే, తగిన పేపర్స్ ఉండాలి, ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పసరి అని తెలియజేసారు. ఇవి లేకుండా వాహనాలు నడుపువారికి తగిన జరిమానా వేస్తాం అని హెచ్చరించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'జోరుగా వాహన తనికీలు'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. లబ్ధిదారులు సుగుణ 47, 000, నర్సింహ 60, 000 ల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, కాటేపల్లి రవీందర్ రెడ్డి, డప్పు గిరిబాబు, వేముల సంతోష్ రెడ్డి, మేకల ముత్యం రెడ్డి, సుడుగు మహేందర్ రెడ్డి, కంచర్ల సోమిరెడ్డి, ఎల్లంకి రవీందర్ రెడ్డి, రెడ్డి నాయక్, దుర్గయ్య లింగా నాయక్, సూరం శంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్ఎల్వీ– సీ 44 (పీఎస్ఎల్వీ– డీఎల్) ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించనున్నారు.కాగా, ఈ ఏడాది అంతరిక్షంలోకి 17 శాటిలైట్స్ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం కొత్త పథకం రూపొందించామన్నారు.దీని ప్రకారం 8, 9 తరగతులకు వెళ్లే విద్యార్థుల్లో జిల్లాకు ముగ్గురిని ఎంపికచేసి అంతరిక్షానికి సంబంధించిన శిక్షణ అందిస్తామన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'రేపు ఇస్రో మరో ప్రయోగం'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ప్రస్తుతం సమాజంలో కూరుకుపోయిన అవినీతి, కుల, మతతత్వాలను తరిమి కొట్టాలని ఎంపీ జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా లోక్ సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కూడా క్విట్ ఇండియా స్పూర్తితో కొనసాగిందన్నారు. తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి వంటి వారు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో డూ అర్ డై నినాదం లాగానే, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని నాడు ఉద్యమ అధినేతగా కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతిని గుర్తు చేశారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'క్విట్ ఇండియా స్పూర్తితో అవినీతిని తరిమి కొట్టాలి: ఎంపీ జితేందర్ రెడ్డి'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: మన నగరం - మన బాధ్యత
హైదరాబాద్, మేజర్న్యూస్: ఇది మన నగరం, దానిని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎవరికివాళ్లు తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మంత్రి కేటీఆర్ ఓ పౌరుడికి బాధ్యతలు గుర్తు చేశారు. మొన్న నగరంలో కురిసిన వర్షానికి చాలాచోట్ల చెట్లు నేలకూలిన విషయం తెలిసిందే. అలాంటిదే ఓ చిన్న కొమ్మ ఇంటి ముందు పడటంతో ఓ పౌరుడు కేటీఆర్కు ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పి వీటిని క్లీన్ చేయించండి సార్ అంటూ ఆయన ట్వీటేశాడు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. తప్పుగా అర్థం చేసుకోకండని, దీనికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు రావాలా? మీరు, మీ స్నేహితులతో కలిసి ఇలాంటి చిన్నచిన్న పనులు చేసుకోవచ్చునని, ఇది మన నగరమే కదా అంటూ కేటీఆర్ సూచించారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చెట్లు నేలకొరగడం, విద్యుత్స్తంభాలు విరిగిపోవడంతో రాష్ట్ర రాజధాని నగరం అంధకారంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, విద్యుత్ తీగలు తెగిపడడంతో అర్ధరాత్రి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం ఉదయం పది గంటలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులెదుర్కోన్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి దాటే వరకు ఎడతెరిపిలేకుండా కురిసింది. ఖైరతాబాద్, హిమాయత్నగర్, సికింద్రాబాద్, తార్నాక, మల్కాజ్గిరి, నాగోలు, పంజాగుట్ట, మియాపూర్, మొయినాబాద్, కాప్రా, అల్వాల్, రామంతాపూర్, దిల్సుఖ్నగర్, బోయినపల్లితో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులపై మోకాలి వరకు నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులపై వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలవడంతో అర్ధరాత్రి వేళ పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. పలు ప్రాంతాల్లో వడగళ్లు వర్షం పడింది. దీంతో ద్విచక్ర వాహనచోదకులు ఇబ్బందులు వర్ణానాతీతంగా మారాయి. వర్షం కారణంగా నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకొంది. ఉరుములు, మెరుపులకు గాలి దుమారం తోడవడంతో అనేక చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఈదురు గాలుల ధాటికి కొన్నిచోట్ల హోర్డింగ్లు నేటమట్టమయ్యాయి. మంగళవారం కురిసిన ఈదురుగాలులతో కూడిన, వడగండ్ల వర్షానికి రాజధాని నగరంలో బీభత్స వాతావరణం నెలకొంది. విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, చెట్లు కూలిపోవడం, రహదారులు నీళ్లమయవడం మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసి పరిస్థితి ఒక కొలిక్కి తీసుకువచ్చారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడగా, విద్యుత్శాఖ అధికారులు రంగంలోకి దిగి విద్యుత్ సరఫరా పునరుద్దరణకు తీవ్రంగా శ్రమించారు. ఈనేపథ్యంలో ఒక యువకుడు చేసిన ట్విట్పై కేటీఆర్ కాసింత ఘాటుగానే స్పందించారు. ఈనగరం మనదని, దాన్ని పరిశుభ్రం చేసుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని పేర్కొని నగరవాసులకు తమ బాధ్యతలను గుర్తు చేశారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు
భద్రాచలం వైపు నుంచి మణుగూరు అడ్డ రోడ్డు వైపునకు వెళ్తున్న కారు సారపాకలోని ఐటిసి ప్రాజెక్టు గేటు సమీపంలో బాలుడు అడ్డురావడంతో తప్పించే క్రమంలో పక్కనే ఉన్న మీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. కారు బోల్తాపడడంతో అందులో ఉన్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: అందాల నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ తన కన్నతల్లి అంటూ విశాఖకు చెందిన సంగీత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ యువకుడి వయసు 29 సంవత్సరాలు కావడంతో అతని వీడియో ఇప్పుటు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాను ఐవీఎప్ విధానం ద్వారా ఐశ్వర్యకు 1988లో జన్మించానని ఈ వీడియోలో సంగీత్ కుమార్ చెప్పుకున్నాడు. లండన్ లో తాను జన్మించానని, తన తండ్రి పేరు అడివేలు రెడ్డి అని చెప్పాడు. చిన్నప్పుడు ఐశ్వర్య తల్లిదండ్రులు కృష్ణరాజ్ రాయ్, వ్రిందా రాయ్ లు తనను రెండేళ్లు పెంచారని, ఆపై అడివేలు రెడ్డి, తనను విశాఖకు తీసుకు వచ్చాడని అంటున్నాడు. తనకిప్పుడు తల్లితో ఉండాలని ఉందని, ఆమే తన తల్లి అని నిరూపించే ఆధారాలు ఏవీ తనవద్ద లేదని చెబుతున్నాడు. ఇక ఈ సంగీత్ కుమార్ వ్యాఖ్యలపై ఐష్ స్పందిస్తుందో లేక నవ్వుకుని ఊరుకుంటుందో?!
