link
stringlengths 41
231
| text
stringlengths 28
5k
|
---|---|
https://www.telugupost.com/top-stories/another-by-election-will-be-held-in-andhra-pradesh-by-election-is-likely-to-be-held-later-this-year-1349208 | ఆంధ్రప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఏడాది చివరలోనే ఉప ఎన్నికల జరిగే అవకాశముంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వచ్చే నెల 5వ తేదీ తర్వాత రాజీనామా చేయనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో మార్చి 14వ తేదీ వరకూ జరగనున్నాయి. ఆ సమావేశాల తర్వాతనే బహుశ రఘురామ కృష్ణరాజు రాజీనామా ఉండవచ్చు. రాజీనామా చేసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది.ఈ ఏడాది చివరిలోపు...అంటే ఈ ఏడాది సెప్టంబరులోపుగా నరసాపురం పార్లమెంటుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. రఘురామ కృష్ణరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో డిసైడ్ అయ్యారు. రాజీనామా చేసిన వెంటనే ఆయన ఆ పార్టీలో చేరతారు. అందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వైసీపీయేతర పార్టీల సహకారం తీసుకోనున్నారు. వైసీపీ వర్సెస్ రఘురామ కృష్ణరాజులాగానే ఎన్నిక జరిగేలా ఆయన చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.పెద్దగా ప్రయత్నం చేయకపోయినా?రఘురామ కృష్ణరాజు పెద్దగా ప్రయత్నం చేయనక్కరలేదు. జగన్ కొమ్ములు వంచాలంటే ఈ ఎన్నికలో ఓడించాలి. అందుకే ఆయన అడగకపోయినా అన్ని పార్టీలూ మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వైసీపీకి ఈ ఎన్నికలో నెగ్గుకు రావడం కష్టమే. ఇప్పటి వరకూ జరిగిన తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ సునాయాసంగా గెలిచింది. అయితే ఆ ఎన్నికల నేపథ్యం వేరు. ఈ ఎన్నిక వేరు. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ లుగా ఉన్న వారు మరణించారు. అక్కడ ప్రత్యర్థులకు కూడా పెద్దగా బలం లేదు. కానీ ఇక్కడ గత ఎన్నికల్లోనే వైసీపీకి పెద్దగా మెజారిటీ రాలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజుకు కేవలం 35 వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.ఎవరు గెలిచినా..?కానీ నరసాపురం అలా కాదు. అన్ని పార్టీలూ బలంగా ఉన్నాయి. ఇక్కడ సామాజికవర్గాల పరంగా చూసినా ప్రత్యర్థుల బలాన్ని తక్కువ అంచనా వేయలేం. క్షత్రియులు, కాపు సామాజికవర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇద్దరూ కలిస్తే వైసీపీకి విజయం కష్టమే. అందుకే లెక్కలు వేసుకుని మరీ రాజుగారు బరిగీశారు. జగన్ కు కూడా ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. తనను కాదని కాలుదువ్వి వెళ్లిన రాజు గెలిస్తే తన పరువు గోదారిలో కలవడం ఖాయం. ఈ ఎఫెక్ట్ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కనపడుతుంది. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు జగన్ కు పెద్ద పరీక్ష పెట్టారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఇక జగన్ కు వచ్చే ఎన్నికల్లోనూ తిరుగులేనట్లే. |
https://www.telugupost.com/movie-news/2-0-trailer-review-95815/ | ఎప్పటినుండో 2.0 సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ మధ్యలో గ్రాఫిక్స్ పనుల లేట్ తో సినిమా విడుదల కూడా లేట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం విడుదల సమయం దగ్గరపడుతున్న టైం లో 2.0 సినిమా ప్రమోషన్స్ తో శంకర్ అండ్ టీం పిచ్చెక్కించే ఏర్పాట్లు చేశారు. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లోని ప్రతి ఒక్క విషయంపై ప్రేక్షకులు కూడా భారీగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆ అంచనాలు అందుకునేలా శంకర్ 2.0 సినిమాని తెరకెక్కించాడనేది నిన్న శనివారం చెన్నై లో విడుదల చేసిన 2.0 ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది చెప్పిన మాట.అయితే సోషల్ మీడియాలో 2.0 ట్రైలర్ మీద కామెంట్స్ మరోలా ఉన్నాయి. శంకర్ - రజినీకాంత్ కాంబోలో తెరకెక్కిన ఈ 2.0 సినిమా మరి ఓవర్ గ్రాఫిక్స్ తో ఉన్నదనే టాక్ వినబడుతుంది. అలాగే ప్రేక్షకుల అంచనాలను ఈ 2.0 సినిమా ట్రైలర్ అందుకునేలా లేదని కొందరి వాదన. ట్రైలర్ చూస్తే విజువల్స్ భారీగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులు వావ్ అంటూ థ్రిల్ అయ్యేవిధంగా ఎక్కడా కనబడలేదని..చాలామంది డిజప్పాయింట్ అవుతున్నారు. ఇక అక్షయ్ కుమార్ పాత్రకు చెప్పిన డబ్బింగ్ ట్రైలర్ రెండు మూడు సార్లు చూస్తే గాని అర్ధమయ్యేలా లేదని అంటున్నారు.మరి బాహుబలి ని తలదన్నేలా సౌత్ నుండి మరో భారీ అంటే 600 కోట్ల బడ్జెట్ మూవీ వస్తుందని ఆశపడ్డ చాలామంది సినీ లవర్స్ కి ఈ 2.0 సినిమా ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఇవ్వడం లేదనేది లేటెస్ట్ న్యూస్. అందుకేనేమో 2.0 యూట్యూబ్ రికార్డ్స్ ని కొల్లగొటింది... అని ఎక్కడా ఆ టాపిక్ చర్చకే రాకుండా పోయింది |
https://www.telugupost.com/movie-news/rakul-preet-singh-food-habits-148204/ | తెలుగులో టాప్ చైర్ కి దగ్గరయినట్లే అయ్యి.. ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లోకెళ్ళిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫిట్నెస్ కోసం బోలెడన్ని జిమ్ ఎక్సరసైజెస్ చేస్తుంది. బాడీ ని ఫిట్ గా వుంచుకోవడానికి నిరంతరం శ్రమిస్తోంది. ప్రస్తుతం తమిళ, బాలీవుడ్ సినిమాల్తో సరిపెట్టుకుంటున్న రకుల్ ఒక్కప్పుడు మాంసాహారం ప్రియురాలు. మాంసాహారాన్ని ఇష్టం గా తినే రకుల్ ప్రీత్… . శాకాహారం అంటే కూడా ఇష్టపడేదట. అయితే రకుల్ డైట్ లో ఎక్కువు భాగం మాంసాహారం ఉండేదట. అందులోను ఉడికించిన కోడిగుడ్లును ఎక్కువగా తినేదాన్ని అని చెప్పిన రకుల్.. అనుకోకుండా శాకాహారిగా మారిపోయిందట. శాకాహారిగా మారాలని అనిపించడమే తడువుగా శాకాహారిగా మారిపోయా అని.. ముంబై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్ప్పుడు ఇంటి నుండే ఫుడ్ వస్తుంది అని.. అందులో పండ్లు, అన్నం, పప్పు రైస్ తీసుకుని వెళుతుందట రకుల్. ఇక ముంబై మినహా అవుట్ డోర్ షూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మాంసాహారమైన చేపలు, చికెన్ లాంటివి ఎక్కువగా దొరుకుతాయని.. అలాంటాప్పుడు కాస్త ఇబ్బంది పడతా అని.. ఏవైనా కూరగాయలు దొరికితే మాత్రం వాటిలో అన్నం, పప్పు వేసి కిచిడీలాగా చేసి నెయ్యి వేసుకొని తింటానని చెబుతుంది రకుల్. |
https://www.telugupost.com/crime/34000-kg-of-explosives-seized-in-bengal-100-people-arrested-says-bengal-cops-1477575 | పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాణసంచాను నిషేధించినా అక్రమ తయారీ కర్మాగారాలను నడుపుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 100 మందిని అరెస్ట్ చేసినట్లు బెంగాల్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కబ్జాలకు సంబంధించి పోలీసులు 132 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో అక్రమ బాణసంచా తయారీ యూనిట్లలో వరుస పేలుళ్ల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. సోమ, మంగళవారాల్లో బెంగాల్ లోని నడియా, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో పోలీసుల దాడులు కొనసాగాయి. ఇప్పటివరకూ 34 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, బాణసంచా స్వాధీనం, అరెస్టులపై మే 29 వ తేదీలోగా రాష్ట్ర సచివాలయానికి నివేదిక ివ్వాలని వివిధ జిల్లాల పోలీసులను ఉన్నతాధికారులు కోరారు. బాణసంచా కర్మాగారాల్లో జరిగిన ప్రమాదాల్లో 17 మంది మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. |
https://www.telugupost.com/top-stories/chandrababu-did-not-err-on-the-side-of-caution-there-is-no-justification-for-practice-of-ycp-leaders-in-the-assembly-1340176 | చంద్రబాబు ఆవేదనను తప్పుపట్టడం లేదు. అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహారశైలిని సమర్థించడమూ లేదు. కానీ జరిగిన విషయాన్ని ఒక కోణంలోనే చూడటం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే చెల్లింది. జర్నలిస్టు గా రెండు కోణాల్లో రాయాల్సిన వీకెండ్ కామెంట్ వన్ సైడ్ గానే ఉంది. అసలు రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ చూస్తే సభలో ఎంత అరాచకం జరిగిందో అని ప్రజలు అనుకోవాలనే రాసినట్లుంది. చంద్రబాబు సీనియర్ నేత. ఆయన ఏడుపు విషయంలోనూ ఎవరికీ అభ్యంతరం లేదు.మూడు నిమిషాల ఎపిసోడ్ ను...కానీ సభలో దుశ్వాసన పర్వమట. కురుక్షేత్ర సభ లాగుందట. వైసీపీ ఆంబోతులట. సంస్కార హీనులు రాజ్యమేలుతున్నారట. సోషల్ మీడియాలో ఉన్మాదం చూసి విస్తుపోయారట. ఏడ్వాల్సింది చంద్రబాబు కాదట. ప్రజలేనట. ఏపీ అసెంబ్లీలో ఇదేమీ కొత్త విషయం కాదు. భువనేశ్వరి పేరునే తాము ప్రస్తావించడం లేదంటున్నా ఆమెను వీధుల్లోకి లాగే ప్రయత్నం చేస్తుంది ఎవరు? మూడు నిమిషాల అసెంబ్లీలో జరిగిన విషయాన్ని మూడు రోజుల నుంచి సాగదీయడమే అనుకూల మీడియా పనిగా పెట్టుకుంది. అసలు మాధవరెడ్డి పేరు ఎత్తితే ఎందుకు అంత ఆగ్రహం అన్న అనుమానాలను రేకెత్తెంచేలలా ఆర్కే వ్యాసం కొనసాగింది. నిజంగా ప్రేమ ఉంటే...చివరకు లోకేష్ పుట్టుక ప్రస్తావనను కూడా ఆర్కే తేవడం సముచితం కాదు. దానిని ఎవరూ ఆకళింపు చేసుకోలేరు. సమర్థించరు కూడా. నిజంగా నారా కుటుంబం మీద ప్రేమ ఉంటే ఈ ఎపిసోడ్ కు అంతటితో ఫుల్ స్టాప్ పెట్టడం సన్నిహితులు చేసే పని. కానీ చంద్రబాబుకు సానుభూతిని మరింత తెచ్చే పెట్టే ప్రయత్నంలోనే ఆర్కే ఉన్నారని పిస్తుంది. రాధాకృష్ణ గత అసెంబ్లీలో జరిగిన విషయాలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది. ఇక చంద్రబాబుకు వచ్చేవే చివరి ఎన్నికలట. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదట. ప్రజలకే ఆయన అవసరం ఉంటే గెలిపించుకోవాలట. నాడు కనపడలేదా?బోండా ఉమ, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడులు అధికారంలో ఉండగా క్లిప్పింగ్ లు చూడలేదా? గుర్తు లేదా? రోజాపై అన్న మాటలు నీ కలానికి కనపడలేదా? వినపడలేదా? రాజకీయంగా చంద్రబాబుకు మరింత బలం సమకూర్చాలంటే వైసీపీ ప్రభుత్వంలో అవినీతిని బయట పెట్టాలి. జగన్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రస్తావించాలి. అంతే తప్ప ఇంట్లో ఉన్న భువనేశ్వరిని బయటకు లాగుతుంది ఇప్పుడు ఎవరు? మీరు కాదా? ఎన్టీఆర్ కుటుంబం ఇప్పడు గుర్తొచ్చిందా?ఎన్టీఆర్ కుటుంబం అంటూ ఇప్పుడు నిక్కీ నీలుగుతున్న రాధాకృష్ణ ఆరోజు ఆయనను కూలదోసేందుకు చంద్రబాబుకు సహకరించలేదా? ఆరోజు ఆయనకు ఎన్టీఆర్ కుటుంబం కనపడలేదా? ఎన్టీఆర్ కుటుంబం అంటే చంద్రబాబు, భువనేశ్వరి మాత్రమేనా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంద్రేశ్వరి కాదా? ఆరోజు దగ్గుబాటిని వాడుకుని తర్వాత వదిలేస్తే ఈయనకు ఆ కుటుంబంపై ప్రేమ ఎక్కడకు వెళ్లింది? భువనేశ్వరిని ఎవరూ ఏమీ అనలేదని వైసీపీ నేతలు చెబుతున్నా రాధాకృష్ణ మాత్రం ఒప్పుకోకుండా ఈ మెలో డ్రామాను మరికొంత కాలం కొనసాగించాలనే నిర్ణయించుకున్నట్లుంది. మొత్తంగా వైసీపీ సంగతి ఏమో కాని టీడీపీ దాని అనుకూల మీడియా కారణంగానే భువనేశ్వరి బజారు కెక్కుతున్నారు. ఈ విషయాన్ని నందమూరి కుటుంబం గమనిస్తే మంచిది. |
https://www.telugupost.com/movie-news/maruthi-next-film-80852/ | యూత్ ని అట్రాక్ట్ చేసి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ తీయడంలో డైరెక్టర్ మారుతీ సిద్ధహస్తుడు అనే చెప్పాలి. అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించే అంశాలు కూడా తన ప్రతి సినిమాలో ఉంటాయి. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను... ఇటు యూత్ ను టార్గెట్ చేసి సినిమాలు తీసే మారుతీ ప్రస్తుతం 'శైలజా రెడ్డి అల్లుడు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.హిట్ ఇచ్చిన బ్యానర్ లో...నాగ చైతన్య - అను ఇమ్మానుయేల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. త్వరలోనే దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మారుతి తనకు పేరు తెచ్చిపెట్టిన బ్యానర్ లో ఇంకో సినిమా చేయనున్నాడు.కుదిరితే అన్నతో లేదా తమ్ముడితో...'భలే భలే మగాడివోయ్' సినిమాతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన గీతా ఆర్ట్స్ లో ఇంకో సినిమా చేయడానికి రెడీ ఉన్నాడు మారుతి. అల్లు అర్జున్ తనకి మంచి మిత్రుడు కావడంతో అతనితో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో మారుతి ఉన్నట్టు సమాచారం. మంచి కథను ఆయన రెడీ చేస్తే అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ ల సినిమా తర్వాత అల్లు అర్జున్.. మారుతీ చెప్పిన స్టోరీ నచ్చితే అతనితో చేసే అవకాశముంది. ఒకవేళ అల్లు అర్జున్ తో లేట్ అయ్యే అవకాశం ఉంటే అల్లు శిరీష్ తో చేసే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. |
https://www.telugupost.com/movie-news/samantha-akkineni-to-play-as-a-shuttler-131792/ | అక్కినేని సమంత ప్రస్తుతం తన భర్త తో హాలిడే ని ఎంజాయ్ చేస్తుంది. లక్కీ లేడీగా పిలవబడే సామ్ ప్రస్తుతం శర్వానంద్ సరసన 96 సినిమా రీమేక్ లో నటిస్తుంది. దీనితో పాటు అమెజాన్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. ఈ రెండు కంప్లీట్ అయినా తరువాత సామ్ ఏ సినిమా చేబోతుందని క్యూరియాసిటీ మొదలైంది. ఫిలింనగర్ సమాచారం ప్రకారం సామ్ నెక్స్ట్ అన్నపూర్ణ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతోందని తెలుస్తుంది. అది కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అని తెలుస్తుంది. ఈమధ్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు వస్తున్నాయి కాబట్టి సామ్ కూడా ఒక షటిల్ క్రీడాకారిణిగా నటించబోతున్నట్లు సమాచారం. అయితే షటిల్ క్రీడాకారిణిగా అంటే కల్పిత కథతోనా, లేకా బయోపిక్ లాంటిదా అన్నది ఇంకా తెలియదు. ఇంకా డైరెక్టర్ ఎవరో క్లారిటీ లేదు కానీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. |
https://www.telugupost.com/movie-news/i-saw-her-in-sangeeth-156607/ | బ్యాట్మెంటన్ క్రీడా కారిణి గుత్తా జ్వాలా ఎప్పుడు సంచలనాత్మక విషయాలతో న్యూస్ లో నిలుస్తూనే ఉంటుంది. అందరూ ఎడ్డెమ్ అంటే తెడ్డెమనే టైప్ జ్వాలాది. క్రీడల్లో ఆటలో అరటిపండులా మిగిలిపోతున్నా అని ఆవేదన చెందిన గుత్తా జ్వాలా ఒకొనొక సమయంలో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే అనుకుంది. అది వరౌట్ అవ్వలేదు. అయితే ఒకసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న జ్వాలా తమిళ నటుడు విష్ణు విశాల్ తో ప్రేమాయణం నడుపుతుంది. ఆ విషయాన్నీ జ్వాలానే రివీల్ చేసింది. హీరో విష్ణు విశాల్ తో డేటింగ్ లో ఉన్న అని.. త్వరలోనే మా పెళ్లి అంటూ ప్రకటించింది. అయితే తాజాగా గుత్తా జ్వాలతో విష్ణు విశాల్ పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పాడు. అసలు కరోనా లాక్ డౌన్ తో తన లవర్ విష్ణు ని కలవలేకపోతున్నందుకు బాధపడుతున్న అన్న గుత్తా జ్వాలతో పరిచయంపై విష్ణు విశాల్ తాజాగా నెటిజెన్స్ తో ముచ్చటించాడు. గుత్తా జలతో తన మీ పరిచయం ఎలా ఏర్పడింది అని అడగగా…గుత్తా నాకు హీరో విశాల్ సోదరి సంగీత్ ఫంక్షన్ లో పరిచయం అయ్యింది అని…. అప్పటినుండి తనతో పెరిగిన పరిచయం ప్రేమగా మారినట్లుగా చెబుతున్నాడు. ఇక లాక్ డౌన్ ముగియగానే తమ పెళ్లి అని చెప్పాడు. |
https://www.telugupost.com/movie-news/త్రివిక్రమ్-trivikram-bought-a-theater-in-east-godavari-124769/ | స్టార్ హీరోస్ తోనే సినిమాలు తీస్తూ సినిమాకి 10 – 15 కోట్లు తీసుకుంటున్న త్రివిక్రమ్ ఓ సామెతను ఫాలో అవుతున్నాడు. ” దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి”. సినిమా సినిమాకి అంత వస్తున్నప్పుడు దాని చక్కబెట్టుకోవాలంటే ఏదొక వ్యాపారం చేయాలి. అదే చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆది నుండే మంచి పెట్టుబడులు పెడుతూనే వున్నారు త్రివిక్రమ్. హైదరాబాద్ శివార్లలో భూములు కొన్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా థియేటర్ ఓనర్ కానున్నాడు. అవును త్రివిక్రమ్ ఇటీవలే 6 కోట్లు పెట్టి ఈస్ట్ గోదావరి రాజానగరంలో ఓ థియేటర్ ను కొన్నారు. అక్కడ రాయుడు థియేటర్ ఉంది. దాన్ని త్రివిక్రమ్ కొన్నారు. లాస్ట్ ఇయర్ ఈ థియేటర్ ని రిన్మోవేట్ చేసి 4 కోట్లు కి అమ్మాలని చూశారట. కానీ ఎవరు కొనలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ అదే థియేటర్ ని 4.90 కోట్లకు కొన్నట్లు బోగట్టా. ఎందుకంటే అక్కడ ల్యాండ్ కాస్ట్ నే 2.50 కోట్ల వరకు వుంది. రాయుడు థియేటర్ పూర్తిగా పడిగొట్టేసి కొత్తగా థియేటర్ ను నిర్మించాలని డిసైడ్ అయ్యాడు త్రివిక్రమ్.ఆ థియేటర్ ను ఈస్ట్ లోనే ఒకరికి నిర్వహణకు అప్పగించారు. |
https://www.telugupost.com/movie-news/అద్గదీ-సూపర్-స్టార్-అంటే-10677/ | రజినీకాంత్ కి దేశ వ్యాప్తం గానే కాదు, ప్రపంచవ్యాప్తం గా ఆయనకు ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. అయన సినిమాల్లో ఎంత స్టయిల్ గా ఒక రేంజ్ లో కనిపిస్తాడో... నిజ జీవితం లో అంత సింపుల్ గా.... ఆధ్యాత్మికత కలిగిన ఒక యోగిలా దర్శనమిస్తాడు. రజినీ సినిమా విడుదలవుతుంది అంటే ఫాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాడు. అంత సింపుల్ గా వుండే రజినీకాంత్ కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. రజినీకాంత్ కి బాగా తాగే అలవాటు... అలాగే సిగరెట్స్ ఎక్కువగా కాల్చే అలవాటు ఉండేదట. ఇదంతా ఆయనే చెప్పాడు. సూర్య, కార్తీ ల తండ్రి శివకుమార్ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆయనికి ఒక లేఖ రాసాడు. ఆ లేఖలో తనకు ఉన్న మందు, సిగరెట్స్ అలవాట్లు గురుంచి ప్రస్తావించాడు.మందు, సిగరెట్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకునే నాకు శివ కుమార్ గారు పిలిచి నువ్వు ఒక గొప్ప నటుడిగా ఎదగాలి అంటే మందు, సిగరెట్ కి కొంచెం దూరం గా ఉండమని ఒక సలహా ఇచ్చారట. ఆయన సలహా తీసుకున్న తర్వాత నేను మానసికం గా, శారీరకం గా దృఢం గా తయారవ్వగలిగానని... ఇదంతా ఆ మహానటుడు నాకు ఇచ్చిన సలహా వల్లే సాధ్యమైందని రజినీ - శివకుమార్ కి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఇంకా శివ కుమార్ నుండి నేను ఎన్నో జీవితపాఠాలు నేర్చుకున్నానని లేఖలో పేర్కొన్నారు. అంత గొప్ప సూపర్ స్టార్.. ఒక నటుడు గురించి ఇంత గొప్పగా పొగిడి , మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సత్యాన్ని తెలియజేశాడు. |
https://www.telugupost.com/lok-sabha-elections/brs-chief-kcr-is-unable-to-digest-the-developments-after-his-defeat-1527084 | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు వీళ్లనా తాను నమ్మింది? అని ముఖ్య సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇంత మంది తనను మోసం చేసి వెళ్లిపోతారని కలలో కూడా ఊహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉండగా అనేక సమీకరణాలను చూసి వారికి పదవులను కేసీఆర్ కట్టబెట్టారు. కొందరికి రెండు సార్లు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మరికొందరికి ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చి మరీ రాజకీయ హోదాను కల్పించారు. అయితే వారే బీఆర్ఎస్ ఓటమి తర్వాత వెళ్లిపోతుండటం కలవరపరస్తుంది.అవకాశమిచ్చినా....దానం నాగేందర్ కు రెండు సార్లు ఖైరతాబాద్ టిక్కెట్ ఇచ్చారు. ఆయన కారణంగా ఉద్యమం నుంచి తమ పార్టీతో పయనిస్తున్న దాసోజు శ్రావణ్ లాంటి వారిని కూడా పక్కన పెట్టారు. అలాగే ఇంద్రకిరణ్ రెడ్డి లాంటి నేతలకు తొలి దఫాలో బీఎస్పీ నుంచి నెగ్గినా తాను మంత్రివర్గంలో చోటు కల్పించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయనకు కేబినెట్ లో చోటు కల్పించారు. అలాగే 2019 ఎన్నికల్లో రంజిత్ రెడ్డికి తాను టిక్కెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నప్పటికీ ఆయన చివరకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోవడం కేసీఆర్ ను కలచి వేస్తుందంటున్నారు. తాను తిరిగి పోటీ చేయాలని కోరినా రంజిత్ రెడ్డి పోటీ చేయనని చెప్పి మరీ కాంగ్రెస్ లోకి వెళ్లి పోటీ చేస్తుండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.పట్నం ఫ్యామిలీకి...అలాగే ఎమ్మెల్యే పట్నం మహీందర్ రెడ్డి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా, తొలి దఫా మంత్రివర్గంలో చోటు కల్పించామని, రెండోసారి ఆయన ఓటమి పాలయినా ఎమ్మెల్సీగా ఇచ్చి చివరిలో మంత్రివర్గంలో స్థానం కల్పించానన్న విషయాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆయన సోదరుడికి కొడంగల్ స్థానంలో రెండు సార్లు పోటీకి అవకాశం ఇచ్చి తాను తప్పు చేశానని మధనపడుతున్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కోనేరు కోనప్ప కూడా తనను మోసం చేసి పార్టీ వీడి వెళతాడని ఊహించలేదని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. పదవులు ఇవ్వని వాళ్లు సరే.. ఇచ్చిన వాళ్లు కూడా వెళ్లిపోవడమేంటన్నది ఆయనకు మింగుడుపడటం లేదు.కేశవరావు కుటుంబానికి...తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలు కేసీఆర్ ను కలవరపరుస్తున్నాయి. ఆమె తండ్రి కేశవరావుకు రెండుసార్లు రాజ్యసభ ఇవ్వడమే కాకుండా ఆమెకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా అవకాశం కల్పించారు కేసీఆర్. అలాంటి కుటుంబం కూడా తాను సమస్యల్లో ఉన్నప్పుడు వీడి వెళ్లడంపై కేసీఆర్ కు ఎవరిని నమ్మాలి? అన్నది కూడా అర్థం కాకుండా ఉందంటున్నారు. ద్వితీయ శ్రేణి నేతలే నయమని, వారికి పదవులు దక్కకపోయినా.. తనను, తన పార్టీని నమ్ముకుని ఉంటూ తనకు కష్టకాలంలో అండగా ఉంటున్నారని కూడా ఆయన అంటున్నారని తెలిసింది. మొత్తం మీద కేసీఆర్ కు ఎవరు తనవారో.. పరాయి వారో ఇప్పుడు తెలిసి వచ్చిందని పార్టీ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/లేనిపోని-వివాదాలలో-ఇరుక్-28287/ | కథానాయికగా తెలుగు, తమిళ, మళయాళ భాషలలో పలు సినిమాలు చేసి అతి చిన్న వయసులో వివాహం, విడాకుల అనుభవాలు చూసేసింది డస్కీ బ్యూటీ అమల పాల్. వాటితోపాటు కెరీర్ తొలి నాళ్ళ నుంచే ఏవో ఒక వివాదాలు నిత్యం అమల పాల్ ని వెంటాడుతూనే వున్నాయి. ఇప్పుడు కథానాయికగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తమిళ్ మరియు మళయాళ భాషలలో వరుస సినిమాలతో బిజీగా వున్న అమల పాల్, తన సెకండ్ ఇన్నింగ్స్ అట్టెంప్ట్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చినప్పుడు తన ముఖం వారికి ఎబెట్టుగా అనిపించకూడదని ఇంత కాలం వచ్చిన గ్యాప్ ని తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా లో ఫిల్ చేస్తూ ప్రేక్షకులకి సెకండ్ ఇన్నింగ్స్ అనే ఫీల్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.తన ఫోటో షూట్స్ ద్వారా అభిమానుల దృష్టిని ఆకర్షించటం ఒక అలవాటుగా మార్చుకున్న అమల పాల్ ఇప్పుడు తాజాగా తాను అప్లోడ్ చేసిన ఒక ఫోటో షూట్ ద్వారా పీకల్లోతు వివాదాలలో కూరుకుపోతోంది. తాను యోగాసనాలు వేసుకుంటున్న సమయంలో తీయబడ్డ ఫోటోలని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది అమల పాల్. అయితే తాను యోగా చేసుకునే గదిలో గోడలకి గౌతమ బుద్ధుని ఫోటో వాల్ ఫాస్ట్‌గా ఉండటంతో అమల చేస్తున్న యోగాసనాలలో భాగంగా తన కాళ్ళు బుద్దిని తాకుతునట్టు కనిపిస్తున్నాయి. ఈ ఫోటో లోని దృశ్యానికి నొచ్చుకున్న బుద్ధిజం వక్తలు సోషల్ మీడియాలో అమల పాల్ పై విరుచుకు పడ్డారు. తక్షణమే ఈ ఫోటో లు తొలగించి క్షమాపణ తెలుపవలసినదిగా డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన నష్టానికి సంజాయిషీ ఇవ్వటం కానీ ఫోటోలు డిలీట్ చెయ్యటం వంటివేమీ చెయ్యలేదు అమల పాల్. గతంలో భారత దేశపు జెండా వైపు కాళ్ళు పెట్టినందుకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇలాంటి వివాదాలతోనే చిక్కుకుని చివరికి క్షమాపణ చెప్పవలసి వచ్చింది. అయితే అమల పాల్ ఈ ప్రక్రియని కూడా పబ్లిసిటీ కి వాడుకోవాలనుకుంటుంది కాబోలు. అందుకే ఇప్పటి వరకు రాచుకున్న వివాదానికి ఎలాంటి స్పందన తెలియజేయలేదు ఏమో. |
https://www.telugupost.com/movie-news/bellamkonda-srinivas-బెల్లంకొండ-శ్రీనివాస-124635/ | కవచం ప్లాప్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అంటే స్పీడుగా సీత సినిమాని పూర్తి చేసి విడుదల చేస్త అది ప్లాప్ అయ్యింది. ఆ సినిమా విడుదలై ఇంకా నెల కాలేదు. ఈలోపే శ్రీనివాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాక్షసుడు సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అబ్బో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంత స్పీడుగా ఉన్నాడేమిటి అనుకున్నారు. రచ్చసన్ తమిళ రీమేక్ ని తెలుగులో రమేష్ వర్మ రాక్షసుడుగా రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తెలుగు షూటింగ్ చాలా స్పీడుగా జరిగిపోతుందని అంటున్నారు. స్పీడు గా కాదు.. చాలా చాలా స్పీడు గా… రాక్షసుడు షూటింగ్ అప్పుడే ముగింపు దశకు చేరుకుంది. మరింత ఫాస్ట్ గా రాక్షసుడు షూటింగ్ ని బెల్లంకొండ – రమేష్ వర్మ చేసారా అంటే? అనే దానికి సమాదానం ఇదే అంటున్నారు. తమిళ రీమేక్ రచ్చసన్ లోని చాలా సీన్స్ ని తెలుగు రాక్షసుడులో పెట్టేశారట. అంటే ఈ సినిమాలో సగం వరకూ వర్జినల్ సీన్లే వాడుకున్నారట. మొన్న విడుదలైన రాక్షసుడు టీజర్లో కనిపించిన కొన్ని షాట్స్ చూసిన వారు తమిళ రచ్చసన్ ఒరిజినల్ సీన్స్ నే అనుకున్నారు. అది నిజమేనట. తమిళంలో నటించిన చాలామంది నటులు తెలుగు రాక్షసుడులో కూడా కనిపిస్తారు. ఆ నటీనటులతో చేయాల్సిన సన్నివేశాల్ని తమిళ రచ్చసన్ నుంచి యధావిధిగా తీసుకొచ్చేశారు. అయితే హీరో చేసిన కొన్ని సీన్లు మాత్రం మళ్లీ కొత్తగా తీశారంతే. అందుకే ఈ తెలుగు రీమేక్ అంత త్వరగా పూర్తయ్యింది. మరి రెండు సినిమాల వరస డిజాస్టర్స్ తో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఎలాగూ చాలా సీన్స్ ని తమిళం నుండి యధావిధిగా పెట్టేసారు కాబట్టి ఈ సినిమాకి పెద్దగా బడ్జెట్ కూడా అవడం లేదట. చాలా తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా నిర్మితమవుతుందట. మరి బెల్లకొండ కెరీర్ లోనే ఈసినిమాకి అతి తక్కువ బడ్జెట్ పెట్టారట. |
https://www.telugupost.com/movie-news/పవన్-కళ్యాణ్-మళ్ళీ-తండ్ర-45792/ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ నాన్నయ్యాడు. పవన్ కళ్యాణ్ - అన్నాలేజ్నేవా దంపతులకు పండంటి మగ పిల్లాడు పుట్టాడు. తన వారసుణ్ణి పవన్ కళ్యాణ్ తన చేతుల్లోకి తీసుకుని ఆ క్షణాన్ని ఎంతో ఆనందించాడనే విషయం ఈ ఫోటో ద్వారా అర్ధమవుతుంది. పవన్ కి ఈ బాబు మొదటి బిడ్డ కాదు. పవన్ కళ్యాణ్ కి ఇదివరకే ఒక బాబు అకీరా నందన్, ఒక పాప ఆద్య ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన లైఫ్ లో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య నందినికి పిల్లలు లేరు. ఆమెతో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ సహా నటి రేణు దేశాయ్ ని ప్రేమించి ఒక బిడ్డ కు తండ్రయ్యాక ఆ బిడ్డ అసాక్షిగా రేణుని వివాహమాడాడు. రేణు దేశాయ్ - పవన్ కళ్యాణ్ పెళ్లి తర్వాత వారికీ మరో పాప పుట్టింది.మూడో భార్యకు ఇప్పుడు కొడుకు.....ఇక రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్.. మూడో భార్యగా చెప్పబడే అన్నాలేజ్నేవా తో సహజీవం చేస్తున్నాడు. ఇప్పడు అన్నా లేజ్నేవా కి - పవన్ కళ్యాణ్ కి ఒక బాబు పుట్టాడు. దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ కి మరో వారసుడొచ్చేసాడు. రేణు దేశాయ్ తో అకీరా నందన్ కి తండ్రయి వారసుని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్నా తో మరో వారసుణ్ణి ఎత్తుకున్నాడు. మరి ఆ వారసుడు రాకతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ, సినిమాల్లో అనుకున్నంత సక్సెస్ లు సాధిస్తాడేమో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఎత్తుకుని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. |
https://www.telugupost.com/movie-news/పాపం-హిట్-కోసం-విలవిల్లా-10803/ | గత మూడేళ్లుగా తాను నటించిన నాలుగు చిత్రాలు బాగా ఆడలేదు. దీంతో రణబీర్‌కపూర్ చిక్కుల్లో పడ్డాడు. ఆయనకు ఇప్పుడు అర్జంట్‌గా ఓ హిట్ కావాలి. కాగా ఆయన హీరోగా నటించిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంపై ఆయనతో పాటు సినీ ప్రేక్షకులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నటించిన ఐశ్వర్యారాయ్ తన 42ఏళ్ల వయసులో కూడా తన కంటే చిన్నవాడైన రణబీర్‌కపూర్‌తో పాటు లిప్‌లాక్‌లు చేసి, ఇంకా సినిమా నిండా హాట్‌హాట్ అందాలతో కనువిందు చేయడం చర్చనీయాంశం అయింది. దీంతో ఈ చిత్రంపై శృంగార ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.మరోపక్క ఈ చిత్రానికి దర్శకుడు కరణ్‌జోహార్ దర్శకుడు కావడంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి నాలుగురోజుల్లో 100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం ఇండియాలో కంటే ఓవర్సీస్లో హల్చల్ చేస్తోంది. ఇదంతా కరణ్జోహార్కు ఓవర్సీస్లో ఉన్న క్రేజ్ పుణ్యం. ఇక వరుసగా సెలవులు రావడం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయింది. ఇదే ఊపులో మరో వారం రోజులు కనుక ఈ చిత్రం థియేటర్లలో నిలబడితే రణభీర్‌కపూర్‌కు ఉన్న ఒకే ఒక్క హిట్ కోరిక కూడా నెరవేరుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఒకే ఒక్కవారం రణబీర్ భవిష్యత్తును తేల్చనుందని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/భారీగానే-ఖర్చు-పెడుతున్న-28491/ | బాలకృష్ణ తన 101 చిత్రాన్ని పూరి డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. పూరి గురించి ఎవరెన్ని చెప్పిన వినకుండా బాలకృష్ణ తన 101 ప్రాజెక్ట్ ని పూరి చేతిలో పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పటికే మొదలైన ఈ చిత్రం అప్పుడే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అయ్యింది . మొదటి షెడ్యూల్ లో బాలకృష్ణ పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన పూరి ఇప్పుడు రెండో షెడ్యూల్ లో బాలకృష్ణ, హీరోయిన్ ముస్కాన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఒక భారీ సెట్ ని వేయిస్తున్నాడట.1. 5 కోట్ల రూపాయల వ్యయంతో భారీ కాలనీ, మార్కెట్ సెట్ ను బాలకృష్ణ కోసం పూరి వేయించాడట. ఈ సెట్ లోనే బాలయ్య, ముస్కాన్ లపై ఆ సన్నివేశాలను చిత్రకరిస్తారని సమాచారం. మరి ఇప్పటికే బాలయ్యని మునుపెన్నడూ చూపెట్టని విధంగా చూపెట్టి ఫ్యాన్స్ మెచ్చేలా చేస్తానని చెప్పిన పూరి, బాలకృష్ణ ని ఎలా చూపిస్తాడో అనే ఆత్రుత అభిమానులకు విపరీతంగా పెరిగిపోతుంది. |
https://www.telugupost.com/movie-news/kerala-govt-invited-allu-arjun-96106/ | కేరళ సినీ ప్రేక్షకుల్లో తెలుగు నటుల్లో ఎవరికీ లేనంత క్రేజ్ అల్లు అర్జున్ కి ఉంది. ఆర్య సినిమా నుంచి అల్లు అర్జున్ నటించిన ప్రతీ సినిమా కేరళలో హిట్ అవుతున్నాయి. దీంతో మళయాళీ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ కి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఇక కాలేజీ క్యాంపస్ లలో అయితే బన్నీ క్రేజ్ మరింత ఎక్కువ. ఇక ఇటీవల కేరళ వరదలతో కష్టకాలంలో ఉంటే అల్లు అర్జున్ తనవంతు ఆర్థిక సహాయం అందించి మరింత అభిమానులను పెంచుకున్నారు. ఇక తాజాగా కేరళ ప్రభుత్వ అల్లు అర్జున్ ని ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో అలప్పిలో నవంబర్ 10న జరగనుంది. మరి, మన తెలుగు హీరో కేరళ ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా వెళుతున్నారంటే గొప్ప విషయమే. |
https://www.telugupost.com/top-stories/ycp-rebel-mp-raghurama-krishna-raju-will-resign-after-february-5-he-himself-made-this-clear-1351866 | నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు కత్తి వేలాడుతుంది. ఆయనకు స్పష్టమైన సిగ్నల్స్ వచ్చిన తర్వాతనే రాజీనామా యోచనకు దిగినట్లు తెలిసింది. ఫిబ్రవరి ఐదు తర్వాత రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు పడుతుందని తెలియడంతోనే ఆయన ముందుగానే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కొందరు పెద్దల సూచనలు కూడా అందడంతో ఆయన రాజీనామా ఆలోచన చేశారంటున్నారు.మొండోడుగానే...నిజానికి రఘురామ కృష్ణరాజు జగన్ కంటే మొండోడు అన్న పేరుంది. ఆయన పార్టీలోనే ఉండి ఇబ్బంది పెట్టాలని భావించారు. వచ్చే ఎన్నికలకు ముందు పార్టీ మారితే సరిపోతుందనుకున్నారు. ఏ పార్టీలో చేరాలన్నది అప్పుడే నిర్ణయించుకోవచ్చని, అప్పటి వరకూ అన్ని పార్టీలతో సఖ్యత కొనసాగించాలని రఘురామ కృష్ణరాజు భావించారు. ఈ మేరకు బీజేపీ పెద్దలతో ఆయన టచ్ లోకి వెళ్లారు. అందుకే పార్టీని థిక్కరించకుండా విమర్శలు చేస్తూ వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు.పార్టీలోనే ఉంటూ...ఇదే పద్ధతిని 2024 ఎన్నికల వరకూ కంటిన్యూ చేయాలని రఘురామ కృష్ణరాజు భావించారు. ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతల కూడా ఇదే రకమైన సలహా ఇవ్వడంతో రచ్చ బండ పేరుతో మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ఆయన వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం కదిలింది. రఘురామ కృష్ణరాజు అనర్హత పిటీషన్ ను స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ప్రాధమిక దర్యాప్తు జరపాలని ఆదేశించారు.అనర్హత వేటు పడుతుందని.....రఘురామ కృష్ణరాజుకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని కొందరు బీజేపీ పెద్దలు కూడా అభిప్రాయపడినట్లు తెలిసింది. అందుకే ఆయనను గౌరవంగా రాజీనామా చేసి తప్పుకోవాలని సూచించారని, లేకుంటే అనర్హత వేటు పడుతుందని చెప్పడంతోనే ఆయన రాజీనామాకు సిద్దమయ్యారు. మరో వారం రోజుల్లో రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయనున్నారు. ఆయన రాజీనామా వెనక ఇదే ప్రధాన కారణమన్న కామెంట్స్ ఢిల్లీలో వినిపిస్తున్నాయి. అనర్హత వేటు తనపై పడేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఆయన చెబుతున్నా, కొందరి సూచనల మేరకే ఆయన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. |
https://www.telugupost.com/crime/online-loan-app-operators-harassing-non-loan-takers-also-case-filed-in-east-godavari-district-1478286 | వ్యక్తిగత అవసరాలు లేదా.. కుటుంబ అవసరాల నిమిత్తం ఆన్ లైన్ లోన్ యాప్ లలో లోన్లు తీసుకున్నవారిని సదరు ఏజెంట్లు ఎలా వేధిస్తుంటారో చూస్తూనే ఉన్నాం. తీసుకున్న మొత్తానికి బదులుగా తిరిగి అధిక సొమ్ము చెల్లించినా.. ఇంకా డబ్బు కట్టాలంటూ ఫోన్లు, మెసేజ్ లు చేసి.. న్యూడ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడగా.. చాలా మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అయితే లోన్ తీసుకున్న వారికే కాదు.. తీసుకోని వారినీ లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియంలో చోటుచేసుకుంది.కడియం మండలంలో నివాసం ఉండే దేవి అనే మహిళ మే27న దిశ SOS కు కాల్ చేసి తనను లోన్ యాప్ నిర్వాహకుడు వేధిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఇంటికి వెళ్లిన దిశ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిరోజుల క్రితం గుర్తుతెలియని నంబర్ నుండి తనకు 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయని, వెంటనే అదే నంబర్ కు అమౌంట్ తిరిగి పంపినట్లు దేవి పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి అదే నెంబర్ నుండి సదరు వ్యక్తి వాట్సాప్ కాల్స్ చేస్తూ.. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయింది. తనకు అదనంగా డబ్బు చెల్లించాలని లేదంటే.. ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని బెదిరించాడు.ఆగంతకుడు చెప్పిన విధంగానే బాధితురాలి ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలను పంపించడం మొదలు పెట్టాడు. అగంతకుడి వేధింపులు శృతిమించడంతో బాధితురాలు దిశా పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అతను కాల్ చేసిన ఫోన్ నంబర్ ఇతర వివరాల ఆధారంగా కడియం పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడితే వెంటనే దిశా SOS కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు. |
https://www.telugupost.com/movie-news/lavanya-tripati-in-bollywood-moviews-80692/ | ఏ హీరో.. హీరోయిన్ అయినా తమ ప్రాంతీయ సినిమాల్లో నటించి కొంచం పేరు రాగేనే బాలీవుడ్ లో ఒక్క సినిమా ఐన చేయాలి అనుకుంటారు. ఎందుకంటే అక్కడ చేస్తే ప్రపంచం వ్యాప్తంగా క్రేజ్ వస్తుంది కాబట్టి. అయితే ఈ విషయంలో ఎక్కువగా హీరోయిన్స్ ఫోకస్ పెడుతుంటారు. అలానే చాలామంది హీరోయిన్స్ ఇప్పటికే ఫోకస్ పెట్టారు.అయితే ఈ లిస్ట్ తాజాగా మన టాలీవుడ్ హీరోయిన్ ఉంది. ప్రస్తుతం అందాల రాక్షసి బాలీవుడ్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. ఆ అందాల రాక్షసి ఎవరు అని అనుకుంటున్నారా? మీ గెస్ కరెక్టే. ఆ అందాల రాక్షసి ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. టాలీవుడ్ లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా త్వరగానే తెలుగులో మంచి క్రేజీ హీరోయిన్ గా మారింది.అయితే ఈ మధ్యే ఆమె కు ఆశించిన స్థాయి విజయాలు దక్కడం లేదు అందుకే .. అవకాశాలు బాగా తగ్గాయి. దాంతో లావణ్య కన్ను బాలీవుడ్ పై పడింది. బాలీవుడ్ లో అవకాశాలు కోసం పలువురు బాలీవుడ్ మేకర్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటుందని టాక్. వన్స్ అక్కడ ఛాన్స్ వస్తే బట్టలు సద్దుకుని వెళ్లిపోయే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. |
https://www.telugupost.com/movie-news/is-prabhas-responsible-for-saaho-disaster-131766/ | బాహుబలి తో ఒక్కసారిగా ఇండియా వైడ్ గా హీరో అనిపించుకున్న హీరో ప్రభాస్. బాహుబలి పార్ట్ 1, 2 లకు ముందు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు. కానీ బాహుబలితో నేషనల్ హీరోగా మారిన ప్రభాస్ అదే ఫ్లో ని కంటిన్యూ చెయ్యాలనుకున్నాడు. బాహుబలి క్రేజ్ తో సినిమా చేస్తే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాడు. అందుకే మంచి కథతో అంటే 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కథని కాస్త 300 కోట్ల బడ్జెట్ సినిమాగా ప్రభాస్ మార్చేశాడు. సుజిత్ మొదట్లో మీడియం బడ్జెట్ కథతోనే ప్రభాస్ ని కలవడం, ప్రభాస్ ఒప్పుకోవడం జరిగింది. కానీ బాహుబలి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ప్రభాస్ కి ఆ 50 కోట్ల బడ్జెట్ ఆనలేదు. అందుకే అదే స్టోరీ లైన్ తో సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ గా మార్చేశాడు. ఎలాగూ యువీ నిర్మాతలు ప్రభాస్ సన్నిహితులే. ప్రభాస్ అడగడమే తరువాయి వారు ప్రభాస్ బాహుబలి క్రేజ్ తో సై అన్నారు. అలా సాహో సినిమా నేషనల్ వైడ్ గా తెరకెక్కింది. సినిమాని నేషనల్ వైడ్ గా తీస్తున్నామంటే.. బాలీవుడ్ లాంటి పెద్ద మార్కెట్ ఉన్న ప్రేక్షకులను తమ వైపు తిప్పుకోవాలంటే అక్కడి నటులను ఎక్కువగా తీసుకోవాలని ఆలోచించారు. ఆలోచన బాగుంది. కానీ ఆయా నటులను వారు వాడుకున్న తీరు సాహో సినిమా చూస్తే తెలుస్తుంది. చిన్నపాటి సీన్స్ కోసం.. బాలీవుడ్ నుండి పెద్ద నటులను తీసుకున్నారు. ఇక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ చూపించాలి అనుకున్నారు…. చూపించారు. అలాగే అన్నిటిలో భారీతనం కొట్టొచ్చినట్లుగా చూపిస్తే ప్రేక్షకులు పడిపోతారనుకున్నారు. కానీ అది కాస్త రివర్స్ అయ్యింది. ఇక హిందీ సినిమాల ప్రమోషన్స్ తో పోలిస్తే సాహో ప్రమోషన్స్ వీక్. తెలుగు, హిందీ లో చేసిన ప్రమోషన్స్ తమిళ, మలయాళంలో చేయలేకపోయారు. ఇక నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన సాహో సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు.. అంటే సాహో సినిమా పరిస్థితి ఏమిటో అర్ధమవుతుంది. బాహుబలి ని చూసి వాతలు పెట్టుకుంటే.. చివరికి మిగిలేది అనేది సాహో సినిమా చూపించింది. సినిమాలో కంటెంట్ లేదు, కామెడీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, యాక్షన్ మితిమీరిపోవడం, బలవంతంగా ఇరికించి న లవ్ ట్రాక్ అన్ని సాహో ని ఇరుకున పడేశాయి. అయితే సాహో విషయంలో ఇంత జరగడానికి కేవలం ప్రభాస్ మాత్రమే కారణమవుతాడనేది ఫిలింనగర్ టాక్. చిన్న డైరెక్టర్ చేతిలో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు పెడితే.. అతను ఎలా హ్యాండిల్ చేస్తడో అనేదీ ప్రభాస్ ఆలోచించాలి. డబ్బుంది కదా అని చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది మరి. |
https://www.telugupost.com/movie-news/i-am-not-big-enough-to-do-biopic-156754/ | మిల్కి బాయ్ మహేష్ వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ సినిమాల హిట్ ఆతర్వాత వంశి పైడిపల్లి సినిమాని పక్కనబెట్టి.. పరశురామ్ కి కనెక్ట్ అయిన మహేష్ బాబు.. తదుపరి చిత్రాన్ని రాజమౌళి తో చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో తన పిల్లలతో ఆడుకుంటున్న మహేష్ బాబు తన భార్య తో కలిసున్న ప్రతి క్షణమే తనకి రొమాంటిక్ అంటున్నాడు. తనకు తన ఫ్యామిలీ కంటే మరేదీ ఎక్కువ కాదని…. ఇక తనగురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే హంబుల్ హంబుల్ హంబుల్ అంటూ చెబుతున్నాడు. ఇక తాను కెరీర్ తొలినాళ్లలో నటించిన మురారీ మూవీ చూసి తండ్రి కృష్ణగారు తన భుజం మీద చేయి వేసి, ఆయన ఇచ్చిన ఎక్సప్రెషన్ తనకి బెస్ట్ మూవ్మెంట్స్ అంటున్నాడు. ఇక తాను చాలా అణుకువుగా ఉంటా అని.. ఇక నిజాయితీ లేని మనుషులను చూస్తే తనకు ఒళ్ళు మంట చెబుతున్నాడు మహేష్ బాబు. ఇక ఎవరైనా మీ బయోపిక్ తీస్తా అని అడిగితె మాత్రం.. తనకు బయోపిక్ తీసేంత అవసరం లేదని… తాను చాలా సాధారణ జీవితం గడుపుతున్నా అని.. అలాంటి నాపై బయోపిక్ తియ్యాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు మహేష్ బాబు. |
https://www.telugupost.com/movie-news/dil-raju-attitude-82475/ | ఇలానే ఉంది ఒక టాలీవుడ్ నిర్మాత వ్యవహారం. టాలీవుడ్ తోపుగా చెప్పుకునే దిల్ రాజు చిన్న హీరోలతో, మీడియం హీరోలతో బడా హీరోలతో సినిమాలు చేసి హిట్స్ కొడుతుంటాడు. ఆయన నిర్మాణంలో పనిచేస్తే గ్యారెంటీ హిట్ అనుకునే హీరోలు చాలామందే టాలీవుడ్ లో ఉన్నారు. ఇక తనకు కలిసొచ్చిన హీరోనైతే రెండు మూడు సినిమాలకు ముందే లాక్ చేసి పారేస్తాడు దిల్ రాజు. ఇక డిస్ట్రిబ్యూటర్ గా కూడా చక్రం తిప్పుతున్న దిల్ రాజు నిర్మాతగా సినిమాలు చేస్తే తమ సినిమాకి ఢోకా ఉండదని చెబుతుంటారు. అయితే అలా హీరోలు చెప్పడం వలన దిల్ రాజుకి ఓవర్ కాన్ఫిడెన్స్ బాగానే ఎక్కువైనట్లుగా కనబడుతుంది. అందుకే ఫ్లాప్స్ లో ఉండి తన దగ్గరకొచ్చే హీరోల గురించి పబ్లిక్ గా ఏదేదో మట్లాడేస్తున్నాడు.ఫ్లాప్స్ లో ఉన్నాడనే అతనితో సినిమా...ఈ మధ్యన దిల్ రాజు మాట్లాడే మాటలు చూస్తుంటే కొంత మంది హీరోలను తనకి తెలిసి అవమానిస్తున్నాడో తెలియకుండా అవమానిస్తున్నాడో అనే విషయం అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న లవర్ సినిమా విషయంలోనూ అంతే. అసలే కష్టాల్లో ఉన్న రాజ్ తరుణ్ ఏదో దిల్ రాజు నిర్మాతగా సినిమా చేస్తే హిట్ అవుతుందని.. లక్కు మళ్ళీ కలిసొస్తుందని అనుకుంటే.. లవర్ ని తన బ్యానర్ లోనే నిర్మించిన.. పెద్దగా పట్టించుకోకపోగా... రాజ్ తరుణ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు కాబట్టే లవర్ సినిమా చేశానని చెప్పిన దిల్ రాజు తాజాగా మరో హీరోపై నోరు పారేసుకున్నాడు.నితిన్ పైన కూడా జాలి చూపించాడు...నితిన్ హీరోగా శ్రీనివాస కళ్యాణం సినిమాని శ్రద్దగా నిర్మించిన దిల్ రాజు..నితిన్ మీద కూడా సెటైర్ వేసేశాడు. శ్రీనివాస కళ్యాణం కి ముందు రెండు సినిమాల ఫ్లాప్స్ తో ఉన్న నితిన్ దిల్ రాజు దగ్గరకెళ్ళి తనకో సినిమా చేసి పెట్టమన్నాడట. ఇక సతీష్ వేగేశ్న కథతో నితిన్ తో సినిమా చేసిన దిల్ రాజు గమ్మునుంటే ఓకె.. కానీ నితిన్ ని ఫ్లాప్స్ నుండి బయటెయ్యడానికే శ్రీనివాస కళ్యాణం సినిమాని నిర్మించినట్లుగా... నితిన్ తనని సినిమా చెయ్యమని అడిగినట్లుగా... గొప్పగా చెబుతున్నాడు. మరి సినిమా విడుదలకు ముందే హీరోల మీద జాలితో సినిమాలు చేస్తున్నట్లుగా దిల్ రాజు చెప్పడం ఎంత వరకు కరెక్ట్. అయినా ఇలా చేస్తే దిల్ రాజుకి ఏ స్టార్ హీరో అయినా సినిమాని నిర్మించే అవకాశం కల్పిస్తారా అంటూ సెటైర్స్ వేస్తున్నారు జనాలు. మరి దిల్ రాజు కావాలని మాట్లాడుతున్నాడో... లేదంటే పొరపాటున మాట్లాడుతున్నాడో గానీ ఈ వ్యవహారం మాత్రం దిల్ రాజు పీకకి చుట్టుకునేలా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. |
https://www.telugupost.com/movie-news/anu-emmanuel-71442/ | ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ కి అవకాశాలు రావాలే గాని ఎడాపెడా రెండు, మూడు సినిమాలు చేసుకుపోతున్నారు. గతంలో సమంత, కాజల్, అనుష్క లాంటి వాళ్లు అలానే స్టార్ హీరోయిన్స్ అయ్యారు. ప్రస్తుతం కూడా అలాంటి హీరోయిన్స్ ఉన్నారు. ఆ లిస్టులో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు డీజే దువ్వాడ జగన్నాధంలో బికినీ తో దున్నేసిన పూజ హెగ్డే. డీజే సినిమాతో వరుస ఆఫర్స్ ని ఒడిసిపట్టుకున్న పూజ హెగ్డే ప్రస్తుతం ముగ్గురు స్టార్ హీరోలతో సెట్స్ మీదకెళ్లబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్న పూజ హెగ్డే మహేష్ తో వంశి పైడిపల్లి తెరకెక్కించబోతున్న సినిమాతో సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అయ్యింది. అలాగే ప్రభాస్ - రాధాకృష్ణ సినిమాలోనూ హీరోయిన్ గా చేయబోతుంది. మరి ఎన్టీఆర్ తో మాస్ స్టెప్స్ వేస్తూ చాలా కష్టపడాలి. కానీ మహేష్ సినిమాలో పెద్దగా డాన్స్ లు చెయ్యాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రభాస్ తో సినిమా కూడా. మరి ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న పూజ హెగ్డే కి రాని డేట్స్ క్లాష్ ఒకే ఒక సినిమా చేతిలో ఉండగా మరో సినిమాకి ఎందుకు వస్తుంది.అనునే తప్పుకుందా...తప్పించారా..?ఆ విషయం ఏదో అను ఇమ్మాన్యుయేల్ కే తెలియాలి. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య సినిమాలు రెండూ పోవడంతో ఢీలా పడ్డ అను ఇమ్మాన్యుయేల్ కి నాగ చైతన్య - మారుతిల శైలజారెడ్డి సినిమా ఆఫర్ ఉంది. అలాగే రవితేజ - శ్రీను వైట్ల సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అయితే తాజాగా అను ఇమ్మాన్యువల్ తాను రవితేజ సినిమా నుండి తప్పుకుంటున్నట్టుగా చెప్పడమే కాదు, కారణం కూడా చెప్పేసింది. తనకి శైలజ రెడ్డి సినిమా డేట్స్ రవితేజ - శ్రీను ల సినిమా డేట్స్ సెట్ కాకపోవడంతోనే రవితేజ సినిమా నుండి తప్పుకున్నా అని చెప్పింది. మరి కేవలం రెండు సినిమాల్లో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం జోక్. మరి అనునే తప్పుకుందా? లేకపోతే ప్లాప్ హీరోయిన్ మనకెందుకులే అని రవితేజ అండ్ కో తప్పించారో? అనేది ప్రస్తుతానికున్న పెద్ద డౌట్.కుటుంబసమస్యలతో సతమతం....అయితే అను ఇమ్మాన్యువల్ తన ఫ్యామిలీ విషయంలో ఎదో సఫర్ అవుతుందని, అందుకే ఇలా సినిమాలు వదిలేసుకుంటుందని అంటున్నారు. గతంలో నా పేరు సూర్య సక్సెస్ మీట్ కి కూడా తాను రాలేకపోతున్నానని, క్షమించమని, తనకున్న ఫ్యామిలీ ప్రోబ్లమ్స్ తోనే తాను ఈ ఈవెంట్ కి రాలేదని చెప్పింది. మరి అనుకి ఉన్నఆ ఫ్యామిలీ ప్రోబ్లెమ్స్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఏదైనా అను రవితేజ సినిమా విషయంలో అబద్ధమాడుతుందనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. |
