sentence_tel_Telu
stringlengths 14
658
|
---|
చివరిగా, ఉష్ణమండల ఆసియాలో, తూర్పు ఆసియాలో కొంత భాగంలో మరియు దక్షిణ, ఆగ్నేయాసియా లో దాదాపు చాలా వరకు, సాగుబడి లేదా నగరీకరణ జరగక, అలాగే మాల్దీవులు వంటి ఏకాంత స్వర్గ ద్వీపాల నుండి థాయిలాండ్ లోని కొన్ని ప్రపంచ ప్రసిద్ది పొందిన సముద్రతీర ఉల్లాస ప్రదేశాల వరకు వేలాది సముద్రతీర ప్రాంతాలలో వివిధ రకాల ఉష్ణమండల వనాలు వ్యాపించి ఉన్నాయి. |
ఈ ఖండంలోని సుదూర తూర్పు భాగాలలో పర్వతాలలో అనేకం అగ్ని పర్వతాలు, అలాగే ఇండొనేషియా మరియు కంచాత్కా అగ్నిపర్వత పర్యాటనకు నిజంగా గొప్ప గమ్యస్థానాలు. |
మేఘాలయ వంటకాలు విలక్షణమైనవి మరియు ఇతర ఈశాన్య భారత రాష్ట్రాలకు భిన్నమైనవి. |
బుకర్ పురస్కార విజేతలు సల్మాన్ రష్దీ మరియు అరవింద్ ఆడిగ, ఈ నగరానికి గల ఘన సాహితీ సాంప్రదాయాలను అంతర్జాతీయంగా ప్రముఖంగా పేర్కొన్నారు. |
ఆంగ్‌కార్ ఆర్కియలాజికల్ పార్క్ లోకి ప్రవేశానికి కంబోడియా వాసులు కాని సందర్శకులు ఆంగ్‌కార్ పాస్ కొనవలసి ఉంటుంది. |
ఫ్లోరిడాలోని ఓర్లాండోలో మరియు చుట్టుపక్కల అనేక ఇతర ఆకర్షణల మధ్య ఉన్నా కూడా, మౌస్ హౌస్ లక్షల కొద్దీ పర్యాటకులను సంవత్సరానికి ఒకసారి ఈ ప్రాంతానికి ఆకర్షించే దీపస్తంభం వలె గర్వంగా నిలుస్తుంది. |
శాన్ ఫ్రాన్సిస్కో బే ఫెర్రీ, ఫెర్రీ బిల్డింగ్ మరియు పియర్ 39 నుండి ఓక్లాండ్, అలమెడ, బే ఫామ్ ఐలాండ్, సౌత్ శాన్ ఫ్రాన్సిస్కోలోని స్థానాల వరకు, ఉత్తరాన సోలానో కౌంటీలోని వల్లేజో వరకు నడుపుతుంది. |
ఎలో లైన్ పైనున్న అత్యంత సమీప ఢిల్లీ మెట్రో స్టేషన్ అర్జన్ గఢ్ . |
చిరపుంజీకి స్థానిక ట్యాక్సీలు కూడా ప్రయాణిస్తాయి, వాళ్ళు మీకు షిల్లాంగ్ నుండి చిరపుంజీ వరకు మార్గమధ్యంలో కొన్ని వీక్షణా స్థలాలు మరియు ప్రదేశాల వద్ద (ఎలిఫెంట్ ఫాల్స్, మౌదోక్ దింపేప్ వ్యాలీ వ్యూ, మొ. వి), అలాగే చిరపుంజీలోని సందర్శనా స్థలాల (మాస్మై కేవ్, చిరపుంజీ ఈకో పార్క్, నోహస్గిథియాంగ్ ఫాల్స్, లేదా ది సెవెన్ సిస్టర్ ఫాల్స్) వద్ద ఆగేందుకు కూడా వీలు కల్పిస్తారు. |
జాతీయ పార్కుకు వచ్చే సందర్శకులకు అనేక ఎంపికలు ఉంటాయి, సుదూరపు నార్త్ రిమ్; మరింత అందుబాటులో (కావున ఎక్కువ రద్దీగా ఉండే) సౌత్ రిమ్; ఫాంటమ్ రాంచ్ లేదా అనేక పడవలు నడిచే కొలరాడో నది వంటి లోయలోని భాగాలతో సహా. |
గ్రాండ్ కాన్యన్ ఉత్తర అరిజోనాలో ఉంది మరియు ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని అతి గొప్ప పర్యాటక ఆకర్షణలలో ఒకటి అవటమే కాక ప్రపంచంలోని ఏడు సహజ వింతలలో ఒకటి. |
