instruction
stringlengths
0
12.1k
input
stringlengths
0
22.2k
output
stringlengths
1
23.8k
మీకు తెలిసిన మహనీయుల హితోక్తులు కొన్నింటిని చెప్పండి.
ప్రార్థించే పెదవులకన్నా సేవించే చేతులు మిన్న – మథర్ థెరిస్సా చెడు వినవద్దు. చెడు కనవద్దు. చెడు మాట్లాడవద్దు – గాంధీజీ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో – కందుకూరి వీరేశలింగం పంతులుగారు. సత్యం పలుకు ధర్మంగా ప్రవర్తించు – ఉపనిషత్తు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ – ఉపనిషత్తు మనిషికి మంచి మనసుండాలే కాని, నానా విధాల సంపదలూ వాటంతట అవే వస్తుంటాయి – తులసీదాసు తెలివైనవారు తమ మాటలతో విలువైన కాలాన్ని హరించరు. వాళ్లెప్పుడూ కాలాన్ని కాపాడటానికి మాటల పొదుపు పాటిస్తారు. – బ్రూస్ బర్టన్ ఎంతటి కాళరాత్రిలోనైనా గంటకి అరవై నిమిషాలే. కనుక మనసు చతికిలబడకూడదు. – ఎడ్మండ్ బర్క్ రేపటిది ఈ రోజు. ఈ రోజు చేయవలసినది ఇప్పుడే చేయాలి – కబీరు మనం ఓ మనిషి గురించి తెలుసుకోవాలంటే, అతను దూరంగా పెట్టే వ్యక్తులను గురించి తెలుసుకోవాలి. – జోసఫ్. పి. సాలక్
ఇచ్చిన ప్రశ్నకి ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి. “కాలం చాలా విలువైంది” ఎందుకు?
ధనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చును. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించవచ్చును. పరువు పోయినా, ప్రవర్తన మార్చుకొని, మంచి పనులు చేసి తిరిగి సంపాదించవచ్చును. కాని, కాలం గడిచిపోతే తిరిగి సంపాదించలేం. గడిచిపోయిన ఒక్క సెకను కూడా తిరిగిరాదు. బాల్యంలో సంపాదించవలసిన జ్ఞానం అప్పుడే సంపాదించాలి. చదువు, ఆటలు, పాటలు, ధనం, కీర్తి ఏదైనా సరే సకాలంలో సంపాదించాలి. కాలం గడిచిపోయాక బాధపడినా ప్రయోజనం లేదు. అందుకే కాలాన్ని వృథా చేయకూడదు. సక్రమంగా వినియోగించుకోవాలి.
కారన్ వాలీస్ సంస్కరణల ముఖ్యాంశాలు వివరించండి.
సివిల్ పరిపాలనా సంస్కరణలు: ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు చాలా లంచగొండులయ్యారని, వారిలో సామర్థ్యం పూర్తిగా లోపించిందని కారన్ వాలీస్ గ్రహించాడు. వారికి కంపెనీ వ్యవహారాలకన్నా సొంత వ్యాపారమే ముఖ్యమైంది. వారు తరచు బహుమానాలను తీసుకునేవారు. అందువలన కంపెనీ ఉద్యోగులు లంచాలనుగాని, బహుమతులనుగాని తీసుకోరాదని కారన్ వాలీస్ హెచ్చరించాడు. ప్రైవేటు వ్యాపారం చేసుకొంటున్న కంపెనీ ఉద్యోగులు దండనలకు పాత్రులవుతారని ప్రకటించాడు. ఉద్యోగుల జీతాలు పెంచమని కంపెనీ డైరెక్టర్లకు సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు కంపెనీ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. కలెక్టరుకు నెలకు 1500 రూపాయల జీతం ముట్టింది. భారతీయుల శక్తి సామర్థ్యాల మీద, గుణగణాల మీద కారన్ వాలీస్ కు చాలా చులకన భావం ఉంది. భారతదేశానికి చెందిన ప్రతి ఉద్యోగి అమిత లంచగొండి అని అతడి అభిప్రాయం. అందువలన పరిపాలనా వ్యవస్థలోను, సైనిక వ్యవస్థలోను భారతీయులకు చోటు లేకుండా పోయింది. అందువలననే పరిపాలనలో ఐరోపీకరణ ప్రవేశపెట్టాడు. ఇది కారన్ వాలీస్ జాతి వివక్షతకు దర్పణం పట్టింది. అయినప్పటికీ పౌర, మిలటరీ ఉద్యోగాలలో లంచగొండితనం రూపుమాపి, కారన్ వాలీస్ నీతివంతమైన పరిపాలన అందించాడు. న్యాయ సంస్కరణలు: కారన్ వాలీస్ 1787, 1790, 1793లో అనేక న్యాయసంస్కరణలు ప్రవేశపెట్టాడు. న్యాయశాఖలో ఖర్చును పూర్తిగా తగ్గించాడు. న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేశాడు. జిల్లా కలెక్టర్లకు న్యాయాధికారాలు తొలగించి వారికి భూమిశిస్తు వసూళ్లను మాత్రమే అప్పగించాడు. జిల్లా కోర్టులకు జిల్లా జడ్జిలను నియమించాడు. సివిల్, క్రిమినల్ కేసులను విచారించడానికిగాను కారన్ వాలీస్ పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. 50 రూపాయల లోపు ఆస్తి తగాదాలను మున్సిఫ్ కోర్టులు విచారించాయి. మున్సిఫ్ కోర్టులకు భారతీయులను న్యాయాధికారులుగా నియమించాడు. నాడు మొత్తం 23 జిల్లాలుండేవి. ప్రతి జిల్లాకు ఒక జిల్లా కోర్టును ఏర్పాటు చేశాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సాలను నాలుగు డివిజనులుగా విభజించాడు. ప్రతి డివిజన్కు ఒక సర్క్యూట్ కోర్ట్ను ఏర్పరచాడు. క్రిమినల్ కేసులలో సదర్ నిజామత్ అదాలత్ అప్పీళ్లను స్వీకరించి విచారించింది. అదేవిధంగా సదర్ దివానీ అదాలత్ సివిల్ వ్యవహారాల విచారణను స్వీకరించింది. గవర్నర్ జనరల్-ఇన్-కౌన్సిల్ క్రిమినల్ కేసులలో తుది తీర్పును ఇచ్చేది. న్యాయశాఖకు సంబంధించిన అన్ని నియమాలను క్రోడీకరించారు. దీనికి ‘కారన్ వాలీస్ కోడ్’ అని పేరు వచ్చింది. సమన్యాయపాలన, స్వతంత్ర న్యాయశాఖలు ఈ కోడ్లో చోటుచేసుకున్నాయి. అంగవిచ్ఛేదంలాంటి క్రూరమైన శిక్షలు రద్దయ్యాయి. పోలీస్ సంస్కరణలు: పోలీస్ సంస్కరణలలో భాగంగా కారన్ వాలీస్ పోలీస్ అధికారాలను జమిందారుల నుంచి తీసివేశాడు. ప్రతి జిల్లాను ఠాణాలుగా విభజించారు. ప్రతి ఠాణాకు దరోగా అనే పోలీస్ అధికారిని నియమించాడు. ప్రతి జిల్లాకు సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ అనే ఉద్యోగిని నియమించాడు. ఈ విధంగా ఆధునిక పోలీస్ వ్యవస్థకు కారన్ వాలీస్ పునాది వేశాడు. జైలు సంస్కరణలు: కారన్ వాలీస్ జైలు సంస్కరణలను ప్రవేశపెట్టాడు. మేజిస్ట్రేట్లు తరచుగా జైళ్లను తనిఖీ చేయాలని, ఖైదీలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చాడు. ఖైదీల ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. సివిల్, క్రిమినల్ నేరస్థులకు వేరువేరు వార్డ్లను కేటాయించారు. మహిళా ఖైదీలకు ప్రత్యేక బ్లాక్ లను ఏర్పాటు చేశాడు. శాశ్వత భూమిశిస్తు నిర్ణయ విధానం: కారన్ వాలీస్ సంస్కరణలన్నింటిలో అతి ప్రధానమైనది శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి. ఈ పద్ధతిలో భూమిశిస్తును వసూలు చేయటానికి ప్రతి 10 సంవత్సరాలకొకసారి వేలంపాటలు వేస్తారు. ఈ వేలం పాటలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తామని ఒప్పుకున్న జమిందారులకు శిస్తువసూలు అధికారాన్ని అప్పగిస్తారు. ఈ మొత్తాన్ని జమిందారులు ప్రతి సంవత్సరం కాక 10 సంవత్సరాల కాలానికి నిర్ణయిస్తారు. ఈ పద్ధతిననుసరించి జమిందారులకు భూములపై యాజమాన్యపు హక్కు ఏర్పడింది. పన్నులు చెల్లించనివారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, వాటిని వేలం వేసి, తన బకాయిలను రాబట్టుకుంది. జమిందారుల నుంచి 89 శాతాన్ని శిస్తుగా వసూలుచేసి, మిగిలిన 11 శాతాన్ని వారికే వదిలివేసింది. ఇది అధికమైన భూమిశిస్తే, కాని ఈ నిర్ణయం శాశ్వతమైంది కాబట్టి భూమి నుంచి ఫలసాయం పెరిగినా అది కంపెనీకి చెందదు. లాభాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన ప్రభుత్వానికి కొన్ని లాభాలు చేకూరాయి. అవి: ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ముందుగా ఖచ్చితంగా తెలిసింది. ప్రతి సంవత్సరం భూమిశిస్తు నిర్ణయం, దాని వసూలు బాధ్యతలు ప్రభుత్వాధికారులకు తప్పిపోయాయి. భూమిశిస్తు రేటు రెండింతలయింది. జమిందారులు కష్టించి తమ ఉత్పత్తులను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోగలిగారు. పెరిగిన ఆదాయాల వల్ల భూస్వాములు పరిశ్రమలలో పెట్టుబడి పెట్టగలిగారు. దీనివల్ల పారిశ్రామికీకరణ జరిగి ప్రజల జీవన ప్రమాణం పెరిగింది. జమిందారులతో మిత్రత్వం లభించి కంపెనీ పాలనకు భద్రత ఏర్పడింది. నష్టాలు: శాశ్వత భూమిశిస్తు నిర్ణయ పద్ధతి వలన కొన్ని నష్టాలు కూడా వున్నాయి. అవి: కొందరు జమిందారులు పెరిగిన శిస్తులు చెల్లించలేకపోవటంతో వారి భూములు వేలానికి వచ్చాయి. కంపెనీ ప్రభుత్వం కూడా కొంతవరకు నష్టపోయింది. ఈ నిర్ణయం వల్ల సమాజం జమిందారులు, కౌలుదారులు అనే రెండు వర్గాలుగా విడిపోయింది. జమిందారుల ఆదాయం పెరిగినందువల్ల వారు నగరాలకు వలసవెళ్లి విలాసవంతమైన జీవితాలు గడపసాగారు. రైతుల స్థితి దిగజారింది. వారు జమిందారుల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడవలసి వచ్చింది. రైతులకు యాజమాన్యపు హక్కు లేకపోవటంతో వారి జీవితం మరింత దుర్భరమైంది. ముగింపు: కారన్ వాలీస్ పరిపాలనావేత్తగా పేరుపొందాడు. బ్రిటిష్ ఇండియా పరిపాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అక్కడ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. అతడి పరిపాలనకు కారన్వాలీస్ విధానమని పేరొచ్చింది. న్యాయ, పోలీస్ శాఖలలో ఇంగ్లీషువారి విధానాలను ప్రవేశపెట్టాడు. అతడి న్యాయసంస్కరణలలో ఇంగ్లీషు న్యాయ విధానం ప్రతిబింబించింది.
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: కంఠీరవం
సింహం, మత్తగజం, పావురం
చరిత్ర రచనలో సాహిత్యాధారాల ప్రాధాన్యత వివరించండి.
చారిత్రక అంశాలను రాబట్టేందుకు సాహిత్యం బలమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. పాలకులు సాధించిన విజయాలు, రాజకీయ, సాంఘిక, మత విషయాలను సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. సాహిత్య ఆధారాలు రెండు విధాలు. 1) స్వదేశీ సాహిత్యం: వేదకాలం నుండి విజయనగర కాలం వరకు ఉన్న విలువైన రచనలు రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక చరిత్రకు అద్దం పడుతున్నాయి. బౌద్ధ, జైన సాహిత్యం చరిత్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది. పురాణాలు, శాస్త్రాలు, సంప్రదాయాలను వివరిస్తున్నాయి. కల్హణుడి రాజ తరంగిణి, కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రసిద్ధ రచనలు. 2) విదేశీ సాహిత్యం: మెగస్తనీస్ ఇండికా, పెరిప్లన్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ వంటి గ్రీకు, రోమన్ రచనలు రోమ్, ఆగ్నేయాసియాతో భారత్ సంబంధాలను వెల్లడిస్తున్నాయి. టాలేమి రచన ‘జాగ్రఫీ’ భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రస్తావించింది. చైనాకు చెందిన ఫాహియాన్, హుయన్ త్సాంగ్ రచనలు భారతదేశ ప్రజల స్థితిగతులను, బౌద్ధ కేంద్రాలను వివరించాయి. ఆల్బెరునీ వంటి ముస్లిం యాత్రికులు భారతదేశాన్ని గురించి వివరించారు. మిన్హాజుద్దీన్ సిరాజ్ తన ‘తబాకత్-ఇ-ఇనాసిరి’ లో ఘోరి దండయాత్రలను వివరించాడు. అమీర్ ఖుస్రూ, జియాఉద్దీన్ బరౌనీ రచనలు మధ్యయుగ భారతదేశ చరిత్రను గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. నికోలోకాంటే, డోమింగ్ పేస్, అబ్దుల్ రజాక్ వంటి ఇటలీ, పోర్చుగీసు, పర్షియన్ యాత్రికుల రచనలు విలువైన చారిత్రక అంశాలను వెల్లడించాయి.
ప్రశ్న : ‘జనపదం’ అంటే అర్థం ఏమిటి? మహాజనపదాలకు, వీటికి గల తేడా ఏమిటి?
మొదట్లో వివిధ తెగలు గంగా – సింధూ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డాయి. ఈ తెగలనే సంస్కృతంలో “జన’ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలిచేవారు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ‘మహా జనపదాలు’ లేదా ‘పెద్ద జనపదాలు’ అని పిలిచేవారు.
ప్రశ్న : నవీన శిలాయుగ వ్యవసాయ పశుపోషకులకు, జీవన విధానం, నాగరికతల ఆవిర్భావానికి ఎలా దారి తీసింది?
నవీన రాతి యుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేసారు. తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమయిన పనిముట్లను తయారు చేసుకొన్నారు. కాంస్యయుగ ప్రారంభ కాలం నాటికి ఈ వ్యవసాయ, పశు పోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. ప్రపంచ వ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, ఈజిప్ట్, సింధూలోయ (భారతదేశం) మరియు చైనాలలో వర్ధిల్లాయి.
క్రింద ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధం మరియు తాత్పర్యం ఇవ్వండి: ఉ || వీరును వారుఁ బండితులు, విక్రమవంతులు, బాహుగర్వదు ర్వారులు; పూని రిత్త బవరంబున నాఱడిఁ జావఁబోవ నె ట్లూరక యుండవచ్చుఁ ? గడు నొప్పెడు మేనులు వాఁడి కైదువుల్ గూరఁగ నాటినం బుడమిఁ గూలుట కక్కట ! యోర్వవచ్చునే ?
ప్రతిపదార్థం : వీరును = ఈ కౌరవులు వారున్ = ఆ పాండవులు పండితులు = చదువు, సాములు నేర్చినవారు విక్రమవంతులు = పరాక్రమం కలవారు బాహు గర్వ దుర్వారులు = భుజబలంచేత అడ్డగించ రానివారు పూని = ఉద్యమించి రిత్త బవరంబునన్ = తమలో తమకు ఏర్పడిన వ్యర్థమైన కలహం వల్ల ఆఱ డిన్ = యుద్ధంలో కావడ్ + పోవన్ = మరణించటానికి సిద్ధపడగా ఎట్లు + ఊరక + ఉండన్* + వచ్చున్ = నివారించక మౌనంగా ఎట్లుండదగును ? వాడి కైదువుల్ = పదునైన ఆయుధాలు (బాణాలు) కూరఁగన్ = దూసుకొని పోయేటట్లు నాటినన్ = గ్రుచ్చుకొనగా కడున్ = మిక్కిలి ఒప్పెడు మేనులు = సుందర (సుకుమారమైన) శరీరాలు పుడమిన్ + కూలుటకున్ = నేలపై కూలటం అక్కట = అయ్యో ఓర్వన్ వచ్చునే = సహింపశక్యము ? తాత్పర్యం : కౌరవులూ పాండవులూ మంచి చదువరులు, పరాక్రమవంతులు, భుజదర్పం గలవారు గనుక ఎవ్వరూ వీరిని అడ్డగించలేరు. ఇట్లాంటివారు తమలో తమ కేర్పడిన కొరమాలిన యుద్ధంలో ఊరక మరణించటానికి సిద్ధపడుతుండగా అడ్డుపడక చూస్తూ ఊరకుండటం మంచిది కాదు. ఇంత కోమలమైన శరీరాలు వాడి బాణాలు ఆవలికి దూసుకొని వెళ్ళేటట్లు గ్రుచ్చుకోగా నేలమీద కూలటం చూచి సహించటం సరైనది కాదు.
కింద ఇచ్చిన పదాలని విడదీసి సంధి పేరు మరియు దాని సూత్రం క్లుప్తంగా రాయండి: 1. ఎల్లి యెల్లక 2. నేల బ్రడి 3. ఏడజ్రూచిన 4. సొమ్మయా
1. ఎల్లి యెల్లక ఎల్లి + ఎల్లక = యడాగమసంధి సూత్రము :- సంధిలేని చోట స్వరంబుకంటెన్ పరంబైన స్వరంబునకుయట్, ఆగమముగానగు. 2. నేల బ్రడి నేలన్+పడి = ద్రత సంధి (సరళాదేశ సంధి) సూత్రము :- ద్రుత ప్రవృతికము మీద పరుషములకు సరళములగు. ద్రుతసంధి/సరళాదేశ సంధి 3. ఏడజ్రూచిన ఏడన్ + చూచిన = ద్రత సంధి / సరళాదేశ సంధి సూత్రము :- ద్రుత ప్రకృతికముల మీది పరుషములకు సరళములగు. 4. సొమ్మయా సొమ్ము + అయా = ఉత్వసంధి సూత్రము :- ఉత్తునకచ్చు పరంబగునపుడు సంధియగు.
ప్రశ్న : పటాల తయారీలో చిహ్నాల ఆవశ్యకతను వివరించండి.
పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలుమార్గాలు బావులు మొదలైనటువంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో చూపలేం. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలు చిహ్నాలతో సూచిస్తారు. ఇవి తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి. పటాలు గీయడం, చదవడం సులభమవుతుంది.
భూమిక “భూమిపైన ఆకుపచ్చని మొక్కలు లేకపోతే భూమిపైన జీవరాశి మనుగడ కష్టమవుతుందని” చెప్పింది. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు?
భూమిపై కల సమస్త జీవరాశులన్నీ ఆకుపచ్చని మొక్కలపై ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆహారం మరియు ఆక్సిజన్ కోసం ఆధారపడతాయి.
ఏ వాక్యముతో నీవు ఏకీభవిస్తావు ? P : రెండు కరణీయ సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ – అకరణీయ సంఖ్యే. Q : అకరణీయ మరియు కరణీయ సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య. i) P మాత్రమే ii) Q మాత్రమే iii) P మరియు Q
ii) Q మాత్రమే
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ప్రశ్న : ప్రతిరోజు మనం నీటిని ఉపయోగిస్తూ చేసే పనుల జాబితా రాయండి.
మన రోజువారీ కార్యకలాపాలకు ఉదా : ఎ) త్రాగడానికి బి) మరుగుదొడ్లు సి) స్నానం చేయడం డి) బట్టలు ఉతకడం ఇ) పాత్రలు శుభ్రం చేయడానికి మనకు నీరు అవసరం. విత్తనం అంకురోత్పత్తికి నీరు అవసరం. విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఉపయోగిస్తారు. పంటలలో నీటిపారుదల కోసం నీటిని ఉపయోగిస్తారు. మన శరీర జీవక్రియ చర్యలకు నీరు అవసరం. అనేక పరిశ్రమలలో నీటిని ఉపయోగిస్తారు.
స్పంజికలలో అనేక వేల కణాలున్నప్పటికీ కణజాల స్థాయి వ్యవస్థీకరణ లేదు. వ్యాఖ్యానించండి.
కణస్థాయి వ్యవస్థీకరణ అతి నిమ్న స్థాయి వ్యవస్థీకరణ. ఈ వ్యవస్థలో వివిధ రకాల కణాలు క్రియాత్మకంగా వివిక్తత చెంది ఉంటాయి. ఎందుకంటే వీటిలో నాడీ కణాలు, జ్ఞానకణాలు ఉండవు. వీటిలో కణాలు వదులైన కణ సమూహాలుగా ఉండును.
అర్ధాలను జతపరచండి. 1. మది అ) వేడుక 2. ఉర్వీశుడు ఆ) పరాక్రమం 3. దళము ఇ) మహారాజు 4. విక్రమము ఈ) అగ్ని 5. సంతోషము ఉ) అడవి 6. వనము ఊ) మనస్సు 7. దహనుడు ఋ) సైన్యం
1. మది ఊ) మనస్సు 2. ఉర్వీశుడు ఇ) మహారాజు 3. దళము ఋ) సైన్యం 4. విక్రమము ఆ) పరాక్రమం 5. సంతోషము అ) వేడుక 6. వనము ఉ) అడవి 7. దహనుడు ఈ) అగ్ని
నగరం/పట్టణం/గ్రామాల్లో ప్రభుత్వం ఏ పాత్రలను పోషిస్తుండడాన్ని మీరు గమనించారో చర్చించండి.
మా ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు తపాలా కార్యాలయాలు వంటి వివిధ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నెలకొల్పి నిర్వహిస్తున్నది. రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం, ప్రభుత్వ రవాణా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి వాటి నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. ఆరోగ్య, సేవలు, పరిశుభ్రత, విద్యుత్, ప్రజా రవాణా, పాఠశాలలు వంటివి ప్రభుత్వం సదుపాయాలుగా అందిస్తున్నది. రైతులు తమ పంట భూముల్లో నీటి పారుదలకై మోటారు పంపుసెట్ల ఏర్పాటుకు ఫ్యాక్టరీలు, కార్యాలయాలు, దుకాణాలు, మార్కెట్ల వంటి వాటిని నిర్వహిస్తున్నది.
మంచి పౌరసత్వానికి గల ఆటంకాలను అధిగమించేందుకు లార్డ్ బ్రైస్ చేసిన సూచనలు ఏవి ?
మంచి పౌరసత్వానికి గల ఆటంకాలను అధిగమించేందుకు లార్డ్ బ్రైస్ రెండు సూచనలు చేయటం జరిగింది. అవి: 1) యాంత్రికపరమైనవి 2) నైతికపరమైనవి. మొదటిది రాజ్య చట్టాలకు సంబంధించినది కాగా రెండవ సూచన రాజ్య యంత్రాంగాన్ని మెరుగుపరచేందుకు తోడ్పడుతుంది.
అయస్కాంత అభివాహానికి SI ప్రమాణం A) వెబర్ B) వోల్ట్ C) ఆంపియర్ D) కూలుంట్
A) వెబర్
అక్షరం అనగా ఏమి?
అక్షరం అంటే పలికే ధ్వనికి ఏర్పరచుకొన్న గుర్తు. ఈ అక్షరాలన్నింటిని ఒకటిగా చేర్చి వర్ణమాల అంటున్నాం. కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు ఏర్పడుతాయి. కొన్ని పదాలతో వాక్యం ఏర్పడుతుంది.
క్రింది వానిలో ద్వీపకల్ప నదికి ఉదాహరణ కానిది. గోదావరి, మహానది, కృష్ణా, సింధు.
సింధు
క్రింద ఇచ్చిన మొదటి పేరా మరియు చివరి పేరా అనుసరించి మధ్య పేరా రాయండి: మొదటి పేరా: మహాపతివ్రతయు, అభిమనవతియునైన కుచేలుని భార్య దుర్భరమైన దరిద్రపీడచే క్రుంగికృశించి పోయినది. ఆకలిమంటచే అలమటించుచు, పిల్లలు ఆకులు, గిన్నెలు పట్టుకొని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నము పెట్టుమని యడిగిరి. వారి మాటలు వినినంతనే పట్టరాని దుఃఖముతో భర్త కడకరిగి “ప్రాణనాథా ! ఇంటిలో దారిద్ర్యము తాండ వించుచున్నది. దానిని తొలగించుటకు మార్గమును ఆలోచింపరైతిరి. చివరి పేరా: భార్య మాటలను విని, ఆమె ధర్మయుతమైన వాక్యములకు సంతసించి, శ్రీకృష్ణుని దర్శనము ఇహపరసాధనముగా భావించెను. “ నీవు చెప్పినట్లుగా శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుటశుభకరమే ఆచక్రపాణికిచ్చుటకేమైన కానుకగలదా ? యని అడుగగా – ఆ ఇల్లాలు కుచేలుని ఉత్తరీయపు కొగునకు కొన్ని అటుకులు ముడివేసెను. గోవింద సందర్శనమునకై వెడలుచున్న ఆనందముతో కుచేలుడు ద్వారకా పట్టణమునకై బయలుదేరెను.
మీ బాల్య మిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించి, దారిద్య్రమనెడి అంధకారము నుండి మమ్ము కాపాడుము. ఆర్తజన శరణ్యుడు, దయాసాగరుడైన శ్రీకృష్ణుడు మిమ్ములను చూచినంతనే, అపారమైన సంపదలను అనుగ్రహించును. కలలోనైన తనను తలవని నీచుని పైతము, కష్ట సమయములో ఆదుకొను జగత్ప్రభువు, ఎల్లవేళల ఆయనను భక్తితో సేవించు మీకు విశేష సంపదల ననుగ్రహింపడా ?” అని పలికెను.
