sloka
stringlengths
77
449
verse
int64
1
78
chapter
int64
1
18
audio
stringlengths
59
63
w2w_meaning
stringlengths
213
1.29k
te_translation
stringlengths
127
741
commentry
stringlengths
0
11.1k
ధృతరాష్ట్ర ఉవాచ । ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః । మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।
1
1
https://www.holy-bhagava…udio/001_001.mp3
ధృతరాష్ట్ర ఉవాచ — ధృతరాష్ట్రుడు పలికెను; ధర్మ-క్షేత్రే — ధర్మ భూమి; కురు-క్షేత్రే — కురుక్షేత్రం వద్ద; సమవేతాః — చేరియున్న; యుయుత్సవః — యుద్ధ కాంక్షతో; మామకాః — నా పుత్రులు; పాండవా — పాండు పుత్రులు; చ — మరియు; ఏవ — నిజముగా; కిం — ఏమి; అకుర్వత — చేసినారు; సంజయ — ఓ సంజయా.
BG 1.1: ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి, మరియు యుద్ధ కాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసిరి?
ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డి వాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించిన వాడు. తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపథం నుండి తప్పించి, న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది. ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండు పుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు. తన అంతఃకరణలో తప్పు చేసిన భావన, అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేట్టు చేసింది, అందుకే కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏమి జరుగుతోందని సంజయుడిని అడిగాడు. ఈ శ్లోకంలో, ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఏమిటంటే, యుద్ధభూమిలో కూడి ఉండి, తన పుత్రులు మరియు పాండురాజు పుత్రులు ఏమి చేసారు? అని. ఇప్పుడు, యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా. వారు సహజంగానే యుద్ధమే చేస్తారు. మరి ధృతరాష్ట్రుడికి, వారందరూ ఏమి చేసారని ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది? అతని సందేహాన్ని తను ఉపయోగించిన పదాల ద్వారా గ్రహించవచ్చు—ధర్మక్షేత్రే, అంటే, ధర్మ భూమి. కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశం. యజుర్వేదం లోని శతపథ బ్రహ్మన్, యందు ఇలా చెప్పబడింది: కురుక్షేత్రం దేవ యజనం. ‘కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం.’ కాబట్టి అది ధర్మాన్ని వర్ధిల్లచేసిన ప్రాంతం. పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలో పాప-పుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులని సంహరించటం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఈవిధంగా ఆలోచించి, వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు. ఆ సంభావ్యత ధృతరాష్ట్రుడికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. తన కుమారులు శాంతి-ఒప్పందం కుదుర్చుకుంటే, పాండవులు ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు. కాబట్టి యుద్ధం జరగటమే మంచిది అని తలచాడు. అదే సమయంలో, యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో, తన పుత్రుల ప్రారబ్ధం ఎలా ఉందో తెలుసుకోగోరాడు. అందుకే ఇరుసైన్యాలు సన్నద్ధమైయున్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలని సంజయుడిని అడిగాడు.
సంజయ ఉవాచ । దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా । ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। 2 ।।
2
1
https://www.holy-bhagava…udio/001_002.mp3
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; దృష్ట్వా — గమనించిన పిదప; తు — కానీ; పాండవ-అనీకం — పాండవ సైన్యమును; వ్యూఢం — సైనిక వ్యూహ రచనతో నిలిచి యున్న; దుర్యోధనః — రాజైన దుర్యోధనుడు; తదా — అప్పుడు; ఆచార్యం — గురువు గారు; ఉపసంగమ్య — సమీపించి; రాజా — రాజు; వచనం — మాటలను; అబ్రవీత్ — పలికెను.
BG 1.2: సంజయుడు పలికెను: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి, ఈ విధంగా పలికెను.
తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధ్రువీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రశ్న వెనకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు, ఖచ్చితంగా యుద్ధం జరగబోతోందని, పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు. అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా, సంభాషణ విషయాన్ని మరల్చాడు. ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాల దుష్ట, క్రూర స్వభావం కలవాడు. ధృతరాష్ట్రుడు అంధుడు అవటం వలన, అతని తరఫున, నిజానికి దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు. అతను పాండవ ద్వేషి. ఎలాగైనా పాండవులని అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు. తన సైన్యాన్ని ఎదుర్కోగలిగినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు, అని అనుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది, మరియు అపారమైన పాండవుల సైనిక సామర్ధ్యాన్ని చూచి వ్యాకులతతో ఆందోళన చెందాడు. దుర్యోధనుడు తన యుద్ధ-గురువు ద్రోణాచార్యుని సమీపించటం, యుద్ధ పరిణామం మీద అతనికి వున్న భయాన్ని తెలియపరుస్తోంది. నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరకి వెళ్ళినా, అతని నిజమైన ఆంతర్యం తన ఆందోళనని ఉపశమనం చేసుకోవటమే. ఈ ఇప్పుడు దుర్యోధనుడు తదుపరి శ్లోకంతో మొదలిడి తొమ్మిది శ్లోకాలని పలికెను.
పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ । వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।।
3
1
https://www.holy-bhagava…udio/001_003.mp3
పశ్య — చూడుము; ఏతాం — ఈ యొక్క; పాండు-పుత్రాణామ్ — పాండురాజు పుత్రులు; ఆచార్య — గురువర్య; మహతీం — గొప్పదైన; చమూమ్ — సైన్యము; వ్యూఢాం — సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన; ద్రుపద-పుత్రేణ — ద్రుపదుని పుత్రుడు ధృష్టద్యుమ్నుడు; తవ శిష్యేణ — మీ శిష్యుని చేత; ధీ-మతా — తెలివైనవాడు.
BG 1.3: దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.
తన అస్త్రవిద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని, యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు, ఒక యజ్ఞం చేసి, ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. ద్రోణాచార్యుడికి ధృష్టద్యుమ్నుడి జన్మ ప్రయోజనం తెలిసినా సరే, తన వద్దకు సైనిక విద్యని అభ్యసించడానికి వచ్చినప్పుడు, పెద్ద మనసుతో, ధృష్టద్యుమ్నుడికి తనకు తెలిసిన విద్యనంతా సంకోచించకుండా బోధించాడు. ఇక ఇప్పుడు యుద్ధంలో, ధృష్టద్యుమ్నుడు, పాండవ పక్షంలో సర్వ సైన్యాధిపతిగా చేరి ఉన్నాడు మరియు పాండవుల సేనా-వ్యూహాన్ని ఏర్పాటు చేసింది కూడా అతడే. ఆయన (ద్రోణుడు) గతంలో చూపిన కనికరమే ప్రస్తుత సంకట స్థితికి కారణమయిందని తన గురువుగారికి సూచిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు ఇంకా మరింత కనికరం చూపించకుండా పాండవులతో యుద్ధం చేయాలని సూచిస్తున్నాడు, దుర్యోధనుడు.
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।। ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ । పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।। యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
4
1
https://www.holy-bhagava…/001_004-006.mp3
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు; ధృష్టకేతు — ధృష్టకేతుడు; చేకితానః — చేకితానుడు; కాశిరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు; కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు; చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు; యుధామన్యుః — యుధామన్యుడు; చ — మరియు; విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః — ఉత్తమౌజుడు; చ — మరియు; వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః — సుభద్ర కుమారుడు; ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును; ఏవ — నిజంగా; మహా-రథాః — పదివేలమంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు
BG 1.4-6: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.
రాబోయే పెను విపత్తు భయానికి, దుర్యోధనుడికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథులను (పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు) చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।। ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ । పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।। యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
5
1
https://www.holy-bhagava…/001_004-006.mp3
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు; ధృష్టకేతు — ధృష్టకేతుడు; చేకితానః — చేకితానుడు; కాశిరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు; కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు; చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు; యుధామన్యుః — యుధామన్యుడు; చ — మరియు; విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః — ఉత్తమౌజుడు; చ — మరియు; వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః — సుభద్ర కుమారుడు; ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును; ఏవ — నిజంగా; మహా-రథాః — పదివేలమంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు
BG 1.4-6: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.
రాబోయే పెను విపత్తు భయానికి, దుర్యోధనుడికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథులను (పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు) చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।। ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ । పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।। యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
6
1
https://www.holy-bhagava…/001_004-006.mp3
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు; ధృష్టకేతు — ధృష్టకేతుడు; చేకితానః — చేకితానుడు; కాశిరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు; కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు; చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు; యుధామన్యుః — యుధామన్యుడు; చ — మరియు; విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః — ఉత్తమౌజుడు; చ — మరియు; వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః — సుభద్ర కుమారుడు; ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును; ఏవ — నిజంగా; మహా-రథాః — పదివేలమంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు
BG 1.4-6: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.
రాబోయే పెను విపత్తు భయానికి, దుర్యోధనుడికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథులను (పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు) చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ । నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।। 7 ।।
7
1
https://www.holy-bhagava…udio/001_007.mp3
అస్మాకం — మన; తు — కానీ; విశిష్టాః — శ్రేష్ఠమైన వారు; యే — ఎవరు; తాన్ — వారిని; నిబోధ — తెలుసుకొనుము; ద్విజ-ఉత్తమ — బ్రాహ్మణ శ్రేష్ఠుడా; నాయకాః — నాయకులు; మమ — మన; సైన్యస్య — సైన్యానికి; సంజ్ఞా-అర్థం — ఎఱుక కొరకు; తాన్ — వారిని; బ్రవీమి — తెలుపుతున్నాను; తే — మీకు.
BG 1.7: ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎఱుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.
దుర్యోధనుడు, కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ (ద్విజులలో అంటే బ్రాహ్మణులలో ఉత్తముడైన వాడు) అని సంబోధించాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తి రీత్యా యోధుడు కాడు; సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడి లాగా దుర్యోధనుడు, తన గురువుగారి విధేయతపట్లనే సిగ్గుమాలిన సందేహాలను కలిగి ఉన్నాడు. దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూడార్థం ఏమిటంటే, ఒకవేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడక పోతే అతను దుర్యోధనుడి రాజ మందిరంలో విలాస భోజనానికి ఆశపడే సామాన్య బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు అని. ఈ విధంగా మాట్లాడిన దుర్యోధనుడు, తన స్వంత ఉత్సాహాన్ని మరియు తన గురువు గారి యొక్క ఉత్సాహాన్ని పెంచటానికి తమ పక్షంలో ఉన్న మహాయోధుల గురించి పేర్కొనటం మొదలు పెట్టాడు.
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః । అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ।। 8 ।।
8
1
https://www.holy-bhagava…udio/001_008.mp3
భవాన్ — స్వయంగా మీరు; భీష్మః — భీష్ముడు; చ — మరియు; కర్ణః — కర్ణుడు; చ — మరియు; కృపః — కృపాచార్యుడు; చ — మరియు; సమితింజయః — యుద్ధంలో విజయుడు; అశ్వత్థామా — అశ్వత్థామ; వికర్ణ — వికర్ణుడు; చ — మరియు; సౌమదత్తిః — భూరిశ్రవుడు (సోమదత్తుని కుమారుడు); తథా — ఈ విధంగా; ఏవ — కూడా; చ — మరియు.
BG 1.8: మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః । నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ।। 9 ।।
9
1
https://www.holy-bhagava…udio/001_009.mp3
అన్యే — ఇతరులు; చ — కూడా; బహవః — చాలామంది; శూరాః — వీర యోధులు; మత్-అర్థే — నా కోసం; త్యక్త-జీవితాః — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; నానా-శస్త్ర-ప్రహరణాః — అనేక ఆయుధములు కలిగినవారు; సర్వే — అందరూ; యుద్ధ-విశారదాః — యుద్దరంగంలో నిపుణులు.
BG 1.9: ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దంగా వున్నారు. వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగిఉన్నారు.
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్। పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।। 10 ।।
10
1
https://www.holy-bhagava…udio/001_010.mp3
అపర్యాప్తం — అపరిమితమైన; తత్ — అది; అస్మాకం — మన యొక్క; బలం — బలము; భీష్మ — భీష్మ పితామహుడిచే; అభిరక్షితాం — సురక్షితంగా ఏర్పాటుచేయబడ్డ; పర్యాప్తం — పరిమితమైన; తు — కానీ; ఇదం — ఈ; ఏతేషాం — వారియొక్క; బలం — బలము; భీమ — భీముడు; అభిరక్షితాం — సావధానంగా రక్షింపబడుచున్న.
BG 1.10: మన సైనిక బలం అపరిమితమైనది, మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటుచేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం, పరిమితమైనది.
దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు, అంత్యకాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తనసైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది. భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం. పాండవపక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు, భీష్ముడి సామర్ధ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు. కానీ, భీష్ముడు, కౌరవులకి, పాండవులకీ ఇరువురికీ కూడా పితామహుడే, ఇరు పక్షాల క్షేమం కోరేవాడే. పాండవులపై అతనికి (భీష్ముడికి) వున్న ప్రేమ, తనను మనస్పూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో, భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు, అని భీష్ముడికి తెలుసు. కానీ, హస్తినాపుర వాసులకి మరియు కౌరవులపట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా, భీష్ముడు, పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః । భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ।। 11 ।।
11
1
https://www.holy-bhagava…udio/001_011.mp3
అయనేషు — వ్యూహాత్మక స్థానాల యందు; చ — మరియు; సర్వేషు — అన్నీ; యథా-భాగం — మీ మీ స్థానంలో; అవస్థితాః — నిలిచివుండి; భీష్మం — భీష్మ పితామహుడిని; ఏవ — మాత్రమే; అభిరక్షంతు — రక్షించండి; భవంతః — మీరు; సర్వే — అందరు; ఏవ హి — కూడా.
BG 1.11: కావున, కౌరవ సేనానాయకులందరికీ, మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.
శత్రువులకు అసాధ్యుడైన భీష్ముడిని, తన సైన్యానికి స్ఫూర్తిగా, శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు. కాబట్టి, సేనావ్యూహంలో తమ తమ కీలక స్థానాలని కాపాడుకుంటూనే, భీష్ముడిని పరిరక్షించమని తన సేనా నాయకులని కోరాడు.
తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః । సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ।। 12 ।।
12
1
https://www.holy-bhagava…udio/001_012.mp3
తస్య — అతనికి; సంజనయన్ — కలిగించుచు; హర్షం — సంతోషమును; కురు-వృద్ధః — కురు వంశములో వృద్ధుడు (భీష్ముడు); పితామహః — తాత గారు; సింహ-నాదం — సింహ గర్జన; వినద్య — శబ్దం చేసి; ఉచ్చైః — పెద్ద స్వరంతో; శంఖం — శంఖమును; దధ్మౌ — మ్రోగించెను; ప్రతాప-వాన్ — తేజోవంతమైన.
BG 1.12: అప్పుడు, కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు, సింహంలా గర్జించాడు, మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ, దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను.
భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు, మరియు సహజంగా అతని మీద వున్న వాత్సల్యంతో, అతన్ని సంతోషపరచటానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి పక్షంలో ఉండటంచే, దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా, తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియచేసాడు. అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం.
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః । సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ।। 13 ।।
13
1
https://www.holy-bhagava…udio/001_013.mp3
తతః — ఆ తరువాత; శంఖాః — శంఖములు; చ — మరియు; భేర్యః — భేరీలు; చ — మరియు; పణవ-ఆనక — డోళ్ళు మరియు ఢంకాలు; గో-ముఖాః — కొమ్ము వాద్యములు; సహసా — అకస్మాత్తుగా ఒక్కపెట్టున; ఏవ — నిజంగా; అభ్యహన్యంత — పెద్దగా మ్రోగినవి; సః — ఆ యొక్క; శబ్దః — శబ్దము; తుములః — భయానకముగా; అభవత్ — ఉండెను.
BG 1.13: ఆ తరువాత, శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు, మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి, మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను.
యుద్ధానికి భీష్ముడి యొక్క గొప్ప ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణగొణ ధ్వని చేసారు. పణవ అంటే ఢంకాలు, ఆనక అంటే డోళ్ళు/ఢంకాలు, మరియు గో-ముఖ అంటే కొమ్ము వాద్యములు. ఇవన్నీ వాద్య పరికరములే, మరియు వీటన్నిటీ ఒక్కుమ్మడి శబ్దం మిక్కిలి కోలాహలాన్ని కలుగచేసింది.
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ । మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ।। 14 ।।
14
1
https://www.holy-bhagava…udio/001_014.mp3
తతః — ఆ తరువాత; శ్వేతైః — తెల్లని; హయైః — గుఱ్ఱములు; యుక్తే — కట్టబడిన; మహతి — శ్రేష్ఠమైన; స్యందనే — రథము; స్థితౌ — కూర్చొనిఉన్న; మాధవః — శ్రీ కృష్ణుడు, సౌభాగ్యదేవత అయిన లక్ష్మీదేవి భర్త; పాండవః — అర్జునుడు; చ — మరియు; ఏవ — కూడా; దివ్యౌ — దివ్యమయిన; శంఖౌ — శంఖములను; ప్రదధ్మతుః — పూరించారు.
BG 1.14: ఆ తరువాత, పాండవ సైన్యం మధ్యలోనుండి, తెల్లని గుఱ్ఱములు పూన్చి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న, మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు.
కౌరవ సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన పిదప, శ్రీ కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు, అద్భుతమైన రథంలో కూర్చొని వుండి, భయరహితులై, తమ తమ శంఖములను శక్తివంతంగా పూరించారు. దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది. సంజయుడు శ్రీ కృష్ణుడికి 'మాధవ' అన్న పేరు వాడాడు. 'మా' అంటే, లక్ష్మీదేవిని సూచిస్తుంది; 'ధవ' అంటే భర్త అని. శ్రీ కృష్ణుడు తన విష్ణు మూర్తి రూపంలో, ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీ దేవికి భర్త. సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని, వారు త్వరలో యుద్ధంలో విజేయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం సూచిస్తున్నది. పాండవులు అంటే పాండురాజు కుమారులు అని. ఐదుగురు అన్నదమ్ముల్లో ఎవరినైనా 'పాండవ' అని సంబోధించవచ్చు. ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది. అతను కూర్చున్న అద్భుతమైన రథం అతనికి అగ్ని దేవుడిచే ప్రసాదించబడినది.
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః । పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ।। 15 ।।
15
1
https://www.holy-bhagava…udio/001_015.mp3
పాంచజన్యం — పాంచజన్యం అని పేరు గల శంఖము; హృషీక-ఈశః — శ్రీ కృష్ణుడు, మనస్సు, ఇంద్రియముల అధిపతి; దేవదత్తం — దేవదత్తం అని పేరు గల శంఖము; ధనంజయః — అర్జునుడు, ఐశ్వర్యమును జయించేవాడు; పౌండ్రం — పౌండ్రం అని పేరుగల శంఖము; దధ్మౌ — పూరించెను; మహా-శంఖం — ఒక బ్రహ్మాండమైన శంఖమును; భీమ-కర్మా — అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి; వృక-ఉదరః — భీముడు, గొప్పగా భుజించేవాడు.
BG 1.15: హృషీకేశుడు, పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు, మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి భీముడు, పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను.
శ్రీ కృష్ణుడికి వాడబడిన 'హృషీకేశః' అన్న పదం, ఆయన మనస్సు మరియు ఇంద్రియములకు అధిపతి అని సూచిస్తుంది. శ్రీ కృష్ణుడు తన యొక్క, మరియు అందరి యొక్క మనసు, ఇంద్రియములకు సర్వోన్నత అధిపతి. తన అద్భుతమైన లీలలను ఈ భూలోకంలో ప్రదర్శించేటప్పుడు కూడా తన మనస్సు, ఇంద్రియముల పై కృష్ణుడు, పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు.
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః । నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।। కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః । ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।। ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే । సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।
16
1
https://www.holy-bhagava…/001_016-018.mp3
అనంత-విజయం — అనంతవిజయం అని పేరు గల శంఖము; రాజా — రాజు; కుంతీ-పుత్రః — కుంతీ దేవి పుత్రుడు; యుధిష్ఠిరః — యుధిష్ఠిరుడు; నకులః — నకులుడు; సహదేవః — సహదేవుడు; చ — మరియు; సుఘోష-మణిపుష్పకౌ — సుఘోషము, మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు; కాశ్యః — కాశీ రాజు; చ — మరియు; పరమ-ఇషు-ఆసః — శ్రేష్ఠమైన విలుకాడు; శిఖండీ — శిఖండి; చ — మరియు; మహా-రథః — పదివేల సామాన్య యోధుల బలానికి ఒక్కరిగా సరితూగే యోధులు; ధృష్టద్యుమ్నః — ధృష్టద్యుమ్నుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; సాత్యకిః — సాత్యకి; చ — మరియు; అపరాజితః — అజేయుడైన; ద్రుపదః — ద్రుపదుడు; ద్రౌపదేయాః — ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చ – మరియు; సర్వశః — అందరూ; పృథివీ-పతే — భూగోళాన్ని పాలించేవాడు; సౌభద్రః — అభిమన్యుడు, సుభద్ర కుమారుడు; చ — మరియు; మహా-బాహుః — గొప్ప బాహువులు కలవాడు; శంఖాన్ — శంఖములు; దధ్ముః — పూరించారు; పృథక్ పృథక్ — వేరు వేరుగా.
BG 1.16-18: ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.
పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన ‘రాజా’ అని సంబోధించబడుతున్నాడు; 'రాజసూయ యజ్ఞం' చేసి, ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజ మందిరంలో వున్నా, అరణ్యవాసంలో ఉన్నా అతనిలో రాజసం, విశాల-హృదయ స్వభావం ఉట్టిపడేవి. సంజయుడు ధృతరాష్ట్రుడిని 'పృథివీపతే' (భూగోళాన్ని పరిపాలించేవాడా) అని సంబోధిస్తున్నాడు. ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టి వేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే, ‘ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఓ రాజా, ధృతరాష్ట్రా, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలువగలవు. ఏమి నిర్ణయించబోతున్నావు?’ అని.
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః । నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।। కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః । ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।। ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే । సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।
17
1
https://www.holy-bhagava…/001_016-018.mp3
అనంత-విజయం — అనంతవిజయం అని పేరు గల శంఖము; రాజా — రాజు; కుంతీ-పుత్రః — కుంతీ దేవి పుత్రుడు; యుధిష్ఠిరః — యుధిష్ఠిరుడు; నకులః — నకులుడు; సహదేవః — సహదేవుడు; చ — మరియు; సుఘోష-మణిపుష్పకౌ — సుఘోషము, మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు; కాశ్యః — కాశీ రాజు; చ — మరియు; పరమ-ఇషు-ఆసః — శ్రేష్ఠమైన విలుకాడు; శిఖండీ — శిఖండి; చ — మరియు; మహా-రథః — పదివేల సామాన్య యోధుల బలానికి ఒక్కరిగా సరితూగే యోధులు; ధృష్టద్యుమ్నః — ధృష్టద్యుమ్నుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; సాత్యకిః — సాత్యకి; చ — మరియు; అపరాజితః — అజేయుడైన; ద్రుపదః — ద్రుపదుడు; ద్రౌపదేయాః — ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చ – మరియు; సర్వశః — అందరూ; పృథివీ-పతే — భూగోళాన్ని పాలించేవాడు; సౌభద్రః — అభిమన్యుడు, సుభద్ర కుమారుడు; చ — మరియు; మహా-బాహుః — గొప్ప బాహువులు కలవాడు; శంఖాన్ — శంఖములు; దధ్ముః — పూరించారు; పృథక్ పృథక్ — వేరు వేరుగా.
BG 1.16-18: ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.
పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన ‘రాజా’ అని సంబోధించబడుతున్నాడు; 'రాజసూయ యజ్ఞం' చేసి, ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజ మందిరంలో వున్నా, అరణ్యవాసంలో ఉన్నా అతనిలో రాజసం, విశాల-హృదయ స్వభావం ఉట్టిపడేవి. సంజయుడు ధృతరాష్ట్రుడిని 'పృథివీపతే' (భూగోళాన్ని పరిపాలించేవాడా) అని సంబోధిస్తున్నాడు. ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టి వేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే, ‘ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఓ రాజా, ధృతరాష్ట్రా, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలువగలవు. ఏమి నిర్ణయించబోతున్నావు?’ అని.
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః । నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।। కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః । ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।। ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే । సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।
18
1
https://www.holy-bhagava…/001_016-018.mp3
అనంత-విజయం — అనంతవిజయం అని పేరు గల శంఖము; రాజా — రాజు; కుంతీ-పుత్రః — కుంతీ దేవి పుత్రుడు; యుధిష్ఠిరః — యుధిష్ఠిరుడు; నకులః — నకులుడు; సహదేవః — సహదేవుడు; చ — మరియు; సుఘోష-మణిపుష్పకౌ — సుఘోషము, మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు; కాశ్యః — కాశీ రాజు; చ — మరియు; పరమ-ఇషు-ఆసః — శ్రేష్ఠమైన విలుకాడు; శిఖండీ — శిఖండి; చ — మరియు; మహా-రథః — పదివేల సామాన్య యోధుల బలానికి ఒక్కరిగా సరితూగే యోధులు; ధృష్టద్యుమ్నః — ధృష్టద్యుమ్నుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; సాత్యకిః — సాత్యకి; చ — మరియు; అపరాజితః — అజేయుడైన; ద్రుపదః — ద్రుపదుడు; ద్రౌపదేయాః — ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చ – మరియు; సర్వశః — అందరూ; పృథివీ-పతే — భూగోళాన్ని పాలించేవాడు; సౌభద్రః — అభిమన్యుడు, సుభద్ర కుమారుడు; చ — మరియు; మహా-బాహుః — గొప్ప బాహువులు కలవాడు; శంఖాన్ — శంఖములు; దధ్ముః — పూరించారు; పృథక్ పృథక్ — వేరు వేరుగా.
BG 1.16-18: ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.
పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన ‘రాజా’ అని సంబోధించబడుతున్నాడు; 'రాజసూయ యజ్ఞం' చేసి, ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజ మందిరంలో వున్నా, అరణ్యవాసంలో ఉన్నా అతనిలో రాజసం, విశాల-హృదయ స్వభావం ఉట్టిపడేవి. సంజయుడు ధృతరాష్ట్రుడిని 'పృథివీపతే' (భూగోళాన్ని పరిపాలించేవాడా) అని సంబోధిస్తున్నాడు. ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టి వేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ సంబోధనకి ఉన్న నిగూఢ అర్థం ఏమిటంటే, ‘ఇరు సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమై ఉన్నాయి. ఓ రాజా, ధృతరాష్ట్రా, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలువగలవు. ఏమి నిర్ణయించబోతున్నావు?’ అని.
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ । నభశ్చ పృథివీం చైవ తుములోఽభ్యనునాదయన్ ।। 19 ।।
19
1
https://www.holy-bhagava…udio/001_019.mp3
సః — అట్టి; ఘోషః — శబ్దము; ధార్తరాష్ట్రాణాం — ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క; హృదయాని — గుండెలను; వ్యదారయత్ — బ్రద్దలు చేసెను; నభః — ఆకాశము; చ — మరియు; పృథివీం — భూమి; చ — మరియు; ఏవ — నిజముగా; తుములః — భీకరమైన శబ్దం; అభ్యనునాదయన్ — ప్రతిధ్వనింపచేయుచు.
BG 1.19: ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.
పాండవ సైన్యం పూరించిన శంఖనాద శబ్దం కౌరవ సైన్య గుండెలను బ్రద్దలుచేసింది. అయితే, కౌరవ సైన్యం తమ శంఖాలను పూరించినప్పుడు పాండవ సైన్యంపై అలాంటి ప్రభావం ఏమీ పడినట్లు చెప్పబడలేదు. పాండవులు భగవంతుని ఆశ్రయించి ఉండటం వలన వారికి తాము సంరక్షిపబడుతాము అన్న విశ్వాసం ఉంది. అటుపక్క, కౌరవులు, తమ స్వీయ బలం మీదనే ఆధారపడి మరియు మనఃసాక్షిలో నేరం చేసాము అన్న వేదన వల్ల, ఓటమి భయానికి లోనయ్యారు.
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః । ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ।। 20 ।। హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ।
20
1
https://www.holy-bhagava…udio/001_020.mp3
అథ — అనంతరము; వ్యవస్థితాన్ — క్రమంగా నిలిచివున్న; దృష్ట్వా — చూసి; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని తనయులు; కపి-ధ్వజః — వానరమును (కోతి) జండాపై కలవాడు; ప్రవృత్తే — ప్రారంభించటానికి సిద్దంగా వున్న; శస్త్ర సంపాతే — ఆయుధములు వాడటానికి; ధనుః — ధనుస్సు (విల్లు) ను; ఉద్యమ్య — పైకెత్తి; పాండవః — అర్జునుడు, పాండు పుత్రుడు; హృషీకేశం — శ్రీ కృష్ణునితో; తదా — అప్పుడు; వాక్యం — పదములు; ఇదం — ఇవి; ఆహ — పలికెను; మహీ-పతే — రాజా.
BG 1.20: ఆ సమయంలో, తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండుపుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.
శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం (జెండా) మీద ఉన్నాడు కాబట్టి, అర్జునుడికి కపి ధ్వజుడు అన్న పేరు ఉంది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది. ఒకసారి అర్జునుడు విలు విద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి, శ్రీ రామచంద్రుని సమయంలో వానరములు భారతదేశం నుండి లంకకు సేతువు (బ్రిడ్జి)ని నిర్మించటానికి ఎందుకు అంత కష్టపడ్డారో తనకు అర్థం కావటంలేదు అని, శ్రీ కృష్ణునితో అన్నాడు. తనే గనక వుంటే, బాణములతో ఒక వారధిని చేసేవాడిని అన్నాడు. శ్రీ కృష్ణుడు, అది ఎలా చేసేవాడో చూపించమన్నాడు. అర్జునుడు తన శర పరంపరతో ఒక వంతెనని నిర్మించాడు. శ్రీ కృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించడానికి రమ్మని పిలిచాడు. హనుమ దానిపై నడవటం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవటం మొదలయింది. తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన (వానర) సైన్య బరువుని తట్టుకోలేదని అర్జునుడికి అర్థం అయింది మరియు అర్జునుడు తన తప్పుకి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడికి, ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకొని గర్వపడొద్దని హితవు చెప్పాడు. హనుమ దయాళువై, మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు. ఈ విధంగా, అర్జునుడి రథం, హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాని కలిగి వుంది. దీనితో అతనికి 'కపి ధ్వజుడు', అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు, అన్న పేరొచ్చింది.
అర్జున ఉవాచ । సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।। యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ । కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ।। 22 ।।
21
1
https://www.holy-bhagava…/001_021-022.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; రథం — రథము; స్థాపయ — నిలిపిఉంచు; మే — నా యొక్క; అచ్యుత — శ్రీ కృష్ణా, సంపూర్ణ దోషరహితుడా; యావత్ — ఎంతవరకు అయితే; ఏతాన్ — ఈ యొక్క; నిరీక్షే — చూసి; అహం — నేను; యోద్ధు-కామాన్ — యుద్ధం కొరకు; అవస్థితాన్ — నిలిపిఉన్న; కైః — ఎవరితో; మయా — నా చే; సహ — కూడి; యోద్ధవ్యమ్ — యుద్ధం చేయవలసి; అస్మిన్ — ఈ యొక్క; రణ-సముద్యమే — మహా పోరాటంలో.
BG 1.21-22: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుతా (శ్రీకృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి.
సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు. అయినప్పటికీ, ఈ శ్లోకంలో, అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకున్న చోటికి తీసుకెళ్లమన్నాడు. ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తోంది. తన పట్ల భక్తుల ప్రేమకు ఋణపడి, భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు. అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్ గ్రస్త-హృదయో భక్తైర్ భక్త-జన-ప్రియః (భాగవతం 9.4.63) ‘నేను సర్వ స్వతంత్రుడను అయినా, నా భక్తులకు బానిస అయిపోతాను. వారు నాకు అత్యంత ప్రియమైన వారు, మరియు నేను వారి ప్రేమకు ఋణ పడిపోతాను.’ అర్జునుడు సుఖంగా రథంలో కూర్చుని తనకి ఆదేశాలు ఇస్తుంటే, అతని భక్తికి వశుడైపోయిన శ్రీ కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారధి స్థానాన్ని తీస్కున్నాడు.
అర్జున ఉవాచ । సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।। యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ । కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ।। 22 ।।
22
1
https://www.holy-bhagava…/001_021-022.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; రథం — రథము; స్థాపయ — నిలిపిఉంచు; మే — నా యొక్క; అచ్యుత — శ్రీ కృష్ణా, సంపూర్ణ దోషరహితుడా; యావత్ — ఎంతవరకు అయితే; ఏతాన్ — ఈ యొక్క; నిరీక్షే — చూసి; అహం — నేను; యోద్ధు-కామాన్ — యుద్ధం కొరకు; అవస్థితాన్ — నిలిపిఉన్న; కైః — ఎవరితో; మయా — నా చే; సహ — కూడి; యోద్ధవ్యమ్ — యుద్ధం చేయవలసి; అస్మిన్ — ఈ యొక్క; రణ-సముద్యమే — మహా పోరాటంలో.
BG 1.21-22: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుతా (శ్రీకృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి.
సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు. అయినప్పటికీ, ఈ శ్లోకంలో, అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకున్న చోటికి తీసుకెళ్లమన్నాడు. ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తోంది. తన పట్ల భక్తుల ప్రేమకు ఋణపడి, భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు. అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్ గ్రస్త-హృదయో భక్తైర్ భక్త-జన-ప్రియః (భాగవతం 9.4.63) ‘నేను సర్వ స్వతంత్రుడను అయినా, నా భక్తులకు బానిస అయిపోతాను. వారు నాకు అత్యంత ప్రియమైన వారు, మరియు నేను వారి ప్రేమకు ఋణ పడిపోతాను.’ అర్జునుడు సుఖంగా రథంలో కూర్చుని తనకి ఆదేశాలు ఇస్తుంటే, అతని భక్తికి వశుడైపోయిన శ్రీ కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారధి స్థానాన్ని తీస్కున్నాడు.
యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః । ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ।। 23 ।।
23
1
https://www.holy-bhagava…udio/001_023.mp3
యోత్స్యమానాన్ — యుద్ధానికి వచ్చినవారు; అవేక్షే అహం — నాకు చూడాలని వుంది; యే — ఎవరు; ఏతే — వారు; అత్ర — ఇక్కడ; సమాగతాః — కూడిఉన్న; ధార్తరాష్ట్రస్య — ధృతరాష్ట్రుని పుత్రునికి; దుర్బుద్ధేః — దుర్భుద్ధి కలవాడు; యుద్ధే — యుద్ధంలో; ప్రియ-చికీర్షవ — సంతోషపెట్టడం కొరకు.
BG 1.23: దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రున్ని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.
పాపిష్టి-బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు, కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే. అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి వుందో వారిని ఒకసారి చూడదలచాడు. ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తుచేస్తూ, దుష్టబుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు. అర్జునుడి దృక్పథం ఇలా వుంది, ‘న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే, కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. వాడు దుష్టబుద్ధి కలవాడు, ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమికూడారు, కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు మొగ్గుచూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు.’
సంజయ ఉవాచ । ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత । సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ।। 24 ।।
24
1
https://www.holy-bhagava…udio/001_024.mp3
సంజయ ఉవాచ — సంజయుడు చెప్పెను; ఏవం — ఈ విధంగా; ఉక్తః — చెప్పబడిన; హృషీకేశః — శ్రీ కృష్ణుడు, ఇంద్రియములకు అధిపతి; గుడాకేశేన — అర్జునుడి చేత, నిద్రని జయించినవాడు; భారత — భరత వంశీయుడా; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; స్థాపయిత్వా — నిలిపి; రథ-ఉత్తమమ్ — ఉత్తమమైన రథమును.
BG 1.24: సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించినవాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ । ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ।। 25 ।।
25
1
https://www.holy-bhagava…udio/001_025.mp3
భీష్మ — పితామహుడు భీష్ముడు; ద్రోణ — ద్రోణాచార్యుడు; ప్రముఖతః — సమక్షంలో; సర్వేషాం — అందరు; చ — మరియు; మహీ-క్షితాం — ఇతర రాజులు; ఉవాచ — పలికెను; పార్థ — అర్జునుడు, ప్రిథ తనయుడు; పశ్య — చూడుము; ఏతాన్ — ఈ యొక్క; సమవేతాన్ — చేరియున్న; కురూన్ — కురు వంశస్థులు; ఇతి — ఈ విధంగా.
BG 1.25: భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు ఇతర రాజుల సమక్షంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థా, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము.
కురు అన్న పదం కౌరవులకు, పాండవులకు ఇద్దరికీ వర్తిస్తుంది, వారు ఇరువురు కురు వంశానికి చెందిన వారే. శ్రీ కృష్ణుడు, ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ పదాన్ని వాడి, అర్జునుడిలో బంధుత్వ భావన తెప్పించి, వారందరూ ఒకటే అన్న భావన కలిగిస్తున్నాడు. బంధుత్వ భావన మమకారానికి దారి తీసి, అది అర్జునుడిని గందరగోళానికి గురిచేస్తే, రాబోయే కలికాలంలో మానవులకు ప్రయోజనకారిగా ఉండే, భగవద్గీత ప్రభోదించే అవకాశం రావాలని శ్రీ కృష్ణుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ధార్తరాష్ట్రాన్ (ధృతరాష్ట్రుని పుత్రులు) అన్న పదానికి బదులు, కురూన్ (కురు వంశస్థులు) అన్న పదాన్ని వాడుతున్నాడు. ఎలాగైతే శస్త్ర చికిత్స వైద్యుడు కురుపుతో ఉన్న రోగికి మొదట్లో దానికి చీముపట్టి ముదిరే మందు ఇచ్చి, తరువాత ఆ యొక్క రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయటానికి శస్త్ర చికిత్స చేస్తాడో, భగవంతుడు కూడా ఆ విధంగానే పని చేస్తున్నాడు. మొదట అర్జునుడిలో అంతర్గతంగా వున్న మోహాన్ని (భ్రమ) ప్రేరేపించేది, ఆ తరువాత దాన్ని నిర్మూలించటానికే.
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ । ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ।। 26 ।। శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।
26
1
https://www.holy-bhagava…udio/001_026.mp3
తత్ర — అక్కడ; అపశ్యాత్ — చూసి; స్థితాన్ — నిలిచిఉన్న; పార్థః — అర్జునుడు; పితౄన్ — తండ్రులు (పినతండ్రులు, పెదతండ్రులు); అథ — తరువాత; పితామహాన్ — తాతలు; ఆచార్యాన్ — గురువులు; మాతులాన్ — మేనమామలు; భ్రాతౄన్ — సోదరులు; పుత్రాన్ — పుత్రులు; పౌత్రాన్ — మనుమలు; సఖీన్ — మిత్రులు; తథా — ఇంకా ; శ్వశురాన్ — మామలు; సుహృదః — శ్రేయోభిలాషులు; చ — మరియు; ఏవ — నిజముగా; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెంటిలో; అపి — కూడా.
BG 1.26: అక్కడ, రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లుళ్లను, మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను.
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ।। 27 ।। కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ ।
27
1
https://www.holy-bhagava…udio/001_027.mp3
తాన్ — ఇవి; సమీక్ష్య — చూసిన పిదప; సః — వారు; కౌంతేయః — అర్జునుడు; కుంతీ పుత్రుడు; సర్వాన్ — అందరూ; బంధూన్ — బంధువులు; అవస్థితాన్ — ఉన్నటువంటి; కృపయా — కరుణతో; పరయా — మిక్కిలి; ఆవిష్టః — కూడినవాడై; విషీదన్ — మిక్కిలి విచారం; ఇదం — ఈ విధంగా; అబ్రవీత్ — పలికెను.
BG 1.27: అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీ పుత్రుడు అర్జునుడు, కారుణ్య భావం ఉప్పొంగినవాడై, తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను.
తన బంధువులందరినీ కలిపి యుద్ధభూమిలో చూడటం వలన, ఈ యొక్క భ్రాతృహత్యాపూరిత యుద్ధ పరిణామాలు, అర్జునుడి మనస్సుకి మొదటిసారి స్పష్టమైనాయి. శత్రువులను మృత్యు ద్వారాలకు పంపించేయటానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకారేచ్ఛతో సమరానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనస్సు మారిపోయింది. తోటి కురు వంశజులు శత్రు సైన్యంలో బారులు తీరి ఉండటం అతని హృదయాన్ని క్రుంగ తీసింది; అతని బుద్ధి గందరగోళానికి లోనయ్యింది, అతని శౌర్యానికి బదులుగా, తన విధి పట్ల పిరికితనం వచ్చేసింది, మరియు పరాక్రమమైన రాతి గుండె స్థానంలో మృదుహృదయత్వం చేరింది. అందుకే సంజయుడు అతని మృదుహృదయాన్ని మరియు ఆదరించే స్వభావాన్ని సూచిస్తూ, తన తల్లి కుంతీ దేవి తనయుడా అని సంబోధించాడు.
అర్జున ఉవాచ । దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ।। 28 ।। సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
28
1
https://www.holy-bhagava…udio/001_028.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు అన్నాడు; దృష్ట్వా — చూసాక; ఇమమ్ — ఈ యొక్క; స్వ-జనం — బంధువులు (సొంతవారు); కృష్ణ — కృష్ణ; యుయుత్సుం — యుద్ధానికి ఉత్సాహంతో; సముపస్థితమ్ — చేరిఉన్న; సీదంతి — వణుకుతున్న; మమ — నా యొక్క; గాత్రాణి — అంగములు; ముఖం — నోరు; చ — మరియు; పరిశుష్యతి — ఎండిపోవుచున్నది.
BG 1.28: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణా, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది.
వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది అయివుండవచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయివుండవచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము. ఈ ప్రకారంగా, మనము ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము. ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్పృహ లోనికి నెట్టివేస్తుంది. అంతిమంగా, ఆ అనురాగము వేదనతో ముగుస్తుంది ఎందుకంటే శరీరం అంతమయినప్పుడు కుటుంబబంధాలు కూడా అంతమౌతాయి. మరోవైపు, పరమేశ్వరుడైన భగవంతుడు మన ఆత్మకి తండ్రి, తల్లి, స్నేహితుడు, యజమాని, మరియు సఖుడు. కాబట్టి ఆ భగవంతునితో సంబంధం, ఆత్మ దృష్ట్యా, ఆధ్యాత్మికమైన భావన. ఇది ఆత్మశక్తిని ఉద్ధరించి, బుద్ధిని ప్రకాశింప చేస్తుంది. భగవత్ ప్రేమ ఒక సముద్రం వంటిది, అన్నీ అందులోనే ఇమిడి వుంటాయి, కానీ శారీరక సంబంధీకులపై ప్రేమ సంకుచితమైనది మరియు తారతమ్యమును చూపేది. ఇక్కడ, అర్జునుడు భౌతిక అనుబంధాన్ని అనుభూతి చెందుతున్నాడు. ఇది అతన్ని నిరాశా సముద్రంలో ముంచివేస్తూ, తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి కూడా భయపడేట్టు చేస్తున్నది.
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।। 29 ।। గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే । న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ।। 30 ।। నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ । న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ।। 31 ।।
29
1
https://www.holy-bhagava…/001_029-031.mp3
వేపథుః — వణుకుచున్న; చ — మరియు; శరీరే — శరీరమునందు; మే — నా యొక్క; రోమ-హర్షః — వెంట్రుకలు నిక్కబోడుచుకొనుట; చ — మరియు; జాయతే — కలుగుచున్నది; గాండీవం — అర్జునుడి విల్లు; స్రంసతే — జారిపోవుతున్నది; హస్తాత్ — (నా) చేతి నుండి; త్వక్ — చర్మము; చ — మరియు; ఏవ — నిజముగా; పరిదహ్యతే — అంతటా మంటపుడుతున్నది; న చ శక్నోమి — సాధ్యము కావటంలేదు నాకు; అవస్థాతుం — స్థిరంగా ఉండుట; భ్రమతి ఇవ — తిరుగుతున్నట్టుగా; చ — మరియు; మే — నా యొక్క; మనః — మనస్సు; నిమిత్తాని — శకునములు; చ — మరియు; పశ్యామి — చూస్తున్నాను; విపరీతాని — అశుభములైన; కేశవ — శ్రీ కృష్ణ , కేశి అనే రాక్షసుడను సంహరించినవాడా; న — లేదు; చ — మరియు; శ్రేయః — మంచి; అనుపశ్యామి — చూడగలుగుతున్నాను; హత్వా — చంపటం వలన; స్వ-జనం — సొంత బంధువులను; ఆహవే — యుద్ధంలో.
BG 1.29-31: నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.
యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి, అర్జునుడు కలతచెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో, అదే గాండీవం అతని చేజారి పోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసికస్థితిలో, చివరికి, ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారి పోయాడు.
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।। 29 ।। గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే । న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ।। 30 ।। నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ । న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ।। 31 ।।
30
1
https://www.holy-bhagava…/001_029-031.mp3
వేపథుః — వణుకుచున్న; చ — మరియు; శరీరే — శరీరమునందు; మే — నా యొక్క; రోమ-హర్షః — వెంట్రుకలు నిక్కబోడుచుకొనుట; చ — మరియు; జాయతే — కలుగుచున్నది; గాండీవం — అర్జునుడి విల్లు; స్రంసతే — జారిపోవుతున్నది; హస్తాత్ — (నా) చేతి నుండి; త్వక్ — చర్మము; చ — మరియు; ఏవ — నిజముగా; పరిదహ్యతే — అంతటా మంటపుడుతున్నది; న చ శక్నోమి — సాధ్యము కావటంలేదు నాకు; అవస్థాతుం — స్థిరంగా ఉండుట; భ్రమతి ఇవ — తిరుగుతున్నట్టుగా; చ — మరియు; మే — నా యొక్క; మనః — మనస్సు; నిమిత్తాని — శకునములు; చ — మరియు; పశ్యామి — చూస్తున్నాను; విపరీతాని — అశుభములైన; కేశవ — శ్రీ కృష్ణ , కేశి అనే రాక్షసుడను సంహరించినవాడా; న — లేదు; చ — మరియు; శ్రేయః — మంచి; అనుపశ్యామి — చూడగలుగుతున్నాను; హత్వా — చంపటం వలన; స్వ-జనం — సొంత బంధువులను; ఆహవే — యుద్ధంలో.
BG 1.29-31: నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.
యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి, అర్జునుడు కలతచెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో, అదే గాండీవం అతని చేజారి పోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసికస్థితిలో, చివరికి, ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారి పోయాడు.
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।। 29 ।। గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే । న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ।। 30 ।। నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ । న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ।। 31 ।।
31
1
https://www.holy-bhagava…/001_029-031.mp3
వేపథుః — వణుకుచున్న; చ — మరియు; శరీరే — శరీరమునందు; మే — నా యొక్క; రోమ-హర్షః — వెంట్రుకలు నిక్కబోడుచుకొనుట; చ — మరియు; జాయతే — కలుగుచున్నది; గాండీవం — అర్జునుడి విల్లు; స్రంసతే — జారిపోవుతున్నది; హస్తాత్ — (నా) చేతి నుండి; త్వక్ — చర్మము; చ — మరియు; ఏవ — నిజముగా; పరిదహ్యతే — అంతటా మంటపుడుతున్నది; న చ శక్నోమి — సాధ్యము కావటంలేదు నాకు; అవస్థాతుం — స్థిరంగా ఉండుట; భ్రమతి ఇవ — తిరుగుతున్నట్టుగా; చ — మరియు; మే — నా యొక్క; మనః — మనస్సు; నిమిత్తాని — శకునములు; చ — మరియు; పశ్యామి — చూస్తున్నాను; విపరీతాని — అశుభములైన; కేశవ — శ్రీ కృష్ణ , కేశి అనే రాక్షసుడను సంహరించినవాడా; న — లేదు; చ — మరియు; శ్రేయః — మంచి; అనుపశ్యామి — చూడగలుగుతున్నాను; హత్వా — చంపటం వలన; స్వ-జనం — సొంత బంధువులను; ఆహవే — యుద్ధంలో.
BG 1.29-31: నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.
యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి, అర్జునుడు కలతచెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో, అదే గాండీవం అతని చేజారి పోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసికస్థితిలో, చివరికి, ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్మకాలతో ఉన్న శకునములను అంగీకరించే స్థాయికి దిగజారి పోయాడు.
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ । కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ।। 32 ।। యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ । త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ।। 33 ।।
32
1
https://www.holy-bhagava…/001_032-033.mp3
న కాంక్షే — నేను కోరుకోవటంలేదు; విజయం — గెలుపు; కృష్ణ — కృష్ణా; న చ రాజ్యం — రాజ్యము కూడా వద్దు; సుఖాని చ — సంతోషములు కూడా; కిం — ఏమిటి; నః — మనకు; రాజ్యేన — రాజ్యముతో; గోవింద — కృష్ణ, ఇంద్రియములకు సుఖము నిచ్చేవాడా, ఆవులంటే ఇష్టమైన వాడా; కిం — ఏమిటి; భోగైః — విలాసములు; జీవితేన — జీవితము; వా — లేదా; యేషామ్ అర్థే — ఎవరి కోసమైతే; కాంక్షితం — కోరుకున్నామో; నః — మా చేత; రాజ్యం — రాజ్యము; భోగాః — విలాసములు; సుఖాని — సంతోషము; చ — ఇంకా; తే — వారు; ఇమే — వీరును; అవస్థితా — నిలిచిఉన్న; యుద్ధే — యుద్ధం కొరకు; ప్రాణాన్ — ప్రాణాలను; త్యక్త్వా — వదులుకొనటానికి; ధనాని — ధనము; చ — కూడా.
BG 1.32-33: ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది?
చంపటం ఒక పాపపు పని అయితే, సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు. రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా, ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు, అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు, ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. ఈ సందర్భంలో, అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే, కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం, జాలి హృదయం లాగా బయటకి కనపడుతోంది. ధార్మిక మనోభావాలు, మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని, మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే, తాను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు. కానీ, అతని అనుభవం దీనికి విరుద్ధంగా వుంది - తన మనసు, బుద్ధి కలత నొందాయి, చేయవసిన పని పట్ల అసంతృప్తి మరియు, లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తోంది.
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ । కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ।। 32 ।। యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ । త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ।। 33 ।।
33
1
https://www.holy-bhagava…/001_032-033.mp3
న కాంక్షే — నేను కోరుకోవటంలేదు; విజయం — గెలుపు; కృష్ణ — కృష్ణా; న చ రాజ్యం — రాజ్యము కూడా వద్దు; సుఖాని చ — సంతోషములు కూడా; కిం — ఏమిటి; నః — మనకు; రాజ్యేన — రాజ్యముతో; గోవింద — కృష్ణ, ఇంద్రియములకు సుఖము నిచ్చేవాడా, ఆవులంటే ఇష్టమైన వాడా; కిం — ఏమిటి; భోగైః — విలాసములు; జీవితేన — జీవితము; వా — లేదా; యేషామ్ అర్థే — ఎవరి కోసమైతే; కాంక్షితం — కోరుకున్నామో; నః — మా చేత; రాజ్యం — రాజ్యము; భోగాః — విలాసములు; సుఖాని — సంతోషము; చ — ఇంకా; తే — వారు; ఇమే — వీరును; అవస్థితా — నిలిచిఉన్న; యుద్ధే — యుద్ధం కొరకు; ప్రాణాన్ — ప్రాణాలను; త్యక్త్వా — వదులుకొనటానికి; ధనాని — ధనము; చ — కూడా.
BG 1.32-33: ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది?
చంపటం ఒక పాపపు పని అయితే, సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు. రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా, ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు, అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు, ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. ఈ సందర్భంలో, అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే, కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం, జాలి హృదయం లాగా బయటకి కనపడుతోంది. ధార్మిక మనోభావాలు, మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని, మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే, తాను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు. కానీ, అతని అనుభవం దీనికి విరుద్ధంగా వుంది - తన మనసు, బుద్ధి కలత నొందాయి, చేయవసిన పని పట్ల అసంతృప్తి మరియు, లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తోంది.
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః । మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ।। 34 ।। ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన । అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ।। 35 ।।
34
1
https://www.holy-bhagava…/001_034-035.mp3
ఆచార్యాః — గురువులు; పితరః — తండ్రులు (పిన తండ్రులు, పెద తండ్రులు); పుత్రాః — కుమారులు; తథా — ఇంకా; ఏవ — వాస్తవంగా; చ — మరియు; పితామహాః — తాతలు; మాతులాః — మేనమామలు; శ్వశురాః — మామలు; పౌత్రాః — మనుమలు; శ్యాలాః — బావ-బావమరుదులు; సంబంధినాః — బంధువులు; తథా — కూడా; ఏతాన్ — వీరు; న హంతుమ్ ఇచ్ఛామి — చంపుటకు నాకు ఇష్టంలేదు; ఘ్నతః — చంపబడి; అపి — అయినప్పటికీ; మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించినవాడా; అపి — అయినప్పటికీ; త్రై-లోక్య-రాజ్యస్య — ముల్లోకములపై అధిపత్యం; హేతోః — కొరకు; కిం ను — ఎం చెప్పాలి? మహీ-కృతే — భూమండలము కొరకు.
BG 1.34-35: గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసిననూ నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిననూ, ఈ భూ-మండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే, ఏం తృప్తి ఉంటుంది మనకు?
ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు; భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు; భూరిశ్రవుడు (సోమదత్తుని తనయుడు) వంటి వారు అతనికి తండ్రి వరుస; పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు, మరియు శకుని అతని మేనమామలు; ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులు తన సోదరులు; లక్ష్మణుడు (దుర్యోధనుని తనయుడు) తన బిడ్డ వంటి వాడు. యుద్ధరంగంలో వేంచేసి ఉన్న ఈ వివిధములైన బంధువులని అర్జునుడు పేర్కొంటున్నాడు. 'అపి' (అంటే 'అయినప్పటికీ' అని అర్థం), అన్న పదాన్ని రెండు సార్లు వాడాడు. మొదట, ‘నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్నెందుకు చంపడానికి పూనుకున్నారు? రెండవసారి, ‘వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ, నేను వారిని వధించాలనుకోవటం ఎందుకు?’ అని.
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః । మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ।। 34 ।। ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన । అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ।। 35 ।।
35
1
https://www.holy-bhagava…/001_034-035.mp3
ఆచార్యాః — గురువులు; పితరః — తండ్రులు (పిన తండ్రులు, పెద తండ్రులు); పుత్రాః — కుమారులు; తథా — ఇంకా; ఏవ — వాస్తవంగా; చ — మరియు; పితామహాః — తాతలు; మాతులాః — మేనమామలు; శ్వశురాః — మామలు; పౌత్రాః — మనుమలు; శ్యాలాః — బావ-బావమరుదులు; సంబంధినాః — బంధువులు; తథా — కూడా; ఏతాన్ — వీరు; న హంతుమ్ ఇచ్ఛామి — చంపుటకు నాకు ఇష్టంలేదు; ఘ్నతః — చంపబడి; అపి — అయినప్పటికీ; మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించినవాడా; అపి — అయినప్పటికీ; త్రై-లోక్య-రాజ్యస్య — ముల్లోకములపై అధిపత్యం; హేతోః — కొరకు; కిం ను — ఎం చెప్పాలి? మహీ-కృతే — భూమండలము కొరకు.
BG 1.34-35: గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసిననూ నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిననూ, ఈ భూ-మండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే, ఏం తృప్తి ఉంటుంది మనకు?
ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు; భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు; భూరిశ్రవుడు (సోమదత్తుని తనయుడు) వంటి వారు అతనికి తండ్రి వరుస; పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు, మరియు శకుని అతని మేనమామలు; ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులు తన సోదరులు; లక్ష్మణుడు (దుర్యోధనుని తనయుడు) తన బిడ్డ వంటి వాడు. యుద్ధరంగంలో వేంచేసి ఉన్న ఈ వివిధములైన బంధువులని అర్జునుడు పేర్కొంటున్నాడు. 'అపి' (అంటే 'అయినప్పటికీ' అని అర్థం), అన్న పదాన్ని రెండు సార్లు వాడాడు. మొదట, ‘నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్నెందుకు చంపడానికి పూనుకున్నారు? రెండవసారి, ‘వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ, నేను వారిని వధించాలనుకోవటం ఎందుకు?’ అని.
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన । పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ।। 36 ।। తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ । స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ।। 37 ।।
36
1
https://www.holy-bhagava…/001_036-037.mp3
నిహత్య — చంపటంవలన; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్ర తనయులను; నః – మన; కా — ఏమిటి? ప్రీతిః — సంతోషము; స్యాత్ — కలుగును; జనార్దన — శ్రీ కృష్ణా, అందరి జనులను పోషించేవాడా; పాపమ్ — పాపము; ఏవ — తప్పక; ఆశ్రయేత్ — ప్రాప్తిస్తుంది; అస్మాన్ — మనకు; హత్వా — చంపుట వలన; ఏతాన్ — వీరందరూ; ఆతతాయినః — దూకుడు గల దుష్టులను; తస్మాత్ — కాబట్టి; న — ఎప్పుడూ లేదు; అర్హాః — అర్హత; వయం — మనము; హంతుం — చంపటానికి; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని పుత్రులను; స్వ-బాంధవాన్ — స్వజనులతో కూడి; స్వ-జనం — బంధువులు; హి — తప్పకుండా; కథం — ఎట్లు; హత్వా — చంపటం వలన; సుఖినః — సుఖంగా; స్యామ — కాగలము; మాధవ — శ్రీ కృష్ణా, యోగమాయా శక్తి యొక్క భర్త.
BG 1.36-37: ఓ జనార్దనా, (సర్వ భూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా), ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులయినా, వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా (కృష్ణా), మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము?
తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి 'అయినా సరే' అని రెండు సార్లు ఇంతకు పూర్వ శ్లోకం లోనే అన్నా, అర్జునుడు మళ్ళీ ‘నేను వారిని సంహరించినా సరే, అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను?’ అని అంటున్నాడు. పోట్లాడటం, చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పనే, అవి పశ్చాత్తాపాన్ని, అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి. అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి, మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపము: మా హింస్యాత్ సర్వ భూతాని ‘ఏ ప్రాణిని కూడా చంపకు’ అని చెప్పబడింది. ఇక్కడ, అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అతను అది పాపపు పని అని భావించాడు. కానీ, ఆరు విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు వుంది అని వశిష్ఠ స్మృతి (3.19వ శ్లోకం) చెపుతోంది: సంపదకి నిప్పు పెట్టే వారు, ఆహారంలో విషం కలిపే వారు, చంపటానికి ప్రయత్నించే వారు, సొత్తుని కొల్లగొట్టే వారు, భార్యని అపహరించ వచ్చిన వారు, మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కొనే వారు. ఇలాంటి వారిని, ఆత్మ రక్షణ కోసం చంపటం పాపము కాదు అని మను-స్మృతి (8.351) పేర్కొన్నది.
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన । పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ।। 36 ।। తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ । స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ।। 37 ।।
37
1
https://www.holy-bhagava…/001_036-037.mp3
నిహత్య — చంపటంవలన; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్ర తనయులను; నః – మన; కా — ఏమిటి? ప్రీతిః — సంతోషము; స్యాత్ — కలుగును; జనార్దన — శ్రీ కృష్ణా, అందరి జనులను పోషించేవాడా; పాపమ్ — పాపము; ఏవ — తప్పక; ఆశ్రయేత్ — ప్రాప్తిస్తుంది; అస్మాన్ — మనకు; హత్వా — చంపుట వలన; ఏతాన్ — వీరందరూ; ఆతతాయినః — దూకుడు గల దుష్టులను; తస్మాత్ — కాబట్టి; న — ఎప్పుడూ లేదు; అర్హాః — అర్హత; వయం — మనము; హంతుం — చంపటానికి; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని పుత్రులను; స్వ-బాంధవాన్ — స్వజనులతో కూడి; స్వ-జనం — బంధువులు; హి — తప్పకుండా; కథం — ఎట్లు; హత్వా — చంపటం వలన; సుఖినః — సుఖంగా; స్యామ — కాగలము; మాధవ — శ్రీ కృష్ణా, యోగమాయా శక్తి యొక్క భర్త.
BG 1.36-37: ఓ జనార్దనా, (సర్వ భూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా), ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులయినా, వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా (కృష్ణా), మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము?
తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి 'అయినా సరే' అని రెండు సార్లు ఇంతకు పూర్వ శ్లోకం లోనే అన్నా, అర్జునుడు మళ్ళీ ‘నేను వారిని సంహరించినా సరే, అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను?’ అని అంటున్నాడు. పోట్లాడటం, చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పనే, అవి పశ్చాత్తాపాన్ని, అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి. అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి, మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపము: మా హింస్యాత్ సర్వ భూతాని ‘ఏ ప్రాణిని కూడా చంపకు’ అని చెప్పబడింది. ఇక్కడ, అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అతను అది పాపపు పని అని భావించాడు. కానీ, ఆరు విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు వుంది అని వశిష్ఠ స్మృతి (3.19వ శ్లోకం) చెపుతోంది: సంపదకి నిప్పు పెట్టే వారు, ఆహారంలో విషం కలిపే వారు, చంపటానికి ప్రయత్నించే వారు, సొత్తుని కొల్లగొట్టే వారు, భార్యని అపహరించ వచ్చిన వారు, మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కొనే వారు. ఇలాంటి వారిని, ఆత్మ రక్షణ కోసం చంపటం పాపము కాదు అని మను-స్మృతి (8.351) పేర్కొన్నది.
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః । కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ।। 38 ।। కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ । కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ।। 39 ।।
38
1
https://www.holy-bhagava…/001_038-039.mp3
యది అపి — అయినా సరే; ఏతే — వారు; న పశ్యంతి — చూడలేకున్నా; లోభ — దురాశ; ఉపహత — కమ్ముకున్న; చేతసః — ఆలోచనలతో; కుల-క్షయ-కృతం — బంధువులను నాశనం చేయటంలో; దోషం — తప్పు; మిత్ర-ద్రోహే — స్నేహితులపై ద్రోహం చేయటం వలన; చ — మరియు; పాతకం — పాపము; కథం — ఎందుకు; న జ్ఞేయం — తెలుసుకోరాదు; అస్మాభిః — మనము; పాపాత్ — పాపము నుండి; అస్మాత్ — ఇవి; నివర్తితుం — మరలిపోవుట; కుల-క్షయ — బంధువులను సంహరించటం; కృతం — చేసి; దోషం — నేరము; ప్రపశ్యద్భిః — తెలిసిన వారమై; జనార్దన — అందరి పోషణ, రక్షణ చూసుకునే వాడా, శ్రీ కృష్ణా.
BG 1.38-39: వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి, బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గానీ, వారు దోషం చూడటం లేదు. కానీ, ఓ జనార్దనా (కృష్ణా), మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము, ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు?
వృత్తి రీత్యా యోధుడే అయినా, అర్జునుడు అనవసరపు హింసని అసహ్యించుకొన్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. వంద మంది కౌరవులు చంపబడ్డారు, కానీ దానికి ప్రతీకారంగా, ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, రాత్రి వేళ పాండవ శిబిరం లోనికి చొరబడి ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను, వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని అతన్ని పశువులాగా కట్టివేసి, అతడిని, శోకిస్తూ వున్న ద్రౌపది కాళ్ళ వద్ద పడవేశాడు అర్జునుడు. కానీ, క్షమాగుణము మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది, అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతణ్ణి క్షమించాలి అని అన్నది. మరో పక్క, అశ్వత్థామని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో, అర్జునుడు శ్రీ కృష్ణుని వైపు పరిష్కారం కోసం చూసాడు. కృష్ణుడు అన్నాడు, ‘గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా అతణ్ని తప్పకుండా క్షమింపవలసినదే. కానీ, ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినదే.’ అని. అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కానీ, అతని తల వెనుక పిలకను కత్తిరించి, అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి, అతణ్ని శిబిరం నుండి బహిష్కరించాడు. కాబట్టి, సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో, పెద్దలని, బంధువులని చంపటం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు. ఋత్విక్ పురోహితాచార్యైర్ మాతులాతిథి సంశ్రితైః బాలవృద్దాతురైర్ వైద్యైర్ జ్ఞాతిసంబంధిబాంధవైః (మను స్మృతి 4.179) ‘యజ్ఞం చేసే బ్రాహ్మణుడు (ఋత్వికుడు), పురోహితుడు, గురువు, మేనమామ, అతిథి, తనపై ఆధారపడి ఉన్నవారు, పిల్లలు, పెద్దలు, వైద్యుడు, మరియు బంధువులు - వీరితో కలహం పెట్టుకోరాదు.’ దురాశకు వశమైపోయిన కౌరవులు విచక్షణా జ్ఞానం కోల్పోయి ధర్మపథం నుండి తప్పుకున్నా, ఏ దురుద్దేశం లేని తను, ఈ పాడు పని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు.
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః । కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ।। 38 ।। కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ । కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ।। 39 ।।
39
1
https://www.holy-bhagava…/001_038-039.mp3
యది అపి — అయినా సరే; ఏతే — వారు; న పశ్యంతి — చూడలేకున్నా; లోభ — దురాశ; ఉపహత — కమ్ముకున్న; చేతసః — ఆలోచనలతో; కుల-క్షయ-కృతం — బంధువులను నాశనం చేయటంలో; దోషం — తప్పు; మిత్ర-ద్రోహే — స్నేహితులపై ద్రోహం చేయటం వలన; చ — మరియు; పాతకం — పాపము; కథం — ఎందుకు; న జ్ఞేయం — తెలుసుకోరాదు; అస్మాభిః — మనము; పాపాత్ — పాపము నుండి; అస్మాత్ — ఇవి; నివర్తితుం — మరలిపోవుట; కుల-క్షయ — బంధువులను సంహరించటం; కృతం — చేసి; దోషం — నేరము; ప్రపశ్యద్భిః — తెలిసిన వారమై; జనార్దన — అందరి పోషణ, రక్షణ చూసుకునే వాడా, శ్రీ కృష్ణా.
BG 1.38-39: వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి, బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గానీ, వారు దోషం చూడటం లేదు. కానీ, ఓ జనార్దనా (కృష్ణా), మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము, ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు?