https://www.telugupost.com/top-stories/nara-lokesh-is-out-of-the-side-he-had-been-on-the-offensive-until-earlier-has-now-backed-down-1348720 | నారా లోకేష్ సైడ్ అయిపోయాడు. మొన్నటి వరకూ దూకుడు మీద ఉన్న చినబాబు ఇప్పుడు కొద్దిగా వెనక్కు తగ్గాడు. ఎన్నికలు దగ్గరపడే సమయం కొద్దీ చినబాబును కొంత బ్యాక్ ను పెడుతున్నట్లే కనిపిస్తుంది. నారా లోకేష్ టీడీపీకి భవిష్యత్ లో సారథ్యం వహించాలి. దానిని ఎవరూ కాదనరు. చంద్రబాబు తర్వాత పార్టీలో ఆయనదే రెండో స్థానం. అందులో నో డౌట్. ఇప్పుడిప్పుడే ఆయన రాజకీయంగా రాటుదేలుతున్నారు. ట్విట్టర్ కే పరిమితమయ్యారన్న విమర్శలున్నప్పటికీ దానికి లెక్క చేయకుండా తాను చెప్పాల్సింది చెబుతున్నారు. తిట్టాల్సింది తిట్టిపారేస్తున్నారు.అప్పటి నుంచే....చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి రావడం, తర్వాత పార్టీ కార్యలయంలో గుక్కపెట్టి ఏడ్వడం వంటి సంఘటన తర్వాత నారా లోకేష్ పార్టీ యాక్టివిటీస్ కు కొంత దూరంగా ఉంటున్నారు. ఆయన మంగళగిరి నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. అమరావతికి వచ్చినప్పుడల్లా లోకేష్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. అక్కడ నేతగా ఉన్న చిరంజీవిని కూడా చీరాలకు పంపేందుకు నారా లోకేష్ సిద్ధమయ్యారు.చినబాబు జోక్యాన్ని....ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు లోకేష్ జోక్యాన్ని పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారట. పూర్తిగా మంగళగిరిలో గెలవడంపైనే దృష్టి పెట్టాలని కోరారట. ఈసారి గెలవకుంటే రాజకీయంగా మరింత ఇబ్బందులు ఎదురవుతాయని, ఆలోచించుకోవాలని లోకేష్ కు చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయాల్లోనూ లోకేష్ జోక్యం లేకుండా చంద్రబాబు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ ఎన్నికలకు....లోకేష్ పట్ల టీడీపీ క్యాడర్ లో మంచి అభిప్రాయమున్నా, ప్రజల్లో ఇంకా ఏర్పడకపోవడంపై లోకేష్ ను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచనున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ, పొత్తుల అంశంపైన కూడా లోకేష్ జోక్యం ఉండబోదు. కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ సైకిల్ యాత్ర చేయాలని భావించినా అందుకు కూడా చంద్రబాబు అంగీకరించలేదని తెలిసింది. లోకేష్ ఫోకస్ అవ్వడానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. అందుకే చినబాబు సైకిల్ యాత్ర కూడా లేనట్లేనని అంటున్నారు. |
https://www.telugupost.com/movie-news/నా-పేరు-సూర్య-ప్రీ-రిలీజ్-68603/ | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా వస్తున్న చిత్రం 'నా పేరు సూర్య'. ఈ సినిమాలో బన్నీ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చాలా సినిమాలకి స్టోరీ అందించిన వకాంతం వంశీ తొలిసారిగా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. కొన్ని రోజులు కింద ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ అని ( టీజర్ ) రిలీజ్ చేసారు. ఆ టీజర్ లో బన్నీ పాత్ర ఏంటో అర్ధం అయ్యిపోయింది. ఇక లేటెస్ట్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోవడంతో... ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 77.65 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. తెలుగు స్టేట్స్ లో 61.95 కోట్లు.. ఓవర్సీస్ 7.2 కోట్లుకు అమ్ముడైంది. నా పేరు సూర్య ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మీకోసం..ఏరియా బిజినెస్ ( కోట్లు )నైజాం 20.20సీడెడ్ 11.25నెల్లూరు 2.60కృష్ణ 4.50గుంటూరు + వైజాగ్ 14.00ఈస్ట్ గోదావరి 5.20వెస్ట్ గోదావరి 4.20టోటల్ (ఏపీ & టీఎస్) 61.95రెస్ట్ అఫ్ ఇండియా (తమిళ్ +కర్ణాటక +నార్త్) 8.50ఓవర్సీస్ 7.20టోటల్ (వరల్డ్ వైడ్ ) 77.65 |
https://www.telugupost.com/movie-news/movie-artist-association-elections-are-about-to-begin-elections-are-taking-place-at-jubilee-hills-public-school-203888/ | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ లు పోటీ పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు జరుగుతున్నాయి. కులం, ప్రాంతం అన్ని అంశాలు ఈ ఎన్నికల్లో ఆరోపణలుగా మారాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరిది గెలుపు అన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. నాలుగు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. |
https://www.telugupost.com/movie-news/దిల్-రాజు-కే-టోకరా-వేశారే-53394/ | పైరసీ చీడపురుగు సిని నిర్మాతలను భయపెట్టిస్తుంది. విడుదలకు ముందే మీ సినిమా ఫైరసీ కాకుండా ఉండాలంటే మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని భయాందోళనకు గురిచేస్తున్నారు. 2012 నుంచి జవాన్ సినిమా వరకు ఓ ముఠా ఫైనాన్సియర్స్ నుంచి ఇలాగే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దిల్ రాజ్ కే టోకరా పెడుతామని హెచ్చరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైరసీ కారణంగా టాలీవుడ్ కు ఏటా వెయ్యి కోట్ల మేర నష్టం వాటిళ్లుతోంది. ఫైరసీ పేరుతో విడుదల కాకముందే ఓ భయంపట్టుకుంటుంది. పెద్ద సినిమాలకు ఫైరసీ భూతం పట్టి పీడిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా పైరసీ బారినపడిందని నిర్మాత రాధాకృష్ణ... న్యాచురల్ స్టార్ నానీ ఎంసీఏ పైరసీ అయిన సినిమాల జాబితాలో ఉందని దిల్ రాజ్ లు బుధవారం హైదరాబాద్ సి.సి.ఎస్. పోలీసులను ఆశ్రయించారు.పైరసీ కాకుండా ఉండాలంటే....గతంలోనూ పవన్-త్రివిక్రమ్- రాధాకృష్ణ కాబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడింది. దీనికి తోడు మళ్లీ ఫైరసీ గాళ్లు కాపుకాసుకుని కూర్చోవడంతో రాధాకృష్ణకు పోన్లు చేసి మరి సినిమా ఫైరసీ కాకుండాఉండాలంటే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రాధాకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. అయితే 2012 నుంచి పైరసీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గిరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టా సుధాకర్ చౌదరీ, పుట్ట ప్రభాకర్ చౌదరీ, విజయలక్ష్మి చౌదరీలను అరెస్ట్ చేశారు. అయితే సినిమా ఫైరసీల పై చీమకుట్టిన దొంగలా ఉన్న సినిమా పెద్దలు.. ఇప్పుడు హాట్ హాట్ కామెంట్లు చేశారు. ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు.. డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు జవాన్ సినిమా అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తెలిపారు. తమకు ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తున్నా ..... అటు ప్రభుత్వానికి , ఇటు సినిమా ఇండ్రస్టీకి నష్టం చేస్తున్నారని సినిమా పెద్దలు వాపోతున్నారు. ఫైరసీని అరికట్టేందుకు పోలీసులు ఐ.టీ. మినిస్టర్ కు కొత్త చట్టం పై నివేదిక అందించారు. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని పోలీసులు ప్రభుత్వానికి విన్నవించారు. |
https://www.telugupost.com/movie-news/vijay-devarakonda-next-movie-105291/ | టాక్సీ వాలా’ లాంటి డీసెంట్ హిట్ తరువాత విజయ్ దేవరకొండ భరత్ కమ్మ అనే కొత్త డైరెక్టర్ తో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి కాకినాడ షెడ్యూల్ కంప్లీట్ అయింది. చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా తరువాత విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని మనకు అందించిన క్రాంతి తన నెక్స్ట్ మూవీ విజయ్ తో చేయనున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోవడంతో త్వరలోనే ఈ ప్రోజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. దీన్ని కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. హీరో గా విజయ్ అయితే ఫిక్స్ అయ్యాడు కానీ హీరోయిన్ ఎవరు అనేది ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు. చాల పేర్లు విపిస్తున్న లేటెస్ట్ గా కేథరిన్ ను ఎంచుకున్నారనేది తెలుస్తుంది. తేజ డైరెక్ట్ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ తో అందరిని ఫిదా చేసిన కేథరిన్ తొలిసారిగా విజయ్ తో చేయనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉండడంతో ఆమెను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. |
https://www.telugupost.com/movie-news/అతి-త్వరలో-కళ్యాణ్-పూరీల-4324/ | నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ చిత్ర ఘన విజయం తర్వాత రెండు ఘోర వైఫల్యాలు పొంది నిరాశ చెందారు. ఒకటి ఆయన నిర్మించి మాస్ మాహారాజా రవి తేజ నటించిన కిక్ 2 కాగా మరొక చిత్రం ఆయన నటించిన షేర్. ఈ వైఫల్యాల నుంచి బైట పడేందుకు ఆయన తన పంథా మార్చుకుని దర్శకుడు పూరి జగన్నాథ్ దారిలోకి వెళ్లారు. పూరి జగన్నాథ్ చిత్ర కథానాయకుల్లానే తన వేషభాషలు మార్చుకున్నారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని కళ్యాణ్ రామ్ ని చూపించబోతున్నారు దర్శకుడు పూరి. జర్నలిజం నేపథ్యంలో ఒక సామాజిక అంశం చుట్టూ ఇజం కథ తిరుగుతుంది అని సమాచారం.దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా టెంపర్ విజయం తర్వాత చేసిన జ్యోతి లక్ష్మి, లోఫర్ చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందలేకపోయారు. అందువల్ల ఇజం చిత్ర విజయం అటు దర్శకుడిగా పూరికి, నటుడు నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ కి కీలకం గా మారింది. ముందు నుంచి ఈ చిత్రాన్ని దసరా బరిలో ఉంచాలని అనుకున్న చిత్ర వర్గం కాల పరిమితి వల్ల సినిమా నాణ్యతలో రాజి పడకూడదు అని చిత్ర విడుదలను వాయిదా వేశారు.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఇజం ఆడియోను ఈ నెల 5 వ తారీకున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. వీలైనంత త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నందమూరి తారక రామ ఆర్ట్స్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. |
https://www.telugupost.com/movie-news/మురుగదాస్-తో-ప్రభాస్-నిజ-42410/ | ప్రభాస్ బాహుబలి విజయ దరహాసంతో ఇపుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రధానంగా నాలుగు భాషల్లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని సాహో చిత్రాన్ని దేశం మొత్తం దింపడానికి రెడీ అయ్యింది. అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో చేస్తున్నాడు. మరి సాహో తర్వాత ప్రభాస్ చిత్రం ఏమిటనే దాని మీద ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. అదేమిటంటే తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ కి తమిళంలో ఎంత క్రేజ్ ఉందొ ఇక్కడ తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. మురుగదాస్ కేవలం తమిళంలోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన దర్శకుడు. మరి నేషనల్ వైడ్ గా సినిమాలు చెయ్యడంలో సిద్ధహస్తుడైన మురుగదాస్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడని తెలియగానే ఆ న్యూస్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చేసింది.అయితే మురుగదాస్ ఎప్పుడూ ఆయా భాషల్లో క్రేజ్ ఉన్న హీరోలతోనే చేసాడు గాని... నేషనల్ వైడ్ పేరున్న హీరోతో సినిమా చెయ్యలేకపోయాడు. అయితే ఇప్పుడు బాహుబలితో జాతీయ స్థాయిలో పేరు కొట్టేసిన ప్రభాస్, మురుగదాస్ కి బెస్ట్ చాయిస్ గా కనబడడంతోనే ఇపుడు మురుగదాస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ... అందుకే ప్రభాస్ తో సినిమా చెయ్యడానికి మురుగదాస్ ఇంట్రస్ట్ చూపుతున్నాడంటున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించడానికి డైరెక్టర్ మురుగదాస్ భారీ ప్లాన్ చేస్తున్నాడనే న్యూస్ మాత్రం ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది. |
https://www.telugupost.com/movie-news/radhe-shyam-second-trailer-raised-expectations-on-movie-1357400 | ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ రాధేశ్యామ్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ తో రాధేశ్యామ్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. ట్రైలర్ ని అంత ఇంట్రెస్టింగ్ గా చూపించారు మేకర్స్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా, యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలున్నాయి. ఐదుభాషల్లో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ అయింది.Also Read : "అశోకవనంలో అర్జున కల్యాణం" విడుదల వాయిదామార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు రాధేశ్యామ్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా బుధవారం రాధేశ్యామ్ నుంచి సెకండ్ ట్రైలర్ ను విడుదల చేసింది. 'మనం ఆలోచిస్తామని భ్రమపడతాం. కానీ మన ఆలోచనలు కూడా ముందుగానే రాసిపెట్టుంటాయి' అని ప్రభాస్ డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత జగపతిబాబు- ప్రభాస్ ల మధ్య వచ్చే డైలాగులు ఆకట్టుకుంటాయి. ట్రైలర్ చివరిలో 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు' అని పూజ చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 1970-80ల కాలం నాటి లవ్ స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్.. ప్రేమకు - విధికి మధ్య జరిగే యుద్ధంగా చూపనున్నారు. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ బాణీలు సమకూరుస్తుండగా ఎస్.ఎస్ థమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/హిందీ-రీమేక్-కాదనుకుని-త-31638/ | టెలివిషన్ కార్యక్రమాలతో పాపులారిటీ తెచ్చుకుని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి తెరకెక్కించిన డేంజర్ చిత్రంతో కథానాయికగా కూడా ప్రేక్షకులని ఆకట్టుకున్న తెలుగు అమ్మాయి స్వాతి తరువాతి కాలంలో తెలుగు సినిమాలతో కంటే ఎక్కువగా తమిళంలో నటనకి స్కోప్ వున్నా పాత్రలలో ఎక్కువ కనిపిస్తూ హీరోయిన్ గా కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. అడపా దడపా తెలుగులో అష్ట చమ్మా, గోల్కొండ హై స్కూల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గర ఐయ్యింది. అనంతరం స్వామి రారా చిత్రంతో ఊహించని విజయాన్ని అందుకుని కార్తికేయ చిత్రంతో విజయ పరంపరని కొనసాగించింది. ఆ సమయంలోనే హీరోయిన్ ప్రాధాన్యత చిత్రం కావటంతో త్రిపుర సినిమా చేసి కెరీర్ పరంగా చాలానే కోల్పోయింది. పైగా ఆ చిత్రంలో స్వాతి లుక్ కథానాయికకు సరిపడే విధంగా కాక క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే దారుణంగా శరీరాకృతితో ప్రేక్షకులని భయపెట్టింది స్వాతి. త్రిపుర మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి కోలుకోవటానికి స్వాతికి చాలా సమయమే పట్టింది. త్రిపుర అనంతరం స్వాతి కెరీర్ లో బాగా గ్యాప్ తరువాత తాజాగా విడుదలైన బాబు బాగా బిజీ చిత్రంలో మిష్టి చక్రవర్తి పాత్ర ముందుగా స్వాతి వద్దకి వెళ్లగా ఆ పాత్రని స్వాతి తిరస్కరించింది. హిందీ హంటర్ లో రాధికా ఆప్టే పోషించిన పాత్రే స్వాతి తిరస్కరించిన పాత్ర. అందుకు కారణాలు ఏవైనా త్వరలో లండన్ బాబులు అనే తమిళ రీమేక్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకి కథానాయికగా మరొకసారి రాబోతోంది. ఈ చిత్రంలో స్వాతి లుక్స్ గత చిత్రాల తో పోలిస్తే చాలా ఫ్రెష్ గా వున్నాయి. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఫేమ్ దర్శకుడు చిన్ని కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సింహ భాగం షూటింగ్ పూర్తి అయిపోయింది. తమిళ్ లో మంచి విజయం సాధించిన అందవన్ కాత్తలై అనే చిత్ర రీమేక్ గా రూపొందుతున్న లండన్ బాబులు చిత్రాన్ని మారుతీ టాకీస్ బ్యానర్ లో దర్శకుడు మారుతి నిర్మిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ఉయ్యాలవాడ-కోసం-మరో-హీరో-ద-39730/ | చిరంజీవి 151 వ చిత్రాన్ని అతి త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా ఈ ఉయ్యాలవాడని మూడు భాషల్లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఉయ్యాలవాడ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మెగా ఫాన్స్ పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. మొన్నీమధ్యనే ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మొదలెడతారని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదుగాని చిరంజీవి పుట్టున రోజు సందర్భంగా ఉయ్యాలవాడ మొదలవ్వొచ్చనే ఊహాగానాలు మాత్రం బాగా ఉన్నాయి.అయితే ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకురావాలంటే బాలీవుడ్ నటులతో పాటే ఇతర భాష నటులకు ఈ ఉయ్యాలవాడ చిత్రంలో చోటివ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉయ్యాలవాడ చిత్రంలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అమితాబ్ కూడా ఉయ్యాలవాడలో నటించడానికి ఉత్సాహం చూస్పిస్తున్నాడంటూ చెప్పారు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. కన్నడ స్టార్ హీరో సుదీప్ ఉయ్యాలవాడలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడంటూ ఒక వార్త టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.సుదీప్ ని ఈ చిత్రంలో నటింప చెయ్యాలనే ప్లాన్ లో భాగంగా అతనితో చర్చలు జరుపుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సుదీప్ ఈగ చిత్రంలో స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. మరి ఇప్పుడు ఈ ఉయ్యాలవాడలో వచ్చిన ఛాన్స్ ని ఒప్పుకుంటే ఎలాంటి పాత్రలో కనబడతాడో అనే క్యూరియాసిటీ జనాల్లో క్రియేట్ అయ్యింది. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ విషయం ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ కంటే మహావీర్ టైటిల్ బావుంటుందని చిత్ర యూనిట్ యోచన చేస్తున్నట్లు కూడా వార్తలున్నాయి. |
https://www.telugupost.com/uncategorized/tabu-remuneration-to-act-in-telugu-cinemas-127252/ | ఒక్కప్పటి హీరోయిన్స్ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తే ఎంత తీసుకుంటారో మధుబాల- నదియా- ఇంద్రజ వంటి వాళ్ళని చూస్తే అర్ధం అవుతుంది. వీరు రీఎంట్రీ ఇచ్చి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారని అప్పటిలో టాక్ ఉండేది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో సీనియర్ హాట్ హీరోయిన్ చేరింది. టాలీవుడ్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న నటి టబు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. టబు ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో టబు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలిసింది. అలానే రానా – వేణు ఉడుగుల కాంబినేషన్ లో వస్తున్న 'విరాటఫర్వం' చిత్రంలోనూ టబు ఓ కీరోల్ పోషిస్తున్నారట. ఇలా తెలుగు లో సినిమాలతో బిజీ కావడంతో రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ పెంచారని తెలుస్తుంది. ఒక్కో కమిట్ మెంట్ కి రూ.60 లక్షల పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె పాత్ర సినిమాలకు మెయిన్ కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు రెడీ గా ఉన్నారట. రీసెంట్ గా టబు బాలీవుడ్ లో దేదే ప్యార్ దే- భారత్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు తెలుగులో కి ఎంట్రీ ఇచ్చారు |
https://www.telugupost.com/movie-news/big-boss-2-troubles-to-nani-113376/ | వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న హీరో నాని… గత ఏడాది బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా మొదట్లో ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత నాని ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్స్ చేసాడు. హౌస్ లోని పార్టిసిపేట్స్ ద్వారా నాని బాగా పాపులర్ అయినా తరువాత కాంటెస్టెంటెంట్స్ నుండి, బయట ప్రేక్షకుల నుండి ట్రోలింగ్ కి గురయ్యాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని అదుపులో పెట్టలేక నాని చాలా సతమతమయ్యాడు. ఇక చివరికి బిగ్ బాస్ తో నానికి తల బొప్పికట్టింది. అప్పట్లో కౌషల్ ఆర్మీకి తలొగ్గి బిగ్ బాస్ యాజమాన్యం నానితో కలిసి కౌశల్ కి బిగ్ బాస్ ట్రోఫీని కట్టబెట్టారని కూడా ట్రోల్ చేసారు. ఇక హౌస్ లో కంటెస్టెంట్ అయిన బాబు గోగినేనితో నాని కాస్త ఘాటుగానే స్పందించాల్సి వచ్చింది. ఆటని ఆటలాగా ఆడండి బాబు సర్ అని సుతిమెత్తగా చెప్పాడు. నానికి మరో తలనొప్పి… ఇక బిగ్ బాస్ సీజన్ 2 అయిపోయి నెలలు గడుస్తున్నా.. ఆ సీజన్ 2 ఇంకా మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంది. కౌశల్ ఆర్మీతో గెలిచిన కౌశల్ ఇప్పుడు ఆ కౌశల్ ఆర్మీ ద్వారానే సమస్యలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కౌశల్ ఆర్మీకి, కౌశల్ కి ప్రత్యక్షంగా టీవీ ఛానల్స్ సాక్షిగా యుద్ధం జరుగుతుండగా… అందులోకి బాబు గోగినేని ఎప్పటిలాగే కౌశల్ ని విమర్శించడం మొదలు పెట్టాడు. ఛానల్స్ కి లైవ్ కాల్స్ లో కనెక్ట్ అవుతూ కౌశల్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కౌశల్ గెలిచిన తర్వాత కౌశల్ ఆర్మీ ఫేక్ అని.. బిగ్ బాస్ యాజమాన్యం ఫేక్ ఓట్స్ తో కౌశల్ కి పట్టం కట్టారని బాబు గోగినేని చిన్న పిల్లాడిలా గెంతుతూనే ఉన్నాడు. అయితే తాజాగా బాబు గోగినేని స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 2 ఓటింగ్ లో అవకతవకలపై ఇప్పుడు కొన్ని రుజువులు బయటికొచ్చినుందన వీటిపై నాని స్పందించాలని అయన అభిపాయపడుతున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 2 ముగిసిపోయినా నానికి ఇంకా ఆ బిగ్ బాస్ తలనొప్పి పోయేలా కనబడడం లేదు. |
https://www.telugupost.com/movie-news/tollywood-actress-mounika-reddy-reaction-on-her-marriage-divorce-news-1497891 | తెలుగు అమ్మాయి మౌనిక రెడ్డి.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. దీంతో గత ఏడాది 'బీమ్లానాయక్' మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన ఒక ముఖ్య పాత్ర చేసే లక్కీ ఛాన్స్ ని అందుకుంది. ఆ సినిమాతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ ఫేమ్‌తో సినిమా ఆఫర్లు కూడా రావడం మొదలయ్యాయి. కానీ ఇంతలోనే తన స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్‌ని స్టార్ట్ అందరికి షాక్ ఇచ్చింది.గత ఏడాది డిసెంబర్లో కుటుంబసభ్యులు, స్నేహితులు మధ్య గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఏమైందో ఏమో ఇప్పుడు ఆ ఫోటోలు మౌనిక ఇన్‌స్టాలో కనిపించడం లేదు. దీంతో ఆమె ఆ ఫోటోలు డిలీట్ చేసింది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. ఇటీవల కాలంలో విడాకుల తీసుకోని విడిపోయిన సెలబ్రిటీస్ అంతా.. ముందుగా ఇలాగే ఫోటోలు డిలీట్ చేశారు.దీంతో మౌనిక కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి. పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే విడాకులు తీసుకుంటున్నారా.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మౌనిక వీటిపై ఒక క్లారిటీ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ లో విడాకుల వార్తలు పై రియాక్ట్ అవుతూ ఒక స్టోరీ పెట్టింది. తన భర్తతో ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ.. తనకి తన భర్తకి మధ్య జరిగిన ఒక సరదా సంభాషణని రాసుకొచ్చింది.మౌనిక.. 'మనం ట్రేండింగ్లో ఉన్నాం' అని విడాకుల వార్త భర్తకి చెప్పగా, అతను రియాక్ట్ అవుతూ.. 'ఏ ఖర్చు లేకుండా మనం ట్రెండ్ అవుతున్నాముగా' అనే అర్ధంతో సరదాగా బదులిచ్చాడు. దీంతో మౌనిక విడాకుల వార్తలో నిజం లేదని తేలిపోయింది. కాగా మౌనిక ప్రస్తుతం ఒక లేడీ ఓరియంటెడ్ పిరియాడికల్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. |
https://www.telugupost.com/movie-news/అదిరింది-ఫస్ట్-వీక్-తెలు-49386/ | ఎన్నో అడ్డంకుల మధ్య మెర్సల్ సినిమా రిలీజ్ తమిళనాడులో ప్రకంపలు సృష్టిస్తుందో అందరికి తెలుసు. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఏకంగా రూ. 235 కోట్ల గ్రాస్ కాచ్ చేసి ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక తెలుగులో అదిరింది అనే టైటిల్ తో పలుమార్లు వాయిదా పడి చివరికి నవంబర్ 9న రిలీజ్ అయ్యి తెలుగు నాట కూడా పర్లేదు అనిపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.4.51 కోట్లు వసూలు చేసింది. ఏరియాల వారీగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మీకోసం..ఏరియా షేర్ ( కోట్లు )నైజాం 1.45సీడెడ్ 0.63ఉత్తరాంధ్ర 0.66గుంటూరు 0.44ఈస్ట్ గోదావరి 0.41వెస్ట్ గోదావరి 0.26కృష్ణ 0.48నెల్లూరు 0.18టోటల్ ఆంధ్ర+తెలంగాణ 4.51 |
https://www.telugupost.com/movie-news/kajal-aggarwal-glmour-show-at-zee-apsara-awards-66293/ | ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి పెద్దగా క్రేజ్ లేదు. కావాలనే కొన్ని అవకాశాలు చేజార్చుకుంటూ ప్రస్తుతంఖాళీగా ఉంటుంది. కుర్ర హీరోలు ఇప్పటికి కాజల్ కోసం ఎదురు చూస్తున్నవారున్నారు. వారు తమ సినిమాల్లో పిలిచి అవకాశం ఇస్తాం అంటే కోట్లు కావాలని డిమాండ్ చేస్తుంది. ఇక సీనియర్ హీరో వెంకటేష్ పక్కన 'ఆట నాదే వేట నాదే' సినిమాలో చెయ్యనని ఖరా ఖండిగా చెప్పేసింది. అలాగే శర్వానంద్ పక్కన కూడా పారితోషకం కారణంగానే సినిమాని వదులుకుందనే టాక్ ఉంది. మరొపక్కన అడిగినంత ఇస్తున్నారు కదా అని బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన వచ్చిన ఛాన్స్ ని పట్టేసింది. ఇక కాజల్ అగర్వాల్ అందాల ఆరబోతకు ఎప్పుడూ సై అనేది. కాకపోతే బాలీవుడ్ లో ఆరబోసినట్టుగా టాలీవుడ్ లో ఆరబోసేది కాదు కానీ... ఇక్కడ కూడా గ్లామర్ డాల్ ల పర్వాలేదనిపించేది. చిరు పక్కన ఖైదీలోను కాజల్ అందాల ఆరబోత మాములుగా రాలేదు. ఇక ఫంక్షన్స్ కి , అవార్డ్స్ ఫంక్షన్స్ కి హాజరయ్యే కాజల్ అగర్వాల్ బొమ్మలాగా అదిరిపోయే దుస్తులతో క్లివేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తుంది. ఒకసారి బాలీవుడ్ లో ఫిలిం ఫర్ అవార్డ్స్ కి హాజరయిన కాజల్ అగర్వాల్ ఆ ఫంక్షన్ కి వేసిన డ్రెస్సు తో తెగ హైలెట్ అయ్యింది. ఆ పింక్ కలర్ గౌన్ లో కాజల్ అందాల విందు మాములుగా లేదు.అయితే తాజాగా కాజల్ టాలీవుడ్ ప్రియులకు కూడా అలాంటి అందాల విందునే ఇచ్చింది. గత రాత్రి జీ తెలుగు ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్వహిస్తున్న అప్సర అవార్డ్స్ కోసం కాజల్ వేసిన డ్రెస్సు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లో ఈ ఫంక్షన్ కి అటెండ్ అయిన కాజల్.. తన డ్రెసింగ్ మెరుపులతో... తనలోని మెరుపు ఇంకా తగ్గలేదని... నిరూపించింది. మరి ఆ డ్రెస్సులో కాజల్ అందాల విందు కి చూపరుల మతులు పోయాయి. ఇక కాజల్ తనేమాత్రం తగ్గేది లేదని... అక్కడ ఫోటో గ్రఫేర్స్ కి చేతినిండా పనిచెప్పింది. అందమైన ఫోజులతో అదరగొట్టేసింది టాలీవుడ్ చందమామ. |
https://www.telugupost.com/movie-news/venkatesh-narappa-movie-will-be-directed-by-venkymama-director-bobby-146289/ | వెంకటేష్ తమిళ అసురన్ రీమేక్ నారప్ప ని అధికారికంగా పట్టాలెక్కించేసాడు. తమిళంలో సూపర్ హిట్ హిట్ అయిన ధనుష్ అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా చేస్తున్నాడు వెంకటేష్. అసురన్ ని యాజిటీజ్ గా దింపేస్తున్నారని వెంకటేష్ నారప్ప లుక్ చూస్తే అర్ధమవుతుంది. ధనుష్ అసురన్ లుక్ కి నారప్ప లుక్ కి పెద్దగా తేడా లేదు. సేమ్ టు సేమ్ ఉంది. దాన్నిబట్టి అసురన్ నేటివిటీ చెడగొట్టే ప్రయత్నాలేమీ జరగడం లేదని తెలుస్తుంది. అయితే ఈ సినిమాని సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అనగానే వెంకీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. అసలే డిజాస్టర్ డైరెక్టర్ అని. కానీ వెంకటేష్ మాత్రం శ్రీకాంత్ అడ్డలకే కనెక్ట్ అయ్యాడు. అయితే అసురన్ సినిమా మొత్తం దళితుల తిరుగుబాటు నేపథ్యంలో ఉంటుంది. ఇప్పుడు నారప్ప సినిమా కూడా అదే కథ తో తెరకెక్కుతుంది. కాకపోతే కొంతమేర అనంతపురం కారంచేడు నరమేధ ఘటనను ఆధారంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దళితులకు, అగ్రవర్ణాలకు మధ్యన దళితులూ ఏ విధంగా అన్యాయం అయ్యారో.. అగ్రవర్ణాల చేతిలో దళితుల మరణాలు ఎలా సంభవించాయి అనేది నారప్పలొ చూపించబోతున్నారట. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం మరో దర్శకుడు దిగుతున్నట్టుగ చెబుతున్నారు వెంకిమామ సినిమాని వెంకటేష్ తో చేసిన దర్శకుడు బాబీ నారప్ప సినిమా యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించబోతున్నాడట. సినిమా మొత్తం శ్రీకాంత్ అడ్డాలా, కేవలం ఫైటింగ్ సీన్స్ బాబీ డైరెక్ట్ చేస్తారన్నమాట. అందుకే నారప్ప కోసం ఇద్దరు దిగుతున్నారు అని అన్నది. |
https://www.telugupost.com/movie-news/rashmika-green-india-163196/ | రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో భాగంగా నటీనటులు; ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు.ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలియజేయడం జరిగింది.ఈ చాలెంజ్ లోకి నన్ను ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన సహచర హీరోయిన్లు అయిన రాశి ఖన్న; కళ్యాణి ప్రియదర్శన్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. |
https://www.telugupost.com/movie-news/private-jet-for-prabhas-173525/ | ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ స్టార్ హీరోస్ కి సమానమైన క్రేజ్ ప్రభాస్ సొంతమైంది. బాహుబలి, సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ.. ఇలా ప్రభాస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ కే మొగ్గు చూపుతున్నాడు. అటు సంపాదన పరంగాను, ఇటు రేంజ్ పరంగాను సౌత్ ఇండియా స్టార్ హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యాం షూటింగ్ ముగించుకుని ముంబై లో ఆదిపురుష్ చర్చల్లో పాల్గొంటున్నాడట. అయితే కరోనా కి కంగారు అపడిన ప్రభాస్ ఓ ప్రైవేట్ జెట్ ని మైంటైన్ చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ లో గుసగుసలు వినవస్తున్నాయి. ప్రభాస్ కరోనా కారణముగా ఫ్లైట్స్ లో వెళ్లి రావడం ఎందుకు రిస్క్ అని.. తన ఎన్ఆర్ఐ ఫ్రెండ్ నుండి ఓ ప్రైవేట్ జెట్ తీసుకుని అందులోనే జర్నీ చేస్తున్నాడట. అందరి కన్నా ముందే ధైర్యంగా ఇటలీ వెళ్లి రాధేశ్యాం షూటింగ్ చెయ్యడానికి ప్రభాస్ కి ఆ ప్రైవేట్ జెట్ కారణమట. ఇక జార్జియా లో రాధేశ్యాం షూటింగ్ ముగించుకుని ప్రభాస్ ప్రైవేట్ ఫ్లైట్ లోనే హైదరాబాద్ రావడం, మళ్ళీ ముంబై కి వెళ్లి అక్కడ ఆదిపురుష్ కథ చర్చలో పాల్గొనడం చేస్తున్నాడని టాక్. తన ఫ్రెండ్ ప్రైవేట్ ఫ్లైట్ లోనే ప్రభాస్ ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా త్రిగుతున్నాడని అంటున్నాడు. |
https://www.telugupost.com/crime/huge-explosion-occurred-in-the-capital-of-bangladesh-seventeen-people-were-killed-in-the-blast-1465942 | బంగ్లాదేశ్ రాజధానిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిహేడు మంది మరణించారు. ఏడు అంతస్థుల భవనంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిహేడు మంది మరణించగా వంద మందికిపైగా గాయపడ్డారు. భవనం శిధిలాల కింద మరికొందరు ఉండే అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నారు. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశముందని తెలిసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.మృతుల సంఖ్య....సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిందరినీ ఢాకా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నారు. అయితే పేలుడు ఎందుకు సంబంధించిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ బిల్డింగ్ లో వ్యాపార సముదాయం ఉంది. ఇక్కడ నిల్వ ఉంచిన రసాయనాల కారణంగానే పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. శిధిలాల తొలగింపు కార్యక్రమం కూడా వేగవంతం చేశారు. |
https://www.telugupost.com/movie-news/srinivasa-kalyanam-business-2-84719/ | నితిన్ - రాశి ఖన్నా జంటగా.. దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదలై వారం కావొస్తుంది. విడుదలైన మొదటి షోకే యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి మాత్రమే తిరిగొచ్చేలా కనబడుతుంది. సినిమాలో అనుకున్నంత కంటెంట్ లేకపోవడం.. సినిమా మొత్తం ఏదో క్లాస్ తీసుకున్నట్టుగా ఉండడం.. పెళ్లి పేరుతొ అన్ని తతంగాలు గుర్తు చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా శ్రీనివాస కళ్యాణం సినిమాని రిజెక్ట్ చేశారు. ఇక వారం రోజుల్లో కేవలం 11 కోట్ల పై మేర షేర్ ని రాబట్టింది ఈ సినిమా. మరి తాజాగా విడుదలైన గీత గోవిందం సినిమా ముందు శ్రీనివాస కళ్యాణం సినిమా చేతులెయ్యడం ఖాయంగానే కనబడుతుంది. ఇకపోతే శ్రీనివాస కళ్యాణం మొదటి వారం ప్రపంచవ్యాప్త కలెక్షన్స్...ఏరియా షేర్స్ (కోట్లలో)నైజాం 4.75సీడెడ్ 1.42నెల్లూరు 0.32కృష్ణ 0.61గుంటూరు 0.75వైజాగ్ 1.30ఈస్ట్ గోదావరి 0.72వెస్ట్ గోదావరి 0.46టోటల్ ఏపీ అండ్ టీఎస్ షేర్ 10.33 కోట్లుఓవర్సీస్ 0.80ఇతర ప్రాంతాలు 0.70మొత్తం ప్రపంచవ్యాప్త షేర్ 11.83 కోట్లు |
https://www.telugupost.com/movie-news/pawan-kalyan-and-rana-daggupati-to-work-together-in-ayyappam-koshiyam-177313/ | మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ తెలుగులో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుపాటి కాంబోలో బడా మల్టీస్టారర్ గా గ్రాండ్ గా మొదలయ్యింది. ఆ పూజా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కూడా కాస్త సందడి చేసాడు. కానీ ఫ్యాన్స్ లో మాత్రం కాస్త గందర గోళం నెలకొంది ఏమిటంటే.. ఈ సినిమాకి త్రివిక్రమే కథ, మాటలు అన్ని అందిస్తున్నారని.. ఆ మధ్యన అజ్ఞాతవాసి కొట్టిన దెబ్బకి ఇంకా ఆయిట్మెంట్ రాసుకుంటూ ఉన్న పవన్ ఫ్యాన్స్ కి ఇది ఇప్పుడు కొత్త టెన్షన్ లా తయారైంది. దానికి కారణం లేకపోలేదు. గతంలో హిందీ క్లాసిక్.. లవ్ ఆజ్కల్ తీసుకొచ్చి త్రివిక్రమ్ చేతిలో పెడితే.. ఆ సినిమాకి త్రివిక్రమ్ తనదైన శైలిలో కథ, మాటలు రాసాడు. అయితే త్రివిక్రమ్ డైలాగ్స్ ని, స్క్రిప్ట్ ని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు పవన్ అజ్ఞాతవాసి పెద్ద షాక్. అలాగే తీన్మార్ కి త్రివిక్రమ్ కథ అనగానే దానిని యధాతధంగా తెరకెక్కించక తప్పలేదు తీన్మార్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జికి. ఆ తీన్మార్ రిజెల్ట్ ఎలా వచ్చిందో అనేది మనందరం చూసిందే. ఇప్పుడు కూడా అయ్యప్పమ్ కోషియమ్ మలయాళం హిట్ సినిమాకి త్రివిక్రమ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారనగానే తీన్మార్ డేస్ గుర్తొస్తున్నాయి పవన్ ఫ్యాన్స్ కి. అందుకనే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చర్చల లో ఈ తరహా చర్చలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సర్ తీన్మార్ ఆడించొద్దు ప్లీజ్ తట్టుకోలేం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/heroine-and-singer-affair-74644/ | బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ విదేశీ సింగర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. వీరి స్నేహబంధం గురించి బాలీవుడ్ సర్కిల్స్ లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రియాంక చోప్రా విదేశీ సింగర్ నిక్ జోనస్ తో కలిసి తిరుగుతోందని ప్రచారం చాలా రోజులుగానే జరుగుతోంది. అయితే, వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా పరస్పరం చేసుకుంటున్న కామెంట్లు ఈ బంధం నిజమే అనే అనుమానాలు కలిగిస్తోంది.ఒకరి ఫోటోలకు ఒకరు కామెంట్లు....నిక్ జోనస్ ఇటీవల ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ జూ ని సందర్శించాడు. జూ లో ఓ జంతువుతో కలిసి వీడియో తీసుకుని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నాడు. దీనిపై ప్రియాంక చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ‘ఎవరు బాగున్నారు..లోల్..’ అని ఆమె ఈ విడియోకు కామెంట్ చేసింది. ఇంతకుముందు కూడా ప్రయాంక పోస్ట్ చేసిన ఓ ఫోటోకు నిక్కి కామెంట్ చేశాడు. దీంతో పాటు ఇటీవల వారు లాస్ ఏంజిల్స్ లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో వీరి బంధం నిజమేనని, కానీ అది కేవలం స్నేహమేనా..? అంతకంటే గాఢమైందా అనేది తేలాలి. ఇక ఇటీవల ఈ విషయంపై స్పందించిన ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా...విదేశీయుడితో ప్రియాంక పెళ్లిని తాను ఒప్పుకోనని స్పష్టం చేశారు. ఆమె పెళ్లి చేసుకోకున్నా సరే కానీ, విదేశీయుడిని మాత్రం చేసుకోకూడదు అని తెగేసి చెప్పారు. |
https://www.telugupost.com/crime/a-terrible-accident-took-place-in-kedarnath-uttarakhand-six-people-died-in-this-incident-1444020 | ఉత్తరాఖండ్ కేదార్నాథ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్‌లతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో ఆరుగురు మరణించారు. వాతావరణం అనుకూలించకే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులున్నారు.సహాయక చర్యలు...కుప్ప కూలి పోవడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాయి. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. సహాయక బృందాలు సంఘటన స్థలికి చేరుకుని చర్యలు ప్రారంభించాయి. ఈ విషాద సంఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. |
https://www.telugupost.com/movie-news/nani-allu-arjun-dance-in-bangkok-86696/ | స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి డాన్సర్ అని మన అందరికి తెలిసిన విషయమే. కానీ మంచి సింగర్ అని మీకు తెలుసా? ఇది పక్కన పెడితే నాని కూడా మంచి సింగర్ అని మీకు తెలుసా? కానీ డాన్సులు చెయ్యాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి. అది బన్నీకి ఉంది. కానీ నాని మాత్రం డాన్సులు విషయంలో అంతంత మాత్రమే అని తెలుసు.అలాంటి వీరిద్దరూ కలిసి ఒకే చోట డాన్సులు వేసి.. పాటలు పడితే ఎలా ఉంటది? కానీ ఆ అదృష్టం కొంతమందికే దక్కింది. వీరిద్దరూ కలిసి బ్యాంకాక్ లో జరిగిన ఓ సంగీత్ ఈవెంట్ లో పాటలు పాడి డాన్సులు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్ లో సింగర్స్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' నుండి ఓ సూపర్ హిట్ సాంగ్ పాడుతుంటే..పక్కన నుండి నాని - తన వైఫ్ అంజన ఇద్దరూ కలిసి కోరస్ పాడారు.ఆ తర్వాత అల్లు అర్జున్ - స్నేహ 'ఆర్య-2' నుండి మరో సూపర్ హిట్ పాటను పాడారు. అయితే వీరు ఇద్దరు కలిసి అంటే అల్లు అర్జున్, నాని కలిసి 'ఎటో వెళ్లిపోయింది మనసు' సినిమా నుండి సాంగ్ ను కలిసి పాడారు. ఇలా ఇద్దరు హీరోస్ కలిసి ఒకే స్టేజి మీద డాన్సులు..పాటలు పాడుతుంటే ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోతుంది. ఇలా ఒకే స్టేజి మీద ఇద్దరు హీరోస్ కనపడటం మంచి వాతావరణమే. |
https://www.telugupost.com/movie-news/rajamouli-plan-on-rrr-103628/ | దర్శకదీరుడు రాజమౌళి సినిమాలు వేరు, వేరే దర్శకుల సినిమాలు వేరు. టాలీవుడ్ లో రాజమౌళి తీసినంత ఇంపాక్ట్ గా వేరే ఏ దర్శకుడు తీయలేడు. ప్రతి విషయాన్ని చాలా డిటైల్ గా తీసే రాజమౌళి షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందుకే ఈయన సినిమాలు అనుకున్న టైంలో రిలీజ్ అవ్వవు. ప్రస్తుతం #RRR షూటింగ్ చేస్తున్న జక్కన్న రీసెంట్ గా ఒక షెడ్యూల్ ను ఫినిష్ చేసాడు. మరో షెడ్యూల్ ను వచ్చే నెల నుండి స్టార్ట్ చేయనున్నాడు. మరి ఎప్పటివరకూ రామ్ చరణ్, తారక్ లు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇద్దరూ వచ్చే ఏడాది అక్టోబర్ వరకు డేట్స్ ఇచ్చారట. అప్పుటివరకు కావాలని రాజమౌళి అడిగిగారట. సంక్రాంతికి క్లారిటీ వస్తుందా..? దసరా లోపు షూటింగ్ కంప్లీట్ చేసి అప్పటినుండి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ వేసాడట జక్కన్న. అంటే అక్టోబర్ తరువాత నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ వేరే ప్రాజెక్ట్స్ పై పని చేయడం మొదలు పెట్టొచ్చు. జక్కన్న అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇద్దరి ఫస్ట్ లుక్స్ దసరాకు లాంచ్ అవుతాయి. డిలే అయిన పక్షంలో ఇద్దరి కొత్త సినిమాల షూటింగ్ కూడా ఆలస్యం అవుతాయి. ఇప్పటివరకు రాజమౌళి ఇతర నటీనటుల పేర్లు వెల్లడించలేదు. రాజమౌళి ఏది త్వరగా చెప్పాడు కదా. కాబట్టి సంక్రాంతి టైంకి ఇతర నటుల వివరాలను, హీరోయిన్ల పేర్లు అనౌన్స్ చేసి దేశవ్యాప్తంగా ఈ సినిమాపై బజ్ తీసుకుని రావాలని చూస్తున్నాడు. |
https://www.telugupost.com/movie-news/మెగా-స్టార్-ఆహ్వానాన్ని-57481/ | యంగ్ హీరో నాగ శౌర్య తన తాజా చిత్రం చలో తో వచ్చే శుక్రవారం (2 ఫిబ్రవరి) నాడు ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా నిన్న (గురువారం 25 జనవరి) సాయంతరం ప్రీ రిలీజ్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా మెగా స్టార్ చిరంజీవి విచ్చేసి చిత్ర బృందాన్ని, ప్రత్యేకంగా హీరో నాగ శౌర్య ని విష్ చేశారు. మెగా స్టార్ తన ప్రసంగంలో భాగంగా అసలు తాను ఈ వేడుకకి ఎందుకు హాజరు అయ్యారో వివరించారు. ఈ వివరణలో నుంచి ఇప్పుడు జవాబు దొరకని ఒక ప్రశ్న ప్రేక్షకులని వెంటాడుతోంది.మెగా స్టార్ చిరంజీవి చలో ప్రీ రిలీజ్ వేడుక వేదిక పై ప్రసంగిస్తూ, నాగ శౌర్య తనని ముఖ్య అతిధిగా ఆహ్వానించటానికి వచ్చినప్పుడు అతడిలో తనని తాను చేసుకున్నానని, తన కెరీర్ తొలి నాళ్ళల్లో తాను నటించిన ఒక చిత్ర శతదినోత్సవ వేడుకకి తాను ఎంతగానో అభిమానించే నటుడిని ప్రత్యేక అతిధిగా ఆహ్వానిస్తే ఆయన బిజీ షెడ్యూల్ కారణాన ఆహ్వానాన్ని తిరస్కరించారని, అప్పటికి ఆ వేడుక జరిగినప్పటికీ తాను ఎంతగానో నిరాశ చెందినట్టు చెప్పారు చిరంజీవి. అలానే హీరోగా మంచి రేంజ్ కి ఎదుగుతున్న శౌర్య తనని ఆహ్వానించినప్పుడు నాకు ఆ సందర్భము గుర్తు వచ్చి తనకి ఎదురైన నిరాశ, నిరుత్సాహం అతనికి ఎదురుకాకూడదనే ఈ వేడుకకి హాజరయ్యానని పేర్కొన్నారు మెగా స్టార్. అయితే తన ఆహ్వానాన్ని తిరస్కరించిన ఆ బడా స్టార్ ఎవరో పేరు మాత్రం రివీల్ చేయలేదు చిరు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ యాక్టర్ ఎవరై వుంటారనేదాని పై అనేక పోల్స్ ప్రారంభమయ్యాయి. |
https://www.telugupost.com/movie-news/ntr-atlee-vijayendraprasad-154425/ | ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని తెలుగు డైరెక్టర్స్ మాత్రమే కాదు, తమిళ, కన్నడ డైరెక్టర్స్ కూడా తహతహలాడుతున్నారు. RRR సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చెయ్యబోతున్నాడు. ఆ తర్వాత సిఎంమా ఎన్టీఆర్ ఎవరితో చెయ్యబోతున్నాడో అనే దానిమీద అందరిలో పిచ్చ క్యూరియాసిటీ. కరోనా లాక్ డౌన్ టైం లో ఎన్టీఆర్ కథలు వింటున్నాడనే టాక్ ప్రచారంలోకొచ్చింది. ఇక తమిళనాట అట్లీ ఎన్టీఆర్ తో సినిమా కోసం కాచుకుని కూర్చున్నాడు. మరోపక్క కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ ఓకె అంటే సై అనేలా ఉన్నాడు. అయితే తమిళ డైరెక్టర్ అట్లీ ని ఎన్టీఆర్ తో కథ వినిపించేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు హెల్ప్ చేసాడనే టాక్ వినబడుతుంది. ఎన్టీఆర్ ని అట్లీ కుమార్ ని కూర్చీబెట్టి కథ చర్చలు చేపట్టాడట. ఆయనెవరో కాదు బాహుబలి కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ మీడియేటర్ గా వ్యవహరించి అట్లీ కి ఎన్టీఆర్ కి మధ్యన ప్యాచప్ చేసాడట. అట్లీ తో విజయేంద్ర ప్రసాద్ కి మెర్సెల్ దగ్గరనుండి అనుబంధం ఉండడంతో.. మెర్సెల్ టైం లోనే ఓ కథ ని విజయేంద్ర ప్రసాద్ కి వినిపించగా.. ఈ కథ ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని ఎన్టీఆర్ దగ్గరికి అట్లీ ని తీసుకెళ్లి కథ వినిపించాడని టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. |
https://www.telugupost.com/crime/madhya-pradesh-man-gives-supari-to-daughter-in-law-to-kill-his-wife-1379455 | అత్తను చంపడానికి కోడలికి 'సుపారీ' ఇచ్చిన మామ కథ ఇది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఎంపీలోని రేవా జిల్లాలో తన భార్యను చంపినందుకు 51 ఏళ్ల వ్యక్తిని, అతని కోడలును అరెస్టు చేశారు. వాల్మీకి కోల్ అనే వ్యక్తి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, తన భార్య సరోజను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. దేంతో ఆమె గొంతు కోసేందుకు తన కోడలు కంచన్ కోల్ (25)కి రూ.4వేలు సుపారీగా ఇచ్చాడని పోలీసులు చెబుతున్నారు.వాల్మీకి ప్రతి నెలా ఆమెకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తూనే ఉంటానని 'డీల్' జరిగింది. సరోజ, కాంచన్ల మధ్య సఖ్యత లేదని వాల్మీకి తెలుసు, అందుకే అతను దానిని సద్వినియోగం చేసుకున్నాడని చెబుతున్నారు. సరోజ్ (50) జూలై 12న తన ఇంట్లో శవమై కనిపించింది. హత్య జరిగిన రోజు వాల్మీకి సాత్నాలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. "జూలై 12న ఆమె తన అత్తయ్యను చంపేసింది. కొడవలితో ఆమె గొంతు కోసింది" అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో కోడలిపై అనుమానం రాగా.. తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో మొత్తం విషయం బయటకు వచ్చేసింది. దీంతో కోడలిని, మామను పోలీసులు అరెస్ట్ చేశారు. |
https://www.telugupost.com/movie-news/big-announcement-168406/ | అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి – అనిల్ సుంకరల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్.యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది . అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. తన చిత్రాల్లో హీరోలను అత్యంత స్టైలిష్ గా ప్రజెంట్ చేసే దర్శకుడు సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని 5వ చిత్రంలో అఖిల్ ని సరికొత్తగా ఆవిష్కరించనున్నారు. 2020 సంవత్సరాన్ని సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఏకే ఎంటర్టెన్మెంట్స్ బిగ్ స్కేల్ లో నిర్మించనున్న అఖిల్ 5 తో తన విజయపరంపరను కొనసాగించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. |
