id
int64
1
4.06M
inputs
stringlengths
4
37.5k
targets
stringlengths
0
37.5k
dataset_name
stringclasses
27 values
sub_dataset_name
stringclasses
7 values
task_type
stringclasses
11 values
template_id
int64
0
18
language
stringclasses
1 value
script
stringclasses
1 value
split
stringclasses
1 value
4,058,501
“అరిష్ట చతుష్టయం” అంటే ఏమిటి?
కింద పేర్కొన్న నాలుగు ప్రధాన కారణాలు (అరిష్ట చతుష్టయం) జాతుల విలుప్తత త్వరితంగా జరగడానికి దోహదపడతాయి. 1) ఆవాస క్షీణత – శకలీకరణం (లేదా) ముక్కలవడం : ఇవి జీవవైవిధ్య క్షీణతకు ముఖ్య కారణాలు. ఎ) అడవుల నరికివేత జాతుల విలుప్తతకు దారితీస్తుంది. ఉదా : భూమండలాన్ని 14 శాతం ఆక్రమిస్తూ ఉండే ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు క్షీణించి ప్రస్తుతం 4 శాతానికి పరిమితమయ్యాయి. బి) అటవీ భూములను సాగుభూములుగా మార్చివేయడం. ఉదా : భూగోళానికి ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్ వర్షాధార అడవులు ఒకప్పుడు అసంఖ్యాక జాతులకు ఆవాసంగా ఉండేవి. ఇటీవల వీటి వృక్ష సంపదను నాశనం చేసి, ఆ ప్రాంతాన్ని సోయాబీన్ మొక్కల సాగుకు లేదా మాంసంగా ఉపయోగపడే పశువుల ఆహారం కోసం గడ్డిభూములుగా మార్చివేశారు. సి) వాతావరణ కాలుష్యం జీవుల ఆవాస నాశనాన్ని ఉధృతం చేస్తుంది. అంతేకాకుండా కాలుష్య కారకాలు వాతావరణ నాణ్యతను మార్చడం వల్ల జాతుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. డి) ఆవాసం శకలీకరణం దానిలోని జనాభా క్షీణతకు దారిస్తుంది. ఉదా : విశాల ఆవరణాలలో నివసించే పక్షులు, క్షీరదాలు వలస ధర్మాన్ని ప్రదర్శించే జీవులు దీని ద్వారా అధికంగా ప్రభావితమవుతాయి. 2) వనరుల అతి వినియోగం : అవసరం, అంతులేని ఆశకు దారితీస్తున్నప్పుడు అది వనరుల అతి వినియోగానికి కారణమవుతుంది. ఉదా : స్టాలర్ సముద్ర ఆవు (స్టాలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్త గౌరవార్ధం నామకరణం చేయబడిన సముద్రపు ఆవు), ఉత్తర అమెరికాలో నివసించే పాసింజర్ పావురం మానవుల దుర్వినియోగం అధికమవడం కారణంగా విలుప్తం అయ్యాయి. మితిమీరిన చేపల వేట కారణంగా అనేక ఆర్థిక ప్రాముఖ్యం గల సముద్ర చేపలు అంతరించిపోయే అవకాశం ఉంది. 3) స్థానికేతర జాతుల చొరబాటు : స్థానికేతర (విదేశీ) జాతులను స్థానిక ఆవాసాలలో ప్రవేశపెట్టినప్పుడు అవి చొరబడేవిగా మారి, స్థానిక జాతుల మీద పైచేయి సాధించి, స్థిరపడి, స్వయం సమృద్ధమైన జనాభాలుగా ఎదుగుతాయి. (సహజసిద్ధంగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండే జాతిని స్థానిక జాతి అంటారు). ఉదా 1: నైల్ పెర్చ్ అనే చేపను తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం వల్ల, ఆ సరస్సులోని 200 జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించాయి. ఉదా 2 : కార్లియస్ గారీపైనస్ అనే ఆఫ్రికన్ పిల్లిచేపను చట్టవిరుద్ధంగా జలజీవ సంవర్ధన కోసం ప్రవేశపెట్టడం అనేది స్థానిక పిల్లిచేపల జీవనానికి హానికరంగా మారింది. 4) సహ విలుప్తతలు : పరాన్నజీవి ఆతిథేయిల అవికల్ప సహజీవనంలో ఆతిథేయి విలుప్తత పరాన్నజీవ విలుప్తతకు దారితీస్తుంది. అలాగే మొక్కలు – జంతువుల మధ్యగల అవికల్ప (విడదీయలేని) సహజీవనంలో మొక్క విలుప్తత జంతువు విలుప్తతకు కారణమవుతుంది. మొక్కలు – పరాగ సంపర్కకారుల సహజీవనం కూడా సహ విలుప్తతలకు ఉదాహరణ. దీనిలో కూడా ఒక జీవి విలుప్తత మరొక జీవి విలుప్తతకు దారితీస్తుంది. ఇలాంటి వాటిని సహవిలుప్తతలు అంటారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,502
n(P) = 4 అయ్యే విధంగా సమితి P కి ఒక ఉదాహరణనివ్వండి.