వృత్తి రీత్యా యోధుడే అయినా, అర్జునుడు అనవసరపు హింసని అసహ్యించుకొన్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. వంద మంది కౌరవులు చంపబడ్డారు, కానీ దానికి ప్రతీకారంగా, ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, రాత్రి వేళ పాండవ శిబిరం లోనికి చొరబడి ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను, వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని అతన్ని పశువులాగా కట్టివేసి, అతడిని, శోకిస్తూ వున్న ద్రౌపది కాళ్ళ వద్ద పడవేశాడు అర్జునుడు. కానీ, క్షమాగుణము మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది, అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతణ్ణి క్షమించాలి అని అన్నది. మరో పక్క, అశ్వత్థామని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో, అర్జునుడు శ్రీ కృష్ణుని వైపు పరిష్కారం కోసం చూసాడు. కృష్ణుడు అన్నాడు, ‘గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా అతణ్ని తప్పకుండా క్షమింపవలసినదే. కానీ, ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినదే.’ అని. అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కానీ, అతని తల వెనుక పిలకను కత్తిరించి, అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి, అతణ్ని శిబిరం నుండి బహిష్కరించాడు. కాబట్టి, సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో, పెద్దలని, బంధువులని చంపటం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు. ఋత్విక్ పురోహితాచార్యైర్ మాతులాతిథి సంశ్రితైః బాలవృద్దాతురైర్ వైద్యైర్ జ్ఞాతిసంబంధిబాంధవైః (మను స్మృతి 4.179) ‘యజ్ఞం చేసే బ్రాహ్మణుడు (ఋత్వికుడు), పురోహితుడు, గురువు, మేనమామ, అతిథి, తనపై ఆధారపడి ఉన్నవారు, పిల్లలు, పెద్దలు, వైద్యుడు, మరియు బంధువులు - వీరితో కలహం పెట్టుకోరాదు.’ దురాశకు వశమైపోయిన కౌరవులు విచక్షణా జ్ఞానం కోల్పోయి ధర్మపథం నుండి తప్పుకున్నా, ఏ దురుద్దేశం లేని తను, ఈ పాడు పని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు.
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః । ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత ।। 40 ।।
40
1
https://www.holy-bhagava…udio/001_040.mp3
కుల-క్షయే — వంశ నాశనము వలన; ప్రణశ్యంతి — నశించిపోవును; కుల-ధర్మాః — వంశాచారములు; సనాతనాః — సనాతనమైన; (ఎంతో కాలం నుండి వున్న); ధర్మే — ధర్మము; నష్టే — అంతరించిపోవును; కులం — కుటుంబం; కృత్స్నం — సమస్తమైన; అధర్మః — అధర్మము; అభిభవతి — జయించును; ఉత — నిజముగా.
BG 1.40: వంశ నాశనం జరిగినప్పుడు, ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును, మరియు మిగిలిన కుటుంబసభ్యులు అధర్మపరులగుదురు.
కుటుంబ పెద్దలు తమ వంశము యొక్క పురాతన సాంప్రదాయాలు, ఏంతో కాలంగా ఉన్న ఆచారముల ఆధారంగా విలువలను, ఆదర్శాలను తమ ముందు తరాలవారికి అందచేస్తారు. ఈ సాంప్రదాయాలు, మానవీయ విలువలను మరియు ధార్మిక పద్ధతులను పాటించటానికి కుటుంబ సభ్యులకి దోహదపడుతాయి. కుటుంబ పెద్దలందరూ అకాలమరణం పాలయితే, వారి వచ్చే తరాల వారికి పెద్దల మార్గదర్శకత్వం, శిక్షణ లభించవు. అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ, వంశములు నాశనమైనప్పుడు, వాటితోపాటే ఆయా సాంప్రదాయాలు కూడా నశిస్తాయని, అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఆధార్మిక, అనైతిక అలవాట్లు పెంచుకొని, తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారని అంటున్నాడు. ఈ విధంగా, అర్జునుడి ఉద్దేశంలో, కుటుంబ పెద్దలు ఎన్నటికి సంహరింపబడరాదు.
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః । స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ।। 41 ।।
41
1
https://www.holy-bhagava…udio/001_041.mp3
అధర్మా — అధర్మము; ఆభిభవాత్ — ప్రబలిపోవుట; కృష్ణ — శ్రీ కృష్ణా; ప్రదుష్యంతి — నీతి తప్పిన వారై; కుల-స్త్రియః — కుటుంబంలోని స్త్రీలు; స్త్రీషు — స్త్రీలు; దుష్టాసు — దుర్నీతి పరులై; వార్ష్ణేయ — వృష్ణి వంశస్థుడా; జాయతే — పుడతారు; వర్ణ-సంకరః — అవాంఛిత సంతానం.
BG 1.41: దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, ఓ కృష్ణా, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు; మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన, ఓ వృష్ణి వంశస్థుడా, అవాంఛిత సంతానం జన్మిస్తారు.
వైదిక నాగరికత, స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యత నిచ్చింది. అందుకే మను-స్మృతిలో ‘యత్ర నార్యస్ తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః (3.56) ‘ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన, పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో, మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడుతారో, అక్కడ దేవతలు హర్షిస్తారు.’ కానీ, స్త్రీలు నీతిబాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు, బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి, దాన్ని అదునుగా తీసుకొనుటం వలన అవాంఛిత సంతానం కలుగుతారు.
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ । పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ।। 42 ।।
42
1
https://www.holy-bhagava…udio/001_042.mp3
సంకరః — అవాంఛిత సంతానం; నరకాయ — నరకప్రాయమైన; ఏవ — నిజముగా; కుల-ఘ్నానాం — కులనాశనము చేసిన వారిని; కులస్య — కులమును; చ — మరియు; పతంతి — పతనము; పితరః — పూర్వీకులు; హి — యథార్థముగా; ఏషామ్ — వారి యొక్క; లుప్త — లేకుండా అవును; పిండోదక-క్రియాః — శ్రాద్ధ తర్పణములు.
BG 1.42: అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు, కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమయిన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమౌదురు.
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః । ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ।। 43 ।।
43
1
https://www.holy-bhagava…udio/001_043.mp3
దోషైః — పాపిష్ఠిపనులచే; ఏతైః — ఈ విధమైన; కుల-ఘ్నానాం — కుల నాశనం చేసే వారి యొక్క; వర్ణ-సంకర — అవాంఛిత సంతానం; కారకైః — కారకులైన; ఉత్సాద్యంతే — చెడిపోతాయి; జాతి-ధర్మాః — సామాజిక, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు; కుల-ధర్మాః — కుటుంబ సాంప్రదాయములు; చ — మరియు; శాశ్వతాః — సనాతములైన.
BG 1.43: కుటుంబ ఆచారము నాశనము చేసి, అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేకానేక సామాజిక, కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును.
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన । నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ।। 44 ।।
44
1
https://www.holy-bhagava…udio/001_044.mp3
ఉత్సన్న— నాశనమైపోయిన; కుల-ధర్మాణామ్ — ఎవరి కుటుంబ సాంప్రదాయములైతే; మనుష్యాణాం — అలాంటి మనుషులు; జనార్దన — జనుల బాగోగులు చూసుకునే వాడా, శ్రీ కృష్ణా; నరకే — నరకములో; అనియతం — నిరవధికముగా; వాసః — నివాసము; భవతి — ఉండును; ఇతి — ఈ విధంగా; అనుశుశ్రుమ — పండితుల నుండి వినియున్నాను.
BG 1.44: ఓ జనార్దనా (కృష్ణా), కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని, నేను పండితుల నుండి వినియున్నాను.
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ । యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ।। 45 ।। యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః । ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ।। 46 ।।
45
1
https://www.holy-bhagava…/001_045-046.mp3
అహో — అయ్యో; బత — దారుణ ఫలితాలు; మహత్ — పెద్ద; పాపం — పాపాలు; కర్తుం — చేయుటకు; వ్యవసితాః — సిద్ధ పడితిమి; వయం — మనము; యత్ — ఎందుకంటే; రాజ్య-సుఖ-లోభేన — రాజ్య సుఖములపై కాంక్షతో; హంతుం — చంపుటకు; స్వ-జనమ్ — సొంత బంధువులను; ఉద్యతాః — అభిలాషించి; యది — ఒకవేళ; మామ్ — నన్ను; అప్రతీకారమ్ — ప్రతిఘటించకుండా; అశస్త్రం — ఆయుధాలు లేకుండా; శస్త్ర-పాణయః — చేతిలో ఆయుధములు ధరించినవారు; ధార్తరాష్ట్రాః — ధృతరాష్ట్రుని తనయులు; రణే — యుద్ధభూమి యందు; హన్యుః — చంపినా; తత్ — అది; మే — నాకు; క్షేమ-తరం — మంచిదే; భవేత్ — అవుతుంది.
BG 1.45-46: అయ్యో! ఎంత ఆశ్చర్యం, దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్ధ పడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే, అది దీనికంటే మేలే.
జరుగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు కానీ, ఈ దుష్టులను సమాజంలో వర్ధిల్లనిస్తే, దుర్మార్గమే వ్యాపిస్తుందని, అర్జునుడు చూడలేకున్నాడు. 'అహో' అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. 'బత' అంటే 'ఘోరమైన ఫలితాలు'. అర్జునుడు అంటున్నాడు, ‘ఎంత ఆశ్చర్యం, ఘోరమైన పరిణామాలు ఉంటాయి అని తెలిసి కూడా, మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్ఠి పని చేయ నిశ్చయించాము.’ అని. తరచుగా, జనులు తమ సొంత తప్పులను చూడకుండా, వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు. అదే విధముగా, ధృతరాష్ట్రుని పుత్రులు దురాశచే ప్రేరేపింపబడ్డారని అనుకున్నాడు; తన యొక్క కారుణ్య భావ పరంపర, ఒక మహనీయమైన మనోభావం కాదనీ, అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహమని అర్జునుడు గ్రహింపలేకున్నాడు. అర్జునుడి వాదనలలో ఉన్న లోపం ఏమిటంటే - శారీరక వ్యామోహం, హృదయ దౌర్బల్యం, మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకొనటానికే అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు. అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో, శ్రీ కృష్ణుడు తదుపరి అధ్యాయాలలో విశదీకరిస్తాడు.
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ । యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ।। 45 ।। యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః । ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ।। 46 ।।
46
1
https://www.holy-bhagava…/001_045-046.mp3
అహో — అయ్యో; బత — దారుణ ఫలితాలు; మహత్ — పెద్ద; పాపం — పాపాలు; కర్తుం — చేయుటకు; వ్యవసితాః — సిద్ధ పడితిమి; వయం — మనము; యత్ — ఎందుకంటే; రాజ్య-సుఖ-లోభేన — రాజ్య సుఖములపై కాంక్షతో; హంతుం — చంపుటకు; స్వ-జనమ్ — సొంత బంధువులను; ఉద్యతాః — అభిలాషించి; యది — ఒకవేళ; మామ్ — నన్ను; అప్రతీకారమ్ — ప్రతిఘటించకుండా; అశస్త్రం — ఆయుధాలు లేకుండా; శస్త్ర-పాణయః — చేతిలో ఆయుధములు ధరించినవారు; ధార్తరాష్ట్రాః — ధృతరాష్ట్రుని తనయులు; రణే — యుద్ధభూమి యందు; హన్యుః — చంపినా; తత్ — అది; మే — నాకు; క్షేమ-తరం — మంచిదే; భవేత్ — అవుతుంది.
BG 1.45-46: అయ్యో! ఎంత ఆశ్చర్యం, దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్ధ పడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే, అది దీనికంటే మేలే.
జరుగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు కానీ, ఈ దుష్టులను సమాజంలో వర్ధిల్లనిస్తే, దుర్మార్గమే వ్యాపిస్తుందని, అర్జునుడు చూడలేకున్నాడు. 'అహో' అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. 'బత' అంటే 'ఘోరమైన ఫలితాలు'. అర్జునుడు అంటున్నాడు, ‘ఎంత ఆశ్చర్యం, ఘోరమైన పరిణామాలు ఉంటాయి అని తెలిసి కూడా, మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్ఠి పని చేయ నిశ్చయించాము.’ అని. తరచుగా, జనులు తమ సొంత తప్పులను చూడకుండా, వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు. అదే విధముగా, ధృతరాష్ట్రుని పుత్రులు దురాశచే ప్రేరేపింపబడ్డారని అనుకున్నాడు; తన యొక్క కారుణ్య భావ పరంపర, ఒక మహనీయమైన మనోభావం కాదనీ, అజ్ఞానంతో తను ఈ శరీరమే అనుకున్న భౌతిక వ్యామోహమని అర్జునుడు గ్రహింపలేకున్నాడు. అర్జునుడి వాదనలలో ఉన్న లోపం ఏమిటంటే - శారీరక వ్యామోహం, హృదయ దౌర్బల్యం, మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకొనటానికే అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు. అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో, శ్రీ కృష్ణుడు తదుపరి అధ్యాయాలలో విశదీకరిస్తాడు.
సంజయ ఉవాచ । ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ । విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ।। 47 ।।
47
1
https://www.holy-bhagava…udio/001_047.mp3
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; ఏవం ఉక్త్వా — ఈ విధంగా పలికిన; అర్జునః — అర్జునుడు; సంఖ్యే — యుద్ధరంగంలో; రథ ఉపస్థే — రథములో; ఉపావిశత్ — కూర్చుండి పోయెను; విసృజ్య — వదిలివేసి; స-శరం — బాణములతో సహా; చాపం — ధనుస్సును; శోక — దుఃఖముతో; సంవిగ్న — దీనస్థితిలో; మానసః — మనస్సు.
BG 1.47: సంజయుడు పలికెను: ఈ విధంగా పలికిన అర్జునుడు, దీనస్థితిలో, తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను, ధనుస్సును పక్కన జారవిడిచి, రథంలో కూలబడ్డాడు.
మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 1.28వ శ్లోకం నుండి అర్జునుడు మొదలు పెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తను ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాశ్యంతో వదిలివేసాడు, ఇది జ్ఞానంతో, భక్తితో భగవంతునికి శరణాగతి చేయటానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమాయకుడు ఏమీ కాదు, అన్న విషయం చెప్పటం ఇప్పుడు సమంజసం. అతడు ఊర్ధ్వ లోకాలకు వెళ్లి తన తండ్రి స్వర్గాధిపతి ఇంద్రుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నిజానికి, తను పూర్వ జన్మలో ‘నరుడు’, కాబట్టి పారమార్థిక జ్ఞానం తెలిసినవాడే. (నర-నారాయణులు జంట అవతారములు, ఇందులో 'నరుడు' సిద్ధుడైన జీవాత్మ, 'నారాయణుడు' పరమాత్మ). దీనికి రుజువు ఏమిటంటే, మహాభారత యుద్ధం ముందు, యదు సైన్యాన్ని అంతా దుర్యోధనునికి వదిలేసి, అర్జునుడు శ్రీ కృష్ణుడిని తన పక్షంలోకి ఎంచుకున్నాడు. భగవంతుడే తన పక్షాన వుంటే తనకు అపజయం ఎన్నటికీ కలుగదు అని దృఢవిశ్వాసంతో ఉన్నాడు. అయినప్పటికీ, శ్రీ కృష్ణుడు, భావితరాల ప్రయోజనం కోసం, భగవద్గీత సందేశాన్ని చెప్పటానికి సంకల్పించాడు. కాబట్టి, సరియైన సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే అర్జునుడి మనస్సులో కలవరము సృష్టించాడు.
సంజయ ఉవాచ । తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ । విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ।। 1 ।।
1
2
https://www.holy-bhagava…udio/002_001.mp3
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; తం — అతనితో (అర్జునుడి తో); తథా — ఈ విధంగా; కృపయా — జాలితో; ఆవిష్టం — నిండినవాడై; అశ్రు-పూర్ణ — కన్నీరు-నిండి; ఆకుల — వ్యాకులతతో; ఈక్షణం — కళ్ళు; విషీదంతం — శోకంతో; ఇదం — ఈ యొక్క; వాక్యం — మాటలు; ఉవాచ — పలికెను; మధుసూదనః — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించిన వాడు.
BG 2.1: సంజయుడు పలికెను: జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు, ఈ విధంగా పలికెను.
అర్జునుడి మనో భావాలని వర్ణించడానికి సంజయుడు, 'కృపయా', అంటే జాలి లేదా కరుణ, అన్న పదం వాడాడు. కారుణ్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి - ఈశ్వర వియోగము వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి, సత్పురుషులకు కలిగే దివ్యమైన కరుణ. మరియొకటి - ఎదుటివారిలో భౌతిక శారీరక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ. భౌతికమైన కరుణ ఒక ఉత్తమ భావమే కానీ అది సంపూర్ణంగా సరియైన దిశలోనే ఉన్నటువంటిది అని చెప్పలేము. అది, కారులో కూర్చున్న డ్రైవర్ కృశించి పోతుంటే, కారు పరిస్థితి గురించి ఆందోళన చెందినట్టుగా ఉంటుంది. అర్జునుడు ఈ రెండవ శ్రేణి మనోభావాన్ని అనుభవిస్తున్నాడు. యుద్ధం కోసం చేరివున్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అర్జునుడి నిరాశ, శోకంతో తల్లడిల్లిపోతున్న పరిస్థితి చూస్తే, అతనికే కారుణ్యం/జాలి యొక్క తీవ్ర అవసరం ఉంది అని తెలుస్తోంది. కాబట్టి తనే ఇతరుల మీద దయతో ఉంటున్నాడు అని అనుకోవటం అర్థరహితమైనది. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ‘మధుసూదన’ అని పిలవబడ్డాడు. మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ, అర్జునుడి మనస్సులో జనించిన, స్వధర్మాన్ని నిర్వర్తించటానికి అడ్డుగావున్న, అనుమానపు రాక్షసిని మట్టుబెట్టబోతున్నాడు.
శ్రీ భగవానువాచ । కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ । అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున ।। 2 ।।
2
2
https://www.holy-bhagava…udio/002_002.mp3
శ్రీ భగవానువాచ — పరమేశ్వరుడైన భగవానుడు పలికెను; కుతః — ఎక్కడినుండి; త్వా — నీకు; కశ్మలం — భ్రాంతి; ఇదం — ఈ యొక్క; విషమే — ఈ సంకట సమయంలో; సముపస్థితమ్ — దాపురించింది; అనార్య — అనాగరికమైన వ్యక్తి; జుష్టమ్ — ఆచరింపబడునది; అస్వర్గ్యమ్ — ఉత్తమ లోకాలకు దారి తీసేది కాదు; అకీర్తి-కరమ్ — అపకీర్తిని కలిగించేది; అర్జున — అర్జునా.
BG 2.2: శ్రీ భగవానుడు ఇట్లనెను: ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది.
మన పవిత్ర గ్రంథాలలో ఆర్య అన్న పదం ఒక జాతిని లేదా తెగని సూచించేది కాదు. మను స్మృతి, ఆర్యన్ అన్న పదాన్ని, 'అత్యంత సంస్కారవంతుడైన వ్యక్తి' అని నిర్వచించింది. ‘ఆర్యన్’ మంచితనాన్ని సూచిస్తుంది, ఆంగ్లంలో ‘పర్ఫెక్ట్ జెంటిల్‌మాన్' (perfect gentleman) అన్నట్టుగా. వైదిక గ్రంథాల ప్రధాన లక్ష్యము మానవులను అన్ని కోణాల్లో ఆర్యన్లుగా అయ్యేట్టు ప్రోత్సహించడమే. శ్రీ కృష్ణుడు, అర్జునుడి ప్రస్తుత పరిస్థితి, ఆ ఆదర్శానికి విరుద్ధంగా ఉందని తెలుసుకున్నాడు, మరియు ప్రస్తుత పరిస్థితిలో ఆదర్శవంతంగా ప్రవర్తించడం ఎలాగో తెలియని అతని అయోమయ స్థితిని సూచిస్తూ మందలిస్తున్నాడు. భగవద్గీత నిజానికి ఇక్కడ నుండే ప్రారంభమౌతోంది, ఇప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రీ కృష్ణుడు, ఇక మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. పరమాత్మ మొదట్లో అర్జునుడిలో జ్ఞాన పిపాసని పెంపొందిస్తూ ప్రారంభిస్తున్నాడు. దీనికోసం, అతని అయోమయ పరిస్థితి అగౌరవమైనదని, ధార్మికుడైన వాడికి తగదని చెప్తున్నాడు. తదుపరి, అర్జునుడికి, తన చిత్త భ్రాంతి వలన కలిగే బాధ, అపకీర్తి, జీవితంలో వైఫల్యం, మరియు ఆత్మ భ్రష్టత్వం వంటి వాటిని గుర్తు చేస్తున్నాడు. శ్రీ కృష్ణుడు, అర్జునుడిని ఓదార్చకుండా, అతన్ని తన ప్రస్తుత పరిస్థితిపై అసౌకర్యముగా భావింపచేస్తున్నాడు. మనం అయోమయంలో ఉన్నప్పుడు, అది ఆత్మ యొక్క సహజస్థితి కానందువల్ల, మనకి అసౌకర్యముగా వుంటుంది. అలాంటి వ్యాకులత, సరైన దారిలో పెట్టబడితే, వైదిక జ్ఞాన సముపార్జనకి ఒక శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది. తనకున్న సందేహానికి సరైన సమాధానం దొరికితే వ్యక్తి మునుపటి కన్నా లోతైన అవగాహన తెచ్చుకుంటాడు. ఈ విధంగా, భగవంతుడు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా మానవులని సంక్షోభానికి గురిచేసి, తమ అయోమయాన్ని పోగొట్టుకోడానికి, వారిని సరియైన జ్ఞానాన్ని వెతుక్కునేలా చేస్తాడు. చివరికి ఆ సందేహ నివృత్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థాయి అవగాహన దశకి చేరుకుంటాడు.
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే । క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।। 3 ।।
3
2
https://www.holy-bhagava…udio/002_003.mp3
క్లైబ్యం — పౌరుషహీనత్వం; మా స్మ — వద్దు; గమః — లొంగిపోవద్దు; పార్థ — అర్జున, ప్రిథ తనయుడా; న — కాదు; ఏతత్ — ఇది; త్వయి — నీకు; ఉపపద్యతే — తగదు; క్షుద్రం — నీచమైన; హృదయ — హృదయ; దౌర్బల్యం — బలహీనత; త్యక్త్వా — వదిలిపెట్టి; ఉత్తిష్ట — లెమ్ము; పరంతప — శత్రువులను జయించేవాడా.
BG 2.3: ఓ పార్థా, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము.
జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, మరియు సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీ కృష్ణుడు నేర్పు గల గురువు, మరియు ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహిస్తూ, ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి అర్జునుడి అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు. అర్జునుడిని, ప్రిథ (కుంతీదేవి యొక్క ఇంకొక పేరు) తనయుడా, అని సంబోధించడం ద్వారా అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తుచేస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించింది, మరియు అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. కాబట్టి, ఇంద్రుడి లాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడు. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మరియు తన వైభవోపేతమైన పుట్టుకకి తగని దౌర్భల్యానికి వశమైపోవద్దని అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నాడు. తన హృదయంలో ఉద్భవించిన తన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ, మరల అర్జునుడిని పరంతప, శత్రువులను జయించేవాడా, అని సంబోధిస్తున్నాడు. తన క్షత్రియ ధర్మమైన కర్తవ్యాన్ని విస్మరించాలనే తలంపు చేత, ఆ శత్రువు గోచరిస్తున్నది. అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం, నైతిక బాధ్యతా కాదు మరియు నిజమైన కారుణ్యమూ కాదు, నిజానికి అది శోకము, చిత్తభ్రాంతి మాత్రమే, అని శ్రీ కృష్ణుడు ఇక విశదీకరిస్తాడు. దీని మూలకారణం మానసిక బలహీనతలో ఉంది. నిజమైన కరుణ మరియు విజ్ఞానంపై, అతని ప్రవర్తన ఆధార పడివుంటే, తనకి అయోమయము, శోకం కలిగి ఉండేవి కావు.
అర్జున ఉవాచ । కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన । ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ।। 4 ।।
4
2
https://www.holy-bhagava…udio/002_004.mp3
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; కథం — ఎట్లా; భీష్మమ్ — భీష్ముడు; అహం — నేను; సంఖ్యే — యుద్ధములో; ద్రోణం — ద్రోణాచార్యుడు; చ — మరియు; మధు-సూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించినవాడా; ఇషుభిః — బాణాలతో; ప్రతియోత్స్యామి — పోరాడగలను; పూజా-అర్హౌ — పూజింపదగిన; అరి-సూదన — శత్రువులను నాశనం చేసేవాడా.
BG 2.4: అర్జునుడు ఇట్లనెను: ఓ మధుసూదనా, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ, శత్రువులను నాశనం చేసేవాడా.
కార్యాచరణకి పిలుపునిచ్చిన శ్రీ కృష్ణుడికి, తన మనస్సులో ఉన్న సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు, అర్జునుడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు తనకు గౌరవనీయులు, ఆరాధ్యులు. భీష్ముడంటే మూర్తీభవించిన సచ్ఛీలత; తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కోసం, అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అర్జునుడి సైనిక (అస్త్ర విద్య) గురువు అయిన ద్రోణాచార్యుడు, యుద్ధతంత్రంలో మహామేధావి, అతని నుండే అర్జునుడు విలువిద్యలో ప్రావీణ్యం పొందాడు. ప్రతిపక్షంలో ఇంకొక గౌరవనీయుడైన వ్యక్తి, కృపాచార్యుడు. అర్జునుడికి అతనంటే ఏంతో గౌరవం. ఇంత మహనీయమైన వ్యక్తులను శత్రువులుగా చూడటం, మంచి మనసు గల అర్జునుడికి జుగుప్స కలిగించింది. ఇంత గౌరవప్రదమైన పెద్దలతో వాగ్వాదమే తప్పన్నప్పుడు, ఇక, వారితో ఆయుధములతో దాడి చేయటం గురించి ఎలా తలచగలడు? అతని మాటలని ఇలా అర్థం చేసుకోవచ్చు, ‘ఓ కృష్ణా, దయచేసి నా పరాక్రమాన్ని శంకించకు. నేను యుద్ధానికి సిద్ధమే. కానీ, నైతిక బాధ్యత పరంగా, నా గురువులను గౌరవించుట మరియు ధృతరాష్ట్రుని తనయులపై వాత్సల్యం చూపుట, నా యొక్క ధర్మం’ అని.
గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే । హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ।। 5 ।।
5
2
https://www.holy-bhagava…udio/002_005.mp3
గురూన్ — గురువులు; అహత్వా — చంపకుండా; హి — నిజముగా; మహానుభావాన్ — మహనీయులైన పెద్దలు; శ్రేయః — మేలు; భోక్తుం — భోగాలని అనుభవించటం; భైక్ష్యమ్ — బిచ్చమెత్తుకుని; అపి — అయినాసరే; ఇహ లోకే — ఈ లోకంలో; హత్వా — సంహరించుట; అర్థ — సంపాదించు; కామాన్ — కోరికతో; తు — కానీ; గురూన్ — గురువులను (పెద్దవారిని); ఇహ — ఈ లోకంలో; ఏవ — తప్పకుండా; భుంజీయ — అనుభవించుట; భోగాన్ — భోగములు (విలాసములు) రుధిర — రక్తం; ప్రదిగ్ధాన్ — కళంకితమై ఉన్న.
BG 2.5: నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తంతో కళంకితమై ఉంటాయి.
అర్జునుడు తన జీవనోపాధి కొనసాగించటం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని జయించాలని ఎవరైనా వాదించవచ్చు. కానీ ఇక్కడ అర్జునుడు ఆ వాదనని తిప్పికొడుతున్నాడు. భిక్షాటన చేసైనా జీవిస్తాను కానీ ఈ నీచమైన నేరాన్ని మాత్రం చేయను అని అంటున్నాడు. ఒకవేళ, యుద్దం చేసి పెద్దలను మరియు బంధువులను చంపటం అనే ఈ హీనమైన పని చేసినా తన అంతరాత్మ తనను, ఈ పని ద్వారా ఈ లోకంలో లభించే ధనము, అధికారము వంటి ఫలములను అనుభవించనీయదు అని విశ్వసిస్తున్నాడు. షేక్స్పియర్ (ఒక గొప్ప ఆంగ్ల రచయిత) నాటకం ‘మక్‌బెత్’ ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణని ప్రస్తావిస్తుంది. అందులో, ఒక వ్యక్తి, అంతఃకరణలో నేరం చేసిన భావన వలన, తన సహజమైన నిద్రని కూడా పొందలేకపోతాడు; ఇక అనైతిక ప్రవర్తన ద్వారా వచ్చిన ధనము, అధికారం గురించి ఏమి చెప్పాలి? మక్‌బెత్, స్కాట్లాండ్‌లో ఒక ఉన్నతమైన వ్యక్తి. ఒకసారి, స్కాట్లాండ్ రాజు తన ప్రయాణంలో రాత్రి విశ్రాంతి కోసం అతని ఇంటికి వచ్చాడు. రాజుని హత్య చేసి అతని సింహాసనాన్ని లాక్కోవటానికి మక్‌బెత్ భార్య అతన్ని పురికొల్పింది. భార్య సలహాకి ప్రభావితమై మక్‌బెత్, రాజుని హత్య చేసాడు. దీనితో, మక్‌బెత్, అతని భార్య, స్కాట్లాండ్ మహారాజు, మహారాణిలుగా పట్టాభిషిక్తులైనారు. కానీ, ఎన్నో సంవత్సరాల తరువాత కూడా, మక్‌బెత్ తన భవంతిలో రాత్రి పూటకూడా పూర్తిగా లేచి ఉండి అటూ ఇటూ నడుస్తూ కనిపించేవాడు. ఆ రచయిత ఇలా రాసాడు, ‘మక్‌బెత్ నిద్రను చంపాడు, కాబట్టి మక్‌బెత్ ఇక నిద్రపోలేడు’ (Macbeth hath killed sleep, and so Macbeth shall sleep no more). మహారాణి కూడా అస్తమానం చేతులు కడుక్కుంటూ కనిపించేది, అదేదో కనిపించని రక్తపు మరకలను కడుక్కుంటున్నదా అన్నట్టుగా. ఈ శ్లోకంలో, అర్జునుడు విచారించేదేమిటంటే, అతను గౌరవనీయులైన పెద్దలను సంహరించి రాజ్యాధికారం సాధించినా, మహారాజులకు అందుబాటులో ఉండే రాజ భోగాలను, అవి రక్తంతో కళంకితమైనందున, తన అంతఃకరణ, వాటిని అనుభవించనీయదు అని.
న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః । యానేవ హత్వా న జిజీవిషామః తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ।। 6 ।।
6
2
https://www.holy-bhagava…udio/002_006.mp3
న — కాదు; చ — కూడా; ఎతత్ — ఇది; విద్మః — మనకు తెలుసు; కతరత్ — ఏది; నః — మనకు; గరీయః — మంచిది; యత్ వా — ఒకవేళ లేదా; జయేమ — మనము విజేయులమైతామో; యది — ఒకవేళ; వా — లేదా; నః — మనలను; జయేయుః — వారు జయిస్తారో; యాన్ — ఎవరినైతే; ఎవ — నిజముగా; హత్వా — సంహరించిన తరువాత; న జిజీవిశామః — జీవించి ఉండబుద్ధి కాదు; తే — వారు; అవస్థితాః — నిలిచియున్నారు; ప్రముఖే — మన ముందు; ధార్తరాష్ట్రాః — ధృతరాష్ట్రుని కుమారులు.
BG 2.6: ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు - వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడటమా. వారిని సంహరించిన తరువాత కూడా, మనకు జీవించాలని అనిపించదు. అయినా, వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి, మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు.
