link
stringlengths 41
231
| text
stringlengths 28
5k
|
---|---|
https://www.telugupost.com/movie-news/ttelugu-directors-alert-with-thugs-result-97403/ | ఈమధ్యన బాలీవుడ్ లో బాహుబలి సినిమాని టార్గెట్ గా చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు స్టార్ హీరోలు. రాజమౌళి బాహబలి బాలీవుడ్ ని ఆ రేంజ్ లో భయపెట్టింది మరి. తెలుగు ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి మీద పంతంతో భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో తెరకెక్కించిన మూవీస్ మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. ఎలాగైనా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలనే కసితో ఉన్నారు కానీ... కంటెంట్ లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. చైనా వంటి దేశాల్లో తిరుగులేని అమీర్ ఖాన్ థగ్స్ అఫ్ హిందూస్తాన్ సినిమా బాహుబలిని టార్గట్ చేసిన సినిమానే. ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కి మట్టి కరిచింది.బాహుబలికి పోటీగా తెలుగులోనే...అయితే తాజాగా టాలీవుడ్ లోనూ బాహుబలిని తలదన్నే రీతిలో ప్రభాస్ హీరోగా సాహో సినిమా సుజిత్ దర్శకత్వంలోని, చిరు హీరోగా సై రా నరసింహారెడ్డి సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్నాయి. బాహుబలికైన ఖర్చుతో పోలుస్తూ ఈ రెండు సినిమాల నిర్మాతలు ఆ సినిమాలకు భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అలాగే బాహుబలి మాదిరిగానే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ మర్కెట్స్ ని దృష్టిలో పెట్టుకుని సాహో నిర్మాతలు, సైరా నిర్మాతలు ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక బాహుబలికి ఏ మాత్రం తగ్గని యాక్షన్ తో సినిమాలను రెడీ చేస్తున్నారు కూడా.బడ్జెట్ కాదు... నచ్చేలా తీయాలి...కానీ థగ్స్ అఫ్ హిందుస్తాన్ చూశాక.. తమ సినిమాలో యాక్షన్, భారీ బడ్జెట్ కంటే... అందరూ మెచ్చే కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారట. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలకు టాక్ తేడా కొడితే... తెలుగులో ఏమో గాని తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాకి కలెక్షన్స్ రావడం కల. అందుకే సైరా సినిమాని, సాహో సినిమాని ఎటువంటి హడావిడి పడకుండా నీట్ గా తెరకెక్కించి.. అందరి అంచనాలు అందుకునేలా రెడీ చెయ్యాలని.. విడుదల లేట్ అయినా పర్లేదు కానీ... అందరూ మెచ్చేలా ఉండాలనే నిశ్చయానికి వచ్చారట. |
https://www.telugupost.com/movie-news/తన-స్వరాలకు-విమర్శలు-వస్-28598/ | తెలుగు సినిమా సంగీత దర్శకులలో స్వర బ్రహ్మ మణిశర్మ సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకోవటం ప్రారంభించినప్పటి నుంచి ఎస్.ఎస్.థమన్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, అప్పటికే ఐడెంటిటీ తెచ్చుకున్న దేవి శ్రీ ప్రసాద్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ అన్ని స్థాయి బడ్జెట్ చిత్రాలకు అందుబాటులో లేకపోవటం, ఎస్.ఎస్.థమన్ తమిళ చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీ అవుతుండటంతో తెలుగులో వారిని రీప్లేస్ చేసే సంగీత దర్శకులకి అవకాశాలు తలుపు తట్టాయి. ఆ క్రమంలో యువ కథానాయకుల చిత్రాలకు ఇస్తున్న ఆల్బమ్స్ తో ఉధృతంగా పాపులారిటీ సంపాదించుకున్న అనూప్ రూబెన్స్ కి పూరి జగన్నాథ్, విక్రమ్ కుమార్ వంటి దర్శకులు వరుస అవకాశాలు కలిపిస్తున్నారు.2016 సంక్రాంతి పండుగకి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం అనంతరం నాలుగైదు చిత్రాలకు స్వరాలూ సమకూర్చినప్పటికీ అనూప్ ప్రేక్షకులని అలరించలేకపోయాడు. అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ కాటమరాయుడు చిత్రానికి స్వరాలూ సమకూర్చే అవకాశం లభించింది అనూప్ కి. ఈ చిత్ర సంగీతం తో అయితే అనూప్ రూబెన్స్ ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్టార్ హీరో చిత్రానికి ఇన్ని విమర్శలు అందుకున్న అనూప్ కి క్రేజీ ప్రాజెక్ట్స్ మాత్రం వస్తూనే వున్నాయి. ఇష్క్, మనం చిత్రాలతో తనకి సంగీతం అందించిన అనూప్ నే దర్శకుడు విక్రమ్ కుమార్ ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్న అక్కినేని అఖిల్ చిత్రానికి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. మరో వైపు నేను నా రాక్షసి, హార్ట్ ఎటాక్, టెంపర్, ఇజమ్ చిత్రాలకు పూరి జగన్నాథ్ తో కలిసి పని చేసిన అనూప్ కి ఆ సాన్నిహిత్యం మూలాన ఇప్పుడు పూరి-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కి కూడా పని చేసే అవకాశం దక్కింది. ఆగడు చిత్రంతో విమర్శలు ఎదుర్కొన్న థమన్ కి తరువాత భారీ సినిమా అవకాశాలు తగ్గగా కాటమరాయుడు చిత్రంతో విమర్శలు ఎదుర్కొన్న అనూప్ రూబెన్స్ కి క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం అయ్యే అవకాశం దక్కుతుండటం విశేషం. |
https://www.telugupost.com/movie-news/గరుడ-వేగా-ఫస్ట్-వీక్-ఎండ్-48437/ | యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ నటించిన 'గరుడ వేగా' భారీ అంచనాలు మధ్య విడుదల అయింది. నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. చాలా కాలం నుండి హీరో రాజశేఖర్ కి హిట్స్ లేకపోవడం తో ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయిందిగాని మొదటి రెండు రోజులు మాత్రం అనుకున్నంత కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది.నైజాం లో పర్లేదు అనిపించుకున్న 'గరుడ వేగా' పరిస్థితి ఆంధ్రాలో మాత్రం చాలా గోరంగా వుంది. ఓవర్సీస్ లో హాలీవుడ్ సినిమా 'థోర్' రిలీజ్ అవడంతో అక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే 'గరుడ వేగా' ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే సరికి తెలుగు రాష్ట్రలలో 2.60 కోట్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 3.60 కోట్లు కలెక్ట్ చేసింది. వాటి వివరాలు మీకోసం..ఏరియా షేర్స్ ( కోట్లు )టోటల్ ఏపీ + తెలంగాణ 2 . 60 కోట్లురెస్ట్ అఫ్ ఇండియా 0 . 25 కోట్లుఓవర్సీస్ 0 . 75 కోట్లుటోటల్ వరల్డ్ వైడ్ షేర్ 3 . 60 కోట్లు |
https://www.telugupost.com/movie-news/అదంతా-ఒట్టి-రూమరే-20210/ | 'మనం' సినిమాలోలా నాగార్జున, నాగ చైతన్య కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీలో నటించనున్నారనే ఒక వార్త గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో ఒకటే హల్ చల్ చేస్తుంది. ఇక ఈ మల్టీ స్టారర్ చిత్రానికి దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజు అంటూ కూడా ప్రచారం జరుగుతున్న వేళ ఇదంతా ఒట్టి పుకారు అని కింగ్ నాగార్జునా స్వయంగా కొట్టిపారేశాడు. నాగ చైతన్యతో నేను మల్టీస్టారర్ మూవీ లో నటించబోతున్నాననే వార్తలు కేవలం ఒక రూమర్ అని నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.నాగార్జున తాజా చిత్రం 'నమో వెంకటేశాయ' విడుదలకు సిద్ధమవుతుండాగా... ఆ సినిమా విడుదల తర్వాత నాగార్జున 'రాజుగారి గది 2 ' లో నటించనున్నాడు. అయితే తన పెద్ద కొడుకు నాగ చైతన్యతో తాను మల్టీ స్టారర్ మూవీ లో నటించే అవకాశం ఇప్పట్లో లేదని తేల్చి చెప్పేసాడు నాగార్జున. |
https://www.telugupost.com/movie-news/junior-ntr-and-puri-jagannadh-movie-andhrawala-ready-for-re-release-1466168 | యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. విదేశాల్లో ఎన్టీఆర్ కు గుర్తింపు లభిస్తోంది. తాజాగా.. కొరటాల శివతో సినిమా చేసేందుకు ప్లాన్ లో ఉన్నాడు. సినిమా ప్రకటించి రోజులు గడుస్తున్నా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోందని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో సినిమాపై కాస్త అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల వేడుక కోసమై ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లాడు.ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాను ఈ నెలలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఆయనే అభిమానులకు తెలిపారు. అదే పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌లో నటించిన ఆంధ్రావాలా. అప్పట్లో ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆ ఫ్లాప్ సినిమాను త్వరలోనే రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. |
https://www.telugupost.com/telangana/crime-rate-increased-in-telangana-this-year-compared-with-2020-says-dgp-mahender-reddy-1346489 | గతేడాదితో పోలిస్తే.. 2021 సంవత్సరంలో తెలంగాణలో నేరాలు పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం వార్షిక నేర నివేదిక 2021 ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021లో నేరాల్లో నిందితులకు శిక్షపడిన కేసులు 50.3 శాతమని తెలిపారు. 80 కేసుల్లో 126 మందికి జీవిత ఖైదు పడిందని డీజీపీ పేర్కొన్నారు. అలాగే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంలో ఉండాలని ప్రభుత్వం సూచించగా.. ఆ సూచనలను సమర్థవంతంగా అమలు చేసినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 98 మంది నక్సలైట్లను అరెస్ట్ చేయగా.. మరో 133 మంది లొంగిపోయినట్లు తెలిపారు.మత ఘర్షణలు లేవుకాగా.. రాష్ట్ర ప్రజలు సహకరించడం వల్ల రాష్ట్రంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదని.. ఒక్క నిర్మల్ జిల్లా భైంసాలోనే మత విద్వేష ఘర్షణలు జరిగాయని తెలిపారు. అలాగే డయల్ 100కు ఈ ఏడాది 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఫిర్యాదు వచ్చిన 5 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని తెలిపారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చేవారి కోసం 800 స్టేషన్లలో రిసెప్షన్లను ఏర్పాటు చేశామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. 2021 సంవత్సరంలో షీ టీమ్స్ లో 5,145 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో బాధితులకు భరోసా కల్పించామని వెల్లడించారు.రోడ్డుప్రమాదాల్లో 6,690 మంది మృతిఇక హాక్ ఐ ద్వారా 83 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని డీజీపీ వివరించారు. ఎన్ని కేసులు పెట్టినా తరచూ నేరాలకు పాల్పడుతున్న 664 మందిపై పీడీ యాక్ట్ పెట్టినట్లు తెలిపారు. ఇక, ఈ ఏడాది 8,828 సైబర్ నేరాలు నమోదైనట్టు డీజీపీ చెప్పారు. అలాగే వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో 6,690 మంది మరణించారని వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.879 కోట్ల జరిమానాలు విధించినట్లు తెలిపారు. దొంగతనాలను అరికట్టేందుకు 2021లో రాష్ట్రంలో 8.5 లక్షల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది క్రైం రేటు 4.6 శాతం పెరిగిందని పేర్కొన్నారు. |
https://www.telugupost.com/movie-news/rajdhooth-movie-openings-127095/ | ఈ శుక్రవారం కూడా ప్రతి శుక్రవారం లా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి. సందీప్ కిషన్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నిన్ను వీడని నీడను నేనే, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తొలి చిత్రం గా ‘దొరసాని’ చిత్రాలతో పాటు మరో చిన్న సినిమా రిలీజ్ అయింది. ఆ రెండు సినిమాలు…. నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి తొలి చిత్రంగా వచ్చిన ‘రాజ్ దూత్’ కూడా రిలీజ్ అయింది. అయితే సందీప్, ఆనంద్ దేవరకొండ సినిమాలకు ఓ ప్లాన్డ్ గా సోషల్ మీడియాలో ప్రచారం సాగించారు. సెలెబ్రెటీస్ కూడా ఈరెండు చిత్రాలని ప్రమోట్ చేయడంతో సినిమా కొంత బజ్ వచ్చింది. అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. కనీస ఓపెనింగ్స్ రాక…. కానీ పాపం తెలుగు రాష్ట్రాల్లో రాజ్ దూత్ కు మినిమమ్ ఓపెనింగ్స్ రాలేదు. అసలు ఈసినిమా వచ్చినట్టు చాలామంది తెలియదు కూడా. దీనికి ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల చాలా మైనస్ అయిందనే చెప్పాలి. దొరసాని సినిమాకి రీజనబుల్ ఓపెనింగ్స్ వచ్చాయి. నిను వీడను నేనే సినిమాకు మరీ అద్భుతం కాకపోయినా, ఓ మాదిరిగా మంచి ఓపెనింగ్స్ నే దక్కాయి. ఓవరాల్ గా ఈ రెండు చిత్రాలు సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశముందని ట్రేడ్ అంచనా వేస్తుంది. |
https://www.telugupost.com/movie-news/dil-raju-remake-f2-movie-in-bollywood-115980/ | విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ నుంచి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ‘ఎఫ్2’ వరకూ ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రాల్లో అత్యధిక చిత్రాలు విజయాలు సాధిచాయి. హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకరు. ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ‘దిల్’ రాజు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన హిందీ పరిశ్రమలో అడుగు పెడుతున్నారు. కుటుంబ కథా చిత్రాలకు వంద కోట్ల రూపాయలు వసూలు చేసే సత్తా ఉందని నిరూపించిన ‘ఎఫ్ 2’ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. నిర్మాతగా హిందీలో ‘దిల్’ రాజుకు తొలి చిత్రమిది. త్వరలో హిందీలో రీమేక్ దిల్ రాజు, ప్రముఖ హిందీ నిర్మాత బోనీ కపూర్ సంయుక్తంగా ‘ఎఫ్ 2’ హిందీ రీమేక్ నిర్మించనున్నారు. హిందీలో అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తారు. ఇంతకు ముందు ఈ దర్శకుడు తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, ఆసిన్ జంటగా అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అలాగే, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాన్ని ‘నో ఎంట్రీ’గా రీమేక్ చేశారు. ఇప్పుడు ‘ఎఫ్ 2’ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నటించే హీరోలు, ఇతర తారాగణం తదితర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. |
https://www.telugupost.com/movie-news/అప్పుడే-మొదలెట్టేసాడు-28483/ | పవన్ నటించిన 'కాటమరాయుడు' ఫలితమెలా వున్నా పవన్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించే చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అప్పుడే పవన్ ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారిగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు నటిస్తున్నారు. వీరితోపాటు సీనియర్ నటి ఖుష్బూ కూడా ఈ చిత్రంలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నిన్న సోమవారమే మొదలైంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక ప్రత్యేకమైన కాఫీ షాప్ సెట్ లో మొదటి రోజు షూటింగ్ ని సార్ట్ చేశారు. మొదటిరోజు షూట్ లోనే పవన్ - అను ఇమ్మాన్యుయేల్ ల మీద మొదటి షాట్ చిత్రీకరించారు.ఇక మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ వారంలోనే పవన్ - త్రివిక్రమ్ సినిమా సెట్స్ లో జాయిన్ కానుందని సమాచారం. ఈ చిత్రానికి సంబందించిన మొదటి షెడ్యూల్ దాదాపు ఒక నెల పాటు హైదరాబాద్ లోనే జరగనుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా కనబడనున్నాడు. ఇక త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో వచ్చిన 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాలు ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మొదలైన మూడో ప్రాజెక్ట్ మీద లెక్కకు మించి అంచనాలున్నాయి. |
https://www.telugupost.com/crime/fire-broke-out-in-rajasthan-five-people-died-on-the-spot-in-this-accident-in-a-chemical-factory-1527216 | రాజస్థాన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మంటల్లో చిక్కుకుని ఐదుగురు మరణించగా, చాలా మంది గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.నలుగురికి పరిస్థితి...సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. ప్రమాదంలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఎన్ఎంెస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికకులు పనిచేస్తున్న సమయంలోనే బాయిలర్ పేలి మంటలు వ్యాపించడంతో వారు తప్పించుకోలేకపోయారని అధికారులు చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/జై-లవ-కుశ-క్లోసింగ్-బిజిన-48140/ | 'జై లవకుశ' సినిమా విడుదల అయ్యి నెలన్నర కావొచ్చింది. ఈ సినిమా విడుదలైనప్పుడు మిశ్రమ స్పందనతో మంచి మార్కులే వేయించుకుంది. అయితే ఈ సినిమాకి పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ముందుగానే అమ్ముకుని ప్రాఫిట్స్ లో వున్నాడు. కానీ కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం ఈ సినిమా టాక్ వల్ల పెద్దగా లాభాలు వెనకేసుకోలేదు. కొన్ని ఏరియాస్ లో పర్లేదు అనిపించిన ఈ సినిమా కొన్ని ఏరియాస్ లో మాత్రం డీలా పడిపోయింది. 'జై లవకుశ' సినిమా క్లోసింగ్ వచ్చేసరికి ఏపీ & టీఎస్ కలిపి 58 కోట్ల షేర్ వద్ద ఆగిపోయింది. 'జై లవకుశ' సినిమా ఏపీ & టీఎస్ క్లోసింగ్ షేర్ వివరాలు మీకోసం...ఏరియా షేర్స్ కోట్లలోనైజాం 16.09సీడెడ్ 12.49యూఏ 7.18తూర్పు గోదావరి 5.60పశ్చిమ గోదావరి 3.70కృష్ణ 4.70గుంటూరు 6.05నెల్లూరు 2.54ఏపీ & టీఎస్ టోటల్: 58.31 కోట్లు |
https://www.telugupost.com/movie-news/cine-actor-kota-srinivasa-raos-family-members-were-shocked-as-the-news-of-his-death-went-viral-on-social-media-1468094 | సోషల్ మీడియాలో పోస్టులు ఎవరికి తోచిన రీతిలో వారు పెడుతున్నారు. కనీసం మర్యాద, జ్ఞానం లేకుండా పోస్టులు చేయడం కొందరికి అలవాటుగా మారింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా అవాక్కయ్యారు.వీడియో విడుదల...దీంతో స్వయంగా కోట శ్రీనివాసరావు వీడియోను విడుదల చేశారు. తాను బతికే ఉన్నానని, అబద్ధపు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన కోరుకున్నారు పాపం. ఉదయం నుంచి తనకు ఆ పోస్టులు చూసి యాభైకి పైగా ఫోన్లు వచ్చాయని, చివరకు పోలీసులు కూడా బందోబస్తుకు వచ్చారని ఆయన వీడియోలో వివరించారు. సోషల్ మీడియాలో ఇలాంటి దరిద్రపు పోస్టులు ఎవరూ నమ్మవద్దని, తాను క్షేమంగానే ఉన్నానని కోట శ్రీనివాసరావు తెలిపారు. |
https://www.telugupost.com/movie-news/హాలీవుడ్-టెలి-సిరీస్-కి-అ-20232/ | 2000 నుంచి నేటివరకు 17 సంవత్సరాలు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులకి బాగా చేరువైన కథానాయిక ప్రియాంక చోప్రా యవ్వన దశ దాటిపో;'తున్న తరుణంలో కూడా బాలీవుడ్ లో బర్ఫీ, మేరీకోమ్, బాజీరావు మస్తానీ చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తన అభిమానుల సంఖ్యను నానాటికి పెంచుకుంటూ పోతూ నేటితరం కథానాయికలకు కొత్త సవాళ్లు విసురుతుంది. ప్రియాంక చోప్రా కి బాలీవుడ్ లో వున్న క్రేజ్ తో పాటు హాలీవుడ్ టెలి సిరీస్ క్వాన్టికో లో నటించటంతో గ్లోబల్ యాక్ట్రెస్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది. క్వాన్టికో టెలి సిరీస్ తో పాటు బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తూ బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ అవకాశాలు ఏవి ఒప్పుకోవటం లేదు. భారత దేశపు ఈశాన్య రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రమైన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ఆ రాష్ట్ర టూరిజం ప్రమోషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించటానికి మాత్రమే అడపాదడపా స్వదేశానికి విచ్చేస్తుంది ప్రియాంక చోప్రా.ఇంత కాలం హోమ్ ఇండస్ట్రీ ని వదిలిపెట్టి హాలీవుడ్ టెలి సిరీస్ కి కాల్ షీట్స్ కేటాయించిన ప్రియాంక చోప్రా కి మరొకసారి గొప్ప గుర్తింపు దక్కింది. ప్రియాంక చోప్రా రెండవ సారి పీపుల్స్ ఛాయస్ పురస్కారం అందుకునే అవకాశం కలిపించింది క్వాన్టికో. ఫేవరెట్ డ్రమాటిక్ యాక్ట్రెస్ విభాగంలో ప్రియాంక చోప్రా పీపుల్స్ ఛాయస్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ విభాగంలో పోటీ పడిన హాలీవుడ్ ప్రముఖ నటీమణులు వియాలో డేవిస్, వాషింగ్టన్ హెలెన్ వంటి వారిని సైతం వెనక్కునెట్టి ప్రియాంక ఈ పురస్కారాన్ని అందుకోవటం గమనార్హం. హాలీవుడ్ టెలి సిరీస్ ఇచ్చిన కిక్ తో ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ చిత్రం బేవాచ్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాదిలో వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. |
https://www.telugupost.com/movie-news/నా-లేట్-ఏం-లేదంటున్నాడు-40696/ | 'జనతా గ్యారేజ్' వచ్చిన ఆరునెలలకు బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' ను స్టార్ట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం తన సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకోనని... సినిమా అయిన వెంటనే సినిమాను లైన్లో పెట్టేస్తానని చెప్పడమే కాదు ఆ పని చేసేస్తున్నాడు కూడా. 'జై లవ కుశ' చిత్రం కాగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయిన ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత కొరటాలకు.... ఆతర్వాత మరో డైరెక్టర్ కి కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి తో ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ‘ఐతే, అనుకోకుండా ఒక రోజు, సాహసం, మనమంతా’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు మొదటి సారి ఒక స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రశేఖర్ యేలేటి చెప్పిన స్టోరీ లైన్ ఎన్టీఆర్ కి నచ్చడంతో వెంటనే దీన్ని డెవలప్ చెయ్యమని... యేలేటి కి ఎన్టీఆర్ సూచించినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు పూర్తికాగానే ఈసినిమా చేద్దామని చంద్రశేఖర్ కి ఎన్టీఆర్ మాట కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి వైవిద్యమైన కథలతో ప్రేక్షకులకు ఎప్పటికప్పుడే కొత్తదనాన్ని పరిచయం చేస్తున్న ఎన్టీఆర్ - యేలేటి కాంబోలో తెరకెక్కే మూవీ ఎలా వుండబోతుందో అంటూ అప్పుడే ఎన్టీఆర్ అభిమానులే కాదు సినిమా ఇండస్ట్రీ అంతా తెగ ఆలోచించేస్తున్నారు .ఇక ఎన్టీఆర్ కూడా బాబీ డైరేక్షన్ లో చేస్తున్న 'జై లవ కుశ'ను సెప్టెంబర్ 21 న విడుదల చెయ్యడమే ఆలస్యం త్రివిక్రమ్ మూవీకి జంప్ అవడానికి రెడీగా వున్నాడు. మరి అప్పటి కల్లా త్రివిక్రమ్, పవన్ చిత్రాన్ని ఫినిష్ చేయగలడా? అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేని ప్రశ్నే. మరి త్రివిక్రమ్ తో సినిమా అయ్యాక కొరటాలతో కూడా ఒక సినిమాకి కమిట్ అయిన ఎన్టీఆర్... ఆ సినిమా కూడా వచ్చే ఏడాది చివర్లోగాని మొదలయ్యేలా లేదు. ఎందుకంటే కొరటాల - మహేష్ కాంబోలో వస్తున్న 'భరత్ అను నేను' పూర్తయ్యాక కొరటాల శివ, రామ్ చరణ్ తో మూవీకి కమిట్ అవ్వడమే కాదు ఆఫీసియల్ గా అనౌన్సమెంట్ ఇప్పించేసారు. ఈ లెక్కన ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత యేలేటితో నటించే ఛాన్స్ ఎక్కువగా వుంది. చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో...! |
