inputs
stringlengths
28
112
targets
stringlengths
30
2.36k
template_id
int64
1
14
template_lang
stringclasses
1 value
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎన్ని చేపలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎన్ని చేపలు' ఒకాయన బారు బయట ఉన్న వాష్బేసిన్లో చేపలు పడుతున్నాడు. బారులో కూర్చున్న పెద్దాయనకి అతన్ని చూసి జాలి వేసింది. ‘పాపం పిచ్చివాడు’ అనుకుంటూ లోపలికి పిలిచి ఓ పెగ్గు పోయించాడు. తర్వాత కాసేపు ఆటపట్టిద్దామని ‘ఇప్పటిదాకా ఎన్ని చేపలు పట్టావేంటి?’ అని అడిగాడు. ఆ మాటకి చిరునవ్వు చిందిస్తూ- ‘నీతో కలిపి ఎనిమిది మంది!’ అంటూ మూతి తుడుచుకుంటూ బయటకి వెళ్లిపోయాడు మందుబాబు.
3
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక క్రికెట్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'క్రికెట్!' జానీ హాస్పిటల్లో ఆఖరి క్షణాలు లెక్కపెడుతున్న తన మిత్రుడు మైఖేల్ దగ్గరకి వెళ్లాడు. ‘నాకు ఎప్పటినుంచో ఓ సందేహం ఉంది. స్వర్గంలో క్రికెట్ ఆడతారా లేదా అన్నదే నా అనుమానం. నువ్వు కనుక స్వర్గానికి వెళ్తే, అక్కడ క్రికెట్ ఆడతారో లేదో వచ్చి నాకు చెబుతావా,’ అని అడిగాడు. సరేనన్నాడు మైఖేల్. ఆ సాయంత్రమే మైఖేల్ చనిపోయాడు. మర్నాడు రాత్రి జానీకి మైఖేల్ మాటలు వినిపించాయి- ‘జానీశ్రీ స్వర్గంలో కూడా క్రికెట్ ఉందని చెప్పడానికి వచ్చాను. కాకపోతే... కాకపోతే...’ ‘కాకపోతే ఏంటి?’ విసుక్కున్నాడు జానీ. ‘రేపు బ్యాటింగ్ నీదేనంట!’
5
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మేనేజర్ ఏడీ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మేనేజర్ ఏడీ!' బాలు: ఇంత చెత్తగా ఉన్న దోశ నేను తిననంటే తినను. మీ మేనేజర్ ఎక్కడ? పిలువ్ వాడిని... వెయిటర్: అబ్బే! ఇంత చెత్త దోశని మా మేనేజర్ కూడా తినరు సార్!
9
['tel']
వరం అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'వరం' బలరాం అడవిలో దారి తప్పిపోయాడు. ఇంతలో అకస్మాత్తుగా అతనికి పులి ఎదురుపడింది. బలరాంని చూడగానే పులి వెంటపడటం మొదలుపెట్టింది. బలరాం పరిగెత్తీ పరిగెత్తీ అలసిపోయాడు. పరగులు పెడుతూనే ‘స్వామీ! ఆ పులిని నీ భక్తుడిగా మార్చేయి!’ అని వేడుకొన్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి పులి బుద్ధిగా తపస్సు చేసుకుంటూ కనిపించింది. ‘స్వామీ! నువ్వెంత మంచివాడివి. నా కోరిక మన్నించావా’ అనుకుంటూ పులిని పలకరించడానికి దాని వైపు వెళ్లాడు. బలరాం తన దగ్గరకు రాగానే పులి కళ్లు తెరిచి ఇలా అంది- ‘స్వామీ నువ్వెంత మంచివాడికి. నా కోరికని మన్నించి ఈ మనిషిని నా దగ్గరకు పంపించావా!’
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నేను వదులుతానా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నేను వదులుతానా!' పోలీసు: నీకసలు బుద్ధుందా! ఏకంగా ఊరేగింపు మీదకే లారీ తోల్తావా. నీవల్ల ఇప్పుడు 20 మంది చావుబతుకుల్లో ఉన్నారు తెలుసా! డ్రైవరు: నాదేం తప్పు లేదండీ! నేను లారీ నడుపుతుండగా ఎదురుగా ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఊరేగింపు జరుగుతోంది. మీరే చెప్పండి! మీరైతే ఎవరి మీదకి లారీ పోనిస్తారు? పోలీసు: ఇందులో అంత ఆలోచించాల్సింది ఏముంది! ఇద్దరి మీదకే పోనిస్తాను. డ్రైవరు: నేనూ అదే పని చేద్దామనుకున్నాను సర్! కానీ వాళ్లు ఊరేగింపులో చేరిపోయి తప్పించుకోవాలని చూశారు!!!
12
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అందుకే కదా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అందుకే కదా!' టీచర్: ఏటా సైబీరియా నుంచి కొల్లేరు దాకా కొన్ని కొంగలు ఎగురుకుంటూ వస్తాయి. ఎందుకో ఎవరికన్నా తెలుసా! శీను: అంత దూరం అవి నడవలేవు కదా టీచర్!
12
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అసలు సమస్య ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అసలు సమస్య' హరి: నా భార్యకి తాగుడు సమస్య ఉందిరా బాబూ! చందు: అవునా! నీ భార్య తాగుతుందా.... నాకు చెప్పనేలేదే.... హరి: అబ్బే.. తాగేది నేనే. కానీ సమస్య మా ఆవిడది!
14
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మాంఛి నిద్ర ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మాంఛి నిద్ర' వైద్యుడు: మీకు బాగా నిద్ర పట్టేందుకు ఒక అద్భుతమైన మాత్ర రాస్తున్నాను. రోగి: థాంక్యూ డాక్టర్! ఈ మందు ఎప్పుడు వేసుకోవాలి. వైద్యుడు: ప్రతి రెండు గంటలకి ఓసారి....
9
['tel']
ప్రాక్టికల్స్ అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ప్రాక్టికల్స్' తల్లి: ఇవాళ స్కూల్లో ఏం నేర్చుకున్నారు చిన్నూ! చిన్నూ: మంటలు ఎలా వెలిగించాలో తెలుసుకున్నాం మమ్మీ. తల్లి: వావ్! మరి రేపు స్కూల్లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? చిన్నూ: స్కూలా.... ఇంకెక్కడి స్కూలు!!!
2
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పెళ్లైన కొత్తలో... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పెళ్లైన కొత్తలో...' భార్య: మీరు బాగా మారిపోయారు! భర్త: ఎందుకు డార్లింగ్... అంత అభాండం మోపుతున్నావు? భార్య: కాకపోతే మరేంటి? పెళ్లయిన కొత్తలో మనిద్దరం కలిసి భోజనం చేసేవాళ్లం. మీరు కొసరి కొసరి అంతా నాతోనే తినిపించేవాళ్లు. ఇప్పుడేమో నాకు ఉందో లేదో కూడా చూడకుండా తినేస్తున్నారు. భర్త: ఓస్ అంతేకదా! పెళ్లయిన కొత్తలో అంటే నువ్వు అప్పుడే వంట నేర్చుకుంటున్నావు. మరి ఇప్పుడు బాగానే చేస్తున్నావు కదా!!!
8
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అలా చేద్దాం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అలా చేద్దాం!' ‘డాక్టరు గారు నన్ను విశ్రాంతి తీసుకోవడానికి స్పెయిన్ లేదా సింగపూర్ వెళ్లమన్నారండీ... ఎక్కడికి వెళ్దామంటారు?’ ‘ఇంకో డాక్టర్ దగ్గరికి...’