పరిస్థితులలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలలో, ప్రత్యామ్నాయాలను వాటి పరిణామాలను బేరీజు వేసుకోవటం పరిపాటి. కౌరవులను ఓడించటం మేలా లేక వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మధన పడుతున్నాడు. రెండు పరిణామాలు ఓటమి గానే తోచాయి, ఎందుకంటే, కౌరవులని సంహరించి యుద్ధంలో గెలిచినా తనకు జీవించాలనే ఆశ ఇక ఉండదు. కానీ, భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు కృపాచార్యుడు మొదలైనవారు అల్పబుద్ధితో కౌరవుల అధర్మ పక్షమున చేరి ఉన్నారు. వారి కోసం ‘అర్థకామ్’ అన్న పదం వాడబడింది, అంటే ‘ధనము, అధికారాములపై ఆసక్తితో ఉండి’ అని, ఎందుకంటే వారు దుష్టుడైన దుర్యోధనుని పక్షంలో చేరారు. కాబట్టి, వారిని యుద్ధంలో సంహరించటం సహజంగా జరిగేదే. నిజానికి, నీచ బుద్ధితో ప్రవర్తించిన గురువు, వదిలి వేయబడటానికి తగిన వాడే అని, యుద్ధం తరువాత, స్వయంగా భీష్ముడే అంగీకరించాడు. ఈ సందర్భంలో, భీష్ముడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంది. శ్రీమద్ భాగవతం ప్రకారం (9.22.19వ శ్లోకం) అతను శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. అతను ఇంద్రియములను జయించినవాడు మరియు శూరత్వానికి, సహృదయానికి ప్రతీక. పరమ సత్యాన్ని తెలిసిన వారిలో ఒకడు మరియు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతాననే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. మృత్యువు కూడా, అతను సంకల్పించి స్వీకరించినప్పుడే ఆయన దరికి వస్తుంది. చాలా కారణాల వలన భీష్ముడు, పన్నెండు మంది మహోన్నత వ్యక్తులలో (మహాజనులు) ఒకడిగా పరిగణించబడ్డాడు. భాగవతంలో ఈ విధంగా ఉంది. స్వయంభూర్ నారదః శంభుః కుమారః కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వైయాసకిర్ వయం (6.3.20) ‘భాగవత ధర్మములు యథార్థముగా తెలిసినవారు ఈ పన్నెండుగురు - మొట్టమొదట జన్మించిన బ్రహ్మదేవుడు, నారద ముని, శంకర భగవానుడు, నలుగురు కుమార ఋషులు, కపిల భగవానుడు (దేవహూతి తనయుడు), స్వాయంభువ మనువు, ప్రహ్లాద మహారాజు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలి చక్రవర్తి, శుకదేవ ముని, మరియు వేద వ్యాసుడు.’ కాబట్టి, భీష్ముడు మహా జ్ఞాని, అతని ఏ పని కూడా ధర్మ-విరుద్ధంగా ఉండదు. అయినప్పటికీ, అతని గంభీరమైన వ్యక్తిత్వం ప్రాపంచిక తర్కానికి అతీతమైనవి. అతను కౌరవుల పక్షాన పోరాడినా, యుధిష్ఠిరుడితో (పాండవ అన్నదమ్ములలో పెద్దవాడు) యుద్ధం ముందు ఈ విధంగా అన్నాడు, ‘నేను అధర్మ పక్షాన పోరాడటానికి బద్ధుఁడనైయున్నాను, కానీ మీరే విజేయులౌతారు అని వరమిస్తున్నాను.’ అని. భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ వారి పక్షాన ఉండగా పాండవులు ఎప్పటికీ ఓడిపోరు అని భీష్ముడికి తెలుసు. తను అధర్మ పక్షాన ఉండి, ముల్లోకాలలో ఎంత పెద్ద శక్తి అయినా ఈ ధర్మ యుద్ధంలో దుర్మార్గమును గెలిపింపలేదు అని నిరూపించాడు. ఈ విధంగా తన ప్రాణాలనే త్యాగం చేస్తూ శ్రీ కృష్ణుని దివ్య లీలల యందు తన వంతు సహకరించాడు. కౌరవుల పక్షంలో ఉండి పోరాడినా, భీష్ముడికి తనపై ఉన్న ప్రగాఢ భక్తి, శ్రీ కృష్ణుడికి తెలుసు. అందుకే, భీష్ముడి ప్రతిజ్ఞని నిలబెట్టడం కోసం తన సొంత ప్రతిజ్ఞనే భంగం చేసుకున్నాడు. యుద్ధంలో ఒకానొక రోజు, మరుసటి రోజు సూర్యాస్త సమయానికల్లా, తాను పాండవ ముఖ్యుడు అర్జునుడిని సంహరిస్తాను లేదా అతనిని కాపాడటానికి శ్రీ కృష్ణుడు, మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టను అనే తన సంకల్పాన్ని భంగం చేయాలి, అని భీష్ముడు ప్రతిజ్ఞ చేసాడు. భీష్ముడి ప్రతిజ్ఞని కవులు ఈ విధంగా వర్ణించారు. ఆజు జో హరిహిఁ న శస్త్ర గాహాఊఁ తౌ లాజహుఁ గంగా జననీ కో శాంతను సుత న కహాఊఁ (సూరదాస్) ‘భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మచే నేను ఆయుధం పట్టనీయకపొతే, నా తల్లి గంగాదేవికి సిగ్గుచేటే, నేను శంతను మహారాజు పుత్రుడనే కాదు.’ భీష్ముడు ఎంత పరాక్రమంతో పోరాడాడంటే, అర్జునుడి రథం ముక్కలు-ముక్కలు అయిపోయింది, అర్జునుడు నేల మీద నిలబడ్డాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడు రథచక్రాన్ని ఎత్తి, భీష్ముడిని, అర్జునుడిని చంపకుండా నిలువరించడానికి ముందుకు ఉరికాడు. చేతిలో రథచక్రమే ఆయుధముగా ఉన్న భగవంతుడిని చూసి భీష్ముడు ఎంతో ఆనందపడ్డాడు. భక్తవత్సలుడైన భగవంతుడు తన భక్తుడి మాట నిలబెట్టటం కోసం తన మాటనే పక్కకు పెట్టాడు అని అర్థం చెసుకున్నాడు. నిజానికి, శ్రీ కృష్ణుడి పట్ల భీష్ముని భక్తి చాలా రసికతతో కూడుకున్నది. ఆయన శ్రీ కృష్ణుడి బృందావన లీలలపై ధ్యానం చేసేవాడు. అక్కడ, గోవులను అడవిలో మేతకి తీసుకెళ్లి సాయంకాలం గ్రామానికి తిరిగి వస్తుండగా, ఆవుల గిట్టల నుండి లేచిన ధూళి ఆ స్వామి ముఖారవిందం పైబడి అది మరింత అందంగా, మధురంగా కనిపించేది. మహాభారత యుద్ధంలో గుర్రాల గిట్టల నుండి లేచిన ధూళి కూడా శ్రీ కృష్ణుడి అందాన్ని ఇనుమడింపచేసింది మరియు తన ప్రభువు దర్శనాన్ని అక్కడ ఆయన ఏంతో ఆస్వాదించాడు. తన జీవితపు చివరి దశలో, అంపశయ్య (బాణములతో తయారు చేసిన పరుపు) పై ఆరునెలలు పరుండిన భీష్ముడు, స్వామి యొక్క ఆ రూపం పై, ఈ క్రింది ప్రార్థనతో ధ్యానం చేసాడు. యుధి తురగరజో విధూమ్రవిష్వక్ కచలులిత శ్రమ వార్యలంకృతాస్యే మమ నిశిత శరైర్విభిద్యమాన త్వచి విలసత్కవచేఽస్తు కృష్ణ ఆత్మా (భాగవతం 1.9.34) ‘యుద్ధ భూమిలో గుర్రపు గిట్టల నుండి ఎగసిన తెల్లని ధూళి, శ్రీకృష్ణుడి కేశములపై పడి కప్పివేసింది, ఇంకా, రథం నడిపే శ్రమ వలన స్వామి ముఖారవిందము చెమట బిందువులతో ఉన్నది. ఇవి ఆభరణముల వలె నా స్వామి అందాన్ని ఇనుమడింపచేస్తున్నాయి; నా పదునైన బాణముల వలన కలిగిన గాయాలు ఆ అలంకారమును మరింత పెంచుతున్నాయి. అలాంటి శ్రీ కృష్ణుడిని పైనే నా మనస్సు ధ్యానం చేయాలి.’ శ్రీ కృష్ణుడు, ఆయన ప్రేమ, భక్తికి ప్రతిస్పందనగా, అంపశయ్యపై ఉన్న భీష్ముడిని కలవటానికి స్వయంగా విచ్చేసాడు. ఆ భగవంతుడిని కళ్ళెదుటే దర్శిస్తూ, మహాత్ముడు భీష్ముడు స్వచ్ఛందంగా తన శరీరాన్ని విడిచిపెట్టాడు.
కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః । యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ।। 7 ।।
7
2
https://www.holy-bhagava…udio/002_007.mp3
కార్పణ్య-దోషా — పిరికితనము అనెడు దోషము; ఉపహత — ముట్టడి చేయబడి; స్వ-భావః — స్వభావము; పృచ్ఛామి — అడుగుతున్నాను; త్వాం — మిమ్ములను; ధర్మ — ధర్మమును; సమ్మూఢ — కలవరపడ్డ; చేతాః — చిత్తముతో; యత్ — ఏది; శ్రేయః — శ్రేయస్కరము; స్యాత్ — అగునో; నిశ్చితం — నిశ్చయముగా; బ్రూహి — తెలుపుము; తత్ — అది; మే — నాకు; శిష్యః — శిష్యుడను; తే — నీ యొక్క; అహం — నేను; శాధి — దయచేసి ఉపదేశం చేయుము; మాం — నేను; త్వాం — నీకు; ప్రపన్నమ్ — శరణాగతుడను.
BG 2.7: నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము.
భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం. శ్రీ కృష్ణుడి సఖుడు, బావ అయిన అర్జునుడు మొదటిసారి కృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు. కార్పణ్య దోషం, అంటే, పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు, తనను లొంగదీసుకుందని, అందుచేత, భగవంతుడిని తన గురువుగా ఉండమని, తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని, బ్రతిమాలుతున్నాడు.ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని, సమస్త వైదిక గ్రంథాలు ఏకకంఠంతో చెప్తున్నాయి.తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిఃశ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్ (ముండకోపనిషత్తు 1.2.12) ‘పరమ సత్యాన్ని తెలుసుకోడానికి, వైదిక వాఙ్మయం తెలిసినవాడు, ఆచరణాత్మకంగా భగవత్ ప్రాప్తినొందిన గురువుని ఆశ్రయించాలి’తస్మాద్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసుః శ్రేయ ఉత్తమమ్శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయమ్(భాగవతం 11.3.21) ‘సత్యాన్ని అన్వేషించేవారు, తమనితాము ఆధ్యాత్మిక గురువుకి శరణాగతం చేసుకోవాలి, ఆయన ప్రాపంచికత్వాన్ని త్యజించి, శాస్త్రముల సారాన్ని అర్థంచేసుకున్నవాడై, సంపూర్ణంగా భగవంతుడినే ఆశ్రయించినవాడై ఉండాలి.’రామచరితమానస్ ఇలా పేర్కొంటున్నది:గురు బిను భవ నిధి తరఇ న కోఈ, జో బిరంచి శంకర సమ హోఈ‘ఆధ్యాత్మిక సాధకులు ఎంత ఉన్నత స్థాయి వారైనా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు.’ శ్రీ కృష్ణుడు తనే స్వయంగా భగవద్గీతలో 4.34వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పాడు: ‘పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి. పూజ్యభావంతో అడగండి మరియు వారికి సేవ చేయండి. అలాంటి జ్ఞానోదయమైన సత్పురుషుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు, ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నవాడు.’జ్ఞాన సముపార్జన కోసం గురువుని ఆశ్రయించటం యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో తెలియచెప్పటానికి, స్వయంగా శ్రీ కృష్ణుడే ఆ పని చేసాడు. తన యౌవ్వనంలో, అరవై నాలుగు శాస్త్రాలను నేర్చుకోడానికి, సాందీపనిముని ఆశ్రమానికి వెళ్ళాడు. కృష్ణుడి సహవిద్యార్థి సుదాముడు ఇలా అన్నాడు:యస్య ఛందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభోశ్రేయసాం తస్య గురుషు వాసోఽత్యంతవిడంబనం (భాగవతం 10.80.45)‘ఓ శ్రీ కృష్ణా, వేదములు నీ శరీరము వంటివి, అవి నీ జ్ఞానం నుండే వ్యక్తమైనవి (కావున నీకు గురువు యొక్క అవసరం ఏమున్నది?). అయినాసరే, నీవు కూడా గురువు ద్వారా నేర్చుకోవాలని నటిస్తున్నావు. ఇది నీ యొక్క దివ్య లీల మాత్రమే.’శ్రీ కృష్ణుడు నిజానికి ప్రథమ జగద్గురువు, ఎందుకంటే అతను భౌతిక ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన బ్రహ్మ దేవునికే గురువు. మాయ యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్మలకి అజ్ఞానం తొలగించటానికి ఒక గురువు అవసరము ఉంటుంది, అని, తన ఉదాహరణతో చెప్పటానికి, ఈ లీలని మన శ్రేయస్సు కోసమే చెసాడు. ఈ శ్లోకంలో అర్జునుడు, ఒక శిష్యుడిగా శ్రీ కృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువు గారిని సరియైన దిశానిర్దేశము కొరకు, జ్ఞానోపదేశం చేయమని ప్రార్థిస్తున్నాడు.
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ । అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ।। 8 ।।
8
2
https://www.holy-bhagava…udio/002_008.mp3
న — కాదు; హి — నిజముగా; ప్రపశ్యామి — నేను చూచుట; మమ — నా యొక్క; అపనుద్యాత్ — పోగొట్టే; యత్ — ఏదైతే; శోకం — శోకమును; ఉచ్ఛోషణమ్ — శుష్కింప చేయునట్టి; ఇంద్రియాణామ్ — ఇంద్రియముల యొక్క; అవాప్య — పొందిన తరువాత; భూమౌ — ఈ భూమిపై; అసపత్నమ్ — ఎదురులేని; ఋద్దం — సుసంపన్నమైన; రాజ్యం — రాజ్యము; సురాణామ్ — దేవతల యొక్క; అపి — అయినా; చ — కూడా; ఆధిపత్యమ్ — ఆధిపత్యము.
BG 2.8: నా ఇంద్రియములను శుష్కింప చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను.
ఎప్పుడైనా మనము దుఃఖంలో మునిగిపోయినప్పుడు, మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది, మరియు ఎప్పుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో, అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలౌతుంది. అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధికన్నా పెద్దవిగా పరిణమించటంతో, తనను శోక సముద్రం నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు. శ్రీ కృష్ణుడిని గురువుగా స్వీకరించిన తరువాత తన దయనీయ స్థితిని వెల్లడిచేయుచూ తన మనస్సులో ఉన్నదంతా ఆయనకి చెప్తున్నాడు, అర్జునుడు. అర్జునుడి పరిస్థితి అతనొక్కడిదే కాదు. జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తప్పక ఎదురయ్యేదే. మనకు సంతోషం కావాలి, కానీ దుఃఖం కలుగుతుంటుంది; మనకు జ్ఞానం కావాలి కానీ అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకోలేము; పరిపూర్ణమైన ప్రేమని కోరుకుంటాము కానీ పదేపదే ఆశాభంగము కలుగుతుంటుంది; మన కాలేజి డిగ్రీలు, నేర్చుకున్న విద్య, మరియు లౌకిక పాండిత్యములు జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు. జీవితమనే చిక్కుముడిని విప్పటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న వాస్తవిక గురువు లభించినప్పుడు, మనకు వారి నుండి నేర్చుకునే అణకువ, వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన నిధి తెరువబడుతుంది. ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు.
సంజయ ఉవాచ । ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప । న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ ।। 9 ।।
9
2
https://www.holy-bhagava…udio/002_009.mp3
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; ఏవం — ఈ విధముగా; ఉక్త్వా — పలికిన; హృషీకేశం — మనోఇంద్రియములకు అధిపతి, శ్రీ కృష్ణుడితో; గుడాకేశః — అర్జునుడు, నిద్రని జయించినవాడు; పరంతపః — అర్జునుడు, శత్రువులను శిక్షించేవాడు; న యోత్స్యే — నేను యుద్ధం చేయను; ఇతి — అంటూ; గోవిందం — కృష్ణ, ఇంద్రియములకు ఆనందమునిచ్చే వాడా; ఉక్త్వా — పలికి; తూష్ణీం — మౌనము; బభూవ — అయ్యాడు; హ — అతను.
BG 2.9: సంజయుడు ఇట్లనెను: ఈ విధంగా పలికిన గుడాకేశుడు, శత్రువులను శిక్షించేవాడు, హృషీకేశునితో, ‘గోవిందా, నేను యుద్ధం చేయను’ అంటూ మౌనముగా ఉండిపోయాడు.
సూక్ష్మబుద్ధి గల సంజయుడు, ధృతరాష్ట్రునికి చెప్పే ఆఖ్యాన వివరణలో తను ప్రస్తావించు వ్యక్తులకు సరిగ్గా తగిన పేర్లు వాడతాడు. ఇక్కడ అర్జునుడిని 'గుడాకేశ' అంటే 'నిద్రని జయించిన వాడా' అని సంబోధించాడు. నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఎప్పుడోఅప్పుడు అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సిందే. కానీ తన దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎంత క్రమశిక్షణ సాధించాడంటే, తను అనుకున్న సమయం లోనే, తను అనుకున్నంత సేపే నిద్రని వచ్చేటట్టు చెయగలిగేవాడు. అర్జునుడిని 'గుడాకేశ' అని సంబోధింస్తూ, సంజయుడు, ధృతరాష్ట్రునికి ఒక విషయం సూచిస్తున్నాడు, ‘ఏ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడో ఆ విధంగానే తన నైరాశ్యాన్ని జయిస్తాడు.’ అని. అంతేకాక, శ్రీ కృష్ణుడికి ఉపయోగించిన పదం 'హృషీకేశ' అంటే 'ఇంద్రియములకు, మనస్సుకి అధిపతి' అని. ఇక్కడ సూక్ష్మంగా సూచించేది ఏమిటంటే, ‘ఇంద్రియములనే అదుపు చేయగలిగే వాడు, అన్నీ కార్యాలు సక్రమంగా నిర్వహింపబడేటట్టు చూసుకుంటాడు.’ అని.
తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత । సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ।। 10 ।।
10
2
https://www.holy-bhagava…udio/002_010.mp3
తమ్ — అతనితో; ఉవాచ — పలికెను; హృషికేశః — శ్రీ కృష్ణుడు, మనోఇంద్రియములకు అధిపతి; ప్రహసన్ — మందహాసముతో; ఇవ — అలాగ; భారత — ధృతరాష్ట్రా, భరత వంశీయుడా; సేనయోః — సైన్యముల; ఉభయోః — రెంటిలో; మధ్యే — మధ్యలో; విశీదంతం — శోకంలో ఉన్న వానితో; ఇదం — ఈ యొక్క; వచః — వాక్యములు.
BG 2.10: ఓ ధృతరాష్ట్రా! ఆ తరువాత, ఇరుసేనల మధ్యలో, శోకసంతుప్తుడైన అర్జునుడితో శ్రీ కృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను.
అర్జునుడి వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా, పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా చేయటం లేదని, పైగా తను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీ కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. జ్ఞానులు అన్నీ సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు. మనకున్న అసంపూర్ణ అవగాహనతో, మనం, ఉన్న పరిస్థితులలో లోపాలు వెదుకుతాము - వాటిపై సణుగుతూ, అసంతృప్తితో ఉంటాము, వాటి నుండి పారిపోవాలనిపిస్తుంది, మన దౌర్భాగ్యానికి వాటిని భాధ్యులుగా చూస్తాము. కానీ, భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచం అన్నీ కోణాలలో లోపాలే లేని, దోషరహిత మైనది, అని జ్ఞానోదయం పొందిన మహాత్ములు మనకు చెప్తున్నారు. మంచి మరియు చెడు పరిస్థితులు రెండూ కూడా ఒక దివ్య, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరిచేరతాయి. అవన్నీ, మన ఆధ్యాత్మిక పరిణితి పెంచి, దోష రహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకెళ్ళటానికి, కూర్చబడ్డాయి. ఈ రహస్యం అర్థం చేసుకున్నవారు ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ఆందోళన చెందకుండా, పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కుంటారు. ‘మంచు తునకలు నెమ్మదిగా భూమిపై పడతాయి, ప్రతి తునక దానికే చెందిన సరైన స్థానంలో పడుతుంది’ (The snowflakes fall slowly to the ground, each flake in its proper place), అనేది ఒక ప్రఖ్యాత 'టావో' నానుడి. ప్రాపంచిక దృష్టికోణం ద్వారా చూస్తే మనకు అర్థం కాకపోయినా, ఈ ప్రపంచపు రూపకల్పన, స్థూల సంఘటనలు ఎంత అద్భుతమైన దోషరహితమైనవో, ఇది మనకు చక్కగా విశదీకరిస్తుంది. భూకంపాలు, హరికేన్లు, తుఫానులు, వరదలు, మరియు టైఫూన్లు మెదలైనవన్నీ ఈ భూమిపై భగవంతుడు తన మహాద్భుతమైన పథకంలో భాగంగా ఎందుకు సృష్టిస్తాడో ఛాందోగ్య ఉపనిషత్తు విశదీకరిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతి ప్రయాణం నెమ్మదించటాన్ని నిరోధించడానికి భగవంతుడు ఉద్దేశ్యపూర్వకంగానే విపత్కర పరిస్థితులను సృష్టిస్తుంటాడు. ఎప్పుడైతే జనులు అలసత్వం, నిర్లక్ష్యంతో ఉంటారో, ఒక సహజ విపత్తు సంభవిస్తుంది, ఇది జీవులు తమ సామర్థ్యాలను పెంచుకుని ఆయా పరిస్థితులను తట్టుకునేలా బలపరుస్తుంది. ఈ ప్రక్రియ పురోగతిని గట్టిపరుస్తుంది. కానీ, ఇక్కడ ఉదహరించిన పురోగతి బాహ్యమైన విలాసవస్తువులతో కూడిన భౌతిక పురోగతి కాదు, అది ఎన్నో జీవితకాలాల్లో అంతర్గతంగా విచ్చుకునే ఆత్మ యొక్క అద్భుతమైన దివ్యత్వం.
శ్రీ భగవానువాచ । అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే । గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ।। 11 ।।
11
2
https://www.holy-bhagava…udio/002_011.mp3
శ్రీ-భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; అశోచ్యాన్ — శోకింపతగని; అన్వశోచః — శోకిస్తున్నావు; త్వం — నీవు; ప్రజ్ఞా-వాదాన్ — ప్రాజ్ఞతతో కూడిన మాటలు; చ — మరియు; భాషసే — పలుకుతున్నావు; గత-ఆసూన్ — చనిపోయినవారు; అగత అసూన్ — బ్రతికున్నవారు; చ — మరియు; న అనుశోచంతి — ఎప్పుడూ శోకించరు; పండితాః — పండితులు/వివేకవంతులు.
BG 2.11: భగవంతుడు ఇలా అన్నాడు: నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, పండితులైనవారు శోకింపరు.
ఈ శ్లోకంతో మొదలిడి, శ్రీ కృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు. అర్జునుడు, తనకు మాత్రం ఒప్పు అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు. కానీ, కృష్ణుడు అతనిపై జాలి పడలేదు, సరికదా, అతని వాదనని నీరుగార్చాడు. కృష్ణుడు అంటున్నాడు, ‘అర్జునా, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడావనుకుంటున్నావు, కానీ నీవు అమాయకత్వంతో ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఎంత పెద్ద కారణం ఉన్నా శోకం అనేది మాత్రం తగదు. పండితులు-వివేకము కలిగినవారు-ఎప్పుడూ శోకింపరు, అది బ్రతికున్నవారి కోసమైనా లేదా చనిపోయిన వారి కోసమైనా సరే. కాబట్టి బంధువులను సంహరించడంలో నీవు ఊహించుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే, అది నీవు పండితుడవు కావు అని నిరూపిస్తున్నది.’ అని. శోకానికి అతీతంగా ఉన్న జ్ఞానిని చూడాలంటే గీతా శాస్త్రంలో ఎక్కువ దూరం వెళ్ళనవసరం లేదు; స్వయంగా భీష్మ పితామహుడే దీనికి చక్కటి ఉదాహరణ. అతను జనన-మరణ రహస్యాలను లోతుగా తెలుసుకుని, పరిస్థితుల యొక్క ద్వంద్వములకు అతీతంగా ఎదిగిన ఋషి. ఎలాంటి పరిస్థితిలోనైనా నిర్మలమైన మనస్సుతో ఉండగలిగి, చివరికి, భగవత్ సేవకి ఉపకరించేది అయితే అధర్మ పక్షాన యుద్ధం చేయటానికి కూడా ఒప్పుకున్నాడు. భగవంతునికి శరణాగతి చేసిన వారు, ఫలితాల చేత ప్రభావితం కాకుండా, అన్ని సందర్భాలలో తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు, అని ఉదాహరణగా చూపించాడు. అలాంటి వ్యక్తులు ఎప్పటికీ శోకింపరు ఎందుకంటే వారు ప్రతీదాన్నీ ఈశ్వర అనుగ్రహంలా స్వీకరిస్తారు.
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః । న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ।। 12 ।।
12
2
https://www.holy-bhagava…udio/002_012.mp3
న — ఎప్పటికీ కాదు; తు — కానీ; ఏవ — తప్పకుండా; అహం — నేను; జాతు — ఏ కాలంలో నైనా; న — కాదు; ఆసం — ఉండుట; న — కాదు; త్వం — నీవు; న — కాదు; ఇమే — ఈ యొక్క; జన-అధిపాః — రాజులు; న — కాదు; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; న భవిష్యామః — ఉండకుండా జరుగుట; సర్వే వయం — మనమందరమూ; అతః — ఇప్పటినుండి; పరం — తరువాత.
BG 2.12: నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు; ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము.
డెల్ఫిలో వున్న టెంపుల్ అఫ్ అపోలో ద్వారం పై ‘జ్ఞోతి సూఎటోన్’ (Gnothi Seuton) అంటే ‘నిన్ను నీవు తెలుసుకో' అని అక్షరాలు చెక్కి ఉన్నాయి. ఏథెన్స్‌కి చెందిన పెద్దమనిషి, పండితుడు సోక్రటీస్ కూడా జనులను తమ ఆత్మ తత్త్వం గురించి విచారించమని ప్రోత్సహించేవాడు. ఒక స్థానిక కథ ఇలా చెప్పబడేది:ఒకనాడు సోక్రటీస్ గాఢమైన తత్త్వ విచారణ ధ్యాసలో లీనమై వీధిలో వెళుతుండగా, ఒక ఆసామిని అనుకోకుండా తగిలాడు.ఆ వ్యక్తి చికాకుగా అన్నాడు, ‘ఎక్కడ నడుస్తున్నావో చూసుకోలేవా? ఎవరు నువ్వు?’ అని.సోక్రటీస్ తమాషాగా ఇలా బదులిచ్చాడు, ‘నేస్తమా, ఈ ప్రశ్న గురించే నేను గత నలభై ఏళ్లుగా ఆలోచిస్తున్నాను. నీకు ఎప్పుడైనా నేనెవరో తెలిస్తే, దయచేసి నాకు తెలియచెప్పు.’ అని.వైదిక సంప్రదాయంలో, ఎప్పుడు దివ్యజ్ఞానం బోధించబడినా, సాధారణంగా అది ఆత్మ-జ్ఞానంతో మొదలవుతుంది. సోక్రటీస్‌కి పరమాద్భుతంగా అనిపించి వుండే ఈ విషయంతో, శ్రీ కృష్ణుడు అదే పద్ధతిని భగవద్గీతలో కూడా అనుసరిస్తున్నాడు. 'నేను' అని మనము అనుకునేది నిజానికి ఆత్మ అని, ఈ భౌతిక శరీరము కాదని, ఇది భగవంతుని వలె సనాతనమైనదని, శ్రీ కృష్ణుడు ఉపదేశాన్ని ఆరంభిస్తున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది:జ్ఞాజ్ఞౌ ద్వావజా వీశనీశా-వజా హ్యేకా భోక్తృ భోగ్యార్థ యుక్తాఅనంతశ్చాత్మా విశ్వరూపో హ్యకర్తాత్రయం యదా విందతే బ్రహ్మమేతత్ (1.9) పై శ్లోకం ఇలా చెప్తున్నది: సృష్టి అనేది మూడింటి కలయికతో ఉన్నది - భగవంతుడు, ఆత్మ, మరియు మాయ - ఈ మూడూ కూడా సనాతనమైనవే. మనము ఆత్మ నిత్యము అని నమ్మితే, ఈ భౌతిక శరీర మరణం తరువాత జీవితం ఉంటుంది అని సతర్కముగా నమ్మినట్టే. తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు దీని గురించి మాట్లాడుతాడు.
దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా । తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।
13
2
https://www.holy-bhagava…udio/002_013.mp3
దేహినః — దేహములోనున్న వాడు; అస్మిన్ — దీనిలో; యథా — ఎట్లయితే; దేహే — శరీరంలో; కౌమారం — బాల్యము; యౌవనం — యుక్తవయస్సు; జరా — వార్ధక్యము (ముసలితనము); తథా — ఆ విధముగానే; దేహ-అంతర — ఇంకొక దేహము; ప్రాప్తిః — పొందును; ధీరః — వివేకులు; తత్ర — ఆ విషయములో; న ముహ్యతి — భ్రమకు లోనవ్వరు;
BG 2.13: ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహము లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు.
శ్రేష్ఠమైన తర్కముతో శ్రీ కృష్ణుడు, ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు, ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించే సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు. ఒక జన్మలోనే మనము బాల్యము, యౌవనము, యుక్తవయసు, తదుపరి వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాము అని వివరిస్తున్నాడు. వాస్తవానికి, ఆధునిక శాస్త్రము ప్రకారం శరీరంలోని జీవ కణాలు నిరంతరంగా పునరుత్పత్తి చెందుతుంటాయి - పాత కణాలు మృతినొందుతూ, వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతుంటాయి. ఒక అంచనా ప్రకారం, ఏడు సంవత్సరాల లోపు, అన్నీ జీవకణాలు మారిపోతాయి. అంతేకాక, కణాలలోని అణువులు ఇంకా వేగంగా మారిపోతాయి. మనము తీస్కునే ప్రతి శ్వాస ద్వారా జీవక్రియచే, ఆక్సిజన్ అణువులు జీవకణాల లోనికి పీల్చబడి, అప్పటివరకు కణాలలో ఉన్న అణువులు కార్బన్-డై-ఆక్సైడ్ రూపంలో విడుదల చేయబడతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక సంవత్సర కాలం లోనే మన శరీరంలోని తొంభై ఎనిమిది శాతం అణువులు మారిపోతాయి. అయినా సరే, నిరంతరం శరీరం మారిపోతున్నా, మనకు అదే వ్యక్తిని అన్న భావన ఉంటుంది. ఇది ఎందుకంటే మనము ఈ భౌతిక శరీరము కాదు, మనము లోపల వసించి ఉన్న ఈశ్వర-సంబంధియైన జీవాత్మ.ఈ శ్లోకంలో, దేహ అంటే శరీరము, మరియు దేహి అంటే 'దేహమును కలిగియున్నది' అంటే జీవాత్మ. ఒక జీవితకాలం లోనే శరీరం నిరంతరంగా మారుతూ ఉండటంవలన ఆత్మ చాలా శరీరాలు మారినట్టే, అని అర్జునుడు గుర్తించేట్టు చేస్తున్నాడు శ్రీ కృష్ణుడు. అదే విధంగా, ఇది మరణం తరువాత ఇంకొక శరీరంలోనికి వెళుతుంది. నిజానికి, ప్రాపంచిక పరిభాషలో, 'మరణం' అని మనం అనుకునేది, జీవాత్మ తన యొక్క పనిచేయని పాత శరీరాన్ని త్యజించడం మాత్రమే, మరియు ‘పుట్టుక’ అని చెప్పుకునేది, జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకోచోట తీసుకోటమే. ఇదే పునర్జన్మ సిద్ధాంతం.చాలామటుకు తూర్పుదేశ తత్త్వశాస్త్రములు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. హిందూ, జైన, మరియు సిక్కు మతాలలో ఇది అంతర్భాగం. బౌద్ధధర్మంలో, బుద్ధుడు తన గత జన్మలను చాలా సార్లు ప్రస్తావించాడు. పాశ్చాత్య తత్త్వశాస్త్ర సిద్ధాంతాల్లో కూడా పునర్జన్మ సిద్ధాంతం ఎంత ప్రబలంగా ఉండేదో చాలా మందికి తెలియదు. పురాతన పాశ్చాత్య మతాలు, తత్త్వశాస్త్ర వర్గాల్లో, ప్రసిద్ధ ఆలోచనాపరులు పైథాగరస్, ప్లేటో, మరియు సోక్రటీస్ వంటి వారు పునర్జన్మ నిజమని అంగీకరించారు మరియు వారి అభిప్రాయాలు కూడా ఆర్ఫిజం, హెర్మెటిసిజం, నియోప్లాటోనిజం, మానిచియానిజం, మరియు గ్నోస్టిసిజం (Orphism, Hermeticism, Neoplatonism, Manichaenism, and Gnosticism) లలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమైన అబ్రహమిక్ మతాలలో, మూడు ప్రధాన మతాల తత్త్వవేత్తలు కూడా పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతు పలికారు. ఉదాహరణకి, కబ్బలాహ్ ని అధ్యయనం చేసిన యూదులు, క్రైస్తవ కాథర్లు, మరియు అలావి షియాలు, డ్రూజ్ వంటి ఇస్లాం షియా శాఖలు. పాశ్చాత్య మతాలలో, ఉదాహరణకి, గొప్ప పురాతన యూదు చరిత్రకారుడు అయిన జోసెఫస్, తన రచనల్లో ఉపయోగించిన భాష ప్రకారం, ఆ కాలపు ఫారిసీలు మరియు ఎస్సెనెలల్లో పునర్జన్మ నమ్మకం ఉన్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా యూదు కబ్బాలాహ్, పునర్జన్మని, 'గిల్గుల్ నేశామోట్' (gilgul neshamot), లేదా 'ఆత్మ యొక్క దొర్లుట' అని చెప్పడము జరిగింది. ప్రఖ్యాత సూఫీ తత్త్వవేత్త మౌలానా జలాలుద్దీన్ రూమీ ఈ విధంగా ప్రకటించాడు:నేను రాయిగా చనిపోయి ఒక చెట్టు అయ్యాను; (I died out of the stone and I became a plant)నేను చెట్టుగా చనిపోయి ఒక జంతువు అయ్యాను (I died out of the plant and became an animal)నేను జంతువుగా చనిపోయి ఒక మనిషిని అయ్యాను (I died out of the animal and became a man)అలాంటప్పుడు నేను మరణం గురించి ఎందుకు భయపడాలి? (Why then should I fear to die?)మరణించి నేను తక్కువ అయిపోయింది ఎప్పుడు? (When did I grow less by dying?)నేను మనిషిగా చనిపోయి ఒక దేవత అవుతాను! (I shall die out of man and shall become an angel!)అనేక మంది ప్రాచీన క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు. క్రైస్తవ చరిత్ర తెలియచేసిన ప్రకారం, పునర్జన్మ సిద్ధాంతాన్ని చర్చించడానికి 325 AD లో, కౌన్సిల్ ఆఫ్ నైసియా (Council of Nicaea), సమావేశం జరిగింది, మరియు బహుశా ప్రజల జీవితాలపై చర్చి యొక్క ఆధిపత్యం పెంచడానికి కాబోలు, తదుపరి అది (పునర్జన్మ సిద్ధాంతం) మతవిరోధముగా ప్రకటించబడింది. అప్పటివరకు అది సర్వ-సాధారణముగా అంగీకరించబడింది. ఏసుక్రీస్తు తన శిష్యులకు, ‘జాన్ ద బాప్టిస్ట్’ (John the Baptist) అనేవారు 'ఎలైజా ద ప్రాఫెట్’ (Elijah the Prophet) యొక్క అవతారమే అని చెప్పటం ద్వారా, పరోక్షంగా ఈ సిద్ధాంతాన్ని ప్రకటించారు. (మాథ్యూ 11:13-14, మాథ్యూ 17:10-13). ఇది పాత నిబంధన (ఓల్డ్ టెస్టమెంట్) లో కూడా పేర్కొనబడింది. (Malachi 4:5). క్రైస్తవ ఫాదర్లలో అత్యుత్తమ పండితుడు అయిన ఒరిజెన్, ఇలా ప్రకటించారు: ‘ప్రతి మనిషి తన పూర్వ జన్మల కర్మల అనుగుణంగా ఒక శరీరం పొందుతాడు’ (Every man receives a body for himself according to his deserts in former lives) సోలమన్ యొక్క 'బుక్ అఫ్ విస్డం' ప్రకారం: ‘మంచి శరీరంతో సక్రమమైన అవయవాలతో పుట్టడం అనేది పూర్వ జన్మలలో చేసిన మంచి పనుల ప్రతిఫలం.’ (To be born in sound body with sound limbs is a reward of the virtues of the past lives) (విస్డం ఆఫ్ సోలోమన్, Wisdom of Solomon 8:19-20)ప్రపంచవ్యాప్తంగా, సైబీరియా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, మరియు ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో, అనేక ఆదివాసీ సమాజాలలో పునర్జన్మపై నమ్మకం కనబడుతుంది. ఇక ఇటీవలి శతాబ్దాల కాలంలో మరియు నాగరికతల్లో చూస్తే, రోసిక్రూసియన్స్, స్పిరిటిజం, థియోసాఫిస్ట్స్ మరియు న్యూ ఏజ్ (Rosicrucians, Spiritism, Theosophists, and New Age) అనుసరించేవారిలో పునర్జన్మ విశ్వసించబడింది. ఇంకా ఇటీవలే, ప్రముఖ విశ్వవిద్యాలయాల గంభీర శాస్త్రీయ వర్గాలలో ఇది అధ్యయనం చేయబడింది, ఉదాహరణగా వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ మరియు డాక్టర్ జిమ్ టకర్ యొక్క రచనలను చెప్పవచ్చు.పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా, ప్రపంచంలోని కష్టాలు, గందరగోళాలు, మరియు అసంపూర్ణతలను అర్థం చేసుకోలేము, అందుకే, అనేక ప్రసిద్ధ పాశ్చాత్య తత్త్వవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నమ్మారు. వర్జిల్ మరియు ఓవిడ్, ఈ సిద్ధాంతం స్పష్టంగా దానికదే తెలిసిపోతోందని భావించారు. జర్మన్ తత్త్వవేత్తలు గోతే, ఫిష్టే, షెల్లింగ్, మరియు లెస్సింగ్ (Goethe, Fichte, Schelling, and Lessing) దీన్ని అంగీకరించారు. మరింత ఇటీవల తత్త్వవేత్తలైన హ్యూమే, స్పెన్సర్, మరియు మాక్స్ మ్యుల్లర్ (Hume, Spencer, and Max Müeller) వీరందరూ దీనిని నిర్వివాదమైన సిద్ధాంతమని ఒప్పుకున్నారు. పాశ్చాత్య కవులలో, బ్రౌనింగ్, రోసెట్టి, టెన్నిసన్, మరియు వర్డ్స్ వర్త్ (Browning, Rosetti, Tennyson, and Wordsworth) మొదలగు వారు అందరూ దీనిని నమ్మారు.శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వము, వివేకులు శోకింపరు అని చెప్పి ఉన్నాడు. కానీ, నిజానికి మనము సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. దీనికి గల కారణం ఏమిటి ? ఇప్పుడు ఆ విషయాన్ని వివరిస్తాడు.