https://www.telugupost.com/movie-news/samantha-yashoda-movie-trailer-out-now-1445403 | సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన సినిమా "యశోద". ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై.. అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సమంత గర్భవతిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా "యశోద" ట్రైలర్ ను విజయ్ దేవరకొండ చేతులమీదుగా విడుదల చేయించింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ట్రైలర్ ని బట్టి చూస్తే.. ఈ సినిమా సరోగసి కథాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.పిల్లల్ని కనలేక, కనే అవకాశం లేక అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనుకునే కొందరు సెలెబ్రెటీస్ కోసం ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే సమంత కూడా ఒక ప్రముఖ వ్యక్తి కోసం అద్దె గర్భం దాల్చుతుంది. అయితే ఆ సమయంలో అక్కడ జరిగే కొన్ని చట్ట విరుద్ధమైన పనులు సమంత కంట పడతాయి. వాటిని బయటపెట్టే క్రమంలో సమంత ఎదుర్కొన్న సన్నివేశాలను.. యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ట్రైలర్ చివరిలో.. యశోద అంటే ఎవరో తెలుసుగా, కృష్ణ పరమాత్ముడు తల్లి అంటూ సామ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సమంత చేసిన ఫైట్స్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. నవంబర్ 11న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్స్ హరి-హరన్ లు దర్శకత్వం వహిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/anushka-in-nagarjuna-movie-110216/ | హీరోయిన్ అనుష్కకి నాగార్జున అంటే ఎనలేని అభిమానం. ఎందుకంటే కెరీర్ తొలినాళ్లలో నాగార్జున అనుష్కకి సపోర్ట్ గా నిలిచాడు నాగ్. అందుకే అనుష్కతో నాగ్ చాలా సినిమాలే చేసాడు. అనుష్క కూడా నాగ్ సినిమాలు చాలా వాటిలో గెస్ట్ రోల్స్ కూడా ప్లే చేసిన విషయం తెలిసిందే. అలాగే నాగ్ కుటుంబానికి అనుష్క చాలా క్లోజ్ కూడా. ఇకపోతే గత కొన్నాళ్లుగా అనుష్క అధిక బరువుతో బాధపడుతూ.. లేటెస్ట్ గా స్లిమ్ లుక్ కి మారింది. ఆయుర్వేద వైద్యంతో అనుష్క టోటల్ స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం అనుష్క స్లిమ్ లుక్ తో మన్మధుడికి గాలం వేసిందనే టాక్ నడుస్తుంది. నాగార్జున.. మన్మధుడు సినిమాని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. మన్మధుడు సినిమాలో సోనాలి బింద్రే, అన్షుతో రొమాన్స్ చేసిన నాగార్జున.. మన్మధుడు 2లో ఇప్పటికే పాయల్ రాజపుట్ ని ఎంపిక చేసారని ఇప్పుడు అనుష్కని కూడా సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒప్పేసుకుందట… అయితే నాగార్జున ఆఫర్ చేస్తే అనుష్క కచ్చితంగా ఒప్పుకుంటుంటుందనే టాక్ నడుస్తుంది. అయితే కేవలం సంప్రదింపుల వరకే కాదు… అనుష్కని సంప్రదించడం.. ఆమె ఒకే చెప్పడం జరిగిందని.. అసలు ఇప్పటికే అనుష్క ఫోటో షూట్ కూడా జరిగిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుంది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. కాకపోతే నాగ్ – అనుష్క లు కలిసి నటిస్తే మాత్రం మన్మధుడు సినిమాకి క్రేజ్ రావడం పక్కా కాబట్టి అనుష్కకి నాగ్ ఆఫర్ నిజమే అయ్యుంటుందని అంటున్నారు. |
https://www.telugupost.com/andhra-pradesh/both-ys-jagan-in-andhra-pradesh-and-kcr-in-telangana-lost-the-elections-1542366 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రభుత్వాలు మారిపోయాయి. తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు పవర్ ను అనుభవించి ఓటమిని చవిచూశారు. ఇద్దరికీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా జగన్ గెలుస్తారని అనేక సార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారంటే జగన్ పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని అనుకోవాలి. ఇక జగన్ కూడా తన పార్టీ వైసీపీని తెలంగాణలో రద్దు చేసి కేసీఆర్ కు పరోక్షంగా సాయపడటానికేనని చెబుతారు. అయితే అది కాంగ్రెస్ కు ఉపయోగపడింది. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇద్దరూ ఓటమి పాలయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే.. జగన్ బెంగళూరులోని తన ఓన్ హౌస్ లో ఉన్నారు.ఇద్దరికీ పోలికలున్నా...కానీ కేసీఆర్, జగన్‌లకు మధ్య కొన్ని పోలికలున్నాయి. ఇద్దరూ జనంలోకి పెద్దగా రారు. ప్రజలను కలవడానికి ఇష్టపడరు. ఇద్దరూ ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారని అందరికీ తెలుసు. అంటే వారు చెప్పిందే వినాలి. అంతే తప్ప ఇతరుల సలహాలు ఏ మాత్రం పట్టించుకోరు. తాము అనుకున్నదే అమలు చేయడంలో ఇద్దరూ ఒకరికి మించిన వారు మరొకరు. అధికారంలో ఉండగా ఇద్దరూ ఎమ్మెల్యేలను కలవరు. మంత్రులకు అపాయింట్మెంట్ ఉండదు. ఇలా ఇద్దరి మధ్య పోలికలు అనేకం ఉన్నాయి. ఎన్నికల సమయంలోనూ ప్రజల మధ్యకు వస్తారన్న ఒక విమర్శ కూడా ఇద్దరిపైన ఉంది. కార్యాలయంలోనే ఉండి పాలన సాగిస్తుంటారు ఇద్దరూ. గత ఎన్నికల సందర్భంగా ఇద్దరూ రాజశ్యామల యాగం నిర్వహించినా అధికారానికి మాత్రం ఇద్దరూ దూరమయ్యారు. ఇద్దరూ కలసి...ఇక అభ్యర్థుల ఎంపికలో ఇద్దరిదీ వేర్వేరు పద్ధతులను అవలంబించారు. కేసీఆర్ సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఇచ్చి ఓటమి పాలయితే, జగన్ సీట్లు మార్చినా, కొత్త వారికి అవకాశం కల్పించినా పవర్ మాత్రం చేతికి రాలేదు. అయితే కేసీఆర్ కు ఒక సానుకూలత ఉంది. కేసీఆర్ ఓటమి తర్వాత బయటకు రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మేనల్లుడు హరీశ్‌రావు తోడుగా నిలుస్తున్నారు. వీళ్లిద్దరూ పార్టీ పనులను చక్కదిద్దుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొంత క్యాడర్ జారిపోకుండా పార్టీని నిలబెడుతున్నారు. ఓటమి పాలయిన రోజు నుంచే కేటీఆర్, హరీశ్ రావులు జిల్లాల్లో పర్యటిస్తూ క్యాడర్ లో ధైర్యాన్ని నింపుతున్నారు. నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కొత్త నాయకత్వంతో ఈసారి అధికారం తమదేనన్న భరోసాను కల్పిస్తున్నారు.ఆ స్థాయి నేత...కానీ జగన్ కు ఆ ఆప్షన్ లేదు. జగన్ ఒక్కరే తిరగాలి. ఆయన కుటుంబ సభ్యులు గత ఎన్నికలకు ముందే రాజకీయంగా దూరంగా జరిగారు. తల్లి విజయమ్మ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్నారు. జగన్ తర్వాత నెంబర్ 2 అనే వాళ్లు లేకపోవడంతో ఆయనే స్వయంగా వచ్చి పార్టీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ క్యాడర్ కొంత నిర్వేదంలో ఉంది. నిరాశలో కూరుకుపోయింది. అయితే ఈ సమయంలో జగన్ మాత్రమే జనంలోకి రావాల్సిన పరిస్థితుల్లో ఆయన వస్తేనే పార్టీ తిరిగి గాడిన పడుతుంది. పార్టీలో ఎవరూ అంతటి స్థాయి నేతలు లేకపోవడంతోనే ఈ సమస్య ఉంది. కేసీఆర్ కు ఉన్న అడ్వాంటేజీ జగన్ కు లేదనడానికి ప్రధానం కుటుంబమేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో కేసీఆర్ కు కుటుంబ బలం ఉండగా, జగన్ మాత్రం ఒంటరి అని చెప్పక తప్పదు. |
https://www.telugupost.com/movie-news/devara-part-1-movie-trailer-released-shades-of-ntr-1550943 | జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ 1 ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో డబుల్ యాక్షన్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. తండ్రీకొడుకులకు సంబంధించిన కథలో అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్ కూడా ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఉత్తరాదిన కూడా మంచి పాపులారిటీని అందుకున్న ఎన్టీఆర్ 'దేవర 1' తో మరింత దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ మూవీ వార్ కూడా ఎన్టీఆర్ చేస్తూ ఉండడంతో దేవర 1 మీద అక్కడ కూడా మంచి హైప్ ఉంది. దేవర: మొదటి భాగం ప్రమోషన్స్ లో భాగంగా తారక్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి కపిల్ శర్మ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్‌తో తారక్ ప్రత్యేక చిట్‌చాట్‌లో కూడా పాల్గొన్నాడు. |
https://www.telugupost.com/crime/incident-of-rape-of-a-girl-in-prodduturu-in-kadapa-district-is-causing-a-stir-1360178 | కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. ప్రొద్దుటూరులోని జూనియర్ కళాశాలలో బాలిక ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒక వ్యక్తి బాలికను తన ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.ఆ యువకుడే.....దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు మోడంపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/ram-charan-review-on-bheemla-nayak-trailer-1356078 | పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్ లో వస్తోన్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా మరో రెండ్రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ పోలీస్ గా వస్తున్న సినిమా కావడంతో.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెట్టింట్లో భీమ్లా ట్రైలర్ మేనియానే కొనసాగుతోంది. పవన్, రానాల మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్నాయి.Also Read : ప్రేమోన్మాది ఘాతుకం.. కన్నతల్లి ముందే యువతి గొంతుకోసి దారుణ హత్యతాజాగా మెగా హీరో రామ్ చరణ్.. తన బాబాయ్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ పై స్పందించారు. ట్రైలర్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. "భీమ్లా నాయక్ ట్రైలర్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంది. ట్రైలర్‌లోని ప్రతీ డైలాగ్, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ పవర్ ఫుల్‌గా ఉంది. ఇక నా స్నేహితుడు రానా దగ్గుబాటి నటన సూపర్‌గా ఉంది. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్" అంటూ ట్వీట్ చేశాడు. కాగా.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.The trailer of #BheemlaNayak is electrifying!! Every dialogue & action of @PawanKalyan Garu was"POWERFUL"My buddy @RanaDaggubati's performance & presence was top notch 👌#BheemlaNayakonFeb25 #Trivikram @saagar_chandrak @MenenNithya @SitharaEnts @MusicThaman ALL THE BEST!!👍— Ram Charan (@AlwaysRamCharan) February 22, 2022 |
https://www.telugupost.com/movie-news/ఈ-ఉత్కంఠకు-తెర-పడేదెప్పు-34300/ | తమిళ రాజకీయాల్లో సినీతారల హడావిడి ఎప్పుడు ఎక్కువే.. ఎంజీయార్ హయాం నుంచి సినిమా గ్లామర్ కీ తమిళ రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఇక తమిళ ప్రజలు కూడా ఎప్పుడూ సినిమా గ్లామర్ కే ఆకర్షితులవుతున్నారు. అందుకే ఎక్కువమంది సినీతారలు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీఅయిపోతున్నారు. అలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా తారలు తమిళనాడు రాజకీయాలను శాసించారు కూడాను. ఇక జయలలిత మరణం తర్వాత తమిళ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. అయితే గతం గతహా అన్నట్టు ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో పాత వాసనలు పోయి కొత్త వాసనలు ముసురుకుంటున్నాయి.తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాడంటూ వార్తలు హల్చల్ చేస్తున్న వేళ.... ఒకప్పుడు తమిళనాట అభిమానులతో గుడి కట్టించుకున్న ఖుష్బూ ఎప్పటినుండో రాజకీయాలపట్ల ఆకర్షితురాలై కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార ప్రతినిధి హోదా దక్కించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఖుష్బూ కాంగ్రెస్ ని వదిలి బయటికి వచ్చే ఆలోచన చేస్తుందని అందుకే.... 'కాలా' షూటింగ్ లో బిజీగా వున్నా రజినిని కలిసి రాజకీయాలు చర్చించినట్లు వార్తలొస్తున్నాయి.ఇక రజిని కూడా పార్టీ అంటూ పెడితే నీకు సముచిత స్థానం ఇస్తానని మాటిచ్చినట్లు ప్రచారం మొదలైంది.మరో పక్క తమిళ రాజకీయ పార్టీలు అన్నాడిఎంకె , పన్నీరు సెల్వం వర్గ ఎమ్యెల్యేలు కూడా రజిని పార్టీ పెడితే జంప్ అవడానికి సిద్ధంగా వున్నారు. ఒక్క రజిని కోసం అక్కడ కొన్ని కోట్లమంది ఎదురు చూస్తున్నారుగాని రజిని మాత్రం నిర్ణయం తీసుకోకుండా ఇంకా సస్పెన్సునే మెయింటైన్ చేస్తూ క్షణ క్షణం ఉత్కంఠకు గురిచేస్తున్నాడు. |
https://www.telugupost.com/movie-news/ఈ-దసరాకి-స్పైడర్‌తో-ప-43775/ | సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగింది. ఈ కార్యక్రమంలో స్పైడర్ సినిమాలో పాటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా..సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ''నేను చెన్నై వచ్చిన కొత్తలో సినిమాల్లో నటించాలని అనుకుంటున్న సమయంలో ఓసారి కుటుంబరావుగారితో మాట్లాడుతుంటే డైరెక్టర్ శ్రీధర్‌గారు వచ్చి తమిళ సినిమాలో నటించే అవకాశం ఉందని అన్నారు. నాకు తమిళం రాదని అన్నా, ఆయనే తమిళం నేర్పిస్తానన్నారు. కానీ నాకు తమిళం రాకపోవడంతో నేను ఆ సినిమాలో చేయలేకపోయాను. ఆ సినిమాయే కాదలిక్క నేరమిల్లై. తర్వాత నాకు ఆదుర్తి సుబ్బారావుగారు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలా నన్ను అభిమానులు మూడు వందల యాభై సినిమాల్లో ఆదరించారు. ఇప్పుడు మహేష్‌ను ఆదరిస్తున్నారు. మహేష్ ప్రతి సినిమాలోనూ ఇంప్రూవ్ మెంట్ కనపడుతుంది. స్పైడర్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. తమిళ హీరోలానే డైలాగ్స్ చెప్పాడు. ఓ హీరో తమిళంలో ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఒక మంచి దర్శకుడుతో ఇంట్రడ్యూస్ అయితే బావుంటుందని అనుకునేవాడిని. చాలా గొప్ప దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ కావడం ఆనందంగా ఉంది. అన్నీ పాటలు బావున్నాయి. సినిమా డెఫనెట్‌గా సూపర్‌హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా చెబుతుఆన్నను.ఎస్.జె.సూర్య మాట్లాడుతూ - ''స్పైడర్ ఒక హాలీవుడ్ మూవీలా ఉంటుంది. మంచి పాటలు, స్టైల్‌గా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు'' అన్నారు.కొరటాల శివ మాట్లాడుతూ - ''స్పైడర్ ఫస్ట్ పోస్టర్, టీజర్ వచ్చినప్పటి నుండి చాలా క్యూరియస్‌గా చూస్తున్నాను. ప్రతి పోస్టర్, టీజర్ క్వాలిటీగా ఉంది. ఇండియాలో ఫైనెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. మురుగదాస్‌గారి గ్రిప్పింగ్ నెరేషన్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఇక సంతోష్‌శివన్, హరీష్‌జైరాజ్ వంటి టీం ఉంటే సినిమా ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీంకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.గల్లా జయదేవ్ మాట్లాడుతూ - ''మహేష్‌బాబుది మొదటి బై లింగ్వువల్ సినిమా. మహేష్ నువ్వు మద్రాస్‌లో పుట్టి పెరిగావ్ కాబట్టి, తమిళంలో యాక్ట్ చేస్తే బావుంటుందని చెప్పేవాడిని. ఇప్పుడు నిజమైంది. స్టైల్, ఇన్టెన్సిటీ, ఎమోషన్ అనే మూడు లక్షణాలు సూపర్‌స్టార్ సినిమాలో ఉండాలి. ట్రైలర్ చూస్తుంటే అవన్నీ కనపడుతున్నాయి. నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు, మురుగదాస్‌లకు అభినందనలు'' అన్నారు.వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''మురుగదాస్‌గారి రచనలకు, దర్శకత్వానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఒక సోషల్ పాయింట్ తీసుకుని, ఎక్కువ మందికి రీచ్ చేయడంలో మురుగదాస్‌గారిని మించిన దర్శకుడు ఇండియాలోనే లేడు. ఎక్సలెంట్ టీం కుదిరింది. మహేష్‌గారు డైరెక్టర్‌గారికి ఇచ్చే రెస్పెక్ట్ గొప్పగా ఉంటుంది. కన్విక్షన్ ఉన్న హీరో మహేష్'' అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్ మాట్లాడుతూ - ''స్పైడర్ ఆడియో వేడుకకు రాకపోవడానికి కారణం నేను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాను. సినిమా కచ్చితంగా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది. మురుగదాస్‌గారికి థాంక్స్. ఈ సినిమా నాకు ఒక మంచి అనుభూతినిచ్చింది. అలాగే మహేష్‌గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. రకుల్, ఎస్.జె.సూర్య సహా యూనిట్‌కు అభినందనలు. ఈ సందర్భంగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - ''ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను చేస్తానని నేను ఊహించలేదు. ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని సినిమా చేశాం. మన తెలుగు హీరోను తమిళంలో లాంచ్ చేయాలని మహేష్‌గారికి చాలా స్క్రిప్ట్స్ వినిపించాను. కానీ చివరకు మురుగదాస్‌గారి స్క్రిప్ట్ నచ్చింది. స్క్రిప్ట్ వినగానే మహేష్‌గారు నాపై నమ్మకంతో ఐదు నిమిషాల్లోనే సినిమాను చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు ముందుగా మహేష్‌గారికి థాంక్స్. అందరూ గర్వపడేలా సినిమా చేశానని కచ్చితంగా చెబుతున్నాను. గ్యారంటీగా సినిమా ఇండస్ట్రీ సూపర్‌హిట్ చిత్రాల్లో 'స్పైడర్' ఒకటిగా నిలిచిపోతుంది. అందరూ ఎంత అతృతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. మహేష్, సంతోష్ శివన్, మురుగదాస్, హరీష్ జైరాజ్ అండ్ టీం కృషితో మంచి సినిమా చేశాం. ముఖ్యంగా సంతోష్‌శివన్‌గారు ఫస్ట్ కాపీ వచ్చేవరకు మరే చిత్రం చేయకుండా ఈ సినిమా కోసం పనిచేశాను. హరీష్ జైరాజ్‌గారి వర్కింగ్ స్టయిల్ చూసి ఆశ్చర్యపోయాను. అలాగే పీటర్ హెయిన్స్ ఒక మనిషి వంద మందితో సమానంగా పనిచేశారు. సినిమాలో పీటర్ హెయిన్గారి యాక్షన్ సీన్స్ చూసి థ్రిల్ అవుతారు. మురుగదాస్‌గారు స్క్రిప్ట్ నుండి ఎంతో కష్టపడ్డారు. ఆయన, ఆయన టీం ఎంతో కష్టపడి మంచి సినిమాను అందించారు. అందరి అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. ఆల్ టైవమ్ రికార్డ్‌ను క్రియేట్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి పండుగ వాతావరణాన్ని తెస్తుంది. ఇంత గ్రేట్ ప్రాజెక్ట్‌లో నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.చిత్ర దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ మాట్లాడుతూ - ''ఈరోజు నా లైఫ్‌లో చాలా ముఖ్యమైనరోజు. నేను మహేష్‌గారి సినిమా ఒక్కడుని విజయవాడలో చూశాను. సినిమా విడుదలై మూడు వారాలైన సినిమా హౌస్‌ఫుల్‌గా, పండుగలా అనిపించింది. నేను అప్పటి నుండి మహేష్‌ను కలిసినప్పుడల్లా నేను ఒక ఫ్యాన్‌ని. మీతో సినిమా చేయాలనుంది అని చెప్పాను. ఒక డైరెక్టర్‌కి మంచి బలం అంటే హీరోనే. స్పైడర్ ఎలా వచ్చిందని చాలా మంది అడుగారు. వారికి నేను చెప్పేదేంటంటే, స్పైడర్..మహేష్‌బాబుగారిలా వచ్చింది. స్టైల్‌గా, హ్యాండ్సమ్గా, డేడికేషన్‌గా సినిమా ఉంటుంది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. ఓ ఏడాది జరిగిన షూటింగ్లో ఆరు నెలలు నైట్ షూటింగే చేశాను. ఏ రోజు కూడా సార్..నేను రేపు ఆలస్యంగా వస్తానని ఒక్కరోజు కూడా చెప్పలేదు. అంత కమిట్మెంట్ ఉన్న హీరో మహేష్. మహేష్‌బాబు ... |
https://www.telugupost.com/movie-news/బాలీవుడ్-బ్యూటీతో-అల్లు-25269/ | తాజాగా అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథంలో నటించి విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఏక కాలంలో అటు షూటింగ్, ఇటు ప్రచార కార్యక్రమాల పనుల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా.. దుబాయ్ లో సినిమా ప్రచారానికి శ్రీకారం చుట్టిన చిత్ర యూనిట్ ఏప్రిల్ లో డీజే విడుదల చేసేందుకు మెండుగా అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అయితే డీజే షూటింగ్ పూర్తి కావస్తుండటంతో ప్రస్తుతం బన్నీ తర్వాత చిత్రానికి సంబంధించిన వ్యవహారాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.ఏప్రియల్ 8వ తేదీ బన్నీ పుట్టిన రోజు సందర్భంగా... ఆ రోజు బన్నీ ఓ కొత్త సినిమా ప్రారంభించాలన్నఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకనే ఒక పక్క కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన హీరోయిన్ విషయంలో కూడా అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. బన్నీ కొత్త సినిమాకు సంబంధించి ఫగ్లీ, ఎంఎస్ ధోనీ చిత్రాలలో నటించిన బాలీవుడ్ భామ కైరా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా స్టార్ రైటర్ గా పేరొందిన వక్కంతం వంశీని పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 'నా పేరు సూర్య' అని వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా ఎటువంటి సమాచారం లేకపోయినా ఇదే ఖాయం కావచ్చన్నట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కు ట్యాగ్ లైనుగా నా ఇల్లు ఇండియా పెట్టునున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. కాగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. |
https://www.telugupost.com/movie-news/ntr-mahanayakudu-review-110340/ | మహానాయకుడు ప్రమోషన్ మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు చడీ చప్పుడు లేని మహానాయకుడు టీం ఇప్పుడు వేగాన్ని పెంచింది. కథానాయకుడు విడుదలకు ముందున్న క్రేజ్ మహానాయకుడు విడుదల ముందు రావడం లేదు. ప్రమోషన్స్ లో లేట్, ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో.. ఎన్టీఆర్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం లేదు. మహానాయకుడు ఫిబ్రవరి 22 న విడుదలవుతుందని.. ఒక రోజంతా సినిమా పోస్టర్స్ తో హంగామా చేసిన మహానాయకుడు టీం… రెండో రోజు మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ అంటూ పోస్టర్స్ తో పాటుగా సాయంత్రానికల్లా మహానాయకుడు ట్రైలర్ ని విడుదల చేసింది. కథానాయకుడు ట్రైలర్ రిలీజ్ అనగానే సోషల్ మీడియా మొత్తం ఎదురు చూడడమే కాదు.. నందమూరి ఫాన్స్ తెగ హడావిడి చేసింది. కానీ మహానాయకుడు ట్రైలర్ వస్తుంది అంటే.. సోషల్ మీడియాలో ఎటువంటి హడావిడి లేదు.. అలాగే నందమూరి ఫాన్స్ హడావిడి కనబడినా అంతగా ఎక్కడా ఫోకస్ అవ్వలేదు. ఇక కథానాయకుడు ట్రైలర్ చూసిన ప్రతిఒక్కరు కథానాయకుడు విడుదల కోసం వైటింగ్ అన్నవారు.. మహానాయకుడు ట్రైలర్ చూసాక చాలా చప్పగా ఉందంటూ పెదవి విరుస్తున్నారు. కథానాయకుడు లో బాలకృష్ణ, ఎన్టీఆర్ గా ఆకట్టుకుంటే.. మహానాయకుడిలో రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ లా బాలకృష్ణ అంతగా నప్పలేదంటున్నారు. ఇక మహానాయకుడు ట్రైలర్ మొత్తం రాజకీయాల చుట్టూతానే చూపించాడు. అయితే అక్కడక్కడా ఎమోషన్, బాధ లాంటివి కలిపాడు కానీ… ఎందుకో కథానాయకుడు మీద ఉన్న ఇంట్రెస్ట్ మహానాయకుడు మీద కలగడం లేదు అనేది వాస్తవం. అలాగే మహానాయకుడు విడుదలకు కేవలం ఆరు రోజులే ఉన్నప్పటికీ… ఆ సినిమా మీద ప్రేక్షకుల్లోనూ ఇసుమంత ఇంట్రెస్ట్ కలగడం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడమే మహానాయకుడుపై ఇంట్రెస్ట్ కలగక పోవడానికి మెయిన్ కారణం. అసలే మహానాయకుడు ప్రమోషన్స్ వీక్ గా ఉండి.. సినిమా మీద ఆసక్తి పెరగడం లేదు అంటే.. ఇప్పుడు మహానాయకుడు ట్రైలర్ చూసాక కాస్తో కూస్తో ఉన్న ఆసక్తి సన్నగిల్లిందని… మహానాయకుడు ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ రాజకీయాలతో ఎంతగా సతమత మయ్యాడో చూపించిన క్రిష్… చంద్రబాబు కేరెక్టర్ ని ఎలా మలిచాడో అనేది కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ని కల్గించే అంశం. అయితే చంద్రబాబు పాత్ర కన్నా ఎక్కువగా.. ఈ సినిమాలో నాదెళ్ల కేరెక్టర్ హైలెట్ అయ్యేలా కనబడుతుంది.. మహానాయకుడు ట్రైలర్ చూసాక. మరి సినిమాలో కావాల్సిన పాయింట్స్ మిస్ కాకపోతే సినిమా ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది. ఇక మహాకనాయకుడు ప్రమోషన్స్ పీక్స్ లో కి వెళ్ళాలి. లేదంటే కేవలం ఐదు రోజుల్లోనే మహానాయకుడు మీద ప్రేక్షకులలో ఆసక్తి కలిగించడం కష్టం. అలాగే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే.. మౌత్ టాక్ తో సినిమా హిట్ అవుతుంది.. లేదంటే కష్టం సుమీ…! |