6
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ స్పేర్ ఉంది... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'స్పేర్ ఉంది...' ఇద్దరు తీవ్రవాదులు బాంబ్ ఫిక్స్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు... ‘అన్నా... బాంబుని ఫిక్స్ చేసేటప్పుడే పేలితే ఎలా?’ ‘ఏం ఇబ్బంది లేదు తమ్ముడూ... నా దగ్గర ఇంకో బాంబు ఉంది’.
9
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కుదరదంతే... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కుదరదంతే...' రావణాసురుడిని కోర్టుకి తీసుకొచ్చారు. ‘గీత మీద చెయ్యేసి ప్రమాణం చెయ్...’ ‘సీత మీద చెయ్యేసినందుకే ఈ కేసు నడుస్తోంది. ఇప్పుడు గీత మీదా? నా వల్ల కాదు’ అంటూ భయపడి పారిపోయాడు రావణుడు.
6
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పిలిచే తీరు వేరు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పిలిచే తీరు వేరు!' ‘‘నేను అర్ధరాత్రి దొంగను చూసి... ‘దొంగా... దొంగా...’ అని అరిచినా ఎవ్వరూ బయటికి రాలేదు...’’ ‘‘మరేం చేశావ్?’’ ‘‘తమన్నా... తమన్నా... అని కేకలు వేశా. అందరూ తలుపులు తీసుకుని బయటకు పరుగులు పెట్టారు. అప్పుడు దొంగను పట్టించా!’
14
['tel']
కరెక్టే కదా... అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'కరెక్టే కదా...' ‘ఏమండీ ఓ శుభవార్త. త్వరలో ఇంట్లో ముగ్గురం కాబోతున్నాం...’ ‘ఓహ్... చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు తెలిసింది...’ ‘ఇప్పుడే... మా తమ్ముడు కాల్ చేసి వస్తున్నానని చెప్పాడు..’
1
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక జంబలకిడి పంబ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'జంబలకిడి పంబ' హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత భర్త, తన భార్య పర్సులో ఓ యువకుడి ఫోటో గమనించాడు. మొదటి సారి దాన్ని అంతగా పట్టించుకోలేదు. నెలయినా అది అలాగే ఉండడంతో భర్తకు మానసిక వేదన మొదలైంది. చివరికి ధైర్యం చేసి భార్యను నిలదీశాడు. ‘అతను నీ మాజీ భర్తా?’ నీరసంగా అడిగాడు. ఆమె భర్త బుగ్గ గిల్లుతూ ‘కాదు’ అంది. ‘అయితే నీ మాజీ బాయ్ఫ్రెండా?’. భర్త చెవిలో ముద్దుగా, నెమ్మదిగా ‘కాదు’ అంది. ‘అయితే మీ అన్నయ్యా? నాన్నా?’ చేతిని నెమ్మదిగా నిమురుతూ ‘కాదు... కాదు’ అంది. కోపంతో ‘మరి ఎవడువాడు?’ అని గద్దించాడు. ముసిముసిగా నవ్వుతూ... సిగ్గుపడుతూ... ‘అది నేనే!! సర్జరీకి ముందు’ అంది.
8
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఉంటాయి గుర్తించాలి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఉంటాయి గుర్తించాలి!' ‘సైలెంట్ లెటర్స్ ఇంగ్లీషులో మాత్రమే ఉంటాయా, తెలుగులో ఉండవా మాస్టారూ...!’ ‘లేదు. తెలుగులో కూడా ఉంటాయి. ఉదాహరణకి కూతురిని అత్తారింటికి పంపే ముందు మామగారు, అల్లుడితో ‘బాబూ జాగ్రత్త’ అని అంటాడు. మధ్యలో ‘నువ్వు’ అనే రెండు అక్షరాలు సైలెంటే..!’
8
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కాకి మనసులో మాట! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కాకి మనసులో మాట!' ‘‘వీళ్లు ఎక్కడి మనుషులురా దేవుడా... అన్నానికి వస్తే తరుముతారు. పిండానికి రాకపోతే బతిమాలతారు..వీళ్లని అర్థంచేసుకోలేం’’
14
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అలా చేయండి చాలు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అలా చేయండి చాలు!' ‘రేపుఉదయం నీకు ఉరిశిక్ష వేయబోతున్నాం. నీ చివరి కోరిక ఏంటో చెప్పు!’ ‘ఏం లేదు సార్... నాకు మెడ దగ్గర నరం పట్టేసింది. తలకిందులుగా ఉరి తీయండి పుణ్యం ఉంటుంది’
3
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ‘స్మార్ట్’ వైద్యం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: '‘స్మార్ట్’ వైద్యం' ‘నాకు నిద్ర ఎక్కువగా వస్తోంది డాక్టరుగారూ... తెల్లారాక కూడా బెడ్ మీద నుంచి లేవాలనిపించడం లేదు...’ ‘ఏ ఫోన్ వాడుతున్నారు...’ ‘నోకియా 1100’ ‘ఓ... అదా సమస్య. మీకో స్మార్ట్ ఫోన్ రాసిస్తాను. అది కొని అందులో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి... అంతే ఇంక మీకు నిద్ర వస్తే ఒట్టు...’
14
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అందరూ దేవుళ్లే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అందరూ దేవుళ్లే!' అమృతం తాగిన వాడిని ‘దేవుడు’ అంటారు. విషం తాగిన వాడిని ‘మహాదేవుడు’ అంటారు. విషం తాగి కూడా... అమృతం తాగినట్టు ఆనందం నటించేవాడిని ‘పతిదేవుడు’ అంటారు.
5
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వీర వాడకం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వీర వాడకం!' ‘మీరు టూత్బ్రష్ ఎంత కాలం వాడతారు’ అని ఓ డెంటిస్టు సర్వే చేస్తున్నాడు. అమెరికన్... ‘ఒక నెల’ అని చెప్పాడు. చైనీయుడు... ‘ఆరు నెలలు వాడతామ’ని అన్నాడు. ‘టూత్ బ్రష్ వాడడానికి ప్రత్యేకంగా ఓ కాలపరిమితి అంటూ లేదు. మామూలుగా అయితే పళ్లు తోముకోడానికి వాడతాం. తర్వాత జుట్టుకి రంగు వేసుకోవడానికి వాడతాం. ఆ తర్వాత ఆభరణాలూ అవీ తోమడానికి. ఇంకా బూరు మిగిలితే... మెషిన్లు, ఇంజన్లలో ఆయిల్ రుద్దడానికి... బూరు మొత్తం ఊడిపోయాక... లంగాలు, పైజమాలకి నాడాలు దూర్చడానికి వాడతాం...’ భారతీయుడి సమాధానం వినగానే స్పృహతప్పి పడిపోయాడా డాక్టర్.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మొత్తం ఎక్కేసింది! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మొత్తం ఎక్కేసింది!' ‘ఆశ్చర్యంగా ఉందే! నీదీ, నీ భార్యదీ ఒకే బ్లడ్ గ్రూప్...’ ‘నాకు తెలుసు డాక్టర్. ఒకటా... రెండా... ఇరవై ఏళ్ల నుంచి నా రక్తం పీలుస్తూనే ఉంది... మరి’
5
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పాయింటేగా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పాయింటేగా!' ‘యుద్ధానికి వెళుతూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోకుండా దోమ తెర కట్టుకుని వెళుతున్నావేంటి?’ ‘దోమలే దూరలేనప్పుడు... బుల్లెట్ ఎలా వెళ్తుంది! అందుకే కట్టుకున్నా’
8
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ బోర్డు చూసి రండి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బోర్డు చూసి రండి!' ‘మా ఇంట్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు’ ‘ఓ పని చెయ్యి... ఇంటికి ‘టు-లెట్’ బోర్డు పెట్టు. దాంతో ఇల్లు ఖాళీగా ఉందనుకుని దోమలు లోపలికి రావు’
14
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ప్లేస్ మారినా... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ప్లేస్ మారినా...' ‘‘ఈ డాక్టర్, గతంలో హోటల్లో పనిచేసి ఉంటాడ్రా...’’ ‘‘ఎందుకూ?’’ ‘‘ఇంజక్షన్ చేయించుకుని డబ్బులు లేవంటే క్లినిక్లో టవళ్లూ, కర్టెన్లూ ఉతికించాడ్రా!’’