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః । ఆగమాపాయినోఽనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ।। 14 ।।
14
2
https://www.holy-bhagava…udio/002_014.mp3
మాత్రా-స్పర్శాః — ఇంద్రియముల యొక్క ఇంద్రియ-విషయ సంయోగము చే; తు — నిజముగా; కౌంతేయ — అర్జునా; కుంతీ పుత్రుడా; శీత — చలికాలం; ఉష్ణ — ఎండాకాలం; సుఖ — సంతోషము; దుఃఖ — దుఃఖము; దాః — ఇచ్చును; ఆగమ — వచ్చును; అపాయినః — పోవును; అనిత్యాః — అనిత్యములు; తాన్ — వాటిని; తితిక్షస్వ — ఓర్చుకొనుము; భారత — భరత వంశీయుడా.
BG 2.14: ఓ కుంతీపుత్రా, ఇంద్రియ-విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన, అనిత్యమైన సుఖ-దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి, చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరత వంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి.
మానవ శరీరానికి దృష్టి, వాసన, రుచి, స్పర్శ, మరియు వినికిడి అనే ఐదు ఇంద్రియ అనుభవములు కలవు. ఇవి, వాటి యొక్క విషయముల సంపర్కం చేత ఆనందం మరియు దుఃఖముల అనుభూతిని కలుగచేస్తాయి. ఈ అనుభవాలు ఏవీ కూడా శాశ్వతమైనవి కావు; మారే ఋతువుల్లా అవి వచ్చిపోతుంటాయి. చల్లని నీరు వేసవిలో ఆనందం కలుగచేసినప్పటికీ, అదే నీరు శీతాకాలంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విధంగా, ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందం మరియు బాధ యొక్క అనుభూతులు తాత్కాలికమే. వీటివల్ల ప్రభావితం అయితే ఒక లోలకంలా అటూ ఇటూ ఊగిపోవలసి వస్తుంది. వివక్ష కలిగిన వ్యక్తి సుఖ దుఃఖాలు రెంటినీ, చెదిరిపోకుండా, తట్టుకోవడానికి సాధన చేయాలి. బౌద్ధమతంలో, ఆత్మ-జ్ఞాన సాధనకి ఉన్న ప్రాథమిక ప్రక్రియ, విపస్సన, ఇంద్రియ అనుభూతులను సహించే ఈ సూత్రం ఆధారంగానే ఉంది. దీని సాధన, కోరికలను తొలగించుకోవటానికి సహకరిస్తుంది. నాలుగు మహనీయమైన సత్యములలో (దుఃఖము యొక్క సత్యము, దుఃఖాల మూలకారణం యొక్క సత్యము, దుఃఖ నివృత్తి సత్యము, దుఃఖ నివృత్తి దిశ మార్గపు సత్యము) చెప్పబడినట్టుగా, 'కోరిక' అనేది అన్ని దుఃఖాలకు మూల కారణం. దీనిలో అంత ఆశ్చర్యం లేదు ఎందుకంటే బౌద్ధ తత్త్వశాస్త్రం అనేది విస్తారమైన వేద తత్వం యొక్క ఉపసముదాయమే.
యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ । సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ।। 15 ।।
15
2
https://www.holy-bhagava…udio/002_015.mp3
యం — ఎవరైతే; హి — వాస్తవముగా; న వ్యథయంతి — వ్యాకుల పడరో; ఏతే — వీటి చే; పురుషం — వ్యక్తి; పురుష-ఋషభ — శ్రేష్ఠమైన పురుషుడా, అర్జునా; సమ — సమానముగా (సమత్వబుద్ధితో); దుఃఖ — బాధ; సుఖం — సంతోషము; ధీరం — స్థిరముగా; సః — ఆ వ్యక్తి; అమృతత్వాయ — మోక్షమునకు; కల్పతే — అర్హుడు అవుతాడు.
BG 2.15: ఓ అర్జునా, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఃఖములచే ప్రభావితం కాకుండా, రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు.
ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు సుఖదుఃఖ అనుభూతులు అనిత్యములు అని వివరించాడు. ఇప్పుడు అర్జునుడిని జ్ఞాన-వివక్ష ద్వారా ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదగమని ప్రోత్సహిస్తున్నాడు. ఈ వివక్షని పెంపొందించుకోవటానికి, మనం మొదట రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకోవాలి: 1) ఎందుకు మనం ఆనందం కోసం ఆకాంక్షిస్తాము? 2) ఎందుకు భౌతిక ప్రాపంచిక ఆనందం మనకు తృప్తినివ్వదు? మొదటి ప్రశ్నకు సమాధానం చాలా సులభం. భగవంతుడు ఒక అనంతమైన ఆనంద సముద్రం మరియు మనం జీవాత్మలం ఆయన అణు-అంశలము. అంటే ప్రాథమికంగా మనం అనంతమైన ఆనంద సాగరం యొక్క చిన్న భాగాలము అని అర్థం. స్వామీ వివేకానంద, జనులని సంబోధిస్తూ, ‘నిత్యమైన ఆనంద స్వరూపం యొక్క బిడ్డల్లారా’, (O ye children of immortal bliss) అని అనేవాడు. ఎలాగైతే ఒక బిడ్డ తన తల్లి వైపు ఆకర్షితమవుతుందో, ప్రతి భాగము సహజంగా దాని పూర్ణభాగం వైపు ఆకర్షితమౌతుంది. అదేవిధముగా, ఆనంద సముద్రం యొక్క అణు-అంశలము కావటం వలన, మనం జీవాత్మలము కూడా ఆ ఆనందము వైపు ఆకర్షితులమైతాము. కాబట్టి ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే. ఆనందం దేనిలో ఉంది, ఏ రూపంలో ఉంది అన్న విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు కానీ అన్నీ ప్రాణులు దాన్ని తప్ప వేరేది ఏదీ కోరవు. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. ఇక ఇప్పుడు రెండవ ప్రశ్నకు సమాధానాన్ని అర్థం చేసుకుందాం. ఆత్మ అనేది పరమాత్మ యొక్క అణు-అంశము కాబట్టి అది భగవంతుని వలె దివ్యమైనది. కావున, ఆత్మ కోరుకునే ఆనందం కూడా దివ్యమైన ఆనందమే. అటువంటి ఆనందం ఈ క్రింది మూడు లక్షణాలను తప్పకుండా కలిగి ఉండాలి. — అది పరిమాణం లో అనంతమై ఉండాలి. — అది శాశ్వతమై ఉండాలి. — అది ఎప్పుడూ కొత్తగా/తాజాగా ఉండాలి. భగవంతుని ఆనందము అలా ఉంటుంది, అది సత్-చిత్-ఆనందము, అంటే నిత్యమైన-చైతన్యవంతమైన-ఆనంద సింధువు అని అంటారు. కానీ, ఇంద్రియములకు వాటి విషయ సంయోగము ద్వారా మనము అనుభవించే ఆనందము దీనికి విరుద్ధముగా ఉంటుంది; అది తాత్కాలికమైనది, పరిమితమైనది, మరియు జడమైనది. ఇందుకే, శరీరం ద్వారా అనుభవించే భౌతికమైన ఆనందము మనలో ఉన్న దివ్యమైన జీవాత్మను సంతృప్తి పరచలేదు. ఈ వివేచనతో, మనము భౌతిక ఆనంద అనుభూతిని నియంత్రించుకునే సాధన చేయాలి. అదేవిధంగా, మనము భౌతిక బాధలను, దుఃఖాన్ని సహించాలి. (ఈ రెండవ అంశం 2.48వ, 5.20వ వంటి తదుపరి చాలా శ్లోకాలలో విశదంగా చెప్పబడింది) అప్పుడే మనం ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదుగుతాము మరియు ఇక ప్రాపంచిక భౌతిక శక్తి మనలను కట్టివేయలేదు.
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః । ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।
16
2
https://www.holy-bhagava…udio/002_016.mp3
న — కాదు; అసతః — తాత్కాలికమైనదానికి; విద్యతే — ఉన్నది; భావః — ఉనికి; న — లేదు; అభావః — అంతం; విద్యతే — ఉన్నది; సతః — శాశ్వతమైనదానికి; ఉభయో — రెంటిలో; అపి — మరియు; దృష్టః — చూడబడినది; అంతః — సారాంశం; తు — నిజముగా; అనయోః — వీటిలో; తత్త్వ — వాస్తవమును; దర్శిభిః — జ్ఞానదృష్టికలవారిచే.
BG 2.16: అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం, ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి.భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వాసర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ (1.12)క్షరం ప్రధానమమృతాక్షరం హరఃక్షరాత్మానా వీశతే దేవ ఏకః (1.10)సంయుక్తమేతత్ క్షరమక్షరం చవ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశః (1.8) ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే - భగవంతుడు, జీవాత్మ, మరియు మాయ – ఈ మూడూ కూడా నిత్యము, శాశ్వతము.1. భగవంతుడు నిత్యశాశ్వతుడు, అంటే ఆయన సత్ (ఎల్లప్పుడూ ఉంటాడు). అందుకే వేదాల్లో ఆయనకు ఒక పేరు సత్-చిత్-ఆనంద స్వరూపుడు (నిత్యుడు-జ్ఞానస్వరూపుడు- ఆనంద సింధువు).2. ఆత్మ నాశనములేనిది. అందుకే అది 'సత్'. కానీ, ఈ శరీరం ఏదో ఒక రోజు నశిస్తుంది అందుకే ఇది 'అసత్' (తాత్కాలికం). ఆత్మ కూడా సత్-చిత్-ఆనంద రూపమే కానీ ఇది 'అణు' (అతి సూక్ష్మమైన) మాత్రమే. కాబట్టి ఇది అణు-సత్, అణు-చిత్, అణు-ఆనంద స్వరూపము.3. దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడిందో, ఆ 'మాయ' కూడా నిత్యమైనదే లేదా 'సత్'. కానీ, మన చుట్టూ కనిపించే అన్నీ భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే, మళ్ళీ అవి కాలంలో నశిస్తాయి. ఈ విధంగా అవన్నీ కూడా 'అసత్' లేదా తాత్కాలికమైనవి అని చెప్పవచ్చు. భౌతిక ప్రపంచం 'అసత్' అయినా, మాయ మాత్రం 'సత్'.ఈ ప్రపంచం 'అసత్' అన్నప్పుడు దాన్ని 'మిథ్య' అని తప్పుగా అనుకోవద్దు. అసత్ (తాత్కాలికము) అంటే మిథ్య (లేనిది) కాదు. కొంత మంది తత్త్వ వేత్తలు ఈ ప్రపంచం 'మిథ్య' (ఉనికి లేనిది) అంటారు. వారు ఏమంటారంటే, మనలోని అజ్ఞానం వల్లనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయని, మనం బ్రహ్మ జ్ఞానంలో స్థితులమై ఉంటే, ఈ జగత్తు ఉనికి ఉండదు అని. కానీ, ఇది గనక నిజమే అయితే, బ్రహ్మ జ్ఞానులకు ఈ జగత్తు కనుమరుగైపోవాలి. వారు తమ అజ్ఞానాన్ని నశింపచేసుకున్నారు కాబట్టి ఈ ప్రప్రంచం ఉనికి వారికి ఉండకూడదు. మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్-ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు, ఎలా రాసారు? పెన్ను, పేపరు ఎక్కడ నుండి వచ్చాయి? బ్రహ్మ-జ్ఞాన పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి, ఈ జగత్తు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది. అంతేకాక, బ్రహ్మ జ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే. వేదాల్లో 'పశ్వాదిభిశ్చావిశేషత్’ అని చెప్పబడింది. ‘అన్ని ప్రాణులలాగానే బ్రహ్మ-జ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది, వారు కూడా ఆహారం తినాలి.’ ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి?ఇంకా, తైత్తిరీయ ఉపనిషత్తులో పలుమార్లు, ఈ జగత్తు అంతటా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పబడింది.సోఽకామయత బహు స్యాం ప్రజాయేయేతి స తపోఽతప్యత సతపస్తప్త్వా ఇదంసర్వమసృజత యదిదం కిం చ తత్సృష్ట్వాతదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య సచ్చ త్యచ్చాభవత్నిరుక్తం చానిరుక్తం చ నిలయనం చానిలయనం చ విజ్ఞానంచావిజ్ఞానంచ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదంకిం చ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి (2.6.4) భగవంతుడు ఈ జగత్తుని సృష్టించడమే కాదు, ప్రతి పరమాణువులో వ్యాపించి ఉన్నాడు అని ఈ వేద మంత్రం, ప్రతిపాదిస్తున్నది. భగవంతుడు ప్రతి పరమాణువులో వాస్తవంగా ఉన్నట్లయితే, ఈ ప్రపంచం లేకుండా ఎలా ఉంటుంది? ఈ జగత్తు మిథ్య అనటం, భగవంతుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న నిజాన్ని వ్యతిరేకించటమే అవుతుంది. ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, జగత్తుకి ఉనికి ఉంది కానీ అది అనిత్యము, అశాశ్వతము అని వివరిస్తున్నాడు. అందుకే దీనిని 'అసత్' లేదా 'తాత్కాలికము' అన్నాడు; దాన్ని మిథ్య లేదా 'లేనిది' అనలేదు.
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ । వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి ।। 17 ।।
17
2
https://www.holy-bhagava…udio/002_017.mp3
అవినాశి — నాశముచేయరాని; తు — నిజముగా; తత్ — అది; విద్ధి — తెలుసుకొనుము; యేన — ఎవరిచేతనైతే; సర్వం — అంతయు; ఇదం — ఇది; తతమ్ — వ్యాప్తి నొంది ఉన్నదో; వినాశమ్ — వినాశము; అవ్యయస్య — అనశ్వరమైన, నిత్యమైన దాని; అస్య — యొక్క; న కశ్చిత్ — ఎవ్వడూ కాడు; కర్తుమ్ — చేయటానికి; అర్హతి — సమర్థుడు.
BG 2.17: శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనంచేయలేరు.
ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పటం ద్వారా, శరీరానికి జీవాత్మకి ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీ కృష్ణుడు. అంటే పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నదేమిటి? ఆత్మ సచేతనమైనది, అంటే చైతన్యము కలిగినది. శరీరము జడ పదార్థంచే తయారుచేయబడినది, చైతన్య రహితమైనది. కానీ, ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణమును శరీరానికి కూడా ఇస్తుంది. ఈ విధంగా శరీరమంతా, ఆత్మ నిండి నిబిడీకృతమై తన చైతన్యాన్ని అంతటా వ్యాపింపచేస్తుంది.కొందరికి ఈ ఆత్మ యొక్క స్థానంపై సందేహాలు ఉంటాయి. ఆత్మ, హృదయ స్థానంలో ఉంటుందని వేదాలు పేర్కొంటున్నాయి:హృది హ్యేష ఆత్మా (ప్రశ్నోపనిషత్తు 3.6)స వా ఏష ఆత్మా హృది (ఛాందోగ్య ఉపనిషత్తు 8.3.3)'హృది' అన్న పదం, ఆత్మ హృదయ ప్రాంతంలో స్థితమై ఉంటుందని సూచిస్తున్నది. అయినా, ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యము, శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? వేద వ్యాసుడు ఈ విషయాన్ని క్రింది విధంగా వివరిస్తాడు:అవిరోధశ్చందనవత్ (బ్రహ్మ సూత్రములు 2.3.23)‘ఎలాగైతే లలాటము (నుదురు) పై చందనం అద్దితే, శరీరమంతా చల్లబడి పోతుందో, అదేవిధంగా, ఆత్మ, స్థానికంగా హృదయంలో ఉన్నా తన చైతన్యాన్ని శరీరమంతా వ్యాపింపచేస్తుంది.’ఇంకా ఎవరైనా ఇలా అడగవచ్చు - చైతన్యమనేది ఆత్మ యొక్క లక్షణం అయితే అది శరీరంలోన ఎట్లా వ్యాపించింది? అని. ఈ ప్రశ్నకి కూడా వేద వ్యాసుడు సమాధానం చెప్పాడు:వ్యక్తిరేకో గంధవత్ (బ్రహ్మ సూత్రములు 2.3.26)‘సువాసన అనేది పుష్పం యొక్క లక్షణం. కానీ, అది పెరిగే తోట కూడా మంచి వాసనతో ఉంటుంది.’ అంటే, పువ్వు తన సువాసన లక్షణాన్ని తోటకి ఇవ్వగలిగింది. అదేవిధంగా, ఆత్మ సచేతనమైనది, అది జీవం లేని జడ శరీరాన్ని కూడా తన చైతన్యంతో వ్యాపింపచేసి చైతన్యవంతం చేస్తుంది.
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః । అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ।। 18 ।।
18
2
https://www.holy-bhagava…udio/002_018.mp3
అంత-వంతః — అంతము కలిగిఉన్న (నశించిపోయేవి); ఇమే — ఇవి; దేహాః — భౌతిక శరీరాలు; నిత్యస్య — ఎప్పటికీ ఉండే; ఉక్తాః — చెప్పబడినవి; శరీరిణః — దేహమునందున్న జీవాత్మ; అనాశినః — నాశరహితమైనది; అప్రమేయస్య — అపరిమితమైన, కొలవశక్యము కాని; తస్మాత్ — కాబట్టి; యుధ్యస్వ — యుద్ధం చేయుము; భారత — భరత వంశీయుడా, అర్జునా.
BG 2.18: ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది; అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యముకానిది, మరియు నిత్యశాశ్వతమైనది. కావున, ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము.
స్థూల శరీరము యథార్థముగా మట్టితో తయారయినదే. మట్టియే కూరగాయలుగా, ఫలములుగా, ధాన్యముగా, పప్పుదినుసులుగా, మరియు గడ్డిగా మారుతుంది. ఆవులు గడ్డి మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి. మనము మనుష్యులము ఈ ఖాద్య పదార్థములన్నీ భుజించగా, అవి మన శరీరముగా మారుతాయి. కాబట్టి, శరీరము మట్టితో తయారయ్యిందని అనటంలో అతిశయోక్తి లేదు. మరణ సమయంలో, ఆత్మ వెళ్ళిపోయిన తరువాత, శరీరము మూడు రకాలుగా అంతమవ్వచ్చు. క్రిమి, విద్, లేదా భస్మ. అది కాల్చివేయబడితే, అప్పుడు అది భస్మముగా మారి మట్టిగా అయిపోతుంది. లేదా, అది పాతి పెట్టబడితే, అప్పుడు క్రిమికీటకాలు దాన్ని తిని మళ్లీ మట్టిగా మారుస్తాయి. లేదా అది నదిలో విసిరి వేయబడవచ్చు, అప్పుడు నీటి (సముద్ర) ప్రాణులు దాన్ని తమ ఆహారంగా చేసుకుని వ్యర్థంగా విసర్జిస్తాయి, అది చిట్టచివరికి సముద్రగర్భంలోని మట్టిలో కలిసి పోతుంది. ఈ ప్రకారంగా, జగత్తులో మట్టి ఒక అద్భుతమైన పరిణామ చక్రానికి లోనగుతుంది. అది ఖాద్య పదార్థాలుగా మారుతుంది, శరీరాలు ఆ ఖాద్య పదార్థాలతో తయారవుతాయి, మరల, ఈ శరీరాలు తిరిగి మట్టి లోనికే చేరుతాయి. బైబిలు ఇలా పేర్కొంటుంది: ‘నీవు మట్టియే గనుక, నీవు తిరిగి మట్టిలోనికే తిరిగి చేరుకుందువు’ (For dust thou are, and unto dust thou shalt return. - Genesis 3:19). ఈ వాక్యం భౌతిక శరీరాన్ని ఉద్దేశించినది. శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు, ‘ఆ భౌతిక శరీరంలోన, నిత్యమైన, నాశరహితమైన అస్తిత్వం ఒకటి ఉన్నది, అది మట్టితో చేయబడలేదు. అదే దివ్య జీవాత్మ, నిజమైన నేను’
య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్। ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ।। 19 ।।
19
2
https://www.holy-bhagava…udio/002_019.mp3
యః — ఎవరైతే; ఏనం — ఇది; వేత్తి — తెలుసుకుంటారో; హంతారం — చంపేది; యః — ఎవరైతే; చ — మరియు; ఏనం — ఇది; మన్యతే — అనుకుంటాడో; హతం — చంపబడేది; ఉభౌ — రెండూ; తౌ — వారు; న — కాదు; విజానీతః — జ్ఞానం కలిగిఉన్న; న — కాదు; అయం — ఇది; హంతి — చంపును; న — కాదు; హన్యతే — చంపబడును.
BG 2.19: ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు - ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతనూ చంపబడదు.
మనలను మనం ఈ భౌతిక శరీరమే అని అనుకోవటం వలన మరణము అనే భ్రాంతి కలుగుతుంది. రామాయణం దీన్ని ఈ విధంగా వివరిస్తున్నది:జౌఁ సపనేఁ సిర కాటఇ కోఈ, బిను జాగేఁ న దూరి దుఖ హోఈ‘మన తల తెగిపోతున్నట్టుగా కల వస్తే, ఆ నొప్పి అనుభూతి మనం నిద్రలేచే వరకూ ఉంటుంది.’ కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి, కానీ దాని వలన కలిగిన నొప్పి అనుభవము మనము నిద్ర లేచి ఆ భ్రాంతిని పోగొట్టుకోనేవరకు బాధిస్తునే ఉంటుంది. అదేవిధంగా, మనము ఈ శరీరమే అన్న భ్రాంతిలో మనము మరణానికి భయపడుతాము. జ్ఞానోదయం అయిన జీవులకు, ఎవరికైతే ఈ భ్రాంతి తొలగిపోతుందో, వారికి మరణం యొక్క భయం నశిస్తుంది.ఎవరూ కూడా ఎవరినీ చంపలేరు అన్నప్పుడు, మరి హత్య చేయడం దండించవలసిన నేరం ఎలా అవుతుంది? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే, శరీరం అనేది జీవాత్మ యొక్క వాహనం. ఏ ప్రాణి యొక్క వాహనాన్ని ధ్వంసం చేయటమైనా హింస చేసినట్టే, అది నిషిద్ధం. వేదములు స్పష్టంగా ‘మా హింస్యాత్ సర్వభూతాని’ ‘ఎవరిపట్లా హింసకు పాల్పడవద్దు.’ అని ఉపదేశిస్తున్నాయి. నిజానికి, వేదాలు జంతువులను చంపటం కూడా నేరంగా పరిగణిస్తాయి.కానీ కొన్ని సందర్భాలలో నియమాలు మారుతాయి, మరియు హింస కూడా అవసరం అవుతుంది. ఉదాహరణకి, పాము కాటు వేయటానికి వస్తున్న సమయంలో, మారణాయుధాలతో దాడి చెయ్యబడ్డప్పుడు, జీవనాధారం లాక్కోబడినప్పుడు, ఆత్మ రక్షణ కొరకు హింస అనుమతించబడింది.ఈ ప్రస్తుత పరిస్థితిలో, అర్జునుడికి సరియైనది ఏమిటి, హింసనా లేదా అహింసనా?, ఎందుకు? శ్రీ కృష్ణుడు, భగవద్గీత ఉపదేశము ద్వారా అతనికి విపులముగా విశదీకరిస్తాడు. ఈ వివరణలో భాగంగా, ఉపదేశ విషయం తేటతెల్లం చేయటానికి అమూల్యమైన దివ్య జ్ఞానము లోకానికి వెల్లడి చేయబడుతుంది.
న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ।। 20 ।।
20
2
https://www.holy-bhagava…udio/002_020.mp3
న జాయతే – జన్మించదు; మ్రియతే — మరణించదు; వా — లేదా; కదాచిత్ — ఎప్పుడైనా; న — కాదు; అయం — ఇది; భూత్వా — ఒకప్పుడు ఉండి; భవితా — భవిష్యత్తులో ఉండేది; వా — లేదా; న — కాదు; భూయః — ఇంకా; అజః — జన్మలేనిది; నిత్యః — నిత్యమైనది; శాశ్వతః — శాశ్వతమైనది; అయం — ఇది; పురాణః — సనాతనమైనది; న హన్యతే — నాశనం కానిది; హన్యమానే — నశించును; శరీరే — శరీరం ఎప్పుడైతే.
BG 2.20: ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.
పుట్టుకకి మరణానికి అతీతమై ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత నిత్యమైన తత్త్వం ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. ఆ ప్రకారంగా, ఆరు రకముల మార్పులు దానికి లేవు - అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, మరియు వినశ్యతి - ‘గర్భవాసం, పుట్టుక, పెరుగుదల, పునరుత్పత్తి, తరుగుదల, మరియు మరణించుట.’ ఇవి శరీరం యొక్క పరిణామాలు, ఆత్మకు వర్తించవు. మనము అనుకునే మరణం, కేవలం శరీర వినాశనం మాత్రమే, కానీ నిత్యమైన ఆత్మ, శరీరంలో కలిగే మార్పులచే ప్రభావితం కాదు. వేదాల్లో ఈ విషయాన్ని చాల సార్లు ప్రతిపాదించారు. కఠోపనిషత్తులో ఒక మంత్రం దాదాపు ఈ భగవద్గీత శ్లోకం లాగానే ఉంది.న జాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్ న బభూవ కశ్చిత్అజో నిత్యః శాశ్వతో ఽయం పురాణోన హన్యతే హన్యమానే శరీరే (1.2.18) ‘ఆత్మకు పుట్టుక లేదు, దానికి మరణం లేదు; అది దేని నుండీ ఉద్భవించలేదు, ఏదీ కూడా దాని నుండి ఉద్భవించలేదు. అది జన్మలేనిది, సనాతనమైనది, నిత్యమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించినప్పుడు అది నశించదు.’ బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:స వా ఏష మహాన్ అజ ఆత్మాజరో ఽమరో ఽమృతో ఽభయః (4.4.25)‘ఆత్మ మహిమాన్వితమైనది, పుట్టుక లేనిది, మరణం లేనిది, వృద్ధాప్యము లేనిది, శాశ్వతమైనది మరియు భయరహితమైనది.’
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ । కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ।। 21 ।।
21
2
https://www.holy-bhagava…udio/002_021.mp3
వేద — తెలుసుకున్న; అవినాశినం — నాశము కానిది; నిత్యం — నిత్యమైనది; యః — ఎవరైతే; ఏనమ్ — ఇది; అజమ్ — జన్మ లేనిది; అవ్యయమ్ — మార్పుచెందనిది; కథం — ఎట్లా; సః — అది; పురుషః — వ్యక్తి; పార్థః — పార్థా; కం — ఎవరిని; ఘాతయతి — చంపే కారణం; హంతి — చంపును; కమ్ — ఎవరిని.
BG 2.21: ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి, ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు?
ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ, మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచి వేస్తుంది. ఆ స్థితిలో, మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చెయ్యదు అని గమనించవచ్చు. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు, అన్నీ పనులు చేస్తూనే వున్నా, వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని, తనను తాను అకర్తగా భావించుకొని, అహంకార రహితముగా, బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని, అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు.
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి । తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 22 ।।
22
2
https://www.holy-bhagava…udio/002_022.mp3
వాసాంసి — వస్త్రములు; జీర్ణాని — జీర్ణమైపోయిన (పాతబడ్డ); యథా — ఆ విధముగా; విహాయ — విడిచిపెట్టి; నవాని — కొత్త; గృహ్ణాతి — స్వీకరించును; నరః — మానవుడు; అపరాణి — వేరైన; తథా — అదే విధముగా; శరీరాణి — శరీరములు; విహాయ — విడిచిపెట్టి; జీర్ణాని — పాతబడ్డ; అన్యాని — వేరే; సంయాతి — ప్రవేశించును; నవాని — కొత్త; దేహీ — జీవాత్మ.
BG 2.22: ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా, మరణ సమయములో, జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును.
ఆత్మ స్వభావాన్ని వివరించటం కొనసాగిస్తూ, శ్రీ కృష్ణుడు, పునర్జన్మ సిద్ధాంతాన్ని, మనం చేసే రోజువారీ పనితో పోల్చుతూ పునరుద్ఘాటిస్తున్నాడు. వస్త్రములు చిరిగిపోయి పనికిరాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము, కానీ ఈ ప్రక్రియలో మనం మారిపోము. ఇదే విధంగా, ఒక దేహమును వదిలి మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో ఆత్మ మార్పునకు లోను కాదు.పునర్జన్మ ఉంటుందని నిరూపించటానికి 'న్యాయ దర్శన్' ఈ క్రింది వాదనని చెపుతోంది.జాతస్య హర్షభయశోక సంప్రతిపత్తేః (3.1.18)మీరు చిన్న శిశువుని గమనిస్తే, ఏ పత్యేకమైన కారణం లేకుండానే, అది ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి విషాదంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. 'న్యాయ దర్శన్' ప్రకారం, ఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకొంటోంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ, ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ మనోముద్రలు మనస్సులో బలంగా ముద్రింపబడటం వలన అవి చాలామటుకు గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతేకాక, జనన, మరణ ప్రక్రియలు ఆత్మకి ఎంత బాధాకరమైనవి అంటే, అవి పూర్వ జన్మ స్మృతులను చాలా మేర తుడిచివేస్తాయి.న్యాయ దర్శన్ పునర్జన్మకి మద్దతుగా ఇంకొక వాదనని పేర్కొంటోంది: స్తన్యాభిలాషాత్ (3.1.21). అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు, తల్లి తన స్తనాన్నిబిడ్డ నోట్లో పెట్టినప్పుడు శిశువుకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి? కానీ, అప్పుడే పుట్టిన శిశువు ఎన్నో పూర్వ జన్మలలో, జంతు జన్మలలో సైతం, ఆయా తల్లుల స్తనాలు, చనుమొనలు, మరియు పొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు, ఆ శిశువు తనంతటతానే గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది.పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే, మనుష్యుల మధ్య ఉన్నఅసమానతన అనేది, కారణం చెప్పడానికి వీలు కాకుండా మరియు అసంబద్ధంగా ఉంటుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డి వాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే, తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనము అతని కర్మఫలం వలన ఇలా జరిగింది అంటే, అతను ఈ ప్రస్తుత జన్మయే తన ఏకైక జన్మ అని, కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పము అంటే, అది కూడా నమ్మశక్యంగానిదే, ఎందుకంటే భగవంతుడు పరమ దయ కలవాడు, నిష్కారణముగా ఎవ్వడూ గుడ్డి వాడిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్కబద్ధ వివరణ ఏమిటంటే అతను తన పూర్వ-జన్మ కర్మల ఫలితంగా గుడ్డి వాడిగా పుట్టాడు. అందువలన, సహజ-వివేకము మరియు వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః । న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ।। 23 ।।
23
2
https://www.holy-bhagava…udio/002_023.mp3
న — కాదు; ఏనం — ఈ ఆత్మ; ఛిందంతి — ముక్కలుచేయబడుట; శస్త్రాణి — ఆయుధములు; న — కాదు; ఏనం — ఈ ఆత్మ; దహతి — కాల్చుట; పావకః — అగ్ని; న — కాదు; చ — మరియు; ఏనం — ఈ ఆత్మ; క్లేదయంతి — తడుపుట; ఆపః — నీరు; న — కాదు; శోషయతి — ఎండగొట్టుట; మారుతః — గాలి.