https://www.telugupost.com/crime/bollywood-actress-aiswarya-rai-attended-enforcement-directorate-hearing-in-the-panama-papers-leak-case-1344776 | పనామా పేపర్స్ లీక్స్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు సోమవారం ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సమన్లు ఇచ్చిన రోజే విచారణకు హాజరు కావాలని అధికారులు పేర్కొనగా.. ఐశ్వర్యరాయ్ ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్ లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన కింద ఐశ్వర్యను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పన్ను ఎగ్గొట్టి విదేశాలకు అక్రమంగా నగదు తరలించారన్న ఆరోపణలపై ప్రశ్నించేందుకు గాను ఈడీ ఐశ్వర్యకు నోటీసులిచ్చింది.పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలింపుకాగా.. ఐశ్వర్యరాయ్ కు గతంలోనే ఈడీ సమన్లు జారీ చేయగా.. విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కోరింది. ఇప్పుడు సమన్లు ఇవ్వగా.. హాజరయ్యేందుకు వీలుకాదని తెలిపింది. కానీ ఈడీ ఖచ్చితంగా హాజరుకావాల్సిందేనని చెప్పడంతో ఐశ్వర్యరాయ్ విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ నిబంధనల మేరకు 2004 నుంచి విదేశాలకు పంపిన ధనం వివరాలను తెలుపాలని గత నోటీసుల్లోనే ఈడీ పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత ధనికులు, శక్తిమంతమైన వ్యక్తులు పన్నులు ఎగ్గొట్టడానికి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధులు తరలించారని.. 2016లో లీకైన పనామా పత్రాల్లో వెల్లడైంది. అయితే లీకైన పనామా పత్రాల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ సహా భారత్‌కు చెందిన ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం. నెలరోజుల క్రితం అభిషేక్ కు కూడా నోటీసులివ్వగా.. ఈడీ విచారణకు హాజరై, కొన్నిడాక్యుమెంట్లను కూడా అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది. |
https://www.telugupost.com/movie-news/sandeep-kishan-ninu-veedan-nene-movie-review-127143/ | అంతా అయిపొయింది.. ఇక ఈ హీరో మళ్ళీ కెరీర్ లో ఎదగలేడు అని.. కేవలం ప్రేక్షకులే కాదు.. ఇండస్ట్రీలోని చాలామంది నిర్మాతలు కూడా అన్నారు. కానీ నాలుగైదు సినిమాలు పోతేనేమి నేను మళ్ళీ హీరోగా నిలదొక్కుకోగలను అని నమ్మి కష్టపడిన ఆ యంగ్ హీరో ఇప్పుడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరా హీరో ఎవరో కాదు వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్. మధ్యలో రెండు మూడు సినిమాలు హిట్ అయినా… తర్వాత మాత్రం సక్సెస్ అనే దానికి బాగా దూరమయ్యాడు. అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో… కెరీర్ లో బాగా వెనకబడి మర్కెట్ లో జీరో పొజిషన్ నుండి మళ్ళి ఇప్పుడు తేరుకున్నాడు. మొన్న శుక్రవారం సందీప్ కిషన్ నటించిన నిను వీడని నేనే సినిమా పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ పెద్దగా అంచనాలు లేవని ఎందుకన్నామంటే.. సందీప్ కిషన్ నటించిన గత సినిమాలన్నీ భారీ డిజాస్టర్స్ కావడంతో.. ప్రస్తుతం సందీప్ నటించిన సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా ఐపోయాయి. కానీ మంచి ప్రమోషన్స్ తో నిను వీడని నీడను నేనే సినిమాతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగించాడు.కాబట్టే ఈ నిను వీడని నీడను నేనే సినిమాకి సందీప్ గత సినిమాల కంటే ఐదారు రేట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా ప్రీ బుకింగ్ బాగుంది. ఇక ఈ సినిమాతో పాటు విడుదలైన దొరసాని, రాజ్ దూత్ సినిమాలలో దొరసాని యావరేజ్ టాక్ తోనూ.. రాజ్ దూత్ నెగెటివ్ టాక్ పడడం కూడా సందీప్ కిషన్ నిను వీడని నీడను నేనే బాగా కలిసొచ్చింది. మరి ఐదారు సినిమాల ప్లాప్ తో ఉన్న సందీప్ ఇప్పుడు ఈ నిను వీడని నీడను నేనే సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ని సందీప్ చాలా కమిట్మెంట్ తో చేసాడని.. గత సినిమాల ప్లాప్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా విషయంలో ఛాన్స్ తీసుకోకుండా.. రీషూట్ కూడా చేయించాడు అని చెబుతుంది మూవీ టీం. ఆ టైం లో మెయిన్ నిర్మాత ఖర్చుపెట్టలేనంటే నిర్మాతగా కూడా మారాడు. తాను అనుకున్న విధంగా సినిమా వచ్చే వరకూ తానే ఖర్చు పెట్టాడు. మరి సందీప్ పడిన శ్రమ ఈ సినిమా హిట్ తో పరిపూర్ణమైందనే చెప్పాలి. |
https://www.telugupost.com/crime/death-toll-in-pakistan-mosque-suicide-attack-reaches-100-1460302 | పాకిస్థాన్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య వందకు చేరుకుంది. పెషావర్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో మసీదులో రెండు రోజుల క్రితం ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిిసిందే. ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. మృతదేహాలను ఇంకా వెలికి తీస్తున్నారు. రద్దీగా ఉండే మసీదులో బాంబు దాడి జరగడంతో ఎక్కువ మంది మరణించారు.ఆసుపత్రుల్లో అనేక మంది...పెషావర్ ఆసుపత్రుల్లో అనేక మంది చికిత్స పొందుతున్నారు. వారిలో అనేక మంది పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు. తెహ్రీక్ - ఇ - తాలిబన్ ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ పేలుడులో 200 మందికి పైగానే గాయపడ్డారని, వారిని పెషావర్ లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ వంద మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. |
https://www.telugupost.com/movie-news/krack-9days-collections-179880/ | మాస్ మహారాజ్ రవితేజ ఎనేర్జిటిక్ పెరఫార్మెన్స్, గోపీచంద్ మలినేని మాస్ కథ తో క్రాక్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. సంక్రాతి సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో కాస్త డల్ అవడంతో మాస్ రాజా కి బాగా కలిసొచ్చింది. పెద్దగా ఎక్సపెక్ట్షన్స్ లేకుండా థియేటర్స్ లో విడుదలైన క్రాక్ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గత సినిమాలు డిజాస్టర్స్ అవడంతో.. ఈ క్రాక్ సినిమా హిట్ రవితేజకి ఊపునిచ్చింది. ఇక మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన క్రాక్ సినిమా రెండో వారంలోనూ తగ్గలేదు. క్రాక్ 9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ నైజాం: 8.45సీడెడ్: 4.49అర్బన్ ఏరియాస్: 2.99ఈస్ట్ గోదావరి : 2.29 వెస్ట్ గోదావరి: 1.85 గుంటూరు: 2.03 కృష్ణా: 1.72నెల్లూరు: 1.35ఏపీ అండ్ టీఎస్ టోటల్ :- 25.17 కోట్లు (41.65 గ్రాస్ )కర్ణాటక అండ్ ఇతర ప్రాంతాలు: 1.28ఓవర్సీస్: 0.66టోటల్: 27.11కోట్లు (44.8 గ్రాస్ ) |
https://www.telugupost.com/movie-news/gopichand-pantham-movie-78521/ | గోపీచంద్ టైం అస్సలు బాగోలేదు. వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. గౌతంనందా, ఆక్సీజెన్, ఆరడుగుల బుల్లెట్టు ఇలా వరసగా గోపీచంద్ ప్లాప్ అవుతూ వస్తున్నాడు. మాస్ మాస్ అంటూ మాస్ కథల వెంట పడడంతోనే గోపీచంద్ కి ఇలా పరాజయాలు తప్పడం లేదు. ఏదో సినిమాలు చేస్తున్నాను.. అవి విడుదలవుతున్నాయి... నాకు విజయాలతో పనేం లేదు అన్నట్టుగాగా గోపీచంద్ కెరీర్ మారిపోయింది. నిన్నటికి నిన్న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పంతం సినిమా కూడా ఏ విధంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొత్త దర్శకుడు చక్రితో కలిసి చేసిన పంతం సినిమా కి ప్రేక్షకులు క్రిటిక్స్ కూడా కేవలం యావరేజ్ మార్కులే వేశారు. మెగ్రీన్ అందాలు, గోపీచంద్ నటన కూడా సినిమాని కాపాడలేకపోయాయి.ఈ సినిమాలో కేవలం గోపీచంద్ నటన, కొన్ని ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే కోర్టులో చెప్పే డైలాగ్ తప్ప ఈ సినిమాలో ఇక మెప్పించే విధంగా ఎక్కడా కనబడలేదు. పంతం సినిమాలో పాటలు ఎందుకు పెట్టారో.. అవి ఎందుకు వచ్చి వెళుతున్నాయి కూడా చెప్పలేని చికాకు పుట్టించే పరిస్థితి. ఇక కథ ఎక్కడో చాలా సార్లు చూసేసినట్టుగా ఉండడం, హీరో, హీరోయిన్స్ మధ్య నడిచే ట్రాక్, ఏ విధంగా మెప్పించలేని మెసేజ్, పెట్టిన కామెడీ కూడా పేలకపోగా... అతిగా అనిపించడం.. ఇలా సినిమాకి ఇన్ని మైనస్ లుగా మారే సరికి ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపు బోర్ ఫీల్ అవుతూనే ఉంటారు. మరి గోపీచంద్ కెరీర్ లో నిలిచిపోయేలా తన 25 సినిమా ఉండాలనుకుంటే.. నిజంగానే గోపీచంద్ కి మరిచిపోలేని టాక్ తో పంతం సినిమా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇక పంతం కి ఎంతగా ప్రమోషన్స్ చేసారు అంటే... గోపీచంద్ ఏ సినిమాకి చెయ్యలేదు అన్నట్టుగా... మరి పంతం సినిమా కి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావనే టాక్ వినబడుతుంది. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా తన తేజ్ ఐ లవ్ యు తో నేడు ప్రేక్షకుల ముందుకు దిగుతున్నాడు. ఒకవేళ తేజ్ ఐ లవ్ యు కి టాక్ లేచిందా ఇక గోపీచంద్ దుకాణం సర్దేయాల్సిందే. లేదు సాయి ధరమ్ తేజ్ కూడా సో సో పెరఫార్మెన్స్ తో ఉంటె గనక గోపీచంద్ గట్టెక్కేస్తాడు. అయినా ఇప్పటికైనా గోపీచంద్ ఆలోచించి కథలను, దర్శకులను సెట్ చేసుకుంటే కొన్నాళ్ళు హీరోగా నిలబడతాడు. లేదంటే మళ్లీ గోపీచంద్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. |
https://www.telugupost.com/movie-news/niharika-acting-in-saira-as-a-small-episode-133904/ | మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక చేసింది మూడు సినిమాలే అయినా.. ఆ సినిమాలో చాలా ట్రెడిషనల్ గా కనబడింది. నిహారిక హీరోయిన్ మెటీరియల్ కాదు. అయినా అమ్మడు లక్కుని పరిక్షించుకుంది. మెగా సపోర్ట్ ఎంతున్నప్పటికీ.. టాలెంట్ ఉంటేనే టాప్ లెవెల్ కి చేరేది అనేది నిహారిక విషయంలో తేలింది. సూర్యకాంతం సినిమా తర్వాత సైలెంట్ గా ఉన్న నిహారిక ఈ మధ్యన సోషల్ మీడియాలో హాట్ ఫొటో షాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తానూ గ్లామర్ గర్ల్ గా గ్లామర్ షో చెయ్యగలను అని చూపిస్తుంది. అందాలు ఆరబొయ్యడానికి రెడీ అనే సంకేతాలు పంపుతుంది. గ్లామర్ కు గ్రీన్ సిగ్నల్….. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి లో చిన్న పాత్ర చేసిన నిహారిక.. తన తదుపరి చిత్రమేది సెట్స్ మీదకెళ్ళలేదు. కానీ హాట్ హాట్ ఫొటోస్ తో తాను హీరోయిన్ నే అంటూ చూపిస్తుంది. తాజాగా నిహారిక పోస్ట్ చేసిన ఫోటో లో స్లీవ్ లెస్ ఫ్రాక్ లో లూజ్ హెయిర్ తో.. హై హీల్స్ వేసుకుని.. హాట్ హాట్ గా కనబడుతుంది. మరి మడి కట్టుకుని కూర్చుంటే పని జరగదనుకుందేమో పాపం ఆ పాప.. అందుకే ఇలా అందాలు ఆరబొయ్యడం హీరోయిన్స్ కేనా.. నాకు తెలుసు అంటూ దర్శకనిర్మాతలకు గ్లామర్ షో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. |
https://www.telugupost.com/movie-news/not-doing-item-songs-162210/ | RX 100 తో యూత్ ని ఓ ఊపు ఊపిన పాయల్ రాజపుట్.. గ్లామర్ పాత్రలకి బోల్డ్ పాత్రలకి యంగ్ హీరోల పక్కన సూపర్ జోడి అనుకున్నారు కానీ.. పిలిచి అవకాశం ఇచ్చిన పాపన పోలేదు. కనీసం సీనియర్ హీరోలైన పాయల్ రాజపుట్ ని ఆదుకోలేదు. తాజాగా పాయల్ రాజపుట్ ఐటెం గర్ల్ గా సెటిల్ కాబోతుంది అనే టాక్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో భరతీయుడు 2 లో పాయల్ రాజపుట్ ఐటెం సాంగ్ లో ఆడబోతుంది అని.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఐటెం తో అదరగొట్టిన పాయల్ రాజపుట్ ని భారతీయుడు కోసం శంకర్ ఐటెం సాంగ్ కి ఎంపీక చేసారని.. లోకనాయకుడితో పాప ఐటెం సాంగ్ లో డాన్స్ వెయ్యబోతున్నట్టుగా వార్తలొచ్చాయి.అలాగే అల్లు అర్జున్ – సుకుమార్ పుష్ప లోను పాయల్ కి ఐటెం సాంగ్ వచ్చింది అంటున్నారు. పుష్ప లో మాత్రం బాలీవుడ్ పాపే ఐటెం గర్ల్ కానీ.. భారతీయుడు 2 లో పాయల్ ఆటాపాటా పక్కా అన్నారు. కానీ తాజాగా పాయల్ ఐటెం సాంగ్స్ లో నేను నటించడం లేదంటుంది. ఇలాంటి గాలి వార్తలు ఎలా పుడతాయో తెలియదంటుంది. నేను ఎలాంటి స్పెషల్ ఐటెం సాంగ్స్ చెయ్యడం లేదు. తెలిసిన వాళ్లంతా భారతీయుడు 2, పుష్ప లో ఐటెం సాంగ్స్ చేస్తున్నారట అని అడుగుతున్నారు. కానీ నేను ఎలాంటి ఐటమ్స్ చెయ్యడానికి ఏ సినిమాకి సైన్ చెయ్యలేదు. అంతేకాదు లక్డౌన్ సమయంలో నెను ఇంతవరకు ఎలాంటి షూటింగ్ లోను పాల్గొనలేదు, కొత్త కథలను వినలేదు. మంచి కథలు వస్తేనే సినిమా ఒప్పుకుంటాను అని చెబుతుంది. |
https://www.telugupost.com/crime/man-kill-19-year-old-daughter-injures-wife-over-sleeping-on-terrace-in-surat-1477218 | చిన్న చిన్న కారణాలకే దంపతుల మధ్య తలెత్తుతోన్న గొడవలు ప్రాణాలు తీసేంతవరకూ దారిస్తున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియకుండా.. హత్యలు చేసి జైలు పాలవుతున్నారు. తాజాగా గుజరాత్ లోని సూరత్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మేడపై నిద్రిద్దామన్న భార్యతో గొడవకు దిగిన భర్త.. ఆమెపై కత్తితో హత్యాయత్నం చేశాడు. అడ్డుకోబోయిన కూతురు, ముగ్గురు కొడుకులపై దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన రామానుజ్ మహాదేవ్ సాహు, రేఖాదేవి దంపతులు సూరత్ జిల్లాలోని కడోదర ప్రాంతంలో నివసిస్తుంటారు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉంది.గురువారం (మే18) రాత్రి రేఖాదేవి మేడపై నిద్రిద్దామని భర్తను కోరగా.. అందుకు మహాదేవ్ అభ్యంతరం చెప్పాడు. అనంతరం ఇద్దరూ గొడవ పడ్డారు. ఇంట్లో నుండి వెళ్లిన మహాదేవ్.. కత్తితో తిరిగివచ్చి భార్యపై దాడికి తెగబడ్డాడు. ఆమెపై హత్యాయత్నం చేశాడు. అడ్డుకున్న 19 ఏళ్ల కూతుర్ని కత్తితో 17 సార్లు పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో అతని ముగ్గురు కొడుకులు కూడా గాయపడ్డారు. కూతురిని చంపిన అనంతరం.. మహాదేవ్ పరారవ్వగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. |
https://www.telugupost.com/movie-news/ravi-teja-ready-to-play-vilan-roles-97378/ | కిక్ 2 సినిమా సమయంలో రవితేజ లుక్స్ మీద బాగా కామెంట్స్ పడ్డాయి. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసిన రవితేజ కిక్ 2 సినిమాలో బాగా ముసలితనంలో కనిపించాడని.. ఇక హీరోగా రవితేజకు అవకాశాలు అడుగంటిపోతాయనుకున్నారు. తర్వాత బెంగాల్ టైగర్ లో కాస్త ఫ్రెష్ లుక్ లో దర్శనమిచ్చిన రవితేజ, రాజా ధీ గ్రేట్, నేల టికెట్, టచ్ చేసి చూడు సినిమాల్లోనూ మునుపుటి లుక్స్ అయితే చూపించలేకపోయాడు. అయితే తాజాగా అమర్ అక్బర్ ఆంటోని సినిమాని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసాడు. ఈ సినిమాలో రవితేజ మూడు డిఫ్రెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు.ప్రస్తుతం అమర్ అక్బర్ ఆంటోని సినిమా ప్రమోషన్స్ లో ఉన్న రవితేజ చాలా ఆసక్తికర విషయాలను మీడియా మిత్రులతో పంచుకుంటున్నాడు. ఇంకా ఈ సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ... సినిమాలో నేను పోషించిన అమర్ అక్బర్ ఆంటోని పాత్రలు మూడు కూడ వేటికవే వైవిధ్యభరితమైనవి. ఈ మూడు పాత్రల్లోను కొత్తగా కనిపిస్తాను.. అని చెబుతున్నాడు. అలాగే అమర్, అక్బర్, ఆంటోని పాత్రల్లో తనకి అమర్ పాత్ర బాగా నచ్చిందని చెబుతున్నాడు. ఇక అమర్ పాత్ర సినిమా కె హైలెట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ లో రవితేజ ఉన్నాడు. ఇక రవితేజ ఎక్కడికి వెళ్లినా... ఆయన అభిమానులు ఆయన్ని విలన్ పత్రాలు కూడా చెయ్యొచ్చు కదా అని అడుగుతున్నారట. మరి విలన్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చెయ్యాలంటే... అప్పుడే కాదు... దానికి మరికొంత సమయం ఉంది... ఫ్యూచర్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించాలంటే.. అందులో భిన్నత్వం ఉండేలా కోరుకుంటానంటూ చెబుతున్నాడు రవితేజ. మరి ఒకప్పుడు హీరోలుగా చక్రం తిప్పిన అరవింద స్వామి, అర్జున్, మాధవన్ వంటి హీరోలు విలన్స్ గా రాణిస్తున్నారు కూడా. ఇక జగపతి బాబైతే... హీరోగా కెరీర్ ని ముగించేసి... విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో దోసుకుపోతున్నాడు. ఇక వీళ్ళలాగే రవితేజ కూడా హీరో గా కెరీర్ అయ్యింది అనుకున్నాక విలన్ గా రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/taxiwala-3-days-collections-98142/ | విజయ్ దేవరకొండ తన మొదటి సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని తరువాత సినిమా 'గీత గోవిందం'తో తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా విజయ్ కొత్త దర్శకుడు రాహుల్ తో 'ట్యాక్సీవాలా' సినిమాతో మన ముందుకు వచ్చాడు. రిలీజ్ అయిన మొదటి షోతోనే హిట్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 8.35 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక ఏరియా వైజ్ వివరాలు మీకోసం..ఏరియా షేర్స్ (కోట్లు)నిజాం 3.80సీడెడ్ 1.05నెల్లూరు 0.26కృష్ణ 0.65గుంటూరు 0.71వైజాగ్ 0.95ఈస్ట్ గోదావరి 0.48వెస్ట్ గోదావరి 0.45టోటల్ (ఏపీ & టీఎస్) 8.35 |
https://www.telugupost.com/movie-news/బాలయ్య-నిర్మాత-హీరో-మరి-ఇ-61675/ | గత ఆరు నెలలుగా టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయో పిక్ తెరకెక్కుతోందని న్యూస్ హల్చల్ చేస్తూనే ఉంది. ఇక 2018 జనవరి నుండి ఇదిగో అదిగో అంటున్నారే కానీ ఆ సినిమా మొదలయ్యే దాఖలాలు అయితే కనిపించడం లేదు. బాలకృష్ణ అయితే ఎన్టీఆర్ బయో పిక్ పై పట్టుదలగానే కనిపిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి తో లైమ్ టైమ్ లోకి వచ్చిన డైరెక్టర్ తేజ చెప్పిన ఐడియాలు మెచ్చి ఎన్టీఆర్ బయో పిక్ ని తేజ చేతికి అప్పజెప్పేసాడు బాలయ్య. అలా తేజ చేతికి ఎన్టీఆర్ బయో పిక్ ని ఇచ్చిన బాలయ్య తన వేరే ప్రాజెక్టు లతో బిజీ అయ్యాడు. ఇక తేజ కూడా ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన ప్రస్తుతం తేజ, వెంకీ తో ఆట నాదే వేటా నాదే సినిమాని తెరకెక్కిస్తూ బిజీగా వున్నాడు.మరి ఎన్టీఆర్ బయో పిక్ పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ.. మార్చ్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగిన తరుణంలో ఇప్పుడు కొత్తగా బాలకృష్ణ కి తేజ డైరెక్షన్ అంటే అనుమానాలు రేకెత్తుతున్నాయట. తేజ విషయంలో అసంతృప్తిగా ఉన్న బాలయ్య బాబు ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో ఒక సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నాడని టాక్ వినబడుతుంది. అదేమిటంటే ప్రస్తుతం బయో పిక్ నిర్మాణ బాధ్యతలతో పాటుగా హీరోగా తానె ఈ సినిమాలో నటిస్తున్న బాలయ్య ఇప్పుడు ఎన్టీఆర్ బయో పిక్ దర్శకత్వ బాధ్యతలను కూడా మోయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా ఒక వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో తేజ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతోనే బాలయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా టాక్. మరి బాలయ్య ఎలా అనుకున్నాడో అలాగే ఎన్టీఆర్ బయో పిక్ ని మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఎన్నికల లోపు ఈసినిమాని విడుదల చెయ్యాలని కృతనిశ్చయంతో ఉన్నాడట. చూద్దాం ఈ బయో పిక్ విషయంలో ఇంకెన్ని వార్తలు బయటికి వస్తాయో. |
https://www.telugupost.com/movie-news/jathi-rathnalu-collections-185739/ | ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)నైజాం 4.49సీడెడ్ 1.40నెల్లూరు 0.41కృష్ణా 0.75గుంటూరు 0.95వైజాగ్ 1.58ఈస్ట్ 0.79వెస్ట్ 0.73టోటల్ ఏపీ & టీస్ షేర్ 11.10 |
https://www.telugupost.com/movie-news/ttrivikram-srinivas-sentiment-71428/ | త్రివిక్రమ్ తన సినిమాలకు ఆచి తూచి టైటిల్స్ ని సెలెక్ట్ చేస్తుంటాడు. దాదాపుగా సినిమా షూటింగ్ చివరివరకు తన సినిమాల టైటిల్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. అలాగే తన సినిమాలకు ఎక్కువగా మూడక్షరాలను వాడే త్రివిక్రమ్ అత్తారింటికి దారేది అంటూ ‘అ’ టైటిల్ సెంటిమెంట్ కి తెర లేపాడు. అతడు, అత్తారింటికి దారేది, అ.. ఆ సినిమాలు సెంటిమెంట్ తోనే పవన్ కళ్యాణ్ సినిమాకి అజ్ఞాతవాసి అనే టైటిల్ పెట్టగా. అది కాస్తా తుస్సుమంది. ఇక త్రివిక్రమ్ టైటిల్ విషయంలో తీవ్ర ఆలోచన చేస్తాడు. మాములుగా తన సినిమాల టైటిళ్ల విషయంలో ప్రతిసారీ కన్ఫ్యూజన్ కి గురవుతుంటాడు.ముందు లీకులిచ్చి...ముందునుండి కొన్ని టైటిళ్లు అనుకుని వాటిని చిత్ర బృందం ద్వారా మీడియాకు లీకులిస్తాడు. అయితే తాను అనుకున్న టైటిల్స్ కి వచ్చే రెస్పాన్స్ ను బట్టి చివరగా ఒకటి ఫైనలైజ్ చేస్తాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో తాను తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్ విషయంలోనూ త్రివిక్రమ్ ఇదే పద్దతిని ఫాలో అయ్యాడు. ముందునుండి అసామాన్యుడు అనే టైటిల్ ని లీక్ చేసి ఉంచాడు. కానీ ఎన్టీఆర్ ఫాన్స్ నుండి ఆ టైటిల్ విషయంలో వ్యతిరేకత కనబడింది. తర్వాత అరవింద సమేత సిద్దార్ద్ కానీ, అరవింద సమేత రాఘవ గాని అన్నారు. కానీ ఫైనలా గా అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ ని పెట్టాడు.మళ్లీ సెంటెమెంట్ తోనే...అయితే అరవింద సమేత అనేది క్యాప్షన్ గా ఉండాల్సిన పదం. వీర రాఘవ అనేది మెయిన్ టైటిల్ అవ్వాల్సిన పదం. కానీ ఇక్కడ త్రివిక్రమ్ టైటిల్ ని తిరగేసి పెట్టినట్లుగా కనబడుతుంది. అరవింద సమేత వీర రాఘవ ఏమిటి వీర రాఘవ.. అరవింద సమేత అని ఉండాలి గాని అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఎందుకంటే వీర రాఘవ అనే టైటిల్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఉంటుంది. కానీ అరవింద సమేత అనేది హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదిగా ఉంటుంది. మరి త్రివిక్రమ్ కన్ఫ్యూజ్ అయ్యాడా, లేదంటే ‘అ’ సెంటిమెంట్ ని నమ్మి అరవింద సమేత అని పెట్టాడా అనేది ఇపుడు ఎన్టీఆర్ అభిమానుల్లో ఉన్న పెద్ద డౌట్. ‘అ’ సెంటిమెంట్ తో టైటిల్ విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ ముందు అస్సలు ఒప్పుకోలేదు. కానీ చివరికి మిగిలింది అరవింద సమేతనే. కానీ త్రివిక్రమ్ టైటిల్ విషయంలో ఎందుకు తికమక పడ్డాడో అనేది దసరాకి గాని క్లారిటీ రాదు. |