https://www.telugupost.com/movie-news/pawan-kalyan-viral-comments-about-allu-arjun-pushpa-movie-1524363 | Pushpa 2 : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని గ్రే షేడ్ పాత్రలో చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం 'పుష్ప'. ఈ సినిమాలో అల్లు అర్జున్.. ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపిస్తారు. ఈ పాత్ర పై చాలా విమర్శలు వచ్చాయి. యూత్ ని తప్పుదారి పట్టించేలా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తూ వచ్చారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీ గురించి వైరల్ కామెంట్స్ చేసారు.పవన్ తన పొలిటికల్ మీటింగ్ లో మాట్లాడుతూ.. "యువత ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పుష్ప లాంటి సినిమాలు చూడడానికి బాగుంటాయి. కానీ నిజ జీవితంలో అలా చేయడం తప్పు కదా. ఎర్రచందనం కొట్టేవాడిని మనం ఎలా మన బుజాల పైకి ఎక్కించుకోగలం" అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా గురించి మాట్లాడడం ఇదేం తొలిసారి కాదు.గతంలో కూడా పలు పొలిటికల్ మీటింగ్స్ లో పవన్ ఈ సినిమా గురించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో.. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి, తనకి వచ్చింది నేషనల్ అవార్డు గురించి గొప్పగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈసారి పుష్ప కథ గురించి మాట్లాడుతూ కామెంట్స్ చేసారు. ఇప్పటి యువత సినిమాలోని కొన్ని కథలని చూసి ఎంజాయ్ చేయండి, అలా కాకుండా నిజ జీవితంలో అవే కథలని అనుసరించడం అనేది తప్పు అవుతుందని పవన్ చెప్పుకొచ్చారు.#Pushpa లాంటి సినిమాలు చూడడానికి బాగుంటాయి నిజ జీవితంలో కాదు - #Pawankalyanpic.twitter.com/wqXYYrrluV— Milagro Movies (@MilagroMovies) March 7, 2024 కాగా ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి భాగానికి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని సుకుమార్.. ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ మూవీలో ఇంపార్టెంట్ సీక్వెన్స్ అయిన జాతర ఫైట్ కోసం కోట్లలో ఖర్చుపెట్టడమే కాదు, నెలలు తరబడి షూటింగ్ చేస్తూ వస్తున్నారు. మరి మూవీలో ఈ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. |
https://www.telugupost.com/telangana/chief-minister-revanth-reddy-realizing-that-there-is-a-risk-of-industries-moving-to-ap-took-precautions-in-advance-1546881 | పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు. ఐదు పదుల రాజకీయ అనుభవం ఆయనది. అందులోనూ లాబీయింగ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ కు తరలించుకు వెళ్లడంతో చంద్రబాబు ముందుంటారు. చంద్రబాబు ఇంకా పాలనలో కుదురుకోలేదు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని, దాని నుంచి బయట పడే మార్గాల కోసమే అన్వేషిస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణంపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడిప్పుడే ఆయన పరిశ్రమల గురించి ఆలోచించే తీరిక లేదు. అంత ఆలోచన కూడా చేయడానికి ఆయన ముందుకు రారు.ఏపీకి పరిశ్రమలు వెళ్లకుండా...అయితే ఆయన బయలుదేరితే ఏపీకి పరిశ్రమలు తరలి వెళ్లే ప్రమాదముందని గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగానే జాగ్రత్త పడ్డారు. తెలంగాణలోని హైదరాబాద్ కంటే ఏపీలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చారంటే అది తన ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతుంది. విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మధ్య పోలిక పెట్టి ప్రత్యర్థులు తమను, తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశముంది. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే ముందుగానే ఆయన మేల్కొన్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఆయన ఒక అడుగు ముందే ఉండాలని నిర్ణయించుకున్నారు.అవగాహన ఒప్పందాలు...ఈ నేపథ్యంలోనే ఆయన హడావిడిగా పది రోజుల పాటు అమెరికా టూర్ పెట్టుకున్నారు. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలతో రేవంత్ రెడ్డి బృందం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ప్రధానంగా కాగ్నిజెంట్ విస్తరణ ఒప్పందం కుదరడం రేవంత్ పర్యటనలో హైలెట్ గా చెప్పుకోవాలి. పదిలక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ హైదరాబాద్ లో కొత్త సెంటర్ ను నెలకొల్పేందుకు అంగీకరించింది. దీనివల్ల పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు మిగిలిన సంస్థల సీఈవోలతోనూ భేటీ అయి ఎంవోయూలను రేవంత్ కుదుర్చుకుంటున్నారు. పారిశ్రామక వేత్తలు, ఎన్ఆర్ఐలతో సమావేశమై తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని కంపెనీలను తెలంగాణకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీని...మరోవైపు స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి దానికి ఛైర్మన్ గా ఆనంద్ మహీంద్రను నియమించడంతో మంచి సంకేతాలు వెళ్లాయి. నిరుద్యోగుల్లోనూ, పారిశ్రామికవేత్తల్లోనూ ఇది గుడ్ సిగ్నల్స్ వెళ్లడంతో ఒకరకంగా ఏపీ కంటే తెలంగాణ పై చేయి సాధించినట్లే. స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కూడా రేవంత్ సక్సెస్ కావడానికి ఒక కారణం. నిరుద్యోగ యువతకు అథునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంచేందుకు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఉపాధి కల్పన కూడా బాగా పెరుగుతుందని ఆశిస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో చంద్రబాబు కంటే రెండడుగులు ముందు ఉన్నారని తెలంగాణవాసులకు రేవంత్ చెప్పకనే చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు ఆలోచనల కంటే ముందుగానే రేవంత్ స్పీడ్ గా వెళుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. |
https://www.telugupost.com/movie-news/నిర్మాత-జంప్-34386/ | బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బెల్లంకొండ సురేష్ తన కొడుకు హీరోగా 'ఎక్కడికిపోతావు చిన్నావాడా' చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాసరావు నిర్మాణ సారధ్యంలో శ్రీవాస్ డైరెక్షన్ లో మరో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలోనూ శ్రీనివాస్ కి జోడిగా 'డీజే' భామ పూజ హెగ్డే ని కోటి రూపాయల రెమ్యునరేషన్ కి హీరోయిన్ గా బుక్ చేసేసారు.అయితే ఈ చిత్ర బడ్జెట్ దాదాపుగా 35 కోట్ల పైమాటే ఉంటుందని అంటున్నారు. మరి 35 కోట్ల పెట్టుబడి అంటే తాను పెట్టలేనని శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు శ్రీవాస్ - శ్రీనివాస్ సినిమా నిర్మాతగా చేసేందుకు అభిషేక్ పిక్చర్స్ వారు ముందుకు వచ్చారట. ఇంతకుముందే బోయపాటి చిత్రానికి వీరు నిర్మాతలుగా చెయ్యాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో కుదరకపోయేసరికి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని అభిషేక్ పిక్చర్స్ వారు లైన్ లో పెట్టారని అంటున్నారు. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రానికి వేరే ఎవరు నిర్మాతలైనప్పటికీ సగం బడ్జెట్ బెల్లంకొండ సురేషే సర్ధేస్తుంటాడు. మరి అంత సదుపాయం వున్న ఆ ప్రాజెక్ట్ నుండి 'ఎక్కడికిపోతావు చిన్నావాడా' నిర్మాత శ్రీనివాసరావు ఎందుకు తప్పుకున్నాడో కదా..! |
https://www.telugupost.com/movie-news/tollywood-celebrities-reached-gannavaram-and-on-the-way-to-cm-jagan-camp-office-1353694 | కొంతకాలం క్రితం ఏపీలో సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక జీఓ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా ఉంది పరిస్థితి. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, కరోనా రాకతో.. పెద్ద సినిమాల విడుదలలన్నీ వరుసగా వాయిదాలు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 25న భీమ్లా నాయక్ సినిమాతో పెద్ద సినిమాల జాతర మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో సినిమా టికెట్ల రేట్ల విషయంపై మరోసారి సీఎం జగన్ తో చర్చించేందుకు సిద్ధమయ్యారు సినీ ప్రముఖులు.Also Read : ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగిన దంపతులునేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు జగన్ తో భేటీ అవ్వనున్నారు. నిజానికి నాగార్జున కూడా వస్తారని భావించగా.. ఆయన ఆఖర్లో డ్రాప్ అయ్యారు. తాజాగా.. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు తదితరులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి బయల్దేరారు. జగన్ తో చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయణ మూర్తి భేటీ కానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ భేటీకి హాజరవుతారని టాక్ ఉన్నా.. ఆయన వస్తారో లేదో అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.✓గన్నవరం విమానాశ్రయం కి చేరుకుని.... అక్కడ నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం కి రోడ్ మార్గం ద్వారా వెళ్తున్న తెలుగు సినీ ప్రముఖులు pic.twitter.com/nMmPTpkc0e— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) February 10, 2022 |
https://www.telugupost.com/movie-news/రాశి-ఆశను-వమ్ము-చేసిన-హీర-44106/ | కొంతమంది హీరోయిన్స్ టాలీవుడ్ లో దశాబ్దాలుగా పాతుకుపోయి సినిమాల మీద సినిమాలు చేస్తున్నా తమ కేరెక్టర్ కి తాము డబ్బింగ్ చెప్పుకోలేరు. దర్శకుడు చెప్పినట్టు మొహంలో హావభావాలను ఎంతో చక్కగా పలికించగల ఈ తరం భామలు గొంతు విషయానికి వచ్చేసరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ ల మీద ఆధారపడిపోతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం తెలుగులోకి అడుపెడుతూనే తెలుగు నేర్చేసుకుని తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పేసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. అలా ఈమధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లు కనబడుతున్నారు. ఆ భామలలాగే రాశి ఖన్నా కూడా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయ్యి తెలుగు నేర్చేసుకుంది. ఇక ఇంతకుముందే తెలుగు సినిమా 'జోరు' లో గొంతుసవరించిన రాశి ఇప్పుడు పూర్తిగా తెలుగు నేర్చుకుని తన పాత్రలకు తానె డబ్బింగ్ చెప్పుకునే లెవల్ కి ఎదిగింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే రాశి ఖన్నా తాజాగా నటించిన ‘జై లవకుశ’లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆశపడిందట. అదే విషయాన్నీ దర్శకుడు బాబీ కి చెప్పడం..... బాబీ తో ఒకే అనిపించుకోవడం చేసిన రాశికి ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడట. రాశి ఖన్నా డబ్బింగ్ కి ఎన్టీఆర్ బ్రేక్ వేసాడంటున్నారు.ఎందుకంటే 'జై లవ కుశ' అనుకున్న టైం కల్లా పూర్తి చేసి విడుదల చెయ్యడానికి చిత్ర బృందం చాలా కష్టపడింది. మరి ఎన్ని కష్టాలు వచ్చినా టైం కి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్ర బృందానికి.... ఇపుడు రాశి డబ్బింగ్ వల్ల ఆలస్యమవ్వొచ్చనే ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్, రాశి డబ్బింగ్ తో రిస్క్ వద్దని దర్శకుడు బాబీకి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మాములుగా అయితే రాశికి తెలుగు భాష కొత్త కాబట్టి ఎమన్నా తేడా వస్తే మళ్ళీ ఆమె గొంతుకు సరిపోయే డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పట్టుకుని మళ్ళీ డబ్బింగ్ చెప్పించాలంటే ఖచ్చితంగా ఆలస్యమవుతుంది అందుకే ఎన్టీఆర్ చిత్ర బృందానికి ఈ సూచన చేసాడన్నమాట. పాపం రాశి ఆశను ఎన్టీఆర్ ఇలా వమ్ము చేసాడన్నమాట |
https://www.telugupost.com/movie-news/big-boss-season-3-telugu-prize-money-139458/ | బిగ్ బాస్ సీజన్ 3 ముగిసి మూడు రోజులైంది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 3 పై వార్తలకు చెక్ పెట్టలేదు. సోషల్ మీడియాలోనూ, టివి ఛానల్స్ లోను బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో ఇంటర్వ్యూ ల కోసం పోటీ పడుతున్నారు. మెగా స్టార్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీ, 50 లక్షల చెక్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ లో ఎంత బిజీ అవుతాడో తెలియదు కానీ…. ప్రస్తుతం టివి షోస్ తో తెగ హైలెట్ అవుతున్నాడు. మరోపక్క శ్రీముఖి ఫ్యాన్స్ ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అనుకుంటే.. షాకిస్తూ రాహుల్ విన్నర్ అయ్యేసరికి వారు ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇకపోతే తనకి 50 లక్షలు వస్తే గనక ఓ సెలూన్ ఓపెన్ చేసుకుని, తన తల్లితండ్రులకు ఇల్లు కట్టించి వారి రుణం తీర్చుకుంటా అన్న రాహుల్ కి బిగ్ బాస్ యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజి మీద రాహుల్ కి 50 లక్షలు ఇచ్చేసినట్టుగా చూపించారు. అబ్బా 50 లక్షలు అందుకున్న రాహులా అంటూ అందరూ మురిసిపోయారు కూడా. అయితే రాహుల్ ఆ 50 లక్షల ప్రైజ్ మని అందుకోలేదనే న్యూస్ రాహుల్ అభిమానులని నిరాశకి గురిచేస్తుంది. ఎందుకంటే… రాహుల్ కి ఇవ్వాల్సిన 50 లక్షల ఒప్పందం ప్రకారం 50 లక్షలు ఇచ్చినప్పటికీ.. అందులో కటింగ్స్(ఇంకమ్ టాక్స్ నిబంధనల ప్రకారం) పోను కేవలం 35 లక్షలు మాత్రమే రాహుల్ చేతికి వచ్చినట్లుగా టాక్. మరి 50 లక్షలు అనుకుంటే ఇలా 35 లక్షలతో రాహుల్ సరిపెట్టుకోవాల్సి రావడం పాపం అనిపిస్తుంది కదూ |
https://www.telugupost.com/crime/brawl-between-women-on-mumbai-local-woman-cop-injured-1442197 | ముంబై సబర్బన్ రైలులోని మహిళా కంపార్ట్మెంట్లో ప్రయాణికుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మహిళల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కొంతమంది మహిళలు డ్యూటీలో ఉన్న మహిళా పోలీసును కూడా గాయపరిచారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, థానే-పన్వేల్ లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్మెంట్లో మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు.వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) ఇన్స్పెక్టర్ శంభాజీ కటారే మాట్లాడుతూ మహిళల మధ్య ఇంత పెద్ద గొడవకు కారణం ట్రైన్ లో సీటు గురించే అని తెలిపారు. ఈ గొడవ ట్రిగ్గర్ తుర్భే స్టేషన్ సమీపంలో సీటు విషయంలో జరిగిందని.. ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసిందని పోలీసులు తెలిపారు. వీడియోలో, కొంతమంది మహిళా ప్రయాణీకులు తమకెలాంటి గాయాలు అవ్వకుండా పక్కకు వెళ్లిపోవడం చూడవచ్చు. వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకున్న ఓ పోలీసు మహిళపై కొందరు మహిళా ప్రయాణికులు దాడి చేయడంతో ఆమె గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీడియోలో, ఇద్దరు మహిళా ప్రయాణీకుల తలపై తీవ్ర రక్తస్రావం చూడవచ్చు. ఈ ఘటనపై జిఆర్పి దర్యాప్తు జరుపుతోందని, కేసు నమోదు చేసినట్లు కటారే తెలిపారు.తుర్భే స్టేషన్లో ఒక సీటు ఖాళీ అయింది.. ఒక మహిళా ప్రయాణీకురాలు తనకు తెలిసిన మహిళను సీటులో కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. అదే సీటును మూడో మహిళ కూడా ఆ సీటుపై కూర్చోడానికి ప్రయత్నించింది. దీంతో ముగ్గురు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అలా ఆ గొడవలో మరికొందరు ప్రయాణీకులు కూడా భాగమయ్యారు. |
https://www.telugupost.com/movie-news/kangana-krish-differences-86601/ | ఈమధ్యన బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు దర్శకుడు క్రిష్ కి, హీరోయిన్ కంగనా రనౌత్ కి మధ్యన విభేదాలంటూ సోషల్ మీడియా దగ్గర నుండి... వెబ్, ప్రింట్ మీడియా వరకు బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ విభేదాల గురించి దర్శకుడు క్రిష్ కామ్ గా ఉండడం... కంగనా తమ మధ్యన ఎలాంటి విభేదాలు లేవంటూ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అయినా, మణికర్ణికా విషయంలో చాలానే సమస్యలు దర్శకుడు క్రిష్ కి, కంగనకి ఉన్నట్టుగా వార్తలు రావడం మాత్రం ఆగడం లేదు. కంగనా ఏదో మా మధ్యన మణికర్ణికా విషయంలో విభేదాలు లేవని చెప్పినా... వారి మద్యన నిజంగానే గొడవులున్నాయని కొన్ని విషయాల్లో కంగనా రివీల్ చేస్తూనే ఉంది.క్రిష్ పేరుకి బదులు కంగనా...మణికర్ణికా సినిమా విషయంలో కంగనాతో విభేదించిన క్రిష్ సైలెంట్ గా టాలీవుడ్ లో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో బిజీ అయ్యాడు. ఇక కంగనా మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఓన్ గా చూసుకుంటుందని టాక్ ఉంది. అయితే ఈ మధ్యన తాజాగా కంగనా మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో క్రిష్ ని తప్పించి తన పేరునే హైలెట్ చేసుకుంటుందంటున్నారు. అయితే ఆ విషయం నిజమనే సంకేతాలు కనబడుతున్నాయి. ఎలా అంటే కంగన డైరెక్షన్ లో అంటూ మణికర్ణిక క్లాప్ బోర్డ్‌పై ప్రింట్ చేసింది అంటూ ఇప్పుడొక క్లాప్ బోర్డు ఫోటో సోషియల్ మీడియాలో హంగామా చేస్తుంది.విభేదాలు లేవని చెబుతున్నా...ఇక అదేమిటి కంగనా పేరు డైరెక్షన్ లో కనబడం చూసి ఆమెని ప్రశ్నిస్తే... అదేం లేదు క్రిష్ మణికర్ణికా డైరెక్టర్ అని చెబుతూనే మా మధ్యన విభేదాలు లేవని చెబుతుంది. అలాగే ఈ విషయాలపై తనకు కాకుండా తన తన తరుపున తన పీఆర్వో రాజేష్ మాట్లాడడం చూస్తుంటే కంగనాకు, క్రిష్ కి మధ్యన చెడిందనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ విషయమై ఇప్పటివరకు దర్శకుడ క్రిష్ స్పందించక పోవడం కూడా పలు అనుమానాలు తావిస్తుంది. |
https://www.telugupost.com/movie-news/mahesh-pawan-multi-starer-154616/ | టాలీవుడ్ హీరోలను మల్టీస్టారర్ మూవీస్ లో చూడాలనే కోరిక చాలామంది ఫాన్స్ కి ఉంది. ఇప్పటికే మహేష్ – వెంకటేష్ లు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేస్తే.. వెంకటేష్ – పవన్ కళ్యాణ్ లు కలిసి గోపాలా గోపాలా సినిమా చేసారు. తాజాగా ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు బడా హీరోలు కలిసి రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నారు. అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఫాన్స్ ఇద్దరు మాత్రమే కాదు….. ఇండియా వైడ్ గా అందరిలో ఆసక్తి ఉంది. ఇక ఎప్పటినుండి పవన్ కళ్యాణ్ – మహేష్ కాంబోలో బడా మల్టీస్టారర్ అంటూ ప్రచారం జరగడమే కానీ… ఆ కాంబో ఎప్పటికి పట్టాలెక్కుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే తాజాగా ఓ కుర్ర దర్శకుడు మహేష్ – పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ తన కల అంటున్నాడు. అతనే రాహుల్ రవీంద్రన్… చి ల సౌ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ నటుడు రెండో సినిమాని కింగ్ నాగార్జున తో చేసాడు. మన్మధుడు 2 సినిమాని నాగ్ తో తెరకెక్కించి డిజాస్టర్ అందుకున్న రాహుల్ ప్రస్తుతం ఓ చిన్న సినిమాని ప్లాన్ చేస్తున్నాడు అనుకున్నారు. అయితే రాహుల్ రవీంద్రన్ రెండు సినిమాలు స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకున్నాడని… అందులో ఒకటి తమిళ బిగ్ స్టార్‌తో ప్లాన్ చేస్తున్నానని.. ఇంకోటి చి ల సౌ తరహాలో చిన్న ప్రాజెక్టని చెబుతున్నాడు రాహుల్. ఇక పవన్ – మహేష్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చెయ్యాలని అది తన డ్రీం ప్రాజెక్ట్ అంటున్నాడు రాహుల్. మహేష్ – పవన్ కాంబో అంటే.. కథ పవర్ ఫుల్ గా ఉండాలని, వీళ్ళని కలిపి సినిమా చెయ్యడం అనేది సామాన్యమైన విషయం కానప్పటికీ.. వాళ్లతో సినిమా చెయ్యాలనేది తన కోరిక అంటున్నాడు. |
https://www.telugupost.com/movie-news/కాస్మెటిక్-సర్జరీ-పుకార్-56827/ | మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ హిందీ సినిమాలలో వరుస విజయాలతో, కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేక నిర్మాతలని వెయిటింగ్ లో పెట్టె స్థాయికి వెళ్లి అప్పటికి టాప్ పోసిషన్ రేస్ లో ఉన్న భామలందరికి గట్టి పోటీ ఇచ్చింది. అయితే కొద్ది కాలం గా అమ్మడి హవా బాలీవుడ్ లో తగ్గిపోయింది. ఇదివరకటిలా అవకాశాలంటూ నిర్మాతల ఫోన్ ల ఒత్తిడి లేదు. వచ్చే అరుదైన అవకాశాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయాయి. దానితో కొంత కాలం చాలా తీవ్ర పరిణామాలని ఎదుర్కొంది కత్రినా.గత ఏడాది జగ్గా జాసూస్ తో బౌన్స్ బ్యాక్ కావాలని ప్రయత్నించినా ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ కాలేకపోయింది. ఏడాది చివరిలో వచ్చిన టైగర్ జిందా హై లో తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో జతకట్టి యాక్షన్ ఎపిసోడ్స్ లో విజృంభించిన కత్రినా కి ఆ చిత్రం బౌన్స్ బ్యాక్ చిత్రం ఐయింది. అయితే అంతకు ముందు కంటే కత్రినా ముఖంలో చాలా మార్పులు వచ్చాయని గమనించిన టైగర్ జిందా హై చూసిన ప్రేక్షకులు కత్రినా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుందని అనుకోవటం, ఈ ఊహలకి బలాన్ని ఇస్తూ సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవ కథనాలు ఊపందుకోవటంతో వీటిని ఖండిస్తూ తాను ఎలాంటి కాస్మెటిక్ సర్జరీ లు చేపించుకోలేదని స్వయంగా కత్రినా కైఫ్ వివరణ ఇచ్చుకుంది. చాలా కాలం తరువాత వచ్చిన భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్న తనకి ఈ పుకార్లు తల నొప్పి గా మారటంతో తానే నోరు విప్పక తప్పలేదు కత్రినా కి. |
https://www.telugupost.com/movie-news/deepika-returned-advance-back-167847/ | ప్రభాస్ తో ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీ కోసం బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పదుకొనే రావడం నిజముగా నాగ్ అశ్విన్ – ప్రభాస్ లకు గ్రేటనే చెప్పాలి. ప్రభాస్ క్రేజ్ ఎంత ఉన్నా సౌత్ హీరోతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నటించడమనేది నిజంగా సంతోషించవలసిన విషయమే. అయితే దీపికా పదుకొనేని భారీ పారితోషకానికి అశ్విన్ దత్, నాగ అశ్విన్ లు ఒప్పించారని, కాదు దీపికా రోల్ సినిమాలో అతి ముఖ్యం గనుకనే దీపికా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒప్పుకుంది అని.. భారీగా అడ్వాన్స్ ఇచ్చి మరీ దీపికాని నాగ శ్విన్ బ్యాచ్ లాక్ చేసింది అని అన్నారు. మరి దీపికా పదుకొనె నాగ్ అశ్విన్ మూవీ మహానటిని చూసి మెచ్చుకోవడం కూడా దీపికా నాగ్ అశ్విన్ మీద నమ్మకంతోనే చేసింది అని చెప్పాలి. అయితే తాజాగా ప్రభాస్ 21 లో దీపికా పదుకొనె పై ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో షేకవుతుంది. అది వైజయంతి మూవీస్ ప్రభాస్ 21 మూవీ కోసం ఇచ్చిన అడ్వాన్స్ ని దీపికా పదుకొనే వెనక్కి ఇచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీపికా అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసింది అంటే.. నాగ్ అశ్విన్ – ప్రభాస్ సినిమా చెయ్యడం లేదేమో అనే భయంతో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు. కానీ దీపికా పదుకొనే అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసింది.. సినిమా మొదలయ్యాకే అశ్విని దత్ దగ్గరనుండి అడ్వాన్స్ తీసుకోవాలని, ఎలాగూ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కాబట్టి సినిమా మొదలయ్యాక అడ్వాన్స్ అందుకుందామని అనుకుంటుందట. అలాగే దీపికా పదుకొనే మరో ఆలోచనలు ఏమిటంటే.. నాగ్ అశ్విన్ – ప్రభాస్ మూవీ కాస్త లెట్ అయ్యేటట్లుగా ఉందని, ప్రబస్ రాధేశ్యాం అవ్వాలి, తర్వాత అనూహ్యంగా ఆదిపురుష్ లైన్ లోకొచ్చినా.. నాగ శ్విన్ సినిమా పూర్తయ్యాకే ఆదిపురుష్ ఉంటుంది అనుకుంటే.. ఓం రనౌత్ ఆదిపురుష్ నాగ శ్విన్ కన్నా ముందే మొదలెట్టే సూచనలు ఇవ్వడంతో.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లేటవుతుంది. అందుకే అడ్వాన్స్ ఇచ్చేస్తే.. నిర్మాతలకు భారం పడకండా ఉంటుంది.. సినిమా మొదలయ్యాకే అడ్వాన్స్ పుచ్చుకోవచ్చని దీపికా ఆలోచనగా చెబుతున్నారు. |