12
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆడది- అనుమానం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆడది- అనుమానం!' భార్య: నేను మీకోసం నోములూ, వ్రతాలూ ఏమీ చేయకపోయినా మీరెలా బాగుంటున్నారండీ? భర్త: అంతా నా మంచితనమే పిచ్చిదానా! భార్య: అదేం కాదు... మీకోసం ఇంకెవరో వ్రతాలు గట్రా చేస్తున్నట్టున్నారు. అది ఎవత్తో మర్యాదగా చెప్పండి.
11
['tel']
తెలుగు- ఇంగ్లిష్ అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'తెలుగు- ఇంగ్లిష్' ‘పచ్చడి తాగితే తెలుగు సంవత్సరం... పచ్చడయ్యేలా తాగితే ఆంగ్ల సంవత్సరం...’
2
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఉద్యోగి ఆవేదన! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఉద్యోగి ఆవేదన!' ‘ఏంటో వెధవ జీవితం... జీతం పెంచమంటే ‘అసలు నువ్వు ఏం పని చేస్తున్నావని’ అడుగుతారు. అదే సెలవు ఇమ్మంటే ‘నువ్వు చేయాల్సిన పని ఎవడు చేస్తాడ’0టారు...’’
9
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదీ సంగతి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ సంగతి!' ‘గుడిలో మగ పూజారులే ఎందుకు ఉంటారు స్వామీ?’ ‘మీ ధ్యాస దేవుడి మీదే ఉండాలని... నాయనా!’
11
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వాట్ ఎన్ ఐడియా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వాట్ ఎన్ ఐడియా!' ‘‘ఏంటే పద్మా... ఉదయాన్నే దోమల బ్యాటుతో ఏం చేస్తున్నావ్!’’ ‘‘ఏం లేదు ఉమా... బియ్యంలో పురుగులు పడితేనూ, దోమల బ్యాటుతో జల్లెడ పడుతున్నా. పురుగులన్నీ చచ్చి, బియ్యం మాత్రం కిందకి వస్తాయని!’’
5
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఉద్యోగం రాకపోతే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఉద్యోగం రాకపోతే!' ఇంటర్వ్యూ అధికారి: మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెప్పినా... నీకు ఉద్యోగం రాలేదనుకో! ఏం అనుకుంటావ్. సుబ్బారావు: పిచ్చివాళ్లతో కాలక్షేపం బాగుందని... అనుకుంటా.
11
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మందు - మతిమరుపు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మందు - మతిమరుపు' ‘‘రాత్రి ఫుల్లుగా తాగి, లేటుగా వెళ్లినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. రోడ్డు మీదనే పడుకున్నా’’ ‘‘తెల్లారిన తర్వాత తీసిందా?’’ ‘‘లేదు రా... తాగింది దిగింది! అప్పుడు గుర్తుకొచ్చింది. నాకసలు పెళ్లే కాలేదని... తాళంచెవి నా జేబులోనే ఉందని!’’
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక యాక్షన్ - రియాక్షన్... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'యాక్షన్ - రియాక్షన్...' ‘సర్... ప్లీజ్ సెండ్ యువర్ పాన్ డిటైల్స్’ (మీ పాన్ వివరాలు పంపండి) అని బ్యాంకు సిబ్బంది నుంచి చిట్టిబాబుకి మెసేజ్ వచ్చింది. టకా టకా టైప్ చేసి సమాధానం పంపించాడు చిట్టిబాబు. అంతే... ఆ మెసేజ్ చూసి మూర్ఛబోయారు బ్యాంకు సిబ్బంది... ఇంతకీ దాంట్లో ఏముందంటే...‘‘ఆకు... వక్క... సున్నం... కాసింత జర్దా!’’
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎవరి కారణాలు వారికుంటాయ్... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎవరి కారణాలు వారికుంటాయ్...' ‘నాన్నా... నన్ను స్కూల్లో దింపడానికి రోజూ మీరే ఎందు కొస్తారు? మా ఫ్రెండ్స్ను దింపడానికి వాళ్ల అమ్మలే వస్తారు కదా..!’ ‘అందుకే... రా! రోజూ నేను వచ్చేది...’
7
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రేటుని బట్టి మర్యాద! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రేటుని బట్టి మర్యాద!' భార్య: ఏమండీ... కారు తాళాలివ్వండి.. కిడ్డీ పార్టీకి వెళ్లాలి. భర్త: పక్కనే కదే! కారెందుకు... భార్య: 5 లక్షల కారులో వెళితే, మర్యాద పెరుగుతుంది... అందుకని! భర్త: అవునా... ఇదిగో ఈ పది రూపాయలు తీసుకో. 50 లక్షల బస్సులో వెళ్లు. మర్యాద భయంకరంగా పెరుగుతుంది.
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సోషల్ ట్రెండు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సోషల్ ట్రెండు!' ‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది. కాని గుర్తుకు రావట్లేదు. ఫేస్బుక్లో ఉన్నారా?’ ‘లేను...’ ‘వాట్సా్పలో ఉన్నారా?’ ‘లేను’ ‘పోనీ ట్విట్టర్లో గానీ... స్కైప్లో గానీ ఉన్నారా...’ ‘లేను... లేను... లేను!’ ‘మరి...’ ‘మీ ఇంటి మేడ మీద రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నా...’
14
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఏం చేయాలి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏం చేయాలి!' సిటీలో పుట్టిపెరిగిన అమ్మాయికి, పల్లెటూరి అబ్బాయితో పెళ్లి జరిగింది. అత్తారింటికి వెళ్లిన మొదటిరోజు... గేదెకి గడ్డి వేయమని పంపారు అత్తగారు. గేదె నోట్లో నురగ చూసి, వెనక్కి వచ్చేసింది కోడలు... అత్త: ఏమయిందమ్మా... గడ్డి వేయలేదా? కోడలు: అది ఇంకా బ్రష్ చేసుకుంటోంది అత్తయ్యా!
12
['tel']
చెప్పే తీరు తెలీదా! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'చెప్పే తీరు తెలీదా!' భార్య టూర్కి వెళుతూ... ప్రాణప్రదంగా పెంచుకుంటున్న తన పిల్లిని జాగ్రత్తగా చూసుకోమని భర్తకి చెప్పింది. మరుసటి రోజు ఫోన్ చేసి పిల్లి క్షేమ సమాచారాలడిగింది. భర్త: పిల్లి చనిపోయింది... భార్య: (చిన్న షాక్ తిని తేరుకుని...) నీకు తెలుసు కదా! ఆ పిల్లి అంటే నాకెంత ఇష్టమో... అంత సడన్గా... మొండిగా అలా ఎలా చెప్పగలిగావ్? నిదానంగా ఈరోజు ‘ఇంటి పై కప్పు మీద ఆడుకుంటోంది’ అని చెప్పాలి. రేపు ‘పైనుంచి కిందపడి కాళ్లు విరిగాయి’ అని చెప్పాలి. మూడో రోజు... ‘నిన్న రాత్రి పాపం అది ప్రాణం విడిచింది...’ అని సున్నితంగా చెప్పాలి. అర్థమైందా? భర్త: అవును నిజమే... సారీ! భార్య: సరే... మా అమ్మ ఎలా ఉంది? భర్త: ఇంటి పైకప్పు మీద ఆడుకుంటోంది...!
2
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఐతే ఒకే... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఐతే ఒకే...' అమెరికాలో కరెంటు పోతే, వాళ్లు కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారు. జపాన్లో కరెంటు పోతే వాళ్లు మొదట ఫ్యూజ్ చెక్ చేస్తారు. అదే మనదేశంలో కరెంట్ పోతే పక్కింట్లో చెక్ చేస్తాం... ‘‘ఓహో... అందరింట్లో పోయిందా... ఐతే ఓకే...’’
3
['tel']
కొత్త సామెత! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'కొత్త సామెత!' హెల్మెట్, భార్యా రెండూ ఒక్కటే... వీటిని నెత్తిన పెట్టుకున్నంత సేపు ప్రాణాలు పదిలం!
2
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆడు మగాడ్రా బుజ్జి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆడు మగాడ్రా బుజ్జి!' నిజమైన ధైర్యసాహసి ఎవరు??? అర్థరాత్రి దాకా తప్ప తాగి, ఇంటికొచ్చి తలుపు తడితే... చీపురతో ప్రత్యేక్షమైన భార్యను చూసి ఏ మాత్రం బెదరకుండా... ‘‘ప్రియా... నువ్వింకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా? కాస్త రెస్ట్ తీసుకో... బంగారం! అలసిపోయావేమో!!!’’ అనేవాడు.
9
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తిండి తేడా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తిండి తేడా!' బ్రహ్మచారికి, పెళ్లయినవాడికి తేడా ఏంటి? బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు. పెళ్ళైనవాడు ఏదిపెడితే అదే తింటాడు.
12
['tel']
రక్తసంబంధం అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'రక్తసంబంధం' ‘‘ఒరేయ్ చంటీ... భూమికి, చంద్రుడికి ఉన్న సంబంధం ఏంటి చెప్పు?’’ ‘‘అన్నాచెల్లెళ్లు సార్...’’ ‘‘అన్నాచెల్లెళ్లా... ఎలారా?’’ ‘‘భూమిని భూమాత... అంటాం, చంద్రుడిని చందమామ అంటాం... ఇద్దరూ అన్నాచెల్లెళ్లే కదా సార్!’’
1
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆపద - ఆత్మ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆపద - ఆత్మ' వర్షం పడుతుండగా ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అప్పారావు... ఇంతలో... ‘‘అక్కడే ఆగిపో... నీ ముందున్న చెట్టు పడబోతుంది...’’ అంటూ ఎవరో అరిచినట్టు అనిపించి, ఆగిపోయాడు. వెనక చూస్తే ఎవరూ లేరు కానీ నిజంగానే చెట్టు పడిపోయింది. ఆశ్చర్యపోతూనే ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కబోతుంటే... ‘‘వద్దు... ఎక్కకు, ఆ ఆటోకి యాక్సిడెంట్ అవుతుంది...’’ అని వినిపించి, ఆగిపోయాడు. ఇంతలో మరెవరో ఆ ఆటో మాట్లాడుకున్నారు. అది కదిలి, కదలగానే ఓ కారు వచ్చి కొట్టేసింది. అప్పారావు మరింత ఆశ్చర్యపోతూ... ‘‘నన్నింతగా రక్షిస్తున్నావు.. ఎవరు నువ్వు?’’ అని అడిగాడు. ‘‘నేను అశరీరవాణిని’’ అంటూ సమాధానం వచ్చింది. ‘‘ఇంతలా నా క్షేమం కోరేవాడివైతే నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎక్కడ చచ్చావ్... వచ్చి రక్షించాలని తెలియదా??’’ అంటూ ఏడవడం మొదలెట్టాడు అప్పారావ్.
10
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వినబడలేదు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వినబడలేదు!' రత్నం: మీ ఆయనని ఆసుపత్రిలో చేర్చారటగా... ఇప్పుడెలా ఉంది. పద్మ: బాగానే ఉన్నారు పిన్నిగారు... రత్నం: ఇంతకీ ఎలా జరిగింది... పద్మ: అదా... అమ్మతో ఫోన్ మాట్లాడుతూ వంట చేస్తున్నా. సేమియాలో యాలకుల పొడి వేయమని అమ్మ చెప్పింది, నాకు సరిగా వినబడక ఎలకల పొడి వేశా! అంతే... పిన్నిగారు!
14
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక శుద్ధ అనువాదం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'శుద్ధ అనువాదం' ‘హోమ్డెలివరీ అంటే ఏంటి గురూ?’ ‘ఆసుపత్రిలో కాకుండా, ఇంట్లోనే పురుడు పోసుకోవడం!’
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ లాక్ ప్రాబ్లమ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'లాక్ ప్రాబ్లమ్' భార్య ఉదయాన్నే మంచం మీది నుంచి దిగకుండానే మేకప్ వేసుకుంటోంది. భర్త: ఒసేయ్... నీకు పిచ్చి పట్టిందా? ఇంకా లేవను కూడా లేదు, అప్పుడే మేకప్ ఏంటి? భార్య: అబ్బా... మీరు ఆగండీ... నేను నా ఫోన్లాక్ ఓపెన్ చేస్కోవాలి. అది నన్ను గుర్తు పట్టట్లేదు!
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వీళ్లు మాత్రం మారరు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వీళ్లు మాత్రం మారరు!' పరీక్ష పాసయితే... అమ్మ: నా బంగారు కొండ! నాన్న: నువ్వు నా కొడుకువి రా... ప్రేయసి: ఐ లవ్ యూ రా... స్నేహితులు: మామా... రారా బారుకి పోదాం! పరీక్ష ఫెయిల్ అయితే... అమ్మ: ఎంతసేపు మొబైల్ పట్టుకుని కూర్చుంటావ్? నాన్న:అస్తమానం టీవీ... టీవీ... ఎప్పుడైనా చదువుకుంటేగా! ప్రేయసి: వెధవ... నీకు జీవితంలో ఓ లక్ష్యం అంటూ ఉంటే కదా! స్నేహితులు: మామా... రారా బారుకి పోదాం!
10
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదీ నమ్మకం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ నమ్మకం' ఏరొనాటికల్ ప్రొఫెసర్లందరూ ఫ్లైట్లో కూర్చున్నారు. విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా అనౌన్స్మెంట్ వచ్చింది... ‘‘డియర్ సర్స్... సర్ఫ్రైజ్ ఏంటంటే... ఈ విమానం మీ స్టూడెంట్స్ స్వయంగా తయారుచేసింది!’’ అంతే ప్రొఫెసర్లందరూ ఫ్లైట్ దూకేసి పరుగో పరుగు... ఒక్క ప్రిన్సిపాల్ తప్ప! ఓ స్టూడెంట్ వచ్చి, ప్రిన్సిపాల్ను అడిగాడు... ‘‘మీకు భయం లేదా సార్..?’’ దానికాయన ‘‘లేదు.. నా స్టూడెంట్స్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది... ఈ ఫ్లైట్ స్టార్ట్ అవ్వదని!!!’’ అంటూ సీట్లో నిద్రలోకి జారుకున్నాడు.
10
['tel']
రెండూ ఒక్కటే! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'రెండూ ఒక్కటే!' భర్త: రాధా... హిప్నాటిజం అంటే ఏమిటి? భార్య: నాకు తెలిసినంత వరకూ... ఒక వ్యక్తిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని, తను చెప్పినట్లు చేయించుకోవడం. భర్త: నాన్సెన్స్... తెలియకపోతే తెలియదని చెప్పు. దాన్ని పెళ్లి అంటారు కానీ, హిప్నాటిజం అని ఎందుకంటారు? నువ్వేంచెప్పినా నమ్మేస్తాననుకున్నావా...
1
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ శుభ్రత ముఖ్యం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'శుభ్రత ముఖ్యం' కస్టమర్: హలో మాస్టారు... డెటాల్ సోప్ ఉందా... దుకాణదారు: ఉంది సార్! కస్టమర్: నిజంగానే ఒరిజినల్ డెటాల్ సోప్ ఉంది కదా... దుకాణదారు: అవునండీ... ఒరిజినల్ సోపే ఉంది! కస్టమర్: అయితే... దాంతో మీ చేతులు శుభ్రంగా కడుక్కుని, ఒక కిలో మైదా పిండి ఇవ్వండి!
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సైడ్ బిజినెస్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సైడ్ బిజినెస్' ‘‘నువ్వు తినగా మిగిలిన అన్నం ఏం చేస్తావయ్యా...’’ అడుక్కునేవాడిని అడిగింది కాంతం. ‘‘ఏం చేస్తానమ్మా... మెత్తగా రుబ్బి, ఎండబెట్టి వడియాలు చేసి మార్కెట్లో అమ్ముతుంటాను...’’ సిగ్గుపడుతూ చెప్పాడు భిచ్చపతి.
11
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బీరువా సమస్యలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బీరువా సమస్యలు' ఆడవాళ్లు బీరువా తెరువగానే, వారికి రెండు సమస్యలు ఎదురవుతాయి. అవి... 1. బీరువాలో కొత్త బట్టలు లేకపోవడం. 2. బట్టలు పెట్టడానికి బీరువా సరిపోకపోవడం.
4
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నిజమైన ప్రేమ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నిజమైన ప్రేమ' పెళ్లి కాకముందు ప్రేయసి పక్కన కూర్చొని చెరువులో రాళ్లేస్తూ మాట్లాడేవాడు. పెళ్లి చేసుకున్నాక... బియ్యంలో రాళ్లు ఏరుతూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. వాడంటే రాళ్లకి ఎంత ప్రేమో, మళ్లీ వాడి దగ్గరికే తిరిగి వచ్చేశాయి!!!
4
['tel']
ఇలా చెప్పాలి... అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ఇలా చెప్పాలి...' భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్లోకి దూసు కొచ్చాడు సుబ్బారావు. భర్త: ఆమ్లెట్ వేయడం అలా కాదు. ఇంకొంచెం నూనె పోయి.. ఆగు ఆగు.. మరీ అంత పోస్తే ఎలా? అయ్యో ఆమ్లెట్ మాడిపోతోంది. తిప్పూ... తిప్పూ.. ఇంకా ఎంత సేపూ.. ఇంకొంచెం ఉప్పు వెయ్యి, అయ్యో అయ్యో... మరీ అంతనా వేసేది... భార్య: అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజే కొత్తగా చేస్తున్నట్లు ఆ అరుపులేంటి? భర్త: నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నువ్వు అరిస్తే... నాకూ ఇలాగే మండుతుంది మరి! (అంటూ నెమ్మదిగా జారుకున్నాడు...)
2
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రహస్యం తెలిసిపోద్ది! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రహస్యం తెలిసిపోద్ది!' ప్రకాష్ ఎంత కష్టమొచ్చినా ఆఫీస్కి సెలవు పెట్టడు. అనగనగా ఒకరోజు సునీత: ఏమండీ... రేపు సెలవు పెట్టండీ. సరదాగా పిల్లలతో బయటికి వెళ్దాం. ప్రకాష్: కుదరదు... సునీత: ఎందుకు? ప్రకాష్: కుదరదంటే కుదరదు... సునీత: ఏ... ఎందుకు? మీరు లేకపోతే కంపెనీలో ఏ పనీ జరగదా ఏంటి? ప్రకాష్: జరుగుతుంది. కానీ నేను లేకపోయినా కంపెనీకి వచ్చే నష్టం ఏమీ ఉండదనే విషయం మేనేజ్మెంట్కు తెలిసిపోతుంది.
8
['tel']
భయపడడం పక్కా! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'భయపడడం పక్కా!' ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అని రాస్తే ఎవరూ పట్టించుకోరు... అదే సిగరెట్ ప్యాకెట్ మీద ‘పొగతాగితే లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది’ అని రాయండి. ఒక్కడైనా సిగరెట్ తాగితే ఒట్టు!
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కష్టం- సుఖం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కష్టం- సుఖం' ‘జీవితంలో కష్టాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. సుఖం మాత్రం వచ్చీ, పోతూ ఉంటుంది...’ ‘అవును స్వామీ... నా భార్య ఎప్పుడూ నాతోనే ఉంటుంది. మరదలు మాత్రం అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటుంది...’
5
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నావి కావు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నావి కావు!' పోలీసు: హత్య జరిగిన కత్తిపైన నీ వేలిముద్రలు ఉన్నాయి కాబట్టి నువ్వే ముద్దాయివి.. ముద్దాయి: నేను ఎమ్బీఏ చదివాను సార్... వేలిముద్రలు వేయాల్సిన ఖర్మ నాకేంటి...
7
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అప్పు రహస్యం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అప్పు రహస్యం' ‘అడక్కుండానే అప్పు ఇస్తున్నావ్. నువ్వు చాలా మంచివాడివి బ్రో’ ‘అదేం... లేదు రా! ఇంట్లో డబ్బు ఉంటే నా భార్య షాపింగ్ తీసుకెళ్లమని విసిగిస్తుంది, పోనీ తీసుకెళ్లానా... శారీ సెలక్షన్కో రెండు గంటలు, దాని మీద గాజుల సెలక్షనుకో మూడు గంటలు, మ్యాచింగ్ కమ్మలు, బొట్టుబిళ్లలు, అదీ, ఇదీ అని... టైమ్ వృథా, పర్సు ఖాళీ. నీ దగ్గరుంటే సేఫ్గా ఉంటుందని!’
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అసలు సంగతి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అసలు సంగతి' విజయ్: మా ఆవిడకి సర్వమత సమానత్వ భావన కాస్త ఎక్కువరా... భాస్కర్: ఓ చాలా మంచిదే కదా! మరి ఎందుకురా... ఏడుస్తూ చెబుతున్నావ్... విజయ్: ఏం మంచిదిరా... దసరా, రంజాన్, క్రిస్మస్... ఇలా ప్రతీ పండగకీ కొత్త బట్టలు కొనమంటే ఎలారా... చచ్చేది?
10
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కొత్త కంప్లైంట్... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కొత్త కంప్లైంట్...' పోలీసు: ఏం జరిగిందమ్మా... ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? మంగమ్మ: మా పక్కింటి పంకజం మీద. మా ఇంటి ముందు నేను వేసిన ముగ్గును ఫోటో తీసి, తన ఇంటి ముందు తానే వేసుకున్నట్టుగా ఫేసుబుక్కులో పోస్టు చేసింది. కాపీరైట్ చట్టం ప్రకారం కేసు పెట్టాలని వచ్చా.