P = {0, 1, 2, 3}, n(P) = 4.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,503
కింద ఇచ్చిన ప్రకృతి, వికృతులను జతపరచండి. 1. ప్రయాణం అ) తలము 2. రథము ఆ) బత్తెము 3. స్థలము ఇ) పయనం 4. భత్యము ఈ) అరదము
1. ప్రయాణం ఇ) పయనం 2. రథము ఈ) అరదము 3. స్థలము అ) తలము 4. భత్యము ఆ) బత్తెము
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,504
Title: #AadhaarFacts: పేదలకు ఆధార్ వరమా? శాపమా?\nGiven the above title of an imaginary article, imagine the article.\n
"మాకు నెలలో కనీసం ఓ వారం రోజులపాటు తినడానికి తిండి ఉండదు" - ఇది ఐదుగురు కుటుంబ సభ్యులున్న మునియా దేవి ఆవేదన. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రాష్ట్రాల్లో రుఒకటైన ఝార్ఖండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఈమె నివసిస్తున్నారు. భర్త భూషణ్ 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇటుకల బట్టీలో పనిచేస్తారు. రోజంతా కష్టపడితే వచ్చేది కేవలం రూ.130. పేదవాళ్లకు అందాల్సిన సబ్సిడీ, రేషన్ సరుకులు గత మూడేళ్లుగా వీరికి ఎన్నడూ సక్రమంగా అందలేదు. దీనికి కారణం గ్రామంలో రేషన్ దుకాణం లేకపోవడమో, లేదా అక్కడ సరుకులు లేకపోవడమో కాదు. వీరి రేషన్ కార్డులను బయోమెట్రిక్ ఆధారిత నంబర్లతో అనుసంధానించకపోవడమే. ఇలాంటి బాధితులు ఝార్ఖండ్‌లో ఇంకా ఎందరో ఉన్నారని బీబీసీ అధ్యయనంలో తేలింది. మూడు నెలల క్రితం 35 కిలోమీటర్ల దూరంలోని ఆఫీసుకు వెళ్లి రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించడానికి అవసరమైన పేపర్లను అందజేశారు మునియాదేవి. అక్కడి అధికారులు రూ.400 లంచం తీసుకుంటే తప్ప ఆ పని చేసిపెట్టలేదు. రూ.400 అంటే వారి నాలుగు రోజుల సంపాదన. "నెట్‌వర్క్ సరిగా లేదు, కంప్యూటర్ పనిచేయడం లేదు అంటూ వాళ్లు ఏవేవో కారణాలు చెప్తున్నారు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది" అంటూ మునియా ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డుల ప్రకారం ఝార్ఖండ్‌లో చాలామంది జనవరి 1నే పుట్టడం విశేషం మునియా దేవి ఉండే విష్ణుబంధ్ గ్రామంలోని 282 కుటుంబాల్లో దాదాపు ఎవ్వరికీ వ్యవసాయ భూములు లేవు. వరి అన్నం, ఓ రెండు కూరలు దొరికిన రోజు వాళ్లకు పండుగే. కొన్ని రోజులు తినడానికి ఏమీ దొరకదు. ఆకలి నిరంతరం వాళ్లకు తోడుగా ఉంటుంది. గడువులోగా రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించకపోవడంతో మొత్తం 350 మంది లబ్ధిదారుల్లో 60 మంది రేషన్‌ను నిలిపివేశారు. వాళ్లంతా - తాము ఎన్నిసార్లు ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందో, అక్కడి సిబ్బందికి ఎలా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందో కథలుగా వివరిస్తారు. రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిందేనని ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త డాక్టర్ జీన్ ద్రెజ్ వాటిని - బలవంతపు, పేదల వ్యతిరేక చర్యలుగా పేర్కొన్నారు. సంతోషి తల్లి కోయలిదేవి 'ఆకలి చావులు' సెప్టెంబర్‌లో సిండెగా జిల్లాలో రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించకపోవడంతో ఒక కుటుంబానికి రేషన్ ఇవ్వలేదు. దీనివల్ల ఆ కుటుంబంలోని పదకొండేళ్ల బాలిక మరణించింది. ఆహారం లేకుండా ఉప్పు, టీతో ప్రాణాలు నిలుపుకొన్న..వారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,505
విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గ ఆలయం గురించి ఒక వ్యాసం రాయండి.
కనకదుర్గ గుడి, ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు. ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి దినము ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది దినములు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు. 1. మొదటి దినము స్వర్ణ కవచాలంకార దుర్గ దేవి 2. రెండవ దినము బాల త్రిపురసుందరి దేవి 3. మూడవ దినము గాయత్రి దేవి 4. నాలుగవ దినము అన్నపూర్ణా దేవి. 5. ఐదవ దినము లలితా త్రిపురసుందరి దేవి 6. ఆరవ దినము సరస్వతి దేవి 7. ఏడవ దినము దుర్గాదేవి 8. ఎనిమిదవ దినము మహాలక్ష్మిదేవి 9. తొమ్మిదవ దినము మహిషాసురమర్దిని 10. పదవ దినము రాజరాజేశ్వరి దేవి ఈ ఐదవ దినమున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా మూలానక్షత్రం గా భావిస్తారు. ఆ దినమున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,506
జాతీయ విపత్తులు గురించి వ్యాసం రాయండి.
అకస్మాత్తుగా సంభవించే ఉపద్రవపూరిత సంఘటననే విపత్తు. దీనివల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుంది. ఇది సంభవించిన ప్రాంతంలో మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దుష్ఫలితాలు కలుగుతాయి. విపత్తుల వల్ల సాధారణ జీవితానికి అంతరాయం కలుగుతుంది. అత్యవసర చర్యలకు ప్రతిబంధక మేర్పడుతుంది. దైనందిన కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది. విపత్తు లక్షణాలు 1. ఆకస్మికంగా సంభవించడం 2. అతివేగంగా విస్తరించడం 3. ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం. 4. ప్రకృతి వనరులను ధ్వంసం చేసి, అభివృద్ధికి ఆటంకం కలిగించడం. సాధారణంగా విపత్తులు రెండు రకాలుగా సంభవిస్తాయి. 