జాతుల మధ్య సంకర్షణని ప్రోత్సహించి, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రజాదరణను పెంచడానికి నాగాలాండ్ ప్రభుత్వం 2000 డిసెంబర్ లో ది హార్న్ బిల్ ఫెస్టివల్ ను ప్రారంభించింది. |
చర్చ్ స్ట్రీట్ లో స్థానీకులు "జూస్ కడాయి" గా కూడా పిలుచుకునే ది సెవెన్ ఇలెవెన్ రసాల దుకాణం, కాలక్షేపానికి ఒక మంచి చోటు. |
అండమాన్‌లలో డైవింగ్ కి ఉత్తమ ప్రదేశాలు సుదూర ప్రాంతాలలో ఉంటాయి, ప్రైవేటు చార్టర్ నావలు లేకుండా వాటిని చేరుకోవడం సాధ్యం కాదు. |
వాల్ట్ డిస్నీ వరల్డ్‌లోని ప్రధాన ఆకర్షణలు ది మేజిక్ కింగ్డమ్, ఎప్కాట్, డిస్నీ'స్ హాలీవుడ్ స్టూడియోస్, డిస్నీ'స్ ఆనిమల్ కింగ్డమ్ అనే నాలుగు అంశాలు గల పార్కులు. |
మౌలిక పదార్థాలు ఒకటే అయినప్పటికీ ఇక్కడి వంటకాలు ప్రధానంగా రెండు వేర్వేరు ఉపప్రాంతాలైన గడ్వాల్ మరియు కుమావ్ కి చెందిన ఆహారానివే. |
32 కిమీ పొడవైన, ఒక సన్నటి వెలుపలి పాయ ఈ సరస్సును మోత్తో గ్రామ సమీపంలో బంగాళాఖాతానికి కలుపుతుంది. |
భూటాన్ విద్యా వ్యవస్థలో, బోధనా మాధ్యమం ఆంగ్లం కాగా జోంగ్కా ను జాతీయ భాషగా బోధించడం జరుగుతుంది. |
ఈ సంగ్రహాలయంలో ఆశియా కళకు అంకితం చేయబడిన ప్రధాన ప్రదర్శనశాల గ్యాలరీ 33 , ఇది చైనా, భారత ఉపఖండం, మరియు ఆగ్నేయాసియా వస్తువులను సమగ్రంగా ప్రదర్శిస్తుంది. |
గుర్తించబడిన అరుదైన, ప్రమాదంలో ఉన్న జంతు జాతులు ఏవంటే ఆకుపచ్చ సముద్ర తాబేలు , దుగాంగ్, ఇరావడీ డాల్ఫిన్, క్రిష్ణ జింక, స్పూన్ బిల్డ్ శాండ్‌పైపర్ , చిలికా లింబ్లెస్ స్కింక్ , మరియు ఫిషింగ్ క్యాట్. |
ఈ రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలలో ఋషికొండ, మైపాడు, సూర్యలంక మొదలైనటువంటి అనేక బీచ్‌లు ఉన్నాయి; బొర్రా గుహలు, భారతీయ నిర్మాణశైలిని చిత్రీకరిస్తూ రాతిని చెక్కి నిర్మించబడిన ఉండవల్లి గుహలు, దేశంలో రెండవ అత్యంత పొడవాటి గుహలైన బెలూం గుహలు వంటి గుహలు ఉన్నాయి. |
గరుడ ఇండోనేషియా ప్రతీవారం బహిరంగ చార్టర్ విమానాలను జకార్తా నుండి/వరకు నడుపుతుంది, వీటికి టికెట్ల అమ్మకం క్రిస్మస్ ఐలాండ్ ట్రావెల్ ఎక్స్ఛేంజి ద్వారా జరుగుతాయి. |
2020 డిసెంబర్ నాటికి, భారతదేశంలో 119,776 చ కిమీ (46,246 చమై) మేర విస్తరించిన 553 వన్యప్రాణుల అభయారణ్యాలు స్థాపించబడి ఉన్నాయి. |
పక్కన తమిళనాడు కన్నా కరైకల్లో మద్యం చవుక, కరైకల్ లో మంచి మదిరశాలలు చాలా ఉన్నాయి- నందా హోటల్ లోని నయాగరా బార్- ప్యారిస్ ఇంటర్నేషనల్ లోని థండర్ బార్- నగరంలోనే ప్రసిద్ధిగాంచిన సిటీ బార్- పాండిచ్చెరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ది సీగల్స్ రెస్టారెంట్ సముద్రతీరాన ఉండి సాయంత్రవేళల కళాక్షేపానికి మంచిగా ఉంటుంది. |