3
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మర్మమెరిగిన తండ్రి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మర్మమెరిగిన తండ్రి' రవి: బ్యాంక్ ఎగ్జామ్స్కు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలని ఫోన్ చేస్తే, మా నాన్న వెంటనే పంపించాడు రా... కిరణ్: మీ నాన్న చాలా మంచివాడ్రా. నువ్వంటే ఎంత నమ్మకం! రవి: డబ్బులు పంపలేదు. పుస్తకాలు కొని పంపించాడ్లే!
10
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రొట్టె విరిగి.... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రొట్టె విరిగి....' వైవాహిక జీవితంలో అతి పెద్ద జోక్ ఏమిటంటే... ‘‘ఏమండోయ్! నేను మీతో అస్సలు మాట్లాడను... అదే నేను మీకు వేసే శిక్ష’’ అని భార్య మొండికేసి కూర్చోవడం.
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అబ్బా అలాగా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అబ్బా అలాగా!' డాక్టర్: నేను తొమ్మిది గంటలకు వేసుకొమ్మంటే, నువ్వు ఆరు గంటలకే మందులేసుకున్నావట.. ఎందుకయ్యా? పేషెంట్: అంటే సార్... బ్యాక్టీరియాకు సర్ప్రైజ్ ఇద్దామని!
14
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పెళ్లిచూపులు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పెళ్లిచూపులు' కుమారుడికి సలహాలు చెబుతున్నాడు తండ్రి.. తండ్రి: ఒరేయ్... అసలే నీకు సిగ్గు ఎక్కువ. కాబోయే మామగారు కట్నం కింద బండి ఇస్తానంటే... కారు అడుగు. కూలర్ పెడతామంటే ఏసీ అడుగు... వాచీ పెడతామంటే బ్రాస్లెట్ అడుగు... అర్థమైందా? కొడుకు: అలాగే నాన్నా ... మరి అమ్మాయిని ఇస్తామంటే వాళ్లమ్మనో, అమ్మమ్మనో అడగమంటారా? (బిత్తర చూపులు చూస్తూ అడిగాడు కొడుకు...)
11
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నా చావుకొచ్చింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నా చావుకొచ్చింది' ‘‘ఎందుకు ఏడుస్తున్నావ్?’’ ‘‘మా ఊర్లో ఏనుగు చనిపోయింది’’ ‘‘ఓ... అదంటే నీకు అంత ప్రేమా..?’’ ‘‘లేదు...లేదు. నేను శ్మశానంలో గోతులు తీసేవాడిని. ఇప్పుడు దానికీ నేనే పెద్ద గొయ్యి తీయాలి’’
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పెళ్లికానుక ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పెళ్లికానుక' పెళ్లికూతురు లావణ్యకి గిఫ్ట్బాక్స్ ఇచ్చి ‘‘ఈ చీర శోభనం రాత్రి మాత్రమే కట్టుకో...’’ అంది లిల్లీ. ఆ రాత్రి ఎంతో ఆసక్తిగా బాక్స్ విప్పిన లావణ్య అవాక్కయ్యింది... అది ఖాళీ బాక్స్!
11
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక చిక్కులమారి హోటల్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చిక్కులమారి హోటల్' పల్లెటూరి పద్మనాభం ఓ రెస్టారెంట్కి వెళ్లాడు. కొద్దిసేపటికి అతను, వెయిటర్తో గొడవ పడుతుండడం చూసి, ఆ రెస్టారెంట్ యజమాని వచ్చి ఏమైందని అడిగాడు. వెయిటర్: ఏం కావాలి అంటే నూడుల్స్ తెమ్మన్నాడు సార్... తీసుకొచ్చి ఇచ్చాను.... యజమాని: సరే... ఏమైంది మరి... వేడిగా లేవా? వెయిటర్: కాదు సార్... నూడుల్స్ మొత్తం చిక్కులు పడి ఉన్నాయి.. డబ్బులు కడుతున్నా కదా... చిక్కులన్నీ తీసి ఇమ్మంటున్నాడు.
6
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తింగరోడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తింగరోడు' డాక్టర్: దెబ్బ తగిలిన చోట ఈ మందును రెండు పూటలా రాసుకోండి. ఓ పది రోజుల్లో గాయం తగ్గిపోతుంది. పేషెంట్: నాకు ఈ దెబ్బ మా ఇంటి నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో తగిలిందండీ! రోజూ అక్కడికి వెళ్లి రాసుకోవడమంటే చాలా కష్టం.
12
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పరువుగల భర్త ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పరువుగల భర్త' సుబ్బారావు: అదేంట్రా ఇక్కడిన్ని కుర్చీలు ఉండగా, అలా నించొని తింటున్నావు? వెంకట్రావు: వద్దులేరా... నిలబడే తింటాను. భార్య సంపాదిస్తుంటే, కూర్చొని తింటున్నాడని అందరూ అనుకుంటారు.
5
['tel']
తగ్గిపోయిందిలే! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'తగ్గిపోయిందిలే!' భర్త: గుండెల్లో నొప్పిగా ఉంది. వెంటనే ఆంబులెన్స్కి ఫోన్ చెయ్యి! భార్య: హా... మీ మొబైల్ పాస్వర్డ్ చెప్పండి త్వరగా... భర్త: ఇప్పుడు కాస్త తగ్గినట్టుందిలే... పర్లేదు!
1
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆన్ ద వే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆన్ ద వే' ఒకసారి మూడు తాబేళ్లు కలిసి ఒక దగ్గర పార్టీ ఏర్పాటు చేసుకున్నాయి. అయితే తొందరలో సోడా తెచ్చుకోవడం మర్చిపోయాయి. అందులో ఒక తాబేలు, ‘‘నేను ఇంటికి వెళ్లి సోడా తెస్తాను’’ అంది. సరేనని, అది వెళ్లి, వచ్చేదాకా ఎదురుచూడడం మొదలెట్టాయి మిగిలిన రెండు తాబేళ్లు. పన్నెండు గంటలు దాటిపోయినా సోడాకోసం వెళ్లిన తాబేలు తిరిగి రాలేదు. ‘‘ఇంకా ఎదురుచూడడం నా వల్ల కాదు ... నేను తాగేస్తాను..’’ అంది రెండు తాబేళ్లలో ఒకటి. వెంటనే ‘‘ఇలాగైతే ... నేను సోడాకోసం వెళ్లను పోండి’’ అనే మాట వినిపించింది, కొంచెం దూరంలో ఉన్న రాయి పక్కనుంచి.
9
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మరో మార్గం లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మరో మార్గం లేదు' డాక్టర్: ఇదిగోమ్మా... నీ ఒంట్లో రక్తం చాలా తక్కువగా ఉంది. ఇకపైన రోజూ కనీసం పది గ్లాసుల నీళ్లు తాగాలి. పేషంట్: సారీ డాక్టర్ ... నేను తాగలేను. డాక్టర్: ఏ.. ఎందుకు తాగలేవు? పేషంట్: మా ఇంట్లో నాలుగు గ్లాసులే ఉన్నాయి డాక్టర్!
9
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మిస్టర్ కంగార్రావు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మిస్టర్ కంగార్రావు' తనకు అందిన ఇన్విటేషన్ కార్డులో ‘పార్టీకి వచ్చేవాళ్లు టై కట్టుకుని రావడం తప్పనిసరి!’ అని రాసి ఉండడం చూసి, టై కొనుక్కుని మరీ కట్టుకెళ్లాడు సుబ్బారావు. పాపం... పార్టీకి వెళ్లి, అందర్నీ చూశాక అర్థమైంది. టైతో పాటు డ్రెస్ కూడా వేసుకోవాలని!