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఐశ్వర్యా రాయ్ నా కన్నతల్లి: విశాఖ కుర్రాడు సంచలన వ్యాఖ్యలు !'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రసాయనాలు డంపింగ్ చేస్తున్న సంస్థల పై చర్యలు: ఎమ్మెల్యే
ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతం లో రసాయనాలు (కెమికల్స్) డంపింగ్ చేస్తున్న సంస్థలను గుర్తించామని, వాటిపై వెంటనే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్ఐఐసీ అధికారులు, డంపింగ్ యార్డ్ నిర్మూలన ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో రసాయనాలు డంపింగ్ చేస్తున్న సంస్థలను గుర్తించి వాటి వివరాలను సోమవారం మన్సూరాబాద్ లో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రసాయనాల డంపింగ్ చేస్తున్న సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి టీఎస్ఎస్ఐఐసీ, జీహెచ్ఎంసీ అధికారులకు లిఖిలపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా రాంకీ సంస్థ కూడా కంటైనర్లతో రసాయనాలు తెచ్చి డంపింగ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. రసాయనాలు డంపింగ్ చేసిన వారిని వదిలే ప్రసక్తేలేదని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: మహిళలు, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం : మంత్రి సత్యవతి
రాష్ట్రంలో గర్భిణి స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్య లక్ష్మి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానం ఇచ్చారు.ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటి. మహిళలు, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. 2015, జనవరి 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గర్భిణిలకు, బాలింతలకు ప్రతి రోజు 200 ఎంఎల్ పాలు, ఒక కోడిగుడ్డుతో పాటు భోజనం అందిస్తున్నాం. ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 16 గుడ్లు(నెలకు), 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 30 గుడ్లను(నెలకు) అంగన్వాడీ సెంటర్ నుంచి అందిస్తున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణిలు, బాలింతలు 4,65,805 మంది, ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు – 10,43,419, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు – 6,74,336 మంది లబ్ది పొందుతున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కోసం 2015 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ. 11 వందల 10 కోట్ల 89 లక్షలను ఖర్చు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలను బలోపేతం చేశాం. అంగన్వాడీ టీచర్లు విశేషంగా సేవలందిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు రూ.10,500 గౌరవ వేతనం పొందుతున్నారు. దీంట్లో కేంద్రం వాటా రూ. 2700, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,800 అని తెలిపారు. ఆయాలకు కేంద్ర వాటా రూ. 1350, రాష్ట్రం వాటా రూ. 4650 ఇస్తున్నాం. పీఆర్సీ అమలైతే టీచర్లకు రూ. 13 వేలకు పైగా, ఆయాలకు అదనంగా రూ. 1300 వస్తుందన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిక్రూట్మెంట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. గర్భిణిలు, పిల్లల పోషణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి బాలామృతం అందిస్తున్నాం అని తెలిపారు. అంగన్వాడీ ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
1
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ నరసింహన్ లకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చిత్రపటం ద్వారా చూపిస్తూ నీరు ఎక్కడి నుంచి విడుదలవుతుంది. ఎక్కడికి వెళ్తుందనేది వివరించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'కాళేశ్వరం ప్రాజెక్టు పై సీఎంలకు వివరిస్తున్న కేసీఆర్'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: రాష్ట్ర మంత్రి, వైసిపి రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుట సొంత పార్టీ నేతలు నిరసన గళం విప్పారు. ఈ ఎమ్మెల్యే తమకొద్దంటూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ వైసిపి అసమ్మతి నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయలసీమ వైసిపి నియోజకవర్గ సమీక్షల్లో భాగంగా గురువారం నాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. సమీక్షా సమావేశం భవనం వద్దకు ఆయన వస్తుండగా మార్గ మధ్యంలో కల్లుమరి గ్రామం జాతీయ రహదారి వద్ద మడకశిర వైసిపి అసమ్మతి నేతలు మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటి. ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ నళిని రంగేగౌడ్, సంగీతం నత్య అకాడమీ డైరెక్టర్ శాలిని సుధాకర్తో పాటు పలువురు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఆయన్ను కలిశారు. ఈ సమయంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున 'జగనన్న ముద్దు- మా ఎమ్మెల్యే వద్దు' అంటూ నినాదాలు చేశారు. దీనిపై మంత్రి వారితో మాట్లాడారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ వ్యవహరించరాదన్నారు. ఏవైనా ఉంటే మాట్లాడుకుందామని తెలియజేశారు. 'మీ ఎమ్మెల్యే పని అయిపోయింది. వదిలేయండి' అంటూ మంత్రి అసమ్మతి నేతలకు ఒక విధమైన సంకేతం ఇచ్చారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'మంత్రి పెద్దిరెడ్డి ఎదుట నిరసనగలం'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఒక్క ప్రాజెక్టైనా పూర్తిచేశారా... వైసీపీ సర్కార్ కు నారా లోకేశ్ సవాల్