https://www.telugupost.com/movie-news/ప్రభాస్-విషయంలో-పూజ-ని-బల-145603/ | ప్రభాస్ సినిమా లుక్ వదలడం, సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది అని చెప్పడం రెండో రోజే ప్రభాస్ – రాధాకృష్ణ సినిమా షూటింగ్ కి బ్రేకివ్వడం, దానితో సినిమా 2020 నుండి 2021 కి వెళ్ళిపోయినట్టుగా ప్రచారం జరిగింది. ఫస్ట్ లుక్ లో టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యకుండా దాచేసిన ప్రభాస్ టీం పూజాహెగ్డే అనారోగ్యం కారణంతో ప్రభాస్ – పూజ హెగ్డే నటించాల్సిన సెకండ్ షెడ్యూల్ కి బ్రేకిచ్చినట్లుగా చెప్పారు. అల వైకుంఠపురములో ప్రమోషన్స్, అఖిల్ సినిమా షూటింగ్ తో క్షణం తీరిక లేని పూజ సిక్ అయినందువలనే ప్రభాస్ సినిమా షూటింగ్ కి హాజరవలేదన్నారు. కానీ తాజాగా పూజ హెగ్డే అల వైకుంఠపురములో సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం వైజాగ్ లో దిగింది. దబ్బ పండులా మెరిసిపోతున్న పూజ హెగ్డే కి నీరసం ఏమిటి? పూజ వలన ప్రభాస్ సినిమా షూటింగ్ కి బ్రేక్ రావడమేమిటి? అంటూ పూజ ని ట్రోల్ చేస్తున్నారు. హిట్ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ లో యాక్టీవ్ గా ఉన్న పూజ ని చూసిన ఎవ్వరన్నా అలాగే అంటారు. అయితే ప్రభాస్ సినిమా షూటింగ్ పూజ వలన వాయిదా పడలేదనేది లేటెస్ట్ న్యూస్. ఇతర కారణాల వలన ప్రభాస్ – రాధాకృష్ణ సెకండ్ షెడ్యూల్ ఆగిందని.. ఇక కృష్ణంరాజు బర్త్ డే సెలెబ్రేషన్స్ లో కృష్ణంరాజు తాను ప్రభాస్ సినిమాలో ఓ రోల్ చేస్తున్నట్లుగా చెప్పాడు. అలాగే ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైద్రాబాదులో మొదలయ్యిందని.. ఇక్కడే హైదరాబాద్ లోనే మూడు నెలల షూటింగ్ ఉంటుందని.. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి…. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నామని స్వయానా కృష్ణంరాజే ప్రకటించడంతో ప్రభాస్ ఈ ఏడాదిలో ప్రేక్షకులకు హ్యాండ్ ఇచ్చాడని క్లారిటీ వచ్చేసింది. |
https://www.telugupost.com/movie-news/రాజు-గారికి-కాలం-కలిసి-రా-67241/ | టాలీవుడ్ లో సూపర్ నిర్మాత ఎవరు అంటే వెంటనే దిల్ రాజు పేరే చెబుతారు. సినిమా కథలను ఎంతో కాలిక్యులేట్ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. గత ఏడాది వరుస హిట్స్ తో ఉన్న దిల్ రాజు నుండి సినిమా వస్తుంది అంటే అందరిలో అమితాసక్తి ఉంటుంది. కానీ దిల్ రాజు నిర్మాతగా సక్సెస్ అయినట్లుగా డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం వరుస పరాజయాలతో కుదేలైయ్యాడు. గత ఏడాది స్పైడర్ విషయం లో బాగా దెబ్బతిన్న దిల్ రాజు.. ఈఏడాది అజ్ఞాతవాసి విషయంలోనూ గట్టిగా దెబ్బ తిన్నాడు. ఈ రెండు సినిమాల నైజాం హక్కులను భారీగా కొనుగోలు చేసిన దిల్ రాజు కి ఆ సినిమాల ప్లాప్స్ తో భారీ నష్టాలొచ్చాయి.నైజాం లో స్పైడర్ తో పాటు విడుదలైన మరో భారీ చిత్రం జై లవ కుశ కూడా దిల్ రాజుని బయట పడెయ్యలేకపోయింది. భారీ సినిమాల మీద భారీ నమ్మకంతో దిల్ రాజు భారీగా నష్టపోతున్నాడు. అందుకే పెద్ద సినిమాల పంపిణీ జోలికి ఇకనుండి వెళ్లకూడదని దిల్ రాజు డిసైడ్ అయ్యాడు. అలాగే పెద్ద సినిమాలని ఒక ఏరియాకి కొని నష్టపోయేకంటే.... పెద్ద సినిమా లు ఒక ఏరియా కొనే మొత్తంతో ఒక మీడియం బడ్జెట్ సినిమా పంపిణీ హక్కుల్ని హోల్‌సేల్‌గా తీసేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అందులో భాగంగానే వరుణ్ తేజ్ - రాశి ఖన్నాలు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమను హోల్‌సేల్ గా కొని పంపిణి చేసిన దిల్ రాజుకి పెద్దగా లాభాలు రాకపోయినా.. ఒక హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.అలాగే నాని సినిమాల మీది ఉన్న నమ్మకంతో దిల్ రాజు కృష్ణార్జున యుద్ధం తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు హోల్‌సేల్ గా తీసేసుకున్నాడు. కానీ ఈ కృష్ణార్జున తో దిల్ రాజుకి నష్టాలు తప్పేట్టు లేవు. ఎందుకంటే ఈ సినిమా మొదటి షోకే మిక్స్డ్ టాక్... రెండు రోజులకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమాల మీదున్న నమ్మకం దిల్ రాజుని ఏ దారికి చేరుస్తుందో తెలియదు గాని.. పెద్ద సినిమాల నైజాం లో కొని నష్టపోవడం కరెక్ట్ కాదనుకుని ప్రస్తుతం సూపర్ హిట్ అయినా రంగస్థలం నైజాం హక్కులను దిల్ రాజు చేజేతులా వదులుకున్నాడు. నైజాంలో రంగస్థలం చిత్రాన్ని 18 కోట్లకి కొనేందుకు దిల్ రాజు నిరాకరించాడు. దాంతో మైత్రి నిర్మాతలు యువి ద్వారా నైజాంలో స్వయంగా విడుదల చేసుకున్నారు. ఇప్పుడు నైజాంలోనే రంగస్థలానికి ఇరవై అయిదు కోట్లకి పైగా షేర్ వస్తోంది. అలా దిల్ రాజు ఒక మంచి లాభాన్ని వదిలేసుకున్నాడు |
https://www.telugupost.com/movie-news/nagababu-comedy-plans-163031/ | నాగబాబు జబర్దస్త్ లో ఏడేళ్లు జేడ్జ్ గా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగించాడు. కానీ నాగబాబు జబర్దస్త్ మీద కోపం తనకి బాగా కావాల్సిన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక జీ ఛానల్ తో మాట్లాడి.. జబర్దస్త్ మాజీ డైరెక్టర్స్ తో అదిరింది షో ప్లాన్ చేయించాడు. తనతో పాటు జబర్దస్త్ టీం లను అదిరింది షో కి లాగేసి జబర్దస్త్ షో ని పడేసి అదిరింది షోని సక్సెస్ చెయ్యాలని చూసి ఘోరంగా దెబ్బతిన్నాడు. రోజా జేడ్జ్ గా జబర్దస్త్ షో ఎప్పటిలాగే జబర్దస్త్ గా నడవడం అదిరింది షో అడుగడుగా విఫలమవడంతో ఇప్పుడు నాగబాబు ఓ ప్లాన్ చేసాడట. అది కూడా తన సొంతగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కామెడి షోని ప్లాన్ చేస్తున్నాడట. తన యూట్యూబ్ ఛానల్ లో ఓ కామెడీ షో చెయ్యాలని, మన ఛానల్ మన ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త కమెడియన్స్ ని తీసుకోవాలని, అలాగే జబర్దస్త్, అదిరింది షోలో చేసే టాప్ కమెడియన్స్ ని, టీం లీడర్స్ ని లాగేసి.. జబర్దస్త్, అదిరింది షోలకి ధీటుగా తన మన ఛానల్ మన ఇష్టం అనే ఛానల్ ద్వారా కామెడీ షోని ప్లాన్ చేస్తున్నాడట. చెయ్యడమే కాదు.. ఇప్పటికే ఎంట్రీలను కూడా ఆహ్వానిస్తున్నాడట నాగబాబు. ఇక నాగబాబు ఒక్కటి కాదు రెండు కామెడీ షోస్ ని ప్లాన్ చేసుకుంటున్నాడట. రెండు షోస్ ని యూట్యూబ్ ఛానల్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు తెస్తాడట. మరి నాగబాబు అదిరింది, జబర్దస్త్ లను కొట్టేసి కామెడీ పరంగా సక్సెస్ అయ్యే ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. |
https://www.telugupost.com/movie-news/ariana-mehboob-173672/ | బిగ్ బాస్ చివరి ఐదు వారాలలో ఏం జరగబోతుందో.. ఎలాంటి టాస్క్ లు బిగ్ బాస్ లో ఉంటాయో.. ఎవరు టాప్ 5 కి వెళతారో అనేది బుల్లితెర ప్రేక్షకుడు ఓ అంచనాకి వచ్చేసాడు. బిగ్ బాస్ ఫైనల్ కి వెళ్ళేది వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో నలుగురు పేర్లు హల్చల్ చేస్తున్నాయి. అందులో అభిజిత్, లాస్య, సోహైల్, అఖిల్ పేర్లు టాప్ 5 లో ఉండగా.. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన మెహబూబ్, అరియనాలు బ్యాగ్స్ సర్దుకోవాలంటున్నారు. మెహబూబ్ ని గత ఐదు వారాలుగా కాపాడుతున్న బిగ్ బాస్ ఈ వారం బయటికి పంపడం ఖాయంగానే కనబడుతుంది. అందుకే రెండు వారాలుగా మెహబూబ్ స్క్రీన్ స్పేస్ తగ్గించింది. ఇక అరియానని ఓ రేంజ్ లో వెనకేసుకొచ్చిన బిగ్ బాస్, నాగార్జునలు కూడా ఇప్పుడు అరియనా ని బ్యాడ్ చెయ్యడం మొదలు పెట్టాడు. అంటే మెహబూబ్, అరియనాలకు టాస్క్ ల పరంగా, బిగ్ బాస్ గేమ్ పరంగా బాగానే ఆడుతున్నప్పటికీ.. వాళ్ళ క్రేజ్ పరంగా కాస్త వీక్ గా ఉండడం వాళ్ళిద్దరికీ శాపంగా మారింది. అందుకే ఈ వారంలో అరియానని.. అవినాష్ తప్ప మిగతా అందరూ నామినేట్ చేసారు. ఇక మెహబూబ్ కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. దీన్నిబట్టి ఈసారి మెహబూబ్ అయినా, లేదంటే అరియనా అయినా ఎలిమినేషన్ అయ్యేలా కనబడుతుంది. అయితే నామినేషన్స్ ప్రక్రియలో అందరిలో అరియనకి ఓట్స్ ఎక్కువ పడి ఆమె ని బ్యాడ్ చేసినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకి సింపతీ వర్కౌట్ అవుతుంది. మరి అరియనాకి అతి ట్యాగ్ తగిలించినప్పటికీ.. ఇప్పుడు అరియనా ట్రెండ్స్ లోకి రావడం అందరిని షాక్ కి గురు చేస్తుంది. అరియనా కి సింపతీ వర్కౌట్ అయ్యి ఆమెని సపోర్ట్ చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దేన్నీ బట్టి ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది కేవలం మెహబూబ్ మాత్రమే. |
https://www.telugupost.com/crime/nagpur-teen-gives-birth-to-baby-after-watching-delivery-videos-in-youtube-1465631 | సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దాని వల్ల కలిగే ఉపయోగాలకంటే అనర్థాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ పేరుతో మోసాలు, హనీ ట్రాప్ లు ఇలా చాలానే జరుగుతున్నాయి. తాజాగా ఓ బాలిక యూట్యూబ్ లో చూసి తనకు తానుగా కాన్పు చేసుకుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం హద్దులు మీరింది. ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.బాలిక పొట్ట పెరుగుతుండటాన్ని గమనించిన తల్లి ఏంటని ప్రశ్నించగా.. అది అనారోగ్యం వల్ల పెరుగుతోందని తల్లిని బురిడీ కొట్టించింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుంది. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు బాలిక జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆ శిశువును గొంతు నులిమి చంపేసింది. ఇంట్లోనే ఉన్న ఓ పెట్టెలో శిశువు మృతదేహాన్ని దాచిపెట్టింది. తిరిగి ఇంటికెళ్లిన తల్లికి కుమార్తె నీరసంగా కనిపించడంతో.. కాస్త గట్టిగా అడగ్గా అసలు విషయం చెప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ప్రాంతానికి వెళ్లి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/geetha-govindam-troubles-84607/ | విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. అసలు ఈ మూవీ సెట్స్ మీదకు రావడానికి డైరెక్టర్ పరుశురామ్ ఎంత కష్టపడో చూద్దాం. ఈ కథను పరుశురామ్ చాలా మంది హీరోలకి చెప్పారంట. కానీ ఎవరూ ఓకే చెప్పకపోవడంతో ఈ కథను పక్కన పెట్టేసి 'శ్రీరస్తు శుభమస్తు' ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కు 'గీత గోవిందం' చేబితే ఆయన కూడా వెతికి వెతికి ఎవ్వరూ ఓకె అనక.. 'శ్రీరస్తు శుభమస్తు' సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.విజయ్ ఇమేజ్ కి తగ్గట్లుగా...'శ్రీరస్తు శుభమస్తు' జరుగుతున్న టైంలో బన్నీ ఓ మాట సాయం చేయడంతో విజయ్ కాస్త అయిష్టంగానే 'గీత గోవిందం' కథను ఓకె చేసాడట. 'అర్జున్ రెడ్డి' కన్నా ముందు కాబట్టి అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కొన్ని మార్పులు చేశారట. ఆ టైంలో విజయ్ పక్కన చేయడానికి ఏ హీరోయిన్ ఒప్పుకోలేదట. దాంతో చాలా నెలలు ఈ సినిమాను స్టార్ట్ చేయలేకపోయారు. ఈలోపు 'అర్జున్ రెడ్డి' రిలీజ్ అవ్వడం, విజయ్ ఇమేజ్ మారడం, పెరగడంతో మరి కొన్ని సీన్లు మార్చారు. ఇక లాస్ట్ కి ఫైనల్ ప్రొడెక్ట్ వచ్చింది.విజయ్ తండ్రి ఓకే చేశాక...అప్పుడు విజయ్ ముందు ఈ సినిమా వద్దు 'టాక్సీవాలా'ను వదులుదాం అని అన్నాడు. నిర్మాతలు అందుకు ఒప్పుకోకపోవటంతో విజయ్ తండ్రి 'గీత గోవిందం' సినిమాను చూసి ఇది రిలీజ్ చెయ్యొచ్చు అన్నాక.. 'గీత గోవిందం' విడుదలకు మార్గం సుగమం అయింది. అంతా అయ్యిపోయింది ఇక సినిమాను రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో.. ఈ కథ నాదే అని ఓ అసిస్టెంట్ డైరక్టర్ ఫిర్యాదు చేశాడు. అతనితో రాజీ పడి.. కొంత డబ్బు ఇచ్చి ఆ సమస్యకు ఎండ్ కార్డు వేశారు. మళ్లీ ఈ లోపు సినిమా నుండి సీన్స్ బయటికి రావడంతో టీం మొత్తం ఒక్కసారిగా ఖంగుతింది. సరే, ఆ అడ్డంకులు దాటి సినిమాను రిలీజ్ చేశారు. 14 కోట్ల సినిమాకు అయిదు కోట్లే రికవరీ. మిగిలినదంతా ఓన్ రిలీజ్ అనుకుని రిలీజ్ చేశారు. ఇప్పుడు 'గీత గోవిందం' సూపర్ హిట్ అయింది. దాంతో డైరెక్టర్ పరుశురామ్ ఊపిరి పీల్చుకున్నాడు. అది మ్యాటర్. ఒక్క సినిమాను రిలీజ్ చేయాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంత కష్టపడాలలో.. ఎన్ని సమస్యలు ఎదురుకోవాలో.. ఈ సినిమా విషయంలో అర్థం అవుతుంది. |
https://www.telugupost.com/movie-news/మళ్ళీ-హిట్-కాంబినేషన్-రి-31788/ | ఎన్టీఆర్ ముందునుండి హిట్ దర్శకుల వెంటపడి వారితో సినిమాలు చేసేస్తుంటాడు. అయితే అలా ఎన్టీఆర్ వెంటపడిన ప్రతిసారి ఆ సినిమాలు మంచి ఫలితాన్నివ్వలేదు. అయినా ఎన్టీఆర్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ మైండ్ సెట్ లో కొంచెం మార్పొచ్చినట్లు కనబడుతుంది. అందుకే 'టెంపర్' చిత్రం నుండి హిట్ ట్రాక్ పట్టాడు. అయితే ఎన్టీఆర్ కి ఎప్పటినుండో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చెయ్యాలనే కోరిక బలంగా ఉండేది. అది ఎట్టకేలకు ఇప్పుడు తీరబోతుంది. ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' కంప్లీట్ కాగానే త్రివిక్రమ్ తో సినిమాని సెట్ చేసాడు ఎన్టీఆర్. ఇక త్రివిక్రమ్ కూడా పవన్ హీరోగా చేస్తున్న చిత్రం కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టేస్తాడని అంటున్నారు. ఇక ఈ చిత్రం నవంబర్ నుండి సెట్స్ మీదకెళ్లనున్నట్లు వార్తలొస్తున్నాయి.అయితే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో మూవీ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టాశాడని అంటున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కొరటాల ప్రస్తుతం మహేష్ బాబుతో చెయ్యబోయే చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. ఇక మహేష్ తో సినిమా కంప్లీట్ కాగానే కొరటాల మరలా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట. ఇక కొరటాల అలా అనుకున్నాడో లేదో ఇలా ఎన్టీఆర్ ని కలవడమూ... ఎన్టీఆర్ తో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడడమూ... ఎన్టీఆర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమూ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. చూద్దాం అధికారిక ప్రకటన వచ్చేవరకు కాస్త అనుమానమే మరి ఈ కాంబినేషన్ లో సినిమా రావడం అనేది.ఒకవేళ ఈ కాంబినేషన్ లో మూవీ సెట్ అయితే గనక అంచనాలు మాత్రం తారా స్థాయిలో ఉండడం మాత్రం నిజం. ఇప్పటికే కొరటాల తీసిన మూడు చిత్రాలు హిట్ అవడం... ఇక మహేష్ తో తీసే 'భరత్ అను నేను' కూడా హిట్ అయితే కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే చిత్రం మీద అంచనాలు మాములుగా వుండవు. |
https://www.telugupost.com/movie-news/bigg-boss-contestant-tamannah-simhadri-sensational-comments-on-cpi-narayana-1356799 | హైదరాబాద్ : బిగ్ బాస్.. ఈ షో కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకూ 5 సీజన్లు పూర్తి చేసుకుంది. నిన్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ సీజన్ ప్రారంభమవ్వగా.. 17 మంది కంటెస్టంట్లు హౌస్ లోకి వెళ్లారు. వారిలో 8 మంది పాత కంటెస్టెంట్లు ఉన్నారు. కాగా.. ఇప్పుడీ షో పై సీపీఐ నారాయణ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. సీపీఐ నారాయణ ఈ రియాలిటీ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఇది బిగ్ బాస్ హౌస్ అని పిలిచే వ్యభిచార గృహమని, అసభ్యకరమైన విషయాలను ప్రోత్సహిస్తూ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని, షో అనుమతిని రద్దు చేయాలని సంచలన కామెంట్స్ చేశారు.Also Read : ఓటీటీలో డీజే టిల్లు.. ఎప్పట్నుంచో మీరే చూడండి !రోజుకి ఒక గంట ప్రసారం చేస్తేనే.. అందులో ఉండే బూతు పురాణం చూడలేకపోతున్నామన్న ఆయన.. ఇక 24 గంటలు ప్రసారం చేస్తే.. అందులో ఉండే కంటెంట్ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై బిగ్ బాస్ మాజీ కంటస్టెంట్ తమన్నా సింహాద్రి ఘాటుగా స్పందించింది. తాజాగా జరిగిన ఓ టీవీ డిబేట్ లో తమన్నా మాట్లాడుతూ.. బిగ్ బాస్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలన్నారు. ఈ వ్యాఖ్యలపై డిబేట్ లో పాల్గొన్న ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నారాయణపై తమన్నా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ.. తమన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిగ్ బాస్ షోను సమర్థిస్తూ అదే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందని, బయట ఊహిస్తున్నది నిజం కాదని అన్నారు. పైగా షో నచ్చనివాళ్లు బలవంతంగా చూడాల్సిన పనిలేదని బదులిచ్చింది. |
https://www.telugupost.com/movie-news/అప్పుడే-మొదలెట్టేసింది-40180/ | సమంత మరి కొద్దీ రోజులో తన ఇంటిపేరును మార్చుకోబోతుంది. నాగ చైతన్య ని పెళ్ళాడి అక్కినేని ఇంట కాలు పెట్టబోతోంది. ఈ ఏడాది మొదట్లోనే సమంత - నాగ్ చైతన్య ల ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే అక్టోబర్ 6 న గోవాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగబోతుంది. మరి తన ఇంటిపేరును అక్కినేని గా మార్చుకోబోతున్న సమంత అప్పుడే ఆ ఫామిలీ లో ఒక మెంబర్ గా కలిసిపోయింది. ఇప్పటికే నాగ్ సర్ అంటూ పిలిచే సామ్ ఇపుడు నాగ్ మామ అంటూ వరుసలు పెడుతూ పిలవడం, అఖిల్ ని మరిదిగా చెప్పడం, అత్తగారు అమలతో ఎంతో క్లోజ్ గా మూవ్ అవడం చూస్తుంటే సమంత తన అత్తింటిలో త్వరగానే కలిసిపోయేలా వుంది.కేవలం అలా అక్కినేని ఇంటితోనే సంబంధాలు మైంటైన్ చేయడంలేదు సమంత, అటు దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఆ ఫ్యామిలిలో కూడా త్వరగానే కలిసిపోయింది. నాగ చైతన్య అమ్మమ్మ చీరని తన పెళ్ళికి కట్టుకోవడం దగ్గరనుండి అన్ని విషయాల్లో బాగా కలిసిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా వరుసకు అన్న అవుతున్న రానా సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడింది. దగ్గుబాటి రానా 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలోని రానా కటౌట్‌ను ట్వీట్ చేసింది. ‘అదిగో నా సూపర్‌స్టార్ అన్నయ్య’ అంటూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన రానా భారీ కటౌట్ ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. 'నేనే రాజు నేనే మంత్రి' ఫస్ట్‌డే ఫస్ట్ షో ఆగస్టు 11 అని ఆ పోస్ట్‌కు హ్యాష్‌ట్యాగ్స్‌ను కూడా జతచేసింది సమంత.మొత్తానికి ఇలా రాణా కటౌట్ ని పోస్ట్ చేస్తూ 'నేనే రాజు - నేనే మంత్రి' ని భలేగా ప్రమోట్ చేసింది కదా సమంత. ఇక రానా - కాజల్ - కేథరిన్ లు నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం రేపు శుక్రవారమే విడుదల కానుంది |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-maharshi-cinema-updates-113228/ | మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మే తొమ్మిదిన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మహర్షి’ సినిమా మీద ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ ఆలస్యమవడంతో.. ఏప్రిల్ 25 న విడుదలవ్వాల్సిన సినిమా మే తొమ్మిదికి మర్చారు. ఇక దిల్ రాజు – పివిపి – అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో… మండుటెండలో కూడా మహర్షి షూటింగ్ లో మహేష్ అండ్ మహర్షి టీం కష్టపడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అలాగే ప్రమోషన్లో నిమగ్నమైంది మహర్షి టీం. అయితే తాజాగా వదిలిన ‘మహర్షి’ వర్కింగ్ స్టిల్స్ లో మహేష్ ఎంతో అందంగా కనబడుతున్నాడు. మహేష్ కి అంత ఏజ్ ఉంటుందా.. ఇంకా 30 ఏళ్ళ కుర్రాడిలా మెరిసిపోతున్నాడు. ‘మహర్షి’ వర్కింగ్ ఫొటోస్ లో మహేష్ యంగ్ అండ్ హ్యాండాసోమ్ లుక్ లో ఇరగదీస్తున్నాడు. వంశి పైడిపల్లి మహేష్ ని చాలా స్టైలిష్ గా ఈ సినిమా లో చూపించబోతున్నాడు. ఇక అల్ల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్న ఈ సినిమా రైతుల సమస్యల చుట్టూనే తిరుగుతుందని టాక్ ఉంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మహేష్ ‘మహర్షి’ సినిమా టీజర్ ఈ నెలాఖరున విడులవుతుంది అంటున్నారు. మరి మే తొమ్మిదిన విడుదలకాబోతున్న ‘మహర్షి’ సినిమా ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది.. ఇప్పుడు వదిలిన ‘మహర్షి’ వర్కింగ్ ఫొటోస్ చూస్తుంటే. |
https://www.telugupost.com/movie-news/narendra-modi-sing-telugu-movie-songs-with-help-of-ai-technology-memes-1498371 | AI టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి.. దానిని ఉపయోగించి ఏవేవో ప్రయత్నాలు, అద్భుతాలు చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాధ్యం కానిది ఏదీ లేదు. వార్తలు చదవడానికి యాంకర్ సహాయం లేకుండానే, ఈ టెక్నాలజీ.. ఒక కృత్రిమ యాంకర్ ని సృష్టించి న్యూస్ ని వ్యూయర్స్ ముందుకు తీసుకు వస్తుంది. ఇక నెటిజెన్స్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు.తమకి నచ్చిన స్టార్స్ ని తమకి నచ్చిన క్యారెక్టర్స్ లో చూసుకోవడానికి AI సహాయం తీసుకోని దేవుళ్లుగా, మహారాజు, మహారాణిలా మార్చేస్తున్నారు. అయితే ఈసారి ఈ టెక్నాలజీని మరింత క్రియేటివ్ గా ఉపయోగించారు. ఒక పాట పాడడానికి సింగర్ లేకుండానే.. ఆ గాయకుడు వాయిస్ తో పాటలని ఆడియన్స్ కి వినిపించేస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు నెటిజెన్స్.. మన దేశ ప్రధాని 'నరేంద్ర మోదీ' గొంతుని అరువు తీసుకోని కొన్ని పాటలను సృష్టిస్తున్నారు.నరేంద్ర మోదీ తెలుగు మాట్లాడడమే చాలా కష్టం. అలాంటిది ఆయనతో తెలుగు లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ ని కూడా పాడించేస్తున్నారు నెటిజెన్స్. జయం చిత్రంలోని 'రాను రానంటూనే', పుష్పలోని 'శ్రీవల్లి', బేబీ మూవీలోని 'ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా', జాను సినిమాలోని 'లైఫ్ అఫ్ రామ్'.. సాంగ్స్ తో మోదీ చుట్టూ ఒక లవ్ స్టోరీని క్రియేట్ చేస్తున్నారు.ఇటలీ ప్రధాని 'జార్జియా మెలోని', నరేంద్ర మోదీ మధ్య.. ఈ పాటలతో ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేసేశారు. ఇక ఇందుకు సంబంధించిన సాంగ్స్ అండ్ వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటి పై కొందరు మీమర్స్ మీమ్స్ చేస్తూ.. నెటిజెన్స్ ని మరింత అలరిస్తున్నారు. మరి మోదీ పాడిన ఆ తెలుగు పాటలను ఒకసారి మీరుకూడా వినేయండి. View this post on Instagram A post shared by Telugu Mucchatlu❤️ (@telugumucchatlu) View this post on Instagram A post shared by Madhav Jaswanth (@whatmadhav) View this post on Instagram A post shared by 𝐍𝐚𝐦𝐚𝐬𝐭𝐡𝐞 𝐁𝐡𝐚𝐲𝐲𝐚 (@namasthe_bhayya) |
https://www.telugupost.com/movie-news/pooja-hegde-comments-on-her-remuneration-146367/ | ఈమధ్యన పూజ హెగ్డే హిట్స్ చూసికుని రెచ్చిపోయి.. నిర్మాతలను అధిక పారితోషకం డిమాండ్ చేస్తుంది అనే న్యూస్ సోషల్ అండ్ వెబ్ మీడియాలో విపరీతముగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఆ వార్తలేమి గాసిప్ కాదండోయ్ నిజమే. నిర్మాతలు తనకి అడిగింది ఇస్తున్నారు అంటుంది. ఎందుకంటే వరసగా పూజ హెగ్డే నటిస్తున్న సినిమాలు హిట్ కావడటంతో ఇప్పుడు పూజ ఏం మాట్లాడిన కరెక్ట్ గానే కనబడుతుంది. వాల్మీకి, అల వైకుంఠపురములో హిట్ అవడంతో పూజ కూడా నిర్మాతలను భారీగానే డిమాండ్ చేస్తుంది అనే టాక్ వినబడుతుంది. అది నిజమే అంటూ పూజ హెగ్డే తాజాగా క్లారిటీ ఇచ్చింది. కథలతో పాటు…. ఆ సినిమా హిట్ గురించి, కలెక్షన్స్ గురించి కూడా పట్టించుకుంటాను అలాగే… సినిమా ప్రమోషన్స్ కి కూడా నాకు చేతనైనంతగా కష్టపడతాను కాబట్టే నా పై నమ్మకంతో నా నిర్మాతలు కూడా నేను అడిగినంత పారితోషికం ఇస్తున్నారు అంటుంది. అలాగే పెద్ద హీరోల సినిమాల్లో తాను ఉండాలని వారు కోరుకుంటున్నారని.. అలాగే నాకిచ్చిన పాత్రకి నేను తగిన న్యాయం చేస్తున్నా అని, నా నిర్మాతలకు లాభం రావడం కూడా ముఖ్యమే కదా అంటూ చిలకపలుకులు పలుకుతుంది ఈ చిన్నది |
https://www.telugupost.com/movie-news/hero-vijay-sarkar-94145/ | అతనొక కార్పొరేట్ మోన్స్టర్. అతను ఏ దేశం వెళ్లినా అక్కడ ఎదిరించిన వాళ్లను అంతం చేస్తాడు. ఎలక్షన్ల కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు. పని గట్టుకుని ఎలక్షన్ల కోసం ఇండియాకు రావడానికి కారణమేంటి..? భారత్‌లో ఏం చేశాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు అశోక్ వల్లభనేని. విజయ్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన 'సర్కార్' చిత్రాన్ని ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిథి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలు. దీపావళి సందర్భంగా వచ్చేనెల 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. |