1. సహజమైనవి 2. మానవ తప్పిదాలవల్ల సంభవించేవి. భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫానులు, కరువులు, కీటకదాడులు, అంటువ్యాధులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సహజమైన విపత్తులైతే యుద్ధాలు, అణు ప్రమాదాలు, రసాయన విస్ఫోటనాలు, ఉగ్రవాద దాడుల్లాంటివి మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తులుగా చెప్పవచ్చు. ఇండియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్ (IDKN) నివేదికల ప్రకారం భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తరచు ఏదో ఒక విపత్తుకు గురవుతున్నాయి. దీనికి కారణం మనదేశ విభిన్న శీతోష్ణస్థితులు, అధిక జనాభా, సుదీర్ఘ తీరరేఖ, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అటవీ నిర్మూలన మొదలయినవి. భారతదేశంలో సంభవించిన కొన్ని ఘోర విపత్తులను పరిశీలించినట్లయితే – భోపాల్ గ్యాస్ దుర్ఘటన, ఉత్తర కాశీ భూకంపం, లాతూర్ (మహారాష్ట్ర భూకంపం, భుజ్ (గుజరాత్) భూకంపం, దివిసీమ ఉప్పెన, దక్షిణ కోస్తాలో సునామీ, ముంబై పై ఉగ్రవాదుల దాడి, కేరళ వరదలు, కరోనా మహమ్మారి విజృంభణ మొదలైనవి కొన్ని. అంత విపత్తుల తీవ్రతను తగ్గించడంలో విపత్తు నిర్వహణ చాలా ముఖ్యం. విపత్తు నిర్వహణ అనేది విపత్తుల వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి మనిషి చేసే క్రమశిక్షణాయుతమైన ప్రయత్నం. విపత్తు నిర్వహణలో ప్రధానాంశాలు 1. సంసిద్ధత 2. ఉపశమన చర్యలు 3. సహాయక చర్యలు 4. పునరావాసం. విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాల విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచనలు కనబడకపోవచ్చు. ఉదాహరణకు భూకంపాలు, విస్ఫోటనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సంభవించే అవకాశం కలదు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు (వనరులు) ఉపయోగించుకొని విపత్తు నుండి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలు ఉపశమన చర్యలు. విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకొని వారికి తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం వంటి మౌలికావసరాలను తీర్చడం సహాయక చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు ఋణ సహాయాన్ని అందించడం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడం పునరావాసం. 2005వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించడానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధన వ్యవస్థను ఏర్పాటుచేశారు. విపత్తులు సంభవించినపుడు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని కూడా రూపొందించారు. వీటికి తోడుగా జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌర రక్షణ కళాశాలను ప్రారంభించారు. విపత్తులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వాటిని సంభవించకుండా ఆపడం అసాధ్యం. విపత్తు సంభవించేవరకు వేచి ఉండకుండా, ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. సక్రమమైన ప్రణాళిక, శిక్షణ, ప్రజలలో సరైన అవగాహన ద్వారా విపత్తులతో సంభవించే విధ్వంసాన్ని తగ్గించవచ్చు. దీనికి ఉదాహరణ కోవిడ్-19 వ్యాధి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించి, వ్యాధి నివారణకు మాస్కులు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల వల్ల వ్యాధి సంక్రమణను, ప్రాణనష్టాన్ని నివారించ గలుగుతున్న విషయం వాస్తవం. విపత్తు నిర్వహణ అనే అంశంపై పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు రూపొందించాలి. విపత్తులు సంభవించినపుడు ఎలా వ్యవహరించాలనే సమాచారాన్ని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి. విపత్తు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, సంక్షోభ సమయంలో స్పందించాల్సిన విషయాల పట్ల పౌరులకు శిక్షణ అందించాలి. విపత్తులు సంభవించినపుడు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు సహాయపడాలి. ప్రజలు కూడ బాధ్యతతో మసలుకుంటూ ప్రభుత్యాలకు తమ వంతు సహకారాన్ని అందించాలి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,507
ప్రశ్న: సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటానికి ఏ సన్నాహాలు చేయాలి?
సూర్యగ్రహణాన్ని సురక్షితంగా చూడటానికి తీసుకోవలసిన/ చేయాల్సిన సన్నాహాలు : 1. సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడరాదు. అలా చూసినట్లయితే కన్నులలోని తేలికపాటి పొరలు దెబ్బ తినవచ్చు. 2. సూర్యగ్రహణాన్ని నల్లటి గ్లాసుల సహాయంతో మాత్రమే చూడాలి. 3. టెలిస్కోప్, బైనాక్యూలర్ లాంటి వాటి ద్వారా చూడరాదు. 4. సోలార్ ఫిల్టర్ ద్వారా మాత్రమే చూడాలి. పెద్దలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే చూడాలి. 5. ప్లానిటోరియం లాంటి ప్రదేశాలు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి వీక్షించవచ్చు. 6. గ్రహణ సమయంలో అయస్కాంత విద్యుత్ పరారుణ తరంగాలు, ప్రసరించవచ్చు. కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,508
ప్రశ్న : సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవటంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజులలో అది సంభవించదు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,509
52/160 = 13/(2^n×5^m) అయిన m + n విలువను కనుగొనుము.
52/160 = (2^2×13)/(2^5×5) = 13/(2^3×5) = 13/(2^n×5^m) n = 3, m = 1 ∴ m + n = 3 + 1 = 4
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,510
కార్టెల్స్ గురించి సంక్లిప్తంగా వివరించండి
సంస్థలు తమ మధ్య పోటీని తగ్గించుకోవడానికి, సంస్థలన్నీ కలిసి ఒక అంగీకారంతో ఉత్పత్తిని, ధరను నిర్ణయించుకోనే వ్యవస్థ.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,511
ప్రశ్న :"వావం గ్రామ విస్తీర్ణం ఎంత?" నేను వికీపీడియాలో వావం గురించిన ఈ వచనాన్ని కనుగొన్నాను మరియు దానిలో సమాధానం ఉందని నేను భావిస్తున్నాను. ఇచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? వచనం: వావం, శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలానికి చెందిన గ్రామము.[1] ఇది మండల కేంద్రమైన బూర్జ నుండి 1 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 344 ఇళ్లతో, 1192 జనాభాతో 299 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 599, ఆడవారి సంఖ్య 593. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 210 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581216[2].పిన్ కోడ్: 532445.