సీఎం జగన్కు రాయలసీమలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ ముందు అయినా తనలాగా సెల్ఫీ దిగే దమ్ము ఉందా అని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క జల ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ఆయన ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చెర్లోపల్లి జలాశయాన్ని లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ పాలనను. ప్రస్తుత వైసీపీ పాలనను పోలుస్తూ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్కు రాయలసీమలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ ముందు అయినా తనలాగా సెల్ఫీ దిగే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ మేరకు లోకేష్ మంగవారం వరుస ట్వీట్లు చేశారు. ‘‘అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చెర్లోపల్లి జలాశయానికి హంద్రీనీవా జలాలను బొంతలవారిపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్తూరు జిల్లాకు తాగు, సాగునీరు వెళ్తుంది. నిలిచిపోయిందనుకున్న ప్రాజెక్టు పనులు మళ్లీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రారంభించి 2018లో పూర్తి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు సాగు, తాగునీరు అందించారు. నదుల అనుసందానం ద్వారా కృష్ణా జలాలను శ్రీశైలం నుండి 565 కి.మీ నుండి సీమకు చంద్రబాబు తీసుకొచ్చారు. 8 నియోజకవర్గాల్లోని 28 మండలాలకు ఈ నీరు చేరుతుంది. 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల మందికి తాగునీరు అందించడమే చెర్లోపల్లి జలాశయం లక్ష్యం. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అనంతపురం జిల్లాలోనూ చెరువులను నింపి తద్వారా తాగునీరు అందిస్తారు. జగన్ కు రాయలసీమలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ ముందు అయినా ఇలా సెల్ఫీ దిగే దమ్ము ఉందా?’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: న్యూఢిల్లీ : పార్లమెంట్లో ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం రాష్ర్టాలకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఒకే దేశం, ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు మొదలైన క్షణం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లలోను సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారం ఉన్నవారికి. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ. సమాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవటంలేదు. కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి. లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండాదండ ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాల్లో పీఎస్ లలో జరుగుతున్న సందర్భాలు లేకపోలేదు.ఏపీలో ఓ దళితుడికి స్టేషన్లో శిరోముండనం చేయించడం కలకలకం రేపిన తెలిసిందే. కొన్ని స్టేషన్లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతుంటాయి. ఏకంగా మద్యం తాగి పోలీసులే చిందులు వేయటం చూశాం. ఇలా పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతోను. తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ ల విషయంలో సుప్రీం కోర్టు జూలు విదిలించింది. అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ప్రతీ పోలీస్ స్టేషన్ లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు...!!'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: తగ్గిన బంగారం ధరలు
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.48,390కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.52,790కి చేరుకుంది. ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.69,500గా ఉంది.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: గద్వాల జిల్లాలోని ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం అమావాస్య సందర్భంగా అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే దేవాలయంలో చివరి శ్రావణమాస అమావాస్య సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ శాఖ తరపున ప్రముఖ హరికథ భాగవతార్ హెచ్ఎం సుధాకర్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం హరికథా కాలాక్షేపం నిర్వహించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'భక్తులను అలరించిన హరికథ'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: జోగులాంబ ఆలయంలో డీకే అరుణ
నడిగడ్డపై తెరాస ప్రభుత్వం* చిన్నచూపు చూస్తుందని, వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియామకమైన తర్వాత గురువారం తొలిసారిగా ఆమె జిల్లాలో పర్యటించారు. తొలుత ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆంజనేయస్వామి, అలంపూర్ ఆలయాలు, జమ్మిచేడులోని జమ్ములమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జోగులాంబ ఆలయ ఈవో ప్రేమ్కుమార్, అర్చకులు ఘన స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం, జోగులాంబకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ స్వామి, అమ్మవారి కృపవల్లే జాతీయ స్థాయి పదవి దక్కిందన్నారు. తెలంగాణలో భాజపా బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు భాజపా వైపే ఉన్నారని, దుబ్బాక ఎన్నికల్లో గెలుపు ఖాయమని పేర్కొన్నారు. జాతీయస్థాయి పదవి కట్టబెట్టిన మోదీ, అమిషా, నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వమే తుంగభద్ర పుష్కర పనులు ప్రారంభించాలన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు తెలియకుండా సీఎం కేసీఆర్ దాస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కిషన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అయ్యపు రెడ్డి, నాయకులు గడ్డం కృష్ణా రెడ్డి, నందిన్నె ప్రకాశ్ రావు,మిర్జాపురం రామచంద్ర రెడ్డి, శ్రీవర్ధన్రెడ్డి, అప్సర్బాషా, రవిహేగ్బోటే, సంజీవ్భరద్వాజ్, అశోక్, శ్రీనివాస్రెడ్డి, రామాంజనేయులు,బండల వెంకట్రాములు, పాండు, వెంకటేశ్వరరెడ్డి,కృష్ణవేణి, రజక జయశ్రీ, తెలుగు అనిత నర్సింహులు, రమాదేవి , పూజారి శ్రీధర్, పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి. గద్వాలలో ద్విచక్రవాహనాలతో భాజపా శ్రేణుల ర్యాలీ ఘన స్వాగతం. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మల్దకల్ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో బీచుపల్లి వద్ద, అలంపూర్ పట్టణంలో గాంధీచౌక్, గద్వాలలో ఆమెకు స్వాగతం పలికి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: నాంపల్లిలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్
ఏటా నాంపల్లిలో జరిగే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వరకు నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు తెలియజేశారు. గత ఏడాది ఎగ్జిబిషన్లో జరిగిన బారీ అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈసారి అగ్నిమాపకశాఖ సూచనల ప్రకారమే ఎగ్జిబిషన్ స్టాల్స్ నిర్మిస్తున్నామని, అగ్నిప్రమాదాలు జరుగకుండా అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నామని తెలిపారు. గత 78 సం.లుగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నా ఏనాడూ అగ్నిప్రమాదం జరుగలేదని కానీ మొట్టమొదటిసారిగా గత ఏడాది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరగడం, దానిలో కోట్లు విలువచేస్తే వస్తువులు దగ్ధం అవడం తమకు చాలా బాధ కలిగించాయని ఈటల రాజేందర్ అన్నారు. కనుక ఈసారి అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎగ్జిబిషన్ మైదానంలో విద్యుత్ వైర్లు ఎక్కడా పైకి కనబడకుండా అండర్ గ్రౌండ్ డక్ట్స్ లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారస్తులకు ఎగ్జిబిషన్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎగ్జిబిషన్ చూసేందుకు రోజు లక్షలాదిమంది ప్రజలు వస్తుంటారు కనుక ఈసారి వారి భద్రతకు మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చే సొమ్మును రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఖర్చు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: హైదరాబాద్లోని కళానగర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. రాచకొంచ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు. ఎల్బీనగర్ డీసీపీ సన్​ప్రీత్ సింగ్​ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, నిషేదిత గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'కళానగర్​లో పోలీసుల నిర్బంధ తనిఖీలు'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: రెండో టి20లో శ్రీలంకపై 9 వికెట్లతో ఆస్ట్రేలియా ఘనవిజయం
తొలి టి20 మ్యాచ్లో పరుగుల పరంగా తమ ఖాతాలో అతి పెద్ద విజయం నమోదు చేసుకున్న ఆ్రస్టేలియా. శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్లోనూ అదరగొట్టింది. తొమ్మిది వికెట్లతో ఘనవిజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 19 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. కుశాల్ పెరీరా (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్), గుణతిలక (22 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) కాస్త నయమనిపించారు. ఆసీస్ బౌలర్లలో స్టాన్లేక్ (2/23), కమిన్స్ (2/29), అగర్ (2/27), ఆడమ్ జంపా (2/20) రెండేసి వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. 118 పరుగుల లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 13 ఓవర్లలో వికెట్ నష్టపోయి అధిగమించింది. కెపె్టన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే మలింగ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. అయితే వార్నర్ (41 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు), స్మిత్ (36 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) ఎక్కడా తగ్గకుండా దూకుడుగా ఆడారు. రెండో వికెట్కు అజేయంగా 117 పరుగులు జోడించారు. వానిందు హసరంగ వేసిన ఐదో ఓవర్లో వార్నర్ నాలుగు ఫోర్లు బాదాడు. వార్నర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడో టి20 మ్యాచ్ శుక్రవారం మెల్బోర్న్లో జరుగుతుంది.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: గుజరాత్లో బీజేపీ శ్రేణుల సంబరాలు
గుజరాత్లో రికార్డు స్థాయి విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుంది. అక్కడ 182 స్థానాలకు గాను 152 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ కేవలం 20 స్థానాల్లోనే లీడింగ్లో ఉంది. బీజేపీ విజయం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు మొదలయ్యాయి. బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటున్నారు. పెద్ద ఎత్తున టపాసులు పేల్చుతున్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కి చేరింది. బుధవారం వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41 ఉంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కి చేరింది. ఈ మూడు కేసుల్లో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. వారు ఇద్దరు కూడా వైద్య దంపతులు. దీంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'తెలంగాణలో వైద్య దంపతులకు కరోనా'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: నంద్యాల ఎన్జీవో కాలనీలో నిలిచిపోయిన పోలింగ్
నంద్యాల: నంద్యాల ఉపఎన్నిక ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. మొదట్నుంచే కొన్ని బూత్లలో ఈవీఎంలు మొరాయించాయి. అప్రమత్తమైన అధికారులు ఈవీఎంలను సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆపేయాల్సి వచ్చింది.నంద్యాల ఎన్జీవో కాలనీలోని 94వ పోలింగ్ బూత్లో ఉదయం నుంచి రెండుసార్లు ఈవీఎం మొరాయించింది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బూత్ దగ్గరికి చేరుకుని ఈవీఎంలను సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లు క్యూలో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరోవైపు నంద్యాల టౌన్ పోలీస్స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరుగుతోంది.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: జైపూర్ : రాజస్థాన్లోని హనుమాన్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. ఒకరు తీవ్రంగా గాయపడటంతో. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జీపులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'రాజస్థాన్లో ఘోర ప్రమాదం'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: శాంతి భద్రతల పరిరక్షణకు కృషి: ఎస్ఐ
చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాలు, చోరీల నియంత్రణకు కృషి చేస్తానని చల్లపల్లి నూతన ఎస్ఐ సీహెచ్ చినబాబు అన్నారు. చిల్లకల్లు నుంచి చల్లపల్లికి చినబాబు బదిలీపై వచ్చారు. గురువారం ఉదయం చినబాబు తన ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఏఎస్ఐలు లక్ష్మణరాజు, ఇక్రం ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికారు. సమిష్టిగా విధులు నిర్వర్తించి ప్రజలకు మంచి సేవలు అందిద్దామని ఎస్ఐ చినబాబు సిబ్బందికి సూచించారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: నెల్లూరు జిల్లా, పట్టభద్రుల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థికి వచ్చే మెజార్టీ చూసి ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా తీర్పును తీసుకువద్దామని బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ప్రకటించారు. ఓటరు లిస్టులో పేర్లు నమోదు అనేది అత్యంత ప్రతిష్టాత్మంగా జరగాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి ఓటు నమోదు చేయించడంతో పాటు, ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. పట్టభద్రుల ఓట్లు చాలా కీలకమన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని వాళ్లు గమనిస్తున్నారని, వైయస్ జగన్మోహన్రెడ్డిపై ప్రత్యేక ఆదరాభిమానాలు వాళ్లకు ఉన్నాయన్నారు. ప్రతి ఓటు ఎంతో కీలకంగా భావించి మెజార్టీ వచ్చే విధంగా చూడాలన్నారు. చాలా కాలం తర్వాత జిల్లాలో తిరిగి పట్టభద్రుల ఎన్నికల వాతావరణం వస్తోందని, ఈ విషయంపై ప్రతి ఒక్కరం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గెలవడం ఖాయమని, మెజార్టీని చూసి ప్రతిపక్షాలు భయపడే విధంగా తీసుకుని వద్దామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, పి రూప్కుమార్, నిరంజన్బాబురెడ్డి, వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'పట్టభద్రుల ఎన్నికల్లో అధిక మెజారిటీ రావాలి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: 11 నుంచి కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 11 నుంచి నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. 11న బెంగళూరు మీదుగా రోడ్డు మార్గంలో చంద్రబాబు కుప్పం చేరుకోనున్నారు. 11, 12 తేదీల్లో కుప్పం మునిసిపాలిటీ, మండలంలో, 13న శాంతిపురం రామకుప్పం మండలాల్లో, 14న గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలు, పార్టీ నేతలతో సమావేశం అవుతారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: అలాంటి నిబంధనేదీ రాజ్యాంగంలో లేదు: వర్ల