https://www.telugupost.com/movie-news/sai-dharam-tej-rashi-khanna-prati-roju-panduge-world-wide-business-142689/ | సాయి తేజ్ – రాశి ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందు కు రాబోతున్న ఈ సినిమాపై సాయి తేజ్- రాశి ఖన్నా ఇద్దరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. సాయి తేజ్ మార్కెట్ కాస్త అటు ఇటు గా మార్పులు జరగడం, మారుతీ కూడా యావరేజ్ సినిమాల్తో ఉండడంతో.. ప్రతి రోజు పండగే సినిమాకి ఓ అనుకున్నంత బిజినెస్ జరగదనే అనుకున్నారు. కానీ ప్రతి రోజు పండగే పాటలు, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రావడం.. పండగ బిజినెస్ జరగడం పూర్తయ్యింది. ప్రతి రోజు పండగే రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల బిజినెస్ జరగ్గా… వరల్డ్ వైడ్ గా 18.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఏరియా: బిసినెస్ (కోట్లలో) నైజాం 5.50 సీడెడ్ 2.80 నెల్లూరు 0.65 కృష్ణ 1.20 గుంటూరు 1.45 వైజాగ్ 2.00 ఈస్ట్ గోదావరి 1.30 వెస్ట్ గోదావరి 1.10 టోటల్ ఏపీ & టీస్ 16.00 కర్ణాటక 0.80 ఇతర ప్రాంతాలు 0.20 ఓవర్సీస్ 1.00 టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్: 18.00 |
https://www.telugupost.com/movie-news/what-about-krack-177690/ | ప్రస్తుతం థియేటర్స్ లో కొత్త సినిమాల హడావిడి కనబడుతుంది. సాయి ధరమ్ తేజ్ ధైర్యం చేసాడు సక్సెస్ అయ్యాడు. సోలో బ్రతుకే సో బెటరుతో సోలోగా థియేటర్స్ లో దున్నేస్తున్నాడు. ఇక సాయి తేజ్ ని చూసిన హీరోలందరూ సంక్రాంతికి తమ సినిమాల డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. రామ్ రెడ్ సినిమాని జనవరి 14 అంటూ అనౌన్స్ చేసాడు. ఇక తాజాగా ఎటువంటి హడావిడి లేకుండా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా జనవరి 15 న అల్లుడు అదుర్స్ ని లైన్ లోకి తీసుకొచ్చాడు. ఇక తమిళనాట భారీగా తెరకెక్కిన మాస్టర్ సినిమా కూడా పొంగల్ రేస్ లోనే ఉంది. మరి వీటితో పాటుగా రవితేజ క్రాక్ సినిమా కూడా సంక్రాతి రేస్ లోనే ఉండబోతుంది అని.. ఎప్పటినుండో హడావిడి చేసున్నారు.సోషల్ మీడియాలో క్రాక్ సాంగ్స్ వదులుతూ మాస్ సినిమాగా క్రాక్ ని ప్రమోట్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని – రవితేజ కాంబోలో రాబోతున్న క్రాక్ సినిమా సంక్రాంతికే అని ఫిక్స్ అయ్యారు కానీ.. డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే శృతి హాసన్ తో రవితేజ రొమాంటిక్ సన్నివేశాల ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే క్రాక్ సినిమాని సంక్రాంతికే విడుదల అంటూ అనౌన్స్ చేసినా డేట్ విషయంలో క్లారిటీ లేకపోయేసరికి రామ్ రెడ్, అల్లుడు అదుర్స్, విజయ్ మాస్టర్ తో పోటీ పడి కలెక్షన్స్ షేర్ చేసుకునే కన్నా జనవరి 12 న కానీ, లేదంటే జనవరి చివరి వారంలో కానీ దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో రవితేజ బ్యాచ్ ఉన్నారట. మరోపక్క జనవరి 15 డేట్ పరిశీలనలో కూడా ఉన్నారనే టాక్ వినబడుతుంది. ప్రస్తుతం ఉన్నపసరిస్థితుల్లో హీరోలెవరూ కలెక్షన్స్ షేర్ చేసుకోవడానికి రెడీ అవ్వడం లేదు. సో రవితేజ వెనక్కి తగ్గినా తగ్గొచ్చనే టాక్ నడుస్తుంది. |
https://www.telugupost.com/movie-news/saira-releases-fifteen-hundred-screens-in-bollywood-134877/ | మెగాస్టార్ చిరంజీవి అంటే మనకి క్రేజ్ కానీ ఇతర భాషల్లో కాదు. అందుకే సైరా సినిమా బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో తారాస్థాయికి చేరినా మిగిలిన భాషల్లో చాలా తక్కువ మొత్తానికి తీసుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను చాలా తక్కువ రేట్ కి కొన్నారు ఎక్సెల్ సంస్థ వారు. మినిమం గ్యారెంటీ పద్ధతిలోనే హిందీ రైట్స్ రామ్ చరణ్ ఇచ్చారట. పదిహేను వందల స్క్రీన్లలో… హిందీ లో ఎంత వస్తుందో చెప్పలేం కాబట్టి అందుకే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల సినిమా కి వచ్చిన లాభాలు మొత్తం డిస్ట్రిబ్యూటర్ కి వెళ్లిపోకుండా తనకి యాభై శాతం వాటా వచ్చేలా చూసుకున్నాడు. నిజానికి రామ్ చరణ్ సైరా ను హిందీ లో సోలో గా రిలీజ్ చేద్దాం అనుకున్నాడు కానీ అతనికి హిందీ మార్కెట్ మీద పట్టు లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక హిందీ లో రిలీజ్ చేస్తున్న ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను లైట్ గా తీసుకోవడం లేదు. అక్కడ ఈ మూవీని ఏకంగా పదిహేను వందల స్క్రీన్లలో విడుదల చేస్తూ తమ క్రెడిబులిటీ చాటుకుంటున్నారు. మరి సైరా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చూడాలి. |
https://www.telugupost.com/movie-news/kalyani-priya-darshan-75696/ | అఖిల్ 'హలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన కల్యాణి ప్రియదర్శన్... సినిమా ప్లాప్ అయిన ఆమె నటన పరంగా.. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఆమెకు తెలుగులోనే అవకాశాలు వస్తున్నాయి. సుధీర్ వర్మ డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా మూవీలో ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె మెగా హీరోతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని తాజా సమాచారం.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందంట. కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు హిట్ అయితే, మరిన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఆమె తమిళంలో కూడా చేస్తునట్టు టాక్. |
https://www.telugupost.com/movie-news/చిరకాల-మిత్రుల-రహస్య-భేట-13429/ | రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ చిరకాల మిత్రులు. వీరిద్దరి స్నేహ బంధం ఎప్పుడో మొదలైంది.వీరు తరుచూ ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో కలుస్తూ ఒకరికొకరు పలకరించుకుని ముచ్చట్లు చెప్పుకునేవారు. కానీ ఈ మధ్య ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం తో వీరు కలవకుండా చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకరినొకరు పరామర్శించుకున్నారు. ఇద్దరికీ ఈ మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎవరి ట్రీట్మెంట్స్ లో వారు బిజీ అయ్యారు. రజిని చికిత్స రీత్యా అమెరికాలో వైద్యం చేయించుకుని ఇటీవలే చెన్నై కి తిరిగొచ్చాడు. అయితే రజినీని పరామర్శించడానికి కమల్ వెల్దామనుకునేలోపు రజిని మళ్ళీ అమెరికా వెళ్లడం తో కలవడం కుదరలేదు.ఇక తర్వాత రజినీని పలకరిద్దామనుకుంటే కమల్ కూడా గాయాల పాలై ఆసుపత్రిలో చేరాడు. కమల్ హాసన్ తన శభాష్ నాయుడు షూటింగ్ లో మెట్లపై నుండి జారిపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కలయికకు అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదు. అయితే తాజాగా వీరిద్దరూ సోమవారం రాత్రి కలిసారని కోలీవుడ్ మీడియాలో ఒకటే న్యూస్. రజినీకాంత్ స్వయంగా కమల్ హాసన్ ఇంటికి వచ్చారని.... కమల్ కూడా గుమ్మనుండే రజినీని సాదరంగా లోపలి ఆహ్వానించాడని సమాచారం. కమల్ ఆరోగ్యం గురించి తెలుసుకుని కమల్ ని పరామర్శించడానికి రజినీ కమల్ ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ భేటీ మాత్రం రహస్యంగానే జరిగింది. ఇక ఒకరి ఆరోగ్య సమస్యలు మరొకరు కనుక్కున్నట్లు సమాచారం. చాలా గ్యాప్ తర్వాత కలవడం తో ఇద్దరూ ఎంతో ఆత్మీయం గా మాట్లాడుకుని భావోద్వేగానికి లోనైనట్లు చెబుతున్నారు.ఇక ఈ భేటీ గురించి కమల్ హాసన్ కి సహాయకుడిగా ఉంటున్న రాజేష్ ఎం.సెల్వా బయటపెట్టాడు. కమల్, రజినీ కలుసుకున్నప్పుడు రాజేష్ ఎం.సెల్వా వారిద్దరితో ఒక ఫోటో తీయించుకున్నాడు. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం తో ఈ భేటీ విషయం బయటికి వచ్చింది. ఎంతైనా ఇద్దరు బడా స్టార్స్ కలిస్తే అది సంచలన విషయమే అవుతుంది కదా. ఇక రజినీ రోబో 2 .0 తో బిజీగా ఉండగా... కమల్ కూడా తన శభాష్ నాయుడు సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. |
https://www.telugupost.com/movie-news/500-కోట్లతో-మరో-భారీ-ప్రాజెక-31840/ | ఇప్పడు నిర్మాతలంతా బాహుబలి సీరీస్ ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అతి పెద్ద ప్రాజెక్ట్ గా తెరకెక్కిన బాహుబలి పెట్టుబడిపెట్టిన మొత్తానికి నాలుగింతలు సంపాదించే దిశగా పరుగులు పెడుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో 'మగధీర, బాహుబలి' వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు చాలా ప్రాఫిట్ వెనకేసుకున్నారు. అందుకే ఇప్పుడు నిర్మాతలంతా భారీ ప్రాజెక్టుల వెంట పడుతున్నారు. ఇప్పటికే ఒక ఎన్నారై సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూ. 1000 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో ‘మహాభారత' ని అనౌన్స్ చేశారో లేదో ఇప్పుడు టాలీవుడ్ లో అపార చాణిక్యునిగా పేరు మోసిన అల్లు అరవింద్ మరో ఇద్దరితో కలిసి 500 కోట్ల భారీ వ్యయంతో సంపూర్ణ రామాయణాన్ని తీస్తానని చెబుతున్నాడు.పురాణ గాధ రామాయణాన్ని ఆలు అరవింద్,నమిత్ మల్హోత్ర, మధు మాతేన తో కలిసి మూడు పార్టులుగా నిర్మించనున్నట్టు సమాచారమందుతుంది. అయితే ఈ రామాయణాన్ని త్రీడి వెర్షన్ లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఇక ఈ మూడు పార్టులను 500 కోట్ల భారీ వ్యయంతో తెలుగు, తమిళం, హిందీ వెర్షన్స్ లో తెరేక్కించి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే ఈ అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే నవంబర్ లో గ్రాండ్ గా లాంచ్ చేసి పట్టాలెక్కించేందుకు సిద్ధం చేస్తున్నారని వినికిడి. అప్పటిలోగా రామాయణం మూడు పార్టులలో నటించే నటీనటుల ఎంపిక పూర్తి చేస్తామని కూడా చెబుతున్నారు. |
https://www.telugupost.com/crime/hyderabad-software-engineer-suspicious-death-at-vellulla-1359639 | జగిత్యాల : హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న బర్ల హరీశ్ (31) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన బర్ల హరీశ్ ది జగిత్యాల జిల్లా మెట్ పల్లి. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న హరీశ్.. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారం క్రితమే స్వగ్రామమైన మెట్ పల్లికి వచ్చిన హరీశ్.. ఆదివారం సాయంత్రం స్నేహితులు ఫోన్ చేయడంతో బయటికి వెళ్లాడు.ఆ తర్వాత వెల్లుల్ల గ్రామ శివారులో హరీశ్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిపోయిందని అతని బాబాయ్ కొడుకుకి హరీశ్ స్నేహితులు సమాచారమిచ్చారు. దగ్గర్లో ఉన్న తోటల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం బావిలో పడిపోయిందని వారు తెలిపారు. హరీశ్ బావిలో పడిపోయాడని, వెనుక కూర్చున్న మరో యువకుడు గట్టుపై పడిపోయాడని చెప్పారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి.. ఈతగాళ్లతో బావిలో గాలించారు. సోమవారం తెల్లవారుజామున హరీశ్ మృతదేహం లభ్యమైంది.హరీశ్ మృతదేహాన్ని పరీక్షగా చూసిన కుటుంబ సభ్యులు.. తల వెనుకభాగం, ముక్కు, చెవుల వద్ద రక్తం కారడం గమనించారు. దాంతో అతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హరీశ్ కు బాబాయ్ అయిన అభిషేక్ కూడా 12 ఏళ్ల క్రితం బావిలో పడి చనిపోగా.. ఇప్పుడు హరీశ్ అదేరీతిలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. |
https://www.telugupost.com/movie-news/lakshmi-rai-hot-shoot-127537/ | టాలీవుడ్ లో స్టార్ హీరోలైన చిరు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన లక్ష్మి రాయ్.. తమిళనాట హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అయితే లక్ష్మి రాయ్ కెరీర్ లో యావరేజ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది కానీ.. టాప్ చైర్ ఎక్కలేకపోయింది. అయితే అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గని ఈ చిన్నది.. మొన్నామధ్యన అంటే బాలీవుడ్ లో జూలై సినిమా చేసినప్పుడు.. స్పెషల్ అకేషన్స్ లో బీచ్ ఒడ్డున బికినీ అందాలతో అదరగొట్టేసింది. ఎప్పటికప్పుడు బికినీ తో లక్ష్మి రాయి చేసే రచ్చ మాములుగా ఉండడం లేదు. ఈ వయసులోనూ ఘాటైన అందాలతో రెచ్చిపోతున్న ఈ పాపకి సినిమా అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే. హాట్ హాట్ గా…. తాజాగా లక్ష్మి రాయి బ్లు బికినిలో చేసిన గ్లామర్ షో యూత్ గుండెల్లో హాట్ హాట్ సెగలు రేపుతోంది. బ్లు బికినీ లో సైడ్ యాంగిల్ లో లక్ష్మి రాయ్ ఇచ్చిన హాటెస్ట్ సెక్సీ ఫోజ్ చూస్తే అబ్బా.. ఇంతందం మనం సినిమాల్లో మిస్ అవుతున్నామే అనిపిస్తుంది. నిజంగా లక్ష్మి రాయ్ బ్లు బికినీ అందాలు మాత్రం అదరహో… బికినీ వేసుకుని స్పెట్స్ పెట్టుకుని.. లూజ్ హెయిర్ తో అమ్మడు అలా అలా నవ్వుతుంది… చూశారూ.. కుర్రకారు గుండెల్లో సెగలు రావడం కాదు.. రంపం పెట్టి కోసేసినట్టుగా ఉంటుందనడంలో సందేహమే లేదు. పాపం పాపకి ఫేట్ బాగోక గాని.. లేదంటే ఈ సెక్సీ అందాలతో ఓ ఊపు ఊపడం ఖాయం. కానీ అందం ఎంతుంటే ఏం ఉపయోగం.. లక్కుండాలమ్మా.. |
https://www.telugupost.com/politics/leaders-of-the-congress-party-are-expressing-their-anger-against-the-former-member-of-parliament-chinta-mohan-1501292 | మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ పై కాంగ్రెస్ పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును వెనకేసుకొస్తూ కాంగ్రెస్, టీడీపీ కలవాలని కోరుకుంటున్న చింతామోహన్ వ్యాఖ్యలను కొందరు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా చింతా మోహన్ చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని చెబుతున్నారు. అంత వరకూ ఓకే గాని, చంద్రబాబు నిర్దోషి అన్నట్లు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.హైకమాండ్ దృష్టికి...చంద్రబాబుపై చింతా మోహన్‌కు అంత ప్రేమ ఎందుకని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్న ఆయన కామెంట్స్‌ను పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని రాజమండ్రి జైలులో పెట్టడం తప్పని, చంద్రబాబు ఎక్కడైనా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయా? అని చింతా మోహన్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ కుట్ర ఉందన్న ఆయన చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాబు మాత్రం...కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం చంద్రబాబు బీజేపీ మద్దతు కోరుకుంటుంటే.. మనం ఎందుకు సపోర్టుగా ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించి వదిలేస్తే సరిపోతుందని, అదే పనిగా ప్రతిరోజూ చింతామోహన్ చంద్రబాబుకు అనుకూల ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత అసలు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. మళ్లీ బీజేపీ వైపునకే ఆయన మొగ్గు చూపారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఇంత స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆలోచన...అయితే చింతామోహన్ ఆలోచన మరోలా ఉందన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తాను గెలవాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆయన భావిస్తున్నారని, అందుకే ఆయన గత కొద్ది రోజులుగా బాబు నామస్మరణ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీలో చేరితే నేరుగా చేరవచ్చు కాని, కాంగ్రెస్ లో ఉండి మాజీ పార్లమెంటు సభ్యుడిగా చంద్రబాబును ప్రతి రోజూ వెనకేసుకు రావడం వల్ల పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. మొత్తం మీద చింతా మోహన్ ఆలోచన ఎలా ఉన్నా ఆయన చేస్తున్న కామెంట్స్ మాత్రం పార్టీలో కాక రేపుతున్నాయనే చెప్పాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది. |
https://www.telugupost.com/movie-news/చెత్త-సినిమా-చేస్తే-చెప్-49348/ | తెలుగులో ఒకప్పుడు సిద్దార్థ్ లవర్ బాయ్ లా వెలిగిపోయాడు. అతని సినిమా కోసం యూత్ తెగ ఎదురు చూసేది. కానీ ఈ మధ్య కాలంలో సిద్దార్థ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. అసలే ప్లాప్స్ లో ఉన్న హీరోతో ఏ దర్శక నిర్మాత అయినా ధైర్యం చేసి సినిమాలు చెయ్యరు. లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సిద్దార్థ్ తో సినిమాలు చేసే వారు లేక అతని మర్కెట్ తో పాటే అతని కెరీర్ కూడా ముగిసిపోయింది... అనుకున్న సమయానికి సిద్ధు తాజాగా గృహం అనే థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకులముందుకు వస్తున్నాడు.ఘాటుగా సమాధానం...తమిళంలో తెరకెక్కిన ఈసినిమా కి హీరో, నిర్మాత సిద్దార్థే. అయితే అక్కడ తమిళంలో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు తెలుగులో రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. అయితే తెలుగులో గృహం ప్రీమియర్ షో కోసం హైదరాబాద్ వచ్చిన సిద్ధుకి ఊహించని ప్రశ్న ఒకటి ఎదురైంది. కెరీర్ విషయమై ఒక విలేఖరి సిద్ధుతో మధ్యలో మీరు చాలా కాలం పడిపోయారే అని అనగా... దానికి బాగా హార్ట్ అయిన సిద్దార్థ్.. కొంచెం ఘాటుగా.. మరికొంచెం స్వీటుగా సమాధానమిచ్చాడు.గతం గురించి అనవసరం....అసలు నెప్పుడూ పడిపోయానని అనుకోవట్లేదు..... ఈ రోజు ఒక హీరోగా, నిర్మాతగా ఒక మంచి సినిమా తీసి.. అందరి ముందూ తలెత్తుకుని నిలబడగలిగాను. మరి నేను పడిపోయానని ఎలా అనుకుంటాను. ఆ మాట అనడం మీ ప్రాబ్లెమ్ కావచ్చు. కానీ నేను అలా అనుకోవట్లేదు. ఈ రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగితే 20 మంది నా చుట్టూ చేరి దగ్గరికి వచ్చి మరి ఫొటోలు దిగారు. కానీ వాళ్లెవ్వరూ కూడా 10 ఏళ్ల ముందైతే ఇతడితో ఫొటో దిగే వాడిని అనుకోలేదు... నాదగ్గరికి వచ్చి మరి నేనంటే ఎంతో ఇష్టమని చెప్పారు. గతం గురించి అస్సలు ఆలోచించను..... మంచి సినిమా తీస్తే ఆదరించండి..... లేదా చెత్త సినిమా తీస్తే చెప్పుతో కొట్టండి అంటూ ఘాటైన రిప్లై ఇచ్చాడు. |
https://www.telugupost.com/movie-news/గౌతమీపుత్ర-శాతకర్ణి-టూ-డ-19723/ | ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 3 .50సీడెడ్ 3 .10వైజాగ్ 1 .57ఈస్ట్ గోదావరి 1 .19వెస్ట్ గోదావరి 1 .73క్రిష్ణ 1 .22గుంటూరు 2 .14నెల్లూరు 0 .65టూ డేస్ ఏపీ, టీఎస్ కలెక్షన్స్ 15 .10 |
https://www.telugupost.com/movie-news/popular-stunt-master-kanal-kannan-arrested-by-tamilnadu-police-1484557 | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్ని సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పని చేశారు కనల్ కన్నన్. ఇప్పుడు ఆయనను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పాస్టర్ కు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసినందుకు కనల్ కన్నన్ ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు నాగర్‌కోయిల్‌లో అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ డీఎంకే నేత ఫిర్యాదు చేయడంతో కన్నన్ను అరెస్ట్ చేశారు. ఒక యువతితో ఓ పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను జూన్ 18న పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ వీడియో ద్వారా కొందరి మనోభావాలు దెబ్బతీశారంటూ డీఎంకే ఐటీ విభాగం డిప్యూటీ ఆర్గనైజర్ ఆస్టిన్ బెన్నెత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 1న కేసు నమోదు అయింది. విచారణకు పిలిచిన పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు.కన్నన్ జూన్ 18న పాస్టర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విదేశీ మతాచారాలు ఇలానే ఉంటాయంటూ కనల్ కన్నన్ ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోకు ఓ తమిళ సాంగ్ ను కూడా జోడించాడు కనల్ కన్నన్. ఆస్టిన్ బెన్నెట్ కన్నన్‌పై పోలీసులకు సమాచారం అందించాడు. నాగర్‌కోయిల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కనల్ కన్నన్ పై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెన్నెట్ తన ఫిర్యాదులో ఈ వీడియోను ఎడిట్ చేశారని, క్రైస్తవ మతం ప్రతిష్టను దిగజార్చడానికి, విభిన్న మతాల మధ్య ద్వేషాన్ని ప్రేరేపించే ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ చేశారని ఆరోపించారు. విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కన్నన్‌కు సమన్లు జారీ చేయడంతో.. జూలై 10వ తేదీ ఉదయం 10 గంటలకు నాగర్‌కోయిల్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సాయంత్రం 7 గంటలకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కోసం జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇది పూర్తిగా డీఎంకే ప్రభుత్వం ప్రేరేపిత కేసని హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. |
https://www.telugupost.com/movie-news/పవన్-వెనుక-త్రివిక్రమ్-న-51599/ | పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటినుండి పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు త్రివిక్రమ్, పవన్ వెంట వున్నాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? పవన్ - త్రివిక్రమ్ కలిసి జల్సా సినిమా చేసినప్పటినుండి వీరి మధ్యన దర్శక హీరో బంధం కాస్తా.. స్నేహబంధంగా మారిపోయింది. అప్పటినుండి పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉంటున్నాడు త్రివిక్రమ్. పవన్ ఎక్కడ ఉంటే త్రివిక్రమ్ అక్కడ ఉండడం దగ్గరనుండి.. అన్ని విషయాల్లోనూ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కి మంచి ఆప్తుడిగా దగ్గరయ్యాడు. కేవలం సినిమాల్లోనే కాదు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటినుండి పవన్ వెనుక త్రివిక్రమ్ ఉన్నాడు. పవన్ మాట్లాడే ప్రతి మాట త్రివిక్రమ్ చేతి రాతే అని ప్రచారం జరిగింది అక్షరాలా నిజం. అందుకే త్రివిక్రమ్ ని మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందనే ప్రచారం కూడా జరిగింది. అసలు ఇప్పుడు ఇంత సోది ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాల్తో బిజీగా ఉంటూనే మరోపక్క రాజకీయాల్లో బిజీగా మారుతున్నాడు. 2019 ఎన్నికలను టార్గెట్ గా జనసేన కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్ గా మారడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ పాద యాత్ర కూడా చేపట్టబోతున్నాడు. అందులో భాగంగానే.. చలోరే చలోరే చల్... జనం లోకి జనం కోసం జనసేనాని అంటూ పవన్ కళ్యాణ్ బయలుదేరాడు.అయితే పవన్ కళ్యాణ్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే అంటూ చెప్పే ముందుగా పవన్ కళ్యాణ్ ఆప్తుడు, మిత్రుడు అయిన త్రివిక్రమ్ వాయిస్ ఆ ఆడియో లో స్పష్టంగా వినబడుతుంది. ఆ ఆడియో మొదట్లో త్రివిక్రమ్ వింటారా! వెనకాలే వస్తారా! తోడుగఉందాం వస్తారా! రండి విందాం.... అటూ చెప్పగా.. పవన్ కళ్యాణ్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్మిత్రమా! అసలే చీకటి! ఇల్లేమో ధూరం! దారంతా గోతులు! చేతిలో దీపం లేదుధైర్యమే ఒక కవచం... రా అంటూ గర్జిస్తూ...ఒక దేశపు సంపద నదులు కాదు... ఖనిజాలు కాదు.. అరణ్యాలు కాదు.. కలలు ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశపు భవిష్యత్తుకు నాయకులు.మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వారికి ఇదే చెబుదాం. పర్వతం ఎవరిముందు వంగి సలాం చెయ్యదు. నేను పిడికిలంతా మట్టే కావచ్చు.. కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా మోసేంత పొగరుంది అంటూ ఆవేశపూరితమైన మాటలు వింటుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తి స్థాయి రాజకీయనాయకుడిలా కనబడుతున్నాడు. మరి త్రివిక్రమ్ మాటలు పవన్ చేతలు చూస్తుంటే.. ఈసారి జనసేనాని మాత్రం గట్టిగా కొట్టేలాగే కనబడుతున్నాడు. |