వావం గ్రామం 299 హెక్టార్లలో విస్తరించి ఉంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,512
...శ్నించినప్పుడు, ఆ అధికారి కాదన్నారు. 'సమాచారం ఉన్నందువల్లనే మేం హిడ్మాను టార్గెట్ చేసే లక్ష్యంతోనే అక్కడికి వెళ్లాం. కానీ, వెనక్కి వచ్చేటప్పుడు బలగాల్లో అప్రమత్తత స్థాయి కాస్త సడలింది. దాని ఫలితమే ఈ నష్టం' అన్నారు. 'ఈ దాడి స్థలం నుంచి హిడ్మా స్వగ్రామం పువ్వర్తి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతం అంతా ఆయనకు కొట్టిన పిండి. పైగా స్థానికుల మద్దతు ఆయనకు ఉంది. కాబట్టి పోలీసుల ప్రతి కదలికనూ వారు జాగ్రత్తగా గమనించి, పకడ్బందీ ప్లాన్‌తోనే దాడికి దిగారు' అని ఓ స్థానిక పాత్రికేయుడు బీబీసీతో చెప్పారు. 'ఆంధ్... Write the rest of the article:
ణ ఇస్తున్నప్పటికీ వారు గ్రేహౌండ్స్‌లా ఎందుకు విజయాలు సాధించలేకపోతున్నారు? ఎందుకు నక్సల్స్ చేతిలో దెబ్బతింటున్నారు?' అని అడిగినప్పుడు వివిధ శ్రేణుల నాయకత్వ లోపమే కారణమన్నారు. 'హిడ్మా, ఆయన అనుచరులు అక్కడ దాడికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారం మాకు ముందు నుంచే ఉంది. ఏదైనా దాడి జరగొచ్చనే సమాచారంతో మేం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధికారులను ముందే హెచ్చరించాం' అని కూడా ఆ అధికారి బీబీసీతో చెప్పారు. అసలు 'మావోయిస్టులు ఇలా వరుసగా దాడులకు ఎందుకు పాల్పడుతున్నారు? ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? దాడులతో ఏం నిరూపించుకోవాలనుకుంటారు?' అన్న ప్రశ్నకు ఆ అధికారి 'వారి టీసీఓసీలో భాగమే ఆ దాడులు' అని బదులు చెప్పారు. మావోయిస్టులు (ప్రతీకాత్మక చిత్రం) అసలేంటీ టీసీఓసీ? మావో రచించిన గెరిల్లా యుద్ధతంత్రంలో టీసీఓసీ (టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపేయిన్) అనేది ఓ కీలక అంశం. 'శత్రువు బలం ఎక్కువగా ఉండి, నీ బలం తక్కువగా ఉన్నప్పుడు, నీ బలమైన ప్రాంతాల్లో నీకున్న శక్తులన్నీ కూడగట్టుకొని శత్రువుకు చెందిన చిన్న చిన్న విభాగాలపై బలమైన మెరుపుదాడులు చేసి విజయాలు సాధించాలి' అనేది మావో చెప్పిన గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో ఒకటి. దీని గురించి మరో పోలీసు అధికారి ఇలా వివరించారు: 'మావోయిస్టులు తమ బలమైన ప్రాంతాల్లో ప్రతియేటా, ముఖ్యంగా వేసవి కాలంలో ఇలాంటి వరుస దాడులకు పాల్పడుతుంటారు. ఈ ఏడాది జనవరి నుంచే వాళ్లు దాడులు పెంచారు. మేం కూడా ప్రతిసారీ జాగ్రత్తగానే ఉంటాం. వారి వ్యూహాలను చిత్తు చేస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఎదురుదెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. ఇది పూర్తిగా ఊహించనిదేమీ కాదు.' 'వాళ్ల ప్రాంతాల్లోకి మేం చొచ్చుకుపోతూ వరుసగా క్యాంపుల్ని ఏర్పాటు చేస్తూ పోతుండటంతో నక్సలైట్లు రెచ్చిపోతున్నార'ని కూడా ఆ అధికారి అన్నారు. ఈ దాడి జరిగిన జొన్నగూడెం సమీపంలోనే తర్రెం, పెగడుపల్లి, సార్కెగూడ, బాసగూడలో మొత్తం నాలుగు పోలీసు క్యాంపులు/స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. త్వరలోనే మరికొన్ని ఏర్పాటు చేయాలనే వ్యూహంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీన్ని అడ్డుకోవడం కోసమే మావోయిస్టులు ఈ దాడికి స్కెచ్ వేశారనేది మరి కొందరు పోలీసు అధికారుల అభిప్రాయం కూడా.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,513
విడదీసిన పదాలను కలిపి రాయండి. ఉదా : మనసు + ఐన = మనసైన, మనసయైన 1. మేన + అత్త 2. పూలు + ఎత్తి 3. ఏమి + అంటిరి
1. మేన + అత్త = మేనత్త, మేనయత్త 2. పూలు + ఎత్తి : పూలెత్తి (ఉత్వసంధి నిత్య సంధి కనుక యడాగమ రూపం ఉండదు) 3. ఏమి + అంటిరి = ఏమంటిరి, ఏమియంటిరి పై ఉదాహరణలో సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేషంగా జరుగుతుంది. అనగా ఒకచోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించక పోవడం ఉంటుంది. ఇలా జరిగే విధానాన్ని వైకల్పికం అంటారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,514
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: ఆ.వె. ఎంత యలుకగొన్న నేమి సత్పురుషుల నోటనెట్లు చెడ్డమాట వెడలు రాహువదన గహ్వరమున నున్నను జంద్రు మీది కరములమృతరసమె కురియుఁగా గాదె !
రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు తన కిరణాలతో అమృతవర్షం కురిపించినట్లుగా గొప్పవారికి కోపం వచ్చినా వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి కాని, చెడ్డమాటలు రావు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,515
క్రింది పదాలను వివరించండి. (ఎ) ఎలక్ట్రోఫారిసిస్ (బి) స్కందనం (సి) టిండాల్ ఫలితం
(ఎ) ఎలక్ట్రోఫారిసిస్ : కొల్లాయిడ్ ద్రావణంలో రెండు ప్లాటినం ఎలక్ట్రోడ్లు ముంచి ఉంచి వాటి మధ్య విద్యుత్ పొటెన్షియల్ను ఆవర్తనం చేసినట్లైతే కొల్లాయిడ్ కణాలు రెండు ఎలక్ట్రోడ్లలో ఏదోఒక దానివైపుగా ప్రయాణిస్తాయి. అనువర్తిత emf ప్రభావంతో కొల్లాయిడ్ కణం చలనం చెందే ప్రక్రియను విద్యుదావేశితకణ చలనం (లేదా) ఎలక్ట్రోఫోరసిస్ అంటారు. (బి) స్కందనం : సాల్ కొల్లాయిడ్ కణాలు- పాత్ర అడుగు భాగానికి చేరి స్థిరపడే ప్రక్రియను సాల్స్కంధనం లేదా అవక్షేపణం లేదా ఫ్లాక్యులేషన్ అంటారు. (సి) టిండాల్ ఫలితం : “కాంతి, కొల్లాయిడ్ ద్రావణం ద్వారా ప్రయాణించినప్పుడు, కాంతి మార్గాన్ని మనం ఒక కాంతివంతమైన పుంజంగా చూడవచ్చు. ఈ దృగ్విషయాన్నే “టిండాల్ ఫలితం” అంటారు. ఇది ఒక దృక్ ధర్మం. కారణము : కొల్లాయిడ్ ద్రావణం ద్వారా కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతి పెద్దసైజు కణాలు అయిన కొల్లాయిడ్ల విక్షిప్త, ప్రావస్థా కణాలలో పరిక్షేపణం చెందుతాయి. ఆకాశము నీలంగా ఉండటానికి టిండాల్ ప్రభావమే కారణము. నిజద్రావణాలు టిండాల్ ప్రభావాన్ని ప్రదర్శించవు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,516
హుయన్సాంగ్ గురించి సంక్లిప్తంగా వివరించండి.