BG 2.23: ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు.
ఆత్మ యొక్క లక్షణం అయిన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు, కానీ ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది, కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగా, ఆత్మను, గాలి ఎండబెట్టలేదు, నీరు తడపలేదు, మరియు అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు.
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమ్ అక్లేద్యోఽశోష్య ఏవ చ । నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః ।। 24 ।।
24
2
https://www.holy-bhagava…udio/002_024.mp3
అచ్ఛేద్యః — ఛేదింపబడనిది; అయం — ఈ ఆత్మ; అదాహ్యః — దహింప బడనిది; అయం — ఈ ఆత్మ; అక్లేద్యః — తడుపుటకు సాధ్యం కానిది; అశోష్యః — ఎండిపోనిది; ఏవ — నిజముగా; చ — మరియు; నిత్యః — ఎప్పుడూ ఉండేది; సర్వ-గతః — అంతటా వ్యాపించి ఉండేది; స్థాణుః — మార్చలేనిది; అచలః — పరివర్తనలేనిది; అయం — ఈ ఆత్మ; సనాతనః — సనాతనమైనది.
BG 2.24: ఆత్మ, విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది; దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తనలేనిది, మరియు సనాతనమైనది.
ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ మళ్లీ చెప్పబడింది. గురువు గారు పరిపూర్ణ జ్ఞానం కేవలం చెపితే సరిపోదు; ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే, విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి. కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకూ ముందే చెప్పిన విషయాన్ని పునరావృత్తం చేస్తాడు. సంస్కృత సాహిత్యంలో దీనిని పునరుక్తి అంటే 'మళ్లీ చెప్పటం' అంటారు. తన విద్యార్థికి బాగా అర్థం అయ్యేలా, ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలను గట్టిగా చెప్పటానికి శ్రీ కృష్ణుడు చాలా సార్లు 'పునరుక్తి' ని భగవద్గీతలో ఒక ఉపకరణంలా వాడాడు.
అవ్యక్తోఽయమచింత్యోఽయమవికార్యోఽయముచ్యతే । తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ।। 25 ।।
25
2
https://www.holy-bhagava…udio/002_025.mp3
అవ్యక్తః — అవ్యక్తమైన (కనిపించని); అయం — ఈ ఆత్మ; అచింత్యః — మనస్సుకు అందనిది; అయం — ఈ ఆత్మ; అవికార్యః — మార్పుకు లోనుకానిది; (వికారములు లేనిది); అయం — ఈ ఆత్మ; ఉచ్యతే — చెప్పబడును; తస్మాత్ — కాబట్టి; ఏవం — ఈ విధంగా; విదిత్వా — తెలుసుకొని; ఏనం — ఈ ఆత్మ; న — కాదు; అనుశోచితుం — శోకించుట; అర్హసి — తగును.
BG 2.25: ఆత్మ అనేది అవ్యక్తమైనది (కనిపించనిది), ఊహాతీతమైనది, మరియు మార్పులేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు.
భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు, కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు. ఆత్మ దివ్యమైనది, భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి మన కంటికి కనిపించదు. శాస్త్రవేత్తలు దాని ఉనికిని అవగతం చేసుకోడానికి ప్రయోగాలు జరిపారు. చనిపోతున్న వ్యక్తిని ఒక గాజు పేటికలో ఉంచి దానిని గట్టిగా మూసి వేసారు. ఆత్మనిష్క్రమణ సమయంలో గాజు పగుళ్ళు సంభవిస్తాయేమో అని చూసారు. కానీ, గాజు పేటిక పగలకుండానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. అత్యంత సూక్ష్మమైనది కావటం వలన, తన కదలిక కోసం ఆత్మకి భౌతిక స్థలం అవసరం లేదు. భౌతిక శక్తి కన్నా సూక్ష్మమైనందువల్ల అది మన మనస్సు యొక్క ఊహకు అందనిది. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:ఇంద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనఃమనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్ పరః (1.3.10)‘ఇంద్రియముల కన్నా ఇంద్రియ పదార్థములు మించినవి; ఇంద్రియ పదార్థముల కన్నా మనస్సు సూక్ష్మమైనది; మనస్సు కన్నా బుద్ధి మించినది; బుద్ధి కన్నా సూక్ష్మమైనది ఆత్మ.’ ప్రాకృతిక మనస్సు భౌతిక విషయములనే గ్రహించగలదు. అంతేకానీ, దివ్యమైన ఆత్మను దాని ఆలోచన శక్తి ద్వారా అందుకోలేదు. అందువలన, ఆత్మ జ్ఞానం తెలుసుకోవటానికి బాహ్య మూలాధారములు అవసరం, అవే శాస్త్ర గ్రంథాలు మరియు గురువు.
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ । తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ।। 26 ।।
26
2
https://www.holy-bhagava…udio/002_026.mp3
అథ — అయినా ఒకవేళ; చ — మరియు; ఏనం — ఈ ఆత్మ; నిత్య జాతం — ఎప్పుడూ పుడుతూ ఉంటూ; నిత్యం — ఎప్పుడూ; వా — లేదా; మన్యసే — అని నీవు భావిస్తే; మృతం — చనిపోవుట; తథా అపి — అయినా సరే; త్వం — నీవు; మహా-బాహో — గొప్ప బలముగల చేతులున్నవాడా, అర్జునా; న — కాదు; ఏవం — ఈ విధంగా; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.
BG 2.26: కానీ ఒకవేళ నీవు, ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే, ఓ మహా బాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు.
ఆత్మ తత్త్వం గురించి వున్న వేరే సిద్ధాంతాలను అర్జునుడు నమ్మదలచాడేమో అని, శ్రీ కృష్ణుడు 'అథ' అన్న పదం వాడాడు. భారతదేశంలో ఉన్న వివిధ తాత్త్విక సిద్ధాంతాలు మరియు ఆత్మ తత్త్వంపై వాటి భిన్నమైన అవగాహనల నేపథ్యంలో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయ తత్త్వజ్ఞానం చారిత్రాత్మకంగా పన్నెండు శాస్త్రాలను కలిగి ఉంది. వీటిలో ఒక ఆరు, వేదాలను ప్రామాణికంగా అంగీకరించాయి, అందుకే వాటిని ఆస్తిక దర్శనములు అంటారు. ఇవి మీమాంస, వేదాంత, న్యాయ, వైశేషిక, సాంఖ్య, మరియు యోగ దర్శనములు. మరల వీటిలో ఇంకొన్ని శాఖలు ఉన్నాయి — ఉదాహరణకి 'వేదాంత' మనేది మరో ఆరు రకాలుగా విభజించబడింది - అద్వైత వాదం, ద్వైత వాదం, విశిష్టాద్వైత వాదం, విశుద్ధాద్వైత వాదం, ద్వైతాద్వైత వాదం, మరియు అచింత్య-భేదాభేద వాదం. వీటిలో మరిన్ని ఉపశాఖలు ఉన్నాయి, ఉదాహరణకి, అద్వైత వాదం అనేది ఇలా పునర్విభజించబడింది - దృష్టి-సృష్టి వాదం, అవచ్ఛేద వాదం, బింబ-ప్రతిబింబ వాదం, వివర్త వాదం, అజాత వాదం మొదలగునవి. మనం ఇక్కడ వీటి తత్త్వ వివరాలలోనికి వెళ్ళము. ఈ సిద్ధాంతాలన్నీ వేదములని ప్రామాణికంగా అంగీకరించాయి అని తెలుసుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది. ఆ ప్రకారముగా, నిత్యమైన, మార్పులేని ఆత్మయే మన స్వీయ స్వరూపంగా అవన్నీ అంగీకరించాయి. మిగిలిన ఆరు తత్త్వ శాస్త్ర సిద్ధాంతాలు వేదాలను ప్రామాణికంగా అంగీకరించవు. ఇవి చార్వాక వాదం, నాలుగు బౌద్ధ సిద్ధాంతాలు (యోగాచార వాదం, మాధ్యమిక వాదం, వైభాశిక వాదం, మరియు సౌతాంత్రిక వాదం) మరియు జైన మతం. వీటన్నీటికీ ఆత్మతత్త్వం గురించి వాటివాటి వివరణలు ఉన్నాయి. చార్వాక వాదం ప్రకారం, ఈ శరీరమే మనము మరియు దాని వివిధ అంగముల/భాగాల సమ్మేళనం వలన చైతన్యం ఉత్పత్తి అవుతుంది. జైన మతం ప్రకారం, ఆత్మ అనేది శరీరమంత పరిమాణములో ఉంటుంది, మరియు అది ప్రతి జన్మకి మారుతూ ఉంటుంది. బౌద్ధ సిద్ధాంతాలు శాశ్వతమైన ఆత్మ ఉనికిని ఒప్పుకోవు, మరియు దీనికి బదులుగా, ఒక జన్మ నుండి మరొక జన్మకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని, ఇది వ్యక్తి యొక్క అస్తిత్వ కొనసాగింపుని కలిగిస్తుందని, పేర్కొంటున్నాయి. శ్రీ కృష్ణుడి సమయంలో కూడా, పునరుద్ధరించబడిన జీవ చైతన్యం, అశాశ్వతమైన ఆత్మ వంటి బౌద్ధ సిద్ధాంతాల లాంటివి ఉండిఉండవచ్చు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒక జీవితకాలం నుండి ఇంకొక జీవితకాలంకు పునరుద్ధరించబడిన జీవ చైతన్య ప్రవాహం ఉంటుందని అర్జునుడు నమ్మినా, శోకించటము తగదు అని. ఎవరైనా ఎందుకు శోకించ కూడదు? తదుపరి శ్లోకంలో ఇక ఇది వివరించబడింది.
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।।
27
2
https://www.holy-bhagava…udio/002_027.mp3
జాతస్య — పుట్టినవానికి; హి — యేలనంటే; ధ్రువః — నిస్సందేహముగా; మృత్యుః — మరణము; ధ్రువం — తప్పదు; జన్మ — పుట్టుక; మృతస్య — మరణించినవానికి; చ — మరియు; తస్మాత్ — కాబట్టి; అపరిహార్యే అర్థే — ఈ తప్పని పరిస్థితిలో; న — కాదు; త్వం — నీవు; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.
BG 2.27: పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.
ఆంగ్ల భాషలో ఒక ప్రసిద్ధ నానుడి ఉంది, ‘యాజ్ ష్యూర్ యాజ్ డెత్’ (as sure as death) అని. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు: ‘జీవితంలో తప్పకుండా ఉండేవి, మరణం మరియు పన్నులు మాత్రమే’. (The only things certain in life are death and taxes.) జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం ఏమిటంటే మనము ఏదో ఒకరోజు మృత్యువుతో కలవాలి. జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. పతంజలి యొక్క 'యోగ్ దర్శన్' లో కూడా, అభినివేష్’ అంటే, ఎట్టి పరిస్థితిల్లో నైనా జీవించి ఉండాలనే స్వభావసిద్ధమైన లక్షణము, భౌతిక మనస్సు యొక్క గుణముగా పేర్కొనబడినది. కానీ, జన్మించిన వానికి మరణం తప్పదు. కాబట్టి తప్పని దాని కోసం శోకించటము ఎందుకు? మహాభారతంలో దీని గురించి ఒక ఘటన చెప్పబడింది.పాండవుల అరణ్యవాస సమయంలో, అడవిలో సంచరిస్తున్న పంచ పాండవులకి దాహం వేసి ఒక సరోవరం వద్దకు చేరుకున్నారు. అందరికీ నీళ్ళు తెమ్మని భీముడిని పంపించాడు, యుధిష్ఠిరుడు. భీముడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే, ఒక యక్షుడు (దేవతా జాతికి చెందిన వ్యక్తి) సరోవరం లోపల నుండి మాట్లాడటం మొదలు పెట్టాడు, ‘మొదట నా ప్రశ్నలకు సమాధానం చెపితేనే, నేను నీళ్ళు తీసుకోనిస్తాను.’ అని అన్నాడు. భీముడు పట్టించుకోకుండా నీళ్ళు తాగటానికి ముందుకెళ్ళాడు. యక్షుడు అతనిని లోపలికి గుంజేసాడు. కాసేపటి తరువాత భీముడు తిరిగి రాక పోయేసరికి కలతపడ్డ యుధిష్ఠిరుడు, ఏమయిందో తెలుసుకొని, నీళ్ళు తెమ్మని అర్జునుడిని పంపించాడు. అర్జునుడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని కూడా అడిగాడు, ‘నేను ఇప్పటికే మీ సోదరుడిని స్వాధీనం చేసుకున్నాను. నీవు నా ప్రశ్నలన్నీటికీ సరిగ్గా సమాధానం చెప్పగలిగితే తప్ప నీటిని తీస్కోవడానికి ప్రయత్నించకు.’ అని. అర్జునుడు కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు, దానితో యక్షుడు అతన్ని కూడా లోపలికి గుంజేసాడు. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు నకులుడు, సహదేవుడు కూడా వచ్చారు, వారికి కూడా ఇదే గతి పట్టింది.చివరికి, యుధిష్ఠిరుడు తానే స్వయంగా ఆ సరోవరం దగ్గరకు వచ్చాడు. మరల ఒకసారి ఆ యక్షుడు అన్నాడు, ‘నీవు ఈ తటాకం నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేదా నీ నలుగురు తమ్ముళ్ళ లాగానే నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను.’ అని. ఆ యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు. నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు, స్వయానా, మారు వేషంలో ఉన్న మృత్యు దేవత అయిన యమధర్మరాజు. ఆయన అరవై ప్రశ్నలను అడిగాడు, వాటన్నిటికీ యుధిష్ఠిరుడు సరిగ్గా సమాధానాలు చెప్పాడు. ఈ ప్రశ్నలలో ఒకటి : కిం ఆశ్చర్యం? ‘ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి?’ యుధిష్ఠిరుడు ఇలా సమాధానం చెప్పాడు:అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయంశేషాః స్థిరత్వం ఇచ్చంతి కిమాశ్చర్యమతః పరం(మహాభారతం) ‘ప్రతి క్షణం మనుష్యులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా ఏదో ఒక రోజు మనమూ చని పోతాము అని మాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది?’జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే, కాబట్టి, తెలివైన వాడు అనివార్యమైన దానిని గూర్చి శోకించడు, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత । అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ।। 28 ।।
28
2
https://www.holy-bhagava…udio/002_028.mp3
అవ్యక్త-ఆదీని — పుట్టుక ముందు అవ్యక్తములు (అప్రకటితములు); భూతాని — సృష్టింపబడిన ప్రాణులు; వ్యక్త — వ్యక్తములు (ప్రకటితములు); మధ్యాని — మధ్యలో; భారత — అర్జున, భరత వంశీయుడా; అవ్యక్త — అవ్యక్తములు (అప్రకటితములు); నిధనాని — మరణించిన పిమ్మట; ఏవ — నిజముగా; తత్ర — కాబట్టి; కా — ఎందులకు; పరిదేవనా — శోకించుట.
BG 2.28: ఓ భరత వంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవిత కాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందులకు?
ఆత్మకి సంబంధించి ఉన్న శోక కారణాన్ని 2.20వ శ్లోకంలో, శరీరానికి సంబంధించి ఉన్న శోక కారణాన్ని 2.27వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు పోగొట్టాడు. ఇప్పుడు రెంటినీ ఈ శ్లోకంలో పొందుపరిచాడు. శ్రీమద్భాగవతంలో నారద మహర్షి, యుధిష్ఠిరుడికి ఈ విధంగానే ఉపదేశించాడు.యన్ మన్యసే ధృవం లోకం అధృవం వా న చోభయమ్సర్వథా న హి శోచ్యాస్తే స్నేహదన్యత్ర మొహజాత్ (1.13.43)‘నీవు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని నిత్యమైన ఆత్మగా భావించినా లేదా తాత్కాలికమైన శరీరముగా భావించినా లేదా ఊహాతీతమైన ఆత్మ మరియు శరీరముల మిశ్రమంగా భావించినా, నీవు శోకించతగదు. శోకమునకు మూల కారణం భ్రమ వల్ల కలిగిన మోహం మాత్రమే.’భౌతిక జగత్తులో ప్రతి ఒక్క జీవాత్మ మూడు శరీరాలచే కట్టుబడి ఉంటుంది - స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం.స్థూల శరీరం: పంచ భూతములతో తయారు చేయబడినది — భూమి, నీరు, అగ్ని, గాలి, మరియు ఆకాశముసూక్ష్మ శరీరం: పద్దెనిమిది మూల-వస్తువులతో కూడినది - ఐదు ప్రాణవాయువులు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, మరియు అహంకారం.కారణ శరీరం: అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి, మునుపటి జీవితాల నుండీవున్న సంస్కారములతో కూడి ఉన్నది.మరణ సమయంలో, ఆత్మ, తన స్థూల శరీరాన్ని విడిచి పెట్టి, తనతో పాటు సూక్ష్మ, కారణ శరీరములను తీస్కుని వెళుతుంది. అటుపిమ్మట, భగవంతుడు మరల ఆత్మకి మరియొక స్థూల శరీరాన్ని, దాని సూక్ష్మ, కారణ శరీరాల అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి గర్భం లోనికి ప్రవేశపెడతాడు. ఆత్మ ఒక స్థూల శరీరాన్ని వదిలి వేసిన తరువాత, వేరే స్థూల శరీరాన్ని తీస్కునే మధ్యలో ఒక పరివర్తన దశ (transitional phase) ఉంటుంది. ఈ దశ కొన్ని క్షణాల నుండి కొన్ని సంవత్సరాల వరకూ ఉండవచ్చు. కాబట్టి పుట్టుక ముందు, ఆత్మ, అవ్యక్తమైన సూక్ష్మ, కారణ శరీరాలతో ఉంటుంది. మరణం తరువాత కూడా అది అవ్యక్త స్థితిలో ఉంటుంది. ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది (ప్రకటితమవుతుంది). కాబట్టి, శోకించటానికి మరణం కారణం కారాదు.
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః । ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ।। 29 ।।
29
2
https://www.holy-bhagava…udio/002_029.mp3
ఆశ్చర్య-వత్ — ఆశ్చర్యమైనదిగా; పశ్యతి — చూచెదరు; కశ్చిత్ — కొందరు; ఏనమ్ — ఈ ఆత్మ; ఆశ్చర్య-వత్ — ఆశ్చర్యమైనదిగా; వదతి — చెప్పెదరు; తథా — ఈ విధముగా; ఏవ — నిజముగా చ — మరియు; అన్యః — వేరొకరు; ఆశ్చర్య-వత్ — అంతే ఆశ్చర్య మైనదిగా; చ — మరియు; ఏనం — ఈ ఆత్మ; అన్యః — మరికొందరు; శృణోతి — వినుట; శ్రుత్వా — విన్న పిదప; అపి — అయినాసరే; ఏనం — ఈ ఆత్మ; వేద — అవగతము (అర్థం); న — కాదు; చ — మరియు; ఏవ — అయినాసరే; కశ్చిత్ — కొందరికి.
BG 2.29: కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు, విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు.
సూక్ష్మమైన పరమాణువుల నుండి విస్తారమైన నక్షత్రాలు/పాలపుంతల వరకు సంపూర్ణ జగత్తు ఆశ్చర్యకరమైనది, అవన్నీ భగవంతుని అద్భుతమైన సృష్టియే కదా. ఒక చిన్న గులాబీ పువ్వు కూడా అద్భుతమైనదే, దాని నిర్మాణం, వాసన, మరియు సౌందర్యం. అన్నిటి కన్నా పరమాద్భుతమైనది స్వయంగా ఆ భగవంతుడే. అనంత శేషుడు, అంటే విష్ణుమూర్తి వసించే దివ్యమైన పదివేల తలల సర్పము, సృష్టి ఆరంభం నుండీ ఆ స్వామి గుణములను కీర్తిస్తూనే ఉన్నాడు కానీ ఇంకా అవి పూర్తి కాలేదు.ఆత్మ అనేది భగవంతుని యొక్క అంశము కాబట్టి భౌతిక ప్రాపంచిక వస్తువుల కన్నా అద్భుతమైనది ఎందుకంటే అది భౌతిక అస్తిత్వమునకు అతీతమైనది. ఎట్లైతే భగవంతుడు దివ్యమో, ఆ భగవంతుని అంశము అయిన ఆత్మ కూడా దివ్యమే. ఈ కారణం వలన ఆత్మను అర్థం చేసుకోవటానికి కేవలం బుద్ధి కుశలత మాత్రమే సరిపోదు; ఆత్మ అస్తిత్వము, ఆత్మ తత్త్వం అర్థం చేసుకోవటం చాలా కష్టం. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోఽపి బహవో యం న విద్యుఃఆశ్చర్యోవక్తా కుశలోఽస్య లబ్దా ఽఽశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః (1.2.7) ‘ఆత్మ జ్ఞాని అయిన గురువు చాలా అరుదు. ఆత్మ జ్ఞాన శాస్త్రం గురించి అలాంటి గురువు గారి నుండి ఉపదేశం వినే అవకాశం ఇంకా అరుదు. ఒకవేళ, గొప్ప అదృష్టం చేత అలాంటి అవకాశం వచ్చినా, ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన శిష్యులు దొరకటం అత్యంత అరుదు.’ కాబట్టి, ఎక్కువ శాతం జనులు, ఏంతో ప్రయత్నించినా, ఆత్మ జ్ఞాన విషయం పట్ల ఆసక్తి చూపకపోయినా లేదా దాన్ని అర్థం చేసుకోలేకపోయినా, జ్ఞానవంతుడైన గురువు నిరాశ చెందడు.
దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత । తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ।। 30 ।।
30
2
https://www.holy-bhagava…udio/002_030.mp3
దేహీ — దేహములో వసించే ఆత్మ; నిత్యం — ఎల్లప్పుడూ; అవధ్యః — వధింపబడనిది/నిత్యశాశ్వతమైనది; అయం — ఈ ఆత్మ; దేహే — శరీరములో; సర్వస్య — అందరి; భారత — భరత వంశీయుడా, అర్జునా; తస్మాత్ — కాబట్టి; సర్వాణి — అందరి; భూతాని — ప్రాణులు; న — కాదు; త్వం — నీవు ; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.
BG 2.30: ఓ అర్జునా, దేహమునందు ఉండెడి ఆత్మ చావులేనిది; కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు.
తరచుగా, తన ఉపదేశ క్రమంలో, శ్రీ కృష్ణుడు కొన్ని శ్లోకాలలో ఒక విషయాన్ని వివరించిన తరువాత చివరికి ఒక శ్లోకంలో దాని సారాంశాన్ని చెప్తాడు. ఆత్మ యొక్క అమరత్వాన్ని మరియు శరీరానికి దానికి ఉన్న భేదాన్ని చెప్పిన ఉపదేశ సారాంశము, ఈ శ్లోకం.
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి । ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ।। 31 ।।
31
2
https://www.holy-bhagava…udio/002_031.mp3
స్వ-ధర్మము — వేదానుసారము ఉన్న తన కర్తవ్యము; అపి — కూడా; చ — మరియు; అవేక్ష్య — పరిగణలో; న — కాదు; వికంపితుమ్ — చలించుట; అర్హసి — తగును; ధర్మ్యాత్ — ధర్మ పరిరక్షణకు; హి — నిజముగా; యుద్ధాత్ — యుద్ధము కంటే; శ్రేయః — శ్రేయస్సు; అన్యత్ — వేరే ఏది; క్షత్రియస్య — క్షత్రియుడికి; న — లేదు; విద్యతే — ఉండును.
BG 2.31: అంతేకాక, నీ యొక్క క్షత్రియ స్వ-ధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి, ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు.
స్వ-ధర్మం అనేది వేదాల అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి. రెండు రకముల స్వ-ధర్మములు, వేదనిర్దేశిత విధులు ఉన్నాయి - 'పర ధర్మ' అంటే ఆధ్యాత్మిక విధులు మరియు 'అపర ధర్మ' అంటే ప్రాపంచిక విధులు. తనను తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుడిని ప్రేమించి, భక్తితో సేవించడమే చేయవలసిన విధి. దీనిని 'పర ధర్మ' అంటారు. కానీ, మానవాళిలో ఎక్కువ శాతం మంది ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు కాబట్టి, తమని తాము శరీరాలుగా భావించుకునే వారి కోసం కూడా, వేదాలు, విధులను సూచించాయి. ఒక వ్యక్తి యొక్క ఆశ్రమము (జీవిత దశ) మరియు వర్ణము (వృత్తి) ల అనుగుణంగా ఈ ధర్మాలు నిర్దేశించబడ్డాయి. వీటిని అపర-ధర్మములు లేదా లౌకిక విధులు అంటారు. భగవద్గీత మరియు వైదిక తత్త్వాలను అర్థం చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక విధులు మరియు ప్రాపంచిక విధుల మధ్య ఉన్న భేదాన్ని గుర్తుంచుకోవాలి. వృత్తి పరంగా, అర్జునుడు యోధుడు, కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం యోధుడిగా తన వృత్తి ధర్మం. శ్రీ కృష్ణుడు దీనిని స్వ-ధర్మము అంటున్నాడు, ఇది శరీర స్థాయిలో సూచింపబడిన విధి.
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ । సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ।। 32 ।।
32
2
https://www.holy-bhagava…udio/002_032.mp3
యదృచ్ఛయా — కోరుకోకుండానే; చ — మరియు; ఉపపన్నం — వచ్చిన; స్వర్గ — స్వర్గ లోకములు; ద్వారం — తలుపు; అపావృతం — తెరిచి ఉన్న; సుఖినః — సంతోషము; క్షత్రియాః — క్షత్రియ వీరులు; పార్థ — అర్జునా, ప్రిథ తనయుడా; లభంతే — లభించును; యుద్ధం — యుద్ధము; ఈదృశం — ఇటువంటి.
BG 2.32: ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు, కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి.
సమాజాన్ని రక్షించటానికి క్షత్రియ జాతి అవసరం ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉంది. వారి వృత్తి ధర్మం అనుసరించి, సమాజాన్ని రక్షించటానికి, వీరులు ధైర్య సహాసాలతో ఉండి అవసరమైతే తమ జీవితాలనే అర్పించాల్సి ఉంటుంది. వైదిక కాలంలో, జంతువులను చంపడం సమాజంలోని మిగిలిన వారికి నిషేధించబడినా, అరణ్యాలలోకి వెళ్ళి, యుద్ధ విద్య అభ్యసించటానికి జంతువులను వేటాడి చంపడాన్ని క్షత్రియ యోధులకు అనుమతించారు. ఇటువంటి సాహాసవంతులైన యోధులు ధర్మాన్ని రక్షించడానికి దొరికే అవకాశాన్ని చేతులుచాచి స్వాగతిస్తారని అందరూ ఆకాంక్షిస్తారు. తమ విధిని నిర్వర్తించడం ఒక పవిత్ర మైన కార్యంగా వారికి ఈ జన్మలో ఇంకా పై జన్మలలో మంచి ప్రతిఫలం లభిస్తుంది. విధిని సక్రమంగా నిర్వర్తించటం అనేది భగవత్ ప్రాప్తి నొందించే ఆధ్యాత్మిక కార్యం కాదు. అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే పుణ్య కార్యం మాత్రమే. శ్రీ కృష్ణుడు తన బోధనలను ఒక మెట్టు దించి ఇలా అంటున్నాడు, అర్జునుడికి ఆధ్యాత్మిక బోధన పట్ల ఆసక్తి లేకుండా శారీరక దృక్పథం లోనే వున్నా, అప్పుడు కూడా, ధర్మాన్ని పరిరక్షించటం అనేది అతని సామాజిక విధి. మనము గమనించినట్టుగా, భగవద్గీత అనేది, కర్మను చేయమని ఉద్భోదించేదే కానీ క్రియాశూన్యతను కాదు (Bhagavad Gita is a call to action, not to inaction). జనులు ఆధ్యాత్మిక ప్రవచనాలు విని, తరచుగా, ‘నేను నా పని/వృత్తిని వదిలిపెట్టాలా ఇప్పుడు? అని అడుగుతారు.’ కానీ, ప్రతి శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మను చేయమని చెప్తున్నాడు, కర్మను త్యజించాలని అతను అనుకున్నదానికి ఇది విరుద్ధం. అర్జునుడు తన విధిని వదిలిపెట్టాలని అనుకుంటే, శ్రీ కృష్ణుడు విధిని నిర్వర్తించమని పదేపదే నచ్చచెప్పుతున్నాడు. అర్జునుడిలో శ్రీ కృష్ణుడు కోరుకున్న మార్పు అంతర్గతమైనది, తన అంతఃకరణ లోనిది, అది బాహ్యమైన కర్మ పరిత్యాగము కాదు. కృష్ణుడు ఇప్పుడు ఇక అర్జునుడికి తన విధిని చేయకపోవడం యొక్క పరిణామాలను వివరిస్తాడు.
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి । తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ।। 33 ।।
33
2
https://www.holy-bhagava…udio/002_033.mp3
అథ చేత్ — కానీ ఒకవేళ; త్వం — నీవు; ఇమం — ఈ; ధర్మ్యం సంగ్రామం — ధర్మ యుద్ధం; న కరిష్యసి — చేయక పొతే; తతః — ఆ తరువాత; స్వ-ధర్మం — వేద విహిత కర్తవ్యము; కీర్తిం — పేరు ప్రఖ్యాతులు; చ — మరియు; హిత్వా — వదిలివేసి; పాపం — పాపము; అవాప్స్యసి — పొందుదువు.
BG 2.33: కానీ, ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి, ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే, తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు.
యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసా వాదుడు అయితే, అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది, అంచేత ఒక పాపపు పనిగా పరిగణించబడుతుంది. సమస్యాత్మకమైనదిగా, చికాకుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచిపెడితే, అర్జునుడు పాపానికి పాల్పడినట్టే అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. పరాశర స్మృతి ఇలా పేర్కొంటున్నది:క్షత్రియోః హి ప్రజా రక్షాంశస్త్రపాణిః ప్రదండవాన్నిర్జిత్య పరసైన్యాది క్షితిమ్ ధర్మేణ పాలయేత్ (1.61)‘అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే, అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మ బద్దంగా పాలించటానికి తోడ్పడాలి’
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్ సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ।। 34 ।।
34
2
https://www.holy-bhagava…udio/002_034.mp3
అకీర్తిం — అపకీర్తి; చ — మరియు; అపి — కూడా; భూతాని — జనులు; కథయిష్యంతి — అంటారు; తే — నీ యొక్క; అవ్యయామ్ — ఎప్పటికీ ఉండిపోయే; సంభావితస్య — గౌరవప్రదమైనవానికి; చ — మరియు; అకీర్తిః — అపకీర్తి; మరణాత్ — మరణము కన్నా; అతిరిచ్యతే — అధికమైనది.
BG 2.34: జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది.
గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ఠ చాలా ముఖ్యమైనది. క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు (ప్రకృతి త్రిగుణములు) వారికి కీర్తి, గౌరవం చాలా ముఖ్యమైన వాటిగా భావింపచేస్తాయి. వారికి అగౌరవం, అపకీర్తి అనేవి మరణం కన్నా నీచమైనవి. ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా కనీసం ఈ నిమ్న స్థాయి జ్ఞానము వల్ల నైనా ప్రేరణను పొందవచ్చు అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇది గుర్తు చేస్తున్నాడు. యుద్ద భూమి నుండి పిరికితనముతో పారిపోయిన సైనికుడిని సమాజం నుండి వెలివేస్తారు. తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఇంతటి అపకీర్తి, అగౌరవం అర్జునుడికి కలుగవచ్చు.
భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః । యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ।। 35 ।।
35
2
https://www.holy-bhagava…udio/002_035.mp3
భయాత్ — భయముతో; రణాత్ — యుద్ధ భూమి నుండి; ఉపరతం — పారిపోయి; మంస్యంతే — అనుకుంటారు; త్వాం — నీవు; మహా-రథాః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సరితూగగల యోధులు; యేషాం — ఎవరికైతే; చ — మరియు; త్వం — నీవు; బహు-మతః — గొప్ప గౌరవనీయుడు; భూత్వా — అయి ఉంటివో; యాస్యసి — నీవు పోగొట్టుకుంటావు; లాఘవమ్ — చులకన.
BG 2.35: ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారు, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు, అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.
అర్జునుడు ఒక మహా యోధుడు అంతేకాక కౌరవ పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి అత్యంత సాహసవంతులకి కూడా గట్టి పోటీ ఇచ్చే ప్ర్యతర్థి. ఎంతో మంది దేవతలతో యుద్ధం చేసి కీర్తి సంపాదించుకున్నాడు. వేటగాడిలా మారు వేషంలో వచ్చిన శివుడిని కూడా పోరాడి మెప్పించాడు. అతని సాహసానికి, నైపుణ్యానికి మెచ్చి పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని శివుడు అతనికి బహుకరించాడు. అతని విలు విద్య గురువు ద్రోణాచార్యుడు కూడా ఒక ప్రత్యేక అస్త్రం ఇచ్చి తన దీవెనలు అందజేశాడు. ఇప్పుడు యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడు యుద్ధ భూమి నుండి వెళ్ళిపోతే, తన బంధువుల మీద ప్రేమతో ఇలా వెళ్ళిపోయాడు అని ఈ వీర యోధులకు ఎప్పుడైనా తెలుస్తుందా? అతనిని పిరికివాడు అని, తమ బలపరాక్రమములకు భయపడి పారిపోయాడు అని, వీరంతా అనుకుంటారు.
అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః । నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ।। 36 ।।
36
2
https://www.holy-bhagava…udio/002_036.mp3
అవాచ్య-వాదాన్ — అనరాని మాటలతో (కఠిన మాటలు); చ — మరియు; బహూన్ — చాలా; వదిష్యంతి — అంటారు; తవ — నీ యొక్క; అహితాః — శత్రువులు; నిందంతః — నిందించుచు; తవ — నీ యొక్క; సామర్థ్యం — సామర్థ్యమును; తతః — అంత కంటే; దుఃఖ-తరం — ఎక్కువ బాధ; ను — నిజముగా; కిమ్ — ఏమిటి.
BG 2.36: నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?
ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, తను చులకనైపోతాడు. శ్రీ కృష్ణుడు నిందంతః అంటున్నాడు, అంటే 'నిందించుట, దూషించుట' అని. 'అవాచ్య వాదాన్' అంటే, 'నపుంసకుడు' వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు ‘చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధ భూమి నుండి, కాళ్ళ మధ్యలో తోక ముడుచుకున్న కుక్కలాగ పారిపోతున్నాడు’ అని చాలా అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళన భరించటం అర్జునుడికి చాల బాధాకరంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు గుర్తుచేస్తున్నాడు.
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్ । తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ।। 37 ।।
37
2
https://www.holy-bhagava…udio/002_037.mp3
హతః — సంహరింపబడినచో; వా — లేదా; ప్రాప్స్యసి — పొందుతావు; స్వర్గం — స్వర్గమును; జిత్వా — గెలిచినచో; వా — లేదా; భోక్ష్యసే — అనుభవించెదవు; మహీమ్ — ఈ భూమండల రాజ్యమును; తస్మాత్ — కాబట్టి; ఉత్తిష్ఠ — లెమ్ము; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; యుద్ధాయ — యుద్ధమునకు; కృత-నిశ్చయ — దృఢ సంకల్పంతో.
BG 2.37: యుద్ధం చేస్తే నీవు, యుద్ధ రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయెదవు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి సిద్ధముకమ్ము.
2.31వ శ్లోకం నుండి శ్రీ కృష్ణుడు ఇంకా వృత్తికి సంబంధించిన విధుల స్థాయిలోనే బోధిస్తున్నాడు. తన కర్తవ్య నిర్వహణ వలన రెండు పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది అని అర్జునుడికి వివరిస్తున్నాడు. అర్జునుడు విజయుడైతే, భూలోకంలో సామ్రాజ్యం అతనికోసం ఉంటుంది, ఒకవేళ కర్తవ్య నిర్వహణ లో ప్రాణాలు విడిచి పెట్టవలసి వస్తే, అతను స్వర్గ లోకాలకు వెళ్తాడు.
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ । తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 38 ।।
38
2
https://www.holy-bhagava…udio/002_038.mp3
సుఖ — సుఖము; దుఃఖే — దుఃఖములో; సమే కృత్వా — సమానముగా భావించి; లాభ-అలాభౌ — లాభ నష్టములు; జయ-అజయౌ — గెలుపు ఓటములు; తతః — అ తరువాత; యుద్ధాయ — యుద్ధమునకు; యుజ్యస్వ — సిద్దుడవు అవుము; న — కాదు; ఏవం — ఈ విధముగా; పాపం — పాపము; అవాప్స్యసి — పొందెదవు.
BG 2.38: సుఖ-దుఃఖాలని, లాభ-నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.
లౌకిక స్థాయి నుండి అర్జునుడిని ఉత్సాహపరిచిన పిదప, శ్రీ కృష్ణుడు, ఇప్పుడు కర్మశాస్త్ర విషయంలో మరింత లోనికి వెళుతున్నాడు. శత్రువులను సంహరించటం వలన పాపం తగులుతుందని అర్జునుడు భయాన్ని వ్యక్తం చేశాడు. శ్రీ కృష్ణుడు ఈ భయాన్ని పోగొడుతున్నాడు. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్నినిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశము చేస్తున్నాడు. పని పట్ల ఇలాంటి దృక్పథం అతన్ని తద్వారా వచ్చే ఏదేని పాప ఫలితాల నుండి విముక్తి కలిగిస్తుంది.స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు, మనం కర్మలను సృష్టిస్తాము. అవి తదుపరి కాలంలో కర్మఫలితాలను (ప్రతిచర్యలు) కలుగచేస్తాయి. మాథర్ శృతి ఇలా పేర్కొంటున్నది:పుణ్యేన పుణ్య లోకం నయతి పాపేన పాపముభాభ్యామేవ మనుష్యలోకం‘మంచి పనులు చేస్తే స్వర్గ లోకాలకు పోయెదవు; చెడు పనులు చేస్తే నరక లోకాలకు వెళ్లెదవు; ఈ రెంటి మిశ్రమం చేస్తే మళ్ళీ ఈ భూలోకానికి తిరిగి వచ్చెదవు.’ ఏ విధంగా అయినా మనం కర్మ-ప్రతిఫల బంధాల్లో చిక్కుకుంటాము. ఈ విధంగా లౌకికమైన మంచి పనులు కూడా మనలను బంధిస్తాయి. అవి భౌతికమైన మంచి ప్రతిఫలములను కలుగచేస్తాయి, అవి ఇంకా కర్మ రాశిని పెంచి, ఈ లోకంలో ఆనందం ఉన్నది అన్న భ్రమను మరింత పెంచుతాయి.కానీ, స్వార్థ ప్రయోజనాలను విడిచిపెడ్తే, ఇక మన చర్యలు కర్మ-ఫలితాలని (కర్మ బంధాలని) సృష్టించవు. ఉదాహరణకు, హత్య చేయటం పాపం, మరియు ప్రపంచంలోని ప్రతి దేశం యొక్క న్యాయ చట్టం దానిని ఒక దండించదగ్గ నేరంగా ప్రకటించింది. కానీ, ఒక పోలీసు, తన కర్తవ్య నిర్వహణలో బందిపోటు దొంగల నాయకుడిని చంపితే అతను దానికి శిక్షింపబడడు. ఒక సైనికుడు శత్రు సైనికుడిని యుద్దంలో చంపితే, దానికి అతను శిక్షార్హుడు కాడు. నిజానికి అతని వీరత్వానికి ఒక పతకం కూడా ఇవ్వబడవచ్చు. ఈ పనులు స్వార్థ ప్రయోజనంతో కానీ, చెడు బుద్ధితో కానీ చేసినవి కాకపోవటం వలన వీటికి శిక్ష ఉండదు; ఆయా పనులు దేశ సేవలో తమ కర్తవ్యముగా చేసినవి. భగవంతుని న్యాయం కూడా ఇలాగే ఉంటుంది. ఎవరైనా అన్నీ స్వార్థ ప్రయోజనాలను విడిచి, కర్మలను భగవంతుని పట్ల కర్తవ్యంగా చేస్తే, అలాంటి పనులు కర్మ ఫలితాలను కలుగచేయవు.కాబట్టి, అర్జునుడిని ఫలితాల పట్ల అనాసక్తుడై, కేవలం తన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే శ్రద్ధ చూపమని శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. జయాపజయాలని, సుఖదుఃఖాలని ఒకలాగే పరిగణిస్తూ సమదృష్టితో పోరాడితే, శత్రువులను సంహరించినా, అతనికి పాపం అంటదు. ఈ విషయం తదుపరి భగవద్గీత 5.10వ శ్లోకంలో కూడా మళ్లీ చెప్పబడింది: ‘తామరాకు నీటిచే తాకబడనట్టుగా, ఎవరైతే తమ కర్మలన్నిటినీ, మమకారము లేకుండా భగవదర్పితముగా చేస్తారో వారికి పాపము అంటదు.’మమకారాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని గంభీరమైన ముగింపు చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు, తను చెప్పిన దాని వెనుక ఉన్న తర్కము ఆవిష్కరించటానికి, కర్మ శాస్త్రం గురించి మరింత వివరంగా చెప్తానంటున్నాడు.
ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు । బుధ్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ।। 39 ।।
39
2
https://www.holy-bhagava…udio/002_039.mp3
ఏషా — ఇప్పటివరకు; తే — నీకు; అభిహితా — తెలుపబడినది; సాంఖ్యే — విశ్లేషణాత్మక జ్ఞానం ద్వారా; బుద్ధిః యోగే — బుద్ధి యోగం ద్వారా; తు — నిజముగా; ఇమాం — ఇది; శృణు — వినుము; బుధ్ధ్యా — అర్థం చేసుకోవటం ద్వారా; యుక్తః — కలిసి; యయా — దేని వలన అయితే; పార్థ — అర్జున, ఫ్రిథ పుత్రుడా; కర్మ-బంధం — కర్మ బంధము; ప్రహాస్యసి — నుండి నీవు విముక్తి చెయ్యబడెదవు.
BG 2.39: ఇప్పటివరకు, నేను నీకు సాంఖ్య యోగం, అంటే, ఆత్మ తత్త్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును, వివరించాను. ఇప్పుడు వినుము, ఓ పార్థ, నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పని చేసినప్పుడు, నీవు కర్మ బంధములనుండి విముక్తి పొందెదవు.
సాంఖ్య అన్న పదం, సాన్, అంటే ‘సంపూర్ణముగా’ మరియు ‘ఖ్యా' ,అంటే ‘తెలుసుకొనుట’ అన్న మూల ధాతువుల నుండి వచ్చింది. కాబట్టి 'సాంఖ్య' అంటే ‘ఒకదాని గురించి పూర్తి విశ్లేషణాత్మక జ్ఞానం’ అని అర్థం. భారతీయ తత్త్వశాస్త్రంలోని ఆరు తాత్త్విక గ్రంథాలలో ఒకటైన 'సాంఖ్య దర్శనం', బ్రహ్మాండములోని పదార్థములకు ఒక విశ్లేషణాత్మక వివరణ తెలుపుతుంది. అది ఇరవై నాలుగు అస్తిత్వాలను లెక్కిస్తుంది: పంచ-మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం), పంచ తన్మాత్రలు (పదార్థం యొక్క ఐదు నైరూప్య లక్షణాలు- రుచి, స్పర్శ, వాసన, శబ్దం, మరియు దృశ్యం), పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, అహంకారము (మహాన్ యొక్క పరిణామముచే జనించినది), మహాన్ (ప్రకృతి యొక్క పరిణామముచే జనించినది), ప్రకృతి (పదార్థ శక్తి యొక్క ఆదిమ రూపం). ఇవన్నీ కాక మరియొకటి, ప్రకృతిని అనుభవించగోరి, దానిలో బంధించబడే, పురుషుడు లేదా ఆత్మ. శ్రీ కృష్ణుడు ఇందాక అర్జునుడికి, 'సాంఖ్య' యొక్క ఇంకొక స్వరూపాన్ని, అంటే, నిత్యశాశ్వతమైన ఆత్మ యొక్క విశ్లేషణాత్మక జ్ఞానాన్ని వివరించాడు. ఇప్పుడు ప్రతిఫలము పట్ల ఆశ లేకుండా కర్మలను ఆచరించే పద్ధతిని తెలియజేయబోవుచున్నానని అంటున్నాడు. దీనికి మన కర్మల నుండి వచ్చే ప్రతిఫలము మీద అనాసక్తి అవసరం. ఇటువంటి నిర్మోహము/నిర్లిప్తత అనేవి బుద్ధిని ఉపయోగించి వివక్షతతో సాధన చెయాలి. అందుకే, ఆసక్తికరంగా శ్రీ కృష్ణుడు దీనిని 'బుద్ధి యోగము' అన్నాడు. తదుపరి శ్లోకాలలో (2.41 మరియు 2.44), ఈ యొక్క నిర్మోహ/నిర్లిప్త/అనాసక్త స్థితికి మనస్సుని తీసుకురావటానికి బుద్ధి యొక్క పాత్ర ఏమిటో, శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.
నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే । స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ।। 40 ।।
40
2
https://www.holy-bhagava…udio/002_040.mp3
న — కాదు; ఇహ — దీనిలో; అభిక్రమ — ప్రయత్నములు; నాశః — నష్టము; అస్తి — ఉండును; ప్రత్యవాయః — ప్రతికూల ఫలితములు; న — కాదు; విద్యతే — ఉండును; సు-అల్పం — ఏ కొంచెము; ఆపి — కూడా; అస్య — దీని; ధర్మస్య — ధర్మము యొక్క; త్రాయతే — కాపాడును; మహతః — గొప్ప; భయాత్ — ప్రమాదం నుండి.
BG 2.40: ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు, ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును.
మనం ఎదుర్కునే గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ శరీరం లభించక పోవచ్చు; బదులుగా, నిమ్న స్థాయి జీవ జాతులలోకి అంటే పశువులు, పక్షులు వంటివి, లేదా అధోలోక జీవజాతుల్లోకి వెళ్ళవచ్చు. మానవ జీవితం మనకు ఎలాగూ వచ్చేదేలే అని భావించలేము, ఎందుకంటే తదుపరి ఎలాంటి జన్మ ఉండాలో, మన కర్మలను బట్టి మరియు మన జ్ఞానం యొక్క స్థాయిని బట్టి నిర్ణయింపబడుతుంది.84 లక్షల జీవరాశుల జాతులు ఉన్నాయి. మానవుల కంటే తక్కువ స్థాయిలో ఉన్న - జంతువులు, పక్షులు, చేపలు, పురుగులు, మరియు ఇతర అన్నీ – వాటికి మన మానవుల లాగా పరిణితి చెందిన బుద్ధి లేదు. అయినా అవి కూడా సాధారణ పనులైన తినటం, నిద్రపోవటం, రక్షించుకోవటం, మరియు సంభోగం వంటివి చేస్తుంటాయి. ఒక ఉన్నత ప్రయోజనం కోసం, తమను తాము ఉద్ధరించుకోటానికి ఉపయోగించుకోటానికి మానవులకు జ్ఞాన శక్తి ఇవ్వబడింది. ఒకవేళ మనుష్యులు తమ బుద్ధిని జంతువులు కూడా చేసే తినటం, నిద్రపోవటం, సంభోగం, మరియు రక్షించుకోవటం వంటి కార్యాలకే కానీ విలాస వంత రూపంలో చేయటానికి, ఉపయోగిస్తే అది మానవ శరీరాన్ని దుర్వినియోగం చేసినట్టే. ఉదాహరణకి తినటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే, వారికి ఒక పంది శరీరం సరిగ్గా సరిపోతుంది, ఆ ప్రకారముగా వారికి వచ్చే జన్మలో పంది శరీరం ఇవ్వబడుతుంది. ఒకవేళ నిద్ర పోవటం తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే భగవంతుడు వారికి పోలార్ ఎలుగుబంటి శరీరం మంచిగా సరిపోతుందని, అదే వారికి వచ్చే జన్మలో కేటాయిస్తాడు. కాబట్టి గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ జన్మ లభించక పోవచ్చు. వేదాలు ఇలా పేర్కొంటున్నాయి: ఇహ చేదవేదీదథ సత్యమస్తి న చేదిహావేదీన్మహతీ వినష్టిః(కేనోపనిషత్తు 2.5) ‘ఓ మానవుడా, మానవ జన్మ ఒక దుర్లభమైన అవకాశం. దీనిని నీవు నీ లక్ష్యం చేరుకోవటానికి సద్వినియోగం చేసుకోకపోతే, నీవు చాలా నష్టపోతావు.’ (కేనోపనిషత్తు 2.5). ఇంకా వేదాలు ఇలా పేర్కొంటున్నాయి:ఇహ చేదశకద్ బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రసఃతతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే(కఠోపనిషత్తు 2.3.4) ‘భగవత్ప్రాప్తి కోసం ఈ జన్మలో గట్టిగా ప్రయత్నించక పొతే, నీవు ఎన్నో జన్మలలో 84 లక్షల రకాల జీవ రాశులలో పడి తిరుగుతుంటావు.’కానీ, మనం ఒకసారి ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రయాణం మొదలుపెడితే, దాన్ని ఈ జన్మలో పూర్తిచేయలేకపోయినా, భగవంతుడు మనకు ఆ ఉద్దేశము ఉంది అని గమనిస్తాడు. కాబట్టి, ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఆగిపోయిందో అక్కడనుండే మొదలు పెట్టడానికి మానవ జన్మని తిరిగి ప్రసాదిస్తాడు. ఈ విధంగా, మనకు ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది.అంతేకాక, ఈ మార్గంలో చేసిన ఏ ప్రయత్నం వలన ఎప్పటికీ ఎటువంటీ నష్టం కలుగదు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఎందుకంటే, ప్రస్తుత జీవితంలో మనము కూడబెట్టుకున్న భౌతిక సంపద అంతా మరణ సమయంలో ఇక్కడే వదిలి వేయాలి. కానీ, యోగపథంలో మనము ఏదేని ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తే, భగవంతుడు దానిని భద్రపరిచి, దాని ప్రతిఫలాలు వచ్చేజన్మ లో ఇచ్చి, మళ్లీ ఎక్కడ అయితే వదిలామో అక్కడినుండి తిరిగి పురోగతి సాధించేటట్టు చేస్తాడు. ఈ విధంగా అర్జునుడికి దాని ప్రయోజనము ఉపదేశించిన శ్రీ కృష్ణుడు ఇప్పుడు మమకారాసక్తి లేకుండా పని చేసే విజ్ఞానాన్ని గురించి ఇక చెప్పటం ప్రారంభిస్తున్నాడు .
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన । బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 41 ।।
41
2
https://www.holy-bhagava…udio/002_041.mp3
వ్యవసాయ-ఆత్మికా — దృఢమైన; బుద్ధిః — బుద్ధి; ఏకా — ఒకటి; ఇహ — ఈ పథములో; కురు-నందన — కురు వంశీయుడా; బహు-శాఖాః — అనేక-శాఖలుగా; హి — నిజముగా; అనంతాః — అంతులేని; చ — మరియు; బుద్ధయః — బుద్ధి; అవ్యవసాయినామ్ — దృఢ సంకల్పం లేని.
BG 2.41: ఓ కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా/స్థిరంగా ఉంటుంది, మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ, దృఢసంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది.
మమకారాసక్తి అనేది మనస్సు యొక్క లక్షణం. ఇదెలా వ్యక్తమవుతుందంటే, మనస్సు పదేపదే మమకార వస్తు/విషయం వైపు పరుగులు తీస్తుంది, అవి వ్యక్తులు, ఇంద్రియ విషయములు, ప్రతిష్ఠ, శారీరక సుఖాలు, పరిస్థితులు మొదలగునవి కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలంపులు పదేపదే మనస్సుకు వస్తుంటే అది, దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడిఉంది అన్నదానికి సూచన కావచ్చు. కానీ, అనుబంధం/మమకారాసక్తి ఏర్పరుచుకునేది మనస్సు అయినప్పుడు ఈ యొక్క అనుబంధం/మమకార విషయాలలో శ్రీ కృష్ణుడు బుద్ధిని ఎందుకు తీస్కోస్తున్నాడు? అనుబంధం/మమకారాలను తొలగించటంలో బుద్ధికి ఏమైనా పాత్ర ఉందా? మన శరీరంలో సూక్ష్మమైన 'అంతఃకరణ' ఉంటుంది, వ్యావహారికంగా దానిని హృదయం అంటారు. ఇది మనస్సు, బుద్ధి, మరియు అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ యంత్రంలో ‘బుద్ధి’ అనేది 'మనస్సు' కంటే ఉన్నతమైనది. బుద్ధి నిర్ణయాలు చేస్తే, మనస్సు కోరికలను సృష్టించి, బుద్ధి నిశ్చయించిన ఆ విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది. ఉదాహరణకి, ఒకవేళ బుద్ధి గనక సంతోషానికి డబ్బే మూలం అని నిర్ణయిస్తే, మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఒకవేళ, పేరు ప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యం అని బుద్ధి నిశ్చయిస్తే, అప్పుడు మనస్సు పేరుప్రతిష్ఠల కోసం వాంఛిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, బుద్ధి యందు ఉన్న జ్ఞానం ప్రకారంగా, మనస్సు కోరికలను పెంపొందించుకుంటుంది. రోజంతా మనం మనష్యులం మనస్సుని బుద్ధి ద్వారా నియంత్రిస్తూనే ఉంటాము. ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా కాళ్ళు చాపుకుని మనస్సుకి నచ్చినట్టుగా కూర్చుంటాము. కానీ, కార్యాలయంలో (ఆఫీసు) లో కూర్చున్నప్పుడు అధికారికంగా కూర్చుంటాము. ఆఫీసు క్రమబద్ధత మన మనస్సుకి నచ్చి కాదు, దాని ఇష్టానికి వదిలేస్తే ఇంట్లో ఉండే అనధికార వాతావరణమే కావాలంటుంది. కానీ, ఆఫీసులో అధికారిక ప్రవర్తన అవసరము అని బుద్ధి నిర్ణయిస్తుంది. కాబట్టి, బుద్ధి అనేది మనస్సుని నియంత్రించటం వలన, మనస్సు యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా, కార్యాలయ మర్యాద కోసం, మనము రోజంతా నిబద్ధతతో ఆఫీసులో కూర్చుంటాము. ఇదే విధంగా, దాని ఇష్టానికి వదిలేస్తే, మనస్సు ఆఫీసు పని చేయటానికి ఇష్టపడదు, ఇంట్లో కూర్చుని టెలివిజన్ చూసేందుకే మొగ్గు చూపుతుంది. కానీ, జీవనోపాధి కోసం ఆఫీసులో పని చేయటం అవసరం అని 'బుద్ధి' నిర్ణయిస్తుంది. కాబట్టి, మళ్లీ మనస్సు యొక్క సహజ స్వభావాన్ని, బుద్ధి నియంత్రిస్తుంది, మరియు జనులు రోజుకి ఎనిమిది గంటలు లేదా ఆ పైగా పని చేస్తారు. ఈ పై ఉదాహరణలు, మానవులగా మన బుద్ధికి మనస్సుని నియంత్రించే సామర్థ్యం ఉంది, అని నిరూపిస్తున్నాయి. ఈ విధంగా, మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని, సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి. బుద్ధి యోగము అంటే, అన్నీ పనులు భగవంతుని ప్రీతి కోసమే అని బుద్ధిలో దృఢ నిశ్చయం చేసుకోవటం ద్వారా కర్మ ఫలాల పట్ల ఆసక్తిరహితంగా ఉండగలిగే కళ. అలాంటి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, లక్ష్యంపై ఏకాగ్రదృష్టితో, విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా ఈ పథంలో దూసుకెళ్తాడు. సాధనలోని పై స్థాయిలలో ఈ సంకల్పం ఎంత బలంగా అవుతుందంటే, ఇక ఏదీ కూడా సాధకుడిని ఆ పథం నుండి తప్పించలేదు. సాధకుడు/సాధకురాలు ఇలా అనుకుంటారు, ‘ఎన్ని కోట్ల అవాంతరాలు నా దారిలో వచ్చినా, ప్రపంచమంతా నన్ను ఖండించినా, నా ప్రాణాలే వదిలివేయాల్సి వచ్చినా, నా సాధనని మాత్రము విడిచిపెట్టను.’ అని. కానీ, ఎవరి బుద్ధి పలు-విధాలుగా ఉంటుందో వారి మనస్సు ఎన్నో దిశలలో పరిగెడుతుంటుంది. వారు ఈశ్వర పథంలో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క ఏకాగ్రతని పెంపొందించుకోలేరు.
యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః । వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ।। 42 ।। కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ । క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ।। 43 ।।
42
2
https://www.holy-bhagava…/002_042-043.mp3
యామ్ ఇమాం — ఇవన్నీ; పుష్పితాం — ఆకర్షణీయమైన; వాచం — మాటలు; ప్రవదంతి — అంటారు; అవిపశ్చితః — పరిమితమైన అవగాహన కలవారు; వేద-వాద-రతాః — వేదములోని ఫలశృతి మీద ఆసక్తి కలవారు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; న అన్యత్ అస్తి — వేరేది ఏదీ లేదు; ఇతి — ఈ విధంగా; వాదినః — వాదిస్తారు; కామ-ఆత్మానః — ఇంద్రియ సుఖములపై ఆసక్తితో; స్వర్గ-పరాః — స్వర్గ లోకాలని పొంద గోరి; జన్మ-కర్మ-ఫల — ఉత్తమ జన్మ, మంచి ప్రతిఫలాలు; ప్రదాం — ఇచ్చే; క్రియా-విశేష — డాంబికమైన కర్మ కాండలు; బహులాం — చాలా; భోగ — భోగములు; ఐశ్వర్య — ఐశ్వర్యములు; గతిం — పురోగతి; ప్రతి — వైపున.
BG 2.42-43: పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులౌతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు, మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు.
వేదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి. అవి: కర్మ-కాండ, జ్ఞాన-కాండ, మరియు ఉపాసన-కాండ. భౌతిక ప్రతిఫలాల కోసం మరియు స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు, కర్మ-కాండలో సూచించబడ్డాయి. ఇంద్రియ భోగాలు కోరుకునే వారు వేదాలలోని ఈ భాగాన్ని స్తుతిస్తారు.దేవతాలోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములు ఉంటాయి మరియు అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు అనువుగా ఉంటాయి. కానీ, స్వర్గలోకాలకు ఉద్ధరణ అనేది, ఏకకాలిక ఆధ్యాత్మిక ఉద్ధరణ అని చెప్పలేము. ఆ స్వర్గలోకాలు కూడా భౌతిక ప్రాపంచిక జగత్తులోని భాగమే, అక్కడికి వెళ్లిన పిదప పుణ్యం ఖర్చయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి రావాల్సిందే. అవివేకులు, కొద్దిపాటి పరిజ్ఞానమే ఉన్నవారు, వేదాల ప్రయోజనం ఇంతే అనుకుని ఆ స్వర్గాది లోకాలకోసం పాటుపడుతారు. ఈ విధంగా వారు, భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నించక, జీవన్మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. కాబట్టి, ఆధ్యాత్మిక విజ్ఞానం కలవారు స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:అవిద్యాయామంతరే వర్తమానాః స్వయంధీరాః పండితం మన్యమానాఃజంఘన్య మానాః పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః (1.2.8)‘స్వర్గాది లోక భోగములను అనుభవించటం కోసం వేదోక్తములైన ఆడంబరమైన కర్మ కాండలు ఆచరించే వారు, తమకు తామే శాస్త్ర పండితులమనుకుంటారు, కానీ నిజానికి వారు వెఱ్రివారు. గుడ్డి వారికి గుడ్డివారు దారి చూపించేవంటి వారు.’
యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః । వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ।। 42 ।। కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ । క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ।। 43 ।।
43
2
https://www.holy-bhagava…/002_042-043.mp3
యామ్ ఇమాం — ఇవన్నీ; పుష్పితాం — ఆకర్షణీయమైన; వాచం — మాటలు; ప్రవదంతి — అంటారు; అవిపశ్చితః — పరిమితమైన అవగాహన కలవారు; వేద-వాద-రతాః — వేదములోని ఫలశృతి మీద ఆసక్తి కలవారు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; న అన్యత్ అస్తి — వేరేది ఏదీ లేదు; ఇతి — ఈ విధంగా; వాదినః — వాదిస్తారు; కామ-ఆత్మానః — ఇంద్రియ సుఖములపై ఆసక్తితో; స్వర్గ-పరాః — స్వర్గ లోకాలని పొంద గోరి; జన్మ-కర్మ-ఫల — ఉత్తమ జన్మ, మంచి ప్రతిఫలాలు; ప్రదాం — ఇచ్చే; క్రియా-విశేష — డాంబికమైన కర్మ కాండలు; బహులాం — చాలా; భోగ — భోగములు; ఐశ్వర్య — ఐశ్వర్యములు; గతిం — పురోగతి; ప్రతి — వైపున.
BG 2.42-43: పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులౌతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు, మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు.
వేదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి. అవి: కర్మ-కాండ, జ్ఞాన-కాండ, మరియు ఉపాసన-కాండ. భౌతిక ప్రతిఫలాల కోసం మరియు స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు, కర్మ-కాండలో సూచించబడ్డాయి. ఇంద్రియ భోగాలు కోరుకునే వారు వేదాలలోని ఈ భాగాన్ని స్తుతిస్తారు.దేవతాలోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములు ఉంటాయి మరియు అవి మరింత ఎక్కువ ఇంద్రియ సుఖాలను అనుభవించేందుకు అనువుగా ఉంటాయి. కానీ, స్వర్గలోకాలకు ఉద్ధరణ అనేది, ఏకకాలిక ఆధ్యాత్మిక ఉద్ధరణ అని చెప్పలేము. ఆ స్వర్గలోకాలు కూడా భౌతిక ప్రాపంచిక జగత్తులోని భాగమే, అక్కడికి వెళ్లిన పిదప పుణ్యం ఖర్చయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి రావాల్సిందే. అవివేకులు, కొద్దిపాటి పరిజ్ఞానమే ఉన్నవారు, వేదాల ప్రయోజనం ఇంతే అనుకుని ఆ స్వర్గాది లోకాలకోసం పాటుపడుతారు. ఈ విధంగా వారు, భగవత్ప్రాప్తి కోసం ప్రయత్నించక, జీవన్మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. కాబట్టి, ఆధ్యాత్మిక విజ్ఞానం కలవారు స్వర్గాన్ని కూడా తమ లక్ష్యంగా ఉంచుకోరు. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:అవిద్యాయామంతరే వర్తమానాః స్వయంధీరాః పండితం మన్యమానాఃజంఘన్య మానాః పరియంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధాః (1.2.8)‘స్వర్గాది లోక భోగములను అనుభవించటం కోసం వేదోక్తములైన ఆడంబరమైన కర్మ కాండలు ఆచరించే వారు, తమకు తామే శాస్త్ర పండితులమనుకుంటారు, కానీ నిజానికి వారు వెఱ్రివారు. గుడ్డి వారికి గుడ్డివారు దారి చూపించేవంటి వారు.’
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ । వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ।। 44 ।।
44
2
https://www.holy-bhagava…udio/002_044.mp3
భోగ — భోగములు; ఐశ్వర్య — విలాసము; ప్రసక్తానాం — మిక్కిలి మమకారాసక్తి ఉన్నవారికి; తయా — దాని వలన; అపహృత-చేతసామ్ — బుద్ధి భ్రమించిన; వ్యవసాయ-ఆత్మికా — నిశ్చయమైన; బుద్ధిః — బుద్ధి; సమాధౌ — సాఫల్యం; న — కాదు; విధీయతే — సాధ్యము.
BG 2.44: ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి, వారు, భగవత్-ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు.
మనస్సులో ఇంద్రియసుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు భోగాలు, ఐశ్వర్యముల కోసం ప్రాకులాడుతుంటారు. సంపాదనను పెంపొందించుకోవటానికి తమ బుద్ధి వాడుతూ, ఎలా ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి సమకూర్చుకుని, శారీరక సుఖానుభవములు మరింత పొందుదామా అని విచారిస్తుంటారు. ఈ విధంగా భ్రమకి లోనయ్యి, భగవత్ ప్రాప్తి పథంలో పయనించటానికి కావలిసిన దృఢ సంకల్పాన్ని అభివృద్ది చేసుకోలేకపోతారు.
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున । నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ।। 45 ।।
45
2
https://www.holy-bhagava…udio/002_045.mp3
త్రై-గుణ్య — భౌతికప్రకృతి యొక్క త్రి-గుణాత్మకమైన; విషయాః — విషయములు; వేదాః — వేద శాస్త్రములు; నిస్త్రై-గుణ్యః — త్రిగుణములకు అతీతంగా; భవ — ఉండుము; అర్జున — అర్జున; నిర్ద్వంద్వః — ద్వంద్వములకు అతీతంగా; నిత్య-సత్వ-స్థః — నిత్యము సత్యములో స్థితుడై ఉండి; నిర్యోగ-క్షేమ — యోగ క్షేమములు గురించి పట్టించుకోని; ఆత్మ-వాన్ — ఆత్మ యందు స్థితుడవై.
BG 2.45: ఓ అర్జునా, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రి-గుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి, నిత్యమూ పరమ-సత్యంలో స్థితమై ఉండి, మరియు భౌతిక లాభాలు, భద్రతల గురించి పట్టించుకోకుండా, ఆత్మ భావన యందే స్థితుడవై ఉండుము.
భౌతిక శక్తి తన మూడు గుణములచే దివ్యమైన జీవాత్మను శారీరక భావనలో బంధించివేస్తుంది. ఈ మూడు ప్రకృతి గుణములు ఏమిటంటే, సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణము. లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమతమ పూర్వ జన్మ సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు పాళ్ళలో ఉంటాయి, తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు, ధోరణులను కలిగి ఉంటారు. వైదిక శాస్త్రాలు ఈ భిన్నత్వాన్ని అంగీకరిస్తాయి మరియు అన్నీ రకాల జనులకు తగిన బోధనలను సూచిస్తాయి. ప్రాపంచిక విషయాసక్తి కలిగిన ప్రజలకు, ఈ శాస్త్రాలు సూచనలను కలిగిలేకపొతే, వారు మరింత దారితప్పిన వారు అయ్యేవారు. కాబట్టి, వారికి భౌతికమైన ప్రతిఫలాలు ఇచ్చే కర్మ కాండలను వేదాలు అందచేశాయి. ఇవి వారికి తమో గుణము నుండి రజో గుణానికి, రజో గుణము నుండి సత్త్వ గుణమునకు ఎదిగేందుకు దోహదపడతాయి. ఈ ప్రకారంగా, వేదాలు రెండు రకాల జ్ఞానాన్ని - ప్రాపంచిక ఆసక్తితో ఉన్నవారికి కర్మకాండలు మరియు ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి దివ్య జ్ఞానమును - కలిగి ఉంటాయి. శ్రీ కృష్ణుడు అర్జునుడికి వేదాలని తిరస్కరించమని చెప్పినప్పుడు, ఆ సూచనని మనం ఇంతకుముందు మరియు తదుపరి శ్లోకాల సందర్భంలో అర్థం చేసుకోవాలి. భౌతిక ప్రతిఫలాలను ప్రసాదించే యజ్ఞయాగాది క్రతువులు, విధివిధానాలు, నియమ నిబంధనలు చెప్పబడిన వేదాలలోని ఆయా విభాగాల పట్ల అర్జునుడు ఆకర్షితుడు కావద్దని ఇక్కడ శ్రీ కృష్ణుడి ఉద్దేశం. దానికి బదులుగా, వేదాలలోని ఆధ్యాత్మిక భాగాలని అవగాహన చేసుకొని పరమ సత్యం స్థాయికి తననుతాను ఉద్ధరించుకోవాలి.
యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే । తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ।। 46 ।।
46
2
https://www.holy-bhagava…udio/002_046.mp3
యావాన్ — ఏదేని; అర్థః — ప్రయోజనం ; ఉద-పానే — నీటి బావి; సర్వతః — అన్ని విధములుగా; సంప్లుత-ఉదకే — ఒక పెద్ద సరస్సు; తావాన్ — అంత; సర్వేషు — అన్నీ విధములుగా; వేదేషు — వేదములు; బ్రాహ్మణస్య — పరమ సత్యం తెలిసినవానికి (బ్రహ్మ జ్ఞాని); విజానతః — సంపూర్ణ జ్ఞానికి.
BG 2.46: ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా, పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే.
వేదములు, ఎన్నో రకాల కర్మకాండలు, ఆచారాలు, పద్ధతులు, పూజలు, వైదిక కార్యక్రమాలు, మరియు జ్ఞాన రత్నాలను వివరించే ఒక లక్ష మంత్రములను కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే ఒక ప్రయోజనం కోసం ఇవ్వబడ్డాయి – జీవాత్మని పరమాత్మ దగ్గరికి చేర్చటమే.వాసుదేవ-పరా వేదా వాసుదేవ-పరా మఖాఃవాసుదేవ-పరా యోగా వాసుదేవ-పరాః క్రియాఃవాసుదేవ-పరం జ్ఞానం వాసుదేవ పరం తపఃవాసుదేవ-పరో ధర్మో వాసుదేవ-పరా గతిః(భాగవతం 1.2.28-29) ‘అన్నీ వేద మంత్రముల, కర్మ కాండల, ఆధ్యాత్మిక ఆచారాల, యజ్ఞయాగాదుల, జ్ఞాన సముపార్జన, మరియు కర్తవ్య నిర్వహణల యొక్క లక్ష్యం, జీవాత్మను భగవంతుని దివ్య చరణముల వద్దకు చేర్చుటయే.’అయితే, ఎలాగైతే తరచుగా మందు బిళ్ళని పంచదార పూతతో మధురంగా చేస్తారో, అదేవిధంగా ప్రాపంచిక విషయాసక్తి కల వారికి వేదాలు, భౌతిక ప్రలోభాలు చూపిస్తాయి. దీని అంతర్లీన ఉద్దేశ్యం, జీవుడిని క్రమంగా ప్రాపంచిక విషయాల నుండి దూరంచేసి క్రమంగా భగవంతుడి పట్ల ఆసక్తి కలిగించటమే. కాబట్టి, మనస్సుని ఆ భగవంతుని యందే నిలిపినవాడు అన్ని వేద మంత్రాల ప్రయోజనాన్ని నేరవేర్చినట్టే. శ్రీ కృష్ణుడు ఉద్ధవుడికి ఇలా ఉపదేశించాడు:ఆజ్ఞాయైవం గుణాన్ దోషాన్ మయాదిష్టాన్ అపి స్వకాన్ధర్మాన్ సంత్యజ్య యః సర్వాన్ మాం భజేత స సత్తమః(భాగవతం 11.11.32) ‘వేదములు ఎన్నో రకాల సామాజిక, కర్మకాండల విధివిధానాలని జనులకు సూచించాయి. వీటన్నిటి పరమార్థం తెలిసినవారు, మధ్యమ స్థాయి సూచనలను తిరస్కరించి, మనస్పూర్తిగా నా పట్ల ఉన్న ధర్మాన్ని నిర్వర్తించెదరు. అటువంటివారిని నా పరమభక్తులుగా పరిగణిస్తాను.’
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।। 47 ।।
47
2
https://www.holy-bhagava…udio/002_047.mp3
కర్మణి — విధింపబడిన (వేదవిహిత) కర్మాచరణమునందు; ఏవ — మాత్రమే; అధికారః — హక్కు; తే — నీకు; మా — లేదు; ఫలేషు — దాని ఫలముల యందు; కదాచన — ఎప్పుడూ కూడా; మా — కాదు; కర్మ-ఫల — కర్మఫలములు; హేతుః — కారణము; భూః — అవును; మా — కూడదు; తే — నీ యొక్క; సంగః — ఆసక్తి (మమకారము); అస్తు — ఉండుట; అకర్మణి — కర్మను మానుటయందు.
BG 2.47: శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.
ఇది భగవద్గీతలో ఒక అత్యంత ప్రసిద్ధ శ్లోకము, ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే భారతదేశంలో చాల మంది స్కూలు పిల్లలకి కూడా ఇది తెలుసు. ఇది కర్మ సిద్ధాంతం గురించి లోతైన అవగాహన కల్పిస్తుంది మరియు కర్మ-యోగ విషయం ఎప్పుడు చర్చించబడినా ఈ శ్లోకం ప్రస్తావించబడుతుంది. ఈ శ్లోకం కర్మ సిద్ధాంతం గురించి నాలుగు సూచనలను చెప్తున్నది. 1) నీ కర్తవ్యం చేయుము కానీ ఫలితాల గురించి పట్టించుకోకు. 2) వచ్చిన కర్మ ఫలములు నీవు అనుభవించటం కోసం కాదు. 3) పని చేసేటప్పుడు కూడా కర్తృత్వాభిమాన భావన (నేనే చేస్తున్నాను అన్న అహంకారం) విడిచిపెట్టుము. 4) కర్మలను మానివేయుటలో ఆసక్తి ఉండరాదు.నీ కర్తవ్య నిర్వహణ చేయుము, కానీ ఫలితాల గురించి విచారించకు: మనకు మన కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది, కానీ ఫలితాలు మన ఒక్కరి ప్రయత్నం మీదనే ఆధారపడి ఉండవు. చాలా కారణాలు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి - మన పరిశ్రమ, మన ప్రారబ్ధం (గత కర్మలు), భగవత్ సంకల్పము, ఇతరుల పరిశ్రమ, సంబంధిత అందరి ప్రారబ్ధం, ప్రదేశము, మరియు కాల పరిస్థితులు (అదృష్టము) మొదలగునవి. ఇప్పుడు మనం ఫలితాల గురించి ఆరాట పడితే అవి మనకు అనుకూలంగా లేనప్పుడల్లా ఆందోళన పడాల్సి వస్తుంది. కాబట్టి ఫలితముల గురించి ఆందోళనని విడిచి పెట్టి, కేవలం చేయవలసిన పని మీదనే శ్రద్ధ చూపమని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. నిజానికి, ఫలితాల గురించి పట్టించుకోనప్పుడే, మన పరిశ్రమ మీద పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాము, దీనితో ఇంతకు పూర్వం కంటే మంచి ఫలితాలు వస్తాయి.హాస్యానికి దీనిని సంక్షిప్తంగా ఆంగ్లంలో ‘NATO - Not Attached to Outcome’ (నాట్ అటాచ్డ్ టు ఔట్‌కం) అనుకోవచ్చు. గోల్ఫ్ ఆడటం వంటి సాధారణ రోజువారీ కార్యక్రమానికి దీనిని అన్వయించి చూద్దాం. జనులు గోల్ఫ్ ఆడినప్పుడు ఫలితాలలో లీనమైపోతారు - వాళ్ల స్కోర్ బాగుందా, బాలేదా అని. కానీ వారు తమ ఆటపై దృష్టి పెట్టి తమ సామర్థ్యం మేర చక్కగా ఆడినప్పుడు, అదే వారికి తాము ఆడిన గోల్ఫ్ ఆటలన్నిటిలో అత్యంత ఆహ్లాదకరమైన ఆటగా అనిపిస్తుంది. అంతేకాక, వారి పూర్తి ఏకాగ్రత, కొట్టే షాట్స్ పైన ఉంటుంది కాబట్టి వారి ఆట చాలా మెరుగవుతుంది.మనము చేసే కర్మల, పనుల ఫలితాలు మన అనుభోగం కోసం కాదు: కర్మలు చేయటం అనేది మానవ స్వభావంలో అంతర్భాగం. ఈ ప్రపంచంలోకి వచ్చాక, మనందరికీ మన కుటుంబ పరిస్థితి, సామాజిక స్థానం, వృత్తి వంటి పరంగా వేర్వేరు విధులు ఉంటాయి. ఈ పనులన్నీ చేసేటప్పుడు ఆయా కర్మల ఫలితాలు మన అనుభోగము (enjoyment) కోసం కాదు అని గుర్తుంచుకోవాలి - ఆ ఫలితాలు భగవంతుని ఆనందం కోసం ఉద్దేశింపబడినవి. ప్రతిఒక్క జీవాత్మ, పరమాత్మ యొక్క అణు అంశము (15.7వ శ్లోకం), కావున మన అన్ని కర్మల ద్వారా భగవంతుని సేవ చేయటమే మనకున్న అంతర్లీన నిజస్వభావం.దాస భూతమిదం తస్య జగస్థావర జంగమంశ్రీమన్నారాయణ స్వామీ జగతాం ప్రభురీశ్వరః(పద్మ పురాణం) ‘సమస్త సృష్టికి ఆ భగవంతుడే ప్రభువు; చర-అచర జీవులన్నీ ఆయన సేవకులే’.ప్రాపంచిక భౌతిక విషయాసక్తిలో, ‘ నా దగ్గర ఉన్న వాటన్నిటికీ నేనే యజమానిని. ఇదంతా నా సుఖం కోసమే. నా ఆస్తులు పెంచుకొని ఇంకా భోగించేందుకు నాకు హక్కు ఉంది’ అనే ఆలోచనా దృక్పథం ఉంటుంది. దీనికి విరుద్ధమైనది ఆధ్యాత్మిక స్పృహ. అది ఈ విధమైన ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది, ‘భగవంతుడే సమస్త జగత్తుకి ప్రభువు, యజమాని, భోక్త. నేను కేవలం అతని నిస్వార్థ సేవకుడిని/సేవకురాలిని మాత్రమే. నాకున్నదాన్ని అంతా ఆ భగవంతుని సేవలోనే వినియోగించాలి.’ అని. ఈ ప్రకారముగా, అర్జునుడు, తానే తన కర్మల ఫలములను అనుభవించేది అని అనుకోవద్దని, శ్రీ కృష్ణుడు సూచిస్తున్నాడు.పనిచేస్తున్నప్పుడు కూడా, చేసేది నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి: అర్జునుడిని కర్తృత్వాభిమానము అంటే 'చేసేది నేనే అన్న అహంకారాన్ని' విడిచిపెట్టాలని కృష్ణుడు కోరుకుంటున్నాడు. తను చేసే పనులలో, ముందుగానే ఆశించిన ఫలితాల గురించి వెంపర్లాట వద్దనీ, మరియు కర్మ ఫలితాలకు తనే కారణం అని అనుకోవద్దని ఉపదేశిస్తున్నాడు.మనం పనులు చేసినప్పుడు, ఆయా కర్మలను చేసేది మనమే అని ఎందుకు అనుకోవద్దు? ఇది ఎందుకంటే, మన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి జడ పదార్థములు (చైతన్యం లేనివి); భగవంతుడు వీటికి శక్తిని ఇచ్చి మనం ఉపయోగించుకోవటానికి వీలుగా చేస్తాడు. తత్ఫలితంగా, దేవునిచే ప్రసాదింపబడిన శక్తి ద్వారానే మనము పనులు చేయగలుగుతున్నాము. ఉదాహరణకి, వంటింట్లో ఉపయోగించే పట్టకారు జడమైనది, తనంతతానే ఏమీ చేయలేదు, కానీ ఎవరైనా తమ చేతుల ద్వారా దానికి శక్తినిస్తే, అది క్లిష్టమైన పనులను, అంటే మండే బొగ్గు తీయటం వంటివి కూడా చేయగలుగుతుంది. ఇప్పుడు మనము ఆ పట్టకారే ఈ పనులు చేస్తోంది అంటే పొరపాటుపడినట్లే. చెయ్యి దానికి శక్తి నీయకపొతే అది ఏమి చేయగలిగేది? అది బల్ల మీదనో, అరుగు మీదనో అలా అచేతనంగా పడి ఉండేది. అదే విధంగా, భగవంతుడు మన శరీరము-మనస్సు-ఆత్మ వ్యవస్థకి పని చేసే శక్తి ఇవ్వకపోతే, మనము ఏమీ చేయలేము. అందుకే మనము, ఆ భగవంతుడే మనము చేసే అన్ని పనులకు వెనుకనుండి శక్తిని ప్రసాదించేవాడు అని గుర్తుంచుకుంటూ, 'చేసేది నేనే అన్నఅహంకారాన్ని' విడిచిపెట్టాలి.ఈ పై విషయాలన్నీ ఈ క్రింది ప్రసిద్ధ సంస్కృత శ్లోకంలో చక్కగా చెప్పబడ్డాయి:యత్కృతం యత్కరిష్యామి తత్ సర్వం న మయా కృతంత్వయా కృతం తు ఫలభుక్ త్వమేవ మధుసూదన‘నేను సాధించిందంతా మరియు నేను సాధించ కోరేదంతా, నేను చేసినది కాదు. ఓ మధుసూదనా, నీవే నిజమైన కర్తవు, నీవు మాత్రమే వాటి ఫల భోక్తవు.’క్రియాశూన్యత (చేయవలసిన పనులు చేయకుండుట) పైన ఆసక్తి వద్దు: ప్రాణుల సహజ స్వభావం ఏదో ఒక పని చేస్తుండటమే అయినా, తరచుగా పని కష్టతరంగా, గందరగోళంగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో, దాని నుండి పారిపోకుండా, మనము శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సరియైన కర్మ శాస్త్రాన్ని అర్థం చేసుకుని అమలు చేయాలి. అంతేకానీ, పని శ్రమతో కూడినది, భారమైనదని తలంచి క్రియాశూన్యతతో ఉండటం అత్యంత తగని చేష్ట. అకర్మణ్యత (చేయవలసిన పనులు చేయకుండుట) అనేది ఎప్పుడూ దేనికీ పరిష్కారం కాదు మరియు శ్రీ కృష్ణుడు దీనిని స్పష్టంగా ఖండించాడు.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ । సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ।। 48 ।।
48
2
https://www.holy-bhagava…udio/002_048.mp3
యోగ-స్థః — యోగములో స్థిరముగా ఉండి; కురు — చేయుము; కర్మాణి — కర్మలు (విధులు) సంగం — మమకారం (ఆసక్తి); త్యక్త్వా — విడిచిపెట్టి (త్యజించి); ధనంజయ — అర్జునా; సిద్ధి-అసిద్ధ్యోః — గెలుపు-ఓటమిలలో; సమః — సమముగా ఉండి; భూత్వా — కలిగి ఉండి; సమత్వం — సమదృష్టి; యోగః — యోగము; ఉచ్యతే — చెప్పబడును.
BG 2.48: జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, ఓ అర్జునా, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును.
అన్ని పరిస్థితులనీ ప్రశాంత చిత్తంతో సమానంగా స్వీకరించటం అనేది ఎంత మెచ్చదగినదంటే శ్రీ కృష్ణుడు దానిని 'యోగం' అంటాడు అంటే పరమాత్మతో ఐక్యత. ఈ సమత్వ బుద్ధి అనేది పూర్వ శ్లోకం యొక్క విజ్ఞానాన్ని అమలుపరచటం ద్వారా వస్తుంది. మన కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది ఫలితము కాదు అని అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే మన పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఫలితములు భగవంతుని ప్రీతి కొరకే, కాబట్టి అవి ఆయనకే సమర్పిస్తాము. ఒకవేళ ఫలితములు మనం అనుకున్నట్టు రాకపోతే, వాటిని భగవత్ సంకల్పముగా ప్రశాంతముగా స్వీకరిస్తాము. ఈ విధంగా, కీర్తి మరియు అపకీర్తి, జయము మరియు అపజయము, సుఖము మరియు దుఃఖము, వీటన్నిటినీ మనము భగవంతుని సంకల్పంగా పరిగణించి స్వీకరిస్తాము. ఈ రెంటినీ సమానంగా స్వీకరించటం నేర్చుకున్నప్పుడు, మనము శ్రీ కృష్ణుడు చెప్పిన సమత్వ బుద్ధిని పెంపొందించుకుంటాము. జీవితంలోని ఒడుదుడుకులకు ఈ శ్లోకం ఒక చక్కని ఆచరణాత్మక పరిష్కారం చూపుతుంది. నావలో మనం సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సముద్ర అలలు ఆ నావను అటూ ఇటూ ఊపటం సహజం. ప్రతిసారి అల తాకినప్పుడల్లా మనం కలత చెందితే మన యాతనకు అంతు ఉండదు. ఒకవేళ అలలు పైకిరావద్దు అనుకుంటే అది సముద్రం యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా ఉండమని కోరినట్లే. అలలు అనేవి సముద్రం నుండి విడదీయలేనివి. అదే విధంగా, సంసార సాగరంలో ప్రయాణించేటప్పుడు, మన నియంత్రణలో లేని, ఎన్నో అలలను అది మన మీదకు తేవచ్చు. మనము ప్రతికూల పరిస్థితులని నివారించటానికి నిరంతరం పోరాడుతూ ఉంటే, మనం అసంతృప్తి/దుఃఖాన్ని తొలగించుకోలేము. కానీ, మన శక్తిమేర ప్రయత్నం ఆపకుండా, దారిలో వచ్చే ప్రతి దాన్నీ స్వీకరించటం నేర్చుకుంటే, మనం ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసినట్లే, అదే నిజమైన యోగము.
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ । బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ।। 49 ।।
49
2
https://www.holy-bhagava…udio/002_049.mp3
దూరేణ — (త్యజించు) దూరము నుండే; హి — నిజముగా; అవరం — నిమ్న స్థాయి లోనున్న; కర్మ — ఫలాపేక్షతో చేసే పనులు; బుద్ధి-యోగాత్ — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందే బుద్ధి స్థిరముగా ఉంచి; ధనంజయ — అర్జునా; బుద్ధౌ — ఆధ్యాత్మిక జ్ఞానము, ఆంతర-దృష్టి; శరణం — ఆశ్రయం(శరణము); అన్విచ్ఛ — వెదుకుము; కృపణాః — లోభి/పిసినారి; ఫల-హేతవః — కర్మ ఫలములను ఆశించేవారు.
BG 2.49: దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము, ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము; బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా, అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోభులు/పిసినారులు.
పనికి రెండు దృష్టికోణాలున్నాయి: 1) మనం బాహ్యంగా చేసే క్రియ 2) దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఉదాహరణకి బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కడుతున్నారనుకోండి. అక్కడి పనివారు ఒక పుణ్య కార్యంలో పాలుపంచుకున్నట్టే, కానీ వారి దృక్పథం ప్రాపంచికమైనది. వారికి వారి జీతం గురించే ఆలోచన. మరొక కాంట్రాక్టర్ ఎక్కువ జీతం ఇస్తానంటే, ఆ కొత్త యజమాని దగ్గరికి వెళ్లడానికి వెనుకాడరు. అక్కడే బృందావనంలో ఉన్న ఒక సాధువు, ఒక గొప్ప గుడి కడుతున్నారని చూసి, భగవత్ సేవ లాగా, 'కర సేవ' (స్వచ్చంద పని) చేస్తాడు. బాహ్యంగా సాధువు చేసే పని, ఆ పనివారు చేసేపని ఒక్కటే అయినా, వారి అంతర్గత దృక్పథంలో చాలా తేడా ఉంది.ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన ఆంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ-భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవత్ అర్పితం చేసినవారు ఉత్తములు. కర్మ ఫలములను భగవత్ అర్పితం చేసినవారు నిజమైన జ్ఞానం కలిగినవారు.'కృపణ' (పిసినారి) అన్న పదం ఇక్కడ వాడబడింది. శ్రీమద్ భాగవతం, 'కృపణ' అంటే ఇలా నిర్వచించింది:న వేద కృపణః శ్రేయ ఆత్మనో గుణ-వస్తు-దృక్తస్య తాన్ ఇచ్ఛతో యచ్ఛేద్యది సోఽపి తథా విధః (6.9.49) ‘భౌతిక ప్రకృతి శక్తి నుండి ఉద్భవించిన ఇంద్రియ విషయములే పరమ సత్యం అని అనుకునే వారే కృపణులు’. మరల శ్రీమద్భాగవతం ఇలా అంటుంది: “కృపణో యో ఽఅజితేంద్రియః’ (11.19.44) ‘ఇంద్రియములపై ఎలాంటి అదుపు లేని వాడే కృపణుడు.’ఒక వ్యక్తి విజ్ఞాన పై-స్థాయికి వెళ్ళే కొద్దీ, సహజంగానే కర్మ ఫలాలని అనుభోగించాలనే కోరిక విడిచిపెట్టి, సేవా దృక్పథం వైపు వెళతాడు. మైక్రోసాఫ్ట్ సంస్థలో తన పదవీత్యాగం చేసిన తరువాత ఇప్పుడు బిల్ గేట్స్, తన శక్తి సామర్ధ్యాలని సమాజ-సేవ లో వినియోగిస్తున్నాడు. అదే విధంగా, అమెరికా అధ్యక్షుడిగా తన హోదా, అధికారము పూర్తయిన తరువాత, బిల్ క్లింటన్, మానవ సమాజ సేవ యొక్క వైభవాన్ని బోధిస్తున్నాడు, ఇంకా ఆ విషయంపై ఒక పుస్తకం ‘గివింగ్ — హౌ ఈచ్ ఆఫ్ అస్ కెన్ ఛేంజ్ ద వరల్డ్’ (Giving — How Each Of Us Can Change The World.) కూడా రాసాడు. వారి సేవా దృక్పథం పొగడదగినదే, కానీ అది సరిగ్గా ఇంకా సరియైన దిశలో లేదు. మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం, భగవత్ అర్పితంగా చేయటం నేర్చుకున్నట్లయితే, ఆ సేవా దృక్పథం లోప (దోష) రహితమవుతుంది.
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే । తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ।। 50 ।।
50
2
https://www.holy-bhagava…udio/002_050.mp3
బుద్ధి-యుక్తః — జ్ఞాన సంపన్నుడవై; జహాతి — త్యజించుము; ఇహ — ఈ జన్మలో; ఉభే — రెంటినీ; సుకృత-దుష్కృతే — మంచి, చెడు కార్యములు; తస్మాత్ — కాబట్టి; యోగాయ — యోగము కొరకు; యుజ్యస్వ — గట్టిగా ప్రయత్నింపుము; యోగః — యోగ అంటే; కర్మసు కౌశలమ్ — నేర్పుతో పని చేసే కళ.
BG 2.50: వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి, నైపుణ్యంతో (సరియైన దృక్పథంతో) పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము.
తరచుగా, కర్మయోగ శాస్త్రం విన్న పిదప, జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు; ఫలితాలపై ఆసక్తి/మమకారం వదిలేస్తే, వారి కార్యనిర్వహణ శక్తి తరిగిపొదా? అని. స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మనపని లోని నాణ్యత ఏ మాత్రం తగ్గదని; పైగా, మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు. తన చికిత్సా ప్రక్రియలో రోగులను కత్తితో కోసే ఒక చిత్తశుద్ధిగల శస్త్రచికిత్సా వైద్యుడిని ఉదాహరణగా పరిశీలిద్దాం. అతను తన విధిని సమత్వ బుద్ధితో నిర్వర్తిస్తాడు, రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతను చలించడు. ఎందుకంటే, అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా, తన శక్తి మేర, ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి, ఒకవేళ శస్త్రచికిత్స ప్రక్రియలో రోగి మరణించినా ఆయనకు హత్య చేసిన అపరాధ భావన రాదు. కానీ, అదే వైద్యుడి ఏకైక బిడ్డకి శస్త్రచికిత్స చేయవలసి వస్తే, అతనికి ఆ పని చేసే ధైర్యం ఉండదు. ఫలితముపై ఉన్న మమకారం వల్ల శస్త్రచికిత్స సరిగా చేయలేనేమో అని భయం ఉంటుంది, కాబట్టి వేరొక వైద్యుడిని ఆశ్రయిస్తాడు. ఫలితములపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు; పైగా మన సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది, అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది. దీనికి బదులుగా, మమకారము/బంధము లేకుండా పని చేస్తే, భయం, ఆందోళన, చికాకు, ఉద్విగ్నత లేదా గాభరా లేకుండా మన గరిష్ఠ నైపుణ్య సామర్థ్యంతో పని చేయవచ్చు. అదే విధంగా, అర్జునుడి స్వంత ఉదాహరణ కూడా ఫలితములపై మమకారం విడిచిపెడితే అది తన సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం ఏమీ చూపదని తేటపరచుతున్నది. భగవద్గీత వినక ముందు, అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయగోరాడు. శ్రీ కృష్ణుడి ద్వారా భగవద్గీత విన్న తరువాత, అతను భగవంతుని పట్ల కర్తవ్యంగా, శ్రీ కృష్ణుడి ప్రీతి కోసం యుద్ధం చేసాడు. అతను అప్పటికీ వీర యోధుడే; కానీ తన అంతర్గత దృక్పథం/ప్రేరణ మారిపోయింది. తన కర్తవ్యాన్ని మమకార బంధాలు లేకుండా చేయటం అనేది అతన్ని ఏమీ తక్కువ సామర్థ్యం కలవాడిని చేయలేదు. నిజానికి దానికి విరుద్ధంగా, అతను మరింత ఉత్సాహంతో పోరాడాడు ఎందుకంటే తన పని ఇప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవ అయిపోయింది.
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః । జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ।। 51 ।।
51
2
https://www.holy-bhagava…udio/002_051.mp3
కర్మ-జం — కర్మల వలన జనించే; బుద్ధి-యుక్తాః — సమత్వ బుద్ధి కలవారై; హి — ఎట్లయితే ; ఫలం — ఫలములు; త్వక్త్వా — విడిచిపెట్టి; మనీషిణః — జ్ఞానులు; జన్మ-బంధ-వినిర్ముక్తాః — జీవన్మరణ బంధముల నుండి విముక్తులై; పదం — స్థితి; గచ్ఛంతి — పొందుదురు; అనామయమ్ — దుఃఖరహితమైన.
BG 2.51: జ్ఞానులు, సమత్వ బుద్ధి కలిగి ఉండి, జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార-ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పని చేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు.
ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని చెప్పటం కొనసాగిస్తూ, అది వ్యక్తిని బాధా-రహిత స్థితికి చేరుస్తుందని శ్రీ కృష్ణుడు మరింత పేర్కొంటున్నాడు. జీవితంలో వైరుద్ధ్యము ఎలా ఉంటుందంటే, మనం సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది, ప్రేమ కోసం తపిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది, జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతిక్షణం అడుగులేస్తుంటాము. భాగవతంలో ఇలా చెప్పబడింది:సుఖాయ కర్మాణి కరోతి లోకోన తైస్సుఖం వాన్యదుపారమం వావిందేత భూయాస్తత ఏవ దుఃఖంయదత్ర యుక్తం భగవాన్ వదేన్నః (3.5.2) ‘ప్రతి ఒక్క వ్యక్తీ ఆనందం కోసం కామ్య కర్మలను చేస్తూనే ఉంటాడు, కానీ తృప్తి లభించదు. సరికదా ఈ పనులు దుఃఖాన్ని మరింత పెంచుతాయి.’ ఈ కారణంగా, ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తమ స్వంత శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు; మరికొందరు తమ స్వజనులు, బంధువులచే బాధింపబడుతున్నారు; మరికొందరు నిత్యావసరాల కోసం కూడా దరిద్రంతో బాధ పడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి, తాము సంతోషంగా లేము అని తెలుసు, కానీ తమ కన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారు అనుకోని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తున్నారు. ఈ గుడ్డి అన్వేషణ ఎన్నో జన్మల నుండీ సాగుతూనే ఉంది కానీ ఎక్కడా దీనికి అంతమే కనిపించటం లేదు. ఇప్పుడు లోకులు కామ్య కర్మల ద్వారా ఎవరూ ఆనందాన్ని పొందలేరు అని తెలుసుకుంటే, అప్పుడు వారు పరుగులు పెట్టే దిశ నిరర్థకమైనదని అర్థం చెసుకుని, ఆధ్యాత్మిక జీవనం వైపు తమ తమ జీవితాన్ని యూ-టర్న్ తిప్పుకునేందుకు ఆలోచిస్తారు.ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢమైన సంకల్పం కలవారు భగవంతుడే సర్వ కార్య ఫలములకు భోక్త అని తెలుసుకుంటారు. ఆ కారణంగా, వారు తమ కర్మ ఫలములపై మమకారం విడిచిపెట్టి, అంతా భగవంతునికి సమర్పించి, మరియు ప్రశాంత చిత్తంతో అన్నిటినీ ఈశ్వర ప్రసాదం (అనుగ్రహం)లా స్వీకరిస్తారు. ఈ విధంగా చేయటం వలన, వారి పనులు జనన-మరణ చక్రంలో పడవేసే కర్మ బంధాలను కలుగచేయవు.
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి । తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ।। 52 ।।
52
2
https://www.holy-bhagava…udio/002_052.mp3
యదా — ఎప్పుడైతే; తే — నీ యొక్క; మోహ — మోహము ; కలిలం — క్లిష్టపరిస్థితి (ఊబి); బుద్ధిః — బుద్ధి; వ్యతితరిష్యతి — దాటిపోవును; తదా — అప్పుడు; గంతాసి — నీవు పొందెదవు; నిర్వేదం — వైరాగ్యమును; శ్రోతవ్యస్య — ఇంకా వినబోయే దానికి; శ్రుతస్య — ఇప్పటి దాక విన్న దానికి; చ — మరియు.
BG 2.52: మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. (ఇహపర లోక భోగముల విషయంలో).
ప్రాపంచిక భోగాలపై ఆసక్తి ఉన్నవారు, భౌతిక ఐశ్వర్యములు మరియు స్వర్గాది లోకములను పొందించే, వేదాలలోని ఆడంబరమైన కర్మ కాండలు చెప్పే భాగాల పట్ల ఆకర్షితులౌతారు, అని శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం చెప్పిఉన్నాడు (2.42-2.43వ శ్లోకాలు). కానీ, ఎవని బుద్ధి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశిస్తుందో వాడు, భౌతిక ఇంద్రియ సుఖాలు దుఃఖహేతువులే అని తెలుసుకొని, వాటిని వాంఛించడు. అలాంటి వ్యక్తికి వైదిక కర్మ కాండల పట్ల ఆసక్తి పోతుంది. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది.పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్త్యకృతః కృతేన (1.2.12)‘కామ్య కర్మల ద్వారా పొందిన ఇహపరలోక భోగములు అనిత్యమైనవి మరియు దుఃఖముతో కూడుకున్నవి అని అర్థం చేసుకొని, జ్ఞాన-సంపన్నులైన మునులు వైదిక కర్మలకు అతీతంగా ఉంటారు.’
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా । సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ।। 53 ।।
53
2
https://www.holy-bhagava…udio/002_053.mp3
శృతి-విప్రతిపన్నా — కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా; తే — నీ యొక్క; యదా — ఎప్పుడైతే; స్థాస్యతి — ఉండునో; నిశ్చలా — నిశ్చలంగా; సమాధౌ — భగవంతుని యందు; అచలా — స్థిరముగా; బుద్ధిః — బుద్ధి; తదా — అప్పుడు; యోగం — యోగము; అవాప్స్యసి — నీవు పొందెదవు.
BG 2.53: కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.
సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయ పడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకంలో జవాబు తెలుసుకొంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధన లోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.మాధవేంద్ర పూరి అనే ప్రఖ్యాత 14వ శతాబ్ద ముని చాలా దృఢంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను ఒకప్పుడు విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు, కానీ సన్యాసం తీసుకుని, పరిపూర్ణంగా శ్రీ కృష్ణభక్తిలో నిమగ్నమైపోయాడు. తన జీవిత తదుపరి దశలో, ఇలా అన్నాడు:సంధ్యా వందన భద్రమస్తు భవతేభోః స్నాన తుభ్యం నమఃభో దేవాః పితరశ్చతరపణ విధౌనహం క్షమః క్షమ్యతాంయత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తాస్య కంసద్విషఃస్మారం స్మారమఘం హరామి తదలంమన్యే కిమన్యేన మే ‘అన్ని వైదిక ఆచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించటానికి ఇక నావద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన, సంధ్యా వందనము (ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం పొందినవారు రోజుకు మూడు సార్లు చేసే వైదిక ప్రక్రియ), పుణ్య స్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు, నేనెక్కడ కూర్చున్నా, కంస విరోధి అయిన శ్రీ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తున్నాను, అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి.’శ్రీ కృష్ణుడు 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాసలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించటానికి, ఈ శ్లోకంలో ఉపయోగించాడు. 'సమాధి' అన్న పదం 'సమ్' (సమత్వము) మరియు 'ధి' (బుద్ధి) అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'. ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ధి కలిగి, ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు, ఆ యొక్క 'సమాధి' అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు.