news
stringlengths
299
12.4k
class
int64
0
2
Feb 19,2017 పోటీతో తగ్గిన విమానయాన ధరలు పనాజీ : వాణిజ్య విమానయాన కంపెనీల మధ్య నెలకొన్న పోటీ వల్ల ప్రయాణ ధరల్లో సగటున 30 శాతం వరకు తగ్గాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడానికి తోడు ఈ రంగంలో తీవ్ర పోటీ నెలకొనడమే ఇందుకు కారణమన్నారు. దక్షిణ గోవాలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యకర పోటీని పెంచడంలో తమ మంత్రిత్వశాఖ కీలక పాత్ర పోశిస్తుందన్నారు. దీంతో అంతిమంగా విమానయాన ప్రయాణికులకు సగటున 30 శాతం వరకు ఆదా అవుతుందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
MIDHALI RAJ ఐసిసి వన్డే ర్యాంకుల్లో నంబర్‌ వన్‌కు చేరువలో మిథాలీరాజ్‌ దుబాయి: భారత మహిళా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వన్డే క్రికెట్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంక్‌కి అతి కొద్ది దూరంలో నిలిచింది ఐసిసి తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకుల్లో మిథాలీరాజ్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం 774 రేటింగ్‌ పాయింట్లతో మిథాలీ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌ అగ్రస్థానంలో కొన సాగుతోంది. లండన్‌ వేధికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో మిథాలీ అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మిథాలీ ఆకట్టుకుంది. అంతకముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. వరుసగా నాలుగు విజయాలతో టోర్నీని ఆరంభించిన టీమిండియా సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించి సెమీస్‌కి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మిథాలీ 109 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో మిథాలీ 356 పరుగులు సాధించింది. దీంతో 779 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న లాన్నింగ్‌కు మిథాలీ చేరువగా నిలిచింది. నెంబర్‌ వన్‌ ర్యాంకులో నిలవడానికి కేవలం ఐదు పాయింట్ల దూరంలో మిథాలీ నిలిచింది. మిథాలీ తప్ప టాప్‌ 10లో ఏ ఒక్క భారత క్రికెటర్‌ కూడా చోటు దక్కించుకోలేక పోవడం విశేషం. ఇక బౌలర్ల జాబితాలో జులన్‌ గోస్వామి, ఏక్తా బిస్త్‌ తమర్యాంకులను దిగజార్చుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ 6,7 స్థానాల్లో కొనసాగు తున్నారు. వన్డే, టీ20 ర్యాంకుల్లో ఆసీస్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, భారత్‌, వెస్టిండీస్‌ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
2
Visit Site Recommended byColombia ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గతంలో నయనతార హీరోయిన్‌గా నటించిన ‘మయూరి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. వై నాట్ స్టుడియోస్ అధినేత ఎస్. శశికాంత్ ఈ చిత్రానికి నిర్మాత. తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవం చెన్నైలో ప్రారంభమయింది. ఓ సరికొత్త కథ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుందని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు. ఈ 'గేమ్ ఓవర్' చిత్రానికి రోన్ ఏతాన్ యోహాన్ సంగీతం అందిస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Apr 11,2015 క్యూ1లో కంప్యూటర్‌ అమ్మకాల్లో క్షీణత              న్యూయార్క్‌ : ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్‌ అమ్మకాల్లో తగ్గుదల చోటు చేసుకుంది. పర్సనల్‌ కంప్యూటర్లు, డెస్క్‌టాప్‌, నోట్‌బుక్‌, ల్యాప్‌టప్‌ విక్రయాల్లో 5.2-6.7 శాతం వరకు క్షీణించాయని ప్రముఖ పరిశోధన సంస్థలు ఐడిసి, గార్టినర్‌ వెల్లడించాయి. తమ అంచనాలకు మించి అమ్మకాల్లో తగ్గుదల చోటు చేసుకున్నాయని పేర్కొన్నాయి.                 ఐడిసి అంచనా ప్రకారం గత జనవరి నుంచి మార్చి కాలంలో 6.7 శాతం తగ్గాయి. గార్టినర్‌ అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్‌ అమ్మకాలు 5.2 శాతం తగ్గి 71.7 మిలియన్లుగా నమోదయ్యాయి. వివిధ దేశాల కరెన్సీ విలువ తగ్గడంతో పిసి అమ్మకాలు పడిపోయాయయని ఐడిసి పేర్కొంది. 2014లో పిసి పరిశ్రమకు భారీ మద్దతు లభించిందని గార్టినర్‌ ప్రిన్సిపల్‌ విశ్లేషకుడు మికకొ కిటగవా పేర్కొన్నారు. గతేడాది విండోస్‌ ఎక్స్‌పిని రద్దు చేయడం కూడా అమ్మకాలను పెంచిందని పేర్కొన్నారు. గత త్రైమాసికంలో నోట్‌బుక్‌లతో కలుపుకుని మొబైల్‌ పిసి, టాబ్లెట్‌ అమ్మకాల్లో స్వల్ప పెరుగుదల చోటు చేసుకుందన్నారు. కాగా పర్సనల్‌ కంప్యూటర్‌ అమ్మకాల్లో క్షీణత చోటు చేసుకుందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
sumalatha 212 Views Pakistan , retirement , Sania Mirza , Shoaib Malik Sania Mirza, Shoaib Malik లండన్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌మలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన సందర్భంగా భారత్‌ టెన్నీస్‌ స్టార్‌ సానియామిర్జా ట్విటర్‌ వేదికగా తన భర్త సేవలను కొనియాడింది. ”ప్రతీ కథకి ఒక ముగింపు ఉంటుంది. జీవితంలో ప్రతీ ముగింపునకూ కొత్త అవకాశం ఎదురుచూస్తుంది. మాలిక్‌.. 20 ఏళ్ల పాటు నీ దేశం తరఫున ఎంతో నిబద్ధతతో వినయంగా ఆడావు. నువ్వు సాధించిన వాటికి నేను, ఇజాన్‌ ఎంతో గర్వపడుతున్నాం” అని ట్వీట్‌ చేసింది. మాలిక్‌ పట్ల గర్వంగా ఉందని తెలిపింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా మ్యాచ్‌ అనంతరం మాలిక్‌ తన రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా పాక్‌ క్రికెటర్లు అతడికి ఘనంగా వీడ్కోలు పలికారు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2
Hyderabad, First Published 4, Nov 2018, 5:22 PM IST Highlights సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడు ఒకేలా ఉండదని అందరికి తెలిసిందే. టాలెంట్ నిరూపించుకోవడానికి సమయం చాలా పడుతుంది. కానీ కాస్త అదృష్టం తోడవ్వాలే గాని లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడు ఒకేలా ఉండదని అందరికి తెలిసిందే. టాలెంట్ నిరూపించుకోవడానికి సమయం చాలా పడుతుంది. కానీ కాస్త అదృష్టం తోడవ్వాలే గాని లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఈ రోజుల్లో అలాంటి స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఇక గత కొన్నేళ్లుగా దర్శకుడిగా ఉన్న పరశురామ్ గీత గోవిందం కంటే ముందు వరకు మీడియం రేంజ్ దర్శకుడు.  కానీ ఎప్పుడైతే గీత గోవిందం రిలీజయ్యిందో అప్పుడే అతని రేంజ్ మారిపోయింది. 10కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా 60కోట్ల వరకు షేర్స్ ని అందించి బాక్స్ ఆఫీస్ డైరెక్టర్ గా పరశురామ్ కి మంచి గుర్తింపును ఇచ్చింది. ఇక ఇప్పుడు అతనితో వర్క్ చేయడానికి బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. పరశురామ్ రెమ్యునరేష్ కూడా పెంచేందుకు సిద్ధంగా ఉన్నారట.  దాదాపు 10 కోట్ల వరకు ఇవ్వడానికి ఒక సీనియర్ నిర్మాత సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పరశురామ్ మాత్రం గీత గోవిందం అనంతరం ఇంకా ఎవరితో సినిమా చేస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. గీత ఆర్ట్స్ లోనే సినిమా ఉంటుందని అప్పట్లో టాక్ వచ్చినప్పటికీ దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మరి పరశురాం ఏ హీరోతో సినిమా చేస్తాడో చూడాలి.  Last Updated 4, Nov 2018, 5:22 PM IST
0
karthi showing interest to make a movie with teja తెలుగు దర్శకుడిపై తమిళ హీరో కార్తీ కన్ను! అలాంటి సినిమా చేద్దామని ప్రతిపాదన.. TNN | Updated: Sep 11, 2017, 12:21PM IST ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో దర్శకుడు తేజాకు మళ్లీ ఊపు వచ్చింది. సరైన హిట్ సినిమా తీసి.. దశాబ్దం దాటిపోయిన నేపథ్యంలో ఆ దర్శకుడికి ఈ పొలిటికల్ థ్రిల్లర్ పెద్ద ఊరటగా మారింది. ఎంతసేపూ ఒకే ప్రేమకథను తిప్పి తిప్పి తీస్తున్నాడని క్రిటిక్స్ చేత విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన తేజ .. తన శైలిని మార్చి, జోనర్ ను మార్చి హిట్టు కొట్టాడు. ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళంలోకి కూడా అనువాదం అయ్యింది. అక్కడ ఇంకా విడుదల కావాల్సి ఉంది. మరి ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ఫిదా అయిన ప్రేక్షకగణం జాబితాలో తమిళ హీరో కార్తీ కూడా ఉన్నాడని సమాచారం. ‘నేనే రాజు నేనే మంత్రి’ని చూసిన తర్వాత తేజకు పెద్ద ఫ్యాన్ అయ్యాడట కార్తీ. ఈ నేపథ్యంలో తేజ దర్శకత్వంలో నటించేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నాడని తెలుస్తోంది. అది కూడా పొలిటికల్ థ్రిల్లర్ నే చేయాలని అనుకుంటున్నాడట ఈ హీరో.
0
Sports Minister Rajyavardhan Singh Rathore promises support to Savita Punia గోల్ కీపర్ తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది భారత మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవిత పునియా తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది. ఆమెకి అన్నివిధాల సాయం అందిస్తామని కేంద్ర క్రీడల TNN | Updated: Nov 9, 2017, 12:27PM IST భారత మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవిత పునియా తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది. ఆమెకి అన్నివిధాల సాయం అందిస్తామని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తాజాగా స్పష్టం చేశారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత మహిళా హాకీ జట్టు ఇటీవల ఆసియా కప్‌‌ విజేతగా నిలవడంలో సవిత క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ.. కేంద్రం, హరియాణా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి సాయం అందలేదని సవిత ఆవేదన వ్యక్తం చేయడంపై క్రీడల మంత్రి స్పందించారు. ‘హాకీ ప్రాక్టీస్, మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా నేను ప్రత్యేకంగా ఎలాంటి ఉద్యోగం చేయలేకపోతున్నాను. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగం ఇస్తామని గతంలో హరియాణా ప్రభుత్వం చెప్పింది. కానీ.. పతకాలు తెస్తేనే అనే మెలిక పెట్టింది. తాజాగా ఆసియా కప్‌ గెలిచిన జట్టులో నేను గోల్ కీపర్‌ని. కనీసం ఇకనైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి’ అని సవిత ఇటీవల మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు. ‘గోల్‌ కీపర్ సవిత వివరాలను సేకరించమని సంబంధిత అధికారులను ఇప్పటికే ఆదేశించాను. తప్పకుండా ఆమెకి అన్నివిధాల సాయం చేస్తాం’ అని మంత్రి వివరించారు.
2
internet vaartha 192 Views ముంబై : ఇ-కామర్స్‌ రంగంలో దిగ్గజంగా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ సిఇఒగా ఉన్న ముఖేష్‌ బన్సాల్‌ కంపెనీ నుంచి వైదొలుగుతున్నారు. కంపెనీ వ్యాపార ప్రకటనల విభాగాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. సహ వ్యవస్థాపకుడు బ్ఠ్ని బన్సాల్‌ కంపెనీ సిఇఒగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ నుంచి చీఫ్‌ బిజినెస్‌ అధికారి అంకిత్‌ నగోరికూడా వైదొ లుగుతున్నారు. మింత్రాను స్థాపించిన ముకేష్‌ బన్సాల్‌ ఆన్‌లైన్‌ రిటైలర్‌గా మంచి పేరుసాధించింది. కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. తదనంతరం ఆబాధ్యతలు బిన్నీ బన్సాల్‌కు అప్పగించారు. బిన్నీబన్సాల్‌ ఫ్లిప్‌కార్ట్‌ను పోటీ సంస్థలు స్నాప్‌డీల్‌, అమెజాన్‌ నుంచి తట్టు కునేందుకువీలుగా పలు కార్యాచరణలు అమలు చేసారు. 2015లో వీటికంటే మంచి వృద్ధిని సాధించింది. అలాగే టెక్నాలజీ రంగ పరంగా కొత్త సంస్తను ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు ముకేష్‌ వెల్లడించారు. అలాగే నగోరి కూడా కంపెనీలో ఇంజినీరుగా చేరారు. సచిన్‌, బిన్నీలకు స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫమ్‌పై తోడ్పాటు అందిస్తున్నారు. కంపెనీ ప్రక్షాళనలో జనవరిలో సహవ్యవస్థాపకుడు సచిన్‌ బన్సాల్‌ కంపెనీ ఛైర్మన్‌గా మారారు. నిధులసేకరణ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ప్రతిభ కలిగినవారిని సమీకరించడం నాయకత్వ టీమ్‌ను రూపొందించడం వంటివి ఆయన బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ముకేషన్‌ బన్సాల్‌ కంపెనీ నుంచి వైదొలిగేంత వరకూ సచిన్‌, బిన్నీ బన్సాల్‌లకు సలహాదారినగా వ్యవహరిస్తారు.
1
Sep 23,2015 జీవితంలో సమతౌల్యత పాటించాలి        నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బతకడానికి పనిచేయాలి తప్ప.. పని కోసమే బతుకుతున్నట్లుగా ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాన్ని దూరం చేసుకోవద్దని హ్యుందారు హెచ్‌ఆర్‌ అండ్‌ జీఏ విభాగం అధినేత ఈయూసంగ్‌ యూన్‌ అన్నారు. ఉద్యోగ జీవితానికి.. వ్యక్తిగత జీవితానికి మధ్య సమతౌల్యత పాటించాలని ఆయన సూచించారు. ఉద్యోగులు సంస్థ లక్ష్యాలను అందుకోవడంలో వారి కుటుంబం కీలక పాత్రపోషిస్తుందన్న 'హ్యుందారు మోటార్‌ ఇండియా ఇంజినీరింగ్‌' (హెచ్‌ఎంఐఈ) ఎండీ కె.ఒ.లీ అభిప్రాయం మేరకు హెచ్‌ఎంఈఐ ఇక్కడ కొత్త ఉద్యోగుల కుటుంబ సభ్యులతో 'ఎంప్లాయి ఫ్యామిలీ కనెక్ట్‌, ఇండక్షన్‌ అండ్‌ మెంటారింగ్‌' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హెచ్‌ఎంఐఈలో ఉద్యోగంలో చేరిన వారికి, వారి కుటుంబ సభ్యులకు మధ్య బావోద్వేగపూరిత సంబంధాన్ని ఏర్పరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ శ్రేణి సంస్థగా హ్యుందారు సంస్థ కొత్తగా చేరిన వారికి అన్ని అత్యాధునిక హంగుళతో శిక్షణనిచ్చి పూర్తిస్థాయి ఉద్యోగిగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం సంస్థ గురించి, కొత్త ఉద్యోగుల బాధ్యతలు గురించి సంస్థలోని సంప్రదాయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు వీలుకలుగుతుందని హెచ్‌ఆర్‌డీ మేనేజర్‌ లక్ష్మీకాంత్‌ అన్నారు. కొత్త ఉద్యోగులు కొలువులో చేరిన మొదటి రోజు నుంచే హ్యుందారు తాను సంస్థలో భాగమనే భావన కలిగించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎ.వి.ఎస్‌ రామేష్‌ వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మిథాలీ డ్రెస్‌పై తిట్లా.. వెర్రివాళ్లులా ఉన్నారే ఒక్క ఫొటోతో నెటిజన్లకి టార్గెట్‌గా మారిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కి.. ఒకప్పటి టీమిండియా ఓపెనర్ రాబిన్ TNN | Updated: Sep 9, 2017, 06:18PM IST ఒక్క ఫొటోతో నెటిజన్లకి టార్గెట్‌గా మారిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కి.. ఒకప్పటి టీమిండియా ఓపెనర్ రాబిన్ ఉతప్ప మద్దతుగా నిలిచాడు. ఇటీవల తన స్నేహితులతో కలిసి దిగిన ఒక ఫొటోని మిథాలీ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై మండిపడిన నెటిజన్లు.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘నువ్వు హీరోయిన్‌వి కాదు.. క్రికెటర్‌వి’ అంటూ కొందరు ఎద్దేవా చేయగా.. ‘మీరు చాలా మందికి స్ఫూర్తి ఇలాంటి ఫొటోలతో మీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు’ అంటూ మరికొందరు సూచించారు. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు కామెంట్లు పెట్టినా.. మిథాలీ రాజ్ మాత్రం మౌనం వహించింది. మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఇలా మండిపడటంపై తాజాగా ఉతప్ప ట్విట్టర్‌లో స్పందించాడు. ‘కొంత మంది తమ వెర్రి ఆలోచనలతో మిథాలీ రాజ్‌ని చెడ్డగా చూపారు. పాతకాలం పద్దతుల్లోనే ఉండిపోయిన వారిని చూస్తే నిరాశ కలుగుతోంది’ అని ఉతప్ప రాసుకొచ్చాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మిథాలీ రాజ్.. భారత్ జట్టుని ఫైనల్ చేర్చిన విషయం తెలిసిందే. ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టినా.. మిథాలీ రాజ్ మాత్రం ఆ ఫొటోని డిలీట్ చేయలేదు. Mithali Raj being treated badly by some silly minds. It's disappointing to see our culture stuck in the same rut @M_Raj03 #MithaliRaj pic.twitter.com/VgdOdoxdoX
2
ONAM SPL FOOD ఓనం కోసం మేక్‌డొనాల్డ్‌ వంటకాలు న్యూఢిల్లీ: మలయాళీయులకి ఓనం పండుగ అంటే ఎంతో ప్రత్యేకం.ఓనమ్‌ వచ్చిందంటే ఆ సంబరమే వేరుగా ఉంటుంది.ఓనమ్‌ సధ్య వంటకాలు గుమగుమలాడుతుంటాయి.అరటాకులో సుమారు 26 రకాల వంటకాలను వడ్డించడాన్ని సధ్య అని పేర్కొంటారు.కేరళవాసులకు ఓనమ్‌ ఎంతో ముఖ్యమైన పండుగ.సుమారు 10 రోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటారు.ఓనమ్‌ సందర్భంగా ఫాస్ట్‌పుడ రెస్టారెంట్‌ మెక్‌డొనాల్డ్స్‌ కేరళ వాసు లకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.బర్గర్‌,వివిధ రకాలకెచవ్‌ లతో సధ్య వంటకాన్ని తయారు చేసింది. మెక్‌డోనాల్డ్‌ తమ అధికారిక ఫేస్‌బుక్‌లో ఒక ఫొటోను పోస్టు చేస్తూ మలయాళీయులకి ఓనమ్‌ శుభాకాంక్షలు తెలిపింది.దీంతో సోషల్‌ మీడియా లో ఆ ఫొటో వైరల్‌ అవుతుంది.
1
india vs sri lanka, 1st test, kolkata: india declare after kohli ton; sl need 231 ఈడెన్‌లో కోహ్లి తొలి సెంచరీ.. శ్రీలంక లక్ష్యం 231 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంక జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. TNN | Updated: Nov 20, 2017, 02:03PM IST కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంక జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరిన కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. అజేయ సెంచరీతో భారత్‌ను ఓటమి ప్రమాదం నుంచి తప్పించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 119 బంతుల్లో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 98 పరుగుల వద్ద లక్మల్ వేసిన బంతిని సిక్స్ బాది సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టెస్టుల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ. అంతేకాకుండా ఈడెన్‌లో తొలి టెస్టు అర్ధశతకం కూడా ఇదే కావడం విశేషం. సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఇన్నింగ్స్‌ను కోహ్లీ డిక్లేర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశ పరిచిన భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నారు. అయితే మిడిలార్డర్ మరోసారి విఫలమైంది. కోహ్లి ఆదుకొనకపోతే భారత్ కష్టాల్లో పడేది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (104 నాటౌట్; 12x4, 2x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆజింక్య రహానే (0), రవీంద్ర జడేజా (9), రవిచంద్రన్ అశ్విన్ (7), సాహా (5) మరోసారి నిరాశపరిచారు. శ్రీలంక తరఫున లక్మల్, శనక చెరో మూడు వికెట్లు పడగొట్టారు. గమగే, దిల్రువన్ పెరీరా చెరో ఒక వికెట్ తీశారు.
2
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఫ్రెంచ్ ఓపెన్లో ఓడిన సింధు.. ముగిసిన భారత్ పోరాటం ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ రెండో రౌండ్లో భారత షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైంది. దీంతో పారిస్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. TNN | Updated: Oct 28, 2016, 11:45AM IST రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. రెండో రౌండ్‌లో ఆమె చైనాకు చెందిన పదకొండో సీడ్ హి బింగ్‌జియావో చేతిలో 20-22, 17-21 తేడాతో ఓటమిపాలైంది. ఇటీవల జరిగిన డెన్మార్క్ ఓపెన్లో జియావోను ఓడించిన సింధు ఈ మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించలేకపోయింది. భారత్‌కు చెందిన మరో షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన ఐదో సీడ్ ఆటగాడు చెన్ చౌ చేతిలో 19-21 16-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. స్విస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ప్రణయ్ ఫ్రెంచ్ ఓపెన్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఇటీవల ముగిసిన డచ్ ఓపెన్లోనూ సింధు అంచనాల మేరకు రాణించలేకపోయింది. ఆ ఓపెన్‌లో ఫైనల్ చేరిన అజయ్ జయరాం ఫ్రెంచ్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టి నిరాశ పర్చాడు. దీంతో పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వన్డేల్లో తొలి క్రికెటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారీ శతకంతో అజేయంగా నిలిచిన రోహిత్ వన్డే క్రికెట్‌లో ఆ ఫీట్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. Samayam Telugu | Updated: Oct 22, 2018, 07:59PM IST వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గౌహతిలో అదివారం జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(140: 107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లు), ఓపెనర్ రోహిత్ శర్మ(152 నాటౌట్: 110 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకాలతో చేలరేగడంతో విండీస్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే విన్నింగ్స్ షాట్ సిక్సర్ కొట్టి 150 పరుగుల మార్క్ చేరుకున్న రోహిత్.. సచిన్ టెండూల్కర్ , ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ల పేరిట ఉన్న రికార్డును అదిగమించాడు. వన్డేల్లో అత్యధిక ఇన్నింగ్స్‌లలో 150 లేక అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. సచిన్, వార్నర్‌లు వన్డేల్లో 5 పర్యాయాలు 150 మార్కు చేరుకోగా, విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 152నాటౌట్‌తో రోహిత్ 6 పర్యాయాలు ఆ అరుదైన ఫీట్ చేసిన తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.
2
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ప్రేయసిని పెళ్లాడనున్న స్టార్ కమెడియన్ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న కపిల్ శర్మ ఇటీవల నిర్మాతగానూ మారాడు. Samayam Telugu | Updated: Oct 8, 2018, 08:07PM IST ప్రేయసిని పెళ్లాడనున్న స్టార్ కమెడియన్ స్టార్‌ కమెడియన్‌, నటుడు, నిర్మాత కపిల్‌ శర్మ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసి గిన్నీ ఛత్రాత్‌ను ఈ డిసెంబర్‌లో వివాహం చేసుకోబోతున్నాడు. గత మార్చి నెలలో గిన్నీతో తన ప్రేమ విషయాన్ని కపిల్ బహిర్గతం చేశాడు. తాజాగా ఆ బంధాన్ని పెళ్లిపీటలవరకు తీసుకెళ్లేందుకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘పంజాబీ సంప్రదాయంలో నాలుగు రోజుల పాటు కపిల్ శర్మ పెళ్లి వేడుకలు నిర్వహిస్తారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఆ వేడుకలకు హాజరై కపిల్, గిన్నీలను ఆశీర్వదిస్తారు. వీలు చూసుకుని ముంబైలో తన స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులకు కపిల్ పార్టీ ఇవ్వనున్నాడని’ సన్నిహితులు చెబుతున్నారు. ది కపిల్ శర్మ షోతో బుల్లితెరకు రీఎంట్రీ ఇవ్వనున్నాడు కపిల్. కాగా, కామెడీ నైట్స్ విత్ కపిల్ ప్రోగ్రాంతో కపిల్ శర్మ స్టార్ కమెడియన్‌గా మారిన విషయం తెలిసిందే. ‘గిన్నీ జత్రాత్ నాలో సగభాగం మాత్రమే కాదు. ఆమె రాకతో నా జీవితం పరిపూర్ణం. లవ్ యూ గిన్నీ, ఆమెను స్వాగతిస్తున్నా. ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నానంటూ ఈ ఏడాది వేసవి సమయంలో తన ప్రేమ విషయాన్ని కపిల్ షేర్ చేసుకున్నాడు. కపిల్ శర్మ సహ నిర్మాతగా వ్యవహరించిన ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అక్టోబర్ 12న విడుదల కానుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Hyderabad, First Published 25, Aug 2018, 4:37 PM IST Highlights 'ఒరు అడార్ లవ్' సినిమాలో ఓ పాటల కన్నుకొడుతూ కనిపించి యూత్ అందరినీ తనవైపు తిప్పేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్.  సోషల్ మీడియాలో ఆమె సెన్సేషన్ గా మారింది.  'ఒరు అడార్ లవ్' సినిమాలో ఓ పాటల కన్నుకొడుతూ కనిపించి యూత్ అందరినీ తనవైపు తిప్పేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్.  సోషల్ మీడియాలో ఆమె సెన్సేషన్ గా మారింది. కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా ఆమె టాపిక్కే.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి అకౌంట్లు ఆమె ఫొటోలు, వీడియోలతో నిండిపోయాయి. అంతగా ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ నటి కేరళ వరద బాధితులకు తన వంతు సహాయం అందించింది. అయితే పబ్లిసిటీ కోసం ఇలా చేశానని అనుకోవద్దంటూ ఓ సందేశాన్ని రాసుకొచ్చింది. ''ఈ ఓనం పండుగకు నేను రాష్ట్రం కోసం చేయగలిగింది చేశాను. మాటలు చెప్పడం కంటే చేతల్లో చేస్తే.. ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని అనిపిస్తుంది. నేను పబ్లిసిటీ కోసం విరాళం ఇవ్వలేదు. మేం ఎంత విరాళం ఇచ్చామో తెలిస్తే.. అప్పుడు ప్రజలు దాన్ని సక్రమంగా వినియోగించుకుంటారు. అందుకే చెబుతున్నాను. మీరు ఏ విషయంలో నన్ను ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తక్కువ చేసి మాట్లాడకండి'' అంటూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ పోస్ట్ తో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలు విరాళం అందించినట్లు ఉన్న లేఖను షేర్ చేసుకున్నారు.  Last Updated 9, Sep 2018, 1:56 PM IST
0
రంగుపడుతోంది..! -  చైనా మాల్‌తో వెలవెలబోతున్న దేశీయ సరుకు -  తక్కువ ధరలే ఆకర్షణ మంత్రం -  రంగు కోల్పోతున్న రూ.15,000 కోట్ల 'హోలీ' పరిశ్రమ ! నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రంగుల పండుగ హోలీ దేశ వ్యాప్తంగా అందరికీ ఆనందాన్ని పంచుతున్నప్పటికీ.. ఈ పండుగే జీవనోపాధిగా బతుకులీడుస్తున్న కుటుంబాలకు మాత్రం అంతులేని ఆవేదననే మిగులుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం చైనా నుంచి ఇబ్బడిముబ్బడిగా దిగుమతవుతున్న రసాయన రంగులు, పిచికారీలు, బెలూన్‌లే. ఇవే వీరి పొట్టకొడుతున్నాయి. ప్రతియేటా చైనా నుంచి దిగుమతి అవుతున్న హోలీ సరుకు ప్రతియేటా అంతకంతకు పెరిగిపోతోంది. హోలీని ఘనంగా జరుపుకొనే ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల మార్కెట్లలో 75 శాతం హోలీ సరుకు చైనా నుంచి దిగుమతై వచ్చిందే కనిపిస్తోంది. దీంతో దేశీయ తయారీదారుల పరిశ్రమలు బోరు మంటున్నారు. ధరల్లో వ్యత్యాసమే ముంచుతోంది..  చైనా నుంచి దిగుమతై వస్తున్న సరుకు మన దేశంలో తయారవుతున్న హోలీ సరకు ధరలకు దాదాపు 55 శాతం మేర తేడా కనిపిస్తోంది. ఎక్కువ మంది వినియోగదారులు తక్కువ ధరలకు లభించే సరుకు వైపు దృష్టి సారిస్తున్నారని అసోచామ్‌ తెలిపింది. దేశ వ్యాప్తంగా దాదాపు 5000 మంది రంగుల తయారీ దారులు దేశీయ హోలీ అవసరాల నిమిత్తం 500 టన్నులకు పైబడి 'గులాల్‌'ను ఉత్పత్తి చేస్తుంటారు. దీనికి తోడు రంగుల పిచికారీలు, ఇతర హోలీ టార్సు తయారీ, వాటి మార్కెటింగ్‌లను కలుపుకుంటే సుమారు 10-15 లక్షల మంది హోలీ పండగనే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి యేటా హోలీ రంగులు, ఇతర అసరమైన సామగ్రికి చెందిన పరిశ్రమ ఉమ్మడిగా ఏడాదికి 20 శాతానికి పైబడి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. పరిశ్రమ వర్గాల అధ్యయనం మేరకు ఈ పరిశ్రమ విస్తృతి రూ.15000 కోట్ల పైమాటే. ఎక్కువ మంది రసాయనాలతో తయారు చేసిన రంగుల పట్ల ఆసక్తి చూపుతున్నప్పటీ.. సహజసిద్ధంగా తయారు చేసిన రంగులకు కూడా ఏ యేటికాయేడు డిమాండ్‌ పెరగుతూనే వస్తోంది. ఈ విభాగం విక్రయాలు దాదాపు రూ.5000 కోట్లను దాటేస్తున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
New Delhi, First Published 7, Feb 2019, 12:17 PM IST Highlights ఈ- కామర్స్ వ్యాపారం నిబంధనల్లో మార్పు తేవడం సబబేనని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ పేర్కొన్నారు. కానీ వాటిని ప్రవేశపెట్టిన తీరే బాగో లేదన్నారు.  విదేశీ పెట్టుబడులు గల ఈ– కామర్స్‌ కంపెనీల విషయమై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నిబంధనలు సరైనవేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. ఈ–కామర్స్‌ సంస్థలు కారు చౌక రేట్లతో స్థానిక వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  భారత్‌లో అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని టైకాన్‌ 2019 స్టార్టప్స్‌ సదస్సులో మోహన్ దాస్ పాయ్ చెప్పారు. ఈ–కామర్స్‌ నిబంధనలను ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నా, అవి కొంత సముచితమేనన్నారు. మరోవైపు, ఇందులో వ్యాపారానికి ప్రోత్సాహం ఇచ్చే కోణం కన్నా ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోణమే ఎక్కువగా కనిపిస్తోందని సదస్సులో పాల్గొన్న స్టార్టప్‌ సంస్థల లాయర్‌ కరణ్‌ కల్రా పేర్కొన్నారు. ఒక ప్రత్యేక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిబంధనలు ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోందని సీనియర్‌ లాయర్‌ నిశిత్‌ దేశాయ్‌ తెలిపారు.   విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లు ఉన్న ఈ–కామర్స్‌ కంపెనీలు తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంపై విక్రయించరాదని, ధరలను ప్రభావితం చేసేలా ప్రత్యేక మార్కెటింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయరాదని కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ-కామర్స్ నిబంధనలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు అమెజాన్‌ ఇండియా ప్లాట్‌ఫాంపై నాలుగు లక్షల పైచిలుకు చిన్న స్థాయి విక్రేతలు ఉండేవారు. తాజా నిబంధనలతో అమెజాన్‌కి చెందిన క్లౌడ్‌టెయిల్, అపారియో సంస్థల కార్యకలాపాలు నిల్చిపోయాయి.   నిబంధనలు కఠినం చేసినా భారత మార్కెట్‌పై తాము ఆశావహంగానే ఉన్నట్లు అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్‌ తెలిపింది. భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్‌ ఏషియా రీజనల్‌ సీఈవో డర్క్‌ వాన్‌ డెన్‌ బెర్గీ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉపాధి కల్పన, చిన్న వ్యాపార సంస్థలు రైతులకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో భాగం అవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. Last Updated 7, Feb 2019, 12:17 PM IST
1
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2
Hyderabad, First Published 8, Apr 2019, 12:30 PM IST Highlights టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారాలు జోరుగా సాగుతున్నా ఎదో తక్కువైంది అనే టాక్ గట్టిగానే వస్తోంది. అసలు గతంలో మెగా హీరోలు ప్రజారాజ్యం పార్టీకోసం ప్రచారాలు బాగానే చేశారు. కానీ ఇప్పుడు జనసేన కోసం మాత్రం అంత చురుగ్గా పాల్గొనడం లేదనే చెప్పాలి.  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారాలు జోరుగా సాగుతున్నా ఎదో తక్కువైంది అనే టాక్ గట్టిగానే వస్తోంది. అసలు గతంలో మెగా హీరోలు ప్రజారాజ్యం పార్టీకోసం ప్రచారాలు బాగానే చేశారు. కానీ ఇప్పుడు జనసేన కోసం మాత్రం అంత చురుగ్గా పాల్గొనడం లేదనే చెప్పాలి. ఓ వైపు రామ్ చరణ్ బాబాయ్ కోసం వస్తా అని చెబుతుంటే పవన్ మాత్రం రాకుంటేనే బెటర్ అని చెబుతున్నాడు.  ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెటర్స్ అయితే వదులుతున్నాడు. అలాగే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు కూడా విషెస్ తెలుపుతుండడంతో ఫ్యాన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంటోంది. వరుణ్ తేజ్ తండ్రి కోసం ఒక రోజు హడావుడి బాగానే చేశాడు. ఇక సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో పోస్టులు ఏస్తున్నాడు గాని జనాల మధ్యకు ఇంకా రావడం లేదు.  మెగా హీరోలు అసలు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఓ వైపు ప్రత్యర్థి పార్టీలు చిన్న తరహా స్టార్స్ తోనే ఒక రేంజ్ లో ఎలక్షన్ లో కలరింగ్ ఇస్తుంటే.. కోట్ల మంది అభిమానులను గెలుచుకున్న మెగా హీరోలు మాత్రం బాబాయ్ కోసం ఇంకా అఫీషియల్ ప్రచారాలు మొదలెట్టలేదు. ఇక మెగాస్టార్ కాంగ్రెస్ లోకి వెళ్లలేక వేరే పనుల్లో బిజీ అవుతున్నారు. ఆయన రాకుండా ఉంటేనే బెటరేమో..? ఎలక్షన్స్ ప్రచారంలో హీరోలు పార్ట్ టైమ్ లా పనిచేయడం అస్సలు ఇష్టం లేదని పవన్ తరచు ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉన్నాడు. కాకపోతే చరణ్ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు అనే కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. పైగా చరణ్ జనసేన ఆఫీసుల్లో రీసెంట్ గా చలాకీగా కనిపించాడు. బాబాయ్ ఆరోగ్య పరిస్థితి అర్ధం చేసుకొని కాస్త హెల్ప్ చేద్దామని అనుకున్నప్పటికీ పవన్ నో అని ఒక వివరణ ఇచ్చాడట.  ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు అభిమానులు వివిధ పార్టీలలో ఉంటారు కావున ప్రత్యేకంగా ఒక పార్టీలో ఉంటే వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి యాక్టింగ్ కెరీర్ కు దెబ్బ పడే అవకాశం ఉంది. వీలైనంత వరకు పాలిటిక్స్ ను పక్కనపెట్టడం బెటర్ అని పవన్ యువ హీరోలకు సూచించినట్లు సమాచారం. అయితే పవన్ నిర్ణయం ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. హీరోలు పార్టీతో రిలేషేన్ మెయింటైన్ చేస్తూనే దురంధురంగా ఉంటున్నారు. ఓ విధంగా పరిస్థితి ముసుగులో గుద్దులాటలా ఉందని టాక్ వస్తోంది. ఫైనల్ గా జనసేన కోసం మెగా హీరోలు బరిలోకి దిగుతారా? లేరా? అనేది ఇప్పట్లో తేలేలా లేదు.      Last Updated 8, Apr 2019, 12:30 PM IST
0
JET జెట్‌ఎయిర్‌వేస్‌ రిపబ్లిక్‌డే ఆఫర్‌ హైదరాబాద్‌, జనవరి 26: గణతంత్ర దినోత్సవ ఆఫర్‌ కింద జెట్‌ఎయిర్‌వేస్‌ ప్రత్యేక ఛార్జిలు రూ.999నుంచి ఎకానమి క్లాస్‌ దేశీయ రూట్లలో ఆఫర్‌చేస్తోంది. గణతంత్రదినోత్సవ ఆఫర్‌ కింద ఇస్తున్న ఈ ఆఫర్‌లో టికెట్లు తీసుకుంటే 2017 ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి ప్రయాణాలకు వీలుగా ఉంటుంది. అయితే ఈనెల 25 అంటే బుధవారం నుంచి ఈనెల 29వ తేదీ మధ్యలో బుక్‌చేసుకుని ఉండాలి. కనీసం 15రోజులకు ముందు టికెట్లు కొనుగోలుచేసి ఉండాలి. రిపబ్లిక్‌డే సేల్‌ కింద జెట్‌ ఎయిర్‌వేస్‌ 30శాతం రిటర్నుజర్నీ టికెట్లపై ఆఫర్‌చేస్తోంది. ప్రీమియర్‌; ఎకానమిక్లాస్‌లలో అంతర్జాతీయ రూట్లలో ఈ సౌకర్యం ఇస్తోంది. అంతర్జాతీయ టికెట్లు బుధ వారం నుంచి ఈనెల 27వ తేదీ మధ్య బుక్‌ చేసుకుని ఉండాలి. దేశీయెయిర్‌ లైన్స్‌ మార్గాల్లో ప్రయాణీకులు జనవరి నుంచి డిసెంబరు వరకూ 998.88 లక్షల మంది రాకపోకలు సాగించా రు. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 810.91 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు అంచనా. 23శాతం వృద్ధిని సాధించింది.
1
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV బౌన్సర్ తగిలి.. నేలకొరిగిన పాక్ ఓపెనర్ శరీరంపైకి వచ్చి దూసుకొచ్చిన బంతిని.. ఫుల్ చేసేందుకు ఇమామ్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వచ్చి హెల్మెట్‌ని తాకింది Samayam Telugu | Updated: Nov 10, 2018, 02:14PM IST పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. న్యూజిలాండ్‌తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో ఫాస్ట్ బౌలర్ లూకీ ఫర్గూసన్ విసిరిన ఓ బౌన్సర్ బంతి ఇమామ్ హెల్మెట్‌కి బలంగా తాకింది. శరీరంపైకి వచ్చి దూసుకొచ్చిన బంతిని.. ఫుల్ చేసేందుకు ఇమామ్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వచ్చి హెల్మెట్‌ని తాకింది. దీంతో.. కొన్ని క్షణాలపాటు నొప్పితో విలవిలాడిన ఇమామ్ మోకాళ్లపైకి ఒరిగి.. అనంతరం నేలపై పడుకుండిపోయాడు. ఇమామ్ స్థితిని గమనించిన జట్టు ఫిజియో, సహచరులు వేగంగా అతని వద్దకు చేరుకుని సపర్యలు చేసి.. అనంతరం మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పరీక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇమామ్ గాయంపై ఇప్పటికీ అధికారిక ప్రకటన రాకపోవడంతో.. మూడో వన్డేలో అతను ఆడటంపై అనుమానం నెలకొంది. 2014 నవంబరులో ఇలానే ఓ బౌన్సర్ బంతి తాకి ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణించిన విషయం తెలిసిందే. ICYMI: Imam-ul-Haq has been taken to the hospital for scans after he was hit on the helmet earlier #PAKvNZ https://t.co/hHsg8JYSAC — Cricingif (@_cricingif) 1541787301000
2
టీమిండియాకు ధోనీ అద్భుతమైన కానుక – కొనియాడిన ఐసిసి   న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ఒక అద్యాయం ముగిసింది.క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అందరి మన్ననలు అందుకున్న ధోనీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా సిరీస్‌లో అనూహ్యంగా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగిన 35 సంవత్సరాల ధోనీ తాజాగా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. జనవరి 15 నుంచి ఇంగ్లండ్‌తో జరుగబోయే వన్డే,టి20 సిరీస్‌కు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ధోనీ సమాచారం అందిం చాడని బిసిసిఐ ట్వీట్‌ చేసింది.కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పినా ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని ధోనీ పేర్కొన్నట్లు బిసిసిఐ ట్విటర్‌లో వెల్లడించింది. దీంతో ఇంగ్లండ్‌తో జరుగబోయే వన్డే, టి20 సిరీస్‌కు ధోనీ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌గా అందుబాటులో ఉంటాడు. కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పడంతోకోహ్లీనే మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ వహించనున్నాడు. ధోనీ హయాంలో టీమిండియా అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. భారత క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌గా ధోనిది ప్రత్యేకమైన స్థానం.మూడు ఫార్మాట్లలోకూడా ఎన్నో అద్బుతమైన విజయాల నందించాడు.గొప్ప ఫినిషర్‌గా పేరొందిన ధోనీ తన ఆటతీరుతో క్రికెట్‌ ప్రేమికుల్ని అలరించాడు. టెస్టులు, వన్డేలు,టి20లకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ అనేక విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో ధోని ఒక అరుదైన ఘనతను సాధించాడు.వన్డే,ప్రపంచ కప్‌,చాంపియన్స్‌ ట్రోఫీ,టి20 ప్రపంచ కప్‌లు ఇలా మూడు సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ చరిత్రలో నిలిచిపోయాడు.మూడు ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించిన ఒకే ఒక్క కెప్టెన్‌ ధోనీ మాత్రమే. భారత క్రికెట్‌కు ధోనీ అందించిన ఒక అద్భతమైన కానుక ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశ క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అందరి మన్ననలు అందుకున్న ధోనీ కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పి ఆశ్చర్యంలో ముంచె త్తాడు. భారత క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌ ధోనీది ప్రత్యేకమైన స్థానం.మూడు ఫార్మాట్లలో కూడా భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయా లనందిం చాడు. టెస్టులు,వన్డేలు,టి20లకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ అనేక విజయాలను అందుకున్నాడు. 2014లో ఆస్ట్రేలియాలో టెస్టు ఫార్మాట్‌ నుంచి పూర్తిగా వైదొలగిన ధోని జనవరి 15 నుండి ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే,టి20 సిరీస్‌లకు కెప్టెన్‌గా కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ధోనీ మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుని ఆశ్చర్యానికి గురిచేశాడు.ధోనీ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం అతని అభి మానులే కాదు,యావత్‌ దేశంలోని అభిమాను లను సైతం ఆశ్చర్య పరిచింది.అయితే కెప్టెన్‌గా ధోని చివరి రోజు ధోని ఎం చేశాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.రంజీ ట్రోఫీలో భాగంగా గుజరాత్‌, జార్ణండ్‌ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ని ధోని తిలికించాడు.అక్కడ ఉండగానే ధోని తన కెప్టెన్సీపై నిర్ణయం ప్రకటించాడు. ఇందులో భాగంగా ధోని తన రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లతో 30 నిముషాల పాటు సమావేశ మయ్యాడు.తన క్రికెట్‌ ప్రస్థానంలోని ఎత్తు పల్లాలను జార్ఖండ్‌ ఆటగాళ్లతో పంచుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా గత నాలుగు రోజు లుగా ధోనీ నాగ్‌పూర్‌లో ఉన్నాడు. కెప్టెన్సీపై ధోనీ తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు ధోనీ సహచరులతో కలిసి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు.దీనిలో భాగంగా జార్ఖండ్‌ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు ధోని కొన్ని మెళుకువలు నేర్పాడు.ఈ క్రమంలోనే నాలుగు రకాల బ్యాట్లను పరిశీలించి తన ట్రేడ్‌ మార్క్‌ హెలికాప్టర్‌ షాట్లతో ధోని అలరించాడు.రంజీ మ్యాచ్‌ అనంతరం హోటల్‌ సిబ్బందికి ధోని ఆటోగ్రాప్స్‌ ఇచ్చాడు.బాల్‌ బా§్‌ు్సతో కలిసి సెల్ఫీలు దిగాడు.దీనికి ముందు విసిఎ క్రికెట్‌ స్టేడియంలో భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌తో కలిసి సుదీర్ఘంగా ముచ్చటించాడు. వీడ్కోలు నిర్ణయాన్ని గౌరవిద్దాం: సచిన్‌ టీమిండియాకు అత్యధిక విజయాలనందించిన కెప్టెన్‌ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.కెప్టెన్‌గా టీమిండియాను పదేళ్ల పాటు నడిపించిన ధోనీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పాడు.అయితే ధోని నిర్ణయం క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి నెట్టివేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి హఠాత్తుగా ధోని వైదొలగడంపై పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం స్పందించిన సంగతి తెలిసిందే.ధోని కెప్టెన్సీ వీడ్కోలుపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలందించి కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన ధోనికి అభినందనలు. కెరీర్‌ తొలి నాళ్లలోదూకుడైన వ్యక్తిత్వం నుంచి కెప్టెన్‌గా కూల్‌గా తీసుకున్న బాద్యతాయుత నిర్ణయాల వరకు ఆతన్ని నిశితంగా గమనించాను.అతని విజయ వంతమైన కెప్టెన్సీ రికార్డును అభినందిస్తూ వీడ్కోలు నిర్ణయాన్ని గౌరవిద్దాం అని ట్వీట్‌ చేశాడు.బిసిసిఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ టి20 ప్రపంచ కప్‌,వన్డే ప్రపంచ కప్‌ లాంటి మెగా టోర్నీలు భారత్‌కు అందించిన గొప్ప కెప్టెన్‌ ధోని.అతని నిర్ణయాన్ని స్వాగతి స్తున్నా అని ట్విట్‌ చేశాడు.ఇదే క్రమంలో ధోని భార్య సాక్షి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.గత పదేళ్లుగా టీమిండియాను విజయ పథంలో నడిపిన ధోని ఇక అధిరోహించే శిఖరాలు ఏమీ లేవంటూ ప్రత్యేకమైన మెసెజ్‌తో ట్వీట్‌ పోస్టు చేసింది.ధోని ఎక్కే పర్వతాలు ఏమీ లేవు.అందుచేత ధోనిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ధోని నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆలోచించే తీసుకుంటాడు.నా భర్త ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టుగానే ఉంటుంది అని ట్వీట్‌ చేసింది.
2
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV డిక్టేట‌ర్‌తో ఆట‌పాట‌ ముంబ‌యి సొగ‌స‌రి శ్ర‌ద్ధాదాస్‌ తెలుగులో ఓ క్రేజీ ఆఫ‌ర్‌ను సొంతం చేసుకుంది. TNN | Updated: Dec 24, 2015, 12:05PM IST ముంబ‌యి సొగ‌స‌రి శ్ర‌ద్ధాదాస్‌ తెలుగులో ఓ క్రేజీ ఆఫ‌ర్‌ను సొంతం చేసుకుంది. బాల‌కృష్ట క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న డిక్టేట‌ర్ చిత్రంలో ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌నుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొంది. ప్రెస్టిజీయ‌స్ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు తెలిపింది. శ్ర‌ద్ధాదాస్‌తో పాటు ముమైత్‌ఖాన్ ఈ గీతంలో న‌టించ‌నుంది. నేటి నుంచి హైద‌రాబాద్‌లో ఈ ఐటెంసాంగ్‌ను భారీ స్థాయిలో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ పాట‌తో సినిమా షూటింగ్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఎరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్, వేదాశ్వ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి. శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంజ‌లి, సోనాల్ చౌహాన్ హీరోయిన్‌లుగా క‌థానాయిక‌లు. బాల‌కృష్ట న‌టిస్తున్న 99వ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వాటికి త‌గిన‌ట్లుగానే ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌,క‌థ‌నాల‌తో చిత్రాన్ని తెర‌కెకిస్తున్న‌ట్లు చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.
0
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV నెలాఖరుకు వీవో 'ఎక్స్21' స్మార్ట్‌ఫోన్..! ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వీవో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను మే 29న విడుదల చేయనుంది. వీవో 'ఎక్స్21' తో ఈ ఫోన్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్‌ను తేనున్నారు. 128 జీబీ ఇంట్నల్ స్టోరేజ్‌‌ను అందించనున్నారు. TNN | Updated: May 13, 2018, 05:34PM IST నెలాఖరుకు వీవో 'ఎక్స్21' స్మార్ట్‌ఫోన్..! ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వీవో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను మే 29న విడుదల చేయనుంది. వీవో 'ఎక్స్21' తో ఈ ఫోన్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్‌ను తేనున్నారు. 128 జీబీ ఇంట్నల్ స్టోరేజ్‌‌ను అందించనున్నారు. 256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.28 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ఈ ఫోన్‌లో డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది. ఈ ఫోన్ ధరను రూ.39,900గా నిర్ణయించారు. 6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 2280 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ 6 జీబీ ర్యామ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4జీ వీవోఎల్‌టీఈ 3200 ఎంఏహెచ్ బ్యాటరీ   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV లైన్లో నేనూ ఉన్నా... తాను కూడా రాజమౌళి ఫ్యాన్ అని ఆయనతో సినిమాకోసం రెడీగా ఉన్నానని మహేష్ బాబుతెలిపారు TNN | Updated: Jul 27, 2015, 07:07PM IST హైదరాబాద్: దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుని అంచనాలకు అందకుండా ఎదిగిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆయనతో సినిమాకోసం ఎన్నాళ్లయినా ఆగేందుకు అగ్రహీరోలు కూడా సిద్ధంగా ఉంటారు. తాజాగా ఆ లిస్ట్ లోనే చేరారు గ్లామర్ హీరో మహేష్ బాబు . తాను కూడా రాజమౌళి ఫ్యాన్ అని ఆయనతో సినిమాకోసం రెడీగా ఉన్నానని తెలిపారు.రాజమౌళితో ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆయన దర్శకత్వంలో చిత్రం ఉంటుందని వెల్లడించారు. 'బాహుబలి'. చిత్రంపై సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రశంసల జల్లు కురిపించారు. బాహుబలి చిత్రంలో విజువల్ ఎఫెక్ట్‌లు అద్భుతంగా ఉన్నాయని . ఇలాంటి సినిమాను కేవలం రాజమౌళి మాత్రమే తీయగలరని పేర్కొన్నారు.
0
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV భారత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టుపై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ TNN | Updated: Mar 14, 2018, 06:51PM IST భారత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టుపై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో ఫైనల్‌ బెర్తుకి చేరువైన టీమిండియా ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా.. గత శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్ గెలుపు బాటని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. టోర్నీలో ఇప్పటికే ఓ సారి భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Virat Kohli అద్భుతమైన కెప్టెన్: ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన కెప్టెన్. టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు అంచనాలకి తగ్గట్టుగానే ఆడుతోంది. ఇక విరాట్ కోహ్లీతో కలిసి నేను రెండు ఐపీఎల్ సీజన్లు ఆడాను. అతని కెప్టెన్సీ ఆడటంతో ఓ మంచి అనుభూతి - స్టార్క్ Samayam Telugu | Updated: Dec 24, 2018, 02:45PM IST Virat Kohli అద్భుతమైన కెప్టెన్: ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన కెప్టెన్ అని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కితాబిచ్చాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో గత వారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో పేస్, బౌన్స్‌కి అతిగా అనుకూలించిన పిచ్‌పై వీరోచిత శతకం బాదిన విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ వరుసగా కవ్విస్తూ బౌన్సర్లతో పరీక్షించినా కోహ్లీ సహనంతో క్రీజులో నిలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అయితే.. రెండో టెస్టులో భారత్ జట్టు ఓడటంతో.. నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమవగా.. మూడో టెస్టు మ్యాచ్‌ బుధవారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మిచెల్‌ స్టార్క్ మాట్లాడాడు.
2
AJAY SRINIVASAN ఎక్ఛేంజిల్లో నేరుగా జాబితా అయిన బిర్లా కేపిటల్‌ ముంబయి, సెప్టెంబరు 2 : ఎవి బిర్లాగ్రూప్‌ ఆర్థికసేవల సంస్థ ఆదిత్యబిర్లా కేపి టల్‌షేర్స్‌ ఎక్ఛేంజిల్లో మంచి ర్యాలితీసాయి. రూ.250వద్ద లిస్ట్‌ అయ్యాయి వెనువెంటనే ఐదుశాతం తగ్గాయి. 237.5 రూపాయలుగా ఎన్‌ఎస్‌ఇలో ట్రేడింగ్‌ జరిగింది. కంపెనీ ఐపిఒకు రాకుండా నేరుగా జాబితా చేయడం ఎక్ఛేంజిల చరిత్రలో మొదటిసారి అని నిపుణుల అంచనా. కొత్తసంస్థ కేపిటల్స్‌ 25 శాతం పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నిబంధనలు అనుసరించిన ట్లు ప్రకటించింది. జాబితా అయిన మాతృ సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ భారీపునర్‌వ్యవస్థీకరణకు చోటుచేసు కోవడం కూడా కేపిటల్‌ విభాగానికి మద్దతునిచ్చింది. అన్ని ఆర్థికసేవలు సైతం ఒకేగ్రూప్‌ కిందకు అంటే అదిత్యబిర్లా కేపిటల్‌ కిందకి వస్తున్నట్లు సిఇఒ అజ§్‌ు శ్రీనివాసన్‌ వెల్లడించారు. ఈ జాబితా ముందు ఇన్వె స్టర్లకు విలువలు పెంచుతుందని, పటిష్టమైన వృద్ధికి ఒక వేదిక ఏర్పాటు చేస్తుందని చెపుతున్నారు. బిర్లాగ్రూప్‌ జీవితబీమా సంస్థల్లోను, మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు ఈక్విటీ, కార్పొరేట్‌ రుణపరపతి, వ్యవస్థీకృత పరపతి, సాధారణ బీమా బ్రోకింగ్‌, సంపద మేనేజ్‌మెంట్‌; హౌసింగ్‌ ఫైనాన్స్‌, పెన్షన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, ఆరోగ్యబీమాల్లో మంచి వాటాతో ఉంది. 41 బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీ పునర్‌వ్యస్థీకరణకు నేరుగా జాబితాకావడం నాంది పలు కుతున్నట్లు తెలుస్తోంది. నువో ఆధ్వర్యంలోని ఆర్థికసేవల బిజినెస్‌ను ఇకపై కేపిటల్‌లో విలీనం చేస్తుంది. ఎబినువోలోని ప్రతి పదిషేర్లకు గ్రాసి మ్‌ మూడు షేర్లనుజారీచేసింది. ఐపిఒకు రాకుం డా ఎక్ఛేంజిల్లో జాబితా కావడం అత్యంత అరు దైన సంఘటన. ఎస్‌ఎంఇలు, స్టార్టప్‌లకు మంచి ప్రయోజనం కలిగిస్తుందనించనా. సెబి ఇలాంటి కంపెనీలకు కొన్ని నిబంధనలను రూపొందించి నేరుగా జాబితా అయ్యే మార్గా లను ప్రకటించింది. 25శాతం కనీస పబ్లిక్‌షేర్‌ హోల్డింగ్‌ను పూరిం చగలిగిన ఏ కంపెనీ అయినానేరుగా ఎక్ఛేంజిలో జాబితా కావచ్చు. పబ్లిక్‌ ఇన్వెస్టర్లు ఈషేర్లు కొనుగోలు చేసుకునేందుకు సెబి అనుమ తించింది. దీనితో కంపెనీలు కొత్తగా ఈమార్గాన్ని అనుసరిస్తున్నట్లు అంచనా.
1
Visit Site Recommended byColombia 1998లో 50 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా అప్పట్లో ముక్కోణపు సిరీస్‌ని వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక నిర్వహించింది. ఇందులో లంకతో పాటు భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడ్డాయి. శ్రీలంకతో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో సౌరవ్ గంగూలీతో కలిసి సచిన్ టెండూల్కర్ తొలి వికెట్‌కి 252 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో తొలి వికెట్‌కి ఈ రికార్డు భాగస్వామ్యం టాప్-10 లిస్ట్‌లో ఉంది. ‘ముక్కోణపు టీ20 టోర్నీకి రావాల్సిందిగా సచిన్ టెండూల్కర్‌ని ఆహ్వానించాం. అతను చాలా బిజీగా ఉంటాడు. అతను రావడంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. లంకేయులకి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అతను తన సందేశం పంపాడు’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
Visit Site Recommended byColombia సచిన్ టెండుల్కర్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' మూవీ ఈ నెల 26వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో అమీర్ ఖాన్ ఆ సినిమా గురించి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సచిన్ బయోపిక్ రిలీజయ్యేంతవరకు కూడా వేచిచూడటం తన వల్ల కావడం లేదంటున్నాడు అమీర్ ఖాన్. సచిన్ గురించి అమీర్ ఖాన్ ఇంకా ఏమేం చెప్పాడో అతడి మాటల్లోనే చూద్దాం. . @sachin_rt , Here's to your 101st century. Break a leg! #SachinABillionDreams #7DaysToSachin Love.a. pic.twitter.com/djAoW8PYps — Aamir Khan (@aamir_khan) May 19, 2017   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Visit Site Recommended byColombia ప్రస్తుతం లీటరు పెట్రోల్‌పై రూ. 19.48 చొప్పున, లీటరు డీజిల్‌పై రూ. 15.33 చొప్పున ఎక్సైజ్ సుంకం విధిస్తున్నారు. కనుక, పెరుగుతున్న ముడి చమురు ధర వల్ల కస్టమ్స్ సుంకం ద్వారా కోశాగారానికి ఎంతో కొంత నగదు చేరవచ్చేమోకానీ, ఎక్సైజ్ సుంకం ద్వారా కాదన్నది ఆయన తర్కం. రాష్ట్రాలు వ్యాట్‌ని, యాడ్ వెలోరమ్‌ని విధిస్తున్నాయి. రేట్లు పెట్రోల్‌పై 6 నుంచి 40 శాతం మధ్య, డీజిల్‌పై 6 నుంచి 28.5 శాతం మధ్య ఉంటున్నాయి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏర్పడగల దృశ్యాల కింద దిగుమతి బిల్లు 25 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు పెరగవచ్చని గార్గ్ అంగీకరించారు. ఇండియా చమురు దిగుమతులపై గత ఏడాది 70 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించింది. ఖరీదైన క్రూడ్ వల్ల క రెంట్ ఖాతా లోటు పెరుగుతుందని ఆయన అన్నారు. అయితే, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ద్రవ్య లోటు పరిస్థితి కూడా అందోళనకరంగా ఏమీ లేదని ఆయన చెప్పారు. కరెన్సీ సౌలభ్యం తిరిగి సాధారణ స్థితికి చేరుకుందని గర్గ్ అన్నారు. ‘‘మనం ఇప్పుడు కరెన్సీల మరిన్ని డిపాజిట్లను చూస్తున్నాం’’ అని ఆయన అన్నారు. మునుపటి విత్‌డ్రాల్ ధోరణి కి భిన్నంగా, దేశవ్యాప్తంగా కరెన్సీల డి పాజిట్లు రూ. 4000 కోట్లకు పైగా ఖ‌జానాకు చేరాయని ఆయన తెలిపారు. కొద్ది వారాల క్రితం కరెన్సీ కొరతకు గల కారణాలలో కర్ణాటక ఎన్నికలు కూడా ఒక అంశమనే సంగతిని ఆయన తోసిపుచ్చలేదు. పెరుగుతున్న బాండ్ ప్రతిఫ లంపై ఆయన అనవసరంగా కలత చెందుతున్నట్లు కనిపించలేదు. అది శుక్రవారం నాలుగేళ్ళ కాలంలో అధిక స్థాయి లో 7.9 శాతానికి తాకింది. బాండ్, ఈ క్విటీ మార్కెట్ల నుంచి నిధులు తరలిపోతున్నప్పటికీ, అది ప్రమాదకరమైన స్థా యిలో ఏమీ లేవని ఆయన అన్నారు. ‘‘2013 నాటి పరిస్థితి ముంచుకొచ్చే అవకాశాలు ఇప్పుడు లేవు, అవి దారిదాపుల్లో కూడా లేవు’’ అని ఆయన అన్నారు. ఒకటిన్నర నెలల్లో 4-5 బిలియన్ డాలర్లు తరలిపోవడం అపరిమితం ఏమీ కాదు’’ అని ఆయన అన్నారు. ప్రభుత్వం రుణ స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని, బాండ్ ప్రతిఫలంలో ప్రస్తుత పెరుగుదలకు స్పందించాల్సిన అవసరం కనిపించడం లేదని ఆయన అన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘మహానుభావుడు’గా శర్వానంద్ ‘భలే భలే మగాడివోయ్, ‘బాబు బంగారం’ సినిమాల తరువాత మారుతి ‘మహానుభావుడు’అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. TNN | Updated: Dec 8, 2016, 04:35PM IST Sharwanand next film Mahanubhavudu శర్వానంద్ టాలీవుడ్‌లో నాని తరువాత మినిమమ్ గ్యారంటీ సినిమాలతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా వంటి హ్యట్రిక్ హిట్స్‌తో సత్తా చాటిన యంగ్ హీరో శర్వానంద్ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. హిట్ సినిమాలు ఇచ్చిన కిక్‌తో పెద్ద హీరోలతో పోటిపడుతూ సంక్రాంతి బరిలో నిలవడానికి ‘శతమానంభవతి’ సినిమాతో రెడీ అయ్యాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సినిమాలో హీరోగా నటిస్తూనే, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్‌లో పెట్టాడు. ‘శతమానంభవతి’ సినిమా పూర్తవ్వగానే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. మారుతి మార్క్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘మహానుభావుడు’అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అప్పటివరకూ బూతు డైరెక్టర్‌గా తనపై ఉన్న పేరును మారుతి ‘భలే భలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి చెరిపేసుకున్నాడు. తరువాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘బాబు బంగారం’ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. తాజాగా శర్వానంద్ హీరోగా మహానుభావుడుతో మరోసారి భారీ హిట్ మీద కన్నేశాడు మారుతి. శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై ఆసక్తినెలకొంది. ఈ మూవీలో శర్వా సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
నోట్లదెబ్బకు రెండేండ్లు వెనక్కి! - ఈ ఏడాది వృద్ధి 7.1 శాతానికే పరిమితమయ్యే అవకాశం - దన్నుగా నిలువనున్న వ్యవసాయం, ప్రభుత్వ వ్యయం - అసాధారణ సంవత్సరం: సీఎస్‌వో నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పెద్దనోట్ల రద్దు చర్య దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒడుదుడుకులకు గురి చేసిందని 'కేంద్ర గణాంకాల కార్యాలయం' (సీఎస్‌వో) శుక్రవారం విశ్లేషించింది. ఫలితంగా ఈ ఏడాది వృద్ధి రేటు గత ఏడాది కంటే కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలపింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 7.6 శాతంగా ఉన్న వృద్ధి రేటు, 2016-17కు 7.2 శాతానికి దరిదాపుల్లోనే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లుగా సీఎస్‌వో లెక్కగట్టింది. ఈ ఏడాది మొదటి రెండు త్రైమాసికాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా 7.1%, 7.3% మేర వృద్ధి చెందినట్లుగా తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం గతంలో మాదిరిగా సాధారణ సంవ త్సరం కాదని 'ప్రధాన గణాంకాల అధికారి' టీసీఏ అనంత్‌ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థలో తీవ్ర ఒడిదొడుకులకు దారి తీసినందన్నారు. నవంబరు మాసానికి సంబంధించి బ్యాంకు డిపాజిట్లు, రుణ వితరణ గణాంకాలను వృద్ధి రేటు అంచనాలలో పరిగణనలోకి తీసకోలేదని తెలిపారు. భారతీయ రిజర్వు బ్యాంకు కూడా గత నెలలో జీవీఏ గణాంకాలను వెల్లడిస్తూ ఈ ఆర్థిక సంవత్సరానికి జోడించిన స్థూల విలువ గతంలో అంచనాకట్టిన 7.6 శాతం కంటే కూడా తగ్గి 7.1 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధనాంగా వ్యవసాయం, పెరిగిన ప్రభుత్వ వ్యయాలే ప్రధానంగా వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నట్టుగా గణాంకాల విభాగం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం 1.2 శాతంగా ఉన్న వ్యవసాయ, అటవీ, మత్స్య రంగాల వృద్ధి ఈ ఏడాదికి 4.1 శాతానికి చేరే అవకాశం ఉందని గణాంకాల శాఖ తెలిపింది. మరోవైపు మైనింగ్‌ రంగంలో మరీ దారుణంగా 7.4 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోయే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. 2015-16తో పోలిస్తే మిగతా అన్ని రంగాలు స్వల్ప వృద్ధిని మాత్రమే నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 7.2 శాతానికి చేరువలో ఉండొచ్చని పేర్కొంది. ఇది 2014-15లో మన ఆర్థిక వ్యవస్థ కనబరిచిన పనితీరుతో సమానం. అంటే మన ఆర్థిక వ్యవస్థ దాదాపు రెండేండ్ల వెనక్కి వెళ్లినట్టుగా పరగణించవచ్చని కొందరు ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. 7.1 శాతం వృద్ధిని కూడా అశించడం కూడా ఎక్కువేనని కొందరు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. గతంలో సీఎస్‌వో ఫిబ్రవరి మాసంలో వృద్ధి రేటు అంచనాలను ప్రకటిస్తుండడం అనవాయితీగా వస్తోంది. అయితే పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీలను ముందుకు జరిపిన కారణంగా సీఎస్‌ఓ ఈ సమాచారాన్ని ముందుగానే వెల్లడించింది. 5-5.5 శాతానికే పరిమితం కావొచ్చు.. కోల్‌కతా: ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనమైన బలానికి తీవ్ర విఘాతం కలిగించినట్టుగా ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మెన్‌ మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ప్రతియేటా ఏడు శాతానికి పైగా వృద్ధిని అందుకొనేంత అంతర్లీనమైన బలాన్ని మన ఆర్థిక వ్యవస్థ సొంతం చేసుకుందని ఆయన అన్నారు. నోట్ల రద్దు కారణంగా దీనికి తీవ్ర భంగం ఏర్పడినట్టుగా ఆయన తెలిపారు. ఫలితంగా వృద్ధి రేటు 1 నుంచి 2 శాతం మేర ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. దీంతో ఈ ఏడాది భారత వృద్ధి రేటు 5 శాతం నుంచి 5.5 శాతానికి దరిదాపులకే పరిమితమయ్యే అవకాశం ఉన్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ 'భారత్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌' ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ రేటును తిరిగి 7 శాతం అంతకంటే ఎక్కువకు చేర్చే విషయమై సర్కారు ప్రాథమికంగా దృష్టి సారించాలని సూచించారు. పెద్దనోట్ల రద్దు సమర్థనీయం కాదన్న అహ్లూవాలియా నల్లధనం నిర్మూలన, డిజిటైజేషన్‌ను ప్రోత్సహించేందుకు గాను ఆకర్షణీయమైన పన్ను రేట్లతో సహా పలు ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Jul 13,2015 అందుబాటులోకి ట్రూజెట్‌ సేవలు హైదరాబాద్‌ : టర్బో మేఘ ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ట్రూజెట్‌ సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లే తొలి విమాన సర్వీసును కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి అశోక్‌ గజపతిరాజు ప్రారంభించారు. గోదావరి పుష్కరాలకు అందుబాటులో ఉండేలా రాజమండ్రికి విమానాల్ని నడుపుతున్నారు. విమానాల కొనుగోలుకు, నిర్వహణ, మరమ్మతులకు 500 కోట్ల రూపాయల పెట్టుబడులు కేటాయించాలని కంపెనీ నిర్ణయించింది. వీరు ఎటిఆర్‌ 72-500 రకానికి చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఐరిష్‌ కంపెనీ నుంచి లీజుకు తీసుకున్నారు. నటుడు రామ్‌చరణ్‌ ఈ సంస్థను ప్రేమ్‌కుమార్‌, వి ఉమేష్‌లతో కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. శంషాబాద్‌ నుంచి దేశీయ సర్వీసులను అందిస్తున్న ఎనిమిదవ విమాన సంస్థగా ట్రూజెట్‌ నిలిచింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి కేటీఆర్‌తోపాటు రామ్‌చరణ్‌, ట్రూజెట్‌ ఎండి ఉమేష్‌లు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2
Suresh 142 Views ఆర్‌బిఐ పదేళ్ల బెంచ్‌మార్క్‌ బాండ్ల వేలం ముంబై, సెప్టెంబరు 4: ప్రభుత్వం తాజాగా పదేళ్ల బెంచ్‌మార్క్‌ బాండ్లను వేలం వేసింది. రాబడుల ను కూడా 6.97శాతంగా ప్రకటించింది. 2009 జూలై తర్వాత మొదటిసారిగా పదేళ్ల బాండ్లను ఏడుశాతం కూపన్‌రేట్‌కంటే తక్కువకు వేలం వేయడం ఇదే మొదటిసారి అని నిపుణుల అంచనా. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ రూపాయి మారకం విలువలు 66.83రూపాయలుగా ప్రకటించారు. మొత్తం గా ఈ వేలం వల్ల 8వేల కోట్ల రాబడులు అందుతాయని అంచనా. డాలరుతో రూపాయి మారకం విలు వలు 66.83 రూపాయలవద్ద ముగిసింది. విదేశీ కరెన్సీ నిల్వలు కూడా 366.77 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2013లో రాజన్‌ బాధ్యతలు స్వీకరించేనాటికి 274.8 బిలియన్‌డాలర్లతో పోలిస్తే ఎక్కువే. మొత్తం 203 బిడ్లు దాఖలయ్యాయి. ఎనిమిదివేల కోట్ల రాబడుల లక్ష్యంగా జారీచేసినఈబాండ్లకు దాఖలైన బిడ్ల విలువ చూస్తే 41,461 కోట్లుగా ఉన్నది. ఆర్‌బిఐ జారీచేయతలపెట్టిన 14 వేల కోట్ల రూపాయల బాండ్లలో ఇదొకభాగం అనే చెప్పాలి. పదేళ్ల బెంచ్‌మార్క్‌ బాండ్లు 7.11 శాతం కూపన్‌రేట్‌వద్ద ముగిసాయి. ప్రస్తుతం బాండ్లద్వారా ప్రభుత్వానికి 87వేల కోట్ల రూపాయలు నిధులు సమీకరించినట్ల యింది. ఈ ఏడాది జనవరిలో జారీచేసిన బాండ్లకు 7.59శాతం కూపన్‌రేట్‌గా ప్రకటించింది. పదేళ్ల బెంచ్‌మార్క్‌ బాండ్లకు మంచి డిమాండ్‌ ఉంటుందనిభావించినప్పటికీ డీలర్లఅంచనాలప్రకారంచూస్తే కూపన్‌ రేట్‌ తగ్గడంవల్ల డిమాండ్‌ ఆశించినస్థాయిలో ఉండకపోవచ్చని చెపుతున్నారు. ఆర్‌బిఐ వడ్డీరేట్లను కోతవిధిస్తు న్నట్లయితే బాండ్లరాబడులపై స్పష్టత వస్తుంది. దేశంలో ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్లు ప్రస్తుతం ఏడుశాతానికి లోపే ఉన్నాయి. బ్యాంకులు తమవడ్డీరేట్లను ఒకేసారి తగ్గించవు. మార్జిన్లుచూసు కున్న తర్వాత, రానిబాకీల అంశం పరిగణనలోనికి తీసుకుని వడ్డీరేట్లు మారుస్తాయి. బాండ్లమార్కెట్ల నుంచి తక్కువధరలకే కార్పొరేట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు బాండ్లద్వారా రిటర్నులు సాధించేందుకు వీలవుతుంది. బాండ్‌మార్కెట్లపరంగాచూస్తే ఆర్‌బిఐ 150 బేసిస్‌ పాయింట్ల వడ్డీరేట్ల తగ్గుదల కొంత ప్రభావం చూపించింది. అయితే బ్యాంకులు మాత్రం వడ్డీరేట్లలో సగంభాగం మాత్రమే క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలిగాయని చెప్పాలి. వడ్డీరేట్లలో మార్పులు లేక పోవడం వల్ల భారత్‌ కార్పొరేట్‌ రంగం బ్యాంకురుణాల నుంచి బాండ్ల జారీవైపునకు మళ్లుతోందనే చెప్పాలి.
1
ఎయిర్‌టెల్‌ 4జీ హ్యాండ్‌సెట్‌ ధర రూ.4వేలు - నవంబర్‌ నాటికి విడుదల - చైనా, తైవాన్‌ కంపెనీలతో చర్చలు న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియోకు పోటిగా ఎయిర్‌టెల్‌ అతి తక్కువ ఖరీదుతో హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. 4జీని సపోర్ట్‌ చేసే ఈ మొబైల్‌ కనిష్ట మోడల్‌ ధర 4వేల రూపాయలు. దీనిని నవంబర్‌ నాటికి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. రెండు సిమ్‌కార్డులను సపోర్ట్‌ చేసే వీటి విలువ 4వేల నుంచి 12వేల రూపాయలు ఉంటుందని కంపెనీ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి చైనాలోని మొబైల్‌ తయారీదారులతో ఎయిర్‌టెల్‌ చర్చలు జరిపిందని, తైవాల్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌తోనూ చర్చించింది. అయితే దీనిపై ఎయిర్‌టెల్‌, ఫాక్స్‌కాన్‌లు అధికారికంగా స్పందించలేదు. రిలయన్స్‌తో పోటీ రిలయన్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 4జీ మొబైల్‌ను 4వేల రూపాయల కంటే తక్కువలోని అందుబాటులోకి తెస్తామని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ముకేశ్‌ అంబానీ మొబైళ్ల తయారీపై దృష్టి సారించటం ఇది రెండోసారి. 2003లో రిలయన్స్‌ మొబైల్‌ను 500 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. దీని అమ్మకాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఎయిర్‌టెల్‌ అందుబాటులోకి తెస్తున్న 4జీ మొబైల్‌లో కంపెనీ నెట్‌వర్క్‌కు మాత్రమే పనిచేసేలా తయారు చేస్తున్నారు. దీని ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించాలన్నది కంపెనీ వ్యూహం. అక్టోబర్‌, నవంబర్‌లలోని పండుగలను దృష్టిలో పెట్టుకొని మొబైల్‌ను విడుదల చేయాలని ఎయిర్‌టెల్‌ ప్రయత్నిస్తోందని సమాచారం. దేశంలో మొదటి 4జీ సేవలు 2012లో కోల్‌కతాలో ప్రారంభమయ్యాయి. ఎయిర్‌టెల్‌ 4జీ సేవలు ఢిల్లీ, హైదరాబాద్‌, వైజాగ్‌, మధురై, చెన్నై, కోయంబత్తూర్‌, ముంబయిలలో అందిస్తోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV అందుబాటు ధరలో 'అపాచీ' సరికొత్త బైక్..! దేశంలోనే మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్... తన బ్రాండ్ అపాచీలో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మూడు రకాల్లో రూపొందించిన 'అపాచీ ఆర్‌టీఆర్ 160' మోడల్ ధర మూడు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. TNN | Updated: Apr 8, 2018, 11:21AM IST అందుబాటు ధరలో 'అపాచీ' సరికొత్త బైక్..! దేశంలోనే మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్... తన బ్రాండ్ అపాచీలో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మూడు రకాల్లో రూపొందించిన 'అపాచీ ఆర్‌టీఆర్ 160' మోడల్ ధర మూడు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. వీటిల్లో... అపాచీ ఆర్‌టీఆర్ 160 కార్బొరేటర్ (డ్రమ్) రూ.79,990లకు, కార్బొరేటర్ (డిస్క్) రూ.82, 990, ఐఎఫ్‌ఐ (డిస్క్) రూ.89,990కి లభించనుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ బైకును 159.7 సీసీ సామర్థ్యంతో రూపొందించారు. కేవలం 4.8 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం ఈ బైక్ ప్రత్యేకత. We rode the 2018 TVS Apache RTR 160 4V at the company's test track and here's what we thought about the new motorcy… https://t.co/v4lZ8SjYl2 — Times of India (@timesofindia) 1523096400000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు Selvi| Last Updated: శుక్రవారం, 25 జులై 2014 (10:59 IST) రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.275 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.15గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.279, విశాఖపట్నంలో రూ.295, విజయవాడ రూ.275, చిత్తూరులో రూ.308, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.275 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.315 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్‌లో రూ.280 రూపాయలుగా పలుకుతోంది. సంబంధిత వార్తలు
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఎయిర్‌టెల్‌లో టెలినార్‌ విలీనానికి డీఓటీ ఆమోదం జియో రాకతో టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎయిర్టెల్ విలీనాలతో ముందుకెళుతోంది. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌లో టెలినార్‌ ఇండియా విలీనాన్ని ఆమోదిస్తున్నట్లు టెలికాం విభాగం సోమవారం ప్రకటించింది. Samayam Telugu | Updated: May 15, 2018, 03:40PM IST ఎయిర్‌టెల్‌లో టెలినార్‌ విలీనానికి డీఓటీ ఆమోదం జియో రాకతో టెలికాం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎయిర్టెల్ విలీనాలతో ముందుకెళుతోంది. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌లో టెలినార్‌ ఇండియా విలీనాన్ని ఆమోదిస్తున్నట్లు టెలికాం విభాగం సోమవారం ప్రకటించింది. నార్వేకు చెందిన టెలినార్‌ అనుబంధ సంస్థే టెలినార్‌ ఇండియా. టెలినార్‌ ఇండియా లైసెన్సులను, ఆ సంస్థ బాధ్యతలన్నింటినీ భారతీ ఎయిర్‌టెల్‌కు బదిలీ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫలితంగా 7 టెలికాం సర్కిళ్ల పరిధిలోని టెలినార్‌ చందాదార్లంతా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి వస్తారు. జనవరి నెల గణాంకాల ప్రకారం టెలినార్‌ ఇండియాకు 4 కోట్ల మంది చందాదార్లున్నారు. అదనంగా 4జీ సేవలకు ఉపయోగపడే 1800 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ 43.4 మెగాహెర్ట్జ్‌ మేర ఎయిర్‌టెల్‌ పరమవుతుంది. ఈ సంస్థల విలీనం కోసం, సెక్యూరిటీ డిపాజిట్‌గా ఎయిర్‌టెల్‌ రూ.1,700 కోట్లు చెల్లించాలని కోరుతూ టెలికాం విభాగం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతవారం తిరస్కరించిన సంగతి విదితమే. విలీనాన్ని ఆమోదించమని టెలికాం విభాగాన్ని కోర్టు ఆదేశించింది. వేలం నిర్వహించకుండా ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయిస్తున్నందున, ఒక్కసారి స్పెక్ట్రమ్‌ ఛార్జీ కింద రూ.1,499 కోట్లు, ఈ స్పెక్ట్రమ్‌ పొందిన టెలినార్‌ ఇండియా ఇంకా చెల్లించాల్సిన రూ.200 కోట్లు కలిపి వసూలు చేసుకోవాలన్నది టెలికాం విభాగం లక్ష్యం. దీనితో టెలికాం విభాగం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
1
Hyderabad, First Published 8, Apr 2019, 6:54 PM IST Highlights చాలా రోజుల తరువాత సాయి ధరమ్ తేజ్ తన సినిమాపై అంచనాలను పెంచుతున్నాడు. వరుసగా ఆరు డిజాస్టర్స్ తరువాత చేసిన సినిమా చిత్రలహరి. ఈ సినిమా సక్సెస్ సాయికి ఒక్కడే కాకుండా సినిమా కోసం పనిచేసిన చాలా మందికి అవసరం.   చాలా రోజుల తరువాత సాయి ధరమ్ తేజ్ తన సినిమాపై అంచనాలను పెంచుతున్నాడు. వరుసగా ఆరు డిజాస్టర్స్ తరువాత చేసిన సినిమా చిత్రలహరి. ఈ సినిమా సక్సెస్ సాయికి ఒక్కడే కాకుండా సినిమా కోసం పనిచేసిన చాలా మందికి అవసరం.   రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ పాజిటివ్ టాక్ తో క్లిన్ U సర్టిఫికెట్ ను అందుకుంది. దీంతో సాయి ఈ సినిమాపై  నమ్మకం మరింతగా పెంచేసుకున్నాడు.  డైరెక్టర్ కిషోర్ తిరుమలకు కూడా ఈ సినిమా రిజల్ట్ చాలా అవసరం. నేను శైలజా తరువాత చేసిన ఉన్నదీ ఒకటే జిందగీ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు.  దీంతో అతను కూడా చిత్ర లహరి సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు. అదే విధంగా మైత్రి మూవీ మేకర్స్ అమర్ అక్బర్ ఆంటోని - సవ్యసాచి లాంటి డిజాస్టర్స్ తరువాత రిలీజ్ చేస్తున్న చిత్రం కావడంతో వీరికి కూడా సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. ఇక హీరోయిన్స్ కళ్యాణి ప్రియదర్శన్ - నివేత పేతురేజ్ చిత్రలహరితో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నారు.  సునీల్  కూడా సినిమా కెరీర్ కి యూ టర్న్ ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఇంతమంది భవిష్యత్తులు మార్చాల్సిన చిత్రలహరి ఈ నెల 12 రిలీజయ్యి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.  Last Updated 8, Apr 2019, 6:54 PM IST
0
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV దేవసేన కొరికితే.. రాజమౌళి నవ్వేశాడు! దర్శకధీరుడు రాజమౌళి.. దేవసేన అనుష్కకి ఒక సీన్ చెప్పాడు. ఒకే సీన్ చూసేద్దాం నేను రెడీ అంటూ దేవసేన మేకప్ వేసుకుని రెడీ అయిపోయింది. TNN | Updated: Apr 24, 2017, 05:18PM IST దర్శకధీరుడు రాజమౌళి.. దేవసేన అనుష్కకి ఒక సీన్ చెప్పాడు. ఒకే సీన్ చూసేద్దాం నేను రెడీ అంటూ దేవసేన మేకప్ వేసుకుని రెడీ అయిపోయింది. డైరెక్టర్ యాక్షన్ చెప్పేసరికి అయ్యయ్యో... డైలాగ్ మర్చిపోయానే అంటూ తన వేళ్లను నోటితో కరిచిపెట్టి గట్టిగా నవ్వేసింది అనుష్క.. దీంతో రాజమౌళి, ఆమె భార్య రమా రాజమౌళి అనుష్క చేసిన చిలిపి పనికి నవ్వుతూ అనుష్కను ఆటపట్టిస్తున్నట్టు ఉన్న ఈ ఫోటో బాహుబలి2 షూటింగ్ స్పాట్ లోనిది. బాహుబలి2 మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుండటంతో ప్రమోషన్‌లో వేగం పెంచుతూ కొన్ని షూటింగ్ లొకేషన్ ఫోటోలను విడుదల చేసింది చిత్ర యూనిట్. వాటిలో అనుష్క సిగ్గులొలికిస్తూ వేళ్లను కొరుకుతూ ఉన్న ఈ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. బాహుబలి పార్ట్1 లో కేవలం గ్లామర్‌‌కు దూరంగా ఉన్న అనుష్క .. పార్ట్‌2లో అభిమానుల ఆకట్టుకునే విధంగా గిరిజన యువతిగా ధైర్య సాహసాలు ప్రదర్శించే రోల్ చేస్తున్నట్లు సమాచారం. బాహుబలి ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలను మారుమ్రోగుతున్న పేరు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలౌతున్న ఈ మూవీ గురించి ప్రేక్షకుడు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి ది బిగినింగ్ సాధించిన ప్రభంజనంతో బాహుబలి2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
0
Visit Site Recommended byColombia 100 ఏళ్లలో రిలీజ్ సరే, ఇంతకీ ఈ సినిమా తీస్తున్న దర్శకులు, నిర్మాతలు అప్పటికి బతికి ఉంటారా? 2115లో రిలీజ్ సాధ్యమేనే అనే ప్రశ్నలకు కూడా వీరి వద్ద సమాధానం ఉంది. వీరు ఉన్నా లేకున్నా, తీసిన సినిమా అప్పటికి రిలీజ్ అయ్యేలా ఓ లాకర్ రెడీ చేశారట. అందులో అవన్నీ భద్రంగా ఉంటాయట. అవి తమ తదుపరి తరాలకు దక్కేలా ఏర్పాట్లు, కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయట. ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా మొదలైంది. ట్రైలర్‌లోకి వస్తే... కథా నాయకుడు ఓ బ్రాంది బాటిల్‌ను ఒక అల్మరాలో పెడతాడు. అయితే, అది సాధారణమైన బ్రాందీ కాదు. వందేళ్లు టైమర్ ఫిక్స్ చేసిన బాటిల్. దాని పేరు Louis XIII. వందేళ్ల తర్వాత మళ్లీ దాన్ని తెరిచి చూస్తారు. కౌంట్ డౌన్ పూర్తవుతుండగా... ఓ అపరిచితుడు అక్కడికి వచ్చి, ఎవరు మీరు అని అడుగుతాడు. వాళ్లు అతన్ని వింతగా చూస్తారు. అంతే. ట్రైలర్ అయిపోయింది. ట్రైలర్‌లో చూపించిన ఫ్యూచర్ వీడియోలో.. 2115 సంవత్సరానికి భూమిపై పరిస్థితి ఎలా ఉంటుందనే అంచనాలు కనిపిస్తాయి. ఈ సినిమా 2115, నవంబరు 18న విడుదల కానుంది. దీన్ని చూడాలంటే.. 100+ ఇయర్స్ జీవించేందుకు ట్రై చేయండి. కష్టం అనుకుంటే, ఈ ట్రైలర్లు చూసి ఆనందించండి. దీర్ఘాయుష్మాన్ భవా! ఇంతకీ ఈ సినిమా పేరు ఏమిటో తెలుసా... '100 YEARS... THE MOVIE YOU WILL NEVER SEE (100 ఇయర్స్.. ద మూవీ యూ విల్ నెవర్ సీ )'
0
Hyderabad, First Published 2, Sep 2019, 7:43 PM IST Highlights అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో శిరీష్ మెప్పించాడు. ఆ తర్వాత మళ్ళీ పరాజయాలు పలకరించాయి. ఈ ఏడాది విడుదలైన ఎబిసిడి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో శిరీష్ మెప్పించాడు. ఆ తర్వాత మళ్ళీ పరాజయాలు పలకరించాయి. ఈ ఏడాది విడుదలైన ఎబిసిడి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో శిరీష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి కథని ఎంచుకుంటున్నాడనే ఆసక్తి నెలకొంది.  తాజాగా శిరీష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. విజయ్ ఆంటోనితో కలసి మల్టిస్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు శిరీష్ ప్రకటించాడు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకుడు. ఇన్ఫినిటీ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.  ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు, ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. బిచ్చగాడు, కిల్లర్ లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు సొంతం చేసుకున్నాడు.    Happy to be venturing into Tamil cinema again in a new bi-lingual film starring @vijayantony sir & myself. Dir by @vijaymilton sir. Following his work since Golisoda, excited to be working with him now. Produced by @FvInfiniti . @ChennaiTimesTOI pic.twitter.com/vMQhJyQPYA — Allu Sirish (@AlluSirish) September 2, 2019 Last Updated 2, Sep 2019, 7:43 PM IST
0
పెళ్లయినా మరింత రెచ్చిపోతున్న బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్ Highlights కరెంట్ సినిమాలో ఇటు నువ్వే ఇటు నువ్వే పాట పాడిన సింగర్ నేహా భాసిన్ బాలీవుడ్ లో పలు టాలెంట్ అవార్డులు గెలుచుకున్న నేహా భాసిన్ రీసెంట్ గా హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారును కవ్విస్తున్న నేహ కరెంట్ సినిమాలో అటు నువ్వే ఇటు నువ్వే.. అనే పాట గుర్తుందిగా ఆపాట పాడిన బాలీవుడ్‌ సింగర్ నేహా భాసిన్ అంటే హిందీలో తెలియని వారుండరు. ఆమెకున్న క్రేజ్ అలాంటింది. కమ్మనైన గొంతుతో, ఆకట్టుకునే అందంతో.. నేహా తన పాటలతో కుర్రకారును మత్తెక్కిస్తోంది. స్కిన్ షోకు ఏ మాత్రం వెనకాడకుండా హాట్ హాట్ ఫోటోలతో నేహా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రాం నిండా ఇలాంటి ఫో కనిపిస్తాయి. గ్లామర్ ఉంది చూపించడానికే అన్నంతగా ఉండే ఈమె ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.   ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఓ ఫోటోపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఏం అందం అంటూ పొగుడుతుంటే, మరికొందరు మాత్రం నేహా హద్దులు దాటుతోందంటూ విమర్శిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌లిద్దామని అంటూ నేహాపై విరుచుకుపడుతున్నారు. అయితే విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా నేహా భాసిన్ తన అందాలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సచిన్‌కు శ్రీలంక ప్రత్యేక ఆహ్వానం కొలంబో వేదికగా మంగళవారం నుంచి ఆరంభంకానున్న ముక్కోణపు టీ20 సిరీస్‌‌ను వీక్షించేందుకు శ్రీలంకకి రావాల్సిందిగా TNN | Updated: Mar 6, 2018, 03:03PM IST సచిన్‌కు శ్రీలంక ప్రత్యేక ఆహ్వానం కొలంబో వేదికగా మంగళవారం నుంచి ఆరంభంకానున్న ముక్కోణపు టీ20 సిరీస్‌‌ను వీక్షించేందుకు శ్రీలంకకి రావాల్సిందిగా ఆ దేశ క్రికెట్ బోర్డు.. సచిన్ టెండూల్కర్‌కి ప్రత్యేక ఆహ్వానం పంపించింది. 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా శ్రీలంక ఈ సిరీస్‌ను నిర్వహిస్తుండగా.. ఆతిథ్య జట్టుతో పాటు భారత్, బంగ్లాదేశ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఒక్కో జట్టు.. మిగిలిన రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుండగా.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మార్చి 18న ఫైనల్లో ఢీకొట్టనున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకి భారత్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. 1998లో 50 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా అప్పట్లో ముక్కోణపు సిరీస్‌ని వన్డే ఫార్మాట్‌లో శ్రీలంక నిర్వహించింది. ఇందులో లంకతో పాటు భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడ్డాయి. శ్రీలంకతో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో సౌరవ్ గంగూలీతో కలిసి సచిన్ టెండూల్కర్ తొలి వికెట్‌కి 252 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో తొలి వికెట్‌కి ఈ రికార్డు భాగస్వామ్యం టాప్-10 లిస్ట్‌లో ఉంది. ‘ముక్కోణపు టీ20 టోర్నీకి రావాల్సిందిగా సచిన్ టెండూల్కర్‌ని ఆహ్వానించాం. అతను చాలా బిజీగా ఉంటాడు. అతను రావడంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. లంకేయులకి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అతను తన సందేశం పంపాడు’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల వెల్లడించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విరాట్ కోహ్లి మరోసారి నిరూపించాడు..! భారత్, ఆస్ట్రేలియా మధ్య ధర్మశాల వేదికగా గత ఏడాది మార్చిలో రసవత్తరంగా టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్‌తోనే TNN | Updated: Feb 26, 2018, 04:11PM IST విరాట్ కోహ్లి మరోసారి నిరూపించాడు..! భారత్, ఆస్ట్రేలియా మధ్య ధర్మశాల వేదికగా గత ఏడాది మార్చిలో రసవత్తరంగా టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్‌తోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ వికెట్ పడగొట్టగానే.. డగౌట్‌ నుంచి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వాటర్ బాటిల్స్ తీసుకుని మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసి.. మ్యాచ్ కామెంటేటర్లలతో పాటు, సహచర క్రికెటర్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆ మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవిశాస్త్రి స్టైల్‌లో చెప్పాలంటే.. ‘మోస్ట్ కాస్ట్‌లీ వాటర్‌ బాయ్’.. అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగులు చేసి.. నీళ్లసీసాలు మోసిన ఏకైక క్రికెటర్ అంటూ.. చెప్పుకొచ్చాడు. భుజం గాయం కారణంగా కోహ్లి ఆ మ్యాచ్‌లో ఆడలేదు. ఏ హోదాలో ఉన్నా.. జట్టులోని సహచరులకి సాయం చేయడంలో తనకి ఎలాంటి భేషజాలు లేవని అప్పట్లో కోహ్లి నిరూపించాడు. దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి ముగిసిన చివరి టీ20 మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా తుది జట్టుకి దూరమైన కెప్టెన్ కోహ్లి.. పెవిలియన్‌ నుంచి మ్యాచ్‌ని చూస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేసి పేలవ రీతిలో రనౌటైన ఓపెనర్ శిఖర్ ధావన్.. తీవ్ర ఒత్తిడి మధ్య పెవిలియన్‌కి చేరాడు. దీంతో.. ఓపెనర్ నలతని గమనించిన విరాట్ కోహ్లి అతని వెనక్కి చేరి.. తలని కాసేపు మర్దన చేస్తూ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొంది.. విజయంతో పర్యటనని ముగించిన విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
Realestate రియాల్టీపరంగా హైదరాబాద్‌కు మరింత జోష్‌ హైదరాబాద్‌: రియాల్టీరంగంపరంగాను, ఆఫీస్‌ స్పేస్‌పరం గాను హైదరాబాద్‌ ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నట్లు సర్వేలు చెపు తున్నాయి. నగరంలో రియాల్టీరంగం ప్రోత్సాహకరంగా ఉందని, ఐటి, ఐటిసేవల ఆధారిత రంగాల వృద్ధితో ఆఫీస్‌ స్పేస్‌కు కూడా మంచి డిమాండ్‌ ఫెరుగుతున్నదని అలాగే రియాల్టీ కొనుగోళ్లు కూడా కొంత ఊతం అందుకుంటున్నట్లు కామన్‌ఫ్లోర్‌డాట్‌కామ్‌ ప్రకటించింది. జిహెచ్‌ఎంసి పరంగా చూస్తే వ్యూహాత్మకంగా రోడ్ల అభివృద్ధికి 2700 నుంచి 2800 కోట్లు ప్రకటించింది. మొత్తం పదికోట్లను ప్రాధాన్యతా క్రమంలో వృద్ధి చేస్తోంది. తెంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్‌, రక్షణరంగ పార్కుల స్థాపనకు ఎక్కువ మద్దతునిస్తోంది. వచ్చేనాలుగేళ్లలో 2500 కోట్ల విలువైన పెట్టుబడులు ఈ రంగంలో వస్తాయన్నది అంచనా. అలాగే కేంద్రం కూడా తెలంగాణలోని 12 నగరాలకు 416 కోట్లు అమృత్‌ పథకం కింద కేటాయింపులు జరిపింది. వీటివల్ల మౌలిక వన రులు వృద్ధి చెందుతాయని కామన్‌ఫ్లోర్‌ అంచనా వేసింది. పరిశ్రమ లకు నిరంతరాయంగా లైసెన్సులు మంజూరుతో మరింతగా ఇన్వెస్టర్ల ను ఆకర్షిస్తోంది. తెలంగాణప్రభుత్వపరంగా రియాల్టీ, నిర్మాణరంగా లకు మంచి ఊతం ఇస్తున్నదని, బిజినెస్‌ రంగా సత్వర అనుమతులు కొంత పారదర్శక శైలిపోలి ఉండటంతో ఎక్కువ ఊతం ఇస్తున్నట్లు తేలింది. తెలంగాణప్రభుత్వం తాజాగా లీజు, అద్దె విధానాలను సరళీ కృతం చేసిందని, ప్రభుత్వ శాఖలకు, ప్రైవేటు వ్యక్తులు సంస్థలకు కూడా ఈ విధానం వర్తిస్తుంది. ఇక గత ఏడాది గూగుల్‌ ఆసియాలోనే అతిపెద్ద క్యాంపస్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకు 1000 కోట్ల పెట్టుబడులు పెడతామని పకటించింది. ఉబేర్‌ లక్షా 50 వేల చదరపు అడుగులస్థలాన్ని కొనుగోలు చేసింది. కామన్‌ఫ్లోర్‌ రియల్‌ ఇన్‌ సైట్స్‌ ప్రకారంచూస్తే కొత్త అపార్టు మెంట్లు 50శాతం పెరిగినట్లు తేలిం ది. 2014లో 34శాతం మాత్రమే చేపడితే గత ఏడాది మరింతపెరి గాయి. కొండాపూర్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, హైఐటెక్‌సిటీ, నిజామ్‌ పేట్‌ వంటివి మంచి మార్కెట్లని ప్రకటించింది. అప్పాజంక్షన్‌, మణి కొండ, బాచుపల్లి, నానక్‌రామ్‌గూడ వంటివి అభివృద్ధి చెందుతున్నట్లు ప్రకటించింది. టాప్‌ పది మార్కెట్ల లో చదరపు అడుగు 2200 నుంచి 4800 రూపాయలవరకూ ఉన్నట్లు కామన్‌ఫ్లోర్‌ అంచనా వేసింది. హైద రాబాద్‌ నగరంలో సగటు కనీస ధర చదరపు అడుగుకు వెయ్యిరూపాయ లుగా ఉంది. ఈ ధరలు కనీసం పది ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు అంచ నా వేసింది. ఇతర మెట్రోనగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 40 లక్షలు, రూ.40-70లక్షలు, రూ.70 లక్షలకుపైబడిన ప్రాజెక్టుల్లో మంచి కదలిక ఉందన్నారు. 850చదరపు అడుగులనుంచి 1600చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఎక్కువ మార్కెట్లు కనిపిస్తున్నట్లు అంచనా వేసింది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌ మార్కెట్లలో అత్యధికవాటా ఉన్నాయి. సికింద్రాబాద్‌, మలక్‌పేట్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్లు కీలకదశలోఉన్నట్లు అంచనా వేసింది.
1
sandhya 293 Views Aaron Finch , Australian batsman , David Warner , usman khwaja aaron finch, australian batsman లండన్‌: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో తొలుత నిదానంగా ఆడిన ఆస్ట్రేలియా ఆ తర్వాత జోరు పెంచింది. ఓపెనర్లు మంచి శుభారంభం అందించడంతో లంకపై ఒత్తిడి పెరిగింది. ఈ ఓపెనింగ్‌ జోడిని ఎలాగైనా విడదీయాలని శ్రీలంక చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఆరంభం నుంచి తడబడుతున్న వార్నర్‌(26) బౌల్డ్‌ అయ్యాడు. ఫించ్‌ అర్ధశతకం పూర్తి చేశాడు. 22 ఓవర్లు ముగిసేవరకు 97 ఒక వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో ఆరోన్‌ ఫించ్‌(56), ఉస్మాన్‌ ఖ్వాజా(10)లు ఉన్నారు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2
Aug 18,2017 మిస్త్రీకి పూర్తిగా 'టాటా' చెప్పేదాం.. న్యూఢిల్లీ : ఉద్వాసనకు గురైన మాజీ చైర్మెన్‌ సైరస్‌ మిస్త్రీతో టాటా సంస్థలకు ఉన్న అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని టాటా గ్రూపు నిర్ణయించింది. టాటా గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఈ సంచలన నిర్ణయానికి వీలుగా బోర్డు సభ్యులకు సూచనలు చేశారని సమాచారం. టాటా సన్స్‌ బోర్డు, టాటా గ్రూప్‌లోని మేజర్‌ ఆపరేటింగ్‌ సంస్థల ప్రమోటర్లు గత నెలలో సమావేశమయ్యాయని, ఈ మీటింగ్‌లో షాపూర్జి పల్లోంజి గ్రూప్‌తో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఈటీ ఒక కథనాన్ని ప్రచురించింది. టాటా సన్స్‌ చైర్మన్‌గా వ్యవహారించిన మిస్త్రీకి గతేడాది బోర్డు సభ్యులు అర్థాంతరంగా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఈ హఠాత్తు పరిణామం అనంతరం నుంచి టాటా సన్స్‌కు, మిస్త్రీకి తీవ్ర వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి మిస్త్రీ నుంచి టాటా గ్రూపునకు ఏదో విధంగా తలనొప్పులు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టాటా గ్రూప్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సైరస్‌ మిస్త్రీ కుటుంబానికి చెందిన అన్ని సంస్థలతో ఉన్న ఒప్పందాలు, భాగస్వామ్యాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
Feb 01,2017 18 లక్షల అనుమానిత ఖాతాలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దాదాపు 18 లక్షల ఖాతాల్లో అనుమానిత డిపాజిట్లు జరిగినట్టు సమాచారం ఉందని రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్‌ ఆదియా తెలిపారు. ఈ అనుమానాస్పద ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ గుర్తించిందని మంగళవారం ఆయన వెల్లడించారు. 'ఆపరేషన్‌ క్లీన్‌ మనీ' పథకంలో భాగంగా ఖాతాలను సరిచూడడం ప్రక్రియలో భాగంగా ఈ ఖాతాల వివరాలను సేకరించామని తెలిపారు. నవంబరు 9 నుంచి డిసెంబర్‌ 31 మధ్య నమోదైన భారీ డిపాజిట్లపై దష్టిపెట్టిన కేంద్రం డాటా ఎనలిస్టుల సహాయంతో ఈ అక్రమార్కులు పని పట్టేందుకు సిద్ధమవుతోందన్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీమొత్తంలో నగదును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులును పంపనున్నట్టు ఆయన తెలిపారు. టాక్స్‌ పేమెంట్‌ ప్రొఫైల్‌తో సరిపోలని డిపాజిట్‌దారుల నుంచి ఈ మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ల ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
internet vaartha 128 Views ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ బ్రూక్‌ఫీల్డ్‌ అస్సెట్‌మేనేజ్‌మెంట్‌ సంస్థలు రెండూ కలిసి జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించింది. సమస్యాత్మక ఆస్తులవ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ జాయింట్‌ వెంచర్‌ కృషిచేస్తోంది. ప్రాథమికంగా వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. బ్రూక్‌ఫీల్డ్‌ ఏడువేల కోట్లకుపైబడి పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. ఎస్‌బిఐ మొత్తం పెట్టుబడుల్లో ఐదుశాతం వాటాతో ఉంది. సమస్యాత్మక ఆస్తుల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల ప్రత్యామ్నాయ పరిష్కారం లభిస్తుందని బ్యాంకు ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య వివరించారు. జాయింట్‌ వెంచర్‌ వివిధ సమస్యాత్మక ఆస్తులను సంక్లిష్ట ఆస్తులను అధ్యయనం చేసి వాటిలో పెట్టుబడులు పెడు తుంది. ఇందుకోసం బ్రూక్‌ఫీల్డ్‌ నిర్వహణ నైపుణ్యాన్ని వినియోగించుకుంటుంది. ఈ విధానం రుణదాతలైన బ్యాంకర్లకు, రుణగ్రస్తులకు ఇద్దరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుందని, బ్యాంకర్లు అద నపు కార్యాచరణ చేపట్టలేని స్థితిలో ఉన్నపుడు, లేదా ప్రమోటర్లు అదనపు మూలధన నిధులు చేకూర్చలేనపుడు ఈవిధానం అమలుకువస్తుంది. ఆ తర్వాత జాయింట్‌ వెంచర్‌ కంపెనీ గుర్తించిన నష్టదాయక ఆస్తుల్లో బ్యాంకర్లతోపాటు పాల్గొని వాటిని విక్రయించడమా, లేక వాటిని వేలం వేసి సొమ్మురాబట్టుకోవడమా అన్నది నిర్ణయిస్తుంది.
1
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌` రిలీజ్ డేట్ ఫిక్స్! యంగ్ హీరో రాజ్‌త‌రుణ్- అను ఇమ్మాన్యుయ‌ల్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దమైంది. TNN | Updated: Jan 18, 2017, 03:18PM IST యంగ్ హీరో రాజ్‌త‌రుణ్- అను ఇమ్మాన్యుయ‌ల్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దమైంది. ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. 2016లో హిట్ అయిన చిత్రాల్లో ఈడోర‌కం-ఆడోర‌కం సినిమా త‌ర్వాత ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`.
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్: మరోసారి ఆకట్టుకున్న తమన్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. Samayam Telugu | Updated: Nov 4, 2019, 10:45PM IST ప్రతిరోజూ పండగే ‘చిత్రలహరి’ చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ అంటూ తెలుగు ప్రేక్షకులకు పండగలాంటి సినిమాను అందించేందుకు సిద్ధమవుతున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అమెరికాలో జరిగింది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ సినిమాలో మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. అలాంటి టైటిల్‌ సాంగ్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు కేకే సాహిత్యం అందించారు. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ మధ్య కాలంలో తమన్ మంచి స్వరాలను అందిస్తున్నారు. మొన్నీమధ్యే ‘అల.. వైకుంఠపురములో...’ రెండు అద్భుతమైన పాటలను స్వరపరిచిన తమన్.. ఇప్పుడు తేజూ కోసం మరో ఆసమ్ ట్యూన్‌ను ఇచ్చారు. ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్ X కాగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు.. ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్‌ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్‌లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్‌గా చూపించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్‌టైన్మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. Also Read: వయొలెన్స్ కావాలన్నారుగా.. సాలిడ్‌గా ఇస్తా: నాని క‌ట్టప్పగా తెలుగు ప్రేక్షకుల‌కి మరింత చేరువైన ప్రముఖ న‌టుడు స‌త్యరాజ్ క్యారెక్టర్‌ని ఈ సినిమాలో ద‌ర్శకుడు మారుతి ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. అలాగే, ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్‌గా ఉండ‌నుందట. ఇంకా ఈ సినిమాలో విజయ కుమార్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ ఇతర పాత్రలు పోషించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Visit Site Recommended byColombia ఇండియా సిమెంట్స్ 70 ఏళ్ల ప్రస్థానం, ఆ సంస్థతో శ్రీనివాసన్ 50 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకొని కాఫీ టేబుల్ బుక్‌ను శుక్రవారం చెన్నైలో రిలీజ్ చేశారు. డిఫైయింగ్ ది పరాడిగమ్ పేరిట శ్రీనివాసన్‌పై రూపొందించిన ఈ పుస్తకాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి రిలీజ్ చేయగా.. తొలి కాపీని మహేంద్ర సింగ్ ధోనికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్, గంభీర్, సెహ్వాగ్, శ్రీనాథ్ తదితర క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహీ మాట్లాడుతూ.. శ్రీనివాసన్‌ను ప్రేమించొచ్చు, ద్వేషించొచ్చు, కానీ ఆయన్ను మాత్రం విస్మరించలేం. చాలా మంది ఆయన్ను ప్రేమించే వారేనని చెప్పుకొచ్చాడు. శ్రీనివాసన్‌ బీసీసీఐ కోశాధికారిగా ఉన్న సమయంలో ఆయన్ను తొలిసారి కలిశానని చెప్పిన మహీ.. అప్పటి వరకూ ఆటగాళ్లు వేతనాలు అందుకోవడానికి నాలుగు నెలలు ఆగాల్సి వచ్చేది. కానీ శ్రీని ఆ సమస్యను పరిష్కరించారని తెలిపాడు. శ్రీనివాసన్‌తో సాన్నిహిత్యం కారణంగా ధోనీ విమర్శలు ఎదుర్కొన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మెయియప్పన్ పాత్ర తేల్చేందుకు ముద్గల్ కమిటీ మహీని ప్రశ్నించింది కూడా. కానీ శ్రీనివాసన్, ధోనీ మధ్య అనుబంధం ఏమాత్రం తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో సుదీర్ఘ కాలం పని చేయడం వల్ల శ్రీనివాసన్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని ధోనీ చెప్పుకొచ్చాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
రాజమౌళినే అంటారా..? బాబు గోగినేనిపై కౌశల్ ఫైర్! Highlights దర్శకుడు రాజమౌళి టాపిక్ తీసుకొచ్చాడు కౌశల్. బాబు గోగినేనిని నామినేట్ చేసిన కౌశల్ అతడిని ఎందుకు నామినేట్ చేస్తున్నాననే విషయాలను చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కసారి అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హౌస్ లో రాజమౌళి ప్రస్తావన తీసుకురావడం అందరికీ షాకింగ్ గా మారింది. ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ లో ఇష్టం లేని మరొక వ్యక్తి నెత్తిపై గుడ్డు పగలగొట్టాలి. దానికి కారణం కూడా చెప్పాలి. అందరూ కౌశల్ ను టార్గెట్ చేసి ఆయన నెత్తిపై గుడ్డు పగలగొట్టారు. హౌస్ లో ఉన్న ఏడుగురు కౌశల్ ను టార్గెట్ చేయడంతో అతడు అసహనానికి లోనయ్యారు. తనపై విమర్శలు చేసిన వారికి సమాధానాలు ఇచ్చే క్రమంలో దర్శకుడు రాజమౌళి టాపిక్ తీసుకొచ్చాడు కౌశల్. బాబు గోగినేనిని నామినేట్ చేసిన కౌశల్ అతడిని ఎందుకు నామినేట్ చేస్తున్నాననే విషయాలను చెప్పుకొచ్చాడు. బాబు గోగినేని.. రాజమౌళిపై చేస్తోన్న వ్యాఖ్యలు సరిగ్గా లేవని నాస్తికుడని చెప్పుకునే రాజమౌళి గుడికి ఎలా వెళ్తున్నారని ప్రశ్నించడం తనకు నచ్చలేదని.. మరో వ్యక్తి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు మీకు లేదంటూ కౌశల్ అతడిని నామినేట్ చేశారు. తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి తనకు దేవుడితో సమానమని అలాంటి  వ్యక్తి గురించి తప్పుగా మాటాడొద్దని అన్నారు. ఇక కౌశల్ కావాలనే రాజమౌళి ప్రస్తావన తీసుకొచ్చి అతడి ఫాలోవర్స్ ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని బాబు గోగినేని మిగిలిన హౌస్ మెంబర్స్ తో అన్నారు.  Last Updated 24, Jul 2018, 12:32 PM IST
0
ఆఫ్రిదీ కంగారు పడాల్సిన అవసరం లేదు Gautam Gambhir – Shahid Afridi న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ తీవ్రంగా విమర్శించారు. కశ్మీరీ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంటేఉ ఐక్యరాజ్యసమితి నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని ఆఫ్రిదీ కోరారు. ఆఫ్రిదీ వ్యాఖ్యలపై భారత మాజీ ఆటగాడు, బిజెపి ఎంపి గౌతం గంభీర్ ధీటుగా స్పందించాడు. మానవ హక్కుల హణనం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనే జరుగుతోందని గంభీర్ చెప్పాడు. మానవ హక్కుల గురించి ఆఫ్రిదీ మాట్లాడటం సంతోషకరమన్నారు. కాగా, మానవ హక్కుల ఉల్లంఘన పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రమే జరుగుతోందన్న విషయాన్ని చెప్పడం ఆయన మర్చిపోయారని కౌంటర్ ఇచ్చాడు. ఆఫ్రిదీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలను తాము చూసుకుంటామని గౌతమ్ గౌంభీర్ చెప్పాడు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2
సమస్యలు కొని తెచ్చుకోకండి: శ్రీరెడ్డి వార్నింగ్ Highlights ఇది డొమెస్టిక్ వయొలెన్స్, ఈవ్ టీజింగ్ సెక్షన్స్ 294, 509, అఫెన్సివ్ ప్రోపగండా యాక్ట్ 1986, ఐపీసీ సెక్షన్ 498ఏ కిందకి వస్తుంది. అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకోవద్దు.  కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులపై కామెంట్స్ చేసిన నటి శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ తారలను టార్గెట్ చేసింది. ఇటీవల చెన్నైకి వెళ్లిన ఆమె అక్కడ ప్రముఖులపై ఆరోపణలు చేస్తుంది. ఈ విషయంలో న్యాయం కోసం నడిగర్ సంఘం వద్దకు వెళ్లాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది. ''నడిగర్ సంఘంతో మాట్లాడబోతున్నాను. నా సమస్యలను వారికి వినిపించాలనుకుంటున్నాను. మహిళల సమస్యపైనే మాట్లాడతాను. నేను నాజర్ గారిని పిలిచాను. ఏం జరుగుతుందో చూడాలి. ప్రెస్ మీట్ లో లేదంటే మీడియా ద్వారా ఎవరైనా నాపై, ఇతర మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చట్టమే శిక్షిస్తుంది. ఇది డొమెస్టిక్ వయొలెన్స్, ఈవ్ టీజింగ్ సెక్షన్స్ 294, 509, అఫెన్సివ్ ప్రోపగండా యాక్ట్ 1986, ఐపీసీ సెక్షన్ 498ఏ కిందకి వస్తుంది. అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకోవద్దు. నేను మాట్లాడిన విషయాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. సత్యమేవ జయతే.. జైహింద్'' అంటూ రాసుకొచ్చింది.  Last Updated 23, Jul 2018, 3:12 PM IST
0
JIO FILM FARE జియోఫిలింఫేర్‌ అవార్డుల నామినేషన్లకు శ్రీకారం హైదరాబాద్‌,జూన్‌ 98: నగరంలో 64వ జియో ఫిలింఫేర్‌ అవార్డ్సు సౌత్‌ 2017 కార్యక్రమాన్ని వర్ధమాన బాలివుడ్‌ హీరో నాగచైతన్య లాంఛనంగా ప్రారంభించారు రిలయన్స్‌జియో తెలంగాణ సిఇఒ కెసిరెడ్డి, ఫిలిమ్‌ ఫేర్‌ ఎడిటర్‌జితేష్‌ పిళ్లైల సమక్షంలో నామినే షన్లు ప్రకటించారు. ఈనెల17వతేదీ నగ రంలోని హెచ్‌ఐసిసి నోవాటెల్‌లో జరుగు తుందని కెసిరెడ్డి వెల్లడించారు. దక్షిణ భారతసినీ నైపుణ్యా న్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మరింతగా సినీపరి శ్రమను ప్రోత్సహించేందుకు వీలుగా ఈఫిలింఫేర్‌ అవార్డుల ప్రధానోత్స వాన్ని నిర్వహిస్తున్నట్లు జియోసిఇఒ పేర్కొన్నారు. భారతీయ సినిమా వైవి ధ్యం గొప్పదనం తెలిసేలా ఈ జియోమిషన్‌ ఈవేడుకలు నిర్వహిస్తుందన్నారు.
1
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Ali Raza: బిగ్ బాస్ 3 విన్నర్ అలీ రజానా? కోపిష్ఠికి టైటిల్ ఏ లెక్కన? బిగ్ బాస్ ఇంకా రెండు నెలలపైనే ఉంది. 16 మందిలో ఐదుగురు బ్యాగ్ సర్దేసినా ఇంకా 11 మంది టైటిల్‌ కోసం నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. ఒక వైపు శ్రీముఖి టైటిల్ ఫేవరేట్‌గా బిగ్ బాస్ హౌస్‌కి వస్తే.. వరుణ్ సందేశ్ సతీసమేతంగా గేమ్‌ని షురూ చేశాడు. వీళ్లు కాదని ఈ అలీ ఏ లెక్కన విన్నర్ అవుతాడు? Samayam Telugu | Updated: Aug 26, 2019, 08:37PM IST Ali Raza: బిగ్ బాస్ 3 విన్నర్ అలీ రజానా? కోపిష్ఠికి టైటిల్ ఏ లెక్కన? బిగ్ బాస్ సీజన్ ప్రారంభమై 36 రోజులైంది. నాగార్జున హోస్ట్‌గా 16 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఐదో వారం నాటికి ఐదుగురు కంటెస్టెంట్స్ సూట్ కేస్ సర్దేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేశారు. తొలివారంలో హేమ, రెండో వారంలో జాఫర్, మూడో వారంలో తమన్నా, నాల్గోవారంలో రోహిణి, ఐదో వారంలో అషు రెడ్డిలు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యారు. 16 మందిలో ఇక మిగిలింది 11 మంది మాత్రమే. Read Also: అషు రెడ్డి బ్యాక్ టు బిగ్ బాస్.. వైల్డ్ కార్డ్ చస్కా మస్కా? ఇక ఈ 11 మందిలో బిగ్ బాస్ విన్నర్ అయ్యేదెవరన్నదానిపై ఇంకా 65 రోజుల ఆట మిగిలి ఉండగానే లెక్కలు మొదలయ్యాయి. ఇందుకోసం గత రెండు సీజన్ల విన్నర్స్, రన్నర్స్‌‌ని ఏ ప్రాతిపదిక ఆడించారు? విజేతలెలా అయ్యారంటూ విశ్లేషణలు మొదలుపెట్టారు. మూడో సీజన్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బిగ్ బాస్ హౌస్‌కి అడుగుపెట్టింది యాంకర్ శ్రీముఖి. ఆమెతో పాటు వరుణ్ సందేశ్ కూడా టైటిల్ కోసం భార్యతో సహా గట్టి పోరాటమే చేస్తున్నారు. ఇక మిగిలిన బాబా భాస్కర్, రవి, అలీ రజా, శివజ్యోతి, వితికా, పునర్నవి, హిమజ, మహేష్ ఇలా 11 మంది కంటెస్టెంట్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్నప్పటికీ వీరిలో బిగ్ బాస్ విన్నర్ అయ్యేది ఒక్కరే కావడంతో ఆ ఒక్కడు అలీ రజా అంటూ కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. బిగ్ బాస్ హౌస్‌లో కోపిష్ఠిగా అందరితో గొడవలు పెట్టుకుంటున్న అలీనే ఈ సీజన్ విన్నర్ అంటూ కొత్త లెక్కలు బయటకు తీస్తున్నారు. అదేంటంటే.. అలీ బిగ్ బాస్ హౌస్‌లో 11వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టడమే అతడ్ని విన్నర్ చేస్తుందట. ఇదేం లెక్క అంటే.. బిగ్ బాస్ సీజన్ 1 విజేతగా నిలిచిన శివ బాలాజీ, సీజన్ 2 విజేత కౌశల్‌లు కూడా 11వ కంటెస్టెంట్స్‌గానే హౌస్‌లో అడుగుపెట్టి విజేతలయ్యారట. ఇప్పుడు సీజన్ 3లో 11వ కంటెస్టెంట్‌గా అలీ రజా అడుగుపెట్టడంతో ఈ సీజన్‌కి కూడా 11 సెంటిమెంట్‌ను ఫాలో అవుతారంటూ అతడే బిగ్ బాస్ విన్నర్ అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ నంబర్ న్యూమరాలజీ వర్క్ ఔట్ అవుతుందా లేదా? అన్నది అలీ రజా ఎలిమినేషన్‌పై ఆధారపడి ఉంటుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
tower1 భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో వాటా విక్రయం ముంబై: భారతి ఎయిర్‌టెల్‌ మంగళ వారం తన భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో 190 మిలి యన్ల షేర్లను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. కెకెఆర్‌, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు లకు 6193.9 కోట్లకు విక్రయించింది. వాటాధర రూ.32చొప్పున మొత్తం 10.3శాతం వాటాలను విక్రయించింది. భారత్‌ లోని అతిపెద్ద టెలి కమ్యూనికేషన్స్‌ సంస్థ గా నిలిచిన ఎయిర్‌టెల్‌ తన రుణభారం తగ్గిం చుకోవాలని చూస్తోంది. భారతి ఎయిర్‌టెల్‌ ఇన్‌ఫ్రాటెల్‌లో తన వాటా 61.7శాతంగా ఉంటుంది. కెకెఆర్‌, సిసిపిఐబి 10.3శాతం వాటాతో ఉంటాయి. ఈ లావాదేవీ తో కెకెఆర్‌భారత్‌ఇన్‌ఫ్రాటెల్‌లో రెండోసారి పెట్టు బడులు పెట్టినట్లయింది. 2008 నుంచి 2015 మధ్యకాలంలో కెకెఆర్‌ పెట్టుబడులుపెట్టింది. తాజా పెట్టుబడుల తర్వాత కెకెఆర్‌, సిపిపిఐబి సంయుక్తం గా ఒకే అతిపెద్ద వాటాదారు బ్లాక్‌లో నిలిచాయి.
1
శేఖ‌ర్ క‌మ్ముల కెరీర్‌లో `ఫిదా` ది బెస్ట్ మూవీ - ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ Highlights ఫిదా సెన్సేషనల్ హిట్ కావడంపై దిల్ రాజు సంతోషం ఫిదా సంబురాలు వేడుక నిర్వహించిన టీమ్ ఫిదా శేఖర్ కమ్ముల కరీయర్ లో అద్భుతమైన చిత్రమన్న అల్లు అరవింద్ యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫిదా'. ఈ చిత్రం జూలై 21న విడుదలై యునానిమస్‌గా సూపర్‌హిట్‌ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. సినిమా స‌క్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో స‌క్సెస్ సంబ‌రాల‌ను నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌, మెగా బ్రదర్‌ నాగబాబు, పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి, హీరో వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ సాయిపల్లవి, దర్శకుడు శేఖర్‌ కమ్ముల, సంగీత దర్శకుడు శక్తి కార్తీక్‌, జె.బి, నటుడు సాయిచంద్‌, రాజు, శరణ్య, గీత, సత్యం రాజేష్‌, గేయ రచయితలు సుద్దాల అశోక్‌ తేజ, వనమాలి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.  సినిమాలో కంటెంట్ న‌మ్మే నిర్మాత దిల్‌రాజు ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ మాట్లాడుతూ - ''సినిమాలు నెమ్మది నెమ్మదిగా జనాలకి ఎక్కుతాయి అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఏ సినిమా అయినా ఫస్ట్‌ షోకే తెలిసిపోతుంది.అలా ఫ‌స్ట్ షోకే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా `ఫిదా`. ఒక పల్లెటూరు వాతావరణంలో, నేటివిటీ మిస్‌ అవకుండా పచ్చని పొలాలు తీశారు శేఖర్‌ కమ్ముల. సినిమా చూసిన వారంద‌రూ ఒక మంచి సినిమా చూసి సంతోషంగా బయటికి వస్తున్నారు. శేఖర్‌ కమ్ముల కెరీర్‌లో 'ఫిదా' బెస్ట్‌ సక్సెస్‌ అని ఫీలవుతున్నాను. ఈమధ్య వరుసగా దిల్‌ రాజు సక్సెస్‌లు సాధిస్తున్నారు. అతన్ని చూస్తే ఈర్ష్య కలుగుతుంది. ఆయనకి వారి శ్రీమతి అనిత ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి. కంటెంట్‌ ఈజ్‌ ద కింగ్‌. స్టార్‌ కాంబినేషన్‌ కాకుండా కంటెంట్‌ని నమ్మి చాలా గొప్ప సినిమాలు తీస్తున్న వారిలో దిల్‌ రాజు ఒకరు. నాగబాబు ఫ్యామిలీలో సక్సెస్‌ వస్తే మా అందరికీ చాలా ఆనందంగా వుంటుంది. వరుణ్‌ ఈ సినిమాలో చాలా నేచురల్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. చాలా ముద్దు వస్తున్నాడు. ఇప్పుడు నేచురల్‌గా చేసే ఆర్టిస్ట్‌లలో వరుణ్‌ ఒకరు. సాయి పల్లవి గ్రేట్‌ టాలెంట్‌ కలిగిన ఆర్టిస్ట్‌. మంచి డ్యాన్సర్‌ కూడా. ఈ సినిమా అంతా తన షోల్డర్‌పై వేసుకొని బాగా క్యారీ చేసింది. సాయిచంద్‌ తండ్రి పాత్రలో అద్భుతంగా యాక్ట్‌ చేశాడు. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, మెగా అభిమానులకి థాంక్స్‌'' అన్నారు.  తెలంగాణ చ‌రిత్ర‌ను దేశ విదేశాల‌కు చాటిన చిత్రం పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ - ''తెలంగాణ మట్టి వాసనని, సంస్కృతిని దేశ విదేశాలకు చాటి చెప్పిన చిత్రం 'ఫిదా'. ఇంత అద్భుతమైన సినిమాని తెరకెక్కించిన శేఖర్‌ కమ్ములకి హ్యాట్సాఫ్‌. తెలంగాణలో హృషికేశ్‌, గుల్జర్‌లాంటి ఒక గొప్ప దర్శకుడు వచ్చాడు. డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌, నిర్మాతగా వరుస సక్సెస్‌లు సాధిస్తున్న దిల్‌ రాజుగారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.  మెగా బ్రదర్‌ నాగబాబు మాట్లాడుతూ - ''మంచి హిట్‌ సినిమా తీసిన నిర్మాత దిల్‌ రాజుని ఫస్ట్‌ అప్రిషియేట్‌ చేస్తున్నాను. దిల్‌ రాజు లేకపోతే ఈ సినిమా హిట్‌ అయ్యేది కాదు. కథను నమ్మి ప్యాషన్‌తో, ఇష్టంతో ప్రతి విషయంలో ఇన్‌వాల్వ్‌ అయి ప్రొఫెషనల్‌గా ఈ సినిమా తీశారు. హ్యాట్సాఫ్‌ దిల్‌ రాజు. ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్‌, బాపుల తర్వాత గోదావరి అందాల్ని, విలేజ్‌ నేటివిటీని అందంగా చూపించే దర్శకుల్లో శేఖర్‌ కమ్ముల ఒకరు. ఆయన ఏ సినిమా చేసినా మనసు పెట్టి తీస్తాడు. సాయిచంద్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌ ఎక్స్‌లెంట్‌గా చేశారు. సినిమాలో అంతా కొత్త వాళ్లే నటించారు. అందుకే చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అన్పిస్తుంది. శక్తి కార్తీక్‌ అదిరిపోయే సాంగ్స్‌ చేశారు. జె.బి. సూపర్‌ రీరికార్డింగ్‌ చేశారు. సాయి పల్లవి భానుమతి క్యారెక్టర్‌ అద్భుతంగా చేసింది. సినిమా చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయాం. 'మిస్సమ్మ'లో సావిత్రిలా 'ఫిదా'లో సాయి పల్లవి అంత అద్భుతంగా చేసింది. వరుణ్‌ చాలా నేచురల్‌గా యాక్ట్‌ చేశాడు. ఈ సినిమాకి వర్క్‌ చేసిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరికీ కంగ్రాట్స్‌'' అన్నారు.  మంచి అనుభూతుల్ని మిగిల్చిన సినిమా సాయిచంద్‌ మాట్లాడుతూ - ''ఫిదా' నా జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. హీరోగా నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ నాకు ఇష్టమైన అన్నపూర్ణ, విజయ సంస్థల్లో పని చేయలేదు. 'మిస్సమ్మ', 'గుండమ్మ కథ'లాంటి గొప్ప చిత్రాల్లో నేను వర్క్‌ చేయలేదే అనే ఫీలింగ్‌ మిగిలిపోయింది. ఆ కోరిక 'ఫిదా'తో తీరిపోయింది. ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్‌ దేశ విదేశాల నుండి చాలా అప్రిషియేషన్స్‌ వస్తున్నాయి. నాకు ఈ సినిమా చాలా అనుభూతుల్ని మిగిల్చింది. ఈ సినిమాకి 'ఫిదా' అయ్యాను. ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన శేఖర్‌ కమ్ముల, దిల్‌ రాజుగారికి నా థాంక్స్‌'' అన్నారు.  టీమ్‌కు థాంక్స్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ - ''ఈ సినిమా ఆత్మ తెలంగాణ. జానపదాలు, బతుకమ్మ పాటలు చిన్నప్పుడు నుండి వినేవాడిని. తెలంగాణ యాస అన్నా, భాష అన్నా చిన్నప్పటి నుండి ఇష్టం. ఈ సినిమాకి గుండెకాయ సాయి పల్లవి. తెలంగాణ భాష నేర్చుకుని ఓన్‌గా డబ్బింగ్‌ చెప్పింది. వరుణ్‌ చాలా నేచురల్‌గా క్యారెక్టర్‌కి తగ్గట్లు పెర్‌ఫార్మ్‌ చేశాడు. విజయ్‌ సి. కుమార్‌, మార్తాండ్‌ కె.వెంకటేష్‌, నేను ముగ్గురం ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా చేశాం. ఇది శేఖర్‌ కమ్ముల ఫిలిం అని నాకు ఎంతో ఫ్రీడమ్‌ ఇచ్చిన దిల్‌ రాజుగారికి నా థాంక్స్‌. శక్తి బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. జె.బి. తన ఆర్‌.ఆర్‌తో సినిమాని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఈ సినిమాలోని మెస్సేజ్‌ అందరికీ కనెక్ట్‌ అయ్యింది. నాకు సహకరించిన ఆర్టిస్ట్‌లకి, టెక్నీషియన్స్‌ అందరికీ నా కృతజ్ఞతలు'' అన్నారు.  సినిమా చూసిన‌వారంద‌రూ ఎంజాయ్ చేస్తున్నారు నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ - ''ఫిదా' సినిమా సెన్సేషన్‌ అయ్యింది. ప్రేక్షకులకి థాంక్స్‌ తెలపడానికి 'ఫిదా' సంబరాలు స్టార్ట్‌ చేశాం. ఇది ఇంకా కంటిన్యూగా సాగుతుంది. నేను ఫారిన్‌లో వున్నప్పుడు రిలీజ్‌కి ముందే శేఖర్‌ కమ్ముల, మార్తాండ్‌ కె.వెంకటేష్‌ ఫీల్‌ గుడ్‌ మూవీ చాలా బాగా వచ్చింది అని నాకు మెస్సేజ్‌ పెట్టారు. వచ్చిన తర్వాత నాగబాబు, అరవింద్‌గారి ఫ్యామిలీకి షో వేశాం. సినిమా చూసి చాలా బాగుంది అన్నారు. 'బొమ్మరిల్లు' టైమ్‌లో కడప నుండి సినిమా సూపర్‌హిట్‌ అని కాల్‌ వచ్చింది. ఇప్పుడు నెల్లూరు నుండి వచ్చింది. 'ఫస్ట్‌ షో చూసినప్పుడే 'ఫిదా' బ్లాస్ట్‌ అవుతుందని ఫీలయ్యాం. ప్రపంచవ్యాప్తంగా 'ఫిదా'ని సూపర్‌హిట్‌ చేశారు ప్రేక్షకులు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మా ప్రతి సినిమాలో నేను ఇన్‌వాల్వ్‌ అవుతాను. ఈ ఫిలింకి నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ లేదు. ఇది శేఖర్‌ కమ్ముల ఫిలిం. వరుణ్‌ చాలా నేచురల్‌గా యాక్ట్‌ చేసి అందరి మన్ననలను పొందుతున్నాడు. సాయి పల్లవి చేసిన భానుమతి క్యారెక్టర్‌ని అందరూ ఓన్‌ చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు'' అన్నారు.  భానుమతి క్యారెక్టర్‌ లేకపోతే 'ఫిదా' లేదు హీరో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ - ''ఫిదా' సక్సెస్‌ సంబరాలు చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఏదైనా సినిమా హిట్‌, ఫ్లాప్‌లు సహజం. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులు ఓన్‌ చేసుకుని రిపీటెడ్‌గా చూస్తారు. సాయి పల్లవి క్యారెక్టర్‌కి చాలా మంచి అప్లాజ్‌ వస్తోంది. ఈ చిత్రంలో భానుమతి క్యారెక్టర్‌ లేకపోతే 'ఫిదా' లేదు. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరిస్తున్నారు. మంచి సినిమాలు వస్తే మేము ఆదరిస్తామని ప్రేక్షకులు 'ఫిదా'తో మరోసారి ప్రూవ్‌ చేశారు'' అన్నారు.  స‌క్సెస్ క్రెడిట్ వారిదే.. హీరోయిన్‌ సాయి పల్లవి మాట్లాడుతూ - ''ఈ సక్సెస్‌ క్రెడిట్‌ అంతా మా టీమ్‌కే చెందుతుంది. ఫస్ట్‌ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ అయినందుకు చాలా ఆనందంగా వుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శేఖర్‌ కమ్ముల, దిల్‌ రాజుగారికి నా థాంక్స్‌'' అన్నారు. ᐧ
0
internet vaartha 159 Views కొలంబో : శ్రీలంక స్పిన్‌ దిగ్గజం మురళీధరన్‌పై శ్రీలంకజట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. మురళీధరన్‌పై  క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేయడమేంటనే అనుమానం వచ్చిందా? మురళీ ధరన్‌ ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు జరుగనున్న పల్లెకిలే స్టేడియంలో పిచ్‌ను తయారు చేస్తుండగా, మురళీధరన్‌ అక్కడికి చేరుకున్నాడు. దీంతో స్టేడియం నిర్వాహకులు మురళీధరన్‌ను అడ్డుకున్నారు. దీంతో వారిని దురుసుగా తోసుకుంటూ లోపలికి వచ్చిన మురళీధరన్‌ శ్రీలంక టీమ్‌ మేనేజర్‌ చరితా సేననాయకే తో వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఆయనపై శ్రీలంక బోర్డు అధ్యక్షుడు సుమతి పాల క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేశాడు.ఒక జట్టుకు కన్సల్టెంట్‌గా ఉన్నవ్యక్తి  మరో జట్టు పిచ్‌లు రూపొందించేటప్పుడు రావడం నిబంధనలకు విరుద్దమని,ఆ ఫిర్యాదులో పేర్కొన్న సుమతి పాల, మురళీ ఇలా పవర్తిస్తాడని భావించలేదని పేర్కొన్నాడు. ఇంకోసారి ఇలా జరుగకుండా చూడాలని ఆయన క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సూచించాడు.
2
Crisworks బెంగళూరుపై గెలుస్తామని అసలు ఊహించలేదు కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తాము గెలుస్తామని అసలు ఊహించలేదని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.బెంగళూరుని నైట్‌ రైడర్స్‌ చిత్తు చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.టార్గెట్‌ ఛేదనకు బరిలోకి దిగిన బెంగళూరును నాథన్‌ కౌల్టర్‌-నైల్‌ 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా,క్రిస్‌ వోక్స్‌ 6 పరుగులిచ్చి 3 వికెట్లు,గ్రాండ్‌ హోమ్‌ 4 పరుగులిచ్చి 3 వికెట్లు,ఉమేశ్‌ 15 పరుగు లిచ్చి 1 వికెట్‌ తీసుకుని దుమ్ము రేపారు.మ్యాచ్‌ అనంతరం క్రిస్‌ వోక్స్‌ మీడియాతో మాట్లాడాడు.స్వల్ప టార్గెట్‌ను ముందుంచిన మేము బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న బెంగళూరుతో గెలువడం కష్టంగా భావించామన్నాడు.అయితే గంభీర్‌ ఇచ్చిన స్ఫూర్తి మాలోని పోరాట పటిమను పెంచింది. ముందుగా వేసిన బౌలర్లు త్వరగా వికెట్లు తీయడంతో తరువాత బౌలర్లకు సులభమైందని వోక్స్‌ పేర్కొన్నాడు.అప్పటి నుంచి మేం సరైన ప్రాంతంలో బంతులు వేశాం.కౌల్టర్‌-నైల్‌,ఉమేశ్‌ బంతిని స్వింగ్‌ చేశారు.నేను స్వింగ్‌ చేయకుండా ఆఫ్‌ సైడ్‌ సరైన ప్రాంతంలో బంతులేశా.వికెట్లు పడుతున్న ప్పుడు అలాంటి బంతులు బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టివేస్తాయి అని వోక్స్‌ వివరించాడు.ముఖ్యంగా క్రిస్‌ గేల్‌,కోహ్లీ, డివిలియర్స్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌పై ఆశలు కలిగాయని వోక్స్‌ వ్యాఖ్యానించాడు.ఈ మ్యాచ్‌లో వోక్స్‌ 2-0-6-3 తో అద్భుత ప్రదర్శన కనబరిచాడు.ఈ మ్యాచ్‌లో వోక్స్‌ గేల్‌,బిన్నీ,శ్యాముల్‌ బద్రీలను పెవిలియన్‌కు చేర్చాడు. పది సంవత్సరాల ఐపిఎల్‌లో కౌల్టర్‌-నైల్‌,గ్రాండ్‌ హోమ్‌లకు మూడు వికెట్లు దక్కగా ఉమేశ్‌ యాదవ్‌కు ఒక వికెట్‌ దక్కింది.కోల్‌కతా నైట్‌ రైడర్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 49 పరుగులకే ఆలౌటైంది.దీంతో పది సంవత్సరాల ఐపిఎల్‌ చరిత్రలో అత్యల్పస్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది.అనంతరం టార్గెట్‌ ఛేదన కోసం బరిలోకి దిగిన బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకు ఆలౌటైంది.ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోవడం ఐపిఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి.ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 82 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
2
London, First Published 15, Sep 2018, 10:19 PM IST Highlights ఆటలో ఆస్ట్రేలియా జట్టు క్రూరమైన తీరుపై ఇంగ్లాండు క్రికెటర్ మొయిన్ అలీ తీవ్రంగా మండిపడ్డాడు. తనను ఒసామా బిన్ లాడెన్ అంటూ ఓ ఆస్ట్రేలియా ఆటగాడు పిలిచేవాడని ఆయన గుర్తు చేసుకున్నాడు.  ఆటలో ఆస్ట్రేలియా జట్టు క్రూరమైన తీరుపై ఇంగ్లాండు క్రికెటర్ మొయిన్ అలీ తీవ్రంగా మండిపడ్డాడు. తనను ఒసామా బిన్ లాడెన్ అంటూ ఓ ఆస్ట్రేలియా ఆటగాడు పిలిచేవాడని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఈ సంఘటన 2015లో యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా జరిగిందని చెప్పాడు. ది టైమ్స్‌ ప్రసారం చేస్తున్న మొయిన్‌అలీ ఆత్మకథలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నాడు. కార్డిఫ్‌లో జరిగిన మొదటి యాషెస్‌ టెస్టు సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలిపాడు. అది తన తొలి యాషెస్‌ టెస్టు. నా ప్రతిభను ప్రదర్శించేందుకు పనికి వచ్చేదని, కానీ, అక్కడ జరిగిన ఒక ఘటన తనపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని అన్నాడు.  ఒక ఆస్ట్రేలియా ఆటగాడు తనను ఒసామా‌ అంటూ పిలిచేవాడని చెప్పాడు. అయితే మైదానంలో తాను ఎప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెప్పాడు. ఆ ఆటగాడు చేసిన వ్యాఖ్యల గురించి ఒకరిద్దరు ఆసీస్‌ ఆటగాళ్లకు, ఆ జట్టు కోచ్‌ డారెన్‌ లీమన్‌కు చెప్పానని అన్నాడు.  అప్పుడు కోచ్‌ డారెన్‌ ఆ క్రీడాకారుడిని పిలిచి "మొయిన్‌ అలీని ఒసామా అని పిలిచావా" అని ప్రశ్నించినట్లు తెలిపాడు. కానీ, ఆ క్రికెటర్ "నేను అలా పిలవలేదు. కేవలం పార్ట్‌టైమర్‌ అని మాత్రమే అన్నాను" అని అబద్ధం చెప్పాడని వివరించాడు. ఒసామా, పార్ట్‌ టైమర్‌ అనే పదాలకు తనకు తేడా తెలుసునని, మరీ అంత పిచ్చివాడిని కాదని మొయిన్ అలీ అన్నాడు. తాను సరిగానే విన్నానని తెలిపాడు. అందుకే మ్యాచ్‌ మొత్తం తాను కోపంగానే ఉండాల్సి వచ్చిందని అలీ అన్నాడు. Last Updated 19, Sep 2018, 9:26 AM IST
2
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2
మార్కెట్లకు అమ్మకాల సెగ స్టాక్స్‌ విక్రయానికే ఇన్వెస్టర్ల ఆసక్తి ముంబయి, మే 6: ప్రపంచ మార్కెట్లలో నెల కొన్న బలహీనతలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీక రణ వంటి అంశాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొ న్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అన్ని రంగా ల్లోను స్టాక్స్‌ను విక్రయించుకోడానికే ఎక్కువ ఆసక్తి చూపించడంతో మార్కెట్లు ఏదశలో కూడా కోలు కునే పరిస్థితి కనిపించలేదు. రోజు మొత్తం కనిష్ట స్థాయిలోనే ముగిసాయి. స్టాక్‌ట్రేడింగ్‌ ముగిసే సవ ుయానికి సెన్సెక్స్‌ 267 పాయింట్లు క్షీణించి 29,589పాయింట్లవద్ద స్థిరపడితే నిఫ్టీ75 పాయిం ట్లు క్షీణించి 9285 వద్ద ట్రేడింగ్‌ ముగించింది. మొండి బకాయిల సమస్యనుంచి బైటపడేసేందుకు బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలు తీసు కువచ్చిన నేపథ్యంలో తొలుత లాభాలతో పరుగులు తీసిన ప్రభుత్వ బ్యాంక్‌ స్టాక్స్‌ చివరిలో భారీ అమ్మ కాలతో భారత పతనం అయ్యాయి. చమురుసహా మెటల్స్‌ధరలు పతనం కావడంతో ఎన్‌ఎస్‌ఇలో ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్‌ సూచీలు రెండు శాతం పతనం అయ్యాయి. ఇదే బాటలో ఎఫ్‌ఎం సిజి, రియాల్టీ, ఆటోరంగాలు సైతం ఒకటిశాతం చొప్పున నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఇలో ఏ ఒక్క విభాగంలోను లాభాలు కనిపించలేదు. ఇక బ్లూచిప్‌ కంపెనీలపరంగాచూస్తే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, టాటా మోటార్స్‌, హిందాల్కో, జీ, యాక్సిస్‌బ్యాంకు, ఒఎన్‌జిసి, గెయిల్‌, రిల్‌, టాటాస్టీల్‌ 2-4శాతం మధ్య నష్టపోయాయి. ఐబి హౌసింగ్‌ ఎసిసి, అదానిపోర్టులు, హెచ్‌సిఎల్‌టెక్‌, ఏసియన్‌ పెయిం ట్స్‌, బోష్‌ 1-3శాతం మధ్య బలపడ్డాయి. దేశీయ స్టాక్స్‌లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకా లకే ఎక్కువ ఆసక్తిచూపించారు. ముందురోజు నగదు విభాగంలో రూ.610 కోట్ల పెట్టుబ డులు వెనక్కితీసుకున్నారు. గడచిన రెండు వారాల్లో ఎఫ్‌పిఐలు నగదులోనే ఏడువేల కోట్లకుపైగా స్టాక్స్‌ విక్రయించారు. మరో వైపు పెట్టుబడులను కుమ్మరిస్తున్న దేశీయ ఫండ్స్‌ సంస్థలు గురువారం మరోసారి 926 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. గడచిన 11రోజుల్లో ఫండ్స్‌ సుమారు రూ.8100 కోట్లు పెట్టుబడులు పెట్టా యి. చిన్నషేర్లకుసైతం అమ్మకాల ఒత్తిడి తాకింది. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌సూచి 1.1శాతం పతనం కాగా, స్మాల్‌కాప్‌ సూచి 0.8శాతం క్షీణించింది. ట్రేడింగ్‌ జరిగిన మొత్తం షేర్లలో రెండువేలు నష్టపోతే 837 స్వల్పలాభాలు సాధించాయి. మిడ్‌క్యాప్స్‌లో టాటాకమ్యూనికేషన్స్‌ 9శాతం క్షీణించింది. లాభాలపరంగా కొన్ని సంస్థలు 1.5 నుంచి 2.7శాతం కూడా లాభపడ్డాయి. వీటిలో మిడ్‌క్యాప్స్‌లో ఐబి హౌసింగ్‌, బెర్జర్‌ పెయింట్స్‌, జెఎస్‌డబ్ల్యు, ఎనర్జీ, ఎక్సైడ్‌, ఓబెరా§్‌ు రియాల్టీ, ఎంఆర్‌ఎఫ్‌ అపోలో హాస్పిటల్స్‌ వంటివి లాభ పడ్డాయి. స్మాల్‌క్యాప్స్‌లో ఓరియంట్‌ వినీర్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, గుజరాత్‌ అంబూజా, ఎంఎస్‌ఆర్‌, ఐబి వెంచర్స్‌, ఎన్‌డిటివి సునీల్‌ హైటెక్స్‌, స్పైస్‌జెట్‌, ఫినోలెక్స్‌ వంటివి4-10శాతంవరకూ లాభపడ్డాయి.
1
కొలువులు కొల్లగొట్టడంలేదు.. కల్పిస్తున్నాం! - భారత్‌తో అమెరికాకే బాగా లబ్ది - టెక్నాలజీ రంగంలో 4,11,00 మందికి ఉద్యోగాలు - 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు - తాజా నివేదికలో తేల్చిన నాస్కామ్‌ వాషింగ్టన్‌: అమెరికా ఆర్థిక వ్యవస్థలకు భారత టెక్నాలజీ పరిశ్రమ ఎంతగానో మేలు చేస్తోందని నాస్‌కామ్‌ అభిప్రాయపడింది. ఈ ఏడాది దాదాపు 4,11,000 మందికి ఉద్యోగావకాశాలను కల్పించడంతో పాటు 2011-15 మధ్య కాలంలో దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర పన్నుల రూపంలో పరిశ్రమ చెల్లించిందని నాస్‌కామ్‌ 'కంట్రిబ్యూషన్స్‌ ఆఫ్‌ ఇండియాస్‌ టెక్‌ ఇండస్ట్రీ టు ది యూఎస్‌ ఎకానమీ' అనే పేరున విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. భారతీయులు అమెరికన్ల కొలువులను కొల్లగొడుతున్నట్లు వస్తున్న వాదనను ఈ నివేదిక తోసిపుచ్చింది. తాము కొత్తగా ఉద్యోగావకాశాలను కల్పించడంతో పాటు జాతీయ నిరుద్యోగ సగటు కంటే కూడా టెక్నాలజీ రంగంలో నిరుద్యోగిత తక్కువగా ఉందని తగిన గణాంకాలతో సహా తెలిపింది. అమెరికా సంస్థల పరపతి పెంచేందుకు, వినూత్న, చౌకైన సొల్యూషన్స్‌ అందించడం ద్వారా ప్రపంచ మార్కెట్లో ఆ దేశం తన స్థానాన్ని నిలుపుకునేందుకు భారత ప్రతిభ ఎంతగానో దోహదం చేస్తోందని నాస్‌కామ్‌ వివరించింది. అమెరికా ఖజానాకు భారత్‌ టెక్నాలజీ పరిశ్రమ 2011-2015 మధ్య కాలంలో దాదాపు 375 మిలియన్‌ డాలర్ల మేర తోడ్పాటను అందించిందని తెలిపింది. త్వరలో భారత్‌-అమెరికాల వ్యూహాత్మక ద్వైపాక్షక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నాస్‌కామ్‌ రూపొందించిన ఈ నివేదికను వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ సోమవరం వెల్లడించారు. త్వరలో అమెరికాకు భారత సంస్థలు చేస్తున్న మేలును గురించి వివరిస్తూ వెలువడిన ఈ నివేదక త్వరలో జరగనున్న చర్చలలో పలు కీలక నిర్ణయాలను తీసుకొనేందుకు దోహదం చేయగలదని అన్నారు. ఆ దేశంలో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులకు, 20 బిలియన్‌ డాలర్ల పన్నుల చెల్లింపులకు, వందలు వేలకొద్ది కొత్త ఉద్యోగాల కల్పనకు దోహదం చేయగలదని తెలిపారు. అమెరికాలో భారత్‌ సంస్థలు అందిస్తున్న దాతృత్వ కార్యక్రమాల ద్వారా సాయం పొందుతున్నవారి సంఖ్య ప్రస్తుతం ఉన్న 1,20,000 నుంచి మరింత పెరిగేందుకు దోహదం చేయగలదని అభిప్రాయపడ్డారు. ఈ నివేదికలోని ఇతర ప్రధాన అంశాలు.. శ్రీ అమెరికాలోని క్యాలీఫోర్నియా, టెక్సాస్‌, ఇల్లినాయిస్‌, న్యూజెర్సీ, న్యూయార్క్‌ నగరాలలో భారత ఐటీ కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాయి. శ్రీ దాదాపు 2 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడ చాలా ఉద్యోగాలను కాపాడాయి.శ్రీ అమెరికాలో నిపుణులైన ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉంది. దీని ఫలితంగా 2022 నాటికి దాదాపు 4,45,000 కంప్యూటర్‌ నిపుణుల కొరత ఏర్పడనుంది.శ్రీ విదేశీయులకు భారత కంపెనీలు తక్కువ స్థాయిలో జీతాలను చెల్లిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను కూడా ఈ నివేదిక ఖండించింది. విదేశీ ఉద్యోగులకు అమెరికా జాతీయులకు కూడా భారత్‌ కంపెనీలు ఒకే విధమైన వేతనాలను చెల్లిస్తున్నట్లు తెలిపింది.శ్రీ భారత కంపెనీలు ఫార్ఛూన్‌ 500 సంస్థలలోని 90 శాతం కంపెనీలకు, వేలాది అమెరికన్‌ కంపెనీలకు అవసరమైన నిర్వహణ తొడ్పాటును, ఆర్థిక విలువను కల్పించడానికి కృషి చేస్తున్నాయి.శ్రీ అమెరికన్‌ కంపెనీలు అన్ని కొణాల్లో వ్యాపార వాణిజ్యాల్ని విస్తరించేందుకు అవసరమైన పరిస్థితులను కల్పిస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో ఐటీ జీతాలు తక్కువే న్యూఢిల్లీ: ఇతర దేశాలతో పోలిస్తే ఐటీ రంగ నిపుణులకు భారత కంపెనీలు చాలా తక్కువ స్థాయిలో జీతాలను చెల్లిస్తున్నాయని ఒక సర్వేలో తేలింది. ఐటీ ఉద్యోగులకు తక్కువ మొత్తంలో జీతాలు చెల్లిస్తున్న పది దేశాల సరసన భారత్‌ చివరి నుంచి ఏడో స్థానంలో నిలిచింది. మన దేశంలో మధ్య శ్రేణి ఐటీ మేనేజర్‌ స్థాయి ఉద్యోగులు ఏడాదికి సగటున 41,312 డాలర్ల వేతనాన్ని పొందుతుండగా.. స్విట్జర్లాండ్‌లో ఇదే స్థాయి ఉద్యోగి దాదాపు నాలుగు రెట్లు (1,71,465 డాలర్ల)అధికంగా జీతాన్ని ఆర్జిస్తున్నట్లుగా 'మై హైరింగ్‌ క్లబ్‌.కామ్‌' సంస్థ 'వరల్డ్‌ ఐటీ సర్వే-2015'లో తేల్చింది. ఐటీ రంగంలో మేటిగా చెప్పబడుతున్న దాదాపు 40 దేశాలలోని 9,413 కంపెనీలకు చెందిలన మధ్యశ్రేణి ఉద్యోగుల వార్షిక చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటూ గత నెలలో ఈ సర్వేను రూపొందించారు. బల్గేరియాలోని కంపెనీలు మిగతా ఐటీ దేశాల కంపెనీల కంటే కూడా ఉద్యోగులకు తక్కువ స్థాయిలో (సగటున 25,680 డాలర్ల) జీతాన్ని మాత్రమే చెల్లిస్తున్నాయి. తరువాతి మూడు స్థానాలను వరుసగా వియత్నాం (30,938 డాలర్లు), థారులాండ్‌ (34,423 డాలర్లు), మలేషియా (3,540 డాలర్లు), ఇండోనేషియా (3,780 డాలర్లు), ఫిలిప్ఫిన్స్‌ (37,500 డాలర్లు) నిలిచాయి. ఈ సరే ఐటీ ఉద్యోగులకు మేటి జీతాలను చెల్లిస్తున్న దేశాలలో స్విట్జర్‌లాండ్‌ తరువాత రెండో స్థానాన్ని బెల్జియం (1,52,980 డాలర్లు), డెన్మార్క్‌ (1,38,920 డాలర్లు), అమెరికా(1.32,877 డాలర్లు), బ్రిటన్‌ (1,29,322డాలర్లు), ఐర్లాండ్‌ (1,22,433డాలర్లు), జర్మనీ (1,16,454డాలర్లు), కెనడా (1,15,232డాలర్లు), ఆస్ట్రేలియా (1,12,340డాలర్లు), హాంగ్‌కాంగ్‌ (1,05,320డాలర్లు)లు నిలిచాయి. ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపాలోని అవుట్‌సోర్సింగ్‌, ఆఫ్‌షోరింగ్‌ ఐటీ రోల్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో చెల్లింపును గురించి వివరిస్తున్నట్లుగా మై హైరింగ్‌క్లబ్‌.కామ్‌, ఫ్లిక్‌ జ్‌బ్స్‌.కామ్‌ సీఈఓ రాజేష్‌ కుమార్‌ తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV యాక్సిడెంట్ అయింది నా కారుకి కాదు: బిగ్‌బాస్ భామ యషికా క్లారిటీ యషికా ఆనంద్ కారు ప్రమాదానికి గురైందని, ఆమె ఫుల్‌గా తాగి నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా యషికా స్పందించారు. Samayam Telugu | Updated: Oct 7, 2019, 10:07AM IST యషికా ఆనంద్ ప్రముఖ తమిళ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ యషికా ఆనంద్ యాక్సిడెంట్ వార్తలపై స్పందించారు. శనివారం అర్థరాత్రి యషికా ఆనంద్ తన స్నేహితులతో కలిసి కారులో లాంగ్ ట్రిప్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు నుంగబాక్కమ్ ప్రాంతంలో యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో భరత్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయట. ప్రస్తుతం అతను హాస్పటిల్‌లో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. READ ALSO: అమ్మడు హద్దులు దాటేసింది.. జాన్వీ హాట్ ఫొటోస్‌ అయితే కారు ప్రమాదం జరిగిన సమయంలో యషికా ఫుల్‌గా తాగి ఉన్నారని వార్తలు వచ్చాయి. పైగా యాక్సిడెంట్ జరిగాక ఎక్కడ పోలీసులు పట్టుకుంటారోనన్న భయంతో అక్కడి నుంచి పారిపోయారని వదంతులు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా యషికా తమిళ మీడియా వర్గాల ద్వాారా స్పందించారు. ప్రమాదానికి గురైంది తన కారు కాదని తన ఫ్రెండ్ కారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను వేరే కారులో ఉన్నానని పేర్కొన్నారు. యాక్సిడెంట్ అయ్యాక పారిపోయానని వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఏం జరిగిందో చూసేందుకు కారు దిగానని పేర్కొన్నారు. తన వద్ద హోండా సిటీ కారు తప్ప మరో వాహనం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో తన కారు ఫొటోను పోస్ట్ చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను కారులో ఉన్న తన ఫ్రెండ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. తాగి కారు నడిపానంటూ తనపై తప్పుడు వార్తలు రాసిన మీడియా వర్గాలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను ఓ సెలబ్రిటీని కావడంతో పాపులారిటీ కోసం తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. READ ALSO: హీరోయిన్‌తో కేఎల్ రాహుల్ డిన్నర్, ఏంటి మ్యాటర్? పాదం, కవలై వెండమ్, మణియార్ కుదుబం, జాంబీ, నోటా వంటి సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యషికా. ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాస్ సీజన్ 3కు ఇటీవల గెస్ట్‌గా హాజరయ్యారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0
Sehwag పంజాబ్‌ విజయాల వెనుక సెహ్వాగ్‌ న్యూఢిల్లీ: గత సంవ్సరం దారుణమైన ప్రదర్శనతో ఐపిఎల్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఐపిఎల్‌ 10వ సీజన్‌ కొత్త ఉత్సాహంతో వరుస విజయాలను సొంతం చేసుకుంటుంది. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధించింది.పుణేతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్లతేడాతో విజయం సాధిం చిన పంజాబ్‌,తాజాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.49 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్‌ రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలోనే విజయం సాధించింది.పంజాబ్‌ ఓపెనర్‌ హసీమ్‌ ఆమ్లా 58 పరుగులు,కెప్టెన్‌ మాక్స్‌వెల్‌ 43 పరుగులతో చెలరేగడంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ టార్గెట్‌ ఛేదించింది. ఈ వరుస విజయాల వెనుక ఉన్నది మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌ అని ఆ జట్టు ఓపెనింగ్‌ బ్యాట్స్‌ మెన్‌ హషీం ఆమ్లా పేర్కొన్నాడు.తాజా మ్యాచ్‌ అనంతరం మీడియాతో ఆమ్లా మాట్లాడుతూ ఓ శుభారంభం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌హెడ్‌ అయిన సెహ్వాగ్‌ ఆటగాళ్ల విషయంలో ఎంతో అద్భుతంగా పనిచేశారు అని హషీం వివరించాడు.ఒకప్పుడు విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ అయిన సెహ్వాగ్‌ పంజాబ్‌ ఆటగాళ్ల విషయంలో ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని ఆమ్లా తెలిపాడు.ఆటగాళ్ల ఆటశైలిని మార్చుకోవాలని సెహ్వాగ ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని పేర్కొన్నాడు.ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌లో వీరు ఒకరన్న విషయం మా అందరికి తెలుసు.ఒక ప్రత్యేక శైలికి అలవాటు పడాలని చెప్పే వ్యక్తి కాదు.ప్రతి ఆటగాడు తమ సామర్థ్యం మేరకు ఉత్తమంగా ఆడాలని మాత్రమే సెహ్వాగ్‌ ప్రోత్సహిస్తున్నాడు. జట్టుకు ఉపయోగ పడే రీతిలో ఆటగాళ్లు తమసామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించేవాడు అని హషీం వెల్లడించాడు. ఇక పంజాబ్‌ జట్టు కెప్టెన్‌గా కాకుండా సీనియర్‌ ఆటగాళ్లు ఇచ్చిన సూచనలు పట్టించుకుంటాడని ఆమ్లా పేర్కొ న్నాడు. మ్యాక్సీ ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఆడాలని ప్రోత్సహిస్తుంటాడు. అతనో ఒక అద్భుతమైన ప్లేయర్‌ అని హషీం వివరించాడు.
2
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఆలయాలు చుట్టేస్తోన్న అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం... TNN | Updated: Aug 6, 2017, 08:27PM IST దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కర్ణాటకలో వున్న పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తున్నాడు. తన కుటంబసభ్యులతో కలిసి హంపి పర్యటనకి వెళ్లిన అల్లు అర్జున్ని అక్కడి అభిమానులు చుట్టుముట్టారు. ఆ తర్వాత సుప్రసిద్ధ దేవాలయం విరుపాక్ష టెంపుల్, విజయ విఠల్ల టెంపుల్, కమల్ మహల్ వంటి దేవాలయాల్లో దైవ దర్శనం పూర్తి చేసుకుని అక్కడి నుంచి తిరిగి హోస్పెటలో తాము బస చేసిన హోటల్‌కి వెళ్లిపోయారు. దువ్వాడ జగన్నాథమ్ తర్వాత నా పేరు సూర్య సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమాతో పూర్తి బిజీ కాకముందే అలా కుటుంబంతో కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ టూర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
0
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV షాకింగ్: ‘బిగ్ బాస్ విన్నర్‌గా శ్రీముఖి.. మిగిలినోళ్లు వెర్రి వెంగలప్పలు’ బిగ్ బాస్ విన్నర్‌ ఎవరో ముందే డిసైడ్ అయ్యారా? ఎవరు ఎన్ని వారాలు ఉండాలన్నది ముందే ఫిక్సా? రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్‌లను కాదని శ్రీముఖిని విన్నర్ చేయబోతున్నారా? తెర వెనుక ఏం జగరబోతోంది? Samayam Telugu | Updated: Oct 30, 2019, 03:16PM IST శ్రీముఖి ‘‘బిగ్ బాస్ విన్నర్‌ ఎవరో నిర్ణయించేది ప్రేక్షకులు మాత్రమే.. నేను, ఆర్గనైజర్స్, రికమండేషన్స్ అలాంటివి ఇక్కడ చెల్లవు. ఒవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదే ముఖ్యం ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్లే గెలుస్తారు. ఈ ఓట్లను లెక్కించడానికి థర్డ్ పార్టీ కూడా ఉంది. వాళ్లు ముంబై నుండి నెట్ వర్క్ చేస్తున్నారు. బిగ్ బాస్ వాళ్లు ముందే ముందే డిసైడ్ అయ్యారన్న దాంట్లో కన్ఫ్యూజన్ వద్దు’’.. ఇదీ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్తున్న మాట. పోల్ అయితే బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ హిమజ, హేమ, మహేష్ విట్టాల వాదన మాత్రం వేరేలా ఉంది. హిమజ అయితే ఏకంగా బిగ్ బాస్ డైరెక్టర్లే శ్రీముఖి డెరెక్షన్‌లో షో నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది. హేమ ఇదే విషయంపై మాట్లాడుతూ.. హౌస్‌లో ఎవరు ఎన్నాళ్లు ఉండాలి. ముందే ఫిక్స్ అయ్యి వచ్చారని దాని ప్రకారం ఆట జరుగుతుందని, మొత్తం బిగ్ బాస్ ఆటని శ్రీముఖి ఆడిస్తుందని ఆమె ఆటలో కంటెస్టెంట్స్ బలి అవుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. Read Also: హాట్ టాపిక్‌గా శ్రీముఖి లవ్ ఎఫైర్.. యాంకర్ రవికి వాచిపోతుందిగా! మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా శ్రీముఖిని చేసేందుకు తెరవెనుక వ్యూహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆమే విన్నర్ అనే ప్రచారం బయటగట్టిగానే ఉంది. అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఏ రకంగా చూసుకున్నా.. శ్రీముఖి టైటిల్ విన్నర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆమెపై వస్తున్న అబద్ధపు ప్రచారాన్ని కొట్టివేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఇదిలాఉంటే.. శ్రీముఖి టైటిల్ విన్నర్ అంటూ వస్తున్న రూమర్స్‌కి బలాన్నిస్తూ ఆమెపై సంచలన ఆరోపణలు చేసింది యాంకర్ శ్వేతారెడ్డి . బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందు ఆడిషన్స్‌కి వెళ్లిన యాంకర్ శ్వేతారెడ్డి.. నిర్వాహకులు ఆమెను సెలెక్ట్ చేయకపోవడంతో ఢిల్లీ స్థాయిలో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ డైరెక్టర్స్ కమిట్ మెంట్స్ అడుగుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా షో ముగింపు దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ షో నిర్వాహకులపైన, యాంకర్ శ్రీముఖిపైన హాట్ కామెంట్స్ చేసింది శ్వేతా రెడ్డి. హిమజ ఎలిమినేషన్ సందర్భంగా అప్పట్లో శ్వేతారెడ్డి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌ గురించి ప్రస్తావించడంతో ఈ వీడియో బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. ‘బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన హిమజను నేను అభినందిస్తున్నా.. చాలా మంది బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత అక్కడ జరుగుతున్న అన్యాయంపై మాట్లాడటానికి సాహసం చేయడం లేదు. అగ్రిమెంట్స్‌లో సంతకాలు పెట్టడం వల్ల ఏమైనా చేస్తారేమో అని భయపడుతున్నారు. కాని హిమజ మాత్రం హౌస్‌లో ఉన్న వాస్తవాలను బయటపెట్టేసింది. శ్రీముఖి గురించి మొదటి నుండి వస్తున్న టాక్ ఏంటంటే.. అభిషేక్ ముఖర్జీ, శ్యామ్ అనే ఇద్దరు బిగ్ బాస్ డెరెక్టర్లు శ్రీముఖికి చాలా క్లోజ్. ఈ ఇద్దరూ ఆమెను హైలైట్స్ చేస్తున్నారు. స్క్రీన్ ప్లేస్ కూడా ప్రతి ఎపిసోడ్‌లోనూ శ్రీముఖిని 25-30 నిమిషాలు శ్రీముఖినే చూపిస్తున్నారు. అంతెందుకు చాలా ఏళ్ల తరవాత స్క్రీన్‌పై కనిపించిన సీనియర్ యాంకర్ శిల్పా చక్రవర్తిని వారంలోనే వెనక్కి పంపి వెర్రిపప్పని చేశారు. రోహిణి, రవిలకు కూడా అన్యాయం చేశారు. వీళ్లందర్నీ పక్కన పెట్టి శ్రీముఖిని అన్యాయం చేస్తున్నారు. బిగ్ బాస్‌కే బాస్ శ్రీముఖి అంటూ హౌస్‌లో పాటలు పాడుతున్నారు. నిజంగా శ్రీముఖినే విన్నర్ కావాలని బిగ్ బాస్ ఆర్గనైజర్స్ కోరుకుంటే.. ఇంతమందిని ఇన్నిరోజుల పాటు వెర్రి వెంగళప్పల్ని ఎందుకు చేస్తున్నారు. బిగ్ బాస్‌లో ఉన్న వాళ్లంగా కాస్తో కూస్తో క్రేజ్ ఉన్నవాళ్లే. వాళ్లకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా బిగ్ బాస్ ముగిసిన తరువాత అందులో ఫైనల్ వరకూ ఉన్న కంటెస్టెంట్స్ బయటకు వచ్చి వాళ్లకు జరిగిన అన్యాయాన్ని బయటపెడితే తరువాత వచ్చే వాళ్ల ఇమేజ్ అయినా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మొత్తంగా బిగ్ బాస్ వల్ల ఎవరికీ ఒరిగింది ఏం లేదు. బిగ్ బాస్ వాళ్లు ఎవర్ని హైలైట్ చేయాలో వాళ్లనే చేస్తున్నారు తప్ప.. మిగిలిన వాళ్లని చీట్ చేస్తున్నారు’ అంటూ సంచలన ఆరోపణలు చేసింది యాంకర్ శ్వేతారెడ్డి. బిగ్ బాస్ తెలుగు విన్నర్
0
Hyderabad, First Published 22, Sep 2018, 4:17 PM IST Highlights అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా బంగారం డిమాండ్ కాస్త తగ్గింది. డిమాండ్ తగ్గడంతో ధర కూడా కాస్త తగ్గుముఖం పట్టింది మొన్నటిదాకా పెరుగతూ వచ్చిన బంగారానికి కాస్త బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా బంగారం డిమాండ్ కాస్త తగ్గింది. డిమాండ్ తగ్గడంతో ధర కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. శనివారం నాటి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.31,450 పలికింది. మరోవైపు వెండి మాత్రం నేడు స్వల్పంగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు జరగడంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 70 పెరిగి రూ. 38,150కి చేరింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో డాలర్‌ మరింత బలపడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గింది. ఇటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కూడా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో దేశీయంగా బంగారం ధర పడిపోయిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగానూ ఈ లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. న్యూయార్క్‌లో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఔన్సు బంగారం ధర 0.68శాతం తగ్గి 1,198.70డాలర్లు పలికింది. వెండి కూడా 0.38శాతం తగ్గి ఔన్సు ధర 14.25డాలర్లుగా ఉంది. Last Updated 22, Sep 2018, 4:17 PM IST
1
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV న్యూయార్క్‌లో 'రాక్షసి' పూర్ణ ప్రధాన పాత్రలో 'కాలింగ్‌ బెల్‌' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న మరో హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ 'రాక్షసి'. TNN | Updated: Jan 29, 2017, 07:58PM IST 'కాలింగ్‌ బెల్‌' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న మరో హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ 'రాక్షసి'. పూర్ణ ప్రధాన పాత్రలో అభినవ్‌ సర్దార్‌, అభిమన్యు సింగ్‌, గీతాంజలి ముఖ్యపాత్రల్లో డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అశోక్‌ మందా, రాజ్‌ దళవాయ్‌, టోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్‌ వర్క్‌ను న్యూయార్క్‌లో చేస్తున్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ - ''కాలింగ్‌ బెల్‌ కంటే టెక్నికల్‌గా ఎన్నో రెట్లు స్టాండర్డ్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా క్వాలిటీగా రావడం కోసం గ్రాఫిక్‌ వర్క్‌ను న్యూయార్క్‌లో చేయిస్తున్నాం. కంటెంట్‌ పరంగా, టెక్నికల్‌గా ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ చిత్రంలో పూర్ణపై చిత్రీకరించిన ఓ సాంగ్‌ సినిమాకే హైలైట్‌ అవుతుంది. నాలుగు నిముషాల నిడివి వుండే ఈ సాంగ్‌ని పూర్తిగా విజువల్‌ ఎఫెక్ట్స్‌లో చిత్రీకరించాం. ఈ పాట ఆడియన్స్‌కి ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.
0
Visit Site Recommended byColombia ఇటీవల ఓ టీవి చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్.. మీకు మీ మేనళ్లుడు కొరటాల శివకు గొడవయ్యిందట కదా నిజమేనా అంటే.. ఈ ఇష్యూ జరిగి చాలా రోజులైందని.. అవును గొడవ జరిగింది అంటూ అంతెత్తున లేచారు పోసాని. ‘వాడు నా మేనళ్లుడే.. అయినా తప్పుగా మాట్లాలితే క్షమించాలా.. నేను వాడి సినిమాల్లో క్యారెక్టర్ ఇవ్వమంటూ పదే పదే ఫోన్‌లు చేస్తున్నానని.. విసిగిస్తున్నానని ఓ పెద్దాయన దగ్గర వాగాడట.. దానికి ఆ పెద్దాయన అదేంటి పోసాని చాలా బిజీ ఆర్టిస్ట్ వేశాలకోసం నిన్ను అడగటం ఏంటని అని బదులిచ్చారు. ఆ పెద్దాయన ద్వారా విషయం తెలుకున్న నేను శివని అడిగా .. తిట్టా.. పోపడ్డా.. నువ్ వేశాలు నాకు ఇవ్వాలా అంటూ క్లాస్ పీకానని అసలు విషయం చెప్పారు పోసాని. ప్రస్తుతం హిట్ దర్శకులుగా కొనసాగుతున్న త్రివిక్రమ్, బోయపాటి, సంపత్ నంది, కళ్యాణ్ కృష్ణ తదితరులంతా పోసానికి అసిస్టెంట్‌లుగా చేసిన వారే. అంతేకాదు అతి తక్కువ కాలంలో 100పైగా సినిమాలకు కథలను అందించి టాప్ తెలుగు సినీ రచయితగా పోసాని కృష్ణ మురళి ఓ వెలుగు వెలగడమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా రాణించారు . అలాంటి వ్యక్తిని తన మామ అని చూడకుండా కొరటాల ఎందుకలా మాట్లాడారా అని టాలీవుడ్‌‌లో ప్రశ్నలు మొదలయ్యాయి.
0
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV బంగ్లాదేశ్‌ను పసికూనలా చూడట్లేదు: కోహ్లి బంగ్లాదేశ్‌ను పసికూనలా చూడట్లేదు.. గత కొంత కాలంగా ఆ జట్టు చాలా మెరుగ్గా ఆడుతోందని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. TNN | Updated: Feb 8, 2017, 01:31PM IST బంగ్లాదేశ్‌ను పసికూనలా చూడట్లేదు.. గత కొంత కాలంగా ఆ జట్టు చాలా మెరుగ్గా ఆడుతోందని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. గురువారం నుంచి హైదరాబాద్లో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో కోహ్లి బుధవారం మీడియాతో మాట్లాడాడు. బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడం లేదు.. ప్రధాన జట్లతో ఆడినట్లే.. వారిపైనా అన్ని వ్యూహాలతో బరిలోకి దిగబోతున్నామని వివరించాడు. ఇక జట్టులో నెలకొన్న పోటీ ఒక రకంగా అదృష్టమని కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కరుణ్ నాయర్ తానేంటో నిరూపించుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో చాహల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి వారిని గుర్తించి జట్టుకి ఎంపిక చేసిన సెలక్టర్లదే ఆ గొప్పతనమంతా అంటూ.. కోహ్లి సెలక్టర్లపై ప్రశంసలు కురిపించాడు. We cannot take any aspect of Bangladesh lightly, says #TeamIndia Captain @imVkohli on the eve of the one-off Test #INDvBAN pic.twitter.com/4Nl9YOP68d — BCCI (@BCCI) February 8, 2017 టెస్టు మ్యాచ్‌లో కేవలం ఒక సెషన్లోనే ఆట స్వరూపం మారిపో‌యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతాం అని కోహ్లి స్పష్టం చేశాడు. యువ బౌలర్ కుల్దీప్ ప్రతిభావంతుడు.. స్వదేశంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నామన్నాడు. మిశ్రా గాయపడటంతో అతడి స్థానంలో కుల్దీప్ తుది జట్టులో ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. టెస్టు హోదా పొందిన తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతుండటంపై విరాట్ మాట్లాడుతూ.. అది వారి అదృష్టం.. ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వస్తారు.
2
GST న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ సర్కారు ఒకేదేశం, ఒకేమార్కెట్‌, ఒకేపన్ను నినాదంతోప్రవేశపెట్టిన జిఎస్‌టి చట్టంతో పేద మధ్యతరగతి ప్రజలకు భారం అవుతోంది. కేవలం ఆహార ఉత్పత్తులేకాకుండా ప్రతి నిత్యావసర వస్తు సరుకులు హోటల్‌, తినుబండారాలు, వస్త్రాలు ఇలా ప్రతి ఒక్క ఉత్పత్తిపైనా జిఎస్‌టి వసూలుచేస్తున్నారు. జాతీయ,రాష్ట్రస్థాయిల్లో నిర్వహించే పోటీపరీక్షలకు తమ పిల్లలను సమాయత్తంచేసేందుకు నిర్వహించే శిక్షణకూడా వాణిజ్యపరమైన లావాదేవీగానే కేంద్రం భావించి జిఎస్‌టిని విధించింది. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఈ పన్ను పెను ఆర్థికభారం మోపుతుందని అంచనా. తాజాగా ట్యూషన్‌ చెల్లించే ఫీజుపై కూడా ఓ విద్యాసంస్థ జిఎస్‌టిని వసూలుచేసింది. చెన్నైలో ఓపాఠశాలలోచదువుకుంటున్న ఓ విద్యార్ధి రూ.10వేలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉండగా జిఎస్‌టి పన్నురూపేణా రూ.1800 చెల్లించాలని పాఠశాల యాజమాన్యం పేర్కొనడంతో ఆ విద్యార్థి తల్లితండ్రులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలకోసం పోటీపరీక్షలయినప్పటికి నీట్‌ వంటి ఉన్నతవిద్యకుగాను నిర్వహించే పోటీ పరిక్షలు ఆయినా శిక్షణ కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థతి ఉంది. ఈ శిక్షణ కేంద్రాలకు జిఎస్‌టి మినహాయింపు ఇస్తేతప్ప విద్యార్ధులు ప్రతిభకు పదును పెట్టుకోలేరన్న వాదన వస్తోంది. ట్యూషన్‌ఫీజులపై జిఎస్‌టిమినహాయింపులివ్వాలని కోచింగ్‌కేంద్రాలనిర్వాహకులు ఆర్ధికశాఖకు విజ్ఞప్తిచేస్తున్నారు.
1
Team India Won First Oneday టీమిండియా ఘన విజయం ధర్మశాల: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది.కాగా అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా 6 వికెట్లతో టీ మిండియా బౌలర్ల సమిష్టి కృషితో గెలుపొందింది. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ 81 బంతులు ఆడి 9 బౌండరీలు,1 సిక్స ర్‌తో 85 పరుగులు అజేయ హాఫ్‌ సెంచరీ చేయడంతో సిరీస్‌ల జట్టుకు విజయం దక్కింది.వన్డేల్లో కోహ్లీకి ఇది 37వ హాఫ్‌ సెంచరీ. టాస్‌ గెలిచిన టీమిండియా మొదట న్యూ జిలాండ్‌ను బ్యాటింగ్‌ చేయాల్సిందిగా కోరింది. దీంతో కివీస్‌ 43.5 ఓవర్లలో 190 పరుగులకే చాపచుట్టేసింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 33.1 ఓవర్లలోనే 4 వికెట్ల కోల్పోయి సులభంగా టార్గెట్‌ను చేధించింది.కివీస్‌ బౌ లర్ల లో బ్రాస్‌ వెల్‌,సోథీ,నీసమ్‌లకు ఒక్కొక్కరికి ఒక వికెట్‌ లభించింది.కోహ్లీతో పాటు జాదవ్‌ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టార్గెట్‌కు టీమిండియా కొన్ని పరుగుల దూరంలో ఉండగా ధోనీ రనౌట్‌ అయి నాలుగవ వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు.టార్గెట్‌ చేధనకు దిగిన భారత్‌ కు మంచి ఆరంభమే లభించింది.కాగా తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో రోహిత్‌ శర్మ 14 పరుగులు అజింక్యా రహానే 34 పరుగులతో కలిసి 49 పరుగులు జోడించారు.మనీష్‌ పాండే 17 పరు గులు కెప్టెన్‌ ధోనీ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ 190 ఆలౌట్‌ టెస్టు సిరీస్‌ను క్లీన్‌ స్పీప్‌ చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో తొలి వన్డేలో న్యూజిలాండ్‌ జట్టుపై ఆధిక్యం ప్రదర్శించింది.కాగా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుని ప్రత్యర్థికి బ్యాటింగ్‌ అప్పగించిన ధోనీ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. పటిష్టమైన న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను పదునైన బంతులతో కకావికలం చేశారు.ఓపెనర్‌ లాథమ్‌ సాహసోపేతమైన ఇన్నింగ్స్‌ ఆడగా టెయి లెండర్లు సత్తా చాటడంతో 190 పరుగులు చేశారు.కాగా మొదట్లో డాషింగ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గుప్టిల్‌ 12 పరుగుల వద్ద హార్ధిక్‌ పాండ్యా ఔట్‌ చేశాడు.ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 3 పరుగుల వద్ద ఉమేష్‌ పెవిలి యన్‌కు పంపగా తరువాతి వికెట్‌ను హార్దిక్‌ పాండ్యా తీసుకున్నాడు.ఆ తరువాత వికెట్‌ను ఉమేష్‌ యాదవ్‌,తరువాత మళ్లీ హార్థిక్‌ పాండ్యా వీరిద్దరూ ఐదు వికెట్లు తీసిన అనంతరం కేదార్‌ జాదవ్‌,అమిత్‌ మిశ్రా కివీస్‌ ఇన్నింగ్స్‌ను శాసిం చారు.అయితే సహచరులు వెనుదిరుగుతున్నా పట్టు వదలకుండా ఓపెనర్‌ లాథమ్‌ 98 బంతులు ఆడి 7 బౌండరీలు,1 సిక్సర్‌తో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.కాగా 65 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన సమయంలో టెయిలెండర్లతో అనితరసాధ్యమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.స్టార్‌ బౌలర్‌ టీమ్‌ సౌథీతో కలిసి లాథమ్‌ నెలకొల్పిన భాగస్వామ్యం కివీస్‌ ఇన్నింగ్స్‌్‌కు ఊపిరిలూదింది. కేవలం 45 బంతుల్లో మూడు సిక్సర్లు,6 బౌండ రీలతో సౌథీ సాధించిన 55 పరుగులు సెకండ్‌ హయ్యెస్టు స్కోరు కావడం విశేషం.ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన లాథమ్‌ నాటౌట్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ ఆటగాడిగా నిలువగా సౌతీ పదవ డౌన్‌లోవచ్చి హాఫ్‌ సెంచరీ సాధించిన వన్డే ఆట గాడిగా రికార్డు నెలకొల్పాడు.కాగా ఈ క్రమంలో న్యూజిలాండ్‌ జట్టు 43.5 ఓవర్లలో 190 పరు గులకు ఆలౌటైంది.టీమిండియా బౌలర్లలో హార్థిక్‌ పాండ్యా,అమిత్‌ మిశ్రా సత్తా చాటి ఒక్కొక్కరు 3 వికెట్లు సాధించగా వారికి ఉమేష్‌ యాదవ్‌,కేదార్‌ జాదవ్‌లు 2 వికెట్ల తీసుకుని తమ వంతు సహ కారం అందించారు. ఊపిరిలూదిన టీమ్‌ సౌథీ న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌కు స్టార్‌ బౌలర్‌ టీమ్‌ సౌథీ ఊపిరిలూదాడు.కాగా 106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన టీమ్‌ సౌథీ సరిగ్గా 10 ఓవర్ల పాటు క్రీజులో నిలిచాడు.క్రీజులో ఉన్నంత సేపు బౌలర్‌ ఉమేష్‌ యాదవ్‌? బుమ్రా? అక్షప్‌ పటేల్‌? అమిత్‌ మిశ్రా ఎవరనేది చూడలేదు.బంతిని బౌండరీ లైన్‌ దాటించడమే టార్గెట్‌గా బ్యాటింగ్‌ చేశాడు.భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.దీంతో ఒకదశలో కివీస్‌ 150 పరుగులైనా సాధిస్తుందా? అన్న అనుమానం కలి గింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌కు రికార్డు భాగస్వామ్యంతో వ్యక్తిగత రికార్డు నెలకొల్పి హాఫ్‌ సెంచరీ సాధించాడు.కాగా 6 బౌండరీలు,3 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసిన సౌతీ న్యూజి లాండ్‌ జట్టులో పదవ నంబర్‌ ఆటగాడిగా హాఫ్‌ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అమిత్‌మిశ్రా వేసిన బంతిని బౌండరీ లైన్‌ దాటించే క్రమంలో మనీష్‌ పాండే చేతికి చిక్కి 177 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.దీంతో 9 వికెట్లుకోల్పోయిన న్యూజిలాండ్‌ జట్టు 177 పరుగులు చేసింది.
2
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV MS Dhoni: ధోనీ ఉండగా.. నెం.4పై చర్చ దండగ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం గురించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. చాలా అతిగా దానిపై అనవసర చర్చ నడిపారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే..? -మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ Samayam Telugu | Updated: May 3, 2019, 06:39PM IST MS Dhoni: ధోనీ ఉండగా.. నెం.4పై చర్చ దండగ హైలైట్స్ మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలు ప్రపంచకప్‌లో ధోనీని నెం.4లో ఆడించాలని కె.శ్రీకాంత్ సూచన విజయ్ శంకర్‌ని ఆ స్థానం కోసం ఇప్పటికే ఎంపిక చేసిన సెలక్టర్లు రెండేళ్లు టీమిండియా నెం.4 స్థానం గురించి సుదీర్ఘ చర్చ ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో మహేంద్రసింగ్ ధోనీని నెం.4 స్థానంలో ఆడించాలని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించాడు. వరల్డ్‌కప్‌ కోసం ఇప్పటికే 15 మందితో కూడిన జట్టుని ప్రకటించిన టీమిండియా సెలక్టర్లు.. నెం. 4 స్థానం కోసం అంబటి రాయుడు స్థానంలో విజయ్ శంకర్‌కి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగగా.. నెం.4 స్థానంలో ఆడే ఆటగాడి గురించి మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ నడించింది. కానీ.. ధోనీ రూపంలో నెం.4లో ఆడగలిగే క్రికెటర్ టీమ్‌లో ఉంటే ఈ అనవసర చర్చ ఎందుకంటూ తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశ్నించాడు. ‘టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం గురించి చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. చాలా అతిగా దానిపై అనవసర చర్చ నడిపారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే..? ధోనీ రూపంలో రెడీమేడ్‌గా నెం.4లో ఆడే ఆటగాడు టీమ్‌లో ఉన్నాడు. మరి ఎందుకు ఈ రచ్చ..? ధోనీ కంటే ఎవరైనా ఆ స్థానంలో ఇప్పుడు మెరుగ్గా ఆడగలరా..? కానీ.. వన్డేల్లో ధోనీని నెం.4లో టీమిండియా ఆడించడం లేదు. అలా ఎందుకు చేస్తున్నారో ఇప్పటికీ రహస్యమే. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాపై ధోనీ బాదిన హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు.. తాజా ఐపీఎల్ సీజన్‌లో సాధిస్తున్న పరుగులు.. అతనిలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాయి. అందుకే ప్రపంచకప్‌లో ధోనీనే నెం.4లో ఆడించండి’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 11 మ్యాచ్‌లాడిన ధోని 358 పరుగులతో టీమ్‌లోనే టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో ఇప్పటికే చెన్నై జట్టు ప్లేఆఫ్‌కి చేరగా.. చివరి లీగ్ మ్యాచ్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం ఆడనుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2
2003 కంపెనీలకు బిఎస్‌ఇలో నష్టం చివరి నిమషంలో పెరిగిన విక్రయాలు ముంబై : మార్కెట్లు చివరినిమిషంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఉపక్రమించడం, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌షేర్లలో మరింతగా పతనం కనిపించడం వంటివి స్టాక్‌ మార్కెట్లు వారంలో రెండోరోజు మళ్లీ నష్టాల్లో ముగిసాయి. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ దిగువస్థాయిలోనే ముగిస్తే నిఫ్టీ సూచీ 75పాయింట్ల దిగువన 7088 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ సూచి 2.4శాతం, స్మాల్‌క్యాప్‌సూచి 2.2శాతందిగజారాయి. మొత్తంగా చూస్తే 2003 కంపెనీలు నష్టాల్లో ముగిస్తే 615 కంపెనీలు స్వల్పలాభాలతో ముగిసాయి. అంతకు ముందురోజు ట్రేడింగ్‌లో లాభాలను చవిచూసిన మార్కెట్లు మళ్లీ ఒక్కసారిగా దిగజారాయి. ట్రేడర్ల నుంచి అమ్మకాలఒత్తిడిపెరగడమే ఇందుకుకారణం. మరింతగా సాగి దిగువకు వెళ్లే అవకాశం ఉంది. దిగువస్థాయిలో నిఫ్టీ 7000 పాయింట్ల వద్ద నుంచి 6850 వద్ద మద్దతు లభిస్తుందని జియోజిత్‌ బిఎన్‌పి పరిభాస్‌ ఫైనాన్షియల్‌ సర్వీ సెస్‌ అధిపతి అలెక్స్‌ మాథ్యూస్‌ వెల్ల డించారు. అలాగే భారత వాణిజ్య ఎగు మతులు కూడావరుసగా 14వనెలలో తగ్గాయి. జనవరినెలలో 13.6శాతం చొప్పున దిగజారినట్లు తేలింది. 21 బిలి యన్‌ డాలర్లు వరకూ మాత్రమే ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్‌ ఉత్ప త్తుల ఎగుమతులు తగ్గడమే ఇందుకు కారణం. గ్లోబల్‌ డిమాండ్‌ కూడా ఇందుకు దోహ దం చేసింది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లనుంచి 1312 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకున్నట్లు కనిపించింది. ఇక వివిధ సూచీలు సెక్టార్లపరంగాచూస్తే బిఎస్‌ఇ రియాల్టీ సూచి అత్యధి కంగా నష్టపోయింది. మూడుశాతంగా ఉంది. బ్యాం కింగ్‌, హెల్త్‌కేర్‌, కేపిటల్‌గూడ్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ ఉన్నాయి. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్‌ సూచి 4.5శాతంగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు లాభాల స్వీకరణకు ఎక్కువ మొగ్గు చూపడంతో అంతకుముందున్న లాభాలు హరించి పోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ నాలుగుశాతం దిగజారింది. ఎస్‌బిఐ ఛైర్మన్‌ తన నివేదికలో ఎన్‌పిఎలు నాలుగో త్రైమాసికంలో కూడా పెరుగుతాయని ప్రకటిం చడమే ఇందుకుకీలకం. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 22శాతం పెరిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంకు, పిఎన్‌బి, యూనియన్‌బ్యాంకు, ఓరియం టల్‌బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, సిండికేట్‌బ్యాంకులు 4 నుంచి 7శాతం క్షీణించాయి. ఐసిఐసిఐబ్యాంకు 3.8 శాతం క్షీణించింది. ప్రైవేటు బ్యాంకింగ్‌ దిగ్గ జం 50వేల కోట్లను బాండ్లరూపంలో విడతలవారీగా సేకరించాలని నిర్ణయించింది. అందుబాటుధరల్లో పక్కాగృహాల ప్రాజెక్టులకు ఈ నిధులు అంద చేస్తుంది. మహీంద్ర అండ్‌ మహీంద్ర 1.8శాతం క్షీణించింది వాహనాల్లో చూస్తే ఎనిమిదివేల కోట్లు ఆటోమోటివ్‌ప్లాంట్లు మహారాష్ట్రలో ఎక్కువ పెట్టు బడులు పెడుతున్నట్లు ప్రకటించింది. కోల్‌ఇండియా 1.7శాతం పెరిగింది. ఇతరత్రాసెన్సెక్స్‌ లో ఐటిసి, టాటామోటార్స్‌, ఎల్‌అండ్‌టి, రిలయన్స్‌ ఇండ స్ట్రీస్‌ వంటివి నష్టపోయాయి. అదాని పోర్టులు నాలుగుశాతం పెరిగాయి. కంపెనీ 26 శాతం నికరలాభాల్లో పెరుగుదల నమోదు చేసింది. 645కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. మెటల్‌ రంగ షేర్లు లాభాల స్వీకరణతో ముందు రోజు లాభాలను కట్టడిచేసాయి. హిందా ల్కో, వేదాంత 3నుంచి 4.5శాతం చొప్పున క్షీణించాయి. టాటాస్టీల్‌ ఒకటి శాతం దిగజారింది. జిందాల్‌స్టీల్‌, పవర్‌ ఆరుశాతం దిగజారింది.క్రిసిల్‌ రేటింగ్స్‌ తగ్గించడమే కీలకం. ఇతరత్రా చూస్తే యునైటెడ్‌ బ్రూవరీస్‌, 11శాతం దిగజారింది. పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు నుంచి కంపెనీని కావాలనే బకాయిల ఎగవేతదారుగా ప్రకటించినట్లు తేలడంతో యుఎస్‌ షేర్లు 2.3శాతం దిగజారాయి. వారం ప్రారంభంలో అద్వితీయంగా పనిచేసిన స్టాక్‌ మార్కెట్లు రెండోరోజే ఎక్కువశాతం విక్రయాలకు లోనయ్యాయి. అంతర్జాతీయ ధోరణులు, ముడి చమురుధరలు వంటివి కీలకం అయ్యాయా అంటే స్థూల ఆర్థికవ్యవస్థ గణాంకాలే ఎక్కువ పనిచేసాయన్నది కీలక ఆర్థికవేత్తల అంచనా.