5
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఇరకాటంలో సుబ్బారావు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇరకాటంలో సుబ్బారావు' ‘‘మా ఆవిడేమో ‘ఇంకోసారి తాగారో నా మీద ఒట్టు’ అంటుంది. నా దోస్తులేమో ‘నువ్వు తాగలేదో... వదిన మీద ఒట్టే’ అంటారు... ఎలా చచ్చేది నేను...’’
5
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదీ సంగతి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ సంగతి!' ‘‘చెప్పండి... ఏంటి మీ సమస్య?’’ ‘‘నా శరీరంలో ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పి పెడుతోంది డాక్టర్!’’ ‘‘అంటే... క్లియర్గా చెప్పండి’’ ‘‘నా భుజాన పట్టుకుంటే నొప్పి పెడుతోంది, మోకాలుని పట్టుకున్నా నొప్పిగా ఉంటోంది, అరికాళ్లని ముట్టుకున్నా నొప్పి అనిపిస్తోంది.’’ ‘‘అర్థమైంది మీ సమస్య.’’ ‘‘ఏంటి డాక్టర్?’’ ‘‘మీ చూపుడువేలికి దెబ్బ తగిలింది...’’
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఒక విద్యార్థి ప్రార్థన ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒక విద్యార్థి ప్రార్థన' ఓ దేవుడా... డాలర్ రేటును 70 రూపాయల దాకా పెంచావు... పెట్రోలు లీటరు 75 రూపాయలకి పెంచావు... ఉల్లి రేటును కిలో 80 రూపాయలకు పెంచావు... కందిపప్పు 200 రూపాయల దాకా పెంచేశావు... అయినా నీకు కోటి కోటి దండాలు సమర్పిస్తున్నాము... ఎందుకంటే పాస్ మార్కులు 35 దగ్గరే ఉంచావు... వాటిని పెంచి ఉంటే, మా గతి ఏమైపోయేది దేవుడా...!
3
['tel']
బోడి సలహా అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'బోడి సలహా' ‘‘ఎండకాలం రాబోతుంది. ముందు జాగ్రత్త చర్యగా వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఓ చిట్కా చెప్పు.’’ ‘‘కర్మా బార్ను నీటిలో కరిగించి తాగండి. అందులో వంద నిమ్మకాయల శక్తి ఉంది.’’
1
['tel']
నీ తిక్క తగ్గలేదింకా! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'నీ తిక్క తగ్గలేదింకా!' ఆనంద్: నమస్తే మాస్టారూ .. బాగున్నారా? గుర్తుపట్టారా! నేనండీ, మీ దగ్గర చదువుకున్న ఆనందాన్ని. టీచర్: వోర్నీ... నువ్వటోయ్! గుర్తొచ్చింది. ఏ ప్రశ్నడిగినా తల తిక్కగా జవాబులు చెప్తూ ఉండేవాడివి. అవును ... ఇప్పుడేం చేస్తున్నావోయ్? ఆనంద్: మీతో మాట్లాడుతున్నానండీ..!
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అర్థం చేసుకోరూ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అర్థం చేసుకోరూ!' ‘‘హైద్రాబాద్కి ఫస్ట్ బస్ ఎన్ని గంటలకి?’’ ‘‘ఉదయం 5 గంటలకి.’’ ‘‘దానికి ముందు ఏమీ లేవా?’’ ‘‘ఉన్నాయి ... రెండు పెద్ద హెడ్లైట్స్!’’
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దొందూ దొందే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దొందూ దొందే!' ఆలోచించి కట్టవలసినవి రెండు. ఒకటి ఇల్లు, రెండోది తాళి. ఆలోచించకుండా కడితే మొదటిది అప్పులపాలు చేస్తుంది. రెండోది తిప్పలపాలు చేస్తుంది.
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నాకూ ఉంది ఓ ఆఫీసు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నాకూ ఉంది ఓ ఆఫీసు' ఫోన్ బిల్లు చూసి, బిత్తరపోయిన బడ్జెట్ పద్మనాభం, ఇంట్లో వాళ్లని పిలిచి ఎవరెన్ని కాల్స్ చేశారని నిలదీశాడు. కొడుకు: నేను ఆఫీస్ ఫోన్ మాత్రమే వాడతాను. భార్య: ఫోన్ అవసరముంటే మా మేనేజర్గారి అకౌంట్లోనే చేస్తా! కూతురు: నా కాల్స్కి ఆఫీసే పే చేస్తుంది. ఇంటి పనిమనిషి (సిగ్గుపడుతూ) : మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేస్తున్నారు కదా! అని నేను ఈ ఫోన్ వాడుతున్నా. మరి నా ఆఫీస్ ఇదే కదా అయ్యగారు..!
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మొబైల్ బాబా సందేశం... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మొబైల్ బాబా సందేశం...' బాబా: పుట్టడం, చావడం మీ చేతుల్లో ఉండదు. మీ గర్ల్ఫ్రెండ్ ఉంటుందో, హ్యాండ్ ఇస్తుందో మీ చేతుల్లో లేదు. కాబోయే భార్య మిమ్మల్ని ఎలా చూసుకుంటుందో కూడా మీ చేతుల్లో లేదు... శిష్యుడు: మరి మా చేతుల్లో చివరి వరకూ ఉండేది ఏంటి బాబా? బాబా: మీ మొబైల్ మాత్రమే!
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కంగారబ్బాయ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కంగారబ్బాయ్' సుబ్బారావు పెళ్లి చూపులకెళ్లాడు. ‘‘మా అమ్మాయి ఇంకా చదువుకుంటాను అంటోందండీ!’’ అన్నాడు అమ్మాయి తండ్రి. ‘‘అవునా... పర్వాలేదు. చదువుకోమనండి. మేం ఓ గంట తర్వాత వస్తాం...’’ అంటూ హడావిడిగా లేచి బయల్దేరాడు సుబ్బారావు.
13
['tel']
కరెక్టే కదా! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'కరెక్టే కదా!' ఎడిటర్: ఇదేంటయ్యా! మినిష్టర్ సుబ్బరంగా బతికే ఉంటే, మినిష్టర్ కన్నుమూత అని శీర్షిక పెట్టావ్? విలేకరి: మినిష్టర్గారి కుడి కంటికి ఆపరేషన్ అయితే, దానికి ప్లాస్టర్ వేసి మూసేశారు. అందుకే ‘మినిష్టర్ కన్నుమూత’అని పెట్టాను. కరెక్టే కదా సార్..!
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తాతయ్య దీవెన ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తాతయ్య దీవెన' భాస్కర్: మా తాతయ్య దీవెన చాలా పవర్ఫుల్ రా! విజయ్: అవునా... ఏలా? భాస్కర్: చిన్నప్పుడు మా తాత నువ్వు పదిమందికి అన్నం పెట్టేంత గొప్పవాడివి అవుతావంటే ఏమో అనుకున్నా.... ఇప్పుడు అదే చేస్తున్నా! విజయ్: అవునా... ఇంతకీ ఏం చేస్తున్నావు? భాస్కర్: క్యాటరింగ్ బాయ్గా.
5
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చలికి వందనం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చలికి వందనం!' పురుషులందరూ చాలా ఒద్దికగా చేతులు కట్టుకుని నడుస్తున్నారు. అమ్మాయిలు నిండుగా బట్టలేసుకుంటున్నారు. వేడిగా తినాలని త్వరగా భోజనాలు చేసి, ముసుగు కప్పుకుంటున్నారు. రోడ్లపై సంచారం తగ్గి, ట్రాఫిక్ తిప్పలు తగ్గాయి. ఫ్యాన్లు, ఏసీలూ వేయకుండా కరెంట్ ఆదా చేస్తున్నారు.