https://www.telugupost.com/movie-news/big-boss-telugu-season-3-rahul-sipligunj-and-punarnavi-139793/ | బిగ్ బాస్ లో క్యుట్స్ లవర్స్, లవ్ బర్డ్స్ గా పేరు గాంచిన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవీలు మా మధ్యన ఏం లేదు మహాప్రభో… మేము కేవలం స్నేహితులమే అని చెప్పినా ఎవరూ వినే పొజిషన్ లో లేరు. పునర్నవి కి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రాహుల్ చెప్పిన ఎవరూ వినడం లేదు. వీరిద్దరి మధ్యన ఏదో ఉండనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడలేదు. ఇక వారిమధ్యన ఉన్న సం థింగ్ సం థింగ్ వ్యవహారాన్ని క్యాష్ చేసుకునే పనిలో టివి ఛానల్స్ ఉన్నాయి. రాహుల్ తో పాటుగా పునర్నవిని కూడా షోస్ కి పిలుస్తూ… రేటింగ్స్ పెంచుకుంటున్నాయి అయితే తాజాగా రాహుల్.. పునర్నవి తాను స్నేహితులం మాత్రమే అని, ప్రేమికులం ఎప్పటికి కాలేమని క్లారిటీ ఇస్తూనే.. పునర్నవి తో సినిమా ఛాన్స్ వస్తే వదులుకోనని అంటున్నాడు. బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ క్రేజ్ పెరిగింది. సింగర్ గా అవకాశాలతో పాటుగా రాహుల్ కి హీరో వేషాలు కూడా వస్తాయని కళలు కంటున్నట్టుగా ఉన్నాడు. అందుకే తాను హీరోగా పునర్నవి హీరోయిన్ గా సినిమా పై మనసుపారేసుకున్నాడు ఈ సింగర్ గల్లీ బాయ్. తనని పునర్వి తో ఛాన్స్ వస్తే సినిమా చేస్తావా అంటే.. అంతకన్నా అదృష్టమా అంటూ సమాధానం చెబుతున్నాడంటే.. రాహుల్ కాస్త ఎక్కువగా ఊహించుకుంటున్నాడనిపిస్తుంది |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-speech-in-tamil-90838/ | మనవాడు విజయ్ దేవరకొండ ఇక్కడ మంచి పేరు, మార్కెట్ ని సంపాదించుకోడమే కాకుండా తమిళం లో కూడా తన మార్కెట్ ను పెంచుకోటానికి చాలానే ట్రై చేస్తున్నాడు. అక్కడ మనవాడు తమిళ స్పీచ్ తో ఇరగకోటేస్తున్నాడట. అక్కడ తమిళ హీరోస్ తెలుగులో ప్రొమోషన్స్ కి వచ్చి అంతంత మాత్రానా తెలుగులో మాట్లాడితే మన వాడు ఏకంగా అక్కడ తమిళ కవుల కోట్స్‌ని కూడా ఉదహరిస్తూ స్పీచులు ఇచ్చేస్తున్నాడు.అతను రీసెంట్ గా నటించిన 'నోటా' చిత్రం చేసేటప్పుడు అంతగా తమిళం వచ్చేది కాదు. అయినా కానీ ఏదో మాట్లాడాలి అన్నట్టు మాట్లాడి తన ఫస్ట్ ప్రెస్ మీట్ ని కంప్లీట్ చేసాడు . 'నోటా' సినిమా అయిపోయేలోపు నేను కచ్చితంగా తమిళంలో మాట్లాడతానని ప్రామిస్ చేసిన విజయ్.. అన్నట్టుగానే ఆ భాషపై పట్టు సాధించి స్పీచ్ ను కుమ్మేసాడు. ఇంత అనర్గళంగా తమిళం మాట్లాడుతున్న విజయ్‌ని, అతని డెడికేషన్‌నీ చూసి, అక్కడి మీడియా, సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు.తమిళ భాష నేర్చుకునేందుకు ఓ ట్యూటర్‌ని పెట్టుకుని, ఆ భాషని నేర్చుకున్నాడు విజయ్. ఇక తమిళం.. తెలుగులో ఓకేసారి రూపొందిన 'నోటా' సినిమా వచ్చే నెల 5న మన ముందుకు రానుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమా హిట్ అయితే తమిళంలోనూ పాగా వేసేయాలని చూస్తున్నాడు విజయ్. మరి ఏం జరుగుతుందో చూడాలి. తెలుగు ప్రొమోషన్స్ లో భాగంగా విజయవాడ, హైదరాబాద్ లలో మీటింగ్ పెట్టనున్నాడు విజయ్. |
https://www.telugupost.com/top-stories/will-kalvakuntla-kavitha-contest-as-nizamabad-mp-this-time-do-not-this-is-the-topic-of-discussion-in-the-rose-party-1459829 | నిజమాబాద్ ఎంపీగా కవిత పోటీ ఈసారి పోటీ చేస్తారా? చేయరా? ఇదే గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారా? అన్న దానిపైనే ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ కవిత పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిజామాబాద్ కుచెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తరచూ కవితతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఎంపీగానా? ఎమ్మెల్యేగానా?దీన్ని బట్టి ఈసారి నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి కవిత రెడీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ నేతల అంచనా కూడా అదే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత కవిత కొన్నాళ్లు ఎలాంటి పదవి లేకుండానే ఉండిపోయారు. అయితే ఆ తర్వాత భూపతి రెడ్డి పార్టీని ఫిరాయించడంతో ఏర్పడిన ఉప ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేసి శాసనమండలిలోకి ప్రవేశించారు. తొలుత కల్వకుంట్ల కవిత అసెంబ్లీకి పోటీ చేస్తారని కూడా మొన్నటి వరకూ గులాబీ పార్టీలో ప్రచారం జరిగింది.తండ్రితకి తోడుగా...కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత కవిత అవసరం ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటుందని అధినేత కూడా నమ్ముతున్నారట. కవిత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీ గెలుపొంది లోక్‌సభలో కాలుమోపారు. ఐదేళ్ల పాటు తెలంగాణ డిమాండ్లను బలంగా లోక్‌సభలో వినిపించారు. ఢిల్లీలో ఇతర పార్టీల అగ్ర నేతల పరిచయాలు కూడా కవితకు ఎక్కువగానే ఉన్నాయి. బీఆర్ఎస్ పెట్టిన పరిస్థితుల్లో తనకు చేదోడు వాదోడుగా ఢిల్లీలోనే ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ పార్టీని, ప్రభుత్వాన్ని కేటీఆర్ కు అప్పగించి తాను ఢిల్లీకి వెళ్లి దేశ రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. విజయం విషయంలోనూ...గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయినా ఈసారి గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు. ఈసారి ట్రయాంగల్ ఫైట్ ఉండటంతో తన గెలుపు నల్లేరు మీద నడకేనని కవిత కూడా భావిస్తున్నారు. గత ఎన్నికలలో మాదిరి బీజేపీకి ఏకపక్షంగా ఓట్లు పడవని, ఎంపీ ధర్మపురి అరవింద్ పైన కూడా ఉన్న అసంతృప్తి తన విజయానికి కారణమవుతుందని భావిస్తున్నారని సమాచారం. తండ్రి వెంటే దేశ రాజకీయాల్లో తోడుగా ఉండాలని కవిత సయితం భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎటూ పదవీ కాలం పూర్తవుతుంది. అంతే కాకుండా అది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో మరొక నేతకు అవకాశమిచ్చి తాను నిజామాబాద్ పార్లమెంటుకు పోట ీచేయాలని, దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని కవిత భావిస్తున్నారని సమాచారం. |
https://www.telugupost.com/crime/son-murdered-his-mother-in-anekal-bengaluru-1372608 | మొబైల్ ఫోన్ కొనివ్వలేదని తల్లిని హతమార్చాడో కొడుకు. కర్ణాటక పోలీసులు శనివారం 26 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. మైలసంద్రలోని లూకాస్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న దీపక్‌ను అరెస్టు చేశారు. జూన్ 1న దీపక్ తన తల్లి ఫాతిమా మేరీ (50)ని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి సోదరి జాయిస్ మేరీ తన తల్లి ఇంట్లో లేకపోవడంపై ఫిర్యాదు చేసింది.ఫాతిమా మేరీ ఆకుకూరలు అమ్మి కుటుంబాన్ని పోషించేది. ఆమె వయసు 50 సంవత్సరాలు. తమిళనాడుకు చెందిన ఆమె 20 ఏళ్ల క్రితం బొమ్మనహళ్లి సమీపంలోని బేగూరికి వచ్చింది. ఐదేళ్ల క్రితం లూకాస్ లేఅవుట్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆమె భర్త అనారోగ్యంతో ఉన్నాడు. 28 ఏళ్ల కుమారుడు దీపక్‌కు ఫిట్స్ ఉన్నాయి. కుమార్తె జాయిస్ మేరీకి రెండేళ్ల క్రితం వివాహమై తల్లి వద్దే ఉంటోంది. మడివాల మార్కెట్‌లోవ్యాపారం చేస్తూ ఉండేవారు. కానీ ఆమె మరణంతో కుటుంబం మొత్తం వీధిన పడింది.కొడుకు దీపక్ మొబైల్ డిస్ ప్లే మూడు నెలల క్రితం చెడిపోయింది. అప్పటి నుంచి కొత్త మొబైల్ కొనివ్వాలని తల్లిని అడుగుతూ ఉండేవాడు. కానీ తల్లి మాత్రం కొన్ని రోజులు ఆగమని చెప్పింది. జూన్ 1న ఎప్పటిలాగే ఫాతిమా మేరీ ఆకుకూరలు కోయడానికి పొలానికి వెళ్ళింది. జాయిస్ మేరీ తన సోదరుడిని పొలం నుండి తన తల్లిని తీసుకురావాలని కోరింది. దీపక్ తన తల్లి రోడ్డు పక్కన చనిపోయిందని తండ్రి ఆరోగ్యస్వామికి సమాచారం ఇచ్చాడు. పోలీసులు చేరుకొని విచారణ మొదలుపెట్టారు. అనుమానితుడిగా ఉన్న ఆమె కుమారుడిని పోలీసులు విచారించగా.. దీపక్ తన తల్లిని హత్య చేసినట్లు అంగీకరించాడు.దీపక్ తన తల్లిని కలిసిన తర్వాత ఫోన్ కొనివ్వమని మరోసారి అడిగాడని పోలీసులు తెలిపారు. ఆమె మరోసారి కుదరదని చెప్పడంతో దీపక్ ఆవేశంతో చీరతో ఆమె గొంతుకోసి చంపారు. హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె వద్ద నుంచి రూ.700 అపహరించి అక్కడి నుంచి పారిపోయాడు. |
https://www.telugupost.com/movie-news/rrr-movie-shooting-updates-122239/ | తెలుగులో మోస్ట్ పవర్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఫిలిం #RRR చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. దీన్ని దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ మూడో షెడ్యూల్ ని ఉత్తర భారతంలోని గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని ప్రదేశాలలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. అయితే షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోలకు గాయాలు అవ్వడంతో కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గా ఇద్దరు హీరోలు పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. టైటిల్ పై ఊహాగానాలు మూడో షెడ్యూల్ లోని భాగంగా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ కి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు హీరోయిన్ అలియా భట్ కూడా పాల్గొనబోతున్నారట. అలియా.. రామ్ చరణ్ కి జోడిగా కనిపించనుంది. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా హాలీవుడ్ అమ్మాయిని తీసుకున్నారు కానీ ఆమె కొన్ని కారణాలు వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో వేరే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు టీం. ఇక ఈ మూవీ టైటిల్ #RRR అంటే “రామ రావణ రాజ్యం”, “రఘుపతి రాఘవ రాజారామ్” అని అనుకుంటున్నారు చాలామంది ప్రేక్షకులు. |
https://www.telugupost.com/movie-news/a-fire-broke-out-in-the-house-of-heroine-rakul-preet-singh-accident-took-place-at-her-residence-in-mumbai-1340165 | హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలో ఉన్న ఆమె నివాసంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ముంబయిలోని ఆమె నివాసముంటన్న బిల్డింగ్ 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సహకారం అందించారు.షూటింగ్ లో రకుల్...వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం జరిగినప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నివాసంలో లేరు. షూటింగ్ లో ఉన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. |
https://www.telugupost.com/movie-news/బడా-ఆఫర్-ని-కాలదన్నిన-విజ-53141/ | ఎప్పటికప్పుడు చెబుతున్న మాటే అయినా.. అర్జున్ రెడ్డి మూవీ తో స్టార్ హీరో స్టేటస్ ని అందుకొని కెరీర్ లో మంచి ఊపు మీద ఉన్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అర్జున్ రెడ్డి తో వచ్చిన యాటిట్యూడ్ ని కూడా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి విజయంతో విజయ్ కి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. పెద్ద ఎత్తున అవకాశాలు వస్తుండటంతో విజయ్ అసలు ఏ ఆఫర్ ని ఎంచుకోవాలా అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.తెలుగులో బడా నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు ఒక్క ఆఫర్ ని అవదులుకున్నాడనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే బాలీవుడ్ లో దిగ్గజ నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ దేవరకొండ తో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు. అయితే ఆ నిర్మాణ సంస్థ వారు విజయ్ దేవరకొండని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు వరుసగా చెయ్యాలని... కాని అదే టైం లో వేరే సినిమాలు చేయొద్దని కండీషన్ కూడా పెట్టారట వారు. మరి విజయ్ అలా చెయ్యలేక యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడట.మరి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అద్భుతమైన ఆఫర్ ని అలా విజయ్ రిజెక్ట్ చేయడం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. అసలు అంత పెద్ద బ్యానర్ నుంచి ఛాన్స్ వస్తే విజయ్ ఎలా వదులుకుంటాడు అని గుసగుసలు ఆడుకుంటున్నారు అంతా. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తెలుగు అవకాశాలని మిస్ చేసుకోకూడదని ఉద్దేశం తో ఇలా బాలీవుడ్ ఆఫర్ ని వదులుకున్నాడనే టాక్ వినబడుతుంది. |
https://www.telugupost.com/movie-news/mega-brothers-chiranjeevi-and-naga-babu-shares-anjanadevi-birthday-celebrations-photos-1459912 | మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ల మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు అన్నదమ్ములు, వారి సోదరీమణులు, వాళ్ల పిల్లలంతా ఒకచోట కలిసి సెలబ్రేషన్స్ చేశారు. ఈ సందర్భంగాఆ ఫోటోలను చిరంజీవి, నాగబాబు నెటిజన్లతో పంచుకుంటూ ట్వీట్ చేశారు. "మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు అమ్మ" అని చిరంజీవి ట్వీట్ చేశారు.అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో ఫోటో షేర్ చేశారు. "మా జీవన రేఖ, జీవితం అనే కానుకతో తమను దీవించిన తల్లి జన్మదినాన్ని జరుపుకుంటున్నామని నాగబాబు వెల్లడించారు. నువ్వు మాపై కురిపించిన ప్రేమ, ఆదరణ పట్ల జీవితాంతం రుణపడి ఉంటాం అమ్మా" అంటూ భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. నాగబాబు, చిరంజీవిలు షేర్ చేసిన ఫొటోల్లో తల్లి అంజనాదేవి తో నాగబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, విజయ, మాధవి ఉన్నారు.మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు. 💐💐 జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ... 🙏Happy Birthday అమ్మ !! pic.twitter.com/SH2h5HBNN7— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2023 |
https://www.telugupost.com/movie-news/విన్నర్-ప్రీ-రిలీజ్-బిజి-24263/ | ప్రాంతం విలువ (కోట్లలో)నైజాం 6 .50సీడెడ్ 4 .40వైజాగ్ 2 .70ఈస్ట్ గోదావరి 1 .80వెస్ట్ గోదావరి 1 .60కృష్ణ 1 .70గుంటూరు 2 .20నెల్లూరు 1 .10కర్ణాటక 1 .50రెస్ట్ ఆఫ్ ఇండియా 0 .30ఓవర్ సీస్ 1 .20మొత్తం థియేట్రికల్హ క్కులు 25 .00 |
https://www.telugupost.com/movie-news/mrunal-thakur-met-harry-potter-actor-daniel-radcliffe-photo-viral-1509865 | Mrunal Thakur : టాలీవుడ్ సీత మృణాల్ ఠాకూర్.. తెలుగులో వరుస ప్రేమ కథలు చేస్తూ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నారు. రీసెంట్ గా నాని సరసన 'హాయ్ నాన్న' సినిమాలో యశ్న, వర్ష పాత్రల్లో నటించి మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ భామ హరి పోటర్ నటుడు డేనియల్ రాడ్‌క్లిఫ్ (Daniel Radcliffe) తో కనిపించారు.హరి పోటర్ సిరీస్ లో టైటిల్ రోల్ లో నటించిన డేనియల్ రాడ్‌క్లిఫ్.. అందరికి గుర్తుకు ఉండే ఉంటారు. ఆ హరి పోటర్ సిరీస్ చూడని వారంటే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు ఆ సిరీస్‌ని, అందులోని పాత్రలని ఎంతో ఇష్టపడుతుంటారు. మృణాల్ ఠాకూర్ కూడా అలాంటి ఒక అభిమానే. తాజాగా ఈ ఫ్యాన్ గర్ల్.. హరి పోటర్ ని కలుసుకున్నారు. అతనితో సెల్ఫీ దిగిన ఫోటోని, వీడియోలను తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. గతంలో విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో గీతగోవిందం వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అమెరికాలో జరుగుతున్నట్లు సమాచారం.మొన్నటివరకు ఇక్కడే హాయ్ నాన్న ప్రమోషన్స్ లో ఉన్న మృణాల్.. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కోసం వెళ్లిన క్రమంలోనే అక్కడ హరి పోటర్ ని కలుసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఫ్యామిలీ స్టార్ లో మృణాల్, విజయ్.. భార్యాభర్తలుగా నటిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు షూటింగ్ ని శరవేగంగా చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/roja-entry-into-jabardast-193828/ | గత కొన్ని రోజులుగా జబర్దస్త్ జెడ్జి ప్లేస్ లో రోజకు బదులు ఇంద్రజ కనిపిస్తుంది. రోజా ఆరోగ్య సమస్యలతో ఓ మేజర్ ఆపరేషన్ తో చెన్నై లోని స్వగృహంలో రెస్ట్ తీసుకుని ఈ మధ్యనే తన నియోజకవర్గం నగరికి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్లుగానే రోజా ఇంటి నుండే తన నియోజక వర్గం పనులని చక్కబెడుతుంది. ఇక రోజా లేకపోవడంతో ఇంద్రజ, మనో జెడ్జెస్ గా జబర్దస్త్ – ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ ఈటీవీలో ప్రసారం అవుతున్నాయి. అయితే మొన్నామధ్యన రోజా మళ్ళీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆమె ఆరోగ్యం చక్కబడడంతో రోజా మళ్ళి జబర్దస్త్ కి రాబోతుంది అన్నారు.కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో రోజా బయటికి రాదు.. ఎలాగూ కాస్త ఆరోగ్యం కుదుటపడాలి, అందులోనూ ఇంద్రజ కూడా మొనన్ ఎపిసోడ్ లో ఎమోషనల్ గ తనకి జబర్దస్త్ తో బాగా గుర్తింపు వచ్చింది అనేసరికి.. ఇక రోజా రాదనుకుంటున్నారు. అలాగే అసలే కరోనా టైం అనుకుంటే.. రోజా మాత్రం జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చేసింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ లో మనో తో పాటుగా రోజా కూడా జేడ్జ్ ప్లేస్ లో జాయిన్ అయ్యింది. మళ్ళీ రోజా తన స్థానాన్ని తాను తీసేసుకుంది. రోజా ఎప్పుడో చెప్పింది.. పాలిటిక్స్ – జబర్దస్త్ తనకి రెండు కళ్ళు అని. జబర్దస్త్ షో ని ఎట్టి పరిస్తితుల్లో వదులుకోను అని కూడా చెప్పింది. పొలిటికల్ గా ఎంత బిజీ గా వున్నా జబర్దస్త్ షో తనకి రిలీఫ్ ఇస్తుంది అని, అలాగే మనీ కోసం కూడా తాను జబర్దస్త్ షో చేస్తున్నట్లుగా చెప్పింది రోజా. ఇక ఆరోగ్యం కోసం కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన రోజా మళ్లీ జబర్దస్త్ కి వచ్చేసింది. |
https://www.telugupost.com/politics/while-tdp-leader-chandrababu-is-visiting-districts-one-after-the-other-ycp-leader-ys-jagan-is-not-leaving-the-chair-1514924 | ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్ ప్రారంభమయింది. ప్రధాన పార్టీలన్నీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల్లో భారీగా మార్పులు చేర్పులు చేపట్టారు. ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేశారు. దాదాపు యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. ఇరవై మందికి పైగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రావని తేలిపోయింది. అయితే జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. ఆయన ఇంకా సమీక్షలతోనే కాలయాపన చేస్తున్నారు. జనంలోకి రావడం లేదు.జనంలోకి రాకపోవడంతో...పార్టీ అధినేతగా జగన్ అప్పుడప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేసేందుకు నియోజకవర్గాలకు వస్తున్నారు తప్పించి పూర్తి స్థాయి ప్రచారాన్ని చేపట్టలేదు. ముదు అభ్యర్థులను ఖరారు చేసుకుని ఆయన జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే డిసెంబరులోనే తాను జనం బాట పడతానని గతంలో ప్రకటించిన జగన్ ఇంకా కుర్చీ నుంచి కదలకపోవడంతో క్యాడర్ లో కూడా కొంత నిరాశ కనపడుతుంది. జగన్ జనంలోకి వచ్చి పార్టీని మరింతగా బలోపేతం చేయాలని నేతల నుంచి క్యాడర్ వరకూ కోరుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పట్లో కదిలే అవకాశాలు కనిపించడం లేదు.క్యాడర్ లో జోష్...మరోవైపు చంద్రబాబు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రా కదిలిరా పేరిట పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేస్తూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. తొలి విడత మ్యానిఫేస్టోను రూపొందించిన చంద్రబాబు దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. సూపర్ సిక్స్ పేరిట ఆయన రాజమండ్రి లో జరిగిన మహానాడులో తొలి విడత మ్యానిఫేస్టో విడుదల చేశారు. మహిళలను, యువతను, రైతులతో పాటు సామాజికవర్గాల వారీగా అందరినీ ఆకట్టుకునేలా చంద్రబాబు జనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తులతో పాటు పార్టీలో చేరికలను కూడా ఆయన స్వయంగా చూసుకుంటున్నారు.ఏడు పదులు దాటినా...ఏడు పదులు దాటినా చంద్రబాబు హుషారుగా జనంలో తిరుగుతుంటే.. ఐదు పదులు కూడా లేని జగన్ మాత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం కావడంపై వైసీపీ క్యాడర్ పెదవి విరుస్తుంది. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడి వెళుతున్నారని, ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో క్యాడర్ లో అయోమయం నెలకొందని, దీనిని తొలగించేందుకు జనంలోకి జగన్ రావాలని వారు కోరుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం తాను కదిలేది లేదని కుర్చీకి అతుక్కుపోయి కూర్చున్నట్లే కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాతనే ఆయన జనంలోకి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి పెద్దాయన పరుగులు తీస్తుంటే... ఈయన మాత్రం ఒంటి మీద బట్ట నలగకుండా కూర్చోవడమేంటన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. |