హర్షుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ (క్రీ.శ. 630-644). ఇతడు దేశంలోని అనేక ప్రాంతాల్లో, బౌద్ధమత పవిత్ర స్థలాల్లో నలందా విశ్వవిద్యాలయంలో గడిపి అనేక బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేశాడు. హర్షునికి సన్నిహితుడైనాడు. హర్షుడు కనోజ్, ప్రయాగలలో జరిపిన మోక్ష పరిషత్లలో పాల్గొన్నాడు. భారతదేశంలో అనేక బౌద్ధ గ్రంథాలను, బుద్ధుని ధాతువులను సేకరించాడు. తన పర్యటన అనుభవాలను సి-యూ-కి అను గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథం హర్షుని రాజ్యంలోని రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులను వివరిస్తుంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,517
పట్టణీకరణ పెరగడమంటే ప్రజల అవకాశాలు పెరగటం, ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వంటివి ఒకటే కాదు. దాని వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. – పట్టణీకరణ పరిణామాలపై మీ వైఖరిని తెలియజేయండి.
పట్టణీకరణ పెరగటం వల్ల అవకాశాలతో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అవి : నివాస స్థలాలకు మరియు గృహ వసతికి కొరత మురికివాడలు పెరగడం గాలి, నీరు, నేల కలుషితం అవడం ట్రాఫిక్ సమస్యలు పెరగడం ఆహార పదార్థాల కొరత చెత్త నిర్వహణ కష్టమవడం మురుగునీటి నిర్వహణ సమస్య ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం. పర్యావరణంపై ఒత్తిడి పెరగడం అభివృద్ధిలో పట్టణీకరణ అనేది ఒక భాగం. అయినప్పటికీ ప్రభుత్వం పట్టణాలలో తగిన వసతులు కల్పించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పట్టణీకరణయే అభివృద్ధికి ఆటంకం అవుతుంది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,518
కింది ప్రకృతులను వికృతులతో జతపర్చండి. 1) రథం అ) ఆన 2) కుమారుడు ఆ) అరదం 3) ఆజ్ఞ ఇ) కొమరుడు
1) రథం ఆ) అరదం 2) కుమారుడు ఇ) కొమరుడు 3) ఆజ్ఞ అ) ఆన
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,519
Doc to summarize: తీవ్రవాదులు దాడికి పాల్పడిన మసీదు బిర్ అల్-అబెద్ పట్టణంలోని అల్-రవాడ మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దేశంలో 2013లో జరిగిన ఇస్లామిస్ట్ తిరుగుబాటు తర్వాత జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే. భద్రతా బలగాలకు సహకరిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి భద్రతా అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేర్వేరు ట్వీట్లలో ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఏం జరిగింది? ఆధునిక ఈజిప్టు చరిత్రలో అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటి. నాలుగు వాహనాలలో వచ్చిన దుండగులు ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచాక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో మసీదు కిక్కిరిసి ఉంది. కనీసం వందమంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. దాడి అనంతరం మసీదులోని చిత్రాల్లో చాలామంది బాధితులు కనిపిస్తున్నారు. దాడికి పాల్పడింది ఏ వర్గం వారైందీ ఇంకా తెలీలేదు. అయితే, మసీదు నుంచి బయటకు వస్తున్న వారిపైన, అంబులెన్సులపైన కూడా కాల్పులు జరిగాయని బాధితుల బంధువులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా కథనం వెల్లడించింది. నాటి నుంచి జరుగుతున్న దాడుల్లో వందలాది మంది పోలీసులు, సైనికులు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ స్టేక్‌కు అనుబంధంగా ఉన్న ‘సినాయ్ ప్రావిన్స్ గ్రూప్’ ప్రధానంగా ఈ దాడులకు పాల్పడుతోంది. తీవ్రవాదుల లక్ష్యం ఎవరు? సూఫీయిజాన్ని ఆచరించేవాళ్లు, ఇస్లామిక్ ఆధ్యాత్మిక వాదులే ఈ మసీదు వద్దకు వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సహా చాలా జీహదీ సంస్థలు సూఫీలతో విభేధిస్తున్నాయి. భీకర దాడి సల్లీ నబిల్, బీబీసీ న్యూస్, కైరో ఉత్తర సినాయ్ ప్రావిన్సులో చాలా ఏళ్ల నుంచి ఇస్లామిక్ మిలిటెంట్లు కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. స్థానిక భద్రతా బలగాలనే వాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అయితే, ఒక మసీదులో ప్రార్థనలు చేస్తున్న ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని, దాడికి పాల్పడటం ఇదే మొదటిసారి. ఇలాంటి దాడుల్లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవటం, బాధితులు కావటం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఉత్తర సినాయ్ ప్రావిన్సు ఎంతో కాలంగా మీడియాకు దూరంగా...వు0ది. nSummary in the same language as the doc:
ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో తీవ్రవాదులు జరిపిన బాంబు, తుపాకుల దాడిలో 235 మంది మరణించారని ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ తెలిపింది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,520
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: వెన్నెల
వెన్నెల పదానికి పర్యాయ పదాలు: కౌముది, జ్యోత్స్న, చంద్రిక
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,521
భారత భాగస్వామ్య చట్టము, 1932 ప్రకారము భాగస్వామ్య నమోదు తప్పనిసరియా ? సంస్థ నమోదుకు సంబంధించిన విధానాన్ని వివరించండి.
భాగస్వామ్య సంస్థ నమోదు తప్పనిసరి అని భారత భాగస్వామ్య చట్టము, 1932లో చెప్పలేదు. కాని సంస్థ నమోదు కాకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. అందువలన నమోదు ఆవశ్యకము అవుతుంది. నమోదును ఏ సమయములోనైనా చేయించవచ్చును. సంస్థను నమోదు చేయడానికి క్రింది విధానాన్ని అవలంబించవలసి ఉంటుంది. నమోదు పద్ధతి: భాగస్వామ్య సంస్థ నమోదు కొరకు భాగస్తులు దిగువ సమాచారముతో ఒక నివేదికను తయారుచేసి దరఖాస్తు చేసుకోవాలి. భాగస్వామ్య సంస్థ పేరు. సంస్థ వ్యాపారము చేసే ప్రదేశము లేదా ప్రదేశాలు. భాగస్తుల పూర్తి పేర్లు, చిరునామాలు. ప్రతి భాగస్తుడు సంస్థలో చేరిన తేది. సంస్థ ప్రారంభమైన తేది, వ్యాపారస్వభావము. . భాగస్వామ్య వ్యాపార సంస్థ కాలపరిమితి. భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించిన ఇతర అంశాలు. భాగస్తులు ఈ దరఖాస్తు పత్రముపై సంతకాలు చేసి క్ 3 నమోదు రుసుము చెల్లించి రిజిష్ట్రారుకు దాఖలు చేయాలి. చట్ట ప్రకారము ఉన్న నియమ నిబంధనలతో దరఖాస్తును పరిశీలించిన పిమ్మట రిజిష్ట్రారు సంతృప్తిపడితే, సంస్థ పేరును, భాగస్తుల పేర్లను రిజిష్టరులో నమోదు చేసి, అధికార ముద్రవేసిన నమోదు పత్రాన్ని రిజిష్టారు సంబంధిత సంస్థకు జారీ చేస్తాడు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,522
కింద ఇచ్చిన భావం వచ్చేలాగా ఒక పద్యాన్ని రాయండి మరియు రాసిన పద్యంలో ప్రతి పదంకి అర్ధము రాయండి: ఈ చిన్నారుల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో, ఎందరు తల్లుల గర్భకుహరాలు శోకంతో దహించుకుపోయి జీవచ్చవంలా బతుకుతున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్ర పోయాయో, వృద్ధిలోకి రావలసిన ఏ విద్యలు అల్లాడిపోయాయో ! ఆలోచిస్తే గుండెలు కరిగి ప్రవహిస్తాయి.