14
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ భవిష్యత్తులో నివాళి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'భవిష్యత్తులో నివాళి' పాపం చాలా మంచివాడు. ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉండేవాడు. అడిగినవాళ్లందరి పోస్టులకి, లేదనకుండా లైక్ కొట్టేవాడు. చాలా హుందాగా కామెంట్స్ పెట్టేవాడు. పాపం తన పోస్టులకి ఎవ్వరినీ ట్యాగ్ కూడా చేసేవాడు కాదు. ఎవరైనా వారి పోస్టులకి ట్యాగ్ చేసినా, ఒక్కమాట కూడా అనేవాడు కాదు. పాపం జీవితాంతం ఒక్క ఫేస్బుక్ అకౌంట్ మీదే బతికాడు. ఆయన మరణం సోషల్ మీడియాకు తీరని లోటు.
10
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కీలెరిగి వాత ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కీలెరిగి వాత' భర్త: 30 ఏళ్ల నుంచీ నిన్నే చూస్తుంటే బోరు కొడుతోంది కాంతం. వెరైటీ కోసం ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుంటుందోయ్! భార్య: మీ మాట నేనెప్పుడు కాదన్నానూ .. బాహుబలి లాంటి పెళ్లికొడుకును చూడండి.
13
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చిట్కా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చిట్కా' ‘‘నా మొహం మరీ జిడ్డుగా అవుతోంది ... ఏ సబ్బు వాడినా లాభం ఉండట్లేదు’’. ‘‘విమ్ బార్ వాడి చూడు ... అది దాగి ఉన్న జిడ్డు మరకలను కూడా తొలగిస్తుందట’’.
12
['tel']
చేసుకున్నవారికి .. అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'చేసుకున్నవారికి ..' ‘‘దేవుడా అమ్మాయిలందరూ అందంగా, వినయంగా ఉంటారు. మరి భార్యలు అలాగే ఎందుకుండరు?’’ అడిగాడు భక్తుడు. ‘‘పిచ్చివాడా ... అమ్మాయిలని నేను సృష్టించాను. వాళ్లను భార్యలుగా మీరు చేసుకున్నారు. అనుభవించండి’’ చెప్పాడు దేవుడు.
1
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వంద మార్గాలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వంద మార్గాలు' ‘‘అమ్మా! ఫేస్బుక్ చూస్తూ పొరపాటున పరమాన్నంలో ఉప్మా పోపు కలిపేశా... మీ అల్లుడు భోజనానికి వచ్చే వేళయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి?’’ ఫోన్లో కంగారుగా సలహా అడిగింది కూతురు. ‘‘దానిలో ఒక కప్పు పెరుగు వేసి గుజరాతీ దద్దోజనం అని చెప్పి పెట్టేసెయ్. మొన్న నేనూ ఇలాగే వాట్సాప్ చూస్తూ పులిహోరలో ఉప్పుకి బదులు పంచదార వేశా.. మిఠాయి రంగు కలిసి మీ నాన్నకి భైరవస్వామి ప్రసాదం అని పెట్టేశా’’ సలహా ఇచ్చింది తల్లి.
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆ మాత్రం తెలీదా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆ మాత్రం తెలీదా?' భర్త మీద కోపంతో బట్టలు సర్దుకుంటోంది భార్య. భర్త: ఏం చేస్తున్నావు? భార్య: నేను మా అమ్మవాళ్ల ఇంటికెళ్తున్నా! కాసేపటికి భర్త కూడా బట్టలు సర్దుకోసాగాడు. భార్య: మీరేం చేస్తున్నారు? భర్త: నేను కూడా మా అమ్మవాళ్ల దగ్గరకెళ్తున్నా! భార్య: మరి పిల్లల సంగతి! భర్త: నువ్వు మీ అమ్మ దగ్గర, నేను మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు పిల్లలు మాత్రం ఎక్కడుంటారు .. వాళ్లమ్మ దగ్గరే!
12
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అంతం కాదిది .. ఆరంభం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అంతం కాదిది .. ఆరంభం' సడెన్గా అర్ధరాత్రి 2 గంటలకు భర్తను నిద్రలేపి - భార్య: ఈగ సినిమాలో సమంత పేరేమిటి? భర్త: బిందు భార్య: మన పక్క ప్లాట్లో ఉండే కవిత, ప్లాట్లో దిగి ఎన్ని రోజులయింది? భర్త: గురువారం వస్తే 2 సంవత్సరాలు పూర్తి .. అయినా అర్ధరాత్రి నిద్రలేపి ఏమిటీ నాన్సెన్స్? భార్య: నిన్న నా పుట్టినరోజు... (నిశ్శబ్దం!!) క్విజ్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఉతుకుడు ప్రోగ్రామ్ మొదలైంది.
8
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అవును .. ఆమె భార్య ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అవును .. ఆమె భార్య !' కొత్తగా పెళ్లైన జంట రోడ్డుమీద నడుస్తుండగా ... సడెన్గా ఒక కుక్క వచ్చి కరవబోయింది. అమాంతం భార్యని పైకెత్తి కుక్క కాటు నుంచి రక్షించబోయాడు భర్త. ‘‘ఇంతవరకూ కుక్క మీదకి రాళ్లనూ, కర్రలనూ విసిరేవాళ్లనే చూశా గాని, పెళ్లాన్ని విసిరే వాడిని మిమ్మల్నే చూశా’’ కోపంగా అరిచింది భార్య.
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దొందూ దొందే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దొందూ దొందే' ‘‘ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ... ఏంటి సంగతి?’’ ‘‘నిన్న ఫేస్బుక్ చూసుకుంటూ మా ఇల్లు అనుకుని, పక్కింట్లోకి వెళ్లిపోయానురా!’’ ‘‘అయ్యో ... ఆ తర్వాత ఏమైంది?’’ ‘‘ఆ ఇంటావిడ వాట్సాప్ చూసుకుంటూ వాళ్లాయనే అనుకుని నాకు కాఫీ ఇచ్చింది. కాఫీ రుచి చూశాక గానీ తెలీలేదు ... అది మా ఇల్లు కాదని!’’
5
['tel']
లైకులే ఆధారం! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'లైకులే ఆధారం!' ‘‘చీరలన్నీ ఫోటో తీసుకుంటున్నారెందుకూ?’’ అనుమానంగా అడిగాడు సేల్స్మాన్. ‘‘ఈ ఫోటోలన్నీ ఫేస్బుక్లో పెడతా .. ఏ చీరకి ఎక్కువ లైకులొస్తే, దాన్ని కొంటా..’’ చెప్పింది చెంగల్వరాణి.
1
['tel']
నీ కక్కుర్తి మండా! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'నీ కక్కుర్తి మండా!' అమెరికా నుంచి వచ్చిన స్టీఫెన్ని భోజనానికి పిలిచాడు శాస్త్రి. ‘‘వెజ్జా .. నాన్ వెజ్జా ?’’ అడిగాడు స్టీఫెన్. ‘‘మా ఇంట్లో ప్యూర్ వెజ్’’ చెప్పాడు శాస్త్రి. ‘‘ఓహ్ .. ఐ లైక్ టు ఈట్ ఇండియన్ వెజ్ డిషెస్’’ అన్నాడు స్టీఫెన్. అరిటాకు వేసి, నీళ్లు పెట్టి లోపలికి వెళ్లాడు శాస్త్రి. ఆయన తిరిగి వచ్చే లోపు అరిటాకు తినేసి ‘‘టూ టేస్టీ .. థాంక్యూ’’ అని తేన్చాడు స్టీఫెన్. శాస్త్రి శోషతో పడిపోయాడు వెంటనే.
1
['tel']