https://www.telugupost.com/movie-news/డైరెక్టుగానే-సెటైర్-వేశా-36711/ | నాని - నివేత థామస్ - ఆది పినిశెట్టి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'నిన్నుకోరి' చిత్రం ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చెయ్యడానికి దిగిపోనుంది. ఇక చిత్రం విడుదల సందర్భంగా హీరో హీరోయిన్స్ మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూ లు గట్రాఇస్తూ 'నిన్నుకోరి' సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగానే నాని చేసిన కొన్ని వ్యాఖ్యల మీద టాలీవుడ్ పెద్ద చర్చకి తెర లేపింది. మాములుగా నాని ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటాడు. టాలీవుడ్ లో అందరితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ తన పని తాను చేసుకుపోయే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు నాని.అయితే ఇప్పుడు నానిని కొంతమంది మీడియా ప్రతినిధులు మిమ్మల్ని ఇంకా మినిమమ్ గ్యారెంటీ హీరో కిందే జమకడుతున్నారని అడగగా... దానికి నాని కొంచెం కోపంగానే సినిమా వసూళ్ల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని.... సినిమా బావుంటేనే సినిమా గురించి మాట్లాడండి... సినిమా బాగోకపోయినా దాని వసూళ్లు బాగున్నాయి అని ఈ మధ్యన బాగా వినబడుతుంది. అలా సినిమా వసూళ్ల గురించి మాట్లాడడం నాకు నచ్చదు. అసలు సినిమా బావుంటేనే ప్రేక్షకులు సినిమా చూడడానికి వస్తారు అంటూ అసహనం ప్రదర్శించాడు.అయితే నాని ఇలా ఏ సినిమా వసూళ్ల గురించి మాట్లాడాడో అందరికి ఇట్టే అర్ధమైపోయిందని అంటున్నారు. తాజాగా విడుదలైన 'దువ్వాడ జగన్నాథం' చిత్రం టాక్ బాగోకపోయినా మంచి వసూళ్లు రాబట్టిందని బాగా ప్రచారం జరుగుతుంది. మరి నాని ఈ సినిమా వసూళ్లపైనే డైరెక్ట్ పంచ్ వేశాడా? అనిపిస్తుంది కదూ.. |
https://www.telugupost.com/movie-news/ఏడాది-తిరక్కుండానే-పవన్-16325/ | నాచురల్ స్టార్ నాని సరసన మజ్ను చిత్రంలో నటించటం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన కథానాయిక అను ఇమ్మాన్యుయేల్. మోడలింగ్ నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చిన ఈ మలయాళీ భామకు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి ఏడాదే త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ ల క్రేజీ ప్రాజెక్ట్ లోకి ప్రవేశం దొరికింది. ఈ సదవకాశంతో ఉబ్బితబ్బిబు అయిపోతోంది అను ఇమ్మాన్యుయేల్. ఇప్పటికే మజ్ను తరువాత రెండు చిత్రాలు ఒప్పుకోగా వాటిలో ఒకటి రాజ్ తరుణ్ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరొకటి గోపి చంద్ సరసన నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఇంతలో ఈ క్రేజీ ఆఫర్ అను ని వెతుక్కుంటూ వచ్చింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం తనను వరించటం తన అదృష్టం అని చెప్తూ పట్టలేని ఆనందంతో ఆ చిత్ర వివరాలు పంచుకుంటూ, "పవర్ స్టార్ సినిమాలో కనిపించాలి అంటే కనీసం ఐదు సంవత్సరాలు అయినా పడుతుంది అనుకున్నాను. కానీ అనూహ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రానికి సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఆఫర్ చేయటంతో వెంటనే ఒప్పేసుకున్నాను. ఫస్ట్ హీరోయిన్ గా కీర్తి సురేష్ అప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది. త్రివిక్రమ్ యాక్టింగ్ వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. స్టోరీ రీడింగ్ సెషన్స్ లో కూడా పాల్గొంటున్నాను. ఈ చిత్రంలో నాకు కీర్తి సురేష్ కాంబినేషన్లో కూడా కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వున్నాయి." అంటూ సెలవిచ్చింది అను ఇమ్మాన్యుయేల్. |
https://www.telugupost.com/movie-news/ఎందుకీ-దాదాగిరి-38774/ | డ్రగ్స్ కేసులో 12 మంది సెలెబ్రిటీస్ కి గాను నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటివరకు ఆరుగురు అబ్బాయిలను మాత్రమే ప్రశ్నించిన సిట్ ఇప్పుడు హీరోయిన్ ఛార్మిని తమ వద్దకు పిలిపించుకుంది. ఇప్పటివరకు హాజరైన వారు పూరి, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, చిన్నాలు సెంటిమెంట్ లాంటిది ఫాలో అవుతూ వైట్ షర్ట్స్ ని ధరించి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక వీరి విచారణ అంతా సుదీర్ఘంగా అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిగింది.ఇక ఈరోజు సిట్ ముందు హాజరైన ఛార్మి వైట్ డ్రెస్ తో కాకుండా బ్లు కలర్ టాప్ తో కొందరు బౌన్సర్లు పక్కన పెట్టుకుని మరీ వచ్చింది. సిట్ కార్యాలయంలోకి ఛార్మి.. అడుగుపెడుతున్న సమయంలో అక్కడ చాలా హడావుడి నెలకొంది. అయితే ఇంత హడావిడిలో ఛార్మి నవ్వుతూనే కనబడింది కానీ... అక్కడ కొద్దిగా మీడియా తోపులాట జరిగి ఛార్మిని ఫోకస్ చేసినప్పుడు మాత్రం ఛార్మి మోహంలో కాస్త ఆందోళన, కంగారు కనబడిందంటున్నారు. ఇక అక్కడనుండి మహిళా పోలీసు అధికారులు ఛార్మికి రక్షణ కల్పిస్తూ లోపలకు తీసుకెళ్లారు. అక్కడ నలుగురు మహిళా అధికారుల సమక్షంలో ఛార్మి విచారణ జరగబోతుందని. ఈ విచారణలో అకున్ సబర్వాల్ గాని మరే ఇతర అధికారులు గాని పాల్గొనరని.... అకున్ తయారు చేసిన ప్రశ్నల్తోనే ఆ మహిళా అధికారులు ఛార్మిని ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.అయితే డ్రగ్స్ డీలర్ కెల్విన్ అరెస్ట్ అయినప్పుడు కెల్విన్ ఫోన్ లో ఛార్మి ఫోన్ నెంబర్ 'ఛార్మి దాదా'గా ఫీడ్ చేసి ఉండడం, కెల్విన్ కి ఛార్మి వాట్స్ అప్ సందేశాలు పంపడం, కెల్విన్ తో ఛార్మి ఫోన్ సంభాషణలు అన్ని ఛార్మి ముందు పెట్టి ఆమెను విచారణ చేస్తారని అంటున్నారు. ఇక ఛార్మి దాదా అనే పదంపైనే సిట్ అధికారులు ఎక్కువగా ఫోకస్ పెడతారనే ప్రచారము మొదలైంది. ఇక ఛార్మి ఈ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు తీరు బాగోలేదని హైకోర్టు కు వెళ్లిన విషయం తెలిసిందే. మరి ఛార్మి ఇలా కోర్టుకు వెళ్లి ఆమె తప్పు చేశానని ఒప్పుకుందని ప్రచారం జోరుగా జరుగుతున్నవేళ ఇప్పుడు ఛార్మి సిట్ అధికారులకు ఎలాంటి ఇంఫార్మేషన్ ఇవ్వబోతుందో అనేదాని మీద అందరికి తీవ్ర స్థాయిలో ఆసక్తి నెలకొని ఉంది. |
https://www.telugupost.com/movie-news/hello-guru-premakosme-93355/ | ఈ రోజు గురువారం దసరా పండగ సందర్భంగా రామ్ పోతినేని - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు బ్యానర్ లో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈమధ్యన ప్లాప్ హీరోలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన దిల్ రాజు... తాజాగా రామ్ తోనూ సినిమా చేసాడు. రాజ్ తరుణ్, నితిన్ వంటి హీరోలకు హిట్ ఇద్దామనే సినిమాలు చేశానని బహిరంగంగా చెప్పిన దిల్ రాజు రామ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకంటే రామ్ గత చిత్రాలు కూడా ప్లాప్ అవడంతో దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తే హిట్ ట్రాక్ ఎక్కుతాననుకుంటున్నాడు. ఎందుకంటే చాలామంది యంగ్ హీరోలకు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చెయ్యడం అంటే వాళ్ళకి భరోసా ఉంటుంది.కథల ఎంపికలో కూడా....దిల్ రాజు కథల ఎంపిక, సినిమా పై ఉన్న పట్టు, సినిమాల పబ్లిసిటీ కార్యక్రమాల్లో కొత్త ఒరవడి ఉండడంతో దిల్ రాజు తో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు ఉత్సాహం చూపుతుంటారు. అందుకే దిల్ రాజు తో సినిమాలు చెయ్యడానికి వారు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే రామ్ కూడా దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసి హిట్ కొట్టాలనుకున్నాడు. కానీ ఇప్పుడు దిల్ రాజు విషయంలో రామ్ అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ వినబడుతుంది. ఈ సినిమా విషయంపై, దిల్‌రాజు పబ్లిసిటీ స్ట్రాటజీ విషయంలోనూ రామ్ అసంతృప్తిగా ఉన్నాడని టాక్. దసరా పండగ రోజు సినిమాని విడుదల చేసి హిట్ కొట్టాలనుకున్నాడు రామ్. అందుకు తగ్గ ప్రమోషన్స్ ని చేసాడు. మరి తమిళ పందెం కోడి తో పోటీ పడడం ఒక ఎత్తైతే.... ఇక్కడ గత వారం విడుదలైన అరవింద సమేత హడావిడి ఇంకా ముగియలేదు. మరి ఆ రెండు సినిమాలను తప్పించి ప్రేక్షకుడిని తన వైపు తిప్పుకునే కెపాసిటీ రామ్ కి ఉందా...?ప్రమోషన్స్ విషయంలో......అందులోను రామ్ గత చిత్రం ఉన్నది ఒకటే జిందగీ ప్లాప్ అవడం వలన ఇప్పుడు విడుదలవుతున్న హలో గురు ప్రేమకోసమే చిత్ర ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చెయ్యాల్సి ఉంది. అయితే తన గత చిత్రాలకు తన పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో పక్కా ప్లానింగ్ తో చేసేవారు. దానిద్వారానే రామ్ తనకు నచ్చిన పద్దతిలో ప్రమోషన్ చేపట్టేవాడు. కానీ ఇప్పుడు స్రవంతి ద్వారా రామ్ ఏం చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా విషయాలన్నీ దిల్ రాజు స్వయంగా చూడడం తో రామ్ ప్లానింగ్స్ ఏం వర్కౌట్ అవ్వకపోవడంతో.. రామ్ కాస్త చిరాకుగా ఉన్నట్లుగా.... సినిమాకి ప్రేక్షకుల్లో రావాల్సిన క్రేజ్ లేకపోవడంతో రామ్ కాస్త అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది.- |
https://www.telugupost.com/movie-news/tej-i-love-you-release-2-75457/ | సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం 'తేజ్'. ఐ లవ్ యూ అనేది ఉపశీర్షిక. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది. జూన్ 16న మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ట్రెండ్‌సెట్ మాల్‌లో ఈ చిత్రం ఆడియో సక్సెస్ మీట్‌ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చెయ్యబోతున్నారు. 'తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి రొమాంటిక్ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మంచి లవ్ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా 'తేజ్ ఐ లవ్ యు' రూపొందుతోంది. జూలై 6 ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.తారాగణం..సాంకేతిక వర్గం..సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాశ్, పవిత్రా లోకేశ్, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్ రవి, అరుణ్ కుమార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్, గోశాల రాంబాబు, స్టంట్స్: వెంకట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సతీశ్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, చీఫ్ కో డైరెక్టర్: చలసాని రామారావు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: సాహి సురేశ్, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్. |
https://www.telugupost.com/crime/brs-councillor-husband-attacked-in-broad-day-light-in-korutla-1488682 | జగిత్యాల జిల్లా కోరుట్లలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ భర్తను పట్టపగలే అది దారుణంగా హతమార్చారు. పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం(48) పై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. బైక్‌పై వచ్చి అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మీరాజం మెడపై తీవ్రగాయాలవ్వగా స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. పెద్దఎత్తున రక్తస్రావం జరగటంతో పరిస్థితి పూర్తిగా విషమించింది. హాస్పిటల్ లో చేరిన కాసేపటికే ఆయన ప్రాణాలు వదిలారని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది.కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద ఓ హోటల్లో లక్ష్మీరాజం టీ తాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అక్కడికి వచ్చి ఆయనపై దాడి చేశారు. కత్తితో మెడపై తీవ్రంగా గాయపరిచారు. పరిస్థితిని గమనించిన కొందరు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిని డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/nags-dedication-173318/ | కరోనా పరిస్థితిలు ఎలా ఉన్నా సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్స్ చేసుకోవడానికి సమాయత్తమవుతోంది. సీనియర్, చిన్న, స్టార్ హీరోలంతా ఎప్పటిలాగే సెట్స్ మీదహడావిడిగా షూటింగ్ చేసుకుంటున్నారు. సీనియర్ హీరోలందరి కన్నా ముందే నాగార్జున బుల్లితెర షో బిగ్ బాస్ షూటింగ్ కి వచ్చేసాడు. బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్న నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులుమనాలీ వెళ్లడమే కాదు.. వారం వారం బిగ్ బాస్ కోసం మనాలి నుండి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్నాడు. మరి తాజాగా నాగార్జున మరో మల్టీస్టారర్ మూవీ షూటింగ్ షురూ అయ్యింది. అది బాలీవుడ్ లో భారీ నటులు అంటే అమితాబచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్ లాంటి స్టార్స్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ కూడా మొదలు కావడంతో అందులో నటిస్తున్న నాగార్జున ఇప్పుడు ముంబై ఫ్లైట్ ఎక్కాడు. బ్రహ్మాస్త్ర లో ఆర్కియాలజిస్టుగా నాగార్జున కనిపించనున్నాడు. ఆ సినిమాలో నాగ్ కాంబో సీన్స్ షూట్ స్టార్ట్ కావడంతో నాగార్జున ఇప్పుడు ముంబై కి వెళ్లాల్సివచ్చింది. మరి వారం వారం బిగ్ బాస్ షో తో పాటుగా కులుమనాలి లో వైల్డ్ డాగ్ షూటింగ్, మధ్యలో బ్రహ్మాస్త్ర షూటింగ్.. మరి నాగ్ ఈ వయసులో ఆయన డెడికేషన్ కి మెచ్చుకోవలసిందే. ఒకేసారి మూడు రకాల షూటింగ్స్ తో నాగార్జున ఏ సీనియర్ హీరో చెయ్యని సాహసం చేస్తున్నాడు. |
https://www.telugupost.com/movie-news/రంగస్థలం-గురించి-మనకి-తె-64545/ | రంగస్థలంలో చిట్టి బాబు లుక్ కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడు? రంగస్థలం టైటిల్ నుండి సడెన్ గా 1985 అనే నెంబర్ ఎందుకు తీసేసారు? చరణ్ గడ్డం పెంచాలన్న ఐడియా ఎవరిది? వీటన్నింటికి చరణ్ ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు.ఒక టైంకు ఎందుకు పరిమితం చేయడం?"ఈ సినిమాను ఒక టైంకు ఎందుకు పరిమితం చేయడం అనిపించింది. ముఖ్యంగా ఈ స్టోరీ 1980ల నాటి కథ. ప్రత్యేకంగా 1985 అని చెబితే అప్పటి ఫ్యాషన్లు తెరపైకొస్తాయి కదా అందుకే ఆ నెంబర్ తీసేశాం.""చిట్టి బాబు లుక్ కోసం చాలానే కష్టపడ్డాం. చాలా లుక్స్ ట్రై చేశాం. లూజ్ ప్యాంట్స్..బెల్ బాటమ్స్..హెయిర్ స్టయిల్..గడ్డం..ఇలా చాలానే లుక్ ట్రై చేశాం కానీ పైనల్ గా గడ్డం, గళ్ల లుంగీకి ఫిక్స్ అయ్యాం."80 శాతం లుంగీతోనే....సినిమాలో 80శాతం తను లుంగీలోనే కనిపిస్తానని అంటున్నాడు చరణ్. టెస్ట్ షూట్ సుకుమార్ చుక్కలు చూపించాడు. ఎన్ని వెర్షన్లు తీశాడో తనకే గుర్తులేదు అన్నాడు చరణ్. ఇక సుకుమార్ తనకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు లుంగీ కట్టుకొని ఉన్నానని, దాంతో సుకుమార్ సినిమాలో లుంగీ గెటప్ కే ఫిక్స్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. నిజానికి 80ల నాటి పల్లెల్లో ప్యాంట్లు కంటే లుంగీలే ఎక్కువగా ఉండేవంటున్నాడు చరణ్. |
https://www.telugupost.com/movie-news/another-remake-from-samantha-154926/ | సమంత కి టాలీవుడ్ లో రీమేక్ రాణి టైటిల్ తగిలించారు. పెళ్లయ్యాక సమంత చేసిన చాలా సినిమాలు రీమేక్స్. యూటర్న్, ఓ బేబీ, జాను అన్ని రీమేక్స్. అయితే సమంత చేసిన రీమేక్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అయినవే. కానీ తమిళ రీమేక్ 96 రీమేక్ జానూ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ….. ఈ సినిమాకి అస్సలు కలెక్షన్స్ రాలేదు. ఇక జానూ తర్వాత సమంత టాలీవుడ్ లో సినిమాలేవీ ఒప్పుకోలేదు. అంతేకాదు.. తమిళనాట నయనతార – విజయ్ సేతుపతి కాంబోలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుండి సమంత బయటికి వచ్చేసిందనే టాక్ ఉంది. అయితే తాజాగా సమంత ఓ కన్నడ రీమేక్ కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. కన్నడలో తెరకెక్కిన దియా సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా ని తెలుగులో రీమేక్ చెయ్యాలని సమంత ప్రయత్నాలు మొదలెట్టిందట. ఆ సినిమాని సమంత స్వయానా నిర్మించబోతుంది అని.. సొంత బ్యానేర్ లోనే దియా కన్నడ రీమేక్ ఉంటుంది అని… అంటున్నారు. మరోపక్క ఈ సినిమాలో సమంత పోషించాలనుకుంటున్న పాత్ర… సమంత కెపాసిటికి ఎంత మాత్రం సరిపోదనే అభిప్రాయాలను ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారట. కానీ సమంత మాత్రం దియా రీమేక్ చెయ్యాలనే ప్లాన్ లో ఉందట. |
https://www.telugupost.com/movie-news/junior-ntr-back-in-aravinda-sets-86835/ | నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు జీవితంలో కోలుకులేని షాక్ తగిలింది. వాళ్ళ తండ్రి నందమూరి హరికృష్ణ అనుకొకుండా ఘోర రోడ్డు ప్రమాదానికి గురై గత బుధవారం కన్ను మూసారు. హరికృష్ణ మరణం నందమూరి కుటుంబానికి తీరని లోటు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోవడం ఆ అన్నదమ్ములకు చాలా కష్టమైనా పనే. ఇక నిన్న శుక్రవారం హరికృష్ణ చిన్న కర్మ ని కొడుకులు పూర్తి చేశారు. అయితే తండ్రి మరణంతో కుంగి పోయిన ఈ ఇద్దరు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు తమ పనుల్లో బిజీ గా మారిపోవడానికి మానసికంగా సిద్ధమవుతున్నారు.ఒక పక్క ఫ్యామిలీ సపోర్ట్ తో తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇప్పుడు అదే ఫ్యామిలీ సపోర్ట్ తో తమ తమ సినిమా షూటింగ్ లకు వెళ్ళబోతున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత - వీర రాఘవ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వచ్చేనెల దసరా టార్గెట్ గా తెరకెక్కడంతో... నిన్నమొన్నటివరకు షూటింగ్ కి విరామం తీసుకోకుండా ఎన్టీఆర్ శ్రమించాడు. కానీ తండ్రి హఠాన్మరణంతో ఎన్టీఆర్ అరవిందకు బ్రేకిచ్చాడు.మరి ప్రాజెక్ట్ కి బ్రేక్ ఇవ్వడమంటే మేకర్స్ ఎంత నష్టపోతారో తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్ కోసం తండ్రి మరణాన్ని జీర్ణించుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాడని టాక్ వినబడుతుంది. సకాలంలో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రివిక్రమ్ తలమునకలై ఉన్నాడు. ఇక కళ్యాణ్ రామ్ నా నువ్వే ప్లాప్ తర్వాత మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా తండ్రి మరణంతో కుంగిపోకుండా నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా సినిమా షూటింగ్ కి వెళ్ళబోతున్నాడట. ఒక నిర్మాత బాధ మరొక నిర్మాతకు తెలుస్తుందని.... కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతే కదా.. మరి ఈ నందమూరి హీరోలకు హాట్స్అప్ చెప్పాల్సిందే. |
https://www.telugupost.com/crime/there-was-a-fire-accident-in-sangareddy-chemical-factory-three-workers-died-in-the-accident-1528910 | సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు. ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులు గాయాలపాలయ్యారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.పది మందికి గాయాలు...గాయపడిన పది మంది కార్మికులును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో యాభై మంది కార్మికులు ఉన్నారని తెలిసింది. దీంతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు లోపల రియాక్టర్ పేలి భవనాల శకలాలు ఐదు వందల మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/త్రివిక్రమ్-కోసం-మారుతున-56027/ | నిన్ను చూడాలని చిత్రంతో వెండితెరపై హీరోగా పరిచయమైనప్పుడు తారక్ ని చుసిన ప్రేక్షకులు ఇంత భారీ శరీరంతో ఈ తరం హీరోల మధ్య హీరోగా కెరీర్ ఎలా నెట్టుకురాగలడు అని పెదవి విరిచారు. అదే భారీ శరీరంతో స్టూడెంట్ నెం.1 , ఆది, సింహాద్రి వంటి భారీ విజయాల్ని అందుకున్న తారక్ రాఖీ చిత్రంలో తన అవతారానికి భయపడిపోయిన మహిళా ప్రేక్షకులని కూడా తన చిత్రాల వీక్షించటం కోసం థియేటర్స్ కి రప్పించాలని కసితో కొన్ని శస్త్ర చికిత్సల సాయంతో, కొన్ని కఠోర వర్క్ ఔట్స్ తో యమదొంగ చిత్రానికి రూపు రేకలు మార్చుకుని షాక్ ఇచ్చాడు.స్లిమ్ లుక్ తో....నాన్నకు ప్రేమతో నుంచి కొద్దిగా ఒళ్ళు చేయటం మొదలుపెట్టిన తారక్ జనతా గ్యారేజ్, జై లవ కుశ చిత్రాలలో కొద్దిగా బొద్దుగానే దర్శనమిచ్చాడు. కాగా తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న తారక్ త్రివిక్రమ్ చెప్పిన క్యారెక్టర్ కి తగిన విధంగా తన లుక్ మలచుకోవటానికి పూర్తిగా స్లిమ్ లుక్ కోసం కష్టపడుతున్నాడట. మళ్లీ యమదొంగ, కంత్రి చిత్రాలలో కనిపించినంత స్లిమ్ గా కనిపించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడట తారక్. మరి యంగ్ టైగర్ లేటెస్ట్ స్లిమ్ లుక్ కి స్క్రీన్ ప్రెజన్స్ ఎలా వుండబోతుందో అంచనాకి రావాలంటే చిత్రం ఫస్ట్ లుక్ విడుదల వరకు ఆగాల్సిందే. |
https://www.telugupost.com/movie-news/jersey-movie-2-weeks-collections-120326/ | ఏరియా షేర్ (కోట్లలో) నైజాం 8.67 సీడెడ్ 1.89 నెల్లూరు 0.63 కృష్ణ 1.40 గుంటూరు 1.46 వైజాగ్ 2.28 ఈస్ట్ గోదావరి 1.40 వెస్ట్ గోదావరి 1.07 టోటల్ ఏపీ & టీఎస్ షేర్ 18.80 ఇతర ప్రాంతాలు 2.50 ఓవర్సీస్ 5.00 టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 26.30 |
https://www.telugupost.com/movie-news/bouncers-of-actress-tamannaah-bhatia-assaulted-media-persons-1439264 | తమన్నా హిందీలో 'బబ్లీ బౌన్సర్' అనే సినిమా తీసింది. ఆ సినిమాను తెలుగులో డబ్ చేశారు. డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తమన్నా హైదరాబాద్ కు వచ్చింది. ఆ కార్యక్రమం కాస్తా గొడవలతో నిండిపోయింది. తమన్నాకు సెక్యూరిటీగా వచ్చిన బౌన్సర్లు.. ఏకంగా మీడియా ప్రతినిధులపై దాడులకు దిగారు. ఈ గొడవలో మీడియా ప్రతినిధులకు కూడా గాయాలు అయ్యాయి.తమన్నా భాటియా బబ్లీ బౌన్సర్ ప్రమోషన్‌ను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై శనివారం హైదరాబాద్ లో బౌన్సర్లు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వీడియోగ్రాఫర్లకు గాయాలయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బబ్లీ బౌన్సర్ అనే మహిళా సెంట్రిక్ చిత్రం కోసం తమన్నా దర్శకుడు మధుర్ భండార్కర్‌తో చేతులు కలిపింది. సెప్టెంబర్ 23న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి చిత్ర యూనిట్ హైదరాబాద్ కు రాగా.. తమన్నా బౌన్సర్లు మీడియాపై దాడి చేశారు.తమన్నా, దర్శకుడు మధుర్ భండార్కర్ ఇద్దరూ సినిమా గురించి మాట్లాడటానికి ప్రెస్ మీట్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు. నటికి సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసినప్పుడు తమన్నా బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు. కొంతమంది మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో కెమెరామెన్‌లపై బౌన్సర్లు దాడి చేయడం, కెమెరాలను పగులగొట్టడానికి ప్రయత్నించడం స్పష్టంగా చూడవచ్చు. ఈ ఘర్షణలో ఇద్దరు కెమెరామెన్‌లు గాయపడినట్లు సమాచారం. ఈ మొత్తం సంఘటన తమన్నా మరియు మధుర్ భండార్కర్ సమక్షంలో జరిగింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. బబ్లీ బౌన్సర్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. |
https://www.telugupost.com/andhra-pradesh/ys-sharmilas-political-steps-from-the-beginning-are-not-correct-1546159 | వైఎస్ షర్మిల రాజన్న బిడ్డగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయితే షర్మిల మాత్రం రాజకీయంగా తొలి నుంచి వేస్తున్న అడుగులు కరెక్ట్ గా పడటం లేదు. అసలు తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారో ఆమెకే తెలియాలి. అసలు బేస్ లేని చోట వైఎస్సార్ పేరు చెప్పుకుని కొన్ని సీట్లు అయినా సంపాదించుకుని రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. పాదయాత్ర చేస్తే తనకు కొంత సానుకూలత వస్తుందని భావించి తెలంగాణలో నాడు పాదయాత్ర కూడా చేశారు. అయితే వైెఎస్ అంటే అభిమానం ఉన్న నేతలు కూడా ఆమె వైపు చూడలేదు. ఎవరో ఒకరోఇద్దరో చేరి వైఎస్సార్టీపీ నేతలని చెప్పుకున్నారు తప్పించి వారికి ప్రజాక్షేత్రంలో బలం లేని వాళ్లు మాత్రమే.పార్టీని క్లోజ్ చేసి...అదే సమయంలో పాలేరు నుంచి పోటీ చేయాలని ఆమె భావించారు. పాలేరు అయితే తన గెలుపు సులువని ఆమె లెక్కలు వేసుకుని అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే దానికి ఆమె ఇచ్చిన వివరణ కూడా ఆమె పక్కనున్న నేతలు కూడా విశ్వసించలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం తాను పోటీ నుంచి విరమించుకుంటున్నానని ప్రకటించిన వైెఎస్ షర్మిల అప్పటి వరకూ ఆమె వెంట ఉన్న నేతలకు చెప్పకుండా నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కలసి తాను పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ప్రకటించారు. దీంతో ఉన్న నేతలు కూడా పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఏపీ రాజకీయాల్లోకి...ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అనూహ్యంగా కాలు మోపారు. అప్పటి వరకూ తెలంగాణ బిడ్డనంటూ డైలాగులు కొట్టిన వైఎస్ షర్మిల చివరకు ఏపీికి వచ్చి తాను ఇక్కడ బిడ్డనేనంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సరైన నాయకత్వం లేక పార్టీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించింది. 2014లో కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా పతనమయింది. 2014 నుంచి మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభలోకి అడుగుపెట్టలేదు. అంటే ఇంత వరకూ గత పదేళ్ల నుంచి కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించలేదు. కాంగ్రెస్ తో జత కట్టిన కమ్యునిస్టులు కూడా ఒక్క సీటును సాధించలేక చతికలపడ్డారు. అలా కాంగ్రెస్ తో దోస్తీ అంటేనే మిగిలిన పక్షాలు భయపడే పరిస్థిితి ఏర్పడింది. కేంద్రంలోనూ కాంగ్రెస్ ....ిఇక 2029 ఎన్నికల వరకూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటికీ కాంగ్రెస్ కోలుకుంటుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ తప్ప మరొక పార్టీకి అవకాశం లేదు. ఇతర పార్టీలు ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల సాధించేదేముంటుందన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి అయినా వచ్చే అవకాశముంది. అదీ కూడా లేదు. 2029 వరకూ వెయిట్ చేయాల్సిందే. అందుకే వైఎస్ షర్మిల రాజకీయంగా వేసిన అడుగులన్నీ వృధాయేనన్నది వాస్తవం. ఎంతగా ప్రజల్లోకి వెళ్లాలనుకున్నా సమస్యలపై పోరాటాలు చేసినా ఏపీలో కాంగ్రెస్ కు ఇప్పట్లో కాలం కలసి రాదన్నది వాస్తవం. మరి షర్మిల ప్రయత్నాలు ఎందుకో మరి? |
https://www.telugupost.com/movie-news/bayapati-vinaya-vidheya-rama-110395/ | రామ్ చరణ్ వినయ విధేయ రామ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం వచ్చింది. దీంతో హీరో రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ నుండి 5 కోట్లు, అలానే నిర్మాత దానయ్య కూడా 5 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. అలానే బోయపాటి కూడా తన రెమ్యూనరేషన్ నుండి 5 కోట్లు ఇవ్వాలని అడిగితే దానికి అతను అంగీకరించకపోవడంతో నిర్మాత దానయ్యకు, బోయపాటి కి మధ్య వాగ్యుద్ధానికి దారి తీసిందనే పుకార్లు వినిపించాయి. అయితే ఈ సెటిల్‌మెంట్ వ్యవహారాన్ని మధ్యవర్తులుగా అల్లు అరవింద్, దిల్ రాజు మాట్లాడి బోయపాటికి నచ్చచెప్పడంతో ఆయన కోటి రూపాయలు ఇస్తా అని చెప్పాడు. కానీ నిర్మాత దానయ్య తో వచ్చిన విబేధాల కారణంగా అసలు పైసా కూడా తిరిగి ఇచ్చేది లేదని బోయపాటి తేల్చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరూ ఇన్వాల్వ్ అయినా… తాను పని చేసిన దానికే రెమ్యూనరేషన్ తీసుకున్నానని… అంతే కానీ రూపాయి కూడా వెనక్కు ఇచ్చేదిలేదని… నష్టాలు, లాభాలు అనేవి పూర్తిగా నిర్మాతే చూసుకోవాలని తెగేసి చెప్పాడట. అలానే బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చిన కొంతమంది నిర్మాతలు ఆ అడ్వాన్స్ లు తిరిగి వెనక్కి ఇచ్చేయమని అడుగుతున్నారని సమాచారం. అయితే బోయపాటి ఒక స్టార్ హీరో డేట్స్ తెచ్చి సినిమా చేయడం తన పూచీ అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వట్లేదు అని వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. |
https://www.telugupost.com/politics/what-is-the-reason-for-kcr-not-responding-to-pm-modis-allegations-1484177 | తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు వరంగల్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణకు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకావాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ 2021 నుండి, రాజకీయ కారణాలతో కేసీఆర్ ఈ ప్రోటోకాల్‌ను నిరంతరం ఉల్లంఘిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరంజజ మోదీ తన పార్టీ నిర్వహించిన రాజకీయ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. వరంగల్‌లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.ఇతర పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకాకుండా తప్పించుకోవడం సర్వసాధారణం అయినప్పటికీ, ప్రధాని తన ప్రసంగంలో కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అవినీతి, వంశపారంపర్య పాలన, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్‌లు తదితర తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసింది ప్రధాని తప్ప మరెవరో కాదు కాబట్టి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రధానమంత్రి స్థాయి నాయకుడు చేసిన ఆరోపణలను ఎవరూ ఉపేక్షించలేరు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌పై కూడా మోదీ ఒకరోజు ముందు ఇలాంటి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై బఘెల్ ఘాటుగా స్పందించి మోడీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే కేసీఆర్ విషయానికొస్తే.. మోదీకి తగిన సమాధానం చెప్పే పనిని ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, ఆయన మంత్రివర్గంలోని ఇతర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించారు. మోదీ పర్యటన ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. మహారాష్ట్రకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సుమారు గంటసేపు మాట్లాడిన ఆయన మోదీ పేరును ప్రస్తావించలేదు, ప్రధాని చేసిన ఆరోపణలను ఖండించలేదు. దీంతో ముఖ్యమంత్రి స్థాయి కంటే ప్రధాని స్థాయి తక్కువగా ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఏది ఏమైనప్పటికీ, కేసీఆర్ నిరంతరం ప్రధాని అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బహిరంగంగా ప్రధాని మోదీ చేసిన తీవ్రమైన ఆరోపణలపై కూడా స్పందించడం లేదు. దీనితో ప్రధాని మోదీ పరిస్థితి సీఎం కేసీఆర్‌తో సమానంగా లేదని, ప్రతిస్పందన అవసరమైన విషయంలో కేసీఆర్ పరిశీలన చేస్తారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. |
https://www.telugupost.com/movie-news/jersy-movie-overseas-rights-118079/ | గత రెండు వారాలుగా థియేటర్స్ అన్నీ కళలాడుతున్నాయి. మజిలీ సినిమాతో బాక్సాఫీసు బోర్ ని దూరం చేసిన సమంత – నాగ చైతన్య ఈ సినిమాతో వారూ హిట్ అందుకున్నారు. గత శుక్రవారం చిత్రలహరి సినిమాకి కూడా యావరేజ్ టాక్ వచ్చి మంచి కలెక్షన్ వచ్చాయి. ఇక మూడో వారంలో నాని జెర్సీ బాక్సాఫీసు బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ తో జెర్సీ సినిమా మీద క్రేజ్ బాగా పెరిగింది. అందులో నేచురల్ స్టార్ నాని సినిమా అంటే ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి ఉంటుంది. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన జెర్సీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలతోనే ఈ జెర్సీ.. నాని గత చిత్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ట్రైలర్ బాగుండటంతో… ఇక అన్నింటికీ మించి నాని జెర్సీ ఓవర్సీస్ హక్కులు 4 కోట్లకు అమ్ముడయ్యాయని… లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. నేచురల్ స్టార్ గా నానికి యూఎస్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే మార్కెట్ వాల్యూ కూడా బాగున్నప్పటికీ… నాని రెండు గత చిత్రాల ఫ్లాప్స్ తో ఓవర్సీస్ మార్కెట్ కాస్త డల్ అయినా తాజాగా జెర్సీకి 4 కోట్లు రావడం అనేది కాస్త షాకింగ్. అయినా జెర్సీ టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతోనే ఓవర్సీస్ లో జెర్సీకి అంత మంచి రేటొచ్చిందని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/prabhas-adipurush-teaser-release-date-fix-1438742 | బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో వరుస హిట్లు అందుకున్న ప్రభాస్.. సాహో తో హ్యాట్రిక్ కొడతాడని అనుకున్నారంతా. కానీ బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన.. సాహో, రాధేశ్యామ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. రెండు ఫ్లాపుల తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. సినిమా అనౌన్స్ చేశాక ప్రభాస్ పోస్టర్ ఒక్కటి తప్ప.. మరే అప్డేట్ ఇవ్వకపోవడంతో.. అభిమానులు మేకర్స్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 3న ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టీజర్ రిలీజ్ ఈవెంట్ ను అయోధ్యలో భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. చిత్రబృందం టీజర్ ను కట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ తర్వాత సినిమా ప్రమోషన్ పనులు మొదలు పెడతారని టాక్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆదిపురుష్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను యూవీ క్రియేషన్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. |
https://www.telugupost.com/andhra-pradesh/fund-raising-for-the-development-of-undi-mla-raghurama-krishnarajus-constituency-has-become-a-discussion-in-the-party-1542468 | కనుమూరి రఘురామకృష్ణరాజు పరిచయం అక్కరలేని పేరు. నరసాపురం ఎంపీగా ఆయన 2019 నుంచి 2023 వరకూ వైసీపీలోనే ఉండి ఆ పార్టీకే కంట్లో నలుసుగా మారారు. ప్రతిరోజూ రచ్చబండ పేరుతో మీడియా సమావేశం పెట్టి మరీ పార్టీపైన, అధినేత జగన్ పైన విమర్శలు చేసే రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో నరసాపురం టిక్కెట్ ఆశించినా దక్కలేదు. ఆ సీటు కూటమిలో పొత్తులో భాగంగా బీజేపీ ఎగరేసుకుపోయింది. ఇక రాజును కాదనలేక, బయట ఉంచలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరీ ఆయనకు ఉండి శాసనసభ టిక్కెట్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంతో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఉండి అభివృద్ధికి...కూటమి అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్న రఘురామకృష్ణరాజుకు చివరకు నిరాశ ఎదురయింది. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. స్పీకర్ పదవి అయినా దక్కుతుందని భావించినా అది కూడా అయ్యన్నపాత్రుడికి దక్కింది. దీంతో రఘురామకృష్ణరాజుకు మంత్రివర్గంలో ఇక తనకు స్థానం దక్కదని తేలిపోయింది. అయినా ఆయన ఉండిలో తనకంటూ ప్రత్యేకతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిధుల పైన ఆధారపడకుండా నిధుల సేకరణను ఆయన సమీకరిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇది ఇబ్బంది కరంగా మారింది. రఘురామకృష్ణరాజుకు పారిశ్రామికవేత్తలు, సినీ పెద్దలతో ఉన్న సంబంధాలతో వారంతా నిధులు ఇస్తున్నారు. ఆ నిధులతో ఉండి నియోజకవర్గం అభివృద్ధి చేపట్టేందుకు సిద్ధమయ్యారు.సొంతంగా నిధుల సేకరణతో...అందులో ఎంత మాత్రం తప్పు లేకపోయినా మిగిలిన ఎమ్మెల్యేలు అలా ఎందుకు చేయకూడదన్న ప్రశ్న ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో వినపడుతుంది. మిగిలిన ఎమ్మెల్యేలకు ఇది ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ నిధులపై తాను ఆధారపడనని పరోక్షంగా రఘురామకృష్ణరాజు చెప్పదలుచుకున్నారా? అన్న ప్రశ్న కూడా వినపడుతుంది. మరోవైపు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయి ఉండటం, ఉన్న నిధులు సంక్షేమ పధకాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తుండటంతో ఇక ప్రభుత్వంపై ఆధారపడి ప్రయోజనం లేదనకున్న రాజు గారు తన సొంతంగా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందనే లభిస్తుండటంతో ఉండి నియోజకవర్గం అభివృద్ధిని తాను సొంతంగానే చేస్తానని ప్రభుత్వానికి పరోక్షంగా సంకేతాలను పంపినట్లయిందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...మరోవైపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పింఛన్లను పంపిణీ చేస్తూ ఇచ్చిన కరపత్రంపై ఎన్టీఆర్ ఫొటో లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే నెల పింఛను చెల్లించే సమయంలో ఎన్టీఆర్ ఫొటో పెట్టాలంటూ ఆయన ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆ కరపత్రంపై కేవలం చంద్రబాబు ఫొటో మాత్రమే ఉండటంతో ఎన్టీఆర్ ఫొటో కూడా ముద్రించాలని పేర్కనడంతో రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారా? లేక కేవలం మరిచిపోయిన విషయాన్ని గుర్తు చేశారా? అన్న విషయంపై ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/director-krish-mahanayakudu-movie-110627/ | ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా నిరాశ చెందారు. దీంతో క్రిష్ మీడియా ముందుకు రావడం మానేసాడు. ఇప్పుడు రెండో భాగం మహానాయకుడు రిలీజ్ దగ్గర పడ్డా ఇంతవరకు క్రిష్ ఎటువంటి ప్రమోషన్స్ చేయడం లేదు. క్రిష్ కనీసం తనవంతుగా సినిమాకి ఎలాంటి ప్రచారం చేయడం లేదు. మహానాయకుడుపై ఎటువంటి బజ్ తీసుకుని రావడం లేదు. కేవలం ఒక్క పరాజయంతోనే క్రిష్ లాంటి పేరు పేరున్న దర్శకుడు అజ్ఞాతవాసం చేయడం సినీ ప్రియులకి నచ్చడం లేదు. మొదటి భాగం ఫెయిల్ అయినప్పుడు రెండో భాగంపై అంచనాలు రేకెత్తించే బాధ్యత దర్శకుడిదేనని.. అతనే డీలా పడితే ఎలా అని అంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలా..? ఎన్టీఆర్ కథానాయకుడుతో పాటు బాలీవుడ్ మూవీ మణికర్ణిక విషయంలో జరిగిన పరాభవం క్రిష్‌ని మానసికంగా బాగా కృంగదీసిందని, అందుకే ఆయన ఇటువంటి వాటికి దూరంగా ఉంటున్నాడని టాక్. అంతేకాదు బాలకృష్ణ – క్రిష్ కి మధ్య చిన్న గ్యాప్ వచ్చిందనే రూమర్స్ వస్తున్నాయి. క్రిష్ ఒక్కడే కాదు బాలకృష్ణ కూడా ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ చేయడంలేదు. |
https://www.telugupost.com/politics/ysrcp-is-ready-to-face-the-poisonous-propaganda-of-the-opposition-1485309 | 'వై నాట్ 175' లక్ష్యాన్ని సాధించడమే లక్ష్యంగా, 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు వచ్చే తొమ్మిది నెలల పాటు గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను మిషన్ మోడ్‌లో ఉంచారు. జులై 21 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక, సమగ్ర సవరణ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం చురుగ్గా ఉండేలా చూడాలని శాసనసభ్యులు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులకు పార్టీ హైకమాండ్ పిలుపునిచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ (ప్రజా వ్యవహారాల) సలహాదారు సజ్జల రామకృష్ణ ఆదివారం పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, జేసీఎస్ సమన్వయకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘వై నాట్ 175’ లక్ష్యం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి నుంచి వచ్చిన సూచనలను గుర్తు చేశారు. ఓటర్ల జాబితా నవీకరణ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇందులో బోగస్ లేదా లేని పేర్లను తొలగించి అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చాలన్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రయోజనకరమైన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. వచ్చే తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్నందున పార్టీకి ప్రతి రోజూ కీలకం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాలు అధికార పార్టీపై విషం చిమ్ముతున్నాయని, వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న ద్వేషం, విషపూరిత ప్రచారాన్ని ప్రతిఘటించాలని వైసీపీ అధిష్ఠానం.. పార్టీ శ్రేణులకు సూచించింది. రాష్ట్రంలో గందరగోళ వాతావరణం సృష్టించేలా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు వైషమ్యాలు సృష్టిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గ స్థాయిలో సొంతంగా టీమ్‌లు ఏర్పాటు చేసుకుని ఎదుర్కోవాలని పార్టీ తన శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో వైసీపీ శ్రేణులు అందుకు రెడీ అవుతున్నాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా ప్రతిపక్షాలు దురుద్దేశపూరిత ప్రచారం చేస్తున్నాయని, ఈ విషయమై ప్రజలకు నిజం చెప్పాలని.. తమ పార్టీ కార్యకర్తలకు అధిష్ఠానం చెప్పిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ వ్యవస్థ చాలా పటిష్టంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ, జేఎస్‌లు విషపూరిత ప్రచారం ద్వారా వాలంటీర్లపై విద్వేషపూరిత ప్రచారాన్ని పెంచారని, దీనికి ఘాటుగా బదులిచ్చేందుకు వైసీపీ యోచిస్తోంది. |
https://www.telugupost.com/movie-news/majili-movie-colelctions-overseas-118192/ | చైతు – సామ్ జంటగా నటించిన మజిలీ చిత్రం చైతు కెరీర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలవడం ఖాయమని అనుకున్నారు. మంచి చిత్రమే అయినప్పటికీ వసూళ్లపరంగా డల్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పక్కన పెడితే యుఎస్‌లో ఈ చిత్రం ఢీలాపడింది. చైతు సోలో హీరోగా నటించిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ సాధిస్తుందని అనిపించింది కానీ అది జరిగేలా కనిపించడం లేదు. నిజానికి తొలి వారంలో ఊపు చూసి మిలియన్ డాలర్లు ఖాయమని కూడా అనేసుకున్నారు. రెండో వారం నుండి ఈ సినిమా పికప్ అవలేదు. దీంతో రెండో వారాంతంలో అత్తెసరు వసూళ్లు మాత్రమే వచ్చాయి. మిలియన్ డాలర్లు కాకపోయినా ప్రేమమ్ వసూళ్లని అయినా దాటుతుందని అనుకుంటే అదీ కష్టమని తేలిపోయింది. ఇక్కడ ఓకే కానీ… ఈ చిత్రం ప్రేమమ్ ను దాటాలంటే మరో యాభై ఎనిమిది వేల డాలర్లు వస్తే తప్ప ఆ మజిలీ చేరడం కష్టం. ప్రస్తుతం ఉన్న ఊపు ప్రకారం అది కష్టమే అని అర్ధం అవుతుంది. దానికి తోడు వచ్చేవారం నాని జెర్సీ రిలీజ్ అవుతుంది కనుక మజిలీకి ఇక థియేటర్లు దొరికే ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి ఎలా చూసిన ఆ వసూలు టార్గెట్ అందుకోవడం కష్టమే అని అర్ధం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఆలా లేదు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కలెక్షన్స్ ని వెనక్కి నెట్టేసి మజిలీ సినిమా నాగచైతన్య సినిమాల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది. |
https://www.telugupost.com/movie-news/the-big-twist-in-rrr-154836/ | రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న RRR పై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా…. ఎన్టీఆర్ కొమరం భీం గా విప్లవ వీరుల పాత్రలు పోషిస్తుంటే. అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా RRR షూటింగ్ వాయిదా పడితే…ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ చేస్తున్నామని రాజమౌళి చెబుతున్నాడు. గ్రాఫిక్స్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ వగైరా పనులను ఎవరికీ వారే ఇంటి నుండి చక్కబెడుతున్నారు. అయితే ప్రస్తుతం RRR విషయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ లు యంగ్ ఏజ్ లోనే దొరల అన్యాయాలను చూసి సహించలేక.. వారిని ఎదిరించలేక.. అందరికి దూరంగా పారిపోయి అజ్ఞాతవాసం గడుపున్న వీరి ఇద్దరికి అజయ్ దేవగన్ పరిచయం అవడం, వీళ్ళిద్దరిని గొప్ప పోరాట యోధులుగా మార్చడానికి అజయ్ దేవగన్ వీరికి గురువుగా మరి.. వారిని యుద్ధ విద్యల్లో పోరాట యోధులుగా తీర్చి దిద్ది.. వారిలో కసిని పెంచి.. దొరల మీదకి ప్రయోగిస్తాడని.. అంటున్నారు. మరి అజయ్ దేవగన్ పాత్ర ఈ సినిమాలో కథని మలుపు తిప్పే పాత్ర అని ఎప్పటినుండో.. ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. మోదటినుండి అజయ్ దేవగన్ పాత్ర మీదే ఈతరహా ప్రచారమే జరుగుతుంది. |
https://www.telugupost.com/top-stories/kishan-reddy-has-to-resign-from-the-post-of-minister-and-also-the-post-of-mp-in-order-to-contest-in-assembly-elections-1436872 | కిషన్ రెడ్డి వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? ఆయన పోటీకే మొగ్గు చూపుతున్నారా? లేదా తన కుటుంబ సభ్యుల ను బరిలోకి దింపనున్నారా? అనే చర్చ జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకం. ప్రతి నియోజకవర్గంలోనూ కీలక నేతలను బరిలోకి దించాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో కీలక నేతలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఇప్పటి నుంచే బీజేపీ కసరత్తులు ప్రారంభించినట్లు తెలిసింది. వరస సమావేశాలు నిర్వహిస్తూ సమర్థవంతమైన నేతల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవసరమైతే ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు జరుగుతుంది.ఒకే ఒక స్థానం...2018 శానససభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో ఒకే ఒక్క స్థానం లభించింది. అదీ నగరంలోని గోషామహల్ నుంచి రాజాసింగ్ ఎన్నికయ్యారు. అన్ని చోట్ల నుంచి అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. 119 నియోజకవర్గాల్లో దాదాపు 107 నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అయితే ఈసారి పరిస్థితులు అలా లేవు. బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా పుంజుకుంది. కాంగ్రస్ ను తోసిరాజని కొంత జనంలోకి వస్తుంది. అయితే హైదరాబాద్ జంటనగరాల్లో పార్టీ పరిస్థితిని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండుసార్లు వరసగా...ఇందులో భాగంగా అంబర్ పేట్ నియోజకవర్గం పై బీజేపీ ప్రధాన దృష్టి పెట్టింది. అంబర్ పేట్ నియోజకవర్గంలో రెండుసార్లు బీజేపీ విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. 2014లోనూ ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కానీ 2018 ఎన్నికల్లో ఆయన గెలుపొందలేక పోయారు. హ్యాట్రిక్ విజయం మిస్ అయ్యారు. అప్పుడు కూడా కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యారు. అంబర్ పేట్ లో ఆయన ఇటీవల తరచూ పర్యటిస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉండి అంబర్ పేట్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. శాసనసభ ఎన్నికల్లో...అయితే ఈసారి ముందుగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు రానున్నాయి. అందువల్ల కిషన్ రెడ్డి పోటీ చేస్తారన్న గ్యారంటీ లేదు. కిషన్ రెడ్డి అయితేనే ఖచ్చితంగా గెలుపు సాధ్యమవుతుందని సర్వే నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి మోడీ కేబినెట్ లో కీలకంగా ఉన్నారు. ప్రధాని గుడ్ లుక్స్ లో ఉన్నారు. ఏడాది ముందే జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మంత్రిపదవితో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన కుటుంబ సభ్యులను పోటీ చేయించే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. కిషన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారంటున్నారు. మరి చివరకు పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి. |
https://www.telugupost.com/movie-news/puri-jagannath-daughter-pavitra-86039/ | ఒకప్పుడు టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు.. స్టార్ హీరోలే కాదు.. కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా పూరి ని తప్పించుకునే స్థితిలో పూరి ప్రస్తుతం ఉన్నాడు. అందుకే హీరోలెవరు ఛాన్స్ ఇవ్వకపోయినా... తన కొడుకు తో సినిమా తీసినా సక్సెస్ కాలేదు... అలాగని పేరు రాలేదు. ఇక ఆయన డైరెక్టర్ అయితే.. కొడుకు ఆకాష్ పూరి హీరో గా అయ్యాడు. మెహబూబా తో డీసెంట్ గా హీరో గా ఏంట్రీ ఇచ్చాడు. నటనలో, డాన్స్ లలో శిక్షణ తీసుకుని మరీ హీరోగా మారాడు. మెహబూబా లో హీరోగా బాగానే మెప్పించిన.. ఆ సినిమాలో కరెక్ట్ కంటెంట్ లేక హిట్ కాలేదు.ఇక పూరి కూతురు పవిత్ర మాత్రం ప్రస్తుతం సినిమాల వైపు రాలేదు. బుజ్జిగాడు సినిమాలోత్రిష చిన్నప్పటి కేరెక్టర్ లో కాస్త చిన్న బిట్ లో కనబడిన పవిత్ర ప్రస్తుతం చదువుకుంటుంది. అయితే గతంలోనే తనకి హీరోయిన్ గా రావడం ఇష్టం లేదని... నటనలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. కానీ సినిమాల్లో పనిచేస్తానని చెప్పింది. టెక్నీకల్ సైడ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పిన పవిత్ర కి నిర్మాణ రంగం అంటే ఇష్టమట. మరి గతంలోలా కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోల కూతుళ్లు, హీరోయిన్స్ కూతుళ్లు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు మరికొంతమంది సక్సెస్ కాలేక సైలెంట్ అవుతున్నారు.ఇక మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు వంటి వాళ్ళు నిర్మాతగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయినట్లుగా పవిత్ర ప్రొడక్షన్ లో సక్సెస్ అయ్యాక… మంచి అవకాశం వస్తే నటన గురించి ఆలోచిస్తానని చెబుతోంది. బుజ్జిగాడు తర్వాత పవిత్రకు రెండు అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట. అమ్మను వాళ్లు ఆ రెండు సినిమాల దర్శక నిర్మతలు బాగా బతిమాలారు. కానీ ఇష్టం లేకనే మళ్ళీ నటన వైపు వెళ్లలేదని చెబుతుంది పవిత్ర. |
https://www.telugupost.com/crime/encounter-took-place-on-the-borders-of-chhattisgarh-four-top-maoist-leaders-were-killed-in-this-encounter-1526375 | Security forces killed Top Maoists Leaders :ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయినట్లు సమాచారం. డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంాతు, డీవీసీ సభ్యులు కురుసాం రాజు, వెంకటేష్ లు మరణించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రాకపోయినప్పటికీ పోలీసులు అనధికారికంగా ధృవీకరించారు.36 లక్షల రివార్డు...మృతి చెందిన మావోయిలస్టులపై 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసుల చెబుతున్నారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఈ ఘటన జరిగింది. అయితే పోలీసు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం కావడంతో మిగిలిన వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారి కోసం అడవిలో గాలిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. |
https://www.telugupost.com/movie-news/nayanathara-real-life-chief-minister-92873/ | కోలీవుడ్ లో సెన్సేషన్ న్యూస్ ఏంటంటే దశాబ్దం కిందట ఓ జ్యోతిష్యుడు నయనతారకు ముఖ్యమంత్రి పదవీయోగం ఉందని చెప్పాడట. అలానే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు కూడా చెప్పాడట. పెళ్లి చేసుకోవద్దు అని..పెళ్లి చేసుకుంటే రోడ్డున పడతావ్ అని..పెళ్లి చేసుకోకుండా ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడట.నందూ బయటపెట్టాడు.....మరి ఇది నయన్ నమ్ముతుందో లేదో తెలియదు కానీ అది నిజమే అని డైరెక్టర్ నందు చెప్పుతున్నారు. ఈవిషయాన్ని నయన్ ఎక్కడ చెప్పలేదు కానీ డైరెక్టర్ నందు ఈ విషయాన్ని బయట పెట్టేసాడు. శింబు - నయన్ ప్రేమలో ఉన్నప్పుడు వారిద్దరూ ఓ జ్యోతిష్యుడు దగ్గరకు వెళ్లారని.. అప్పుడు అలా ఆ జ్యోతిష్యుడు చెప్పాడని నందు చెప్పాడు.అందుకోసమేనా?మరి ఈవిషయం ఆమె నమ్మిందో లేదో కానీ ప్రస్తుతం ఆమె అయితే అధికారికంగా అవివాహితగానే ఉంది. మరి నయన్ సీఎం ఎప్పుడు అవుతుందో! ఏమో గుర్రం ఎగరావచ్చు. కానీ ఇవ్వని ట్రాష్ అని కొంత మంది అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. |
https://www.telugupost.com/crime/tragedy-occurred-in-nizamabad-district-three-children-died-after-going-swimming-1530451 | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంద.ి ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం ఓడ్యాట్‌పల్లిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మరణించారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల రోదన అంతా ఇంతా కాదు.ముగ్గురూ...మృతులను తిరుపతి, నవీన్, మహేష్ గా గుర్తించారు. ఈత రాకుండా చెరువులోకి దిగడం.. నీళ్లు ఎక్కువగా ఉండటంతోనే చిన్నారులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. |
https://www.telugupost.com/movie-news/madras-high-court-notices-173199/ | మద్రాస్ హై కోర్టు సెలెబ్రిటీస్ కి షాకిచ్చింది. ఆన్ లైన్ లో జరిగే గ్యాంబ్లింగ్ ని ప్రోత్సహిస్తూ యాడ్స్ లో పాల్గొన్న పలువురు సెలబ్రిటీస్ కి మద్రాస్ హై కోర్టు నోటిస్ లు జారీ చేసింది. ఆన్ లైన్ జూదం వలన చాలామంది ఆస్తులు పోగొట్టుకోవడమే కాదు.. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. వాటిని ఎంకరేజ్ చేస్తూ సెలబ్రిటీస్ ఆయా రకాల ఆన్ లైన్ గేమ్స్ కోసం పబ్లిసిటీ చేయడంపై కోర్టు సీరియస్ అయ్యింది. ఈ రకమైన ఆన్ లైన్ గేమ్స్ ని ప్రోత్సహిస్తూ పబ్లిసిటీ చేసిన వారిలో క్రికెటర్స్ సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ సెలబ్రిటీస్ అయినా రానా, ప్రకాశ్ రాజ్, తమన్నా, సుదీప్ లకు మద్రాస్ హై కోర్టు నోటీసు లు జారీ చేసింది. ఆన్ లైన్ జూదాన్ని నిషేధించాలంటూ వేసిన పిల్ పై మద్రాస్ హాయ్ కోర్టు సెలెబ్రటీస్ కి నోటీసులు జారీ చేసింది. మరి జూదాన్ని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించడం అనేది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. ఇక ఆన్ లైన్ జూదాన్ని మరో పది రోజుల్లో నిషేదించాలని చెప్పింది కోర్టు. మరి ఈ నోటీసు లకు సెలబ్రిటీస్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ నెల 19 కల్లా సెలబ్రిటీస్ కోర్టు కి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని కోర్టు తెలిపింది. |
https://www.telugupost.com/movie-news/ఆ-మ్యూజిక్-డైరెక్టర్-పై-ప-64498/ | సూర్య తో కలిసి తమిళ డైరెక్టర్ తెరకెక్కించిన సింగం సీరీస్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. అయితే మొదటి రెండు అంటే సింగం 1 , 2 పార్ట్ లకు మ్యూజిక్ కూడా ఆ సినిమాలు హిట్ అవడానికి అతి ముఖ్య కారణంగా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సింగం మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ దగ్గరనుండి పాటల వరకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. సినిమా హిట్ లో మెయిన్ పార్ట్ మ్యూజిక్ కె ఇచ్చేసారు క్రిటిక్స్ అండ్ ప్రేక్షకులు. కానీ ఏమైందో తెలియదు తెలియదు గాని డైరెక్టర్ హరి సింగం 3 కి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ని తప్పించి హరీష్ జైరాజ్ కి అవకాశం ఇచ్చారు. అయితే మొదటి రెండు పార్టులలో మ్యూజిక్ కి ఎక్కవ మార్కులిచ్చిన వారు సింగం 3 కి మాత్రం మ్యూజిక్ ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయారు. మరి అప్పట్లో సినిమా మ్యూజిక్ విషయంలో దర్శకుడు హరి తీసుకున్న రాంగ్ డెసిషన్ సినిమా విడులయ్యాక కానీ అతనికి అర్ధం కాలేదు. అయితే అప్పుడు దేవిశ్రీ ప్లేస్ ని హరీష్ జైరాజ్ కొట్టేస్తే ఇప్పుడు దేవిశ్రీ, హరీష్ జైరాజ్ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రతీకారం అనే పెద్ద మాట ఎందుకులే గాని మీరు ఇప్పుడు చదివేది చూస్తే ఇంచుమించు అలానే అనిపిస్తుంది. అదేమిటంటే ఇప్పుడు డైరెక్టర్ హరి తమిళంలో తెరకెక్కిస్తున్న సామీ సినిమా సీక్వెల్ సామి 2 కి దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. మరి ముందుగా హరి సామి 2 కి హరీష్ జైరాజ్ నే మ్యూజిక్ కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడు హరీష్ జై రాజ్ ని తప్పించి హరి, దేవి తో జట్టు కట్టాడు. మరి సామీ సినిమాకి హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. కానీ ఇప్పుడు సామీ 2 కి హరీష్ ప్లేస్ లో దేవిశ్రీ ఉన్నాడు. అలా అనుకోకుండా దేవిశ్రీ ప్రసాద్ హరీష్ చేయాల్సిన సినిమాని చేస్తూ హరీష్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. |
https://www.telugupost.com/politics/there-is-happiness-in-the-party-over-the-finalization-of-congress-mlcs-in-telangana-1515493 | నిజమే... గుడ్ సెలక్షన్.. వీరిద్దరి పేర్లను అధినాయకత్వం ఖరారు చేయడం సబబే. పదేళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉండి, విపక్షంలో ఉండి నాటి ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే అందుకు అనువైన శక్తి కావాలి. తపన కావాలి. పార్టీ పట్ల అంకిత భావం ఉండాలి. తరచూ పార్టీలు, జెండాలు మార్చే వారికి ఏదో పదవి అన్ని పార్టీల్లోనూ లభిస్తూనే ఉంటుంది. వారిది అవకాశవాద రాజకీయం అని తెలిసినా.. సామాజిక కోణంలోనో, ఆర్థికపరంగానో చూసి వారికి అందలం ఎక్కిస్తారు. ఏ పార్టీ అయినా దీనికి అతీతం కాదు. అందుకే పార్టీలను క్షణాల్లో మార్చేందుకు ఎవరైనా సిద్ధపడతారు. తమకు పదవి లభిస్తే చాలు అని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.ఎమ్మెల్యే కోటాలో...కానీ ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైన వారిద్దరూ సరైనోళ్లే. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లు ఇద్దరూ పదేళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారే. ఉద్యమ కాలం నుంచి ఉన్నవారైనా పార్టీ ఆదేశాలను ఎన్నడూ బేఖాతరు చేయలేదు. పార్టీ ఇచ్చిన పనిని వాళ్లు పూర్తి చేయడానికే ప్రయత్నించారు. కానీ వారికి గత ఎన్నికల్లో కాలం కలసి రాలేదు. లెక్కలు సరిపోలేదు. సర్వేలు వీరివైపు చూడలేదు. అందుకే వారిద్దరికీ టిక్కెట్లు గల్లంతయ్యాయి. అయితేనేం.. అప్పుడే వారికి హామీ లభించింది. అధికారంలోకి రాగానే చట్టసభలకు పంపుతామని ఇచ్చిన హామీని వారు నమ్మారు. పార్టీ కోసం పనిచేశారు. ఫలితంగా ఈరోజు ఎమ్మెల్సీలు కాబోతున్నారు.కుర్చీకే గౌరవం ఇచ్చి...అద్దంకి దయాకర్ కు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది. ఆయనకు బీఆర్ఎస్ నేతలతో సంబంధాలున్నా ఎప్పుడూ గులాబీ పార్టీ వైపు చూడలేదు. 2014 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి చూసి కుంగిపోలేదు. టీవీ చర్చల్లో అద్దంకి దయాకర్ పాల్గొని అప్పటి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ప్రయత్నించారు. తెలంగాణ కాంగ్రెస్ వాయిస్ గా నిలిచారు. పీసీసీ చీఫ్ లు మారినా.. ఆయన ఎవరి పక్షాన నిలబడలేదు. ఎవరిని పార్టీ ఆ కుర్చీలో కూర్చోబెడితే.. ఆ కుర్చీకే గౌరవం ఇచ్చిన అద్దంకి దయాకర్ కల ఎట్టకేలకు సాకారం కానుంది. ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం సముచితమైన నిర్ణయం అని పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి. విద్యార్థి సంఘం నేతగా...అదే విధంగా బల్మూరి వెంకట్ కాంగ్రెస్ అనుబంధ సంఘం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేశారు. అనేక కేసులను ఎదుర్కొన్నారు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. చివరకు ఒకానొక దశలో ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తే జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే మారు మాట్లాడకుండా ఓకే చెప్పారు. ఆయన ఒంటరిగానే అప్పుుడు పార్టీ కోసం ప్రచారం చేసుకున్నారు. డిపాజిట్లు దక్కలేదు. అయినా కుంగిపోలేదు. ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించినా రాలేదు. కానీ నిరాశ పడలేదు. పార్టీ వెంటే నడిచారు. ఇప్పుడు నక్క తోక తొక్కినట్లు ఎమ్మెల్సీ కాబోతున్నారు. అందుకే ఇద్దరి పేర్లను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ హైకమాండ్ మంచి నిర్ణయమే తీసుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇందులో వేరే అభిప్రాయానికి, విమర్శలకు తావు లేదు. |
https://www.telugupost.com/movie-news/సక్సెస్‌తో-వీడ్కోలు-పలకా-15280/ | 2016 సంవత్సరానికి తెలుగు చిత్రాలలో తొలి సక్సెస్ ఇచ్చిన చిత్రం నేను శైలజ. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా పరిచయమయ్యింది. పరిచయ చిత్రం, పైగా ఈ ఏడాదికి తెలుగులో తొలి చిత్రం ఐన నేను శైలజ తో బాహారీ విజయాన్నే నమోదు చేసింది కీర్తి సురేష్. ఈ చిత్రం తరువాత అనూహ్యంగా కొద్దిగా విరామం వచ్చినప్పటికీ ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో బిజీగా వుంది కీర్తి సురేష్. పలు స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ కథానాయిక అవకాశం దక్కించుకుంది ఈ మద్రాస్ నాచురల్ బ్యూటీ.నేను శైలజ తరువాత కీర్తి సురేష్ నటించిన మరే స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. కానీ కీర్తి సురేష్ తమిళంలో ధనుష్ సరసన తొడరి చిత్రంలో నటించగా ఆ చిత్రం ధనుష్ కు తెలుగు లో వున్న మార్కెట్‌తో రైల్ పేరు మీద అనువాదమయ్యింది. ఆ చిత్రం నష్టాలను మిగిల్చింది. తమిళంలో విజయం పొందిన కీర్తి సురేష్ ఇటీవల చిత్రం రెమో కథానాయకుడు తెలుగు వారికి పరిచయం లేనప్పటికీ మరో విజయం కోసం ఉవ్విళ్ళూరుతున్న కీర్తి సురేష్ స్వయంగా దిల్ రాజు కు రెమో చిత్ర అనువాద హక్కులు ఇప్పించింది. తమిళ ప్రేక్షకుల అభిరుచులు తెలుగు ప్రేక్షకుల అభిరుచులు వేరు వేరు అని మరోసారి చాటి చెప్పింది తెలుగు రెమో ఫలితం.ఇక అనువాద చిత్రాల సంగతి పక్కన పెట్టి వరుస విజయాలతో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ నటించిన నేను లోకల్ చిత్రం ఈ నెల 23 న విడుదలకు సిద్దమవుతుండటంతో నేను లోకల్ పై ఆశలు పెంచుకుంది కీర్తి సురేష్. ఈ ఏడాదికి ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం సక్సెస్‌తో స్వాగతం పలికినట్లుగా మరో స్ట్రెయిట్ తెలుగు చిత్ర సక్సెస్‌తో వీడ్కోలు పలకాలని ఆరాటపడుతోంది కీర్తి సురేష్. మరి ఈ భామ ఆశ నెరవేరుతుందో లేదో మరో మూడు వారాలలో తేలిపోనుంది. |
https://www.telugupost.com/movie-news/అమ్మో-అస్సలు-తగ్గడం-లేదు-38116/ | ధనుష్ తమిళంలో నటించిన 'విఐపి' చిత్రం ఇక్కడ తెలుగులో 'రఘువరన్ బిటెక్' గా విడుదలై హిట్టయ్యింది. అయితే ఇప్పుడు ధనుష్ నిర్మతాగా.. హీరోగా మళ్లీ 'విఐపి' సీక్వెల్ గా 'విఐపి 2 ' ని చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో 'విఐపి 2 ' పేరు తోనే విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అయితే ధనుష్ - కాజోల్ - అమలాపాల్ లు ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈచిత్రం ఈ నెల 28 నే విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు రైట్స్ దక్కించుకోవడానికి ఒకరిద్దరు నిర్మాతలు బాగా ట్రై చేశారు. కానీ ధనుష్ మాత్రం వాళ్ళకి దిమ్మతిరిగే రేటు చెప్పి ఖంగు తినిపించాడట.'విఐపి 2 ' తెలుగు రైట్స్ కావాలంటే 12 కోట్లు ఇవ్వాల్సిందే అంటున్నాడట. మరి ఒక్కసారే అంత రేటు చెబితే ఎవరు కొంటారు చెప్పండి. అందుకే ఇప్పటివరకు తెలుగు రైట్స్ ని కొనడానికి నిర్మాతలెవరు ముందుకు రావడం లేదట. మరి సినిమా విడుదల దగ్గర పడుతుంది. కానీ ధనుష్ సినిమాని అంత రేటు పెట్టి కొన్నాక కూడా మరో కోటి రూపాయలు ఖర్చులు, పబ్లిసిటీకి పెట్టాల్సి వస్తుంది. మొత్తం అంతా కలిపి దాదాపు 13 కోట్ల దాకా అవుతుంది. కాబట్టి ఆ సినిమా కొనడానికి తెలుగు నిర్మాతలకు ఆసక్తి పోయిందంటున్నారు.మరి రజినీకాంత్ సినిమాలంటే అడిగినంతా ఇచ్చేస్తారు గాని ఇలా మిగిలిన హీరోలు అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు జంకుతారు. అందులోనూ సూర్య, కార్తీ సినిమాలకే అంత రేటు లేదంటున్నారు. మరి ఒకవేళ ధనుష్ సినిమాని 12 కోట్లకి కొన్నా కూడా డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఏంటంటూ క్వచ్చన్ చేస్తున్నారు సదరు నిర్మాతలు. |
https://www.telugupost.com/movie-news/ఐశ్వర్య-కూడా-మోదీని-కీర్-13051/ | ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన పాప జననం తరువాత పత్రికా విలేకరులతో, మీడియా ప్రతినిధులతో ముచ్చట్టించటం పూర్తిగా మానుకుంది. తన కూతురు ఆధ్య జననం తరువాత ఆవిడ నటించిన చిత్రాల సంఖ్య కూడా కేవలం రెండు మాత్రమే. ఇటీవల విడుదల ఐన ఏ దిల్ హై ముష్కిల్ విజయం సాధించి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కి మొదటి 100 కోట్ల వసూళ్ల చిత్రంగా నిలవటమే కాక, ఆమెకు పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చింది. అయితే తన చిత్రాల గురించి కూడా ఎప్పుడూ పెద్దగా నోరు మెదపని ఐష్ ఇప్పుడు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కేంద్ర ప్రభుత్వ పని తీరు గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది.తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఒక వైపు దేశ ఆర్ధిక వ్యవస్థను తయారు మారు చేస్తుండగా, ఆ చర్య లోని దీర్ఘ కాళికా ప్రయోజనాలపై సామాన్య ప్రజలకు మరింత చైతన్యం కలిపించాలని అభిప్రాయపడింది ఐష్. "ఇంతటి సాహసోపేతమైన నిర్యాన్ని తీసుకోవటమే కాకుండా నిజాయితితో అమలు జరుపుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా లో వస్తున్న వార్తలు కానీ, ఇతర రాజకీయ పార్టీల ఆరోపణలు కానీ సామాన్య ప్రజలను కొంత ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తేవటానికి ఈ నోట్ల రద్దు వలన జరిగే దీర్ఘ కాళికా ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరేలా కేంద్ర ప్రభుత్వమే జాగ్రత్తలు వహించాలి. అప్పుడే ఈ చర్య సక్రమంగా అమలు అవుతుంది." అని తన మనసులోని మాట వ్యక్తపరిచింది ఐశ్వర్య రాయ్ బచ్చన్. |
https://www.telugupost.com/crime/kalvakuntla-kavita-about-hakeempet-sports-school-incident-1489439 | తెలంగాణలో చోటు చేసుకున్న ఓ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక దినపత్రిక లో వచ్చిన కథనం నన్ను ఎంతో కలిచివేసింది. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదు. బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని గౌరవ మంత్రి @VSrinivasGoud గారిని కోరుతున్నాను" అంటూ ఆదివారం ఉదయం ఒక పోస్టు పెట్టారు కవిత.హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో... అధికారి లైంగిక వేధింపులపై ఆమె ఈ విధంగా స్పందించారు. స్పోర్ట్స్ స్కూల్‌లో తన గదికి ఎదురుగా ఉండే గదిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సదరు అధికారి రాసనీలలు నడుపుతున్నాడని, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆ అధికారి. బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు. సాయంత్రం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడు. ఆట విడుపు పేరుతో కారులో బాలికలను ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని బాలికలు ఆరోపించారు. ఉన్నతాధికారుల అండదండలతో వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు చెబుతున్నారు. స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై స్పందించిన ప్రభుత్వం..బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిని సస్పెండ్ చేసింది. |