శా. ఆలోకించిన గుండియల్లబగు నాయా పిల్ల గోరీలలో : నే లేబుగ్గల సౌరు రూపడియెనో ! యేముద్దు నిద్రించెనో యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో – యీ లోకంబున వృద్ధిగాందగిన యే యే విద్యలల్లాడెనో ! ప్రతిపదార్థం : ఆలోకించిన = చూసిన గుండియల్ = గుండెలు కఱగున్ = కరిగిపోతాయి ఆయా = ఆ పిల్లగోరీలలోన్ = పిల్లల సమాధులలో ఏ లే బుగ్గల = ఎన్ని లేత బుగ్గల సౌరు = అందం రూపటియెనో = నశించిపోయిందో ఏ ముద్దు = ఎన్ని అనురాగాల ముద్దులు నిద్రించెనో = దీర్ఘ నిద్రపోయాయో ఏ లీలావతి = ఏ స్త్రీమూర్తి గర్బగోళమున = గర్భ కుహరము వహ్ని జ్వాల = అగ్ని జ్వా లలు జీవించునో = జీవచ్ఛవంలా బతుకులు ఈ లోకంబున = ఈ లోకంలో వృద్ధిగాదగిన = వృద్ధిలోకి రావలసిన ఏఏ విద్యలు = ఏ విద్యలు అల్లాడెనో = అల్లాడి పోయినవో
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,523
ప్రశ్న: రెడ్డిగూడెం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? అడిగిన ప్రశ్నకి సమాధానం క్రింద ఇచ్చిన సమాచారం లో ఉంటె అవును లేకపోతే కాదు మరియు ప్రశ్నకి ఇచ్చిన సమాధానం కి సంబంధం లేకపోతే సంభంధం లేదు అని రాయండి సమాచారం: రెడ్డిగూడెం పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు రెడ్డిగూడెం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. రెడ్డిగూడెం కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2619 ఇళ్లతో, 9873 జనాభాతో 1838 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5146, ఆడవారి సంఖ్య 4727. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2694 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 24. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588998[1].పిన్ కోడ్: 521215. గ్రామ భౌగోళికం [2] సముద్రమట్టానికి 73 మీ. ఎత్తు సమీప గ్రామాలు కుడప 5 కి.మీ, మాధవరం 5 కి.మీ, కునపరాజుపర్వ 5 కి.మీ, అన్నేరావుపేట 7 కి.మీ, నగులూరు 7 కి.మీ సమీప మండలాలు విస్సన్నపేట, ఎ.కొండూరు, నూజివీడు, మైలవరం సమాచార, రవాణా సౌకర్యాలు రెడ్డిగూడెంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. విస్సన్నపేట, కంభంపాడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 45 కి.మీ దూరంలో ఉంది. విద్యా సౌకర్యాలు గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల విస్సన్నపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల మైలవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్...
ఇచ్చిన సమాధానం కి ప్రశ్నకి సంభంధం లేదు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,524
భారతీయ 200 రూపాయల నోటు (₹ 200) భారత రూపాయికి విలువ. 2016 ఇండియన్ బ్యాంక్ నోట్ డీమోనిటైజేషన్
తరువాత , కొత్త కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది - ₹ 2,000, ₹ 500, 200, 100, ₹ 50, ₹ 20, 10.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,525
కింది వాక్యముని ఆధునిక వ్యవహార శైలిలోకి మార్చండి. (ఈ మార్పులు చేసేటప్పుడు “ము” వర్ణాలు, బిందు పూర్వక ‘బు’ కారాలు, అంబు) యడాగమాలు, క్రియా స్వరూపాలు (చేయును, జరుగును, చూడుము వంటివి మారతాయి. గమనించండి.) కొందరు పన్యాముల మూలమున నాపని చేయుదురు.
కొంతమంది ఉపన్యాసాల ద్వారా, ఆ పని చేస్తారు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,526
కింద ఇచ్చిన పదంతో వాక్య ప్రయోగం చెయ్యండి: అడుగున పడిపోవు
పసిబాలుడు లోతైన బోరుబావి అడుగున పడిపోవడం విచారకరం.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,527
భాగస్వామ్య సంస్థ రద్దు రకాలను వివరించండి.
భాగస్వామ్యము రద్దు, భాగస్వామ్య సంస్థ రద్దుకు తేడా ఉన్నది. భాగస్తుని మరణము, విరమణ, మతిభ్రమించడం, దివాలా తీయడం వలన భాగస్వామ్యము రద్దు అవుతుంది. కాని భాగస్వామ్య సంస్థ రద్దుకానవసరము లేదు. సంస్థను |పునర్వవస్థీకరణచెంది అదే పేరు మీద వ్యాపారాన్ని కొనసాగించవచ్చును. కాబట్టి భాగస్వామ్య రద్దులో సంస్థ రద్దు కావచ్చును లేదా కాకపోవచ్చును. కాని భాగస్వామ్య సంస్థ రద్దయితే వ్యాపారమును కొనసాగించే ప్రశ్న ఉండదు. సంస్థ ఆస్తులను అమ్మి, ఋణదాతలకు చెల్లించగా ఏమైనా మిగిలితే మిగిలిన భాగస్తులు పంచుకుంటారు. భాగస్వామ్య సంస్థ రద్దు దిగువ పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒప్పందము ద్వారా రద్దు: భాగస్వామ్య సంస్థను భాగస్తుల పరస్పర అంగీకారముతో లేదా ఒప్పందములో పేర్కొన్న షరతుల ప్రకారము రద్దు చేయవచ్చును. నోటీసు ద్వారా రద్దు: ఏ భాగస్తుడైనా సంస్థను రద్దు చేయాలని ‘వ్రాతపూర్వకముగా ఇతర భాగస్తులకు నోటీసు పంపడం ద్వారా కూడా రద్దు పరచవచ్చును. ఆగంతుక రద్దు: -ఒక భాగస్తుడు మరణించినా, మతిభ్రమించినా లేదా దివాలా తీసిన ఆ సంస్థను రద్దు చేయవచ్చును. తప్పనిసరిగా రద్దు: ఒక భాగస్తుడు లేదా భాగస్తులందరూ దివాలాదారుగా ప్రకటించబడినపుడు లేదా సంస్థ వ్యాపారము చట్ట వ్యతిరేకము అయినపుడు సంస్థ రద్దవుతుంది. కోర్టు ద్వారా రద్దు: సంస్థలో ఏ భాగస్తుడైనా శాశ్వతముగా అశక్తుడు అయినా, అనుచితముగా ప్రవర్తించినా, ఉద్దేశ్యపూర్వకముగా ఒప్పందాన్ని అతిక్రమించినా, ఇతరుల అంగీకారము లేకుండా తన వాటాను బయటవారికి బదిలీ చేసినా కోర్టు సంస్థను రద్దు చేయవచ్చును.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,528
పొగాకును పూర్తిగా నిషేధించిన ప్రపంచంలో మొదటి దేశం ఏది?
భూటాన్
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,529
స్త్రీల పట్ల సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? దీనిపై మీ అభిప్రాయాలు తెల్పండి.
స్త్రీల పట్ల సమాజంలో గౌరవ భావమే ఉన్నది. కానీ, సమాజంలో కొంతమంది స్త్రీలను చులకనగా చూస్తారు. చదువుకోనివారు, వివేకం లేనివారు, గౌరవం లేనివారు మాత్రమే స్త్రీలను తక్కువగా చూసే ప్రయత్నం చేస్తారు. స్త్రీలు బలహీనులనే భావం కూడా కొంతమందికి ఉంది. అది తప్పు.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,530
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: మరణం
మృత్యువు, నిర్యాణం, చావు
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,531
Title: మావో స్థాయికి జిన్‌పింగ్: అధికారాలు పెంచనున్న చైనా ‘రెండు సమావేశాలు’\nGiven the above title of an imaginary article, imagine the article.\n
మావో జెడాంగ్, జీ జిన్‌పింగ్ జాతీయ శాసన సభ, రాజకీయ సలహా విభాగం సమావేశాలు బీజింగ్‌లో ప్రారంభమయ్యాయి. వీటినే చైనా 'రెండు సమావేశాలు'గా పిలుస్తారు. దేశ రాజకీయాల్లో ఈ రెండు సమావేశాలు అత్యంత కీలకమైనవి. ఈయేడు కీలకమైన రాజ్యాంగ సవరణలు చేసే దిశగా పార్లమెంట్ కొన్ని నిర్ణయాలను ఆమోదించనుంది. అందులో ముఖ్యమైంది ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం. అంతేకాదు, ఎవరైనా రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండరాదనే నిబంధనను కూడా తొలగించడం. అంటే దీనర్థం షీ జిన్‌పింగ్‌ను మరింత కాలం అధ్యక్ష పీఠంలో కొనసాగించడం. ఇప్పటికే ఆయన సిద్ధాంతాలు, మార్గదర్శకాలతో నవ చైనా ముందుకు వెళుతోంది. దీన్నే 'షీ జిన్‌పింగ్ ఆలోచనలు'గా పిలుస్తున్నారు. ఆయ‌న పాల‌న‌లో తీసుకొచ్చిన‌ కొత్త‌ సంస్క‌ర‌ణ‌ల‌నే జిన్‌పింగ్ థాట్ అంటారు. ఏమిటీ సమావేశాలు? చైనా చట్టసభను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)గా పిలుస్తారు. ఇది భారత్‌లోని లోక్‌సభ లాంటిదని చెప్పవచ్చు. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఎన్‌పీసీ అత్యంత బలమైన జాతీయ సభ. అయితే, చైనాలో ఏక పార్టీ వ్యవస్థ అమల్లో ఉండటంతో అంతర్జాతీయ పరిశీలకులు మాత్రం దీన్ని రబ్బర్ స్టాంప్‌గా అభివర్ణిస్తుంటారు. ఈ ఏడాది చైనా ప్రావిన్స్‌లు, స్వతంత్ర ప్రాంతాలు, కేంద్ర పరిపాలన మున్సిపాలిటీలు, హాంకాంగ్, మకావ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతాలు, సాయుధ దళాల నుంచి దాదాపు 2,980 మంది ఎన్‌పీసీ సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు. ఇందులో 742 మంది మహిళలు, 438 మంది మైనారిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఎన్‌పీసీ భవనం దేశంలో చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) అత్యంత బలమైన రాజకీయ సలహా సంస్థ. అయితే, దీనికి చట్టాలు చేసే అధికారం మాత్రం లేదు. ప్రస్తుతం సీపీపీసీసీలో 2,158 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. వీటి సమావేశాలు కూడా కీలకమైనవే. ఈ రెండు సమావేశాలను చైనీస్‌లో 'లియాంగ్ హుయ్‌'గా పిలుస్తుంటారు. ఇవి వారం నుంచి రెండు వారాల వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది సీపీపీసీసీ సమావేశాలు మార్చి 3న, ఎన్‌పీసీ సమావేశాలు మార్చి 5న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఏం జరగొచ్చు? ఐదేళ్లకోసారి నిర్వహించే కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు గతేడాది 2017లో జరిగాయి. ఆ తర్వాత జరుగుతున్న పెద్ద కార్యక్రమం ఈ రెండు సమావేశాలు. అందుకే ఇవి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,532
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: సమూహం
గుంపు, రాశి, సముదాయం
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,533
మీ పరిసరాల్లో మీకు కన్పించే మూఢనమ్మకాల నిర్మూలనకు ఎలాంటి చర్యలను తీసుకుంటారు ?
మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనేక మూఢనమ్మకాలు ప్రభావితం చేస్తున్నాయి. వాటిని పారద్రోలడానికి నేను చేసే పనులను వివరిస్తాను. 1. ముందుగా నిరక్షరాస్యులకు విద్య నేర్పుతాను. 2. వయోజనులకు మంచిగా నచ్చచెపుతాను. 3. స్వచ్ఛత, స్వేచ్ఛ, సమానత్వం గురించి వివరించి చెపుతాను. అప్పటికీ మార్పు రాకపోతే సామాజిక సేవా కార్యకర్తలు, సంస్కర్తలచే చెప్పిస్తాను. 4. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను చిన్నచిన్న నాటికల ద్వారా మా వాడలో ప్రదర్శిస్తాను. 5. మూఢనమ్మకాలను పారద్రోలటానికి, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయిస్తాను. 6. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను, కరపత్రాల ద్వారా మౌఖికంగా వివరిస్తాను. 7. వయోజనులతో సత్సంబంధాలను కల్గి, వారికి నచ్చచెప్పి మూఢనమ్మకాలపై వారికి అవగాహన కల్పిస్తాను. 8. నా మిత్ర బృందంతో కల్సి వారి జీవితాలలో మార్పు కొరకు కృషిచేస్తాను.
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,534
I wonder హైడ్రోజన్ పరమాణుభారం ఎంత ?
"ఆవర్తన పట్టిక" అనునది రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసములు మరియు ఆవర్తన రసాయన ధర్మముల ఆధారంగా యేర్పాటు చేయబడిన ఒక అమరిక. ఈ పట్టికలో మూలకాలు వాటి పరమాణు సంఖ్య(పరమాణు కేంద్రకంలో గల న్యూట్రాన్ల సంఖ్య) యొక్క ఆరోహణ క్రమంలో అమర్చబడినవి. ఈ పట్టికలో ప్రామాణీకరించబడిన ప్రకారం 18 నిలువు వరుసలు మరియు 7 అడ్డు వరుసలు గానూ, పట్టిక క్రింది భాగంలో రెండు ప్రత్యేక వరుసలు అమర్చబడినవి. ఈ పట్టికను నాలుగు బ్లాకులుగా విభజింపవచ్చు. వాటిలో s-బ్లాకు మూలకాలు ఎడమ వైపు, p-బ్లాకు మూలకాలు కుడి వైపున, d-బ్లాకు మూలకాలు పట్టిక మధ్య భాగం లోనూ, f-బ్లాకు మూలకాలు పట్టిక దిగువ భాగంలోనూ అమర్చబడి ఉన్నాయి. ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అనుయు, నిలువు వరుసలను గ్రూపులు అనియు వ్యవహరిస్తారు. ఈ గ్రూపులలో కొన్నింటికి హలోజనులు లేదా జడ వాయువులు వంటి పేర్లతో పిలుస్తారు. నిర్వచనం ప్రకారం ఆవర్తన ధర్మాలను కలిగియుండినప్పటికీ ఆ పట్టిక మూలకాల యొక్క ధర్మములను మరియు క్రొత్తగా వచ్చిన, ఇంకా కనుగొనబడని మూలకాల యొక్క ధర్మముల మధ్య సంబంధములను వివరించుటకు కూడా ఉపయోగపడుతుంది. ఫలితంగా, ఒక ఆవర్తన పట్టిక- ప్రామాణిక రూపం లేదా కొన్ని ఇతర రసాయన ప్రవర్తనను విశ్లేషించడం కోసం ఉపయోగకరమైన ముసాయిదా రూపాంతరం-అందిస్తుంది, మరియు పట్టికలు విస్తృతంగా రసాయన శాస్త్రం మరియు ఇతర శాస్త్రాల్లో ఉపయోగిస్తారు. పూర్వగాములు ఉన్నప్పటికీ మెండలీఫ్ 1869 లో మొదటి సారి ఆవర్తన పట్టికను ప్రచురణ చేసిన వ్యక్తిగా గుర్తింబడ్డాడు. ఆయన అప్పటికి తెలిసిన మూలకాలను వాటి ధర్మాల ఆధారంగా (పరమాణు భారం) వర్గీకరణను అభివృద్ధిపరచాడు. మెండలీఫ్ కూడా కొన్ని కనుగొనబడని మూలకాలను ఊహించి వాటికి కూడా కొన్ని ఖాళీలను పట్టికలో ఉంచి వాటికి స్థానం కల్పించాడు. ఆయన ఊహించిన మూలాకాలలో చాలా మూలకాలను తదుపరి కాలంలో కనుగొని వాటికి సూచించిన ఖాళీలలో అమర్చారు. తర్వాతి కాలంలో మరికొన్ని మూలకాలను కనుగొన్న తదుపరి మెండలీఫ్ ఆవర్తన పట్టికను విస్తృతపరచారు. తర్వాత తయారుచేయబడిన ఆవర్తన పట్టికలో మూలకాల రసాయన ధర్మాల ఆధారంగా సిద్దాంతీకరించారు. పరమణు సంఖ్య 1 (హైడ్రోజన్ నుండి 118 (అననోక్టియం) వరకు గల అన్ని మూలకాలలో కొన్ని కనుగొనబడినవి మరికొన్ని కృత్రిమంగా తయారుచేయబడినవి. పరమాణు సంఖ్యలు 113,115,117 మరియు 118 గా గల మూలకాలు యిప్పటికీ నిర్ధారింపబడలేదు. ఆవర్తన పట్టికలో మొదటి 98 మూలకాలు ప్రకృతిలో సహజంగా గలవి. మరికొన్ని మూలకాలు [n 1] వాటిలో...
Aya-Dataset
-
-
0
tel
Telu
train
4,058,535
Title: సముద్రాన్ని ఈదుకుంటూ కరోనాను మోసుకొచ్చాడా?\nSummary: ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ రోగిగా అనుమానిస్తున్న వ్యక్తికి ఆ ఇన్ఫెక్షన్ లేదని దక్షిణ కొరియా అంటోంది.
ఆ వ్యక్తి దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు గత వారమే పారిపోయినట్లు భావిస్తున్నారు. నిజానికి ఆయనది ఉత్తర కొరియానే. మూడేళ్ల క్రితం అక్కడి నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చారు. మళ్లీ వారం క్రితం స్వదేశానికి పారిపోయారు. దక్షిణ కొరియాలోని గాంగ్వా ద్వీపం నుంచి ఈదుకుంటూ స్వదేశానికి ఆయన పారిపోయినట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. సరిహద్దుకు సమీపంలోని గాంగ్వా ద్వీపానికి మొదట ఆ వ్యక్తి చేరుకున్నారని దక్షిణ కొరియా సైన్యం సోమవారం తెలిపింది.
Aya-Dataset
-
-
0
tel
Telu
train