1
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కోహ్లి విన్నావా.. స్టీవ్‌స్మిత్ ఏమన్నాడో..? భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అసాధారణ ఆటతో అభిమానుల్ని TNN | Updated: Feb 23, 2018, 12:12PM IST భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అసాధారణ ఆటతో అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆటగాళ్లు. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా వీరిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఏడాది క్రితం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. బెంగళూరు వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో డీఆర్‌ఎస్ కోరే ముందు స్టీవ్‌స్మిత్ మైదానం నుంచే డగౌట్‌లోని జట్టు సిబ్బంది సాయం కోరేందుకు ప్రయత్నించడం.. కోహ్లి అడ్డుతగిలి ఫీల్డ్ అంపైర్లకి ఫిర్యాదు చేయడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆ సిరీస్‌లో అప్పటికే తాను రెండు మూడు సార్లు స్మిత్ సాయం తీసుకోవడాన్నితాను చూశానని తర్వాత మీడియా సమావేశంలో కోహ్లి చెప్పగా.. ఈ ఘటన జరిగిన చాలా రోజులకి కోహ్లి ఆరోపణలన్నీ ‘రబ్బీస్’ అంటూ స్టీవ్‌స్మిత్ కొట్టిపారేశాడు. ఆ తర్వాత ఇద్దరు క్రికెటర్లూ ఈ విషయాన్ని వదిలేశారు. కానీ.. తాజాగా మళ్లీ కోహ్లి గురించి స్టీవ్‌స్మిత్ మాట్లాడాడు. దక్షిణాఫ్రికా గడ్డపై పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లి ఆట చూసి తాను చాలా నేర్చుకున్నాని స్టీవ్‌స్మిత్ ప్రశంసించాడు. ‘ఆఫ్ సైడ్ ఫీల్డర్ల మధ్యలోంచి విరాట్ కోహ్లి చాలా అద్భుతంగా షాట్స్ ఆడతాడు. ముఖ్యంగా స్పిన్‌ని ఎదుర్కోవడంలో అతనిది ప్రత్యేక శైలి. అతని ఆట చూసి నేను చాలా నేర్చుకున్నా’ అని వెల్లడించాడు. కోహ్లితో పాటు.. ఏబీ, విలియమ్సన్ ఆట నుంచి కూడా తాను కొంత నేర్చుకోగలిగానని అతను వివరించాడు. ‘బ్యాట్‌ఫుట్‌పైకి వెళ్లి ఆడటం ఎలాగో దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ నుంచి నేర్చుకున్నా.. బంతిని చివరి క్షణంలో చాకచక్యంగా బౌండరీకి తరలిండాన్ని న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్ విలియన్స్‌ నుంచి నేర్చుకున్నా. ఇలా నా చుట్టూ ఉన్న ఆటగాళ్ల ఆట చూస్తూ నా ఆటకి మెరుగులు దిద్దుకున్నా’ అని స్టీవ్‌స్మిత్ వెల్లడించాడు. వన్డేల్లో అసాధారణ రికార్డుల్ని కోహ్లి బద్దలు కొడుతుండగా.. టెస్టుల్లో బ్రాడ్‌మాన్ స్థాయి ఆటతో స్టీవ్‌స్మిత్ చెలరేగుతున్నాడు.
2
Suresh 147 Views పింక్‌ బాల్‌పై స్పందించిన గంభీర్‌ కోల్‌కతా: దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో భాగంగా దులీప్‌ ట్రోఫీలో తొలిసారి పింక్‌ బాల్‌తో నిర్వ హిస్తున్న టెస్ట్‌ మ్యాచ్‌లో తాను ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొలేదని టీమిండియా ఆటగాడు గౌతం గంభీర్‌ స్పష్టం చేశాడు.ఇప్పటికే పింక్‌ బాల్‌కు సంబంధించిన పలు రకాల అభిప్రాయాలు వెలువడిన నేపథ్యంలో గంభీర్‌ స్పందించాడు. పింక్‌ బాల్‌ మ్యాచ్‌కు ఎటువంటి అడ్డూలేదు.కేవలం బంతి కలర్‌ మాత్రమే ఇక్కడ మారింది.మిగతా అంతా సంప్రదాయ ఎర్ర బంతి తరహాలోనే ఉంది.కోకోబుర్రా పింక్‌ బాల్‌ బంతి ఎరుపు,తెలుపు బంతుల మాదిరిగానే ఉంది.పింక్‌ బాల్‌ ఎక్కువ స్వింగ్‌ అవుతుందని ఏదో జరిగిపోతుందననే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు.నేనైతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొలేదు అని గంభీర్‌ పేర్కొన్నాడు ======
2
internet vaartha 587 Views వ్యూహాలు రూపొందించడాన్ని నేర్చుకుంటున్నా : కోహ్లీ న్యూఢిల్లీ : టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపులో ఉంది.కాగా నేడు ఇండోర్‌లో మూడవ టెస్టు ప్రారంభంకానుంది. టెస్టు కెప్టెన్‌ కోహ్లీ నాయకత్వంలో టెస్టు మ్యాచ్‌ల్లో మెరుగైన విజయాలు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో మూడవ టెస్టు కూడా గెలిచి క్లీన్‌ స్వీప్‌ చేయాలని టీమిండియా భావిస్తుంది. టీమిండియా జట్టులో నేడు సీనియర్‌ ఓపెనర్‌ గంభీర్‌ ఆడనుండగా అనారోగ్యం నుంచి కోలు కున్న న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా బరిలోకి దిగుతున్నాడు. కాగా స్వదేశంలో టెస్టులో మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచ నంబర్‌ 1 జట్టుగా ఎదిగిన టీమిండియాను ఎలాగైనా ఢీకొనాలని న్యూజిలాండ్‌ అన్ని వ్యూహాలను సిద్దం చేసుకున్నట్లు కనిపిస్తుంది. కాగా టెస్టుల్లో ప్రణాళికలకు అనుకూలంగా మైదానంలో ప్రత్యర్థిపై వ్యూహాలు రూపొందిం చడాన్ని ఇప్పుడిపుడే నేర్చుకుంటున్నానని టీమిండియా టెస్టు క్రికెటర్‌ కోహ్లీ వెల్లడించాడు. కాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా చివరి దైన మూడవ టెస్టు మ్యాచ్‌లో ఇండోర్‌ వేదికగా శనివారం ఆరంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ తాజాగా మీడియాతో మాట్లాడాడు.ఒక సెషన్‌లో వ్యూహాలు విఫలమైనపుడు టెస్టు కెప్టెన్‌గా మళ్లీ ప్రత్యర్థులపై పట్టు సాధించడమెలాగో ప్రస్తుతం నేర్చుకుంటున్నాను.కొన్ని సందర్బాలలో వికెట్‌ తీయడం కష్టమైనపుడు పరుగులు నియంత్రిం చడం ద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చని ఇప్పటికే తెలుసుకున్నాను అని వివరించాడు. కాగా రెండేళ్ల తరువాత టెస్టు జట్టులోకి వచ్చిన సీనియర్‌ ఓపెనర్‌ గంభీర్‌కు మూడవ టెస్టు జట్టులో మరోఓపెనర్‌గంభీర్‌మాత్రమే ప్రత్యమ్నా యంగా కనిపిస్తున్నాడనిసమాధాన మిచ్చాడు. మూడవ టెస్టులో బరిలోకి విలియమ్సన్‌ అనారోగ్యంతో రెండవ టెస్టు మ్యాచ్‌కి దూరమైన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ శనివారం నుంచి భారత్‌తో ఆరంభం కానున్న మూడవ టెస్టులో బరిలోకి దిగే అవకాశం కన్పిస్తుంది. కాన్పూర్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత స్పిన్నర్లని సమర్థవంతంగా ఎదుర్కొన్న విలియమ్సన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 75 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్‌ అనంతరం విలియమ్సన్‌ అనారోగ్యానికి గురికావడంతో కోల్‌కతా టెస్టులో అతను మైదానంలోకి దిగలేదు.పర్యటనలో మేము మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నాం,కానీ భారత్‌ పిచ్‌లపై ఈ నిర్ణయం కఠినతరమైనదే. కానీ ప్రయత్నిస్తాం, ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. నేడు మైదానంలోకి దిగుతాననే నమ్మకం ఉంది అని విలియమ్సన్‌ ధీమా వ్యక్తం చేశాడు.కోల్‌కతా టెస్టులో రాస్‌ టేలర్‌ కివీస్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
2
bsnl comes with new data plans against reliance jio బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చవకైన డేటా ఆఫర్లు...! ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌... ప్రీపెయిడ్ కస్టమర్లకు చవకైన డేటా ఆఫర్లను తీసుకొచ్చింది. రూ.118, రూ. 379, రూ. 551 ధరతో మూడు సరికొత్త ప్లాన్లను ప్రకటించింది. | Updated: Mar 31, 2018, 03:12PM IST ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌... ప్రీపెయిడ్ కస్టమర్లకు చవకైన డేటా ఆఫర్లను తీసుకొచ్చింది. రూ.118, రూ.379, రూ.551 ధరతో మూడు సరికొత్త ప్లాన్లను ప్రకటించింది. జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. 28 రోజుల కాలపరిమితితో రూ.118 ప్లాన్‌ను, 30 రోజుల కాలపరిమితితో రూ.379 ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. ఇక రూ.551తో రీఛార్జ్‌ ఆఫర్‌‌ను కేవలం... కేరళ సర్కిల్‌కు మాత్రమే పరిమితం చేసింది. ఈ ప్లాన్ల ప్రకారం... రూ.118తో రీఛార్జ్‌ చేసుకున్నవారికి.... రోజుకు 1జీబీ 3జీ లేదా 4జీ డేటా వస్తుంది. దీంతో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ కూడా ఉంటాయి. జియో రూ. 98 ప్లాన్‌కు పోటీగా... బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 379తో రీఛార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు... రోజుకు 4జీబీ 3జీ లేదా 4జీ డేటా 30రోజుల పాటు వస్తుంది.
1
Hyderabad, First Published 12, Mar 2019, 9:22 AM IST Highlights మొత్తానికి మహేష్ బాబుకు, సుకుమార్ కు మధ్య మనస్పర్దలు తొలిగిపోయినట్లే అని తెలుస్తోంది. సుకుమార్ చెప్పిన విషయాలు, అసలు ప్రాజెక్టు ఎనౌన్సమెంట్ వెనక ఏం జరిగింది అనేది పూర్తిగా మహేష్ విన్నారట.  మొత్తానికి మహేష్ బాబుకు, సుకుమార్ కు మధ్య మనస్పర్దలు తొలిగిపోయినట్లే అని తెలుస్తోంది. సుకుమార్ చెప్పిన విషయాలు, అసలు ప్రాజెక్టు ఎనౌన్సమెంట్ వెనక ఏం జరిగింది అనేది పూర్తిగా మహేష్ విన్నారట. తను కూడా ఎంత హర్ట్ అయ్యాడో , బాధపడ్డారో సుకుమార్ చెప్పుకున్నారట.  మహేష్ కూడా తను ఫీలయ్యానని, ఒక్కమాట కూడా తనతో అనకుండా ప్రాజెక్టు ఎనౌన్స్ చేయటం పద్దతి కాదన్నారని తెలుస్తోంది. ఏదైతేనేం ఈ వీకెండ్ లో చెన్నైలో జరిగిన మీటింగ్ లో ఇద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకున్నారట. త్వరలోనే తిరిగి కలిసి పనిచేద్దామని ఒకరికొకరు బెస్ట్ విషెష్ చెప్పుకున్నారుట.  దాంతో సుకుమార్ ఇప్పుడు పూర్తి స్దాయిలో హ్యాపీగా తన ప్రొడక్షన్స్ మీదా, తను డైరక్ట్ చేయబోయే చిత్రం మీదా కాన్సర్టేట్ చేయనున్నారు. మహేష్ తో అనుకున్న ఎర్ర చందనం కథనే అల్లు అర్జున్ తో చేయబోతున్నారట. అయితే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చిత్రం పూర్తయ్యాకే ఆ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ లోగా తన అసెస్టెంట్స్ డైరక్ట్ చేస్తున్న సినిమాలను సుకుమార్ పూర్తి స్దాయిలో పట్టాలు ఎక్కించి, పర్యవేక్షించనున్నారు.  అక్టోబర్ నుంచి అల్లు అర్జున్ డేట్స్ ఇస్తారని జూలై నుంచి స్క్రిప్టు మీద మరోసారి కూర్చుంటారని, అప్పటిదాకా బ్రేక్ ఇస్తారని తెలుస్తోంది. అల్లు అర్జున్ ని డిఫరెంట్ గెటప్ లో చూపించబోతున్నారని, సినిమా మొత్తం రా గా ఉంటుందని, అడవిలో జరిగే ఓ ఇన్విస్టిగేషన్ డ్రామా అని చెప్తున్నారు. రంగస్దలాన్ని మించి హిట్ కొట్టాలనే పట్టుదలతో సుకుమార్ ఉన్నారు.
0
Nov 09,2018 స్క్రిప్ట్‌లో భాగంగానే నిర్ణయమా.. రానున్న ఎన్నికల నేపథ్యంలో దేశంలో కరెంటు ఖాతా లోటు అంతకంతకు పెరిగిపోతోంది. ఎన్నికలకు కేవలం స్వల్పకాలం మాత్రమే గడువుండడంతో ఆర్‌బీఐ వద్ద రిజర్వుగా ఉన్న నిధులను ఖజానాకు మళ్లించి ప్రజా కర్షక పథకాలతో ఓట్లను దండుకోవాలని ప్రభుత్వం భావి స్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సర్కారు ఆర్‌ బీఐ ఉన్నత కార్యవరంపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ గవర్నర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెబుతున్నారు. ఈ నేపథ్య ంలోనే ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి మధ్య వివాదం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. అయితే రానున్న ఎన్నిక లకు ముందు, అందునా ఆర్థిక సేవల రంగం వివిధ కుంభకోణాలతో సతమతమవుతున్న తరుణంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఉన్నతాధికారులిద్దరు రాజీనామా చేయడం ప్రభు త్వానికి భారీ ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కానీ ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేయవలసి వస్తే మాత్రం అది ఆర్ధిక వ్యవస్థకు ముప్పేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు ఉర్జిత్‌ను ఆరోగ్య కారణాలు చూపి తప్పించేలా స్కెచ్‌ వేస్తోందన్న ఆరోపణలు వినవస్తు న్నాయి. ఇప్పుటు అనారోగ్య సమస్యలు అనేవి ప్రభుత్వ స్క్రిప్ట్‌లో భాగమేనని.. ఉర్జిత్‌ను హుందాగా తప్పించేలా ప్రభుత్వం చేస్తున్న ప్లాన్‌ అనే విమర్శలు లేకపోలేదు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
sumalatha 208 Views World Cup 2019 , yuvraj singh Yuvraj Singh హైదరాబాద్‌: యువరాజ్‌ సింగ్‌ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ ఫలితంపైవిస్మయం వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ నిర్వహించిన మ్యాచ్ ఫలితం డ్రా అయితే ఎక్కువ బౌండరీలు కొట్టిన టీంనే విజేతగా ప్రకటించే ఐసీసీ బౌండ్రీ రూల్‌పై విమర్శలు వ్యక్తమవుతున్న ఈ క్రమంలో యువీ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. తాను ఈ రూల్‌తో ఏకీభవించనని యువరాజ్ సింగ్ బాహాటంగా ప్రకటించాడు. కానీ.. రూల్స్ రూల్సే కాబట్టి వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు అభినందనలు తెలిపాడు. కివీస్ వీరోచిత పోరాటం చేసిందని యువీ కితాబిచ్చాడు. ఈ పద్ధతిలో విజేతను నిర్ణయించడం సరైన విధానం కాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ కూడా అభిప్రాయపడ్డాడు. ఈ రూల్‌ను మార్చాల్సిన అవసరం ఉందని బ్రెట్ లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
2
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV చిరంజీవితో కన్నడ హీరోయిన్ ఎఫైర్ నిజమేనా ? చిరంజీవితో కన్నడ హీరోయిన్ ఎఫైర్ నిజమేనా ? ఏంటీ ఇది నిజమేనా అని షాకవుతున్నారా ? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. TNN | Updated: Oct 8, 2015, 06:49PM IST చిరంజీవితో కన్నడ హీరోయిన్ ఎఫైర్ నిజమేనా ? అని టైటిల్ చదవగానే మన మెగాస్టార్ చిరంజీవేమో అని అనుకునేరు. అలాంటిదేం లేదు. పొరుగునే వున్న ఈ శాండిల్‌వుడ్ హీరో పేరు కూడా చిరంజీవినే. పూర్తి పేరు చిరంజీవి సర్జా . ఇక అసలు విషయంలోకి వెళ్తే, గత కొన్నాళ్లుగా చిరంజీవికి, కన్నడ హీరోయిన్ మెఘనా రాజ్‌కి ఎపైర్ వుందంటూ శాండిల్‌వుడ్ అంతా కోడై కూస్తోంది. కానీ దీనిని వాళ్లెప్పుడూ ఖండించ లేదు అలాగని చెప్పి నిజమని అంగీకరించనూ లేదు. కానీ తాజాగా మెఘనా రాజ్ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ చూస్తే, ఆమె చిరంజీవితో ఎఫైర్ వుందని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అనిపిస్తోందంటున్నాయి కన్నడ సినీవర్గాలు. అందుకు కారణం చిరంజీవి సోదరుడిని ఆమె ఆ సోషల్ మీడియా పోస్టులో 'బిల్' అని సంబోధించడమేనట. చిరంజీవి సోదరుడు, నటుడు అయిన ధృవ సర్జాకి బర్త్‌డే విషెస్ చెప్పిన మెఘనా.. ఆ పోస్టులో 'హ్యాప్పీ బడ్డే బిల్' అని పేర్కొంది. బిల్ అంటే బ్రదర్ ఇన్ లాకి షార్ట్ కట్ అనీ.. ఆమె అతన్ని బిల్ అని అందంటే చిరంజీవి తనకి కాబోయేవాడేనని పరోక్షంగా అంగీకరించినట్లేననేది శాండిల్‌వుడ్ టాక్. దీనికైనా ఆమె వివరణ ఇస్తుందో లేదో చూడాలి మరి. Happieee happiieee budday bil @DhruvaSarja ... Kushkushi yaagi saada iru! God bless!
0
sumalatha 113 Views stock market stock market ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్లు నష్టపోయి 36,936 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 10,925 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.92గా ఉంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/national/
1
Visit Site Recommended byColombia ఈ ఫస్ట్‌లుక్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ.. ‘మా సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేసిన వ‌రుణ్ తేజ్‌గారికి నా థాంక్స్‌. ఫ‌స్ట్‌లుక్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మంచి ల‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌. సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. రాహుల్ విజ‌య్‌ సూప‌ర్బ్ పెర్ఫామర్‌. దివ్య విజ‌య్‌ మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ, న‌వీన్ నూలి ఎడిట్ వ‌ర్క్ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ అవుతాయి. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంది`` అన్నారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం`` అన్నారు. రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, రాళ్ల‌ప‌ల్లి, ఈశ్వ‌రీరావు, ప‌విత్రా లోకేశ్‌, స‌త్యం రాజేశ్‌, జోశ్ ర‌వి, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు నటిస్తున్నారు.
0
Mar 03,2019 బీమా సంస్థల ఉద్యోగులకు తీపి కబురు! న్యూఢిల్లీ:ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలో మోడీ సర్కారు సమాజంలోని అన్ని వర్గాల వారికి తాయిలాలను ప్రకటించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే శనివారం ప్రభుత్వ రంగ బీమా సంస్థల్లో ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌గా పెన్షన్‌ను పొందేందుకు గాను వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 1995 జూన్‌ 28 నాటికి ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థల్లో పని చేస్తున్న వారికి ఈ నిర్ణయంతో లాభం కలుగనుంది. బీమా సంస్థలకు చెందిన కొందు ఉద్యోగులు అప్పట్లో అవగాహన లేమితో పాటు వివిధ ఇతర కారణాల వల్ల సాధారణ పెన్షన్‌కు బదులుగా కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని ఎంచుకు న్నారు. దీంతో వారు ఇప్పుడు ఇతర ఉద్యోగుల మాదిరిగా పెన్షన్‌ను పొందలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం బీమా సంస్థల ఉద్యోగులకు సాధారణ పెన్షన్‌కు మారే సౌకర్యాన్ని కల్పించనున్నట్టుగా తెలిపింది.తాము తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా దాదాపు 42720 మంది ఉద్యోగులకు, 10720 మంది సీనియర్‌ సిటిజన్లకు మేలు జరుగుతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శనివారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. తాజా నిర్ణయంతో భారతీయ జీవిత బీమా సంస్థలోని (ఎల్‌ఐసీ) 24,595 మంది ఉద్యోగులకు, 18125 మంది ఇతర అయిదు ప్రభుత్వ రంగ బీమా సంస్థల ఉద్యోగులకు మేలు చేయనుంది. ప్రభుత్వ రంగంలోని ఇతర బీమా సంస్థల జాబితాలో జీఐసీ, న్యూ ఇండియా అషూరెన్స్‌ కంపెనీ, నేషనల్‌ ఇన్షూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్షూరెన్స్‌ కం పెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్షూరెన్స్‌ కంపెనీలు పని చేస్తున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కెప్టెన్సీకి ఏబీ డివిలియర్స్ గుడ్‌బై..! దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి అనూహ్యంగా బుధవారం తప్పుకున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ TNN | Updated: Aug 23, 2017, 08:22PM IST దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి అనూహ్యంగా బుధవారం తప్పుకున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఫిటెనెస్, గాయాల కారణంగా టెస్టు ఫార్మాట్‌కి డివిలియర్స్ ఏడాది నుంచి దూరంగా ఉంటున్నాడు. గత కొన్ని నెలలుగా తన కెరీర్‌ గురించి ఏవేవో వార్తలు రాస్తున్నారని.. కానీ.. నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు డివిలియర్స్ వెల్లడించాడు. ‘ఏడాది నుంచి నేను చాలా బాధ్యతలు తీసుకున్నాను. దీనివల్ల మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయాను. 2004 నుంచి మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘకాలంగా ఎడతెరపిలేని క్రికెట్ ఆడాను. ఇప్పుడు నాకు బంగారంలాంటి ఇద్దరు పిల్లలున్నారు. నా భార్య, పిల్లలతో ప్రశాంతంగా సమయం గడపాలని ఆశిస్తున్నా. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో నా కెరీర్ గురించి చర్చించాను. మరికొంత కాలం క్రికెట్ ఆడతాను. గత ఆరేళ్లుగా దక్షిణాఫ్రికా జట్టుకి కెప్టెన్‌గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. టీ20, టెస్టుల్లో డుప్లెసిస్ ఇప్పటికే మెరుగైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. అతనికి ఇవ్వకుండా ఒకవేళ కొత్త వ్యక్తిని వన్డే కెప్టెన్‌గా నియమించినా నా వంతు సహకారం అందిస్తా’ అని డివిలియర్స్ స్పష్టం చేశాడు.
2
AARATHI టాటాసన్స్‌ చీఫ్‌ డిజిటల్‌ అధికారిగా ఆరతి సుబ్రహ్మణియన్‌ ముంబయి, జూలై 14: టాటాగ్రూప్‌సంస్థల ప్రమో టింగ్‌ సంస్థ టాటాసన్స్‌ కొత్తగా ఛీప్‌ డిజిటల్‌ ఆఫీసర్‌గా ఆర్తి సుబ్రహ్మణియన్‌ను నియమిం చింది. ప్రస్తుతం టిసిఎస్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా ఉన్న ఆరతి టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్ర శేఖరన్‌కు విధులపరంగా రిపోర్టుచేయాలిస ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ కొత్త బాధ్య తలు స్వీకరిస్తారని టాటాస్‌ వెల్లడించింది. గ్లోబల్‌ టెక్నాలజీ రంగంలో 26 ఏళ్ల అనుభవం ఉన్న ఆరతి టిసిఎస్‌లోనే తన కెరీర్‌ను ప్రారంభిం చారు. భారత్‌తోపాటు క్వీడెన్‌, అమెరికా, కెనడా దేశాల్లో కూడా నిచేసినట్లు టాటాసన్స్‌ ప్రకటిం చింది. వరంగల్‌లోని ఎన్‌ఐటినుంచి కంప్యూటర్‌ సైన్సులో పట్టభద్రురాలైన ఆరతి సుబ్రహ్మణి యన్‌ అమెరికాలోని యన్సాస్‌ వర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీని పొందారు.
1
Also Read: ఆన్‌లైన్ సినిమా టికెట్లు బంద్.. మంత్రి చెప్పిన కారణమిదే తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఎన్నోసార్లు రామ్ చరణ్‌ను, సినిమా దర్శకుడిని కలిశామని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చెప్తున్నారు. అయినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం చిత్ర యూనిట్‌ను మరోసారి కలిస్తే.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడారని.. చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. కథను తీసుకున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఉయ్యాలవాడ వంశస్థులు ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ‘సైరా’ చిత్రంపై కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. Must Read: గుడికని తీసుకెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్.. నిజామాబాద్‌లో ప్రియుడి దారుణం కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
0
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV తనని అలా పిలవొద్దని బాలీవుడ్ స్టార్స్‌కి ప్రభాస్ విజ్ఞప్తి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండటం అంటే ఇదేనేమో! బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం... | Updated: Jun 23, 2017, 04:41PM IST తనని అలా పిలవొద్దని బాలీవుడ్ స్టార్స్‌కి ప్రభాస్ విజ్ఞప్తి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి వుండటం అంటే ఇదేనేమో! బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకు టాలీవుడ్‌కి డార్లింగ్‌గా పేరున్న ప్రభాస్ ఆ తర్వాత బాహుబలిగా యావత్ దేశానికి సుపరిచితుడయ్యాడు. బాహుబలి విజయంతో అంతెత్తుకు ఎదిగినా కానీ సింప్లిసిటీలో మాత్రం మరింత ఒదిగిపోయాడు ప్రభాస్. ప్రభాస్ సింప్లిసిటీ ఏంటో టాలీవుడ్ ఆడియెన్స్‌కి తెలియనిది కాదు కానీ ఇటీవల జరిగిన ఓ పార్టీతో అతడి మనస్తత్వం, స్వభావం ఏంటనేది బాలీవుడ్ ప్రముఖులు, ఆడియెన్స్‌కి కూడా తెలిసిపోయింది. ఇటీవల కరణ్ జోహర్ ఏర్పాటు చేసిన బాహుబలి 2 సక్సెస్ పార్టీకి హాజరైన ప్రభాస్ అక్కడ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ప్రభాస్‌ని అభినందించిన బాలీవుడ్ స్టార్స్ అతడితో కలిసి తీసుకున్న సెల్ఫీలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తనతో సంభాషించే సమయంలో బాలీవుడ్ స్టార్స్ తనని పదేపదే 'సర్' అని పిలుస్తుండటంపై ప్రభాస్ కొంత ఇబ్బందికి గురయ్యారట. తనని అలా పిలిచిన వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ వంటి హీరోలతో దయచేసి తనని అలా 'సర్' అని పిలవకుండా ప్రభాస్ అని పేరు పెట్టి పిలవాల్సిందిగా సూచించారట ప్రభాస్. ప్రభాస్ చేసిన ఆ విజ్ఞప్తిపై స్పందించిన వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ ఇద్దరూ... '' మీరు ( ప్రభాస్) మాకు బాహబలి! మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవలేం'' అని బదులిచ్చారట సరదాగా. దటీజ్ డార్లింగ్ ప్రభాస్..   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0