https://www.telugupost.com/movie-news/payal-rajpoot-role-in-venkatesh-nagachaitanya-venkymama-movie-142509/ | పాయల్ రాజపుట్ కి వరస గా షాకులు పడుతూనే ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ తో చేసిన RX 100 హిట్ కానీ RDX లవ్ ప్లాప్. RDX లవ్ అలాంటి ఇలాంటి ప్లాప్ కాదు. అమ్మడుకి దిమ్మతిరిగే ప్లాప్ ఇచ్చింది. అయినా పాయల్ రాజపుట్ కి కుర్ర హీరోలెవరు ఛాన్స్ ఇచ్చినపాపాన పోలేదు. వెంకిమామ లో సీనియర్ హీరో వెంకటేష్ సరసన, డిస్కో రాజా లో రవితేజ సరసన ఆఫర్స్ తగిలాయి. వెంకిమామలో రాశి ఖన్నా కాంపిటీషన్, డిస్కో రాజా లో నాభ నటేష్ కాంపిటీషన్. మరి సీనియర్ హీరోలంటే.. ఇప్పటినుండి ఇక పాయల్ కి యంగ్ హీరోస్ ఛాన్స్ రావడం కష్టం. అందులోని వెంకిమామ సూపర్ డూపర్ హిట్ అయితే పాయల్ కి ఏమైనా ఛాన్స్ ఉండేది. కానీ వెంకిమామ కి యావరేజ్ పడింది. వెంకిమామ కి యావరేజ్ టాక్ పడడం అటుంచి… ఈ సినిమాలో పాయల్ రాజపుట్ కేవలం అందాల ఆరబోతకే కానీ.. నటనకు స్కోప్ లేని పాత్ర. హిందీ టీచర్ గా పాయల్ గ్లామర్ గా కనబడింది. ఓకె.. కానీ నటనకు ఏమాత్రం ఆస్కారం లేదు. ఏ క్రిటిక్ చూసినా పాయల్ రాజపుట్ అందాల ఆరబోతకి.. వెంకటేష్ సరసన పాటల కోసమే కానీ పాయల్ హడావిడి సినిమాలో ఏం లేదనేశారు. ఒకరు పాయల్ రాజపుట్ పాత్ర ప్రేక్షకుల్ని కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్తుంది. ఆమె అప్పీయరెన్స్ కూడా ఏమంత గొప్పగా లేదు అంటే మరొకరు… పాయల్ రాజపుట్ కన్నా కొద్దిగా రాశి ఖన్నా పాత్రకే ఎక్కువ ఇంపోర్టన్స్ ఉంది.. పాయల్ ఎలా ఒప్పుకుందో పాపం అంటున్నారు. మరి వెంకిమామ ఇంతపెద్ద షాకిస్తే… రేపు రవితేజ డిస్కో రాజా ఏం చేస్తుందో అనే బెంగలో పాయల్ ఉంది |
https://www.telugupost.com/movie-news/స్నేహితుడినే-లెక్కచేయని-17375/ | సునీల్ కి ఈ మధ్యన హీరోగా పెద్దగా కలిసి రావడం లేదు. అసలే కమెడియన్ పోస్ట్ కి బ్రేక్ ఇచ్చి మరీ హీరో గా సెటిల్ అయినా సునీల్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అయినా కమెడియన్ గా అవకాశాలు వచ్చినా కూడా వాటిని లెక్క చెయ్యకుండా ఇంకా హీరోగా ఎవరన్నా ఛాన్స్ ఇస్తారేమో అని కాచుకు కూర్చున్నాడు. మరో పక్క సునీల్ తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. కానీ అవేమి పట్టాలెక్కే ఛాన్స్ లేదని తేలిపోయింది.మరి మళ్ళీ కమెడియన్ గా వచ్చెయ్యొచ్చు కదా.. అని చాలామంది సునీల్ కి నచ్చజెబుతున్నారట. ఇక సునీల్ ని ఇప్పటికే చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 లో కమెడియన్ గా చెయ్యమని కోరగా తనకి డేట్స్ ఖాళీ లేవని తప్పించుకున్నాడట. అంటే సునీల్ కి ఇప్పుడు చేతిలో సినిమా లేక పోయిన కూడా డేట్స్ ఖాళీ లేవా? అని అందరి మదిలో మెదిలే ప్రశ్న. అంటే సునీల్ కి కమెడియన్ గా మళ్లీ ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదనేగా దానర్ధం. ఇక అన్న సినిమాలో చెయ్యనని చెప్పిన సునీల్ ఇప్పుడు తమ్ముడి సినిమాలో కూడా చెయ్యనని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం లో సునీల్ కి ఒక మంచి పాత్రని రెడీ చేసాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎందుకంటే సునీల్ త్రివిక్రమ్ కి ఆప్త మిత్రుడాయె. అందుకే సునీల్ తన సినిమాలో కమెడియన్ గా చేస్తాడనే నమ్మకం తో త్రివిక్రమ్ సునీల్ కి ఒక కేరెక్టర్ ని డిజైన్ చేసాడట. అయితే ఈ ఛాన్స్ ని కూడా సునీల్ కాదన్నాడనే మాట వినిపిస్తోంది. మరి ఏంతో నమ్మకం తో వున్న త్రివిక్రమ్ కి స్నేహితుడైన సునీల్ అలా ఎందుకు నో చెప్పేసాడో. అసలే హీరో గా అవకాశాలు రావడం లేదు అయినా కూడా ... మెగాస్టార్, పవర్ స్టార్ పక్కన కమెడియన్ గా సునీల్ ఎందుకు చెయ్యనన్నాడో అందరూ తెగ చర్చించుకుంటున్నారట. |
https://www.telugupost.com/movie-news/కాస్త-ఆలస్యంగా-స్పందించా-36639/ | జిఎస్టి కి వ్యతిరేఖంగా గత నాలుగు రోజులుగా కోలీవుడ్ పరిశ్రమలో ఎంతో ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రెండు ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు భారం భరించడం తమ వల్ల కాదంటూ సినిమా షూటింగ్ లు కూడా బ్యాండ్ నిర్వహిస్తున్నారు. ఇక గత సోమవారం నుండి తమిళనాట థియేటర్స్ అన్ని బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. 48, 58 శాతం పన్నుల భారానికి వ్యతిరేఖంగా తమిళ సినీ నటులు పోరాటం షురూ చేశారు. అందులో కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేయాగా కొందరు మాత్రం డైరెక్ట్ గానే స్పందించడం మొదలు పెట్టారు.అయితే రాజకీయాల్లోకి వస్తా అంటూ తాత్సారం చేస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఏం మాట్లాడకపోయేసరికి తమిళ సినిమా పరిశ్రమ లోని కొందరు ప్రముఖులు జిఎస్టి కి వ్యతిరేఖం గా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని వ్యక్తి రాజకీయాలకు పనికి రాడంటూ రజినీ పట్ల వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక రజినీకాంత్ అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లాడని చెబుతున్నారు. కానీ సోషల్ మీడియా అంటూ ఒకటి ఏడ్చిందిగా అందులో అయినా కనీసం తన స్పందనని రజినీ వ్యక్త పరిస్తే బావుండేదని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే గత నాలుగు రోజులుగా సైలెంట్ గా ఉన్న రజినీ ఎట్టకేలకు జిఎస్టి మీద తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఆ లేఖలో రజినీ తమిళ పరిశ్రమలో ఉన్న లక్షలాది మంది జీవితాల్ని దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం తమ డిమాండ్ ను ఆమోదించాలి అంటూ తమిళ సినీ పరిశ్రమకు తన మద్దతుని తెలియజేశాడు. |
https://www.telugupost.com/movie-news/పది-రోజులు-ఇంటిముఖం-చూడన-14963/ | రానున్న సంక్రాంతి పండుగకి బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనేట్టుగా గట్టి పోటీ నెలకొననుంది. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 150 వ చిత్రం ఖైదీ నెం.150 ఆయన కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కటం, మరోపక్క నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి నిర్మాణాంతర కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసుకుంటూ సంక్రాంతి బరిలో దిగటానికి సిద్దమవుతుండటం. ఇప్పటికే గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రీకరణతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయి ఉండాలి. కానీ షెడ్యూల్ మధ్యలో దర్శకుడు క్రిష్ వివాహ వేడుక రావటంతో చిత్రీకరణకు కొంత అంతరాయం కలిగింది.అయినప్పటికీ సంక్రాంతికి విడుదల చేసి తీరాలని, అదే సమయంలో సినిమా నాణ్యత కోల్పోకుండా జాగ్రత్తలు వహిస్తూ నిర్మాణాంతర కార్యక్రమాలు చేపడుతున్నారు గౌతమీ పుత్ర శాతకర్ణి బృందం. "పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ దశలో మాకు వున్న చిన్న చిన్న సందేహాలకు కూడా ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చి మాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. దర్శకుడు క్రిష్ అయితే పది రోజులకి ఒక సారి ఇంటికి వెళ్తున్నారు. ఆయన ఒంటరిగా లాగుతున్న పెద్ద రథానికి మేము అందరం కలిసి చిన్న పాటి సహాయం మాత్రమే అందిస్తున్నాం. క్రిష్ ఇంటికి వెళ్లకుండా దగ్గర ఉండి తన పర్యవేక్షణలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన భార్య రమ్య అందిస్తున్న తోడ్పాటు అనిర్వచనీయం." అని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేతల్లో ఒకరైన నిర్మాత రాజీవ్ రెడ్డి తన అనుభూతిని పంచుకున్నారు. |
https://www.telugupost.com/crime/telangana-excise-police-strong-warning-to-pubs-1351908 | హైదరాబాద్ నగరంలోని పబ్ లపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. రణ గొణ ధ్వనులతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పబ్ లపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. సౌండ్ తో పాటు లైవ్ బ్యాండ్ పై ఆంక్షలు పెట్టింది. పబ్ ల కారణంగా ఎవరికైనా ఇబ్బంది (సౌండ్ పొల్యూషన్) కలిగితే ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు తెలిపింది. నగరంలోని ఆయా పబ్ లలో శబ్ద కాలుష్యాన్నినివారించే దిశగా జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ,పోలీసులు సూచనలు చేసింది.Also Read : మహీంద్రా షోరూమ్ లో రైతుకు అవమానం.. నేరుగా ఇంటికే బొలెరో వాహనంపబ్ ల నుంచి వచ్చే సౌండ్స్ వల్ల ఇబ్బందులు కలిగితే.. ఫిర్యాదుదారులు నేరుగా 100కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పౌరులకు తెలిపింది ఎక్సైజ్ శాఖ. కొన్ని పబ్ లు ఎక్కువ వాల్యూమ్ లతో నడుస్తున్నాయన్న సమాచారం మేరకు నగరంలో ఉన్న పబ్‌లలో నో డీ జే & నో లైవ్ బ్యాండ్ ఆదేశాలు జారీ చేశారు ఎక్సైజ్ పోలీసులు. |
https://www.telugupost.com/movie-news/arvind-swamy-real-father-is-senior-actor-delhi-kumar-1494132 | తమిళ నటుడు అరవింద్ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజా, బొంబాయి వంటి సినిమాలతో ఇండియా వైడ్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో కొన్నాళ్ళు సినీ పరిశ్రమకు దూరమయ్యి తమ ఫ్యామిలీ బిజినెస్ ని డెవలప్ చేసుకున్నాడు. అరవింద్ స్వామి తండ్రి వెంకటరామ దొరై స్వామి అని అందరికి తెలిసిన విషయమే. ఈయనకు తమిళనాడులో పలు హాస్పిటల్స్ ఉన్నాయి. వీటితో పాటు అరవింద్ కొత్త బిజినెస్ లు కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు.అయితే అందరికి తెలిసినట్టు వెంకటరామ దొరై స్వామి.. అరవింద్ స్వామి సొంత తండ్రి కాదు. అరవింద్ స్వామి సొంత తండ్రి కూడా సినీ పరిశ్రమకు చెందిన వాడే. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించిన ఢిల్లీ కుమార్.. అరవింద్ స్వామి అసలు తండ్రి. ఈయనకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకడైన అరవింద్ స్వామిని ఊహ తెలియని వయసులోనే.. ఢిల్లీ కుమార్ తన చెల్లెలు వసంత స్వామికి దత్తత ఇచ్చేశారు. అప్పటి నుండి అరవింద్ స్వామి వాళ్ళ అబ్బాయి లాగానే పెరిగాడు.ఢిల్లీ కుమారే తన సొంత తండ్రి అని అరవింద్ స్వామికి తెలుసు. కానీ ఆ బంధాన్ని ఎక్కువ పెంచుకోలేదట. ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇద్దరు కలవడం తప్ప, ప్రత్యేకంగా ఎప్పుడు కలుసుకోరట. అలాగే ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు బయట ఇంటర్వ్యూలో ఎక్కడా పెద్దగా మాట్లాడుకోరు కూడా. గతంలో అరవింద్ స్వామి ఇండస్ట్రీకి పరిచయం అయ్యినప్పుడు ఢిల్లీ కుమార్ తన సొంత తండ్రి అని చెప్పాడు.ఆ తరువాత మళ్ళీ ఇప్పటి వరకు ఎక్కడా ఆ విషయాన్ని మాట్లాడలేదు. ఇక ఢిల్లీ కుమార్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడడం తప్ప.. బయట ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవు. మరి మీలో ఎంతమందికి తెలుసు.. అరవింద్ స్వామి ఢిల్లీ కుమార్ తనయుడు అని. |
https://www.telugupost.com/movie-news/చెర్రీ-తో-పాటు-రకుల్-ని-కూ-12966/ | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి చేత అతిధి పాత్ర చేపించి మరీ కమర్షియల్ సక్సెస్ కోసం తాపత్రయ పడ్డ బ్రూస్ లీ చిత్రం ఘోర పరాజయం చవిచూడటంతో కొంత కాలం విరామం తీసుకుని రిస్క్ చెయ్యకుండా విజయం సాధించిన కథనే రీమేక్ చెయ్యటానికి సిద్దపడి తమిళం లో సంచలన విజయం సాధించిన తన్ని ఊరువం చిత్రాన్ని తెలుగులో ధ్రువ పేరుతో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం విజయ దశమి పండుగకు విడుదల చేయలేకపోయారు. డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చేసిన ప్రకటనను, ఈ సారైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే కసితో తాను నిర్మిస్తున్న మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెం.150 నిర్మాణ వ్యవాహారాలను కూడా పక్కన పెట్టి థాయిలాండ్లో ధ్రువ చిత్ర సాంగ్ షూట్లో కష్టపడుతున్నాడు.చిత్రీకరణ పని మీద విదేశం వెళ్తున్నప్పటికీ రామ్ చరణ్ తేజ్ తన శ్రీమతి ఉపాసన ను వెంట తీసుకుని వెళ్ళాడు. లొకేషన్లో రామ్ చరణ్ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు నిబద్దతతో పని చేస్తుండటం చూస్తుంటే తెలియని ఉత్సాహం వస్తుంది అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రేక్షకులతో తన అనుభూతిని పంచుకుంది ఉపాసన. నటుల పని ఏమాత్రం సులభతరమైన వ్యవహారం కాదు అని, సినిమాకి సంబంధించిన బృందం పడే ఇబ్బందులు, ఎదుర్కొనే ఒత్తిడులు స్వయంగా చూస్తున్నానని చెప్పి, తన భర్త తో బీచ్ లొకేషన్లలో రొమాన్స్ గీతాలలో కాలు కదుపుతున్న రకుల్ ని కూడా పొగడ్తలతో ముంచేసి ఏమాత్రం అసూయ లేని తన విశాల హృదయాన్ని ప్రదర్శించింది ఈ మెగా కోడలు. |
https://www.telugupost.com/movie-news/సెకండ్-ఇన్నింగ్స్‌లో-భల-1006/ | 80వ దశకంలో హీరోగా, మరీ ముఖ్యంగా కామెడీ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు సీనియర్ నరేష్. ఆ రోజుల్లో రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్‌లతో పాటు సీనియర్ నరేష్ కూడా కామెడీ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత ఆయన కొంతకాలం తెరమరుగయ్యాడు. ఇప్పటికీ నరేష్ నటించిన 'నాలుగు స్థంబాలాట. చిత్రం భళారే విచిత్రం' చిత్రాలను ఎవ్వరూ మర్చిపోరు. ముఖ్యంగా 'చిత్రం భళారే విచిత్రం'లో ఆయన వేసిన లేడీ గెటప్, అందులో ఆయన పండించిన కామెడీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. తాజాగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో కూడా ఆయన వరుస చిత్రాలు చేస్తూ దూకుడు మీదున్నాడు. ఇటీవలి కాలంలో ఆయన నటించిన 'చందమామ కథలు, దృశ్యం, భలే భలే మగాడివోయ్' చిత్రాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక తాజాగా విడుదలైన 'గుంటూరు టాకీస్' ఆయన్ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. కాగా ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అ..ఆ', మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం', సూపర్‌స్టార్ కృష్ణ రీఎంట్రీ ఇస్తున్న 'శ్రీశ్రీ' వంటి చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు చేస్తున్నాడు. మొత్తానికి సీనియర్ నరేష్ కెరీర్ ఇప్పుడు మంచి ఊపుమీదుందనే చెప్పాలి. |
https://www.telugupost.com/movie-news/hit-2-movie-trailer-out-now-1449535 | విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. వరుస హిట్లతో దూసుకెళ్తున్న అడివి శేష్ హీరోగా.. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా హిట్ 2. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. విడుదలైన నాలుగు గంటలకే 1 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో.. సినిమాపై అంచనాలను రెట్టింపయ్యేలా చేసిందీ ట్రైలర్. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ 2 ది సెకండ్ కేస్‌తో మరోసారి పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మీనాక్షి చౌదరి అడివి శేష్ కు జోడీగా నటించింది.అడివి శేష్ ఒక కూల్ పోలీస్ గా కనిపిస్తాడు. అతనికి ఒక భయంకరమైన కేసును అప్పజెప్తారు. ఆ కేసులో ఊహించని ట్విస్టులు ఎదురవుతుంటాయి. అత్యాచారం జరగదు కానీ.. అమ్మాయిలు చనిపోతుంటారు. ఒక్కొ అమ్మాయి నుండి ఒక్కో శరీర భాగాన్ని నరికి.. ఒక డెడ్ బాడీగా పడేస్తాడు నిందితుడు. ఆ నిందితుడు ఎవరు ? ఎందుకు వరుసగా అమ్మాయిల్ని చంపుతున్నాడు ? అన్న సస్పెన్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. న్యాచురల్ స్టార్ నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హిట్ 2 విడుదల కానుంది. |
https://www.telugupost.com/politics/bjp-mla-rajasingh-gave-clarity-on-joining-brs-1484944 | హైదరాబాద్: తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేతల అసంతృప్తి, ఇతర పార్టీల్లో చేరికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ బీఆర్‌ఎస్ చేరవచ్చని పుకార్లు వచ్చాయి. ఇవాళ ఎమ్మెల్యే రాజాసింగ్.. మంత్రి టి.హరీశ్ రావు నివాసానికి వెళ్లిన నేపథ్యంలో ఆయన అధికార బీఆర్‌ఎస్‌లో చేరవచ్చనే ఊహాగానాలకు దారితీసింది. అయితే, బీజేపీ తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న వార్తలకు రాజా సింగ్ చెక్ పెట్టారు. హరీష్‌రావును కలిసిన అనంతరం రాజాసింగ్ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. అందులో తాను చనిపోయే వరకు బీజేపీతోనే ఉంటానని చెప్పారు. బీజేపీ తన సస్పెన్షన్‌ను ఎత్తివేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కానీ పార్టీని వీడను అని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో ఇస్లాం మతంపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో బిజెపి ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యారు. బీజేపీ వేటు వేసిన తర్వాత.. రాజాసింగ్ కొంతకాలం సైలెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరనున్నరనే వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీలో చేరడం లేదని ఆ వార్తలను రాజాసింగ్ ఖండించారు.తాను బీజేపీని వీడనని, మరే ఇతర రాజకీయ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించేందుకు, తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కోరేందుకు హరీశ్‌రావుతో సమావేశమైనట్లు రాజాసింగ్ తెలిపారు.भगवा और भाजपा मेरी रगों में है.... pic.twitter.com/t7gtsMPrGA— Raja Singh (@TigerRajaSingh) July 14, 2023 |
https://www.telugupost.com/top-stories/even-though-it-has-been-many-years-since-janasena-party-was-formed-party-does-not-have-a-discipline-committee-1435083 | జనసేన పార్టీని పవన్ కల్యాణ్ స్థాపించి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తుంది. అయితే ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. పవన్ కల్యాణ్ సోలోగానే పార్టీని ఇప్పటి వరకూ నడుపుకుంటూ వచ్చారు. తొలుత మాదాసు గంగాధరం, జేడీ లక్ష్మీనారాయణ వంటి నేతలు ఉండేవారు. తర్వాత నాదెండ్ల మనోహర్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే కీలక నేతలందరూ పార్టీ నుంచి వెళ్లిపోయారు. జిల్లాలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ ఆ పార్టీకి లేరు. ఆ పార్టీలో ఎవరూ చేరలేదు. వీరు చేర్చుకోలేదు కూడా. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు ఎన్నికలు జరిగాయి.కోవర్టులు ఎవరు?2014లో జనసేన పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీకి మద్దతుగా నిలించింది. 2019 ఎన్నికల్లో కమ్యునిస్టులు, బీఎస్సీలతో కలసి కూటమి ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళ్లింది. ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఆ సమయంలోనూ పార్టీలో పెద్దగా ఎవరూ చేరలేదు. అయితే ఈసారి జనసేనలో చేరికలు ఎక్కువగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నుంచి జనసేనలో చేరేందుకు నేతలు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి నేతల నుంచి ప్రతిపాదనలను అందుతుండటంతో పవన్ కల్యాణ్ అప్రమత్తమయ్యారంటున్నారు. మరోవైపు ఉన్న నేతల్లో కొందరు కోవర్టులు ఉన్నారని పవన్ కల్యాణ్ అనుమానిస్తున్నారు. అందుకేనా?జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్లు అవుతున్నా ఆ పార్టీకి క్రమశిక్షణ సంఘం అంటూ ఏమీ లేదు. 2019 ఎన్నికల్లో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ పంచన చేరిపోయారు. అయినా ఆయనపై చర్య తీసుకోలేదు. తాజాగా నిన్న జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కారణం చేరికలకు ఓకే చెప్పడానికేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చేరికలతో పార్టీలో కొంత ఊపు వస్తుందని జనసేన నేతలు నమ్ముతున్నారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా చేరికలు అవసరం. కానీ ఇప్పటి వరకూ చేరికలు లేవు. ప్రతిపాదనలు భారీగానే వస్తుండటంతో క్రమశిక్షణ సంఘాన్ని నియమించుకుందామన్న కొందరి నేతల సూచనకు పవన్ కల్యాణ్ ఒకే చెప్పినట్లు తెలిసింది.ఓకే చెప్పేశారా?అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో క్రమశిక్షణ సంఘాన్ని తాజాగా నియమించారు. అసలు నేతలు ఎవరున్నారని ఆయన ఈ సంఘం పెట్టారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఇప్పటి వరకూ అయితే ఆ అవసరం లేదు. ముందు ముందు అవసరాన్ని గుర్తించి ఆయన క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారంటున్నారు. దీనికి ఆయనే ఛైర్మన్ గా ఉంటారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు చేర్చుకుని నియోజకవర్గాల్లో బలపడాలన్న ప్రయత్నంలో పవన్ కల్యాణ్ ఉన్నారని సమాచారం. అందుకే ఆయన చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అందుకే క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేశారన్న టాక్ వినపడుతుంది. |
https://www.telugupost.com/crime/most-wanted-criminal-sunkara-prasad-naidu-arrested-1380649 | మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడును అరెస్ట్ చేశారు పోలీసులు. గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసులో సుంకర ప్రసాద్ నాయుడుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప‍్రసాద్ నాయుడితో పాటు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు పోలీసులు. వారికి చెందిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు సుంకర ప్రసాద్ నాయుడు గ్యాంగ్‌పై కేసులు ఉన్నాయి. ఇటీవలే ఆకుల వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు ప్రసాద్ గ్యాంగ్.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు సుంకర ప్రసాద్ నాయుడు గ్యాంగ్‌పై కేసులు ఉన్నాయన్నారు. గుంతకల్లుకు చెందిన ఆకుల వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాప్ చేసిన ఘటనకు సంబంధించి సుంకర ప్రసాద్ నాయుడుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రసాద్ నాయుడితో పాటు మరో 15మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వారికి చెందిన రెండు వాహనాలను సీజ్ చేశామన్నారు.ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఏకంగా 33 హత్య కేసుల్లో నిందితుడు. తాను చేసిన హత్యల గురించి వివరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇతని భార్య ఓ మాజీ నక్సలైట్. ప్రసాద్‌కు సుమారు రెండు దశాబ్దాల క్రిమినల్ చరిత్ర ఉంది.అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలతో డోన్ సమీపంలోని ఓబుళాపురంపై మిట్టపై కిడ్నాపర్ల ముఠాను అరెస్టుచేసి బాధితునికి విముక్తి కల్పించారు పోలీసులు. ఈ ఘటనతో పాటు గత నెల 29 న స్వామీజీ ముత్యాల గంగరాజును కిడ్నాప్ చేసి రూ. 24 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేశారు. వీరి నుండీ ఒక ఫిస్టోల్, 16 తుటాలు, స్కార్పియో, ఎటియాస్, బుల్లెట్ వాహనాలతో పాటు రూ. 6.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. |
https://www.telugupost.com/movie-news/ప్రియుడిని-దాచి-దాగుడు-మ-56166/ | ఇంగ్లాండ్ దేశస్థురాలైన యువ కథానాయిక అమీ జాక్సన్ భారీ ప్రాజెక్ట్స్ తో సందడి చేస్తూనే వుంది. అయితే అమ్మడికి అంత భారీ ప్రాజెక్ట్స్ కూడా కెరీర్ టర్నింగ్ పాయింట్స్ గా చెప్పుకునే సరైన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దిల్ రాజు నిర్మాణంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిధి పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఎవడు లో తళుక్కుమన్న అమీ జాక్సన్ కి ఆ చిత్రంలో పోషించిన పాత్ర నిడివి తక్కువ కావటంతో పెద్దగా గుర్తింపు రాకపోయింది. అనంతరం మరో క్రేజీ ప్రాజెక్ట్ 'ఐ' కి శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన ఏకైక హీరోయిన్ గా ఆ చిత్రంలో కనిపించినప్పటికీ చిత్ర ఫలితం బెడిసికొట్టడంతో అమీ లైం లైటు లోకి రాలేకపోయింది. ఇక ఈ సారి మాత్రం తన స్టార్ తిరగకుండా ఆపటం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తం చేస్తుంది అమీ జాక్సన్. ఇంత ధైర్యం అమీ కి రావటానికి కారణం సూపర్ స్టార్ రజని కాంత్ సినిమా 2.0 లో నటించటం అని ప్రత్యేకంగా చెప్పాలా? కానీ అమ్మడికి అర్ధం కానీ విషయం ఏమిటంటే రజని కాంత్ సినిమాలో ఆయనని దాటుకుని వేరే ఆర్టిస్టులకి ఫేమ్ రావటం అసంభవం. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ కి వున్న పవర్ అలాంటిది.అయితే అమీ జాక్సన్ సినిమాలలో క్రేజ్ పక్కనపెట్టి సోషల్ మీడియా లో నెటిజన్లు తన గురించి చర్చించుకునే విధంగా ఫోటోలు పెట్టింది లెండి. తన కౌగిట్లో ఒక వ్యక్తిని దాచి పెట్టి ఒక ఫోటో, అతగాడి నడుముని చుట్టేస్తూ బుగ్గన ముద్దెడుతూ మరో ఫోటో పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది అమీ జాక్సన్. అయితే ఈ ఫోటో లో వున్న వ్యక్తి ముఖం కనిపించకుండా జాగ్రత్త వహించింది అమీ. సస్పెన్స్ ఎక్కువ ఉంచితే ఎక్కువ ప్రచారం దక్కుతుందనే ప్లాన్ వేసినట్టుంది ఇంగ్లాండ్ భామ. |
https://www.telugupost.com/movie-news/anchor-srimukhii-to-get-married-soon-189808/ | బుల్లితెర మీద ఫెస్టివల్ స్పెషల్స్, కామెడీ షోస్ కి గొంతు చించుకుని అరిచి మాట్లాడే శ్రీముఖి.. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో తెగ రెచ్చిపోతుంది. అనసూయ కి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటుందో ఏమో కానీ.. శ్రీముఖి అల్లరి అబ్బో ఈ మధ్యన మాములుగా హైలెట్ అవ్వడం లేదు. ఇదంతా ఏ హీరోయిన్ అవకాశాలు కోసమోలే అని సరిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు శ్రీముఖి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో బిగ్ బాస్ షో లో తాను ఒకరి ప్రేమలో పడి మోసపోయాను అంటూ చెప్పిన శ్రీముఖి.. మళ్ళీ ఇంతవరకు ప్రేమలో పడినట్లుగా చెప్పకపోయినా.. శ్రీముఖి ముంబై సినిమా ఫీల్డ్ తో సంబంధం ఉన్న వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా.. అతనినే శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం నడుపుదామన్నా ఆమె పేరెంట్స్ ఆమెని పెళ్లి చేసుకోమనంటూ బలవంత పెట్టేస్తున్నారట. పెళ్లి చేసుకున్నాక కూడా కెరీర్ ఎక్కడికి పోదు.. పెళ్లయ్యాక సుమ, అనసూయ అద్భుతంగా దూసుకుపోవడం లేదా అని నచ్చచెప్పడంతో శ్రీముఖి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. ఇప్పటికే పలు షోస్ లో తన పెళ్లి పై క్లూ ఇస్తున్న శ్రీముఖి పెళ్లి త్వరలోనే ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది. |
https://www.telugupost.com/crime/accident-took-place-in-udupi-district-four-people-were-killed-in-the-accident-when-the-ambulance-rammed-into-it-1380111 | కర్ణాటకలో ని ఉడిపి జిల్లా లో ఘోర ప్రమాదం జరిగింది. శిరూర్ టోల్ ప్లాజా వద్దకు అంబులెన్స్ దూసుకు రాగా ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అంబులెన్స్ లో ఉన్న నలుగురు మరణించారు. అతి వేగంగా టోల్ ప్లాజా వద్దకు వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయాల పాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అంబులెన్స్ వేగంగా...శిరూర్ టోల్ ప్లాజా వద్దకు అంబులెన్స్ చేరుకునే లోపే టోల్ గేట్ సిబ్బంది ఒక లేన్ కు ఉన్న బ్యారికేడ్లను తొలగించారు. అయితే నీరు ఎక్కువగా రోడ్డుపై నిలిచి ఉండటంతో వేగంగా వచ్చిన అంబులెన్స్ అదుపుతప్పి టోల్ గేట్ ను ఢీకొట్టింది. వేగాన్ని తగ్గించేందుకు డ్రైవర్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసు అధికారులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/top-stories/ys-sharmila-is-preparing-to-contest-in-telangana-padayatra-was-started-two-years-before-the-elections-1374137 | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వేగం పెంచారు. ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర దాటేసింది. పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. వైఎస్ షర్మిల తెలంగాణలో పోటీ చేసేందుకు ఆమె సిద్దమవుతున్నారు. వైఎస్సార్టీపీని బలోపేతం చేసే దిశగా ఆమె ఎన్నికలకు రెండేళ్ల ముందే పాదయాత్రను ప్రారంభించారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై ఆమె నిప్పులు చెరుగుతున్నారు.పోటీ చేసేందుకు....ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని తెలిసింది. పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. 2016 ఉప ఎన్నికల్లో తప్ప అక్కడ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని తెలిసింది.గ్రౌండ్ వర్క్...పార్టీ అధినేతగా ఎక్కడో ఒకచోట నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. అది పాలేరుగా షర్మిల డిసైడ్ అయ్యారంటున్నారు. పాలేరులో అయితే సులువుగా గెలుపు అవకాశాలుంటాయని ఆమె భావిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కూడా జరగనుంది. పాలేరు నుంచి తాను పోటీ చేస్తే అసెంబ్లీలోకి అడుగుపెట్టవచ్చని షర్మిల భావిస్తున్నారు. తొలిసారి పోటీ...వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తే తొలి సారి ప్రత్యక్ష్య ఎన్నికలలో పోటీ చేసినట్లవుతుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా షర్మిల ఇంతవరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆమె తొలిసారిగా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తన పార్టీ అభ్యర్థులను కూడా ఆరు నెలల ముందు ప్రకటించేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/దర్శకుడికి-హీరోయిన్-కి-మ-55966/ | బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన క్వీన్ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే… తెలుగులో ఈ చిత్రంలో తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. తెలుగు , మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఫ్రాన్స్ లో పూర్తయిన సంగతి తెలిసిందే… అయితే ఓవర్ బడ్జెట్ అవుతున్న కారణంగా.... ఈ సినిమాని మధ్యలో ఆపేసినట్లుగా ఆమద్యన న్యూస్ వచ్చింది. అయితే ఓవర్ బడ్జెట్ప్ కారణంగా క్వీన్ రీమేక్ ఆగలేదని... దానికి వేరే కారణముంది అంటున్నారు.అయితే ఆ కారణం ఏమిటి అంటే.... తెలుగు రీమేక్ నుండి ఆ చిత్ర దర్శకుడు నీలకంఠ తప్పుకున్నాడని సమాచారం. అది కూడా తమన్నాతో భేదాభిప్రాయాలు రావడంతోనే నీలకంఠ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడని సమాచారం. మలయాళం రీమేక్ ను నీలకంఠ దర్శకత్వం వహించనున్నాడు.అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తమన్నాకి దర్శకుడు నీలకంఠ కి పడకపోవడం వలెనే ఏ ఈసినిమా ఆగిపోయిందనే న్యూస్ హల్ చల్ చేస్తుంది |
https://www.telugupost.com/movie-news/venky-plan-for-drushyam2-190676/ | రీమేక్ రాజా వెంకటేష్ ఇప్పటికే నారప్ప, దృశ్యం 2 షూటింగ్స్ పూర్తి చేసేసుకుని.. ఎఫ్ 3 షూటింగ్ లో బిజీగా ఉందామనుకున్నాడు కానీ.. అనిల్ రావిపూడి కి కరోనా రావడంతో ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ ని వాయిదా వేసింది టీం. అయితే మలయాళంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అద్భుతమైన హిట్ అయిన మోహన్ లాల్ దృశ్యం 2 సినిమాని ఆ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ తో వెంకటేష్ తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దృశ్యం 2 రీమేక్ రైట్స్ కొన్న నెల లోగా ఆ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి షాకిచ్చారు వెంకీ. అటు అసురన్ రీమేక్ నారప్ప, ఇటు దృశ్యం 2 రీమేక్ లని వెంకీ లుంగ చుట్టి పడేసాడు.అయితే మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం 2 ని ఓటిటికి అమ్మేసినట్టుగా వెంకీ కూడా దృశ్యం 2 సినిమాని అంత ఫాస్ట్ గా చుట్టేసింది ఓటిటికి అమ్మెయ్యడానికే అనే టాక్ మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది.. ఇలాంటప్పుడు దృశ్యం 2 మూవీని థియేటర్స్ లో విడుదల చేసందుకు టైం పడుతుంది కాబట్టి.. దగ్గుబాటి బ్రదర్స్ ఇద్దరూ దృశ్యం 2 ని ఓటిటికి అమ్మేయ్యొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కరోనా లాక్ డౌన్ తో గత ఏడాది చాలా సినిమాలు ఓటిటి లోనే విడుదలయినట్లుగా వెంకీ అండ్ సురేష్ బాబు లు కూడా దృశ్యం 2 ని ఓటీటీకి అమ్మేస్తారో.. లేదంటే థియేటర్స్ కోసం వేచి చూస్తారో జస్ట్ వెయిట్ అండ్ సి. |
https://www.telugupost.com/movie-news/varudu-kavalenu-movie-is-coming-out-in-ott-from-january-7th-1345981 | చాలా కాలం తర్వాత నాగశౌర్య ఖాతాలో హిట్ పడింది. అశ్వత్ధామ తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్యను వరుడు కావలెను సినిమాతో.. హిట్ వరించింది. నాగశౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. కాలేజీలో ప్రేమ- ఉద్యోగం- కుటుంబ అనుబంధాల మధ్య నడిచే ఈ సినిమా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఉండటంతో.. మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు వరుడు కావలెను ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.జనవరి 7వ తేదీ నుంచి జీ5 లో ఈ సినిమా స్ట్రీమ్ అవ్వనుంది. ఈ మేరకు జీ5 సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఆకాష్ - భూమి పాత్రల్లో కనిపించిన శౌర్య - రీతూ వర్మలు.. క్యారెక్టర్లో ఒదిగిపోయారనే చెప్పాలి. కూతురికి పెళ్లి చేసేందుకు నానా కష్టాలు పడుతున్న తల్లిగా నదియ కనిపిస్తారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్నందించారు. |
https://www.telugupost.com/movie-news/విజయ్-అదరగొడుతున్నారు-1055/ | ఇలయదళపతి విజయ్ హీరోగా 'రాజు రాణి' ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తేరీ'. ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్ విడుదలై అదరగొడుతోంది. ఈ ట్రైలర్ ఎంతో స్టైలిష్‌గా ఉందని విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు. ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ చూస్తే ఇందులో విజయ్ రజనీకాంత్‌లా కొన్ని స్టైలిష్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థం అవుతోంది. చూయింగ్ గమ్‌ను రజనీ సిగరెట్‌ను నోట్లో వేసుకున్నట్లుగా వేసుకోవడంతో పాటు ఆయన పలు విధాలుగా రజనీని ఇమిటేట్ చేసిన సంగతి అర్థం అవుతోంది. మరి ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను, విజయ్ అభిమానులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది. కాగా ఈచిత్రంలో సీనియర్ నటులైన ప్రభు, రాధికా కీలకపాత్రలు పోషించనున్నారు. |
https://www.telugupost.com/movie-news/not-shah-rukh-khan-but-his-bodyguard-was-stopped-at-mumbai-airport-by-customs-1447939 | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను ఎయిర్ పోర్టులో ఆపేశారనే వార్తలు శనివారం చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే..! ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు షారుఖ్ ను ఆపేశారని చెప్పుకొచ్చారు. అనేక ఖరీదైన గడియారాలు, ఇతర గాడ్జెట్‌లను తీసుకుని వస్తున్నారని.. అందుకే ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులు షారుఖ్ ఖాన్ ను ఆపినట్లు శనివారం నివేదించబడింది. షారుక్ శుక్రవారం రాత్రి షార్జా నుంచి వచ్చినట్లు విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) వర్గాలు తెలిపాయి. యూఏఈలోని ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్ సినిమా ఐకాన్, కల్చరల్ నరేటివ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి శనివారం షారుఖ్ ఖాన్ దుబాయ్ వెళ్లారు. షారుఖ్ ఖాన్, అతడి బృందాన్ని టీ-3 టెర్మినల్ వద్ద రెడ్ ఛానల్ దాటుతుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాగులని సిబ్బంది తనిఖీ చేశారు. బ్యాగులో Baubn & Zurbk వాచీలు, 6 బాక్సుల రోలెక్స్ వాచీలు, స్పిరిట్ బ్రాండ్ వాచీలు, Apple సిరీస్ వాచీలు లభించాయి. వీటితో పాటు వాచీల ఖాళీ పెట్టెలు కూడా ఉన్నాయని కథనాలు వచ్చాయి.అయితే ఆపింది షారుఖ్ ఖాన్ ను కాదని.. అతని అంగరక్షకుడు రవిశంకర్ సింగ్ అని తేలింది. షారుఖ్ ఖాన్ అంగరక్షకుడు రవిశంకర్ సింగ్ కస్టమ్స్ కు డబ్బులు చెల్లించినట్లు ఎయిర్ పోర్టు అధికారి తెలిపారు. షారుఖ్, అతని మేనేజర్ పూజా దద్లానీ, రవిశంకర్ సింగ్.. మరో ముగ్గురు సభ్యులు చార్టర్డ్ ఫ్లైట్‌లో 12:30 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌లో దిగారు. లగేజీ స్క్రీనింగ్ సమయంలో, కస్టమ్స్ సిబ్బంది ఆరు బ్యాగ్‌లలో రెండింటిలో ఆరు లగ్జరీ వాచీలను కనుగొన్నారని అధికారి తెలిపారు. వాచీలు రూ.17.86 లక్షలకు విలువ చేయగా, ప్రస్తుతం ఉన్న రేటు ఆధారంగా రూ.6.88 లక్షల కస్టమ్స్ సుంకం విధించినట్లు తెలిపారు. జనరల్ ఏవియేషన్ టెర్మినల్ కస్టమ్స్ డ్యూటీ చెల్లింపు కౌంటర్ పనిచేయకపోవడంతో, కస్టమ్స్ అధికారులు షారుఖ్ బాడీగార్డ్‌ను విమానాశ్రయంలోని టెర్మినల్ 2కి తీసుకెళ్లారు, అక్కడ అతను సూపర్‌స్టార్ తరపున మొత్తాన్ని చెల్లించాడని అధికారి తెలిపారు. కొంత సమయం సింగ్ అక్కడే వేచి ఉండగా.. ఖాన్‌తో సహా మిగిలిన ఐదుగురు సభ్యులు విమానాశ్రయం నుండి వెళ్ళిపోడానికి అనుమతించారని, ఆ తర్వాత కస్టమ్స్ డ్యూటీ చెల్లింపు ప్రక్రియ పూర్తయిందని అధికారి తెలిపారు. షారుఖ్ ఖాన్ ను అస్సలు అదుపులోకి తీసుకోలేదని, ఎలాంటి ప్రశ్నలు అడగలేదని కస్టమ్స్ విభాగం తెలిపింది. |
https://www.telugupost.com/movie-news/kangana-ranaut-alia-bhatt-fight-117698/ | గతంలో వారసత్వ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి వచ్చి టాప్ పొజిషన్ కి వెళ్లడం ఒక వింతేమీ కాదు…. నాలాగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో టాప్ హీరోయిన్ గా నిలబడడం గొప్పంటూ వారసత్వం విషయంలో అలియా భట్ ని బహిరంగంగానే ఒక ఆట ఆదుకున్న కంగనా రనౌత్ మరోసారి అలియా భట్ పై నోరు పారేసుకుంది. ఎప్పుడూ ముక్కుసూటిగా అందరి విషయంలో ఓపెన్ గా మాట్లాడుతూ తిట్లు తినే కంగనా మరోమారు అలియా భట్ ని టార్గెట్ చేసింది. నిన్నగాక మొన్న మణికర్ణికా విషయంలో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కంగనా ఇప్పుడు మరోమారు బాలీవుడ్ మీడియాకి మేత వేసింది. గత ఏడాది అలియా భట్ నటించిన గల్లీ బాయ్ సినిమాతో అలియా భట్ తొ ప్రతి అవార్డు విషయంలో మణికర్ణికా లో కంగనా చేసిన పాత్ర పడుతూ వస్తుంది. అయితే తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకలో మణికర్ణికా కు గట్టి పోటీ ఇచ్చింది గల్లీ భాయ్ అలియా భట్. ఫైనల్ గా ఆ అవార్డు ని మణికర్ణికా తో బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చినందుకు గాని కంగనాకు రావడంతో.. మీడియా వారు కంగనాని.. ఈ అవార్డు విషయంలో అలియా భట్ నుంచి గట్టిపోటీ ఎదురైందా.. అని అడగగా… దానికి కంగనా రనౌత్ గల్లీ బాయ్ సినిమాలో అలియా పాత్ర ఏమంత గొప్పగా లేదు. అసలు నిజంగా చెప్పాలంటే గల్లీ బాయ్ లో అలియా చాలా రొటీన్ పాత్ర చేసింది. అలియా గల్లీ బాయ్ లో చేసిన పాత్ర నాకేం నచ్చేలేదు. అలంటి పాత్ర చేసిన అలియా తొ నాకు పోటీనా అంటూ… అలియా భట్ ని ఉద్దేశించి.. ఇలాంటి చెత్త పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గిస్తే బావుంటుందని.. ఉచిత సలహా కూడా పారేసింది కంగనా. మరి అంతలా అలియా పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కంగనాపై అలియా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/సూపర్-స్టార్-తిరస్కారాని-17539/ | తాజాగా 66 వ ఏట అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజని కాంత్ ఇప్పటికీ చెరగని ఛరిష్మాతో కేవలం తన పోస్టర్ తో ప్రేక్షకులను థియేటర్ల వైపు బారులు తీరేలా చేస్తున్నారు. ఆయనతో కలిసి తెరను పంచుకోవాలని ఉవ్విల్లూరే అగ్ర తారలు ఎందరో లెక్కే లేదు. ఇటీవల ఆయన నటిస్తున్న 2 .o చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ వేడుకలో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తనకు రజని కాంత్ తో కలిసి నటించాలని వుంది అని వేదిక పై బహిరంగ ప్రకటన చేశారు. బాలీవుడ్ మరో టాప్ హీరో ఆమిర్ ఖాన్ తాను నటించినా దంగల్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో కూడా అనువదిస్తుండగా ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పవలసిందిగా రజని ని కోరారు.ఆమిర్ ఖాన్ చేసిన ప్రతిపాదనను రజని కాంత్ తిరస్కరించారు అన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వాస్తవమే కానీ, రజని కి సినిమా నచ్చకపోవటం వలెనే తన గొంతు అరువు ఇవ్వటానికి నిరాకరించారు అని వచ్చిన కథనాలను మాత్రం ఆమిర్ ఖాన్ ఖండించారు. దంగల్ ప్రత్యేక ప్రదర్శన వేసి రజని కాంత్ కి చూపించగా ఆయనకు బాగా నచ్చటంతోనే తాను తమిళ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పవలసిందిగా రజని ని కోరాడట ఆమిర్ ఖాన్. అయితే ఇద్దరు స్టార్ హీరోస్ ల కు ఇటువంటి సహకారాలు వర్తించకూడదు అని, ఒకవేళ ఆలా చేస్తే ఫలితం తేడా కొట్టే అవకాశాలున్నాయని సూచించి రజని తిరస్కరించారట. రజని గొంతు తమిళ ప్రేక్షకులకు సుపరిచితం కావటంతో తెరపై కనిపిస్తున్న ఆమిర్ హావభావాలని ఆస్వాదించకుండా కేవలం వినిపించే గొంతు తో ప్రయాణం చేసే ప్రమాదం ఉండటమే రజని ఆమిర్ ప్రతిపాదనను నిరాకరించటానికి కారణమట. |
https://www.telugupost.com/movie-news/విలనిజాన్ని-పరిచయం-చేసావ-36809/ | బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ ఇపుడు తన విలనిజం ఎలా వుండబోతుందో చూపెట్టేస్తున్నాడు. చెప్పిన టైంకే అంటే గురువారం సాయంత్రం 5.22 ని.షాలకు 'జై' టీజర్ ని విడుదల చేసింది 'జై లవ కుశ' చిత్ర యూనిట్. మరి ముందునుండి చెబుతున్నట్టే 'జై లవ కుశ' మూడు టీజర్స్ తో అభిమానులకు త్రిబుల్ బొనాంజా అందించడానికి వస్తామని చెప్పినట్లే ఇప్పుడు 'జై' టీజర్ తో అభిమానులను అలరించడానికి వచ్చేసాడు.బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' మొదలైనప్పటినుండి 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ 'జై' పాత్రలో పూర్తి నెగెటివ్ షేడ్స్ లోనే కనబడుతాడని ప్రచారం జరుగుతుంది అయితే ఆ ప్రచారం నిజమే అని ఇప్పుడు ఈ' జై' టీజర్ చూస్తుంటే స్పష్టంగా అర్ధమవుతుంది. సుర... సుర... సుర... అంటూ కారులోనుండి కాలు బయటికి పెట్టి తన ఇష్ట దైవం రావణాసురుడికి దణ్ణం పెడుతూ నడిచొచ్చే 'జై' పాత్రలో ఎన్టీఆర్ సూపర్ పెరఫార్మెన్సుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ 'ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ. ధ ధ ధ ధైర్యం ఉండాలా' అంటూ ఎన్టీఆర్ నత్తితో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. అయితే ఎన్టీఆర్ ని ముందు అనుకున్నట్టుగానే డైరెక్టర్ బాబీ మాస్ లుక్ తోనే 'జై' టీజర్ లో పరిచయం చేసాడు. విలన్ కుండాల్సిన అన్ని లక్షణాలు ఎన్టీఆర్ లో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. మరి 'జై' పాత్రతో అదరగొట్టిన ఎన్టీఆర్ మిగతా కేరెక్టర్స్ ఎలా వుండబోతూన్నాయో అనే క్యూరియాసిటీని అందరిలో పెంచేసాడు. ఇకపోతే 'జై లవ కుశ' బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. మరి 'జై' టీజర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చే లవ, కుశ టీజర్స్ పై మరింత ఆసక్తి అంచనాలు ఏర్పడిపోయాయంటున్నారు అభిమానులు. |
https://www.telugupost.com/crime/police-case-filed-against-on-youtuber-bigg-boss-5-fame-sarayu-1353062 | యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ సరయూపై కేసు నమోదు7 ఆర్ట్స్.. ఈ యూ ట్యూబ్ ఛానల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఛానల్ లో వచ్చే కంటెంట్, భాష పై గతంలో పెద్ద రచ్చే జరిగింది. జరిగితే జరిగింది కానీ.. ఈ యూ ట్యూబ్ ఛానల్ వల్ల సరయు కి యమా క్రేజ్ వచ్చింది. అలా యూ ట్యూబర్ గా ఫేమస్ అయి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో హౌస్ లోని ఎంట్రీ ఇచ్చి, మొదటి వారమే ఎలిమినేట్ అయింది. కాగా.. ఇప్పుడు సరయు మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవలే ఆమె స్టార్ట్ చేసిన హోటల్ ప్రమోషన్ లో భాగంగా ఓ సాంగ్ విడుదల చేసింది. ఆ పాటలో హిందువులను కించపరిచేలా తీశారంటూ సరయుపై రాజన్న సిరిసిల్ల పీఎస్ లో కేసు నమోదైంది.Also Read : జేఎన్టీయూలో ర్యాగింగ్.. 12 మంది సస్పెండ్సరయు, మరికొంతమంది హోటల్ ప్రచార పాటలో గణపతి బప్పా మోరియా అని రాసి ఉన్న బ్యాండ్ ను తలకు కట్టుకుని హెటల్ లోకి వెళ్తారు. ఈ సన్నివేశంలో దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు, ఆ కేసును బంజారాహిల్స్ పీఎస్ కు బదిలీ చేశారు. పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. |