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం టీడీపీను దెబ్బతీయడానికేనని టీడీపి పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్ని ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం పునఃసమీక్షించడానికి గానీ, పరీక్షించడానికి గానీ చట్టబద్ధత లేదన్నారు. అలాంటి నిబంధనేదీ రాజ్యాంగంలో లేదని గుర్తు చేశారు. ప్రభుత్వం అనేది నిరంతరంగా కొనసాగే వ్యవస్థ అనీ చంద్రబాబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అనడం అర్థరహితమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. గత నిర్ణయాల్ని ఎందుకు పరిశీలించాల్సి వచ్చిందో ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదన్నారు. కేవలం అనుమానంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ ఉపసంఘం, సిట్ల ఏర్పాటుకు జారీ చేసిన జీవో 1411,344లను రద్దు చేయాలని కోరారు.ఆ జీవోలపై తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుకి సవాల్ విసిరారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, దమ్ముంటే తనతో పోటీకి దిగాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు సవాలు విసిరారు. అదే వారు కనుక ఓడిపోతే రాజీనామా చేయాలని అన్నారు. బెదిరింపులు, అహంకారం, డబ్బులతో హుజూరాబాద్లో పరిస్థితిని అటుదిటు మార్చడం కేసీఆర్ జేజమ్మ తరం కూడా కాదన్నారు. తాను ధర్మం కోసం, న్యాయం కోసం దేన్నైనా త్యాగం చేసే సత్తా ఉన్నోడని ఈటల అన్నారు. ధర్మంతో పెట్టుకున్న కేసీఆర్ కు పతనం తప్పదని హెచ్చరించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని, రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఇదేనని అన్నారు. కేసీఆర్తో తనకు 18 సంవత్సరాల అనుబంధం ఉందని, కాబట్టే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రాజీనామా చేయమంటే ముఖం మీద కొట్టి వచ్చానని ఈటల పేర్కొన్నారు. గత రాత్రి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నానని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాటిముందు ఫలించవని అన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'కేసీఆర్, హరీశ్రావులకు ఈటల సవాల్'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కలకలం రేపుతున్న చిరుత సంచారం...
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో జనసంచారం లేకపోవడంతో అడవి జంతువులు అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్లో చిరుత సంచారం కలకలం రేపింది. రైల్వే గెస్ట్ హౌస్లో పనిచేస్తున్న వాచ్మెన్. కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో కుక్క అరుపులు విన్పించడంతో వాచ్మెన్ కుటుంబం బయటకు వచ్చారు. ఒక్కసారిగా చిరుతను చూడడంతో భయంతో ఇంట్లోకి పరుగులు తీశారు. అనంతరం చిరుతపులి ఆ కుక్కను నోటితో కరుచికుని తీసుకెళ్లిపోయింది. హార్సిలీహిల్స్లో చిరుత దాడి చేయడం ఇది మూడో సారి. దీంతో హార్సిలీహిల్స్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చిరుత భారీ నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: మణిపూర్ సీఎం ఇంటిపై దాడికి యత్నం
అల్లకల్లోకలంగా మారిన మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారని ఇటీవల తెలియడంతో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్కు చెందిన పూర్వీకుల ఇంటిపై దాడిచేసేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాల్లో కాల్పులు జరిపి వారిని అడ్డుకున్నారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఈ యాక్టు ప్రకారం 21 రోజుల్లో విచారణ పూర్తవుతుంది: హోం శాఖ మంత్రి సుచరిత
ప్రియాంకరెడ్డి ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో జరగకూడదన్న ఉద్దేశంలో దిశ ఏపీ 2019 యాక్టు తీసుకువచ్చామని హోం శాఖ మంత్రి సుచరిత చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ యాక్టు ప్రకారం అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడే వారిని వెంటనే అరెస్టు చేసి. 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి శిక్ష విధిస్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల రక్షణ నిమిత్తం సైబర్ మిత్ర, మహిళా మిత్ర కార్యక్రమాలను తీసుకొచ్చినట్టు చెప్పారు. అత్యాచారాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, అందుకు పలు రకాల అంశాలు దోహదం చేస్తున్నట్టు చెప్పారు. మద్యపానం, మాదకద్రవ్యాలు, పోర్న్ సైట్స్ ప్రభావాలతో మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయని, నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే తమ ప్రభుత్వం ఈ యాక్టు తీసుకువచ్చిందని సుచరిత చెప్పారు.
1
['tel']