కింది సంభాషణ చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. కెజియా : సుప్రజా ! సెలవుల్లో ఎక్కడి కెళ్ళావ్? సుప్రజ : నేనా ! మా కుటుంబంతో యాగంటి క్షేత్రం చూడటానికి వెళ్ళాను. కెజియా : ఓహెూ ! అలాగా ఆ పుణ్యక్షేత్రం ప్రత్యేకత ఏమిటో ! సుప్రజ : ఒకటేమిటి? అనేక ప్రత్యేకతల నిలయమది. కెజియా : నిజమా ! అవేమిటో చెప్పు. సుప్రజ : ‘యాగంటి’ కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది. అత్యంత రమణీయ ప్రదేశం, సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగరూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. కెజియా : అలాగా ! సుప్రజ . : ఔను ! ఆలయం వెలుపల ‘అగస్త్య పుష్కరిణి’ అనే కొలను ఉంది. అందులో నీళ్ళు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. అంతేకాదు అక్కడ ఉన్న నంది విగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ ఉండటం ముఖ్యమైన విశేషం. అక్కడ మూడు సహజసిద్ధంగా ఏర్పడిన గుహలున్నాయి. వీరబ్రహ్మంగారు ఆ గుహల్లోనే కూర్చుని కాలజ్ఞానం రాశారట ! పర్వీన్ : ఏంటి ? మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు. పదండి. బడికి వెళ్తాం ! (ముగ్గురూ నిష్క్రమిస్తారు) ప్రశ్నలు: అ) యాగంటిలోని ఉమామహేశ్వరాలయానికి, మిగిలిన శివాలయాలకు తేడా ఏమిటి? ఆ) అగస్త్య పుష్కరిణి ప్రత్యేకత ఏమిటి? ఇ) కాలజ్ఞానం ఎవరు రాశారు? ఈ) పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
అ) యాగంటిలోని ఉమామహేశ్వరాలయానికి, మిగిలిన శివాలయాలకు తేడా ఏమిటి? జవాబు: సాధారణంగా శివాలయాలలో శివుడు లింగరూపంలో ఉంటాడు. కాని యాగంటిలో పార్వతీ, పరమేశ్వరులు విగ్రహరూపంలో ఉంటారు. ఆ) అగస్త్య పుష్కరిణి ప్రత్యేకత ఏమిటి? జవాబు: అగస్త్య పుష్కరిణిలో నీరు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. ఇ) కాలజ్ఞానం ఎవరు రాశారు? జవాబు: వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. ఈ) పై సంభాషణ ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జవాబు: యాగంటి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది?
మొదటిజతలోని రెండు అంశాల మధ్యగల సంబంధం ఆధారంగా రెండవ జతను పూరించండి. జపాన్ : డైట్ : : రష్యా : ?
డ్యూమా.
మీ మిత్రులకు, బంధువులకు ఏఏ సందర్భాల్లో లేఖలు రాస్తారు?
ఆనందం కానీ, బాధ కానీ కలిగినపుడు బంధువులకు లేఖలు వ్రాస్తాం. ఇంట్లో పెళ్ళిళ్లు, గృహప్రవేశాలు మొదలైనవి చేసుకొనేటపుడు బంధువులకు, మిత్రులకు శుభలేఖలు పంపుతాం. ఏదైనా పిక్ నిక్ లేదా తీర్థయాత్రలకు, పెళ్లిళ్లు మొదలైన వాటికి వెళ్లి వచ్చినపుడు, మిత్రులకు, మామయ్యకు ఉత్తరాలు వ్రాస్తాను. మాకు నచ్చిన, నచ్చని విషయాలు వారితో పంచుకొంటాం.
కింది ప్రత్యక్ష కథన వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి. అ) రాజకీయపార్టీలవారు “జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర” అని ఎన్నికల ప్రకటించారు. ఆ) “సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది” అని నెహ్రూ అన్నాడు.
అ) రాజకీయపార్టీలవారు “జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర” అని ఎన్నికల ప్రకటించారు. జవాబు: రాజకీయపార్టీలవారు జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్రాయని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు. ఆ) “సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది” అని నెహ్రూ అన్నాడు. జవాబు: సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు.
ప్రశ్న : రాజులు విధించే పన్నుల వల్ల గ్రామపెద్దలు ఏ విధంగా లాభపడేవారు?
వ్యాపారస్తుల నుండి తమ తరఫున పన్నులు వసూలు చేయాలని గ్రామపెద్దని రాజులు కోరేవారు. ఈ పన్నులు వసూలు చేసినందుకు గాను రాజు వీరికి కొంత శాతం ముట్టచెప్పేవారు. ఈ విధంగా రాజులు విధించే పన్నుల వల్ల గ్రామ పెద్దలు తమ అధికారం, సంపద పెంచుకుని లాభపడేవారు.
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల ఏ కొండలలో ఉంది?
శేషాచలం కొండలు.
క్రింద ఇచ్చిన సమాచారంకి శీర్షిక రాయండి: ధర్మవర్తనులు అనగా ధర్మబద్ధంగా నడుచుకొనే మానవులు. ధర్మవర్తనులు పాలసముద్రము వంటివారు. ముష్కరులు అంటే నీచులు. ఈ నీచులు కాకులవంటివారు. ధర్మబద్ధంగా జీవించేవారిని చూసి కొందరు నీచులు మిక్కిలి హీనమైన నీచవాక్యాలతో నిందిస్తూ మాట్లాడతారు. ఆ నీచుల తిరస్కారవాక్యాల వల్ల ఆ ధర్మవర్తనులకు ఏమి లోపము రాదు. ఈ విషయంలో భాస్కరశతకకర్త, చక్కని దృష్టాంతం ఇచ్చాడు. పాలసముద్రము నిర్మలంగా ఉంటుంది. ఆ సముద్రం మీది నుండి కాకి ఎగిరివెడుతూ, ఆ పాలసముద్రంలో రేట్ట వేస్తుంది. అంతమాత్రం చేత ఆ పాలసముద్రానికి ఎలా లోటు కల్గదో, అలాగే నీచులు మాట్లాడిన నీచవాక్యాల వల్ల కూడా, ధర్మవర్తనులకు ఎటువంటి లోటు, లోపము రాదని ఆయన చెప్పాడు.
ధర్మవర్తనులకు, ముష్కరులకు తేడాలు
కింద ఇచ్చిన పద్యానికి భావం రాయండి: క. మానుగ రాజకుమారులు తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా స్నానార్థం మరిగి యందు మ హా నియమస్థుఁడయి నీళ్ళనాడుచునున్నన్.
ఒకనాడు రాకుమారులందరితో కలిసి ద్రోణుడు గంగాస్నానం చేయటానికై వెళ్లి, ఎంతోనిష్ఠతో నీటిలో స్నానం చేస్తుండగా
పల్లెటూళ్ళ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాలను వివరించండి.
పల్లెటూళ్ళలో ప్రజలు ఒకరినొకరు ఆప్యాయంగా అక్కా, బావా అంటూ పలకరించుకుంటారు. పల్లెలలో పండుగలు, ఉత్సవాలు, వేడుకగా జరుగుతాయి. సంక్రాంతి, దసరా వంటి పండుగలకు, గ్రామాలు చక్కగా అలంకరింపబడతాయి. ప్రతి ఇంటికి రంగుల పూలతోరణాలు కడతారు. వివిధ వాయిద్యాలు మ్రోగిస్తారు. గంగిరెద్దులు, గరగలు, విచిత్రవేషాలు తోలుబొమ్మలాటలు, హరికథలు వగైరా ఉంటాయి. ఈ కళలు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నాయి. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు సంక్రాంతికి ఉంటాయి. వీటివల్ల మన ప్రజలకు ప్రాచీన సంస్కృతీ వైభవం తెలుస్తుంది. గ్రామాలు పరిశుభ్రంగా ఉండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. భోగిమంటల వల్ల, ముగ్గుల వల్ల దోమలు వగైరా దూరం అవుతాయి. మనుష్యుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకుంటారు. పల్లెటూళ్ళు మన ప్రాచీన సంస్కృతీ వైభావాన్ని వెల్లడించే కేంద్రాలు. ఈ సంస్కృతీ సంప్రదాయాలను మనం కాపాడుకుంటే మన భారతదేశ ప్రాచీన నాగరికతా వైభవం కాపాడబడుతుంది.
గణాంకశాస్త్ర పరిధి గురించి సంక్లిప్తంగా వివరించండి
స్టాటిస్టిక్స్ అనే పదాన్ని ముఖ్యంగా రెండు అర్థాలలో వాడుతున్నారు. దీనికి ‘ఏకవచన’ ప్రయోగంలో గణాంక శాస్త్రమని అర్థం. దీనిని గణాంక పద్ధతులు అని కూడా పిలుస్తారు. దానికి కారణం గణాంక శాస్త్ర పరిధిలోకి వచ్చే అంశాలు ముఖ్యంగా దత్తాంశాన్ని సేకరించడం సమర్పించడం విశ్లేషణ చేయడం విపులీకరించడం మొదలగునవి. అయితే బహువచన ప్రయోగంలో స్టాటిస్టిక్స్ అనే పదానికి “సాంఖ్యదత్తాంశం” అని అంటారు. దీని పరిధిలోకి వచ్చే అంశాలు. జనాభా ఉత్పత్తి జాతీయాదాయ లెక్కలు అమ్మకాలు లాభాలు జననాలు మరణాలు అనగా జనాభా లెక్కలు మొదలగునవి.
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: ఉ. భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధజలాభిషేకముల్ భూషలు గావు పూరుషుని భూషితుఁ జేయుఁ బవిత్రవాణి, వా గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించు నన్నియున్
బంగారు ఆభరణాలు ధరించడం, కొప్పులో పువ్వులు పెట్టుకోవటం, సుగంధ ద్రవ్యాలను వాడటం, పన్నీరుతో స్నానాలు చేయటం మొదలైనవి మానవులకు నిజమైన అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటయే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు అన్నీ నశించిపోయేవే.
ఇచ్చిన పద్యానికి భావం రాయండి: ఆ.వె. భూమి నాది యన్న భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదన భీతు జూచి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినుర వేమ !
ప్రపంచాన్ని సృష్టించి యిచ్చిన రామా ! వేమా ! ఎంతోమంది జన్మించి మరణించిన ఈ భూమి నాది అంటే వాడి అమాయకత్వానికి భూమి నవ్వుతుంది. దానం చేయకుండా ధనాన్ని దాచుకొనే అశాశ్వతుడైన మనిషిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా మరణం తప్పదు కదా ! యుద్ధానికి భయపడే వాడిని చూస్తే యమధర్మరాజు నవ్వుతాడు.
ఆవృత బీజ మొక్క జీవిత చక్రంలోని దశల గురించి క్లుప్తంగా రాయండి.
ఆవృతబీజ మొక్క జీవిత చక్రములో రెండు దశలు ఏకాంతరంగా ఏర్పడుతూ ఉంటాయి. అవి : 1) సిద్ధ బీజదదశ 2) సంయోగ బీజదదశ. 1) సిద్ధ బీజద దశ : జీవిత చరిత్రలో ఇది ద్వయస్థితిక దశ. సంయుక్త బీజం నుండి ఏర్పడుతుంది. ఈ మొక్కపై ప్రత్యుత్పత్తి అంగాలు ఏర్పడతాయి. 2) సంయోగ బీజదదశ : ఇది ఏకస్థితిక దశ. సిద్ధబీజ మాతృ కణాలు క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడిన సిద్ధబీజం నుంచి ఈ దశ ఏర్పడుతుంది. ఆవృతబీజాలలో సిద్ధబీజ మాతృ కణాలు రెండు రకములు. సూక్ష్మ సిద్ధబీజ మాతృకణాలు పరాగకోశములోను, స్థూలసిద్ధబీజ మతృకణాలు అండములోని అండాంతః కణజాలంలోను అభివృద్ధి చెందుతాయి. ఈ మతృకణాలలో క్షయకరణ విభజన జరగటం ద్వారా సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు ఏర్పడతాయి. సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు వరుసగా పురుష, స్త్రీ సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి. పురుష, స్త్రీ సంయోగ బీజదాలు వరుసగా పురుష, స్త్రీ బీజ కణాలను ఏర్పరుస్తాయి. పురుష సంయోగ బీజము, స్త్రీ బీజ కణముతో సంయోగము చెంది ద్వయస్థితిక సంయుక్త బీజము ఏర్పడుతుంది. అనేక సమవిభజనల అనంతరము విత్తనములో సంయుక్త బీజము పిండముగా ఏర్పడును. విత్తనము మొలకెత్తి సిద్ధబీజద మొక్క ఏర్పడును.
జ్వరం వచ్చినపుడు డాక్టర్లు నూనెలో వేయించిన వేపుళ్ళు తినకూడదంటారు. ఎందుకో కారణాలు తెల్పండి.
జ్వరముగా ఉన్నప్పుడు రోగులకు తేలికపాటి ఆహారమును తీసుకోవాలని సూచిస్తారు. జ్వరంగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ ఎక్కువ పోషక విలువలు కలిగిన మాంసం, చేపలు తదితరములైన వేయించిన పదార్థములను తేలికగా జీర్ణం చేసుకోలేదు. వేపుడు పదార్థములు జీర్ణ వాహికపై అదనపు శ్రమను కలుగజేసే లక్షణములు కలిగి ఉంటాయి. అందువలన డాక్టర్లు వేపుళ్ళు తినకూడదని అంటారు.
ద్వంద్వ సమాసం గురించి రాయండి మరియు ఉదాహరణలు రాయండి.
ద్వంద్వ సమాసం: ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది ద్వంద్వ సమాసం. అంటే సమాసం లోని పూర్వపదం, ఉత్తరపదం రెండు పదాల అర్థాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. ఉదా: 1. సీతారాములు = సీతయును, రాముడును 2. భయభక్తులు = భయమును, భక్తియును 3. తల్లిదండ్రులు = తల్లియును, తండ్రియును
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి నియంత్రిత శృంఖత చర్య అనింత్రిత శృంఖల చర్యలలో న్యూట్రాన్ ప్రత్యుత్పాదక గుణకం విలువ ఎంత?
నియంత్రిత శృంఖల చర్యలో ప్రత్యుత్పాదక గుణకం K = 1. అనింత్రిత శృంఖల చర్యలో ప్రత్యుత్పాదక గుణకం K > 1.
బాల త్రిపురసుందరి స్తోత్రం రాయండి
కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం నితంబ జిత భూధారం సురనితంబిని సేవితాం నవంబురుహ లోచనం అభినవాంబుదా శ్యామాలాం త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే కదంబవన వాసినీం కనకవల్లకీ ధారణీం మహార్షమణి హారిణీం ముఖసముల్ల సద్వారుణీం దయా విభవ కారిణీం విశదలోచనీం చారిణీ త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయ కందబ వన శాలయా కుఛ బరోల్ల సన్మాలయా కుచో పామిత శైలయా గురుకృపాల సద్వేలయా మదారుణ కపోలయా మధురగీత వాచాలయా కయాపి ఘన లీలయా తపచితవయం లీలయా కందబ వన మధ్యగం కనక మండలోపస్థితాం షడంబ రుహ వాసినీం సతత సిద్దసౌదామినీం విడంబిత జపారుచిం వికచచంద్ర చూడామణీం త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయ కుచాంచిత విపంచితాం కుటిల కుంతలాలంకృతం కుశే శయనివాసినీం కుటిల చిత్తవిద్వేషణీం మదారణ విలోచనాం మనసి జారి సంమోహినీం మాతంత ముని కన్యకాం మధుర భాషిణి మాశ్రయే స్మరతే ప్రథమ పుష్టిణీం రుధిర బిందు నీలాంబరాం గ్రుహిత మధు పాత్రికాం మధు విఘూర్ణ నేత్రంచలం ఘనసథిన భారోనతాం గలిత చూలికాం శ్యామలాం త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే సకుంకుమ విలేపనాం అళి క చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సచర చాప పాశాంకుశాం అశేష జన మోహినీం అరుణ మాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం పురందర పురంధ్రికాం చికుర బంధ సైరంధ్రికాం పితామహ పతివ్రతాం పటు పటీర చర్చారతాం ముకుంద రమణీమణి లసదలంక్రియా కారిణీం భజామి భువానాంబికాం సురవధూటితా చేటికాం ప్రథమ శైలపుత్రీచః వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం||
‘కాటుక గ్రుక్కినట్టి కరవటంబున జగదండ ఖండమమెరె’ ఈ మాటలు కవి ఏ సందర్భంలో పేర్కొన్నాడో వివరించండి. ఈ పోలికను విశ్లేషించండి.
సంధ్యా సమయం తర్వాత విశ్వమంతా చీకటి వ్యాపించిందని చెబుతున్న సందర్భంలో కవి ఈ మాటలను పేర్కొన్నాడు. చీకటిలో భూమి, ఆకాశం, దిక్కులూ అన్నీ కలిసి పోయాయి. అప్పుడు బ్రహ్మాండ ఖండం కాటుక నింపిన పెద్ద భరిణెలా ఉందన్నాడు. బ్రహ్మాండంలో 14 లోకాలుంటాయి. పై లోకాలు 7. క్రింది లోకాలు 7. మధ్యలోనిది భూలోకం. చీకటి కేవలం భూగోళానికి మాత్రమే ఏర్పడింది. అందుకే పైన, క్రింద సమానమైన మూతలు గల భరిణెతో భూగోళాన్ని పోల్చాడు. దీనిద్వారా ఎఱ్ఱనగారి పరిశీలనా దృష్టి, లోకజ్ఞానం వ్యక్తమౌతున్నాయి.
నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించి వ్యాసం రాయండి.
నేడు మనుష్యులంతా నగరాల్లోనే జీవించాలని, తాపత్రయపడుతున్నారు. నగరాల్లో ఉన్నత విద్య, ఆధునిక వైద్య సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అన్ని తరగతుల ప్రజలకూ అక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి. అందువల్ల గ్రామీణ ప్రజలందరూ, నగరాలకు ఎగబ్రాకుతున్నారు. పై కారణాల వల్ల నగరాల్లో జనాభా పెరిగి పోయింది. నగరాల్లోకి వచ్చే ప్రజలకు ఉండడానికి ఇళ్ళు సరిపడ దొరకడం లేదు. నగరాల్లో ప్రజలు నడచి వెళ్ళడానికి సైతం, రోడ్లు చాలటల్లేదు. సిటీ బస్సులు ఖాళీలుండటం లేదు. తరచుగా ట్రాఫిక్కు జామ్లు అవుతున్నాయి. త్రాగడానికి నగరాల్లో సరిపడ మంచినీరు దొరకడం లేదు. నిత్యావసరాలకు సహితం, నీరు కొనవలసి వస్తోంది. ఆహారపదార్థాల ధరలు, పెరిగిపోతున్నాయి. సామాన్య మానవులు, హోటళ్ళలో ఏమీ కొని తినే పరిస్థితి లేదు. వారికి వైద్య ఖర్చులు పెరిగి పోతున్నాయి. సామాన్యులు నగరాల్లో, మురికివాడల్లో, గుడిసెల్లో బ్రతకవలసి వస్తోంది. తక్కువ ఆదాయం వారి బ్రతుకులు నగరాల్లో కుక్కల కంటే హీనంగా ఉంటోంది. నగరాల్లో ఇండ్ల స్థలాలు, లేక, చెరువులు కప్పి ఇళ్ళు కడుతున్నారు. వర్షాలు వస్తే ఆ ఇళ్ళు మునిగి పోతున్నాయి. నగరాల్లో ఉద్యోగాలు సహితం, తేలికగా దొరకడం లేదు. పోటీ పెరిగిపోయింది. వలసలు వచ్చినవారు, తమ పిల్లలను కాన్వెంటు ఫీజులు కట్టి చదివించలేక పోతున్నారు. వారు కార్పొరేట్ వైద్యశాలల ఫీజులు కట్టి వైద్యం చేయించుకోలేక పోతున్నారు. నగరాలలో ఏదో బ్రతకాలని వచ్చిన గ్రామీణులు, ఉభయ భ్రష్టులయి, నగరాలలో ఇలా కష్టనష్టాలకు గురి అవుతున్నారు.
పాఠశాలలో కావలసిన సౌకర్యాలను కోరుతూ విద్యాశాఖాధికారికి లేఖ.
ఉట్నూరు, X X X X X. ఆదిలాబాద్ విద్యాశాఖాధికారి గారి దివ్యసముఖమునకు, అయ్యా, నేను ఉట్నూరు ఎస్.ఆర్.యం. హైస్కూలులో పదవతరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులందరికి సరిపడ తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్నాం. అలాగే మా పాఠశాలకు గ్రంథాలయ వసతి కాని, లేబరేటరి వసతికాని లేదు. వీటికి తోడు ఉపాధ్యాయుల కొరత కూడా కలదు. అందువల్ల మా కెంతో అసౌకర్యంగా ఉంది. తమరు దయయుంచి పై విషయాలను దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేసి మా విద్యాభివృద్ధికి సహాయపడవలసినదిగా ప్రార్థించుచున్నాను. ఇట్లు, తమ విధేయుడు, ఆర్. రమేష్. చిరునామా : జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, ఆదిలాబాద్, ఆదిలాబాద్ జిల్లా.
స్వల్పకాలిక విత్తము గురించి సంక్లిప్తంగా వివరించండి
ఈ తరహా విత్తాన్ని స్వల్ప కాలానికి అంటే సంవత్సరము అవసరాల నిమిత్తము సేకరించడము జరుగుతుంది. ఈ విత్తాన్ని సేకరించడానికి వనరులు వాణిజ్య బ్యాంకుల నుంచి ఋణాలు వాయిదా పరపతి ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు వాణిజ్య పత్రాలు
వర్తమానకాల క్రియ గురించి రాసి ఉదాహరణలు ఇవ్వండి.
వర్తమానకాల క్రియ – జరుగుచున్న పనిని తెలుపు క్రియ. ఉదా: వెళ్ళుచున్నావు, వ్రాయుచున్నాడు, తినుచున్నాము.
x – y = 7 ను ఖండించే రేఖ ___________ A) x + y = 7 B ) 2x – 2y = 10 C) 3x – 3y = 21 D) ఏదీకాదు
A) x + y = 7 → క్రింది దత్తాంశాన్ని చదివి 141, 142 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఒక రోజు 1 కిలో బంగాళాదుంపలు మరియు 2 కిలోల టమోటాల ధర ₹ 30 రెండు రోజుల తర్వాత 2 కిలోల బంగాళదుంపలు మరియు 4 కిలోల టమోటాల ధర ₹ 66 గా ఉన్నది.
మందుల దుర్వినియోగాన్ని నిర్వచించండి.
వ్యాధులను నివారించి తద్వారా శారీరక, మానసిక సుఖశాంతులు పొందడానికి మనం మందులు వాడుతున్నాం. వీటిని వైద్యపరంగా కాకుండా వేరే విధంగా వినియోగించడం వల్ల శారీరక లేదా మానసిక రుగ్మతలకు గురవుతున్నాం. దీనినే మందుల దుర్వినియోగం అంటారు. ఉదా : హోలీ రోజున వాడే బంగ్, డాక్టర్ సలహాపై మత్తుకు వాడే వివిధ మందులు – డాక్టరు ద్వారా కాకుండా విపరీతంగా తీసుకోవడం.
సీసము ఛందస్సు గురించి క్లుప్తంగా వివరించండి.
సీసము : ప్రతి పాదమునందును ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉండును. ఒకటి, మూడు, అయిదు, ఏడు గణముల ప్రథమాక్షర ములకు యతి చెల్లును. ప్రాస నియమము లేదు. ప్రాసయతి వేయవచ్చును. నాలుగుపాదాల చివర ఆటవెలదిగాని, తేటగీతిగాని తప్పక చేర్చవలెను. ప్రతి పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి, రెండు భాగాలుగా చేయవచ్చును. మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు, రెండో భాగంలో రెండు సూర్యగణాలు వరుసగా ఉండును.
గ్లైకోసైడిక్, పెప్టైడ్, ఫాస్ఫోడైఎస్టర్ బంధాలను పటాలలో విశదీకరించండి.
గ్లైకోసైడిక్ బంధము : ప్రక్కప్రక్కన ఉండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే రసాయన బంధం. పెప్టైడ్ బంధము : ప్రోటీనులోని అమైనో ఆమ్లాల మధ్య ఉన్న బంధము ఫాస్పోడై ఎస్టర్ బంధము : ఫాస్ఫేట్ అణువు చక్కెరలోని హైడ్రాక్సిల్ గ్రూప్ మద్యకాల బంధమును ఎస్టర్ బంధం అంటారు. ఫాస్పేటి కిరువైపులా ఉన్న ఒక్కొక్కొ ఎస్టర్ బంధంను ఫాస్ఫోడై ఎస్టర్ బంధం అంటారు.
ఎదురుపద్దు అంటే ఏమిటి?
ఒకే వ్యవహారాన్ని మూడు వరుసల గల నగదు చిట్టాలో డెబిట్వైపు, క్రెడిట్వైపు నమోదు చేస్తే దానిని ఎదురుపద్దు అంటారు. ఎదురుపద్దు నగదు పుస్తకములో రెండు ఖాతాలను అనగా నగదు, బాంకు ఖాతాలను ప్రభావితము చేస్తుంది. నగదుగాని, చెక్కులుగాని బాంకులో డిపాజిట్ చేసినపుడు, ఆఫీసు అవసరాలకై బాంకు నుంచి నగదు తీసినపుడు ఎదురుపద్దు ఏర్పడుతుంది. ఈ రెండు సందర్భాలలోను నగదు, బాంకు వరుసలలోను పద్దులు వ్రాయాలి.
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి రేటు నియమంలోని గాఢత పదాల ఘాతాంకాలు, చర్య స్థాయికియోమెట్రిక్ సమీకరణంలోని గుణకాలు సమానంగా లేని ఒక చర్యను తెలపండి.
రేటు నియమంలోని గాఢత పదాల ఘాతాంకాలు, చర్య స్థాయికియోమెట్రిక్ సమీకరణంలోని గుణకాలు సమానంగా లేని చర్యకు ఉదాహరణ క్రింద ఇవ్వబడినది. CHCl3 + Cl2 → CCl4 + HCl రేటు = k[CHl3] [Cl2]½ CH3COOC2H5 + H2O → CH3COOH + C2H5OH రేటు = k[CHCOOC2H5] [H2O]0
సృజనాత్మకతకు ఉన్న పార్శ్వాలను వివరించండి. జతపరచడం
సృజనాత్మకతకు చాలా కోణాలున్నాయి. అవి నూతన ఆవిష్కరణలు కావచ్చు. కొత్త ప్రయోగాలు కావచ్చు. లేదా ఉన్న వాటినే కొత్తగా తెలుసుకోవడం కూడా కావచ్చు. ఉన్న భావాలను తిరిగి ప్రయోగించడం ద్వారా, ద్వారా, మార్చడం ద్వారా కొత్త విషయాలు కనుక్కోగలిగే సామర్థ్యం, ఊహించగలిగే సామర్థ్యాలను సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అనేది ఒక వైఖరి. అది కొత్తదనాన్ని, మార్పునీ అంగీకరించగలిగే భావాలతో, ఊహలతో కూడిన మానసిక స్థితి. జీవనాన్ని విజయవంతంగా గడపడం, మంచిదైన ప్రతిదాన్నీ అనందిస్తూనే దాన్ని మరింత మంచిగా చేయగలిగే అవకాశాలకోసం వెదకడాన్ని సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే కష్టించి పనిచేయటం. మన భావాల్నీ, మనకు లభ్యమవుతున్న పరిష్కారాల్నీ క్రమంగా మార్చుకుంటూ, మరింత పదును పెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళడం. దేన్నైనా అందరూ చూస్తున్నట్లే చూసి ఆ చూసిన దాని గురించి మిగిలిన వారికంటే భిన్నంగా ఆలోచించటమే సృజనాత్మకత ముఖ్యలక్షణం.